Telugu Samagra andhra sahithyam (v 2) - anilvaranasi/indianlanguages GitHub Wiki

నాళ?! | ర రెందన్‌ నంర్రీని ఈ, | , తీ " (౯ జా. ంఇట్టి” ం ॥ క పీ లు |

బవహూకగణ క ల్‌ ట్ర | సమగ్ర ఆంధ్ర సాహిత్యం రెండవ సంపుటి ర్‌చ్‌న్‌ ఆరుద్ర తెలుగు అకాడమి హైదరాబాదు 2003

కటగోంబ్రాగం 6624%మర్ట ఏడంగిట్రుంలాా 6|/లిం34 54గజ20 ఉంటంది: తుగురూడ; కెలుంరే 5861600 : 2003; ౧9. + + 1066 + 17+. ౮ రి రి "౭౮౦0౮ ఎయుకన! గ కరల2026 (గ కం+1366 2616101 ; 2003 న. ౦016 : 1000 ల (/ వ013%ఆ 0 గర౮60౮ 449096, క4లా0264-500 029 (తంత లిణరేలల) *96ల 6 ౮౪౧౪21 5001390866 5ంసీలం6 0 ల0యంంగ01% 0౯30010 బుక 162006 10 ఇల్ర10021 పడు క్రండక్రైల 2 ఉం 0176౧10/ 1౯1 0 16 6౦౪౧౧౬౦ హరే! 11 (6 1000 0౯ గంజి కైటం౪గ06 అలలంంణంగ6ం పం 61. తీత గం్రిగిదా *%0బంలులా బా గబా రింంి 262౫ ఏరాంగ 7ట67౪64 4684 ౧౦ 0గ౦౧ ౮౯ ౧౫౮ లీల గ్యారగండడం6డే ల్సి 2% బంటూ (07 4%) ర4గ్తాంలి 744044 4 రంల బలగటూంగ ల్లో 26 00గ్రాగ్రిన? ౮౪౫4న ళల" [రాల స యో ( ౪౧ క అ స్స క || సగం : 23. 270=00 న్‌ అ పన్‌ వాదం గో నాయ కొ0(66 13 12యథ2 వేమ6? ధగాలంల। జ వగ కశ జణుటు/ పంల వగ, ౧160011 - 600014 విగగ096ే 28 వేశం త్య త వరుల, కరీలడరం6ే తవిరమీ రంల.

భూమిక

1968లో తెలుగు అకాడమి స్థాపన జరిగిన నాటి నుంచీ ఉన్నత స్థాయిలో బోధనభాషగా తెలుగు స్థిరపడటానికి అకాడమి నిర్వహిస్తున్న కృషి అందరికీ తెలిసిన విషయమే. తెలుగు అకాడమి ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయివరకు పాఠ్య పఠనీయ గ్రంథాలను, అనువాద, సంప్రదింపు గ్రంథాలను, శాస్త్ర నిఘంటువులను, జనరంజక _ గ్రంథాలను, మోనోగ్రాఫ్‌లను, వృత్తివిద్యాకోర్సులకు సంబంధించిన గ్రంథాలను ప్రచురిస్తున్నది. అందేకాకుండా తెలుగు అకాడమి ఇంటర్మీడియట్‌ స్థాయిలో తెలుగు మాధ్యమంలోనే గాక ఆంగ్ల మాధ్యమంలో కూడా పాఠ్య గ్రంథాలను ప్రచురించి విద్యారంగానికి సముచితమైన సేవ చేస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంవారు ప్రముఖ సాహితీవేత్త శ్రీ ఆరుద్ర రచించిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం గ్రంథం సర్వహక్కులను, ప్రచురణ బాధ్యతను తెలుగు అకాడమికీ అప్పగించడంతో ఆ గ్రంథ ప్రచురణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.

గతంలో “సమగ్ర అంధ్ర సాహిత్యం 13 సంపుటాలుగా. వెలువడి సాహిత్యాఖిమానుల ఆదరణ పొందింది. దీనిలో ఆరుద్రగారు జీవించి ఉండగానే, వారే పలు మార్పులూ, చేర్చులూ చేసుకున్నారు. ఆ సవరణలన్నింటినీ పొందుపరచి, దీనిని మళ్ళీ 4 భాగాలుగా తీసుకొచ్చే ప్రయత్నం తెలుగు అకాడమి చేస్తున్నది. ఆ నాలుగు భాగాలలో ఇది రెండవది గతంలోలాగే ఇది సాహిత్యాఖిమానుల ఆదరణ పొందుతుందడనడంలో సందేహం లేదు.

సమగ్ర ఆంధ్ర సాహిత్య గ్రంథం రెండో భాగాన్ని తూడా ఆరుద్రగారి జన్మదిన కానుకగా తెలుగు అకాడమి వెలువరిస్తున్నది. ఈ గ్రంథ ప్రచురణకు సహకరించిన శ్రీమతి రామలక్ష్మి ఆరుద్రగారికి కృతజ్ఞతలు. ఈగ్రంథం సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు, సాహిత్యాభిమానులకు, విమర్శకులకు, అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాం.

దాః ఎ. మంజులత పంచాలకులు

మనవి

నమగ్ర ఆంధ్ర సాహిత్యం, తెలుగు అకాడమీవారి విశిష్ట వ్రచురణలో ఇది రెండవ నంవుటి. దీనిలో మలిరాయల, ఆరవీటిరాజుల, నాయకరాజుల, కడపటిరాజుల యుగాలు ఉన్నాయి. ఈ నంపుటి సాధ్యమైనంతవరకు లోపరహితంగా వుండాలనే ప్రయత్నం చేశాను. ఇంతకు పూర్వం ప్రచురించిన సంస్థల ప్రచురణలలో - పదాలు, వాక్యాలు, పంక్తులు, పేరాలు, పేజీలు, చివరికి ప్రకరణం కూడా లేకుండా ముద్రణ అయింది. ఆది చాలా విచారింపతగ్గ విషయం. ఆ లోపాలు యీ విశిష్ట నంపుటిలో సరిదిద్దడం జరిగింది. అవన్నీ ఆరుద్ర చేసుకున్న దిద్దుబాట్లను అనుసరించే చేయడం జరిగింది.

అకాడమీవారి మొదటి నంవుటిలో లాగానే ఈ రెండవ నంపుటిలో కూడా - ముఖ్యపదానుక్రమణిక, కవులు, కావ్యాలు, ఇతరులు, ఇతర సాహితీ విషయాల పట్టిక చేర్చాను. ఇది చదువరులకు కుతూహలం రేకెత్తిస్తుందని నా నమ్మకం. అది చూసి, ఏ విషయం కావాలంటే ఆ పేజీ తెరచి చదువుకోవచ్చును. నాలుగు నంపుటాలు పూర్తి అయ్యాక సమగ్ర ఆంధ్ర సాహిత్యం - పసదసూచి తయారు చేయాలన్న ఉద్దేశంతో దీనిలో ముఖ్యమైనవే సూచించడం జరిగింది. లోటుపాట్లను మన్నించి, చక్కని ఈ రెండవ నంపుటిని సాహిత్యాభిమానులు ఆదరించాలని నా ఆశ. చెన్నయ్‌ కె, రామలక్ష్మి జూన్‌ 2003

డాః ఎ. మంజులత సంచాలకులు

మనవి మాటలు

సాహిత్యాఖిలాష గల సాధారణ పాఠకులు అంధ్ర సాహిత్యం గురించి సంపూర్ణంగా చన్నయభట్టునుండి చిన్నయసూరిదాకా మాత్రమేకాక సాతవాహనుల కాలం నుండీ సాహితీ సమితి దాకా అంధ్ర సాహిత్యుం అనేక విధాలుగా, బహుముఖాలుగా సాగింది ప్రజ్ఞావంతులైన తెలుగుకవులు రచించిన గ్రంథాలు అన్నీ అచ్చుపడి వెలుగు చూడలేదు. అచ్చయిన పుస్తకాలు కూడా అన్నీ అందరికీ లభించడంలేదు. లఖించిన పుస్తకాలైనా అన్నీ సాధారణ పాఠకులకు బోధపడే వివరణలతో లేవు. ఈకొరతను తొలగించవలసిన బాధ్యత నేటి సాహితీపరులపై వుంది.

పన్నెండు నంపుటాలలో సమగ్ర ఆంధ్ర సాహిత్యం ప్రజానీకానికి పరిచయం చేద్దామనే సంకల్పం కొన్నేళ్ళ కిందట నాకు కలిగింది.

సమగ్రత అశయం. దీన్ని సాధించడానికి ఇది ప్రయత్నం. పూజ్యులు కందుతూరి వీరేశలింగంగారు ప్రామాణిక సాహిత్యరచనకు పునాదులు వేశారు. శ్రీయుతులు మానవల్లి రామకృష్ణకవిగారు.. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. చిలుకూరి వీరభద్రరావుగారు, కొమర్రాజు లక్ష్యణరావుగారు. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు మొదలైన మహనీయులు సాహిత్యంతోపాటు దేశ చరిత్రను కూడా విశదం చేశారు. నురవరం ప్రతాపరెడ్డిగారు మన సాంఘిక చరిత్రకు శ్రీకారం చుట్టి కొత్త కోణాలను చూపెట్టూరు. వీరి రచనలను ఆధారం చేసుకొని తమ ప్రతిభతో కొత్త అతరాలను గుర్తించి, నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించి సాహిత్య చరిత్రను అనేకమంది విద్వాంసులు, విమర్శకులు, విఖ్యాత పత్రికలలో, వివిధ గ్రంథాలలో వివరిస్తున్నారు. ఈ అమూల్యు రచనలన్నింటిని నా దృక్పథంతో సమన్వయం చేయడానికి ఈ రచనలో యత్నించాను.

ఒక ఖాష మాట్లాడే ప్రజల దేశ చరిత్ర, సాంఘిక చరిత్ర, సాహిత్య చరిత్ర ఒకదానితో ఒకటి పెనవేసుకొని వుంటాయి. రాజకీయాలవల్ల వివిధ రంగాలలో పరిణామాలు ఏర్పడుతూ వుంటాయి. విఖిన్న నంఘటనలే జరిగినా అవి ఒక చారిత్రత క్రమంలోనే వుంటాయి. రాజకీయ ప్రభావాలకు లోనుకాని యుగం వుండదు. రాజవంశాల పెరుమీదుగా యుగాలను పేర్కొనడం రివాతే.

సాంఘిక చరిత్రతు పనికివచ్చే సాహిత్య గగ్రంథాలనే ఎన్నుకొనడంవల్ల సురవరం ప్రకాహెడ్డిగారి యుగవిభజన వారి ప్రయోజనాలకు అనుతూలమైంది సమగ్ర అంధ్ర సాహిత్యంలో వఏస్తీర్ణతను దృష్టిలో వెట్టుకొని నేను యుగాల అంకెను, ఆయా రాజవంశాల ప్రాముఖ్యాలను బట్టీ పెంచవలసి వచ్చింది. ఆదిలో నేను వేసుకొన్న ప్రణూశికలో యుగవిభజన చేసుకొన్నాను. కాని పుస్తక ప్రచురణను ప్రారంభించడానికి ముందే వ్రతినంపుటిలో పుటల పరిమితిని, నంపుటాల సంఖ్యను, ఒక్కొక్క సంపుటం వెలనూ, వన్నెండు నంవుటాలకు మొత్తం పూర్తిగా ముందే చెల్లించే పక్షంలో సెట్టువెల, అందువల్ల

లఖించే లాభసాటి సదుపాయాలూ ప్రకాశకులు ప్రకటించారు. ఎందరో ఈ ప్రణాళికకు స్వాగతం చెప్పారు. చందాదారులుగా చేరారు.

1965 జనవరి నెలనుండి ఈ సంపుటాల రచనకు ఉపక్రమించాను. ప్రతి సంపుటిలోని పుటల పరిమితి ముందుగానే నిర్ణయం కావడంవల్ల ప్రతి ప్రకరణలో తెలిసిన ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా విరివిగానే రాసినా చివరకు కుదించడం తప్పనిసరి అయింది. సమగ్రత దెబ్బతినతూడదని సంపుటాల సంఖ్యను పెంచి అదనపు యుగాలనూ, ఉపయుగాలను చేర్చవలసి వచ్చింది. ప్రచురణకు ముందే ప్రజలకిచ్చిన వాగ్గానానికీ భంగం లేకుండా పన్నెండు సంపుటాలనూ వరుసగా ప్రచురించడం జరిగింది.

1865 ఏప్రియల్‌ నెల నుండి నవంబరు నెల దాకా ఎనిమిది నెలలు క్రమం తప్పకుండా ఆసాంతం రచనచేసి “సమగ్ర ఆంధ్ర సాహిత్యం' సంపుటాలను అచ్చుకివ్వడంలో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. టెన్షన్‌వల్ల రావలసిన అన్ని రుగ్మతలూ వచ్చాయి. అయినా ప్రజలకు ప్రకాశకులతోపాటు వాగ్దానం చేసినది పన్నెండు సంపుటాలు కనుక ఆ సంఖ్యను పూర్తిచేయాలని నిశ్చయించాను. అది 1988 ఫిబ్రవరి నాటికిగాని పూర్తిచేయలేక పోయాను. ఈ పన్నెండు సంపుటాలు వెలువడుతున్నప్పుడు ఆసక్తితో చదివి, సహృదయంతో విమర్శించి, ప్రోత్సహించిన వాళ్ళిందరో ఉన్నారు. చెల్లాచెదురుగా ఉన్న ఆకారాలను ఒక్కచేతో త్రోడీకరించి మ్లోషణ చేస్తున్నప్పుడు రచనలో తప్పులు దొర్లడం తప్పదు. వీటికి తోడు సాపు వ్రాస్తున్నప్పుడో, ఫప్రూఫు దిద్దుతున్నప్పుడో మరికొన్ని సూచించే లోపాలూ, కొందరి కోపాలూ రెండవ ముద్రణలో సర్జుకొంటానని అప్పుడే సవినయంగా విన్నవించుకొన్నాను. మొదటి ముద్రణ సంపుటాలన్నీ ఏనాడో చెల్లుబడీ అయిపోయాయి. రెండవ ముద్రణకోసం ఎందరో ఎదురుచూస్తున్నారు. కొందరు ఒత్తిడి చేస్తున్నారు. గత సంవత్సరం నా రెండు కళ్ళ కేటరాక్టులతూ అపరేషన్‌ విజయవంతంగా జరగడంవల్ల గ్రంథ పఠనానికి, రచన కార్యక్రమానికి వీలు కలిగింది.

సమగ్ర అంధ్ర సాహిత్యంలో కొరతగా మిగిలిపోయిన సంపుటాలను పూర్తిచేయడమేగాక, తొలి పన్నెండు సంపుటాలను కొత్త వైనాలు చేర్చి తిరగరాసి ప్రచరించాలని నిశ్చయించాను. “ప్రజాశక్తి బుక్‌ హౌస్‌” వారు పునర్ముద్రణ ప్రచురణ ప్రారంభిస్తున్నారు. ఒక వ్యక్తి సమాజంలో ఏదైనా సాధించగలిగాడంటే దానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను ఎందరి సహాయ సహకారాలో ఉంటాయి. నా కృషిలో నాకు తోడ్పడిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ పరమార్శాన్ని సాధింప చేస్తున్న నా ఉత్తమార్థం రామలక్ష్మికి నా అభినందనలు.

1998 సంత్రాంతి మదరాసు - అం 017 శరస్రం

సమగ్ర ఆంధ్ర సాహిత్యం - నా మాట

తెలుగు సాహిత్యం ప్రసక్తి వస్తూన్నన్ని రోజులు ఆరుద్ర జీవించి ఉంటాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం అతణ్ణి చిరంజీవిని చేసింది. దీనిలో అసత్యం లేదు. అతిశయోక్తి లేదు. అప్పట్లో “తెలుగు సాహిత్యంపై విస్త్రుతంగా పరిశోధనచేస్తూన్న మీరు ధన్యజీవులు'' అన్నారు వావిళ్ల రామస్వామిశా స్తులుగారు “ఈ సమగ్ర ఆంధ్ర సాహిత్యం ద్వారా చక్కని వాడుక భాష ఎలా రాయాలన్నది జాతికి తెలిపిన మొదటివాడు, సాహిత్య చరిత్ర ఆ భాషలో రాసి మెప్పించినవాడూ ఆరుద్రే” అన్నారు మిత్రులు జి. కృష్ణ, “మీ వ్యవహారిక భాష చాలా ఉత్సాహాన్ని కల్లిస్తూంది సామాన్యులకిది సుబోధకంగా, కుతూహలాన్ని రేకెత్తించేదిగా వుంది. అని మెచ్చారు ఎ.ఎస్‌.గుప్పగారు. "మీ రచన విలక్షణంగా వుంది - సాహిత్య నిర్వచనాన్ని, లక్ష్యంగా వుంచుకుంటూనే అనేకానేక నూతన అంశాలు సవిస్తరంగా హృద్యమమైన శైలిలో ప్రసక్తం కావడం - యీ రచనలోని విశేషాంశం. ఇంపుసాౌంపులతో ముద్దులు మూటకడుతూ, ఆంధ్ర ప్రజానీకాన్ని మురిపిస్తున్న మీ కృషి అజరామరమైనది”' అని సాహిత్యభూషణ పుల్లాభొట్ల వెంకటేశ్చర్లుగారు ఖావించారు. “మీరు అపూర్వమైన ఇన్ఫర్మేషన్‌ ఆంధ్ర సాహిత్యాన్ని గురించి సంపాదిస్తూ మాకానందం కలుగ చేస్తున్నారు” అని అభిమానం ప్రకటించారు కప్పగంతుల లక్షణశాస్త్రిగారు. ““ఆరుద్రగారి గ్రంధ రచనా పద్ధతి - అతి రుచికరంగా వుండి, అక్కడక్కడీ వారి చెణుకులు లెనిన్‌ గ్రాడ్‌ మంచు సోనల్లా చనవులునెరపి చక్కలిగింతలు పెడుతాయి చదువరిని* అని లెనిన్‌గ్రాడ్‌ నుంచి ఎస్‌.వి.జోగారావుగారు భావించారు. “అవసరం అయిన చోట వివరణ అనవసరమైన చోట సవరణ సరసమైన తీర్చు, హృద్యమైన మార్చు, పఠితలను ఆసక్తి కల్షిస్తూంది అన్నది సత్యోక్తి” అన్నారు శ్రీ కొమండూరి రామానుజాచార్యులుగారు. “సామాన్య పాఠకులకు మొట్టమొదటిసారిగా సాహిత్య చరిత్రలో పరిచయం ఏర్పరచుకొనే అవకాశం కల్సించింది. ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకుపోడానికి వీలైనది - మీ సజీవమైన భాష మీ అద్బుత రచనా చాతుర్యం! ఎస్‌.వి.సూర్యనారాయణ అఖిప్రాయపడ్డారు. “వజ్రాలు ఏరడం, రాళ్లు ఏరడం కూడా మనకు ఉపయోగమే. ఆ రాలు ఏరినవాడు మనం కోరకుండానే వరాలు ఇచ్చినవారే.”” వేలూరి వారి ఉవాచ. “ఈ సంపుటాలలో నువ్వు తెలుగు ప్రపంచంలో చిరంజీవివి అవుతున్నావు” అంటూ దీవించారు తాపీవారు.

ఇలా ఎందరెందరో పెద్దలు, ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం మెచ్చారు. ఆరుద్ర భుజం తట్టారు. “పూర్తిచేసిగాని ఆగకు”' అని హ్పైరించారు. ఈ హెచ్చరికకు కారణం వుంది. ఇప్పటిదాకా ఎందరెందరో తెలుగు సాహిత్య చరిత్రను ప్రారంభించినా కొనసాగించీన దాఖలాల్లేవు. ఆరుద్ర ఈ సంపుటాలలో పోనుపోను ఆధునిక కాలపు యువతరానికి అందని, తెలియని - ఎన్నో విషయాలను అందించారనీ, ఈ రీత్యా పోనుపోను సంపుటాలు అపారమైన విలువను సంతరించుకున్నాయనీ - పెద్దలు

అరుద్ర చాలా పట్టుదల గల వ్యక్తి. కువిమర్శకుల ధోరణికి కృంగిపోయే తత్వంగాని, పొగడ్తలకు పొంగిపోయే బలహీనతగాని లేని వ్యక్తిత్వం అతనిది తను

వేసుతున్న ప్రణాళిక ప్రకారం - శ్రమించి రాసుకుంటూపోయాడేగాని, ప్రచురణకర్తలు ఏం చేస్తున్నారన్నదాన్ని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. శ్రమదోపిడీని సహించలేని యీ సామ్యవాదిని - ఎలా దోచుకున్నారో, దోచుకోబడ్డాడో పదుగురు చెప్పినా పటించుకోలేదు. ఫలితం తొలిముద్రణ మాకే రుణభారాన్ని మిగిల్చింది. రెండవ ముద్రణ అత్‌ నిర్లక్ష్యంగా ప్రమరణ అయి అతని మనసును బాగా కృంగదీసింది.

కవి, భావుకుడు, వ్యాపారం తెలియనివాడు, స్నేహానికి ప్రాణం పెట్టే తత్వమున్న వాడు యింత దారుణంగా కృంగిపోవడం నేను కళ్లారా చూశాను. ఈ దేశంలో సాహిత్యం బువ్వపెట్టదు. ఏదో వృత్తి వుండి పక్కన సాహిత్య వ్యాపారం చేసుకుంటే ఏమోగాని లేకుంటే బ్రతుకు భారమే మిగులుతుంది.

ఆరుద్ర పోయాక నేనో నిర్ణయానికి వచ్చాను. యువకుడు, ఉత్సాహావంతుడు అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారిని “ఈ సాహిత్య సంపుటాల సర్వహక్కులు స్వీకరించండి. వాటి విలువ సాటిలేనిది” అని కోరాను. వారు ప్రభుత్వం తరపున స్వీకరించి ఆ హక్కులు, ప్రచురించే బాధ్యతలను - తెలుగు అకాడమీ వారి చేతుల్లో పెట్టారు. చక్కని అవగాహన, సాహిత్యం పట్ల ఎంతో అఖిమానం గల డాక్టర్‌ ఎ, మంజులతగారు ఈ కార్యక్రమానికి ఎంతో సంతోషంగా శ్రీకారం చుట్టి “ఇకమీదే అలస్యం” అని అన్నప్పుడు = ఆమె అభిమానాన్ని నేను కొలవలేను. పదమూడు సంపుటాలను - నాల్గు సంపుటాలుగా రూపొందించాలని నిర్ణయించాను. సంస్కరించి ప్రచురణకు తొలి సంపుటానికి నాంది పల్కాను. ఈ విషయంలో నాకు అన్నివిధాలా వెన్నుదన్నుగా డా॥ మేడిపల్లి రవికుమార్‌ (ఎస్‌.మియూనివర్సిటీ, తెలుగుశాఖ) నిలబడ్డాడు. ఆరుద్ర తను చేద్దామనుకొన్న మార్పులూ, చేర్చులు, తీసీయాలనో, తగ్గించాలనో అనుకున్నవి - అన్నీ అన్ని సంపుటాలలో నోట్‌ చేసి పెట్టారు. నేను వాటిని అనుసరించి అమలో పెడుతూనే, అవసరమైన చోట్ల కుదిస్తూ - తొలి సంపుటి సిద్ధం చేశాను. ఆగస్టు 31, ఆరుద్ర జన్మదినం నాటికి దీనిని వెలువరిస్తానని - బాధ్యత సంతోషంగా డాక్టర్‌ మంజులత స్వీకరించారు. ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్లీ ముఖచిత్రం రాసి యిచ్చారు బాపు - ఎప్పటికీ ఆరుద్ర అభిమాని ఆయన; “నేను వేయడమేమిటి? ఆయన వేయించుకున్నారు” అన్నారు.

ఉత్సాహంతో ప్రచురణ భారం స్వీకరించిన తెలుగు అకాడమీ డైరక్టర్‌ డాక్టర్‌ ఎ. మంజులతకు, హక్కులు స్వీకరించి నాకు మనశ్శాంతిని చేకూర్చిన ప్రియతమ చంద్రబాబుగారికీ నేను శాశ్వతంగా రుణపడి చున్నాను.

నా భావనలో ఆరుద్ర అఖిరుచికి దీటైనది - యీ తెలుగు అకాడమీ వారి ప్రచురణే. ఇదే నాకు తొలి ప్రచురణేమో అనిపిస్తూంది. 30-7-2002 చెన్నయ్‌ శె. రామలక్ష్మి

విషయసూచిక

  1. మలిరాయల యుగం 01

  2. కొరవి గోపరాజు 09 3౩. మాడయ్య కవి 18

  3. మనుమంచి భట్టు 24

  4. మాదయ్యగారి మల్లన 29

  5. కృష్ణదేవరాయలు 37

  6. నంది తిమ్మన 72

  7. చరిగొండ ధర్మన్న, నాదెండ్ల గోపమంత్రి 85

  8. అల్లసాని పెద్దన 91

  9. పుత్తీటి రామభద్రయ్య 104

  10. ధూర్జటి 1%

  11. సంకుసాల నరసయ్య 117

  12. చింతలపూడి ఎల్లన్న (రాధామాధవ కవి) 123 14 హరిభట్టు 133

  13. పిడపర్తి కవులు 144

  14. తాళ్ళపాక కవులు 147

  15. యాగంటి లక్ష్మయ్యగారు 151

  16. పోశెట్టి లింగన్న 159

  17. ప్రొఢకవి లింగన్న 162

  18. వెన్నెలకంటి సూరన్న 1%

  19. వాసిరాజు రామయ్య 177

  20. చెందలూరి చిక్కయ్య 179

  21. కానుకొలను అన్నమరాజు 183

  22. ఖానుకవి 185

  23. తెనాలి రామకృష్ణుడు 1౫

  24. కందుకూరి రుద్రకవి 215

  25. ఇతర కవులు 226 2౫. నవాబుల యుగం 234

  26. ఆరవీటిరాజుల యుగం 242

  27. శంకరకవి 252

  28. వెలగపూడి వెంగన్న 256

  29. టైచరాజు వెంకటనాథుడు 264

  30. మొల్ల 267

  31. అయ్యలరాజు రామభద్రుడు 272

  32. తెనాలి కవులు - బంధువులు 276

  33. అద్దంకి గంగాధరుడు 281

  34. సారంగు తమ్మయ్య 289

  35. చదలువాడ మల్లన 29

  36. పింగళి సూరన్న 296

  37. రామరాజ భూషణుడు 321

  38. మరింగంటి సింగరాచార్యులు 337

  39. ముగ్గురు లాక్షణికులు పత1

  40. పన్నెండు మంది వేదాంతులు 343

  41. పచ్చకప్పురపు తిరువేంగళరాజు 351

  42. దోనూరి కోనేరునాథుడు 353 వ్ర. సిద్ధిరాజు తిమ్మరాజు 366

  43. రామరాజ రంగప్పురాజు 362

  44. జక్కరాబజు వేంకటకవి - అయ్యలరాజు కవులు 368

  45. చక్రపురి రాఘవాచారి 373

  46. ఏకామ్రనాథుడు, చరిత్రకారులు 376

  47. పెదపాటి జగ్గన్న 385

  48. ఒక అజ్ఞాత గ్రంథసంధాత 399

  49. కొందరు స్మరణీయులు 402

  50. మట్ల అనంతరాజు 415

  51. కవి చౌడప్ప 425

  52. తరిగొప్పుల మల్లన 429

  53. _బమ్మెరకవులు, పేరయలింగం 434

  54. బొడ్డుచర్ల తిమ్మన, వీబ్దల తిమ్మరాజు 438

  55. ముద్దరాజు సోదరులు, చిత్రకవి పండితులు ఉక?

  56. కామినేని కవులు, ఆఖ్రితులు వా!

  57. మారన వెంకయ, మరి కొందరు శతక కవులు 458

  58. కులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ తరత

  59. ఇతరకవులు త77 ఆ. నాయకరాజుల యుగం 496

  60. ద్విపదభారత కవిత్రయం 507

  61. ఎలకూచి బాలసరస్వతి - సురఖి మాధవరాయలు 512

  62. భట్ల పెనుమర్తి కోదండరామయ్య 520

  63. రఘునాథ నాయకుడు 524

  64. చేమకూర వెంకటకవి 546

  65. కొందరు తిట్టు కవులు 560

  66. పుష్పగిరి తిమ్మన అతని కవిమిత్రులు 56687 74, కట్టా వరదరాజు 593

  67. అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 596

  68. కృష్ణాధ్వరి. శ్లేష కవులు 606

  69. _ పెద్దాపురం ప్రభువులు, వారి ఆశ్రితులు 613

  70. తొలి తరం ఇతర కవులు 618

  71. విజయరాఘవ నాయకుడు 632

  72. దామెర్ల కవులు - కాకమానిమూర్తి కవి 648

  73. క్షేత్రయ్య 686

  74. రామభద్రమ్మ, రంగాజమ్మ, మరికొందరు ర!

  75. కొందరు నాటకకర్తలు 702 ౪5. సవరం చిననారాయణ 710

  76. గణపవరపు వెంకటకవి 723 ౪7. లింగనమఖఫి తిరుకామయ్య 76 ౫. నారాయణతీర్జులు, సిద్ధేంద్రయోగి 743 ౫. చింతలపల్లి పండితులు - లయగ్రాహి కవులు - బోరవెల్లి సంస్థానం 757

  77. కాకునూరి అప్పకవి 785

  78. పదిమంది శతకకవులు 776

  79. _తాడిగోళ్ళ కదిరీపతి, అయ్యలరాజు నారాయణ 781

  80. మలితరం ఇతరకవులు 706

  81. కడపటిరాజుల యుగం 800

  82. వరంగల్లు సుబాకవులు 810

  83. మెదకు సుబాకథవులు 817

  84. సురపురం సంస్థానం 927

  85. గద్వాల సంస్థానం, కర్నూలు సుబా 62

  86. వేమన, కడపసుబా కవులు 8340

  87. తిరాసుబా కవులు ౫51

  88. మధుర నాయకరాజులు, ఆశ్రితులు 874

  89. తంజావూరు మహారాష్ట్ర రాజులు 296

  90. తంజావూరులో తెలుగు కవులు 910 10%. ఆర్కాటు సుబా కవులు 931

  91. కొండవీడు బందరు సర్కారులు 943 1%. కొండపల్లి ఏలూరు సర్కారులు 949

  92. ప్రోలునాటి కవులు 965 1%. _ కళింగ కవులు 983

  93. ఇద్దరు ఆలంకారికులు 1006

  94. ముగ్గురు శేషధర్మ కవులు 1012

  95. కొందరు మహత్మ్యాలరచయితలు 1016

  96. పదిమంది శతకకవులు 1019

  97. రామాయణ రచయితలు . 1024

  98. అన్నట్టు వీళ్లూ ఉన్నారు 1010 ముఖ్యపదానుత్రమణీక సంప్రదించిన గ్రంథాలు

మలిరాయల యుగం

అది ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమున్న యుగం; స్వర్ణయుగం! అల్లసాని పెద్దన. ముక్కు తిమ్మన, మాదయగారి మల్లన్న ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, సంకుసాల నరసయ్య, రాధామాధవ కవి మొదలైన ఆజానుబాహులందరూ ఈ యుగం లోనివాళ్ళీ. భారతదేశ చరిత్రలోనేకాక, ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే మహా వ్యక్తి కృష్ణదేవరాయల పరిపాలన ఈ యుగంలోనే ప్రజాక్షేమానికి మంగళకైశికీ గీతాలను పాడింది. చాణక్యుజణ్జీ చంపి పుట్టి యుగంధరుని తలదన్నే మహామంత్రి అప్పాజీ తిమ్మరుసయ్య స్వహస్తాలతో ఈ యుగానికి రూపురేఖలు దిద్దాడు. అతని అమృత హస్తాల చలువవల్ల విజయనగర సామ్రాజ్యం వికసించిన పువ్వులాగ గుబాళించింది. అతని విగత నేత్రాల నుండీ కారిన రక్తాశ్రువుల వేడివల్ల రాయల కీర్షికాంత పాదాల లత్తుక లావాగా మారింది. రాయల కుత్తుకలో కత్తులు పాట పాడాయి. ఈ యుగంలోని విజయనగర సాత్రూజ్య చరిత్ర ఆంధ్రులు విస్మరించలేని పుట్టుమచ్చ.

విద్యారణ్యులవారి ఆశీర్వాదంతో సంగమవంశ రాజులు ఈ సామ్రూజ్యాన్ని క్రీశ 135లో స్థాపించారు. కళలను పోషిస్తూ, కవులను ఆదరిస్తూ, ఆఖ్రితులకు అగ్రహారాలిస్తూ, ఉద్పటవివాదాలలో గెలిచినవారికి కనకాఖిషేకాలు చేస్తూ సంగమ రాజులు క్రీ.శ.1485 దాకా పాలించారు. ఈ వంశంలోని కడపటి రాజులు అతి దుర్చలులై అవినీతిపరులుగా మారినందువల్ల, వీరి కొలువులోనే ఉన్న దండనాయకుడు సాళువ నరసింహరాయలు సా్రూజ్యాన్ని రక్షించడానికి క్రీ.శ. 1485లో అధికారాన్ని హస్తగతం చేసుకొని వజ్ర సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు తాళ్లపాక అన్నమయ్యగారిని సత్కరించి సంకీర్షనలను ప్రోత్సహించాడు. పిల్లలమర్రి పినవీరయ్యను పోషించి కృతి పుచ్చుకొన్నాడు. సాళువ నరసింహరాయలు క్రీ.శ 1490లో మరణించాడు. అతడు మృ త్యు ముఖంలో ఉన్నప్పుడు యుక్తవయస్సు రాని తన కుమారులను తన తుడిభుజింలాంటి తుళువ నరసానాయకునికి అప్పగించాడు. ఈ ఇద్దరు కొడుకుల్లో ఎవరు

విశ్వాసపాత్రుడైన నరసానాయకుడు తన స్వామి చెప్పిన మాటలు నెరవేర్చాడు. నరసింహరాయల పెద్ద కొడుకు తిమ్మరాజును గద్దెపై కూర్చోపెట్టాడు. అయితే దురదృష్ట వశాత్తూ అతడు పట్టుమని పది నెలలు కూడా జీవించలేదు. ఈ అభాగ్యుని తరువాత అతని సోదరుడు తమ్మిరాజును, ఇమ్మడి నరసింహరాయలనే పేరిట నరసానాయకుడు గద్దె తెక్కించాడు. ఇతడు క్రీ.శ 1490-1506 వరకు పాలించినట్టు శాసనాలు ఉన్నాయి. అయితే, నరసింహరాయలింతకాలమూ గద్దెమీద కూర్చొని పాలించలేదు. పెనుకొండ దుర్గంలో బంధితుడుగా ఈ రాయలు బతుకుతూ ఉంటే అతని పేరుమీదుగా నరసానాయకుడు అధికారం చలాయించాడు. దీనికి స్వార్ధంకాక సామ్రాజ్య రక్షణే కారణం. కొంతమంది -సామంతులకు నరసానాయకుని పాలన కిట్టలేదు. అతణ్జీ తప్పించడానికి రాయలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారు. ఎదురు తిరిగిన రాయలను నరసానాయకుడు బంధించక తప్పింది కాదు. సామ్రూజ్యంలోని కలహాలను అదనుగా చూసుకొని

2 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సామంతులు తిరగబడ్డారు. పరరాజులు కత్తి దూశారు. ఏకకాలంలోనే ఇంటా బయటా ఉన్న శత్రువులతో నరసానాయకుడు పోరాడి, జయించి రాజ్యానికి కొంత భద్రత చేకూర్చాడు.

ఈ విజయాలలో నరసానాయకునికి ఇద్దరు ఎంతగానో తోడ్పడ్డారు. ఒకరు సాళువ తిమ్మరుసయ్య, రెండవ వారు నరసానాయకుని పెద్ద కొడుకు వీర నరసయ్య, నరసానాయకుని కార్యకర్తగా, మంత్రిగా, విశ్వాసపాత్రుడుగా ఆనాటి రాజకీయ చరిత్రలో తిమ్మరుసయ్య ప్రముఖ పాత్ర వహించాడు. ఈ ప్రధానే కాక చేతికందివచ్చిన కొడుకు తూడా రాచకార్యాలలో పాలొనడం వల్ల నరసానాయకునికి బరువు కొంత తగ్గినట్టుండేది. తండ్రీ కొలువులో వీరనరసయ్య అంతికాన ఉండేవాడు. నరసానాయకుని కొలువును అతనికి వరాహపురాణం అంకితం ఇచ్చిన నందిఘంట కవులు ఇలా వర్ణించారు:

అష్ట భాషా కవిత్వాబ్బసంభవులైన సుకవిపుంగవులు సంస్తుతులు సేయ

సంకీర్ష రాగరంజకులైన గాణల గములు గీత ప్రబంధములు పాడ

కలకంకణ క్వాణకర సరోరుహలైన రమణులు వింజామరములు వీవ

వరబలాధికులైన శరణాగతా రాతిసామంతు లుభయ పార ఏముల గొలువ

ఈతూర్మితనయుడు నరసయ్య గుణనిధాన- మంతికంబున సేవింప నలదికొన్న సురఖికాన్మీరగంధంబు సోడుముట్ట-నుండె బేరోలగమునయనోత్సవముగ (వరాహ పురాణం, 1-11)

ఈ కూర్మితనయుడే తన తరువాత సాత్రూజ్యాన్ని సంరక్షించాలని నరసా నాయకుడు భావించి రాచకార్యాలలో పాల్గొన నిచ్చినట్టుంది. తండ్రీ ఆశలను నరసయ్య వమ్ము చెయ్యలేదు. నరసానాయకుడు క్రీ.శ. 1503లో మరణించాడు.1 సామ్రాజ్యానికి హక్కుదారుడైన రాయలు పెనుగొండ. దుర్గంలో ఇంకా మ్రగ్గుతూనే ఉన్నాడు. బంధితుడైన రాజు పేరిట రాజ్యాన్ని ఏలడం అనే నాటకం నరసయ్యకు మనస్కరించలేదు. తన తండ్రిీకున్నంత ఓపిక అతనికి లేకపోయింది. చెరలో ఉన్న రాయలను చంపించి తానే గద్దెకిక్కాడు. రాయ కిరీటంతోపాటు, నరసయ్య వీర నరసింహరాయలనే పేరును ధరించాడు. ఇతనితోనే వాస్తవానికి మలిరాయల యుగం ప్రారంభమయింది.

వీరనరసింహరాయలు గద్దెకక్కాక మూడేళ్లపాటే రాజ్యం చేశాడు. ఇతడింత సమర్శడైనా, ఇతని ప్రధాని సాళువ తిమ్మరుసయ్య ఎంత రాజకీయ ధురంధురుడైనా పరిపాలన ప్రశాంతంగా జరగలేదు. ఒకవైపు సామంతులు, మరొకవైపు శత్రురాజులు కత్తులు దూసి ఒత్తిడి తెచ్చారు. వీరనరసింహ నాయకుడు నమ్మకస్థలైన స్నేహితులను, బంధువులను తూడగట్టుకొన్నాడు. తన సవతి తమ్ముడు కృష్ణరాయలను రాజధానికి కాపుగా ఉంచి వీరనరసింహరాయలు శత్రువులపై దండు నడిపించుకొని వెళ నిశ్చయించాడు. అందుకు కృష్ణ్టాయలు అంగీకరించలేదు. సైన్యాలతో తానే వెడతానన్నాడు. అప్పటికతడు పదహారేళ్లవాడు. నూనూగు మీసాల నూత్న యౌవనంలో 1 కణం సకుణణం జాండా త వరం ననా

మలిరాయల యుగం రి అహ్మశేవగరము [కుం ఉ ఓరుగల్లు "శ్ర ంయాచ' 06 గుల్చర్ల జ గోలకొండ ౨ కోవెలకొండ . విజాంప్థురం ౧ ఇహ్టైమగర్తో ల షి | యచో [| ండవీడూో ఉం ఫా ముదుగల్లు" గో శ్రీశైలము శ

  • కంప్తలి విజయనగరం కందుకూరు ఉదయగిరి | ౨ పెనుగొండ

9 ద్వారసముద్రము

స. సలు

శాస్తో వెంటి ఉమ్మత్తూరు సే మధులీ ఉన్ని మలిరాయలనాటి ఆంధ్రదేశము

తీ సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఉన్నాడు. ఇటువంటి అర్చకుని సైన్యంతో పంపడానికి వీరనరసింహరాయలు మొదట అంగీకరించలేదుగాని చివరకు ఒప్పుకున్నాడు. కృష్ణరాయలు యుద్ధాలలో బాగా రాణించినట్టుంది. వీరనరసింహరాయలు రాజకీయ తంత్రం బాగా తెలిసినవాడు. ఆధునిక యుద్ధాలలో విజయం సంపాదించాలంటే అశ్వికబలం చాలా అవసరం. అయితే గుళ్టాల వర్తకం ఆ రోజులలో గుత్త వ్యాపారమైంది. జాతి గుజ్జాలను మహమ్మదీయ వర్తకులే దిగుమతి చేసేవారు. వాటిని బహమనీ సుల్తానులకే విక్రయించేవారు. ఈ గుత్త వ్యాపారాన్ని అరికట్టడానికి వీరనరసింహరాయలు చక్కని రాజనీతి ప్రదర్శించారు. అప్పుడప్పుడే మన దేశంతో పోర్చుగీసువారు వర్తక సంబంధాలు పెట్టుకుంటున్నారు. “వాళ్లము రాయలు ప్రోత్సాహం యిచ్చి జాతి గుర్రాలను వాళ్ల ద్వారా దిగుమతి చేయించుకున్నాడు. అన్వికదళాలను పెంపొందింపబేశాడు. జాతిమత విచక్షణలేకుండా, అర్హతగలవారినందరినీ గుగ్రపురౌతులుగా పటాలంలో చేర్చుకున్నాడు. ఈ చర్య విజయనగర సాత్రూజ్యానికి వజ్రకవచమైైంది. ప్రధాని సాళువ తిమ్మరుసయ్య మంత్రాంగం, నమ్మకస్థులైన అరవీటి వంశం వాళ్ల సహాయం, తమ్ముడు కృష్ణరాయల ఉత్సాహం వీరనరసింహరాయలకు పెట్టని కోటలుగా ఉన్నాయి. కప్పమీయక తిరుగుబాటు చేసిన సామంతులపై వీరనరసింహరాయలు స్వయంగా సైన్యాలు' నడుపుకొంటూ వెళ్లాడు. పన్చిమ తీరంలోని తుళువ రాజ్యాధిపతు లను పాదాక్రాంతులను చేసుకొన్నాడు. ఆ తరువాత కనుమలు దాటి కర్నాటకంలో ప్రవేశించి ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నం సామంతులను ముట్టడించాడు. అయితే వాళ్లు లొంగలేదు. పై పెచ్చు, రాయల బలాలను ఓడించారు. ఇది వీరనరసింహరాయలకు హృదయశల్యమైంది. మంచాన పడ్డాడు. అపజయానికి తోడు మరో బెంగ పట్టుకొంది. “ తన తరువాత తన కొడుకు రాజ్యానికి వస్తాడన్న ఆశ సన్నగిల్లింది. వీరనరసింహరాయల కుమారుడు ఎనిమిదేళ్లవాడు. ఈ పసివాణ్ణి తోసిరాజని కృష్ణరయలు గద్దె ఎక్కుతాడని వీరనరసింహరాయలు భయపడ్డాడు. ప్రధాని తిమ్మరుసయ్యను పిలిపించి తన భయాలు చెప్పాడు. కృష్ణ్ణాయలను తక్షణం బంధించి రహస్యంగా వధించి అతని కళ్ళు తనకు _ చూపమన్నాడు, రాజాజ్ఞ విన్న తిమ్మరుసయ్య నిష్క్రమించాడు. ॥ అతడు వెనువెంటనే కృష్ణ్ణాయలను బంధించాడు. రహస్య ప్రదేశంలో ఉంచాడు. అయిడే వధించలేదు. ఆ మహామంత్రికి, అపస్కారకంలోనికి దిగజారుతున్న రాజుగారి అజ్ధకంటే అల్లకలోలం ' కాబోతున్న రాజ్బు రక్షణ ముఖ్యమనిపించింది కాబోలు. సమరాలలో శక్తిసామర్థ్యాలు చూపెడుతున్న కృష్ణరాయలు ప్రజలకు రామరక్ష కాబోయే- ఆయన చెవిన వేశారు. గజపతి ప్రతాపరుద్రుడు దండెత్తబోతున్నాడు. వీరనరసింహ రాయలు సామంతుల చేతిలో అపజయం పొంది మనోవ్యథతో మృత్యుముఖంలో ఉన్నాడు. ఈ స్థితిలో రాజ్యం చాలా పెద్ద శత్రువుతో రాజ్యం యుద్ధం చేయవలసివస్తే

మలిరాయల యుగం ర్‌ సైన్యాలకు ప్రోత్సాహం ఇచ్చే ప్రభువు ముందు నడవాలి. కృష్ణరాయలే అందుకు తగినవాడు. అతణ్ణి చంపి వీరనరసింహరాయల ఎనిమిదేళ్ల కుమారుణ్ణి గద్దెమీద తూర్చోపెడితీ రాజ్యాన్ని ఈనగాచి. నక్కలపాలు చేసినట్టు అవుతుంది. నరసానాయకునితో పాటు తాను పాతికేళ్ల నుంచి పాటుపడీ రాజ్యాన్ని ఇలాగ ఒక కొలిక్కి తెచ్చాడు. ఇది ఇప్పుడు పుటుక్కున తెగిపోయేటట్టుంది. అందుకే సాళువ తిమ్మరుసయ్య కృష్ణూూాయలను రహస్య ప్రదేశంలో సజీవునిగానే ఉంచి ఒక మేకను చంపి దాని కళ్లను తీసుకువెళ్లి వీరనరసింహరాయలకు చూపించాడు. మంచానపడ్డ రాజు గుండెలు

ఇది క్రీ.శ. 1509 జూలైలో జరిగింది. తిమ్మరుసయ్యకు వచ్చిన వర్హమానాలు నిజమ్రేనవే. ప్రతాపరుద్ర గజపతి విజయనగరంపై దాడి చేశాడు. వీరనరసింహరాయలు లేడు. అతని కుమారులు పసివాళ్లు, వాళ్లను చంద్రగిరి కోటకు పంపించి మర్యాదలతో బంధించి తిమ్మరుసయ్య తగిన కట్టుదిట్టాలు చేశాడు. కృష్ణ్ణాయలను విడిపించాడు. రాజుగా ప్రకటించాడు. 1509 ఆగస్టు 7వ తారీఖున కృష్ణరాయలు రాజ్య స్వీకారం చేశాడు. (అనాడు కృష్ణాష్టమి) గజపతి సైన్యాలపై కృష్ణరాయలు కత్తి దూశాడు. యుద్ధం ఏ కారణాలవల్లనో చాలా స్వల్పకాలమే జరిగింది. గజపతి పలాయనం చిత్తగించాడు. కృష్ణదేవరాయలు “గజపతి గజతూటపాకల'” అనే బిరుదు సముపార్టించుకున్నాడు.కి

గజపతిని జయించి, రాజధానిలో అడుగుపెట్టి ఇంక పట్టాఖిషేకం చేసుకొందామనుకొనే వేళకు కృష్ణదేవరాయలకు మరొక అవాంతరం వచ్చిపడింది. విజాపురాన్ని పాలించే యూసఫ్‌ ఆదిల్‌ఖాన్‌ విజయనగరంపై దాడి చేశాడు. అయితే గజిపతిని ఓడించినట్టే ఇతణ్జి కూడా కృష్ణ్టాయలు అదృష్టవశాత్తూ అవలీలగా ఓడించాడు. ఈ విజయం వల్ల కృష్ణదేవరాయలు “పరిభూత సురత్రాణ' అనే లిరుదును సంపాదించుకున్నాడు.

1509 ఆగస్టులో రాజ్య స్వీకారం చేసిన కృష్ణరాయలు వజ సింహాసనాన్ని అధిష్టించక ముందే రెండు బిరుదులు సంపాదించి శాలివాహన శకవత్సరాలు 1431 మాఘశుద్ధ చతుర్దశినాడు, అనగా క్రీ.శ 1510 జనవరి 23-24వ తారీఖుల మధ్య పట్టాఖిషేకం చేసుకొన్నాడు. తనకు ప్రాణదానం చేసి రాజ్యాన్ని ప్రసాదించిన సాళువ 2. క్రీశ 1509లో గజపతి విజయనగరంపై దాడి చేశాడని ఓరుగంటి రామచంద్రయ్య గారు

నిరూపించాడు. సరిగ్గా ఆ సమయానికే చైతన్య ప్రభువు పూరీజగన్నాథానికి విచ్చేశాడు. అప్పుడు గజపతి విజయనగరంపై యుద్ధంలో ఉన్నాడని చైతన్య భాగవతం చెప్తూంది. “ఏ సమయ ఈశ్వర అయలా నీలాచలే తఖనె ప్రతాపరుద్ర నాహిక ఉత్కలే యుద్ధ సేగియాచ్చేన్‌ విజయనగరే అతయేవా ప్రభూనా దేఖలెన్‌ సెయిటారె” ఈటల సగిజత, క4ర 3. “పాఠలం' అంటే ఏనుగులకు వచ్చే పిత్తబ్వారం, 4. డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య గారి అభిప్రాయం ప్రకారం కృష్ణరాయల పట్టాఖిషేకం - 1609 నాడు జరిగింది. చూ. భారతి 1946, సంపుటి ౫, సంచిక 4, పుట 230.

గ్‌! సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తిమ్మరుసును శిరః ప్రధానిని చేసుకొన్నాడు. రాయలవారికి నిజంగా అతను ప్రధాని కాడు; తండ్రీలాంటివాడు. తిమ్మరుసయ్యను కవులిలా పొగిడారు:

అయ్య అనిపించుకొంటివి-నెయ్యంబున కృష్ణ్ణాయనృప పుంగవుచే

నయ్యా నీసరి యేరీ-తియ్యని విలుకాడ వయ్య తిమ్మరుసయ్యా!

(చాటుపద్య మణిమంజరి 1 పుట 105)

తిమ్మరుసయ్య తొలి రోజులలో నూరిపోసిన రాజ నీతుల వల్ల, తీర్చిదిద్దిన రూపురేఖల వల్ల కృష్ణదేవరాయలు అనన్యసామాన్య సా[్రూజ్యాధిపతి అయ్యాడు. తన అద్వితీయ పరాక్రమంతో సంపూర్ణ దక్షిణ భారతాన్ని జయించడమేగాక, గయలో జయశాసనం వేసీటంత మహోన్నత కీర్తులు సముపార్దించుకొన్నాడు. క్రీ.శ 1510లో పట్టం కట్టుకొన్నది లగాయతు క్రీ.శ 1530లో మరణించేదాకా 20 సంవత్సరాలు నిరుపమానమైన జీవితం గడిపాడు. ఎన్నో దుర్గాలు పట్టుకొన్నాడు. ఎన్నో యుద్ధాలు జయించాడు. ఎందరో కవులను పోషించాడు; భూషించాడు. ఎన్నో కృతులు మెచ్చుకొన్నాడు; పుచ్చుకొన్నాడు. నిత్యకల్యాణం పచ్చతోరణంగా జీవితం గడిచింది. (రాయల ఇతర జీవిత వివరాలను కవిగా అతని గురించి చెప్పుకొంటున్నప్పుడు తెలుసుకొందాం.) ఈ నిండుచంద్రుడు అస్తమించేటప్పుడు దీర్షగ్రహణం పట్టింది. తెలుగుజాతి విడుపుస్నానం చేసేలోగా ఆ బ్రతుకు తెల్లవారింది.

తన అన్న వీరనరసింహరాయలలాగే కృష్ణదేవరాయలు కూడా అవసాన కాలంలో తన కొడుకుల కోసం తాపత్రయపడ్డాడు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకొందామని, తాను బ్రతికి ఉండగానే తన కుమారునికి పట్టం కట్టాడు. అప్పుడా బాలుని వయసు అలేళ్ళు. దురదృష్టవశాత్తూ, పట్టంకట్టిన కొద్దికాలానికే కృష్ణ్ణూయల కుమారుడు మరణించాడు. తిమ్మరుసయ్యే విషం పెట్టి చంపించాడని కిట్టనివాళ్లు చెవి కొరికారు. రాయలు నమ్మాడు. మమకారం వివేకాన్ని తోసిరాజంది. రాయలు గుడ్డివాడయ్యాడు. తిమ్మరుసయ్య కళ్లు తోడించాడు. కటకటాల వెనుక పెట్టించాడు. చేయరాని ఘాతుక కృత్యం చేశాక రాయలు పశ్చాత్తాపం చెందాడు. తరువాత నివేకోదయం అయినట్టుంది. 7 తన తరువాత, తన రెండవ కుమారుడు (పద్దెనిమిది మాసాలవాడు) రాజవుతాడన్న ఆశ ఎలాగూ. లేదు. అందుచేత తన రాజ్బుం సోదరుడు అచ్యుత దేవరాయలకు సంక్రమించాలని శాసించి మరణించాడు.

అధికార వొంఛ మహా చెడ్డది. ఆప్పులనే పగవాళ్ళను చేయిస్తుంది. కృష్ణ్ణాయలకు మగ సంతానం చాలా ఆలస్యంగా కలిగినా పుత్రికాలాభం ఆదిలోనే కలిగింది. తిరుమలాంబ అనే కుమార్తెను అరవీటివారి వంశంలోని రామరాజుకిచ్చి పెళ్ళి చేశాడు. అల్లుడు అన్నివిధాలా సమర్శడే. సంస్కారంలో, సాహసంలో ఎవరికీ తీసిపోడు. చివరకు స్వార్థంలో తూడా! తన మామగారి తరువాత తాను రాయసింహాసనం అధిప్టించాలి! లేదా ముక్కుపచ్చలారని మరిదికి సంరక్షతుడుగా ఉండాలి; గాని పినమామగారు (అందులోనూ సవతి పినమామగారు) అచ్యుత దేవరాయలు రాజ్యానికి రావడమేమిటని రాచఅల్లుడు భావించాడు. అడ్డుపెట్టాడు. దానికి తోడు పక్క రాజ్యాలలో ప్రభువు

మలిరాయల యుగం ఇ ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు దాడీ చేద్దామా అని ఎదురుచూస్తున్న పరరాజులు ముట్టడించారు. అచ్యుత దేవరాయలు తన సవతి అన్నగారి ఆజ్ఞ ప్రకారం రాజ్యాన్ని వెంటనే హస్తగతం చేసుకోలేకపోయాడు. పరరాజులను జయించి, అయిన వాళ్ళతో రాజీ చేసుకున్నాడు. కొంత రాబ్యం కృష్ణ్ణాయల శిశువు పేర అళియరామరాయలుీ ఏలుకోవడానికి ఒప్పందం జరిగింది. ఈ సంధివల్ల సమర్భలైన కొందరు రాజోద్యోగులు నొచ్చుకున్నారు. కృష్ణ్ణాయల ఆదేశాన్ని తు.చ తప్పకుండా అమలు జరపనందుకు కొందరు నాయకులు తిరగబడ్డారు. అచ్యుత దేవరాయలు వాళ్లని అణచివేశాడు. తన బావమరిది తరపున కొంత రాజ్యానికి సమ్మతించిన అలియరామరాయలకు రావలసినది తూడా దక్కని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉన్నట్టుండి కృష్ణ్ణాయల కుమారుడు మరణించాడు. అలియరామరాజు అధికారం సన్నగిల్లసాగింది. దానిని నిలదొక్కు కోవడానికతడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అడ్డం పెట్టుకొని పాలించడానికి ఒక వారసుడు అవసరం అయాడు. రామరాజు ఒక వ్యక్తిని పట్టాడు. అచ్యుత దేవరాయల అన్న కొడుకు సదాశివరాయలే సింహాసనానికి తగిన 'వారసుడని చెప్పి రామరాజు ఏలసాగాడు. అచ్యుత దేవరాయల కాలమంతా దండయాత్రలతోనూ, తిరుగుబాటుల తోనూ గడిచిపోయింది. క్రీ.శ. 1530లో పదవి చేపట్టిన అతడు క్రీ.శ. 1542లో తన సవతి అన్నగారిలాగే మరణించాడు. ॥ |

అచ్యుత దేవరాయలు కన్నుమూసేటప్పుడు అతనికి యుక్షవయసురాని ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు వెంకటాద్రి. ఈ పసివాణ్జి గద్దెమీద నిలిపి ఇతని మేనమామ సలకంరాజు చినతిరుమలరాజు రాజ్యం చేయసాగాడు. కొన్ని నెలలు గడిచాయో లేదో మేనమామకు రాజ్యకాంక్ష ఎక్కువైంది. మేనల్లుణ్ణి పదవీభ్రష్టుణ్ణి చేసి రాయసింహాసనం దక్కించుకోవడానికి ఎత్తులు వేయసాగాడు. ఇవి రాజమాతకు తెలిశాయి. తన తోడబుట్టినవాడు ఇంత ద్రోహానికి ఒడికడుతున్నాడని అమె ఆందోళన చెంది విజాపూరు సుల్తానుల సహాయం అర్థించింది. తురక సేనలు విజయనగరంపైకి రాసాగాయి. ప్రజలు భయపడ్డారు. పరసేనలు రాజ్యంలో అడుగుపెట్టకుండా ఉండాలంటే సమర్థుడు రాయసింహాసనం ఎక్కాలి. అందుచేత సలకం చిన తిరుమలరాజుకే పట్టం కట్టారు. అతడు శత్రుసైన్యాలను వెళ్లగొట్టాడు. విజయం సాధించాక అతనికి పట్టపగ్గాలు లేకపోయాయి. కర్కోటకుడయాడు. దారుణ దమననీతిని అనుసరించాడు. మేనల్లుణ్ణీ చంపించాడు. నాయకులను ఏదో ఒక సాకుతో.వధిందాడు. -

ఈ నిరంకుశునికి భయపడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకసాగారు. సదాకివరరాయల పేర రాజ్యాధికారాన్ని కొనసాగిస్తున్న అశియ రామరాయలు ఇదే తరుణమని భావించాడు. సలకం చినతిరుమలరాజుపై యుద్ధం చేసి ఓడించి చంపాడు. క్రీ.శ. 1543లో సదాశివరాయలు సంపూర్ణ విజయనగర సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. పేరు కతడు రాయలేగాని రామరాజే సూత్రధారి. కొంతకాలానికి అళియరామరాజు ప్రత్యక్షంగా రాయనామాలు బిరుదులను స్వీకరించి బాహాటంగా

8 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ప్రభుత్వం నడపటం మొదలుపెట్టాడు. సదాశివరాయలెలాగో క్రీ.శ. 1576 దాకా పాలించాడు గాని అతడు గద్దె ఎక్కిననాడే మలిరాయల యుగం అంతమై అరవీటివారి ప్రాభవం ఎక్కువయిందని చెప్పాలి.

రాజకీయంగా చూస్తే. కృష్ణ్ణాయల అనంతరం ఈ యుగంలో కుట్రలూ, తుహకాలూ ఎక్కువగా కనబడతాయి. అయితే సాంస్కృతికరంగంలో అవిచ్చిన్నమైన సంప్రదాయం అనలెత్తుతూనే ఉంది. రాయలవారంత కాకపోయినా తదితరులు సైతం ఈ కాలంలో కళలను పోషించారు. దాసానుదాసులు సైతం హుందాగా ఉండేవారు. మంత్రులు కూడా కృతులు అంకితం పుచ్చుకొనేవారు. కృష్ణ్ణూాయల అంతఃపురంలో సంగీత నాట్యవిద్యలకు ఆచార్యుడుగా ఉండే భండారు లక్ష్రయ్యీ ఒక చిన్నసైజు సోమంతుడుగా నిండుపేరోలగంలో ఉండేవాడు. ఇతను భానుకవిచేత పంచతంత్రం _ అనువాదం చేయించాడు. తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల గోపమంత్రి కొండవీటి దుర్గానికి పాలకుడుగా ఉండేవాడు. ఇతని దగ్గర పనిచేసే ఊరదేచయ్య తెనాలి రామలింగని తొలి రచనను అంకితం పుచ్చుకొన్నాడు.

కృష్ణరాయల వారి తరువాత రాయసింహాసనానికి వచ్చిన అచ్యుత దేవరాయలు తూడా సాహిత్యాన్ని. పోషించాడు. అతడు స్వయంగా '“తాళమహోదధి' అనే గ్రంథం సంస్కృతంలో వ్రాశాడు. రాజనాథ డిండిమభట్టు 'అచ్యుతరాయాభ్యుదయం' అనే గ్రంథం వ్రాశాడు. ఈ ఆస్థానకవి సంస్కృతంలో భాగవతచంపు బ్రాసి అచ్యుతదేవ రాయలకు అంకితమిచ్చాడు. పురుషుళేకాక స్త్రీలు కూడా ఇతని కాలంలో చక్కని గ్రంథాలు వ్రాశారు. తిరుమలాంబ అనే కవయిత్రి 'వరదాంవికా పరిణయ'మనే కావ్యం వ్రాసింది. అందులో అచ్యుత దేవరాయల జీవిత విశేషాలు - వెంకటాద్రిని యువరాజుగా అఖిషిక్తుణ్జి చేసేదాకా - వివరించింది. ఓడూరి తిరుములాంబ అనే ఒక విదుషీమణి కూడా ఆ కాలంలో ఉంది. అచ్యుత దేవరాయలు బహూకరించిన స్వర్హమేరువును ప్రస్తుతిస్తూ అమె వ్రాసిన శోకాలు హంపిలోని విర్ణలనాథుని దేవాలయంలో ఉన్నాయి. ఈ _ కాలంలోనే మోహనాంగి అనే మరొక రచయిత్రి ఉంది. ఈమె మారీచీ పరిణయం బ్రాసింది. ఈమె కృష్ణ్ణాయలవారి కుమార్డె అనీ, అశియ రామరాయల భార్భ్చ అని కూడా చెప్పుకొంటారు. అచ్యుత దేవరాయలను రాధామాధవ కవి వంటి తెలుగు కవులు ప్రస్తుతించారు.

అళియరామరాజు సంగీత సాహిత్యాలకు పందిరి అయ్యాడు. ఈ యుగంలో వర్ధిల్లినంతగా మరెప్పుడూ లలిత కళలు వర్ధిల్లలేదు. కళలలో లలితాంగులదే పై చేయి కావడం మొదలైంది. మలిరాయల యుగం కడపటి రోజులలో సంఘాన్ని ప్రతిఫలిస్తూ కావ్యాన్ని తరువాత వ్రాసినా, వైచరాజు వెంకటనాథుడు ఇలా వాపోయాడు:

వెల్లివిరినె పెంటి విద్యలు, మగవిద్య - లడుగుపట్టి క్రిందుపడిరి బుధులు

హీనజాతి పురుషు లెచ్చిరి యాచింప-బోవు టెట్లు నేటి భూమిపతుల?

(పంచతంత్రం. 2-132)

  1. ఇతడు 'సంగీత సూర్యోదయం' అనే గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాశాడు.

మలిరాయల యుగం త్తి

పెంటి విద్యల ఆదరణకు ఈ యుగంలో అంకురార్పణ జరిగింది. పుష్పలావికల సరస సంభాషణలు రాయలవారు ఆముక్తమాల్యదలో విరివిగా వర్ణించడానికిదే కారణం. తెనాలి రామలింగడూ, సంకుసాల నరసయ్యా సానివాడలను మరీ విపులంగా వర్ణించారు. ధూర్జటి కాపరిసరాలు కరతలామలకాలే. ప్రవరుణ్జి సృష్టించిన పెద్దనగారు కూడా “రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చే కప్పురవిడెం' లేనిదే కావ్యం చెప్పని రసికులు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు చెప్పినట్టు ““రసికత్వం తిరస్కరింప తగినది కాదు. అది నాగరికతకు నిధానము; పొౌరుషమునకు ఫలము; అభ్యుదయమున కాధారము.?”

మలిరాయల యుగంలో ప్రముఖ కవులు చిత్రించిన నాగరికత, చూపించిన పౌరుషం, సాధించిన అభ్యుదయం ఏమిటో పరిశీలిద్దాం.

కొరవి గోపరాజు

'సర్వబజ్ఞుడు కానివాడు సత్కవి యగునే అనే భావంతో కావ్యాలను విజ్ఞాన సర్వస్వాలుగా, నిఘంటువులుగా తయారు చేసే సంప్రదాయాన్ని మొదలుపెట్టిన కవులలో కొరవి గోపరాజు ప్రథముడు. అతడు తన 'సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యంలో ఇలా

ఎప్పటి కేయది ప్రస్తుత-మప్పటి కావిద్య మహిమ మచ్చుపడంగా

చెప్పక సర్వజ్ఞత్వము- చొప్పడునే? కావ్యమంత సులభమె ధాత్రిన్‌? (సింహా. 1-22)

సర్వజ్ఞత్వం ఉట్టిపడేటట్లు కావ్యం వ్రాయడం అంత సులభం కాకపోయినా, అటువంటి గ్రంథాలు చదువుకొనడానికి చాలా సులభంగా ఉండటం ఎంతో ముఖ్యం. తెలుగున తేటగా కథలు తెల్పితీ కావ్యం పొందులేదనే కాలంలో ఎక్కువగా తెలుగువైపే మొగ్గి విక్రమార్కుని సింహాసనంపై ఉన్న ముష్ఫయిరెండు బొమ్మలూ చెప్పిన కథలను సరసొక్తి కావ్యంగా వ్రాశాడు. తెలుగులో అప్పటికే విక్రమార్క చరిత్రను జిక్కవ చంపూకావ్యంగా వ్రాసి పేరు పొందాడు. కూచిరాజు ఎర్రన్న బేతాళ పంచవింశతి కథనం చేశాడు. వెన్నెలకంటి అన్నయ్య తన షోడశకుమవూర చరిత్రలో కొన్ని బేతాళ విశక్రమార్కకథలు వ్రాశాడు. సంస్కృతంలో ఈ కథలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇప్పుడా “ఎంగిలి కావ్యం ఎందుకు? అని ఎవరైనా ప్రశ్నిస్తే గోపరాజు ఇలాగ సమాధానం చెప్తున్నాడు.

సుగుణులు బాణోచ్చిష్టం-జగత్రయ'మ్మనగ గొంత చదువగ బ్రియమే

తగ తోడంటిన పాలిం-పుగ బెరుగయి యున్న నది యభోజ్యం బగునే?

(సింహా. 1-26)

ఇలాగ జవాబు చెప్పాడు:

10 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సంబంధము లగు రసభా-వంబులు మునుకంటె నఖినవంబులు గలవే యంబుధినె కాక బహుర-త్నంబులు వర్తకుల కేమి తా బండినవే? (సింహా. 1-27) పూర్వ కవులు గొప్పవాళ్ళే కావచ్చు; ఇప్పటి కవులు తల్లికి కడగొట్టు కొడుకులు; వీళ్ళంటేనే ఆమెకు ప్రియం అని చెప్పాడు. పాత కథలు పాత ధోరణిలోనే చెప్పడం వల్ల ఏం ప్రయోజనం? కర్ర ఊత ఇస్తే గుడ్డివాడు సైతం ఎక్కడికైనా నడుచుకొని పోతాడు. తన వచోవిశేషం కనబరుస్తూ పూర్వ కథలు చెప్పాలి. ఇక ఇందులో తప్పులంటారా? ఆదరించక చెడామడా తిడితే బాణమయూర కాళిదాసాదులకైనా తప్పులు తప్పవు. ఇక అన్యుల సంగతి చెప్పాలా? కాబట్టి, నీతోటేమిటి పామ్మనక ఒప్పులే చూసి సత్కవులు మెచ్చుకోండి. తప్పులుంటే అనుమానించక తీర్చిదిద్దండి. 'నేర్చరులైనవారిచే సానలబట్టి తీర్చినను సన్నపురత్నము వన్నై కెక్కదే?' అని గోపరాజు విన్నవించాడు. బమ్మెర పోతరాజులాగే కొరవి గోపరాజు కూడా “సహజ పాండిత్యం కలవాడు. అందుకే పాతిక పద్యాలలో ఇలా విన్నపం చేయవలసి వచ్చింది (సింహాసన. 1:14-38 దాకా). చతురమైన, హృద్యమైన అనవద్య గద్యపద్య విద్యవలన విద్యోదితులైన పూర్వ కవీశ్చరుల ప్రసాదం వల్ల ఆపాదితమైన సహజ సాహిత్య తరంగాలు ఉప్పాంగే అంతరంగంతో గోపరాజు ఈ విన్నపం చేసి రసభావాలు ముప్పిరిగొనేటట్లు ముష్ఫయిరెండు బొమ్మల కథలు పన్నెండు ఆశ్వాసాలలో చెప్పాడు. ప్రథమాశ్వాసంలో కథావతారిక ఉంది. రెండు నుంచి పదకొండో ఆశ్చాసం దాకా మూడేసి కథల చొప్పున ముష్ఫయి చెప్పాడు. చివరి ఆశ్వాసంలో రెండు బొమ్మల కథలు కథనం చేశాడు. ఈ పన్నెండు ఆశ్వాసాలలో తన సర్వజ్ఞత్వం ప్రకటించుకొందుకు సవిస్తరంగా ఈ క్రింది ప్రథమాశ్వాసం : (1) పద్మిని మొదలైన స్త్రీజాతులు (2) అహోకునాలు (3) డేగవేట (4) చేపలలో రకాలు. చ్వితీయాఅశ్వాసం : (5) చతుర్చాషాకవిత్వం (6) సురత తంత్రాలు (7) వంటలు. తృతీయాశ్వాసం : (8) పుత్ర్రోదయం _(9) పురుడుపోసే పద్ధతి (10) వర్ష వర్ణన (11) వసంత వర్ణన (12) వృక్షాల రకాలు (13) పుష్పాపచయం, చతుర్ధాశ్వాసం : (14) నిరోష్ట్రృదండకం (15) రాజనీతులు (16) సూర్యాస్తమయ వర్ణన (17) సంధ్య (18) అంధకారం (19) చంద్రోదయం (20) వెన్నైల (21) మూషకేశ్వర స్థలపురాణం (22) విద్యాప్రశంస (23) ఛందోవిషయాలు (24) స్త్రీ అనే పదానికి తిలుగులో పర్యాయపదాలు, (25) సానివాడ (26) మధుపానం. (క్రీ.శ1435) ఇరవైనాలుగు చెప్పాడు. పదమూడు చెప్పినవాడు ఈ ఇద్దరికీ మధ్య కాలం వాడని పొరబడడానికి ఆస్కారం లేకపోలేదుగాని రాయవాచకంలో ఇరవైవళ్లు మాత్రమే ఉన్నాయి. విశ్వనాథ నాయనివారి స్థానాపతి (క్రీ.శ1575) అనంతునికి కనీసం ఒక శతాబ్దం అర్వాదీనుడు. క్రీ.శ 1550లో ఉన్హు చిత్రకవి పెద్దన 27 యతులు చెప్పాడు. అందుచేత గోపరాజు కాలనిర్ణయానికి ఈ యతుల లెక్క

కొరవి గోపరాజు 11 పంచమాశ్వాసం :. (27) అధ్యాత్మిక విద్యాయోగం (28) శ్లేమూలోపమానంతో ఛందస్సులతో అరణ్య వర్ణన (29) సూర్యోదయ వర్ణన (30) సంగీతం (31) విరహ వర్ణన చంద్రోపాలంభనం (32) వివాహ వర్ణన. సప్తమాశ్వాసం : (33) వసంత వర్ణన (34) అంకయుద్ధం (35) బంధకవిత్వం (36) శరద్వర్ణన. అష్టమాశ్వాసం : (37) వేట (38) సాముల రకాలు (39) పుణ్యతీర్థాలు. నవమాశ్వాసం : (40) వేసవి (41) స్పప్నులాభాలు దశమాశ్వాసం : (42) జ్యోతిషం- గ్రహశాంతులు (43) జూదం, చదరంగం (44) చోరశిక్ష వీశాదశాశ్వాసం : (45) రత్నాలు (46) పద్దులు వ్రాసే పద్ధతులు (47) సప్తసంతానాలు (48) ఇంద్రజాలం (ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ (49) వితంతు ధర్మాలు (50) అరవైనాలుగు కళలు,

ఈ వివిధ విషయాలను కేవలం కేటలాగులా ఏకరువు పెట్టక సందర్పోచితంగా, విసుగు పుట్టకుండా చెప్పడంలోనే గోపరాజు గొప్పతనం ఇమిడి ఉంది. గోపరాజు కూడా నిజంగా కవి పట్టపురాజు. ఉచితార్థ కళారాబితుడు. భామమెరిగినవాడు. ఇటువంటి వాళ్ళను రాజులు చేపడికే రాజ్యం కాదే అన్నాడు, చూడండి,

ఏజనులకైన సద్గుణ - యోజీతులై భావమెరిగి యుచితార్థకళా

రాజితులగు కవిరాజుల - రాజులు చేబట్టిరేని రాజ్యముగాదే? (సింహాసన. 1-29)

అయితే గోపరాజు ఏ రాజునూ ఆశ్రయించలేదు. తన కృతిని నరాంకితం చెయ్యలేదు. తిక్కనగారిలాగా హరహరనాథునికే అంకితం ఇచ్చాడు. హరినీ, హరుణ్ణీ, విడివిడిగా చక్కని పద్యాలలో చల్లగా ఒకసారి దేశ్యాలతో, ఒకసారి తద్చవాలతో వర్ణించాడు. విక్రమార్కుని సింహాసనం ఎక్కబోతూ భోజరాజు ముష్ఫుయిరెండుసార్లు హరినో, హరుణ్లో ప్రార్థించాడు. చేసిన చమత్కారం చేయకుండా గోపరాజు ఈ ప్రార్థనల బ్రాశాడు. కావ్యంలో అక్కడక్కడ సందర్పోచితంగా హరిహర స్తుతులు రచించాడు. ఇతర దేవతలను కూడా చమత్కారంతో నుతించాడు. గంగను నుతించడంలో ఉన్న వ్యంగ్యం చూడండి. “ఒకడీ పాదాలు ఆశ్రయించి, ఇంకొకడి నెత్పెక్కి, మరొకడి వెంటపడి,

ఒకనియడుగు జేరియొకని యౌదల నెక్కి-యొకని వెంట వచ్చి యొకని గలిసి

వెడలి"పారితనుచు విందు మట్టయ్యునీ- జీవనంబు లోకపావనంబు.

(సింహా. 6-12)

గంగ విష్ణుపాదాన పుట్టి శివుని శిరస్సు ఎక్కి భగీరథుని వెంట వెళ్లి సముద్రునితో కలిసింది. ఈ పురాణ కథలను అలాగ చమత్కరించాడు. ఎంతటి మలినుడైనా గంగవల్ల పవిత్రుడవుతాడని శివుణ్ణి ఉదాహరణగా చూపించాడు. చూడండీ.

12 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కాముని గాల్చి బూడిదను గంధముగా గొని యెద్దు నెక్కుచుం

బాములు దోలు నెమ్ములు గపాలములు దన మేని సొమ్ముగా

గాముల గూడి యాడుచును గాడు గృహంబుగ నున్నవాడు గం

గామృత మౌదలం జిలికినంత సదాశివుడయ్యె నెల్లెడన్‌. (సింహాసన. 6-8)

గంగానదిలో తల కడీగితీ చలి ఎందుకు వేయదో వివరిస్తున్నాడు. వినండీ.

మలినుడు మైగడిగిన ని-ర్మలుడౌ టది చెల్లు లోకమాతా, నీలో

దలదడిపిన జలిలేదని-వెలయుట యీ హరుని నుదుటి వేడిమిజుమ్మీ,

(సింహాసన. 6-11)

భావాలలో ఇటువంటి వ్యంగ్యమే కాకుండా చెప్తే గాని తెలియని బంధకవిత్వం తూడా గోపరాజు చూపించగలడు. విశక్రమార్కుని వద్దకు ఒక పేద బ్రాహ్మణుడు తన తుమార్త్హెను తీసుకువచ్చి ఇలాగ స్తుతించాడు:

రాజ్బంబు వదలక రసికత్వ మెడలక జయశీల ముడుగక నయము చెడక

దీనుల జంపక దేశంబు నొంపక నిజముజ్జగింపక నేర్చు గలిగి

విప్రుల జుట్టాల నెన్ను సొచ్చినయట్టివారిని గొల్పినవారి ప్రజల

హర్షంబుతో గాచి యన్యాయ ముడుపుచు మున్ను జెప్పినరీతి జెన్నుమీరి

చేతలొండులేక పాత్రల విడువక - యశముకలిమి తమకు వశముగాగ

వసుధ యేలురా జవర్గంబులోచనయ్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను, (సింహా. 7-75)

ఈ పద్యంలోనే ఆ బ్రాహ్మణుడు నిగూఢంగా ఒక విన్నపం చేశాడట. ఈ సీసపద్యంలోని ప్రతి అర్థపాదంలోని మొదటి అక్షరాలనూ చదువుకొంటే - 'రాజా, దీని వివాహం చెయ్యవయ్యా' అనే వాక్యాన్ని గోపరాజిలా పద్యంలో బంధించాడు. ఇటువంటి చిక్కుప్రశ్చల పద్యాలు గోపరాజుకు ఇష్టమే. విక్రమార్కుని వద్దకు మరో గట్టివాడు వస్తాడు. నాలుగు భాషలలో దీవించి ''నా పేరు ఆరక్షరాలు. అందులో మొదటి అక్షరం తీసివేస్తే నేను అశ్వవేదిని అవుతాను. మొదటి రెండు అక్షరాలు తీసివేస్తే నాట్యకర్త నవుతాను. నాల్లు తీసివేస్తే చాలా నేర్చ్పరిని, అన్ని అక్షరాలు కలిపి చదివితే బుద్ధిబలం గల ట్రొడుణ్ణీ, నేతివీరకాయలాగా కాకుండా సార్థక నామధేయుబ్ది' అన్నాడు. “ఏదీ మళ్ళీ చెప్పు' అని విక్రమార్కుడు అడీగి అతగాడు చెప్పాక - నువు “చతురంగతద్‌జ్ఞ' అనే పేరుకలవాడీవి' అన్నాడు. (సింహా. 2-47, 48)

కొరవి గోపరాజు కాలంలో చదరంగం బాగా ప్రచారంలోకి వచ్చింది “తోసిరాజు ఆటకట్టు' అనిపిస్తానని ఒక ఆటగాడు చెప్పుకొన్నట్లు గోపరాజు వ్రాశాడు.

చతురంగంబున నేనతి-చతురుడ గరితురగమం త్రిశకటభటప్ర

స్థితిపరహస్తముచేయుదు-క్షితి మెచ్చగ రాజు బంటుచే గట్టింతున్‌ (సింహా. 10-౪9)

గోపరాజు తన సమకాలిక క్రీడను చెప్పాడనడం నిర్వివాదాంశం. కృష్ణదేవరాయల వారితో బొడ్డుచర్ల తిమ్మన చదరంగం ఆడేవాడు.

కొరవి గోపరాజు 13

శతసంఖ్యు లొక్కటైనను - సతతము శ్రీకృష్ణ్ణాయజగతీపతితో

చతురంగ మాడి గెలుచును-ధృతిమంతుడు బొడ్డుచర్ల తిమ్మన భళిరే!

(చాటుపద్య మణిమంజరి)

చదరంగంలో ప్రజ్ఞ చూపించినందుకు రాయలవారు తిమ్మనకు '“కొప్పోలు' అగ్రహారం ఇచ్చారు. ఈ క్రీడ మలిరాయల యుగంలో ఇంత ప్రచారం పొందడంవల్ల ఈ కాలపు గ్రంథాలలో చదరంగం ప్రసక్తి కనబడుతుంది. “శూన్యగృహంబులు చతురంగఫలకంబులయంద' అని మాదయగారి మల్లన పురవర్ణన చేశాడు. కుమార్డెను అత్తవారింటికి పంపించేటప్పుడు '“సారెలో ''జాలవల్లికలు, పలుమానికముల చదరంగంబులు, సౌగటాసారెలు' తూడా కుంతలేశ్చరుడు పెట్టాడని సంకుసాల నరసయ్య చెప్పాడు. తేటవెన్నెైలమించు. తెరచిరా జనిపించు నకలంకహారవల్లికలతోడ' గంధర్వులు హిమగిరికి వచ్చారని తెనాలి రామలింగడు చెప్పాడు.

ఈ వర్జనలన్నీ రాయలవారు చదరంగం పోషించడంవల్లే కావ్యాల్లోకీ జొరబడ్డాయి.

కొరవి గోపరాజు రాయలవారి కాలానికి కొంచెం ప్రాచీనుడని పరిశోధకులు తలుస్తారు. ఇతని కాలం క్రీ.శ 1430-1490 అని కొందరు నిర్ణయించారు.

అయితే గోపరాజు క్రీ.శ 1500-1530 వాడని నా అభిప్రాయం. ఇతడు పూర్వ కవిస్తుతిలో పిల్లలమర్రి పినవీరభద్రుని నుతించాడు. (సింహా.1-12) పినవీరయ్య కాలం నిర్వివాదం. క్రీశ 1485-1490లో రాయసింహాసనం అధిష్టించిన సాళువ నరసింహరాయలకు జైమిని భారతాన్ని పిల్లలమర్రి పినవీరయ్య కృతి ఇచ్చాడు. గోపరాజు క్రీ.శ. 1490 దాటాకనే సింహాసనద్వాత్రింిక వ్రాసి ఉండాలి. అందుచేత అతని కాలం క్రీ.శ1500-1530 అని భావించవచ్చు.

అయితే గోపరాజు కాలాన్ని పూర్వ పరిశోధకులు ఒక అరవై సంవత్సరాలు ప్రాచీనం చేయడం అతడు తన కావ్యంలో చెప్పిన వంశక్రమంవల్లనే జరిగింది.

వెలనాటి చోళుల వద్ద ఉండే వెన్నయామాత్కుడు తన వంశకర్త అని గోపరాజు చెప్పుకొన్నాడు. ఇతని కాలం క్రీ.ఈ 1220.

ఈ' వెన్నయామాత్యుని దగ్గరనుంచీ కొరవివారి వంశవృక్షం ఇలా బ్రాయవచ్చు. 2. చాటుపద్య మణిమంజరి, ప్రథమ భాగం 'వేటూరి ప్రభాకర శాస్త్రిగారు. పుట 155. 3. రాజశేఖర చరిత్ర 1-53. 4. _కవికర్షసాయనం, 3౩-195 6. ఉద్బటారాధ్య చరిత్ర, 1-97 8. అంధ్ర కవితరంగిణి, ౪, చాగంటి శషయ్యగారు, పుట 147

వెన్నయ్య (క్రీ.శ 1220) | పేరు తెలియదు | అమరేశ్చరుడు (వెన్నయ్య పౌత్రుడు) పెద్దిరాజు | అబ్బయ్య గోపయ్య. సత్తెనారన (ఆంధ్రకవితాపితామహుడు) రామరాజు కేసన బాచిరాజు సింగన కసవరాజు గోపాల వెన్నయామాత్యుని దగ్గరనుంచీ తరానికి నలభై సంవత్సరాలు లెక్కపెడీతేగాని గోపరాజు కాలం క్రీ.శ. 1430 అవడం లేదు. ఇది చారిత్రక పరిశోధకుల నియమాలకు విరుద్ధం. సామాన్యంగా ముప్ఫయి. సంవత్సరాలనే లెక్కిస్తారు. పాతిక సంవత్సరాలు క్షేమం. అప్పుడు వెన్నయ్యకూ, అతని పొత్రుడైన ఆమరేశ్వరునికీ మధ్య కొన్ని తరాలు గతించి ఉండాలి. పొత్రుడు అంటే సాక్షాత్తూ కొడుకు కొడుకు కాడు. వంశంలోనివాడు అని అర్ధం చెప్పుకొనడం చారిత్రక సంప్రదాయం. తన పెదతాతగారి కుమారులు బాచన, సింగనలు కుమోఢజాత్మస్టోడ సింగన వద్ద మంత్రులుగా ఉండేవారని గోపరాజు చెప్పాడు. (సింహా. 1-48). క్రీ.శ. 13%ీ*1421 దాకా రాచకొండల్లో రెండవ అనపోత నాయకుడు పాలించాడు. ఇతని దగ్గరే బాచన సింగనలు ఉండేవారని భావిస్తే గోపరాజు కాలం క్రీ.శ 1450 ప్రాంతాలుకాక తప్పదు. అయితే పద్మనాయక రాజ్యపు అవసాన కాలంలో క్రీశ 1430-1475 దాకా పాలించిన ముమ్మడి సింగమ నాయకుని కాలంలో ఈ బాచన, సింగనలుండేవారనుకొంటే గోపరాజు కాలం క్రీ.శ 1500 అవుతుంది.” గోపరాజు తండ్రీ కసవరాజు తూడా మంత్రిత్వం చేశాడు. రాణామల్ల నరేంద్రుని వద్ద ఇతడుండేవాడు. ఈ రాణాగారి గురువుగారి పేరు బ్రహ్మదేవ ఒడయరు. ఈతడు శ్రైవాచార ప్రథమ సింహాసనాధీశ్చరుడు. ఇతని కుమార్తె కామమ్మను కసవరాజు వివాహం చేసుకున్నాడు. రాజగురువుల కుమార్తెను పెళ్లి చేసుకోడంవల్లకాక, స్వీయ ప్రతిభవల్లనే కసవరాజు ప్రభుత్వోద్యోగి అయ్యాడని భావించవచ్చు. తన తండ్రిని గురించి గోపరాజిలాగ చెప్పాడు: 7. ఈ నిర్ణయం ప్రకారం ఆంధ్రకవితాపితామహుడు కొరవి స్తైనారనకాలం కూడా శ్రీ.శఈ1430-75 ప్రాంతాలు అవుతుంది. రెడ్డిరాజుల యుగం సుఅ,సా. మొదటి సంపుటి, 2002

కొరవి గోపరాజు 15 తంత్రముచే గార్భము పర-తంత్రము గాకుండ బతిహితమె చేయు మహా మంక్రులలోపల గసవయ-మంత్రి విచారమున దివిజమంత్రియు బోలెన్‌.

(సింహాసన. 1-54) కొరవి కసవరాజూ, అతని ఏలిక రాణామల్లనరేంద్రుడూ ఉండే ఊరిపేరు వేముగల్లు. ఇది తెలంగాణాలో నిజామాబాదు జిల్లా ఆరుమూరు తాలూకాలో ఉంది.

సింహాసనద్వాత్రింశికలోని 21వ బొమ్మకథలో గోపరాజు ఒక ధర్మపురిని 5

గద్యపద్యాలలో వర్ణించాడు. ఇది కరీంనగర్‌ జిల్లాలో గోదావరి ఒడ్డున ఉంది. ఇది

సుప్రసిద్ధ వైష్టవక్షేత్రం. ఇక్కడి నరసింహాలయం విఖ్యాతమైనది. ఈ గ్రామంలో రామేశ్చ్వరాలయం కూడా ఉంది. ఈ జమిలి దేవాలయాలను గోపరాజు ఇలా పేర్కొన్నాడు:

హరిహరు లేకంబనియెడు - పురాణవచనంబు దృష్టముగనొకచోటన్‌

నరసింహుండును, రామే-శ్చరుడును గల ధర్మపురికి వచ్చె గడంకన్‌.

(సింహా. 8-177)

కరీంనగర్‌ జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రాలైన రామేశ్వరం ధర్మపురిని ఈ 21వ కథలో పేర్కొన్నాడు. వేములవాడను కృత్యాదిని స్మరించాడు. కాబట్టి కొరవి గోపరాజు కరీంనగరు జిల్లాలో కూడా నివసించినవాడు కావచ్చు. గోపరాజు వరంగల్లుకు దగ్గరలోవాడన్నది స్పష్టం. “కాకతిమూలశక్తి గనిగా నొనరించిన పైడిచట్టు' అనే

“ఏకశిలా ఖిదానమున నెన్నికకెక్కి ధరిత్రిలోని వేపోకల బోనియిట్టి సిరిపుట్టిన యింటికి

ఓరుగంటికి' ఒక పాత్రను గోపరాజు పంపించాడు. ఆ ఊళో చందనగంధులను, విటులను,

జాణలను, దాన వినోదులను, ప్రభాసుందరమూర్తులను, కవులను, శూరులను చూపించాడు. అక్కడ నుంచి దూరంలో ఉండే గంగదగ్గరతు పంపించాడు. అది త్ర్యంబక విరోద్చూత గోదావరినది. ఓరుగల్లుకు నూరుమైళ్ల కైవారంలో ఉండే ఏదో గ్రామంలో తూడా గోపరాజు ఉండేవాడని చెప్పవచ్చు. భావి పరిశోధనవల్ల రాణా మల్లనరేంద్రుడు ఎక్కడివాడో తేలవచ్చు.

ఉచితార్థకళారాజితులగు కవిరాజుల రాజులు చేపడితే రాజ్యము .కాదే అన్న గోపరాజు తనెందువల్లనో ఏ రాజునూ చేరక, చక్కని కవితారాజ్యాన్నే ఏలుకున్నాడు. ఇతనికి రాజనీతులు విపులంగా తెలుసు. ఇతడు ఈ కావ్యంలో అక్కడక్కడ వ్రాసిన నీతిపద్యాలు సేకరిస్తే ఒక నీతిశాస్త్రమవుతుందన్న వెంపరాల సూర్యనారాయణకశాస్త్రిగారి మాటలు అక్షరాలా నిజం. గోపరాజు కావ్యంలోని వర్ణనలను పట్టి ఆ కాలంనాటి ఆచారవ్యవహారాలను సవిస్తరంగా సురవరం ప్రతాపరెడ్డిగారు గుర్తించారు" సాంఘిక చరిత్ర రచనకు ఉపయోగపడుతూ రసవంతంగా వ్రాసిన కావ్యాలలో గోపరాజు కావ్యం ప్రథమశ్రేణిలో ఉంటుంది.

  1. సింహాసనద్వాత్రింశిక, పీఠిక, పుట 3.

  2. అంధ్రుల సాంఘిక చరిత్ర, ౩-వ ప్రకరణం.

మాడయ్య కవి

మహాభారతానికి జైమిని భారతం ఎటువంటి అనుబంధ గాథో. రామాయణానికి మైరావణ చరిత్ర అటువంటి గాథే. అహిమహిరావణులన్న పేర్లు కూడా రావణాసుర తుంభకర్ణులంత సుప్రసిద్ధమైనవే. ఆంజనేయుడు తోకతో కోటకట్టి రక్షించుకుంటున్న రామలక్ష్మణులను ఎత్తుకొనిపోయి పాతాళ లోకంలో భద్రకాశికి బలివేయబోయిన మైరావణ చరిత్ర ఆంధ్రదేశంలో ఈనాడు ఆబాలగోపాలానికీ తెలిసిన గాథే. ఆ ఘట్టాలు కొట్టిన పిండే. ఈ మైరావణ చరిత్రను మొట్టమొదట ఆంధ్ర సాహిత్యంలో పద్య కావ్యంగా రచించిన కవి పేరు మాడయ్య. ఇతడు వీరనరసింహరాయల కాలంలో 1485-1508 ప్రాంతాల మధ్య ఉండేవాడు. ఇతని జన్మస్థలం గుడివాడ. ఇది కృష్ణా జిల్లాలోని గుడివాడే అని చెప్పవచ్చు. పిఠాపురం దగ్గిర ఇంకో గుడివాడ వుంది కాని, బహుశా అది ఈ కవి స్వగ్రామం కాదేమో! ॥

ఏ గుడివాడ జన్మస్థలం అయినా, మాడయ్య అక్కడ నిలకడగా ఉన్నవాడు కాదు. దేశం అంతా సంచారం చేశాడు. ఇతడు సర్వాగమశబ్ద శాస్త్ర చతురవివేకుడు.! తన విద్వత్తు చూపించడానికి ప్రతికక్షులను జయించడానికి చాలా ఆస్థానాలకు వెళ్ళాడు. కర్ణాట సాభ్రూజ్యాధిపతి వీరనరసింహరాయలను మెప్పించాడు. కోట సింగన మంత్రిగారి కొలువులో '“తస్కరకవిరాజు నెవరినో ఇతడు ఓడించి దట్టించాడు. మొన మొన్నటి జయపురం సంస్థానాన్ని ఆ రోజులలో నందాపురం అనేవారు. ఆ మన్యం భూములు కూడా మాడయ్య సందర్శించి కాంచనాభరణాల బహుమతులు అందుకొన్నాడు. ప్రస్తుతం పర్తాకిమిడిగా ప్రసిద్ధమైన కిమిడి రాజ్యాన్ని పాలించే రాజుల నుండి రెండు గుద్రాలను కానుకగా పుచ్చుకొన్నాడు. క్రీ.శ. 1497-1530 మధ్య పాలించిన ప్రతాపరుద్ర గజపతి సమకాలికులు, దాయాదులు అయిన నారాయణ రుద్రదేవుడో, అతని వారసుడు అనంత రుద్రదేవుడో అప్పుడు కిమిడి రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. మాడయ్య అఖిల

ఇన్ని రాజ్యాలు సందర్శిస్తూ, అక్కడి కవులతో వాదాలు పెట్టుకుంటూ జీవితం గడిపిన మాడయ్య నిలకడగా అక్కడక్కడ విశ్రమించి పుస్తకాలు వ్రాశాడు. “దేవేంద్ర విజయం' అనే ద్విపద కావ్యాన్ని వ్రాసి ఎర్రమంత్రికి అంకితం ఇచ్చాడు. ఇతడు కేసక్షా వినుతుని సుతుడు. ఇతని బావమరిది కాండవవంశంలోని వేజర్ల అబ్బయ్యగారి గోపమంత్రి. తన బావమరిది ఎర్రయ్యకు ఒక కావ్యాన్ని మాడయ్య అంకితం ఇవ్వడం చూసి గోపమంత్రి తూడా కృతిని పుచ్చుకోవాలని అనుకున్నాడు. కవిని పిలిపించి “మైరావణ చరిత్ర' ను చెప్పించాడు. తొలి కావ్యాన్ని ద్వాపదగా వ్రాసినా దీనిని మూడు ఆశ్వాసాల ప్రబంధంగా మాడయ్య రచించాడు. అష్టాదశ వర్ణనలలో వీలైన కొన్ని మాత్రమే వర్ణించాడు. అన్నీ పులిమి కావ్యాన్ని చెడగొట్టలేదు.

మాడయ్య కవి తన కావ్యంలో నన్నయ తిక్కనలను మాత్రమే ఇలాగ నుతించాడు:

మాడయ్య కవి 17

రక్కసీచేత జిక్కువడి రాయిడిబొందినయట్టి వేదముల్‌

చక్కగ జేసి వ్యాసుడు ప్రశస్తము సేసిన భారతం విలన్‌

దక్కగ నాంధ్రభాష విశదంబుగ జెప్పిన నన్నపార్యునిం

దిక్కనసోమయాజీిని మదిం దగ గొల్బెద గావ్యభూతికిన్‌ (మైరావణ చరిత్ర, 1-12)

కవిత్రయంలో మూడవవాడైన ఎగర్రయ్యగారిని ప్రస్తుతించకపోయినా వారి నక్కడక్కడ అనుకరించాడు. ఎర్రయ్యగారు తమ హరివంశంలో ప్రోలయ వేమారెడ్డిని వర్ణిస్తూ అతడు అనేక కథనాలు చెప్పి చేసి చేయుచున్నాడు; చేయనున్నాడు, “పునరుక్తికృతి శుభావలుల నెల్లో అన్నారు. మాడయ్య కూడా సరిగ్గా ఇలాగే తన కృతిపతిని వర్ణించాడు.

తన మనస్ఫూర్తి సురమంత్రి ననుసరింప-దన గఖీరిమ వననిధి తరము డింప

వెలసి వెలయుచునున్నాడు వెలయగలడు- గురుతరోదారి వేజర్ల గోపశారి

(మైరావణ చరిత్ర, 1-16) .

ఎర్రయ్యగారిని ఇలా అనుకరించినా ఎందువల్లనో వారి పేరెత్తలేదు, వీరినే కాదు. శ్రీనాథుని కూడా నుతించలేదు. వంటకాలను వర్ణించడంలో మిగతా తెలుగు కవులంతా శ్రీనాథుని తరువాత చెప్పవలసినవాళ్ళీ. ఉడుకు బచ్చలికూరనైనా చక్కగా పద్యంలో ఇమిడ్చే నైపుణ్యం అతనికే చెల్లుతుంది. మాడయ్య కవి మైరావణ చరిత్రలో చివర శ్రీరాములవారికి కౌసల్యాదేవి వడ్డించిన వంటకాలను ఇలా వర్ణించాడు:

ఒసపరియైన రాజసపు టోగిరమున్‌ మిరియంపు గూరలు[౯

గసగస లానవాలు గడు గమ్మని నెయ్యిని విండివంటలున్‌

రసములు బాయసంబు మధురంపు ఫలంబులు నూరుగాయలున్‌

బసగల భక్తితో బసిడిప్లారమందున బెట్టె నెంతయున్‌ (మైరావణ చరిత్ర, ౩3-199)

మైరావణ చరిత్రలో కౌసల్యా దేవిచేత రాములవారికి వడ్డన చేయించడానికి _ కారణం బైమిని భారతంలో పినవీరభద్రుడు దేవకీదేవి చేత వడ్డింపించడమే. చూడండి ఆ పద్యాలు.

కనకపీఠి జుతుష్షష్టికాకబోల- విరచితంటైన పసిడిహ్లారమునందు

దేవకీదేవి వడ్డింప దృష్తిమీర- బంకజోదరు డారగింపంగదొడగి

మెత్తనైమిలమిల మెరయు రాజన్నంబు నొలుపుబప్పులును సద్యోఘృతంబ

నప్పడంబులు వడీయములు దాలింపులు బలుచని నులివెచ్చపడిదములును

బులుసుగూరలును బజ్ఞులు దియ్య చారులు బంచదారలు నానవాలు జున్ను

బులగంబు బహువిధంబుల పిండివంటలు బాయసంబులు వడపప్పు తేనె

పానకంబులు సిగరులు ఫలరసాయ- నములు బచ్చళ్ళు కలవంటకములు బెరుగు

నూరుగాయలు మొదలుగా నుచితవృత్తి- నారగింప జతుర్విధాహారములను

(జైమిని భారతము, ౩-49, 50)

  1. హరివంశం, పూర్వ 1-19

18 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఈ వంటకాల పద్యం శ్రీనాథుని అనేక పద్యాలకు అనుసరణ. ముఖ్యంగా హరవిలాసంలోని ఒక పద్యమూ, క్రీడాఖిరామంలోని ఒక పద్యమూ దీనికి వరవళ్లు పెట్టాయేమో చూడండీ.

మిరియమునుల్లియు బసుపు మెంతియు నింగువ జీరకంబు శ

ర్కరయును జింతపండును గరాంబువు గమ్మని నేయి తైలమున్‌

బెరుగును మేళవించి కడు బెక్కు విధంబుల బాకశుద్ధి వం

డీరి సిరియాలునిం గటికిడందమునం దరళాక్షు లిద్దరున్‌ (హరవిలాసము 2-121)

తప్పురభోగివంటకము కమ్మని గోదుమపిండివంటయున్‌

గుప్పెడు పంచదారయును గ్రొత్తగ గాచిన యాల నే పెస

ర్పప్పును గొమ్మునల్లనట్టిపండ్లును నాలుగు నైదు నంజులున్‌

లప్పలతోడ గ్రొంబెరుగులక్ష్మణవజ్ఞలయింట రూకకున్‌ (క్రీడాఖిరామము, 168)

ఇలా పినవీరభద్రుని ద్వారా, శ్రీనాథుని ప్రభావం కనబడుతున్న మాడయ్య భావించడంలో తప్పులేదు. సభలలో వాదించడం ఇతనికి ఇష్టం. కుకవి నింద చేసే సందర్చంలో సభలలోని పండితమ్మన్యులనే తిట్టాడు.

పౌంకపు గావ్యలక్షణము పోక డెరుంగక దిట్టకూళలై

కొంకక వంకరర్థములు గూర్చి సభాస్థలి బ్రౌడులట్లుని

శృంక జరించుచున్‌ సుకవి సంఘము వల్కుల మెచ్చతూరకే

యంకము సేయవచ్చు నల యయ్యల మున్నుగ బ్రస్తుతించెదన్‌. (మైరావణ చరిత్ర, 1-13)

ఇందులో ప్రస్తుతించు అనే క్రియకు “మిక్కిలి కొనియాడు* అనే నైఘంటికార్థం ఉన్నా, వెటకారంగానే కవి వాడాడు. ఇలాగ జాతీయాలు వాడడం ఈ కవి కలవాటే. శ్రీరామునితో నీకు విరోధమెందుకని మైరావణుడు మొదట హితోపదేశం చేసిటప్పుడు తోపంతో రావణుడు ఇలా అంటాడు.

ఇచ్చట నినుదలచిన పని-మెచ్చగ జేసితివి, చాలు, మెల్లన నిక నీ

వచ్చిన త్రోవనె క్రమ్మర-విచ్చేయుము వలవ దిచట వెరచెద వనినన్‌

(మైరావణ చరిత్ర, 1-115)

ఈ మైరావణుడు ఎంతటి మాయావో విఖీషణుడు సుగ్రీవాదులకు చెప్పినప్పుడు మాడయ్య చాలా అరుదైన ప్రయోగం చేశాడు, చూడండి.

