Telugu Soubadhra kavitha vaividyam - anilvaranasi/indianlanguages GitHub Wiki
- వషళ్ర కమైిట్లు.
నాయని కవితాముశిలనం. న్ | | ఉం . ల మ .
గ్ 7 . -. ఎ" ః .
ళ్ | ," ఆ వ
శ ౨
ఫ్ య్ జ్జ రయి నాఖట | జ
రై (| (|
బి శే *!101॥10 య
లల ఈల లట్తోళ్య , (గ చు క్రీ
సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం నాయని కవితానుశీలనం చేహరి రాకూరాక్రు శ్రీమనప్వినీ ప్రచురణలు వరంగల్లు
506490[26/2 5046౧4 గడ౪712 ౪20160౧72౧ [2/2౧ గజ/12౧౪9/40౧2౧౧ 4 €0/86%400 01 5౯9924 0౧ గ౭/2౧॥ 560002/20 60౫ ౮౧664౧ గ౭గ౫౫౧1౦ 1-4-24/1, ౧10022, 546617 091662, ౧౮6౯2026 - 500007 గ౧౦గ౧6: 040 - 2715 2440 [13౬6110౧ 2006 0010091 ॥ 0) ఖో 0001693 "500 (| ళ్ ఆ షం! యా ఖ్జో (బ్ నిగం 50 లో “నో ఈ 00౪6౯6651౧” 11004౧ రాం ౧0గ/1101 గీజజ౧1: 1405౧6 0110 గో / 0౦౧195 ఇ/&14019 &4॥ [84641009 0001 5[009 ( య ాలాలయ శం ళల లొ టి ఖ్ (| . న్ ఇ లో యో క “ 4 వై నిగగ(66 ఇ ాబామిడ గీ5[01 గగం002 [561 నగ౧౧|9౧ 5651606 గిడ60164 7౧6416 20941 - 506 002 గ౧౦గ6: 0870 - 2427404
ప్రస్తావన
సుమారు 1978 నుంచి 2004 వరకు నాయని సుబ్బారావు గారి కవిత్వం గురించి వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనం ఇది. ఎక్కువ భాగం ఆయన పుట్టిన రోజు (అక్టోబరు, 29) సందర్భాన్ని పురస్కరించుకొని రాసిన వ్యాసాలివి. ఈ సంకలనానికి ప్రేరకుడు, కూర్చరి ఆచార్య అనుమాండ్ల భూమయ్య. ఈ వ్యాసాల సంఖ్య చాలా స్వల్పమైనా, ఇతరత్రా కనిపించని కొన్ని విషయాలు వీటిలో కనిపిస్తాయి. అది అనుమాండ్ల భూమయ్య నాయని వారిపై తన పరిశోధన ప్రారంభించేటప్పుడు నన్ను చేసిన ఇంటర్వ్యూ విషయాలు కూడా చివర చేర్చాను. ఇందులో నాయని వ్యక్తిత్వం గురించి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఇప్పటికీ నాయని వారి కవిత్వంపై సమ(గ్ర [గ్రంథం- భూమయ్య సిద్ధాంత వ్యాసమే. (1981)
ఈ వ్యాసాలలో వేరు వేరు సందర్భాల్లో రాసినవి కావటం వల్ల అక్కడక్కడ కొన్ని పునరుక్తులు కనిపిస్తాయి. ఏ వ్యాసానికావ్యాసం సమగ్రంగా ఉంటే బాగుంటుందని పునరుక్తులు తొలగించలేదు. ఈ వ్యాస సంకలనాన్ని ఈ విధంగా అందిస్తున్నందుకు భూమయ్యకు ఆశీరభినందనలు.
నా వ్యక్తిత్వాన్ని నా సాపొత్య దృక్పథాన్ని విశేషంగా ప్రభావితం చేసిన నాయని సుబ్బారావు గారిని మరోసారి మనసారా స్మరించుకుంటూ.... 2006, అక్టోబరు 5 - చేకూరి రామారావు
విషయసూచిక 1 నాయని కవితా భూమిక ల కే 2, _ శతకలక్షణ వివేచన 'వేదనా వాసుదేవ పరిశీలన ల కేక 89. నాయని నవభావనల నగిషీ 30 4 నాయని వారి లఘు కావ్యాల్లో గురుత్వం ఎం. తై 5 నాయని సుబ్బారావు వర్ణనోజ్వల వైభవ విశేషాలు ౫ 6 నాయని వ్యక్తిత్వం ఎ ర్9
చేరా పుస్తకాలు
1975 తెలుగు వాక్యం : (పునర్ముద్రణ - 1999, 2002) 1978 వచన పద్యం : లక్షణ చర్చ
ఆచార్య సంపత్ముమారునితో వివాదం, సంయుక్త ప్రచురణ 1982 రెండు పదులపైన పద్యగేయ సంకలనం 1982 తెలుగులో వెలుగులు
భాషా పరిశోధన వ్యాసాలు : రెండో ముద్రణ 2002 1991 _చేరాతలు సాహిత్య విమర్శ - పరామర్శ
రెండో ముద్రణ 2003 1994 చేరా పీఠికలు 1997 ముత్యాలసరాల ముచ్చట్లు ఛందోవ్యాసాల సంకలనం 1998 ఇంగ్లీషు తెలుగు పత్రికాపదకోశం 2000 స్మృతికిజాంకం అనుభూతి వ్యాస సంకలనం 2000 భాషానువర్తనం భాషావ్యాసాలు 2001 భాషాంతరంగం భాషాపరిశోధక వ్యాసాలు 2001 సాహిత్య వ్యాస రింఛోళి 2001 కవిత్వానుభవం వ్యాససంకలనం 2001 సాహిత్య మహిళావరణం మహిళా చైతన్య వ్యాసాలు 2002 వచన వచన తత్త్వాన్వేషణ వ్యాససంకలనం 2002 సాహిత్య కిర్మీరం 2003 భాషాపరివేషం
- నాయని కవితా భూమిక
కధ కంచికి పోయినదా
వ్యధితాత్మత కధకుదింటి కరుగన్వలెనా
వృధుమత్సత్య కవిత్వ
(ప్రధాన మార్గమ్ము మూయబడినట్లేనా
- నాయని సుబ్బారావు కృతులు
నాయని సుబ్బారావు గారి కవిత్వానికి ప్రధాన (ప్రేరణ ఆత్మానుభూతి. గాఢమైన అనుభూతి కలిగినప్పుడే ఆయన హృదయాన్నుండి 'సౌభద్రుని ప్రణయ యాథ్రి, 'మాతృగీతాలు, 'వేదనా వాసుదేవము', “విషాద మోహనము, “జన్మభూమి' లాంటి ముఖ్యమైన కావ్యాలు వెలువడిన. మొదటి రెండు కావ్యాలు దాదావు సమకాలికాలు, సౌభద్రుని పణయయాత్రలో మొదటి భాగం పూర్తి అయిన తరువాత మాతృగీతాలు రచించారు. ఆ తరవాత ప్రణయ యాత్రలో రెండో భాగమైన ఫలశ్రుతి రచించారు. తొలి కృతులకీ వేదనావాసుదేవానికి మధ్యకాలంలో కొన్ని ఖండికలు రచించారు. వాటిల్లో ఆత్మానుభూతి కనిపించదు. అవికొన్ని “నాయని సుబ్బారావు కృతులు అనే వుస్తకంలోనూ, “భాగ్యనగర కోకిల అనే పుస్తకంలోనూ ఉన్నై ఇవి ఆయన ్రధాన కవితా మార్గంలో ఇమిదేవి కావు.
సుబ్బారావుగారి కావ్యాల్లో 'సౌభద్రుని ప్రజయయాత్రకు ఎక్కువ పేరు వచ్చింది. వత్సలా సౌభద్రులు ఈ కావ్యంలో నాయికా నాయకులు. భారతంలో పాత్రలకూ ఈ పేర్లకూ ఏమీ సంబంధంలేదు. స్వీయ ప్రణయమే ఈ కావ్యంలో వర్జితమయింది.
కవితాపరిణామ దృష్ట్యా ఉత్తరోత్తర కావ్యాలు మేలయినవి. అయినా ప్రణయ యాత్రలోని ముగ్గ సౌందర్యమే ఎక్కువ మందిని ఆకర్షించింది. ఇందుకు ఉద్యమ రూపంలో వచ్చిన భావకవిత్వ ప్రభావం ముఖ్యకారణం కావచ్చు. భావ కవిత్వం ఒక ఉద్యమంగా 1920-80 సంవత్సరాల నుధ్యకాలంలో విజృంభించింది. అప్పుడు శీరు తెచ్చుకొన్న కవులు అప్పటి కావ్యాల కర్తలుగానే వఠితల మనసుల్లో నిల్చి పోయారు. తరవాత ఎంత మంచి కావ్యాలు రాసినా అవి పాఠకుల మనసు సౌభ్మద భద కవితా వైవిధ్యం శ చేకూరి రామారావు
కెక్కినట్లులేదు. ఇటీవల సుబ్బారావు గార్ని గురించి వచ్చిన వ్యాసాలు, సంస్మరణ వాక్యాలు కూడా చూస్తే ఈ అభిప్రాయం బలపడుతున్నది. ఉద్యమ (ప్రభావం ఉంది. ప్రణయ యాత్రలో పద్యాలు భావకవిత్వ యుగంలో రచించినవి. విశ్వనాథ సత్యనారాయణగారి '“గిరికుమారుని (ప్రేమగీతాలు' ఆ కాలంలో (1920-1928) వచ్చినవే. వీరిద్దరి స్నేహం అందరికి తెలిసిందే. (ప్రేమగీతాల్లో సౌభద్రుని వ్రసక్తి ఈ విధంగా వస్తుంది. శ్రీ మధుర మూర్తులును చిరంజీవులైన యట్టి వత్సలా సౌభిద్రు లమృత (వణయ వారిరాళిని వుడినిటం బట్టినారు ఎతజి6గిన జనమ్ము నివ్వారయే ఖభజింవ
- గిరికుమారుని (యేమగీతాలు: ఖండిక-78 వీరిద్దరి మైత్రివల్ల ఈ రెండు కావ్యాల్లో (ప్రణయయాత్ర - (ప్రేమగీతాలు) పోలికలు కనిపిస్తే తీసుకున్న ఉపమానాల్లో వాడుకున్న సంకేతాల్లో ఎత్తుగడల్లో ఖండికల నిర్మాణంలో ఈ పోలికలున్నై, ఫాలం మీద నెలవంక, నముద్ర మథనం నదీ ప్రవాహం, పరమ శివుడు వంటి వస్తువుల (విషయాల) ప్రసక్తి ఈ రెందు కావ్యాల్లోను కనిపిస్తుంది. ఉదాహరణ ప్రాయంగా ఒక్క పోలిక మాత్రం చూద్దాం. ఆ వయోరాశళిలోం (దిలోకాతి భీక రముగ వివవన్నా వోలావాలము నముద్భ వించె నది యోర్చు గలిగి దేవీ / గళమ్ము నందు నిలివితి నేను జ్ఞానాక్ఫతినయి.
- గిరికుమారుని (ప్రేమగీతాలు: ఖండిక-6 అని సత్యనారాయణగారు శివుడితో అభేదం చెప్పుకున్నారు. వత్సలా ఫాలమున నెలవంక గుజుతు కందళలించి వికానించి కళలు దేరి తరుణ శారద దాకా నుధాకరాచ్చ బింబము లనంతములు లెక్కపెట్టు కొనాడు ఈ యమర్హ్వాచ్చ చం(దికలాన్ని నాళ్ళు నా తనువు ముంచుకొను నన్ని నాళ్ళు ఒక్క యీ శరత్తేమి నాది నదాళివత్వ వదని /
- నా.సు.కృతులు: ఫలశ్రుతి. ఖండిక 16 పేజీ. 120 సౌఖ్మద భద కవితా వైవిధ్యం ల చేకూరి రామారావు
అని సుబ్బారావుగారు శివుడితో పోలిక తెచ్చుకొన్నారు. రెండో మూడో, పద్యాలున్న ఖండికలలో ప్రతి పద్యం మొదటిపాదం ఒకే రకంగా మొదలు పెట్టడం ఇద్దరిలోనూ ఉంది. పద్య నిర్మాణ సామ్యాలు కూడా చూపించొచ్చు. సన్నిహితంగా మెలిగే ఇద్దరు కవుల రచనల్లో ఇట్లాంటి సామ్యాలుండటంలో ఆశ్చర్యంలేదు. ఎవరు ఎవర్ని అనుసరించారు అనే ప్రశ్న కిక్కడ ప్రసక్తి లేదు. ఇన్ని పోలికలున్నా సాహిత్య లోకంలో సౌభదుని వణయయా(్రకున్న గుర్రింవు గిరి కుమారుని (పేమగీతాలకు లేకపోవటం విశేషం. విశ్వనాధ తరవాత రచించిన గొవ్చ కావ్యాలవల్ల (మేమ గీతాలు మరుగునవడి పోయినై అని ఒక అభిప్రాయం ఉంది. ప్రణయయాత్ర తరవాత నాయని రాసిన కవిత్వమూ గొప్పదే. అదీగాక విశ్వనాధ తొలిరోజుల్లోనే రచించిన కిన్నెరసాని పాటలకు మంచి ప్రఖ్యాతే ఉంది. ప్రణయ కవిత్వానికి సరిపడే మార్దవం, అక్షిష్ట వాక్యనిర్మాణం, సద్యఃస్ఫూర్తి కలిగించే పదాలకూర్చు, వద్య నిర్మాణంలో సౌకుమార్యం ప్రణయ యాత్రలో ఉన్నై (ప్రేమగీతాల్లో సరిగ్గా ఇవే లోపించినై. ఉదాహరణకు (క్రేమ గీతాల్లో మొదటి ఖండికలోనే ఉన్న ఈ పద్యం చూడండి. విఫలిత వునఃవునః కృత వివిధయత్న భావిత వ్రచండ బాధా తథావిదారి తాన్మదీయ వృూదంతరం ఖందుం దోచె న్ఫురిత నంఫుల్ల నవజపాళోజనంధ్య
- గిరికుమారుని (ప్రేమగీతాలు: ఖండిక-1 ఇందులో కర్మణి రూపాలతో కూర్చిన విశేషణ బాహుళ్యం పద్యానికి క్లిష్టతను తెచ్చి పెట్టింది. భాషా కార్మశ్యం, భావక్షిష్టత కలిసిన ఈ పద్యం కూడా ప్రేమగీతాల్లోదే, తుంవురుల జల్లులందుం ద్విషాంవతి ఘృణు లొలనీ కిర్మీరతంబైన వ్వోమనీమ బైంద్ర కార్ముక ఖండ నవా(నమొవ్పి బిగురు తాడిగెను మింట మాఘవతలక్ష్మి
- గిరికుమారుని (ప్రమగీతాలు: ఖండిక-66 (వానజల్లుల మీద సూర్య కిరణాలుపడి ఆకాశమంతా ఇంద్ర ధనస్సులతో నిండి ఉంది) అని ఈ పద్యంలో భావం. అయితే త్విషాంపతి, మృణులు, ఐంద్ర సౌభ్యద భద కవితా వైవిధ్యం 3 చేకూరి రామారావు
కార్ముకఖందడసహ(స్రం వంటి మాటలకూర్చులు భావస్స్ఫూర్తి కలక్కుండా అడ్డు కుంటున్నై. అస్మద్ధృదబ్దమ్ము వంటి శబ్ద స్వరూపాన్ని మరుగుపరిచే సంస్కృత సంధు లంటే విశ్వనాథకు ఇష్టం.
విశ్వనాధ, నాయని కవిత్వాల తులనాత్మక పరిశీలన చెయ్యటం ఇక్కడ నా ఉద్దేశం కాదు. మొదటి కావ్యంకన్నా ఉత్తమమైన కావ్యాలు రాసినా మొదటి కావ్యానికున్న (ప్రశస్తి తగ్గకపోవటానికి కారణాలు వెతకటమే నేను చేసింది. ఈ విషయాలను స్పష్టపరచటంకోసం తొలి కావ్యాలకన్నా గొప్ప కావ్యాలు రాసిన ఇద్దరు కవులను, అందులోనూ సన్నిహితంగా మెలిగిన వారి రచనల్ని పోల్చి చూపాను.
సౌభద్రుని ప్రజయయాత్రలో ఇంకో విశేషం ఉంది. నాటి భావకవుల ప్రణయ కవిత్వమంతా అప్రాప్రమనోహరి చుట్టూ అల్లుకొన్నది. వారికి వారి 'ప్రజయదేవత లబ్ధి కావటానికి వీల్లేని విధంగా వారు (ప్రేమించారు. అందువల్ల వారి ప్రణయ కవిత్వంలో వర్ణితమయింది ఒక అంశం మాత్రమే. అందువల్ల అది అసంపూర్ణం. నాయని (ప్రణయానికి లబ్ధి ఉంది, ఆ తరువాత తన ఆనందాతిశయాన్ని వర్డిస్తూ పద్యాలు రాశారు. తను సాధించిన దానిమీద అపార గౌరవం వ్యక్తం చేశారు.
అంత (త్రమవడి పావన మభ్రగంగ
ధారుణికిం దెచ్చినాడు భగేరథుందు
అంత మధియించి కలశరత్నాకరమ్ము
అమృతభాందమ్ము వదనీ నా రమరవరులు.,
మత్సురానేక వుజ్యజన్ఫుములు వండి
జావ్నూవీ స్వచ్చవును నుధాస్వాదుమూర్తి
వైన నీ దివ్వ సాన్నిధ్య మందుకొంటి
వుడమికిన్ న్వర్ణమున కొకు ముడీ రచించి. అని తన విజయాన్ని గానం చేశారు. కవిత్వంలోనే కాక జీవితంలోనూ, జీవితాంతం వరకూ తన (ప్రణయిని మీద అదే గౌరవభావంతో ఉన్నట్లు ఆయన్ను వ్యక్తిగా ఎరిగిన వారికి తెలుసు. నాయని విషాదకావ్యాల్లో వేదన సామాన్య గుణమైనా వాటిలో వైవిధ్యముంది. పాతికేళ్ళ వయసులో తల్లిని పోగొట్టుకున్నారు. ఉన్న ఒకే ఒక్క కొడుకును సుమారు డెబ్బై ఏళ్ళ వయసులో పోగొట్టుకున్నారు. తల్లిని పోగొట్టుకున్న సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం శ్రీ చేకూరి దామారావు
తనయుని పసితనపు వేదన మాతృగీతాల్లో కనిపిస్తే ఎదిగిన కొడుకును పోగొట్టుకున్న తండ్రి పరిణత వేదన విషాద మోహనములో కనిపిస్తుంది. అతి సామాన్యమైన సంఘటనలే అక్షర రూపాన్ని తాల్చి కావ్యత్వాన్ని పొందినై. ఏను స్నానమ్మునకు బావి కేగినాను లేత నూర్భుని బంగరు వూతలందు మురియుచును తల్లి యొడ్డును ముద్దు గొనుచు అమ్మ యేదిరా యన్న వాయలలు నన్న
- నా.సు. కృతులు: మాతృగీతాలు. పేజి 152 ఈ పద్యంలో వర్ణితమయింది అతి సామాన్య సంఘటనే. తల్లిని కోల్పోయిన కవికి ప్రకృతిలో అచేతన వస్తువుల మధ్య కూడా తల్లీ బిడ్డల సంబంధమే కన్పిస్తుంది. అలలకీ, ఒడ్డుకీ అట్లాంటి సంబంధాన్ని కల్పించటం వల్ల ఈ సంఘటన కావ్యత్వాన్ని పొందింది. పైగా ఆ అలల చప్పుడు తన్ను అమ్మ ఏదిరా అని అడుగుతున్నట్టని పించింది. నహజమైన నంధుటనలకే కావ్యత్వాన్ని కల్పించే నేర్పు నాయని కావ్యాలన్నిటిలోనూ కనిపిస్తుంది. ఇది విషాద మోహనములో అత్యున్నత స్థాయికి పోయింది. అట్లాంటి ఒకటి రెండు సంఘటనలను విషాద మోహనములో నుంచీ ఉదహరిస్తాను. ఒక గడియారం చేతికి పెట్టుకోటానికి మనసయి కొనుక్కుంటే అయిన వాళ్లొకరు తనకు కావాలని తీసుకున్నారు. రెండోది ఎవరో దొంగిలించారు. కొడుకు సంపాదన పరుడయి ఒకటి కొనిస్తానంటే నాకివ్పుడేమవసరంలే ! అన్నారు. కానీ కొడుకు చనిపోయిన తరువాత ఆ గడియారాన్ని ధరించిన తండ్రి ఆవేదన ఈ పద్యంలో కనిపిస్తుంది. ఈనాడు నీగడియార మిట్లు ధరింబి నా తండ్రి ఆనాటి నీకోరి తీర్చగంటిరా య(ువుల్ తొరుగ / దీనిని ధరియించలేను వలదంచు తీయనులేను దీని యాగని కొట్టుకొనుట నీ గుండె తీరై ధ్వనించి ! గడియారపు చప్పుడును కుమారుని గుండె చప్పుడుతో పోల్చటంతో సాధారణ శోకం కావ్యత్వాన్ని పొందింది. సౌభ(ద్ర భద్ర కవితా వైవిధ్యం ర్ చేకూరి రామారావు
కొడుకు చనిపోయిన కొన్నాళ్ళకి నాయనికి 70వ జన్మదినం వచ్చింది. ప్రతి ఏటా కొత్తబట్టలు కొడుకు తెస్తే కట్టకునే సంగతి గుర్తు తెచ్చుకొని, ఆనాటి స్థితిని ఈ పద్యంలో వర్జించారు.
వచ్చు వచ్చగ వంచభక్ష్య వరమాన్న భోజనమ్మగుచు
వచ్చు నియ్యది యివ్వుదొలికి బూడిద పాతర! కమురు
బొచ్చెగవుల్ పుట్టినిల్లు ! కార్నల్పు బూతమ్ము! నేను
చచ్చిన రోజురా! నందన వియోగ శావదగ్ధుడను.
విషాద మోహనము 225 మధ్యాక్కర పద్యాల సంపుటి. మూడు మూడు పద్యాలు ఒక్క ఖండికగా విభజింపబడింది. నాయని వేదనా తీవ్రత అంకిత పద్వంలో కూడ కనిపిన్తుంది.
కొదుకులో కూతులో పోవ నడలడి. గూరి, తాటలును
తదపలై కాలమ్ము వెళ్ళబుచ్చెడు తల్లిదం(డ్రులకు;
వుడమి విషాద విశేష కావ్యముల్ పొంకించి, కరుణ
కడమలంటిన (ప్రాక్తనాధునాతన కవి కవీతతికి. మాతృగీతాల కన్నా విషాద మోహనములో వేదనా తీవ్రత వ్యక్తమవుతుంది. తేలిక మాటల్లో చెప్పాలంటే మాతృ గీతాల్లోది తెలియని వేదన, విషాద మోహనములోది తెలిసిన వేదన. మాతృనష్టం వల్ల కలిగిన గాయం మానటానికవసరమైనంత జీవితం ముందుంది. పుత్ర నష్టం వల్ల కలిగిన గాయం మానటానికి తగినంత జీవిత శేషం లేదు. మరీ ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎదిగిన కొడుకు పోతే దాన్ని మరిపించగల నంవభుటనలంతగా ఉండవు. ఈ రెండు విషాద కావ్యాలు చదివిన పారకుల అనుభూతిలో భేదం ఉంటుంది. మాతృగీతాలు చదివితే మంచి పద్యాలు చదివిన అనుభూతి మిగులుతుంది. మాతృగీతాల్లో కవి అనుభూతి పద్యశిల్పాన్ని మరపించే తీవ్రస్థాయికి పోయినట్టు కనిపించదు. విషాద మోహనము చదువుతున్నప్పుడు పద్య రచనా శిల్పం మీదికి మనసుపోదు. కవి వేదన పారకుడిలో సహవేదన కలిగిస్తుంది. చదువుతున్నంతసేపు కళ్ళనీళ్ళు పెట్టించగల శక్తి విషాద మోహనానికి ఉంది.
విషాద మోహనములోని వేదనా తీవ్రతకు ఇంకో కారణం కూడా ఉంది. మోహనుడి మరణం హఠాత్తుగా జరిగింది కాదు. శిథిలమయి పోయే జీవకణాల స్థానంలో కొత్తవి ఏర్పడని వ్యాధి మూలాన మరణించాడు. రోజు రోజుకూ సౌభద భద కవితా వైవిధ్యం 6 చేకూరి రామారావు
శిథిలమవుతున్న కుమారుడు కళ్ళముందు కనిపిన్తుంటే ఆవేదన దుర్భరమయినది. తనెక్కున కాలం బతకనని తెలిసిన మోవానుడి మాటలు కూడా ఈ కావ్యంలో వ్యక్తమయి గుండెల్ని విండివేసై.
