Telugu Shabdha Brahma Sri Sri - anilvaranasi/indianlanguages GitHub Wiki
శబ్తిబుహశశ్తు. రోళంకి అప్పలల్పారి | య్ అాటిక్తలాగ “కరా మం. ఫు ఈ. ఊఈతశతరాిూ ఇ “ హు కళ వనన మున ప |
అల శబ్దబ్రహ్మ శ్రీశ్రీ రోణంకి అప్పలస్వామి కూర్చు సింగంపల్లి అశోక్‌కుమార్ శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ
6% ౦40కు! ఉననడ కళ4గ1 5౧18౧ 540౧174గ10/1| ౧౮౭౬౦47101 110.23 [191 5610౧ : ౦0౪౭౧౦9 2010 ప ౧ సర్ య న ఐ.౧౧. & [ఓ2/001: / ఖ్ 58/15గ 540%/401641 / ౪1|2/2౪/262.520 004 (్టా ౧౧౧166 ఇ 5% 81 ౧గ౧౧(6|5..12/2464-520 002 00౪౪ 0౭81౧ : 1. 540/20౧04024౧), ౪112842064 [౯11 00౪9; 5/1 ఏ॥ 0!4౪4/౧8 : 82064, 0౧౪౧౧౬| 840100౪6! [౦౧౭౧౫ 0/24/06 : శీగ౧గ౭క06!2 ౯/66, ౪124౧484/౧4౧) ర్ధ వయ. న యా వశ ఉట లీ. ల ల్ ర్ట టం ( నిగ|౦౬ ౧౩. 2 ఖ్ ం [౧0/0౦౧199 : 5౧15౧! 941117440110111 305, ౧౩4 70౪/6, ౪969/21120 51, 420400 2820 02/44ఉరడ- 520 004. [| 0866-661 7375, ౧౭ 0866-66973/75:: 091: 9246277375 క౬౯-|4&| : 35గ/3గ/_3940౧/20101] అ౪/2౧౦౦.00౧ ఇ ఈ పుస్తకానికి హార్దిక, ఆర్థిక ప్రోత్సాహం విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీరోణంకి రమాపతిరావు,టెక్కలి
శబ తర జ్జ అగాలు
01 నవ్యాంధ్ర సాహిత్యంలో శ్రీశ్రీ అవతరణ 1952 05 02. వాగనుశాసనుడు శ్రీశ్రీ 1970 $2 083. శ్రీశ్రీ అనువాద సరళి 1970 క! 04 నేటి సాహిత్యంలో శ్రీశ్రీ ప్రముఖస్థానం 1970 18
-
భావపరంపరను జాతి చైతన్యంలో జీర్ణింపజేసిన శబ్దబ్రహ్మ 1970 2గ 06 నవ్యకవిత్వం సాగిస్తున్న గవేషణ 1971 20
-
్రీతీ దీర్చాయుష్మాన్ భవ 1980 లై 08 తెలుగు కవిత్వంలో సింబలిస్టు ధోరణి 1981 22
-
రోణంకి ధనుష్టంకారం 1982 23
-
శ్రీశ్రీ రోణంకి వివాదం 1983 2ైత్ష
-
విమర్శలకు జవాబు 1988 26
-
శ్రీశ్రీపై ముఖాముఖి (దా ॥ కడియాల ఇంటర్వ్యూ) 1984 28
-
ఉదయం ఇంటర్వ్యూ నుండి 1985 29
-
ఆంధ్రభూమి ఇంటర్వ్యూ నుండి 1986 29 ముందూ... వెనుకా...
0౦ బహుభాషల సిరికంకి సింగంపల్లి అశోక్‌కుమార్ 80 ౦. 'ఆంగ్ల సాహితీశేముషి సింగంపల్లి అశోక్‌కుమార్ తే ౦ శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణలు తై
జట్ జ జె జ్లాననిధీ, బహుభాషల పెన్నిథీ.. కూ
మహాకవి శ్రీశ్రీకి గురుతుల్యులు. రోణంకి అప్పలస్వామి తన తెలుగు వ్యాసాలలో సగం శ్రీశ్రీ గురించి రాసినవే కావడం విశేషం ఆ వ్వాసాలను ఇలా పుస్తక రూపంలో నేటి తరం పారకుల ముందు ఉంచుతున్నాం. ఆ జ్ఞాననిధీ, బహుభాషల పెన్నిధీ అయిన రోణంకి గురించి సాహితీ ప్రముఖుల అభిప్రాయాలు పారకులకు అందిస్తున్నాం
“ఆయన ఒక మహా పుస్తకప్రియుడు. బహుభాషా కోవిదుడు. విద్య వ్యసనముగా జ్ఞానమే ఆనందముగా జీవించిన నిత్య రెబెల్ ఆచార్య రోణంకి అప్పలస్వామి ఆయన తన జ్ఞానలక్ష్మిని ఎప్పుడూ అమ్ముకొనలేదు. గోప్యమైన కవి. ఒంటరిగా జీవించిన పండితుడు పుస్తకం హస్త భూషణమే కాదు మస్తక భూషణం కూడానని నిరూపించిన శారదాతనయుడు. సాహిత్యం కొత్త మలుపు తిరిగేవేళ ఆ వచ్చే మార్పులకు తాత్వికమైన ప్రాతిపదికను జతగూర్చి అంతకు పూర్వంనుంచి తిష్టవేసుకు కూర్చున్న సాహిత్యపు విలువలతో వచ్చే సంఘర్షణను ఎదుర్కొనడానికి ఒక యోధుడు అవసరమవుతాదు ఆ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించిన జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమూర్తి ఆచార్య రోణంకి అప్పలస్వామి”
(= వురాణం సుబ్రహ్మణ్యశర్క, రెబెల్ రోణంకి, సంపాదకీయం నుంచి ఆంధ్రజ్యోతి వారపత్రిక (17-04-2987)
“* ఎందుచేతననగా జ్ఞానముచేత గొప్పవాదు.అతను బి ఏ చదువుతున్న కాలంలోమాకు పారంచెప్పే మాష్టర్లకి అతనితో సమానమైన ఇంగ్రీషుభాషా జ్ఞానములేదు. కొంతమంది లెక్చరర్స్ మాట్లాడుతూవుంటే గబుక్కున లేచి “తప్పది” యిలా అనాలి, ఇంగ్లీషు వాక్యం యిలా ఉండాలి, తప్పు చేప్పేరు అనేవాడు ఇది కాకపోతే కర్మం జాలక రొమేంటిక్ పొయెట్రి చెపుతూ ఉంటే ఆ మాష్టార్లనడ్డగించి అదికాదు, ఇది అని చెప్పి యిలా ఏదో వాళ్లని కొట్టుకు తినేవాడు”
(=చాసో మద్రాసు పొట్టి శ్రీరాములు హాలులో ఇచ్చిన ఉపన్యాసం నుంచి, ముద్రణ 16-1-1994 'ఆంధ్రజ్యోతి దినపత్రిక)
“నెత్తిమీద దొరటోపీ నోట్లో సిగరెట్, టక్ చేసిన పొడవుచేతుల షర్టుతో విలక్షణంగా కనిపించే ఆ వ్యక్తి బహుభాషాకోవిదుడు. ఆధునిక తెలుగు సాహిత్యం, ముఖ్యంగా శ్రీశ్రీ యుగం పరిపుష్టం కావడానికి తన ప్రజ్ఞాపాటవాల్ని వినియోగించిన సాహిత్యశీలి రోణంకి అప్పలస్వామి. స్వయంగా కవి మాత్రమే కాదు, ఆధునిక ఆంధ్రసాహిత్య చరిత్రలో విస్మరింపవీలులేని కవి, పండితుడు ఇంగ్లీషు, ఫెంచి, జర్మన్, లాటిన్, స్పానిష్, ఇటాలియన్, (గ్రీకు భాషలు శ్రీరోణంకికి బాగా వచ్చు తెలుగు మాట చెప్పక్కర్లేదు.ఆ భాషలను వాటిలోని సాహిత్యసౌందర్యాన్ని అధ్యయనం చేసి తెలుగు వారికి పరిచయం చేశారు శ్రీ రోణంకి”
(= కె.వి యస్.వర్మ, “ఆంగ్లకవిగా తెలుగు అప్పలస్వామి” “ఈనాడు దినపత్రిక 08-09-1986 ) అంకితం శ్రీ రోణంకి అప్పలస్వామిగారికి
“ దీపాన్ని వెలిగించేందుకు దీపం /సాన పట్టిన మీదటే వజ్రం 1! / బంగారు పళ్లానికి గోడ చేర్చు /మీ చేతి చలువ వీడి కూర్చు! ” (- అరుద్ర, శన తొలి కావ్యం “త్వమేవాహం'(జాలై,3949) అంకిత వాక్యాలు )
ఇది “శ్రీశ్రీ సాహిత్యనిధి' 28వ ప్రచురణ. శ్రీశ్రీ సాహిత్య ప్రచురణ, ప్రచార, ప్రణాళికలో చేరి శ్రీశ్రీ గురించివీ, శ్రీశ్రీ విరించివీ 'నూరు పుస్తకాల హోరులో 'నేనుసైతం' అంటూ గొంతు కలుపుతూ “పదండి ముందుకు' అంటున్న శ్రీశ్రీ సాహిత్య ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
కన్వీనర్, శ్రీశ్రీ సాహిత్యనిధి శ శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
ముత్యాలసరాలపోకడను, దేశికవితారీతులను, యుగలక్షణాలను, ఆకళించుకొన్న కవి నవ్యాంధ్ర సాహిత్యంలో శిఖీ అవతరణ
అది ఏ సంవత్సరమో సరిగ్గా జ్ఞాపకంలేదు కాని, బహుశా 1930లలో అనుకుం టాను, మా ఇంట్లో దొర్లుతూ, ఒక పుస్తకము నా కంట పడింది పుస్తకము రెండోక్లాసు కుర్రవాళ్లది; దానిలో నాకు అవసరమైన విషయం ఏమీ కనుపించలేదు, కాని కుర్రవాళ్ళు పుస్తకానికి అట్టగా వేసుకొన్న అచ్చుకాగితం నన్నాకర్షించింది. దానిని విప్పితెరచి చూసే సరికి, అందులోని విషయం నన్నాకర్షించడమే కాదు, ఆశ్చర్యపరచింది. ఇంత సుందరమైన కవిత్వం తెలుగుభాషలో వెలువదుతుందా అనే విభ్రాంతి జనించింది. అదిఒక గీతం, పేరు “'మవాప్రస్థానం), కవి శ్రీశ్రీ గీతమంతటినీ నాలోనేను చదువుకున్నాను మళ్ళీ మళ్ళీ మననం చేసుకొని ఈ కృతికర్త విరచితములైన ఇతర కావ్యాలేవైనా వున్నవా అని ప్రశ్నించుకున్నాను
మరి రెండు మూడురోజులకు, సాయంకాలము వాహ్యాళికి పోగా, పల్లెటూరి బడి పిల్లలు కొంతమంది, బడినుండి ఇళ్ళకు పోతూ, కోలాహలంగా గొంతుకలు విప్పి సందడిగా కనిపించారు; ఏదో పాట పాడుతూ, నడచి పోతున్నారు పాటను శాంతంగా వింటిని కదా, అది నేను రెండుమూడు రోజులక్రితం చదివి అనుభవించిన గేయమే. నేనాక్కజ్జే చదివి ఆనందించి నప్పటికంటె, పదిమందీ పాడుతూన్నప్పుడు ఆ గీతం మరీ వినసొంపుగా ఉంది పూర్తిగా విని వాఖ్యానిస్తే వింత వింత అర్థాలు, రంగులు, దృశ్యాలు దృగ్గోచరమైన ఈ వాతావరణంలోనుంచి, మరో (ప్రపంచపు వాతావరణంలోనికి అడుగులువేస్తున్నట్టు దృశ్యమాన వస్తువులన్నీ అద్భుతావహములైనట్లు ఒక విచిత్ర రసభావోదయం కలిగింది. ఇది ఒక అవస్థ. నన్నే కాదు, సహృదయులైన పరితలెవరినైనా ఆ గీతం ఆవేశిస్తుంది మరోప్రపంచపు దారులలో కదంతాక్కిస్తుంది. నడకమాని కొంచెం ఆగి ఆలోచిస్తే ఈ మరోప్రపంచపు స్రష్ట అయిన శ్రీశ్రీ ఒక విశిష్టలక్షణోపేతుడనే విషయం స్పష్టమవుతుంది. ఇదివరకు వచ్చిన కవుల నుండి వేరుచేసే ఒక ప్రత్యేకత నవ్యత, వింతవ్యక్తిత్వం ఈ కవిలో మూర్తీభవించినవని విదితమవుతుంది. శ్రీశ్రీనికవిగా చూస్తున్నప్పుడు ఏవో కొన్ని పడికట్టరాళ్ళువంటి కొన్ని అలంకారిక సూత్రాలతో తూచుకొని, విలువలు కట్టుకోరాదు అనంతంగా పెరుగుతున్న కావ్యాలకు ప్రత్యేకం లక్షణాలను చెప్పుకోవడం మంచిది. కొంతవరకు మాత్రమే పెరిగిన కావ్యాలపై వెలువడిన లాక్షణికసూత్రాలు,ఆధునిక (గ్రంధాల స్థానాన్ని సరిగ్గా నిర్ణయించ లేవు. అంతమాత్రాన, ప్రాచీనాలంకారిక (గ్రంధాలు ఎందుకూ కొరగానివని చెప్పడంనా అభిమతం కాదు
వ్యక్తి-సంఘము : వ్యక్తి ప్రవృత్తికన్న సంఘ ప్రవృత్తి బాహుళ్యమైనది కవి సంఘంతో బాటుపెరుగుతూ, పెరిగిస్తూ కృతులను సాగించడం బహుకష్టం. ఆధునిక సాహిత్యంలో యీగురుతర బాధ్యతను నిర్వహించినది వీరేశలింగం, గిడుగు, గురజాడలు. రోణంకి అప్పలస్వామి క్
తననాటి సాంఘిక అన్యాయాలను, దురాచారాలను, మోసాలను, ధిక్కరించి సాహిత్యాన్ని బెషధంగావాడినవారు వీరేశలింగం; సంస్క్మరణోద్యమాలతో సంఘజీవికాన్ని మార్చినూతన సాంఘికదృష్టిని, చైతన్యాన్ని కలిగించినదితడే; వ్యక్తిగా సాంఘిక పోరాటాలలో, తనకుతానై పాల్గొనిన సారస్వత సేవకుడు అయితే, భాషలో నాటి కాలానికికలుగవలసిన, రావలసిన మార్చు మాత్రం, వీరినుంచి అంతగా కలుగలేదు. ఆ కొరతను వాగనుశాననుడు, గిడుగు పరిపూర్తికావించాడు. వ్యావహారికాంధ్ర సారస్వతానికి గిడుగు, గురజాడలు నారాయణభట్టు, నన్నయలవంటివారు అనడంలో విప్రతిపత్తి లేదు. మొత్తంపై ఈ మూర్తిత్రయం శ్రొక్కిన పద్ధతులువేరే అయినా, వారి గమ్యం ఒక్కటే; ప్రజలకు సన్నిహితంగా రచనలను, సాగించడమే గాక, సమాజ ఉన్నతికి సాహిత్యసృష్టి జరిగింది. ఈ ముగ్గురిలో గల ప్రజాదృక్పధం శ్రీశ్రీ కవనంలో పరాకాష్టను పొందకలిగింది. రాయప్రోలుతో ప్రారంభింపబడిన “భావకవిత్వం వీరేశలింగం, గురజాడ ప్రజాదృక్పధానికి దూరమైనది సాంఘిక ప్రవృత్తికన్న, వ్యక్తి ప్రవృత్తియే అధికమైన ధోరణిలో, చిత్రమైన మరొక త్రోవను తీసింది. వీరికి రవీంద్రుడు ఆచార్యుడు. రవీంద్రునికిగల సాంఘికదృష్టి వీరికిలేదు. షెన్లీకీట్సులు వీరందరికీ అభిమానులు భావకవుల ప్రవేశంతో తెలుగుకవిత్వంలో, రీతులలో ఒక మార్పురావడం వచ్చినదేగాని, మార్చు వీరేశలింగం, గురజాడలు అనుసరించినదీ కాదు, ఆశించినదీకాదు. వీరినవ్య కవిత్వరీతులు, వాటికవేసాటి అవి చదివి ఆనందించతగినవే. క్లిష్ట పరిస్థితులు :ప్రధమ ప్రపంచ సంగ్రామానంతరము గురజాడ అప్పారావు గారి నిర్యాణంతో, అధునికాంధ్ర సారస్వతం ఒకక్షిష్ట పరిస్థితులలో పడిపోయింది. దేశంలో యుధ్ధం జరగక పోయినా, యుద్ధబీభత్సం సమాజాన్నంతటినీ కలవర పెట్టసాగింది. నిరుద్యోగం, ఆకలి, రోగం, దుఃఖం, దారిద్ర్యం, మోసం, పరపీడన, వంచనలతో మానవుడు విసిగి వేసారిపోతున్నాడు వివిధ అంతస్తులు వర్గాలు వాటి వైరుధ్యం మేధావులకు కనిపించ సాగాయి ప్రధమ సంగ్రామానంతరం యించుమించు మూడుదశాబ్దాల పిమ్మట, కవిగా అవతరించిన శ్రీశ్రీని సోవియట్రష్యా ఆకర్షించింది. శ్రీశ్రీ సమకాలికులైన నారాయణబాబు వంటికవులకు సహితం ఎర్రబావుటా ఉద్రేకశబలితం కాజొచ్చింది. శ్రీశ్రీ నారాయణబాబు లకు ఆవేశహేతువులు చరమలక్ష్యంనాడు ఒక్కటే; త్రోవలు మాత్రం వేరు ఒకరు ఎగిరే ఎర్రబావుటా పట్టుకోగా మరొకరు రుధిరజ్యోతిని వెలిగించుకున్నారు. ఒకరు వడులతో సుడులతో ప్రవహించే నదివంటివారు. మరొకరు మందమందంగా పరువులెత్తే నదివంటి వారు నాటి సమాజంలో గ్లాని, నైరాశ్యము పెరిగి వృద్ధికాజొచ్చింది. పరపరిపాలన తొలగి పోవాలనే కాంక్ష ఆవరించింది. ప్రత్యక్ష నరకకూపంవలె వున్న ఈ సంఘస్వరూపము మారుతుందా అనే నిస్పృహ అలముకున్నది. అశాంతి, ఆవేశం, ఆ యుగ లక్షణాలలో కొన్ని ఈ సంధి యుగంలో, ఒక ఆశకు, ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని ప్రసాదించే మహత్తరశక్తిగల కవి, ప్రజలకు కావలసి వచ్చాడు. దగాపడిన ప్రజల గాధలను, కధనంజేసి, కదను తొక్కించ గల ఆవేశపూరితుడైన ఒక విప్లవకవి అవసరం. ప్రజల గొంతుకలలో దాగివున్న అర్ధాలను విప్పి, బయటకు వారి కష్టాలను పాడగల ఒక గొంతుక జనించింది, అ గొంతుకే శ్రీశ్రీ 6 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
శ్రీశ్రీ అవతరణము :ముత్యాల సరాల నవీన పోకడలు ప్రాబీన దేశికవితా రీతులు శ్రీశ్రీ కవిత్వంపై తమ ప్రభావాన్ని నెరవు కున్నవి. కానీ శ్రీశ్రీ ఇంతటితో ఆగిపోలేదు కొన్ని పాశ్చాత్యపుంతలను అనుసరించాడు. రొమాంటిక్ కవిత్వం, పాశ్చాత్య దేశాలలో, (ఫెంచికవి 'బోద్‌లేర్' ప్రవేశంతో విచ్చిన్నమయింది. అత్యంతాభివృద్ధి చెందిన పారిశ్రామిక నాగరికతలోని కుళ్ళును కుట్రను శిధిలస్థితిని, బోద్‌లేర్ తన కావ్యాలలో చక్కగా చిత్రించాడు. అతనితో కావ్యవస్తువు మారింది. కానైతే కావ్యరీతులు మాత్రం మార్పు చెందలేదు. సింబలిజపు ధోరణులు ఇతని కృతులలో బీజప్రాయంగా కనిపించిన కారణాన “సాంకేతిక వాదజనకుని'గా బోద్‌లేర్‌ను పేర్కొనవచ్చును. తరువాత క్రమక్రమంగా, ప్యూచరిజం, క్యూబిజం, ఇమేజిజం మొదలుగాగల వివిధ “ఇజములు” కవితారంగములో తలలెత్తినాయి ఫ్రాయిడ్ కనుగొన్న అవ్యక్త, వ్యక్తావ్యక్త, అంతర్గత చైతన్య మొదలుగా గల మానసికవాదం సాహిత్య రీతులను బహువిధాల మార్చివేసింది ఈవాదపు చివరిదశ సర్రియలిజం, లేదా అధివాస్తవికక ఈ వాదపు కవులకు ఆచార్యుడు 'అందెబ్రితో' అనే ఆయన ఇతని పద్ధతిని రచన కొనసాగించిన అనేకులలో, లూయీ ఆరగాన్ ప్రభృతులు కొందరు వీరిద్దరి దృక్చధాన్ని ద్వితీయ ప్రపంచ సంగ్రామం మార్చివేసింది. నూత్నపద్ధతులపై ప్రసరించిన వీరిదృష్టి ఈనాడు సమూహ గానానికి పనికివచ్చే గీతాలను రచియింప జేస్తున్నది. శ్రీశ్రీకి వీరికీ ఒక ప్రధానభేదం వుంది. ఆరగో ప్రభృతులు నేడు కొత్తగా అనుకరిస్తున్న మార్గం నాడు శ్రీశ్రీ పయనించిన రహదారే. కాని ఈనాడు శ్రీశ్రీ కత్రొక్కిన అధివాస్తవికత ఏనాడో అరగాన్ ప్రభృతులు పయనించిన రాజబాటే. ఇది గమనించతగిన ముఖ్యభేదం ఈ విషయసమర్ధనకు, నేను చదివిన ఫ్రెంచి కృతుల మూలముల నుండి ఉదాహరణలను యివ్వగలను. అయితే శ్రీశ్రీ కృతులు నేడు ఆరగాన్ వంటి కవులకు మార్గదర్శకాలైనవని చెప్పడం నా అభిమతం కాదు. శ్రీశ్రీ కేవలం ఒకేపద్ధతిని కాక, అనేక ఫణితుల కావ్యాలను రచించాడు రచించిన కృతులసంఖ్య అల్బమే. కాని వాటి గుణము మాత్రం అనల్పం
వస్తువు - త్ కావ్యానికి వస్తువు, రీతి రెండూ ప్రధానాలే. భావశబలత లేని, వస్తుగౌరవం లేని రీతి మెచ్చుకోతగింది కాదు. కొత్తకొత్త కావ్య వస్తువులను అభివర్ణించేటప్పుడు, వాటిని పోషించే సరిక్రొత్త రీతులుత్పన్నాలవుతాయి. వస్తువు ఎంత ఉదాత్తమైనదయినా భావానికి తగిన భాష లోపించినప్పుడు కావ్యం నీరసమవుతుంది. రీతి ప్రధానమై వస్తుగౌరవ శూన్యమైన కావ్యము పేలవమైనది. భావనాబలంలోని లోటును కప్పిపుచ్చడానికి కొందరు కవులు శబ్దాన్నే ఆశ్రయించారు నిరర్ధక ఛేకానుప్రాసలు, లాటాను ప్రాసలు, యమకాలతో, శ్లేషప్రధానాలైన కావ్యాలు క్షుద్రములే, ఆవేశాన్ని సహజకోమలంగా పొదిగేభాష్స కవికి అత్యవసరం, జాతి సంప్రదాయానికి, ఉపజ్ఞతకు పూర్తివ్యతిరిక్తములైన శబ్దపయోగాలు, శబ్బాలంకారములు, దేశభాషల నుడికారాన్ని ధ్వంసంచేస్తాయి. అన్య జాతీయాలను వాడితేనే తప్ప భావం స్ఫుటంకానప్పుడు, కవి వానిని ప్రయోగించడం దోషం కాదు. తెలుగుభాషను సంస్కృత సమాసాల బారలతో చుట్టబెట్టడం, దానిని బంధించడమే ప్రాచీన కావ్యాలలో సంస్కృత భాషాప్రభావం ఎంత ఉధృతంగా కనిపించినా, అది తెలుగు కాదు. గుక్కతిరగనీయని లాటిన్ పదాలను ఇంగ్లీషు పద్యాలలో యిమిద్చిపెడితే ఎంత వికృతమో, రోణంకి అప్పలస్వామి క్
తెలుగుకు సంస్కృతభాషా అంతే అయితే ఇంగ్లీషులో లాటిన్, తెలుగులో సంస్కృతము ఉపయోగించ రానేరాదని కాదునా అభిప్రాయము ఆంగ్లకవులు సాధ్యమైనంత వరకు ఆంగ్లోసాక్టన్ పదాలనే వాడుతూ వచ్చారు జాతీయతకు భంగంరాని తావులలో స్వభాషకు అందని భావప్రకటనకు మాత్రమే అన్య జాతీయాలను వాడుకున్నారు. తెలుగున తిక్కన భారతరచనా పద్ధతి ఇట్టిదే సాధ్యమైనంత వరకూ సంస్కృత శబ్దాల దరిచేరకుండా తెలుగునుడి కారాన్ని రమణీయంగా వాడుకున్న తిక్కనాదుల పద్ధతి కవులకు ఆదర్భవంతం కావాలి
అచట పుట్టిన చివురు కొమ్మైనా చేవ : * జనార్దన రావు కోసం ” అనే శ్రీశ్రీ కృతిని తీసుకుందాము. క్షయవ్యాధితో మరణించిన అతని మిత్రుని సంస్మరిస్తూ 'మహా ప్రస్థానాన్ని అంకితంగా ఇచ్చిన గీతం యిది ఈ పద్ధతి రచనను ్రెంచిలో 'వెర్స్లీబ్రొ అని ఆంగ్లంలో “ఫ్రీవెర్స్' అని అంటారు. దీనిని వచనంలో చదువుదామన్నా దాని నడక మనల్ని అలాగ చదవనియ్యదు. నిరుత్సాహాన్ని అధిగమించి ప్రతికూల శక్తులను జయించే సాహసాన్ని ప్రదర్శిస్తూ కవి మహాప్రస్థానాన్ని గానం చేస్తున్నాడు. పండితులను పామరులను మహాప్రస్థానం ఆవేశపరుస్తుంది. కావ్య వస్తువులు సామ్యవాద ప్రతిపాదితాలు. సామ్యవాదం అంటే సరిపడని వారికి సైతం ఈ వాక్యాలు రసోద్రేకజనితాలు. హేతువు వాటిలోగల కావ్యత్వమే
సామాజికవాది శ్రీశ్రీ ;సామాజికవాదంకంటె, వ్యక్తివాదమే గొప్పదని కొందరు, వ్యక్తివాదం కంటె సామాజికవాదమే ఘనమైనదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. శ్రీశ్రీ సామాజికవాది సమాజ పురోగమనంతో వ్యక్తి అభివృద్ధి చెందుతాడని అతని భావం పరిపూర్జుడవుతాడని నమ్మకం; అయితే శ్రీశ్రీ తన రచనలలో వ్యక్తిని ఎరగాచేయక వ్యక్తిగౌారవం ఘనమైనదని శ్లాఘిస్తాదు. ఈ దృక్పథం అతని 'జయఖేరిలో ధ్వనిస్తున్నది. కవి ఊహించిన 'మరోప్రపంచపు సృష్టికి తానుకూడ ప్రపంచాబ్దెపు తెల్లరేకై పల్లవిస్తానంటున్నాడు. ఇది జగన్నాధుని రథచక్రాలు భూమార్గం పట్టనిదే జరగదని నమ్ముతున్నాడు. పాశ్చాత్య నాగరికత లోని మెలకువలను అలవర్చుకోని వారికి, శ్రీశ్రీ సంపూర్ణంగా అర్ధం కాజులడు జగన్నాధుని అనేశబ్దం పాశ్చాత్యులు జగర్నాట్గా వాడతారు. జగర్నాట్ విధ్వంసకహేతువు. లోకంలో వున్న అన్యాయాలను, దుర్మార్గాలను, వ్యత్యాసాలను జగన్నాధుని రధచక్రాలు పిండి పిప్పి చేస్తాయని అతని ఆశ. అయితే ఇది విధ్వంసంతో ఆగిపోదు. జగన్నాధుని రధాగమనంతో పునఃసృష్టి జరిగి తీరుతుంది. పాశ్చాత్యులు దేవుణ్ణి ప్రార్ధించేటపుడు, “దివిభువిపై' అవతరిం చాలని కోరుకుంటారు అలాగే ఇక్కడ ఆకాశమార్జాల నుంచి సామాజిక న్యాయం కలిగించే “జగన్నాథుని రథం” కదలి రావాలని శ్రీశ్రీ ఆకాంక్షించుతాడు, ఈ రధం ఊహాతీతమైన ప్రదేశాల నుంచి మాత్రం క్రిందకు దిగిరాదు. శనిదేవత రథచక్రపుటిరుసులలో పడినలిగిన, కూడులేని, గూడులేని, దగాపడిన అన్నలు తమ్ములు ఈ రధాన్ని భావకల్పన చేసుకొన్నారు. "వీరే ఆరధాన్ని గొలుసులతో వీధుల వెంటలాగుకొని వెడతారు ఈ భావము “ప్రతిజ్ఞ అనే కృతిలో మరీ విస్పష్టం. “శరీరకష్టం స్ఫురింపజేసే, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి...
నా విరచించే నవీనగీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవంిగా జపించుకుంటున్నాడు
కవి.
శ్రీ్రీశైలి కేవలం గేయాత్మకమైనది మాత్రమే కాదు; అతని ఆఖ్యాన శైలికి “బాటసారి
8 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
ఒక ఉదాహరణ వ్యావహారికభాషను ప్రతిభగల కవి, వాడుతున్నప్పుడు అవి ఎంతటి గంభీరతను సాధించగలదో “బాటసారి ఒక రుజువు “ప్రతిజ్ఞులో గల సంస్కృత శబ్దజాలము బాటసారిలో కన్పించదు. “పతిజ్ఞు వీర రస ప్రధానం, '“బాటసారి' 'కరుణరసి శబలితం. వీరరస పోషణకు కవి సంస్కృత భాషను ఆశయించక వీలులేకపోయింది. “బాటసారి” కృతిని మైక్రోస్కోపు ముందువుంచి పరీక్షించినా ఒక మాటపొల్లులేదు. శబ్దాలన్నీ వింత వర్దాలతో, అర్థాలతో హృదయాన్ని వశం చేసుకుంటాయి. బరువైన భావానికి తగిన శబ్దాలను తూచినట్లు ప్రయోగిస్తాడు. దారి తెలియని బాటసారి, మంద మందంగ నడచినట్లు ఈ కావ్యశయ్యారీతి మంద గమనంతో ముందుకు సాగిపోతుంది “దారితప్పిన బాటసారికి ఎంతకష్టం !” అనేటపుడు, నడుస్తున్న బాటసారి హరాత్తుగా ఆగిపోయినట్లు మనకుస్సురిస్తుంది. రమణీయ శబ్బార్ధాలతో విగ్రహాలను కావ్యాలలో మహాశిల్పివలె మలచి మనోహరం చేస్తాడు. ఆ శిల్చం సాధారణకవుల కలవడదు. “నడిసముద్రపు నావరీతిగ సంచరిస్తూ, సంచలిస్తూ, దిగులుపడుతూ, దీనుడౌతూ,” అనే పట్టున బాటసారి వేదనను బొమ్మల తోరణాలను కట్టి మనకు చూపిస్తాడు. దీనిని కేవలం శిల్పంకొరకే ప్రయోగించక, ప్రయోజనాన్ని అర్థించి ప్రయోగిస్తాడు 'భిక్షువర్నీయసి' లో “ముగ్గుబుట్టవంటి తలా, ముడుతలు తేరిన దేహం, కాంతిలేని గాజుకళ్లు, తనకన్నా శవం నయం . ప్రక్కనున్న బండరాతి పగిదిగనే పడియున్నది” పాపం ఈ ముదుసలిని చివరకు జంతువులైనా తొంగిచూడవు కుక్కకు కొండకుకూడా ఆమె అంటే నిర్లక్ష్యమే; తన పాపం ఏమీ లేదనుకొని ఎంగిలాకు గాలికి ఎగిరివచ్చి మీద పడుతుంది.
“ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటె లాగుంది జాబిల్లి అనే చోట రస సన్నిహితమైన ఈ బొమ్మ కావ్యానికి సొగసును యిస్తుంది 'పేదలు” అనే కావ్యం, “అద్వైతం అనే గేయం అనువాద, అనుసరణలని చెప్పుకున్నా, నిజానికి అవి స్వతంత్ర రచనల వంటివే భారత భాగవతాలు, కవుల ప్రతిభ వలన ఎలా స్వతంత్రాలైనవో యివీ అంతే “పేదలు” అనే కావ్యానికి మూలం, 'లేపోవోవ్' అనే ఫ్రెంచి గీతం. మూలంలోని మొదటి చరణంతో, తెలుగులోని మొదటి చరణాన్ని సరి పోల్చి చూస్తే ఈ స్వతంత్రత కనిపిస్తుంది 16% 631 రేం 020౧765 00601, తం, అ) 6౫ 663 1209 66 160% (041 3016 0416, ౧౦౧౧6 165 016063 ౮౧ ౧౧011166 (0౪40 అం జం 00010683 ౪14, 2 లం, 1214 01, 0100 జం 0246 (8000) 1106 910063 10 & 09౧61200
కావ్యాంత పాదాలలో శ్రీ శ్రీ నూటికి నూరుపాళ్ళూ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించాడు (ప్రేమను వేదంగా అంగీకరిస్తే 'అద్వైతం” అనే గీతం ఒక దివ్యసూక్తి. ఇది నృత్యగీతి, సంస్టృత పదాలుహెచ్చు, పదమధ్య విరుపులు. అంత్యనుప్రాసలు, జాతీయమైన నడకలతో, ఈ గీతం హృదయంగమం చేస్తున్నది పాశ్చాత్య చైతన్యాన్ని జాతీయంచేసి తెలుగు నరాలకు ప్రసరింప జేస్తున్నాడు స్రీ పురుషప్రేమకు గల వివిధాంతరములను విచిత్రమైన ధోరణిని అభివ్యక్తం చేస్తున్నాడు. పద్యరచనకున్న గౌరవం, మన పండితుల గేయరచనకీయడం లేదు వారి దృష్టిలో పద్యరచనకున్న ప్రాముఖ్యత గేయరచనకు లేదు ఈ రీతి విభజన పొశ్చాత్యులలో కనిపించదు వారి దృష్టిలో పద్యగేయాలకు సమాన గౌరవస్థానమే కల్చింపదిడుతుంది.
రోణంకి అప్పలస్వామి 9
కాని అది యేమి కర్మమో, మన పండితులకీ సమానాదరణలేదు మార్గ, దేశి అని కవిత్వాన్ని ద్వివిధ విభాగం కావించి దేశిపట్ల అనాదరణ చూపేవారు. పాశ్చాత్యుల దృష్టిని అలవర్చు కోవడం లేదు. ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతుల కలయిక ఏనాడూ జరగనంత తీవ్రంగా నేడు జరుగుతున్నది అన్యజాతీయమైన సంస్కృత అలంకారిక, వ్యాకరణ సూత్రాలను, తెలుగులోనికి పరివర్తింప చేసుకొని, సహజవిరుద్ధంగా, శబ్దవ్యుత్పత్తిని కల్పించి, తెలుగు భాషను కృతకం చేస్తారే కాని, సహజ విరుద్ధంకాని పాశ్చాత్య రీతులను మన కవులనుసరిస్తే, పండితులు అదిరిపడుతున్నారు. “నరకలోకవు జాగిలమ్ములు గొలుసు డ్రెంచుకు వురికిపడ్డాయి” అనే చోట గ్రీకు పౌరాణిక సంప్రదాయం స్ఫురించే విషయం ఎవరూ కాదనరు ఈ సంప్రదాయాన్ని కవి 'అవతారం' అనే దానిలో ప్రతిభావంతంగా వాడుకున్నాడు తమపై అధిరోహించి అధి కారాన్ని చలాయిస్తున్న నియంతలపై వారి వాహనాలు తిరుగబడతాయి. విప్లవం తెస్తాయి ఈ అధికార ధిక్కరణ కవి సర్వత్ర జరుగుతున్నట్టు వ్యంగ్యంగ సూచిస్తాడు. వాచ్యంచేయడు. ఆ తిరుగుబాటే, అతనికి అవతార దర్శనం. పాశ్చాత్యదేశాలలో కూడా ఈ సంఘర్షణ జరుగుతున్నట్టు నిర్దేశించడానికి 'నరకలోకపు జాగిలములు గొలుసు తెంచుకు ఉరికిపడునట్లు' భావించడం కన్నా మరొక గత్యంతరము లేదు యముని మహిషంవలె నరకలోకపు జాగిలములు కూడా ఎదురుతిరిగినవని చెప్పడంతో కావ్యంలో కవి ఉపలక్షించిస “ఐక్యత” సాధించబడింది. దీనిని పాశ్చాత్య వ్యామోహమనీ, భావదాస్యమనీ, వేదికలపై సనాతనులు అధిక్షేపించడం హాస్యాస్పదం. పౌరాణిక యుగంలో సంచరించే వారికి, 'ఈ ఆధునికత* హితవు కాదని నవ్యులు విమర్శించవచ్చును. కాని సహృదయులైన వారికి ప్రాత కొత్తలలోని ఉజ్వలత సమానంగానే భాసిస్తుంది. మన సాంప్రదాయ విశిష్టత అన్యుల కంటి ఎదుట ప్రకాశించినందులకే ఇలియట్ తన “వేస్టులేండ్” అనే కృతిలో “దత్త దయాధ్వం, దామ్యత, శాంతి, శ్శాంతి, శ్భాంతి”' |! అనే శబ్దాలను ఒక ప్రయోజనాన్నర్ధించి ప్రయోగించాడు విశాల సంస్కృతిని కాంక్షించే వారికి సంకుచితదృష్టి ఉపయోగకారి కాదు లిరిసిజము: భవిష్యత్తులోనికి తొంగిచూసే భావోద్వేగమూ రసోద్రేక ఉన్మీలనశక్తీ. ఆత్మాశయ కవిత్వమైన లిరిసిజమునకు అవసరం లిరిసిజం అనే పదం గేయ కవిత్వమని సమానార్థకంగా వాడుకుంటున్నామే కాని ఆంగ్లంలో యిచ్చినంత అర్ధపుష్టి, తెలుగున వ్యక్తం కావడం లేదు రొమాంటిక్ కవిత్వమంటే భావకవిత్వమని చెప్పుకోవడంకూడా యిట్టిదే. లిరిసిజం శ్రీశ్రీ రచించిన 'కవితా ! ఓకవితా 1 అనే దానితో అంతిమస్థాయిని అందుకున్నదని చెప్పవచ్చును. తెలుగులో ఈ గేయం ఒక మహాకావ్యమే, శ్రైశవగీతి కూడా యిట్టిదే; ప్రకృతి సౌందర్య చిత్రీకరణలో దీనికిదేసాటి. 'కవితా ఓ కవితా" అనే గీతికలో కవి తానెలా వివిధ దశలలో అభివృద్ధి చెందాడో ద్యోతకం చేస్తుంది 'వెర్స్లీబొను తెలుగులోనికి ఎంతో నేర్పుతో తెచ్చి ఒక సొగసును కల్పించాడు. జీవితంలో కవిత్వమే సర్వస్వమని నమ్మి అన్నిటిని త్యజించిన శ్రీశ్రీ వంటి కవులను సమాజం తగిన విధంగా ఉపయోగించుకొనక పోవడం ఒక లోపమే. 'పాపం, పుణ్యం, ప్రపంచమార్గం, కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలు ఏమీ ఎరుగని శైశవావస్థను కవి నిపుణతతో చిత్రిస్తున్నాడు. ఉత్తమకవిత్వం అతిసాధారణ మాటలలో చెప్పవచ్చుననే దానికి “మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే, అవి మీకే అని 10 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
ఆనందించే కూనల్లారా 1” అనే చరణాలుదాహరణలు సర్నకాలాలలోను నిలిచి పోయే శ్రీశ్రీ సూక్తులకు దిజ్మూత్రవివరణమవసరం ప్రపంచమొక పద్మవ్యూహం; కవిత్వమొక తీరని దాహం, పెనునిద్దుర వదిలించేదీ, మునుముందుకు సాగించేదీ, పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ, కావాలోయ్ నవకవనానికి” అనేవి శాశ్వతత్వాన్ని సంపాదించుకుంటున్నవి మాటలను పొదగడంలో, వింతార్థాలలో ప్రయోగించడంలో శ్రీశ్రీ అందెవేసినచేయి. “హృదంతరాళం గర్జిస్తూ, పరపీడన పరాయణత్వం, ఖరీదుకట్టే షరాబులేడు” అనే ప్రయోగాలలో ఎన్నో అనుభూతులు, ఎంతో బరువు ద్యోతకమవుతుంది
ప్రకృతిలో మానవత్వం అనేకవిధాల పరిణతి చెందుతున్నది ఈ పరిణతిని *ఓ మానవుడా 1” అనే గీతిలో పదగుచ్చంగా కూర్చాడు. సహస్రరూపాలలో ప్రత్యక్షమవుతూన్న మానవమూర్తిని, ఒకచోట అద్ధంపట్టి దర్శించాడు ఈ మానవ మూర్తులందరూ కలసి రచించిన చరిత్రను సామ్యవాద దృక్సధంతో “దేశచరిత్రలు” గానం చేస్తున్నాడు తెలుగువారికీ గీతము ఒక వేదం, ఒక్కొక్క చరణం ఒక్కొక్క బుక్కు ఇందులోని మంత్రశక్తి దివ్యమైనది ఒక దేశానికీ, ఒక జాతికీ ఈ గీతం ఒక బుక్కు చదివిన మనుష్యులను కలవరపరుస్తుంది, మంత్రిస్తుంది. ఈసమ్మోహన శక్తి సంస్కృత శబ్బాలలో దీనిని రచించినట్లయితే, కలిగివుండక పోవును సులభమైన తెలుగులో శ్రీశ్రీ దీనిని సాధించాడు
ద్వితీయ సంగ్రామానంతరం, ఫ్రాన్సు దేశంలో ఉద్భవించిన ప్రధమశ్రేణి కవులలో ప్రప్రధముడు ఆరగాన్, అతనికి సామ్యవాదులేకాక, తద్వ్యతిరేకులు కూడా జోహారులర్చిస్తారు. భూతకాలాన్నంతటినీ ఒక శిధిలమైన భవనంతో ఆరగాన్ ఈక్రింది పంక్తులలో ఉపమించాడు. “520003 12 ౪104116 081886 9105 16 02౧0010105 66 03 0125" (16168 020)/ 24/2) 16016 [0761 10 16 ౪4ళ్రైం10 ౦౯00 12069)
ఎవరు మహాకవి :;రచయితను నేను, చదువుకున్నది మీరు; మన మిద్దరమూ సామ్యవాదులం కాకపోయినంతమాత్రాన, సామ్యవాదం కవిత్వం రూపాన ప్రభవిస్తున్నపుడు, ఆ ఉత్తమ కవిత్వానికి జోహరులర్చింపక తప్పదు
శ్రీశ్రీ మహాకవి అవునా, కాదా అని నేడే తర్మించుకుంటున్నారు, మహాకవి కాడని కొందరి తీర్పు. మహాకవిత్వం సంఖ్యలోకాక గుణప్రధానంగ వుంటుంది
437 పంక్తులు మాత్రమే కలిగిన వేస్టులాండ్ అనే కావ్యం, ఇలియట్కు మహాకవి బిరుదాన్ని సముపార్టించింది ఇది పాశ్చాత్య దేశాలపద్ధతి కాళిదాసు ఒకే ఒక మేఘసందేశ కావ్యాన్ని రచించి ఊరుకున్నా ఆయన మహాకవే ఇంతకీ శ్రీశ్రీ స్థానాన్ని నిర్ణయించవలసింది అతని పరితలు కాని శ్రీశ్రీ మనకోసం “కలంపట్టి ఆకాశపుదారులంట అడావుడిగ వెళిపోయే, అరుచుకుంటూ వెళిపోయే, జగన్నాధని రధచక్రాల్, రధచక్రపు ప్రళయఘెష” భూమార్గం పట్టించాడు; భూకంపం పుట్టించాడు
ఆంధ్రులు ఖండాంతరాలకు వెళ్ళినా, శ్రీశ్రీ వంటి కవి, తమకు వున్నాడని సగర్వంగా చెప్పుకోవచ్చును
( ముద్రణ: “విశాలాంధ్ర” వారపత్రిక ప్రత్యేక సంచిక, 26-9-1952 )
రోణంకి అప్పలస్వామి [11
స శ్రీత్రీ వాగనుశాసనుడు శ్రిర్రి
శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివారావు. ఇంటిపేరు, తన పేరు రెండూ కూడా శ్రీకారంతో మొదలిడుతున్నాయి. శ్రీ అంటే అందరికీ తెలుసును. పూజా పునస్మ్కారాలలో శ్రీకారం తప్పనిసరిగా ఆవృత్తి అవుతూ వుంటుంది. శ్రీకారం శుభదాయకం. కావ్యరచన కుద్యమించే కవి శ్రీకారంతో ప్రారంభించటం మన సంప్రదాయం శ్రీకారంతో శ్రీశ్రీ జన్మిం చాడు. ఈ అదృష్టం శ్రీశ్రీకే దక్కింది శ్రీశ్రీ కవిగా ప్రఖ్యాతి చెందిన తరువాత చాలామంది కవులు శ్రీశ్రీని వరవడిగా తీసికొని శ్రీకారాన్ని స్వీకరించారు. ఇది శ్రీశ్రీ నామధేయంలోని ప్రత్యేకత.
వస్తూన్న సంవత్సరం ఫిబ్రవరీ మొదటి వారంలో విశాఖపట్నంలో వైభవోపేతంగా శ్రీశ్రీ షష్టిపూర్తి వుత్సవాన్ని జరపబోతున్నారు. ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని పారకులకు శ్రీశ్రీని పరిచయం చేయటం న్యాయమని తోస్తుంది.
ఈనాడు శ్రీశ్రీ పేరు తెలియనివారు లేరు. శ్రీశ్రీ పాటలు సినిమా తెరపైని ఆబాల గోపాలం విని ఆనందపరవశులౌతున్నారు. శ్రీశ్రీని ఎవరూ ఎరుగని రోజుల్లో నేను బాగా ఎరుగుదును. పాశ్చాత్య చైతన్వాన్ని తెలుగునానుడి ద్వారా తెలుగుజాతి రక్త ప్రసారంలో ప్రవేశపెట్టి జీర్ణింపజేశాడు శ్రీశ్రీ ఆం(ధ్రగీర్వాణ భాషల మెలకువలను బాగా ఆకళింపు చేసుకున్నాడు వాడుక భాషలోని పదజాలాన్ని సమ్మిళితం చేసి తెలుగుజాతి చైతన్యాన్ని ఆధునీకరించి విస్తృత పరిచాడు. సాహితీరంగంలో శ్రీశ్రీ ప్రవేశించిన తరువాత వ్యావహారిక భాష కావ్యభాషగా స్థిరపడిపోయింది. అంతేకాకుండా వాడుక పదాలకు కవితాస్థాయి సంక్రమించింది. కావ్యభాషలోని పూర్వప్రయోగాలు నవ్యార్థాలతో భాసించే పాటవాన్ని సంత రించుకున్నాయి.
