Telugu Sandhyaragamu - anilvaranasi/indianlanguages GitHub Wiki
సా ౯ వలఖషగణ్న, (| ఫి షప అ , . గ. యు (0 వరే మయ లం. | స్లో /. సైజట్టలు అత... పే: శ ము. (బక! హౌ | క బు జ్ “ఫ సం స. సహజకవి మల్లెమాల ఎ . 0! 'పసుపడి మక్కువతో సేకరించిన ం న్ా , ఉల్లో లక్ క్ట చ ర శ వ. వ వణ స | ఈపు స్తకాన్ని సాహాత్యాభిమానుల కోసం 1 గ్ . / శ (| 4 ఆనందంతో బహూకరిస్తున్నాం ౫ 1. ల సా _చులెమాలకుటుంబం _.-క్లీ/ గ్ర (1! ల ॥ ణా / (7 0 / / ల ( లీ ఛో 11 పు ॥ ఈ చ టా! న. 1/4 మచ్ లఎదుభాదమలక దాయ దక గ. గ న పల షా ౦౩రక్వ్యి ఆం రక లలు. (గ నటి గ నను న బె వ్ జ టంట...
శ్రీరస్తు జ్ సంధ్యారాగము డౌ॥ సుంకర వెంకమాంబ ప్రచురణ శ్రీ ప్రియదర్శిని పబ్లికేషన్స్ బళ్ళారి
రా జం ళీ యా గుళి భా సంధ్యారాగము బలి డొ॥ సుంకర వెంకమాంబ ప్రచురణ శ్రీ ప్రియదర్శిని పబ్లికేషన్స్ య్యా (గ్రంధాలయ ప్రథమ ముద్రణ యో న్ా జనవరి, 2005 “(రంజలి వైడేన్త) ఇ) కారబపుష్యం సా నా ఘు ప్రతులు : 1000 న హెదరాబార్ | హక్కులన్నియు ర్ట కవయిత్రివి గ్ కి వెల: 80/- రూలు. (/ ప్రతులకు విశాలాంధ్ర బుక్ హౌస్ డా॥ సుంకర వెంకమాంబ (అన్ని బ్రాంచీలు) 18/87, శ్రీప్రియదర్శిని నవోదయ బుక్ హౌస్ అపట్షాస్తి కాంపౌండ్ కాచిగూడ, శై _ గ హైదరాబాదు - 27 ఫోన్ : 08392 - 256444 ముఖచిత్రం వలసల హరికృష్ణ దోన్ - 518 222 సెల్ : 09440549178 లేజర్ టైప్ సెట్టింగ్: ముద్రణ; మను గ్రాఫిక్స్ కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ 1-8-185/2, చిక్కడపల్లి 40-ఎపిహెచ్బి, విద్యానగర్ హైదరాబాదు-500 020 హైదరాబాదు - 500 044. ఫోన్ : 27633574 ఫోన్ : 27618261
అంకితము శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము మాజీ ఉప కులపతి, సాహితీ మూర్తులు, గురువరేణ్యులు జర ఇల్ శ ఆచార్య కొలకలూరి ఇనాక్ మహోదయులకు కొలకలూరి వంశ కలశాబ్ధి సోముండు, శ్రీ ఇనాక్ మనీషి శేఖరుండు, గురుడు-మార్గదర్శకుడు నాకు, కృతి నిచ్చి గురుబుణమ్ము తీర్చుకొందు నేడు. 1 సాంధ్య రాగమ్ము సహృదయాస్వాద్య మైన మధువు పంచు సరస్వతీ మహలు విబుధ! మీ మహోన్నత కీర్తికి మేడ యగుచు సరసవరులకు విందు భోజనము లిడుత! ల |
సృష్టి యున్నంత కాలమ్ము ప్రేమ యెసగు, పేమ రసరూపమున కావ్యరీతి పాసగు, మనసరికి, కళారాధనామతికి, మీకు సాంధ్యరాగమ్ము సంతుష్టి సల్పుగాక! 3 బహువిధ కథలసంఘ శిల్పమ్ము చెక్కు సిద్ధహస్తులు మీరు - మీ చిత్తమందు అతులితమ్ము సంధ్యారాగ మలము కొనుత! మధుర మధురానుభూతి సమ్మదము నిడుత! తీ పలుకు జవరాలి మురిపెంపు పలుకరింపు సొంపు గ్రహియించు రసిక రాజులకు మీకు చంద్రునకు నూలుపో గటు సాంధ్యరాగ కృతి రసాకృతి ప్రీతి నంకిత మొనర్హు. ర్ =డొ॥ సుంకర వెంకమాంబ ..
ఆచార్య కొలకలూరి ఇనాక్ 1-3-29, శాంతినగర్ మాజీ ఉప కులపతి అనంతపురం = 515 004 శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ఫోన్ :; 08554-221171 తిరుపతి అభినందన డా॥ కుమారి సుంకర వెంకమాంబ సముజ్వ్వల సాహితీ సౌభాగ్యవతి, సమ్యక్ సంయమన సౌందర్యవతి, సుకుమార మనస్విని, ఉత్తమోపన్యా సకురాలు, ఉదాత్తకవయిత్రి, ఉన్నత పరిశోధకురాలు, సున్నిత హృదయ, భావకవితా పరవశురాలు, ఆర్టతా భావాంతరాత్మ ప్రణయోహా పరీరంభ తపస్విని, మధురాదరోదిత సుధామయ వాక్ ప్రపంచ పాలనా ప్రకంపన ప్రోజ్బులన సమర్థ, నియమనిష్టా గరిష్ట విశిష్ట వరిష్ట వర్థిష్టువు. ఆమె హృదయాకాశంలో వెల్లివిరిసిన 'సంధ్యారాగము' ఇది. నాకంకితం, అదే ఆనందం. అందుకే ఈ అభినందన. ఇది బృందావన సుస్యందన సుందర కవితా కళావేదిక, ఇది శతమానం భవతు ఆశీరక్షతల, సుగంధ పరీమళ సంభరిత సుమమాలిక. “ఉదయరాగము' ప్రధమకవితా వధూటి. పరమ సౌందర్యవతి. “నంధ్యారాగము' ద్వితీయ కవితాలలామ. వర్తమాన అద్భుత సౌభాగ్యవతి, (ప్రథమ కావ్యంలో నాయిక కవయిత్రి. ద్వితీయ కావ్యంలో నాయకుడు కవి. రెండింటి కవయిత్రి డా. వెంకమాంబ. మొదట నాయికకు, పిదప నాయకుడికి కవయిత్రి. వాగ్దానం చేసింది. స్వర పరీమళం పంచింది. అప్పటి నాయిక ప్రియుడి సంయోగంలో అయోగంలో యోగం భోగం దర్శించి తరించిన ధన్య. ఇప్పటి నాయకుడు దూరీకృతనాయికాపరీరంభ సుఖుడు. దుర్భర వేదనాకుల చిత్తుడు. విరహాతురుడు. నాయికా వియోగానల దగ్ధ శిరళ్ళరీరుడు. షే
వ్రచండ అయోగ వాతాహతి చిక్కిన దందహ్యమాన హృదయుడు. నా నట్యమాన మానసుడు.
డా॥ కుమారి సుంకర వెంకమాంబ నాయిక మనస్థితిని భావనలో నిలుపుకొని వెలయించిన 'ఉదయరాగము'" ముక్తక పుష్పగుచ్చ సముచ్చయం. ఆమె నాయక హృదయావస్థ, తనూ సందర్శనం పొంది, తానే నాయకుడై విరియించిన “సంధ్యారాగము" కూడా ముక్తక సంకలనమే. స్రీహృదయ లాలిత్యం కోమలత్వం నాయకుడి కంఠ దఘ్మంగా నింపింది కవయిత్రి డా॥వెంకమాంబ.
ఈ కావ్య ద్వయంలో కవయిత్రి పరిణత హృదయం, పరిపూర్ణ భావుకత పరిశుద్ధ అంతఃకరణం, ప్రజ్వల ఆలోచన, ప్రకంపిత అనుభూతి, అక్షర సుందరంగా కవితామందిరంగా, ఆనంద నందనంగా వెలుగు వెల్లువలు వెలార్పాయి.
ఈ రెండు కవితా సంకలనాలవల్ల కవయిత్రి సరస్వతీ రూపంగానే కాదు, పుంభావ సరస్వతీ స్తవనీయ రూపంగా ప్రకాశించింది.
“ఉదయరాగ మూల మెదియొ అదియె మూలమయ్యె సంధ్యారాగము నకు' అని ఉదయసంధ్యల రాగ గానం చేయగలిగింది కవయిత్రి.
స్తీపురుషులన్న వైవిధ్యం వల్ల శరీరాలు వేరేకానీ మనసాకటే కావటం వల్ల ఇంత ప్రేమాయణం సాగిందని కవయిత్రి విశదీకరించింది.
సంధ్యారాగములోని “నాయిక అభినవాంధ్ర భాషాయోష. అమృత కవితా నితంబిని, అనుపమాదృష్టదేవత'.
(పేమించగలవాడే కవితను ఆఅశ౭ించగలడనీ, ఆరాధించగలడనీ, అనుభవించగలడనీ, భావించడం సహజమే. ప్రణయ భావగీతికను అరసిక శిఖామణులు మెచ్చరని, వాళ్ళు హృదయ భాష ఎరుగలేని నిరక్షరాస్యులని కవయిత్రి నిరసించింది.
అయోగంతో వేగిపోయే నాయకుడు చాలా సందర్భాలలో శ్రీకృష్ణుడు లాగా సత్యాపాద యుగళిచలన చాలన చక్రవర్తిలాగా, కనిపిస్తాడే కాని
1౪
దక్షిణనాయకుడు లాగా కనిపించడు. నాయకుడు ఏకపత్నీవ్రతుడు, ఏక (ప్రేయసీ వ్రతుడు, ఏకపేయసీ వియోగ అయోగ శృంగారాంబుధి ఈతగాడు- గజీతగాడ- స్వేచ్చ్భానావికుడు.
ఆమె తలపే అతడిలోని కవిత. ఆమె ఊసులే అతడి భాష. అమె ఆలోచనలే అతడి జీవాయువులు. ఆమె సాక్షాత్కారమే అతడి నిరీక్షణ. అమె ప్రత్యక్షమే అతడి పారవశ్యం.
ఈ కావ్యంలో “కలికి ప్రేమ విలువ కట్టగా శతకోటి పంచశరులకు సాధ్యం కాదని కావ్యనాయకుడు గుర్తించాడు. హృదయంలో నాయిక నిరంతరంగా సంచరిస్తుంటే, సంచలిస్తుంటే 'మధురకవితల నల్గుట మానలే' నని గమనించాడు. 'నా వ్రాయు కావ్యమ్ము అంకితముగ నీకు అందజేతు' నని నాయికకు తెలిపాడు. ఉన్న ఒక్క హృదయ మామెకు అంకిత మొనరించి అలమటించు అదృష్టవంతుడు కావ్య నాయకుడు. కలలు కరువైన బిచ్చగాడు ఆకలీ దాహమూ జయించిన యోగి పుంగవుడు.
నాయకుడు “ఆత్మ సౌందర్యమును గారవించే సంస్కారి. బాహ్య సౌందర్యం సంభావింపని వివేకి. హృదయమ్ ప్రియురాలికి సమర్పించుకొను సహృదయ శేఖరుడు.
“తరము లాకటైనా పెద్ద అంతరమున్న" వాళ్ళు నాయికా నాయకులు, స్త్రీ పురుషులు మాత్రమే కారు, వీరు ఢ్రేయసీ ప్రియులు.
భావకులు, భావితులు, భావకవులు హర్షించేటట్ట్లుగా, ఆనందం వర్షించేట్టుగా, జంటకవులమై, జంటగా, ఒంటరిగా కాక, వెంటనంటి ఉంటూ కవులమైై, గాయకులమై ఆనందలోకాల వారసులమై, ప్రేయసీ ప్రియులమైై, కాలంలో కాలగర్భంలో కాలగర్భ కుహరాంతరంలో కలసి పోదామని నాయికా నాయకుల సంకల్పం.
ఒకసారి “పాలపుంత పాన్చు' మీద, మరోసారి “పండువెన్నెల మల్లెల పాన్చు'మీద “జిలుగు తెలిమబ్బు పరదాల' మాటున శయనిద్దామని నాయకుడు నాయికను కోరాడు.
ఖా
పుష్పక విమానంలో మేఘశకలాల మీద చుక్కలు చూస్తాయన్న భయం విడిచి విహారయాత్రకు పోదామని నాయకుడు (పేయసిని ఆహ్వానించాడు.
ఆమె “'మృదుపాద యుగళి కడిగి' పసుపు పారాణి పూయ సంకల్పించే ప్రేమికుడు నాయకుడు.
జన్మజన్మల నుంచి నిరీక్షించినా ఆమె రాదు, కటాక్షించదు, కనికరించదు కరుణించదు. జన్మ తరింపచేయదు.
నాయకుడికి ఎదరుచూవులే, అన్వేషణే, గవేక్షణే, కాంక్షామత్తచిత్త నిరీక్షణే, విధిగా మారింది. తపించటమే పరమావధిగా పరిణమించింది. పరిశోషించటమే పరిష్కార ప్రభగా పరిఢవిల్లింది.
ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగో నాయిక ఎదురైతే నాయకుడు (మ్రాన్పడి, మాటలు లేక, చేతలు లేక, చూపులు లేక, కదలిక లేక స్థాబువై, నిశ్శబ్ద వేణువై, మౌనస్వనమురళీలోలుడ్రై, గుండె పగిలి, పండిమండి “మసై' నుస్రె, గాలికల్హాడిన ధన్యజీవి నాయకుడు.
మళ్ళీ మామూలే! నాయిక అంతర్భ్థానమవుతుంది. ఇక నాయకుడి విరహమ్-విరహం. అడ్డమాకలు లేని విరహం, అంతూపాంతులేని విరహం. ఆద్యంతాలులేని విరహం, అనంత విరహహేల వేదన తపన తపస్సు.
నాయకుడు కవి కాకపోతే విరహం బరువుతో బాధతో భగ్న్శహృదయుడై, భగ్న మనస్కుడై భగ్న జీవియై, భగ్న సర్వాంగుడై అంతరించి పోయేవాడే. అవతారం చాలించేవాడే.
కాని సుకవిత నాయకుణ్ణి బ్రతికించింది. నాయిక ఆలోచనలు అనుభూతులు అతణ్ణి సజీవుణ్ణి చేశాయి. సకర్ముణ్ణి చేశాయి. సరాగిని చేశాయి. సత్యసంధాయిని చేశాయి. చిరంజీవిని కావించాయి.
డా॥కుమారి సుంకర వెంకమాంబ గొప్పనాయకుణ్ణి. గొప్ప (పేమికుణ్ణి విశేష నహృదయుణ్ణి. విశిష్టకవిని. విశుద్ధ మానవుణ్ణి నంధ్యారాగంలో సృష్టించింది.
|
ఇంత చిన్న కావ్యంలో ఎంతో సముదాత్త (పేమ భావనను, దాంపత్య మాధుర్యాన్ని ప్రేయసీ ప్రియుల వియోగ శృంగార పరాకాస్టను ప్రతిష్టించిన కవయిత్రిని అభినందిస్తున్నాను.
ఈ విశిష్ట కృతిని నాకు అంకితం కావించిన నా శిష్యురాలు వెంకమాంబను నూరేళ్ళు వర్ణిల్లమని, నిత్యనూతన కవితా కాంతులు వెలయించమని, పరిపూర్ణ జీవితం అనుభవించమని, నిండుహృదయంతో, మనసారా, అక్షరాలా ఆశీర్వదిస్తున్నాను.
= కశథం -
- కొలకలూరి ఇనాక్ 3-12-2004 ఛ1
శ్రీవాణి ఈర జి.వి. స అ వ సుబ్రహ్మణ్యం 1-8-702/105, నల్లకుంట, పొట్టీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ - 500 044. నాంపల్లి, హైదరాబాద్ - 500 004 ఫోన్ : 2763 1013 మధుర గీతి
డాక్టర్ సుంకర వెంకమాంబగారు రచించిన 'సంధ్యారాగము" ఒక మధురమైన లిరిక్కు. తెలుగులో వెలువడ్డ ఆత్మాశ్రయ కవితా శాఖకు పూచిన పూలగుత్తి. గ 10010 18 2 [00-0200676 ౦6%, 1840508 2 310216 50602566 ౪70058 ౧౪౧00856 15 (0 3%జా6 2 5266 00016, 2 ౧0064 0! 2౯౬ 1066౪10 13 86266౯" (4610 సెగ : 106020” 6౫401900: 4& 0105- 520/ 0 4జం౯ 16019- పుట : 79)” అనే నిర్వచనం లిరిక్కుల వివేచనకు బాగా త్పోడుతుంది. అత్మాశ్రయ కవిత్వంలో సామాజికుడు స్వాత్మీయాకరణం ద్వారా అనుభవించే కవి స్వీయావస్థలు మూడు, అవి- 1) మానసికావస్థ (51246 0౧11164), 2) భావోద్వేగొవస్థ (14006), 3) స్వభావావస్థ (ఉటగరల ఆత్మాశ్రయ కవితా కృతులలో ఈ మూడు రకాల అవస్థలకూ ప్రాతినిధ్యం వహించే కవులున్నారు. వారిని స్థూలంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.
శ మానసికావస్థలను వ్యక్తంచేసే కవితలు ఎక్కువగా రచించిన వారు-దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, కవికొండల వెంకట రావుగారు, వేదుల సత్యనారాయణ శాస్రిగారు, మల్లవరపు విశ్వేశ్వరరావుగారు మొదలైనవారు .
2 బావోద్వేగావన్ఫలను వ్రళటించే కవితలు ఎక్కువగా రచించినవారు - వేంకట పార్వతీశ్వర కవులు, బసవరాజు అప్పారావుగారు, నండూరి సుబ్బారావుగారు మొదలైనవారు.
- వివిధ న్వభావావస్థలకు ప్రాతినిధ్యం వహించే కవితలు
౪111
రచించినవారు- రాయప్రోలు సుబ్బారావుగారు, విశ్వనాథ సత్యనారాయణగారు, అడవి బాపిరాజుగారు, అబ్బూరి రామకృష్ణరావుగారు, తల్దావర్డుల శివశంకర శాప్రిగారు, దువ్వూరి రామిరెడ్డిగారు, నాయని సుబ్బారావుగారు మొదలైనవారు. ఆఅత్మాశయ కవిత్వం ఒక ఉద్యమంగా సాగిన రోజులలో వెలువడిన రచనలు పై వర్గీకరణకు లోబడినా, ఆ తరువాత వెలువడిన రచనల్లో ఈ మూడింటి మిశ్రప్రవృత్తిగల రచనలుకూడా వెలువడటం గమనిస్తాం. వీటిని సామాన్యంగా భావకవితా శాఖలో పేర్కొనటం ఆధునికుల అభిమతం. శ్రీమతి డౌ॥ సుంకర వెంకమాంబగారు భావ కవిత్వానంతర ధోరణులలో వెలువడిన ప్రణయ కవితా ప్రస్థానానికి సంబంధించిన రచయిత్రి. ఆమె ప్రకృతి కవిత్వాన్ని, ప్రణయ కవిత్వాన్ని మానసికావస్థలకు అనుగుణంగా రచించి తమ భావుకతను ప్రదర్శించారు. ఈ రచయిత్రికి తేటగీతి మధురాభివ్యక్తికి మహనీయమైన వాహికగా తోడ్పడింది. తేటగీతి భావకవితకు పదునైన సాధనం. శ్రీశ్రీ మాటలలో - “ఒక అనిర్వచనీయ మహోన్నతమగు హాయి యున్నది గీత పద్యములయందు దరు లొరసి పారు గాంగ నిర్హరిణి కరణి చెంగు చెంగున గీతి తురంగలించు” ఆధునిక దివ్య ఖండ కావ్యముల యందు బ్రాణ సన్నిభమై గీతి పరుగులాడు! విసృత వనాంతరోదగ్ర వీధులందు( గ్రేళ్ళుజుకు లేడివలె గీతి త్రుళ్ళులాడు! పద్యాలలో తేటిగీతిని పాటలాగా వాడుకున్నారు భావకవిత్వోద్యమ !