వేదనా వాసుదేవము 1958-1962 మధ్యకాలంలో రచించారు. జీవితంలో తనకున్న బాధ్యతలన్నీ తీరకుండానే ఉద్యోగ విరమణ చేసిన తరుణం అది. కుమారుని చదువు పూర్తి కాలేదు. ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సి ఉంది. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు జరిగింది కావ్యరచన. ఈ రెంటికి కార్యకారణ సంబంధం సూచించటం నా ఉద్దేశం కాదు. అప్పటి కవి మానసిక స్థితికి దోహదకారులైన భౌతిక పరిస్థితులను చూపొను. 'మదింగంటగించుకొని నన్నజ్ఞాత వాసమ్ము పొమ్మన్నా వెందుకు?' అని వాసుదేవుణ్ణి (ప్రశ్నించారు.
వేదనా వాసుదేవానికి తెలుగు సాహిత్యంలోనూ, నాయని కవితా ప్రస్థానం లోనూ విశిష్టమైన స్థానం ఉంది.
ఇది శతకం కాని శతకం. 12 ఖండికలుగా విభక్త్రమయిన ఈ పుస్తకంలో ఒక్కో ఖండికలో 9 పద్యాలున్నై అంటే మొత్తం 108 పద్యాలున్నై. శతకానికి అష్టోత్తర శత సంఖ్య సాంప్రదాయికమే. శతకాల్లో కథ ఉండదు. ఏ పద్యాని కాపద్యమే చదువుకోవచ్చు. అయితే వేదనా వాసుదేవములో 12 సమఖండాల అంతర్విభజన ఉంది. శతకాల్లో మకుటం ఉంటుంది. అంటే ఏ పద్యానికైనా అంతంలో ఒకటే సంబోధన ఉంటుంది. ఇట్లా ఒకే సంబోధన ఉండటంవల్ల శతకమంతా ఒకేరకం పద్యాల్లో ఉంటుంది. అంతగా ఖేదించని పద్యాల్లో కూడా ఉండొచ్చు. అంటే ఆ మకుటం మార్పు లేకుండా వట్టే వద్యాలయి ఉండాలి. దాశరధీ శతకం ఉత్చలచంపకమాలల్లో ఉంది. ఆంధ్రనాయక శతకం సీస పద్యాల్లో ఉంది. అందువల్ల పద్యాల ఎన్నికలో స్వాతంత్ర్యం తక్కువ. గతి భేదానికి అవకాశం తక్కున. మకుట నియమం ఛందస్ స్వాతంత్ర్యాన్ని భంగపరుస్తుంది. వేదనా వాసుదేవంలో మకుటం లేదు. అందువల్ల వృత్తనియమం కూడా లేదు. శతకాలలో లేని ఖండాల అంతర్విభజన ఉంది. శతకం అంతటికీ ఒకే శోత ఉంటాడు. మకుట, వృత్త భేద నియమాలు బాహ్యానిర్మాణ ($4గడం6 96401476) భాగాలు. ఒకే శ్రోతనుద్దేశించి చెప్పటం అంతర్చిర్మాణం (6660 57401478) గా భావించొచ్చు. ఈ పద్ధతి (ప్రకారం వేదనా వాసుదేవము బాహ్యానిర్మాణాన్ని తృణీకరించిన శతకంగా భావించవచ్చు. బాహ్యానిర్మాణ నియమాల్ని పాటించక పోవడం వల్ల ఛందోవైవిధ్యం సాధ్యమయింది. దాన్ని అనుసరించి వ్యక్తీకరణ వైవిధ్యం. సౌభ్యద భద్ర కవితా వైవిధ్యం 7 చేకూరి రామారావు
వేదనా వాసుదేవానికి నాయని కవితా ప్రస్థానంలో కూడా విశేషమైన స్థానం ఉంది. మొదటి కృతులకు దీనికి మధ్య దాదాపు 30 ఏళ్ళ వ్యవధి ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని లఘు కృతులు రచించినా అవి నాయని ప్రధాన కవితా మార్గంలో ఇమిడేవికావు. అట్లా ఇమిడేవి ఉన్నా ఏవో ఒకటి రెండుంటై. ప్రణయ యాత్ర నాటి ముగ్ధకవి మహాకావ్యరచన చెయ్యబోయే ప్రొఢకవిగా దర్శమిస్తారు. వేదనా వాసుదేవములోని భావ (ప్రొాథిమకు ఈ కింది పద్యం ఉదాహరణగా (గ్రహించొచ్చు. భావము చియ్యవట్టి మెడవల్పజి మోర కుదించి తోక జెం డా వెన నెత్తి దర్ప వికటమ్ముగ గంతులువేయు కోడెయై నీవను కట్టు గొయ్యకడ నిల్వగ నేరదు పొళుపాల్య ల క్షీ విభవాభిరామ గుణసేవధివై, యిదియేమి గోవతీ ౫ భగవంతుడి దశావతారాలను వేషాలుగా చమత్మరించి ప్రతి పదంలోనూ ఉక్తివైచితిని సాధించింది ఈ కింది పద్యం. చదువులు తెచ్చి యమ్మునలిజందెవు పోగునకిచ్చి చేపవై, మదవతివై నుధన్ కనులు (మాలని దయ్యములాన వంచి, మ ట్టి దినును బుట్టబొమ్మ నాక ఠీవిగ కొమ్ముననెత్తి దంస్రీవై విదిత మవోనుభావములు వేషము లిమ్మెయి నెన్ని తాల్చవో + ఈ పద్యంలో ఆయా నామాలకు పర్యాయాలుగా వాడిన శబ్దాలు, శబ్ద సంయోజనలు నిఘంటువుల నుంచి (గపొంచినవి కావు. కేవలం కవిసొంతమే. ప్రతిపర్యాయ పదంలోను క్తి వైచిత్రి సాధించబడింది. జన్మభూమి నాయని సుబ్బారావుగారి కావ్యాల్లో చివరిదీ, పెద్దదీ, గుణంలో గొప్పదీ. రచనా వైవిధ్యమున్నదీ. ఈ కావ్యరచనకు పొదిలెసనీమ దండకవిలె నుంచి కూడా కొంత సమాచారం సేకరించిట్లు పీఠికవల్ల తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న పొదిలె గ్రామం సుబ్బారావుగారి జన్మభూమి. ఇతర జనవదముల నేను వ్రవాసినై మజచియైన మేను మజచిలైన కన్నతల్లి పొదిలె యున్న దిక్కున కాళు లుంచి యెవుదడు వవ్వళించలేదు. సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 8 చేకూరి రామారావు
తన జన్మభూమి మీద సుబ్బారావుగారి కంత గౌరవభావం, ఆ గాధానుభూతే జన్మభూమి మీద కావ్యం రాయించింది. దీని ప్రారంభం నుమారు 1960లోనే జరిగింది. 1978 ప్రాంతంలో ఈ రచన పూర్తి అయింది. ఇందులో ప్రకృతి, తటాక, ధరణీధర, శక్తి, శివ అని అయిదు ఖండాలున్నై. బాలకేళి అని ఆరోఖండం రాయాలని వారికెంతో కోరికగా ఉండేది. కాని చివర్లో అనారోగ్యం, ఆ తరువాత మృత్యువు రావటం వల్ల బాలకేళీ ఖండం మనకు దక్కలేదు. జన్మభూమి ఇంతవరకూ వచ్చిన ఏ కావ్య (ప్రక్రియలోనూ ఇమడదు. (ప్రకృతి ఖండంలో పాదిలె పరిసర ప్రకృతిని తనబాల్య స్మృతుల ఆధారంగా వర్ణించారు. ఈ ఖండాన్ని చిత్రకళలో 'ల్యాండ్‌స్కేప్' చిత్రణతో పోల్చవచ్చు. మిగతా ఖండాల్లో ఆ ప్రాంతాల దేవతలు, అక్కడ ప్రచారంలో ఉన్న గాధలు వర్ణించారు. వర్ణనలు చేసినచోట ఇది వ్రబంధమనిపిన్తుంది. దేవతలను గురించి వర్జించినచోట స్థలపురాణ మనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చిన రకరకాల ఉపాఖ్యానాలతో పురాణం అనిపిస్తుంది. ఏ ఒక్క ప్రక్రియకీ ఒదగని కావ్యం ఇది. కవి చెప్పదలచుకున్న దానికి ఇప్పటి వరకూ ఉన్న ఏ కావ్య ప్రక్రియా చాలలేదు. ఆయా ధోరణులన్నిటినీ ఇముడ్చుకోగల కావ్య(ఫప్రక్రియ అవసరమయింది. ఈ కావ్య రూపం మీద, ఈ కావ్యంలో శిల్పసంపద మీద తగినంత పరిశోధన చెయ్యకుండా ఇప్పుడప్పుడే చెప్పటం సాధ్యం కాదు. కవి వర్ణనా చాతుర్యానికి ఒక పద్యం మాత్రం ఉదాహరిస్తాను. ఇది ధరణీధర ఖండంలో వర్నావర్ణనలోది. అగ్గీకి కాయుకరానట్టి కొయ్యల తది పొగచూరి యన్నమ్ము పొందు దవ్వి నాలుకతీవీకై నంజుకో నమరిన తీరు బెల్లవుటచ్చు నీరుకాటా కరకరల్యో దూదిగతి మెత్తనై చెదె చిజు తిండికేర్పడ్డ బొరుగులెల్ల నప్పుడప్పుడు నోటి త్రుప్పు డుల్లగజేయు వందు రేగడ బూజువట్టి పోయె నా నిరంతర వర్షాధారా నిశాంత శీతలత్వోవవాతి కువ సెనగలైన సౌభ్యద భద్ర కవితా వైవిధ్యం 9 చేకూరి రామారావు
లేక తలబైట పెట్టంగ రాక తిండి తివ్చులకు నగచాట్లయి తెరల జనము
- జన్మభూమి; ధరణీధర - 47
ఈ ఘట్టంలోనే 45, 46, 48 పద్యాలు కూడా కవి పరిశీలనాపటిమను వ్యక్తంచేస్తై. అట్లాగే తటాక ఖండంలో 101 నుంచి 132 వరకూ ఉన్న తాటితోపు వర్ణన కూడా ఈ సందర్భములో చూడదగింది. మనం మామూలుగా చూసేవే అయినా కవి వాటికి కావ్యత్వం కల్పించిన తీరు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అట్లాగే (ప్రకృతి ఖండంలో 84 నుంచి 42 వరకు చేసిన శిలావర్జన కవిభావనా శక్తికి ఉదాహరణలు.
ఈ కావ్యంలో వైవిధ్యం కోసం వాడిన వృత్తాల సంఖ్య కూడా ఎక్కువ. వృత్తాచిత్యాన్ని గురించిగాని, కథాకథన శిల్పం గురించిగాని ప్రత్యేక పరిశోధన చేసిన వాళ్ళు చెప్పటమే సబబు.
నాయని సుబ్బారావుగారు కొన్ని లఘుక్ఫతులు రచించారని పైన ప్రస్తావించ బడింది. కార్తెలమీద, సంవత్సరాది మీద రాసినవి కొన్ని అయితే, మరికొన్ని ప్రథమ స్వాతంత్ర్య సమరం నాటి ఒక గాధ, చిత్తరంజన్‌దాస్, గాంధీ, బోను, నెహ్రూ, పటేల్ మొదలైన వారి మీద రాసిన పద్యాలు కొన్ని ఈ పద్యాలు మంచి పద్యాలే అయినా ఆయా సంఘటనల వాస్తవిక పరిశీలన వీటిలో కనపడదు. ఒక కాల్పనిక కవి స్పందనే మనకు కనిపిస్తుంది. 1947 ఆగష్టు 15న రాసిన పద్యాలు ఇందుకు చక్కని ఉదాహరణలు.
కారు మబ్బుల నల్ల కప్పు వేనిన నింగి
పారతంత్ర్ర తమన్సు పొముకొన్న ధరితి
కలికి రాయంచ రెక్టులు వివ్వుకొనియెనో
తెలిదమ్మి వూల రేకులు కవ్చుకానియెనో
ఎన్నాళ్ళ కెన్నాళ్ళకీ మవోదయ దీవ్తి
కన్నార గాంచు భాగ్యము గల్లె మన కవో
రాయంచ రెక్కలు విప్పుకోటం, భూమి తెల్లతామర రేకులు కప్పుకోటం అచ్చమైన కాల్పనిక ధోరణి కల్పనలు. సౌఖద్ర భద కవితా వైవిధ్యం 10 చేకూరి రామారావు
ఈ పైన చర్చించినవి 1958లో అచ్చయిన నాయని సుబ్బారావు కృతులు రెండవ భాగంలోవి. ఆ పుస్తకానికి రాసిన వీరికలో ఇదినా సర్వకృతుల సంకలిత సంపుటి అని రాసుకున్నారు. అంతటితో తన కావ్య రచన అయిపోయినట్టు భావించినట్టుంది. ఆ పుస్తకంలో చిట్టచివరి ఖండిక అయిన వృధు మత్పత్వ కవిత్వ (ధాన మార్గమ్ము మూయబడినట్లోనా అని చెప్పుకున్నారు.
కాని తరువాత కొన్ని ఖండికలు ఖాగ్యనగర కోకిల అభినవ శ్రీక్ళష్తలీలలు వంటి పద్యాలు కొన్ని రేడియో వాళ్ళకు మరి ఇతరత్రా రాసిన పద్యాలు కలిపి 1966లో భాగ్యనగర కోకిల అనే పుస్తకంగా అవతరించింది. ఇందులో సామాజిక విషయం ఉన్న ఉచ్చిష్ట భారతము అనే ఖండిక కూడ ఒకటి ఉంది. ఎంగిలాకుల్లో అన్నం ఏరుకుతింటున్న కుర్రవాణ్ణి వర్ణించారు. అందులో చిట్టచివరి పద్యంలో కాల్బనిక ప్రపంచాన్ని వదలి వాస్తవిక ధోరణికి వస్తున్నారా అన్న ఆశ కల్పించే ఈ కింది పద్యం ఉంది.
అతడు ముకళ్తనంగుదౌను కా దది నరే
వ్రగతి వంట విరగ ఐండెనన్న
ఐం(ద్ర జూలికోక్తి కవవాద మతదన్న
కజతురేల (వ్రభుత మెజయు దొరలు
ఆ పుస్తకంలో ఇది చివరి వద్యం. కాల్పనిక మార్గంలో ఉన్న కవులు ఇట్లాంటి పద్యాలు అప్పుడప్పుడు రాసినా అవి వారి వారి ప్రధాన కవితా మార్గాల్లో ఇమిడేవికావు.
భాగ్యనగర కోకిల అనే సంపుటిలో కొన్ని చక్కని చిక్కని వద్యాలు, సున్నితమైన వోస్యం చిలికే పద్యాలూ ఉన్నా అవి ఆయన అల్ప రచనలుగానే గుర్తించబడతై. మిగాతా కావ్యాలతో పోలిస్తే వాటికి అంత చెప్పకోదగిన స్థానం
ఉంటుందని చెప్పలేము. వేదనా వాసుదేవము, విషాదమోహనము, జన్మభూమి వంటి గొప్ప కావ్యాలు రాయబోయే కవి చేసిన రచనాభ్యాసంలాగే భాగ్యనగర కోకిలలో పద్యాలకు గుర్తింవు ఉంటుంది.
మొత్తం మీద తెలుగు సాహిత్యంలో నాయని సుబ్బారావు గారి కవిత్వానికున్న
స్థానం ఏమిటి? అనే ప్రశ్నకు ఇప్పుడప్పుడే నమాధానం చెప్పటం కష్టం. ఈయన గురజాడ, శ్రీశ్రీల వలె కవితా విప్లవ నేతృత్వం వహించలేదు. విశ్వనాథ సత్యనారాయణ గారిలాగా తానే ఒక ఉద్యమం అయి సాహిత్య సమరం సాగించలేదు. శిష్యకోటిని సౌభద భద్ర కవితా వైవిధ్యం 11 చేకూరి రామారావు
తయారుచేసుకోనూ లేదు. (ప్రాచీనాధునాతన కవుల్లో ఎవరో ఒకర్ని ఒరవడిగా పెట్టుకొని కవితా రచన చెయ్యలేదు. వీరి కవిత్వంలో సాంఘిక చైతన్యం వెతకటం అర్ధంలేని వని. కాలేజి చదువులు వదిలేసి జాతీయోద్యమంలో దూకిన ఈ కవిమీద ఆ ఉద్యమ (ప్రభావం ఏమంత ఉన్నట్టు కనపడదు. సౌభద్రుని ప్రణయాత్రమీద సాహిత్యోద్యమ ప్రభావం ఉన్నా ఈ కావ్యం ఆనాటి ఇతర భావకావ్యాలకన్నా భిన్నమైంది. ఇతర కావ్యాలమీద ఆ ఉద్యమ ప్రభావం కనిపించదు. ఆయన మాటల్లోనే చెపితే సుబ్బారావుగారిది *పృథుమత్సత్య కవిత్వ ప్రధానమార్గం'. తెలుగు సాహిత్యంలో ఏదో కోవకు చెందినట్టు కనిపిస్తూ ఏమూసలోనూ ఇమడని అపూర్వ కావ్యాలు రచించారు నాయని. నాలుగైదు పద్యాలు రాసి అవి తెచ్చిన ప్రఖ్యాతితో జీవితాన్ని గడపలేదు. “బండెడు చెత్తను ఛందశ్చండముగా పోగు” చెయ్యలేదు. “మా నాయని వ్రాసిన దంతా బంగారమే” అని కృష్ణశాస్త్రిగారి చేత అనిపించుకున్న కవి.
ఉద్యమ కవులకున్నంతమంది పాఠకులు బహుశా నాయనికి ఉండరు. అచ్చమైన కవిత్వాన్ని ఆదరించే పాఠకులున్నంత కాలం నాయని కవిత్వం నిలుస్తుంది. కాని కవితా ప్రస్థానంలో ఆయన సాధించవలనినవి ఇంకా మిగిలే ఉన్నట్టు కనిపిస్తుంది. వేదనా వాసుదేవము రెండో భాగం కూడా మొదలు పెట్టి సగమే (57 పద్యాలు) వ్రాశారు. జన్మభూమికి బాలకేళీఖండాన్ని చేర్చాలన్న కోరిక తీరనేలేదు.
కాని జీవిత ప్రస్థానంలో 79 ఏళ్ళకే అలసిపోయారు. పదేళ్ళ కిందట ఉన్న ఒక్క కుమారుణ్జీ, ఇరవై రోజుల కిందట మూడో అల్లుణ్జీ పోగొట్టుకున్నారు. 1978 జులై 8వ తేదీ ఉదయం 7-10కి శాశ్వతంగా విశ్రమించారు. కవిత్వంలో బంగారు పంట పండించిన నాయనిది పరిపూర్ణ జీవితం.
నావల్నీ రమణీ నుధా ప్రణయితానందమ్ములం దేలితిన్
నా వుత్రీ విదుషీ యశో వినర విన్యానమ్ములం బొంగితిన్
నా పుట్టెల్లను వందె నీదు చలువన్ మానాథ / నంసార సౌ
ఖ్యాపూర్హమ్ముగ నేమి కావలయునయ్యా యింక నాకిచ్చటన్.
- వేదనా వాసుదేవము
(విషయ సేకరణలో సాయపడ్డ నాయని కృష్ణకుమారి గారికి, వ్యాసం డిజైన్‌లో మార్పులు సూచించిన వెల్చేరు నారాయణరావుగారికి ఒకటి రెండు సవరణలు చేసిన భూమయ్యకూ కృతజ్ఞతలు) సౌభద భద్ర కవితా వైవిధ్యం 12 చేకూరి రామారావు
నాయని సుబ్బారావు గౌరి కావ్యాలు:
-
'సౌభద్రుని పజయయాత్ర 1985, 1948, 1970.
-
“మాతృగీతాలు', 1929, 1958.
-
నాయని సుబ్బారావు కృతులు, 1958 (“సౌభద్రుని ప్రణయయా(త్ర, “మాళ్ళగీతాలు' కాక మరి కొన్ని ముక్తకాలు కూడా కలిపి వేసిన పుస్తకం) త్న భాగ్యనగర కోకిల 1966. 5, _ వేదనా వాసుదేవనము, 1964, 1970.
-
_ విషాదమోహనము, 1970 జన్మభూమి, 1978. అరుణతార 2978 జూన్-నవంబరు నంచిక సౌళద్ర భద కవితా వైవిధ్యం 13 చేకూరి రామారావు
-
శతకలక్షణ వివేచన 'వేదనా వాసుదేవ' పరిశీలన శతక వాబ్మయానికి తెలుగు సాహిత్యంలో ఉన్న విశిష్టతను స్పష్టం చెయ్యాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఆ అవసరమే ఈ వ్యాసానికి ప్రధాన (ప్రేరణ. తెలుగులో శతక లక్షణాల్ని గురించి నాలో ఆలోచనలు (క్రేరేపించిన “వేదనా వాసుదేవము' అనే శతకాన్ని ఈ దృష్ట్యా పరిశీలించటం మరో ప్రయోజనం. తెలుగులో శతకం అనగానే మకుటాన్ని గురించి మాట్లాడటం మన అలవాటు. తెలుగులో శతకానికి నన్నయగారినే మొదటి వారని చేసిన సంప్రదాయం కూడా మనకుంది. భారతం ఆదిపర్వంలో ఉదంకోపాఖ్యానఘట్టంలో “మాకు బ్రసన్నుదయ్యెదున్ అని అంతమయ్యే రెండు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలు ఉన్నాయి. అందులో చంపకమాలను ఉదాహరణ'ప్రాయంగా చూడండి. బవువన పొదపాట్టికుల వర్వత పూర్ణ నరస్ఫరస్వతీ నపాత మవో మహీభరమజన్ర నవాస్ర ఫణాళి దాల్సి దు నృహతర మూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యరైన య య్యపాపతి దుష్కుతాంతకు దనంతుడు మాకు (బ్రనన్నుదడయ్యెడున్. అయితే ఈ పద్యాలను శతక మూలంగా భావించడం (భ్రమ మూలకం. ఈ పద్యాలలో సంబుద్ధి (&46/883) లేదు. పైగా నాలుగు వద్యాల్లోనూ (శోతలుగా ఉద్దిష్టులైనవారు వేరు వేరు. పద్యాంత సమత్వాన్ని మాత్రమే శతక లక్షణంగా భావించడమే ఈ (భమకు మూలమనుకుంటాను. నన్నెచోడుడి కుమారసంభవం దశమాశ్వాసంలో 90 నుంచి 99 వరకు పది స్తుతి పద్యాలు దారిద్ర్య విద్రావణా అనే మకుటంతో ఉన్నాయి. ఇవి శార్జూల మత్తేభాలు. అందులో తొమ్మిదో పద్యం ఉదాహరణగా చూడండి. సారాచార విచార దక్షులమల జ్ఞాన క్షణోద్వీక్షణ (సారంభాత్ళు కులాత్ళ నిన్ను నెనయన్ భావించి దుర్వార నం సారాంభోనిధి పాఠ మెయ్టు నుమవా త్చౌఖ్యాత్సులై మర్షులా ధారాధేయ విముక్తి యుక్తులగుదుర్ దారిద్ర విద్రావణా సొభద్ర భద్ర కవితా వైవిధ్యం 14 చేకూరి రామారావు
ఇందులో సంఖ్యా నియమం అట్లా ఉంచితే సంబుద్ధి ఉంది. ఆది పద్యాంత సమత్వ మకుటరూపంలో ఉంది.
తెలుగులో మల్లికార్జున పండితారాద్యుని శ్రీగిరి మల్లికార్జున శతకం మొదటిదని పండితుల ఊహ. అయికే అందులో ఒకే ఒక పద్యం దొరుకుతుంది. అది ఇది:
లోకములెల్ల నీ తనువు లోనివ, నీవట యెంత కల్టుదో
నాకప వద్దు నంభవ జనార్దను లాదిగ నెల్ల పెద్దలున్
నీ కొల దింత యంతయన నేరక మొక్కు దొడంగిరన్న ని
న్నేకరణిన్ నుతింతు బరమేళ్వర శ్రీ గిరిమల్లికార్డునా
ఒక పద్యాన్ని బట్టి దీన్ని శతకమనవచ్చునా అంటే లాక్షణికులు ప్రత్యేకంగా ఉదాహరించిన దాన్ని బట్టి అది (గ్రంధాంతర్భాగమే అయివుంటుందంటారు పరిశోధకులు.
శతక వాబ్బయంలో పూర్తి గ్రంధంగా సంఖ్యా నియమం(109) తోనూ మకుట సహితంగానూ దొరుకుతున్నది వృషాధివ శతకం. పాల్కురికి సోమనాధుడు (1170-1240) రచించిన శతకమిది. పెక్కుభాషల్లో పద్యాలు రచించటం ఈ శతకంలో ఒక విశేషం. తమిళ, కన్నడ, ఆరెమరారి, జాను తెలుగు, సంస్కృత, మణిప్రవాళ భాషారీతుల్లో పద్యాలందులో ఉన్నాయి. అందులో ఈ కింది పద్యం అచ్చ తెలుగు లక్షణ చర్చలో తరచు ఉదాహరిస్తుంటారు.