వీరేశలింగంకు పూర్వం తెలుగులో వచన రచన లేదనే చెప్పాలి.గద్యం వచనరచన కానేరదు నిర్ణిబంధ ఛందోరచన మాత్రమేనని చెప్పాలి.మొదటగా సునిశితమైన వచన రచన చేసినవాడు కందుకూరి. అయితే ఇది గ్రాంధిక రచన. గురజాడ, గిడుగు ప్రోద్పలంతో వాడుక భాషలో కవితలల్లటానికి సాహసించాడు ముత్యాలసరాలనే ఛందస్సుని ప్రప్రధమంగా ప్రవేశ పెట్టాడు ఈ ఛందస్సు క్రొత్తది కాకపోయినా దీనికి కవితా ప్రతిపత్రిని ప్రసాదించాడు. “కొత్త పాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా” అన్న గురజాడ ఆశయం శ్రీశ్రీ కవితలో పరాకాష్టనందుకొంది ఈ కారణంచేత శ్రీశ్రీని మహాకవి అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు.
రెండవ మహాసంగ్రామకాలంలో కమ్యూనిస్టులు గురజాడని, శ్రీశ్రీని ప్రచారంలోకి
12 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
తీసుకొని వచ్చారు సమావేశాన్ని ప్రారంభించేటప్పుడు గురజాడ “దేశమును ప్రేమించుమన్నా అన్న గేయాన్ని కమ్యూనిస్టులు పాడటం నేర్చుకున్నారు అదేవిధంగా శ్రీశ్రీ “ప్రతిజ్ఞ 'దేశచరిత్రలు' అన్న గేయాల్ని ఆవేశపూరితంగా పాడటం మొదలుపెట్టారు ఈ కారణంచేత ఇతర రాజకీయ దృక్పధాలుండేవాళ్లు వీరిద్దర్నీ వెలివేసిన విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది తెలుగుజాతి గౌరవప్రతిష్టలకు భంగకరం అమెరికా నుండి కీ.శే. కెనడీ మనదేశానికి శాంతి దళాన్ని పంపించారు. తెలుగుదేశానికి వచ్చిన ఈ శాంతి దళ సభ్యులకు శ్రీశ్రీ పేరు తెలుసు “మహాప్రస్థానం అన్న గేయం ఆంధ్రదేశానికి రాకముందే వాళ్లు వినియున్నారు. నాచేత ఈ గేయాన్ని చదివించుకొని టేపురికార్డు చేసుకున్నారు. వాళ్లు “విస్కాన్సిన్ విశ్వ విద్యాలయంలో ఈ గేయాన్ని మొదట విన్నామని, వీర రసపూరిత గేయమనీ మెచ్చుకున్నారు
తెలుగువారమైన మనం ఏ పార్టీకి చెందినవారమైనా మనకవులను ఆదరించడం, గౌరవించడం నేర్చుకోవలసివుంది ఈ సత్యాన్ని మనదేశంలో గుర్తించినవారు వంగీయులు మాత్రమే మన పూర్వులు 'దేశభాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చాటారు. మనకీనాడు ఈ ధైర్యం కొరవడ్డం జాతి అభ్యుదయానికి శుభసూచకంకాదని తెలుసుకోవడం అవసరం. మాటకు మన రాజధానిలో 'రవీంధ్రభారతి అన్న సాంస్కృతిక కార్యకలాపాలకై నిర్మింపబడిన భవన నామకరణాన్ని పరిశీలించండి. రవీంద్రుడంటే అపారమైనటువంటి గౌరవం కలవారిలో నేనొకణ్ని అయినప్పటికీ మనకు వేయి సంవత్సరాలకు తక్కువకాని సాహిత్య సంప్రదాయం కల్గిన మనం ఈ భవనాన్ని *కవిత్రయ భవనరి అని నామకరణం చేసివుంటే మనజాతి గౌరవస్థాయి పెరిగివుండేది. తెలుగు భారతం మన సాహిత్యానికి పునాది. అంతేగాక మన ప్రధమ మహాకావ్యమని చెప్పుకోవలసిన ప్రతిపత్తి కలిగివుంది ఇది అనువాదమనటానికి వీలులేదు. తెలుగుదనం తెలుగుభారతంలో మూర్తీభవించింది మనజాతి పురోగమించాలంటే ఈ పరమ సత్యాన్ని గుర్తించటమే కాకుండా చాటుకోవలసివుంది.
మన సాహిత్య ప్రాశస్త్యాన్ని మనకంటే బాగా రష్యన్ సాహిత్య విమర్శవేత్తలు గుర్తించారు. మరో విషయాన్ని పాఠకులకు నేను గుర్తు చేస్తాను. అంగ్లవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు జెబిఎస్ హాల్టేను వైజ్ఞానిక విషయాలు తెలుగుభాషలో మలచటానికి అనువుగా వుందని చెప్పాడు. మరొక (ఫ్రెంచి భాషా తత్వవేత్త కూడా ఆయనతో ఏకీభవించాడు. ఆధునిక విజ్ఞానాన్ని తెలుగుద్వారా ప్రచారం చేసేందుకు మనరాష్ట ప్రభుత్వం కృతనిశ్చయమైంది కళాశాల స్థాయిలో కూడా తెలుగులో శాస్త్ర పాఠాలను విద్యార్థులకు నేర్పటం మొదలైంది. ఇప్పటికే ప్రచురితమైన గ్రంధాలు వ్యావహారికభాషలోనే రాయడమైంది
ఇది సరిణైైన విధానమని నా విశ్వాసం. వ్యావహారిక వాదాన్ని లేవదీసింది గిడుగు మహాశయుడు, గురజాడ తన ప్రక్రియల ద్వారా వ్యావహారికాన్ని పటిష్టంచేశాడు శ్రీశ్రీ నేటి పాశ్చాత్య భావక్షిష్టతను తెనుగులో (ప్రస్ఫుటింపచేశాడు. తెలుగుజాతి శ్రీశ్రీ వంటి మహా వ్యక్తులను గౌరవించటం జాతి గౌరవాన్ని గౌరవించుకోవడమే అవుతుంది.
(ప్రజురధం', విజయనగరం వారపత్రిక, 28-01-1970)
రోణంకి అప్పలస్వామి 13
శ్రీల్రీ స ర్రితి అనువాద సరళి శ్రీశ్రీ తాను రచించిన కవితలని కొన్నింటిని అనువాదాలుగా పేర్కొన్నాడు మరి కొన్నింటిని అనుకరణలని నామకరణం చేశాడు వీటన్నింటిని నేను కవితాంతరీకరణా లంటాను ఆంగ్ల, ఫ్రెంచి మాతృకలకు ప్రశంసాపాత్రమైన ఉత్తమోత్తమ ్రతీకలను తేలుగు నుడికారాన్నేమాత్రం బలికానీయకుండా తెలుగుకవి సాధించాడు తెలుగు భారతముగాని భాగవతముగాని అనువాదాలనిపించుకోవు. అదేవిధంగా శ్రీశ్రీ అనువాదాలు అనుకరణలు రూపాంతరాలని చెప్పడం సమంజసం ఇతర భాషలలోని కవితాసృష్టికి సమమైన ప్రతిసృష్టి ఈతని అనువాద సరళి అనువాదానికనువుగానిది కవిత్వమని కవిత్వానికొక నిర్వచనం కద్దు పద్యాలకు ప్రతిపదార్థం చెప్పడం సార్వత్రికమవడంచేత దండాన్వయానికి దొరకని రచన అసలు రచనే కాదని అనుకోవడం అలవాటైంది హృదయోద్వేగం, ఆత్మానుభవాతిశయం వచనరచన కతీతంగా వుంటవి ఏదో ఒక ఛందస్సును ఆశ్రయిస్తవి. ఈ ఛందస్సు క్రొత్తది కావచ్చును కాని వచన రచన శయ్యకు వేరుగా ఉండి తీరుతుంది. ప్రతిభాషకు ప్రత్యేకమైన ఒక వాక్య నిర్మాణ పద్దతి వుంటుంది. ఒకే ఒక భావాన్ని ప్రకటించేందుకు ఏ రెండు భాషలలోనైనా సరే భాషా భాగానుగుణ్యము, వర్ణ సమా మ్నాయము సాధ్యము కానేరవు. శబ్దధ్వని సరే మారి తీరుతుంది రాగం అనువాద యోగం కానట్టే కవిత్వం కూడా అనువాదాతీతమనే చెప్పాలి ఛాయామాత్రంగా భావం భాషాంతరీకరితమవుతుంది ఉదాహరణకు ఈ క్రింది పద్యపాదాన్ని గమనించ మనవి “మధుపర్మ మిదురీతి మకరంద బృంద/ మందర గంధవహుదడు ముందర మెలంగ” ఇందలి గమనమాంద్యము, బరువు,జిగి, యమకము వేరే భాషలోనికి కొని పోవుట శక్యముకాని పని. ఉచ్చ్వాస నిశ్వాస ధ్వనిని 'సోహం'” అన్న శబ్బద్వయంగా మన వేదాంతులు భావించారు.'సోహం'వంటి పదాలు పొదిగే నైపుణ్యం కవిత్వలక్షణం అందులోని భావం శాస్త్ర సమ్మతమా? అన్న ప్రశ్న ఇక్కడ అనవసరం శబ్ద సామ్యము భావం పరమసత్యమనే నమ్మకాన్ని రేకెత్తిస్తుంది అయితే ఈ సంస్కృత శబ్దమిశ్రమాన్ని ఇతర భాషల లోనికి అనువదిస్తే అట్టి నమ్మకం నెలకొనదు చెప్పవచ్చేదేమంటే సుదీర్హ కావ్యం కానివ్వండి, రమణీయార్ధ ప్రతిపాదక శబ్దం కానివ్వండి. అనువాదంలో తద్రూపాన్ని కోల్పోవడం తధ్యం కవులు ఇతర భాషలలోని కావ్యాల్ని చదివేటప్పుడు అనువదించాలని అనుకరించాలని తహ తహ పడటం సంభవిస్తుంది శ్రీశ్రీకి ఆంగ్ల డ్రైంచి భాషల పరిచయం కద్దు. అందుచేత ఉత్తమోత్తమమైన కొన్ని కావ్య ఖండికలను తెలుగు కనువైనట్లు మార్చివేశాడు ఈ ఖండికలన్నీ కేవలం స్వీయ రచనలనిపించే కళాకౌశలాన్ని ప్రదర్శించాడు. 14 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
“'మహాప్రస్థానం'లో “పేదలనే' కవిత ౪౭126161 రచించిన '1ఆ0167/౮' అనే (ఫ్రెంచి కవితకు అనువాదము “గంటలు 806 యొక్క 36113 అన్నగేయంలో ప్రకటితమ్రైన భావాలలో కొన్నింటిని మాత్రమే పొందు పరచిందని చెప్పాలి. అద్వైతమన్న అనుకరణ 51004006 రచించిన & 12101 అన్న గేయమే శ్రీశ్రీ తెలుగు మాతృకకు స్వేచ్భాను వాదమనేటంతటి హృదయ స్పందనాన్ని ప్రదర్శిస్తోంది “పేదలు అన్న కవిత మొదటి చరణం ఫ్రెంచి మాతృకను దగ్గర నిడుకొని పరిశీలిస్తే శ్రీశ్రీ ప్రదర్శిత శబ్ద నైపుణ్యం తేటతెల్లమవుతుంది.
శ! 20 651 66 044716 ౧౦౭4౧6 /స60 ౪0 6౪౫ రలు [1203 66 ౧16413
౮150160116 ౮౦౧౧06 163 ౧1ల౫ట / 0౪౫ 0101166 ల ౫6 ౧౦౦ 16మ6 / 410) 1) లం 12063 0 16210 రయ 46 (0481ల) 86 28 16 560065 ౧01 2 91076 026. అంతేలే పేదల గుందెలు / అ(శ్రువులే నిండిన కుండలు శ్మృశానమున శళికాంతులలో / చలివారిన వెలిరాబండలు
మాతృకలో కాసారాలు అన్న పదానికి బదులు శ్రీశ్రీ కుండలు అన్న పదాన్ని వాడాడు “శశికాంతులలో చలివారిన' అన్న భావము మాతృకలో లేదు. అంతేలే అన్న తెలుగు విరుపు కేవలం శ్రీశ్రీది. అనువాద శబ్దపాటవం మాతృక శబ్ద పాటవానికి తీసిపోదు ఇదే సరళిలో అనువాదమంతా నడిచింది
“ఖడ్గసృష్టి సంపుటిలో ఆంగ్ల, ఫ్రెంచి, రష్యనుభాషలలోనుండి పెక్కు అనువాదాలు చేర్చబడినవి. డిలాన్ ధామస్ నుండి చేసిన అనువాదాలు, మాక్చీను “పుట్టని పాప ప్రార్ధన” మాతృకలకు మిక్కిలి సన్నిహితంగా వున్నవి ఆద్రెబ్రిత కవిత 163 21106465 90606216కు అనువాదం, 'ఛాయాభంగిమలు' - శెల్లవెంద్రుకల రివాల్వర్ అన్న సంకలనములోనిది. ఇందులో కూడా శ్రీశ్రీ వీలయినంత సమానొాంతరంగా ప్రయాణించాడు జీవితానికి ప్రాముఖ్యం యివ్వను అని మొదలుపెట్టాడు మాతృకలోని సీతాకోక చిలుకలను అనువాదకుడు పిపీలికాలుగా మార్చాడు శయ్యను శబ్దపాటవాన్ని పురన్మరించుకొని శ్రీశ్రీ తెలుగుభాషకనువైన పదజాలాన్ని సృష్టించాడు 'యుద్ధరంగం” అన్న ఖండిక 6011120006 4౦౦1110216 రచించిన 2016 లోని మొదటి భాగం. జోన్ అని నామకరణంచేసిన అనువాదం 2026లో ఆఖరు భాగం, గీగ్రం110206 మొట్ట మొదట 54గ63115) అన్న పదాన్ని ప్రయోగించాడు. 2016 అన్న కవిత క్యూబిస్టు కవిత్వానికి మంచి మచ్చుతునకగా పరిగణింపబడుతోంది క్యూబిజం అంటే వస్తువును అన్ని వైపులనుండి పరిశీలించడం, మాతృక పాశ్చాత్య జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. శ్రీశ్రీ మన నాగరిక జీవితాన్ని కవితావస్తువుగా పరి[గ్రహించాడు. 2016 మొదటి పాదము ఉన్నదున్నట్లుగా చెప్పాలంటే చివరికి పురాణ ప్రపంచంతో విసుగెత్తి పోయింది నాకు అని తెలుగులో అవుతుంది శ్రీశ్రీ కుళ్ళిపోయిన 'ప్రపంచమని, “నాకు బదులు నీకని' అనువదించాడు. 150] 0౪61 తెలుగులో కుతుబ్మీనార్ అయింది. (ఫెంచి కవి పాతను క్రొత్తదిగాను క్రొత్తను పాతదిగాను చమత్కరించాడు. పారిశ్రామిక దృశ్యాలు పురాతనమైపోయినట్లు కవి ఊహించాడు. కైస్తవ మతము మిక్షిలి ఆధునికమైనట్లు 9006 నాగరికత అందరినీ మించినట్లు చిత్రిస్తాడు. 31% 0౪6 గొర్రెలను కాస్తున్న స్త్రీవలె గోచరిస్తుంది సెయినునది మీద వంతెనలు గొట్టెలు అవి బాబా అని అరుస్తున్నట్లు భావిస్తాడు కవి. రోణంకి అప్పలస్వామి 15
శ్రీశ్రీ అనువాదాల్లోనేకాదు. స్వీయకవితలలో కూడా అతినవీనశయ్యలను ్రవేశపె ట్టాడు. ఈ విషయాన్ని గుర్తించడం అందరికీ సాధ్యంకాదు కవిత్వమెలకువలను చదవడంలో ప్రస్ఫుటం చేయడం ఒక విద్య పాశ్చాత్యభాషలలోని శయ్యలను శ్రీశ్రీ తెలుగులో సుసాధ్య పరిచాడు. ఈ సత్యాన్ని శ్రీశ్రీ కవితలను వినిపించి నిరూపించగలనని నా వినయపూర్వకమనవి.
