Telugu Sarvaantaryami - anilvaranasi/indianlanguages GitHub Wiki
ల శ న్‌్ | . ర సట షు న గ వే స ను ళం క్ రా
సట వం స. కూ, య యం క ప న ము యీ షస | త న్ వబ -. సో మే యాం న్స సా ర బ్ర ఎక స ల! య్య. భా స్మ శన: షా? స ఓ సలి . దాక నా చ ఆ మర వాం లే సో చంటి న న... ॥ గే ల వె చాటు శర జో నం మ్ టే 1; రం ౨ సమస నె ఆ. స్త” ర? మ్ లలల య టా రూ త్య టం చాటి, నం రం సటకా 7 ప న న టన న న న లం య దం చసన సి సమన క్ య ఉన్నా నుందు లట వ నునన వరదుడు అల్లో ర్సురీ పొయిట్రి సర్కిల్ కా! హైదరాబాద్
హాం సు చయయ కంిధాలయ (ఇ య్. న నం టో కా పం ఏ. న్నాద్తి సై నునంలో . 1% ఖీ ర్ ్టలం.... టంట శ కరగ 24౮ న్ 00౦|160110౧ 0 ౧౦౭౧౫8 ౧0615" 0౦౧6! ౧1౦01 110. కఈొర/(నంం. 11.00. 5ర3ట,౪01660'౧౦౩౦ ౪0౧౦$1001006[0౧), గ/౦610006 - 500 070, [19౪ 801100 : 2206 0౦౭౦8గ౦6; 2005 |. ౧౦౭ 06$0౧: 5110, గటగ౦[0 01601065 యూ ౯౨||$166 0/౮1౦| గ౦61/ 01016. ట్రీ 16-2-740/75/40.41. 0౧౦౩9 1000; "కు ఆంరం|4౧౧౮|౦గా. ౧౪౦. ౧౧: 24064195 ః| ౧0౧199 ౮610016 61 : 9016906161 800% 100596, 0౧140606 1 /660006 6౧06 13 శ ర/0౧౦౧60 1౧4.2 16/060/0 800% 40౪56, 0౧౧. &౧౧౦ 30100] 11600 కింయంగం౪ల (1/66/0006 - 600 001: 0156 కొిట:10%0 0౧6107, ౧౧౦6౮౧౦ 1 ౧/6౪[60060%౧6 16టం48001%804006,40య0ై0606 10ఆం000. ౦౧౧౧౦౩౭6 61 |(:010 01601019, ౦-2 స/౮15 ఉర, గరఆ్రంరర గ6610006. 5౧: 2244088 06౧౮ ౧గ౧160 01 616/6 1౧0/69౪10గ9, [౧౮౮510 4160, ఉంగ౧ం000, /6ఈ౦006.0౧0౧౬౦: 2767841], 55295076 ౧.35,
వెన్సైల దీవం ఆరిపోయింది హైదరాబాద్ నిద్రపోయింది నన్ను పెంచి పెద్దచేని వెళ్ళిపోయిన తల్లి నా అక్కయ్య నుళీలాబాయికి ఒం పెద్దరాజా
గురువులు కౌ శినారెడ్డి మిత్రులు వానీరెడ్డి నవీన్ వరుభూరి నుబ్బయ్య అక్షర క్రియేటల్స్ నీత ద్వారాకా బృందం వత్రికలు - మిత్రులు అందరికీ కృతజ్ఞతలు
ఎక్కడెక్కడా...!
1 తడిస్తే కుళ్ళిపోతారా..! .. 7 | 20. ఖర్జూరపు గెలల్లాంటి య 43 2, తలుపులు 98 | 2. డిక్టేటర్ కీర్ 3. నీరండ 1 | 22. సభాసధులారా! గీరి 4, రుణం ౧4౧2 | 20. సందర్భ సహితం అ ర్0 5. సర్పంలాంటి నయనాలు .. 14 | 24. మంట ం క3 6, అశ్చర్యం ఎ గ | 25. ఆసరా య ర్‌క్ 7. ఎవరూ భయపడరు ఎ 198 | 26. సావాసం ఎం 57 8. పూర్వీకులు *, 20 | 27. కెంపులు యు 58 9. ఒకటీ - ఒకటీ ౨. 21 | 28. అర్జునా, ఫల్గుణా,
-
అందుకే...! అ 22 పార్డా, కిరీటీ...! మ క్‌కి 11 ముద్ర 24 | 29. వినిపించీ వినిపించకుండా .. 60
-
బందిఖాన 25 | 30, పువ్వులు య 62
-
శిథిలాల నడుమ...! 27 |, 31 నిజమేనా! య 63
-
సర్వాంతర్యామి * 29 | 32. ఏం చేద్దాం! య 64
-
అతడంటాడు ,. 32 | 33. ఒక నెమలిపింఛంగా..! .- 65
-
ఎంతకాలానికి = 34 | 34. మునులూ
-
ఆధునికోత్తరుడు అ 35 మునిపత్నులూ 67 18, ఒక్క నిషా కోసం అ 37 | 35. పచ్చిగాయం ఎ 69
-
దూరాన...! ._. 398 | 36. దాదార్‌టువీటీస్టేషన్ .. 70
తడిస్తే కుళ్ళిపోతారా....
రొకరాక వర్షం వస్తే
పిచ్చి గొడుగులెందుకు
కుంటిపరుగు తెందుకు
ఈ విసుక్కోవడాలెందుకు
తడిస్తే కుళ్ళిపోతారా!
బార్జర్‌లో వున్న సైనికుడు
స్వంత ఊరుకి వచ్చినట్ట్లు వచ్చింది ఉదయం నుంచీ బయటకు వెళ్ళిన తల్లి బిడ్డకు పాలు పట్టడానికి వచ్చినట్లు వచ్చింది పరాయి దేశంలో వున్న కొడుకు
ఏళ్ళ తర్వాత రాసిన ఉత్తరంలా వచ్చింది రాకరాక చినుకులు వస్తే రెయిన్‌కోట్లెందుకు
కోతిటోపీలెందుకు
ఈ బూచి వేషాలెందుకు
మట్టిముద్దల్లా కరిగిపోతారా!
అలిగిన మిత్రుని
పలకరింపులా వచ్చింది
విడిపోయిన గ్రేయసి
భర్తాపిల్లల్లో ఎదురుపడినంత పవిత్రంగా వచ్చింది కరువులో రాలిన
హో , ఆశారాజు కవిత
శనర్యాంతర్మామ్
రేగుపళ్ళలా వచ్చింది
లేకలేక జల్లులు వస్తే
రబ్బరు బూట్లెందుకు
ఈ కుష్టురోగుల నడకలెందుకు
చూర్ణకింద దేకడాలెందుకు
నీళ్ళు తాకితే పాదాలు ఊడిపోతాయా!
రాకరాక మల్లెమొగ్గల్లా వచ్చింది
లేకలేక చిర్నవ్వులా కురిసింది
కార్ల అద్దాలు మూసేయడమెందుకు
బస్సు షెల్టర్ల కింద దాక్కోవడమెందుకు
పోలీసుల్ని చూసి బెదిరే
పగటిదొంగలా!
ఇన్నాళ్ళకు
కరచాలనంలా వచ్చింది
చల్లని వెచ్చదనం కౌగిలిలా వచ్చింది
బట్టలన్నీ విప్పేసి
నగ్నంగా గంతులేయాలి
దోసిలినిండా చినుకులు నింపుకొని
తనివితీరా ముద్దుపెట్టుకోవాలి
రాకరాక వర్షం వస్తే
రోడ్డ మీధ బృహన్నల్లా కులుకులెందుకు
ఎండిపోతే వొణికిపోవాలి
తడిసిపోవడానికి భయమెందుకు?
