Telugu Sankalitha - anilvaranasi/indianlanguages GitHub Wiki

. య చ్నేళ్ల/ కింత ల. 1... లీ ఛీ | ్‌ే ని ( 9 రరకట ఖీభలతి భం. వు! ఇ (్ధ్ర నా నాం ఈ పు గ టు. అసలు “ఆశని గా. న స్‌ శీ " గ్‌ న్‌ టల ర్‌ు శ కి అ వు శ్ర! శ! ల్‌ . లీ ॥/ మం సక , న్‌ ం [గో ( (| | 9. గ్‌ (ఆ కే బ్‌ ॥ ఇ లా లల * వ స్ట ను తర సీ | ఆ నే సర తమి ౨|ణ.. మ శ. క పై [10 కం! జ స ప! పం. వ భా రగ గ గ వం తేన నా (మ! సం. శ / ర యహోవా యేసు. 0. న్‌ రా న య్య ఖం. క్ట మ సస / £, ర లీలన్‌? ల! . 191? అ; లు... బో య చట... “ఆ ఆహరం రాఅ జ... [ | | |. శీ | వ. రం పన నన త యాం | హస య. శ మ! టు ల్‌ జ యేన నన క 1 పిత ౮ కో క ప య. శ తంత షత =. .. . క వ ల! కన. మల వన | మ | శ్రదబం ఉస ౨. . (1 శ ః (నం సం ఇ మాం నోము య్‌ సై తళ... ట్ర | ల 4 ల్లీ మం మత. మం. బం యాట గ గా షా న సఖ

  • ట్ర. ౧ ళో షే 2 యల స క (స స స. 2: భం నట జ్య ము తకం నలల స నం శ్లో ర పం చట నన స నం లు. ర. ఎం జర?! వ్‌ ్ట / షా రల ఇ టప ఇ దో (న్‌ క్ష (9 గ సన (0 వో గిట్త! _. టి ౪ జ న, జ క క గే

సంకలిత

ఆఆఆ సాలు

ఓల్లా వ్యా

స [కై క వ్యాస సంపుటం ఓలా 0౧ నం. షు న్న వా! యూ ద్వ నా డం... -- ల స రాలా

  1. స డం ట్ర .. 2 జీ, బి న్వచ్చ ప్రచురణలు హైదరాబాద్‌

న. లి య కీ లలా రాడా వ ల వై లో య క! న బు షా / ర్న ఒం ల ఖ్‌ జా సోడ ఇటలి ఇ. ఉల. వ. / వడ సైకుడ!.1114 70164 సంకలిత ఓల్లా మొదటి ముద్రణ ; జూన్‌ 2013 డిజైన్‌, బుక్‌మేకింగ్‌ ; జుగాష్‌విలి డి.టి.పి. : క్రియా డిజైన్స్‌ ముద్రణ : చరిత ఇం(పైషన్స్‌, హైదరాబాద్‌ ప్రతులకు విశాలాంధ్ర బుకిహౌస్‌, నవోదయ బుక్‌ హౌస్‌, కాచిగూడ, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ దిశ పుస్తక కేంద్రం : చిక్కడపల్లి ం*ఆ౦001 ₹౧౫౧౫1౦౫126.001 వెల : రూ॥ 7₹0/-

ప్రముఖ కథకుడు, విమర్శకుడు అత్యంత ఆత్మీయ మిత్రుడు సింగమనేని నారాయణ గారికి ఆయన సప్తతి సందర్భంగా...

  • ఓల్లా

[మమమ॥

  • అంధకారం నుంచి ఆకాశంలోకి ............4౨. 009
  • ఆడవాళ్ళ వ్యవహారం ..........౨.౨24౦౦౦ల౦ల౦00బలంటంలలల.. 015 8 కుటుంబ సంబంధాలపై ఫైర్‌ ............౨౨౨౦౨444౬ 2౬622 6బ22ట40 222 018
  • కృత్రిమ వసంతానికి బందీలరి ........౨౨౨౨౨౨౨౨౨౨౨౦౬౭౭౭౬౭౭౭౭౭ 024
  • దీపామెహతా వాటర్‌.............౦౦౦౦౦౦౦౦౦౦ంలలంవలలలం. 029
  • మానసిక ఆరోగ్యానికి హానిచేస్తున్న సినిమాలపై నిర్లక్ష్యమా? ... 039 ౨ శరత్‌ కథను ఇంతగా మార్చవచ్చా? ........౨౨౨౭. రికీతి
  • 'ఆలోచన* అంటే ఇంత వ్యతిరేకత ఎందుకు? .................= 058 ౨ ఒక 'మగవాడి గోడు ..............౦౦౦౦౦౦ల౦ంలలలలంలంలలలలఐ 0క్‌లి
  • ఆలోచింపచేసే కథలివి .................4444౨౭౭౭౦౦౭౦౭ల౭౭౨౭. రి6కీ
  • 2004 కథా సాహిత్య సింహావలోకనం ................. 069
  • ఈ స్వప్నం నిజమవుతుంది ...........౨౨౨౨౦౦౦౨౦౦౭౭౭౭౦౬౭లం లలల 089
  • మారినట్లు కనిపిస్తూ, సారాంశంలో

ఏమీ మారని స్థితికి ప్రతిబింబం - ఆనందీ గోపాల్‌ కథ ...... 092

  • ఆంధ్రా పారిస్‌కు వందేళ్లు ...............౦44౦౦౦౦౨౦౦౭౭౭౨ 098 ౨ కనక పుష్యరాగం ...........౨౨౨౨౨౨౨౨౦౦౦౦లరవరం లలల లంచం 108

  • మళ్ళీ కళ్ళు తెరిచిన 'పుణ్యభూమీ కళ్ళుతెరూ' ..................... 108 ౨ విలువైన చరిత్ర పుస్తకం .............ంంటంంటంంంలలలం. 116 8 అరుణ కవిత్వం - స్త్రీల అస్తిత్వవేదన .......................౨. 219 ౨ శిరంశెట్టి కాంతారావు కథా సంపుటి ముందుమాటగా ........... 129

  • ప్రీవాద కథ - కొన్ని ఆలోచనలు .....................౨. కలెకీ ౩ స్త్రీవాద కవిత్వంపై సమగ్ర పరిశీలన ........................౨ 140 అ సింగమనేని కథలు - జండర్‌ స్పృహ ................ కేత్తత్న

  • దాశరథి వెన్నెల పాటలు... ంంంంంటలంలంంలంలలలంలంం.. కేడి అ కైసరున్నీసో ...............ంంంంంంంంంంంంటుంంంటటంలలలం.. కేర్‌డీ

వ. న్‌ _ గ. 1 అంధకారం నుంచి ఆకాశంలోకి మన సినిమాలలో ప్రీ పాత్రలూ, స్తీ సమస్యలూ చాలా విచిత్రంగా కనిపిస్తుంటాయి. భారతదేశంలో సినిమాలు తియ్యటం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ స్రీలు ప్రధానంగా వెండితెరమీద అలంకరించబడ్డ బంగారు బొమ్మలుగానే మిగిలిపోతున్నారు. జీవమున్న బొమ్మలుగానే మిగిలిపోతున్నారు. జీవమున్న స్త్రీలూ, మనుషులుగా జీవించే స్త్రీ ప్రాతలూ సినిమాలలో చాలా అరుదుగా కనపడతాయి. పాపులర్‌ వ్యాపార చిత్రాలలో స్త్రీ పాత్రలను ప్రధానంగా మూడు నాలుగు రకాలుగా మనం గుర్తింపవచ్చు. పతివ్రత - పతిత - సూమర్‌ ఉమెన్‌ ఇవి ప్రధానమైనవి. సావిత్రి, అనసూయ, సక్కుబాయి, తులసీ వీళ్ళంతా పురాణ ప్రసిద్ధులై సినిమాలలోకి ప్రవేశించి పాతివ్రత్యాన్ని వెండితెరమీద ్రకాశింపచేశారు. ఈ పతివ్రతలందరూ ఒకేమూసలో వుంటారు. వీళ్ళ జీవితానికి గానీ వ్యక్తిత్వానికి గానీ భిన్న కోణాలుండవు. ఉన్న కోణాలను కూడా సామాన్యంగా మరుగున పడేస్తారు. ఒకే కోణం నుంచి మనం వీళ్ళను చూడాలి. అది పాతివ్రత్యం. పవిత్రత. ఈ ఒక్క విషయమే ఈ స్త్రీల జీవితాలను శాసిస్తుంది. ఇటువంటి పతివ్రతల జీవిత సౌభాగ్యాన్ని గానం చేసే పాటలు సినిమాలలో ఎక్కువగా వుంటాయి. నాగయ్యగారు పాడిన 'ఆదబ్రతుకే మధురం దగ్గర నుంచి, 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి”, 'ఆలయ మేలా, అర్చ్భనలేలా, ఆరాధనలేలా, పతిదేవుని సన్నిధిని మించిన పరమార్ధము సంకలిత - ఓల్లా ౪9.

గలదా" అంటూ (ప్రసిద్ధ గాయకులందరూ పతివ్రతల గొప్పతనాన్న్సీ పాతివ్రత్య మహత్వాన్న్సీ గానంచేశారు. ఈ పతివ్రతల పాత్రలలో ఒక చిన్న మలుపు ఉన్న పాత్రలు కూడా సాంఘిక సినిమాలలో మనకు తరచు కనిపిస్తుంటాయి. అదేమిటంటే

  • మొదట కొందరు ప్తీలు చాలా దురాశ పరులుగా, స్వార్థ పరులుగా వుంటారు. భర్తనూ, కుటుంబంలో మిగతావారినీ చాలా కష్టపెట్టి సినిమా చివరకు పతివ్రతలుగా మారిపోతారు. పశ్చాత్తాపంతో పవిత్రులవుతారు. రెండవ రకం ప్రీ పాత్రలు వ్యాంపు పాత్రలు లేదా పతితలు. వీళ్ళు పతివ్రతల భర్తల నాకర్షించి, వారి కష్టాలు పెంచి తద్వారా వారి పాతివ్రత్యాన్ని కూడా పెంచటానికి వుపయోగపడే పాత్రలు, రాను రానూ ఈ పాత్రలు సినిమాల్లో తగ్గిపోతుండటం సంతోషించాల్సిన విషయం. ఐతే ఈ పాత్రల స్టానే ఒక్క క్లబ్బు డాన్సు చేసి మరి కనపడకుండాపోయే స్త్రీ పాత్రలు ఇటీవలి సినిమాల్లో చాలా ఎక్కువైపోతున్నాయి. మూడవ తరం స్రీ పాత్రలు సూపర్‌ ఉమన్‌ పాత్రలు. నాడియా సినిమాలు ఈ రకం పాత్రలకు ప్రారంభమని చెప్పాలి. సామాన్యంగా యాక్షన్‌ సినిమాలలో హీరో చేసే పనులన్నీ ఈ సూపర్‌ హీరోయిన్లు కూడా చేస్తారు. ఒంటి చేతో ఎంతమంది రౌడీలనయినా చిత్తుచేస్తారు. రౌడీరాణీ, పంచకల్యాణి - దొంగలరాణి, గంగ - మంగ వంటి సినిమాలు మన తెలుగులో కూడా విరివిగానే వచ్చాయి. ప్రస్తుతపు వ్యాపార సంస్కృతికి అనుగుణంగా సినిమాలలో ప్రీలు కూడా మారుతున్నారు. వారిలో ఒకరకం పాత్రలు కమర్షియల్‌ తిరుగుబాటుదార్లు - ఈ స్త్రీలు విలన్లను చంపి పోలీసులకు లొంగిపోతారు. ఈ స్రీ పాత్రలు విలన్లని చంపటం కూడా చాలా గ్లామరస్‌గా వుంటుంది. చంపటం అనే క్రియకూ వారి ముఖానికీ ఏమీ సంబంధం వుండదు. అప్పుడు కూడా ఈ స్రీలు అందంగా ఆకర్షణీయంగా వుంటారు. ఈ మధ్య సినిమాలలో స్వతంత్ర్యభావాలకీ పాతివ్రత్యానికీ మధ్య నలిగే పాత్రలు కనిపిస్తున్నాయి. వీరి ఆధునికత, అభ్యుదయం చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒక సినిమాలో హీరోయిన్‌ వితంతువైనా ఎంత విప్లవాత్మకంగా మారిపోతున్నదోనని మనం సంతోషించే లోపు రెండో రీలులోనే ఆమె ఆ బొట్టు పెట్టుకున్నందుకు సంజాయిషీ యిస్తుంది. ఆమె భర్త మరణించేముందు ఆమె ముఖాన బొట్టు తియ్యవద్దన్నాడట. అందుకని ఆమె బొట్టు పెట్టుకొంటోంది. దీనిని అభ్యుదయమనాలో పాతివ్రత్య మనాలో తెలియక సంకలిత - ఓల్గా ౪10.

మనం తికమకపడాల్సిందే - ఇంకో సినిమాలో అన్యాయంగా అనుమానించి ఒదిలేసిన భర్తను భార్య తిరస్కరిస్తుంది. ఆత్మగౌరవం గల పాత్ర సినిమాలలోకి వచ్చిందని సంతోషించే లోపు ఆమె భర్త ఫోటోకు పూజలు చేస్తుంది. భర్త ఒళ్ళోనే చివరకు మరణిస్తుంది. ఇందులో అభ్యుదయం సంగతి మనం ఎలా అర్ధం చేసుకోవాలో తేల్చుకోలేం. ఐతే ఇంత చరిత్ర గలిగిన భారతీయ సినిమాలలో స్రీలనూ స్త్రీ సమస్యలనూ సానుభూతితో సహజంగా సవ్యంగా చిత్రించిన సినిమాలే లేవా అంటే వున్నాయి. అరుదుగానైనా మంచి సినిమాలే వున్నాయి. తెలుగులోనే బాలయోగిని, యోగిని, సుమంగళి, కన్యాశుల్కం వంటి సినిమాలు ఆనాటికున్న పరిమితులతో సమస్యను చిత్రించే ప్రయత్నం నిజాయితీగా చేశాయి. 1925వ సంవత్సరంలోనే 'చైల్డ్‌ విడో అనే సైలెంట్‌ సినిమా వచ్చింది. “దునియా నామానే?, 'దహేజ్‌, 'గుడియా' లాంటి సినిమాలు ఆత్మగౌరవం గలిగిన స్త్రీ పాత్రలను పేక్షకులకు పరిచయం చేశాయి. వ్యాపార చిత్రాలనలా వుంచి ఇబీవల పారలల్‌ సినిమాలూ, ఆర్ట్‌ ఫిలింలు అని పేరుపడిన కొన్ని సినిమాలలో స్త్రీ పాత్రలనూ ప్రీ సమస్యలనూ చాలా సున్నితంగా వాటికున్న కాంప్లెక్సిటీలను అర్థం చేసుకుంటూ చిత్రించిన సినిమాలు వున్నాయి. సత్యజిత్‌ రే తీసిన 'చారులత) 'మహానగరొ సినిమాలు అలాంటివే. 'చారులత' రవీంద్రుడి నవల. రే దానిని అపురూపమైన సినిమాగా మలిచాడు. భర్తతో స్నేహం లేకపోవటం వల్లా, మరిదితో స్నేహం వుండటం వల్లా చారులత పడిన సంఘర్షణను ఎంత సున్నితంగానో మనకు చూపి ఒక ప్రీని మనకు పరిచయం చేశాడు. “'మహానగరొలో ఉద్యోగం చేసే ప్రీ పదే బాధను చాలా సహజంగా చిత్రించాడు రే. రుత్తిక్‌ ఘటక్‌ 'మేఘడాక తార” లో కూడా వుద్యోగం చేస్తూ తండ్రిలా కుటుంబ భారాన్ని మోసే ఆడపిల్ల శక్తి స్వరూపాన్ని మనకు పరిచయం చేశాడు. మృణాల్‌ సేన్‌ తీసిన “ఏక్‌ దిన్‌ ప్రతి దిన్‌' ఈనాటి లక్షలాది ఆడపిల్లల జీవితానికి ప్రతిబింబం. వుద్యోగం చేసే అవివాహితయైన ఆడపిల్ల అర్ధరాత్రిదాకా ఇంటికి రాకపోతే ఆ ఇల్లూ, పక్కఇళ్ళూ, ఆ వీధంతా ఎంత కలవరపడుతుందో సేన్‌ చాలా ప్రతిభావంతంగా సంకలిత - ఓల్లా * 11

చూపించాడు. చివరికామె అర్ధరాత్రి దాటాక వస్తుంది. రకరకాల మనుషులు రకరకాలుగా రియాక్ట్‌ అవుతారు. సినిమా అయిపోతుంది. సినిమా చూసిన చాలామంది 'సేన్‌ను అడిగారట. ఇంతకూ ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళిందీ అని “అది నాకనవసరం - మీకనవసరం - అనవసరం అని చెప్పటానికే ఈ సినిమా తీసింది.” అని సేన్‌ చెప్పారు. ఆ అమ్మాయి ఏ చెడ్డపనీ చెయ్యలేదని, వదో ఓ మంచి కారణం వల్లనే ఆలస్యమయిందనీ చెప్పవచ్చుగదా అని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారట. (ప్రస్తుతం పురుష స్వామ్యసమాజం మంచి కారణం చెబితే ప్రీలను అర్ధం చేసుకోటానికి, పాపం - సిద్ధంగానే వుంది. “ఆలస్యంగా ఇంటికిరా ఫరవాలేదు. క్షమిస్తాం. కానీ కారణం చెప్పు, మంచి కారణం. వితంతువైనా బొట్టు పెట్టుకో. ఒప్పుకుంటాం కానీ కారణం చెప్పు, అది నీ భర్త కోరిక అని. భర్తని ఒదిలెయ్యి - పోనీలే అని ఊరుకుంటాం. కానీ కారణం చెప్పు - మాకు నచ్చే కారణం. మా విలువలనీ మా సెంటిమెంట్లనీ దెబ్బతియ్యని కారణం చెప్పు” అంటుంది సమాజం. ఈ రకమైన అదుపునీ, అణచివేతనూ దెబ్బతీసే సినిమాగా “ఏక్‌ దిన్‌ ప్రతిదిన్‌' ని మనం చెప్పుకోవచ్చు. అపర్టా సేన్‌ తీసిన 'పరోమా' సినిమా చాలాపెద్ద చర్చనీయాంశం అయింది. పరోమా తనపేరు కూడా మర్చిపోయేంతగా సంసారంలో ఇమిడిపోయిన స్త్రీ. ఆమె ఒక భార్య, ఒక కోడలు. వ్యక్తిగా తనను తాను మర్చిపోయిన దశలో ఓ యువకుడు పరోమాను కొన్ని విషయాలలో మేల్మోలుపుతాడు. వాళ్ళిద్దరి మధ్యా ఎఫైర్‌ నడుస్తుంది. ఈ ఎఫైర్‌, ఈ సంబంధం తప్పాఒప్పా అన్నచర్చ అనంతంగా జరిగింది. (తప్పనే చాలా మంది ప్రముఖుల అభిప్రాయం అనుకోండి) కానీ అసలు చర్చ జరగాల్సిన విషయాన్ని అందరూ పక్కన పెట్టేశారు. లేక కావాలని మర్చిపోయారో. పరోమా సంసారాన్ని గురించి ఎవరూ చర్చించలేదు. ఆమెను అణచివేసే బాధ్యతల గురించీ, చాకిరి గురించి చర్చలేదు. యాంత్రికమైన భార్యాభర్తల సంబంధం గురించి చర్చలేదు. సంసారంలో అణగారిన ఆమె వ్యక్తిత్వం, అభిరుచులూ, ఆసక్తులూ వీటి గురించి చర్చలేదు. ఇవన్నీ తప్పులు కాదా? సమాజం ఆమోదించిన తప్పులు కావా? ప్రీ జీవితాన్ని ఇన్ని తప్పలకూ పొరపాట్లకూ గురిచేసి ఆమె ఎఫైర్‌ని మాత్రమే భయంకరమైన తప్పుగా చూడటం ఏమిటని పరోమా మనల్ని అడుగుతుంది.

“'మిర్చిమసాలా' సినిమాలో ప్రీలు సంఘటితంగా ఒక సమస్య నెదుర్మోనటం చక్కగా చిత్రీకరించారు కేతన్‌ మెహతా. హీరోయిన్‌ ఒకృత్తీ వీరోచితంగా శత్రువుని తుద ముట్టించటం కాకుండా తోటి ఆడవాళ్ళ సాయంతో, వాళ్ళకు అందుబాటులో వున్న పనిముట్లనే అయుధాలుగా చేసుకుని తమ తెలివితేటల్ని వుపయోగించి శత్రువుని ఎదుర్కొంటారు. తెలంగాణా పోరాటంలో ఎన్నో గ్రామాల్లో ప్రీలు శత్రువులను కారం జాడీలతో ఎదుర్కొన్నారు. అలాంటి స్త్రీలను గుర్తుకు తెస్తుందీ సినిమా. 'మండి' సినిమాలో శ్యామ్‌ బెనగల్‌ వేశ్యలను కూడా మనుషులుగా పరిచయం చేస్తాడు. మండిలో స్టీలు తమను తాము పాపులుగా, హీనులుగా చూసుకోరు. తమను తామే అసహ్యించుకుని కుమిలిపోయే వారిగా వుండరు. వాళ్లుకూడా మనుషులు. జీవితాల్ని జీవించే ప్రేమించే మనుషులు. కష్టాలూ, సుఖాలూ, సంతోషాలూ, బాధలూ అన్నీ అనుభవించే స్రీలు. ఒక కొత్త కోణం నుంచి వారిని మనకు పరిచయం చేశారు శ్యామ్‌ బెనగల్‌. విజయమెహతా తీసిన 'రావ్‌ సాహెబ్‌ చాలా మంచి చిత్రం. ఆ చిత్రంలో రాధక్క బాబూరావు భార్య. అతను రావ్‌సాహెబ్‌ దగ్గర పనిచేస్తుంటాడు. రాధక్మకు రావ్‌సాహెబ్‌ అంటే ఆకర్షణ వున్నట్లు ఒకటి రెండు సన్నివేశాలలో చూపించారు విజయ మెహతా.

  • ఆ సినిమాని కొంతమంది మేధావులూ, ఫిలిం క్రిటిక్స్‌తో కలిసిచూశాను. వీరిలో విజయ్‌ మెహతా కూడా వున్నారు. ఆ సినిమా చూడగానే మగవాళ్ళంతా విజయ మెహతా మీద దాడిచేశారు. భర్త వుండగా, భార్యాభర్తలు అన్యోన్యంగా సంసారం చేస్తున్నపుడు భార్యకు పరాయి మగవాడిమీద ఆకర్షణ వుందన్నట్లు చూపించటం ఏమిటి అని ఆగ్రహంతో అడిగారు. విజయ్‌ మెహతా మెల్లగా నవ్వి “స్త్రీ పురుషుల మధ్య ఒకోసారి అనుకోకుండా తాము స్త్రీ పురుషుల మన్న స్పృహ కలిగి చిత్రమైన పనులు చేయిస్తుంది. ఇద పీర్‌ కెమిస్ట్రీ - అండ్‌ ఐ లవ్‌. దట్‌ కెమిష్ట్రీ” అని నిర్మాహమాటంగా చెప్పేసరికి ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నారు. సినిమాలలో 'ప్రీలను సహజంగా చిత్రించటం లేదనేది ఒక విషయం. ఐతే సహజంగా చిత్రిప్తే అర్ధం చేసుకునే వారెంత మంది అనేది కూడా ఒక ప్రశ్నే - ఎందుకంటే మన సమాజం, మన విలువలూ, మన దృక్చధాలూ అన్నీ పురుషుని దృక్కోణం నుంచే ప్రతివిషయాన్నీ చూపిస్తాయి. ఈ సమాజమే పురుషస్వామ్య సమాజం. సంకలిత - ఓల్లా * 13

అలాంటప్పుడు నిజమైన స్త్రీలను సినిమాలలోకి తీసుకురావటం తేలిక కాదు. కానీ తీసుకురావాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇప్పుడిప్పుడే అపర్హాసేన్‌, విజయమెహతా వంటి మహిళా దర్శకుల సినిమాలు చూస్తుంటే రక్తమాంసాలున్న స్త్రీ, మనిషిగా, వ్యక్తిగా, బలంతో, బలహీనతలతో వున్న నిజమైన ప్రీ సినిమాలలోకి వస్తుందనే నమ్మకం కలుగుతోంది. (అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్చి 8వ హైదరాబాద్‌ మహిళా జర్నలిస్టుల సమావేశంలో 'సినిమాల్లో ప్రీలు'.....ప్రసంగం) ఆదివారం, ఆంధ్రజ్యోతి 26 ఏప్రిల్‌, 1988, సంకలిత - ఓల్లా * 14

నం. న తటి . అస్త, 2 ఆడవాళ్ళ వ్యవహారం (స్త్రీల గర్భధారణ శక్తి మీద రాజ్యానికి వున్న అధికారాన్ని చాలా సూటిగా, స్పష్టంగా చూపించిన సినిమా “ఏన్‌ ఎఫైర్‌ డి ఫెమ్మిస్‌”. ఆడవాళ్ళు పిల్లల్ని కనడం, కనకపోవటం అనేది వాళ్లకీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయంగా కనిపిస్తుంది. దానిమీద రాజ్యానికి వున్న కట్టడి ఏమిటో అర్ధం కావటం చాలాకష్టం. ఎక్కువమంది పిల్లల్ని కంటే పెంచడం ఆర్థికంగా తల్లిదండ్రులకు కష్టం దేశ జనాభా పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు భారమనీ ప్రభుత్వం ఎక్కువమంది పిల్లల్ని కనొద్దంటుంది, అనేది మాత్రమే మనకి అర్ధమవుతుంది. పిల్లల్ని కనకుండా వుండగల్లిన పరిజ్ఞానం వెనకాల వున్న చరిత్ర మనకు తెలియదు. పిల్లల్ని కనకుండా వుండే హక్కుకోసం ఎందరు ఆడవాళ్ళు ఎట్లా పోట్లాడారో, ఎన్ని త్యాగాలు చేశారో, ఎట్లా బలైపోయారో మనకు చరిత్ర చెప్పదు. మన చరిత్ర సరిహద్దుల విస్తరణ కోసం రాజ్యాలు చేసుకొన్న యుద్ధాలలో మరణించిన వీరులను మాత్రమే గుర్తిస్తుంది. ఆర్థికాధికారాల మార్పిడిలో బలైన ప్రజలను కూడా గుర్తిస్తుంది. కానీ స్త్రీల మనశ్ళరీరాల మీద జరిగే దురాక్రమణ గురించీ, అప్పుడు ఎన్నో రకాలుగా ప్రతిఘటించిన స్త్రీల గురించీ మాత్రం చరిత్ర ఏమీ చెప్పదు. మనకు తెలిసిన చరిత్రకు ఆ దృష్టి లేదు. నేను పైన పేర్మాన్న ఫ్రెంచి సినిమా మనకు తెలియని అలాంటి ఒక చరిత్రని చెబుతుంది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లోని ఒక పట్టణంలో యుద్ధకాలపు దారిద్ర్యం నుంచి తననూ, పిల్లల్నీ రక్షించుకోవాలని చూసిన మరియా అనే స్త్రీ తాలూకు కధే 'ఏన్‌ ఎఫైర్‌ డి ఫెమ్మిస్‌. / సంకలిత - ఓల్లా * 15

ఈ కథలో మరియా పొరుగింట్లో నివసించే ప్రీ కడుపుతో వుంటుంది. తాను అనుభవిస్తున్న దారిద్ర్యపు జీవితంలోకి మరోప్రాణి రావటం ఇష్టంలేని ఆ పొరుగింటి ప్రీ ఎలాగైనా తన గర్భాన్ని తీసేసుకోవాలనుకుంటుంది. అప్పుడు ఫ్రాన్స్‌లో గర్భస్రావం చట్ట విరుద్ధం. ఆ ప్రీ నాటువైద్యాలెన్నో చేసుకుంటుంది. కానీ అవేమీ ఫలితాన్నియ్యవు. ఇలా వుండగా మరియా గర్భస్రావానికి ఒక కొత్త పద్ధతి కనిపెడుతుంది. ఆ పద్ధతిలో ఆమె పొరుగింటి స్త్రీకి విజయవంతంగా గర్భ(స్రావాన్ని చేయగలుగుతుంది. అప్పుడా పొరుగింటావిడ ఎంతో సంతోషించి మరియాకి ఒక గ్రామఫోన్‌ని బహుమతిగా ఇస్తుంది. అప్పుడు మరియాకి గర్భస్రావం చేయటాన్ని వృత్తిగా చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. దుర్భరమైన దారిద్ర్యంలో, అనారోగ్యంతో, పిల్లల్ని కనలేక, పెంచలేక అవస్థలు పడుతున్న ఎందరో ఆడవాళ్లు మరియా సహాయాన్ని కోరుతూ వస్తారు. ఈమె దబ్బు పుచ్చుకుని వారికి గర్భస్రావం చేస్తూ వుంటుంది - క్రమంగా మరియా సంపాదన పెరుగుతుంది. ఇంతలో మరియాకి ఒక వేశ్యతో పరిచయమౌతుంది. సంపాదన పెరిగాక ఒక పెద్ద ఇంట్లోకి మారిన మరియా తన ఇంట్లో ఓ గది ఆ వేశ్యకు అద్దెకిస్తుంది. ఆ డబ్బుతో పిల్లలతో మరియా సుఖంగా బతుకుతూ వుంటుంది. మరియా భర్త యుద్ధంలో గాయపడి ఇంటికి తిరిగివస్తాడు. అతనికి ఏ పనీ వుండదు. భార్య చేస్తున్న పనికి నొచ్చుకుంటూ వున్నా, డబ్బు వస్తోంది గాబట్టి మాట్లాడకుండా ఊరుకుంటాడు. మరియా భర్తను ప్రేమించదు. అతనితో ఎలాంటి సంబంధాన్నీ పెట్టుకోదు. ఆవిడకి తన పిల్లలంటే ప్రాణం. ఇలా జరిగిపోతున్న ఆమె జీవితంలోకి మరో మగవాడు వస్తాడు. అది తెలిసిన ఆమె భర్త భరించలేకపోతాదు. (అంతకు ముందే ఆమె ఆ భర్తమీద జాలితో అతన్ని కాస్త సుఖపెట్టమని తన ఇంట్లో చేరిన నర్చుని అడుగుతుంది). మరియా చట్టవిరుద్ధమైన గర్భ(స్రావాన్ని వృత్తిగా చేస్తోందని, తన ఇంట్లోనే వ్యభిచారం సాగిస్తోందనీ మరియా భర్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాడు. ప్రభుత్వం మరియాను అరెస్ట్‌ చేస్తుంది. పారిస్‌ కోర్టు విచారణ జరుపుతుంది. పారిస్‌ జైల్లో వుండి మరియా తన లాయర్ని ఈఫిల్‌ టవర్‌ ఫోటో ఒకటి ఇవ్వమని, తన పిల్లలు దాన్ని చూడలేదని, ఆ ఫోటోని పిల్లలకి పంపుతానని అడుగుతుంది. కోర్టు మరియాకు మరణశిక్ష విధిస్తుంది. యుద్ధానంతరం పతనమైన ఫ్రాన్స్‌ పరువును పునరుద్ధరించటానికీ, నైతిక విలువల్ని కాపాడుతున్నామనే నమ్మకాన్ని ప్రాన్స్‌ ప్రజలకి సంకలిత - ఓల్లా * 16

కల్గించటానికి, కుటుంబ పవిత్రతను సంరక్షించటానికీ మరియా మరణం ఫ్రాన్స్‌ (ప్రభుత్వానికి చాలా అవసరమౌతుంది. ఆ విధంగా మరియాని చంపి ఫ్రాన్స్‌ ప్రభుత్వం తన బెన్నత్యాన్ని నిలబెట్టుకుంటుంది. మరియా దగ్గరకు వచ్చిన ఆడవాళ్ళంతా పిల్లల్ని వొద్దనుకున్నవాళ్ళే. మరియా ఎవ్వరికీ బలవంతంగా గర్భస్రావం చేయలేదు. తాము కనబోయే పిల్లలకు ఫ్రాన్స్‌ దేశం ఏమీ ఇవ్వలేదనీ, వాళ్ళకోసం భవిష్యత్తులో ఏమీ చేయలేదనీ తెలుసుకున్న ఆడవాళ్ళు ఈ దుర్భర పరిస్థితుల్లోకి పసిపిల్లల్ని రానివ్వకపోవటమే తమకీ, దేశానికీ మంచిదనుకుంటారు. అలాంటి స్త్రీలకు మరియా సహాయం చేసినందుకుగానూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం మరియాను శిక్షించింది. మరియా చేసిన అబార్చన్‌లలో ఒక్కటి మాత్రం విఫలమై ఆ స్రీ చనిపోతుంది. అప్పుడు ఆ చనిపోయిన స్త్రీ తాలూకు ఒకావిడ వచ్చి మరియాని నిందిస్తుంది. “గర్భంలో వున్న పిండానికి కూడా ఆత్మవుంటుంది తెలుసా” అని హెచ్చరిస్తుంది. మరియా ఒక్కక్షణం ఆలోచనలో పడుతుంది. ఆమాట ఆమె మనసును కలవరపెడుతుంది. తన స్నేహితురాలైన వేశ్యని అడుగుతుంది. గర్భంలో వున్న పిండాలకు ఆత్మవుందడం నిజమా అని. పిండాలకే కాదు స్రీలకీ ఆత్మలనేవి వుండవని అంటుంది మరియా స్నేహితురాలు. మరియా కలవరం తగ్గుతుంది. 1948 జూన్‌ నెలలో మరియా తల నరికించేసింది ఫ్రాన్స్‌ ప్రభుత్వం. అప్పుడు మరియా పరిస్థితి ఎలాంటిది? ఆమె అమరురాలైందన్న భావం కాదుకదా ఆమె చుట్టూ అపకీర్తి. ఆమె పిల్లలకి అపకీర్తి. అందరూ మరియానీ, ఆమె సంతానాన్నీ అసహ్యించుకుంటారు. ఆ అపకీర్తిలోనే ప్రకాశిస్తుంది మరియా. ఇవాళ గర్భస్రావం చట్టబద్దమైంది. కానీ మరియా గానీ, ఆమెలాగే అలాంటి అపకీర్తి పాలైన ఎందరో ఆడవాళ్ళుగానీ ఈరోజు చరిత్రలో ఎక్కడున్నారు? ఎలాంటి స్థానంలో వున్నారు? వాళ్ళందరి గురించి ఈనాటి స్త్రీలు చరిత్రని తిరగతోడాలి. ఈ అపకీర్తి చ్భాయల్లోనే ఈనాటి స్రీలు - ప్రీల చరిత్రకోసం శోధించాలి. మరియా జీవితగాధ మనకి చెప్పేదిదే. ఆలోచనలు రేకెత్తించే ఈ సినిమా దర్శకుడు క్లాడీ చాబ్రోల్‌ అనే ఫ్రాన్స్‌ దేశస్థుడు. “ప్తీలు సగం ప్రపంచ భారాన్ని తమ భుజాలపై మోస్తున్నారు” ఇత మన కనన ను శన జను కనను లోహిత ఏప్రిల్‌ 1989 సంకలిత - ఓల్లా * 17

లా"

ప

కలు

3 కుటుంబ సంబంధాలపై ఫైర్‌ జనవరి 14వ తారీఖు సాయంత్రం, త్రివేండంలో కైరాలి థియేటర్‌ దగ్గర ఫైర్‌ మొదలయింది. సాయంత్రం ఆరుగంటల సినిమాకు జనం ఐదుగంటల నుంచే గుమిగూడారు. ఎందుకో అర్ధం కాలేదు. దీపామెహతా అనే దర్శకురాలికి అంత పేరేం లేదు. ఈ సందడి ఎందుకో అర్ధం కాలేదు. బహుశా షబనాఆజ్నీకి ఇంటర్నేషనల్‌ అవార్డు వచ్చిందనా? ఏమో - ఎందుకైనా మంచిదని, నాకూ కుటుంబ రావుకు మంచి సీట్లు సంపాదించుకోవచ్చునని నేనూ గేటు దగ్గరకు 5:10 నిమిషాలకంతా చేరాను. మరో ఐదు నిమిషాల్లో జనం గోల భరించలేక గేట్లు తీసేసారు. ఐదున్నరకు థియేటర్‌ నిండిపోయింది. జనం కింద కూచుని, నిలబడి, కిక్కిరిశారు. దీపా మెహతాని పరిచయం చేశారు. ఆమె థాంక్స్‌ చెబుతూ మా అమ్మానాన్నలు ఈ ఆడిటోరియంలో వున్నారు. వాళ్ళకు ఈ షో అంకితం చేస్తున్నానని చెప్పి ముగించింది. ఫైర్‌ మొదలయింది. అది అగ్ని అని ఎవరికీ తెలియదు. సినిమా ఐపోవడానికి యింకా మూడు నిమిషాలేటైముంది? నాకు చాలా అయోమయం - ఏంటిది? ఇంతేనా? ఎందుకిలాంటి ముగింపు ఇవ్వబోతోంది. దీపామెహతా ఎందుకిట్లా చేసిందనే కన్‌ప్యూజన్‌

  • ఇలా జరక్కూడదనే బాధ. మెదడు అల్లకల్లోలమైంది. కొందరు ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు కోపం! కానీ ఒకటిన్నర నిమిషం గడిచింది. అమ్మయ్యా! నేను ఆశించింది - దీపా ఇవ్వదలుచుకున్న ముగింపు వచ్చింది
  • ఆనందంతో చప్పట్లు కొట్టాను. ఆనందంతో కుటుంబరావుని పట్టుకుని యేచ్చాను. ఐయామ్‌ సో హ్యాపీ! దీపా మెహతాని అభినందించాలనిపించింది. సంకలిత - ఓల్లా + 18

హడావుడిగా ఆమె దగ్గరకు వెళ్ళాను. మామూలుగా అంత కిక్కిరిసిన థియేటర్‌లో సినిమా తర్వాత దర్శకుల దగ్గర కూడా గుంపులు వుంటారు. దీపా మెహతా దగ్గర అంతలేదు. నేను వెళ్ళి ఆమెను అభినందించి చాలా బాగుంది మీఫిల్మ్‌ అంటుంటే - ఆమె “నిజంగా మీకు నచ్చిందా అని అడుగుతోంది - ఎందుకిలా అడుగుతోందా అనుకునేంతలో ఒక వ్యక్తి గబగబా వచ్చి 'ఐడోంట్‌ లైక్‌ యువర్‌ ఫిల్మ్‌ డోంట్‌ మేక్‌ రాటెన్‌ ఫిల్ఫ్‌. డోంట్‌ మేక్‌ రాటేన్‌ ఫిల్ఫ్‌ లైక్‌ దిస్‌ అన్నాడు చాలా కోపంగా. దీపా “ఇట్స్‌ - ఓ.కె అంది. అతనింకేదో అనబోతే 'యు సెడ్‌ వాట్‌ యు వాంట్‌ టు సే, గో-గో టు హెల్‌ అని దీనితోపాటు ఆ సినిమాలో నటించిన నందితాదాస్‌ని కూడా అభినందిస్తూ, మానవ సంబంధాల గురించి, ఇది చాలా మంచి సినిమా అనీ, ఎంతో సాహసం కావాలీ సినిమా తీయడానికని దీపాతో చెబుతూ థియేటర్‌ నుంచి బైటికి వచ్చాం. జనంలో చాలా మంది గుండెల్లో మంటలు రేగాయి. కానీ కొందరి గుండెల్లో మాత్రం ఎంతో ఆనందం. ఆ సినిమానలా తీసినందుకు దీపా మెహతాపై ప్రేమతో, ఒక స్రీ ఆ సినిమా తీసిందనే సంతోషంతో గర్వంతో, నిజంగా సంక్రాంతిగా, అంతర్జాతీయ వుత్సవంలా అనిపించింది. ఒక భారతీయ స్త్రీగా దీపామెహతా మీద ఎంతో (ప్రేమ కలిగింది. ఇంతకూ ఆ ఫైర్‌ ఏమిటి? ఎందుకు థియేటర్‌లో ముషప్పాతికవంతు పురుషులు ఆ సినిమాను యిష్టపడలేదు? ఎందుకు చాలా మంది 'ఆ! పర్వర్రెటెడ్‌ స్టఫ్‌ అని చప్పరించి తమ కోపాన్ని దాచుకున్నారు? ఎందుకు ఎంతోమంది కోపాన్ని దాచుకోలేక దర్భ్శకురాల్ని తిడుతూ వెళ్ళారు? ఫైర్‌ ఒక మధ్యతరగతి హిందూ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన కథ. ఢిల్లీలో ఒక హోటల్‌ నడుపుతున్న కుటుంబం. మంచం మీద నుంచి కదలలేని మాట్లాడలేని 90 సంవత్సరాల వృద్ధురాలు, అశోక్‌, జతీన్‌ల తల్లి ఆయింటి పెద్ద. ఇద్దరన్నదమ్ములు, అన్న భార్య రాధ, హోటల్‌లో పనిచేసే ముండో, ఇదీ వాళ్ళ కుటుంబం. తమ్ముడు జతీన్‌ హనీమూన్‌తో సినిమా మొదలవుతుంది. జతిన్‌ని పెళ్ళాడిన సీత చాలా తెలివైనది, చురుకైనది, భావుకురాలు. సజీవమైన అమ్మాయి. జతీన్‌కు ఆ పెళ్ళి తప్పనిసరై చేసుకున్నాడు - అన్నపోరు పడలేక. అతనికి ఒక చైనీస్‌ ప్రియురాలు జూలీ వుంది. ఆమెనతడు ఒదల్లేడు. అన్నకు పిల్లల్లేరు. తమవంశం నిలబడడానికి జతీన్‌ పెళ్ళి చేసి అతనికి పుట్టబోయే పిల్లలకోసం ఎదురుచూసే అతను ఒక ఆధ్యాత్మిక మిధ్యా సంకలిత - ఓల్లా * 19

ప్రపంచంలో బతుకుతుంటాడు. అతని గురువు బాబా - కోరికలే బాధకు కారణమని, కోరికలను జయించాలని, వివాహం, సంతానం కోసం మాత్రమేనని చెబుతుంటాడు. అది నమ్మిన యితను పిల్లల్ని యివ్వలేని భార్యను తాకకుండా నిగ్రహాన్ని పాటిస్తూ వుంటాడు. తన నిగ్రహశక్తిని, తన కోరికలను జయించాడా లేదా అన్న విషయాన్ని పరిక్షించడానికి అప్పుడప్పుడు భార్యను పక్కలో పడుకోబెట్టుకుని తన కోరికలను జయించానని గర్వపడుతుంటాడు. పదమూడు సంవత్సరాల పాటు అతని భార్య రాధ తనలోపలి కోరికలను, స్పందనలను, (ప్రేమను, దయనూ చంపుకుని నిర్జీవంగా ఒక శవంలా అతనిపక్కన పడుకుంటూ, అతనికీ, అతని ముసలి తల్లికీ ఓర్పుగా సేవలు చేస్తూ, హోటల్‌లో వంటలు చేసి అందిస్తూ రాత్రీపగలు చాకిరీ తప్ప చిన్నచిరునవ్వు కూడా లేకుండా బతుకుతుంటుంది. ఆమె జీవితంలో సీత చిన్న కాంతిరేఖలా వస్తుంది. సీతకూ ఎన్నో ఆశలూ, కలలూ- మొదటి రాత్రి, భర్త ఆమె హైమన్‌ పొరను చించి రక్తం వస్తోంది భయపదకని అటుతిరిగి పడుకుని నిద్రపోతాడు. పక్క దుప్పటిమీది రక్తపు మరకను వెంటనే సబ్బుతో వుతికిన సీత తన బతుకునెలా నిర్మలం చేసుకోవాలా అనే ఆలోచనతో జ్వలిస్తుంటుంది. జతిన్‌కు వీడియోలు అద్దెకిచ్చే షాపు చిన్నది, ఆ హోటల్‌లోనే ఓమూల వుంది. బ్లూఫిలింలు కూడా చినృపిల్లలకు అద్దెకివ్వగలిగిన వాడు జతిన్‌. ఆ చిన్నపిల్లలు కూడా ప్యూదలిజానికీ, వలస మనస్తత్వానికి పుట్టి, గ్లోబల్‌ కల్చర్‌లో పెరుగుతున్నవాళ్లు. అన్నకు బాబా బోధనలు, వ్యాపారం తప్పయేమీ పట్టదు. జతిన్‌కు జూలీనే ప్రపంచం. రాధకు చాకిరీ, రోజురోజుకూ నిర్దీవమవుతున్న బతుకు - ఒక గంట చేతిలో పెట్టుకుని అది మోగిస్తూ, ఆ యింట్లో తన అంగీకార అనంగీకారాల్ని స్పష్టంగా తెలియజేస్తూ మంచం దిగకుండా పాలించే వృద్ధమాత. వీళ్ళందరి మధ్య ఆసులో కండెలా తిరుగుతూ పొద్దస్తమానం విశ్రాంతి లేకుండా పనిచేసే ముందో. సీత యెక్కువ రోజులు ఈ వాతావరణాన్ని భరించలేక పోతుంది. అంత హిపోక్రసీ, బాధ్యత పేరుతో క్రౌర్యం, నిర్లక్ష్యం, డబ్బు, సంపాదన. (ప్రేమకు తావులేదు. ఓ అర్ధరాత్రి ఒంటరిగా ఏడుస్తున్న సీతను ఓదార్చడానికి వస్తుంది రాధ. నాకు వెళ్ళిపోవాలనుంది అన్న సీతను బెంగపడకు అని చెబుతుంది రాధ. అదికాదు నీకు తెలియదు అంటూ రాధ పెదవులను ముద్దాడుతుంది సీత. ఆ క్షణంలో రాధకు ఎక్కడి మౌనమృదంగాలో పలుకుతాయి. సుప్తభుజంగా లేవో కదులుతాయి. శాంతితరంగాలు ఒకదానివెంట ఒకటీ ఆమె పైకి వచ్చి నిలువెల్లా ముంచుతుంటాయి. సీత రాధ మంత్రనగరి సరిహద్దులు సంకలిత - ఓల్లా ౪ 20

తాకింది. ఆమె హృదయంలో దీపం పెట్టింది. దీంతో రాధలో సాహసి క్రమంగా బైటికి వస్తుంది. నిర్జీవమైన రాధ కళ్లల్లో చిన్నకాంతి. ఎప్పుడూ నవ్వని ఆమె పెదవులపై చిన్న హాసరేఖ. చాకిరికి అలవాటై బండబారిన ఆమె చేతుల్లో ఒక మృదుత్వం. రాధ, స్‌తలు రాధాకృష్ణులయ్యారు. ఆ ఇంట్లో నవ్వులు విరబూశాయి. వాళ్ళ (ప్రేమతో ఆ ఇల్లు బృందావనమే అయింది. పనులన్నీ మామూలే కానీ కొత్త వుత్సాహం, కొత్త చైతన్యం. బాబా భజనలో అన్న జూలీ ప్రేమలో తమ్ముడు. ఒకరోజు రాత్రి జతిన్‌ పైజామా బొందు విప్పుకొని సీతవైపు జరుగుతాడు. సీత తనజోలికి రావొద్దని చెబుతుంది. అతనికర్థం కాదు. ఓ.కె అని నిద్రపోతాడు. ఇంట్లో టీ.వీలో రామాయణం చూస్తూ పరవశించే అన్న వృద్దమాత, పనంతా అయ్యాక బ్లూఫిలిం చూసుకుంటూ మాస్టర్‌బేట్‌ చేసుకునే ముండో. వీటన్నింటినీ మరిచిపోయి తమ (ప్రేమలో తాము మునిగిన సీతారాధలు. ఒకరోజు సీత అగ్నిప్రవేశం నాటకం కూడా చూస్తారు. ముండో హనుమంతుడి వేషం కడతారు. సీత అగ్ని పునీత అవడం

  • తర్వాత రాముడు అడవులకు పంపడం చూసి అందరితో పాటు కన్నీళ్ళు పెట్టుకుంటాడు అన్న. భర్తల ఆయురారోగ్యాల కోసం పౌర్ణమి రోజు వుపవాసం చేస్తారు తోడికోడళ్ళు. అదంతా వాళ్లకో ఆట. జతీన్‌ తన భార్య యింత ఆనందంగా వుండడం చూసి కాస్త షాకవుతాడు. నీకు బోర్‌ కొట్టకుండా పిల్లల్ని కనిపెంచుకో అని అనవసరమైన సలహా ఇచ్చి సీత చేత “యు ఆర్‌ ఎ పాంపస్‌_ఫూలొ అని తిట్టించుకుని ఆమెను చెంపదెబ్బ కొడ్రతాడు. సీత కూడా తిరిగి కొడుతుంది. ఇలా నడుస్తుండగా ముందో ఒకరోజు బ్లూఫిలిం చూసి మాస్టర్‌బేటింగ్‌ చేసుకుంటుండగా రాధ చూసి అతనిని తిడుతుంది. వెంటనే వెళ్లిపొమ్మంటుంది. నీ మరిది చిన్న పిల్లలకు ఈ క్యాసెట్లు అద్దెకిస్తున్నాడు. అతని సంగతేమిటి? నేను చచ్చేలా పనిచేస్తున్నా నాకెవరూ లేరు. ఏ విశ్రాంతి లేదు. నేను చేసేదే తప్పా అంటాడు. రాధ కోపంతో ఆదంతా వినిపించుకోదు. అతనిని పంపమంటుంది. భర్త ఈ ఒక్కసారికి క్షమిద్దామంటాడు. తమ్ముడు జతీన్‌ ఖ్లూఫిల్మ్‌ల సంగతి బైటికొస్తుందని అతని భయం. జతీన్‌ని, ముందోని బాబా దగ్గరకు తీసుకెళ్ళి బోధన చేయించి క్షమిస్తాడు. రాధకు భయం తమ విషయం బయటపడుతుందని. సంకలిత - ఓల్గా ౪ 21

సీతతో ఆ భయం గురించి చెబితే మనిద్దరం ఈ ఇల్లు ఒదిలి వెళ్ళిపోదాం. ఎక్కడైనా బతకగలం భయపడకు అని ధైర్యం చెబుతుంది. ఒకరోజు యథాప్రకారం అన్న బాబా భజనలో వుంటాడు. జతీన్‌, జూలీ దగ్గరుంటాడు. రాధ, సీతలు తమ ప్రేమలో వుంటారు. ముండోలో పగో, కోపమో వెళ్ళి యజమానిని పిలుచుకొచ్చి విషయం చెప్పి నువ్వే నీ కళ్ళతో చూడమంటాడు. యజమాని తన యాజమాన్యపు స్వభావంతో ముందు అతనిని వెంటనే సామాను సర్దుకొని బైటికి నడవమని చెప్పి ఆ తర్వాత సీత గదిలోకి చూస్తాడు. తనకళ్ళతో తనే చూస్తాడు. రాధ, సీతలు ఒకరినొకరు ఎలా (ప్రేమిస్తున్నారో చూస్తాడు. భరించలేని కోపంతో తలుపులు బద్దలు కొడతాడు.

సీత వెంటనే వెళ్ళిపోదామంటుంది. రాధ భర్తతో వున్న విషయం చెప్పి వుదయం వస్తానంటుంది. తప్పకుండా వస్తాను నాకోసం చూస్తుండు అంటుంది. ఆ వర్షప్రరాత్రి సీత ఒంటరిగా ఇల్లు ఒదిలి వెళ్ళి రాధకోసం చూస్తుంటుంది. రాధ భర్త - వుమ్మడి కుటుంబవు యజమాని - కోపంతో, ద్వేషంతో రగిలిపోతుంటాడు. రాధను పక్కమీదకు రమ్మంటాడు. రానంటుంది. రేప్‌ చేయబోతాడు. లొంగదు.

మర్శాడు వుదయం మామూలుగా కాఫీ చేస్తున్న రాధ దగ్గరకు వచ్చి అతను మళ్ళీ తన బాధ్యత గురించి మాట్లాడుతాడు. బాబా కోరికలను జయించాలా లేదా అని మాట్లాడుతుంటే రాధ చెబుతుంది. 'నాలోపల కోరికలున్నాయి. ప్రేమకోసం, స్పర్శకోసం, సహానుభూతికోసం కోరిక వుంది. నాకు సీత కావాలి. నేను సీతకోసం వెళ్ళిపోతున్నాను” అని చెబుతుండగా ఆమె పమిట కొంగు స్టవ్‌మీద పడి అంటుకుంటుంది. మంట పెరుగుతుంటే చూసి రాధ భయంతో అరుస్తుంది. భర్త ఆర్పడు సరికదా ఆమెను చాలా కఠినంగా, తృప్తిగా పగ చల్లారిన కళ్ళతో చూస్తుంటాడు. మంటలు పెద్దదవుతాయి. రాధ ఈ చీరె విప్పడానికి భయంతో, ఆత్రంగా స్ట్రగుల్‌ చేస్తుంది. రాధ చచ్చిపోతుందన్న ఆనందంతో కొందరు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. వాళ్ళ పైశాచికత్వాన్ని మగ మృగత్వాన్ని, ప్రదర్శించుకున్నారు. యుగయుగాలుగా యేదో పేరుతో, మిషతో స్రీలను నిప్పుల్లో తోస్తున్న ఆ మగవాళ్ళ రక్తం రాధ చచ్చిపోతుందనే ఊహతో చిందులేసింది. హైందవ ధర్మమో, వివాహ వ్యవసా, కుటుంబ వ్యవస్తో, మట్టో, మశానమో, ఆడవాళ్ళ పాలిట శ్శృశానమో మిగిలిందని, వేయిపడగల విషనాగు బుసలు కొట్టి, కొందరు (ప్రేక్షకులను ఆవహించి వాళ్ళచేత చప్పట్లు కొట్టించింది.

ఒక్క నిముషం - మరొక్క నిముషం - అయోమయం - నిస్సత్తువ, ఆర్తి.

సీత రాధకోసం వర్షంలో తడుస్తూ ఎదురు చూస్తుంది. రాధకోసం యుగాల నుంచి

సంకలిత -- ఓల్లా * 22

తమ (ప్రేమను దాచిన కళ్ళతో ఎదురుచూస్తుంది. రాధకేమయింది ఎందుకు రాలేదని ఆలోచిస్తుంది. రాధ వచ్చింది - అగ్నిప్రునీత అయి - నిజంగా యిన్ని యుగాల తర్వాత - చరిత్ర చేసిన అవమానాల అగ్నిపరీక్షల భారాన్ని ఆ కపటత్వాన్ని మోసీ, మోసీ - యేసుక్రీస్తు శిలువ కన్నాభారమై, అంతకన్న కంటక కిరీటమైన పాతివ్రత్యాన్నీ మోసి, మోసి - లోకం విసిరే, రాళ్ళురప్పల దెబ్బలతో, రక్తం, కన్నీళ్లు కలిసి, తనో బాధ ప్రవాహమైన ప్రీ యిన్నాళ్ళకు నిజంగా, తన ఆత్మబలంతో, తన నిర్ణయాధికారంతో, తనతోటి స్త్రీ సహకారంతో, లోకం మోపిన అవమానాన్ని అనుమానాన్ని దగ్ధం చేసి సజీవంగా, నిష్పుకడిగిన మనిషిలా పైకి లేచింది. పునరుద్ధానమంటారా? పునర్జన్మ అంటారా? పర్వర్షన్‌ అంటారా? ఏదైనా అనండి. రాధ, సీతలు మనుషులు. మానవ సంబంధాలు కొన్ని యుగాల నుంచి హింసాద్వేషాలతోనూ, (ప్రేమానురాగాలతోనూ యేర్పడుతున్నాయి. అన్నీ కలగలిసి మనం అర్ధంచేసుకోలేనంత సంక్షిష్టమై వున్నాయి. ఫాసిజం, అన్ని మానవ సంబంధాల నిండానిండి వుంది. దానికి వ్యతిరేకంగా ఒక కోణంలో యిద్దరు ట్రీలు మానవ సంబంధాలలో (ప్రేమకోసం చేసిన ప్రయత్నం ఈ కథ. వాళ్ళు లోకరీతికి భిన్నం కావచ్చు. కానీ భిన్నత్వాన్ని ఆమోదించడం ఫాసిస్ట్‌ వ్యతిరేకుల ప్రాథమిక లక్షణం కావాలి. అలాకాని నాడు అందరూ ఫాసిస్టులే అవుతారు. ఈ సినిమా కుటుంబంలో, మతంలో, సంస్కృతిలో పేరుకుపోయిన కపటత్వాన్నంతా బైటబెట్టింది. ఒకసారి మనల్ని మనం నగ్నంగా, లోలోపలి నగ్నత్రాన్ని పరీక్షించుకునేలా చేసింది. భూస్వామ్య, వలస, గ్లోబల్‌, సంస్కృతులన్నీ కలగలిసి మానవ విలువల్ని పతనం చేసే క్రమాన్ని చూపింది, ఎంతో నిర్భయంగా, నిజాయితీగా, సాహసంగా - ఈ సినిమా మనదేశంలో విడుదలవుతుందా అని సందేహంగానే వుంది. ఏదైనా ఒక ప్రీగా దీపామెహతా సాహసాన్ని దర్శకురాలిగా ఆమె ప్రతిభను అభినందిస్తున్నాను. రాధపాత్రను స్వీకరించి అద్భుతంగా పోషించిన షబనా ఆజ్మీ గురించి చెప్పడానికేముంది. ఆమె గురించి మనకు తెలియనిదేముంది. సీతగా నందితా జీవించింది. ఆమెను, ఆమె నటనను చూసే అదృష్టం తెలుగు ప్రేక్షకులకు వుండదేమోననే బాధతో -

ఆదివారం, ఆంధ్రజ్యోతి

జనవరి 1997 సంకలిత - ఓల్లా ౪2.

టో న్‌ న కృత్రిమ వసంతానికి బందీలం వసంతకాలంలో చెట్లు కొత్త చిగుర్లు తొడుగుతాయి. కొన్ని మొగ్గ తొడుగుతాయి. మరికొన్ని వికసిస్తాయి. మొత్తంమీద శిశిరకాలంనాటి మోడుతనాన్ని వీడి, ప్రతి చెట్టూ, మొక్కా గడ్డీ పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. ప్రకృతి ఒక వుత్సాహాన్ని సంబరాన్నీ పొందుతుంది. అది ప్రకృతికి సంబంధించిన వసంతం. అది నెమ్మదిగా (ీష్టంలోకి వర్షబుతువులోకి వెళ్తుంది. ఒక సమతూకాన్ని (ప్రకృతిలో సాధించి సార్థకత పొందుతుంది. ఆ వసంతకాలపు అందాలకూ, ఆనందాలకూ మనిషి రోజురోజుకూ దూరమవుతున్నాడు. సాంఘికంగా తన వసంతకాలాన్ని తాను సృష్టించుకుంటున్నాడు. కొత్త వస్తువులు, కొత్త సరకులు, ఆ సరకుల ఆరాధన, మాయ, కొత్త ఆశలు, అత్యాశలు, కొత్త అమ్మకాలు, కొత్త కొనుగోళ్ళు, చిగురించి వికసించి విషప్పారి ఆక్టోపస్‌లయ్యే షేర్‌ మార్కెట్లు, బజార్లు, మండీలు ఇది వుత్పత్తి రంగంలో అనివార్యంగా మనిషి సృష్టించుకుంటున్నానని సంబరపడుతున్న వసంతకాలం. ఇది వసంతకాలమని మానవజాతి భ్రమపడటం కాదు. నమ్ముతోంది. దాని మిరుమిట్లు గొలిపే అందాలకూ, దిగమ కలిగించే జాదూలకూ, అది విసిరే మన్మథ బాణాలకూ, వలపు వలలకూ ముగ్ధులై మానవులు అందులో చిక్కుకుపోతున్నారు. దానికి బందీలైపోతున్నారు. బందీలయ్యాక చాలామందికి తెలిసివస్తుంది. ఈ వసంతకాలం నుంచి విముక్తి లేదనీ, (గ్రీష్మ వర్ష బుతువులకూ, ఆ అనుభూతుల సమతూకానికీ అవకాశామే లేని ఒక సాలెగూటిలో తాము చిక్కుకున్నామని తెలిసివస్తుంది.

సంకలిత - ఓల్లా * 24

వాళ్ళ విముక్తి ఈ కృత్రిమ వసంతానికి ఆవల, దాని క్రూరత్వాన్ని అర్ధం చేసుకున్నవారి వల్లనే అవుతుంది. ఈ వసంతంలో తిరుగుతూ కూడా దాని గురించిన స్పృహతో దాని మలినాన్ని అంటించుకోని యువతరం వల్లనే కుదురుతుంది. ఈ కృత్రిమ వసంతం గురించీ, ఈ వస్తు వినిమయ ప్రపంచం గురించీ, అందులో మానవజాతి కోల్పోతున్న మానవీయ విలువల గురించీ, ఆ అమ్మకపు, కొనుగోలు సమాజపు క్రూరత్వం గురించీ ఎంతో లోతుగా ఆలోచించి దానిపై దర్శకుడు బాసు భట్టాచార్య కొట్టిన గట్టిదెబ్బ 'ఆస్తా సినిమా. బొంబాయి మహానగరంలో ఒక కాలేజీ లెక్సరల్‌ కుటుంబం. కాలేజీ లెక్బరర్లందరూ రిజిష్టర్‌లో సంతకాలు చేసి, మొక్కుబడిగా పాఠాలు చెప్పి, తమ సొంత వ్యాపారాలు తాముచూసుకుంటూ, రెసిదెన్నియల్‌ కాలేజీ వ్యాపారాల్లో భాగమవుతూ, ట్యూషన్లు చెప్పుకుంటూ ఎలాగోలా డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న ఈకాలంలో ఆ లెక్సరరు ట్యూషన్లు కూడా చెప్పకుండా, మనసంతాపెట్టి పాఠాలు చెబుతాడు. తన వృత్తినీ, తన విద్యార్థులనూ యెంతో ఇష్టపడతాడు. వాళ్ళ అభివృద్ధికి చేతనైనంత సాయం చేద్దామనుకునే మనస్తత్వం వున్నవాడు. తనకొచ్చే జీతంతో భార్య, కూతురు, తనూ సింపుల్‌గా బతుకుతుంటాడు. భార్య మానసి ఆ జీతాన్ని పొదుపుగా వాడుతూ, చిన్న చిన్న సరదాలూ, అవసరాలూ తీర్చుకోటానికి కూడా బుర్రబద్దలయ్యేలా ఆలోచిస్తుంటుంది. చిన్నపాప సహజంగానే తన బాల్యచాపల్యంతో అవీఇవీ కావాలని అమ్మను అడుగుతూ వుంటుంది. ఆ చిన్న కోర్కెలు తీర్చలేకపోతున్నామే అని మానసి కూడా బాధపడుతుంటుంది. మానసికి ఒక చెప్పుల దుకాణంలో పరిచయమవుతుంది మేడం. తన పిల్లకు బూట్లు కొనటానికి డబ్బుల్లేని బలహీన క్షణంలో మానసిని ఆ మేడం పట్టుకుని తన డబ్బు చెల్లించి, స్నేహం చేసుకుని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి తీసుకువెళ్తుంది. మానసికి ఇంటి చాకిరీ, భర్త మాటలూ, అతనిపాఠాలు, పాటలు, అతని స్నేహితులు, విద్యార్థులూ, వాళ్ళతో అతను రాసి వేయించే మంచినాటకాలూ ఇవి తప్ప బైటిప్రపంచం అంతగా తెలియదు. ఇంట్లో పని అమ్మాయిని కూడా పెట్టుకోకుండా చాకిరంతా తనే చేసుకునే మామూలు మధ్యతరగతి స్త్రీ మానసి. ఆమె ఆ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఎస్మలేటర్లూ, షాండిలియర్లూ, అద్భుతమైన ఫర్బీచర్లూ, నాజూకైన అమరికలూ, మెత్తని తివాసీలూ, సంకలిత - ఓల్లా ౪25

విశాలమైన బాత్‌రూమ్స్‌ యివన్నీ చూసి దిగమ చెందుతుంది. ఆమె మనసాక్కసారిగా హాయిగా రిలాక్స్‌డ్‌గా అవుతుంది. ఒక కొత్తలోకంలోకి - దేవేంద్రలోకంలోకి అదుగిడిన అనుభూతి. అయితే అక్కడ తాను రంభ కాబోతున్నానని ఆమెకు తెలియదు. తెలిసినా దేవేంద్రలోకంలో రంభ కావటానికి అంత వ్యతిరేకతా కలగలేదు. అసలదంటే ఏమిటో కూడా ఆమెకు తెలియదు. అది ఒక కొత్త అనుభూతి. దానికోసం ఆమె అంతరంగంలో ఎక్కడో దాగివున్న కోరికలు ఆమెను బలహీనపరిచాయి. దేవేంద్రలోకం నుంచి ఇంటికి వచ్చాక గానీ ఆమెకు తన బలహీనత గురించి బాధకలగలేదు. అప్పుడు కూడా ఆమె అతనిచ్చిన డబ్బుని రొమాంటిక్‌గా చించెయ్యలేదు. జాగ్రత్తగానే దాచింది. తన సంఘర్షణను మనసులోనే అణుచుకుంది.

