Telugu Selava roju - anilvaranasi/indianlanguages GitHub Wiki
యః ల ట్ నా ల ల / “ లే ట్ట స్ట ఏట ఖీ య్ . వ. హాఖ్ల స లం రాశి రం. ర్ ్టీ 1. ఈటీ యము 4.
- గ్ య, | లా వ నాడీ హూరటాషరా్నా న /
రూకినీఓ సూర్యీభాస్కర్ తా "వే సెలనరి టి నచనీ కవితా సంఫుటీ స్రై సొన్యు సల్లేేషన్స్ 9-3-6/1 ఎ, సరస్వతీ నిలయం, గాంధీనగరం, కాకినాడ - 533 004, ఫోన్ : 2364421
సెలనలరో టూ (చన కవితలు) , రూకిరీఓ సూర్యీధొస్కర్ శీ (రె రచయిత ళా లిం ప్రధమ ముద్రణ : డొస్పంబరు, 2003 .. ప్రతులు . 500 “౯ ౧ 2(ల్ ముఖచిత్రం : నర్శింగారి సౌజన్యంతో... . ముద్రణ : మారుతి ఆఫ్‌సెట్ ప్రింటర్స్ , కాకినాడ, ఫోన్ : 2379890 వెల ; 25/- శ్రీమతి ఎమ్. సుభద్ర, 9-3-6/1 ఎ, సరస్వతీ నిలయం, గౌంధీనగరం, కాకినాడ - 533 004; ఫోన్ : 0884 - 2364421 మరియు విశాలాంధ్ర అన్ని బ్రాంచీలూ...
కవితల వరుస... కెన్ సారో బివివా? 9 పరవాళంది 32 సెలవు రోజు 12 తమితీరని తీరం 34 అందాల అందలం 13 బ్లడీ ఇండియా 36 సైన్స్ వెర్సస్ సెంటిమెంట్ 18 పల్లెగూటిలో... రీ 3తి బహిష్కరించండి... పరిష్కరించండి 19 ఉవాణువుటై! ద్ద 39 రైతు (ఆత్ఫు హత్య ్త కంగులై... రాగాలై! త ప్ర(గుతి నిధులకు రాన రణం / తప నిశాని ౮ ల్ మగా ఎ! మా (౧ శశ
నీతి నియతి వీవు, నీమాల కాముండ!
పొరశాలనెంతొ భద్రముగను
జరుపగలుగునట్టి సార్ధకనాముండ!!
డోకుబు[ర్ర వంశ దొరవు నీవు.
పూర్తి మానవత్వ మొదవు మూర్తివీవు...
కీర్తి నొందెడు నిపుణతా స్ఫూర్తివీవు!
ఆర్తితోడ సలుకుచుంటి నన్న! మనదు
మైత్రి శాశ్వత మెప్పుడు, మరువకోయి. అభ్యుదయకాది, స్నేహశీలి, నిగర్వి
ఉపాధ్యాయ సమైక్యతా సమన్వయ కర్త నా ప్రియ మిత్రులు, శ్రేయోభిలాషి శ్రీ డో కృుబుర్రు భద్తుం గారికి ప్రేమాభిమానాలతో ...
బాధ్యత నుండి ఒక్కరోజు కూజతా సెలవ కోరని కవి
- అద్దేపల్లి రామమోహనరావు
1980 దశకం నుండి భారతదేశం, పెట్టుబడిదారీ విధానంవైపు వేగవంతమైన పరుగు మొదలుపెట్టింది. ఈ దేశంలోని అంతకు పూర్వపు సిద్దాంతాలు, సంఘర్షణలు అన్నీ కొత్త ఆలోచనలు ప్రారంభించినై. అంతకు ముందు ఫ్యూడల్ చట్రమే ప్రధాన వైరుధ్యంగా సాగిన ఆలోచనలన్నీ, పెట్టుబడిదారీ విధానపు కొత్త వైరుధ్యాల్ని ఎదిరించే భావ సామగ్రిని సమకూర్చుకోవడం (ప్రారంభమైంది. అసలు ఈ దేశపు మౌలిక విలువలే సవాలు చేయబడే పరిస్థితులు వచ్చినై. సార్సభౌమత్తం, సర్వసత్తాకం, అలీనవిధానం మొదలైన భావనలన్నీ కాలదోషం పట్టే సమయం ఆసన్నమైంది. అంతకు ముందెన్నడూ లేనట్టుగా అన్ని విలువల్నీ వ్యాపారమే నిర్ణయించే ఒక నూతన ప్రమాదం దాపురించింది. ఉదాత్తమైన ఆలోచనలన్నీ (ప్రజల పరమైనై; వ్యాపారమే అన్ని జీవన విధానాల్నీ నిర్ణయించే పరిపాలన పాలకవర్గాల పరమైంది. ఈ వైరుధ్యంలోంచి, భారతదేశంలోని అన్ని భాషల్లోని సాహిత్యమూ వికసించడం ప్రారంభమైంది. ఈ దేశంలోని ప్యూడల్ శక్తులతో పోరాటం ఒకస్థాయిలో ఉండగా, అంతకంటే విస్ఫృతమైన, తీవ్రమైన స్థాయిలో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే సాహిత్య సృష్టి కొనసాగింది. తెలుగు సాహిత్యంలో ఎక్కువస్టాయిలో కవిత్వమూ, కధ, ఈ సంఘర్షణలను ప్రతిబింబించడం (ప్రారంభమైంది. అంతకుముందు అనేక భావాలతో నిబద్దులైనవారు, ఈ కొత్త సంఘర్షణలకు కూడా తమ రచనల్లో తగిన స్థానం ఇచ్చారు. అయితే, ఈ సంఘర్షణతోనే ఊపిరిపీల్చుకునే, కవుల పరంపర ఒకటి గుర్తింపదగిన స్టాయిలో పురోగమిస్తోంది, ఈ పరంపరలో పరిణత (86౧10౧ కవులూ ఉన్నారు, పరిణమిస్తున్న కవులూ ఉన్నారు. పరిణమిస్తున్న- అన్నది ప్రతిభా విషయం కాదు కొత్త సంఘర్షణలకు గల నిబద్దతతో పరిణమిస్తున్న వారని అర్థం. ఈ పరంపరలో, వర్తమాన కాలానికి తగిన వివేచనతో, కవిత్వం రాస్తున్న వారిలో, గుర్తించ దగిన కవి ఈ 'సెలవరోజు' కవితాసంపుటి రచయిత మాకినీడి సూర్యభాస్కర్.
ఈ నాడు కళ్ళ ఎదుట కనిపిస్తున్న అంశాల్ని అర్ధం చేసుకోవడానికి, కవి శీర్షాసనం వెయ్యవలసిన పరిస్థితి ఉంది. అంటే తల్లక్రిందులుగా అర్హంచేసుకుంటేగాని,
ఒక అంశంలోని మౌలిక సత్యం అవగాహనకాదు. చూడగానే, అభివృద్రిలా కనిపించేది, వ్యతిరేక దృష్టితో లోపలికి పోతేగాని, కుట్రగా అర్హంకాదు అందుకే సూర్యభాస్కర్ ఒక కవితలో ఇలా అంటాడు. ఆకవిత పేరు శిర్షాసనం'
'ృువ్వుల్లో శీర్దాసనం చేస్తేనే
తేనెటీగలకు నుధువు దారికేది
తలకిందులై ముక్కుతో
జలగర్భం చీలిస్తేనే
కింగ్‌ఫిషర్‌కు చేపలు దొరికేది,
మనిషీ!
నువ్వూ లోనికి
లోలోనికి. . నీలోనికి
శీర్దాసనం వెయ్యాలి”
పశుధర్మాన్ని దాటిపోవడానికి, అంతర్‌దృష్టి కావాలనే భావనతో సూర్యభాస్కర్ ఈ కవిత చెప్పినా, బహిర్‌దృష్టికి ఆకర్షణగా కనిపిస్తూ అంతర్‌దృష్టికి పతనంగా స్థిరపడే, సమకాలీన సంస్కృతిని అవగాహన చేసుకోవడానికి శీర్చాసనం' అవసరమనే ఆలోచన నేను అన్వ్నయిస్తున్నదే, శీర్దాసనం' అనే పదంలోని బలంవల్ల,
పైకి ఆకర్షణీయం చేయబడుతున్న విదేశీ వస్తువుల్ని, ఈ దేశపు సాంతదనాన్నీ, (ప్రాకృతికతనీ నశింపజేస్తూ, కేవల వ్యాపార దృష్టితో జీవితాన్ని దోపిడి చేసే వస్తు వ్యామోహాన్ని ధ్వంసం చెయ్యమంటాడు సూర్యభాస్కర్. అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకోవడం ఎప్పుడూ అభ్యంతరం కాదు. అయితే, ఆరోగ్యమూ, జీవన సౌఖ్యమూ మొదలైన అంశాల్ని మరుగుపరచి, కేవలం వ్యామోహంతో ముందుకు వెళ్ళడం, దేశ ఆర్థిక వ్యవస్థనూ, మౌలిక విలువల్నీ ధ్వంసం చేసేదిగా సాగిపోవడం, తగదని చెప్తున్నాడు. అందుకే 'బహిష్కరించండి.. పరిష్కరించండి" అనే కవిత రాశాడు. 2000 సంవత్సరంలోనే, ఈనాడు వివాదాలకు కారణమైన కోకోకోలా” గురించి ప్రస్తావించాడు.
“కోకాకోలా (హాలా)హలం
నవతరాల సమ్మోహప్రవాహం
నిత్యానసరవస్తు పరిధిలోకి
అనివార్యంగా పరుగులు తీస్తోంది
సగటు బ్రతుకుని పరుగులు తీయిస్తోంది!
పెస్టిసైడ్‌లు కలపడం, కలపకపోవడం వేరేవిషయం, కానీ అందులో ఆరోగ్యానికి సహకరించే అంశాలేమీలేవు. అందులోని కృత్రిమ పదార్దాలు అంతిమంగా ఎసిడిటీకి సహకరించేవే. అందువల్లనే వీటి (ప్రచారం 'నవతరాల సమ్మోహ (ప్రవాహం'గా పరిణమించింది.
ఈ సంపుటిలోని కవితల్లో సూర్యభాస్కర్, ముఖ్యమైన అంశాల్ని పైపైన చెప్పడంగాక్క, అవగాహన కలిగించే సూక్ష్మాంశాలతో చెప్పాడు. ఇది ఈనాడు కవిత్వానికి చాలా అవసరం. అమూర్తమైన కోపంతో, ఆవేదనతో చాలా కవితలు వస్తై. కాని, అవగాహన కల్షించేందుకు, వస్తువును లోతుగా, వాస్తవికంగా రూపొందించడం ముఖ్యం. సూర్యభాస్కర్ ఈ కోవలోకి వస్తాడు. 'రైతు ఆత్మహత్య" కవితలో, అందుకు నేసధ్యమైన అంశాలన్నీ వివరిస్తాడు
“విత్తనాన్నివ్వని విత్తనాన్ని
విత్తానికి మారకం చేయొచ్చు...
హై బిల్లింగ్‌తో హైటెక్కినా
లోవోల్టేజితో మొరాయించే మోటార్లు
తడారిన ఎడారిపాలాల బీట వేసిన నోళ్ళు...
పెరుగుతున్న ఎరువుల ధరలతో సాటు
చీడపీడల్ని కాక పంటను నాశనం చేసే
కల్తీ పురుగుల మందులు
“పాము పొడిలో దోమకాటు వేస్తె
టుంగ్రోవైరస్‌ను రారమ్మంటై...'
ఇలా ఎన్నో వాస్తవికతలు ఈ కవితలో ఆవిష్కరించబడినై. సాధారణంగా ఏ వస్తువు తీసుకున్నా, యిలాటి వాస్తవికాంశాల్ని కవితాత్మకంగా చెప్పడం సూర్యభాస్కర్ విధానం.
మరో కవిత 'అందాల ఆందలం'లో గ్లోబలైజేషన్ ముద్దుబిడ్డల్లో ఒకటైన అందాల పోటీలను వస్తువుగా తీసుకున్నాడు. పైకి చాలా ఆకర్షణీయంగా వీటిని సామాన్య (ప్రజలకి ప్రసార సాధనాలు మప్పుతున్నై కాని, వీటి చీకటి కోణాల్లోకి కవి శీర్షాసనం" వేస్తే కనిపించే సత్యాలు వేరు. ఈ కవితలోని కొన్ని పంక్తులు
“ఆలోచిస్తే తెలుస్తుంది
గ్లోబలీకరణ మాయాజాలం
ఆర్జిక సంస్కరణల అమలులో
రూపొందిన భామాకలాసం..
అయిదేళ్ళలో రెట్టింపైన బ్యూటీ బిజినెస్
లావోలెన్, మోబెలైన్, ఎలియన్స్, గార్షియర్
ఎక్స్‌క్లూజివ్ “షో రూంల
సంపన్న దేశాల బ్యూటీ మార్కెట్ తరలింపు
వీథి వీధినా వెలుస్తున్న
బ్యూటీ పార్లర్లు'
సమకాలీన కవిత్వం, కవితాత్మకతతో పాటు సాంస్కృతిక రాజకీయాది అంశాల సమ్మేళనంగా సాగి, పారకుడి అవగాహన పరిధిని పెంచాలి. సూర్యభాస్కర్ కవిత్వం ఈ దిశగా విజయవంతమౌతోంది. గ్లోబలైజేషన్ అనే ఆకర్షణీయమైన పదం వెనక ఉన్న అంధకార కోణాలెన్నో ఇతని కవితల్లో ఆవిష్కరణ పొందుతై. సా(మ్రాజ్యవాద వ్యతిరేక కవితా ప్రవాహంలో ఒక ఉత్తుంగ తరంగం సూర్యభాస్కర్,
గ్లోబలైజేషన్‌లో ముందుగా బలైపోయేది కుటుంబ సంబంధాలూ, మానవ సంబంధాలూ. వీటిని వర్షిస్తూ రాసే కవితల్లో అర్హత చాలా ముఖ్యం. ఈ వస్తువుకి రాజకీయాది అవగాహనలకంటె, మెత్తని భావాలు (ప్రధానంగా ఉండాలి. సూర్యభాస్కర్ కవితల్లో ఈ ఆర్రతా లక్షణం తగినంతగా ఉంది. బాల్యం, పల్లెటూళ్ళు, ముసలివాళ్ళ ఆవేదనలూ మొదలైనవి ఏవి వర్ణించినా, సూర్యభాస్కర్ హృదయపు కదలికల్ని ముఖ్యంగా తీసుకుంటాడు. వీటన్నిటికీ గ్లోబలైజేషన్ తో ప్రత్యక్ష సంబంధం కనిపించకపోయినా, అనుబంధాత్మక సన్నివేశాలు పోనుపోను క్షీణించడంపై, దాని ప్రభావం తప్పకుండా ఉంది. రెక్కలొచ్చిన పిల్లలు తలోవైపు వెళ్ళిపోగా యింట్లో ఒంటరిగా కాలక్షేపం చేసే నానమ్మ, తాతయ్యల ఆవేదన 'తమి తీరని తీరం” అనే కవితలో సూర్యభాస్కర్ వర్షించాడు. ఎప్పుడో ఒకసారి మనవడు, మనవరాలు వాళ్ళ దగ్గిరికివస్తారు. అక్షణాల్ని గూర్చి చెప్తాడు కవి
“ఆ రెండు మూడ్రోజులూ
పిల్లల్లో పసిపిల్లల
నానమ్మా తాతయ్యా
తెలినవ్వుల నురగలౌతారు
ఒంటరితనపు తీరాన్ని చేరిన కెరటాలు
అంతరంగపు లోతుల్లోకి
ఇంకకుండానే వెళ్ళే సనుయం వస్తుంది
తీరం - ఒంటరిగా ఉండలేకా
నగర శబ్దాల సముద్రంలోకి పోలేకా
అతలా కుతల సతమతపు
బెంగ వీడ్కోలవుతుంది”
ఒక దృశ్యాన్ని అన్ని కోణాల్లో వర్షిస్తూ, కవితాత్మకంగా అనుభూతికలిగించే పద్దతిలో చెప్పడం ఒక నేర్పు. సూర్యభాస్కర్, హైకూ రచయిత కూడా కాబట్టి యిటువంటి అనుభూతుల్ని పట్టుకునే కవితలు చాలా రాసాడు. కుంభవృష్టి కురిసి వెలిసిన రోడ్లమీది దృశ్యాల చిత్రణ 'జీవాణువులై' అనే కవితలో చేసిన విధానం విశిష్టమైనది
“అంతవరకూ మసిబారిన
ఆకాశపు కారడవిలో చిక్కిన సూర్యుడు
తడి ఆకుల మాటు నుండి
తడి సడిగా తొంగి పలకరిస్తాడు
కాలవల్లోకి ప్రవహించే ఇంద్ర చాపాలై
పెటోలు కంపుతో వర్షం ముగుస్తుండగా
చెట్టూ... పక్షులూ రెక్కలార్భ
మళ్ళీ భయసెడతై'
సూర్యభాస్కర్ కవిమాత్రమే కాదు. గుర్తింపు గల విమర్శకుడు కూడా. అందువల్ల అతని కవితల నిండా అక్కడక్కడ ముఖ్యమైన అభిప్రాయాల ఉద్దాటనలు కూడా కనిపిస్త. అంతేగాక చాలా కవితల నిర్మాణంలో (శ్రద్ధ కనిపించడానికి కూడా కారణం విమర్శకుడు కావడమే
తన కవితాశిల్సాన్ని యింకా విస్తరించుకుంటూ, తన నైపుణ్యాన్నింకా వేగవంతం చేసుకుంటూ మాకినీడి సూర్యభాస్కర్ పురోగమించాలని ఆశిస్తున్నాను.
ఇన్ సారో జ విలా? బావుల్లో నూనెంత ఉన్నా ఎర్రగా పీచు రేగిన జుట్టుతో తైల సంస్కారం లేని రాజ్యం... రగలడమే జీవితమైనవాడు చమురు బావుల్ని రగిలించి పారేస్తాడని భయం! తలదించుకోనివాళ్ళ తలాడించడం నేర్చుకోనివాళ్ళ తలపెట్టి ఆలోచించేవాళ్ళి తలలు తీయడమే పనిగా తల ఎగురవేసే రాజ్యంలో ... ఒగొనీ జాతీయుల ఎర్రని ఎగోనీ! కెన్ సారో వివా - (ప్రజా పోరాట మాసమా! ... నైజీరియా సైనిక కూటమి గుండెల్లో వైజారా! . =. కారు నల్లని బ్రతుకుల్లో కారుణ్య చైతన్య పుంజనూ! ... ఆచరణగా మారి ఉరి(త్రాడుకు (వేలాడిన చావులేని అక్షరమా! నీ మరణ విచారం నుంచి (ప్రభవిస్తుందో విప్లవం 'కెన్ సారో బి వివా?” అని '్రళ్నించే వాళ్ళకు కెన్ సారో వివా! నీవే జవాబు! నీవే నీవే ఒక సవాలు!