రచనాకాలం న ఆంధ్రజ్యోతి వివిధ
8272005 ఉదయం 9 గం. * 18.2005
ఆశారాజు కవిత
ర్ *శ్‌డ్తక్యాము
తలువులు సమయం దొరికినప్పుడు తలుపులు తెరచి చూసుకోవాలి చీకటిగా వుంటే దీపం వెలిగించాలి మూలల్లో, సాలెగూళ్ళు అల్లుకుంటే కర్రతో తీసెయ్యాలి పుస్తకాల మీద దుమ్ము కూర్చుంటుంది ఖడ్గాలకు బూజుపడ్డ్తుంది అద్దం మీద మరకలేర్చడతాయి సితారు తీగల మీద చిత్తు కాగితాలు పేరుకుపోతాయి చందమామ మీద మబ్బులు గుమిగూడుతాయి ఒంటరిగా వున్నప్పుడు తలుపులు తెరచి చూసుకోవాలి హార్మోనియం మీద బొద్దింకలు తిరుగుతుండొచ్చు ప్లూటు రంధ్రాల్లో జెర్రి పిల్లలు పెరుగుతుండొచ్చు నెమలి పింఛం మీద ఆశారాజు కవిత
ర్త నర్వాంతర్హామి
బల్లులు గుడ్డు పెట్టి వుండొచ్చు అర్ధరాత్రి వొకసారి తలుపులు తెరచి చూసుకోవాలి వర్షానికి గూడుకారుతుందా తుపానుకి పూలు రాలిపోయాయా ఎండకు కొలనులో నాచు మిగిలిందా చలికి పెయింటింగు చెదరిపోయిందా అప్పుడప్పుడు మనలోకి మనం తొంగి చూసుకొని బతుకును శుభ్రం చేసుకోవాలి చఈచనాకాలం: 13.8.2005, రాత్రి భ్రాంతి బాల్
ఆశారాజు కవిత
| గ శ నర్వాంతర్జామి
నీరెంద ఇ౦౦త జ్వరంలో ఆ పరుపు మీద, ఎందుకు పడుకుంటావు నుదురు పెనంలా కాలుతోంది వొళ్ళు మరుగుతున్న నీళ్ళలా వ్పంది ఇంత తీవ్రజ్వరంలో ఆ సోఫా మీద ఎందుకు పడుకుంటావు నీటి మీద తేలిన చేపల్లా, కళ్ళు తేలిపోతున్నాయి అడుగంటిన అన్నంమాడులా, పెదాలు చెక్కుగట్టాయి వాణుకుతున్నావు మూల్గుతున్నావు ఇంత నీరసంలో ఆ మంచం మీద, ఒక్కదానివే ఎందుకు పడుకుంటావు నా భుజం మీదపడుకో - నా తలకు నీ తలని అనుకోనివ్వు ఇన్నేళ్ళు, నన్ను నీ వొడిలో లాలించావు ఈ వయసులో నిన్ను బొమ్మలా జోకొడతాను ఇంత జ్వరంలో అంత దూరంగా ఎందుకు పడుకుంటావు నా ఎద మీద సేద తీర్చుకో నీ రుణం తీర్చుకుంటాను ఆశారాజు రవిత || *నర్వాంతర్మామి
రుణం ధన్యవాదాలు చెప్పాల్సివస్తే చాలామంది ముందు మోకరిల్తాలి బొమ్మలు గీయడం నేర్చిన చిన్నచిన్న కథలు చదవడం అలవాటుచేసిన క్లాసులో ముందరి బెంచీ మీద కూర్చునే ధైర్యం పోసిన పెద్ద నయనాల చిన్నపిల్లకు హృదయ కుసుమాలు అందజేయాలి ఒకే బెడ్డు మీద పడుకొని ఒకే దుప్పటిలో అన్ని కాలాలను చదువుకొన్న నా క్లాసుమేటు కాని పర రాష్ట్రమిత్రుడు ఎదురుపడితే ఇన్నేండ్ల బరువును పక్కనబెట్టి దుఃఖం వచ్చేలా కౌగిలించుకోవాలి నా చేతికి గాయమైనప్పుడు తన వేలితో నా పళ్ళు తోమి ముఖం కడిగి తలదువ్విన అపురూప మిత్రుడు, అరుదైన సోదరుడు ఇప్పుడు ఎదురుబడితే కాలేజి చదివే వయసులోకి వెళ్ళి ఇప్పుడున్న అతని వయస్సుకు
ఈనిత [2 య్కల
పాదాభివందనం చేయాలి
తొలివయసులోనే
చెలికాణ్ణి చేసిన వసంతసేన
ఏమీ తెలియని కలలలో
అనార్కలిలా దొరికిన సుస్మితహాసిని
మైదానాలు చూపించి
నదులు దాటించిన, పదవ నడిపిన పిల్ల
ఎప్పుడు ఎదురుపడినా
నా భార్యాపిల్లలకు
దేవకన్యగా పరిచయం చేయాలి
ఈ జీవితం దేనికోసమోనని
పుస్తకాలతో, నేస్తాలతో, చర్చించుకునే వేళ
రాజును చంపి
రాజీని చెరసాలలో బంధించి
యువరాజుకు విషం పెట్టి
ఒక కారుడు ప్రజల్ని వేధిస్తున్నప్పుడు
విషాన్ని జయించిన యువరాజు పెద్దవాడై
దుష్ట పరిపాలకుడ్ని హతమార్చిన కథలు చెప్పి
నాకు వీరత్వం పోసిన
ధర్మరాజు, బైగరొరెడ్డి తాతను తలచుకోవాలి
కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తే
ఇంకా చాలామంది ముందు
ఇలా చేతులు జోడించి నిలబడాలి
ఆదివారం ఆంగద్రబ్యోతి, 24.4.2005
[3 క్ష
సర్పం లాంటి నయనాలు ల్ ద్ద లురాడుకు వర్షం వేళ్ళాడుతోంది కొన్ని పువ్వులూ, కొన్ని లతలూ - కొన్ని మడతలూ, కొన్ని అలలూ గాలికి టపటపా జల్లు కురుస్తోంది దీన్ని మనం పరదా అంటున్నాం పరదాకు, లోపలి పక్కన ఒక కొవ్వొత్తి లోకం రాత్రింబవళ్ళు వెలుగుతోంది తుపాను వచ్చినా ఆరిపోలేదు అక్కడొక చిన్నికృష్ణుడు పిల్లంగోవి పట్టుకొని, సినిమా హాలు ముందు తిరుగుతున్నాడు పోస్టర్ల దగ్గర గుంపులు గుంపులుగా గోపికలు మాయలఫకీరు నవ్వును వింటున్నారు బుకింగు వద్ద, పెళ్ళి కాని బాలనాగమ్మ టికెట్టు కొంటోంది రాజ్‌కపూర్ సినిమాలోని పద్మిని గేటు దగ్గర నిలబడింది మ్యూజియం దగ్గర మధుబాల అనారుపళ్ళు అమ్ముతోంది పరదా కదిలితే చాలు ఎక్కడో దాచుకున్న చందమామ తొంగిచూస్తోంది వర్షంలో తడుస్తూ, రిక్షా మీద వెళ్తున్న ద్రౌపది ఎదురుపడుతుంది మధుమతి, పురాతన హవేలీలో గాయానికి కట్టు కట్టుకుంటోంది ఆశారాజు కథిత
| ద *ళర్యాంక్యూమి
అర్ధరాత్రి, పెదాల చప్పుడును ఏ పరదా ఆపలేకపోయింది బయటవైపు కూడా పరదా ఒక ఆకాశం, అదృశ్య సుందర కేశపాశం చంద్రుడూ, తారలూ ఒక్కొక్కసారి పాగలా, కొన్నిసార్లు ఇంద్రధనుస్సులా గులాబి పువ్వుల నది పడవలో (్రేమికురాలు ఒడ్డు మీద నా శత్రువు, కవీ గాయకుడూ ఖడ్గధార్ భోజనం లేదు, సంపాదనస్పృహ లేదు, సంసారం పట్టింపు లేదు రేఖ కావాలి, రేఖలాంటి మబ్బులు కావాలి, మెరుపులు కావాలి అందమైన, సర్బంలాంటి నయనాలు కావాలి విషంలాంటి సెదాలు కావాలి చూడూ చిరుతపులిలా చూస్తోంది ఒక సముద్రంలా నవ్వుతోంది కవిత్వం రాయనప్పుడు ఎడారిలో జాతర లేనప్పుడు బన్సాలీ చంద్రముఖి ఊరుకోదు మణిరత్నం నేపాలీరాజి ఊరుకోదు రవివర్మ దమయంతి ఊరుకోదు విరహంలో రాధికా ఊరుకోదు వాళ్ళు వెయ్యిపద్యాలు, కౌగిలి నిండా పాటలు, లక్ష మైకాలు సమస్త ప్రకృతికి అనువాదాలు అద్భుతం నురగలు విరజిమ్మే యవ్వన పరాగాలు నెమిలీకలు, తంబురా తీగలు వీణ శరీరాలు, పదునైన కరవాలాలు పరదాకు యిటు ఒక పెయింటింగు, మేల్కొని వున్న అడవి గుర్రం మీద వెళ్తున్నాను సంయుక్తను ఎత్తుకు పోతున్నాను సహస్ర శిరచ్భేద అపూర్వచింతామణి ఓడిపోయింది అప్పుడప్పుడూ కలిసి, వీధిమలుపు దగ్గర నమస్కరిస్తుంది ఆశొరాజు రవిత వ్ శ ళర్చాంతర్భామి
హార్మోనియం పాడగానే, కాగితం మీద ఒక వాన, ఒక మొలక పద్యం జలదరిస్తోంది, అడుగులేస్తోంది పరదాకు అటువైపు వున్నది కవిత్వమే ఇటువైపు పారేది కవిత్వమే కవిత్వం నేను ఎంచుకున్న ఇష్టమైన, స్వేచ్చా బేడీలు నేను అతిగా ఢ్రేమించిన మంచి రాక్షసి నవ్య వీక్ 5.10.2005 ] ర ఆశారాదా కథిత నర్వాంతర్జామి
ఆళ్చర్యం అది కిటికీలోంచి కనిపించిన దృశ్యం అతడు బరువుగా నడుస్తున్నాడు జ్ఞాపకాలు బరువెక్కి వుంటాయి ఆగి ఆగి అడుగులేస్తున్నాడు పక్తి ఎగురుతూ పోయినా చెట్టు మీంచి, చిన్న ఆకు రాలినా చిన్నపిల్లని దగ్గరకు తీసుకున్నట్టు చూస్తున్నాడు రోడ్డును దాటడానికి ఎన్ని జ్ఞాపకాల్ని ఆలోచించి వుంటాడో అటువైపు నుంచి ఎవరో పిలిచినట్లు ఇటువైపు నుంచి ఎవరో తరిమినట్లు అడ్డంగా నది పారినట్టుగా కెమెరాకి దొరికిన వాక విచిత్ర భంగిమలా దాటాడు అక్కడెవరో విడిపోయి వుంటారు అదృశ్యంగా ఎవరో ఎదురుపడి వుంటారు తన అడుగుల్సి తనే వెదుక్కున్నట్లు పఫుట్‌పాతు మీద నడుస్తున్నాడు ఎంత దూరం వెళ్తాడో దారికి తెలియదు ఎక్కడ ఆగుతాడో దూరానికి తెలియదు ఆశారాజు కవిత
| / నర్వాంతర్జామి
అతని చూపులు వసంతంలా వున్నాయి చాలాసేపు గమనిస్తే తెలుస్తుంది అతడొక పాట పాడుతున్నాడు కిటికీలోంచి చూస్తే వినిపిస్తుంది ఆశ్చర్యం ఆ పాట, నేను పాడుతున్నదే నువ్వూ చూస్తే నువ్వు కూడా పాడుతూ కనిపించవచ్చు రచనాకాలం: 16.2005 సాయంత్రం 5.30
ఆశారాజు కవిత
- రో *శడ్తయ్యామి
ఎవరూ భయపదరు గలి వీస్తుంటే ఎండ బయటపడింది ఆకాశమొక కరవాలం ఎర్రగా సెగలు చిమ్ముతోంది నేలను కాల్చే ఎడారి ఎండ అక్కడ ఎవరూ భయపడలేదు పిల్లలు జారిపోతున్న చెడ్డీలు పైకి లాక్కున్నారు పెద్దలు చుట్టల మీది బూడిదను దులుపుకున్నారు ఎవరూ భయపడలేదు ఎగ్రని సూర్యుడుండే భూమిలోనే పుట్టారు నల్లని చీకటిలాంటి మట్టిలోనే పెరిగారు ఎండిన పశువుల పేడలాంటి మట్టి వానకోసం గాలిని పెనవేసుకు౦టోంది అక్కడ ఎప్పుడూ ఎవరూ భయపడరు ఆఅకలికే భయపడలేదు మట్టిపెళ్ళల్ని బెల్లం ముద్దల్లా ముద్దాడేవాళ్ళు ఎవరూ దేనికీ భయపడరు రచనాకాలం ణా థవ్రజాసాపొత్ వ్రత్యేక నంబికో 28.7.2005 ఉదయం 1248 * నవంబల్ 2005 ఆశారాజు కనిత . 0 శ నర్చాంతర్భామి
పూర్వీకులు మబ్బిని వాసన చూడు నీకే తెలుస్తుంది ఇక్కడ మిగిలిన గుర్తులెవరివో ఎప్పుడో ముగిసిన కతలేమిటో మట్టిని వాసనచూడు ఊపిరి వినబడుతుంది మనిషి పుట్టిన నేల గడిచిన సమయంలో వెనక్కి వెళ్ళిపోయింది తాతలూ తండ్రులూ ఈ మట్టిలోనే పుట్టారు సూర్యునితో వెన్నెలతో దుమ్ముతో చెమ్మతో కలిసి బతికారు వాళ్ళు కష్టపడిన బీడులో పెరిగిన గడ్డీ వయసు పెరిగిన ముసలివృక్షాలూ ఇంకా పరిమళిస్తున్నాయి పూర్వీకులు కౌగిలించుకున్న మట్టి కొత్త ప్రపంచానికి కొత్త రూపం అందించింది మట్టిని వాసన చూస్తే తెలుస్తుంది జీవితం ఎన్ని రంగులుంటుందో!