భర్తమీద ఎంతో ప్రేమ, ఈ జరిగినపని అతనికి తెలియకుండా వుంచటంలో ఎంతోబాధ. రెంటిమధ్య ఎంతో నలిగిపోయింది. మేడం ఆమెను ఒదలలేదు. వస్తువ్యామోహమూ ఒదలలేదు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో మళ్ళీమళ్ళీ దేవేంద్ర లోకానికి వెళ్తూనే వుంది. వస్తువులు వస్తున్నాయి. పాపకు ఖరీదైన తినుబండారాలు వస్తున్నాయి. ఆమె మానసిక సంఘర్షణా పెరుగుతోంది. అక్కడ ఆ ప్రపంచంలో తనకు తెలియవచ్చిన బైంగిక సుఖానుభూతుల్ని భర్తతో నిజమైన (ప్రేమతో, కోరికతో పొందింది. భర్తకు ఒక వజ్రపుటుంగరం కూడా కొన్నది. అది భర్తకు యెట్లా యివ్వాలి?

భర్త దగ్గర చదువుకునే స్టూడెంట్‌ ఒకమ్మాయి తనతో స్నేహంగా వుంటుంటే ఆ అమ్మాయిని అడిగింది - “నువ్వు ఇచ్చినట్లుగా ఈ వుంగరాన్ని అతనికి ఇవ్వు" అని, అయితే అప్పుడే అనుకోకుండా ఆ అమ్మాయికి మొత్తం విషయమంతా చెప్పాల్సి వచ్చింది. అది ఒకరకంగా మానసికి కూడా మేలే - తన భారమంతా దించుకుంది. మేడంని ఒదుల్చు కోలేని తన పరిస్థితి, భర్తకు చెప్పాలని వున్నా ఎట్లా చెప్పాలో తెలియని స్థితీ, అంతటినీ పిచ్చిగా ఏడుస్తూ ఆ అమ్మాయితో చెప్పుకుని గుండెల మీది బరువు దించుకుంది.

పెళ్ళికాకముందు ఇలా జరిగివుంటే నిర్భయంగా చెప్పేసేదాన్ని ఇప్పుడు చెప్పటం నావల్ల కావటంలేదు అంటుంది. ఆ అమ్మాయి సమస్యను సానుభూతితో అర్ధం చేసుకుని వున్న విషయాన్ని వున్నట్లు ఒక కథలా మాస్టారుకి చెప్పి “భర్రతో ఈ విషయం ఆ భార్య చెబితే ఏం జరుగుతుంది” అని అడుగుతుంది.

సంకలిత - ఓల్లా * 26

ఆ మాస్టారు మానవత్వం వున్న మంచిమనిషి గనక ఏమైనా జరగొచ్చు. భర్త ఆమె నుంచి విడిపోవచ్చు. ఆమెను చంపవచ్చు. తనే చచ్చిపోవచ్చు. కానీ అన్నిటికంటే మంచి మార్గం అర్ధం చేసుకోవటమే, ఆ భార్య పరిస్థితిని అర్ధం చేసుకోవటమే” అంటాడు. మానసి గుండెల మీదినుంచి పెద్ద బరువు దిగింది. ఆ అమ్మాయి డైమండ్‌ రింగ్‌ని మాస్టారి పుట్టిన రోజు కానుకగా ఇస్తున్నానని మానసి చేత మాస్టారి వేలికి తొడిగిస్తుంది. ఆ రాత్రి దంపతులిరువురూ ఇన్నాళ్ళూ లేని కోణంలో, కొత్త అర్థంలో సహచరు లవుతారు. ్రేమికు లవుతారు. నిజమైన (ప్రేమ వున్నచోట సంజాయిషీలకూ, క్షమాపణలకూ తావు లేకపోవటమంటే యేమిటో - బాధలోంచీ, సంఘర్షణలోంచి, వైరుధ్యాల్లోంచి స్నేహం, డ్రేమా యెట్లా వికసించి ప్రేమికులను మరింత గాఢమైన (ప్రేమలో ముంచుతాయో దర్శకుడు అసమాన ప్రతిభతో మూడు నిమిషాల పతాక సన్నివేశంలో (ప్రేక్షకుల అనుభూతిలోకి తీసుకొచ్చాడు. ప్రశ్నలతో మన మెదళ్లను కల్లోలపరచి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకునేలా ప్రేరేపిస్తుందీ సినిమా. ఈ కన్ఫ్యూమరిజం సంస్కృతిని గురించి చెప్పటం కోసం లంచాలనో, వరకట్నాల్నో విషయంగా తీసుకుంటే ఆ విషయాన్ని తేలికగా తీసెయ్య గలిగేవాళ్ళం. వస్తువ్యామోహాన్నే జీవన విధానంగా చేసుకుని ప్రేమ అనేది అక్మర్లేదనుకునే పాత్రను తీసుకుని ఈ సమస్యను చిత్రిస్తే అలాంటి వాళ్ళుంటారు - వాళ్ళ స్వభావమది అని తీసివేసెయ్యగలం. కానీ (ప్రేమతో, స్నేహంతో, మానవ విలువలతో బతుకుతున్న మనుషుల మధ్య యెట్లాంటి చిచ్చుని ఈ కన్య్యూమరిజం, ఈ వస్తు వ్యామోహం, ఈ ఫైవ్‌స్టార్‌ కల్చర్‌ రేపగలదో ఒక సామాన్య ప్రీ పాత్రను ఆధారంగా తీసుకుని చిత్రిస్తే ఆ ప్రశ్నను పక్కకు తీసెయ్యటం కష్టం. కొన్నాళ్ళపాటు ఆ ప్రశ్న మనల్ని వెన్నాడుతుంది. అట్లా వెన్నాడి, వేధించి, ఈ సంస్కృతిపై పోరాటానికి వ్యక్తిగత స్థాయిలోనైనా తయారుచేసే సత్తావున్న సినిమా అస్త ఈ సినిమాలో అభ్యంతకర దృశ్యాలుగా చాలామంది భావిస్తున్నవి ప్రధానంగా రెండున్నాయి. మానసి సెక్సుని ఆనందించే పద్ధతుల్ని భర్తకు పరిచయం చేసి అతనితో ఆనందించటం. ఇంతకంటే గొప్ప మానవీయమైన (ప్రేమ సన్నివేశాన్ని నేనీమధ్య సంకలిత - ఓల్గా * 27

కాలంలో చూడలేదు. భర్తమీద ఆ అమ్మాయికున్న (పేమకు ఆ సన్నివేశాన్ని మించిన వుదాహరణ వుండదు. దానిని ధైర్యంగా చూపిన దర్శకుడ్ని అభినందించాలి. కొడవటిగంటి కుటుంబరావు రాసిన 'పచ్చకాగితం” కథగాని బాసు భట్టాచార్య చదివి ఈ సన్నివేశాన్ని రూపొందించాడా అనిపించింది. కొడవటిగంటి కుటుబరావు రాసిన 'పచ్చకాగితం' సెక్సువాలిటీ గురించిన సున్నితమైన కోజాన్ని మానవత్వంతో చూపిన కథ. ఆ కథకూడా ఈ సన్నివేశం లాగానే చాలామందికి మింగుడు పడలేదు. నిజానికి ఈ సన్నివేశం కాలానుగుణంగా ఆ కథను దాటివచ్చింది కూడా. రెండవ సన్నివేశం భర్తకు తన సంపాదనతో డైమండ్‌ రింగ్‌ కొనివ్వటం. థియేటర్లో జనం రెండు సన్పీవేశాలలోనూ అల్లరిగా, హేళనగా నవ్వటం కూడా చేశారు. కొందరు కోపంతో మండుతూ కూచున్నారు. భర్తల అక్రమ సంపాదనతో కొనిచ్చిన పట్టుచీరెల్ని మేడల్నీకార్లనూ భార్యలు అనుభవించినప్పుడు రాని అభ్యంతరం, తన శరీరంతో ఎవరినీ మోసం చేయకుండా, తమ మనసుని కష్టపెట్టుకుని సంపాదించిన డబ్బుతో ఒక భార్య భర్తకు కానుక ఇచ్చినప్పుడు యెందుకు వస్తుంది? సంపాదనా పరురాలు, వుద్యోగస్తురాలు కాని ప్రీకి తన వాళ్ళకు బహుమతులు ఇవ్వాలంటే మార్గమేమిటి? అది ఘోరం అనుకుంటే ఈ బహుమతుల కల్చర్‌ని హేళన చేయండి, శరీర వ్యాపారాల్ని హేళనచేయండి, దానిలో బందీలైన స్రీలనుకాదు. పై తరగతి వాళ్లకంటే, కింది తరగతి వాళ్ళకంటే నిజానికి ఈ సమస్య మరింత యెక్కువగా మధ్యతరగతి వాళ్ళది. ఈ మధ్యతరగతికి పై తరగతి వాళ్ల సంస్కృతి ఆదర్శం. ఆ తరగతికున్న విలాస వస్తువులన్ని పొందాలనే పరుగు మొదలు పెడతారు. ఆ పరుగులో యెక్కడో పడిపోతారు. గాయపడతారు. ఆయాసంతో వూపిరాడక వుక్కిరిబిక్కిరై చచ్చిపోతారు. ఆస్తా సినిమాలో మాస్తారిలా మానవత్వం వున్న మనుషుల చేయూత దొరికితే లేచి గాయాల్నించి బైటపడగలగుతారు. ఇలా ఎన్నో విషయాలని చాలా కళాత్మకంగా చెప్పిన సినిమా ఆస్తా. ఆంధ్రప్రభ దినపత్రిక 21 ఫిబ్రవరి 1997 సంకలిత -- ఓల్లా * 28

కీ వట

5 దీపామెహతా వాటర్‌ షొందూ సమాజంలోని కుళ్ళునీ, పాపాన్సీ పూలే, కందుకూరి, గురజాడ, చలం రచనలకంటే సూటిగా బయటపెడుతుందా? వాటర్‌ గురించిన ఈ రగడ ఆర్‌.ఎస్‌.ఎస్‌. వాళ్ళూ, హిందూమత ఛాందస వాదులు యెందుకు రేకెత్తించినట్టు? వాళ్ల సమస్య యేమిటి? గంగానదీ తీరంలో షూటింగ్‌ జరపటంలో సమస్యవుందని అందరూ అనుకున్నారు. కానీ సమస్య అది కాదని తేలిపోయింది. మధ్యప్రదేశ్‌లో కూడా ఆ సినిమా తీయకూడదని బి.జె.పితో సహా ఆ వర్షం వాళ్ళంతా గొంతెత్తి అరుస్తున్నారు. గంగానది సమస్యకానపుడు యిక సమస్య అంతా వితంతువుల గురించీ, మతనియమాల వల్ల వితంతువుల జీవితాలు దుర్భరం కావటం గురించీ 'వాటర్‌” సినిమా కథ అని అర్ధమవుతుంది. ఆ విషయం మీద యింకో వాదనకు అసలు చోటెక్కడ నుంచి వచ్చిందో, యెట్లా వచ్చిందో అన్నదే ఆశ్చర్యం. హిందూమతం వితంతువుల విషయంలో పరమఘోరంగా, కిరాతకంగా ప్రవర్తించించనటంలో యెవరికీ సందేహం కూడా వుండాల్సిన అవసరం లేని కాలం యిది. పదేళ్ళ క్రితమైతే ఈ విషయం గురించి చర్చేవుండేది కాదు. పదేళ్ళుగా బలం పుంజుకుంటున్న మత ఛాందస వాదం, దాని నీడన పెరిగివచ్చిన రాజకీయ పార్టీ అధికారంలోకి రావటం వల్లనే “వితంతువుల గురించి సినిమా తియ్యటం నేరమయిపోయింది. జాతి గౌరవాన్ని మంటగలిపే పనయిపోయింది. ఇది ఇవాళ భావవ్యక్తీకరణ స్వేచ్చకు కలిగిన ఆటంకంగా కళాకారులూ మేధావులూ అనుకుంటున్నా యిది నిజానికి స్త్రీల హక్కుల పోరాటాలను, స్రీల లైంగికత్వ ఆకాంక్షలను అణచివేసే

క్రమంలో వాళ్ళు వేస్తున్న మొదటి దెబ్బ. లేకపోతే వాళ్లకు సమస్యయేముంది? గంగానది పుట్టిన చోట మందాకిని అర్ధనగ్నంగా నృత్యంచేస్తే వారికి అభ్యతరం రాలేదు. గంగానదిని అనేకమంది అనేక రకాలుగా చిత్రీకరించినపుడు అభ్యంతరం లేదు. ఇపుడు అభ్యంతరానికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వాళ్ళకు అంతులేని అధికారాన్ని యిచ్చే ప్రభుత్వం అధికారంలో వుండటం. సినిమా వితంతువుల గురించి అని తెలియటం, మూడోది, అతి ముఖ్యమైనది భారతదేశంలోని లౌకిక శక్తులు, వామపక్ష హేతువాద, వుద్యమాలు అతి బలహీనమై పోవటం. ఇవన్నీ “వాటర్‌” మీద జరిగిన సంఘర్షణలో ప్రతిఫలించాయి. మనం తెలుగువాళ్ళం, ఆంధ్రప్రజలం ఈ సమయంలో గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. మనకు మంచి సాంస్కృతిక నేపథ్యం వుంది. ఆధునిక దృక్పథంతో మూధాచారాలను, మత మూఢవిశ్వాసాలను యెొదిరించిన గొప్ప పోరాట సాంస్కృతిక నేపథ్యం వుంది. దానిని మనం యెట్టి పరిస్థితుల్లోనూ జారవిడువకూడదు. మనకు పూర్వం మనవాళ్ళు మనకందించిన సంస్మరణ భావాలనూ, అభ్యుదయ భావాలను, విప్లవ కార్యాచరణను మనం గుర్తుంచుకుని యిలాంటి మూర్ధత్వపు ఆలోచనల బీజాలు కూడా ఆంధ్రదేశం మీద పడకుండా జాగ్రత్త పడాలి. కందుకూరి, త్రిపురనేని రామస్వామి చౌదరి, గురజాడలు మనలో నింపిన స్వేచ్భా ప్రాణవాయువును మనం కలుషితం కానీయకూడదు. ఇది ముందు గుర్తుంచుకుని, ఈ నేపథ్యంలో మనం 'వాటర్‌' వివాదాన్ని మరింత లోతుగా, మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చే మత ఛాందసవాదంగా పరిగణించి చర్చించుకుందాం. గంగానదీ, గంగా భాగీరథీ సమానులుగా హిందూ సమాజం బాధించే వితంతువులు

  • ఈ రెండు విషయాల గురించీ యింతవరకూ యెంతో సాహిత్యం, యొన్నో ఉద్యమాలు వచ్చాయి. అన్నింటినీ భారతదేశం ఆహ్వానించింది. భారత (ప్రజలు అనుకూలంగానే స్పందించారు. ప్రతికూలంగా స్పందించిన వారున్నా వారి భావాలు ప్రజలకు తెలియటానికి యెలాంటి ఆటంకమూ యొదురుకాలేదు. ప్రజలు వారిని విన్న తర్వాతనే వారిని తిరస్కరించారు. సంస్క్మరణోద్యమం దాదాపు భారతదేశమంతటా వితంతు పునర్వివాహంతో నే (ప్రారంభమైంది. వితంతువులను గురించీ, వారి దుస్థితి గురించీ ఆలోచించిన వాళ్ళను సంకలిత - ఓల్లా ౪ 30

సంస్కర్తలుగా గుర్తించి గౌరవించాం. కందుకూరి వీరేశలింగం గారిని ఆయన రోజుల్లో ఛాందసవాదులు వెలివేశారు. నానా కష్టాలూ పెట్టారు. వీరేశలింగం జీవిత చరిత్ర చదివితే ఆయన్ని ఆనాటి మత ఛాందసవాదులు పెట్టిన యిబ్బందులన్నీ తెలుస్తాయి. ఆయన కొండంత ధైర్యంతో వాటన్నిటినీ ఎదుర్కొన్నాడు. అప్పుడాయనకు బ్రిటిష్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. (ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వాధికారులను విమర్శించినప్పటికీ) తర్వాత అదొక వుద్యమమై వితంతు వివాహం నేరం, పాపం కాదని అందరూ ఒప్పుకున్నారు. వితంతు వివాహాలు అవసరమని వాదించే క్రమంలో “వీరేశలింగం” 'గురజాడలు వితంతువులను లైంగికంగా కంట్రోలు చేయడం వల్ల సమాజంలో పెరిగిపోతున్న అవినీతిని బైటపెట్టారు. అమాయకులైన స్త్రీలను వాడుకునే పురుషులు, దానివల్ల గర్భాలు, భ్రూణహత్యలు - వీటన్నిటితో చితికిపోయిన స్త్రీల జీవితాలను బాగుచేయాలనే ఆ సంస్కరణ వుద్యమాలు నడిచాయి. ఆ వితంతు జీవితాన్ని కథా వస్తువుగా తీసుకుంటే యివాళ యింత రగడ యెందుకు జరుగుతున్నట్టు? దీపామెహతా ప్కిష్ట యివాళ కొత్తగా హిందూ మతాన్ని చేసే విమర్శ యేముంటుంది?

హిందూ సమాజం వితంతువుల విషయంలో చూపించే కపటత్వాన్ని యింతకు ముందంతా మనం చదివి అసహ్యించుకున్నామే - దానిని సంస్కరించు కోవాలనుకున్నామే! వీరేశలింగం గారి స్వీయ చరిత్రలో చెప్పిన ఈ క్రింది వాస్తవ కథకంటే, యెక్కువగా హిందూ సమాజపు కపటత్వాన్ని యింకేదీ బైటపెడుతుందనుకోను. “జ్యోతిశ్యాస్త విదుడైన వైదిక మార్గోప జీవియైన యొక శిష్ట బ్రాహ్మణ గృహస్థుడుండెను. పినతండ్రి కూతురగు పదునారేండ్లు ప్రాయముగల యనాధ బాల వితంతు వొకతె యాయన వద్ద నుండెను”. “ఆ వితంతువు జుట్టు తీయించుకోకుండా రంగుచీరెలు కట్టుకుంటుంటే ఈ (బ్రాహ్మణుడు చూడలేక తెల్ల ముతకబట్ట తెచ్చియిచ్చాడట. ఆమె ఆ బట్ట తీసుకోకుండా నాకు చీరెలు చాలా వున్నాయి. నీ భార్య కిమ్మందట. అదేంటి విధవలు కట్టేబట్ట నా భార్య కట్టుటయేమిటని ఆయన అడిగితే నీ భార్యలాగే ముత్తయిదు కాబోయే నాకూ ఈ బట్ట పనికిరాదని చెప్పిందట. దాంతో ఆ బ్రాహ్మణుడు నెత్తీనోరూ కొట్టుకుంటూ (బ్రాహ్మణ సభాపతుల దగ్గర కొచ్చి తనకొంప కొచ్చినచేటు గురించి చెప్పుకున్నారు. వాళ్ళందరూ కలిసిచేసిన పనేమిటంటే - వీరేశలింగం గారి మాటల్లోనే చదవండి - “మనవారు పూర్వాచార పరాయణులగుట చేత నీతి బాహ్యమైన గూఢ వ్యభిచారమునైన నంగీకరింతురుగానీ యాచార విరుద్ధమైన ధర్మవివాహము నంగీకరింపరు. ఇంటనే యుండి వివాహముతో బనిలేక నీమనసు నచ్చినవానితో స్వేచ్చగా వివరింపవచ్చుననియు,

సంకలిత - ఓల్గా * 31

సీ స్వైరిణీ వ్యవహారమును కెవ్వరూ నడ్డురాగలవారు కారనియు నమ్మబలికి కావలసినవారా అనాధబాలను వివాహ ప్రయత్నమునుండి విముఖురాలిని చేసిరి. రంకు సాగిన పెండ్లి యక్కరలేదను సామెతను ప్రమాణముగా గైకొని యా యజఖాగ్యురాలిష్పటికిని కులములోనే యుండి దుర్వృత్తి యందు కాలము గడుపుచు బహిష్మార బాధ లేక కులమును పావనము చేయుచున్నది”. దీపా మెహతా తీసే సినిమా కథ యింత సూటిగా, నలుపు తెలుపుల్లో హిందూ మత కపటత్వాన్ని బైటపెడుతుందని నేననుకోను. 1881లో మనం నిర్భయంగా బైటపెట్టుకుని కడుక్కున్న కుళ్ళుని చూసి యివాళ వులిక్కిపడటం యెందుకు? వులిక్కిపడటం కాదు దాడికి దిగటం. భారతదేశ సాధువులందరూ దీనికి వ్యతిరేకమట. ఈ సాధువులు, యతుల గురించి కూడా వీరేశలింగంగారు రాశారు. “1880 - 81 సంవత్సరములో మా వివేకవర్థనియు, ప్రార్ధనా సమాజమును, విద్యార్థులు సంఘసంస్కరణ సమాజమును గూడ మహోత్సాహముతో, మిక్కిలి చురుకుగా బనిచేయు చుండెను. విరూపాక్ష పీఠస్ణులైన మా శంకరాచార్య స్వాములవారు విజయనగరము నుంచి బైలుదేరి దారిపొడుగునను భిక్షలను, పాదపూజలను గైకొనుచు మా గోదావరీ మండలమునకు వచ్చుచుండిరి. ఇట్టి ఆచార్య స్వాములవారు భిక్షలని, పాదపూజలనీ పేరులు చెప్పి ధనాకర్షణ చేయుచుండటమే గానీ సాధారణముగా మతబోధ చేయవలెనన్న చింతయే వారికుండదు. వారిలో కొందరికి మత (గ్రంథముల పేర్లుకంటే భక్ష్యముల పేరులే యెక్కువగా తెలియును”. ఒక స్వాముల వారికి కడుపునిండా భోజనం పెట్టిన గృహిణీ, ఆ తర్వాత స్వామి వేదాంత (గ్రంథ పఠనం చేస్తారేమోనని “స్వామీ భగవద్గీత తేనా అని అడిగిందట. ఆపేరు తెలియని ఆ స్వామి అదేదో తిండి పదార్ధం అనుకుని “అమ్మా యిప్పుడు కడుపునిండుగా వుంది. మరి రెండు గడియల సేపు ఆగి తీసుకురా” అన్నాడట. ఈ కథ రాసిన తర్వాత విరేశలింగం గారు 'యతీశ్వరులలో అనేకులకు మత విషయక జ్ఞానమీతీరుగనే యుండును. రాజమహేంద్ర వరమున జరుగుచున్న విధవా వివాహ ప్రయత్నమును గూర్చి తునియొద్దనున్నప్పుడే మా స్వాములవారు విని తామచ్చటకు విజయం చేసినపుడు ఆ పనిలో ్రవేశించిన వారి నందరినీ వెలివేసెదమని యానతిచ్చిరట. పీఠాధిపతుల యనర్దక్షృత్యముల గూర్చియూ, వారు విత్వాషహారణము నిమిత్తము చేయుచున్న అకృత్యముల గూర్చియు. వారిని స్వకృత్యమునకు సంకలిత - ఓల్లా * 32

మరల్ప్బుటకు శిష్యులు చేయవలసిన కర్తవ్యము గూర్చియు మా వివేకవర్ధని బహువిధముల వ్రాసి ప్రజల కన్నుల తెరుపుటకారంభించినది”. “ఆ కాలములో స్వాములవారు విధవా వివాహముల నెంత నిషేధించుచూ వచ్చినను, ఫఘోటక బ్రహ్మచారులైన వారి శిష్యులు మాత్రము రండలతోడ రాత్రుల మంత్రకములైన వివాహములను రహస్యముగా జరుపుచునే వచ్చిరి. పాఠశాలలోని విద్యార్థులు కొందరీ రహస్యమును కనిపెట్టి ఒకనాటి రాహత్రి కాచియుండి యొక బ్రాహ్మణ వితంతువుతో సంసారము చేయుచున్న బ్రహ్మచారి శిష్యుని పట్టుకొని, ఆ యపూర్వ దంపతులను వీధిలోని కీడ్చుకొని వచ్చి యెల్లవారికిని జూపి యవమానపరచిరి”. దీపా మెహతా తన సినిమా స్రిష్టలో యిలాంటి దృశ్యాన్ని యింత సూటిగా చూపించే సాహసం చేస్తుందనుకోను. అలాగే కన్యాశుల్కం నాటకం గుర్తు తెచ్చుకోండి. రామప్ప పంతుల్ని, మీనాక్షినీ గుర్తుతెచ్చుకోండి. వాళ్ళు నాటకంలో కాదు - దేశమంతటా వున్నారు. కాశీలోనూ వుంటారు. దీపామెహతా యెంత గొప్పస్రిస్ట రాసినా అది “కన్యాశుల్కం” నాటకం కంటే శక్తివంతంగా హిందూ సమాజంలోని కుళ్ళునీ, పాపాన్నీ బైటపెట్టలేదు. మరి కన్యాశుల్మాన్ని వందేళ్ళనుంచీ గౌరవిస్తున్న మనం దీపామెహతాను యెందుకు సంశయంగా చూస్తున్నాం. సీత రావణాసురుని చితిలో దూకి అగ్నిప్రవేశం చేసిందనే ఆలోచనతో 'సీత అగ్నిప్రవేశం” కథ రాసిన చలం మనకెంతో వివేకాన్ని ఆధునికత్వాన్ని అందించాడు. సంస్మరణోద్యమాన్ని దాటి 150 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత మనకీ సందేహాలూ, భయాలూ యెందుకు? మనకే సందేహాలూ, భయాలూ లేవు. ప్రజలకే సందేహాలూ భయాలూ లేవు. కేవలం ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించి మత ఛాందస వాదులకు లొంగిపోయే వాతావరణం వుండటమే కారణం. మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో, యిప్పటి శివసేన స్థావరమైన మహారాష్ట్రలో జ్యోతీరావ్‌ ఫూలే సావిత్రీబాయ్‌ ఫూలేలు చేసిన కృషి వారు బైటపెట్టిన హిందూమత మౌధ్యపు బండారం ఒకసారి గుర్తుచేసుకుందాం. ఒక బ్రాహ్మణ వితంతువు ఒకరోజు సావిత్రీబాయితో యిలా చెప్పింది. 'ఏం చెప్పనమ్మా? నా లోపల ఒకప్రాణి పెరుగుతోంది. నేనేం చెయ్యాలి? దీన్నెక్కడ పారెయ్యను? నా భర్త రెండేళ్ళ క్రితం చచ్చిపోయాడు. ఇది నా బావగారు చేసిన సంకలిత - ఓల్గా *3

పాపం. నాకే హక్కులూ లేవు. నన్ను రక్షించుకోవటం గానీ, నా బిడ్డని రక్షించుకోటం గానీ తెలియదు. అమ్మా - నేనేం చెయ్యాలో మీరే చెప్పండి. నాకు చచ్చిపోవటం తప్పదారిలేదు. చచ్చిపోవాలనే వుంది. బతకాలని లేదు.” “ఇప్పుడు యొన్నో నెల?” “ఆరో నెల. అయినా నన్ను వేధించటం ఆగలేదు. మా బావగారు నన్నేదో ఒక మూలకు లాక్మెళ్తూనే వున్నాడు”. నీకు చదవటం, రాయటం వచ్చా?" “నాకు యెవరు నేర్చుతారమ్మా? అసలు దీనిగురించి మా అత్తగారితో కూడా మాట్లాడలేను. వెధవ ముండని - అందరూ నన్నే తిడతారు. అది నాతలరాత. వం చెయ్యను. నా శరీరం నిశ్శబ్ధంగా మండిపోతుంటే నా లోపల యింకో ప్రాణి నిశ్శబ్ధంగా పెరుగుతోంది. ఈ పొట్టతో, ఆ బరువుతో యెట్లా బతకాలి? ఆమె వెక్కిళ్ళుపెట్టి యేడుస్తోంది. నేనామెను ఓదారుస్తున్నంతలో సేఠ్‌జీ వచ్చాడు. మేం ఆమెకెలాగో సహాయం చేస్తామని చెప్పి శాంతింపచేసి యింటికి పంపించాను. “ఈవిడ నీ వెంటపడి వచ్చింది. ఇలాంటివి యెప్పుడూ జరుగుతూనే వుంటాయా? అని అడిగాను, “జరుగుతాయనుకుంటా' ఆయన తన స్నేహితుల దగ్గరకు వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన నిర్భాంతంలోంచి తేరుకోలేదు. “సావిత్రీ, ఈ పిల్లల పరిస్థితి దారుణంగా వుంది. “ఎందుకట్లా?” 'వాళ్ళ కుటుంబాల్లో మగవాళ్ళు వీళ్ళని వాడుకుంటారు. దానికి ఫలితంగా గర్భాలొస్తే ఆ పిల్లల్ని కడుపులోనే చంపేస్తారు”. “ఏంటి? చంపేస్తారా - ఆ పసిగుద్దుల్ని - ” నా నోట మాట రాలేదు. “జెను. వాళ్ళ పాపాల్ని దాచుకోటానికి ఆ అమాయక జీవుల్ని హత్యచేస్తారు”. “చెప్పకు - నేను వినలేను'

సంకలిత - ఓల్త్లా * 34

నేను మా మామగారి యిల్లొదిలి వచ్చాక మళ్లీ ఇప్పుడే యేడ్చాను. ఎవరో చేసిన పాపానికి బిడ్డ పుడుతుందా? దానంతటది మెల్లిగా వచ్చేస్తుందా? “మనం ఈ స్రీలకి అండగా నిలబడాలి సావూ”?

సేఠ్‌జీ చాలా కదిలిపోయాడు. మృత శిశువులు యొత్తుగా రాసిపోసినట్లు మా కళ్ళముందు ఒక దృశ్యం కదలాడింది. 'మత బోధకుల సంగతి అలావుంది. వాళ్ళ పాపాలకు యెప్పుడు శిక్ష అనుభవిస్తారు? మతపరమైన బాధ్యతల గురించి అంతూపొంతూ లేకుండా మాట్లాడతారు. వీళ్ళ పిల్లల్ని పుట్టకుండానే చంపేస్తారు. చావకుండా బతికిన పిల్లల్ని (క్రైస్తవ మిషనరీలకు యిచ్చేస్తారు. వాళ్ళలా చేస్తే ఫరవాలేదన్న మాట” కానీ మనం యేం చెయ్యగలం?” “ఆ అమ్మాయిల్ని తెచ్చి యిక్కడ పురుడు పోద్దాం” “మరి దీనికి డబ్బు?” “డబ్బు సంపాదిద్దాం. నేనింకా కష్టపడి పనిచేస్తాను. దుకాణం వుంది. పొలం బాగానే పండుతోంది. నేనింకేదన్నా పని దొరుకుతుందేమో చూస్తాను. నువ్వు మరిన్ని రజాయిలు తయారుచేసి అమ్మొచ్చు.” కానీ బడి సంగతెట్లా.' “ఇప్పుడు బడి నడిపేందుకు కొందరున్నారు. వాళ్ళు సరిపోతారు. స్కూలు కమిటీ ఆపని చూసుకుంటుంది. మనం ఈ పని మొదలు పెట్టాలి. మనం బడి సంగతి పూర్తిగా వదిలెయ్యాలని కాదు.” మాకు తెలియనంత వేగంగా ఒక శిశుహత్యా నిరోధాశ్రమం ప్రారంభించాలనే నిర్ణయం జరిగిపోయింది. నా వుద్దేశంలో ఒక వితంతువు తానే వ్యామోహంలో పడినా మనం ఆమెకు సహాయపడాలి? బెను కదా? జీవితంలో అన్నిదారులూ మూసుకుపోయిన ఈ యువతులు యవ్వనంలో యేం చేస్తారు? కోరికను యెవరు చంపుకోగలరు? జీవన కాంక్షను యెవరు చంపుకోగలరు? మేం యిలాంటి ఆశ్రమం ్రారంభిస్తున్నామని ప్రజలకు తెలియచేయడానికి సేర్‌జీ పోస్టర్లు తయారుచేయించాడు. 'ఆత్మహత్య నుండి తప్పించుకోండి" అని పెద్ద అక్షరాలతో

సంకలిత - ఓల్గా * 35

పైనరాసి వుండేది ఆ పోస్టరుమీద. దానికింద 'కాలుజారిన స్త్రీలు గర్భవతులైతే జ్యోతిరావు గోవిందరావు పూలే యింట్లో పురుడు పోసుకోవచ్చు. వారి పేర్లు బైటికి చెప్పబడవు' ఆ పోస్టర్లు అన్నిచోట్లా అంటించారు. పూనాలోనే కాదు. చాలా ప్రాంతాలలో, పండరీపురలాంటి పుణ్య తీర్చాలలో నాసిక్‌, గయ, కాశీ లాంటి పుణ్యక్షేత్రాలన్నిటా ఆ పోస్టర్లు అంటించారు. గర్భవతులైన ఆడపిల్లలు వాళ్ళ జీవితాల్ని అంతం చేసుకోటానికి అలాంటి చోట్లకే వెళ్తారు. వాళ్ళను చూడటం హృదయవిదారకంగా వుండేది. వాళ్ళతో యేం చెప్పగలం? వాళ్ళూ మాట్లాడలేరు. కానీ ప్రేమాభిమానాలతో కూడిన మన చేతిస్పర్శ వాళ్ళకెంతో ఓదార్చునిస్తుంది. మంత్రసానులు వచ్చి పురుడుపొయ్యటం ఆ యువతులకు యిష్టం వుండదు. ఆ మంత్రసానులు ఆవార్త అందరికీ చెప్తారని భయం. అందుకే ఆ చిన్ని శిశువుల పవిత్ర జననాలకు నేనొక్కదాన్నే సాక్షిని. ఆ స్త్రీలు బాగా నొప్పులు పడి చివరకు ప్రసవించాక వాళ్ళ ప్రశాంతమైన ముఖాలను చూడటం చాలా ఆనందంగా వుండేది. అలాగే రక్తంతో తడిసిన నా చేతులతో బొడ్డుతాడు కోసి ఆ శిశువులను యెత్తుకుంటే నా మనసంతా ఆర్ధమయ్యేది. కొందరు యువతులు వాళ్ళ పిల్లల్ని మారక్షణలో వదిలేసి వెళ్ళిపోతుంటే చూడటం చాలా బాధగా వుండేది. ఇప్పుడు నా ప్రపంచంలో పిల్లలూ, నేనూ”. ఇది చూసినా కూడదా పుణ్యతీర్ధాలలో జరిగేదేమిటో, వీటికీ వితంతు జీవితాలకూ వున్న సంబంధమేమిటో హిందూమతం స్రీలనెలా కంట్రోలు చేస్తోందో మనకర్ధమవుతుంది. మహారాష్ట్ర ప్రజలు జ్యోతీబాపూలేనూ, సావిత్రీ బాయినీ మళ్ళీ మళ్ళీ చదివి ధైర్యం పొందాలి. మత ఛాందసవాదులు తాము మొట్టమొదటగా కంట్రోలు చేయవలసిన విషయంగా స్త్రీల లైంగికత్వాన్ని యెజెండాలోకి తీసుకుంటారు. ఏ ఛాందసవాదులైనా సరే - తాలిబన్ల నుంచి విశ్వహిందూ పరిషత్‌ వరకూ! వాళ్ళకు 'సతి' పరమ పవిత్ర కార్యక్రమం. 'సతి'గా బూడిదైన స్త్రీని ఆరాధిస్తారు. 'సతి' కాని స్రీలు జీవచ్చవాలలాగా వుండాలి. అట్లా యింట్లో వాళ్ళకు చాకిరీ చేస్తూ జీవచ్చవాల్లా వున్న ప్రీల మీద ఆయింటి మగ వాళ్ళు అఘాయిత్యం చేస్తారు. లొంగితే గర్భం - దానిని కడుక్కునేందుకు యే కాశీయో, రామేశ్వరమో, మరింకో పుణ్యతీర్ధమో వెళ్ళి తీరాలి. కొందరలా వెళ్ళి వచ్చేసేవారు. సంకలిత - ఓల్లా * 36.

మరికొందరు అక్కడి యేర్పాట్లు, ఆశమాలు, యిలాంటి విపరిణామాలకు వెంటనే విరుగుళ్ళూ - యివన్నీ వుండటంతో అక్కడే వుండిపోయేవారు. ఈ విషయాలన్నీ మనకు శరత్‌ నవలల్లో, వుత్తర భారతదేశ సాహిత్యంలో కనపడుతూనే వుంటాయి. భారతీయులకు తెలియని విషయమేమీ కాదు. ఇందులో మన దేశగౌొరవం పాడయ్యేది లేదు. ప్రీలను ఒక్కోదేశం ఒక్కో రకంగా కంట్రోలు చేస్తుంది. కంట్రోలు గురించి మాట్లాడటం యిబ్బందిగా వుంటుంది. కానీ మాట్లాడటం ్రీలకు అవసరం. దీపా మెహతా తీసే సినిమాతో మనదేశ గౌరవం మట్టిపాలవుతుందని భయపడే వారిని “సతిని గొప్పజేసి ప్రోత్సహిస్తుంటే, సతీమాతలకు ఆలయాలు కడుతుంటే మనదేశ గౌరవం పోదా అని ప్రశ్నించాలి. వితంతువుల జీవితాల్లోకి కల్లోలాన్ని విప్పిచెబితేనే పోయే గౌరవం భాతరదేశ స్రీలకు అక్కర్లేదు గాక అక్కర్లేదు. ఎంతోమంది నిస్సహాయ అభాగినుల జీవిత వ్యధలనూ కథలనూ దాచుకున్న గంగానది నిశ్శబ్ధంగానే ఈ దేశ స్రీలకు యెన్నో కథలు చెబుతుంది. తన ప్రతి నీటిబిందువులోనూ స్త్రీల కన్నీళ్ళనూ రక్తాన్నీ దాచుకుంది గంగానది. ఆ కన్నీటిని, రక్తాన్నీ గంగానది నుండి వేరుచేసే శక్తి యెవరికీ లేదు. అవి గంగా ప్రవాహంలో భాగం. గంగానది ఒడ్డున ఒక సినిమా తీసినా తీయకపోయినా, వితంతువులను జీవచ్చవాలుగా బతకమని శాసించిన మన సంస్కృతి గురించి మనం గర్వపడటానికేమీ లేదని గుర్తుంచుకోవాలి. ఏది గర్వపడదగినదో, యేది అవమానపడ వలసినదో దౌర్జన్యంతో ప్రజలకు కొత్తగా అర్ధం చేయించాలని చూడటం మూర్ధత్వం. ఈ మూర్ధత్వంలో వున్న ప్రభుత్వాధినేతలు మతఛాందస వాదానికి లొంగి, స్త్రీలు తమ అవమానాలకు నిరసనగా జరిపిన పోరాటాలన్నిటినీ జాతిగౌరవాన్ని మంట గలిపేవని తీసిపారేస్తారా? సతిని చట్టబద్ధం చేస్తారా? వితంతు వివాహాలను నిషేధిస్తారా? ఇంకా స్త్రీల కనుకూలమైన వాటన్నిటినీ నిషేధిస్తారా? ఏం చెయ్యటానికి వీళ్ళివాళ ఈ దౌర్జన్యానికి దిగారు. ఇక్కడ ప్రారంభమై యింకెక్కడికి వెళ్తారు? ఎన్ని వందల సంవత్సరాల వెనక్కు తీసుకువెళ్తారు? 150 సంవత్సరాల నాటినుంచీ బైటపడుతున్న మన వెతల కథలను నిషేధించాలని చూస్తున్న వీరి దోవ యెక్కడికో మనం స్ర్రీలం అర్ధం చేసుకోవాలి.

సంకలిత - ఓల్టా ౪ 37

దీపామెహతా “వాటర్‌” ప్రస్తుతం భారతదేశంలో పేరుకుంటున్న హిందూ పాపాన్ని ప్రత్యక్షంగా మనకు చూపించేందుకు వుపయోగపడింది. రాబోయే ప్రమాదాన్ని ప్రీలు అర్థం చేసుకునేందుకు పనికి వచ్చింది. ఆంధ్రదేశపు ప్రజలు మళ్ళీ ఒకసారి వీరేశలింగాన్ని, గురజాడను, చలాన్నీ వున్నవ లక్ష్మీబాయమ్మనూ, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌నూ, డా॥అచ్చమాంబనూ గట్టిగా తల్ప్చుకోవాల్సిన రోజులు వచ్చాయి. వారి కథలనూ జీవిత కథలనూ మళ్ళీ చదువుకుందాం. 150 సంవత్సరాలుగా సాగుతున్న ప్రీల హక్కుల పోరాటాల సంస్కృతిని గౌరవించుకుందాం. అదే మనదేశ సంస్కృతి అనీ, ఆ సంస్కృతే మనకు గర్వకారణమని చాటుదాం. విజయవిహారం మార్చి 2000 సంకలిత -- ఓల్గా ౪ 38

(లై స్టే ప జ్య

  • గ శ మానసిక ఆరోగ్యానికి హానిచేస్తున్న సినిమాలపై నిర్లక్ష్యమా? నా స్నేహితురాలు వసంత “ఈ సినిమాలను బ్యాన్‌ చెయ్యాల్సిందే. యింకోదారి లేదు” అన్నది. నేను ఆశ్చర్యపోతునే యింకోపక్క ఆనందిచాను. ఎందుకంటే నేనూ మా స్నేహితురాలూ యిద్దరం భావవ్యక్తీరణ స్వేచ్చ మీద నమ్మకం వున్నవాళ్ళం. సెన్సార్‌ మీదా నిషేధాల మీదా నమ్మకం లేని వాళ్ళం. ఏ పుస్తకంగానీ, యింకేదైనా కళారూపంగానీ, సెన్సార్‌ చేయబడిందని తెలిస్తే, నిషేధించబడిందని తెలిస్తే వెంటనే సెన్సార్‌కు వ్యతిరేకంగా యేదో ఒక కార్యక్రమం తలపెడతాం. వ్యతిరేకించే ప్రచారం యేదో ఒక రూపంలో చేస్తాం. కానీ మాలాంటివారికి కూడా తట్టుకోవటం కష్టమైపోతోంది. ఆ మధ్యకాలంలో ఓ సినిమా ప్రదర్శన నిలిపివేయమని కోరాలనుకున్నాం. నేను, మల్లాది సుబ్బమ్మ గారూ, కొండవీటి సత్యవతి, వసంతలక్ష్మి మొదలైన వాళ్ళం ఆ సినిమా చూసి నిజంగా భౌతికంగా జబ్బుపడ్డాం. ఒట్టి తలనొప్పి కాదు, వాంతులు, జ్వరంతో రెండు రోజులు బాధపద్దాం. ప్రదర్శన నిలపటం, నిషేధించటం గురించి కోర్టుకు వెళ్ళాలని బాలగోపాల్‌ దగ్గరకు వెళ్తే ఆయన నిషేధం గురించి అడగవొద్దు. అది ముందు ముందు చాలా ప్రమాదమతుంది. ఈ వుదాహరణతో మంచి సినిమాలను, కళాత్మక విలువలున్న వాటిని కూడా నిషేధించమని అడిగే వాళ్ళుంటారు, భావవ్యక్తీకరణ స్వేచ్చ గురించి అడిగేవాళ్ళం కదా మనం అన్నారు. సెన్సార్‌ బోర్డు తన పని సరిగా చేయలేదని కోర్టుకి వెళ్ళొచ్చునన్నారు. సంకలిత - ఓల్దా * 39

చాలాసార్లు మహిళా సంఘాలు అశ్లీల సినిమాలను నిషేధించాలని ప్రదర్శనలు చేసినపుడు మాకు వచ్చే సమస్య అదే. ఆశ్లీలమనేదాన్ని యెట్లా నిర్వచిస్తాం? మత ఛాందసవాదులు ఆడవాళ్ళను వెనక్కు నెట్టటం కోసం స్రీలకు సంబంధించిన యొన్నో విషయాలకు అళ్లీలమనే ముద్రవేయగలరు. కొత్తపద్ధతిలో (డ్రస్‌ చేసుకోవటం కూడా వాళ్ళకు అళ్లీలమవుతుంది. మొన్నటికి మొన్న ఒక యూనివర్సిటీలో విద్యార్థులు వైస్‌ ఛాన్సలర్‌ దగ్గరకు ఒక వింత డిమాండ్‌తో వెళ్ళారు. ఆ యూనివర్సిటీలో చదివే అమాయిలు సంప్రదాయ దుస్తులే ధరించాలని ఆ డిమాండ్‌. అట్లా విద్యార్ధినులకు (్రెస్‌ కోడ్‌ పెట్టడం యూనివర్సిటీ నియమాలలో భాగం కాదు గాబట్టి తాను పెట్టలేని వైస్‌ ఛాన్సలర్‌ చెప్పారు. దాంతో ఆ విద్యార్థులు రెచ్చిపోయి బనీన్లు మాత్రమే ధరించి యూనివర్సిటీ అంతా గొడవ చేశారు. అశ్లీలం అనే మాటకు ఛాందసవాదులు ప్రీలను మళ్ళీ పరదాలలోకీ, యిళ్ళల్లోకీ నెట్టే అర్ధాలే వెతుకుతారు. మేము చూసి జబ్బుపడ్డ సినిమాలో హీరో ఆఫీసుకు వెళ్తున్న ఒకావిడను బజార్లో పట్టుకుని అడ్డంగా నిలబడి నువ్విలా చక్కగా తయారై బైటకి వస్తే నాకు కోరిక పుడుతోంది. పక్కకు వెళ్టాంరా! ఐదు నిమిషాలు చాలు అంటూ మాట్లాడతాడు. పైగా వుద్యోగాలు చేస్తూ బైటకొచ్చిన ఆడవాళ్ళను చూస్తే ప్రతి మగవాడికి యిలాంటి బుద్దే పుడుతుంది, నేను పైకి చెబుతున్నాను, యెవరూ చెప్పరు అని తన నిజాయితీని ప్రకటించుకుంటాడు. ఆడ వాళ్ళు బైటకి రావటం, శుభ్రంగా కనపడటం కూడా అశ్లీలమయిపోయే వాతావరణం కల్పించగలుగుతారు మత ఛాందసవాదులు. ఈ సినిమా నిర్మాత భగవంతుడికీ భక్తులకూ మధ్య లింకు యేర్పరిచే వ్యాపారస్తుడు కావటం యాదృచ్చికం కాదు.

భావవ్యక్తీకరణ స్వేచ్చ మీది గౌరవంతోనే యిన్నాళ్ళూ సినిమాల గురించి ప్రీల వుద్యమం పెద్దయెత్తున ఆందోళన చేయలేదు. ఐతే యివాళ అందరికీ సహనం నశిస్తోంది. భావ వ్యక్తీకరణ అనేమాటకున్న గౌరవాన్ని సినిమా నిర్మాతలు పాటించటం లేదు. ్రలను హీనంగా చూడటం, హింసించటం, యిక జనరల్‌గా హింసాకాందను గ్లామరైజ్‌ చేయటం యివి యెంత పెరిగిపోయాయంటే మా వంటివాళ్ళకు కూడా యింక ఈ సినిమాలను ఆపగలిగితే బాగుందునన్నంత కోపం వస్తోంది. అసలు సినిమాలకు సంబంధించి భావవ్యక్తీకరణ స్వేచ్చను మనం విడిగా ఆలోచించాలి. సినిమా ఒక కళారూపం అనుకుంటే ఆ సినిమాను రూపొందించే కళాకారులకు స్వేచ్చ వుండాలి. ఆ కళాకారులందరూ తమ సృజనాత్మక శక్తులను స్వేచ్చగా పనిచేయనిచ్చి సినిమాను సృష్టించాలి. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాలలో ఆ స్వేచ్చ యెవరికి వుంటోంది? నిర్మాతకు యిష్టమైన ఫార్ములా కథను, లేదా నిర్మాత యే రకమైన సినిమా తీస్తే

సంకలిత - ఓల్గా * 40

డబ్బులొస్తాయనుకుంటాడో ఆ సినిమాకు కళాకారులంతా పనిచేస్తారు. రచయిత, దర్శకుడు, సినిమాటో గ్రాఫర్‌, ఎడిటర్‌, సంగీత దర్శకుడు, నటులు, అందరూ పెట్టుబడికి లోబడే పనిచేస్తారు. వాళ్ళందరి స్వేచ్చనూ పెట్టుబడి శాసిస్తూనే వుంది. వాళ్ళు స్వేచ్చగా పనిచేసే వాతావరణం యివాళ లేదు. అలగే ఫలానా ఆలోచనా విధానానికీ, ఫలానా విశ్వాసానికి, లేదా శుద్ధ కళారాధనకు కట్టుబడి నేను ఈ సినిమా తీస్తున్నాను. ఇందులో నేను చెప్పే భావాలను చెప్పనీయకుండా చేసే అధికారం మీకు లేదు అనగలిగిన స్థితిలో సినీ నిర్మాతలున్నారా? ఏ ఆలోచనాలేని అరాచక హింస తప్ప కొన్ని సినిమాలలో యేమీవుండదు. అర్థంలేని కట్టు కథలు తప్ప జీవిత వాస్తవాలు వుండవు. హింసను గ్లామరైజ్‌ చేయటంలో ఒక సినిమాతో మరొకటి పోటీపడుతుంది. హింసను యిలా ఆకర్షణీయంగా చూపటం వల్ల రెండు ప్రమాదాలున్నాయి. ఆ హింసా తత్వాన్ని వొంటబట్టించుకుని నిజజీవితంలో దానిని చేసి చూడాలనుకునే (పేక్షకులు కొందరు తయారవుతారు. దానికంటే ప్రమాదకరమైంది యింకొకటుంది. లక్షలాది ప్రజలు సినిమాలో హింస చూడటానికి అలవాటు పడిపోయి తమ కళ్ళయెదుట జరిగే హింసలకు చలించకుండా మొద్దుబారిపోతున్నారు. కొట్టుకోవటం, రక్తాలు కారేలా పొడుచుకోవటం, గాయపరచుకోవటం, చంపుకోవటం, ఆస్తులను ధ్వంసం చేయటం, అద్దాలు పగలగొట్టడం, కార్లు తగలబెట్టడం యివన్నీ యెంత ఆకర్షణీయంగా చూపిస్తారంటే, ఆ దృశ్యాలను ఒకరకమైన గగుర్పాటుతో, డ్రిల్‌తో కళ్ళార్పకుండా చూస్తూ ఎంజాయ్‌ చెయ్యటం అలవాటయ్యి, నిజజీవితంలో కూడా హింసను కోరుకునే ఒక మానసిక ధోరణి యువతరానికి అలవాటవుతోంది. జీవితంలో హింస లేదా - దానినే మేం చూపుతున్నాం అంటారు నిర్మాతలు, దర్శకులూ. జీవితంలో వున్న హింస దుఃఖాన్నీ కోపాన్నీ అసహ్యాన్నీ కలిగిస్తుంది. సినిమాలలో హింస కూడా అవే భావావేశాలను కలిగిస్తే జీవితచిత్రణ అనవచ్చు. కానీ సినిమాలలో హింస థ్రిల్‌నీ, శాడిస్టు సంతోషాన్నీ కలిగించి ఆ హింసను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే తత్వాన్ని అలవాటు చేస్తుంది. హింసకు స్పందించటం వేరు. దానిచేత ఆకర్షించబడటం వేరు.

ఒక్కహింస అనేకాదు ఈ కళారూసం” అమలులో వున్న అన్ని చట్టాలనూ వ్యతిరేకిస్తుంది. చట్టాలకు అతీతంగా వచ్చే మానవజీవిత సమస్యలను హుందాగా చూపి చట్టాలలో రావలసిన మార్పులను కోరే సినిమాల గురించి కాదు మనం మాట్లాడుకునేది. అసలు చట్టాలను గానీ, వాటిని తయారుచేసుకునే క్రమంలో మానవజాతి అలవరుచుకున్న సంస్కారాన్ని గానీ పట్టించుకోకుండా తయారయ్యే సినిమాలే యివాళ వస్తున్నాయి. సినిమా ఆడపిల్లలకు పద్దెనిమిదేళ్ళు రాకుండానే పెళ్ళిళ్ళు చేస్తుంది. దానిని సమర్ధిస్తుంది.

సంకలిత - ఓల్లా * 41

బహుభార్యత్వాన్ని ప్రచారం చేస్తుంది. దానిని గ్లామరైజ్‌ చేస్తుంది. లైంగిక వివక్షను ప్రతిక్షణం పెంచుతుంటుంది. ప్ర్రీలను కించపరిచే మాటలు, చేష్టలు, సంఘటనలూ సినిమాల నిండా పొంగి పొర్గుతుంటాయి. ఏ చట్టమన్నాా ఏ నియమమన్నాా ఏ నిబంధనన్నా వాళ్ళకు లెక్కా జమాలేదు. పేదవాళ్ళనీ, అందవిహీనులని, నల్లని వాళ్ళనీ యిష్టమొచ్చినట్లు అవమానిస్తారు. అడిగేవాళ్ళు లేరు. నల్లరంగు మనదని మర్చిపోయి, యూరోపియన్లు మనల్ని నల్లవాళ్ళంటారని మర్చిపోయి, నల్లరంగునీ, ఆధ్రికావాళ్ళనీ హేళన చేస్తుంటారు. ప్రజల ఈస్తటిక్‌ సెన్సిబిలిటీస్‌నీ, సంస్కారాన్నీ ధ్వంసం చేసే సినిమాలను యేం చెయ్యాలి? ఇవాళ యెక్కువమంది కళాకారులందరూ పరాయీకరణకు గురైన కార్మికుల స్థాయిలోనే వున్నారు. పెట్టుబడిని తమ శ్రమతో మరింత పెంచటానికి పనిచేస్తున్నారు తప్పితే కళ కోసమని పనిచెయ్యటం లేదు. సినిమా సరుకుగా మారిపోయింది. ఆ సరుకు కల్తీ సరుకు అయితే దానిని మార్కెట్‌లోకి రానివ్వకుండా చేసే అవకాశం వుండాలా లేదా? ప్రజలు తెలియకకొంటూనే వుంటారు. నష్టపోతూనే వుంటారు. హానికరమైన సరుకును మార్కెట్లోకి ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత లేదా? వోనికరమా కాదా అనిచూసే సెన్సార్‌ బోర్డు మరింత బాధ్యతతో పనిచేయాలా? లేదా? ప్రజల భౌతిక ఆరోగ్యానికి హానిచేసే మందులను డ్రగ్‌ చట్టాల ప్రకారం నిషేధిస్తారే- మానసిక ఆరోగ్యానికి హానిచేసే వాటి గురించి యింత నిర్లక్ష్యమా? ఒకవైపు చట్టబద్ధంగా యేర్పడిన సెన్సార్‌ చేయవలసిన పని చేయకుండా కూర్చుంటే యింకోవైపు వీధుల్లో గూండాలు సెన్సార్‌ చేసే అధికారాన్ని తమచేతుల్లోకి తీసుకుంటున్నారు. వీరి ఛాటికి సినిమాలు, నాటకాలు, కథలూ, నవలలూ అన్నీ ఆగిపోతున్నాయి. ఈ స్థితికి కారణం మన పట్టనితనం, పిరికితనం అనిపిస్తోంది. సెన్సార్‌ బోర్జుని సరిగా పనిచేయించటానికి పూనుకున్నా యెంతో మార్చు వస్తుంది. సెన్సార్‌ నిబంధనలను సరిగా అమలు జరిపితే యిపుడు వస్తున్న సినిమాలలో 90% విడుదల కాలేవు. సెన్సార్‌ బోర్డు సభ్యుల నియామకాలు కేవలం రాజకీయ నియామకాలు కాకుండా ప్రజలపట్ల బాధ్యత గలవారిని నియమించాలనే ఒత్తిడి పెరగాలి. సెన్సార్‌ బోర్డు ప్రజలపట్ల బాధ్యత వహించేలా ఆ యంత్రాంగాన్ని మార్చుకోవాలి. విజయవిహారం నవంబర్‌ 2000 కె సంకలిత - ఓల్లా * 42

క / శరత్‌ కథను ఇంతగా మార్చవచ్చా? దాదాపు వందేళ్ళ నుంచీ దేవదాసు ఒక వదలని వ్యామోహమై భారతీయుల హృదయాలను పట్టుకున్నాడు. ఒక సాంఘిక నవలా నాయకుడు ఇన్నేళ్ళపాటు ప్రజల మనసుల్లో వుండటం అరుదుగా జరిగే విషయం. భగ్న (్రేమికులనూ, బలహీనులనూ, తాగుబోతులనూ చూసినపుడు దేవదాసును తల్చుకోకుండా వుండరు. మజ్ను రోమియోల కథలు ప్రసిద్ధమైనా వారి తీరువేరు. వారు విఫల (్రేమికులే గానీ ధీరులు. ప్రేయసి కోసం ఏ సాహసమైనా చేయతలపెట్టే సాహసులు. దేవదాసు ఆ రకంగా (ప్రేమికులకు స్పూర్తిదాయకుడు కూడా కాదు. తన చిన్ననాటి స్నేహితురాలిని తన జీవితంలోకి తెచ్చుకునేందుకు చిన్నపాటి ప్రయత్నం కూడా చెయ్యకుండా, విషాద మాధుర్యానికి మదిరా మైకాన్ని జతచేసి, ఒకరకమైన నిష్కియా పరత్వానికి ప్రతీకగా నిలిచిన జమిందారు 'దేవదాసు'. అసమర్థుడు, సంశయాత్ముడు, పిరికివాడు, బలహీనుడు అయిన ఈ దేవదాసు జీవితంలోకి పార్వతి వచ్చి (ప్రేమ అనే ఆధునిక భావాన్ని ప్రవేశపెట్టకపోతే అతను తన భారాన్నీ, జమిందారీ భారాన్నీ భార్యమీదనో, మేనేజరు మీదనో మోపి జీవితాన్ని వెళ్ళబుచ్చేవాడు. తండ్రి కలకత్తా పంపించి చదివించకపోయినా అన్న ద్విజదాసులా భార్యావిధేయుదై, మరింత అధికారం ప్రజల మీద చలాయించేవాడు. కానీ కలకత్తా చదువు, పార్వతి (ప్రేమా, ఈరెండూ అతని జీవితంలోకి ఆధునికతను తెచ్చిపెట్టాయి. ఆ భారాన్ని అతను మొయ్యలేక సతమతమయిపోయాడు. ఇవాళ్టికి ఇటువంటి భారాలు - అచ్చగా ఇవే కాకపోయినా, భారతీయ యువతరం మీద పడుతూనే వున్నాయి. సంకలిత - ఓల్లా * 4

తాముపుట్టి పెరిగిన భౌతిక వాస్తవికతకూ - కావాలనో, కాకతాళీయంగానో, బలవంతంగానో తమ జీవితాల్లోకి తెచ్చుకున్న ఆధునిక ఆలోచనలకూ, మధ్య నలిగిపోయే అనేకమంది యువకులు దేవదాసుని గుర్తుచేస్తూ వుంటారు. భూస్వామ్య సమాజంలో, ఆ విలువలను పెంచి పోషించే కుటుంబాలలో పెట్టి పెరిగి, ఆ స్వభావాన్ని నరనరానా నింపుకుని, బైటినుంచి వచ్చే ఇతరేతర శక్తుల ఆకర్షణను తప్పించుకోలేక ఆ చైతన్యానికి ప్రభావితులై, తమ స్వభావానికీ ఈ చైతన్యానికీ మధ్య జరిగే భయంకర యుద్ధంలో క్షతగాత్రులవుతుంటారు. అందుకే నాయికా ప్రతి నాయకుల మధ్య భీకర పోరాటాలు లేకపోయినా, మనిషి తనమీద తను చేసుకునే ఈ యుద్దాన్ని ఇన్ని సంవత్సరాలుగా కొన్ని కోట్లమంది ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. తమకే తెలిసీ తెలియని తమ అంతరంగ యుద్దాన్ని అందంగా ఆకర్షణీయంగా చూపినందుకే భారతీయులు దేవదాసు నవలనూ, సినిమానూ అంతగా ఇష్టపడతారనిపిస్తుంది. అందువల్లే బెంగాలీ భాషలో ఏనాడో రాసిన నవల, ఇంతపేరు తెచ్చిపెడుతుందని రచయితే ఊహించని నవల, నవలగానే కాక సినిమాగా కూదా అన్ని భారతీయ భాషల ఢ్రేక్షకులనూ బలంగా ఆకర్షించింది. మళ్ళీ దేవదాసు పాత్ర దగ్గరకు వస్తే కలకత్తా చదువుతో అతనికి కొత్త సంస్కారం, మంచితనం అబ్బాయి. ఆ సంస్కారం సంఘ సంస్మర్తల ప్రభావంతో వంగదేశంలో వ్యాపించిన సంస్కారం. అందుకే జమిందారు బిడ్డ అయినా చం(ద్రముఖి వృత్తిని అతనంతగా అసహ్యించుకున్నాడు. మామూలుగా అయితే ఆ రోజుల్లో చంద్రముఖి వంటి వారికి దేవదాసు లాంటి జమీందారులే మహారాజ పోషకులు. చంద్రముఖి వృత్తిని అసహ్యించుకుని, ఆమెను అప్రయత్నంగా, తన ప్రమేయం పెద్దగా లేకుండానే సంస్కరించిన పుణ్యం సంపాదించుకున్నాడు. పార్వతి, చంద్రముఖి - భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్ర్రీల ప్రేమ పొందటానికి దేవదాసుకున్న అర్హత అతని బలహీన మనస్తత్వం, మంచితనమూనే. పార్వతీ, చంద్రముఖిలిద్దరూ చాలా బలమైన వ్యక్తిత్వం గల స్రీలు. సమర్ధులు. తమ జీవితాలకూ, తోటివారి జీవితాలకూ కర్తలు కాగలిగిన ధీరులు. అలాంటి స్త్రీలు ఒక బలహీనుడిని ప్రేమించి, అతని సేవలలో అతని జీవితాన్ని చక్కదిద్దటంలో తమ జీవితానికి సార్థకత కలుగుతుందని అనుకున్నారు. అయితే దేవదాసు తన అసమర్థతతో, పిరికితనంతో, ఆ సమర్భుల జీవితాలను కూడా నిరుపయోగం చేయబోయాడు. అయితే అదికూడా అతనికి చేతకాలేదు. పార్వతి తన సంకలిత - ఓల్లా ౫ 44

భర్తకుటుంబాన్నీ, దివాణాన్నీ చక్కదిద్దింది. చంద్రముఖి కలకత్తా వదిలి అశ్వద్ధపురం అనే గ్రామంలో పేద ప్రజలకు కాస్తంత అండగా నిలబడింది. ఇక దేవదాసు వ్యసనానికి బానిసై, దిక్కులేని చావు చచ్చి భారతీయుల కన్నీటి ప్రవాహంలో ఇన్నేళ్ళుగా సేదదీరుతూనే వున్నాడు. శరత్‌చంద్ర చటర్జీ కూడా “పార్వతి ఏమయిందో... నాకు తెలియదు. తెలుసుకోవాలనే కోరిక కూదా లేదు. దేవదాసు గురించే నాకుచాలా దుఃఖంగా వుంటుంది” అంటూ అతని వంటివారి కోసం ఒక్క కన్నీటి బొట్టయినా కార్చమని మనల్ని మంత్రించినట్టు నియంత్రించాడు. మనం మంత్రముగ్గుల్లా దేవదాసుకోసం ఏడుస్తూనే వున్నాం.