రప్యను భాషతో నాకు పరిచయం లేదు. అయినప్పటికీ మయకోవ్‌స్కీ రచించిన “వ్లాడిమిర్ ఇల్యిచ్ లెనిన్” అన్న ఖండిక, పుష్కిన్ విరచిత “చలికాలపు ఉదయం” మధురాతి మధుర రచనలని చెప్పాలి. వీటి గమన నైపుణ్యం అనన్య సాధ్యం. సమూహగానం చేయించి ఇందలి శబ్ద తార్మికాన్ని భావనాపటిమను మిక్కిలి అమోఘమైనవిగాను, నవీనమైనవిగాను రుజువుచేయవచ్చునని నేను గుండెమీద చెయ్యి వేసుకొని చెప్పగలను 521౪2601 ౫]! ది ఒక శీర్షిక కద్దు ౨01 13142164 కవితలు కొన్ని వున్నవి వీటిని నేను చర్చించ బూనుకోను. అన్నింటిలోను తెలుగునానుడిని కవి విస్మరించలేదు. తెలుగు జాతి చైతన్యం కనుగుణంగా పదచిత్రణను మలచాడు. ఇక మిగిలింది “ఏవీ తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములుూు అన్న శీర్షిక దీనికి మాతృక (ఫ్రెంచి కవి *౪/1]108 పదునైదవ శతాబ్దంలో ననుకుంటాను రచించిన 9211266 463 620169 4) 1600052641 అంటే పూర్వము వాసికెక్కిన ప్రీల సంస్మరణ బలాద్ అంటే ఇంగ్లీషులోని 028126 కాదు. శ్రీశ్రీ ఈ గేయంలోని పల్లవిని మినహాయించి యితర నియమాలను పాటించలేదు. మనదేశ చరిత్రలో పేరువడసిన ప్రీలను పురుషులను కూడా పేర్కొన్నాడు. ్రెంచిలో పల్లవి 14215 00 '$016 165 96865 6 '2012 61 ఇల జార 16 500౪3 0 61౬ ౪628 కవితలో ఈ క్రింది చరణముంది,
0430026116, *1లంై6 3007641162 / సలం జం శల ౪18102 9076601222
ఇంగ్లీషులో అనువాదములో 420 ౧000ల ౪౧౮౭ 26 211 ల? అని వుంటుంది, ఈ చరణాన్నాధ్రారంగా శ్రీశ్రీ తన పల్లవిని పొందుపరచుకున్నాడు అయితే ఫ్రెంచిలోను, ఇంగ్లీషులోను ఈ కవిత ఏ విధంగా మస్తిష్కంలో బ్రమరగానం చేస్తూంటుందో అదేవిధంగా మరువరానిదిగా తెలుగులో మలచబడింది.
శ్రీశ్రీ తెలుగులో సాహిత్యరంగంలో ప్రవేశించడంతో వ్యావహారికభాష తిరుగు లేకుండా సాహిత్య భాషగా స్థిరపడిపోయింది ఈతని కవిత్వంలో భాషావిష్లవం పరాకాష్ట నందుకోవడమేకాకుండా భావవిప్లవం జయంగాంచిందని చరిత్రలో సువర్దాక్షర లిఖిత మయి తీరుతుంది ఇందుకు సంబంధించిన శ్రీశ్రీ సుభాషితాన్ని పునశ్చరణ చేయడం యీ వ్యానానికి సరియైన ముగింపు.
మనఃప్రపంచానికి బాహ్యస్వరూపం భాష / భాషా విష్లవమనే భావ విప్లవం/అందుకే ఈ ఆనంద సమయంలో / భాషలోనూ భావంలోనూ విప్లవం తెచ్చిన (మహా మానవులైన / మన గిడుగు, గురజాడ, వీరేశలింగం / మహానీయులను/ నా మనఃఫలకం ముందు సాక్షాత్మరింపజేసుకొని/ నమస్కరిస్తున్నాను / వారిచ్చిన ఆశీర్వాదాలు / తీర్చిదిద్దిన ఒరవడులు /చిరకాలం మన ఆంధ్రాననికి /శ్రీరామరక్ష /దేవతలౌ మానవులే దీవించాలి /దేశంలో దేవత్వం దీపించాలి
(ముద్రణ: సృజన మాసపత్రిక (14), ఫిబ్రవరి, 1970 ) 16 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
నేటి సాహిత్యంలో శీత ఉముఖ స్తానం ఖ ముప్పైయేడులోనో ముప్పైయెనిమిదిలోనో నాకు సరిగా జ్ఞాపకం లేదు. శ్రీశ్రీ ౮1360౧1200 రచించిన 15100" 053606211510, ఉ౧66 919101 వెలువరించిన వఏ్లం621- 1560/2016510 ఒక చేత నిడుకొని విజయనగరం వచ్చాడు నేను, చాగంటి సోమయాజులు, నారాయణబాబు శ్రీశ్రీ కలిసి ఈ పుస్తకాలు చదువుతూ అందులోని విషయాలు చర్చిస్తూ మూడు రోజులు సాహిత్య వీధుల్లో ఉద్వేగ పూరితమై కాలహరణం కావించాము, నాలుగవ దినము నేను మా వూరికి పయనమయ్యాను నాతో శ్రీశ్రీ, సోమయాజులు స్టేషన్‌కు వచ్చారు. వెయిటింగ్ రూములో కూర్చొని మాట్లాడుతూ వుండగా నేను 57120406 పదాలతో చేసిన ఇంద్రజాలాన్ని గూర్చి ముచ్చటిస్తూ 11076 ౪66 ౪4 006 [ంక6 15, ఖర 1 ౪౬6 1206 16 1628 అన్న ఖండికను పాడనారంభించాను నేను. శ్రీశ్రీ అపుడు తన 'అద్వైతం' అన్న ఖండికను నాకు విన్పించారు. అనుకరణ 51004006 మాతృక కంటే బాగుందని శాసించడమే కాకుండా ఎవరినో కలమడిగి నా చేతనున్న ఒక ఆంగ్ల కవితా సంకలనం 51) 162 మీద శ్రీశ్రీ చేత స్వీయ ఖండికను వ్రాయించుకొని తదుపరి కంరస్తం చేస్తేనేగాని తనివి తీరలేదు. ఆ రోజుల్లో శ్రీశ్రీ ప్రతిభను గుర్తించిన వారు చాలా తక్కువమంది మాత్రమే. వారిలో ప్రధమ శ్రేణికి చెందినవాణ్ని నేనని సగర్వంగా చెప్పుకోగలను. ఎందుకు శ్రీశ్రీ మీద మీకింత మోజు అని అడిగిన వారికి నా సమాధానం చెప్పడం అవసరం. రెండు పేజీలకు మించకుండా ఈ ప్రస్తావన ముగించవలసిన స్థలాభావ పరీక్షను తట్టుకోవడం సాధ్యం కాదేమో, సరే ప్రయత్నిద్దాం తప్పనిసరి అయేపుడు ఆదేశోల్లంఘనం చేద్దాం. శ్రీశ్రీ 'అద్వైతం' నాకొక గుణపారాన్ని నేర్చింది. తెలుగు భాష పాశ్చాత్య భాషలలో దేనికీ కూడా తీసిపోరు. ఎంత సంక్షిష్టమైన భావ ప్రకటనయైనాసరే తెలుగులో మలచ వీలవుతుంది. ఆంగ్ల భాషలోవలె రెండు జాతుల పదజాలాలు తెలుగువారి జన్మసొత్తు ఈ గుజాతిశయం హిందీ భాషకుగాని ఫ్రెంచి భాషకుగాని లేదు. హిందీ వారు ఉర్జూనుంచి వచ్చిన పారసీక అరబ్బీపదాలను త్రోసిపుస్తున్నారు. ఇది భాషకపచారమే కాగలదు. ఎవరూ నమ్మవీలుకాని విధంగా పందొమ్మిదవ శతాబ్ద పంచమ దశాబ్దము మొదలుకొని (ఫెంచి కవిత పరవళ్లు తొక్కుతూ ఇరవదవ శతాబ్దంలో ఆంగ్ల కవితకు ఒరవడి పెట్టడం మొదలిడింది గదా, అలాంటపుడు తెలుగువారికేమి కొదువ, అని నేను పరవశించాను తెలుగులో చాగియున్న సామర్థ్యాన్ని చేవను శ్రీశ్రీ తన కవితలో బహిర్గతపరిచారు. “మహాప్రస్థానం పుస్తకరూపం ధరించక పూర్వమే అన్ని శీర్షికలను చదివి అతని పదాలు పొదిగే నేర్పును విద్యార్థులకు పంచిపెట్టాను రోణంకి అప్పలస్వామి [7
రెండవ మహాసంగ్రామ కాలంలో సామ్యవాదులు శ్రీశ్రీకి బ్రహ్మరధం పట్టడం ప్రారంభించారు. సినిమాపాటల ద్వారా నేడు శ్రీశ్రీ ఆబాలగోపాలానికి ఆప్తడయ్యాడు సాహిత్య రంగంలో శ్రీశ్రీ ప్రవేశానంతరం వ్యావహారిక భాష తిరుగులేకుందా స్థిరపడిపోయిందంటే ఎంతమాత్రం అతిశయోక్తికాదు వాడుకలోని తెలుగు పదాల్ని వాడుతూ దీర్హ సమాసాొల్ని విసర్జిస్తూ సంస్కృత పదాలకు తెలుగు విరుపులు వినూత్న భావోద్రేకాన్ని చేకూర్చగలవని నిరూపించాడు. 'హసిస్తుందా' *రహిస్తుందా"” 'పరిష్షవిస్తూ “పరిక్షమిస్తూ' లాంటి ప్రయోగాలు చేసేందుకు అతనికిముందు సాహసించినవారు లేరు. సర్వసాధారణంగా భావుకత భాషకు బానిసగానే వుంటుంది శ్రీశ్రీ మాత్రం భాషను భావుకతకు బానిసను చేసి వేశాడు. తెలుగులో పదిహేడు విధాలైన ప్రాసలున్నవి. వ్యావహారికంలో వీటన్నింటినీ శ్రీశ్రీ ప్రదర్శించగలడు. అనునిత్యం వాడే మాటలలోని శ్లేషార్ధాలతో గారడీ చేయగలడు సమకాలిక వైజ్ఞానిక చైతన్యపాటవం, ఇంద్రియ ప్రతిచలన ప్రత్యేకత లేదా వినూత్నత తెలుగు భాషకతీతం కాదని రుజువు చేశాడు గేయ రచనకు వచన కవితకు బిగువైన పునాదులు నిర్మించాడు. ఐతిహాసిక, ప్రాబంధిక తెలుగు గొప్పది కాదని యెవరనగలరు. కాని కృతకమని నిత్య జీవితానికి మిక్కిలి దూరమైపోయిందని చెప్పక వీలులేదు. ఈ సత్యాన్ని చిన్ననాటే శ్రీశ్రీ (గ్రహించి ఉగ్గుపాలతో సంక్రమించిన (గ్రాంధికానికి విడాకులిచ్చి వ్యావహారిక ఆటవెలదిని చేపట్టాడు. (ప్రజానీకానికి సన్నిపొతుడయ్యాడు. పాతపదాల్ని సానపట్టి కొత్తరంగులీనేటట్టు చేశాడు. మూడుయాభైలతో పరితలను ఉ(గ్రూతలూగిస్తూ సాటిలేని రీతిగా సామాజిక విమర్శచేసి చూపించాడు. 'సిరిసిరిమువ్వ' శతకం యాఖభైయైదు కందాలు పండితులనవి ఆశ్చర్యచకితులను చేస్తవి. ప్రాసక్రీడలు, 1106౧013 ను పోలిన లిమరుక్కులు నూతన లలిత ఛందస్సులను ప్రవేశపెట్టి అందలి ఉల్లేఖనా పాటవాన్ని వేయినోళ్ల చాబుకున్నవి
'ఖద్దసృష్టిలోని కళాకౌశలం నిశ్చయంగా అనన్యసాధ్యం విద్యను గూర్చిన భర్తృహరి నిర్వచనం శ్రీశ్రీ కవితకు తప్పక అనువర్రిస్తుంది
కల్పాంటేష్వతిన ప్రయా విధనం / శ్రీశ్రీ కవితాఖ్యమిదమ్ ధనం
అని చమత్మరించేందుకు సమర్ధించేందుకు సాహసిస్తున్నాను శ్రీశ్రీ యుగపురుషుడు.
మహాకవి. వాగనుశాసనుడు. వాగ్గేయకారుడు కలంపట్టి మహాసంకల్పించి తెలుగు భాషా సుస్యందనాన్ని భూమార్గం పట్టించిన తెలుగుజాతి పాలిటి భవిష్యద్దర్శ్భక మహావీరుడు
1 జన్మసొత్తు ఈ దుష్టసమానం అవసరమని తోచింది 'జన్మహక్కు కూడా దుష్టసమానమే
- ఈ నామవాచకాన్ని క్రియారూపం చేశాను మహా సంకల్పం. ఈ మంత్రాన్ని పురోహితులు వివాహంలో జపించడం హైందవ సాంప్రదాయం శ్రీశ్రీ 'ఖడ్గసృష్టి'లో మహాసంకల్పం ఒక ఖండిక.
(జ్యోతి మాసపత్రిక, 1970 జనవరి)
18 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
ఇ౭ంచటపతరంపరను జాతి చైతన్వంలో జీర్లింపజేసిన ప్ శేబ్ద బ్రహ్మ
నేను ఉన్నతవిద్య నభ్యసించే రోజుల్లో ఆంగ్లంలో కవితలల్లడంలో నిమగ్నుదనై వుండేవాన్ని ఎం ఏ.,పాపైన తరువాత ఒకనాడు నరసన్నపేటలో మండపాక పార్వతీశ్వరశాస్రి గారు నాముఖంలోని పరవశతను సహోపాధ్యాయులకు వ్రేలెత్తిచూపి నేను శ్రీశ్రీని జ్ఞప్తికి తెస్తున్నానని మొదలిడి శ్రీశ్రీని పరిపరి విధాలా ప్రశంసించారు ఇదెన్నటికీ మరువరాని సన్నివేశం.
1934-35లో శ్రీరంగం నారాయణబాబు,చాగంటి సోమయాజులు,నేను కలసి కవిత్వంలోని వినూత్నరీతులను విమర్శిస్తూ వుందేవాళ్లం, నారాయణబాబు ఒకనాడు కొత్తగా వెలువడిన 'వైతాళికులనే కవితాసంకలనాన్ని నాచేతికి అందించాడు. అందులోని శ్రీశ్రీవి రెందేరెండు శీర్షికలు, “సుష్తాస్టికలు, 'జయజఖేరి' నన్నమితంగా ఆవేశపరిచాయి. అందలి అనన్య సాధ్యమైన రచనాసంవిధానం నన్ను ముగ్భణ్ని చేసింది. మరికొద్ది రోజుల్లో “జ్వాలిలో 'మహాప్రస్థానం' సాక్షాత్మరించింది. తెలుగు భాషలో జీవనాడి ప్రతిస్పందన అందులో పరవళ్లు తొక్కింది.