సర్కార్ ఎక్స్‌ప్రెస్,
కెన్ సారో బి వివా = విచారం సత్తువ కాగలదా? 21-11-1995
సెలవ రోజు సెలవురోజు ఇల్టు రెండవుతుంది .. వంటగదిలో ఆమె, డ్రాయింగ్ రూమ్‌లో నేను... ఇల్లో డైపోల్ యూనివర్స్! పోపు ఘుమఘుమల తలపుల్లో ఆమె... మౌనం వంట వండుతుంది! ఆలోచనాలోచనాలను తగిలించుకుని అక్షరాలు ఏరుకుంటూ, చల్టుకుంటూ. . నేను- మౌనం ఒక ధ్యానం! ఎవరికి వారం - ఆదివారం, నిశ్శబ్దం గదుల్లో తిరుగాడుతుంది. నిళ్ళ్శబ్దం మౌనం కాదు.. మూగతనం మౌనం కాదు... మాటల వెల్టువకు ఆచోచనల లాకు మౌనం! మౌనం ఒక తపస్సు॥ మౌన క్షణాల మధ్య బందీలమై సొంత యింట్లో శరణార్జులం... ఎక్కణ్జుంచో వచ్చి ఒకే సెల్‌లో చేరిన ఖైదీలం! ఇంతలో- ఒక శబ్ద కెరటం సుడిగాలిలా పరుగెత్తుకు లోనికి దూసుకొస్తుంది- ఆయాసంతో రొప్పుతూనో... అలసి సొలసి అలమటిస్తూనో.. ఆటకెళ్ళిన అమ్మాయి! మౌనం భగ్నం, (వ్రతం చెడుతుంది, ఫలితం - ఒక్కోసారి దక్కుతుంది,
ఉత్తరాంధ్ర మాసపత్రిక, ఏప్రిల్ 2000
అందాల అందలం విశ్వమేధస్సులో నాలుగోవంతు భారతీయం ... అందచందాల్లోనూ! భారత మహిళ అందం 'సుస్మితం'" 9 సౌందర్య “ఐశ్వర్యం”! అయినా, అయిదేళ్ళుగానే అయిపు కొచ్చిం దెందుకనో? కానీ, అయితే భారతీయ సౌందర్యం (ప్రపంచ అందాల అందలానికి మహరాణిత్వం అందిస్తోంది . .. ఈ మధ్యీ మధ్యే అందాల పోటీలకు మన అందమూ “యుక్తా ముఖి మవుతోంది! ఇపుడు “లా(ధా)రాదత్త' మైంది కదా, అందాల అందలం ఇకపై మనదే! ఆలోచిస్తే తెలుస్తుంది - గ్లోబలీకరణ మాయాజాలం .. ఆర్థిక సంస్కరణల అమలులో రూపొందిన భామాకలాపం! అయిదేళ్ళలో రెట్టింపైన బ్యుటీ బిజినెస్... లావోరెల్, మేబెలైన్, ఎలియన్స్, గార్జియర్ ఎక్స్‌క్లూజివ్ “షొ రూంల
సంపన్న దేశాల బ్యూటీ మార్కెట్ తరలింపు! వీధి వీధినా వెలుస్తున్న బ్యూటీ పార్లర్లు!! కొత్త విదేశీ ఉత్పత్తిని మార్కెట్లో నిలబెట్టే టీవీ స్కిట్ట తాజా చిరునవ్వుల రోజా అందాలు .. విదేశీ డెలిగేట్లను స్వాగతించే తత్కాలిక నాలుగైదు రోజుల అందాల సేవల కాంట్రాక్టులు! నా దేశ సోదరీమణులారా! సహజ సౌందర్య దీప్తులారా! ఇది గ్లోబలైజేషన్ విక్షిమైజేషన్, కాదు, కాదిది మన సివిలిజేషన్!! అందం కాదు... డబ్బూ కాదు, జీవితం, జీవితం అందగించాలి - చదువుతో .. సంస్కారంతో నందనవనిగా విరబూయాలి . .. అందమైన హృదయ నిర్మాలిన్యంతో! అచ్చమైన . . స్వచ్చమైన అందాల అందలం అదే... అందుకొనే (ప్రయత్నం మీదే! 7-3-2000. మంగళ 7 ఎఎమ్ ఉత్తరాంధ్ర మాస పత్రిక, జూన్ 2000 శై యాాలాయాలాలాలా. నులక రోబి
కుందేళ్ళే ఓడిపోతయ్, పిచ్చికళ్ళ జతలు జతలు జతలుగా పాపం, చూపుల తోరణాలై టీవీ (స్కీన్‌కు వేలాడతయ్! కానీ ... నిరాశా నిస్ప్రహలతో వాలిపోతయ్! పిల్లని వెక్కిరించిన గుడ్డులా మ్యాచ్‌కంటే ముందుగా ఫిక్సింగ్ వెక్కిరిస్తుంది! ముందే ఫిక్సైన ఫలితం - 'సెల్‌ఫోనుల్లో ప్రయాణించి డీడీగానో, చెక్కుగానో మారుతుంది... డీడీ వన్‌లో పనులు మానిపించే డీఢీఢిక్ ఆర్భాటమవుతుంది। నేర్పరితనం లం అడ్డదారులు పట్టి అడ్డదిడ్డంగా తీసే పరుగులై పిల్లిమొగ్గలేసీ . దేకీ.. పాకీ... ఎన్నెన్నో వేషాలేసీ , . . మోళీచేసీ ...
చివరికి బంతిని పట్టలేకపోతుంది! బంతుల్ని కొట్టలేక... పట్టలేక క్తీన్ బౌల్డ్ అవుతారు ... 'క్రికెట్టై దేశవరువు పంటను నాశనం చేస్తారు క్రికెటర్లు! బుకీ డాలర్ల అక్రమ సంపాదన రా నిర్లిప్త సోమరితనం కాగా 'శ్రికెట్ కుందేళ్ళు ఓడిపోతుంటయ్! కుందేలు విజయ మెప్పుడూ కుందేటి కొమ్మ మరి! 7-5-2000. ఆదివారు3 సిఎమ్ 25-6-2000, ఆదివారం ఆం(ధ్రభూమి
నత్యాగ్రహ శఅవిశ్వానం)!
అది -
అనివార్యమైనప్పుడు ,
హద్దులు చెరిపి, కల్గోలం జరిపే
ప్రళయ ప్రభంజనం!
జల (ప్రయోగానికి బదులుగా
ఖాం'(డ్రించి ఉమిసిన లాలాజలం....
బాప్పవాయు గోళాల దాడికి
బలంగా గాలి పీల్చి వదలిన
మూకుమ్మడి నిశ్వాసం.
ఛార్జీ చేసిన బ్యాటరీని
యింకా ఛార్జీ చస్తే పవరు పెరిగినట్టూ
పెంచిన విద్యుత్ “ఛార్టిలకు
దీటుగా పెంచిన లార్'ఛార్జోలతో
పవరు పెరిగిన నిరసన వెల్టువ!
పోలీసు తూటాలకు
గాలిలో ఎగిసిన సమాధానపు రాళ్ళు -
పాయింట్ బ్లాంక్ రేంజిలో
చిప్పిల్లిన రక్తప్రవాహమై బలి!
చేనుమేసే కంచె పై
ప్రజల సత్యాగ్రహ అవిశ్వాసం!
ఛలో అసెంబ్లీ...
అదొక విజృంభణ...
అదొక తెగింపు...
అదొక సాహసం...
కలసి వెరసి, అదొక
జీవన్మరణ ఉద్యమ పోరాటం!
'ప్రజాళి ఆరాటం! 30-8-2000, బుధవారం, 11 ఎ యమ్ ఉత్తరాంధ్ర మాసపత్రిక, ఆక్టైబరు 2000
కూశీనీపి నూద్యభాస్మద్ అణ. 5
ఫైన్ ౩ర్సస్ సెంటిమింట్] సైన్సూ ... సెంటిమెంటూ పక్కపక్కనే మసలుతున్న జలతైల మి(శ్రమ సమాజం! సంప్రదాయపు పునాదుల్ని పెళ్ళగించని ఆధునికత... ఆధునికతని మొత్తంగా తిరస్కరించలేని సంప్రదాయం... మనదో సంప్రదాయాధునికత! ఇదో ఆధునిక సంప్రదాయం॥ “వ్యక్తి పురోగతే సమష్టి పురోగతి” అంటుంది సంప్రదాయం. “సమష్టిగా పురోగమిస్తే వ్యక్తి పురోగమిస్తాడు” అంటుంది శాస్త్ర విజ్ఞానం. శాస్త్ర విజ్ఞానపు తొలి అడుగులు సంప్రదాయ హస్తాలలో నలగక తప్పదు... అయినా-= సాంకేతికాభివృద్ది కనుగుణంగా సంప్రదాయం మారకుంటే తిరుగుబాటూ తప్పదు! సెంటిమెంటైనా . . , ఆధునికతైనా సమాజ శ్రేయస్సుకు... మానవ (ప్రేయస్సుకు... వెరసి, మానవ సమాజ ఉషస్సుకు! 12-8-2000. శనివారం 6 పి ఎమ్ తెలుగు విద్యార్థి, డిసెంబరు, 2000
బఫొప్కరించండి .... తరిత్యరించండి]
విదేశీ విలాస విపణీ వ్యామోహం... యిప్పటికీ అదో తీరని దాహం!