కవులు, ఆ బాటలో తమ సాంధ్యరాగాన్ని వినిపించి ఒక అనిర్వచనీయమైన హాయిని కలిగించారు ఈ రచయిత్రి.
“నుంజు మంజీర కింకిణీ మధురవాణి
మారుమైోగుచు నున్నది మనసులోన
ప్రతి రుణత్కృతి ఒక్కొక్క పద్యకృతికి
నాంది యగుచుండె భాగ్యమ్ము నాదికాదె!”
అన్న గీతి ఈ రచయిత్రి కవిత్వంలోని మధురాభివ్యక్తితో కూడిన లయాత్మక సౌందర్య స్ఫూర్తికి మచ్చుతునక. ప్రతిపద్యం, ఈ దృష్టితో చూస్తే- ప్రణయ కింకిణిగా ధ్వనించే మధురవాణి.
ఈ రచయి(త్రి తాను (క్రేమికుడిగా భావించి భావాభివ్యక్తిని ఆత్మాశ్రయంగా వెలువరించటం ఆ రచనలోని విశేషం. అంతేకాక ప్రకృతి స్వభావరూపమైన సంధ్యను, ప్రణయినిగా భావించి భావగీతిని పాడటం ఈ కృతి ప్రత్యేకత. అందులో శాబ్దిక, అర్థిక చమత్కారాల చాతుర్యం ఈ రచయిత్రి ప్రతిభా ప్రకాశం! మచ్చుకు -
“ధర అయస్కాంత మనుమాట తప్పా ఒప్పా దానితో నాకు పనియేమి? గాని చెలియ! నన్ను నిత్య మాకర్షించుచున్న కతన
నీ వయస్కాంత మన్నది నిజము! నిజము!”
మధురమైన భావాన్ని సరళమైన అలంకార శైలిలో చెప్పటం ఈ రచయిత్రి సహజస్వభావం. సరళమైన శైలిలో సారవంతమైన కవితాశక్తిని పాదగటం అమె నైపుణ్యం. మచ్చుకు -
“గోవు పొదుగున దుగ్గమ్ము కూడినట్లు
వదన శశిబింబ సంజాత సుధలు కదిలి
అవియె అధరాధరమున ్రోగయిన వేమొ!
కానియెడ యింత మధురిమ కలుగుటెట్లు” గ
అభినయంలో అభ్యవ్యక్తమయ్యే భావ మాధుర్యాన్ని వర్ణించిన ఈ
కవయిత్రి, ఒక మధుర ఫణితికి మహనీయోదాహరణం- “పెదవి కదలనీక పేమాయణము చెప్పు నీ విశాల నేత్ర నిపుణ శైలి కంటి, నాదు హృదయ గండ సెండేరమ్ము తొడుగ అడుగు ముందు కిడవె చెలియ!”
ఈ రచయిత్రిని రసహృదయులు భవిష్యత్తులో తప్పక గండపెండేర బహూకృతితో సమ్మానిస్తారని భావిస్తున్నాను. ఆ గౌరవం ఆమెకు కలగాలని ఆశిస్తున్నాను,
= జీవి. సుబ్రహ్మణ్యం |
ఉత్పల సత్యనారాయణాచార్య 145, అలకాపురి మహిళూర దత్తపీఠ ఆస్థాన విద్వత్కవి హైదరాబాదు - 500 035 కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఫోన్ : 2403 3511 (పేమ హృదయము
“ఉదయరాగంి అనే లఘు కావ్యం చదువుతున్నప్పుడు నాకెంతో ఆశ్చర్యం కలిగింది, ఇవి నా పద్యాలే అని, నా రచనే అని. అట్టమీద చూస్తే కవయిత్రి డా॥ సుంకర వెంకనూంబ పేరున్నది.
నా చిన్నప్పుడు “అభిజ్ఞాన శాకుంతలం” పాఠంగా చదువుతూ “దర్భాంకు రేణ చరణః క్షత ఇత్యకాండే, తన్వీ స్థితా” అనే శ్లోకంలోని భావం నాకు తట్టినదే ఇంతకుముందే కాళిదాసు చెప్పేశాడు కదా అని బాధపడ్డాను. ఇది తన రచనే, తన భావమే అనిపించేటట్టున్నదే ఉత్తమ కవితకు సరియైన కొలమానం,
ఉదయరాగం ప్రేమ భావనా భరితమైన సుమధుర పద్యకావ్యం. డా॥ వెంకమాంబగారు పరమ పురుషుబ్నీ, పురుషోత్తముణ్నీ ఆరాధించిన శ్రీకృష్ణానుశీలనవతి. ముఖపత్రం మీద గాజుల చేత్తో పట్టుకున్న నెమలి యీకను గమనించకుండానే శ్యామసుందరాసక్తమైన ఈ కవయిత్రి ప్రేమ హృదయాన్ని ఆకళింపు చేసుకోవచ్చు.
ఢయేమరన వరిపూర్ణమ్రైనదే హృదయం అనిపించుకొంటుంది. హృదయానికి మరొక పేరు (శ్రే. ఢ్రేమాస్పదుల హృదయంలోని వ్యధను హృదయమున్నవాడే గ్రహింపగలుగుతాడు.
డా॥ వెంకమాంబగారు (ప్రమరన హృదయ. ఆమె రచించిన “ఉదయరాగం' నిజానికి ఆమె హృదయరాగం,
న]
ఈ కాలంలో '్రేమకావ్యమా? ఈ రోజుల్లో పద్యాలా? అని కొందరు వైతండికులు ఆశ్చర్యాన్ని అభినయిస్తూ నోరు తెరుస్తారు. “వలపెరుంగని బ్రతుకు వలచి మురిసేకంటె వలచి విఫలమ్మొంది విలపింసమేలురా” అన్నారు బసవరాజు అప్పారావుగారు. కవితలనేవి హృదయ స్పందనలేకాని, మస్తిష్క ధ్వనులు మాత్రం కావు. ఈ కవయిత్రి నేటి వైతండికుల మాటలు లెక్కచేయక తన హృదయాన్ని విప్పి తన భావాలను వ్యంగ్య మధురంగా, ఛందస్సుందరంగా పఠితల హృదయాల్లోనికి చొప్పించారు. వారిని సహృదయులను చేశారు. పాఠకుణ్నీ సహృదయుల్ని చేసేదే ఉత్తమ కవిత. సహృదయతకు నిర్వచనం చెప్పాడు అనందవర్థనుడు “రసజ్జతైన సహృదయత్వమ్” అని (ధ్వన్యాలోకం).
హృదయవంతుడు తప్పకుండా ప్రమమయుడవుతాడు. ఆ వెంటనే రసజ్ఞుడూ సహృదయుడూ అవుతాడు. సాధుభావం, సద్భావం కలవాడవుతాడు. సాహిత్యానికి ప్రథమ ప్రయోజనం హృదయాన్ని మార్గవం చేయడమే. మృదుహృదయుడు జగత్తంతటా నిండియున్న ప్రేమను చూస్తాడు. మనుష్యులలోనే కాదు, పశుపక్ష్యాదులలో, ఆకులో, పువ్వులో, రెమ్మలో, కొమ్మలో కూడా ప్రేమను చూచి ఆనందిస్తాడు. “ఆ స్పందనం గతిమతాంపులక స్తరూణాం” (శ్రీమద్భాగవతం). బృందావన తరు శాఖలు క్రిందికి వంగి ఉంటాయి. ఎందుకని? బృందావనంలో గోపాలుడు గోచారణ చేస్తూ చల్లని నీడకోసం తమ దగ్గరికి వస్తాడని. దివ్యర్హులు వేదశాఖలను వదలి, తమ శాఖల మీద పక్షుల వలె కూర్చుండి శ్రీకృష్ణుణ్నీ దగ్గరగా దర్శిస్తారని. ఇదెంత (ప్రేమ భావమో! గోపికలదో, శ్రీశుకదేవుడితో చెప్పలేము.
“ఉదయరాగం' రచించిన డా॥ వెంకమాంబగారు “సంధ్యారాగం” కూడా రచించారు.
“ఉదయ రాగమ్మునకు మూల మెదియొ అదియె 15 మూలమయ్యె సంధ్యారాగమునకు...” (సంధ్యారాగం 1ర్రిచ్రి) గ!
అహోరాత్ర సంయోగ సమయం సంధ్య. పై పంక్తుల్లో ఒక రహస్యాన్ని బహిర్గతం చేశారు కవయిత్రి. ప్రేమ ప్రప్రథమంగా స్త్రీ నుంచి వెల్లడి కావడం ప్రేమోత్పత్తికి ప్రథమ హేతువు. అది ఉదయరాగం. ప్రధమంగా పురుషుని ద్వారా వెల్లడి అయిన (ప్రేమ నిజమైన (పేమ కాజాలదు. అది వ్యామోహమవు తుంది. లేదా కామమవుతుంది. తుదకు అది వినాశకారణ మవుతుంది. స్త్రీ పురుషుల మనస్థితిలో ఒక విశిష్టమైన భేదముంది. బాహ్య సౌందర్యంలో పురుషుడు నిమగ్నమైనంతగా స్రీ నిమగ్న కాదు. అంతస్సాందర్యంలో స్రీలు విముగ్ధలైనంతగా పురుషులు కారు. పురుషులు ప్రీని రమణీ-సుందరి అని ప్రశంసించడం, స్రీలు పురుషుణ్ని “తెగువ చూపించి ఎదురించు ధీర గుణము” (ఉదయరాగం:21) “అత్మ సౌందర్య మనిశమ్ము నలరుచుండు” (ఉదయరాగం 44) “మేరునగధీరుడని యెంచి మేను మరచి” (ఉ.రా.54) ఇలాంటి ప్రశంసలు చేయటం ప్రాచీన కావ్యాలలో కూడా చూస్తాము. కోటి మన్మథుల సౌందర్యం కలవాడు కదా కృష్ణుడు, గోపికలు ఆయన్ను “విధి కరీరిమావీర! ముహ్యతి” (శ్రీమద్భాగవతం) “వీర' అని సంబోధిస్తారు. ఉదయరాగ ప్రభావం సంధ్యారాగం మీద గాఢంగా పడ్డది. కవయిత్రి ప్రేమాస్పదుని ద్వారా పలికించిన పలుకులు ప్రియురాలివే అనిపిస్తుంది. “గుణ గరిష్టులు (ప్రేమను గ్రుడ్డిదనిరి గ్రుడ్జిదే కాదు వెళ్టి బాగులది కూడ” (సంధ్యారాగం : 59) అని ఎంతో హృద్యంగా చెప్పారు దొ॥ వెంకమాంబగారు. ఈ వెజ్ఞిబాగుల (పేమలోనే ఒక విశేషముంది. అది శాంతియుతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మరి దేనిలోను ఈ వెట్టీబాగుల (యేమలో కలిగినంత ఆనందం కలగదు. ఈ విషయం (ప్రమగలవారికే తెలుస్తుంది. “ఎదురు చూపులలో కూడ ఎంత హాయి ఉన్నదో దోచుకొమ్మన్నదో...” (సంధ్యారాగం : 18) గో
పేమికుల ఎదురు చూపుల్లో అహంత లయమైపోతుంది. అప్పుడు మేళన సౌఖ్యం కంటె ఎదురు చూపుల సుఖమే ఆనందావహమనవుతుంది. (ప్రేమికుల విరహంలో కావ్యసామగ్రి ఎంతో దాగి ఉంది. బ్రశుకులోని దుఃఖం వేరు. విరహ దుఃఖం వేరు. బ్రతుకులోని దుఃఖాన్ని తొలగించుకోడానికి మార్గాంతరాలున్నట్లుగా విరహ దుఃఖాన్ని తొలగించు కోడానికి మార్గాంతరాలు ససేమిరా ఉండవు. కనుకనే సమాజంలో స్త్రీకి గల మర్యాదను పురస్కరించుకొని స్రీ విరహవ్యధ కవుల కావ్యాలలో సమాదరణీయ మైన విషయమయింది. ఢ్రేమికుల పవిత్ర ప్రేమకు ఎంతటి అపమార్గాన్న యినా, ప్రలోభాన్నయినా తిరస్కరించే సామర్థ్య ముంటుంది. అదే ప్రమబలం! “నిన్న నేటిలోన నేడు రేపటిలోన లీనమైన రీతి నేను నీవు (భక్ ఒకరిలోన నొకరు ఒదిగిపోదము” (సంధ్యారాగం : 446) అంటాడు ప్రియతముడు. ప్రియురాలి అంతస్సౌందర్యానికి ముగ్గుడై ఆమెను తన గుండె కదుముకోగోరుతాడు. సాంధ్య పురుషుడికి ఉదయరాగిణిని కలుసుకోవడం సంభవమే. సంధ్యా కాంతకు మాత్రం దినపురుష సమాగమం అసంభవం” అన్నాడు వాల్మీకి మహర్షి “అనురాగవతీ-సంధ్యా దివసస్తత్పురస్సరః అహో! దైవగతి శ్చిత్రా తథాపి న సమాగమః” సుప్రసిద్ధమైన ఈ శ్లోకార్థాన్ని గుర్తెరిగియే డా॥ వెంకమాంబగారు తమ జంట కావ్యాలకు “ఉదయరాగము”-“సంధ్యారాగము” అని నామకరణం చేశారు. కవయిత్రుల కావ్యాలలో రూపవర్దనం ఎంత లేదన్నా రవ్వల గాజులు, సరిగంచు చీరె, కొప్పులో సన్నజాజులు, వామభుజాన జడవాల్బుకోవడ౦ గ
మొదలైనవి సంధ్యారాగంలో అప్రయత్స ప్రసక్తాలయినాయి. ఈ కవయిత్రి తన సహజానుభూతిని అభివ్యక్తం చేసిన మనోజ్ఞభావాలు ఎన్నెన్నో! “పరుల చూపులు నీపైన పడునా ఏమొ అనుచు చింతించు నా మది అహరహంబు” (ఉదయరాగము) “పిలుచుటకు వచ్చుటకు నాకు వలను పడదు చిక్కుముడి వీడుటెటులనో చెప్పు...” (సంధ్యారాగం : 29) ఈ చిక్కుముడే శ్రీ మద్భాగవతంలో చెప్పిన పతి శ్వశ్రూ పితృభ్రాత్రాది 'స్నేహ శృంఖల. దుర్దర గేహ శృంఖల-ప్రియతములలో దుర్లభత్వ, నియమత్వ, నివారణత్వాది ప్రతిబంధకాలుంటాయి. అవే మన్మథునికి చిక్కిన పరమాయుధా అవుళాయి, ఇవి లేకపోతే విరహమనే ఉండదు. (ప్రేమున్న చోటనే విరహముం టుంది. ఢ్రేుమాగ్నిని విరహం ్రజ్వళింపబేస్తు౦ది. (థేమాంకురం విరహజలం తోనే పెరుగుతుంది. కోరుకొన్న ప్రియురాలు కోరుకొన్న చోట కోరుకొన్న వేళ కోరిన విధంగా కలిస్తే ఇక ప్రేమ సాహిత్య మేముంటుంది? “కానిచో కైతపై నెట్లు కలుగు మోజు” (సంధ్యారాగము : 25) “పలుకనేర్చిన నాల్క చెప్పంగ లేని సంగతుల నెన్నా నీ చూపు చాటి చెప్పె” (సంధ్యారాగము : 20) (ప్రేమికులకు నోట్లో నాలుక ఉండదు. అది వారి నయనాల్లో ఉంటుంది! “చూపులే తియ్యనైన, వా చూపుకన్న మధురమైనవి మూట, లా మాటకన్న వ.
మనసు మధురాతి మధురమ్ము మధురిమలకు మధురిమవు నీవు; నీ యూసు మధురతమము.” (సంధ్యారాగము : (మై
(పేమ పూర్ణహృదయం నుంచి వెలువడిన భావుకతా వాక్కులివి,
“కావ్యమానందాయ” అని కావ్య ప్రయోజనాన్ని నిర్వచించాడు హేమచంద్రుడు తన కావ్యానుశాసనంలో. మనిషికి ఆనందం-శాంతి- ప్రేమ వలననే లభిస్తాయి. (పేమ భరితమైన జీవనమే యధార్థమైన జీవనం. (ప్రేమ ఉన్నచోటనే ఆనందం ఉంటుంది. మాధుర్యం ఉంటుంది.
పాండిత్యం, దాన్ని మించిన కవిత్వం, ఈ రెండిటితో రూపాందిన ్రాఢ కవయిత్రి డా॥ వెంకమాంబగారు. ఆమె “అభినవాంధ్ర భాషా యోష” “అమృత కవితా నితంబిని” (సంధ్యారాగము : 109). ఈ కవయిత్రి తన అర్జిత శక్తిని వ్యక్తిత్వ శక్తినీ రెంటిని కలగలిపి ఛందో గతమైన అభివ్యక్తీతో (పేమ రసమాధుర్యాన్ని ఆలపించిన రాగాలివి.
ఈమె రచించిన ఆటవెలదులలో వనమయూరాల నృత్యం, తేటగీతు లలో మత్తకోకిలల గళమాధుర్యం ఉట్టిపడుతున్నాయి. ఆటవెలది, తేటగీతి పద్యాలకు ఒక విలక్షణత్వం ఉంది. ఏ పాదానికి ఆపాదం అర్ధవంతంగా ముగియడ మది. ఆ పద్యాలలోని గణాలను మెలికలు తిప్పితే వాటి విలక్షణతకు హాని కలుగుతుంది. అది వచనంలాగా ఉండి శ్రావ్యత చెడిపోతుంది. శైలి దెబ్బతింటుంది. డౌ॥ వెంకమాంబగారు ఈ విషయాన్ని గుర్తించి ఆటవెలది తేటగీతులను కాపాడినందుకు సంతోషిస్తున్నాను. గురుస్థానంలో ఉన్న విదుషీమణియొక్క పద్య నిర్మాణశక్తిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.
న]
“..... శుకపిక రాజహంసాదులెల్ల వాసికెక్కుట నీ గురుత్వమున గాదె?” (సంధ్యారాగము : 40) అని ప్రశంసితురాలైన ఆచార్య ఈమె. “తెలుగుభాష కింత తియ్యందనమ్ము నీ చలువ, నీవు నలువ చెలువ వేమొ?” (సంధ్యారాగము : ఫె అని నేను కూడా ఈ కవితా సరస్వతికి అయిదు పదులు చేస్తున్నాను. -ఉత్పల సత్యనారాయణాచార్య 12-7-2004 జ
ఓం వణ 7 2014012062 00046420 11.4. 710. ల101(౫0. ౫1, 6.౫౦3 కంగా 9016530 3064 1166 ౬2%! గాణ! 5166 చమ న రల%41- 600029 8 : 23632751 “ధర్మావిరుద్గో భూతేసు కామోస్మి భరతర్షభ” “ధర్మబద్ధమ్ములైన భూతముల యందు కానవచ్చెడి కామమ్ము నేనె పార్థ!”
అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ మాట లన్నవాడు అచ్యుతుడైతే. విన్నవాడు విజయుడు. అక్కడ వాళ్ళిద్దరిదీ గురుశిష్య సంబంధం. ఇద్దణూ ధర్మావిరుద్ధమైన కామాన్ని పూర్తిగా అనుభవించినవారే. అందుకే, ఆ యిరువుర ఇతివృత్తాలు రమణీయమైన ప్రణయ గాథలుగా రూపొందాయి. చతుర్విధ పురుషార్థాలలో గూడ తార్తీయీకమైన పరుషార్థంగా కామమే పేర్కొనబడింది. అదే పవిత్రమైన ప్రణయం. “కామాతురాణాం నభయం నలజ్ఞా అన్నప్పుడు కామాతురులైన నరులు, ధర్మవిరుద్ధ కామ వాంఛాపరులని అర్ధం. అందుచేత, (ప్రేమానురాగ ప్రణయాది నామాలలో వ్యవహరింపబడుతున్న ధర్మావిరుద్ధమైన కామం, జీవితం అవినాభావ సంబంధం కలవి. ఈ (ట్రేమ భావం కేవలం మనుష్యులకేకాదు; సమస్త జీవకోటికీ అనుభవయోగ్యమైనదే. అందుకే “భూకేషు' అనే మాట. కొన్ని తిర్యక్కులు కూడా నీతిబద్ధమైన కామవాంఛకు కట్టుబడి ఉండడం మనకు తెలుసు.
భూతాలన్నింటిలోనూ చాలా తెలివైన భూతం మనిషి అందుచేత వచ్చిన చిక్కంతా మనిషితోటే! (ప్రపంచం తగలబడిపోతుంటే నీకు ప్రణయ కవిత్వం కావాలా?” అంటారు కొందలు. అయితే, ప్రతి మనిషికీ జీవితంలో ఎంతో
గగ
కొంత ప్రణయానుభవం ఉండక తప్పదు. మజీ, అది ధర్మా విరుద్ధమైనదైతే దాన్ని కావ్యంలో శృంగార రూపంలో ఆవిష్కరించగూడ దనేది వంకర మాట. తదావిష్కృతి తప్పనిసరి - అనేది “సుంకరి మాట.
కవిత్వం పద్య రూపంలో ఉంటే, అందులో ప్రణయ భావం ఉంటే, అది భావకవిత్వమనీ, దానికి కాలం చెల్లిపోయిందనీ కొందరి అపోహ. నిజానికి, వస్తు రహితాలై, ప్రపంచిత భావ మాత్రాలై, భిన్న ఛృందో విశిష్టమైన రచనలన్నీ భావకవిత్వ శాఖలే. గుణాన్ని బట్టీ ఆయా కవితా శాఖలకు వేజు వేణు పేళ్ళు పెట్టుకోవడంతప్ప, అవన్నీ భావ కవిత్వాలుగా వ్యవహరింపబడ దగినవే. ఏ శాఖలోనైనా నవరసాలకు సంబంధించిన ఏ భావాన్నైనా ప్రకటించవచ్చు. తప్పులేదు. ఒక కవితాశాఖ ఒక రూపంలో ఒక కాలంలోనే వర్ధిల్లుతుందను కోవడం తప్పు. అలా వర్ధిల్లాలనుకోవడం మన బుజ్జలకు పట్టిన త్రుప్పు,.అందరూ పసగల కవిత్వం వ్రాయలేనట్లే ఎవ్వరూ అసలైన కవులను శాసించలేరు. వానకాలంలో పడే వడగండ్లు మన్ని ఎడాపెడా వాయించినా, వాటిలో ఏదో అందం ఉందని మనం చూస్తుండగానే అవి కరగి కనుమలజుగయ్యేటట్టు, ఎన్నో కవితా నామక రచనలు మఘలో పుట్టి, పుబ్బలో మాయమయిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. వాటిలో, రావం ఉన్నంతగా భావం ఉండటంలేదు. పూనకం ఉన్నంతగా “పానకం' ఉండటంలేదు. అటువంటి యీ రోజుల్లో ఒక కవయిత్రి “సంధ్యా రాగం” వంటి లలిత శృంగార కావ్యాన్ని రసిక హృదయ రంజకంగా రచింపగలగిందంటే, అది తప్పకుండా మనం మెచ్చుకోదగిన ఒక విశేషం.
ఈ సంధ్యారాగ కృతిలో ఎక్కడా శబ్దాడంబరం లేదు. అర్థక్షిష్టత లేదు. అశ్లీలం లేదు. పేలవత్వం లేదు. నీరసత్వం లేదు. ఆద్యంతం విరహ పీడితుడైన ప్రియుని ఆవేదన వ్యక్తమవుతున్నా ఎక్కడా నైరాశ్యచ్భాయలే లేవు. ఆదినుండి అంతం వరకు అలవోకగా పాఠకుల మనన్సుల్ని ఆకట్టుకొని, వారికీ రసానుభూతిని కలిగించగల లలిత శృంగార పేశలమైన రచనమాత్రమే ఉన్నది.
సగ
“శృంగార ఏవ మధురః, పరప్రహ్లాదనో రసః” అనే సిద్ధాంతాన్ని పటిష్టం చేస్తూ, ఈ కావ్యం కవయిత్రి రచనా వైశిష్ట్యాన్ని వేనోళ్ళ చాటుతున్నది. సంధ్యారాగాన్ని గుజించి మరో సంగతి చెప్పాలి. ఈ కావ్యంలో పోషింవబడిన విప్రలంభ శృంగారానికి ఆలంబనం పురుషుడు. అంటే కావ్యమంతా నాయకుని విరహ వర్ణనమే. అయితే యీ కావ్యాన్ని రచించిన దొక స్త్రీ, ప్రతి కథా పాత్రలోను కవి పరకాయప్రవేశం చేసి, ఆ యా పాత్రల్ని తత్తద్గుణానుసారంగా చిత్రిస్తేనేగాని, సమగ్రమైన _ సజీవ పాత్ర చిత్రణం కుదురదు. ఆ విధంగా పాత్రలలో తాదాత్మ్యం చెంది తనది అనదగిన ఏ వాక్యం లేకుండా పాత్రోచితమైన చిత్రణంలో పూర్తిగా పాత్రను అభివ్యక్తం చేయాలంటే కవికి ఆత్మ పరిమార్దనం (561[-0011[2400) ముఖ్యం. ఆత్మ పరిమార్దనం కుదిరితేనేగాని పాత్ర చిత్రణ సమయంలో కవి ఆత్మ వ్యక్తీకరణ ప్రమాదానికి గుజీకాకుండా తప్పించుకొనలేడు. అయితే, కవి పూర్తిగా తన్ను తాను మరిచిపోతే రచన సాగదు. అందుచేత పాత్ర చిత్రణ సమయంలో కవికి కావలసింది ఒక విధమైన తటస్థ భావమే. “తాను' అనే ఆత్మ ప్రతీతికి దూరం కాకుండానే అత్మ పరిమార్దన వ్యవస్థితమైన నియతాత్మలో నిర్దుష్టంగా ఆయా పాత్ర చిత్రణ చేయవలసి ఉంటుంది. ఇది అసిధారావ్రతం ఇటువంటి పాత్ర చిత్రణం నాటక రచయితకు అవశ్యానుష్టేయం. ఆత్మాశ్రయ కవికి ఆ చిత్రణం సాధ్యపడదు. ఆత్మాశ్రయ కవిత్వమే అయినా, “సంధ్యారాగం'లో నాయకుడైన పురుష పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, యీ అసిధారావ్రతాన్ని ప్రశంసార్హంగా నిర్వహించింది కవయిత్రి వెంకమాంబ. అందుకే యీ కావ్యాన్ని చదివేటప్పుడు అందలి ప్రతిమాట కావ్యనాయకుణ్ణి మన కనులముందు నిలుపుతుంది కానీ, ఆ నాయకుణ్ణి సృష్టించిన కవయిత్రిని కాదు. ఏతాదృక్సాత్ర సృష్టి చేయగలిగిన కవయిత్రులు తెలుగు సాహిత్య రంగంలో ఎందరో లేరు. ఈ కావ్యాన్ని కవయిత్రి తన గురువు కంకితం చేయడం మరొక విశేషం. గురుశిష్యుల అనుబంధానికి కాలదోషం పట్టిన ఈ కాలంలో అరుదుగానైనా నా!
అక్కడక్కడా ఇటువంటి సంఘటనలు జరుగుతుండటం హర్షించదగ్గ విషయం. ఈ 'సంధ్యారాగ' కావ్యాన్ని తన గురువు ఆచార్య కొలకలూరి ఇనాక్కు అంకితం చేసి, పాతబడిపోతున్న ఒక సదాచారాన్ని సముద్ధరించిన వెంకమాంబ వినయ శీలం మెచ్చదగింది. “విద్య యొనగును వినయంబు”. అవును. ఆమె విద్యావతి. అందుకే గర్వ లోభాది దుర్గుణాల కతీతమైన ఆ వినయం, ఇక వెంకమాంబ కవితా మధురిమను రసికులకు కించిన్మాత్రమైనా
చవిచూపవలసి ఉన్నది. విధురుడైన ప్రియుడు ప్రియురాలు నుద్దేశించి యిలా అంటున్నాడు-
“వలచి వలపించు కడలి కౌగిలికి చేర
చరణ మంజీర ఘలఘల స్వరము లొలయ
పరుగు పరుగున నేగు నిర్జరిని జూడ
తెలియదా! ప్రియదర్శినీ! వలపు మహిమ.” (ప.3)
సెలయేరు ఎగిరెగిరి దూకుతూ పరుగెడుతోంది. ఆ దూకుడంతా కడలి
కౌగిలి చేరడానికే. మా ఊళ్ళోకూడా కడలి ఉంది. కాని 'పూండిలో నీళ్ళు లేవు. ఆ నిర్షరి అక్కడకు రాకూడదా! ఊహూ రాదు. కడలినే వెదుక్కొంటూ వెడుతుంది. అదే మజి వలపు మహిమ! ఉప్పు నీటితో నిండిన కడలి రాయుణ్లే నిర్ణరి అంత (ప్రేమిస్తుంటే మఠి నేను చేసిన నేరమేమిటి? అని వాపోతున్నాడు విరహార్తుడైన ప్రియుడు.
“సకియ నా మది నీ కనుసైగ విడిచి
ఈ ప్రపంచసంచారమ్ము నిష్టపడదు
నాకు నెపుడు నీ తోడిదే లోకమయ్యె
కట్టిపడవైచె నీ కనుకట్టు విద్య” _ (ప.21)
కనుకట్టు విద్యను గారడీవాళ్ళు ప్రదర్శిస్తుంటారు. కాని, దాని ఆనుపానులు మనకు తెలియవు. ఇక్కడ కవయిత్రి అటువంటి కనుకట్టు
ప.
విద్యను విశదంగా మనకు ప్రదర్శించి చూపుతున్నది. ప్రియుడు ప్రియురాలి కనుసైగకు కట్టువడి పోయాడు. కాబట్టి, ఆమెది కనుకట్టు విద్య. ఇదే విధంగా మజొక చోట కూడా ఇలా అంటుంది కవయిత్రి. “కనుల కాటుక దిద్దితే కమల నయన! కాటుకా! అది కాదు, కన్కట్టు మందు”. (ప.34) ప్రియురాలు కన్కట్ట విద్యలో అంత ప్రవీణురాలు కాబట్టే - “వధువు చిటికెన నైలు చేపట్టి వరుడు వెంట నడిపించుకొని పోవు విధము కలదు, (పేమ కిటుకేమొ! చెలియ! నీ వెంట నంటి పరుగులిడుచుంటి నే వెజివాని పగిది”. (ప. 44) అని వాపోతున్నాడు పాపం! ప్రియుడు. అలా పరుగెడుతున్నా సరే, ఆమె చరణయుగళి కందిపోతున్నదన్న బాధేగాని, ప్రియుడికి తన పొదా లేమైనవనే బాధే లేదు. “సహజ సుకుమారమైన నీ చరణ యుగళి కణకు రానేల నడయాడి కందిపోయె, కాంచి నా కనుల్ దుఃఖాశ్రు కణము లాలికె పఅచి యుంచెద అరచేయి పదము లిడవె!”” (ప.55) తనను వెళ్టీవాణ్ణి చేసినా సరే ఆమె అడుగులకు తన అరచేయిని పాన్పుగా చేసే ప్రియుడి అనురాగాన్ని కవయిత్రి చిన్న చిన్న మాటల్లో వ్యక్తీకరించిన తీరు మనోజ్ఞంగా ఉంది. “ఉదయరాగమునకు మూల మెదియొ అదియె మూల మయ్యె సంధ్యారాగమునకు సకియ! మన శరీరాలు వేజైన మన సాకండె అదియ సాగించె నింత ప్రమాయణమ్ము” (ప. (ఖ్ మ.
ఉదయరాగంలో ప్రేయసి. సంధ్యారాగంలో ప్రియుడు. అక్కడ విరహిణి. ఇక్కడ విరహి. ఇరువురూ ఒకరికోసం ఒకరు పరితపిస్తున్నారు కాబట్టి ఇది ఏకతైవానురాగం కాదు. అయితే, పరస్పరానురక్తుల కీ విరహబాధ ఏల? అంటే, ఒక్కొక్కప్పుడు పరస్పరానురక్తులయిన నాయికా నాయకులు కూడ పార తంత్ర్యంవల్ల గాని, దైవికంగా గాని ఎడబాసి ఉండడం జరుగుతుందనీ, అప్పటి వారి విరహం “అయోగ విప్రలంభ శృంగారిమవు తుందనీ దశ రూపకకర్త ధంనజయుడు చెప్పాడు. వెంకమాంబ కృతులైన ఉదయరాగ సంధ్యారాగాలు రెండూ ఈ శాస్త్ర మర్యాదకు హద్దుల్లా రూపొందాయి. వెంకమాంబ కవితా చమత్కృతికి మరొక మచ్చుతునక మాత్రం చూపి విరమిస్తాను. ప్రియుడు (ప్రేయసి అధరా న్నిలా వర్ణిస్తున్నాడు- “పైన చిరునవ్వు వెన్నెల-లోన ప్రణయ జీవనాధారసుధ జన్మసిద్ధమైన అధరమా అది కాదు వియత్తలమ్ము వదలి కదళి వచ్చిన నెలవంకగాని” (ప. 163)
చంద్రుడు వెన్నెల టేడు. ఆమె చిజునవ్వు వెన్నెల, అతడు సుధాకరుడు. అమె అధరం సుధామయం, అందుచేత, ఆమె అధరం నెలవంక. రమణీయ మైన కల్పన. ఈ కల్పనవల్ల స్ఫురించే మజొక విశేష మేమంటే, నాయిక కురులను మేఘాలతో పోల్చడం కవి సమయం. అందుచేత, ఆమె అధరం వియత్తలం నుండి దిగివచ్చిన చంద్రరేఖ అనడం సముచితం. సంధ్యా రాగంలాగా ఈ కవయిత్రి కృతి కూడా నానావర్ణ రంజితమై హృదయాహ్లాదకారిగా భాసిస్తున్నది.
ఈ కవయిత్రి వృత్తాది ఛందస్సాధన కూడా చేసి, మజీన్ని విశిష్ట కృతులను వెలయించాలని ఆకాంక్షిన్తూ అవెకు అభినందనలూ, ఆశీన్సులూ తెలుపుతున్నాను.
౧౦
సకల జీవుల చిత్త జాడ్యమ్ము హరియించు వాసంతలక్ష్మితో వరుసకలిపి, విరహులపై దండు వెడలు మన్మథ దేవు కేతనమ్మున చేంవ కీంత గజపి, నవచూత కిసల యాన్నము మెక్కి యెసరేంగు కలకంఠములకు రాగములు నేర్చి, మనసు ర్సుల్లన వీచి మరులు రేకెత్తించు మలయానిలమ్ముతో మలసియాడి, పంకరుహవైరి పసలెల్డ్ల సుంకమడిగి, మధుర శృంగార భావనా మహిత మగుచు నెగడి, “సాంధ్యరాగమ్ము” న నీదు కవిత విరహీజనవేద మైన దో వెంకమాంబ! = వి. రామచంద్ర చబొదరి 18-10-2004 గనె
మధుర కవితా సరస్వతి, 6-3-668, దుర్గానగర్ కాలనీ రసధుని, మహాకవి, పంజగుట్ట, హైదరాబాదు-500 082 దుగ్గిరాల రామారావు ఫోన్ : 23402277 హైదరాబాదు-500 082. శ్రీరస్తు ఆశీస్సుమమంజరి సుంకరాన్వయ శశరేఖ వెంకమాంబ మృదుకవిత కింత మాధుర్య మెట్టు లబ్బె? పంచదారయు విరిదేనె పనసతొనలు కలిపి సృష్టించె. గాబోలు! నలువరాణి. 1 అలోరంగనాథ రామాయణ (గగ్రంథాను శీలనమ్ము” విమర్శ ఖేలనమ్ము “ఉదయ రాగము” నందు సదమల భావాలు జీవాలు గ్రేమోపజీవతతికి; “రామయణములోని రసరమ్య ఘట్టాలు” పట్టుగొమ్మలు తేనె తెట్టియలకు; నవధాన కళ గూర్చి వివిధాంశముల. దెల్చు వ్యాసమ్ము చాతుర్య భాసురమ్ము అన్నమాచార్య సంక్రీర్తనావళీ వి శిష్ట విశేషణము సముత్కృష్ట రచన; వినుతి పాత్రముల్ నీ కృతుల్ వెంకమాంబ! కల్లకాదిది కల్ల నావల్ల! గాదు. 2 నీ 'సంధ్యా రాగము'లో భాసిలు సుకుమార భావబంధుర హృదయో ల్లాసకర మృదుల పదవి న్యాసము మెచ్చందగు, వెంకమాంబా విదుషీ! 3 నగ
ఉజ్వల కవిత్వ బాలభానూదయమున “కుదయ రాగము” తలపోయ నుదయ నగము, “సాంధ్య రాగము” వికసిత సరస కవన మంజుల సువర్ణపద్మ పద్మాకరమ్ము, తీ అభిమానవతివి, సుమతివి, అభినవ తరిగొండ వెంకమాంబవు కవితా విభవమ్మున, సుంకరకుల మభినుతి. గనె నీవు జన్మమందిన కతనన్. ర్ విరిదేనె సోనలన్ గురియు నీ మధురవా గ్వైభవమ్మునకు సౌభాగ్యమస్తు! సరసాంధ్ర సుకవితా విరచనమ్మందు నీ యుత్సాహమునకు నభ్యుదయమస్తు! చదివినంతనె గుండె. గదలించు నీ కావ్య రుచిరార్థ సూక్తి కారోగ్యమస్తు! కమనీయమైన సత్కృవనమ్ముపైన నీ యభిమానమునకు దీర్చాయురస్తు! అమృత భావ స్రవంతి నోలాడు నీదు చిత్తమునకు మనోరథ సిద్ధిరస్తు! వినుత వితరణాలంబ! సద్గుణకదంబ! సుంకర పయోధి శశిబింబ! వెంకమాంబ! 6 = దుగ్గిరాల రామారావు 11-7-2004 న.