రబనాకాలం: 28 72005 ఉదయం 70.30
ఆశారాజు రవిత
౨0కు
ఒకటీ - ఒకటీ ఆది వేసవి సాయంత్రం గడ్డి ఎండిపోయిన నేల నేను ఒక కలను వెంటబెట్టుకుని కూర్చున్నాను గుడిగంట నీడ నా తల మీద పరుచుకుంటోంది స్తంభాల చల్లదనం నా ముఖం మీద వాలుతోంది ఆకాశం మనకబారుతోంది ఆ దారిన ఎవరూ రావటంలేదు సంధ్యాకిరణాలూ ధూళిపరాగాలూ చెట్ల శిరస్సుల మీద కిరీటాలు అల్లుతున్నాయి వెన్నెల వచ్చేవేళకు పువ్వులు విచ్చుకునే వేళకు ఎవరైనా రాకపోతారా! పుస్తకం చదవడం ఆపినచోట ఒక పేజీని మడతపెట్టాను మిగతా కథా నడవకపోతుందా! ఈ ప్రపంచంలో రెండే రెండు గొప్పవి రెండే రెండు అద్భుతమైనవి ఒకటి ఉదయం ఒకటి ఆశా ఆశారాజు కవిత న్ | ( నర్వాంతర్జామి
అందుకే... నేనెప్పుడో ఒక గొప్ప పద్యం రాసి వుంటాను అందరూ ఆశ్చర్యపోయటట్టు ఒక తరాన్ని (పేరేపించేటట్టు ఒక ఆకురాయిలాంటి, గరుకుపద్యం వినిపించి వుంటాను జ్ఞాపకం లేదు కలగానైనా గుర్తుకు లేదు నిష్పాకణమంటుకున్న, చురకలాంటి కావ్యం రాసి వుంటాను మూర్భపోగొట్టే మాటలాంటి ఆయుధమేదో సృష్టించి వుంటాను నుదుటిమీద ముద్దు పెట్టుకునే యుద్ధమేదో గెలిచి వుంటాను మేల్కొలిపే పిల్లంగోవిలాంటి పాటేదో రాసి వుంటాను సంగీతంతో ఆకాశాన్ని పక్షులతో నింపి వుంటాను పాలరాతి మంచుపాగ చీకట్లలో దుఃఖంలో కూడా నవ్వుతూ కనిపించే, స్రీమూర్తి శిల్పాన్ని
చెక్కి వుంటాను చెల్లాచెదురైన జీవితాలకు తరగని నీడని నిర్మించి వుంటాను
నేను కొలిమిలాంటి కవిత్వంగా బతికే వుంటాను అందుకే ఇష్టుడు ఆశారాజు రవిత
22 *నడ్తయ్యాల
కొందరికి స్నేహితుడిగా కొందరికి గ్రేుమికుడిగా మరికొందరికి శత్రువుగా పరిచయమయ్యాను రచనాకాలం _ నత్రిక మన మానవత్రిక 786.8.2005 సాయంత్రం 4.70 శః దీసెంబర్ 2005 ల ర్ ఆశారాజు కనిత శా. నర్వాంతర్జామి
మద్ర గొల్లోకి విసిరేసిన రూపాయి నాణెం కొమ్మల్డోంచి తెగి కిందకు రాలుతున్న ఎర్రని బాదాం ఆకు బకెట్‌నీళ్ళలో గిరికీలు కొడ్తున్న చిన్నపిల్ల బొట్టుబిళ్ళ ఒకరోజు అయిపోయింది వయస్సు పెరిగిందంటే బతకటానికి ఒకరోజు గడిచిందన్నమాట విజయానికి ఒక అవకాశం తగ్గిందన్నమాట ఉదయమెంత అద్భుతంగా దర్శనమిస్తుంది సంధ్య ఎంత మనోహరంగా వుంటుంది జాగ్రత్తపడూ! ఏ ముద్రని దినం మీద వదలకుండా క్షణమైనా నిద్రపోకు ఈ ప్రయాణాన్ని ఒక కథగా ముగించు రచనాకాలం; 16.48.2005 సాయంటత్రం 3.36 2 ల్లీ +కిగారాడా రనిత నర్వాంతర్జామి
బందిఖాన రీలలు కనే సమయం లేదు నిద్రలో కూడా జైల్లోనే వుంటారు రంగులు కనిపించవు రుతువులూ కనిపించవు చెట్ల మీద కురిసిన ఉదయం తెలియదు వెన్నెల రాలే కురులూ తెలియవు ముఖమెంత తియ్యగా వుంటుందో నయనాల చురక ఎంత గాయం చేస్తుందో దు;ఖమూ, నవ్వూ, అన్నీ నిళ్శబ్దాలే చుట్టూ వొక ఊబిని తవ్వుకున్నారు దారినిండా బురద నింపుకున్నారు ఒక (ప్రేమ లేదు ఎవరి పట్లా దయా, జాలీ లేదు పరిమళం తెలియదు గాలి తాకిన భాషా తెలియదు ఒక్క సంపాదన మాత్రమే తెలుసు ఏ మార్గం గుండానైనా ఫర్వాలేదు డబ్బులు దొరికే
బో
బందిఖానాకే వెళ్ళాలని చూస్తారు స్పర్శ మరిచిపోయారు జీవితాన్ని రూపాయి కాగితంగా మార్చుకున్నారు కలలు కనే సమయం లేదు సంపాదన రోగంతో బాధపడుతున్నారు రచనాకాలం: 1ఓ8.2005 సాయంత్రం 6 ఆశారాజు కవిత లీ ౮ థి నర్వాంతర్జామి
శిథిలాల నదుమ.../ జ్తాపకం క్షా ఒక పురాతన గ్రీకుశిల్పసుందరి నడుస్తూ నడుస్తూ ఆగిపోయినపుడు నీ భుజం మీద తల అన్ని నిలబడుతుంది నువ్వు అలసిపోయి వాంటరిగా కూర్చున్నప్పుడు నీ ఎదురుగా నాట్యం చేస్తుంది ఇన్నేండ్ల ప్రయాణంలో ఇన్ని రుతువుల తాకిడిలో శిల్చం చెక్కుచెదరలేదు నీ వయసులో మార్పులు వచ్చాయి శిల్పం నవ్వులో వెలుగు తగ్గలేదు మిత్రులు మోసగించి వుంటారు ప్రియురాళ్ళు మాట మార్చి వుంటారు అద్దంలో దాచుకున్న పాలరాతి శిల్బం నీ కళ్ళల్లో ప్రతిఫలిస్తుంది పుస్తకాల్లో ఏదో వొక పేజీ మీద ఎక్కడో వాక గొప్ప వాక్యంలో బతికుంటుంది నిన్ను మెలిపెట్టే పాట, అ శిల్బం పాడిందే
27
ఏ వాయిద్యాన్ని ముట్టుకున్నా పలికే వెన్నెల గీతం శిల్పం జ్ఞాపకం ఒక శ్వాస శిధిలాల నడుమ నడిచే ఒక శాశ్వతం రచనాకాలం: 28.2025 సాయంత్రం 4.45 ఆశారాజు రవిత లీ ర్ శా నర్యాంతర్భామి
సర్వాంతర్వామి చినుకులు పడుతుంటే మంటలు వెంటపడ్డున్న కాలం వెన్నెల చుట్టూ కమురు ముసీరిన కాలం సముద్రాల్ని రాబందులు తన్నుకపోతున్న కాలం పిచ్చిపట్టిన కాలం భూగోళాన్ని మట్టితట్టలతో పూడ్చే ప్రయత్నం చేస్తున్న కాలం వెర్రికాలం పగబట్టిన కాలం అతని వెంటపడీన కాలం అతని కోసం వేటాడుతున్న కాలం కళ్ళు బైర్లు కమ్మిన కాలం పచ్చకామెర్లు వచ్చిన కాలం అకాళం ఎత్తు పెరిగిన టేకుచెట్టు అతడేనేమో దెయ్యాలగుట్ట మీది నల్దబండ అతడేనేమో నక్కలవారైలో పారేనీళ్ళు అతడేనేమో నీటిచెలమ దగ్గర నిలబడ్డ పెద్దపులి అతడేనేమో పాటపాడుతూ వెళ్తున్న పొట్టి తోకపిట్ట అతడేనేమో నాట్యం చేస్తున్న మాయపింఛాల నెమలి అతడేనేమో ఆశారాజు కవిత
౨ శౌ నరాంకర్భామ్
వర్షం వెలిసిన తర్వాత పొడిచిన ఇంద్రధనుస్సు అతడేనేమో గాలి వీస్తున్నప్పటి వింటినారి ప్రతిధ్వని అతడేనేమో (భ్రమలు కమ్మిన కాలం లోయలో దిగుతున్న నెలవంకలో అతడుండొచ్చు ఇప్పచెట్ల మీద కురిసే వెన్నెలకుప్పల్లో అతడుండొచ్చు ఆరిపోని దీపంలా వెలిగే వేగుచుక్కల్లో అతడుండొచ్చు తెల్లకుందేలు కుడికంటిలో అతడుండొచ్చు సాయంకాలం పొడుగ్గా సాగే ఎర్రకొండ ఒంటెనీడలో అతడుండొచ్చు అనుమానం ముళ్ళలా పెరిగిన కాలం ఎండిన వాగులో గులకరాళ్ళు కదిలిస్తున్నారు చిట్లిన మొర్రిపళ్ళ వాసన చూస్తున్నారు మర్రి ఊడలకు భయపడి నరికి నిప్పు పెడ్తున్నారు భయాన్నే బతుకుతున్న కాలం భయ పెడ్తున్న కాలం అతని కోసం గాలిస్తున్నారు ఈ పువ్వులు ఎవ్వరై వుంటారు? పక్షుల గూళ్ళు ఎవ్వరై వుంటారు? చెట్ల మీది తేనెతుట్టై ఎవరై వుంటారు? ఒంటరిగా దిక్కులు చూస్తున్న కొంగ ఎవరై వుంటారు? గరికలో తిరిగే జింకపిల్ల ఎవరై వుంటారు? అతని కోసం గాలిస్తున్నారు పశువుల కాపరి అతడేనా! ఎండ మీద సరుచుకొన్న మబ్బులు అతడేనా! అడవిలో వెలసిన నామాల దేవుడి గుండు అతడేనా! డొంకలో వున్న మద్దిమొద్దు అతడేనా! జారుడుబండ మీద ఆడుకుంటున్న గండుకోతి అతడేనా! శరీరం జలదరిస్తున్న కాలం అళనికోసం గాలిస్తున్నారు రాలిన ఆకుల్ని ఎవరు తొక్కి వుంటారు చిత్తు కాగ్గితాల్ని ఎవరు చించేసి వుంటారు ఆశారాజు కవిత