మనలోన మనకు గలహము - పెనుపంగా నేర్చు మిత్రభేదము పుట్టన్‌

ఎనమండ్రలోన బదుగుర- గనుమాయల మొరగి తివియగా నేర్చు దగన్‌

(మైరావణ చరిత్ర, 1-124)

మైరావణుడు ఎనమండుగురిలో పదిమందిని కనుకట్టుతో లాగుతాడట। ఇతనికీ

శ్రీరాముడు దేవుడని మొదటే తెలుసు. ఈ సంగతి రావణునితో చెప్పి విధిలేక రాముణ్జీ

మాడయ్య కవి 19 ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడాతని భార్య మాతంగి తన భర్తకు రాముని గొప్పతనం చెప్తుంది, దశావతారాలలో పరశురామావతారం కాక ఆరు వర్ణించి అవి శ్రీరాముని పూర్వావతారాలని హెచ్చరిస్తుంది. అతడు తెలిసి తెలిసి చావు తెచ్చుకుంటాడు. అతని మరణ వార్తను చెప్పడానికి రాక్షసాంగనలు వెళ్లినప్పుడు మాతంగి ఎలా ఉందో మాడయ్య బాగా వర్ణించాడు. ఇరుగెలంకుల దైత్యతరుణీకదంబంబుగొలువ గద్దియమీద నలరుదాని సలలిత సత్కళాసాభాగ్య రేఖల బౌలోమియొప్పుల బరగుదాని నవరత్నమయ భూషణములకు దన మూర్తిభూషణంటైయండ బొలుచు దాని మృదుపాణిపద్మంబు మెరుగుజెక్కిట జేర్చి తన భర్త సేమంబు దలచుదాని వృద్ధపుణ్యాంగనలు సెప్పవీనులలర గథలు వినుచున్న ధర్మమార్గంబు దాని గలిత తన్వంగి మాతంగి గాంచి మొక్కి హస్తములు మోడ్చీ కడుగంపితాత్ములగుచు. (మైరావణ చరిత్ర, 3౩-135) ఈ వర్దనలోని 'కథాశ్రవణం' రంగనాథ రామాయణంలోని రావణాసురుని తల్లిని జ్ఞాపకం చేస్తుంది. లంకను విడిచిపెట్టి శ్రీరాముని శరణు వేడడానికి ముందు విభీషణుడు తల్లి దగ్గరకు వెడతాడు. ఆ ఘట్టంలో ఆమె “'వెన్నెలరసమాన విదళించి తివిరి మిన్నేటి నురుగుతో మెరుగు పెట్టినట్లు” నెరసిన కనుబొమలతో. నెరసిన కిరప్సుతో ఉంది. ముదుక కతుప్పసాలు తొడిగింది. పురాణాలు వింటూంది. ఆ సంగతి రంగనాథ రామాయణకర్త ఇలా చెప్పాడు. వెలసిన తనయొద్ది వేదఘోషములు | సలలితమ్మగుచున్న జలఘోషములుగ వినుతమహుద్విజవితతులు చెలగ గనుపట్టు జాహ్నవిగంగనా నొప్పి బహుపురాణంబులు బహు వేదములును బహుశాస్త్రములు పెక్కు బ్రహ్మరాక్షసులు " బహుభంగిజదువంగ బహుభక్తివినుచు బహుళ నిర్మలశుభప్రభ దేజరిల్ల నుండియు రావణు నొప్పమి దలచి - కొండంత వగపు చేకొనియున్న తల్లి గాంచి దండము వెట్టి కన్నుల నీరు - నించి దుఃఖితుడైన... (రంగనాథ రామాయణం, పుట 259) మాడయ్య కాలంలో రాచవారి ఆడవాళ్లకు పుణ్యాంగనలు పురాణం చెప్పేవారు కాబోలు, రాచమాతల వైభవాన్ని ముక్కుతిమ్మనగారు కూడా చక్కగా విశదం చేశారు. ఇంద్రుని తల్లి అదితిని ఎలా వర్ణించారో చూడండి. తొడలపైజాచిన యడుగు గెందమ్ములనొయ్యన బౌలోమియొత్తుచుండ బార్జ్వభాగంబున బంకేరుహాసను కామినీరత్నంబు కతలు సెప్పు బనిబూని యంతంత వినయాపనతవృత్తి సప్పర్షికాంతలు సంచరింప వీజనచామర వీటికరండాదికములు దిక్చతిసతీగణములు దాల్చ

20 సమగ్రాంధ్ర సాహిత్యం విమలచింతామణీమయ వేదిమీద - గల్చ్బకలతాంత కల్పితతల్పసీమ

నధివసించిన నిఖిలలోకైక వంద్య - సమరమౌక్షికశూక్తినయ్యదితిగనియె.

(పారిజాతాపహరణం, 3-24)

పెద్ద కోడలి తొడల మీద అడుగులు చాపి ఆమెచేత ఒత్తించుకొంటూ చదువుల

సరస్పాతి చెప్పే కథలు వింటూ, సామంతుల భార్యల చేత వింజామరలు వీయించుకొంటూ

పౌరోహితుల భార్యల విధేయత చూస్తూ భోగాలు అనుభవించేది, నిజంగా నిఖిలలోకైక

వంద్య, సామ్రాజ్యాధిపతికి జనయిత్రి, రాణివాసంలోని స్త్రీలు ఇలా కథలు - బహుశా రామాయణం - వినిపించుకొంటే పురుషులు పురాణాలు వినేవారు.

ఆ రోజులలో రామాయణం పారాయణం చేయడం ఒక వ్రతం అని నికరంగా చెప్పవచ్చు, మాడయ్య సోదరుడు మల్లన రాచవారి మన్ననలు పొందాడు. 'రామాయణ పారాయణ పఠనద్రతం'లో కీర్తి సంపాదించాడు. ఈ సంగతి తనతో తన కృతిపతి చెప్పినట్టు మాడయ్య కృత్యాదిని వ్రాశాడు.

నీయగ్రజుండు దక్షిణ-రాయనృపప్రవిమలాల్ది రమణీయుడు రా

మాయణపఠనవ్రతని- త్యాయతఘనయశుడు మల్లనార్యుడు పేర్మిన్‌,

(మైరావణ చరిత్ర, 1-20)

తన కాలంలో ఇంత ప్రసిద్ధమైన పురాణ పఠనాన్నే మాడయ్య మాతంగి

శుద్ధాంతంలో పేర్కొన్నాడు. భర్త మరణించాడని తెలిశాక మాతంగి రోదనాన్ని ఇలా వర్ణించాడు:

అల్లన యాణిముత్తియము లాకలిదీర మెసంగి మీలు దా

మొల్లక పాయగా నుమియు నుర్విని రాలెడు రీతి గుప్పలై

ర్యుల్లన గంటినీరు కుచ్చూలములం దురలంగ నేడ్చె ను

త్భుల్లసరోజనేత్ర తన పూరుషు సారెకు జేరు వాడుచున్‌ (మైరావణ చరిత్ర, 8-13)

అడవారి కళ్ళు చేపలలాగే ఉండవచ్చు. కన్నీటి చుక్కలు ఆణిముత్యాలలాగ - ఉండవచ్చు. శోకిస్తున్న ఆడదాని కంటి చేపలు కక్కుతున్న ముత్యాలలాగ కన్నీటి చుక్కలు రాలాయని వర్ణించడం బాగానే ఉంది అయితే మగడు చచ్చి ఏడుస్తూన్న దాని నిలా చూపించడం కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది. మాడయ్య అక్కడక్కడ మంచి వర్ణనలు చేశాడు. మొట్టమొదట అయోధ్యాపురాన్ని వర్ణిస్తూ ఇలా ఉడ్రేక్షించాడు:

అపురమున గల మణిమయ- గోపురముల సంచరించు కోమలు లెపుడున్‌ నూపురములందు జుక్కల-దా పింపంగాదె రాజు తనలో గందెన్‌ (మైరావణ చరిత్ర, 1-40) అయోధ్యను వర్ణిస్తూ మాడయ్య రామరాజ్యంలో పామరులు, మూర్చలు, అలసులు, తామసులు, అజ్ఞానమతులు, ధైర్భహీనులు, సోమరులు లేరని చెప్పాడు.3 ఆదర్శ రాజ్యంలో

మాడయ్య కవి 21 అందరూ విద్యావంతులే అని వర్ణించడంలో ఈ కవి మనస్తత్వం బోధపడుతుంది. ఇతణ్జ కృతిపతి ఇలా పొగడాడట! రసములు తొమ్మిదింగలుగు రమ్యనవార్థసుశబ్బమాధురీ విసరము లుల్లసిల్ల నతివిస్ఫటలక్షణరూడి బౌడీమన్‌ రసికుల నెమ్మనంబులను రాగము నొంద దెనుంగుబాసనిం పెసగగ జెప్పనేర్తు సరి యెవ్వరు నీకును మాడ ధీమణీః (మైరావణ చరిత్ర, 1-22) ఇతడు ఏఏ రాజ్యాలు సందర్శించాడో మొదట మనం చెప్పుకొన్నాం. ఆ సంగతులన్నీ కృతిపతినోట మాడయ్య ఈ పద్యంలో విశదం చేశాడు. చూడండి: మెప్పించినాడవు మెరవడి గర్జాటనరనాయకుని వీరనారసింహు దట్టించినాడవు తస్కరకవిరాజు గోటసింగనమంత్రి కొలువులోన గాంచినాడవు కనక్కాంచనాభరణంబు లేపార నందాపురీశుచేత నందినాడవు నుత్తమాశ్వద్వయంబును కిమిడిభూమండలరమణుచేత నవమతిస్సూర్తి గ్రోడించినాడ వఖిల కావ్యలక్షణలక్ష్యసాగరము నెరయ నిన్ను వేర్వేర నింక వర్ణింప నేల ప్రోడ వన్నింట సర్వయమాడసుకవి (మైరావణ చరిత్ర, 1-18) ఇందులో మాడయ్య అఖిల కావ్యలక్షణ లక్ష్యసాగరము క్రోడీకరించాడని ఆనాటివాళ్లు చెప్పినా ఈనాటివాళ్లు ఇతడు లక్షణ విరుద్ధమైన ప్రయోగాలెన్నో చేశాడని నేటి చిన్న వ్యాకరణ దీపంతో వెదకి తప్పులు పట్టుకొంటారు. యకారంబును, వువూ వో వోలును దెలుగుమాటలకు మొదట లేవు అని చిన్నయసూరి సూత్రీకరించాడు (బాల, సంజ్ఞ 17). అయితే మాడయ్య కావ్యాన్ని చూస్తే 'వొ' కారంతో మొదలయ్యే పదం కనబడుతుంది. నాటి రాత్రి రామలక్ష్మణులను కాళికి బలి యివ్వాలని మాతంగితో మైరావణుడు చెప్పే ఘట్టంలో ఈ ప్రయోగం చేశాడు. కావునను మొరగి దశరథ - భూవరతనయులను నాదు పూనిక దక్కన్‌ ఈవేళ దెచ్చి కాళిక - కే 'వొ” ప్పన చేతు దలక కిమ్ముల దరుణీ. (మైరావణ చరిత్ర, 1-141) ఫ్రాసస్తానంలో 'వొప్పని అనే మాట వాడాడు, ఒకారంతో మొదలవవలసిన మరికొన్ని మాటలు “వి కారంతో మాడయ్య ప్రయోగించాడు. వలచుధాతువుకు వ్యతిరేకంలో “ఒల్లను' అని ప్రయోగించాలని లాక్షణికులు అనుకొంటారు. అయితే మాూడయ్య కావ్యంలో “వల్లను' అనే రూపం కనబడుతుంది. శ్రీరాముణ్ణీ మైరావణుడు ఎత్తుకొనిపోయాక విలపిస్తున్న సుగ్రీవు డిలా అంటాడు. (వ

22 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి త్రుళ్ళిన రావణాసురుని ద్రుంపక సంతతశోకమగ్నయై

తల్లడ మందుచున్న వసుధాసుత గావక వీరధర్మమున్‌

బొల్లుగ జేసి రాఘవులు వోయినయప్పుడె మేను బ్రాణము

ల్వల్లను నంగదుం గొనుచు వారిధి మెల్లనె దాటు డీందరున్‌

(మైరావణ చరిత్ర, 2-60)

ఇందులో “ఒల్లను' అనే మాట దిద్దడానికి వీలులేని యతిస్థానంలో ఉంది.

అందుచేత మైరావణ చరిత్రను సంస్కరించిన పండితులు ఇలా వ్రాశారు: “ఇందు

వలచుధాతువునకు వ్యతిరేకమునందు 'ఒల్లను' అని ప్రయోగింపవలసియుండగా 'వల్లను' అను గ్రామ్యరూపము వాడబడినది.”

అయితే “వ్యతిరేకంబునందు వలచున కొల్ల విభాషనగు” అని చిన్నయసూరి సూత్రీకరించాడని మరచిపోతూడదు. (బాల. క్రియ 107) “ఒల్లు రానప్పుడు “వల్ల' రావచ్చు నని విస్కరిస్తేినే ఇది గ్రామ్యరూపమనుకోడం జరుగుతుంది మాడయ్య ఈ కావ్యంలో “పుడమీశుడు అనే ప్రయోగాలు పద్దెనిమిది చేశాడు. కొన్ని లక్షణ విరుద్ధాలని పరిష్కర్తలు దిద్దేశారు.

“ఇందు 'పుడమీశ అనునది గ్రామ్యరూపము, పుడమి శబ్దము సంస్కృతమను ఖ్రాంతిచే నీశశబ్దముతో సవర్ణదీర్హమున గలుపబడినది. ఇట్టిచోట్ల మేము “పుడమిదొర' యని సవరించుచు వచ్చితిమి. మోషముగ మార్చుచేయ నక్కర లేకుండ దిద్దుటకు వీలున్నచోట్ల నిట్లే మరికొన్ని సవరింపబడినవి' అని పరిష్కర్తలు చెప్పారు. పండితులు దిద్దిన అసలు పాఠాలు దొరికితే 'అఖిల కావ్యలక్షణ లక్ష్యసాగరం' వ్రాసినవాళ్లు సహితం ఒకనాడు వాడే అపురూప ప్రయోగాలు మనకు దక్కేవి. మాడయ్య తన 'దేవేంద విజయం' అనే ద్విపదలో ఇటువంటివి ఎన్ని ప్రయోగాలు చేశాడో; అతడు లక్షణ విరుద్ధమైన అర్థాలను చెప్పినవారిని క్షమించలేదు. తస్కరకవిరాజును ఇటువంటి సందర్చంలోనే దట్టించి ఉంటాడు. ఈ కవి ఎవరో, ఏ పుస్తకాలు బ్రాశాడో తెలియదు._ సంస్కృతంలో బిల్లణ చరిత్ర వ్రాసిన చోర కవికీ, ఇతనికీ సంబంధం లేదు. మాడయ్య తన కావ్యంలో ఆ సంస్కృత కవిని స్తుతించాడు.

ప్రార్ధనము సేతు తివుభద్రు బదరసేను

జోరు భవభూతి దండి మయూరు బాణు

మాఘు భారవి నుదృటు మరియు బేరు "

గల కవీంద్రుల జింతింతు గరిమతోడ (మైరావణ చరిత్ర, 1-11)

తస్కరకవిరాజు కోటసింగరాజుగారి కొలువులో ఉండేవాడని మాడయ్య పద్యంవల్లనే తెలుస్తుంది. ఈ కోట సింగరాజు ముప్ఫయి రెండు ప్రసిద్ధ మంత్రులలో 4. శ్రీరామకృష్ణ కవులు, మైరావణ చరిత్ర, పీఠిక, పుట ౩.

  1. శ్రీరామకృష్ణ కవులు, మైరావణ చరిత్ర, పీఠిక, పుట 4.

మాడయ్య కవి 23 ఒకడు. ఇతడు రాజమండ్రి వద్ద ఉండే పట్టిస వీరభద్రేశుని భక్తుడు. ఈ కోట సింగరాజు నిరతాన్నదాత. ఇతణ్జి కీర్తించే భట్రాజుల పద్యాలను వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్య మణిమంజరిలో క్రోడీకరించారు. గడుసరి లోఖి యర్థ మది కన్న పుదొంగల బందిపోటుకున్‌ బుడమిని వారకాంతలకు భూపతిికిం జను గోటసింగ! నీ పడసిన యర్థ మార్తులకు బాంధవకోటికి యాచకాళికిన్‌ గుడికిని సత్రశాలకును గూపతటాకవన ప్రతిష్టకున్‌. (చాటుపద్య మణీమంజరి, 94) ఇతనికీ కీర్తి భార్యవల్ల వచ్చిందని మృదువుగా హాస్యమాడిన పద్యం ఒకటీ ప్రసిద్ధమైనదే. తోటసింగ రాజుమాటవాసియె గాని - గంగమాంబవలన ఘనత కెక్కె గంగమాంబ జగతి గయ్యాళియైనను - సింగరాజి తేమి చేయగలడు? (చాటుపద్య మణిమంజరి, 94) ఈ చాటువులు ఎవరు చెప్పారో తెలియదు. మాడయ్య చెప్పినా చెప్పి ఉండవచ్చు, చాటువులే కాక నీతిపద్యాలు బ్రాయడంలో మాడయ్య సిద్ధహస్తుడు. మైరావణునిచేత రావణునికి “పరస్తీహరణం పాపమని ఇలా చెప్పించాడు. పరులకు నవ్వు పట్టు తన బంధుజనంబుల కెల్ల నిందయ స్థిరముల కాలయంబు కడు సిగ్గులచేటున కాస్పదంబు స త్పరమము త్రోవగాక కడు భాసురకీర్తికి మూలహాని యె వ్వరికి బరాంగనంగలియ వర్తనమే బల మెంత గల్లినన్‌. (మైరావణ చరిత్ర, 1-107) సుమతి శతకం మొదలైన ప్రబోధ శతకాలలోని నీతులవంటివి కూడా మైరావణ చరిత్రలో ఉన్నాయి. మైరావణుని మేనల్లుడు నీలమేఘునకు పట్టం కట్టి హనుమంతుడిలా హితోపదేశం చేస్తాడు. చేరకు పాతివ్రత్యల - గోరకు పరధనము లెంత కోపంబైనన్‌ బోరకు విజ్రులతోడను - నేరకు గలలోననైన నిష్టురభాషల్‌ మనుపుము దీనజనావళి - మనుపుము బాంధవుల బవ్రీతి మరి దానవులన్‌ దనుపుము పితృదైవంబుల - ననుపుము సత్కీర్తి దిశల కరుగం బేర్మిన్‌ (మైరావణ చరిత్ర, 3౩-162, 16) మాడయ్య సక్కీర్షిని మైరావణ చరిత్ర చక్కగా చాటుతుంది. 6. చాటుపద్య మజీమంజరి, 2-వ ఖాగం,పుటు 72.

మనుమంచి భట్టు అనాది నుంచి భారతీయ సైన్యాలను గజ, తురగ, రథ, పదాతి దళాలు అనే చతురంగబలాలుగా విభజించేవారన్న సంగతి సుప్రసిద్ధం. వీటిలో అశ్వబలం చాలా ముఖ్యమైనది. శత్రువులను సూటిగా ఎదుర్కొనడానికీ, పారిపోయేవాళ్ళను వెంట తరుమడానికీ, తన సైన్యాల పార్శ్వాలను రక్షించుకొనడానికీ, యుద్ధ వార్తలు దేశం అంతటా రహస్యంగా చేరవేయడానికీ, శత్రుసేనను చీల్చి తోసుకొని చెండాడడానికీ మన పూర్వులు అశ్వ్చ్వదళాలను ఉపయోగించారు. వేగం, సాహసం అవసరం అయ్యేచోట్ల అశ్వదళమే విజయసాధకమని భారతీయుల విశ్వాసం. ఈ అఖిప్రాయాన్నే మనుమంచి భట్టు అనే కవి ఒక పద్యంలో ఇలా చెప్పాడు: కరిరథవీరథీషణవికారజల గ్రహకోటిచేత దు స్తరమగు వైరిభూరణసైన్యపయోనిధి నెన్న నశ్చమం దరగిరి ద్రచ్చెగాక మరి తక్కిన రీతుల ద్రచ్చవచ్చు నే యరయగ వీరలక్షి నిలనౌభళకంపధరాతలేశ్వ్చరా! (అశ్వలక్షణసారము, 1-72) ఇది 'హయలక్షణవిలాసం' అనే అశ్వశాస్త్రంలోని పద్యం. మంచి జాతి గుజ్తాల లక్షణాలు విశదపరచే గ్రంథాలు సంస్కృతంలో ఎన్ని ఉన్నా తెలుగులో మొదటి గ్రంథం కాకతీయుల కాలంలోనే వెలసింది. ఎవరో పేరు తెలియని తెలుగు కవి 'శాలిహోత్రం' అనే అశ్వశాస్త్రం రచించాడు. దానిని కొలనువారి వంశంలో ఉన్న గన్నయ్యకు అంకితం ఇచ్చాడు. ఈ గ్రంథం చాలా ప్రసిద్ధమయింది. దీనిలోంచి ఒక పద్యాన్ని తీసుకుని మడికి సింగన తన సకలనీతి సమ్మతంలో ఇలా ఉదహరించాడు: నాలుగుకాళ్లును గొనయును - వాలము వదనము విశాలవక్షము దెలుపై మేలైన యష్టమంగళ - నేలెడు పతియేలు నవని నేలెడు పతులన్‌ (సకలనీతి సమ్మతం, 827) మడికి సింగన శాలిహోత్రంలోనిదని ఉదాహరించిన ఈ పద్యమే కొద్ది మార్చులతో మనుమంచి భట్టు రచించిన 'అశ్వ్చలక్షణసారం' అనే గ్రంథంలో ఉన్నట్టు కనబడుతుంది. నాలుగుకాళ్లుం గొనచెవి-వాలము వదనము విశాలవక్షము తెలుపై త్రాలునది యష్టమంగళి-నేలిన పతియేలు ధరణి నేలినపతులన్‌ (అశ్వలక్షణసారము, 1-27) వాస్తవాని కీ పద్యం శాలిహోత్రం అనువదించిన రచయితదే గాని మనుమంచి భట్టుది కాదు. శాలిహోత్రంలోని చాలా పద్యాలను లేఖకులు ఇతర గ్రంథాలలో బ్రాసుకొన్నారు. కొండపల్లివారు అచ్చువేసిన అశ్వలక్షణసారం 'మొదటి అంకురంలో 2. ప్రచురణకర్తలు . కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్సు

మనుమంచి భట్టు 25 తొలి 62 పద్యాలూ శాలిహోత్రంలోనివే. 65వ పద్యం ఇలా శ్రీకారంతో మొదలవుతుంది.

శ్రీజన్మసదనరాజ- వ్రాజిత యసమాననయనరాజీవునకున్‌

రాజులకు దుగ్ధవారిధి-రాజునకున్‌ కుమూరకంపరాజున కెలమిన్‌

ఆ తరువాత వచనం ఇలా ఉంది.

'అభ్యుదయపరంపరాఖివృద్ధిగా నా యొనర్చం బూనిన హయలక్షణ విలాసంబను కృతికి కథావిధానం బెట్టిదనిన.” (అశ్వలక్షణసారం, 1-64)

ఈ కృత్యాది వాక్యాల వల్ల తొలి 62 పద్యాలలో కొన్ని ఇంకొక గ్రంథంలోనివని స్పష్టం. ఈ పద్యాలు గన్న భూపాలునికి అంకితం, ఇాలిహోత్రంలోనివే అని ఈ పద్యం రుజువు చేస్తూంది.

అనఘుడు శాలిహోత్రుడు హయంబులకున్‌ మును జెప్పినట్టి యా

యనుపమలక్షణంబులు వయఃపరిమాణము రోమజంబులన్‌

దెనుగున నెల్లవారలకు తేటపడన్‌ రచియింతు సత్కవుల్‌

విని కొనియాడ దానగుణవిశ్రుత కన్నయమేదినీశ్వరా! (అశ్వలక్షణసారం 1-2)

కాకతీయుల కాలంలో అనువదించిన ఈ గ్రంథంలోని పద్యాలు ఇలాగైనా తెలియవస్తున్నందుకు సంతోషమే. కాకతీయుల కాలంలోనే ఒక అశ్వశాస్త్రం తెలుగులోనికి వచ్చినా, మళ్లా ఇంకొక హయలక్షణ విలాసం వ్రాయడానికి కారణం తొలిరాయల యుగంలో గుర్రాల ప్రాముఖ్యం చాలా హెచ్చింది. వాటికోసం బాలా యుద్దాలు, విప్లవాలు, దారుణాలు జరిగాయి. అధర్వవేదకాలం ముంచే యుద్ధంలో ఆశ్బాలు వాడుతున్నా, అశ్వమేధ యాగాలు చేస్తున్నా, మనవాళ్లు మంచి జాతి గుర్రాలను యవన దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉండేవారు. పశ్చిమ తీరాన, గోవా కేవు పట్టణం ఒకనాడు విజయనగర సామ్రాజ్యంలో ఉండేది “మూరు'లనే వర్తకులు ఈ రేవులో అరబ్బీ, పారశీక దేశాల నుంచి మంచి గుర్రాలు దిగువతి చేసేవారు. వాటిని బహమనీ సుల్తానులకు, ఇక్కడి హిందూ రాజులకు విక్రయించేవారు. అయితే మత పక్షపాతంతో బహమనీ సుల్తానులకు, వారి ఆన్రితులకు మాత్రమే ఉత్తమాశ్వాలను విక్రయించేవారు. కొన్నాళ్లకు విరూపాక్షరాయల కాలంలో. (క్రీ.శ 1465-1478) విజయనగర రాజులకం ఏరకం గుర్రాలైనా అమ్మడం మానివేశారు. తన రాజ్యంలోఉన్న రేవులో దిగుమతి చేసే గుర్రాలను తన శత్రువులకు అమ్ముతున్నారన్న కోపంతో విరూపాక్షరాయలు గోవా పట్టణంలో ఉన్న పదివేల 'మూరు'లను చంపించాడు. ఈ ఘోరకృత్యం జరిగాక బహమనీ సుల్తానులు కొంకణంపై దాడీ చేసి గోవా రేవును హస్తగతం చేసుకున్నారు. ఆ తరువాత అది మళ్ళా విజయనగరం చేతికి రాలేదు. పశ్చిమ సముద్రంమీద జరిగే వ్యాపారంపై బహమనీ సుల్తానుల అజ్ఞలకు లోబడి ఉంది. వాళ్లు నిజంగా అశ్వ్చపతులయ్యారు.

26 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఈ చారిత్రక పరిస్థితులను చూస్తే మళ్ళీ ఒక అశ్వశాస్త్రం తెలుగులో రచించవలసిన అవసరం కనపడుతుంది. అందుకే మనుమంచి భట్టు “'హయలక్షణ విలాసం రచించాడు. ఇది చాలా ప్రచారం పొందింది. ఎందరో దీని ప్రతులు వ్రాసుకొన్నారు. అయితే ఇంతకుముందు ఉపయోగిస్తున్న శాలిహోత్రంలోని పద్యాలను లేఖకులు ఈ హయలక్షణ విలాసంలో చేర్చుక్తొన్నారు. ప్రాచీన గ్రంథంలోని భాగాలనేకాక అనంతర లేఖకులు అర్వాచీన గగ్రంథంనుండి కూడా కొన్ని భాగాలను హయలక్షణవిలాసంలో కలుపుకొన్నారు. ఏకాలంలోవాడో తెలియని ఒక కవి (కామయ్య శిష్యుడు) అశ్వశాస్తాన్ని వ్రాసి, ఏ రాజ్యపువాడో తిలియని ఉత్తమ గండదొడ్డభూపాలునికి అంకితమిచ్చాడు. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో “హయలక్షణవిలాసం' అనే తాళపత్ర గ్రంథంలో 41 కమ్మలు ఉన్నాయి. వాటిలో 23 కమ్మలలో మనుమంచి భట్టారకుని గ్రంథంలోంచి, మిగతా పద్ధెనిమిది కమ్మలలో ఈ “ఉత్తమగండ- అశ్వశాస్త్రం' అనదగ్గది ఉంది అందులోని చివరి పద్యాలలో ఇలా ఉంది :

గాయకసత్కవీం ద్రబుధకల్పమహీరుహమైన దొడ్డభూ

నాయకు కీర్షి యెంత సురనాగమహో... కృతిన్‌

దోయధిసప్తకావృత చతుర్ధిశభూమి వెలుంగుచుండ బ్ర

హ్మాయువు శ్రీయు నయ్యెడు మహామహిమోత్తమగండభూవరా!

కరివరదుని గమలాసను- నిరుగురువుల విద్య శిక్ష యిచ్చిన...

*.. నొగి గ్రియవిద్యకు - గరకలితాబ్బములు మోడ్చి కామయ గొల్తున్‌

ఈ అశ్చశాస్తాన్ని అంకితం పుచ్చుకొన్న ఉత్తమ గండభూవరుడు ఎవరో తెలుసుకొనడానికి ప్రయత్నిద్దాం. ఛందోగ్రంథాలలో '“ఉత్తమగండచ్చందం' అని ఒకటి ఉంది. దాన్న గురించి రావూరి దొరస్వామిశర్మగారిలా వ్రాశారు : “ఉత్తమగండవిరుదము గల సాళువకంపరాజున కంకీతము, కంపరాజు హయలక్షణసారకర్త. ఈ ఛందఃకర్త చిత్రపు భీమన యని లక్షణశిరోమణి వలన దెలియుచున్నది.'*

సాళువ కంపరాజు అశ్వశాస్త్రాన్ని అంకితం పుచ్చుకొన్నాడేగాని రచించలేదు. కంపరాజుకు "ఉత్తమగండ' అనే బిరుదు ఉన్నట్టు కనపడదు.

“ (1 మీసరగండ, (2) బర్చరబాహ, (3) రాయచౌహత్తమల్ల, (4) ధరణీ వరాహ, (5) కఠారిరాయ అనే విరుదులే కంపరాజు కున్నట్టు మనుమంచి భట్టు గగ్రంథంవల్ల తెలుస్తున్నది. గ 482 గ్రంథంలో ఉత్తమ గండభూవరుని పేరు దొడ్డరాజు, ఇతని తండ్రిపేరు ఖీమరాజు, సాళువ కంపరాజు హయలక్షణసారకర్త అని రావూరివారు ఏ ఆధారాలవల్ల విలాసాన్ని మనుమంచి భట్టు అంకితం ఇవ్వడంలో ఎంతో జౌచిత్యముంది. అలాగే-తొలి 1250.

  1. తెలుగు ఖాషలో ఛందోరీతులు, పుట 403.

మనుమంచి భట్టు 27 శాస్త్రీయ గ్రంథం శాలిహోత్రం కూడా గుర్రాలను దిగుమతి చేసుకొనే కొంకణ మండలాన్ని పాలించే గన్న్యయ్యకు అంకితం ఇవ్వడంలో ఎంతో చారిత్రకమైన జౌచిత్యం కనబడుతుంది.

హయలక్షణ విలాసంలోని కృత్యాది పద్యాలు లఫించలేదు కనుక మనుమంచి భట్టును గురించిన వివరాలు తెలియవు. గ్రంథం ఆశ్వాసాంత గద్భలో ఇలా ఉంది : “ఇది సకల సుకవిజనసంస్తోయమానకవితాచాతురీధురీణ నిఖిలభాషాప్రవీణ ఖైరవాచార్య పుత్ర పరమపవిత్రమనుమంచి భట్టు ప్రణీతంబైన హయలక్షణవిలాసంబు.””

దీనివల్ల ఇతని తండ్రి ఖైరవాచార్భుడని, ఇతడు కవితాచాతురీధురీణుడని, నిఖిలభాషాప్రవీణుడని తెలుస్తుంది. శాస్త్రీయ గ్రంథాలలో కవితాచాతుర్యం చూపడానికి ఆస్కారాలు తక్కువ అయినా చక్కని ధారతో, మృదువైన పదాలతో చక్కని కవిత్వం దబాశాడు.

వరశుభలక్షణంబులను వర్జనకెక్కిన ఘోటకంబులన్‌

ధరణిపు డెక్కబోవలయు దజ్జగతీపతి కోరివచ్చునిం

పరుదున శత్రులక్ష్మివిభవాన్వితర్చై యఖిసారికాకృతిన్‌

దురమున గంపభూరమణదోర్పలభీమ కుమారమన్మథా! (అశ్వలక్షణసారము, 1-75)

ఈ హయలక్షణవిలాసాన్ని అంకితం పుచ్చుకొన్న సాళువకంపరాయలు కర్నూలు జిల్లా చింతకుంట గ్రామంవాడని, క్రీ.శ. 1442-1459 ప్రాంతాలవాడని చాగంటి శేషయ్యగారు అభిప్రాయపడుతున్నారు.!

ఈ కంపరాయల తండ్రి పేరు జౌబళరాయలు. క్రీ.శ 1442లో “శ్రీమన్మహా మండలేశ్వర అవుబళదేవమహారాజులకు వోబాయ్యమ్మకున్ను సుపుత్రుడైన శ్రీమన్మహా మండలేశ్చర మీసరగండకఠారి సాళువ కంపయ్య దేవమహారాజుల శాసనం ఒకటి లఖిస్తూంది. దీనిని నిడుదవోలు వెంకటరావుపంతులుగారు. ప్రకటించారు ““శ్రీపంతులుగారి. పరిశోధనల వలన చరిత్రకారుల కగపడకుండ దాగియున్న కంపభూపతి బయలుపడుటయు, మనుమంచి భట్టు కాలము సరిగా నిర్ణయమగుటయు తటస్థించినది” అని చాగంటి శేషయ్యగారు వ్రాశారు.”

అయితే దురదృష్టవశాత్తూ ఈ శాసనంలోని కంపరాయలూ, మనుమంచి భట్టు కృతిని అంకితం పుచ్చుకొన్న కంపరాయలూ విఖిన్న వ్యక్తులు. శాసనంలోని కంపరాయల తల్లి పేరు ఓబాయమ్మ. కృతిభర్త అయిన కంపరాయల తల్లి పేరు ఫీమాయమ్మ డాక్టరు బిరుదురాజు రామరాజుగారు సంపాదించిన హయలక్షణ విలాసం సమగ్రప్రతిలోని ఒక సీసపద్యపు ఎత్తుగీతిలో ఇలా ఉంది.

క. ఆంధభ్రకవితరంగిణి 6-వ సంపుటి, పుటలు 1౫-110. 6. భారతి, మిోోధి, ఆషాడం. 7. అంధ్రకపితరంగిణీి, 6-వ సంపుటి,పుట 10%

28 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఉరముపై నొండు బోగల్లు తురగరత్న మగ జయమిచ్చు తద్రాజ్య మనుభపించు భవ్యచారిత్ర ఖీమవంబాసుపుత్ర రాజకులధీర యోబళరాయకంప (అముద్రితము. 2-44) అందులోనే ఇంకొక పద్యంలో “ప్రభుతుద (నుత?) భఖీమాంబపుత్ర పరమపవిత్రా'' (2-49) అని ఉంది. ఈ సంబుద్దే శాలిహోత్రంలో కలిసిన ఒక పద్యంలో ఉంది. అది ముద్రిత ప్రతిలో కనబడుతుంది. (1-40). ఈ సాక్షాలవల్ల శాసనంలోని కంపరాయలు, కృతిని అంకితం పుచ్చుకొన్న కంపరాయలు వేరువేరు వ్యక్తులని స్పష్టమవుతున్నది. కాబట్టి మనుమంచి భట్టు కాలనిర్ణయ సమస్య మళ్లా మొదటికి వచ్చింది. సాళువ అనే ఇంటీిపేరుంది కనుక సాళువ మంగు (క్రీ.శ. 1352) వంశంలోనివాడు. ఈ మంగరాజుకు వీర జౌబళరాజు అనే అన్నగారు ఉన్నాడు. హయలక్షణ విలాసం కృతిపతి బహుశా ఈ జౌబళరాజు కుమారుడో. ఆ సంతతివాడో కావచ్చు. ఈ సాళువ కంపరాయలు కృష్ణదేవరాయల సేనాని అని అశ్వలక్షణసారంలో ఉన్న ఈ క్రింది పద్యంవల్ల చెప్పవచ్చు. శ్రీకరకటాక్షవిజయ- శ్రీకాంతాకృష్ణరాయసిద్ధకృపాణా, _.. స్వీకృతసత్వరపర- ఫీకరు భటయూధకంపప్పృ ధ్వీనాథా. (అశ్వ3-1) కృష్ణదేవరాయల సైన్యాధిపతులలో తామెరిగినంత వరకు ఓబల కంపరాయల పేరు కనిపించలేదని కొందరు పరిశోధకులు వ్రాశారు! అయితే ఉదయగిరి దుర్గాన్ని జయించాక రాయలవారు ఒక 'కంపన్నును అక్కడ 'తాణ్యం' ఉంచారని ఒక ప్రాచీన గ్రంథం చెప్తున్నది" ఈ కంపన్న ఓబళ కంపరాయలు కావచ్చు. ఏమైనా... గుర్రాలకోసం యుద్ధాలు జరిపిన కాలంలోనివాడే అని ఊహించడానికి అస్కారం ఉంది. గుర్రాల దూరము బోవునప్పుడును దుర్మమశత్రునృపాలసైన్యముల్‌ బోరున గెల్చుచున్నపుడు బొంకముతో మృగయావినోదవి పారజయాదికారణము లారసి చూడగల్గనేర్చునే? (1-69) మన భాషలో కూడా ఇటువంటి గ్రంథం ఒకటి ఉందని మనుమంచి భట్టు కృతి సజీవంగా ఉండి రుజువు చేస్తూంది. విజయనగర _సాభ్రాజ్యమందలి అంధ్ర వాజ్మయ చరిత్రము, మొదటిభాగం, టీకుమళ్ల అచ్యుతరావుగారు, పుట 275 9. రాయవాచకం, పుట 91, పంక్తి 21

మాదయ్యగారి మల్లన పుస్తలూ పూసలూ ఐదవతనానికి చిహ్నాలని ఆంధ్ర మహిళలు భావిస్తారు. మంగళసూత్రధారణతోపాటే నల్లపూసలు కూడా పెళ్లినాడు వాళ్లు ధరిస్తారు. ఈ ఆచారం ఆదిమకాలంలో లేదు. కాకకీయయుగంలోని కవులు పెళ్లిని వర్ణిస్తూ తలంబ్రాలు పోసుకోడాన్నే వర్ణించారు. శ్రీనాధుడు, పోతరాజుగారు మంగళసూత్రాన్ని పేర్కొన్నారు. తెలుగు ఇల్లాలి మెడలో నల్లపూసలను తొలిసారి కట్టించిన కవీశ్వరుడు మాదయ్యగారి మల్లన. అతడు రచించిన రాజశేఖర చరిత్రలో సూర్యోదయాన్ని ఇలా వర్ణించాడు : సవిధకీర్ణపరాగాగ్ని సాక్షిగాగ-దమ్మివిందు కరగ్రహణ మ్మొనర్చ బొలుచు పడ్మినికిని నల్లపూసదండ- గట్టినాడన నెలదేటిగములు పొదలె. (రాజ. 2-69) కథానాయకుని వివాహాన్ని వర్చిస్తున్నప్పుడు బరేని కుండలను, దంపతి _ ఆాంబూలాలను కూడా మాదయ్యగారి మల్లన పేర్కొన్నాడు. బరేని కుండల విషయం చెప్తూ చమత్కరించాడు. కన్నెచనుదోయిచుట్టముల్‌ గాన బ్రీతి-వాని కల్యాణవేళకై వచ్చినట్టి తమ్మిపూమొగ్గలోయన దార్చి రచటబూజకుండలు తారకారాజముఖులు సింధుభూపాలు సత్కీర్తి చెలగి పద్మ- జాండమివ్వల నీరీతినావరించు జూడుడనుమాడ్కి దెల్లని సున్న మలది-మానవతు లందునిలిపిరైరేనికడవ. (రాజశేఖర చరితము. ౩3-176, 177) వధూవరులను పసిడి మంచంపై కూర్చోపెట్టి మాదయ్యగారి మల్లన దంపతీ తాంబూలాలు ఇప్పించాడు. మగువయునాథుడుం బసిడీమంచముపై వసియించి యొండొరుల్‌ మొగములు వంచి యోసరిలి ముంచిన సిగ్గుల గన్నుగోనలన్‌ నగవు దొలంక విప్రమిథునంబుల కిచ్చిరి దివ్యవాసనల్‌ బుగులుకొనంగ జేసిన యపూర్వమనోహరవీటికావళుల్‌ (రాజే. ౩3-180) లగ్నం పెట్టింది లగాయతు, గృహప్రవేశం దాకా జరిగిన పెళ్లితంతును మాదయ్య గారి మల్లన 75 గద్యపద్యాలలో వర్ణించాడు. (3-154 నుండి ౩3-228 దాకా). అసలు రాజశేఖర చరిత్ర అంతా కలిసి 516 గద్యపద్యాల కావ్యమే. అంటే పెళ్లి వర్ణన మొత్తం కావ్యంలో ఆరవవంతుకు ఎక్కువగా, ఏడవవంతుకు కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఈ కావ్యం ఇంత చిన్నదైనా మన సాహిత్యంలో దీనికొక ప్రత్యేకమైన స్థానం, దీని రచయిత కొక శాశ్వతమైన కీర్తి ఉన్నాయి. అనంతరకవుల కావ్యాలలోని కథాప్రణాళికలకు ఈ రాజశేఖర చరిత్ర ప్రస్ఫుటమైన నమూనా. “అనగనగా ఒక కథానాయకుడు. అతడొక అమ్మాయిని చూశాడు. మోహించాడు. ఆమె కూడా అతనిపై మరులుకొంది. ఇద్దరూ విడివిడిగా విరహంలో పడ్డారు. చందమామనూ, చల్లగాలినీ,

30 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మన్మథుణ్ణీ అమాంబాపతు శాల్తీలన్నిటినీ ఇద్దరూ తిట్టిపోశారు. ఈ విరహం ఉద్గతమైన తరువాత పెద్దలు పెళ్లి చేస్తారు. నూతన దంపతులు సుఖంగా ఉంటారు. “ఇలాంటి పిసరంత కథను తీసుకొని కొసరికొసరి వర్ణనలు చేసుకుంటూ కావ్యాలు వ్రాయడం అనంతరకవులలో పరిపాటే. దానికీ రాజశేఖర చరిత్ర వినాయకపూజ చేసింది.

మాదయ్యగారి మల్లనకు శాశ్వతమైన కీర్డి రావడానికి ఈ కావ్యమొక్కటే కారణం కాదు. అతడు అష్టదిగజాలలో ఒకడు. రాయలవారు దండయాత్రలు చేస్తున్నా తీర్ధయాత్రలు చేస్తున్నా వెంటమ్మో కవులలో మల్లన ఒకడు. రాయలవారు మూడు ఇళ్ల తురకలతో చేసిన యుద్ధంలో మొదటి జగడాన విజయం లఖించినప్పుడు ముక్కుతిమ్మనగారు ఒక పద్యం చెప్పారు. అప్పుడు అల్లసాని పెద్దనగారు, మాదయ్యగారి మల్లన తూడా అక్కడ ఉన్నారు. రాయలవారి ఇష్టకథావినోదమైన నగరినియోగులు, కవీశ్వ్చరులు, విద్వాంసులు మొదలైనవారి నిండుసభలో మల్లయ్య తప్పకుండా ఉండేవారు. రాయలవారి కొలువు తూటంలో ఈ కవి ఆదినుంచీ ఉంటున్నా, ఆ చక్రవర్తికి ఏదీ అంకితం ఇచ్చినట్టు లేదు. రాజశేఖర చరిత్రలో రాయల ప్రసక్తి కూడా లేదు. ఈ గ్రంథాన్ని నాదెండ్ల అప్పమంత్రి అంకితం పుచ్చుకున్నాడు. ఇతడు అప్పాజీ తిమ్మరుసయ్యకు స్వయానా మేనల్లుడు. సాక్షాత్తు అల్లుడు. క్రీ.శ 1516-1520 మధ్య ఇతడు వినుకొండ, గుత్తిసీిమలకు పరిపాలకుడుగా ఉండేవాడు.

అప్పమంత్రి చేసిన దానాలు అనేకం, అందులో 17 దానాలకు శాసనా ధారాలున్నాయి. ఇతడు మంగళగిరి పానకాలస్వామికి ప్రాసాదం కట్టించాడు. తొమ్మిది బంగారు కలశాల మండపం నిర్మించాడు. తన పేరుమీదుగా అప్పాపురం అనే గ్రామాలు వినుకొండలో ఒకటి, నాదెండ్లలో ఒకటి, రేటూరులో ఒకటి అగ్రహారాలుగా దానం చేశాడు. సర్వదుంబాలాగా గ్రామాలు దానం చేయాలంటే ఇచ్చేవాడు కనీసం సామంతప్రభువంత హోదా కలవాడై ఉండాలి. అప్పాజీ ధర్మమా అని, అతని అల్లుడు అంత దర్దాగా బ్రతికీనవాడే.

అయితే నాదెళ్ళవారికి తిమ్మరుసయ్య మూలంగా రాజప్రాపకం లభించలేదు. ఒకరకంగా చూస్తే తిమ్మరుసయ్య నాదెళ్ళవారి వల్లనే రాచకొలువులో చేరి ఉంటాడు. అప్పమంత్రి ముత్తాత పేరు మల్లయ్య. ఈయనకు గంగన, చిట్టిగంగన్న అనే ఇద్దరు తమ్ముళ్ళున్నారు. వీళ్ళలో చిట్టిగంగన్న చాలా గొప్పవాడు. సాళువ నరసింహరాయల వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈ నరసింహరాయలే తాళ్ళపాక అన్నమయ్యను బాల్యంలో సివించినవాడు. పిల్లలమగ్రి పినవీరయ్యను పోషించి బైమినిభారతం కృతి పుచ్చుకొన్నవాడు. ఈ సాళువ నరసింహరాయలవద్ద చిట్టిగంగన్న చాలా పెద్ద పదవిలో ఉండేవాడు. ఇతని గురించి మాదయ్యగారి మల్లన ఇలా చెప్పాడు:

సాళువనారసింహమను జ ప్రభుకార్యకళాధురంధరుం

డై లవణాల్లి వేష్టిత ధరాధిపదుర్మతమంత్రమంత్రిశుం

డాలవితాన కేసరియనంగ ననంగ సమానరూపరే

ఖాలలితాంగుడట్టి చిట్టిగంగన యొప్పు గుణానుంషంగుడై. (రాజ. 1-19)

  1. రాయలవాచకం, పుట 115, 116
  2. రాయలవాచకం, పుట జ. పంత్తీ 20

మాదయ్యగారి మల్లన 31

చిట్టిగంగన అందానికి మయన్మధుడే కాక అద్భుతమైన మాటకారి. ఇతరరాజుల సభలలో సహితం అనర్గళంగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకొనే చాతుర్యం కలవాడు.

అంగాధీశ కళింగరాజ మగధాధ్యక్షాదిభూభృతత్సభా

రంగాభంగవిహారముల్‌ ఘనకిలా గ్రావస్థలీసంసర

ద్ధంగోత్తుంగతరంగనిర్లళి తనిధ్యానోద్చట ప్రక్రియా

సాంగత్యంబులు చిట్టిగంగ విభువోచాసంభ్రమారంభముల్‌ (రాజ.1-20)

ఇటువంటి మంత్రి. దగ్గిర శుశ్రూష చేసి సాళువ తిమ్మరుసయ్య మహామంత్రి అయ్యాడు. చిట్టిగంగనే రాయలకొలువులో తన శిష్యుణ్ణి ప్రవేశపెట్టాడని భావించవచ్చు. ఉద్యోగమిప్పించడమే కాక తిమ్మరుసయ్యకు తన కుటుంబంలోని పిల్లనే ఇచ్చి పెళ్ళి జరిపించాడు. అంతేకాదు, తిమ్మరుసయ్య చెల్లెలు కృష్ణమాంబను తిమ్మయ్యకు ఇప్పించాడు. బావమరదులు ఒకరి చెల్లెలిని ఇంకొకరు వివాహం చేసుకోడం కుండమార్చు పెళ్ళి అంటారు. చిటిగంగన ఇటువంటి పెళ్ళి చేయించి నాదెళ్ళవారికీ, సాళువవారికీ గల సంబంధ బాంధవ్యాలకు రెండుపక్కల నుంచీ పీటముళ్లు వేశాడు.

తిమ్మరుసయ్య చెల్లెలు కృష్ణమాంబకు ముగ్గురు తుమారులు. పెద్దవాని పేరు కోనయ్య. ఇతడు కేవలం అగస్త్యభ్రాత. ఇతని గురించి మనకు ఏమీ తెలియదు. మిగతా ఇద్దరూ రామలక్ష్మణులంత ప్రసిద్ధులు. వీళ్లలో పెద్దవాడు అప్పనమంత్రి, రెండవవాడు గోపమంత్రి. మేనమామ పలుకుబడివల్లనేకాక స్వాయంప్రతిభవల్ల కూడా వీళ్లు ఉన్నతో ద్యోగాలలో రాణీంచారు. రాయలవారి రాజ్యారంభకాలంలో నాదెళ్ల గోపమంత్రి గుత్తిదుర్దానికి పాలకుడుగా ఉండేవాడు. అప్పమంత్రి ఏ హోదాలో ఉండేవాడో తెలియదుగాని, ఒకపక్క మంత్రులు, ఇంకోపక్క శూరులు, మరోపక్క విద్వద్ప్రహ్మలు, సత్కవివర్యులు, గాయకులు మొదలైన వాళ్లతో నిండిన పేరోలగంలో ఉండి, “కవిత్వారూడ విశేషగోప్టి' ఆలించేటంత ఘనమైన అధికారంలో మాత్రం ఉండేవాడు ఇతడు మాదయ్యగారి మల్లనను పిలిపించి ఇలా అన్నాడు:

నీవిపుడు చెప్పదలచిన - భావరసోద్యన్మహాప్రబంధము నాపై

గావింపు మంకితంబుగా- గో విదహృదయ ప్రమోదగుంఫితఫణితిన్‌. (రాజు, 1-14)

మాదయ్యగారి మల్లన నిజంగానే కోవిదహృదయాలు ప్రమోద గుంఫితమయ్యే ఫణితిలోనే, భావరసాలలో ఉద్యన్మహాప్రబంధం చెప్పాడు. ఈ రాజశేఖర చరిత్ర నిజంగా అతని స్వకపోలకల్పితమేనని భావించాలి. దానికి మూలం ఏ పురాణంలోనూ ఉన్నట్లు కన్పించదు. మల్లన చెప్పలేదు. కథ ఎక్కడిదో చెప్పకపోవడం అలా ఉంచి తన గురించి 3. తెలుగుభాషాసమితివారివిజ్ఞాన సర్వస్వం, పుట ౪21. 4. రాజశేఖర చరిత్ర, 1-12 6. బండారు తమ్మయ్యగారు, టేకుమళ్ల అచ్యుతరావుగారు రాజశేఖర చరిత్రపై వ్యాసాలు వ్రాశారు.

ఇద్దరూ, దీనికి మాతృక ఏదో తెలియదని, ఎన్నో గ్రంథాలు వెతికాక చెప్పారు. చూ. విజయనగర సాభ్రూజ్యమందలి ఆంధ్రవాబ్బయ చరిత్ర, 2వ భాగం, పుట 306.

32 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కూడా అట్టే వివరాలు చెప్పుకోలేదు. తను అయ్యంకిపురం అనే అగ్రహారానికి వైభవాకరమైన సత్కవినని చెప్పుకున్నాడు. ఈగ్రామం కృష్ణా జిల్లాలో ఉంది. అయినా మల్లన కడప జిల్లాలో పెరిగినట్టు ఉంది. కడప తాలూకాలో ఉన్న పుష్పగిరిలో అఘోరశివాచార్యులనే గురువు ఉండేవాడు. మల్లన ఆయన శిష్యరికం చేసి ఇంతవాణ్జయ్యానని చెప్పుకొన్నాడు. ఈ అఘోరశివాచార్యులకు ఇంకా ప్రసిద్ధులైన శిష్యులున్నారు. నందిఘంట కవులు, ముక్కుతిమ్మన ఈయన శిష్యులే. నలుగురు ప్రథమ శ్రేణి కవులకు గురువైన అఘోరశివాచార్యులు గొప్పవాడై ఉండాలి. అతడు దీక్షాగురువు కాక విద్యాగురువే అయి ఉంటాడని పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ గురువు వద్ద తానేమేమి నేర్చుకొన్నదీ మల్లన వివరించి చెప్పలేదుగాని రాజశేఖర చరిత్రలో ఒక గురువును ఇలా వర్ణించాడు:

సరసాహారము లింటబెట్టి బహుశిష్య శ్రేణికిం దెల్పు శా

స్రరహస్యస్థితి చెప్పు నధ్యయనసంధ్యల్‌ హవ్యకవ్యంబులన్‌

సురకోటింవితృకోటి నేమరక ప్రోచున్‌ విప్రవర్గంబులో

సరిలే రెచ్చట నమ్మహాత్మకునకున్‌ సా జన్యభవ్యోన్నతిన్‌. (రాజ. 8-11)

బహుశా అఘోరశివాచార్యులు శిష్యులను ఇంటపెట్టుకొని సరసాహారం పెట్టి ఇాస్త్ర రహస్యాలు నేర్చి ఉంటాడు. తన వైదుష్యాన్ని మల్లన చెప్పుకోలేక పోయినా తాను సృష్టించిన ఒక చిలుకను ఉద్దండపండితుని చేశాడు. అది 'వచోహీవాక కాకోదరస్వామి.' అది వ్యాసులవారితోనైనా వాదించగలదట.

వాదింతున్‌ బహువేదశాస్త్రకలనావైయాత్య సంసద్ధి న

వ్వేద వ్యాసులతోడ నైన మది సంవీక్షించి యెబ్బోట నే

గాదన్నన్‌ మరి నిర్వహింపగ నశక్యంబేరి కస్మద్వచ

శీదాంపత్యము నాకనాక యనుకోసిగ్గయ్యెడున్‌ భూవరా. (రాజ. ౩-22)

తన గుణాలనే తను సృష్టించిన చిలుకకు కూడా ఆపాదింపజేశాడు మల్లన. తన సంగతి తాను చెప్పుకోడానికి అతడూ సిగ్గుపడతాడు. సొంతబాకా ఊదుకొనేవాళ్ళంటే అతనికి గిట్టదు. గంథారంభంలో కుకవులను ఇలా నిరాకరించాడు.

గాఢార్థప్రతిపాదన క్రమకళాకౌశల్యము ల్లేక వా

చాడక్కార్చటితోడ దామెతముమర్జూయంచు గైవారముల్‌

ట్రొడించేయుచు బ్రాజ్ఞులన్నగుచు గర్వగ్రంథులై యుండు న

మ్మూఢస్వాంతుల మొచ్చకుండుటయ సమ్మోదంబు మాబోంట్లకున్‌. (రాజు 1-9)

రాజశేఖర చరిత్రలో గాడార్థప్రతిపాదన చేసి కళాకౌశలం లేకపోతే లేకపోవచ్చు గాని వాచాడక్కార్చటి ఎంతమాత్రం లేదు. సరససంస్కృత పుష్పగుచ్చం నుంచి ప్రభూతమైన తెనుగునెత్తావి అఖిల దిశలలోను గుబాళించడానికి తరుణపవమానమయ్యే 6. ఇతని శాసనాలు ఒకటి క్రీ.శ 1501లోనూ (4౫ 307 01905), ఇంకొకటి క్రీ.శ 1541లోనూ (4.2 303

  1. ఉన్నాయి.

మాదయ్యగారి మల్లన 33 కవిత్రయంవారి విశేషచతుర వాచానిరూడిని మల్లన మెచ్చుకుంటాడు. అనుసరిస్తాడు. (రాజ.1-7). రాజోఖర చరిత్ర నెత్తావిలాగా ఉల్లాసకరమే. ॥

అవంచిక అని ఒక నగరం ఉంది. దానిని హీమధన్వనృపతి పాలిస్తూ ఉండేవాడు. ఆ ఊళో సంపదలకేం లోటు లేదు. దేశం సస్యశ్యామలంగా ఉండేది. పుష్కలంగా ఉన్న

కాకరపండువంటి జిగి కల్లిన మేలిపసిండి ధాత్రికిన్‌

పోకకు బుట్టె డమ్మినను బోనొక కల్పము బట్టు జూడ్కి పే

రేకటిదీర వైళ్ళపతులిండ్లు గనుంగొననొప్పు నప్పురిన్‌. (రాజు, 1-50)

అ ఊరి జౌన్నక్యాన్ని చెప్పాలంటే మాటలు చాలవు కాబోలు. కవి దానిని

అన్నగరి చిరుత ఏనుగు - గున్నలపై నెక్కి నిక్కి తోయగవచ్చున్‌

మిన్నేటి పసిడితామర - లన్నన్‌ మరి ఏమి చెప్ప నందలికరులన్‌? (రాజు, 1-51)

ఏనుగు పాడీగా దేశం వర్ధిల్లి ప్రజలకే కొరతా లేకపోయినా రాజుగారికి ఒక చింత ఉంది. ఆయనకు సంతానం లేదు. పిల్లల కోసం అల్లాడినాక ఆయనకొక మెరుపులాటి ఆలోచన తట్టింది.

నీలకంకఠుని శిరస్సుపై నీళ్లు చల్లి - పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు

గామ ధేనువు వానింట గాడిపసర-మల్లసురశాఖి వానింట మల్లెచెట్టు.(రాజ.1-౪)

నిర్లక్ష్యంగా నీళ్లు చల్లి పత్రి పారవేస్తేనే కోరికలు తీర్చే పాడి ఆవును, పూలచెట్టును సాంతం చేసుకోవచ్చు. భక్తిగా ఆరాధిస్తే ఇక చెప్పేదేముంది అని ఆ రాజు శివుణ్ణీ పూజించడం ప్రారంభించాడు. తాను కివభక్తుడవడమే కాకుండా తన ప్రజలందరినీ శైవుల్ని అవమన్నాడు. పరమశివుని పాటించనివాడు తనకు పగవాడని రాజు చాటించాడు.

ఎచ్చట జూచినం బమధహిండితచండనిశాతవర్తనం

బెచ్చట జూచినన్‌ గుహగణేశ్చరభవ్యగుణానువాదనం

బెచ్చట జూచినన్‌ కివసమాహిత పు ణ్యకథానుకీర్తనం

బచ్చుపడంగ జేసె నత డాదిమ్హైవకులా గ్రగణ్యుడై. (రాజ.1-70)

ఇంత ఉడ్లోలంగా ఆరాధించాక ఆ రాజు కల ఫలించింది. రాణీ కడుపు పండింది. పుట్టిన బిడ్డకు రాజశేఖరుడనే పేరు పెట్టారు. అతడు పెరిగి పెద్దద్దాడయ్యాడు. ఒకనాడు రాజు పేరోలగంలో ఉండగా కొలువుకూటంలోనికి ఒక ముని మండిపడుతూ వచ్చాడు. “ఏం జరిగింది మహాత్మా అని రాజు అడీగొతే 'ఏం చెప్పను? నా కుమార్తినొక రాక్షసుడు ఎత్తుకుపోయాడు' అని జటిలకౌశికుడనే ఆ ముని వాపోయాడు. ఇంతకూ ఆ అమ్మాయి పసిపాప. రాక్షసుని తూతురికి ఊడిగం చెయ్యడానికా అసురుడు నరపాపలను

34 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

పరమ మాయావి అయినా ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి తనతో రాజశేఖరుని పంపించమని అడిగాడు. రాజు పంపించాడు. మొదట రాక్షసుడు గర్వించాడు. “బెబ్బులి మీద చీంబోతు లంఘీస్తుందా?”' అనుకొన్నాడు. అయితే రాజశేఖరుని చేతిదెబ్బ చూసి కాలికి బుద్ధిచెప్పి కాళికా దేవాలయంలోకి పోయి అమ్మవారి కాళ్లు పట్టుకొన్నాడు. రాజశేఖరుడు వెంబడించాడు. రాక్షసుణ్జీ కాళికకు బలి ఇస్తానని కత్తి దూశాడు. అప్పుడు అమ్మవారు శాంతస్వరూపంతో ప్రత్యక్షమైంది.

కొప్పుపై నొప్పెడు కొదమచంద్రునితోడ గస్తూరికాతిలకంబుతోడ

సీమంతవిరచితసిందూరరుచితోడ (గగ్రొత్తముత్తియపుజేర్చుక్క తోడ

దళతళమను దంతతాటంకములతోడ రమణీయనాగహారములతోడ

గల్లుగల్లను రత్నకంకణమ్ములతోడ జిలుగైన చెంగావివలువతోడ

ముద్దుమోమున లేనవ్వు మొలకతోడ

జిల్లచూపుల కరుణారసంబుతోడ

శాంతరూపంబు గైకొన్న శంభురాణీ

యమ్మహాకాళి ప్రత్యక్ష మయ్యెనపుడు (రాజు 2-జ)

ఆమె సాక్షాత్కరించగానే రాజశేఖరుడు ఒక దండకంతో ఆమెను నుతించాడు. మల్లన ఈ దండకం శ్రీకారంతో మొదలవలేదు; “నమస్తే నమఃతో అంతం కాలేదు. శ్రీనాథునిలాగే మాదయ్యగారి మల్లన రెండు నగణాలపై రగణాలు నిలుపుతూ దండకం బ్రాశాడు. అమ్మవారు కనబడి రాజశేఖరుని దీవించి “నాకు బదులుగా ఈ రాక్షసుణ్ణీ మన్నించ'మంది. అసమానమైన ఒక మణిని బహూకరించి అంతర్భానమైంది. తరువాత ఒక యోగిని వచ్చి రాజశేఖరునికి ఒక చిలుక నిచ్చింది.

తూచా తప్పక యుండ నాగమకథాస్తోమంబులం జెప్పు వా

చాచాతుర్యము గానరాగత భవిష్యద్వర్హమానార్థముల్‌

సూచించున్‌ మది మెచ్చ నీ కుబుసుపుచ్చున్‌ నెచ్చెలిం బోలి యీ

రాచిల్కం గయికొమ్ము పార్థివకువూరా యంచు వర్ణించుచున్‌ (రాజ, 2-102)

మునితుమార్తెను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించాడు. చిలుకను, మణిని తీసుకొని 'అనేకదూరం' వెళ్లాడు. ఒకచోట ఆకలి అయింది. మణిని తలుచుకొన్నాడు. ఠక్కున నవకాయ పిండివంటలూ ఉద్బవించాయి.

కలమాన్నంబు ఘృతంబు బాయసము శాకవ్రాతముల్‌ పిండి చం

టలు పాల్టేనియ జున్ను వెన్న యిడియానా లుక్కెరల్‌ చక్కరల్‌

ఫలముల్‌ పానకముల్‌ రసాయనము లంబ శ్లూరులిం డ్లూరుగా

యలు బజ్జాల్‌ దధిపిండఖండములు నందావిర్చవించెం దగన్‌. (రాజ. 2-127) వంటకాలే కాకుండా వడ్డించేవాళ్ళు కూడా మణిలోంచి వచ్చారు.

మాదయ్యగారి మల్లన తర్‌ సంచిత బాహుమూలరుచిసంపద పొంపిరివో గెలంకులన్‌ గుంచె యొకర్తు వైవ నొకకోమలపల్లవపాణీ లీల వ డ్జించె నృపాలమౌళికి గటీతటహాటక మేఖలాసమ భ్యంచితకింకిణీరంవము నందియమైోతలు సందడింపగన్‌. (రాజ, 2-180) రాజశేఖర చరిత్రలోని మణి సామాన్యమైనది కాదు. దీని గొప్పతనాన్ని చిలుక ఇలా చెప్పింది ఈనఘచరిత్ర యామణి యనర్హ్య మొకానొకనాడు పార్వతీ వనరుహపత్ర నేత్ర నెరవాదితనంబున జూదమాడి గె ల్పిన మది గౌతుకం బొదవ కీతమయూఖ కళావతంఘడ వ్వనితకు నిచ్చె నీకునతివత్సలతన్‌ గృపజేసి గాళియున్‌. (రాజ.2-139) భోజనాలయాక చిలుకతో రాజుకుచూరుడు సాగాడు. ఒకచోట ఒక అందగల్తె చెలికత్తెలతో విహరిస్తూంది. వాళ్లు పుష్పోపచయం చేశారు. జలకేళ కావించారు. కథానాయకుడు అమెను చూశాడు. ఆమె అతణ్జీ చూసింది. తొలిప్రేమ కలిగింది. ఈ అతిలోకసుందరి ఎవరని రాజశేఖరుడు చిలుకను అడిగాడు. అమె పూర్వజన్మ కథను చిలుక చెప్పింది. శాపంవల్ల అమె ఈ దేశపు రాజకుమార్తెగా పుట్టింది. పూర్వం ఈ అమరపురంలో ఇద్దరు బ్రాహ్మలు ఉండేవారు. ఒకడు ధనికుడు, ఇంకొకడు పేదవాడు. దరిద్రం ఎంజైనా చేయిస్తుంది. కులనిర్మూలన కారణంబు ప్రతిభాకుట్టాక ముద్వేగకో పలకతాదోహద మాజవంజవసుఖప్రత్యూహ చూత్మవ్యథా జ్వలనజ్వాలిక కామినీనయనవీక్షాపాతసంరోధిని త్యలఘుత్వా శ్రయభూమి లేమి యది యాహా మేలుగావింపదే పలుచగా చూచు నెంతయు బంధుసమితి పిలువవిలువంగబలుకరు విడ్డలైన రచ్చకెక్కెడుమూట గారాబుసతియు లెక్క సేయదు లేమి తూలించెనేని. (రాజ, 3౩-14, 15) ఈ దరిద్రాన్ని దాటడానికి విష్ణుమూర్తిని తపస్సుతో మెప్పించడం తప్పు మార్గం లేదని పేద బ్రాహ్మణుడు కావేరీ తీరాన ఉగ్ర తపస్సు చేస్తున్నాడు. అప్పుడక్కడకు కొంతమంది గంధర్వ కన్యలు వచ్చారు. అందులో ఇద్దరు ఒక పూల గుత్తికోసం తగువులాడుకొన్నారు. “నువ్వెంత? అంటే ' నువ్వెంత?" అనుకొన్నారు. దగ్గరలో తపస్సు గంధర్వ కుమార్తె ఒయ్యారం ఒలకబోసింది. ముక్కుమూసుకొన్న బ్రాహ్మణుడు కళ్లు తెరిచాడు. మానవళొంతగా జన్మించమని శప్‌ంచాడు. ఆ గంధర్వకన్యే ఈ రాకుమార్తె అని చిలుక చెప్పింది.

36 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ నాయకీనాయకులు ప్రేమించుకొన్నాక విరహంలో పడి, పెళ్లాడి గట్టెక్కారు. కథ కంచికి పోయింది. ఈ కావ్యంలో మల్లన ఏమీ సాధించినట్టు కనబడదు. ఇతివృత్తం సర్వసామాన్యం, కథాకథనంలో చమత్కారాలు లేవు. ముఖ్య పాత్రలు పుస్తకాలలోంచి ఉద్బవించినట్టు ఉంటాయి. సంభాషణలు చెప్పుకోతగినంత గొప్పగా ఉండవు. ప్రకృతి వర్ణనలో సూక్ష్మ పరిశీలన వ్యక్తమవదు. అయినా మాదయ్య గారి మల్లన ఆంధ్ర సాహిత్యంలో ఒక స్థానం ఏర్పరచుకోగలిగాడంటే దానికి కారణం అతని చిత్తశుద్ది శేషలూ, యమళ్తాలూ మొదలైన వాటి జోలిక్‌ పోకుండా. నిరాడంబరమైన కావ్యాన్ని సూటిగా చెప్పుకొని పోయాడు. సమకాలిక సమాజాన్ని కావ్యంలో ప్రతిఫలించదలచు కుంటే మల్లన చక్కగా పాత్ర స్పాభావాలను చిత్రించాడు. భర్త చదువుకోనివాడైతే, చేతకానివాడైతే భార్య 'దేవుడా ఇంత చేశావా” అని దరిద్రాన్ని భరించవచ్చు; పక్కింటి వాళ్ళకు విద్యలో ఏ మాత్రం తీసిపోనివాడై లేమి అనుభవిస్తే ఆ యిల్లాలు ఎంత బాధపడుతుంది? ఆమె భర్తతో ఇలా మొరపెట్టుకొంది : పెనిమిటి యనక్షరాస్యుడు - ననఖిజ్ఞుడు నైనదైవమాయని మదిలో వనరుచు లేమిన్‌ బడదగు - నినుజెందియు నాకు నింత నెవ్వగ యగునే? మండ జఠరాగ్ని దనయులు - చండతమంగలమువంటి సంసారమునిం కొండు గతి లేదు దినదిన - గండం బేరీతి గడపగాదగు ననఘా. చదివినారలు పెక్కుసంధ్యలగించిత్తు దప్పకయుండ వేదత్రయంబు పఠియించినారలు ప్రతిభాసమున్ని ద్రసాష్టవంబున మూలశాస్త్రవితతి శోధించినారలు శుద్ధమతిస్ఫూర్తి నఖిలపురాణేతిహాససమితి చూచినారలు బుధస్తోమంబు గొనియాడ గావ్యనాటకముఖగ్రంథసీమ యేమి చెప్పెడీదాన మీరికడలేవు సకలవిద్యలు భూసురసమితి కెల్ల నజున కెనవత్తు రన్నింట సకట మీర లముకుందునికన్న నేవెలితిచెవుడు? (రాజ, ౪-19, 20, 21) ఈ ఇల్లాలు ఇలా బాధపడటానికి ఇంకో కారణం కూడా ఉంది. పక్కింటి ముకుందుడు మహారాజుగా జీవిస్తున్నందుకు బాధలేదు. అయితే అతని సోమిదేవమ్మ చూస్తేనే ఈ పిదరాలికి బాధ. అందుకే భర్తతో పొరుగు దంపతుల గురించి ఇలా అంటుంది. అతని నడవడి జూడం-గా తామర తంపరగుచు గాదెలగొలుచున్‌ వేతవిడిముడియుబహుగో- వ్రాతంబును గల్లి రాజువడువున నుండున్‌ పూచిన తంగెడుగతి వి-ద్యాచతురుం డతని సోమిదమ్మపొరుపునన్‌ వాచాల రత్న కంకణ- సూచితవిభవమున మొరయజూడంగలనే? (రాజ. 3-21-, 22) ఖార్య ఇలా ఈసుతో చెప్పినప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు ఇలా అంటాడు : ఏరికి బుద్ధి బలంబులు - కారణములు గావు సువ్వె కలరె ధరిత్రిన్‌ నేరిచి బ్రతికినవాఠలు - నేరక చెడ్డట్టివారు నీరజనేత్రా. (రాజు 3-23)

మాదయ్యగారి మల్లన 37

వాస్తవికత ఉట్టిపడే ఇటువంటి సజీవ పాత్రలలో మాదయ్యగారి మల్లన కావ్యమంతా బ్రాయలేదే అన్న బాధ కలుగుతుంది రాయలవారి కొలువులో చేరకముందు ఇతడీ కావ్యం బ్రాశాడు. అస్థాన కవి అయి అష్టదిగ్గజాలలో చేరాక ఇతడేమైనా కావ్యాలు వ్రాశాడో లేదో మనకు తెలియదు. రాయలవారిపై ఇతడు చెప్పిన చాటువులైనా కనీసం మనకు దక్కలేదు. అయితీ మాదయ్యగారి మల్లన మున్నూట అరవైరోజులూ కవిత్వం చెప్తూ కూర్చోడు. అతనికి కొన్ని నియమాలు ఉన్నాయి.

చెప్పదగు కవిత రసము - ల్పిప్పిల నప్పపష్ప బళిబళలీ యనలేదా

యెప్పుడు చేయక యుండుట- యొప్పుసుమీ సుకవియెంతయుచితజ్ఞుడొకో.

(రాజ, 1-89)

చూదయ్యగారి మల్లన నిజంగా జొచిత్యం తెలిసినవాడు. ఎక్కడ ఆగాలో

తెలుసుకొనడం కళాకారుని ముఖ్య లక్షణం. కృష్ణదేవరాయలు

శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీర ప్రతాప శ్రీ వీరకృష్ణ్ణాయమహారాయలు ఆంధ్ర సాహిత్యం చేసుకొన్న అదృష్టం కొద్దీ పుట్టారన్న విషయంలో అభిప్రాయభేదాలు ఉండవుగాని ఆయన ఏసుముహూర్తాన, ఎప్పుడు పుట్టాడన్న విషయమే పరిశోధకులు ఇదమిత్సమని తేల్చలేదు. శాలివాహన శకవర్దాలు 1409 పరాభవనామ సంవత్సర చూఘబహుళ అష్టమి శుక్రవారానికి సరైన క్రీ.శ. 1487 ఫిబ్రవరి 16వ తారీఖున రాయలు జన్మించాడని కొందరు భావిస్తున్నారు.!ే రాయలవారి జాతకాన్నీ జననకాలాన్నీ ఆనాటి పేరు మోసిన _దైవజ్ఞులెందరో పరిశీలించి ఫలితాలు చెప్పడానికి ప్రయత్నించి ఉంటారుగాని, వీళ్ళలో ఏ ఒక్కరు వ్రాసిపెట్టిన జాతకమైనా మనకు దక్కలేదు. అయితే ఇంత వివరంగా నక్షత్రంతో సహితం రాయల జననకాలాన్ని పరిశోధకులు ఎలా నిర్ణయించగలిగారంటే వివిధ శాసనాలు శోధించి ఇక్కడో విషయం, అక్కడో సంగతి చేర్చి చరిత్రను తారీఖులతో సహా ఊహించగలిగారు.

వాసప్పనాయకుడనే భృత్యుడొకడు ప్రతి మాసి నెలలోనూ జ్యేష్టా నక్షత్రంనాడు, అది రాయలవారి జన్మనక్షత్రం కనుక, ఉత్సవం జరిపించమని కంచి తాలూకాలో ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇందువల్ల రాయలవారు 'మాసి' నెల జ్యేష్టా నక్షత్రంనాడు జన్మించారని తెలుస్తున్నది. మాఘమాసాన్ని తమిళంలో మాసి అంటారు. క్రీ.శ 1503లో నరసానాయకుడు మరణించినప్పుడు అతని రెండవ భార్య కుమారుడు కృష్ణరాయలు ' “పదహారేళ్ళ బాలుడనే ద్రతీతి ఉండడంచేత క్రీ.41503 నుంచి పదహారేళ్ల వెనక్కు వెడితే రాయల జన్మసంవత్సరం క్రీ.శ. 1487 అవుతుంది. అది పరాభవ సంవత్సరం, అ ఏడు మాఘమాసంలో బ్యేష్టానక్షత్రం వచ్చిన రోజు బహుళాష్టమి, శుక్రవారం.

అయితే ఈ తారీఖును పరిశోధకులందరూ ఆమోదించలేదు. క్రీ.శ. 1509లో రాజ్యానికి వచ్చినప్పుడు కృష్ణ్ణాయల వయసు ఇరవైకి పైబడ్డదని పరదేశ చరిత్రకారుడు

  1. ఓరుగంటి రామచంద్రయ్యగారు, 5864169 0౧ [ొంగంిజంా౭, 243 2 డగ 216 ౮4 1916

38 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి బ్రాశాడు,3 రాయలు మరణించేనాటికి వృద్ధుడని ఆ చరిత్రకారుడే తెలియవేశాడు. రాయలపారు 20 సంవత్సరాలు పాలించారు. రాజ్యానికి వచ్చినప్పుడాయన వయసు ఇరవై అయితే, మరణించినప్పుడు నలభై అవుతుంది. అది వృద్ధాప్యం అనిపించుకోదు. అందుచేత, తండ్రీ మరణించేనాటికీ రాయలవారు ఇరవైయేళ్లు పైబడ్డవాడనడంలో పరదేశ చరిత్రకారుని ఉద్దేశం ఆయన యుక్తవయస్కుడని చెప్పడమే కావచ్చు. అన్నగారి మూర్గాఖిషేకం నాటికి రాయలవారు ముప్ఫయి. సంవత్సరాల లోపువాడని భావించవచ్చు. అందుకే కొందరు చరిత్రకారులు రాయలు శాలివాహన శకవర్తాలు 138లో (క్రీశ 1474) జన్మించి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అంటే రాయల 29వ ఏట తండ్రీ నరసానాయకుడు మరణించాడు. 32వ ఏట అన్నగారు పట్టం కట్టుకొన్నాడు. తన ౩5వ ఏట విజయనగర వజ్రసింహాసనాన్ని అధిష్టించారని చెప్పవచ్చు. వాసప్పనాయకుని శాసనంవల్ల రాయలవారి జన్మనక్షత్రం జ్యేష్ట అనీ, వారు మాఘమాసంలో జన్మించారనీ తెలుస్తున్నది. కొందరు చరిత్రకారులు ప్రతిపాదించే క్రీ.శ.1474లో రాయలవారు పుట్టి ఉంటే అది విజయనామ సంవత్సర మాఘబహుళ అష్టమి గురువారం అవుతుంది. అయితే ఈ తారీఖు వట్టి అంచనాయేగాని దీనికి వేరే ఆధారం లేదు. అందుచేత క్రీశ 1474 నుండి 1487 లోపున ఏ తారీకునాడైనా రాయలవారు జన్మించి ఉండడానికి ఆస్కారం ఉంది. ఆ పదమూడు సంవత్సరాలలో మాఘమాసంలో వ్యేష్థా నక్షత్రం ఏయే కారీకులలో వస్తుందో, తిథినక్షత్రాలు ఏయే సమయాలో అంతమవుతాయో చూద్దాం. 10-201474 | గురువారం | విజయ మాఘబహుళఅష్టమి (13) షష్ట 75 1-2-1475 బుధవారం | జయ మాఘబహుళదశమి (55) జ్కేష్ట ౫9 178లో మాఘమాసం లేదు 7-2-1477 | శుత్రవారం | దుర్ముఖ మాఘబహుళనవమి (0%) వ్యేష్ట 62 28-2-18 | బుధవారం | హేవిలంలీ మాఘబహుళదశమి (71) వేస్ట్‌ 62 14-2-1479 | ఆదివారం | విలంలి మాఘబహుళఅష్టమి (౫) జ్కేష్ట 78 4-2-1480 | శుక్రవారం | వికారి మాఘబహుళ నవమి (70) జ్యేష్ట 91 25-2-1481 గురువారం శార్వరి మాఘబహుళదశమి (17) జ్యేష్ట 22 11-2-1482 | సోమవారం | పవ మాఘ (ఈ) షప 2-2-1463 ఆదివారం శుభకృతు మూఘహళలస్టమి (0%) హో గా దశమి (1091) 23-1-1484 | శుక్రవారం | శోభకృతు మాఘబహుళ దశమి (టి) వేస్ట్‌ ౫0 9-2-1485 | బుధవారం | క్రోధి మాఘబహుళశనవమి (38) | పృష్ట 2 30-1-1486 | సోమవారం విశ్వావసు మాఘబహుళ దశమి (1) క్‌ 18 16-2-1467 శుత్రవారం | పరాభవ మాఘబహుళ అష్టమి (0) సస 8 వ నూన్‌ లా కం కావా సాలా . స్వామికణ్డుహిగారి వపను వానుటం ఆ సంచిక 4, పుట 2౫5. 8 వస్యరనాచు సవర వ్రష్రోనూసంలోనూ, ఫాల్గుణంలోనూ రెండు అధికమాసాలు

కృష్ణదేవరాయలు 39 ఈ పట్టికలో ఏ ఒక్కటైనా కృష్ణ్ణాయలవారి జన్మదినం కావచ్చు. అయితే వీటిలో వ్యేష్థానక్షత్రయుక్త అష్టమినాడే ఆయన ప్రభవించి ఉండవచ్చుననే ఊహ ఒకటి పౌడముతున్నది. కృష్ణరాయలు శ్రీకృష్ణుని అవతారం అని అనాటి జనులు విశ్వసించారు. అందుచేత వారి జన్మతిథి అష్టమి అని భావించడంలో అసంగతం ఉండదు. ఇదే వాస్తవమైతే పై తారీఖులలో నాలుగు మాత్రమే రాయలవారి పుట్టినరోజులు కావడానికి ఆస్కారం ఉంది. ఆ నాలుగూ విడిగా వేసిచూద్దాం. హరా యటా1క క 14-2-1479 | అదివారం | విలంలి మాఘ బహుళ అష్టమి బ్చేష్ట 11-2-1482 | సోమవారం | ప్లవ మాఘ బహుళ అష్టమి చేష్ట 16-2-1487 | శుక్రవారం | పరాభవ మాఘ బహుళ అష్టమి బ్యేష్ట పై తారీఖులలో మొట్టమొదటిదే కృష్ణ్ణూాయలవారి జన్మదినం అని మనం అంగీకరిస్తే ఆయన కీర్త్లోషులయే నాటికి, 58 సంవత్సరాలవారై ఉంటారు. అరవయ్యోపడిలో పడ్డంవల్ల అది వృద్ధాష్టుంగా భావించవచ్చు. పరదేశ చరిత్రకారుల ఊహలు నిజమే అని అంగీకరించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పై తారీఖును ఆమోదించే ముందు మరొక్కవిషయం గమనించాలి. కృష్ణరాయలు శ్రీకృష్ణుని అవతారం అని మన పూర్వులు నమ్మడానికి మరొక కారణం కూడా ఉండవచ్చు. ఆయన రాయలవారి కాలంలో ఉండి వారి జన్మనక్షత్రాన్ని చెప్పిన వాసప్పనాయకుని శాసనాన్ని మనం కొట్టిపారెయ్యడానికి వీలులేదు. కృష్ణ్ణూాయలవారు శ్రీజయంతినాడు ఉంటుందిగాని అది చారిత్రక ప్రమాణాలకు విరుద్ధం. కాబట్టి వారు మాఘమాసంలో వ్యేష్థానక్షత్రయుక్త "అష్టమినాడే జన్మించారని ఆ తారీఖును ఆమోదించడమే మంచిది. రాయలవారు విజయనామ సంవత్సర మాఘబహుళ అష్టమి గురువారంనాటికి సరియైన క్రీశ 1474 ఫిబ్రరి 10వ తేదీనాడు ష్యేష్థానక్షత్రంలో జన్మించారని ప్రస్తుతానికి నిర్ణయించి అయన చరిత్ర చెప్పుకొందాం. కృష్ణదేవరాయలు తన తల్లికి తొలిచూలుబిడ్డ అయినా తండ్రీకి రెండవ కుమారుడు. నరసానాయకునికి ముగ్గురు భార్యలు. పెద్ద భార్యపేరు తిప్పాజీ. ఆమెకు వీరనరసింహ రాయలు జన్మించాడు. రెండవ భార్యపేరు నాగాంబ. ఈమె కుమారుడే కృష్ణరాయలు. మూడవ భార్య పేరు ఓబాంబ. ఈమెకు ఇద్దరు కుమూరులు; ఒకడు అచ్యుత దేవరాయలు; రెండవవాడు రంగరాయలు. క్రీ.శ 1485-90ల మధ్య; అంటే కృష్ణ్ణూయలకు పదకొండు దాటాక పదహారు వచ్చే మధ్యకాలంలో నరసానాయకుడు సాళువవారి కొలువులో మన్నన వడసి రాయలకు కుడిభుజంగా ఉండేవాడు. సుకవిరాజులను ఉద్దరిస్తూండేవాడు. '“స్వీకృత కవితాప్రవాహ సితఫేన గుళుచ్చాకార మౌక్తిక 7. వరాహ పురాణం, 1-62 6. చరాహ పురాణం, 2-1౫

శం సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి స్వచ్చాకల్పు"డై నరసానాయకుడు ఉండేవాడు.?- ఇటువంటి విద్యాగోష్ణులలో తండ్రీ ఉండేటప్పుడు సభలోనే ఉండి వినే అవకాశాలు కృష్ణ్ణాయలకు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పలేంగాని అతని సవతి అన్నగారు వీరనరసింహరాయలు తండ్రికి కూర్మి తనయుడై పేరోలగంలో ఉండేవాడు. కృష్ణ్ణాయలకు అప్పటికి పదహారు సంవత్సరాలు కూడా లేవు. కనుక సభలో కూర్ప్చొనడానికి అవకాశం కలుగలేదు. అయితీ మేడసోరణ గండ్లలోంచి కొలువుకూటం లోనికి చూస్తూ బాల కృష్ణ్ణాయలు ఆనాడు పేరుమోసిన కవుల కావ్యాలు వినేవాడు కాబోలు. నందిఘంట కవులను పిలిపించి తన తండ్రీ _ కర్పూరతాంబూలం ఇచ్చి వరాహపురాణం కృతి చెప్పుమని ఆదేశించటం విన్న బాలకృష్ణ రాయలలో ఏ భావాలు కలిగాయో, ఎప్పటికైనా మనం కూడా ఇలాగ కృతులు అంకితం పుచ్చుకోవాలన్న కోరిక సుప్తచైతన్యంలో అవ్వక్టరాగాలను ఆలపించి ఉంటుంది.

రాయలకు చిన్నతనంనుంచీ సంగీతసాహిత్యాలంటే ఇష్టం. బాల్యంలో వీణ నేర్చుకొన్నాడు. గురుదక్షిణగా కృష్ణయ్య అనే విద్వాంసునికి విలువైన ముత్యాలహారాలు, వజ్రాలహారాలు ఇచ్చాడు. కావ్య నాటకాలంకారాల మర్మాలు అవగాహన చేసుకొన్నాడు.ే** నానా కళలలో వేత్త అయ్యాడు. అపరభోజుడనీ, ఆంధ్రభోజుడనీ పాగడ్తలు అందుకొనడానికి తగినంత లోతుగా పునాదులు తవ్వుకొన్నాడు. మేధాపద సాధారణ బోధాకర హృదయుడు'!ే అని ముందు ముందు ముక్కుతిమ్మనగారిచే పిలిపించుకొందుకు తగినట్టు పెద్ద పెద్ద పండితులకు సహితం .సాధారణంగా బోధపడని జ్ఞానానికి ఆకరమయ్యేటట్టు తన హృదయాన్ని విశాలం చేసుకొన్నాడు.

చిన్నప్పటి నుంచీ కృష్ణ్ణాయలకు ముక్కుతిమ్మనగారితో సహవాసం ఉండి ఉండవచ్చు. తిమ్మనగారు నందివారి చిరంజీవి. నందిఘంట కవులలో ఘంటసింగన మేనల్లుడు. జంటకవులు నరసానాయకుని దర్శనం చేసుకొనేటప్పుడు చినతిమ్మన బాలరాయలతో పరిచయం చేసుకొనడానికి ఆస్కారం లేకపోలేదు. పొడుగాటి ముక్కున్న తిమ్మనగారు చిన్నప్పుడే రాయలవారి వైదుష్యాన్ని పాడగట్టి వుండవచ్చు. తిమ్మనలాగే అల్లసాని చొక్కరాజుగారి అబ్బాయి పెద్దిరాజు కూడా చిన్నప్పుడే రాయలవారి విద్యామిత్రుడు కావచ్చు. అల్లసానివారి నివాసగ్రామం సాళువవారి ముఖ్య పట్టణమైన చంద్రగిరికి మరీ దూరంలో లేదు. అల్లసానివారు కడప జిల్లా కమలాపురం తాలూకాలోని కోకట గ్రామంలో ఉండేవారు.!* ఆనాడు చిత్తూరు జిల్లా చుట్టుపక్కల పరగణాలన్నిటికి చంద్రగిరి హృదయంలాగా ఉండేదని భావించవచ్చు. అక్కడినుంచే సాళువవారు రాయసింహాసనానికి ప్రస్థానం చేశారు. సైన్యనాయకపట్టభద్రత్వం పొందిన 16. హంపి శాసనం, క్రీశ 1410 ఎపిగ్రాఫియా ఇండికా, 1వ సంపుటి,పుట ౫1. 11. పారిజాతాపహరణం, 1-2. 12. ఈ గ్రామాన్నే తరువాత రాయలవారు పెద్దనగారికి దానమిచ్చారు. అల్లసానివారి నీవాసగ్రామం

బళ్ళారి జిల్లా దూపాడు పరగణాలో దొరాల అనే ఊరు అని వీరేశలింగం పంతులుగారు బ్రాశారు. ఆంధ్రకవులచరిత్రము, 2-వ భాగం (1౫8), పుట 29.

కృష్ణదేవరాయలు 41 తుళువవారు అక్కడే ఆ తరువాత నివసించి ఉండవచ్చు. విజయనగరంలో రాజాశ్రయం సంపాదింపదలచిన పరిసరప్రాంతాలవాళ్ళకు చంద్రగిరి మొదటి మజిలీ కావచ్చు.

కృష్ణరాయల బాల్యం చంద్రగిరిలోనే గడిచిందనీ, అక్కడ ఒక వంక అల్లసాని పెద్దనగారితో, ఇంకొక వంక ముక్కుతిమ్మనగారితో రాయలకు "పరిచయం ఏర్పడిందనీ భావిస్తే, వాళ్లతో కలిసి కృష్ణరాయలు ఎన్నో సంస్కృతాంధ్ర [గ్రంథాలు చదివి ఉండవచ్చు. తన రచనలు చదివి వినిపించి ఉండవచ్చు. ఉత్తరోత్తరా, రాయలను “కర్టకుండలిత రసాఖండకవికావ్య' అని అల్లసాని పెద్దనగారు సంబోధించారు (మయను-1-82). ఆఖండరసకావ్యాలు కర్ణభూషణాలు గావడానికి ముందే రాయలవారు తమ చెవులలో కవులకు ఇల్లు కట్టించి ఇచ్చి ఉంటారు. రాయలవారి రచనలు తోడికవిమిత్రులకు వీనులవిందు చేస్తే ఆ రసికులు 'జౌను' అని ఉంటారు.

పదహాకిళ్లు నిండి, నూనూగు మీసాల నూత్న యౌవనం వస్తూన్న వయసుగల రాయలు చంద్రగిరి నుండి విద్యానగరానికి మారి ఉంటాడు. క్రీ.శ. 1490లో సాళువ నరసింహరాయలు మరణించాడు. రాజ్యభారం నరసానాయకునిమీద పడింది. అతడు భార్యలతో, పుత్రులతో రాజధానిలో స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటాడు. కృష్ణరాయలు మహామేధావిగా పరిణతి చెందడానికి చక్కని అవకాశాలు లఖించాయి. ఆనాడు విజయనగరం అక్షరాలా విద్యానగరమే. తెలుగు, కన్నడం, తమిళం, సంస్కృతం, పారసీకం, అరబ్బీ మొదలైన భాషలలో ఉద్దండ పండితులు, మహాకవులు రాజధానికి వచ్చిపోతూ ఉంటారు. వీరందరి వైదుష్యాన్నీ ఆకళించుకొనే అవకాశం రాయలకు కలిగింది.

కృష్ణరాయలు కేవలం విద్యాపరిశ్రమలలోనేకాక రాజోచిత విద్యలన్నింటిలోనూ కృషి చేశాడు. ఆయన వ్యాయామస్థిరసంధి బంధువు.!3 చక్కని కండలు తిరిగినవాడు. ఆనాడు విజయనగరంలో వాడవాడలా సాముగరడీలు ఉండేవి. ఆ తాలింఖానాలలో ఆడవారు కూడా కసరత్తు చేసేవారు. హరిఅక్క అనే పొరుషవంతురాలు తన తండ్రిని కుస్తీలో చంపిన జెట్టీలతో ద్వంద్వయుద్ధం చేసి అందర్నీ చంపి పగదీర్చుకుంది.పే రాయనైన్యాలలో హంతకులు ఉండేవారు. కృష్ణరాయలు ప్రతిరోజూ కసరత్తు చేసేవాడు. పొద్దున్నే చిన్న గిన్నెడు కుసుమనూనె త్రాగి అదే నూనె ఒళ్ళంతా పట్టించుకొని సాము చేసి, సవారీలు చేసి కుస్తీలు పట్టేవాడు. రాయలవారిలా కసరత్తూ, ముద్గరాలూ, సంగడాలూ తిప్పడం చూసి కాబోలు అల్లసాని పెద్దన ఉత్తరోత్తరా ఇలా వర్ణించారు:

ఉరుసంధ్యాతపోో ణమృత్కలితమై యొషప్పారు బ్రహ్మాండమ

చ్గరిడిం గాలవూంతగాడు చరమాగస్కంధముం బేర్చు ని

బ్బరపుక సంగడమో యనన్‌ శి డిగెం బ్రాగ్బూమిభృత్కైతవే

తరబాహగ్రపుసంగడం బనగ మార్తాండుండు దోచెన్‌ దివిన్‌, (మనుచరిత్ర, ౩-59) 13. మనుచరిత్ర, 6-12. - 14. సాలటోరు, 2-వ భాగం -

శం సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ండమెన గరిడీశాలలో ప్రభాత సంధ్య పరచిన ఎర్రమన్నులాగా ఉందట. అందు తన హోంతకారి సూర్యచంద్రులనే సంగణాల జతను రెండుచేతులా తేదుదట. పెదనగారు భావించిన కాలమనే హోోంతకారి రాయలవారి వివిధ సైనిక విద్యలలో ఆరితేరినవాడు. ఆయన వాజ్యారోహణ నైపుణీనతులుడుక “ఆవల్లత్తురగ బహువిధారోహ కళారేవంతుడు అశ్చ్వహృదయాన్ని బాగా అర్థం చేసుకొని రకరకాల గుజ్జిపుస్వారులలో ఆరితేరి ఎటుపడితే అటు దూకీంచేటంత నైపుణ్యం సంపాదించడానికి చిన్నప్పటి నుంచి శిక్షణ అవసరం. విజయనగరానికి రాగానే మూలబలాలలో ముఖ్య దండనాధులలో ఎవరో ఒకరికి కృష్ణ్ణాయలను నరసానాయకుడు అప్పచెప్పి ఉంటాడు. వాళ్ళ తర్భీదులో కృష్ణరాయలు సైనిక విద్యలు నేర్చి ఉంటాడు. కృష్ణూూయలు పైలాపచ్చీసులోనికి వచ్చేనాటికే దండనాయకుడై ఉండవచ్చు. అతని ఖర్చు వెచ్చాలకోసం నరసానాయకుడేదో ఏర్పాటు చేసి ఉంటాడు. కృష్ణ్ణూయలాడబ్బును రెండుచేతులా ఖర్చు పెట్టి ఉంటాడు. ఆయన ఉద్దేశంలో “నిజభోగముల కగువెచ్చము వెచ్చంబు కాదు విత్తంబునకుక?.** రాయలు యౌవనంలో భోగలాలసు డవునో కాదో చెప్పలేంగాని అతడు భోగంవాళ్లను, వాళ్ల వాడలో చాలాసార్లు చూసి ఉంటాడు, విజయనగరంలోని సూశెిబజారులో వేశ్యలు తమ ఇళ్లముందు అరుగులమీద చాలా తీరుబాటుగా కూర్చొని ఏయే విధాలుగా పొద్దుపుచ్చుతారో రాయలు బాగా పరిశీలించాడు, గాజులు గలగలలాడిస్తూ వీధి అరుగుమీద సానికూతులు సారెలు వేస్తే, ఆ చప్పుడుకు యతుల గుండెలు జల్లుమంటాయట. మన్మథుడిలాంటివాడు ఆ పక్కనుంచి పోతున్నా వాళ్లు కావాలని మొగమెత్తి చూడకుండా పరాకు నటిస్తారటు. అయితే శ్రీకార్యపరులైన వాళ్లు అటువస్తే వాళ్ళు లేచి మొక్కుతారట. వాళ్ళు పాచికలు బాగా కుదిపి వేస్తున్నప్పుడు కొప్పుముడి ఊడిపోతే రెండో చేత్తో దానిని సవరించుకొంటూ న్నపుడు బయటపడ్డ వాళ్ల రవికలోని చనుకట్టు గలీబులో ఉన్న మన్మథుని తలగడలాగా కనబడుతుందట. ఇవన్నీ రాయలు స్వయంగా చూసి ఉత్తరోత్తరా వర్ణించాడు. (ఆముక్తమాల్యద 1-59). - విజయనగరంలోని వారకాంతల సంగతి రాయలకు బాగా తెలుసు. వాళ్లు చక్కగా తాంబూలం వేసుకొని కెంపుల్లాగ ఎరుపెక్కిన పలువరుసను ఒక వడ్డగింజతో తోముతూ ఉంటారు. అదిమినా బట్టల కంటుకోని విధంగా ఒంటినిండా నిగ్గులు తేరేటట్టు పసుపు రాసుకొని జలకమాడుతారు. పైటలోపలే చేయి ఆడించి పలుచగానే వక్షోజాలకు పరిమళద్రవ్యాల చందనాన్ని పూసుకొంటారు. వేసుకున్న హారంలోని మంచిముత్యాలు ఏ కారణంవల్లనైనా రతిలో తెగిపోతే లక్ష్రపెట్టరు, మనిషిని ౪8. అముక్తమాల్యుద, 4-22

కృష్ణదేవరాయలు 43 చూసీచూడగానే ఏ కులమో ఇట్టే చెప్పేస్తారట, విటుడు ఉన్నదంతా ఊడ్చేసి పేదపడితే పోషించగలరట. రాజులు తమ వాడను వెలిరాణీవాసంగా భావించేటట్టు చేయగలరట, వాళ్లు మాట్లాడుతూ కావ్యాలు మాట్లాడగల జాణలట. (ఆముక్త, 1-60).

విజయనగరంలోని నాగవాసంలో సంచరిస్తున్నప్పుడు ఏ యింటి మేడమీది పంచలోనో ఒక యువతి రాయల కళ్లపడింది. భుజంమీది నుంచి తీసుకున్న జడ చనుకట్టుమీదికి పడవేసి ఆ ముద్దరాలు కురులు విష్పుకుంటూంది. ఆమె చనుగవ వీణకుండే కాయలవలె ఉన్నాయి. జడనున్న పువ్వులు గోటితో మీటుతున్నప్పుడవి దంతపు మెట్లలాగా కనబడ్డాయి.” చిన్నప్పటి నుంచి వీణ అంటే చెవికోసుకొనే రాయలకు చిక్కు ఎడలించుకొన్న చిన్నది వీణ మీటుతున్నట్టు కనబడడంలో వింత లేదు.

చిన్నాజీ అనే సానిపిల్లతో కృష్ణ్ణయలకు పరిచయం అయింది. ఆ పరిచయం ప్రగాడానురాగంగా మారింది. కృష్ణ్ణూయల కప్పటికి పాతికేళ్లు కూడ లేవు. తొలిప్రేమలోని నిర్మలత్వం అతని మాటలలో వెలువడి చిన్నాజీని వినిర్మలం చేసింది. అతడు బాస చేశాడు. ఏనాటికైనా తాను రాజ్యాధిపతి అయితే ఆమెను వివాహం ఆడీ దేవేరిగా చేసుకొంటానని వాగ్గానం చేశాడు. ఆమె విశ్చసించింది. రాయలింకా తండ్రీ చాటువిడ్డ. రాత్రులు నగరు దాటి యథేచ్చగా రాలేడు. అందుకే రహస్యంగా ఆమెను కలుసుకుంటూ ఉండేవాడు, ప్రధాని తిమ్మరుసయ్యవి పాము చెవులు, పిల్లిగుడ్లు రాత్రిపూట కోటనుంచి కండచీమ కాలు బయటపెట్టినా, మరునాడు ఆ సంగతి ఆయనకు తెలుస్తుంది. నరసానాయనింవారి రెండవ సుపుత్రుడు రాత్రుళ్ళు నగరు వెలుపల రహస్యంగా ఏవో రాచకార్యాలు చక్కబెడు తున్నాడని తిమ్మరుసయ్యకు ఆరెకులు విన్నపాలు చేసుకొన్నారు. విజయనగరంలో రాత్రిళ్లు గస్తీ తిరిగే ఆరెకులు వెయ్యికళ్ళతో చూస్తారు. ఎవరైనా ఏదైనా పారేసుకొంటే తీసి భద్రంచేసి నమ్మకంగా హక్కుదారులకు అందచేస్తారు. ఈ ఆరెకుల కంటపడకుండా తప్పించుకొందామని కృష్ణరాయలు వరిమళ్లలో కాలువపక్క నక్కి కూర్చుంటే చూసి ఉంటారు. అతని తలగుడ్డ తెల్లగా, బాతురెక్కలా ఉందేమో, బాత్ములను చూసి అఆరెకులు వస్త్రమని ్రమించారని కృష్ణరాయలు ఉత్తరోత్తరా ఒక పద్యం చెప్పాడు.

