Telugu Shakunthala Dhushyantham - anilvaranasi/indianlanguages GitHub Wiki

అ ళా నిస చకగానాలనా-నంరాతరాణానారాణడక తాకాలని తాడాడతకనాలా నాననా పా, ల!

  • పి (1. స్ప ఫ్య! న. వ. క్ష వళ క లాలి ణి. (ఓ శాత శ స్తా వ లం. ర్ట) లా. 9అకా.. ఈత ఆ [ జ్‌ ద పరులు తోాలె న్‌! న్న క / తె త్రో శ (వా ఆ” ఆ ఖా శ్‌ య. | ఇత త ఆ గ ప / న. సంగీత నృత్య దూరం అం య. ' న లు టా క. తనా వో? ఇట వ క్ట] సం! ర మ వం | వహ మన! గలే ర్న న (. | ః సళ్ళ టట భరో ఎచాయా న్‌ స సీ | న స బక్‌ |. నం న మ. నమూన శే. వ శా న ఖ్‌ న్‌ చే రెట్ట టన అ నావా న్‌. టా క. ల. వ ల క వ య్‌ న 0. వ య నత న . మ షష క స్ట న్న మ | వలా వ. న న స టా స న... వ రే ఇటీ -ఫుక్నా జస న ల క హత ఏ నం టి లు గల / . న థై ల క | ళీ ॥ య క గ్గ ॥ న | అటి ఖు న మూ గ ప జీ... మాం మ మళ వః |. ఈ. ష్‌ సహజ కవి మల్లెమాల | స న. ప స్ట | ॥ జొ న ఓ. మా న్‌! వ... మనసుపడి మక్కువతో సేకరించిన మ (టా స న , ల శ పుసకాని సాహిత్యాభిమానుల కోసం గక! ఖో నే ! సుందరయ్య విజ్ఞాన కేంద్రాని న. గ గ్‌ | [గ / న. ష్‌ ్‌! - స ప్త ఆనందంతో బహూకరిస్తున్నాం జ. . క్‌ " / ఖగ ,/. సు. - మల్లెమాల కుటుంబం ( యి | . వ. (| 1 క. జ చ. _ లు జో | | ॥ బేర్‌ | . నో ॥ సి 1] " వ. 1 క మ! | (| భి చ! . . య. న. | . న ॥ గ సఖ్యం ॥ స్‌] టోభ' నట. (1. ట్‌... మం... ర. న. . గ ॥ స్ట షట! నటు. నత రట |. శ ౦ గ. /. న్న. (1 స శ న. [1 ॥ న. + సు స్ట! న ను. సంసా! గ వ లా ల వో షష, టనే ర. ఖు మ? (1 11... య. (| (! య. ప ప శే 1... టా. | స / లీ ॥ గ్ల క. గ హం టి. సమ్‌ చట! గో (న గ్‌ స్‌ | క. భ్‌ న స. న.

యాత రాణ టీ ప్‌ శకుంతలాదుష్కంతర శాందరన౦ద౦ ఆలా (రంగే నృ్య టాతాయి లాలా బేతవోలు లామబభ్రహ్చాం యం 30|(కుక్రా ంతససేకా

5210016212 09 సు206200 ఉ& 503062022206200 యా జ - శభ వుండ ఇ1 ౪ ల1494 0886౭ - 01411285 క గాహు ఎలా వ యం అ 46/07 కాంట 8. 404344], 14., ౯౧.0. 5థయంం1 01 ౬1ల206, ౨.5. 60364 ౮౧1౯౩1 ఇెతజంటలుడం/ ౧2౭౧00, 8010౮౧౮ - 533 124. ౨1: 0883 - 2436372, 0౬5౬1 : 98481 69769 రో 1119 ౪0) 20౧59 10 షం 5 116002 (౮ ఎ ౭౬56407: 500 _కృస్రంద్యానాలియ. వష స (| హం కనక . సా, వసో వ ధ్యా వళ వల! నడ వ కా న/106: 20. 25/- క్‌ న౦/6౦౧౦/89 తల101 4-301, 129206 124, కంగు - 533 124. నిాగగ/ంర 207 5౧ 24014 ౧౧౧౬౧౩, 09 : 5.2. కలయ? నెశంరుటుంంళంలరగ 56660 గతితతిిన౮గ0గా/. జా 0883 - 2476345

శ్రీ కె.ఎస్‌.ఆర్‌. ప్రసాదరావుగారికి బే,రా. బహూకృతి తారణ - గణచతుర్ధి

|

తొభలిపలుకులు

1975వ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ఐ.రా.స. కాబోలు ప్రకటించింది. ఈ సందర్భంగా బాలబాలికలతో ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించి ఏడాది పొడవునా రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రదర్శనలు ఇప్పిస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది మా కె.ఎస్‌.ఆర్‌. ప్రసాదరావు గారికి. వీరు గుంటూరులో నాగార్జున సాంస్కృతిక కేంద్రాన్ని స్థాపించి కార్యదర్శిగా అనేక సంగీత - సాహిత్య - నత్య - సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరులు సాంప్రదాయికంగా భారీఎత్తున నిర్వహించి అప్పటికే గుంటూరు నగర సాంస్కృతిక రంగంలో చరిత్ర సృష్టించిన కార్యదక్షులు. ఈ కేంద్రానికి అనుబంధంగా నాగార్జున సంగీత నృత్యకళాశాలను కూడా నెలకొల్పి విజయవంతంగా నడుపుతూ యువతరానికి సంప్రదాయ కళలమీద మక్కువ ఎక్కువ చేస్తున్న పుణ్యాత్ములు. ఈ కళాశాల బాలబాలికలతో ్రదర్శింపజెయ్యడానికి ఒక సంగీత నృత్య రూపకం రాసి ఇవ్వండి అని నన్ను అడిగారు. కాళిదాసుకి నమస్మరించి ఒక గంటన్నర వ్యవధికి కుదించి శకుంతలా దుష్యంతం తయారు చేశాను. అన్ని హంగులూ కుదిరాయి. ఈ ప్రదర్శన - ప్రధాన నగరాలన్నింటా హోరెత్తింది. పాడినవారు అక్షరాలకు ప్రాణం పోశారు. ఆడిన పిల్లలు పాత్రలకు జీవం పోశారు. ఆకాశవాణిలో, దూరదర్శనంలో ప్రసార మయ్యింది. చాలాకాలం చాలా ప్రదర్శనలు జరిగాయి. ఆ తరువాత బృందం చెదిరి పోయింది. పిల్లలకు రెక్కలు వచ్చాయి. దేశ విదేశాలకు ఎగిరిపోయారు. టి.వి. ఛానళ్ళ పుణ్యమా అని ఇప్పటితరం పిల్లలకి పిచ్చిడ్రస్సులూ పిచ్చి దాన్సులూ ఆకర్షణలయ్యాయి. సరే - రాసినవాడికి ఉందే మమకారం కొద్దీ దీన్ని ఇప్పుడు ఇలా ముద్రించి మీ చేతుల్లో పెడుతున్నాను.

నాగార్జున విశ్వవిద్యాలయానికి భూటాన్‌ నుంచి మత - రాజకీయాధికారుల బృందం ఒకటి ఆధికారిక వర్యటనకు వచ్చింది. బుద్ధిస్ట్‌ నృడీసెంటర్‌ ప్రారంభానికని జ్ఞాపకం. 1985-86 (ప్రాంతం. వారి కోసం ఒక గంటసేపు కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటుచేసే బాధ్యత ప్రసాదరావుగారి మీదనే పడింది. అప్పుడు రాసి ఇచ్చాను. సౌందరనందం నృత్యనాటిక. దీన్ని చూసిన ఆ భూటాను బృందం పరవశించిపోయి బుద్ధ పాత్రధారిని తెగమెచ్చేసుకుని అతడి భిక్షాపాత్రలో కరెన్సీ నింపి - రచయితతో సహా ప్రదర్శన బృందం అందరినీ తమ దేశానికి రాయల్‌ గెస్ట్‌లుగా రమ్మని ఆహ్వానించింది. ఉన్మత్తయక్షరాజం అని మరో బౌద్ధరూపకం కూడా తయారు చేసుకుని (దీని స్రిష్ట ఏమయ్యిందో !) వెళ్ళాం. దారిలో ఢిల్లీలో ఒక ప్రదర్శనను ఇండియన్‌ కల్చరల్‌ కౌన్సిల్‌ వారు (శ్రీమతి సోనాల్‌ మాన్‌సింగ్‌ అప్పటి అధికారిణి) వర్పాటు చేశారు. దానికి శ్రీ ఆర్‌. వెంకట్రామన్‌ గారు,

శ

శ్రీ కె. సచ్చిదానందమూర్తిగారు వంటి పెద్దలెందరో వచ్చారు. ఆనందించారు. ప్రోటోకాల్‌ పక్కన పెట్టి వేదికమీదకు సరాసరి వచ్చి నన్ను, బృందం సభ్యుల్నీ అందరినీ అభినందించారు. అదొక మధురానుభూతి. శ్రీ సచ్చిదానందమూర్తిగారు స్రిష్టని మెరుగుపరిచే కొన్ని సూచనలు ఇచ్చారు నాకు. భూటానులో విజయయాత్ర సాగించి వచ్చాం. తరువాత కాలంలో ఇదీ చాలా ప్రదర్శనలకు నోచుకుంది. అందుకని శాకుంతలానికి దీన్ని కూడా జోడించాను.

పాత్రధారుల పేర్లు నాకు జ్ఞాపకం లేవు. ఇప్పుడు సేకరించే వ్యవధీ లేదు. ఓపికా లేదు. ప్రస్తుతానికి గుర్తున్న పేర్లు నాలుగు చెబుతాను. శకుంతల వేసిన అమ్మాయి పేరు శాంత. కమర్షియల్‌ టాక్స్‌ బాలముకుందరావుగారి అమ్మాయి. కణ్వుడు, విశ్వామిత్రుడు, దూర్వాసుడు వేసింది సుబ్రహ్మణ్యం. తరువాత ఇతడు మంచి నాట్యాచార్యుడయ్యాదని విన్నాను. దుష్యుంతుడి పేరు జ్యోతిర్మయి. ఇప్పుడీవిడ అమెరికాలో ఉందిట. డాన్సు స్కూలు నడుపుతోందిట. సుందరి వేసిన అమ్మాయి పేరు వాణీ సుజాత. గుంటూరు తాసిల్దారుగారి అమ్మాయి. నందుడి పేరు ఉషాకిరణ్‌. బుద్ధుడు రమేష్‌. హెద్మాస్టరు శ్రీ వేమూరి వారి అమ్మాయి నిర్మల (ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉందిట), గొల్లపూడి ప్రకాశరావు గారి అమ్మాయి ప్రమద్వర - వీళ్ళు చెలికత్తెలు. డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పారావుగారి అమ్మాయి - చిట్టితల్లి - మేనక. వీళ్ళంతా అప్పటికి పదోతరగతి లోపు చదువుతున్న బాలబాలికలు. అద్భుతంగా చేశారు. ఎప్పటికీ వీళ్ళని మనసారా ఆశీర్వదిస్తూనే ఉంటాను. బహుశ వీళ్ళు కూడా తమ బాల్యం ఎంత మధురంగా సాగిందో నెమరువేసుకుంటూ ఈ సంగీత రూపకాల ఆడియో క్యాసెట్లు అప్పుడప్పుడూ వింటూ ఉంటారనుకుంటా.

ఈ సంగీత నృత్యకళాశాలకు రాయల్టీ చెందేట్టు ఉమాశంకర స్తుతిమాల క్యాసెట్టును రూపొందించారు ప్రసాదరావుగారు. ఈ కేంద్రానికి ఆస్థానకవిని నేనే కనక సంస్కృతాంధ్రాలలో శ్లోకాలూ పాటలూ రాసి ఇచ్చాను. కన్నడ సినిమా సంగీత దర్శకులు శ్రీ ఉపేంద్రకుమార్‌ సంగీతం సమకూర్చారు. శ్రీమతి పి. సుశీలగారూ, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు. ఇది 1981లో అని నా జ్ఞాపకం. ఇప్పటికీ ఈ క్యాసెట్టు (ఇప్పుడు సి.డి.) ఊరూ వాడా మారు మోగుతోంది. ఇంటింటి పాట లైపోయాయి. ఇవి సాంస్కృతిక కార్యక్రమాల్లో, పేరంటాల్లో, భజనల్లో, శుభకార్యాల్లో విరివిగా వినిపిస్తున్నాయి. అన్నింటికీమించి శ్రీశైలం మల్లన్న వీటిని ఉభయసంధ్యల్లోనూ ఆలకిస్తున్నాడు. నా జన్మ తరించింది. వీరందరి సౌకర్యం కోసం ఈ పాటల్ని అనుబంధంగా సమకూర్చాను. పాడుతున్నవారు సాహిత్యం సరిజూసుకుంటారని.