క
సద్దిమూట తీసుకెళ్తున్న కరైకుర్రాడి మీద అనుమానం రాళ్ళు కొడ్తున్న బోదకాలు ముసలాయన మీద అనుమానం కట్టెలమోపు మోసుకొస్తున్న స్రీ నిజంగా ప్రీయేనా అన్న అనుమానం నిద్రపట్టని కాలం అతని కోసం గాలిస్తున్నారు అంగుళం అంగుళం అన్వేషణ అడుగడుగునా పరీక్ష మలుపు దగ్గరా నిఘా కూడలి మధ్యనా నిఘా అతని కోసం అటు అడవుల్ని తగలబెడుతుంటే ఇటు అతడు జనంలో వ్యాపిస్తున్నాడు దినదినం మనందరిలో జీవిస్తున్నాడు రచనాకాలం తెలుగువలుక్కు, 15వ తానా నమావేశాల 30.42005 మధ్యావ్హాం ఓ30 శ్లః జ్ఞావిక నంచిక్క 2006 ఆశారాజు రవిత ౮ “క్లైచ్కున
అతదంటాడు అతడంటాడు ఏమయితే నాకేమిటీ ఎవరొస్తే నాకెందుకు ఎవరు పిలిస్తే నాకేమిటీ ఎవరు మునిగితే నాకెందుకు ఏది ఎక్కడ మాయమైతే నాకెందుకు అతడంటాడు పోనీ పోకేపోనీ అన్నీ పోనీ బ్రిడ్జి కూలికే కూలిపోనీ కాళ్ళు విరిగితే విరిగిపోనీ ఎవరూ మిగలకుండా మరణిస్తే మరణించనీ చిన్నపిల్లలు రోదిస్తే రోదించనీ ముసలాళ్ళు కొట్టుకుపోతే కొట్టుకపోనీ ఎవరుంటే వుండనీ ఎవరు లేకపోతే లేకపోనీ అతడంటాడు వాళ్ళ గురించి నేనెందుకు బాధపడాలి వాళ్ళ ఇల్లు తగలబడితే నేనెందుకు నీళ్ళు చల్లాలి ఆశారాజు రనిత ఎం
అతడు పడిపోతే నేనెందుకు లేపాలి , ఎవరో జబ్బుపడితే, నేనెందుకు చూడ్డానికి వెళ్ళాలి వాళ్ళ కోసం నేనెందుకు ఆలోచించాలి ఎవరి సమస్యల గురించో, నా తలనెందుకు బాదుకోవాలి అతడంటాడు నా కుటుంబం బాగుంటే చాలు నా ఉద్యోగం భద్రంగా వుంటే చాలు నాకు తినడానికి తిండి వుంటే చాలు నా సంసారం సాఫీగా సాగితే చాలు అతడంటాడు అందరూ నాకు సహాయం చేయాలి అందరూ నా పిల్లల్ని పట్టించుకోవాలి అందరూ నన్ను చూడ్డానికి రావాలి అతడంటాడు ఎవ్వరికీ నేనేమీ పెట్టను అందరూ నాకే ఇవ్వాలి బినుకు - సాహిత్య మానవత్రిక్స ఆగను 2005 ్ర ఆశారాజు కనిత
ఎంత కాలానికి టౌళ్ళది అగ్నిజ్వాలల రంగు ఉచ్చ్వాస నిశ్వాసలు ఆరెంజి, బాదాం రంగు జ్వాలలు నుదుటి మీద స్వేదం వేడినీలం నుదుటి గీతల చర్మం సునేరు రంగు ఎవరువారు?! ఎవరు చందమామ రంగు నిప్పుల్లో నడుస్తున్నది...?! ఎవరు నా కనైప్పల లోయల్లో తిరుగుతున్నది...?! పండగనాడు అకుపచ్చని దున్తుల్లో _ నాట్యం చేస్తున్నదెవరూ?! ఎంతకాలానికి ఎంత దూరానికి ఈ నేల మీదికి తడి చేరింది ఈ ఇంటి ముందర స్వప్నంలాంటి దృశ్యం చూశాను ఈ మెలకువలో వీరులసాములాంటి స్వప్నం చూశాను రచనాకాలం ఆదివారం ఆం(్రవ్రభ 3142005 మధ్యావ్హాం 1230 శ 20.122005 ఆశౌరాజు ఠనిత ౨4+
ఆధునికోత్తరుడు నువ్వ చచ్చిపో తాజ్‌మహల్ పడగొడతాను నువ్వు పెళ్ళి చేసుకో నేను దేవదాసు ప్రియురాలి ఇంట్లో పడి వుంటాను నువ్వు పల్లకీల్లో తిరుగు నేను నీ ఇంటి ముందు రాళ్ళు విసిరేస్తాను నువ్వు వరదల్లో కొట్టుకుపో అడ్డుపడే ఆనకట్టల్ని కూలగొడతాను నువ్వెక్కిన రైలుబండి పడిపోనీ "పేపర్లో నీ పేరు కనిపించకుండా చెరిపేస్తాను విమానానికి నిప్పంటుకోని నువ్వు కాలినబూడిదలో నీళ్ళు పోస్తాను పిల్లలు పుట్టిన తర్వాత నువ్వెందుకూ నా చిన్నప్పటి పక్కింటి గాండ్ల నంగు స్నేహం చేస్తాను అల్లావుద్దీన్ అద్భుతదీపం౦ రాణీవైతే నాకేమిటీ అర్జునుని ఉలూచిని తెచ్చుకుంటాను నిన్ను నలభై దొంగలు ఎత్తుకుపోతే నేను బాగ్దాద్ పిల్లను కొనుక్కుంటాను నీకన్నా కైకేయి సౌందర్యవతేమీ కాదు మండోదరి కూడా నీ ఎత్తు వుండదు ఊర్మిళది నీ రంగు కంటే తక్కువే 4 కవిత
క
అయినా యమునాతీరంకే వెళ్ళి పెళ్ళయిన రాధతోనే తిరుగుతాను ఇక్కడ కరువు వచ్చింది నిన్ను పోషించుకోలేను తొందరగా చచ్చిపో నాకోసం అందాల శూర్చణఖ ఎదురుచూస్తోంది ఇప్పుడు సమ్మెలకాలం వచ్చింది నీ రోగాన్నెక్కడా చూపీంచలేను నా ముందరే చచ్చిపో ఎవరో రాజకీయ నాయకురాలితో జతగూడుతాను నీకింత సహనం వుండకూడదు నేను పురుషుళ్లైనందుకు నిన్ను చంపుతాను తిరిగి చూడకు నన్ను నీ దగ్గరకు పిలవకు చచ్చిపో వెంటనే చచ్చిపో నేను చచ్చిపోయిందెప్పుడో వెదుక్కుంటాను రచనాకాలం ఆంధ్రద్రభొ - సావొలీ గవాక్తం ౫.722005 ఉదయం ౫ * 19,102005 ఆశారాజు కవిత ఎ౮రీ శ న్యూంతర్భామ
ఒక్క నిషా కోసం ఇల్లు కూలిపోయింది అంటే, ఎవరి స్వప్పాలో కూలిపాయ్యాయి శిథిలాల మట్టి పరిమళం, మనిషి పరిమళం మట్టిపెళ్ళలు, రాతిముక్కలు, మనిషి బతికిన సవ్వడులు ఎన్ని కోరికలతో ఇల్లు కట్టి వుంటారు నగిషీలు చెక్కిన తలుపులు, కిటికీలు, వాళ్ళ అభిరుచులు పెళ్ళిళ్ళు జరిగిన ఇల్టు, పిల్లలు తిరిగిన ఇల్లు ప్రేమలు అల్లుకొన్న రంగులు, 'పెనవేసుకొన్న బంధనాలు పడతులు అలిగి వుంటారు, శృంగారంగా దెబ్బలాడి వుంటారు సేవలు చేసినవాళ్ళు, పూలు చల్లి వుంటారు పండగనాటి నాట్యాల్లో, కాలిపట్టాలు తెగి వుంటాయి బంగారు గొలుసులు జారి వుంటాయి గుండెల మీద, ఎన్ని చీరలు, ఎంత మృదువుగా పాకి వుంటాయి ఒక్కొక్క ముత్యాన్ని దగ్గర చేర్చి కట్టిన ఇల్లు ఒక్కొక్క తీపిని, గుచ్చి కూర్చిన పూలదండ ఎన్ని త్యాగాలు చేసి, ఒక స్వప్నాన్ని స్వాధీనం చేసుకొన్నారో వృక్షాలు పెరిగినచోట, సెలయేరు పారిన చోట పక్షుల గుంపులుండి వుంటాయి, జింకల మందలుండి వుంటాయి కూలిన మట్టిలో, దుమ్ములో ఎన్ని దృశ్యాలు అదృశ్యమయ్యాయో ప్రయాణం బగ్గి మీద జరిగేది ఆశారాజా
౩7+
రోడ్డు జట్కాలతో పులకించేవి గుర్రాల పరుగుల్లో కన్నతల్లులు నవ్వుకునేవాళ్ళు వరసైన యవ్వనాలు, అందాలు, వాకిట్లో వున్నప్పుడు ఏ రుతువైన, వసంత రుతువే అయ్యేది ఎప్పుడు, ఎవ్వరు ఫోటోలు తీసుకున్నా పక్కనో, వెనుకన్సో ముందరో, ఇంద్రధనుస్సులా ఇల్లు వుండేది ఏమైనట్టూ, కాలానికేమైనట్టూ, కట్టుకున్న కలలకేమైనట్టు తుపాను వీచిందా, పగవానికి కోసం వచ్చిందా, ఏమొచ్చిందీ పిల్లలు కాపాడలేకపోయారు కాదు, ఇష్టపడకపోయారు పొదరిల్లు నచ్చలేదు, పూల పరిమళం నచ్చలేదు మట్టి నచ్చలేదు, ముగ్గులు నచ్చలేదు విమానాల ప్రయాణం కోసం హారాన్ని తెంపేశారు, దారాన్ని ముక్కలు చేశారు పూలు నలిపేశారు ఒక్క డాలర్ కోసం, ఒక్క నిషా కోసం పెద్దలు నిర్మించిన కలని ధ్వంసం చేశారు శిథిలాల మీద నడిచి వెళ్ళారు ఆంధ్రభూమి - సాహితి, 25.7.2005 ఆశారాజు కవిత ఎరిాహ్‌చ్కన