కొత్త తరాలకు, ఇప్పటి యువతరానికి దేవదాసు తెలిసే అవకాశం లేదనుకుంటున్న సమయంలో మళ్ళీ దేవదాసుని సినిమాగా తీయాలనే ఊహ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి వచ్చింది. నవల చదవని కోట్లాది ప్రజలకు దేవదాసు మళ్ళీ ఇంకొకసారి తెరమీద సజీవంగా కన్పించి సమ్మోహన పరిచాడు. ఈతరం (ప్రేక్షకులు కూడా శరత్‌ దృష్టిని అర్ధం చేసుకుని ఆయన నవల చివర్లో ఇచ్చిన ఆదేశాన్ని పాటించారు. నిజానికి ఇప్పటి యువతరం దేవదాసుని నిరాకరించాలనీ, నిరాకరిస్తుందనీ చాలా మంది అనుకున్నారు. ఇవాళ్టి యువతరం కెరీరిజం, డబ్బు సంపొదనల వైపు కొట్టుకుపోతున్న తరం. ఈతరం కాలక్షేపపు క్రేజీ ప్రేమచిత్రాలనూ, పెద్దల అనుమతితో తప్ప చేసుకోని (ప్రేమ పెళ్ళిళ్ళ చిత్రాలనూ ఆదరిస్తోంది. కెరీర్‌కోసం (ప్రేమను ఒదులుకోవాలనే సందేశంతో వచ్చిన చిత్రాలను కూడా విజయవంతం చేశారు. అలాంటి యువతరం దేవదాసు వంటి భగ్న (ప్రేమికుడి కథను, ప్రేమకోసం తనొకృడే (పేయసిని చంపకుందా, లేదా తానూ, ప్రేయసీ కలిసిచచ్చే ప్రయత్నం చేయకుండా) తాగి,తాగి చచ్చిపోయిన వాడి కథను, బోలెడంత జమీనీ, చదువునీ పరమ నిర్లక్ష్యంగా పారేసుకున్న యువకుని కథను చూసి ఆనందిస్తారని సంజయ్‌ లీలా భన్సాలీ అనుకోవటమే విచిత్రంగా వుంది. బహుశ అతనికి తన “స్టార్స్‌? మీదా, సెట్టింగ్స్‌ మీదా, కాస్టూమ్స్‌ మీదా ఎంతో నమ్మకం వుండి వుండాలి. కానీ అటువంటి అగ్రశ్రేణి తారలూ, సెట్టింగ్స్‌ వున్న “లజ్జ వంటి అనేక సినిమాలు, కొత్త ఇతివృత్తాలతో బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడితే, తాగి తాగి పడిపోయిన దేవదాసుని చూడాలని జనం థియేటర్లకు తరలిరావటం సగటు భారతీయ మనస్తత్వాన్ని కాచి వడపోసిన శరశ్చంద్రుడి గొప్పతనమేనేమో అనిపిస్తుంది. సగటు భారతీయ పురుషులలోని అసమర్ధతకూ, అహంకారానికీ, లౌల్యానికీ,

సంకలిత - ఓల్గా * 45

వ్యసనానికీ, నిష్కియాపరత్వానికీ ప్రతికగా దేవదాసుని (ప్రేక్షకులు స్వీకరించారా? ఆ కోణం దగ్గర అతనితో జనం ఐడెంటిపై అవుతున్నారా? తమ అసమర్ధ పురుషులను 'ప్రేమించకుండా వుండలేని తమ దౌర్భల్యాన్ని ప్రీలు ఈ కథలో, ఈ సినిమాలో చూసుకుని మరోసారి బాధపడుతున్నారా?

సంజయ్‌ లీలా భన్సాలీ కొత్తగా దేవదాసు చిత్రాన్ని తీస్తూ ఎంతో వివాదం రేకెత్తించాడు. యాఖైకోట్ల బడ్జెట్‌ అవసరమా అనేకాదు, ఒక కథను సినిమాకు అనువదించుకునేటప్పుడు కొన్ని తప్పనిసరి మార్పులు వుంటాయి. వుండక తప్పదు. రచయితలు అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని పొదిగి ఊహ తెలియంగల పాఠకులకు ఎంతో ఎంతో వదిలేస్తారు. కానీ మాస్‌ మీడియం, దృశ్య ప్రధానం అయిన సినిమాకు కొన్ని అద్‌వాన్‌టేజస్‌తో పాటు ఎన్నో పరిమితులు వుంటాయి కాబట్టి కథ తెరమీదకు వచ్చేసరికి ఎన్నో మార్పులు తప్పవు. ఐతే సంజయ్‌ లీలా భన్సాలీ చేసిన మార్పులు చూసి ఒకతరం హృదయాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా దేశ స్వాతంత్ర్యానికి కొంచెం ముందో వెనకో పుట్టి, శరత్‌ తెలుగు రచయిత అని చిన్నతనంలో నమ్మి, పెద్దయ్యాక కూడా అసలు శరత్‌ తెలుగువాడే పొరపాటున వంగదేశంలో పుట్టాడని అనుకుని, వినోదావారి దేవదాసుని అరడజను సార్లకు తక్కువ కాకుండా చూసిన తరం ఒకటుంది. ఆతరం ప్రభావానికి లోనై ఆలస్యంగానైనా దేవదాసుని చదివి, చూసి ఆ మత్తుకి చిత్తయిన తర్వాతితరం కూడా వుంది. ఈ రెండు తరాల వాళ్ళూ భన్సాలీని క్షమించలేరు. భన్సాలీ దేవదాసు విడుదల కాకముందే టి.వి.లలో రెండు నిముషాల “ప్రోమోస్‌ 'యాద్స్‌' చూడగానే వాళ్ళ గుండెలు మండిపోయాయి. శరీరాలు అసహ్యంతో జలదరించాయి. సినిమా థియేటర్లో పార్వతి తల్లి పాత్ర చిత్రణ చూసి ఛీత్మారాలు చేశారు. శరత్‌ కథను ఇంతగా మార్చవచ్చా అన్న ప్రశ్న వాళ్ళను వేధించింది. చాలా చర్చలు చేసుకున్నారు.

“అసలు కథను మార్చకుండానే సినిమాగా మలుచుకోవాలి. వినోదా వారు, విజయనిర్మల మార్చలేదు. హిందీలో బెంగాలీలో ఏం చేశారో? దిలీప్‌ కుమార్‌ దేవదాసులో కూడా పెద్దగా మార్పులున్నట్టు లేవు. ఆ సినిమాలు ఇప్పుడు చూడాలన్నా దొరకవు. అసలు నవలలో ఈ మార్చులకు అనుగుణమైన ఒక వాక్యమైనా వుందా? అసలు నవలలో ఏముంది అంటూ, అనుకుంటూ నవలను వెతుక్కుని చదువుకోవటంలో, పాత దేవదాసు సినిమాలను గుర్తు తెచ్చుకోవటంలో మునిగారు కొందరు దేవదాసు అభిమానులు. వారికి అడగని వరంలా హైదరాబాద్‌ ఫిలింక్షబ్‌ వారు అపురూపంగా దేవదాసు ఫిలిం

సంకలిత - ఓల్లా * 46

ఫెస్టివల్‌ ఏర్పాటుచేశారు. మూడు భాషలూ, ఆరు సినిమాలు, నవల వుండనే వుంది. ఏ దర్శకులు, ఏ నటులు శరత్‌ 'దేవదాసు'కు ఎంతవరకూ న్యాయం చేశారని పోల్చి చూసుకునే వీలు కలిగింది.

కథలో మార్పులు చేయవచ్చా అనే ప్రశ్న దేవదాసు ఫెస్టివల్‌ మొదటి రోజునే చర్చకు వచ్చింది. వినోదావారి దేవదాసుని చూపిన రోజు ప్రారంభ సభలో అక్మినేని నాగేశ్వరరావు గారు ఎంతో హుందాగా మాట్లాడుతూ ఈ నవలను తెలుగులో సెల్యులాయిడ్‌ మీదకు ఎక్కించేటప్పుడు చేసిన మార్పుల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు జరిగిన మార్పుల గురించి ఆలోచించమన్నారు. నవలలో పార్వతీ దేవదాసుల మధ్య బాల్యస్నేహం తప్ప యవ్వనపు ప్రేమలేదు. పార్వతి మనసులో (ప్రేమ ఆమెకే తెలుసు. దేవదాసుకి పార్వతి వచ్చి పాదాలమీద పడి అక్కడ కాస్త చోటివ్వమని అడిగేవరకూ ప్రేమిస్తున్నాననే స్పృహే లేదు. కానీ వినోదావారు తీసినప్పుడు వారిద్ధరి మధ్యా (ప్రేమ పెళ్ళి గురించిన ఆలోచన ముందే వున్నట్లు చూపారు. ఆ దృశ్యాల గురించిన చర్చా సమయంలో అక్ష్మినేని వేదాంతం వారినీ, సముద్రాల గారినీ ఎందుకీ మార్చు చేస్తున్నారని అడిగారట. నవల చదవని మామూలు ప్రేక్షకుల కోసం, కొన్ని విషయాలు స్పష్టంగా ఎస్టాల్లీష్‌ చేస్తే తప్ప అర్ధం చేసుకోలేనివారి కోసం మార్పులు తప్పనిసరి అని వారు సమాధానం ఇచ్చారట. మిగిలిన దేవదాసులలో కంటే (భన్సాలీ దేవదాసు తప్ప) నిజానికి తెలుగు దేవదాసులోనే ఎక్కువ మార్పులున్నాయి. నవలలో లేని విషయాలను చేర్చటమే కాదు, వున్న విషయాలను కొన్నిటిని చిత్రీకరించలేదు కూడా. ఐనా ఆ వినోదా వారి దేవదాసు మీద తెలుగుపాఠకులకూ, (క్రేక్షకులకూ కోపం రాలేదు. ఎందుకంటే జరిగిన మార్పులు పాత్రౌచిత్యాన్ని పెంచాయి గానీ తగ్గించలేదు. రచయిత నాటి వదిలిన మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరిగాయే గానీ, వికృతంగా, వంకరకొమ్మల్లా అవలేదు. ఉదాత్తత, బజెచిత్యం విషయాలలో రచయిత ఆశయాల కెక్కడా భంగం కలగలేదు. ఒక వుదాహరణతో చెప్పాలంటే దేవదాసు తండ్రి చనిపోయినప్పుడు తన గ్రామం వస్తాడు. పలకరించటానికి పార్వతి వాళ్ళింటికి వస్తుంది. ధర్మన్న పార్వతితో దేవదాసు వ్యసనపరుడైనాడనే విషయం చెబుతాడు. ఆ విషయం పార్వతి దేవదాసునడిగి తాగననే మాట తీసుకోవాలని విఫల యత్నం చేస్తుంది. నవలలో ధర్మన్న దేవదాసు తాగుడు గురించే కాక, చంద్రముఖితో స్నేహం గురించి చెప్పి, ఆమెకు నగలు కొనిస్తున్నాడని చెబుతాడు. పార్వతి నగల గురించి

కూడా ప్రశ్నిస్తుంది. దేవదాసు అలాంటిదేమీ లేదని చెబుతాడు. మన వినోదావారి ధర్మన్న గానీ పార్వతిగానీ ఆ సంగతే మాట్లాడరు. అవి మాట్లాడకపోవటం వల్ల ధర్మ్శన్నకు దేవదాసు స్వభావం గురించి తెలిసినట్లయింది. చంద్రముఖితో దేవదాసు ఎలా వ్యవహరిస్తాడో చిన్నతనం నుంచీ దేవదాసుని పెంచిన ధర్మన్నకు తెలియటం సముచితంగానే వుంది. పార్వతి నగల ప్రస్తావన తేకపోవటం తెలుగువారికి బాగుంది. పార్వతి నోటినుంచి ఆ మాటలు వస్తే బాగుండేది కాదు అనిపించింది. రచయితను దాటి ఇక్కడ పాఠకులు పాత్రను ప్రేమించటం ప్రారంభించారు. ఇలాంటి మార్పులకు ఆనందించారు. కానీ సరికొత్త దేవదాసులో పార్వతి చంద్రముఖి కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాన్ని భరించలేకపోయారు. సరిగ్గా ఇక్మడే చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయాలున్నాయి. కాలానుగుణమైన మార్పులు, చారిత్రక విరుద్ధమైన మార్పులు జనానికి బాగా పరిచయమై వారి ఊహల్లో స్థిరంగా ఒక రూపంతో వున్న పాత్రల విషయంలో చేయవచ్చా, చేయగూడదా? మార్పులు చేసేటప్పుడు ఏవైనా కొన్ని సూత్రాలు పాటించాలా అక్కర్లేదా అన్న చర్చ అవసరమవుతుంది. చంద్రముఖీ, పార్వతీ కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాన్ని టి.వి.లో చూసి చిరాకుపడుతూ 'నవలలో ఇది లేదు” అని నేను అరుస్తుంటే ఈతరం యువకుడొకరు అది దర్శకుడు కాలానుగుణంగా చేసిన మార్పు కావచ్చన్నాడు. అలాంటి మార్పు చేయగూడదన్నాను. దేవదాసు అలా ఊహించుకుంటున్నట్టు చిఫ్రీకరించాడేమో, సినిమా చూడకుండా అలా చిరాకుపడవద్దన్నాడు. 'దేవదాసలా ఊహించుకోడు. అతనికి చంద్రముఖి నృత్యం చేయటమే ఇష్టంలేదు. ఇక పార్వతితో కలిసి అంటే దేవదాసు అసలు సహించడు. పార్వతినలా చూస్తే అతని గుండె పగిలిపోయి చచ్చిపోతాడు. చివరి సన్నివేశం వరకూ వుండడు” అన్నాను. దర్శకుడు కొత్త ఆలోచన ఏదైనా చెప్పాలనుకున్నాడేమో, వీళ్ళిద్దరూ స్నేహం చేస్తే ఎలా వుంటుంది. దేవదాసుని ప్రేమించిన ఇద్దరు స్రీల స్నేహం ఎలా వుండొచ్చని ఆలోచించి భన్సాలీ ఈ మార్పు చేశాడేమో అన్నాడా యువకుడు. రచయిత వుద్దేశించనివి, విపరీతమైనవీ, పాత్రల స్వభావానికి వ్యతిరేకమైనవీ అయిన మార్పులు చేయకూడదని నేను వాదించాను మరి. 'స్పీత్ర అగ్నిప్రవేశం','అశోకం' వంటి రచనల సంగతేమిటని అడిగాడు. చలం, ముద్దుకృష్ణలు ఆ రచనల్లో వాల్మీకి ఉద్దేశించని భావాలు సీతతో పలికించారు గదా. అంతెందుకు సంకలిత - ఓల్లా * 48

నువ్వు రాసిన యుద్ధము - శాంతి నృత్య రూపకంలో సీత, శూర్చణఖలు కలిసి స్నేహంగా నృత్యం చేస్తారు గదా అన్నాడతను.

వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. నిజమే. రామాయణ, మహాభారతాలను ఆధునిక రచయితలు కొత్త ఆలోచనలతో తిరగరాశారు. వాల్మీకి, వ్యాసుడు వుద్దేశించని భావాలు, ఆయన వ్యతిరేకించే భావాలూ రాశారు. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో ఎన్నో ప్రక్షిప్తాలు వాటిలో చేరాయి. అసలు మూలంలో ఏముందనే ప్రశ్న చాలాసార్లు వచ్చింది. అనువాదాలలో ఎన్నో మార్పులు జరిగాయి. వాటిని సినిమాలుగా తీసినప్పుడూ రకరకాలుగా మార్చారు. ఆధునిక రచయితలు తిరగరాసిన రామాయణ భారతకథలు ఎవరో కొందరు వ్యతిరేకించినా చాలావరకూ జనామోదం పొందాయి. విచిత్ర మేమిటంటే ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారికి చలం, ముద్దుకృష్ణలు సీత, సావిత్రుల పాత్రల స్వభావాలను మార్చటం నచ్చలేదు. త్రిపురనేని రామస్వామి చౌదరిగారు రాసిన శంబూక కథ మీద రాని అభ్యంతరాలు చలం, ముద్దుకృష్ణుల పాత్రల మీద వచ్చాయి. సరే అదలా వుంచి - అంత మహాకావ్యాలనూ, ప్రజలందరికీ చిరపరిచితమైన పాత్రలనూ మార్చినప్పుడూ రాని అభ్యంతరం, సంజయ్‌లీలా భన్సాలీ చేసిన మార్చు చూసి ఎందుకు రావాలి? ఆ రెండింటికి తేడా ఏమిటి? పురాణపాత్రలలో మార్పులను ఇష్టంగా చదివిన వారికి కూడా ఈ మార్పులు ఎందుకు మింగుడుపడలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటేనే ముందుముందు క్లాసిక్‌ రచనలలో మార్పులు చేయబోయే రచయితలకూ, దర్భ్శకులకూ కొంత స్పష్టత వస్తుందనిపిస్తుంది.

చలం 'సీత అగ్నిప్రవేశం లో సీత తన అగ్నిపరీక్ష కోరిన రాముడిని అడగవలసిన నాలుగు మాటలూ అడిగి తనమీద రాముడి కంటే రావణుడికే ఎక్కువ ప్రేమ అని అర్ధం వచ్చే మాటలు మాట్లాడుతుంది. ఇక్కడ సీతను ఆత్మగౌరవం గల ఒక కొత్త స్త్రీగా రచయిత ఊహించాడు. పౌరాణిక కాలాంనాటి ధర్మాలతో, పాతివ్రత్యంతో నిండిన సీతతో, ఆ ధర్మాలకూ పాతివ్రత్యాలకూ అతీతంగా న్యాయాన్యాయాలనూ హేతుబద్ధతనూ ప్రవేశపెట్టాడు. ఆధునికకాలంలో కూడా సీతను ఆదర్శంగా తీసుకుని అవమానాలకూ, అనుమానాలకూ గురవుతున్న ప్రీల మనసుల్లోంచి ఆ సీతను తుడిచేసి ఈ సీతను ప్రవేశపెట్టడం వల్ల చలం సాధించాల్సిన సాంఘిక ప్రయోజనం ఎంతో వుంది. మిగిలిన రచయితలూ అంతే. పాతధర్మాలకూ, నీతులకూ కాలంచెల్లి వాటి స్థానంలో

సంకలిత - ఓల్లా * 49

వ్యక్తి "స్వేచ్చా, కౌరహక్కులూ, బాధ్యతలూ, మానవ హక్కులూ ఎవాల్స్‌ అవుతుంటే వాటిని ప్రజలకు పరిచయమైన, వారికి ఆదర్శంగా వుంటున్న పురాణ పాత్రల ద్వారానే చెప్పించే ప్రయత్నం చేశారు కొందరు రచయితలు. సీత రాముడిని అడిగే ప్రశ్నలకు హర్షద్వానాలు చేయని ఆధునిక స్త్రీ వుండదు. రచయితలు చేసిన ఆ మార్పులవల్ల ఆధునిక ప్రీలు ఎంతో నైతికబలాన్నీ ధైర్యాన్నీ పొందారు. కానీ దేవదాసులో భన్సాలీ చేసిన మార్పులు ఏ సాంఘిక ప్రయోజనాన్ని ఆశించి?

ఇద్దరు అగ్రతారలు కలిసి నృత్యం చేస్తే (ప్రేక్షకులు ఆనందిస్తారనే ఒకే ఒక వ్యాపారదృష్టి తప్ప ఎంత ఆలోచించినా మరొక కారణం కనిపించటం లేదు. అలాగే పార్వతి తల్లి పాత్రను అంత అతిగా చూపించటంవల్ల సాధించినదేమిటి? ఈవిడే దేవదాసుని (ప్రేమిస్తోందా అనే అనుమానం వచ్చేంత హడావుడీ చెయ్యటంలో అర్ధం కనిపించదు. ఆమె నృత్యం చేసే సన్నివేశం కూడా అనౌచిత్యానికి ఆటపట్టు అయింది తప్ప ఇతరత్రా సాధించిన ప్రయోజనమేమీ లేదు. బిమల్‌రాయ్‌ తీసిన 'దేవదాసు'లో పార్వతీ, చంద్రముఖీ ఒకసారి ఒకరికొకరు ఎదురుపడతారు. పార్వతి పల్లకీలో, చంద్రముఖి కాలినడకనా ప్రయాణం చేస్తుంటారు. ఎవరెవరో తెలియకపోయినా ఒక్కక్షణం పాటు ఇద్దరూ ఒకరినొకరు పరిశీలనగా చూసుకుంటారు. ఆ దృశ్యం (ప్రేక్షకులలో ఆసక్తిని, అనేక ఆలోచనలనూ రేకెత్తిస్తుంది. నవలలో లేకపోయినా ఆ దృశ్యం నవల అందాన్ని ఇనుమడింప జేసిందేగాని తగ్గించలేదు. నిజం చెప్పాలంటే హిందీ దేవదాసులో అదొక్కటే ఆసక్తికరమైన దృశ్యం. ఆ చిన్న దృశ్యాన్ని ఆధారంగా తీసుకొని భన్సాలీ ఇంతపెద్ద మార్పు చేశాడు. ఈ మార్చువల్ల ఏ ప్రయోజనం లేకపోవచ్చు గానీ నష్టం ఏమిటి అని ఎవరైనా అడగొచ్చు. పాత్రాచిత్యం దెబ్బతింటుందనే సమాధానమే ఇవ్వగలుగుతాం. ఆ కథతోబాగా పరిచయం వున్నవారిని బెచిత్య రాహిత్యపు మార్పులు బాగా చికాకు పెడతాయి. కొందరిని చికాకు పెట్టినా సాంఘిక ప్రయోజనమో, కళా ప్రయోజనమో వుంటే దానిని అర్ధం చేసుకోవచ్చు. భన్సాలీ చేసిన మార్పులలో ఆ రెండూ లేవు. ఆరు రోజులు ఆరు దేవదాసులు చూసినా మొదటి ఆరుస్థానాలూ వినోదా వారి దేవదాసుకే ఇవ్వక తప్పదనిపిస్తోంది. ఆ తర్వాత సైగల్‌ దేవదాసు కొంత బాగుంది. ఆ తర్వాత కొత్తగా బెంగాలీలో శక్తిసామంత తీసిన దేవదాసులో నటులకు చాలా పరిమితులున్నా ఫరవాలేదు భరించవచ్చనిపించింది. బిమల్‌రాయ్‌ దేవదాసు బాగా

సంకలిత - ఓల్గా *50,

నిరాశ పరిచింది. చంద్రముఖిగా నటించిన వైజయంతిమాల నటన కొన్నిచోట్ల ఫరవాలేదనిపించింది తప్ప ఆ సినిమాలో బాగున్నదంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. మూలకథను అనుసరించినా, చక్కని కెమెరా పనితనం చూపించినా బిమల్‌రాయ్‌ దేవదాసు ఆత్మను పట్టుకోవటంలో విఫలమయ్యాడు. నాగేశ్వరరావుని చూసిన కళ్ళతో దిలీప్‌కుమార్‌ని చూడటం ఏదో సామెతను గుర్తుతెస్తుంది. బాధ, వేదన, ద్వైదీభావం, నిరాశ మంచితనం, నిర్లిప్తత, వేదాంతం, ఇవేమీ లేని ఒక నిర్వికారపు దేవదాసులా దిలీప్‌కుమార్‌ మనల్ని చాలా నిరాశపరుస్తాడు. నవలను చిత్రానువాదం ఎలా చెయ్యాలో వినోదావారి దేవదాసు చూసి నేర్చుకోవలసింది ఎంతైనా వుంది.

మిగిలిన అన్ని దేవదాసు చిత్రాలలోని పార్వతికీ, వినోదావారి పార్వతికీ భూమ్యాకాశాల మధ్య వున్నంత తేదావుంది. మిగిలిన పార్వతులు అందమైనవారు. దేవదాసు కోసం బాధపడేవారు. పెళ్ళిచేసుకుని భర్తకనుకూలంగా నడుచుకున్న వారిగా కనిపిస్తారు. అంతే, మిగిలిన సినిమాలలో చంద్రముఖి కున్నంత ప్రాధాన్యత వివాహానంతరం పార్వతికి లేదు. కానీ మన పార్వతి లావా లోపల దాచుకుని నడుస్తున్న అగ్నిపర్వతాన్ని గుర్తుతెస్తుంది. పెళ్ళిపల్లకీలో కూచుని నిశ్శబ్ధంగా కన్నీరు కార్చినప్పటి నుంచీ, శాంత గంభీరమైన స్వభావం గల ఇల్లాలిగా, తనకంటే పెద్ద పిల్లలకు తల్లిగా ఆమెను చూస్తుంటే మన హృదయం చెప్పలేని వేదనతో బరువెక్కుతుంది. దేవదాసు దు:ఖాన్ని మర్చిపోవటానికి మద్యాన్ని ఆశ్రయించాడు. చంద్రముఖి స్నేహం చేశాడు. పార్వతి తన దుఃఖాన్ని తానే మింగిన గరళ కంఠి. ఆమె దయగా నవ్వుతుంటే మనకు పట్టరాని దుఃఖం వస్తుంది.

వ్యవస్థలోని, తల్లిదండ్రులలోని, ఆస్తి అంతస్తులలోని అమానుషత్వం కర్కశత్వం అంతా మనకు ఎవరూ చెప్పకుండానే అర్ధమవుతుంది. అలా అర్ధం చేయించిన ఘనత దర్శకుడికి ఎంత దక్కుతుందో నటిగా సావిల్రికీ అంతే దక్కుతుంది. దేవదాసు తాగి, చిక్కి శల్యమై,

మురికి బట్టలతో, చెత్తకుండీ పక్కన కుక్కను పట్టుకుని కూచుంటే మన మనసు

ఎంత ద్రవిస్తుందో - అంతకు పదింతలు, ఒళ్ళంతా నగలు అలంకరించుకుని, పెద్ద మేడలో దయగా, ప్రేమగా చిరునవ్వులు చిందిస్తూ పిల్లలనూ, భర్తనూ సేవించే పార్వతిని చూస్తే మన మనసు రోదిస్తుంది. ఆమెకోసం మనప్రాణం కొట్టుకుపోతుంది. పార్వతి కష్టం, ఆ సినిమాలో పాటలో చెప్పిన కష్టం 'మనసున లేనివారీ సేవలతో, మనసీయగలేని నీపై మమతలతో' - అది ఎంత కష్టమైన పనో అక్షరమక్షరమూ _.మనకు అర్ధం

సంకలిత - ఓల్లా ఇక. 1౨! 801

చేయించింది సావిత్రి. తన పరిస్థితిని, దు:ఖాన్నీ దానికి అనుకూలమైన రూపంతో, మాటలతో, చేతలతో అర్ధం చేయించటం కంటే తన లోతైన చూపుతో, పేలవమైన నవ్వుతో, పరధ్యానపు తీరుతో అర్థం చేయించటం చాలా కష్టం. ఆ కష్టం పార్వతికి వుందనే స్పృహ కూడా మిగిలిన 'దేవదాసు' సినిమాలలోని పార్వతి పాత్రధారులకు వున్నట్లు కన్పించదు. ఎవరూ వాళ్ళకు చెప్పినట్లు కూడా లేదు. సావిత్రికి చెప్పినదెంతో

కానీ ఆమె మనకు అర్ధం చేయించింది సముద్రమంత శోకం. ఆర్తి, ఆవేదన. 'దేవదాసు'లా అవాలని ఏ కోశానా అనుకోనివారు కూడా దేవదాసు కోసం జాలితో కాసిని కన్నీళ్ళు కారుస్తారు. అది మానన స్వభావపు లోతులను తరచి, సామాజిక నియమాలకూ, మనుషుల ఆసక్తులకూ మధ్య వచ్చే సంఘర్షణలకు బలహీనమైన మానవులు ఎలా నలిగి నాశనమైపోతారో కళాత్మకంగా చూపిన శరత్‌ చంద్రుడి అద్భుత కథ సాధించిన సార్వకాలిక విజయాన్ని చాటుతుంది. ఈ రకంగా 'దేవదాసు' ఇంకో వందేళ్ళ తర్వాత కూడా సినిమా కంటే శక్తివంతమైన ఆనాటి మీడియం

ద్వారా ప్రజల దగ్గరకు వస్తాదేమో. ఆదివారం ఆంధ్రజ్యోతి 20 అక్టోబర్‌ 2002 క్‌ సంకలిత - ఓల్లా * 52

యం ఇ (4 ఇష గ్త్‌ ల ూ 'ఆలోచని అంటే ఇంత వ్యతిరేకత ఎందుకు? 'ఎ మేటర్‌ ఆఫ్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌ అనే స్వీడన్‌ సినిమాలో ఒక సన్నివేశం చాలా షాక్‌ కలిగించేది వుంది. ఒక అమ్మాయి కొడుకుని కంటుంది. హాస్పిటల్లో రెండు రోజులు నొప్పులు పడి చావుబతుకుల మధ్య గడిపి కొడుకుని కని ఇంటికి వెళ్ళిన ఆమెకు భర్త ఇంకొక స్త్రీ కౌగిలిలో కనిపిస్తాడు. భరించలేని కోపంతో దు:ఖంతో ఆమె ఆ రోజుల పిల్లవాడిని మేడమీద నుంచి కిందికి విసిరేస్తుంది. పిల్లవాడు చచ్చిపోతాడు. ఆమె జైలుకి వెళ్తుంది. “మనుషులు మారాలి సినిమాలో దరిద్రం వల్ల పిల్లలకు విషమిస్తుంది తల్లి. తల్లులు రకరకాల పరిస్థితుల్లో పిల్లల్ని చంపుకుంటున్నారు. ఆకలి, దరిద్రం, దుర్భర పరిస్థితులు, భరించలేని కోపం, దుఃఖం ఇలా ఎన్నో కారణాల వల్ల పిల్లల్ని చంపుకునే భయంకర స్థితిలోకి తల్లులు నెట్టబడుతున్నారు. న్యాయస్థానం తనకు ఉచితమనిపించిన శిక్షల్ని ఆ తల్లులకు వేస్తోంది. కానీ ఢిల్లీ కోర్టు ముందు పోగైన జనం జూన్‌ 28వ తారీకున ఇందూ అనే ఆవిడను చంపాలనీ, మరణశిక్ష విధించాలనీ కేకలేశారు. ఎన్నో రకాల దుర్భాషలాడి ఆమెను అవమానించారు. ఆమెను వ్యభిచారిణి అన్నారు. ఎందుకు? ఇందూ పిల్లలు హత్య చేయబడ్డారు. ఆ హత్య చేసింది ఇందూని ప్రేమించిన యువకుడు. దహనం చేసేటప్పుడే జనం ఇందూని తిట్టారు. కేకలేశారు. చంపాలన్నారు. ఎందుకు? ఇందూ నేరం చేసిందా లేదా అని విచారణ ప్రారంభమైనా కాకముందే ఆమె మీద తీర్చులెందుకు ఇస్తున్నారు? సంకలిత - ఓల్గా ౪53

ఆ హత్యలో ఆమెకు సంబంధం లేదనటానికి ఎన్ని ఆధారాలున్నా జనం వాటిని ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇందు భర్త ఇందూనే పిల్లల్ని చంపిందని చెప్పటం వల్లనా? అతనే ఇందూకి వ్యతిరేకంగా కేకలేస్తూ తిరగటం వల్లనా? ఆ కేకలేసేజనం దృష్టిలో ఈ కేసు ప్రాముఖ్యత ఏమిటంటే “తల్లి, తన ప్రియుడి కోసం పిల్లల్ని చంపించటం” ఈ కారణంగానే ఆ తల్లికి పిలల హత్యలో భాగం వుందా లేదా అన్నది ఏమీ తేలకుండానే అనేకమంది ఆమెకు మరణశిక్ష వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్రోల్‌ పోసి తగలబెట్టడం చాలా ఘోరం. ఐతే ఆ ఘోరం కంటే దానికి కారణమైన ఇందూ (ప్రేమ అందరికీ ఘోరాతి ఘోరంగా కనిపిస్తోంది. ఇందూ భర్రతో పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటూ వుంటే ఈ హత్యలు జరగవు గదా. “చక్కని సంతానం చల్లని సంసారం” అని పాడుకోకుండా ఇందూ ఈ (ప్రేమ - వ్యవహారంలోకి ఎందుకు దిగింది? ఇందూకి ఈ అక్రమ (ప్రేమ వ్యవహారం లేకపోతే ఈ హత్యలు జరిగేవి కాదుగదా. కనుక ఇందూ (ప్రేమ వ్యవహారమే ఘోరం. ఇదీ ఆ జనం ఆలోచనా ధోరణి. భర్తవుండగా, అతనికి తెలిసో తలియకుందానో ఇంకొకరితో సంబంధం పెట్టుకున్న స్త్రీ సమాజం దృష్టిలో చెడిపోయినది. పతిత, వ్యభిచారి ఇలాంటి మాటలు తప్ప ఆ స్త్రీ గురించి చెప్పటానికి మరి మాటలు దొరకవు. అలాంటి వ్యభిచారి, పతిత, పిల్లల్ని హత్యచేసే వుంటుంది. ఇది ఆ జనం నమ్మకం. పిల్లల్ని చంపేస్తే తను (ప్రేమించిన మనిషితో కలిసివుండటం ఎలా కుదురుతుంది? పిల్లల్ని ఆమె ఎంతో క్రేమగా చూసుకునేదనీ, పిల్లలకోసమే రెండుసార్లు ఇంటినుంచి వెళ్లిపోయిన ఇందూ మళ్ళీ తిరిగి వచ్చిందనీ తల్లిదండ్రులు చెబుతున్నారు గదా. పిల్లవాడిని హాస్టల్లో వుంచాలనీ, అమ్మాయిని తనతో తీసుకెళ్ళాలనీ ఇందూ అనుకుంటున్నట్లు నమ్మకమైన ఆధారాలున్నాయి గదా - వీటన్నిటినీ ఎందుకు పట్టించుకోరు? నిజానిజాలేమిటో విచారిద్దామనే సహనం ఎందుకు పాటించరు? కారణం ఒక్కటే - ఇందూ మంచిదికాదు అనే విషయం తేలిపోయింది. భర్త వుండగా ఇంకొకరితో శారీరక సంబంధం పెట్టుకోవటం చాలా చెడ్డపని అని సమాజంలో నీతులూ, విలువలూ సంకలిత -- ఓల్లా ౫ 54

చెబుతున్నాయి. ఈ చెడ్డపని చెయ్యగల స్త్రీ ఇంకెంత ఘోరమైనా చెయ్యగలదని ఆ నీతులను నమ్మే ప్రజలు అనుకుంటారు. ఆమె ఆ పని చెయ్యటంతోనే తన విలువను నమ్మకాన్నీ అన్నిటినీ పోగొట్టుకుంది. ఆమె గురించి ఏమనటానికైనా హక్కుందని సమాజం భావిస్తుంది. ఈ కారణంగా ఆమెను ఎవరైనా ఎంతైనా అవమానించవచ్చు. ఇదే ఆ జనం వేసిన అసభ్యమైన కేకల వెనకాల వున్న అసలు కారణం. ఈ నీతి అవినీతుల ప్రశ్నలో పురుషులకీ స్రీలకూ వుండే అగాధం ప్రీలను ఎంతో హింసిస్తుంది. పురుషుల ఇతర సంబంధాలు అసలు నేరాలుకావు. వాటి కారణంగా వాళ్ళకు విలువపోదు. ఇతను భార్యవుండగా ఇంకొక సంబంధంలోకి వెళ్ళాడు గాబట్టి ఏ ఘోరమైన నేరమైనా చెయ్యగలడని ఎవరూ అనరు. ఈ విషయం వల్ల అతన్ని అవమానించరు. ఎందుకంటే ఈ సమాజం దృష్టిలో పురుషుడు వ్యక్తి స్తీ పురుషుడి స్వంత ఆస్తి. ప్రీ మనిషికాదు. ఒకరికి చెందిన భోగ వస్తువు. ఈ అభిప్రాయాల కారణంగానే ఇందూ మీద జనానికి అంతకోపం. ఇందూని తిట్టటంలో శపించటంలో మునిగి పోయినవాళ్ళ ధోరణి చాలా ప్రమాదకరంగా వుంది. ఎందుకంటే వాళ్ళు సమస్యను గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరుపిల్లల తల్లి భర్తనుంచి వేరే పోవాలంటే ఏం చెయ్యాలి? పిల్లల మీద ఆమెకు హక్కుందా? పిల్లల్ని ఆమెకు ఇవ్వటానికి భర్త అంగీకరిస్తాడా? ఆమెను ఒదలటం ఇష్టం లేకపోతే పిల్లల మీద ఆమెకున్న (ప్రేమను అడ్డంపెట్టి ఆమెను మరింత అణిచివెయ్యదా. కోర్టుకి వెళ్ళి పిల్లల మీద హక్కు సాధించుకోగల ధైర్యం ఎంతమందికి వుంటుంది? కోర్టుల్లో దొరికే న్యాయం మీద నమ్మకం ఎలా కలుగుతుంది. భర్తలో ఏ లోపమూ చూపించకుండా తనకు అతని మీద (ప్రేమ లేకపోవటం వల్లా వేరొకరి మీద ప్రేమ కలగటం వల్లా భర్తనుంచి విడిపోతానంటే అంగీకరించే స్థితిలో సమాజంగానీ, చట్టాలు గానీ, న్యాయస్థానాలు గానీ వున్నాయా? పెళ్ళయిన ఆడదానికి ఏ కారణంవల్లనైనా భర్తతో సరిపడక, ఇంకొక వ్యక్తిని పెళ్ళిచేసుకుందామనుకుంటే భర్తా, అతని తల్లిదండ్రులు, ఆ విషయాన్ని కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయంగా తీసుకుని ఆమెను ఎంత అణచివేస్తారు? సంకలిత - ఓల్లా * 55

ఎన్ని హింసలు పెడతారు?

పిల్లలకి ఆమె మీద ఎలాంటి భావం కలిగిస్తారు?

ఈ విషయాల గురించి ఆ కేకలు వేసిన జనానికి తలియదు. ఇందూని తిట్టేవాళ్లు ఈ విషయాల గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు.

ఇక్కడ ఒకసారి మన సమాజ భౌతిక స్థితి గురించి కూడా మనం ఆలోచించాలి. సమాజ భౌతిక పరిస్థితుల నుంచీ చూస్తే పాతసంప్రదాయాలకూ, విలువలకూ, వ్యవస్థలకూ కాలం చెల్లింది. అవన్నీ చీకిపోతున్నాయి. ఐతే వాటి స్థానంలో కొత్త విలువలు వేగంగా ప్రచారంలోకి రావటంలేదు. కొత్త విలువలను నమ్మేవారూ ప్రచారం చేసేవారూ చాలా తక్కువమంది వున్నారు. వాళ్లు కూడా ఈ కొత్త విలువల పట్ల (ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోతున్నారు. ఆ విలువలకు తగినటువంటి సైద్ధాంతిక పునాదిని కల్పించలేకపోతున్నారు. అందువల్ల ప్రజలు పాత సంప్రదాయక భావా లలోనే వుండి ఆ భావజాలం నుండి ఎవరు ఏ కొంచెం పక్కకు తొలిగినా చాలా ఆందోళన పడిపోతున్నారు. అటువంటి ఆందోళనతోనే ఇవాళ ఇందూని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. వ్యభిచారి అని కేకలేస్తున్నారు.

ఇప్పుడు జరిగిన ఈ ఘోరసంఘటనను సమాజం ఎలా అర్ధం చేసుకుంటుంది? దీనిలో ఏ సామాజిక అంశాలనూ, ఏ సామాజిక నేపథ్యాన్నీ గుర్తిస్తుంది. అసలు సమస్యను గుర్తించదు అనే విషయం తేలిపోయింది. ఏ బాధ్యతా లేని జనం ఇందూని గురించి తేలికగా వెకిలిగా మాట్లాడుతారు. పాత సంప్రదాయ భావాలను బలపరచటానికి ఈ సంఘటనను వాడుకుంటారు. భర్తనూ సంసారాన్నీ కాదనుకోవటంవల్ల, స్త్రీలకూ వారి మాతృత్వానిక్రీ వచ్చే ప్రమాదాన్ని మరింత బలంగా చెప్పటానికి ఈ సంఘటనలు వాడుకుంటారు. భర్తనుంచి విడిపోవాలనుకునే ప్రతి స్రీని, వ్యభిచారి అనే నిందకు గురవ్వవలసి వుంటుందనే భయానికి గురి చేస్తారు. ఇప్పుడు జరిగిన హత్యవెనుక వున్న పునాదిని మాత్రం కదిలించరు.

ఇప్పుడు జరిగిన హత్యేవాళ్ళకు కనబడుతోంది గానీ ఈ సమస్యలను ఇలాగే వదిలేస్తే, స్త్రీ పురుష సంబంధాల విషయంలో నీతి అవినీతుల గురించి మన పాత భావజాలాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో జరగటానికి అవకాశమున్న ఘోరాల గురించి ఎవరూ ఆలోచించటం లేదు.

సంకలిత - ఓల్లా 4 56

ఇందూని తిట్టటంలో మునిగిపోయిన వాళ్ళకు ఇందు పడిన యాతన, హింస గురించి ఆలోచించాలనైనా తట్టటం లేదు. స్త్రీలనూ పిల్లలనూ స్వతంత్ర వ్యక్తులుగా కాక స్వంత ఆస్తులుగా, తమ వంశ పరువు ప్రతిష్టల ఆస్తులుగా, తమ వంశ పరువు ప్రతిష్టల గుర్తులుగా చూస్తున్న కుటుంబ వ్యవస్థను గురించి ఇప్పుడైనా మనం ఆలోచించాలి. ఆదివారం ఆంధ్రజ్యోతి 2 అగస్టు 1988 సంకలిత - ఓల్లా ౪57

న్‌.

ప

ఇ ట్యట్లి

ఒక “మగవాడి” గోడు

తోలేటి జగన్మోహనరావు తాను రాసిన 'మగోడు కథా నేపథ్యాన్ని గురించి రాస్తూ

పెద్దయెత్తున ప్రీ వాదం మీదదాడికి దిగారు. అయితే అందులో ఆయన ప్రస్తావించిన

విషయాలు చాలాసార్లు చర్చించినవే. ఒకటి రెండు విషయాలు పరమ తెలివితక్కువగా

వున్నాయి. వాటికి సమాధానం ఇవ్వడం కూడా అనవసరమనిపించే స్థాయిలో వున్నాయి.

ఐనా కొత్తగా చదివే పాఠకులలో కొందరైనా కొద్ధి గందరగోళానికి కూడా గురయ్యే

(ప్రమాదం వుండకూడదని ఆయన వ్యాసానికి సమాధానం రాస్తున్నాను.

ముందు ఆయన కథ గురించి ఒకటిరెండు మాటలు మాట్లాడుకోవాలి. ఆ కథ

ఆయన స్రీ వాదాన్ని అపహాస్యం చేయటానికి రాశానని చెప్పుకున్నారు. అపహాస్యం

అనే దానిని ప్యారడీకి సమానార్థకంగా వాడినట్లు అనిపిస్తుంది. కానీ కథ చదివితే

కేవలం ప్యారడీగా అనిపించదు. చాలా ద్వేషం కనిపిస్తుంది. ఆయన ఆ కథలో

లేవనెత్త దల్చుకున్న విషయం పెళ్లి చేసుకుంటే పురుషుడు కూడా కొంత స్వెచ్చ

కోల్పోతాడు కదా. కొంత స్వేచ్చ ప్రీ పురుషులిద్దరూ కోల్పోతారు కాబట్టి యిద్దరూ

అడ్జెస్టయి బతకాలి గానీ పెళ్ళి ఒద్దనీ, కుటుంబం వద్దనీ అరాచకపు మాటలు

మాట్లాడతారా అనేది. నేను ఈ విషయాన్ని అపహాస్యంగానో, వ్యంగ్యంగానో కాకుండా

సీరియస్‌గానే చర్చిస్తాను.

పై అభిప్రాయాల్ని రెండు స్థాయిలలో పరిశీలించాల్సి వుంది. ఒకటి పెళ్ళి చేసుకుంటే

పురుషుడు కోల్పోయీ స్వేచ్చ, ప్రీ కోల్పోయే స్వేచ్చ గుణాత్మకంగా ఒకటేనా? పెళ్లికి సంకలిత - ఓల్గా ఖ్‌ ర్‌రి

ముందు కూడా స్త్రీ స్వేచ్చగా ఎక్కడుంది? పెళ్లి తర్వాత కూడా తన స్వేచ్చను కోల్పోకుండా వివాహజీవితంలో మసులుకునే వెసులుబాటును పురుషుడికి ఈ సమాజం కల్పించలేదా? ఆ వెసులుబాటుని ఆమోదింపచేయటం కోసం ఎన్ని సంప్రదాయాలను, ఎంత భావజాలాన్నీ కల్పించారు? ఆ వెసులుబాటుని ఒదులుకుని కుటుంబంలో స్రీలకు సహకరించి అవకాశాలనూ, స్వేచ్చనూ, బాధ్యతలనూ సమానంగా పంచుకోటానికి ఎంతమంది సిద్ధంగా వున్నారు? స్రీ విముక్తిని చిట్టచివరికి వాయిదా వేసేసి అప్పుడు చూసుకోవచ్చులే అనే ధోరణిలో వున్నవారికి ప్రీ వాదులు అడుగుతున్నవి చికాకుగానే వుంటాయి. ఆందోళన కలిగిస్తాయి. పెళ్ళి సంబంధంలోకి వచ్చేముందే తాము ఒక అసమానమైన స్థాయిలో వుండి ఈ సంబంధంలోకి వస్తున్నామని యిద్దరికీ తెలుస్తూనే వుంటుంది. బార్‌గెయినింగ్‌ కెపాసిటీ గానీ, అధికారంగానీ పురుషుడికే యెక్కువ వుంటుందనే విషయం తేటతెల్లంగానే వుంది. ఈ అసమాన సంబంధంలో అడ్‌వాంటేజస్‌ అన్నీ పురుషుడికే వుండటమూ తెలుస్తుంది. అసమాన సంబంధంలో ప్రతిఘటన, ఘర్షణ లేకుండా వుండటం కుదరదు. అవి లేవంటే యిక పూర్తిగా బానిసత్వమే. బానిసలు కూడా యేదో ఒకరోజు ప్రతిఘటిస్తారు. వివాహంలో స్రీ పురుషులు బానిస

  • యజమాని సంబంధంలో వున్నారనే విషయం యివాళ కొత్తగా నిరూపించాలా? ఆలోచించే వారెవరికైనా, స్రీ ద్వేషంతో కరడుకట్టని వారెవరికైనా అది అర్ధమవుతుంది. ప్రీలు ప్రతిఘటించినప్పుడు కుటుంబ వ్యవస్థ కదిలిపోతున్నట్టే అనిపిస్తుంది. స్త్రీలు మౌనంగా అడ్జెస్టవుతూ బతుకుతున్నంతకాలం ఎవరికీ ఏ పేచీ వుండదు. ఇప్పుడీ ఆందోళనంతా స్త్రీల ప్రతిఘటనను తట్టుకోలేక - ఆ మేరకు ప్రీల వుద్యమం, స్ర్రీవాదుల డిమాండ్సు ముందుకు వెళ్తున్నట్టే. ఇక పెళ్లిలో అధికార హోదాలో వున్న పురుషుడికి కూడా ఆ సంబంధంలో నిజమైన ఆనందం దొరకదు. ఒకరిని అణచిపెట్టటంలో ఎవరైనా మానవత్వం కోల్పోతారు. దాని వలన వచ్చే వికృతమైన భావనలన్నింటికీ వాళ్లు లోనవుతారు. కొందరు దానినే ఆనందించే శాడిస్టులవుతారు. మరికొందరు అశాంతి పడుతుంటారు. దానిలోపల వాళ్లూ బందీలవుతారు. బానిసలుగా వుండడానికి అలవాటుపడిన స్త్రీలతో బతకడం సమానత్వాన్ని గౌరవించే పురుషులకు కష్టంగానే వుంటుంది. అలాగే బానిసత్వాన్నే ప్రీల నుంచి కోరుకునే పురుషులకు ప్రతిఘటించే స్త్రీలతో కలిసి బతకడం కష్టంగా వుంటుంది. స్త్రీల బానిసత్వాన్ని ప్రీ పురుషులిద్దరూ ఆమోదించినప్పుడు ఒక రకమైన పద్ధతిలో కుటుంబం నడుస్తుంది. చాలాకాలం సంకలిత - ఓల్గా ౪59

కుటుంబ వ్యవస్థ అట్లాగే నడిచింది. ఇప్పుడూ నడుస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రతిఘటన యొక్కువవడంతో కుటుంబ వ్యవస్థంతా ధ్వంసమవుతుందనే భయం చాలామందిలో కలుగుతోంది. ప్రీవాద రచయిక్రులు ప్రీల ప్రతిఘటనకు కథారూపమో, కవితా రూపమో ఇస్తున్నారు. స్రీలందరి ప్రతిఘటనా ఒకే స్థాయిలో, ఒకేరకంగా వుండదు గాబట్టి ఆ తేడాలన్నీ రచనలలో కనిపిస్తాయి. ఈ కథలో ఆయనపెట్టిన యింకో వాదం మనసైనప్పుడు మనసైన పురుషుడిని అనుభవించే స్వేచ్చ (?), ప్రీవాదులు కావాలనుకుంటున్నారనేది. ఈ అబద్ధపు ఆరోపణ వెనుక ఆయన మర్చిపోయిన వాస్తవం ఏమిటంటే మనసైనప్పుడు మనసైన ప్రీని అనుభవించే అవకాశాలను పురుషులకు శతాబ్దాలుగా అనేక రూపాలలో, వ్యవస్థలలో యిస్తున్న సమాజం మనది. స్త్రీల లైంగిక హింస, అణచివేత మీద ఆధారపడిన సమాజం మనది. వ్యభిచార వ్యవస్థ నుంచీ లైంగిక అత్యాచారాల వరకూ ప్రీల శరీరాలను అనుభవించడానికీ, హింసించడానికీ ఎన్నో రూపాలను అనుమతిస్తున్న హింసా సమాజం మనది. దానిని గుర్తించకుండా మధ్యతరగతి నేపథ్యంలో (పేమలేనప్పుడు ప్రీ పురుషులు విడిపోవడం గురించీ, ప్రేమకు చావు పటకలుంటాయి, మారుతుంటుంది, ఒక సజీవమైన సంబంధం కాబట్టి ప్రేమను కాపాడుకోవలసిన బాధ్యతనూ, ప్రేమ బతకాలంటే వుండాల్సిన వాతావరణాన్ని చిత్రిస్తూ, రచనలు చేస్తున్న స్తీనాదులను మనసైనప్పుడు మనసైన వారిని అనుభవించే అవకాశం కోసం అడుగుతున్న వారిగా చిత్రించబూనుకోవటం రచయిత వికృతపుటాలోచనను తెలియచేస్తుంది. ఆ కథలో నేను ఫలానా ఆవిడకు మొగుడ్ని కాను, ఫలానా వారికి తండ్రిని కొను అని ఒక పాత్రచేత ఎంత అపహాస్యం చేయడానికి చెప్పించినా మేం సీరియస్‌గా చెబుతున్న మాటల సారాంశం అదే! మొగుడి లా “తండ్రిలా ఆధిపత్యం చెలాయించడంతో మీ జీవితానందాలను నాశనం చేసుకోకండి. సహచరుల్హా, స్నేహితుల్లా మీరు కలిసి బతికే స్త్రీతోనూ, మీ పిల్లలతోనూ మీ సంబంధాలను చక్కబరుచుకోండి అని. ఇక ఈ కథ పక్కనబెడితే స్త్రీవాదం గురించి ఈయనకు చాలా ఆందోళన, ఆవేశం పెల్లుబికాయి. ప్రీవాదం రకరకాలుగా వుందట. ఎందుకు వుండగూదదనే ప్రశ్నగానీ, వుండడమే మంచిదనే ఆలోచనగానీ ఈయనకు రావాలని ఆశించటం అత్యాశే అవుతుంది. ఈయన సమర్ధిస్తున్నట్టు కన్పిస్తున్న వర్ణపోరాట సిద్ధాంతం మాత్రం ఒకటిగా

వుందా? అందులో ఎన్ని శాఖలూ, ఎన్ని విభేధాలూ లేవు? అదీయనకు గుర్తున్నట్లు లేదు. ఏ అణచివేత కూడా ఏకశిలాసదృశ్యంగా వుండదనీ, ఎన్నోరకాల తేడాలతో, ప్రత్యేకతలతో వుంటుందనీ, దానికి ప్రీల అణచివేతగానీ, ప్రతిఘటనగానీ మినహాయింపు కాదనీ స్త్రీవాదులు భావిస్తారు. స్రీలు కూడా ప్రత్యేకతలతో వున్నారు. అవన్నీ వారి ప్రతిఘటనలో, వారు చేస్తున్న వుద్యమాలలో, ఆ వుద్యమాల నుంచి రూపొందే సిద్ధాంతంలో ప్రతిఫలిస్తాయి. అందులో ఆశ్వర్యపోవడానికేమీ లేదు.

ప్రీ వాదులు అదేమంటే "సైమన్‌ ది బోవా' అనీ మరొకటనీ అంటారట - మార్చునో, లెనిన్‌నో, మావోనో కోట్‌ చేస్తే రానిఇబ్బంది మేధావులైన స్త్రీలను, స్రీవాద సిద్దాంతాన్ని అభివృద్ధి చేసిన స్త్రీలను కోట్‌చేసినప్పుడు ఎందుకు వస్తుందో ఆలోచించుకోవాలి. మాకు కావలసిన ప్రీ విముక్తి ఎలాంటిదో మేం అనేకచోట్ల చెప్పాం. ప్రీ పురుష సమానత్వం స్రీ ఒక్కతే సాధించలేదనే పరమసత్యం యిప్పుడే కనుగొన్నట్లు చెబుతుంటే నవ్వొస్తుంది. ప్రీవాదులు ఆశించే సమాజం ప్రీ పురుషులిద్దరూ సమానవకాశాలతో వుందేదేనని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కానట్లు, బుర్రకెక్కనట్లు నటించే వారిని ఏం చేయగలం. స్త్రీపురుషులిద్దరూ శత్రువర్గాలు కాదు అని ఒక వ్యాఖ్యానం చేస్తే సరిపోదు. ఇంటా బయటా భద్రతలేని స్థితిలో, నిరంతరం మానప్రాణాలను ఎలా రక్షించుకోవటమా అని ఆందోళనపడే ప్రీలు నిర్ణయించుకుంటారు, ఎవరు మన శత్రువులు, ఎవరు మనమిత్రులు, ఎవరితో ఎలాంటి సహకారం, పొత్తు కుదుర్చుకోవాలి అని. అది వాళ్ల చావుబతుకులకు సంబంధించిన సమస్య. మీరు చెప్పిన సారా పోరాటానికి స్రీలు కదిలింది కూడా ఈ హింసా పరాకాష్టను భరించలేకనే. నిత్యం తన్నులు తన్నేవారినీ, చంపాలని ప్రయత్నించేవారినీ, అత్యాచారానికీ తలపదేవారినీ, జీవకారుణ్య దృష్టితో చూడమని బోధించడానికి మేం సిద్ధంగా లేం. మా పోరాటంలో కలిసి వచ్చే వారితో మేం ఐక్యంగా కలిసి పనిచేయగలం. శత్రువులుగా వుండదల్పుకున్నారా,మిత్రులుగా చేయి చాస్తారా అనేది తేల్చుకోవలసింది మీరు. ప్రీల వెనుకబాటుకి కారణం వ్యక్తులుగా ఒక్కొక్క మగవాడూ కారణమనేంత అజ్ఞునంలో ప్రీవాదులు ఎప్పుడూ లేరు. ప్రతి మగవాడికీ స్త్రీని అణిచే అనేక మార్గాలను తెరిచి వుంచిన పిత్రుస్వామ్య సమాజం గురించే వాళ్లు మాట్లాడుతున్నారు. సమస్య ఏమిటంటే స్త్రీవాదులు ఏం మాట్లాడినా మేం మా ఇష్టం వచ్చినట్టు అర్ధం చేసుకుంటాం అనే ధోరణి పెరిగిపోవటమే.