ఈ 1981లోనే, ఈ ్రసాదరావుగారే సంప్రదాయ సంగీతాభిమానం కొద్దీ తన మిత్రులతో కలిసి మళయాళ సినిమా 'గానం'ను తెలుగులోకి తర్జుమా చేయించారు. అది

ర్‌

జాతీయ పురస్కారాలు అందుకున్న మళయాళ సినిమా. తెలుగులోనూ ఉదయం ఆటలుగా బాగానే ఆడింది. దీనికి టైటిల్‌ సాంగ్‌ మళయాళంలో లేదు. తెలుగులో నాతో రాయించారు. ఉపేంద్రకుమార్‌ సంగీతం సమకూర్చగా శ్రీ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యంగారు గానం చేశారు

  • గానం సినిమా శీర్షికాగీతంగా. నేనూ సినీగేయ రచయితనే. కాకపోతే “అ-ద్వితీయ” అన్నముక్క ముందు తగిలించుకోవాలి - ప్రస్తుతానికి. ఇదో తమాషా అనుభూతి. ఇదో సరదా. అందుకని ఆ పాట కూడా మీకు అందిస్తున్నాను.

వెరసి- ఈ పుస్తకంలో అక్షరాలన్నింటి వెనకా, ప్రేరకుడూ కారకుడూ ప్రసాదరావు బహద్దరువారే. నేనంటే ఎంత ఇష్టమో! ఎంత నమ్మకమో ! చాలామందికి ఈయనతో పడదు. ఈయనకూ చాలామందితో పడదు. కానీ ఈయనగారి కార్యదక్షత విషయంలో ఎవ్వరికీ అభిప్రాయభేదం లేదు. ఎంతలేసి కార్యక్రమాలు నిర్వహించాడు ! ఎన్నెన్ని ప్రత్యేక సంచికలు వేయించాడు! ఎలాంటెలాంటి సంగీత - నృత్య విద్వాంసుల్ని ఎంతెంతగా సత్మరించాడు ! ఓహ్‌ ! తలుచుకుంటే - మేన నిప్పుడుం బులకలు వొడమెడును. గుంటూరు నగర సాంస్కృతిక చరిత్రలో 1975 నుంచి 1995 దాకా ఒక సువర్జాధ్యాయమే. ఇంకా ముందు నుంచేనేమో కూడా. అందుకని ఈ చిన్నిపుస్తకాన్ని శ్రీ కె.ఎస్‌.ఆర్‌. ప్రసాదరావుగారికి ఆత్మీయంగా సస్నేహంగా కానుక పెడుతున్నాను. అంగీకరించి ఆనందిస్తారనీ ఆనందింప జేస్తారనీ నమ్ముతున్నాను. ముందుగా అనుమతి తీసుకుని బహూకృతి అందించడంలో కన్నా ఇలా చెయ్యడంలో మజా ఎక్కువ కదండీ 1

చివరగా ఒక్కమాట, ఈ రచనలను ఎవరైనా ప్రదర్శనలకు - అంటే వ్యాపారం కాని ప్రదర్శనలకు ఉపయోగించుకోదలుచుకుంటే ముందుగా ఒకమాట చెప్పండి. సంతోషిస్తాం, సమ్మతిస్తాం. సెలవు. బొమ్మూరు - 538 124, భవదీయుడు 15.09.2004 బేతవోలు రామబ్రహ్మం

6

శకుంతలాదుష్యంతం

  • సంగీత నృత్యరూపకం -
  1. సంగీత దర్శకత్వం _ : శ్రీమతి సూరి సత్యవాణి
  2. నృత్య దర్శకత్వం శ్రీ చింతా ఆదినారాయణశర్మ
  3. గాత్ర సహకారం శ్రీమతి వి.ఎల్‌్‌ జగదీశ్వరి శ్రీమతి రామతారకం శ్రీమతి రేణుకా కౌశిక్‌
  4. వాద్య సహకారం శ్రీ సాగి, శ్రీ విశ్వనాథం మొ!॥వారు
  5. రంగాలంకరణ శ్రీ గుళ్ళపల్లి ఆదిశేషయ్య & కో
  6. రచన ; శ్రీ బేతవోలు రామబ్రహ్మం
  7. సంస్కృత మూలం వ. శ్రీ కాళిదాసు 1985-అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా
  8. సమర్పణ : నాగార్జున సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు నాగార్జున సాంస్కృతిక కేంద్రం, గుంటూరు-2.
  9. నిర్వహణ : శ్రీ కె.ఎస్‌.ఆర్‌. ప్రసాదరావు, వ్యవస్థాపక కార్యదర్శి శకుంతలా దుష్యంతం ప్రథమాంకం = అరణ్యం సీను - (వేటకు తగిన వేషంతో కిరీటంతో - విల్లును ఎక్కుపెట్టి లేడికూనను వెంబడిస్తూ దుష్యంతుడు ప్రవేశిస్తాడు) దుష్యంతుడు వ _పట్టవలెరా ! (అఠాణా-మిశ్రచాపు) ఈ లేడికూనను బేతవోలు రామబ్రవ్డుం 7

శకుంతలాదుష్యంతం కొట్టవలెరా ! వేటలో గల వేడృతీరగ ॥పట్టః॥ చెంగుచెంగున దాటిపోవును నిలిచి నిలువక మరలి చూచును పట్ట! సగము నమిలిన గరిక తుంపులు దారిపొదవున జార విడచును పట్ట! వెన్నుపోటును గాచుకొనుటకు ఉండజుట్టుకు ఉరుకుచుండెను పట్ట! అడుగు నేలను - గజము నింగిని దుముకులాడుచు తొలగిపోవును పట్ట! (బాణాన్ని విడిచి పెట్టబోయే సమయానికి ఇద్దరు ముని కుమారులు రాజుకీ లేడి కూనకీ మధ్యలో అడ్డుగా నిలుస్తారు) ముని కుమారులు : తగదిది తగదిది తగదూ (వసంత-ఆది) దుష్యంత మహీధవ ! తగదిది తగదిది తగదూ (ఒకరు దీనంగా కణ్వాశమ హరిణంబును ఒకరు కోపంగా) సంహారము చేసెదవే ? 11తగదిది। బలవత్తర ఘనశాత్రవ భటకోటుల వెస జీల్చెడు కఠినాయస నారాచము హరిణంబును జంపుటకా- 1తగదిది।। పరిమళ లహరులు బిందెడు సుకుమారపు సుమరాశిని పరికించుచు పరికించుచు బలు నిప్పులు పోసెదవే ॥తగదిది!! 8

శకుంతలాదుష్యంతం (అప్పుడు బాణాన్ని ఉపసంహరిస్తూ దుష్యంతుడు) దుష్యంతుడు ఏ తగదిది తగదిది తగదూ ఓ మౌనీంద్రులు ! మన్నింపుడు తగదిది తగదిది తగదూ కణ్వాశ్రమ హరిణంబును సంహారము చేసెదనే? 1తగదిదిః॥ (మునికుమారులు రాజుగారిని మెప్పుగా ఆశీర్వదిస్తారు) ముని కుమారులు :; కం॥ పురువంశోద్భవ ! నీవిటు (వసంత, శరంబు నుపసంహరింప సంతసమయ్యెన్‌ వరపుత్రుని - నీ సరియౌ నురుతర సద్గుణ బలాధ్యు నొందుమ వేగన్‌ దుష్యంతుడు ; చం॥ మునిజనులార ! మంత్ర పరిపూత వచోనిధులార ! సత్యవా (వసంత) క్య నిచయులార ! దీవెనల నందితి - నాదు కృతజ్ఞతాభివం దనములు గైకొనుండు, ఇక - నితాంత తపోనిధి కణ్వుంజూడన మ్మునివరు నాశ్రమంబునకు పోయెదంగాక వినీత వేషినై (అనసూయా ప్రియంవదలతో శకుంతల ధర్మారణ్య విహారం. కణ్వాశమం ఉన్న అరణ్యం పేరు “ధర్మారణ్యం”. సంస్కృతంలో పాట -) తదన దిను తదిమి శకుంతల ; నూత్నం లసతి సఖి ! కాననం - పశ్య (తదికి తదిమి) (జయశంకరి -ఆది నూత్నం లసతి సఖి ! కాననమ్‌ - ॥ లేదా బృందావన సారంగ) భృంగైః అసితవిపు - లాంగైః కృతరజో భంగైః జితాబలాపాంగైః అద్య-పశ్య 1నూత్నం॥ వల్లీ భూమిజా మళల్లీ ప్రాలింగతి సల్లీన తరుమత్ర- తల్లీలాం చ - పశ్య ॥నూత్నం॥ బేతవోలు రామ(బ్రవ్మాం ౦

శకుంతలాదుష్యంతం కీరైః ముఖరిత తీరైః మధురోక్తి సారైః శోణముఖ - వారైః అద్య-పశ్య ॥నూత్నం!! (ఈ పాట అయ్యేలోగా ఈ మునికన్యలకి కనిపించకుండా వెనకాల నుంచి రంగప్రవేశం చేసి దుష్యంతుడు చెట్లచాటున నిలిచి శకుంతలను తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దుష్యంతుడికి కిరీటం ఉండదు. సాధువేషం. అదే వినీత వేషం) (ఈ పాట అయిపోగానే శకుంతల ఒక పూలతీగెను కదుపుతుంది దానిమీద ఉన్న తుమ్మెద ఒకటి ఆమె ముఖం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ తుమ్మెద బాధను నటిస్తూ శకుంతల -) శకుంతల ఏ చూడు మనసూయా 1 (కల్యాజి/వలజి-ఆది) గండు తుమ్మెద మిదమీదకు వచ్చుచున్నది చూడు! అనసూయ ౩; మోము జూచి - జలజ మనుకొని చుట్టు చుట్టూ తిరుగుచున్నది ॥ శకుంతల 2 చూడు ప్రియంవదా |! గండు తుమ్మెద మీద మీదకు ... వచ్చుచున్నది ॥చూడు॥ ప్రియంవద ; కన్ను విప్పి తేరిచూచిన కలువరేకని వదలకున్నది ॥ శకుంతల ; చూడు మనసూయా 1 గండుతుమ్మెద మీదమీదకు వచ్చుచున్నది ॥చూడు॥ అనసూయ వ. చేయి సాచి - కొట్టబోతే పద్మ మనుకొని- పట్టుచున్నది 10

శకుంతలాదుష్యంతం శకుంతల ; చూడు ప్రియంవదా ! గండు తుమ్మెద మీదమీదకు వచ్చుచున్నది ॥చూడు॥! ప్రియంవద ; కేలుదోయిని - మోము దాచిన మొగ్గ లనుకొని - ముసురుచున్నది శకుంతల ఏ చూడు మనసూయా ! గండు తుమ్మెద మీదమీదకు వచ్చుచున్నది ॥చూడు! అనసూయా :. ఆడువారము - మేము కూడా ప్రియంవదలు ; ఆర్చగలమా - తీర్చగలమా? ॥ చూడు ప్రియంవదా ! చూడు అనసూయా ! గండు తుమ్మెద మీదమీదకు పోవుచున్నది ! శకుంతల ; కం॥ చెలులారా! -నావెతన వ్వులయాటగ నుండె మీకు - పోపోందమ్మా | అళ్లిబాధలనుండి శకుం తల గాపాడంగం గలుగు నాధుడె లేడా? (చెట్టు చాటు నుండి దుష్యంతుడు హఠాత్తుగా ప్రవేశిస్తాడు) దుష్యంతుడు ఏ ఉంటి సకియా ! (కల్యాణి/శ్రీరంజని-ఆది) ఉంటి చెలియా ! రాజవిభుడను రక్షకుడనూ ॥ఉంటి॥! గడుసు తుమ్మెద బెడద బాపి పరమ సుఖమును పంచగలను ॥ఉంటి॥ బేతవోలు రానుబ్రవ్మాం 11

శకుంతలాదుష్యంతం (తుమ్మెదను పట్టుకుని దూరంగా విసిరేస్తాడు) తేటి దంట ఈమె నంట ఈసు పడితి నేను పడతీ ! ॥ఉంటి॥ అనసూయ : తే.గీ. _ అర్జ్యపాద్యము లీయగా - అదనుగాదు, ప్రియంవద గౌరవంబులు సేయుటల్‌ - నేర మయ్య ! ఇద్దరూ కలసి , కణ్వపుత్రికం గాచిన క్ష్మాతలేశ ! (అభేరి) వందనమ్ములు గొనుమ ! మా వందనములు ! (ఈ ఉపచార వాక్యాలని పట్టించుకోకుండా దుష్యంతుడు శకుంతలని సమిపిస్తూ) దుష్యంతుడు : తే.గి. వెలంది మేఘాన చంద్రమఃకళ యనంగ (అఖేరి) కైరలు ధూమాన హోమాగ్నికీల యనంగ నార చీరల నున్నటి సారసాక్షి రాచ కన్నెగ డెందాన తోంచుచుండె (అనసూయా ప్రియంవదలతో దుష్యంతుడు -) ద్విపద కణ్వపుతి యనిరి కంజాస్యలార ! (బ్రహ్మచారి యతండు ! బ్రహ్మ్నర్షిపతికి (అభేరి సంతు గలుంగుటన్న వింతగాం దోంచె, ఈమె జన్మకథను ఎరిగింపుండమ్మ! ॥ (అనసూయా ప్రియంవదలు కనుసన్నలతో శకుంతల అనుజ్ఞ తీసుకొని మొదలు పెడతారు -) అనసూయా ; వినిపించెదమో రాజా! ప్రియంవదలు : మా చెలి కథ (ఆరభి/కమాస్‌-రూపక) వినిపించెదమో రాజా ! కణ్వుని కీవిడ పెంపుడు కూతురు 12