అవధానసరన్వతి, అవధానిరత్న దోన్ - 518222 మహిశూర దత్తపీర ఆస్థానకవి, కర్నూలు జిల్డా గండ్లూరి దత్తాత్రేయ శర్మ,ఎం.ఎ. ఫోన్ - 221890 శతావధాని, అమోదము సీ రామాయణ పురాణ రచనావిమర్శన పండితాళికి సుధాపానమయ్యె, ఉదయ రాగంబున హృదయ మాశించిన ప్రణయ సామ్రాజ్యమ్ము ప్రాప్త్రమయ్యె, రామాయణంబున రసరమ్య ఘట్టాలు కవితాసతికి రత్తకాంచియయ్యె, అవధానవిద్యా రహస్యవిశ్లేషణ రసికజన మనోభిరామమయ్యె, తే॥ కలసి వచ్చెనొ పుణ్య పాకమ్ము నేడు వలచి వచ్చెనా నోముల పంట తోడు వినుతి కెక్కితె సుంకర వెంకమాంబ! కవిత పరవళ్ళు త్రొక్కించు కతనమాకు. 1 చం॥ అమృతము గ్రోలినట్టు మలయానిల మల్లన తాకినట్లు రా గము చెవి సోకినట్లు పసికందు పసందుగ నవ్వినట్లు ప ద్యము పలికించు సుంకర కులాంబుధి రత్నమ! వెంకమాంబ! నీ సుమధుర భావనా లహరి చొక్కనివాడు రసజ్ఞు డెట్లగున్? 2
- గండ్లూరి దత్తాత్రేయ శర్మ 24-7-2004 న...
డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి,ఎం.డి. 7/829 సరస్వతీ మందిరం రోడ్ శిశువైద్య నిపుణులు వై.యం.ఆర్.కాలనీ ప్రొద్దుట్టూరు- 516361 ఫోన్ - 253594 ప్రస్తుతి తెలుగు పలుకు బడుల తియ్యందనాలతో ఎడద పులకరించు నుడులతోడ ఉదయరాగ కృతిని హొయలుతో నడిపించి వెంకమాంబ కవిత వెల్లివిరిసె. 1 రాజహంస నడక రసరమ్యఘట్టాలు కులుకులొలికి మదిని పలకరించు వెంకమాంబ కవిత వింతశోభల తోడ విన్నువేల్చు విల్లు వెలుగులీను. 2 రంగనాథ రామాయణ రత్ప్నరుచుల కష్టమను మాట లేకుండ కమఫణితి తెలుగు జాతికి పంచిన ధీవిశాల ప్రథిత వెంకమాంబను నేను ప్రస్తుతింతు. 3 -డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి 24-11-2003 నుగ
కృతజ్ఞతాంజలి ఖో “ఉదయరాగంి నా తాలి సద్యకృతి. ఇతివృత్తము- నాయికకు నాయకునిపై గల నిర్వ్యాజానురాగ భావవ్యక్తీకరణ. “సంధ్యారాగం'లోనిది నాయకుని హృదయంలో నాయిక గురించి తొణికిసలాడే భావపరంపరాభివ్యక్తి
ఉదయరాగం సంధ్యారాగానికి నాంది.
కృతిస్వీకారము ఆమోదించి, సంధ్యారాగానికి చక్కని వ్యాఖ్యానంతో తమ అభిప్రాయాన్ని వెలార్చి, 'అభినందన'తో ఆశీస్సులందజేసిన, అభ్యుదయ కవి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య కొలకూరి ఇనాక్ గౌరికి నా కృతజ్ఞతా నమోవాకములు.
ఆత్మాశ్రయ కవిత్వ, భావకవిత్వ ధోరణులను వివరించి, “సంధ్యారాగం' పద్యకావ్యాన్ని విశ్లేషించి, కవితా విశేషాల నుగ్గడించి, కవయిత్రి గండపెండేర సత్కారమందుకోవాలనే ఆకాంక్షను వెలిబుచ్చి, 'మధురగీతిని' ఆలపించిన విమర్శక శిభామణులు అచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారికి నా కృతజ్ఞతా నమస్సులు.
“పేమహృదయాన్ని' పీఠిక రూపంలో ఆవిష్కరించి, సంధ్యారాగానికి చక్కని భాష్యం వ్రాసిన మైసూరుదత్త పీఠ ఆస్టాన విద్వత్కవులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కార గ్రహీతలు, సుముధుర భావకవులు, సహృదయశీలులు శ్రీ ఉత్పల సత్య నారాయణాచార్యగారికి నా హృత్పూర్వక కృతజ్ఞతోత్సల నమస్సులు.
గర
ఛలోక్తులు రువ్వుతూ, చురకలువేస్తూ చమత్కారబంధురంగా “ధర్మావిరుద్ధకామమే భగవంతుని స్వరూపం' అన్న సత్యాన్ని నిరూపించి, “సంధ్యారాగం' విరహిజనుల వేదమని నిర్వచించి, పద్యవైభవాన్ని ఆవిష్కరింప జేసిన సరసకవి ఆచార్య వి.రామచంద్రచాదరిగారికి ఏవిధంగా కృతజ్ఞతలు తెలియజేయగలను? “అంజలి గావించెద ప్రాజ్ఞ శేఖరమణీ! సద్బంధు చింతామణీ![” నా రచనలన్నీ చదివి 'ఆశీస్సుమమంజరి'తో నన్ను దీవించుటే కాక ఈ సంధ్యారాగం సుందరపుస్తకాకృతిని సంతరించుకొను కార్యశక్రమంలో ముద్రణ వ్యవహారాన్ని ఆసాంతం పర్యవేక్షించిన సహృదయులు, మాన్యులు, మధుర కవివరేణ్యులు, శ్రీదుగ్గిరాల రామారావుగారికి - పద్యాలలో '“ఆమోదము'ను, “ప్రస్తుతి'ని అందజేసిన కవివతంసులు శ్రీగండ్డూరి దత్తాత్రేయ శర్మ శతావధాని గారికి, డా॥కోడూరు ప్రభాకరరెడ్డిగారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. “సంధ్యారాగం' సకాలంలో చక్కగా డిటిపీ చేసిన శ్రీ కుడివూడి భాస్కరరావు (మనుగ్రాఫిక్స్) గారికి, ముద్రించిన శ్రీఎ.జగన్మోహనరెడ్డి (కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్) గారికి, ఆకర్షణీయంగా ముఖపత్ర చిత్రాన్ని వేసిన చిత్రకారులు శ్రీ వలసల హరికృష్ణగారికి నా కృతజ్ఞతలు. ఇంతవరకు వెలువడిన నా కృతుల నన్నింటిని పరిశీలించి నన్ను అభినందిస్తూ ఆశీర్వదించిన ప్రముఖుల అభిప్రాయాలను సంగ్రహంగా ఈ పుస్తకం చివర పొందుపరిచాను. వారందరికీ నా కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు. ఈ సంధ్యారాగం కృతి కూడా రసజ్ఞులైన పాఠక ముహాశయుల ఆదరాభిమానాలు పొంది, నా కవితాకుమారి చరితార్జురా లవుతుందని అశిస్తూ... బుధజన విధేయురాలు = డొ॥సుంకర వెంకమాంబ 22-12-2004 న.
త్ డా టు మ్మా! క కహ! లో న [ం/ స రము (య [1 నై సుల నై ర (| న శ య్ (| ్గి యం 4ల్ (/ శ [సరం ళు గ క్షీ 1 సట. స ఆ న.
శ్రీరస్తు
ఇల్ల
సంధ్యారాగము పశ్చి మాశాంగనా మనోభావ మెంచి ఉల్లము చలించి తరణి రాగిల్లె ననగ సాంధ్య రాగమ్ము విరిసె నో సకియ! చూడు, వలపు మొలపించు ప్రకృతి సొంపులకు బలుపు. 11 పలుకులో, పాటలో నొకేబాట గాగ భామ! బ్రతుకులో తీపిని పంచుకొనుచు ఎజ్జగురువింద పొదరింట ఎదు రెదురుగ కూరుచున్నవే! శారికాకీరయుగము, 2
కజ2848 దా; సుంకర వెంకమాంబ ౩262640326 262క23సస262కప30323230303262
2 సంధ్యారాగము వలచి వలపించు కడలి కౌగిలికి చేర చరణ మంజీర ఘలఘల స్వరము లొలయ పరుగు పరుగున నేగు న్పిర్ణథిని చూడ తెలియదా! ప్రియదర్శినీ! వలపు మహిమ. ౩ కోయిలకు నా పయిన అంత కోపమేల? సకియ! తన కుహూ గాన నిస్వనము తోడ ప్రేమ భావన నాలోన విరియ జేసి గాసిపెట్టును, నీవైన కనికరింపు. లే .మొయిలుతా చేసికొన్నట్టి పున్నెమేమొ సుదతి! దివి నుండి భువి నెల్ల చూడగలదు, ధరణి నుండియు నీ ముఖ దర్శనమ్ము పడయ లేనట్టి మంద భాగ్యుడను నేను. ర్ ఇడశరాళ 23 ఈ 3230626 2626092626082326హ326 డా సుంకర వెంకమాంబ 28284
సంధ్యారాగము పె గుండె దోచుకొందురొ అను గుబులుకొలది గడియయైనను నిదురపట్టెడిదికాదు, ఇచ్చమెయి నేనె హృదయమర్పించుకొంటి, దశ తిరగకున్ని? సత్పాత్రదానమహిమ. 6 విసుగు చెందను నా (పేమ విన్నవింప, మగువ! సుకుమార మందార మధువు గోరి ఎదుట రొదసేయు కొదమ తుమ్మెదను గనమొ! ఫల మొసగితీరు కష్ట మెప్పటికి నైన. 7 తలిరు జొంపాల మెటుగు టందమ్ముగాని తమ్మి పూవుల విరియు గందమ్ముగాని తరళ మందారముల మరందమ్ముగాని మెలత! ఎవరిక? కొదమ తుమ్మెదకు గాక! 8 ౩౫826 దొ॥ సుంకర వెంకమాంబ
టే సంధ్యారాగము సన్నజాజులు విరిసిన సంజవేళ, పిల్లగాలులు మెలమెల్ల విసరువేళ, మసక మసకగ చీకట్లు ముసురువేళి, మదిని కోరెద నిను జేర మానవతిరొ! ర వేడుకొనె మేఘమాలను ప్రియు డొకండు, ప్రణయకథ దెల్పె హంసకు ప్రభువొకండు, విన్నవించెను చిలుకకు వేల్పొకండు, రమణి! మనమధ్య రాయబారమ్ములేల? 10 నవ రసోల్లాస భావవిన్యాసములకు నీ కనుంగవ కాణాచి కాకయున్న ఈ జగన్నాటకమ్ము స్తంభించిపోదె! అమ్మొ! నా కన్నులకు బైర్లు క్రమ్ముకొనవె! 11 కజాతిణతడథ2క26275262526260262626262626234 డ్రా, సుంకర వెంకమాంబ 23261
సంధ్యారాగము వ్ నీవు గల గల నవ్వుచో నిఖిల జగతి వలపు జలపాతములు పరవళ్ళు తొక్కు నన్ను మురిపింప నీ చిరునవ్వుచాలు, అదియ ప్రణయ హర్మ్యమునకు మొదటి మెట్టు 12 ప్రతి దినమ్మును మాటాడవలసి నట్టి క్రొత్త ముచ్చటలకు నేమి కొదువ లేదు, చెలమ నాగుండె, చేదిన కొలది ఊరు ఊటలై ఊసు లెన్నోన్నొ పోటి పడుచు. 13 ఎదురు చూచితి నీకోసము లతాంగి! వింత పులకింత సుంత విన్సింతమనుచు, నీ గళస్వనమ్మును విని మూగవోతి ఇంక (మ్రాన్నాటు తొలగింపు మీవె చెలియ! 14 ఆ2*ఇ౪ దొ; సుంకర వెంకమాంబ ఆహ౫౫క26డ6డ52కడక 26 2కడాకడరరాకడ62కడకపకడకళ
ర సంధ్యారాగము ప్రణయినీ! నీ పరిచయ మేర్ప్చడక మున్ను తెలియచుండెను నాకు రాత్రింబవళ్ళ కాలగమనమ్ము నీదు సాంగత్య మహిమ ఎపుడు పగలు రాత్రయ్యెనో ఎజుగ నైతి. 15 ధర అయస్కాంత మనుమాట తప్పా ఒప్పా దానితో నాకు పనియేమి? గాని చెలియ | నన్ను నిత్య మాకర్షించుచున్న కతన నీ వయస్కాంత మన్నది నిజము! నిజము! 16 ప్రియసఖీ! నీవు నడయాడువేళ సొగసి గజ్జె లందియల్ వినుచు సంగతులు వింటి, ప్రణయ కావ్య రసధ్వని ప్రాణములవి ఆంతరంగిక భావ భాష్యమ్ము లవియ. 17 చగిరణం డక పరణ 626 362626264082628282626266 దా సుంకర వెంకమాంబ 28282
సంధ్యారాగము క్ మసక చీకటి పరదాల మాటు నుండి చిలిపి తారక తొంగి చూచినది చూడు, ఎదురు చూపులలో గూడ ఎంత హాయి ఉన్నదో, దోచుకొమ్మన్న దో లతాంగి! 18 రాధ మనసున కృష్ణుని రాసలీల కృష్ణ హృదయమ్మునన్ రాధ నృత్యహేల ఎన్ని జన్మల బంధమొ్మ ఎవరి కెరుక, వలపు జవరాల! తెలిసికోవలయు నీవు. 19 సూక్ష్మమున మోక్ష మను సూక్తి సుందరాంగి! సుంత అవగతమయ్యె నీ చూపు కతన, పలుకనేర్చిన నాల్క చెప్పంగలేని సంగతుల నెన్మా నీ చూపు చాటిచెప్పె. 20 ౭2౭౫౩ దొ సుంకర వెంకమాంబ :3262401ష303032803262ఆ26062606ఉ6003234
కి సంధ్యారాగము సకియ! నామది నీ కనుసైగ విడిచి ఈ ప్రపంచ సంచారమ్ము నిష్టపడదు, నాకు నెవుడు నీతోడిదే లోకమయ్యె, కట్టిపడవైచె నీ కనుకట్టు విద్య. 21 నీవు బహుదూరమందు నున్నావటంచు మథనపడితిని మొదట ఓ మంజువాణి! గుండెగుడినున్న నిన్ను కన్లొనిన నాకు ఎంత దగ్గణ నుంటివో ఇపుడు దెలిసె. 22 పలకరింపుల వరకేల ప్రణయరాజ్ఞి! నీవు 'ఊ” అన్న ఆనంద మావహిల్లు, “ఊ' యనెడిదాక ఎందుకే? ఊసు దెలుపు ఒక్క చిజునవ్వు చాలు నన్నూపివేయ. 23 ఆడర26262626262క282క2326262606262326* డ్రా, సుంకర వెంకమాంబ 28284
సంధ్యారాగము 9 అధరముల యందు మధువు కాదన్న నాడు కలికి చూపులలో కైపు గననినాడు ముద్దు లేదు ముచ్చట లేదు, ముద్దరాల! నిన్ను కాదన్న సృష్టియే నిండుసున్న. 24 కాదు లేదని వాదింపరాదు రమణి! ఉన్నమాట వచించెద నున్న యట్లు, నిన్ను మిక్కిలి ప్రేమించుచున్నవాడ కానిచో కైతపై నెట్టు కలుగు మోజు, 25 పసిడి అందియల్ చూచు నెపమ్ము వెట్టి చిన్నిపదములుతాకి హర్షించ గంటి; రాధ మృదుపాదములకు పారాణిదిద్ది కృష్ణు డింకెంత మై పులకింత గనెనొ! 26 క87648 డొ॥ సుంకర వెంకనూంబ ౪౫౪2626256 2626 0606262623260626282602
10 సంధ్యారాగము నన్ను మజిచిపోలేవని నాకు తెలియు కొని నీ బింకమును గాంచి కలత పడుదు; “హృదయమును దోచుకొంటి నింకెందుబోదు” వను నుదాసీనమా! ఓర్వనౌనె చెలియ! 27 మమతతో నీవ పల్కరింపని క్షణమ్ము ఎంత దిగులొందినానా నీకేమి తెలియు, చేరరానని నీవు భీష్మించుకొన్న ప్రణయినీ! నీక జీవచ్చవమ్మె మిగులు, 28 నీవుగా వచ్చి పిలిచిన నిమిషమందె వచ్చి వ్రాతెదమని ఆశపడుచు నుంటి, తెల్లవారదు నీక్సు, నావల్ల కాదు, చిక్కుముడి వీడు బెట్స్పలన్లో చెప్పు చైల్ర్స! 29 నరరరంరరడరంరరవకరరళరరకననక నక ద్ర్యా సుంకర వెంకమూంబ 26232
సంధ్యారాగము 11 వయసునకు తగ్గ పడుచు లభ్యంబుకాని అంతవరకును మనసు త్రుల్లింతలెన్నా? నీవు తారసపడిన అ నిమిషమందె చినుకు చిక్కిన ముత్యంపు చిప్పనైతి. 30 నిన్ను ప్రేమించినది మొదల్ నీవు గాక ఎవరు పల్కరించినగాని ఏదొ విసుగు, బండబాజీన (ప్రేమ తపస్వి నైతి, నన్నె మరచిన వెర్రి మనస్వి నైతి. 31 మనసు చెదరని అత్మాభిమాని వీవు, రాజసముపోని ఆత్మగౌరవము నాది, పృథ్వి జనముల దృష్టిలో బేల వీవు, నిజమునకు బేలయైనది నేనె చెలియ! 32 82౭28 దొ॥ సుంకర వెంకమాంబ
12 సంధ్యారాగము కొంగు తగలకనే - వెంట గ్రుమ్మరిలితి మంత్రముగ్గుని వోలె-ఓ మంద గమన! మరుని మాహేంద్ర జాలమ్మొ! మరుల మందొ! కొంగు కొస నన్ను ముడివైచు కొంటివిపుడు. 33 ఒక్కసారి నావైపు నీ యోర చూపు తొంగి చూచెనొ! లేదొ! నే బెంగపడితి, కనుల కాటుక దిద్దితే! కముల నయన! కాటుకా! అది కాదు కన్కట్టుమందు. 34 సిగ్గు సింగొరముల రూపు చెక్కుచున్న చిలిపి కాటుక కనుల రెప్పలు కదలి చూడవే! నెచ్చెలీ! నిన్ను వేడుకొందు, ఈ23:282646:26625626252325262826262625% ద్రా| సంకర వెంకమాంబ 28284
సంధ్యారాగను 13 కోరదలచిన సురశాఖి గోరుకొందు అముదపు చెట్టు జోలికి అసలు పోను త్రాగదలచిన అమృతమ్మె త్రాగనెంతు ఎంగిలించిన పూదేనె లేల? నాకు. 36 అమృతమును గ్రోలవలె నను ఆశకలదు, దానికై దేవతల వేడ దలచుకొనను, ప్రణయ దేవతా! నీయధరమ్ము చాలు, ఇంట సీరియుండ యాచింపనేల పరుల? 37 నాకు తోడుగ నీవున్న నరకమైైన సకల సంతోషముల గూర్చు స్వర్గమౌను, వెంట నీవున్న జాదారి కంటకములె లలిత లావణ్య నిధులు - గులాబి పూలు. 38