సంకలిత - ఓల్గా * 61

ఇక కెరియరిస్టులైన ప్రీ వాదుల గురించి ఈయన మాట్లాడిన మాటలు ఎంత అర్థం లేనివో. కెరియరిస్టులు ప్రతివాదంలోనూ ప్రతి పార్టీలోనూ వుంటారు. నిజానికి ప్రీవాదంలో ఆచరణ లేకుండా కేవలం మాటలతో కాలక్షేపం చెయ్యటం కష్టం. వర్గవైరుధ్యాల గురించి మాట్లాడటం చాలా సులువు. ఆచరణ లేకుండా దోపిడీ, అణచివేతల గురించి వుపన్యాసాలు దంచడం మరింత సులుపు. అట్లాంటి వారిని మనం చాలామందిని చూసివున్నాం. స్రీ వాదాన్ని తిట్టటానికి వర్గ దృక్పథాన్ని భుజాన వేసుకోవటం కూడా చాలా సులువు. వర్దాన్నీ జండర్‌ని సమాన స్థాయిలో అర్ధం చేసుకొని రెండింటినీ ప్రతిఘటించే మార్గాల కోసం అన్వేషిస్తున్న (స్త్రీవాదులను ఎంతెంత మాటలైనా అనడానికి సాహసించేవారిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్న అభ్యుదయ వాదులు తోలేటి జగన్నోహనరావుకి అర్థం కాకపోవటంలో ఆశ్చర్యం లేదు. ఆయన అర్థం చేసుకోవాలని కూడా అనుకోవటం లేదని ఆ వ్యాసం చదివితే తెలుస్తూనే ఉంది. ఇక జయలలితనూ, తాయమ్మనూ పోలుస్తూ ఆయన చేసినవాదం ఏ కొంచెం ఆలోచించే వారికైనా వెగటు పుట్టించేలా వుంది. జయలలిత, తాయమ్మల అణచివేత ఒకటేనని స్త్రీవాదులు అంటారా? ఎవరన్నా ఎక్కడన్నా అన్నారా? జయలలిత పురుష రాజకీయ సంస్కృతి నుంచి వచ్చిందనటం కూడా తప్పేనా? ఇన్నాళ్ళ నుంచీ రాజకీయాలు నడిపింది ఏ వర్గమో, ఏ లింగమో, ఏ కులమో అందరికీ తెలుసు. అగ్రవర్ణ అగ్రవర్గ పురుషులు యిన్నాళ్ళూ రూపుదిద్దిన రాజకీయ సంస్కృతి నుంచి బయటపడటం సులువు కాదు. స్రీలు, దళితులు కూడా ఈ సంస్కుతిలో పడిపోతారు. ఆ ప్రమాదం వుంది. అది చరిత్రలో జరిగింది. అలాగే జయలలిత ప్రీ అనే ఒక్కఅంశాన్నే కాకుండా ఆమె ఏ వర్షానికి చెందింది, ఏ వర్గానికి ప్రాతినిద్యం వహిస్తుంది అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తీసుకుంటాము. ఆడవాళ్ళ కూలీరేటు మగ కూలీకిచ్చే దానికంటే చాలా తక్కువ వుంటుందనీ, దానిని మార్చడానికి చాలా పోరాటాలు జరిగాయనీ, జరగాలనీ తెలయదా అని ఆశ్చర్యం వేస్తుంది, ఆడకూలి డబ్బులతోనట చూశారా అన్న జగన్మోహనరావుగారి వ్యాఖ్యానం చూస్తుంటే. “ప్రతి ప్రీ ఒక నిర్మల కావాలి! అన్న కవితలో రకరకాల సమాజాల్లో స్రీ అణచివేత గురించీ, ఇప్పటి సమాజంలో ధనిక మధ్యతరగతి, కార్మిక వర్ణాలలో ప్రీ స్థితిని నేను చెప్పాను. ఆ కవితను వక్రీకరించి, దానిని జయలలిత, తాయమ్మల స్థితితో పోల్చి నానా గందరగోళం చేశాడీయన. సంకలిత - ఓల్లా ౪62

ఇక ప్రీకి విముక్తి చిట్టచివరికన్నా ప్రసాదించారు. చిట్టచివరకు, యిక గత్యంతరం లేదనుకునే వరకూ వాళ్లకు విముక్తి యివ్వకుండా వుండాలనే మీ ఆలోచన తేటతెల్లంగానే వుంది. ఇన్‌స్టెంట్‌ పరిష్కారాలు, అరచేతిలో స్వర్గాలూ ప్రీవాదులు ఎప్పుడూ చూపలేదు. కుటుంబం గురించీ, జండర్‌ గురించీ మనదేశపు నేపథ్యంలో మా ఆలోచనలు చాలాసార్లు చెప్పాం. చెబుతున్నాం. అలాగే మేం కచ్చితమైన డిమాండ్లతో పనిచేస్తున్నాం. పేదరికం, హింస, మానవహక్కులు, విద్య, ఆరోగ్యం వంటి విషయాలలో స్త్రీలకు అవకాశం కోసం అడుగుతున్నాం. మేం 'ఏమడుగుతున్నామో తెలియక అడగటం వేరు. తెలియనట్లు ఆడగటం వేరు. మొత్తం మీద ఈ కథానేపథ్యంలో ఆయన తన వ్యాసాన్ని ప్రీవాదుల మీద దాడికి వుపయోగించుకున్న పద్ధతి ఆయన అక్కసుని తెలియచేస్తుంది. స్త్రీల వుద్యమాల నేపథ్యంలో, స్త్రీవాద సిద్ధాంతం పదునెక్కుతున్న నేపథ్యంలో మగవాడిలా తప్ప మానవుడిగా ఆలోచించ నిరాకరించే మన మేధావుల, రచయితల గోడు యెట్లా వుంటుందో, అప్పుడప్పుడూ యిలాంటి రాతల వల్ల అందరికీ

తెలియటం కూడా అవసరమేనేమో! ఆదివారం ఆంధ్రజ్యోతి 4 జనవరి 1998

సంకలిత - ఓల్గా * 63

టన 10

ఆలోచింపచేసే కథలివి

ఎంతపెద్ద విషయాన్నయినా చిన్న కథలో ఇమడ్చాలని కుతూహలపడే కథా రచయిత యాళ్ల అచ్యుత రామయ్య, ఈ సంపుటిలోని ఇరవై రెండు కథలలోనూ ఎంతో వైవిధ్యం వుంది. ఐతే ఆ వైవిధ్యాన్ని ఆవరించుకుని ఒక స్పష్టమైన అవగాహన కూడా వుంది. అచ్యుత రామయ్య ప్రగతిశీల రచయిత. దానితోపాటు 90వ శతాబ్ధంలో తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన స్త్రీవాదం అచ్యుత రామయ్యను ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది. 1991 నుండి1998 వరకు రాసిన ఈ ఇరవై రెండు కథలలో అభ్యుదయ, స్త్రీవాద దృకధాన్నించి అనేక సమస్యలను పరిశీలించే ప్రయత్నం చేశాడు. 1991లో 'రావణకాష్టం' రాసినప్పుడు అచ్యుత రామయ్యకు స్త్రీల సమస్యల పట్ల సానుభూతి, డబ్బుకోసం మనుషులు చేసే అఘాయిత్యాల పట్ల కోపం మాత్రమే వున్నాయి. అందుకే ఆ కథలో నాయిక తులసి, తల్లిదండ్రులు తన బాధను విని కూడా అత్తారింటికే వెళ్ళమంటే మౌనంగా వెళ్ళిపోయింది. అక్కడ భర్తచేతిలో అనేకమంది నిర్భాగ్యులవలే హత్యకు గురైంది. మరణించేపుడు తనది ఆత్మహత్యేగాని హత్యకాదని చెప్పి మరణించింది. తులసి పాత్ర మీద మనకు సానుభూతితో పాటు విసుగుతో కూడిన కోపం కూడా వస్తుంది. రచయిత భావాలకు ప్రాతినిధ్య పాత్రగా నిలిచే ఉమ కూడా తల్లిదండ్రులతో 'భర్తపెట్టే బాధలు భరించలేక తల్లిదండ్రుల దగ్గరకు వస్తే ఆమె మంచి చెడులు చూడటం మీ ధర్మం కాదా? నాన్నా, నీకేమయినా థైర్యం వుంటే దగ్గరుండి పెళ్ళి జరిపించిన పెద్దలందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి “మరొకసారి మా అమ్మాయిని బాధపెట్టినట్లు తెలిసిందా, నీ మక్కెలిరగదన్నుతాం” అని హెచ్చరించి రండి” అని

సంకలిత - ఓల్లా * 64

మాత్రం అంటుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆపని చెయ్యకపోతే అక్కనెలా రక్షించుకోవాలో ఆమెకు కూడా తెలియదు. బహుశ తనను తాను రక్షించుకోవాలనే పట్టుదల లేని స్త్రీని ఎవరూ రక్షించలేరేమో! ఐతే క్రమంగా అచ్యుత రామయ్య సృష్టించే ప్రీ పాత్రల్లో మార్చు వచ్చింది. ప్రీల సమస్యల గురించి తనకొక స్పష్టమైన అవగాహన ఏర్పడుతున్న కొద్దీ రచయిత సృష్టించే ప్రీ పాత్రలు రాడికల్‌గా మారాయి. అందరినీ అన్నిటినీ ఎదిరించి తమ జీవితాలను తమ చేతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నించే స్త్రీలు ఈ కథలలో ప్రత్యక్షమవసాగారు. 'ఒక అడుగు ముందుకు లో వంచించిన ప్రేమికుడి మెడలు వంచో, ఒత్తిడి చేసో, భయపెట్టో పెళ్ళాడటం మంచిది కాదని చెప్పే సాహసం చేశాడు. నిజానికి ఒరిస్సాలో గిరిజన బాలిక “సబిత చేసిన మౌనపోరాటం తర్వాత, అది వెండితెరకెక్కి విజయం సాధించిన తర్వాత కొంతకాలంపాటు ఆంధ్రదేశంలో మౌనపోరాటాలు వేలాదిగా జరిగాయి. అంటే స్రీలు గురయ్యే మోసాలు చీకటి చాటునో, కుటుంబ మర్యాద వెనకనో అజణిగిపోకుండా బైటికి వచ్చాయి. ఐతే సబితగ్గానీ, మౌనపోరాటం చిత్ర కథానాయిక గానీ మోసాన్ని బైటపెట్టాలనీ, తమబిడ్డలు చరిత్రహీనులవకూడదనీ మాత్రమే అంతపోరాటం జరిపారనే సంగతి చాలామంది పట్టించుకోలేదు. అనేకమంది స్త్రీలూ, ఆలోచనాపరులూ కూడా మౌనపోరాటాల వల్ల మోసం చేసిన పురుషులు పూర్తిగా మారి మంచి వైవాహిక జీవితాన్ని గడుపుతారని ఆశించారు. వారి ఆశలు చాలాసార్లు నిజం కాలేదు. మోసపోయిన స్త్రీల జీవితాలు మరింత దుర్భరమయ్యాయి. ఈ విషయాన్ని ఈ కథలో మృణాళిని అర్ధం చేసుకున్న తీరు అభినందనీయం. 'రావణకాష్టం' నుండి నిజంగానే ఈ కథ 'ఓ అడుగు ముందుకే'. “అభిమాన భంగం లోనూ కొత్త ధోరణిని చూపిన అచ్యుత రామయ్య వివాదాస్పదు డయ్యాడు. రేప్‌ కాబడిన అమ్మాయి అది తన శరీరానికి జరిగిన నొప్పి మాత్రమేనని, గాయం మాత్రమేననీ అనుకోటానికీ, నమ్మటానికీ ఎంతో అవగాహన, సాహసం కావాలి. ఆమె నమ్మకాన్ని తూట్లు చేయడానికి ఇంటాబైటా స్వజనమూ, ఇరుగుపారుగులూ శాయశక్తులా ప్రయత్నిస్తారు. వాటన్నిటిని తట్టుకుని నిలబడిన పాత్ర కౌస్తుభ. తనపై జరిగిన దాడి గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటుంది. స్త్రీల సమస్యలను ఒక కోణంలోనే చూని ఒకేరకంగా అర్ధం చేసుకుని ఒకే వరిష్కారాన్ని అందించలేమనటానికి రేప్‌' ఒక వుదాహరణ. తనపై జరిగే అత్యాచారాల గురించి మాట్లాడకూడదని స్రీలకు చిన్నప్పటి నుంచీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక బోధ జరుగుతుంది. చాలాసార్లు వాటి గురించి మాట్లాడించటం అవసరమవుతుంది. స్త్రీలపై సంకలిత - ఓల్లా * 65

జరిగే హింసను వెలికి తీసుకురానిదే దానిని ఆపటానికి అవసరమైన నామాజిక పరిష్కారాలను వెతకటం సాధ్యం కాదు. అదే సమయంలో చైతన్యపరంగా స్త్రీలు రేప్‌ని తమ జీవితాన్ని అంతంచేసేంత, చేసుకునేంత భయంకరమైన విషయంగా చూడకూడదనే విషయాన్ని కూడా పదేపదే చెప్పాల్సి వుంటుంది. ఈ రెండింటి మధ్యా ఒక తేడా వున్నట్లు కనిపిస్తుంది. నిజానికి ఆ తేడా ఏమీ లేదు. అలాగే నేరస్తులకు శిక్ష పడాలంటే స్రీలు మరింత బాధను అనుభవించాలి. కొందరికైనా శిక్ష పడాలంటే స్త్రీలు దానిని గురించి మాట్లాడి, న్యాయస్థానాలకు వెళ్ళక తప్పదు. కౌస్తుభ అలా చెయ్యననటం కూడా చాలామందికి కొరుకుడు పడలేదు. ఐతే ఈ పోలీసు వ్యవస్థా, న్యాయ వ్యవస్థా పనిచేసే తీరుచూసి కౌస్తుభలాంటి అమ్మాయిలు ఈ నిర్ణయానికి వస్తే వాళ్ళను తప్పు పట్టాల్సిన పనిలేదు. కౌస్తుభ తనపై జరిగిన అత్యాచారానికి వ్యక్తిగత పరిష్కారం కంటే సామాజిక పరిష్కారం కావాలనుకుంది. ఆ వైపుగా పనిచెయ్యటం మొదలెట్టింది. అచ్యుత రామయ్య తన కథలలో పదేపదే చెప్పే విషయం సామాజిక కారణాలు, సామాజిక పరిష్కారాలు. అచ్యుత రామయ్యకున్న ప్రగతిశీల దృక్పథం ఆయన కథలలో చాలావాటికి ఈ ముగింపునే అందించింది. మళ్ళీరావణకాష్టం' గురించి అనుకోక తప్పటం లేదు. పెళ్ళనే రావణకాష్టంలో తులసి వంటివాళ్ళు ఆహుతవుతున్నారని చెప్పి వారిపై సానుభూతి కలిగించిన రచయిత 1995 లో "నేను సీతను కాను” రాసే నాటికి పెళ్ళి గురించీ, దానిలో అధికార సంబంధాల గురించి, కీలక విషయం గురించి చాలా స్పష్టత వున్న పొత్రను సృష్టించాడు. ఒక రాత్రి పరాయి మగవాడి ఇంట్లో గడిపిందనే కారణంతో భార్యను అనుమానించే భర్రతో ఆమె అంటుంది - “సంసారమనేది గానుగాట లాంటిది. భార్య అనే ఎద్దుకు శీలమనే గంతలు కళ్ళకు కట్టి భర్త అనే తెలుకలవాడు కర్రపెత్తనం చలాయిస్తుంటాడు” అని. 1998 నాటికి రచయిత పెళ్ళిలో ప్రీకి రక్షణ దొరుకుతుందనే అభిప్రాయాన్ని తుత్తునియలు చేసే 'భర్త కాటుకు కుక్కదెబ్బ' అనే కథ రాశాడు. కష్టసుఖాలలో పాలుపంచుకోకుందా భార్యను అవమానించి హింసించే భర్తను నమ్ముకోవటం కంటే ఒక కుక్కను నమ్ముకోవటం మంచిదనుకుంటుంది వనజ. భర్త ఇల్లు ఒదిలిపోయాక ఒక కుక్కను పెంచుకుంటుంది. తిరిగివచ్చి అలవాటు ప్రకారం వనజను కొట్టబోయిన అనంత్‌ మీదకు దూకుతుంది ఆ కుక్క 'తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న వాళ్ళను ఎవరైనా అవమానిస్తే చూస్తూ ఊరుకోవడానికి భర్త కాదు - విశ్వాసం వున్న కుక్క”. సంకలిత - ఓల్లా ౪ 66

“తనకిప్పుడు భయం లేదు. భర్తా, పోలీసులూ, ప్రభుత్వమూ కల్పించని భద్రతను ఓ కుక్క కల్పించింది.” అనుకుంటుంది వనజ. ఇది మనుషుల్ని నమ్మలేని సమాజం, కరాటేలపై, కుక్కలపై ఆధారపడాల్సిన సమాజం. మగసమాజం. ఈ మగ సమాజాన్ని మనుషుల సమాజంగా మార్చాలనే తపన వున్న పాత్రలను సృష్టించటం అచ్యుత రామయ్య ప్రత్యేకత. “ఆమె నవ్వు కథలో అచ్యుత రామయ్య సమాజంలో అమలులో వున్న ద్వంద్వ నీతులను ప్రశ్నించాడు. తన కొలీగ్‌తో వివాహేతర సంబంధాన్ని కోరిన వేణు, తన భార్య మాలతి అలాంటి సంబంధంలో వుందని తెలిసి కుష్పకూలిపోతాడు. మాలతిని నిలదీస్తే ఆమె అర్ధవంతమైన నవ్వు నవ్వుతుంది. ఆ నవ్వులో అర్జాన్ని గ్రహించే శక్తి లేని వేణుమళ్ళీ అడుగుతాడు 'నేను నీకేం హోనిచేశాను. నాకింత అన్యాయం ఎందుకు చేసావని' - ఆమె చాలా శాంతంగా జవాబిచ్చింది. “ఈ గోడ నాతో పాటుగా పన్నెం దేళ్ళుగా కలిసి వుంది. ఇది నాకెప్పుడూ హాని తలపెట్టలేదు. అంత మాత్రం చేత నేనీ గోడను ప్రేమిస్తూ కూర్చోలేను కదా” అని. వివాహ జీవితంలో (ప్రేమ కరువై, స్పందన లేని భర్తలతో విసిగిన స్రీలు, వివాహేతర సంబంధాలలోకి వెళ్తే అందరూ వాళ్ళనే తప్పుబడతారు. భార్యలనుంచి ఏ లోపమూ లేకున్నా వారి ఢేమను లెక్కచెయ్యకుండా ఇతర సంబంధాలలోకి వెళ్ళిన పురుషులు రసికులవుతారు. శ్రీకృష్ణులవుతారు. ఈ ద్వంద్వ నీతిని సవాలు చేస్తుందీ కథ. అచ్యుత రామయ్య అన్నీ ప్రీలకు సంబంధించిన కథలే రాశాడనుకుంటే పొరపాటు. ఇరవై రెండు కథలలో ఆరు కథలే అవి. ఐతే ప్రతి కథా ఒక కొత్త అంశాన్ని కొత్త దృష్టినించి చెప్పటంలో అన్నిటినీ ప్రస్తావించాల్సి వచ్చింది. అచ్యుత రామయ్య రాసిన మంచి కథలలో “గారడి ఒకటి. జీవితంలో మనం ఎన్నో భ్రమలతో బతుకుతుంటాం. వాటిలో కొన్ని హాని చేసేవి. కొన్ని ఆనందాన్నిచ్చేవి. కొన్ని ఎక్కువ హానిచేసేవి, కొన్ని తక్కువ హానిచేసేవి. ఈ తారతమ్యాలు పాటించకుండా మనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో మనుషుల భ్రమలను బద్దలు కొట్టాలని చూస్తే మన ముఖమే బద్దలవుతుంది. బాబాల గారడీ విద్యల జోలికి పోటానికి సాహసించని వాళ్ళు వీధి గారడీ వాళ్ళను సవాలు చేయటానికి సిద్ధమవుతారు. పేద రికార్డు డాన్సర్లను పట్టుకు శిక్షించి, టి.విలో డాన్స్‌ బేబీ డాన్స్‌లో పరమ ఘోరమైన రికార్డింగ్‌ డాన్సులను అనుమతించి లొట్టలేసుకు చూసే ప్రభుత్వ యంత్రాంగం లాగా. అలాంటి ఓ యువకుడు, తన గ్రామంలోని విద్యావంతుల్లో ఒకడు, తన కుటుంబంలో మొదటి విద్యావంతుడు, తన ఊళ్ళో సంకలిత - ఓల్లా *67

గారడీ విద్యతో పొట్టపోసుకునే అతన్ని సవాలు చేస్తాడు. అతనిదంతా అబద్ధమంటాడు. కొడుకు మెడకోసి అతికించే విద్యను బహిరంగంగా ప్రదర్శించమని సవాలు చేస్తాడు. పాపం తనుచేసే ప్రభుత్వోద్యోగంలో చేయవలసింది ఈ గారడీనేననీ, ప్రజలను భ్రమలలో ముంచటమేననీ అతనికి తెలియదు. ప్రధానమంత్రి నుంచీ నాయకులందరూ ప్రదర్శించేదీ గారడీనేననీ గ్రహించలేని అమాయకుడు. అవతల గారడీవాడు తన వృత్తిని నిరూపించుకోటం కోసం, కాపాడుకోవటం కోసం కొడుకుని చంపుకోటానికి సిద్ధమయ్యాడు. ఈ చివరి క్షణాల్లో వివేకోదయమైన ఆ యువకుడు ఆ అఘాయిత్యాన్ని ఆపుతాడు. ఈ పాపిష్టి సమాజంలో పొట్టకోసం ఎన్నిపాట్లు పడాలో తెలియజేప్పే మంచి కథ 'గారడి'. “కొత్త సీసాలో పాతసారా? 'దగాపడిన దేవుడు” వంటి వ్యంగ్య కథలు రాయటంలో అచ్యుత రామయ్యకు మంచి వుత్సాహం వుంది. అచ్చంగా అలాంటి కథలతో ఒక సంపుటి తెచ్చినా బాగుంటుంది. 'శసభంగం', ఇవాళ్టి మన యాంత్రిక జీవిత విధానాలకూ, అర్ధంపర్థంలేని పిల్లల చదువులకు, ఆ చదువుల కోసమే బతుకుతున్న తల్లిదండ్రుల జీవితాలకూ అద్దం పట్టిన కథయితే, 'ఆనందమే జీవిత మకరందం” ఈ రొటీన్‌ టల బురదలోంచి, సంపాదన రొంపిలోంచి పైకిలేచి, స్వచ్చమైన నీళ్ళతో ఒళ్ళు కడుక్కుని మంచి గాలి గుండెల నిండా పీల్చుకుని ప్రాణహితంగా, ప్రాణసహితంగా బతకమని చెప్పే కథ. “నిజాయితీ పరుడు, 'తలుపు సందు నీతి, “నేటి సిద్దార్ధ కథలు సంక్షిష్ట సామాజిక సందర్భంలో మధ్య తరగతి జీవులైన, వాళ్ళ ఆలోచనలూ, వాళ్ళ ఆచరణలూ ఎట్లా వుంటాయో, దానివల్ల కలిగే హాని ఏమిటో చెప్తాయి. 'చందు' కథలో పిల్లల మనస్తత్వాన్ని పట్టుకోడానికి ప్రయత్నించాడు. మొత్తానికి ఈ కథల సంపుటి ఆలోచింపచేస్తుంది. అశాంతి పెడుతుంది. కొంతమందికి కోపాన్ని కలిగిస్తుంది. సాహిత్య ప్రయోజనం ఇలాంటి స్పందనే కదా! యాళ్ళ అచ్యుత రామయ్య కథా సంపుటి 'ఆమె నవ్వుకు ముందుమాట 18 ఫిబ్రవరి 20083 సంకలిత - ఓల్లా * 68

క స 2004 కథా సాహిత్య సింహావలోకనం “తెలుగు కథలు చాలా అభివృద్ధి కావలసి వుంది... కథలు యావత్తూ ఒక్క బ్రాహ్మణ సంసారాల చుట్టూ తిరుగుతున్నై.. తెలుగు సంఘం ఒక్క బ్రాహ్మణులతోనే లేదు. బి.ఏలు పాసయిన యువకులతోనూ లేదు. తెలుగువాళ్ళ ముఖ్య వ్యాపారం స్తీ పురుషులొకర్నొకరు ్రేమించుకోవటమూ కాదు. కానీ కథలు ఎంతసేపటికి ఈ ధోరణిలోనే వుంటున్నై. 1985లో కథా సాహిత్యం గురించి కొడవటిగంటి కుటుంబరావు గారి వ్యాఖ్యానం ఇది. ఆయనే 1956లో “కార్మికులు, కర్షకులు, కుమ్మరి, సాలె, వడ్రంగి మొదలైన వృత్తుల వారు ఎట్లా జీవిస్తున్నారు? అట్లా ఎందుకు జీవిస్తున్నారు? వారి సమస్యలేమిటి? వాటినెట్లా పరిష్కరించుకుంటున్నారు? నా తరపున దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం వారి సమస్యలను ఎట్లా పరిష్మరించబోతోంది. ఇటువంటీ ప్రశ్నలు కలగకుండా జీవితాన్ని చిత్రించి చూపగల సాహిత్య శాఖలలో కథా సాహిత్యం అగ్రగణ్యమైంది. అన్ని వర్గాలనుంచీ రాగలిగింది. అన్ని వర్గాలకూ పోగలిగింది.” అని కథకున్న విస్ఫృతిని ఎత్తి చూపారు. కానీ అప్పటికి కథ ప్రధానంగా అగ్రవర్ణ జీవితాన్నే చిత్రిస్తూ వచ్చింది. 1967లో కుటుంబరావుగారికి కథాసాహిత్యం మీద ఆశ పూర్తిగా సన్నగిల్లింది. ఒకవ్యాసంలో ఆయనిలా రాశారు. “ఒకవేళ ఈ యుగపు ప్రజల సాహిత్యావసరాలను తీర్చటానికి చిన్నకథ చాలదేమౌ, జీవితాన్ని మరింత విశాల దృష్టితో, మరింత లోతుగా తెలుసుకోవాలన్న కోరిక సంకలిత - ఓల్గా * 69

చదివేవారిలో కలుగుతున్నదేమో. ఇదే నిజమైతే చిన్న కథకు ఇక పత్రికలలో తాత్కాలిక స్థానం మాత్రమే వుండవచ్చు. ఐతే 80వ దశాబ్ధం నుంచీ కథా సాహిత్యం మెల్లగా పుంజుకుంది. నవల కంటే కథలు పాఠకుల ఆదరణ పొందసాగాయి. అస్తిత్వ రాజకీయాల నేపథ్యంలో వర్ద, వర్ష, లింగ, స్పృహ పెరగటంతో రచయితలు వైవిధ్య భరితమైన అనేక జీవిత విధానాలనూ, విషాదాలనూ, ప్రత్యేకతలనూ చెప్పటానికి కథ సరియైన మాధ్యమంగా స్థిరపడిపోయింది.. అంతకు ముందు సుప్రసిద్ధ కథకులూ, మంచి కథలూ లేవని కాదు. కథ కథకులను దాటి ఒక ప్రక్రియగా, వుద్యమంగా ప్రత్యేక స్థానాన్ని పొందటం 80వ దశాభ్ధిపు చివరి సంవత్సరాలలో మొదలై 90 దశాబ్ధంలో స్థిరపడింది. ప్రజల జీవిత వేగం పెరగటంతో చదవటానికి కూడా నవల కంటే కథ ప్రజలకు అనుకూల సాహిత్య ప్రక్రియ అయింది. 2004వ సంవత్సరానికి ఒక ప్రాధాన్యత వుంది. ప్రజలు మత ఛాందస వాదానికి వ్యతిరేకంగా తమ తీర్పునిచ్చారు. ప్రపంచీకరణకు, సరళీకృత ఆర్థిక విధానాలకూ తాము సుముఖం కాదని చెప్పగలిగినంత స్పష్టంగా చెప్పారు. తీర్పు వుత్సాహాన్ని ఇచ్చి వుండాలి. ఆ వుత్సాహంతో రచయితలు ఎలాంటి కథలు రాశారు? అంతకు ముందునుంచీ ప్రపంచీకరణకూ, మన ఛాందసవాదానికీ వ్యతిరేకంగా రచనలు చేస్తున్న రచయితల రచనలలో యిప్పుడు మరింత గుణాత్మకమైన మార్చు వచ్చిందా? కొత్త రచయితలు, లేదా ఈ విషయాల మీద ఇప్పుడు కొత్తగా రాసే రచయితల రచనలు ఎలా వున్నాయి? ఇవి ఈ సంవత్సరం కథలు చదువుతున్నప్పుడు నన్ను కుతూహల పరిచిన విషయాలు. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు అనగానే అదేదో ఆర్ధిక రాజకీయాలకు సంబంధించిన కథలనీ, అవి (ప్రత్యేక దృక్పధమున్న రచయితలే రాస్తారనీ అనుకుంటే పొరపాటు. ప్రపంచీకరణ రధచక్రాల తాకిడికి గురికాని ప్రజలు భారతదేశంలో, దానిని మరింత వేగంగా అమలు జరపాలని వుబలాటబడిన ఆంధ్రప్రదేశ్‌లో అసలే లేరు. సమస్త మానవ సంబంధాలకూ వాటి తాకిడి తగులుతూనే వుంది. మానవ జీవితంలోని అతి సున్నిత పార్య్యాలను కూడా అవి ప్రభావితం చేశాయి. అనేక మానవ సంకలిత - ఓల్లా ౪70

విలువలను తల్లకిందులు చేశాయి. చెల్లా చెదురుచేశాయి. అందువల్ల 2004 వ సంవత్సరపు కథకులు ఏ విషయంమీద కథరాసినా ఆ కథలలలో అంతర్లీనంగా వీటి ప్రభావం వుండి తీరాలి. ఆ ప్రభావం, దాని తాలూకూ ఛాయలూ లేని కథలు వున్నాయంటే ఆ కథలకూ సమాజానికీ ఏ సంబంధమూ లేదన్నమాట. ఆ కథలు 2004 సంవత్సరంలోనే రానవసరం లేదు. పదేళ్ళ ముందు పదేళ్ల తర్వాత కూడా అలాంటి కథలు రావొచ్చు. దురదృష్ట మేమంటే అట్లాంటి కథలు కూడా వచ్చాయి. వాటిని గురించి కథా వార్షిక సమీక్షలో ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదని నేననుకుంటున్నాను.

2004లో వచ్చిన కథలు 1956లో కొడవటిగంటి కుటుంబరావు కథా సాహిత్యం గురించి పెట్టుకున్న ఆశలను సఫలం చేశాయి. ముఖ్యంగా గ్రామీణ సమాజంలోని సమస్త వృత్తులూ తమ సహస్ర చిహ్నాలతో ఈఏడాది కథా ప్రవేశం చేశాయి. గత అయిదారేండ్ల నుంచీ ఈ క్రమం ప్రారంభమైనా ఈ సంవత్సరం చేతి వృత్తులను జీవనాధారంగా చేసుకున్న ప్రజల జీవన విషాదాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్న మంచి కథలు అనేకం వచ్చాయి. ఐతే ఇక్కడ ఒక సంగతి ప్రస్తావించాలి. రచయితలలో కొందరికి వీటిని కులవృత్తులుగా చూడాలా చేతి వృత్తులుగా చూడాలా అనే విషయంలో గందరగోళం వుంది. కులవృత్తులు పోతున్నాయంటే కులాల మధ్య అంతరాలు పోవాలి. కానీ అలా జరగటం లేదు. కుల అణచివేత ఏ మాత్రం చెక్కుచెదరకుండా జీవనాధారంగా వున్న వృత్తులు చేజారిపోవటం గ్రామసీమలలో దళిత బహుజనుల జీవితాన్ని దుర్భరం చేసింది. ఐతే కులానికీ వృత్తికీ వన్న సంబంధాన్నీ వైరుధ్యాన్నీ పరిశీలిస్తూ ఆ సంఘర్షణను చిత్రించిన రచయితలు తక్కువనే చెప్పాలి. జీవనాధారాలైన వృత్తులు పోయి అలమటిస్తున్న (ప్రజల వేదనను రచయితలు యధాతథంగా వాస్తవికంగా రాయగలిగారు గానీ దానిలో యిమిడి వున్న అనేక వైరుధ్యాంశాలను, ఆధునికత, అభివృద్ధి అనేవాటితో ముడివడిన వాటిని పట్టుకోలేదనే అనిపించింది. ఐనప్పటికీ వాస్తవ జీవిత చిత్రణ కూడా ముందడుగే. వడ్రంగం, కుమ్మరి, హలాల్‌, బొందలు తవ్వటం, మంత్రసానిపని, నేతపని, ఎరుకల వాళ్ళు, వుత్తరాలు రాసిపెట్టి బతికేవాళ్లు, బిక్షాటన వృత్తిగా గలవాళ్ళు కూరలమ్ముకునే వాళ్లు, గ్రామీణ కళాకారులు, సెక్స్‌వర్శర్లు, రైతుకూలీలు యిలా ఎందరి జీవితాలో కథలుగా వచ్చాయి. ప్రస్తుత సమాజంలో వాళ్ళ నిస్సహాయతనూ, జీవన సమరంలో నిరాయుధంగా నిలబడిన వారి పరిస్థితులనూ కథలు చెప్పాయి.

సంకలిత - ఓల్లా * 71

చేతి వృత్తుల వారికి ఆర్థికం ఎంత ముఖ్యమైందో స్వేచ్చ కూడా అంత ముఖ్యమైన విషయమనీ, ఆ స్వేచ్చ పోగొట్టుకోవటం వాళ్లకు చాలా బాధకరమనే విషయాన్ని కథకులు చెప్పారు. వాళ్ళు పేదవాళ్ళు కావచ్చుగానీ ఒకరికింద నౌకరీ చేసేవాళ్ళు కాదు. నౌకరీ చేయటం వల్ల వచ్చే అనేక లక్షణాలు వాళ్ళకు అబ్బవు. పనిచేయటంలో కొంత స్వతంత్రతకు అలవాటుపడి వుంటారు. ఆ వృత్తులకు దూరమైనప్పుడు దరిద్రంతో పడే బాధతోపాటు కొత్త నౌకరీలలో ఒకరికింద స్వేచ్చ లేకుండా పనిచేయాల్సి రావటంలోని బాధను కూడా అనుభవించాలి. గుమస్తా మనస్తత్వానికి అలవాటు పడ్డ పట్టణ, నగర మధ్య తరగతి ప్రజలెరుగని బాధ ఇది. దీనిని 'కుట్ర' కథలో జాతశ్రీ ఎత్తి చూపుతాడు. నాగముని అనే వడ్రంగి, తన గ్రామంలోకి ట్రాక్టరు, ప్లాస్టిక్‌ వస్తువుల ప్రవేశంతో జీవనోపాధిని కోల్పోతాడు. అతని కొడుకు కోదాడ అనేచిన్న పట్టణంలో ప్టీలు కొట్లో పనికి చేరతాడు. నెలకింత అని నికరాదాయం వుంటుందనీ, ఆర్థికంగా తమను ఆదుకుంటాయనీ తెలిసినా సంతోషించలేక పోతాడు. పట్టణ మధ్య తరగతి వాళ్ళయితే ఆ నికరాదాయం చాలనుకునేవారు. నాగముని “ఒకరికింద పనిచెయ్యలేదే ఎన్నడూ. ఎందుకిట్లాంటి రోజు లని బాధపడతాడు. అదే 'కొత్త చిగురు”లో శేషారెడ్డి వవసాయం మానేసి చిన్న దుకాణం పెట్టుకుని హాయిగా వుంటాడు. కారణం అతని స్వేచ్చ అతనికి వుంది. అనేకమంది రైతులు వ్యవసాయం నుంచి వ్యాపారం వైపు మళ్ళుతున్న వాస్తవ స్థితిని 'కరువు రాగం' వంటి కథలు చెప్తున్నాయి. భిక్షాటనను వృత్తిగా తండ్రి చేస్తుంటే విసుక్కుని వ్యవసాయంలోకి దిగి ఆ నష్టాలకు తట్టుకోలేని నారాయణ పాత్ర జి.వెంకంటకృష్ణ “గరుడస్తంభం' కథలో సజీవమయ్యింది. (గ్రామాల్లో హలాల్‌ చేయటం వృత్తిగా గల పేద ముస్లిం జీవితాన్ని పెద్దింటి అశోక్‌కుమార్‌ 'జిద్దు” కథలో చెప్పారు. ఒక జీవిత విధానాన్నీ దానిలోని కషసుఖాలనూ పరిచయం చేసిన మంచి కథ 'జిద్దు- ఒక పేద కళాకారుడి జీవితాన్ని “తపస్సు' కథలో వి.ఆర్‌ రాసాని రాస్తే భార్యలను గల్ఫ్‌ దేశాలకు పనికోసం పంపి, ఇక్కడ పనిలేదనే నిరాశలో కూరుకుపోయి తాగుబోతులైన మగవాళ్ళ గురించి, నిష్రయోజకులైన వారి బిడ్డల గురించీ డి.రామచంద్రరాజు “చీకటి సవ్వడి" అనే కథ రాశారు. (గ్రామాలలో మంత్రసానుల జీవన పరిస్థితులకు కె.వరలక్ష్మి “మంత్రసాని కథ అద్దం పడుతుంది. (గ్రామీణ ప్రాంతాలలో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించటం అవసరమనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ప్రసవం మంచిగా (ప్రసూతి డాక్టరు చేతి మీదుగా జరగటం సంకలిత - ఓల్లా జ 72

మాతా శిశు ఆరోగ్యానికి మంచిదనే విషయమూ అంగీకరించాల్సిందే. మరి తరతరాలుగా మంత్రసాని పనిచేసి బతికిన వారేం కావాలి? వారికున్న నైపుణ్యాన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలెందుకు వినియోగించుకోవు? వినియోగించుకోవటానికి ఆలోచనెందుకు చేయరు? అట్లాంటి ఆలోచన లేకపోవటం వల్లనే చేయి తిరిగిన మంత్రసాని సుక్కమ్మ చేతిలో పనిలేకుండా పోయింది. తమకు చేతనైన మరో వృత్తి పందుల పెంపకంతో బతుకుదామంటే జ్వరాలకు కారణమని పందుల్ని చంపే కార్యక్రమాన్ని అమలుచేస్తారు ప్రభుత్వంవారు. గ్రామీణ ప్రాంతాలలో అనేక కుటుంబాల వలే ఎరికల సుకృమ్మ కుటుంబం కూడా స్త్రీల శ్రమ మీద ఆధారపడింది. ఆ ప్రీలు శ్రమ చేయటానికి సిద్ధంగానే వున్నారు. పనేలేదు. సుక్కమ్మ కూతురు లోవ గతిలేక వేశ్యావృత్తికి వెళు _ంటే ఏం చెయ్యలేని సుక్కమ్మ దేవుడిని తిడుతుంది. వృత్తులు మూలబడటంతో ప్రధానంగా బాధితులయింది ప్రీలు మగవాళ్ళు పనివెళుక్కుంటూ పట్టణాలకు వలసవెళ్ళినా, వున్న వూళ్ళోనే పనిలేక నిరాశా నిస్ప్రహలకు లోనై తాగుబోతులైనా, పిల్లలు వృద్ధులతో కూడిని కుటుంబభారం యావత్తు 'లోవి వంటి స్త్రీల పైన పడుతుంది. అలాంటి స్రీలకు 'లోవ' పట్టిన దారి తప్ప మరోదారిలేని పరిస్థితిని చాలామంది కథకులు తమ కథల్లో చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో పేదరిక భారం చివరికి ఎవరిమీద పడుతుందనే విషయంలో ఈ కథలు స్పష్టంగానే వున్నాయి. కరువు వాత పడ్డ రైతుల కథలు గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చాయి. వ్యవసాయంలో వచ్చిన నష్టాలను తట్టుకోలేని సుగాలీలు ఆడపిల్లల్ని అమ్ముకోవాల్సిన దారుణ పరిస్టితి శాంతి నారాయణ “నమ్ముకున్న రాజ్యం" కథలో మన హృదయాల్ని కదిలిస్తుంది. వ్యవసాయకూలీలకు వలస పోవడం అనేక సంవత్సరాలుగా అనుభవంలో వున్నదే. రైతులు కూడా వలసపోయి కూలి పనులకోసం వెతుక్కోవాల్సి వచ్చిన పరిస్థితులను 'దెబ్బ' కథలో సన్నప్రరెడ్డి వెంకటరామిరెడ్డి చెబుతారు. మెట్ట పొలాల రైతుల పరిస్థితి మరీ దారుణమైనది. అదునులో వాన కురిస్తే విత్తనాలు చల్లకుండా వుండలేరు. ఆ తర్వాత వానల్లేక పోతే ముందు పెట్టిన పెట్టుబడి అప్పుగా మిగిలిపోతుంది. అయినాసరే వాళ్ళు వ్యవసాయం మానలేరు. రైతు పుట్టుక పుట్టాక ఇట్లాంటి చిన్నచిన్న దొండ్లకల్లా ఎదపడ్తే మనం ఎవసాయం చేసినట్లే.” అనుకుంటారు డాఃఎం హరికిషన్‌ రాసిన 'పచ్చికరువు' కథలోని రైతులా. కరువు కాలంలోని రైతుల వ్యధలన్నిటినీ 2004లో వచ్చిన కథలు రికార్డు చేయగలిగాయి. ఐతే భూమి సమస్యలను సంకలిత - ఓల్లా ౪73

లోతుగా వెళ్ళి చూడాల్సిన అవసరం ఎంతైనా వుంది. తెలుగు కథకులు ఆ సమస్యలను కథలలోకి తీసుకొచ్చి తెలియజెప్పాలి. (గ్రామాలలో పట్టాలేకుండా వంద సంవత్సరాలనుండీ వ్యవసాయం చేస్తున్న దళిత కుటుంబాలున్నాయి. వారికా భూమి రకరకాల పేర్లతో హక్షుగానే వచ్చింది. కానీ పట్టాలుమాత్రం చేతికి రాలేదు. అటవీ భూములలో సేద్యంచేసి, కొత్త అటవీ చట్టాలతో బైటికి నెట్టేయబడిన రైతుల పరిస్థితి యింకా కథలకెక్కలేదు. పట్టాలకోసం మండలాఫీసుల చుట్టూ, కలక్టరాఫీసుల చుట్టూ తిరుగుతున్న దళితుల గురించిన కథలింకా రావాల్సేవుంది. రైతుల బాధలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చూసి, తెలుసుకునీ రాస్తున్న కథకులు భూమి సంబంధాల గురించీ, ఆ సంబంధాలలో పనిచేస్తున్న వర్గ, వర్ణ, లింగ వైరుధ్యాల గురించీ మరింత లోతుగా పరిశీలించి రాసినపుడే పాఠకులు కూడా రైతు సమస్యల నుంచి భూమి సమస్యను అర్థం చేసుకోగలుగుతారు. ఈ రీతిలో ఈ సంవత్సరం వచ్చిన రెండు కథలు నోముల ఎస్‌ అరుణ రాసిన “బొడ్రాయి తీర్చు, నల్లూరి రుక్కిణి రాసిన 'ముంపు' నల్లూరి రుక్మిణి తీసుకున్న కథావస్తువు విస్ఫతి వల్ల సమస్యకున్న అనేక కోణాలు చూపగలిగింది. ప్రాజెక్టులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్మిస్తే అది అభివృద్ధి అని ప్రభుత్వం అనుకోమంటే దానివల్ల ప్రజలలో పెరిగిన చైతన్యం అసలైన అభివృద్ధిగా మనకు చూపగలిగింది రచయిత్రి. “బొడ్రాయి తీర్పు” కథ ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యే అయినా అకథ తప్ప భూమి విషయంలో దళిత లైతులు గురవుతున్న వంచనను కొంతవరకైనా తడిమిన కథలులేవు. అయితే కథలు సమస్యల చిత్రణ చేసినంతగా ఆ సమస్యల మూలాల జోలికి వెళ్ళీ వ్యాఖ్యానించే పనిచేయటం లేదు. కనీసం చేయదగినంత చేయటం లేదు.

(గ్రామాలలో మారుతున్న కుల సమీకరణాల గురించి కూడా ఈ సంవత్సరం మంచి కథలు వచ్చాయి. అనేక (గ్రామాలలో, ముఖ్యంగా తెలంగాణా (గ్రామాలలో అగ్రవర్దాల ప్రజలు సంఖ్యరీత్యా చాలా తక్కువమంది నివసిస్తున్నారు. బి.సిలు, దళితులు, మెనార్టీలే ఎక్కువమంది పల్లెల్లో నివసిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్యా అనేక వైరుధ్యాలు భూమి సంబంధాల వల్లా, కులవివక్షవల్హా మతోన్మాదం వల్లా పెరిగిపోతున్నాయి. మారిన ఈ గ్రామీణ పరిస్థితిని తెలుగు కథకులు అంచనా వేయగలుగుతున్నారు. బోయజంగయ్య రాసిన '“బొందలగడ్డ జి.వెంకటకృష్ణ రాసిన 'పడి లేచే కెరటం" ఈ రెండు కథలూ చాలా సమర్థవంతంగా పల్లెల్లో మారుతున్న కుల సమీకరణాల గురించి చెప్పాయి.

సంకలిత - ఓల్లా ౪ 74

ముఖ్యంగా బొందలగడ్డ కథలో అ(గ్రవర్ధాలు బి.సి.లకూ, దళితులకూ మధ్య వైరాన్ని ఎలా పెంచుతున్నాయో చూపే ప్రయత్నం జరిగింది. వర్గం,కులం ఈ రెండింటిలో ఏది మూలమో చూపే ప్రయత్నం చేశారు “వర్గమూలాలు కథలో పెద్దింటి అశోక్‌ కమార్‌. ఆ కథలో గంగ కుటుంబం ఆర్థికంగా బాగున్న కుటుంబమే. భర్త మండల పరిషత్‌ సభ్యుడు. తగుమాత్రం సంపాదన వుంది. గంగ డిగ్రీ చదివింది. గ్రామంలో అందరూ వాళ్ళను గౌరవిస్తూనే వుంటారు. వాళ్లనుంచి అవసరమైన సలవోలూ, సహాయాలూ తీసుకుంటూనే వుంటారు. కానీ వాళ్ళకు తమ హద్దుల గురించి ఎప్పుడో ఒకసారి తెలియవస్తుంది. ఆర్థికంగా, విద్యాపరంగా తమస్ధితి బాగుండగానే కులపరమైన వివక్ష పోయిందనుకునే దళితులు భంగపడక తప్పదని గంగకూ, శంకర్‌కూ అర్ధమవుతుంది.

గంగ బతకమ్మను పెట్టుకోవాలంటే తనకులం వాళ్ళతో పాటు చేయాలి గానీ, బతకమ్మకు కులం ఏంటని పెద్ద కులాల దగ్గరికిపోతే పరాభవం తప్పలేదు. గ్రామీణ వాతావరణంలో ఎంత అనాగరికంగా ఈకులం పని చేస్తుందో గంగకూ ఆమె బతకమ్మకూ పట్టిన

గతి చూస్తే అర్ధమవుతుంది.

ఇక ప్రీ పురుష సంబంధాలు,మానవ సంబంధాలు విషయంలో కూడా ఈ సంవత్సరం

గ్రామీణ నేపధ్యం నుంచే మంచి కథలు వచ్చాయి. 90వ దశాబ్ధంలో స్త్రీ పురుష సంబంధాల గురించి నగర జీవిత నేపధ్యంలో ఎక్కువ కథలు, ఆలోచింపజేసే కథలూ

వచ్చాయి. రచయిత్రులనుంచి ఎక్కువ కథలు వచ్చాయి. స్త్రీవాదులు నగరాలలోని

మధ్యతరగతి విద్యావంతుల గురించే రాస్తున్నారనే విమర్శలు గతంలో వచ్చాయి. ఈ

దశాబ్ధంలో ఈ పరిస్థితి మారి గ్రామీణ నేపథ్యం నుంచి కథలు రావటం సంతోషించదగిన

పరిణామం. రచయిత్రుల కంటే రచయితలు రాసిన కథలే ఎక్కువున్నాయి. ఐతే స్రీ

పురుష సంబంధాలలోని మానవీయ కోజాన్స్న్సీ హింసనూ అర్ధం చేసుకుంటూ

వివాహబంధం కంటే మానవీయ సంబంధాలకు ప్రాధాన్యత నివ్వాలని చెప్పే స్త్రీవాద

దృక్పథం రచయితలను ప్రభావితం చేయటం మనం గమనించవచ్చు. (దీనికి గాను

మూల్యాన్ని చలం తర్వాత ్రీవాద రచయిత్రులు చెల్లించవలసి వచ్చిందనేది కూడా

గమనించాల్సిందే.) మానవ సంబంధాలలో స్త్రీ పురుష సంబంధాలు చాల ముఖ్యమైనవి.

నిశితంగా గమనించాల్సినవి. అవి మనుషుల భౌతిక మానసిక పరిస్థితులతో ఎంత సంక్షిష్టమైన ముడులు పడి వుంటాయంటే అవి ఒక పట్టాన అర్థం కావు. ఏ సామాజిక నియమాలకూ లొంగనంత బలమైనవి. ఒక చిన్న ఆచారానికి కూడా చెల్లాచెదరయ్యేంత

సంకలిత - ఓలా *75

బలహీనమైనవి. ఈ బలాన్నీ బలహీనతనూ గందరగోళ పదకుండా అర్ధం చేసుకోవటంలోనే రచయితల ప్రతిభ వుంటుంది. బి.వి.ఎస్‌ స్వామి రాసిన “కలుపు మొక్కు కథ ఆ సంక్షిష్టకను పట్టుకునే ప్రయత్నం చేసింది. రెండోపెళ్ళి - వయసు మళ్ళిన భర్త, సవతి తల్లిగా ఒక కొడుకును పెంచే బాధ్యత. అన్నిటికీ ఆమె న్యాయమే చేసింది. కొడుకు పెరిగి పెద్దయ్యి పెళ్ళికూడా చేసుకున్నాడు. ఐతే మొదటినుంచీ ఆమెకొన్ని రోజులు ఇంటినుంచి బైటికి వెళ్ళి గడిపి వస్తుంటుంది. భర్తకు దాని గురించి ఏ అభ్యంతరమూ లేదు. కోడలు వచ్చాక ఆమె దీన్నాక సమస్య చేయటంతో సవతి కొడుక్కూ చుట్టపక్కల వాళ్ళకూ కూడా అభ్యంతరం వస్తుంది. గొడవ పెద్దదై కోడలు అలిగి పుట్టింటికి పోతుంది. ఈ అవమానాన్ని భరించలేక కొడుకు తాగుబోతై చివరికి తల్లిమీద అత్యాచారం చేయబోతాదు. నలుగురూ పట్టుకుని ఆపి అతన్నాక గదిలో వేసి గొళ్ళెం పెడతారు. తెల్లవారేసరికి అతను వురి వేసుకు చనిపోతాడు. ఇకశవ పంచాయిత్రీ, వున్న కాస్తా తనకిచ్చేస్తే కేసు పెట్టనని కోడలు పట్టుబడుతుంది. ఒప్పుకోక తప్పదు. అందరూ ఈ తల్లిని - అదే - సవతితల్లిని తిడతారు. కొడతారు. భర్త ఏమీ అనడు. మొదట్నుంచీ అంతే - భర్తకు లేని అభ్యంతరం లోకానికెందు కుండాలనేది రచయిత అమాయకపు ప్రశ్న, స్త్రీల లైంగికత్వం మీద లోకంలో ఎవరైనా పెత్తనం చేయవచ్చు. ఎప్పుడైనా చేయవచ్చు. ఆమె లైంగికత్వాన్ని కంటోలుచేసే అధికారం ప్రతివారికి (ప్రీ పురుష బేధం లేకుండా) వుంటుంది. ఆ అధికారాన్ని వాడతారా మానతారా అనేది వారి చైతన్యాన్ని బట్టో, అవకాశాన్ని బట్టో, యిష్ట్రాయిష్టాల బట్టో వుంటుంది గానీ కుటుంబ భావజాలపు లక్ష్మణరేఖ దాటిన ప్రీ లైంగికత్వం మీద పెత్తనం చేసే అధికారం సమాజానికి వుంటుంది. ఈ విషయం ఈ కథలో బలంగా వచ్చింది. మానవీయ సంబంధాలు కూడా ఈ సమాజంలో సాధ్యమేనని 'భవబంధాలు” కథలో ద్వారక చెప్పారు. గంగూ అనే స్రీ భర్తనుంచి విడిపోయి రహీంతో బతుకుతుంది. మళ్ళీ భర్తకు జబ్బు అని తెలియగానే రహీంనడిగి డబ్బు తీసికెళ్ళి వైద్యం చేయిస్తుంది. భర్త చచ్చిపోయాక దిగులుతో కొన్నాళ్ళకు తనూ చనిపోతుంది. గంగూ పడిన ఈ మానసిక ఉద్రిక్తత, ప్రేమ, బాధ్యత, ఆత్మీయతల సంఘర్షణ రహీం అర్ధం చేసుకుంటాడు. ఇక్కడ ఆస్తి డబ్బు వీటి ప్రసక్తి లేకపోవటం వల్ల ఘర్షణలేమీ లేవు. అందువల్ల సామాజిక నియమాలు వుల్లంఘించి కూడా రహీం శాంతిగానే వుండగలిగాడు. సంకలిత - ఓల్లా ౪76.

గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు ప్రీ పురుష సంబంధాలలో 'పవిత్రత' గురించో “అక్రమ సంబంధాలి గురించో 'సంప్రదాయి భావజాలం ఇంత వుండేది కాదు. వృత్తి చేసుకునే ప్రీలుందేవారు. వారికి తగిన గౌరవం వుండేది. వారు ఆత్మగౌరవంతో ఆ గ్రామజీవితంలో పాలుపంచుకునేవారు. ఇప్పుడు వలసవాద సంస్మరణ చట్టాలతో, అలాంటి ప్రీల బతుకులు అవమానంతో, హింసతో నిండిపోయాయి. ఆ పరిస్థితిని అద్భుతంగా చెప్పిన కథ ఎం. ఉమామహేశ్వరరావు 'వాంటేప మాను". ఇందులో బంగారమ్మ వెనకటి తరం మనిషి. ఆమెకు ఊళ్ళో పలువురితో సంబంధాలున్నాయి. అవి కేవలం సెక్స్‌ సంబంధాలే కాదు. ఆమె మంచి స్నేహితురాలు. పలువురికి హితురాలు. ఆమెకో గౌరవం, ఆమె మాటకో విలువ వుండేది. ఎందరికో అండనివ్వగలిగేది. నీడనివ్వగలిగేది. పెళ్ళి చేసుకుంటామని వచ్చినవారిని ఒద్దని స్వేచ్చగా బతికింది. కానీ అలా బతికే కాలం అయిపోయింది. ఊళ్లోకి పోలీసులొచ్చి వృత్తిచేసుకుని బతికే స్త్రీలను అల్లరిచేసిన తీరుకి ఎంతో ధెర్యంగల బంగారమ్మ బావిలో పడి చచ్చిపోయింది. 1940-50 దశాబ్దాల వరకూ పట్టణ ప్రాంతాలలో కూడా బంగారమ్మ వంటి వాళ్ళుండేవారు. కొ.కు “నీకేం కావాలి” నవలికలోని కస్తూరి పాత్ర పట్టణ ప్రాంతంలో బతికిన బంగారమ్మ అయితే బంగారమ్మ ఇటీవలి కాలం వరకూ గ్రామీణ ప్రాంతంలో బతికిన కస్తూరి. బంగారమ్మలకూ, కస్తూరీలకూ సమాజంలో గౌరవప్రదమైన చోటు పోయి చాలాకాలమే అయింది. భారతీయ సమాజాన్ని అర్ధం చేసుకోకుండా వలసపాలకులు తెచ్చిన చట్టాలు, వాటి మూలంగా చితికిన ఒక వర్గపు స్త్రీల బతుకులు, పేదరికం కారణంగా వృత్తిలోకి దిగుతున్న అసంఖ్యాక హింసామయజీవితాలు, వీటిని అర్ధంచేసుకుని మంచి కథలు మరిన్ని రావాల్సిన అవసరం వుంది. ఉమామహేశ్వరరావు ఒక దృష్టినుంచి ఆ ప్రయత్నం చేస్తే గోగు శ్యామల 'రడం'కథలో కూతురిని జోగినిగా మార్చకుండా వుండేందుకు వున్న కాస్త భూమినీ పోగొట్టుకున్న ఒక దళిత కథను గొప్పగా రాశారు. సమాజం మారింది. చట్టాలు మరాయి. యంత్రాంగం మారింది. కానీ జోగిని వంటి ఆచారాలు మాత్రం బతికే వున్నాయి. రెండొందలేళ్ళపాటు వలసదేశంగా బతికిన భారతదేశపు దౌర్భగ్యస్థితికి ఇట్లాంటి చచ్చి చావని, స్త్రీలను చావనివ్వని బతకనివ్వని, ఆచారాలూ, వ్యవస్థలూ ఒక వుదాహరణ. పుష్పాల కృష్ణమూర్తి “ఒంటరి గుడిశి యానాది ప్రీల జీవితం గురించిన మంచి కథ. మొత్తం మీద గ్రామీణ జీవితంలోని అన్ని వర్గాల, వర్ణాల స్త్రీల ఆవేదనల్ని ఆత్మగౌరవాలనూ, ధైర్యాన్నీ సంకలిత - ఓల్లా * 77

నిబ్బరాన్ని చిత్రించే కథలు అనేకం ఈ సంవత్సరంలో వచ్చాయి. బి.యస్‌.రాములు “నాన్నమ్మ, మొలకలపల్లి కోటేశ్వరరావు "పెడసరం మనిషి, వింజమూరి మస్తాన్‌ బాబు 'పరవి, పెద్దింటి ఆశోక్‌ కుమార్‌ రైతక్క, ఐతా చంద్రయ్య “సరళి, కె. వరలక్ష్మి “అతడు - నేను, కేతు విశ్వనాథరెడ్డి 'పనిమంతురాలు, ఇలా ఎన్ని కథలలోనో ఆంధ్రదేశపు గ్రామీణ స్త్రీలు తమ మనోబలమే ఆధారంగా జీవితంతో తలపడే దృశ్యం మానకు కన్పిస్తుంది. ఈ స్రీలు తమ మనోబలమే ఆధారంగా జీవితంలో తలపడే సమస్యలను ఎదుర్కోవటం చూసినప్పుడు కథకులు ప్రీలను అర్ధం చేసుకునే తీరులో కూడా గుణాత్మకమైన మార్చు వచ్చిందని అనిపిస్తుంది. గ్రామీణస్తీలలో ఒక నిసర్గ సౌందర్యాన్నో అమాయకత్వాన్నో బలహీనతనో చిత్రించే ధోరణి బాగా తగ్గి, వారి బలాలను చూడగలగటం ఆహ్వానించదగ్గ మార్పు.

అలాగని స్త్రీల మీద జరిగే దారుణ హింసను కథకులు విస్మరించారని కాదు. గీతాంజలి రాసిన 'ఫాతేహా కథలో మాలెన్‌బీ జీవితంలోని హింస దారుణం. భర్త రెండోపెళ్ళి చేసుకుంటాడని మగపిల్లల కోసం ఆపరేషన్‌ చేయించుకోకుందా శరీరాన్ని జబ్బులపాలు చేసుకుని చనిపోతుంది మాలెన్‌బీ. ప్రీలు పునరుత్చత్తిలో పదే హింసను ఇంతకుముందువలే ఈ సంవత్సరం కూడా గీతాంజలి విప్పిచూపారు. ముదిగొండ సుజాతారెడ్డి, జహంగీర్‌బీ, తెలంగాణా విముక్తి జరిగినప్పటి నుంచీ ఇప్పటివరకూ జీవితంలో బరువు బాధ్యతలూ, దరిద్రం తప్ప మరేమీ తెలియని పేద ముస్లిం ప్రీ జీవితాన్ని చూపారు. బురఖా వేసుకున్న కారణంగా చనిపోయిన ముస్లిం వ్యవసాయికూలీని వేంపల్లె షరీఫ్‌ 'రజాక్‌మియా సేద్యం” లో చూపారు. శిరంశెట్టి కాంతారావు 'బగారా' కథ నగరానికి వలసవచ్చిన గౌండ్ల గురవయ్య, భార్య పిల్లల్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చిన స్థితిని చెప్పింది. ఇలా చాలా కథలలో (గ్రామీణ స్తీలమీద జరిగే హింస కథా వస్తువైంది.

ఐతే పట్టణ, నగర ప్రాంతాలలోని ప్రీపరుష సంబంధాల గురించీ, ప్రీల జీవితాల గురించీ మంచి కథలు, చెప్పుకోదగిన కథలు చాలా తక్కువ వచ్చాయి. నగరాల్లో మధ్యతరగతి స్త్రీల త్రిశంకు జీవితాలు, స్లమ్స్‌లో బతికే పేద ప్రీలు, బాలికలూ అనుభవించే హింస, పై తరగతి స్రీల డొల్ల జీవితాల మీదకు కథకుల దృష్టి మళ్ళలేదు. గ్రామీణ జీవితంలోని ప్రీల బలాలను చూపిన కథకులతో పాటు నగర జీవితంలో చదువు, వుద్యోగం, సన్నిహితులూ అన్నీ వుండి జీవిత సమస్యలను ఎదుర్మోలేని ప్రీల కథలు కొన్ని వచ్చాయి. ఇది వింతగా వున్నా వాస్తవం కూడా వుందని ఒప్పుకుతీరాలి.

సంకలిత - ఓల్లా + 78

నగరాల్లో పెరుగుతున్న వ్యాపార ధోరణి, వినిమయ సంస్కృతి ఈ తరం పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో, “అభివృద్ధి, గురించి నగరాల్లోని ప్రజలకు ఎంత గందరగోళం వుందో ఓల్లా రాసిన “వెలుగులో చీకటి కథ చెబుతూ, దానికి లోనైన యువతులు తమజీవిత ప్రాధాన్యాలను ఎలా నిర్ణయించుకుంటున్నారో చూపుతుంది. జె.భాగ్యలక్ష్మి “ఏం విలువలు నాన్నా! కథ విదేశీ వీసా కోసం కాంట్రాక్టు పెళ్ళికి సిద్ధమైన యువతి మనసును పాఠకులకు పరిచయం చేస్తుంది. 'మీ తరంలో మీరు కొన్ని విలువలు ఒదిలేశారు. మా తరంలో మేం మాబాగుకోసం కొన్ని విలువలు వదిలేస్తే అది తప్పనటం న్యాయమా” అని సూటిగా ప్రశ్నించి తమ రాజీతత్త్వాన్ని సమర్ధించుకునే మధ్యతరగతిని వులిక్కిపడేలా చేస్తుంది. శ్రీ లలిత రాసిన “అతడి భార్య' ఎయిడ్స్‌ సంసార జీవితంలో రేపే కల్లోలాన్ని సమర్ధవంతంగా చూపింది. ఎల్‌.మూర్తి రాసిన 'ఒక తడిచూపు కథ' విప్లవోద్యమ నేపథ్యంలో ప్రీపురుష సంబంధాల గురించి వచ్చిన మంచి కథ.

మొత్తంమీద నగర జీవితంలోని సంక్షిష్ట మానవ సంబంధాలను రచయితలు ఈ సంవత్సరం పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోలేదనే చెప్పాలి. ప్రపంచీకరణ వల్ల నేరుగా, కొట్టొచ్చినట్లు కన్పించే కొన్ని మార్పులను మాత్రమే కథకులు కథాంశాలుగా తీసుకున్నారు. చిరకాలం నుంచీ చేస్తున్న పనులు నగరంలో వచ్చిన మార్పుల వల్ల హఠాత్తుగా లేకుండాపోతే, మారిపోతే వ్యక్తులు పడే బాధను కె.వి.నరేందర్‌ 'షఫీ బుక్‌స్టాల్‌లో, వారాల కృష్ణమూర్తి 'పారాహుషారొ కథలలో చూడవచ్చు. మొదటి కథలో బుక్‌స్టాల్‌ని జ్యూస్‌ సెంటర్‌గా మార్చాల్సి రావటం, ఆ స్టాల్‌ వుండే బస్టాండ్‌లో వచ్చిన మార్పులు కథావస్తువయితే, రెండో కథలో పోస్టాఫీసు దగ్గర వుత్తరాలు రాసే పని యస్‌.టి.డి బూత్‌లపట్ల, యస్‌.టి.డి నడిపే వారి పని సెల్‌ఫోన్లవల్లా పోవటం ఆసక్తికరంగా చెప్పారు. తోటిమనిషి వమవుతున్నా పట్టనితనాన్ని పతాకస్థాయిలో సలీం తనకథ 'మరణదృశ్యం'లో ఆవిష్కరించారు. వలస కార్మికులు నగరాల్లో బతికే తీరుని సుంకోజి దేవేంద్రాచారి 'నేరం”* “రాబందులు” కథల్లో చిత్రించారు. చంద్రలత 'అగ్గువి కథ టమాటా పంటలో అమ్మకాలలో రైతుకీ, చిన్న దుకాణాదారులకు జరిగే అన్యాయాన్నీ చౌకలో కొని నిలవజేసుకోవాలనుకునే వ్యాపార ధోరణినీ చాలా విపులంగా వివరంగా రాసి ప్రపంచీకరణకూ కూరగాయలు పండించే రైతులకూ ఒక లింకుని కల్పించారు. వాడ్రేవు చిన వీరభద్రుడు 'ట్రాఫికల్‌ ఫీవర్‌ ప్రపంచీకరణ గురించి మరింత ప్రత్యక్షంగా

(ప్రపంచబ్యాంకు అధికారిని కూడా కథలో పాత్రగా మలిచిన కథ. ఈ కథలో ఎన్హీ విషయాలు ప్రస్తావించబడ్డాయి. ప్రపంచబ్యాంకు వుద్దేశాలు, కన్సల్టెంటుల స్వభావాలు, స్థానిక పరిస్థితుల్ని పట్టించుకోకుండా పరిశోధనల్లో మునిగే శాస్త్రవేత్తలు, వీరి మధ్యలో నలిగే సన్నకారు రైతులు, దళిత రైతులు, వీటన్నిటితో పాటు యల్లమ్మకథ వేపచెట్లు ప్రాశస్యం మూడో ప్రపంచ దేశాల వనరుల మీద పాశ్యాత్యుల లోభ, కాంక్షా దృష్టి ఇన్ని విషయాలతో ఈ కథ నిజంగా వుక్కిరిబిక్కిరయింది. ముగింపు కాస్త అసహజంగా వున్నా ఆహ్వానించదగినవి కాలువ మల్లయ్య 'గ్లోబలి' “గోధూళి కథలు. ప్రపంచీకరణ సాధారణ మానవుల జీవితాల్లో పరాయీకరణనూ, సంక్షోభాన్నీ' తెచ్చిపెట్టిన తీరు గురించి రాసినవే. నగర జీవితంలోని సమస్యల గురించి రాసిన కథకులకు ప్రధాన సమస్యలుగా ఇతివృత్తాలుగా రెండు అంశాలు కనిపించాయని తోస్తోంది. పిల్లల చదువులు, వృద్ధాప్యం. వీటిలో మళ్ళీ పిల్లల చదువుల గురించే ఎక్కువకథలొచ్చాయి. చెప్పాలంటే కరువుకథల తర్వాత ఎక్కువ కథలు పిల్లల గురించి,వారి చదువుల గురించీ వచ్చాయి. ఆ సమస్య మధ్యతరగతిని ఎంతగా భయపెడుతోందో దీనివల్ల తెలుస్తుంది. ఈ సమస్యను సీరియస్‌గా రాసినవారెంత మంది వున్నారో వ్యంగ్య ధోరణిలో రాసినవారూ అందరున్నారు. సీరియస్‌గా రాసిన కథలో చెప్పుకోదగిన మంచికథ మధురాంతకం నరేంద్ర రాసిన “యుద్ధకాండ. పిల్లలు చదువులో వెనకబడుతున్నారనే ఫోబియా మానవ సంబంధాలను, పిల్లల మీద అనివార్య అవ్యాజ (్రేమనూ ఎలా కబళించి వేస్తుందో నరేంద్ర ఆలోచింపచేసేలా రాశారు. ఎలాంటి చదువు పిల్లలకు దొరకకుండా పోతుందో సత్యాజీ 'ఐడి అవతల” కథలో రాశారు. హాస్య ధోరణిలో 'కొత్త మార్చులొస్తున్నాయి' అనే డా॥కె.సుభాషిణి రాసిన కథ బాగుంది. సరళీకృత ఆర్థిక విధానాల్లో విద్య, ఆరోగ్యం ఈ రెండూ సంక్షేమరంగం నుంచి వ్యాపారంలోకి వచ్చాయి. దాని ప్రభావం పిల్లల చదువులు తప్ప మరింకో విషయం పట్టించుకోకుండా పోటీ ప్రపంచంలోకి పసిపిల్లల్ని మంటల్లోకి మిడతల్లా నెడుతున్న నగర మధ్యతరగతి తల్లిదండ్రుల మీద విపరీతంగా వుంది. విద్యావ్యాపారం వారికో సవాలయింది. దానిని కాదనలేరు. బెననలేరు. ఈ సందిగ్ధ స్థితిని రచయితలింకా బాగొ రాయాల్సివుంది. వైద్యరంగం మీద చాలాతక్కువ కథలే వచ్చాయి. వైద్యరంగ పరిస్థితి యింకా దారుణంగా వున్నా రచయితలు ఈ సంవత్సరం ఆ విషయం మీద పెద్దగా స్పందించలేదు. విద్యగురించి సంకలిత - ఓల్లా * 80.

చేసిన ఒకటి రెండు ఆలోచనలు కూడా ప్రత్యామ్నాయ వైద్యం గురించి చేయలేదు. “డిశ్చార్ట్‌ అనే కథ మాత్రం దీనికి మినహాయింపుగా వచ్చిన మంచి కథ. సాధారణ ప్రజలను, చదువురాని వారినీ కార్పోరేట్‌ హాస్పిటల్స్‌ ఎలా భయపెడతాయో రచయిత బాగా రాశారు.

ఇక వృద్దుల జీవితాల గురించి వచ్చిన కథలలో మూడొంతులు పైగా పిల్లలు తల్లిదండ్రులను చూడకపోవటం, వృద్ధులైన తల్లిదండ్రులను ఒదిలి అమెరికా వెళ్ళటం, దానివల్ల దూరమైన తాతామనమలు ఇలా సాగాయి. మారుతున్న పరిస్థితుల్లో వృద్ధులైన తల్లిదండ్రులలో రావాల్సిన మార్పు గురించి ఆలోచింపచేసే కథలు రాలేదు. వృద్దులు, పిల్లలు అనగానే సెంటిమెంట్‌ వచ్చి ఆక్రమణ, దురాక్రమణ చేస్తుంది. దానివల్ల ఒక కోణమే కథల్లో కనిపిస్తుంది. సెంటిమెంట్‌ వుండదనీ, వుండకూడదనీ కాదు. అది మెలోడ్రామాలా మారకూడదు. వృద్దాశ్రమంలో వారి జీవితాలు పాజిటివ్‌గా చిత్రించి జీవితంపై ఆశ కల్పించే చిన్నకథ 'బృందావనం' అల్లూరి గౌరీలక్ష్మి రాశారు. ముదిగొండ శివకౌముదీ దేవి 'రాగిచెంబు' కథ మంచికథ. బామ్మ గురించీ ఆమె వ్యక్తిత్వాన్నీ గురించీ ఆమెకు రాగిచెంబుతో వున్న అనుబంధాన్ని చక్కగా చెప్పారు. ఇంట్లో వృద్ధులు కానివాళ్ళు తమ జీవనోత్సాహంతో వృద్ధులను, వాళ్ల అనుబంధాలను ఎట్లా పట్టించుకోరో ఒకచిన్న సంఘటనతో షాకింగ్‌గా చెప్పారు. బామ్మరాగి చెంబును కరిగించి యాష్‌ ట్రే తయారు చేయించుకుంటారు. ఇక బామ్మ నేంచేస్తారో రచయిత్రి చెప్పలేదు. చెప్పాల్సిన అవసరమూ లేదు. పల్లెటూళ్ళ గురించీ, బాల్యం గురించీ, అమ్మమ్మలు, నాయనమ్మల గురించీ నగరాల్లోని వారి నోస్టాల్టియా కథలు ప్రతి సంవత్సరమూ వచ్చినట్లే ఈ సంవత్సరమూ వచ్చాయి. వాటీలో అక్కిరాజు రాసిన 'అంటుకొమ్ము రెండు ప్రయోజనాలను తాకింది. అమెరికానుంచి ఎంతో కాలానికి వచ్చి తమ గ్రామాలను బంధువులను కల్చుకుని బాల్యాన్ని తల్చుకుని ఆనందించటం. ఇందులో కొత్తేమీ లేదు. కానీ ఆడవాళ్ళ పేర్లతో వంశవృక్షాలుండవనీ, మొగ పిల్లలు లేకపోతే అక్కడితో వంశవృక్షం ఆఖరవుతుందనే విషయం వీళ్ళకు ప్రత్యక్షంగా అర్ధమవుతుంది. ఇప్పటి పిల్లలు తమ తల్లిపేరుతో కొత్త వంశవృక్షాన్ని తయారుచేస్తారు. ఆ ముగింపు ఎంతో బాగుంది.