కోకోకోలా (హాలా) హలం
నరనరాల సమ్మాహ ప్రవాహం . నిత్యావసర వస్తు పరిధిలోనికీ అనివార్యంగా పరుగులు తీస్తోంది...
సగటు బ్రతుకును పరుగులు తీయిస్తోంది! రంగు రంగుల చుక్కల చీరల్ని కట్టే సీతాకోక చిలుకల ప్రాకృతిక నృత్యవేది హరితవదన కమిలి.... కుమిలి మరుభూమిగా మారనున్నది.
పచ్చదనాన్ని కనడమే
అసహజమైన విత్తనం
బడుగు రైతు (బ్రతుకు మీద
పెత్తనం చెలాయించనున్నది!
బహుళజాతి జీ.ఎ 0.ల పర్యవేక్షణలో ఎల్లలు దాటి దిగనున్న జి.ఎం. పుడ్డు... ఇష్టం లేకున్నా, జరరాన్షిని చల్లార్చే
(ప్రజలు కార్చే నెత్తుటి కన్నీరు కానున్నది! దేశియతా(మోద) ముద్రతో ఆకర్షణీయమైన 'అందుబాటు” ప్యాకింగులతో జీవన స్రవంతిలో కలిసిపోతున్న సకలావసరాల విదేశీ వస్తువెల్లువ...
భారతీయ సంస్కృతిని స్ట్థానభ్రంశీకరిస్తూ విదేశీ వ్యాపార ఛానలైజ్ఞు విషముసంస్కృతి! దేశ దురాక్రమణ జరిగితే ప్రాదేశిక సమ(గ్రతతోపాటూ 'స్వేచ్చవే కోల్పోతాం... దేశార్థిక స్వావలంబన కుంటుపడితే జాతి జీవచ్చవమై మనుగడనే కోల్పోతాం! అయిదు దళశాబ్దాలనాటి మూడు శతాబ్దాల దాస్యహీన చరిత్ర పాతసీసాలో కొత్త లేబులుతో తిరిగి రానున్న ఈ చారిత్రక మలిసంధ్యలో- ప్రతి పౌరుడూ సైనికుడు కావాలి... (ప్రపంచ కాబూలీకి పాదాశ్రాంతమైన ప్రభుశునకాలను అప్రతిహతంగా ఎదుర్కొనే ప్రతిన బూనాలి.. ప్రమత్తు డవ్వాలి! అదే ఆలోచన... ఆదే ఆశయం... అదే ఆయుధాన్ని అందుకోవాలి... మళ్ళా తొలిసంధ్య ఉషస్సులను చేదుకోవాలి! నా దేశ ప్రజలారా! ముక్త గళంతో రవళించండి... వ్యాపార సంస్కృతీ విషనాగును తరలించండి! విదేశీ వస్తువులను మరోసారి బహిష్కరించండి... జాతి ఆర్థిక పారతంత్ర్యాన్ని మనసారా పరిష్కరించండి! 15-10-2000, ఆదివారం 12 పి.ఎమ్ ఉత్తరాంద్ర మాసపత్రిక, జనవరి 2001
ల టోపీలందంగా చేసి ఇతరుల తలలపై పెట్టాచ్చు... కోకో-కోలాహలాన్ని సామ్ము చేసుకోవచ్చు. | ఎవడి ఉత్పత్తికి వాడో రేటు కట్టొచ్చు... విత్తనాన్నివ్వుని విత్తనాన్నీ విత్తానికి మారకం చేయొచ్చు... కానీ - ఆ విత్తనాన్ని చల్లి పండించిన పంటను సొంతంగా అమ్ముకునే వీల్లేదు! సేద్యమో సీజనల్ పీడకల... రైతు పాలిట మృత్యువల! హై బిల్లింగుతో హైటె-క్కినా లో వోల్టేజీతో మొరాయించే మోటార్జు, తడారిన ఎడారి పొలాల బీటలేసిన నోళ్ళు! తడిపేందుకన్నట్లూ, వర్షిస్తయ్... మేఘాలు కాని మేఘాలు! తారునల్లని ఆకాశంలో క్షణం వెలిగే మెరుపులా
ముడుతలు దేరిన దేహాకాశంలో రెపరెపలాడే గాజు గోళాలు... రైతుల కళ్ళ మేఘాలు - వర్షిస్తయ్, వానరాని కాలంలో సైతం! పెరుగుతున్న ఎరువుల ధరలతోపొటు చీడపీడల్ని కాక పంటను నాశనం చేసే కల్తీపురుగుల మందులు - “పాముపొడ'లో దోమకాటు వేస్తయ్.. టుం(గ్రోవైరస్‌ను రారమ్మంటయ్! పగబట్టిన ప్రకృతీ అలిగి నిప్పులు చెరిగే ఎండల కొలిమి గజ్జెల మోతతో నర్తించే ఆనావృష్పో... హద్దూ ఆఅపూలేని హరికేను పోతల గర్జించే అతివృష్టో అయి రెంటికీ చెడిన రేవద్ని చేస్తుంది - దున్ని దున్నీ బక్కచిక్కిన దుక్కిటెద్దులాంటి దిక్కుమొక్కూలేని నాగలికరైన వెన్నెముక బడుగు (బ్రతుకుతో చెడుగుడాడుతూ! వరదకబంధుడి ముంపు హస్తాలలో . పచ్చని పైరుతల్లి చిక్కుకుపోతుంది!
7
తాను తిన్నా, తినకపోయినా అప్పు తినిపించి పెంచిన పంటను- చేతికొస్తుందనేసరికి అందొచ్చిన కొడుకు హత్యలా... కోసుకుపోతాడెవడో అప్పులవాలా! అప్పుడు - ళ్ చీడపీడల్ని అరికట్టలేని కల్తీశక్తి పెరిగిన మిగిలిన పురుగులమందు నోటిలో తెల్లని పత్తి నురుగవుతుంది... గొంతుకు పేనిన యమపాశమై ఊపిరిని లాగేస్తుంది! హత్య ఆత్మహత్రై ఊపిరి పీలుస్తుంది! 8-6-2000, గురువారం 2 ఎ యమ్ (ప్రజాసాహితి, జూలై 2001 గ ందీరీ య్య _2రొరిర్యు ఖ్తా భాం మి. ల జగం*ం 6షపమ్లూ , ల లో వ్ ర పొద ల్లా డ్‌ష్టక 01%
వ్ర(గుతి నిధులకు ఆహ్వానం (ప్రతినిధులను ఆహ్వానిస్తూ బేనర్... బేన రవతల నాలుక్కుర్చీల స్టేజీ: నాయకమ్మన్యుల ఉపన్యాసాలు రాజకీయ వ్యతిరేక నినాదాలుగా గొంతులో ఆవేశమై ఉబుకుతయ్... నిధులకోసం ముష్టి సారాంశమై చివరికి ముడి విప్పుకుంటయ్! సంఘ సర్వసభ్య సమావేశమైనా జనరల్ బాడీ మీటింగైనా షార్టీల రిపార్టీల చదరంగపుటెత్తుల రహస్య చర్చావేదికలైనా - అడుక్కోవడంలోనే అంతమవుతయ్! ప్రగతి నిధుల సమీకరణలో ఏకతాటిపై నడచిన యూనియన్నూ... పార్టీలూ... సమస్యల పరిష్కార మొచ్చేసరికి కప్పల తక్కెడ మేళాలవుతయ్! రాని పి ఆర్‌సి క్షోసమో ('ప్రమోషను స్క్‌లు అమలుకో తీరా (ప్రాధేయమై కలిసినప్పుడు 22 వరనవనయయయయలాలం సేలకు దోబి
పూరా లంచాలివ్వ్యాలంటూ ముడుపుల వసూళ్ళు! దౌత్య సంబంధాలను డాలరుల్లో కాలిచే ఈ రోజుల్లో... పాపాయికంటే రూపాయి ప్రియమైన ఈ రోజుల్లో... నాణెంలా గుండ్రంగా దార్హుకుంటూ పోయే మానవ సంబంధాల మనీ బంధాలలో... ప్రతినిధులకు ఆహ్వానం పలకడమంటే 'ప్రగతినిధులను స్వాగతీకరించడమే... (ప్రతి సమస్యనీ డబ్బుచేసుకోవడమే, అడ్డంగా బలిసిపోవడమే! 10-12-2000, ఆదివారం 10 ఎ యమ్ తెలుగు విద్యార్థి జూలై 2001
నిశాని రాతిని పట్టి మానవ పరిణామాన్ని మలుపు తిప్పింది - బొటనవేలు. రాళ్ళను చెక్కి ప్రాణం పోసిందీ... చిత్రాలకు మాటలు నేర్పిందీ... అక్షరాల్లో కవిత్వాన్ని ప్రవహింపించిందీ... లోహాలను సాగదీసి మెరిపించిందీ... బొటనవేలే! బొటన వేలంటే - పని చేసే నేర్పు వస్తు సముదాయాల కూర్పు సమాజ ప్రగతికి చేర్పు పరిణతి... పరిణామం... మార్పు! అయితే - ఇతిహాస కాలం నుంచీ బొటనవేలును నరికే సంస్కృతి నేర్పుగా బాణాలు వేసిన బొటనవేలు శిష్య వాత్సల్యానికి తెగింది. (ప్రియురాలి జ్ఞాపకాల్ని ఏడో అద్భుతంగా నిలిపిన పాపానికి తాజమహలు సమాధిలో బొటన వేళ్ళెన్నో సజీవ భూస్ట్రాపిత మయ్యాయి. దడే నడమమనయయయియియియయయయిం సెల దోటి