తలబక్షచ్చటగ్రుక్కి బాతువులు కేదారంపుగుల్యాంతర

స్థలి నిద్రింపగ జూచి యారెకు లుషస్నాతప్రయాతద్విజా

పలిపిండీకృత శాటులన్నవిధతద్వాసంబు జేర్చంగ రే

వుల డిగ్గ న్వేసబారువాని గని నవ్వు న్నాలిగోప్యోఘముల్‌ (ఆముక్త. 1-౪6)

బ్రాహ్మణులు తెల్లవారుజామునే స్నానాలు చేస్తారు. వాళ్లు కాలువల ఒడ్డున అప్పుడప్పుడు వస్త్రపు పిడుచలు మరిచిపోవచ్చు. రెక్కలలో తలలు దూర్చుకొని నిద్రపోతున్న బాతులు వస్రాలలాగా కనబడీతే ఆ బట్టలను బాపనయ్యలకు ఇచ్చేద్దామని ఆరెకులు దగ్గరకు వెళ్ళారు. ఆ చప్పుడుకు బాతులు లేచి ఈదుకొంటూపోతే ఫైరు కాపరి 17. ఆముక్తమాల్యద, 1-62

44 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి యువతులు నవ్వారట. రాయలవారు ఇంత కమ్మగా వర్ణించిన సంఘటన ఆయన జీవితంలో బాగా హత్తుకుపోయింది కావచ్చు.

కృష్ణరాయలు. రాత్రిపూట. చేస్తున్న ఘనకార్యాల సంగతి తెలియగానే తిమ్మరుసయ్య వెంటనే ఈ యువకునికి పెళ్ళి చేయించాలని నిశ్చయించాడు. ఈ అబ్బాయి వివాహంతో ఏదైనా రాచకార్యం నెరవేరుతుందా అని ఆలోచించాడు. విజయనగర సామ్రాజ్యానికి పక్కలో పల్లేరు కాయలలా ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నం సామంతులు బాధాకరంగా ఉంటున్నారు. వీరీలో ఒకరిని వియ్యంతో లొంగదీసుకుంటే కొంత బాగుంటుందని తిమ్మరుసయ్య భావించాడు. శ్రీరంగపట్నం పాలించే చామరాయల కుమార్తె తిరుమలదేవిని కృష్ణరూయలకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. తిమ్మరుసయ్య తలచుకొంటే ఆగుతుందా? వెంటనే క్రీ.శ. 1498లో, అంటే కృష్ణ్ణాయల 24వ ఏట వివాహం జరిగి ఉంటుంది. సముహూర్తాన్ని సూచించడానికి ఇసుక గడీయారం వాడి ఉంటారు. తెరకట్టారు. కృష్ణ్ణూాయలు జీలకర్ర బెల్లం వధువు శిరస్సుపై పెట్టాడు. ముక్తల సేసలు జల్లుకొన్నారు. ఈ వివాహక్రియలన్నీ రాయలవారికి జ్ఞాపకం వచ్చాక ఉత్తరోత్తరా శరత్కాలాన్ని పెళ్ళితో సరిపోల్చారు.

కెరలు ్రవంతిపై ఇసుక క్రీందగువేళ నినుండు మేఘపుం

దెరసనజల్లగా విరహదీప్తకరప్పతమౌసజీరఠో

త్కరగుడమట్లు పద్మినుల గ్రమ్ము సకేసరమాధ్విపోల్చెబై

గర మరుదారె దేంట్లు సెకగందిన ముత్తెపు సేనలో యనన్‌ (ఆముక్షమాల్యద, 4-15)

శరత్కాలంలో ఏట్లో పై ఇసుక తెకలి కిందికి పోతుంది. అది నీటిగడియారంలా ఉంది. సూర్భుడు మేఘాల వెనుకకు పోయాడు. అది పెళ్లి కొడుకుముందు తెర కట్టినట్లుంది. తామరపువ్వుల కేసరాలపై మకరందం బాగా అలుముకొంది. ఆ కేసరాలు, మేనె జీలకర్రబెల్లంలాగా ఉన్నాయి. విరహం వేడికి బెల్లం కరిగి చెయ్యంతా అంటుకొన్నట్ట్లు కనిపిస్తూంది. తుమ్మెదలు నెగకు కందిన ముత్యాలలాగా ఉన్నాయట. తెలుగు పెళ్ళిళ్ళలో జీలకర్ర బెల్లం పెట్టడం పెళ్ళిలో మొదటితంతు. అయితే ఈ తొలి చర్యను తెలుగు సాహిత్యంలో రాయలవారికి ముందు ఎవరూ వర్జించినట్టు లేదు. తొలిరాయల యుగందాకా మిగిలిన కవులు నీటి గడియారాన్నే పేర్కొన్నారు. గాని రాయల వారే ఇసుక గడియారాన్ని ప్రప్రథమంగా సూచించారు.

చిన్నాదేవి మీద ఎంత ప్రేమ ఉన్నా రాయలవారు తిరుమలదేవితో అన్యోన్యంగానే ఉన్నారు. ఆ దంపతుల ఆశలు పండి అనతికాలంలోనే ఐడీ నిండింది, రాణివాసంలో ఉయ్యాల కట్టారు. రాయలవారికి, బహుశా వారి ఇరవై అయిదవ యేట, క్రీ.శ. 1499లో ప్రథమ పుత్రిక జనించింది. ఆ తొలిచూలు బిడ్తకు తిరుములాంబ అని పేరు పెటారు. రాయలు తన కుమార్తెకు ఏడుకొండలవాడి పేరు పెటడంలో కారణముంది. ఆయనకు తిరుపతి వెంకటేశ్చరుడంటే అమిత భక్తి. చిన్నప్పుడు రాయలు చంద్రగిరిలో వుండేవాడు. అక్కడికి తిరుపతి కనుచూపుమేర దూరంలో ఉంటుంది. గుగ్రమెక్కి రికాబుకాళ్ళను

కృష్ణదేవరాయలు 46 కొంచెం జాడిస్తి కళ్ళుమూసి కళ్లు తెరిచేలోగా అడివారం చేరుకోవచ్చు. రాయలు ఎన్నోసార్లు చిన్నప్పుడు కొండ ఎక్కి కొలచుకొని ఉండి ఉంటాడు. ఈ గాడభక్తిని అల్లసాని పెద్దనగారు. గ్రంథస్థం చేశారు. “శ్రీవెంకటేశ పదపద్మావేశిత సదయ హృదయాః”' అని తన ప్రభువును సంబోధించారు.!కి

రాయలకు 25వ ఏట పుత్రిక జనించింది. 29వ యేట, క్రీ.శ. 1503లో తండ్రీ మరణించాడు. దానితో రాజకీయ పరిస్థితులు మారాయి. అన్న పట్టం కట్టుకున్నాడు. తనతోబాటు రాచకార్యాలలో తమ్ముణ్ణి కూడా కలుపుకుని వుంటాడు. అప్పట్నించి సాహిత్య వ్యాసంగానికి ఏదో కొద్దిపాటి కాలాన్నే రాయలు కేటాయించినట్టు భావించ వచ్చు. వివాహం అయింది మొదలు తండ్రీ మరణందాకా వున్న అయిదు సంవత్సరాలలో కృష్ణరాయలు కావ్యరచన చేసినట్టు వూహించవచ్చు.

ఉగ్రుక్షలు, ఉపమలు, స్వాభావోక్తులు అతిశయించేటట్లు రాయలు మదాలన చరిత్రను మొదట రచించాడు. ఇది మార్కండేయ పురాణంలో వున్న కువలయాశ్చ చరిత్ర కావచ్చు. కువలయాశ్చ్వుడు మదాలసను వివాహం చేసుకున్నాడు. రాయలు రచించిన మదాలస చరిత్రను విని రసికులు చాలా మెచ్చుకున్నారు. ఈ కృతి చెప్పాక రాయలు “సత్యావధూప్రీణనం' అనే కావ్యం వ్రాశాడు. ఇది బహుశః _ పారిజాతాపహరణం కావచ్చు. సత్యభామను తృప్తి పెట్టడానికి కృష్ణుడు చేసిన పనులన్నింటిలోకి పారిజాతం తేవడమే గొప్పది. దానిని రాయలవారు హరివంశంలో చదివి ఆ ఘట్టం ప్రత్యేకంగా ఒక కావ్యానికి తగినంత ఇతివృత్తం కలదని భావించి భావం, ధ్వని, వ్యంగ్యం మొదలైన కావ్యగుణాలకు పెన్నిధానమయేటట్లు నిర్మించారు. వేదాలు, పురాణాలు, ఉపసంహితలు క్షుణ్ణంగా చదివి వాటిలోని గాథలు ఏర్చి సకలకథాసారసం గ్రహం అనే సంకలనాన్ని రాయలు సమకూర్చాడు. విన్నవాళ్ళ పాపాలు పటాపంచలయేటట్లు సూక్షినైపుణ్యంతో 'జ్ఞానచింతామణి' అనే కృతి తాను నిర్మించినట్లు రాయలు తరువాత చెప్పుకున్నాడు. ఆయన '“రసమంజరి అనే కావ్యాన్ని కూడా వ్రాశాడు. ఈ మధుర కావ్యాలన్నీ ఆయన సంస్కృత భాషలోనే రచించాడు. అయితే ఏఒక్కటీ నేడు లభించవు.

రసమయ కావ్యాలు రచించే రాయలు కలాన్ని పక్కకు పెట్టి కత్తిని చేపట్టవలసిన అవసరం క్రీ.శ. 1506 దాటాక వచ్చింది. ఆ యేడు అతని సవతి అన్నగారి వీరనరసింహ రాయలు విజయనగరసామ్రాజ్యపు రత్నసింహాసనాన్ని అధిష్టించాడు. ఇందుకు అభ్యంతరం చెప్పి ఎదురు తిరిగిన సామంతులను అదుపులో పెట్టవలసిన బాధ్యత ప్రధాని తిమ్మరుసయ్యమీద ఎంతవుందో అంత వీరనరసింహరాయలు కృష్ణరాయలపైన కూడా పెట్టినట్లుంది. అతనికి తమ్ముడంటే వాత్సల్యం, తల్లి నాగాంబ అంటే గౌరవం వున్నాయి. తన తల్లీ, సవతితల్లీ కౌసల్యా, సుమిత్రలవంటివారనీ, జ్రనూ, తన తమ్ముడూ రామలక్ష్మణులవంటివారనీ వీరనరసింహరాయలు ఒక శాసనంలో ఇలా బ్రాయించాడు.కీ 18. మనుచరిత్ర 3-1 19 కంచికామకోటిపీరాధిపతుల వద్దనున్న తామ్రశాసనాలలో నెం. 112, పుట 22 అని నేలటూరు

వెంకటరమణయ్యగారు ఉదాహరించారు. భారతి, 19349, మార్చి, పుట 161.

46 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

తిప్పాజీనాగలాదేవ్యోః కౌసల్యాశ్రీసుమిత్రయోః

దేవ్యో రివ నృసింహేం ద్రాత్తస్మాత్చంక్తిరథా దిన

వీరౌ వినయినౌ రామలక్ష్మణా వివ నందనౌ

జాతౌ వీరన్ఫసింహేంద్ర కృష్ణ్ణాయమహీపతి.

తన తమ్ముడు వినయసంపన్నుడని, మహీపతి అని వీరనరసింహరాయలు చెప్పాడు. “మహీపతి అనే మాట వాడడంవల్ల కృష్ణ్ణాయలకు రాచకార్యాలలో ప్రముఖ స్థానం యిచ్చినట్లు కనబడుతుంది. వీరనరసింహరాయల పరిపాలనను సుస్థిరం చేయడానికి కృష్ణరాయలు ఎంత పాటుపడినా అన్నగారు అదృష్టహీనుడు, మూడేళ్లు మాత్రమే రాజ్యం చేశాడు. క్రీ.శ 1509 జూలైలో అతడు మంచాన షడ్డాడు. దీనికి ముందు ఎదురుతిరిగిన సామంతులను అణచడానికి వెళ్ళి ఉమ్మత్తూరుదొరల చేతిలో ఓడిపోయాడు. తను ఆట్టేకాలం బతకనని అతనికి తెలుసు. మహాప్రధాని తిమ్మరుసయ్యకు తన అంతిమ కోరిక చెప్పి మరణించాడు.

రాబ్యక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పాజీ తిమ్మరుసయ్య రాయసింహాసనంపై కృష్ణ్ణాయలను ఎలాగ ఎక్కించినదీ ఇంతకుముందు ముచ్చటించుకున్నాం. పట్టం శట్టుకొన్నాక రాయలు ఒక కచ్చితమైన దినచర్య ఏర్పాటు చేసుకున్నాడు. నిద్ర లేవగానే ఒక జాముసేపు వైద్యులతోనూ, జ్యోతిషులతోనూ ముచ్చటించేవాడు. 'సుఖంగా నిద్రపట్టిందా?' అని కుశలప్రశ్హ వేసి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొనే వైద్యులతో ఊరు తెల్లవారక ముందు సల్గాపించడంలో రాయల జాగ్రత్త కనపడుతుంది. జాము పొద్దెక్కాక మంత్రులతో, సామంతులతో సంప్రతింపులు, ధనార్జన నియుక్తులైన కాయస్థులతో గోప్టిచేసి రాజ్యంలోని అదాయవ్యయాల లెక్కలు వినేవాడు, తరువాత అంగమర్థనం, మల్లులతో వ్యాయామం చేసేవాడు. వంటవాళ్ళతోటి, వేటకాళ్ళతోటి మాట్లాడేవాడు, వేటకాళ్లు తెచ్చిన మాంసం ఎలా వండాలో వంటవాళ్ళకు పురమాయించేవాడు. ఏయే మాంసాలు తీసుకురావాలో వేటకాళ్ళకు చెప్పేవాడు.

అపరాష్లా సమయంలో దేవతార్చన, అర్యులతో ధర్మాధికారులతో గోష్టి భోజనం చేశాక భుత్తాయాసం తీరడానికి విదూషకునితో సల్తాపం, తరువాత కవులతో, పొరాజీకులతో విద్యావినోదం, ఆ పిమ్మట చారులతో మంతనాలు, సంజవేళ పాటకచ్చేరీ, రాత్రి సుఖనిద్రకు ముందు ప్రేయసీ గోష్టి,

కృష్ణరాయల తొలిప్రేయసి చిన్నాజీ, దేవుడు మేలు చేసి తానెప్పటికైనా రాజ్యూనికీ వస్తే అమెను దేవేరిగా చేసుకొంటానని ఎప్పుడో ఆమెకు మాటిచ్చాడు. పట్టం కళ్టుకున్నాక అది నిజంగా నిలబెట్టుకున్నాడు. చిన్నాజీ చిన్నమదేవి అయింది. పట్తమహిషి తిరుమలదేవితోపాటు చిన్నాజీకి కూడా రాయలు సమాన హోదా యిచ్చాడు. దండయాత్రలకు నడిచినా, తీర్థయాత్రలకు కదలినా రాయలు డేవేరులిదరిసీ వెం పెట్టుకొనే వేవాడు. వాస్తవానికి కళింగ దిగ్విజయ యాత్రతు వ్లేముందు రాయలు భార్యలతో తిరుపతి వెళ్లాడు. క్రీశ 1513 ఫిబ్రవరి 10 తారీఖునాడు తిరువేంగళదేవునికి

కృష్ణదేవరాయలు 47 నవరత్న ఖచితమైన కిరీటం చేయించాడు. పట్టాఖిషేకంలో తాను అటువంటి కిరీటం ధరించాడో లేదోగాని దేవునికి చేయించిన కిరీటం అపూర్వమైంది.

1555 తులాల బంగారం కేవలం వొమ్మచ్చుకే (అంటే కిరీటం కింది భాగాన ఉండే మట్టుకుమాత్రం) వాడారు. మిగిలిన కుందనం పనికి 1076 తులాల బంగారం పట్టింది. 2822 కెంపులు, 160 పచ్చలు (ఇవి నూటెనిమిది రతులు), 423 పాత వజాలు, మధ్య మాణీక్కంతో కలుపుకొని ౩ మాణిక్యాలు, 10 వైఢూర్యాలు, 10 గోమేధికాలు, 3130 ముత్యాలు ఈ కిరీటంలో ఉన్నాయి. ఈ మహాదానాన్ని రాయలు చేస్తున్న రోజునే పట్టమహిషి తిరుమల దేవీ 374 తులాల బంగారుహ్మోన్ని స్వామివారి ఆనవాల నైవేద్యసేవకు దానం చేసింది.*! ఆనాడే, అదే. తూకంగల బంగారంతో ఒక పైడిగిన్నా అదే ఆనవాలసివకు చిన్నమదేవి ఇచ్చింది.22 రాయల దేవేరులిద్దరికీ ఏమాత్రం తేడా లేదని ఈ దానాలే వక్కాణీస్తాయి. రుక్మిణీ సత్యభామలవంటి ఈ ఇద్దరేకాక రాయలకు మరో ఇద్దరు భార్యలున్నారట. న్యూనిజ్‌ అనే చారిత్రక సంచాలకుడు ఈ సంగతి చెప్పాడు. అయిడీ ఫియిస్‌ అనే విదేశీయుడు రాయలవారికి 12 మంది భార్యలని వ్రాశాడు. ఇందులో కొందరు భోగపత్నులు కావచ్చు.

రాయలు స్త్రీలోలుడని చెప్పలేంగాని 'కవితాస్త్రీలోలు'డని అల్లసాని పెద్దనగారు ఎలుగెత్తి, సగర్వంగా చెప్పారు. రాయలవారు తొలి దండయాత్రనుంచీ పెద్దనగారు ముక్కుతిమ్మనగారు, మాదయ్యగారి మల్లన మొదలైన కవులను వెంటపెట్టుకొని ఉండేవారు. రాయలు పట్టాఖిషేకం చేసుకొన్న కొత్తలో విజాపురం, అహమ్మదునగరం, గోలుకొండ రాజ్యాల ఏలికలు ముగ్గురూ ఉమ్మడిగా రాయలపై దాడి చేశారు. గోలకొండవారి సరదు స్థలాలలో మూడుఇళ్ల తురకలు మోర్బ్పావేసి పాళెందిగారు. కృష్ణవేణి దాటి డెరిజా వేశారు. డెరిజా వేయడం అంటే అమీతుమీ తీలేదాకా వేసిన డేరా ఎత్తమనే ప్రకటన. ఈ గుడారంలో సుల్తాను ఉంటాడు. ఇది పడిపోతే సుల్తాను పరాజయం పౌందినట్టే. అందుకే సర్దారులు, అమీరులు అంతా కలిసి డెరిజాను వేయి కళ్ళతో కాపాడుతారు.

కృష్ణ దాటి, మూడిళ్ల తురకలు డెరిజా వేశారని వినగానే రాయలవారు ఆగ్రహించారు. ఏం చేయాలని అమర నాయకం వారందరినీ ప్రశ్నించారు. పెమ్ముసాని రామలింగచమనాయకుడనే మహాశూరుడు ఇలా సలహా చెప్పాడు:

“తురకలతో యుద్ధం అనగా ఎంత? దేవరవారి ప్రతాపంవల్ల డెరిజాతాళ్లు తెగకోస్తాను. అప్పుడు భేరి తాడనం చేసి నడిస్తే తురకలు మూడు తెగలవాళ్లు పటాపంచలవుతారు” అన్నాడు, తాను వెళ్ళి డెరిజాతాళ్లు కోస్తానని శపథం చేశాడు. మూడిళ్ళ తురకలూ డెరిజా వేశారని తెలియగానే స్వయంగా రాయలు తానేం శపథం 20. తిరుపతి దేవస్థానం శాసనాలు, సంపుటి ౩, నెం. 32 21. అదే సంపుటిలో, నెం. 51 22. అదే సంపుటిలో, అదే నెం. 51 23. మనుచరిత్ర, 1-45

48 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చెయ్యలేదు. అదీ తన రాజనీతికి విరుద్ధం, యుద్ధంలో ఎప్పుడూ ప్రభువు ప్రతిజ్ఞలు చేయకూడదట. రాయలవారు ఇలా గ్రంధస్థం చేశారు: ప్రతిన వలదు వైరిపట్టున నృపతికి దండువెడల దీరకుండు దీరు గాకయుండీయుండి కాలంతరమున నౌ గార్యకాడొ యంకక్తాడొ నృపుడు. (ఆముక్తమాల్యద, 4-26) - రాజు శత్రువుమీద ఎప్పుడూ ప్రతిజ్ఞ చేయకూడదు. దండెత్తినప్పుడు కార్యం తీరితే తీరవచ్చు. లేకపోడే తీరకపోవచ్చు. రాజు కార్యవాది అవాలిగాని ఖడ్గవాదిలాగా మారకూడదు. అంకకఠాడు ఉత్త జట్టీకోరు, కార్యవాది కనుకనే రాయలు తాను స్వయంగా శపధం చేయక తన సేనానులచేత చేయించాడు. రాజు ఎప్పుడూ శూరాలాపం చేయకూడదని మరొక నిషేధం రాయలవారు చేశారు. శూరాలాపములకునతి-శూరుడు దానయ్యు నృపతి సోకోర్వదగు న్యారుబ్బుదు రందున నిజ-శూరత దొరలందు గనుట సూ కార్యములన్‌ (ఆముక్టమాల్యద, 4-244) ఇటువంటి రాజనీతులు తొలియుద్ధం దగ్గిరనుంచీ రాయలవారు అమలులో పెట్టారు. పెచ్ముసాని రామలింగమనాయకుడు శపథం చేసినట్టుగానే డెరిజాతాళ్లు తెగకోశాడు. రాయలవారు భేరీతాడనం చేయించి మదహత్తి నెక్కుకొని ఉభయఛత్రాలతో మకలటెక్కాలతో, నూటయిరవై ఘట్టాల ఏనుగులతో, అరవైవేల గుర్రాలతో, అయిదు లక్షల సిపాయిదళంతో పౌట్టంగా నడిచారు. రాయలవారి సైన్యం వరదలాగా నడిస్తే నిజంగా కృష్ణవేణమ్మకు కూడా ఆ కాలంలో వరదలు వచ్చాయి. ఈ రెండు వరదలకూ తట్టుకోలేకపోయారు తురకలు. తమ ఏనుగులను, గుడారాలను వదలిపెట్టి పారిపోయారు. రాయలవారు కృష్ణవేణి ఒడ్డుకు వచ్చి మూడు తెగల తురకల గుర్రాలను, ఏనుగులను నగరిలో కట్టిపెట్టమన్నారు. గుడారాలు నిశానీలు, నగారాలు మొదలైనవి మొదటి జగడాన దొరికాయి కనుక అవన్నీ నగరికట్టమని, దివాణానికి చెందుతాయని అన్నారు. ఇటువంటి అజ్ఞ రాజు ఇవ్వకపోతే ఎవరికి దొరికినవి వాళ్లు అంకీంచుకొనడం ఆనాటి నీతి. రాయలవారు నగరి నియోగుల కీయవలసిన అజ్ఞ నిచ్చి ముక్కుతిమ్మన మొదలైన కవీశ్చరులకేసి చూసి “నేటి జయం ఏరికి?”” అని అడిగారు. అప్పుడు తిమ్మనగారిలా పద్యం చెప్పారట: నరసింహకృష్ణరాయా। - దురమున నీపేరుపేర దురకల ద్రుంచెన్‌ గరిరాజవరదుడ వని నీ-కరిఘటములు నిన్ను జూచి గ్రక్కున తిరిగెన్‌ (రాయవాచకం, పుట ౪) తిమ్మనగా రీపద్యం చెప్తున్నప్పుడు యుద్ధరంగంలోని గుడారంలో అల్లసాని పెద్దనగారు,. మాదయ్యగారి మల్లనగారు కూడా ఉన్నారు. యూసఫ్‌ అదిల్‌ఖాన్‌ను మనో సంహరించాక అల్లసాని పెద్దనగారు ఈ పద్యం బహుశ యుద్ధరంగంల్‌ శ్‌న్సే రు,

కృష్ణదేవరాయలు త్రి అలుకన్‌ ఘోటకథట్టికాఖుర పుటీహల్యస్థురాసానిపు

చ్చలువోదున్ని చలచ్చమూగజమదాసారప్తుతిన్సీర్దిపు

ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తౌ దృష్టి కే

దులఖానో గక పాలమర్థపహరిద్చూజాంగల శ్రేణికిన్‌ (ఆముక్త 1-42)

ఖురాసాని దేశంనుంచి వచ్చిన తురకల శరస్సులనే పుచ్చతోటలను గుర్రపు డెక్కలనే నాగళ్ళతో దున్ని ఏనుగు దళాల మదధారలనే వర్షంతో తడిపి, యేకధాటిగా కీర్తిపంట పుష్కలంగా పండించి. దానికి దిష్టిబొమ్మగా అదిల్‌ఖాన్‌ కపాలాన్ని రాయలవారు నిలిపారట. ఈ పద్యంలో రాయలవారికి చాలా ఇష్టమైన రూపకాలంకారం ఉంది. రాయలవారి కేదైనా పద్యం నచ్చిడే దానిని ఒకటికి రెండుసార్లు చదివించుకొని విని కంఠతా పడతారు. దీనికొక నిదర్శనముంది.

రాయలవారు రోజూ నిత్యకృత్యంగా ప్రాతజాలంలో పద్యనీతి చదవమని వింటూ ఉండేవారట. ఒకనాడు పద్య నీతిచంద్రయ్య తను వచ్చి చదవడానికి వీలులేక కుమారుని నగరికి పంపించాడట. అతడు మేలుకొలుపులయ్యాక సంజనీతి, విదురనీతి, చాణుక్యనీతి, భర్హృహరినీతి శతకం మొదలైనవి చదివాడట. రాయలవారు సావధాన చిత్తులై ఉన్నారు. చంద్రయ్య కొడుకు ఈ పద్యం చదివాడు.

బలవర్గము సామంతుల - బలమునకగ్గలముగల నృపాలున కొదవే

బలిమె పెఅనృపతికాజ్ఞా- బలసంపద కెంతదవ్వు బద్దెనరేంద్రా!

ఈ పద్యం అతడు చదివాక రాయలవారు దానిని ఇనుమారు ముమ్మారు చదవమని మనసుకు తెచ్చుకున్నారు. తరువాత దానిమీద తక్షణం తీసుకోవలసిన చర్య తీసుకున్నారు. కరణాలను పిలిపించి రాజ్యంలో గిరి దుర్గ జలదుర్గ, స్థలదుర్గాలెన్ని? కోటలు ఎన్ని? ఎవరెవరికి ఎంత ఎంత జీతం? సైన్యమెంత! మొదలైన వివరాలన్నీ లెక్కచెప్పమన్నారు. ఈ వరకున్ను వీరనరసింహరాయలవారు లెక్కపక్కాలడిగి పరామర్శించెడివారు గాదు. ఇప్పుడు స్వామివారు లెక్కలు పరామరిక చేస్తున్నారు కనుక ఏయే లెక్కలు విన్నపం చెయ్యమన్నారో ఆయా లెక్కలు సేకరించి వ్రాసి నేటమర్నాట అన్నియు విన్నపం చేస్తామని చిన్నభండారం కరణాలు చెప్పారు. తక్షణ చర్య తీసికొనడం అన్నది రాయలవారి జీవితవిజయాల కీలకం, ఆయన రాజనీతిలో ఒకటే నియమం పెట్టుకున్నారు, వినండీ.

లాలన నారక్షుల గమి-నేలి తెలిసి ముచ్చునాజ్ఞయిడ కతడు చెరం

బో లాతి నిడనయశమెం-డేలేవదె శూలప్పుథువణిజ్నార్రియమునన్‌ (ఆముక్ట4-239)

“లాలించి రక్షక్షభటులను ఏలి దొంగ ఎవరో తెలిసికొని వెంటనే తిక్షించమని రాయలవారి శాసనం, ఆలస్యం చేస్తే ఒకవేళ దొంగ పారిపోతీ, తమ పీకలమీదికొస్తుందని రక్షకభటులెవరో దారిన పోయేవాడీని తీసుకొచ్చి కొట్లో తోస్తారు. వాడే అసలు దొంగ అనుకొని రాజు శిక్షిస్తే అపఖ్యాతి, ఇది 'ఘనమైన శూలం, లావుపాటి సెట్టి న్యాయంలాగ తేలుతుంది” అని రాయలవారు పిట్టకథ జ్ఞాపకం చేశారు. రాయలవారి ఆముక్తమాల్యదకు చాలా ప్రతిభావంతమైన వ్యాఖ్యానం బ్రాసిన వేదం వెంకటరాయశాస్త్రిగారు ఈ న్యాయాన్ని ఇలా విడమరిచారు వినండీ.

ర్‌0 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ““పంచమహాపాతకపట్టణములో అవకతవక ప్రభువుకడ. ఒకడు తాను ఇల్లు కట్టుకొనుటకు మట్టిగోడ పెట్టుకొనగా వర్హము కురిసి గోడ కూలిపోయినదనియు అహూధిని దండింపవలెననియు. మొరయిడెను. ఈ తప్పెవరిదని రాజు అడుగగా మేఘునిదని అవివేకపు ప్రధాని చెప్పెను. మేఘుని కొరతవేయుడని రాజు తలారులకు ఆజ్ఞాపించెను. “మైగవలన మేఘుడయినాడు. పొగది తప్పుగాని మేగునిది గాదు" అని అరెకులు చెప్పిరి. “పొగను కొరుత వేయు'డని రాజు ఆజ్ఞాపించెను. “పొగకు కారణము కుమ్మరయావము' అని యొక సభ్యుడు చెప్పెను. “ఆవమును కొరుతవేయుడు' అని రాజు ముదలయిడెను. 'అవములేదు, దానిని పెట్టిన కుమ్మరియున్నాడు' అని మరియొక సభ్యుడు చెప్పెను. అంత కుమ్మరికి అజ్ఞ అయినది. కుమ్మరి “అయ్యవారి ఇంటి పెండ్లీ, నేను అరివేణికుండలకై అవమిడితిని. మీరు పెండ్లికుమారుని వేయవలయునుగాని నన్ను వైచెదరేమి?' అని అరెకులతో వాదించెను. వారీమాట రాజుతో చెప్పగా రాజు పెండ్లికుమారుని కాజ్ఞయిడెను. పెండ్లికుమారుని పీటలమీదనుండి కొర్తికిం గొనిపోయిరి. అతడు కొర్తిం జూచి "అయ్యా, కొగ్రులావుగా ఉన్నది, నేను సన్నపాటివాడను. నన్ను వైచెదరేమి' అని వాదించెను. ఆ వాదము అరెకులు రాజుతో చెప్పగా రాజు ఆలోచించి, “అవును, ఆకొర్తికి తగిన లావుపాటివానినే వైవవలసినది. ముమ్మాటికి ఇదే నెలవు. మరి రాకుడు* అని ముగించెను. అంతట ఆఅరెకులు లావుపాటివానిని సెట్టి నొకనిని కొర్పికడకు గొంపోయిరి. అతడు ధనమిచ్చెదనన్నను “మేము రాజాజ్ఞ మీరుదువూ? లంచము గొందుమా? ధర్మస్థాపన జరుగవలదా?” అని వాని గొరుతుం దివిచిరి. - ఇదయ్యా శూలప్పుథు వణిజ్న్యాయము."*ీ రాయలవారికి హాస్యరసమంటే చాలా ఇష్టం. ఆయన మానవనైజాన్ని బాగా పరిశీలించిన వ్యక్తి. తమ ఉద్యోగాలు కాచుకొందుకు నిరోషులను సహితం అధికారులు బలిచేస్తారని తెలుసు. ఈ సంగతి ఘాటుగా చెప్పక సున్నితంగా పిట్టకథ న్యాయంతో ముడిపెట్టారు. అధికారులెంత లంచగొండ్లో రాయలకు తెలుసు. అందుకే ఇలాగ చెప్పారు. మనమున కొండు రెండు మరుమంత్రముల స్నెరిపోవ జెప్పినం జనపతు లాతనిం విలువ సాగుదు రాగతి సార విల్చున చ్చనువునకే థనాది గొని సంగతిగానివి క్రొవ్వి చేయజె ప్పున్ఫపతి తద్బహిశ్చరితము _జ్రరుచే బరికింపగా దగున్‌ (ఆముక్త 4-265) ఎవరైనా ఒకటికి రెండుసార్లు మనసుకు నచ్చే ఆలోచన చెప్తే రాజులు అటువంటి అధికారిని అడపా దడపా పిలిపిస్తూనే ఉంటారు. ఇది చూసి రాజుగారితో తమ తరపున సిఫార్సు చేయమని ప్రజలు లంచాలిస్తారు. అది పుచ్చుకొని తనమాట సాగుతుందనే గర్వంతో అతడు అసంగతపు ఆలోచనలు చెప్పవచ్చు. కాబట్టి అలాంటివాళ్ళ (బ్రతుకులు

కృష్ణదేవరాయలు 51

కన్నొకటి నిద్రవో బెరకంట జాగ

రంబు గావించు భూరుహాగ్రంబుమీది

యచ్చభల్లంబుగతి భోగ మనుభవించు

నెడను బహిరంతళీరులపై దృష్టి వలయు. (ఆముక్త. 4-241)

ఇంత జాగ్రత్తగా ఉండేవారు కనుకనే రాయలవారికి యుద్దాలలో, రాచకార్యాలలో ఎప్పుడూ ఓటమి లేదు. మూర్గాఖిషికం చేసుకొన్న కొత్తలో మూడీళ్ళ తురకల మీద గెలుపు సాధించారు. తరువాత ఉమ్మత్తూరు కివనసముద్రం మొదలైన సామంతులను అదుపులో పెట్టారు. పెనుగొండ నుంచి శివనసముద్రం దాకా ఉన్న రాజ్యాన్ని కట్టుదిట్టం చేసి నమ్మిన ఉద్యోగులను నియమించారు. తరువాత తిరుపతి వెంకన్న, దర్శనం చేసుకొని కళింగంపై దిగ్విజయ యాత్రకు బయలుదేరారు.

కళింగ దండయాత్ర నాల్లు ఘట్టాలుగా జరిగింది. మొదట ఉదయగిరి దుర్వాన్ని పట్టుకొన్నారు. తరువాత ఒక ఏడాదికి అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జున కొండ మొదలైన దుర్గాలు కైవసం చేసుకున్నారు. కొండవీటి దుర్గాన్ని జయించారు. అప్పుడా దుర్గంలో ఉన్న ప్రతాపరుద్ర గజపతి రాణీ ఒకామె, పుత్రుడు వీరభద్రగజపతి పట్టుపడ్డారు. వారిని రాయలు సముచితరీతిని మర్యాదలతో బంధింపించాడు. శత్రువుల జనానా పట్టుబడితే వాళ్ళను పుట్టింటివారిలాగా మర్యాదలు చేయాలని రాయల ఫర్మానా.

రాష్ట్రమెరియింపుకొనుము దుర్గములు తదవ

రోధ మగపడ్డ బుట్టింటి రూడి నడవు

పరుషములు తద్రిపుల రాయబారులెదుట

బలుకకుము సంధియొక వేళ వలసియుండు (ఆముక్త 4-267)

పగవాడి దేశం తగలబెట్టు, దుర్గాలు తీసుకో, అంతేకాని అతడి స్త్రీజనం దొరికితే పుట్టింటివాళ్లకులాగ మర్యాదలు చెయ్యి, శత్రురాజుల రాయబారులవద్ద కటువుగా మాట్లాడకూడదు. ఎప్పుడేనా సంధి అవసరం వస్తుంది. అప్పుడీ పరుష వాక్యాలు అడ్డురాకూడదు - అని రాయలవారు చెప్పారు. పగవాళ్ళపట్ల ఎంత ఉదారంగా ఉండాలో తనవాళ్ల విషయంలో మరింత వాత్సల్యంతో ఉండాలన్నది రాయలవారికి బాగా తెలుసు. సామాన్య ప్రజలపట్ల ముఖ్యంగా రైతులపట్ల ఆయన ఉదారుడు.

దేశవైశాల్య మర్థసిద్ధికిని మూల-మిల యొకింతైన గుంటకాల్వలు రచించి

నయముపేదకు సరి గోరునను నొసంగి ప్రబలజేసిన నర్థధర్మములు పెరుగు

(ఆముక్త. 4-26)

దేశం ఎంత విస్తరిస్తే అంత ఎక్కువగా ఆదాయముంటుంది. ఎంత చిన్న దేశమైనా కాలువలు త్రవ్వించాలి. ధనరూపమైన పన్నులూ, ధాన్యరూపమైన పన్నులూ ఇతరులకన్నా పేదలమీద తక్కువగా వేయాలి. అప్పుడే ధర్మార్గాలు రెండూ అతిశయిస్తాయి. పన్నులిచ్చుకోలేక ప్రజలు పరాయి దేశాలు పట్టిపోతే వారించక, వారి పశువులను

52 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

తీసుకోవచ్చనీ, ఇళ్లు పడగొట్టి వంట చెరుకు చేసుకోవచ్చుననీ భావించే యుద్ధభూమిలో

నక్కల్లాంటి అధికారులుండే రాజుకు ఏడు దీవులు జియించినా సమృద్ధి లేదట. వినండి. ప్రజలవసిచన్న విలువ కప్పసుల గొలుచు

నమ్మియిండ్తింధనంబున కాయె ననెడు

కలని సక్కైన యధికారి గల నృపతికి

నేడుదీవులు గొన్న సమృద్ధిలేదు. (ఆముక్త 4-237)

ఇటువంటి దృక్పథం _..ఊంది కాబట్టే రాయలవారు తాము ఏయే దుర్గాలు జయించారో వాటిని సమర్థులకిచ్చి, కొన్నిచోట్ల పాతవాళ్లనే నియమించి వ్యవసాయానికి వసతులు కల్పింప జేసివారు. కొండవీడును జయించాక ఆ దుర్గరక్షణ దానిని సాధించిన సాళువ తిమ్మరుసయ్యగారిక్షి రాయలు అప్పజెప్పాడు. ఆయన సమర్శుడైన తన మేనల్లుడు నాదెళ్ళ గోపమంత్రిని పిలిపించి కొండవీడుమీద పెత్తనం ఇచ్చాడు. కొండవీటివద్ద రాయలవారు ప్రతాపరుద్ర గజపతి కుమారుని మన్నించిన "విషయాన్ని ముక్కుతిమ్మన గారిలా చమత్కరించారు :

మునుకొని కొండవీటికడ మూడత రుద్రుడు కృష్ణనందను

న్మనసిజు నిర్ణయించె నది మానుషమే సరసింద్రు కృష్ణరా

యనృపతి కొండవీటికడ నాహవభూమి బ్రతాపరుద్రనం

దనుడగు వీరభద్రు గరుణామతి గాచె జగత్రసిద్ధిగన్‌. (పారిజాతాపహరణం, 1-21)

పూర్వం కొండయింటివద్ద ఈశ్వరుడు కృష్ణకుమారుడైన మన్మథుని చంపాడు. అది అమానుషమని ఇవాళ కొండవీటి కృష్ణుడు రుద్రుని కొడుకును కాచాడు!

ఈ విజయాన్ని సాధించాక రాయలవారు అమరావతికి వెళ్ళి అక్కడ తులాపురుష దానం చేశారు. శ్రీశైలం వెళ్లి స్వామి దర్శనం చేసుకొన్నారు. ఇది క్రీ.శ 1515లో జరిగింది. బహుశా ఈ సంవత్సరమే రాయలు తమ కుమార్తెకు వివాహం చేసి ఉంటారు. గోలకొండ సుల్తానులవద్ద వుండే ఆరవీటి రామరాజు ఆ కొలువు మానుకొని రాయల వద్ద చేరాడు. ఇతని యోగ్యతలు గుర్తించి, తన కుమార్తె నిచ్చి రాయలు వివాహం చేశారు. ఈ శుభకార్వం అయాక రాయలవారు మళ్లీ కళింగ దండయాత్రకు వెళ్ళారు. ఈసారి తెలంగాణా అంతటినీ స్వాధీనం చేసుకొన్నారు. ఈ విజయాలను ముక్కుతిమ్మనగారు ఇలా వర్ణించారు:

ఉదయాద్రివేగ యత్యుద్ధతి సాధించె, వినుకొండ మాటమాత్రఛ హరించె

గూటము ల్సెదరంగ కొండవీ డగలించె, బెల్లముకొండ యచ్చెల్లజెరిచె

దేవరకొండ యుద్వృత్తి భంగముసేనె, జల్లిపల్లె సమగ్రశక్తిడులిచె

గినుకమీర ననంతగిరి క్రిందుబడజేసె, గంబంబు మెట్టు గ్రక్కున గదల్బె

బలనికాయము కాలిమట్టులనె యడచు

'గటకమును నింక ననుచు నుత్కలమహీశు

డనుదినమ్మును వెరచు నెవ్వనికి నతడు

రాజమాత్రుండె శ్రీకృష్ణూయవిభుడు? (పారిజాతా. 1-23)

కృష్ణదేవరాయలు 53 ముక్కు తిమ్మనగారు ఉదయగిరి నుంచి కంబంమెట్టు దాకనే రాయలవారి విజయాలు చెప్పి ఆ తరువాత వాటిని పారిజాతాపహరణంలో స్పష్టంగా పేర్కొనక ప్రోవడంచేత క్రీశ. 1516లో తెలంగాణా విజయాలు లఖించిన వెంటనే పారిజాతాపహరణ రచన జరిగి ఉంటుందని, అది ఆయేడే రాయలవారికి కృతిసమర్ప్చణ జరిగి ఉంటుందని ఊహించ వచ్చు. కొండపల్లి తెలంగాణా. విజయాలు సిద్ధించాక రాయలవారు ఊరుకోలేదు. ఏకధాటిని జమ్మిలోయగుండా మంటలదారి చేసుకొంటూ కోనమన్నైెం కాల్చి గోదావరిని అట్టుడికించి సింహాచలం వెళ్ళి అక్కడకు దగ్గరలో ఉన్న పొట్న్యూరువద్ద సేనలను అపించి ఎప్పటికైనా గజపతి వస్తాడా యుద్ధమిస్తాడా అని ఎదురుచూసి ఆర్నెల్లు ఆగి ఇంక రాడని నిశ్చయించుకుని జయస్తంభం నాటించి సింహాచలంలో దేవుణ్ణి దర్శించి దానాలు చేశారు. ఇది క్రీ.శ.1516 మార్చి 29న జరిగింది. ఆ తరువాత రాయలవారు రాజధానిలో కొన్ని నెలలు ఉండి క్రీ.శ. 1517లో దక్షిణదేశ యాత్రలకు వెళ్లారు. వివిధ క్షేత్రాలు దర్శించారు. ఎట్టకేలకు రాయలవారికి 44వ ఏట ఒక పుత్రుడు జన్మించాడు. తన తరువాత ఈ మహాసామ్రాజ్యానికి వారసుడు ప్రభవించాడని రాయలు పొంగిపోయి ఉంటాడు. ఆ పుత్రోత్సాహం ఇనుమడించి రాయలవారికి పట్టపగ్గాలు లేకపోయాయి. కళింగ దండయాత్రలో నిజంగా గజపతిని పాదాక్రాంతుణ్ణి చేసుకోవాలని సంకల్పించి కూచివేశారు. దండు కదలింది, వద్దని అప్పాజీ హెచ్చరించాడు. వినలేదు, గజపతుల రాజధాని కటకాన్ని రాయలవారు ముట్టడించారు. చుట్టూ దండువిడిసి ఉంది. వద్దని వారించిన అప్పాజీ కూడా ఉన్నాడు. గజపతి చావో రేవో తేల్చుకోవాలనుకొన్నాడు. అతని సామంతులు, పదహారుమంది పాత్రులు విజ్బృంఖించదలచారు. కథ అడ్డం తిరిగేటట్టుంది. అప్పాజీ చక్రం అడ్డువేశాడు. దొంగ ఉత్తరాలు వ్రాసి పదహారుమంది పాత్రులు వాస్తవానికి విజయనగరంవారి ఉప్పుతిని కటకంవారికి ద్రోహం తలపెట్టుతున్నారనే నమ్మకం గజపతికి కలిగేటట్టు చేశాడు. పాచిక పారింది. పాత్రుల తలలు తెగాయి. పట్టపురాజు పారిపోయాడు. కటకాన్ని రాయలు కాల్పించాడు. గజపతి బేరానికి దిగాడు. అప్పాజీ తన చాకచక్యంతో కయ్యాన్ని వియ్యంగా మార్చి గజపతి కుమార్తెను రాయలవారికి ఇప్పించి వివాహం జరిపించాడు. తన 45వ ఏట కృష్ణరాయలు మరొక వివాహం చేసుకొన్నాడు. రాయలవారికి మరో ప్రేయసి ప్రాప్తిస్తుందని విద్వజ్ఞనులు ముందుగానే జోస్యం చెప్పారు. కటకాన్ని ముట్టడించడానికి ముందు బెజవాడలో ఆగి ఒక ఏకాదశినాడు రాయలవారు ఉపవాసం ఉన్నారు. అనాటి రాత్రి నాలుగోజాములో శ్రీకాకుళం ఆంధ్రవిష్ణువు కలలో కన్పించి ఒకటి ఆదేశించాడు. రాయలవారు నిద్రలేచి కాల్య కరణీయ విధులు తీర్చి నిండోలగంలో ఉండి వేదాగమవిదులగు విద్వజ్ఞనులను పిలిచి తన కల వివరించి దాని ఫలితం చెప్పమన్నాడు. వాళ్లు ఎన్నెన్నో మనవి చేసి చివరకు “ఇతోధిక బహు ట్రేయసీప్రాప్తి'' ఉంటుందన్నారు. కలలో దేవుడు కోరినది గుళ్లూ గోపురాలూ కాదు; మడులూ మాన్యాలూ కాదు. రాయలవారు అడక్కుండా అటువంటివి దానం చేశారు. ఆంధ్రవిష్ణువు అడిగింది ఏమిటంటే - ఒక పుస్తకం బ్రాయమనడమే, “ఇప్పటిదాకా

54 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఎన్నో రచనలు చేశావు. సంస్కృతంలో వ్రాసి మెప్పులు పొందిన నీకు తెలుగు అసాధ్యం అవుతుందా? కాబట్టి ఆంధ్రభాషను ఒక కృతి చేసి మాకు అంకితం యియ్యి' అన్న కోరొకే కోరాడు దేవుడు. రాయలు వేయబోయే ప్రశ్న తనకు తెలుసుకాబట్టి దేవుడు ముందే చెప్పాడు. ఇతివృత్తం వివరించాడు. 'కన్నడరాయడా, నేను తెలుగురాయణ్ణి. నా కా కథ తెలుగులో చెప్పు అన్నాడు. తెలుగులోనే ఎందుకు చెప్పమన్నాడంటే “దేశం తెలుగుదేశం; నేను తెలుగు వల్లభుణ్ణిః తెలుగు కలకండలాగా తియ్యగా ఉంటుంది. దేశదేశాల రాజులు కొలుచుకుంటూ ఉంటే వివిధ భాషలు మాట్లాడే నీకు దేశభాషలందు తెలుగు లెస్స అని తెలియదా!" అన్నాడు. ఆంధ్రవిష్ణువు తనతో చెప్పిన మాటలను రాయలవారు ఈ విధంగా గ్రంథస్థం చేశారు.

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను - దెలుగువల్లభుండ దెలు గొకండ

యెల్లనృపులుగొలువ నెరుగవే బాసాడి- దేశభాషలందు దెలుగు లెస్స

(ఆముక్త 1-15)

అంధ్రవిష్ణువు ముచ్చటపడి చెప్పమన్న కథ చిన్నదే అయినా వన్నాకెక్కినది. శ్రీరంగంలో రంగమన్నారు స్వామి ఒక చిన్నదానిని పెండ్లి చేసుకొన్నాడు. ఆ పిల్ల రోజూ తన జడలో ముడిచిన దండతీసి స్వామి కైంకర్యానికి ఇచ్చేది. ఈమె పేరు గోదాదేవి. ఈమె ఇంకెవరోకాదు. ఈనాడు ఆంధ్రదేశపు శ్రీవైష్టవులలో ఆడవాళ్లు చూడి కుడుత్తమ్మ, ఆండాళ్లమ్మ అని పేరు పెట్టుకొంటారే - ఆ పేర్లకు కారణభూతురాలు. అరవంలో “చూడికుడుత్తనాచ్చియార్‌' అంటే ముడిచియిచ్చిన ముగుద అని అర్థం. దానినే రాయల వారు సంస్కృతీకరించి “ఆముక్తమాల్యద' అన్నారు. ఈ చూడికుడుత్తమ్మ “ఆండాళ్‌ కావడాని కొక కథ ఉంది.

తమిళదేశంలో శ్రీవిల్లిపుత్తూర్‌ అనే గ్రామం ఉంది. క్రీ.శ 725 ప్రాంతాలలో ఆ ఊళ్లో విష్ణుచిత్తుడనే భత్తుడున్నాడు. ఆయన పెరియాళ్వార్‌ అనే పేరున ప్రసిద్ధుడయ్యాడు. చక్కని భక్తిగీతాలు రచించి, వాటిని గానం చేస్తూ రోజూ కట్టిన పూలదండలు స్వామికి అర్చించేవాడు.

ఒకనాడు పెరియాళ్వారుకు తులసికోటలో ఒక ఆడపిల్ల దొరికింది. ఆ చక్కని బిడ్డను ఆయన శ్రీదేవో, భూదేవో, నీళాదేవో అని భావించి ఇంటికి తీసుకువెళ్లి పెంచారు. ఆ పిల్ల పెరిగి పెద్దదయింది. ఆ కన్నెపాప రోజూ తండ్రి కట్టే తిరుమాలను తీసుకొని రహస్యంగా జడలో పెట్టుకొని నూతిలో ప్రతిబింబం చూసి మురిసిపోయి కొంతసేపు పోయాక దండను తీసి స్వామికైంకర్యానికి ప్రత్యేకించిన సజ్జలో ఉంచేది. దానిని పెరియాళ్వారు పెరుమూళ్లకు సమర్పించేవాడు. |

తిరుమాలను తన కూతురు కురులలో పెట్టుకోవడం ఒకనాడు తండ్రి కళ్ళపడింది. అది అపచారం అని ఆయన భావించాడు. ఎన్నాళ్లనుంచో ఇటువంటి కాని పని జరుగుతున్నందుకు ఆయన బాధపడ్డాడు. వేరే పువ్వులు సేకరించి ఇంకోదండ కట్టి స్వామివారికి సేవ చేశాడు. ఆ రాత్రి పెరియాళ్వారుకు కల వచ్చింది. అమ్మాయి

కృష్ణదేవరాయలు 5కి ముడీచియిచ్చిన మాలలే అధికంగా పరిమళిస్తున్నాయని, అవే తనకు ప్రీతికరమని భగవంతుడు చెప్పాడట, పెరియాళ్వారు కళ్లు తెరిచాడు, “ఎన్నై ఆండాళ్‌ ఎన్నై ఆండాళ్‌ అని కూతురును ప్రశంసించాడు. నాటినుంచీ ఆమెకు ఆండాళ్‌ అనే పేరు స్థిరపడిపోయింది. “ఎన్నై ఆండాళ్‌ అంటే 'నన్నేలిన తల్లి అని అర్థం.

ముడిచియిచ్చిన ముగుద కాబట్టి ఆండాళ్లమ్మకు '“చూడికుడుత్త నాచ్చియార్‌ అనే మరోపేరు ప్రసిద్ధమైంది. ఆమె భక్తి ప్రగాడమైనది. దేవుణ్ణే తప్ప వేరొకరిని పెళ్లాడనని ప్రతిజ్ఞ చేసింది. తన కోరిక తీరడానికి మార్గిరమాసంలో నోము నోచింది. శ్రీవిల్లిపుత్తూరునే గోకులంగా, ఆడపిల్లలను గోపకాంతలుగా అమె రోజుకో పాశురం చొప్పున గానం చేస్తూ నోము నోచింది. ఆమె ఆనాడు పాడిన పాటలే తిరుప్పావై అనే సంకలనం అయాయి, ధనుర్మాసంలో నేడీ పాశురాలు పాడనిదే శ్రీవైషవులకు తెల్లవారదు. ఆండాళ్లమ్మ పాడిన పాటలు ఎంత ప్రసిద్ధమైనాయంటే ధనుర్మాసాన్ని వైష్ణవులు తిథులతో లెక్కించడం మానేశారు. ఉదయం పాడే తొలిమాటలతో ఆ రోజును వ్యవహరిస్తారు.

చూడికుడుత్తమ్మ నోములు పండి శ్రీరంగనాథుణ్ణే పెళ్లి చేసుకుంది. ఆమె గానం చేసిన యితర గీతాలు 'నాచ్చియార్‌ తిరుమొశి అనే పేర వైష్ణవులకు పారాయణ గ్రంథాలు అయాయి. పెరియాళ్వారు గానం చేసినవి దివ్యప్రబంధంలో చేరాయి. ఈయన మధురలోన్తున్న పాండ్యరాజు సభలో వాదం చేసి శ్రీవైష్ణవాన్ని స్థాపించాడు. రాజు బ్రహ్మరథం పట్టించి ఈయనను శ్రీవిల్లిపుత్తూరు పంపించాడు. ఆయనకు భగవంతుడు సాక్షాత్కరించాడు. ఇప్పుడాయన చెప్పిన గీతాలు సుప్రసిద్ధమైనాయి. అండులో మొదటిది ఇది.

పల్గాండుపల్లాండుపల్లాయిరత్తాండు- పలకోడి నూరాయిరం

మల్గ్లాండ తిండోళ్‌ మణివణ్లూ! - ఉన్‌ శెవ్వడి శెవ్వి తిరుక్కాపు!

దీని అర్ధం బోధపడకపోయినా తెలుగువాళ్లు పలుసార్లు ఈ గీతాన్ని వైష్ణుల నోట వింటూనే ఉంటారు.

పలుయేండ్లు పలుయేండ్లు పలువేనవే లేండ్లు-పలుకోటి నూరేండ్లకున్‌

అరిమల్లురను గెల్చు మణీవర్ణ నీ-అరుణచరణాల సిరికి తిరురక్ష అని పైదానికి అర్థం. విష్ణుచిత్తులవారూ, ఆండాళ్ళమ్మా తమిళంలో గొప్ప కవిత్వం చెప్పిన వ్యక్తులు. పన్నాండుమంది ఆళ్వారులలో ప్రముఖస్థానం ఉన్నవాళ్లు, వీరి చరిత్రను కావ్యంగా వ్రాయమని దేవుడే తనకు అదేశించాడని కృష్ణరాయలవారు భావించి ఏడు అశ్వాసాలలో 878 గద్యపద్యాలతో ఈ కావ్యాన్ని బ్రాకారు. అయితే ఇందులో 'అన్నంకన్నా ఆధరువులే ఎక్కువ' అన్నట్టు కథకన్నా వర్ణనలే అధికం. ప్రథమాశ్వాసంలో 89 గద్యపద్యాలున్నాయి. వీటిలో 49 పద్యాలు మంగళాచరణం నంచి షష్ట్య్రంతాలదాకా ఉన్న అవతారిక ఆక్రమించింది. 50వ గద్యతో కథ ప్రారంభించి 51 నుంచి 76 దాకా 26 పద్యాలలో శ్రీవిల్లిపుత్తూరు పురవర్దన. ఇందులో వరిగింజతో తాంబూలరక్తిమను తోముకొనే వార కాంతలు మొదలైన వారి ప్రసక్తీ ఉంది. 77వ పద్యంలో విష్ణుచిత్తులవారు

56 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి రంగంలో అడుగుపెడతారు. 78 నుంచి ౪5 దాకా 8 గద్యపద్యాలలో ఆయన భార్యాసమేతంగా ఎలా అతిథిసక్కారాలు చేస్తారో చెప్పడం; జనుంచి 89 దాకా మూడు అఆ్వ్వాసాంతపద్యాలు ఉన్నాయి. ఎనిమిది గద్భపద్యాలలో రాయలవారు. చేసిన విష్ణుచిత్తుని గృహవర్ణన అనాటి వైష్ణవ సంసారిని కళ్ళముందు సజీవంగా చిత్రిస్తుంది. గగనము నీటిబుగ్గ కెనగా' జడిపట్టిన నాళ్లు భార్యక న్పొగ సౌరకుండ నారికెడపుంబొరియ ల్లవులించి వండ స య్యగపల ముంచిపెట్టు గలమాన్నము నొల్చిన ప్రప్పు నాలుగే న్పొగిపినకూరలు న్నడియము ల్వరుగు ల్పెరుగు న్హ్రతపుతిన్‌ _ ( ఆముక్త.1-80) ముసురుపట్టిన రోజులలో పొయ్యిమండక, వండే ఇల్లాళ్ళ కంట్లో పాగ పడుతుంది. తన భార్యామణికి ఈ బాధ లేకుండా ఎండు కొబ్బరిబోండాలను జాగ్రత్త చేశాడు. వరి అన్నం, ఛాయపప్పు, నాలుగైదు సాతాళించిన కూరలు, వడియాలు, వరుగులు, పెరుగు, నెయ్యి ఆ కొబ్బరిచిప్పలతో తోడి వడ్డించడానికి వీలైనంత సమృద్ధిగా అవలీలగా వండి పెడుతుందట. వానకాలంలో వంట వండడానికి ఇల్లాళ్ళు ఎంత శ్రమ పడతారో మరోఘట్టంలో రాయలిలా వర్ణించాడు: ఇల్లిల్లు దిరుగ నొక్కిం తబ్బు శిఖి యబ్బె నేనింటిలో బూరి యిడి విసరక రాజదు రాజిన రవులు కొల్పాసలెగాని కల్గదు గూడు దాన గలిగె నేని కూరగుట మందైన బెన్పొగ సుఖ భుక్తి సేకూర దాభక్తి కిడిన బాగ్బోక్తల కెతీరుబహుజనాన్నముదీర నారుల కొదవు పునఃప్రయత్న మాజ్యవటముఖ్యలయ మెన్న రాలయాంగ దారులయమెన్నరంతిక కారజనిక పచననాంధోగృహిణీ రామి బడక మరుడు వెడవెడనె యార్వనొగిలిరజ్జడిని గృహులు (ఆముక్త. 4-127) ఇల్లిల్లూ తిరిగితే ఏదో కొద్దిగా నిప్పు దొరకుతుందట. దొరికినా, ఇంట్లో ఎండుగడ్డి పెట్టకపోతీ అది రాజుకోదట. రాజుకొన్నా ఇంటివాసాలు పొయ్యిలో పెడికేగాని ఆ నిప్పు రగుల్కొనదు. రగుల్కొన్నా అన్నం ఉడకదు. ఒకవేళ ఉడికినా ఇల్లంతా ఆవరించిన పొగతో సుఖంగా భోజనం చేయడం పడదు. ఇంతకూ వేళగాని వేళ ఎవరైనా వస్తారని ఎందరి కోసమో వండీ వార్చిన అన్నం తొలిబంతివాళ్ళకే సరిపోతుంది. అడంగులు మళ్ళీ వంట ప్రయత్నం చేసుకోవాలి. నేయిపోసి తడిపిన గుడ్డలు పొయ్యిలో పెట్టడానికైనా ఆ సమయంలో వెనుకాడరు. ఇంట్లో ఉన్న కొయ్యసామాను పౌయ్యిలో పడెయ్యడానికి సంకోచించరు, తరువాత అంట్లూ ఎంగిళ్లూ ఎత్తుకోవాలి. ఎంత రాత్రి అయినా పని తిమలదు. తొందరగా మగువ తన కేళికామందిరానికి రానందుకు ఇంటాయన తహతహలాడుతాడు. కామయ్య కచ్చలో కందులు వేయిస్తాడు. వరకాలంలో గృహస్థుల యిక్కట్లు రాయలవారు ఎప్పుడు చూశారో తూచాతప్పకుండా చిత్రించారు. సాధారణ గృహస్థులవంటివాడు కాడు కనుక విష్ణుచిత్తులవారు తన భార్య కీబెడద తప్పించే ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి కూడా ఆ యింట్లో వడ్డనలు జరుగుతూనే ఉంటాయి

కృష్ణదేవరాయలు 657 ద్రావిడ వేదాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. విష్ణుచిత్తులవారీవిధంగా భాగవతులను సేవిస్తూ ఉంటారని చెప్పి రాయలవారు రెండో ఆశ్వాసంలోకి వెళ్లారు.

ద్వితీయాశ్వాసంలో కథ ఎత్తుగడకు, మొదటిదానికీ ఏవిధమైన సంబంధం లేదు. దక్షిణ మధురను వర్ణించడం మొదలుపెట్టారు. 31 పద్యాలలో ఆ పురవర్ణన జరిగాక ఆ రాజ్యాధిపతి మత్స్యధ్వబుణ్జి 6 పద్యాలలో వర్టించారు. ఆ రాజునలా ఉండమని, తీరుబాటుగా 26 పద్యాలలో వేసవికాల్లాన్ని. వర్జించారు (2-45 నుంచి 2-70 దాకా), అటువంటి వేసవిలో ఒక పరదేశి విప్రుడు. ఒకు అరుగుమీద పడుకున్నాడు అప్పుడు. మొదట వర్ణించిన రాజుగారు మత్స్యధ్వజుడు భోగంవాళ్ల ఇంటికి బయలుదేరాడని చెప్పారు. వెలయాలి ఇంటికి వెళ్లడానికి ఎంత హుందాతనమో చూడండి.

పన్నీటితో గదంబము జేసి పూసిన నృుగనాఖివస రాచనగరు దెలుప

బాటలానిలము లార్చగ దపారపుజుంగు లలరు దానికి మూగు నళులజోప

గర్జడోలామౌక్తికచ్భ్చాయ లెగబ్రాకు నురుహారరుచుల ద్రస్తరికి దన్న

శన్గికాంతి చెంగావి దసిలి మించిన కేలి స్వర్ణత్సరువు వాడి వాలు మెరయ

మెలత యడపము దేజర న్మేరువనగ

దలవరులు గొందరొలసి ముందర జనంగ

నర్థి రథ్యాంతరాంతఃపురాంతరమున ల

భోగినీసంగతికి రాజు వోపుచుండి (ఆముక్త 2-75)

రాచనగరులో ఉండేవారే పన్నీటితో కలిపిన కస్తూరి పూసుకొనేవారు కాబోలు, సువాసనతోటే హోదాను ఆ రోజులలో పోల్చుకొనేవారు. సిగపూవుల పరిమళానికి మూగుతున్న తుమ్మెదలలాగ టోపీకుచ్చులు పాటలానిలంవల్ల ఊగుతున్నాయట. హారాల కాంతులు ఎగబ్రాకుతూ ఉంటే వాటిని చెవులనున్న ముత్యాల వెల్లులు కిందకు తోస్తున్నాయట. ఉదయచంద్రుని కాంతిలాంటి చెంగావి పంచె అంచుని పట్టుకున్న చేతిలో బంగారుపిడిగల కత్తి మెరుస్తూంటే పరిచారిక పాన్‌దాన్‌ పట్టుకొని రాగా కొందరు తలారులు ముందు దారితీయగా భోగకాంత ఇంటికి రాజుగారు దయచేస్తున్నారు.

అ సమయంలో అరుగుమీద పడుకొన్న పరదేశి విప్రుడు ఒక శ్లోకం చదివాడు, వర్దాకాలం నాల్గు నెలల కోసం మిగతా ఎనిమిది నెలలు పాటుపడీ సామానులు జాగ్రత్త చేసుకొన్నట్టు రాత్రి కావలసిన దానికి పగలు, ముసలితనంలో కావలసినదానికి యౌవనంలోనూ, పరలోకంలో కావలసినదానికి ఇహలోకంలోనూ జాగ్రత్త చేసుకోవాలని ఆ శోకం చెప్తుంది. దీనిని వినగానే రాజుగారికి వైరాగ్యం వచ్చింది. తనకు ముక్తిమార్గం ఎవరు బోధిస్తారో_ వారికింత ధనమిస్తానని చెప్పి అది కోటలో వేళ్లాడకట్టారు. రెండవ అశ్వాసంలో 86వ పద్యందాకా ఈ కథ చెప్పి దీనికీ, మొదటి ఆశ్వాసంలో దానికీ రాయలవారిప్పుడు ముడివేశారు. ఈ. రాజుకు ఉపదేశం చేయమని విష్ణుచిత్తులవారిని భగవంతుడే పంపిస్తాడు. దీనితో రెండో అశ్వాసం ముగుస్తుంది.

మూడవ ఆశ్వాసంలో విష్ణుచిత్తుడు రాజసభలో ప్రవేశించడం, 3 పద్యాలలో పరమతాలను ఖండించడం, 5 పద్యాలలో స్వమతాన్ని స్థాపించడం జరుగుతుంది.

క్‌8ి సమగ్రాంభ్ర సాహిత్యం - రెండవ సంపుటి తరువాత రాజుగారికాయన ఒక పురాణగాథ విన్పిస్తాడు. ఖాండీక్య కేవిధ్వజులనే అన్నదమ్ములు భౌతిక రాజ్యం కోసం యుద్ధం చేస్తారు. అధ్యాత్మిక జ్ఞానం తోసం కలుసుకొంటారు. ఇది 86 గద్యపద్యాలలో రాయలవారు చాలా చక్కగా కథనం చేశారు. గెలిచిన ప్రభువుగాని, ఓడిపోయిన రాజుగాని ఎలా ధర్మబద్దులై ఉండాలో వివరించారు. ఈ ఆశ్వాసంలోని 9 పద్యాలలో మొదటి 13 పద్యాలూ, చివరి 4 పద్యాలూ తీసస్తే ఇదొక స్వతంత్ర ఉపాఖ్యానంగా నిలబడుతుంది. నాల్గవ అశ్వాసం ఈ కావ్యంలో చాలా పెద్దది. ఇందులో 299 గద్యపద్యా లున్నాయి. మత్స్యధ్వజుని సభలో గెలిచిన విష్ణుచిత్తులవారు. శ్రీవిల్లిపుత్తూరుకు బయలుదేరడం, భగవంతుడు సాక్షాత్కరించడం, భక్తుడు పరవసించి దశావతారాలను కీర్తించడం, తరువాత మేళతాళాలతో స్వగ్రామంలోకి ప్రవేశించడం ఒక భాగం. ఇందులో ౩7 గద్భపద్యాలున్నాయి. ఇందులో 15 పద్యాలు దశావతార ప్రశంస. తొలిరాయల యుగంనుంచీ ప్రబంధ శాఖలో ఇదొక రెమ్మగా సాగింది. శ్రీనాథుడు మొదట శృంగార నైషధంలో దశావతారాల ప్రస్తుతి మొదలుపెట్టాడు. నలుడు మాధ్యాహ్నికపూజలో దశావతారాలను స్తోత్రం చేసినట్టు శ్రీనాథుడు 29 పద్యాలు వ్రాశాడు (8-120 నుంచి 148 దాక). తాళ్లపాక అన్నమాచార్యులవారు ఎన్నో సంకీర్తనలలో దశావతారాలను పారిజాతాపహరణంలో పది పద్యాలలో అవతారాలను వర్ణించారు (3:28-38 దాక). రాయలవారు కూడ ఇక్కడ అనుసరించారు. ఇది చూసి అల్లసాని పెద్దనగారు, తెనాలి రామకృష్ణుడు, ఆ తరువాత చాలామంది అనంతర కవులు అవతారాల ప్రశంస చేశారు. నాలుగో అశ్వాసంలో విష్ణుచిత్తులవారి కథ ౩37 గద్య పద్యాలే ఉన్నా ఒక సుదీర్హమైన వచనంలో విష్ణుచిత్తులవారి ఊరేగింపును రాయలవారు వర్ణించారు. అది ఏ అల్లసానిపెద్దనగారి ఊరేగింపునో స్ఫురణకు తెస్తుంది. మేళతాళాలు, సానికూతుళ్లు, రాజకుమారులు, వారి సరసాలు, సల్లాపాలు, కేరింతలు, నవ్వులు, బుక్కదాసరులు, అగసాలెలు, తొడతొక్కిడి. రద్దీ కోలాహలం మొదలైనవి లోకాతీతప్రజ్ఞతో రాయలవారు వర్ణించారు. తరువాత 247 గద్యపద్యాలలో యామునాచార్యులవారి కథను రాయలవారు చెప్పారు. నిజానికీ కథనం 139 గద్యపద్యాలే అని చెప్పవచ్చు. ఏమంటే, మధ్య 108 పద్యాలలో రాయలవారు బుతువర్జనం చేశారు. దానికీ, కథకూ సంబంధం లేదు. యామునాచార్యులవారి చరిత్రం అనుకున్న 139 పద్యాలలో ఆయన చెప్పిన రాజనీతి 82 పద్యాలు, వీటిని కూడా తొలగిస్తే కథాభాగం 57 పద్యాలు మాత్రమే. ఈ కథ చిన్నదిగా కన్పించినా ఎన్నతగ్గదే. పాండ్యరాజు పరమ శ్రైవుడు, అతని భార్యకు విష్ణుభక్తి, రాజుగారికి “వెర్రైవం' దశమినా డేకభుక్తము జేసి యవలినాడోర్చి జాగరముతో నుండు నిటు బారసి పోనీదు పైనిద్రబారుటక్కలువాడు మత్పుణ్యకథల ద్రోయు నేమంపుమూనాళ్లు కామింప దధినాథుమరునాడు కన్నును మనసు దనియ

కృష్ణదేవరాయలు 59 నారజపువన్నై బతసెబ్ద కరుగుగూర్మి నరుగుచో నాఖిదుడిచి కప్పురపునాఖి బెట్టునిట్టులు మద్బక్తి పుట్టియును ని జేశునెడ భక్తిచెడదు మదిష్టమగుటి్‌ (ఆముక్త 4-50) ఈ పద్యంలో ఒకటి గుర్తించాలి. భర్త శైవాన్ని స్వీకరింపకపోతే అటివంటివాణ్ణి విడిచిపెట్టడం అవసరం అని వీర్దైవం ప్రబోధించింది. పండితయ్య ఇది కచ్చితంగా ఆదేశించాడు (శివతత్వసారం, 231-233), ఇక్కడ రాయలవారు మూత్రం భార్యాభర్తలకు విడాకులు ఇప్పించలేదు. పతిభక్తి విష్ణుమూర్తి ఇష్టంగనుక అమె నిజేశునియెడ భక్తి చెడదట. ఈ పాండ్యరాజును వైష్ణవ మతంవైపు తిప్పడానికి విష్ణుమూర్తి యామునాచార్యులను నిర్ణయించారు. వైష్ణవ వటువు రాణిని కలుసుకొని “వాదం పెడితే నేను పరమతాలను ఖండించి విష్ణుతత్వమే పరమతత్త్వమని నిరూపిస్తాను. అయితి ఈ సంగతి రాజుగారికీ ఎవరు చెప్తారు? ఆయన విష్ణుభక్తి విముఖుడుకావున వైష్ణవుల మనవి విన్నవించడానికి అంతా భయపడుతారు. నువ్వు విష్ణుభక్తి పరాయణురాలవు. నీభర్హ నీకు విధేయుడు, ఆయనకు చెప్పి వాదం పెట్టించు" అని యామునాచార్భుడు కోరాడు, ఆమె భర్తకు విన్నవించింది, వాదం పెట్టించింది. యామునాచార్యుడు సభలో ప్రవేశించాడు. రాజుగారికి నవ్వు వచ్చింది, వైష్ణవవటుని అకారం హ్రస్వం, రాజుగారిలా అన్నారు. సంగతియెయోయిసుమంతటింగణావు- తత్త్వనిర్ణయవాదంబు తరమె నీకు నోడితేనియుబట్టి మొర్రో యనంగ- లింగమునుగట్టకుడుగ మెరింగినొడువు (ఆముక్త, 4-60) వాదంలో ఓడితే నీకు లింగకాయ కట్టించకమాననని రాజు బెదిరించాడు. పంతమైనను గానిమ్ము పార్ధివేంద్ర-యుక్తులను నిగ్రహస్థాన మొదవెనేని యమ్మదెచ్చిన విద్వాంసుడనగ వలవ - దెట్లు గావిపవలయు నట్లట్టచేయు (ఆముక్త, 4-69) అమ్మ తెచ్చిన విద్వాంసుడని కనికరించనక్కర లేదు, నేను ఓడితే నీయిష్టం ఆ రోజులలో రాజసభలలో అమ్మతెచ్చిన విద్వాంసులని ఉండేవారు కాబోలు, ముక్కుతిమ్మనగారు రాయలవారి కొలువులో 'అమ్మతెచ్చిన విద్వాంసులే' అన్ను ప్రతీతి ఉంది. తిమ్మనగారు తిరుమలదేవి తెచ్చిన కవీశ్వరులనడంకన్న చిన్న్షదేవి మెచ్చిన జ. ఈ పద్యంలో 'బారసి' అనే ప్రయోగం ఉంది. దానికి 'ద్వాదశా అని అర్దం. ఈ మాటను దోనయామాత్సుడు, 'ఖైరవకవి' కూడా వాడారు. సస్యానందం ముద్రాపకులు 'హీరగా అని అచ్చు వేశారు. సరైన రూపం బారసి' అని సావర్గంలోని వర్గతృతీయంలోనే సాధురూపం ఉన్నదని తెలుస్తుంది.

60 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సాహిత్య బంధువు అనడానికే ఆస్కారాలు కనబడుతున్నాయి. “అమ్మతెచ్చిన' వద్వాంసు" డనే మాట వాడుతున్నప్పుడు రాయలవారి మస్తిష్కంలో ఏ జ్ఞాపకాలు మెరిశాయో మనం చెప్పలేం. యామునాచార్యులవారు మాత్రం ఎవరో సమకాలిక వ్యక్తులను గుర్తుచేసి ఉంటారు, యామునాచార్యులవారు పరమతాలను ఖండించి స్వమతాన్ని వైదుష్యంతోనే స్థాపించినట్టు రాయలవారు వ్రాశారు. అయితే “గురుపరంపరాప్రభావం' అనే వైష్ణవ గ్రంథంలో యామునాచార్యులు జయించిన పద్ధతి ఇంకొక రకంగా ఉంది. ప్రతి పక్షీ _యామునాచార్యుని చూసి 'నీవు. విద్వాంసుడవైనా, బాలుడవు, నాతో వాదించలేవు, అందుచేత నువ్వు మూడు లౌకిక వాక్యాలు చెప్పు. నేను వాటిని ఖండిస్తాను' అన్నాడట. “అలాగే కానీయండి' అని ఇసుమంత టింగణాలాంటీ యామునాచార్యుడు చెప్పిన వాళ్ళాలు చాలా చిన్నవి. “నీతల్లి గొడ్రాలు కాదు' ఈ రాజు సార్వభౌముడు. రాజమహిషి పతివ్రత అని మూడు ప్రకటనలు చేసి ఖండించమన్నాడు. ప్రతిపక్షి నోరు మూసుకుని పరాజయం ఒప్పుకొన్నాడు.* రాయలవారు ఈవిధంగా మాటకారితనంతో కాక ఆధ్యాత్మిక వాదంతోనే యామున విజయం కథనం చేశారు. వారికి విశిష్టాద్వైతం క్షుణ్ణంగా తెలుసు. అందుచేత ఆ మతంలో తమకు నచ్చిన విషయాలను, అవకాశం కలిగినప్పుడల్లా గ్రంథస్థం చేశారు. యామునాచార్య చరిత్రను పనికట్టుకొని విష్ణుచిత్తుని కథకు ముడిపెట్టారు. వాస్తవానికి పెరియాళ్వారుకు యామునాచార్యులు చాలా ఆర్వాచీనులు, అయినా రాయలవారు స్వతంత్రించి ప్రాచీనుణ్ణి చేశారు. దేవుని నోటంట ఈ కథను సవిస్తరంగా చెప్పించారు. ఆముక్తమాల్యదలో నాల్గవాశ్వాసం చివరిదాకా ఇదే కథ. అయిదవ ఆశ్వాసంలో అసలు కథ మొదలవుతుంది. తులసికోటలో గోదాదేవి దొరకడం నాల్లు పద్యాలలో చెప్పేసి ఆమె యౌవనం ముచ్చటించారు. 30 పద్యాలలో నఖశిఖపర్యంతం వర్ణించారు. ఆమె చెలికత్తిలను గురించి రెండు పద్యాలలో చెప్పి, ఆమె ఆముక్తమాల్యద కావడం రెండు పద్యాలలో చెప్పారు. ఒకటి సీసపద్యం. విష్ణుచిత్తులవారు ధనవంతులైనా నిగర్వంతో మాలలు కడుతూ ఉంటారు. కుమార్దె తండ్రి గట్టెడుకమ్మ చెంగలువవిరుల తోమాలెలలకలు దువ్వి కంతునకునా ర్థనిబద్ధఖేటకం బనగ నీల నందు వృషకకుద్రేఖనెడమ కొక్కింత యొరగ-నిడిన ధమ్మిల్లవలయంబు నడుగ గొంతసే పర్థి గీలించి కూపవారి-నీడ వీక్షించి క్రమ్మరి గూడ నుసుచు. (ఆముక్త, 5-౫1) గోదాదేవి కొప్పు' నెమలి ఈకలతో చేసిన మన్మథుని డాలులాగా ఉన్నదట. అది నల్ల ఆంబోతు మూపురంతీరున ఉన్నదట. దానిక్రింద కొంచెంసేపు ఆ మాల పెట్టుకొని

  1. అముక్తమాల్యద, వావిళ్ళప్రతి, ఉపొద్దాతం _ మేడేపల్లి వెకటయయణాదార్యులారు. పుటః

కృష్ణదేవరాయలు 61 నూతిలో నీడ చూసుకొని మళ్లీ ఆ మాల పూలబుట్టలో పెట్టేసిదట. దీని తరువాత పద్యంలో చూడీకుడుత్తమ్మను మరోలా వర్జించారు. ఆ నవలా యలంతివసుపాడి దుకూలము దాల్చి గుబ్బచన్‌ గోనల దావు లుప్పతిల గుంకుమడేటల నిగ్గుదేర గ ప్రాసన నాఖి దీర్చి పితృబద్ధలతాంతము లర్ధి గొప్పునం బూని యొకింత సే పునిచి పుచ్చి చెలింగని వెచ్చ నూర్చుచున్‌ (ఆముక్త 5-39) రెండు పద్యాలలో ముడిచి ఇచ్చిన ముగుదను వర్ణించిన తరువాత ఆమె విరహాన్ని సుదీర్ణంగా _ చెప్పారు... ఆమె కొంటెగా వివిధ అవతారాలలో ఆదివిష్ట్ణువును ఎత్తిపాడుస్తుంది. చెలికత్తిలామెకు చిలిపిగానే జవాబు చెప్తారు. గోదాదేవి రాధాకృష్ణులను దెప్పుతుంది, అప్పుడామె పూర్వజన్మ కథను చెలికత్తిలామెకు చెప్తారు. ఆమె ఇతోధికంగా విరహంలో పడుతుంది. శ్రైత్యోపచారాలు చేస్తారు. అమె వ్రతం మొదలైనవి 51 గద్యపద్యాలలో వర్ణించారు. తరువాత 48 పద్యాలలో వసంత వర్ణన, మళ్ళీ గోదాదేవి మదనతాపం, ఆమె పరిస్థితిని తెలియని వెర్రిబాగుల విష్ణుచిత్తుడు “దేవా. నా కూతురేదో వింత తపస్సు చేస్తూంది. ఏకాదశినాడు జూగరం ఉంటాం. ఆమె రోజూ ఉంటూంది. వద్దంటే వినదు. మేరి చెంబులతో స్వామివారి తీర్థం పుచ్చుకొంటే, ఒళ్లు తడుపుకొంటుంది. అన్నీ విరుద్ధమే. ఇదేం తపం? పిచ్చి కాబోలు:” అని మొరపెట్టుకున్నాడు. ఆ ఛాందసానికి దేవుడు నవ్వుకొన్నాడట. అంతలో ఐదవాశ్వాసం ముగిసింది. ఆరో ఆశ్వాసంలో 'పేరుకొనగాని కులంలో ఉన్న తన భక్తుని కథ దేవుడే చెప్పడం మొదలుపెడతాడు. పూర్వం వామనావతారంలో దేవుడు నివసించిన పుణ్యాశ్రమానికి మూడామడల దూరంలో ఒక మాలవాడ ఉంది. అందులో ఒక దాసరి ఉన్నాడు, అతడు రోజూ తెల్లవారుజూోమున ఈ మూడామడల దూరాన్నీ నడిచి ప్రభాతవేళ దేవాలయం వెలుపల మంగళైశికి గీతాలు పాడుతాడు. గర్బగుడి కడిగిన నీళ్లు తూముగుండాపారి, రాతితొట్టె నిండి బయటకు పారితే ఆ నీళ్ళను తీసి ఏ శూద్రుడైనా యిస్తే మహాప్రసాదమని పుచ్చుకొని మాలదాసరి మహదానందం పొందేవాడు, ఒకనాడు అద్ధమరేతిరిని ఇంట్లో పిల్లి జొరబడితే భయపడి కోళ్లు తూశాయి. అది తొలికోడికూత అని భమసి మాలదాసరి లేచి మంగళకైశికీ గానానికి బయలుదేరాడు, చీకట్లో దారితప్పి ఒక (బ్రహ్మరాక్షసి పాలబడ్డాడు. ఆకలితో ఆవురావురుమంటున్న రాక్షసుడు దాసరిని తినదలచాడు: “సరే నేను గుడిముందు గానం చేసివచ్చాక తిను” అన్నాడు దాసరి రాక్షసుడు ఒప్పుకోలేదు, తత్త్వబోధ చేసి, ఒట్లు పెట్టుకొని చివరకు ఒప్పించి, గుడివద్ద పాడి, అన్నమాట నెరవేర్చుకొందుకు తిరిగివచ్చాడు దాసరి. అతడు వస్తాడని రాక్షసుడు భావించలేదు, వచ్చాక అతణ్ణి తినదలుచుకోలేదు, మంగళకైశికీ గానఫలం తనకు ధారపోసి తన కీ రాక్షసత్వం తొలగించమన్నాడు. దాసరి అంగీకరించలేదు. (బ్రహ్మరాక్షసి వైషు మతోద్ధారకులైన రామానుజులు, మనవాళమహాముని, శఠగోపసూరి, వేదాంతదేశికుల వైనాలు చెప్పాడు. ప్రపన్నుడైన

62 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తనను విపన్నుడిగా చేయవద్దంటాడు, దాసరి అంగీకరిస్తాడు. రాక్షసుడు తన కథ చెప్తానంటాడు. ఇంతతో 69 గద్య పద్యాలున్న ఆరో అశ్వాసం ముగుస్తుంది.

ఏడో ఆశ్వాసం మొదటి 25 గద్యపద్యాలు బ్రహ్మ రాక్షసుని కథ. తరువాతి 950 గద్యపద్యాలు చూడికుడుత్తమ్మ శ్రీరంగనాయకులను సేవించడం, అతనిలో ఐక్యం కావడం, దేవుడు మాయావధూటినామెస్థానంలో నిలపడం, తూతురు కనబడక విష్ణుచిత్తుడు విలపించడం, దేవుడు నవ్వుకొని సమాధానం చెప్పడం, పెళ్లిమాటలు, గోదాదేవికి రంగనాథునితో కళ్యాణం మొదలైనవి ఉన్నాయి. దీనితో కావ్యం ముగుస్తుంది.

ఆముక్తమాల్యద తెలుగులో ఉన్న పంచకావ్యాలలో అత్యంత ప్రొడమైనది. అప్పుడప్పుడు వ్రాసిపెట్టిన ఘట్టాలను చప్పుచప్పున జారుముడివేసి కలిపినట్టు కనబడుతుంది. ఏ ఘట్టాని కా ఘట్టం చక్కగా ఉంటుంది. రాయలవారు పాత్రలను చిత్రించిన తీరు నిరుపమానం. ప్రతిపాత్రా సజీవంగా కనబడుతుంది. సన్నివేశాలన్నీ సహజంగా ఉంటాయి. ప్రకృతి పరిశీలన అద్భుతం. రాయలవారి చేతికి ఎముక లేకపోవచ్చుగాని నోటికి అడ్డుపెట్టుకుంటారు. మాటలు వాడడంలో ఎక్కడలేని పాదుపూ వుంటుంది. తమ కొలువులో ఉద్యోగం ఇచ్చేవాడిని నిశితంగా పరీక్షించి అర్హుడైతేనే నియమించే పద్ధతిలో వ్రాసే పద్యాలలో ప్రతి మాటను తూచివేస్తారు. వ్యర్థపదాలను పరిహరించడంతో అర్థం మరీ ఘనీభవించి బుర్ర వేడెక్కితీగాని భావం కరిగి రసనిష్పత్తి జరగదు, రాయలవారి అలంకారాలు నిజంగా చక్రవర్తి ధరించవలసిన భూషణాలలాగా బోలెడంత నగిషీతో ఉంటాయి. ఉడ్రీక్షలు, ఉపమలు, రూపకాలు కోకొల్లలు. రాయలవారి స్వభావోక్తులు సైతం నేలమీద నడవవు. ఏనుగులెక్కినట్టు ఎత్తునే ఉంటాయి. రాయలవారి పద్యాలు కొన్ని సాతాళించిన ఇనుప గుగ్గిళ్ళు, మరికొన్ని బొంత అరటిపళ్ళు, ఎవరైనా ఒలిచి పెట్టి ముక్కలు చేసి వ్యాఖ్యానపు పంచదారలో ముంచి ఇస్తే వాటి రుచి తెలుస్తుంది.

ఆముక్తమాల్యదకు వావిళ్లవారు వ్రాసిన “రుచి వ్యాఖ్య, వేదం వెంకటరాయకాస్త్రిగారు వ్రాసిన సంజీవనీ వ్యాఖ్య ప్రసిద్ధాలు. వావిళ్లవారిది విద్యార్థులకు, వేదంవారిది విద్వాంసులకు ఉపయోగిస్తాయని ఈయుణ్ణివారు చెప్పిన మాటలు అక్షరాలా నిజం.” ఆముక్తమాల్యద వజ్రాలగని. సంజీవినీవ్యాఖ్య సానపట్టె కార్ధానా, ఈ రెండు ముద్రిత వ్యాఖ్యలేకాక మూడు అముద్రితాలు కూడా ఉన్నాయి. గట్టుపల్లి శ్రీనివాసకవి (క్రీ.శ.1800) మహాటీక వ్రాశారు. తరువాత క్రీశ 1813 ప్రాంతాల ఉప్పలపాటి జోగిజగన్నాధరాజుగారు “బుధమనస్తోషణి' అనే వ్యాఖ్య వ్రాశారు. క్రీ.శ 1848కి పూర్వమే గుడిపాటి వెంకటకవిగారు 'తాత్చర్య బోధిని అనే వ్యాఖ్య బ్రాశారు. పాతవ్యాఖ్యాతల అఖిప్రాయాలను అక్కడక్కడ పేర్కొంటూ వేదంవారు మహాభాష్ట్రం వ్రాశారు. ఇందులోని లోపాలను సవరించడానికి తగిన సమీక్షను దీపాల 27. ఆముక్తమాల్యద పర్యాలోకనం - వెల్దండ ప్రభాకరామాత్య రచనకు * ఆంధ్రసాహిత్య సౌరభభూమిక'

కృష్ణదేవరాయలు 63 పిచ్చయ్య శాస్త్రిగారు చేశారు. వెల్దండ ప్రభాకరరావుగారు ఆముక్తమాల్యదపై చేసిన సవిస్తర పర్యాలోకనానికి ఈయుణ్ణ్జి వెంకటవీరరాఘవాచార్యులవారు. సుడీర్హమైన భూమిక వ్రాశారు. అందులో ఆముక్తమాల్యదకు సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా తెలియజేశారు. క్రీశ 1856-57 దాకా అముక్తమాల్యదపైగాని, రాయలవారిపైగాని, కృతికి కృతికర్తకు సంబంధమున్న ఏ యితరవిషయాలపైగాని వెలువడిన గ్రంథాలు, వ్యాసాలు ఏమిటో వివరిస్తూ ఒక పట్టికను క్రోడీకరించారు. వారు లెక్కించినవి 105 ఉన్నాయి. ఇంతమంది ఇన్ని వ్యాసాలు, గ్రంథాలు వ్రాసి రాయలవారి మహోన్నత కవితా వృక్షానికి నిచ్చెనలు వేశారు. ఈ నిచ్చెనల మీద అందరూ ఎక్కలేరు. రాయలవారి వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రత్యేకమైన దృక్పథాన్ని అర్థం చేసుకొనడానికి ఏళ్లూ పూళ్ళూ పడుతుంది. సామాన్య సాహితీప్రియులకు అంత తీరుబాటు ఉండదు. రాయలవారు నేటి ఆంగ్ల సాహిత్యంలో జేమ్సు జాయిస్‌ కోవలోనివారు, జాయిస్‌ వ్రాసిన యులిసిస్‌, ఫిన్నిగాన్స్‌ వేక్‌ అనే ఉద్రంథాలను కొమ్ములు తిరిగిన విద్వాంసులు సహితం చప్పున అర్థం చేసుకోలేరు. వాటిమీద వివరణలు, టీకలు, భాష్యాలూ బోలెడు వెలువడ్డాయి. జాయిస్‌ రచయితల రచయిత, రాయలవారాకోవలో తొలిపూస. . ఆముక్తమాల్యదలోని పద్యాలను రచిస్తున్నపుడు రాయలవారి ' దృష్టిలో తమ అస్థానంలో ఉన్న విద్వాంసులే ఉన్నారేమో అనిపిస్తుంది. వారు జొను అని మెచ్చుకొనడమే వారు ఆళించినట్టు భావించవచ్చు. ప్రభువు కనుక తామేది చెప్పినా తల ఊపుతారు. అది కాదు తనకు కావలసినది, నిజమైన మెప్పు కావాలి, అందుకే ప్రతి పద్యాన్నీ ఒక సాలిగ్రామం చేశారు, ప్రతి వర్ణనా ఒక థైలవర్ణ చిత్రంలాగా రచించారు. రాయలవారు ఇంత శ్రమతో ఈ గ్రంథాన్ని వ్రాస్తే కొందరు సాహిత్య నిష్టాతులే దానిని అల్లసాని పెద్దనగారు వ్రాశారనే వాదాన్ని లేవదీశారు. దానికి రకరకాల కారణాలను చూపించారు. పెద్దనగారు. వ్రాసిన 20 పద్యాలు ఆముక్తమాల్యదలో కనబడతాయి. “అఖర్వమహిమాతి ధూర్చహుడగు తుర్వసువంశంబునం బుట్టినట్టి నీకిట్టి శోభన పరంపర లేమి అద్భుతములు? -అవధరింపు” అని ఆ వంశాన్ని కీర్తించినట్టు రాయలవారు కృత్యాదిని చెప్పారు. పరుల వాక్యాలుగా ఆయన 28 పద్యాలు ఉదాహరించారు. వీటిలో 17 పద్యాలు పెద్దనగారి మనుచరిత్రలో కనబడతాయి. మిగతా పదకొండు పద్యాలను రాయలవారు పెద్దనగారి యితర గ్రంథాలనుండీ తీసుకొన్నారో, లేక ఇతర అష్టదిగ్గజాల కావ్యాల నుండీ ఉదాహరించారో ప్రస్తుతం లభ్యమయ్యే ఆధారాలనుబట్టి చెప్పలేం. ఇతరుల వాక్యాలు అని రాయలవారు స్పష్టంగా చెప్పి వాడుకున్న ఈ పద్యాలలో శ పెద్దనగారివే కాబట్టీ ఆముక్తమాల్యదలో ఆయన చెయ్యి ఉందని ఎవరూ అనరు. ఆంధ్రవిష్ణువు తనకు స్వప్నంలో దర్శనమిచ్చిన ఘట్టాన్ని వర్ణిస్తూ రాయలవారు వ్రాసిన “నీలమేఘముడాలు డీలు సేయగ జాలు” పద్యం మనుచరిత్రలో కనబడుతుంది. (ఆముక్తమాల్యద 1-12; మనుచరిత్ర 6-101) విష్ణుచిత్తుల వారికి శ్రీమహావిష్ణువు

64 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సాక్షాత్కరించిన ఘట్టంలో రాయలవారు “జయజయదానవ దారణ కారణ అనే కవిరాజవిరాజితం వ్రాశారు (ఆముక్త 4-16) ఇది మనుచరిత్రలో కనబడుతుంది (మను 34-103). ఈ పోలికలేగాక ఇతర కారణాలతో పెద్దనగారే ఆముక్తమాల్యద వ్రాశారని కొందరు భావిస్తారు. ఆ కారణాలను పదిహేడింటిని వేదం వెంకటరాయశాస్రిగారు (కోడీకరించారు.2 ఆముక్సమాల్యదను రాయలవారు కాక పెద్దనగారు వ్రాశారని అభాండం వేసిన వాళ్లలో తొలివాడు తెనాలి రామకృష్ణుడట. ఇతడి క్రింది చాటువులో పెద్దన గారిని ఎత్తిపాడిచాడని లోకులు చెప్పుకొంటారు. ఎమితిని సెపితిని కపితము- బ్రమపడి వెరిపుచ్చకాయ వడిదిని సెపితో యు మెతక్కయతిని సెపితో-యమవసనిశి యనెడి మాట యలసని పెదనా! గీ ఈ ఎత్తిపాడుపుకు కారణభూతమైైన్‌ అమవసనిశి అనే మాట ఆముక్తమాల్యదలో ఉంది. ద్యుమణి కరాళి మొగ్లూ-యమవసనిశి గలయగూర్చి హదనౌటయు న య్యమృత పుబిందులె క్రమ్మర-నుమినెడు నస గల యగరకలుడుగక రాలెన్‌ (ఆముక్త, 4-99) అయితే అమవసనిశి అన్నమాట వాడిన పెద్దనగారి పద్యం ఇంకొకటి వేరే ఉంది. కలనాటీ ధనము లక్కర- గలనాటికి దాచగమలగర్చుని వశమా నెలనడిమినాటి వెన్నాల-యలవడునే గాదెబోయ యమవసనిశికిన్‌? ఈ పద్యం పెద్దనగారు ఏ సందర్బంలో చెప్పారో తెలియదు. ఇది మనుచరిత్రలో లేదు. మరే గ్రంథంలోనిదో చెప్పలేం. రామకృష్ణుడు నిజంగా పై వెక్కిరింపు చేశాడో లేదో నిర్ణయించలేం. అతడీ క్రింది విధంగా చెప్పాడంటారు. ప్రొడదీర్ణ సమాసపదముల గూర్చి శ్రీనాధుండు కూలార్చె నైషధంబు దాని తల్లిగ నలసాని పెద్దన దెల్సె ముది మదితప్పి యాముక్తమాల్య నూహించి తెలియరాకుండ సూరవరాజు భ్రమగళా పూరోదయము రచించె నత్తోషశబ్బవాగాడంబరం బొప్పు పస ఘటించెను మూర్తి వసుచరిత్ర ఇట్టి కవులకు నేను నాకొట్టుకొలకు- జెప్పినాడ మదీయవై చిత్రి మరయ, బాండురంగవిజయమును బటిమ దనర- విష్ణువర్థిష్పుడను రామకృష్ణుకవిని ॥ (ఆముక్తమాల్యద సంజీవిని పీరిక, పుట 6) ఈ పద్యం పాండురంగ విజయంలో లేదు. ఇది ఎవరో వ్రాసి రామకృష్ణునకు అంటకట్టినది కావచ్చు. అందుచేత పెద్దనగారి సమకాలికుడే ఆముక్తం ఆయన రాసినట్టు చెప్పాడన్న సంగతి నిరాధారం. ఇకపోతే ఈ అభాండానికి మూలకారకుడు కాకునూరి అప్పకవి. అతడు ఆముక్తమాల్యదలో 13 పద్యాలు లక్ష్యాలుగా ఉదాహరించాడు. ఆంధ కవితాపితామహుడు దాని రచయిత అని చెప్పాడట, అప్పకవి దృష్టిలో బ్రాహ్మణుడు గానివాడు కవి కాడు (అప్ప, 1-44). అప్పకవిని ప్రమాణంగా స్వీకరించిన అనంతర కవులు, వ్యాఖ్యాతలు పెదనగారే బ్రాశారన్హు వాదాస్ను స్వీకరించారు. 28. ఆముక్తమాల్యద సంజీవనీవ్యాఖ్య, పీఠిక, పుటలు 6 నుండి 71.

కృష్ణదేవరాయలు 65 ఒకరు వ్రాసిన పుస్తకానికి తన పేరు పెట్టుకోవలసిన అవసరం రాయలవారికి లేదు. పెద్దనగారు కొద్దిగా అక్కడక్కడ సలహాలిచ్చి ఉంటే ఉండవచ్చు, కాని రచన రాయలవారిదే అని చెప్పవచ్చు. పెద్దనగారూ, రాయలవారూ సరిసమానంగా పరిశీలించిన కొన్ని విషయాలను ఎలాగ గ్రంథస్థం చేసినదీ చూస్తే ఈ విషయం చెప్పవచ్చు, రాయల వారి కోటలో వేటపులులు ఉంటాయి, అవి గబ్బుకంపు కొడుతూ ఉంటాయి, తన ప్రభువులతోపాటు ఆస్థానకవి కూడ వాటిని చూశాడు. పెద్దనగారు హిమవత్పర్వత వర్జనలో ఇలా వ్రాశారు: సెలవుల వనదంశములు మూగి నెరకెట్టగోల్పులుల్‌ పొదరిండ్ల గురకలిడగ " (మనుచరిత్ర, 2-6) పొదరిళ్లలోని పెద్దపులులు గురకలు పెడుతున్నాయి. వాటి పెదవుల సందునుంచి జొల్లు కారుతూంది. దానిపై అడవి ఈగలు ముసురుతున్నాయి అని పెద్దనగారు స్వాభావోక్సిలో చెప్పారు. రాయలవారు కూడా సమక్షికమైైన గబ్బును వర్దించారు, చూడండి. గబ్బు సమక్షికంబయి మొగం బడువ న్దరువర్ణము ల్పడన్‌ ద్రొబ్బుచు గార్కొగిళ్ల రొదతో బురణించెడు బొబ్బరింతగా డ్పుబ్బి విసంజ్ఞ గాక జెవులూదిన వల్లపు డుర్చి గూలగా బెబ్బులి గొంతుక్రోల్గరచి పెల్లున మార్కెడ ద్రైళ్లదాటుచున్‌. (ఆముక్త ౩-20) కేవిధ్వబుడు యాగం చేస్తున్నాడు. అతని యజ్ఞదేనువుమీద పులి విరుచుకుపడింది. పులి పెదవుల జొల్లు మీద ఈగలు ముసురుతున్నాయి. ఆ గబ్బును గోవు సహించలేకపోయింది. రోత కలిగి ఊపిరి తిరగలేదు. ఆవుమీద పులి ఎలా పడిందో రాయలవారు ప్రత్యక్షంగా కనబడేటట్టు వ్రాశారు. ఒకే దృశ్యాన్ని పెద్దనగారూ, రాయలవారూ చూశారు. పెద్దనగారొక సీసపాదంలో వ్రాసిన దానిని రాయలవారు “గబ్బుసమక్షికంబయి' అని రెండు పదాలలో కుదించారు. ఇదే తేడా ఆముక్తమాల్యదలో _ సర్వత్రా కనపడుతుంది. పెద్దనగాకే నిజంగా ఆముక్తం వ్రాసినట్టయితే కథ ఇంకా వదులుగా చెప్పగలరు. ఆముక్తంలో మహాప్రతిభ కనబడుతుందిగాని ప్రసన్నకథా కలితార్థయుక్తి గోచరించదు, ఇంతకూ రాయలవారు. దేవునిచేత అబద్ధం ఆఅడించవలసినంత దిగజారారనుకోవడం ఆంధ్రసాహిత్యానికే అవమానం. రాయలవారి కలలో ఆంధ్రవిష్టువు కనబడిన తేదీ ఏమిటా అని పరిశోధకులు బహువిధాల చర్చించారు. కుందూరి ఈశ్వరదత్తుగారు శ్రీ.శ. 1519 జనవరి 27 అని నిర్ణయించారు. ఓరుగంటి రామచంద్రయ్యగారు ఆ సంవత్సరమే నవంబరు ౩ అన్నారు. క్రీశ 1518 ఆగస్టు 8 తారీఖునాటికి కళింగదిగ్విజయం పూర్తి అయింది. సింహాచలంలో రాయలవారు శాసనం వేయించారు. దేవునికి దానం ఇవ్వడానికి గజపతివద్ద గ్రామాలు పుచ్చుకున్నారు. ఆగస్టుకు పూర్వమే 'కళింగదేశవిజిగీషు రాయలవారికి ఉండాలి, అప్పుడే దేవుడు కనిపించినట్టు రాయలవారు బ్రాశారు. కుందూరి వారి తారీఖు ఆమోద యోగ్యంగా ఉంది.

66 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కళింగ విజయం పూర్తి అయ్యాక రాయలవారు సుఖంగా కాలుమీద కాలు వేసుకొని కూర్చోలేదు. అలా యుద్దాలు చేస్తూనే ఉన్నారు. క్రీ.శ. 1520 నుండి 1523 దాకా విజాపురం తురకలతోనే బోలెడు యుద్ధాలు జరిగాయి. రాయచూరు దగ్గరలో ఉన్న కెంబావి, నైరామన గ్రామల వద్ద యుద్దాలు కళింగ విజయానికి ముందే - బహుశ జరిగాయి. ఆ తరువాత ఇస్మాయిల్‌ అదిల్‌ఖాన్‌ రాయచూరు స్వాధీనం చేసుకొన్నాడు. రాయలవారు స్వయంగా సేనలతో దుర్గాన్ని ముట్టడించాడు. అదిల్‌ఖాన్‌ను ఓడించి అతని తుపాకులు, ఫిరంగులు, ఏనుగులు, గుజ్లాలు రాయలవారు స్వాధీనం చేసుకున్నారు. అదిల్‌ఖాన్‌ పారిపోయి ఇతర మహమ్మదీయ రాజ్యాలవారి సహాయం కోరాడు. వాళ్ళు రాయలవారికి లేఖలు వ్రాశారు, అదిల్‌ఖాన్‌ వద్దనుంచి తీసుకొన్నవి అతనికి తిరిగి ఇవ్వమని సూచించారు. లేకపోతే తాము ఉమ్మడిగా రాయలపై దండు వస్తామని బెదిరించారు. “మీరు రానక్కరలేదు. మీవద్దకు నేనే యుద్ధానికి వస్తా'నని రాయలవారు జవాబు చెప్పారు. మూడిళ్ల తురకలూ నోరు మూసుకొన్నారు.