బలుపొదతోలు సీరయును, పాపనరుల్స్ గిలుపారు కన్ను వె
న్నెలతల, చేదు కుత్తుకయు, నిండిన వేలువు టేరు, పల్గువూ
నలుగల రేని లెంకవని జాను తెనుంగున విన్నవించెదన్
వలవు మదిం దలంతు బనవా ఐనవా బనవా వృషాధిపా.
అచ్చ తెలుగు కావ్య సమగ్ర నిర్వచనానికి పద్యం చాలకపోయినా అచ్చ తెలుగు కావ్యాల్లో పద సృష్టి తత్త్వ పరిశీలనకు ఉపయోగిస్తుంది. సాధారణంగా భక్తి శతకాల్లో కనిపించే అనుప్రాసలు, యమకాలు, ముక్త్రపదగ్రస్తలు వంటి భాషావ్యూవహాలు ఈ శతకం లోనే మనకు కనిపిస్తాయి. అంటే ఈ శతకం ఒట్టిగా మొదటి శతకమనే కాదు మొదటి సమగ్ర సంపూర్ణ శతకం అని కూడా చెప్పవచ్చు.
శతకాలు సంస్కృతంలోను, కన్నడాది భాషల్లోనూ ఉన్నాయి. పద్య సంఖ్యను బట్టి కావ్యభేదపరిగణనం సంస్కృతాలంకారికులూ సకృృత్తుగా చేశారు. 'శతేన శతకం ప్రోక్తమప్టోత్తర శతం” అని 18వ శతాబ్దపు అమృతానందయోగి అలంకార సంగ్రహంలో సౌభద్ర భద కవితా వైవిధ్యం 15 చేకూరి రామారావు
పేర్మాన్నాడు. (గోపాలకృష్ణారావు, 1976). తెలుగులో “శతకమననొప్పు మటి పద్య శతము గూడి” అని విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణిలో అన్నాడు. అనంతా మాత్యుడు “వెలయు శతకమన, వెండి యష్టోత్తర శతకమనగ” అని రెండు వేరు వేరుగా చెప్పడం బట్టి పద్య సంఖ్యాపరిగణన దృష్ట్యా మాత్రమే. ఆ మాటకొస్తే ఆ శతక ప్రస్తావన చేసిన ఆలంకారికులంతా సంఖ్యా పరిగణనకే ప్రాధాన్యమిచ్చారు. అప్పకవి శతకాన్ని గురించి ఆసలు ప్రస్తావించనేలేదు.
కోరాడ రామకృష్ణయ్యగారు, నిడుదవోలు వెంకటరావు గారు దీన్ని సంస్కృత (ప్రేరణ ఉన్నా దేశి కవితాశాఖగా పరిగణించారు. తెలుగువారు దీన్ని పెంచి పోషించారు. (6౧|౦|| చేశారు) అని వారి భావం. ఇది తెలుగు వారికి ఇష్టమైన కావ్య ప్రక్రియగా కనిపిస్తుంది. తెలుగులో ఏ ముహూర్తాన బయలు దేరిందో గాని అవిచ్చిన్నంగా ఇప్పటికీ సాగుతున్న ప్రక్రియ ఇది. ఇతర భాషల్లో శతకాల సంఖ్య వందల్లో ఉండొచ్చు. కాని తెలుగులో వేలల్లో ఉన్నాయి. తెలుగులో పద్య రచన చేయగలిగిన ప్రతికవీ శతకం రాసి ఉంటాడని సాధారణీకరణం (36౧622440౧) చేయగలిగిన పరిస్థితి ఉంది. గణాంక పరిశోధన (94291021 96౧/69౧ చేస్తేగాని ఈ విషయం నిర్ధారించలే మన్నమాట నిజమే గాని, యాదాలాపంగా ఆలోచిస్తేనే విచిత్రమైన విశేషాలు కనిపిస్తాయి. ప్రాచీనుల సంగతి అట్లా ఉంచండి. అందులో ఎన్ని నిలిచాయో ఎన్ని క్రిమిదష్టమైపోయాయో చెప్పలేము. వంగూరి సుబ్బారావుగారు మొదలుకొని కె. గోపాలకృష్ణారావుగారి వరకు శతకాల సేకరణ చేశారు గాని వారి పని పూర్తయిందని చెప్పలేం. ఆధునికులు కూడా చాలా శతకాలు రచిస్తున్నారు. భక్త చింతామణి శతకకర్త వద్దాది సుబ్భారాయుడుగారి వంటి తొలినాటి కవుల్ని వదిలేసినా, విశ్వనాథ సత్యనారాయణగారి వంటి మలినాటి కవుల్ని విస్మరించినా ప్రధానంగా గేయకవి అయిన శ్రీశ్రీ (సిరిసిరిమువ్వ శతక కర్త), ప్రధానంగా వచన కవి అయిన దేవి ప్రియ (గరీబు శతక కర్త) వరకు శతక కర్తలు కనిపిస్తున్నారు. తెలుగులో పద్య రచన ఉన్నంత కాలం శతక రచన ఉంటుందని ఒక సూత్రీకరణ చెయ్యటానికి అభ్యంతరం లేదనుకుంటాను. ఇప్పటికే “ఇన్నా అల్లా అనే మకుటంతో గీటు రాయి అనే తెలుగు ముస్లింల వారపత్రికలో ఒక కంద శతకం అచ్చవుతున్నది. ఈ సందర్భంగా అవాంతరంగా ఒక చిన్న విషయం స్పష్టత కోసం చెప్పుకోవాలి. సంఖ్యా పరిగణన సాధ్యంగాని కవితారూపంలో శతకం ఉండదు. వచనంలో శతకం ఉండదు. వచన కవితలో శతకం ఉండదు. కనీసం ఇంత వరకు లేదు. అయితే పాద సంఖ్యానియమం ఉన్న పద్ధతి ఏదన్నా వచన కవిత్వంలో (ప్రభవిస్తే అందులోను సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 16 చేకూరి రామారావు
శతకం రావచ్చు. గేయాల్లో శతకాలు రాలేదు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రసిద్ధ గేయ కృతుల్లో పాద సంఖ్యానియమబద్ధమై, గేయ సంఖ్యాపరిగణన సాధ్యమైన గేయ కవిత్వం రాలేదు. ఆధునిక గేయ కవిత్వంలో అట్లాంటి పరిగణన ఒక ముత్యాల సరానికి సాధ్యమవుతుందనుకుంటాను. ముత్యాల సరం నాలుగో పాదం సాధారణంగా పొట్టిగా ఉండి పద్యం (గేయం) ముగింపును సూచిస్తుంది. (- చేస్తుంది) సమమాత్రాక పాదాలున్న గేయాల్లో వృత్తాల్లో లాగ నాలుగు పాదాల నియమం సంప్రదాయంగా ఏర్పడలేదు. ముత్యాలసరాని కట్లా ఏర్పడింది. అయితే ముత్యాల సరంలో శతకాలు వచ్చాయో లేదో ఇప్పుడు నేను చెప్పలేను. రావటానికి అనుకూలమైన ఛందస్సౌలభ్యం అందులో ఉంది.
ఈ సందర్భంలో అవాంతరంగా ఒక చిన్న సందర్భోచితానుభవం ప్రస్తవిస్తాను. 1988 నవంబరులో తిరువనంతపురంలో సాహిత్య అకాదమీ వారి అనువాద కర్మాగారంలో “శరణమయ్యప్పా” అని ముత్యాలసరం నాలుగో పాదం మకుటం నేనిస్తే అక్కడి తెలుగు సాహిత్య కార్మికులు (0210102019) పద్యాలు పూరించారు. అయితే అవి నూరు కాలేదు. శతక ప్రక్రియ ముత్యాల సరానికి విస్తరించటానికి నిర్మాణగతమైన అడ్డంకులు లేవని చెప్పటమే ఇక్కడ నా ఉద్దేశం.
తెలుగు సాహిత్యంలో శతకం ఇంతగా ఆదరణ పొందటానికి, ఇంకా పొందుతుండడానికి కారణాలు అన్వేషించాల్సిందే.
ప్రాచీన సాహిత్యం కథా ప్రధానం. అందులో కవి స్వానుభవాలను, అనుభూతులను (1861009 ౧6 ఆగాం[0గ9) వ్యక్తం చెయ్యడానికి అక్కడ అవకాశం తక్కువ. పాత్రల ముఖంగా చెప్పాచ్చుగాని, అది చాలా పరిమితం. పైగా రసభంజకతకు, అనౌచిత్యానికి దారి తీయవచ్చు. అవతారికలో కొంత కొంత సాధ్యమే కాని అదీ పరిమితే. అందువలన కధా కావ్యాల మూసనుంచి బయటపడి తన మానసికాందోళనలను, వేదనలను, అనుభవాలను, అనుభూతులను వ్యక్తం చేసుకోటానికి (ఒక 6౪౪20౧0గా, ఒక [86 గా) ఈ శతక ప్రక్రియ పనికొచ్చింది. చాటువులు కూడా ఇందుకు పనికి రావచ్చుగాని, అవి కేవల ముక్తకాలు. వాటికి గ్రంధస్థితి లేదు. భావగాఢతను వ్యక్తీకరించడానికి ముక్తక పరిమితిని దాటాలి. భావ వైవిధ్యానికి కూడా ముక్తక పరిధి చాలదు. అందువల్ల కవి తనభావాలను స్వేచ్చగా వ్యక్తం చెయ్యడానికీ, వాటికి గ్రంధస్థితి కల్పించటానికీ, శతకం అనువుగా అక్కరకొచ్చింది. అంటే దీని ఆత్మాశ్రయత్వమే దీని ఐలం అన్నమాట! తెలుగు శతకారంభం చూస్తే, వాటి మూలాలుగా ప్రతిపాదితమైన వాటిని గమనిస్తే శతకానికీ, భక్తి భావానికి అధిక సంబంధమున్నట్టు కనిపిస్తుంది. సౌభద భద్ర కవితా వైవిధ్యం 17 చేకూరి రామారావు
తొలి శతకాలేకాక ప్రసిద్ధ శతకాలన్నీ కూడా (వేమనశతకం, భాస్మరశతకం, సుమతీ శతకం వంటి అపవాదాలు కొసి భక్తి శతకాలు కావటం విశేషం. తెలుగు కవిత్వంలో భక్తి సంప్రదాయం బలమైనది. భక్తి భావంలో ఒక స్వేచ్చ ఉన్నది. ఒక నమ్మకం ఉన్నది. నమ్మకం ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. స్వేచ్చ స్వచ్చందతనిస్తుంది. ఈ రెండూ కలిసి నిజాయితీకి దోహదం చేస్తాయి. ప్రాచీన కాలంలో రాచరికం బలమైన వ్యవస్థ. అది కవుల్ని ఆదరించింది, ఆగ్రహించింది. అనుగ్రహించింది కూడా. రాజులతో కాని, సంఘంతో గాని వైరుద్ధ్య మేర్చడ్డప్పుడు ప్రాచీన కాలంలో మనిషికి ఓదార్పు, ఆత్మ విశ్వాసం ఇయ్యగలిగిన శక్తి భక్తికి ఉంది. బహుశా ఆ కారణంగా ప్రాచీన శతకాల్లో ఉత్తమ కవితా స్ఫూర్తి ఉన్న శతకాలన్నీ భక్తి శతకాలే. ఆ సంప్రదాయం అంతరించలేదు. కాని రాను రాను శతకాల్లో ఇతర రీతులూ (ప్రవేశించాయి. అంటే శతకాల్లో భక్తి ప్రాచీనమనీ, లౌకిక (66006110 దృష్టి అర్వాచీనమనీ భావించవచ్చు. ఆధునిక కాలంలో లౌకిక దృష్టి పెరిగినా శతకంపై మోజు తీరలేదు. అందువల్ల పాత ప్రయోజనంతో కొత్త ప్రయోజనాలు (౪01010౧9) ఏర్పడ్డాయి. భక్తిలోనూ మార్పులు వచ్చాయి. భక్తి శతకాల్లో కూడా లౌకిక దృష్టి మానవీయత ప్రవేశించాయి. కామితాల కోసం భగవంతుని స్తుతించటం ఒక మార్గం అయితే భగవంతుని అత్యంతాత్మీయంగా సంబోధించటం, అధిక్షేపించటం, ఎత్తిపొాదవటం (ఇవన్నీ భక్తితోనే) తరువాత శతకాల్లో కనిపిస్తాయి. శతకేతర సాహిత్యంలోనూ ఇవి ఉన్నాయి. దాశరథీ శతకం, రామదాసు కీర్తనలు ఇందుకు మంచి ఉదాహరణలు. శతకాలు లౌకికమైన తరువాత అందులో నీతులూ, బూతులూ రెండూ కనిపిస్తున్నాయి. కవి చౌడప్ప శతకం అందుకు ఉచిత ఉదాహరణ. పూర్వం భక్తి శతకాలు చాలా వరకు కవి పరిణత స్థితిలో రాసినట్లు కనిపిస్తుంది. అందుకే అందులో లౌకిక సుఖాలపై నిరాసక్తత పాలకులపై కట్టుబాట్లపై తూష్టీంభావమూ, తమ తమ పూర్వ వర్తనలపై పశ్చాత్తాపం (00౧1999100), భాషావిషయాలపై పట్టుదల సడలడం (భగవంతుని ముందు వ్యాకరణ నియమాలు అల్బం) కన్పిస్తాయి. వ్యాకరణోల్లంఘనం కవి నిరసన (0/01661) కు ఒక బాహ్య సూచిక కావచ్చు. పరిమితుల్లో అయినా స్వేచ్చా ప్రకటన కావచ్చు. సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 18 చేకూరి రానూరాను
భక్తి శతకాలు సన్నగిల్లిన తరువాత కొత్తగా రచన చేసేవారు పద్య రచనాభ్యాసం కోసం శతకాన్నాశ్రయించినట్టు కనిపిస్తుంది. శతకం మాత్రమే రచించి ఇంకేమీ రాయని వాళ్ళను కూడా ఎరుగుదును. (మా అమ్మ మేనమామ ఒకాయన ఇతరత్రా కవిత్వం రాయలేదు గాని హనుమతృ్శతకం రచించారు. నువ్వేమన్నా శతకం రాశావా అని సన్నడుగుతుండేవాడు నలభయ్యేళ్ళ కిందట)
ఇటీవలి కాలంలో శతకం హాస్యానికి ఎక్కువ ఉపయోగిస్తున్నట్టుంది. బహుశా అది శ్రీశ్రీ గారి సిరిసిరి మువ్వ ఒరవడి కావచ్చు. ఆయనకు కవిచౌడప్ప ఒరవడి.
శతకం కొత్త కొత్త ప్రయోజనాలను (4౧౦40౧3) కూర్చుకొని ఇంకా కొంత కాలం తెలుగు సాహిత్యంలో నిలవవచ్చు. దీని ఆత్మాశయత్వమే దీని ప్రాణం.
ఈ ఆత్మాశయత్వమే శతకావిర్భావానికి మూలమైంది. ఇదే ప్రాచీన కాలంలో సమాంతర సాహిత్య ధోరణిగా ప్రశస్తి చెందటానికి మూలమైంది. ఈ లక్షణమే శతక (ప్రాచుర్యం ఆధునిక కాలంలోకి వ్యాపించటానికీ, విస్తరించటానికీ దోహదం చేసింది. బహుశా ఆత్మాశయ కారణంగానే వంగూరి సుబ్బారావుగారు శతకాన్ని భావగీతాలుగా భావించారు. అయితే కాశీనాథుని నాగేశ్వరరావుగారు వీటికొక సూక్ష్మ భేదాన్ని చెప్పారు. భావ గీతాలు భౌతికానందాన్నిస్తే, శతకాలు ఆధ్యాత్మికానందాన్నిస్తాయన్నారు (చూ గోపాలకృష్ణారావు, 1976). ఈ రెంటికీ భేదం నిరూపించడం సాధ్యమో కాదో చెప్పలేదు. ఆధునిక భావకవుల్లో విశ్వనాధ సత్యానారాయణ, కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావుగారి వంటి భావ కవుల భక్తి పద్య గీతాల్లో కనిపించేది “ఆధ్యాత్మికం కాదనగలమా? ఆ మాటకొస్తే శ్రీశ్రీగారి ప్రభవలో చాలా పద్యాల్లో ఆధ్యాత్మిక భావమే గుర్తించగలం.
శతకంలో ఉన్న ఈ ఆత్మాశ్రయత్వమే శతకాన్ని ఖండకావ్యానికి సన్నిహితం చేసింది. అందుకే బేతవోలు రామ బ్రహ్మంగారి 'కౌత్త గోదావరి శతకమా? ఖండకావ్యమా అంటే ఏదో ఒకే సమాధానం ఎన్నుకోవటం కష్టం. శతక లక్షణాలున్న ఖండకావ్యమనో, ఖందకావ్య లక్షణాలున్న శతకమనో అనాల్సి ఉంటుంది. శతక ఖండ కావ్య లక్షణాలు ఆధునికంగా ఎట్లా కలిసిపోయాయో (౧0౧౪౭86 అయ్యాయో) ఎందుకు కలిసి పోయాయో ఆలోచించటానికి ఈ ఉదాహరణ పనికొస్తుంది.
శతక లక్షణాల ప్రతిపాదనలలో విమర్శకుల్లో సామ్యం కనిపిస్తుంది. నిడుదవోలు వేంకటరావుగారు (1966) 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త సౌభద భద కనితా వైవిధ్యం 19 చేకూరి రామారావు
నియమము, 4 రసనియమము, 5. భాషా నియమము అని అయిదు లక్షణాలు ప్రతిపాదించారు. కె. గోపాలకృష్ణరావుగారు (1976) మొదటి నాలుగు నియమాలను వేంకటరావుగారి ననుసరించే ప్రతిపాదించారు. వెంటకరావుగారి వృత్త నియమాన్ని గోపాలకృష్ణరావు ఛందోనియమమన్నారు. రెండూ ఒకటే, కాకపోతే వృత్తాలనే మాట వర్ణఛందస్సులకే నియతంగా భావించినందువల్ల దాన్ని విస్తృతపరచి దేశిచ్చందస్సులకు కూడా వర్తించేట్టు ఛందోనియమమన్నారు. గోపాలకృష్ణారావుగారు వేంకటరావుగారి భాషానియమాన్ని గ్రహించలేదు. కాని ఆత్మాశ్రయ కవితా ధర్మము అనే దాన్ని అదనంగా చేర్చారు.
వేంకట రావుగారి భాషా నియమం అనే లక్షణానికి ప్రత్యేక ప్రయోజనం కనపడదు. “శతకములన్నియు సలక్షణమైన కావ్య భాషలోనే యుండును” అని తప్ప వేరే ఏమీ చెప్పలేదు. అయితే కావ్య భాషా లక్షణాతిక్రమణ శతకాల్లో కనిపిస్తుందని గుర్తించటం అవసరమనుకుంటాను. అప్పుడు వేంకటరావుగారి భాషా నియమం బదులు నియమాతి క్రమణాన్ని శతక లక్షణంగా (గ్రహించాల్సి ఉంటుంది.
గోపాలకృష్ణారావుగారి ఆత్మాశ్రయ ప్రతి పాదనలో శతకానికి ప్రాణభూతమైన గుణాన్ని పట్టుకునే ప్రయత్నం జరిగింది. ప్రచురమైన వస్త్యాశ్రయ కవితారీతినుంచి శతకాన్ని వేరు చేసేది ఈ లక్షణమే.
అయితే శతకానికి ఆత్మాశ్రయత్వ ప్రతిపాదన ఒక్కటే సరిపోదనుకుంటా. వక్తృశోతృ్చ సంబంధం కూడా ముఖ్యమే. అందుకే సంబుద్ధి ప్రధాన మనటం, శతకంలో వక్తృ శ్రోతలు మారరు. (శ్రోతృసంబోధన మారవచ్చుగాని శ్రోత మారరు. సంబోధన కూడా మారకపోతే అదే మకుటం అవుతుంది. అందువల్ల శతకానికి మారని (శ్రోత (ప్రధానం. సంబుద్ధి మారినా శతకానికి ప్రాణమైన అంతర్నిర్మాణం మారదు. మారని సంబుద్ధినే మకుటం అంటున్నాం. అది బాహ్య నిర్మాణం. అందువల్ల మకుట నియమం శతకానికి నియమం కాదనటం. శతక నిర్మాణాన్ని సూచించేదే కాని అత్యవసరమైంది కాదు. (1౧౦0౬౪46 061 ౧౦1 1౧౧౧౪౭౪769). సంబుద్ధిని లక్షణంగా చెపితే ఆత్మాశయం గతార్థమై పోతుంది. మకుటం నియమంగా చెప్పకృళ్లేదు. మకుట సహిత, రహిత శతకాలన్నీ సంబుద్ధి ద్వారానే సూచితమవుతాయి.
ఇక ఛందో నియమం విషయం - శతకం ఫలాని వృత్తాలల్లోనే ఉండాలన్న నియమం బేదు. మకుటం ఉన్న శతకాల్లో సమానవృత్తాలు వాడుకలో ఉన్నాయి. మత్తేభ సౌభద్ర భద కవితా వైవిధ్వం 20 చేకూరి రామారావు
శార్జూలాలు సమాన వృత్తాలు. అట్లాగే ఉత్పల చంపకమాలలు. ఈ వృత్తాలను నియమించేది మకుటం. “దాశరథీ కరుణా పయోనిధీ అనే మకుటం ఎన్నుకున్న తర్వాత చంపకోత్పలలు తప్ప వేరే మార్గం లేదు. నారాయణా, శ్రీకాళహస్తీశ్వరా, సర్వేశ్వరా, అనే మకుటాలు ఎన్నుకున్న తరువాత మత్తేభ శార్జూలాలు తప్ప వేరే దారి లేదు. అంటే వృత్త నియమం మకుట నియమంపై ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని పూర్వ పరిశోధకులు గుర్తించారు కూడా.
“పై మకుట నియమమును బట్టియే తెలుగు శతకములలో వృత్తనియమ మేర్చడినది” అని వేంకటరావుగారూ (1966), వృత్తమకుట నియమములు పరస్పరాశ్రితములు అని గోపొలకృష్ణరావుగారు (1976) రాశారు. అయితే స్పష్టత కోసం ఛందో నియమాన్ని ప్రత్యేకంగా చెప్పి ఉంటారు. మకుటంలో చాలా భేదాలు కనిపిస్తున్నాయి. భాస్కరా, సుమతీ అని మూడక్షరాలతో పాటు “దాశరథీ కరుణా వయోనిధీ అని యతి స్థానాన్ని నియతం చేసే మకుటాలు ఉన్నాయి. కోవెల సంపత్ముమారాచారి గారి యతీంద్రా వ్యాజ రామానుజా అనే మకుటమూ అంతే. బేతవోలు రామటబ్రహ్మంగారు కొత్త గోదావరిలో “గోదావరి అని వాడిన చోట మత్తేభ శార్జూలాలు తప్పలేదు. గౌతమీ అనివాడిన చోట చంపకోత్చలు, మత్తేభ శార్జూలాలు ఏవైనా వాడుకోవచ్చు. ఆయన ఆ అవకాశాన్ని వాడుకున్నారు కూడా !
సీసపద్య శతకాల్లో ఉన్న ఎత్తు గీతలో ఆఖరి పాదమంతా 'రామలింగేశ రామచం[ద్రపురవాసి అని మకుటం. ఆంధ్రనాయక శతకంలో “చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ, హతవిమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ” అని ఎత్తు గీతి చివరి రెండు పాదాలూ మకుటమే అయ్యాయి. నరసింహ, కుక్కుటేశ్వర శతకాల్లో కూడా అంతే విస్తృతి ఉంది. సీస పద్యం పెద్దది కావటం వల్ల ఇది సాధ్యమయిందనుకుంటాను. కంద పద్యంలో సాధారణంగా చిన్న మకుటాలే ఉంటాయి. రెండు గణాలకు మించవు.
తెలుగు శతకాల్లో వృత్త నియమం కాకపోయినా, మకుటం అనుమతించినా కవులెందుకో సమవ్ఫత్తాల్ని దాటిపోలేదు. సీస, కందాలయితే ఒకే పద్యాన్ని వాడుకున్నారు. అందువల్ల ఛందో నియమం నియమం కాకపోయినా ఛందస్సామ్యూన్ని మించిన స్వేచ్చను తెలుగు కవులు అంతగా తీసుకున్నట్టు కనపడలేదు. ఛందస్సును పాక్షికంగా మకుటం నిర్ణయిస్తుంది. బహుశా తన్మూలంగా కవి ఐచ్చికంగా సమత్వాన్ని లక్షించి ఉండవచ్చు.
శతకానికి పేరు పద్య సంఖ్యను బట్టి వచ్చిందనేది స్పష్టమే. అయితే ఈ నూరు సంఖ్యను నూరుకు పై చిలుకు అని అర్ధం చెప్పకోవాలి. నూరుకు పైన ఎన్ని సౌభద్ర భద కవితా వైవిధ్యం 21 చేకూరి రామారావు
ఉంటాయనేదాంట్లో పెద్ద గట్టి నియమం ఉన్నట్టులేదు. 101, 102, 103,..... పరిశీలించి చూడలేదు గాని బహుశా 120 వరకూ ఉండొచ్చుననుకుంటా. అయితే స్తుతి రూపంగా శతకం ప్రారంభం కావడం వల్ల సంఖ్య అప్రధానమై ఇతర లక్షణాలకు ప్రాధాన్యం వచ్చింది. సంస్కృత స్తోత్రాల్లో మకుటం ఉంది. శతకాల్లో లేనేలేదని వేంకటరావు గారంటారు.