ఆరు గజాల నేసిన గాలిని అగ్గిపెట్టెలో ఒదిగించిన నేతగాడి బొటనవేలు ఇంగ్లీషు మిల్లులో నజ్ఞు నజ్జయింది. నైపుణ్యమున్న బొటనవేలిని చూస్తే అదిలేని వేలుకు గోరుచుట్టు... గోరుచుట్టుపై రోకటిపోటు! యంత్రాన్ని నడిపే పెట్టుబడిదారీ భూతం బొటనవేళ్ళను నరికి పొట్ట కొడుతూనే ఉంది. చేతగాని భూధన స్వామ్యచేతులు బొటన వేళ్ళను నరికి బొటబొటా కన్నీరు కార్పిస్తున్నయ్. అందుకే - బొటనవేళ్ళన్నీ చేతులు కలపాలి సమైక్యంగా నినదించాలి... తమను నరికే శక్తులకు సమాధి కట్టాలి... సమాధి గోడలపై చరమగీతం రాసి తమ నిళాని బలంగా వత్తాలి! 25-11-1999, గురువారం 1- 2 ఎ యమ్ చైతన్య కవిత, 31-32 విక్రమ వసంతం మరియు శరత్తుు అనంతం, 5వ సంచిక కూకిలీడి సూధ్యభాస్మద్ అనానను. 2స్
రుజాగ్రస్త సర్వానర్థం రైతో... కూలీయో... రైతు కూలీయో చేతిపనివాడో.... కార్మికుడో. . నేతగాడో . వృత్తిపనుల కేతిగాడో. . ఎవడైతేనేం?1 ఒక్కొక్కడూ దేశానికో వెన్నుపూసంటూ ఎంత గౌరవం ఎంత మన్నన! ప్రభుత్వమే వారి ఫోటోలకు దండవుతుంది... తలదగ్గర దీపమై గొంతులో గుక్కెడు తులసి తీర్థం పోస్తుంది! ఇదంతా చచ్చాకా అనుకున్నారేమో! కానేకాదు, (బ్రతికుండగానే! పేదసాద బలహీనపు టెముకలే ఆర్థిక సంస్కరణ చక్రానికి బాటగా సామ్రాజ్యవాద రధం పల్లెల్ని చేరుతోంది. రైతుపాలిట అదో పార్టీనియం కలుపు మొక్క! కుటీర పరిశ్రమల్ని మూయింబే ఎగ్జిం పాలసీ! (బ్రతకలేక పోతున్నానని ఎవడైనా అంటే ఆ అభ్యర్థనలోని నిజాయితీని మెచ్చుకుంటూనో,_. తిరుగుబాటుగా వ్యక్తీకరిస్తూనో, . బలవంతపు చావు సాధనాన్ని 'ప్రయోగిసుంది.
చావు సాధనాలెన్నో!
అభ్యర్హనైతే,
ఎవరికి వారే విధించుకునే (ఆత్మ) హత్యో...
ఫ్యాక్టరీ ఏక్సిడెంటో.
తిరుగుబాటైతే,
బలవన్మరణానికి మేకప్ చేసే
లాకప్పో. ఎన్‌కౌంటరో...
వెన్నుపూసలు ఊపిరి వదిలాకా,
ఊపిరి పీల్చుకుంటూ, బహుశా
అమరవీరుల బహమతులు (ప్రకటిస్తుందేమో
ఈ (ప్రజాస్వామ్య (ప్రభుత్వం
రుజా(గ్రస్త రుణ(గ్రస్త సర్వానర్హం! 20-10-2000, శుక్రవారం 8 పియమ్ ఉత్తరాం[ధ్ర వారపత్రిక, 19-3-2002.
ప్రజా సాహితి రజతోత్సవ సంచిక, అక్టోబర్ 2002
కొత్త బాల్యం
ఆరాత్రి...
తొలకరి జల్లుల కవితలతో
శిరీష వనంలో ముషాయిరా! సభానభాన్ని వెలిగించిన
మెరుపు పువ్వుల కాంతిలో
కవిమేఘాలు పాడి పొడి
ఆడి స్వేచ్చగా, అలసిసోగా .
పన్నెండు గంటల డిసెంబరాఖరు రాత్రిని ఆఖరి కవితామేఘం,
ఒక సమ్మోహన రాగ౦- మానసాకాశాలను చుట్టేసింది...
బాల్యం ముసురు మైకం కమ్మేసింది. అలలు అలలుగా దొర్జుతూ
బాల్యాన్ని మధువు చేసి (త్రాగించిన గజల్ - “ఈ ధనమంత పోనీ
యౌవనమంత పోనీ
భోగాలు పోనీ, సరాగాలు పోనీ...
ఆనాటి బాల్యాన్ని ఒకసారి రానీ!”
అదే రాగమైనా,
రామసక్కని మోహనమే!
అదేరాగం, అదే రాగం
పదేపదే చెవుల్లో గింగిర్దాడుతూ నిలిచిపోయిన కాలం...
స్తభించిపోయిన గాలీ...
అచేతనమై పోయిన సమస్త ప్రకృతీ! అద్దేపల్లి పెదాల వేదికమీద నర్తనమాడే పదాల పదసవ్వడుల విన్యాసం వేసవి ఉక్కపోత రాత్రి చినుకుల్దా పిల్లల్ని చేసి గంతులు వేయించింది ఉత్సాహాన్ని బొట్టు బొట్టుగా రాల్చుతూ ఆపాటి మధురమై సాగి సాగి సాగి... ఎప్పుడు ముగిసిందో? అసలు ముగిసిందో, లేదో! బాల్యం నర్తనం ఎప్పుడాగిందో! “వహ్వా! వహ్వా! హుర్రే! లతో రాగ (ప్రపంచాన తలలూపుతూ ఊగిపోతూ కొత్తగా మొలకెత్తిన చెట్టు... శాఖా కరాల చప్పట్లు! కాలం పురిటిబిడ్డ కొత్త వత్సరం పుట్టుకొచ్చింది. ॥ కవులందరికీ “కొత్తబాల్యం' పట్టుకొచ్చింది. 31-12-1999 రాత్రి శిరీష యింట్లో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరిపిన కవిసమ్మేళనంలో అద్దేపల్లి ఆలాపించిన గజల్ విని 01-01-2000, 14-3-2000 శనివారం, & ఎయ్ సర్కార్ ఎక్స్'ఫ్రైస్, 28-4-2002
వరభా ఉంది జంతువులు అంతరించిపోతున్నాయని పత్రికలు ఘోపషిస్తుంటే దిగులేస్తుంది, కానీ - బస్మ్కెక్కి దిగే చోట వినబడే వింత వింత సకిలింపులు - పరవాలేదు, గుర్రాలు (బ్రతికే ఉన్నాయని తెలుపుతున్నయ్! ఆ సకిలింపులకు అందం సంకట కటకట కంటగింపై లోలోనికి ముడుచుకుపోతుంటే, “గాడిద కొడుకు"లంటూ చీదరించుకునే పెద్దరికపు చీవాట్టు - పరవాలేదు, గాడిదలు (బ్రతికుండబట్టేకదా, వాటికి కొడుకులని తృప్తి కలుగుతుంది! మీదికి లంఘించి కోరికల పంజా మానాన్ని చీల్చినప్పుడు- పరవాలేదు, పులులు బ్రతికే ఉన్నాయని సంతోషమవుతుంది! శీలం చెడి, తన మానాన తాను (బ్రతుకు వెళ్ళదీస్తుండగా, లోకం కూసినప్పుడూ...
లోకులు చెవులు కొరుక్కున్నప్పుడూ..
పరవాలేదు, పుంజులూ, కాకులూ
బ్రతికి ఉండడమే కాకుండా
వాటి పని నవి చేసుకుంటున్నా యనిపిస్తుంది!
కట్న కానుకలు తేలేదని
భార్యల్ని పీక్కుతింటున్నపుడు...
ప్రాణాన్ని తోడేస్తున్నప్పుడు ఎ
పరవాలేదు, రాబందులు... తోడేళ్ళు
నిక్షేపంగా ఉన్నాయనిపిస్తుంది.
అయితే,
ఇన్ని జంతువులూ... పక్షులూ
ఒకే రూపంతో
రెండు కాళ్ళమీద నిటారుగా నిలిచి
(క్రార్యంగా నవ్వుతున్నప్పుడు అ
అప్పుడు మాత్రం,
పరవా ఉందనిపిస్తుంది.!