తరువాత అదిల్‌ఖాన్‌ మళ్ళీ బేరాలు పెట్టాడు, తన సొత్తు తనకు ఇమ్మని ప్రాథఖేయపడ్డాడు, అదిల్‌ఖాన్‌ స్వయంగా వచ్చి తన పాదాక్రాంతుడై తన పాదాలను ముద్దుపెట్టుకొంటే ఆ ఆయుధ సంపదను తిరిగి ఇచ్చేస్తానని రాయలు చెప్పాడు, అదిల్‌ఖాన్‌ విజయనగరం దర్చారుకు రాలేదు, అతణ్జి వెంటాడుతూ రాయలు కలుబరిదాకా వెళ్ళాడు. ఆ విజయయాత్ర అక్కడితో ఆగలేదు. ఆ 'పంచగౌడధాత్రీపదం' దాకా వెళ్ళినట్టు పెద్దనగారి సాక్ష్యం ఉంది..ొ రాయలవారు క్రీ.శ 1522లో వేయించిన జయశాసనం ఒకటి గయలో ఉంది. అప్పటికి రాయలవారి వయసు 48 సంవత్సరాలు.

ఏభయ్యోపడిలో పడగానే రాయలవారి దృక్పథం మారినట్టుంది. రాజనీతిని ప్రదర్శించవలసిన సమయాల్లో అహంభావాన్నే ప్రకటింపసాగారు, మూడిళ్ళ తురకలలో ఇద్దరు ఏదో మొహమాటానికి అదిల్‌ఖాన్‌ తరపున ఉత్తరాలు వ్రాస్తే, వాటికి నొప్పించక తానొవ్వక సమాధానం చెప్పవలసిన రాయలవారు “మీరు రానక్కరలేదు. యుద్దానికి నేనే వస్తాను' అని జవాబు చెప్పడంలో వాక్సారుష్యమే కనబడుతోంది. శత్రురాజుల దూతల దగ్గర తూడా పరుషాలు పలుకకూడదన్న రాయలవారు ఇలా ప్రవర్తించడం వింతే.

క్రీ.శ 1523 నుండి, అంటే రాయలవారి 49వ సంవత్సరం నుంచీ వారిమీద అప్పాజీ ప్రభావం తగ్గుముఖం పట్టింది. అప్పటి కాశిరః ప్రధాని ముసలివాడు అయ్యాడు, ఎంత లేదన్నా సహస్రమాసజీవి. ఆ పండుముసలితనంలో అప్పాజీ గోవా పరిసరాలలో యుద్ధం చేశాడు. -పోర్చుగీసువాళ్ళ చేతిలో ఓడిపోయాడు. ఈ పరాజయంతో రాయలవారికి అప్పాజీమీద ఉండే గౌరవం తగ్గుముఖం పట్టినట్టుంది. పైగా క్రీశ 1524లో రాయలవారు తమ ఆరేళ్ళ కుమూరునికి పట్టాభిషేకం చేశారు. ఈ శుభకార్యం చేయాలన్న ఉద్దేశాన్ని బయటపెట్టినప్పుడు ఆదిలోనే అప్పాజీ కొంచెం అడ్డుచెప్పి ఉండవచ్చు. 2. మనుచరిత్ర, 1-11

కృష్ణదేవరాయలు 67 “ఇప్పుడేమంత తొందర? చిరంజీవికి సంపూర్ణ పట్టాఖిషికం కాక యువరాజు పట్టం కట్టండి" అని సలహా ఇవ్వడానికి అస్కారం ఉంది. రాయలవారు లక్ష్యపెట్టలేదు. తిరుమలదేవరాయలకు పట్టం కట్టారో లేదో, కొద్దికాలానికే ఆ బాలుడు మరణించాడు. కిట్టనివాళ్లు అప్పాజీ విషం పెట్టించాడన్న పుకారు లేవదీశారు. రాయలవారు నమ్మి, చేయగూడని ఆఘాయిత్యం చేశారు

అప్పాజీ కళ్లు తోడించినందుకు ఆ ప్రధాని కుమారులు తిరుగుబాట్లు లేవనెత్తారు. రాజ్యంలో అల్లకల్లోలాలు ప్రారంభం అయాయి. అంత్యకాలంలో అప్పాజీని రాయలు విడుదల చేయించారు కాబోలు. జ్ఞానోదయం అయి, తన తరువాత తన సవతితమ్ముడే వారసుడని సమర్శనికే రాజ్బుమిచ్చారు. కుమారునికి పట్టం కట్టినది మొదలు మరణించేదాకా రాయలవారు అయిదేళ్ళు మానసిక వ్యథలకు లోనై ఉంటారు. అప్పాజీకి చేసిన ద్రోహానికి మళ్ళీ మళ్ళీ మనసులోనే విలపించి ఉంటారు. అప్పాజీ సామాన్యుడు కాడు. రాజకీయంగా ఎంత దురంధరుడో సంస్కారంలో అంత విద్వాంసుడు, సకలాగమపారావారపారీణుడు. అగస్త్రుడు వ్రాసిన బాలభారకానికి మనోహరవ్యాఖ్య బ్రాసీన రాయలవారితో పాటు రాచకార్యాలలోనే కాక భువనవిజయంలో జరిగే సాహిత్య గోష్టలలో గూడా అప్పాజీ పాల్గొనేవారని ఊహించవచ్చు.

రాయలవారు విద్యావినోదాలు బరిపీ సభాభవనం పేరు 'భువన విజయం.' ఆయన నివసించే మందిరం పేరు “మలయ కూటం.” భువన విజయంలో ఎనిమిది దిక్కులా ఎనిమిది సింహపీఠికలు వేసి వాటిపైన ఎనమండుగురు కవులను నిలిపి రాయలవారు విద్యావినోదాలు జరిపేవారు. ఈ ఎనమండుగురే అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధి చెందారు. సాహిత్యగోప్టిలో అష్టదిగ్గజాలు ఉండడం వైష్ణవ సంప్రదాయం. క్రీ.శ 1370 నుంచి 1443దాకా ఉన్న మనవాళ మహామునివద్ద అష్టదిగ్గజాలూ, నవరత్నాలూ ఉండేవారు.ో రాయలవారీ సంప్రదాయాన్ని అనుసరించారు. భువనవిజయంలో అసీనులైన ఎనమండుగురు కవులు ఎవరో మనం నికరంగా చెప్పలేం. అందరూ ఆంధ్రకవులే అనుకోకూడదు. ఈ కవులు ఎవై ఉంటారని వివిధ పరిశోధకులు చర్చించి తలోపట్టికా ఇచ్చారు. గురజాడ శ్రీరామమూర్తిగారి దగ్గరనుంచి నిడుదవోలు వెంకటరావుగారి దాకా ఎవరెవరు ఏఏ పేర్లు చెప్పారో ఈయుణ్ణివారు వివరించారు. వారి ఉద్దేశంలో ఈ దిగ్గజాలు ఎమై ఉంటారో సూచించారు. నిడుదవోలు వెంకటరావుగారు అష్టదిగ్గజాలపై ఒక సవిస్తరవ్యాసం వ్రాశారు. అందులో వారిచ్చిన జాలితానే ఈయుణ్జీవారు అమోదించినట్టు కనబడుతుంది. రుద్రకవి సంగతింకా పరిశోధించాలని మిత్రులు వేదం వెంకటరాయశాస్త్రిగారు వ్రాశారు.3* సంకుసాల నరసయ్య అష్టదిగ్గజాలలో ఒకడేమో అని నా అనుమానం. 30. వెల్దండవారి “ఆముక్తమాల్యద పర్యాలోకనం' భూమికలో ఈయుణ్జీవారు చెప్పారు. పుటు 22. 31. ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, 1955-56 మన్మథ, సంపుటం 48. 32. ఆముక్తమాల్యద - వేదంవారి ముద్రణ, ప్రకాశకవిజ్ఞప్తి, పుట 2౫

68 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వ | ఖిలా. ఇ. 9... 1. 2 న జై జా, ఇ ఓ. క . భే ౧ ౨|| £6 1 త. [ [

ర ఇని ళ్ధా

రా న ఫ్‌ న సీస పై సైసప. ష్‌. ఇ శప క ళా, హ్‌ న 4 | [

శీ ళా జీ ర

| జ్‌ ర్టీ టే శ్‌. . న్‌ . గ ం సి! భే | [ శే పక శా! స... శ... ల ఇళ ళా లీ యి హ్‌! క ళ్డి ; ] గ ఖై . శ్జాచల ఉలి బి బీ జజ ఆ ౪8౪ శ ణీ కీ

కృష్ణదేవరాయలు 69

భువన విజయంలో ఆసీనులైన అష్టదిగ్గజాలకు రాయలవారు కడప మండలంలోని తిప్పలూరు అనే గ్రామాన్ని సర్వాగ్రహారంగా చేసి దానం చేశారని ఒక శాసనంవల్ల తెలుస్తున్నది.కి% అయితే ఇది రాయలు స్వయంగా చేసిన శాసనం కాదు. అష్టదిగ్గజాలకు దానం చేసిన ఈ గ్రామంలో దొమ్మరిపన్నులు రద్దుచేస్తూ ఇతరులు ఈ శాసనాన్ని వేశారు. దీనిమూలంగా అష్టదిగ్గజాలు ఉండేవారనీ, వారికీ రాయలవారు దానాలు చేసేవారనీ మాత్రమే చెప్పవచ్చు. కాని ఆ కవుల పేళ్లేమిటో. ఏయే భాషలవారో చెప్పలేం.

రాయలవారి పోషణలో ఇతర భాషల కవులు కూడా చాలామంది ఉన్నారు. తమిళ సంస్కృత, కర్ణాటక సాహిత్యాలలో ఉద్దండులు కొందరు రాయల ఆస్థానంలో ఉన్నవాళ్లే రాయలవారు. దిగ్విజయాలకు వెళ్ళినప్పుడు ఏనుగులూ, గుత్తాలూ మొదలైనవాటినేకాక పరరాజుల తోటలో ఉండే సాహిత్య సైంధవాలను, కవిమత్తేభాలను విజయనగరం తీసుకొని వచ్చేవారు. ప్రతాపరుద్ర గజపతి ఆస్థానంలో ఉండే లొల్ల లక్ష్మీధరుడూ, దివాకరుడూ మొదలైన సంస్కృత పండితులూ, భండారు లక్ష్మీనారాయణ అనే నూత్నభరతాచార్యుడూ రాయలవారి అస్తానానికి వచ్చారు. చింతలపూడి ఎల్లన కూడా బహుశా ఆ ప్రాంతాన్నుంచే వచ్చాడేమో.

రాయలవారి ఆస్థానంలో కేవలం కవులే కాక ఇతర కళాకారులెందరో ఉండేవారు. నటులు, గాయకులు, ప్రముఖులు. రాయలవారు ప్రతియేడూ వసంతోత్సవాలు జరిపించేవారు. అటువంటి ఉత్సవాలలో కొత్త నాటకాలు ఆడడం సంప్రదాయం. “తాయికొండ నాటకం' అనేది ఆనాడు బహుళప్రచారం కలదని చెప్పవచ్చు. ఈ నాటకం ఆడినందుకు నట్టువ నాగయ్యను రాయలవారు సన్మానం చేసి శాసనం వేశారు. ఆ రోజులో ప్రముఖ తార విషయం కూడా తెలుస్తూంది. పోతవరపు కట్టువ తిమ్మయ్య కూతురు పాత్రధారణ చేసింది. వసంతోత్సవంలో ప్రదర్శించడానికి రాయలవారే స్వయంగా జాంబవతీ పరిణయం అనే సంస్కృత నాటకం వ్రాశారు. చాలాకాలానికీ కృతి దొరికింది. ఈయుణ్ణి వారీ రూపకంలో కొంత భాగాన్ని ప్రకటించారు జాంబవతీ పరిణయమేకాక ఉషాపరిణయం అనే నాటకం కూడా వ్రాశారట. ఇది వెలుగు చూడలేదు. ఆ కాలంలో గంగావతరణం అనే మరొక నాటకం కూడా ప్రచారంలో ఉండేది.

సంస్కృత నాటకాలు, తెలుగు యక్షగానాలూ మాత్రమేకాక ఆరోజులలో బొమ్మలాటలు తూడ్తా విరివిగా ఉండేవి. బొమ్మలాట విరూపాక్షయ్య కొడుకు బొమ్మలాట కాళయ్య రాయలవారికి ఆప్తుడట.5 చదరంగం ఆడేవాళ్లంటే రాయలకు ఎంత ఇష్టమో చెప్పక్కరలేదు. బొడ్డుచర్ల తిమ్మనకు అగ్రహారం దానం చేశారు. రాయలవారికి వేటకూడా చాలా యిష్టంకాబోలు, అల్లసాని పెద్దనగారు వర్ణించిన స్వరోచి 33 4౧ 282 0 1937-38 34. సంస్కృత సాహిత్య పరిషత్సత్రిక, అక్లోబరు 194 అని ఆముక్త మాల్వద “పర్వాలోకనం* భూమికలో

రు.

70 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వేట రాయలవారిదే. దేవీనవరాత్రులలో దేవికి బలి యివ్వడానికి ఒక అడవి దున్నను లాయలవారు స్వయంగా వేటాడి పట్టుకువచ్చారు. ఒక్కవేటున దాని తలను తెగగొట్టగలమా లేమా అని వీరాధివీరులే తటపటాయిస్తే విశ్వనాథనాయకుడు అవలీలగా బలివేశాడు.

ఆ కాలంలో శరన్నవరాత్రులు మహావైభవంగా జరిపేవారు. రాయలవారు వైష్టవులే అయినా ఇతర దైవాలకు దానాలు, ఉత్సవాలు విస్మరించలేదు. అభిమానించి ఆచరించిన వైష్ణవ మతం తూడా ఆయన ఎక్కువగా సంస్కృత గ్రంథాల నుంచే స్వీకరించారను తోవచ్చు. పెరియాళ్వారు, చూడికుడుత్తమ్మ తమిళంలో చెప్పిన పాశురాలను రాయలవారు తెనిగించలేదు. ఆముక్తమాల్యదలో విరివిగా తమిళ పదాలు ఉన్నాయి కనుక ఆ భాషాపరిజ్ఞానం లేదనుకోలేం. ఏ కారణంచేతనో రాయలవారు గురుపరంపరలో అచార్య

పురుషులను గురించి చారిత్రక విరుద్ధమైన విషయాలను గ్రంథస్థం చేశారు. జీవితకాలంలో ఎక్కువగా ఇతర విషయాలపై కేంద్రీకరించడంవల్ల ఈ అశ్రద్ధ ఏర్పడింది కాబోలు. రాయలవారు 568 సంవత్సరాల కాలం జీవించారు. ఈ కాలంలో వారు సంకులసమరాలు గావించారు. హేమాద్రి దానాలు చేశారు. సాహిత్య గోష్టులు జరిపించారు. ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన తారీఖులను చూస్తే ఆయన సాధించిన విజయాలు తెలుస్తాయి. అనుభవింపదగిన రాగభోగాలు షష్టిపూర్తి జరుగక ముందే అనుభవించారు. వయసు వాలు 1474 ఫిబ్రవరి 10 | జననం, విజయసంవత్సర మాఘ బహుళ అష్టమి గురువారం, పృేవ్యా నక్షత్రం. 2 | 1496 కృష్ణరాయల తండ్రి నరసానాయకుడు శ్రీరంగపట్నాన్ని జయించాడు. 23 | 1497 కృష్ణరాయలకు చిన్నాదేవి అనే వేశ్వతో సహవాసం. 24 | 14906 కృష్ణరాయలకు పెళ్లి చేస్తే మంచిదని తిమ్మరుసయ్య భావించి ఉంటాడు. శ్రీరంగపట్నం ఏలిక కుమార్తె తిరుమలదేవితో వివాహం జరిగింది. 25 | 1499 కుమార్తె జననం 29 | 1503 తండ్రీ మరణం 22 1506 అన్న పట్టాభిషేకం 35 | 1509, జూలై22 | అన్న మరణం ఆగస్టు 7 కృష్ణరాయల రాజ్యస్వీకారం 1509 గజపతిని ఓడించి “గజపతి గజకూటపాకల' అనే బిరుదు పొందడం 1603 సాగరు, కలుటరుగ యుద్ధాలలో యూసఫ్‌ అదిల్‌ఖాన్‌ను పరాభవించడం 38 | 1510, జనవరి24 | కృష్ణ్ణాయల పట్టాభిషేకం 37 | 1511 రాయచూరు. మున్నగు దుర్గాల ఆశ్రమజ, బెడందఠోట స్వాధీనం చేసుకొని మహమ్మదు సాహూను విడుదల చేసి బహమనీ రాజ్యుపుగద్ధె విరుదువచ్చింది. 38 | 1512, సెప్టెంబరు 22 ఉమ్మత్తూరు. పాలెగాండ్రను అదుపులోనికి తీసుకురావడం, వెనుగొండనుంచి కివసముద్రందాకా ఉన్న రాజా న్ని కట్టుదిట్టం చేసి నమ్మకస్థులను ఉద్యోగులుగా నియమించడం

కృష్ణదేవరాయలు 71 ము వూ

39 | 1513, ఫిబ్రవరి 10 | దిగ్విజయానికి ముందు తిరుపతి యాత్ర

16513, మే 2 తిరుపతిలో

1513, జూన్‌ 9 ఉదయగిరి విజయం

1513, జూన్‌ 13 | రెండవసారి తిరుపతి యాత్ర 1513, సెప్టెంబరు 20 | రాజధానికి తిరిగి రాక,

40 | 1514 తూర్చు దండయాత్రలలో రెండవ ఘట్టం అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, తంగెడ, కేతవరం మొదలైన దుర్గాలు స్వాధీనం చేసుకోడం

41 | 1515, బూన్‌ 23 కొండవీటి దుర్గంపై గెలుపు

1515, జూలై8 | అమరావతిలో తులాపురుషదానం

1515, జూలై25 | శ్రీశైల స్వామిదర్శనం

1516 రాయలు తన కుమార్తె తిరుమలాంబను అరవీటి రామరాజుకిచ్చి వివాహం చేశాడని భావించవచ్చు.

42 | 1516 తూర్పు దండయాత్రలలో మూడవ ఘట్టం తెలంగాణాను స్వాధీనం చేసుకోవడం, కొండపల్లి విజయం

  1. మార్చి ౫ | సింహాచలంలో ప్రథమ శాసనం 4 | 1617, జనవరి? | తిరుపతి దైవదర్శనం 1517, జనవరి9 | కంచిలో 1517, ఫిబ్రవరి 8 | కుంభకోణం 1517, ఏప్రిల్‌ 1 తిరిగి కంచికి రాక. శత | 1519 బహుకాలానికి రాయలకు పుత్రజననం 45 | 1519, జనవరి27 | కళింగ దిగ్విజయంలో చరమఘట్టం 1519, అగస్టు 8 రాయలవారు విజయవాటికకు రావడం, కలలో శ్రీకాకుళ ఆంధ్రవిష్ణువు కనబడి ఆముక్తమాల్యద వ్రాయమని ఆదేశించడం

46 | 1520 ఫిబ్రవరి 1? | తిరుపతి యాత్ర

1520, డీనెంబరు | రాయచూరు దుర్గాన్ని ఇస్మాయిల్‌ అదిల్‌ఖాన్‌ ఆక్రమించదలచాడు,

47 | 1521, డిసెంబరు | ఇస్మాయిల్‌ రాయచూరును కైవసం చేసుకున్నాడు

15622, జూన్‌ 13 | దుర్గం స్వాధీనం అయింది

1522, ఆగస్టు అదిల్‌ఖాన్‌ పాదాక్రాంతుడవుతాడని రాయలు ముదుగల్లు వెళ్లాడు, ఖాన్‌ లేడు. రాయలు వీజాపూరుదాకా వెళాడు ఖాన్‌ అక్కడ లేడు.

1522, అక్టోబర్‌ | రాయలు కలుబరుగకు వెళ్లాడు, సుల్తాన్‌ పుత్రులను విడుదల చేసి పెద్దవాడికి పట్టం కట్టాడు.

1522 ఉత్తర హిందూస్తాన్‌పై దిగ్విజయం, గయలో జయశాసనం

త | 1523 రాజ్యానికి తిరిగివచ్చాక, గోవా పరిసరాలు పరుల చేతిలో చిక్కాయని తిమ్మరుసును సైన్యంతో పంపడం, అప్పాజీ ఓటమి

50 1524 రాయలు తన కుమారుడు తీరుమలదేవరాయలకు పట్టం కట్టాడు.

1524 బాలరాయల మరణం, అప్పాజీపై అనుమానం

651 | 155 రాజ్యంలో. తిరుగుబాటు: తిమ్మరుసు కుమారుని పితూరీ, రామరాయలు దానిని అణచడానికి వెళ్లాడు

52 | 1525 మహ్మదీయుల యుద్ధాలు

655 | 1529 మహ్మదీయులపై నాల్గవ రాయచూరి యుద్ధం, రాయలకు జయం

56 1530 రాయల నిర్యాణం

72 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

నిఖిల భోగాలూ అనుభవించిన సాహితీ సమరాంగణ చక్రవర్తి నిశ్చింతగా మాత్రం మరణించలేదనుకోవాలి. ఆయన దివికేగిన తరువాత ఆథ్రితులు, అప్పులు, అభిమానులు అంతా జీవచ్చవాలలాగా (బ్రతుకు వెళ్లదీశారు. మిగిలినవాళ్ళ సంగతి ఎలా ఉన్నా అప్పాజీ సంగతి చెప్పుకొంటే సిగ్గేస్తుంది. బాల్యంలో ఆయన దుర్చర దారిద్ర్యం అనుభవించాడు. ఒక సామ్రాజ్యాన్ని సృష్టించగలిగిన మహాప్రజ్ఞను స్వహస్తాలతో సాన పట్టుకొన్నాడు. మృత్యుముఖంలో ఉన్న యువకుని రక్షించి పట్టం కట్టాడు. గయదాకా జయపరంపరలు లఖించేటట్టు రాజనీతి నెరపాడు. అప్పాజీ చేసిన దానాలు కూడా అనేకం. రాయలవారు తిరుపతికి ఏడుసార్లువెళ్లి ఎన్నో దానాలు చేశారు. తిమ్మరుసయ్య కూడా చాలా దానాలు చేశారు. తిరుపతి దేవాలయంవారు ఏటా తిమ్మరుసయ్యకు ప్రసాదం పంపేవారు. రాయలవారు పోయాక పట్టుకొనే కొమ్మలేక, దినం వెళ్ళక తిమ్మరుసయ్యకు ఈ తిరుపతి ప్రసాదాన్ని అమ్ముకోవలసిన దుస్థితి పట్టింది.నో

రాజ్యాంతంలో నరకం తప్పదంటారు. తన ప్రభువుకు స్పార్గం ఇప్పించడానికా అన్నట్టు అప్పాజీ భూలోకంలోనే తాను నరకం అనుభవించాడు! ఇటువంటి రాజు, ఇటువంటి మంత్రి ఇంక ఎక్కడా ఉండరు!

నంది తిమ్మన

ఆంధ్రులు అల్లారుముద్దుగా, అతి గారాబంగా చూసుకొనే కావ్య నాయిక సత్యభామ. అఆంధ్రనాట్యం, కూచిపూడి వారి ధర్మమా అని ఈమె కలాపమంతా తెలుగునాట మారుమోగింది. అయితే ఈమె రూపురేఖలూ, కోపతాపాలూ తొలిసారిగా ప్రస్ఫుటంగా చిత్రించిన కవి నంది తిమ్మనగారు. ఆయన రచించిన పారిజాతాపహరణం మంచి కావ్యాలలో పంచదార చిలుకు ఆయన ముక్కు పారిజాతపరిమళాలను ఆభఘ్రాణించింది. ఆ సౌరభాలు గాలి కెగిరిపోకుండా మాటల్లోనే వాటిని బంధించి మధుర కావ్యాన్ని ఆయన సంతరించారు. నంది తిమ్మనగారికి ముక్కుతిమ్మనగారనే పేరు సుప్రసిద్ధం. “ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు' అనే మాటలు నిరూడమైనమి.

తిమ్మనగారి ముక్కు చాలా పొడుగ్గా ఉండబట్టి ఈ పేరు వారికి వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఆయన ఒక చక్కని చుక్క ముక్కును చక్కగా వర్ణించబట్టి ఈ పేరు వచ్చిందని సంప్రదాయ సిద్ధంగా సాహితీలోకం చెప్పుకొంటుంది. ఆయన బ్రాసినదే అని ఈ క్రింది పద్యాన్ని ఉదాహరిస్తుంది.

నానాసూనవితానవాసనల నానందించు సారంగ మే

లా నన్నొల్ల దటంచు గంధఫలి పల్కాకన్‌ దపం బంది యో

షెనాసాకృతి దాల్చి సర్వసుమస్సారభ్యసంవాసిర్లై

పూనెం బ్రేంఖణమాలికామధుకరీపుంజంబు లిర్వంకలన్‌!కే 36. తిరుపతి శాసనాల సంపుటి 4. సంఖ్య 72, 74, 9. రాయలవారు పోయిన అరేళ్ళదాకా అప్పాజీ బ్రతికీ

ఉన్నాడు. శాసనాలకాలం 156.

  1. వసుచరిత్ర 2-47

చంది తిమ్మన 73

ఇది ముక్కుమీద ప్రణజయకోపముండే సత్యభామ ముక్కును వర్ణించే పద్యం కాదు. దీనిని తిమ్మనగారు రచించనూ లేదు. ఇది రామరాజభూషణుడు వసుచరిత్రలో రాజుగారి క్రీడా సచివునిచేత చేయించిన వర్దనలోని ముక్కు పద్యం. అయినా ఈ పద్యాన్ని తిమ్మనగారి దగ్గిర కొనుక్కొనే తన గ్రంథంలో వసుచరిత్రకారుడు పెట్టుకొన్నాడని సాహితీపరులు సరదాకు చెప్పుకొంటారుగాని ఇది సత్యానికి సగమెరుక.

వాస్తవానికి ముక్కుతిమ్మనగారు. పారిజాతాపహరణం వ్రాయడానికి పెద్ద కారణముందట. ఆయన రాయలవారి భార్యలలో ఒక దేవేరి తరపున అరణంగా వచ్చిన కవి అని ప్రతీతి. రాణివాసంలో ఒక సంప్రదాయం ఉంది. రాత్రిపూట రాజుగారు విచ్చేసేదాకా రాణిగారు పాన్చుమీద తలగడదిక్కున తల పెట్టుకొని పడుకోకూడదు. పాదాలవైపునే పడుకోవాలి. ప్రభువు వచ్చాక, లేపితే 'ఉపనీతి అన్నట్టు తిరగాలి. ఒకనాడు రాయలవారు- ఎంతకూ పడకటింటికి రాలేదు. అర్ధరాత్రీ అపరాత్రీ దాటాక నిద్రకళ్ళతో వచ్చి రాణిని లేపకుండానే పడుకొన్నారట. నిద్రలో ఆమె కాలు వారి కిరస్సుకు తగిలిందట. వెంటనే ఇటు ఆయన, అటు ఆమె లేచారు. రాయలవారు అమె కావాలనే కాలితో తన్నిందని కోపగించుకున్నారు. వెనువెంటనే ఆమె నగరు విడీచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ గడపలో కాలుపెట్టలేదు. అమ్మగారు కుమిలిపోయింది.

అమ్మ తెచ్చిన విద్వాంసుడు కాబట్టీ తిమ్మనగారికి ఈ సంగతి తెలిసింది. రాయలవారిని సుముఖులను చేయడానికి పారిజాతాపహరణం కావ్యం వ్రాశారు. ఆ కాలంలో కృష్ణదేవరాయలవారు శ్రీకృష్ణుని అవతారం అని అందరూ విశ్వసించేవారు. ఈ సంగతి జ్ఞాపకం చేసినప్పుడల్లా రాయలవారు సహజంగా పొంగిపోతారు. ఒకసారి ఆయన పురాణ కథాగోష్టి జరుపుతూ “దాశరథులు ఎక్కువా? పాండవులు ఎక్కువా?' అని ప్రన్నంచారట. ఎవరూ జవాబు చెప్పకపోతే తామే చెప్పారు. పూర్తి దైవాంశలతో జన్మించిన దశరథుని సంతానం లోకోత్తరులనడంలో వింత లేదు. మానవులుగా పుట్టి మహనీయ చరిత్రకు కారకులైన పాండవులే గొప్పవారని రాయలవారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ గోష్టిలో రాయలవారికి వింజామర విసురుతున్న చాకలి చేతులు జోడించి '“ఏలిన వారీ జన్మలో తూడ పాండవులమీద పక్షపాతం మానలేదు” అని విన్నవించుకొన్నాడు. రాయలవారు బ్రహ్మానందం పొందారు. ““నీకేం కావాలో కోరుకో” అన్నారు. 'దేవరకోట ఏలుకోవాలని ఉంది మహాప్రభూ" అన్నాడు. వెంటనే అది రాయలవారు వాడికి ఇచ్చేసినట్టు కట్టడి చేశారు.

ఈ ముచ్చట నాటి గోష్టిలో ఉన్న తిమ్మనగారికి తెలిసిందే. '“ఏలినవారికి ఈ జన్మలోనే కాదు, కృష్ణావతారంలోనే ముద్దుభార్య మెత్తని కాలితాపులు తప్పలేదు. ఆ జన్మలో నొచ్చుకోలేదే, ఈ జన్మలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో మరి?” అని చీవాట్లు పెట్టడానికి తిమ్మునగారీ కావ్యం బ్రాశారట. ఇందులో కొంత సత్యం ఉండవచ్చు. తిమ్మనగారు అమ్మ తెచ్చిన విద్వాంసులు కాకపోయినా అమ్మమెచ్చిన సత్కవులు కాకపోరు. రాణివాసంవారికి వచ్చిన కష్టాన్ని తప్పించడానికి కలం పట్టుకొని ఉంటారు. రాయలవారు అడగాలేదు; కొలువులోనికి పిలిచి చేతిలో తాంబూలం పెట్టనూలేదు.

74 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అయినా తిమ్మనగారు ఈ కావ్యాన్ని వ్రాసి అర్జెంటుగా అంకితం ఇచ్చారు. కృత్యాది పద్యాలలో రాయలవారు అపర కృష్ణావతారమని ఇలా వర్ణించారు:

యాదవత్వమున సింహాసనస్థుడు గామి సింహాసనస్త్థుడై చెన్ను మెరయ

గొల్లయిల్లాండ్రతో గోడీగించుట జేసి పరకామినీసహోదరత జూప

మరి జరాసుతునకై మధురడించుటజేసి పరవర్గదుర్గముల్‌ బలిమిగొనగ

బారిజాతము నాసపడి పట్టి తెచ్చుట నౌదార్యమున దాని నడుగుపరుప

గోరితొలుమేన దనకైన కొదువ లెల్ల - మాన్చుకొనవచ్చి భువనైకమాన్యలీల

నవతరించిన కృష్ణుడౌననగ మించె - న రసవిభు కృష్ణ్ణూయభూనాయకుండు.

(పారిజాతాపహరణం, 1-71)

శ్రీకృష్ణునికి ఎనమండుగురు భార్యలు, అందరూ సమతాఖిమానులే! ద్వారకా నగరంలోని తోటలలో, కావలసిన తీరున నిర్మించిన కొండచరియలలోని తోటలలో, ఏటి ఒడ్డున నున్న పొదరిళ్ళలో, జలకేళి చేసే నదుల తీరాన కట్టిన మణిమయ సౌధాలలో ఏ వేళలో ఏ భార్మ ఎటువంటి సరసం కోరుకొంటే, ఆ వేళలో, ఆ తీరున ఆ భార్యతో మాయాకల్పనచాతురితో కృష్ణుడు వినోదించేవాడు. అయితే ఆ భార్యలలో ఇద్దరు తాము అందరికన్నా అధికులమనుకొనేవారు. కులము, రూపము, మగని కూరిమి నాకే ఉందని ఇవతల రుక్సిణీ, అవతల సత్యభామా గొప్పలు చెప్పుకొనడంవల్ల వాళ్ళ మధ్య రవరవలు పొడమాయి. ఈ పరిస్థితిలో ఒకనాడు కృష్ణుడు రుక్మిణీదేవి యింటికి వచ్చి ఏకాంతంలో కొంతమంది అందమైన పరిచారికలు పరిచర్యలు చేస్తూ ఉంటే చంద్రకాంత శిలావేదికమీద కూర్చొని అత్యంత వినోదకేళితో జూదం ఆడడం మొదలు పెట్టాడు. ఇది తిమ్మనగారు పారిజాతాపహరణంలో పాత్రలను పరిచయం చేసిన తీరు.

మిగతా కవులు ఇంత సూటిగా కథారంగంమీదకు పాత్రలను ప్రవేశపెట్టరు. పురాన్ని వర్టించి ఆ వూరి సానివాడలో విహరించి, కథానాయకుని గుణగణాలు జాబితాగా చెప్పి, అతని ఎనమండుగురు భార్యలను పేర్కొని, వీలైతీ వాళ్లను నఖశిఖపర్యంతరం వర్జించి ఆ తరువాత ఒక్కొక్క భార్యతో కృష్ణుడు ఎలా భోగించేవాడో సవిస్తరంగా చెప్పి ముచ్చట తీర్చుకొని అసలు కథ ఎత్తుకొనేవారు. పాండిత్య ప్రకర్ష్టా కల్చనానైపుణ్యం ప్రదర్శించడానికి కాక వేరీ ప్రయోజనం కోరి వ్రాసిన పుస్తకం కాబట్టీ తిమ్మనగారు తిన్నగా కథలోనికి దూకారు. నాటకంలాగా కావ్యాన్ని వ్రాశారు.

తెర ఎత్తగానే రుక్కిణి యింట జూదమాడుతున్న కృష్ణుడు కనబడతాడు. అతడు నిజానికి తన వలపుతో జూదమాడుతున్నాడు. దీని పరిణామం విషమిస్తుందని తెలిసే ఆడుతున్నాడు. ఆ సమయంలో అక్కడికి నారడుడు ఆకస్మికంగా వచ్చినట్టు వచ్చాడు. కృష్ణుడు ధర్మపత్నీసమేతంగా అతిథ్యం ఇచ్చాడు. రుక్కిణి కనుసన్న చేసింది. పరిచారికలు రత్నసింహాసనం వేశారు. “మీ రాకవల్ల కృతార్థుడనైనాను. నామీద తమరు అకారణంగా దయ జూపిస్తున్నారు' అని కృష్ణుడు వినయం నటించాడు. నారదుడు “స్వామీ, అలా అనడం భావ్యమా' అని చెప్పి, అప్పటిదాకా శ్రీకృష్ణుడెత్తిన అవతారాలను ఒక్క సీసంలో దబ్బున ముగించి తొందరగా రెండు కందపద్యాలలో నిన్ను నేను పాగడగలనా? ద్వారక

నంది తిమ్మన 75 వైఠుంఠం. ఈ రుక్మిణి లక్ష్మీదేవి. మీరిద్దరూ ఉండబట్టే ఇక్కడికి తరచు వస్తున్నాను అని చెప్పి మొగ్గవిడుస్తూ ఉంటే ఆనాడే కోసిన పారిజాత పుష్పాన్ని మిన్నేటి పసిడినెత్తమ్మి చిగురుటాకులో పొదివి ఇచ్చాడు. కృష్ణునికి ఆశ్చర్యం వేసింది. పువ్వు తీసుకొని కృష్ణుడు రుక్కిణివంక చూసినా సత్యభామను తలచుకొన్నాడు.

ఇది రుక్కిణికిస్తే సత్యభామ ఏమనుకుంటుందో! ఇక్కడ పుచ్చుకొన్నది అక్కడకు పంపిస్తే ఈ రుక్మిణి ఏమనుకుంటుందో! జౌనులే. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది ఇంకొకరికి పంపకూడదు అని రుక్సిణికే ఇచ్చాడు. ఆమె తీసుకొని నారదునికి మొక్కి కొప్పులో

_ పెట్టుకుంది. అర్ధనారీశ్చరమూర్తిలో గౌరమ్మ సిగపూవుగా లేతజాబిల్లి తురుముకొన్నట్టు

ముక్కుతిమ్మనగారు ముద్దుపలుకుతో వర్ణిస్తున్నారు. వినండి:

మగమీల నగజాలు తెగ గీలుకొనువాలుగనుగవ కొకవింత కాంతి యొదవె

వలిజక్కువల పెక్కువలుదక్కువగనిక్కు చనుదోయికొకవింతఛాయదోచె

నెలతుమ్మెదల దిమ్ము వెలిజిమ్ము చెలువమ్ముగల వేణి కొకవింత నలుపుమీరె

నలచెందొపలవిందు చెలువెందువెదచిందు మొగమునకొక వింత జిగి దొలంకె

జక్కదనమున కొక వింత చక్కదనము

జవ్వనంబున కొకవింత జవ్వనంబు

విభ్రమంబున కొక వింత విభ్రమంబు

గలిగె నద్ధివ్యకుసుమంబు కతన సతికి. (పారిజా. 1-58)

ఆమె అందం ఇలాగ అతిశయించాక ఇంక కలహజ్వాల రాజపెట్టదలిచాడు. “అమ్మా, ఇది సమస్త లోకాలలో ఇప్పటికి నలుగురే ధరించారు. శచి, పార్వతి, లక్ష్మీ సరస్వతి తప్ప మరెవ్వరూ ముడవలేదు. నువ్వు హరికి బహిఃప్రాణానివి. నీవు ధరించబట్టి ఈ పువ్వు ధన్యమైంది. ఈ పుష్పం పరిమళం చెడదు; వాడదు; పరువం తప్పుదు; పరాగపరిభరితం అయి నిరంతరం జగదేకమనోహరంగా ఉంటుంది" అని చెప్పి నారదుడు ఇంకొంచెం వివరాలు చెప్పాడు:

అలినీలాలక। నీవు నీపతి రహస్యక్రీడ వర్తించువే

ళ లతాంతాయుధసంగరంబునకు నుల్లాసంబు గల్చించు ను

జ్ఞ్వలదీపాంకురమై రతిశ్రమ తనూసంజూతధారాళఫఘ

రృలవంబు లొౌలగింపగా సురటిర్టై రంజిల్లు నిచ్చాగతిన్‌. (పారి. 1-60)

నిత్య బ్రహ్మచారి అయినా సర్వజ్ఞుడు కనుక నారదుడు రహస్యక్రీడలను గురించి తూడ అఖిభాషించాడు. తరువాత “ఇన్నాళ్లూ సవతులందరిలో సత్యభామ కనుసన్నలందే హరి వశంవదుడై తిరుగుతాడని విన్నాం. కాని నీపట్లనే అనురాగమున్నవాడు, కాకపోతే ఈ పువ్వు మరెవ్వరికీ ఇవ్వక నీకెందుకిస్తాడు?" అని ప్రశ్నించాడు. అంతటితో ఊరుకుంటాడా? కాస్త ఎగసనదోశాడు.

76 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చక్కనిదాన నంచు నెలజవ్వని నంచు జగంబులోన బే రెక్కినదాన నంచు బతి యెంతయునా కమరక్తుడంచు దా నిక్కుచు విర్రవీగుచు గణింపదు కాంతల సత్య యింతకున్‌ స్రుక్కక యున్నై నీమహిమసూచిన బోటులు విన్నవించినన్‌? _ (పారిజా. 1-6) ఈ సంగతి చెలికత్తెలు చెప్తే సత్యభామ దుఃఖించకుండా ఉంటుందా అని కావాలనే నారదుడు అన్నాడు. చెలికత్తిలు చెప్పాలనే కోరాడు. వాళ్లు చెప్పడానికీ వెళ్లారు. రంగం మారింది. సత్యభామ తన శృంగారవనంలో నగరిపొంత చక్కగా తీర్చిదిద్దిన పూలతేనెల ఏటికాలవ ఒడ్డున చెంగల్వపుప్పాళ్లు నించిన చంద్రకాంత ఇిలావేదిక మీద చెలికత్తిలతో సరసగోష్టి చేస్తూ కృష్ణుని గుణాలు వర్షిస్తున్నది. తుమ్మెదల మోత. చిగురుల మధ్య బెదరిన కోకిలారావాలు, నీటి గాలులూ అమెకు పూర్వంలాగా హాయి పుట్టించడం లేదు. అందుచేత ఏదో అనుమానం వేసింది. వెంటనే తన భర్త మరో మగువను గూడి తనను మరిచిపోయే పనులేమిటి చేశాడో అని అమె సందేహించింది. అంతలో రుక్మిణి నగరులో జరిగిన విషయాలు చూసిన చెలికత్తి వచ్చింది. విషయాల్నీ పూసగుచ్చినట్టు ఏకరువు పెట్టింది. సత్యభామ వింది. వేటువడ్డ ఉరగాంగనలాగ, నేయిపోస్తే ' భగ్గని దరికొన్న హుతాశన కీలలాగా లేచి, కళ్లు ఎర్రపడగా, రుద్ధకంఠంతో “ఏమిటీ? నారదుడు అలా అన్నాడా? ఆ మాటలు గోపికావల్లభుడు చెవియొగ్గి విన్నాడా? రుక్కిణేమంది? చెప్పవే, ఇంకెందుకు మొహమాటం”, అంది. అన్నదేగాని చెలికత్తెను చెప్పనివ్వలేదు. “మహా గొప్ప పువ్వని పొగడుతూ నారదుడు అచ్చుతునికి కానుక యిస్తే ఇవ్వొచ్చు. దానిని ఆయన తన కిష్టమైన వాళ్లకు ఇస్తే యిచ్చుకోనీ, మధ్య మాపేరెత్తవలసిన అవసరం ఆ మాయదారి మునికేం వచ్చింది?” అని సత్యభామ మండిపడింది. అంతలో సమాధానం చెప్పుకొంది. “ముని ఏం చేశాడులే. రుక్కిణిని తిట్టి ప్రయోజనం లేదు. ధూర్తగోపాలుడు చేసినదాన్నే చెప్పుకోవాలి. ప్రాణానికి ప్రాణంలాంటి మగడు ఇలా చేస్తే మనస్సు మండదా?*' అనుకొంది. చెలికత్తెలతో ఆ సాద వెళ్లబోసుకుంది. ధనమిచ్చి పుచ్చుకొన్నను - మనమున నోర్వంగవచ్చు మగ డింతులకున్‌ జనవిచ్చి పుచ్చుకొన్నను-మనవచ్చునె యింక నేటి మాటలు చెలియా! (పారిజా.1-97) పతి మేర తప్పితే కులకాంతలకు వేరుగతి లేదనుకొంది. 15 పద్యాలలో (1-5 నుంచి 97 దాకా) తిమ్మనగారు సత్యభామ కోపాన్ని ప్రబ్వలింపజేశారు. అంతతో సత్యభామ ఈ రంగం నుంచి నిష్క్రమించింది. ఎలాగ? పచ్చని చందనపు వృక్షం తొగర్రలోకి ఆడపాములాగా, కోపగ్భృహం చెట్టుతొర్రలాగా చీకటిగానే ఉంటుంది. అలిగిన సత్యభామను తిమ్మనగారు ఇలా వర్ణించారు.

నంది తిమ్మన 77

మాసిన చీరగట్టుకొని మౌనముతోడ నిరస్తభూషయ్రై

వాసెనకట్టు గట్టి నిడువాలిక కస్తురి పట్టు వెట్టి లో

గాసిలి చీకటింటి కడకంకటిపై జలదాంతచంద్రరే

ఖాసదృశాంగియై పారలె గాడమనో జవిషాదవేదనన్‌. (పారి. 1-99)

తలకట్టుకొని పడుకొన్నా ఆమెకు తలకుమించిన మోహం పుట్టుకొచ్చింది. చెమట పట్టింది. మనసు వెలవెలపోయింది. అమె కొంచెం కళ్లు తెరుస్తుంది, నవ్వుతుంది. తల ఊపుతుంది. పానుపుమీద పడుతుంది, లేస్తుంది. ప్రణయకోపంలో వచ్చిన మదనతాపం అటువంటిది మరిః ఇక్కడీ దృశ్యంమీద తిమ్మనగారు తెరదించారు.

తరువాత ఒక చిన్న ప్రవేశకం. తాను ఆడిన జూదపుపర్భవసానం తనకు తెలుసు. కృష్ణుడు నారదుని దగ్గిర ప్రద్యుమ్నుని కూర్చోపెట్టి సత్య గృహానికి బయలుదేరాడు. ఆగాలమీద, మేఘాలమీద రథం తోలాడు. సత్యనగరు చిన్నబోయింది. నిశ్శబ్దంగా ఉంది. కృష్ణయ్య క్రమంగా కోపగృహానికి వెళ్లాడు. దారిలో కొందరు చెలికత్తెలతో మంతనాలాడీ, కొందరిని వాడిచూపులతో, కొందరిని చేతిసన్నలతో మంచి చేసుకొన్నాక మధ్యందిన భానుమండలకరావళి హావళి వాడియున్న తీగలాగ ఉన్న సత్యను చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత

ఈ లలితాంగిచంద మొకయించుక చూచెద నంచు ధూర్తగో

పాలుడు తాలవృంత మొక భామిని సత్యపిరుంద నుండి మం

దాలసలీలమై విసర నాదట గైకొని వీచె దద్వపుః

కీలితపంచసాయక తిఖిం దరికొల్పుచు నున్న కైవడీన్‌. (పారి. 1-109)

చెలికత్తె చేతిలోని విసనకర్రను తీసికొని మాయకృష్ణయ్య విసరడం తాపం తగ్గించడానికి కాదు, కోపం హెచ్చించడానికే. ఆయనలా విసరడం మొదలుపెట్టేసరికి ఆ గాలికి పారిజాతపరిమళాలు వీచాయి. రుక్మిణి యింటనున్నప్పుడు ఆ సువాసన అతని ఒంటికి అంటుకొని ఉంది. ఈ కొత్త తావి వాసన వేయగానే ముసుగు వీసి సత్య ఏకాంత గృహంలో నాలుగుపక్కలా చూచింది. భర్తను చూచి బాష్ట్పాకళికాతరళీకృతలోచన అయింది. మళ్లా తలవంచుకొని ముసుగు పెట్టుకొంది. నిట్టూర్చింది, అప్పుడు కృష్ణుడు ఏమీ తెలియనట్టు ఇలా అన్నాడు:

మన మరయం దలంచి యొక మార్గము పన్నితో నవ్వులాటకో

నను వెరపించెదో యకట నాయెడ నిక్కము దప్పు గల్గెనో

వనజదళాయతాక్షి! పగవాడనె నన్నిటు లేల చూడ వొ

క్క నిమిషమైన నీవు దయ గనానకుండిన నిల్వనేర్తునే (పారి. 1-116) అనునయించబోయాడు. నీ తియ్యని అధరామృతం, నీ బిగికౌగిలి లేక తపించే నన్ను కొంచెం దయచూడు అని కొంగు పట్టుకొన్నాడు. ఆమె చేతిలోని లీలారవిందంతో కొట్టబోయినట్టు బెదిరించింది. తప్పుచేసిన మగవాడు పట్టుకోవలసినది కొంగుకాదు, కాళ్ళు అని హెచ్చరిక చేసినట్టు కనిపించింది కాబోలు. కృష్ణుడు వెంటనే పాఠం నేర్చుకొన్నాడు.

78 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

పాటలగంధి చిత్తమున బాటిలు కోపభరంబు దీర్చ నె

ప్పాటను బాటుగామి మృదుపల్లవకోమలతత్పదద్వయీ

పాటలకాంతి మైళిమణిపంక్తికి వన్నియపెట్ట నాజగ

న్నాటకసూత్రధారి యద్దునందను డర్మిలి మొక్కె, మైక్కినన్‌. (పారిజా.1-120) అతడు కాళ్ళమీద పడితేపడ్డాడు, అమె ఊరుకుంటుందా?

జలజాతాసనవాసవాదిసురపూజాభాజనంబై తన

ర్చు లతాంతాయుధు కన్నతండ్రిశిర మచ్చో వామపాదంబునం

దొలగంద్రోచె లతాంగి, యట్లయగు; నాధు త్నేరము ల్సేయ బే

రలుకం జెందినయట్టి కాంత లుచితవ్యాపారము ల్నేర్తురే? (పారిజా. 1-121)

నిజమేః కోపంలో మగవాళ్లకే ఒళ్లు తెలియదు. ప్రణయకోపంలో ఆడువారికీ తెలుస్తుందా? అలా తన్నినప్పుడు రసికుడు తప్పు పట్టుకోడు. ఉద్దీపితమన్మథరాజ్యం ప్రాప్తించించనుకుంటాడు. కృష్ణుడు అలాగే అనుకొన్నాడు.

నను భవదీయదాసుని మనంబున నెయ్యపుగిన్క బూని తా

చినయది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ

త్తనుపులకా గ్రకంటకవితానము దాకిన నొచ్చు నంచు నే

ననియెద నల్క మానవుకదా యికనైన నరాళకుంతలా! (పారి. 1-123)

ఈ మూటలు విన్నాక సత్య లేచింది. ఒంటిమీద బట్టలు సరిగ్గా లేవు. సగంసగం మేను కనబడుతూంది. కొప్పు ఊడింది. ఆ ముడి వృథాగా దోపుకొంటూ చనుకట్టుమీద పైటచెంగు కప్పుకొంటూ చిరుచెమట కమ్మిన మొగంతో ఓరచూపులు చూస్తూ, పెదవి అదురుతూ ఉంటే -

ఈనయగారపుం బ్రియము లీ వస లీమొగమిచ్చమాట లే

లా నిన్ను నమ్మియుండిన ఫలం బిదె తోడన కల్లె నాకు నీ

యానసుమీ ననుం జెనకి యారడివెట్టిన నవ్వువారలం

గాన వెరుంగునే పఘులకాపరిభావజమర్శకర్మముల్‌: (పారిజా. 1-125)

గొడ్డు తోలుకొనేవాడికి శ్రేరసం ఏం తెలుస్తుంది? కృష్ణదేవరాయలవారు కూడా యాదవాన్వయంలోనే జననం పొందారని తిమ్మనగారు మొదటే చెప్పి పునాది వేశారు (పారి.1-18). రాయలవారిని భుజాలు తడుముకోమని తిమ్మనగారు ఈ+* పద్యంలో కావాలనే ఈ మాట బిగించారు కాబోలు. సత్యభామ అంతటితో ఊరుకోలేదు. “పలుపోకల మాయలు నీకు వెన్నతో పెట్టిన వంది. పారిజాత పరిమళం నాకు ప్రకటించి నన్ను వేళాకోళం చేయాలని వచ్చావంది.

మానంబె తొడవు సతులకు-మానమ ప్రాణాధికంబు మాన మఖిలస

న్మానములకు మూలంబగు-మానరహితమైన బ్రతుకు మానిని కేలా?

(పారిజా. 1-129)

నంది తిమ్మన 79

ఆమె అఖిమానవతి. లోకంలో అందరాడువారూ మొగుడు కొట్టినందుకు ఏడవరు. తోడికోడళ్ళు దెప్పినందుకు ఏడుస్తారు. సత్య అలాంటిది కాదు; మొగుణ్ణీ కొట్టినందుకు కాక తోడికోడళ్ళలో చులకనైనందుకు బాధపడుతుంది. “అత్తగారి ముఖం ఎలా చూస్తాను? సిగ్గసిగ్గు తోడికోడళ్లు నవ్వకముందే ఏమిటో తేల్చుకొంటాను. ఆ తరువాత నువ్వు సుఖంగా ఉండవచ్చు" అంది.

ఈసున పుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే

గాసిలి యేడ్చె బ్రాణవిభు కట్టిదుటన్‌ లలితాంగి పంకజ

శ్రీసఖమైన మోముపయి జేల చెరంగిడీ బాలపల్లవ

గ్రాసకషాయకంఠ కలకంఠవధూకలకాకలీధ్వనిన్‌. (పారిజూ. 1-13)

ముక్కుతిమ్మనగారు ముద్దుముద్దుగా ఏడిపించారు. ప్రణయకోపంతో చెయ్యి విదిలించుకొని, కళ్లెర్రచేసి, తిట్టవలసిన నాలుగూ తిట్టి పెట్టవలసిన చీవాట్లూ పెట్టాక ఆడది ఆఖరు ఆయుధం ఉపయోగించి బావురుమంటుంది. అది లైన్‌క్రియర్‌ సిగ్నల్‌ మగవాడు వెంటనే నిండు కౌగిలిలో పాదివిపట్టుకొని బుజ్జగ్గిస్తే అలుక తీరుతుంది. కృష్ణుడు అయడే చేశాడు.

ఆ రమణీలలామ మదినంటిన కోపభరంబు నిల్ప గా

నేరక నెవ్వగం బొగుల నీరజనాభుడు నిండుకౌగిటం

జేరిచి బుజ్జగించి నునుజెక్కుల జాలుకొనంగ జారు క

న్నీరు కరంబునం దుడీచి నెయ్యము దియ్యము దోప నిట్లనున్‌. (పారిజా. 1-134)

“ఇంద్రుడు యుద్దానికి వచ్చినాసరే పారిజాతాన్ని నీకు తీసుకువచ్చి ఇస్తాను. నీ వెరటిచెట్టుగా ఆ వృక్షాన్ని నాటుతాను” అని బాస చేశాడు. నీలమేఘశ్యాముని ప్రతిజ్ఞాగర్జన విన్న సత్యభామ కడీమిచెట్టులాగా వికసించింది. అమె చెలికత్తిలు మయూరికలలాగ చెలరేగారు.

ఇక్కడితో పారిజాతాపహరణంలో ప్రథమాశ్వాసం ముగిసింది. దీనితో పాటు చిమ్మనగారి ప్రయోజనం కూడా నెరవేరింది. “కావాలని కోపంతో తన్నిన తన్నే మన్నన - అని కృష్ణుడు భావించాడే, తమ దేవేరి కాలు పొరపాటున తగిలితే సర్టుకుపోలేరా?”” అని చిమ్మనగారు రాయలవారికి మెత్తని చీవాట్లు పెట్టారు. రాయలవారు గ్రహించుకొన్నారు. ఆయనకు ఇదేం కొత్త కథా? తాము 'సత్యవధూప్రీణనం' వ్రాయనే వ్రాశారు. ప్రణయ తోపంతోగాక గ్రీష్కతాపంతో వాడిపోయిన ప్రియురాలికి వట్టివేళ్ళ విసనకర్రతో విసరడం వారికి స్వానుభవమే. ఉత్తరోత్తరా ఇలా వర్ణించారు.

తీలగు కంతువెంబడిన తెమ్మెరలు గ్రవిదీస్తి కల్కి పా

తాళము బట్టుచుండదమతావులు మ్రుచ్చిలబట్టి యౌషధీ

పాలునకొప్పుగించె నన వైసురఖిశ్చసనంబు నించె గాం

తాలసవక్రసీమ విటులార్చు సుశీరపు దాళవృంతముల్‌ (ఆముక్త, 2-63)

80 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

పారిజాతాపహరణంలో తిమ్మనగారు నాయకునిచేత ప్రియురాలి కాళ్ళక్సు మొక్కించడం చూశాక అల్లసాని పెద్దనగారు కూడా ఆమోదించినట్టున్నారు. స్వరోచి పెళ్ళి వర్ణనలో సన్నాకల్లు ఇలా తొక్కించారు:

జగతీనాధవతంస మానతశిరస్సమ్మేళనన్‌ నెయ్యపుం

జగడంబుల్‌ ప్రియమొప్ప మాన్చెడుతరిం జంచత్కిరీటా గ్రర

త్నగణస్పర్భసహంబుగావలసియో నా గోర్కి దైవారున

మ్మగువం బాదతలంబువట్టి సనెకల్‌ మట్టించె మోదంబునన్‌. (మను. 5-93)

పెళ్ళినాటినుంచి ప్రియురాలి కాళ్ళకు మొక్కడం ప్రాక్టీసు చేయించాలని పారిజాతాపహరణం చదివాకనే పెద్దనగారికి స్ఫురించినట్టుంది. రాయలవారూ, పెద్దనగారూ ఇద్దరూ ఈ కావ్యంలోని మొదటి అఆశ్వాసాన్ని గొప్పగా మెచ్చుకొనే ఉంటారు. పారిజాతాపహరణంలో ఇంకో నాలుగాశ్వాసాలూ, మరో ౩72 గద్యపద్యాలు ఉన్నాయి. అయితే అవి మొదటి ఆశ్వాసంలోని 140 గద్యపద్యాలలోని శిల్పానికి వేలువిడిచిన బంధువులాగ కనబడతాయి. మిగతా ఆశ్వాసాల కథలో వీగువు లేదు.

రెండో అశ్వాసంలో కృష్ణుడు మాధ్యాహ్నికస్నానం చేస్తాడు; శృంగారం చేసుకొంటాడు, సత్యభామ దగ్గరకు నారదుడు వస్తాడు. అమ్మా, కృష్ణుడు యుద్దానికైనా నిన్ను విడిచివెళ్లగలడా? అలాంటివాణ్ణి అపార్థం చేసుకోకు అని చెప్పి “నీ మగడు నా దీవనచేత ఎలాంటి ఎలాంటి కార్యమైనా సాధించుకొంటాడు' అని చెప్తాడు. తరువాత సాయంకాలం అవుతుంది. చీకటి, చుక్కలు పొడుస్తాయి. చంద్రుడు ఉదయిస్తాడు. ఇక్కడ తిమ్మనగారు చక్కని చంద్రోదయ వర్ణన చేశారు.

అమరు ఆమృతాంబునిధిలోని యమృతరసము

వెండిచేరుల బటికంపు గుండ కట్టి

చేదుకొనియెదరో నాగ శీతరోచి

మెరుగుమెయితోన యల్లన మిన్ను వ్రాకె. (పారిజా. 2-40)

ఈ పద్యాన్నే ఒక సంకలనకర్త మరో గ్రంథంలోనిదని ఉదాహరించాడు. ఇది చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనంలోని పద్యం అని ఆంధ్రసాహిత్య పరిషత్తువారి ప్రతిలో ఉంది. పారిజాతాపహరణంలో చంద్రుణ్ణి వర్దించాక నాయికానాయకులు చంద్రికా విహారాలు చేస్తారు. వినోదక్రీడలో ఓలలాడి నిదురిస్తారు. తరువాత మేలుకొలుపులు. కృష్ణుని ప్రయాణ సన్నాహం. దారిలో కనబడే వింతలను వర్జించి భార్యకు చెప్పడం. మేరుపర్వతం దాటుతారు. ఈ ఆశ్వాసంలో కృష్తుడు గరుత్నంతునిపై ప్రయాణం చేస్తున్నా కథ చీమనడక నడుస్తుంది. స్పష్ట లాలి

తృతీయాశ్వాసంలోని తీరు చూస్తే ద్వితీయాశ్వాసంలోని కథే వేగంగా నడిచిందనిపిస్తుంది. స్వర్గంలో శ్రీకృష్ణుని ఇంద్రాదులు సివిసారు. రాజుగారు నాధా నానా నయానననయ న సక ననన సరకు... మే స ఓ విస్క్టృత ప్రబంధ పద్యావళి, చిమ్మపూడి అమరేశ్వరుడు - విశ్రమసేనం, అంధ్ర సాహిత్య పరిషత్‌

పత్రిక సంపుటి 87 సంచిక 4-6. పద్యం 41 ఈ పద్యాన్ని గంథనామం కర్తనామం తెలియరానివి అన్న శీర్షికలో వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రచురించారు ప్రబంధ రత్నావళి, పుట 157.

నంది తిమ్మన 81 ఊరేగుతున్నప్పుడు పురస్త్రీలు చూసినట్టు కృష్ణుణ్ణి అనిమిషకాంతలు చూస్తారు. ఈ సంగతి తిమ్మనగారు పది పద్యాలలో చెప్పారు. తరువాత శ్రీకృష్ణుడు తన తల్లి అదితిని చూస్తాడు. ఆమె దశావతారాల వర్ణన సుదీర్దంగా చేస్తుంది. గణసమకదండకంలో కృష్ణలీలలు వర్జిస్తుంది. తరువాత కృష్ణుడు వైజయంతానికి చేగుకాడు. రాయలవారి నివాసమందిరం మలయకూటాన్ని వర్డించినట్టు తిమ్మనగారు. వైజయంతిని పొడుగాటి వచనంలో వర్ణించారు. తరువాత ఆకాశగంగాతీర నందనవనంలోని విశేషాలపై శ్రీకృష్ణుడు ప్రత్యక్ష వాఖ్యానం చెప్తాడు. మూడో ఆశ్వాసం ముగుస్తుంది.

నాలుగో ఆశ్వాసంలో మొదట పారిజాతం దగ్గరకు చేరుతారు. కృష్ణుడు దానిని వర్ణిస్తాడు. అప్పడు సత్యభామ ఇలా అంటుందిః

నావుడు సత్యభామ నిజనాధున కిట్లను నేల తామసం

వీవిబుధా ధినాయక మహీరుహముం బెకలించి లోకసం

భావితమైన నీపలుకుబంతము నెల్ల మదీయగేహకే

భీవనవాటి వేడుక దలిర్చగ నిల్చుము జీవిశేశ్వరా. (పారిజా. 4-11)

వెంటనే అది పట్టుకుపోతీ ఎలాగ ఇంకా బోలెడు పద్యాలలో పుష్పాపచయం, జలక్రీడలు వర్దించాలి. 11-వ పద్యంలో సత్యభామ 'ఏల తామసం' అంది. 50-వ పద్యంలోగాని పారిజాతాపహరణం జరుగలేదు. స్వర్గంలోని కావలివాళ్లు ఇది తగునా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సత్యభామ జవాబు చెప్పింది. ఆమె ముఖంపై చిరునవ్వు అంకురించింది. జారిన కొంగూ, వాడీన కొప్పూ సవరించుకుంటూ ఇలా చెప్పింది:

వినుడు సురేశ్చ్వరు వనపాలకులు! వార్థి బొడమిన ఈ దివ్యృభూరుహమున

కిందాణి యెవ్వతె? ఇంద్రుండు నెవ్వడు? తోడి యిందిరను, గౌస్తుభము నెవ్వ

డధిపుడై ధరియించె నతడె చేకొనుగాక తెకతీర యిది యేమి యొకరి సొమ్మె

యిదె నాదు విభునిచే నీవదాన్యనగంబు నొడియించుకొని యేగుచున్నదాన

బలుకు లేటికి దా వీరపత్నియేని

మీశచీదేవి తనదు ప్రాణేశుడైన

మఘవు నిట బంపి సత్యభామావిధేయు

వలన మరలంగగొనుటెపో వాసితనము. (పారిజా. 4-59)

తన భర్త తనకు విధేయుడని అతని సమక్షంలోనే చెప్పి “బస్తీమే సవాల్‌ అని సత్య ప్రకటించింది. వనపాలకులు ఈ మాటలు శచీవిధేయునికి చెప్పడానికి వెళ్లారు. చతుర్థాశ్వాసంలో యుద్ధప్రయత్నాలు మొదలవుతాయి.

పంచమాశ్వాసంలో ఇంద్రోపేంద్రుల యుద్ధం 38 పద్యాలలో వర్ణన. తరువాత క్రిందపడ్డ ఇంద్రుణ్ణి కృష్ణుడు లేవనెత్తుతాడు. నీ తప్పేం లేదు. ఏదో నీ మరదలు కావాలంటే చెట్టుకోసం వచ్చాను. నీ వజ్రాయుధం నువ్వు తీసుకో. నీ సొమ్ము నాకెందుకు?”' అన్నాడు. దానికి ఇంద్రుడీలా జవాబు చెప్పాడు.

82 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

సామ్మన నెద్ది యేననగ సొమ్మున కెవ్వడ గర్హ నీవు నీ

సా మ్మృఖిలప్రపంచమును శూరకులంబు నలంకరించు నీ

వమ్మహి నుండునంతకు ననన్యదురాపము పారిజాతభూ

జమ్మును నుండు నన్న వికసన్ముఖుడై హరి వీడుకొల్చుచున్‌. _ (పారిజా. 5-40)

ఇంత జ్ఞానముంటే అంత యుద్ధం ఎందుకో! పారిజాతంతో కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. ఆ చెట్టుమహిమ వల్ల చెవిటివాళ్లు వినడం మొదలుపెట్టారు. గుడ్డివాళ్లకు కళ్లు వచ్చాయి. కుంటివాళ్లు నడవసాగారు. పారిజూతాన్ని ప్రతిష్టించాక నారదుడు వచ్చి పుణ్యకవ్రతం ప్రతిపాదించాడు. సత్యభామ ఆ నోము నోచింది. కృష్ణ్ణాయల దేవేరులలో ఎవరో ఒకరు చేసిన వ్రతంలాగా దానిని తిమ్మనగారు వర్ణించారు. నోమునోచి సత్యభామ నారదునికే భర్హను దానం చేసింది. ఆ జడదారి కృష్ణునిచేత పనులు చేయించుకొన్నాడు.

మేళవించినవి సుమ్మీ దీని మెట్లని మాంసలాంసంబున మహతి జేర్చి

మిన్నేటి జలము సుమ్మీ తొలంకెడు నని డాచేత మణికమండలు వొసంగి

యిది జపోచితము సుమ్మీ జతనం బని వలచేత బద్మాక్షవలయ మిచ్చి

యీశాను డీచ్చె జుమ్మీ మాకు నిది యనిశార్డూల చర్మంబు జంక జొనిపి

పొమ్ముపొమ్మని యొకకొంతపోవబోవ

రమ్మురమ్మని మరల చేరంగవీలిచి

కపటనటనాపరుండైన కంసవైరి

బరమముని నవ్వుటాలకు బనులుగొనియె. (పారిజూ. 5-86)

ఈ నవ్వులాట కొద్దిసేపే. వెంటనే చతురవాచాఫ్రాొడితో ఒక పాదభమకం (5-93), ఒక గోమూత్రికాబంధం (5-94), నాగబంధం (5-95), ఛురికాబంధం (5-%), చత్రబంధం (5-97), ద్వ్యక్షరికందం (5-98), ద్వాకంద త్రౌంచపదం (5-99,100), భుజగప్రయాతగర్చ స్రగ్విణీ (56-101) మొత్తం ఎనిమిది బంధచత్ర కవితలతో నారదుడు స్తుతించాడు. అతడు త్రికాలవేది కనుక చక్రబంధంలో 'కృష్ణరాయకృతి, “నంది తిమ్మకవి అనే పేర్లు వచ్చేటట్టు స్తుతించాడనుకోవాలి. ఈ చిత్రగతులలో స్తుతి అయ్యాక కథ కంచికి వెళ్లింది. ఈ కావ్యం చివర తిమ్మునగారిలా స్వవిషయం చెప్పుకొన్నారు.

కౌశికగోత్రవిఖ్యాతు డాపస్తంబసూత్రు డార్వేలపవిత్రకులుడు

నందిసింగామాత్యునకును దిమ్మాంబకుదనయుండు సకలవిద్యావివేక

చతురుడు మలయమారుతకవీంద్రునకు మేనల్లుండు కృష్ణరాయక్షితీశ

కరుణాసమా లబృఘనచతురంతయానమహా గ్రహారసన్మానయుతుడు

తిమ్మయార్యుండు శివపరాధీనమతి య

ఘోరశివగురుశిష్యుండు పారిజాత

పూరణ మను కావ్య మొనరించె నాంధ్రభాష

నాదివాకరతారా సుధాకరముగు (పారిజా. 5-10)

నంది తిమ్మన 83 ఈ పారిజాతాపహరణ కావ్యం కృతి ఇవ్వడానికి ముందే రాయలవారు తిమ్మనగారికి పల్లకీలు, అగ్రహారాలు ఇచ్చి' సన్మానించారని ఈ పద్యుంవల్ల తెలుస్తున్నది. పారిజాతాపహరణంలో రాయలవారి కళింగ విజయాన్ని సంపూర్ణంగా వర్ణించలేదు కాబట్టి ఇది క్రీ.శ 1519కి పూర్వం రచించినట్టు కనబడుతుంది. తిమ్మనగారికి రాయలవారి పరిచయం చిన్నప్పుడే ఏర్పడడానికి అస్కారం ఉంది. ఈయన మేనమామ మలయమారుతకవి నందిఘంటకవులలో ఘంటసింగయ్య. ఆ జంటకవులు కృష్ణరాయల వారి తండ్రీ నరసానాయకునికి వరాహపురాణం అంకితం ఇచ్చారు. అప్పటి నుంచీ బాలరాయలకు, చిన్నతిమ్మనగారికి మైత్రి ఉండేదేమో! రాయలవారు రాజ్యానికి వచ్చిన దగ్గిరనుంచీ తిమ్మనగారి కొలువులో ఉండేవారేమోనని రాయవాచకం వల్ల తెలుస్తున్నది. మొదటి జగడాన విజయం రాగానే దానిని ముక్కుతిమ్మనగారు వర్ణించారు. రాయలవారి అస్థానకవిగా ఆయన క్రీ.శ. 1522 దాకా ఉన్నారని చెప్పడానికి శాసన ప్రమాణం ఉంది. ఆ సంవత్సరం రాయలవారు గయలో వేయించిన జయశాసనం తిమ్మనగారే వ్రాశారు. దానిలో పారిజాతాపహరణంలోని ఈ క్రింది పద్యంకూడా ఉంది. తిరుమలదేవీవల్లభ - కరుణామయహృదయ రాజకంఠీరవ యీ శ్వరానరసభూపురందర - వరనందనబాసదప్పవరగండాంకా. (పారి. 2-105) ఈ గయ శాసనంవల్ల తిమ్మనగారు రాయల శాసనాలు వ్రాసే విద్యాధికారి పదవిలో ఉన్నారనిపిస్తుంది. కొన్ని సంస్కృత శాసనాలను వారు వ్రాశారేమో ఖావిపరిశోధన వల్ల ఏమైనా బయటపడవచ్చు. తిమ్మనగారు పారిజాతాపహరణాన్ని హరివంశం నుండి అనువదించారనీ, మూలంలోని కల్పనలు కొన్ని యథాతథంగా దించారనీ కొందరు పరిశోధకులు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. “మూలగ్రంథంలోని చాలాభాగముల ననుసరించియే ఈ కవివరుడు వ్రాసినను బెక్కుచోట్లలో గాథలను మార్చియు, సంక్షేపము చేసియు, బొత్తిగా వదలియు, లేని వర్ణనాదులు విస్తరించియు, పెంచియు, భేదములుగావించెను” అని పరిశీలకులు ఒప్పుకుంటున్నారు.5 ఇక అనువాదం ఏమిటి? ఆధారాన్ని తీసుకున్నాడు అనాలి. నిజానికి పుట్టపర్ది నారాయణాచార్యులుగారు చెప్పినట్టు “ప్రతిదానిని గీర్వాణముతో ముడిపెట్టనిది మనకు తృప్తిలేదు* తిమ్మన కావ్యానికి కన్నడంలో ఉన్న “హరికథాసారం అనే గ్రంథం మాతృక. అని నారాయణాచార్భులుగారు చెప్తున్నారు. కొన్ని కన్నడ పదాలను ఆయన మక్కికి మక్కి తెనిగించారట. అల్లసాని పెద్దనగారు 'హరికథాసారం' తెలుగులో. రచించినట్లు ౩. ఈ శాసనాన్ని మొదట కె.వి.హెచ్‌. శర్మగారు ఆంధ్రసాహిత్య పరిషత్‌ పత్రిక 47 సంపుటి, 2-3 సంచికలలో ప్రచురించారు. 1959 ఫిబ్రవరి నుండి కొన్ని నెలలు - 19% దాకా భారతిలో ఈ శాసనం గురించి చర్చలు జరిగాయి. ం 4. విజయనగరసా్రూజ్యమందలి ఆంధ్రవాజ్బయచరిత్ర, టేకుమళ్ల అచ్యుతరావుగారు, ద్విడీయభాగం, పుటు 2. క్‌. వౌ రిజాతాపహరణం, పరిమళోల్లాస వ్యాఖ్యతో, పీఠిక - నాగపూడి కుప్పుస్వామి అయ్య. 6. తెలుగు ఖభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, 3-వ సంపుటి. పుట ౪2.

84 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి లాక్షణికులు కొన్ని పద్యాలు ఉదాహరిస్తున్నారు. తెలుగులో పెద్దనగారూ, తిమ్మనగారూ వ్రాసిన కావ్యాలనుండి పద్యాలను కన్నడకవి అనువదించాడేమో పరిశోధించాలి.

ముక్కుతిమ్మనగారు పారిజాతాపహరణమొక్కటేగాక “వాణీవిలాసం' అనే ఇంకొక కావ్యం కూడా వ్రాశారట. ఈ సంగతి కూచిమంచి వెంకటరాయకవి వ్రాసిన కవి మనోరంజని అనే అప్పకవీయ విమర్శవల్ల తెలుస్తున్నదట.” ఇది నేడు అలభ్యం. దొరికితే పారిజాతంలాగే వీనులవిందు చేస్తుంది.

ఒకసారి తిమ్మనగారు తమ వీనులకు కొత్తకుండనాలు పెట్టుకొన్నారట. ఒక భట్టు ఆయన దర్శనం చేసుకొని ఇలా ప్రశంసించాడట.

మాకొలదిజానపదులకు - నీకవితాఠీవి యబ్బునే కూపనట

ద్చేకములకగగనధునీ-కీకరముల చెమ్మ? నందిసింగయతిమ్మా!

ఈ పద్యం వినగానే తిమ్మనగారు సంతోషించారు. ఇవ్వడానికింకేం దగ్గిరలేక చెవినున్న ఒక కుండలం తీసి భట్టును తిమ్మునగారు సత్కరించారు.

మరునాడు కొలువుకూటానికి ఒక్కకుండలంతోనే ఆయన వెళ్లారు. "ఏమిటి విశేషం?” అని రాయలవారు అడిగారట. తిమ్మనగారు జరిగినది మనవి చేశారు. ఆ పద్యాన్ని చదివారు.

రాయలవారు విని మూడవపాదంలో '“గగనధునీ అనే మాటను "నాకధునీ అని తూరిస్తే బాగుంటుందన్నారు. వెంటనే తిమ్మనగారు రెండో కుండలం తీసి రాయలవారికి బహూకరించారు.

మంచి పద్యాలు చెప్పడమేకాదు. మంచి పద్యాలను మెచ్చుకోగలగడం సత్కవిలక్షణం! లు 7. విజయనగరసామ్రూజ్యమందలి ఆంధ్రవాజ్బయ చరిత్ర 2-వ భాగంలో టేకుముళ తరావుగారు

చెప్పారు. పుట 218. న్‌ కే భా శ్లే ఆచ్భుతరావుగా

చరిగొండ ధర్మన్న

నాదెండ్ల గోపమంత్రి ఆంధ్ర రంగస్థలంమీద నేడు అశేషప్రచారం గల నాటకాలలో గయోపాఖ్యానం ఒకటి. ఒక్కటే ప్రాణంగా సంచరించిన కృష్ణార్ణునులు పరస్పరం పోరాడుకున్న ఈ కథ తొలిసారిగా కృష్ణదేవరాయల వారి కాలంలోనే కావ్యరూపాన మన సాహిత్యంలో వెలసింది. చరిగొండ దర్శన్న అనే కవి చిత్రభారతం అనే ఎనిమిది ఆశ్వాసాల కావ్యాన్ని వ్రాశాడు. ఇది గయోపాఖ్యానం కాదు గాని కృష్ణార్జునుల యుద్దాన్ని కథనం చేస్తుంది. ఇందులో కూడా అర్జునుడు అభయమివ్వడమే యుద్ధ కారణం. కృష్ణునివల్ల ప్రాణభయం ఫొందినవాడి పేరు చతుర్ధనుడు. అతడు ఒకనాడు వేటకు వెళ్లాడు. అక్కడ అతనికో గుర్రం కనబడింది. మెచ్చుకొని ఆ రాజు దానిని నగరుకు తీసుకుపోయాడు, ఒక మంచిరోజు చూసి దానిపై సవారి చేయపోయాడు. ఆ గుర్రం అతనితో ఎగిరి అన్ని లోకాలూ చూపించింది. తిరిగి అతణ్జి రాజ్యానికీ తీసుకు వస్తున్నప్పుడు ఆ గుజ్జపు నోటి నురుగు అర్హ్యమిస్తున్న కృష్ణుని చేతిలో పడీంది. అతడీ అపచారానికి కారణభూతుణ్ణి ముప్ఫుయిరోజుల్లో చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ చేస్తున్నపుడు నారదుడు అక్కడ ఉన్నాడు.

తాను అపచారం చేసినట్టుగాని, కృష్ణుడు శపథం చేసినట్టుగాని తెలియని చతుర్ధన మహారాజుకు నారదుడు ఈ సంగతులు కాస్తా చెవిని వేస్తాడు. చతుర్దనుడు భయపడి దేవేంద్రుణ్ణి రక్షించమంటాడు. అతడు కృష్ణుని చేతిలో ఓడిపోయాను. నేను రక్షించలేను' అంటాడు. పారిజాతాపహరణ కథ చెప్తాడు. చతుర్ధనుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. అతడు “నేను పూర్వం కృష్ణుని చేతిలో అపజయం పొందినవాణ్ణే అని ఉషాపరిణయం కథ చెప్తాడు. బ్రహ్మకూడా నిరాకరించి కథ చెప్తాడు. తనను కాపాడేవాడు ఎవడూ లేడే అని చతుర్ధనుడు పరితపిస్తున్న సమయరలో అతని రాజ్యప్రాంతాలలో ఉన్న అడవిలో అర్జునుడు వేటాడటానికి వస్తాడు. చతుర్ధనుడు తాను ఎవరిబారినుండి శరణు కోరుతున్నదీ చెప్పక అర్జునుణ్ణి వేడుకొంటాడు. అతడు అభయప్రదానం చేస్తాడు. పాండవులు భీష్ముణ్ణి సంప్రదించారు. ఆయన కౌరవ పాండవులను కలిపాడు. యాదవులతో ఈ నూట అయిదు గురు అన్నదమ్ములూ పద్ధెనిమిది రోజులు యుద్ధం చేశారు. కృష్ణుడు చక్రాయుధాన్ని ధరించి ఒక్క ధర్మరాజును తప్ప అందరినీ సంహరించాడు. ధర్మరాజు వద్దకు కృష్ణుడు వచ్చి “ఒక్క వరమిచ్చాను. ఎవర్ని ్రితికించమంటావు?' అన్నాడు. అతడు చతుర్ధనుడీనే బ్రతికించమన్నాడు. పాండవులు అభయమిచ్చిన వాడీని కాపాడలేకపోయారనే అపఖ్యాతి తప్పుతుంది అన్నాడు. కృష్ణుడు మెచ్చుకొని అందర్నీ బ్రతికించాడు.

ఈ కథ చిత్రంగా ఉంది కనుకనే దీనికి చరిగొండ ధర్మన్న చిత్రభారతం అని పేరు పెట్టాడు. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ కథ ప్రాక్తన రాజావళీ వేష చరితములలోన మిగుల నాశ్చర్య హేతువైన కథ.* ఇలావంతునకు శుకయోగి చెప్పిన

  1. చిత్రభారతం, 1-11
  2. చిత్రభారతం, 1-౫

86 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కథను నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడట. ఈ కథను విచిత్ర గతిలో అలంకారసరణి మీర, రసములు చిప్పిల, మెచ్చులొలుక, చరిగొండ ధర్మన రచించాడు. ఇతడు “శతలేఖినీ సురత్రాణ' విరుదం గలవాడు. తెలంగాణలోని చరిగొండ గ్రామంవాడు. ఇది మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఉంది ఆ కాలంలో దానిని చరిగొండసీమ అని పిలిచేవారు.

నేడు కరీంనగర్‌ జిల్లాలోని ఉన్న ధర్మపురికి చరిగొండ ధర్మన్న వెళ్లాడు. అక్కడి నరసింహస్వామికి భక్తుడైన ఎనుములపల్లి పెద్దనగారు ఆ రోజుల్లో చిత్తపుఖాన్‌ మంత్రిగా ఉండేవారు. ఆ ప్రభువు ఈ మంత్రికి బంగారు చామరాలు, పల్లకీలు, వెల్లగొడుగులు మొదలైన రాచమర్యాదలన్నీ ఇచ్చాడు. ఖాన్‌ అనే పేరు ఉండడంవల్ల ఇతడు మహమ్మదీయుడని పౌరపడడానికి ఆస్కారం ఉంది గాని చిత్తపుఖాన్‌ హిందువే. బోయకులంలో పుట్టి చిన్నప్పుడు పశువులు కాచుకొంటూ తిరిగిన నీతడు స్వప్రయోజకుడు. ఆనాటి తెలంగాణాలోని మహమ్మదీయుల కొలువులో చేరాడు. సైనికుడుగా చేరి 'హ్రథ్రు సేనాని అయ్యాడు. చిన్న జాగీరు, చిత్తపుఖాన్‌ అనే పేరు సంపాదించుకొన్నాడు. క్రీ.శ. 1480-85 ప్రాంతాలలో రాచకొండకు ఏలికగా ఉన్నాడు. ప్రజానురంజకుడయ్యాడు. క్రీ.శ. 1503లో కుతుబ్‌-ఉల్‌-ముల్క్‌ నుండి వరంగల్లును జయించి మహమ్మదీయులు పాడుచేసిన దేవాలయాలు బాగుచేయించి దైవాలను పునః ప్రతిష్ట చేయించాడు, పాకాల చెరువు మొదలైనవి త్రవ్వించాడు. దురదృష్టవశాత్తూ ఇతడు అట్టే కాలం ఓరుగల్లు పాలించలేకపోయాడు. క్రీ.శ. 1512లో కులీకుతుబ్‌షా ఇతణ్జి ఓడించాడు. అందుచేత చిత్తపుఖాన్‌ గజపతులను ఆశ్రయించాడు, కృష్ణదేవరాయలవారు కళింగ దండయాత్ర చేస్తున్నప్పుడు తన విలుకాండ్రతో ఇతడు విజయనగర సేనలను చీకాకు పెట్టాడు. ఈ యుద్ధంలోనే చిత్తపుఖాను మరణించాడేమో అని పరిశోధకులు భావిస్తున్నారు.

క్రీశ 1503-1512 మధ్య ఓరుగంటిని చిత్తపుఖాను పాలించాడు. అ కాలంలోనే ఎనుమలపల్లి వెద్దనమంత్రి ఉండేవాడు. ఈ వైభవాలను చరిగొండ ధర్మన్న తన చిత్రభారతంలో పేర్కొన్నాడు. కనుక ఈ కాలంలోనే చిత్రభారత రచన జరిగిందని చెప్పవచ్చు. ధర్మన్న నుతించిన తెలుగు కవులలో పిల్లలమర్రి పినవీరభద్రయ్య లేడు.

ఘనునన్న పార్యు దిక్కనసోమయాజుల వర్జించి వేములవాడ ఖీము

నాచనామాత్యు సోము శ్రీనాథు చిమ్మ-పూడి యమరేశు బమ్మెరపోతరాజు

శంభుదాసుహుళక్కి భాస్కరుడునాది- యైన సుకవులకెల్ల నెయ్యమున నెరిగి. 3. ఆంధ్రకవి తరంగిణి, 8వ సంపుటి, పుట 114 4. రాయవాచకం, 94-95 ర్‌, బుఖాను అను ప

రకా 1 ను సీతాపతిరా గౌనా అదిరాజు వీరభద్రరావుగారు, లక్ష్యణరాయ పరిళోధనమండలి

చరిగొండ ధర్మన్న, నాదెండ్ల గోపమంత్రి 87

ఇతడు సుకవులను నుతించాడుగాని పోతరాజుగారి లాగే కుకవుల ఊసే ఎత్తలేదు. ఇతడు తన కవిత్వం గురించి కృతిపతిచేత ఇలాగా చెప్పించాడు.

శతలేఖినృవధానపద్య రచనా సంధాసుర త్రాణచి

హ్నితనామా చరికొండ ధర్మసుకవీః నీ వాగ్విలాసంబులా

కితికంఠో జ్జ్వల జూటకోటరకుటీశీతాంశురేఖాసుధా

న్వితగంగాకనకాబ్ద నిర్చర రసావిర్బూత మాధుర్యముల్‌. (చిత్రభారతం, పీఠిక 18)

ఇది అతిశయోక్తి కాదు. ఇతడు వ్రాసిన ఎనిమిది ఆశ్వాసాలలో ఎక్కడ ఏ పద్యం తీసుకున్నా మధురంగానే ఉంటుంది. ప్రబంధ లక్షణాలకు కావలసిన అష్టాదశ వర్ణనలతో చిన్న కథను 1304 గద్యపద్యాలకు పెంచాడు. కృష్ణార్జునుల యుద్ధానికి కారణభూతుడైన చతుర్ధనుడు అసలు మూడో ఆశ్వాసంలోగాని రాడు. ప్రథమాశ్వాసం కథ ఎత్తుకోడానికే సరిపోయింది. తుల్యుడనే ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఏయే బుతువులు ఎలా ఉండగా తపస్సు చేసినదీ చెప్పి బుతు వర్ణనలు చేశాడు. ఆ బుషి తపస్సు చెడగొట్టడానికీ రంభ వచ్చింది. ఆమెను దేవేంద్రుడెలా పంపినదీ వివరించారు. ఆమెతో ఇతర అప్సరసలు వచ్చారు. మన్మథుడు సిబ్బందితో బయలుదేరాడు. వసంత వర్ణన, పుష్పాపచయం, జలకేళ, తడిబట్టలలో అందాలు, ఇలాగ వివిధ విషయాలతో గ్రంథం పెరిగింది. ముని చుట్టూ చేరిన అప్సరసలు వ్రాయగా రాని పలుకులు పలికారు" రంభ వీణ”వాయించ సాగింది. ముని కళ్లు తెరిచాడు. ఆమెను నఖశిఖ పర్యంతం వీక్షించాడు. సకలావయవాలూ ముష్ఫయి పద్యాలలో వర్ణించాడు. తనివితీరక ఇంకో పద్యంలో వితర్కించాడు.

ముని తన వలలో పడ్డాడని రంభ సంతోషించింది. స్వర్గసాఖ్యాలన్నిటికి తానే కారణం అని చెప్పింది. తనువులు నొచ్చిన పిదప పొందే బ్రహ్మానందకేళి కంటే ప్రయాసలేని వనితాసంగమం మిగుల సౌఖ్యం అంది.

నీవీ మోక్షము గోరి యోగముల నెంతే డస్సి డెందంబులో

నే వెంటం గొనరాని మీది యమృతం బేలావిచారిప?నా .

నీవీ మోక్షము జేసి యాగముల నెంతే నెమ్మదిండాయ నీ

వే వెంటన్‌ జనకుండ గల్గు నమృతం విచ్చోట నామోవిపైన్‌. (చిత్రభారతం, ౩-82)

ఆమె ఇలాగ అన్నాక మునికి కోపం వచ్చింది. ఆడ గుజ్తానివై పుట్టు అని శపించాడు. రంభ తల్లడిల్లింది.

విటుడు పలొత్తీన గటగటపడు మోవి యినుపకళ్లెములకు నెట్టు లోర్చు

గొనగోరు తాకిన గ్రొవ్వారు దేహంబు ఘనకశాహతుల నేగతి సహించు

వలిసపయ్యద మోప దలకెడి యంసంబుపక్కెర నేరీతి నిక్కితాల్చు

నొరులు పాదాంభోజయుగళిమోపగ నున్నయే నన్యులవహింపనెట్లునేర్తు వక యహ మయా 6. చిత్రభారతం, 3-3౦

86 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

సంతతము మందగమనాలసంబులైన

నాదు పాదంబు లిల పవనంబులీల

పర్వుబెట్టంగ జూలునే పరమయోగి వర్య నాకిట్టిదుర్దశ వలదు, మాన్సు!

(చిత్రభారతం, ౩-%)

నలకూబరుడంతటివాడు మత్పదాంభోరుహలాక్ష కుంకుము బొట్టుగ గైకొని ఎల్లవేళలా ఉంటాడే. నాకీయాడ గుగ్రపురూపు వచ్చిందా అని మొత్తుకుంది శాపవిమోచనం చెప్పమంది. చతుర్ధనుడనే రాజును సకలలోకాలూ తిప్పిన తరువాత నీకు విముక్తి కలుగుతుందని చెప్పాడు. అలాగే జరిగింది. అయితే రంభకు విముక్తి కలిగినా రాజు పీకలమీదకు వచ్చింది. అది అర్జునుణ్ణి చుట్టుకొంది. కృష్ణుడు మండిపడ్డాడు. “నాసహాయమ్ములేకున్న నరుడునరుడు నాసహాయంబు గలిగిన నరుడుహరుడు. (చిత్రభారతం, 6-1427)” అని కృష్ణుడు రుజువు చేశాడు. ధర్మన్న ఈ కృష్ణార్జునుల యుద్దాన్ని చుహాభారత సంగ్రామమంత విరివిగా వర్జించాడు. కురుపాండవులు మనుష వ్యూహాన్ని రచిస్తారు. యాదవులావలవ్యూహంలో ఎదుర్కొంటారు. ఒకనాడు వ్యూహాల్లో, వ్యూహాల్లో 'వ్యూహాలు పన్నుతారు. శకటాకారంబుగా మోహరంబు మీరంబన్ని యందు నంతర వ్యూహంబుగా పద్మవ్యూహంబు సమకట్టి, దాని మధ్య ప్రదేశంబున సూచీవ్యూహం బేర్చరచి పాండవులు యుద్ధం చేస్తారు. ఈ యుద్ధ వర్ణనలు మూలంలోనివో లేక ధర్మన్న స్వకపోలకల్పితాలో? ఇతనికి యుద్యాలేకాక వేట బాగా తెలుసు. చతుర్ధనుని వేట 32 గద్యపద్యాలలో వర్ణించాడు. మనుచరిత్రలో అల్లసాని పెద్దనగారు వర్ణించిన దాని దగ్గరో ఉంటుంది. ఎటొచ్చీ ఇది ముందు వ్రాశాడు పినవీరయ్య, నందిఘంట కవులు ఇది ఫ్యాషన్‌ చేసిపోయారు.,

అల్లసాని పెద్దనగారికి ముందే వేటను సవిస్తరంగా వరించిన ధర్మన్న, నంది తిమ్మనగారికంటే ముందుగా పారిజాతాపహరణం కూడా తన గ్రంధంలో సూచించాడు 26 గద్యపద్యాలలో ఇంద్రుడిచేత ఈ కథ చెప్పించాడు. అయితే ఇందులో నారదుడు పువ్వు తెచ్చి ఇవ్వడు. సత్యభామ అలగడం, కృష్ణుని కాలితో తన్నడం వగైరాలు లేవు నరకాసుర వధ తరువాత యకాయకిని స్వర్గానికి వెళ్లడం, అక్కడ శచీదేవి అవమానం చేయడం, సత్యభామ చిన్నబుచ్చుకోవడం ఉన్నాయి. కృష్ణుడు ఊరడిస్తాడు.

ఏమిటి కింత వంత తరశిక్షణ! చెప్పు మటన్న లేచి య

బ్బామిని చన్నుదోయిపయి పయ్యెదకొంగు దలంగి జార

నెమ్మా మరవాల్చి యూరువుల ముంగర ముత్యము గందనేడిచెం

గోమలనూతన స్వరము గ్రోలుచు గోయిల పిల్లయో యనన్‌. (చిత్రభారతం, 5-౫)

ముక్కుతిమ్మనగారీకన్నా ముందుగానే ఏడ్చినా, అంత ముద్దుగా ధర్మన్న ఏడ్వలేకపోయాడు. అయితే ఈ సత్యభామ కోపం వస్తే తల కట్లుకు పడుకోదు. చెంపమీద చెయ్యివేసుకుని ఆలోచిస్తుంది. శచీదేవి అవమానించాక సత్యభామ తన విడిడీ పోయింది.

చరిగొండ ధర్మన్న నాదెండ్ల గోపమంత్రి 89 ఈసును గోపము న్మది చహించి పులోమజ వేడిమాట క్రై గాసిలి మేన సొమ్ముడిపి కన్నుల గ్రమ్మెడు నీట జందనం బోసరిలంగజేసి శిర మొయ్యన పంచి కపోల పాళిపై జేసయకొల్పి యొక్క యెడ జింతిలుచుండెడు నంతలోపలన్‌ (చిత్రభారతం, 5-91) తెలుగుసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే సాహిత్య కల్పనలు కొంచెం ముందుగానే ఊహించిన చరికొండ ధర్మన్న కవిత్వం గజ్జెలగుర్రంలాగా కదను తొక్కుతుంది. వాస్తవానికి కీతడు మంచి గుల్డం, చక్కని కవిత్వం ఒక్కలాగే ఉంటాయి అంటాడు. పదముల చొప్పును వడీయొ-ప్పిదము నలంకారలక్ష్మి పేర్మియు ధారా స్పదభావము గల్లి శుభ- ప్రదమై హయమమరె సత్ర్రబంధమరీతిన్‌. (చిత్రభారతం, 3౩-160) ఈ సత్రబంధాన్ని రాయలవారి ప్రతికక్షి ఆశ్రితుని ఆశ్రితుడు బ్రాకాడు. అయికే ఇదే కృష్ణార్డున సంవాదాన్ని రాయలవారి ఆశ్రితుడు కూడా వ్రాశాడు. నేతు ప్రచారంలో ఉన్న కథలతో గయోపాఖ్యానాన్ని నాదెండ్ల గోపమంత్రి ద్విపదకావ్యంగా వ్రాశాడు. ఇతడు అప్పాజీ తిమ్మరుసయ్యగారి కడగొట్టు మేనల్లుడు. మొదట గత్తిదుర్గానికి పాలకుడుగా ఉండేవాడు. తరువాత కొండవీడు పాలించాడు. ఇతని అన్న అప్పనమంత్రికే మాదయ్యగారి మల్లన రాజేేఖరచరిత్ర అంకితం ఇచ్చాడు. నాదెండ్ల గోపమంత్రి సంస్కృత గ్రంథాలు చాలా చదువుకొన్నాడు. కృష్ణమిశ్రుడు రచించిన ప్రబోధచంద్రోదయం నాటకానికి చంద్రికా వ్యాఖ్యను గోపమంత్రి వ్రాశాడు. అందులో అవతారికలో తన అన్న అప్పమంత్రిని గురించి చెప్పాక, తన సంగతి ఇలా వ్రాసుకొన్నాడు. తస్యానుజస్తరుణ భాస్కరదివ్య తేజః నాదెండ్ల గోపసచివో నయమార్గవేత్తా చాణక్య భట్టిశివదేవయుగంధరాదీన్‌ యః పూర్వమంత్రి తిలకానపి ధిక్కరోతి.” (ప్రబోధ చంద్రోదయ వాఖ్యావతారిక, 10) ఇంతటి నయమార్గవేత్త కనుకనే తిమ్మరుసయ్యగారు కొండవీటి రక్షణ ఈతని భుజాలపై పెట్టారు. కృష్ణరాయల వారీ దుర్గాన్ని క్రీ.శ. 1515లో జయించారు. అప్పాజీ చేతిలో పెట్టారు. ఆయన మేనల్లుడిని పాలకునిగా చేశారు. నాదెండ్లవారి వంశకర్త విశ్వామిత్రుడు. మానికొండవీటిలో యజ్ఞం చేశాడట, అక్కడ రాఘవేశ్చరుని ఆలయం ఉంది. దానికి గోపమంత్రి ప్రాకార గోపురాలు కట్టించాడు. ఇది క్రీ.శ. 1520లో జరిగింది. ఈ నిర్మాణం జరిగాక ఆ దేవునికి అంకితంగా ఈ ద్వాపదకావ్యం గోపమంత్రి చెప్పాడు. అందుచేత దీని రచనాకాలం క్రీ.శ. 1520 తరువాతనే అని చెప్పవచ్చు. కప మక నస సనన వ పస సున ప ప 7. కృష్టార్దనసంవాదం, పీఠిక, పుట 29

తం సమగ్రాంధ్ర సాహిత్యం = రెండవ సంపుటి ఇందులో 1513 ద్విపద పాదాలున్నాయి. కల్పనలేవీ గొప్పగా లేకపోయినా కథనం సాఫీగా ఉంది. అన్నీ విరివిగా వర్జించాలనే ఉబలాటం ఎక్కడా లేదు. నుడీకారపు రుచులు ఉన్నాయి. ఈ గయోపాఖ్యానాన్ని గోపమంత్రి స్వయంగా కల్పించాడో, లేక ఏ పురాణంలో నుంచైనా తీసుకొన్నాడో తెలియదు. ఇందులో సుభద్రచేత కృష్ణుడు రాయబారం పంపించడం కూడా ఉంది. అమెను పంపిస్తూ “తేకువ గయుని బుత్తెమ్మను మట్లుగాకున్న మధువిందు కలహమౌననుము”' అంటాడు. చిన్న మాటలలో పెద్ద అర్థం ఇమిడింది. సుభద్ర అర్జునునితో ఇలా అంటుంది. ప్రాణప్రదంబైన పద్మాక్షు విడిచి - ప్రాజేశ గయుని చేపట్టిన మేలె బెదరి మీదెరుగక పేరోడ నిలిచి - పదరుబట్టిన నెట్టి పడువయ్యుజూడ ఎందును బెరటి చెట్టెవ్వర్‌కైన - మందుగా దను మాట మరి నిజంబయ్యె. (కృష్ణార్జున 678-632) సుభద్ర ఒకర్తే కాదు. ద్రౌపది కూడా ఇలాగే హితోపదేశం చేస్తుంది. ముంగొంగురత్నంబుముంగిటి బసిడి - తంగేటి జున్ను, రాధాభర్త మనకు నిటువంటి శౌరికి నేలనొకో నేడు - కటకటా మనమీద ఘటియిల్లె కినుక ఛాయయోగ్రహగతి చాలని వేళ - పాయని చుట్టాలు పగవారు గారె. (కృష్ణార్జున. 916-921) ఈ యుగంలో వెలసిన ఫ్రొడకావ్యాల ముందు గోపమంత్రి ద్వాపద వెలవెల పోవచ్చునుగాని మన సాహిత్యంలో వెలువడిన మొదటీ గయోపాఖ్యానం వ్రాసినందుకు అతడు స్మరణీయుడే అవుతాడు.

అల్లసాని పెద్దన

తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాలలో మనుచరిత్రను మొట్టమొదట లెక్కపెడతారు. ఆంధ్ర ప్రబంధ కవులలో ప్రథమ పూజ అల్లసాని పెద్దనగార్‌కే చేస్తారు. ఆదీ కవులు, కవిబహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు, నవీనగుణసనాథులు, కవిసార్వభౌములు మొదలైన ఆజానుబాహులెందరున్నా మన సాహితీ రంగంలో అందరికన్నా ఒక జానెడు ఎత్తుగా కనిపించే జూణ ఆంధ్ర కవితాపితామహుడే. దీనికి కారణం కృష్ణదేవరాయల వారు అందరికన్నా పెద్దపీట వేసి పెద్దనగారిని దానిమీద నిలబెట్టడం కానేకాదు. ఆయన సహజంగా ఉన్నతుడు, రాయలప్తారి పీట లేకపోయినా, జానెడు కాకపోతీ, బెత్తిడయినా ఎత్తుగా అల్లసాని పెద్దనగారు కనబడకపోరు. దానికి కారణం, ఆయనలో పూర్వకవుల శుభలక్షణాలన్నీ కేంద్రీకృతం అయాయి. నన్నయగారి ప్రసన్న కథాకలికార్థయుక్తీ, తిక్కనగారి సంభాషణశైలిలోనే పాత్రచిత్రణ, ఎర్రయగారి జౌచిత్యవంతమైన తెలుగు _ వాతావరణం, నాచన సోముని కొత్త చమక్కారాలూ, శ్రీనాథుని శయ్యాసాభాగ్య ప్రీతీ పెద్దనగారికి ఒక్కరూపున మూర్తీభవించి సాక్షాత్కరిస్తాయి. అందుకే రాయలవంటి వారు సహితం ఆయనకు జోహారు అన్నారు.