ముస్లిం ప్రజల జీవన వైవిధ్యాన్ని గురించీ, మైనారిటీ ప్రజలుగా వారి ప్రత్యేక పరిస్థితుల గురించీ ఈ సంవత్సరం ముస్లిం రచయితల నుంచే మంచికథలు వచ్చాయి. ఇబ్రహీం రాసిన 'జైతున్‌, రహమతుల్లా “ప్యార్‌ మిర్దా మహేశ్వరీ కా, షాజహానా రాసిన

సంకలిత - ఓల్త్లా * 81

ండాస్‌కథలు వాటిలో కొన్ని మాత్రమే. మరుగుదొడ్ల సమస్య, అందులో ముస్లిం యువతులకు ప్రత్యేకంగా వుండే ఇబ్బందుల గురించిన కథ సండాస్‌. ఖదీర్‌బాబు 'ఢథాకన్‌' మీద ముస్లింల నిస్సహాయతనూ, ముస్లిం యువకుల దిక్కుతోచని స్థితిని వాస్తవికంగాను పాఠకులకు ఆకట్టుకుని ఆలోచింపచేసే విధంగా రాశారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు ఎన్నో ఆశలతో వచ్చిన కుటుంబం. ఇంజనీరింగ్‌ చదివే కొడుకు సమద్‌ వుద్దరించగలడని ఆశపడ్డ కుటుంబం. “'సమద్‌' ఇంజీనీతే. కానీ ముస్లిం ఇంజనీర్‌, దాంతో వుద్యోగావకాశాలు తగ్గిపోయాయి. వుద్యోగం రాలేదనే కాక ఎందుకు రాలేదో తెలుసుకున్నాక సమద్‌ ఎందుకు రాదో తేల్చుకునే దోవలోకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్‌ పాతబస్తీలో 'సమద్‌"లు ఇవాళ చాలామంది తయారవుతున్నారంటే దానికి కారణం వాళ్ళు మాత్రం కాదు. ఈ విషయానికి ఖదీర్‌బాబు చాలా ప్రతిభతో కథారూపం ఇచ్చారు. ముస్లింలంటే టెగర్రరిస్టులే అని భయపడే ఒకవర్గం మనస్తత్వాన్న్నీ ఆ భయం ఎంత అనవసరమనే విషయాన్నీ చెబుతూ 'ఒక రైలు ప్రయాణం” కథ డా॥1ప్రసాదమూర్తి రాశారు. పాతబస్తీలో జరిగే అరబ్బు షేకులతో ముస్లిం అమ్మాయిలకు జరిగే పెళ్ళిళ్ళలోని వంచనను బైటపెట్టింది దా॥కె.సునంద రాసిన “కాంట్రాక్టు పెళ్ళి. దుబాయ్‌కి వెళ్ళినా హింస, అవమానం, దరిద్రం తప్ప మరేం మిగుల్చుకోకుందా తిరిగి వచ్చే ముస్లిం యువకుల కథ మహమూద్‌ రాసిన 'మిష్కిన్‌. ఒక సమయంలో మంచి స్పేహితులుగా వున్న హిందూ ముస్లిం వ్యక్తులు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా శత్రువులవుతున్న తీరు 'ఖబూతర్‌ కథ చెప్తుంది. పురాణ, చారిత్రకాంశాల గురించి ఈ సంవత్సరం కూడా కొన్ని కథలు వచ్చాయి. పోయిన సంవత్సరం 'శూర్చణఖి గురించిన కథ వస్తే ఈ సంవత్సరం మండోదరి గురించిన కథ తాడేపల్లి పతంజలి రాశారు. మండోదరి కలలో సీతను కలిసి మాట్లాడటం ఇతివృత్తంగా వుంది. భారతంలోని మాధవి పాత్రను తీసుకుని డి.ఆర్‌.ఇంద్ర కథ రాశారు. రామాయణం తమిళంలో రాసిన కంబ కవి నేపథ్యంలో ఒక కథ వచ్చింది. రామాయణ, భారతాలను వ్యాఖ్యానిస్తు, ఆధునిక భావాలతో వాటిని అర్ధం చేసుకుంటూ ఆ పాత్రలను కొత్తగా నిర్వదించటంలో తెలుగు రచయితలకు చలం పెట్టిన ఒరవడి కొనసాగుతూనే వుంది.

మిస్టిక్‌ రియలిజం పేరుతో మరింకేవో పేర్లతో రాసే కథలలో ఈ ఏడాది మిస్టిసిజం పాలు తగ్గి రియలిజం పాలు పెరిగి, అవి పాఠకులకు కొంచెమైనా అంతుబట్టే, అర్ధమయ్యే దిశగా మళ్ళాయి. రమణజీవి రాసిన 'ఒరేయ్‌ సుంకన్న కథలో రచయిత చెప్పదల్పుకున్నది సామాన్యపాఠకులకు చాలావరకు అర్ధమయింది. దయారాహిత్యం వల్ల పిల్లలు పుట్టని వ్యాధి మానవజాతికి వచ్చి మానవజాతి అంతరించటం గురించిన కథ కూడా అర్థమై అంత భయానక దృశ్యాన్ని భయంకరంగా కళ్ళముందు నిలిపింది. విశ్వభవిష్యత్తు గురించి కథలలో రమణజీవి కథతోపాటు విరాగి రాసిన “ఆఖరి అత్మహత్య” కూడా వుంది. మనుషులిక బాగుపడరనే భయంకరమైన నిరాశ. పతంజలి శాస్త్రి 'పిచ్చి మాలచ్చమ్మ కథ కూడా మిస్టిక్‌ రియలిజం పోకడతో వున్న మంచికథ. జీవితంతో ఎక్కువ సంబంధం వున్నప్తుడే మిస్టిక్‌ రియలిజం లేదా మరొక కొత్త పద్ధతిలో కథలు సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. అది లేనపుడు కథ కంచికీ పోకుండా, పాఠకులకూ దొరకకుండా 'ఎటో వెళ్ళిపోతుంది”. పిట్టలనూ, జంతువులనూ పాత్రలుగా తీసుకుని రాసిన కథలు రెండుమూడు వచ్చాయి. దోరవేటి 'లకుముకి పిట్ట, ” ఐ.టి.ఆర్‌.వి. శివాజీ రావు “రేచుకుక్కలు” వాటిలో మంచి కథలు. మొత్తంమీద తెలుగు కథకు ఏ వస్తువూ అనర్హం కాదని ఈ సంవత్సరం తెలుగు కథకులు నిరూపించారు. ఇక ఒక సిరీస్‌గా, సీరియల్‌ కథలుగా వచ్చిన 'ప్రళయ కావేరి కథలు”, దీపం చెప్పిన కథలు, 'పసలపూడి కథలు వేరుగా సమీక్షించాల్సినంత విస్పృతి గలవి. దక్షిణ కోస్తా, గోదావరీ, రాయలసీమ ప్రాంతాలలో కొన్ని ప్రత్యేక గ్రామాలకు, అక్కడి జన జీవితానికీ సంబంధించిన కథలు. ఇట్లా ఒక ప్రాంతమో, ఊరో, కుటుంబమో తీసుకుని దానిపై అనేకకథలు రాసే పద్ధతి నామిని నుంచి మంచి వారసత్వంగా తెలుగు కథకులు స్వీకరించారు. ఖదీర్‌ ఆ పద్ధతికి ఒక అందాన్ని హుందాతనాన్నీ తీసుకొస్తే ఈ సంవత్సరం స.వెం.రమేష్‌, వంశీ, గోపిని కరుణాకర్‌లు ఆ సంప్రదాయానికి ఒక గౌరవాన్నీ ఆకర్షణనూ, నిసర్గ తాత్వికతనూ సమకూర్చారు. ఈ సంవత్సరం (2004) చెప్పుకోదగిన సంఖ్యలో హాస్య వ్యంగ్య కథలు వచ్చాయి. ఎన్నిబాధలున్నా తెలుగువారిలో నవ్వుకోగల శక్తి పుష్కలంగా వుందని నిరూపించాయి. సంకలిత - ఓల్లా * 83

ఆ శక్తి వున్న జూాతిమీద ఆశలు పెంచుకోవచ్చు. ఈ కథలలో జి. ఆర్‌. మహర్షి “దెయ్యం” కథ చెప్పుకోదగిన కథ. చాలాకాలం గుర్తుండి నవ్వించే కథ. వర్తమాన సమాజంలో పిల్లలూ, పెద్దలూ కూడా ఎంత అసాధ్యులుగా తయారవుతున్నారో వ్యంగ్య హాస్య ధోరణిలో చూపుతూ, అలా తయారవకపోతే తప్ప బతకలేనితనాన్ని పెంచుతున్న సామాజిక దారుణ దృశ్యాన్ని కడుపుబ్బ నవ్విస్తూ చెప్పారు. కస్తూరి మురళీ కృష్ణ రాసిన “చురకత్తి గుర్తుకే మన ఓటు రౌడీ రాజకీయాల మీద చురక వేసే కథ. రౌడీలు సమ్మెచేస్తే ఏఏ వర్ణాల వునికికి ప్రమోదమో, జనజీవితం ఎలా స్తంభించి పోతుందో చెప్తూ మేధావుల మీద మంచి చురకలు వేశాడు. 'మా వూరి మహానాటకంి లాంటి కథలు ఇంతకు ముందొచ్చినా, ఇవాళ్టి నేపధ్యంలో బాగా నవ్వించే కథ. టి.విల గురించీ, ఆ కార్యక్రమాల గురించీ హాస్యకథలొచ్చాయి. వాటిలో క్విజ్‌ పఫ్రోగ్రాంల మీద ఇలపావులూరి మురళీధర రావు రాసిన 'తెలుగుబు(ర్ర హాయిగా నవ్విస్తుంది. చివరగా అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు రాసి ఇక్కడి పత్రికలలో ప్రచురించిన కథల గురించి నాలుగుమాటలు చెప్పుకోవాలి... ప్రపంచాధిపతిగా అమెరికా బడుగుదేశాల మీద చలాయిస్తున్న పెత్తనాన్నీ చేస్తున్న దోపిడీని వ్యంగ్య ధోరణిలో “ప్రగతి ప్రభ అనే కథను ఆరి సీతారామయ్య రాశారు. జానపద నేపధ్యంలా కనిపించే ఈ కథ వర్తమాన ప్రపంచ పరిస్థితిని వాస్తవికంగా చూపుతుంది. గతంలో కొ.కు దిబ్బరాజ్యం కథల ధోరణిలో సాగేకథ. ఇలాంటి కథలను నిర్వహించటం చాలా కష్టం. సీతారామయ్యగారా పని సమర్ధవంతంగా చేశారు. విషయం, కథనం, వ్యంగ్యం అన్నీ బాగా కుదిరాయి. ఆయనే మరోచిన్న కథలో వివాహంలో మొనాటనీ, రొటీన్‌నెస్‌ని రాశారు. భర్రలోకానికి మంచివాడే. ఏ వ్యసనాలూ లేనివాదే. కానీ అతనితో జీవితం నిత్యనూతనం కాదు. ఆమెకలాంటి జీవితం కావాలి. ఆ జీవితం కోసం వెతుకుతూ వెళ్ళింది. సంప్రదాయపరులకు ఈ కథతో చాలా అభ్యంతరాలు కన్పించవచ్చుగానీ అనేకమంది స్త్రీలు చెప్పుకోలేని వేదనను చిన్న కథలో చెప్పారు. వేమూరి వెంకటేశ్వరరావు అమెజాన్‌ అడవులలో యువతీయువకుల సాహస యాత్ర గురించి మంచి కథ రాశారు. అమెజాన్‌ అడవులలో తప్పిపోతే భయపడాల్సింది క్రూరమృగాలకు కాదు. చీకటితోపాటు ముసిరే దోమలకు. ఆ దోమల బీభత్సాన్ని ఒళ్ళు జలదరించేలా రాశారు. ఇంకా అమెరికాలో బాగున్న పూజారి వృత్తి గురించి, సంకలిత - ఓల్లా ౪8

అక్కడి జీవితంలోని డొల్లతనాన్ని గురించి, పిల్లల పెంపకంలోని ప్రత్యేక సమస్యల గురించి, అమెరికాలో తెలుగు సంస్కృతి పేర జరిగే వ్యాపారాన్నీ గురించి రెంటాల కల్పన, నిడదవోలు మాలతి, వంగూరి చిట్టిన్‌ రాజు మొదలైన వారు కథలు రాశారు. మొత్తానికి ఎక్కువమంది రచయితలు అక్కడి తమ ప్రత్యేక సమస్యలనే రాశారని చెప్పాలి. తాము డాలర్లలో సంపాదిస్తామనే విషయం మాత్రమే గుర్తుంచుకునే బంధువులు, వారెలా పీక్కుతినేది, దానికి తల్లిదండ్రులు కూడా మినహాయింపు కాదనే నిజం - వీటిని గురించి రాసిన కథకులున్నారు. సీతారామయ్యగారు తప్ప ఎవరూ అమెరికా రాజకీయాలను ప్రస్తావించలేదు. సెప్టెంబర్‌ 11 తర్వాత అమెరికా జీవితంలో పోయిన ప్రైవసీ గురించీ, పెరిగిన భయందోళనల గురించీ, రేసిజం గురించీ మానవహక్కుల మీద జరిగే దాడుల గురించీ కథలేమీ రాలేదు. ఒకరిద్దరు మినహా అమెరికాలో తెలుగువారు అక్కడి తమ తెలుగు జీవితాన్ని రాయటానికే వుత్సాహం చూపుతున్నారు తప్ప అమెరికన్‌ జీవితం గురించి రాయటానికి వుత్సాహపడటం లేదనిపిస్తుంది. ఇన్ని విషయాల గురించీ, సమాజంలోని అనేక అంశాల గురించీ, రాసిన తెలుగు కథకులు రాయవలసినవి ఇంకా వున్నాయి. అసంఘటిత, సంఘటిత రంగాలలోని కార్మికుల గురించిన కథలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రభుత్వ వుద్యోగుల గురించీ, వారి కష్టసుఖాలు, అవినీతి, రాజకీయాలలో అవినీతి వీటి మీదకూడా చెప్పుకోదగిన కథలు రాలేదు. ప్రపంచ కార్మికులు సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని గురించి మర్చిపోయి 18 గంటల వెట్టిచాకిరీ చేస్తున్న హైటెక్‌ కంప్యూటర్‌ కూలీల గురించి ఈ సంవత్సరం మంచి కథలు రావల్సి వుంది. కానీ రాలేదు. పోలీసు వ్యవస్థ మీద గన్‌మేన్‌ల గురించిన ఒక్క కథ తప్ప రాలేదు. గ్రామీణ జీవితం గురించి ఎక్కువ కథలొచ్చినా గ్రామరాజకీయాలను చిత్రించే కథలు ఎక్కువ రాలేదు. నల్లూరి రుక్కిణి “కుమ్ము' కథ మాత్రమే గ్రామ రాజకీయాలలో పెరుగుతున్న దళిత చైతన్యాన్ని పట్టుకోగలిగింది. మధ్యతరగతిలోని హిపోక్రసీ, కృత్రిమ విలువలు, రాజీ ధోరణులను తీవ్రంగా విమర్శిస్తూ కథలు రావలసే వుంది. యువతీ యువకులు ముఖ్యంగా విద్యార్థులు ఈ సంక్షిష్ట వర్తమానంలో దిక్కుతోచక పరిగెడుతున్న తీరు రచయితల కలానికి అందలేదు. కానీ మొత్తం మీద చూసినపుడు 1956వ సంవత్సరంలో తెలుగుకథలు ఏ పనులు చేయాలనీ, ఏ ప్రయోజనం కోసం పుట్టాలనీ కొడవటిగంటి కుటుంబరావు అనుకున్నారో సంకలిత - ఓల్లా * 85

అవి 2004 లో 90% నెరవేరాయని సగర్వంగా చెప్పుకోవచ్చు. కథావస్తువు గురించే ఇంతసేపూ ప్రస్తావించాను. కథా రచన గురించీ, శిల్చం గురించీ కొన్ని విషయాలు ప్రస్తావించాలి. కథలు యిలావుండాలి. ఇలాగే రాయాలి అని నియమాలను పెట్టడం అసాధ్యం. కథను ఎన్నో రకాలుగా రాయొచ్చు. కానీ కొన్ని కథలు చదువుతున్నపుడు ఇదేం కథ అనీ, కథ ఇలాగేనా రాసేదని అనిపిస్తుంది. విసుగుపుడుతుంది. చదవటం మానేస్తాం. అలాంటి పద్ధతుల్లో కథలు రాయటం మానెయ్యాలి. అంటే కొందరు కథకులు ఇంకా అలాంటి పద్ధతుల్లో రాస్తూనే వున్నారు. బహుశ మంచి కథలు చదవకుండా రాయటం వల్లనేమో తెలియదు. కొందరు రచయితలు పాత్రల గురించి వారి స్వభావం గురించి విడిగా పనిగట్టుకుని చెబుతారు. వాతావరణాన్ని విడిగా నిడివిగా వర్ణిస్తారు. అసలు కథ పై రెండింటి నుంచీ వేరే ఎక్కడో దూరంగా వుంటుంది. ఈ మూడింటినీ కలిపి కథ రాయటం నేర్చుకున్న కథకులు మంచి కథకులు. అలాగే సంయమనం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. పని గట్టుకుని వర్జనలు చేయటమనే పాత పద్ధతిని ఒదలాలి. వర్జనలు క్లుప్తంగా కథకు అత్యవసరంగా వుండాలి. కథలో ఏజఒక్క వాక్యం లేకపోయినా కథ కుంటుబడుతుందనిపించేలా రాయగలిగిన పద్ధతి అలవరుచుకోవాలి. మంచి కథకులుగా పేరుపడ్డవారు కూడా చాలాసార్లు ఈ సంయమనం పాటించటం లేదు. అనేక విషయాలను ఒకే కథలో చెప్పాలనుకోవటం కూడా కథకు మంచి చేయదు. పాఠకులను గందరగోళపరచి విసుగు తెప్పిస్తుంది. ఆ విషయాలు ఎంత ముఖ్యమైనవైనా, పాఠకులకు తెలియటం అవసరమని భావించినా వాటిని కలగాపులగం చెయ్యకుండా వుంటే కథ ఆసక్తికరంగా సాగుతుంది.

కథ మాత్రమే చెప్పాలి అనే సూత్రాన్ని చాలాసార్లు చాలామంది రచయితలు వుల్లంఘించారు. ఆ సూత్రాన్ని పాటించటం కష్టమే కావొచ్చు గానీ, వుల్లంఘనలు ఆ కష్టంతో సంబంధం లేకుండా దానిని మించి పేజీలకు పేజీలు దారుణంగా సాగిన సందర్భాలున్నాయి. చిత్రమేమిటంటే అలాంటి వుల్లంఘనలు జరిగిన కథలు శిల్పరీత్యా గొప్పవనే భ్రమ, దాని గురించి ప్రచారమూ కూడా వినవచ్చింది.

సంభాషణల విషయంలో కథకులు చాలా జాగ్రత్త పడాలని అనిపించింది. నాటకంలో డైలాగుల్లా అనిపించే సంభాషణలు కథలలో తరచూ కనిపిస్తున్నాయి. తెలివైన సంభాషణలు, పాఠకులకు కూడా కనీసపు తెలివి తేటలుంటాయని (గ్రహించిన సంభాషణలు కథల్లో వుండాలి.

సంకలిత - ఓల్లా * 66

ఈ ఏడాది రాసిన కథలో కూడా ఈ కింది ధోరణి కొనసాగిందంటే మంచి కథలు చదవకుండా కథలు రాసే రచయితలు వున్నారనిపిస్తోంది. 'తన అంగీకారాన్ని తెలియచేసే ముందు తన కుటుంబం గురించి రాజేషకి తెలియజెప్పటం తన విధిగా భావించి ఇలా చెప్పసాగింది శిరీష. 'విధి వక్రించి మా జీవన నౌక తుఫానులో చిక్కుకుంది.....? పై సంభాషణ సీరియస్‌గా ఒకరితో ఒకరు చెప్పేటపుడు హాస్యాస్పదంగా వుంటుంది. ఇదే వాక్యం హాస్య సన్నివేశంలో ఎబ్బెట్టుగా లేకుండా సరిగ్గా సరిపోతుంది. మాట్లాడుకునేటట్లు సహజంగా రాయటంలో కథకులు నేర్చుకోవాల్సింది చాలావుంది. కొందరు విషయం కంటే శిల్చం పట్ల శ్రద్ధ పెట్టినవారు వున్నారు. వారి కథలు కూడా విసుగునే తెప్పిస్తాయి. చాలామంది శిల్చ్బం అంటే కవిత్వాన్ని కథలో చొప్పించటమనీ, ఎక్కువ వర్ణనలు చేయటమనీ, వుషమానాలు గుప్పించటమనీ, అనుకుంటూ వాటికోసం తపనపదతారు. శిల్పమంటే పాఠకులకు చిరాకూ, విసుగూ తెప్పించకుండా ఆసక్తితో చదివించటమేనని కథకులు గ్రహించాలి. శిల్చం గురించి కొడవటిగంటి కుటుంబరావు రాసిన రెండు వాక్యాలతో ఆ విషయాన్ని ముగిస్తున్నాను. “ఈనాటి సాహిత్యం సృష్టించేవారు అడుగడుగునా నా శిల్చ్బం చూడండి అన్నట్టు రచన చేయనవసరం లేదు. శిల్చం ఎంత గోప్యంగా వుంటే అంతమంచిది.” ఈ గోప్యం గురించి తెలుగు కథకులు, విమర్శకులు తెలుసుకోవాలి. ఇక భాష విషయానికి వస్తే మాండలిక భాషల్లో రచనలు చేయటం గురించి వాదాలు చేసే కాలం పూర్తయింది. పూర్తి మాండలికంలో కథంతా రాసే రచయితలు పెరుగుతున్నారు. సంభాషణలు మాండలికంలో రాసి రచయిత చెప్పేది మాండలికేతర భాషలో రాయొచ్చుగదా అనే వారున్నారు. ఐతే చాలాకాలం నుండీ మాండలికాలలో సంభాషణలు రచయితలు రాస్తూనే వున్నారు. దానినుంచి మాండలికాలను అర్థం చేసుకుని ఈ పాటికే మాండలిక భాషలో కథలను సునాయాసంగా చదవటం పాఠకులు అర్ధం సంకలిత - ఓల్లా ౪87

చేసుకుని వుండాల్సింది. ఆ అలవాటు కాలేదంటే వాళ్ల అలసత్వమే కారణం. దానిని సాకుగా తీసుకుని రచయితలను వారివారి మాండలికాలలో రాయొద్దనటం న్యాయం కాదు. ఐతే మాండలికంలో రాయటం కూడా రచయితలు అభ్యాసం చెయ్యాలి. బాగా రాస్తే మాండలికం విపరీతంగా పాఠకులను ఆకర్షిస్తుంది. రాయటం చేతకానపుడే పాఠకులు విముఖులవుతారు. మాండలికాన్ని బాగా రాసి తమ ప్రాంతపు భాషను ఇతర ప్రాంతాలకు పరిచయం చేసేవారు కేవలం భాషా సేవే చెయ్యటం లేదు. సమాజంలోని అధికార సంబంధాలను నిర్ణయించి నిర్ధేశించే శక్తులలో భాష ఒకటి. చాలా ముఖ్యమైన శక్తి. అధికారంలో వున్నవారి భాష బలహీనుల అనుభవాలను తక్కువ చేస్తుంది. ప్రాతినిధ్య విషయాలలో కూడా భాష ప్రధానపాత్ర పోషిస్తుంది. అందుకే భాష గురించి అన్ని వాదవివాదాలు. మాండలికాల గురించి కూదా కొడవటిగంటి కుటుంబరావు రెండు మంచిమాటలు చెప్పారు. “సాహిత్యాభిలాషులు, అభిమానులూ అని చెప్పుకునేవారు వెయ్యేళ్ళ నాటి భాష అర్ధం చేసుకోగలరు గానీ రెండొందల మైళ్ళ దూరంలో జనం నిత్యమూ వాడుకునే చైతన్యం గల జీవద్భాషను అర్ధం చేసుకోలేని స్థితిలో వుంటే ఏమనాలి? ప్రతి ప్రాంతీయ శబ్ద జాలమూ, నుడికారమూ అన్ని ప్రాంతాల వారికీ అర్ధం కావాలి. ఈ పనిచేయటం రచయితలకే సాధ్యమవుతుంది. అందువల్ల కథకులు వివిధ మాండలికాల్లో విరివిగా కథలు రాయాలి. పత్రికలలో కథలకు చోటింకా పెరగాలి. కథకు పెరిగిన జనాదరణ చూసి ఒక కథ ప్రచురించే పత్రికలు రెండు కథలకు చోటివ్వాలి. కథల ప్రచురణ ఆపేసిన పత్రికలు మళ్ళీ మొదలుపెట్టాలి. ఎలక్షానిక్‌ మీడియాలో మంచి కథలకు చోటు దొరకాలి. మంచి కథల జోలికి ఎలక్ష్రాన్‌ మీడియా ఎందుకు పోవడం లేదో, మంచి రచయితలు, కథకులు ఎలక్షానిక్‌ మీడియాకు శత్రువులెందుకయ్యారో, అందులో వున్న వ్యాపార రహస్యమేమిటో విప్పిచెప్పే కథలను కథకులు రాయాలి.

2004 కథావార్నిక ముందుమాట

సంకలిత - ఓల్లా * 88

వ్‌ 12 ఈ స్వప్నం నిజమవుతుంది 80వ దశాబ్దంలో విప్లవ, ప్తీవాద నేపథ్యంలో కవిత్వం రాసిన అపురూపమైన కవయిత్రి విమల. తన స్వరంలో తీవ్రతకూ, భావుకత్వానికీ మధ్య చక్కని సమన్వయం కుదుర్చుకోగలిగిన కవయిత్రి ఆమె. 'అడవి వుష్పాంగిన రాత్రి, 'సౌందర్యాత్మక హింస), 'వంటిల్లు' వంటి కవితలతో తనదైన ప్రత్యేక ముద్రను స్థిరపరుచుకున్నది. కవితా వస్తువు రాజ్యమైనా, మతమైనా, పిత్రుస్వామ్యమైనా, విప్లవ ధోరణులైనా, అన్యోప దేశంగానో, వ్యంగ్య ధోరణితోనో, నసుగుతోనో, విసుగుతోనో కాకుండా సూటిగా ధిక్మారస్వరం వినిపించగల సత్తా ఆమె స్వంతం. విమల రెండవ కవితా సంపుటి 'మృగన'. ఈ సంకలనంలో పదునైన నేలపై అరుదైన కాలంలో పడిన విత్తులు మొలకెత్తి క్షేతమంతా కలల ఫలసాయంతో బరువెక్కి ఒరిగింది. ఈ సంకలనమంతా స్వష్నాలే. కలలే కలలు. 89 కవితల్లో స్వప్నం అన్న పదంలేని కవితలు 15 మాత్రమే. పదం మాత్రమే కాదు. కలలు కనటమనే భావన ఒక పాజిటివ్‌ అర్థంతో సంకలనమంతా పరుచుకుని వుంది. కలలు మన బతుకుని అర్ధవంతం చేస్తాయి. ఆగామీ కాలం గురించి ఆశ కలలలోనే చిగురు వేస్తుంది. ఆ కాలం గురించి ఆలోచిస్తూ, నిరీక్షిస్తూ, ఆకాలంలోకి ప్రయాణిస్తూనే మనుషులు సజీవంగా వుండగలుగుతారు. గాలి పీల్చటమే కాదు కలలు కనే శక్తి కూదా ప్రాణానికి అత్యవసరం. ఆ శక్తి ఈ సంకలనం ద్వారా విమల మన హృదయాల్లోకి పంపగలిగింది. ఒక ప్రీ, విఫ్లవ స్వప్నాలలో స్త్రీగా ఎదిగిన మనిషి తన స్వప్నాలకూ, వాస్తవాలకూ సంకలిత - ఓల్గా * 89

మధ్యనున్న అంతరాలనూ, అంతరాయాలనూ, అవాంతరాలనూ అన్వేషిస్తూ అధిగమిస్తూ పోవటమే “'మృగని. “ఎంత అద్భుతమైన స్వష్నాలివి, “ఎంత మధురమైన స్వప్నాలవి, “ఎర్రజెండాలా రెపరెపలాడుతూ” వస్తాయి. 19వ శతాబ్దం నుంచీ ప్రతి తరంలోనూ అనేకమంది యువతీ యువకులు కన్న విప్లవ స్వష్నాలివి. “చిరకాల స్వష్నాన్ని అందుకునేందుకై యుగాలు పరిగెత్తాలి.” అనేకసార్లు కలలు కరిగిపోతాయి. కల్లలే అనిపిస్తాయి. కానీ విమల చెప్పినట్లు “కవేళ ఒక విధ్యంసం నుండి మరాక పునర్నిర్మాణ స్వష్వాన్ని కనేందుకు సాహసించక తప్పదు" విమల చేసిన ఆ సాహసయాత్రే 'మృగన'. ఇది తేలికపని కాదు. ఈ యాత్ర యాతనాభరితం .వేదనాపూరితం. అనంతం అనిపించే శూన్యాన్ని అంగుళం అంగుళం ఆశతో నింపుకుని రావడమంటే వట్టి మాటలూ, పదాలూ పేర్చటంకాదు. మళ్లీ కొత్త భాష ఓనమాల దగ్గర్నుంచీ మొదలుపెట్టి, కలలు కనడం నేర్వడానికి ఎంత రక్తం ఒలకాలి గుండెను చీల్చుకుంటూ! ఎన్ని కన్నీళ్ళు కారాలి కళ్ళను ఎరుపెక్కిస్తూ! ఆ రక్తమూ, కన్నీళ్షూ తర్చణ చేస్తూ ముందుకు సాగుతున్న విమల మనకీ సంకలనంలో సాక్షాత్మరిస్తుంది. ఇది కొన్ని తరాల అన్వేషణ గనుక ఎందరో విమలతో సహానుభూతి చెందగలుగుతారు. “కాలం చెక్కిలిపై నేను కవిత్వం రాసేప్పుడు నా నెమలి పింఛపు కలంపై ఎక్కడి నుంచో సుతారంగా వచ్చి వాలుతుందో సీతాకోకచిలుక నేనొక సీతాకోకల దీవిని వెతుక్కుంటూ బయలుదేరాను గడచిన జన్మలో నేనే ఒక సీతాకోకచిలుకనేమో” అంటూ సున్నిత్క సునిశిత, సంకేతభరితమైన కవిత్వంతో ఆలోచింపచేసే విమల “తల్లులారా రండి

సంకలిత - ఓల్లా * 90

మన సిగ్గుబిళ్ళల్ని తీసి వాళ్ళ ముఖాలపై విసిరేద్ధాం ప్రేమో, ప్రతీకారమో, లాభాపేక్షో మనం వివస్తలం కానిదెన్నడు” అని తీవ్రధ్వనితో నిరలంకార, నిస్సంకేత కవిత్వాన్ని పదునుగా రాసి పాఠకులను అవేశ భరితులను చేయగలదు. “సముద్రంలా చందమామ” కవితలో చందమామను ఎన్నో సరికొత్త వుపమానాలతో వర్ణించి (చందమామను సరికొత్త వుపమానాలతో వర్ణించి ఆహా! అనిపించడం తమాషా కాదు) బాణ మహాకవినీ, కాళిదాసునీ ఒక చూపు చూసే శక్తి గల విమల “అపరిమితానంద రసడోలికలలో తూగాడే వాడెవడూ రహస్య గర్భస్రావాల అవమానభారంతో నెత్తిన ముసుగేసుకుని నిష్కమించేదెవరు” అంటూ స్త్రీల గుండె మంటల్ని వుపమానాల ఆజ్యం లేకుండానే మరింత ప్రజ్వలింపచేయగలదు. వస్తుశిల్పాల రహస్యం తెలిసిన కవయిత్రి విమల. అందుకే 'బషీర్‌బాగ్‌' గురించి రాసి వుద్రేకపరచగలదు. 'ప్యారీ జాన్‌ గురించి రాసి మురిపించగలదు. “ఒకానొక నమ్మకం) వంటి కవితతో సమాజం గురించి తాత్విక అంచనా వేయగలదు. తను తక్కువ రాస్తానని విమలే చెప్పుకుంది. అందుకేనేమో పలికిన ప్రతి భావమూ పలచబడకుండా చక్కగా చికృనైంది. విమల కవిత్వం చదివాక అన్యాయంపై ఆగ్రహం, నిరాశపట్ల ధిక్కారం, శూన్యం గురించిన నిర్భయం, గతం పట్ల నిర్మోహమైన ప్రేమ, భవిష్యత్తు గురించి వెలుతురు, అద్బుత విప్లవ స్వప్నాల వేణుగానాల పిలుపుల వినికిడి

  • ఇవన్నీ మనల్ని వుక్కిరిబిక్కిరి చేస్తాయి. దాన్నించి తేరుకుని మనం సహృదయ మానవులమవుదాం. ఇంతమంచి పరిణామ కారణమైన విమల కవిత్వాన్ని మనసారా ఆహ్వానిస్తూ , ఆస్వాదిస్తూ ఈ స్వప్నం నిజమవుతుందని గట్టిగా నమ్ముతూ....! ఆదివారం ఆంధ్రజ్యోతి 1 నవంబర్‌ 2009 క్‌ సంకలిత - ఓల్లా * 91

న వ లో న్డ్‌ డం

13 మారినట్లు కనిపిస్తూ, సారాంశంలో ఏమీ మారని స్థితికి (ప్రతిబింబం - ఆనందీ గోపాల్‌ కథ 19వ శతాబ్దం నుంచీ “భారతీయ స్తీ ఒక సమస్యగానే వుంది. 21వ శతాబ్దం వచ్చినా ఆ సమస్యకున్న సంక్షిష్టత పెరుగుతున్నదేగాని తరగటం లేదు. చదువుకున్న స్త్రీ వుద్యోగం చేసే స్త్రీ సమాజంలో చురుకైన పాత్ర నిర్వహించే స్రీ - యిలాంటి స్తీ కోసం 19వ శతాబ్దం నుంచీ పురుషులు కలలు కన్నారు. ఆ స్త్రీకి ఒక రూపాన్నివ్వటం కోసం తపనపడ్డారు. సంస్కర్తలు, విద్యావేత్తలు, జాతీయోద్యమ నాయకులూ ఈ ఆధునిక భారతీయ స్త్రీని కొత్తగా చెక్కాలని చేసిన ప్రయత్నాలలో ప్రీల మనసులకూ, శరీరాలకూ యెన్ని దెబ్బలు తగిలాయా అని ఆలోచిస్తే గుండె బరువెక్కి పోతుంది. ఆధునికత్వం, వ్యక్తిత్వం, స్వేచ్చ, వీటిని - సంప్రదాయం, ఆచారం, పాతివ్రత్యాలతో బ్యాలెన్స్‌ చేయటానికి ఈ రెండు వందల సంవత్సరాలుగా భారతప్త్రీలు పడిన హింసను తల్చుకుంటే గుండె నీరయిపోతుంది. ఈ మధ్య 'ఆనందీ గోపాలొ అనే నవల చదివాను. అది ఆనందీగోపాల్‌ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన నవల. 19వ శతాబ్దానికి చెందిన ఆనంది జీవితం చదువుతుంటే ఒకవైపు సంతోషం, మరొకవైపు బాధ, చివరకు కన్నీళ్ళు ఆగని దుఃఖం - మూడు కలిసి వుక్మిరిబిక్కిరి చేశాయి. తొమ్మిదేళ్ళ వయసున్న ఆనందికి ఇరవై అయిదేళ్ళ గోపాలరావుతో వివాహమవుతుంది. గోపాలరావుకి అప్పటికే ఒకసారి వివాహమై భార్య చనిపోయింది. ఈసారి వితంతువుని పెళ్ళాడదామనుకున్న అతను దానికి పరిస్థితులు

సంకలిత - ఓల్లా * 92

సహకరించక ఆనందిని పెళ్ళాడతాడు. అతను ప్రభుత్వంలో చిరుద్యోగి. పెళ్ళికి ముందే అతను ఆనంది తండ్రికి ఒక షరతు పెడతాడు. ఆనందిని తను చదివిస్తాడు, దానికి అభ్యంతరం పెట్టకూడదని. ఆ షరతుని సీరియస్‌గా తీసుకోని 'తండ్రికీ, ఆనంది కుటుంబానికీ గోపాలరావుతో చాలా ఘర్షణలు జరుగుతాయి. ఆడపిల్ల పలక, పుస్తకం ముట్టుకోవటమే మహాపాపమనుకునే తల్లిదండ్రులకూ, తన భార్యను చదివించడమే తన జీవితాశయంగా చేసుకున్న గోపాలరావుకు మధ్య చిన్ని ఆనంది నలిగిపోతుంది. తిట్లు, దెబ్బలు, యేడుపులు మధ్య ఆనంది అక్షరాభ్యాసం జరిగిపోతుంది. క్రమంగా ఆమెకూ చదువంటే యిష్టం కలుగుతుంది. కానీ గోపాలరావు ఆశకు అంతులేదు. తన భార్య అమెరికా వెళ్ళి వైద్యం చదువుకోవాలి. డాక్టరవ్వాలి. ఈ కోరిక అతన్ని దెయ్యంలా పట్టుకుంటుంది. అది ఆనందికి అతను అంటిస్తాడు. ఆ అగ్నిలో శలభమై పోయింది ఆనంది జీవితం. నానా అగచాట్లూూ పడి ఆనందిని ఓడ యెక్కించి అమెరికా పంపుతాడు. ఇరవైయేళ్ళ ఆనంది, ఒంటరిగా, తనను చిన్నచూపు చూసి చీదరించుకునే తెల్లజాతి స్త్రీలతో కలిసి, అంతులేని ధైర్యంతో, గుండె నిబ్బరంతో చేసిన ఆ ఓడ ప్రయాణం భారత స్త్రీల స్వేద్భాగమన చరిత్రలో మర్చిపోలేని ఘట్టం. అమెరికాలో ఓ కుటుంబం ఆనందిని ఆదరించింది. ఆమె చదువుకునే ఆసక్తిని, దాక్టరవ్వాలనే కోరికనూ అగ్నిజ్వాలలా రేపిన గోపాలరావు ఆనంది అమెరికా జీవితాన్ని నియంత్రించటం ప్రారంభిస్తాడు. చిన్నతనంలో చదువుకోనని మొండికేసిన ఆనందిని దండించిన గోపాలరావు మీద మనకు పెద్దగా కోపంరాదు. చదువంటే యేమిటో తెలియని ఆ పిల్లకు చదువు నేర్పుతున్నాడు గదా అని క్షమిస్తాం. ఆనందికి కొత్త జీవితాన్ని యివ్వటానికి గదా యిన్ని తిప్పలు పడుతున్నాడు అని జాలిపడతాం. “నువ్వ డాక్టరయ్యి తీరాలి. అమెరికా వెళ్ళి తీరాలి” అని శాసించి ఆనందిని అమెరికా పంపించిన తర్వాత గోపాలరావులో బుసలు కొట్టిన భారతీయ పురుషత్వాన్ని మాత్రం మనం క్షమించలేం. అతని ఆంక్షలన్నీ పాటిస్తూ, అతని అనుమానాలకు కుమిలిపోతూ, ఆ చలిదేశంలో చీరె తప్ప వెచ్చనిదుస్తులు ధరించకుండా, ఆ చలిని తట్టుకునే బలమైన తిండి తినకుండా, సంతోషమనే మాట మర్చిపోయి చదువు తప్ప మరో ధ్యాసలేకుండా వైద్యురాలయింది ఆనంది. ఐతే భారతదేశం నుంచి గోపాలరావు రాసే ప్రతి వుత్తరమూ ఆమెకో కత్తిపోటే. ఆమెను అమెరికా పంపేముందు నువ్వు మాంసాహారం తిన్నా అక్కడి దుస్తులు సంకలిత - ఓల్త్లా * 93

ధరించినా అభ్యంతరం లేదన్న భర్త తాను శాఖాహారం తింటూ, చీరె కట్టుకుంటున్నానని మొత్తుకున్నా వినకుండా 'నువ్వు చెడిపోయావు” అంటూ వుత్తరాలు రాస్తుంటే యేం చెయ్యాలి? యెట్లా తట్టుకోవాలి? ఆ పరాయిదేశంలో యెవరితో యిది చెప్పుకోవాలి? ఎవరికి అర్ధమవుతుంది? అప్పుడామె వివేకంతో ధైర్యంతో రాసిన వుత్తరం యివాళ్టి మన మత ఛాందసవాదులకు మంచి జవాబు. ఆమె మతాన్ని గురించిన భర్త ఆలోచనలన్నింటినీ ఖండించింది. తప్పని చెప్పింది. ప్రపంచంలో ప్రతి మతంలోనూ కొన్ని లోపాలున్నాయి. ఆ లోపాలను పట్టుకుని ఆ మతాన్ని తూలనాడటం సరికాదు, మనం అసత్యంతో మన హృదయాలను మోసపుచ్చుకుంటున్నాం. సత్యమే దైవం, పొందూమతం గానీ, కైస్తవమతం గానీ తోటివారిని నీచంగా చూడమనో, మోసగించమనో చెప్పవు. తమ పేరుతో ప్రజలు చేసే ఘోరాలను ఆ మతాలు ఆమోదించవు. మానవులు సత్యాన్ని అర్ధంచేసుకోలేక ఈ తప్పిదాలు చేస్తున్నారంటూ ఆమె రాసిన వుత్తరాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. ఆ స్థితిలో కూడా ఆమెభర్త మీద జాలి పడుతుంది. అతని మానసిక స్థితిని అర్ధం చేసుకుంటుంది. కానీ ఆమె భౌతికంగా, మానసికంగా పడిన హింసవల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడయిపోయింది. క్షయవ్యాధి పాలవుతుంది. ఆ వ్యాధితోనే డిగ్రీ తీసుకుని భారతదేశం వచ్చింది గానీ తన జబ్బుకి తాను వైద్యం చేసుకోలేక పోయింది. సరైన చికిత్స యెక్కడా దొరకలేదు. డాక్టరై వచ్చిన ఆమెను సత్మరించటానికి పోటీపడ్డ సంపన్ను లున్నారే గాని, ఆమెను తినేస్తున్న వ్యాధి నుంచి ఆమెను కాపాడే వైద్యులు లేకపోయారు. చివరకు ఆమె ఆయుర్వేద వైద్యం చేయించుకోవాలనుకుంటుంది. ఒక ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు తన జబ్బుని నయం చేయగలడనుకుంది. కానీ అమెరికా వెళ్ళి మ్లేచ్చ వైద్యం నేర్చుకొచ్చిన ఒక ఆడదానికి తన నైద్యం చేయటానికి నిరాకరించాడా వైద్యుడు. ప్రాణాలు పోతున్నా మతాచారాలను మరచిపోయి వైద్యం చేయాలనే మానవత్వం లేని వైద్యుల చేతిలో బందీ అయిన ఆయుర్వేద వైద్యం ఆనందికి దొరకలేదు. దాక్టర్‌ ఆనంది - భారతదేశపు మొదటి మహిళా డాక్టరు - వైద్యం లేక మరణించింది. ఆధునికత, సంప్రదాయాల జమిలి కోరల్లో చిక్కుకుపోయి చనిపోయింది. బాలగంగాధర తిలక్‌ వంటివాళ్ళ అభినందనలను అందుకున్న ఆమె తనసేవలను భారతస్త్రీలకు అందించకుండానే ప్రాణాలు విడిచింది. సంకలిత - ఓల్త్లా ౪ 94

చనిపోయేముందు ఆమె గోపాలరావుని క్షమించింది. ఆ క్షమలో మానవత్వం పాలెంతో పాతివ్రత్యంపాలెంతో తెలుసుకోగలవారెవరూ? భూమి గుండ్రంగా వుందని భర్త చెప్పినరోజు ఆ జ్ఞానం యిచ్చిన ఆనందంలో తేలియాడిన ఆనంది, స్త్రీల జీవితం ఖందాంతరాలు దాటివచ్చినా, యెంత జ్ఞానం సంపాదించినా, తిరిగి తిరిగి, భర్త పాదాల చెంతకే చేరాల్సి రావటం గమనించి విషాద సముద్రంలో మునిగిపోయిందో లేదో మనకు తెలియదు. సంపాదించిన జ్ఞానానికీ, ఈదాల్సిన జీవితానికీ మధ్య పొంతన లేని స్థితిని చూసి ఆమెపడిన వేదన ఆమె బతుకు పుస్తకంలో మనం చూడగలం. తన భర్త ఆశయాన్ని తన ఆశయంగా మార్చుకోటానికి సంఘర్షించి, భర్త ఆధునికత్వాన్ని వొదిలి సనాతునుడై తన ఆశయానికి తూట్లు పొడుస్తుంటే చూస్తూ, భరిస్తూ,సహిస్తూ వుండటానికీ కూడా సంఘర్షించిన ఆమెకు జీవితంలో మిగిలిందేమిటి?

ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూనే వుంటుంది.

అప్పటినుంచి యిప్పటి వరకూ భారతదేశ స్రీలకు ఈ చిక్కుముడి విడిపోలేదనే అనిపిస్తుంది. ఆధునికంగా అదే సమయంలో సంప్రదాయకంగా, స్వేచ్చగా అదే సమయంలో పతివ్రతగా వుండాలనే సామాజిక ఒత్తిడిని తట్టుకుని తను తనుగా, ఒక వ్యక్తిగా నిలబడాలని భారత స్తీ ఈ రెండువందల సంవత్సరాలుగా ఘర్షణ పడుతూనే వుంది. ఈ ఘర్షణను రికార్డుచేసి, దానికొక గౌరవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత స్రీలమీదే వుంది. ఎందుకంటే ప్రీలుపడే ఈ ఘర్షణలకు యే విలువా వుండదు. అవి చిన్న తగాదాలుగా, అహంభావులైన ్రీల చేష్టలుగా, పిచ్చివాళ్ళ చేష్టలుగా రకరకాలుగా తమ ్రాధాన్యతనూ, విలువనూ కోల్పోతాయి. అవి పోరాటాలనే గుర్తింపు కూడా పొందవు. అందువల్లనే 'ఆనంది గోపాలొ జీవిత కథకూ, అలాంటి బీవిత కథలకూ చాలా ప్రాముఖ్యం వుంది. ఇలాంటి కథల ద్వారానే ప్రీల చరిత్ర అనేది యేర్చడుతుంది. చదువుకోవాలనే తపనతో, అక్షరాలు దిద్దుకునేందుకు పలకా బలపం కొనివ్వని ఛాందస కుటుంబాలలో పుట్టినా, వంటింటి గోడలపై బొగ్గుతో అక్షరాలు దిద్దుకుని విద్యావంతులైన స్త్రీలను తల్పుకోకపోతే, ఆ చరిత్రనూ, వారి ఆర్తినీ మన గుందెల్లో ప్రతిధ్వనించనివ్వకపోతే యివాళ్ళి మన కంప్యూటర్‌ చదువులు కేవలం చిలకపలుకులై మనకు మరిన్ని సంకెళ్ళు తగిలిస్తాయి. సమాజమంతా యెదురు తిరిగినా, అవమానించినా, రాళ్ళు వేసినా, కుటుంబాలు వెలివేసినా, ఒంటరిగా నిలిచి,

సంకలిత - ఓల్లా * 95

మానవులుగా తమకు అన్ని హక్కులూ కావాలని తిరుగుబాటు చేసి, ప్రతిరంగంలో తొలిసారిగా అడుగుపెట్టి, తమ బాధ్యతను శిలువ మోసినట్లు మోసిన ఈ స్త్రీల రక్తంలో, ప్రవహించిన ఆత్మగౌరవాన్ని గుర్తు తెచ్చుకోకపోతే యివాళ్లి మన వునికికి అర్ధం వుండదు. ఇపుడు మనం వున్న సందర్భం నుంచి ప్రయాణం చేయటానికి ఒక లక్ష్యం వుండదు. ఒక గమ్యం కనపడదు. ఎంతో మారినట్లు కన్పిస్తూ సారాంశంలో యేమీ మారని మన స్థితిని అర్ధం చేసుకోటానికి కూడా “ఆనంది గోపాల్‌ వంటి కథలు అవసరం.

ఇవాళ ఆడపిల్లల్ని చదివించటం యెంత మామూలయినా ఆ పిల్లల మీద పోలీసింగ్‌ ఆపలేకపోతున్నాం. ఆ పిల్లలు స్వేచ్చగా సంచరించేందుకు అవసరమైన భద్రతా వాతావరణాన్ని కల్పించలేకపోతున్నాం. స్వేచ్చా స్వాతంత్రాల గురించి ఆ పిల్లలు చదివే విషయానికీ, వాళ్ళ జీవితాలకూ మధ్యవుండే అగడ్త వారిని అనుక్షణం అయోమయంలో పడవేస్తుంది. ఎంత చదివినా, యేం వుద్యోగం చేసినా పెళ్ళే పరమావధి అనే భావజాలం మళ్ళీ వాళ్ళని వెనక్కు నెడుతుంది. పెళ్ళి చేసుకోకూడదని కాదు నా అభిప్రాయం. స్రీ పురుషుల సహచర్యం సహజం. కానీ 'పెళ్ళి ప్రీలపై మోపే భారాలు, బాధ్యతలూ పురుషుల మీద మోపదు. అందువల్ల పెళ్ళయిన తర్వాత స్త్రీలకు తమపని, వృత్తి సెకండరీ అయిపోతాయి. ఎంతో కష్టపడి చదివిన చదువు, యెంతో యిష్టంగా చేపట్టిన వృత్తీ సెకండరీ అయిపోయి సంప్రదాయకంగా వచ్చిన భార్యాత్వం, మాతృత్వం 'ప్రధానమైపోతే ఆ రెండింటికీ మధ్య సయోధ్య సాధించటానికే స్రీల శక్తంతా ఖర్చయిపోతుంది. ఈ సయోధ్య సాధించటంలో స్త్రీలు యెంత రాజీపడాలో చెప్పనవసరం లేదు. పి.హెచ్‌డీలు చేసి యింట్లో వూరికే కూర్చున్న నా స్నేహితుల్ని చూస్తుంటే నాకాశ్చర్యం వేస్తుంది. వాళ్ళు తమ అశాంతిని పోగొట్టుకోటానికి తమలో తాము యెంతో యుద్ధం చేస్తుంటారు. ఒకోసారి యుద్ధం అనేదే తలపెట్టరు. అలాగే వుద్యోగాలు చేస్తున్న నా స్నేహితులు మంచి భార్యలమనీ, మంచి తల్గులమనీ అనిపించుకోటానికి చేసే ఫీట్లూ, తీసే పరుగులూ చూస్తే కూడా వాళ్ళ శక్తికి ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళెన్ని ఫీట్లు చేసినా భర్తలనూ, పిల్లలనూ తృప్తిపరచలేక ఆ'మంచి” అనే సర్టిఫికెట్‌ సంపాదించలేక అపరాధ భావనతో నలిగిపోయే స్నేహితులు యింకెందరో! 'మంచి అమ్మాయి", 'మంచి భార్య? “మంచి తల్లో ఈ మాట అనిపించుకోవటమే తమ జన్మ

సంకలిత - ఓల్లా * 96

సాఫల్యమనుకునే భావన నుంచి స్త్రీలను బైటపడెయ్యటానికి యెలాంటి ప్రయత్నమూ

లేదు. అది కేవలం తమ ఒక్కరి వల్లా అయ్యేపని కాదని కూడా వాళ్ళకు తెలియదు.

అది తెలియనంత కాలం స్రీలు ఈ ఆధునిక॥సంప్రదాయాల సంఘర్షణలో

నలిగిపోతూనే వుంటారు. ఇంతకూ మన సంస్కరణలన్నీ వలసపాలనలో పుట్టుకొచ్చినవి.

పురుషుల చొరవతో పుట్టుకొచ్చినవి. తమకేం కావాలి అని స్రీలు ఆలోచించి మార్పులు

తెచ్చుకోవటమనేది యిప్పటికీ ప్రారంభం కాలేదు. తమకేం కావాలో ఆలోచించుకునే

వెసులుబాటు స్త్రీలకిప్పటికీ దొరకలేదనే అనిపిస్తుంది. దానికోసం భారతస్త్రీలు యింకా పోరాడాల్సే వుంది.

విజయవిహారం

ఏప్రిల్‌ 2000

సంకలిత - ఓల్గా ౪97

న ం ॥ “ఆయు

14 ఆంధ్రా పారిస్‌కు వందేళ్లు సరిగ్గా వందేళ్ల క్రితం 1910 వ సంవత్సరంలో తెనాలిలో, చలంగారు వాళ్ల తోటలో బాడ్మింటన్‌ కోర్టు పెట్టారు. ప్రతిసాయంత్రం తమ్ముళ్లూ, చెల్లెలూ, రంగనాయకమ్మగారు (చలంగారి భార్య) వెళ్లి ఆదేవాళ్ళు. దానిని గురించి చలం మాటల్లో చెప్పాలంటే “సాయంత్రం మేమందరం బ్యాట్స్‌ చేతుల్లో పట్టుకుని వెళుతూ వుంటే, ఇళ్లల్లో వాళ్లందరూ వాకిళ్లలో నిలబడి చూసేవారు. కొంచెం ధైర్యంచేసి తిట్టటం ప్రారంభించారు. కొందరు వాక్తిళ్లలో వుమ్మేసేవారు. వెనకటి కాలంలో బ్రహ్మసమాజం వారు ఇట్టాంటివన్నీ భరించారని చదివి వుండటం వల్ల వాటినన్నిటిని మేమూ భరించాము. అట్లా ప్రారంభమైంది నా స్వేచ్భా యజ్ఞం”. చలం ప్రారంభించిన ప్రీ స్వేచ్భా యజ్ఞాన్ని కొనసాగించిన కొడవటిగంటి కుటుంబరావు తెనాలిలోనే 1909లో పుట్టారు. వారింట్లోనే సాహితీ సమితి సమావేశాలు జరిగేవి. 1921లో జాతీయోద్యమ భావాలతో జాతీయ పాఠశాల కొన్నాళ్లు నడిచింది. కుటుంబరావు ఆ పాఠశాలలో వడ్రంగం నేర్చుకున్నారు. కాలేజీ చదువయ్యాక కుటుంబరావు గారు సాహిత్యపు లోతులు చూసి, రచయితగా జీవితం (ప్రారంభించింది తెనాలిలోనే. “చదువు, “అనుభవం” నవలల్లో ఆయన బాల్యకౌమారాల జీవితంలో వర్ణించింది తెనాలినే. 'యువ” ప్రచురణలు ప్రారంభించి చలం గారీ కథలను ప్రచురించింది తెనాలిలోనే. హోటల్‌ వర్కర్‌గా పనిచేస్తూ అద్భుతమైన నవలలు '“శారద' రాసింది తెనాలిలోనే. రావూరి భరద్వాజ, ఆలూరి భుజంగరావులకు తెనాలితో ఎంతో సన్నిహిత సంబంధం

సంకలిత - ఓల్లా * 98

ఉండేది. త్రిపురనేని రామస్వామి చౌదరిగారు తెనాలిలో సూత్రాశమం నెలకొల్పటం, అక్కడ జరిగే చర్చలు, బ్రాహ్మణ వ్యతిరేకోద్యమభావాలు, గోపీచంద్‌ ప్రభావితుడైన తీరూ ఇదంతా తెనాలిలోనే.

చడక్రపాణిలోని చతురత, సాహిత్యాఖభినివేశం పదును తేలింది తెనాలిలోనే. జి.వి.కృష్ణారావుగారి 'కీలుబొమ్మలు' జీవం పోసుకుంది తెనాలిలోనే. ఉప్పుసత్యాగ్రహ సమయంలో కాంగ్రెస్‌ నాయకులందరూ (మగవారు) అరెస్టయితే గుంటూరు మండల కాంగ్రెస్‌ మహాసభ తెనాలిలో గంగానమ్మ గుడి దగ్గర తల్లాప్రగడ విశ్వసుందరయ్య అధ్యక్షతన జరిగింది. కమ్యూనిస్టు భావాలు తెనాలి యువకులు స్వంతం చేసుకుని ప్రచారం చేశారు. రాడికల్‌ హ్యుమనిజం ఆవుల గోపాలకృష్ణమూర్తి వంటి కార్యకర్తలతో పెరిగింది కూడా తెనాలిలోనే.

1945లో అభ్యుదయ రచయితల మొదటి మహాసభలు తెనాలిలోనే జరిగాయి. ఇక నాటకరంగం తెనాలిలో వినూత్న పోకడలు పోయింది. తెనాలి పక్కగ్రామం అనంతవరంలో పుట్టిన అబ్బూరి రామకృష్ణరావు గారు తెనాలిలో 1943 లో 'నటాలి సంస్థ స్థాపించి కన్యాశుల్మం, మృచ్చకటికం వంటి నాటకాలు ప్రదర్శించారు. గోవిందరాజుల సుబ్బారావుగారు చాలా సంవత్సరాలు తెనాలిలో స్థిరపడి నాటకరంగానికి పేరుతెచ్చారు. స్థానం నరసింహారావు గారూ తెనాలి వచ్చి స్థిరపడ్డారు. తెనాలిలో ఇప్పటికీ స్థానం వారివీధి వుంది. పేర్లు చెప్పటం మొదలెడితే ఎంత చోటూచాలదు. 1950లో కన్నెగంటి నాసరయ్యగారు జనతా ఆర్ట్‌ థియేటర్స్‌ స్థాపించి “అన్నాచెల్లెలు” 'ఇదా ప్రపంచం), 'భయం' నాటకాలు ఆడారు. నేతిపరమేశ్వర శర్మగారు ఆంధ్రక్రాంతి థియేటర్స్‌ స్థాపించి ఆత్రేయ నాటకాలు ప్రదర్శించారు. కాంచనమాల సొగసైన నయనకమలాలు వికసించింది తెనాలిలోనే.

గుమ్మడి, జగ్గయ్య, సావిత్రి, జమున. వీరంతా తెనాలి చుట్టపక్కల (గ్రామాలలో పుట్టి తెనాలి నాటకరంగ చైతన్యంలో దీప్తిమంతమైనవారే. మూడుసార్లు 'ఊర్వశి బిరుదు స్వంతం చేసుకున్న శారదా తెనాలి వారే. దాసరి కోటిరత్నం, లక్ష్మీరాజ్యం, వంగరా తెనాలివారే. నాట్యానికి మరోపేరు ఖిక్షావతి. ఆమె నర్తిస్తుంటే చూసేందుకు దూర గ్రామాల నుంచి బండ్లు కట్టించుకువచ్చే వారు. ఆమెపేరు మీద కూడా తెనాలిలో ఒకవీధి యిప్పటికీ వుంది.

తుమ్మపూడిలో వుండే సంజీవదేవ్‌ గురించి భారతదేశమంతా తెలుసు. తెలంగాణా సాయుధ పోరాట నవల తెనాలి నుంచే వచ్చింది. బొల్లిముంత శివరామకృష్ణ రాశారు. వచన కవితలో ఆలూరి బైరాగి ఒరవడి ఎవరు మర్చిపోగలరు? ఇదంతా తెనాలి ఘనచరిత్ర. మున్సిపాలిటీగా మారిన వందేళ్లలో ఇవికొన్ని మైలురాళ్లు మాత్రమే. నేను గుంటూరులో పుట్టి పెరుగుతూ 1967లో, పదహారేళ్ల వయసులో మొదటిసారి తెనాలి వెళ్లాను. అప్పటికి పై చరిత్రంతా నాకు తెలియదు. ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలకని వెళ్లాను. నగ్జల్బరి ఆలోచనలు అంకురించిన రోజులు. ఆ సభల నిండా ఆ వుద్రేకపుటూపిరులే! ఆ రోజే తెనాలిలోనే మొదటిసారి తరిమెల నాగిరెడ్డిగారి వుపన్యాసం విని వురూతలూగాను. సుడిగాలిలా అది నన్ను చుట్టి శ్రీకాకుళోద్యమం వైపు నెట్టింది. అ తర్వాత పౌరహక్కుల సభలకూ, విరసం సభలకూ తెనాలి వస్తూ పోతూ వుండేదాన్ని, జుగాష్స్‌ బొల్లిముంత సాంబశివరావు, మరికొంత మంది మిత్రులు చైతన్య మిత్రులుగా ఏర్పడి 1971 ఫిబ్రవరిలో నిర్వహించిన సాహిత్య గోష్టిలో మూడువేల మంది పాల్గొన్నారంటే నమ్మటం కష్టంగానే వుంటుందిప్పుడు. ఆ రోజు సాయంత్రం పదివేల మంది హాజరైన బహిరంగసభలో శ్రీశ్రీ, చెరబండరాజు, వరవరరావు ప్రజలను వుర్రూతలూగించారు. ఆ రోజు నెప్పటికీ మర్చిపోలేను. 1978లో నేనిక తెనాలి వాసినైపోయాను. తెనాలి వియస్‌.ఆర్‌. కళాశాలలో లెక్చరర్‌గా వుద్యోగం వచ్చింది. ఎంత పెద్దకాలేజీ! దాని వెనుక ఎంతదూరదృష్టి! ఎంతమంచి విజన్‌! తెనాలి చుట్టుప్రక్కల పల్లెటూళ్లలో ఆర్ధికంగా, కులపరంగా వెనుకబడిన వారెంత మందో ఆ కళాశాల వల్ల వున్నత విద్య, వుద్యోగాలు పొంది ఆత్మగౌరవంతో జీవించగలిగారు. అన్ని వర్గాల, వర్ణాల యువతీయువకులు ఒకే ఆవరణలో చదవటం వల్ల ఆ వాతావరణంలో బహుళత్వం కనిపించేది. అలాంటి కాలేజీలో, వున్నత వ్యక్తిత్వం గల నన్నపనేని వెంకటరావు గారి నిర్వహణలో నడుస్తున్న కాలేజీలో వుద్యోగం దొరకటం ఎంత అదృష్టమో చేరిన వెంటనే తెలియకపోయినా ఎమర్జెన్సీ నాటికి బాగా తెలిసింది. నాకు విప్లవపార్టీతో సన్నిహిత సంబంధం వుందని తెలిసి కూడా యాజమాన్యంగానీ, తోటి వుపాధ్యాయులు గానీ ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. ఆ నిర్భంధపు రోజులలో ఆ కాలేజీలో ఎంతో గౌరవంగా జీవించాను. నన్నపనేని వెంకటరావుగారి వంటి ప్రజాస్వామిక వాదులు చాలా అరుదుగా కనిపిస్తారు. సంకలిత - ఓల్లా * 100

ఆర్‌వైఎల్‌ అధ్యక్షుడిగా వున్న వర్ధనరావు గారూ కాలేజీలో ఎలాంటి యిబ్బందీ పడలేదనుకుంటా. 1972-75 సంవత్సరాల కాలంలో అరుణోదయ సాహితీ సాంస్కృతిక వేదికను విద్యార్ధుల కోసం, యువతీయువకుల కోసం నడిపాం, జుగాష్‌ బొల్లిముంత సాంబశివరావు, రాఘవరెడ్డి, ఊసా, మరికొందరు మిత్రులం కలసి. వారంవారం వుర్ద్ణూ స్కూలులో (థెరుగు మార్కెట్‌) చర్చా కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి క్షణం జీవించాం ఆరోజులలో - మళ్లీ తెనాలిలో అటువంటి రోజులు వస్తాయా! ఐతానగరం తెనాలిలో ఒక గ్రామంలా వుందేదప్పుడు. అక్కడినుండి గాంధీచౌక్‌ వరకూ వున్న రోద్దులాంటి రోడ్డు రాజధానిలో కూడా లేదేమో. కాలువ పక్కన ఆరువేలమంది విద్యార్థులతో కాలేజీ యువసముద్రంలా వోరెత్తుతుండేది. వి.యస్‌.ఆర్‌ అండ్‌ ఎన్‌. వి.కళాశాలలో ఎంత పెద్ద లైబ్రరీనో! ఎన్నో మంచి పుస్తకాలు చదివానక్కడ. '“అతడు-ఆమె-మనం'” అనే సాహిత్య విమర్శ ఆ లైబ్రరీలో కూచునే రాశాను. హితశ్రీగారి కథల గురించి ఆయనతోనే మాట్లాదే అవకాశం ఆ లైబ్రరీలోనే కలిగేది. “మిసిమి” సంపాదకులుగా ప్రసిద్ధులైన అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డిగారు, నేనూ లైబ్రరీలోకూర్చుని చర్చించుకుంటుంటే కాలం తెలిసేది కాదు. స్టాఫ్‌ రూంలో ఎన్నీ వేడివాడి చర్చలు జరిగేవి. తిక్కన, శ్రీనాధుల కవిత్వం నుంచి విప్రవరచనల వరకూ హాస్యంగానూ, పరుషంగానూ వాదించుకునేవాళ్లం. ఎమ్మెస్‌గారూ, పాపయ్యగారు వంటి సీనియర్స్‌ తమ వ్యక్తిత్వాల ద్వారా స్టాఫ్‌రూంలో స్నేహం వెల్లివిరిసేలా చేసేవారు. ఇంకోవైపు రాడికల్‌ హ్యుమనిజం. కమ్యూనిజం కత్తులు దూసుకుంటూనే వుండేవి. లోహియైటు, సోషలిస్టు రావెల అరుణగారు మంచి రిసోర్స్‌ పర్సన్‌. సంజీవదేవ్‌ గారు అరుణ గారికి రాసిన వుత్తరాలలో భాషా విషయాలపై స్టాఫ్‌రూంలో అంతులేని చర్చలు నడిచేవి. అఫిలియేటెడ్‌ కాలేజీ టీచర్స్‌ అసోసియేషన్‌ కార్యకలాపాలకూ తెనాలి కేంద్రంగా వుండేది. రంగారావుగారూ, వెంకయ్యగారూ, ఎ.సత్యనారాయణ గారూ ఏ.సీ.టీ.ఏను చురుగ్గా నడిపించేవారు. ఇంగ్లీషు లెక్సరర్‌ తమీజుద్దీన్‌గారి తెలుగు భాషా సంపదని ఆనందించేవాళ్లం. నఫీజుద్దీన్‌గారు రచయితగా ్రసిద్ధులే. 1985లో నేను తెనాలి వదిలి హైదరాబాదు వచ్చాను. ఆ తర్వాత తెనాలి చాలాసార్లు వెళ్లాను.