శకుంతలాదుష్యంతం మా వలె - ఈ లత లన్నిటివలెనే వినిపించెదమో రాజా! వచనం : బ్రహ్మర్షి పదంబును గోరి విశ్వామిత్రులొకట ఘోరమౌ తపంబును కోరి చేయ - ఉలికిపడినట్టి ఇంద్రుండు మేనకాదేవి నంపించెనటకు మేనకాదేవి నంపించెనటకూ - (ఈ వచనం చెబుతూ ముని కన్యలు ఒక ్రక్కకీ, దుష్యంతుడు మరో ప్రక్కకీ వెళ్ళిపోతారు. ఫ్లాష్‌బ్యాక్‌ మ్యూజిక్‌ - ముని కన్యలు వెళ్ళిన వైపునుంచి విశ్వామిత్రుడు రంగప్రవేశం చేసి ధ్యానముద్రలో కూర్చుంటాడు. దుష్యంతుడు వెళ్ళినవైపునుంచి మేనక ప్రవేశిస్తుంది. తెల్లటి చీరతో. ఇది మరొక తపోవనం సీను) = వత్తి - తెర వెనుక నుండి పాట - (అఠాజూ / కాపీ - ఆది) వచ్చిందయా మేనక - తరలి వచ్చిందయా మేనక సుమసాయక విజయ పతాకిక వచ్చిందయా మేనక ॥ మునివరు తపమును వంపగా సురపతి చనుమని పంపగా అలరింపగా నటియింపగా అలరింపగ - నటియింపగ తరలీ 1వచ్చిందయా॥ చెందొవ తేటుల జాడగా నొనటను ముంగురు లాడగా జడ వీడగా బేతవోలు రామ(్రహ్మాం 13

శకుంతలాదుష్యంతం కటియాడగా జడ వీడగ - కటియాడగ తరలీ॥[వచ్చిందయా॥ గిరియుగ సానుల వాగుగా ఉరమున హారము లూగగా నడ తీగగా వగ రేపగా నడ తీవగ - వగరేపగ తరలీ 1వచ్చిందయా॥। పదముల దిద్దిన లత్తుక చీరకు ఎరుపుల నొత్తగా తెలి చీరకు ఎరుపుల నొత్తగా . మదమత్తగా మరు లెత్తగా మదమత్తగ మరు లెత్తగ తరలీ 1వచ్చిందయా॥ (ధ్యానం వదిలేసి విశ్వామిత్రుడు) వచనం ; ఓ సౌందర్యరాశి ! నా తపంబు నంతయును బోసి (అఠాణా/సరస్వతి) నీ కెంబెదవి గ్రోలుటయె మిన్న - బ్రహ్మర్షి పదవి కన్న న న్నేలుకొమ్మా ! ఓ కుందనపు బొమ్మా! నన్నేలు కొమ్మా ! (ఆమె కడకొంగు పట్టుకొని వెళ్లిపోతాడు. మళ్ళీ ఫ్లాష్‌బ్యాక్‌ మ్యూజిక్‌. దుష్యంతుడూ మునికన్యలు పునఃప్రవేశం - పాత సీను). = వేత్తి - అనసూయా ఏ వినిపించితిమో రాజా ! ప్రియంవదలు మా చెలి కథ వినిపించితిమో రాజా ! 14

శకుంతలాదుష్యంతం కణ్వుని కీవిడ పెంపుడు కూతురు మా వలె - ఈ లతలన్నిటివలెనే వినిపించితిమో రాజా |! మా చెలి కథ వినిపించితిమో రాజా ! మా చెలి కథ వినిపించితిమో రాజ ! దుష్యంతుడు వ (శకుంతలను నిర్దేశిస్తూ - ) (షణ్ముఖ/తోడి) ఉ। ఓయి శకుంతలా ! మధుకరోపమ కుంతల ! నీదు రూపు ప ద్మాయితమైన చూపు, ముని యాత్మజ కావని తెల్పనోపు - వ్యం గ్యాయతమైన నీ - ప్రియవయస్యల వాక్కులు నిన్ను రాజ క న్యాయతి నిల్పి-నా మది లతాంతధనూ రుతి సల్పె - సుందరీ! (శకుంతలను చూపుతూ - అనసూయా ప్రియంవదలతో -) దుష్యంతుడు వ తే.గీ. గండు తుమ్మెద వ్రాలెనా కమలిపోవు గాలి ఒక్కింత సోకెనా కందిపోవు ఇట్టి సుకుమారి తపము చేపట్టదగునె? నళినదళముతో వృక్షమ్ము నరుకనగునె? అనసూయ ఫి తే.గీ. _ అర్జుదైనట్టి పెనిమిటి నందగోరి తపము చేయుచునున్నది ధరణినాథ ! ప్రియంవద 2 తమరి రాకతో ఈనాడు ధరణిపాల ! కణు మదిలోని భారమ్ము కడను గనుత ! (అనసూయా ప్రియంవదలు చిరునవ్వులతో వెళ్ళిపోతారు. వారి వెంట శకుంతల కూడా జారుకోబోతూంటే దుష్యంతుడు అడ్డం నిలిచి -) దుష్యంతుడు ౩ తే.గీ. నీవు నంగికరింతువే నిప్పు డతివ । (శంకరాభరణం) పంచభూతాలళి సాక్ష్యంబు పలుకుచుండ బేతవోలు రామబ్రహ్హాం 15

శకుంతలాదుష్యంతం శాస్త్రసమృతి - గాంధర్వ చారుఫణితి నీదు చేదోడు వాదోడు లందుకొందు పంచశరుపైని కోపంబు బాపుకొందు నీవు నంగీకరింతువే నిప్పు డతివ ! (శకుంతల సిగ్గుతో ముడుచుకుపోతుంది. బదులు పలుకదు. మౌనం అర్భాంగీకృతిగా స్వీకరించి దుష్యంతుడు-) దుష్యంతుడు. _ : తనువున ననిచిన పులకలునూ (వలజిసారంగ-అది) చెక్కిట మెరసిన ఎరుపులునూ మనసును దెల్పుచునుండగనూ మాటలకే మరి నోచనటే ! ॥ సిగలో తురిమిన మల్లెలునూ కన్నుల కదలెడు కాంతులునూ మనువులనాడుచు నుండగనూ మాటలకే మరి నోచనట్రే | నొసటను నిలిచిన స్వేదమునూ కెంపవు పెదవుల అదరులునూ ఊసులనాడుచు నుండగనూ మాటలకే మరి నోచనటే ! ॥ (శకుంతల చిరునవ్వుతో తన అంగీకారం తెల్పుతుంది. దుష్యంతుడు ఉత్సాహంగా చేరువకు వచ్చి చెయ్యి పట్టుకుంటాడు) దుష్యంతుడు వ పున్నమి వెన్నెల నీ వయితే వెన్నెల రేడును నే నవుతా ॥ శకుంతల ; తొలి నుడి మంత్రము నీ వయితే పలికెడు స్వరమును నే నవుతా 1 16

శకుంతలాదుష్యంతం

దుష్యంతుడు ఏ. పరిమళ లపహరివి నీవయితే

సిరి మల్లెల మంజరి నే నవుతా ॥ శకుంతల యోగము యాగము నీ వయితే

ప్రణవము సిద్ధియు నే నవుతా ॥

(ప్రథమాంకం పూర్తి అయ్యింది)

ద్వితీయాంకం (మధురస్మృతులతో పరధ్యానంగా ఉన్న శకుంతలను అనసూయా ప్రియంవదలు

ఆటపట్టిస్తున్నారు) (హిందోళ / తిలకామోది - ఖండ / మిశ్రగతి) ప్రియంవద ఏ పలుకవేమిటే ? చెలీ ! నీవు

పలుకవేమిటే ? అనసూయ ఏ ఒలుకబోవులే ముత్యాలు

ఒలుకబోవులే ॥పలుక॥ ప్రియంవద ఏ జామిపండు చెక్కిలిపై

పంటినాక్కులేమిటే ? అనసూయ ఏ రా చిలుకే దరిని జేరి

వాచవినే చూసెనేమొ ॥1పలుక॥ ప్రియంవద ; నల్లకలువ పువ్వుల్లో

ఎ(ర్రజీర లుండెనేమె? అనసూయ ; _ తేటిటేడు చేరవచ్చి

తేనె జుర్రిపోయె నేమొ 1॥పలుక॥ ప్రియంవద ; తేటనీటి కొలనులోన

కలతబుట్టె నేమిటే? బేతవోలు రామ(బ్రవ్మాం 17

శకుంతలాదుష్యంతం అనసూయ ఏ రాజగజము మునకలాడి కేళి సలిపి పోయెనేమొ ॥పలుక॥ ప్రియంవద వ _మెత్తనయిన చివురుజంట కందిపోయె నేమిటంట? అనసూయ వ సేవకుండు చేరవచ్చి ఒత్తి ఒత్తి వెళ్ళినేమొ ॥పలుక॥ ప్రియంవద ఏ ఊం ఉంగరమ్ము తొడిగినాడె? అనసూయ వ ఊం ఉంగరమ్ము తొడిగినాడె? ప్రియంవద వ ఊసులేమి చెప్పినాదె? అనసూయ 2 బాసలేమి చేసినాదె? ॥1పలుక॥ (ఈ అల్లరిని భరించలేక శకుంతల దుష్యంతుడిచ్చి వెళ్ళిన రాజముద్రికను చూసు కుంటూ పారిపోతుంది. అదేవైపు నుంచి దూర్వాసుడు ఉగ్రంగా ప్రవేశిస్తాడు -) దూర్వాసుడు 2: ఆ.వె. మునివరేణ్యు నన్ను పూజింపకుండ ఈ (హిందోళ/ముఖారి) పారిపోవుచున్న పడతిమిన్న ఎవని రాకలను ప్రతీక్షించుచుండెనో వాడు - దీని మరచువాడు గాక ! (వెంటనే అనసూయా ప్రియంవదలు భయంతో అతనికి పాదాభివందనం చేసి -) అనసూయ ప్రియంవద : మన్నింపుమో మౌనిచంద్రా ! (వకుళాభరణం/ మమ్ము సామ-ఖండచాపు) మన్నింపుమో కీర్తి సాంధ్రా ! ఈరేడు లోకాల ఏ చోట జూచినా నీవంటి మునిజోదు మాకంట బడలేదు మన్నింపు॥ నాలుకే ఒక మంత్ర దండంబుగా బూని విధి వ్రాతలను గూడ - తప్పింపగలవాడ ॥మన్నింపు! 168

శకుంతలాదుష్యంతం దూర్వాసు డనుమాట - దూరాన వినినంత దేవేంద్రుడే నొద్ది - దిగిపోవు తా గద్ది ॥మన్నింపు॥ కబ్వర్ని పుత్రిపై - ఘనరోషమును బూని శపియింపదగదయ్య - క్షమియింపుమోయయ్య ॥మన్నింపు॥ దూర్వాసుడు ఏ తే.గీ. ఓ మునీంద్ర కన్యకలార ! ఊరడిలుడు (వకుళసిందుభైరవి) మీదు ప్రార్థనాగీతికి మెచ్చినాము మాదు శాపమ్ము మరలింప మనసుబుట్టె - “గృరుతునేదేని చూపించుకొన్నః - అతడు తెలివినొంది మో చెలిని గుర్తింపగలడు” (అని వెళ్ళిపోతాడు. అనసూయా ప్రియంవదలు ఆనందంతో) (మోహన / సింధు-రూపక) ప్రియంవద వ ఉంగరమున్నది కాదే ! నృపుడిచ్చిన ఉంగరమున్నది కాదే! అనసూయ ; మనకిక భయమది లేదే ముని పుత్రికి మనమిది చెప్పగరాదే ! 1 ఉంగ॥ ప్రియంవద ఏ ముని పుత్రికి మాత్రమె కాదే మరి యెవరికి మనమిది చెప్పగరాదే ! 1 ఉంగ॥ (ద్వితీయాంకం పూర్తి అయ్యింది) బేతవోలు రామబ్రహ్మం 19