అల్లసాని పెద్దనగారు వాస్తవానికి ఎప్పుడు కృష్ణరాయల ఆస్థానంలో చేరారో చెప్పలేం. పెద్దనగారు రాయలవారి బాల్య గురువని కొందరు భావిస్తారు. అయితే ఈ ఊహకు ఆధారం కనబడదు. రాయలవారూ, పెద్దన గారూ నూత్న యౌవనంలో స్నేహితులు కావచ్చు. కాని వారికి గురుశిష్య సంబంధం ఉన్నట్టు కనిపించదు. రాయలవారి విద్యాగురువు ఎవరో నికరంగా చెప్పలేం. తిరుమల తాతాచార్యులవారు మత గురువులే. మఠ సంస్థాపకుడు. పెద్దనగారు మాత్రం తమకు శఠగోపయతీంద్రుల దయవల్ల చతుర్విధ కవిత్వాలూ అవ్బినవని చెప్పుకొన్నారు. క్రీ.శ.1512 నుండి 22 దాకా అహోవిలమఠానికి పాలకులుగా ఒక శఠగోపయతి ఉన్నారు. ఈయన ఆ మఠంలో సప్తమ పీఠాధిపతి, వీరు వాసంతికాపరిణయం అనే రూపకం వ్రాశారు. వారి వద్దనే పెద్దనగారు సాహిత్య శిక్షణ పొందారు. పీఠాధిపత్యం వహించడానికి ముందు శఠగోపయతి పూర్వాశ్రమంలో విద్యాదానం చేస్తూ వుండేవారనుకోవాలి. మఠమున్న అహో బిలక్షేత్రం పెద్దనగారి జన్మస్థానమైన కోకట గ్రామానికి ఐదారామడల చేరువలో ఉంది. నేడు కడప జిల్లాలో, జమ్మలమడుగు తాలూకాలో ఉన్న గండికోటవద్ద తోకఠటమనే గ్రామం ఉంది. అందులో అల్లసాని వారు కాపురము-డేవారు. ఈ గ్రామం కాశీరామేశ్వరాలకు పోయే ఘంటాపథం ప్రక్కన ఉంది.

పెద్దనగారు చిన్నప్పుడే అహోవిలం వెళ్ళి శరగోపయతికి శిష్యులై పురాణాలు, ఆగమాలు, ఇతిహాసాలు మొదలైనవాటిలో కథార్థాలను తెలుసుకొని ఉంటారు. ఆ మఠాధిపతి విద్యానిలయుడు. ఆశ, మధుర చిత్ర, విస్తర కవిత్వాల మర్మాలు

  1. విజయనగర సామ్రాజ్ఞ్యమందలి అంధ్రవాజ్బ్మయ చరిత్ర, 2-వ భాగం, టేకుమళ్ళ అచ్యుతరావు గారు,

పుట 114.

2 మనుచరిత్ర, 1-6

92 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తెలిసినవాడు. వాటిని పెద్దనగారికి శరగోపయతి విడమరిచి చెప్పి ఉంటాడు. ఈయన బోధవల్ల పెద్దనగారు భాషలో “అపరశేషభోగి' అయ్యారు. అనర్గళంగా అశుకవిత్వం చెప్పే విద్యను అలవర్చుకొన్న పెద్దనగారికి ఎక్కడకు వెళ్ళినా దిగ్భాజయమే. నూత్న యౌవనంలో ఆయన చంద్రగిరి వెళ్ళి బాలకృష్ణ్ణాయల పరిచయం ఏర్పరచుకొని ఉంటారు. రాయలవారు పట్టం కట్టుకొన్న వెంటనే మూడిళ్ళ తురకలతో ముమ్మరంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధభూమిలో రాయలవారితోపాటు ముక్కుతిమ్మన గారు, అల్లసాని పెద్దనగారు,' మాదయ్యగారి మల్లన వంటి కవులు ఉన్నారు!కి అప్పటికి పెద్దనగారు హరికథాసారమనే కృతిని రచించి తమ గురువు శఠగోపయతికో, యిష్టదైవానికో అంకితం ఇచ్చినట్టుంది. ఈ [గ్రంథం నేడు నష్టమైనా లాక్షణికులు ఉదాహరించిన కొన్ని పద్యాలు దక్కాయి. అందులో షష్ట్రంతంలాగ కనబడే ఈ పద్యం ఒకటి ఉంది. శరకోపయతికి ఖలతరు - కురారరూపమతికి శరగురుమతహృత్క ర్మఠనిరతికి జతురాగమ-పఠనాయతనియతికి యజపాధికభృతికిన్‌ (ఆనందరంగ ౩3-317) ఈ పద్యాన్ని కస్తూరి రంగకవి అఖండయతికి ఉదాహరణగా తన ఆనందరంగ రాట్బందంలో ఉదాహరించాడు. ఇది అల్లసాని పెద్దనగారి హరికధాసారంలోనిదని చెప్పాడు. ఇందులొ వటపత్రశాయిగా పవ్వశించిన నాటినుంచి బలరామావతారంలో ప్రలంబాసురుని సంహరించేదాకా హరికథలన్నీ ఉన్నాయి అనుకోవచ్చు. వటపత్ర శాయిని పెద్దనగారిలా వర్ణించారు : అదేవోత్తముడు సుధాం- భోధివటైకా గ్రిమ దళమున బాలుండై చేదోయిచేత దక్షిణ-పాదము గొని నోట జేసె బకపక నగుచున్‌. (ఆనందరంగ, ౩-66) ఈ పద్యాన్ని వర్గప్రాసానికి ఉదాహరణగా కస్తూరి రంగకవి ఉదాహరించాడు. ప్రలంబాసుర వధను ఇలా పెద్దనగారు వర్జించారు. = అంబరము వగుల నార్చి ప్ర-లంబాసురు డాగ్రహము వెలయ గదిరిన వే ళం బలరాముడు చేముసాలంబున వాని తల ద్రుంచె లావు మెరయగన్‌: (ఆనందరంగ. 3-42) ఈ క్రింది పద్యం అఆక్వాసాంత పద్యంలాగా ధ్వనిస్తోంది. లేకపోతే దైవం సాక్షాత్కరించినప్పుడు ఏ పాత్రయినా చెప్పినది కావచ్చు. శయధృతఫణివలయభవా- వ్యయవిహితవిశుద్ధసంవిదాత్మకమాయా మయనానావిధలీలో-దయ సదయకటాక్ష వైలతనానయాధ్యక్షా! 3౩. రాయవాచకం, పుట

అల్లసాని పెద్దన 93 ఈ హరికథాసారంలో కూడా కొద్దిగా శృంగారం ఉందేమో అని ఈ క్రిం పద్యంవల్ల అనుమానం కలుగుతూంది. " బాలరసాలకిసాలము - గ్రోలుచు పలికెడి పికంబకోయన జాలా జాలిపడియాన యతిమధు-రాలాపము లనియె నాదరణమున వినగన్‌. (ఆనందరంగ. 3౩-356) ఈ కావ్యంలో వీరస్వర్గ ప్రస్తావన ఉంది. చూడండి. తెంపరియై మదియింత చ-లింపక ననిలోన దెగియె నెవ్వ డతడు నై లింప సభనుండుననుడు - బ-దంపడీ యార్యులు వచింప దానిట్లనియెన్‌.

  • (ఆనందరంగ. ౩3-166) హరికథాసారంలో కూడా పెద్దనగారు హిమాలయ పుణ్యక్షేత్రాలు వర్షించినట్టు ఒక సీసపాదంవల్ల తెలుస్తోంది. త్రివర్గప్రాసానికి ఉదాహరణగా కస్తూరిరంగకవి దానిని ఉదాహరించాడు. ఇందులో 'ఆ త్రినేత్రుడు వనజాత దలాక్షుని గురించి తపముగైకొనిన చోటు' అని ఉంది. (ఆనందరంగ, ౩-78). ఇది మనుచరిత్ర రచించాక ముది మది తప్పినప్పుడు వ్రాసినది కాదు. చాలా తొలి రచన అని చెప్పవచ్చు. రాయలవారి ఆస్థానంలో చేరిన తరుహత చాలా సంవత్సరాలవరకు పెద్దనగారు ఏవో ఆశు పద్యాలు ఇష్టమొచ్చినప్పుడు చెప్పడమేగాని తీరుబాటుగా కూర్చుని కావ్యాలు బ్రాసినట్టు కనబడదు. ఆయన కృతి వ్రాయాలంటే బోలెడంత వాతావరణం కావాలి. నిరుపహతిస్థలంలో అడపా తడపా లోనున్న ప్రియురాలి దగ్గిరనుంచి కర్పూర తాంబూలం తెచ్చే దూతిక. ఆత్మకింపైన భోజనం, ఉయ్యాలమంచం, చెప్పిన పద్యం ఒప్పో తప్పో పోల్పుకో గలిగే రసజ్ఞులు, ఊహ తెలిసిన లేఖకులు, పాఠకులు ఉంటే గాని ఆయన రచించరు. ఈ సంగతి ఆయన చెప్పిన పద్యంవల్ల తెలుస్తూంది. నిరుపహతిస్థలంబు రమణజీప్రియదూతిక తెచ్చి యిచ్చు క ప్పురవిడె మాత్మ కింపయిన భోజన ముయ్యెలమంచ మొప్పు త ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్‌ దొరికినగాక యూరక కృతుల్‌ రచియింపు మటన్న శక్యమే?

" అయితే ఈ సాకు పద్యం చెప్పడానికి మనస్కరించనప్పుడు ఏకరువు పెట్టేదే. పెద్దనగారు యుద్ధభూమిలో సైతం పద్యాలు చెప్పినట్టు కనబడుతుంది. రాయవాచకంలో గ్రంథస్థం చేయలేదుగాని కృష్ణూాయలపై పెద్దనగారి చాటువులు కొన్ని ఉన్నాయి.

ఏపున కృష్ణరాయ జగతీశ్చరు ఖడ్గము మింటి మార్గమున్‌ జూపిన భానుమండలము జొచ్చి హుటాహుటి శత్రు లేగుచో రేపటి బాపనయ్యపగలింటి మహో గ్రపు జంగమయ్య యో మాపటి దాసరయ్య మముమన్ననచేయు మటందు రెంతయున్‌. (ఆనందరంగ. 3౩-276)

94 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఈ పద్యాన్ని అభేదయతికి (ర-ల మైత్రి ఉదాహరణగా కస్తూరిరంగకవి హిందువులైతే సూర్యబింబాన్ని చూసి ఏమనేదీ చెప్పారు. ఈ క్రింది పద్యంలో మరణించిన మహమ్మదీయ వీరులు ఏమంటారో చెప్పారు.

సమరక్షోణిని కృష్ణాయలభుజాశాతాసిచే బడ్డదు

ర్థమదోర్జండపుళిందకోటియవనవ్రాతంబు సప్తాశ్వ మా

ర్లమునన్‌ గాంచి నెబా సహోహరిహరం గాఖూబు ఘోడాకితే

తుముకీ బాయిలబాయి దేమలికి యందుర్శింటికిం బోవుచున్‌.

(చాటుపద్యమణిమంజరి, 1 పుట 158)

పెద్దనగారిటువంటి చతురవచోధనులు. రాయలవారికి హితులు. అందుచేత తరుచుగా ఇద్దరూ కలిసీ ఉండేవారు. మంచి కవిత్వం చెప్పడమేగాక మంత్రాంగంలో కూడా పెద్దనగారు పాల్గొంటూ ఉండేవారు. పెద్దనగారి సలహాలకో. సాహిత్యానికో మెచ్చిన రాయలవారు ఒక అగ్రహారం దానం చేశారు. అది అల్లసాని పెద్దనగారి జన్మస్థల కోకటమే. రాయలవారితో పాటు పెద్దనగారు క్రీ.శ. 1518లో కళింగ దండయాత్రలో పాలొన్నారు. అది బహుధాన్యనామ సంవత్సరం. ఆయేడు వైశాఖ పూర్ణిమనాడు చంద్రగ్రహణం వచ్చింది. పెద్దనగారు బెజవాడలో ఉన్నారు. ఇటువంటి పుణ్యకాలంలో ఏదీ దానం చేయకపోతే ఎలాగ? అని పెద్దనగారు బెజవాడ మల్లికార్జున దేవుని సన్నిధిలో సహిరణ్యోదక దానధారాపూర్వకంగా తమ అగ్రహారంలోని చేనులు కోకట సకలనాధుని లింగానికి ధారపోశారు. ఈ దానాన్ని శాసనంగా రాగిరేకులపై చెక్కించారు.

ఆ సంవత్సరమే కార్తీకమాసంలో ఉత్గాన ద్వాదశి పుణ్యకాలంలో అల్లసాని పెద్దనగారు స్వగ్రామంలోని మరికొంత చేను దానం చేశారు. ఈసారి చెన్నకేశవులకు ఇచ్చారు. ఆ బహుధాన్య సంవత్సరం విజయనగరం కొలువులో ఉన్నవారికి అన్నివిధాలా సంతోషదాయకం. అంతకు ముందు రాయలవారు పొట్నూరిలో విజయస్తంభం నాటించారు. ఆ యేడు లేక లేక రాయలవారికి పుత్రసంతానం కలిగియి ఆ పుత్రోత్సాహంలో ఆయన లెక్కలేనన్ని పండుగలు, సంబరాలు జరుపుకొన్నారు. రాజధానిలో భువనవిజయం అనే సభామందిరం కట్టించారు. అందులో సింహపీరికపై కొలువుండి రాయలవారు ప్రాజ్ఞుల గోష్టిలో కవితామధురిమ గ్రోలుతూ ఉండేవారు. ఒకనాడు రాయలవారు వారొక గండపెండేరాన్ని బంగారు హ్హాంలలో ఉంపించి తెప్పించారు. ఉభయ భాషలలో సమానంగా కవిత్వం చెప్పగల వాళ్లు దీనిని స్వీకరించవచ్చని ప్రకటించారు. ఆ సభలో ఉన్నవారు తక్కువవారు కాదు. బహుభాషావేత్త కవిరాజ బిరుదు గల తుమారడిండీమ కవిసార్వభౌముడున్నాడు. ఇతడు వీరభద్రవిజయం అనే డిమము వ్రాశాడు. రసమంజరి, రసతరంగిణి, రసపారిజాతం మొదలైన ఎనిమిది గ్రంథాలను బ్రాసిన భానుదత్తుడు మరొకపక్క ఉన్నాడు. వాల్మీకి రామాయణనికీ లఘు, గురుటీకలు వ్రాసిన ఈశ్వ్చరదీక్షితులు కూడా ఆసీనుడై ఉన్నాడు. కర్టాటకవికుల సార్వభౌముడు ఖానుకవికుమారుడు మహాకవి తిమ్మన్న సముఖంలోనే ఉన్నాడు.

అల్లసాని పెద్దన లి5్‌ కుమారవాల్మీకి నరహరి ఆ సభలోనే ఒక పీఠం అధిష్టించాడు. “ఇరుసమయవిలక్కమ్‌' బ్రాసిన తమిళకవి హరిహరదాసు ఆ పేరోలగంలో కూర్చున్నాడు. రాయలవారితోపాటు పొట్నూూరిదాకా వెళ్లిన కవి ఇతడు తన గ్రంథంలో సింహాచలక్షేత్రాన్ని హాంసించాడు. జయస్తంభాన్ని వర్ణించాడు.

తమిళ సంస్కృత, కర్ణాట కవిపండితులతోబాటు తెలుగు కవులు ముక్కుతిమ్మన గారు, మాదయ్యగారి మల్లన్న ధూర్జటి ఉండనే ఉన్నారు. పెద్దనగారు సరేసరి - తొలిపీటమీదనే ఆసీనులయ్యారు తిమ్మనగారు. అప్పటికే పారిజాతాపహరణం కృతి సమర్పించారు. అగ్రహారాలు ఆందోళికలు పుచ్చుకొన్నారు. ఆ సభలోని దిద్దంతులందరూ పొందినవారే. అయితే రాయలవారు ప్రకటన చేశాక ఒక్కొక్కరు లేచి ఈ గండపెండేరానికి నేనే తగినవాడనని చెప్పలేకపోయారు. అప్పుడు రాయలవారిలా తెలుగు పద్యంలో చెప్పారు.

ముద్దుగ గండ పెండియరమున్‌ గొను డంచు బహూకరింపగా

నొద్దిక నా కొసంగుమని యొక్కరు గోరగలేరు లేరొకో... అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా పెద్దనగారు లేచి నిలబడ్డారు. రాయలవారి ఉద్దేశాన్ని ఆయన గ్రహించారు. ఈ గండపెండేరం సంస్కృతాంధ్ర భాషలలో నైపుణ్యానికి బహుమతి అని గ్రహించారు. వెంటనే ఆ పద్యం ఇలా పూర్తిచేశారు.

పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగ వే

పెద్దన కీదలంచినను పేరిమి నాకిడు కృష్ణారాణృపా. ఆ పద్యాన్ని అలా పూరించి, వెనువెంటనే సుదీర్సమైన సీసమాలికలో కవిత్వమంటే ఎలా ఉండాలో, ఏ భాషలో ఏ రీతిలో ఉండాలో వివరిస్తూ ఇలా చెప్పారు.

పూత మెరుంగులున్‌ బసరుపూపబెడంగులు జూపునట్టి వా

కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మనగమ్మనన్వలెన్‌

రాతిరియున్‌ బవల్‌ మరపురాని హెయల్‌ చెలి యారజంపు ని

ద్ధాతరితీపులో యనగ దారసిలన్వలె లోదలంచినన్‌

బాతిగ బైకొనన్‌వలెను బైదలికుత్తుకలోని పల్లటీ

తూతలనన్వలెన్‌ సాగసుకోర్కులు రావలె నాలకించినన్‌

వేతికొలంది తౌగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే

ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టి చూచినన్‌

డాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెర దొండపండువలె వాచవి గావలె బంట నూదినన్‌

గాతలదమ్మి చూలిదొర కైవసపు జవరాలి సిబ్బెపు

న్మే తెలియబ్బురంపు జిగినిబ్బర పుబ్బగు గుబ్చి గుబ్బపొం

బూతలనూనెకాయ సరిపోడిమి కిన్నైర మేలుబంతి సం

96 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి

గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా

సాతత తానతా నలపసక్‌ దివుటాడెడు గోట మీటుబల్‌

మోైోతలనుంబలెన్‌ హరువు మొల్లము గావలె నచ్చతెన్న్లు లీ

రీతిగ సంస్కృతం బుపచరించెడు పట్టున భారతీ వధూ

టీతపనీయగర్చనికటీభవదాననపర్వసాహితీ

భౌతిక నాటకప్రకరభారత భారసమ్మత ప్రభా

శీతనగాత్మజాగిరిజు శేఖరశీతమయూబరేఖికా

పాతసుధాప్రపూ బహు భంగఘుమంఘుమఘుంఘుమార్చటీ

జాతక తాళయుగ్క్మలయసంగతిం చుంచువిపంచికామృదం

గాతత తేహితత్తహితహాహాధితధంధణుధాణుధింధిమి

చబ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ

నూతనఘల్దలాచరణనూపుర రమూళరుులీమరందసం

ఘాత వియద్భునీచక చక ద్వాక చోత్పలసారసం గ్రహా

యాతకుమారగంధవహహారిసు గంధవిలాసయుక్తమై

చేతము జల్లజేయవలె జిల్లన జల్లవలెన్‌ మనోహర

ద్యోతక గోస్తనీఫలమధు ద్రవగోఘృతపాయసప్రసా

రాతిరస ప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్‌ (చాటుపద్యమణిమంజరి, 1-151)

ఈ పద్యాన్ని వింటున్నంతసిపూ ఈ పద్యంలో చెప్పినవన్నీ అందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటాయి. “భళీ, మర్గూ' అని అందరూ మెచ్చుకొన్నారు. రాయలవారు సింహాసనం దిగి స్వయంగా తమ చేతులతో ఆ గండపెండేరాన్ని పెద్దనగారి పాదానికి తొడిగారు. అప్పుడు పెద్దనగారిలా దీవించారు.

క్షీరాంభోనిధియందు యోగసరణిం జిచ్చక్తి ప్రాపించి త

దో రాజత్కకుబంతగోపవిలసదో రాజగోలోకతా

స్ఫారాలోకనతేజిగాత్ర చలనస్వాంతాద్రి దంభోళికృ

త్సారజ్ఞాన సనందనాది మునిబ్బందాధిక్యసామర్థ ర్ట్‌వాః

పూరాకారత నిద్ర జెందు కరుణాంభోరాశి నిన్‌ బోవుతన్‌.

ఈ గండపెండేరం తొడిగిన సందర్భంలోనే ఆంధ్ర కవితాపితామహుడనే బిరుదు ఇచ్చి ఉంటారు. క్రీ.శ1518 బహుధాన్యలో కార్తీకమాసందాకా పెద్దన గారీ బిరుదు ఏ శాసనంలోనూ చెప్పుకోలేదు. ఏడాది తిరిగాక క్రీ.శ 1519 కార్తీకంలో ఆ విరుదు కనబడుతుంది.

ప్రమాది సంవత్సరం శత్రువులకే గాని రాయలవారికి ప్రమాదం కలుగచేయలేదు. గజపతులు తూడా విజయనగరంవారితో వియ్యంపాంది ప్రమాదం గడుపుకొన్నారు. రాయలవారికి ఇతోధిక ప్రేయసీప్రాప్తి కలిగింది. కళింగం మీద అన్నివిధాలా జయం 4 చాటుపద్య రత్నాకరంలో దీపాల పిచ్చయ్యళాస్త్రగారదాహందాడ పవనోాొొొ

అల్లసాని పెద్దన రా లఖించింది. ఈ శుభసమయంలో హితుడు, చతురవచోనిధి, ఆంధ్ర కవితాపితామహుడు అయిన పెద్దనగారికి రాయలవారు కటకాదిసీమ నాయంకరం ఇచ్చారు. అంటే ఆ ప్రాంతాలకు గవర్నరుగా నియమించారు. క్రీ.శ. 1519 కార్తీక పున్నమినాడు చంద్రగ్రహణ పుణ్యకాలంలో పెద్దన తమ నాయకరంలోని అన్నూరు గ్రామంలోని వరదరాజు పెరుమాళ్లుకు అంగరంగవైభోగాలకూ, నిత్యనైవేద్యాలకూ, దీపారాధనకూ దానాలు చేశారు. తీయని కవిత్వం చెప్పుకొనే కవికి నాయంకరం ఇవ్వడంలో ఒక అంతరార్థం కనబడుతోంది. ఎన్ని గ్రామాలకు అగ్రహారాలుగా యిచ్చినా, పెద్దనగారు వాటినిలా పుచ్చుకుని అలా మళ్ళీ దానం చేసిస్తున్నారు. పాండ్యరాజు ఎంత ధనమిచ్చినా దానిని భాగవతులకు, భగవంతునికి, మందిరాలకు దానం చేసేసి ఉత్త చేతులు జోడించి, “తిరుష్పల్లాండు'తో దేవుని స్తుతించిన విష్ణుచిత్తుల కథ రాయలవారికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు దేవుడు విశ్వకర్మను పిలిపించి పెరియాళ్వారులకు శ్రీవిల్లిపుత్తూరులో మణిమయసొధం నిర్మించమని హుకుమ్‌ జారీ చేశాడు. పెద్దనగారు పూర్వపు ఆ పెద్దభక్తునిలాగే రాయల కనులకు కనబడి ఒక నాయంకరమిస్తేగాని ఈయన ఏమీ నిలుపుకోలేరని భావించి ఉంటారు. క్రీ.శ. 1522లో ఉత్తర హిందూదేశంలో గయదాకా జయించిన పిదప రాయలవారు రాజధానికి తిరిగి వచ్చారు. భువనవిజయంలో కొలువుండి ఒకనాడు పెద్దనగారిని చూశారు. ఈయన చేతిమీదుగా ఒక కృతిని పుచ్చుకోవాలనుకుని ఇలా అన్నారు. సప్తసంతానములలో బశస్తిగాంచి ఫింమయు గాకుండునది ధాత్రికృతియకాన కృతి రచింపుము మాకు తిరీషకుసుమ .. పేశలను ధామయోక్తుల బెద్దనార్య. (మనుచరిత్ర, 1-14) దిరినెనపువ్వులాగా మెత్తని కవిత్వం చెప్పడంలో పెద్దనగారికి ఆయనే సాటి. ఆయన సకల పురాణ కథలను గాలించినవారు. నవీన కావ్య రచనకు అనుకూల కథలను వెతుకుతున్నట్టు రాయలకు తెలుసు. మార్కండేయ పురాణంలోని స్వారోచిషమనువు చరిత్ర చక్కగా, రసవంతంగా రచించవచ్చుననే సంగతి పెద్దనగారు చూచాయగా రాయలవారికి మనవి చేసే ఉంటారు. అందుకే ఆ కథార్థస్మృతిని పేర్కొని ఇలా అన్నారు. హితుడవు చతురవచోనిధి - పతులపురాణగ మేతిహాసకథార్థ స్మృతియుతుడ వాంధ్రకవితా-పికామహుడ వైవ్వరీడు పేర్కొననీకున్‌! మనువులలో స్వారోచిష-మనుసంభవ మరయ రససమంచితకథలన్‌ వినవింపు కలిధ్వంసక-మనఘ భవచ్చతురరచన కనుతూలంబున్‌. (మనుచరిత్ర. 1-15, 16) కృష్ణ్ణంయలవారు కవితాస్త్రీలోలురని పెద్దనగారికి తెలుసు. ఆయన చెప్పమన్న రససమంచిత కథను నిజంగా శిరీషకుసుము పేశలసుధామయోక్తులతో చెప్ప

98 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మొదలుపెట్టారు. కథ ఎత్తుకొనడంలో చకచక చెప్పడంలో పెద్దనగారు. నిజంగా తిక్కనగారిలాంటివారు. విరాటపర్వం మొదలుపెడుతూ తిక్కనగారు ఒక వచనం చెప్పి తిన్నగా కథలోకి దిగారు. అలాగే పెద్దనగారు కూడా మార్కండేయ పురాణంలో ఎవరు ఎవరికి ఈ తథ చెప్పినదీ మూడు ముక్కల్లో ముక్తసరిగా వివరించి అరుణాస్పదమనే పురాన్ని చూపించారు. ఆ ఊళో నాలుగు వర్జాలవారినీ, నాగవాసంవారినీ ఒక్క సీసంలో చెప్పి కథానాయకుని వెనువెంటనే పరిచయం చేశారు. రససమంచితమైన రచన చేయదలిచారు కనుక వేగం దెబ్బతినకుండా కథ చెప్పాలని వారికి తెలుసు. ఇతర కవులైతే అరవై పద్యాల్లో, కనీసం ఆరు పద్యాలలో చేసే పురవర్ణ్షన ఆరుపాదాల సీసంలో ముగించారు. కథానాయకుని ప్రవేశపెట్టడంలోనే ఎంతో జౌచిత్యముంది.

ఆపురి బాయకుండు మకరాంకశశాంకమనోజ్ఞిమూర్తి భా

షాపరశేషభోగి వివిధాధ్వరనిర్మలధర్మకర్మ దీ

క్లాపరతంత్రు డంబురుహగర్చకులాభరణం బనారతా

ధ్యాపనతచ్సరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడ, (మను. 1-51)

ప్రవరుడు అందగాడు అని ఎత్తుగడలో చెప్పడం కథకు కావాలి. అతశణ్జీ చూడగానే ఉత్తరోత్తరా అపూర్వ లావణ్యవతి వరూధిని ప్రేమిస్తుంది. కాబట్టి ఆ సౌందర్యం ముందే చెప్పడం గొప్ప కథనశిల్పం. ప్రవరుడు ఎంత అందగాడైనా విరాగి అని రెండు పద్యాలలో చెప్పారు.

వాని చక్కదనము వైరాగ్యమునజేసి - కాంక్షజేయు జారకామినులకు

భోగబాహ్యమయ్యె బూచిన సంపెంగ - పొలుపు మధుకరాంగనలకుబోలె.

(యను. 1-52)

ఇది తరువాతి కథకు మొదటి మెట్టు. ప్రధాన పాత్రను పరిచయం చేస్తూ తొలి పద్యాలలోనే అతని శీలాన్ని చెప్పగలగడం మహాకవుల రచనలోనే కనబడుతుంది. గురజాడ అప్పారావుగారు కన్యాశుల్కంలో మధురవాణి పాత్రను తొలిసారి రంగంమీద ప్రవేశపిడుతున్నప్పుడు ఇటువంటి రచనా తిల్పాన్ని చూపించారు. ఆమె నోరు తెరచి అనే మొదటి మాటలోనే ఆమె మనస్తత్వం తెలుస్తుంది. “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. కాకవద్దంటే చెవిని పెట్టరుకదా!”” అంటుంది. అప్పారావుగారు అల్లసానివారి కోవలోని మహాకవి. గ

పెద్దనగారు ఒక్క పొల్గుమాట లేకుండా, ఒక్క అనవసరమైన పద్యం లేకుండా ప్రవరుని పాత్రను క్రమంగా పరిచయం చేశారు. అందగాడు, విరాగి అయినా సంసారే. ఈూరిమి సోమిదమ్మ ఉంది. యౌవనంలోనే యాగం చేశారు. తల్లిదండ్రులున్నారు. శిష్యులున్నారు. ధనాడ్యుడు. కులశీలశమదమాదులు చూసి మెచ్చుకొని దోషం లేని సాలగ్రామదానం ఇస్తామని మహారాజులే వచ్చి ప్రాథేయపడినా తీసుకోడు. అతనికీ 6. కన్యాశుల్కం, ప్రథమాంకం, రెండోస్థలం

అల్లసాని పెద్దన 99 దూరమైనా వెళ్ళి తీసుకువస్తాడు. ఇంటికి తీసుకువచ్చి ఆతిథ్యమిస్తాడు. ఇచ్చి. మృష్టాన్న భోజనం పెట్టి సంతృప్ప్తులను చేస్తాడు. చేసి వాళ్లు కూర్చున్న దగ్గరకు వచ్చి, లోకంలో ఉన్న సముద్రాలు, పర్వతాలు, నదులు, తీర్గాలు, వాటి మహత్వాలు తెలుసుకోవాలని చెప్పమని అడుగుతాడు.

అడిగి యోజనపరిమాణ మరయు, నరసి

పోవలయు జూడ ననుచు నూర్చులు నిగుడ్చు

ననుదినము తీర్థసందర్శనాఖిలాష

మాత్మనుప్పొంగ నత్తరుణాగ్నిపోత్రి. (మను. 1-57)

ఇంత గోఢమైన వాంఛగల ప్రవరునింటికి ఒక సిద్ధుడు వచ్చాడు. అతడు రమారమి ప్రపంచం అంతా చుట్టి తిరిగి వచ్చాడు. అతడు ప్రవరునిలాగా తరుణుడే. ఏళ్లూ పూళ్లూ పట్టే యాత్రలు ఇంత చిన్నవయసులో ఎలా చేశారని ప్రవరుడు అడిగాడు. తనదగ్గిర ఒక పాదలేపనం ఉందని, దాని ప్రభావంవల్ల వాయువేగ మనోవేగాలు సాధించానని సిద్ధుడు చెప్పాడు. ప్రవరుడు 'నన్నూూ మీ శిష్యుని చేసుకోండి అన్నాడు. ధన్యుణ్ణి చేయమన్నాడు.

అనుటయు రసలింగము నిడు - తన వట్రువ ప్రేవసజ్జ దంతపుబరణిన్‌

నినిచిన యొక పసరిది యది - యని చెప్పక పూనెదత్పదాంబుజయుగశళిన్‌.

(మనుచరిత్ర. 1-78)

ఈ పద్యంలో ఏ పసరో చెప్పలేదని తెలపడం చాలా గడుసుశిల్పం. ప్రవరుడు హిమాలయాలకు. వెళ్ళాడు. అది భస్మంతో కలిసిన భూతధాత్రిలో ఓషధులు మొలిచేటట్టు చేయగల్లిన చల్లదనం కలది. అదనుతో చేపి చన్నవిసి యోషధులమన్మొదవు కొండలకెల్ల బిదుక నెరగడం ఈ హిమాలయంవల్లనే, ఆ కొండమీద ఉన్నన్ని మూలికలు ఇంకెక్కడా ఉండవు. పసరు కరిగిపోయినా పేరు తెలిస్తే ప్రవరుడు ఆ మూలికలో ఆకులో సంపాదించి పసరుపిండి ఊరు చేరుకొంటాడు. అందుకే సిద్ధుడు పేరు చెప్పలేదని తవిచెప్పడం, పాదలేపనం కరిగిపోయింది. కాబట్టి పసరేమిటో తెలియదు కాబట్టి ఇంటికి పోయే మార్గం చెప్పమని కనపడ్డవాళ్లను బ్రతిమాలడం. కనపడ్డది వరూధిని. కవి ఆమెను చూపించడానికి ముందు ఆమె గాలిని వర్ణించాడు.

మృగమదసారభవిభవ - ద్విగుణీతఘనసారసాంద్రవీటీగంధ

స్థగ్‌తేతరపరిమళమై- మగువపాలుపు దెలుపు నొక్క మారుత మొలనెన్‌.

(మనుచరిత్ర, 2-24)

అది ఆడగాలి, భోగినిని సూచించే తావి. ప్రవరుడు కాబట్టి తట్టుకోగలిగాడు. మరొకరైతే ఆ గాలికే వరూధిని వలలో పడతారు. ఆమె నర్మగర్పంగా చెప్పినవి అతడు పట్టించుకోలేదు, సూటిగా చెప్పినా వినిపించుకోలేదు. అమె హేతువాదం మొదలుపెట్టింది. అతడు 'నీవన్నయర్థమెల్ల నిజము కాముకుడైనవానికి అని ఒప్పుకొన్నాడు. తను బ్రహ్మానందాధిరాజ్బంలో పదవీచ్యుతుణ్జి కాలేనన్నాడు. ఆమె బ్రహ్మానందమంటే ఏమిటో వివరించింది.

100 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఎందే డెందము కందళింప రహిచే నేకాంతతన్‌ నిర్చృతిం

జెందుం గుంభగత ప్రదీపకళికాభ్రీ దోప నందిందు బో

తెందో నింద్రియముల్‌ సుఖించగను నాయింపే పరబ్రహ్మ, 'మా

నందో బ్రహ్మ' యటన్న ప్రాజదువు నాంతం బర్థ మూహింపుమా.

(మనుచరిత్ర. 2-62)

ఆమె తత్తరం చూస్తి సిగ్గూ వెగటూ పొడమాయి. అతడు నిస్పృహత తెలిపే

చిరునవ్వు నవ్వాడు. 'ఈ పాండిత్యం నీకు తప్పు ఇంకెవరిలోచూశాం' అన్నాడు.

“తుచ్చసుఖాలు మీసాలపై తేనియ లన్నాడు. ఇది విన్నాక ఆమె నోటంట మాట రాలేదు.

“వనిత తనంత తావలచి వచ్చిన చుల్కనగాదె యేరికిన్‌ అనుకొంది. మేనుసోకిడి తేనెలో

పడ్డ ఈగలాగ కొట్టుతుంటాడనుకొంది. కౌగలించుకుంది. అతడు 'హా శ్రీహరీ అని ఓరమోము పెట్టుకొన్నాడు. ఆమెను త్రోసిశాడు.

ప్రవరునికి సిగ్గూ వెగటూ కలిగించేవిధంగా వరూధిని ప్రవర్తించడానికి కూడా కారణం లేకపోలేదు. మొదట వాళ్లు ఏకాంతంలో ఉన్నారు. అప్పుడామె నర్మగర్చంగా మాట్లాడింది. అతడే ఇంగితం తెలుసుకొనకపోతే హేతువాదంలోకి దింపింది. అతనిచేత “శౌను, కామానికి నిజమే అనిపించింది. మరికొంతసేపుపోతీ అతడు ఒప్పుకొనేటట్టు చేయగలిగినంత నెరజాణ ఎందుకింత తత్తరపాటు చూపెట్టింది? దానికి కారణం “ఆనందో (బ్రహ్మ అనే పద్యానికి ముందు పెద్దనగారు చెప్పారు. ప్రవరుడు “బ్రహ్మానంద రాజ్యపదవీచ్యుతికి ఒప్పుకోనూ” అంటూ ఉంటే వరూధిని చెలికత్తెలు అటు వస్తున్నారు. వాళ్ళను రావద్దని కళ్లతోనే వారించింది. ఆ చెలికత్తెలు తనను చూశారు; తను మరులుకొన్నవానిని చూశారు. ఇతణ్జి వశం చేసుకోకపోతే వాళ్లలో తలెత్తుకోలేదు. అందుకే తొందర, ఆమె తీరుబాటుగా ప్రయత్నించినా, ప్రవరుడు, తాకినచోట అంటుకొన్న తావిని కడీగేసుకొని పోయేవాడు. అది వేరే కథ. పెద్దనగారు వరూధిని పాత్రను చిత్రించడంలో ఎంతో మనస్తత్వ పరిశీలన చూపించారు. కథ అల్లడంలో ప్రతిచోటా జిగిబిగి చూపెట్టారు.

“అల్లసానివాని అల్లిక జిగిబిగి అన్న సీర్షికతో విశ్వనాథ సత్యనారాయణగారు ఎన్నో సాగసులు చూపిస్తూ పెద్దనగారి ఉత్తమ శిల్పాన్ని వివరించారు. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రిగారు “అల్లసాని పెద్దనార్య కవిత్వతత్స్వము' అనే పేర సుదీర్హ విమర్శ చేశారు. ఆ విమర్శ సారాన్ని చివర వారే ఇలా పొందుపరిచారు. న్‌

మనుచరిత్రము భాషావిషయములో ఉత్తమ గగ్రంథము. ఇందు సలక్షణమగు భాష కలదు. కూర్పు విషయములో మధ్యస్థానములో నుండదగినది. రసానుగుణమగురీతులు వృత్తులు అంతగా లేవు. నీతి విషయములోనిది యథమగ్రంథము. దుర్నీతి గరపుచున్నది. కానీ గృహస్థధర్మ వివరణాధికము లిందు బాగుగా నున్నవి. విషయములో మనోహర గ్రంథము. చక్కని వర్ణనలు కలవు. రసవిషయములో నడిమితరములో జేరదగినదనుటయు నతిశయోక్తియగునని తోచెడిని. శృంగారశాంతములు పాడుచేయ బడినవి. వీరమొకింత కలదు. ఉత్తమ గంథముకాదు 6. అఆంధ్రసాహిత్యపరిషత్సత్రిక, సంపుటి 10, సంచికలు 5, 6 _

అల్లసాని పెద్దన 101

పెద్దనగారి కావ్యం సత్కావ్యమే అని చాలామంది పండితులు తరువాత వ్రాశారు. వాదోపవాదాలు, చర్చలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలూ జరిగాయి. కథావస్తువులో ఐక్యత లేదని కొందరన్నారు. స్వవచోవ్యాఘాతాలున్నాయన్నారు కొందరు సాహిత్య పిపాసులు. పరిశోధకులు, పండితులు గ్రంథం సాంతం చదివినా సాధారణ పాఠకులు మాత్రం మనుచరిత్రలో తొలి మూడు అశ్వాసాలే ఉత్కంఠతో చదువుతారు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చెప్పినట్టు ఎవరీనా మీగతా ఆశ్వాసాలు చదివితీ వరూధినీ ప్రవరులు మళ్లా కనబడతారేమో అన్న ఆసక్తితోనే చదువుతారు.” ప్రభాకరశాస్త్రిగారీ మనుచరిత్రను రెండు భాగాలుగా విభజించారు. ॥

““నేడు మనుచరిత్ర' మనబడు ఈ ప్రబంధమున తొలి నాలురైదాశ్వాసముల రచనము స్వరోచిస్సంభవమనియు, నా తరువాత నారవయాశ్వాసము తుదిదాక గల రచనము _ స్వారోచిష సంభవమనియు వేర్పరచి రెండు ప్రబంధములుగా నేను బేర్కొందును. రెండు ప్రబంధములను రాయల కంకితముగా నొక కృత్యవతరణికతో నొక సంపుటముగా సంధానించినాడు. గనుక మొత్తము సంపుటమును మనుచరిత్రమని పేర్కొనుచుందును.!

మనుచరిత్రలో మిగతా మూడు ఆశ్వాసాలలో కూడా రసవంతమైన

. కవిత్వముందని సోదాహరణంగా నిరూపించడానికి కేతవరపు వెంకటకాస్త్రిగారు వ్యాసాలు వ్రాశారు. పూర్వార్థంలోనే కావ్యంలోని తేజం తూడా మందగిస్తుందని పింగళి లక్ష్మీకాంతంగారు అభిప్రాయపడినా పెద్దనగారి పెద్దరికానికి గల కారణాలెన్నో ఆయన సవిస్తరంగో వివరించారు.9 కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారివంటి విద్వాంసులే ఇది ఉత్తమ గ్రంథం కాదనినా ఇందులో పెద్దనగారు దుర్నీతిని ఆకర్షవంతంగా చేయాలని చేయలేదు. ఆయన ఉద్దేశం మార్కండేయ పురాణంలో ఉద్దాటించిన ఏకపత్సీవతంలోని గొప్పతనాన్ని ప్రచారం చెయ్యడమే. ముగ్గురు పెళ్లాలను కట్టుకొని విహరిస్తున్న స్వారోచిని చూసి మరాళి తీవ్ర వాదాలు చేసిన చర్చలో పెద్దన ఆశించిన నిజమైన ప్రయోజనం కనబడుతుంది.

మెలతకు బతిపైనైనను - మెలతుకపై బతికినైన మేలగుటెందున్‌

గలయది మెలతకు బతికిన్‌ - వలపు సమంబగుట జన్మవాసనచెలియా.

(యను. 6-66) అని హంస మెచ్చుకొంటుంది. చక్రవాకి ఇలా తెగనాడుతుంది. . . ముదమున నిమ్మహీవడొక ముద్దియ చూడగ నొక్క కాంతతో___

సదమదమై కడంగి రతి సల్పుట తెల్లముగా నెరింగియున్‌ళ్య8 + | బగంధా.. వై

మది వివరించి రోయ కఖిమానము దక్కినవారికూరుళ్తుల్‌.--

వదలక పెద్దసేసెదవు వందిగతిం దగ వీవిచారముల్‌ | ౯... ౧ (మను. 6-69) ళో 7. మీగడతరకలు - మనుచరిత్ర, పుట 1౫. . స సీ గ్‌ 4. అందులోనే, పుట 15 . న 9. ఆంధ్రసాహిత్యపరిషత్సత్రిక, సంపుటి 17, సంచిక 1. చమ్మ విత్‌ 044. 10. తిలుగుభాషాసమితి వారి విజ్ఞానసర్వస్వం, 3-వ సంపుటి, పుటలు 927-931

102 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చత్రవాకి కావ్యసందేశాన్ని ఇలాగ విన్పిస్తుంది.

తగులునెవ్వడొక్క తరుణికి నొకనికి - మెలత చలచు నదియ మేలనంగ

వచ్చు. గాని పెక్కు వనితలపై గూర్క్మి - గలుగుననుట బొంకు గాదె తరుణి,

(యను. 6-74)

ఇది మార్కండేయపురాణంలో ఉన్న సందేశమే. పెద్దనగారు మూలాన్ని అనుసరించారు. తెలుగు మార్కండేయపురాణంలో మారన వ్రాసిన దానికి ఏమాత్రం గద్య పద్యాలలో తగ్గించకుండా వ్రాశారు. మొత్తం మనుచరిత్రనంతా మారనగారు 14 గద్య పద్యాలలో రచించారు. పెద్దనగారి రచనలో మారనగారి పద్యాల ఛాయలు కనబడతాయిగాని పురాణంలో అక్కడక్కడ లోపించిన జౌచిత్యాన్ని పెద్దనగారు బాగా పోషించారు. ఈ ఇద్దరి కావ్యాలను మూలంతో జైపారుచేసి టేకుమళ్ల అచ్యుతరావుగారు చక్కని పరిశీలన చేశారు.3 పెద్దనగారు ఏ పూర్వకవులను అనుసరించినదీ పరిశోధకులు చాలా వ్యాసాలలో చూపించారు. ఇది గ్రంథ చౌర్యం కాదు. పూర్వకవీశ్వగ వాశ్ర్రయోగదక్షత సత్కవి లక్షణాలలో ఒకటిగా అప్పకవి చెప్పాడు (అప్ప. 1-4). గగ్రంథచౌర్యం ఎంత అవమానకరమో పెద్దనగారికి బాగా తెలుసు. అందుకే కృత్యాదిని ఇలా కుకవినింద చేశారు.

బరువైతోచు కుటుంబరక్షణకుగా బ్రాల్మాలి చింత౯€ నిరం

తరతాళీదళ సంపుటప్రకర కాంతారంటునం దర్థపుం

దెరువాటుల్‌ గొనికొట్టి తజ్‌జ్ఞపరిషద్విజ్ఞాతచౌర్య క్రియా

విరసుండై కొరతంబడం గుకవిష్పథ్వీభృత్సమీపక్షితిన్‌. (మను. 1-9)

పెద్దనగారు తమ కావ్యాన్ని పరిషత్తులో చదివి వినిపించారు. భువన విజయంలోని కవులందరూ ఓహో అన్నారు. రాజసన్నిధానంలో తన కృతి రాణించింది. రాయలవారు పరమానందంతో అంకితం పుచ్చుకొన్నారు. కృతి స్వీకరణ మహోత్సవంలో ఊరేగింపు బయలుదేరుతున్నప్పుడు రాయలవారు స్వయంగా పెద్దనగారు తూర్చున్ను పల్లకీ తమ చేత్తో పట్టి ఎత్తారు. పెద్దనగారంటే ఆయనకంత భక్తిగౌరవాలు!: ఆయన కవిత్వంలోని చేవ వారికి తెలుసు.

అరుణాస్పదాన్ని వర్ణిస్తూ పెద్దనగారు 'అచటపుట్టిన చివురుకొమ్మైన చేన' అన్నారుగాని వారింట అందరూ చక్కని కవిత్వమే చెప్పగలరని ఒక కథ తెలియజేస్తుంది ఒకనాడు పెద్దనగారౌపద్యం రాయడం మొదలుపెట్టారు.

మృదుతల్చంబు ప్యారలీల దిగి ధమ్మిల్లంబు చేబూని రా

గదదృగ్గాలముతోడ గౌను నులి మూగన్‌ మోము మార్వెట్టుచున్‌

వదలంబారిన నీవి పట్టుకొని యా వామాక్షి యిట్లేగె - ననన టన! 11. విజయనగర స్తామాజ్యమందలి ఆంధ్రవాబ్బయచరిత్ర, 2-వ భాగం, పుటలు 148-154 18 మనుచరిత్ర, ఆనందముద్రణ, పీఠిక-శంజనగరం తేవప్పెరుమాళయ్య, పుటలు 24-28

అల్లసాని పెద్దన 103 ఇంతదాకా వ్రాసి ముగింపు ఆలోచిస్తూ పెద్దనగారు ఎక్కడికో వెళ్లారు. వారి కుమార్డె ఇలా పూరించిందట. 'దత్సదన భ్రాజీతరత్న దీపకళికా స్తంభము క్రీనీడకున్‌.'

ఇంత రసవంతంగా పూరించిన ఆ ఆడకూతురి పేరు మనకు తెలియదు. పెద్దనగారి కుటుంబ జీవితం ఏమిటో తెలుసుకునే అవకాశాలు కూడా లేవు. రాయలవారు మరణీంచిన తరువాత కూడా జీవించి ఉన్నారనే ఆయన చెప్పిన చాటువువల్ల తెలుస్తుంది. విజయనగరంవారు వియ్యాలవారన్న సంగతి మరచిపోయి రాయలవారు గతించగానే గజపతులు దండెత్తారటు. అప్పుడు పెద్దనగారీ కింది పద్యం చెప్పారట.

రాయరాహుతమిండ రాచయేనుగు వచ్చియారట్లకోట గోరాడునాడు

సంపెటనరపాలసార్వభౌముడు వచ్చిసింహాద్రిజియశిల జేర్చునాడు

నెలగోలుసింహంబు చేరి ధిక్కృతి గంచుతల్పుల గరుల డీకొల్చునాడు

ఘనతర నిర్బర గండపెండెర మిచ్చికూతు రాయల కొనగూర్చునాడు

ఒడలెరుంగవొ చచ్చితొ యుర్చిలెవొ

చేరజాలక తలచెడీ బీర్ణమైతొ

కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్ర

తెరచినిలు కుక్క సౌొచ్చిన తెరగు దోప (చాటు. 1 పుట 162)

ఆంధ్రకవితాపికామహుడు వ్రాసి పంపించిన ఈ పద్యం చదువుకొని గజపతి సిగ్గుతో వెళ్లిపోయాడట. అందరూ నిట్టూర్చి ఉంటారు. పెద్దనగారు మాత్రం దినదినం రాయలవారిని తలచుకొంటూ బాధపడుతూనే ఉన్నారు. ఆయన చెప్పిన ఇంకో చాటువు.

ఎదురైనచో దన మదకరీంద్రము నిల్పికేలూత మెసగి ఎక్కించుకొనియె

మనుచరిత్రం బందుకొను వేళ బురమేగబల్లకి తన కేల బట్టి యెత్తి

గోకట గ్రామాద్య నేకాగ్రహారంబులడిగిన సమీలయందు నిచ్చె

విరుదైన కవిగండపెండేరమున కీవతగుధని తానె పాదమున దొడిగె

ఆంధ్రకవితాపితామహ అల్లసాని

పెద్దన కవీంద్ర! యని తన్ను పిల్చునట్టి

కృష్ణ్ణూయలతో దివి కేగ లేక

బ్రతికియున్నాడ జీవచ్చవంబనగుచు. (చాటుపద్కమణీమంజరి, 1, పుట 161)

అవసానకాలంలో 'ఆయన జీవచ్చవమే అయినా కీర్తోషులయ్యాక ఆయన నిజంగా ట్రతకడం మొదలుపెట్టారు.

ఆయన సజీవకవి.

వుత్తేటి రామభద్రయ్య కృష్ణదేవరాయలవారి. భువన విజయంలో అష్టదిగ్గజాలు ఉండేవారని అందరూ అంగీకరిస్తారు గాని, ఆ ఎనమండుగురూ ఫలానా ఫలానా వారని నికరంగా ఎవరూ తేల్చి చెప్పలేదు. ప్రస్తుతం దొరకే ఆకరాలతో ఆలా డేల్చడం కూడా కష్టం. అష్టదిగ్గజాలలో అయ్యలరాజు రామభద్రుడున్నాడని పండితలోకం భావిస్తూ వచ్చేది. క్రీ.శ1550-70 ప్రాంతాలలో ఉన్న గొబ్బూరి నరసరాజుకు రామాభ్యుదయం అంకితమిచ్చిన అయ్యలరాజు రామభద్రుడు అష్టదిగ్గజాలలో ఉండడానికి ఆస్కారం లేదనీ, పుత్తిటి రామభద్రయ్యే రాయలవారి ఆశ్రితుడు కావచ్చునని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రతిపాదించారు. నిడుదవోలు వెంకటరావుగారు దీనిని సోదాహరణంగా సమర్థించారు.] పుత్తీటి రామభద్రయ్య ఎవరు? ఇతడు రాయలవారి ఆస్థానంలో ఉండే ఆస్కారం

ఉందా? ఇటువంటి ప్రశ్నలకు ఈ కవి రచించిన “సకల కథాసార సంగ్రహము” అనే కావ్యమే జహాబు చెప్తుంది. ఇది అసమగ్రంగా దొరికినా ఇందులో తొమ్మిది ఆశ్వాసాల ' దాకా నిండుగా దక్కాయి. ఈ కావ్యం వ్రాతప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. (0.855)

దీని అవకారికలో “కృష్ణ్ణాయ నరపాలాఖండలుండు” తనను పిలిచి ఈ కావ్యాన్ని చెప్పమన్నట్టు స్పష్టం చేశాడు (1-29). ఈ కృష్ణరాయలు సాహితీ సమరాంగణ సార్వభాముడే అన్న విషయం మరొక వివరణలో కవి స్పష్టం చేశాడు. ఈ కావ్యు రచనకు తనను ప్రేరేపించినవాడు “కన్నడ మహీమండలాఖండలుండును చండ పరాశ్రమ వరరాజ శుండాల కంఠీరవుండునునగు నరకంఠీరవ రాయ సూతి” అని ప్రకటించడం వల్ల ఇంక ఏ విధమైన అనుమానాలకూ అస్కారం లేదు. సకల కథాసార సంగ్రహం కావ్యాన్ని రచించిన రామభద్రయ్య కృష్ణరాయల సన్నిధానవర్తి. సార్వభౌముని సన్నిధానంలో ఉండే అందరికీ చనువు ఉంటుందని చెప్పలేం. ఈ రామభద్రయ్య మాత్రం ఆంతరంగిక _ వ్యవహారాలు తెలిసినవాడని ఊహించవచ్చు. కృష్ణదేవరాయలు ఇతణ్జి “మన్మనోరథ కార్య నిర్వాహకుండవు'' అని ప్రశంసించాడు. (1-29). రచనావ్యాసంగంలో మాత్రమే , కాక _రాచకార్యాలలో కూడా రామభద్రయ్య కార్యనిర్వాహకుడని భావిస్తే తప్పులేదుగాని కవి తన గురించి వేరి ఏ విషయాలూ చెప్పుకోలేదు. కనుక ఊహాగానం . చేయడం సమంజసం కాదు. రామభద్రయ్య బహువిధ కవితా చమత్కారధుర్యుడు కనుక కృష్ణరాయలు క ఒక కావ్య రచనకు ట్రేరేపించాడు. పురాతన కవులు విరచించిన ప్రబంధాలను షించి భగవద్భక్తినివ్యాగరిష్టులైన రాజశేషుల తాంతాలు ప్రసిద్ధమయ్యేటట్టుగా ప్రశస్త కథలు నని వ పాం ప్రార్థించాడు. సార్వభౌముడు అదేశించకుండా ప్రార్థించాడని చెప్పడంలో కవిపట్ల ప్రభువుకు గల గౌరవం వ్యక్తమవుతూంది. గా

పుత్తేటి రామభద్రయ్య 105 ఈ రామభద్రయ్య తన ఇంటిపేరు చెప్పుకోలేదు. తాత తండ్రుల పేర్లూ చెప్పుకోలేదు. తనది కాశ్యపస గోత్రమని మాత్రమే '“సకలకథాసార సంగ్రహం'లో స్పష్టం చేశాడు. అయ్యలరాజు రామభద్రుడు తన తాతముత్తాతల పేర్లు చెప్పుకొన్నాడు. తమ ఇంటిపేరు అయ్యలరాజు వారని చెప్పుకొన్నాడు. అంతేకాని తమ గోత్రం రామాభ్యుదయంలో చెప్పుకోలేదు. అయినా ఇతని వంశంలోని అనంతరకవులు ఇతణ్ణి పేర్కొంటూ తమ గోత్రం కౌండిన్యసగోత్రమని చెప్పుకొన్నారు. ఈ ఇద్దరు రామభద్రులు గోత్రాలు వేరువేరు కాబట్టి వీరు విఖిన్న వ్యక్తులని నిస్సందేహంగా నిర్ధారణ చేయవచ్చు. సకల కథాసార సంగ్రహం రచయిత క్రీ.శ1530లోపునే తన రచన చేశాడు. రామాభ్యుదయం రచయిత క్రీ.శ 1555 ప్రాంతాలలోగాని ఆ రచన చేయలేదు. కృష్ణ్ణాయల అంతరంగిక కార్యనిర్వాహకుడూ, సార్వభౌముని చేత ఆదేశాలుకాక ప్రార్థనలు స్వీకరించేవాడు 1530 నాటికే ప్రొడ నిర్బరమైన వయసులో వాడై ఉండాలి. ఈ _ రామభద్రులు అఖిన్నులని కొందరు సాహితీపరులు భావిస్తున్నారు. అయితీ అనంతర రచన అయిన రామాభ్యుదయంలో మా తాత ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని రచించాడని సగర్వంగా గద్యలో కూడా చెప్పుకొన్నవాడు తొలి రచన అయిన సకల కథాసార సంగ్రహంలో ఆ ప్రసక్తిని తానుగా గాని, తన ప్రభువు వాక్యాలుగా గాని ఎందుకు ప్రకటించుకోలేదు? ఇద్దరూ ఒక్కరే అయితే కృష్ణ్ణాయలవారు పురమాయిస్తే సకలకథాసార సంగ్రహాన్ని ఇంతకు ముందు రచించానని రామాభ్యుదయంలో ఎందుకు పేర్కొనలేదు? ఈ ప్రశ్నలకు ఒక్కటే సమాధానం! ఇద్దరూ అభిన్నులు కాక విఖిన్నులు కాబట్టే అని. సకలకథాసార సంగ్రహం రచించిన రామభద్రయ్య తన యింటిపేరు చెప్పుకోలేదు గాని అనంతర లాక్షణికులు ఒక పుత్తేటి రామభద్రయ్యను పేర్కొన్నారు. రాయలవారి అష్టదిగ్గజాలలో _ పుత్తేటీ రామభద్రయ్య ఉన్నాడని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తెలియచేశారు. సకల కథాసార సంగ్రహం రచించిన రామభద్రయ్య తన ఇంటిపేరు చెప్పుకోకపోయినా అతడు పుజ్తేటి రామభద్రయ్యే అని సాహితీపరులు కొందరు విశ్వసిస్తున్నారు. అయితే పుత్తేటికవి రాయలవారి 'సకల కథాసార సంగ్రహమును' తెనిగించాడనే పొరపాటు అభిప్రాయానికి కూడా ఆస్కారం కలిగింది.5 కృష్ణదేవరాయలవారు తమ ఆముక్తమాల్యదలో '* శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి సకల కథాసార సంగ్రహంబు' అని తమ రచన జాబితాలో చెప్పుకొన్నారు (ఆముక్త 1-13). ఇది వారు సంస్కృతంలో రచించిన గ్రంథం. ఈ కావ్యం దొరకలేదు గాని దాని అవతారిక లభ్యమవుతుంది. దీనిని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు గుర్తించారు. “కృష్ణ్ణాయలు: సకల కథాసార సంగ్రహము” అనే వ్యాసంలో వ్యాసతీర్ణులవారి ప్రేరణతో కృష్ణ్ణాయలు వివిధ ఆమ్నాయాల నుండీ, ఇతిహాసాల నుండీ లభ్యమైన కథలతో దీనిని రచించారని చెప్పారు 2. హంసవింశతి 1-12, 15. 3. కాకర్ల వెంకట నరసింహం - రామాభ్యుదయము - ఉపోద్దాతము = పుట ౧౦౧/|| 4. చాటుపద్యమణిమంజరి - ద్వితీయ భాగము (1922) మద్రాసు - పుట. 29. 5. ఈయుణ్జి వేంకటవీర రాఘవాచార్య ఆముక్తమాల్యద - పర్యాలోకనం - భూమిక - పుట - 2 8. భారతి అక్టోబరు - 19

1% సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఈ వ్యాసంలోనే వారు ఎందువల్లనో రామభద్రని సకలకథాసార సంగ్రహము రాయలవారి రచనను అనుసరించి తెలుగులో రచించిన గ్రంథమని ఊహించదగిన విషయమని భావించారు. అంజేకాదు ఈ రామభద్రయ్యే అయ్యలరాజు రామభద్రయ్య అని కూడా అభిప్రాయపడ్డారు. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో పండితులుగా ఉంటున్నప్పుడు 1934లో 0855లో నెంబరు గల పుస్తకం గురించి చివర వివరణ ద్రాస్తూ ఈ సకల కథాసార సంగ్రహం కర్త “ఆపస్తంబ సూత్రుడు, కౌండిన్యసగో త్రుడునగు రామభద్రకవి, రామాభ్యుదయ కర్త యీతడే యగును. వీరి యింటిపేరు పుత్తీటి వారని లక్షణ గ్రంథములందు గలదు” అని విరుద్ధ విషయాలను చెప్పారు. ఈ కావ్యం గద్యలో కవి తాను కాశ్వపసగోత్రుడనని మాత్రమే చెప్పుకొన్నాడు. రామాభ్యుదయ కావ్యకర్ణ గోత్రాన్ని సరిగ్గా చెప్తూనే ఈ పౌరసాటును ధీమంతులైన ప్రభాకరులు ఎందుకు చేశారో.” 1922లో అష్టదిగ్గజాలలో పుత్తేటి రామభద్రయ్య ఉన్నాడని వారే గుర్తించారాయె. ఈ విషయమై లోతుకు వెళ్ళి చాలామంది సాహితీపరులు పరిశోధించలేదు.

పుత్తేటి రామభద్రయ్య రచనను పరిశీలించిడే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ కృతికీ ప్రేరణ కృష్ణ్ణయల వల్ల వచ్చినా దానిని ఆ సార్వభామునికి కాక తన యిష్టదైవమైన కృష్ణునికే కవి అంకితమిచ్చాడు. తన స్వష్నకాలంలో దేవుడు ఇది కోరాడట. ఈ సంగతిని కన్నడ రాయనికి కవి చెప్తే కుతూహలంగా విని ఈ ప్రబంధము ప్రకాశముగా హరికిమ్ము అని ప్రోత్సహించాడట (1-39). సార్వభౌముని సూచనల మేరకు పురాతన మహాకవి విరచిత ప్రబంధాలను రామభద్రయ్య అన్నేషించాడు. నిత్య సక్కీర్ది పోతనామాత్య సుకవి వల్ల ప్రభావితుడయినందున భావికవీంద్రులను కూడా సన్నుతించాడు.

సరళపదార్థ విస్ఫురణ సంగతి చాల నెరింగి లక్షణం

బరమర లేక జూచి యమరాంధ్రములందు కడుం బ్రవీణులై

సరసకళల్‌ గ్రహించి మృదుసారవచోరచనా చమత్రియా "

పరులగు సత్ర్రసన్నులను భావి కవీంద్రుల నాశ్రయించెదన్‌. (సకల కథా. 1-19) -

పురాతన గ్రంథాలను పరిశీలించి రాయమని చెప్తూ కృష్ణరాయలు తన భుజాలపై ఎంతటి బరువును పెట్టాడో రామభద్రయ్యకు తెలుసు.

సరసగతుల రచించెడి శక్తి గలుగు

సుకవులకు గాని సుకవుల సూక్తి పటిమ

దెలియగా రాదు మూఢ బుద్ధులకు మోసు

వానికి తెలుసు కావడి బరువనంగు (సకల కథా 1-౫) జాణలు మెచ్చే కవిత్వం ఎలా ఉండాలో రామభద్రయ్యకు తెలుసు.

అరవత గుబ్బ చనవలె బయల్‌పడ నీకను ఘూర్తరాంగనా

గరుకుచ యుగ్మమున్‌ వలె నిగూడముగా కను యాంధ్రదేశపున్‌

పుత్తిటి రామభద్రయ్య 107

గరిత చనుంగవన్‌ వలె నొకానొక రుంచుక గానిపించినన్‌

. సరసులు మెత్తు రక్కవిత జాణలకున్‌ కడురంజకంబగున్‌ (సకల కథా 1-3)

ఇటువంటి అఖిప్రాయాలే ఈ కవి సమకాలికులకూ, సమీపకాలపు అర్వాచీను లకు ఉన్నట్టు వాళ్ళ కావ్యాలలోని ఇదే భావమున్న పద్యాల వల్ల విశదమవుతోంది. టైచరాజు వేంకటనాథుడు తన పంచతంత్రంలోనూ (1-18), మొల్ల తన రామాయణంలో (పీఠిక 15) “కొలదిగ గానవచ్చు వలిగుబ్బ చనుంగ కీవితో కవిత పాలుపు వహించా లన్నారు. కవిత్వం ఎలా ఉండాలో తెలిసినా రామభద్రయ్య రచన అంత పొంకగా ఉన్నట్టు కనబడదు.

సకలకథాసారసంగ్రహం ఎన్ని ఆశ్వాసాల కావ్యమో తెలియదు. తొమ్మిది ఆశ్వాసాల గ్రంథం మాత్రమే లఖించింది. అందులోనూ చివరి ఆశ్వాసం అసమగ్రం. 599 పద్యాలు మాత్రమే నవమాశ్వాసంలో దక్కాయి. ఈ కావ్యంలో నల, హరిశ్చంద్ర, పురుకుత్స, పురూరవ, సగర, కార్తవీర్యార్డునులనే షట్బత్రవర్తుల కథలనూ, కృష్ణావతార ఘట్టాలను ఇతర భగవద్చక్తి నిష్థాగరిష్టులైన రాజశ్రేష్టుల వృత్తాంతాలు చెప్పాడు. ఆతి మధురరసాయన ద్రాక్షాపాకంగా, శృంగారయుక్తంగా ఉండాలని చెప్తూనే ' గ్రంథవిస్తారంబు కాకుండునట్లుగా' రచించమని కృష్ణరాయలు ్రేరేసించడంవల్ల రామభద్రయ్య పరిమితులకు లోనై రచించాడని గ్రంథ పరిశీలన వల్ల తెలుస్తుంది. ద్వితీయాశ్వాసంలో హరిశ్చంద్రుని కథను చెప్పాడు. మచ్చుతో ఘట్టం చూద్దాం.

పాముకాటు వల్ల చనిపోయిన లోహితాస్యుని తీసుకొని చంద్రవతి శ్మశానానికి వెళ్ళి “అకటా చేరడు నేలకున్‌ దగడె' అని రోదించడం అన్ని హరిశ్చంద్ర కావ్యాలలోనూ సర్వసామాన్యం. సకలకథాసారసంగ్రహంలో తూడా చంద్రమతి విలపించాక హరిశ్చంద్రుడు ఇలా అంటాడు.

లలనా ఈతడు సప్తసాగర థరారాజేంద్ర సూనుండనిన్‌

విలపింపన్‌ వినినాడు నంతటి లసద్విఖ్యాత రాజేంద్రునిన్‌

గలయం జాలిన పుణ్యభాగి నవనీనాధుండు నీమేనను

జ్ఞ్వల కామంబున ఉంచు కాంచనముకొంచెంటైన లేదే సతీ (సకల కథ - 2-342) ఉన్న బంగారాన్ని గోప్యంగా ఉంచుతున్న దన్న ఆరోపణ విన్నాక చంద్రమతి “ఆహా నేను ధర్మంబు దాచిన దాననని మీరు బల్కదగునే” (2-345) అని మళ్ళా రోదించింది. అప్పుడు హరిశ్చంద్రుడు ఇలా అన్నాడు.

వనిత భవద్గళంబునన్‌ మంగళ సూత్రనామియై

ఇనకర లీలగ్రాలగను ఇట్టుల లేదని చెప్ప జెల్లునే

కనుగవ గల్గువారు ధరకట్టగ చెప్పిన గానకుందురే (సకల కథా 2-346)

శంకరకవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంతో పోల్చి చూస్తే ఈ పద్యాలు అంత రసబంధురంగా ఉన్నట్టు కనబడవు. సకలకథాసారసంగ్రహాన్ని ట్రౌనుదొర

108 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కూలంకషంగా పరిశీలించారు. కాలేజి గ్రంథాలయంలో ఉన్న మెకంజీ దొరగారి ప్రతికి ఒక పుత్రికను బ్రౌనుదొరగారు 1840 అక్షోబరులోనే పుట్టించారు. మూడేళ్ళ తర్వాత దానిని చదివి 1843 జూలైలో నిర్మొహమాటంగా తమ అభిప్రాయాన్ని ఇలా రాశారు.

"౫6 19 8౧ 116౧4116 ౧౦6గ౫ 0 ౧౦ గంగ 1/౧219767 ౧౭గ9 2/9 ఓల06గం? &గిరే 51016౧ ₹0గ 06167 &41౧0/3 ... (౨ 855) _

బౌనుదొరగారు ఇలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా గ్రంథాలయ పండితులు “ఇది గొప్ప ప్రబంధము" అని కేటలాగులో చెప్పారు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఒక వ్యాసంలో కృష్ణరాయల కంకితముగా తడ్రేరణమున నొక గొప్ప యాంధ్ర

" ప్రబంధము'గా సకలకథాసారసం గ్రహాన్ని మెచ్చుకొన్నారు.! ఈ [గ్రంథం కృష్ణరాయలకు

అంకితం కాదన్నది నిర్వివాదాంశం. గొప్పతనంగాని, చప్పదనంగాని అభిరుచులను బట్టీ తేల్చుకోవాలి. సకలకథాసార సంగ్రహం రచించిన రామభద్రయ్య కృష్ణరాయలవారి “మనోరథకార్య నిర్వాహకుడ'న్న సంగతి కూడా నిర్వివాదాంశం.

అష్టదిగజాలలో ఇతడున్నాడా లేడా అన్నది ఇప్పుడున్న ఆకరాల బట్టి అంత సులభంగా తేలే విషయం కాదు.

ధూర్హటి

““రాజులు మత్తులు; వాళ్ళ సేవ నరకప్రాయం; వారిచ్చే దాసీలు, పల్లకీలు, గుర్రాలు నగలూ మొదలైనవి ఆత్మవ్యథాబీజాలు” అని నిరర్వయంగా నిజాన్ని చాటిన మొదటి తెలుగుకవి ధూర్జటి. ఇతడు శ్రుతులు అభ్యసించాడు. శాస్త్రగరిమలు శోధించాడు. తత్త్వాలు మదిని ఊహించాడు. శరీరం అస్థిరం అని, బ్రహ్మమే సత్యమని గుర్తించాడు. ఈ సంగతి సభల్లో వృథా వచనాలుగా చెప్పేవాళ్ళను చూశాడు. నిండు యౌవనంలో రతిరాజద్వార సౌఖ్యాలలో సంతోషించాడు. బహురాజద్వారసౌఖ్యాలలో శాంతించాడు. వధూనఖా గ్రాలచే అతని ఒళ్లు కాయలు కాచాయట. వక్షోజాల రాపీడితో రొమ్ము రాపాడిందట. మన్మథవిహారక్షేశవిభ్రాంచిలో వయసు ఉడీగింది. జుత్తు రాలిపోయి శిరస్సు బట్టతల అయింది. మత్తెక్కిన రాజులు విద్వాంసులైన మిత్రులను రక్షించడం మానేశారు. జ్ఞానులు ద్రోహులయ్యారు. వాళ్లు చేసి కపటాలు, ఈర్ష్యలు మొదలైన క్రీయాదోషాలు అతడు సహించలేకపోయాడు. సన్యసిద్దామనుకొన్నాడు. అయినా మనసులోని కోపం మానడంలేదు. తను నివసించే సీమలోని దేవుడు శ్రీకాళహస్తీశ్చరుడు. ఆ దైవం ముందు తన కోపాన్ని వెళ్ళగ్రక్కాడు; బాధలు చెప్పుకొన్నాడు. భయాలు నివేదించాడు; కోరికలు విన్నవించుకొన్నాడు. ఏమాత్రం భయపడకుండా, నిజం అణుమాత్రం దాచకుండా చిత్తశుద్ధితో. మహోద్వేగంతో అతడు ఒక శతకం చెప్పాడు. దాని పేరు శ్రీకాళహస్తీశ్వర శతకం. 8. భారతి - అకోబరు, 1930.

ధూర్జటి 109

ఈ శతకం వల్ల ధూర్జటి జీవిత చరిత్రను ఊహించడానికి అవకాశాలు ఉన్నాయి. మరే శతకంలోనూ ఏ కవీ చెప్పలేనంత ఆత్మకథ, సమకాలిక పరిస్థితులూ ఇందులో ఉన్నాయి. అది ఒకరిని చంపి పదసులై బతుకుదామని రాజులనుకొంటున్న కాలం. కృప, ధర్మం, అభిజాత్యం మొదలైనవి పాలించేవాళ్ళలో మృగ్యమవుతున్నాయి.. అందుకే అతడిలా అన్నాడు:

రాజన్నంతయె పోవునా కృపయు ధర్మం బాఖిజాత్యంబు వి

ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్‌

సౌజన్యంబు కృతం బెరుగుంటయు విశ్వాసంబు గానున్న దు

ర్చీజశ్రేష్ణులుగా గతంబు గలదే శ్రీకాళహస్తీశ్వరా. (39)

తిట్టు కవిత్వం చెప్పకపోతే ఎంత సత్కవికేనా భయపడక రాజులు నిర్లక్ష్యం చేసే రోజులు. ఈ సంగతి ధూర్జటి ఇలా గ్రంథస్థం చేశాడు:

క్షితినాథోత్తమా సత్కవీశ్చరుడు వచ్చెన్‌ మిమ్ములం జూడగా

నత డేమింట కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత త

త్ప్పతిభ ల్మంచివి తిట్టుపద్యములు చెప్పండాతడైనక్‌ మముం

గితమే బూనెనుబొమ్మటంచు నధముల్‌ శ్రీకాళహస్తీశ్చరా. (11-3)

విద్వాంసుడుగా పుట్టినందుకు బ్రహ్మను తిట్టుకొనేవారు. తెలివితీటలతో పాటు ఆకలిదప్పులను కూడా ఎందుకు పెట్టాడో ఆ తొత్తుదైవం అని దూషించుకొనేవారు. ధూర్జటి ఇలాగ చెప్పాడు:

వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులన్‌ జేయనే

లాధీచాతురిజేసె జేసిన గులామాట నేపోక క్షు

ద్వాధాదుల్‌ గలిపింపనేల యిది కృత్యంటైన దుర్మార్గులం

జీధాత్రీశుల జేయ నేటి కకటా శ్రీకాళహస్తీశ్చరా! (8)

సమకాలిక రాజుల దుర్మార్గాలకు ధూర్జటికి విసుగెత్తి పోయింది. బహుశా కృష్ణ్ణాయలవారు గతించిన కొత్త రోజులలో కావచ్చు. ఉపమానాలలో ఉడ్రేక్షలలో ధ్వని, వ్యంగ్యం, శబ్దాలంకారవిశేష భాషలు మొదలైన వాటితో ధూర్జటి కడు తియ్యగా కవిత్వం చెప్పే నూత్న యౌవనంలో కృష్ణ్ణాయలవారు బ్రతికే ఉన్నారు. కాళహస్తి ప్రాంతాల నుంచి ధూర్జటి, తెనాలి ప్రాంతాల నుంచి రామలింగకవి రాజధానీ నగరానికి వచ్చి అక్కడ సానివాడలో పాత పుస్తకాలలో చదువుకొన్న విషయాలలో కొత్త అనుభవాలు గడిస్తున్న రోజులవి. ఇద్దరూ పైలాపచ్చీసులో ఉన్నారు. ఇద్దరూ రసికులు. ఇద్దరూ జూణలు. ఏ సానికూతురు గానరసాన్ని ఆనడానికో వెళ్లినప్పుడు ఒకరినొకరు చూసుకొని ఉంటారు. ఊళో ఇద్దరు యువకవులు చాలా మంచి కవిత్వం చెప్తున్నారన్న సంగతి రాయలవారి చెవినబడింది కాబోలు, పీలిపించుకొని కవిత్వం విన్నారు. ఆస్థానంలో ఉండమన్నారు. అష్టదిగ్గజాలలో చేర్చారు. ధూర్జటి పద్యాలలోని మధురిమ రాయలవారిని ముగ్గులను చేసింది.

110 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి “స్తుతమతియైన యాంధ్రకవిధూర్జటి పల్కుల కేల కల్గెనో యతులితమాధురీమహిమ””

అని ఆయన ఒకనాడు మనోజ్ఞసభలో ఆశ్చర్యంతో ప్రశ్నించారు. అప్పుడు కొంటె

రామలింగం లేచి ఇలా పూర్తిచేశాడు:

““-హాో! తెలిసెన్‌ భువనైకమోహనో దద్ధత సుకుమారవారవనితా జనతాఘనతాపహారిసం తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ॥ే రాయలవారు ధూర్జటి కవిత్వాన్ని ఎంత మెచ్చుకున్నారో, రామలింగడు చెప్పిన కారణాన్నీ అంత హర్షించే ఉంటారు. అయితే ఈ ఇద్దరు యువకవులూ నాలుగు కాలాల పాటు రాయలవారి పోషణలో ఉండే అవకాశాలు నిండుకొన్నాయి. రాయలవారు క్రీ.శ. 1530లో మరణించారు. ఇద్దరు యువకవులూ వేరే బ్రతుకుతెరవు చూసుకున్నారు. కృష్ణ్ణాయల తరువాత ప్రాముఖ్యం వహించిన అచ్యుతదేవరాయలూ, అళియ రామరాయలూ కవిపోషకులే. అయితే ధూర్జటి హృదయం ఏ సంఘటనల వల్లనో గాయపడింది. రాజకీటకాల నతడు చీదరించుకున్నాడు. రాజులను ఆశ్రయించుకొనే తిట్టు కవులంటే అతనికి అసహ్యం వేసింది. చదవుల్‌ నేర్చిన పండితాధములు స్వేచ్చాభాషణ క్రీడలన్‌ వదరన్‌ సంశయఖీకరాటవుల ద్రోవల్డప్పి వర్తింపగా మదన క్రోధికిరాతులందు గని భీమప్రొడిచే దాకినం జెదరుం జిత్తము చిత్తగింపగదవే శ్రీకాళహస్తీశ్వరా, (70) అతనికంతా సంశయమే. శరీరఘటనం అంతా విచారమే. మంత్రతంత్రాలు పరిశీలించాడు. సాంఖ్యాది యోగరహస్యాలు గురువు చెప్తే విన్నాడు. అయినా శంక పోలేదు. బోధించిన గురువుల సంగతిమాత్రం తెలుసుకున్నాడు. అయవారై చదివింపవచ్చు దన పాదాంభోజతీర్థంబులన్‌ దయతో గొమ్మనవచ్చు స్నేహితుని నర్ధప్రాణదేహాదుల న్నియు నా సొమ్మన వచ్చుగాని సిరుల న్నిందించి నిన్నాత్మని " క్కియతం గానగరాదు పండితులకున్‌ శ్రీకాళహస్తీశ్వరా (73) చాలామంది వేషధారులే. అన్యులను స్తోత్రం చేయనని వ్రతం పట్టిన వాళ్లు రాజులను చేరి ఇంద్రుడనీ చంద్రుడనీ పొగడడం అతనికి వెగటు పుట్టించింది. స్తోత్రం బన్యుల బేయనొల్లని వ్రతస్థుల్యోలె వేసంబుతో బువ్రీబు త్రకళత్రరక్షణకళాబుద్ధిన్‌ నృపాలాధముల్‌ బా త్రంబంచుభజింపబోదు రిదియు న్బావ్యంబటె యెవ్వారి చా రక లెన్సడు మెచ్చ నెంచ మదిలో శ్రీశాయాస్తీషా. (0)

  1. ఈ పద్యపాదాన్ని ఇంతదాకా, ధూర్జటివంశంలోని కువూర ధూర్జటి గ్రంథస్థం చేశాడు (కృష్ణ్ణాయవిజయం, 1-౫)

ధూర్జటి 111 ధూర్జటి తన మదిలో మరొక నిశ్చయం చేసుకొన్నాడు. తన కవిత్వం ఇంకెవరికీ ఇవ్వక శివునికే మీదు కట్టాడు. నీకుంగాని కవిత్వ మెవ్వరికి నే నీనంచు మీదెత్తితిక జేకొంటిం విరుదంబు కంకణము ముందే గట్టితిన్‌ బట్టితిన్‌ లోకుల్‌ మెచ్చ వ్రతంబు నాతనువుకిలున్‌ నేర్చులుంగావు చీ చీ కాలంబులరీతి దప్పదు జుమీ శ్రీకాళహస్తీశ్చరా. (114) ధూర్జటి నిజంగా తన కవిత్వం దేవునికే ముడుపు కట్టాడు. “శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం' అనే పద్యకావ్యం వ్రాసి దేవునికే అంకితం ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని అతడు శతక రచనకు ముందు రాశాడో తరువాత వ్రాశాడో తెలియదు. బహుశ ముందుగానే అని _ భావించవచ్చు. దీనికి స్కాందపురాణం, వైష్ణవ ఖండంలో ఉన్న ఆరవ అధ్యాయం ఆధారం కావచ్చు. ఈ స్థలపురాణాన్ని్ని ఏ సూతుడూ శౌనకాది మహామునులకు చెప్పలేదు. కాళహస్తి చుట్టుప్రక్కల వున్న నారాయణవనాన్ని పాలించిన వీరనరసింహ రాయలనే యాదవరాజుకు సాక్షాత్తూ శివుడే చెప్పాడు. ఈ రాజు చారిత్రక వ్యక్తీ. నారాయణవనాన్ని క్రీ.శ. 1000లో ఇమ్మడి నరసింహరాయలు పరిపాలించాడు. ఇతడే చంద్రగిరి కోటను నిర్మించాడు. ఇతనిచేత కాళహస్తి దేవాలయాన్ని కట్టించాలని దేవుడు సంకల్పించినట్టు ఈ పురాణం చెప్తుంది. అయితే క్రీ.శ. 12వ శతాబ్దంలో ఉండే రాజేంద్రచోళుడనే చోళరాజు కాళహస్తి దేవాలయం నిర్మించాడు. ఆ ప్రాంతాలలోనే ఏ పండితుడో ఈ స్థలపురాణాన్ని వ్రాసి స్కాందంలో ఇరికించి ఉంటాడు. ధూర్జటి తెలుగులో ఈ మహత్యాన్ని 755 గద్య పద్యాలలో హృద్యంగా నాలుగాశ్వాసాల కావ్యంగా రూపొందించాడు. తన కృతికన్యారక్నానికి విద్యాపారంగతుడైన వరునిగా కాళహస్తీశ్చ్వరుని ఎంచుకొనగానే దేవుడు దీవించాడట. ఈ శుభకావ్యరత్నమున కీశునధీశుని జేసినన్‌ మహా దేనికసార్వభౌముడు మదిం బ్రమదంబు వహించి ధూర్జటీ నీశివభక్తి కావ్యసరణిం గడుధన్యత బొంద నవ్యభా షాశయతానిగుంభనరసస్థితి నొప్పు దలిర్చజెప్పుమా. (శ్రీకాళ 1-8) ఈ కావ్యం నిజంగానే నవ్యభాషా నిగుంఫనంతో రసస్థితి శతధా కనబడుతుంది. తక్కిన కవులందరూ భౌతికంగా పురవర్ణన చేస్తే ఇతడు ఆధ్యాత్మిక సంపదతో పురవర్ణన చేశాడు. కాళహస్తిలో కామినులు సహితం యోగిజనమే అని వర్ణించాడు. పరిచితవిందునైపుణి నపారకళానుభవప్రసక్తి నా దరసవివేకసంపద సదాశుక వాక్యసుధానుభూతి మో హరహితవృత్తి బ్రస్ఫురదనంగరహస్యవిచారబుద్ధి న ప్పురమున గామినీజనులు పాల్తురు యోగిజనంబు పోలికన్‌ (శ్రీకాళు 1-24) నారాయణవనంరాజుగారి పరిచారిక ఒకర్తె ఇటువంటి యోగినే. ఈమె ఇంటికీ ఇివుడు మిండజంగం వేషంలో వచ్చాడు. ఆయన సౌందర్యాన్ని చూసి కామ శరసంతాపం

112 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చెందని కాంత మచ్చుకైనా లేదట. ఈ జంగానికి ఆ పరిచారిక కన్నడ భాషా పదాలతో ఇలా స్వాగతం ఇచ్చిందట.

విజమాడు దేవరు నిజకృపాదృష్టి జెన్నారు నాయిల్లు బిడారు మీకు

నాకుమీపాదార్చనము చేయ నడలింగమూర్తి చేకురెవచ్చిమూర్తమాడు

మొడయచిత్తేశ నాయునికిని మజ్జనంబాడీ శివార్చన మాడబేకు

విచ్చేయడు విభూతి వీడియం బందుకో జంగమస్వామి నా సదనమునకు

నోగిరంబులు మంచి మేలోగిరములు

నావటించెద బదరు మీ రారగింప

బ్రతిదినంబును జంగమూర్చనము లేక

తనివుపడనొల్ల విజిత కందర్భయనుడు. (శ్రీకాళు 1-35)

ఇలా అనగానే అతడు సంతోషించాడు. ఇది మహాత్మురాలు. కివచారిర్టైన సుశీల అని కరుణించాడు. దానిని రతికి అంగీకరింపబేశాడు.

తాను గుమారజంగమనుసుధాకరమౌళియు గూడిమాడి యిం

పైన రతిప్రసంగముల నర్థనిమీలిత నేత్రపద్మముల్‌

మానని చుంబనంబులును మాటలు చూడ్కులు వీడివిడిపో

నీని కవుంగలింతలు ననేకవిలాసములుం జెలంగగన్‌

ఎక్కడ బట్టినం గళల యిక్కువ, లెక్కడ నోరు సోకినన్‌

జక్కెరలప్ప లేమనిన సారసుధారసమట్టు లుండినన్‌

జక్కదనంబు పెన్నిధులు సంభమ మొప్పగ నేమి సేసినన్‌

మక్కువ చెయ్యులై మెరయు మన్మధకేళి యొనర్చు నంతటన్‌. (1-42, 4)

రాజుగారి భోజన సమయంలో హ్హాం పెట్టవలసిన పని ఈ దాసీదానిదే. తపసినలా సేవించుకొంటున్న నది రాజుగారి కొలువుకు గైరుహాజరయింది. కడుపు కాలిన రాజుగారికి ఒళ్లు మండింది. ఆ నీలవేణి తలగొరిగించమని అజ్ఞ జారీ చేశాడు. దానిని అమలు జరిపారు. ఆ పరిచారిక జంగం కాళ్లమీద పడింది. ఆయన హస్తమస్తక సంయోగంతో దానిని దీవించాడు. మళ్లీ కురులు వచ్చాయి. మరునాడు కొలువులోకీ వెళ్లగానే రాజుగారు. ఆశ్చర్యపోయారు. సంగతి తెలుసుకొని జింగం కాళ్లమీద పడ్డారు. అతడు రాజుగారికి కాళహస్తి మాహాత్మ్యం పూసగుచ్చినట్లు కొన్ని కథలలో చెప్పాడు పదిమంది భక్తులను పరమేశ్వరుడు కరుణించిన గాథల సంపుటమే ఈ స్థలపురాణం. ఈ “వ్యక్తులెవరో చూడండి. (1) వసిష్టుడు; (2) బ్రహ్మ (3) సాలెపురుగు; (4) పాము; (5) ఏనుగు; (6) చెంచుతిన్నడు; (7) బ్రాహ్మణపూజారి; (8) నక్కీరుడనే తమిళకవి: (9) ఇద్దరు సానికూతుళ్లు: (10) యాదవరాజు. ఈ పేర్లన్నీ కృత్యాదిని మంగళాచరణంలో వచ్చేటట్టు ధూర్జటి పద్యం చెప్పాడు.

శ్రీవిద్యానిధిర్చు మహామహిమచే జేన్నై వసిష్థాజలూ

ఆావాతాశనసామజాటవికగో త్రాదేవనత్కీరరా

ధూర్జటి 113 జీవాక్షీయుగయాదవాధిపులకున్‌ శ్ర్రేయస్కరంబైన యా

ర్యానామాంగము దివ్యలింగము మదీయాఖీష్టము ల్సల్పెడున్‌. (1-1)

పై పద్యంలోని జాపితాలో లేని వ్యక్తి మరొకడు కావ్యంలో ఉన్నాడు. అతడు అగస్త్యుడు. ఈయన ధర్మపత్నీ సమేతంగా దక్షిణానికి వచ్చాడు. కాళహస్తీశ్చరుడికి అభిషేకం చెయ్యడానికి తగిన జలం లేదని తపస్సు చేశాడు. శివుడు తన జటాజూటం లోంచి ఆకాశగంగ పాయను పంపాడు. అది సువర్జముఖీనది అయింది. ఈ కథ కూడా ధూర్జటి ఈ కావ్యంలో కథనం చేశాడు.

ఈ పది కథలలో ధూర్జటి పద్దెనిమిది వర్ణనలూ కాక ఎన్నో లౌకిక విషయాలు చెప్పాడు. కాళహస్తి పరిసరాలలో ఉండే చెంచుపల్లెలు ధూర్జటికి బాగా తెలుసు. వాళ్ళ అచార వ్యవహారాలు, ఆటపాటలు, జాతరలు అన్నీ ఈ [గ్రంథంలో చెప్పాడు. తెరవేట, డేగవేట, ముంగివేట, ఏదువేట, సివంగివేట, ఇగ్రివేట, గంటవేట, ఎద్దువేట మొదలైనవ వేటలెన్నో ధూర్జటి స్వయంగా చూశాడు. చెంచులు ఆడా మగా తాగి ఎలాగ తందానలాడేదీ గమనించాడు. -

మాటలాడదలంచి మరచిపోయెడువారు నడవబోవుచుదొట్రుపడెడువారు

నూరకుండెదమని యుండనోపనివారు లేచెదమని లేవలేనివారు

బనిలేని పని బట్టబయలు దిట్టెడివారు బాడనేరకయును బాడువారు

నెదురైనవారికి నెల్ల మొక్కెడివారు వ్రీడావిహీనులై యాడువారు

జాల బ్రావియు మగుడు జేసాచువారు

దొడరి యువదంశభాండము లొడుకువారు

నైరి మృగయాదిదైవతయాత్రయందు

బానముల జేసి శబరదంపతుల రతుల. (శ్రీకాళు ౩-41)

ఈ చెంచుపల్లెలో పుట్టిన తిన్నడు ఒకనాడు వేటాడుతూ కాళహస్తీశ్వరుని చూశాడు. “ఈనట్టడవిలో ఎందుకున్నావయ్యా' అన్నాడు.

ఓ సామీ ఇటువంటి కొండదరిలో నొంటిం బులుల్‌ సింగముల్‌

గాసింబెట్టెడి కుల్రనట్టడవిలో గల్తున్విక్రీనీడ నే

యాసం గట్టితి వేటిగడ్డ నిలునీవాకోన్నచో తూడా నీ

శ్లేసుట్టంబులు దెచ్చి పెట్టిదరు? నీకిందేటికే లింగమా! (శ్రీకాళ3-65)

తనతో వాళ్ల ఊరికి వచ్చెయ్యమన్నాడు. రాకపోతీ తానూ వెళ్లనన్నాడు. “ఎన్నేళ్లనుండియో పస్తున్నాడీ యడవిలోన మహేశు'డని దొప్పలలో మాంస ఖండములు తీసుకువచ్చి పెట్టేవాడు. విలాక చంకలో ఉండేది. వీపున అంపసాది, చేతులలో దొప్పలు, పుక్కిళ్లటో పవిత్రమైన స్వర్ణముఖినీళ్లు దేవుడానంజుళ్లు తినకపోతే ఇలా అడిగేవాడు.

కాలవొత్రొవ్చ మాడం-గాలెనొ చవిగావొ కమ్మగావో నీకున్‌

జాలవొ యలవడవో తిన - వేలా కరకుట్లు? పార్వతీశ్వరః చెపుమా.

(శ్రీకాళ ౩-89)

114 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ నాగరిక భత్తులకన్నా ఈ ముగ్ధభక్తుడే గొప్పవాడని రుజువు చేయడానికి శివుడు కంట రక్తబాష్పాలు కార్చాడు. అపుడు తిన్నడిలా నేత్రవైద్యం చేశాడు. తోకపొట్లం బావిగొన నూది యెత్తుచు గషణోష్టకరభభాగమున గాచి నెత్తి తంగేడాకు మెత్తి రేచకి నిమ్మ నంటినీరున నూరి పట్టు వెట్టి తెల్లెంగింటెనపువ్వు దెచ్చి తద్రస మిడి కలివెపువ్వులు గోసి నలచి పిడిచి పేరిన నెయిపెట్టి పెరుగువత్తులు వైచి చనుబాలతో రాచి సంకు చమిరి విన్న మందులు తానరి కన్నమందు లడీగి తెచ్చిన మందులు నడవిమందు లెన్ని చేసిన మానక యిందుమౌళి కన్ను తొడిబడి నెత్తురుగారుటయును. (శ్రీకాళ ౩3-110) చేసిన వైద్యాలు వెల్లిగలిసిన చింతపండు, నీట వ్రాసిన వ్రాలు అయిపోయాయని తిన్నడు తన కన్ను తోడి దేవుడి కిచ్చాడు. ఆయన రెండో కంట కూడా నెత్తురు కార్చాడు. తిన్నడు తన రెండోకన్ను తూడా ఇవ్వబోయాడు. దేవుడు ప్రత్యక్షమై వారించాడు. ముక్తినిచ్చాడు. తిన్నడి గొప్పతనాన్ని తెలుసుకున్న శివబ్రాహ్మడు కూడా మోక్షాన్ని పొందాడు. పొట్టకోస్తే అక్షరం ముక్కలేని ముగ్గభక్తుని కథ ఎంత హృద్యంగా బ్రాశాడో, మహావిద్వాంసుడైన తమిళకవి నక్కీరుని కథ కూడా ధూర్జటి అంత చక్కగా వ్రాశాడు. ఈ తమిళకవి చారిత్రక ప్రముఖుడే. తమిళ వాబ్బయంలో శక్కీరుడను పేరుగల కవులిద్దరున్నారు. ఒకరు సంగం కవులు వర్టిల్లిన క్రీ.శ+.300 ప్రాంతాలలో ఉండేవారు.* రెండోకవి క్రీ.శ. 650 ప్రాంతంవాడు. ఇతడు _ సుబ్రహ్మణ్యుని మీద “మురుగాట్రుపడ్డె' అనే కావ్యం వ్రాశాడు. ఇతడే శైవభక్తులలో నక్కీర దేవనాయనార్‌ అనే పేర ప్రసిద్ధుడయ్యాడు. ఇతని చరిత్ర తమిళంలోనే రకరకాలుగా ఉంది. పరంజోతి మునివర్‌ తిరువిళయాడల్‌ పురాణంలో ఒకలాగ పులియూర్‌ నంవి మరొకలాగ ఇతని కథ వ్రాశారు. తమిళదేశంలో ఉండే విఖిన్న గాథలను ధూర్జటి సమ్మిళితం చేశాడు - పాండ్కరాజు కొలువులో నక్కీరుడు గొప్పికవి. ఆ రాజ్యంలో క్షామం వచ్చింది. ఒక పేద అర్చతునికి సహాయం చేద్దామని శివుడ్ణే ఒక పద్యం వ్రాసి ఇచ్చాడు. సభలో దానిని చదివితే రాజు సత్కరిస్తాడని చెప్పాడు. అర్చకుడు చదివాడు. నక్కీరుడు దగ్గిర మొర పెట్టకొన్నాడు. దేవుడు సభలోకి స్వయంగా వచ్చి వాదించాడు. 'దేవుడు రాసినా సరే తప్పు తప్పి* అన్న ధోరణిలో నక్కీరుడు ఉన్నాడు. దైవానికి కోపం వచ్చి శాపం ఇచ్చాడు. శ్రీకాళహస్తీశ్చరుని సేవవల్ల విమోచనం వచ్చింది. 2 0105 ౦ జంటే సీమాప్రంంంైం ౩౧4 జడల కం 5 సల! 284 ౯:35 8. పనీ, 113 4. ఈ విషయమై చల్లా రాధాకృష్ణశర్మగారు విపులంగా పరిశోధనలు చేశారు. 18 దెజుల౫ ౯ తుడు ంాటూాల. (రింరటండు 0 131-146.

ధూర్జటి 116

ఈ కథను తమిళ స్నేహితుల మూలంగా తెలుసుకొని ధూర్జటి బ్రాశాడనుకోవచ్చు. గ్రంథాదిని కన్నడ పదాలు వాడినట్టే ఈ ఘట్టంలో అతడు తమిళ పదాలు వాడాడు.

ఉళణ్లామల జగదంవిక-నణామల విశ్చనాథు నారాధించెక్‌

ముఖ్ఞాసయు బొన్నాసయు-బెణ్లాసయు లేనివారి పెన్నిధు లగుటన్‌.

(శ్రీకాళ. ౩3-185)

శివభక్తులలో చాలామంది దక్షిణ దేశీయులే. అందుకే ధూర్జటి మరొక కథలో తమిళదేశంలో పుట్టిన సానికూతుళ్ల తివభక్తిని తెలియజేశాడు. ఈ సందర్భంలో సానివాడలో తనకు గల పరిచయం పచరించాడు. సమకాలిక సంప్రదాయాలు చిత్రించాడు. సాని తూతుళ్ల పుట్టుక వర్ణించిన ఘట్టంలో ఆ రోజుల్లో బాలింతలు బిడ్డను ఎలా సాకేదీ ఇలా చూపించాడు.

అలదునలుంగు దేహమున వేణ్డీళ్లార్చు దడీయొత్తు మెత్తని ధవళవన్త

మున గాలావ్రేలి మన్నున బొట్టువెట్టు గన్సవబెట్టు గాటుకకడునపునకును

బెట్టు, బొత్తులమీదబెట్టు, జన్నిచ్చు జోకొట్టు జోలలుపాడు మట్టెపరుచు.

దలయంటు చిట్టాముదమున రక్షార్థంబు ముసిడికోలలు మంచమున నమర్చు

బ్రాటనులిగాయ గూర్చి పాదములగట్టి

యుప్పు వేపాకుపై జల్లు నిప్పులతివ

ద్రిప్పి యిడు దృష్టిదోషంబు తీరవీధి

ట్రేమమీరంగ బిడ్డల బెంచునపుడు. (4-11)

ఈ బిడ్డలను తొట్టిలో పెట్టి కొక్కోక కళావిలాసములకు గల అర్థం జోలపాటగా పాడి కమనీయశైశవం నుండి వాళ్లకు వార ధర్మ విద్యాబుద్ధులు వేశ్ళమాత నూరిపోసీంది. అయితే వాళ్లు శివభక్తి అలవరుచుకొన్నారు. ఎదిగిన కూతుళ్లను తల్లి ఇలాగ తిట్టేది.

, రసికులు మీ గానరసమున వచ్చిరి పాడరే పాడుగాను

జాణలు మీ విలాసము జూడవచ్చిరి చూడరే శివభక్తి చూరవోను

పల్లవు ల్మీ తోడ భాషింపవచ్చిరి పలుకరే శివభక్తి పారిపోను

పార్థివు ల్సాకలసంపద లీయవచ్చిరి పిలువరే శివభక్తి పెంపుచెడను

ధనముగలిగిన జంగమార్చన మొనర్చ

శివున కథిలోపచారము ల్సేయవచ్చు

వనజముఖులాళ్ళా! నా సరివారిలోన

సిరుల మెరయుచు దలయెత్తి తిరుగవచ్చు (4-35)

తల్లి చీవాట్లు పెడితే పిల్లలు పోట్లాడుతూ ఉండేవారు.

ఆ సానితూతుళ్లను దోచుకొందామని దొంగలు ఒక ఎత్తువేశారు. '“ఎందుకూ? తల్లితో పోరగా పనిలేదు. ఆ తిరుకాళహస్తిపతిని చూపిస్తాం” అని లేవదీసుకుపోయారు. ఆ చొంగలబారినుండి వారిని దేవుడు కాపాడడం ధూర్జటి చక్కగా చిత్రించాడు.

116 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కాళహస్తిలోని ఆ దైవానికాపేరు రావడానికి కారణభూతులైన ఏనుగు, సాలెపురుగు, పాము ఎలా ముక్తి పొందినదీ ద్వితీయాశ్వాసంలో చెప్తాడు.

వాటి పూర్వ్చజన్మలు నాలుగో ఆశ్వాసంలో వివరించాడు.

కాళహస్తీశ్చరుని. పేరు చెప్తే ధూర్జటి పరవతిస్తాడు. శ్రీనాథునికంత శివభక్తో ధూర్జటికి అంతకు రెట్టింపు ఉంది.

ప్రతి పద్యం గుండెలలోంచి వెలువడుతుంది. లక్షణం, అలంకారం, పదబంధం, రసం మొదలైనవి వాటంతటవే కవితాధారలో తీలితీలి మనల్ని ఓలలాడిస్తాయి.

అతని కవిత్వంలో మాధుర్యమేకాక, సర్వబజ్ధత్వము, బహుముఖ నిర్వహణ శక్తీ కనబడతాయి - పూర్వకవుల ననుసరించినచోట కూడా, ఏ పద్యం తీసినా సహజంగా ఉంటుంది గాని ఎరువు తెచ్చుకొన్నట్టు ఉండదు.

ఎరువు పద్యం పట్టుకొని వెళ్లి పాండ్యరాజు సభలో అవమానం పొందిన అర్చకుడు ఇలా బాధపడడం ధూర్జటి చెప్తాడు.

తానెరిగిన విద్య నృపా - స్థానములో నెరప గీరి సమకూరుంగా

'కేనరునకు బరవిద్యా - ధీనత భూపాలసభల దేజము కలదే? (39-162)

ధూర్జటి పద్యాల్లో పరవిద్య మందుకైనా ఉండదు.

సంకుసాల నరసయ్య

రాయలవారు ఒకనాడు తన కుమార్తె మోహనాంగితో చదరంగమాడుతున్నారట. ఆట మంచి రసకందాయంలో ఉంది. రాయలవారు మంత్రినీ, ఏనుగునూ జోడించారు. ఆ రెండింటి మధ్య మోహనాంగి బంటొకటి చిక్కుకుంది. దాన్ని తొయ్యడమా, మానడమా అని ఆలోచిస్తూ అమె చిన్న కూనిరాగం తీసింది. “ఉద్ధతుల మధ్య పేదల కుండ దరమె?” అంది. ఇది గీతపద్యపాదం. రాయలవారికి చదరంగమంటే ఎంతిష్టమో పద్యాలంటేనూ అంతకన్నా ఎక్కువ. ఏదైనా కొత్త పద్యం వింటే ఒకటికి రెండుసార్లు చదివించుకొంటారు. “ఏమిటమ్మా ఆ పద్యం? పూర్తిగా చదువు” అన్నారు. అమె సిగ్గుపడింది, అయినా రాయలవారు చదవమన్నాక మానకూడదు, చదివింది.

ఒత్తుకొని వచ్చు కటికుచోద్వృత్తి జూచి

తరుణి తనుమధ్య మెచటికో తలగిపోయె

నుండెనేనియు గనబడుకున్నా? యహహః!