“మకుటాత్మకమగు శతముక్తక సముచ్చయమే శతకము" అని గోపాలకృష్ణారావు గారు నిర్వచించారు. అయితే ఈ రెండూ ఖచ్చితంగా అన్ని వేళలా అన్ని శతకాల్లోనూ పాటించలేదు.
శతకాల్లో పద్యాలను ముక్తకాలనటం పూర్తి సత్యం కాదనుకుంటాను. ఒక భావ ధోరణిలో రాసే పద్యాల పూర్వాపర సమన్వయం లేకుండా ఉండడం కుదరదు. అందుకే గోపాలకృష్ణారావుగారు పూర్వాపర నిరపేక్షకములు అన్నారు. అపేక్షకూ, అన్వయానికి భేదం నిరూపించగలమో లేదో ! ఏ పద్యానికా పద్యం స్వతంత్రంగా నిలబడే శక్తి ఉన్నా కాన్ని వర్గాలుగా విభజించడానికి కూడా వీలుందని (గ్రహించాలి. ముక్తక భావనను ఒప్పుకుంటూనే వర్గ విభజనను అంగీకరించాల్సి ఉంటుంది.
చాలా ఆధునిక శాస్త్రాల్లో చాలా విషయాల మధ్య, విజ్ఞానాల మధ్య స్పష్టమైన విభాజక రేఖ కనపడదని శాస్రజ్ఞులంటారు. దీన్నే కన్వర్దెన్సు అని పిలిచారు. శతక లక్షణ వివేచనలో ఇది మాటి మాటికి గుర్తు చేసుకోవలసిన విషయంగా కనిపిస్తుంది. ఒక వర్గంలో ఇంకో వర్గంలోనూ, ఒక లక్షణం ఇంకో లక్షణంలోనూ కలిసిపోవటాన్ని కన్వర్దెన్సుగా భావించవచ్చు (౧9౧౪౧ 1985).
శతక లక్షణ వివేచనంలో నిడుదవోలు వేంకటరావుగారూ, గోపాలకృష్ణారావు గారూ అంగీకరించిన ఒక నియమం “రసనియమం'. రసం తీగెలాగితే డొంకంతా కదులుతుంది. అయితే శతకమంతా ఒకే భావ ప్రసార వాహికగా భావించటం దీని మూలతత్త్వం. అంటే భక్తి, హాస్యం, వగైరాల్లో వవైనా వపద్యాలన్నిటినీ కలిపే మూడ్ ఒకటే ఉండాలని దాని భావంగా అర్ధం చేసుకోవచ్చు. వస్వైక్యత అన్నట్టుగా భావైక్యత అనొచ్చునేమో! దాన్ని రసం అన్నా భావం అన్నా మూడ్ అన్నా శతకమంతటా ఒక ప్రధాన భావధార (60౧1౧8౧ ౧౦౦6) ఉండాలని దీని తాత్పర్యంగా అర్థం చేసుకుంటున్నాను. సౌభ్యద భద కవితా నైవిధ్యం 22 చేకూరి రానూరావు
ఈ విధంగా చూస్తే శతక లక్షణాలుగా ్రతిపాదితాలయిన లక్షణాల్లో (1) సంబుద్ధి, (2) ప్రధాన భావధార ముఖ్య లక్షణాలుగా కనిపిస్తున్నాయి. మిగతావి చాలా శతకాల్లో కనిపిస్తున్నా నిర్వచన సమ(గ్రత ఉన్న లక్షణాలుగా కనిపించవు.
లక్షణాలు కుదరటం, కుదరకపోవటం విమర్శకుల తలనొప్పి. శతకం కలిగించే అనుభవాల విషయంలో ఈ వ్యాసంలో చర్చించిన విషయాలను ్రస్తావించక తప్పదు. స్పష్టమైన విభాజక రేఖలు ఉండకపోవచ్చు. అవగాహన స్పష్టత ఉంటే చాలు. అనుభవాన్ని గుర్తించే పద్ధతిలో వివరించగలిగితే శతకానుభవాన్ని పట్టుకోగలుగుతాం. ఆ లక్ష్యం కోసం చేసే ప్రయత్నంలో ఇదో భాగం. ఈ వ్యాసం ప్రధాన ప్రయోజనం కూడా అదే.
ఖై
నాయని సుబ్బారావుగారు. (1899-1978) భావకవిగా తెలుగు సాహిత్యాభిమానులకు చిరపరిచితులు. ఆయన రచించిన సౌభద్రుని ప్రణజయయాత్ర, మాత్చగీతాలు ఒక కాలంలో అధిక ప్రచారం పొందిన కవితా సంపుటులు. ఇవి తొలిదశలో రాసిన కావ్యాలు. సుమారు 25-80 సంవత్సరాల సుదీర్హ వ్యవధి తరువాత 1958 ప్రాంతాల్లో భాగ్యనగర కోకిల వగైరా ఖండకృతుల రచన ప్రారంభించారు. అదే సమయంలో వేదనా వాసుదేవము (ప్రారంభించి 1962కి పూర్తి చేశారు. మలిదశలో రాసిన మరో మహాకృతి (౧౭౦? *ంగం జన్మభూమి. ఈ రెండు కృతుల స్వరూప స్వభావాల గురించి విమర్శకుల్లో భిన్నాఖిప్రాయాలున్నాయి. వీటి విపుల చర్చ అనుమాండ్ల భూమయ్య రచించిన నాయని సుబ్బారావు కృతులు పరిశీలన అనే (గ్రంథం (1981)లో విపులంగా ఉంది.
వేదనా వాసుదేవాన్ని “మకుట నియమము లేని శతకప్రాయమైన కృతి యిది” అని 1964 ఏప్రిల్ నెల భారతి సంచికలోని సమీక్షలో శాక్యసింహ పేర్కొన్నారు. శతకం అంటే నూరు పద్యాలని అర్థమైనా శతకకర్తలు నూటికి పై చిలుకు పద్యాల్నే శతకాల్లో పాటించారు. వేదనా వాసుదేవంలో 108 పద్యాలున్నాయి. ఇది ఒకో ఖండికకు తొమ్మిది పద్యాల చొప్పున పన్నెండు ఖండికలుగా విభక్తమైంది. పుస్తకం అంతా సాంప్రదాయిక భక్తిమార్గంలో నడిచింది. దీన్ని భారతిలో శాక్యసింహ ఇట్లా అంటారు.
“ధూర్జటి కాళహస్తీశ్వర శతకమును తలపించును. ప్రాయికముగా శతక కృతులలో జీవుని అరిషద్వర్గ ప్రకోపము, భగవదు పేక్ష దానికి ఫలముగా కలిగిన ఆవేదన భగవంతుని నాశ్రయించి వానికి సర్వస్వము నర్చించుట, ఆయన దర్శనానవాప్తిచే సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 23 చేకూరి రామారావు
నిరాశాదైన్యములు జనించుట, మాయామేయమైన సంసారము పట్ల వైముఖ్యము దట్టమగుట, మోక్షాఖిలాష మున్నగునవి వర్ణింపబడును. నాయని సుబ్బారావుగారు ఆ త్రోవనే పోయిరి. గుండె లోతులలోని సూక్ష్మ వేదనలను వెలువరించు శక్తియుక్తులు, అవి ప్రతిఫలించు భావన, ఆ భావనను సంప్రదాయ పద్ధతిలో ప్రకటించు భాషాబలము మున్నగునవి యన్నియు సుబ్బారావుగారిలో సమృద్ధిగా నున్నవి”.
నాయని సుబ్బారావుగారి కవిత్వాన్ని గురించి అందరూ ఒప్పుకునే ఒక లక్షణం ఉంది. కవిత్వం ఆయన జీవితంలో నుండి వస్తుందనీ, కవిత్వంలో నిజాయితీ, స్వచ్చత ఉంటుందనీ, దీన్నే వైతాళికులులో ముద్దుకృష్ణ (1935) ఇట్లా అంటారు.
“పద్యాలు జీవితాన్ని చీల్చుకొని వస్తవి. అంత బాధాకరంగా ఉంటవి. హృదయానికి తగిలేటట్టు చెబుతాడు, యత్నం లేకుండా. పద్య నిర్మాణానికి పాటుపడినట్లు కనిపించడు. అదే ఆయన కళ గొప్పది”.
నాయని సుబ్బారావుగారు 1955లో నరసరావుపేట పురపాలకోన్నత పారశాల నుంచి ఉద్యోగ విరమణ చేశారు. తరువాత 1957 వరకు తిమ్మ సముద్రంలో ఒక హైస్కూలు హెడ్మాష్టరుగా పని చేశారు. అక్కడి ఉద్యోగం కూడా అయిపోయిన తర్వాత హైదరాబాదులో తన పెద్దకూతురింట కొన్నాళ్ళున్నారు. ఉద్యోగ విరమణ అయితే అయింది. కాని బాధ్యతలు తీరలేదు. ఇంటర్మీడియేట్ పూర్తిచేయలేకపోయిన కొడుకు, ఇంకా పెళ్ళిచెయ్యాల్సిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఆ సమయంలో జీవితంలో అనుభవించిన వేదనకు (ప్రతిరూపమే వేదనా వాసుదేవము.
ఈ కావ్యంలో 12 ఖండాలూ విడివిడిగా చూస్తే పన్నెండు ఖండకృతులుగా భావించవచ్చు. అయితే అన్నిట్లోనూ ఉన్న వస్వైక్యత వల్ల ఒకే కావ్యం అయి సంబోధనాది లక్షణాల వల్ల శతకమయింది. ఇందులో కూడ ఖండకావ్య, శతక లక్షణాలు 'కన్వర్డ్” అయినట్లు గ్రహించగలం. మకుట నియమం లేకపోవటం వల్ల వృత్తాలతోపాటు కంద గీతాలు కూడా ఉన్నాయి. గతి వైవిధ్యమూ, ఖండ కావ్యస్సూర్తి కలిగించటానికి పద్యాలు తోడ్పడతాయి.
ఈ కావ్యంలో ప్రధానంగా కనిపించే పద్ధతి ఉక్తి వైచిత్రి. దీని ద్వారా భగవంతుని ఆత్మీయంగా సంభావించి, హాస్యం, ఎత్తిపొడుపు, భక్తి, (ప్రేమ కలగలిపిన పద్ధతి కనిపిస్తుంది. సౌభద్ర భద కవితా వైవిధ్యం 24 చేకూరి రామారావు
ఆ మవాోతల్లి చలువ గోటానుకోట్ల
కీవు వడగలెత్రితివి కొందెక్సి కులుక
ఆలి చేనిన నంవన్మవోనుభావ
వట్టి వీసినారివగుట భావ్యమృాటయ్య +
ఆ జగల్లయకారి సాంబయ్య (భష్ట
చిత్తులకు త్రవ్వి తందమ్ము లెత్తువాడు
భక్తులను బిట్టు రాచి రంపాన బెట్టి
కాని వదలని గడును వెంకయ్య వీవు
సాంబయ్య, వెంకయ్య అనే సాధారణమైన తెలుగు పేర్లతో దేవుళ్ళను పేర్మొానటంలో ఉక్తి వైచిత్రి ఆత్మీయ స్ఫోరకం. తెలుగు మాటలు వాడినంత సహజంగా సంస్కృత సమాసకల్పనకూడా చేస్తారు సుబ్బారావుగారు.
ఒక కారుణ్య కటాక్షలేశమిటురాదో / ఈ తమఃవూర్హ కం
టక నంక్షీర్ధ వరంపర (గ్రసనలుంటాకావదీర్దాన్టుదా
న్లీకతా వీధి నిరంతరోజ్ఞ్వలముగా తేజు(వ్రభల్ బిమ్మదో
వికచాంభోజమరంద నమ్మిత దయా విస్ఫార నేత్రద్యుతీ !
భగవంతుని అలుక, ఆయన్ని దూరం చేసుకునే తలపు, చేసుకోలేకపోవటం వంటి భావాన్ని ఈ కింద పద్యంలో రమణీయంగా చెప్పారు.
ఒకనిర్వేదవు వెల్లునన్ మునిగి ని న్నద్వానీతుంజేసి
భల్లుకవుంబట్టుగ నాదు గుందె తల్పున్ మూసీ లోనన్ బిగిం
చుకొనంగా గడె ఏమి నా తెలివి మండున్, తల్పుపై నుండి పా
యక తీయంగల కుంచె కోల యది నీ హస్తార్సితమ్మై ప్రభూ !
భగవంతుని లక్షణాలనే ఉక్తి చమత్కృతితో మెలిపెట్టి వాడిన తీరు ఈ శతకంలో చాలా చోట్ల కనిపిస్తుంది.
వ్రణతార్తి భంజనుదవని
గణేయులగు వారు పొగడగా ముగ్ధుడనై
గుణహీను నిన్ను విడువక
గుణింతు నిది యేమి బావుకోనో తెలియన్ సౌళద భద కవితా వైవిధ్యం 25 చేకూరి రామారావు
పై పద్యంలో నిర్గుణుడు అనే రూపాన్ని గుణహీనుదని వ్యాఖ్యానించటంలో వైచిత్రి గమనించదగింది. నిర్ణుణుడనే మాటలోని తాత్త్వికతను. భంజించి గుణహీనుడు అనే వ్యావహారికార్థాన్ని స్ఫురించటంతో ఈ వైచిటత్రి వచ్చింది. ఈ పద్యంలో సరి పాదాల్లో ప్రాసను గురువు చెయ్యటం ఒక వైచిత్రి. ఈ పద్ధతి కందక్రీడలు ఆయన రచనల్లో ఇతరత్రా కూడా ఉన్నాయి.
సమకాలిక స్పృహ శతకాల్లో కనిపించటానికి ఉదాహరణగా ఈ కింది పద్యాన్ని గ్రహించవచ్చు.
అణుగర్భమ్మున వీట వెట్టుక నునూక్ష్మా చర్వణాసాధ్య చి
కణమై పోతివి నాకు భౌతిక మవోజ్ఞాన ప్రభాధీమద
(్రణులీ నృష్టి రహస్య భేదన కళా కాముల్ నినుం గానక
యృణుగర్భమ్మును (నక్షులింతు రిక నయ్యా ! నీకు తావేదనో /
ఆధునిక శాస్త్రం సాధించిన అణు విచ్చేదనం భగవంతుని ఉనికికి భంజకం అన్న భావనను వ్యంజించిన తీరు ఇక్కడ విశేషమైనది. దేవుడు లేదని చెప్పటం కాదిక్కడి పరమార్ధం, శాస్త్రజ్ఞులు దేవుణ్ణి వెంటాడుతున్నారనీ, అన్వేషిస్తున్నారనీ.
సమాసాన్ని ఒక గాంభీర్య స్ఫూర్తికి వాడుకోవటం తెలుగు కవిత్వంలో సాధారణంగా కనిపించే పద్ధతి. ప్రాచీనాధునిక కవిత్వాల్లో నుంచి ఎన్నైనా ఉదాహరించ వచ్చు. సమాసాల్ని అనుదాత్త భావాలకు వాడి వాస్యాన్ని హేళనను సూచించటం నాయని సుబ్బారావుగారి కవిత్వంలో కనిపిస్తుంది. వేగంగా రిక్షా తొక్కుతున్నతన్ని -
అతను నారాయణగుడా మవో(వ్రశస్త
శీధు పానాధరీకుత నీరపాణి అని భాగ్యనగర కోకిలలో వర్ణించారు. ఆ కాలంలో నారాయణగుడా (హైదరాబాదులో ఒక పేట)లో తయారయ్యే గుడుంబా అనే నాటు సారాయిని సమాసంలో సూచించారు. అట్లాగే వేదనా వాసుదేవంలో చూడండి.
పుట్టిన (గ్రామమున్ విడిచి పొమ్మని మిత్రుని సాకతమ్మునన్
మెట్టిన యూరు కాదని నమీక్ఫృత నంకర సర్వనభ్వతా
ఘట్టము నర్వసంస్థ్కుతి వికార నికార ఘరట్టమైన యీ
కొట్టములోన తెచ్చి వదగూల్చితి వెంత దయావరుందవో సౌభద భద్ర కవితా వైవిధ్యం 26 చేకూరి రామారావు
హైదరాబాదు నగర సంస్కృతిపై ఆయన కోపాన్ని అసవ్యోన్ని వెలువరిస్తూ సమీకృత సంకర సర్వసభ్యతాఘట్టము అన్నీ సర్వసంస్కృతి వికారనికారఘరట్టము అనీ రెండు సమాసాలుపయోగించారు. తెలుగు తీరు కనిపించని సంకర సంస్కృతిని వర్ణించిన తీరు. ఘరట్టము అంటే తిరగలి. అన్ని సంస్కృతులు ఇక్కడ తిరగలిలో నలిగి పోతున్నాయని సూచన,
ఈ కావ్యంలో మరెన్నో విశేషాలను భూమయ్య (1981) తన సిద్ధాంత గ్రంధంలో చర్చించాడు. వాసుదేవోపాసన అధ్యాత్మిక రహస్యాలను వివరించాడు. “శుకమార్గమ్మును బట్టిపోవు నటవే సూనుండు” అనే పద్యంలోను తరువాత పద్యంలోను వంశాకూరములెల్ల నీదు విలయ వ్యాపార సంరంభనిస్రింశోద గ్రత ముక్కముక్కలుగ విచ్చేదమ్ములై గాని నీ వంశీగాన నిరంతర వ్యసనముల్ వర్షింపవా భూమిపై” అనే భాగంలోను అసంభావితంగా భావ్యర్థ సూచన ఉందని భూమయ్య పేర్మాన్నాడు. ఇక్కడ సూచన ఏమిటంటే సుబ్బారావుగారి ఏకైక కుమారుడు (1933-1968) 22-8-1968న మరణించాడు.
ఈ కావ్యంలో గుర్తింపకుండా ఊరుకోలేని విశేషమేమిటంటే ఎన్ని వేదనలున్నా కవి సంతృప్త జీవితాన్ని గడిపిన దాఖలా ఉండటం. ఆ పద్యం ఇది.
నా వల్నీ రమణీ సుధాప్రణయితానందమ్ములం దేలితిన్
నా వుత్రీ విదుషీ యళోవినర విన్వాసమ్ములం బొంగితిన్
నా వుట్టెల్లను వండె నీదు చలువన్ మా నాధ + నంసొర సౌ
ఖ్యాపూర్హమ్ముగ నేమి కావలయునయ్యా యింక నాకిచ్చటన్.
వేదనా వాసుదేవము శతక సాహిత్యంలో విలక్షణమైనదే కాదు, రసజ్ఞుల నలరించే గొప్ప కవిత్వం పేరిన కావ్యం. ఈ శతాబ్దపు గొప్ప కావ్యాల పట్టికలో చేర్చదగిన కావ్యం.
ఈ వేదనా వాసుదేవము కోవెల సంపత్ముమారాచార్యుల పూనిక వల్ల 1964లో అచ్చయింది. కవికి 1966లో కర్నూలులో రిక్షాపై వెళుతుండగా ప్రమాదవశాత్తు కాలు విరిగింది. పడకపై ఉండి వేదనా వాసుదేవము-2 రచించారు. ఇందులో అర్ధనూట పదహారు పద్యాలున్నాయి. ఇది [గ్రంథరూపంలో రాలేదు (శతజయంతి ప్రచురణలో ఇప్పుడు ఇది వస్తోంది). సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 27 చేకూరి రామారావు
బహుశా దీన్ని అర్ధశతకం అనాలేమో. ఇక్కడ ఎందుకో అన్నీ వృత్తాలే రచించారు. చంపకోత్పలలు, మత్తేభ శార్జూలాలూ ఉన్నాయి. ఆయనే ఈ పద్యంలో ఇట్లా చెప్పారు.
ఛవిమన్ఫజ్జని నంవుటలవనిన్ శార్జూల మత్తేభ వీ
రవివోరమ్ములు చంపకోత్పల మధు ప్రాగ్భార సౌరభ్యముల్
శివముల్ నీకయి సాగి మంగళమహాశ్రీ చిక్కెనంచత్క్సుపా
ప్రవణమ్మైన నన్ను చూడగదవే ప్రహ్లాద రక్షామణీ
మొదటి భాగంలో కనిపించే హాస్య చమత్కార ధోరణి ఈ భాగంలో కనిపించదు అయితే ఉదాత్త భావ గాంభీర్యం పుష్కలంగా ఉంది.
ఇందులోను విభాగాలున్నాయి. గాని సమఖండాలు కావు. కొన్ని ఖండాల్లో 9 ఉన్నాయి. కొన్నిట్లో ఇంకా తక్కువున్నాయి. ఏడో ఖండికలో నాలుగే పద్యాలున్నాయి ఆఖరు పద్యం ఇది.
అలసత్వమ్మున మొకువోయినది పొమ్మన్మద్వివేకమ్ము నే
ర్పాలయన్నినుది పొందగాగలుగుటెట్లో జ్ఞానగవ్యూ నదో
హలమై యయ్యది నిన్ను పొందునట చేయంజాలు సద్భక్తి మో
కలు నాటంగదె నా యెదంద నిజ భక్త వ్రాత నిత్యావనా
ఈ నాలుగు పద్యాలతో ఖండిక ముగిసినట్టు కనపడదు. ఆఖరి పద్యం ముగింపు పద్యంగానూ కనపడదు.
బహుశా ఇంకా రాయాలనుకొని రాయలేదేమో. అందువల్ల ఈ రెండో భాగాన్ని అసంపూర్ణ శతకంగా భావించాల్సి ఉంటుంది. ఈ శతకం పూర్తిగా అందకపోవటం లోపమే అయినా అందినవి చాలు ఆయన కవితా సౌరభం వెదజల్లటానికి, రసజ్ఞులను తనియించటానికి. దఉవపయ్యాక్త ముఖ్య గ్రంథ వ్యాన సూచి;
1 _గగింగింగి, గం 112064, 00౧౪౭౧౦౧౦౪. 1౧066000 1 [[0గ 0౧౦౧౩ 1౧0౪866 0% ౬2004286, 15 ౧౬1/6 1౧6 0గ910 2౧6 ౪99 64 *౦గం ౧16౫9 1985
సౌభ్యద భద్ర కవితా వైవిధ్యం 28 చేకూరి రామారావు
2, భూమయ్య, అనుమాండ్ల. నాయని సుబ్బారావుగారు కృతులు పరిశీలన హనుమకొండ, 1981
౩. గోపాలకృష్ణారావు కె., ఆంధ్ర శతక సాహిత్య వికాసము, హైదరాబాదు, అం.సా.ప., 1976
4 ముద్దుకృష్ణ సామినేని (సం.) వైతాళికులు. కవితా సంకలనం, హైదరాబాదు, విశాలాంధ్ర బుక్ హౌస్, 1994 (తాలిముద్రణ, 1985).
-
వేంకటరావు, నిడుదవోలు. ఆంధద్రశతక వాజ్మయ వరిణామ చరిత్ర, సంపాదకీయం. శతక సంపుటం- 1, హైదరాబాదు, అం ప్ర. సొపొత్య అకాడమి,
-
శాక్యసింహ, వేదనా వాసుదేవము - సమీక్ష్య భారతి ఏప్రిల్, 1964
-
సుబ్బారావు నాయని, వేదనా వానుదేవము. ఖమ్మం, భారత సాపిత్య కళాపరిషత్తు, 1964.
(తెలుగు, సంపుటి-1 సంచిక-9, 1996 జనవరి (పుట 1-14) తెలుగు అకాడమీ, హైదరాబాదు) సౌభద భద కవితా వైవిధ్యం 29 చేకూరి రామారావు
- నాయని నవభావనల నగిషీ
తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగానికీ, భావ కవితా యుగానికీ కొన్ని విచిత్రమైన పోలికలున్నాయి. ఈ రెండు ధోరణులూ రచనా పద్ధతిమీద ఎక్కువ శద్ధ చూపించాయి.
మహాకవుల పేరు మీద యుగ విభజన చేసే అలవాటున్న మన సాహిత్య చరిత్రకారులు ప్రబంధ యుగం దగ్గరకొచ్చేసరికి నట్లు పడ్డారు. కొందరు పెద్దన యుగం అనీ, మరికొందరు రాయల యుగం అని సమర్థించుకోటానికి ప్రయత్సించారు గాని ఫలించినట్టు లేదు. అట్లాగే భావ కవిత్వం తరవాత వచ్చిన అభ్యుదయ కవితా కాలాన్ని శ్రీశ్రీ యుగం అని కళ్ళు మూసుకుని అనేశారు. కాని భావ కవితా యుగాన్ని అంత ఆషామాషీగా రాయప్రోలు యుగం అని అనలేకపోయారు. ఈ రెండు యుగాల్లోనూ, సమస్మంధులైన మహి కవులుండటమే ఇందుకు కారణమనుకుంటాను. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, రామరాజ భూషణుడు, పింగళి సూరన ఇట్లా తమ నేర్పు చూపించి, వారు గొప్ప కవులుగా పేరు తెచ్చుకున్నారు. అట్లాగే భావ కవితా యుగంలో రాయప్రోలు సుబ్బారావు, నందూరి సుబ్బారావు, నాయని సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణశాస్త్రి ఇట్లా అనేకులు మహాకవులు సమస్మంధులు గొప్ప కవిత్వాన్ని రాసి సమానంగా పేరు తెచ్చుకున్నారు. ఒక కవి పేరు మీదుగా కవితా యుగానికి పేరు పెట్టడంలోని అనౌచిత్యాన్ని అన్యాపదేశంగా ఎత్తి చూపారు.