శకుంతలాదుష్యంతం తృతీయాంకం (రాజపురోహితుడితో కలిసి దుష్యంతుడు ఏకాంతంగా కొలువుతీరి రాజనర్రకీమణుల భరతనాట్యం తిలకిస్తుంటాడు -) = వేత్తి - (ఆదితాళం) ఏ సాగరు వెచ్చని కౌగిలికై కాపీ/ంసధ్వని సాగెడు సుందర వేణికనై ఆర్తవ మంజుల గీతికలే ఆడనా పాడనా అందముగా సాగరు! న జతి నూ తరువుల లతలను గల్పుచునూ (ఖమాస్‌) పేశల సుమములు జల్లుచునూ కోపన కోపము తీర్చగనూ చైత్ర వసంతము వచ్చెనిదే సాగరు! నా జతి నా జోగులు చేసెడి మాపులతో (చక్రవాకం) వేగము చూపెడి రేపులతో తరుణుల కోపము రేపగనూ గ్రీష్మ మహర్తువు వచ్చెనిదే ॥సాగరు॥ నల్లని మబ్బుల జూచినచో (బహార్‌) జేంటల మంటలు హెచ్చుగదే . విరహుల మాటను చెప్పకువే ఆ వానల కాలము వచ్చెనిదే | 1సాగరు॥

శకుంతలాదుష్యంతం జూ జతి న ప్రకృతియు పురుషుడు కలిసినచో (శంకరాభరణం) తెల్లని నవ్వుల జల్లులవే మొల్లల హరువుల పోలికగా శారదసుందరి వచ్చెనిదే ॥సాగరు॥ నా జతి నా గరికల పోచల కట్టకడ (సరస్వతి) నిలిచిన మంచు కణంబిదిగో ఖండిత కన్గాస బిందువుగా - హైమ మహర్తువు వచ్చెనిదే | 1॥సాగరు! న జతి న పతి యొక వంచన చేయుటచే (కీరవాణి) సతి తన భూషలు డుల్చ్బుటగా లతికల ఆకులు రాలగనూ శిశిర మహర్షువు వచ్చెనిదే ॥సాగరు॥ (నర్తకీమణులకు బహుమతులిస్తాడు) (తృతీయాంకం పూర్తయింది) చతుర్ధాంకం (కణ్వాఢమం. కణ్వుడు దుఃఖభారంతో ఏకాంతంగా ప్రవేశం) కణ్వుడు ;. తే.గీ. ఈ శకుంతల అత్తవారింటి కేగు (తోడి/ఖరహర) నన్న వార్త, దుఃఖాతిశయమ్ము నిచ్చు చుండె - పెంచిన తీపికే గుండెలవియు చుందె, కన్నతీపి యిక నెట్లుండునొక్కొ! బేతవోలు రామబ్రహ్మం ల

శకుంతలాదుష్యంతం అఖిల సంగ పరిత్యాగినైన నేనె (ధన్యాసి) పుత్రికా విరహానకున్‌ పొగులుచుంటి అప్పగింతల సమయమ్మునందు నింక కన్నవారల దుఃఖమ్ము నెన్నం దరమె । వచనం : ఓ, ఉద్యాన వన దేవతలారా ! ఓ తరు లతా నివహమ్ములారా !

(శహానా ఠాగం) ఉ॥ బోదెలు తీసి, నీరములు పోసి, అనేకవిధాల మిమ్ము నెం తేదయ పెంచినట్టి జననీపద వాచ్య - శకుంతలాఖ్య; చై త్రాదుల నవ్వు పువ్వుల హొయల్‌ కలబోసిన మీ వయస్య; నే డాదట మెట్టినింటికి ప్రయాణము సేయుచునుండెనమ్మ । అ త్యాదృతి దీవెనల్‌ సలుపుడమ్మ ! శుకీపిక కంఠమాధురిన్‌

(కోకీల కూత ప్రధానంగా పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి శార్‌బ్లరవ శారద్వతులు ప్రవేశిస్తారు -)

(హుసేని,ఖైరవి-ఖండచాపు)

పదం ; అదిగో అదిగో వినిపించెను కోకిలమ్మ కలగానము ఇదిగో ఇదిగో వినిపించెను శుకపిక మృదుగీతము వన దేవత లంగీకృతి తెలిపినారు పలికినారు శకుంతలమ్మ ప్రణయగాధ శుభము శుభము జయము శుభము అదిగో!

(అనసూయా ప్రియంవదలతో గర్భిణి శకుంతల ప్రవేశిస్తుంది. కణ్వుడి దగ్గరకు వెళ్ళి -)

శకుంతల వ గీ కన్నవారి ముక్కు మొగముం గాంచనట్టి

(కాపీ/ముఖారి) నాకు - తల్లియున్‌ తండ్రియు నైతి వీవు;

వెలితి రానీక పెంచిన పితకు నీకు 22

శకుంతలాదుష్యంతం మోకరిల్లుటకన్ననో మునివరేణ్య ! అన్య మేముండె నేను చేయంగం గలది ! (పాదాభివందనం చేయబోతుండగా లేవనెత్తి -) కణ్వుడు వ గీ కోరుకొన్నట్టివాడు చేకొనెను నిన్ను (బిలహరి) భాగ్యశాలినివమ్మ ఓ పడతి మిన్న! చక్రవర్తి సల్లక్షణశాలి నొకని అచిరకాలాన పుత్రుగా నందుమమ్మ ! (హిందోళ) నడుమ వచ్చిన కలిమికి మిడిసిపదక ఈవు వర్తించి మాట దక్కించుమమ్మ ! కులవధూ వర్తనంబులు తెలిసినట్టి నీకు నింతకన్నను చెప్ప నేమికలదు ! శకుంతల వ కదలలేను మిమ్ము విడిచి (కానడరాగం నిలువలేను పతిని మరచి రూపకతాళం) ఆశీస్సుల నందించి పంపించుము ఓ తండ్రీ ! కదల! తనువులివ్వి వేరయినా మనసు మనది ఒకటమ్మా ! చెలులారా ! నను నెపుడూ మరువకండి ! మరువకండి ! 1॥కదల॥। గున్నమామిడి చెట్టుతోడ సిరిమల్లెల తీగ గూర్చి పరిణయమ్ము చేసినాను కాపాడుడు దానినమ్మ ! 1॥1కదల॥ తరులారా ! లతలారా ! మృగములార ! పక్షులార ! బేతవోలు రామ(్రమ్మాం 23

శకుంతలాదుష్యంతం మిము వీడి యేగుచుంటి అలుగకండి ! అలుగకండి ! 1కదల॥। తలిదండ్రులు విడిచారని పసికందును పొత్తిలిలో సాకినావు - పెంచినావు ఆ(శ్రమంబ ! వీడుకోలు ! ॥కదల॥ (కుడిభుజం కుడికన్ను అదరటాన్ని అభినయిస్తూ రెండడుగులవేసి తూలి నిలదొక్కుకుని-) మనసులోన శంకలేవో మరలమరల రేగుచుండె దొసగు లేమి చేసినానా క్షమియింపుము సంయమీంద్ర ! ॥కదల॥ కణ్వుడు (ఊరడింపుగా) :గీ॥ నీదు ననురాగ గరిమయు - మాదు ఘనత (అఠాణా/పూర్వీకల్యాణి) పోవిభూతియు నండగా పొసగుచుందె, పౌరవాన్వయేందుడు నిన్ను పట్టమహిషి గాంగ స్వీకరించును తల్లి ! కలత పడకు ! గ; సర్వ సర్వంసహాదేవి - సవతి గాగ అఖిల భోగాల చిరకాల మనుభవించి సుతుని భుజమున రాజ్యవిస్ఫూర్తి నిలిపి నీవు నీదు దుష్యంతుతో నేమ మలర మరల రావమ్మ! ఈ ఆ(థభ్రమంబునకును. శకుంతల 2 _కదలలేను మిమ్ము విడచి ॥ (శార్‌బ్ఞరవ, శారద్వతులతో శకుంతల ఒకవైపునకు, తక్కినవారు మరోవైపునకు నిష్మమిస్తారు) ఆ చతుర్ధాంకం పూర్తి అయ్యింది - 24

శకుంతలాదుష్యంతం పంచమాంకం (పురోహితునితో దుష్యంతుడు వకాంత సుఖాసీనుడై ఉండగా - )

ద్వారపాలకుడు ఏ (వచనం) జయము ! జయము ! మహారాజా ! (మోహన-ఖండచాపు) కణ్వమహాముని శిష్యులట, శార్‌బ్జరవ శారద్వతులట,

కణ్వమునీంద్రుల పుత్రికయట

అంతర్వత్ని శకుంతలయట

దర్శనంబునకై వచ్చి ద్వారంబు కడ నుండిరయ్యా !

(ప్రవేశపెట్టుమని దుష్యంతుడు సంజ్ఞ చేయగా, శార్‌జ్ఞరవ శారద్వతుల వెనుక

శకుంతల ప్రవేశిస్తుంది) (ధన్యాసి ూహన-ఖండచాపు) శిష్యులు వ జయము ! జయము ! దుష్యంత చక్రవర్తీ !

జయము ! జయము ! దిగంత వ్యాష్తకీర్తీ ! దుష్యంత ఏ అభివందనములయ్య 1! మునులూ !

మికూ - మీ గురువులకు

అభివందనములయ్య ! మునులూ ! శార్‌జ్ఞరవ ; అందింపుడని పంపినారూ

కజ్వర్ని ఆశీస్సు

లందింపుడని పంపినారూ ॥ దుష్యంత ; అభివందనములయ్య ! మునులూ !

మీకూ- మీ గురువులకు

అభివందనములయ్య ! మునులూ |! శారద్వతుడు 2 ఆధిబాధల నందకుండా

మీ ప్రజలు

ఆరోగ్యముగనూ ఉండా 1అందింపుడని ॥ దుష్యంతుడు ఏ అభివందనములు ........... బేతవోలు రామ(బ్రహ్హాం 25

శకుంతలాదుష్యంతం శార్‌జ్ఞరవ వ కందోయి ధూమమ్ము దూరినా పురోడాశ పిండమ్ము కుండమ్ములో బడిన భంగి శారద్వత వ గాంధర్వ పద్ధతిని నీవు ఈ శకుంతలను పెంద్లాడ సంతసము బొందీ ॥అం॥ దుష్యంతుడు ఏ ఈ తల్లి నేనెపుడు మౌనీ ! చూడనే లేదయ్య స్వామి ! ఇక పెండ్లాడు టను మాట ఏమి? 1అఖి॥ శార్‌జ్ఞరవ (కోపంగా): రాజూాధిరాజుల మటంచూ మునిపుత్రి మానంబు దీయంగ దగునే? దుష్యంతుడు(కోపంగా): మౌని శిష్యులు మీరు స్వామి | మీ మేరలో మీరుండ రేమో ? శారద్వత (శాంతంగా): అది యేమిటో చక్రవర్తీ ! అట్లరడు ఖీ లిథిన ముద్రికే సాక్ష్యంబు - చూపింపుమమ్మా ! చూపింపుమమ్మా | (అంటూ శకుంతల కేసి తిరుగుతాడు. శకుంతల వేలు తడుముకుంటూ కంగారు పడుతూ -) శకుంతల (వచనం): హతవిధీ ! ఓ శార్‌బ్ల్ణరవ శారద్వతులారా ! (మోహన/ధన్యాసి) రాజముద్రిక కన్పింపకుండె - గంగయొడ్డున శక్రతీర్థంబున జారెనేమొ. పోనిండు ! పోనిండు ! 26

శకుంతలాదుష్యంతం తే.గీ. _ శాస్తసమ్మతి గాంధర్వ చారు ఫణితి జరుపుకొన్నట్టి మనువిట్లు విరిగిపోయె, పంచభూతాలె సాక్ష్యంబు పలుకకున్న ఉంగరము నాదు సంసార మోమంగలదె? తే.గీ. _ తల్లిదండ్రులచే పరిత్యక్త నయితి పితృసమానుడౌ కబ్వర్ని వెడలనడిచె ఇపుడు భర్తచేతను తిరస్కృతిని గంటి నన్ను విడచి మీరును బోవు డన్నలార ! తే.గీ. _సలిపినానయ్య ఆ నాడు సాహసంబు, తప్పు కాదది యన్న సత్యంబు - నేను - నాదు గర్భంబులోని భ్రూణమ్ము నెరుగు, చారుశీలను - బ్రతికెద- చావబోను. పురోహితుడు . : వ॥ సత్యవాక్య పరిపాలకా ! దుష్యంత మహీపాలకా ! తే.గీ. _ గర్భమందున్న శిశువును గాంచువరకు ఆమె మాయింట నా కూతురనగ నుండు జన్మమందిన బిడ్డని జాతకమ్ము - రూపు రేఖ - పరిష్కృతిం జూపం గలవు. దుష్యంతుడు ; అడుపుట్టుక - అశిక్షిత పటుత్వానికే కాదు అందరి సానుభూతికీ ఆలవాలము గదా ! అట్లే కానిండు. (పంచమాంకం పూర్తి అయ్యింది) షష్థాంకం (గంగ ఒడ్డున జాలరివాళ్ళు నలుగురు చేపలు పడుతుంటారు) బృందగానం - జానపద నృత్యం - శుద్ధసావేరి - త్రిశ్రగతి బేతవోలు రామ(బ్రవ్మాం 27