ఒకటి రెండు సంవత్సరాలు గడిచాయి. శ్రీశ్రీ విజయనగరం ఆగమించాడు. నారాయణబాబు, నేను, చాగంటి సోమయాజులు ఆతనికి ఆతిధ్యాన్నిచ్చాం. మేము తప్పించి యెవ్వరూ శ్రీశ్రీని గుర్తించలేదు శ్రీశ్రీ తీసుకొని వచ్చిన గాస్మ్కాయిన్ రచించిన 'సర్రియలిజం' చరిత్ర సర్రియలిస్టు మానిఫెస్టోనొక దానిని అధ్యయనం చేసి చర్చించాం. అప్పటికే నేను ప్రాయిడ్ను కొంతవరకు చదివి వుండడంచేత అధివాస్తవికతలోని వెర్రి మమ్ములను ఉర్రూతలూగించింది నాలుగైదురోజులు గడిచాయి. నేను మా వూరికి ప్రయాణం కట్టాను. ముగ్గురు స్నేహితులు నాతో స్టేషన్‌కు వచ్చారు వెయిటింగ్ రూమ్‌లో స్విన్నర్ను కవితనొక దానిని నేను వెర్రిగొంతుక విచ్చి మైయడంతో శ్రీశ్రీ ఆంగ్ల కవితకు ప్రతిరూపమైన తన అద్వైతగీతాన్ని విన్సించాడు. నా ఆవేశం అతి తారా స్థాయినందుకొంది నా పుస్తకాలలో, నా పేరుకూడా వ్రాయనొల్లని నేను నా చేతనున్న పుస్తకం 'ప్లయ్లీఫ్ మీద ఆ గీతాన్ని వ్రాయించి కంరస్టం చేశాను
రెండవ ప్రపంచసంగ్రామ ప్రారంభదశలో నేను విజయనగరం కళాశాలలో అధ్యాపకవృత్తిని స్వీకరించడం సంభవించింది. రెండుమూడుసార్లు శ్రీశ్రీతో పారస్పర్యాన్ని నేర్పాను. ఇద్దరం కలసి ఇంగ్లీషు ఫ్రెంచి కవితలను కొన్నింటిని సరియైన శయ్యలలో ఆలపించాం.
నలఖైలలో కమ్యూనిస్టు పార్టీ వారు శ్రీశ్రీ విప్లవ బుషిత్వాన్ని గుర్తించి 'మహాప్రస్థానం'
రోణంకి అప్పలస్వామి 19
“దేశచరిత్రలు “ప్రతిజ్ఞ అనే కవితలను సభలలోను, ఊరేగింపులలోను ఆవేశంతో గానం చేయడంతో శ్రీశ్రీ పేరు ఆబాలగోపాలానికి పరిచితమైంది తదుపరి శ్రీశ్రీ సినీ పాటలలోని కవిత్వగుణం ప్రజాహృదయాల్ని చూరగొని రచయిత నామధేయాన్ని ఇంటింటా వాడవాడలా ప్రతిధ్వనింపచేసింది.
పిన్ననాటి నుండి ఈనాటి వరకూ శ్రీశ్రీ కవిగానే జీవించారు సంస్కృత, తెలుగు సాంప్రదాయాలను ఆకళించుకొని ఆధునిక పాశ్చాత్య భావపరంపర జాతి చైతన్యంలోకి జీర్ణింపజేసిన మహామనిషి అని ఖ్యాతిని గడించుకున్నప్పటికీ నమతనేమాత్రమూ విడనాదని నిత్యయవ్వనుడు. యువత దశలో విప్లవాన్ని వరించి కాలక్రమేణా పలాయనాన్ని చిత్తగించిన వారసంఖ్యాకులు అరవైయయిదవయేట కూడా శ్రీశ్రీ వైష్లవ్యస్థాయి పెరిగిందేకాని క్షీణించ లేదు. ఇది ఇతని ప్రత్యేకత,
త్రీశ్రీ చిరకాలం బతకాలని ఆకాంక్ష ఛాందసాన్ని పరిమార్చగల నానుడిని ఈయన సాధించాడు. మున్ముందు భాషా విషయికంగా, సామాజికంగా విప్లవ వ్యతిరేకత తలెత్తకుండా (ప్రజానీకాన్ని జాగరణ మొనర్చగలిగే తన వాక్చటిమను సానపెట్టుకుంటూ అభ్యుదయపధంలో ప్రయాణిస్తారని నా ఆశ,
(ముద్రణ :; 1970 ) నవ్యకవిత్వం సాగిస్తున్న గవేషణ శ్రీశ్రీ సేయ రచన ఉపస్యాసభూయిష్టము. కదనకుతూహల సముపేతము వ్యవహారిక భాషకు గ్రాంధిక భాషల హంగులనన్నింటిని పుణికి పుచ్చుకొని తొడగగలిగిన మహాభాగ్యశాలి సాధారణ కవుల భావుకత భాషకు బానిసత్వం మాజ్రమే చేస్తుంది. శ్రీశ్రీ తన భావుకతకు భాషను బానిసను చేసివైచిన ఖడ్గతిక్కన. నిస్సందేహంగా మహాకవి. విప్తవాన్ని చేపట్టి యువతరం వారిని ఉత్తేజితులను ఉద్వేగపూరితులను చేసి కవితను నిత్యావసర వస్తువులలో నొకటిగా వరిగణింపచేశాడు పాశ్చాత్య భావపరంపరను తెలుగుజాతి సహజసంపదగా వెలయించి తన తరువాతవారి నరనరాల్లో జీర్ణింపచేశాడు. ప్రాసక్రీడలు, లిమరుక్కులనే సహజవిమర్శనాత్మక ప్రక్రియలను సృష్టించి పెట్టాడు ఇవి యాతని ప్రత్యేకాధిక్యతలు కొంపెల్ల జనార్ధనరావు నిర్యాణాన్ని విలపించే శ్రీశ్రీ వచన కవిత నేర్చరితనమనల్పము
ఇప్పటి వారికి కూడా శిరోధార్యము. దానిలో “దొంగ లంజకొడుకులసలేమెసలే ధూర్తలో కంలో అనే ప్రయోగము ఎవరు ఈసడించుకున్నా సందర్భశుద్ధితో కూడిన ప్రశంసార్హ ప్రయోగమని చెప్ప శంకించనవసరం లేదు. ( ఆకాశవాణి ప్రసంగవ్యాసం (1964-65 మధ్య ) ముద్రణ: ఆంధ్రజ్యోతి వారపత్రిక, 26-08-1971 ) 20 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
నేనెరిగిన శ్రీశ్రీని గురించి ఇంతకుముందు ఇతరత్రా రాయడంవల్ల ఇంకా రాయడం చర్విత చర్వణం అవుతుంది ఈనాడు ఆంధ్రులంతా ఒక్కుమ్మడిగా శ్రీశ్రీని మహాకవిగా గుర్తించడం నన్ను ఆనందపరవశుణ్జి చేస్తుందంటే ఏమాత్రం అతిశయోక్తికాదు. 35 సంవత్సరాల క్రిందటనే శ్రీశ్రీ యుగపురుషత్వాన్ని గుర్తించానని చెప్పేందుకు గర్విస్తున్నాను. 1970 సం॥లో విశాఖపట్నంలో శ్రీశ్రీ షష్టిపూర్తి సభల అనంతరం శ్రీకాకుళంలో శ్రీ తిమ్మరాజు శివరావు ఆధ్వర్యాన శ్రీశ్రీని సన్మానించారు. అనేకమంది స్వీయ కవితలను చదివేరు. మరికొందరు సుదీర్ధంగా ప్రసంగించారు మూడు గంటల తరువాత సభలోనున్న నన్ను పిలిచి మాట్లాడమన్నారు నేను శ్రీశ్రీకి మహాకవి అనిపించుకొనేందుకు ఉన్న అర్దతలను గూర్చి రెండు గంటల సేపు ఉపన్యసించవలసి వచ్చింది.
రెండవ ప్రపంచ మహాసం[గ్రామం ఉధృతంగా ఉండే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీవారు గురజాడ వారినీ, శ్రీశ్రీని బాగా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. నలఖైలలోవీరిద్దరి కవితలను బృందగానం చేసి ప్రజానీకాన్ని ఉత్తేజ పరిచారనడం సత్యదూరంకాదు. ఈనాడు గురజాడ, శ్రీత్రీ ప్రవేశపెట్టిన కవితారీతులు అనుసరణీయంగా పరిణమించాయి. వృత్తాలు, పూర్వపు తెలుగు ఛందస్సులు వెనకబడ్డాయి. దీనికి కారణం ఏమైవుంటుందని మనం ఆలోచిస్తే తెలుగు నుడికారం ్రీల పాటల్లోనూ, జానపద గేయాల్లోనూ, మనం వెనుకబడిన తరగతులనుకొనేవారి వేదాంతపరమైన తత్త్వాల్లోనూ జీర్ణించుకొని ఉండటం అని చెప్పాలి. ప్రజాఛందస్సులను గురజాడ విస్మరించలేదు. శ్రీశ్రీ గురజాడ కంటే ముందుకు పోయి అసలు సిసలైన తెలుగు నడకలను తన వశం చేసుకోగలిగాడు. యడ్ల రామదాసు రచించిన తత్త్వాలలో జాతిపరమైన ఈ తెలుగు నడకను పరిశీలించండి
చూడచక్కని చిన్నది / కడ మేడ గదిలో నున్నది
పాశ్చాత్య భాషల్లోవలె తెలుగులో సహజసిద్ధమైన అంత్యప్రాస ఆదినుంచీ ఉంది. ఈ తెలుగుదనాన్ని గుర్తించి శ్రీశ్రీ పాత ఛందస్సులను పరిత్యజించి, అంత్యప్రాసను విరివిగా వాడి యమక గమక సమన్వితమైన ప్రజాఛందస్సులను మలిచాడు. సమకాలీన తెలుగు భాషలో అచ్చతెనుగు పదజాలం చాలా మటుకు హరించుకుపోయింది
దానికి బదులుగా సంస్కృతపదజాలం చోటుచేసుకుంది. పూర్వకవులు దీర్చ సమా సాలను వాడటంవల్ల ఈనాడు వారి కవిత్వం సంస్కృతభాష వచ్చినవారు మాత్రమే అర్ధం చేసుకోగల పరిస్థితి ఏర్పడింది. శ్రీశ్రీ సంస్కృత పదాలను తెలుగు విరుపులతో జన సామాన్య భావోద్వేగాన్ని ప్రజ్వలింపజేయగల నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఇంతటితో తెలుగు కవిత ప్రజల భాషకు అనువైన పుంతలను ఏర్పరచుకొందని చెప్పవచ్చు. రోణంకి అప్పలస్వామి 21
1980 మార్చి 2వ తేదీన కాకినాడ నగర వాసులు మహాకవి డెబ్బెయవ జన్మదినోత్సవాన్ని జరప నిశ్చయించడం తెలుగు వారందరికీ ఆనందదాయకం. కాకినాడ సాంస్కృతిక జీవనానికి ప్రాతినిధ్యాన్ని వహించేవారికి గర్వకారణమైన చారిత్రక సంఘటన కాగలదు. శ్రీశ్రీ కంటే ఆరుమాసాలు అధిక వయస్కుడనైన నేను శ్రీశ్రీని హృదయపూర్వకంగా అభినందించడమేకాక “దీర్దాయుష్మాన్భవి అని ఆశీర్వదిస్తున్నాను (ముద్రణ ; మహాకవిశ్రీశ్రీ అభినందన సంచిక, 70వ జన్మదిన మహోత్సవాలు,కాకినాడ, 08-02-1980)
ఠి అలీ ధో
తెలుగు కవిత్వంలో సింబలిస్టు ధరణి
తెలుగు భావకవులెవరూ ఫ్రెంచి సింబాలిజానికి లోనుకాలేదు. అభ్యుదయకవి శ్రీశ్రీ సింబాలిజం గురించి కొంత తెలిసినవాడైనప్పటికీ గురజాడననుసరించి అభ్యుదయ మార్గాన్నే (ప్రయాణించాడు. అయితే శ్రీశ్రీ కృతులు కొన్ని సింబలిస్టుకోవకు చెందినవే. “అద్వైతం'లో స్విన్బర్న్ను అనుసరించాడు. స్విన్‌బర్న్ కవిత, శ్రీశ్రీ కృతి పదార్థానికి అతీతం ఈ రెండు ఒక వ్యక్తి మానసిక స్థితిని పరితలో రేకెత్తించ నుద్దేశించినవి. ఇవి ఏమాత్రం తాత్పర్యానికి లొంగవు.సంగీతం శ్రోతలలో (ఢ్రేరేపించే భావపరంపరను పోలిన అవ్యక్తానుభూతుల్ని ప్రజ్వ లింపజేస్తాయి 'నిజంగానే),“ఒక రాత్రి,'జయభేరి,'సుష్తాస్టికలు'-సింబలిస్టు కవితలే. 'జగన్నాధ రధచక్రాలిలోనూ “మహాప్రస్థానంలో కూడా ఇతోధిక సింబలిస్టుధోరణి గర్భితమైవుంది.
(ముద్రణ: 'రాజకమలం' (శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్, మద్రాసు ప్రత్యేక సంచిక 1981)
22 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
రోణంకి ధనుష్టంకారం పురిపండావారు దివంగతులవడం చాలా విచారకరం. మనమేమి చేయగలం ఎవరూ వుండిపోయేది లేదు. “విముఖాబాంధ వాయాంతి ధర్మస్త మనుగచ్చతి” అన్నారు పెద్దలు.
శ్రీశ్రీ విషయం చర్చకు వచ్చేటప్పుడు నిజం చెప్పాలంటే అతను తప్పు చేశాడు. నారాయణబాబు చచ్చిపోయేటప్పటి నుంచి అతనిని తిట్టిపోస్తూనే వున్నాడు ఈ శతాబ్దాన్ని గురజాడవారిదనడం న్యాయం. శ్రీశ్రీయే “గురజాడ జాడ నా జాడి అని వాక్రుచ్చాడు ఇప్పుడు నేనే ఆధునిక సాహిత్య జనకుడనని అనడం న్యాయబద్ధం కానేరదు. వేగుంట, శ్రీశ్రీ లిద్దరిని సాహితీ పురుషులందరు నిక్కచ్చిగా నిరసించడం అవసరమని నాకు తోస్తోంది. ఆరుద్రను నారాయణబాబు కవితా సంకలనాన్ని వెలువరించినప్పటి నుంచి శ్రీశ్రీ దూషించడం మొదలెట్టాడు ఇరవయి (20) సంవత్సరాల కిందట 'ఆరుద్ర మంచి కవిత్వం రాస్తున్నాడు. నేను మరి రాయనవసరంలేదు' అన్న మహా పురుషుడు శ్రీశ్రీ.
ఆరుద్ర శ్రీశ్రీకి ఆప్తబంధువు అయితే విసిగిపోయాడు. సోమసుందర్ పుస్తకానికి పీరిక రాయడం సంభవించింది. శ్రీశ్రీ తప్పులు వెదికి వెదికి విమర్శించాడు అయితే ఒక విషయం శ్రీశ్రీ నా కిప్పటికీ యిష్టుడేనని చెప్పాలి నన్ను దూషించినప్పటికీ అతను మహాకవి అని నేనంటాను. దురదృష్ట మేమిటంటే అతని బెద్ధత్యం ఎవరెస్ట్ శిఖరాన్ని మించిపోయింది.
చాలాకాలం కిందటే నేను సాహిత్య జనకుడు గురజాడగాని శ్రీశ్రీ కాడని సుదీర్హ పత్రికా ప్రకటన చేశాను. 'ఆంధ్రజ్యోతివారు, 'ఆంధ్రప్రభివారు ప్రకటించలేదు. 'వశాలాంధ్రివారు పత్రికా ప్రకటనగా వెలువరించారు. 'ఆంధ్రపత్రిక, 'ఈనాడు లేఖగా ప్రచురించారు.