వీరిలో కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు గారలు భావకవిత్వపు కాలంలో అలవర్చుకున్న కావ్య శిల్ప నైపుణ్యాన్ని తరువాత కాలంలో విస్తృతంగా ఉపయోగించు కున్నారు. ఒక విచిత్రమేమిటంటే, కృష్ణశాస్త్రి గారికి రచన చేయటంలో ఎంతో శ్రద్ధ, రచనలు భద్రపరచుకోవటంలో అంత అశ్రద్ధ. సోమరితనమో, నిర్లక్ష్యమో, లేక తన రచనల శక్తి మీద విపరీత ప్రత్యయమో తెలీదు, కాని ఆ రచనలను పుస్తకాలుగా అచ్చేసుకునే పని సాహిత్య లోకానికే అప్పజెప్పేశారు. ఆ పని పూర్తికాకపోతే ఆ నష్టం ఎవరిది?
నాయని సుబ్బారావుగారు (ఈ లోకాన్ని నమ్మింది ఎవడులే అనుకున్నారో ఏమో) తన రచనలు (థద్ధగా సొంత చేతి రాతతో శుద్ధ ప్రతిని రాసి అట్టే పెట్టుకునేవారు. సౌఖద భద్ర కవితా వైవిధ్యం 30 చేకూరి రామారావు
ముఖ్యమైన కృతులన్నీ తన జీవిత కాలంలో అచ్చుఅయినాయి. “సౌవీరభద్రుడు” పేరుతో సాహిత్య అకాడమీ మీద రాసిన సెటైరూ, ఇంట్లో సరదాకి క్యాలెండరు కాయితాల ఖాళీ స్థలాల్లో రాసినవి, ఇంకా చాటువులు కొన్ని మాత్రం పుస్తకాల్లో కెక్కలేదు.
వీరిద్దరి కవిత్వ విశేషాల గురించి ఈ పాటికే చాలా మంది చాలా చాలా రాశారు. ఇటీవల కాలంలో ఉస్మానియాలో ఎన్. నిర్మలాదేవి కృ.శా. గారిమీద, కాకతీయలో భూమయ్య నాయని సుబ్బారావుగారి మీద విస్తృతమైన సిద్ధాంత (గ్రంథాలు రాశారు. అయితే సిద్ధాంత గ్రంధాలకు కొన్ని విస్తృతులతోపాటు పరిమితులూ ఉన్నాయి. సిద్ధాంత (గ్రంధకర్త కవిత్వంలో లీనమయిపోయి తన్మయీభావంతో రాసే అవకాశం లేదు. శాస్త్ర చర్చకు నిలిచే విషయాలే రాయాలి. అస్పష్టత పనికిరాదు. రుజువు కాని, చెయ్యలేని విషయాలను ప్రతిపాదించకూడదు. (ఈ పరిమితులు అందరూ పాటిస్తున్నారని కాదనుకోండి. భక్తి కవిత్వం మీద ధీసిస్సులు రాసి, తాము ఆ భక్తులకు భక్తులయిపోయి భజనలు చేసిన వారు మనకు లేకపోలేదు) ఈ పరిమితులే సాహిత్య పత్రికల్లో వచ్చే వరిశోధక వ్యాసాలకూ ఉన్నాయి. (ఉండకవోతే ఉందాలి). అయితే పరిశోధక వ్యాసమొక్కటే వ్యాసానికి పూర్ణ రూపం కాదు. ఇంకా రకరకాల నిబద్ధ, అనిబద్ధ వ్యాస రూపాలు ఉన్నాయి. పై కవుల మీద ఆ రకపు అనిబద్ధ వ్యాసాలుకూడా పత్రికల్లో వచ్చాయి.
కవిత్వం అందరు పారకులకూ ఒక రకం అనుభవాన్నియ్యదు. అందుకు వారి పూర్వానుభవాల ప్రమేయం చాలా ఉంటుంది. అది కావ్యానుభవమూ కావచ్చు, జీవితానుభవమూ కావచ్చు. స్వానుభూతుల నేపధ్యంలో ఒక్కో పారకుడికి ఒక్కో కవితా ఖండిక ఒక్కోరకంగా అర్థమవుతుంది. ఆ పద్ధతులను వివరిస్తే ఇంగ్లీషులో “లిటరరీ అప్రీషియేషన్” అంటారు.
ఈ పద్ధతిలో ఏ కవిని గురించి అయినా, ఏ పద్యం గురించి అయినా తనకు అర్ధమయిన రీతిలో వివరింవచ్చు.
నాయని సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్రిగార్ల కవిత్వాల్లో కనిపించే సమాన లక్షణాలు కొన్ని ఉన్నాయి. పదాలు పొదుపుగా వాడి చిక్కని కవిత్వం రాయటం వీళ్ళ పద్యాలలో కనిపించే సమాన లక్షణం. తమ అనుభవాలను అసాధారణీకరించటంలో (సామాన్య అనుభవాల స్థితి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటంలో) వీరిద్దరికీ గొప్ప ప్రతిభ ఉంది.) సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 31 చేకూరి రామారావు
నాయని సుబ్బారావు గారిది ఒక పద్యం చూడండి. వత్సలా ఫొలమున నెలవంక గురుతు కందళించి వికాసించి కళలు దేరి తరుణ శారద రాకా నుధాకరాచ్చ బింబము లనంతములు లెక్టు పెట్టుకొనెదు
ఈ యమర్తాచ్చ చంద్రిక లెన్నినాళ్ళు
నా తనువు ముంచుకొను నన్నినాళ్ళు ఒకు
యీ శరత్రేమి నాది సదాశివత్వ పదవి
సౌభద్రుని ప్రణయ యాత్ర కావ్యంలో ఉత్తర భాగం ఫలశ్రుతి. అందులో పద్యం ఇది.
(ప్రేయసీ ప్రియుల సాన్నిహిత్యం ఈ భాగంలో కవితా వస్తువు. వత్సల (ప్రేయసి. (ప్రియుడి భావన వర్ణితమయిందీ పద్యంలో.
వత్సల ఫాలం మీద నెలవంక గుర్హు (బొట్టు) పెట్టుకొన్నది. నెలవంక ఒక్కటే కాని వత్సల కాంతివల్ల అది కళలు దేరి అనంతమైన శరత్పూర్ణ చంద్ర బింబాల కాంతితో వెలుగుతున్నది. ఒక్క నెలవంక గుర్తుకీ అనంతమైన శరద్రాకా సుధాకర బింబాలకీ ఉన్న అంతరం ఎన్నుకున్న శబ్దాల ద్వారా సమర్ధంగా సూచించారు.
ఈ వెన్నెలలు మానవలోకానివి కావు. అమర్వ్యాచ్చ చంద్రికలు ! ఇవి నాయకుని శరీరాన్ని ముంచుతున్నాయి. ఇవి ఇట్లా తన్ను ముంచెత్తినంత కాలం తనది సదాశివత్వ పదవి. సదాళివుడితో పోలిక ఎక్కడినుంచి వచ్చింది? నెలవంక వత్సల ఫాలం మీద గదా ఉన్నది అనే సందేహం వస్తుంది. శివుడు అర్ధనారీశ్వరుడు. పార్వతి శివుడిలో సగభాగం. అంటే శివపార్వతుల శరీరం ఒకటే. ఆ పోలికను కూడా ఇక్కడ తెచ్చుకొంటే ఇక్కడ సదాశివుడితో పోలిక సారస్యం తెలుస్తుంది. ఇదంతా కవి చెప్పడు. పద్యాన్ని మళ్ళీ చదివి భావన చేసుకొని గ్రహించాలి.
ఇక్కడ సదాశివత్వ పదవిలో చిన్న చమత్కారం పొదిగారు. 'సదా' అంటే ఎల్లప్పుడు అని అర్థం చెప్పుకుంటే “శివత్వ పదవికి ఆనందకరమైన స్థితి అని అర్ధం చెప్పుకోవచ్చు. తన ఆనందం ఒక్క ఈ శరత్మాలానిది కాదు. శాశ్వతమైనది అని స్ఫూర్తి.
కొండంత అర్భాన్ని రెండుచిన్న గీత పద్యాల్లో (రెండోది నిండా పూర్తి కాలేదు. కూడా) ఇమిడ్చారు. సౌభద భద్ర కవితా వైవిధ్యం 32 చేకూది రామారావు
ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్రించాలి. నాయని సుబ్బారావు గారి కవిత్వంలో ఈ చిక్కదనం సంప్రదాయంలో నుంచి వచ్చిన కధలను సాంప్రదాయిక ప్రతీకల రూపంలో సంక్షేసించటం వల్ల వచ్చింది. సంప్రదాయంతో పరిచయం ఉన్నవారికి ఈ ప్రతీకలను విస్తరించుకోవటం తేలిక. ఈ చిక్కదనాన్ని గ్రహించటానికి సుప్రతిస్టితమైన మార్గం ఉంది.
గమ్యంలోనూ, మార్గంలోనూ ఉన్న స్పష్టత వల్ల ఈ కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి ఏమంత కష్టపడకృర్తేదు. కాకపోతే ఏ మంచి పద్యం అర్ధం చేసుకోటానికైనా పాఠకుడికి తగిన అధ్యయనం అవసరమే.
ఈ రకమైన చిక్కదనాన్ని తరవాత దశలలో రచించిన ఇతర కావ్యాల్లోనూ నిర్వహించారు. ఉదాహరణకు వేదనా వాసుదేవము (మొదటి ముద్రణ 1964)లో ఈ పద్యంలో చూడండి.
ఒక నిర్వేదపు వెల్లువన్ మునిగి, నిన్నుద్వానితుం జేసి భ
ల్లుకపుం బట్టుగ నాదు గుండె తల్పున్ మూని, లోనన్ బిగిం
చు కొనంగా గడె, ఏమి నా తెలివి మండున్ / తల్పుపై నుండి పా
యక తీయంగల కుంచెకోల అది నీ వాస్తార్చితమ్మై ప్రభూ +
వాసుదేవుని వాసం తన గుండె గుడిలోనే. అయితే ఒక 'మూడొలో ఆయన్ని బయటికి వెళ్ళగొట్టి గుండె గుడి తల్పు మూసి లోపల గడె పెట్టుకున్నాడు. కాని అది ఏమంత తెలివైన పని కాదు. తలుపుపై నుంచి గడె తీసే సాధనం కుంచెకోల ప్రభువు చేతిలోనే ఉండిపోయింది. వాసుదేవునితో తన సాన్నిహిత్యాన్ని తాను వద్దన్నా తన ప్రభువు తనలోనే ఉంటాడనే భావాన్ని గుడి-కుంచెకోల అనే రెండు సాధనాల ద్వారా పొదుపుగా వ్యక్తం చేశారు.
నాయని సుబ్బారావు గారు (1899 - 1978) భావ కవిగానే మిగిలిపోలేదు. అభ్యుదయ కవిగా మారలేదు. చిక్కని కవిత్వాన్ని అపారంగా అందించిన చక్కని కవిగా
మిగిలిపోయారు. చేరాతలు, ఆంధ్రజ్యోతి 1987 అక్టోబర్ 25 సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 33 చేకూరి రామారావు
- నాయని వారి లఘు కావ్యాల్లో గురుత్వం
ఒక కవిని సమగ్రంగా అంచనా వేయడానికి ఆయన అలఘు కావ్యాలనే కాక లఘుకృతులను కూడా పరిశీలించవలసి ఉంటుంది. ఇదేమంత కాత్త విషయం కాదు కాని సాహిత్య విమర్శకులు కవుల ప్రధాన కృతుల ప్రభావంలో పడి వారి అప్రధాన కృతులను తరచు విస్మరిస్తుంటారు. పోతన భాగవతం గుర్తుపెట్టుకుంటారు గాని భోగినీ దండకం మర్చిపోతారు. శ్రీ శ్రీ అంటే మనో (ప్రస్థానం, కాకపోతే మరో (గ్రస్టానం గుర్తు పెట్టుకుంటారు గానీ ప్రొన క్రీడలు, సిరిసిరిమువ్వ శతకం, లిమరుక్తులు, కొంటె కోణాలు వగైరా గురించి అంతగా పట్టించుకోరు. కానీ అవి చూడకపోతే శ్రీశ్రీ హాస్య ప్రియత్వం తెలియదు. ఈ దృష్టితో నాయని సుబ్బారావు గారి కవిత్వం పరిశీలిస్తే ఇంతకు పూర్వం విస్మృతమైన ఎన్నో విషయాలు చెప్పటానికి వీలవుతుంది.
నాయని సుబ్బారావు గారి కావ్యాలలో సౌభ్యదుని వజయయాత్ర (ఫలథ్రుతితో సహా), మాళ్ళగీతాలు, వేదనా వానుదేవము, విషాద మోవానము, జన్మభూమి - ఇవి సుమారు ఏఖైఏండ్ల (1920-70) కాల విస్తృతిలో రాసినవి. ప్రణజయయాత్రలో యాత్రా ప్రారంభ సాఫల్యాలు, మాతృగీతాలలో మాతృస్మృతి. విషాద మోహనములో అకాల మరణము చెందిన పుత్ర స్మృతి, వేదనా వాసుదేవములో ఆత్మ నివేదనము, జన్మభూమిలో తన బాల్య జీవితం గడిపిన ప్రాంతం కావ్య వస్తువులు. వీటి అన్నింటిలోనూ ఆత్మాశ్రయ ధోరణే కనిపిస్తుంది. విసృత కావ్యమైన జన్మభూమిలో మాత్రం పరిధి విస్తృతం కావడం వల్ల వస్త్వ్వాశ్రయం కనిపిస్తుంది. సమకాలిక గాథల కథనం ఇందులో ఉంది. నాయని సుబ్బారావు గారి కవిత్వ పాఠకులు వాటిల్లో కొన్ని కాని, అన్నీ కాని చదువుతారు. వాటిని గురించి మాట్లాడతారు. రాస్తారు. కాని 1948లో రెండోసారి అచ్చయిన మాతృగీతాలతోపాటు చేర్చిన తత్త్వమసి, సాగర సంగీతము వంటి కావ్య ఖండికలను గానీ, 1958లో నాయని సుబ్బారావు కృతులు పేరుతో అచ్చయిన సంకలనంలో చేర్చిన మరికొన్ని ఖండకృతులుగాని, 1957-1964 ప్రాంతంలో రచించి 1966లో భాగ్యనగర కోకిల పేరుతో అచ్చేసిన మరికొన్ని ఖండకృతులను ఎక్కువ పట్టించుకోరు. అయితే సౌభ్గద భద్ర కవితా వైవిధ్యం 34 చేకూరి రామారావు
కవి కావ్య జీవితంలోని సమ(గ్రతను (101200 (గ్రహించటంకోసం ఈ లఘుకృతులను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
కావ్యానుభూతిలో ఖండకావ్యాలకు విస్తృత కావ్యాలకూ భేదం ఉంటుంది. విస్తృత కావ్యాల పరనంలో కలిగేది అఖండానుభూతి (1౧0౧౫166 అ౦6గ౭౧౦6౨). ఉత్తరోత్తరా కావ్యానుభవంలో పూర్వపూర్వానుభవాల స్మృతీ ప్రమేయమూ ఉంటాయి. ఖండకావ్యాలలో అనుభవం కూడా ఖండంగానే ఉంటుంది. భౌతికానుభవ సాదృశ్యం చెపితే విసృత కావ్యానుభవం క్షుశ్స్రేరక పానీయాలతో సహా వివిధ రుచుల సమాహారంతో ఒక (క్రమంలో ఏర్పాటు చేసిన పసందైన విందు భోజనం (4౧ ౪001218 1629) లాంటిది. ఖండ కావ్యానుభవం స్వల్ప విరామంలో చేసే అల్బాహారానుభవం లాంటిది. వీటిలో దేని విలువ దానిదే. సందర్భ భేదాలను బట్టి రెంటికీ మానవ జీవితాలను నిస్సారత నుంచి తప్పించి రసప్లావితం చేసే శక్తి ఉంది. ఒక్కోసారి విసృత కావ్యంలో దొరకని వైవిధ్యం, భిన్నత్వం, (ప్రత్యేకత (౪1గ60/ ఖండ కావ్యాలలో దొరుకుతుంది.
సాధారణంగా నాయని సుబ్బారావు గారిని భావకవుల జాబితాలో చేర్చి మాట్లాడుతుంటారు. నిజానికి చాలా మంది భావకవులు ఆ ధోరణికి పరిమితమైన వారు కాదు.
భావకవుల మీద ప్రపంచం గురించి సమాజం గురించి పట్టించుకోలేదని ఒక కాలంలో ఒక విమర్శ ఒక ఆరోపణ ఉందేది. అయితే భావకవులు జాతీయోద్యమంలో మమైకం అయినట్లు వాళ్ళ జీవితం సాక్ష్యం ఇస్తుంది. వాళ్ళ రచనల్లో ముఖ్యంగా వాళ్ళ ఖండ కృతుల్లో కూదా ఈ సాక్ష్యం ఉంది. అంతే కాదు సమకాలిక జీవన స్పందన కూడా కనిపిస్తుంది.
ఈ ఖండ కావ్యాలలో సంవత్సరానికి, బుతువులకు, ఇతర సందర్భాలకూ ఇతరుల కోరికపై రాసిన కొన్నింటిని వదిలేస్తే జాతీయోద్యమం వేడితో స్ఫూర్తితో రాసినవి కవికి ఉద్యమంపై ఉన్న సానుభూతిని తెలియజేస్తాయి. 1958లో అచ్చయిన నాయని సుబ్బారావు కృతులు రెండో భాగమే తత్త్వమసి (సిపాయిల తిరుగుబాటు సందర్భంలో ఒక గాధ), సాగర సంగీతము (చిత్తరంజన్ దాస్ స్మృతికి), ఉత్సారణము, దాస్యగీతి (భారత దాస్యానికి వేదన వ్యక్తం చేసేవి ఈ రెండు), అంజలి (నేతాజీకి) మహోదయం, (స్వాతంత్ర్యదిన సందర్భంగా), పుష్పాంజలి (మొదటి స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా) తెలుగు తల్లి, శ్రద్ధాంజలి (సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు) రాసిన ముక్తకాలు పరిశీలిస్తే ఈ సౌభద్ర భద కవితా వైవిధ్యం 35 చేకూరి రామారావు
కవి భారతదేశ దాస్యానికి దుః;ఖించారని, భారతదాస్య విముక్తికి ఆనందించారని, స్వాతంత్రోదయాన్ని బలపరిచారని, ఉద్యమనాయకులను అభిమానించారని ఆంధ్రోద్య మానికి కూడా ఈయన స్పందించారని స్పష్టంగా తెలుసుకోవచ్చు. సుభాష్ చంద్రబోస్‌పై రాసిన అంజలిలోను, 1947 ఆగస్టు 15 నాటి స్వాతం్రోత్సవానికి రాసిన 'మహోదయం'లో ఆయన తొలిసారిగా మాత్రాచ్చందస్సును వాడుకున్నారు. ఆ తర్వాత చాలా కాలానికి (1957 తర్వాత) భాగ్యనగర కోకిలలో చేర్చిన జనవరి ఇరవైయారులో తప్ప ఇంకెక్కడా ఆయన గేయాలన్నీ వాడుకోలేదు. ఆనాటి భావ కవులు ముఖ్యంగా కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు తల్లావర్హుల శివశంకరశాస్ర్రి, కవికొండల వెంకటరావు పద్య, గేయాలను సమంగా వాడుకొని రెండిటిలోనూ నైపుణ్యం చూపించారు. నండూరి సుబ్బారావుగారు ఆ తర్వాత వచ్చిన కొనకళ్ళ వేంకట రత్నంగారు తమ కవిత్వాన్ని పాటల్లోనే రచించారు. ప్రధానంగా పద్య కవి అయిన విశ్వనాధ సత్యనారాయణ గారి కిన్నెరసాని, కోకిలమ్మ పెళ్ళి అనే గేయ కావ్యాలు కవికి అధిక ప్రచారాన్ని కల్పించి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. గేయానికి వ్యాప్తి కలిగించి ప్రామాణికతను కల్పించింది భావకవులే. (ఆ ప్రామాణికతనే సి, నారాయణరెడ్డిగారు అందుకొని విస్తృత పరచారు.) నేటి సభల్లోనూ రేడియో, టెలివిజన్ల లోనూ తరచుగా వినిపించే లలిత గీతాలను భావగీతాలు అని కూడా అంటారు. ఈ భావగీతాల పేరూ, వ్యాప్తి భావకవుల కాలం నుంచే మొదలయ్యాయి. ఈ విషయంలో నాయని సుబ్బారావు గారు భిన్నంగా కనిపిస్తారు. గేయాన్ని చాలా అరుదుగా వాడుకున్నాడు. అదీ ఒక్క ఖండగతినే. “అంజలి”, 'మహోదయము” అనే ఖండికల ఆద్యంతాలలో గేయం వాడారు. నేతాజీని ప్రశంసించే ఈ భాగం చూడాలి. తన యూహా నరుల కందగరాని మార్గమై తమ మాయ నురల కందగరాని జాలమై మిన్ను ముట్టినదటే కన్ను గట్టినదటే జయపాొంద్ నినాద దికృక్ర సమ్మోపొతా ప్రయుత న్వతంత్ర భారత వాపొనీవితా సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 36 చేకూరి రామారావు
అని ఖండిక ప్రారంభించి మళ్ళీ పద్యాల్లోకి వెళ్ళిపోయాడు. స్వాతంత్రోత్సవ దినంనాడు ఎంతో పారవశ్యంతో గాన చేసిన పద్ధతి కనిపిస్తుంది. ఒక కాల్పనిక యుగపు కవి స్వతంత్రావతరణాన్ని దర్శించిన విశిష్ట పద్ధతికిది మంచి ఉదాహరణ.
కారుమబ్బుల నల్ల కప్పు వేసిన నింగి
పారతంత్ర్య తమస్సు పాముకొన్న ధరిత్రి
కలికి రాయంచ రెక్టులు వివ్ఫుకానియెనో
తెలిదమ్మీ వూల రేకులు కవ్పుకొనియెనో
ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళ కీ మవోదయ దీప్తి
కన్నార గాంచు భాగ్యము గల్లె మన కవో అని మొదలైన ఈ ఖండిక మధ్యలో ఆరు పద్యాలు ఇముడ్చుకుని -
ధూత దుర్భర దాస్వ దురిత సంతమనమ్ము
స్వాంతంత్ర్ర నవయుగోదృవదివ్య రాగమ్ము
ఉనని చన్నానల స్వేచ్చా వయస్సుబికెనో
జనని కన్లానల విశ్వ (శ్రేయమురలెనో
ఎన్నాళ్ల కెన్నాళ్ళకీ మవోదయ దీవ్రి
కన్నార గాంచు భాగ్యము గల్లి మన కహో, అని ముగుస్తుంది. కవి దీనిని అంత్య ప్రాసలేని ద్విరద గతి రగడగా నడిపించాడు. యతి ప్రాసల నియతి కూడా పాటించారు. ప్రాచీన రగడగా నియమాలను పాటించినా అధునిక కవుల లయ నిర్వహణ కనిపిస్తుంది. భాగ్యనగర కోకిల:
1957లో నాయని సుబ్బారావు తన కవితాయాత్ర ఇక ముగిసిందనుకున్నారు. 'కృతులు'లో ఇది నా సర్వ కృతుల సంపుటి అని చెప్పుకున్నారు. చివరి ఖండికలో-
కథ కంచికి పోయినదా
వ్యధితాత్సక కథకుడింటి కరుగవలెనా?