సరదా తీరిపోతుంది!
కానీ -
జంతువులు అంతరించిపోతున్నాయని
పత్రికలు ఘోషి స్తున్నపుడు
నిజంగా, దిగులేస్తుంది...
వాటిని మించిన జంతువే
వాటి విలుప్తానికి కారణమని తెలిసినప్పుడు -
నిజంగా, నిజంగా దిగులేస్తుంది!
జూలో 'సాక్షి పులిని చంపిన సంఘటనకు (4-10-2000) స్పందించి .
15-11-2000, బుధవారం 8 పియమ్ ఉత్తరాంధ్ర వారపత్రిక, 14-5-2002
తమి తీరని తీరం
రెక్కలొచ్చాకా = పల్లెచెట్టునొదిలి నగర బీడుల మోడులపై సొంత గూళ్ళేసుకున్న తమవాళ్ళకై ఎదురుచూసే చకోర మిధునంలా-
నానమ్మా, తాతయ్యా ంం
నిళ్ళ్శబ్ద నిరంకుశుడి నిరపేక్ష
మౌన కొరడా రుళిపింపుల రాజ్యంలో. పల్లెటూరిలో, ఆ యింట్లో!
పడక్కుర్చీలో పద్యాలు చదూకుంటూ, కవిత్వప్పక్షి తాతయ్య ఇణేళ్ ఖణేళ్ నానమ్మకు గా(త్రకచేరీ!
వంటింట్లోంచి లీలగా గిన్నెల చప్పుడు తాతయ్యకు వాద్య సంగీతం!
మరే చప్పుడూ లేని
నీరవ చప్పిడి నిశ్శబ్దం!
'ప్ర'తీహారు'లై
జెయిలింట్లో నీరసంగా వాళ్ళు -
అలల ఆగమనం కోసం, ఆలుపన్నది లేకుండా ఎదురు చూసే తడి ఆరని సము(ద్రతీరంలా కెరటాలొచ్చి మురిపిస్తాయని ఆశగా... ఆబగా... వచ్చే అన్ని కెరటాలూ తీరం తాకవు,
ఉత్త-రపు కుశల (ప్రశ్నగానో...
రెండు నిమిషాల ఫోనుకొాలుగానో... మొక్కుబడి మనీ ఆర్డరుగానో .
సము(ద్రంలోకే జారుకుంటయ్!
వెనుదిరిగే కెరటాల్ని చూస్తూ,
తమి తీరని నిర్నిమేష నిరీక్షై... వాళ్ళు!
22 ప సెలవ రోజు
ఏ నాల్రోజుల సెలవో దొరికితే, చేపల విందులూ... పడవ వినోదాలూ.. శాటి'లైట్-హౌస్” ప్రోగ్రాంలూ లేకపోతే, తీరికైతే.. పండుగనో, పబ్బమనో... ఆటవిడుపు మజిలీకై కెరటాలు తీరాన్ని తాకుతయ్! తడి చేరిన తీరం, యింకా చెమ గగిల్లి ఆనందార్షవ మౌతుంది! నే మనవలు కేరింతల సమె గటలతో నిశ్శబ్దాన్ని సహస్ర శిరచ్భేదం చేస్తారు... అల్లరి తవ్వు'గోల'లై ఒంటరితనాన్ని తవ్విపోస్తారు! మనవరాళ్ళు పొటల హరివిల్టులై, నానమ్మ చుట్టూ నాట్యమయూరాలౌతారు! ఆ రెండు మూదడ్రోజులూ, పిల్లల్లో పసిపిల్లలై - నానమ్మా, తాతయ్యా క కర. ఉరు తెలినవ్వుల నురగలౌతారు[॥ ఒంటరితనపు తీరాన్ని చేరిన కెరటాలు ఆంతరంగపు లోతుల్లోకి ఇంకకుండానే వెనక్కెళ్ళే సమయ మొస్తుంది తీరం - ఒంటరిగా ఉండలేకా, నగర శబ్దాల సముద్రంలోకి పోలేకా అతలాకుతల సతమతపు బెంగ వీడ్కోలవుతుంది. తడి ఆరని... తమి తీరని తీరం = నిశ్చల నీరవ నీరస నిర్నిమేష నిరీక్షణలో... ఎప్పటిలా! 31-8-2000, గురువారం 2 ఎయం అనంతం 7వ సంచిక, ప్రతిబింబాలు శీర్షికలో మూకినీడి సనూప్యుభాస్మ్మన్ అలానా. ఏ0
బ్లడీ ఇండియా
చాలా మందిని చూశాను! మెడలో మూర్చ బిళ్ళగా...
కర్ర ఊతను తాటిస్తూ బెర్తుల నడుమ మెల్లగా సాగే గుడ్డి పాటగా...
చిరుగుల చొక్కాను చీపురు చేసి,
రైలు బోగీల కళ్మలాన్ని నాకేసే బాల్యంగా...
కాళ్ళు పట్టి వదలని బ్రతిమాలుడు పాలిషుగా... అకలి అవతారాలెత్తించిన
రకరకాల కడుపు చిచ్చులను చూసి -
“బ్తడీ ఇండియా!” అని గొణుక్కుంటూ,
పైసా విదల్బాలంటే మూర్చబోయే జేబుల్ని.. రాత్రికోసం - ఎక్కగానే బెర్హుల్ని
ఆ(క్రమించేసే అక్రమార్కుల్నీ...
జేబురుమూల్ని ముక్కుకు అడ్డుపెట్టుకునే
అత్తరు గుమాయింపుల సిల్కు లాల్ఫీల్నీ...
నొసలు చిట్లించే గ్లాస్కోపంచుల్నీ .
చాలామందిని చూశాను!
చాలా చాలా మందిని!
గమ్మత్తు, వాళ్ళందరూ-
ఇల్టూ ఒళ్ళూ, మనసూ
యిరుకిరుకు కమురు కంపు కొట్టే గబ్బుగాడొకడూ... కని పెంచిన అమ్మనాన్నల్ని
కనిపించని వాళ్ళ ఖర్మానికి వదిలేసిన వాడొకడూ.. కని పెంచిన దేశానికి గుడ్‌టై కొట్టి
(బ్రెయిన్ డైయిన్‌లో
కొట్టుకుపోతున్న మేధావాకడూ...
నిజమే, దేశం -
“బ్లడీ ఇండియా” కాకపోతుందా?
ఆంతకీర్తీ రాకపోతుందా??
అనంతం 7వ సంచిక, 'ప్రతిబింబాలు' శీర్షికలో
చ లాలా సెలద రోజి
హా! పోర్నోగ్రాలి వి-ఛానెలై. . ఎఫ్-ఛానెలై రక్తనాళాలు తెగిపోయే హైటెక్ (పర్ టెన్షన్! నరాల రాపిడి కరాళ మార్చిడి.... గుప్తమానసిక వ్యభిచారంతో శరీరాను'బూతుల' పందేరా! “లవ్ అన్న పవిత్రపదమూ, పర్యాయాలూ కీ బోర్జునుంచి అయ్యే తర్జుమా కంప్యూటర్ తెరమీద బీఎ్హై నైతిక పతనారోహణ మౌతుంది. ఇంటర్నెట్ కేబుల్ సాక్షిగా దేశదేశాల మానసిక భంగాలూ ఇరిడియం పరవశమై పలకరిస్తుంటే... భిన్నరుచుల నేపధ్యంలో ఛానెల్స్‌గా విడిపోతూ- ఇంటిల్లిపాది అనుబంధాలూ, ఆప్యాయతలూ విచ్చిన్న హృద్రోగానికి గురైనప్పుడు ఈసీజీ తీస్తే వెక్కిరిస్తూ అది - “హైటెక్ పోర్నోగ్రాఫ్'! 14-8-2000, గురువారం ౩ ఎ యమ్ అనంతం 7వ సంచిక 'ప్రతిబింబాలు' శీర్షికలో
ప్రభాతం ఆవులిస్తూ లేచిన నైటీలను మడచికట్టిన లుంగీలను లాక్కెళ్తూ గొలుసుల చివర పెంపుడు కుక్కలు... విశ్వాసంతో పరుగెత్తలేని నిశ్వాసం! గొంతుల్లోకి కాఫీచుక్కగా మారడానికి ఇళ్ళకేసి పరుగులెత్తే తెల్లనీళ్ళ ప్యాకెట్టు... చెట్టాపట్టాలేసుకు జాగింగ్ చేసే రోడ్డు... బస్కీలు తీస్తూ వ్యాయామించే స్టే (గ్లౌండ్లు బడికంటె పదిలమైన ట్యూషన్‌కి పుస్తకాల మూపురాలతో ఎడారి ఓడలై వంగి వంగీ... పరుగులెత్తే పిల్ల హడావిళ్ళు... కాలనీలో - ఎప్పటికీ కరగని ఆఫీసరు బొజ్జలు బాడ్మింటన్ బాలై పెట్టే పరుగులు... కావిళ్ళు, బిందెలు, పీపాలుగా మారి తొట్టి రిక్షాల్గో పబ్లిక్ టేఫ్ ఉరుకులు మొదటి షిస్టు పరిశ్రమకై లంచ్ ప్యాక్‌లు తగిలించుకొని కాఖీ యూనిఫాం సైకిళ్ళ రేసులు... చద్ది మూటలు వేలాడేసుకుని పరుగులాంటి నడకతో కోతల కొడవళ్ళు... మేస్త్రీ తాపీలు! చీకట్లో పురిటి నొప్పులు పడ్డ రాత్రి (ప్రసవించిన వెలుతురు చైతన్యం (ప్రభాతమై - పరుగులూ... ఉరుకులూ! 2-8-2000, బుధవారం 9 ఎ యమ్ అనంతం 7వ సంచిక, “ప్రతిబింబాలు” శీర్చికలో
అల్లిగూటిలో... నాన్నుద్యోగం పుణ్యమాని బదిలీల సర్వంలోపడి తల్లిలాంటి పల్లె ఒడినుంచి జారిపడ్డాను, రోదసిలోకి శాటిలైట్‌లా! పిల్లల్ని ఏడిళ్ళూ తిప్పే పిల్లిలా, నా ఉద్యోగమూ- చెడ తిరిగీ తిరిగీ, ఎన్నాళ్ళకో... ఎన్నళ్ళకో... మళ్ళీ! తల్లిలేని నా పల్లె వెక్కిరించింది, మోడువారిన చెట్టులా... తేనె పిండిన తుట్టెైలా! చావురోదన లయ్యాకా, చూపుల పలకరింపులే మాటలైనచోట... నిశ్శబ్దం రాజ్యమేలుతున్న వేళ... బలవంతంగా గడపాల్పొచ్చిన నిరాసక్తకాలం - తోచక, మౌనాన్ని వీడి హృదయం ఘోషించింది... పల్లెతో నాకున్న చిన్ననాటి కొద్దిపాటి అనుబంధాన్ని పలవరించింది! పెణక్కి కట్టిన పరిగె కంకుల్ని ముక్కున పొడుస్తుంది, పిచ్చుక! కుటుంబ బాధ్యతలూ, విధి నిర్వహణా ఒత్తిడుల పొరల క్రింద గడ్డ కట్టిపోయిన నిక్షిప్త బాల్య స ట్రకుల్ని నేనూ... “త్రుళ్ళి త్రుళ్ళి పడుతోంది తాలకరి వయసం”టూ అత్తల పిన్నమ్మల ఆడంగి సభలతో మొదట చూసిన సినిమా స్వీయ నృత్య ప్రదర్శనలు... కోకిలల్ని రెచ్చగొట్టిన కూకూ పాటలు...