శకుంతలాదుష్యంతం దండాలమ్మో - గంగాలమ్మా ! దండాలమ్మో - నీకు దండాలమ్మా ! సిట్టెయ్య వ ఈ సేపల సిట్టెయ్యకి ఏ సేపలు పట్టుబడితె ఆ సేపలె కతుకుతాడు మారాజే మా వోడొసె దండాలు! సిట్టెమ్మ వ శివుడుగోరి నెత్తిమీద సివమెత్తీ - సిందేత్తే 'సేపలన్ని సెదిరి రావ సిటిగాడికి సిక్కిపోవ? దండాలు! మరొక యువకుడు : మాం విచ్చే సేపలతో మారాజులు బతుకుతుంటే - మా బతుకులు నీకాడే మటుమాయం అవుతుంది ! దండాలు! మరొకరు ఏ నావపైని పడుచు జంట నావ కింద నీటిగుంట ఊరోళ్ళ గుట్టులన్ని ఏ రొడ్దున మాకె యెరుక ॥దండాలు॥! సిట్టెమ్మ ; అద్దరేతిరేళ లెగిసి ఆకాసం సూసినానొ - సుక్కమీలు గురుతురావ తెల్లవారులిదే యావ! 1॥దండాలు॥ సిట్టెయ్య ;. ఈ రోజున ఈ వలలో మారాజుల కిట్టమయిన 28

శకుంతలాదుష్యంతం కారమినలె నింపుతావా గులకరాళ్ళి ముంపుతావో..... దండాలు! (ఈ పాట పాడుకుంటూ వల దేవుతుంటారు. చివరి చరణంలో వల దేవేసరికి వాడిచేతికి ఒక ఉంగరం దొరుకుతుంది. ఆ నలుగురు జాలరివాళ్ళలోనూ వాడే పెద్ద - ముసలివాడు. వాడు ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకొని ఆశ్చర్యపోతూ -) సిట్టెయ్య : తే.గీ. ఓరినాయనో ! రతనాల ఉంగరమ్ము సిట్టిగాడికి ఇదియేటి సింగరమ్ము ! బేగె బేగెను బోయి మా పెబువగారి కిచ్చుకొందును ............... తక్కినవారు వ వ॥ ఆం - ఇత్తే ! సిట్టెయ్య వ... ఈనాము ఇచ్చు పెబువు - ఈనాము లిచ్చు పెబువు (అని ఆ ఉంగరంతో పారిపోతాడు. తక్కినవారుపైపాట పాడుకుంటూ వల దేవుతుంటారు. శార్‌బ్బరవ శారద్వతులతో రాజపురోహితుడు వారి దగ్గరికి వస్తాడు) శార్‌జ్ఞరవ, శారద్వత: ఓ జాలరి దొరలారా ! ఉరుకరుణామయులారా |! ఉంగరమేదయినా ఇట దొరకిన ఈయుడయా ! ॥ఓ జాలరి! 2వ జాలరి ౩; ఓ బాపన దొరలారా! ఉంగరమొకటే దొరికెనయా ! పురోహితుడు వ ఈయుడు ఈయుడు ఈయు డరే ! కోరిన సొమ్ముల నిత్తుమురా ! మరో జాలరి 2 ఏలిన దొర కది ఇచ్చుటకై సిటిగాడిదె పుచ్చుకపోయెనయా ! (కణ్వ శిష్యులతో పురోహితుడు తక్షణం నిర్గమిస్తాడు. తక్కిన జాలర్లు పాత పాట పాడుతుంటారు) బేతవోలు రామ(బ్రహ్మాం 29

శకుంతలాదుష్యంతం సప్తమాంకం (ఆ రాజముద్రికను చేతపట్టుకొని రాజోద్యానవనంలో ఒంటరిగా దీనంగా దుష్యంతుడు) దుష్యంత ఏలా మరచితి ఈ కథ తొల్లీ? ఏలా మెదలెను ఈ వ్యధ మళ్ళీ? ఏలా! (సావేరి-ఖండచాపు) అలనా డచ్చట ఆశ్రమమందున పరిణయమాడిన - పడతికి తొడిగితి ॥ఏలా॥ రాకకు గురుతుగ ఇచ్చినవాడను దీనిని జూడగ జ్ఞానము వచ్చెను 1॥ఏలా॥ అయ్యో పాపము - ఆ మునికన్యక ఏమని తలచెనొ - ఏమని వగచెనా వలా! నాదు శకుంతల - నన్ను క్షమించునె? నాదు శకుంతల - నన్ను క్షమించునె? ఏలా! (మూర్చపోతాడు. పురోహితుడు ప్రవేశిస్తాడు) పురోహిత వచనం : ఊరడిల్లు మూరడిల్లుమో దుష్యంత చక్రవర్తీ ! అనసూయా ప్రియంవదలచే (అమృతవర్షిణి) అసలు రహస్యంబు నెరిగిన కణ్వమహాముని మనకు ఆజ్ఞ నంపించినారు. దూర్వాసు శాపంబును తద్విమోచనంబును దీనికి కారణంబనిరి స్వామి ! - ఇందు తమ దోషము ఆవంతయును లేదు. దుఃఖింపకయ్యా ! దుష్యంతుడు ఇ తే.గీ. నిజమ? మీరన్న ఈ మాట నిజమటయ్య? (హిందోళ/ కాంభోజి మరల చెప్పుడి ! ఇంకొక్కమారు - ఒక్క “అిండగతి) మారు పల్కుడు ! నోరార మరల ననుడు నిజమ? మీరన్న ఈ మాట నిజమటయ్య? 30

శకుంతలాదుష్యంతం పురోహితుడు (ఖండ) నిజము- నిజము - నిజము - ముమ్మాటికిని నిజము. దుష్యంతుడు 2 సంతసమ్ము సంతసమ్ము సంతసమ్మహో ! (మధ్యమావతి- సంబరమ్ము సంబరమ్ము సంబరమ్మహో | త్రిథచాపు) సకల భూమి నేలుకంటె చక్రవర్తి నగుట కంటె అపకీర్తులు తాలగుకంటె (పేయసినే మరల గనుట ॥సంత॥ నమ్ముడయ్య ఇంతదనుక తెలియరాని దిగులుతోడ లోనలోన కుములుచుంటి నేడు వెతలు తీర గంటి ॥సంత॥ పురోహితుడు ; కామరహితమైన ప్రేమ ధర్మసహితమైన (పేమ నిష్కలంకమైన నీదు వంగడమ్ము నిలుపుగాక ! సంతః! (తెరలో లాలిపాట), బెరస ! లాలీ ! అంచిత పౌరుష! లాలీ ! స్పారాంభోజన్నయనా 1! పౌరవతనయా ! లాలీ ! (పొత్తిలిలో పసిబిడ్డతో శకుంతల, అనసూయా ప్రియంవదలు, శార్‌బ్లరవ శారద్వతులు ప్రవేశిస్తారు. అప్పుడు శకుంతలను సమీపిస్తూ) దుష్యంతుడు : కానరాని వెతలు మడిగె ప్రేమలతిక మొగ్గతొడిగె మాన్యులార ! మౌనులార ! మేలు మరువబోము లెండు ॥సంత॥ బేతవోలు రామ(బ్రహ్మాం 31

శకుంతలాదుష్యంతం

  • భరతవాక్యం -

ఉ॥॥ ఆర్జిత భిలనాయక వరాకృతియై అలనాడు పాండవే యార్డును నస్త్ర శస్త్ర మహిమాన్వితు జేయు శశాంక మౌళి, నా గార్జున సంస్కృతి ప్రధితమై తగు కేంద్రము దీని నిత్యమ త్యూర్జిత గీతికాదిక కళోదధిగా వెలయించు గావుతన్‌ !

తే.గీ.॥ (ప్రేమలతలకు కొసలలో విరిసినట్టి పసిడి మొగ్గలు చిన్నారి పాప లనగ వారు చిందించు చిరునవ్వు పరిమళాలు సకలదిశలకు నిరతమ్ము సాగు గాక !

యు శుభం జు 32

సాందరనందము

  • సంగీత నృత్యరూపకం -
  1. సంగీత దర్శకత్వం _ : శ్రీ పెమ్మరాజు సూర్యారావు
  2. నృత్య దర్శకత్వం : శ్రీ మహంకాళి సూర్యనారాయణ శర్మ
  3. గాత్రసహకారం వ శ్రీమతి రాధికా కృష్ణ & శ్రీ రాజారావు
  4. వాద్య సహకారం శ్రీ సాగి, శ్రీ విశ్వనాథం మొ।వారు
  5. రంగాలంకరణ వ త్రీ గుళ్ళపల్లి ఆదిశేషయ్య & కో
  6. రచన : దాః బేతవోలు రామబ్రహ్మం
  7. సంస్కృత మూలం వ త్రీ అశ్వఘోషుడు
  8. తెలుగుపద్యానువాదం : శ్రీ పింగళి, శ్రీ కాటూరి
  9. సమర్పణ వ నాగార్జున సంగీత నృత్య కళాశాల నాగార్జున సాంస్కృతిక కేంద్రం, గుంటూరు-2.
  10. నిర్వహణ : శ్రీ కెఎస్‌.ఆర్‌. ప్రసాదరావు, సంస్థాపక కార్యదర్శి సౌందరనందం శ్లో! అగజానన పద్మార్కం, గజానన మహర్షిశం అనేకదం, తం భక్తానామ్‌ ఏకదంత ముపాస్మహే ॥

ఈ ప్రకారంబుగా ఇష్టదేవతా (ప్రార్ధనంబును, రంగ సరస్వతీ పూజనంబును సభ్య పారిషద స్వాగతంబును, యధావిధి గావించి, నాగార్జున సంగీత నృత్యకళాశాల వారిచే ప్రదర్శింపబడుచున్న సౌందరనందంబను సంగీత నృత్యరూపకంబునకు కథాక్రమం బెట్టిదనిన -సుందరీనందుల నర్శకేళులకు సఖీజనులు కావించు సన్నాహ సంరభమదిగో -అల్లదిగో -

= ప్రథమాంకం - (సుందరి అంతఃపురంలో చెలికత్తెలు అన్నీ సిద్ధం చేస్తున్నపాట) (తిలాంగ్‌-ఆదితాళం) _ బాలా! జ్యోతీ ! పద్మల్లారా ! వైళమ రండో ప్రియ సఖులారా ! బేతవోలు రామ(్రవ్మాం 33

శకుంతలాదుష్యంతం

  • భరతవాక్యం - ఉ ॥1 ఆర్జిత భిలనాయక వరాకృతియై అలనాడు పాందవే యార్డును నస్త్ర శస్త్ర మహిమాన్వితు జేయు శశాంక మౌళి, నా గార్జున సంస్కృతి (్రధితమై తగు కేంద్రము దీని నిత్య మ త్యూర్దిత గీతికాదిక కళోదధిగా వెలయించు గావుతన్‌ ! తే.గీ. 'ప్రేమలతలకు కొసలలో విరిసినట్టి పసిడి మొగ్గలు చిన్నారి పాప లనగ వారు చిందించు చిరునవ్వు పరిమళాలు సకలదిశలకు నిరతమ్ము సాగు గాక ! _ శుభం - 32

సౌందరనందము

  • సంగీత నృత్యరూపకం -
  1. సంగీత దర్శకత్వం _ : శ్రీ పెమ్మరాజు సూర్యారావు ౨. నృత్య దర్శకత్వం : శ్రీ మహంకాళి సూర్యనారాయణ శర్మ
  2. గొత్రసహకారం శ్రీమతి రాధికా కృష్ణ & శ్రీ రాజురావు
  3. వాద్య సహకారం : శ్రీ సాగి, శ్రీ విశ్వనాథం మొ!వారు
  4. రంగాలంకరణ ఏ శ్రీ గుళ్ళపల్లి ఆదిశేషయ్య & కో
  5. రచన ; దాః బేతవోలు రామబ్రహ్మం
  6. సంస్కృత మూలం : శ్రీ అశ్వఘోషుడు
  7. తెలుగుపద్యానువాదం : శ్రీ పింగళి, శ్రీ కాటూరి
  8. సమర్పణ : _ నాగొర్జున సంగీత నృత్య కళాశాల నాగార్జున సాంస్కృతిక కేంద్రం, గుంటూరు-2.
  9. నిర్వహణ : శ్రీ కె.ఎస్‌.ఆర్‌. ప్రసాదరావు, సంస్థాపక కార్యదర్శి సౌందరనందం శ్లో అగజానన పద్మార్మం, గజానన మహర్షిశం అనేకదం, తం భక్తానామ్‌ ఏకదంత ముపాస్మహే ॥