ప్రపంచీకరణ వల్ల తెనాలి చాలా ప్రభావితమైందనిపిస్తోంది.

ఊళ్లో వున్నఒక్క పుస్తకాల షాపు 'సరళా బుక్‌ హవుస్‌ 90౦0లలో మూతబడింది.

కార్చోరేట్‌ కాలేజీ చదువులు యువతరంలో చైతన్యాన్ని , శక్తిని హరించి వేశాయనిపిస్తోంది.

రాజకీయ చైతన్యాన్ని పూర్తిగా తీసివేశాయి. ఒకప్పటిలా దళితపేదలూ, అగ్రవర్థాలు

ఒకే కళాశాలలో చదివి స్నేహాలు చేసుకునే అవకాశం పోయి, దూరాలు పెరిగిపోయాయి.

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత తగ్గటంతో వ్యవసాయ ఆధారిత ప్రాంతాల

ప్రాధాన్యత కూడా తగ్గిందేమో.

వ్యవసాయం నుంచి వచ్చే అదనపు విలువ తగ్గింది. ఆ అదనపు విలువ కళా సాహిత్య

రంగాలకు రావటమూ తగ్గింది. సారవంతమైన మాగాణి భూములూ, పంటకాలువలతో

తెనాలి బాగుంటుంది. కానీ కొత్తప్రయోగాలు, ఆలోచనలూ కాస్త మందగించాయా

అనిపిస్తుంది. తెనాలి చుట్టుపక్కల [గ్రామాలలో కొంత యువతరం అమెరికాకూ,

నగరాలకూ వెళ్లిపోయింది. కొత్త యువతరానికి చైతన్యాన్ని అందించే రాజకీయాలు

లేవు. సాహిత్య వాతావరణమూలేదు.

ప్రపంచీకరణవల్ల అన్నిచోట్లలాగే యిక్కడా విలువలు లేకుండాపోయాయి.

ఐకే తెనాలి మీద ఆశలు - చిన్నచిన్న ఆశలు.

వందేళ్లు నిండిన తెనాలి( మున్సిపాలిటి) మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలనే ఆశ!

మళ్లీ యవ్వనం సంతదించుకుంటుదనే ఆశ!

సూతాశ్రమపు హేతువాదం, చలం ధర్మాగ్రహ వుద్రేకం, కొ.కు.మేధస్సు, చక్రపాణి

చాతుర్యం, శారద సాహిత్య పిపాస నాటకరంగ ప్రతిభామూర్తుల తపన, రాడికల్‌

భావాల కోలాహలం - వీటిని వారసత్వంగా స్వీకరించే తరం ఒకటి తెనాలి నుంచి

రావాలనే ఆశ!

కొత్తకాలంలో, కొత్త పిలుపులతో, కొత్త ఆలోచనలతో కార్యరంగంలోకి దూకి సరికొత్త

సంస్కృతిని ఆంధ్రదేశానికి అందించి మళ్లీ “ఆంధ్రాపారిస్‌'గా వెలుగుతుందనే ఆశ ఆంధ్రజ్యోతి దినపత్రిక

16 ఫిబ్రవరి 2010 సంకలిత - ఓల్లా * 102

.

స్ట 10

న

కీ లవటు

లీ

కనక పుష్యరాగం 1892లో జన్మించిన పొణకా కనకమ్మగారికిప్పుడు నూట ఇరవయ్యవ ఏడు. ఆమె 1963లో తన 71వ ఏట మరణించారు. అప్పటికి ఆమె నూటయాఖైఏళ్ళకు సరిపడా పనిచేశారు. కనకమ్మగారి స్వీయచరిత్ర 'కనకపుష్యరాగం' చదివితే తెలుస్తుంది స్రీలు ఎంతెంత పనులు, ఎంత కీలకమైన పనులు, చరిత్రను మలుపు తిప్పేపనులు చేసి కూడా మరుగునపడి వుండవలసి వస్తుందో. ఈ సమాజంవారి పనులను పట్టించుకున్నట్టే వుంటుంది గానీ చాలా తెలివిగా పక్కన పెట్టేస్తుంది. పక్కకు నెట్టేస్తుంది. కనకమ్మగారి స్వీయచరిత్ర చదువుతుంటే అనిపిస్తుంది ఇంతగా సామాజిక, రాజకీయ కార్యక్రమాలలో మునిగినది పురుషులైతే వారు ఎన్ని పదవులు అధిష్టించేవారో, ఎంత అధికారం పొందేవారో, ఎన్ని విగ్రహాలు ప్రతిష్టించబడేవోనని. స్త్రీలు ఆ పదవీ, అధికార, విగ్రహారాధనల కోసం తహతహలాదకుండా ఆ దారిలో నడవనందుకు సంతోషించాలో, వారు ఆయా రంగాలలో పనిచేస్తూ ఏర్పరచిన విలువలు, ప్రజాస్వామ్య సంస్కృతి, ఇవన్నీ ప్రజలకు తెలియకుండా, ఆ చరిత్ర అందకుండా పోయిందని విచారించాలో తెలియదు. కాదు - నిజానికి దానికి తప్పకుండా విచారించాలి. ఇప్పటికైనా కాళిదాసు పురుషోత్తంగారు పుణ్యం కట్టుకోబట్టి మన బంగారం మనకు దొరికింది. ప్రజలకు కావలసిన అసలైన నిధులు యిలాంటి పుస్తకాలే. ఆ రోజుల్లో 14,15 సంవత్సరాల అమ్మాయి ఒకరు, ఇల్లు ఎంత ముఖ్యమో సమాజమూ అంత ముఖ్యమని గ్రహించుకుని, ఇంటినీ సామాజిక రాజకీయ జీవితాన్నీ సమతూకం సంకలిత - ఓల్లా * 103

చేసుకుంటూ తన జీవితాన్ని గడిపిన తీరు ఈ పుస్తకంలో చాలా సింపుల్‌గా చెప్పారు. అదేదో విశేషం కాదన్నట్టూ, సర్వసాధారణమన్నట్టూ ఆమె చెబుతున్న విషయాలన్నీ మనదేశ చరిత్రలో ముఖ్యఫట్టాలు. నేనింత చేశాననే ధోరణి లేకుండా ఇంతే చేయగలిగాను అన్నట్టు చెప్పే కనకమ్మగారిని గాఢాలింగనం చేసుకున్న తృప్తి కలుగుతుంది, ఈ పుస్తకం చదివితే. 1907వ సంవత్సరంలో బిపిన్‌ చంద్రపాల్‌ నెల్లూరు వచ్చి కనకమ్మగారి ఆతిథ్యం స్వీకరించి బహిరంగసభలో మాట్లాడి ఆమెను ఆశీర్వదించి వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి కనకమ్మగారి జీవిత చరిత్రకూ దేశచరిత్రకూ పెద్దతేడా వుండదు. ఆంధ్రదేశపు రాజకీయ సాంస్కృతిక చరిత్రను నిర్మించిన తాపీ మే'ప్తీలలో కనకమ్మ గారు అతిముఖ్యులు. 1918 నాటికి సుజనరంజని సమాజ స్థాపనలో భాగం పంచుకున్నారు. 1914 నాటికి అతివాదిగా మారి నిషిద్ద సాహిత్యాన్ని ప్రచురించటం, పాండిచ్చేరి నుండి తుపాకులు వస్తే వాటిని దాచటంలో వుత్సాహపడటం, 'హిందూ సుందరి, 'అనసూయి పత్రికలలో వ్యాసాలు రాయటం, 'ెట్టునీడ ముచ్చట్లు” పేరుతో కాలమ్‌లాగా రాసి చెట్టునీడ కనకమ్మగారుగా గుర్తింపుపొందటం, 1918లో హోంరూలు వుద్యమానికి మద్దతుగా పనిచేయటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నిపనుల్లో క్రియాశీలంగా పాల్గొన్నారో చెప్పలేం. ఆ వుత్సాహం, జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే కోరిక ఎంత వుందంటే, ఆవిడ యింట్లో కూర్చున్న రోజులు తక్కువ. 1919లోనే మద్రాసు వెళ్లి తిలక్‌ని కలిశారు. 1921లో బెజవాడ వచ్చిన లాలా లజపతిరాయ్‌ని కలిశారు. 1919లోనే దరిశి చెంచయ్య గారి పరిచయంతో గదర్‌ పార్టీ గురించి అర్ధం చేసుకున్నారు.

ఎన్నెన్ని పనులు చేసిందో కనకమ్మ!

రాజకీయాలే కాదు పుస్తక ప్రచురణ చేపట్టి పిచ్చయ్య శాస్తి 'స్వప్న ప్రయాణం),దువ్వూరి రామిరెడ్డి 'మాతృశతకం' ప్రచురించారు. అవి సామాన్యమైన పుస్తకాలా! బ్రిటీష్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తగలబెట్టిన పుస్తకాలు. 1921లో అహమ్మదాబాదు కాంగ్రెస్‌ సభలకు వెళ్లి అక్కడ తొలి వుపన్యాసం ఇచ్చారు. అక్కడ నుంచి గాంధీ ఆశ్రమం, బొంబాయి, పూనా అన్నీ చూసి వచ్చారు. అన్నట్టు “జమీను రైతు” పత్రిక న్థాపన ఈమె కుటుంబం నుంచే జరిగింది. ఊరి మాలపల్లిలో ప్లూ వస్తే పల్లెలో అందరికీ జావ, మందులు కనకమ్మ గారింటి నుంచే వెళ్ళేవి. కాంగ్రెస్‌ సభలు నెల్లూరులో

సంకలిత - ఓల్లా ౪ 104

జరిగితే ఆ రెండు రోజులు వంటపెత్తనమూ ఆమెదే. చివరి రోజు బహిరంగసభలో అధ్యక్ష న్థానమూ ఆమెదే. కాకినాడ కాంగ్రెస్‌ సభలలో వృద్దురాలైన షాకత్‌ ఆలీ తల్లిగారికి సేవలొకవైపు. ప్రీల రాజకీయ సభకు కస్తూరి బాయి అధ్యక్షత వహించాలనే నిర్ణయాన్ని అమలుచేసుకునే రాజకీయ కర్తవ్యం మరోవైపు. రాయలసీమలో కరువు వస్తే నరసాపురంలో నాటకం వేసి టిక్కెట్లమ్మి పంపే సహాయశీలి ఆమె. మద్రాసులో 'ప్రీల రాజకీయ సభలో పాల్గొని అధ్యక్షత వహించమని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారంతటి వారు అడిగితే నిరాకరించగలిగినంత గుండె నిబ్బరం ఆమె స్వంతం. ఎన్నోపనులు చేసినా ఆమె ఆశ, ధ్యాస, శ్వాస అంతా ఆమె స్థాపించిన కస్తూరీబాయి బాలికల పాఠశాల మీదనే. దానికోసం ఆవిడ చేసిన కష్టం అంతా ఇంతా కాదు. 1929లో ఆ విద్యాలయ శంకుస్థాపనకు గాంధీగారిని రప్పించి, రామదాసు నాటక ప్రదర్శన వేయించి ఆయనకు చూపించింది. అందరి దగ్గరా డబ్బు వసూలు చేసింది. గాంధీతో చాలా అనుబంధం ఆమెకు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో జైలుకి వెళ్ళేముందు, స్మూలుకి ఇబ్బంది లేకుండా డబ్బు అప్పుతెచ్చి వుంచే ముందు చూపు ఆమెది. నెల్లూరులో మొదటి ఎగ్జిబిషన్‌ కూడా ఆమే పెట్టింది. అప్పుడు దాని ప్రయోజనం చేతివృత్తుల, కళాకారుల నైపుణ్యాల ప్రదర్శన. ఉప్పల లక్ష్మణరావు, మెల్లీగారు అక్కడ తమ ఖద్దరు ప్రదర్శించారు. 1934లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు కనకమ్మ, 1987లో శాసనసభలలో స్త్రీలు అధికంగా వుండాలని ఆ సభ్యత్వానికి దరఖాస్తు పంపారు. ఆమెమాటల్లోనే అప్పుడు జరిగింది తెలుసుకుందాం. “ఆదవాళ్ళనే నెపంతో కాబోలు నన్ను తీసుకోలేదు. చివరకు నేను కట్టిన పైకము కూడా తిరిగి రాలేదు. 'ప్రీలకు ప్రాతినిధ్యము కావలయునని ఊరక మాట్లాడే దానికంటే కార్యము చేసి చూపించేది ్రేష్టము గదా. అదేగదా అత్యుత్తమ లక్ష్యమూ. మాటలకంటే చేతలు ముఖ్యమని మనసావాచా కర్మణా నమ్మిన వ్యక్తి కనకమ్మగారు. సంపూర్ణ స్వతంత్ర తీర్మానం గురించి కాంగ్రెస్‌ మహాసభలలో స్త్రీల తరపున మాట్లాడే రాజకీయ పరిణతి అమెది. బెంగుళూరు నాగరత్నమ్మతో పరిచయాన్ని స్నేహంగా చేసుకుని ఆనందించిన స్నేహశీలి. త్యాగరాజస్వామి సమాధికి బెంగుళూరు నాగరత్నమ్మ పూనుకున్నప్పుడు కనకమ్మగారూ

తన వంతు సాయం చేశారు, స్నేహమన్నప్రుడు కనకమ్మగారి స్నేహితురాలు ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారి గురించి చెప్పుకోవాలి. వుద్యమాలలో ఇంత సుదీర్హకాలం స్నేహితులుగా వుండి, ప్రతిపనీ కలిసి చేయటం, కష్టాలు కలిసి పంచుకుని ఆనందించటం చాలా అరుదుగా జరుగుతుంది. అందులో ్రీల విషయంలో మరీ అరుదు. వీరిద్దరి స్నేహం ఎన్ని మంచిపనులు చేయించిందో. కనకమ్మగారి సాహిత్య కృషి కూడా తక్కువది కాదు. పద్యరచన, వ్యాసాలు రాయడంతోపాటు, 1982లో జైలుకి వెళ్ళినపుడు మహారాజ నందకుమార్‌ రాసిన 'వురి' అనే పుస్తకాన్ని హిందీనుంచి తెలుగులోకి అనువాదం చేశారు. రాయప్రోలు సుబ్బారావు, కాంచనపల్లి కనకమ్మగార్లతో ఆమెకు మంచి స్నేహం వుండేది. మద్రాసులో ఒకసారి ఈమె తెలుగులో మాట్లాడితే రాజాజీ అంతటివాడు తమిళంలోకి అనువాదం చేశాడు. నెల్లూరులో ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి పాట కచేరీ నిర్వహించి విద్యాలయానికి లక్ష రూపాయలు వసూలు చేసింది. నెల్లూరుకి రాని నాయకులు, కళాకారులు లేరు. ఉదయ శంకర్‌ దంపతులు, ఘంటసాల, నాగయ్య, లలిత, పద్మిని ఒకరు కాదు - కనకమ్మగారి కళా హృదయానికీ, సామాజిక బాధ్యతకూ లొంగనివాళ్ళు ఆ కాలంలో ఎవరూ వున్నట్టు లేరు. 1947కు ముందే బాలికలకు పారిశ్రామిక విద్యాలయం స్థాపించాలనే ఆలోచన చేసిన దూరదృష్టి ఆమెది. దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, నెల్లూరుకు, ఇంతచేసిన ఆమెకు ఆ ఊరి పెద్దలు ఏదో చేయాలి కదా! చేశారు. ఆమె స్థాపించి అభివృద్ధి చేసి, కంటిపాపలా కాపాడిన స్కూలులో ఆమెకు చోటు లేకుండా చేశారు. ఆ సమయంలో ఆమెకు అందగా నిలబడి మాట్లాడినవారు, ఆమెను స్కూలు నుంచి దూరం కాకుండా చేయగలిగిన వారూ లేరంటే ఆమెమీద వారికి ఎంతకోపం వుండి వుండాలి? అంతకోపం ఎందుకు? స్వస్థలంలో అంతపనిచేసి అందరికంటే ప్రసిద్ధురాలవుతుందా? దుర్గాబాయమ్మగారిలా మరో ఊరిలో అయితే ఫరవాలేదు గానీ ఎక్కడ పుట్టిందో అక్కడ ఇంత పేరంటే అక్కడున్న పురుషులేం కావాలి? ఎంతమంది స్త్రీల సామాజిక శ్రమను పురుషులు దురాక్రమించారో, అనుభవించారో, తల్చుకుంటే గుండె మండిపోతుంది. ఆమె చనిపోయినా, భయమే, కోపమే. ఆమె స్థాపించిన స్కూలు విద్యార్థినులు, అధ్యాపకులు ఆమె భౌతికకాయాన్ని చూడడానికి కూడా నిషేధమే. ఆమె కాంస్య విగ్రహం పెట్టుకుని సంకలిత - ఓల్లా * 106

ఎప్పుడన్నా ఓ పూలమాల వేసి తల్చుకోటానికి కూడా నెల్లూరు వాసులకు అదృష్టం లేదు. భయం. దానినిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆమె చరిత్రకెక్కితే ఎందరు చరిత్రహీనులవుతారో! ప్రీల శమమీద, వారి అణచివేత మీదా ఆధారపడి నిలబడిన ఈ పురుష చరిత్రను తిరస్కరించి కొత్త చరిత్ర రాసే పనియింకా యింకా వేగంగా వెయ్యి చేతులతో చేయాలి స్రీలు. గురజాడ అన్న వాక్యంలో కీలకమైన మాట మర్చిపోకూడదు. “ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖించాలి”. “పునర్లిఖించటం'” - అది చాలా ముఖ్యం. దానికి కావలసిన ఇటుకలు కనకమ్మగారి స్వీయ చరిత్రలో మనకు పుష్కలంగా దొరుకుతాయి. ఆ పునర్‌ లేఖనానికి ఈ రూపంలో తోడ్చడిన 'పురుషోత్తములకు” చేతులెత్తి నమస్కరించాలి. కాళిదాసు పురుషోత్తంగారు చేసిన అమూల్యమైన ప్రయత్నానికి స్త్రీలందరి తరపునా ధన్యవాదాలు చెప్పాలి. ఆదివారం ఆంధ్రజ్యోతి 18 సెప్టెంబర్‌ 2011 సంకలిత - ఓల్త్లా * 107

16

మళ్ళీ కళ్ళు తెరిచిన 'పుణ్యభూమీ కళ్ళుతెరూ”

చరిత్రకున్నట్లే సాహిత్యానికి, సాహిత్య చరిత్రకు ఒక నిరంతరమైన కొనసాగింపు, అదే సమయంలో మార్పు వుంటాయి. సాహిత్య చరిత్రలోకి వెళ్ళి కొంచెం పరిశీలనగా చూస్తే ఆ కొనసాగింపుల క్రమం గొప్ప రచయితల రచనల్లో చాలా ఆసక్తికరంగా కనపడుతుంది. 'పుణ్యభూమీ కళ్ళుతెరూ' నవల 1970లో బీనాదేవి రాశారు. దానిని ఇప్పుడూ చదువుతుంటే ఎక్కడో, గత సాహిత్య చారిత్రక నేపథ్యంలోంచి మధురవాణి మాటలు వినపడతాయి. గురజాడ రూపుదిద్దిన మధురవాణి మాటలు. తన గురించి, తన వృత్తి గురించి, ఎంతో ఆత్మగౌరవం ప్రకటించిన మధురవాణి, ఆ కాలపు సంస్మర్తల ప్రభావం వల్ల “'మరోజన్మంటూ వుంటే అంటూ ఇలా అంటుంది. “కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్లన్నవారు వుందురేమో” అంటుంది! మధురవాణి ఈ మాటలు 1909వ సంవత్సరం లోనివైతే 1970వ సంవత్సరం నాటికి ఒక కాపు మనిషిగా పుట్టిన రాజమ్మ 'పుణ్యభూమీ కళ్ళు తెరూ' నవలకు కథానాయకురాలయింది. ఈ రాజమ్మ వంగమొక్కలకూ మిరప మొక్కలకూ దోహదం చేసేంత సున్నితమైన పని కాకుండా, అరచేతులు తెగిపోయేలా చెరుకు తోటలో అకుచుట్టటం దగ్గరినుంచీ అన్ని రకాల శ్రమలూ చేసింది. తనకోసం తన భర్త కోసం కొడుకుకోసం ఒళ్ళు విరుచుకుని పనిచేసింది. ప్రతిగా మధుర వాణి ఆశించిన, కలగన్న 'తనవాళ్ళిచ్చే భద్రత రాజమ్మకు దొరకలేదు. దొరక్కపోగా ఏపని నీతి బాహ్యమని సంస్కర్తలు భావించి, ఆ వృత్తి నిర్మూలనకు వుద్యమాలు చేసి మధురవాణిని సైతం ప్రభావితం

సంకలిత - ఓల్లా * 108

చేశారో, ఆ వేశ్యావృత్తిలోకి రాజమ్మ ఏభద్రతా లేకుండా, ఏ శిక్షణా లేకుండా, ఏ రక్షణా లేకుండా గుండెరాయి చేసుకుని దిగింది. గడిచిన 60 ఏళ్లలో దేవదాసీలు కాపు మనుషుల్లా వ్యవసాయంలోకి వచ్చి వుండొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ నిష్పత్తిలో వ్యవసాయ కుటుంబాలలోని మనుషులు, వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులపాలై, భూమినుండి నెట్టివేయబడి, గౌరవంగా (బ్రతకటానికున్న అన్ని మార్గాలూ ఒకటొకటే మూసుకుపోతే వేశ్యావృత్తిలోకి దిగాల్సి వచ్చిన క్రమాన్ని రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక నేపథ్యంతో సహా పట్టుకుని చూపిన నవల బీనాదేవి 'పుణ్య భూమీ కళ్ళు తెరూ* మధురవాణి రాజమ్మను చూసి భయపడుతుందో, బాధపడుతుందో తెలియదు గానీ వ్యవసాయం మీద ఆధారపడి బతకాలని మాత్రం అనుకోదు. సమాజంలో ఆడది తనను తాను రక్షించుకునే సామర్ధ్యం లేనిదైతే వేరే ఎవరూ రక్షించలేరని రాజమ్మ జీవితం మనకు చెబుతుంది. వ్యక్తుల మంచితనాలు వ్యవస్థ ముందు వెలవెల బోతాయి. రాజమ్మ భర్త సింహాచలం కూడా వ్యవసాయం చేసే రోజుల్లో రాజమ్మంటే (్రేమగానే వుండేవాడు. పొలం పోయిన తరువాత కూడా చాలాకాలం రాజమ్మ మీద అతను జాలి, దయ, ప్రేమ చూపగలిగిన మానసిక స్థితిని నిలుపుకో గలిగాడు. కానీ వ్యవస్థ ఎంత క్రూరంగా వుందంటే మనుషులు అమానుషంగా మారిపోవటానికి ఎంతో సమయం పట్టదు. మొత్తం మీద వ్యవసాయం, షావుకారు కోర్టులు, పోలీసులు రాజకీయ పార్టీలు అన్నీ కలిసి రాజమ్మను వేశ్యావృత్తిలోకి దింపిన క్రమమే, ఈ నవలలోని కథ. దేశీయ పాములన్నీ కరిచినా కొన ఊపిరితో వున్న రాజమ్మను అంతర్జాతీయ పాము అమెరికా పౌరుడు జె.జే, రూపంలో వచ్చి కరిచింది. రాజమ్మను సెక్స్‌వర్కర్‌గా తన దగ్గరకు పిలిపించుకొని జే. జె. ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమ్మే చంపిందని పోలీసు లామెను అరెస్టు చేసి జైలుకు పంపారు. న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష వేయటానికి సిద్ధంగా వుంది. 1988లో హైదరాబాద్‌ మెహందీలో ఇదే సంఘటన జరిగింది. కానీ స్త్రీల చైతన్యం అప్పటికి కాస్త పెరిగింది. రాజమ్మ వంటి ప్రీలు మనకు తారసపడితే, మనం వాళ్ళను చూసి నీత్రీ జాతీ లేని వాళ్ళని చీదరించుకుని తలలు తిప్పుకునే ముందు మనం రాజమ్మ అలా ఎందుకు మారిందో ఆలోచించాలని “పుణ్యభూమీ కళ్ళు తెరూ' హెచ్చరిస్తుంది. రాజమ్మను అలా మార్చిన గవర్రాజు లాంటి భోటాలిడర్ల గురించి, సురేంద్ర లాంటి షావుకార్ల గురించి, ఆచారిలాంటి దౌర్భాగ్యుల గురించీ, జె.జె, అతని స్నేహితుడు వంటి పాపిష్టి విదేశీయుల గురించీ, సంకలిత - ఓల్లా * 109

పోలీసుల గురించీ - అన్నిటికంటే ముఖ్యం ఆకలి, జబ్బులు, అవిటితనాల గురించీ తెలుసుకోవాలని 'పుణ్యభూమీ కళ్ళుతెరూ' నవల చెబుతుంది. వీళ్ళంతా ఇలా వుండటానికీ, ఆకలి మనుషుల మీద క్రూరంగా దాడి చేయటానికి కారణం డబ్బు అని ఆ నవల ఎలుగెత్తి చెబుతుంది. నవలలో అనేక చోట్ల డబ్బు మానవీయ విలువలను ధ్వంసం చేస్తున్న తీరు మనకి అర్ధమవుతుంది. అలా అర్ధం చేయించటమే ఈ నవల ప్రయోజనం. ఐతే 1970 నుంచి 2011 వరకు ఈ నలభై సంవత్సరాలలోనూ దేశం ఎంత అభివృద్ధి చెందిందంటే ప్రతి జిల్లాలోని ప్రతి (గ్రామంలోనూ రాజమ్మలు తయారుచేయబడుతున్నారు. డబ్బు మనిషిని దారుణంగా హత్య చేసింది. ప్రభుత్వం వారే ఎంత శ్రమకోర్చి ఖర్చుపెట్టి తయారుచేస్తున్న గణాంకాలలో ట్రాఫికింగ్‌ పెరుగుతున్న తీరు చూస్తే దేశం వెలిగిపోతున్న తీరు అర్ధమవుతుంది.

కథకు చిన్న పాయింట్‌ వుంటే చాలుగానీ నవలకు షాట్‌ వుండాలి. ఆ ప్లాట్‌ని రచయితలు ఎలా అల్లుకుంటూ ఎలా విప్పుకుంటూ వెళ్తారో అదే ఆ నవలాశిల్పం. రాజమ్మ వ్యవసాయం నుండి వ్యభిచారంవైపు వెళ్లటమే ఈ నవల ప్పాట్‌. దానిని అల్లేటప్పుడు సామాజిక వ్యవస్థలోని వివిధ అంగాలనూ చూపి రాజమ్మ జీవితాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నడిపించిన శక్తులను బీనాదేవి చిత్రచిత్రాలుగా చూపించారు. రాజమ్మకు ఈ నవలలోని చాలా పాత్రలు తెలియవు. వాళ్ళ గురించి రాజమ్మకు ఏమీ తెలియకుండానే రాజమ్మ జీవితాన్ని వాళ్ళు ప్రభావితం చేయగలిగారు. లాయర్లు వెంకట్రావు, పురుషోత్తం, అసిస్టెంటు విమల -- వీళ్ల పేర్లు కూదా రాజమ్మకు తెలియవు. తనను భూమినుంచి నెట్టివేయటంలో వీళ్ల దుర్మార్గపు పాత్ర గురించి అంతగా తెలియదు. రాజమ్మకసలేమీ తెలియదు. కథలో ముఖ్యపాత్ర తన జీవితంలో పెద్ద మార్చులకు కారణమైన అసలు పాత్రలతోటి ఎపుడూ తలపడలేదు. ఇది రచయితలు సామాన్యంగా అనుసరించే నవలా శిల్చం కాదు. అరుదైన కథన పద్ధతి. ఇలా చెయ్యటం వల్ల ఈ డబ్బు నడిపించే సామాజిక మహాయంత్రంలోని ఏ ఒక్కభాగం గురించీ ఏమాత్రం తెలియకుందా, ఆ యంత్ర రాక్షసి కోరలకు అమాయకులు ఎలా చిక్కుతున్నారో నవల చదివేవారికి అర్ధమవుతుంది. మన జీవితాన్ని ఎవరు ఎక్కడినుండి శాసిస్తున్నారో తెలిస్తే ఆ శాసనానికి ఎదురు తిరగాలనే కోరిక పుడుతుంది.

కానీ ఈ సామాజిక గజిబిజి అల్లిక రోజురోజుకీ ఎంతో సంక్షిష్టంగా తయారవుతోంది. మనల్ని శాసించి నియంత్రించే రాజకీయ శక్తులేమిటో, అవి ఎక్కడనుంచి

సంకలిత - ఓల్లా * 110

పనిచేస్తున్నాయో, వాటి ప్రాణాలు ఏ సముద్రాల అవతల మర్రిచెట్టు గూటిలోని చిలకలో వున్నాయో తెలుసుకోవడం మేధావులకే అసాధ్యంగా వుంది. అంత అసాధ్యపు పని రాజమ్మ చేయలేకపోవచ్చు. అందువల్లనే రాజమ్మకు ఎదురు తిరగాలనే తలపే కలగలేదు. నిజానికి ఆ కోరిక రాజమ్మలో కంటే పాఠకులలో పుడితే మరింతగా సాహిత్య ప్రయోజనమూ, సామాజిక ప్రయోజనమూ కూడా నెరవేరుతుంది. అందువల్లనే కథానాయిక రాజమ్మ కత్తిపట్టుకు ఎదురుతిరగకుండా తనను సాధ్యమైనంత త్వరగా వురితియ్యమని వేడుకుంటుంది. అది చదివిన పాఠకులకు ఏదోఒక ఆయుధంతో రాజమ్మలను రక్షించాలనే కోరిక పుడుతుంది. ఆ ప్రయోజనం కోసమే బీనాదేవి కథను, కథన పద్ధతిని ప్రత్యేకంగా ఎంచుకుని నడిపించారు. రాజమ్మకు తెలియకుండా రాజమ్మ జీవితాన్ని నడిపిన ఆదృశ్య, అమానుష శక్తులను రాజమ్మ చుట్టూ అల్లటంలోనూ, ఆ అల్లికనొక క్రమంలో పాఠకులకు పరిచయం చెయ్యటంలోనూ రచయితగా బీనాదేవి ప్రతిభ వుంది. ఈ మిగిలిన పాత్రలలో ఏ ఒక్కటి కనీసపు మానవత్వంతో వున్నా రాజమ్మ జీవితం ఇంత దారుణంగా వుండేది కాదు. కానీ అలా వుండటం వాళ్ళ చేతుల్లో కూడా లేదు. మహాభీకరమైన రాక్షస వ్యవస్థ ఒకటి నడుస్తోంది. దాని విశ్వ రూపాన్ని రేఖామాత్రంగా పరిచయం చేసి మన ఊహకు వదిలేశారు బీనాదేవి. ఇవాళ రేపూ పేపర్లలో దగా కంపెనీల గురించిన వార్తలు వస్తుంటే, కొ.కు నవల 'వారసత్వం'లో రామదాసు పాత్ర గుర్తొచ్చినట్టు 'పుణ్యభూమీ కళ్ళుతెరూ' నవల చదువుతుంటే రైతులందరూ గుర్తొస్తారు. సింహాచలం, రాజమ్మలు ఆత్మహత్య చేసుకుని ఒక్కసారిగా చనిపోయే అదృష్టానికి కూడా దూరమయ్యారు. క్షణంక్షణం చస్తూ బతికారు. వ్యవసాయాన్ని అలాంటి స్థితిలోకి నెట్టిన వ్యవస్థ దుర్మార్గం పాఠకులకు తేటతెల్లమవు తుంది. షావుకార్లకు తోడు ఇప్పుడు బ్యాంకులు, మైక్రో క్రెడిట్‌లు కూడా తోడయ్యాయి. ఈ నవలలో జె.జెఅనే అమెరికన్‌ పాత్ర అవసరమా అనే సందేహం కొందరికి రావొచ్చు. బహుశా అది నిజంగా జరిగిన సంఘటన కావొచ్చు. కానీ తరచుగా జరిగేది కాదు. అలాంటి పాత్రను సింబాలిక్‌గా అర్ధం చేసుకోవచ్చు. ఇందులో జె.జె తన తమ్ముడికి అన్యాయం చేసి, పాపం చేశాననే భావంతో మనశ్శాంతి కోసం ఇండియా వస్తాడు. ఇరాక్‌, ఆస్టనిస్తాన్‌లలో తాము చేసిన పాపాలను ఇంకో బడుగుదేశానికీ 'సాయం' చేసి కడుక్కుందామనుకునే అమెరికా లాగానే !- అలాగే మన వ్యవసాయ సంక్షోభపు తీవ్రత, అమెరికన్‌ మార్కెట్‌ ఎకానమీ తీరు తెన్నులపై సంకలిత - ఓల్దా * 111

ఆధారపడి కొనసాగిన తీరుకూడా ఈ పాత్ర మిషతో బీనాదేవి చెప్పినట్లు అనిపిస్తుంది. అగ్రరాజ్యాల పాపిష్టి విధానాల ప్రభావం అంతిమంగా పదేది మనదేశం వంటి దేశాలలోని నిరుపేద స్ర్తీల మీదనే. రాజమ్మకు జె.జె. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో, చేసుకోబోయే ముందు తననెందుకు పిల్పాడో, సాయం చేస్తున్నాననుకుని డాలర్లు, పౌడర్లు, ఇతర విదేశీ సామాగ్రి ఎందుకిచ్చాడో ఏమీ తెలియదు. కానీ జె.జె.ని హత్యచేసిందనే అభియోగంతో జైల్లో ఉరిశిక్ష అమలుకోసం ఎదురుచూస్తూ వుంది. మరో అమెరికన్‌ “ఎంటర్‌ (పెన్యూర్‌ రైటర్‌ ఆమె జీవిత కథ రాసి బెస్ట్‌ సెల్లర్‌గా చేసి డబ్బు సంపాదించాలని వచ్చాడు. ముందు చెప్పినట్లు ష్లాట్‌ చాలా పకడ్బందీగా పురోగమించి నవల ముగింపు సమయానికి అన్ని పాయలూ కలిసిన నది సాగరసంగమం చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక 70లో రాసిన “బీనాదేవి జండర్‌ పరంగా ఎలాంటి సెన్సిటివ్‌నెస్‌తో వున్నారనేది ఇవాళ్టి విమర్శకులు అంచనా వేయక తప్పదు. రాజమ్మలాంటి పేద స్త్రీని కథానాయికగా తీసుకోవటంలోనే బీనాదేవి వర్గస్పృహను, జండర్‌ స్పృహను గమనించవచ్చు. ఈకథలో సింహాచలాన్ని కథానాయకుడిగా చేసేందుకు అన్ని అవకాశాలూ వున్నాయి. నిజానికి రాజమ్మకున్న మనోధైర్యం కూడా లేక సింహాచలం చిత్రహింసలనుభవించాడు. ఒక నిరుపేద రైతుగా, రిక్షా కార్మికుడిగా ఈ నవలకు కథానాయకుడు సింహాచలం అని చెప్పుకునేలా చేసేందుకు రచయితకు అన్ని అవకాశాలూ వున్నాయి. కానీ రచయిత అలా చెయ్యలేదు. దోపిడీకి పీడనకు గురయ్యే పురుషుడికి కూడా తాను దోపిడీ చేయటానికి ప్రీల శ్రమ వుంటుంది. పీడించటానికి ప్రీలుంటారు. భార్యలుగా, తల్లులుగా, సెక్స్‌వర్మర్లుగా - ఒక నిరుపేద రైతుభార్య, ఒక బిడ్డకు తల్లిలఅయిన రాజమ్మ సెక్స్‌ వర్కర్‌ అయితేగాని, తన భార్యత్వాన్ని, మాతృత్వాన్ని నిర్వహించలేకపోయింది. కాబట్టి ఈ పుణ్యభూమిలో, ఈ కర్మభూమిలో, రాజమ్మే కథానాయిక. రాజమ్మల వెన్నెముకల మీదనే అంతిమంగా ఈ వ్యవస్థ నిలబడింది. వీనాదేవిలో ఈ చూపు వుండడం వల్లనే సింహాచలం పాత్ర నాయకుడిగా కాక (ప్రతి నాయకుడిగా మారి (అలా మారటం అతని అపరాధమని రచయిత చెప్పలేదు. వ్యవస్థనే విప్పిచూపారు) రాజమ్మ పుణ్యభూమికి ప్రతినిధి అయింది. రాజమ్మకు అందం, వయసు కారణంగా ఎన్నో పరీక్షలెదురయ్యాయి. అన్నిసార్లూ రాజమ్మ ఆత్మగౌరవం కాపాడుకుంది. రాజమ్మ చివరకు తను పనిమనిషిగా సంకలిత - ఓల్లా * 112

వున్న ఇంటి యజమాని ప్రిన్సిపాల్‌ రంగరాజుకి లొంగిపోతుంది. అతనంటే రాజమ్మకు జాలి. అతని పిల్లలను తన పిల్లాడి కంటే ఎక్కువగా సాకింది. అతను ఒక విషాదంలో వున్నప్పుడు రాజమ్మ అతన్ని కాదనలేకపోయింది. ఆ సంగతి బీనాదేవి చాలా గొప్పగా రాశారు. “లైటు ఆర్పుతూ” వద్దనకు రాజమ్మా' రంగరాజుగారు అన్నారు. “మొదటిసారి పిల్లాడికిచ్చిన పాలు - అమ్మ చచ్చిపోవటం, వీపుమీద ఇనపకొారడా చెళ్ళుమంది. కలలో కనిపించిన దేముడు - తన కాళ్ళకిందే ఊబి అయిన భూమి - తనలో తల్లి అప్పుడే నిద్రలేచినట్టు అనిపించింది”. తనపట్ల దయగా ప్రవర్తించిన రంగరాజు కోరికను ఒక తల్లిలా తీర్చిందని చెప్పి రాజమ్మ పాత్రను పాజిటివ్‌గా గ్లోరిపై చేసిన బీనాదేవి గారికి నమస్మారాలు చెప్పకుండా వుండలేం. ఇందులో వీరాచారి అనే స్త్రీ ద్వేషి పాత్ర కూడా వుంది. సమాజంలో స్త్రీల గురించి ఎలాంటి నీచమైన ఆలోచనలున్నాయో చెప్పటానికే సృష్టించారా పాత్రను. “బాబోయ్‌ ఇలా అనుకుంటారా ఆడవాళ్ళ గురించి” అనిపిస్తుంది. పూర్తి నెగిటివ్‌ పాత్రచేత మాట్లాడించిన ఈ మాటలు రచయిత టోన్‌లో, దృక్పథంలో భాగం కావు. సమాజం ప్రీల విషయంలో ఎంత దుర్మార్గపు, పాపిష్టి ఆలోచనలు చేస్తుందో చెప్తయంతే- ఈ నవలలో రచయితకు రెండు పరీక్షాసమయాలొచ్చాయి. ఒకటి లాయర్‌ విమల. రెండు ప్రిన్సిపాల్‌ భార్య విజయ. విమల మగవాళ్ళ బలహీనతలతో ఆడుకోవటాన్ని తన సరదాగా చేసుకుంది. ఐతే రచయిత ఆ పాత్ర మీద జడ్జిమెంట్‌ ఇచ్చే పనిచెయ్యకుండా పరీక్ష పాసయ్యారు. విజయ 'సాసైటీ లేడీ అని సమాజం పిల్చే పనులు చేస్తుంది. ఆమె వ్యాపకాలు, సరదాలు, షికార్ల గురించి రచయిత నిష్మర్షగానే తన అయిష్టాన్ని ప్రకటిస్తారు. ఆమె తన జీవనశైలి వల్ల, భర్తవల్ల కాకుండా మరొకరి ద్వారా గర్భవతి అవుతుంది. అది బైటపడితే తట్టుకోలేని బలహీనురాలు కావటం వల్ల చచ్చిపోతుంది. ప్రిన్సిపాల్‌కి విజయమీద సహజంగానే కోపం వస్తుంది. తన బాధంతా ఓ స్నేహితుడితో పంచుకుంటాడు. 'ఈ జన్మలో మరి ఆడదాన్ని నమ్మలేను అంటాడు. ఈ స్నేహితుడు “దేముడు లేడన్నవాడికే ఒక్కోక్షణం ఎక్కడలేని నమ్మకం పుట్టుకొస్తుంది. నువ్వు మాత్రం తొందరపడి విజయగురించి తీర్పు చెప్పకు అంటాడు. బీనాదేవి జండర్‌ స్పృహ వున్న రచయితగా ఫస్టు క్లాసులో పాసయ్యారు. ఆఖరికి బ్రోతల్‌ హవుస్‌ నడిపే నరసు పాత్రమీద కూడా అనవసరమైన వ్యాఖ్యానాలు లేకపోగా ఆమె నేపధ్యం వివరించి వదిలేశారు. కులపరంగా చూస్తే సింహాచలం, రాజమ్మలు బిసిలకు చెందినవారిగా సంకలిత - ఓల్హా * 113

అనిపిస్తారు. కాకపోతే రచయితది ప్రధానంగా వర్గస్పృహ. వర్గ చైతన్యంతో రాసిన నవల ఇది. వర్గపోరాటం వల్లనే దోపిడీ పోతుందనే దృష్టి కూడా రచయిత కుందనీ, వర్గ పోరాటంలో సాయుధ పోరాటం తప్పదనే సిద్ధాంతంపై కూడా రచయితకు నమ్మకముందని చివరి మాట వల్ల తెలుస్తుంది. బీనాదేవి గారంటే వుపమానాలు. వుపమ కాళిదాసస్య అంటారు. కానీ కాళిదాసే స్వయంగా ఒప్పుకుంటాడు వుపమాలంకారం వాడటంలో బీనాదేవిని మించినవాళ్ళు లేరని. అలంకారాలని మామూలుగా పాత్రల పరిచయానికి వాడతారు. ముఖ్యంగా తెలిసిన ప్రకృతితో మనకు తెలియని పాత్రలను పరిచయం చేస్తారు. ఆ పాత్ర స్వరూపాన్ని కొంచెంగా స్వభావాన్ని మనకు అర్ధం చేయించేందుకు రచయితలు అలంకారాలను ముఖ్యంగా వుపమాలంకారాన్ని వాడతారు. బీనాదేవి ఆ పరిమితిని దాటి నేపథ్యాన్నీ ఒక మూడ్‌నీ సృష్టించేందుకు ఎక్కువగా వుపమాలంకారం వాడతారు. చుట్టూ వున్న వాతావరణ వర్ణనతో పాఠకులలో ఒక మూడ్‌ ఏర్పరచి జరగబోయే సంఘటనకు వారిని సంసిద్ధులను చేయటానికి ఈ వర్ణనలు వుపయోగపడతాయి. చాలాసార్లు పాఠకుల ఊహాశక్తిని పెంచేలా అలంకారాలు వాడటం బీనాదేవి ప్రత్యేకత. “పండినదంతా కోసుకో గలిగిన మనిషి మొహంలా ఆమె మొహం సంతుప్టిగా వుంది”

  • ఈ వుపమాలంకారంలో పోల్చిన పోలిక, ఆమె ముఖమూ రెండూ పాఠకుడు ఊహించు కోవాల్సిందే. పండినదంతా కోసుకోగలిగిన మనిషి మొహాన్ని కూడా పాఠకులు ఊహించుకోవలసిందే - ఇలాంటి వర్ణనల వల్ల పాఠకులకు విసుగురాదు. ఒక వుత్సాహం వస్తుంది. భౌతికమైన వాటిని కాకుండా మానసికమైన ఫీలింగ్స్‌ని వర్ణించటం కూడా చాలా అద్భుతంగా చేస్తారు. చిన్న రాజమ్మకు, పేదరికంలో మగ్గుతున్న పదిహేనేళ్ళ రాజమ్మకు, పనిచేయించుకున్న బుగత అనుకోకుండా ఆరణాలు ఇస్తాడు. ఆ ఆరణాలు ఏం చెయ్యాలని చాలా ఆలోచనలు చేస్తుందా పిల్ల, అందులో ఒక అందమైన ఆలోచన “ఈ ఆరణాలు అమ్మకి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. పాల సముద్రంలోంచి దేవుడు లేచి చిరునవ్వు నవ్వినట్టుంటుంది”. “చేతకానివాడి నిర్లక్ష్యంలా ఉంది” “జబ్బుకు సగం లొంగిపోతున్న ఆరోగ్యవంతుడిలా వుంటాడు గానీ ఆరోగ్యం కోలుకుంటున్న రోగిలా వుండడు", మనిషిని వర్ణించాల్సినప్పుడు కూదా వాస్తవంగా వుంటూనే ఆ వాస్తవంలో ఒక మెరుపు మెరిపిస్తారు. సంకలిత - ఓల్లా * 114

'ఆ రాత్రి దువ్వని జుట్టుతో, గుండీలు లేని చొక్కాతో, వెలిగించని బీడీతో' ఇంతవరకూ ఈ వర్ణనలో విశేషం ఏమీలేదు - కానీ 'కళ్ళల్లో ఖూనీ పెట్టుకుని బయల్దేరిన గవర్రాజు' అనేసరికి ఒక మెరుపు మెరిసినట్లవుతుంది. వర్ణనలు, అలంకారాలు సామాన్యంగా సౌందర్యాన్ని ప్రకృతిని వుద్దేశించి భావుకతతో చేస్తారు. కానీ బీనాదేవి ఏ విషయాన్నయినా వర్ణనాత్మకంగా అలంకారాలు ప్రయోగిస్తూ చెప్పేస్తారు. 'గుమస్తాలు స్వాతంత్ర్యం వద్దనే మంచి బానిసల్లా పట్టుదలతో పనిచేస్తున్నారు, “పాముకి పారవచ్చినట్టు గవర్రాజుకి అతి సహజంగా మున్సిపల్‌ సభ్యత్వం ఇంకేవో పదవులు, ఇతర పేర్ల్షమీద కాంట్రాక్టులు వచ్చాయి.” కొన్ని స్టేట్‌మెంట్స్‌ తిరుగులేని విధంగా చేయటం కూడా బీనాదేవి ప్రత్యేకత. రాజకీయాల్లోకి దిగినవాడికి ప్రజలంతా ఒకటి కాదు” ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో వుంటాయి నవలనిండా. ఈ అలంకారాలు ఎప్పటికప్పుడు నవల స్థాయిని పెంచుతూ పోతాయి. చాలాకాలం నుంచీ పాఠకులకు అందుబాటులో లేని ఈ నవల “మనసు ఫౌండేషన్‌” వారి పుణ్యమా అని బీనాదేవి సమగ్ర సాహిత్యంలో మరొకసారి కళ్ళు తెరిచింది.

వివిధ ఆంధ్రజ్యోతి

7 నవంబర్‌ 2011

సంకలిత - ఓల్లా * 115

నాన్నా స. సిటిలో

క్‌, విలువైన చరిత్ర పుసకం

౬. అణాదొ మాదిగలు సామాజికంగా తక్కువ స్థాయిలో బీదరికంలో మగ్గుతున్నా, ఏ పనులు చేస్తున్నా వారిలో ఒక ఆధ్యాత్మిక చింతన, అన్వేషణ మొదట్నుండీ ఉందని, తాత్విక జిజ్ఞాస, ఆధ్యాత్మిక గమ్యాల గురించిన ఆలోచన కుల మతాలకు అతీతంగా ఉంటుందని, కొత్త మతాలు, ఆచారాలు పుట్టుకొచ్చి ఆ జిజ్ఞాసకు కొన్ని భౌతిక రూపాలనిస్తాయని ఈ పుస్తకం చక్కగా నిరూపిస్తుంది. మాదిగల పుట్టు పూర్వోత్తరాల గురించి, ఆచార వ్యవహారాల గురించి, ఆధ్యాత్మిక ప్రవృత్తుల గురించి పరిశోధన చేసి “ఎమ్మా రొషాంబు క్లౌ” రాసిన పుస్తకం 'చెప్పులు కుడుతూ... కుడుతూ.., ఆమె 1870-80 ప్రాంతాల్లో మిషనరీ ఫాదర్‌గా పనిచేసే భర్త క్లౌతో పాటు ఒంగోలులో నివసించారు. ఆ కాలంలో అనేకమంది మాదిగలు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుల బోధనలతో ప్రభావితులైనట్లు ఈ పుస్తకం వలన తెలుస్తుంది. గురువుల ఉపదేశం పొంది, వారు చెప్పిన ఆచారాలు పాటించేవారు. నాజరయ్య అనే గురువు చాలా ప్రసిద్దుడు. నాజరయ్య మతం అని అతని పేరుతోనే ఒక మతం ప్రచారంలో ఉండేది, అనేక మంది మాదిగలు ఆ మతాన్ని అనుసరించారు. కాలక్రమేణా వీరబ్రహ్మేంద్రస్వామిని అనుసరించిన మాదిగలు ఎక్కువమంది క్రైస్తవమతంలోకి వచ్చారు. వీరబ్రహ్మేంద్రస్వామి చేసిన సామాజిక విమర్శను ఆమోదించినవారికి, క్రైస్తవులు చేసిన కొన్ని భారతీయ సామాజిక విమర్శలు

సంకలిత - ఓల్లా * 116

కూడా సబబుగా తోచి ఉండవచ్చు. బహుదేవతారాధనను నిరసించి ఏకేశ్చరోసాసనలోకి రావటం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార విషయంలో కొన్ని నియమాలు - ఇవీ క్రైస్తవం తొలి నాళ్లలో ప్రచారం చేసిన విషయాలు.

ఇదలా ఉంచితే మత మార్పిడి జరిగినప్పుడు వ్యక్తులుగా, కుటుంబాలుగా ఎంత సంక్షోభం అనుభవించాల్సి ఉంటుందో కొన్ని ఆసక్తికరమైన అనుభవాల ద్వారా ఈ పుస్తకం చెప్పింది. అందరూ అనుసరించే మార్గం నుండి మొదటిసారి విడివడి ఒక్కొక్కరుగా నడవటానికి ఎంత బలం కావాలో, వారి కుటుంబ సభ్యులకు అది భరించటం ఎంత కష్టమో, మళ్లీ వారు ప్రధాన మార్గంలోకి రావటమో, లేక వీరే ఆ వ్యక్తి కోసం కొత్త మార్గాన్ని అనుసరించటమో జరిగేలోపు, కుటుంబ సంబంధాలలో, మానవసంబంధాలలో ఎంత ఘర్షణ, రాపిడి జరుగుతుందో ఈ పుస్తకంలోని వాస్తవ ఘటనలు చదివితే అర్ధమవుతుంది. ఇది ఈ పుస్తకంలోని అత్యంత అసక్తికరమైన మానవ సంబంధాల కథనం.

ఇక 1879-78 సంవత్సరాలలో వచ్చిన అతి భయంకరమైన కరువు సమయంలో మిషనరీలు చేసిన సేవ వల్ల, ఉపాధి కల్పన వల్ల మత మార్పిడులు ఎక్కువగా జరిగాయనే వాదనను అంగీకరించటం సరైందా కాదా అనే ఉప చర్చను కూడా ఈ పుస్తకం రేకెత్తిస్తుంది. ఐతే మతానికి ఆధ్యాత్మిక ప్రపంచంతో, అక్కడి ప్రపంచంతో ఎంత సంబంధం ఉందో, భౌతిక ప్రపంచంతో అక్కడి లాభనష్టాలతో అంతకంటే ఎక్కువ సంబంధం ఉంది. భౌతిక ప్రపంచం, అందులో లాభనష్టాలు లేక పోతే అసలు మతానికి ఉనికే లేదు. సామాన్య ప్రజలు ఇహలోకంలో తమ జీవితం కోసం పరలోక ప్రభువులకు ప్రార్ధనలు చేస్తారు. ఆ క్రమంలో వారికి ఇహలోకం కంటే పరలోకం మీద ఆసక్తి పెరగవచ్చు. కానీ మతం ఎక్కువమంది జీవితాల్లోకి భౌతిక జీవితావసర కారణాలవల్లే వస్తుంది. అందువల్ల మిషనరీలు మాదిగలకు కల్పించిన సాంఘికస్థాయి వల్ల, చేసిన సేవ వల్ల వారు క్లైస్తవంలోకి మారితే అందులో వింతేమీ లేదు. తప్పపట్టటానికి కూడా ఏమీ లేదు. అవిద్యలో, అనారోగ్యాలతో ఉన్న వలస దేశాల ప్రజలకు విద్య, ఆరోగ్యం అందించాలనే సేవాభావంతో వచ్చినవారు అవి అందించి ఊరుకోలేదు. తమ విద్య, ఆరోగ్యాలకు కారకునిగా తాము నమ్ముతున్న ప్రభువుని కూడా వారికి అందించాలని తాపత్రయపడ్డారు.

నిజానికి చర్చ జరగాల్సింది ఈ విషయం మీద కాదు. ఈ పుస్తకంలోని వాస్తవ సమాచారం వల్ల మనకు తెలిసిన మాదిగల ఆధ్యాత్మికజిజ్ఞాస గురించి చాలా చర్చ జరగాల్సి ఉంది. వారి ఆధ్యాత్మిక అన్వేషణను నిరూపించటం, ఆ జిజ్ఞాస క్రమ పరిజామాన్ని గుర్తించటం వల్ల ఇప్పటి వారి సాంఘిక స్థాయికి చేకూరే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? వివిధ సాంఘిక స్థాయిలలో, అంతరాలలో ఉన్న భిన్న వర్గాల, వర్ష్దాల, ప్రజల ఆధ్యాత్మిక ఆలోచనలను పోల్చి చూసేందుకు ప్రయత్నం జరిగితే ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. 19వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో మాదిగల భౌతిక, ఆధ్యాత్మిక జీవన పరిస్థితులను డాక్యుమెంట్‌ చేసిన విలువైన పుస్తకం 'చెప్పులు కుడుతూ... కుడుతూ...” ఆదివారం ఆంధ్రజ్యోతి 25 మార్చి 2012 సంకలిత - ఓల్తా * 118

ళా సు రోలే లొ ల లగ అరుణ కవిత్వం - ప్తీల అస్తిత్వవేదన అల కాలాన్ని పసిపాపలా లాలించాలనే భావన చేసిన అరుణ ప్రీ సంవేదననూ, వైతన్యాన్న్సీ అస్తిత్వాన్ని వ్యక్తీకరించిన తీరు చాలా ఆసక్తికరంగా వుండటంలో వింతలేదు. ప్రీవాద కవిత్వం ఒక ఉధృతిగా వచ్చి, గాంభీర్యాన్ని సంతరించుకున్న తర్వాత రాయటం మొదలుపెట్టిన కవయిత్రి అరుణ. తొలినాళ్ళ ప్రీవాద కవిత్వపు తత్వాన్నీ సారాన్ని బాగా గమనించింది. ఆవేశాన్ని ఆగ్రహాన్ని న్యాయబద్ధమైన ప్రశ్నలుగా కవయిత్రులు అడుగుతున్న తీరుని గమనించింది. ఆ తొలిదశ గడిచి ఒక నిర్లిప్తదృష్టితో సమాజాన్ని చూసే ధోరణి వచ్చినపుడే అరుణ కవిత్వం ఒక ప్రవాహంలా కట్టలు తెంచుకుని వచ్చింది. కట్టలు తెంచుకున్నది గానీ విధ్వంస స్వభావం ఏమాత్రం లేదు. ప్రవాహం బందిఖానా నుండి స్వేచ్చాతీరంలోకి రావటానికే కట్టలు తెంచుకున్నది. స్వేచ్భాతీరంలోకి రావటానికి కొన్ని అర్హతలు ముందు సంపాదించాలి. ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం, సహానుభూతి, అనుకంప యివన్నీ వుంటేనే గానీ స్వేచ్చకు అర్ధం తెలియదు. ముందు వీటన్నిటినీ ఆత్మగతం చేసుకుని ఆ తర్వాత వస్తుగతం చేసింది అరుణ. మొదటి కవితా సంకలనం 'మౌనమూ మాట్లాడుతుంది” లో అరుణ “పాతివ్రత్యాల మాతృత్వాల సెంటిమెంట్ల ప్యాకింగుల్తో నలిగి ప్రీల “వ్యక్తిత్వం ఆత్మగౌరవం ఎన్నిసార్లు గాయాలకు గురయ్యయో' గుర్తించింది. సంకలిత - ఓల్లా * 119

“జలతారు పరదాల మాటున అణగారిన సొంత ఇష్టం) గురించిన విచారధార ఆమెను అలజడికి గురిచేసింది. అన్నీ గుర్తించాక తన గమ్యం తెలియటం కష్టం కాదు. ఏ వర్గానికైనా గమ్యం ఏమిటో తేలికగానే తెలుస్తుంది. కానీ ప్రయాణం కష్టం అని క్రమంగా గాని తెలియదు. ఆ ప్రయాణ కష్టాన్ని అరుణ తన తొలి కవితా సంపుటిలోనే గుర్తించి దానిని విశ్లేషించబూనుకుంది. 'పయనం'* అనే కవిత ఆమె స్రీసంవేదనా కవితాయానంలో మొదటి అడుగు. ఆ తర్వాత అరుణ ప్రయాణ వేగం పెరిగింది. ఈ సమాజంలో స్త్రీపురుషులకు సమాన న్యాయం లేదని (గ్రహించి దాన్ని గొంతువిప్పి ప్రకటించింది.

“అయ్యా!

నీకో న్యాయం నాకో న్యాయమా

అయితే ఇది అన్యాయ న్యాయం

నీకో ధర్మం నాకో ధర్మమా

ఇది అధర్మ ధర్మం

నీకో నీతి నాకో నీతా!

ఇది అవినీతి” అని నిష్మర్షణ ప్రకటించి అస్తిత్వ వుద్యమాల పోరాట ప్రకటనను హుందాగా, ధీమాగా, సాహసంతో చేస్తుంది. ఇక అరుణ స్త్రీవాద కవయిత్రా కాదా అన్న ప్రశ్నకు తావులేదు. సమాజంలో ్రీపురుషుల మధ్య వున్న అసమానతలను గుర్తించి వాటిని ప్రశ్నించి, సవాల్‌చేసి కార్యాచరణలోకి దిగటమే ్రీవాదం. 'ఒక నాణెం, ఐదు పక్కలు, ఒకే వేదన” కవితలో భిన్న వయసులకు వర్ణాలకూ చెందిన మహిళల ఆవేదనను అర్ధ వంతంగా వినిపించిన తర్వాత అరుణ (మోగించిన సమరఖేరి స్త్రీవాద నాదంలోనే మోగింది.

“నువ్వు అణచివేతవైతే

నేను వుద్యమాన్నవుతా

నువ్వు ఆధిపత్యమైతే

నేను పోరాటమవుతా

నువ్వు విత్తుని నాటితే

నేను మొలకనయ్యే దానిని

కాని నిప్పును నాటుతున్నావు

అగ్నిజ్వాలనై లేస్తా తన మొదటి కవితా సంకలనంలోనే ఇంత తీవ్రమైన హెచ్చరిక చేసిన అరుణకు ఈ పురుష స్వామ్యపు దుర్మార్గం మీద ఎంత ఆగ్రహం వుందో అర్ధమౌతుంది. “'మౌనమూ మాట్లాడుతుంది” సంకలనంలోనిదే మరోగొప్ప కవిత “స్వాభిమాన్‌ అమ్మాయిల మీది ప్రేమతో వాళ్ళను గాఢాలింగనం చేసుకుంటూ రాసిన కవిత. కొత్త ప్రపంచంలో సరికొత్త దారులు వేసుకుంటూ, రికార్డులు సృష్టిస్తూ, ఆదర్శంగా అగ్రభాగాన నిలుస్తున్న మహిళలను 'స్వాఖిమాన లతలు గా అందంగా వర్ణించింది అరుణ.