దూరాన.../ మనసు పొరల్లో దూరాన, ఎడారి కావల తుపాను ఆగిన, వేకువవేళ నులి వెచ్చని గాలిలో రెండు కళ్ళు, బరువుగా ఎగిరిపోతున్న క్షణాలు రెండడుగులకు ఒకసారి, వెనక్కి తిరిగి, ఉలిక్కిపడి కాలిబాట, పాములా ఎదురు తిరిగి చుట్టూ వున్న దృశ్యానికి నిప్పంటుకొని ఒకరికొకరు కనిపించే ఆకాశమంత మలుపు దాటితే, ఇద్దరికి అడ్డుపడే, అడవి పరిచిన చీకటి మళ్ళీ ఎప్పటికో, ఆ వంతెన మీద నడిచి, సంతోషపడేది ఆ రోడ్డు మీద మనుషులుంటారా అప్పటిలాగే, అట్టాగే, అలాంటి నవ్వులుంటాయా కిటికీలో నిలబడిన సౌందర్యం గేటు దగ్గర, తల ఎగరేసిన సోయగం ఉత్తరం రాసేటప్పుడు, కిసుక్కుమన్న మైకం అంతే మధురంగా, అచ్చం, అప్పటిలాగే, ఇప్పటికీ వుంటాయా చెరువుకట్ట మీద ఇద్దరి స్నేహాలు జాతర చివరిరోజు విడిపోయే కౌగిళ్ళు ఎక్కడో కలిసి, ఎక్కడెక్కడో విడిపోయి అప్పుడప్పుడు, ఎవ్వరెవ్వరో దగ్గరయ్యి మనసు కనిపించకుండా తేనెటీగలు ముసిరి
ర్ ౮ ఆశారాజు కవిత
నర్వాంతర్జామి
మనిషి అడుగులు, పక్షుల గుంపుల్లో కలిసి గుడి ముందరి, ముసలితాత చూపుల్లో మాయమైన లోకం సన్నబడి, చిన్నదయ్యి, ఎక్కడికో, జరిగి జరిగి రాత్రిని, కరెంటుదీపం కింది వెలుగును చేసిన పాట అంతెత్తు శిల్పం, అటూయిటూ తిరిగే అగరొత్తి బురదకాళ్ళను, మెట్ల మీద రాస్తూ, నీళ్ళను శుభ్రం చేస్తున్నట్లు ఆ నెలవంక, అక్కడి గరికలో, ఎప్పటిలా, ఇప్పుడు కూడా మెరుస్తుందా చిన్న కుటీరం చల్ల నీళ్ళబావి వీపును నిమిరే చేయిలాంటి నీడ కలగన్పట్టే వుంది సగం సగం కల చెదిరినట్టే వుంది గుండెనెవరో పిసుకుతున్నట్టే వుంది గుర్రం బండి మీద వెళితే, కల అందుతుందా అక్కడేమైనా మార్చు వచ్చిందా ఆనాటి సాయంత్రం, అట్లాగే వుందా అర్ధరాత్రి, నిద్రలేపిన స్పర్శ మూసుకొన్న కళ్ళతోనే తిన్న, పేరు మరిచిపోయిన పళ్ళు తోట ఏమయ్యుంటుందీ పక్షులు ఎగిరిపోయి వుంటాయా, గూళ్ళు చెల్లాచెదురయ్యి వుంటాయా రైలు మీద వెళితే, అక్కడికి ఎవరు చేరుకోగలరు నడిచి వెళ్తే అంత దూరం బతకగలరా మర్రిచెట్టు మీది వర్షాకాలం రైల్వే ప్లాటుఫారం మీది ఎండాకాలం మఫ్లర్‌లో చుట్టుకున్న చలికాలం అప్పటి పండగల పేర్లు యివి ఉత్సవాలు చూడటానికి ఇష్టం వచ్చిన కాలమిది ఎప్పుడైనా పండగలు వస్తాయా కొత్తబట్టలు వేసుకొని, సెంటు రాసుకుంటే సరిపోతుందా కరచాలనం అక్కడెక్కడో పడిపోయింది ఇప్పుడు పరుగులు తీస్తే, ఇంకా అక్కడే వుంటుందా ఆశారాజు కవిత ఉగ్ర 0 నర్వాంతర్జామి
నడిచి నడిచి, కాళ్ళునొప్పులు పెట్టిన మాట నిజమే మరి కనిపించిన శిథిలాల్లో, ఎన్ని చరిత్రలు దర్శనమిచ్చాయి (ప్రేమను అమ్మిన దుకాణంలో మనసు పరిహారాన్ని కోరింది ఏళ్ళ తరబడి నిరీక్షణ యుగాల విరహాలు మోసిన హృదయాలు ఒక కాలం ఒక రుతువు మళ్ళీ కాలం, మళ్ళీ ఒక రుతువు అలసిపోయి వుంటుంది నేల బెంగపెట్టుకొని వుంటుంది గాలి తిట్టుకొని వుంటుంది గ్రేమ యుద్ధం జరిగాక, కొన్ని మార్గాలు పూడుకుపోయాయి ఏ వాహనం వేళకు దారకలేదు ఎందరెందరో గుండెను తొక్కారు అక్కడ ఏది మిగిలిందో, ఏది వచ్చి చేరిందో ఎప్పుడన్నా సమయం దొరికితే దారి తెలియదు కొన్ని కొన్నిసార్లు, కొంత కొంత పరిమళం సోకుతుంది మనిషి చూపులకు, ఇంత అద్భుతమైన గుణముంటుందా తుపాన్లు వచ్చాయి కరువులు దాడిచేశాయి తోరణాలు తెగిపోకుండా వుంటాయా ముందొక స్వప్నం వెనకొక స్వప్నం మధ్యలో నడిచే పక్షి ఒక ఇంద్రధనుస్సును, మెడ చుట్టూ చుట్టుకొని ఎగిరే పక్షి స్వపష్మాలు వర్షంలోనో, కనుపాపలోనో, కరిగి వుంటాయి స్వప్నం రాసేదికాదు దాచిన చోటు నుంచి తీసి ఇచ్చేది కాదు శరీరానికి, తూట్లు పడని రోజులు మనవి కావు కాందిశీకులు పరభాషలో మాట్టాడినప్పుడు ఆశారాజు కవిత త్న శ శర్చాంతర్మామి
వస్తువులు స్పష్టంగా అర్థమవుతాయి వర్షం ఆగిపోయి, చలి తగ్గిపోయి ఎడారి వచ్చినచోట నిలబడితే మంచిది ఖర్జూరపు చెట్ల నీడ, ఇసుకలో తేలిన నీట్ అలలు ఒంటెలు నములుతున్న ఏకాంతగీతం ప్రయాణం సాగడానికి మన ప్రమేయం లేదు ముసాఫిర్ ముందుకు నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద భూమి, చుక్కలు నిండిన నింగి, పక్కనున్న చెట్లూ చేమలూ-
తిరిగిపోయే ప్రపంచం, పడిపోయిన తరంగం, మాసిపోయే చిత్రం వెన్నెల కింద కాసేపు గడిపినవాడికి ఎండ సెగలు మరిచిపోయేవి కావు ఎవరివి ఈ దుస్తులు, ఈ పాదరక్షలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిన గుర్తులు ఈ పాదముద్రలు చాలాసేపు పరీక్షిస్తే చాలాసేపు లోనికి దిగితే అడుగున ఏదో వుండాలి, కావాల్సిందేదో కనబడాలి అట ముగిసీ వుంటుంది డేరా పీకేసి వుంటారు కొత్తగా వచ్చినవాళ్ళను పాత పరిసరాలు గుర్తుపట్టవు మోడులతో, బీళ్ళతో, నరుక్కుపోయిన చెట్టు, మిగిలిన దేహాలతో- స్నేహం చేస్తే, ఏమన్నా మార్చు ఉంటుందేమో ప్రాచీన వర్షాలు కురిసి నదులు ఏర్పడతాయో ఏమో ఇప్పుడు పడవల్ని తయారుచేసుకోవాలి పడవలు నడపడం నేర్చుకోవాలి ముందర తీరముండకపోదు తీరమ్మీద స్నేహితులూ, బంధువులూ నిరీక్షిస్తూ వుండకపోరు జీవితం పాతకొత్తల సమూహం జీవించి వుండటమే జీవితం
నేటినిజం - ఉగాది నంచిక్క 9.4,2005 ఆశారాజు రనిత
ఉం మకన్
ఖర్లూరవు గెలల్లాంటి "| లం ముశ్యాల్లా, వజ్రాల్హా బియ్యపుగింజల్త్లా, పక్షుల కళ్ళలా వాకిలి నిండా, ముఖాలమీది నవ్వుల నిండా టీవీలోని రంగులు మాదిరీ, పసిపిల్లల అరచేతుల మాదిరీ చిన్నప్పటి ఆటలలాంటి నిన్నమొన్నటి ప్రేమపత్రాలలాంటి పూల అంగట్లో చెల్లాచెదురైన చేమంతులు గుమ్మాల మీంచి, జారిపడిన బంతిపూల రేకులు పండగనాటి, గడపమీది ముగ్గుల మురిపాలు అర్ధరాత్రి వినిపించిన, రేష్మా పాట పదునులాంటి ఒక్కసారి ఎగసిన, చిర్తల శబ్దమధురం లాంటి తడిసిన ఘాగ్రాలు దులుపుతున్న హస్తాల గాజులలాంటి నెమలిపింఛాలు రాలుతున్న మృదువైన రంగులలాంటి తెల్లవారుజామున కురిసే వెన్నెల చిక్కదనం పడవలో కూర్చున్న జంటల గుసగుసల తీపిలాంటి ఎప్పుడో విడిపోయిన ప్రియురాలి జ్ఞాపకంలాంటి వస్తుందనుకున్న ఫోన్‌కాల్ ఆశలా వీడ్కోలు నాటి చూపుల్లా గాలికి కాగితం ఎగిరే దూరంలా గుక్కెడు పాలు తాగుతున్న లేగదూడ చాప చుడుతున్న ఇల్లాలు, కురుల నీడ ఊయల త్ర శక నర్వాంతర్జామి