ఈ ్రకారంబుగా ఇష్టదేవతా ప్రార్ధనంబును, రంగ సరస్వతీ పూజనంబును సభ్య పారిషద స్వాగతంబును, యధావిధి గావించి, నాగార్జున సంగీత నృత్యకళాశాల వారిచే ప్రదర్శింపబడుచున్న సౌందరనందంబను సంగీత నృత్యరూపకంబునకు కథాక్రమం బెట్టిదనిన -సుందరీనందుల నర్శకేళులకు సభఖీజనులు కావించు సన్నాహ సంరభమదిగో -అల్లదిగో-

  • ప్రథమాంకం - (సుందరి అంతఃపురంలో చెలికత్తెలు అన్నీ సిద్ధం చేస్తున్నపాట) (తిలాంగ్‌-ఆదితాళం) బాలా! జ్యోతీ | పద్మల్లారా | వైళమ రండో ప్రియ సఖులారా ! భఖేతవోలు రామట్రహ్శాం 33

సౌందరనందం నంద సుందరుల నర్శకేళులకు సర్వము సిద్ధం చేయండర్రా ॥ గోరువెచ్చని నీళ్లల్లోనా వట్టి వేళులా సారము కలిపి పొంగెడు సిగ్గులు మూటలు గట్టి బంగరు పాత్రలనందించండి ! ॥బాలా॥ పండు వెన్నెలకు కెంపుటంచులూ అంచ రెక్కలకు అరుణరేఖలూ మడుగు చీరలివె మడతల్లోనా రోజా అత్తరు పులమండమ్మా ॥బాలా॥ అకు వక్కకప్రపు బలుకూ కాచూ ఏలకి ఘనసారమ్మూ ఇంపుగ సొంపుగ ఈ పళ్ళెములో ఏర్చుడి పేర్చుడి ఏమనుకోక ॥బాలా॥ మబ్బు దొంతరల పరుపులపైనా పాల నురువులా పట్టు శాలువలు మడత లన్నవే రానీకుండా పరచండమ్మా ! పడతుల్లారా ! ॥బాలా॥ పట్టెమంచమట ! మల్లె పందిరట ! హంసతల్పమట ! హాసకల్పమట ! పంచబాణుడీ మంచము సాకిరి పగలూ రేయీ ఓహిరి సాహిరి ! 1బాలా॥ (ఒక వైపు నుంచి నందుడు, ఒకవైపు నుంచి సుందరి ప్రవేశిస్తారు) 34

సౌందరనందం (ఖమాస్‌ - ఖండచాపు) నంద ఇ సుందరీ రారమ్ము ! సుకుమారి రారమ్ము! సుందరి ; సుందరా రారమ్ము! - నందుడా రారమ్ము! అనురాగభరితమ్ము జా అద్వైత సుఖమిమ్ము || నంద ఏ లోకాన బుతువులు - ఆరంట పోనిమ్ము నిత్యము చైతన్య - చైత్రమ్మె మన సొమ్ము సుందరి ; లోకాన సూర్యుడూ - కలడంట పోనిమ్ము నిత్యము మన యింట - చంద్రుని నృత్యము ! నంద 2 తే.గీ. పడతిరో నీదు నెమ్మోము పైని నేను కొసరి కస్తూరి తిలకమ్ము గుస్తరింతు సుందరి ఏ ప్రియతమా ! నీ కపోలాన డ్రేమమీర బొట్టు నంటింతు ముద్దుగా దిష్టిచుక్క ! నంద ఏ ॥ సుందరీ ॥ సుందరి ఏ ॥ సుందరా ॥ నంద ; కన్నీరు పన్నీరు - కలవంట జగమందు ఆనంద బాష్ట్పాలె - మన కొండు లేవందు 1సుందరీ॥ సుందరి : ఎడబాటు లెరుగను విరిపోటు లెరుగను నీవన్న నేనన్న మాటలే ఎరుగను ॥సుందరా॥ నంద ; తే.గీ. సదరు ననురాగరసముతో పదనుచేసి నీదు పాదాన పారాణి నేనె యిడుదు - సుందరి. : నాదు తాంబూల రసముతో నీదు నెడద వ్రాసి చూపనా నాలోని వలపు తలపు 1॥1సుందరీ॥ ॥సుందరా॥। నంద ; నాలోని రక్తమ్ము అనురాగ సిక్తమ్ము నాలోని ప్రాణమ్ము నీవేను నను నమ్ము సుందరీ! బేతవోలు రామ(బ్రవ్మాం 85

సొందరనందం సుందరి 2 నాలోని అణువణువు నీదేను కోకొమ్ము నా గుండె సవ్వడిలో నీ పేరు వినుకొమ్ము 1సుందరీ॥ నంద వ తే.గీ. అదరుచున్నట్టి నీదు కెంబెదవి జంట ముద్దుముచ్చట్లు నేనేమొ ముచ్చటింతు సుందరి : కాంక్షలొలికించు నీదు వీక్షాయుగమ్ము కోటి కెంపుల తనువెల్ల (గ్రుమ్మరించు నంద ఏ ॥ సుందరీ ॥ సుందరి 2 ॥ సుందరా ॥ నంద 2 తే.గీ. నిముస మిచట కూర్చుండుమో నీరజాక్షి ! (దర్చారుకానడ) కెంపు లొలికించు నీ కపోలంపు సీమ వలపు పాలతో మకరికా పత్ర పంక్తి నేర్పుమీరంగ రచియింతు నెనరు దనర నిముస మిచట కూర్చుండుమో నీరజాక్షి ! తెరలో ఏ భిక్షాం దేహి ! భిక్షాం దేహి ! భిక్షాం దేహి ! నంద ః తే.గి. భిక్ష యడుగుచును న్నారు భిక్షు లెవరా ! కాంచి వత్తును త్రుటిలోన, కదలకీవు - (కొంచెం ముందుకి వెళ్ళి మేడమీద నుంచి క్రిందకి చూసినట్టుగా అభినయించి) తే.గీ. అయ్యయో ! అపచారమే ! అస్మదగ్ర జుండు - బుద్ధదేవుండు = పోచుండె నదిగా ! సుందరి వ (తనూ వెళ్ళి చూసి ఆశ్చర్యంగా) తే.గీ. ముదిత లందరు పనులందు మునిగిరేమొ |! భిక్ష ఎవరును పెట్టరు- వెడలుచుండె ! నంద ; అనుమతినిమ్మా - అలికులవేణీ ! (దర్చారుకానడ) పరుగున పోయీ - సరగున వచ్చెద 1 అనుమతి॥ 36

సొందరనందం బుద్ధ దేవుడిటు - భిక్షను గొనక పోవుట మనకెటు - శుభమవు దేవీ! /॥అనుమతి॥ అపచారము జరిగెను - ఆగ్రహింపకని పదముల బడి నే - వారినె వేదెద 1 అనుమతి।॥। సుందరి వ తే.గీ. సూర్యదేవుని నెడబాసి ఛాయ యొకట నెప్పుడైనను నుండెనో యేమొ కాని మిమ్ము నెడబాసి యొక్క క్షణమ్ము కూడ నుండి యెరుగను న్వామి ! ఎట్లుండగలనా ! నంద వ ఇక్క డున్నట్టి వత్తునో ఇక్షుతన్ని ! ఇంతలోననె బాధించునా ఇక్షుధన్వి? సుందరి : ఇక్షుధన్వియో ఇంకేదొ యెరుగ గాని పత్రభంగమ్ము తడియారు మాత్రలోన తమరు విచ్చేసి ఈవలె దర్శనమ్ము (వెనక్కి వెనక్కి చూసుకుంటూ, వెళ్ళలేక వెళ్ళలేక వెడతాడు. పరుగున వెనక్కి వచ్చి కౌగిలించుకుంటాడు. మళ్ళీ బయల్దేరతాడు. వెడతాడు చివ్వరికి).

  • ద్వితీయాంకం- (ముందు బుద్ధుడు = వెనుక నందుడు -) నంద ; స్వామి ! ఓ స్వామి! పలుకడేమి స్వామి ? (మాంటురాగం) మరలిపోదునా సుందరీమందిరముకు? అయ్యయో ! అపచారమే - అటుల గాదు - స్వామి ! ఓ స్వామి ! నిలువడేమి స్వామి? తరలిపోలేను ! వెనుకకున్‌ మరలలేను ! చిన్నికెరటాల హంసగా చెలగుచుంటి - స్వామి ! ఓ స్వామి ! నిలుమయ్య క్షణము స్వామి ! బేతవోలు రామబ్రహ్మం 37

సౌొందరనందం (కొంతదూరం వెళ్ళాక బుద్ధుడు ఒక రాయిమీద కూర్చుంటాడు -నందుడు వెళ్ళి పాదాల మీద పడతాడు) బుద్ధ వ తే.గీ. నంద సుకుమార ! రాజన్య ! సుందరాంగ ! (గౌరీమనోహరి) రమ్ము - కూర్చుండు మొక్క క్షణమ్ము - బిడ్డ ! (అని తనచేతిలోని భిక్షాపాత్ర నందుడిచేతిలో పెడతాడు. అది పుచ్చుకుని నందుడు- ) నందు ఏ మన్నింపుమో బుద్ధదేవ | నన్ను మన్నింపుమో బుద్ధదేవ | (గౌరీమనోహరి-ఆది)ి అపచార మయిపోయె అపరాధ మయిపోయె నీ పాదపద్మమ్మె మా పాలి ఇలువేల్పు మన్నింపు! బుద్ధ వ తే.గీ. చందమామకు కలదేని స్వార్థమిటుల (శుద్ధపంతువరాళి) పండువెన్నెల జగమంత నిండు నటవె? నీదు ప్రేమమ్ము ప్రజకెల్ల నీయకుండ (ప్రేయసికి మాత్రమిచ్చుట న్యాయమగునె? నంద : మన్నింపుమో బుద్ధదేవ ! నన్ను మన్నింపుమో బుద్ధదేవ ! లోకాన చీకట్లు వ్యాపించునే గాక - ప్రియురాలి వన్నెలే - నా పాలి వెన్నెలలు ॥మన్నింపు॥ బుద్ధుడు: శోకమయమైన లోకమ్ము జూడుమయ్య క్షతియోచిత కార్యమ్ము సలుపుమయ్య ! నంద ఏ నా లోకమే నాది - నా ప్రణయమే నాది (ఖండచాపు)) లోకాల శోకాలు నాకేల నోదేవ! 1మన్నింపు॥ బుద్ధ ఏ పెద్ద పులివోలె పైపైకి వెడలివచ్చు ముసలితనమును తలపోయుమో కుమార |! 38

సొందరనందం నంద య వార్ధక్యమనుమాట వయసు కుందడును గాక మా (ప్రమభావాలు వాడిపోని సుమాలు ॥మన్నింపు॥ బుద్ధ ; మృత్యుదేవత దయబూను టెరుగదయ్య చావు నిత్యము - పుట్టిన జంతుతతికి ! నంద ; చావు తప్పని మాట - సత్యమే యవుగాక ఆ మాట లిపుదేల ? ఆ ఊహలిపుడేల? ॥మన్నింపు॥ బుద్ధ ఏ తే.గి. కామ మనుదానినే నీవు ప్రమ యనుచు (కళ్యాణి) ఒక్క ప్రాణినే మ్రేమించి యుంటివేని మృత్యువశమున దుఃఖమ్ము మిగిలిపోవు అఖిలజీవుల (ప్రేమించు టరయుమయ్య ! నంద వ సుందరిని మించు అందగత్తెలు లేరు మా ప్రేమ నిత్యమ్ము మా ప్రేమ సత్యమ్ము ॥మన్నింపు! (ఇప్పుడు బుద్ధుడు లేచి, నందుణ్జి భుజం మీద తలమీద నిమురుతూ) బుద్ధ : తే.గీ. సుందరిని మించు నందాల సొగసుగత్తె (మోహన) లెందరెందరో కలరయ్య ! ఈ జగాన, రమ్ము చూపింతు నాతోడ రాకుమార ! నందనోద్యాన సీమకున్‌ నడువుమయ్య ! (ఇద్దరు నిష్రమిస్తారు. నందనవనం సీను. రంభా మేనకల నృత్యం) (కళ్యాణి - ఆదితాళం) రంభ : రంభను నేనే కానా ? నందన వన - మధు బుతు సంరంభను రంభను నేనే కానా ? 1॥రంభను॥ బేతవోలు రామబ్రహ్మం 39