[14 సంధ్యారాగము వలపు తియ్యందనమ్మును తెలియ లేమి చందమామను మెత్తురు మందమతులు, సకియ! నీవున్న నాకేల చందమామ! నీవు లేకున్న నాకు వెన్నెల అదేల? 39 శిష్యలోకమ్ము లోక ప్రసిద్ది గనుట సరిగ తీర్చిదిద్దిన గురువరుని చలువ, అతివ! శుకపిక రాజహంసాదులెల్ల వాసి కెక్కుట నీ గురుత్వమునగాదె! 40 శాపవశమున దివినుండి జాణీ భువికి అవతరించిన తారకా యువతి వీవు, తోడు కోరిన సుకవి చంద్రుడను నేను, చెలియ! తప్పునె జన్మజన్మల బుణమ్ము 41 ఈణశర5 2626062603 06262623282606262628 దా; సుంకర వెంకమాంబ 22౫౫౫
సంధ్యారాగము 15 ప్రాణసభి! నీవు కట్టిన పట్టుచీర కుచ్చెళులు తాక భూదేవి ముచ్చటపడు, చెలియ! నా సంగతిని వేరి చెప్పవలెనె! ధరణికన్న అదృష్టజాతకుడ నేను. 4 లతకు కవితకు తెలుసు సంగతియె సుమ్ము సముచి తాశ్రయమొందుట సరస మనుచు, సరస నేనుండ నింకేల కొరత నీకు, వలచి రాలేవొ? చెంతకు వలపు తీగ! 43 వధువు చిటికెనవేలు చేపట్టి వరుడు వెంట నడిపించుకొని పోవు విధము కలదు, ప్రేమ కిటుకేమొ? చెలియ! నీ వెంటనంటి పరుగులిడుచుంటి నే వెట్టివాని పగిది. డీటీ
16 సంధ్యారాగము తారకాంగనల్ బిరబిర దరిని జేర వెండివెన్నెల పరచె జాబిల్లి చూడు, అలపు సాలపులు తీరగ అతివమిన్న! అనుభవింత మా హాయిని ఆశదీర. 45 ఎన్నిలేకున్న నీవు తోడున్న యెడల ఇహము నందు కష్టమ్మైన ఇంపు నింపు; ఎన్నియున్నను నీవు లేకున్న్మయెడల పరమ సుఖమైన నాకు దుర్భరముసుమ్ము! జీర చివురుటాకుల చెంగావి చెలువు గెలుచు- విధి సృజింపగ జాలని సుధలు దాచు నీదు మధురాధరమ్ముపై నిలిచి పిలుచు మొలక నవ్వులె నాకు సంకెలలు చెలియ! శ 2 కషక:2క26023282603232ఈ262826263232624% డా, సుంకర వెంకమాంబ 28262
సంధ్యారాగము 17 మాట పలుకును లేకుండ మత్తు మందు ఈక్షణంబుల చల్లె దో ఇందువదన! మనసు మనసులో లేదు నా మాట వినదు, ఎట్లు భరియింప గలవాడ నిట్టి పోరు. 48 మున్ను చేసిన పుణ్యాన నిన్నుగంటి, దేవు డిచ్చిన వరమని తెలిసికొంటి, వలచి వలపించి నావేమి ఫలము? చెలియ! చేరరాకుండ కట్టడి చేసినావు. ఉరి “ఉవిదలకు బుద్ది పెడతల నుండు” ననిరి ఇంతులకు సూక్ష్మబుద్ది నాల్గింతలనిరి, ఇది ప్రజావాణి; ఇందు నెయ్యది నిజమ్మొ ప్రియతమా! నీవె యిక నిరూపించవలయు. 50 ఇ282౪ దాః సుంకర వెంకనూంబ ౪232625262625432626262626260062626262
18 సంధ్యారాగము నిండు పున్నమి వెన్నెల నివ్వటిల్లె, మల్లెపూల గుబాళింపు మత్తుజల్డె, పిల్లగాలి పచారులు 'పెచ్చరిల్డె, ఇన్ని మనకోసమే నని ఎలుగు చెలియ! క్1 ఏది జరిగిన మనమంచికే యటంచు తృప్త్పిపడుట మేలంటివి ఆస్తురాల! కానీ మనమధ్య ఎడబాటు కలుగుటేల మంచిదయ్యెనో నాకు బోధించు మీవె! 52 ధ్యానమందునో! వేరె చింతనము కలదు, తపము లెమ్మందునా! మంత్రజపము లేదు, అబ్బె మనసున కేకాగ్రతానుభూతి, ప్రణయ రసరాజ్ఞి నీ ప్రభావమ్ము సుమ్ము 53 ఇ౮౩:232626262626262603082803260626264 డ్రా; సుంకర వెంకమాంబ 28282
సంభధ్యారాగము 19 ప్రణయ సమ్రాజ్జి! నీ మృదుపాదయుగళి కడిగి పారాణి నిడుటలో కలుగు తృప్తి అనుభవైక వేద్యమ్ము, వాకొనగలేను, చరణములు తాక ప్రక్కకు జరుపుకొని! 54 సహజ సుకుమారమైన నీ చరణ యుగళి కరకు రానేల నడయాడి కందిపోయె కాంచి నా కనుల్ దుఃఖాశ్రుకణము లొలికె, సఅచి యుంచెద అరచేయి పదము లిడవె! ర్5్ శ్రేయస్! ప్రేయసీ! యని పిలిచి పిలిచి ఇంతి!కుత్తుక జీరబోయినది చూడు, నీ గళస్వనమింత విన్నించినంత గొంతులో తీపి తళుకొత్తి కొలువుదీం. 56 ఇంజ దొ॥ సుంకర వెంకమాంబ 32౫262623262క062క23 2632626262 606006266
20 సంధ్యారాగము నిన్ను నాతోడ గొనిపోవ నిశ్చయించి నేను చేసాచి, చేయి నందించుమంటి, నీదు హస్తమ్ము తాకిన నిమిషమందె అడుగు ముందుకు పడక 'మ్రాన్సడితి చెలియ! 57 నన్ను మురిపించు స్వప్ప్న సుందరివి నీవు, కలలు కజవైన తొలి బిచ్చగాని నేను, తరము లొకటైన పెద్ద అంతరము కలదు, కాంచనము నీవ, ఒక గ్రుడ్డి గవ్వ నేను. 58 ముందు నాస్థాయి మజచుట మొదటి తప్పు, నాది నాదను కొనుట రెండవదొసంగు, గుణగరిష్టులు (ప్రేమను గ్రుడ్డిదనిరి, గ్రుడిదేకాదు వెజ్డిబాగులది కూడ! 59 ఈ౭౪26262606 28260623 28282628126282836%* దా సుంకర వెంకమాంబ ౫26282
సంధ్యారాగను 2 ఎవరి చెయిదము వారికి ఇంపు గొలుపు, ధవుని కోపించి కాలితో తన్నె సత్య, తన్ను కా లొత్తుటయె గొప్పదన మనెంచె మాధవుం, డాతడే నాకు మార్గదర్శి. 60 లేకి స్వర్గమ్ముతో పనిలేదు నాకు పోవలసి వచ్చినా నీవు రావలయును, సకియ! నా యిష్టమందువా? సరియె! నేను మొదట మనసిచ్చి 'స్వేచ్ళ కోల్పోయినాను. 61 నడువలేనంటి, విను కారణమ్ము నాదు హృదయ రంగస్థలమ్మున వదలకుండ చెలియ! నర్తించి, నర్తించి, అలసికూడ గజ్జెలను విప్ప వందుకే కాళ్ల నొప్పి! 62 ఆజక:౭౪ దా; సుంకర వెంకమాంబ ఆ౫౭క232526 26260526 262624%06262326406284
22 సంధ్యారాగము “పదవె పోదము చెలి!” యన్న వత్తుననవు, “రాదు లె”మ్మనుకొన్న దూరముగ చనవు, రావు నీవేమొ; నన్ను పోనీవు, మధ్య కణకు టడకత్తెరను బెట్టి నజకుచుంటి. 63 నోరు మెదప మనస్సున నొచ్చుకొనుదు వని తలచి మూగనోము చేకొనుట యయ్యె, నేను బిగిసికొన్నానని నీవు కినిసి తిరిగి చూడవు - తగవింక తీరుటెట్టు? 64 పలకరించగ కాబోలు వచ్చితనుచు ముద్దు ముచ్చట లాడ సంసిద్ధమైతి, పలుకరించుట అట్టుంచి ప్రక్కనున్న నన్ను కన్నెత్తియైన కానవు లతాంగి! 65 అధా౭రక2326262602382824246032క26262626ఈ2627 డ్రా, సుంకర వెంకమాంబ 28264
సంధ్యారాగము 23 నేను కలగంటినో లేక నిజమొ గాని నీవు రమ్మన్న యట్ళు లన్సించు నాకు, కలికి! గుండె గుమ్మమునకు కావభుంచి బాధ పెట్టుట న్యాయమా! బీదవాని. 66 సాగరము లోతు కనిపెట్ట సాధ్యమౌను, ఇంతి స్వాంతమ్ము కనుగొన నెవరితరము? దురవగాహము; దాని లోతులను తెలిసి కొంటి ననుకొంటి తల దించుకొంటి నిపుడు. 67 ఒక్క పద్దెమ్మునకు బదు లొక్క స్మితము ఒక్క చిలుచూపు పందెమ్ము నొప్పుకొంటి, నీవు నాచెంత కరుదెంచి నిలువబడగ మైమథచి కైతలల్గుట మజచిపోతి. 68
పద్యమున కొక్క చిబుచూపు పందె మనుట
మాటవరునకు అన్నట్టి మాటకాని
సార కవితా మరంద కాసారమైన
నీకు పద్యమ్ము లొసగ నేనెంతవాడ! 69
శచిని కవినంచు కడు ప్రగల్భములు పలికి
విజ్ఞవీగును కాని నా వెజ్జీ మొగము
నీవు నెనరూని తోడుగా నిలువకున్న
తడబడును పాదములు యథార్థమ్ము సకియ! 70
శుష్క వేదాంతమును వినిచోద్య పడితి,
సత్యమని మిథ్యయని వృథా చర్చలేల?
“నేను సత్యమ్ము సత్యమ్ము “నీవు, మనము
ప్రణయ రాజ్యంబునకు పరిపాలకులము. 71 శ262626 252525 2626262626262626262628 దా, సుంకర వెంకమాంబ 283౫
సంధ్యారాగము 5 లేదు పిడిబాకు చేతిలో; లేదు శరము హృదయమంతట గాయమ్ములే నెలంత! కోరచూపులె సూటిగా గ్రుచ్చుకొనియె; అధరసుధ పథ్యమైన గాయములు మాను. 72 నేను నినుచేర వచ్చిన నీకు-నీవు నన్ను దరిజేర రాకున్న నాకు వంత; ఇరువురకు సమ్మతంబైన వెరవు వినుమ! స్వప్నమున వచ్చి లాలించి చనుము చెలియ! 73 ఎంత కమ్మగ పాడీ మెప్పించె నౌర! కిసల యారుణ చరణకింకిణులు నీవి సరిగమలు నేర్వకున్నను; సన్నుతాంగి! సన్నుతించెద నీ పదాశయము మహిమ. 7క ౭౫౭౫౭ దా॥। సుంకర వెంకమాంబ 3282626 26262608ప6 0626 062826262828262
రం సంధ్యారాగము చెలియ! నా వ్యథాహేతువు చెప్పుమనిన చెప్పవనికాదు - చెప్పి చేసెడిది లేదు, ఆ యుపేక్షయే నాకు ఆహ్లాద మిచ్చు, కుదుటపడనీకు, నన్నిట్లు కుములనిమ్ము. 75 చిచ్చు రగిలించి శివుడు గెల్బినది గెలుపె? వలపు పండించు మరుగిల్పు గెల్పుగాక! ఓ చెలీ! కటాక్షించి నన్నోడనిమ్ము ఓడి ప్రణయాబ్ధి నన్నోలలాడనిమ్ము, 76 కలికి! సామాన్య వనితవు కావు నీవు ప్రణయరస మోహినీ స్వరూపమవు కాని, (పేమ దాహార్తి కుములు నా హృదయమునకు అమృత భాండమ్ము నిచ్చి ప్రాణమును నిలుపు. 77 ఈ[ఆ2౭26%32606062ఈ 03 032326238080026206ఈడా,; సుంకర వెంకమాంబ 2626౯
సంభ్యారాగము 27 నీలి నీలాలకన్నుల వాలు జూపు నేలపై కాలు వ్రాసిన వ్రాలు చదువ వేల ముంగొంగు ముడివైచు లీలనిలిచి మరులు ముద్రించు రాగమంజరికి ప్రణతి. 78 గోవు పొదుగున దుగ్గమ్ము కూడినట్లు వదన శశి బింబ సంజాత సుధలు కదిలి అవియె అధరాధరమున ్రోగయినవేమొ! కాని యెడ యింత మధురిమ కలుగుటెట్టు? 709 కొండ కోనల చెంగు చెంగున చరించు పడుచు సెలయేటి జావళీ పాటలోన పదము పదమున నీగళస్వనము వింటి నిజము నేపథ్యగాయని నీవె సుమ్మ! 80 ౩౭98౫24 డొ॥ సుంకర వెంకమాంబ
28 సంధ్యారాగము నీదు నీలాలకమ్ముల నీటు చూచి కొదమ తుమ్మెద బోటి సిగ్గుపడుచుండ, కమ్మ తెమ్మెర కరచాలనమ్ము చేయ చెజకు విలుకాడు చప్పట్టు చజచె చెలియ! 81 విరియ బూచిన మల్లెపందిరుల పజ్జ, వెల్లివిరిసిన వెన్నెల వెండి తెరల, చాటుమాటున దోబూచు లాటలాడి అలసిపోయిన మనము ధన్యులము చెలియ! 82 ఎవడురావాడు; సొంపారు భువనములను కాంచి నిస్సారమంచు చాటించువాడు? ఇంతి చెలువమ్ము చూడలేదేమొ పాప, మజుడె గని యుబ్చి తబ్బిబ్బు లయ్యెగాదె! 83 ఆణశ2౭260ఈ 262626 డాఈడాతరక23260626262626% దా, సుంకర వెంకమాంబ 23252
సంధ్యారాగము 29 లలిత లలిత సుమావళీ కలిత లతలు సరస కస్తూరి కర్పూర సౌరభములు కోకిలా శారికా కీర కూజితములు సృష్టి అందాలు మనకోసమే లతాంగి! 84 చిలుక గోరువంక జీవించు చందాన పార్వతీ మహేశ ప్రణయలీల కన్నెవాగు కడలి కలిసిపోయిన రితి నీవు నాకు నేను నీకు చెలియ! 85 ప్రకృతి నింగికి పట్టంచు పైటవైచె చూడుమా! చెలి హరివిల్లు సాగసుదనము పోల్చుకొనబోకు నీకనుబొమలతోడ, మథనపడుసుమ్ము మనసులో మన్మథుండు. 86 ౩2౪౫2౪ డౌ సుంకర వెంకమాంబ
౩0 సంధ్యారాగము ప్రణయ సామ్రాజ్య పాలనా పట్టమహిషి! మదనునకు కొలు కూటంపు కొదువతీర్చ చో టొసంగిన నీ వాలు చూపు కోపు సృష్టి లోపమ్ము దిద్ది తీర్చినది చూడు! 87 జిలుగు వెలుగుల జాబిల్లి చేయిసాచి తారకాకపోలమ్ముల తాకజూచె, చిలిపి చెలికాని భావమ్ము తెలిసి మురియు క80పు సొంపుల చుక్క చెక్కిళ్ళు చూడు! 88 సంజ కెంజాయ మెలమెల్ల జారిపోయి మసక మసకగ చీకట్లు ముసురువేళ మనసులను విప్పి మాటాడు కొనెద మింక జాగు సేయక రారాదొ! చారునయన! 89 శణ62826050526005262526026262626284824621 దా సుంకర వెంకమాంబ 2625౯
సంధ్యారాగము ప] మనసునందు మనసు మనుగడలో తోడు నీడ వగుచు చెలియ! నీవు దొరక అదియె భాగ్య మనియు నదియ స్వర్గమ్మని ఎంచు నన్ను పల్కరించరావె! త్రం కవితకై కవి తపియించు కరణి నేను '్రేమ దేవత! నీకై తపించు చుంటి, క్షణము క్రీగంట నన్ను చూచినను చాలు అదియె పుణ్య ఫలమ్ముగా నాత్మ నెంతు. 01 కాలచక్ర గమన లీలతో పనియేమి? సృష్టి అందములకు సెలవు లేదు, వలపు కలదు - కోడె వయసు తోడుకలదు, సకియ! ఒడిని వ్రాలు టొకటె కొదువ. 92 ఆ౭64౫ డొ॥ సుంకర వెంకమాంబ
32 సంధ్యారాగము నిన్ను విడిచి ఒక్క నిమిషమేనియు నిల్వ మనసు సమ్మత్రించు ననుట కల్ల, మనసుకన్న నీకు మనసైన దెయ్యది? చూచుకోవె! వచ్చి దోచుకోవె! 93 నీలిమబ్బు గొంతు నినదించి నంతనే తనువు పులకరించి తత్తళాంగు మనుచు నటనమాడు వననమయూరిని చూడు, మనసు పొందు హాయి మరువగలమె! ర్ర4 చేయి చేయి కలిపి హాయిగా విహరింత మిదె వసంతవేళ - ఎదురు చూచు చివురు సౌరు - విరుల శృంగారముల జోరు అనుభవించు వారె అభిలసుఖులు. 05 కడ32646253203026262628262626002323262624డా సుంకర వెంకమాంబ 23232
సంధ్యారాగము 33 క్ష్రణముళ్లణము నిన్ను స్వాగతించుచు నుంటి కదలి ఏడడుగులు కలిసి రమ్ము! మండుటెండయైన పండువెన్నెల యౌను ఎండమావులు సెలయేరు లౌను. 96 గెలిచె నరకునితో పోరి కృష్ణమూర్తి సత్యజతలేక ఆపని సాధ్యపడెనె? సకి! అనంగునితోపోరు సలుపుచుంటి ప్రేమ బలమున ననుగెలిపింపరావె! 97 అవె పదమ్ములు నర్ధమ్ము అవియె యైన మధుర మధురమ్ములైన నీ పెదవి సోకి వట్టినుడులకు మధురిమ పట్టువడును సకియ! వల్లింప రావె! నే సుకవి నౌదు. 08 ఇష౭క దొ సుంకర వెంకమాంబ ౪2626230626 262603 262ఈ2క26షక060300306డ
య! సంధ్యారాగము చినుకు చినుకు రాలి చికురమ్ములను వ్రాలి చెక్కిళులను జాథీ చెంగలింప తడీసి తడిసి, తనువు తళుకొత్తు నందాల దాచనెంచు చెలియ తలచుకొందు. 99 భువన రక్షకులైన (త్రిమూర్తులేని సతులు తోడుగ లేరేని జడులుగాం! మరచిపోకుము, స్నష్టి ధర్మమ్మటంచు చెప్పి తప్పించుకొనబోకు చెలియ నీవు. 100 ఇంతమంది పలుకరించుచు నుండగా ఎడద నీదు పిలుపు కెదురుచూచు, మాట మాట కలిపి మమతాను రాగమ్ము పంచరావె! పలుకరించిపోవె! 101 చంళ2రణండండండండాంర3డ626డ2ఈ2625క2602306236 డా| సుంకర వెంకనూంబ 28244
సంధ్యారాగము 35 మలయ మారుతుండు, మదనుండు, చంద్రుండు మల్లెపూల రథము మలచినారు ప్రణయయాత్ర కొజకు, పదవె పోదము చెలీ! మంచి తరుణ మిదియ మించ నీకు! 102 దరవికస్వర మల్లికా దామములను సాంధ్య సమయాన నీవాలు జడను దురిమి నీకు ముస్తాబు చేయుటే నాకు దీక్ష వమ్ము గావింతువేల? కాలమ్ము చెలియ! 103 బ్రహ్మ తలతిక్క పనులతో పడిన పాట్లు నీముఖము చూచినంతనే నిమ్మళించు, కాని పనిచేయుమని కోరబోను చెలియ!