'సెగకు పెట్టిన కంజిర బిగువు నాట్యం చేస్తున్న గాలిపటాల నడుము సొగసు ఇసుక రేణువులైన, సముద్రంలాంటి ఎడారి విసిరిన ఖర్జూరపు గెలల్డాంటి గోరింటాకు దిద్దుతున్నప్పుడు, బిగబట్టుకొన్న పెదవుల్లాంటి వేటకు ముందు మీటిన వింటినారి ధైర్యంలాంటి రైతు కలలు, బడిపిల్లల స్వష్పాలు, కలగలిసిన ఉత్సాహంలాంటి ఇంతటి శోభగా కురుస్తున్న వర్షం చిన్నప్పుడే చనిపోయిన తల్లి - ఎత్తుకొని లాలిస్తున్న పాటగాయంలా వుంది రచనాకాలం: &.7.2005 ఉదయం 17 ణ్ త్త ఆశారాజు కవిత నర్వాంతర్భామి
డిక్టేటర్ నీ మరణం అచ్చం నీలాగే వుంటుంది ఒక వెన్నెలలాగా ఒక తెమ్మెరలాగా ఒక అత్తరు పరిమళంలాగా నీ చుట్టూ, నిన్ను కమ్ముకునే వుంటుంది నిజంగా నువ్వు చేతులూపుతూ నడిచినట్టే నువ్వు తలదువ్వుకుంటున్నట్టే ముఖం కడుక్కుంటున్నట్టే పౌడర్ చల్గుకుంటున్నట్టే చక్కగా డ్రెస్ సర్జుకుంటున్నట్టే అచ్చంగా, అచ్చం నీలాగే వుంటుంది నీ వయస్సు "పెరుగుతున్నట్టే నీ చుట్టు నువ్వు తిరుగుతున్నట్టే వుంటుంది ఒక్కొక్కసారి అనేకసార్లు రాత్రుల్లో నిద్రలేపి, గడియారం చూపెడ్డుంది మత్తుగా నిద్రపోతుంటే కలలో కనిపించి మనోహర తీరాలకు లాక్కెళ్తుంది అప్సరసల మధ్య వదిలేసి 40
ఒక వెయ్యి గుర్రాల రథాన్ని నీ పక్కన నిలబెడ్డుంది ఒక్కొక్కసారి, కిటికీలోంచి చల్లని పిల్లతెమ్మెరలా తలుపుసందుల్లోంచి, తొంగిచూసే ఎండలా చలికాలంలో మంచుతుంపరలా మరణం, అచ్చమంటే అచ్చం నీలాగే వుంటుంది ఇంటి పని చేస్తుంది ఆఫీసు పని చేస్తుంది బస్సు ప్రయాణం చేస్తుంది వర్షంలో తడుస్తుంది బస్సు షెల్టర్ కింద నిలబడుతుంది మరణం నీలాగే స్నానం చేసి పైజామా లాల్చీ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఇంటి ముందు, వాలుకుర్చీలో కూర్చొని "పేపర్లూ, పుస్తకాలూ చదువుతుంది వీలున్నచోటల్లా కవిత్వం పాడుతుంది నీలాగే శక్తివంతమైన కవిత్వం రాస్తుంది మరణం నీ ప్రతిబింబంలాగే వుంటుంది టకప్ చేసుకొని ప్రియురాల్ని స్కూటరెక్కించుకొని రద్దీగా వున్న జనం మధ్య వేగంగా వెళ్తున్న నీలాగే వుంటుంది
ఏటీయం దగ్గర ఇరానీ చాయితాగే దగ్గర పాన్‌షాపు ముందర నువ్వు సిగరెట్ పాగవూదేంత దూరంలో క్రేన్ వక్కపాడి రేపర్ పడేసేటప్పుడు
ల ఆశారాజు కనిత
ఉగ్ర శనాంతర్జామి
ఎగర్రనిపాన్‌లా, దట్టమైన పొగాకుపాగలా అచ్చం, మరణం నీలాగే వుంటుంది మార్కెట్లో కూరలు కొనుక్కొని డజను అరటిపళ్ళు బేరమాడి జేబులోంచి డబ్బులు తీసేటప్పుడు వర్గానికి, తెల్లప్యాంటు మీద ఎవరిదో సైకిల్ బురద చల్లినపుడు మరణం, నీలాగే కర్చీఫతో తుడుచుకుంటుంది నువ్వు వాంటరిగా వున్నప్పుడైనా గుంపులో తిరుగుతున్నప్పుడైనా మరణం నీకు అడుగుదూరంలోనే అచ్చం నీలాగే వుంటుంది అలాగని అచ్చుగుద్దినట్లు నీలాగే వుందని అద్దంలో నిన్ను నీవు చూసుకున్నట్టు మరణాన్ని చూడకు మెడకు గొలుసుకట్టి నువ్వు చెప్పినట్టు వినే కుక్కపిల్లలా తిప్పుకోవాలి మరణం నిన్ను ప్రశ్నించకూడదు మరణాన్ని నువ్వు శాసించాలి. రచనాకాలం: 318.2005 సాయంత్రం 4 ఆశారాజు కనిత ద్ర /7 న్కు
సభాసదులారా నలభైతామ్మిది రావాల్సింది తొంభైనాలుగు వచ్చింది వర్షం కురియాల్సింది వడగాడ్చులు వీచాయి ఆగాల్సిన చోట ఆగలేదు అనువుగాని చోట ఆగాల్సి వచ్చింది కొందరు ముందుగానే వచ్చారు ఎవ్వరూ మనవాళ్ళు కాదు రావాల్సిన వాళ్ళ జాడలేదు నిరీక్షణే శరణ్యమైంది మాట్టాడాల్సిన చోట మౌనం ఎదురైంది ప్రశాంతత కోరుకున్నచోట తుపాను మొదలయ్యింది పక్షులు వాలాల్సినచోట తోట ధ్వంసమైంది కూలాల్సిన గోడల దగ్గర స్తంభాలు లేవడం మొదలయ్యింది మనుషులతో వుండాల్సిన వీధిని నిశ్శబ్దం చుట్టముట్టింది బజారు వెలవాల్సిన చోట శిథిలాలు మిగిలాయి ఆలింగనాలుండాల్సిన పండుగలో ఆశారాజు కవిత
ఉగ్ర శ్షాయ్మాన్
నెత్తురు చిందింది
పాటలు వినబడాల్సిన చోట
శోకం ముంచుకొచ్చింది
సభాసదులారా
నాతోటి యోధులారా
మూర్చులను వదిలేయండి
సంశయస్తులను పట్టించుకోకండి
మనం మాట్లాడుకుందాం
కలిసి నడవాల్సిన కాలం
కలల కోసం కలం పట్టిన వాళ్ళం
కరచాలనానికి అర్ధం గొప్పది
కలిసి నడిచే బతుకు గొప్పది
విశాలాంధ్ర - సాహిత్యానుబంధం, &8.2005
త్ర నా ఆశారాజు కవిత
నర్వాంతర్జామి
సందర్భనపొతం అర్థరాత్రి దాటి వుంటుంది వెన్నెల కూడా నల్లగా వుంది వేకువజాము ఎండమావుల్లా చంటిపిల్లల నడకల్లా అల్లంత దూరాన వికసిస్తున్న పూల పరిమళంలా కొత్తగా కురిసిన వాననీటి ధారల శబ్దంలా మీరొచ్చారు సవ్వడి లేకుండా ఏకొంచెం లేకుండా దారులు రహస్యాల్ని కాపాడి వుంటాయి వీధిదీపాలు శ్వాస బిగపట్టుకొని వుంటాయి వెల్తురు మాట్టాడి వుంటుంది ఆకాశం చూసి వుంటుంది మబ్బులు మీకు ఎదురుపడి వుంటాయి పల్లెటూళ్ళ నుంచి వచ్చే పాలవాళ్ళ సైకిళ్ళు కనబడి వుంటాయి ఇక్కడికి చాలాదూరం మైదానం దూరం నదులు దూరం అడవులు దూరం నడిచి వచ్చారో పరుగెత్తుకొని వచ్చారో గడ్డిలారీల్లో వచ్చారో కట్టెలబండిలో వచ్చారో ఎలా వచ్చినా చాలా శ్రమ తీసుకొనే వచ్చారు ఒకపూట భోజనం పెడ్డాం ఆశారాజు కవిత
వ్ ౮ ళర్యాంతర్మామి
ఒక కరచాలనం తీసుకుంటాం ఒక అలాయిబలాయి ఇస్తాం మనసు నింపుకుంటాం కడుపు నింపుకుంటాం కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాం బరువు దించుకుంటాం ఇప్పుడు మీరెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తారో మాకు తెలియదు మరొక రాత్రి కోసం ఇంకో వేకువజాము కోసం
- రోజూ ఎదురుచూస్తాం కోరిక తీరకపోవచ్చు మీరు కనబడకపోవచ్చు మాకు ఆశ చావదు పిల్లలు నిద్రపోతుంటారు మీ స్పర్శ వాళ్ళ ఆయుష్షు పెంచుతుంది వాళ్ళు కలలు కంటుంటారు వెన్నెల కనురెప్పల్ని తడీపేస్తుంది కుక్కపిల్లలు ముడుచుకొని నిద్రపోతుంటాయి మీ కళ్ళల్లో కనిపించే చరిత్ర చదువగలమా మీరు ఉన్నంతసేపూ మా ఇల్లు సింహంలా వుంటుంది మీరు ఖాళీచేసిన అడుగుల మీద పరీక్షలు జరుపుతారు మీకు తగిలిన గాలికి తెలుసు మీరు చూసిన పరిసరాలకి తెలుసు స్వేచ్భ కోసం పడే ఘర్షణ సముద్రంలో సుడిగుండాలుంటాయి కెరటాన్ని కెరటం గుద్దుకుంటుంది ఎడారిలో ఇసుక చెలరేగుతుంది తుపాను వెలసిన తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది గాబరా వద్దు నడుస్తున్నప్పుడు మిత్రుని భుజం తగులుతుంది ఇప్పుడేమీ వ్యాఖ్యానాలు వద్దు శస గ్ల ౧రాలయ్ష్యా ఆశారాజు కనిత ము ళ్త తానా నో