శ్రీశ్రీతో ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు ఎవరిని దూషించవద్దని హెచ్చరిం చడం ఇది నా సలహాగా భావించండి.
(“ఆంధ్రజ్యోతి వారపత్రిక = 17-12-1982 )
రోణంకి అప్పలస్వామి 23
శ్రీశ్రీ రోణంకి వివాదం
శ్రీతీ 'హుంకారాని'కి ఇది నా జవాబు. నేను భయపడి జవాబివ్వడం లేదని ఆబాలగోపాలం అంటున్నారు. ఇందులో మీ బాధ్యత కూడా వుందని మీకు తెలుసు
హుంకారమన్న ప్రయోగం శ్రీశ్రీదో కాదో తెలియదుగాని, ధనుష్టంకారమన్నది నా ప్రయోగం కాదు. దూదేకుల సాయెబు చేసేపని నాకు చేతకాదు. వ్యక్తులను దూదేకడం, దూషించడం నా బోంట్లకు తగనిపని నాకు చాలాకాలం నుండి శ్రీశ్రీ అంటే ఇష్టం ఇప్పటికీ నాకు ఇష్టమేనని చెబితే శ్రీశ్రీ నమ్మాలి. నాకు శ్రీశ్రీతో ఎందుకు పేచీ వచ్చిందో, నేను పత్రికా ప్రకటన చేసినప్పటి నుంచి అందరికీ తెలిసిన విషయమే శ్రీశ్రీ, గురజాడ “ఆధునిక సాహిత్య జనకుడు కాదనడం ముమ్మాటికీ అసత్యం. ఇంగ్లీషులో చెప్పాలంటే & ౧1౫112] [1181102600 0౯ ౧135006 గురజూడ జనకుడనడానికి తగిన కారణాలున్నాయి. అతనిని పందొమ్మిదవ శతాబ్దపు కవి అనడం అసందర్భం 1910లో “ముత్యాల సరాలు మొట్ట మొదట ప్రచురితమయ్యాయి. ఇదిలావుండగా, అతను 19వ శతాబ్దము వాడైనాసరే “జనకుడు కాదనడానికి వీలుపడదు. అతను ఆధునిక కవిత్వం తీసుకోవలసిన పుంతను ఏర్పరచిపెట్టేడు వాడుకభాషను, అంటే వ్యావహారిక భాషను ్రవేశపెట్టేడు మానవాభ్యుదయాన్ని నిక్కచ్చిగా వరించాడు. వసుధైక కుటుంబాన్ని దర్శించాడు పాత ఛందస్సులను వరించి భావకవిత్వాన్ని రచించిన శ్రీశ్రీ గురజాడవల్ల ప్రభావితుడై కొత్త ఛందస్సులను, అభ్యుదయ భావ పరంపరను అలవర్చుకున్నాడు. గురజాడ ఒరవడి వినా శ్రీశ్రీ భావకవిగా మిగిలిపోయి వుందునేమో!
(ఫెంచి మహాకవి బోడ్లేర్ను తీసికుందాం అతను 1866లో చనిపోయాడు 20వ శతాబ్దంలో ఎలియట్్ పౌండ్లకాలంలో బోగ్లేర్ ఆధునిక ఐరోపీయ సాహిత్యానికి 'జనకుడిని పేరు పొందేడు. గురజూడ 20వ శతాబ్దంలో కూడా జీవించాడు జీవించి వుండకపోయినా అతనే ఆధునిక సాహిత్య జనకుడనకతప్పదు.
శ్రీశ్రీ తానే 'గురజాడ జాడ నా జాడుఅని చెప్పుకున్నాడు గురజాడను గురించి విపుల వ్యాసరచన కూడా చేశాడు. గురజాడ టాగూర్ కంటే గొప్ప కవి అని తానే కుండబద్దలు కొట్టినట్లు ధృవీకరించాడు. ఆంగ్ల సాంప్రదాయం ప్రకారం గురజాడనే జనకుడని తీరాలి వేగుంటకి 1236 అన్న పదానికి సరైన అర్థం తెలిసినట్లు లేదు. తెలిసివుంటే బుద్ధి పూర్వకంగా (ల అని ప్రయోగించడు. శ్రీశ్రీ కవిత నాకు అపరిమితమైన ఇష్టం. ఆంగ్ల ఛందస్సులను తెలుగుభాషకి తగినట్లు మలచగలిగాడు పాశ్చాత్య భావపరంపరను తెలుగు వారికి తెలుగు భావపరంపర అనేటట్లు చేయగలిగాడు. నేనీమధ్యన విశాఖపట్నంలో ఇద్దరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు 'ఆనందం అర్జవమైతే? అన్న కవిత కవిత్వమాకాదా అని ప్రశ్నిస్తే వారు కవిత్వమనే 24 శబ్దదబ్రహ్మ శ్రీశ్రీ
ఒప్పుకున్నారు. అప్పుడు ఏ కవిత్వమైతేనేం భావ కవిత్వమైతేనేం. విప్లవ కవిత్వమైతే నేం, కవిత్వమనేటప్పుడు కవిత్వమని ఒప్పుకోవాలి అని గట్టిగా అన్నాను వారి చేతనే గురజాడ ఆధునిక సాహిత్య జనకుడని ఒప్పించాను. శ్రీశ్రీని ఒప్పించడం మీరు చేయవవలసిన పని అని హెచ్చరించాను. వారు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు తెలిసి అబద్ధమాడ నిశ్చయించిన వారిని ఎవరు మార్చగలరు?
నేను శ్రీశ్రీ భక్తుడను గాని, నారాయణబాబు భక్తుడనుగాని కాను నారాయణబాబు కవి అనేవారినందరినీ నారాయణబాబు భక్తులనడం భావ్యం కాదు శ్రీశ్రీ నారాయణబాబును 400౯55 ౧06 అనడం సహృదయులెవరూ హర్షించరు. నారాయణబాబుని మాటమాటికీ తన సమాధానాలలో అవసరం లేకుండానే దూషించడం ఎందుకు చేస్తున్నట్లు?
పేరు ప్రతిష్టలకు ప్రాకులాడే మనిషిని కాను నేను. భూవలయం సూర్యకుటుంబంలో ఒక చిన్న గ్రహం మాత్రమే. సౌరకుటుంబం మన 8॥1జ0/లో అత్యంత చిన్నభ్రాగం. ఇట్లాంటి 8922 లు కోటానుకోట్లు విశ్వాంతరాళంలో వున్నట్లు ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం భూ వలయంలో తెలుగు ఒక భాష భాషలనేకం. శ్రీశ్రీ, నారాయణబాబు, ఆరుద్రలను దూషించి పేరుప్రతిష్టలను సంతరించుకోలేడు. పాశ్చాత్య భాషలలో నా శేముషిని శ్రీశ్రీ ఒప్పుకుంటు న్నాడు. నేను గ్రీకు, లాటినూ, ఫ్రెంచి, జర్మనూ, ఇటాలియన్, స్పానిష్ భాషలను అభ్యసించడం నిజం. సంస్కృత శ్లోకాలు, తెలుగు పదాలు ఆలపిస్తే శ్రోతలు నాకీ రెండు భాషలూ అనర్గళంగా వచ్చునని అనుకుంటారు. అది నిజం కాదని నాకు తెలుసు. నిజం కాదని నేను చెప్పినా శశోతలు నమ్మడంలేదు. నా పాండిత్యాన్ని శంకిస్తున్న శ్రీశ్రీకి నా కృతజ్ఞత చెప్పుకోవచ్చు. నేను, శ్రీశ్రీ, మరెవ్వరూ సర్వజ్ఞులం, సార్వత్రికులం, సార్వకాలికులం కాము. కాలము ఈ విశ్వాంతరాళాన్ని దర్శించడానికి ప్రయత్నిస్తే ఊహాతీతం. ఊపిరి ఆగిపోయినట్లనిపిస్తుంది మన అహంకారం మటుమాయమతకుంది. నా మాట విని శ్రీశ్రీ నారాయణబాబు ఆరుద్రల విషయం ఎత్తుకోవడం మంచిదికాదు ఎవరినీ తిట్టడం మానివేయాలి. అతని ప్రస్తుత ధోరణి అతని పేరుప్రతిషస్టలకే భంగకరం. నారాయణబాబును తిడుతూవుంటే శ్రీశ్రీలో లేనిది నారాయణబాబులో వుందని పారకులనుకుంటే తప్పేముంది? నారాయణబాబు నిస్సందేహంగా అభ్యుదయవాది, 110 006గాని [35 గ౦6గాని కాడు అలా శ్రీశ్రీ అంటే సహృదయులు ఒప్పుకోజాలరు. ఈ సత్యాన్ని శ్రీశ్రీ గుర్తించడం అవసరమని నా హెచ్చరిక. శ్రీశ్రీ నారాయణబాబు పరువుప్రతిష్టలు అధికకరం అవడం ఖాయం నారాయణ బాబుకు పదచిత్రణాకాశలం కాక, విగ్రహకల్పనా పాటవం మెండుగా వుంది. అతనిని దూషించడం విడిచిపెట్టకపోతే శ్రీశ్రీ పరువుప్రతిష్టలు తగ్గడం తధ్యం.
20వ శతాబ్దం నిర్ద్వంద్వంగా గురజాడది. శ్రీశ్రీది కానేరదు. ఇప్పటి కవులందరూ గురజాడకు రుణపడి వుండడంచేత, నిస్సందేహంగా గురజాడ ఆధునిక సాహిత్య జనకుడు ఇలా నేననడం శ్రీశ్రీ అన్నట్లు నా అవగాహనాలోపం కాదు. శ్రీశ్రీ 'ఈశతాబ్దం నాది" అని గొంతు చించుకోవడం తన మితిమీరిన జెద్ధత్యజనితం.
(ఆంధ్ర జ్యోతి వారపత్రిక, 1983 ?) రోణంకి అప్పలస్వామి 25
విమర్శలకు జవాబు నన్ను విమర్శించినవారికి, ఇకమీదట నన్ను విమర్శించనెంచిన వారికి ఇదే నా సమాధానం. నేను జె వెంకటేశ్వరరావు, కుమార్, టి, ఎల్.కాంతారావుగార్ల ఉత్తరాలను జాగ్రత్తగా చదివేను. వారందరికీ సవినయంగా నా సమాధానాన్ని అందజేస్తున్నాను. శ్రీ్రీ నిర్యాణానికి నెలరోజుల ముందే ఆయన వాక్యావళి సేకరించేను. టెక్కలిలో ఒకే ఒక టైపిస్టు ఉన్నాడు. అతను పదిహేను రోజులు లేకపోవడంవల్ల అతను వచ్చిన తరువాత వాక్యావళిని టైపు చేయించి “ఆంధ్రజ్యోతి వారపత్రికకు, 'ఆంధ్రపత్రికుకు, “విశాలాంధ్రికు పంపించాను. ఈ పంపించడం శ్రీశ్రీ మరణానికి 15 రోజుల పూర్వం జరిగింది. శ్రీశ్రీ ఆసుపత్రిలో వున్నట్లు తెల్సుకొని, జూన్ 14వ తేదీన శ్రీశ్రీకి ఈ విధంగా కార్డు రాశాను ₹ంజు 5% - 5% 55, 1 160 126)/08 జం 066 - 16660 జడే ప ఇగకట 06 2 906667 6007ల”. మరుచటి దినం సాయంత్రం శ్రీశ్రీ జీవితాన్ని చాలించాడు నేను పొందుపరచిన వాక్యావళి అతను చదవాలనే రాశాను దురదృష్టవశాత్తు అలా జరగలేదు వెంటనే ప్రచురించడం బాగుండదని “జ్యోతి వారపత్రిక “ఆంధ్రపత్రిక వారు 'విశాలాంధ్ర కూడా ఆలస్యంగా శ్రీశ్రీ ఉవాచను (ప్రచురించారు శ్రీశ్రీపైని ఇంతకు ముందుగాని, ఇప్పుడుగాని నాకు ద్వేషభావం లేదు అతని నిర్యాణానంతరం అతని పేరు ఆధునిక సాహిత్యంలో చిరస్థాయిగా నిలుస్తుందని నేనన్నాను ఒక సంతాపసభలో. శ్రీశ్రీ గురజాడకంటే ముందుకు పోయి వాడుక భాషను. అభ్యుదయ విప్లవ భాష పరంపరను సుస్థిర మొనర్చాడు. అతనికంటే మరెవరూ ముందుకు పోలేరని నేను సభలో అన్నాను అనుకుంటున్నాను కూడా శ్రీశ్రీ సైనిగాని మరెవరిపైని గాని నాకక్కసు లేదు అసలెందుకుండాలి అని నేను ప్రశ్నిస్తున్నాను. జె. వెంకటేశ్వరరావు గారికి ఒక సిద్ధాంతానికి, ఒక ఉద్యమానికి ఆరంభకుదైన వారినే యుగకర్త అని అంటారని మనవి చేస్తున్నాను కుమార్ అన్నాయన నాది ద్వంద్వ ప్రవృత్తి అంటున్నారు ఫాదర్ ఆఫ్ మోడరన్ పొయట్రీ అనడానికి *౦301018 2006012206 లేదా 2600611400 ఉందా? అని అడుగు తున్నారు. 2080126 తో మనకు పనిలేదు. సంప్రదాయాన్ని మనం పాటిస్తే గురజాడనే 26 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
యుగకర్త లేదా మూలపురుషుడు లేదా ఫాదర్ అనాలి. కాకినాడలో జరిగిన 70వ జన్మ దినోత్సవ సంచికలో నేనే శ్రీశ్రీని యుగపురుషుడని అన్నాను కాని యుగకర్త అనలేదు యుగకర్షృత్వానికి, యుగవురువత్వానికి నిశ్చయంగా భేదం వుంది. శ్రీశ్రీని యుగపురుషుడనడానికి అప్పుడుగాని, ఇప్పుడుగాని నాకభ్యంతరం లేదు. శ్రీశ్రీ గురజాడ కంటె ముందుకు పోయి, ఏమిచేశాడో, మూడవ పేరాలో విస్తృతపరచాను. అందుకే శ్రీశ్రీ యుగపురుషుడు. గురజాడ మరణానంతరం అతని పనిని సమర్ధవంతంగా పూర్తి చేశాడు.