వృధుమత్సత్య కవిత్వ
(పథానమార్గమ్ము మూయబడినల్లేనా? అని రాసిన పద్యంలో కూడా ఈ సూచన ఉంది కాని వేదనా వాసుదేవము విషాద మోహనము, జన్మభూమి వంటి పరిణత కావ్యాలు ఆ తర్వాతనే వచ్చాయి. వీటి రచనా సౌభ్యద భద్ర కవితా నైవిధ్యం 37 చేకూరి రామారావు
కాలం 1958-1970 అయితే 1958-1964 మధ్య కాలంలో (ఆలిండియా రేడియోలో పని చేసే కాలంలో) రాసిన కవితా ఖండికలను “భాగ్యనగర కోకిలు పేరుతో 1966లో ప్రచురించారు. రేడియో అవ్వ ఉచ్చిష్ట భారతము అనేవి ప్రత్యేకంగా గుర్తించదగినవి. ఆకాశవాణి కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగిని గురించి రాసిన రేడియో అవ్వ. ఎండిన కసపు దుబ్చిరినీ నబ్బడల వరచుకొన్న విధాన వలిత కేశములు విరినీన తలతోడ వెలయు నా యన్వ (్రతుకంతయును (గ్రీష్టుపర్వ మా యవ్వ ఆమె తర్వాత చనిపోయిందని తెలుస్తుంది. ఆమె గురించి ఎవరూ పట్టించుకోక పోవడాన్ని ఇట్లా వర్ణిస్తారు. పేరు పెంపునుగన్న పెద్దల కట్లు సాగుచునున్న (ప్రసారమ్ము నావీ మధ్యలో నవ్వ యాళ్ళుకు శాంతి గోరు నాకాళవాణీ ఆద్దాంజలి లేదు నంతాప నూచక నభరైన లేదు వ కే వ జగముల పాలించు చల్లని తల్లి చేయెత్రి రమ్మని చేరంగ బిలిచి మునీముని నవ్వుల ముద్దు నివ్వాళు లెత్తెనేమో యవ్వ కెవ్వరికెరుక అని ఆ అవ్వకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. హోటల్ ప్రక్కన చెత్తకుండీలో పడ్డ విస్తరాకుల కోసం ఎగబడే కుక్కలతో పాటు పోటీ పడే బాలుణ్ణి “ఉచ్చిష్ట భారతం'లో వర్ణిస్తారు. ఆ బాలుడు తాను కడుపునిండుగా తిని కుక్కలనూ పందులనూ పిలిచి మిగిలింది పెడతాడు. దాన్ని చూచి కవికి కడుపులో దేవినట్లయింది. వదునేనేండ్లుగ విస్తరిల్లిన ప్రజాస్వామ్యమ్ములో నంతతా భ్వుదయ శ్రీనముపేత సర్వనమతా వ్యూవోఖి షేకమున్మున్ సౌభద భద కవితా వైవిధ్యం 38 చేకూరి రామారాన
వదనైనట్టి స్వతంత్ర భారత మవో పౌరుండవై నీకు నే
మీ, దశాదుప్పరిపాక దైన్యమిది స్వామీ ఇట్టి కక్కుర్తికిన్ అని ఆ కుర్రాడికి భోజనం పెడతా రమ్మంటాడు. వాళ్లిద్దరి మధ్యన ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది. తనకు తోచిన రీతి సమాధానమిచ్చి ఆ “ఉచ్చిష్ట సామ్రాజ్య లక్ష్మీవాల్లభ్యుడు” ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆ ఖండిక ముగింపులో ముక్తాయింపు అనాటి (ఈనాటి కూదా) పాలక వర్గాలపై గొప్ప వ్యాఖ్య.
అతడు ముక్తనంగుదవును కాదది నరే
(ప్రగతి వంట విరగబందె నన్న
ఐం(దజాలికోక్తి కపవాద మతడన్న
కరతురేల ప్రభుత మెరయు దొరలు
ఎన్నాళ్ళ కెన్నాళ్ళకీ మహోదయ దీప్తి అని స్వతంత్రావతరణమును గూర్చి పాడిన కవి పదిహేనేళ్ళ తర్వాత ఎంతగా భ్రమాదూరుడయ్యాడో ఈ ఖండిక ద్వారా తెలుసుకోవచ్చు. వ్యవస్థలో అనాద్బతులు నిస్సహాయులు పడుచున్న అవస్థలపై కూడా కవి దృష్టి పడిందని ఈ ఖండికలు చదివితే తెలుస్తుంది.
నాయని సుబ్బారావు గారు జీవితంలోను కవిత్వంలోను లలిత హాస్య ప్రియులు. జీవితంలో ఘటనలు కొన్ని అనుమాండ్ల భూమయ్యగారి నాయని సుబ్బారావు కృతులు
- పరిశీలన (1981) అనే (గ్రంథంలో దొరుకుతాయి. కవిత్వంలో హాస్యంలో వేదనా వాసుదేవంలోను జన్మభూమిలోను కొన్ని దొరికినా భాగ్యనగర కోకిలలో, అభినవ శ్రీకృష్ణలీలలులో ప్రత్యేకంగా గుర్తించగలం. సమాసోద్ధతితో ప్రొఢ శైలిలో చిరుహాస్యం చిందించటం నాయని సుబ్బారావు గారి పద్ధతిలా కనిపిస్తుంది.
వసంత బుతువులో కోయిల కూస్తుంది. కాని హైదరాబాదులో కోకిల కూత సర్వర్తుకముగా గమనించారు. ఆ కోకిల కూజితానికి ఎవరెవరు ఎట్లా స్పందించారో వర్ణించే చిరు హాస్య ఖండిక ఈ భాగ్యనగర కోకిల.
వారు నంస్మార శుచులైన ఖాగ్యవంతు
లొక్కు దాడీ మహారధవ్మెళ్టి వచ్చి
చెరువుకట్ట బెంచీ పైన చెరియొక్ళ దెన
గొలువు దీర్తురు చేతి గుడ్డలను వరవి. సౌభద భద కవితా వైవిధ్యం 39 చేకూరి రామారావు
వకణా వేరు సెనగల నెంచుకొని య తందు సగబాలు మోవాంబు తరుణికిచ్చు నామె మదన సాధ్రూజ్య వట్టాభివిక్త మొన రీతి వానన్ముఖియై వెలుంగు నీ వనంతాగమోన్నిద్ర నిభ్ధృత రాగ మంజు శింజాన రనుణీయ మధురగీతి కాదు వారికి, వారు నంన్మార జడులు వారి మోటారు వోరనే వారి వీణ అట్లాగే “పాగాంతరే' చెవులు సురక్షిత్రాలయి మోటారు సైకిల్‌పై షికారుపోతున్న సిక్కు దర్చకునకు కోకిల కూత కూడ వినపడదట ! మన్మథుని విజయధ్వజంలా వెనుక సీటులో కూర్చున్న అమ్మాయి వింటుందట. పొట విని కామ వరవశోల్చణము లతివ చూవురాకె ట్లతని వీవు సొచ్చి (గుచ్చి దూసికొని త్రోనసికొనిపోయి తుదకు బవిరి గడ్డ మాతని దొకయింత కళవళించు ఆమె స్పందనము, సొచ్చి (గ్రుచ్చి దూసికొని, త్రోసికొని అని వర్ణించాడు. అంతటి స్పందనకు సిక్కు దర్పకుని గడ్డం కొంచెం కదిలిందట. (ఈ విశేషార్ధం ఆయనే నాకు చెప్పారు.) రిక్షాచోదకుని వర్ణిస్తూ - అతడు నారాయణగుదా మవో (ప్రశస్త శీధు పానాధరీకృత సీరపాణి కలిత బహుముఖ సారథ్య కౌశలమున దారుకుని మాతలిని తలదన్నినాడు అంటారు. ఆ రిక్షాలో వున్న దంపతులు కోకిల పాట విని దిమ్మెరవోదు రొకళ్ళపై నొకరిగా. (హైదరాబాదు నారాయణ గూడాలో గుడుంబా అనే నాటు సారా తయారయ్యేది ఆ రోజుల్లో) ఆ సందర్భాన్ని ఇంకా వర్ణిస్తూ. సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 4౦ చేకూరి రామారావు
వరభృత కువూ నినాద నంక్రములు వార లొక్కరా యిర్వురా యన్న చిక్కు విదదు వరభృత కుహూ నినాద వి[జ్రముడు నూతు దేక చక్రముపై నివమెత్తి యూగు, నాయని సుబ్బారావు గారి అలఘు కావ్యాలతో పాటు లఘు కావ్యాలు కూడా రమణీయ భావ సంకలితాలై ఆస్వాద యోగ్యాలుగా ఉంటాయి. ఆయన హాస్యట్రీతి, ప్రాపంచిక దృక్పధమూ, లఘుకావ్యాల్లో కన్పిస్తాయి. ఏ కవి దృక్పధాన్నయినా సమ(గ్రంగా (గ్రహించాలంటే ఒక కవి రచించిన అల్పానల్ప రచనలన్నీ స్వీకార్యాలే. విషాద స్మృతి కావ్యాలు: మానవ జీవితంలో సుఖదుఃఖాలు రేయింబవళ్ళలా పరస్పరం వెన్నంటి చక్రనేమి క్రమంలో వర్తిస్తూనే ఉంటాయి. కవులు వీటిని హర్షగీతాలుగానూ, శోకగీతాలుగానూ గానం చేస్తూనే వుంటారు. శోక గీతాలను ఇంగ్లీషులో ఎలిజీలంటారు. భావగాధతతో రాసిన ఏ గీతాన్నైనా మొదట్లో ఎలిజీ అనే పిలిచేవారు. సుమారు 16వ శతాబ్దం నుంచి ఈ మాటకు శోక కావ్యం అనే అర్ధం రాను రాను స్థిరపడింది. ఆంగ్ల సాహిత్యంలో ఇదొక ప్రత్యేక కావ్య పద్ధతిగా స్థిరపడింది. ఆప్పులైన వారి ఆత్మీయుల మరణానికి శోకతప్త హృదయంతో పలికే విలాప గీతం అనే అర్ధంలో ఆధునికులు ఎలిజీ అనే మాటను వాడుతున్నారు. దీనికి తెలుగులో స్మృతి కవిత అని అనుకోవచ్చు. ఎలిజీ అనే స్మృతి కవిత ఆధునికాంధ్ర సాహిత్యంలో ఒక ప్రత్యేక శాఖలో విస్తరించింది. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ఎలిజీలు అరుదుగా కనిపిస్తాయి. శ్రీ కృష్ణదేవరాయల మరణానికి దుఃఖిస్తూ అల్లసాని పెద్దన చెప్పిన 'ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి కేలూత యొసగి యెక్కించుకొనియె” అనే పద్యంలో ఈ ఎలిజీ లక్షణాలు కనిపిస్తాయి. ఆ పద్యంలో “ఆంధ్రకవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్రయని నన్ను పిలుచునట్టి, కృష్ణ్ణాయలతో దివికేగలేక, (బ్రతికియున్నాడ జీవచ్చవంబనగుచు” అని పెద్దన రాయలవారిని విషాదంతో స్మరిస్తాడు. ఆధునికాంధ్రలో చాలామంది ఎలిజీలు రాశారు. రాజకీయ నాయకులు పోయినప్పుడు రాసిన విషాద కావ్యాల్లో గాఢత ఉండదు, పొగడ్తలుంటాయి. ఆప్తులు పోయినప్పుడు రాసిన విషాద కావ్యాల్లోనే ఎక్కువ ఆర్తి సొభద్ర భద్ర కవితా వైవిధ్యం తే చేకూరి రామారాను
కనిపిస్తుంది. అటువంటి ఈనాటి తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైనవి కొన్ని ఉన్నాయి. తన కూతురు మంగళప్రదమ్మ చనిపోయినప్పుడు బసవరాజు అప్పారావుగారు రాసిన ఎలిజీ ప్రసిద్ధమైనది. భార్య మరణానికి దుఃఖిస్తూ దువ్వూరి రామిరెడ్డిగారు భన్న హృదయం పేరుతో 1925-1930 మధ్యన కొన్ని ఎలిజీలు రాశారు. అందులో భార్య మరణించినప్పుడు బిడ్డపోయినప్పుడు రాసిన పద్యాలున్నాయి. 1925 జూలై 9న ఆయన భార్య, 1926 ఆగస్టు 20న ఆయన కూతురు మరణించారు. ఆ నిర్వేద కాలంలోనే ఆయన్ను ఉమర్ ఖయ్యాం రుబాయతులు ఆకర్షించాయి.
మిత్రులు పోయినప్పుడు రాసిన ఎలిజీలలో మొక్కపాటి రామమూర్తిపై కృష్ణశాస్త్రిగారు, కొంపెల్ల జనార్ధనరావుపై శ్రీశ్రీగారు రాసినవి ప్రసిద్ధాలు. భార్య పోయినప్పుడు విశ్వనాథ సత్యనారాయణగారు వరలక్ష్మీ ట్రిశతి రాశారు. నాయని సుబ్బారావు గారి తల్లి 1924 ఫిబ్రవరి 8న మరణించారు. అప్పటి నుంచి బహుశా ఒక సంవత్సరం కాల వ్యవధిలో మాతృగీతాలు రచించారు.
తెలుగులో మొదటి స్మృతికావ్యమని అనుమాండ్ల భూమయ్య అనే పరిశోధకుడు (చూ.నా.సు. కృతులు పరిశీలన 1981) అంటాడు. ముందు వెనకల మాట ఎట్లా ఉన్నా అనాటి పారకులను కంటతడి పెట్టించిన విషాద స్మృతి కావ్యం మాత్చృగీతాలు. ఇతర కావ్యాలలో వైరాగ్యం, తత్త్వచింతన ఎక్కువ కనిపిస్తాయి. మాతృగీతాలలో తల్లి బిడ్డల సంబంధం కారణంగా ఆర్తి శోకం, మౌగ్ధ్యం, అమాయకత్వం వంటి భావాలు కనిపిస్తాయి. మాతృగీతాలు రాసే నాటికి కవి వయస్సు పాతికేళ్ళు. అయినా తల్లితో అనుబంధం ఎక్కువ. విశ్వనాథ సత్యనారాయణగారి మాటల్లో 'ఈ కవి ప్రకృతితః సుకుమారమైన బిడ్డ. వయస్సు వచ్చినను పసితనములోని మాధుర్యము వెనుద్రొకృని చిట్టికూన. అందుకే తల్లిని దూరం చేసిన విధిపై కోపం తెచ్చుకుంటాడు.
ఎవ్వదా (క్రూరకర్శఠుదెవడు? నీల
జలద నిర్ముక్త శ్రైశిర శర్వరీ ప్ర
శాంత మలవాటుపడిన నిశాంతమందు
అకట నట్టింటి దీవమ్ము నార్స్చినాడు.
ఎవ్వడా విరసొత్సికుందెవడు? సాంధ్య
రాగ మంజుల రేఖావిరాజమాన
మంగళాకాశ సీమంత రంగమందు
కారు చీకట్ల రాసులు (గ్రక్కినాదు? సౌభద భద్ర కవితా వైవిధ్యం 42 చేకూరి రామారావు
ఎవ్వదా నిర్ణయ స్వాంతుదెవడు? నన్ను
కంటక నిగూఢ వివిన మార్హముల తల్లి
లేని బిద్దను గావించి మాననంవు
టానలన్నియు నడుగంట గోసినాడు. మాత్చగీతాల్లో మౌగ్ధ్యం కనిపిస్తుంది.
అచట నీవేమి చేయుదు వచట ఎచట
నేనటకు వత్తు నీవును నేను మరల
తల్లి బిద్దాటలాడుకొంద మవ్యుతాఖి
వక్త వథముల నే చీకు చింతలేక అని తల్లి చాటు బిడ్డలాగా వాపోతారు. రెండులోకాల పొలిమేరలు ఒకటైన చోట నువ్వు చిచ్చి కొడుతుండగా నీ ఒడిలో నిదురపోతానంటారు.
విషాద మోహనము అనేది సుబ్బారావుగారి రెండో స్మృతి కావ్యం. 1968 ఆగస్టు 22న ఉన్న ఒకే ఒక్క కుమారుడు చనిపోగా అంతులేని శోకంతో రచించిన కావ్యం ఇది. అప్పుడు సుబ్బారావుగారి వయసు సుమారు డెబ్బైెయేళ్ళు. అంత పెద్ద వయసులో ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. ఆసుపట్రి నుంచి వచ్చిన కుమారుని భౌతిక కాయాన్ని చూచి నీ పేరు చిరస్థాయిని చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఒక సంవత్సర కాలంలో 225 మధ్యాక్కరాల పద్య కావ్యాన్ని వ్రాశారు. తన లాంటి ఆపత్తు జరిగిన వారికి ఈ కావ్యాన్ని అంకితం ఇచ్చారు. “కొడుకులో కూతురులో పోవనడలడి కూరితాటలును తడపలై కాలమ్ము వెళ్ళబుచ్చెడు తల్లిదండ్రులకు పుడమి విషాద విశేష కావ్యములే పొంగించి, కరుణ కడమలంటిన ్రాక్తనాధునాతన కవి కవీతతికి” మాత్ఫగీతాలలో మౌగ్ధ్యం కనిపిస్తే విషాద మోహనములో విశేషమైన పరిణతి కనిపిస్తుంది. ఈ పరిణత కావ్యంలో విధి దూషణ ఉండదు. కుమారుని ఆత్మకు శాంతిని ప్రసాదిస్తాడన్న ఆశాభావం కనిపిస్తుంది. అంతేకాక సకల ధరణికి శాంతి కోరుకుంటారు.
పాంచులమ్ములు మనన్ఫంభవమ్ములు వరమార్ధ చింత
(్రంశనమ్ముగ పేర్చు శోక మోవారూవములైన అవర
శించు మారమ్ముల క్రకచ దంధ్రలు శిథిలత్వ మొంది
ఓం శాంతి ఓం శాంతి సకల ధరణికి ఓం శాంతి యెవుదు అని ప్రపంచ ప్రజలందరికిని శాంతిని కాంక్షిస్తారు. సౌభ్యద ఖద కవితా వైవిధ్వం త చేకూరి రామారావు
ఈ కావ్యమూ, దానితో పాటు కుమారుని స్మృతి శాత్వతంగా ఉంటుందని ఆశిస్తారు.
ఎందాక మధురాతి మధుర మాంధ్రనసొపొత్వ ప్రపంచ
మందీ విషాద మోవానము మన్నానసార్తి రోచనము
నందీప్త కరుణమ్ము ఫలిత శాంతి ప్రనన్నమ్ము వెలయు
నందాక నీ పేరు జగతి శాశ్వతమ్మైయుందు తండ్రి.
సుబ్బారావు గారు ఆశించినట్లే ఆంధ్ర సాహిత్యంలో విషాద మోహనము స్థానం శాశ్వతం. కుమార స్మృతి కూడా శాశ్వతమే.
- ఆంధ్రజ్యోతి సాహిత్యవేదిక, 1998 డిసెంబర్.
కార్టూన్ కవిత్వం:
వభ్రికలలో కార్టూన్లు
పడడం చూళ్ళేదూ?
వద్యంలో ఆ మాదిరి
వద్ధతి వీల్లేదూ అని అప్పుడెప్పుడో 1958లో శ్రీశ్రీ తెలుగు స్వతంత్రలో అన్నారు.
తెలుగులో కార్టూన్ కవిత్వం ఎప్పుడు మొదలైందో సరిగ్గా తెలియదు. అంతకుముందు 1950లో కాబోలు అప్పటి రాజకీయ పరిస్థితులను వ్యాఖ్యానిస్తూ నండూరి రామమోహనరావుగారు ఆంధ్ర వారపత్రికలో అంత్య ప్రాస నియమంతో లిమరిక్కులు రాసేవారు. చాలా మంది అనుకుంటున్నట్టుగా (అభ్యుదయ కవిత్వంతో సహా) సాహిత్య ప్రక్రియలు చాలా వాటికి శ్రీశ్రీ ఆద్యులు కాకపోవచ్చుగాని చాలా క్షేత్రాలను చదును చేసి చక్కని బాట వేశారు. అన్నిటికి ఆద్యుడు కావటమే గొప్పకాదు. ఆ మార్గాన్ని పటిష్టం చెయ్యటం కూడా గొప్పే. ఆ తర్వాత ఆ మార్గంలో నడిచిన ప్రసిద్ధులు చాలా మంది ఉన్నారు. నాయని సుబ్బారావు గారు కార్టూన్ కవిత్వం రాశారంటే ఆశ్చర్యమే. నాయని సుబ్బారావు ఎంత సీరియస్ కవో అంత వోాస్యప్రియులు. నిజ జీవితంలో ఆయనతో పరిచయం ఉన్న వారికి ఈ విషయం బాగా తెలుసు. ఆయన లఘు కృతుల్లో ఈ హాస్య ప్రియత్వం స్పష్టంగా తెలుస్తుంది. సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం త చేకూరి రామారావు
నాయని సుబ్బారావు రాసిన కార్టూన్ కవిత్వం ఆయన పేరు మీద అచ్చు కాలేదు. 1958లో ఆయనతో సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు కలిగింది. అప్పుడు తుమ్మల వెంకటరామయ్యగారి సంపాదకత్వాన అభ్యుదయ మాస పత్రిక వస్తుండేది. అభ్యుదయ పత్రికాభిమానిగా ఆ పత్రికకు రచనలు సేకరించి పంపుతుండే వాణ్ణి. అప్పుడు నాయని సుబ్బారావు గారిని కూడా అడిగాను. ఆయన “సౌవీరభద్రుడు” అనే కలం పేరుతో కొన్ని కార్టూన్ రచనలు చేశారు.
నాయని సుబ్బారావు గారి కార్టూన్ కవిత్వం రూపంలో ప్రధానంగా వచన కవిత. అయితే దీన్ని వచన కవిత అనే కంటే ముక్తచ్చందం అనటం ఉచితం. ఛందస్సు నుండి బయటపడే ప్రయత్నంలో వచ్చిన కవితా రూపాన్ని ముక్తచ్చందం (థ్రైంచ్లో వెర్స్ లిబేర్ అంటారు) అని స్వచ్చందంగా లయ ప్రమేయం లేకుండా వచ్చిన కవితా రూపాన్ని వచన కవిత రూపాన్ని వచన కవిత (ఫ్రెంచ్‌లో వెర్స్ లీబ్ర అనీ, ఇంగ్రీషులో (ఫ్రీవర్స్ అనీ అంటారు) అనీ అనుకుందాం. ఈ రెండూ కవితా రూప పరిణామంలో రెండు దశలు. మొదటి దశలో లయ విముక్తం అయే ప్రయత్నమే కనిపిస్తుంది. కాని లయ స్ఫూర్తి అనియతంగా ఉంటుంది. రెండవ దశలో లయస్స్ఫురణ అసలే ఉండదు. (ప్రస్తుతం తెలుగు కవిత రెండో దశలో ఉంది. ఈ దృష్ట్యా నాయని సుబ్బారావు గారి కార్టూన్ కవితా రూపాన్ని ముక్తచ్చందం అంటున్నారు.
నాయని సుబ్బారావు గారు రాసిన కార్టూన్ కవిత్వానికి ఆధారమైన వార్తను కవితా ఖండిక కింద తెలుగులో సూచించేవారు. కొన్నిటికి ఆధారాలైన వార్తల కత్తిరింపులు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుంచి తీసుకున్నవి. ఆయన ఫైలులో దొరికాయి. అభ్యుదయ పత్రికలో 'సౌవీరభద్రుడు' పేరుతో రాసిన వాటిలో పత్రిక పేరు తేదీ వివరాలు దొరకవు. తర్వాత 1965 ఆగస్టు నుంచి “ఆంధ్రప్రభలో” అప్పుడప్పుడు 'క్షేత్రజ్ఞుడు' అనే మారు పేరుతో ప్రకటించిన వాటిలో ఈ వివరాలు దొరుకుతాయి.
నాయని సుబ్బారావు గారి కార్టూన్ కవిత్వంలో రెండు దశలు ఉన్నాయి. తాలిదశ 1958, మలిదశ 1964. తొలిదశలో కవితలు పెద్దవి. అభ్యుదయలో ఒక పూర్తి పేజీకి నిండి ఉండేవి. సుమారు 20 పాదాలకు పైన, 24 పాదాల వరకూ ఉండేవి. మలి దశలో కవితలు చిన్నవి. వాటి పాద సంఖ్య 12గా నిర్దిష్టం. ఈ దశ కార్టూన్ కవిత్వంలో లయస్స్ఫూర్తి ఎక్కువ, చాలా చోట్ల మాత్రా ఛందస్సు నడక స్పష్టంగా కనిపిస్తుంది. సౌభద భద్ర కవితా వైవిధ్యం ఉప్ చేకూరి రామారావు
“వీరభద్రుడు పేరుతో అభ్యుదయలో రాసిన వాటిలో శ్రైష్యోపాధ్యాయిక, “నాం.గ. జీవస్తోత్రం” అనేవి దొరుకుతున్నాయి. (సాహిత్య అకాడమీ ఏర్పడ్డప్పుడు రాసిన సెటైర్ ఒకటి దొరకటం లేదు.)
ఎన్ని తుఫానులు లేచినా చేయదల్పుకున్న పని ఆగేదేమీలేదు. మేం ప్రకాశం గారి దగ్గర “తయారైనవాళ్ళం కదా విజయవాడలో ఆర్.టి.సి. బస్సుల ప్రారంభోత్సవ సందర్భంలో శ్రీ సంజీవరెడ్డి అనే నోట్ శైష్వోపాధ్యాయిక కవిత కింద ఉండేది.
ప్రకాశం గారి శిష్యులం మేము
వరమానందయ్య శివ్యులం కాము అని (ప్రారంభమైన 22 లైన్ల కవితలో సంజీవరెడ్డి వర్గాన్ని పరమానందయ్య శిష్యులతో పోల్చారు. ఇలా వచన కవితలా సాగిన తర్వాత చివరి ఆరు లైన్లలో చతురస్ర గతిలోకి వెళ్ళిపోయింది.