యుద్ధతుల మధ్య బేదల కతుండదరమె? చక్కని పద్యం, “ఎవరు చెప్పినదమ్మా!”” అని రాయలవారు ప్రశ్నించారు. “నాలుగువేల వరహాలు పెట్టి ఆ పద్యం కవిదగ్గర కొన్నా''నని మోహనాంగి చెప్పింది. ఇటువంటి కవిత చెప్పి ఆ కవి ఎవరో, ఏ గ్రంథం బ్రాశాడో, ఎందుకీ పద్యం అమ్ముకోవలసివచ్చిందో రాయలవారు వాకబు చేశారు. అయితే అప్పటికే ఆ కవి రాజదర్శనం కాక విసిగి వేసారి విజయనగరం విడిచిపెట్టి వెళ్లిపోయాడు. రాయలవారు విచారించారు.

ఈ కథకు కాళ్లూ, చేతులూ ఉన్నాయో లేవోగాని ఈ పద్యం మాత్రం ఒక కావ్యంలో ఉంది. దాని పేరు 'కవికర్టరసాయనం' ఈ ప్రబంధంలో నాయిక సకలావయవ వర్ణనలో నడుముమీద చెప్పిన పద్యమిది. విమలాంగి అనే రాజకుమార్తె చిత్రపటాన్ని లిఖించి ఇద్దరు చిత్రకారులు మాంధాత దగ్గరకు తీసుకువచ్చి ఆమెను వర్ణించిన ఘట్టంలోనిది ఈ పద్యం (3-26), ఈ కావ్యాన్ని వ్రాసిన కవిపిరు సంకుసాల నరసయ్య, ఇతని ఇంటిపేరులోని సంకుసాల బహుశా కడప జిల్లా పులివెందుల తాలూకాలోని “సుంకేసులి కావచ్చు. ఆ గ్రామంలో ఒక నరసింహస్వామి ఆలయముంది. ఆ దేవుని పేరే అతనికి కవి తల్లిదండ్రులు పెట్టి ఉంటారు.

నరసయ్య తన తల్లిదండ్రుల పేరుగాని, కులగోత్రాదులుగాని ఎక్కడా చెప్పుకోలేదు. తాను భట్టపరాశరుల కిష్యుడనని మాత్రమే తెలియజేశాడు (1-77). క్రీశ 1536 ప్రాంతాలలో భట్టపరాశరుల శిష్యులు ఉండేవారని శాసన ప్రమాణముంది.! సంకుసాల నరసయ్య ఈ పరాశర భట్టాదార్యులవారి శిష్యుడే కావచ్చు. ఈ గురువుల వల్ల నరసయ్యకు సత్కృతుల పరిచయం ఏర్పడిందట. వాటి రసానుభవ హేతువు వల్ల అతడు సముల్లసన్మానసుడైనాడు. నరసయ్యకు కవులంటే చాలా గౌరవం. ఘనమతులైన సత్కవులు అందరికీ అకారణ బంధువులు. వాళ్లు మనసులో ఉన్న 'నెవ్వగలు' మాన్ని

  1. తిరుపతి దేవస్థానం శాసనాలు, సంపుటి 4, నెం. 73

118 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కావ్యానందం కలిగిస్తారు. తథాముఖంలో ఇంపుగా హితాహితబోధ చేస్తారు. ఇం ద్రియాతీతమైన భావాలను చూసినదానికంటే అద్బుతంగా తెలియజేస్తారు.

మనమున గొన్న నెవ్వగలు మాన్సి ఘటింతురు కావ్యసమ్మదం

బనఘ కథాముఖంబున హితాహితబోధ మొనర్హు రింపుగా

గనుగొనుకంటి నద్చుతముగా నెరిగింతు రతీంద్రియార్థముల్‌

ఘనమతు లెల్లవారికి నకారణబంధులు గారె సత్కవుల్‌ొ (కవికర్ణ, పీఠిక, 8)

అకారణ బంధువులైన సత్కవులంటే ఇంత అభిమానం కనుకనే నరసయ్య తన కావ్యానికి “కవికర్ణరసాయన' అనే పేరు పెట్టాడు. గ్రంథం చిట్టచివర ఇలా విజ్ఞాపన చేశాడు.

కవితా విచక్షణ గల - కవికంఠ విభూషణముగ గైకొనవలయుం

గవినరనృసింహవిరచిత - కవికర్ణరసాయన మను కావ్యముదీనిన్‌. (కవికర్ణ, 6-21)

వాస్తవానికి దీనికి 'మాంధాతృ చరిత్ర అని పేరు పెట్టాలి. సాకేతపురాన్ని యవనాశ్చుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి పుత్రులు లేరు. సంతానం కోస అతడు ఇంద్రయాగం చేశాడు. మాంధాత జన్మించాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి అతనికి పట్టంకట్టి రాజనీతులు బోధించి అడవులకు పోయాడు. మాంధాత ధర్మయుక్టంగా పరిపాలించాడు. శరక్కాలం వచ్చాక అతడు దిగ్విజయానికి వెళ్తాడు. స్వర్వాన్ని ముట్టడించాడు. తరువాత రావణునితో తలపడ్డాడు, రాయబారాలు జరిగాయి. విఫలమైనాయి. సంకుల సమరం జరిగింది. మాంధాత రావణుల ద్వంద్వ యుద్దాన్ని సాక్షాత్తూ శివుడే దిగివచ్చి ఆపాడు. మాంధాత మంధరగిరి మీద జయస్తంభం నిలిపి రాజధానికి తిరిగి వచ్చాడు. అతని వద్దకు ఇద్దరు చిత్రకారులు వచ్చారు. కుంతల దేశాధిపతి కుమార్తె విమలాంగి చిత్రపటాన్ని తెచ్చారు. మాంధాత ఆ రూపాన్ని చూసి

_ మోహించాడు. అతని చిత్రాన్ని ఆ చిత్రకారులు ఆమెకు అందజేశారు. ఆమె కూడ

మరులుకొంది. ఇద్దరూ విరహంలో పడ్డాక వివాహం జరిగింది. మాంధాత భార్యతో క్రీడాగృహంలోకి వెళ్లాడు, నవోడాసంగమంలో రాత్రీ పగలు తెలియలేదు. వసంతం వచ్చింది. మాంధాత వనవిహారం చేశాడు. పుష్పాపచయం, జలక్రీడ మొదలైన ఆటపాటల తరువాత చీకటి పడింది. జారులు, విటులు, వారకాంతలు చెలరేగారు. వేశ్వమాతను తిట్టుకొన్నారు. చంద్రుడు ఉధయించాడు. యువతీశ్చంగారకేళి జరిగింది. ఆ మదవతులు మధుపానం చేశారు. పరవశించారు. తెల్లవారింది. మాంధాత నగరుకు వెళ్లాడు, అతనీ దగ్గరకు వసిష్థాది మునులు వచ్చారు. వాళ్లను సత్కరించి, తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పమన్నాడు. వాళ్లు చెప్పారు, కర్మస్వరూపం, ఉపాస్య బబ్రహ్మస్వరూప నిర్ణయం, వేదవేదాంత పురాణ స్వరూప నిరూపణం చేశారు. విరుద్ద శృతులకు సామరస్యం చెప్పారు. ప్రసన్న స్వరూపాన్ని నిరూపించారు. మాంధాత విరాగి అయ్యాడు. వసిష్టుడు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. మాంధాత తపస్సు చేసుకొందుతు వెళ్లాడు. దానిని చెడగొట్టడానికి ఇంద్రుడు అప్సరసలను పంపాడు. వాళ్లు కాస్తా మాంధాతకు శిష్యురాళ్లయ్యారు. ఇంద్రుడు బ్రహ్మతో సంప్రతించాడు. విష్ణుమూర్తి వద్దకు రాయబార

నంకుసాల నరసయ్య 119 బృందంగా వెళ్లి 'దయచేసి మాంధాతకు ప్రత్యక్షమవిమని మహజరు పెట్టుకొన్నారు. దేవుడు మంజూరు చేశాడు; సాక్షాత్కరించాడు. మాంధాత కృతార్ధడయ్యాడు.

నాటకీయత లవలేశం కూడా లేని ఈ కథను ఆలంబనంగా చేసుకొని సంకుసాల నరసయ్య ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. పైగా దీనీని విన్న యతులు విటులుగా మారుతారనీ, విటులు యతులుగా మారుతోరనీ సగర్వంగా ప్రకటించాడు.

యతి విటుడు గాకపోవుడె ట్లస్మదీయ -కావ్యశృంగార వర్ద నాకర్ణనమున

విటుడు యతి గాకపోరాదు వెస మదీయ - కావ్యవైరాగ్యవర్దనాకర్ణనమున.

(కవికర్ణ. పీఠిక, 22)

ఈ ప్రకటనలో అతిశయోక్తి లేదు. మన కావ్యాలలో కనిపించే విచ్చలవిడి శృంగార వర్జనల వెల్లువ ఈ నీటిబుగ్గలోనుంచే పుట్టింది. వాగె వదల్చిన కోర్కెలు ఈ గ్రంథంలో వలరాచశివాలు తొక్కుతాయి. తెలుగు కావ్యాలలో చెలరేగే కామాన్ని ప్రేరేపించడానికి మన్మథుడు మామూలు పువ్వులు ఉపయోగిస్తే లాభం లేదని నిర్ణయించుకొన్నది ఈ గ్రంథంలోనే. చూడండీ.

మధుమదోన్మత్తలై యల్క మరచి సఖులు

నూరెలకు దార బతులపై సోలునట్టి

చేడియల మన్మథుడు వెర్రి చెరకు వింట

నేసె నుమ్మెత్త విరులచే నేసరేగి. (కవికర్ణ. 4-166)

ఉమ్మెత్త పువ్వుల బాణాలు వేయబట్టే శృంగారం ఇంత వెర్రితలలు వేయడం మొదలైంది. ఆ కాలంలో జనులు స్వైరవిహారం చేస్తూ ఉండేవారు. ఆది కావ్యాలలో ప్రతిఫలించింది. చీకటి పడితే చాలు జారబజారు హోరెక్తీది కాబోలు. సంజెపొద్దున ఫిశాదాలలాగా పట్టుకొంటే వదలని గుడిసెబింతలు వీథులు ఎలా ఆరికట్టారో నరసయ్య వర్ణించాడు.

చిటికలు వేయుచు జిరుపాట పొడుచు జార్చిపయ్యెద గూడ జేర్చుకొనుచు

గన్నరూపమునెల్ల గరసంజ్ఞ విలుచుచూ నెటకేని జనువాని కెదురుసనుచు

గడిచిపోవచ్చిన గౌగిట బట్టీ నీవా యంచు నదలి మోహంబు గేచి

చూపిన వెలకు నంతే పోయనుచు జంకె వేయుచు రోయుచు వెంటబడుచు

రూక లడుగుచు దుద బచ్చ నాకునైన

నొడబడచు హస్త్రగతమైన నొడియ నడిచి

దొడ్డబందాటమున గోక్ష ద్రోసికొనుచు

గుడీనెజంతలు దెరువాటు గొట్టి రపుడు, (కవికర్ణ. 4-95)

తెరువాటుగొట్టే గుడిసె లంజెలేకాక ముసుగుపెట్టుకొని గుడిసెలు దూరె కొత్త సిగ్గరిమిండలు తూడ ఆనాడు ముమ్మరంగానే ఉండేవారు. ఈ బజారు శృంగారాన్నే వడపోస్తే, ఆనాటి మధుపానగోష్ణులలో. జలకేళులలో, వనవిహారాలలో సరససల్లాపాలు

120 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అవుతాయి. మరింత నిగ్గుతెంర్‌స్తే నాయికానాయకుల సంభోగవర్దనలుగా రూపొందుతాయి. వారకాంతలు చెలరేగిన ఆనాటి సమాజంలో కులకాంతలను కవులు కనికరించి వాళ్ల మానాన వదలి వెయ్యలేదు. రాజుగారు ఊరేగినప్పుడు చూసి 'మనసు పట్టలేకపోవడం తెగ వర్ణించారు. తన పెల్లికి వెళుతున్న మాంధాతను చూసి పొరకాంతలు ఎటువంటి మన్మథావస్థలు పొందిందీ నరసయ్య 11 గద్య పద్యాలలో వర్ణించాడు. భారపు నిండు వెక్కసపు బ్రాయపు జవ్వని యోర్తు మందిర ద్వారమునందు నిల్చి నృపవంశమనోభవు చిత్తమోాహనా కారము జూడ నంగజవికార వశంబున నీవి జారినన్‌ గూరిన సిగ్గమై దలుపు గొబ్బున మాటుగ బేనె నాఖికిన్‌. (కవికర్ణ. 3౩-157) రాజును చూసిన కాంతల కోకముడి బిగువు సడలిందో లేదోగాని ఇటువంటి వర్ణనలలో మన కవులు హద్దులను సడలించడం పరిపాటే! మనుచరిత్రలో పెళ్లికి వెళుతున్న స్వరోచిని చూసి పౌరకాంతలు ఎలా మరులుకొన్నారో అల్లసాని పెద్దనగారు పది పద్యాలలో వర్ణించారు. ఒకావిడ స్నానం చేస్తూచేస్తూనే ఆదరాబాదరగా వచ్చి చూసిందట. నీకు లోబడ్డానని ప్రమాణం చేయడానికీ, సంప్రదాయం ప్రకారం, తడిబట్టలతో వచ్చినట్టుందట. జీలుగుల బెట్టుచుం దొడల జెంద్రిక పావడ యంట మైతడిం బెళపెళ లేని చీర గటిబింకపుజున్నుల చేర్చికొంచు వే జలకము లాడియాడి యొక చాన కరస్థిత కేశయై నృపున్‌ వెలువడి చూచె లో బడితినీ కని బాసకు నిల్చెనో యనన్‌. (మను. 5-6) ఇలా తడిబట్టలతో వచ్చి రాజును చూడడం ఈమె ముక్కుతిమ్మనగారి దగ్గరనుంచి నేర్చుకొంది. ఆయన పారిజాతాపహహరణంలో ముందే ఇలా బ్రాశారు. కాళియభేరి జూచు తమకంబున మజ్దిన మాడియాడి నీ లాలక యోర్తు గంధసలిలార్ధకచంబుల జన్నుదోయిపై వాలిన సందిటం బొదివిరాజపథంబున కేగుదెంచుగో పాలకామూర్తి గాన శిఖిబర్హము గానుక దెచ్చెనో యనన్‌. (పారిజాత. 3౩-14) ముక్కుతిమ్మనగారు కూడ ఈ ఘట్టంలో పది పద్యాలు వ్రాశారు. ఇటువంటీ సన్నివేశంలో ఎంత మంచి కల్పనలు చేసినా రక్తికట్టవు. అందుకే నరసయ్య పొరకాంతల తొందరపాటును కుకవి కవిత్వంతో పోల్చాడు. ం ఇలరేని జూడ జనుతమి-లలన యొక తె తడబడిన యలంకారముతో వలయు వడిగూడని పద-స్థలనంబును గలిగి కుకవికవితయు బోలెన్‌. (కవికర్ణ. 3-15 తులస్త్రీల పట్ల కొంచెం గౌరవం చూపించి నరసయ్య ఇలా అన్నాడు: కులసతి శిష్టమార్గమునకు మదినిల్లిన దాటరామికిన్‌ గులము మహాంబురాళి పతి కొండ గృహాంగన మంధకూప మా

సంకుసాల నరసయ్య 121 కులసతి దుష్టమార్గమునకు న్మది నిల్పివయేని దాటగా గులమొక గోప్పదంబు వతి గుండు గృహాంగంణ మాటపట్టగున్‌. (కవికర్ణ 4-104) నరసయ్య కావ్యంమాత్రం రకరకాల శృంగారవర్దనలకు ఆటపట్టు. మంచి భావుకతకు ఉనికిపట్టు, యతిని సైతం విటుని చేస్తానన్న పంతంకొద్దీ వ్రాసిన పద్యాలు కాబట్టీ రౌడీతనం కనబడుతుంది. ఇతడు విటుణ్జి సైతం యతిని చేస్తానని ఛాలెంజి చేసి చెప్పిన ఘట్టాలు నిజంగా వేదాంతమయాలు, ఎవ్వండ? నెందుండి యెచటి కేమిటికి నే బద్ధుండనైతి నేబంధనమున గారణం బెయ్యది? కాదు కారణ మెద్ది? యెద్ది కారణజన్య? మేదికాదు? ధర్మమేదేది? యధర్మంబు నే దిప్పు? డెందు వర్తించెద? నెందు నిలువ నేది కృత్య? మకృత్య మెయ్యది? గుణ సంవిశిష్ట మెయ్యది? దోషజుష్ట మెద్ది? యను వివేకంబు లేక ప్రాయమున గ్రొవ్వి పశువువోలె విశ్నోదరపరుడు నరుడు సంచరించుచు నజ్ఞానసంభవంబు నధికతరమైన దుఃఖంబు ననుభవించు. (కవికర్ణ. 5-106) ఈ దుఃఖాలను దాటడానికి, నిజంగా తరించడానికి ఒక్కటే మార్గమట. శరణాగతులకు దక్కన్‌ - బరులకు మోక్షంబు లదు భవనస్తుడు ని ర్పరుడు నన నిరుదెరంగుల - బరగు బ్రపన్నుండు సుకృత పరిపాక ఖిదన్‌. (కవికర్ణ. 5-91) సంకుసాల నరసయ్య నిజంగా ప్రపన్నుడ్రు. అతడు నిజమైన వైష్ణవుడు. నరాంకితం చేస్తే తన కృతి దూష్యమవుతుందని దేవునికి అంకితమిస్తాడు. రాజులను ఇలా గర్హించాడు. ఆందోళికలయందు సంతరచరులైన సవికృతాకృతుల పిశాచజనులు పరకరాళంబులై ప్రార్ధింప గనుగోక నాయెత్తకుండు జీవచ్చవములు వాలవీజనముల (గగ్రాలుచు నీగకు నంటివిఖరవర్తులాండసములు నేత్రపరంపరావిలకంటకాకృతి జేరబోరాని బర్బూతరులు శంకనాగుస్వరస్వరశ్రవణ సమన విస్పుటచ్చత్ర విస్పారిత స్ఫటిక విష్టవిషవైద్యవశవర్తిదుష్టణులు ప్రభుదురాత్ముల నెవ్వాడు ప్రస్తుతించు? (కవికర్ణ. పీఠిక. 24) ఇటువంటివాడు రాజాశ్రయం కోసం విజయనగరం వెళ్ళి పడిగాపులు పడ్డాడనీ, రాజదర్శనం పెద్దనగారు పడనివ్వలేదనీ విశ్వసించడం కష్టమే. అయినా ఇతడు రాయలవారి కాలంవాడని చెప్పడానికి మోహనాంగి చదరంగ కథ పనికివస్తుంది. రాజులను ఇలాగే దూషించిన ధూర్జటిని తూడా రాయలవారు మెచ్చుకొన్నారు. కనుక బహుశా ఇతణ్జి తూడా సత్కరించారేమో తెలియదు. నరసయ్య తనను మెచ్చుకొందుకు

122 నమల్రాంఛ్ర సాహిత్యం - రెండవ నంపుటి బొల్లని పల్లవితామము - గొల్లలుగా బొగడ నొక్క కోయిల లేదే? ం (కవికర్ణ. పీఠిక ౫) బాలా కోయిలలు ఇతజణ్జీ పాగిడాయి. అనలు తనను తాను పాగడుకొనడంలో నరసయ్య అందెవేసిన చేయి. “మామకసాత్యవతేయ వాజ్హయోదర్క -సుధార్జవోదయ విభాయక పార్వణశర్వరీవరా!”” (5-158) అని కృతిపతిని ప్రశంసిస్తూ తనను వ్యాసులవారితో పోల్చుకొన్నాడు. ఆ నోటితోనే తాను అల్బుడననీ చెప్పుకొంటాడు.

జ్ఞాన ప్రొఢమహాకవీశ్వర వచస్సంస్తూయమానుండు ల

క్ష్మీనాథుండు మదల్చ వాక్యరచనాస్వీకర్త గాతుండునే?

నానాభూపతు లెల్లగానుకలు రత్న శ్రేణులర్చింపగా

ధాన్తా ముష్టిముచుం గుచేలు గరుణక్‌ ధన్యాత్ముగా బూడడే! (కవికర్ణ. పీఠిక 2౫)

ఇది శ్రీ వేదాంతదేశికాచార్యులవారి ఈ క్రింది శోకంలోని ప్రౌఢ ప్రయోగానికి అనుకరణ.

క్షోజీరోణశతాంశపాలనకళా దుర్వారగ ర్వానల

క్షుభ్యత్డు ద్రనరేంద్ర చాటురచనాధన్యాక౯ నమన్యామహే

దేవం సేవితు మేవ నిశ్చినుమ హే యోసా దయాళు పురా

ఛానాముష్టిముచే కుచేలమునయే దత్తుస్మ విస్తేశతాం.

కవిత్వంలో సంకుసాల నరసయ్య ఎంతమాత్రం కుచేలుడు కాడు. కుటేరుడే అయితే నూలుపోగంత కథను తీసుకొని 1200 గద్య పద్యాలు వ్రాస్తి ఎంతటి కనైని విసుగు పుట్టిస్తాడు.

“నృసింహకవియే కాక ఆంధ్ర సంస్కృత కవులలో పెక్కురు గ్రంథమునందలి యేక భాగపరిచయమున మహాకవి వతంసులుగా గన్పింతురు. తుదుముట్ట చదవితిమా, ఉన్న గౌరవము పోవును. దీనికి ప్రధాన కారణము కవులలో నూటికి తొంబదితొమ్మిది మందికి గ్రంథము యొక్క సమష్టి మీద దృష్టి యుండదు; చదివెడువారికి అట్టీ చూపుండరాదేమో!”" అన్న ఒక రసజ్ఞుని చూటలు కొంత నిజమే.

  1. ఈ సంగతి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు గుర్తించారు. ఆంధ్రసాహిత్య పరిష సంపుటే ఓ 3- _కవికర్ణ రసాయనము - దిగుమర్తి సీజారామస్వామి, భారవి, సంపుటి ౫, సంచిక 11.

చింతలవూడి ఎల్లన్న (రాధామాధవ కవి)

రాధిక శృంగార దేవతగా నేడు రసరాజ్యాన్ని పరిపాలిస్తున్నది రాధామాధవుల ప్రణయమే నిగ్గుతేరిన ప్రణయమని ఈనాడు రసికులందరూ భావిస్తారు. విరహం చేత అర్హురాలైన రాధిక మీదా, నహజంగా ధూర్తుడైన కృష్ణునిమీదా కనీసం ఒక గేయమో, పద్యమో అల్లని తెలుగుకవి ఉండడు. అయితే మన అంభ్ర సాహిత్యంలో మొట్టమొదట రాధాకృష్ణుల చేత పరస్పరం ముద్దుపెట్టించిన మొనగాడు శృంగారకేఖరుడైన శ్రీనాథుడు. ఆయన తన ఖీమఖండంలో కృతిపతిని దీవిస్తూ వ్రాసిన తొలి పద్యాలలో రాధాకృష్ణుల ప్రణయం చిత్రించాడు.

వాలికమోము మత్తవనబ్బ్తికిశోరలాస్యలీల బై

వాలిచి పచ్చకప్పురపు వాసనతోడి ముఖారవింద తాం

బూలపు మోవి మోవిపయు మోపుచు రాధకు నిచ్చు ధూర్తగో

పాలుడు ప్రోచుగావుత నపారకృపామతీ మంత్రియన్ననిన్‌. (భీమ. 1-3)

రాధ పెదవిమీద కృష్ణుని వెదవి మోపించి ముద్దు పెట్టించిన శ్రీనాథుడు తానుమాత్రం పెదవులు మూసుకొన్నాడు. ఈ ఒక్క పద్యంలో తప్ప రాధాకృష్ణుల ప్రసక్తి మరెక్కడా. తేలేదు. తేవడానికి ఆస్కారం కూడా లేదు. ఈ పద్యమైనా అతడు చెప్పినందుకు తెలుగువాళ్లు అతనికీ బుణపడతారు. తాను వ్రాసిన అన్ని కృత్యాది వద్యాలవల్తా చరిత్రకు తోడ్పడినట్టే ఈ పద్యంలో కూడా శ్రీనాథుడు సాహిత్య చరిత్రకు. నహాయం చేశాడు. శ్రీశ 135కు పూర్వం హరివంశాన్ని అనువదించిన ఎల్రావైగడవారి నుదీర్హ రచనలో శ్రీకృష్ణుని ప్రియురాలిగా రాధ పేరు ఎక్కడా కనబడదు. క్రీశ 3475కు పూర్వం ఖాగవతాన్ని నవిస్తరంగా రచించిన బమ్మెర పోతరాజుగారి శ్రీకృష్ణచరిత్రలో అతని ప్రేయసిగా రాధ ఊసే కనబడదు. అందుచేత తెలుగుదేశానికి క్రీశ *౫-వ శతాబ్దంలో వంగదేశం నుంచి రాధ దిగుమతి అయిందనే ఆపోహ ఒకటి ప్రచారంలో ఉంది. క్రీశ 1429-30ల మధ్య ఖీమఖండాన్ని వ్రాసిన శ్రీనాథుని పద్యంలో రాఛ ప్రసక్తి ఉండడంవల్ల ఆవాటికే తెలుగువాళ్ళకు అమెతో ముఖపరిచయముందవి చెవ్పువచ్చు.

అయితే రాధాకృష్ణుల ప్రణయ జీవిశాన్ని నంపూర్ణ కావ్యంగా వ్రాసి ఈ శృంగారాన్ని తెలుగువాళ్లతు సుపరిచితం చేసిన మహానుఖావుడు చింతలపూడి ఎల్లన్న్య అతని కావ్యం పేరు రాధామాధవం. బ్రాసీవబ్రాయగానే ఈ ప్రబంధం నుప్రసిద్దమైంది. దీనిని విన్న తరువాత బ్రాసినవారి పేరు శ్రోతలు మరచిపోయారు. అతజ్జీ రాధామాధవ కవి అని పిలివారు. అదే చివరకు స్థిరపడిపోయింది. కవితూడా తాను వ్రాసిన అనంతర వివరాలు అట్టే చెప్పుకోలేదు. రాధామాధవంలో గద్య ఇలా ఉందిః

124 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ

ఇది శ్రీమదనగోపాలచరణకమల సివాధురీణ సత్కళాపారీణ కృష్ణభట్టారకపాౌత్ర చింతలపూడి కామయప్రభుసుపుత్ర సుకవివర్య రాధామాధవ ఎల్లనార్యప్రణీతంటైన రాధామాధవం బను శృంగార ప్రబంధంబు...

ఈ గద్యవల్ల కవి మదనగోపాలభక్తుడనీ, కళాకోవిదుడనీ, ఇతని తాత పేరు కృష్ణంభట్టుగారనీ, తండ్రి కామయ్యగారనీ, వీళ్ళ ఇంటి పేరూ, ఊరి పేరూ చింతలపూడి గ్రామమనీ తెలుస్తున్నది. అయిడే కవి ఫలానా జిల్లావాడని కచ్చితంగా చెప్పలేం. ఏమంటే తెలుగుదేశంలో అరు జిల్లాలలో పదకొండు చింతలపూడి గ్రామాలున్నాయి. వాటి వివరాలు చూడండీ :

విశాఖపట్ట్లుం జిల్లా : (1) చింతలపూడి (వీరవల్లి తాలూకా), (2) చింతలపూడి (గోలుకొండ తాలూకా), (3) చింతలపూడి (గోలుకొండ మన్యం)

తూర్పుగోదావరి జిల్లా : (4) క్రాపచింతలపూడి (అమలాపురం తాలూకా) _ (5) వన్నె చింతలపూడి (అమలాపురం తాలూకా), (6) చింతలపూడి (ఎల్లవరం తాలూకా)

పశ్చిమ గోదావరి జిల్లా : (7) చింతలపూడి (చింతలపూడి తాలూకా)

కృష్ణా జిల్లా : (8) చింతలపూడి (గుడీవాడ తాలూకా)

గుంటూరుజిల్లా: (9) చింతలపూడి (తెనాలి తాలూకా), (10) చింతలపూడి (రేపల్లె తాలూకా)

నెల్లూరు జిల్లా : (11) చింతలపూడి (దర్శి తాలూకా)

ఈ పదకొండు గ్రామాలలో ఏ ఒక్క చింతలపూడి గ్రామమైనా ఎల్లన్న స్వాగ్రామ మవడానికి వీలుంది. అయితే అతడు తూర్పు గోదావరి జిల్లావాడని భావించడానికి ఆస్కారాలున్నాయి. క్రీ.శ 1402 ప్రాంతాలలో చింతలపూడివారు ఈ సీమలో ఉన్నట్టు శాసనప్రమాణాలున్నాయి.! చింతలపూడి కాచన్నగారు తమ తండ్రి కృష్ణమరాజుగారికీ రాధామాధవ కవి బహుశా ఈ చింతపూడివారి వంశంలోనివాడు కావచ్చు. తూర్పు _ గోదావరి జిల్లా ఎల్లవరం తాలూకాలో ఒక చింతలపూడి గ్రామమున్నదని చూశాం. ఈ తాలూకా పేరులోని “ఎల్ల శబ్దానికీ, రాధామాధవకవి పేరులోని “ఎల్లో శబ్దానికీ సంబంధమున్నదేమో చూడాలి. ఇది కేవలం బాదరాయణ సంబంధమో, కాదో

భావిపరిశోధనలవల్లగాని తేలదు.

చింతలపూడి ఎల్లన్న చిన్నప్పటి నుంచి మదనగోపాలభక్తుడని భావించవచ్చు. అతడు “కృష్ణా, “వల్లవీ వల్లభా' అనే మకుటంతో ఒక శతకం చెప్పాడేమో అని ఊహాగానం చేయడానికి ఆస్కారముంది. ఈ మకుటంతో ఉన్న తొమ్మిది పద్యాలూ రాధామాధవ

ప్రబంధంలో అక్కడక్కడ కనబడతాయి. శతకంలో తాను వ్రాసిన మంచి పద్యాలను 2. రాధామాధవంలో ఈ నుకుటమున్న పద్యాలు ఇవి: 1-22, 1-23, 1-24, 1-13, 1-35, 2-28, 2-10, 2107, 3145,

చింతలపూడి ఎల్లన్న 125 సందర్పోచితంగా అతడు వాడుకొన్నాడని భావించవచ్చు. బాలక్రీడల నుంచి లీలావిహారాల దాకా కృష్ణచరిత్రను ఈ శతకంలో ఎల్లన్న కీరించినట్టు కనబడుతుంది. చూడండీ : బాలక్రీడల గన్నతల్లికి మనఃప్రహాదముం జేయుచున్‌ హేలామైత్రి ఘటించి గోపకులతో నేపార వర్తింపుచున్‌ గేలిం జారుడ వౌచు గోపికల కౌగిళ్ళ న్వినోదించు థీ శాలిత్వంబులు నీకె యొప్పు నవు గృష్టాః వల్లవీవల్లభా! (రాధా. 1-135) అయితే ఎల్లన్న తన ఇష్టదైవాన్ని కేవలం శృంగార పురుషునిగానే కాక

  • పరబ్రహ్మంగా కూడా ఊహించుకొన్నాడు. స్థిర విజ్ఞానశేషనిశ్చలితదృష్టిం దుష్టి జూడంగ సా గరకలోలఘటాపరంపరలలో గన్పట్టు నర్కాకృతి౯ బరమబ్రహ్మవిలోకనాత్ములకు శుంభద్దివ్యతీజస్థితి౯ శరణత్వంబును జూపుచుండుదువు కృష్టా! వల్లవీవల్లభా! (రాధా. 1-23) చింతలపూడి ఎల్లన్న సర్వం శ్రీకృష్ణమయంగా భావించాడు. ఇలా కీర్తించాడు. నీవే యజ్ఞములుక్‌ దదీయఫలముల్‌ నీవే కులాచారముల్‌ నీవే మంత్రము నీవెతజ్జపములుక నీవే మనోవాంఛయుక్‌ నీవే మోక్షము నీవె చిద్విభవము న్నీవే వితర్కింప నా నావర్జాశ్రమధర్మమార్గులకు గృష్టాః వల్లవీవల్లభా (రాధా. 1-24) శ్రీకృష్ణుని చిద్విభవం ఎల్లయ్య బహుశా ఎర్రయ్యగారి హరివంశంవల్ల తెలుసుకొని ఉంటాడు. ఆయన కవిత్వమంటే అతనికంతో గౌరవం. గంగాతరంగాల సంగీతంలాగా ఎర్రయ్యగారి మృదుమధురవచనాలుంటాయని అతని విశ్వాసం. అందుకే వారిని ఇలా నుతించాడు. నానావిధవటునటదీ-శానశిరస్సునిదభంగ సలిలోర్మఘటా సూనధ్వనిమృదుమధురవ-చోనిధి శివదాసు గొలుతు సుకవిశశాంకున్‌. (రాధా. 1-12) ఎల్లన్న బ్రాసిన మరో గ్రంథంలోని పూర్వకవిస్తుతిని ఈపద్భుంలోని “శివదాసు' అన్న పేరుతో ఎర్రాపైగడగారినే పేర్కొన్నాడని నిరూపించవచ్చు. ఎర్రయ్యగారి బిరుదు రాజీయంలో కవిత్రయాన్ని ఇలా నుతించాడు. భారత కావ్యహార మొకభాగము నన్నయభట్టు గూర్చె ము క్లారమణీయవాక్యముల దక్కిన భాగము సోమయాటి పెం
  1. మద్రాసు ఓరియంటల్‌ లైబ్రరీ ట్రయన్నియల్‌ క్యాటలాగు. సంపుటి 3, భాగం ౩, పుకు 108

126 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పార నొనర్చె రెంటి గలయక శివదాసుడు మధ్యనాయక శ్రీ రచియించె శారద ధరింప గవిప్రియకీర్తిమించగన్‌. (౧347 ఎర్రయ్యగారి రచనలు నిజంగా కొలికిపూసలే. వారి రచనలలో మెత్తదనాన్ని ఎల్లన్న అలవరుచుకొన్నాడు. అయితే కవ్వితం ఉండవలసిన చోట్ల గట్టిగాకూడ ఉండాలి. ఆ విద్య శ్రీనాథుని రచనలవల్ల ఎల్లన్న బాగా అవగాహన చేసుకొన్నాడు. అందుకే కవిసార్వభౌముణ్జీ ఇలా నుతించాడు. సూనాస్త్రప్రమదామదస్స్ఫురితవక్షో జాతుకారిన్యముక్‌ బూనంజాలు వచోవిలాసముల నేర్పుల్‌ చూపి కర్ణాటక క్షాశనాథేంద్రు సభక్‌ గవిత్వ విజయోత్సాహంబు గైకొన్న మా శ్రీనాథుం గవిసార్వభౌము గొలుతుక సేవాంజలుల్‌ గీల్కొనన్‌. (రాధా. 1-13) పూర్వకవుల పుస్తకాల ధర్మమా అని ఎల్లన్న మృదుమధురగంఖీర వాచామోషాలు తెలుసుకొన్నాడు. సంస్కృతంలో సుప్రసిద్ధ కావ్యాలేకాక అప్పుడప్పుడే. ప్రచారం పొందుతున్న ఒకటి రెండు శతాబ్దాల క్రిందటి గ్రంథాలను కూడా అతడు పఠించాడు. వాటిలో జయదేవుడు రచించిన రాధామాధవ కావ్యం ఉంది. ఈ జయదేవుడు ప్రఖ్యాతమైన గీతగోవిందాన్ని వ్రాసిన జయదేవుడో కాడో తెలియదు. సంస్కృత వాజ్బయంలో చాలామంది జయదేవులున్నారు. గీతగోవిందాన్ని వ్రాసిన జయదేవుడు క్రీశ 1090-1140 ప్రాంతాలవాడు ఇతడుకాక క్రీ.శ. 1300 ప్రాంతాలలో చంద్రాలోకం, రసమంజరి మొదలైన అలంకార శాస్త్రాలూ, ప్రసన్న రాఘవం అనే రూపకం వ్రాసిన జయదేవుడింకొకడున్నాడుో గంగేశపండితుడు వ్రాసిన తత్వచింతామణి అను తర్కళాస్తానికి వ్యాఖ్యగా ఒక జయదేవుడు ఆలోకం వ్రాశాడు. ఇతని శిష్యుడు టీక వ్రాశాడు వీళ్లుకాక శృంగార మాధవమనే చంపూ గ్రంథాన్ని బ్రాసిన ఒక జయదేవుడు కూడా ఉన్నాడు. ఇంతమంది జయదేవులలో ఎవరు రాధామాధవం బ్రాశారో తెలియదు. బహుశా శృంగారమాధవ చంపూ కావ్యాన్నే ఎల్లన్న రాధామాధవం అన్నాడేమో: అతడు జయదేవుణ్ణీ ఇలా నుతించాడు. నుతియింతు వాగ్వి శేష - స్థితి రాధామాధవంబు చెప్పిన విద్యా చతురానను నీలాచల - పతిహితు జయదేవసుకవిపంచప్రదరున్‌. (రాధా. 1-10) జయదేవుడు వ్రాసిన రాధామాధవాన్ని చదివాక దానిని అనువదించాలనే కోరిక ఎల్లన్నకు జనించింది కాబోలు. ఒకనాడు అతడు పూర్వ కవుల మృదుమధుర గంభఖీరవాచావిశేషాలతో, భావరసగర్చితమైన వివిధ పదబంధాలతో ఒక ప్రబంధం రచిద్దామనుకొంటూ ఉంటే రాధాసమేతంగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడట. “కవితాకల్చవల్లొ అనే ద్వాదశాక్షరకలితమైన తన దివ్యమంత్రాన్ని ఉపదేశించాడట. 4. సంస్కృత వాజ్ధ్మయ చరిత్ర, ద్వితీయ సంపుటం - మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు, పుట ౩4. 5. సంస్కృత వాబ్మయ చరిత్ర-!,పుటలు 256, 418 6. అదే గ్రంథంలో, పుట 227.

చింతలపూడి ఎల్లన్న 127 రాధామాధవం అనే శృంగార కావ్యాన్ని రచించి తనకు అంకితమిమ్మని బోధించాడట. ఎల్లన్న ఇలా పొంగిపోయాడు.

బోధించు యిష్టదైవము రాధాసతి గూడి సొమ్యరమ్యాకృతి హృ

త్సౌధమున దోచి కృష్ణుడు - రాధామాధవము చెప్పురాయని పలికెన్‌.

ఇష్టదైవంబు పొడకట్టి హృదయవీధి - దనకు గృతిజెప్పుమని ప్రసాదంబుసేనె

నింతకంటెను సౌభాగ్యమేమిచెప్ప - దైవకృపగల్లెనేని వింతలే శుభములు. (రాధా. 1-26, 27)

ఈ కావ్యం వ్రాశాక నిజంగానే ఎల్లన్నకు శుభాలు చేకూరాయి. క్రీ.శ 1519లో బహుశా రాయలవారు కళింగ విజయం నుంచి తిరిగి వస్తున్నప్పుడు చింతలపూడి ఎల్లన్న విజయనగర సార్వభౌముని దర్శనం చేసుకొని తన కవిత్వం వినిపించదలిచాడు. అతని శక్తిసామర్వ్యాలు పరీక్షించడానికి అల్లసాని పెద్దనగారు ఒక సమస్య ఇచ్చారు. నగరు, తగరు, తొగరు, వగరు అనే మాటలు ప్రాసస్థానంలో వాడుతూ రామాయణపరంగా ఎల్లన్నను పద్యం చెప్పమన్నారు. అతడు ఆశువుగా ఇలా చెప్పాడు.

నగరు పగాయె నింక విపినంబుల కేగుడు రాజ్యకాంక్షకుం

దగరు కుమూరులార యని తల్లి నగల్‌ మిగులంగ దోపగా

దొగరున రక్షగట్టి మది దోపక గద్గదఖిన్న కంఠయై

వగరుచుచున్న జూచి రఘువంశవరేణ్యుడు తల్లి కిట్లనున్‌.

ఈ పద్యాన్ని విన్నాక అందరూ సంతోషించారు. ఇవే మాటలు వాడుతూ భారతపరంగా చెప్పమన్నారు. ఎల్లన్న ఆశువుగా ఇలా రచించాడు.

తొగరుచి కన్నుదోయి గడు దోపగ గర్జుడు భీమసేనుపై

దగరు ధరాధరంబుపయి దాకిన భంగిని దాకి నొచ్చి తా

వగరుచుచు న్వెసక్‌ బరుగువారిన నచ్చటి రాజలోకముల్‌

నగరు సుయోధనాజ్ఞమది నాటుట చేసి ధరాతలేశ్వరా! దీనిని మెచ్చుకొన్నాక రాయలవారూ, ఇతర కవులు ఇవే మాటలతో భాగవతపరంగా ఒక అశుపద్యం చెప్పమన్నారు ఎల్లన్న చెప్పాడు.

వగరుపు మాత్రమే వరుడు వశ్యుడు కాడు సఖీసఖిత్వ మె

న్న గరుడవాహనుండు మము నాడటు డించుట యెల్ల నుద్ధవా

తగరని కాక మోహపు లతాతనులైన విడంగజూతురే

తొగరుచి యోషథీశునకు దోవగజేయునె వీడనాడగన్‌.

ఈ సమీక్ష పూర్తికాగానే ఎల్లన్న బ్రాసిన రాధామాధవ కావ్యాన్ని అల్లసాని పెద్దన మొదలైన కవులున్న సభలో రాయలవారు విన్నారు. విని మెచ్చుకొన్నారు. ఆభరణాలు మొదలైన కానుకలిస్తూ ఎల్లన్నకు రాధామాధవకవి అనే బిరుదిచ్చారు. దీనిని అతడు ఈ కావ్యపు గద్యంలో చేర్చుకొన్నాడు. ఈ సన్మానాన్ని గ్రంథాదిని అవతారికలో ఇలా వివరించాడు.

128 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

రాధామాధవ మచ్యుతాంకితముగా బొడక్రియం జెప్పి త

న్మాధుర్యంబున గృష్టరాయవిభు గర్జాటేశు మెప్పించి నా

నా ధాతృప్రతిమాన సత్కవులలోనక్‌ భూషణ శ్రేణితో

రాధామాధవనామ మందిర జగత ఖ్యాతచారి త్రుడన్‌, (రాధా. 1-౫)

ఈ పద్యంలోని 'ధాతృప్రతిమాన సత్కవులు' అనే మాట అల్లసాని పెద్దనగారినే సూచిస్తున్నది. వారికి “ఆంధ్రకవితా పితామహ బిరుదు ఉంది. ఇది వారు క్రీ.శ. 1519 ప్రాంతాల శాసనాలలో వాడారు. కనుక రాధామాధవకవికి రాయలవారి సన్మానం క్రీశ 1519లోనో, లేక ఆ తరువాతనో జరిగిందని చెప్పవచ్చు. రాయలవారు సత్కరించాక ఎల్లన్న ఇతర అస్థాన కవులతో బాటు విజయనగరానికి వెళ్లి అక్కడ స్థిరపడిపోయాడు. ఇదే తరుణంలో కళింగదేశం నుంచి ఎందరో కవులూ, పండితులూ వారి ఆస్థానంలో చేరి రాజధానికి వెళ్లారు. సౌందర్యలహరికి వ్యాఖ్య వ్రాసిన లొల్ల లక్ష్మీధరుడు, పారిజాతాపహరణ రూపకాన్ని వ్రాసిన దివాకరుడు, సంగీతసూర్యోదయాన్ని రచించిన బండారు లక్ష్మీనారాయణకవి మొదలైన సంస్కృత రచయితలు వీళ్లలో ముఖ్యులు. రాధామాధవకవి కూడా ఈ పండితులతోపాటి విజయనగరానికి చేరుకున్నాడని భావించవచ్చు.

రాజధానికి చేరుకొన్నాక రాధామాధవకవి అక్కడ పదేళ్లపాటు సుఖంగా జీవించాడు. కొంతమంది రాబకీయోద్యోగులతో సంబంధబాంధవ్యాలు పెట్టుకొన్నాడు. సంజయగారి తిమ్మరసయ్య అక్కడ మంచి -పదవిలో ఉన్నాడు. కందాచారం లెక్కలు బ్రాసే 'చీఫ్‌ మిలిటరీ అకౌంటెంట్‌ ఉద్యోగంలో ఉండేవాడు. ఇతనికీీ రాధామాధవకవికీ చాలా సఖ్యత ఏర్పడింది. ప్రస్తుతం మనకు తిలియని బంధుత్వం కూడా ఏర్పడింది ఇటువంటి ఉద్యోగస్థులతోనూ, ఇతర కవిమిత్రులతోనూ హాయిగా జీవిస్తూ రాధామాధవకవి 'తారకబ్రహ్మరాజీయం' అనే మరొక ప్రబంధం రాయడం మొదలుపెట్టాడు. దీనిని పూర్తిచేసిలోగా కృష్ణ్ణాయలవారు మరణించారు. రాజ్యంలో కల్లోలాలు వచ్చాయి. చివరకు కృష్ణ్ణాయల సవతి తమ్ముడు అచ్యుతదేవరాయలు రాజ్యానికి వచ్చాడు. ఇతనివద్ద సంజయ్యగారి తిమ్మరసు ఉద్యోగం కొనసాగించాడు. ఈ తిమ్మురసుకు తన రాజుగారి ఇష్టాయిష్టాలు బాగా తెలుసు.

అచ్యుతదేవరాయలు కూడా సాహిత్యపోషకుడే. ప్రతియేడూ ఒక గ్రంథం బ్రాయించి తిరుపతి వెంకటిశ్చరునికి సక్కావ్య పుష్పాంజలి సమర్పిస్తూ ఉంటాడు. తన ఉద్యోగులు కూడా తనలాగే కావ్యాలు వ్రాయించి దేవునికి అంకితం చేయిస్తే రాధామాధవకవిని చూసి ఇలా అన్నాడు.

పరమహితుడవు కారకబ్రహ్మరాజ-మనుప్రబంధంబునీ చెప్పినది మదాత్మ

నాయకుండగు శ్రీరఘునాయకునకు- నంకితము సేయవలయు నాకఖిమతముగు

(1347

చింతలపూడి ఎల్లన్న 129 ఎల్లన్న సంతసించి దీనికి అంగీకారం తెలిపాడు.

నావుడు నీకు నంకిత మొనర్చదలంచినవాడ బంధుసం

భావన; నీకు నిష్టముగ బ్రహ్మమయుం డగు రామభద్రధా

త్రీవరమౌళి కంకిత మిదే యొనరించిన మంచి పైడికిం

దావిని ఘటిల్లె నేమియన? నంజయతిమ్మ! వివేకభూషణా! (౧.347)

రాధామాధవ కవి బంధుసంభావన చేసిన నంజతిమ్మరుసు బాగా చదువుకొన్నవాడే. చక్కని సంస్కారమున్నవాడు. ఇతని గురించి కవి ఇలా చెప్పాడు.

వేదపురాణశాస్తముఖవిద్యల కెల్ల గురుండు బహ్మవి

ద్యాదృడబుద్ధి నేర్చు లిపు లన్నియు వ్రాయు సమస్తదేశభా

షాదు లెరుంగు స్వామిహితమైన ప్రయోజన మాచరించు నా

నాదోలం బ్రసిద్ధుడగు సంజ తిమ్మన బోల రెవ్వరున్‌. (౧.౩47)

ఈ తిమ్మరసయ్య కోరికపైన రామునికి అంకితమిచ్చిన తారకబ్రహ్మరాజీయం ఎన్ని అఆశ్వాసాలో తెలియదు.” మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో రెండు ప్రతులున్నాయి. ఒకదానిలో నాలుగాశ్వాసాలున్నాయి. (౧.347) ఇంకో ప్రతిలో రెండాశ్వాసాలున్నాయి. (౧.719) ఈ కావ్యం రామతారకమంత్రంయొక్క మాహాత్మ్యాన్ని తెలియజేస్తుంది. దీనిని సంస్కృతంలో నారాయణ మిశ్ర అనే యతి రచించాడట. ఇతడు ప్రయాగక్షేత్రవాసి, దీనిని రాధామాధవ కవి తెనిగించాడు. ఆగమాంతపరిచితమైన ఈ కావ్యాన్ని అతడు శృంగారరసంతో ముంచెత్తాడు. రెండో ఆశ్వాసంలో ఒక బ్రాహ్మణ పతితుని కథ ఉంది. ఇతడు తీర్థయాత్రలకు పోతూ దారిలో ఒక బోయదానిని చూశాడు. దాని ప్రేమలోపడ్డాడు. అది మగనాలు, అయితే పరదారాగమనం పాపం కాదని ఆ కాముకుడు ఎంతో సమర్థించుకొన్నాడు.

అమరాధీశుడు స్వర్గ మేలడె యహల్యాజారుడయ్యు౯? శుచి

త్వముతోడం బరదారసంగమము విద్వాంసుల్‌ నివారింపుటల్‌ -

తమ భార్యల్‌ నియమస్శలై సతతలీలాహీనులం బాయు దో

సములం దోస మటంచు నే నెరుగనే సందేహ మింకేటికి౯? (౧౩47)

ఈ పద్యంలోని భావాలే తరువాత శేషం వెంకటపతి (క్రీశ 1704-31) వ్రాసిన తారాశశాంక విజయంలోని 'లోకములోన కొందరబలుల్‌ తమసతులందనియింపలేక' అనే పద్యానికి వరవడి, “పరనారీసంభోగము పరమసుఖం'* బని బ్రహ్మంతవాడే కూతురి చెరిచాడని తారకబ్రహ్మ రాజీయంలోని పాత్ర అంటాడు.

నరకమని చదివి చెప్పియు - ధరణీపతి దండభయము దగిలించిమా

న్తురుగాక యథమపురుషులు - హరిహరు లజ్ఞాలె? రమింపరా పరసతుల! (౧. 347 7. కోరాడ రామకృష్ణయ్యగారు అయిదు ఆశ్వాసాలు అన్నారు (విష్టమాయానాటకం పీరిక, పుట 13) 8. మత్స్యపురాణం తృతీయాశ్వాసంలో సుభద్రుడనే బ్రాహ్మణ పతితుని కథ ఉంది. దీనిని హరిభట్టు

ఈ యుగంలోనే తెనిగించాడు. (చూ. మత్స్య 13-81 నుండి)

130 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కావ్య నాయికలలో స్వీయకన్న పరకీయ మంచిదనే ఉద్దేశానికీ పునాదులు పడుతున్న కాలంలో ఈ కావ్యం తయారైంది. అందుకే ఇంత బర్‌తెగించిన భావాలు, ఈ ఉద్దేశాలు వెర్రితలలు వేసి మన కావ్యాలలో పరకీయ శృంగారం కట్లు తెంచుకొని ప్రవహించింది. పరకీయలకు పరదేవతగా రాధ వెలసింది. అయితే రాధామాధవంలో మాత్రం రాధ స్వీయ; శాస్త్రోక్తంగా కృష్ణుని పెళ్లాడిన ఇల్లాలు. ఈమె సహస్రగోపుడనే గోపాలుని కూతురు. ఈమె అందాన్ని నారదుడు కృష్ణునివద్ద వర్ణిస్తాడు. ప్రేమకలిగి కృష్ణుడు సాక్షాత్తూ సరస్వ్పతినే రప్పించి ఆమెను రాయబారానికి పంపుతాడు. వాణీ మధురవాణిగా రాధవద్దకు. వెళ్లి కృష్ణునిపై ఆమెకు అనురాగం కలిగిస్తుంది రుక్కిణీకల్యాణంలాగ రాధాకల్యాణం కూడ అన్ని వివరాలతో - తండ్రి ఇష్టపడడం, అన్న అడ్డుచెప్పడం మొదలైన ఘట్టాలతో నిండి ఉంది. ఎటొచ్చీ అక్కడ రుక్మిణిని గుడిలోనుంచి ఎత్తుకుపోయాడు. ఇక్కడ రాధను స్వయంవరమండపంలో దండవేశాక తీసుకుపోతాడు. భార్యమొగం చూసి రుక్కిని కొంచెం ఎగతాళి చేసి విడిచిపెట్టినట్టే రాధ సోదరుణ్ణి తూడా శుద్ధకోతిని చేసి ఆమె ముఖంచూసి విడిచిపెడతాడు. చాలా చిన్న కథను తీసుకొని అయిదాశ్వాసాల గ్రంథంగా ఎల్లన్న రచించాడు. ఇతని రచనా విధానం పింగళిసూరన్న అంత ప్రతిభావంతునికే దారిచూపింది

రాధామాధవకవి తన ప్రతిభను మరొక కావ్యంలో కూడా ప్రదర్శించాడని పండితలోకం భావిస్తున్నది. దాని పేరు విష్ణమాయానాటకం. ఈ కావ్యానికి రెండు రకాలలో గద్యలున్నాయి. ఒకదాంట్లో దాని రచయిత అనంతయ్య అని ఉండి; రెండోదాంట్లో రాధామాధవ కవి అని ఉంది. విష్ణ్టమాయా నాటకాన్ని మడికి అనంతయ్య వ్రాసి ఉంటాడని చాగంటి శేషయ్యగారు భావించి నిరూపించడానికీ ప్రయత్నించారు. వారి వాదాన్ని పటిష్టం చేయడానికి కావలసిన సాక్షార్టలను సేకరించి మనం అనంతయ్య చరిత్రలో చెప్పుకొన్నాం.* క్రీశ 1347-1400 ప్రాంతాలలో ఉన్న మడికి సింగన్నకు అనంతయ్య అనే సోదరుడున్నాడు. అతడు కవి అని సింగన చెప్పలేదు. అయినా అనంతయ్య కవి అయితే అతడు ఈ గ్రంథం వ్రాయడానికి ఆస్కారం ఉందని సింగన్న. గ్రంథంలోని పద్యాలను పోలిన పద్యాలను విష్ణమాయా నాటకం నుంచి తీసి థైపారువేశాం. పోలికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంతమాత్రంచేత అనంతయ్యే బ్రాశాడనలేము. మడికి సింగన్న పుస్తకాలను చదివిన మరే కవైనా వ్రాయవచ్చు. చింతలపూడి ఎల్లన గోదావరి ప్రాంతాలవాడు కనుక అ సీమలోని కవియైన సింగన్న గంథాలను చదివి ఉండకపోడు. అందుచేత ఈ పోలికలున్న పద్యాలను రాధామాధవ కవి వ్రాసినా వాసి ఉండవచ్చు. కాబట్టీ విష్ణమాయా నాటకాన్ని రాధామాధవ కవి రచించాడనే వాదాన్ని పటిష్టం చేయడానికి ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి.

విష్ణమాయా నాటకం అనే పేరు విచిత్రమైనది. కావ్య నాటకం కాకపోయినా ఈ పేరు పెట్టడంలో కవియొక్క ప్రత్యేకమైన అఖిరుచి తెలుస్తుంది. రాధామాధవ కవికీ ౩. రాధామాధవ పీరికలో నడకుదిటి వీరూ వగారు సారన్న వన్నం యయ వవ +. రెడ్డిరాజుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, పసరు ఎనిన్పని కఠాలను జైపారు వేశాడ

చింతలపూడి ఎల్లన్న 131 ఇటువంటి ఊహలున్నాయా అని చూద్దాం. రాధస్వయంవరానికి వచ్చిన రాజులను పేర్కొని ఆ సభను ఇలా వర్ణించాడు: (

వెండియుం బెక్కువికారంబులు చూపుచు బరిభగ్నృవీడానురాగఘట్టితా భోగంబగు మనంబుతో రాగరసరంజితంబును లోలదృగ్విన్యాసంబును బహురూపచేష్టాకలితంబును గృతకరకంకణఘలఘలాత్కారంబును మోహయవనికాత్రాంతంబునునై మదనమాయా నాటక సద్విధానరంగమండలతాండవలోలంబగు నర్హకచత్రంబను భావంబు దోవ నప్పు డప్పెను' రాచకొలువు చెలువారి.... (రాధా. 4-237)

ఈ వచనంలో మదనమాయానాటకం అనే ప్రయోగం చేయడంవల్ల విష్ణమాయానాటకం అనే పేరు రాధామాధవకవి పెట్టగలడని తెలుస్తున్నది.

సాధారణంగా కవులు రెండుమూడు గ్రంథాలు వ్రాసినప్పుడు తొలిరచనలలోని పద్యాలభావాలను అనంతర గ్రంథాలలో పొందుపరుస్తారు. కొన్నిచోట్ల తొలిరచనల లోని పద్యాలను యథాతదంగా తరువాతి కావ్యాలలో వాడుకొంటారు. రాధామాధవం లోని పద్యాలు ఏమైనా విష్ణమాయానాటకంలో ఉన్నాయా అన్న విషయం పరిళోధిద్దాం. స్వయంవర మండపంలో ప్రవేశించిన రాధను వర్ణిస్తూ నూగారుసంగతి ఇలా చెప్పాడు.

లలితనీలమణిశలాక నా రసుపేర - నిలిపెగాక నలుప నిలుపడేని

గురునితంబింబ కుచకుంభ భరమున - వెలది యసదునడుము విరుగకున్నా?

(రాధా. 4-226)

ఇదే పద్యం విష్ణుమాయా నాటకంలో కూడ కనబడుతుంది. కొలనులో మునిగి స్త్రీ స్వరూపాన్ని పొందిన నారుదుణ్ణి చంద్రకేతుడనే రాజు చూసి మోహిస్తాడు. అప్పుడు చేసిన సకలావయవ వర్ణ్జనలో ఇలా ఉంది.

లలితనీలమణిశలాకయౌ నూ గారు - నిలిపెగాక నలువ నిలువకున్న

గురునితంబబింబ తుచకుంభ భరమున - వెలది యసదునడుము విరుగకున్నా?

(రాధా. 4-226)

ఈ ఘట్టంలోనే చంద్రకేతుడు ఇంకా ఇలా వర్జిస్తాడు.

అమృతాంశు డెంత దానము తా నొనర్చెనో పొలతినెమ్మోముతొ బోల్చబడియె

నళు లెట్టి పుణ్యాటవుల నిష్ట మెలగెనో యింత్సి పెన్నైరులకు నీడు వడసె

దమ్ము లెన్నెన్ని తీర్ధ్థంబుల దోగెనో సతిశ్రాలుగన్నుల సాటి నొందె

గజము లే క్షేత్రమార్గముల వర్తించెనో చెలువనడకకు సరి చెప్పవలసె

గాంచనము భూమి నేమేమి కర్మములకు

వచ్చెనో చానమైచాయ వన్నె కెక్కె

జీలుక లే సత్యవాత్కముల్‌ పలికినవియె

యబలమధురోక్తులకు సమ్మతయ్యె నిపుడు. (విష్ణు. 5-18)

132 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సరిగ్గా ఇదే పద్యం రాధామాధవంలో ఉంది. స్వయంవర మండపంలో తన ముందు నిలబడ్డ రాధను చూసి మాధవుడు ఇలాగే అనుకొంటాడు. విష్ణుమాయా నాటకంలో ఆఖరి పాదంలో “అబల మధురోక్తులకు సమ్మతయ్యెనిపుడు' అని ఉంది రాధామాధవంలో 'సవతయ్యె నిపుడు" అనే మంచి పాఠం ఉంది. ఇంతే తేడా. ఈ రెండు గ్రంథాలలోనూ ఇలాగ ఒకే పద్యాలు ఉండడంవల్ల విష్ణమాయా నాటకానికీ, రాధామాధవ కవికీ సంబంధం కనబడుతున్నది. రాధామాధవంలోని ఆశ్వాసాల మొదటనున్న పద్యాలే విష్ణమాయా నాటకంలో కనబడుతాయి - ఒక్కటి తప్ప.

ఈ పట్టికలో ఒకే ఒక పద్యం విభిన్నమైనది. అది విష్టమాయానాటకం పంచమాశ్వాసం మొదట ఉన్నది. ఇలాగ కొత్తగా ఒకటి వ్రాసిన కవి మిగతా ఆ్య్వూసాలలో వేరే పద్యాలు వ్రాయక రాధామాధవంలోని ఆశ్వాసాది పద్యాలనే ఎందుకు వాడుకొన్నాడో తెలియదు. ఆశ్వాసాంత పద్యాలు రెండు కావ్యాలలో పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. రచనా విధానంలో కూడా విభిన్న పద్ధతులు కనబడతాయి. రాధామాధవం ప్రబంధ ధోరణిలో ఉంది. విష్ణమాయా నాటకం పురాణరీతికి దగ్గర్లో ఉంది. ఒకే కవి రెండు పద్ధతులలో రెండు కావ్యాలు వ్రాయవచ్చని ఎభ్రయ్యగారి నరసింహపురాణం, హరివంశాలే నిరూపిస్తాయి. ద్వితీయాశ్వాసం మొదట - తీయాశాఇసం మొదట -

'శ్రీరాధాధరమధురసు మా తా (స్రోతధారసగాల్గా ద్రశాంతదారుణ ధారసధారా ప్రకాంతదారుణ శ్రి ల గోపా స్మారశరానలథీరో దారగుణావాలనమమదన లా! దారగుణావాలనవమదన గోపాలా! తృతీయాశ్వాసం మొదట - ్రీ శ్రీకరరాధావదనసు తృ శ్రీ రాధానఖరక్షత న ధఛాకరవింబప్రసన్న దరహాసరుచి చేశకళా వ్యాకోచద్భగుత్సలః విజ్యాశేవలమూల;। వం దరు కదర్వో నవమదన గోపాలా! భారగుణావాల: నవమదన గోపాలా! శ్రీగాధామదమ్యు చతుర్థాశ్వాసం అదిలో. . 'శ్రీరాధామదవద్వ ముద్రా గోరహమకరీకలాప్త యర వ్‌ కరీకలాపశోభన - (ముద్రా క్షోరుహమకరీకలాపశో భన ప్రారంభజృంఖిః సునిశిత ధారానఖజాల! ధారానఖజాలనవమదన గోపాలా! నవమదన గోపాలా అలుల న్‌౦ అదిలో.... న్‌ త శ్రీరాధానఖరక్షత టిలో... శారేశకళానిర స్తదర్చకదర్బో ధ్యారై దారంధకార! ఆగదా ధార। రారాసితకిర జితచేతో గుణవాలః నవమదన గోపాలా, కక శ్నాకరకల్గాలవమదన గోపాలా!

చింతలపూడి ఎల్లన్న 133

విష్ణమాయా నాటకాన్ని రాధామాధవకవి రచించాడనే నిర్ణయానికి తగినంత ఆధారం అంతరంగిక సాళ్ష్యాలవల్ల సేకరించాం. భావి పరిశోధనలవల్ల అనంతయ్య గద్య ఈ గ్రంథానికి ఎలా దఖలుపడిందో కేల్చాలి. రాధామాధవకవి గ్రంథాలను బాగా పరిశీలించవలసిన అవసరం ఎంతో ఉంది.

పారిభట్టు

బమ్మెరపోతరాజుగారి భాగవతం ప్రాచుర్యం పౌందీ పొందగానే వారి అనంతర కవులపై తక్షణ ప్రభావం కనబడసాగింది. కొందరి రచనా శైలిలో మార్పులు వచ్చాయి. కొందరి ఆలోచనా సరళిలో మార్పులు వచ్చాయి. కొందరి జీవన విధానాలే మారిపోయాయి. చాలామంది వైష్ణవం పట్ల ఆకర్షితులయ్యారు. ఆదిలో భ్రమరాంబా భక్తుడైన భైరవుడు పోతరాజుగారి. ప్రభావంలోపడి వైష్టవుడై, తొలిరాయల యుగంలో, శ్రీరంగ మాహాత్మ్యం రాశాడు. అడుగడుగునా భాగవతంలోని పద్యాలను అనుసరించాడు.కే ఇతనిలాగే ఎందరో పోతరాజుగారి అనుయాయులయ్యారు. ఆయన భాగవతంలో విడిచిపెట్టిన స్కంధాలను యథాశక్తి పూరించారు. వీరిలో కొందరు చరిత్రకెక్కిన సాధారణ ప్రజ్ఞావంతులు. కొందరు మరుగుపడిన మాణిక్యాలు. చెప్పుకోదగ్గ సులక్షణాలు కొద్దిగానో, గొప్పగానో ఉన్నవాళ్ళు. ఇటువంటి వారిలో హరిభట్టు ప్రముఖుడు.

ఇతడు బమ్మెరపోతరాజుగారిలాగే తెలంగాణా వాస్తవ్యుడు. కంబంమెట్టు ప్రాంతాలలోనివాడు. ఆ గిరి దుర్గంలో కొన్నాళ్ళు నివాసమున్నవాడు. ఆనాటి రాజకీయ చదరంగపు గళ్ళలో ఈ దుర్గం చాలా ప్రాముఖ్యం గలది. క్రీ.శ. 1448 నాటికే కపిలేశ్చర గజపతి రాజమండ్రీ ఖమ్మంమెట్టు రాజ్యాలను జయించాడు. రాఘవదేవనరేంద్ర మహాపాత్రుని ఆ ప్రాంతాలకు రాజ్యపాలకునిగా నియమించాడు.

గజపతుల పాత్ర సామంతుల ఏలుబడీలోనికి కంబంమెట్టు వచ్చిన దశాబ్దంలోనే, బహుశా వేదపండితుల ఇంట్లో హరిభట్టు జన్మించి ఉంటాడు. ఇతని పూర్తి పేరు హరిహరభట్టు. హరిభట్టుగా ప్రసిద్ధుడయ్యాడు. పేరు సుప్రసిద్ధమైనా హరిభట్టు ఇంటిపేరు ఏమిటో తెలియదు. తండ్రీ పేరు రాఘవరామచంద్ర ఛట్లోపాధ్యాయులు కావచ్చు. కొందరు ఈయనను రాఘవయ్య అనీ కొందరు రామయ్య అనీ పిలిచేవారు కాబోలు. పేరులో ఉన్న చంద్రుణ్ణి అందరూ మరచిపోయినా హరిభట్టు తాను రచించిన ప్రతి గ్రంథంలోనూ తన తండ్రీ 'చంద్రనామాంక రామ విద్వన్మణి' అని చెప్పుకొన్నాడు. వ్యవహార నామంగా నైనా హరిభట్టు తండ్రి రామచంద్రోపాధ్యాయులుగా ఉత్తరోత్తరా శాసనానికెక్కాడు. వేదశాస్తార్థ తత్త్వజ్ఞులనే ఛట్టోపాధ్యాయులంటారు. వేదవేదాంగ్లో పరిజ్ఞానం ఉన్నవారిని విద్వాంసులంటారు. హరిభట్టు తన తండ్రీ పేరులో ఈ మాటలను రెండు వశషణాలుగా వాడాడు. తన గురించి చెప్పుకొనేటప్పుడు ఇతరులు ఇవే పదాలు వాడుకొస్హ్రట్సా పద్యస్థం చేశాడు. బహుశా ఈ తండ్రీ కొడుకులిద్దరూ పౌరాణికులు

  1. తొలిరాయల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటం, సం 2002

134 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కావచ్చు. సంస్కృతంలోని అష్టాదశ పురాణాలలోని కొన్ని ముఖ్యంగా విష్ణుపారమ్యమున్నవాటిని కలవారి ఇండ్లలో చదివి విడమర్చి చెప్పేవారు కాబోలు కంబంమెట్టు స్థలకరణాలైన కొలిపాకవారి లోగిట్లో రెండు మూడు తరాలుగా ఎవరో పురాణ శ్రవణం కావించేవారు. రామచంద్ర ఛట్లోపాధ్యాయులూ, హరిభట్టూ ఈ కొలిపాక వారి ఆశ్రితులు.

ఊరిమీద ఊరుపడ్డా కరణం మీద కాసుపడదు అని సామెత చెప్పినట్టు రాజ్యాలేలే రాజులు పోయినా, కొత్త ప్రభువులు వచ్చినా దుర్గాధిపత్యాలలో మార్చులు వచ్చినా సర్వసాధారణంగా స్థలకరణాల పదవికి ముపష్పురాదు. కొలిపాకవారు కంబంమెట్టు దుర్గానికి వంశపారంపర్యంగా కరణాలు. గజపతుల పాలన మొదలయ్యాక కరణాలు స్థలకరణాలు అయ్యారు. ఈ ఓడ్రరాజుల పరిపాలనా విధానంలో రాజ్యాలూ, సీమలూ కొన్ని స్థలాల కింద విభజన పొందుతాయి. ఒక్కొక్క స్థల కరణం అధీనంలో ఇరవై ఒక్క స్థలాలు కూడా ఉండొచ్చు. ఇతనికి పాత్ర అనే బిరుదూ, పల్లకి ఎక్కే హక్కూ గజపతి ప్రసాదించవచ్చు.2 కంబయెట్టు దుర్గానికి కొలిపాక ఎర్రన్న “స్థల కరణికా గ్రామజీ అయ్యాడు. దుర్వాన్ని ఎవరు పాలిస్తున్నా ఇతని వైభవం అంతకు తక్కువేం కాదు.

కొలిపాక ఎగ్రన్నా అతని తండ్రీ సర్వనా వైష్ణవులు తిరుమల నారాయణ అనే ఆచార్య స్వాముల శిష్యులు. సర్వన కవులను పోషించి విష్ణుపురాణ సంహితలను ఆలకిస్తూ ఉండేవాడు. ఎర్రన్న కళాచతురులు, జాణలు, గాణలు, వారభామినీ వ్రతులు చేరికొలిచే సభలో విష్ణుకీర్తన, విశిష్ట పురాణాలు అలకించేవాడు.* కొలిపాకవారి లోగిట్లో ఎందరో పొరాణికులుండేవారని ఇందువల్ల తెలుస్తూంది. రామచంద్ర ఛట్లోపాధ్యాయులూ అతని కొడుకు హరిభట్టూ ఈ పౌరాణిక బృందంలో ఉండేవారని ఊహిస్తే తప్పేంలేదుగానీ ఇతోధిక సాక్ష్యాలు అవసరం,

హరిభట్టు ప్రాజ్ఞుడయ్యేనాటికి రాచకొండ, దేవరకొండ రాజ్యాలు గతమెంతో ఘనకీర్తిగలవిగా చరిత్రలో కలసిపోయాయి. అయినా “చాప చిరిగినా చదరంత'. ఆ రాజ్యాలలో సంస్కృత సరస్వతి దిత్కుమాలినది కాలేదు. పద్మనాయక ప్రభువులకు అధినాయకులుగా వచ్చిన గజపతులకు తెలుగు రాకపోయినా సంస్కృత భాషా పరిచయం గట్టిగానే ఉండేది సామంతుల ప్రాపకం లభించాలంటే సంస్కృత రచనలు చేయడం ముఖ్యం. హరిభట్టు అంతే చేశాడు. తండ్రి దగ్గర నేర్చుకొన్నదానితోనే సర్వవిద్యానవద్య, సహజ సారస్వకానవద్యా అనే బిరుదులు తన గద్యలో చెప్పుకొనేటంత పండితుడయ్యాడు. సంస్కృతంలో చక్కని కవిత్వం చెప్పగలిగిన వాడయ్యాడు. శృంగార దీపిక అనే నామాంతరం గల రతిరహస్యమనే కామశాస్త్ర

“శృంగార రసప్రపూర్ణ హృదయులైన రసికులను రంజింపచేస్తూ వారి పొగడ్తలను అందుకొన్న పూర్చకవి రచితములైన కావ్యాలు ఛాలా ఉన్నాయి. వొటిలోని సారాన్ని గ్రహించి సరళ్టైలిలో ఈ కళాశా స్రాన్ని విరచిస్తున్నాను'' అని మొదటే ఇలా చెప్పాడు. పానానానహాా ల పగను అని మొదటే ఇలా చెప్పాడు _ పై ననగా, కఅణిగాః 6౪౫% 0 042 - జిల 1957. ౧.144 4. అదే పుస్తకంలో, 1-14

హరిభట్టు 135 కావ్యాని సంతి బహుశ ప్రథితాని పూర్వైః

శృంగార పూర్ణసరసాఖిల సన్నుతాని

ఉద్ధృత్వసార మధునాహ ముదీరయామి

కావ్యేషు కేషు సకలం సుకలా విలాసం (రతిరహస్యం 1-4) తాను రచించే కావ్యాన్ని చూస్తే యోగి జనుల మనసులే చలిస్తాయి. ఇక ఇతరుల సంగతి చెప్పాలా అని ప్రన్నిస్తున్నాడు.

మయా విరచితం కావ్యం దృష్టా యోగి జనస్యచ

మానసం విచలత్యేవ కిమన్యే మనుజాధమాః (రతిరహస్యం 1-5)

తమ కావ్యాలతో యతులను విటులను చేయగలమని, విటులను యతులను చేయగలమని కవులు గొప్పలు చెప్పుకొనే కాలం అది. సంకుసాల నరసయ్య తన కవికర్టరసాయనంలో ఈ విధంగా ప్రకటించడం అతని ప్రకరణంలో చూశాం. హరిభట్టు విటుణ్ణీ యతిగా చేస్తాననే సవాలు చేయలేదుగాని ఉత్తరోత్సరా తానే భాగవత శ్రషృడైపోయాడు. అయితే ఇది అంచెలమీద సాగిన పరిణామం. ఏ రచన చేస్తున్నా చిత్తశుద్ధితో చేయడం ముఖ్యం. హరిభట్టు రచించిన రతిరహస్యంలో నీచమైన అభిరుచులు కనబడవు. ఆ గ్రంథ ప్రాశస్త్యాన్ని పంచాగ్నుల ఆదినారాయణకాస్త్రిగారు ఇలా ఉగ్గడీంచారు.!

“హరిభట్టు- రతిరహస్యము'”' కొక్కోకుడు రచించిన రతిరహస్యుముగాక ఈయన మరియొక రతిరహస్యము రచించినాడు. కొక్కోకుని రతిరహస్యము కంటెను ఈయన గ్రంథము చాలా సంప్రదాయశుద్ధముగాను, కామసూత్రోద్దేశ నిబద్ధముగాను ఉన్నది. ఇయ్యది మూడు పరిచ్చేదములు గలది. శోకరూపకము...” సంప్రదాయ శుద్ధత్వం కొన్ని విషయాలలో అభిలషణీయం. సదాచారం తెలుసుకొనడం ముఖ్యం. హరిభట్టు అందుకు ప్రయత్నించాడు. రతిరహస్యం గ్రంథాన్ని ఎవరు కోర్‌తే ఎందుకు రచించాడో తెలియదు. ఏ పోషకునికి అంకితమిచ్చాడో భావిపరిశోధనలవల్ల తెలియవచ్చు. హరిభట్టు ధనంకోసం కన్నులకు కనబడ్డ కలవారందరినీ సన్నుతి చేయడం ఒక దశలో ఉండేది. కడుపుకోసం కావ్యముఖాలలో కలవారిని సన్నుతించడం తప్పులేదు. సంస్కృతంలో శాస్త్ర గ్రంథాలు వాదించడంకన్నా, పాగడ్డ పద్యాలను చెప్పడం జీవనోపాధికి సులభమార్గం. కవిత్వం, అందులోనూ ఆశుకవిత్వం చెప్పగల హరిభట్టుకు ప్రముఖులను ముఖస్తుతి చేసే అవకాశాలు లఖించే ఉంటాయి.

ఆ రోజుల్లో తెలంగాణంలో అవధాన కవిత్వం ఒక కొత్త మోజుగా తయారైనట్టుంది. ఓరుగల్లులో చిత్తాపఖానుని కొలువులోని మంత్రిని నమ్ముకొన్న చరిగొండ ధర్మన్న శతావధానాలు చేసినాడు! 'శతలేఖినావధాన పద్య రచనా సంధా సురత్రాణు'డనే విరుదు అతనికి ఉంది. శతావధానం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. రెండు మూడు రోజులకన్నా ఎక్కువ కాలం కావాలి. అష్టావధానం అయితే 6. చిత్ర భారతం - పీఠిక పద్యం 16

136 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తొందరగా _ ఒకనాడు ముగించవచ్చు. హరిభట్టు ఈ ప్రక్రియను చేపట్టాడు అష్టఘంటావధాన విన్‌ష్ట బిరుదాంకీతుడయ్యాడు. చాలా అవధానాలు చేసి తన నేర్చును ప్రదర్శిస్తేనే గాని ఇటువంటి మన్నన లభించదు.

హరిభట్టు అవధానాలు చేస్తున్న కాలంలోనే కొలిపాక ఎర్రన్న అతబ్జి కంబంమెట్టులోని తన సమక్షానికి పిలిపించాడు. అతడు శబ్దార్ధ భావరసాలంకార బంధంగా ఒక ప్రబంధం చేయాలనుకొంటున్నాడని ఎర్రన్నకు తెలుసు. తనకు విష్ణుకథలు వినడం ఇష్టం. హరిభట్టు చెప్పదలుచుకొన్నది వరాహపురాణం. దానిని తనకు అంకితం చేయమని ఎర్రన్న అడిగాడు. కర్పూర తాంబూల లాలితాంబరాభరణాలు' ఇచ్చాడు.

తెలుగు సాహిత్యంలో అప్పటికే ఒక వరాహపురాణం ప్రచారంలో ఉంది. దానిని తొలిరాయల యుగంలోని నందిఘంటకవుల జంట రచించారు. అయితే అందులో వరాహావతార ఘట్టం అన్నదే లేదు. వరాహపురాణంలో రెండు ఖండాలు ఉన్నాయి ఒకటి కైవల్య ఖండం, రెండోది విజ్ఞాన ఖండం. హరిభట్టు మొదటిదానిని అనువదించాడు ఇందులో వరాహావతార కథ ఒక్కటే కాదు; నరసింహావతార గాథా, ఆ మాటకొస్తే దశావతారాల సంక్షీష్త గాథలూ వగైరాలున్నాయి. అయిదు ఆఅశ్వాసాలలో 1255 గద్య పద్యాలలో హరిభట్టు కైవల్య ఖండాన్ని ఆంధ్రీకరించాడు.

“హరిభట్టు'” వరాహపురాణమేల రచించెను?” అని ప్రశ్న వేసుకొని కారణాలు వెదకడానికి మన పరిశోధకులు ప్రయత్నించారు.” స్థానిక, చారిత్రక కారణాలను అన్వేషించడం చాలా అవసరం. ఆంధ్రదేశాన్ని ఆదినుంచీ చాళుక్యులు పాలించారు. వారు వరాహ లాంఛనులు. తెలంగాణాలోని వివిధ రాజ వంశాల వాళ్ళు కూడా తమ శాసనాలలో మొదట విధిగా వరాహస్తుతి చేయడం కనబడుతుంది.కీ శ్రీ.41191లో వేయించిన కాకతీయులు కొండపర్సి శాసనంలోనూ (నెం.1-20), క్రీ.శ. 659-60లో విక్రమాదిత్య సత్యాశ్రయ శ్రీష్ఫథ్వీవల్లభ మహారాజు వేయించిన అమిదేలపాడు తాత్ర శాసనంలోనూ (నం. 8), త్రిభువనమల్లుడు కొలనుపాకలో వేయించిన శాసనంలోనూ (నెం.1-42), బాదామీ చాళుక్య ప్రభువు విజయాదిత్యుడు క్రీ.శ704లో; విక్రమాదిత్య " సత్యాశ్రయ శ్రీష్ఫథ్వీవల్లభమహారాజు వేయించిన అమిదేలపాడు తామ్ర శాసనంలోనూ (నెం.2-1), కల్యాణీ చాళుక్యులకు చెందిన కుమార సోమేశ్వర దేవుడు కొలనుపాకలో వేయించిన శాసనంలోనూ (నెం.2-28), కాకతిరుద్రదేవుడు బెక్కల్లు కరీంచగరు జిల్లాలో వేయించిన శాసనంలోనూ (నెం2-32), క్రీశ 1294లో" యాదవ చక్రవర్తి రామచంద్రదేవుడు మత్తలలో వేయించిన శాసనంలో (2-ఇ-1) ధరణీ వరాహ స్తుతి

లు భట్టు కాలంలోనే క్రీశ 1503లో చిత్తాబుభానుడు వేయించిన వరంగల్లు శాసనంలో కూడా వరాహ ప్రార్ధన ఆదిలోనే ఉంది శతాబ్దాలుగా

హరిభట్టు 137 తమ ప్రాంతాలలో నుతిస్తున్న ఆది వరాహదేవుని కథ ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కవికీ, కవిపోషకునికీ కలిగి ఉంటుంది. అందుకే వరాహపురాణాన్ని తినిగించడం జరిగింది.

మన పురాణాలన్నీ రమారమి పరస్పర ప్రతిధ్వనులు. ఒకో కథ వివిధ పురాణాలలో కనబడితీ రమారమి అవే శోకాలు మూలంలో ఉండవచ్చు. వాటిని వివిధ కవులు అనువదిస్తున్నప్పుడు తమ నేర్చు చూపవచ్చు. లేదా పూర్వులను అనుకరించవచ్చు. వరాహ పురాణాన్ని హరిభట్టు యధాశక్తి పోతనగారిని అనుకరిస్తూ సాఫీగా ఆంధ్రీకరించాడు తప్ప అంతకన్నా ఎక్కువగా ఏమీ చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. ప్రహ్లాద చరిత్రలో పోతరాజుగారు హిరణ్యకళిపునిచేత ఇలా అడిగించారు.

చోద్యంబయ్యెడు నింతకాల మరిగెన్‌ శోధించి యేమేమి సం

వేద్యాంశంబులు నెప్పిరో? గురువులే వెంటం బరింపించిరో?

విద్యాసార మెరుంగ గోరెద భవ ద్విజ్ఞాత శాస్త్రంబులో

బద్యం బొక్కటి చెప్పి సార్థముగ దాత్పర్యంబు భాషింపుమా!

(భాగవతం. 7-16)

పోతరాజుగారి తర్వాత ప్రహ్లాద చరిత్ర రాసిన కవులంతా ఈ పద్యానికి వేలువిడిచిన బంధువులనే తీసుకొచ్చారు. వెన్నెలకంటి సూరన్న విష్ణుపురాణంలో ఇలా హీరణ్యకశిపుని చేత చెప్పించాడు.

ఏమి సుభాషితంబు పఠియించితి పుత్రక రాజనీతు లే

మేమి యెఅుంగ జెప్పె గురుడిప్పుడు నీదగు పుస్తకంబునం

దేమి లిఖించి యున్న యది యిప్పుడు పారకశక్తి జూచెదన్‌

మామది కింపుగా జదువుమూ యొక పద్యము వీరి ముందరన్‌. (విష్ణు - 2-281) ఇదే ఘట్టంలో హరిభట్టు కొడుకును తండ్రీ ఇలా అడిగాడని రాశాడు.

నీనేర్చినట్టీ నీతి వి

తానములో నొక సుభాషి-తము చదువుము. నా

కానందంబుగ, మధుర వ

చో నిపుణత కెల్లవారు- చోద్యంబందన్‌ (వరాహ. 3-23)

పూర్చులు వృత్తాలలో చెప్పినవి తాను చిన్న పద్యంలో చెప్పడం, ఇతరులు చిన్నపద్యాలలో చెప్పినవి తాను వృత్తాలలో చెప్పడం హరిభట్టు హ్ర్యేకతలాగ కనబడుతుంది. మాదయ్యగారి మల్లన రాజశేఖర చరిత్రలో ఇలా రాశాడు.

నీలకంకఠుని శిరసుపై నీళ్ళుచల్లి

పత్తిరిసుమంత నెవ్వడు పారవైచు

గామధేనువు వానింటి గాడి పసర

మల్ల సుఆశాఖి వానింటి మల్లెచెట్టు. (రాజశేఖర. 1-65)

136 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మల్లయ్య ఒక చిన్న పద్యంలో ఇంత సూటిగా చెప్పిన భావాన్నే హరిభట్టు ఉఊత్పలమాలలో సాగతీశాడు. నీ కవితోత్తమాంగమున నీళ్ళును దోనెడు చల్లువాడు మం దాకిని మోచు బువ్వొకటీి దా నిడువాడు బ్రసన్నచంద్రరే ఖా తుసుమంబ దాల్ఫు సిరి గందమలందినవాడు మన్మథ ప్రాకటభూతి రైకొను బురాకృత పుణ్యఫలంబు తప్పునే! (వరాహ.1-76) నీలకంఠుని నెత్తిమీద నీళ్ళిన్ని బల్లి పత్రి పారేస్తే కల్చవృక్షానికి, కామధేనువుకూ హక్కుదారుడు కావచ్చును గాని హరిభట్టు తొలినుంచీ హనుద్చక్తుడు. తాను మహనుమత్కరుణా వరప్రసాద సాదిత సారస్వత నిరాతంకుడనని గద్యలో చాటుకొన్నాడు. ఆ దేవుజ్ణే నమ్ముకొన్నా ఆ హనుమంతుడు కొలిచే రాముణ్జీ, ఆ రామునికే తన పుస్తకాన్ని అంకితమిచ్చి విష్ణుకథలు చెప్పిన బమ్మెరపోతరాజుగారినీ అమితంగా హరిభట్టు ఆరాధించసాగాడు. పోతరాజుగారి భాగవతాన్ని ఎన్నిసార్ల పారాయణ చేశాడో వారు చెప్పకుండా వదలిపెట్టిన ఏకాదశ, ద్వాదశ స్కంధాలను తెనిగించాలని సంకల్పించాడు. అవి హనుమంతునికే అంకితమివ్వదలిచాడు. ఏళాదశ స్కంధంలో హరిభట్టు తన భావాలను పాత్రల ద్వారా చెప్పించాడు. సూతుని చూసీ పరీక్షిత్తు “విమల వాక్రాఢి తోడుత విస్తరించి. శ్రవణపుట యుగ్మమునకు నుత్సాహమొదవనిఖిల మునిలోక వంద్య నాకానతిమ్ము” (11-15) అని అడిగాడట. సూతుడు “వినిపించెద మనములోన వేడుక పుట్టన్‌ ఘనతర మద్వాగ్విభవంబున దోచిన కొలది” చెప్తానన్నాడు (11-17). ఏకాదశ స్కంధంలో హరిభట్టు వాగ్విభవం మెరుగుపడింది. ఇందులో మొత్తం 320 గద్భపద్యాలున్నాయి. ఈ స్కంధం “హింసచేయకుంట - హితమాచరించుటి” ప్రబోధిస్తుంది. వైదిక ధర్మమార్గాన్ని నిరసిస్తుంది. యజ్ఞయాగాదులను నిషిధిస్తుంది యజ్ఞాదులందు దుప్ప్రజ్ఞాసమేతులై మహిన సర్వజ్ఞులమంచు గొంద రామ్నాయ మార్గ గూడార్థంబు లెణలుగక విధిలేక పశువుల విశమనంబు సేసి యా పశువురోడాశ ఖండంబుల నగ్నిలోపల వేల్చి యఖిల భూత భేతాళములకు సంట్రీతి తోడుత దృష్తి సమకూర్చు జీవహింసకులు, మీద నపునరావృత్తికరమైన యట్టి పదము జెందనేరక యాత్మవంశీయులైన యట్టి వారలతో గూడి హర్షముడిగి పడుదురతిఘోర నరక తూపముల లోన. -. (హరిభట్టు. 11-252) __ జీవహింస కూడదన్న నోటితోనే యజ్ఞసంస్కృతిని భూషించే వాళ్ళకు ఇటువంటీ హితోక్తులు రుచించవు. ఈ మాటలు సాక్షాత్తూ వాసుదేవుడు ఉద్దవునికి చెప్పినవే. హరిభట్టు ఇంత విస్పష్టంగా చెప్పిన భావాలను వెలిగందల నారయ చెప్పిన ఏకాదో స్కంధంలో వెతుక్కోవాలి. వెతుక్కున్నా వెలితిగానే ఉంటుంది. హరిభట్టు ఏకాదశ

హరిభట్టు 139 ద్వాదశ స్కంధాలను తెనిగించాక అందులోని మంచి పద్యాలను లేఖకులు తమ ప్రతులలో సందర్పోచితంగా ఎక్కించుకొన్నారు. పాటుపడేదొకరు, ఫలితమనుభవించే దొకరూ! హరిభట్టే ఇలా చెప్పాడు.

చీమలు పెట్టిన పుట్టల

బాములు సుఖీయించునట్లు పరమ జ్ఞానుల్‌

ప్రేమంబున బరగృహమున

వేమరు సుఖియింతు రధిక విభవము తోడన్‌ (హరిభట్టు 11-238)

హరిభట్టు వాగ్చాభవం పరీగృహాలలోనే ప్రచ్చన్నంగా బతికింది. హరిభట్టు స్వదేశం విడీచి ఎందుకో పరదేశాలు పట్టాడు. అతణ్జీ అభిమానించి, అతని భాగవతాఖినివేశాన్ని మెచ్చుకొని అతనిని చేరదీసిన ఏ ప్రాంత సామంతులో తమతోబాటు హరిభట్టును పూరీ జగన్నాథానికి తీసుకొని వెళ్ళారు. ఆ రోజుల్లో కంబంమెట్టు గజపతులకు ఆయువుపట్టు. యుద్ధాలకు ఉనికిపట్టు. చిత్తాపుఖానుడు ఓరుగల్లును పోగొట్టుకున్నాడు. కంబంమెట్టు చేరుకొంటే అక్కడినుంచి కూడా వెళ్ళగొట్టడానికి సుల్తాన్‌కులీ నిశ్చయించుకొన్నాడు. చిత్తాపుఖాను గజపతులను ఆశ్రయించి కంబంమెట్టును నిలుపుకొన్నాడు. కృష్ణదేవరాయలు తన పూర్వ దిగ్విజయ యాత్రను క్రీశ. 1512లో ప్రారంభించాడు. హరిభట్టులాంటి వారికి పూరీ జగన్నాథమే శరణ్యమయింది.

తెలుగు వాళ్ళలో పోతరాజుగారి ఆంధ్రమహాభాగవతమెంత ప్రాచుర్యం పొందిందో ఉత్కళదేశంలో జగన్నాథదాసు రచించిన ఒరియా భాగవతం అంతటి ప్రసిద్ధమైంది. ఓడ్ర భాగవతం 'గగానయోగ్యమైనది. గేయ ఛందస్సులో ఉన్నది. హరిభట్టు పూరీలో ఆ భాగవత గానాన్ని ఆలకించాడు. పోతరాజుగారు విడిచిపెట్టిన షష్టస్కంధాన్ని తినిగించాలని భావించాడు. అది పూరీ జగన్నాథునికే అంకితమివ్వదలిచాడు.

ప్రస్కంధామర రాజ్యురక్షకుని భూభారావ హర్పకున్‌ మహే

శస్కందాఖిసుత ప్రభావు గమలా సంక్రాంత రాలీన్మహో

రస్కున్‌ విష్ణు దలం భగవత పొరాణీయమైన ష

ష్టస్కంధంబు దెనుంగు జేసెదను గృష్టట్రీతిగా వేడ్కతోన్‌. (౧1.1069)

ఇంతకు ముందు స్కంధములను కడుపుకోసం పాగడినందువల్ల పొడమిన పాపాలు పోవడానికి జగన్నాథస్వామికి ఈ గ్రంథం అంకితమిస్తున్నానని ఇలా చెప్పాడు.

ఎడపక విష్ణునిం బొగడ నెన్నడు నొల్లక దుర్మదంబునన్‌

గడుపులకై నరాధముల గావ్యముఖంబుల సన్నుతింపగా

బొడమిన పాపజూాలముల బొట్టణగం బొలియించు ముక్తిబొం

దెడు కొణకై రచింతు గృతి నీలగిరీంద్రున కర్పితంబుగన్‌. (గ. 10639)

ఇంతకుముందు ఏకాదశ ద్వాదశ స్కంధాలు నరులకు కాక హనుమంతునికి అంకితమిచ్చాడు కదా! వాటికి పూర్వం షష్టస్కంధం చెప్పాడా? ఎప్పుడు చెప్పినా ఇది

140 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ప్రచారంలోనికి రాలేదు. ఇప్పటికీ అముద్రితంగానే తాళపత్రప్రతులలో ప్రాచ్యలిఖిక గగంథాలయాలలో మూలుగుతున్నది. ఇతనేకాక ఇతరులు చేసిన షష్టస్కంధాను వాదాలలో కవితలు పోతరాజుగారి దివిటీ ముందు దివ్వెలే.

భాగవత శేషోన్నయాన్ని హరిభట్టు విశిష్టాద్వైతిగా చేశాడు. పూరీలో నివసించడం అతనిలో మార్చును తెచ్చింది. సర్వం శ్రీ జగన్నాథమనే తత్త్వం అర్థమైంది.

పరుసమునకు నినుము బంగారమునొక్క

విధమర్చ్హైన యట్లు వీక్షసేయ

శ్వపచుడైన విప్రవరుడైన శ్రీవిష్ణు

భక్తి కొక్క సమము పరిచరింప. (౧.109)

షష్టస్కంధం అవతారికలో తాను చెప్పిన ఈ పద్యం ఆచరణలో పెట్టినట్టున్నాడు విష్ణువు తప్ప వేరే దైవం లేడనీ రామానుజుడే జగద్గురులనీ విశ్వసించాడు. “శ్రీ రామానుజ పాదపద్మయుగళీచింతా సమాయుక్తుడై' శ్రీరంగనాథుని సేవించసాగాడు. దేవాంతర నమస్కారాల పరిత్యజించాడు. సకల వైష్ణవ ప్రశస్తమైన' విష్ణుధర్మోత్తరమనే పేరుగల మత్స్య పురాణాన్ని తెనిగించదలిచాడు. ఇది శ్రవణధారా వాంఛితమై నవీనమై అలకువ నొందాలని కోరుకున్నాడు.

మత్స్య్యపురాణ రచనా కాలం నాటికి హరిభట్టులో విశిష్టమైన మార్చు వచ్చిందని చెప్పడానికి అప్పటిదాకా పూర్వకవిస్తుతిలో ఎవరూ చేయని ఒక నమస్కృతి ఉదాహరణ. “పదపద్యములు దేశభాషల రచియించి వెలసిన కవుల కంజలు లొనర్చి అని కృతి చెప్పసాగాడు. ఈ మాటలు అంటున్నప్పుడు బహుశా అతని దృష్టిలో ఒరియా భాగవతాన్ని చెప్పిన జగన్నాథదాసూ, తిరుపతిలోని తాళ్ళపాక కవులూ మెదలి ఉంటారు.

మత్స్యపురాణంలో రసవద్దట్టాలు లేనేలేవు. ఉన్న కథలైనా తులసి మాహాత్మ్యం ఏకాదశీవ్రత మాహాత్మ్యం, సప్తసంకాన ప్రతిష్థాఫలాలూ వగైరాలు చెప్తాయి. ఈ కావ్యంలో అయిదు ఆశ్వాసాలలో 783 గద్యపద్యాలున్నాయి. ఇది 1912లో కవికా పత్రికాధిపతులచేత కాకినాడలో ప్రచురణ ఫాొందింది. ఈ మత్స్యపురాణాన్ని ఇప్పటిదాకా సాధికారంగా ఎవరూ మహ్హ్లోషణ చేసినట్టు కనబడదు. రసికానందం కోసం కాకపోయినా భక్తి ప్రచారం ఎలాంటి వదంతులు అనుసరించి చేశారో, అందులోని మంచి చెడ్డలేమిటో గుర్తించడం అవసరం. ఎటువంటి పాపం చేసీనవాడినైనా ఇట్టే క్షమించి మోక్షమిచ్చే మతం కొన్ని చారిత్రక పరిస్థితులలో ఆకర్షణీయంగా ఉంటే ఆశ్చర్యం లేదు మత్స్యపురాణం నిండా అలాంటి గాధలు కనబడతాయి.

“ఆయురారోగ్య నిత్యైశ్వర్యములు కల్లి విభవంబుతో ధాత్రి వెలయుకొరకు హరిభట్టు మత్స్యపురాణాన్ని శ్రీరంగనాథునికి అంకితమిచ్చాడు. కోరినవన్నీ సత్పురుషుల ఆదరణవల్ల అతనికి లఫించాయి. “ధనములకై నరాధముల సన్నుతించడం కడుపుల్జై నరాధములను కావ్యముఖాన సన్నతించడం హరిభట్టు దృష్టిలో పాపమేగాని,

హరిభట్టు 141 సజ్జనులు చేసే సత్కారాలు స్వీకరించడం, గ్రామాలు పొంది అనుభవించడం, విభవంతో వెలుగు కలగడం ఇష్టమే. క్రీ.శ. 1513 నాటికి అతణ్ణి ఆదుకొని అష్టభోగాలతో అగ్రహారాన్ని ఇచ్చే. పోషకుడు దొరికాడు. శ్రీమద్రఘుపతి నాయకాచార్యులైన శ్రీవీరరామనాయకుడు ఏప్రాంతంలోని వాడోగాని కృష్ణదేవరాయల సామంతుడు. ఇతడు తన అధికారంలో ఉన్న చిన్నపల్లె అనే గ్రామానికి రామసముద్రం' అనే పేరు పెట్టి నిధి మొదలైన 'సమస్త తేజస్వామ్యాల' తో హరిభట్టుకు దానమిచ్చాడు.!* పోషకుడు కవిగారిని

ఏదైనా కృతి అంకితం ఇవ్వమని కోరలేదు. “మా వంశస్థులకు శ్రేయః ప్రార్ధన జేసుకొని'”' ఆ

గ్రామంలో సుఖంగా ఉండేది * అని వ్రాయించి తామ్ర శాసనాన్ని ఇచ్చాడు.

గామం చేతిలో ఉంటే ఎటువంటి విభవం వస్తుందో హరిభట్టుకు తెలుసు. ఎవరికి అంకీతమిద్దామని రచించాడోగాని నారసింహపురాణం అనే అయిదాశ్వాల కావ్యంలో ఒకచోట ఇలా చెప్పాడు. కరణాలు, పరిహాసకులు, పరివారాలు సఖులు మంత్రులు, కర్మజ్ఞులు అందరూ గ్రామ విభుని చెంత చేరుతారు. ఇతడే శ్రీ విష్ణున్థానములకు, వైవాలయములకు, శక్తి సదనాలకు భోగాలు నడిపించాలి. దేవాలయాలలో ఉస్మా సానులు మానులు మొదలైన భోగాలవారిచేత సేవలు చేయించాలి. గ్రామాధిపతి భోగలాలసుడైతే ఆ మేళాలు దేవుని కొలువులో కాక తన కొలువులోనే ఉంటాత్య. యు

తన కొలువును దనపై బెన

చిన పదముల పాటలును రచింపగదినముల్‌

చనుగాని మేళమున క

య్య నిమిష సేవకును గలుగ శీవకాశంబుల్‌ (నార - 5 - 15)

దేవాలయాలపై అధికారం గలవారు సుగంధ ద్రవ్యాలు దేవునికోసం సేకరించాలి. దుష్టుడు గ్రామ పాలకుడయితే తన కోసం వాటిని చేర్చుకొంటాడు.

పునుగు గస్తురియు గప్పురము గుంకుము గంధ సార ఖండములు పన్నీరు మొదలు

సురఖి వస్తువులెల్ల శోధించి శోధించి మేలైనయవి తన పాల నిలిపి

రత్నభూషణముల రాయిఅప్పులు మయంచి యవి యెల్ల గిలు బాడి యందుకు బతి

యమరించి జీర్ణంబు లగువాని బెట్టెల నించి నూతన పటీనికర మెల్ల

దనదు బొక్కస మింటికి దార్చి పెరుగు,

కాయగుడములు ఖండ శర్కరయు దేనె

లాత్మ గృహమున నుండి రాహవణపజిచి (నార = 5 -147) చుంచివన్నీ ఆత్మగృహంలో ఫ్రోగుచేసి నాసిరకానివి దేవుళ్ళ మొగాన కొట్టే చుష్టగ్రామాధికారులను హరిభట్టు చూడకపోలేదు.

10 4కి 0 సిసంంా౭ గూయంతంం108! అంగ 1927 కం! ంయంకంగ ౧1069 ౧8౩6 77 గ ౦౦౧౪ ౦1 కమగంంతంంరణగి. 96౧ 01 సుగం గూంరగితరేలచుతాడి 0% ౪ట3080362ట0 ఏ34626 5812 1436 ౯ 46 విం55లు900 0 5గషిీగ ౬ 96031 4యగ 1౧ గం127 04 ఈ శాసనప్రమాణూన్ని నిడుదవోలు వెంకటరావుగారు లోకానికి తెలియచేశారు. భారతి, జూలై 1949.