సౌందరనందం మేనక ; మేనక నేనే కానా! మౌనిప మానస సమ్మోహక మేనక నేనే కానా ! 1మేనక॥ (బుద్దుడు - నందుడు ప్రవేశించి చెట్లచాటున నిలిచి చూస్తుంటారు) రంభ : ధనదుని పుత్రుడు నలకూబరుడే పదములు పట్టిన పద్మదళాక్షిని 1రంభను॥ మేనక ; విశ్వామిత్రుని విశ్రుత తపములు గజ్జెల మువ్వల కరణిని దాల్చితి మేనక! రంభ : జంకక గొంకక లంకేశ్వరునికి శాపమునిచ్చిన సరసిజాక్షిని రంభను! మేనక ; వజ్రాయుధమే భంగము పొందిన అపజయ మెరుగని ఇంద్రాశుగమును 1॥మేనక॥ (నృత్యం ముగించి కిలకిలలాడుతూ వాళ్ళు వెళ్ళిపోతుంటే = నందుడు వెంటబడతాడు) బుద్ధ ఏ ఆం ఆ. రాకుమారా 1! ఆగుమాగుము ! వారి వెంటబడకు - (చెయ్యి పట్టుకుని ఆపుతాడు) తే.గీ. సుందరిని మించు సొగసరుల్‌ - చూచినావె ! వీరలను జూడ నీ బుద్ధి వివశమయ్యె, (అఖేరి) కామమే కాని నీయది ప్రేమ కాదు, పేమ యనుదాని కవధులే లేవు తండ్రి ! (నందుడు సిగ్గుతో తలదించుకుంటాడు. బుజ్జగిస్తూ - బుద్ధుడు) తే.గీ. తల్లిదండ్రుల కోల్పోయి తల్లడిల్లు శోకమూర్తుల, తండ్రివై సాకుమయ్య ౭ (ముల్తాన్‌) అంధకారాన జీవించు నంధులకును కాంతిరేఖల నందింప కదలుమయ్య ! లి 40

సౌందరనందం ఎందరెందరో వికలాంగు లిలను గలరు వారి సేవించు కన్నను పాడి గలదె? ల నంద న బుద్ధం శరణం గచ్చామి ! సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి 1! (అంటూ పాదాభివందనం చేస్తాడు) బుద్ధ : లోకసేవలో నానంద మాకళించి (రేవతి) దీక్షతో జీవితమ్ములు తీర్చుకొనుము (అని ఆశీర్వదిస్తూ పైకి లేవనెత్తుతాడు) నంద ఏ మోహలత లెల్ల తెగిపోయె బుద్ధదేవ ! అంధకారమ్ము నశియించె అమల రూప! ఆమె అజ్ఞానమున్‌ గూడ నార్చివేసి - ధర్మపథ యాత్రలో తోడునిమ్ము తండ్రి ! లె (అంగీకార సూచకంగా బుద్ధుడు తల ఊపి “తథాస్తు అంటాడు) జా తృతీయాంకం జూ (ఉద్యానవనంలో విరహంలో ఒంటరిగా సుందరి ప్రవేశం) సుందరి ఏ రా దేలనే మనస ! రా డేలనే ? నా ప్రాణనాథుండు రాడేలనే? సరసాన జడలాగ ఉరిమి చూచిన దనుచు (మలయమారుతం అధరాన పల్లొత్త - అటు నెట్టె నన్ననుచు -ఖండచాపు) బిగి కౌగిటికి బిల్వ - బెట్టు చేసినదనుచు తలపోసి తలపోసి - అలుక బూనెనొ యేమొ సిగలోన పూదండ వసివాడిపోయె చషకాన గంధమ్ము - తడి యారిపోయె కనులందు కన్నీటి - జడులాగిపోయె మకరికా పత్రమ్ము - మటుమాయ మైపోయె 11రాడేల॥1

సౌందరనందం సరసీజ పత్రాభ - నయనాలనే చూచి ముత్యాల నవ్వాల్కు- మొగ మందమే చూచి నడలందు కనిపించు - మగ రఠీవులే చూచి ఏ పడతి ఏ మడతి ఇక వీడననినాదొ 1రాదేల॥ నను వీడి క్షణమైన - మనజాల ననినాడు నాలోని అణువణువు - నీవేనె యనినాడు నాతోడు నానీడ - నా ప్రాణ మనినాడు పరికింప నువు నేను ఒకటేనె యనినాడు 11రాడేల! ఈ వయసు లీ సొగసు లింకిపోవునవంట ఈ వలపు లీ తలపు - లారిపోవున వంట ఎరిగెరిగి నీ కెందు - కీ వింత వలవంత ఒకరోజు విరహాన - ఉపదేశ మిడెనమొ . ॥1రాడేల॥ వైరాగ్యభావాల - కీ వంశ మొక పాదు ఇల యశోధరకు నేను - ఏరాలినే కాద ! కొనిపోయి ఆ సామి - తన దీక్షనిచ్చెనో ఆ మాట వచియింప మోమోటపడెనో ॥రాడేల॥ (నందుడు బౌద్ధ సన్యాసివేషంతో సుందరిని సమీపిస్తాడు) సుందరి. : తే.గీ. పట్టువస్త్రాలు సిగపూలు పారవైచి కావిగుడ్డలు కట్టిరా? కాంచలేను (నందుడు పలకడు) నగరులోనున్న వనితల వగలు రేపు నందసుందరు డిట్లాయె నక్కటకట ! (పలకడు) (మాయామాళవగాళు ఏమి పాపమ్ము నొనరించె నీ అభాగ్య? సన్యసించితి రేలొకో స్వామి ! తమరు? (పలకడు) 42

సౌందరనందం చేసికొన్నట్టి వలపుల బాసలెల్ల నీటి మూటలే ఆయెనా నేటితోడ? (భుజాలు పట్టి కుదుపుతుంది. పలకడు) గుండెనొక బండగా మార్చుకొనిరి - నిజమె ఒడలును శిలామూర్తిగా బడసినారా? పలుక వేమిది ప్రాణమా ! పలుకవేమి? ఒక్కపరి “సుందరి అనుమోయి చాలు (పలుకడు) కైశ్య బంధమ్ము తొలగించి కావిగట్టి బిచ్చపున్‌ పాత్ర చేపట్టి వచ్చుటెల్ల అగ్రజాజ్ఞగా భావింతునయ్య! కాని ఈ మహా మౌనమే నన్‌ దహించుచుండె. (పలుకడు) పలకవే స్వామి ! ఒకమారు పలుకుమయ్య ! నాల్క కత్రుంచెనా మీయన్న? పల్మవేమి? “నీచురాల ! అవలబొమ్ము నీవు” అనుచునైన పలుకుమా ! ఒకతూరి పలుకుమయ్య ! (పలుకడు) (అతని నుంచి కొంచెం జరిగి) కొమరు బ్రాయంపు టందాల గున్నమావి నల్లుకొన్నది మాలతీ వల్లి యొకటి కన్ను కుట్టినదోయి! మీ యన్నకిపుడు చేసిపోయెను చిల్లంగి చేత యొకటి (చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చేతితో ముఖం తుడుచుకొని) సుందరి : సరియె కానిండు - నేనునున్‌ సన్యసింతు రక్తి నున్నట్లె మీ విరక్తియందు బేతవోలు రామబ్రహ్మం గ

సౌందరనందం గూడ సహధర్మచారిజై తోడునిలతు బౌద్ధదీక్షను తమతోడ పంచుకొందు బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి (అంటూ తెరలోకి వెళ్ళిపోతుంది. నందుడు రంగం మీద ఒంటిరిగా మిగులుతాడు. ధ్యాన ముద్రతో కూర్చుంటాడు. తెరలోనుంచి ఈ పద్యం -) బుద్ధాయ, మహిత ్రబోధాయ, వైరాగ్యభవనాయ, దేవ! తుభ్యం జయోస్తు (హిందోళ) కలికల్మష హరాయ, కారుణ్యలతికాలవాలాయ, దేవ ! తుభ్యం జయోస్తు, నిర్జితహింసాయ, నిర్మిత ధర్మప్రపంచాయ, దేవ ! తుభ్యం జయోస్తు, త్యాగ స్వరూపాయ, దశదిశాగత శిష్యభజనాయ, దేవ ! తుభ్యం జయోస్తు, ఆర్త సంరక్షక్రాయ తుభ్యం నమోస్తు పరమసత్యవ్రతాయ తుభ్యం నమోస్తు దీనజన బంధుమిత్రాయ తే నమోస్తు విశ్వకల్యాణకర గురవే నమోస్తు (ఇది అయ్యేలోగా సుందరి బౌద్ధభిక్షుకిగా వేషం మార్చుకుని వచ్చేస్తుంది, పాదాఖివందనం చేస్తుంది. ఆమెని సన్యాసిని వేషంలో చూసి నందుడు -) (మోహన-ఖండచాపు) నంద ౩ సోదరీ 1! రారమ్ము! సోదరీ ! రారమ్ము! బుద్దునీ పాదాలె శరణమ్ము ! శరణమ్ము ! సుందరి ; సోదరా! రారమ్ము ! సోదరా ! రారమ్ము సంఘమ్ము పాదాలె శరణమ్ము ! శరణమ్ము ! నంద ; సోదరీ ! రారమ్ము! సోదరీ ! రారమ్ము! ధర్మమ్ము పాదాలె శరణమ్ము ! శరణమ్ము ! టీడీ

సౌందరనందం (బుద్దుడు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తాడు) పరిత్రాణాయ సాధూనామ్‌ (రేవతి) వినాశాయ చ దుష్కుతామ్‌ | ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ తే.గీ॥ ధర్మమార్దాన నడువుడీ ధన్యులార ! సంఘసేవను చేయుడీ సౌమ్యులార ! శాంతిసౌఖ్యాల నందుడీ శాశ్వతముగ మనుజ జన్మంబు చరితార్థ మగును గాక ! సుందరీ _ : బుద్ధం శరణం గచ్చామః ! సంఘం శరణం గచ్చామః ! నందులు ధర్మం శరణం గచ్చామః ! = శుభం - బేతవోలు రామ(బిహ్హాం &ీ5్‌

ఉమాశంకర స్తుతిమాల

  1. సంగీత దర్శకత్వం ఏ థ్రీ ఉపేంద్రకుమార్‌
  2. గాయనీ, గాయకులు : శ్రీమతి పి. సుశీల, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 8 రచన ;. శ్రీ బేతవోలు రామబ్రహ్మం 4 సమర్పణ : శ్రీ కె.ఎస్‌.ఆర్‌. ప్రసాదరావు, వ్యవస్థాపక కార్యదర్శి వ నాగార్జున సంగీత నృత్య కళాశాల నాగార్జున సాంస్కృతిక కేంద్రం, గుంటూరు-2, 1 స్నాత్వా జలే శీతలితాంతరంగాః స్పృష్ట్వా చ పుష్పాణి సువాసితాంగాః వీజన్సి ప్రాభాత మరుత్తరంగాః ఉత్తిష్ట | శంభో । తవ సుప్రభాతమ్‌ ॥ క్‌ నందీశ్వరాంభా నినదం మనోజ్ఞం వర్నాబ్దగర్జా మివ మన్యమానః | కేకీ కుమారస్య-కరోతి నృత్యమ్‌ ఉత్తిష్ట ! శంభో! తవ సుప్రభాతమ్‌ ॥ 2 లోకైక బంధుం ప్రసవిష్యతీతి ప్రాచీం సమర్చ్యాంజలిబద్ధహస్తాః ॥| స్తోతుం భవన్తం మునయః ప్రవృత్తాః ఉత్తిష్ట! శంభో ! తవ సుప్రభాతమ్‌ ॥ తి 46

ఉమాశంకర స్తుతిమాల బ్రహ్మాది దేవోదిత వేదమంత్రైః దిక్పాల భూషా వ తరాజ్సినాదైః | కోలాహలో ద్వారి ఎ సంఫప్రభూతః ఉత్తిష్ట ! శంభో ! అఆఎు సుప్రభాతమ్‌ ॥ త్తే ఆభాతి శైలోపరిలంబమానా మేఘాళి రేషా గజచర్శ్మనీలా | నీతేవ శాటీ హరిణా త్వదర్ధమ్‌ ఉత్తిష్ట ! శంభో ! తవ సుప్రభాతమ్‌ | ల్‌ ప్రాచ్యా సమంతాత్ర్రవికీర్యమాణెః లిష్తో౭. ద్య లోకః సితకాంతిపుంజైః ధత్తే త్వదీయాం రుచిరాంగ శోభామ్‌ ఉత్తిష్ట! శంభో ! తవ సుప్రభాతమ్‌ ॥ 6 శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం - కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగీంద్ర హృదయాల (మోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం - బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెలతాల్పు డెందాన వలపు వీణల మీటు మా తల్లి గాజులకు నీరాజనం - రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం - ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం

ఉమాశంకర స్తుతిమాల చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగరకు నీరాజనం - రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు ఇనబింబ మనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లలువోలె గాలి కల్లలనాడు మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేకమోహిని, సర్వేశు గేహిని మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం 3 కైలాసగిరిపతిం భజే అహమ్‌ కైలాసగిరిపతిం భజే ॥కైలాస॥ బ్రహ్మాది విబుధార్చితాంఘ్ర ద్వయం ఘన నిగమాంత మనుపూత శుభదాహ్వయం అర్ధచంద్ర ధారిణం బహుతర పాపౌఘ పరిదాహకారిణమ్‌ ॥కైలాస% ఇంద్రాది సురనాయకాగ్రేసరం నిజపదపద్మ నుతిశీలి భయ సంహరమ్‌ సర్వమంగళాంచితం భవ భయ దీర్షాభ్ధితరణే2_ తివాంఛితమ్‌ కైలాస! గరి

ఉమాశంకర స్తుతిమాల యోగీంద్రహృదయాంబుజేందీ - వరమ్‌ ఉరు నిటలాంబకాధూత కుటిల స్మరమ్‌ హాస భూతి శోభితం మృగవర చర్మైక కటివస్త్ర భూషితమ్‌ కైలాస! ణీ అన్నపూూర్జాదేవి ! అర్చింతునమ్మా ! నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా ! ॥1అన్న। విశ్వైకనాథుడే విచ్చేయునంట నీయింటి ముంగిట నిలుచుండునంట ॥ అన్న నా తనువునో తల్లి ! నీ సేవ కొజకు అర్పింతునోయమ్మ ! పై జన్మవరకు ॥ అన్న నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నీ పాదముద్రతో నా ఒడలి ఉదకాంశ నీ వీడు జేరి నీపాద పద్మాలు కడగాలి తల్లీ || అన్న ఖేతనోలు రామ, లు రామ్రివ్ణైం శం

ఉమాశంకర స్తుతిమాల చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగరకు నీరాజనం - రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు ఇనబింబ మనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లలువోలె గాలి కల్లలనాడు మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేకమోహిని, సర్వేశు గేహిని మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం 3 కైలాసగిరిపతిం భజే అహమ్‌ కైలాసగిరిపతిం భజే ॥కైలాస॥ (బ్రవ్మాది విబుధార్చితాం[ఘి ద్వయం ఘన నిగమాంత మనుపూత శుభదాహ్వయం అర్ధచంద్ర ధారిణం బహుతర పాపౌఘ పరిదాహకారిణమ్‌ 1 కైలాస%॥। ఇంద్రాది సురనాయకాగ్రేసరం నిజపదపద్మ నుతిశీలి భయ సంహరమ్‌ సర్వమంగళాంచితం భవ భయ దీర్జాల్టితరణే2_ తివాంఛితమ్‌ 1 జైలాస॥ ప!