“గుండెల మీద కుంపట్లు

ఎప్పటి మాట

గుండె గూటిలో వెన్నెల దీపాలు

అడవిలో మానులు కాదు

జనారణ్యంలో కదిలే కాంతి దీపాలు అన్ని రంగాలలోకి విస్తరించి, దేశానికి ఒకే ఒక ఆశగా వెలుగుతున్న దీపాలవంటి స్త్రీలను కీర్తించటం వల్ల అందరిలోనూ ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఎవరినీ అల్లుకోకుండా, ఎవరి మాటునా దాక్కోకుండా స్వయం ప్రకాశాలుగా మారేక్రమం గమ్యం చేరుకునే ప్రయాణంలోని ఒకదశ. ప్రీలమీద జరిగే అనే కానేక హింసలలో లైంగిక వేధింపులొకటి. ఆ వేధింపులు తారా స్థాయికి చేరి హత్యా రూపంలోకి మారి ఆంధ్రప్రదేశ్‌లో స్వైర విహారం చేస్తున్నాయి. (పేమ అవ్యాజంగా కలగవలసిన ఒకానొక సున్నితమైన భావన అన్నమాట మరచిపోయి అధికారంతో హస్తగతం చేసుకుని నలిపివేసే క్రూరమైన ఆలోచనలను (పేరేపిస్తోంది. మగవాళ్ళ (క్రేమాధిపత్య అహంకారానికి బలైన అనేకమందిలో గుర్తుండిపోయే పేరు శ్రీలక్ష్మీ. అరుణ ఆ అమ్మాయి గురించి చిరకాలం గుర్తుండే కవిత 'ఘోరం' అనే పేరుతో రాసింది. ఆడపిల్ల పుట్టకముందు నుంచీ పుట్టుకకోసం, పుట్టాక వునికి కోసం చేయాల్సిన యుద్దాన్ని ఆ యుద్దాన్నీ అనివార్యం చేసిన సామాజిక దౌష్టాన్ని తనదైన శైలిలో చెప్పిన కవిత 'యుద్ధం మొదలు!. ప్రీలు చేసే ఈ యుద్ధం

సంకలిత - ఓల్గా * 121

తమ మనుగడ కోసమేగాని ఇతరులను హతమార్చేందుకు కాదు. అందుకే అరుణ రాసిన యుద్ధగీతాలు కూడా సజీవంగా,సరళంగా వుంటాయి గానీ భీభత్స రసా కావు. కవితాశిల్బం పట్ల అరుణకున్న మంచి అవగాహనకు నిదర్శనంగా తో వుదాహరించవచ్చు. అప్పడే పుట్టిన పాపాయిలు చేతులు వూపుతున్న దృశ్యం తో అందంగా ఉంటుంది. అదే సమయంలో ఆ పాపాయి పేరిగి పెద్దదయి ఈ క చేయాల్సిన యుద్ధం గుర్తొస్తే అయ్యో అనిపించక మానదు. అందం, కరుణ, గామా దుర్మార్గం ఈ మూడిటినీ కలిపి రక్తికట్టించటంలో అరుణ నేర్చు కనిపిస్తుంది. “ఈ బుజ్జితల్లి చిట్టి చేతులు బిగించి గాలితో చేస్తున్న యుద్ధం' “వొస్తూ వొస్తూ దేవలోకం నుంచి తెంచుకొచ్చిన పారిజాత పుష్పాల్లాంటి ఈ బోసినవ్వుల్ని వాడిపోకుండా ఎలా కాపాడాలి ఇలాసాగే ఈ కవితనిందా పాపాయి మీద ప్రేమ, పాపాయి చెయ్యాల్సిన యుద్ధం గురించిన చింత - ఈ శెండింటిన్సి మంచిస్థాయికి చేర్చిన నేర్పు అరుణ కవితొ శిల్పానిది. 'ముసలమ్మ పుట్టినరోజు” అనే క్రవిత్ర 'పాటల చెట్టు' లోనిది. అది అరుణ రెండవ కవితా సంకలనం. తొంభై ఆరేళ్ళ తన జీవితాన్ని నెమరు వేసుకునే ఒక స్రీ మాటలు అరుణ కవిత్వంలో జీవం పోస్తుక్షుని ఆర్తిగా మారి ఆ ప్రీ జీవన సారాంశొన్ని మనకు వినిపిస్తారా. ఆ ముసలమ్మ వేదన స్తీలోకపు సార్వజనీన వేదనగా మన చెవులలో రింగుమంటుంది. 'ఎన్నిటినో ప్రొంద్రి మరెన్నిటినో ప్రోగాట్టక్ష్స ఎన్ని గాయాల మీంచ్చి నడిచొచ్చాన్లో ఎన్ని వేదనా నదులను ఈదానో సంకలిత = ఇతను

రక్తనాళాల్లో ప్రవహించే బాధాతరంగాలను

ఎలా గుండెలో అదిమిపట్టానో” ఇన్ని చెయ్యకుండా జీవితం ఎలా గడుస్తుంది? గడిచిన జీవితం గడవగా ఇప్పుడున్న జీవితంలో ఈ ముసలమ్మ తనను తాను వర్ణించుకున్న తీరు, ఆ పోలిక అద్భుతం.

పొద్దుగూకపోయ్యే ముందు

ఎర్రగా కనిపించినా వేడిలేని సూర్యుడిలా

నా కంటే నా నీడ పొడుగైనట్టు” అంటుంది - జీవిత సమీక్ష తరువాత తన గురించిన అంచనాను ఎంత చక్కగా ఆవిష్మరించిందో కదా! అరుణ కవిత్వంలో ప్రత్యేకత అదే. సామాన్యమైన విషయాన్ని సామాన్యంగా చెబుతున్నట్లు చెబుతూనే చటుక్కున ఒక మెరుపుని మెరిపిస్తుంది. ఒక కాంతిని కల్పిస్తుంది. తాత్వికంగా ఎన్నో జీవిత వాస్తవాలను ఆవిష్కరించిన అరుణ వాస్తవ విషయాలను యధాతధంగానే చమత్మారం జోడించి చెప్పటంలోనూ తన ప్రతిభ కనపరుస్తుంది. 'మిడిలేజ్‌' కవిత చదివి తమను గురించి తాము నవ్వుకుని నిట్టూర్చని ప్రీలుండరు. అందరికీ అనుభవమయ్యే విషయాలే - యాఖై వళ్ళు దాటగానే మోకాళ్ళు, నడుము సహకరించలేమని మొరాయిస్తాయి. శరీరం, మెకాళ్ళు నదుము చాలంటున్నా బాధ్యతలు మేమున్నాం మోయవలసిందేనని మీద పడతాయి. రోటరీ దినచర్యలో ఎన్నో మార్పులు చేసుకుంటూ నెట్టుకు రావలసి వస్తుంది. మెట్లెక్క పోవటం, పరుపు ఒదిలి కటికినేల మీద పడుకోవటం, నడుము నొప్పికి మంచిదని డాక్టరు చెప్పటం. ఆ నడుము చాలా అరిగిందని తెలియని మనమడు మీదికి ద్‌ ఎత్తుకోనునటం'. వీడిని ఎత్తుకుని ఎదకు హాత్తుకోవాలనిపీం గొ వు తల్చుకుంటే కలిగే భయం = ఈ మధ్య వయస్ములైన మహిళల సందిగ్ధ స్థితిని నవ్విస్తున్నట్లే రాసి గంభీరంగా ముగించింది అరుణ (మిడిలేజ్‌' కవితలో ఆడపిల్లల అంతరానాల గురించి రాసిన ఆటవిక సంస్కృతి అనే కవిత “అమ్మ ఒక మనిషి అనే మూడవ కవితాసంకలనం లోనిది:

“పెనంమీద పడ్డ నీటిముక్క

చటుక్కున ఆవిరైనట్టు

ఆకారం రాకముందే

డ్‌ సంకలిత - ఓలి * 12

బుడగ పగిలిపోయినట్టు

ఇదొక

నిశ్శబ్ధ మహా విధ్వంసం. లని. అరుణ కవిత్వంలోని విశిస్టత అదే స స్త్మతస్ప మరొకరు రాయలేని శ వేదనల గురించీ రాయటం మా గురించి, వారి అనుభూతుల గురించి, ఆ స్త్రీ స్వరాన్ని ఆ కవితలో ప్రవేశపెట్టడం కాదు. అది పురుషులైనా రాయొచ్చు. కానీ ఒక స్రీ “మాన్ని చి రాసిన కవితలలోనే కొందరు కవయిత్రులకే సాధ్యమవుతుంది. అరుణ స్త్రీల సంచి వస్తుంది. అంటే కాదు. ఏ కవితలోనైనా ఆ స్రీ స్వరం ఆ స్రీ దృష్టి వ ంల్న అరుణ ప్రీ హృదయంతోనే లోకాన్ని చూస్తోంది. సమీక్షిసోం రోజువారీ యాంత్రిక పసిపాపలా లాలిస్టానని” ధ్ధీమ్రాగా చెప్పగలుగుతుంది. ప్రీల సిన కవిత ఒక జీవితాన్ని ఆ యాంత్రికతనంతా పాఠకులు అనుభూతి చెందేలా క్ష ఏడుపుల రోజు కాలింగ్‌బెల్‌తో మొదలయ్యేరోజు, మిల్క్‌ కుక్కర్‌ విజిల్‌ గుందా, వల్ల తజలలోకి లోంచి, కలలురాని కళ్ళు చూసే యాంత్రిక దృశ్యాలలోంచి, యజ ర గు జీవిత వస్తుంది. అక్కడ జీవితం గాడి తప్పిందని తెలిసినా చేసేది లేదు. రాళ తిక జీవితాన్ని గమనం సహజంగా లేదనే విషయం తెలిసిరాదు - ఇంత యాంటి “అస్తిత్వ గడుపుతున్న కోట్లాది స్త్రీల మనసులను అర్ధం చేసుకోగలిగింది అ కషమొంది. ప్రభలు” కవితని అరుణ చాలా బాగా నిర్వహించింది. ఆ కవితా పస్తువ సిన ఆడవాళ్ళ మ్షీద్ర ముఖ్యంగా ప్ర్రీల మీద జరిగే లైంగిక అత్యాచారాల గు తండ్రులు, కవిత. లైంగిక్ర అత్యాచారాలు ఎవరో పరాయి వాళ్ళు కాదు - తాతలు, వరించాక అన్నలు, మామలు యిలా ఎవరంటే వారు ఆ(క్రమించే స్త్రీ శరీరాల బాధను దు కానీ అంతటి విష్షాదంల్రోంచి క్ర ప్రతిఘటన స్థాయిలోకి తీసికెళ్ళటం తేలిక కాదు. ఆ పనీ అరు చాలా తేలికగ్గా చేసేస్తుంది,

“సాలె ప్పరుగు

తనచుట్టూ అల్లుకున్న గూడులా

నీ చుట్టు ఒక రక్ష్య వలయాన్ని

నువ్వే ఏర్చరచుక్షో

అణచి వేత్రపై

ఎక్కుపెట్టిన బాణంలా

ఈ లోకం నడిబొడ్డున నిలబడిన ఎలుగెత్త మని, ధిక్కార స్వరాన్ని వినిపించమని చెప్పంది. “ప్రక్రియ కవిత చాలా మంచి కవిత. కవితంతా చిరునవ్వుని గురించి. చిరునవ్వు ఎలా పుడుతుంది, ఎంత సున్నితం. ఒకోసారి ఆ స్వభావం ఎలా మారుతుంది ఇదంతా వివరంగా కవితలో వస్తుంటే మనం చిరునవ్వుతో, ఆ నవ్వవల్ల వికసించే మనసుతో చదువుతుంటాం. హఠాత్తుగా చివరి పాఠాలలో అనేసరికి ఒక్కసారి కవితా వస్తువంతా ఇంకోవైపు తిరుగుతుంది. దిక్కు మారుతుంది. చిరునవ్వులు చిందించే ముందు అమ్మాయిలు ఎంత జాగ్రత్త పడాలో చివరికి చెప్పి మొత్తం కవితను మరో మార్గంలో నడిపి ఎలివేట్‌ చేసింది అరుణ. చిరునవ్వు రాలిపడిందంటే

“పాదరసంలా చితికిపోతుంది

చితికిన చిరునవ్వు అతకదు

మనసులాంటిదే

చిరునవ్వు కూడా" అనటంతో ఆడపిల్లలను అందంగా సున్నితంగా హెచ్చరించిన కవితై ఒకే ప్రత్యేక కవితగా నిలబడింది. 2008లో వెలువరించిన “హృదయమే వదనం” సంకలనం నాటికి అరుణ పునరుత్పత్తికి ఆకరమైన త్రీ శరీరం గర ఎంతో అవగాహనతో రాయగలిగింది. “స్తీ శరీరం ఒక నిరంతర గాయమోి నిర్వంద్వంగా ప్రకటించింది. ఆపరేషన్లు, వీటి ఫలితాలు, పర్యవసానాలు యివన్నీ రాసి

“అన్ని రకాల బెషధాలకూ

ఇదో గొప్ప ప్రయోగశాలో అంటుంది ఐతే ఏం వెయ్యాలి. తన శరీరాన్ని గురించి బాధపదాలా? &ీ శరన. ఎందుకు పొందా ్‌ 9 వన్న అరుణ అలో ఎన్నటికి అనదు. ఎన్ని

నా అని చిరాకుపడాలా? దృష్టి వన్ను క్రోవాలి. అలా ఇబ్బందులు సమాజం కల్పిస్తున్నా. తన శరీరాన్ని తౌను గౌరవించుకనా

సమాజం కల్పిస్తునా గుతుంది. అరుణ గౌరవించుకున్నప్తుడే తన పునరుత్పత్తి హళి గ మౌట్లాదగలు బల్బు! పునరుల్స కవిత ఆ గౌరవ ప్రకటనతోనే ముగుస్తుంది. డ్‌ సంకలిత ఓల్లా * 125

“ఈ శరీరమంటే

నాకెంతో గౌరవం

నాదే అయినందుకని కాదు

దీనికో సృష్టి కర్తవ్య మున్నందుకు” ఎంతో స్థిత ప్రజ్ఞత్వం, స్థిమితత్వం వుంటే తప్ప కవితను ఇలా ముగించలేరు. అలాంటి విశాల దృష్టితోనే “ఇల్లు కవిత రాసింది అరుణ. 'సూది నా జీవిత సూత్రం సంకలనం లోనిది ఈ కవిత. “ఇల్లంటే అమ్మే' అని స్పష్టంగా చెప్పి చివరికి ఇంటిని నిర్వచించిన తీరు ఆమె అవగాహనని తెలియజేస్తుంది.

“ఆకాశాన్ని దుప్పట్లు చేసి

మడతపెట్టుకొచ్చాను

అయినా ఇంటి విస్తీర్ణం

భూ మండలానికి వుంటుందా? ఎంత లోతైన భావన! ప్రపంచమంతా ఇంట్లోకి వచ్చి ఇల్లు ప్రపంచం కంటే పెద్దద వటమనే భావన అద్భుతంగా చేసింది అరుణ.

“ఇల్లంటే గోడలు కప్పు

కొలతల నిర్మాణం కాదు

కలతలు, అనుభూతుల, జ్ఞాపకాల

సమాహారం” అంటూ ప్రపంచాన్ని చిన్నదాన్ని చేసి, అమ్మ “ఇల్లే నా ప్రపంచం” అని 'ప్రకటించటంలోని చూపు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అదే సంకలనంలో ఇంటికున్న మరొక పార్వాన్ని కూడా చూపుతుంది. ఒక స్త్రీ ఇంట్లో తనను తాను కోల్పోవటం ఎలా జరుగుతుందో చాలా విషాదానుభూతి కలిగిస్తూ చెబుతుంది. ఇల్లు, తనూ అభేదం అయిన స్థితిని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.

“అంతా నేను అయినప్పుడు

గూడులాంటి ఇల్లు కోసం

ఎక్కడని వెతకను'

సంకలిత - ఓల్లా * 126

అంటుంది. ఇల్లంటే స్త్రీ, స్త్రీ అంటే ఇల్లు అని సమాజం స్థిరపరిచింది. ఆ కఠినచర్య వల్ల ప్రీల జీవితాలు ఇంటికే అంకితమై అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. చివరికి ఇల్లు స్త్రీకి కూడా కనిపించకుండా పోయేస్టితి. అదెలాంటి స్థితో అరుణ చాలా గొప్పగా చెప్పింది.

“ఇంట్లో

ఇల్లు కనిపించటం లేదు

దేహంలో ఆత్మలాగ! దాదాపు అన్నీ ఆత్మల్లేన్ని దేహాలే - ఇంట్లో వుండాల్సిన మానవ సంబంధాల బదులు అధికార సంబంధాలు రాజ్యమేలే స్థితిని అరుణ (ప్రతీకాత్మకంగా అద్భుతంగా చెప్పింది. ప్రీల సంవేదనా భరిత జీవన కారణాల గురించి ఇంత రాసిన అరుణ అమ్మతనం, మాతృత్వం వీటి గురించి రాయకుండా వుంటుందా! మొదటి సంకలనం నుంచీ మాతృత్వం ఆమె కవితా దృష్టిని దాటిపోలేదు. అమ్మ అంతర్లీనంగా ఎన్నో కవితలలో నడుస్తూనే వుంది. “అమ్మ మనసుకు వైకల్యం లేదు”. 'టమాటి 'అమ్మ ఒక మనిషి “అమ్మపాటి “అమ్మ కడుపు చల్లగా” 'తఫ:ఫలం' “అమ్మ అవిభాజ్యం' “గోడు” ఇత్యాది కవితలన్నిటిలో మాతృత్వంలోని చీకటి వెలుగులను అరుణ చూపించింది. మాతృత్వాన్ని అనవసరంగా అతిశయోక్తులతో ఆకాశానికెత్తకుండా, యదార్థ వ్యదార్థ జీవిత చిత్రణతో చూపే కవయిత్రులలో అరుణ ఒకరు. ఇంతకూ కవయిత్రులలో అరుణ స్టానాన్ని అంచనా వెయ్యాలా? కవయి్రులనే ప్రత్యేక తరగతిలోంచి మొత్తం కవిలోకంలో అంచనా వెయ్యాలా? రెండూ జరగాలి. స్త్రీలుగా ప్రత్యేక దృష్టిలో ఎంతోమంది కవయిత్రులు రాస్తున్నప్పుడు ఆ దృష్టినించి అరుణ స్థానమేంటి? వీరితో అరుణకు విభేదముందా? సారూప్యత వుందా? సారూప్యత వుంటూనే అరుణ తన ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగిందా? ఈ ప్రశ్నలకు సమాధాన మివ్వటం ద్వారా మొదటి అంచనా వేయివచ్చు. మొత్తం కవిలోకంలో అరుణ ప్రత్యేకత ఏమిటి అనేదానిని అంచనా వేయటం తప్పనిసరి. అలా చేయకపోతే అరుణకే కాదు ఏ కవయిత్రికీ న్యాయం జరగదు. ఏదో స్రీలు రాస్తున్నారు, వారిలో వారికి పోటీపెట్టి సంతోష పడదామని ప్రధానస్రవంతి పురుషాధిక్య కవి ప్రపంచం ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. దానిని సాగనివ్వకూడదు. ఈ రెండు విధాలుగా చూసినప్పుడు

సంకలిత - ఓల్లా * 127

అరుణ వర్తమాన కవిలోకంలో ప్రత్యేకమైన కవి. ఆమె కవితా వస్తువులు, వాటి నిర్వహణలోని తాత్వికత, శిల్పం, వీటితో ఆమె తనదైన ప్రత్యేక ముద్రను తెలుగు కవిత్వంపై వేసింది. ఇక ఆమెలోని స్రీ స్వరం, దృష్టి, కవయిత్రులలో ఆమెను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఒక నిబ్బరంతో స్రీ సమస్యలను కవిత్వీకరించిన కవయిత్రి. నిరాడంబరమైన, సూటియైన, స్పష్టమైన శైలితో, ఆ శైలికి తగిన సరళమైన భాషతో వర్తమాన కవితా సన్నీవేశంలో సుస్థిరంగా నిలచి, భవిష్యత్‌లోకి కాలూనబోతున్న

కవయిత్రి అరుణ. ఆమె ప్రభావం రాబోయే కవుల మీద వుంటుంది. నది జనవరి 2013

సంకలిత - ఓల్గా * 128

సాను ప శిరంశెట్టి కాంతారావు కథా సంపుటి “ఊతకరలుకి ముందుమాటగా... ప్రపంచీకరణ నేపథ్యంలో అంతకు ముందెన్నడూ లేనంతగా ప్రజల జీవితాల్లో మార్పులొచ్చాయనే సంగతి ఇవాళ అందరికీ తెలిసిందే. గోరటి వెంకన్న గీతంలో చెప్పినట్లు ఇవాళ “పల్లె కన్నీరు పెడుతుంది". ఈ పల్లె ప్రజల కన్నీరును కవులు, రచయితలు సాహిత్యంలో రికార్డు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణా రచయితలు ఆ పని ఒక కర్తవ్యమన్నంత దీక్షతో చేస్తున్నారు. ఆ కర్తవ్యం శ్రద్ధగా నిర్వహిస్తున్న రచయితలలో శిరంశెట్టి కాంతారావు గారు ఒకరు. ఒకరే కాదు ముఖ్యులు. ఖమ్మంజిల్లాలోని గిరిజన, గిరిజనేతర ప్రజల జీవితాల్లోని సంఘర్షణను, యాతనను, ఆగ్రహాన్ని ప్రతి ఘటనను, ఆశను అన్నిటిని అక్షరబద్ధం చెయ్యాలని కంకణం కట్టుకున్నట్లు కాంతారావు ఈ సంకలనంలోని 18 కథలనూ రాశారు. కథా వస్తువు అంతా పల్లె జీవితమే. కులవృత్తులు, వ్యవసాయము సంక్షోభంలో పడటంతో కొత్త జీవనోపాధులు వెతుక్కోనలసి వచ్చిన ప్రజల మానసిక క్షోభను ఆయన వాస్తవికంగా ఆవిష్కరించారు. కులవృత్తి అంటే అది ఒక మనిషి ఒక జీవిత కాలంలో చేసినదే కాదు. చేతివృత్తులు కులవృత్తులై, కులాలకు, వృత్తులకు కూడా వైవిధ్య భరితమైన సంస్కృతి, ప్రత్యేక అస్తిత్వం సంతరించుకుని శతాబ్దాలు గడిచిపోయాయి. ఈ శతాబ్దాల జీవన గమనంలో మంచీ వుంది. చెడూ వుంది. ఏదేమైనా ఆ వృత్తిలో పుట్టి పెరిగిన తరాల వారసత్వపు అనుభవ సంపదను చేజార్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు, కొత్త జీవనోపాధి సంకలిత - ఓల్లా * 129

వెతుక్కోవాల్సి వచ్చినప్పుడు, తనను తాను మార్చుకోటానికి తనను తానుగా బతకనివ్వటానికీ సమాజం సహకరించనపుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? అతను జీవించటానికీ, పదే పదే కిందపడుతూ తగిలిన దెబ్బలను లెక్క చెయ్యకుండా తిరిగి జీవితం విసిరిన సవాలును స్వీకరించటానికీ ఎంత శక్తి కావాలి? ఇదంతా శిరంశెట్టి కాంతారావు రాసిన *“ప్రయాసి కథలో మనకు అర్ధమవుతుంది. అందులో కుమ్మరి అయోధ్య చేతివృత్తులను ఒదిలి కొత్త జీవనోపాధులను వెతుక్కుంటున్న కోట్లాది పేద ప్రజలకు ప్రతినిధి. ఇవాళ కుండలెవరు కొంటారు? ఇంట్లో కుండలు పేరిస్తే కడుపులు నిండవు. కాపురాలు సాగవు. అలాగని మరింకో పనిలో దిగటానికి మనస్సు ఒప్పుకోదు. భయం. ఆందోళన. అయోధ్య కొడుకు వీరన్నకు తెగించక తప్పదు. భవిష్యత్తు అతనిది. అతని బిడ్డలది. తండ్రి అసమ్మతిని లెక్కచెయ్యక సాగులోకి దిగుతాడు. ఒంట్లో శక్తి బతుకు బాగు చేసుకోవాలనే కోరిక వున్నపుడు మనుషులు ఏ పనిలోనైనా రాణిస్తారు. పనికిరాదనుకున్న భూమిలో బొప్పాయితోట వేసి బంగారం ముద్దల్లాంటి కాయల పంట తీస్తాడు. డబ్బు, డబ్బుతో పాటు మంచి రైతుగా పేరూ సంపాదిస్తాడు. కుందలయినా తోటలయినా మట్టి అతనికి తల్లి. ఆ తల్లిని ప్రేమగా బాధ్యతగా చూసుకున్న వీరన్న అంటే, వీరన్న సేద్యం అంటే అయోధ్యకు కూడా ఇష్టం కలుగుతుంది. కుటుంబమంతా ఒకటై కష్టపడుతుంది. కానీ బడుగు జీవుల బాగుని సహించలేని భూస్వామ్య వర్గం పల్లెల్లో ఇంకా బలంగానే వుంది. ప్రపంచీకరణ మార్పులు పేద రైతు,కూలీ, చేతివృత్తి జీవుల జీవితాన్ని కుదుళ్ళు పట్టి లేపాయి గానీ భూస్వామ్య వర్ణాలను మార్చలేకపోయాయి. మార్చలేకపోగా రకరకాలుగా బలోపేతం చేశాయి. ఆ బలంతో తలపడాల్సిన అదనపు భారం కూడా ఈ పేద ప్రజలపై పడింది. దానికి కూడా తయారుగానే వున్నారు అయోధ్య, వీరన్నలు. ఈ ఒక్క కథతో ప్రపంచీకరణ విసిరిన వలను చేధించుకునే పోరాటంలో వున్న పలువురి జీవన పోరాటాన్ని పాఠకులకు అర్ధం చేయించారు. పాఠకులకు ఆ జీవితాలను అర్ధం చేసుకోవటం వల్ల వచ్చే సంస్కారం, పేద ప్రజల పక్షం వహించాలనే అవగాహన సామాజిక మార్పుకి, మంచి మార్పుకి దోహద మవుతాయి. అదే కాంతారావు కథలు నెరవేర్చిన సాహిత్య ప్రయోజనం. ఖమ్మం జిల్లా సరిహద్దులలోని అటవీ ప్రాంతాలలో నివసించే గిరిజనులది చాలా దుర్భర పరిస్థితి. పేదరికం, అందుబాటులో లేని మౌలిక సదుపాయాలు, అమాయకత్వం, అటవీ సంపదలపై కన్నేసి, గిరిజనుల మాన ప్రాణాలతో చెలగాట మాడుతున్న మైదాన ప్రాంతపు కొత్త సంపన్న వర్గం, గిరిజనుల కోసం పోరాడే విప్లవకారులు, ఆ వుద్యమాల సంకలిత - ఓల్లా * 130

నణచివేసే పోలీసులు - వీటన్నిటితో వాళ్ళ జీవితాలకు ఒక్క రోజు స్థిమితం లేదు. ఈ క్షణం ఏం జరుగుతుందో, ఎవరు ఎటునుంచి విరుచుకుపడతారో తెలియదు. అన్నల స్థావరాలు, పోలీసు క్యాంపుల మధ్య జీవితం అయోమయం, హింసాపూరితం అయిపోతుంది. విషపు గడ్డలు తవ్వుకుని, ఆ గడ్డలలోవిషాన్నంతా తీసివేసి వాటితో కడుపునింపుకుని సాగించే బతుకు వారిది. బతుకు తీపి వారిది. ఆ తీపిలో విషాన్ని నింపి వారిని సంహరిస్తున్న సమాజం మనది. “సమిధలు” “మూగ జీవాలు” ఈ రెండు కథలూ ఖమ్మం జిల్లా గిరిజన జీవితాలను మన కళ్ళముందుంచుతాయి. 'సమిధలు'లో అన్నలు, పోలీసులు, సల్వాజుడుం వీళ్ళ మధ్య కిర్మా, దుక్కి అనే గిరిజన యువతీ యువకుల జీవితాలు ఏమైపోయాయి అనేది కథాంశం. 'యాసగడ్డలు' తిని బతికే వారి విషాద జీవితం పరిచయమవుతుంది. తమ గిరిజన స్రీలనవమానించిన పోలీసుల్ని చంపిన గిరిజన పెద్ద సాహు, వెజ్జు చివరికి ఆ పోలీసుల చేతికి చిక్కటం ఇష్టంలేక విషపు గడ్డలు తిని చనిపోతారు. చత్తీస్‌ఘడ్‌ నుంచి ఖమ్మం జిల్లాకు ప్రాణాల కోసం వలస వచ్చిన వారి జీవితాలు తెగిన గాలి పటాలవుతున్న తీరు చూస్తే మనం ఏ (ప్రపంచంలో బతుకుతున్నాం అనిపిస్తుంది. అమానుష అనాగరిక సమాజంగా మారుస్తున్న శక్తులను గురించి తెలుసుకుని వాటిమీద తిరగబడాలనే కోరిక కలిగించే కథ 'సమిధలు". గిరిజన స్రీలు మైదాన ప్రాంత పురుషుల అకర్షణకు, మాయమాటలకు లొంగిపోతారని, ఆ రకంగా వారిని మోసం చేస్తారనీ తెలుగు సినిమా కథలు, వ్యాపార సాహిత్యం మనకు చెప్తాయి. ఐతే 'మూగజీవాలు కథలో గిరిజన తెగలోని ఆచారాలను

మైదాన ప్రాంతవాసులు ఎలా వాడుకుని వాళ్ళని మోసం చేస్తారో రచయిత చెప్పారు.

గిరిజన జీవితాన్ని గ్లామరైజ్‌ చెయ్యకుండా, లేదా మరీ జాలి పడాల్సిన స్థితిలో చూపకుండా వాస్తవంగా చిత్రించిన కథలివి. ఇవి విషాదాంత కథలైతే 'కోయళత్తూర్‌ బాటి ఆశను కలిగించే కథ. ఇంత విధ్వంసంలోనూ ఎక్కడో ఓ ముళ్ళదారైనా వుంటుంది.

ముళ్ళ కంపలను తీసి వేసుకుంటూ నడిస్తే గమ్యం దగ్గరవుతుంది. బతుకు ఓ దారిలో పడుతుంది అనే ఆశను కలిగించే కథ ఇది.

సమస్త భూవనరులనూ హిరణ్యాక్షుడిలా ఆక్రమించటం నేర్చుకున్న దురాశాపరులైన వ్యాపారుల గురించి, వారి దురాశకు కొంత కాలం తలొగ్గినా, చివరికి ఎదిరించక తప్పదనే గ్రహింపుతో తెగించిన ప్రజల గురించి రాసిన కథ “గట్టు తెగిన ఊరు” నదిలో ఇసుకను అన్ని కాలాల్లో తరలించుకుని అమ్ముకునే పరిస్థితిని వార్తలుగా వింటున్న పాఠకులకు ఒక కథా చిత్రంగా దగ్గరినుంచీ పరిచయం చేశారు. పేద

సంకలిత - ఓల్లా * 131

వాళ్ళు ఒక చిన్న గూడు కోసం, తలదాచుకునే నీడ కోసం ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్‌ గృహకల్పలు రాజ్యమేలుతున్న రోజుల్లో కూడా అలాగే వుంది. ఇందిరమ్మ ఇల్లు కావాలనుకున్న పులుగమ్మ చివరకు డబ్బు కోసం ఫార్మా కంపెనీ ప్రయోగాల్లో చచ్చిపోయింది. పోశమ్మకుంటలో ఇళ్ళ స్థలాల ఆక్రమణకు ప్రాణాలను తెగిస్తారు పేదలు. ప్రభుత్వ పథకాలలో చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం లేకపోతే ఏ పథకాలూ పేద ప్రజలకు మేలు చేయవని, పైపెచ్చు కీడే చేస్తాయనీ హెచ్చరిస్తాయి కథలు. “జీవితం మళ్ళీ మొదలైంది” ఒక పొట్టు బండివాడి జీవిత కథనం. అద్బుతమైన కథ. ఇద్దరు విభిన్న స్రీలు 'పాత్రలుగా' వున్న కథలున్నాయి ఈ సంకలనంలో. ఒక కథలో తండ్రికి గయలో శ్రాద్ధకర్మలు చేయటానికి వచ్చిన స్త్రీని ఈసడించుకున్న వారు, తల్లిదండ్రులకు ఆమె అండగా నిలబడిన తీరు చూసి చలించి ఆమె పక్షం వహిస్తారు. ఆటోమేటిగ్గా పాఠకులూ ఆమె పక్షం వహిస్తారు. స్మశానానికి కాపలా కాసే సీతమ్మ కథ “అంతులేని పయనం. స్త్రీలు సామాన్యంగా రాని పనిలోకి వచ్చి అక్కడా సమస్యలు, చికాకులతో బతికే సీతమ్మ సాహిత్యంలో పదికాలాలు గుర్తుండే పాత్ర. ఇంకా ప్రభుత్వ అస్తవ్యస్త కరెంటు విధానాలతో షాకులకు గురై చనిపోయే రైతులు, కుటుంబ భారం మొత్తంమీద పడిన రైతు భార్యలు, వారి దగ్గర మిగిలినదంతా ఊడ్పుకునే భూస్వాములు. వీరి దగ్గరకు తీసికెళ్ళి కథ 'కాడెడ్గు ఎకరం నేల - మానవ సంబంధాలలో ముఖ్యం తల్లి, దండ్రులకు పిల్లల సంబంధాలలో వచ్చిన మార్పులను చూపే కథలు “ఆ తలుపులెప్పుడూ తెరిచే వుంటాయి” “నాన్న పోయిన తర్వాత” మొదటి కథ భార్య పోయిన భర్త గురించైతే, రెండవ కథ భర్త పోయిన భార్య గురించి. జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరితనంలో బతికే తల్లిదండ్రులకు ఆసరా ఇవ్వలేని స్వార్థ ప్రపంచంలో పిల్లలు కూరుకుపోతే తెలివిగా తమ జీవితాలను అర్ధవంతం చేసుకున్న స్త్రీ పురుషులు ఈ కథల్లో కనిపిస్తారు. పరిస్థితులకు తలొగ్గి దైన్య జీవితాలు గడపకుండా మన జీవితాలను మన చేతిలోకి తీసుకోమనే (ప్రేరణను ఈ కథలు కలిగిస్తాయి. “పూసుగూడెం రాజులు” వంటి కథను ప్రజల జీవితం గురించి బాగా తెలిసిన వారు తప్ప రాయలేరు. గూడేలలో జనం బతుకులను శాసించే శక్తులు, వాటితో జనం ప్రత్యక్ష పరోక్ష పోరు - ఇదంతా సామాన్య సాహిత్య పాఠకులకు తెలియని జీవితం సంకలిత - ఓల్లా * 132

శిరంశెట్టి కాంతారావు తప్ప మరాకరు రాయలేని జీవితం. 'వలయం' కథ కూడా అలాంటిదే. స్మశానానికి సైతం కాస్త చోటు వుంచకుండా భూమిని కబ్బా చేసే స్వార్థ రాజకీయ శక్తులు జనం సమస్యలను పట్టించుకోకుండా మత్తులో ముంచే సారా, సెల్‌ఫోన్లు - ఇది ఇవాళ అనేక పల్లెల్లో కనిపించే సామాన్య దృశ్యం. అసామాన్యంగా రాశారు రచయిత.

రచయితగా కాంతారావు కున్న బలం జీవితాన్ని దగ్గరగా, (ప్రత్యక్షంగా చూసి, అనుభవించి అర్థం చేసుకున్న తీరు. రచయితలకు ఈ జీవితానుభవమే (ప్రధానం. వస్తురీత్యా రచయితను అగ్ర ్రేణిలో నిలబెట్టేది 'జీవితానుభవం'. దీనిని కథగా మలచటంలో రచయిత ఎన్నుకునే శైలీ, శిల్పాలు ఆ కథకు మరింత మెరుగు పెడతాయి. కథకు ప్రధాన లక్షణమైన “కథ మాత్రమే చెప్పాలి. కథ తప్ప మరేమీ చెప్పకూడదు” అన్న సూత్రాన్ని కాంతారావు అక్షరాలా పాటించారు. కథను సాకుగా తీసుకుని ఇతరేతర విషయాలు, తనకు తెలిసిన, తను చెప్పదల్చుకున్న విషయాలు చెప్పకుండా నిగ్రహం పాటించారు. పాత్ర వృత్తిని, ప్రవృత్తిని చాలా వాస్తవికంగా వర్ణించారు. పాఠకుల సానుభూతి సంపాదించటానికి అనవసర ప్రయాస పడలేదు. పాఠకులను ప్రయాస పెట్టలేదు. భాష విషయంలోనూ రచయితను అభినందించాలి. మాండలికాన్ని పాత్రలకు వాడుతూ, అన్ని ప్రాంతాలవారికి తేలికగా వుండే భాషలో కథ నడుపుతూ మంచి వ్యూహాన్నే ఎంచుకున్నారు. ఏ రచయితైనా తనకు అనువుగా వుండే భాషా శైలీ వ్యూహాలను ఎన్నుకున్నప్పుడు పాఠకులకు తొందరగా దగ్గరవుతాడు. ఆ నేర్పు రచయితగా శిరంశెట్టి కాంతారావు సాధించారు. సాధించిన దానితో సంతృప్తి పడే నైజం ఆయనది కాదని ఆయన కథలు చెప్తాయి. జన జీవితంతో సన్నిహిత సంబంధాలున్న రచయితగా, జనం పక్షాన నిలబడిన రచయితగా, భాషపై, మాండలికంపై సాధికారత వున్న రచయితగా ఆయన సాధించవలసింది కూడా చాలా వున్నది. ఆయన కలం నుంచి మరిన్ని కథల కోసం ఎదురు చూసే ఆసక్తిని పాఠకులలో రేకెత్తించే ఈ

కథాసంకలనాన్ని ప్రచురించినందుకు అభినందిస్తూ... శిరంశెట్టి కాంతారావు కథా సంపుటి ఊతకర్రలుకి ముందుమాట 29. సెప్టెంబర్‌. 2012

సంకలిత - ఓల్లా * 133

టా అం య! య, 20 స్త్రీవాద కథ - కొన్ని ఆలోచనలు ప్రీవాద కథ అంటే ఏమిటి? స్త్రీలు రాసిన కథలా, స్త్రీల గురించి రాసిన కథలా? స్త్రీల గురించి స్త్రీలు రాసిన కథలు మాత్రమేనా, ప్రీల గురించి పురుషులు రాసిన కథలు కూడా స్త్రీవాద కథలు అవుతాయా? అలా అయితే 1980 తర్వాతనే ప్రీవాద కథలు అనేపేరు ఎందుకు వచ్చింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుని ఆ తర్వాత స్త్రీవాద కథల పుట్టుకను, పరిణామాన్నీ వికాసాన్నీ అంచనా వేద్దాం. అర్థం చేసుకుందాం. స్త్రీవాదం అనే మాట ఒక స్పష్టమైన తాత్త్విక రాజకీయ అర్ధంతో సాహిత్య రంగంలోకి ప్రవేశించింది 1980 వ దశాబ్దంలో. ఆ తాత్విక రాజకీయ దృక్పథాన్ని స్థూలంగానైనా చెప్పుకుంటేనే మనం స్త్రీవాద కథకున్న ప్రత్యేక రూపము, సారమూ అర్థం చేసుకోగలుగుతాం. ఈ సమాజం పిత్రుస్వామ్య సమాజమనీ, ఈ సమాజం ప్రీల లైంగికత్వాన్ని, మాతృత్వాన్ని (శ్రమనూ కంట్రోలు చేస్తుందనీ అర్ధం చేసుకుని అంగీకరించటం, ప్రీలు ఈ సమాజంలో అనుభవిస్తున్న కష్టాలను, ఎదుర్కొంటున్న సమస్యలనూ, హింసనూ, వాళ్లు చేసే తిరుగుబాట్లనూ వాళ్ల చైతన్యంలో గుణాత్మకంగా వచ్చిన మార్చును విడివిడి సంఘటనలుగా, వ్యక్తిగతం మాత్రమే అయిన విషయాలుగా కాకుండా, సమాజ లైంగిక, రాజకీయ, ఆర్థిక విధానంలో భాగంగా చేసి చూడగలిగిన దృష్టినీ, ప్రీవాదం అంటాము. ఆ దృష్టి కలిగి వుండి ప్రీల అసమానత్వాన్నీీ అణచివేతనూ తొలగించేందుకు ఏ రకమైన ఆచరణనైనా చేసే వారిని - కథలు రాయటంతో సహా

  • ప్రీవాదులు అంటాం. ఈ (ప్రత్యేకమైన దృక్పథం తెలుగు సాహిత్యంలోకి 80వ దశాబ్ధంలోనే వచ్చింది. అది ఆకాశాన్నించి హఠాత్తుగా ఊడిపడలేదు. 1960 దశాబ్దపు

చివరి నుంచీ మొదలై 1970 వ దశాబ్దంలో ఊపందుకుని విసృతంగా సాగిన స్త్రీల వుద్యమం వల్ల ఈ దృక్పథం ఒక క్రమంలో సాహిత్యా వరణంలోని స్రీలకు అందింది. ఆ దృక్పథం వచ్చాక కథారచనలో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. స్త్రీల సమస్యలు వ్యక్తిగత రాగద్వేషాలకూ, వ్యక్తుల మంచిచెడ్డలకూ మాత్రమే పరిమితమైనవి కావు. అవి సామాజిక రాజకీయ సమస్యలు. భర్త మంచివాడు, ప్రేమగా చూసేవాడూ అయినంత మాత్రాన ప్రీల సమస్యలు తీరవు. వారిపై ఒక సామాజిక అణచివేత అమలవుతోంది అని గ్రహించి ఆ అణచివేత మూలాలను అర్ధం చేసుకుని ప్రశ్నించి దానిపై తిరుగుబాటు చేయటమే స్త్రీవాద కథ లక్షణం, లక్ష్యం. అలాగే, జండర్‌ నిర్మాణం ఈ సమాజంలో ఎలా జరుగుతుందో అర్ధం చేయించటం కూడా తొలి దశలో స్త్రీవాద కథచేసిన ముఖ్యమైన పని. మనుషులు ఆడవాళ్ళుగానూ మగ వాళ్ళు గానూ శారీరకమైన తేడాలతో పుడతారు. అది శరీర సంబంధమైనది. కానీ వీళ్ళు స్ర్రీలుగానూ, పురుషులుగానూ సాంఘికంగా తయారుచేయబడతారు. స్త్రీలను ప్రీత్వంతోనూ, పురుషులను పురుషత్వంతోనూ బ్రతకాలని శాసించి, వారి పరిధులను నిద్ధేశించి, వాటిని దాటకూడదనే నిర్భంధాలు విధించిన పిత్రుస్వామ్య సమాజాన్ని అర్ధం చేసుకుని, ప్రీ పురుషులిద్దరినీ తమపై రుద్దబడిన భావజాలాన్ని ఒదిలించుకుని మనుషులుగా బతకమని కోరిన కథలు స్త్రీవాద కథలు. అబ్బూరి ఛాయాదేవి గారు రాసిన “బోన్సాయ్‌ బతుకులు” ఆడపిల్లలను పెంచేతీరు వారినెంత నిస్సహాయులుగా తయారుచేస్తుందో స్పష్టంగా చెప్పిన మంచికథ. ప్రీత్వం అంటే సుకుమారత్వం, బలహీనత, క్షమ, సహనం, త్యాగం అంటూ పురుషత్వం అంటే బలం, ధైర్యం, పోరాటం, విజయం, అన్వేషణ అంటూ సమాజం కల్పించిన భావజాలాన్ని బలంగా ఎదుర్కొన్న కథలు ఓల్లా రాజకీయ కథలు. స్త్రీవాద కథలకు దిశానిర్దేశం చేసిన కథలు. ప్రీ శరీరంలోని ప్రతి అవయవమూ ఎలా నిర్భంధానికి గురవుతుందో, ఎలాంటి దుర్భేద్యమైన రాజకీయ అణచివేత వుంటుందో ఈ కథలు స్పష్టం చేశాయి. ఈ కథలు వచ్చేంతవరకూ సమాజ పరిణామానికీ, పురోగతికీ, కీలకమైన విషయంగా వుత్పత్తి రంగం మాత్రమే వుండేది. వుత్పత్తి రంగంలో పనిచేసి ఆర్జించి, సమాజాన్ని ముందుకు నడిపించే వారిగా పురుషులకు విలువ వుండేది. అందువళ్లే వారికి ఆ రంగంలో హక్కులు, రాయితీలు కల్పించేందుకు ఎన్నో పోరాటాలు, కార్మికోద్యమాలు జరిగాయి. స్రీలు ప్రధానంగా వున్న పునరుత్పత్తికి ఎలాంటి విలువ గౌరవమూ వుండేది కాదు. అదంతా సహజంగా జరిగిపోయే విషయంగా చూసేవారు. సంకలిత - ఓల్గా * 135

కానీ ఓల్లా 'ఒక రాజకీయ కథః వుత్పత్తి, పునరుత్చత్తిని సమానమైన విలువతో చూసింది. వుత్పత్తి రంగంలో పురుషులు సాధించుకున్న హక్కులు పునరుత్పత్తిలో స్రీలకెందుకు లేవు, అక్కడ పురుషుల ఐక్యత అవసరమని గుర్తించినట్లు ఇక్కడ స్త్రీల ఐక్యత అవసరమని ఎందుకు గుర్తించలేదని సూటిగా ప్రశ్నించి సంచలనం రేపింది. అలాగే సంతానోత్బత్తిలో ప్రధానమైన భారాన్ని మోస్తున్న ప్రీలకు సంతానాన్ని కనాలా ఒద్దా, ఎప్పుడు, ఎవరికి కనాలి అనే నిర్ణయాలు తీసుకునే హక్కు అధికారం లేకపోవటం గురించి 'భిన్న సందర్భాలు” వంటి కథలు చర్చను రేపాయి.

ఈ సమాజం తమకు ఆపాదించిన పాత్రలనే యాంత్రికంగా మోస్తూ తమ అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని గురించిన స్పృహ లేకుండా బతుకీడుస్తున్న స్త్రీల జీవితాలకు అద్దం పడుతుంది పి.సత్యవతి రాసిన 'ఇల్లలకగానే అస్తిత్వ పోరాటాల కాలమైన వర్తమాన సమాజంలో ఈ కథ ఒక బలమైన ముద్రను వేసింది. స్త్రీల అస్తిత్వ ఆకాంక్షలు వ్యక్తమయ్యేది, వాటికోసం ముందుగా పోరాటాలు జరిగేదీ కుటుంబం లోపలే - వివాహం, కుటుంబం ఈ రెండింటిలోని అణచివేతను, అసమానత్వాన్నీ ప్రశ్నించటం స్త్రీవాద కథల మరొక ప్రధాన లక్షణం. కుటుంబం పవిత్రమైనదనీ మార్పుకు అతీతమనే భావనను బద్దలుకొట్టి కుటుంబంలో ప్రజాస్వామ్యం కావాలనే కాంక్షను బలంగా వ్యక్తీకరించాయి స్త్రీవాద కథలు. వివాహబంధంతో ఒక కుటుంబంగా ఏర్పడి అందులో అసమాన సంబంధాల వల్ల తిప్పలు పడటం కంటే, వివాహమనే బంధం లేకుందా ప్రేమ, స్నేహాల ప్రాతిపదిక మీద స్త్రీపురుషులు కలిసి బతకటం సాధ్యమవుతుందా అన్న చర్చను లేవదీసిన కథ “ప్రయోగం”. “ప్రయోగం” కథ సమాజంలోనూ, సాహిత్యంలోనూ ఎంతో చర్చను రేకెత్తించింది. 1950వ దశాబ్ధంలో 'పంచకల్యాణి” నవలలో తనను (్రేమించే పురుషుడిని కూడా తన ఆత్మాభిమానాన్ని ఎక్కడ హరిస్తాడో అనే భయంతో వేధించిన లలిత పాత్రను సృష్టించిన కొడవటిగంటి కుటుంబరావు గారు 'సమాజంలో స్రీపురుషులు సమాన స్థాయిలోకి వచ్చేంతవరకూ పేమ వివాహాలు విజయవంతం కావు అంటారు. 1990 దశాబ్ధంలోని (ప్రయోగం! కథలో సునంద తనను తాను "కొత్త విలువలకోసం కొత్త మానవసంబంధాల కోసం, స్నేహం 'ప్రేమలకోసం జీవితంలో నిర్భయంగా ప్రయోగం చేస్తూ ఆ ప్రయోగాలలో కనుగొన్న సత్యాలలో జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే” వ్యక్తిగా చెప్పుకుని అటువంటి సాహసం, చైతన్యం వున్న పురుషుని కోసం వెతుకుతానంటుంది. ఆ కథానాయకుడికి ఆ చైతన్య స్థాయిలేదు. సునంద చైతన్యస్థాయి నందుకోగలిగిన పురుషులున్నప్పుడే ఈ ప్రత్యామ్నాయ

సంకలిత - ఓల్లా * 136

విధానాలు విజయవంతం అవుతాయి. అంతవరకూ అసంతృప్తులు, వైఫల్యాలు, తప్పవు. ఐతే ప్రత్యామ్నాయ విధానాల గురించి ఆలోచించాల్సిన అన్వేషించాల్సిన అవసరం స్త్రీ పురుషలిద్దరికీ సమానంగా వుందని “ప్రయోగం” కథ చెబుతుంది. కుటుంబంలో భర్త అహాన్ని సంతృప్పిపరచటానికి తమ తెలివినీ మేధస్సునీ దాచుకుని (బ్రతికే అనేకమంది స్త్రీలు జీవన సారాంశాన్ని జీవ రాహిత్యపు బతుకునీ పి.సత్యవతి “గాంధారి” కథలో రాశారు. కుటుంబంలో భర్త అణచివేతే కాక తండ్రి, తల్లి మిగిలినవారి అణచివేత కూడా దుర్భరంగానే వుంటుందనీ దానినుంచి బైటపడాలని కూడా స్త్రీలు కోరుకుంటారనీ కుప్పిలి పద్మ “ముక్త కథ చెబుతుంది. ఎస్‌.జయ రాసిన రెక్కలున్న పిల్ల” ప్రీల స్వేచ్చా కాంక్షను” అందులోని ఆనందాన్ని బలంగా వ్యక్తీకరిస్తుంది. ప్రీలను ఈ సమాజం అత్తలుగా కోడళ్ళుగా విడదీసి వాళ్ళమధ్య శత్రుపూరిత సంబంధాలు ఏర్చరుస్తుందనే చైతన్యంతో “గోడలు” వంటి కథలు వచ్చాయి. స్రీలు వుద్యోగాలు చేస్తూ ఆర్ధికంగా స్వతంత్రులైనట్లు కన్పించినా ఆ ఆర్జన మీద అధికారం ఎవరిదీ అన్న అంశం మీద మంచి కథలు వచ్చాయి. ఇంద్రగంటి జానకీబాల రాసిన 'జీవన రాజకీయం' వుద్యోగం చేస్తూ కుటుంబాన్ని మోస్తున్న స్రీకి వుద్యోగంపోతే, అది కూడా ఆమె ఆరోగ్యరీత్యా అయితే, దానిని కుటుంబమూ ఆఫీసూ కూడా ఎలా చూస్తారనే దానికి మంచి వుదాహరణ ఈ కథ. స్త్రీలు వుద్యోగాలు చేస్తున్నప్పుడు బదిలీ అయితే, ప్రమోషన్‌ వస్తే కుటుంబంలో ఎలాంటి అలజడి చెలరేగుతుందీ, కుటుంబ అవసరాలకు ఆమె ఎదుగుదల ఎలా బలి అవుతుందనే అంశం “బదిలీ కథలో బలంగా చిత్రించబడింది. స్త్రీల సంపాదన మీద ప్రీలకు పట్టువుండాలనే విషయాన్ని “జేబు” సంకేతంతో బలంగా చెప్పింది పాటిబండ్ల రజని. భర్తలేని ప్రీలకు సామాజిక ఆమోదం తేలికగా దొరకదు. ఆ సామాజిక ఆమోదం లేకుండా జీవించలేని స్రీలు ఏదో ఒక రకంగా ఆ 'భర్త అనే (భ్రమను కల్పించి బతకాల్సిన పరిస్థితిని చెబుతుంది కొండేపూడి నిర్మల 'అబద్ధం' కథ. ప్రీ పురుష సంబంధాల గురించి రచయిత్రులు అనేక కొత్త కోణాలు తమ కథలలో చర్చించారు. నల్లూరి రుక్మిణి “బిగించి కట్టిన మూటలు కథలో స్త్రీ పురుష లైంగిక సంబంధాలలో అన్ని విధాల నలిగేది స్రీలేననే విషయం రాసింది. స్త్రీలను విముక్తి చేస్తామనే రాజకీయ వుద్యమాలలో, రాజకీయ రంగాలలో కూడా స్త్రీలపట్ల ఎలాంటి వివక్ష వుంటుందో కూడా ప్రీల దృష్టినుంచి మంచి కథలు వచ్చాయి. ఏ రంగంలోనైనా ప్రీల పురోగతికి ఆటంకంగా వున్న ఇంటి చాకిరి గురించీ, అందులోని మొనాటనీ గురించీ, ఆ చాకిరితో మొద్దుబారిన ప్రీల మనశ్శరీరాల గురించీ స్త్రీవాద

కథలు వచ్చాయి. పిల్లల పెంపకం మాతృత్వ విధిగా కర్తవ్యంగా చూడకూడదనీ, అది నిజానికి సామాజిక బాధ్యత అనీ 'కేసు' వంటి కథలలో ఓల్లా చర్చించారు.

తమ శరీరాలు, పునరుత్పత్తి, వివాహం కుటుంబం వీటి తర్వాత స్త్రీవాదులు ప్రస్తుత ప్రపంచీకరణ, సందర్భాన్నీ, ప్రపంచీకరణ ్రీపురుష సంబంధాలనూ, మానవీయ సంబంధాలనూ, స్ర్తీల అణచివేతనూ ఎలా ప్రభావితం చేస్తుందో, మనుషులను ఒకరికొకరు పరాయివారిగా ఎలా తయారుచేస్తుందో చెప్పేమంచి కథలు రాశారు. సరళీకృత ఆర్థిక విధానాలూ, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, ఆహార పంటల స్థానంలో వ్యాపార పంటలు, ప్రభుత్వరంగ సంస్థల మూసివేత, విద్య వైద్యాలతో సహా ప్రైవేటు యాజమాన్యాల చేతిలోకి పోవటమూ, కార్పోరేట్‌ రంగంలో నియమిత పనిగంటలు, వ్యక్తిగత స్వేచ్చ కూడాలేని వెట్టిచాకిరీ విధానం, ఇవన్నీ కుటుంబంలో స్త్రీల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న విషయాల మీద ఎన్నో మంచి కథలు వచ్చాయి. రైతుల ఆత్మహత్యల కారణంగా కుటుంబ భారమంతా మోయాల్సి వచ్చిన ప్రీలు, పట్టణాలకు వలస వచ్చిన స్త్రీలు గురయ్యే హింస, వీటి గురించి కథలు రచయిత్రులు రాశారు. విద్యావిధానంలో వచ్చిన మార్చులతో పిల్లల బతుకుతోబాటు తల్లుల బతుకూ దుర్భరమయింది. మధ్యతరగతి స్త్రీలకు తమ పిల్లల్ని ఈ పోటీ ప్రపంచంలోకి నెట్టి వాళ్ళు విజయాలు సాధించేలా తయారుచేయటమే జీవితమైంది. ఎల్‌కె.జీ నుంచి అమెరికాలో వుద్యోగం సంపాదించుకునే వరకూ పిల్లల జీవితాలను తీర్చిదిద్దటానికి ఎలాంటి పరుగుతియ్యాలో ఆ పరుగులో వారెంత అలిసిపోతున్నారో, శిధిలమవుతున్నారో విప్పిచెప్పిన కథ పి.సత్యవతి “సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌”.

మల్టీనేషనల్‌ కంపెనీలు వుద్యోగస్తుల జీవితాల్లోకి ఎలా చొచ్చుకువస్తాయో, వాళ్ళకు వ్యక్తిగతమనే చోటు సమయం లేకుండా ఎలా చేస్తాయో 'కుబుసం' కథ సమర్ధవంతంగా చిత్రించింది.

(గ్రామాలలో శిధిలమవుతున్న ఆప్యాయతల గురించీ, పెరిగిన ఆడంబర జీవిత విధానాల గురించి, కృత్రిమ విలువల గురించి, డబ్బు వెంటబడి తీస్తున్న పరుగులో కోల్పోతున్న మానవ సంబంధాల గురించీ, ఆడపిల్లల్ని అమ్ముకుంటే తప్ప బతకలేని పరిస్థితుల గురించ్చీ, అమ్ముకునైనా ఆడంబరంగా బతకాలనే వికృత ధోరణుల గురించి రచయిత్రులు కథలు రాశారు. గ్రామాలలో వస్తున్న మార్పులను సామాన్య స్త్రీల జీవన నేపధ్యాల నుంచి రాస్తున్న రచయిత్రులలో చెప్పుకోదగినవారు కె.వరలక్ష్మీ, నల్లూరి రుక్కిణి.

సంకలిత - ఓల్లా * 138

కె. వరలక్ష్మి 'ఖాళీసందులు' 'నిరసన' “మట్టి బంగారం” కథలు 90 దశాబ్ధంలో వచ్చిన మంచికథలు. తెలంగాణా గ్రామాలలో ప్రపంచీకరణ సందర్భంలో జరుగుతున్న విధ్యంసాన్ని ముదిగంటి సుజాతారెడ్డి 'పల్లె మింగిన పట్నం” కథలో మన కళ్ళకు కట్టేలా రాశారు. తెలంగాణా ప్రీల వ్యధాభరిత జీవితాన్ని అనేక పార్య్వాల నుంచీ చిత్రిస్తున్న మంచి రచయిత్రి గీతాంజలి. ఆమె రాసిన “బచ్చేదాని” వంటి కథలు ప్రీవాద కథా సాహిత్యంలో సుస్థిరస్థానం పొందుతాయి. మైనారిటీ ప్రీల సమస్యల మీద “షాజహానా” రెండు మంచి కథలు రాశారు. గిరిజన ప్రీల సమస్యల గురించి గోపి భాగ్యలక్ష్మి రాసిన 'జంగుబాయి' వాడ్రేవు వీరలక్ష్మి రాసిన 'కొండఫలం' 'నల్లక్క' కథలు చెప్పుకోదగినవి.

ప్రీవాద కథా సంకలనాలు అనేకం రావటం, ప్ర్రీవాద సాహిత్య బలాన్నీ పాఠకులలో ఆ కథలకు పెరుగుతున్న ఆదరణను సూచిస్తున్నాయి. “స్త్రీవాద కథలు” 'నూరేళ్ళపంట' 'నల్లపొద్దు' మొదలైన సంకలనాలు ప్రీవాదకథాసాహిత్యాన్ని సుస్థిరం చేశాయి. దళిత స్త్రీల సమస్యల గురించీ, వారెదుర్కొంటున్న రెండు అంచుల అణచివేత గురించి, వారి జీవన వైవిధ్యాన్ని గురించీ భవిష్యత్తులో రాబోతున్న గొప్ప కథలకు భూమిక “నల్లపొద్దు'లో ఏర్పడింది. వినోదిని రాసిన “మరియి” కథ, పచ్చనూరు అనురాధ రాసిన 'పాటలు నేర్చిన నెమలి” కథ, గోగు శ్యామల రాసిన “ఏనుగంత తండ్రికన్న ఏకులబుట్టంత తల్లినయం' కథలు దళిత ప్రీల అనుభవాలనూ, ఆలోచనలనూ పరిచయం చేసి బలమైన ముద్రవేశాయి.

దాదాపు పాతిక సంవత్సరాల నుంచి తెలుగు సాహిత్యంలో ప్రీవాద కథలు కొత్త చూపును కల్పించాయి. మానవ జీవితానుభవాన్ని అర్ధం చేసుకోవటమే సాహిత్య 'ప్రయోజనమైతే, ఆ మానవులలో సగమైన స్త్రీల జీవితానుభవాన్ని అర్థం చేసుకోటానికి ప్రీవాద కథలు దోహదపడ్డాయి. స్త్రీవాదకథలు లేనిది వర్తమాన మానవ జీవితాన్ని సాహిత్యం ద్వారా అర్ధం చేసుకోవటం అసాధ్యం అన్నంతగా 'ప్తీవాద కథలు మానవ జీవితపు లోతులను ప్రశ్నించాయి. సమాజాన్ని ధిక్కరించాయి. సంకెళ్ళను తెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసి కొత్త సంకెళ్ళ గురించి హెచ్చరించాయి. తెలుగు సాహిత్యానికి పరిపూర్ణత్వాన్నిచ్చి భారతీయ భాషలలో తెలుగు సాహిత్యానికి సగౌరవ స్టానాన్ని గర్వించదగ్గ స్థానాన్ని ఇచ్చాయి.

క్‌ సంకలిత - ఓల్గా * 139

చి కీ తవాటై (ల.