నారాయణబాబు విషయం కుమార్‌గారు ఎందుకెత్తారో నాకు బోధపడటంలేదు. శ్రీశ్రీ నారాయణబాబుని ఎందుకు దూషించాలి అని నేనని ఉన్నానేమో! కాని శ్రీశ్రీ నిర్యాణానంతరం నేను శ్రీశ్రీని ఎంతమాత్రం న్యూనతపరచలేదు. టిఎల్ కాంతారావుగారికి మూలపురుషుడన్నా యుగకర్త అన్నా ఫాదర్ అన్నా ఒకటేనని నా మనవి
ఈ శతాబ్దంనాదని శ్రీశ్రీ అన్నాడని చాలామంది అంటున్నారు. టిఎల్ కాంతారావు గారు కూడా అదే అభిప్రాయాన్ని నేను విశదపరచడం తప్పులేదంటున్నారు. నా ప్రకారం ఈ శతాబ్దిం శ్రీశ్రీ ఒక్కరిదేకాదు. అభ్యుదయ విప్లవ కవులలో గురజాడది. నారాయణ బాబుది భావకవులలో కృష్ణశాస్రిది, విశ్వనాధ సత్యనారాయణది, రాయప్రోలుది అని అనడం న్యాయం
ఎవరు నన్నుగర్జించినా నేను విచారించను. ఇప్పుడు కొందరు ఈ శతాబ్దం శ్రీశ్రీ దంటే. అనతికాలంలోనే మరి కొందరు ఒక సంస్థ నేర్పాటు చేసుకొని అధిక సంఖ్యాకులను తమవైపు తిప్పుకుని మరెవరిదో ఈ శతాబ్దం అని అనవచ్చును. ఈ కారణాన్ని పురస్కరించుకొని మనం సంప్రదాయాన్ని విస్మరించరాదు. నాకు పేరు ప్రతిష్టలతో నిమిత్తం లేదు. నేను చెప్పవలసింది చెప్పాను. శ్రీశ్రీ నిస్సంశయంగా మహాకవి అని నేను చాలా కాలం నుంచి అంటున్నాను. వేగుంట మోహన్ప్రసాదు శ్రీశ్రీ ఫాదర్ అనడం తప్పని, గురజాడ కంటే మించిన అభ్యుదయ కవులు ఎందరు ఉద్భవించినా, యుగకర్త గురజాడ అనే అనాలి. ఆంగ్ల విమర్శకులు షేక్స్పియరు ఛాసరు కంటే గొప్పవాడైనా ఛాసరునే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీషు పోయట్రీ అన్నారు. ఇతర ఐరోపియ సాంప్రదాయాలలో ఫాదర్ అన్న సాంప్రదాయం నాకు తెలిసినంతమట్టుకు లేనట్టుగా వుంది తెలుగు సంప్రదాయంలో అల్లసాని పెద్దనని “ఆంధ్ర కవితా పితామహండు' అన్నారు గాని మరెవరినీ పితామహుడని గాని, యుగకర్త అనిగాని అనలేదు అన్నది సత్యమనుకుంటాను. అందరూ ఒక్కుమ్మడిగా నన్ను తిడితే తిట్టండి. వారికి ఒరిగేది ఏమీ ఉండదు
( ఆంధ్రజ్యోతి వారపత్రిక, 1983 ?)
రోణంకి అప్పలన్వామి 27
శ్రీశ్రీ కై శ్రీ రోణుంకి అవ్చులస్వామి బఐవుభఖాషా కోవిదులు. విజయనగరం మవోరాజూ కాలేజీలో ఇంగ్రీషు లెక్టరర్‌గా చాలా కాలం వనిచేశారు- శ్రీశ్రీ మవోవ్రస్థానం గీతాలు రానే రోజులలో తరచుగా విజయనగరం వబ్చి చాసో ఇంట్లో బసచేసేవారు. చాసోగారి ఇంటిమేదమీద రోణంకి ఉండేవారు, రోణంకి, చాస్తో శ్రీశ్రీని బాగా ప్రోత్సపొంచారు. రోణంకి శ్రీశ్రీకి (ఫెంచి యూరోవియన్ కవుల రచనలతో పదిచయం కలిగించారు 1984 అక్టోబర్ 24వ తోదీన సాయం(తం విశాఖవట్టణం ఆంధ్రా యూనివర్సిటీ ఫాకల్టీ క్లబ్లో రోణంకి వారిని శ్రీశ్రీ రచనలపై ఇంటర్వ్యూ చేశాను. నేనడిగిన వ్రశ్నలకు నూటిగా సమాధానాలు ఇవ్వలేదుగాని కొన్ని ఆనక్షికర విషయాలు తెలిపారు - రోణంకి అప్పలస్వామి : విజయనగరంలో శ్రీశ్రీ చాసో ఇంట్లో దిగేవారు అతని పద్యాలు బాగుంటే బాగున్నాయని చెప్పేవాణ్ణి. శ్రీశ్రీ తెలుగు బాగా చదువుకున్నాడు. “వసుచరిత్ర అనర్గళంగా చదివేవాడు పురిపండా ఆధునిక బెంగాలీ సాహిత్యాన్ని నజ్రుల్ ఇస్లాంను శ్రీశ్రీకి పరిచయం చేశాడు. శ్రీతీ ఛందో ధిక్కరణ చేసిన కాలంలో అతన్ని నేను చాలా ప్రోత్సహించాను. చాలా మంది తెలుగువాళ్ళకంటే శ్రీశ్రీ ఇంగ్రీషు బాగా చదువుకున్నాడు. 12/16 0 శ్ంఢ60 261082 పం66)/ అనదగిన యోగ్యత గురజాడకే వుంది. శ్రీశ్రీకి లేదు. (ఇంటర్వ్యూ 14-20-1984 :: ముద్రణ : శ్రీశ్రీపై ముఖాముఖి, 2010 ) దా॥ కడియాల రామమోహనరాయ 28 శబ్దబ్రహ్మ శ్రీశ్రీ
“ఉదయంి ఇంటర్వ్యూ నుండి
ప్రశ్న శ్రీశ్రీ తరువాత ఎవరు?
రోణంకి *" ఎవరూ కనిపించడం లేదు.
ప్రశ్న :అంటే శ్రీశ్రీ తర్వాత అంతాశూన్యం అన్న అజంతా వాదనని బల పరుస్తున్నారా?
రోణంకి "శూన్యం అని నేను అనను. కానీ, శ్రీశ్రీ స్థాయిని అందుకున్నవారు ఎవరూలేరు.
ప్రశ్న: శ్రీశ్రీని “పాదర్ అఫ్ మోడర్న్ పొయిట్రీ” అంటే మీరు కాదన్నారు గురజాడే అని నొక్కి చెప్పారు. పత్రికలకు ఉత్తరాలు కూడా రాశారు ఎందు చేత?
రోణంకి (శ్రీశ్రీ కాదు కాబట్టి చారిత్రక సత్యాన్ని వమ్ము చేస్తే సహించలేను.
(జర్నలిస్టు ప్రకాష్ చేసిన “ఉదయం” దిన పత్రిక ఇంటర్వ్యూ నుండి 01-10-1985)
“'అంధ్రభూమి” ఇంటర్వ్యూ నుండి
ప్రశ్న * శ్రీశ్రీ సాహిత్యంలో సోషలిజం లేదా కమ్యూనిజం ఎంత జీర్ణమైంది?
రోణంకి * ఎంత జీర్ణమైందంటే నేను ఒకటి చెబుతాను గురజాడ అప్పారావుకు రష్యన్ తెలియదు. శ్రీశ్రీ నిన్న పుట్టేడు. శ్రీశ్రీలో గొప్పతనం ఒకటుంది. అదేమిటంటే తాను రచనలు చేసినప్పుడు గురజాడ అప్పారావు ఆధిక్యతను గుర్తించాడు. గురజాడ అప్పారావునుండి నేర్చుకున్నాను అని చెప్పేడు. నేర్చుకున్నది నిజమే. గురజాడ అప్పారావును అధిగమించి ముందుకెళ్లేడు గురజాడ అప్పారావులాగ రాయడానికి ప్రయత్నించేడు అనుకరించలేదు శ్రీశ్రీని అందుకు మొచ్చుకోవాలి. చాలామంది ఇప్పుడు రాస్తున్నవాళ్లు అనుకరిస్తున్నారు. అది నాకు ఇష్టంలేదు. శ్రీశ్రీ ఛందస్సులు వేరు. ఇతని గొప్పతనమక్కడ ఉంది శ్రీశ్రీ మంచి కవిత్వమే రాశాడు.
ప్రశ్న శ్రీశ్రీకి సోషలిజం కమ్యూనిజం ఎంత జీర్ణమైందో చెప్పలేదు?
రోణంకి .అది నేను చెప్పలేను. తన అనుయాయులకు తగినట్లుగా ప్రవర్తించాడని నా ఉద్దేశం.
(జర్నలిస్టు దాట్ల సత్యనారాయణరాజు చేసిన ఆంధ్రభూమి దినపత్రిక ఇంటర్వ్యూ నుంది 20-06-1986)
రోణంకి అప్పలన్వామి 29
రోణంకి అప్పల స్వామి (1909 - 196/7) వో గ బహుభాషల సిరికంకి సాహిత్య పిపాసి రోణంకి అనువాదసేద్యపు వరికంకి యూరోపియను భాషల రసాస్వాదనలో రణపెంకి 30... శద్యాఠీకీ
4 లశ ఆంగ్ల సాహితీశేముషి “* రచయితలను నేను సాధకులుగా భావిస్తాను రచనాశక్తి హరయోగం లాంటిది. ఈ యోగానందానికి అలవాటుపడితే లౌకిక ప్రగతి, ధనార్ధన రుచించవు. అంతకంతకూ రచనా నైపుణ్యం, సమాజ విమర్శక నైశిత్యం, దార్భనిక సామర్థ్యం అధికమౌతాయి.ఇంగ్రీషు సాహిత్యం బాగా చదవాల ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తేనే మెళకువలు, ప్రయోగాలు బాగా తెలుస్తాయి. గురజాడ గొప్పు నాటకం రాయడానికి, శ్రీశ్రీ గొప్ప కవిత్వం రాయడానికి వారు ఇంగ్లీషు సాహిత్యాన్ని బాగా చదవడమే కారణం”అని చెప్పే ఆచార్య రోణంకి, కవితాలోలుడు, సాహిత్య పిపాసి, భౌతికవాది, మార్చిజం అభిమాని పశ్చిమ ఐరోపా భాషల్లో పండితుడు.తొలి రోజుల్లో శ్రీరంగం నారాయణ బాబుకి, శ్రీశ్రీకి ఫ్రెంచియూరోపియన్ కవుల రచనలతో పరిచయం కలిగించిన గురు తుల్యులు. టెక్కలి బోర్డుస్కూలులో విద్యాభ్యాసం, తరువాత విజయనగరం మహారాజావారి కళాశాలలో ఎఫ్.ఏ.,బి.ఏ., బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో ఎం.ఏ. (ఇంగ్లీషు) అనంతరం నిరంతర అధ్యయనంతో లాటిన్, ప్రాబీన గ్రీక్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్ ఇంగ్లీష్ సంస్కృతం, తెలుగుభాషలలో మంచి ప్రవేశం సంపాదించారు. విజయనగరం మహారాజా కళాశాలలో ఆంగ్లోప న్యాసకులుగా, శాఖాధిపతిగా పనిచేసి 1978లో ఉద్యోగవిరమణ చేశారు తరువాత యు జి.సి ఫెలోషిప్ కింద 1974-78 మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గౌరవాధ్యాపకులుగా పనిచేశారు 1988లో '590085 216 సోణయ' తొలి ఇంగ్లీషు కవితల స్తంపుటి వెలువరించారు తరువాత ఇంగ్లీషులో '16 1౬001 286 06 906005 అనే పేరున్మతెలుగులోని అణిముత్యాలనదగిన మంచిమంచి పద్యాలను 'ఇజ్ఞర్షరలోకి అనువదించి. తెలుగు సొగసులను తెలుగు భాషే తరులకు పంచి పెట్టారు ప్రాచీన,ఆధుఖిక్ష తెలుగు కవులు రచించిన పద్యాలను ఇంగ్లీషులోకి అనుసృజన చేయగా అవి 1106122 ఓం+6 కీంంణు5ో అనే పుస్తకంలో చేరాయి. దానిని ఓ అమెరికన్ సంస్థ ప్రచురించింది వేగుంట మోహనప్రసాద్ ప్రచురించిన 3 22056 2106 ఆంగ్రకవితా సంకలనంలో వీరివి 20 అనువాదాలు ఉన్నాయి. మాకియవెల్లి 'ప్రిన్స్' పుస్తకాన్ని రాజనీతి” పేరున తెలిగించగా దాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ 1962లో ప్రచురించింది ఇంకా ఆకాశవాణిలో ఎన్నో విలువైన ఆంగ్లప్రసంగాలు చేశారు. శ్రీశ్రీ కవితలపై రాసిన విమర్శకవ్యాసం వాది తొలి తెలుగు రచన కాగా ఆ తరువాత శ్రీశ్రీపై ఎన్నో వ్యాసాలు రాశారు.
“ చిన్నప్పుడే నాకు ఇంగ్లీషు మీద ప్రేమ ఏర్పడింది ఇంగ్లీషులో కవితలు అల్లడం మొదలు పెట్టాను. తెలుగులో కృషిచేయలేదు. దాంతో తెలుగులో కవిత్వం రాయడానికి నేను అలవాటు పడలేదు అని చెప్పుకున్నారు. 1998లో ఆయన సోదరుడు కృష్ణమూర్తి ఆయన ప్రియళిష్యుడు, ఆరాధకుడు మానేపల్లి సంపాదకత్వంలో “సంస్మరణ” సంచిక వెలువడింది
తిలా 06 ]40646021 [61౪93 ౧0600” ఎవరన్న దానిపై చెలరేగిన వివాదంలో శ్రీశ్రీతో తలపడి గురజాడను సమర్ధిస్తూ శ్రీశ్రీతో వాద ప్రతివాదనలు సలిపిన ఆచార్య రోణంకి అప్పల స్వామి 1909లో సెష్టెంబర్15న, శ్రీకాకుళం జిల్లా లోని టెక్కలి వద్ద ఇజ్జవరంలో జన్మించారు 1987 మార్చి 28న టెక్కలిలో మరణించారు. జ రోణంకి అప్పలస్వామి ర!
శ్రీశ్రీ సాహెత్యనిధి ప్రచురణలు
- సంస్మరణ ; 25గురు అమర సాహితీవేత్తలు 30-00
- శ్రీశ్రీ పిలుపు ; కొదవటిగంటి కుటుంబరావు 20-00
- మహాకవి 2 రావిశాస్త్రి 20-00 01 చంద్రునికో నూలుపోగు 2 సమతారావు 20-00
- శ్రీశ్రీ మరో ప్రస్థానం..టీకాటిప్పణీ : వరవరరావు 80-00
- మన కొడవటిగంటి వశ్రీత్రీ 20-00
- గిరాంమూర్తి 2 శ్రీతీ 20-00
- కొంపెల్ల జనార్దనరావు జ్ఞాపకాలు : శ్రీశ్రీ 20-00
- ఫకీర్షా పలుకులు 2 శీత్రీ 20-00
- శ్రీశ్రీ బులెటిన్ ( సంపుటి-1) వ కూర్చు : అశోక్‌కుమార్ 50-00 11 శ్రీశ్రీ ఖద్గసృష్టి కావ్యపరామర్శ :సి.వి 80-00 12, పౌరహక్కుల ఉద్యమ ప్రసంగాలు : శ్రీశ్రీ 20-00
- ఉగాది సంగీతం వ్ శ్రీ్రీ 25-00 14 పరిణయ రహస్యం వ తీఠీ 20-00
- శ్రీశ్రీ ఎలిజీలు ; శీతీ 25-00 16 విప్లవపథ నిర్దేశకుడు 2 ఎ.బి.కె.ప్రసాద్ 30-00
- మహాప్రస్థానం ఒక పరిశీలన ; అద్దేపల్లీ రామమోహనరావు 20-00
- శ్రీశ్రీ అన్వేషణ : ఎన్, వేణుగోపాల్ 20-00
- భువనభవనపు బావుటా : వి. సూర్యారావు _ 20-00
- శ్రీశ్రీపై ముఖాముఖి : కడియాల రామమోహనరాయ 30-00
- శ్రీశ్రీ-100 : శ్రీశ్రీ శతజయంతి విశేషసంచిక 100-00 22, తిలక్ చిత్రాల్లో శ్రీశ్రీ గీతాలు వ్ తీఠీ 20-00 బతి శబ్దబ్రహ్మశ్రీశ్రీ : రోణంకి అప్పలస్వామి 20-00 2డీ చిరంజీవి శ్రీశ్రీ ఏ చలసాని ప్రసొద్ శ0-00 26, శ్రీశ్రీ ఒక తీరని దాహం : అదృష్టదీపక్ 20-00 యన్న వివరాలకు : కన్వీనర్, శ్రీశ్రీ సాపిత్యనిధి. | "కో / 306, ప్రగతి టవర్స్, వీరయ్య వీధి, మారుతీనగర్, విజయవాడ-520 004
ళా న
51480114 8౧411144 (జ్ర ం ,] కథ 1 [కు (/ గ కన స ళ్ ష్