142 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

మెరికలు మలిగండ్లు బెరసిన క్రొత్తనూకలు పుప్పిగాణుపెసలును గనరు

నెయ్యిము నూనియ నెలగాళ్ళ నుండియు బులిసి బూరటలాడు బూజు పెరుగు

నూరెల్ల నొల్లని కూరగాయలు త్రప్పలవు మిరియంబులు జవుటి యుప్పు

సౌరభం బెడలిన సంభారములు నేయి బడుకలు జవిచెడ్డ గుడము వరటి

చెడిన పుళిపండు గాని యాచెడుగు

దేవతోపహారంబులకు ననర్జోజ్బలార్హ

భోజ్బుముల నంపడొక నాడు బూర్వకాల

కలిత మర్యాదలుడీగె వేల్పులకు నెల్ల. (నార - 5 - 14)

ఏ వేల్చుకోసం హరిభట్టు నారసింహపురాణాన్ని రచించాడో తెలియదు. కవిత్రయంలో ఒకరైన ఎర్రయ్యగారు నృసింహ పురాణం పూర్వభాగాన్ని రచించారు. దానిని ఆయన శ్రీ లక్ష్మీ నృసింహవతారంబను పురాణమని పేర్కొన్నారు. కాబట్టీ ప్రహ్లాద పట్టాఖిషేకం తరువాత అహోబలక్షేత్రమాహాత్మా్యాన్ని ప్రశంసించి కథను ముగించారు. ఈ ప్రహ్లాదుడే ఉత్తరోత్తరా దేవతలమీద కత్తికట్టి స్వర్గం మీద దాడిచేస్తాడు. ఈ కథలను ఎర్రయ్యగారు వదలిపెట్టేశారని వాటిని నారసింహపురాణం ఉత్తరభాగంలో హరిభట్టు కథనం చేయదలిచాడని ఆంధ్ర సాహిత్య లోకం విశ్వసిస్తోంది. అయితే ఈ ఉత్తర భాగంలో వచ్చే చాలా కథలు ముఖ్యంగా ప్రహ్హాదుడు దేవతలపై పగబట్టడం ఎర్రయ్యగారు తమ హరివంశంలో సవిస్తరంగా చెప్పారు. అయినా ఎర్రయ్యగారిమీద ఉన్న గౌరవం కొద్దీ “ప్రబంధ పరమేశ్వరుడు ప్రబంధ రచనా ప్రావీణ్యముతో రచించిన నృసింహపురాణము పూరక గగ్రంథముగా భావించి ఈ కృతి కూడ 'తద్రచనయకా హరిభట్టు దీనిని రచించాడని కొందరు భావిస్తున్నారు. ఇదే నిజమయితే ఎర్రనగారిలాగ హరిభట్టు కూడ _నారసింహపురాణం ఉత్తర భాగాన్ని నరసింహస్వామికే అంకితమివ్వదలిచాడేమో. అతని ఉద్దేశమేమిటో తెలుసుకొనడానికి ఆకరాలేమీ లేవు.

హరిభట్టు తదనంతరం అతని కొడుకు రాఘవయ్య ఈ పుస్తకాన్ని తుంగభద్రా తీరంలోని ప్రోలుగంటి పురానికి తీసుకువెళ్ళి రంగన్న అనే సంపన్నునికి అంకితం ఇచ్చాడు. ఈ రాఘవయ్య కూడా కవిత్వ మల్లగలడు. తండ్రి రచించని కృత్యాది పద్యాలనూ, కృతిపతి వంశ వర్జననూ రచించాడు. రామసముద్రం తామ్ర శాస తెలియవచ్చేదాకా హరిభట్టు కాలనిర్ణయానికి ఈ అంకితం పద్యాలే అఆధారమయ్యాయి. సాహిత్య చరిత్రకారులు విఖిన్న ఊహాగానాలు చేసి నారసింహపురాణ రచనా కాలా ఇంకా తేలని సమస్యగానే మిగిల్పారు. కొందరు ఇది హరిభట్టు తొలిరచన అంటున్నారు.11 ఇతరులు చాలామంది ఇది అతని కడపటి రచన అని భావిస్తున్నారు నారసింహ పురాణాన్ని ఎన్నడో తాను హరిహరభట్టుగా చలామణీ అవుతున్న కాలంలో 11. దేవళ్ళ చిన్నికృష్ణయ్య - వరాహపురాణం (సంశోధిత ముద్రణము) పీఠిక - పుట - 11 12. చాగంటి శషయ్యగారు - ఆంధ్రకవితరంగిణీ - ఏడవ సంపుటం పుట - 17౫

హరిభట్టు 143 రచించి ఎవరికీ అంకితమివ్వకుండా అటక మీద పెట్టాడన్న వాదం పూర్వపక్షం చేస్తూ ఇటీవల కొందరు పరిశోధకులు కొత్త సాక్ష్యాలు చూపారు. హరిభట్టు నారసింహ పురాణానికి, తెనాలి రామలింగని ఉద్దటాచార్య చరిత్రతూ పోలికలు ఉన్నాయి. కాబట్టీ నారసింహపురాణం క్రీశ. 1525 ప్రాంతాలకు ముందుగానే ప్రాచుర్యం పౌందినదనే వాదన ఒకటి వచ్చింది. ప్రస్తుతం లఖిస్తున్న ఆకరాలతో ఎన్ని రాగాలలోనయినా ఊహాగానం చెయ్యొచ్చు. ఎవరి రాగం వాళ్ళకు ఆనందం. పోషకుల ఆనందం కోసమో, తన ఆత్మానందం కోసమో హరిభట్టు చెప్పిన గ్రంథాలన్నీ పురాణాలే. వీటిలోని కథలన్నీ రోళ్ళ రోకళ్ల పాడిన పాత పాటలే. పాడడానికి అనువుగా ఉండేటట్టు తన రచనలను “వచన కావ్యాలుగా హరిభట్టు చెప్పదలిచాడు. సింహగిరివచనాలు, వెంకటేశ్చర వచనాలు, యాగంటివారి వచనాలు మొదలైనవి మనకు సుపరిచితమైైనవే. చ పదాలలో కాక పద్యాలలో చెప్పినవి కూడా శ్రవణ ధారణకు యోగ్యమైనవిగా చెప్పాలన్న ఉద్దేశంతోనే హరిభట్టు తన రచనలను వచన కావ్యాలన్నాడు. ఇందులో అన్నీ విన్న కథలే ఉండవచ్చు. నూతనోత్సుకంబు నూలుకొలిపి పరిణమింపజేయు హరిణాంక కిరణంబు లఖఫినవములుగావె యను దినంబు. (నార - 1- 72) హరిభట్టు చెప్పినట్టు వెన్నాల రేకలు ఏనాటి కానాడే కొత్తలు కావచ్చు. ఇది ఫోతరాజుగారి విషయంలో చెల్లుతుంది. వారి కవిత పుచ్చపువ్వులాంటి వెన్నాల. వారి ప్రభావంలో పడి ఇమిటేషన్‌ రచనలు చేసినవారి కవితలు మసకేసిన వెన్నెలల్లే అనిపిస్తాయి. చలపత 13. సూర్యదేవర రవితుమూర్‌ - వ్యాససుధ ““హరిభట్టు నారసింహ పురాణ రచనా కాల నిర్ణయం” పుట 87 నుండీ.

పిడపర్తి కవులు

ఆంధ్ర సాహిత్యంలో వైష్టవానికి తాళ్లపాక కవులు చేసినంత సేవను వీర్టూవానికి పిడపర్తి కవులు చేశారు. ఈ కుటుంబంలోని చిట్టచివరి ప్రసిద్ధుడు రెండవ బసవకవి. ఇతడు క్రీశ బహుశ 1460లో జన్మించి మలిరాయల యుగంలో రచనలు చేశాడు. పాల్కురికి సోమనాథుని ముఖ్యకిష్యుడు శివరాత్రి కొప్పయ్యగారి వంశంలోనే ఈ పిడపర్తి కవులు జన్మించారు. ప్రతాపరుద్రుని మంత్రి ఇందులూరి అన్నయ్యచేత పాల్కురికి సోమనాథుడు తన ప్రియశిష్యుడు శివరాత్రి కొప్పయ్యకు డోకిపర్రు అగ్రహారం ఇప్పించాడు. ఈ కొప్పయ్యగారి మనుమని మనుమడు ఈ వంశంలో తొలికవిగా కనబడుతున్నాడు. అతని దగ్గరనుంచి ఈ కవులను గురించి కొన్ని వివరాలు తెలుసుకొందాం.

  1. పిడపర్తి నిమ్మయ్య : కొప్పయ్యగారి మనుమని మనుమడు. క్రీ.శ. 1440 ప్రాంతాల ఉండి ఉంటాడు. ఇతడు అష్టభాషావేది. భవులకెన్నడూ కవిత్వం చెప్పని ఘనుడు. ఇతని కృతులేమిటో తెలియవు. రెగళిక నిమ్మనాథుడనే కవి ఒకడున్నాడు. అతడు వ్రాసిన 'నిజలింగ చిక్కయ్యకథ' అనే యక్షగానంలో ఇతని పేరు కృతికర్ణగా పారపాటున కనబడుతున్నది. (౧.279*
  2. పిడపర్తి మొదటి ఐసవకవి: ఇతడు నిమ్మయ్యగారి పినతండ్రి కొడుకు. కాబట్టి ఈయనకూడ క్రీ.శ. 1440 ప్రాంతాలలోనే జీవించి ఉంటాడు. గురుదీక్షా బోధ, పిల్లనైనారుకథ, బ్రహ్మోత్తర ఖండం మొదలైన రచనలు చేశాడు. అయితే ఇందులో గురుదీక్షా బోధ తప్ప మిగతావి దొరకవు. ఇతడు కూడా “కవిత భవులకు జెప్పని సవినయుండు.” శ్రీనాథునిలాగ ఏయే వయసులో ఏయే రచనలు చేసినదీ బసవకవి తన గురుదీక్షా బోధలో ఇలా చెప్పుకొన్నాడు.

పిన్న ప్రాయమున జెప్పితి శివకథలు - ప్రన్న తెనుంగున బదరితికొని

నడివయసున బిల్లనయనారు చరిత - నుడివితి ద్విపదగా (?) సూక్తులను

కాల మాసన్నంబుగా కటమున్నై - లాలిత కావ్యకళాప్రొడి బేర్మి

సకలాగమపురాణ సమ్మతమైన - యొక శివకధ నింక నొనరింపవలయు

కెరియ పద్మరసు అనే కన్నడకవి వ్రాసిన దీక్షావిధానాన్ని ఈ పిడపర్తి మొదటి బసవకవి అనువదించాడు. దీనికి మీనభూపాలుడనే రాజు ప్రోద్బలం, ఇది '“కృతుల కైవడి చమత్కృతుల బుట్టించి చతురులు చేసిన చరితంబు కాదు.” బహుశాస్త్ర సారం. 3. పిడపర్తి సోమనాథుడు : ఈ వంశపు కవులలో ఇతడు చాలా సుప్రసిద్ధుడు. మొదటి బసవకవి కుమూరుడు. తొలిరాయల యుగంలో జన్మించి మలిరాయల యుగంలో తొలిరోజులదాకా జీవించాడు. ఇతడు పాల్కురికి సోమనాధుడు ద్విపదగా వ్రాసిన బసవపురాణాన్ని “పద్యభారతి'గా రచించి, తండ్రి కోరికమీద పాల్కురికి సోమనాథునిోే అంకితమిచ్చాడు. ద్విపద బసవపురాణాన్ని సోమనాథుని తండ్రీ ఇలా ప్రస్తుతించాడు.

  • పద్యబసవపురాణంలో ఈవివరాలున్నాయి యా
  1. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం టై-క్యాటలాగు, సంపుటి 2, భాగం ౩, పుట 787, 734.

సిడపర్డి కవులు 145

అది వేదోగమసార సంగ్రహము సత్యజ్ఞాన సంపాదనం

బది రుద్రాది మహాపురాతన కథావ్యాప్తంబు పాపాపహం

బది సద్బక్తి వివృద్ధి కారణము ముక్త్ర్యావాస మట్నౌను నీ

వది చెప్పందగు బద్యకావ్యముగ కావ్యప్రజ్ఞ సేవ్యంబుగన్‌.

అతడు తండ్రి చెప్పినట్లే చేశాడు. శబ్దార్థసారాలు అతణ్జీ పెద్దలు చదివించారు. అతనికి కావ్యనిర్మాణ శక్తి ఉంది. తండ్రీ అనుజ్ఞ మీరి నడువడు. ఆయన ఎలా చేయమంటే అలా చేస్తాడు. శివకవులు అంగీకరించే విధంగా ద్విపదలను పద్యాలుగా చేశాడు.

సోము డేని చెప్పె సోమేశుద్విపదలే - పెట్టి పద్యములుగ బెని చెనంచు

నన్యు లనగవలదు నాయయ్య శిష్యుల - మగుట మనకు జెల్లు నవియు నిలుప ఈ పద్య బసవపురాణాన్ని వ్రాశాక పిడపర్తి సోమనాథుడు ప్రభులింగ లీలలను ద్విపదలుగా అయిదు ఆశ్వాసాలలో వ్రాశాడు. కన్నడంలో చామరుసయ్య,. ఇరవై అయిదు గతులతో వ్రాసిన వెయ్యిన్నూటపదకొండు పద్యాలు వీటికి మూలం.

వీర్షైవ మతాన్ని ఖడ్గంతో ప్రచారం చేసిన బసవేశ్వరుడు “అనుభవమంటపం' అనే వీరైవ విద్యాపరిషత్తు నెలకొలిపాడు. దాని అధ్యక్షుడు అల్లమ ప్రభువు. ఇతట్జే ప్రభుదేవుడంటారు.3

అల్లము ప్రభువు గొప్పతనాన్ని సాక్షాత్తూ శివుడే పార్వతీదేవికి చెప్పాడు. ఆమె మానవులు మాయాతీతులు కాలేరని అతణ్జి చూయలో పడవేసి వంచిస్తానని పంతం పట్టింది. భూలోకంలో మోహినీదేవికి, మమకారుడనే వానికి మాయ జన్మించింది. ఆమె సంపూర్ణ యౌవనము పొందగానే అల్లమ ప్రభువును లోబరుచుకొనడానికి పార్వతి ఏర్పాట్లు చేసింది.

ఏకాంత గృహమున కెవ్వర్‌కెరుగ రాకయుండగ నర్థ రాత్రంబునందు

అల్లమ దెచ్చి శయ్యాస్థలి నునిచి యల్లన దమ మూయ నచటకు దెచ్చి

చెలులు చేతల పేరు చెప్పక చనిరి తలుపు చేరుచుకొంచు దదంతరమున

మదన భూతము సోకి మాయ యల్లమను గదిసి పైకిని పొందగా బోవ నతడు

నీలమేఘంబులోని మెఅుగు భాతి నాలోకనంబు సేయంగనేగాని

యాలింగనంబు సేయంగ గన్నడుడు ఆకాశము విధాన నలరుటే కాని -

యేకమై రతికేళి మెనసి యుండడు బత్తితో నధరంబు పట్టి పీల్చినను

రిత్తినోరే చప్పరించి నట్లుండు కరము కరంబున గదియింప బయలు

పరికించి పట్టిన భాతియై యుండు నురమున జన్మొన లొత్తిన బయలు

పరిరంభణము చేయు పగిది యై యుండు నీరీతి మాయ తానెంత చేసినను

మారవిక్రియ లల్లమకు లేక యుండో 3. అదిమ యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటం సం 2002 4, వీర్చైవూంధ్ర వాజ్బయం - తృతీయ ప్రకరణం - పుట 139లో శిష్టారామకృష్ణశాస్త్రిగారు

ఉదాహరించారు.

146 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మాయకు అల్లమ ప్రభువు లోబడలేదు. కనుక తివుని దగ్గర పార్వతి తన ఓటమిని అంగీకరించింది. ఆమె తనయొక్క సాత్త్విక నిర్మల కళను నిర్మించి భూలోకానికి పంపి భక్తివైరాగ్యాలతో అల్లమ. ప్రభువును సేవించుకొనమని నియమిస్తే అతడు భక్తికి వశుడవుతాడని శివుడు చెప్పాడు. పార్వతీదేవి సత్వభక్తి అక్కమహాడేవిగా జన్మించింది. ప్రాప్త యౌవన అయింది. మండలేశ్చరుడు అమెను మోహించినా ఆమె శివునే తన భర్తగా కోరింది. శివుని కోసం అన్వేషించడంలో అల్లమ ప్రభువు మాహాత్మ్యాన్ని అమె తెలుసుకొంది. వారిద్దరికీ వివాహమైంది. తర్వాత బసవేశ్వరుడు అల్లము ప్రభువుని అనుభవమంటపంలో నిలుపుతాడు, ఎన్నో లీలలకు కారకుడు కనుక అల్లమ ప్రభువు చరిత్రను ప్రభులింగ లీలలంటారు. కన్నడంలో ఉన్న ఈ లీలలను నెల్లూరి రామలింగయ్య ప్రోత్సాహంతో పిడపర్తి సోమనాథుడు అయిదాశ్వాసాల ద్విపద కావ్యంగా వ్రాశాడు. పద్యాలైనా, ద్విపదలైనా చక్కగా నడిపించే శక్తిమంతుడు. ' ప్రబంధనిబంధన శక్సియుక్త అనే విరుదును గద్యలో వేసుకొన్నాడు. ఇతడు స్వతంత్ర ప్రబంధాలు నిర్మించకపోవడం విచారించదగ్గ విషయమే. 4. పిడపర్తి రెండన బసవన్న : ఇతడు సోమనాథుని తమ్ముని కొడుకు. తన పెదతండ్రి ద్విపదలుగా వ్రాసిన ప్రభులింగలీలలను ఇతడు పద్యకావ్యంగా చెప్పాడు. దీనిని చల్లపల్లి (గ్రామకరణం మల్గారాధ్యునికి అంకితం చేశాడు. తన కృతిపతిని ' బంధురకవి సార్వభౌమ” అని కీర్తించాడు. ఈ రెండవ బసవన్న కవిత్వం “అంత శ్రేష్టమైనదని కాదు. వ్యాకరణ దోషములున్నవి, వ్యర్థపద ప్రయోగము లధికము” అని చాగంటి శేషయ్యగారు వ్రాశారు పిడపర్తి కవులు భవులకు కవిత చెప్పని శీలవంతులు. అంతమాత్రాన వీరి కవిత భవులకు నిషిద్ధం కాదు. సాహిత్య చరిత్రలో సమగ్రమైన అవగాహనకు వీళ్ళ రచనలు చదవక తప్పదు.

తాళ్లపాక కవులు

తెలుగు సాహిత్యాన్ని శ్రీమంతం చేసిన కవి కుటుంబాలలో తాళ్ళపాకవారి కుటుంబం చెప్పుకోదగినది. సంకీర్సనాచార్యుడు, పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు పలికినదల్లా పాట అయితే, అతని సంతతిలో అందరూ చదువుల సరస్వతులే అయ్యారు. అన్నమయ్య అల్లుడూ, కూతురు కొడుకూ కవుథే. ఈ కుటుంబంలో వ్యక్తులందరూ తెలుగు భాండాగారంలో చేర్చిన పదసంపదపై ప్రత్యేకంగా ఒక పుస్తకమే వ్రాయవచ్చు. అన్నమయ్య కాక ఈ కుటుంబంలో పన్నెండుమంది ప్రముఖులు కనబడుతున్నారు. వాళ్ళలో రమారమి అందరూ సాహితీపరులేః సంకీర్తనలు రచించి పాడగలిగినవారే.

పాట దేవుని సన్నిధికి తిన్నని బాట అని భాగవతులు విశ్వసిస్తారు. సంగీతకృతుల వల్లనే తప్పించి “యజ్ఞ క్రతువుల వల్ల తన మనస్సు కరుగదని' దేవుడే అన్నాడట. మలిరాయలయుగంలో! ఈ సంగతిని హరిభట్టు తన మత్స్య పురాణంలో ఇలా చెప్పించాడు. "

సంగీతామృత ధారల

సంగీకృతమైన యట్లు యాజ్ఞాదులచే

తం గరగదు సంతోషిత

రంగితమై మన్మనంబు రమ్య చరిత్ర (మత్స్య - 5 - 110) ఇది నారదునితో విష్ణువు స్వయంగా చెప్పిన మాటలు. దేవుడు ఇంకా ఇలా అన్నాడట.

జననుత సామవేదమున సంభవమయ్యెను గానవిద్య త

జ్ఞనితములైన రాగములు చక్కగ గూర్చి మదీయ సద్గుణా

ఖినవములైన గీతములు ప్రేమదలిర్పగ బాడ నేర్చు స

జ్ఞనుడు మదీయు డాతనికి జక్కన యిత్తున్తు వాంఛితార్థముల్‌ (మత్స్య - 5 -111) ఈ పురాణంలో దేవుడు ఇలా చెప్పాడన్న సంగతి ముందే తెలుసు కాబట్టి కృత్యాది పద్యాలలో పూర్వ కవులను నుతిస్తూ హరిభట్టు గేయ కవులను తలచుకొని దండం పెట్టాడు.

“పద పద్యములు దేశభాషల రచియించి

వెలసిన కవుల కంజలు లొనర్చి”' (మత్స్య - అవతారిక - 6) ఈ సీస పద్భుపాదం రాస్తున్నప్పుడు హరిభట్టు మనోవీధిలో తాళ్ళపాక కవులూ గోచరించారని నిస్సందేహంగా చెప్పవచ్చు. సంకీర్పనాచార్యులుగా ఈ కుటుంబంలోని వారి కీర్తి దేశమంతా పాకింది.

ఈ తాళ్ళపాక కవులు కేవలం రచయితలేకాక లాక్షణికులు. అన్నమయ్యగారి రెండవ భార్య కొడుకు పెదతిరుమలయ్య సంకీర్తనలు బ్రాయడమేకాక మొదటిసారిగా

148 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తెలుగుభాషలో ఉన్న 'బండీరాల' జాబితా చెప్పాడు. ఎక్కడ 'బండీరా”' వాడాలో ఎక్కడ సాధుకేఫ వాడాలో నిర్టేశించాడు. ఆ రేఫరకార నిర్ణయాన్ని 53 పద్యాలలో చెప్పాడు. అందులోనూ అకారాదిగా వ్రాశాడు. అచ్చులు హల్లులు వరుసనె-వచ్చిన కేఫలును రాలు వర్ణించెద ముక మెచ్చుగ నాదికవీశ్చరు-లచ్చు పడం గృతుల జెప్పినటువలె గృష్టా. (2 ఈ 53 పద్యాలూ తరువాత లాక్షణికులకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ పెదతిరుమలయ్యగారి కుమూరుడు చినతిరుమలయ్య సంకీర్సన లక్షణం తెలుగులో వ్రాశాడు. పాటలకు కూడా కావ్యగౌరవం సంపాదించి పెట్టాడు. '““సంప్రదాయాగత జ్ఞానసహితుడైన మనుజు సత్కవితయు వేద మంత్రసమము”" అని చాటాడు (సంకీర్షన జా ౬ లక్షణం, 23). తాళ్ళపాక కుటుంబంలోని వ్యక్తులు క వతరాలణణ నారారారాణ బవారానన 1 తిమ్మక్క మొదటి భార్య సుభద్రాకల్యాణం - ద్విపద 2. నరసింగన్న పెద్ద భార్య కొడుకు | రచనలు తెలియవు న్‌ అక్కలమ్మ 'రెండవ భార్య రచనలు చేసినట్టు లెదు త పెదతిరుమలయ్య రెండవ భార్య కొడుకు | చాలా రచనలు చేశాడు క్రీశ (1480-1846) 1 శృంగార సంకీర్తనలు 2 అధ్యాత్మిక సంకీర్తనలు ౩ వైరాగ్య వచన గీతాలు 4 శృంగార దండకం 5. చక్రవాళమంజరి 6. శృంగారవృత్తశతకం 7. వెంకటేశ్చరోదాహరణం 8. నీతి సీసశతకం 9 సుదర్శనరగడ 10. రేఫరకారమయులు 11. భగవద్గీత - తెలుగు వచనం 12 ద్విపద హరివంశం ర్‌ తిరుమలాంబ తూతురు రచయిత్రి కాదేమో 6. | రేవణూరు కొండయ్య అల్లుడు రామచంద్రోపాఖ్యానకర్త 7... |రేవణూరు వెంకటార్యుడు! మునిమనుమడు | 1. శకుంతలా పరిణయం (తిరుమలాంబకొడుకు) |2 శ్రీపాదరేణు మాహాత్మ్యం ఈ, చినతిరుమలయ్య మనుమడు అష్టభాషాకవిచ క్రవరి (1405-1563) పెదతిరుమలయ్య 1. ఆధ్యాత్మ శృంగార కీర్తనలు పెద్దకొడుకు) 2. తెలుగు సంక్రీర్షన లక్షణం నను

  1. తాళ్ళపాకవారి లఘుకృతులు, పుటలు అ-౪,

తాళ్లపాక కవులు 149 | పరు ___[లన్ననయ్యతోసంబంధం | వమాలురవనలు పెదతిరువేంగళనాథుడు మనుమడు సంకీర్తనలు పాడి (క్రీశ 1546లో (పెదతిరుమలయ్య;) నాట్యం చేసేవాడు పోయాడు) మూడవ కొడుకు) చినతిరువేంగళనాథుడు, మనుమడు 1. అన్నమాచార్య చరిత్ర లేక చిన్నన్న (పెదతిరుమలయ్య 2 _అష్టమహిషీ కల్యాణం (ద్విపద) (క్రీశ 156లో నాల్గవ కుమారుడు ౩ పరమయోగి విలాసం (ద్విపద) పోయాడు) 4. ఉషా పరిణయం కోనేటి మనుమడు వైభవంగా బ్రతికాడు తిరువేంగళనాథుడు | (పెదతిరుమలయ్య (క్రీశ 1564-45) కడగొట్టు కొడుకు) తిరువెంగళప్ప మునిమనుమడు అమరుకాన్ని తెనిగించాడు, (క్రీశ 1553-54) (చినతిరుములయ్య కావ్య ప్రకాశానికి కొడుకు) “సుధానిధి, నామ లింగాను వేదమంత్రాలవంటి వచనాలు చేసిన ఈ కుటుంబంలోని వ్యక్తులు, వాళ్ళతో వియ్యమందినవాళ్ల పేర్ల పట్టిక చూస్తి, వీళ్ళ సాహీత్య సేవ ఎంతో తెలుస్తుంది. ఈ కుటుంబంలోని కవులను ఎవరో సమకాలిక కవి, బహుశా తెనాలి రామకృష్ణుడు ఇలా ప్రస్తుతించాడు: చిన్నన్న ద్విపద కెరగును - పన్నుగ బెదతిరుమలయ్య పదమున కెరగుక మిన్నంది మొరనె నరసిం - గన్న కపిత్వంబు పద్యగద్య శ్రేణిన్‌ అయితే నరసింగన్న వ్రాసిన రచనలు ఏమిటో తెలియవు. అన్నమయ్యగారి పెద్దభార్య కుమారుడే సుంకేసుల గ్రామంలో స్థిరపడి సంకుసాల నరసయ్య అనే పేర ప్రసిద్ధుడయ్యాడని వేటూరి ప్రభాకరశాస్త్రిగారి అభిప్రాయం.2 దీనిని చాగంటి శేషయ్యగారు నిరాకరించారు. _ పెదతిరుమలయ్య చాలా వైభవంగా బతికాడు, అప్పాజీ తిమ్మరుసును అవసానదశలో ఆదుకొన్నాడు. ప్రసాదం హక్కును కొని సహాయం చేశాడు. మండపాలు కట్టించాడు. ఉత్సవాలు జరిపించాడు. అంగరంగభోగాలతి కట్టుదిట్టం చేశాడు. అతని కృషివల్లనే తాళ్ళపాకవారి రచనలు రాగి రేకులపైకి ఎక్కి చెక్కుచెదరకుండా నిలిచాయి. పెదతిరుమలయ్యగారి నాలుగో కొడుకు చిన్నన్న ఈ కవులందరిలోనూ సుప్రసిద్ధుడు. ఇతడు జలజాతవాసిని చనుబాల పుష్టితో కవిత్వం చెప్పనేర్చిన జాణ. ద్విపద లక్షణాన్ని నిర్దుష్టంగా నిర్వచించాడు. కవిత్వం ఎలా ఉండాలో వివరించాడు. కులికి కస్తురివీణె గోసిన కరణి - దెలికప్పురపు గ్రోవి దెరచిన సరణి విరవాది పొట్లంబు విడిచినమాడ్కి - పరిమళించుడు గవుల్‌ బళిబళి యనగ గవిత చెప్పిన సులక్షణుని గవీంద్రు-డవునందుకే నేర్చినట్లు చెప్పెదను. (అష్టమహిషీ - 175 - 180) 2 అన్నమాచార్య చరిత్ర పీరిక పుటజ 3. ఆంధ్రకవితరంగిణి, 8వ సంపుటి, పుట 248

1650 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నిజంగా ఇన్ని పరిమళాలూ గుబాళించేట్టు చిన్నన్న అష్టమహిషీ కల్యాణ రచించాడు. శ్రీవైష్ణు మతంలోని పన్నిద్దరాళ్వారుల చరిత్రను పరమయోగివిలాసమనే పీఠ “ద్రవిడప్రబంధం చూచి” తెనిగించాడు. రాయలవారికన్నా శ్రద్ధగా విష్ణుచిత్తుల కళ్ళ గోదాదేవి చరిత్ర వ్రాశాడు. అమరానికి వ్యాఖ్య బ్రాసి, అమరుకాన్ని తెనిగించిన తిరువెంగళ్పు అన్నమయ్యగా0 మునిమనుమడు. అమరుక శతకాన్ని తెనిగిస్తూ ఆ పద్యాలలోని భావాలను వచనంలో వివరించాడు. ఇది అముద్రితం. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో కెండు ప్రతులున్నాయి. (౯. 107, ॥.673). చిట్టచివరి శోకం, దానికి అనువాదం, వివరణ చూడండి సాలక్తకేన నవపల్లవకోమలేన పాదేన నూపుర్గవతా మదలాలసేన యసాడ్యతే దయితయా ప్రణయాపరాధాత్‌ సంగీకృతో భగవతా మకరధ్వజేన, యావరసార్థమున్‌ గిసలయారుణకోమలము౯ వినూత్నర త్నావళినూపురంబును మదాలసభావము నౌ పదంబుచే నే వరపూరుషుండు ప్రణయేర్ష్య బరాంగనచేత దాడీతుం జై విలసిల్లు వాడు కుసుమాయుధదేవునకు౯ వ్రియుండగున్‌ (2. 107 తిరువెంగళప్ప పాదతాడనాన్ని ఇలా కీర్షిస్తే ఇతని తాతగారి మేనల్లుడు రేవణూరి వెంకటాచార్భుడు “గుబ్బల దెబ్బలు" ప్రశంసించాడు. శకుంతలా పరిణయంలో ఇలా వ్రాశాడు. పంతము లేల బాల నవపల్లవగల్లవహల్లవంపు గో

రంతట జేర సైపవు రయమ్మున రొమ్మున గుమ్మ నీదు కొం

డంతటి గుబ్బదెబ్బలకు హాళిని బాళిని దాళనీదు వి

థ్రాంతి కొకింత నీకు గృపరాద? పరా కపరాధమేమొకో; (1.140)

ఈ వెంకటాచార్యుని పీలిచి ఒక రాజు కృతి చెప్పమన్నాడు. తీరా అంతా రాసీ తీసుకొని వెళితే ఒక కరణం విఘ్నం కలిగించాడు. అందుచేత దేవునికి అంకీతమిచ్చాడు. ఇతడు శ్రీపాదరేణు మాహాత్మ్యం అనే కృతి కూడ రచించాడు.

“తీనెలపై తేట తిన్నని చెరకుపానకముల నేరుపరవిన మేలుచక్కెరల తీపుచల్లదెమ్మెరలు చిక్కని కప్రంబు జీవరత్నములు కల యమృతంపు మీగడమీరి తావులు' చిలుకుతూ కవులెల్ల చేయెత్తి మొక్కగా అన్నమయ్య రచనలు చేశాడు.

ఈ తీపులకు కవులందరూ వారసులే,

  • చిన్నన్న ఎక్కడెక్కడ ద్రవిడవేదాన్ని అనువదిచినద్‌ ప్త గుర్తించారు నా య క ను. 118169 రాధాకృష్ణశర్మగారు

యాగంటి లక్షయ్యగారు వైప్సచులలోనైనా. శ్రైవులలోనైనా నిజమైన భక్తులకు జీవన విధానం పట్ల ఒకే రకమైన అవగాహన ఉంటుంది. చూనవులన్నవారు బతకడానికి తిండి తినాలి. తన కుటుంబాన్ని పోషించుతోవాలి. శైవులు కాయకష్టం చేసుకొనడాన్ని కాయికం అంటారు. కాయికం వల్ల వచ్చే అర్థంలోనే కల్పవృక్షాలున్నాయంటారు. భాగవతులలో బమ్మెర పోతరాజుగారు సుప్రసిద్ధులు. ఆయన ఇలా అన్నారని లోకం చెప్పుకొంటుంది. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్‌ _ తూళల కిచ్చి యప్పడుపు తూడు భుజించుట కంటె సత్కవుల్‌ హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలగౌ ద్దాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై. (చాటువు) భాగవతులైన పోతరాజుగారు పద్యంలో చెప్పిన ఈ భావాలే శైవుడయిన ఒక కవి పాటలో ఇలా చెప్పాడు. మోపకుంటే యూర కుండుము పాపము వేయకుమంతే చరణం: తెరవాటు కొట్టి తెచ్చి తేగమిచ్చే కీర్తికంటె నొరుల నొప్పించక యుండుటే చాలు పరుల బాధించి సంపదల బొందుట కంటె ధర దున్నుకొని బ్రదుకు దారిద్రమే చాలు “క్రీస్తే? చరణం: ఒరులతో చాడి చెప్పి యుడుగర లందు కంటె గరిమతో గోచైన కట్టేది మేలు పరులతో కల్లలాడి వాచాలుడగుట కంటె నరయంగ మూగ వాడయ్యేది మేలు “ఓపితే?” చరణం: పరులచేనప్పు చేసి పప్పుకూడు దినుట కంటె దొరకు నంబలి యొక్క దోనెడే మేలు పరదైవముల గొలచి పడయు సిద్ధులకంటె &రిమ నే గంటీశు నొద్దనుంటే చాలు “ఓపితీ'” (0. 2489లో 22వ పాట) ఈపాట యాగంటివారి వచనాలలోనిది. దీనిని కట్టింది యాగంటి లక్ష్మయ్య. ఆయన అసలు సిసలు వీర్టైవులు. సామాన్య ప్రజలకోసం వీరైవం ద్విపద కావ్యాలను ప్రోత్సహించింది. శతకాలు, యక్షగానాలు కూడా వీర్ణైవ కవులు రచించారు. అయితే పామరులను కూడా అకట్టుకొనేవి పాటలే. తాళ్ళపాఠవారి ఆధ్యాత్మిక సంకీర్హనలలాగే తైవులు కూడా శైవ సంకీర్తనలు రచించుకొన్నారు. తత్త్వాలు, యాలలు చాలా, ప్రచారంలో

152 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఉండేవి. ఇప్పటికీ యాగంటివారి తత్తాాలు తెలుగుదేశంలోని చాలా ప్రాంకాలలో వినబడుతూనే ఉంటాయి. తరువాత యుగాలలో వేమనగారి మీద యాగంటివారి రచనల ప్రభావం చిన్నప్పుడు గట్టిగానే ఉండేది.

“వేమనవంటివారు' అనే ఆరో ఉపన్యాసంలో ““ఏగంటి వారెవరో ఒకరో అనేకులో, యేవూరి వారో యెప్పటివారో తెలియు నవకాశము నాకు లఖింపలేదు” అని రాళ్ళపల్లివారు అన్నారు.1 కొన్ని గుజిలీ ప్రతులలో ఈ పాటలు కొన్ని “యేగంటీ లక్ష్రయ్యగారి వచనాలు అని ముద్రించిన సత్యాన్ని శర్మగారు గుర్తించారు. దూదేకుల సిద్ధయ్యులాగే యాగంటి లక్ష్మప్పు కూడా వీరబహ్మంగారి. శిష్యులలో ఒకరై ఉండవచ్చుననే అఖిప్రాయానికి డాక్టర్‌ గోపీ వచ్చాడు. యాగంటి లక్ష్మయ్యగారు వీరబహ్మంగారి. శిష్యుడైన సాలెకులజుడని తిచ్మూవజ్ఞల కోదండరామయ్యగాకు రాశారట. ఈ సంగతి చెప్తూ బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఇలా రాశారు.

“ కోదండరామయ్యగారే ఆధారంతో బ్రాశారోగాని యాగంటి లక్ష్మయ్యగాకి తత్త్వాలనుబట్టిగాని కాలజ్ఞాన తత్త్వాల పుస్తకంలోని పాటలపై నున్న సూచనలను బట్టిగాని లక్ష్యయ్యగారు వీరబ్రహ్మంగారి శిష్యుడన్న విషయం యెక్కడా సూచితం కాలేదు. అందుచేత యాగంటి గురుడూ ఆయన శిష్య బృందమూ బ్రహ్మంగారి ప్రభావంతో సంబంధంలేని మరొక కాలానికి చెందినవారని మాకు తోస్తుంది సిద్ధయోగులకూ, శ్రైవమతానికి ఆటపట్టుగా పేరుపడిన శ్రీశైల ప్రాంతంలో చీరుండీ

కర్నూలు జిల్లా బనగానపల్లె సంస్థానంలో “యాగంటిపల్లె ఉంది. ఈ గ్రామంలో స్థిరపడిన గార్లపాటి లక్ష్మయ్యగారికి ఉత్తరోత్తరా “యాగంటి లక్ష్మయ్య" అనే పేరు వచ్చి ఉంటుంది. ఈయన సుప్రసిద్ధ శైవసంకీర్తనలు పాడిన కవి. ఈయననే తన నవచోళ చరిత్రలో పొశెట్టి లింగయ్య ఇలా పొగిడాడు:

““వీరభద్రేశ్చరు విజయ సాహసము నీర రసంబున విరచించి తానె

దాతయ్చై కవులకు ధాత్రిలో నుత వి ధాతర్చై మరి నెరదాతయ్రై మిగుల

బాటల సద్బక్టి పరుల నుతిసేయ బాటికెక్కిన గార్లపాటి లక్ష్మణుని

వెలయగా వినుతించి విజ్ఞానమును

(నవచోళ చరిత్రం - ప్రథమాశ్వాసం ద్విపద పంక్తులు 80 నుండి 87)

ఈ ద్విపద పంక్తులవల్ల గార్లపాటి లక్ష్యయ్యగారు పాటలు రాసి సాటికెక్కారని తెలుస్తోంది. గార్లపాడు గ్రామం కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో ఉందీ గుంటూరు తాలూకాలో ఒక గార్గపాడు ఉంది. పల్నాడు రాయలసీమలోని 2. ప్రజాకవి వేమన - పుట 330.

3౩ అంధ్ర వాగ్గేయకార చరిత్రము - పుట 413.

యాగంటి లక్ష్రయ్యగారు 163 గార్లపాడులోనే లక్ష్మయ్యగారు ఉండడానికి ఆస్కారం ఉంది. గార్లపాడు, యాగంటిపల్లె రెండూ కర్నూలు జిల్లాలోనే ఉండడం గమనించదగ్గ విషయం.

సుప్రసిద్ధుడైన తెనాలి రామకృష్ణుడు, రామలింగడిగా ఉన్నప్పుడు తెలియవచ్చే విషయాలవల్ల వాళ్ళ ఇంటి పేరు గార్లపాటివారు, తండ్రీ రామయ్యగారు, పినతండ్రి లక్షణయ్య. ఈ గార్లపాటి లచ్చన్నగారినే పోశిట్టి లింగన్న నుతించాడని ఇంతకుముందు చూశాం. రామకృష్ణుని తండ్రిగారు తెనాలిలో రామలింగేశరస్వామికి క్రీ.శ. 1510లో ఉత్సవ విగ్రహాలను చేయించారు. గార్లపాటి లక్ష్మ్యయ్యగారు కూడా అప్పటివారే. ఈ వంశంలోనివారూ, వీరి బంధువులూ దేశసంచారాలు చేసినట్టుంది. రామకృష్ణుడు, అతని తరువాతివారు వైష్ణవులయినా గార్లపాటివారు ఆదిలో శైవులే.

రామకృష్ణుని పినతండ్రో కాదో కచ్చితంగా చెప్పలేంగాని రాయలసీమలో గార్లపాటి లక్ష్రయ్యగారు ఉండడం మటుకు ఖాయం. ఆయన పాటలు రచించి పాటికెక్కడం గ్రంథస్తమైన విషయం. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో “ఏగంటివారి వచనములు అనే వ్రాతప్రతులు డి.2487 నుండీ డీ. 2498 దాకా పన్నెండు ఉన్నాయి. వీటిలో ఆరు తాళపత్ర గ్రంథాలు, ఆరు కాగితం పుస్తకాలు. 'యాగంటివారి మంగళహారతి" (డీ.2486), ఏగంటి భాష్యము (డి.2499) అనే మరో రెండు పుస్తకాలు తూడా ఆ గ్రంథాలయంలోనే ఉన్నాయి. యాగంటివారి మంగళహారతిలోని చివరి చరణంవల్ల కర్త లక్ష్మయ్యగారే అని తేలుతోంది.

అరుదొంద వృషభ వాహనుడు యాగంటీశు

డరయ లక్ష్యాభక్స వర దుడగుచు

పరికింప నేలిన ప్రమధగణ

సరస సాయుజ్య శివ సమూహమునకు ॥1జియ మంగళం! (డి. 2486)

ఈ పాటలలో యాగంటి గరుడు, యాగంటి హరుడు, యాగంటి శివుడు, యాగంటి లింగడు మొదలైన ముద్రలే ఎక్కువ కనబడతాయి. నాలుగు పాటలలో యాగంటి నంజేశుడు అనే ముద్ర ఉంది. ఇంకో నోలుగు పాటలలో “పిడపర్తి గురుడు” అనే పేరు కనబడుతోంది. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం వారి డి. కేటలాగులో డీ. 2487 అనే గ్రంథం వివరాలు చెప్పాక కేటలాగు రచయిత చివర కొన్ని వాక్యాలు రాశారు. “ఇందలి గేయములన్నియు శైవవేదాంత సంబంధమైనవి, ఏగంటి నంజేశ్చ్వరాంకితములు. పిడపర్తి లక్ష్యయ్యగారి వచనములనియు నీ గేయములకు బేరు గలదు. అందుచేత పిడపర్తి లక్ష్మయ్యగారీ గ్రంథమున రచించినట్లు తోచుచున్నది.”'

పిడపర్తి కవులు చాలా సుప్రసిద్ధులు. ఎన్నో శైవ కావ్యాలు రచించారు. అయితే వారి చంశంలో ఎవరూ లక్ష్మయ్య అనే పేరిట వ్యక్తి కనబడడం లేదు. పద్భు బసవ పురాణం, 4. _ఆంధ్రకవితరంగిణి - ఎనిమిదవ సంపుటం - పుట ౩1 5. ఓ.లై. తెలుగు పుస్తకాల డి. క్యాటలాగు - పన్నెండో సంపుటం - పుట 2735

ద్విపద ప్రభులింగలీలలు చెప్పిన పిడపర్తి సోమన్నగారు ప్రఖ్యాత శైవ కవులు; గురువులు. ఈయన 1520 ప్రాంతాలవారే. వీరినే యాగంటివారు పిడపర్తి గురువుగా పేర్కొని వుంటారు. ఈ పాటలకు 'ఏగంటివారి వచనాలు' అన్నదే ప్రచారంలో ఉన్న పేరు. శైవులు లింగధారులు. లింగానికి అంగానికి భేదం లేదు. ఉండకూడదు: అదట భక్తుడు లింగామౌట కణుమాత్రము భేదము కలదా అది శివాంగము భక్తనామకం బదియే లింగము కాదాట ॥అదట। సంగతముగ తన యిష్టలింగమున కంగము వేరే కలదా లింగము ప్రాణమునైన భక్తుని చిదంగము అంగముకాదా నింగడముగ యా లింగమునకు మరి వీనులు వేరే కలవా అంగికంటై భక్తుడు వినియెడి అవియే వీనులు కావా అఆదట హరలింగమునకు స్పర్శనము మరిత్వకంగము వేరే గలదా అరయగు భక్తునిత్వ కనియెడి స్పర్శేంద్రియ మదియె కాదా యిరవుగ శివలింగమునకు యిరు నేత్రంబులు వేరే కలదా తరలన్‌ భక్తుడు చూచెడి యా నేత్రంబులు అవియే కాదా (అదట అనుప గురులింగమునకు వక జిహ్వాగ్రము వేరే గలదా అనుదినమును భక్తుడు రుచిగొనియెడి ఆ జిహ్వాగ్రము కాదా ఘను డేగంటీశ్చరలింగమునకు ఘాణము వేరే కలదా అనుదినమును భక్తుడు ఘ్రాణించేటి అదియే ఘాణము కాదా (ఆదట (డి. 289 - పాటసంఖ్య 19) ఈ పాటలో జంగానికీ లింగానికి అభేదం యాగంటివారు చెప్పారు. ఈ భావాలను ఉత్తరోత్తరా వేమనగారు తమ పద్యాలలో విస్తరించారు: లింగమంగమునను లీల దెలియు వెన్క మనసు లింగమందు మరులు కొనును మనసు నిల్చ్బనందె మరిలింగముండురా విశ్వదాభిరామ వినురవేమ (వే.సూ.రు 38) లింగమందు జూడ లీనమై యుండెనా యంగమందు జూడ నమరి యుండీ అంగ లింగ సంగమన నేకమైయుండు విశ్వదాభిరామ వినురవేమ (వే.సూ.ర.3367) నవలను 6. బందరు వారి ప్రతిలోనూ, ఇతర ప్రతులోనూ “అంగ లింగ భంగ మన నేకమైయుండు” అనే అసాధుపాఠమే కనబడుతుంది. యాగంటి వారి వచనాలలో “అంగ లింగ సంగమము' అవే ప్రయోగం ఉంది. చూ.డి.240లో జవ పాట,

యాగంటి లక్ష్మ్యయ్యగారు 165

ఆత్మయందు జ్యోతి యమరుట లింగంబటు

తెలిసి చూడగాను తేటపడును అదియు

గురువులిక యబ్బునా కిలియంగ

విశ్చదాఖిరామ వినురవేమ. (వే.సూ.ర.24)

యాగంటివారు లింగధారులయినా సంసార యోగులు, సంసారంలో ఆశాపాశాలు, ఇంద్రియమోహాలు ఉంటాయి. వీటినే ఒక పాటలో చెప్పారు:

ఈలాగు సుఖములింద్రియ మోహపాశముల

పాలు గావలసె భవబంధముల చేతనే ఈ

చనుప్రేమ ప్రియసతుల చక్కని రూపమటుజూచి

ఘన దివ్యలింగ భావన శాయబాసెనే

అనువైన బిగువు చన్నులు ముట్టతమకమున

తన మనసు శివలింగము ముట్టబాసెనే 1ఈ॥!

రతితూర్మి కొసరు మధురాథిరము లొల్కు విని

శృతి శివానంద సన్నుతి శాయ మరచెనే

రతి క్రమాపేక్షలకు రయము నధరముగ్రోలి

గతిచెడి ప్రసాద భాగంబెల్ల బాసెనే ఈ

సురత వేళల కళల జూపు సతులకు జిక్కీ

నెరయ గురుపాద సుస్థిర శేయబానెనే

సరసకేళి విలాస మాటలకు జిక్కి

పరమ గురు మంత్రంబు పఠియింప బానెనే ఈ;

అరయ నానా సుఖంబు లస్థిరంబని తెలిసి

గురుని శ్రీపాదంబు కొలువంగ బానెనే

పరమ గురు డేగంటి నంజేశ్వరుని

కరుణ చేతున్నట్టి కర్మిగా వలనెనే 11ఈ1_ (డి.2499లో 75వ పాట)

ఈ పాటలోని భావాలను కూడా వేమనగారు చాలా పద్యాలలో విన్తరించి చెప్పారు :

మతము దారి మరచు మధురామృతము జూచి

మగువ రూపు జూసి మనసు మరచు

యోని జూచి పరమయోగంబు మరచురాో

విశ్చ్వదాఖిరామ వినురవేమ. (వే.సూ.5.2913) గలడా ననా! 7. '“యోనిజూచి' అనే చోట "ఉరముజూచి' అనే పాఠం బందరుప్రతిలో వుంది. బ్రౌన్‌ (189) ప్రతిలో

యోనిజూచి సర్వయోగముల్‌ మరచురా: అనే పాఠం ఉంది. చూ.పుట 1%.

156 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇంత కనులు చనులు యెంత లెస్సని చూచి మోహపడును బుద్ధి మోసపోయి గరిసెలోని వాని కానలేడాయెరా విశ్చదాఖిరామ వినురవేమ (బాను. 2913 పుట 120 పద్యం 3౪) ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఇవ్వవచ్చు. శైవులు అగ్నిహో త్రాది కర్మలను దూపషిస్తారు. ఆన్టీకాలను అవహేళన చేస్తారు. .యాగంటివారు ఒక పదంలో ఇలాగ ఎద్దేవా చేశారు: కాకుల తమవారిగా జేసిటి - పలు గాకులకును భక్తి ఏల కలుగు కా మొల్లమైన తూళ్ళు కూరలను పుల్లెకు మూగిన పులుగులను తల్లిదండ్రి అని తలచి తలచి మొక్కే గుల్గ్లాములకు భక్తి గురుతేల కలుగును కా (డీ.(2498)లో 34వ పాట) యాగంటి ప్రభావం చిన్నప్పుడే తమ మీద పడినందువల్ల వేమనగారు కూడా ఇలాగే ఆన్టీకాలను అవహేళన చేస్తూ కొంచెం ఘాటుమాటలే వాడారు; పిండములను జేసి పితరుల దలపోసి కాకులకును బెట్టు గాడ్జెలార పియ్యతినెడి కాకి పితరు డెట్లాయెరా దాఖిరామ వినురవేమ (బౌను (189) పుట. 158 పద్యం 192) ( పద్య పితర యన్నమనుచు బ్రీతితో విలిపించి కాకులకును బెట్టు కర్ములారా కాకులందు నేమి ఘనులకు బెట్టుడీ విశ్చదాఖిరామ వినురవేమ (బ్రౌను (19) పుట. 158 పద్యం 191) బాహ్మణేతరులు ఇప్పటికీ తమ పితారాళ్ళ తిథి రోజున బ్రాహ్మణులకు 'పొత్తర్లు ఇవ్వడం కద్దు. వేమన గారి కాలంలో ఇది ముమ్మురంగానే సాగుతూ ఉండే ఆచారం. దానిని కూడా వారు ఖండించారు: "బ్రాహ్మణులకు బెట్ట ఫలము కద్దందురు కుక్కలకును బెట్ట కొదువ యేమి ఇందునందు శివుడె యేకమై యుండును విశ్చదాఖిరామ వినురవేమ. (వే.సూ.ర.2809) “తల్లి రంకు దెలుప తద్దినాలు అని మరో పద్యంలో వేమనగారు అన్నారు (వే.సూ.ర.299). యాగంటివారు లింగధారులలో ఉన్న దోషాలను తూడా చూశారు:

యాగంటి లక్ష్మ్యయ్యగారు 157 లింగధారుల మనుచు లెక్కశాయరు గాక లింగమును ప్రాణము తల్లీనము గావలదా (డీ. 2489లో 29వ పాట) లింగధారులమనుకొనేవారు అన్నీ ఎన్నిరకాలుగా లెక్కచేయరో ఎన్నో లెక్కలేనన్ని పద్యాలలో వేమనగారు వివరించారు. “బట్టతాళ్ళలోను బంధించి కట్టగా, లింగ డెవరి సొమ్ము దొంగిలించె' అని అడిగారు (వే.సూ.ర.2671). ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వేసి తరచి తరచి చూసి లింగధార్లకన్న దొంగలు లేరయా' అని కేల్చేశారు. (వే.సూ.ర.282). శైవం ఇలా ఉందనుకొంటే వైష్ణవం దానికన్నా ఘనంగా ఉందా? యాగంటివారు కూడా ఇదే అనుమానంలో పడ్డారు: ఏటి శైవము మరి యేటి వైష్ణవ వ్రతము యే యా రూపంబు యేటి మార్గములు 1ఏటి బొంకకను సత్యంబు పోనీయ కెపుడును లంకింప జిహ్వకు అదియె శుద్ధి శంక లేకను దాన మంకించి చేయుటకు బొంకళను తగినట్లు బూనుటేశుద్ధి ఏటి పరవనితలను జూచి పట్టరాని మోహంబు స్థిరముగా వదిలినదే దేహశుద్ధి నిరతంబు బాడియను నింద శీేయక యెపుడు స్పిరకాలమున్నదే చిత్తశుద్ది ॥ ఏటి! థి వీ భి పంచేంద్రియములను పారనియ్యక యెపుడు మంచితనమున నిలుచు మనసునకు శుద్ధి యెంచి యాగంటేీశు నే వేళ తనలోన అంచెరిగి పూజింప ఆత్మశుద్ధి 1ఏటి (డి. 2461లో 50వ పాట) “ఆత్మశుద్దిలేని యాచారమదియేల?”* అని వేమనగారు అందరినీ ప్రశ్నించారు: ఛి వ్రైవవైష్టవాది షణ్మతముల కెల్ల దేవుడొక్కడనుచు దెలియ లే తమకు భేదమైైన దత్త్వంబు భేదమా విశ్చదాఖిరామ వినురవేమ (వే.సూ.6ర. 3242)

  • . విష్ణుభక్తులెల్ల వెలిబూది పాలైరి వాదమేల మత విభీదమేల? తెలియ లింగధరులు తిరుమంటి పాలైరి విశ్చదాఖిరామ వినురవేమ (వే.సూ.ర. 3576)

158 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి శైవులైనా. వైష్టవులైనా ప్రజలకోసం పాటలు పాడుతున్నా వాటిలోనే సూటి మాటల మధ్య చాటుగా దాచిన మార్మిక చింతనను గుప్పిస్తారు. యాగంటివారు చెప్పిన ఈ క్రీంది మార్మిక వచనాలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్న యాలలే. శౌార్యమానే చిలుక గంటి సూర్య దీప్తీ గాయుచుండగా యాగంటి లింగా చూడచూడాశ్చర్య మాయెరా గండికోట మీద చూడా దండి ఉదయాగిరి గంటి దండి ఉదయగిరి మీదనూ యాగంటి లింగా! ఉండగంటి చంద్రాగిరినీ ఆకసాన కోడి కూనె చీకటింట ప్రొద్దు పౌడిచె మూక చిత్తాల మధ్యమూనాను యాగంటి లింగా యేకమ్చై వెన్నెల గానెరా (డీ. 2489లో ౩2వ పాటనుండి) ఇంత మరీ మార్శికం కాని తత్వాలు కూడా యాగంటి వారు రచించారు. అవి నేటికీ జనంలో కొందరు పాడుకొంటూనే ఉన్నారు. శివ శివ యన మేలు తుమ్మెదా శివుడ ననగ వినమేలు తుమ్మెదా శివుని భక్తులాకు తుమ్మెదా శివశరణన్న మేలె తుమ్మెదా శ్రీకంఠుడను పూవు తుమ్మెదా మూడు లోకములాయెను తుమ్మెదా సాకారమై యుండు తుమ్మెదా పరమేకాంతమున జూడు తుమ్మెద. ముట్టిముట్టని పూవు తుమ్మెదా అది - ముట్టింది జిగమెల్ల తుమ్మెదా ముట్టిచూడగ లేవె తుమ్మెదా - ముట్టి పాయాలేవె తుమ్మెదా ఇది పదహారు చరణాల పెద్ద పాట. చిట్ట చివరి చరణంలో యాగంటి ముద్ర ఉంది. గురుడు నీ శిరమూన తుమ్మెద - మా గురుడు నీ శిరమూన తుమ్మెదా కరపద్మములు మోపి తుమ్మెదా - అట అరయనే గంటీశు డుండు తుమ్మెదా (డి.2489లో 31వ పాట) టవ, వైష్ణాలలో రాను రాను మార్మికత మఠీ ముదిరాక ఈ వచనాలు బైరాగులు పాడుకొనే తత్వాలుగా మారిపోయాయి. మూసిన గుప్పెట్లో ఏదో ఉంటుందన్న నమ్మకం అంధ విశ్వాసంగా పరిణమిస్తుంది. కాయకష్టాన్ని ప్రశంసించే ప్రాచీన గీతాలు మళ్ళా ప్రచారంలోనికి తీసుకురావడం శ్రేయస్కతం

పోశెట్టి లింగన్న

అభ్యుదయ కవిత్వం ఒక ఉద్యమంగా ప్రారంభం కాకముందే దేశ చరిత్రల పట్ల సరికొత్త అవగాహనతో ఒక కవి వేయవలసిన ప్రశ్న వేశాడు.

తాజమహల్‌ నిర్మాణానికి

రాళ్ళెత్తిన తూలీలెవరోయ్‌?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌

అది మోసిన బోయీ లెవరోయ్‌?

ఇటువంటి ప్రశ్నలే అడుగడుగునా దేశ చరిత్రలను అధ్యయనం చేస్తున్నప్పుడు వేసుకోవాలి. గోదావరిపై అనకట్ట కడుతున్నప్పుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఏ పద్ధతులను అవలంబించాడు? కూలీలను ఎలా వాడుకొన్నాడు? ఇంకా గతకాలంలోనికి వెళితే కరికాలచోళుడు కావేరికి కట్ట కటిస్తున్నప్పుడు ఏ నిరంకుశ విధానాలను ప్రయోగించాడు? వెట్టి ఎలా చేయించుకున్నాడు? ఈ చివరి ప్రశ్నలకు తెలుగు సాహిత్యంలో ఊహించుకొనడానికి కొన్ని సమాధాన శకలాలు దొరుకుతాయి.

మలిరాయల యుగంలో పోశిట్టి లింగన్న అనే వీర్చైవకవి 'నవచోళ చరిత్ర అనే ద్విపద కావ్యం రచించాడు. క్రీ.శ1500 ప్రాంతాలలో ఉన్న గార్లపాటి లక్ష్యయ్యగారిని పూర్చకవిగా నుతించడంవల్ల ఈ లింగయ్య ఆ కవిగారికి ఒక తరమో, రెండు తరాలో అర్వాచీనుడవుతాడు. ఈ కవి వీర్చైవుడు కనుక కులం, గోత్రం, తల్లితండ్రుల పేర్లూ ఏమీ చెప్పుకోలేదు. ఇతడు అయిదు ద్విపద కావ్యాలు రాశాడు. 1. శంకరదాసమయ్య చరిత్ర 2. వీరసంగమయ్య దేవ చరిత్ర 3. మళల్హ్లణ చరిత్ర 4. శిష్య ప్రబోధం 5. నవచోళ చరిత్ర, వీటిలో చిట్టచివరిది అచ్చుపడింది. ఇందులో తాను మొట్టమొదట రచించిన గ్రంథంలోని కథానాయకుడైన శంకరదాసయ్య గారి వంశమే తన వంశమనీ, వారి గోత్రమే తన గోత్రమనీ చెప్పుకొన్నాడు.

పోశెట్టీ లింగన్న బగిరాముపల్లి ప్రాంతాలవాడు. ఈ ఊరు ఎక్కడుందో తెలియదు. చక్కిలాల లింగప్పు అనే ఆయన చెప్పమంటే నవచోళ చరిత్రను కన్నడంలోని కథలు ఆధారంగా ఈ కవి బగిరాముపల్లిలోని మృత్యుంజయుని పేర ద్విపద కావ్యంగా చెప్పాడు.

ఈ కావ్యం పేరు నవచోళ చరిత్ర కనుక ఇందులో తొమ్మండుగురు చోడ రాజుల కథలు న్యాయంగా ఉండాలి. అయితే ఎనమండుగురు కథలే ఉన్నాయి. ఈ కథలను విన్న ఉండే సాసల పురాన్ని పాలించే భైరవరాజుకు పండితారాధ్యుడు ఈ కథలను చెప్పాడట. ఇది జనశ్రుతి కావచ్చు. ప్రాచీనులైన చోడరాజులలో కరికాలచోడుడే సుప్రసిద్ధుడు.

160 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చారిత్రక వ్యక్తి! ఇతడు కావేరికి కట్ట కట్టించాడు. ఆ నిర్మాణాన్ని కథనం చేస్తున్న ఘట్టాలే నవచోళ చరిత్రలో మనకు పనికి వచ్చేవి. కరికాళ చోడుడు వాహ్యాళికి వెళ్ళి కావేరిని చూశాడు. ఆ నదికి కోట్టకట్టీి తటాకం నిర్మించాలనుకొన్నాడు. దొరలనాయకులను దోరంపు ప్రజలను, ప్రతిభ ధర్మార్థ పరులను, గ్రామాధిపతులను పిలిపించాడు. ఉప్పరలకు ఒప్పుగా ఈవులు పంపీ రప్పించాడు. కులగండకులను నిల్పుకొన్నాడు. లోహకారకులంలోని వారలను రప్పించాడు. పాతాళములు ముట్టత్రప్వి ఆ మట్టిని గగనంబు ముట్టగట్టల పర్వతాకా రంబులుగా వేయగలిగే మేటి ఉప్పరలు వచ్చారు. కాసెలవారు వచ్చారు. కొలుములు పెట్టీ లోహకారులు రాత్రింబవళ్ళు అనక గడ్డపారలు, నెలగపారలు అపారంగా చేశారు. పాషాణభేదులకు ఉక్కుమొనలు చేశారు. బలువైన సున్నపు బట్టీలు పెట్టారు. సున్నపు విసురురాళ్ళు నిలిపారు. పనుల వారల గూర్చి పనుల గొనునట్టి పనుల వారల నధిపతులుగా జేసి గగామముల్‌ కట్నములు కరిమర్థివృత్తి భూములాభరణముల్‌ పూబ్వి నొసగ తగినవారినే పర్యవేక్షణకు నియమించాడు. కొండలలాంటి గుండ్లను ఖండించి బండ్లమీద శిలలు తెచ్చేవాళ్ళు తెస్తున్నారు. ఖంగు ఖంగున రాళ్ళు ఖండించువారు ముంగిలి ధ్వనులు నినుములు సాగవ్రేయు సమ్మెట ధ్వనులు భూస్థలి గాడినటుల ప్రమ్మిన యా గడ్డపారల రవము రమ్మను వారును పొమ్మను వారు తిమ్మును వారును గొమ్మను వారు ఈ యెడ నాలసం బిటికి పనులు చేయుడు చేయుడని చెప్పెడువారు చేసెడి వారిని జేయని వారిని జూచి యెరుంగరు చోద్యమనువారు వేత్రి పరంపర వేర్వేర గూడి చిత్రముగా పనుల్‌ చేయించువారు. ఆ తటాక నిర్మాణంలో ఎందరో పాల్గొన్నారు. వెదురు బెత్తాలు పట్టుకొని కర్రపెత్తనం జరుగుతోంది. పనివాడితనం చూపించవలసీన శ్రామికులకు కట్నాలు, కానుకలు వేతనాలు ఇద్భారు. బండ చాకిరీ చేయవలసినవారు వెట్టికి రావలసినదే. ఎవైనా సా తమవంతు వస్తే వెట్టి చేయాలి. పిట్టవ్వ అనే ముస వేసుకొని అమ్ముకొంటుంది. సట్టన్య ముసలమ్మ అట్లు “కావేరి గట్టను గట్టగా వంతు రావలెనని చోడరాజు భృత్యులను తరిమిడి పిలువగా...” పిట్టవ్వ దగ్గరకు నల్లని దేహం, నల్లని గడ్డం, నల్లని గొంగళి గల ఒక కోనంగి దాసరి వచ్చాడు. అవ్వ సీ వెట్టి కరిగెద నేను జివ్వన నీ విపుడు చేసెడియట్లు తునకలైనవి నాకు దొరకొని యొసగు ౯ ననన నత

  1. చాళుక్కయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్య, మొదటి సంపుటం సం న్‌ా

పోశెట్టి లింగన్న 161 అని చెప్పాడు. ఆమె అంగీకరించింది. ఆ కోనంగి దాసరి వెట్టికి వెళ్ళాడు. పనులవారు కొనియాడేటట్టు ముందు చాలా అబ్బురంగా వెట్టి చేశాడు. కట్ట నాయకుడు మెచ్చుకొన్నాడు. రాజుకు చెప్పి బహుమానాలు ఇప్పిస్తానన్నాడు. ఆ తర్వాత ఆ తోనంగి దాసరి “అంచెలంచెల తట్టలందిచ్చు సతుల అంచెటికతు వెళ్ళాడు. వాళ్ళతో హాస్యాలాడసాగాడు. వింతవింతలు చేస్తూ గొబ్మిళ్ళ పదాలు పాడసాగాడు. కావేరీ కట్టను కట్టే పనివాళ్ళనందరినీ నవ్వించసాగాడు.

సారెకు నిట్టి హాస్యముల నవ్వింప వారలు గడ్డ పాఅల విడిచి

పనులు మానుచు వెంట బరుగులు వారి మునుకొని యేతెంచి మూకలు గూడీ

తెవ్వున నవ్వుచు కేకలు నిడగ దవ్వుల వారెల్ల దివిలి యేతేర

కరమర్థి గావేరి గట్టించునట్టి దొరలు నాయకులును దోడ్డోడ భటుల

పురికొల్చ్ప... ఆ బెత్తాలవారు ఆ కోనంగిని పట్టుకొని బాదారు. అతడు పెడబొబ్బలు పెట్టాడు. అవి కరికాళుడు విన్నాడు. ఏమిటి సంగతి అని అడిగాడు. ఆ కోనంగి దాసరిని సన్నిధిలోనికి పిలిపించుకొన్నాడు. వెదురు బొంగులతో వాడి వీపు చిట్లగొట్టమన్నాడు.

దెబ్బలు వీపున దేలెడి యట్లు దెబ్బలు పడగ పెను బొబ్బల నిడుచు

చేతుల నొడ్డుచు ఖీతి నొందుచును కూతల బెట్టుచు... ఆ కోనంగి దాసరయ్య శిక్ష అనుభవించాడు. ఇతడు తనను పరీక్షించడానికి వచ్చిన శివుడని కరికాళుడు భావించాడు. తరువాత వేదే కథ -

పోశెట్టి లింగన్న చెప్పిన ఈ కథలో ఆ కాలంలో తటాక నిర్మాణం ఎలా జరిగేదో, అందులో పాలొనే నేర్చరులైన శ్రామికులు, బండ చాకిరీ శ్రామికులూ ఎలా పాలొనేవారో; దొరలు నాయకులు ఎలా కగ్రవెత్తనం చేసేవారో కొంత తెలుస్తూంది. ఫెఇొట్టి లింగన్నకు శ్రామికుల గురించి బాగా తెలుసు. అతడిది కుమ్మరి వృత్తి. ఈ సంగతిని అతడు తనంత తాను చెప్పుకోకపోయినా కృత్యాదిని పూర్వులను స్తుతిస్తూ అందరికన్నా ముందుగా కుమ్మరి గుండయ్య అనే శ్రైవభక్తుణ్ణి లింగన్న నుతించడం స్వ్పకులాఖిమానమని పరిశోధకులు భావించారు. పోళెట్టి లింగన్నకు కష్టజీవుల గురించి తెలుసు. కాయకష్టం గురించి తెలుసు. వీర్ణైవులు కాయకష్టాన్ని 'కాయికం' అంటారు. దానితో సంపాదించినది కూడబెట్టకూడదు. ఎప్పటి సంపాదన అప్పటికే కర్చుపెట్టూలి. కాయికం చేసి దానితో జంగమార్చన చేసి “కైతూలి కేతయ' కథను చెప్పాక కాయికం మహిమను ఇలా నుతించాడు.

కాయికార్థంబు దా కల్ప భూరుహము కాయి కార్థంబు దా కడతేరు విధము

కాయికం సదృల దాయకం బెలమి కాయిక లబ్ధమున ఘనగురులింగ

జంగమారాధన సలుపుము నీవు మంగళప్రదముగా... శ్రమైకజీవనాన్ని కీర్తించే, ప్రబోధించే ఏ మతంలోనైనా అభ్యుదయాంశాలు ఉంటాయి. 2. పంచాగ్నుల ఆదినారాయణకాస్త్రి “నవచోళ చరిత్ర పీఠిక, పుట 6 ఆంధ్రపత్రికాధిపతులు,

ప్రకాశకులు, మద్రాసు 192.

శ్రాఢకవి మల్లన్న

కవిత్వం వారకాంతలా ఉండవద్దా అని ప్రన్నించిన ఒక కవి మన సాహిత్యంలో కనబడతాడు. అతని పేరు ప్రొఢకవి మల్లన్న ఈయన తన రుక్మాంగద చరిత్రలో ఈ పక్ష వేశాడు.

సౌరభ్యంబును బంధచాతురితగ న్మయ్యా చమక్కార శృం

పారీణఐత్వము మంజు వాగ్విభవమున్‌ బాంచాల రీతిందగన్‌ _

వారస్త్రీయును బోలి నొప్పవలదా వర్జింపగావ్యంబిలన్‌. (రుక్మాంగద 1-24)

సానితూతుళ్ళ ప్రొఢత్వాన్ని హర్షించే ఈ రసికుడు కవిత్వ సౌరభం ఎలా ఉండాలో తూడా చెప్పాడు.

జాజుల పొట్లము విప్పిన

యోజ గవిత్వంబు వెలయకుండిన సభలన్‌

బూజీంతురె యాకృతి బుధ

రాజులు రాజులును సుకవి రాజులు గరిమన్‌. (రుక్మాంగద. 1-2)

రాజులవల్ల కృతులు పూజలందుకోవాలని చెప్పిన ఈ ప్రొడ కవి తన కావ్యం నరాంకితం చేయలేదు. సప్ప గోదావరీ జల నవీన విహారుడైన దాక్షారామ ఖీమేశ్వరునికి అంకితం చేశాడు. పాల్కురికి సోమనాథుని కాలం మొదలుగా శ్రీనాథుని కాలందాకా దాక్షారామం సానితూతుళ్ళకు సుప్రసిద్ధం. ప్రొడకవి మల్లన్న ఆ క్షేత్రంలోని స్వామికి అంకితంగా చెప్పిన కావ్యం కాబట్టి కవిత్వం లక్షణాలను వారకాంతా సమ్మితం చేశాడు.

వెలయాండ్రలాగ కవితలు మురిపించాలన్న ఈ కావ్యంలో కులస్త్రీల గురించే ధర్మపన్నాలు ఎక్కువగా చెప్పాడు. పతివ్రతా లక్షణాలు ఏకరువు పెట్టి చివరకు ఇలా సహగమనం కూడా ప్రబోధించాడు.

పతినలయించుట దోషము

పతితో నలుగుటయు మిగుల బాపముసతికి

నతి గడచిన బతితోడనె

చితిలో బడవలయు వలదు జీవింపంగన్‌ (రుక్మాంగద తృతీయ పుట - 58)

చిచ్చున నురికీన సతికి ఎదురుగా విమానం వచ్చేనట. అయితే అందరూ ఇటువంటీ పతివ్రతలు కాలేరు. బతికున్నప్పుడు భర్హ తనను నిరాదరిస్తె ఏ స్త్రీ అయినా అతని ఆదరణకు నోచుకోవాలని చూస్తుంది. కట్టుకొన్న దానిని సరతుగొనక ఇంకో చపలాక్షిని మగవాడు మరిగ్‌తీ ఆ మగనాలు ఏం చేస్తుంది? నలు

  1. ఈ పుటల సంఖ్యలు 1410లో వంకాయల కృష కెటి గ

ఏకాదశీమాహాత్మ్యము అనే రుక్మాంగద చరిత్ర స్టష్తువు క్‌ (చెన్న పట్టణము) ప్రకా

ప్రొడకవి మల్లన్ను 163

ప్రాణేశ్చరుండు చేపట్టునా నన్నంచు గ్రహబలంబులు ద్విజవ్రతతినడిగి

చెలువుండు నను నిరీక్షించునా ప్రియముతో ననుచు జోచిళ్ళు నిత్యమును బల్లి

పతినన్ను జనువున బాలించునాయని ధైర్యంబు నదలి సోదనలు సూచి

నాధుండు నన్ను మన్నననేలు నాయని శకునంబులో కొన్ని చాలనరసి

బలులకై వాకిటికి వచ్చు బడుగు జోగి

జంగమయ్యలకును బూజ సలిపి సలిపి

యెందునొకయింత విశ్వాసమే... (రుక్మాంగద - తృతీయ పుట 47) లఖించకపోతీ ఆ యిల్తాలు భర్తను దక్కించుకొనడానికి వలపుమందు పెట్టవచ్చు. అది వికటించవచ్చు. భర్త అనురాగాన్ని పొందాలన్నది స్త్రీకి సహజమైన తోరికు తాళికట్టిన అలిని ఒల్లక వృత్తులన్నీ అమ్మి వెలయాండ్రకు పెట్టి. సంచితమగు ధనమంతా సానులకిచ్చి దొరకినన్ని అప్పులు చేసి పరసతులకు పెట్టి, బాకీలు తీర్చలేక, అప్పులవాళ్ళు పెట్టే బాధలు భరించలేక అప్పుడు భార్య నగలు జ్ఞాపకం వచ్చి ఇంటికి వచ్చి, “నేను మారిపోయాను నీ నగలు ఇవ్వు” అని ఏ భర్త అయినా అడిగతే సర్వసాధారణమైన ఆడకూతురు ఏం చేస్తుంది. కాళ్ళమీద పడుతున్న మగడిని త్రోసేస్తుంది. అనవలసిన మాటలన్నీ అని కడిగేస్తుంది.

పుస్తెగట్టీన యది మొద ల్పొంతరావు ధనము బ్రాయంబు వారసుందరుల కొసగి

యాత్రసన్యాసమున శీఘ్రమరుగుదెంచి సత్యములు పల్కుటే విట చక్రవర్తి

సమదృష్టి నొకనాడు చక్కగా జూడవు పేరెత్తి పిలువవు ప్రియముతోడ

నన్నదమ్ములు లేరటంచు యోచింపవు చెలువంబునకు మెచ్చి చెంతరావు

చీరసామ్ములు వెట్టి చేపట్టవైతివి యొంటనుండగ భయంబుడుపవైతి

బుతుకాలమెరిగి నీహితసాఖ్యమీవైతి ఏంతసేయక గారవింపనైతి

పుణ్యపాపంబు లాత్మలో బూనవైతి

నగ్ని సాక్షిగ గైకొన్న యాలియందు

బడయవైతివి పుత్రుల బాపజాతి

యేటిమగడవు నీకు నేనెట్టి యాల! (రుక్మాంగద - చతుర్ధ - పుట 60) ఇంత ఖచ్చితంగా చెప్పిన పిమ్మట అతనితో ఆమె కాపురం చేయలేదు.

ఇవి నా సొమ్ములు వింటె యోయి మగడా యేమైన నీ విచ్చినా

డవె నా తల్లియు దండ్రి బాంధవులు వేడ్కల్మీర జేయించిరీ

రవణంబు ల్ప్విను వీనిలోన నొక తారంబైన నీ జాలనీ

చెవులాకుల్చగ సేయ వచ్చితివి నీచేనియ్యనే నోర్తునే

. (రుక్మాంగద - చతుర్థ - పుట - అ)

ఓర్చలేదు కాబట్టే వెంటనే భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది - ఇలా భర్తను

విడనాడడం గత్యంతరం లేనప్పుడే. అయితే మగవాడికో నీతీ, ఆడవార్‌కెన్నో నీతులూ

184 వమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

సంఘం ప్రీదే తప్పుంటుండి. ప్రొడకవి మల్లన్న రుక్మాంగద చరిత్రలోని ఒక సలా ఈ మగనాలి కథను చెప్పాడు. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిన చాలాకాలానికి భర్త వచ్చి ఆమెను ఏలుకొంటాడు. వాళ్ళు సుఖంగానే ఉంటారు. అయితే భర్తను వదిలేసిన పాపానికి బతితున్నప్పుడు కాక చచ్చిపోయాక యములాళ్ళు శిక్షించారట. తర్వాత అదే వేరానికి వెయ్యేళ్ళు కాష్ట కీటకంలాగ జీవించి కష్టాలతు లోవైందటు. ఈ కథను రుక్మాంగదువి భార్య పంధ్యావళి పిలువవి పేరంటానికి వచ్చిన మోహినికి చెప్తుంది.

ఇటువంటి కథలను ప్రదారం చేయడమే పూ్యూడలు యుగాల కవుల ధ్యేయం. “పతి యనురాగ మొంది ప్రియ భామల వెందర బెండ్లి యాడినన్‌ సతులకు సమ్మతింపదగు”

  • అవేది అనాటి నీకి.

విడువదగు గతి చరించిన

విడువంగా రాదు ప్రాణవిభునే పతియున్‌

పడతికి పతిభక్తి కదా

తొడవాయెగ జన్నే వికచతోయవివేత్రా. (రుక్మాంగద - చతుర్ధ - ఫుటు - 49)

వడవలసిన కష్టాలన్నీ పడతులే పడాలి. వర్ణ వయో లింగ భేదాల పూరు అసమానతల వ్యవస్థను పురాతన పాలక వర్గాలు సృష్టించారు. దానిని సంగకక్షీంచే పురాణాలను ఏరచింప చేశారు. లెక్క ప్రకారం మనకు పద్దెనిమిది మహా ఉంది.

“మా ద్వయం “భ ద్వయం చైవ

“భ త్రయం “వ చతుష్టయం

“అ “నా “హ “లింగ “కూ “ప్కా*వి

పురాణాని పృథక్‌ పృథక్‌ -ఇటువంటి సులువు సూత్రాన్నే ప్రొఢకవి మల్లన తన కావ్యంలో ఇలా చెప్పాడు.

తరణి నొకటొకటి పాపకు

సరసిజుభవు రెండు నాలు జఐలళాయిని శం

కరు బదియుగా బురాణము

లిరవుగ వర్ణించు బదియు నెనిమిది వరుసన్‌ (రుక్మాంగద - ప్రథమ - పుట - 6)

వాళ్ళ వాళ్ళ మతాలనుబట్టి బ్రహ్మ, విష్ణు, శివ, శక్తి పారమ్యాలను బోధించే పురాణాలు ఎన్ని తయారైనా లెక్కకు మాత్రం అవి ఎప్పుడూ పద్ధెనిమిదే. బ్రహ్మాండ పురాణంలో రుక్క్ళాంగద చరిత్ర ఉందనీ దానినే చెప్తున్నాననీ ప్రాడకవి మల్లన్న ప్రకటించాడు. అయిదు అశ్వాసాలలో ఏకాదశీ బ్రత మాహాత్మ్యంతోబాటు తులసీ, అన్నదాన, ఆమలక మహిమల వంటివి చెప్పాడు. లోకులు పాపాలు, చేయకపోతే నరకం శూన్యమవుతుంది. అందువల్ల మానవులచేత పాపాలు చేయించడం దేవతలకు వేడుక

ప్రొడకవి మల్లన్న 165 ఏయే పాపాలు చేస్తే ఏయే నరకాలు ప్రాప్తిస్తాయో మన పురాణాలు చెప్తాయి. ఈ కావ్యం తూడా అదే చెప్పింది. అయితే ఇందులోని ఉపాఖ్యానాలలోనే సమకాలిక జీవనం కొంత ప్రతిఫలిస్తుంది.

ఫ్రొడకవి మల్లన్న ఏ కాలంవాడో నికరంగా చెప్పడానికి ఆధారాలు కావ్యంలో దొరకవు. ఇతని ఇంటి పేరు ఫ్రొడకవివారు కావచ్చును. ఇతని తండ్రి పేరు పోతయామాత్యుడు. ఈయన బమ్మెర పోతరాజుగారే అన్న పొరపాటు గుర్తింపు పూర్వం జరిగింది. ఆయనకు మల్లన్న అనే కువూరుడున్నాడన్న జనశ్రుతి ఒక్కటే దీనికి కారణం. తన తండ్రి భాగవతం తెనిగించినట్టు ప్రొడకవి మల్లన్న ఎక్కడా చెప్పలేదు. పైగా బమ్మెరవారిది కౌండిన్య గోత్రం. ఫ్రొడకవి వారిది శ్రీవత్స గోత్రం. నిస్సందేహంగా బంధుత్వాలు నిర్ణయించడానికే ఈ గోత్రాల గురించి మనం పట్టించుకోవాలి.

ఈ మల్లన్న కాలాన్ని ఒక రకంగా ఊహించడానికి ఆధారాలున్నాయి. క్రీశ. 1656లో కాకునూరి అప్పకవి పరమ ప్రామాణికంగా సాహిత్యలోకం భావించే అప్పకవీయం అనే .ఛందోవ్యాకరణ లక్షణాన్ని చెప్పసాగాడు. తన పూర్వులు పద్య రచనలో ఏయే ఘనకార్యాలు చేశారో అందులో వివరించాడు. తిట్టు కవులలో దిట్టలను పేర్కొన్నాడు. “'కినిసి యొక్క ముహూర్తమున బ్రహ్మదండి ముండ్లెల్ల డుల్లగ దిట్టె మల్ల ఘనుడు” అని పేర్కొన్నాడు (2-370). ఈ మల్లఘనుడు ఎవరో కూడా ఆ తర్వాత ఒక వచనంలో వివరించాడు.

“ప్రొడకవి మల్లన్న మూడవచోట అకారమును నిలిపి రెండు గడియలకు బ్రహ్మదండి చెట్టు ముండ్లు రాల దిట్టిన చాటుధారః

గుడియన్న నృపతి బొడగన

నడవంగా గొండవల్లి నగరిపడమటం "

గుడీ యడుగు మడమ గాడీన

చెడిన ముండులు బ్రహ్మదండి చెట్టునడుల్లున్‌" (అప్పకవీయం - 2 - 372)

ఈ సాక్ష్యాన్నిబట్టి, అప్పకవి 16565 నాటివాడు కనుక ప్రొడకవి మల్లన అంతకు నూరేళ్ళ ముందరివాడో, ఇంకా ప్రాచీనుడో అనుకోవచ్చు. బహుశా క్రీశు 15650 ప్రాంతాలవాడని ఊహించవచ్చు. పెదపాటి జగ్గన్న ప్రబంధ రత్నాకరమనే తన సంకలన గ్రంథంలో కవి పేరూ, కావ్యం పేరూ చెప్పకపోయినా ప్రొడకవి మల్లన్న రుక్మాంగద చరిత్రలోని ప్రభాతవర్ణన ఒకటి ఉదాహరించాడు (చూ వేటూరి ప్రబంధ రత్నావళి - పద్య సంఖ్య 606).2 దీనివల్ల ఎంత అర్వాచీనుడైనా మల్లన్న మలిరాయల యుగంలోని వాడే అవుతాడు. ఇతడు బమ్మెర పోతరాజుగారికి అర్వాచీనుడే అని కచ్చితంగా నిర్ణయించడానికి ఆధారాలున్నాయి. తన కావ్యాన్ని “మహాభాగవత స్కంధా బంధురంబును, అల్ప ప్రయాసంబును, అధిక ఫలంబును”' అగునని చెప్పాడు. దీనిని 2. ఈ సంగతిని నిడుదవోలు వెంకటరావుగారు గుర్తించారు. చూ ప్రబంధ రత్నావళి (1976) పీరిక -

పుట 94.

186 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చదవడానికి అల్ప ప్రయాసం ఉండవచ్చుగాని సాంఘిక చరిత్ర రచనలో ఇది అధిక ఫలంకన్నా అత్యల్ప, ఫలాన్నే ఇస్తుంది. కవిత వారకాంతలా వలపించినా సత్కృత్తి ఎలాంటిదో మల్లన్నకు తిలుసు.

నానాళ్ళును శృంగారము నానావిధవృత్త వర్ణనలు సంపూర్ణం

బై నిల్చిన కృతి సత్కృతి గా నుతియింపుదురుగా సుకవులెల్లెడన్‌.

(రుక్మాంగద - 1- ౫)

రుక్మాంగద చరిత్రలో సంపూర్ణత కొరవడినట్టు కనబడుతుంది. వెన్నెలకంటి సూరన్న

మన సాహిత్య చరిత్రలో కొన్ని కొన్ని ఇంటిపేర్లు తరచుగా వినబడుతూ ఉంటాయి. అటువంటి వాటిలో 'వెన్నెైలకంటి' వారిది సుప్రసిద్ధం. ఈ వంశంలోని వివిధ కవులో, పండితులూ, .విఖిన్న కాలాలలో వేర్వేరు ప్రభువుల వల్ల అగ్రహారాలు, ఆందోళికలూ మొదలైన సత్కారాలు పొందారు. 'కవిత పుట్టిల్లు వెన్నాలకంటి యిల్లు అనే ప్రశస్తిని నోచుకున్నారు. మలిరాయల యుగంలో క్రీ.శ. 1530-1555 ప్రాంతాలలో వెన్నెలకంటీ సూరన్న విష్ణుపురాణాన్ని ఆంధ్రీకరించి రావూరి బసవయ రాఘవరెడ్డికి అంకితమిచ్చాడు. ఈ కృతికర్తా, కృతిభర్తా ఇద్దరూ రెండు ప్రసిద్ధ వంశాలలోనివాళ్ళు. ఈ సంగతిని సూరన్న సగర్వంగా చెప్పుకొన్నాడు. తన గురించి ఇలా చాటుకొన్నాడు.

ఈ నిఖిలంబు మెచ్చ నమరేశ్చరదేవుడు చూడ గృష్టవే

అీనది సాక్షిగా ననికి నిల్చిన రావుతు గేస భూవిభుం

గానకు దోలి వెన్నడిచి కాచిన వేమయ యన్న పోత భూ

బానికి సత్ర్రబంధము లొసంగిన వెన్నాలగంటి వారిలోన్‌.

ఈ పద్యంలోని అనవోత భూజాని క్రీ.శ. 1353-1364 సంవత్సరాల మధ్యనున్న ప్రభువు. ఈయనకు సత్ర బంధములు ఇచ్చిన వెన్నెలకంటి వారిలోని కవిపేరును సూరన్న చెప్పుకోలేదు. తన పూర్వీకునికి, తనకూ సుమారు రెండు వందల ఏళ్ళ ఎడం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ వంశంలో ఎందరో కవులు కనబడతారు. వాళ్ళ గురించి ఈ గ్రంథంలోనే వివిధ యుగాలలో సవిస్తరంగానే చెప్పుకొన్నాం. ఆ సంగతులు బేరీజువేద్దాం.

  1. రెడ్డిరాజుల యుగంలో వెన్నెలకంటి జన్నమంత్రి దేవకీనందన శతకం రచించాడు. ఇతడు సంగమ వంశపు రాజులలో ప్రసిదుడైన దేవరాయల కరుణకు పాత్రుడయ్యాడు.! రా చానా
  2. విక్రమార్క చరిత్ర, 1-4

వెన్నెలకంటి సూరన్న. . ' 167 2. ఈ జన్నమంత్రి కుమారుడు సిద్ధనకే జక్కన తన విక్రమార్క చరిత్రను అంకితమిచ్చాడు. తన కృతిపతి వంశాన్ని వర్జిస్తూ జక్కన మిగతా వివరాలు చెప్పాడు. ఈ వంశం మూల పురుషుడు సూరన సోమయాజి క్రీ.శ. 1161-1181 సంవత్సరాల మధ్య పాలించిన వెలనాటి రాజేంద్రచోడుని వల్ల ఎద్దనపూడి అగ్రహారాన్ని పొందాడు. ఈ వంశంలోనివాడే బహుశా సూరన సోమయాజి మనవడు సిద్ధన క్రీ.శ. 1285 ప్రాంతాలలో నన్నయ గంధవారణుడని ప్రసిద్ధుడైన ఒక తెలుగు చోడ ప్రభువు వద్ద ప్రధానిగా ఉన్నాడు. ఈయన పురాణ కావ్యరస నానా నాటకాలంకృతులు” పోషించాడు. ఇతని పెద్దకొడుకు పేరు భాస్కరుడు. ఈయననే సూరన అని కూడా పిల్చేవారు కాబోలు. జక్కన తన విక్రమార్కచరిత్రలో ఇతనిని తన కృతిపతి పెద్దతండ్రిగా ఇలా చెప్పాడు. వెన్నెలగంటి సూర్యుడు వివేక గుణాఢ్యుడు, వేదశాస్త్ర సం పన్నుడు రెడ్డి వేమ నరపాలకు చేత మహాగ్రహారముల్‌ . గొన్న కవీంద్ర కుంజరు డకుంఠిత తేజుడు పెద్ద తండ్రిగా సన్నుతి గన్న సిద్ధునకు సంతత దాన కళా విమోదికిన్‌ _-- (విక్రమార్క. 1-62)

  • ౫. ఈ వెన్నెలకంటి సూర్యుడు క్రీ.శ+.1382 ప్రాంతాలవాడు. మలిరాయల యుగంలోని వెన్నెలకంటి సూరన్నకూ, ఇతనికీ ఇంటి పేరూ, పేరూ ఒకటే అయినా వీళ్ళమధ్య ఎన్ని -.. 3. గజపతుల యుగంలో వెన్నెలకంటి అన్నయ్య షోడశ కుమార చరిత్ర అనే కథాకథన కావ్యాన్ని రచిస్తే అది భేతాళ పంచవింశతి పేర ప్రసిద్ధమైంది. ఇతడు తన తండ్రి సూరన్న గార్‌కే ఇది అంకితమిచ్చాడు. ఈ వెన్నెలకంటి సూరన, రామాయణ, భారతాది ఇతిహాసాలే కాక కూర్మపురాణం, పద్మపురాణం మొదలైన ప్రముఖమైన “అపార పురాణవిలోచన గౌరవమతి ధన్యుడు” నూత్న భరతాచార్భుడు. విక్రమార్క చరిత్రలో పేర్కొన్న వివిధ వెన్నెలకంటి కవుల గోత్రంలాగే ఈ వెన్నెలకంటి సూరన్నగారిదీ, అన్నయ్య గారిదీ హరితసగో త్రమే. మలిరాయల యుగంలో విష్ణుపురాణం ఆంధ్రీకరించిన వెన్నెలకంటి సూరన్నదీ అదే గోత్రం. సగో త్రీకులన్న ఒక్క విషయం తప్పించి ప్రాచీనులైన వెన్నెలకంటి కవులను మలిరాయల యుగంలోని సూరన్నకూ గల బంధుత్వం వివరాలు ప్రస్తుతం లఖిస్తున్న ఆకరాల వల్ల తెలియవు. అందుకే కవి తన యింటిపేరును మాత్రమే "తన విషయంలో మాదిరిగానే తన కృతిపతి వంశం గురించి కూడా ప్రాచీన వైభవాన్ని ఇలా ప్రకటించాడు. రావూరి రాఘవరెడ్డి అనవేమక్షితపాన్వయోత్తము' డని చెప్పాడు (విష్ణుపురాణం-4-348). ఈ అనవేమారెడ్డి క్రీ.శ.1364-1386 పంటకులంలోని ప్రసిద్దుడైన ప్రభువు: . . యు
  1. అందులోనే!-3 . ౩. అందులోనే 1-35
  2. _షోడశకుమూరచరిత్ర - 2- 185 క్‌ అందులోనే (8-91)

టి నమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

తన (బ్రతుకు భూమిసురులకు

దన బిరుదులు పంటవంశధరణీశులకున్‌

దననమయు భూమి ప్రజలకు,

నన వేమన యిచ్చె గీర్హి నధితుండగుచున్‌. (విష్ణుపురాణం, పీఠిక-3)

అటువంటి పంటకులంలో తన కృతిపతి జన్మించినాడని వెన్నెలకంటి సూరన్న చెప్పాడు. అయిదు పురుషాంతరాలలోని వ్యత్తుల పేర్లు పేర్కొన్నాడు. కృతిపతి తండ్రి బసవారెడ్డి విషయంలో కొన్ని చారిత్రక మేషాలు పేర్కొన్నాడు.

కటకాధిపతియైన గజపతి రాజునే బ్రతిలేని పల్లకిపదవి నొందె

మహిమచే గర్జాట మండలాధిపుచేత గడలేని రాజ్యభాగములుగాచె

బ్రౌడ పొరుషమున రాజిల్లి మణయగా మలకవజీర్ణ కుమ్ములిక జేసె _

దెలగాణ భూముల గల మన్నెవారిచే బలవంతమునను గప్పముల గొనియె

జాటు ధాటీని రాఘాట ఘోట కావ,

ళీ ఖుర్జోద్దూతని విడ ధూళీ విలిప్త

మండి తొాశాంగనాకుచమండలుండు

బాహుబలశాలి తమ్మయ:టసన విభుడు. (విష్ణు. పీఠిక. - 41)

ఈ పద్యంలో గజపతిని, నరపతిని, అశ్వపతిని, తెలంగాణాలోని మన్నేవారిి పేర్కొనడం చేత బసవారెడ్డి కాలనిర్ణయం గురించి ఊహాగానాలకు ఆస్కారం లఖించిండి మన సాహిత్య చరిత్రకారులలోని ఆద్యులు గురజాడ శ్రీరామమూర్తిగారు, కందుకూరి వీరేశలింగంగారూ. విష్ణుపురాణ రచనా కాలాన్ని నిర్ణయించారు. గురజాడవారు వెన్నెలకంటి సూరన్న శ్రీనాథుని సమకాలికుడని, 1378-1428 అని చెప్పారు. కందుకూర వారు క్రీ.శ1460-1480 అన్నారు.

నిర్దిష్టమైన శాసన ప్రయోగాలు లేకపోతే ఏ కవి కాలాన్నయినా నిర్ధారణ చేయడు చాలా కష్టమైన పని. వీరేశలింగంగారు చేసిన కాలనిర్ణయం “అసమర్థ సాధనములకో సిద్ధాంతపరచిన' దని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు “చెప్పారు.* విష్ణుపురాణం కృతిభ్లో అయిన బసన రాఘవరెడ్డి క్రీశ 1526-29 ప్రాంతాలలో ఉన్నవాడని, అందుకు శాసనప్రమాణాలు ఉన్నాయని వాటీని పేర్కొన్నారు. నెల్లూరు శాసన సంపుటాలలోని సాక్ష్యాలను సూచించారు గాని ఉదాహరించలేదు. ఇది 1918లోని ముచ్చట. అనాకే వెన్నెలకంటి సూరన్న కాలనిర్ణయం ఇదమిత్ధం అని తేలవలసింది. అయినా మన సాహిళ్కే చరిత్రకారులు పాత పాటనే పాడసాగారు. 1951లో చాగంటి శేషయ్యగారు. మాక్రో ప్రభాకరశాస్త్రిగారు. సూచించిన శాసనాలను గుర్తించి తమ గ్రంథంలో వాటి పొందుపరిచారు.” నేను పూర్వం నా సమగ్రాంధ్ర సాహిత్యం మలిరాయల యుగంలో 7. _అంధ్రకవి తరంగిణి - ఎనిమిదవ సంపుటం - పుట 218

వెన్నెలకంటి సూరన్న 169 వం వల్ల లకంటి సూరన్న కాలాన్సి 1530-1 స

స్థలాభా, హే న్ని 555 అని ముక్తసరిగా చెప్పాను నెల్లూరి శాసన సంపుటాలలోని రెండవ భాగంలోని కనిగిరి 33వ శాసనాన్ని

చూడండి.

  1. శుభమస్తు: స్పాస్తిశ్రీ, శకవర్షంబులు 1448 అగు "

  2. నేంటి పుష్యశుద్ధ 15 గురువారమున్ను సోమగహ

  3. అమున్ను అయిన పుణ్యకాలం అందును జగనొ

  4. బృగండ్డ సంగ్రామ ధనంజయ హేమాద్రి దాన

  5. చింతామణి పట్టులలాట రాయబసువ శ

  6. కర విరుదాంకుడు అయిన రావూరి రాఘవరెడ్డిగారు తము

  7. తండ్రీ బస్వారెడ్డిగారికిన్ని తమ తల్లి అమలాంవికకున్న పుణ్యమ

  8. ఘనట్టుగాను లింగాల కొండ సోమేశ్వరుని కిన్ని బగాది గంగకున్నూ్నూ

  9. _సాష్టాంగమున్నూ దణ్నము పెట్టి సమర్పించిన ధర్మ శాసనము

  10. కు కొండ మర్చుయ్యంగారు మానామాంకరాను యిచ్చిన కనిగిరిపోల

  11. చెర్ల ముసుండూరు సీమలో గంగపట్నం సోమేశ్చరునికిన్ని బగాదిగం

  12. గ కున్ను సోడసోపచారల కున్న సమర్పిస్తిమి...

ఈ శాసనం వల్ల రావూరి రాఘవరెడ్డి ఉదయగిరి సీమలో రాయసం కొండ మరుసయ్యగారి అధీనంలో ఉన్న రాజ్యంలో ఒక నాయంకరం పొందినవారని, అతని కాలం క్రీ.శ. 1528 అనీ, తండ్రీ పేరు బసవారెడ్డి అనీ, తల్లి పేరు అమలాంబ అని స్పష్టం అవుతూంది. వెన్నెలకంటి సూరన్న చెప్పిన కృతిపతి తల్లిదండ్రుల పేర్లు కూడా ఇవే. ఈ శాసనంలోని బిరుదులను సూరన్న తన కృతిలో అక్కడక్కడ పేర్కొన్నాడు. హేమాద్రిదాన చింతామణి (పీరిక-77) సంగ్రామ ధనుంజయ (4-1) జగనొబ్బగండ (8-1) ఈ దాఖలాల వల్ల వెన్నెలకంటి సూరన్న ఎప్పటివాడో నిస్సందేహంగా తేలింది.

రావూరి రాఘవరెడ్డి ఉదయగిరి రాజ్యంలో గుడ్డూటీ నుండి తన నాయంకరాన్ని ఏలుకొంటున్నాడని విష్ణుపురాణం వల్ల తెలుస్తోంది. ఈ గుడ్డూరు సాహిత్య చరిత్రలో ఇంతకు ముందు ప్రసిద్ధమైనదే. ఈ ఊరే ఎర్రాప్రగడ వారి గ్రామం. అందుకే పూర్వకవి స్తుతిలో సూరన్న ముందుగా ఎగ్రనగారిని స్తుతించాడు. (పీఠిక-9) రావూరి రాఘవరెడ్డి కవులకు అగ్రహారాలు ఇవ్వదగినంత వైభవంగా ఉన్నవాడే. వెన్నాలకంటి సూశఠన్నకు తన తండ్రీ పేరిట బసవాపురం అనే అగ్రహారాన్ని ఏక భోగంగా ఇచ్చి కృతిని అందుకొన్నాడు. (పీఠిక - 27).