21 స్త్రీవాద కవిత్వంపై సమగ్ర పరిశీలన 1998వ సంవత్సరంలో “నీలిమేఘాలు కవితా సంకలనం వెలువడిన తర్వాత ప్రీవాద సిద్ధాంతం, కవిత్వం పరిశోధనార్హత్రగల అంశాలుగా విశ్వవిద్యాలయాల చేత కూడా గుర్తింపబడ్డాయి. ఆచార్య చేకూరి రామరావు వంటి భాషా శాస్ర్రవేత్తలు, సాహిత్య విమర్శకులు “నీలిమేఘాలు” కవితా సంకలనాన్ని ఈ శతాబ్దంలో వెలువడ్డ రెండవ ఉత్తమ కవితా సంకలనంగా పేర్కొన్న తర్వాత సహజంగానే తెలుగు సాహిత్య అధ్యయనపరులందరి దృష్టి ప్రీవాద సాహిత్యంపై ప్రసరించింది. ఐతే వినోదిని ఏదో అధ్యయనం కోసం,కేవలం పిహెచ్‌.డి.కోసం “స్త్రీవాద కవిత్వం, భాష, వస్తు, రూప, నవీనత”ను పరిశోధనాంశంగా ఎంచుకున్నదని నేను అనుకోవటం లేదు. వినోదిని దళిత స్త్రీవాదిగా నేను భావిస్తున్నాను. అందువల్ల స్త్రీవాదం, స్త్రీవాద కవిత్వం ఆమెకు ఏదో బైట నుంచి పరిశోధించాల్చిన విషయం మాత్రమే కాదు. తన లోపలికి తాను నిత్యం చూసుకుని, తన అస్తిత్వాన్ని తాను గుర్తించుకుని, ఆ అస్తిత్వ స్పృహతో నిత్యం ఊపిరి తీసుకోవాల్సినంత ముఖ్యమైన విషయం. ఆ అంశాన్ని ఎంచుకున్న తర్వాత వినోదిని దానికి న్యాయం చేసింది. ప్రీవాదం స్వయంగా ఒక విశ్లేషణా పద్ధతి. అన్ని సామాజిక అసమానతలను, అధిపత్యాలనూ అర్ధం చేసుకునే ఒక దృష్టికోణం. ఈ దృష్టికోణం ఒకటుందని స్రీలకు అర్థమయ్యాక ఇక వాళ్ళను ఆపటం ఎవరి తరమూ కాదు. శతాబ్దాల పాటు కవయిత్రుల గొంతులు నొక్కి వేయబడ్డాయి. వాళ్ళ నాలుకలు కత్తిరించబడ్డాయి. సాహిత్య చరిత్రలో వాళ్ళు చరిత్రహీనులయ్యారు. సాహిత్య చరిత్రలో ఎవరి గురించి రాయాలి, ఎంత ('ప్రాముఖ్యత నివ్వాలి అనేదెప్పుడూ మగవారి చేతుల్లోనే ఉండిపోయింది. విశ్వవిద్యాలయాల్లో చదివే, పనిచేసే ప్రీల శాతం గణనీయంగా పెరిగిన తర్వాత

సంకలిత - ఓల్లా * 140

కూడా స్త్రీల సాహిత్యానికి సరైన గౌరవం రాలేదు. స్త్రీవాద సాహిత్యం బలంగా వచ్చిన తర్వాత మాత్రమే, వినోదిని వంటి వారు పట్టుబట్టటం వల్లనే, ఎండ్లూరి సుధాకర్‌ వంటి పర్యవేక్షకులు పెరగటం వల్లనే, ప్రీల సాహిత్యంపై విశ్వవిద్యాలయ పరిశోధనలు పెరిగాయి. స్రీవాద సాహిత్యం రాకముందు స్రీల సాహిత్యం గురించి పరిశోధన చేస్తామన్న మహిళా పరిశోధకులు ఎదుర్శొన్న ఆటంకాలు ఎన్నో ఇప్పటికీ అటంకాలన్నీ తొలిగిపోయాయని చెప్పలేము. ఐతే ఆటంకాలను ఎదుర్మోవాలనే పట్టుదలగలవారి సంఖ్య పెరుగుతుంది. (స్త్రీవాదం అంటే సామ్రాజ్యవాదుల నంన్కతి అనీ, ప్రజా ఉద్యమాలను పక్కదోవట్టించటానికి వచ్చిన పెడధోరణి అనే ప్రచారాలు మునుపుటంత కాకపోయినా యింకా బలంగానే ఉన్నాయి. ఆ ప్రచారాల వెంట కొట్టుకుపోవటం సులభం. ఎందుకంటే 'ప్రీలకు సంబంధించిన అనేక విషయాలు భౌతిక వాస్తవికతతో కంటే భావజాలంతో గట్టిగా ముడివేసుకుని సంప్రదాయాల రూపంలో, ఆచార వ్యవహారాల రూపంలో, విశ్వాసాల రూపంలో కొనసాగుతుంటాయి. ఉత్పత్తిరంగంలోని అదనపు విలువ అర్ధమైనంత తేలికగా, పునరుతృ్చత్తిలో ఇంటిచాకిరిలో ఉన్న అదనపు విలువ అర్ధం కాదు. అర్ధం కాకుండా మాతృత్వం, గృహిణిత్వం, పాతివ్రత్యం యిత్యాది భావజాలాలు అడ్డం పడతాయి. దాని వల్ల స్త్రీల భావాలలో, చైతన్యంలో, ప్రవర్తనలో, వేషధారణలో ఎక్కడ చిన్న మార్పు వచ్చిన అది మన దేశీయం కానిదనీ, పాశ్చాత్య ప్రభావమనీ, అందువల్ల మనకు పనికిరానిదనీ ముద్ర వేస్తారు. ఐతే స్త్రీల ఉద్యమాలు బలపడుతున్న కొద్దీ, ప్రీల గొంతులు ప్రతిఘటనా స్వరాలను పలుకుతున్నకొద్దీ ఈ వాదనలు పిత్రుస్వామ్య సమాజం స్త్రీల నణిచే విధానంలో భాగమని స్రీలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆరోపణలను తీసి పక్కన పడవేసి తమ చరిత్రను తాము అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్త్రీల ఉద్యమాల చరిత్రను ప్రీవాదం ఒక విశ్లేషణా పద్ధతిగా రూపొందిన క్రమాన్ని తెలుసుకుంటున్నారు. అనేకరంగాలను ్రీవాద విశ్లేషణా పద్ధతిలో పరిశీలిస్తున్నారు. అలాంటి పరిశీలనల్లో వినోదిని రాసిన ఈ పుస్తకం కూడా భాగమయింది. ముందే చెప్పినట్లు సాహిత్య సూత్రాలు సాధారణంగా మగవారి చేతుల్లో ఉంటాయి. సాహిత్య ప్రయోజనాన్నీ వాళ్లే నిర్వచిస్తారు. కాబట్టి పితృస్వామిక సమాజంలో ఆ విలువలతో ప్రీలు రచన చేస్తున్నప్పుడు ఆ సాహిత్యం ఏ విధంగా ఉంటుంది? పితృ స్వామిక విలువలతోనే రూపొందుతుందా? ఆ విలువలను ఛిన్నాభిన్నం చేస్తుందా? మొన్న మొన్నటి వరకూ ప్ర్రీలు రాసిన సాహిత్యం పిత్రుస్వామిక విలువలకు లోబడే, సంకలిత - ఓల్గా * 141

ఆ పరిధిలోనే, ఆ పరిమితులలోనే ఉంది. ఎంతవరకూ ్రశ్నించాలో ఎక్కడ ఆగాలో పితృస్వామ్య సమాజమే నిర్ణయించింది. దాని బిగికౌగిలి నుండి పూర్తిగా బయటపడి (ప్రీవాద కవిత్వం జలపాతంలా దూకింది. పితృస్వామిక విలువలను ముక్కలు చేసింది. ఆ ముక్కలు చేయటంలో కవితా వస్తువులే మారిపోయాయి. కవి సమయాలు మారిపోయాయి. భాషా ప్రయోగాలలో కొత్త మార్పులు వచ్చాయి. వస్తుపరంగా వచ్చిన మార్పులనన్నిటినీ వినోదిని వివరించింది. 'ప్రీవాద కవిత్వంలో స్త్రీల శరీరాలు కవితావస్తువులయ్యాయి. అందులో వింతేమీ లేదు. శతాబ్దాల భారతీయ సాహిత్యంలో ప్రధానమైన కవితా వస్తువు స్రీ శరీరమే. ఐతే అది పురుషులు వర్ణించినది. తమ మోహాలకూ, కామాలకూ, భక్తికీ, మాతృత్వ భావనకూ ఆలంబనగా నిలిచిన ప్రీ శరీరపు అంగాంగాలను, వందల, వేల సార్లు కవులు వర్ణించారు. వర్ణిస్తున్నారు. కానీ వర్ణనీయ వస్తువు తిరగబడి తనను తాను వర్ణించుకుంటే అప్పుడు సాహిత్యం పతనమవుతుందంటారు సంప్రదాయ సాపొతీవేత్తలు. ్రీవాద కవిత్వం వచ్చినపుడు కూడా అదే అన్నారు. ఈ కవితలలో శరీరస్పృహ తప్ప సామాజిక స్పృహలేదని ఆరోపించారు. వారికి తెలియనిదేమిటంటే ఈ శరీరాలకు అతీతంగా సమాజం ఉండదని. శరీర స్పృహలో సామాజిక స్పృహ భాగమేనని. స్త్రీల శరీరాలు కుంచించు కుని, సిగ్గుతో తలదించుకోనవసరం లేదని, తమ శరీరాల మీద అమలవుతున్న కంట్రోలుని ప్రశ్నించి ధిక్కరించాలని, కవయిత్రులు భావించారు. దానికి ముందుగా ఈ పితృస్వామ్యపు ముసుగులను చీల్చివేసి తమను తాము సత్య దర్శనం చేయాలను కున్నారు. ఆ క్రమాన్ని వినోదిని ఒక పద్ధతిలో సాహిత్య విద్యార్థులకు ఉపకరించేలా వివరించింది. స్త్రీవాదులు కుటుంబాలను విచ్చిన్నం చేస్తారనేది మరొక అపోహ. హింసలతో, ఆర్తనాదాలతో, జీవచ్చవాల వలే బతుకునీద్చే ప్రీలను తయారు చేసే కుటుంబ వ్యవస్థను ప్రీవాదులు బలంగా విమర్శిస్తారు. ఆ విమర్శలు కవితా రూపంలో మరింత బలంగా వచ్చాయి. ఆ కవితలకు భయపడిన వారికి, ప్రేమ, స్నేహాలతో నిండి, అధిపత్యానికి తావులేని స్త్రీ పురుష సంబంధాలను ప్రత్యామ్నాయంగా చూపారు. ఆ క్రమాన్ని కూడా వినోదిని తన పరిశోధనలో భాగం చేసుకుంది. స్త్రీల మీద జరిగే వ్యవస్థీకృత హింసను గురించి కూడా ్రీవాద కవిత్వం విపులంగా రాసింది. ఆ హింస కుటుంబ హింస కావచ్చు. కులహింస కావచ్చు. పనిచేసే చోట జరిగే లైంగిక హింస కావచ్చు. వ్యభిచారం పేరుతో జరిగే హింస కావచ్చు. హింసామయమైన స్త్రీల క్షత గాత్రాలను స్త్రీవాద కవయిత్రులు ఈ పురుషాధిపత్య సమాజానికి విప్పిచూపారు. సంకలిత - ఓల్లా * 142

వినోదిని దళిత, కైసవ, ముస్లిం వాదాల మధ్యనున్న వైరుధ్యాలను కూడా ప్రస్తా వించింది. ప్రీవాదం ప్రతి అస్తిత్వాన్నీ గుర్తిస్తుంది. వర్గం, కులం, లింగం, జాతి, మత అస్తిత్వాలన్నిటిని గుర్తించి, సామాజిక మార్పుకి వీటన్నిటిలో మార్పు రావాలని చెబుతుంది. వర్గ దోపిడి, కుల అణచివేత, లింగ వివక్ష జాతి మత విద్వేషాలు పోగొట్టే క్రమంలో ప్రీవాదం కొత్త దారులు వేస్తుంది. పై వాటిలో ఏదో ఒకటి మాత్రమే ముఖ్యమైనదనో ప్రధాన మైనదనో ప్రీవాదం చెప్పదు. ఈ అణిచివేతలన్నీ ఒకదాని నొకటి బలపరుచుకునే క్రమంలోనే పితృస్వామ్య అధిపత్య సంస్కృతి ఏర్పడుతుందనీ, వర్గం, కులం, లింగం ఒక చిక్కని సంక్లిష్టమైన అల్లికలా యేర్చడి పితృస్వామ్యాన్ని రక్షిస్తుందని చెబుతుంది. వీటిలో ఏ ఒక్కదానినైనా విడదీసి విడిగా అర్ధం చేసుకోవటం కుదరని పని. ఒక దానితో మరొకటి ముడిపడి ఉన్న ఈ అణిచివేతల సంక్షిష్ట స్వరూప స్వభావాలను అర్ధం చేసుకోవటంలోనే స్త్రీవాద సిద్ధాంత ప్రత్యేకత ఉంది. వినోదిని దాని మీద కూడా దృష్టి సారించటం సంతోషించాల్సిన విషయం. చివరిగా వినోదిని స్త్రీవాద కవిత్వం కొన్ని విషయాలలో పురోగమించాల్సే ఉందని తేల్చి చెప్పింది. ఖచ్చితంగా చెప్పింది. అది అందరూ ఆలోచించాల్సిన విషయం. మనం ఏ సంస్కృతిలో పుట్టి పెరుగుతామో దానిని ఎదిరించే క్రమంలో మనకు తెలియకుండానే ఆ సంస్కృతినే వాడుకుంటాం. పితృస్వామ్యం తయారు చేసిన సంస్కృతి వేయి తలల విషనాగు. ఒక తల ఉత్తరించినా యింకొక తలతో బుసకొదుతుంది. దాని స్వరూపాన్ని అర్థం చేసుకుని పోరాడటానికి మరింత కృషి చేయాలి. తిరిగి ఆ పితృస్వామ్య ప్రతిరూప ప్రతి ఘటనలనే తయారు చేస్తే ప్రయోజనం శూన్యం. అది కవిత్వంలోనైనా, ఉద్యమాలలోనైనా. దళిత, ముస్లిం మైనారిటీ ప్రీలు మరిత ఎక్కువగా రాయాల్సిన అవసరాన్ని వినోదిని నొక్కి చెప్పింది. అణచివేతకు గురైన కమ్యూనిటీల నుంచి ప్రతిఘటనా స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అది సంతోషించవలసిన విషయం. ఇప్పుడున్న సాహితీ, సామాజిక వాతావరణంలో వినోదిని చేసిన ఈ పరిశోధన దళిత, ముస్లిం, స్త్రీవాద కవయిత్రులకు స్ఫూర్తినిస్తుందనీ, వారి కవిత్వాన్ని అద్ధం చేసుకునే మార్గాలను పాఠకులకు అందిస్తుందనీ ఆశిస్తున్నాను. దా॥ ఎమ్‌.ఎమ్‌. వినోదని, పి. హెచ్‌.డి. సిద్ధాంత (గ్రంధానికి ముందుమాట సంకలిత - ఓల్లా * 143

ప

22

సింగమనేని కథలు - జండర్‌ స్పృహ

అపారమైన జీవితానుభవము, సాహిత్యానుభవమూ ఉన్న రచయిత సింగమనేని నారాయణగారు. మార్కిస్టు దృక్పధంతో సామాజిక మానవ సంబంధాలను విశ్లేషంచగల రచయిత. నిర్దిష్టమైన ప్రాపంచిక దృక్పధంతో నిర్దిష్ట స్థల కాలాల వాస్తవ జీవిత చిత్రణ చేయ గలిగిన కొద్ది మంది రచయితలలో సింగమనేని ఒకరు. రాయలసీమ భౌగోళిక ప్రాంతంలో, సన్నకారు రైతాంగ జీవన్మరణ పోరాటాలను చిత్రించి రాయలసీమ కథకు ఒక స్వరూపాన్ని స్వభావాన్ని సమకూర్చి గుణాత్మకమైన మార్చుని తెచ్చిన రచయితలలో మొదటిగా చెప్పకోవలసిన పేరు సింగమనేని నారాయణ గారిది. మార్క్చిస్టు ప్రాపంచిక దృక్పధాన్ని యాంత్రికంగా అన్వయించే రచయిత కాదీయన. జీవితాన్ని పరిశీలించటంలో ఆయన దృక్పధం ఆయనకొక ప్రత్యేక దృష్టి నిస్తుందే గాని, ఆ దృక్పథమే ఆయన దృష్టిని నిర్దేశించదు. అంటే సమాజంలో, జీవితంలో వస్తున్న కొత్త సమస్యలను, మార్చులను ఆయన యాంత్రికంగా అర్ధం చేసుకుని రాయడు. సృజనాత్మకతను వీడడు.

1995వ సంవత్సరం తర్వాత వచ్చిన స్త్రీవాద భావాలు అనేకమంది మేధావులను, వామపక్ష ప్రగతిశీలురనుకునే వారిని కూడా కలవర పెట్టాయి. కల్లోల పరచాయి. సమాజంలో స్త్రీల స్థానాన్ని స్థాయిని అంచనా వేసేందుకు 80వ దశాబ్దంలో స్త్రీవాదులు అందించిన పరికరాలు ముఖ్యంగా మూడు. స్త్రీల లైంగికత్వం, (శ్రమ, మాతృత్వం. ఈ విషయాల గురించి సృజనాత్మక సాహిత్యం అంతకుముందు చలం, కొ.కు. గోపిచంద్‌వంటి అతి కొద్దిమంది మాత్రమే స్త్రీల పక్షం వహించి రాశారు. 80వ దశాబ్దంలో రచయిత్రులు ఈ అంశాల గురించి విరివిగా రాయటం ప్రారంభించారు. ఆకాలంలో ఈ విషయాల గురించి చిత్తశుద్దితో, సహానుభూతితో ఆలోచించి అర్ధం చేసుకుని కథలు రాసిన రచయితగా సింగమనేనిగారిని చెప్పుకోవచ్చు.

సంకలిత - ఓల్లా * 144

మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీలు పడే హింసను, వరకట్నమనే దుర్మార్గానికి తల ఒగ్గాల్సిన స్థితిలో ఉన్న ్రీలను, కొత్త సామాజిక నేపథ్యంలో ధైర్య సాహసాలతో, వివేకంతో ఎదుగుతున్న స్త్రీలను సింగమనేని ఒక పిత్రువాత్సల్యంతో, మిత్ర సాన్నిహిత్యంతో తన కథలలో పాత్రలుగా మలిచారు. భర్త అనే పాత్రలోకి ప్రవేశించగానే, భార్య మిద పెత్తనం చేతికి చిక్కగానే, మానవత్వాన్ని మరిచిపోయే పురుష పుంగవుల చెంపల మాద ఛెళ్ళుమని కొట్టిన దెబ్బగా “జవాబు” కథను చెప్పకోవచ్చు. చిన్న కథ. శక్తివంతమైన కథ. కథా లక్షణాలన్నిటిని పుణికి పుచ్చుకున్న కథ. ముగింపు వాక్యంతో మర్చిపోలేకుండా మనసుల్లో నిలబడే కథ. భార్యలు అను నిత్యం తమ యోగక్షేమాల గురించే ఆలోచస్తారనే ఇంగిత జ్ఞానం లేని భర్తలందరికీ ప్రతినిధి ఈ కథలోని గంగాధరం. భార్య పిల్లవాడిని కొట్టింది. పిల్లవాడు తల్లి మిద ఫిర్యాదు చేశాడు. వంశాంకురానికి తగిలిన దెబ్బకు కోపగించి భార్యను తిట్టి కొట్టినపుడు భార్య తను కొడుకును కొట్టిన కారణం చెప్పింది. భర్తకని ఉంచిన కాఫీ ఆ పిల్లవాడు తాగేశాడు. అక్కడితో కథ ముగుస్తుంది. భర్తల దౌష్టాన్ని గురించిన ఆలోచన పాఠకుల మనసులలో మొదలవుతుంది. తల్లిగా పిల్లలను పెంచి పోషించే ప్రీకి అవసరమైనపుడు దండించే స్వేచ్చ ఉందని అనుకుంటాం. ఉండొచ్చు. కానీ అది భర్తలు అనుమతిస్తేనే! పురుషుల కంట్రోలు, ప్రీలు కుటుంబ జీవితంలో చేసే ప్రతి పనిమోదా పరుచుకుని ఉంటుంది. ఆ కంట్రోలు ఎవరు ఎప్పుడు ఎలా ఆపరేట్‌ చేస్తారనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత నేపథ్యాల మీదా, సంస్కారం మదా ఆధారపడి ఉంటుంది. కంట్రోలు మాత్రం పిత్రుస్వామ్యం పురుషుల హస్తగతం చేసింది. కారణం ఏదైనా, జవాబు ఏదైనా డ్రీలపై హింస, 'జవాబు' కథలోలా జరుగుతూనే ఉంటుంది.

కొత్తతరం ప్రీలను పరిచయం చేసే కథలను రాయటంలో సింగమనేని నారాయణ గారికి ఉత్సాహం ఎక్కువ. “నీకు నాకు మధ్య నిశీధి 'వాసంత తుషారం' 'ఒక అసందర్భం” “ఇంటింటి కథ' “నిషిద్ధం ఈ కథలలో ఈ కాలపు అమ్మాయిలు ఆత్మ విశ్వాసంతో హుందాగా ప్రవర్తిస్తారు. తమ జీవితాల గురించి తాము ఆలోచించుకునే అమ్మాయిలు, తమ జీవితాల గురించి తామే నిర్ణయాలు తీసుకునే అమ్మాయిలు, తమ జీవితాలను మార్చుకోవాలని ఉత్సాహంతో, ధైర్యంతో కదిలే అమ్మాయిలు పాత్రలుగా సింగమనేని చక్కని కథలు రాశారు. “నీకు నాకు మధ్య నిశీధి కథలో సుధ మెడిసిన్‌ చదవటం మాత్రమే కాదు. చాలా వివేకవంతురాలు. స్నేహశీలి. ధైర్యం చొరవ గల యువతి. ఈ లక్షణాలన్నీ ప్రేమాస్పదమైనవే. వీటిని చూసిన సురేంద్ర ఆమెను ప్రేమిస్తాడు. ప్రేమను తెలియ చేస్తాడు. ఒప్పుకొటానికి సుధకి ఏ అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ సురేంద్రకు చిన్న పరీక్ష పెట్టింది. తమ పెళ్ళికి అడ్డుగా నిలవగల కులం, డబ్బు అనే రెండింటిని గుర్తు చేసింది. సురేంద్ర మంచివాడే గానీ

సంకలిత - ఓల్లా * 145

పిరికివాడు. వీటిని మనిద్దరం కలిసి అధిగమించగలం అనే ధైర్యశాలి కాదు. తన 'ప్రేమాలాపనలకు క్షమించమని అడిగి ముఖం చూపించకుండా వెళ్ళిపోయేంత బలహీనుడు. సుధకు అలాంటి బలహీనుడు అవసరం లేదు. తనతో పాటు నడిచే సాహసి కావాలి. అందుకే ఆమె సురేంద్ర క్షమాపణకు బిగ్గరగా నవ్వుకుంది. ఆ నవ్వుతో కథ ముగుస్తుంది. కానీ మారుతున్న కాలంలో ఆధునిక స్త్రీలను సహచరులుగా పొందాలంటే పురుషులకు కావలసిన అర్హతల గురించి పాఠకులలో ఆలోచనలు మొదలవుతాయి. ఆలోచింప చేసే మంచి ఆధునిక కథ 'నీకు నాకు మధ్య నిశీధి. పది కాలాల పాటు గుర్తుండిపోయే పాత్ర డాక్టర్‌ సుధారాణి. 'వాసంత తుషారం'లో ఇద్దరమ్మాయిలు పెళ్ళిచూపుల తతంగాన్ని తల్లకిందులు చేస్తారు. పెళ్ళి కూతురూ, ఆమె స్నేహితురాలు కలిసి పెళ్ళి కొడుకు ఇంటికి వచ్చి పెళ్ళి కొడుకునీ, అతని కుటుంబాన్నీ ప్రత్యక్షంగా చూస్తారు. అది ముందు మామగారికి ఆశ్వర్యాగ్రహాలు కలిగించినా చివరకు అత్తగారు, పెళ్ళి కొడుకు సానుకూలంగా స్పందించటంతో సుభాంతమవుతుంది. ఇది చిన్న చొరవ. కానీ పెద్ద చర్య. తాము జీవితాంతం కలిసి బతకాల్సిన మనిషి నేపథ్యాన్ని తాము ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలనే చైతన్యం రావటం చాలా పెద్ద విషయం. తన గురించి తను బాధ్యత వహించటం. తన జీవితాన్ని మరెవరి ఆలోచనలకో వదలని బాధ్యత తనకుండటమే స్వేచ్చ. ఇంత పెద్ద విషయాన్ని సరదాగా, తేలికగా, ఒప్పించే విధంగా రాయటం నారాయణ గారి నేర్పరితనం. “ఒక అసందర్భంలో' కథానాయిక దాదాపు మనకు కనిపించదు. కథంతా ఆమె తండ్రి అవివేకం మీదుగానే నడుస్తుంది. పది లక్షల కట్నం ఇచ్చి, కూతురు చేత బంగారంలాంటి ఉద్యోగాన్ని మాన్పించి, పెళ్ళి నిర్ణయించిన తండ్రి. లోకంలో ఇలాంటి తండ్రులు అసంఖ్యాకంగా ఉన్నారు కానీ లావణ్యలాంటి అమ్మాయిలు మాత్రం వేళ్ళమిద లెక్కబెట్టగలిగినంతమంది మాత్రమే ఉన్నారు. తండ్రి చేసిన ఆ అవివేకమైన నిర్ణయాన్ని తిరస్కరించి నిశ్చితార్ధం రోజు అదృశ్యమై అపాయాన్నించి తప్పించుకుంటుంది. ఇక్కడ కూడా తన పట్ల తన బాధ్యతను గుర్తించటమే లావణ్య చేసింది. స్రీలు చేయవలసింది కూడా అదే. తమ జీవితాలను గుడ్డిగా తండ్రుల చేతిలోనో, భర్తల చేతిలోనో పెట్టకుండా నిర్ణయాలు తామే తీసుకోవటం. నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుచేయటం. ఈ సమాజంలో ఇది అంత సులువైనపని కాదు. అందుకే లావణ్యపాత్ర కథ చివరలో ఉత్తరం రూపంలో ప్రత్యక్షమైనా ఎంతో కాలం పాఠకులకు గుర్తుండి పోతుంది. (ప్రమాదాన్ని ఎంత బాగా పసిగట్టింది, ఎంత ముందుచూపుతో అపాయాన్నించి తప్పించుకుంది అనుకుంటాం. అలాంటి అమ్మాయిలు తారసపడితే చిన్నచూపు చూడకుండా, గౌరవించి. అభినందించగల సంస్మారాన్నిచ్చే కథ 'ఒక అసందర్భం. సంకలిత - ఓల్గా * 146

“నిషిద్ధం కథలో మమత సంస్మారరీత్యా మరింత పరిజెతి చెందిన పాత్ర. ఇంటి చాకిరి గురించి రెండు మంచి కథలు రాశారు సింగమనేని. ఇంటి చాకిరికి విలువ లేదు. ఇంటి చాకిరి చేయటం వల్ల స్రీలకు విలువ లేదు. ఇప్పటికీ కొద్ది మార్పులతో ఇంటి చాకిరి గురించిన భావన మారకుండా ఇలాగే ఉంది. ప్రీవాదులు ఇంటీ చాకిరిని శఛమగా గుర్తించాలనే లక్ష్యంతో ఎంతో సిద్ధాంత చర్చ చేశారు. చేస్తున్నారు. ఎన్నో ప్రతిపాదనలు చేశారు. చేస్తున్నారు. ఇంటి చాకిరిని ఛ్రమగా గుర్తించినపుడు దానికి ఒక విలువ ఉన్నపుడు, మగవాళ్ళు కూడా ఆ పనులు చేయటానికి సంకోచించరు. దానివల్ల స్రీలు మోస్తున్న భారం తగ్గుతుంది. ఇది సమాజంలో ఫ్రీ పురుషు లిద్దరికీ అర్ధం కావాల్సిన విషయం. ఈ విషయాన్ని తనదైన సరళత్వంతో, స్పష్టతతో కథలుగా రాశారు సింగమనేని. “ఇంటింటి కథి “శ్రమైక జీవనం” “తరగతి గదిలో తల్లి ఈ మూడు కథలు ఇంటిచాకిరి స్ర్తీల మిద వేసే అదనపు భారాన్నీ పురుషులు ఆ పనులను పంచుకోవాల్సిన అవసరాన్నీ చాలా సానుకులంగా, కన్విన్సింగ్‌గా చెప్పిన కథలు. పాఠ్యాంశాలన్నీ స్త్రీ పురుష వివక్షను అసమానతనూ పెంచేవిగా ఉన్న పరిస్థితులున్నప్పుడు దానిని చక్కదిద్ద గలిగినది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు జందర్‌కి సంబంధించిన సెన్సిటివ్‌నెస్‌తో ఉంటే, భవిష్యత్‌ తరమైనా అసమానతలకు దూరం కాగలదనే ఆశను కలిగించే కథ “తరగతి గదిలో తల్లి. మాతృత్వాన్ని ఊరికే గొప్ప చేయటం తప్ప మోసే భారాన్ని అర్థం చేసుకోని వారికి కనువిప్పు కలిగించే కథ. 'ఇంటింటి కథ. చాలా వివరంగా ఇంటీ చాకిరి ప్రీలను శారీరకంగా మానసికంగా

ఎలా కుంగదీస్తుందో కళ్ళకు కట్టిస్తుంది. దానినుంచి బైటపడాలనే ఆలోచననూ

కలిగిస్తుంది.

(స్త్రీల చైతన్యంతో రగిలే దశాబ్దంలో కొన్ని కథలే అయినా కీలకమైన అంశాల గురించి

మంచి సాహసులైన పాత్రలను సృష్టించి కథలు రాయటంతో తన మార్చిస్టు దృక్పధాన్ని విశాలం చేసుకున్న సృజనాత్మక రచయితగా నిలిచారు సింగమనేని నారాయణ గారు.

ఇంత ప్రత్యక్షంగా కాకపోయినా 'హింసి కథలో సొవిత్రివలే అనేక రైతు కుటుంబాల

లోని ప్రీలు పడే బాధలు సింగమనేని దృష్టిని దాటి పోలేదు. సమాజంలో స్త్రీల పట్ల

రావలసిన సంస్కార దృష్టిని పరిచయం చేసిన రచయితగా సింగమనేని గారు

గుర్తుంటారు.

సింగమనేని నారాయణ గారికి అప్పాజోస్యుల, విష్ణుభొట్ల అవార్డు వచ్చిన సందర్భంగా... సంకలిత - ఓల్గా * 147

వాట 23 దాశరథి వెన్నెల పాటలు దాశరథి పేరు వినగానే తెలంగాణ వీణ మోగుతుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం మృదంగ నాదంతో మారుమోగుతుంది. కరకు రక్కసి నిజాం పాలనను ఎదిరించి నిలిచిన త్రివిక్రముడు దాశరథి మన కనుల ముందు ప్రత్యక్షమవుతాడు. జైళ్ళు, తుపాకీ గుళ్ళూ లక్ష్యపెట్టక రాచరికాన్ని సవాల్‌ చేసిన ఉక్కుమనిషి అనిపిస్తాడు. ఐతే ఆ ఉక్కుమనిషి హృదయమెంత సున్నితమో, సుకుమారమో, సౌందర్య భరితమో తెలుసుకున్నపుడు మనకు ఆశ్యర్యం కలుగుతుంది. ఆ సున్నితత్వాన్నంతా ఒకచోట రాశిగా పోస్తే ఎంత అపురూపంగా ఉంటుందో దాశరథి రాసిన వెన్నెల పాటలన్నిటినీ ఒక్కసారిగా వింటే, తలచుకుంటే అలాగే ఉంటుంది. కె. ప్రభాకర్‌ సంకలనం చేసిన దాశరథి సినిమా పాటల పుస్తకంలోని 124 గీతాలలో మెజారిటీ గీతాలు వెన్నెల పాటలు. వెన్నెల కురిపించే పాటలు. వెన్నెల సిరి ఒలికించే పాటలు. వెన్నెల మిద ఒక కవి ఇన్ని పాటలు రాయటం కూడా అరుదేనేమో. దాశరథికి వెన్నెలంటే ప్రాణమని తెలుస్తుంది. “వాగ్దానం” సినిమాలో నాయికా నాయకులు అపార్జాల మబ్బులు తొలగిపోగానే పాడుకునే పాటలోని చరణం వినగానే మనసంతా హాయిగా అవటమే కాదు మనం నాయికా నాయకుల అనుభూతితో తాదాత్యం చెందుతాం. సినిమా పాటల ప్రయోజనమే అది. ఆ విషయాన్ని తన మొదటి పాటలోనే అర్ధం చేసుకున్న దాశరథి. “ఈ నాటి పున్నమి ఏనాటి పున్నెమో జాబిలి విరిసేను మనకోసమే” అంటూ ఆ జావీినిని అంతటితో ఒదలకుందా సంకలిత - ఓల్లా * 148

“ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా” అంటాడు. వెన్నెల స్నానం అంటే దాశరథికి ఎంత ప్రియమంటే ఈ భావాన్ని ఇంకో రెండు మూడు పాటల్లో భిన్న రీతుల్లో పలికించాడు. 1969లో రాసిన “ఆత్మీయులు” సినిమాలోని మంచిపాట “మదిలో వీణలు [మోగేలో వలపు చేత వెన్నెల స్నానాలు చేయించాడు “సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది. పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది" ఎంత అందమైన కల్పన, అనుకుంటే ఈ వెన్నెల స్నానాన్ని ఇలా సూటిగా కాకుండా మరింత రమణీయమైన ఊహగా చెప్తాడు. బృందావనాన్ని మన కళ్ళముందు ప్రత్యక్షం చేయిస్తూ “అందాల కన్నయ్య కనిపించగానే బృందావనమ్మల్ల పులకించిపోయె యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే” నెలరాజు నవ్వితే విరిసేది వెన్నెలేగా! రాధమ్మ చేసిన ఆ యమునా నదీ తీరపు వెన్నెల స్నానానుభూతిని పాటవినే ప్రతి శ్రోతకూ అందించగల అతి భావకుదైన 'కవి దాశరథి" దాశరధి వెన్నెల కురవటం తప్ప మరోలా భావించలేడు. వెన్నెల వర్షంలా కురవాల్సిందే -మనమంతా తడవాల్సిందే - ్రతి వెన్నెల వానా ఒక ్రత్యేకమైనదే- రంగుల రాట్నం సినిమాలో భక్తి గీతంలో ఎలా వెన్నెల కురిపించాడో చూడండి. “ప్రత్రిదేవు ఒడిలోని మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ ఇంకో భక్తి గీతం “అమాయకురాలు”లో ఎలా వెన్నెల వర్షాన్ని దృశ్యమానం చేశాడో చూడండి. “షాన్నలు పూసే బృందావనిలో వెన్నెల కురిసే యమునా తటిపై” రంగుల రాట్నంలో రెండు సందర్భాలూ వేరు వేరు - ఒకటి తన ప్రియుని దైవంగా భావించుకునే ముగ్ధ పాడే పాట. రెండవది తన హృదయంలోని వేదననంతా తను

నమ్మిన దైవానికై నివేదించుకునే ఆర్తి గీతం. కానీ రెండింటిలోనూ వెన్నెల కురిసింది. భిన్నంగా, చల్లగా, మధురంగా, మెల్లగా, మాననీయంగా. బృందావనంలోని వెన్నెలే రంగుల రాట్నంలోనూ, అమాయికురాలులోనూ కలిగించే అనుభూతి ఒకటే కానీ రెండు పాటలలో ఎంతో వైవిధ్యం. ఒకే దృశ్యాన్ని చిత్రిస్తూ అనుభూతిని కలిగిస్తూ - అలా చేశాడనే ఆలోచన మనకు కలగనీయకుండా చేయటంలో దాశరథి గారి కవితా మాంత్రికత ఉంది. ఇంకోచోట ప్రేయసీ ప్రియుల మిద నేరుగా వెన్నెల కురిపిస్తారు.

“పానుపు మురిసింది మన జంట చూసి

వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి” (ప్రేమ లేని హృదయాలలో కూడా వెన్నెల కురిపించే పద చిత్రాలివి. 'ప్రతిపాటలోనూ చందమామనూ, వెన్నెలను ప్రస్తావించి మనసులకు ఆహ్లాదం కలిగించే ఉత్సుకత ఉంది దాశరథికి అనిపిస్తుంది. ఇద్దరు మిత్రులు చిత్రంలో 'ఖుష్కీ ఖుషీగా నవ్వుతూ” అనే పాట వాళ్ళ జీవితాల్లో సంతోషం సంబరం చెప్పుకుంటూ సాగుతుంది. తన స్పేహితురాలు భర్త దగ్గరకు మేనాలో వెళ్ళిందని ఆమె సంతోష పడితే సరే నువ్వు ఓ పెళ్ళి పల్లకీ చుసుకోమని అతను మేలమాడతాడు. సరదాగా ఒకరినొకరు బనాయించుకుంటూ సాగే ఆ పాటను మేనా కుదుపులు, పల్లకీ బోయీల అరుపుల నుంచి ఒక్కసారి గగనవీధుల్లోకి దూసుకుపోయేలా చేస్తాడు. ఇంద్రధనస్సు, మేఘాల రథమూ వచ్చేస్తాయి పాటలోకి. అక్కడి వరకూ వచ్చాక వాళ్ళిద్దరూ ఇక వాళ్ళిద్దరిలా ఎలా ఉంటారు?

“చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా” అంటూ ఆ పాటను ఎక్కడికో తీసుకువెళ్లారు - నేల మిద మొదలైన పాట నింగిలోకి ప్రయాణించి శోతల మనస్సుల్లో వెన్నెల నింపుతుంది. చదువుకున్న అమ్మాయిల్లో చాలా మంచిపాట “వినిపించని రాగాలే కనిపించని అందాలే” పాటలో కూడా అంతే - పూల తోటను వసంత కాలంలో చల్లని గాలిలో వర్ణిస్తాడు ముందు చరణంలో. తర్వాత చరణంలో ఆ పూలను వెన్నెలతో ఎంత చక్కగా కలుపుతాడో చూస్తే ఆశ్యర్యనిపిస్తుంది. “విరితేనెల వెన్నెలలో” అంటాడు. పువ్వలు, మకరందం కలిసి వెన్నెలయిన భావన, పూల మోద వెన్నెల తేనె కురిసిందా

  • తేనెలాంటి వెన్నెలలో పూలు విరిసాయా? ఎలాగైనా చెప్పుకోవచ్చు - ఇంతా చేసి

సంకలిత - ఓల్గా * 150

విరహిణి అయిన కథా నాయిక 'ఆ విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే' అంటూ మధురమైన బాధను వ్యక్తీకరిస్తుంది. దాంతో ఆ విరితేనెల వెన్నెలలో మాధుర్యం విరహ వ్యధతో కలిసి మరింత దుర్భర మధురమవుతుంది. గొప్పపాట, కీట్స్‌ రాసిన 916254 [61041ట ని వినిపించే గొప్ప పాట వినిపించని రాగాలే. *ఏ దివిలో విరిసిన పారిజాతమో' పాటలో ఒకే ఒక పాదంలో వెన్నెల ప్రస్తావన ఉంటుంది.

“నీ రూపమే దివ్య దీపమై

నీ నవ్వులే నవ్వతారలై

నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే” కానీ ఆ పాటంతా వెన్నెల కురుస్తున్నట్లుగానే ఉంటుంది. వెన్నెల మహిమ అధ్భుతంగా తెప్పించాడు వేరే పదాలతో. “సిరిమల్లె సొగసు - జాబిల్లి వెలుగు” అనే రెండు పద చిత్రాలతో అద్భుతమైన వెన్నెల రాత్రిలో, ఆ కాంతిలో విరబూసిన తెల్లని మల్లెల దగ్గరకు మనల్ని తీసుకెళ్ళి ఆ పరిమళాన్ని ఆస్వాదించేలా చేస్తాడు. శ్రేయసిని జాబిలితో వెన్నెలతో పోల్చటం అందరు కవులూ చేస్తారు. సినిమా పాటలలో తప్పకుండా ఆ పోలికే ఉంటుంది. ఎందుకంటే అతి సామాన్యులకు, పామరులకు కూడా ఆ పోలిక ఆర్థమవుతుంది. వాళ్ళు ఆనందిస్తారు. ఐతే దాశరథి కేవలం ముఖ సౌందర్యాన్ని వర్ణించటానికి మాత్రమే జాబిలిని పాటలోకి 'తీసుకురాడు. జాబిలిలాంటి ఆమె లేదా అతను ఇవతలి వ్యక్తి జీవితంలోకి ఏదో ఒక మార్పు కాంతివంతమైన మార్పు తీసుకోచ్చినపుడే ఆ పోలికకు సార్ధకత. అలాంటి సార్ధకతను తన పాటలలో సమకూర్చగల నేర్పరి దాశరథి. “చిక్కని చీకటిలోన అతి చక్కటి జాబిలి నీవే అన్నా “వెన్నెల లేని నా జీవితాన పున్నమి విరిసిందిలే” అన్నా అక్కడ ఒక కథ మనకు తెలుస్తుంది. “ఏ మచ్చలేని జాబిల్లివే” అని అన్నపుడు “వెన్నెలలో విందు చేయి పున్నమి చంద్రుడవు నీవు” అన్నపుడు వారి బాహ్య సౌందర్యమే కాక అంతరంగ సౌందర్యమూ మనకు అవగతమవుతోంది. సినిమా పాట బహుళ ప్రమోజనాన్ని సాధించాలి. ఆ సాధనలో ఆరితేరిన కవి దాశరథి. “నీ వెన్నెల మోములో ఈ విషాదమెందుకో” అని అన్నా “ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు నీ మనుగడలో నిండాలమ్మా”

సంకలిత - ఓల్లా * 151

అని ఆశీర్వదించినా ఆ పాత్ర స్వభావాలలో ఉండే వెన్నెల చల్లదనమే కవి కలంలోంచి వస్తుంది. మంచి మనసులున్న పాత్రలకు, హృదయం నిండా (ప్రేమ పొంగి పొర్లుతున్న పాత్రలకు వెన్నెల, జాబిలి కంటే మంచి సంకేతం ఏముంటుంది. సందర్భాన్ని బట్టి ఆ వెన్నెల, జాబిలి ఉపమానం కావచ్చు రూపకం కావచ్చు, ఉ్రేక్ష కావచ్చు, అతిశయోక్తీ కావచ్చు, స్వభావోక్తీ కావోచ్చు. అలంకారాన్ని తగినట్లు అలంకరిస్తేనే పాత్రకు, పాటకు అందం వస్తుంది. అ విద్యలో నిపుణుడైన కవి దాశరథి. అతి సున్నితమైన భావాలలో, పదాలతో, పదచిత్రాలలో వెన్నెలను దాశరథి ప్రకాశింపజేసిన తీరు ఎంత సుందరమో చూడండి.

“నీ నవ్వు వెన్నెలందు నే కరగిపోవుచుందు

“మత్తు గొలుపు తెలి వెన్నెలతో”

“ధిండ్రు చందమామ ఆనందసీమ”

“అందములొలికే మోమును జూచి

జాబిల్లి సిగ్లిల్లి నీలాల దాగెనె”

“జాబిలి నీ కోసం జగతికి వాలినది”

“విరిసిన వెన్నెలవో - చెలి చెలీ నీ వెవరో”

శ్విగల్రో గల జాబిల్లి చిరునగవులు చిందగా”

“నీ చూపుల వెన్నెలలో నిదురపోవు కలువను నేనే”

“వెన్నెల్లు విరబూసె పున్నమి నడిరేయి”

“జాబిల్లి వచ్చాడె పిల్లా నిన్నెంతో మెచ్చాడె”

“కన్నులలో వెన్నైలగా నిను దాచేను”

“వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేసేవు”

“అందని జాబిలి పొందులో అందాలు పొందాను అనాడు”

“వెన్నెలంతా ఎగిరివచ్చి ముఖముపై నిలిచిందిలే”

“తారా జాబిలి ఒకటై సరసమాడె ఆ రేయి” ఇలా తన గీతాలను వెన్నెల బయళ్ళు చేశాడు దాశరథి. అచ్చమైన శృంగార గీతంగా సాగే పాటలో (ప్రేమించిచూడు)

“వెన్నెలరేయి ఎంతో చలిచలి

వెచ్చని దానా రావె నా చెల అని నాయకుడంటే

“చల్లని జాబిలి నవ్వెను మరీ మరి

అల్లరి వాడా నీదే ఈ చెలి” అనే ఆమె సమాధానంలో వెన్నెల, జాబిలి, ఒక కౌగిలిలో ఒదిగిన అనుభూతి శ్రోతలకు కలుగుతుంది. ఒక తాత్తిక భావన చెప్పటానికి కూడా వెన్నెలను దాశరథి చాలా అందంగా ఉపయోగించుకున్నాడు. “మూగమనసులు” సినిమాలో అల్లరిపిల్ల గౌరి “గోదారి గట్టుంది గట్టుమోద సెట్టుంది” అని చిలిపిగా పాడుతూనే జీవిత ప్రాధాన్యాలను తెలిపే గంభీర భావనను మనముందు పెడుతుంది.

“ఎన్నెల ఉంది ఎండ ఉంది

పూవు ఉంది ముల్లుంది

ఏది ఎవ్వరికి ఇవ్వాలో

ఇదమరిసే ఆ ఇది ఉంది” అది గౌరి పాత్రను మొదటిసారి ప్రేక్షకులకు పరిచయం చేసే గీత సన్నీవేశం. గౌరి అల్లరిగా కనిపించే లోతైన మనిషి పకపక నవ్వుతూ ఎదుటి వారి ప్రవర్తన శృతిమించితే పళ్ళూడగొట్టే వ్యక్తిత్యం. ఆ స్వభావాన్నంతా ఈ పాటలో ముఖ్యంగా ఈ చివరి చరణంలో ఇమిడ్చారు దాశరథి. గౌరి మనస్తత్వం లాంటిదే ఈ చరణం కూడా. వెన్నెలను ఇలా కూడా వాడుకోవచ్చా అనిపించే ప్రయోగం. దాశరథి గారంటే వెన్నెల, ఎండ, పువ్వు, ముల్లు ప్రజలకి, నిజాం నవాబుకి. సినిమా పాటల శోతలకు మాత్రం ఆయన గితాలు నిండు చందమామలు, ఏ మచ్చలేని జాబిల్లులు. కురిసే వెన్నెల వానలో తడిసే వెన్నెల స్నానాలు.

లో హన వాతా;

24 ఇసరున్నీసా' రహమతుల్లా మంచి కవి. కథకుడు. “బా” కథల సంపుటితో “బా రహమతుల్లా అయ్యాడు. తన కథ తన ఇంటిపేరు కావటం, లేదా తనను గుర్తుపట్టించే అస్తిత్వ నామధేయం కావటం కంటే రచయితలకు కావలసిందే ముంటుంది. బా రహమతుల్లా రాసిన 'మా' కథల సంపుటంలో హృదయాన్ని కదిలించి మెదడుని చిన్న కథగా రాశాడు. ఒక నవలగా రాయదగినంత విషయం వుంది కథలో. ఎన్ని జీవితాలో, ఎన్నిపాత్రలో ప్రవేశించవచ్చు ఈ కథలో.కానీ రహమతుల్లా రెండు పాత్రలే తీసుకున్నాడు. కైసరున్నీసా, బాషా. మిగిలిన పాత్రలు అసలు లేవని కాదు. అవన్నీ నేపథ్యంలో, లాంగ్‌షాట్‌లో దృశ్యాల్లా వుంటాయి. వీళ్ళిద్దరూ క్లోజప్‌లో మనకు కనిపిస్తారు. ఈ రెండు పాత్రలలో - అందులోనూ కైసరున్నీసాలో మనకు వర్తమాన చారిత్రక విషాదాన్ని వినిపిస్తాడు. ఆమె ముఖంలో దానిని కనిపింపచేస్తాడు.

1992 డిసెంబర్‌ 6 తర్వాత భారతదేశం మారిపోయింది. విశ్వాసాలు అవిశ్వాసా లున్నాయి. సంశయాలు వాస్తవాలయ్యాయి. నమ్మకాలు వమ్మయ్యాయి. ముస్లిం మైనారిటీల మనసుల్లో ఎడతెగని ఆందోళన ప్రవేశించింది. భారతీయులమనే నమ్మకంతో జీవిస్తున్న వారి మనసులో సందేహాలు మొదలయ్యాయి. మనం భారతీయుల మనుకుంటున్నాం గానీ భారతదేశం, మెజారిటీ భారతదేశం మనల్ని ఏమనుకుంటోంది అనే ప్రశ్న వారిలో చిన్నగా రాజుకుని గుజరాత్‌ మారణకాండతో అది పెద్ద జ్వాల అయింది. అది కైసరున్నిసా బేగం కథా సందర్భం. కైసరున్నీసాబేగం గుజరాత్‌ నరమేధంలో

సంకలిత - ఓల్లా * 154

బలి అయిన కుటుంబానికి చెందింది.ఆమె కుటుంబాన్నంతటినీ చంపారు. పదిమంది మగమృగాలు ఆమెమీద అత్యాచారం చేసి చచ్చిందనుకుని ఒదిలేశారు. చచ్చినా బాగుండేదనుకుంటూ కైసరున్నీసా బతికింది. బాధితుల శిబిరాలలో సేవచేసేందుకు వచ్చిన భాషాతో ఆమెకు పరిచయమైంది. బాషా ఆమెకు సేవచేశాడు. ఆమెను ప్రేమించాడు. కానీ కైసరున్నీసా మానసికస్థితి అప్పటిలో ఆ (ప్రేమను అంగీకరించేలా లేదు. ఏడేళ్ళు గడిచాయి. కైసరున్నీసా కాస్త తేరుకుంది. బొంబాయి వచ్చి సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. బాషా సంగతి మనసులో ఓ మూల మెదులుతూనే వుంది. తనలాంటి కార్యకర్తల సమావేశానికి హైదరాబాదు వచ్చిన కైసరున్నీసా అనుకోకుండా బాషాను కలిసింది. కాలం మానిన గాయాలు. మళ్ళీ కాస్త సున్నితమైన హృదయం. తనకోసం పెళ్ళి చేసుకోకుండా బాషా ఉన్నాడనే తలపు. ఇద్దరూ కలిసి బొంబాయిలో సామాజిక కార్యకర్తలుగా బతుకుదామనుకున్నారు. ఎన్నో ఆశలతో బొంబాయి రైలెక్కారు. రైలు బొంబాయి చేరిందో లేదో టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు బాషా. కైసరున్నీసా హిందూత్వ టెర్రరిస్టుల చేతిలో చచ్చినంతపనైంది. చావుకంటే ఎక్కువే అనుభవించింది. బాషా ముస్లిం టెర్రరిస్టుల చేతిలో మరణించాడు. ఇంక “ఆశ ఎక్కడుంది? ఎవరు తనవారు? ఎవరు పరాయివారు? ఎవరిని విశ్వసించాలి? ఒక నమ్మకం అపనమ్మకమైతే ఎలాగో ఇంకో నమ్మకాన్ని పట్టుకుందామని పెనుగులాడవచ్చు. కానీ అసలు నమ్మకమనేదే లేనప్పుడు సామాన్యుల సంగతేమిటి? ఏ ఆధారమూ లేక గాలిలో ఎంతకాలం వేలాడతారు. జీవితం మీద ఎలా ఆశపెంచుకుంటారు? ఏ కలకంటారు? అలాంటి స్థితిలోకి నెట్టబడ్డారు భారతీయ ముస్లిం ప్రజలు.

ఈ కథని ఒక ముస్తింగా రాయటానికి చాలా సాహసం కావాలి. హిందూత్వ వుగ్రవాదం గురించి చాలా కథలొచ్చాయి. కానీ ముస్లిం ఉగ్రవాదం గురించి ప్రస్తావించిన కథలు రాసిన ముస్లిం రచయితలు అరుదు. రాయాలనే నియమమేమీ లేదు. కానీ ద్వేషం లేకుండా న్యాయం గురించిన ప్రశ్నలను అడగగల రచయిత రాయకుండా వుండలేదు. ఒక దృశ్యం మాత్రమే చూపించి ఊరుకోలేడు. ఒక దృశ్యం చూపించటం కూడా తక్కువ విషయం కాదు. తమమీద మెజారిటీ ప్రజలు ద్వేషంతో, అనుమానంతో వున్నప్పుడు అది అన్యాయమని చెబితే కూడా సహించలేనంత అసహనంతో, విద్వేషంతో వున్నప్పుడు దానిని గురించి మాట్లాడటం, రాయటం కూడా సాహసమే. ఈ కథలో

సంకలిత - ఓల్లా * 155

కైసరున్నీసా బొంబాయిలో కార్యకర్తగా పనిచేస్తూ హైదరాబాద్‌ వస్తుంది. అప్పుడామెకి ఒక ఫోన్‌కాల్‌ వస్తుంది. '“ఒసేయ్‌.... నీకింకా బుద్ది రాలేదే. ఐనా మీకు బుద్ది వస్తుందని అనుకోవటం మా పొరపాటు... అహమ్మదాబాదును వెలగబెట్టడం అయిందా? భాగ్యనగర్‌ వేంచేశావ్‌. ఒసేయ్‌ దొంగ.... నీకిదే చివరి వార్నింగ్‌... ఇంకో మీటింగ్‌లో మాట్లాడావంటే అదే నీ చివరి ప్రసంగమౌతుంది.... బీకేర్‌పులొ ఈ ద్వేష పూరితమైన ఫోన్‌కాల్‌ ఏం చెబుతుంది. తమకు జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడుతున్న రాస్తున్న ముస్లింలను ఎట్లా హిందూ ఫండమెంటలిస్టులు వెంటాడుతున్నారో, వేటాడుతున్నారో అర్ధమవుతుంది. గుజరాత్‌లో వుండి నోరెత్తే సాహసం చేసిన ముస్లింల జీవనం దుర్భరంగా వుంటుంది. అసలు జీవితమే లేకుండా పోతుంది. కైసరున్నీసా గుజరాత్‌ ఒదిలి బొంబాయి వచ్చింది. కానీ ఆమె మౌనంగా రాలేదు. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తాము గురైన భయానక హింసను ప్రపంచానికి వెల్లడించింది. న్యాయం కోసం అడిగింది. ఆది సాహసమైన పరిస్థితి కావటమంటే దేశానికి అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఆ దౌర్భాగ్యం దేశానికి పట్టింది. కైసరున్నీసాలా న్యాయం కోరినవారూ, న్యాయాన్ని గురించి ప్రశ్నించిన వారూ, రాసినవారూ చంపబడుతున్నారు. వెలివేయ బడుతున్నారు. నిర్భందించబడు తున్నారు. వారిలో రచయితలూ వున్నారు. విపరీతమైన సెన్సార్‌ షిప్‌కు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ఆ దృశ్యాన్ని వాస్తవికంగా చిత్రిస్తున్న రచయితలను వారి నిబద్ధతను గౌరవించాలి. ఐతే ఈ పనిలో కష్టనిష్టారాలనుభవిస్తున్న వారికి ఇంకొక దృశ్యం గురించి రాయటం తేలికకాదు. ఎందుకంటే ఒక కథ రాయటానికే వారి శక్తంతా పెట్టవలసి వస్తుంది. రెండవ కథ రాయమని వారిని అడగటం కూడా అన్యాయమేమో అనిపిస్తుంది. కానీ రెండు కథలనూ రాయగల నిబ్బరం వున్న రచయితలను నునం గౌరవించి కాపాడు కోవాలి. తీవ్రవాదం ఎటునుంచి వచ్చినా అది బలిగొనేది మానవత్వాన్ని. మనిషిలో పగ, ద్వేషం తప్ప మరింకే విచక్షణను మిగల్బని తీవ్రవాదం ఏ రూపంలో వున్నా ఏపేరుతో వున్నా అది మానవులకు వినాశనాన్నే మిగులుస్తుంది. ఆ ఆలోచనతో ఈ కథ రాసినందుకు రహమతుల్లాను అభినందించాలి. సంకలిత - ఓల్లా * 156

గుజరాత్‌ నరమేధం జరిగాక తెలుగు రచయితలు, రచయిత్రులు అహమ్మదాబాద్‌లోనూ, పరిసర గ్రామాలలోనూ తిరిగి ఆ విధ్వంసాన్ని కళ్ళారా చూశారు. నిర్భాంతపోయారు. వెక్ళివెక్కి ఏడ్చారు. శిబిరాలలో జీవచ్చవాలుగా బతుకుతున్న ప్రజలను ఏమని ఓదార్చాలో తెలియక కన్నీరు కార్చారు. ఆ వాస్తవ సంఘటనను తన కథా నేఫథ్యంగా రహమతుల్లా చాలా సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. తిరిగి వచ్చిన రచయితలు, రచయిత్రులు కవితలు రాసి “గుజరాత్‌ గాయం అనే పేరుతో ప్రచురించారు. తర్వాత చాలా దాడులు జరిగినపుడు కూడా వీరిలో కొందరు స్పందించి రచనలు చేశారు. ఐతే భిన్న స్థల కాలాల్లో జరిగిన ఈ సంఘటనల పరిణామాన్ని జతచేసి చూడాలనే ఆలోచన ఎవరికీ వచ్చినట్లు లేదు. ఈ రెండింటిని విడివిడి సంఘటనలుగా కాక భారతీయ సమాజంలో చోటు చేసుకుంటున్న వికృతపోకడల నుంచి కలిసి పుట్టినవేనని, అవి ఇంతటితో ఆగవనీ, ఆగాలంటే కైసరున్నీసా లాంటివాళ్ళు తమ జీవితాలు ధారపోసి పనిచేయాలని రహమతుల్లా ఈ కథలో పరోక్షంగా చెప్పాడు. కథ ముగిశాక బాషాని బతికించకూడదా? రహమతుల్లా అంత కఠినాత్ముడా - అనిపిస్తుంది. కైసరున్నీసా మీద కాస్త కనికరం చూపించకూడదా అనిపిస్తుంది. అలాంటి భావనని మనలో కలిగించటమే రచయితగా రహమతుల్లా విజయం. కఠినత్వం రచయితది కాదు పరిస్థితులది. పరిస్థితులను పక్కనబెట్టి రచయిత పాత్రను ప్రేమిస్తే రచన అవాస్తవికమవుతుంది. కైసరున్నీసా కథ కల్పన కాదు. వాస్తవమని చెప్పకనే చెప్పాలంటే బాషా చనిపోవాల్సిందే. కైసరున్నీసా పాత్ర సృజన, నిర్వహణ ఈ రెండూ చాలా గొప్పగా చేశాడు రహమతుల్లా. కైసరున్నీసాపైబడి పదిమంది మగమృగాలు అత్యాచారం చేశారు. ఆమె కళ్ళఎదుటనే కుటుంబాన్ని అంతంచేశారు. ఇదిచూసి, అనుభవించి పిచ్చెత్తిపోకుండా వుండాలంటే ఎంత ధైర్యం, ధృడమైన వ్యక్తిత్వం కావాలి? అత్యాచారానికి అన్యాయానికి గురైనవారు నోరువిప్పి దానిని గురించి మాట్లాడాలంటే న్యాయం గురించిన స్పృహ వుండాలి. తాను నోరు విప్పి మాట్లాడటం కేవలం తనకోసం మాత్రమే కాదని, న్యాయం కోసమనే లోతైన వివేచన వుండాలి. అది లేకపోతే కైసరున్నీసా ఎదుర్కొన్న హింసవంటి హింస ఎదుర్శొని మాట్లాడలేరు. ఎవరికోసం మాట్లాడాలి? మాట్లాడితే ఇంకేం జరుగుతుంది? ఏం ఒరుగుతుంది? - ఇలాంటి ప్రశ్నలన్నీ మనసులోకి సంకలిత - ఓల్త్లా * 157

వస్తాయి. కైసరున్నీసా తనది బతికున్న శవంలాంటి పరిస్థితిఅని తనే అనుకుంది. చచ్చిపోవటం మేలనుకుంది. తనవాళ్ళంటూ ఎవరూ లేరు. ఆ బాధకు, డిప్రెషన్‌కు లొంగక తప్పని పరిస్థితి. ఆ పరిస్థితిలో తన దురవస్థను దాటి చూడగలిగిన వాళ్ళే న్యాయం గురించి ఆలోచించగలుగుతారు. ఆ చూపు కైసరున్నీసాకు వున్నందుకు మనం సంతోషించాలి. కైసరున్నీసా ప్రీగానో, బాధితురాలిగానో మాత్రమే కాకుండా పౌరురాలిగా ఆలోచించగలిగింది. ప్రతికూల పరిస్థితుల్లో ఫలితం లేదని తెలిసీ ఆమె గొంతు విప్పింది. గొంతు విప్పకపోతే, అందరూ నిరాశతోనో, భయంతోనో మౌనం వహిస్తే ఇక ఆ సమాజం గురించి ఆశపెట్టుకోటానికేమీ లేదు. అలాంటి నిరాశలోకి అంథ:కారంలోకి మనల్ని నెట్టలేదు కైసరున్నీసా. చూసిన విషయాన్ని సాక్ష్యంగా చెప్పటానికే ఎంతోమంది భయపడ్డారు. పొరపాటున చంపకుండా ఒదిలిన అమ్మాయి వచ్చి ప్రత్యేక సాక్షిగా, బాధితురాలిగా న్యాయం కోరుతుంటే ఆ రాక్షసులు బతకనిస్తారా? ఆ భయం కైసరున్సీసాకు లేదు. ఆమె బతికిందే నోరు విప్పటానికి. ఆ ధైర్యం చేయకపోతే ఆమె బతకటమెందుకు? చాలా గొప్ప వ్యక్తిత్వం కైరున్నిసాది.

గాయాల నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆమె తన జీవితం తను జీవిస్తే చాలనుకోలేదు. ఎక్కడో ఒకచోట తలదాచుకుంటే చాలనుకోలేదు. ముఖ్యంగా - చాలా ముఖ్యంగా ఆమెతన మతం తనకు విధించిన సంకెళ్ళను చేధించుకుంది. చేధించుకున్నాననే స్పృహను పొంది స్వేచ్చను అనుభూతి చెందింది. బాషా పెళ్ళి చేసుకోమన్నప్పుడు చేసుకుని వుంటే ఆమె జీవితం ఒక మామూలు జీవితంలాగా, భర్త, పిల్లల సేవలో గడిచిపోయేదేమో - కైసరున్నీసా భిన్నంగా ఆలోచించింది. తన ప్రతికూల పరిస్థితుల్లోనే అనుకూల అంశాలను గమనించగలిగిన స్థితికి చేరుకుంది. తన జీవితంలో వచ్చిన మార్చుని గమనించి ఆహ్వానించింది. “ఎడారిలో పడున్న చేపపిల్ల చెరువులో వచ్చి పడ్డట్లయింది. ఇస్లాం చట్టం నుంచి స్వేచ్చా వలయం..... చుట్టూ వున్న సమాజాన్ని అందమైన చమన్‌లా చూడాలి. మతాలకతీతంగా మనుషుల్లో (ప్రేమానురాగాలు పెరగాలి. నిందితులు రాక్షసులు శిక్షించబడాలి.... పదిమంది కోసం బతకటంలోనే గొప్పదనముంది. నాకు వుపశమనమూ వుంది. పెళ్ళి, కుటుంబం నాకు అడ్డవుతాయి” ఇంత స్పష్టంగా తన గురించి తను ఆలోచించుకోగల వివేకం కష్టాల్లో రాటుదేలిన కైసరున్నిసాకు వచ్చింది.

సంకలిత - ఓల్లా * 158

తర్వాత ఏడేళ్ళపాటు బొంబాయిలో పనిచేశాక మళ్ళీ కైసరున్నీసాకు “డ్రేమించటానికి కావలసిన మహాశక్తి వచ్చింది. హైదరాబాదులో బాషా కలిసినప్పుడు తనలోని జీవశక్తి ఇచ్చిన (ప్రేమశక్తిని ప్రకటించింది. తనతోజీవితం, పని, పంచుకోటానికి రమ్మని బాషాని ఆవ్వానించింది. బాషా అంగీకరించాడు గానీ తీవ్రవాదం అంగీకరించలేదు.

కైసరున్నిసాకు దేశం తప్ప తనవారు మిగలలేదు. అట్లాంటి పరిస్థితుల్లో - దేశంలోని సమస్త ప్రజలూ “భీ - ఏం దేశమిది? దేశం ఇంత పాడయిందేమి"టని అనుకుంటున్న వేళ - ఆ విధ్వంసాన్ని రెందోసారి స్వయంగా అనుభవించిన కైసరున్నీసా మాత్రం “ఈ దేశం గొప్పది. దీని కోసమే పనిచేయాలి...... సారే జహాసే అచ్చా! హిందూ శితా హమారా హమారా. మజహబ్‌ నల్లా సిఖృతా అపస్‌మె బైర్‌ రఖ్నా? అనుకుంటుంది. సాధ్యమా అలా అనుకోగలగటం. సాధ్యమేనంటున్నాడు రహమతుల్లా. సాధ్యమేనంటున్నది కైసరున్నీసా - బహుశ వీరిద్దరూ దేశమంటే మట్టికాదనీ, మనుషులనీ, దేశాన్ని (ప్రేమించటమంటే మంచిని పెంచటమని గట్టిగా నమ్ముతారనుకుంటా.

సంకలిత - ఓల్గా * 159

ఓల్లా ఇతర రచనలు

నవలలు కథాసంకలనాలు సహజ రాజకీయ కథలు స్వేచ్చ ప్రయోగం మానవి భిన్న సందర్భాలు కన్నీటి కెరటాల వెన్నెల మృణ్మ్యయనాదం ఆకాశంలో సగం విముక్త గులాబీలు

సంపాదకత్వం అనువాదాలు మాకు గోడలు లేవు సామాన్యుల సాహసం నీలిమేఘాలు భూమి పుత్రిక నూరేళ్ళ చలం మిస్సింగ్‌ సారాంశం మూడు తరాలు సరిహద్దులులేని సంధ్యలు పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం మహిళావరణం ఉరికొయ్య అంచున జీవితమే ఒక ప్రయోగం నేనూ సావిత్రీబాయిని అలజడి మా జీవితం అక్షర యుద్దాలు నవలా మాలతీయం

కవిత్వం ఓల్లా కవితలు కొన్ని... ఇతరములు అతడు - ఆమె - మనం (సాహిత్య విమర్శ) కుటుంబ వ్యవస్థ - మార్క్చిజం (వ్యాసం) వాళ్ళు ఆరుగురు (నాటిక) యుద్ధము - శాంతి (నృత్య రూపకం) పలికించకు మౌనమృదంగాలను (సాహిత్య వ్యాసాలు) తొలివెలుగులు (ప్రీవాద వ్యాసాలు) కుటుంబ వ్యవస్థ - మార్చిజం - ఫెమినిజం (స్త్రీవాద వ్యాసాలు) సహిత (సాహిత్య వ్యాసాలు) ం గూరజ్నాడ్ర అడుగు జాడ (సాహిత్య వ్యాసాలు) శ 4 య "షె జ (౨101 నా - ఓల్లా ౪ 160 స _ ॥ ,. సై న. క లలల

1టుత్యం కింక... వో ల్‌... మ. 4 షే సని వ న ననే , క ఒం శీ 1... భి. భ్‌! ॥ (గ కా ర్ట స. ॥ | 1 సంకలిత ,/ . వా క. పు! న్‌ చ. నం... న మ నక టం (7... నాయుడు యయ నట... మా టి కా లల న... పస ల య న లా. సహంనతలతీ న మ స. మ! టం నం న స. క్‌ న నల 3 రయ ల (5 సు. నా. ల న. ప నం. టల నం త మ టా. చ నట [నయన లు... నే! మ న? పళ. మే | |] ప (6 £ గ్‌. ల టన ం షో త సషన్నాల.. | | మ టింకర మ శ . న ము మటలు ర ఖ్‌ తు గ (8. దాన్‌ ల ల ల్‌ మం... హు భట న్‌ 'ససపతంలి వ.

  • న! వ ప .. . న చ. నే టన నం శ న ల్‌ తు . న. మ తో న్‌. న మ న చసన యన్‌ స. . క త [| ప న ను. త టు ట్‌ | కళ్ల క్త నా న్‌ు న క న ము తలు న... . | పన ఏన వస్‌ ౩ సపసురద ని! జంతిక. ఢ | మక ల న (౫ న. వాళ్ళువిముకితఈకృతిమ వసరితై నకి అవ్ష్యుజే స టీ . న కు. న మ అపు న 1 ఈ వసంతఠలో .. గ లై అద్ధత చేఘుకున్తవాతి ఉళ్లతే: అవ్రషది తవతకా స తతతేఠచుక్‌ స పతక లతిలన కుదుట ధట మ... - (షు | ' ఇఠటి కభుకోని యువతఠలవల్లి) కుధుర య టు లు మ. ! క మ. =.