చిరునగువు చాలు క్రొత్త ఊపిరులనింప. 104
36 సంధ్యారాగము సురుచిరాకృతి-శిల్పసుందరుల సాగను, కంఠమాధురి-త్యాగయ్య గానలహరి, మాట మరియాద-జయదేవ మధుర ఫణితి, సహజ సిద్ధము లివి నీకు సకియ! నిజము. 105 తళతళలు కుల్కు విరులకు తావిలేదు, తావి తనరారు విరుల కందమ్ము లేదు, అందమును తావి గలుగ మరంద మున్నె అన్ని సుగుణమ్ము లున్న ని న్నభినుతింతు. 106 నీవు కిలకిల నవ్వుచో జీవకళల నేల తులకింప మేలిముత్యాలు రాలు, దాచుకోనీవె! ఎడద భద్రముగ వాని, నవ్వుకొందము బ్రతికినన్నాళ్లు చెలియ! 107
కణరణశడ౭252క260640626232323032828231284* దొ, సుంకర వెంకమాంబ ౫౫౫౫౫
సంధ్యారాగము 37 అభినవాంధ్ర భాషా యోషవయిన నిన్ను అమృత కవితానితంబిని వయిన నిన్ను అనుసమాదృష్ట దేవత వయిన నిన్ను ఇంత ప్రేమించి నానని ఎలుగ నైతి. 108 సకియ! అందమ్మునందును చదువునందు పోలిక వచింపగా నీకు ముజ్జగముల రతి యొకర్తుక భారతీ సతియొకర్తు; కవుల కల్పన కాదిది కటికి నిజము. 109 తలపగా యామినీ పూర్ణ తిలక వీవు బిల్హణుడ నేను - ఉరిశిక్ష వేయుగాక మరుడొ ధారుణీవరుడొ కాతరుడ గాను, రామ! నీ ప్రేమ నాకు శ్రీరామరక్ష 110 ఇ2౪౫8 డా సుంకర వెంకమాంబ ౪౫౫౫౭2౫2౩0323ద32326డ60క260క262క2కడకడా
36 సంధ్యారాగము క్షణికమో! శాశ్వతమొ! దాని చర్చయేల? అనుభవానందమే మన ఆశయమ్ము పూలపాదరిళ్ళు, సెలయేళ్ళు పుట్టి పెరిగి వేచి యున్నవి మనల సేవించ నిమ్ము! 111 కలదు రంగుల రాట్నమ్ము కాలచక్ర, మెన్ని మాటలో పాటలో యెదకు తెలియు త్వరగ రారాదొ! ఈ మంచి తరుణమందు, ఆఅలసించుట నీకు భావ్యమ్ముకాదు. 112 కలలకనుగొన్న నిన్ను నా కన్నులార కాంచు టెన్నటికో చెలీ! కరవు దీర ఎదురు చూచి యెదురు చూచి నిదురరాక కలలు కజవయ్యె, నీరాక తెలియదయ్యె. 113 శణ3గకడక2626హ2కడ626262626923262625626263 దా, సుంకర వెంకమాంబ ౫6262
సంధ్యారాగము 39 మనసులోమాట నీవాలు కనులు తెలిపె, కనులలో గుట్టు సిగ్గుబుగ్గలు వచించె, సిగ్గుబుగ్గల ఊసులు చెలియ! నీదు కదలి కదలని పెదవు లేకరువు పెట్టె. 114 “ఉదయరాగము'నకు మూల మెదియొ, అదియె మూలమయ్యె సంధ్యారాగమునకు సకియ! మన శరీరాలు వేజైన మనసాకండె, అదియ సాొగించె నింత పేమాయణమ్ము 115 జిలుగు టద్దంబు మనసది చిట్లెనేని అతుకుటకు బ్రహ్మకైన వీలగునె? చెలియ! సున్నితమ్ము నా హృదయమ్ము వెన్నకన్న పదిలముగ నీదుగుండెల కదుము కొనుము. 116
82828 దొ॥ సుంకర వెంకమాంబ ౪14232క262646262 6026 రక260కరకరకమక262కడా
త్త౦ సంధ్యారాగనము
ఎంతమందిని చూడలేదింత వరకు?
వలపు రగిలించె నీ తొలివాలు చూపు,
అందుకే యింత వలవంత - అది గ్రహించి
హాస్యమునకైన నన్ను కాదనకు చెలియ! 117
నీలిమబ్బుల మధ్యలో నీలవేణి!
అరుణ దీపమ్ము లవి వెల్లె నరసినావె?
నీదు రాగంపు ముద్రల నిర్వచింప
అ జ్ఞ్బల నగుపించె ననిపించు నంబరాన. 118
ప్రవిమల రసాలసాల పల్లవము మెసవి
కొసరి కోయిల సంగీత గోష్టి నెరప
ఆ సుధా గీతికల తన్మయత్వ మొందు
గున్నమావిని నేనను కొందు చెలియ! 119 శడక2కడకటకడఠ2తడతరత డశ80606282క2603ఏ64 దా; సుంకర వెంకమాంబ 2౫264
సంధ్యారాగము 41 ఆలపించవె చెలి! ఆపాత మధురమ్ము గాగ రాగమాలికాపదమ్ము ఆమనోజ్ఞ నూలి కాలోచనామృత ధారలోన నన్ను తడియ నిమ్ము! 120 నీదు పెదవిపైన నృత్య మాడుచు నుండు మాట మాట యందు మధువు చిందు, తెలుగు భాషకింత తియ్యందనమ్ము నీ చలువ; నీవు నలువ చెలువ నేమొ? 121 మనసు మల్లెలోన మమతామరందమ్ము ఎంత దాచినావొ ఏమొ చెలియ! మాట మాట నాకు మధురమై తోచి నీ మాట వినగ నెపుడు మనసు పడుదు. 122 ఆ2౭2* దా|; సుంకర వెంకమాంబ
తై సంధ్యారాగము పాల యలుకలేల? మన ముద్దుముచ్చటలక (ప్రొద్దు చాలక యుండె, ఓ ముద్దుగుమ్మ! కరిగిపోయిన కాలమ్ము తిరిగి రాదు కలత కలిగించు ఊహలే వలదు మనకు. 123 ఇవ్వి రవ్వల గాజుల సవ్వడులటె అలరు విల్కాని హయహేషలగును గాక! కానిచో గుండెలోతులలోన జొచ్చి వలపు తలపుల గిలకొట్ట గలుగు టెట్లు? 124 మజల మఅల గ్రోల మధురిమ వెగటైన సుధను చూరలాడు సురల కన్న నిత్య నూత్నమైన నీ అధరామృత పానమత్తుడైన నేను మిన్న. 125 కహపకజరదరడకణరరర2ర250కడక282626264032303డ డా, సుంకర వెంకమాంబ 284క%
సంధ్యారాగము న! ఎన్నివన్నె చిన్నెలున్న వీ జగతిలో అన్ని వన్నె చిన్నె అరుగు దెంచి నిను వరించి చెలియ! నీ అందమును నేను చూచి చూచి అనిమిషుండ నైతి. 126 కుండపోత వాన కురిసిన రీతిగా గ్రుక్క త్రిప్పుకొనక కోటి ఊసు లొక్క బిగిని చెప్ప నుబలాట పడు నాదు అంతరంగ మెప్పు డరయ గలవో! 127 పల్కరింపకున్న పల్కరించిన రితి నవ్వకున్న గాని నవ్వినట్లు చెలగు నీదు మురువు చిత్తరువును జూచి నేను చిత్తరువుగ నిలిచిపోతి. 128 ఆ2626 దాః సుంకర వెంకమాంబ ౫262326 హ32క06 06 డఈ డం 2646 పళడ3 2323262864
లేడీ సంధ్యారాగము మల్లె ఒడిలోన కొలువైన మంచుబిందు వచ్ధి కెరటాల తూగుసోయగపు ముత్య మంబరంబున కులుకు ఒయ్యారిమించు శాశ్వతమ్మగు మన (ప్రేమ సాటిరావు. 129 వలపు పూదేనెవాక నీవాలు జూపు, పిలువకయె పిల్చి బంధించు చిలిపి నవ్వు, కెంపు బుగ్గల మాటున కెరలు సిగ్గు, మజచిపోద మటన్నను మజువతరమె? 130 ఏల యెడబాటు? తడబాటులేల? మనకు ప్రణయకోపాల కాల యాపనములేల? కలసి విహరింత మానంద కాననముల, రావె! నా (పేమ రాజ్య సమ్రాజ్జి! రావె! 131 శడక262826 600 పో పర ట62606203206262600408262 ద్వా, సుంకర వెంకనూంబ 26282
విరహ యోగానుభవములో వింత తీపి కలదనిరి పెక్కు రా తీపి వలదు నాకు, విరహమొక కొంత యేని దుర్భరము సుమ్ము చెలియ! నినువీడి క్షణమైన నిలువగలనె? 132 కొసరి యొకసారి నేను బెట్టుసరి చూపి నీవు బ్రతిమాలుకొన పొంగిపోవ నెంతు, నీవు కన్పింపగనె నన్ను నేను మరచి చెఅగుకొస బట్టుకొని వెంట తిరుగుచుందు! 133 చూపులే తియ్యనైన, వా చూపుకన్న మధురమైనవి మాట, లా మాటకన్న మనసు మధురాతి మధురమ్ము మధురిమలకు మధురిమవు నీవు; నీ యూసు మధురతమము! 134
తేర సంధ్యారాగము కంచు సరిగంచు చీర సింగారమునకు సొగసు రెట్టించు సన్నజాజులను తురిమి వామ భుజమున జడ జాలువార్చి నిలిచి స్వాగతించిన నీ నవ్వు చాలు నాకు. 135 మున్నా ఆలోచనలు బోలెడన్ని నాకు, నిన్ను చూచిన దాదిగ నీవు దప్ప వేరు అలోచనమె లేదు; నీరమీవె అన్నమును నీవె, సకియ! నా ప్రాణ మీవె. 136 సకియ! ఇటు చూడు తాంబూల చర్వణమున ఎంత పండినదో నోరు; అంతరంగ మెంత రాగిల్లినదొ అంత ఎజ్జనయ్యె; అరణమీరాదె! నీ అరుణాధరమ్ము 137 కక గ6262326260625266626:2548284262628 డా|, సుంకర వెంకనూంబ 2౫262
సంధ్యారాగము ల
నీలిమబ్బుల కురులలో నింగితురిమె నిండు జాబిల్లి అందాల బొండు మల్లి, " సండు జాబిల్లి పరువాల పాలవెల్లి!
నిన్ను నా గుండె గుడిలోన నిలిపినాను. 136 ప్రణయ దేవతా! ఏ ముహూర్తమున నీవు
మధుర మధుధారలూరు నీ హృదయవీణ
మీటి రాగాలు పలికించి దీటుగ నను
సాంతమొనరించు కొంటివో సుంత చెప్తుమ! 139 సోగ కన్గవ విసరు వాల్చూపు సౌరు
చాటు శృంగార రసకావ్యకోటి వనరు
అపర శ్రీనాథకవి నైతి, అందుకొనవె!
అంకితమొనర్హు జీవితానంద సుకృతి. 140
828628 దొ॥ సుంకర వెంకమాంబ
జే సంధ్యారాగము రాగరాగిణ్! స్వరకళారాధనమున మధుర మురళీ స్వరాళిలో సుధలు విరియ నీ పెదవి సుంత అరువిమ్ము, నెనరు మీర ధన్యతను గాంతు నీ దివ్య ధాత్రిలోన. 141 ముగ్ధరాధ వలచి మురళీధరుండు నా యంత పలవరించె ననితలంప, బహు ముఖినమైన ప్రణయమ్ములో మున్లు వానికేమి తెలియు వలపు తీపు! 142 తపనగాని నీదు దరహాస లాస్యమ్ము అనుకరింప గలదె ఆటవెలది, కలలు గనుటె గాని కంఠ మాధుర్యమ్ము చాటగలదె చిన్ని తేటగీతి, 143 శహశగర2క26262626262064626032526252300321 దొ॥ సుంకర వెంకమాంబ 2౫284
సంధ్యారాగము 49
మూగ మనసు ముద్దుముచ్చట జవరాల! తేనె మనసునీది తెలియగలదు
ఒక్క మొలకనవ్వు ఉదయించి ఊరించి
మాయమయ్యె చెలియ! మణఖువబోక! 144 ముడుపు గట్టినాను ముత్యాల ముక్కర
నీ కలంకరింప నిశ్చయించి
ఎప్పు డెప్పు డనుచు ఎదురు చూచుచు నుంటి జాగుసేయనేల జలజనేత్ర! 145 "పెదవి కదల నీక (ప్రమాయణము చెప్పు
నీవిశాల నేత్ర నిపుణ శైలి
కంటి, నాదు హృదయ గండపెండేరమ్ము
తొడుగ అడుగు ముందుకిడవె చెలియ! 146
50 సంధ్యారాగము చెలియ హృదయసీమ చెలికాడు; చెలికాని హృదయ మందు చెలియ మెదలుచున్న దాని ప్రేమ యనుట ధర్మమ్ము, జననాంత రాను బంధ ఫలిత మదియ కాదె! 147 కోపమేలనె చెలి? కోయిల కొలువైన గొంతు తీయదనము సుంతయేని కరకు మాటకతన తరిగి పోనీయకే అఆసుఖమ్ము చెరప న్యాయమటవె! 148 ఏలనే చిరాకు? ఎవరేమిటన్నారు? నీదు మనసు కలచు నెరసులెవ్వి యేని నేను చేసినానా చెప్పవె చెలి! ఈ పరాకునింక ఓపలేను. 149 ఈడర2ర2క260626డ5 26262626 ష54640626664065 డా, సుంకర వెంకమాంబ 28262
లాం కష. యో సం లదు్నా. సంధ్యారాగ లి ॥ వ్ షా నవ్వవే! ఒక సారి నీనవ్వు నాకు పండువెన్నెల హాయిని పంచిపెట్టు, పలుకవే! మనసార నీ పలుకు నాకు విమల గాంధర్వ గానమ్ము విందుసేయు. 150 ఎన్ని జన్మలనేని నిన్నే వరించి ప్రణయ రసరమ్య మధురకావ్యము రచించి పద్యపాదోదకము సమర్పణము చేసి చంప కోత్పల పాదపూజన మొనర్హు. 151 నీవు వాకొన ఊసులన్నింటి వినుచు నేను ఊకొన యుగములు నిమిషములుగ కరగి పోనిమ్ము చెలియ! నీ కనులలోని సరసశ్శంగార కావ్యమ్ము చదువనిమ్ము! 152 ౭2౪2౪ దొ! సుంకర వెంకమాంబ :8232326 2626262566 2623260626 26005062
౨2 సంధ్యారాగము క్షణములోపల కోపమ్ము, క్షణములోనె శాంత, మురిమిన మేఘమ్ము జల్లు కురిసి చల్లబరచిన యట్లు నీ యుల్లమెంత సున్నితమె! ఇంక నేనెంత సుకృతినొకద! 153 మునుపు భోజరాజ ముఖ దర్శనమ్మున శ్రిత లల్లు శక్తి కలిగెనంట నిన్ను తలచుకొన్న నిమిషంబె నాలోన లలిత కవన వాణి లాస్యమాడె. 154 నిన్న నేటిలోన - నేడు రేపటిలోన లీనమైన రీతి నేను నీవు ఒకరిలోన నొకరు ఒదిగి పోదము చెలీ! కాలమపుడు మనకు కలిసి వచ్చు. 155 ఆజ323గక26262626262ఈ02628262600840326262 దొ సుంకర వెంకనూంబ 23261
సంధ్యారాగము 53 కనులు మిణుమిట్లు కొలిపెడి కాంతితోడ నీవు నాకంత దవ్వుగా లేవు గాన నిన్ను రేచుక్కగా పోల్చుకొన్న నేను ఎంత తప్పుచేసితినో గహించుకొంటి. 156 తీగతీగకు నీపేరు తెలిపి తెలిపి అందముల నారబోసిన అలరు లేరి సరులు గ్రుచ్చితి సిగలోన తురుమ నీవె! పుణ్యఫలమొందు నా జన్మ, పూలజన్మ, 157 ముద్దమందారమును మెచ్చి ముడిచినావు మురిసి, నిడువాలు జడలోన ముద్దుగుమ్మ ఇంక నిన్నలరింప అలంకరింప ముద్దమందార మౌదును ముద్దరాల! 156 ఇఆ2౪2౪ దాః సుంకర వెంకనూంబ '౪2323%23:2823262626 2626262605 0608282342
కశ సంధ్యారాగము భగవదర్చితమైన పుష్పమును తీసి తనిసి కబరీ భరమ్మున జొనిపినావు, చెలియ! నీ సిగబంతినై చెలువు మీర విరిగ జనియించి భగవదర్చితుడనౌదు. 159 నిగనిగని ఇంద్ర నీలాల సొగసు విలుచు కుటిల కుంతలముల జారు కొప్పుచుట్టి విరియ బూచిన మరుమల్లె తురిమినావు మల్లె కాదది చెలియ! నా మనసుగాని, 160 మూగ మనసుల ఊసుల ముచ్చటించు ముద్దబంతిని జడలోన ముడిసినావు తెలిసెలే! నాకు నీలోని వలపు చెలియ! వలచి వలపించు నెణఖజాణ! వందనాలు. 161 కడెశణండికడకడ2కడ62626ప3హక23232క262క23ఉవ6 ద్వా సుంకర వెంకమాంబ 26264
సంధ్యారాగము క్ నిను తలంచినంత వననమయూరము మించి ఆటవెలది వోలె ఆడు మనస్సు, మత్తకోకిల గళ మాధుర్యమును నింపి తేనెలూర పాడు తేటగీతి. 162 పైన చిలునవ్వు వెన్నెల, లోన ప్రణయ జీవనాధార సుధ జన్మసిద్ధమైన అధరమా! అది కాదు వియత్తలమ్ము వదలి కదలి వచ్చిన నెలవంక గాని. 163 స్పిగ్ధ సుకుమారి! నీవు స్పృశింతువేని (మోడులైనను చివురించి మొగ్గతొడుగు, మనసు మనసున లేక సాొమ్మసిలియున్న నన్ను నీవాని మరచుట న్యాయ మగునె! 164 62824 దాౌ॥ సుంకర వెంకమాంబ 2828262626 2328262606 26062326 2క2626డా
వర సంధ్యారాగము
కలికి పట్టినదెల్ల బంగారమయ్యె ,
ముదిత ముట్టిన దెల్లను ముత్యమయ్యె,
ఏమి మహిమమ్మొ! నన్ను నీ యిష్ట సఖుని
చేరగాదీసి రసరాజు చేయరాద్ొ! 165
నీ యధరముల నవ్వు వెన్నెలను నేను,
నీ కనుంగవలో నిగనిగలు నేను,
నీ గళమ్మున పలుకు తేనియను నేను,
నేను కానిది నీలోన లేనె లేదు. 166
మంజు మంజీర కింకిణీ మధురవాణి
మారు (మైోగుచు నున్నది మనసులోన,
ప్రతిరుణత్కృతి ఒక్కొక్క పద్యకృతికి