ఎన్ని తుఫానులు రేగినా
ఎన్ని అవాంతరాలు మూగినా
చేరుస్తాం దూలాన్నీ గమ్యం
శిప్వు వాక్యమిది చిన్నయ రమ్యం
అయితే స్వామి అప్పటి దాకా
నూది పదిలమేనా ? - చూడు మజాకా
సూదినీ దూలానికి గుచ్చి మోసుకుపోయే పరమానందయ్య శిష్యుల పోలికతో ఈ కవిత సాగింది.
నాం.గం. జీవస్తోత్రం అనేది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల గురించి రాసింది. ఇప్పుడు కూడా కష్టపడి పనిచెయ్య మనండి వారిని యన్. జి.వో.లను పొగడ్డానికి సిద్ధంగానే ఉన్నాం. శాసననభలో (బెజవాడ) గోపాలరెడ్డిగారు చేసిన ప్రకటనపై కవితా వ్యాఖ్యానమిది.
ఆర్థికమంత్రి పొగిడి నిన్నంట
ఆకాశానికెత్తుతాదంట
ఇంత అద్భష్టం పండించావా
ఎంత ధన్యుడవు ఎన్ జి, జీవా
అని మొదలై సాగుతుంది కవిత. సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం తీరి చేకూరి దామారాను
ఆలన్యం కాకుండా జావో
అఖీనుకు యన్. జీ జీవో
ఐదు గంటలదాకా కుర్చీ కంటిపెట్టుకొని వనిచెయ్
ఫైళ్ళ దొంతరలన్నింటినీ వటాపంచలు చెయ్ /
అప్పుడు అర్థిక మంత్రి వానన్ముఖుడై
పైసాలు వర్షించడుగాని బవుత్ ఖుషీగా
కన్యాకుమారి నుంచి క్రైలాన గిరిపర్యంతం
ఘనా” జటా వల్లిస్తాడు నీ కష్టదర్భ జీవితం అని ఆర్థిక సహాయం చెయ్యకుండా ఒట్టి పొగడ్తలతో ఉద్యోగులను సంతృప్తి పరచదలచుకున్న ఆర్థికమంతత్రిని హేళన చేశారు. ముక్తాయింపుగా చతురస్రగతిలో-
వ్యర్థ మనర్ధం తక్సిందంతా
సార్ధకమైందొకటే - అది
ఆర్థికమంత్రి పొగడ్త - అదే వురు
షార్ధమ్ ! చరితార్థమ్ ! వరమార్ధమ్ ! అంటారు.
పాదసమత్వం పాటించని వచన కవిత్వంతో ప్రారంభించి చివరి రెండు లేదా నాలుగు లైన్లలో ముక్తాయింపుగా చతురశ్రగతిని పాటించిన ఖండికలివి. అంత్యప్రాస పొటించినా అంత నిర్దిష్టంగా, నిర్చుష్టంగా పాటించినట్లు కనపడదు. పెద్ద పాదాల్లో పద్యాల్లో యతిలాంటి విరామమూ, వర్ణ మైత్రిని కూడా గమనించవచ్చు.
రెండవ దశ (1965)లో 'క్షేతజ్ఞుడు అనే కలం పేరుతో రాసిన కవితల్లో పాద సంఖ్య నిర్దిష్టం. నాలుగు పాదాల మూడు చరణాలు (స్టాంజాలు) ప్రతి కవితలోను కనిపిస్తాయి. ఇవి మొత్తం అచ్చయినవి 17 కవితలు. 22-8-65 నాటి ఆంధ్రప్రభలో అచ్చయిన 'ఏనుగు ఏడ్చింది అనే కవిత శీర్షికపైన ఎడం పక్కన బ్రాకెట్లలో 'కార్టూన్ కవిత్వం) అని కూదా ము(ద్రితమైంది. 'క60%041 7౭609 10 19 ౧౧౭౬౩(8గ అని ఆగస్టు 4 ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో అచ్చయిన వార్త దీనికి ఆధారం. రామ్‌నాథ్ సంస్థానపు ఏనుగు మావటివాని శవాన్ని తొండంతో స్పృశిస్తూ కంట నీరు కార్చిందని వార్త “మనిషికి మనిషికీ మధ్య ఈ మమకారం” అరుదని ఒకరన్నారని చెబుతూ-
ఎందుకు లేదు తమ్ముడూ ! ఇది (ప్రజాయుగం
్రజాతంత్రంలో ప్రజా సంక్షేమం కోసం సౌభద్ర భద కవితా వైవిధ్యం శ చేకూరి రామారావు
నగలనక్త రాత్రనక మన భజూవభువులు
ముద్దు ముద్దుగా కార్సడంలేదా మొనలి కన్నీరు ! అన్న చివరి నాలుగు పాదాల్లో తన కాలపు ప్రజాస్వామ్య ప్రభువుల కన్వయిస్తూ కార్టూన్ కవిత్వం రచించారు.
ఉ్రాలంగాణాలో మద్య నిషేవణ, ఆంధ్రప్రాంతంలో మధ్య నిషేధనం” ఉన్న ఆ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో కల్లుగీతకు అనుమతించారు. తెలంగాణాలో తీసిన కల్లు చాలటం లేదని నిషేధప్రాంతం నుండి ఇక్కడికి కల్గు రవాణాకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాన్ని అవహేళన చేస్తూ 'సురా సమన్వయం” అనే కవిత 19-9-65 ఆంధ్రప్రభలో రాశారు.
“ఆంధ్రా కల్లు కొంత గుటకాయస్వాహా అక్కజ్ణే కానీ సాధు సుబ్రహ్మణ్యులకిది సంతాపకరమైతే కానీ, తెలంగాణా కల్లు పాకలో, (త్రిశంత్మోటి విలాసాలతో అందాలొలక బోస్తుందిక, ఆంధ్ర సురాభాండేశ్వరి” అని చమత్కరించారు.
కాంగ్రెస్ తరపున (పశ్చిమ జర్మనీ) “బాన్ పోవటానికి కామరాజునాదారుగారు బెజవాడ గోపాలరెడ్డిగారిని ఎంచుకున్న వార్త చదివి చమత్కారమైన పాట “బాన్-వాయేజ్, గోపాలయ్యకు” అని 12-12-65 ఆంధ్రప్రభలో రాశారు.
వళ్చిమ జర్మనీ 'ఖ్లాందు” విల్చేని
కామరాదను కంవ కందళించేని
క్షేమాన పోయి వచ్చేవు లాభాన
పోయిరా జర్శనీ పోయిరావయ్య అని తీసుకొని గోపాలరెడ్డి గారితో మేలమాడారు. అప్పటి గోపాలరెడ్డిగారి శృంగార ప్రియత్వం గురించి నాటివారిలో కొన్ని చతురోక్తులు ప్రచారంలో ఉండేవి. వాటిని ఎరిగిన వారికి పై పాటలో స్వారస్యం తెలుస్తుంది. యతి పాటించి ప్రాసవదిలేసిన పాట ఇది. ఈ పాటలో ఆంధ్రసాహిత్య నిత్యాకాడమీశ అని గోపోలరెడ్డిగారిని సంబోధించారు. ఆంధ్రసాహిత్య అకాడమీ ఉన్నంతకాలం బెజవాడ గోపాలరెడ్డిగారే అధ్యక్షులుగా ఉన్నారు.
“క్రిలో మాంసం అయిదు రూపాయలు, చేపలు రెండున్నర (ఫ్రైస్ లైన్ శాసించు” అనే నినాదం వట్టి ఫార్సు అని మఖ్దూం మొహియుద్దీన్ (సి.పి.ఐ. నాయకులు) చేసిన ప్రకటనపై 'మొహియుద్దీనాలాపం' అని 21-11-1965 ఆంధ్రప్రభలో రెండు భుజంగ 'ప్రయాతాలు ఒక కంద పద్యం కలిపి ఒక ఖండిక రాశారు. సౌభద్ర భద్ర కవితా నైవిధ్యం 48 చేకూరి రామారావు
కిలో గోష్ ఖరీదైదు రూపాయలల్లా
కిలో మచ్చి దామందులో నర్ధమల్లా
మసాలా మజాయింత వట్టింతమంటే
వారా మిర్చి అమ్లీ పలాండూల్ వవ్చుల్
మవామ్మేరు వంతల్ ఖరీదుల్ గదల్లా
(భుత్వమ్ము ఢంకా బజాయించి చాటే
నినాదమ్మవో నేతిబీరాయెనల్లా
(వ్రయిన్లైను శానించు ఫార్సెల్ల నల్లా అని ఉర్జూ మాటల మిశ్రమంతో రాశారు. రిటైర్డ్ టీచర్లకు పెన్షన్ శాంక్షన్ చేసే ఉత్తరువు శరవేగంగా వస్తున్నట్లు ఎగువసభలో విద్యామంత్రి ప్రకటించారు. దాన్ని వ్యాఖ్యానిస్తూ “అయ్యవారికి చాలు ఐదు స్టేట్మెంట్లూ అనే శీర్షికతో 5-12-65 నాటి ఆంధ్రప్రభలో ఒక వచన కవిత రోశోకు. దసరా పట్యీంలో “అయ్యవారికి చాలు అయిదు వరహాలు” అని ఉంటుంది. ప్రభుత్వం వారు రూపాయలకు బదులు స్టేట్మెంట్లే అయ్యవార్లకిచ్చేది అని ధ్వని.
రిట్తైరైన టీచర్లను కొందరు రిటర్న్ టిక్కెట్ లేని ప్రయాణం.
శీష్రుమేవ వేయ్యనున్నారని చెప్పారు గనకనే
కొంతలో ఆర్థిక వ్వవస్థ కుదిరేపని ఆశిస్తే
“మాజీ కాసుమంత్రి అధునా ముఖ్యమంత్రి
చచ్చిపోతే వింఛన్ శాంక్షన్ చేస్తారా వాళ్ళకు
అమాయకంగా అడిగి సభలో వోనం పలికించాడు
భద్ర నింహాననన్థుడు. నదా బ్రవ్మోనంద భరితుడు
వండిన కాంగ్రెస్ కాలజ్ఞాని, బ్రవ్మాయాధ్యక్షులు
ఉజరూరుగా వుత్రర్వులు జారీ అవుతున్నాయనె
వాలం వుచ్చి, కలం కొన్న ఆ జలరామాత్య
అయ్యలూ +
స్టేట్మెంట్ల ఆజ్బంతో ఆశలు పొంగించుకోండి.
అలనిపోయి [ాణాలు
వారీ అనేంత వరకూ సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 49 చేకూరి రామారావు
పూర్తిగా ఉదాహరించిన పై ఖండిక నాయని సుబ్బారావు గారి కార్టూన్ కవిత్వానికి వచన కవిత్వానికి ఉదాహరణగా పనికొస్తుంది. “మాజీ కాసు మంత్రి అనే మాటలో (బ్రవ్మానందరెడ్డి గారి ఇంటి పేరుతో చేసిన చమత్మారం ఉంది.
రిటైర్డు టీచర్ల బతుకులతో ఆడుకోవటమే కాదు, ఈ పాలకులు ఆ సమయంలో కూడా ఎట్లా క్రూర పరిహాసానికి (0౧161)0:88) పాల్పడతారో పై ఖండిక సూచిస్తుంది.
“ఉక్కు ఫ్యాక్టరీ యోగాయోగం' అనే పేరుతో రాసిన ఒక అముద్రిత కార్టూన్ కవిత ఆయన ఫైలులో కనిపిస్తుంది.
విశాఖలో ఉక్కు మంత్రి బల్లగుద్ది విస్పష్టం చేశాడు. బెలదిల్లాలో
(ప్రశ్నలు వేసిన వారి పాచిక పారనివ్వలేదు.
ఆంధ్రుల చిరవాంఛితాలకు ఆయుష్కర్త.
నిపుణాతి నిపుణ సంజీవ కరణికర్మకు నీలం సంజీవరెడ్డి
ఐదవ (ప్రణాళికా కాలంలోనే ఐదవ ఉక్కు ఫ్యాక్టరీ
నాల్గవ ప్రణాళికా కాలం లోనైనా అంటున్నదే
బొకారో కన్యా సమ్మోహిత బుద్ధి ఉక్కు మంత్రిత్వశాఖ
న్యూమరాలజి ప్రభావం కాదు కదా.
ఈ వైముఖ్యానికి ఈ వార్త పెద్ద పొరపాటని ఎలుగెత్తి
చాటాడు విజయవాడలో.
స్టేట్ ఆర్థిక శాఖావర్తి శ్రీయుత చెన్నారెడ్డి మంత్రి
కొత్త సంవత్సరంలోనైనా విశాఖ కోరిక నెరవేరేనా? లేక
విశాఖపట్నం వీశెడు బెల్లం నీకొక పదలం నాకొక పదలం అనడమేనా?
(పైన 'శాఖావర్తి అనే మాటలో శ్లేష ఉంది)
ఈ 18వ ఖండిక 1966 జనవరి మొదటి వారంలో అచ్చుకావాల్సింది. రాజకీయ కారణాల వల్ల ప్రచురించటం లేదని పత్రిక వారు తెలియపరుస్తూ ఎప్పటిలాగే మళ్లీ రాస్తుండమన్నారట. (చూ. అనుమాండ్ల భూమయ్య - నాయని సుబ్బారావు కృతులు, పరిశీలన, 198], పే. 220) ఈ మహాకవికి, అంత సీనియర్ కవికి కూడా పత్రికలవారి వేటుతప్పలేదు. ఆ తర్వాత సుబ్బారావు గారు కార్టూన్ కవిత్వం రాయలేదు. సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 50 చేకూరి రామారావు
భావకవులు సామాజిక సమస్యల నుంచి పారిపోతారనే వాదులో వమంత నిజం లేదని నాయని సుబ్బారావు గారి కార్టూన్ కవిత్వం మరోసారి నిరూపిస్తున్నది. ఈ కవిత్వంలో (ప్రజా సమస్యల పట్ల సకాల స్పందన, సానుభూతి వ్యక్తమవుతున్నది. పదునైన హాస్యాన్ని ఆయుధంగా వాడుకున్న తీరూ కనిపిస్తుంది.
నాయని సుబ్బారావు గారు కార్టూన్ కవిత్వానికి పద్యాన్నీ గేయాన్నీ వచన కవిత్వాన్నీ కూడా వాడుకున్నారు. పద్యాన్ని ఆధునికం చెయ్యటంలో సుబ్బారావుగారి పాత్ర ఉంది. వచన పద్యాన్ని కార్టూన్ కవిత్వానికి అన్వయించటం అప్పటికి అంత ప్రచురం కాదు. (అసలు లేదేమో కూడా) మధ్యలో ఆగిపోకపోతే మరిన్ని ప్రయోగాలు వచ్చి ఉండేవి. ఇప్పుడు మిగిలినవైనా వచన కవిత్వ రూపపరిమాణంలో నాయని సుబ్బారావు గారి పాత్ర తెలియజేస్తున్నాయి. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కార్టూన్ కవిత కవి కవిత్వ తత్త్వవివేచనకు చాలా అవసరం.
ఆంధ్రప్రభ సాహిశీగవాక్షం 1994 డిసెంబర్ 5.
సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 5్1 చేకూరి రామారావు
- నాయని సుబ్బారావు వర్దనోజ్వల వైభవ విశేషాలు నాయని సుబ్బారావు గారు (1899-1978) స్ఫురద్రూపి, ఆజానుబాహుడు, పొడగరి. నా చిన్నతనంలో ఆయన్ని 'గణపారం ప్రభ అనేవాళ్లు. నరసరావుపేట పక్కన ఉన్న కోటప్పకొండ తిరునాళ్ళకు దగ్గరి ఊళ్ళ నుంచి “ప్రభలు పట్టుకెళ్ళడం ఒక సంప్రదాయం. అక్కడి 'గణపవరం' ఊరువారు అందరికంటే ఎత్తైన *ప్రభి కట్టుకొని వెళ్ళేవారు. మనిషి స్వరూపం ఏంత ఉత్తాలమైనదో ఆయన వ్యక్తిత్వం అంత ఉన్నతమైనది. భావకవుల యుగంలో తన సమకాలికులలో చిన్నవాడు సుబ్బారావు అని పిలుచు కొంటున్నా ఇప్పటిలాగే అప్పుడు కూడా వాళ్ళ మధ్య ఈర్వ్యాసూయలు ఉండేవని వింటుంటాం. కానీ అందుకు దూరంగా ఉన్నది, బహుశా నాయని సుబ్బారావు గారు ఒకృరేనేమో! అటువంటి మహాకవితో, మహావ్యక్తితో అతిసన్నిపాతంగా మెలిగే అవకాశం అదృష్టం నాకు దక్కింది. ఒక జీవితకాలం పదిలంగా దాచుకోవలసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి. బహుశా నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన కొద్దిమంది వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన “జన్మభూమి” కావ్యంలో తన జన్మభూమి అయిన 'పొదిలె (ప్రస్తుతం (ప్రకాశం జిల్లాలో ఉంది)ను వర్ణించారు. ఈ ప్రాంత ప్రకృతి సుబ్బారావుగారు ఈ కావ్యం రాసేనాటికే మారిపోయింది. జన్మభూమికి ఆయన రాసిన ముందుమాటలో “ఇందలి (ప్రకృతి వర్ణనలు నా బాల్యస్మృతుల నుండి చేదుకొన్నవి. ఇప్పుడు కొన్ని మార్పులు కలిగినవి. ఉదాహరణకు అప్పటి తాటి తోపు ఇప్పుడు లేదు” అని రాశారు. అప్పటి ఆ ప్రాంతపు ప్రకృతి ఎట్లా ఉండేదో ఈ వర్షనలను బట్టి ఊహించుకోవలసిందేకాని ఇంకో విధంగా తెలిసికానే మార్గంలేదు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే విశ్వనాథ సత్యనారాయణ గారి వర్ణనం సారస్యం కొన్ని సందర్భాలలో వర్ణ్య వస్తువును చూసిన తర్వాత బాగా అర్ధమవుతుంది. రామాయణ కల్పవృక్షం “బాలకాండిలో “ముక్త్యాల సంస్థానం” వారి కోటను వర్ణించిన ఈ పద్యం చూడండి. సీ, అట్లు వేదాద్రియు నిట్లు భరద్వాజు నాతశ్రమంబును గాబినట్టి చోట సౌభ భద్ర కవితా వైవిధ్యం 52 చేకూరి రామారావు
తా కృష్ణవేణి యుత్తర వాపొని వవిభ్ర మై మల్పు తిరిగిన యట్టి చోట
వారణాసీయు బోలె వ్రళయ కాలంబునం దైన విత్తి లేనట్టి చోట
ఒక కృష్ణపాయ తానాగి చుట్టి వచ్చి యు త్తమ జలదుర్ల భూతమగుచోట
ఒక్టు నితరాజవాంనమ్ము యొడ్డునందు
రెక్టు ముదుచుక కూర్చున్న వక్తి దోవ
కట్టె ముక్త్యాల కోటను కట్టె న్వర్హ
నీమకును రతనాల నిచ్చెనల మెట్లు
(ఈ పద్యం ఇప్పటి పప్రతుల్లో కనిపించదు)
“ముక్త్యాల వెళ్ళటానికి సాధారణంగా జగ్గయ్యపేట నుంచి బస్సులోనో, నడిచో వెళ్ళేవారు. 'ముక్త్యాల' ఆవలితీరం సత్తెనపల్లి తాలూకాలో ఉంది. నేనొక సందర్భంలో అటునుంచి వస్తూ పడవ ప్రయాణం చేశాను.
పై వర్ధనలో ప్రతిఒక్క అంశంలోని గొప్పదనం, బెచిత్యం అప్పుడునాకు స్పష్టంగా అర్ధం అయింది. నిజానికి సుబ్బారావుగారి వర్ణనా ప్రాగల్వాన్ని గురించి చెప్పతగినంత వ్యవధి కూడా లేదు. ఆయన వర్ణనల గురించి సమ(గ్రంగా చెప్పాలంటే ప్రాచీనాంధ్ర కవుల వర్ణనలతో పోల్చి తులనాత్మకంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కావడానికి చరిత్ర అధ్యాపకుడేగాని ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ఆయన పాండిత్యం అపారమైనది. అప్పుడప్పుడు ఆయన పెట్టిన పరీక్షల్లో నేను కళ్లు తేలేసిన ఘట్టాలు చాలా ఉన్నాయి. అయినా, ఆ మహాకవి మీద ఉండే గౌరవం 'కృష్ణక్కయ్యా మాటకు ఎదురాడే ధైర్యం చాలక ఈ వ్యాసరచనకు సాహసించాను.
నాయని సుబ్బారావు గారు తొలుత సౌభద్రుని ప్రణజయయాటత్ర, మాతృగీతాల ద్వారా భావకవిగా దేశానికి పరిచయసుయ్యారు. ఉద్యోగ విరమజానంతరం ్రొఢకవిగా అవతరించారు. భావకవితా ప్రియులకు శ్రీశ్రీ ప్రాసక్రీడలు గుర్తుందే ఉంటుంది.
రాయ(ోలు మైలురాయి
అబ్బూరి. చలివేందిర
సౌభదుని వణయయాభ్ర
చదవాలని తొందర నొభద్ర భద్ర కవితా వైవిధ్యం 53 చేకూరి రామారావు
1950 ప్రాంతంలో పునర్ముద్రణ పొందిన సౌభద్రుని ప్రణయ యాత్రను ఎంతో మందికి కొని పెళ్ళికానుకగా బహూకరించాను.
ఆయన కవిత్వంలో మలిదశ హైదరాబాద్‌లో (ప్రారంభమయింది. అప్పుడాయనకు సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు కలిగింది. అది 1958 ప్రాంతం అనుకుంటా. క్రమంగా “భాగ్యనగర కోకిల, 'ేదనా వాసుదేవమూ, 'జన్మభూమి” కావ్యాల రచన జరిగింది. మిగతా కావ్యాల్లో విషయాలు కొంచెం పక్కన పెడితే, ఆయన వేదన 'వేదనా వాసుదేవముూలోనూ, వర్దనా కౌశలం, “జన్మభూమి” లోనూ కనిపిస్తుంది. ఆయన వేదనా తీవ్రతకు పరాకాష్ట “విషాద మోహనము."
ఆయన జన్మభూమి 'పొదిలె ఒకప్పటి నెల్లూరి జిల్లాలో ఉంది. తన జన్మభూమిని గురించి కావ్యం రాయాలన్న ఆయన కోరిక ఎప్పటికో కాని తీరలేదు. ఈ కావ్యానికి శ్రీకారం చుట్టించింది త్రిపురనేని గోపీచంద్. వీళ్ళిద్దరూ ఆలిండియా రేడియోలో పనిచేసేవారు. అప్పటి 'యువ* పత్రికలో జన్మభూమిలో కొంతభాగం (ప్రచురితమైంది. ఈ (గ్రంధాన్ని వాళ్ళ పెద్దన్న నాయని నరసింహారావు గారికి అంకితమిస్తూ రాసిన అవతారికలో ఈ పద్యం ఉంది. “అభ్యుదయ పరంపరాఖభివృద్ధిదముగా పొదిలెగాధ లెల్ల పొదువుకొన్న వర్ణనా విశేష వైభవోజ్వలము సుకృతి నీయగా సుకృతినైతి” అంటారు. ఈ కృతి 'సుకృతి అని ఆయనకు విశ్వాసం ఉంది. ఇందులో పొదిలెగాథ చెప్పారు. అంతేకాక దీని “వర్ణనా విశేష వైభోవోజ్వలము” అని కూడా పేర్కొన్నారు. ఈ గాథల తీరు వేరే వ్యాసానికి విషయమవుతుంది. వర్ణనా వైభవోజ్వల విశేషాలే ఇక్కడ ('ప్రసక్తాలవుతాయి.
ఈ కవి చేసిన వర్దనలు ప్రధానంగా పొదిలె పరిసర ప్రకృతి వర్ణనలు. అష్టాదశ వర్దనల వంటి మూస వర్ణనలు కావు. తన జ్ఞాపకాలలో బొమ్మకట్టి స్థిరపడిన వర్జనలు. ఆ వర్ణనలలో మౌలికత, పులకింత, భావుకత సంపుష్టి కనిపిస్తాయి. ఈ వర్ణనలు ఎవరికి వారు చదువుకొని ఆనందించవలసినవే. అయినా ఆ మహాకవి సంస్మరణకోసం కొన్ని ఉదాహరణ ప్రాయంగా చూద్దాం. పొదిలె పరిసర ప్రకృతిలో కొండలు బండలు విశేషమైనవి. మనకు భాగ్యనగరిలో కూడా ఇవి కనిపిస్తాయి. కనుక కొంత భావించుకోవచ్చు. ఈ పద్యం చూడండి.