వీథుల్ని చుట్టబెట్టిన పరుగుల ఆటలు... కాళెంగిలి తాయిలాల
“అమ్మా- నాన్నల పిడత సంసారాలూ... దూరంగా నేలని ముద్దాడే ఆకాశాన్ని (త్రుంచి జేబురుమాలుగా మడవాలనే విఫలయత్నాలూ.. ఊరి కాలవలో గేలం పట్టిన చేపలవ్వడాలూ. ॥ పంట మోటారు ధారకి
శిరసప్పగించి దిమ్మెక్కిపోవడాలూ...
చేలగట్ల కందికాయల "స్నేహాలూ...
చెరకు తోటల తీపి తీపుల తోపుళ్ళు..
దొంగ మామిడి కాయల కారముప్పు నంజులూ... గోటితో జు(ర్రిన తాటి ముంజులూ. .
వల(లు)పు గింజల్ని
తల్లి పిచ్చుక, "పెరట్లోని వేపచెట్లుపై
లా గ! [మ గూట్టోని పిల్లనోళ్ళ కందించింది... న!
సాచిన రెక్కల కంబళి కప్పింది!
నా మధుర స్మృతుల గింజల్ని
పిల్లలిద్దర్నీ చెరో చేత్తో పొదివిపట్టి నేనూ- చాన్నాళ్ళ కెన్నాళ్ళకో..
పల్లెగూటిలో...
పరవశించిపోయాను!
25-8-2000, శుక్రవారం 8 పియమ్ సంస్కృతి - త్రైమాసిక సాహిత్య బులెటిన్ - 2, జూలై 2002
చిరుజల్టుగా మొదలై
మట్టి పరీమళమై ముక్కుకు అందుతుంది... ఉన్నట్టుండీ
కారుమబ్బుల కుంభవృష్టయి మనుషుల్ని తోరణాలు చేసి
షాపుల చూరులకు వేలాడేస్తుంది. అరవై అడుగుల కాలవలై (ప్రవహించే రోడ్డు
నుదుట మూగే చినుకుల ఈగల్ని వైపరు ముంగురుల్తో తోలుకుంటూ చక్రాల తెడ్లతో ఈదే వాహనాలు... మెరకందిన మేర
గడ్డి పరక మోదికి చీమల్లా
ఉభయ చరాలై పాకుతయ్! ఎండరంగు వెలిసిన (ప్రకృతి
చల్లని పచ్చరంగు కురుస్తుంది చూరు ధారల దారప్పోగులు
నేల అద్దంపై సృష్టించే
వలయ వలయ వలయాల సాలెగూట్లో మనసూ మెదడూ చిక్కి, మమేకమై "హైకూ అనుభవమౌతయ్!
బడ్డీ కొట్టు టీ కెటిలు సెగలు గడ్డకట్టిన ఊపిరికి ఊపిరులూదగా, డిస్పోజబుల్ హైటెక్ కాగితప్పడవల్ని రాదారి కాల్వల్లో తేలుస్తూ పెద్దాళ్ళూ చిన్నపిల్ల లౌతారు! అంతవరకూ మసిబారిన ఆకాశపు కారడవిలో చిక్కిన సూర్యుడు తడి ఆకుల మాటునుంచి తడి సడిగా తాంగి పలకరిస్తాడు కాలవల్లోకి ప్రవహించే ఇంద్రచాపాలై "పెట్రోలు కంపుతో వర్షం ముగుస్తుండగా - చెట్టూ... పక్షులూ రెక్కలార్చి మళ్ళీ భయపెడతయ్! బురద పన్నీరు చిలకరిస్తూ రంయ్‌న కార్డు సాగిపోతుండగా... అంతవరకూ వడదెబ్బకు సొమ్మసిల్లినవి, చలిదెబ్బకు చెమ్మగిల్లి టూవీలర్జ్హు ముణగదీసుకు మొండికేసి మోటారు చికిత్సాలయం వెలుపల బార్జుతీరి రోడ్డు కిరువైపులా బారికేడు లవుతయ్! ప్రకృతంతా గృహోన్ముఖమైనా, నిర్జీవపు బారికేడ్డో జీవాణువులై కొందరు... 12-6-2002 మంగళ, 20-6-2002 గురు సర్కార్ ఎక్స్‌ప్రెస్, 24-8-2002 త0 ాలలననాయావావావలి నలక రోబో
రంగులై... రాగాల్లి వాడు- జీవితంలో విశాలంగా పరుచుకున్న తారునల్లని విచారపు రంగునే వర్ణాంచితం చేసుకుంటాడు... రంగు సుద్దలే బ్రతుకైనవాడు- చేతి కుంచెను అరగదీసుకుంటూ రంగును రంగుతో మేళవించి వర్ష సంగీతమై పల్లవిస్తాడు... రంగుల జాతరాతాడు! నిశితమైన వేళ్ళ కళ్ళతో సునిశితమైన గీతలు గీసీ... రేఖలు రేఖీ రంగుల (ప్రకాశాలద్ది, నాలుగు రోడ్ల కూడళ్ళలో దేవతామూర్తుల బ్లో అప్ అవుతాడు! ఏ దేవుజ్తైనా కోరిన తక్షణం దర్శించి, దర్శింపజేయగలవాడికి లక్ష్మీ సాక్షాత్కారం దొరకదు! రంగుల భాష తెలిసిన ఏ కొందరో గలగల్హాడితే.. చిల్లరై రాలితే, బిగించి కట్టిన గుప్పిట మూట- సగం ఆకలినే మాయం చేస్తుంది. తీరని అర్జాకలి మళ్ళి... మళ్ళీ... మళ్ళీ... రోడ్లపై పరుచుకుంటూనే ఉంటుంది... రంగులై!.. రాగాలై॥ 26-12-2000, మంగళవారం 11 పియమ్
ప్రజాసంస్కృతి - మాసపత్రిక, 16 అక్టోబర్ 2002
కూకినీడ సూద్యభార్మన్ వాననానావవను. 41
ఛానవైలీకరణం హైటెక్ వ్యాపార ప్రకటనలూ ఇంటర్నెట్ ఇంటింటా దింపే హాలీ నీలిచిత్రాలు - నీ నరాల తీగల సంకేతాల్ని మోసుకుపోయే యావెట్టు! దుశ్ళాసనుడొల్చిన చీరల్లా ని సంస్కృతిని నన్నీకరించే... మెజీషియన్ నోట్టోంచి ఎంతెంతెంతగా లాగినా వచ్చే రంగు కాగితాల చొంగ తీగల్హా... వందల వేల ఎపిసోడ్‌ల క్షు[ద్రకధల చేతబడి- పిల్లల వికసనాన్ని వికటింపించే కంటతడి సెంటిమెంటు వంటాకాలనే వంటబట్టిస్తుంది ఉప్మాలో కరివేపాకు సూడో ఛైల్డ్ మోడలింగ్ చిన్ని బుర్రల్లో చిక్కుకుంటుంది. కలలు కనే కళ్ళకు కల్లల మిధ్యాభ్రమల తెరలు దించుతుంది.