ఆకాశాన్ని తెల్లబడనిద్దాం వెలుగులో ఏదీ దాగదు ఎవరూ ఎవర్నీ రహస్యపు చూపుల్లో చూడకూడదు వేచిచూద్దాం అడిగిచూద్దాం అద్దంలో ముఖం కనబడకుండా పోదు చెయ్యి విరిగినపుడు బాధపడలేదు ఇల్లు కూలినపుడు సడలిపోలేదు నీకు కోపం వస్తే బాధపడ్డాను నీలోకి తొంగి చూడకపోతే వికలమవుతాను అంతా పద్ధతి ప్రకారమే జరుగుతుంది ఉచ్చులు లెక్కప్రకారమే అల్లుకుంటున్నాయి నిదానంగా ఆలోచించుకుందాం మనం చూస్తున్నది మనం చూస్తున్నదేనా! అంటున్నది మనం అంటున్నదేనా! ఇక్కడే కాసేపు ఆగుదాం అందరం ఒకర్మొకరం నిజాయితీగా కాస్త గుమగా చూసుకుందాం
వ్2 ఈఅకరారాదా కనిత నర్వాంతర్జామి
మంట
ఠి
౧)ల్లలు మంటపెడ్డ్తున్నారు
మంటలకు నిజం తెలియదు
మంటలకు మంచి పనీ తెలియదు
అంటించిన చోట మండటమే తెలుసు అంటించేవాడి గుణాన్నిబట్టి
అంటించేవాడి ఉద్దేశ్యాన్ని బట్టి
మంట మంచి చేసిందా
వక్రబుద్ధి వల్ల చెడు జరిగిందా తెలుస్తుంది
ఒక పిల్లాడు చిన్నకర్రతో మంటల్ని ఆడిస్తున్నాడు , మరొకడు కాగితం ముక్కలు చించి మంటల్లో వేస్తున్నాడు మంట వాళ్ళకు ఆట
చీకట్లో మంట రేకులు విచ్చిన పెద్ద పువ్వులా వుంది పిల్లల కళ్ళు ఎర్రగా వున్నాయి
వాళ్ళ నవ్వులూ ఎర్రగా వున్నాయి
మంట ముందు నిలబడితే రంగుల్లో ముంచినట్లే వున్నారు పక్కన బొమ్మరిల్లంత గుడిసె
గుడిసె మీద నిండు పౌర్ణమి
వెన్నెల ఎర్రగా వుంది
గుడిసె ముందు ఆ పిల్లల తల్లి కూర్చుంది
తల దువ్వుకొంది |
ముఖం తుడుచుకొని బొట్టు పెట్టుకుంది
ఆశారాజు కవిత
వ్ ప నర్చాంతర్జామ
పెదవుల మీద చల్లని వెన్నెల... శరీరం నిండా మంటల ప్రతిబింబం చుట్టూ వున్న చెత్తాచెదారాన్ని కాలుస్తున్న పిల్లల్ని చూసింది ఎవరో పారీసిన మలినం కాలిపోతున్నందుకు ఎర్రగా నవ్వింది అంటించేవాడి గురిని బట్టి వుంటుంది...
రంజని పార్గిన ఉగాది నంచిక 2005 ఆశారాజు కనిత
ఆసరా జక్క వాట చంపుతుంది ఒక్క పాట బతికిస్తుంది ఒక్క పాట కనిపించనంత దూరం పాటతోపాటు, సంఘటనలు ఊహించుకోవాలి సంఘటనల్లో మనుషుల్ని చూసుకోవాలి మనుషుల చుట్టూ, యేమలూ, దుఃఖాలూ, త్యాగాలు ఎడారిలో, ఎర్రని ఎండలో గాలి దుమారంలో, దప్పిక త్ప్చో ఒక్క పొట బంగారపు రజను ఇసుకలో, తడిని చిందే ఒక్క పాట చీకటి వికసించిన రాత్రి తొరలు రాలిపోయిన చీకటి కురులు దులిపినప్పుడు రాలిన సువాసనభరిత నీటిబిందువులు ఒక్కపాట ఒక్కపాట గాయపరుస్తుంది ఒక్కపాట మలాం రాస్తుంది ఎన్నిసార్లు తప్పిపోయాను ఈ వీధుల్లో ఎక్కడెక్కడో కొట్టుకుపోయాను ఈ ప్రవాహాల్లో దారి చూపించిన చిన్నపిల్లల పసిడిపలుకుల్లా పడవ విరిగి మిగిలిన, కర్రచెక్క ఆసరాలా ఒక్కపాట దరి చేర్చింది పాట వెంబడి అలోచనలు
లం “*్తక్ష్యూనో
పాట వెంబడి ఉచ్చ్వాస నిశ్వాసాలు
పాట వెంబడి తడి నేత్రాలు
పాట వెంబడి అదృశ్య రైలు వెంట పరుగులు
ఒక్కపాట బాణం వదులుతుంది
ఒక్కపాట కట్టు కడుతుంది
పాట కేవలం ఒక్క పాటనే కాదు
నడిచి వచ్చిన దారి
వినిపించే బతుకు
రచనాకాలం: 27.6.2005 సాయంత్రం 4.30
౨6 క్యాడ్
నావానం
సూక్యుని చూపు నడలుతోంది
పడమర వెచ్చదనం పెరుగుతోంది
నీడలు రబ్బరులా సాగుతున్నాయి
వృక్షాల మీద పక్షులు గుసగుసలాడుతున్నాయి
కట్టైలమోపులతో లంబాడి ఆడపిల్లలు పరుగెడుతున్నారు
దుప్పటి కప్పుకొన్న చిన్నపిల్లలా చీకటయింది
వంట కోసం
పెద్దగా మంట పెట్టారు
పులులూ సింహాలూ
రాక్షసులూ విషప్పురుగులూ
వాళ్ళనేమీ చేయలేవు
రచనాకాలం: 29.7.2005 మధ్యావ్హాం 12.05
వ్ /7 + నారాజు కవిత
నర్వాంతర్మామి
రొంవులు నగరమంతా కురుస్తూ ఇంటికి వచ్చాను తలుపులు తీయండీ! వాకిట్టో నిలబడి కరిగిపోతున్నాను తలుపులు తీయండీ! దారి పొడుగునా గలగలా పారివచ్చాను బస్సులు పాఠరాయి ఆటోలు పారాయి కాలినడకన సమయం కూడా పారింది ఫుట్‌పాత్ మీద కురిశాను నిషా కళ్ళ ముందు కురిశాను ఎండిన అధరాల మీద కురిశాను తడిసిపోయాను మీ గొంతు తడుపుతాను మీ బతుకు తడుపుతాను మీ ముఖాలమీది నవ్వును తడుపుతాను తలుపులు తెరిచి చూడండి నేను నాటిన చినుకులు నేలంతా మొలకెత్తుతున్నాయి మీ ఇంటి ముందు కెంపులు వికసిస్తున్నాయి అనంతం - వార్త ఆశారాజు కనిత ౨6+
ఆబ అర్హునా, ఫల్గుణా పార్గా కిరీటీ... జు ౧ థి రేపో ఎవ్రుడో (గ్రకటిస్తారు ఎక్కడా నడీచే *బ్టం రాకూడదని మాట్లాడుతున్న నందడీ వుండకూడదని బతుకుతున్హు ఆనవాళ్ళు మిగలకూడదని నిళ్ళభ్ధం మాత్రమే మిగలాలి శూన్యం మిగలాలి న్మశానం మిగలాలి ఏలుకోవడం కోనం రేపో మాపో నిషేధాన్చి విధిస్తారు రచనాకాలం: 1662005 సాయంత్రం ౩30 ఆశారాజా కవిత వ్ ౮ ( నర్వాంతర్జామి
వినివీంబీ వినివించకుండా.../ పాట వినిపించీ, వినిపించకుండా వినిపిస్తోంది రంగు వెలసిన, కర్చీఫ్ లాగానే వుంది ఉదయమెప్పుడో కడుక్కొని దినమంతా తిరిగిన ముఖంలా వుంది రాత్రంతొ బస్సులో ప్రయాణం చేసినప్పటి (డైస్సులా వుంది వేకువజామున బయటకువెళ్ళి చీకటిపడ్డాక ఇంటికి వచ్చిన ఇంటర్ విద్యార్ధి వాలకంలా వుంది పాట వినిపించినట్టు, వినిపించనట్టు, వినిపిస్తోంది వేగంగా కారు వెళ్ళింతర్వాత పక్కన ఎగిరే చిత్తుకాగితాల చలనాల్లా కొన్ని అడుగుల శబ్దాలు కొన్ని ఆటల దృశ్యాలు ఒక్కసారి గుండెలో సముద్రం పొంగుతుంది ఏవేవో బొమ్మలు ఎవరవరో, నవ్వినట్ట కనిపించే అద్దాల లోపలి మనుషులు తోరణాలు కట్టిన ఆకాశం ఎండా, వెన్నెల కలగలిసి కురిసిన వర్షం తడిసిన పక్షుల గుంపులు ఆశారాజు కవిత 00 *+హష్మప
ఉంగరాల జుట్టు కుర్రాడు బిస్కెట్ పట్టుకొని ఇంటి మెట్లు దిగుతున్న పండగదినం కనిపించినట్టు, కనిపించి కనిపించని, కనువిందు నొప్పి పాట విసురుతున్న వలలు జ్ఞాపకాల తీరాల వరకు విస్తరిస్తున్నాయి పాట వినిపించి, వినిపించక కొత్త స్వప్నం చిగురిస్తోంది రచనాకాలం రంజని 15.9.2005 సాయంత్రం 330 *శే దనరా-దీపావళి నంచిక్క 2005 ర | ఆశారాజు కవిత నర్వాంతర్జామి
వువ్వలు
పొద్దుటిపూట ఎండ
కొంచెంసేపు సన్నని చినుకులు
కొద్దిగా, పల్చని కాగితంలా గాలి
పువ్వులు తాకినంత మెత్తని బాధగా చలి
పుప్పొడి రాలి రంగులు కురిసిన క్షణాల్లా
నీ కోపం
నీ గ్రేమ
నీ లాలింపు
నువ్వు కనిపించకపోతే
ఈ వెన్నెలుంటుందా
నీ మాటలు
నువ్వు చెప్పిన సంఘటనలు
ఈ అనుబంధం
వాత్సల్యంతో కూడిన నీ పలకరింపులు
నాతోనే వుండిపోతాయి
ఎప్పుడో, ఎక్కడో
నీ కథలు చెప్పుకుంటాను
చెమ్మగిల్లిన నా కళ్ళలో
నీ రూపాన్ని చూసుకుంటాను