ఒక మహోరాజు రత్నోజ్వల సీంవోన
నానీనుదై కొలువమరువేళ సౌభద భద్ర కవితా వైవిధ్యం 54 చేకూరి రామారావు
ఒక మవోసేన దర్వోద్దత చతురంగ మూర్దిత వ్యూవామై యున్నవేళ ఒక మవాోక్షేత్ర రథోత్సవాలోకనా యాత మానువ్వ కమ్మలము వేళ ఒక మవాతీర్ధ సేవోత్సావా జనగణ మృఘమర్షణ స్నానమాడువేళ వ మావోమాంత్రికుని దయాప్న వాస్త దండ మాడెనొ తచ్చిలాధ్వమ్ము లెల్ల చేతనారహితోపలాశ్రితములయ్యు మానవాకార సౌందర్య మండితములు. శిలల్లో మానవాకారాలు దర్శించటం ఈ పద్యంలో కనిపిస్తుంది. మహారాజు రత్నాసనం మీద కొలువు తీరినట్టుగానూ, ఒక మహాసేన చతురంగ బలంతో వ్యూహం పన్నినట్టుగానూ, ఒక మహాక్షేత్రంలో రథోత్సవాన్ని చూడటానికి మనుషులు గుమి గూడినట్లుగానూ ఒక మహాతీర్థంలో భక్తులు స్నానమాడుతున్నట్టుగానూ కవికి కనిపించాయి. అంకేకాదు అవి జరుగుతున్నప్పుడు దయలేని ఏ మహా మాంత్రికుడు మంత్రదండంతో శపించాడో అందుకే ఆ శిలలు చేతనా రహితమైన మానవాకారాలతో వెలుగుతున్నాయి. ఈ కొండలు వట్టి చట్టుబండలు కాదంటూ. .. ఈ దృశశిలా కలాంత ర్వైదుష్ యది వట్టి చట్టుబండలు కాదున్ పాదపలతావితాన శ్రీదర్శన రమ్యముల్ ధరిశ్రీధ్రమ్ముల్ ఆ కొండలు చెట్లు, తీగలతో జీవం ఒలుకుతూ చూట్టానికి రమ్యంగా ఉన్నాయి. పొదపలతా విలాస ప్రసక్తి జీవ స్పర్భ కోసమే. నాయని సుబ్బారావుగారి అన్నదమ్ములు అన్యోన్యంగా ఉండేవారు. 1978లో అచ్చయిన జన్మభూమిలో నలుగురన్నదమ్ములు కలిసి తీయించుకున్న ఫోటో ఉంది. ఆయన పెద్దన్నకు ఈ పుస్తకం అంకితం. ఆ ఫోటో కింద... సౌభద భద కనితా వైవిధ్యం క్ చేకూరి రామారావు
వితత వినయ భావాన్విత నైజూను జన్మ (త్రితయ నతత సేవా తృప్తి మన్నవ్వ రామా ! అని ఉంది. వినయ భావుకులైన ముగ్గురున్నదమ్ముల సేవా తృప్తిని గలిగిన అభినవ శ్రీరామా అని పోల్చారు. ఈ భావం ఈయనపై వేసిన ప్రభావ జన్యమే. మరో పద్యంలో అగనామ సామ్యమున పె ఖగు పెంవులహో సవోదరాచ్చ (పేమల్ భృగుపాషాణమ్ములు వృ క్ష గణమ్ములు నల్లి బిల్లిగా నల్లుకొనున్. రాళ్ళూ, చెట్లు స్వచ్చమైన సోదర డ్రేమతో అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్నాయట. దీంట్లో ఒక చిన్న శబ్ద చమత్కారం కూడా జోడించారు. అగము అంటే కొండ, చెట్టు అని రెందర్భాలున్నాయి. అదే ఖండంలో మరోచోట ఈ సోదర సంబంధాన్ని సూచిస్తూ ఇంకో పద్యం ఉంది. పెద్ద చెట్టు మొదలు పెనవేనికొని వేణు చేయరాక పెరుగు చిన్న చెట్టు అన్న గోచి వెంట ననయమ్మూ పాయక తగిలి తిరుగు పిన్న తమ్మునట్లు ఈ పద్యమూ తన బాల్యానుభవాన్నే తెలియజేస్తుంది. ఈ అన్నదమ్ముల అనుబంధాన్ని కొంత కొంత నేనూ ఎరుగుదును. ఇప్పటి తరానికి తెలియదుగాని మా చిన్నప్పుడు ఐబలుసుపంద్లు, నాగజెముడు పండ్లు తిన్న అనుభవం మాకుంది. వాటి వర్ణనలు చూడండి. పడుచుముల్లు వాడి బందకు దెలియును బందవేడి యెరుగు పడుచు ముల్లు వాడి వేడి జోడు గూడిన జాడదల్తే, ఐలును చెట్ల నింద వరువు వండ్లు. బలుసు పండ్లు చిన్నవే కాని చాలా రుచిగా ఉంటాయి. వాటిని ముళ్ళు గుచ్చుకోకుండా జా(గ్రత్తగా కోయాలి. జాగ్రత్తగా నూగు తీయాలి. మా చిన్నప్పుడు తంగేడు ఆకులతో గంటసేపు కొట్టి నూగుతీసే వాళ్లం. - సౌభ్యద భద్ర కవితా వైవిధ్యం 565 చేకూరి రామారొన
నాగజెముడు వర్ణన చూడండి. . . ఆ న్హారజాము డివ్ఫుదంతయు నంతరిం చిన దది బ్రతికియుండిన దినాల పొదిలె బీదల కన్నవూర్హ తాంబూల క రండవావా తదీయరళక్త రాగ రంజిత రుచివూర్హ రన్యువలమ్ము లి ప్టము వచ్చినన్ని కష్టవడి కోని పై నూగు ముండ్లు నేర్చార వినర్జింబి ములు వెట్టి రెందు డివ్పులుగ జీరి పాణగొడ్డ మంగిటిముల్లు వరివారించి బీజమయమైన గుజ్జు తృవ్తిగ భుజించి నిండు కదువుల నరగా వండు నోళ్ళ (బదుకు తీర్తురు నిత్వ పర్వముగ వారు. (ప్రకృతి పర్టనలతో కాండలు, చెట్లతో షాటు తప్పని సరిగా పర్టించపలసింది జలాన్ని కొండల మీద జల దేవతలు పెహరిస్తారసె పర్టిస్తారు. ప్రకృతి యందమ్ము పురివివ్పి వగులబడిన కరణి నొప్పు నెమిళ్ళ కేకాన్వనముల నవళలై వారిదేవత లాడుచుంద్రు కొంద కొమ్ముల జాణుడు బందలాట మనను అద్భుతంగా ఆకర్షించేది “తాటితోపు వర్ణన. ఆ తాటి తోపు ఈ కావ్యం రాసే నాటికే లేదు. అయినా కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. ఆ వర్ణన తటాక ఖండంలో 101వ పద్యం నుంచి 132 పద్యాల వరకు విస్తరించింది. ఇందులో తాటితోపును అనేక విధాల వర్ణించిన రీతిని చదివి ఆనందించవలసిందే. కొన్ని మాత్రమే ఉదహారిస్తాను. అందులో ఉదాపారణ ప్రాయంగా దీన్ని చూడండి. . . అనిలో భీష్మున కంవశయ్య యది యే మాళ్చర్య మామూరె డె త్తున నిర్జించుట యర్హునుండని నముత్తుంగ ద్రుమాస్త్రమ్ముల న్నినుపారన్ పదివేల భీష్ముకులనేనిన్ చాలున ట్లే నవా ర్హునుడో తీర్చిన యంపళయ్య నిగుదారున్ తాటితో వందమై సొభద్ర భద్ర కవితా వైవిధ్యం 57 చేకూరి రామారావు
తలయిచ్చు నింటి కఫ్పుకు నిలు వంతయు నిచ్చు నింటి నిట్రాళ్ళకు మే న్నలి యిచ్చు నింటి పొయ్యికి నిలాజనుల కాతదెంచి యియ్యని దేదీ, ఈ ఘట్టంలో ప్రతి వద్యమూ ఉదాహరణార్దమే అయినా ఒక పద్యంలో (ప్రస్తుతానికి సంతృప్తి పడదాం. ఎనవచ్చు ననవచ్చు నునులేత కొబ్బరి పక్కులో నొగరింత చిక్సకున్న నరివచ్చు ననవచ్చు చెరకులు సెలవుల కోతలౌ కరకులు కూదకున్న (పతివచ్చు ననవచ్చు పనన మవ్వపు తొనల్ పొట్టలో నొకవిత్తు వుట్టకున్న తులవచ్చు ననవచ్చు తొలికావు మామిడి వంధ్లు టెంకల పుల్చు వట్టకున్న తాటితో విచ్చు నెందును సాటిలేని బు(గర్రగుంజును తేగలు ముంజెలును ఫ లావలియును కాలముల రసాతి తర్ప జావ్తి గలిగించు పొదిలె జనాళికెవుడు నాయని వర్ణనా వైభవము గురించి ఎంతైనా కొనసాగించవచ్చు. కాలమ నంతమైనా మన కాలము పరిమితమే కనుక ఎక్కడో చోట అగక తప్పదు. దేవులపల్లి కృష్ణశాప్రిగారన్నట్లు “నాయని రాసిందంకా బంగారం” దానికి పరిమితు లేమున్నాయి కనుక. విశాలాంధ్ర. 82122004 సౌభద భద్ర కవితా వైవిధ్యం 8 చేకూరి రామారాన
- నాయని వ్యక్తిత్వం
నాయని సుబ్బారావు గారు నరసారావుపేట మునిసిపల్ హైన్మూల్లో హెడ్యాస్టురుగా పనిచేసేటప్పుడు అదే స్కూల్లో 5..ఓ.0. వరకు నాలుగేండ్లు చదువుకున్నాను. అప్పుడాయన కవి అని నాకు తెలియదు. ఆయన రాసిన హిందూదేశ చరిత్ర టెక్టు బుక్కుగా చదువుకున్నా ఒకసారి సెలవుమీద ఉన్న టీచరు ఐదులు వచ్చి క్లాన్లులో ఒక ఫోటో చూపించినట్టు, అందులో కృష్ణశాస్త్రి ప్రభృతులు ఉన్నట్లు గుర్తు హైస్కూలు వదిలిన తరువాతనే ఆయన కవి అని తెలిసింది. 1950-52 ప్రాంతంలో సౌభద్రుని ప్రణయ యాత్ర రెండో ముద్రణ ప్రతి మొదటిసారిగా చదివి ముగ్భజ్జి అయ్యాను. సుమారు ఇంకో నాలుగైదేళ్లు అది నిత్య పారాయణ గ్రంథమయింది. బాగా చదవటాన (ఇప్పటికి) అందులో పద్యాలు ఎన్నో నోటికి వచ్చేవి. ఆ తరువాత సుమారు 1956-1958 సంవత్సరాల కాలంలో అప్పటి తెలుగు స్వతంత్రలో నా పద్యాలు అచ్చయ్యేవి. ఆ పద్యాల్లో నాయని ముద్ర స్పష్టంగా కనిపిస్తుండేది.
నాయనితో దగ్గరి పరిచయం 1957 నుంచే. కుటుంబ బాధ్యతలు పూర్తి కాకుండానే ఉద్యోగ విరమణ చేసి వారి పెద్దమ్మాయి నాయని కృష్ణకుమారి గారి దగ్గర హైదరాబాదులో ఉన్నప్పుడు కొన్నాళ్ళు నేనూ వారితో పాటు ఉన్నాను. అప్పటి బస దోమలగూడాలో అద్దె ఇల్లు. 1958లో కొన్నాళ్ళు రోజూ 1౬౧186౧6 మీద పొద్దున్నే నడక సాగించే వాళ్ళం. అప్పుడాయన తన సాహిత్య జీవితాన్ని గురించి అనేక ఇతర విషయాలను గురించి మాట్లాడేవారు.
ఇంట్లో ఉన్నప్పుడు చుట్ట కాల్చుకుంటూ ఇనప పడక కుర్చీలో కూర్చునో ఆటు ఇటూ పచారు చేస్తూనో అంతర్లీనమయి ఆలోచనలో మునుగుళుందేవారు. అది పద్య రచనచేసే మూడ్ అయి ఉంటుంది.
ఆయనలో సున్నితమైన హాస్యచమత్స్సతి ఉండేది. ఒకసారి వారింటికి వచ్చిన ఇద్దరు బయటికి వెళ్ళి సాయంత్రం ఒక్కరే తిరిగి వస్తే. . .
,.. == = సమేతుదై యతడు పోయి
ఏక్రమేవా౬ ద్వితీయుదై యేగుదెంచె సౌథద భద కవితా వైవిధ్యం 59 చేకూరి రామారావు
అని జవాబు చెప్పమని ప్రశ్నార్థకంగా నా వైపు చూశారు. విషయం అర్థమయి నవ్వుకొన్నాను.
ఆ రోజుల్లో ఆయనకు కొంచెం మలబద్ధకం ఉండేదనుకొంటాను. 'అందువల్లనో ఏమో ఉదయం పూట రెండు మూడు కప్పుల కాఫీ తాగి మూడీగా చుట్టకాలుస్తుండేవారు. అప్పుడు, నా పేరును చమత్మరించి 'సిద్ధించే సీతాపతిరావు” అనేవారు. ఆ తరువాత నేను తెలుగు ఆనర్సు చదువుకు విశాఖ వెళ్ళగా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండేవారు. (కాని ఆ ఉత్తరాలు భద్రపరచని సోమరితనం క్షంతవ్యం కాదు) ఒకసారి కందపద్యాల్లో ఉత్తరం రాశారు. ఒక పద్యం మాత్రంగుర్హు....
నివ్హున్న చుట్ట కొసనోర్
చొప్పించియు కడు. . . చోద్వ్యముగా గువ్ గువ్చుమని పొగను వదలుదు రప్పా తూరువు వెలందు లచ్చట నుఖులే 1958లో 'స్కృతి కిణాంకం” అనే పేరుతో నేను రాసిన ఒక పొడుగాటి గేయం స్వతం(త్రలో అచ్చయింది. ఆ రోజుల్లో నా పద్యాలూ, గేయాలూ కొద్దిగా అభ్యుదయలో వచ్చినా ఎక్కువగా స్వతంత్రలో వచ్చేవి. ఈ జీవిత వధమందున ఏను సేకరించుకున్న వురా న్థృతుల మణులలోన శిరోమణివి నీ వవుదువు నీ క్రిన్మన్ నందేశా ల్లేకుందా నవవర్షాల్ కాలవాపొనీ గర్భం లో లీనమ్మయి పోయెను. అ పాదాలు చదివి ఠక్కున పేరు పోల్చుకొని అడిగేశారు. నాయని కవిత్వం ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంత ఉన్నతమైనది. రెండూ సమాన స్థాయిలో ఉన్నతంగా ఉండటం చాలా అరుదు. కొంత మంది కవుల్ని కవులుగా మెచ్చుకున్నా వ్యక్తులుగా భరించలేం. కాని నాయని వ్యక్తిత్వాన్ని దర్శించినవారు మెచ్చని వారు లేరు. కొన్నాళ్ళపాటు అయినా ఆయనకు దగ్గరగా మెలిగి ఆయనతో గడిపిన రోజులు అపురూపమయినవి. సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 60 చేకూరి రామారావు
ఆయన కోపంతో ఎవర్నీ తిట్టగా నేను చూడలేదు. కోపం రాదని కాదు. కోపం వచ్చినప్పుడు మాట్లాట్టం మానేస్తారు. ఒకసారి పెద్దకూతురు మీద అలిగి నాలుగైదు కీపాల వరకూ (ఇంకా ఎక్కువేనేమో) మాట్లడలేదు.
ఇంటా బయట ఆయన [ఓ౬|[09/౧2! 6౮6౧౦౦౦ 501తో జీవించారు. ఇంట్లో ఎవర్నీ శాసించరు. తమ నిర్ణయాలు ఇతరుల నెత్తిన రుద్దరు. ఇతరుల అభిప్రాయాలు వింటారు. మన్నిస్తారు.
ఆయన కుమారుడు ఒక్కడే మోహనరావు (1988-1968). 1958 వరకు కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేయలేదు. అతనికి కాలేజి చదువుల మీద ధ్యాస ఉండేది కాదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. రామకృష్ణ పరమహంస, వివేకానంద పుస్తకాలు చదువుతుండేవాడు. అతను పరీక్షలు రాయటానికి గుంటూరు వెళ్ళి వస్తుండేవాడు. బహుశా 0[6౧౧151)/ 5౯2౦160213 లో పోతుండేదనుకుంటాను. వాళ్ళిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగేది.
“ఏరా? ఎట్లా చేశావు?”
“క్క సారీ పోతుంది నాన్నా”
జ్యల్హే పోతే పోయిందిలే”,
ఈ సంభాషణ విన్న నాకు కళ్ళు తిరిగేవి. అన్నిసార్లు పరీక్ష పోయినా ఏమీ అనరేమిటీ అని. అప్పుడూ, అంతకు ముందూ చాలాసార్లు చాలా పరీక్షల్లో తప్పటమూ, తల్లిదండ్రుల చేత చీవాట్లు తినటమూ నాకప్పటికే అలవాటయినై. అందువల్ల ఈ సంఘటన నన్ను అంతగా 1౧౧౧9౩౩ చేసింది. ఆయన గుండె నిబ్బరాన్ని సంఘటనలే చెప్పగలవు. వర్ణనలు చెప్పలేవు.
మోహనరావు తరువాత బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. కాని కొంత కాలానికి నివృత్తి లేని వ్యాధికి గురయ్యాడు, దాన్ని మయోపతి అంటారట. పునర్నిర్మితి లేకుండా, క్షణం క్షణం జీవకణాలు శిధిలమై పోతుంటాయి. ఎన్ని వైద్యాలు చేసినా గుణం కనిపించలేదు. దారుణమైన ఫలితం అందరికీ తెలిసిందే. కాని ఎవరూ ఏం చేయ్యలేని పరిస్థితి కడుపుకోత అర్ధం చేసుకోగలం గాని చెయ్యగలిగింది లేదు. చివరికి హాస్పిటల్లో చేర్చటమూ, మోహనరావు అఖరి శ్వాస వదలటమూ (22-8-1968) అన్నీ జరిగిపోయినై. చూడటానికి వెళ్ళిన వాళ్ళని చాలా నిబ్బరంగా పలకరించేవారు. నన్ను చూసి “హాస్పిటల్లో నువ్వూ ఒక రోజు పడుకున్నావట గదా !” అన్నారు. తలూపి ఊరుకున్నాను. మూడోరోజున కర్మాంతరాలు జరిపినప్పుడు మంత్రోచ్చ్భాటన చేస్తున్న సౌళద భద కవితా వైవిధ్యం " 61 చేకూరి రామారావు
(బ్రాహ్మణ్జి చూసి “ఇంతమంది బ్రాహ్మల్ని చూశానుగాని మీ మాదిరిగా మంత్రాలు స్ఫుటంగా ఉచ్భరించినవాళ్ళను చూడలేదని ప్రశంసించారు. ఆ బ్రాహ్మడి కళ్ళు అర్ధమై ఒక క్షణం మాట్లాడలేకపోయాడు. 'పుట్టెడు దుఃఖంలో ఉండి మీ రీ మాటనడం మీ మంచితనం అని తన పనిలో లీనమయ్యాడు. ఆ తరువాత 1970లో విషాదమోహనము అచ్చయింది. ఇది చదువుతుంటే ఎప్పుడో ముద్దుకృష్ణ 'వైతాళికులు” సంకలనంలో నాయని కవిత్వాన్ని గురించి చెప్పిన మాటల సత్యం తెలుస్తుంది.
“పద్యాలు జీవితాన్ని చీల్చుకు వస్తవి, అందుచేతనే అంత బాధాకరంగా ఉంటవి. గుండెలకు తగిలేట్టు చెబుతాడు, యత్నం లేకుండా, పద్య నిర్మాణానికి పాటుబడినట్టు కనిపించడు. అదే ఈయన కళ, గొప్పది. .. ఈయన కవిత్వానికి గీటురాయి హృదయం = =... బాధలో హృదయాన్ని బద్దలు కొడతాడు..” ఈ మాటలు సౌభద్రుని ప్రణయయాత్ర, మాతృగీతాలను దృష్టిలో పెట్టుకొని ముద్దుకృష్ణ గారు రాశారు. “విషాద మోహనము” విషయంలో ఈ మాటలు మరింత సత్యాలు.
నాయని తిక్కన భారతాన్ని నన్నెచోడుడి కుమార సంభవాన్ని ఎక్కువగా చదువుతుండేవారు. అప్పుడప్పుడు వాటిల్లో నుంచి “గ్రంధ (గ్రంధులు కొన్నిటిని గురించి మమ్మల్ని (నన్నూ కృష్ణకుమారి గారిని) అడుగుతుండేవారు. తెలుగులో ప్రత్యేకమైన డిగ్రీలు పుచ్చుకున్నా ఆయన పాండిత్యం ముందు తల వంచాల్సి వచ్చేది. అంత పాండిత్యం ఉన్నట్టు ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళకి గాని తెలీదు. ఆయనకు జ్యోతిష్యం కూడా వచ్చు. జాతకచక్రం వెయ్యగలిగేవారు.
అభ్యుదయ కవిత్వం, ఆ తరువాత కవితా రీతులు ఆయన్ని అకర్షింపలేదు. స్వాతంత్రోద్యమం గురించి, ఆగస్టు 15ల మీద అప్పుడప్పుడు పద్యాలు రాసినా అభ్యుదయ కవిత్వం బాగా ప్రచారంలో ఉన్న కాలంలో 1210! ౪0/49 ఏమీ రాలేదు. మళ్ళీ ఆయన కవిత్వ జీవితం భాగ్యనగర కోకిలతో (సుమారు 1958; పుస్తకం 1966లో అచ్చయింది.) పునః ప్రారంభమయి వేదనా వాసుదేవముతో పరిణతికి చేరి జన్మభూమితో పారమ్యాన్ని అందుకున్నది.
కవిత్వానికి రాజకీయాలు అంటరానివి కావని ఆయనతో వాదించే వాణ్ణి. ఆయన వాదించేవారు కారు. విని ఊరుకునే వారు. చిరునవ్వుతో ఉపేక్షించేవారు.
ఆ రోజుల్లో (1958) జువ్వాడి గౌతమరావు గారి నాయకత్వాన “జయంతి” అనే పత్రిక వచ్చేది. దాన్ని అప్పటి అభ్యుదయ పత్రికలో కె.వి. రమణారెడ్డి గారి కోరిక
సౌభద్ర భద్ర కవితా వైవిధ్యం 62 చేకూరి రామారాన
మ! గురుదక్షిణ | శ ౧... స్కూల్లో పంతులు గార్డి మీరు తలుచుకుని ఎంత | . . [ కాలమయిందో.” కాలేజీలో మ్కెంతో నచ్చిన 'లెక్టరర్ గురించి | | . మ ఏ. ఫ్రెండ్స్ దగ్ధరమ్రు ప్రస్తావించి ఎన్నేళ్లయిందో. ఏమోగానీ - ఇక |, “బస... శిమ్మణ్ణి చూడండి. అర్థశతాబ్దం క్రితం పాఠాలు చెప్పిన హెడ్ (౧, షా. = "మాస్టర్ గురించి దశాబ్దాలుగా ఎన్నో వ్యాసాలు రాసీ రాసీ చివరికి "| న్ సప _* వాటన్నిటినీ మాస్టరుగారి జయంతికి గ్రంథంగా తెచ్చారు. ల సాన స తెలుగులో భావ కవితా ఉద్యమ తార నాయని | న. నుబ్బారావు గారి కావ్యాలు చేకూరి రామారావుగారికి |." ' ఎస... దోరిచూపాయి. హైదరాబాద్‌లో నాయని గారింట్లోనే బతికి. (1,1? ను ౯. ౯ తయనకెంతో దగ్గరగా ఉండే అద్యష్టమూ కలిగింది. ఆయన్లీ. [' బు =, “సౌభద్రుని పజయయాత్రా” నుండి సాగిన కవితా యాత్రలో చేరా ఎ * వెంటేఉన్నారు. “భార్మనగర కోకిల, వేదనా వానసుదేవము, + ॥ _ ఉథవ్మభూమి కావ్యాల నుండి ఎంతో విషాదభరితమైన “విషాద _ శ్రే మోహనము వరకూ నాయని గారి కవిత్వానికీ జీవితానికీ ( మనందర్షీ ఎంతో దగ్గరగా తీసుకెళ్తారు చేరా. " ॥ , ఈ వ్యాసాల్లో కవితా పరిశీలనా అంటూ అదే పనిగా =... బోరించ కుండా నాయని కార్టూన్ కవితలూ, విశ్వనాధజోకులూ
- చటివిస్తాయి. | ' ల... 1978లో నాయని మరణించినప్టటి నుండి ఆయన పై | ల. ౪ ' _ ' జరిగిన పరిశోధనలకు చేరా సహకరించారు. ఇదిగో ఈ | | వ్యాసాలన్నీ రాశారు. తర్వాతి తరం వారికి నాయనిని సజీవంగా, , ;'ఉజ్బలంగా అంధించారు. మీరు గానీ మేంగానీ ఇలా ఎప్పుడన్నా శే "చేశామా అని తలుచుకుంటే కడుపు చెరువవుతుంది. కావ్యాలు ; రాసినప్రుడే కాక, చేరా లాంటి శిష్కుడున్నందుకు గూడా నాయని ఠీ"