రంగురంగుల మళల్టీఛానళ్ళల్లో ఈదులాడాకా. రంగూ రూపాల్నీ అట్టేపెట్టుకుని ఆలోచనలూ, అభిరుచుల్లో వాడి బానిస వవుతావు .. వాడి వ్యాపారానికి దినుసు వవుతావు నీ జాతి సంస్కృతిని ఎండగట్టి నిన్ను నిలువెత్తు పరాయి తనంగా మార్చుతుంది ఛానెల్! బంగాళాఖాతం, అరేబియా తీరాల యౌవనాల్ని అట్లాంటిక్ తీరంలో తేలుస్తుంది. సభ్యతా సంస్కారాల సాంద్ర సంస్కృతిని భౌతికవాద తీరపు ఇసుకపర్రల్గోకి మళ్ళించి యింకిపోయేలా చేస్తుంది ఛానెలీకరణం! 25-12-2000. సోమ. 23-3-01. శుక్ర. 25-5-02. గురువారం ఈరోజు (దిన) 23-2-2003
అల్లి చిరునామా
ఊరి గడప దగ్గర కాపలా కుక్కలాగుండే వాగేదీ? మధ్యలో సరస్సు రంగవల్లి మీద గొబ్బెమ్మలాంటి గుడీ... పక్కనే ప్రసాదాలూరించుకుంటూ తినే బడీ... కంకుల చేతుల్లో పిల్లల్ని పిలిచే మడీ... ఏమైపోయాయ్? బు(ర్ర మాసాల కి(ర్రుచెప్పుల పొన్ను కర్రల ఇచ్చకాలు నడిబొడ్డు, రచ్చబండ గట్టుకిందే సమాథైపోయాయా?! "పేర్లక్కర్లని
న! ల వదినా పిన్నీ బాబాయ్‌ల పలకరింపులూ... చేదబావి గిలక నింపే నడుమొంపుల ' కన్న బిందెల సరసొలూ.. తీరిగ్గా 'చుట్ట'రికపు పొగలూదుతూ చేసే పెద్దరికపు టరుగుల పరిహాసాలూ.. ఏవీ, కనబడవేం! ఏతామేసే అందాల్ని చూసి రెచ్చిపోయి వడిసెల జోరుగ తిప్పే నూనూగు మోసాల మంచెకట్టూ...
ఊరి జనాన్ని గట్టు చేర్చే బల్లకట్లూ... గుబురు చెట్టూ... ఎక్కడికి పోయాయ్? పల్లె గుడిసెలు కొప్పుల్లో గుమ్మడిపూలు తురమడం మానేసి నాజూకు ముళ్ళు ముడిచి డిష్ యాంటెన్నా వలల్ని చుడుతున్నయ్! కాళీ పుల్లలు విరిగీ, కబడ్డీ కాళ్ళు బెణకీ యాంటెన్నా ఊచలకి బాల్యం ఉరేసుకుంది. కాలవగట్ట బుడుంగు ఈతలు మల్టీ ఛానెళ్ళలో మునకలేసి పల్లె, బాల్యాన్ని కోల్పోయి నాగరికతారుజతో వజవజ వణుకుతోంది. పల్లె చిరునామా ఏ మాయాదారి డాట్‌కామ్‌లో యిరుక్కుపోయిందో?] 23-5-2002, గురువారం 6 ఎ యమ్ సర్కార్ ఎక్స్(ప్రెస్, 24-2-2003
ఉమ్ముడాఫ్థి అతగాడు 'సారాగమై రాగా ముద్దయి కడుపునూ కాంక్షనూ చల్చార్భనన్నందుకు వీపుమీద తట్టై తేలినప్పుడు లేలేత సరాగాలై తడిమిన చేతులు- మరో నాలుగు జతలు కలిసాకా, ఎవరి "స్వేచ్చ వారిదిగా ఎవరి ఆనందం వారిదిగా ఎవరి సుఖం వారిదిగా ఎవరి జీవితం వారిదిగా... ఆమె స్వేచ్చకు వారధిగా ఆమె ఆనందానికి అవధులు గీస్తూ ఆమె సుఖాల్ని మండువా జైలులో కుదేసి ఆమె జీవితాన్ని ఖైదు చేశాయి. నలుగురన్నదమ్ములకీ నాలుగు భాగాలైన లోగిలికి ఉమ శైడాస్టిగా ఎ బూజులు పట్టిన మండువా... గాజులు చిట్లిన ఆమె, యింకా యింటిని వెలిగించాలని ఆశగా! మత్తులో జోగే మగని ఈగలు మూగే నోటి చొంగ బియ్యంలేని కుండలో ఎసరైతే, ఆమె చెమట చుక్కలు గింజలై ఉడికి వాళ్ళ చేతుల్లో మెతుకులై మెరిసేవి. వారి చిరిగిన బాల్యాన్ని కప్పెన 'పైటచెంగు అనాచ్చాదిత రొమ్ములై వేలాడుతుందిపుడు
కడుపులో తన్ని బయటి కొచ్చినవాళ్ళు కదా, కడుపును రేషను ముద్దలకాళ్సై తంతున్నారింకా. పక్కలో ఒదిగొదిగి కోడిపిల్లలై పడుకున్నవాళ్ళు పక్కమించి పక్కకి గిరాటేశారు. కడుపు ఫలించాలని పట్టిన (వ్రతం... ఫలించిన కడుపులు నింపేందుకై పడిన (శ్రమ (వ్రతం. వాళ్ళు దారబాబుల్లా బతకాలని భారంగా దొర్లించిన జీవన(వ్రతం- యిప్పటికీ మమతల సఫెవికాల్‌తో విచ్చుకోని ఆశీః పెదవుల కరడుగట్టిన మౌనవ్రతమే! మెత్తని ఒడిలో పవ్వళించిన వాళ్ళు ఆ ఒడిలోనే అవమానాల మూటలు పెట్టి మండువా ఒడికి అప్పగిస్తే - వాళ్ళే తడబడే అడుగుల కెప్పుడో వేదికైందని ఆప్యాయంగా దాన్ని మరణశయ్య చేసుకొంది. నాలుగేపుల గుమ్మాలకీ నాలుగు (ప్రాణాల్ని మంగళతోరణాలు చేసి వేలాడుతూందామె, తరతరాల భవిష్యానందాన్ని కాంక్షిస్తూ యా? అగంధాలవై కనబడని గాలి స్పర్భయి భి ల క బం 1 క వాళ్ళను తడుముతూనే ఉంటుంది! “" ౧ టి భి [40 రీరాతతపె ఎ మిగిలిన అయిదో (ప్రాణం ఓ లో డిన మ ఆ పాడుబ ండువాలో మ నాస్య గ నిరంతర లాలనై... చిరంతన దీవెనై!! న న 1-6-2002, శనివారం 8 ఏ.ఎమ్ ఈరోజు, 5-3-2003
శీర్దాననం లోనికి లోలోనికి... నీలోనికి శీర్దాసనం వేస్తేనే... కని, పాలిచ్చి కని, రక్షించే పశుధర్మం ముఖ్యమే! కానీ- అంతకు మించిన కని, ఆనందించే కని, సంస్కృతిగా మిగిలిపోయే కళలున్నయ్. . కలలున్నయ్! పువ్వుల్లో శీర్దాసనం వేస్తేనే తేనెటీగలకు మధువు దొరికేది! తలకిందులై ముక్కుతో జలగర్భం చీలిస్టేనే కింగ్ ఫిషర్లక్తు చేసల్లు దొరికేది! నుఖ్వ్ లోనికి లోలోనికి .. నీలోనికి శీర్దాసనం వెయ్యాలి! 5-4-2001, గురువారం
సర్కార్ ఎక్స్‌ప్రెస్, 22-3-2003
బేర కుత లలలాానాానానాలాలాా. సలవు రోటి
| 1 కృతికర్త కృతిభర్త ; మాకెనీదె ముబ్రిత రచనలు - జ్యోతిబాల, సుమ కవితాంజలి, హైకూ చిత్రాలు లా ప్రకృతి గీసిన వికృత చిత్రం, సెలవరోజు . కళాసాహితీ తోరణం, హైకూ కవిత్వం - అనుశీలన, నానీలూ - నాలుగు వ్యాసాలు, కలం కలలు (మొదటిభాగం), దృక్కోణం, సత్యాన్వేషణలో, రెండు ఎలిజీల మధ్య అంతసౌందర్యం : కథల సంపుటి పాఠశాల పాలన, చదువుల పండుగ, 5016గ1110 16౧౧౧6గ కొలెస్టిరాలు మాకెనీడిపై ఇతరుల పుస్తకాలు .. రచన - రసన (మాకినీడి సాహిత్య, వ్యక్తిత్వ సమీక్షు దృష్టి - సృష్టి (మాకినీడి కళాసమీక్షు డా -- మాకినీడి - కళా సాహితీ జీవన రేఖాంకన : త్వరలో రానున్నవి . కవిత్వం : రాలిన పుప్పాడ్మి బుతుగానం, ఒక్కక్షణం ॥ .. విమర్శ. : విమర్శ - పరామర్శ, విమర్శ.వేదిక, కలం కలలు (రెండవ భాగం) - , కళా విమర్శక వ్యాసాలు, మన చిత్రకారులు . | (18౧1 ౯౧౧6౯ = ఛి0884-2379690