నాంది యగుచుండె భాగ్యమ్ము నాదికాదె! 167 తహరడతరం2౭232806262626బ320262628426286 డా|; సుంకర వెంకమాంబ 26262
సంధ్యారాగను వ్ నా కవనవాహినీ జీవనమున నాదుగు పదము నీవె, భావము నీవె, ధ్వనివి నీవె, రసము నీవె, పాఠము నీవె, ప్రాణమీవె, ప్రణయ రాగిణీ! నాకు సర్వస్వమీవె! 168 అగ్నిసాక్షిగా నా వెంట అడుగులోన అడుగుగా నీవు నడచుట ఆర్షధర్మ మైన నీవెన్మ నడచుటెంతైన నాకు ఇష్ట మానందదాయక మిందువదన! 169 నీవు నామది దోచుకొన్నావు చెలియ! దోచుకొన్నందువలన సంతోష పడితి, నేను చవిగొన్న ఆ మధురానుభూతి తనువులో అణువణువున దాచుకొందు. 170 8432౪ దౌ॥ సుంకర వెంకమాంబ ఈ2643262623260460360క0366660342626060642
58 సంధ్యారాగను నీదు మధురోక్తి చాతురి, నీ నయమ్ము నీదు మురిపెమ్ము నీ (ప్రేమ, నీదు చేష్ట నీ మమత్వ సమత్వ సన్నిహిత తత్త్వ మెవరి మెప్పింపకుండు? నేనేమిలెక్క? 171 జన్మ జన్మలందు సకియ! నీ సాంగత్య మందవతె నటంచు అఆశపడుదు అదియె భాగ్యమంచు నాత్మలో దలపోసి వరము నీయ సాయి కరము కొలుతు. 172 తారకాదీపముల నూనె తరిగిపోయె, కమ్మ తెమ్మెర చరణాలు సామ్మసిల్లె, పడుచు కలువల మోములు ముడుచుకొనియె కానరావేల? కాయలు కాచె కనులు. 173 కజకణర2క252620326252626262646626426282%౫ డ్రా; సుంకర వెంకమాంబ 2826౫
తనివితీరలేదు దయచేసి ఒకసారి
కానబడవె నాకు కలలనైన,
ఆకసాన మెరయు అయ్యరుంధతి వోలె
ఎపుడు కంట పడెదొ చెపుము చెలియ! 1174
హంస నీకాలి అందెగా అవతరించి
పదము పదమున “సరిగమపదని” నేర్చి
మానసమును పాొంగించెడి మధురఫణితి
జావళీ కూర్చి నీకీర్తి చాటు చెలియ! 1756
వనమయూరి నృత్యమ్ము చేసినది గాని
నీ నడకలోని హొయలు కన్పింప దందు,
పడుచు కోయిల పాట విన్నడియె గాని
నీ గళమ్ముతో నది సరితూగలేదు. 176 క2౫68 దా॥ సుంకర వెంకమాంబ 323232625262626 26282626 0603052030క062
60 సంధ్యారాగము పొలుపు నిలువెల్ల పూచిన పూవుకన్న (క్రాన్ననలకన్న, మృదువైన వెన్నకన్న హాయిగొల్పెడు పున్నమి రేయికన్న మిన్న నీవని నామది ఎన్నుకొనియె. 177 మగువమిన్న! ఈడేరిన మల్లె కన్నె గాలి తాకున కదలెనా? కాదు, కాదు! కొదమ తుమ్మెద రుంకార పదము వలచి పీలుచు చున్నది తలయూచి, చెలియ! చూడు! 178 మనసు మహనీయ మయసభ, మండుటెండ వెన్నెలగ-వెన్నెలను మండువేసవిగను చూపగల, దపార్థమ్ముల రేపగలదు, కాని నీ యున్మి వెన్నెలే గంటి, చెలియ! 179
ఆడళిడారర 30323282 6232323262623హ3262626 దా; సుంకర వెంకమాంబ 26234
సంధ్యారాగము 61 రూపుదాల్చిన ఓంకార రోచి వీవు, మాటలాడ నేర్చిన చందమామ వీవు, నడువ గలిగిన హరిచందనమనవు నీవు, వలచి వలపించు భాగ్యదేవతవు నీవు 180 ప్రణయినీ! నిన్ను గూర్చిన భావగీతి అరసిక శిఖామణులు మెచ్చ రది సహజము; ఎజుగ జాలుదురీ! వారు హృదయ భాష్య దాన మనకేమిలే! మన ధ్యాస మనది. 181 ప్రణయ దేవతా! నీ వచ్చు పథము దెలిసి వలచి ఉత్తరీయమ్మును పజచినాను, ఒత్తుకొను నేమొ? దోయిలి' యొగ్గు వాడ, బ్రహ్మరథమునే సంసిద్ధ పరచు వాడ. 182 ఆఅ౭౭౩౭౪ దాః; సుంకర వెంకనూంబ ౩23232323062308230300303032326060క2క2ా
62 సంధ్యారాగము నేను నవ్విన మాత్రాన నీదు గుండె కోటి వీణియ రాగాల గుమ్మ మగును, నీవు చూచిన చాలు రాజీవ నయన! నవరసానంద వాహినుల్ నన్ను తడుపు. 183 నను వలచినావు సకియ! నీ మనసు నిన్ను బ్రతుకనిచ్చునే? నాకు దూరముగ నున్న ఇప్పటి దొకొ! ఈ బంధమ్ము-హృద్గతమ్ము; దాని తప్పింప నెవ్వరి తరము కాదు. 184 “నీవు వేలు సఖుడ! నేను వే”అను భేద భావ మేల సకియ! నీవు లేక నేను లేనిమాట నిక్కువ, మ్మద్వైత మెంత మధురమౌనొ? ఎజుగలేవొ? 185 శణాశణకణత2ం2క062608డ6హ60క262329436282364” డా; సుంకర వెంకమాంబ 26232
సంధ్యారాగము 63 చెలియ! నీ తోడ విహరింప చెట్టు చెట్టు పారిజాతమ్ముు మునుగు కాసారమెల్ల మానస సరోవరమె; ఒక మంచి మాట మంత్ర మనిపించె - నాదు జన్మమె తరించె. 186 నాకు తెలియు నీవు నర్మ గర్భంబుగా చూచు చూపులోని సూక్ష్మహేల, నీకు తెలియు నేను నిన్ను వెంటాడెడు వాలకమ్ములోని వలపు తీపు. 187 నీవు నాకెంత దవ్వున నిలిచి యున్న నా హృదయరాగ వల్లకీ మోహతంత్రి చెక్కిలిని మీటుచున్నావు చెలియ! ఎంత పారవశ్యమో నేను చెప్పంగ లేను! 188 ఇ౫జో౭6 దాః సుంకర వెంకమాంబ ౪2626238262623203682326039606ష6 23003264
654 సంధ్యారాగము పరువపు పరీమళమ్ముతోపాటు-లోన వలపు తేనియ నందింప వలతి వీవు, ఆ ప్రణయ భిక్ష నర్ధించు అప్త సఖుని గుమ్మమున నిల్వబెట్టకే కోమలాంగి! 189 మమతయో ట్రేమయో గాని మనసు నందు నీ మనోహర రూపమే నిలిచియుండు, ప్రతి నిమేషము నీ మాట - పలుకు వినగ నామనసు తహతహలాడు నన్ను మచి! 190 మాటి మాటికి నిను జూడ మనసు పడితి, కనులు విప్పార్చి దశదిశల్ గాంచుచుండ వచ్చితివి గాని హర్ష బాప్పములు గ్రమ్మి కాంచలేనైతి; ఎప్పు డా కారిక్ష తీరు? 191 శజకణక262కటఆడక2623250628032326ప2626% దా; సుంకర వెంకమాంబ 26268
సంధ్యారాగము 65 కుసుమ కోమల రూపమ్ము గూర్చి సాగసి, కోయిలను మించు కంఠమ్ము గూర్చి మురిసి, చిలిపి నవ్వుల గూర్చి యోచించుకొనుచు, పిచ్చి పుల్లయ్య అని పేరు తెచ్చుకొంటి. 192 నిన్ను నాదాన వనుకొంటి నేను - పరుల కనులు నీమీద పడునేమొ అని అసూయ పడుదు - నీ తలంపులలోన పవలు రేయి అనక నే నుండవలెనని ఆశపడుదు. 193 నవ్వవే చెలి! చిరునవ్వు నవ్వినంత బుగ్గ సొట్టలు పడి పొన్న పూలు పూయు, చూడవే! రెప్ప లల్తార్చి, చూచినంత చెలియ! జలజల రాలును కలువపూలు. 194 828౫4. దా సుంకర వెంకమాంబ 'ఆ28:2626023126 282625క6ఉ6262623032క062626డె
656 సంధ్యారాగము చిలిపి చేతల కవ్వించు చిన్నదాన! చురక వేయకే సరసాల చొక్కువేళ, కొంటె మాటల నూరించీ కుర్రదాన! కసరుకొనకే సరాగాలు కొసరువేళ! 195 కొసరు చూపులు చూడకే కొంటెదాన! చిలిపి నవ్వులు రువ్వకే చిన్నదాన! చూపులను దాగి తూపులు చురుకు మనును, నవ్వులను దాగి పువ్వులు నవ్వుకొనును. 196 గాలి సోకి వెదురుగడ వేణు వయ్యెను శిలయు ఉలిని తాకి శిల్ప మయ్యె, శంఖ మందు బోయ జలము తీర్ధం బయ్యె, సకియ! నీదుకతన సుకవి నైతి. 197 ఆహం2 626 23062893232366262600320326034562 దొ సుంకర వెంకమాంబ 2818౫
సంధ్యారాగము 67 నీవు రాక మునుపు నిను గూర్చి తలపోయ గంగవోలె ప్రణయ కవిత పొంగి, నీవు వచ్చి ఎదుట నిలిచిన క్షణమందె ఎడద ఊహలెల్ల ఎగిరిపోయె. 108 ఒక్క పద్యమునకు ఒక్క నవ్వును నవ్వి ప్రోత్సహింప రావె! ముద్దరాల! నన్ను సుకవి జేయ; నా వ్రాయు కావ్యమ్ము అంకితముగ నీకు అందజేతు. 199 హృదయమున నీవు నిరతము మెదలుచుండ మధుర కవితల నల్లుట మానగలనె? ఎంత సుకృతమ్ము నీది! కవీంద్ర మణిని కొలువు కవివరుగా దిద్దుకొంటి వౌర! 200 ఈఆ౭౪౭౫౪ దాః సుంకర వెంకమాంబ
68 సంధ్యారాగము అబ్బముఖి! నా యెడంద ముత్యాల శాల అతులితంబైన ప్రణయ సింహాసనమున నిన్ను కూర్చుండగాజేసి నిర్మల మతి జరుపుకొందును కావ్య మంజరుల పూజ. 201 నేను నీకోసమే పుట్టినా నటంచు మనసు లొక్షటైన మనుగడ మధురమైన, ప్రేమ యన ఇది యని పేరు పెట్టవచ్చు, సృష్టికే క్రొత్త అందాలు చేర్చవచ్చు. 202 జన్మజన్మాంతర బుణానుసారి ప్రేమ, హృదయ నీరేజ మొలికించు మధువు (పేమ, రెండు మనసుల కలయికే ఢ్రేమ, సకియ! అదియె ముడివైచె నిను-నన్ను ఆప్పరాల! 203 ఈజళజ626జక2క2కణకడరర32323282626234826౯ దా, సుంకర వెంకమాంబ 26232
సంధ్యారాగము రం కసరి కొట్టగలుగు గడుసరి దానవు, ఆదరించి పలుకు ఆర్ధమతివి, అన్నిటికిని మించి అఆత్మీయురాలవు, అందువల్ల నాకు అంత (ప్రేమ! 204 కలికి పేమ విలువ కట్టగా శతకోటి పంచశరుల కైన వలను పడునె? ఉన్న హృదయ రత్న మొక్కటి అర్చింతు, అది అమూల్య మైన దందుకొనుము! 205 మాయ మర్మంబు లెజుగని మచ్చి కంటి నన్ను వలచిన దని మది నెన్నిమార్లు తలచుకొనుచుందునో అదే ధ్యాసగాగ; మణచిపోబోకుమా! చెలీ! మన ప్రణయము. 206 ఈ9448 దాః సుంకర వెంకమాంబ ౪2౪2626 264స్టడకంకడరరకడాం వళ 036526230ఈ262
70 సంధ్యారాగము ఎంత కాలమ్ముగా చంద్రు డెదురు చూచి తారకా సమాగమ లబ్ధి తనియ జాలె, అంతకాలమ్ము నిన్ను నే నభిలషించి ఎదురు చూచెద నీ కోసమే! లతాంగి! 207 కంటి చూపు తోడ కావ్యాలు సృజియించు దంట వీవు - వలపు పంట వీవు; పలుకరింపు లోనె పన్నీటి జల్లుల చిలుకరించు రామచిలుక! రావె! 208 మనసులోని తీపి మమతకు గుజుతుగా ప్రణయ లేఖ వ్రాసి పంపరాదొ! అక్ష రాక్షరమ్ము హాయిగా అమృతమ్ము కురిసి ఎడద చల్లబరచు నాకు. 209 కణకణ 6262626 2606262696062666406232643 దా; సుంకర వెంకమాంబ 252842
సంధ్యారాగము క్ మాయ మర్మంబు నెజబుగని మనసు గాంచి, మనసు విప్పి మాటాడు లక్షణము గాంచి, లక్షణంబైన రూప విలాస మెంచి, మీన లోచన! నిన్ను (ప్రేమించుచుంటి! 210 పదవె పోదము ప్రేయసీ! పాలపుంత పాన్పు చుక్కల జవరాండ్రు పరచినారు, జిలుగు తెలిమబ్బు పరదాలు చేతు లూపి పిలుచు చున్నవి, పరికింపవే! ఒయారి! 211 పిల్ల తెమ్మెర తాకున ఉల్లసిల్లి జలతరంగిణు లామ్మాయ జటలు పలుక, తుంప్తురులు చిల్కి ఆశీః పరంపరలను కురియు సెలయేటి దరికి నేగుదము రావె! 212 64626 డొ సుంకర వెంకమాంబ ౪282842626232823066030012626 262626 080342
72 సంధ్యారాగము
పూవుతో తావి తావితో పూవు పుడమి
రసిక జన మనోహరములై రాణ కక్కు,
నీవు నేనును ప్రణయ వల్లీ వికాస
జీవకళ లయ్యెదము వెంట రావె! చెలియ! 213
చల్లగాలులు వీచెడి సంజ వేళ,
గరిక పచ్చని కాలువ గట్టుమీద,
ఊసు లన్నియు చెప్పుచు, ఒకరి కొకరు
కూరు చుందము రావె! ఒయ్యారి భామ! 214
క్షీర నీరమ్ము కైవడి చెలిమి వెలసి,
కడలి కన్నె వాగులయి ఒక్కటిగ కలసి,
నీడలో నీడయై తోడు నీడ యగుచు,
పరవశింతము రావె! క్రొ వ్వలపు కొమ్మ! 215 కడకడికజర2రడక26262కఉంక262623262క462623% దా; సుంకర వెంకమాంబ 26262
సంధ్యారాగము గ మేఘగళ ఘుం ఘుమ ధ్వని మింట మొరయ వనమయూరి ధిమింధిమి యనుచు కులుకు; కులుకు, ఒయ్యారముల కలగలిపి కాంచి పరవశింతము రా చెలీ! త్వరిత గతిని. 216 మల్లె పొదరిళ్ళ లోగిళ్ళ మరులు గొన్న శారికా దంపతుల మేను ర్ఫుల్లు రనగ కొమ్మ లూగించి విరిజల్లు గ్రుమ్మరించి, కొత్త జంటకు శుభము పల్కుదమె! చెలియ! ర నీ మనసు నాకు తెలిసెలే! లేమ! నేడు మలయ మారుతములు వీచె, మల్లెపూలు పూచె; నీ జడ నిండుగా ముడువ నెంతు వెను దిరిగి నిల్వుమా! నితంబిని! క్షణమ్ము 218
ఆ28౫. దొ; సుంకర వెంకమాంబ ఆ2823262602క2306260క23డతం3డకరకనరదాకడ3
౯. సంధ్యారాగము పండువెన్నెల మల్లెల పాన్పుపైన మనసు మురిపించు మరపించు ప్రణయగీతి నీవు పల్లవి చరణమ్ము నేను గాగ జంటగా ఆలపింతము సకియ! రావె! 219 సకియ! మన మిర్వురమె మేఘశకలము లను పుష్పక విమానములలోన పూట పూట తఅపి వెన్నెల వేళల తనివిదీర తిరిగి వత్తము నీవు సత్వరము రమ్ము! 220 (పేమ భావన కిసుమంత వెలితి లేదు కాని ననుజేర రావేమి కారణంబొ? తారకలు చూచునో యను తపన కలదొ? సిగ్గు బరువున వెనుకకు తగ్గినావా? 221 ఈఅ౭ిర2623:2326ప30609260అ2శ06 3262326064 డా! సుంకర వెంకమాంబ 2౫౫౫౫
సంధ్యారాగము ల్ చివురు మెసవిన పికములు చెలియ! నీదు గానమాధురి కోటమి గనుట సరియె ఫలములను మెక్కు శుకములు పలుకులందు నీ పలుకు తీపి దక్కక తాపమందె. "222 పలుకుచెలి మేలుకొలుపు నీ పలుకరింపు, భావ పరిమళ మొలయు సంపంగి సుమము, ఎంత తలచిన మదికంత యింపు నింపు, గళము సవరింపు మింక నీ యలుక మాని. 223 ప్రీతితో నీవు నను పల్కరింతువేని రససముల్దాస కావ్య నిర్ణరిణి కదలి నీ పదమ్ములు సృశియించి నిఖిల సరస హృదయ కేదారముల తనియింపకున్నె? 224 ౩౭౫౩5౪౩ దౌ॥ సుంకర వెంకమాంబ '82826%8262626డ6 0623302323 2నర6234
765 సంధ్యారాగము వాలు క్రీగంట నీవు నా వైపు క్షణము చూచి పదిలంపు నా గుండె దోచుకొనగ పన్నుగడ పన్నితివి ఏమొ? పద్మ నయన! పలుకరించిన ముత్యమ్ము లాలుకు నటవె! 225 నీవు కన్చింపకున్న, కన్చించికూడ చూపు సారించకున్నను, చూచికూడ ఒక్క చిఖునవ్వు నవ్వకయున్న చెలియ! నీకు తెలుసును నా మనో వ్యాకులమ్ము 226 ప్రణయ కోసము శృంగార ఫలరసమ్ము కనుల కాషాయ కాంతులు క్రమ్ముకొనియె వలపుకానిని ఉడికింపవలెనె చెలియ? నవ్వుటాలకు నైన పంతమ్ము వలదు. 227 ఆగిక2క 262526 2626260526262క26262625284 డా| సుంకర వెంకనూంబ 26282
సంధ్యారాగము ౯!