ఉమాశంకర స్తుతిమాల యోగీంద్రహృదయాంబుజేందీ - వరమ్‌ ఉరు నిటలాంబకాధూత కుటిల స్మరమ్‌ వాస భూతి శోభితం మృగవర చర్మైక కటివస్త్ర భూషితమ్‌ కైలాస! శీ అన్నపూర్ణాదేవి ! అర్చింతునమ్మా ! నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా ! అన్న విశ్వైకనాథుడే విచ్చేయునంట నీయింటి ముంగిట నిలుచుండునంట ॥ ॥అన్న॥ నా తనువునో తల్లి ! నీ సేవ కొజకు అర్చింతునోయమ్మ ! పై జన్మవరకు ॥ అన్న నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లీ ! ॥ అన్న నా ఒడలి ఉదకాంశ నీ వీడు జేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లీ ! అన్న బేతవోః లు రామ(బమ్మాం 49

ఉమాశంకర స్తుతిమాల నా తనువు లేజోర౨ి.౦శ నీ గుడికి జేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లీ ! 1 అన్న నా తనువు మరుదంశ నీ గుడికి జేరి వీచోపు కొాసలలో విసరాలి తల్లీ ! ॥ అన్న నా తనువు గగనాంశ నీ మనికి జేరి నీ నామ గానాలు మోయాలి తల్లీ 1 1 అన్న। ర్‌ ఓంకార రూపిణీ ! క్లీంకార వాసినీ 1 జగదేక మోహినీ 1! ప్రకృతి స్వరూపిణీ ! అన్న శర్వార్ధ దేహినీ |! సకలార్థ వాహినీ ! భక్తాఘ దాహినీ ! దహరాబ్ది గేహినీ ! అన్న మృగరాజ వాహనా ! నటరాజు నంగనా |! అర్ధేందు భూషణా ! అఖిలార్తి శోషణా ! అన్న ర్‌0

ఉమాశంకర స్తుతిమాల కాశికా ! కామాక్షీ ! మాధురి మీనాక్షీ ! నను బ్రోవవె తల్లీ ! అనురాగ శ్రీ వల్లి ! 1 అన్న 6 మేలుకోవయ్య ! శంకరా ! శశిధరా ! మేలుకోవయ్య ! మమ్మేలుకో ॥మేలు॥ బగటైన పన్నీట - పసపాడి గిరిపుత్రి తిలకము కాటుకా - చెలువారగా దిద్ది చెంగావి నును చీర - జీరాడుచుండగా మేలుకొల్పులతోడ - గుమ్మాన నడయాడ బంగారు టందెలే - (శ్రుతి కల్పి మొరసెరా ॥మేలు॥ గల గలా ప్రవహించు - సెలయేటి గానమూ అరవిచ్చుకొనుచున్న - అంభోజగంధమూ శుకపిక కలహంస - సుకుమార గీతమూ సంగీత సాహిత్య - సమ్మేళశనముగాగ ప్రాభాతవాయువు - పరతెంచె హాయిగా ॥మేలు॥ పవలెల్ల నిను మోసి బడలేను కాబోలు గాటంపు నిద్రలో - కనుగూర్క్మి ఆ నంది అదరాటుగా లేచి - అర్రెత్తి మీ జూచి మెడలోని మువ్వలే - సడిసేయగా నిల్చి ఒడలెల్ల సారించి - ఉరిమింది చూడరా ॥మేలు॥ బేతవోలు రొమ(బ్రవ్మాం క్‌1

ఉమాశంకర స్తుతిమాల నందీశు నా రంకె - నవమేఘ గర్జగా మురుహన్న శిఖిరాజు - పురివిప్పి యాడగా ఆరుమోముల వేల్పు అడిగడిగో విచ్చేసి గౌరమ్మ వెనకాల - దోబూచులాడుచూ నీ పిలుపుకోసమే నిలుచుండె గడపలో మేలు! గ్‌ ఆలింపరా ।1సాంబ। ఆలింపరా। నా మనవి ఆలించి నను నీవె పాలింపరా | 1॥ఆలింప!। కనులార నీ రూపు కనుగొంద మంటేను కలికి సౌరులనుండి కదలిరా వీ కనులు ! మనసార నీ పేరు స్మరియింతమంటేను పంచబాణుడు వాడూ పడనీయకుండెరా 1ఆలింప॥ నీ దివ్యతేజము ధ్యానింతమంటేను కోతివంటి మనసు కుదు రెరుగదాయెరా కైలాస శిఖరాన కొలువున్ననా సామి! ఎంత పిల్చిన గానీ వినిపింపదా యేమి ! 1 ఆలింప॥ ర్‌2

ఉమాశంకర స్తుతిమాల శంభో ! శంకర ! సాంబ ! సదాశివ! సంధ్యా నృత్యము సల్పుము దేవా ! 11 శంభో॥

ప్రమధులు విబుధులు పరివేష్టింపగ ప్రళయమొ విలయమొ (భ్రమ సృష్టింపగ

వడి వడి విడి వడి

జడలొక వింతగ

కెంపుల కాంతుల

నింపుగ నింపగ 1శంభో॥ గిర గిర గిర గిర తిరుగుట తెలియగ రాకా సగమున గిరిసుత నగవున నిలబడి కనుగొనగా

పొంగున చిందిన

గంగా జలములు

పువ్వుల రువ్వుల

పోడిమి జారగ శంభో! జల జల జల జల రాలెడు భస్మము వెన్నెల వానను కన్నుల నిల్చగ

బేతవోలు రామబ్రవ్డాం 53

ఉమాశంకర స్తుతిమాల మెడలో పునుకలు బడి బడి తాకగ బుజముల పాములు బసుకొట్టాడగ 1శంభో॥ శంఖము తూర్యము నాదస్వరమును తానే క్రమమున క్రమముగ షణ్బ్ముఖు డూనిక నూదగ మద్దెల మర్దళ దర్చురములను శ్రుతిలయ లొప్పగ గణపతి వేయగ ॥శంభో॥ గంతుల ఉరవడి ప్రిదిలిన మువ్వలు తారల వడువున ధరణికి నురలగ చెంగున లేచీ రంగుగ దూకగ రజతాచలమే అల్లలనాడగ 1శంభో॥ ధఢధమధమ ధమ ధమ ధమరుక నాదము మెండై ముల్లోకములకు సివ మెత్తింపగ క్రొత్తగా వ!

ఉమాశంకర స్తుతిమాల

హరి హరి శిరముల

వెలిగెడు మణులవి

నీరాజనముల

నిలువున నీయగ ॥శంభో॥

9 హే సంధ్యా తాండవ విరాజ ! నటరాజ ! బ్రహ్మర్షి రాజర్ని దిక్పాల గంధర్వ యక్షాదిఖిర్వంద్యమానాంఘినీరేజ ! వాణీ సుధాంభోధి కన్యాదిభిర్దీయమానాచ్చ నీరాజ ! సంధ్యాభ్ర సంకాశ జూటీ పరిష్కార సంభావ్యమానార్ధ నిడ్రాజ |! గంగా సముత్తుంగ రంగత్తరంగై స్సదా పూత భవ్యోత్తమాంగ ! క్షపాచారి సంఘాత బాహామదాంచత్తమో£౭_ భంగ ! యోగీంద్ర దివ్యాంతరంగాబ్దినీ భృంగ ! భోగీంద్ర భూషావిరాజత్సమస్తాంగ ! హే నాథ । గౌరీమనోనాథ । లోకైకనాథ | ప్రభావై రనంతైస్సనాథ ! త్వదీయం వినా నాస్తి మే రక్షణం దేవ ! పాహీతి యాచామి ! దేహీతి యాచామి ! త్రాహీతి యాచామి ! తాపం హరస్వేతి యాచామి ! పాపం క్షమస్వేతి యాచామి ! తుభ్యం నమో దేవ ! తుభ్యం నమో దేవ ! తుభ్యం నమో నమః ! ఖేతవోలు రామ(బ్రవ్మాం క్‌5్‌

గానం 'గానం' సినిమావైటిల్‌ సాంగ్‌ బాణీ : శ్రీ ఉపేంద్రకుమార్‌, వాణి : శ్రీ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం రచన : బేతవోలు రామబ్రహ్మం కానరాని ఇలవేల్పుల తొలి దీవెనయే - గానం సృష్టినుంచి మనుజుడు నేర్చిన తొలి చదువే - గానం అమరగానం,' మధురగానం, ప్రణయగానం 1కానరాని॥। గున్నమావి చిగురులు చూస్తే కోకిల కుహుకుహు - గానం నల్లని మబ్బులు తాళం వేస్తే శిఖి కులుకే - గానం అమరగానం, మధురగానం, ప్రణయగానం కానరాని! తేటిరేడు మనసును తడితే పువ్వుల తహతహ - గానం గుండెలు కరిగీ వాకలు కడితే కవి పలుకే - గానం అమరగానం, మధురగానం, ప్రణయగానం కానరాని! రాం 56 ఈ (4 6౫. సకరకే ర న ని చమన ౯

. ॥ “పాలా దారాల వనాలు సనా లాలూ స్ట | శ | - స! ! శ క గ . | అ స న లోన. ॥ మ టాయ్‌ వయా | సాంథతతరనఅటల (2 .. ఓ ఆతా ఆ గ్త్‌ న. థీ లోకాల "వా | ఇ | | లి డ్‌ / ఉట రానంత న్యుటతకంలాలాాలలాాాాాాాాాా . న నాలా సా ప లత త టలు దలకు ఆల టిలలా ర నళల 4 బ్య ళా గన్య్టుష్టప్ట ర ఫే జ్ర లా క త సీ కళ న్‌ సై. రు యగ |. లట షో ళా న . టో ॥ స సట నో ర నా. ॥ న ॥ -్‌ పాపాల బాలల క | ై నాటా . న. న న ర యు నరముల పో చ ర క... య! వ టి మ. , శక. జా సాం! న్‌. న న న సహ | వని సయ న క నళ షే సక న్‌. జ సం 1 గా. క. _ ఇ | ఇష స క, . ట్ర్‌ 4. 1 ॥ శ "కమ. ళు... ॥ స్‌ [కి ల్‌ ల! , ॥ క! కమిట ॥ న ఒ అం | గ ః. న! /. ( ః" 1 య... | గ్‌ | టం షో స. " - / య టే లీ | య మం ము మో య్‌ ల 1. 1 | / . సం టు. స క ష్‌ యన ? | 1! టిం టట! | గ [[౪ స స. న | (1 ః టై! సట: క /. ః! / శీ ॥ “ లి న్‌. . ర గ్‌ నే , సా | ఖ్‌ ల | టై (0 ! / యి | టీ. . చవ ల్‌ , ల స. , ॥ స య యం శః (. | శే [| స బేతవోలురామబ్రహ్మ౦ం | గ్‌ భా నం సి 1. | (1 ల్‌ నల గ. | / చీ న. | మ. ను డి వన సం బేటి ఉం స మేలే! న గ్‌. టంట స ల్‌ 1, సట సట రాత న ల్‌ 2ంగోలా! ! పన 1 (1. 1 న స!