రబనాకాలం విశాలాంధ్ర - సాహిత్యానుబంధం 13.9.2005 ఉదయం శీ 21712005
62+ టో
నిజమేనా! నువ్వ ఊహించగలవా కవిత్వం లేకపోవడం ఏదైనా కవిత్వం కాకపోవడం - నువ్వు, ఎప్పుడైనా ఊహించగలవా పొద్దున్నే న్యూస్‌పేపర్ పక్కన దేశం విలవిల్దాడుతోంది రచనాకాలం: 28.4.2005 ఆశారాజు కవిత భ్ హ సద్వాంతర్భాము
ఏం చేద్దాం! (౬ నమస్కారం! మీ కోసం నెత్తురు తెచ్చాను నెత్తురులో తడిసిన వస్త్రాలు తెచ్చాను గాయపడిన అక్షరాలు తెచ్చాను మీరు, కొందరు పొలాల్లో వున్నారు కొందరు రోడ్డు వేస్తున్నారు చెట్ల కింద కూర్చున్నవాళ్ళు ఆలోచనలకు పదును పెడ్తున్నారు బస్సుల కోసం ఎదురుచూసే వాళ్ళు కొలిమిలా కాలుతున్నారు మార్కెట్లో సరుకులు కొంటున్నవాళ్ళు పల్లేరుకాయల మీద నడుస్తున్నారు ఏం చేద్దాం! నిర్మాణం మీ చేతుల్లో వుంది మీతో కలిసి నడుద్దామని వచ్చాను లేవండి! లేచి నడవండి! రచనాకాలం ఆం(ధ్రవ్రభ - అదివారం 2842005 శ 21172005 ఆశారాజు కవిత ర4 క్యాన్
ఒక నమలివింఛంగా.../ రుప్పుడు దొరకవు ఎక్కడా కనిపించవు అట్లా దొరికేవి కావు అట్టా కనిపించేవి కావు కొత్తబట్టలు తెచ్చి బుజ్జగించి తొడిగించి పండగ చేసుకొనే ఆ సజల నేత్రాలు ఆ చల్లని నేత్రాలు ఆ ప్రాణం పోసే నేత్రాలు ఇప్పుడెక్కడ దొరుకుతాయి ఎక్కడో వర్షంలో ఎప్పుడో ఎండలో ఎంతో మంచుకురుస్తున్న రోజుల్లో నన్ను ఒక ఎడారికి సముద్రం స్నేహానికి ఒక అడవి ఆచ్చ్భాదనలోకి చీకటి వెలుగులు కలిసిన వెన్నెల ఎండల ప్రపంచానికి ఒక నెమలిపింఛంగా ఓ ఖడ్గంగా నదుల్లో ప్రవహించే పాటగా ఆశారాజు కవిత
భ్ శి సర్చాంతర్మామి
ఇళ్ళ ముందరి ముగ్గుల్లా ఎవరూ పిరికిగా వెనుదిరగకుండా నన్ను దీపంగా వెలిగించి నాట్యం చేస్తున్న పాదాలకు గజ్జెలు కట్టి గుమ్మాలకు తోరణాలు కట్టి నన్ను పక్షిగా తీర్చిదిద్ది ఎవరి ముందు తలవంచకుండా ఆకాశంలో ఎగరేసిన ఎప్పటివో అన్నం తినిపించిన అమృతం పోసి పెంచిన ఆ రూపం దొరకదు అది దొరికేంతవరకు ఇట్లా మనిషి మనిషిలో అన్వేషిస్తూ ఇంకా బతికుంది వత్రిక - మన మానవత్రిక్త ఏవ్రిల్ 2005 ఆశారాజు కవిత రర శ నాంతర్మామి
మునులూ - మునివత్నలూ బలి ౨౫ర్వతాల నీడలకింద మునులు తపస్సుకు కూర్చున్నారు గాలి పరిమళపు జ్వాలలు లేపుతోంది తీగలు వృక్షాల నడుముల చుట్టూ తిరుగుతున్నాయి నేల పువ్వుల గోరింటాకు పెట్టుకుంది మునిపత్సులు స్నానమాడి నదిని పడవను చేస్తున్నారు నది వొడ్డున చిన్నచిన్న జింకపిల్లలు అలల్ని గజ్జెల్లా లాగుతున్నాయి మునిపత్నుల నారచీరల మీద బంగారు చారల ఉడుతలు ఎగురుతున్నాయి నదిలో మునిగి లేచిన మునిపత్సుల వక్షోజాల మీద మురిసి దుముకుతున్న చేపపిల్లలు వాళ్ళ అధరాల మీద మోసపోయి వాలుతున్న సీతాకోకచిలుకలు ఎండలో పశువుల వెంట నడుస్తున్న పశువుల కాపరి మునుల్ని చూశాడు మునిపత్సుల్ని చూశాడు ఒక నమస్కారం పెట్టి తన ఆకలికి విముక్తిని కోరాడు వాళ్ళొక ఫలమిచ్చారు బతుకుపొమ్మన్నారు ఆశారాజు కవిత 6౮/7 శ స్కాంతర్భామి
పశువుల కాపరి నవ్వాడు ఆ ఫలము మేము పండించిందేనన్నాడు మీరు తపస్సు చేసి సంపాదించింది కాదన్నాడు మునిపత్నులు బిత్తరపోయారు పశువుల కాపరి చేతిలో మట్టి తీసుకొని నుదుటి మీద రాసుకున్నాడు మట్టిని ముట్టుకోవడమే పవిత్రమైన తపస్సు అన్నాడు మునులు సిగ్గుపడ్డారు పశువుల కాపరి పశువుల వెంట నడిచాడు ఆశారాజూ రవిత
భ్ శహ్బోంతర్జామి
వబచ్చిగాయం ఇప్పుడది దర్చణం కాదు సూర్యచంద్రుల ప్రతిబింబం కాదు చుక్కలు రాలిన దుప్పటి కాదు పక్షులు వాలిన వాకిలి కాదు వెన్నెల్లో విరిసిన కలువ కాదు ఉదయం మెరిసే పద్మం కాదు "సేపొచ్చిన తల్లి స్త్రన౦ కాదు నవ్వుతున్న పసిపిల్లల ఉయ్యాల కాదు బడిపిల్లలు ఆడుకొంటున్న మైదానం కాదు ప్రియురాలి యవ్వనం పాంగు కాదు వాణికే నడుమ్మీది నురగ ఒడ్డాణం కాదు అలల కుచ్చిళ్ళ పట్టుచీర కాదు తీరమ్మీద మోగే వెండిపట్టాల నాదం కాదు ఇప్పుడది సముద్రం కూడా కాదు లక్షల ప్రాణాల్ని మింగిన శిరటాల జెడల రాక్టసి కోట్ల పడగలతో విషం కక్కిన “సునామీ ప్రళయ సర్ఫ్చ సమూహం ఇప్పుడది కడలి కూడా కాదు మనుషుల్లో మిగిలిన భయం ఇప్పుడు సముద్రం అందం కూడా కాదు శవాన్ని గుర్తు చేసే పచ్చిగాయం
అనంతం - వార్త 4.320055
ఆశారాజు రవిత
609 సి నర్యాంతర్మాము
దాదర్ టు వీటీ స్టేషన్ నౌొమ్ రాజ్‌కపూర్ హై బూట్‌పాలీష్ కర్తా హై విశ్రోలీ మె రహతా హై పడా లిభేలా హై దారు పీతా హై కిసీకూ గాలీ నహీ దేతా హై కామ్ కర్తా హై బచ్చన్ కో సలాం కర్తా హై గోవిందా లోకల్ హీరో హై మాధురీ వర్లీ మే మిల్తీ హై అపన్ కో సబొసే దోస్తీ హై మెహెనత్ కర్తా హై చోరీసే నఫ్రత్ హై నామ్ రాజ్‌కపూర్ హై పడా లిఖేలా హై దారు పీతా హై ఇజ్జత్ సే జీతా హై సబొసే ప్యార్ కర్తా హై మేరా నామ్ రాజ్‌కపూర్ హై ఖండాలామే బూడీ మా హై ఆశారాజు కవిత
70 శ నాంతర్భామి
ముమ్సు ఖానా ఖిలాతీ హై
నామ్ రాజ్‌కపూర్ హై
బూట్‌పాలిష్ కర్తా హై
అక్కా ముంబై ములకు జాంతా హై
(నేను ముంబై వెట్తన్నవ్రుడు తాగి వున్న ఒక బూట్‌పాలీష్‌వాలా దాదర్ నుంచి
ముంబై వీటీ స్టేషన్ వరకూ బూటోపాలెష్ చేన్తూ మాట్లాడిన మాటలు, 7. “చ్యున
నర్వాంతర్భామి
ఎన్టుడెన్టుడూ... ఏమిటేమిటీ...
నేవథ్యం జననం = శ్ డిసెంబర్ 1954 చదువు _ బి.ఎ. యల్‌యల్.బి. తల్లిదండ్రులు - యశోదమ్మ (యశోద)
వెంకయ్య (వెంకట్)
నివాసం “.. హైదరాబాద్ భార్య - ఎన్. సీతొదేవి (కస్తూరి) పిల్లలు - శైలీ రచిత
ప్రచురించిన వున్తకాలు నేపథ్యం ల. 1991 దిళ =. 1993 ఒక తడి గీతం 1998 సారంగి =. 2001 చిల్మన్ = 2002 బద్నాం (దీర్ధకవిత) _ ... 2002 మామూలుగా (దీర్ధకవిత) ... 2003 ఉత్సవం = "జనవరి 2005 సర్వాంతర్యామి *= డిసెంబర్ 2005
వురస్కారాలు థఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు తెలుగు యూనివర్సిటీ సాహిత్య పురస్కారం సినారె కవితా పురస్కారం ఉమ్మడిశెట్టి కవితా పురస్కారం కామిళెట్టి కవితా పురస్కారం విశ్వకళా పీఠం స్నేహనిధి పురస్కారం రంజని-కుందుర్తి అనార్య యా లయ న
0 ఆఈఆశారాజఖా రవీత (ఈ ప వట లటవవ2 రవ 4కి8 220623 న గ /72 శ సూంతర్మామి అష! ఘూ
హస అతని కోసం అటు అడనవుల్సి తగలబెడుతుంటే ఇటు . | అతడు జనంలో వ్యాపిస్తున్నాడు దినదినం మనందరిలో బీవిస్తున్దాడు! య