'రెప్పవాల్బక చూపు సారించుదాక రెప్ప లల్లార్చి కోర్కె లూరించుదాక
తీయనై్సనది చూపని తెలియనైతి
తెలిసి కైమోడ్చు కాన్క నందింపనుంటి. 228 ఉవిద! నాకున్న దొక్కటే ఒక్క హృదయ
మదియు నీ కంకిత మొనర్చి అడలుచుంటి
అక్కునన్ జేర్చి ఓదార్చు నంత కరుణ
ఉన్నదో, లేదొ యని మిన్నకుంటి నేను! 229 మగువ అనురాగ దేవత మనసు తెలిసి
ఆత్మ సౌందర్యమునకు జోహారు చేసి
గారవించు సంస్కారుల దారిలోన
నన్ను నడిపించి సకియ! పుణ్యమ్ము గొమ్ము 230
78 సంధ్యారాగము మృదు మధుర భాషణమ్ముల మెచ్చు నీకు నచ్చునో నచ్చదో నాదు నాటు కవిత ఆప్తుడను నేను - నీవు రసార్షమతివి అనుచు మదిలోన భావింతు అమల చరిత! 231 అక్షరమున నొదిగి అర్ధమ్ము ధ్వనియించు, ధ్వనిని దాగి మధుర గుణముతోచు, గుణము మించి గుండెగుడి డ్రేమ విలసిల్లు, ఇట్టి వలపు రూప మీవు చెలియ! 232 పత్రమో పుష్పమో నాకు పంచియిచ్చి కలయ పండిన వలపును తెలిసీనావు వలపు పంచిన నీకు ఏ ఫలమొ! జలమొ! కాదు, హృదయమ్మె అర్చింతు కమల నయన! 233 శడ626డ326262626262528262626262626285* డా|; సుంకర వెంకమాంబ 234క%
సంధ్యారాగము 79 ప్రియతమా! నా వలపు నిరూపించు కొజకు తీపి గుజుతుగ ఏమి అందించగలను? పద్యమా! ప్రాణమా! నేను బ్రదికియున్న యంతకాలము నీకు దాసోహ మనెద! 234 ఓ చెలీ! గులాబి కయి చే సాచబోకు కోమలాంగుళి ములు (గ్రుచ్చుకొనునా ఏమొ! నేనె పువుగోసి నీ సిగలోన దురిమి సంతసమునందు సదవకాశమ్మునిమ్ము! 235 పెదవులను నీవు రవ్వంత కదిపినంత మధురమే మధురమ్ము నీ మాట తీరు అధరమున సుధా కలశమ్ము నమరవరులు దాచియుందురు నే దాని దోచుకొందు. 236 ౩2౫౫8 దా॥ సుంకర వెంకమాంబ ఆ323232526256082626ఈ0300526260606 4696232
80 సంధ్యారాగము వలపు పరిమళముల వాసీంచు రసరమ్య పద్య పారిజాత ప్రసవమాల సవదరించి జంట కవులమై పోదమా! భావకవులు మనల ప్రస్తుతింప. 23/7 పుష్పముల పోలు కోమల ముగ్ధ మనసు- పాలు తేనెయ కలకండ పంచదార కలిపినట్టులు తియ్యని పలుకులు గల సకియ నందిన నా జన్మ సార్థకమ్ము 236 చెజికునకు పండు పండిన కరణి గాదె! నీకు నాపైన ప్రేమ జన్మించుటనిన అలిగి యుండిన వేళ నా కందకున్న తరుణ్ నీ (ప్రేమ తియ్యని ద్రాక్షపండు. 239 ఉపళహంహకడర232603030క662626284060625వ3% దా; సుంకర వెంకమాంబ 2628౫
సంధ్యారాగము 81 సర్వమంగళ! నాథుని సరస జేరి పరుల బాధలు జూడవు-పాడి యౌనె? విరహ బాధను తొలగించి వేగ నీవు సకియ జతగూర్చు మమ్మ! అంజలి ఘటింతు. 240 శోకమును మాపు మిత్రుని రాక చూచి దిక్కుతోచక రేయెల్ల స్రుక్కియున్న జక్కవల ప్రమోదము కొండ యెక్కెననగ వెలుగు రేకలు తొలికొండ వెల్లివిరిసె. 241 కారు చీకటిలోన దుఃఖమున కుములు పద్మినికి మనోవికసనప్రాభవమ్ము ప్రబల జేసెడి ప్రియు ననురాగ మనగ ఉదయ రాగము ్రాగ్జిశ నుల్లసిల్లె. 242 ఆ౭౪౨౫ దొ; సుంకర వెంకమాంబ ౪2626232623260626280626032క2ఈ0క062064
82 సంధ్యారాగము ఉదయ రాగముగా నీవు ఉత్పలాక్షి! సాంధ్యరాగముగా నేను - శాశ్వతముగ- సరస విమలాంధ్ర సాహితీ జగతియందు కలిసి యుంద ముమాశంకరుల విధాన. 243 రావె! ప్రియురాల! రాధికా ప్రణయశీల చరణ మూనిన నేల ఈ సంజవేళ జంటగా విహరింతము జాప్యమేల? కరగిపోయిన ప్రాయమ్ము తిరిగి రాదు! 244 కలసి విహరింతమా! చెలీ! కవులకెల్ల సరస శృంగార కావ్య లక్ష్యమ్ము కాగ, తెలిసి వివరింతమా! సఖీ! వలపు నింపు జీవితానంద గీతికా శ్లేష ఫణితి. 245 ఆణర2కడెతణిం2ంపకరం26డర2థ2326ప3032క26264 డా, సుంకర వెంకమాంబ ౫26464
సంధ్యారాగము 83 దాచుకో చెలీ! నిన్ను నిత్యమ్ము తలచి, తలచి, మలచిన పద్య రత్నముల నెల్ల హృదయభండారమున; విస్మరించబోకు ! నను కటాక్షింప ఒక్క రళ్నమ్ము చాలు. 246 సరస శృంగార నిధి! నీకు స్వాగతమ్ము ప్రణయ సమ్రాజ్జి! నీకిదే బహుపరాకు ఊహ సుందరి! నీకు శుభోదయమ్ము అత్మ సౌందర్యలహరి! జోహారు నీకు. 247 ఆ2౫౫౩ దౌ సుంకర వెంకమాంబ ౫264182626 స6230626262626236600క 2628262
గ 1 సిం
రైవ్ ప్రముఖుల అభినందనలు - అశీర్వాదాలు సరళసుందరంగా, లలితమధురంగా "పెద్ద పెద్దవృత్తాలు, దీర్ధసమాసాల జోలికి పోకుండా దేశిచ్చందస్సులో ఒక చక్కటి మధుర ప్రబంధాన్ని డా॥వెంకమాంబగారు కావించినారు. డొా.వెంకమాంబ గారు ఇంకా ఎన్నో సరసమధుర కావ్యాలు జనావళికి అందించాలని, అందుకు శ్రీరామచంద్ర ప్రభువు వారికి కావలసిన ఆరోగ్య భాగ్యాలను, సుమధుర కవితా వైభవాన్ని ప్రసాదించాలని అనేక మంగళా శాసనాలను కావిస్తున్నాం.
- పరమహంస పరివ్రాజక శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీ మన్నారాయణ రామానుజ జీయరుస్వామి, సీతానగరం, గుంటూరుజిల్లా. 12-6-2002 రంగనాథ రామాయణ మహాకావ్యాన్ని “విమర్శనాత్మక పరిశీలన' పేరిట నిశితంగా పరిశోధన చేసినవారు కుమారి సుంకర వెంకమాంబ. ఈమె పరిశీలన చాలా సునిశిత దృష్టితో కూడినది. విశేషాలను చక్కగా పరిశీలించి - ఆలోచించి - నిశ్చయించి అమూల్య విషయాలను వెలువరించిన డా॥ వెంకమాంబను నిండుహృదయంతో అభినందిస్తున్నాను. ఆశీర్వదిస్తున్నాను.
- బొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి, అనంతపురం 20--7-2001 ప్రాచీన శాసనభాషలో చెప్పవలెనంటే డా॥వెంకమాంబ '“నడముయ్యల గుట్ట... ఈ కవయిత్రి సాహితీ సకారత్రయ (సౌందర్యం - సారళ్యం - సౌకుమార్యం) - త్రివేణి... డా॥ వెంకమాంబ పద్యాలలో లలనా లావణ్యం, లాలిత్యం సహజ సుందరములుగా సాక్షాత్కరించుచున్నవి... ఈ కవయిత్రిలో
86 తెలుగుదనం కోడె నెమలివలె పురివిప్పి నాట్యం చేయుచున్నది. రచన పక్వద్రాక్ష, డా॥వెంకమాంబ లక్ష్మణరేఖ దాటనట్టి సాహితీసీతాసతీమణి! బళ్ళారి వాస్తవ్యురాలు. వెల్లివిరిసె నాడు బళ్ళారి గడ్డపై తెలుగు వెలుగు జిలుగు తళుకు బెళుకు నేడు కూడ కైత నెత్తావి ఘుమ ఘుమల్ వెంకమాంబ హృదిని వెల్లివిరిసె. నండూరి రామకృష్ణమాచార్య, హైదరాబాదు 10-9-2001/1-7-2002 కావ్యానికి రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి కవిత్వం - రెండవది శిల్పం. కవిత్వం శబ్దసంబంధి, అక్షర రమ్యతను వెలారుస్తుంది. దానినుంచే ఒక శైలి ప్రభవిస్తుంది. అది రీతి ప్రస్థానానికి చెందినది. అలంకారాలు కవిత్వాన్ని ప్రకాశింపచేస్తాయి. అలంకారమే సౌందర్యం. ఇట్టి కవిత్వాన్ని రంగరించుకున్నది మీ “ఉదయరాగం”.
- వడలి మందేశ్వరరావు, హైదరాబాదు. 7-9-2004 చిరంజీవిని సౌభాగ్యవతి సుంకర వెంకమాంబ “రంగనాథ రామా యణము - అనుశీలనము ” అనే తన సిద్ధాంత వ్యాస గ్రంథాన్ని ప్రకటిస్తున్నది. ఇందులో ముఖ్యంగా కావ్యధర్మమర్మాలను సమన్వయించిన తీరు ప్రశంసనీయంగా ఉంది. సమన్వయ భూమి విద్వజ్ఞన పరిశ్రమను నిరూపించు టలో నికషోవలం. డా॥వెంకమాంబ ఆ భూమిలో నిలువద్రొక్క గలనని నిబ్బరంగా నిరూపిస్తున్నది. డా;సుంకరవెంకమాంబ చేసిన ఈ సాహిత్యకృషిని మనసారా అభినందిస్తున్నాను. = అచార్య శలాక రఘునాథళర్మ , రాజమండ్రి జూలై 2002 మీ “ఉదయరాగం” ఒక (ప్రేమ కావ్యం. కవిత్వంలో పరిణతి, భావోదాత్తత చోటుచేసుకున్నాయి. “రామాయణంలో రసరమ్యఘట్టాలు”
87 అయిదూ అవాల్మీకాలే అయినా నిజమైన రసరమ్య ఘట్టాలే! జానపదుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఘట్టాలు! ఆ ఘట్టాలనే అందంగా, తియ్యంగా, సరళంగా తిరగదోడి పిన్నలనూ పెద్దలనూ పులకరింప జేశారు. ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. ఇది మీ ప్రతిభకు తారకాణ. రంగనాథ రామాయణంపై మీ అనుశీలనం ప్రశంనీయమైన కృషి. ఈ గ్రంథాన్ని మీరు అన్ని కోణాలనుండి పరిశీలించి నిష్పాక్షికంగా నిగ్గుతేల్చారు. ఒక “డాక్టరల్ థీసెస్' ఎలా వుండాలి? అనే దానికి మీ అనుశీలనం ఒక ఉదాత్తమైన ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. న్
= కళావాచస్పతి డా॥ కొంగర జగ్గయ్య, చెన్నై 14-10-2002 అందరూ కవిత్వం వ్రాయలేరు. అది భగవత్రసాదం. ఆ ప్రసాదం వెంకమాంబకు లభించింది. వెంకమాంబ బెచిత్య దృష్టి గొప్పది. కవిత్వానికి బెచిత్యం ప్రాణం. ఆమె రచించిన 'ఉదయరాగం' చదివాను. ఆ పుస్తకంపై వేసిన బొమ్మ “చేయితిరిగిన రచయిత్రి” అని వ్యంగ్యంగా చేసిన సూచన. ఆమెను మనసారా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
- అచార్య బిరుదురాజు రామరాజు, హైదరాబాదు 19-5-2002 డా॥వెంకమాంబ తేటగీతి పద్యాల్లో తేటతేటగా తీయతీయగా గ్రేమ భావుకతను అభివ్యక్తం చేసింది. చక్కని లలితకృతికి అకృతినిచ్చిన డా॥వెంకమాంబకు నా అభినందన. జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత డౌ॥సి.నారాయణరెడ్డి, హైదరాబాదు 15-11-2002 ఆ॥వె. అలతిఅలతి మాట లతి మనోహరముగా బుల్లి పద్యములను పొదిగినావు రామకథను తరచి రసరమ్య ఘట్టాల నేరి రాసిపోసి ఎదిగినావు.
88 కం॥ నులివెచ్చని మీగడవలె పలు రుచులను గొలువునట్టి పదబంధములన్ శలబోసి నీవు వండిన ఫలహారము నిచ్చమెచ్చి పద్యమ్మిడితిన్.
- సహజ కవి డా॥ మల్లెమాల, హైదరాబాద్ 15-11-2002 డా॥ నుంకర వెంకమాంబ ప్రముఖ రచయిత్రి. ఎక్కడా క్లిష్టత కనబడకుండా రచన సరళసుందరంగా సాగిపోవడం వెంకమాంబగారి ప్రత్యేకత. _ ఆచార్య కె. సర్వోత్తమరావు, తిరుపతి 1-5-2002 “ఉదయరాగం” లలితమధురరమ్య కవితగా నన్నలరించింది... బళ్ళారి తెలుగు కన్నడముల కూడలి. అదొక సాహితీ సంగమ క్షేత్రం. అ సాహితీ సుక్షేత్రంలో పరిమిళాలు వెదజల్లే కావ్యపుష్పాలెన్నో వున్నాయి. వాటిలో మేలి పరిమళము లీను కృతులు మీ రచనలు.
- డా॥జానమద్ది హనుమచ్చాస్తి, కడప 11-9-2002 కవయిత్రి వెంకమాంబ రసహృదయం ఆమె నూరక నిలువనీయక కలం పట్టించింది. ప్రధానంగా ఆమెది కధనశైైలి. ఆర్భాటం లేని ప్రసన్న సహజమైన శైలి. అందుకే - పద్యం మాకు నోటపట్టదు - అనుకునే వారిని కూడా పట్టి చదివిస్తుంది, ఆమె కవిత్వం. డా. సుంకరవెంకమాంబ బాధ్యత కలిగిన అధ్యాపకురాలిగా రాణిస్తూ
- నిత్యం రచనా వ్యాసంగం కూడా నిష్టతో చేస్తున్న సాహితీ పరురాలు. సాహితీ క్షేత్రంలో నిత్యకృషీవలత్వంతో ఆమె మరింత రాణింవుకు రావాలని కోరుకుంటున్నాను.
- సి, వేదవతి, హైదరాబాదు 7-2-2002
89
మీ “ఉదయరాగం” ఒక ముగ్గనాయిక యొక్క హృదయంలో
ఉదయించిన అనురాగం... మీ రచన స్వాతిజల్గుగాని రోహిణీ కార్తెవర్షం గాదు.
దీనికి నండూరి వారు వ్రాసిన సాహితీ సరిగమపదని - అక్షరాల సార్ధకం -
సరి=తగినట్టి అనగా సాధుళీలానికి యుక్తమైనట్టి, గమ = గమకంలో అనగా
ఉత్సాహపూరితమైైన పూనికలో కూర్చిన, పద = పదముల యొక్క, ని=
నిధానము. అందుచేతనే ఇది “కన్నడ రాజ్యోత్సవ ప్రశస్తి అవార్డు-2002'ను
పొందగలిగింది... అమలినమైన శృంగార వీథిలో పద్యాన్ని పరిమళ భరితంగా
నడిపినారు. పద్యంపై మోజు తగ్గుతున్న కాలంలో ఇటువంటి రచన వెలువడటం ముదావహం.
- కపిల వాయి లింగమూర్తి, నాగరకర్నూలు
12-8-2003
వెంకమాంబగారికి పద్యమంటే ప్రాణం. ఆ దిశగానే ఆమె కలం
నడిచింది. = రసరాజు, తణుకు 8-6-2002
ం0 కవయిత్రి గురించి.... జననం ; రొకట్ల (అనంతపురం జిల్లా తల్లిదండ్రులు వ. శ్రీమతి ఓబుళమ్మ కీ॥శే॥ సుంకర హనుమంతప్ప విద్యార్హతలు ; సీత, 8.564. ౬.౬.8 (6060140., ౯౧.౨.. వృత్తి రీడర్, తెలుగుశాఖ శ్రీమతి అల్లం సుమంగళమ్మ స్మారక మహిళా కళాశాల, బళ్ళారి అభిరుచులు ; గ్రంథ పఠళనం-రచనా వ్యాసంగం. సాహితీ రూపకాలలోను సమావేశాలలోను పాల్గొనుట. పురస్కారాలు “కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్తి అవార్డు-2002” గుల్బర్గా విశ్వవిద్యాలయం “ఉదయరాగంి పద్య కావ్యానికి ఇచ్చిన పురస్కారం రచనలు - ముద్రితాలు : 1. రంగనాథ రామాయణము - అనుశీలనము (గుల్బర్గా విశ్వవిద్యాలయం పిహెచ్.డి. పట్టా పొందిన సిద్ధాంత గ్రంథం). 2. ఉదయరాగం (పద్య కావ్యం). 3. రామాయణంలో రసరమ్య ఘట్టాలు. (ఖండ కావ్యం). 4. సంధ్యారాగం (పద్యకావ్యం). అముద్రితాలు : సాహిత్య వ్యాసాలు. డు సహందరరకళంరాలు్యు సా శి తా ణ్మీ 0402 క్లవలతై ల య న్ టల మైళ్షా వైచ్యాతన్తోగ
| ఆ | | | డా! సుంకర వెంకమాంబ , డా॥ కుమారి సుంకర వెంకమాంబ సముజ్జ్వల సాహితీ సౌభాగ్యవతి... ఉన్నత పరిశోధకురాలు.... ఉదాత్త కవయిత్రి.... గొప్ప నాయకుణ్ణి... గొప్ప ప్రేమికుణ్జి, వి లో సహృదయుణ్ణి, విశిష్టకవిని, విశుద్ధ మానవుణ్ణి 'సంధ్యారాగం'లో సృష్టించింది. ఇంత చిన్న కావ్యం ో ఎంతో సముదాత్త ప్రేమభావనను, దాంపత్యమాధుర్యాన్ని (ప్రేయసీ ప్రియుల వియోగశ్ళంగార.. పరాకాష్టను ప్రతిష్టించిన కవయిత్రిని అభినందిస్తున్నాను. .. గ - ఆచార్య కొలకలూరి ఇనాక్ డా॥ వెంకమాంబ గారు సాంధ్యరాగాన్ని వినిపించి ఒక అనిర్వచనీయమైన హాయి '____ కలిగించారు. శాబ్టిక, ఆర్థిక చమత్మారాల చాతుర్యం ఈ రచయిత్రి ప్రతిభా ప్రకాశం. సరళమై శైలిలో సారవంతమైన కవితాశక్తిని పాదగటం ఆమె నైపుణ్యం. - సు - ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, పాండిత్యం, దాన్ని మించిన కవిత్వం, ఈ రెండింటితో రూపొందిన ప్రాధకవయిలొ దా॥ వెంకమాంబ. ఈమె రచించిన ఆటవెలదులలో వనమయూరాల నృత్యం, తేట ల ట్ మత్తకోకిలల గళమాధుర్యం ఉట్టిపడుతున్నాయి. “శుకపికరాజహంసాదులెల్ల వాసికెళ్కుట. | నీగురుత్వమున కాదె” అని ప్రశంసితురాలైన ఆచార్వ ఈమె. . చార్య క ఎ ఉత్సల సత్యనారాయ . వ్ / | ఈ సంధ్యారాగకృతిలో ఎక్కడా శబ్బాడంబరం లేదు. అర్థ క్లిష్టత లేదు. అశ్లీలం లేదు. పవతర లేదు. నీరసత్వం లేదు: పాఠకుల మనస్సుల్ని ఆకట్టుకొని, వారికి రసానుభూతిని కలిగ లలిత శృంగార. పేశలమైన రచన మాత్రమే ఉన్నది. ఈ కావ్యం కవయిత్రి రచనా వైిమ్టున్స.
- ఆచార్య వి. రామచంద్రచౌదలి
- సుంకర పయోధి శశిరేఖ వెంకమాంబ | “ మృదుకవిత కింత మాధుర్య మెట్టులబ్బె! / పనస తొనలును విరిదేనె పంచదార .. కలిపి సృస్టించె గాబోలు నలువ రాణి. న.