క నం మొల లంగు అం ౮ చందమ దందా గరుకయంగం! 0 కడకంగ 0౧ అరం బటు తిగిరే 10౧6 0౧ ౧28002 ౯ శస? ౧8౧ - జ క సోంరూజ - 1905

170 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తెలుగు సాహిత్యంలో విష్ణుపురాణాన్ని ఆంధ్రీకరించిన వారిలో వెన్నెలకంటి సూరన్న మొదటివాడు కాదు. పద్మనాయకుల, రెడ్డీరాజుల యుగంలోని పశుపతి నొగనాథుడు ఇంతకు ముందే దీనిని తెనిగించాడు. అయితే ఆ గ్రంథం మరుగున పడిపోయింది. ఒక్కటంటే ఒక్కటే పద్యం దక్కింది. అది కూడా ఒక సంకలన గ్రంథకర్త సేకరించబట్టే. ఇది వసంతాన్ని వర్ణించే పద్యం. పురాణంలోనిదైనా ప్రబంధ ధోరణిలోని పద్యమని ఆ యుగాల సంపుటంలోని నాగనాథుని ప్రకరణంలో చెప్పుకొన్నాం. ఈ పూర్వీకులను వెన్నెలకంటి సూరన్న పేర్కొనకపోవడం కూడా గమనించాం. ఇతడు చెప్పని దానికంటే చెప్పిన విషయం ఒకటి చాలా విడ్డూరంగా కనిపించుతుంది. తాను తఆనిగిస్తున్నది ““ఆదిమహాపురాణంబగు " బ్రహ్మాండ పురాణంబు నందలి పరాశర సంహితమైన శ్రీ విష్ణుపురాణమని”చెప్పాడు. ప్రతి ఆక్వాసాంత గద్యాలలోను ఈ సంగతి విష్ణుపురాణం విఖిన్నమైనవి. అటువంటప్పుడు సూరన్న ఇటువంటి ప్రకటన ఎందుకు చేశాడా అని తెనుగు సాహితీపరులందరూ ఆశ్చర్యపడ్డారు. ““పురాణములందు బ్రహ్మాండాంతర్గతమని విష్ణుపురాణమునేరేని చెప్పిరేమో విచారణీయము”' అని శేషాద్రి రమణ కవులు చెప్పారు. ప్రాచ్య లిఖిత గ్రంథోలయం వారి *డి' కేటలాగులో విష్ణుపురాణం గురించి వివరిస్తూ గ్రంథాలయ పండితులుగా వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. “బ్రహ్మ పురాణమునందు పాఠశరసంహితమైన శ్రీ విష్ణుపురాణంబునందు అని యుండుటకు సందర్చమేమో! తప్పే కానోపు[!” అని అభిప్రాయపడ్డారు.!9 బహుశా వెన్నెలకంటి సూరన్న 'ఆదిమహాపురాణంబగు బ్రహ్మాండ పురాణంబునందలి పరాశర సంహితయైన శ్రీ విష్ణుపురాణం' అని చెప్పి ఉంటాడు. లేఖకులు బ్రహ్మాండ పురాణమని తప్పు బ్రాసుకొన్నారేమో. సూరన్న ““ఆదిమహా పురాణంబగు బ్రహ్మపురాణం” అని చెప్పడానికీ ఒక కారణం కనబడుతూంది. “చతుర్ముఖ బ్రహ్మ కృతయుగములో బ్రహ్మమను పేర శతకోటి గ్రంథ పరిమితి గల పురాణ సంహితా స్కంధమును నిర్మించెను. దాని సారమును వేదవ్యాసుడు నాలుగు లక్షల శ్లోకములు గల అష్టాదశపురాణ సహితంగా రచియించి సూతుడైన రోమ హర్షణ మునికీ చెప్పెను. అన్ని పురాణములలోను బ్రహ్మము మొదటిది” అని మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు మన “ఇతిహాసములు-పురాణములు”' గురించి రాస్తూ చెప్పారు.11 అష్టాదశ పురాణాలలో ఆరు పురాణాలు శ్రీమన్నారాయణుని ప్రశంసించే సాత్త్విక పురాణాలు. అవి వరుసగా 1. విష్ణుపురాణం, 2. భాగవతం, 3. నారదీయం, 10. 4 విజడోంరణ ఆటర్తంంల 0 ఈం ?టుం్ర. 0గుదట 604 ౦గజాణ! గందం సలా ఆ011, $ిశీజరణ8 1915, ర 295 11. నంగ్రహాంధ్ర విజ్ఞాన కోశము - రెండవ సంపుటము. పుట 95

వెన్నెలకంటి సూరన్న 171 4. పద్మపురాణం, 5. వరాహపురాణం, 6. గరుడ పురాణం. కొన్ని సంప్రదాయాల ప్రకారం నారదీయ పురాణం స్థానంలో వాయవ్య పురాణాన్ని చేర్చడం ఉంది. మన తెలుగు సాహిత్యంలో విష్ణువును ప్రశంసించే ఈ పురాణాలలో పద్మపురాణాన్ని మొదట మడికి సింగన రెడ్డిరాజుల యుగంలో అనువదించాడు. అతడే భాగవతాన్ని కూడా ద్వాపద కావ్యంగా కొంత తెనిగించాడు. ఇది బమ్మెర పోతరాజుగారి లేఖిని నుండి అనన్యంగా భాగవతం వెలువడడానికి అరవై సంవత్సరాలముందే జరిగింది. తొలిరాయల యుగంలో నంది ఘంటల జంట వరాహపురాణాన్ని తెనిగించారు. పిల్లలమర్రి పినవీరభద్రుడు నారదీయ పురాణాన్ని ఆంధ్రీకరించాడు గానీ అది నష్టమైంది. పోతరాజుగారి తర్వాత ఇంచుమించు నూరేళ్ళకు వెన్నెలకంటి సూరన్న విష్ణుపురాణాన్ని్ని తెనిగించాడు. సరిగ్గా ఇదే కాలంలో హరిభట్టు వరాహపురాణాన్ని అంధ్రీకరించాడు. ఈ కవులకు సమకాలికుడైన బద్దెపూడి పెద్దయ్య వాయుపురాణాన్ని అనువదించాడు. అంటే మడికి సింగన కాలం నుంచీ రెండు శతాబ్దాల లోపున విష్ణుపారమ్యాన్ని కీర్తించే అరు పురాణాలలో ఒక్క గరుడ పురాణాన్ని తప్పు మిగతా అయిదింటినీ తెలుగు కవులు దేశానికి ఇచ్చారు (గరుడ పురాణాన్ని సూరపరాజుగారు అరవీటి రాజుల యుగంలో కొంత అనువదించారు). | ఒకే దైవం యొక్క లీలలను కీర్తించే పురాణాలు కాబట్టి వీటిలోని కధలన్నీ ఇంచుమించు ఒకే మోస్తరుగా ఉంటాయి. మడికి సింగన తన పద్మపురాణం నవమ దశమాశ్వాసాలు రెండింటిలో పూర్తిగా కృష్ణావతార గాథలను సవిస్తరంగానే చెప్పాడు. పురాణాల జాబితాలో ఎక్కదు గానీ ఎర్రయ్యగారు హరివంశంలో తూడా కృష్ణావతార విశేషాలను హృద్యంగా చెప్పారు. ఈ కథనం బమ్మెరపోతరాజుగారి రచనకు మేలుబంతి అయింది. వెన్నెలకంటి సూరన్న తన విష్ణుపురాణంలో షష్టాశ్వాసంలో యదువంశ మహిమను 184వ పద్యంనుండి ప్రారంభించాడు. (ఈ ఆశ్వాసంలో 412 గద్యపద్యాలు ఉన్నాయి). సప్తమాశ్వాసంలో (433 గద్య పద్యాలు), అష్టమాశ్వాసంలో (482 గద్య పద్యాలు) ఎంతో సవిస్తరంగా వెన్నాలకంటి సూరన్న కృష్ణావతార పోేషాలను కథనం చేశాడు. అంటే 1143 గద్య పద్యాలలో భాగవతదశమస్కంధ గాథలనే సూరన్న తూడా చెప్పాడన్నమాట. రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే ఏమనిపిస్తుందో గాని ప్రశస్తతమమైన రచనలు ఆకట్టుకొన్నాక ఇతర ప్రజ్ఞావంతుల రచనలు తూడా ఎక్కిరావు. పోతరాజుగారి మందార మకరంద మాధుర్యం చిప్పిల్లే భాగవత రచనామృతాన్ని గ్రోలాక ఇతర కవులు చెప్పే కృష్ణావతార గాథలను అనడానికి సాధారణ పాఠకులకు మనస్కరించదు. అందుకే పోతరాజుగారికి ప్రాచీనులైన ఎర్రయ్యగారి హరివంశంగానీ, మడికి సింగన్న పద్మపురాణంగాని వన్నైకెక్కినట్టు కనబడవు. అలాగే పోతరాజుగారికి అర్వాచీనుడైన వెన్నెలకంటి సూరన్న రచన అంతంత మౌత్రంగా ఉన్నట్టే అనిపిస్తే ఆశ్చర్యం లేదు. అయిదే ఏమాటకామాటే చెప్పుకోవాలి. తులనాత్మక పరీక్ష చేసేటప్పుడు ఆయా కవులు ఏ పరిస్థితులలో ఏ పరిమితులకు లోబడి, ఏ వృత్తులతో రచనలు చేశారో

172 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చూడాలి. అందుకే శేషాద్రి రమయణ కవులు ఇలా చక్కగా చెప్పారు. “నరకాసుర వధము, ప్రహ్లాద చరిత్రము, ధ్రువోపాఖ్యానము, శ్రీ కృష్ణావతార ఘట్టము, రుక్కిణీ కల్యాణము లోనగు కథా భాగములీ విష్ణుపురాణమున సంగ్రహ రూపముగ నున్నవి. పోతన రచనమునకు తీసిపోవుచున్నది. ఈ భేదము పోతన చిత్రకవితా ప్రియుడు, సూరన్న నిరర్గ్లళధారా వశంవదుడు నగుటచే నేర్పడినది. కావున నాయా భాగములు గైకొని తారతమ్య చర్చ గావించుట యుచితముగాదని మా తలంపు.””12 షోలికలు తీసుకు రావలసిన అవసరం లేని సందర్పాలలో ఒక కవి ఏదైనా కథాఘట్టాన్ని. ఎంత రసవంతంగా కథనం చేశాడో పథిీలిస్తే అతని పనివాడితనం _ బయటపడుతుంది. కృష్ణావతార కథను చెప్పే సప్తమ, అష్టమాశ్వాసాలలో కాక ఇతర ఆశ్బాసాలలో వెన్నెలకంటి సూరన్న కవితను అక్కడక్కడ చూద్దాం. ద్వితీయాశ్వాసంలో మారిష అనే స్త్రీ కథా (204వ పద్యంనుండి 255వ పద్యందాకా సుమారు 51 గద్య పద్యాలు) పంచమాశ్వాసంలో సౌభరి చరిత్రా (122 నుండి 195 దాకా 7౫ గద్య పద్యాలు) షష్టాశ్వాసంలో తారాశశాంక కథా (35 పద్యంనుండి 63 దాకారు గద్య పద్యాలలో) వెన్నెలకంటి సూరన్న కథనం చేశాడు. వీటిలో సౌభరి చరిత్రను ఇంతకు ముందే కిందటి యుగంలో జ్రోలుగంటి చెన్నమంత్రి ప్రకరణంలో సవిస్తరంగా చర్చించాం. ఇప్పుడు మారిష కథనూ, తారాశకాంక కథనూ కొద్దిగా పరిశీలిద్దాం. పూర్వం కంథుడనే ముని ఘోర తపస్సు చేస్తున్నాడు. దానిని చెడగొట్టడానికి ఇంద్రుడు ప్రమేలోచననే తన 'కొలువులంజియిను పంపాడు. ఆ అప్పరస 'మేఘమండలిలోనుండి మెరుపుతీగలాగ వచ్చింది. మునిని మదనాతురుణ్జి చేసింది. అతడు పాలతి కెమ్మోవి చవిచూచి పొదలు గుబ్బ గద్చి పాలిండ్లు గదియంగ గౌగిలించి సురత సుఖముల దనినోప జొక్కకున్న గాని పుష్పాస్తుచే బ్రతుకంగ జాల. (విష్ణు. 2-21) ననుకొన్నాడు. ఆమెకు తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఇలా అన్నాడు. తరుణి నీచేత మదన తంత్రంబు లెలుగ గోరి యున్నాడ నాయాస కొంచెపడక యుండ సురత సుఖాంభోధి నోలలార్చి యింపు సౌంపార నన్ను మన్నింప వలయు. (విష్ణు 2-21) అమె “నామీద మీదు మిక్కిలి మేలు కలిగింది. దేవర ఊడిగం ఇచ్చ వచ్చినట్లు మీ చిత్తం ఎట్లుంటే అట్లు నడుచుకొంటానని చెప్పింది. వారు నూరు సంవత్సరాలు క్రీడించారు. ఆమె ఇంద్రుని కొలువుకు వెళ్ళిపోతానంది. 'నీవు వచ్చి ఎన్నాళ్ళయిందేం 12. విష్ణుపురాణం - వావిళ్ళీముద్రణ (196) పీఠిక పుట-9

వెన్నెలకంటి సూరన్న 173

ఎంతకాలమైన నీరీతి మీ తోడ

గలసి మదనకేళి సలుప నాకు

దగదు లంజెగాని యొగి నీకు భార్యగా

నది యెజింగి నన్ను ననుపవలదె. (విష్ణు 2-228)

వాళ్ళు ఇంకో ఇన్న్యూరు సంవత్సరాలు క్రీడించారు. “నేను అప్సరసను కనుక అమరలోకానికి వెళ్ళక తప్పదంది.' అప్పుడు ఆ ముని ఇలా అన్నాడు.

మొల్ల సుగంధి నామనసు మోహము నాలుడి వెట్టి నీవున

న్నొాల్లక వీడ నాడెద వయో తగవా మగవారి చిత్తముల్‌

వుల్లసిలంగ జేయ బొరపెచ్చము లాడంగ నాడువారికే

చెల్లును జెల్లదో వ్రతము చెడ్డ సుఖంబును దక్కదయ్యెగా. (విష్టు- 2 - 234) ఇలా చెప్పిన ముని కొన్నాళ్ళకు 'మదనభూతావేశం' దిగిపోయాక “నీవల్ల నా తపస్సు చెడీంది. ఇంక ఉండవలదు. పొమ్ము. పోకుండి తేని యిష్పుడ శపింతు' అన్నాడు. ఆమెకు చెమటలు కమ్మాయి. వణుకుతూ పోతున్న ఆ ప్రమేలోచ| చెమటల నుండి మారిష అనే అడువిడ్డ పుట్టింది. ఈ కథను చంద్రుడు ప్రచేతసులకు చెప్పాడు. ఆ మారిషను వరప్రసాదంవల్ల ఆ పదిమందికి ఇచ్చి ఉమ్మడిగా పెళ్ళి చేయించాడు.

పురాణ గాథలలో అత్యంత ప్రాచీనమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటిని కథనం చేస్తూన్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మోతాదు మించతూడదు. వెన్నెలకంటి సూరన్న ఈ పురాణ గాథను కొంత ప్రబంధరీతిలో చెప్పడానికి ప్రయత్నించాడు. “ఓహో; అన్నట్టు లేకపోయినా 'అబ్బే' అని పెదవి విరిచేటట్టూ ఈ కథనం లేకపోవడం గమనించదగ్గ విషయం.

ఇక తారాశకాంక చరిత్ర చూద్దాం. చంద్రుడు బృహస్పతి దగ్గర శిష్యునిగా చేరాడు. గురునకు, గురుపత్నికి అధిక భక్తి కొనసాగంగ పరిచర్యలు చేశాడు. ఒకనాడు గురుడు దేవేంద్రుని యాగం నిమిత్తం దేవలోకానికి వెళ్ళాడు. చంద్రుడు వినయవర్తనుడై ఉన్నా తారకు అతని రూపం చెప్పరాని వలవంతలు చేసింది. ఆమె పంచసాయకు మోహన బాణంలాగ ఇంట్లో మెలగసాగింది. చంద్రుడు మదనాతురుడయ్యాడు. అమె సౌభాగ్యోచిత శృంగార కళాశ్రీ చాతుర్యాలకు చిక్కాడు. ఆమె తూడా సమేలపు మేలమాడసాగింది. ఒకనాడు ఏకాంతంలో

మేలము లాడుచుం దన సమీపమునన్‌ విహరించుచున్న య

బ్బాలిక గుబ్బ చన్నుగవపై యర జారిన యుత్తరీయపుం

జేలము పట్టి రాదిగిచి చెక్కలు నొక్కుచు బుజ్జగించి హే

రాళము లైన మోహపు విరాళి తనంబుల నాతడిట్లనున్‌

తరళాక్షి నీతిశాస్త్రము

లిరవుగ గురువలన బెక్కులెటిగితి నింకన్‌

గురుపత్ని వైన నీచే,

వరుసన్‌ మరుశాస్త్ర మెరగవలయున్‌ నాకున్‌. (విష్ణు - 6-21, 22)

174 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఆమె అందుకు సమ్మతించింది. ఆ ఇరువురూ అన్యోన్య సరస సంభోగంబుల వలన బొక్కి వర్తించుచుండేవారు.

చిక్కులు పడ్డ వెండ్రుకలు చిక్కినలంగిన కమ్మపూవులుం

జక్కెర మోపులుం గుసుమ సాయకు ముద్రలు చిల్లుగందపుం

బక్కులతోడి దేహములు పాయని మోహములున్‌ సమంబులై

చొక్కపు జార దంపతులు చూడ టబకాశతనొంది రెంతయున్‌ (విష్ణు-6- 27) “మన సంగతి బయటపడుతూంది. ఇంక ఇక్కడ మనకు ఉండతగునా' అని చంద్రుడు అడిగాడు.

ఎక్కడి మగ డెక్కడీ బ్రతు

కెక్కడి సంసార చింత లేటికి నాకు

దక్కక నీ బిగి కౌగిట,

నొక్కటియె రతుల సలుపకుండిన జంద్రా.

నీ వెంట దోడు నీడై,

నే వచ్చెద పొమ్ము నీకును నాకున్‌

దైవంబు లంకె సేనెను

బైవాత్సక పంచశరుడు సాక్షిగ మనకున్‌. (విష్ణు- 6 - 31, ౩) చంద్రుడు ఆమెను లేవతీసుకొని తన లోకానికి వెళ్ళిపోయాడు. బృహస్పతి వచ్చి తన భార్య ““వ్యభఖిచారితనంబున చంద్రువెట మారు మనువు” వెళ్ళిపోయిందని తిలుసుకొన్నాడు. ఇంద్రుడి దగ్గర మొరపెట్టాడు. చంద్రుని వద్దకు మహాత్ములలోన తపసులు కొందరు రాయబారం వెళ్ళారు. దేవేంద్రుడు తన కోపాన్ని చంద్రునికి చెప్పమన్నాడు. చంద్రుడు అపహాస్యం చేశాడు.

కాయజు చేత గాసిబడీ గౌతము భార్యకు బోయి కొక్కరో '

కోయని తోడి కూత లొగి గూసి మునీంద్రుని చేత శప్పుడై

పోయిన వజ్రి మేటి దొరవోలె బృహస్పతి పత్నికై ననున్‌

రోయగనాడ నేల తన రోతలు లోకము వారు నవ్వనన్‌. (విష్ణు - 6 - 41) తర్వాత బ్రహ్మ “నేను చెప్పానని చెప్పండి అని రాయబారులను పంపాడు. వాళ్ళూ విఫలులయ్యారు. చంద్రుడు “తన్ను పుట్టించిన దైవమైననను డీకొని ఈ పని మాన్చనోపునే” యన్న పట్టుదలతో ఉన్నాడు. ఖివుడు ఉగ్రుడయ్యాడు. చంద్రశేఖర, చంద్రులకు ఘోర యుద్ధమైంది. చివరకు బ్రహ్మ అమర గంధర్వాప్సరోపయుక్తుడై వచ్చి ఆ యుద్దాన్ని ఆపీంచాడు. తారను బృహస్పతికి ఇప్పించాడు. ఆమె గర్బవతి. బృహస్పతి అమెను చూసి “మదీయ క్షేత్రంబున నన్యవీర్యం బుదయించు నిక్కుమారుని విసర్జించి రమ్మ'న్నాడు. '“పతివచనం బలంఘనీయంబగుట చేసి యహ్సరమ=పతివ్రత యిషికా స్తంభ మధ్యంబున నక్కుమారుని గనియె”' (విష్ణు. 6-54). పుట్టిన బిడ్లను చూశాక వీడు

వెన్నెలకంటి సూరన్న 175 నా కొడుకంటే నా కొడుకని గురువూ, చంద్రుడు దెబ్బలాడుకొన్నారు. ఎవరికి కన్నావో చెప్పమని దేవతలూ, మునులూ అడిగారు. ముందు సిగ్గుపడ్డా “వీడు చంద్రుని కొడుకే అని తార చెప్పింది. బృహస్పతి కుమారుని యందు మోహం విడిచాడు.

మలిరాయల యుగంలో వెన్నెలకంటి సూరన్న అరవై పై చిలుకు గద్య పద్యాలలో చెప్పిన ఈ తారాశశాంకాన్నే కడపటి రాజుల యుగంలో, మధురలో నున్న శేషం వెంకటపతి 758 గద్య పద్యాలలో హృదయమున్న శృంగార కావ్యంగా మలచాడు. వెంకటపతి మీద సూరన్న ప్రభావం లేనేలేదని చెప్పాలి. ఈ విషయంలో కాకపోయినా ఇంకో విషయంలో వెన్నెలకంటి సూరన్న నాయక రాజుల యుగంలోని కవులకు దారి చూపెట్టాడనిపిస్తుంది. తన పోషకుని శృంగార లీలలుగాని, అతని కుటుంబంలోని వాళ్ళ భోగలాలసత్వాన్ని గాని కీర్తించడం మలిరాయల యుగంలో ప్రారంభమైంది.

వెన్నెలకంటి సూరన్నను పోషించిన రావూరి రాఘవరెడ్డికి ఇద్దరు తమ్ముళ్లున్నారు. చిన్న తమ్ముడు లక్ష్మయ్య ““చేతోజాతోపమాన శృంగార కళా చతురుడు.” కృతిపతి వంశ వర్ణనలో చిట్టచివర సందర్బం ఉన్నా లేకపోయినా ఈ లక్ష్మయ్య జాణతనాన్ని రాణ తెక్కించేటట్టు రెండు పద్యాలలో సూరన ఇలా వర్జించాడు.

చెంగటి బోటి కత్తియలు, సిగ్గులు రేచగ లేతనవ్వుతో

దొంగలి తెప్పలన్‌ వలపు దూకొన బయ్యెద కొంగు జారగా

ముంగిటి మేడపై జిలుక ముద్దులు చూచుచు నిల్చియున్నయ

య్యాంగన నిన్న రాత్రి బసవాధిపు లక్ష్ముని గూడెనే చెలీ (విష్ణు - పీఠిక - 74)

రసికపుమాటలన్‌ మనసు రంజిల జేయగా నేర్చునీగులన్‌

దిసిడితనంబు లేదు వలపించి యలంపడు మోహనాకృతిన్‌

బసగన జాణరాయడని పల్కిన దల్లికి గూడ దక్కటా

బసవయ లక్ష్యునిన్‌ రతుల చాయుట కంతుని బాయుటే చెలీ. (విష్ణు - పీఠిక - 75) ఈ బాపతు పద్యాల ధోరణి నాయక రాజుల యుగంలో విజయ రాఘవ నాయకుని మీదా, ఇతరుల మీదా కోకొల్లలు, మచ్చుకు రెండు చూడండి :

రాజానిభాననా! సరసులరాలవు జబ్బుగ నల్లినావదే

మే జడ? యింతకంటె వలెనే? వలనొప్పు విగించి యల్లవే

యో జవరోల! వేజెపని యున్నది; దోసమె దోసమె మహా

రాజగునట్టి యవ్విజయ రాఘవు మై చిగురాకె కోమలీ!

తులికెద వేటికే చెలియ తుంచెడు మానెడు గాను నెల్లవా

రలు వినినారలే; విజయ రాఘవ రాయడు నిన్ను గూడుటల్‌

వలపులె చాటుచున్నవి జవాదియు నల్దవు విజ్ఞివీగగా

వలెనటె చూచి యోర్తురటె వంతులు జంతులవేటి యెమ్మెలీ?

(చాటుపద్యమణిమంజరి -8 171, 172)

176 సమగ్రాంధ్ర సాహిత్యం = రెండవ నంపుటి ఈ బాణీ పద్యాలకు వెన్నెలకంటి సూరన లాంటి ఆద్యులే బోణీ చేసినట్టు కనబడుతుంది. ఆనంతర కవులకు ఒక విధంగా తాను మార్గదర్శకుడయితే తాను తన పూర్వ కవులను అనుసరించక పోలేదు. శ్రీనాథుడు భీమఖండంలో *“మమ్ము రక్షించు గోదావరమ్మూ యెపుడు' అని భావించే మునులు ఇలా అంటారని అన్నాడు. గోదావరి? గోదావరి? గ్రోదావరి యంచు బల్కు గుణవంతులకున్‌ గోదావరి తల్లీ! సంపాదింక్షువు గదమ్మ నీవు భవ్య సుఖంబుల్‌ (ఖీమ - 4 - 16) ఈ పద్యాన్ని మనసులో పెట్టుకొనే వెన్నాలకంటి సూరన్న జైలోక్య పావనియైన గంగానదిని ఇలా కీరించాడు. గంగానదిః గంగానదిః గంగానది యనుచు రేపకడ మేల్కనుచున్‌ గంగానది ప్రణుతించిన మాంగల్య సుఖంబులెల్ల మనుజుల కొదవున్‌ -(విష్ణు- ౩ - 191) ఒక్క శ్రీనాథునికే కాదు, అతని సమకాలికులను తూడా సూరన్న అనుసరించాడు. జక్కన విక్రమార్క చరిత్రను రచించి తమ వెన్నెలకంటి వారిలోనే ఒక పూర్వీకునికీ అంకీతమిచ్చాడని సూరన్నకు తెలుసు. ఆ (గ్రంథాన్ని చదివాడు. జక్కన తన కృతిపతిని కీర్తిస్తూ ఇలా చెప్పాడు. సాబగుమై గనువిచ్చి చూడనేర్చిననాడె సుజనుల గరుణ తో జూడనేర్చె మువ్వంబు దళు కొత్త నవ్వనేర్చిన నాడె నయమార్గహీనుల నవ్వ్ననేర్చె నడుగెత్తి యల్లన నడవనేర్చిననాడె ననచి ధర్మము త్రోవ నడవ నేర్చె లలి దొక్కు బల్కులు పలుక నేర్చిన నాడె పరికించి సత్యంబు పలుకనేర్చె బ్రాయనేర్చిన నాడె సద్వర్ణసమితి నర్థినర్థులు ప్రబల వబ్రాయంగ నేర్చె బాల్యమున యంద బహుకళా ఫ్రొడి మించె జరయశోహారి జన్నయసిద్ధ శౌరి (విక్రమార్క. 1- 49) సరిగ్గా ఇదే పద్ధతిలో సూరన్న తన కృతిపతి అయిన రాఘవరెడ్డిని కూడ ప్రస్తుతించాడు. చూడనేర్చిన నాడె చూడంగ నేర్చెను గవిగాయకుల యిండ్ల గలిమి గలుగ నవ్వనేర్చిన నాడె నవ్వంగ నేర్చెను ధనలోభులైన దుర్మ నుజపతుల బలుక నేర్చిననాడె బలుకంగ నేర్చెను సుజనసమ్మతముగా సూనృతంబు నడవ నేర్చిననాడె నడవంగ నేర్చెను మహనీయ మగు ధర్మ మార్గమునను జదువ నేర్చిననాడె తా జదువ నేర్చె న ద్యాగ సిద్ధాంత వేద్యంబు లైన కథలు రాయవేశ్యా భుజంగుండు రవ్యుకీర్తి రతుడు రావూరి బసవయ రాఘవుండు (విష్ణు - పీఠిక - ౪)

వాసీరాబు రామయ్య 177

రావూరి రాఘవరెడ్డి సంగతికేంగాని వెన్నెలకంటి సూరన్న మాత్రం చదవనేర్చిన నాడే ప్రాచీన కావ్యము చదవనేర్చాడని చెప్పవచ్చు. ముఖ్యంగా తమ వెన్నెలకంటివారికి సంబంధించినవి విడిచిపెట్టి ఉండదు. తమ వంశంలోని పూర్వ ప్రసిద్ధులకూ, తనకూ ఎటువంటి బంధుత్వం ఉందో అతడు చెప్పిన పద్యాలవల్ల మనకు విశదం కావడం లేదుగానీ ఆ వంశంలోని అనంతర కవులు మాత్రం సూరన్నకూ, తమకూ గల బంధుత్వాన్ని సవిస్తరంగా చెప్పారు. సూరన్నకు ఆరు తరాల అర్వాచీనుడు వెన్నెలకంటి వెంకటాచలం అన్నకవి కృష్ణవిలాసం అనే కావ్యంలో తమ వంశవృక్షాన్ని సూచించాఢు.

మన సాహిత్యలోకంలో పూర్వంనుంచే కాక ఇటీవల ఇతర పుస్తక ప్రపంచంలో తూడ వెన్నెలకంటి వారిది తరచుగా వినబడుతున్న ఇంటి పేరే.

వాసిరాజు రామయ్య స౦ప్రదాయప్రకారం మనకు పద్దెనిమిది పురాణాలు, పద్ధెనిమిది ఉపపురాణాలు వున్నాయి. అయితే నిజంగా లెక్కపెట్టడానికీ మొదలుపెడితే 22 మహాపురాణాలు, 34 ఉపపురాణాలూ తేలుతాయి. స్థలపురాణాలకు లెక్కీలేదు. మహా పురాణాలలో నారదీయం, ఉపపురాణాలలో బృహన్నారదీయం అనే వైష్ణవ ప్రశంసాత్మకమైనవి ఉన్నాయి. వీటిలో నారదీయాన్ని పిల్లలమర్రి పినవీరభద్రుడు తెనిగించాడు. అది అలభ్యం. ఇందులోని పద్యాలలో ఏ ఒక్కటీ మచ్చుకు తూడా డొరకదు.! బృహన్నారదీయాన్ని వాసిరాజు రామయ్య అఆంధ్రీకరించాడు. అందులోని మూడు పద్యాలను ఒక ప్రాచీన సంకలనకర్త తన గ్రంథంలో ఉదాహరించాడు.* పెదపాటి జగ్గన సంకలనంతోపాటు వీటిని కలిపి వేటూరి ప్రభాకరకాస్త్రిగారు ముద్రించారు. ఈ పురాణం నారదసనత్కుమారుల సంవాదరూపకమైన రచన. ఇందులో గంగావతరణ కథ ఎక్కువగా ఉంటుంది. పష్టాహయులకు ఓడీపోయి బాహునృపతి అడవులు పట్టడం, అక్కడ అతడు మరణించడం, గర్చవతిగానున్న అతని భార్య సహగమనం చేయబోవడం, జౌర్వముని వారించడం, సగరుడు జన్మించడం, పెరిగి అశ్వమేధం తలపెట్టడం, దానికి విఘ్నం కలగడం, సగరపుత్రులు భస్మమవడం, భగీరథ ప్రయత్నాలు, గంగావతరణం మొదలైన సన్నివేశాలన్నీ వివరంగా ఉంటాయి. ఈ ప్రధాన కథకు ముందు, వెనక సృష్టి ప్రకారం, భారతవర్దమాహాత్మ్యం, ఏకాదశీవ్రత సమాచరణం, పితృకార్యప్రకారం మొదలైనవి వున్నాయి. ఈ పురాణాన్ని చాలా జటిలమైన శైలిలో వాసిరాజూ రామయ్య వ్రాశాడని ఉదాహరణ పద్యాలవల్ల తెలుస్తున్నది. భగీరథుణ్జి ఇలా వర్డించాడు: గురువు కంచెర్ల కొండమాచార్యులు.. గురువు వంశకర్త ఏకళిలానగరంలో వైష్ణవ మతాన్ని వ్యాపింపజేశాడు. ఈ నారదీయపురాణ అనువాదం సమగ్ర ప్రతి లఖిస్తున్నది - మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలలో ౫416.

  1. అంధ్రపాహిత్యపరిషత్తువారి భాండాగారంలో ఉన్న 'ఉదాహరణ పద్యములు."

178 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి విశ్వంభరాచ క్రవిజయలక్ష్మీఘనస్తనపరీరంభదో స్తృంభయుతుడు బాడబానలశిఖాభంగ భానుప్రభాతో ద్యోతమాన ప్రతాపోజ్జ్వలుండు తుంభీనసాధీశగురుపద్మసంభవస్ఫుట శేముషీకళాభూషణుండు సురసింధుశరద భశు భ్రా భకాద భవి భమస్తిరయశో విశ్రుతుడు విపులకోదండనిర్ముక్తవిశిఖనివ దారుణోద గ్రదహనదందహ్యమాన సమదశా త్రవరాజన్యచటులవిపిన సముదయుండు భగీరథక్ష్యావరుండు (ప్రబంధరత్నావళి, 412) వామనావతారంలో హరి శ్రివిక్రముడై ఆకాశానికి కాలుచాపుతాడు. “ఆ

త్రివిత్రమాకారంబున సకలలోకంబుల నాక్రమించు నవసరంబున తదీయాంగుష్టంబు సోకి

బ్రహ్మాండంబు ఖిన్నంటై తద్వారంబున బాహ్యజలంబు వ్రహించిన నది గంగయనం టబ్రసిద్ధంబు' అయిందని బృహన్నారదీయాన్ని అనువదించిన అర్వాచీనుడు కొత్తలంక మృత్యుంజయుని అవతారికలోని విషయానుక్రమణికవల్ల తెలుస్తున్నది. ఈ గంగను భగీరథుడు సంపాదించాడు. వాసిరాజు రామయ్య గంగను వర్ణిస్తున్న పద్యం ఏదీ లఖించలేదుగాని వేసవి వర్ణన ఒకటి లభ్యమైంది చూడండి.

మల్లికానవసముత్భల్లపాటలపుప్పు వల్లరీసొరభ్యవాసితంబు

కాసారనీరజవ్యాసక్సమధుకరీ రుంకారముఖరితాశాముఖంబు

పద్మాస్తకిరణ ప్రభావలీసంతప్కమానసర్వంసహామండలంబు

దహనహేతిచ్చటాదందహ్యమానదుర్గమఘోరకాంతారసముదయంబు

చటులతరనిర్చరోష్టసంసక్షవాత

శోషితాశేషనిమ్నగాస్తోమజంతు

సంచయంబును నగుఘర్మసమయ మేచి

పర్వెనతిసాంద్రమగుచు దిగ్బాగముల (ప్రబంధరత్నావళి, 411)

ఈ పురాణంలో ఎక్కడా భారద్వాజుని ప్రసక్తి లేదు. అయినా అఆ మహర్షిని టహ్రాంసిస్తూ వాసిరాజు రామయ్య ఒక పద్యం రాశాడు.

అంబోజాసనమానసాంబుజభవుం డధ్యాత్మవిర్యోన్నతా

రంభుం డిద్ధతపోవిశేషమిత ప్రస్ఫీతఘోరాఘసం

రంభుం డంచిత శాంతిసంయుతుడు భారద్వాజమౌనీంద్రుడు

జ్ఞృ్రంభఖించెన్‌ వరసప్తసంయమిజనశ్రేజణీసముద్పాసియై. (ప్రబంధ. 410) ఇతనిదో, ఇతని కృతిపతిదో భారద్వాజగోత్రం కావచ్చు. వంశాన్ని వర్ణిస్తూ మొదట

ఈ పద్యాన్ని వాసిరాజూ రామయ్య వ్రాసివుంటాడు. ఈ మూడు. పద్యాల

౩. మదరాసు ప్రాచ్చలిఖిత గ్రంథాలయంలో బృహన్నారదీయం, ॥246లో వుంది.

వాసీరాజు రామయ్య 179 శైలినిబట్టి వాసిరాజు రామయ్య తత్సమపదభూయిష్టమైన రచనే చేశాడని భావించవచ్చు. దేశ్యాలు చాలా స్వల్పం. విష్ణుకాంచీమాహాత్మ్యం వ్రాసిన ఆంధ్రకవి రామయ్యా, ఇతడూ ఒక్కరో, వేరో అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు అనుమానించారు. ఇద్దరూ ఖిన్న వ్యక్తులే. ఆంధ్రకవి రామయ్య రచన ఇంత తత్సమపదాలమయం కాదు. అదీకాక ఇద్దర్నీ ఒక సంకలనకర్తే పేర్కొన్నాడు. ఇద్దరూ విఖిన్నులు కాకపోతే రెండు పేర్లు ఎందుకిస్తాడు? వాసిరాజు రామయ్య కృతి దొరికితే అతని తెలుగు కవిత్వం ఎంత జటిలమైనదో జాత్యముకాని సంస్కృతాన్ని అతడు ఎలా చొలిపేవాడో మరింత ఎక్కువగా తెలుస్తుంది. చెందలూరి చిక్కయ్య శ్రీనాథుని బావమరిది దగ్గుపల్లి దుగ్గన్న “నాసికేతోపాఖ్యానం' వ్రాసి చెందలూరు మంత్రులలో ఒకడైన అనంతయ్యగారి గంగయ్యకు అంకితం ఇచ్చాడు. “చెందలూరువా*రనే ఇంటి పేరు గల చిక్కయ్య ఒకడు అదే నాసికేతోపాఖ్యానాన్ని ఆ తరువాత రచించాడు. దుగ్గన్న వంటి ప్రసిద్ధుడు వ్రాసిన కావ్యాన్ని, తన ఇంటీపేరున్నవారే అంకితం పుచ్చుకొన్నదాన్ని చిక్కయ్య మళ్ళీ ఎందుకు అనువదించాడో తెలియదు. అయితే ఇతడు వ్రాసిన కావ్యం తూడా దుగ్గన్న రచనలాగే బహుళ ప్రచారం పొందింది. వాస్తవానికి పెదపాటి. జగ్గన తన ప్రబంధ రత్నాకరంలో చిక్కయ్య బ్రాసిన నాసికేతోపాఖ్యానం నుంచే పద్యాలు ఉదాహరించాడు. కాని దుగ్గన్నను స్మరించనేలేదు. పోనీ, దుగ్గన్న సంగతి జగ్గన్నకు తెలియదని అనుకోడానికి కూడా అస్కారం లేదు. ఏమంటే, దుగ్గన్న వ్రాసిన శివకాంచీమాహాత్మ్యం నుంచి రెండు పద్యాలు జగ్గన్న ఉదారించాడు. దుగ్గన్న రచించిన నాసికేతోపాఖ్యానమే చెందలూరి చిక్కయ్య పేరుతో ప్రచారం అయిందేమో అని ముందు భ్రమించినా, రెండు గ్రంథాలూ వేరు వేరని పరిశీలన వల్ల _ తేలుతుంది. ప్రబంధరత్నాకరంలో చిక్కయ్య పద్యాలని చెప్పినవి దుగ్గన్న గ్రంథంలో లేవు. అయితే ఈ ఇద్దరూ ఒకటే మూలాన్ని చూశారనీ, ఒకే పద్ధతిలో అనువాదం చేశారనీ సంవాదఘట్టాలవల్ల తెలుస్తున్నది. - తూడా అలాగే చేసినట్టుంది. పెళ్ళి ప్రయత్నాల వర్ణన ఒకటి లభించింది. చూడండి. రాజితరత్నదర్భణతోరణంబుగడు శోభితములైన కలువడముల మానితకనకరం భాస్తంభపంక్తుల భాసురోజ్జ్వల పతాఠాసమృద్ధి న కసపసకనసపనటనపకుడ నన పస క కస ల 4. _ప్రబంధరత్నావళి పీఠిక, పుట 16,

180 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నిర్మలస్ఫురితమాణీక్యకుంభంబుల మెండైన చిత్రంపు మేలుకట్ల దనరు నగరంబు సుతనిరంతరవిభూతి నతిశయంబుగ దగ నలంకృతు లొనర్చి బహుపదార్థంబు లొడగూర్చి పరిణయమున కాయితము సేసి రంత వా రనుపమముగు (ప్రబంధరత్నావళి, 140) పెళ్ళితూతురును అలంకరించడంకూడా ఒక సీసపద్యంలో చిక్కయ్య ఇలా వర్ణించాడు: బహువిధ పరిమళభరీతోదకంబులజెలువంబు శోఖిల్ల జలకమార్చి కబరిభారంబున గన్నై చెంగలువలు పసమీర గొనలుదోపంగ జెరివి తీండ్రించు పసిడిదీధితులచే నమరెడునవరత్నమయభూషణములు దొడిగి మృగమదము గుంకుముంబును మేళవించి గంధసారంబుమైదీగె గలయ నలది శ్రీలు మెరయంగ బరిణయోచితముగాగ సఖులు శైసేసి తెచ్చి చంద్రముఖిని (ప్రబంధరత్నావళి, 139) పెండ్లి భోజనాలను చిక్కయ్య ఒక్క సీసపద్యంలో వర్ణించాడు. ఆతమృతోపమానంబులగు నన్నములతోడ బహువిధశాకసూపములతోడ =. బాయసాపూపజాంబాలికంబులతోడ విమలహయ్యంగవీసములతోడ షాడబంబులతో రసావళ్ళతోడను ఘనశర్క రాపానకములతోడ కదళికా ద్రాక్షాదిమృదుఫలంబులతోడ వడియాలతోడ బచ్చడులతోడ ట్రకటముగ దుగ్ధమథితత క్రములతోడ ప్రియము దళుకొత్త షడ్రసోపితముగను భాసురంబుగ నారగింపంగ జేనె నా రఘుక్షోణివిభుడు బ్రాహ్మణులనెల్ల, (ప్రబంధరత్నావళి, 137) ఇందులో బ్రాహ్మణులకే చిక్కయ్య వడ్డించాడు. దుగ్గన్న్యు పాపం తన నాసికేతోపాఖ్యానంలో బంతిపాపం లేకుండా సక్తల జనులకు రెండు సీసపద్యాలలో విందు చేశాడు. పీటలు వేయించి, గంధాక్షత లిప్పించి, పరిమళోదకంతో చేతులు కడిగించి, బంతిబంతికి తాటాకు విసనకర్రలు సరఫరా చేయించి దుగ్గన్న ఘనంగా పెళ్ళి భోజనాలు పెట్టించాడు, చూడండీ: వరుసతో పెట్టిన పరమహాసనముల సుచితక్రమంబు నుండబనిచి కర్పూరకుంకుమకస్తూరికావాసితములైన గంధాక్షతము లొసంగి కరగృహీతములైన పరిమళోదకములు పలుచగా జిలికించి పట్లుచేసి రమణీయనవరత్నరజతచామీకర రచితంబులగు హారములు వెట్టి

చెందలూరి చిక్కయ్య 181 నవనవోశీర తాళవృంతములువిసర- బంక్తిబంక్తికినింతులుపంచిపెట్ట సంభృతములైన సకలభోజ్యములుదెచ్చి- సూపకారులు వడ్డింపజొచ్చిరంత. శాలో్యోదనంబులు సద్యోఘృతము లొల్పు బప్పు... టముల్‌ పాయసంబు లప్పడంబులు వడియంబులు గలవంటకములు దాలింపులు గమ్ముతూర లంబళ్ళు వడిదంబు లామ్లరసంబులు తినెలు శర్కర లానవాలు పానీయములు పక్వఫలము లిక్షురసంబు పచ్చళ్ళు తిఖరులు పానకములు ద... వణమూరుగాయలు దక్రములును, వలసినట్టులు వడ్డీంపజెలగి చెలగి చవులుప్రస్తుతి సేయుచు సకలజనులు నారగించి రసాధారణాదరమున (నాసికేతోపాఖ్యానం, 2:218-219) ఏమైనా దుగ్గన్న శ్రీనాథుని బావమరిది. శాకపాకాలూ, వంటా, వడ్డనా వర్ణించడంలో శ్రీనాథుని మించిన తెలుగుకవి మరొకరు లేరు. దుగ్గన్న బావగారి శుశ్రూష చేసినందువల్ల కొంత ఒంటపట్టింది. చిక్కన పెళ్ళిభోజనాలింకా వర్ణించాడో ఏమో, జగ్గన్న ఒక్కటే ఉదాహరించాడు. నరకాన్ని చూసివచ్చిన తరువాత నాసికేతుడు అక్కడి వింతలన్నీ వర్ణించి తండ్రికీ, తక్కిన మునులకూ చెప్తాడు. ఏఏ పాపాలు చేస్తే ఏఏ నరకాల పడతారో వివరిస్తాడు. చిక్కయ్య ఎటువంటి పుణ్యాలు చేస్తే ఈ నరకాలను తప్పించుకొనవచ్చో తూడా వివరించినట్టుంది. చూడండీ ఈ పద్యం: లక్ష్మి గొల్హాపురి లంక శాంకరి విశాలాక్షి గాశికను వింధ్యమున దుర్గ గన్య గన్యాకుబ్ద గామరూపంబున గామాక్షి గాంచిని గామకోటి మండలి బుండ్రక మాణిక్య దత్తవాటమున నార్యావర్తకమున ద్రిపుర జాలంధరంబున జ్వాల హేమచ్చత్రపురి మహాయోగ శ్రీగిరిని భ్రమర విరజవిరజహుంకృతి పీఠ(?) సింహ ళమున నరసింహికనుగాళ్మిరమునవాణీ నుజ్జయిని మహాకాళిని నున్నతముగ జూచువారలు జముపురి జూడ రెందు. (ప్రబంధరత్నావళి, 141) చిక్కయ్య నాసికేతోపాఖ్యానంలో చెప్పిన ఇటువంటి పుణ్యాలు దుగ్గన్న కూడా కథనం చేశాడేమో తెలియదు. అతని గ్రంథం కొంతమటుకే మనకు దొరికింది. చిక్కయ్య పద్యాన్ని ఇంకోదాన్ని దుగ్గన్న కావ్యంతో శైపారు వేస్తే మరొక సమాన ఘట్టంలోనిదని తెలుస్తుంది. నరకలోకానికి ఒకసారి నారదుడు వస్తాడు. అతని రాకను వర్ణించిన దుగ్గన్న పద్యం శిథిలమైంది. ఈ చిక్కయ్య పద్యం మాత్రం దొరికింది. ప్రాలేయ కిరణవింబస్ఫూర్తి దలపించు విశదంపు దనుకాంతి దిశలు వ్రాక జిగినిండదొలకెడు చిగురుటాకులసౌంపు వాటించు ఘనజటా భరముమెరయ కాంచన మాంజీవికాసంబు గెడగూడి చెలువుసూపుచు మృగాజినము దనర గమనీయ కోమల కరపయోరుహమున బ్రకటింతంబగు విపంచిక దలిర్చ

182 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

హరికథాలాపశో ఖితమైనయట్టి

యాననమ్ము బ్రసన్నత నలరుచుండ

గగనమున నుండి సమవర్తి కడకు వచ్చె

సమరసంయమివరుడు విద్యాగురుండు (ప్రబంధరత్నావళి, 1౫)

ప్రతిప్రబంధంలోనూ విధిగా ఉండే పురవర్దన ఒకటి చిక్కయ్య నాసికేతో పాఖ్యానంలో కూడా ఉంది.

వారణ పట్టణాన్ని వర్ణిస్తూ అతడు వ్రాసిన పద్యాన్ని సంకలనకర్త ఉదాహరించాడు.

వర్ణితప్రాకార వప్రరత్న ప్రభావ్యూహ కిమ్మీరిత వ్యోమతలము

వివిధవాదిత్ర భైరవ రావపూరిత ప్రవిమానతరదిశా భాగసమితి

బహుళ దంతావళ ప్రాలంబు ఘంటికాటంకృతోల్లాసి ఘంటాపథంబు

కమనీయరూహేఖా కళావిభ్రయ ప్రకటితాబ్దాననా రత్న పేటి

సహజ ధర్మార్థ కామమోక్ష ప్రసిద్ధి

సన్నుతౌదార్య ఖేలనా జన్మభూమి

__సకలసంపద్పిలాస విస్తారహసిత

రాజరాజపురంబు వారణపురంబు (ప్రబంధరత్నావళి, 142)

ఈ ఆరు పద్యాలూ తప్పించి చిక్కయ్య కావ్యం మనకు దక్కలేదు. అది దొరికితే దుగ్గన్న కావ్యంలోని అసంపూర్ణ కథాభాగం ఏమిటో తెలుసుకొనేవాళ్ళు.

దుగ్గన్న వబ్రాశాక, మళ్ళీ అదే కావ్యాన్ని చిక్కయ్య అనువదించపవలసిన అవసరం ఏమిటో, ఇతనికీ, దుగ్గన్న కృతికీ ఏమి సంబంధమో బోధపడేది.

అసలు ఈ చెందలూరి వారికీ, ఆ చెందలూరివారికీ ఇంటి పేరు బాదరాయణ సంబంధం తప్ప మరేదీ బంధుత్వం లేదేమో.

దుగ్గన్న వ్రాసిన నాసికేతోపాఖ్యానాన్ని అదే శతాబ్దంలో ఇంకొక రచయిత కూడా

బ్రాశాడనీ, అది సంకలన కర్తలు గుర్తించేతంట ప్రొఢంగా ఉండేదనీ మాత్రమే ప్రస్తుతానికి

చెప్పుకోగలం.

కానుకొలను అన్నమరాజు .

సంస్కృత శృంగార కావ్యాలలో అమరుకం చాలా ప్రసిద్ధమైనది, ప్రాచీనమైనది. ఇందులో ఉన్న 101 శోకాలలో ఏదో ఒకటి అనువదించో, అనుకరించో తన కావ్యంలో చొప్పించుకోని తెలుగుకవి లేడు. ఒక్క తెలుగుకవులేగాదు; సంస్కృత కవులు కూడా అందులో సుప్రసిద్ధులే. సూర్యశతకం వ్రాసిన మయూరుడు ఈ అమరుకంలోని రెండవ శోకాన్ని పూర్తిగా అనుకరించాడట.! మయూరుడు క్రీ.శ 606-630 ప్రాంతాలలో ఉన్నవాడు. శ్రీహర్జుని ఆస్థానకవి. అమరుక కావ్యం ఈ కాలానికి ముందే సుప్రసిద్ధమై ఉండాలి. దీని కర ఎవరో తెలియదు.

అయితే ఈ కావ్యాన్ని శంకరాచార్యులవారు రచించినట్టు లోకం చెప్పుకుంటుంది. మండనమిశ్రునితో వారు వాదించిన సందర్భంలో మిశ్రుని భార్య ఉభయభారతి అడిగిన ప్రశ్నలకు స్వానుభవంతో సమాధానాలు చెప్పాలని ఆదిశంకరులు తలచారట. అమరుకుడనే రాజు మరణిస్తే ఆ బొందెలో పరకాయ ప్రవేశు చేసి అమరుకుని రాణులతో క్రీడించి అప్పుడు. కల్గిన శృంగారానుభూతులను ఈ ముక్తకాలుగా " ఆదిశంకరులు చెప్పారట. ఇది ఉట్టి కట్టుకథే అయినా చాలా సుప్రసిద్ధమైంది.

అయితే అమరుక కావ్యాన్ని అమరుకుడనే కవే వ్రాసినట్టు ఈ శతకానికి వ్యాఖ్యానాలు వ్రాసిన పెదకోమటి వేమారెడ్డి, అర్జునదేవవర్మ మొదలైనవారి వ్రాతల వల్ల తెలుస్తున్నది , అమరుకానికి సుమారు ఇరవై వ్యాఖ్యానాలు ఉన్నాయట, పెదకోమటివేమారెడ్డి బ్రాసిన “శృంగార దీపిక అనే వ్యాఖ్యానంతో చెదలువాడ సీకారామశాస్తులు గారు తెలుగుటీక జతచేర్చి అమరుకాన్ని 1865లో, అంటే నూరేళ్ళ కిందట ప్రచురించారు. కళాప్రపూర్ణ వేదం వెంకటరాయశాస్త్రిగారు సంపూర్జాంధ్ర వ్యాఖ్యానం వ్రాసి ప్రచురించారు. ఈ శతకాన్ని ఎందరెందరో తెలుగు భాషలోకి అనువదించారు. వారిలో ప్రప్రథముడు కానుకొలను అన్నమరాజు. ఈ తొలి అనువాదం మన దురదృష్టవశాత్తూ నేడు లభ్యం కాదు. అయితే తన కాలంనాటికి ప్రసిద్ధమైన కావ్యాలలోంచి రత్నాలు సేకరించిన ఒక ప్రాచీన సంకలన గ్రంథకర్త కానుకొలను అన్నమరాజు - వ్రాసీన. అమరుకంలోంచి రెండు పద్యాలను స్వీకరించాడు. ఈ సంకలనసంధాత పెదపాటి జగ్గనకన్నా ఇరవై సంవత్సరాలు ప్రాచీనుడు.' ఇతని పుస్తకం "ఆంధ్రసాహిత్య పరిషత్తువారి భాండాగారంలో '“ఉదాహరణ పద్యాలు' అనే పేర ఉంది. దానిని పెదపాటి జగ్గన పుస్తకంతో కలిపి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు * ప్రబంధరత్నావళి అనే పేరున ప్రచురించి దేశానికంతో ఉపకారం చేశారు.

ప్రబంధరత్నావళిలో పొందుపరిచిన రెండు అమరుక పద్యాలూ ' కృత్యాదిని కానుకొలను అన్నమరాజు చెప్పిన ప్రార్థనా పద్యాలు. ఒకటి అమరుకంలోని తొలి శ్లోకానికి అనువాదం, మూలాన్న్నీ, తెనిగింపునూ చూడండి 2 సంస్కృత వాజ్మయ చరిత్ర - మల్తాది సూర్యనారాయణ శాస్త్రిగారు, పుట 30. 3. ప్రబంధరత్నావళి - వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, పీఠిక పుట3 . "

184 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి జ్యాకృష్టి బద్ధకటకాముఖ పాణిష్ఫృష్ణ ప్రేంఖన్నఖాంశు చయసంవళితో మృడాన్యాః త్వాం పాంతు మంజిరత పల్లవకర్ణ పూరలోభ భమద్ర్రృమరవిభ్రమభృత్కటాక్షాః (అమరుకం, 1) పార్వతీదేవి బాణం సంధించింది. నారిమీద బాణం పెట్టి పట్టుకొనే హస్త విన్యాసాన్ని “కటకాముఖం' అంటారు. కటకాముఖపాణిర్బై బాణాన్ని సంధించి గురిచూస్తూ చెవిదాకా లాగినప్పుడు కడగంటి చూప్పువ్య్భమీదే ఉంటుంది. పార్వతీదేవి కంటి చూపు తుమ్మెదలాగ ఎర్రని గోళ్ళ కాంతి పూవుబమీద తిరుగుతూందట. అటువంటి పార్వతీదేవి కటాక్షించి నన్ను కాపాడాలి అని మంగళాచరణం. దానిని కానుకొలను అన్నమరాజు ఇలా అనువదించాడు: చులుకనజాపముం దిగుచుచో గటకాముఖ పాణిమీద బె లాలయు నఖాంశులం గదిసి యొప్పెడు కెంజీగురాగుత్తిచే నలవడికర్ణపూరముననంటిన తుమ్మెదవోని పార్వతీ లలనకటాక్షదృష్టి మసలం జరితార్థుల జేయుగావుతన్‌. (ప్రబంధ. 5) రెండవ పద్యంలో అన్నమరాజు త్రిపురాసురసంహారిగా శివుని ఊహించి అతని రథాన్ని ఇలా వర్ణించాడు: తివిరి రాశికి నెక్కి తిరుగు చక్రంబులు మెట్టులబదిలమై మెఅయుతేరు బహుముఖంబుల నేర్చు పచరించు సారథి వ్రాసి చూపగరాని వారువములు గట్టియై వీక నక్కరదీర్చు నిలుగమ్మి శ్రుతిహితంబుగ మోత చూపునారి విజయానుకూలమైై విలసిల్లు బాణంబు... దనకు నబ్బుటయును పురత్రయము గెలిచి పృథుల విఖ్యాతి గైకొన్న రథికవరుడు జయము దేజంబు భూతియు వ్రియమెలర్చ మనల గరుణా విధేయుడై మనుచుగాత. (ప్రబంధ రత్నావళి, 6) కానుకొలను అన్నమరాజా క్రీ.శ. 1500 ప్రాంతంవాడో, అంతకు పూర్వుడో చెప్పగలంగాని అతను ఎక్కడివాడో, ఇంకా ఏమేమి గ్రంథాలు వ్రాకాడో తెలియదు. దక్షిణ భారత శాసన సంపుటాలు ఒక దాంట్లో క్రీ.శ 1494 సంవత్సరంలో హంపీక్షేతంలో వేసిన ఒక శాసనం ఉంది. అందులో 'కాముంగొలని సూరపరాజో అన్నయ్యకొడుకు అన్నయ్య అనే పేరు కనబడుతుంది ఇతడే అమరుకం తెనిగించిన అన్నమరాజు అని నిడుదవోలు వెంకటరావుగారు గుర్తించారు. “అయితే ఈ శాసనమును కానుకొలనువారి కనువర్తింపజేయ వీలులేదు” అని చాగంటి శేషయ్యగారు అఖిప్రాయపడుతున్నారు* 4. దక్షిణ భారత శాసనసంపుటి, 4వ సంపుటం, నెం, 271 5. భారతి, 16వ సంపుటి, 21-వ పుట; 6. అంధ్రకవితరంగిణి, 9వ సంపుటి, పుట 2౫.

భానుకవి 185

“కానుకొలను అనే ఇంటిపేరున్నవారు నేడు బందరులో ఉన్నారు, 'కానుకొల్లు' అనే గ్రామం కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలో ఉంది. అన్నమరాజు ఈ ప్రాంతంవాడు కావచ్చు. క్రీ.శ.1494లో భాస్కరక్షేత్రమైన గుత్తిలో ఉన్న “కాముంగొలను' వారికీ, ఇతని ఇంటి పేరుకూ ఏమిటి సంబంధమో భావిపరిశోధనలవల్ల గాని తెలియదు.

తెలుగులో మొట్టమొదట అమరుక కావ్యాన్ని అనువదించినవాడుగా అన్నమరాజు మనకు స్మరణీయుడు.

భానుకవి

తమకు కావ్యాలను అంకితమిచ్చిన కవులకు అగ్రహారాలను ఇవ్వడం సామ్రాజ్యాధిపతులతూ, సామంతులతూ, మహామండలేశ్చరులకూ, నాయంకరాలుగల వారికి చెల్లిందనుతోవచ్చుగాని, అంతఃపురాలలో నాట్య సంగీత విద్యలకు ఆచార్యుడైన ఒక విద్వాంసుడు తనకు కృతి ఇచ్చిన కవికి కర్పూరసమేతంగా తాంబూలం, జాంబూన దొంబరాభరణాలు, చామరాందోళికా విభవాలు మాత్రమేకాక ఏకభోగ గ్రామాలు ఇచ్చాడంటే అది చెప్పుకోదగ్గ విషయమే. ఇది మలిరాయల యుగంలో జరిగింది. కృతిపతి పేరు భండారు లక్ష్మీనారాయణ, కృతికర్త పేరు భానయ్య లేక భానుకవి. కృతిపేరు పంచతంత్రం.

భండారు లక్ష్మీనారాయణ సామాన్యుల కొలువులో వున్న భరతాచార్యుడు కాడు. సామ్రాజ్యాధిపతి శ్రీ కృష్ణదేవరాయల వారి కార్య భారధౌరేయుడుగా ఉంటూనే సంగీత నాట్య విద్యలలో తన నేర్పును చూపించాడు. ఇతడు సంగీత సూర్యోదయమనే లక్షణ గ్రంథాన్ని రచించాడు. దీనిని 'లక్ష్మణభరత'మని పేర్కొంటారు. ఇతని తండ్రీ విట్టలయ్య కూడా విద్వాంసుడు. గుజరాతులోని మండ్యా పాలకుడైన సుల్తాన్‌ ఘియాజుద్దీన్‌ ఈ చిట్టట్టయ్యకు మూడువేల తులాల బంగారాన్ని ఇచ్చాడంటే అతని విద్వత్తూ ప్రభురంజకత్వగరిమా తెలుస్తుంది! ఈ విట్టలయ్యే “గజపతి మెప్పించి కనకఘంటలు గొని విద్యాప్రవీణత వినుతికెక్కి'” అని. భానుకవి కీర్తించాడు. (పంచతంత్ర-128). భండారు లక్ష్మీనారాయణకు సూక్ష్మలిఖితాచార్య. రాయబయకార, తోడరమల్ల, అభివ్‌భరతాచార్య అనే బిరుదులున్నాయి. కృష్ణదేవరాయలు ఈయనను మెచ్చి బంగారు పాలకీ, రెండు ముత్యాల గొడుగులూ, మదగజాలు, వైభవాన్ని సూచించే మలహరీవాద్య గౌరవాన్ని రాజాంతఃపుర నాట్యవిద్యాధిపత్యం ఇచ్చారు. ఈ సంగతులను లక్ష్మీనారాయణ తన 'సంగీత సూర్యోదయం'లో సగర్వంగా చాటుకొన్నాడు. భరతుని నాట్యశాస్త్రమే ఆధార గగ్రంథమైనా దత్తిల కోహళాచార్యులు మతాలను కూడా ఇతడు సుటీకలతో తెలుసుకొన్నాడు. తాండవ లక్షణంలో భరతుడు నూట ఎనిమిది కరణాలను చెప్పాడు. అందులో కట్టకడపటి దాని పేరు గంగావతరణం. భండారు లక్ష్మీ నారాయణ

  1. సలలిత! నెబాటరంగంిత నాశ! - 80332806 - [164 90001 - 1983 - ఊర కథ6ంం ౯ 06

186 సమభ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ కరణం పేరు మార్చేసి దానికి “కృష్ణావతరణం' అనే అఖిధానాన్ని పెట్టి సూర్యోదయం'*లో అప్పటిదాకా ఇతరులెవ్వరూ చెప్పని కొత్త విషయాలున్నాయని మానవల్లి రామకృష్ణకవిగారు. తేల్చారు... 'ఈ లక్ష్మణ ఇభోరతం' వ్రాతప్రతులే తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయంలో “మతంగ ఖొరత' మనే పేరుతో ఉందని కవిగారే గుర్తించారు. తన కాలంనాటి “గజలు' మొదలైన ఉత్తర హింద్తూస్థానపు సంగీత విషయాలను కూడా లక్ష్మీనారాయణ చెప్పాడు.

కృష్ణదేవరాయలవారి దగ్గరకు రావడానికి ముందు లక్ష్మీనారాయణ “నానా మహేశ 'మహితాస్థానా'లలో జేగేయమానంగా ఉన్నారు (పంచ 1-44). ఇతడు సప్తసంతానా 'లలో ఒకటైన కృతి ఆచంద్ర సూర్యతారళమై నిలుస్తుందని తన ఆశ్రితుడైన తిప్పయ్యగారి భానయ్యను పిలిపించాడు. కవికి వరవాగ్వైఖరి, లక్షణజ్ఞతా, పురాతన సుకావ్య ప్రొఢిమ ఉన్నాయని ఏదైనా ప్రబంధం చేసి అంకితమీయమని సత్కరించడమే కాక ఏకభోగంగా గామాలు ఇచ్చాడు. భానయ్య పంచతంత్రాన్ని తెనిగించాలని నిశ్చయించాడు.

"తెలుగు సాహిత్యంలో తొలిరాయల యుగంలోనే దూబగుంట నారాయణ పంచతంత్రాన్ని చెప్పాడు. దాన్ని చూసి అందులోని కొన్ని పద్యాలను మెచ్చుకొని వాటిని స్వీకరించి భానయ్య అయిదు ఆశ్వాసాలలో అయిదు తంత్రాల కథలనూ చెప్పాడు. గ్రంథపాతాలవల్ల కావ్యం అక్కడక్కడ నష్టమైనా ప్రస్తుతం 738 గద్యపద్యాలు ఉన్నాయి. ఈ గ్రంథం అచ్చుపడింది.*

ఈ కావ్యంలో ఏమంత గొప్ప కవిత్వం లేకపోయినా నాసిరకం రచన కూడా కాదు. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఒకటి ఉంది. కృతిపతిని అశ్వాసం మొదటా, చివరా సంబోధించడం ఆచారం. భానయ్య తన కావ్యంలో ఎక్కడ నీతులు చెప్పినా ఆ పద్యాలను కృతిపతి సంబోధనతోనే వాడాడు. మూలంలోనూ, ఇతర కవుల 'పంచతంత్రానువాదాలలోను లేని మరొక విశేషం ఇతని కావ్యంలో ఉంది. మోసాన్ని మోసంతోనే జయించాలన్న విషయాన్ని కథనం చేసే “రాజకీరము-గణిక' అనే కథను

ఒక రాజుగారు తమ ఊళ్ళోవున్న ఒక వారకాంతను కలలో కలుసుకొని _ కశాయజుకేళిలలో అనుభవించాడు. నిద్రలేచాక తన స్వప్నృప్రకారం పురోహితులకు చెప్పి తర్వాత ఆ దోష పరిహారం నిమిత్తం దానాలు ఇచ్చాడు. ఈ వార్త ఊళ్ళో పొక్కింది. ఆ వారకాంత రాజు కొలువులోనికి వచ్చి “తమకు తెలియని తగవు ఏముంది, నేను నిద్దురకు వేయి గద్దెంబలు పుచ్చుకొంటాను. విటులందరూ అలాగే ఇస్తారు. తమరూ ఇవ్వాలి” అని చెప్పింది. రాజు డోలాందోళనలో పడ్డాడు. రాజుగారి చిలుక ఉపాయం చెప్పింది. అద్దం తెప్పించమంది. దానిముందు ధనం ఉంచమంది. కలలోని సుఖానికీ అద్దంలోని సౌమ్ము పుచ్చుకోమని సాని కూతురుకు చెప్పింది. సభ నివ్వెరపోయింది. 2. ఖానుకవి : పంచతంత్రం 142428 ౦౪౫గా౧౭౧[ 0౧౭౧1౫ బండ ంటి 5ంగజ 110.19 - 14864 -

  1. న

భానుకవి 187 వారకాంత చిలుకమీద పగపట్టింది. దానిని వండుకు తింటానని ప్రతిజ్ఞ చేసింది. ఈ శపథం నెరవేరేదే గాని చిలుక అసాధ్యురాలు మోసాన్ని మోసంతోనే గెలిచింది.

భానయ్య ఈ కథను 22 గద్యపద్యాలలో ముక్తసరిగా చెప్పాడు. ఈ కథనే కదిరీపతి తన శకసప్తతిలో 92 గద్యపద్యాలలో చాలా రసబంధురంగా చెప్పాడు (తృతీయ 5 నుండీ జవ నెం. పద్యందాకా).3

ఈ ఘట్టం కథనంలో భానయ్య అనవసరపు వర్ణనలు చొప్పించనందుకు సంతోషించాలి. పగబట్టి రాజుగారి చిలుకను చంపదలచిన వారకాంత ఒక పన్నాగం పన్నింది.

ఆరమణీ నృత్య విద్యా

పారీణత నొక్కనాడు పాఠకాసురసం

హారుని సూర్యష్థ్రీ క్రియ బెం

హారగ మెప్పించే దబ్బనాధిప ముఖ్యున్‌. (పంచ - 1-37)

భానయ్య ఇంతటితో సరిపెట్టాడు. ఇంకొక కవి అయితే తన కృతిపతి నూత్చ, భరకాచార్భుడు కనుక ఈ ఘట్టంలో ఆ సానికూతురు ఎన్న రకాల నాట్యం చేసిందో చెప్పేవారు. భానయ్య ఆ జోలికి పోలేదు.

“కావ్యగుణ సంపాదనము నందు కన్న... నీతులు పొందుపరచుట యందే ఇతనికి దృష్టి ఎక్కువ. ఇలా అనడం వల్ల ఇందులో కావ్యగుణాలు కొరవడ్డాయని కాదు. వాటికోసం ప్రయత్నం లేదని భావము” అని ప్రాచ్చ లిఖిత గ్రంథాలయ పండితులు చెప్పింది అక్షరాలా నిజం.

ఏది ఏదయిడేనేం, ఎటివంటి కవిత్వం చెప్పి కృతి ఇస్తాడో తెలియక ముందే భండారు. లక్ష్మీనారాయణ తన అత్రితుడైన భానయ్యకు “ఏకభోగంగా గ్రామాలు' ఇచ్చాడు.

“కావలచిందీ రంభ తా మునిగింది గంగ అనే సామెతలో 'తా అందింది కృతి లాలా. 3. ఈ సంగతి ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో పండితులుగా ఉన్నప్పుడు మల్లంపల్లి శరభిశ్వర శర్మగారు

మొదట గుర్తించారు.

తెనాలి రామకృష్ణుడు (క్రీ.శ. 1500 సంవత్సరానికి ఐదారేళ్లు కొంచెం కుడిఎడంగా తెనాలి గ్రామంలో గార్లపాటివారి కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళంతా శివభక్తులు. మంచి పండితులు, చక్కని కవులు. గార్లపాటి రామయ్యగారూ, లక్ష్మణయ్యగారూ పెరుకెక్కినవారు లచ్చనగారు స్వయంగా దాత, నుతవిధాత. ఆయన కీర్తిని, సద్బక్తిని పాటలను పరులు ప్రశంసించేవారు. పాల్కురికి సోమనాథుని తరువాత అంతటి వైభవం ఈయన కుండేదని చెప్పవచ్చు. పరమశివాచార పబచక్రవర్తి అయిన పాల్కురికి సోమనాథుని నుతించాక పోసెట్టి లింగకవి పాటికెక్కిన గార్లపాటి లక్ష్మణునే తన నవచోళ చరిత్రలో పేర్కొని నమస్కరించాడు. లచ్చనగారు వీరభద్ర విజయం అనే కావ్యాన్ని వీరరస ప్రాధాన్యంతో రచించారు. ఈ సంగతులు నవచోళ చరిత్రవల్ల తెలుస్తున్నాయి.

వీరభద్రేశుని విజయసాహసము - వీరరసంబుగ విరచించి తానె

దాతయ్టై కవులకు ధాత్రిలో - నుతవిధాతర్టై మదిరినెరదాతర్లై మిగుల

బాటల సద్బక్తి పరులు నుతిసీయ - బాటికెక్కిన గార్లపాటి లక్ష్మణుని

వెలయుగా నుతియించి విజ్ఞానమునను - గలుగునాదిమ శివకవుల భజించి

(నవచోళచరిత్ర, 1:79-82)

బహుశ గార్లపాటి లక్ష్మణుని అన్నగారైన రామయ్య పంతులుగారు తెనాలి

రామలింగేశ్చరస్వామిని ఆరాధించేవారు. శుక్లనామ సంవత్సర మాఘశుద్ధ పంచమీ

గురువారంనాడు రామలింగేశ్చరుని ఉత్సవ విగ్రహాన్ని రామయ్యగారు చేయించారు. ఆ ఆలయంలోని ఉత్సవ విగ్రహపీఠంపై ఈ శోకం నేటికీ ఉంది.

శ్రీతెనాలినగరే వ్యరాజయ ద్వార్లపాటి పురరామపండితః

శుక్షమాఘసితపంచమీగురౌ రామలింగమునుయోత్సవాకృతిమ్‌.

ఈ రామయ్యగారి భార్య పేరు లక్కమాంబ. ఈ దంపతులకు కల్లిన మొదటీ సంతానానికి రామలింగేశ్చరుని పేరే పెట్టుకొన్నారు. శుక్షపక్ష చంద్రునిలాగ పెరిగే కుర్రాడీకీ శుక్షయజుర్వేదం చెప్పించారు. పాలగుమ్మి ఏకేశ్చరునివద్ద' అతడు విద్యాభ్యాసం చేశాడు. వేదంతోపాటు కావ్యాలు, నాటకాలు, అలంకారాలు చదువుకొన్నాడు. రామలింగు కవిత్వం చెప్పసాగాడు. గ్రాంథికసన్నుత ప్రతిభ గాంచాడు. రసజ్ఞతలో మించాడు. అదేమ గ్రంథాలు ఉగ్గడించాడు. ఫణిరాట్సరికల్పిత శాస్త్రవీధికి బంధువై సత్కవులను ప్రార్థించాడు. సమగ్రసహజి సాహిత్య మాధురీ సంయుతాత్ముడయ్యాడు. బహువేదవివేక పవిత్రభావ సంకలితాలైన వాక్యాలతో కావ్యాలు చెప్పడం నేర్చాడు. *“కుమారభారతి అనే విరుదుకు తగినంత పాండిత్యం సంపాదించాడు.

ఇ ప్రాలసాని లీ వేటూరి. ప్రభాకాస్తగారాచద్భటారాధ్యచరిత్ర. పీకలో ఉదాహరదాడ

తెనాలి రామకృష్ణుడు 189 నాలుగంచుల నవయౌవనం రాగానే రామలింగం తన స్వగ్రామానికి దగ్గరలో ఉన్న కొండవీటికి వెళ్లాడు. అప్పుడా దుర్గాన్ని అప్పాజీ తిమ్మరుసయ్యగారి మేనల్లుడు నాదెళ్ళ గోపమంత్రి భద్రోద్యోగిగా పాలిస్తూ ఉండేవాడు. ఈయన బాగా చదువుకున్నవాడు. కవి. గయోపాఖ్యానాన్ని 'కృష్ణార్ణున సంవాదం' అనే ద్విపద కావ్యంగా వ్రాశాడు. ఈ గోపమంత్రి దగ్గర ఉద్యోగులు కూడా విద్యావంకులే, సాహిత్యప్రియులే. వీళ్ళలో ఊర దేచయ్య ముఖ్యుడు. ఈయన గోపమంత్రికి రాజకార్య నిర్వాహకుడు. రసనాగ్రజాగ్రదశేష విద్యాసందర్పుడు. ఈయన నాల్కమీద అన్ని విద్యలూ ఆడుతూ ఉండటానికి కారణం: ఆయన లొల్ల లక్ష్మీధరపండితుని శిష్యుడు. గురువుల కటాక్షంవల్ల శివపంచస్తవికి దేచయ్య వ్యాఖ్యానం వ్రాశాడు. లక్ష్మీధరుడు గజపతుల ఆస్థానంలో ఉన్న మహాపండీతుడు. ఆ వైదుష్యాన్ని మెచ్చుకొన్న కృష్ణదేవరాయలవారు. అత్తవారింటినుంచి అరణంగా ఆయనను విజయనగరం తెచ్చుకున్నారు. కర్ణాటక సామ్రాజ్యంలో కొందరు లక్ష్మీధరుని శిష్యులైనట్టున్నారు. దేచయ్య తన వ్యాఖ్యానంలో ఇలా చెప్పాడు: సచాయం దేచయామాత్యో మహిమ స్తవపంచకమ్‌ లక్ష్మీధరకటాక్షేణ కురుతే గురుతేజసా. పండితులతో కొంతకాలం గడుపుతూ ఉండేవాడు. ఈయన తెనాలినుండి వచ్చిన యువకవిని చూశాడు. మెచ్చుకొన్నాడు. దేచమంత్రికీ, రామలింగానికీ కొంత బంధుత్వం కూడా ఉంది. గార్లపాటివారికీ, ఈశ్వరపైగ్గడవారికీ సంబంధ బాంధవ్యాలున్నట్టు ఊహించవచ్చు. గార్లపాటి వారికా ఇంటి పేరు రావడానికీ ముందు వారు ఈశ్వర పైగ్గడ వారి వంశంగా పేరుకెక్కారట. అయితే ఇది సందేహాస్పదం.! గార్లపాటి వారికి ఈశ్చరపైగ్గడవారు బంధువులనే చెప్పాలి. దేచమంత్రి తండ్రి అన్నయ్యమంత్రి ఈశ్వర ప్రైగ్గడవారి ఆడపడుచును పెళ్ళి చేసుకొన్నాడు. ఈ బంధుత్వాన్ని పురస్కరించుకొని రామలింగం కొండవీడువెళ్లి దేచమంత్రిని చూశాడు కాబోలు. దేచమంత్రి రామలింగని కవిత్వం విన్నాక అతనిచేత ఒక కావ్యం చెప్పించి అంకితం పుచ్చుకోవాలనుకున్నాడు. దేచయ్య కూడా శివభక్తుడే. శివునికన్నా కివభక్తులి గొప్పవారనే వీర్జైవుడు. శివభక్తులందరిలో ఉద్బటుడు గొప్పవాడు. అతని కథను చెప్పమని రామలింగాన్ని ఇలా పురమాయించాడు: హరభక్తులందురు నుద్ధట - గురుడధికుడు తత్రసిద్ధ గుణమణిగణవి స్ఫురణాఖిరామమును నీ-వ రచింపుము కావ్య మొకటి వర్ణనకెక్కెన్‌. (ఉద్పటా. 1-29) 2. ఊరదేచమంత్రిది కౌండిన్యస గోత్రం గార్లపాటివారిడీ అదే గోత్రం ఈ ఇంటిపేరు రావడానికీ ముందు వాళ్ళకు ఈశ్వరపైగ్గడవారనే పేరుంటే వారిదితూడా అ గోత్రమే అవుతుంది అయితే, ఊరవారూ ఈశ్వరపైగ్గడవారూ సగో త్రీకులై, వీరి పిల్లలను వారు పెళ్ళిళ్ళు చేసుకొనడానికి ఆస్కారం ఉండదు. దేచమంత్రి తల్లి ఈశ్చరపైగ్గడ మల్లనగారి కుమార్తె కృష్ణమాంబ. (ఉద్భట. 1-2)

190 సమీగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దేచమంత్రి ఉదృటయ్య కథనే చెప్పమనడానికి వేరే కారణం కూడా ఉంది. అతనికి ముదిగొండ చంద్రశేఖరారాధ్యుడు దీక్షాగురువు. ఈయన ఉద్బటుని సంతతి వాడట. తన గురువుగారి మూలపురుషుని కథను సహజ్ఞైవాచారపరాయణునిచేత కావ్యంగా బ్రాయించాలనే కోరిక ఉండడం సహజమే. అందుకే ఈ చరిత్ర బ్రాయడానికి రామలింగమే తగినవాడని దేచయ్య అనుకొన్నాడు. విలసదయాతయామబహువేదవివేకపవిత్రభావసం కలితములైన వాక్యముల గావ్యము చెప్పగ నేర్తు వాదికా వ్యుల కవితానిగుంభనసమున్నతి గాంచినవాడ వౌదు నీ వలఘువచోవిలాససుగుణాకర రామలింగసత్కవీ! (ఉద్బటా. 1-2౫) దేచయ్య నియమించిన తరువాత రామలింగం ఉద్పటాచార్యుని చరిత్రను ౪1 గద్యపద్యాలలో మూడాశ్వాసాల కావ్యంగా వ్రాశాడు. నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులకు ఈ కథ చెప్పాడని రామలింగం వివరించాడు. తొలి కావ్యం కనుక వర్ణనలు గుప్పించాలనే ఉబలాటం మరీ ఎక్కువ “నైమిశారణ్యం... అని ఎత్తుకొంటూనే ప్రబంధ ధోరణిలో వర్ణనకు ఉపక్రమించాడు. అచలసుతాభర్త కర్పించి మరికాని మృగములు వేబూరి మేయ వచట అసమలోచనునకు నర్చించి మరికాని యళులు క్రొవ్విరొడేనె లానవచట అంధకధ్వంసికి నర్చించి మరికాని కోయిల చిరుగురాకు గొరుక వచట అంగజారాతికి నర్చించి మరికాని చిలుకలు పండ్లు భుజింప వచట తక్కుగల జంతువులు శంభుదలచికాని యుచితవర్తనముల గోరియుండ వచట వదనములు వేయి గలయంతవానికైన నాయరణ్యంబు గొనియాడ నలవి యగునె? (ఉద్బటా. 1-౫) ఈ నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు చెప్పిన ఉద్చటుని కథ చాలా చిన్నది. పూర్వం కైలాసగిరివద్ద వసంతకాలంలో (రామలింగం ఊరుకుంటాడా? వసం వర్ణన చేశాడు) పార్వతీపరమేశ్వరులు విహారం చేస్తున్నారు. అక్కడకు గంధర్వ ముఖ్యుల తొందరు వచ్చారు. వాళ్లు 'తేటవెన్నెల మించు తెరచిరాజనిపించు అకలం! హారవల్లికలతో'' ఉన్నారు (ఉద్చటా. 1-97). ఈ గంధర్వులు క్రొవ్వెక్క పార్వతీపరమేశ్వరుల ఏకాంతాన్ని కూడా లక్ష్య్రపెట్టలేదు. ఈశ్వరునికి కోపం వచ్చిందీ వాళ్ళను పిశాచాలు కమ్మని శపించాడు. నిజానికంతకన్నా ఎక్కువ శాపమే ఇవ్వా అయినా చంపగలిగియు నొక్కింత చలము మాని విషమనయనుండు పులినాకివిడిచినట్లు “ చావుతోడుత తోడైన చటులఘోర కష్టరూపంబు వారికి గలుగబేయు. (ఉద్బటా.1-1ట

తెనాలి రామకృష్ణుడు 191 అ గంధర్వులకు ప్రాణాలు తలకెక్కాయి. “పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయవచ్చా? శాపవిమోచనం చెప్పు'మన్నారు. శివుడు కరుణించి చెప్పాడు. “ ఆర్యావర్తంలో రెండవ కాశీ అయిన పల్లకీపురంలోని రుద్రభూమిలో మీరు కొన్ని దివ్య సంవత్సరాలు కాచుకొని వుండండి ఆ నగరంలో ముంబభోజుడనే రాజు జన్మిస్తాడు. అతని గురువుగా ముదిగొండ ఉద్పటారాధ్యుడు ఆగమిస్తాడు. ఆయన కాలగతి చెందినప్పుడు అతని చితాగ్నీ ధూమాల నాష్రాణించగానే మీ పిశాచరూపాలు పోతాయి” అని కివుడు చెప్పాడు. శాపగ్రస్తులైన గంధర్వులను తీసుకొని వాళ్ళ రాజు చిత్రరధుడు పల్లకీపురానికి వెళ్లి ఏళ్లూ పూళ్లూ, కాచుకొన్నాడు, ఒకనాడు అతడు ఆహారం కోసం వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి శృశానం చిన్నబోయింది. మిగతా పిశాచాలన్నీ వెళ్లిపోయాయి. ముంజభోజుని గురువు కాలధర్మం చెందాడు. అతని చితినుండి ధూమాలు క్రమ్ముకొన్నాయి. ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి. “అందరి శాపాలూ కడతేరాయి. నా గకేమిటి' అని చిత్రరధుడు విలపించాడు. గురువుగారు పోయారన్న వల్లమాలిన దుఃఖంతో వల్లకాటిదగ్గరే తద్చాడుతున్న ముంజభోజుడు ఈ ఏడుపు విన్నాడు. జాలి పొందాడు. అదేపనిగా శివుణ్ణి ధ్యానించాడు. ప్రత్యక్షమయేదాకా మాననని పంతం పట్టాడు. దేవుడు దిగి వచ్చాడు. భక్తుణ్ణి కరుణించాడు. పిశాచానికి విమోచన కలిగించాడు. దేవునితోపాటు ఉద్బటారాధ్యులవారు కూడా కూడా వచ్చారు. ఆయనను మరికొన్నాళ్లు భూమిమీద ఉండి మతప్రచారం చేయమని దేవుడు ఆదేశించాడు. ఆయన విశ్వనాథుని ఘర్మజలాన అవతరించారు. ముదిగొండ వారి వంశానికి మూలపురుషులయ్యారు.

ఈ కథను 842 గద్యపద్యాలలో చెప్పనక్కరలేదు. వాస్తవానికి పాల్కురికి సోమనాథుడు ఉద్బటుని కథను 38 ద్వాపదలలో చెప్పాడు. సోమనాథుడు వ్రాసిన కథను తెనాలి రామలింగం చదివాడు. ద్విపదలలోని కొన్ని మాటలను పద్యాలుగా చెప్పాడు కూడా. తోటి పిశాచాలు విముక్తులై వెళ్లిపోయాక గంధర్వపతి ద్విపదలో ఇలా విచారించాడు:

ఎలమి నొక్కటిసాల కేడ్నూరు భూతములు నుద్పటుని గాలు పాగదాక దడవ

కైలాసము కేగ గతి చెడి తాన - భూలోకమున జిక్కి పౌగిలెద తండ్రీ

గచ్చరండో నంగగాచి నక్కలకు - నిచ్చినయట్లయ్యె నీడితకీర్తి. (బసవ. 7:612:614) ఈ ద్విపదలోని “ఈనగాచి నక్కలపాలు చేయడ'మనే సామెతను రామలింగడిలా పద్యంలో చెప్పాడు:

మోచితి నుగ్రశాపభరముక్‌ శతదివృసమంబు లన్నియు

జూచితి నష్టభోగములు చూచినవారలు నవ్య నుద్చట

శ్రీచరణాంగధూమములు చెందుట గానమి యీసునంతకు€

గాచి వృకాలి కిచ్చిన ప్రకారము దోచె మదీయసిద్ధికిన్‌. (ఉద్బ. 3౩-260) ముష్ఫుయిఎనిమిది రెళ్లు-76 ద్వాపద పాదాలలో సోమనాథుడు చెప్పిన ఉద్బటయ్యగారి చరిత్రను 82 గద్యపద్యాలుగా చెప్పడానికి రామలింగడందులో కొత్త కథలు చేర్చాడు.

192 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ ముంజభోజుని తండ్రి పాలించే ఊరిని వర్ణించడం, ఆ రాజుకు సంతానం లేకపోకే విలపించడం, భార్యాసమేతంగా అతడు కాశీకి బయలుదేరడం, దారిలో కౌండిన్యముని అతనికి 40 గద్యపద్యాలలో కాశీమాహాత్మ్యం చెప్పడం, ఆ చెప్పడంలో మదాలసుడనే పరమ పాపాత్ముడు కాశిలో చనిపోవడం వల్ల ఉత్తమ లోకాలు పొందాడని యథాలాపంగా అంటే అతని కథ చెప్పమని రాజు అడగడం, దానిని కౌండిన్యముని 178 గద్యపద్యాలలో చెప్పడం, తరువాత రాజదంపతులకు ముంజభోజుడు జన్మించడం, అతని పురుడు పుణ్యాలు, ముద్దుముచ్చట్లు, పట్టాభిషేకం, విరక్తి, ఉద్పటయ్యగారి ఉపదేశాలు ఆయన మరణం, పిశాచాల శాపవిమోచనం, ఒంటిపిల్లి రాకాసి ఏడ్వడం - - మొదలైన చిలవలూ పలవలూ పెంచి-రామలింగడు ఇంత కథ బ్రాశాడు.

ఈ కావ్యంలో మదాలసుని చరిత్రమీద కవి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాడు. ప్రబంధాలలో అందరూ వ్రాసే విరహాలూ, ఉపాలంభనలూ, శృంగార విలాసాలూ వర్ణించడానికీ కథ తప్ప ఇంకొకటి రామలింగనికి మరేదీ అనువుగా దొరకలేదు. ఇతడు వర్చించిన మదాలసునికి, కాశీఖండంలో శ్రీనాథుడు వర్ణించిన గుణనిధికి పోలికలున్నాయి. కవిసార్వభౌముడే శివరాత్రి మాహాత్మ్యంలో సృష్టించిన సుకుమూరునికి సాక్షాత్తు తమ్ముడు. మదాలసుని కథ విపులంగా చూద్దాం.

తుంతల దేశంలో రత్నగర్పపురి అనే ఊరుంది. ఆ ఊళో ధీనిధి అనే మహాపండితుడున్నాడు. అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. అతనికి మదాలసుడు అని పేరు పెట్టారు. అతడు పెరిగి పెద్దవాడవుతూ వేదాదికాలైన విద్యావోోషాల పాండిత్యం సంపాదించాడు. చంద్రకళ అనే అమ్మాయి నతనికిచ్చి పెళ్లి చేశారు. నాలుగంచుల నవయౌవనం రాగానే మదాలసుడు మారిపోయాడు.

చతురామ్నాయవిహారముల్‌ మరచె శాస్త్రక్రీడ చాలించె మా

నితపౌరాణిక వాక్యసంశ్రవణముక నిర్దూతముక్‌ బేనె శ్రీ

నుతవాత్స్యాయనకూచిమారమతముల్‌ జూచెన్‌గులాచారసం

గతికిక్‌ దూరముజేసె నెమ్మనమూ డుష్కర్ముండు పారుండొగిన్‌:

(ఉద్బటా. 2-120) నెరవెంట్రుకలు దువ్వి కొప్పుపెట్టి పువ్వులు తురుముకొని విలాస వేషంలో తిరిగేవాడు. జూదమంటే చెవికోసుకుంటాడు. పరధనమంటే అపహరిస్తాడు. పూచిన తంగేడులా ఉన్న పెళ్లాన్ని విస్మరించి పరభామలను మరిగాడు. తల్లి కూతురు మరదలు అనగ చిట్టంటువలల అందరికి ఒక్కవావి చూపి పెచ్చురేగాడు. కానక కన్న సంతానమని తల్లి 'జౌొను, కాదు అనకుండా ఊరుకుంది. వద్దంటే మొండీకెత్తుతాడని తండ్రీ చూసీచూడనట్లు ఊరుకున్నాడు. మదాలసుడు మరీ చెడిచెటాతులయ్యాడు. విటుల తగవులు తీర్చేవాడు. వారసతుల మధ్య కలహాలు పెట్టేవాడు. కోడిపందేలు ఆడేవాడు. కలవారి ఇళ్లకు కన్నం వేసేవాడు. ఊళోవాళ్లు విసిగిపోయారు. అయితే ఏమీ చెయ్యలేకపోయారు.

తెనాలి రామకృష్ణుడు 193

భవ్వ్యుడు తద్దురుండు నరపాలగ్భృహంబున మాన్యుడై సుధీ

నేవ్యగతిం దలిర్చుట బ్రసిద్గుడు గావున ' బ్రాహ్మణో నహం

తవ్య' యటన్న నీతియు సతంబయి చెల్లుట నద్దురాత్కు బా

పవ్యవసాయుజంపుటకు బౌరులు లోగుదు కేమి సేసినన్‌. (ఉద్బ. 2-131)

ఊరివారి తిట్లు విన్నాక మదాలసునికీ అయినవాళ్లు హితోపదేశం చేయబోయారు. తగవుగాదని తల్లి చెప్పింది. ధర్మశాస్త్రాల అంతరార్థాలు, మర్మాలు చెప్పి తండ్రీ వారించాడు. తలొకరూ తలోమాటా అన్నారు. ఏం లాభం?

పిన్న్సవయసున గడుబెంచి పెరుగనిచ్చి-పంపలేరైరి సుతు నాలువర్గమైన

తల్లిదండ్రులు మొలకైనతరినిజెట్లు-వంపబడుగాక పౌచ్చిన వంపనగునె?

(ఉద్చ.2-13)

అందరూ ఏవగించుకొన్నారు. తల్లీ, తండ్రీ ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. మదాలసుడు దేశాంతరం పోవాలనుకున్నాడు. చీకట్లు ఓ అంటే ఓ అనే నడిరేయి! తెగించి శివాలయంలో ఉన్న అనర్హవిభూషణాలన్నీ కొల్లగొట్టి ఎవరూ చూడకుండా పారిపోయాడు. కన్యాకుబ్దం చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్ళపాటు పెద్దమనిషిలాగా చెలామణి అయ్యాడు. ఆ ఊళ్లో కనకలత అనే ఇరవై సంవత్సరాల సానిపాప ఉంది. అది ' ప్రాణసంయుక్టదర్పకబాణం'” గుడిలో ఆ పిల్ల నాట్యం చేయడం మదాలసుడు చూశాడు. మరులు కొన్నాడు. “ఎవరీ అమ్మాయి" అని పక్కనున్న చెలికాణ్జీ అడిగాడు. అతని పేరు పరభావవేది. మదాలసుని భావాలు తెలిసినట్లు నేను పొత్తుపరుస్తానులే అని మాట యిచ్చాడు. ఆ రాత్రి మదాలసునికీ శివరాత్రి అయింది. “గుడి వెళ్ళకుండగ కుదియించి కొనకొంగు పట్టి క్రమ్మర ముద్దువెట్టనైతి' అని విలపించసాగాడు. “ఆలూ లేదు, చూలూ లేదు' అన్న సామెతలాగా ఆ జవరాలు చేజిక్కకుండానే కలలు కనసాగాడు.

ఏనొకవేళ గాడరతి నేడ్డెర లోపల డస్సి దూలినక్‌

మానితచూతపల్లవ సమానగుణాధర సంభవామృతం

బానగ నిచ్చుచుక్‌ గలయ నప్పుదియుక మది నూలుకొల్పున

చ్మూనవతీలలామ దగుమచ్చిక నెన్నుడు గారవించెదన్‌. (ఉద్బ్చ. 2-178) ఇలాగ పాతిక పైచిలుకు పద్యాలలో విరహబాధ పడ్డాక తెల్లారింది. పరభావవేది సానివాడకు వెళ్లాడు. “ఏమి చేయుచు నున్నవారింటివారు, వచ్చితిమి మేము చుట్టాల మిచ్చటికిని'” అంటూ నవ్వుతో లోపలకు వెళ్లాడు. కనకలత తల్లి ఎదురు వచ్చింది. అది జగజంత,

పగలు రాతిరి సేయ పరగంగ రాతిరి పగలుసేయగ గాడు దగిలి పట్ట

నిప్పుక లొడిగట్ట నెరిసందు కల్లిన సావడి కొట్టంబు చంకబెట్ట దివియ

మున్నీరు దెగ నీదమన్ను మిన్నునుగూర్చ మంచును గొలువ ధూమంబు

గన్నుండగా లోని గనుపాప వెడలింప బిట్టు శేషాహి నాకట్టు గట్ట

194 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

రాత దైలంబు పుట్టింప జేతిలోన

సకలజగములు నొక్కట నవదరింప

జాలియేఫ్రాద్దు విటులకు జాలియొసగు

కనకలతమాత మాయూ ప్రకారభూతు. (ఉద్చటా. 2-29) వచ్చినవాళ్ళివరో ఆమెకు తెలుసు. చుట్టరికం కలిపింది. ఇలా చెప్పింది:

మన్నన నా మరందలగు మంజులవాణీకి జుట్టమైన. చి

ట్టన్నమభట్టునందనుడ వల్లుడ వారయ వావి నాకు నీ

వెన్నడు మాగృహంబునకు నేటికి రా విదె నీకు వింతయే

పిన్నవుగాన తూరముల పెంపు దలంపవు గాక భూసురా! (ఉద్బటా. *2-20) 'వానకో, వరపునకో వస్తావు. దేవుని దయవల్ల నీకేం తక్కువ లేదు. మీ పెద్దలలాగ నువ్వు తూడా మాతో చెలిమి చేయాలి” అని ఇంకా ఇలా అంది:

ఓడగట్టిన దూలమై యుండవలయు మీకు మాకును నెవైన మిత్రభావ

మింటికిక్‌ వచ్చుచుక్‌ బోవుచుంట మేలు నీకు మే మెంతవారము నీతి దెలుప!

చేయం జేయగ బొందగు - పాయబాయంగ నెడలు బాంధవ మెందు౯

మీయన్నగారి కైవడి - మాయందుల బొందు నిలుపుమా విప్రవరా।

(ఉద్పటా. 2-211, 22

పరభావవేది తక్కువ తిన్నాడా? “ఇంటికి వస్తే చుట్టాలు, లేకపోతే కారా?' అన్నాడు. “కనకలతను చూద్దామని వచ్చాను. తరువాత ఒక రహస్యం చెప్తాను. నీ కొరతలు తీరుతాయి' అన్నాడు. వేశ్య్వమాత అమ్మాయిని రప్పించింది. “దీనికి తగినవాడీని వయసులో ఉన్నవాడిని, విటుల ధర్మం తెలిసినవాణ్ణి చూసిపెట్టు' అంది. “నేపాలం, మాళవం, అవంతి మొదలైన దేశాల రాజులు కబుర్లు పెడుతున్నారు. నాకు వాళ్ళిచ్చే డబ్బుమీద ఆశలేదు. మనసు, మర్మం తెలిసినవాడికే మా అమ్మాయిని ఇస్తాను” అంది. పరభావవేది 'సెభాషు' అన్నాడు.

మంచిపని జేసితివి నీవు మహిపసుతుల

తోడి జడ్డకు జొరక యో తోయజాక్షి

మనము సంసారులము గాన మనకు దగిన

వారితోడను బొందు ఖావ్యంబు జేయ. (ఉద్చటా. 2-22)

కనకలతను మదాలసునికి దఖలుపరిచాడు. “సానిజననికి తలపు ఠోరికకంటి నినుమడిగ ఇప్పించాడు. మదాలసుడు “మన్మథాద్వైత సుఖవార్ధి మబ్దనమున దోగి పరితాప మంతయు' మరచిపోయాడు. ఎన్నాళ్లు సాగుతుందే?.. బేతిలోనిదంకొ హరించుకుపోయింది.. సొమ్ము కావాలి. వింధ్య చుట్టుపక్కల ఊళ్లు డబ్బుతో మూల్గుతున్నాయని విన్నాడు. తన ప్రావీణ్యం చూపించి ఆ దేశపు రాజుల ధనాగారాలకు కన్నం వేద్దామనుకున్నాడు.

తెనాలి రామకృష్ణుడు 195 కడియును గత్తియు నాచే-వడియుండినయేని పద్మభవునిల్లైనళ వడి జొచ్చి కన్నమున వెస-వెడలింపనె మినుకకుండ వేదండంబున్‌?

(ఉద్బటా. 2-239) బయలుదేరాడు. అయితే అలసిపోయాడు. తిండిలేదు. ఒక చెట్టుక్రింద సొమ్మసిల్లి పోయాడు. అప్పుడా దారివెంట విద్యావాణీభవుడైన ఒక పండితుడు వస్తున్నాడు. ఆయనా దగ్గరలో ఉన్న రాజుగారిచ్చిన దానాలు స్వీకరించి ఆ వజ్రాలూ, వస్తాలూ పట్టుకొని, చిన్నారి కొడుకును వెంటబెట్టుకొని వస్తున్నాడు. సామ్మసిల్లిన మదాలసుణ్జీ జూచి జాలిపడ్డాడు.. నీళ్లు బల్లి సేద దీర్చాడు. ప్రాణదానం చేశాడు. అతణ్ణి చూడగానే మదాలసునికి ఏదో ఆశ పుట్టింది. అతికేటట్టు అబద్ధం ఆడాడు. “జాతికి విప్రుణ్జి, వాదంలో ఓడిపోయి సిగ్గుపడి శాస్త్రపాఠం చేయడానికి పోతున్నాను! అన్నాడు. “నామది తోచుచున్నయది నాయన నీవు దలంప సర్వవిద్యామయమూర్తివంచు' అని చెప్పి తనను ఇష్యునిగా స్వీకరించి శాస్త్రాలు చెప్పమని అర్థించాడు.

కాపురము నాకు గడుపెద్ద కంచియంత

యిల్లు శ్రీ ధాన్యకటకమై హెచ్చు మిత్రు

లరయు దలవెండ్రుకలయంద రచ్చికంబు

లేదు గ్రాసంబునందు నోవేదమూర్తి (ఉద్బటా. 2-258)

ఇలా మదాలసుడు చెప్పగానే ఆ విద్యామూర్తి నమ్మాడు. “నిన్ను నాకొడుకులాగా చూసుకొంటాను" అన్నాడు. పొద్దుపోయింది. చీకటిపడింది. పడుకొన్నప్పుడా పండితుణ్లీ, కొడుకుని చంపి డబ్బు తీసుకొని బయలుదేరాడు. దారి తప్పాడు. కాశీవైపు నడిచాడు. అదృష్టంవల్ల ఆ పుణ్యక్షేత్రం చేరుకొన్నాడు. అక్కడ వాడినొక పాము కరిచింది. ప్రాణాలు పోతున్నాయి. కాశీలో చనిపోయేవారందరికి శివుడు తుడిచెవిలో తారకమంత్రం ఉపదేశం చేస్తాడు. అతడలా చేస్తున్న సమయంలో యమభటులు వచ్చి శివుణ్ణి చూసి పారిపోయారు. యముడే వచ్చాడు. ఎందుకొచ్చావని ఖివుడు అడిగాడు. ఈ మదాలసుడు చేయని _ పాపమంటూ లేదని యముడు ఏకరవుపెట్టాడు.

మొదల ట్రాహ్మణకర్మముల పట్టు వదలించి జారుడై కులటల జంకబెట్టి

తల్లిదండ్రుల మాట తలమీరి వర్తించి కైదువ ధర్ధియించి జూదమాడీ

చోరుడైశంకరు సొమ్ములు దొంగిలి హత్తి వారాంగన పొత్తు దొడగి

గంజాయి భక్షించి కలు దావి నంజుడు నమిలి కృతఘ్నుడై నట్టడవిని

శాంతువేదాంతవిద్యావిచారనిపుణు

నిరపరాధు మహీసురవరుని నతని

పుత్రతుని జంపి తుది నిన్ను బోలినాడు

వీడు నేనేమియనువాడ విశ్వనాథ! (ఉద్భటా. 2-273)

ఇివుడు.. కాశీక్షేతమహిమ.. చెప్తాడు. తుమ్మెదముక్కు అంటితే పువ్వు అరూపమవుతుంది. సిద్ధరసం తాకితీ ఇనుము బంగారమవుతుంది. కాశీలో మరణిస్తే

19% సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పాపకర్ముడు తనలాగ అవుతాడని కివుడన్నాడు. మదాలసుడందుకే ముక్తుడయ్యాడని చెప్పాడు.

ఈ మదాలసుని కథ ఏ పుఠరాణంలోనిదో తెలియదు. ఉద్బటారాధ్యుని చరిత్రలో దీనిని ముడిపెట్టడంతో రామలింగం వేసినది జారుముడే. తన సాహిత్యపు సరదాలు తీర్చుకొనడానికి ఈ కథ నింత విపులంగా వ్రాశాడు. శ్రీనాథుని ప్రభావంలో కథ ననుసరించినా సమకాలిక జీవితాన్ని మదాలసుని కథలో చొప్పించాడు. కనకలత తల్లీ పరభావవేదీ అనుకునే మాటలలో రామలింగని పరిశీలన కనబడుతుంది. మిగకా భాగాలలో కూడా రామలింగకవి వాస్తవికతను చిత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలు తనబడతాయి. అతని కాలంలో పసిపాపల నెలా నడిపించేవారో ఇలా వర్ణించాడు:

అరటిపండున నడుగెత్తు ననఘమూర్తి

చెరకుగోలకు జేసాచు జిన్నితండ్రీ

యనుచు శుద్దాంత కామినీజనులు జెలగి

నడవు దిద్ధంగ నడుచు భూనాథసుతుడు. (ఉదృ్పటా. ౩-౪) పసిపాపల నడకలే కాదు; ప్రభువుల నీతులను కూడా చెప్పించాడు.

గోపకుండావు నల్లన గుస్తరించి - యొయ్య నొయ్యనదుగ్ధంబు లొడుచుకరణి

ప్రజల చిత్తంబు గందనిపగిది నడచి - ధర్మవర్తనమున గాంచు ధనములనఘ

(ఉద్బటా. ౩-91) విపులంగా వర్జించాడు. ఉద్పటయ్యగారు ముంజభోజునికి దీక్ష ఇవ్వడం ఒక పండుగలాగా చేయించాడు. నేల యీనినట్టు దేశికపుంగవులు, దృఢజ్ఞానులు వచ్చారట. వచ్చి ఇలా దీవించారు.

సింధుబల్లహురీతి శ్రీపతిపండితు మరియాద ధూపద మాచిదేవు

నట్లు మహాకాళుననువున నల్లకల్క దబ్రహ్మకేవగక్క యవిధమున

శూలదబ్రహ్మయ్య చొప్పుర బిబ్బబాచనలీల వీరనాచాంకుపోల్కి

కదిరరమ్మయగారి కైవడి దెలుగేశు మహణయ్యచందాన మాచిరాజు

కరణీ మాళిగ మారయ్యగతి దెలుంగు

జొమ్మనార్యుని పడుపున నురియుచౌడు

పగిది బసవేశ్వరుని మాడ్కి భక్తియుక్తి

శంభు బూజించి బ్రదుకు రాజస్యచంద్ర। (ఉద్పటా. ౩-1) నయన పాన నను ౩ హరిభట్టు రచించిన నారసింహపురాణంలోని పదబంధాలవంటివే ఉద్బటారాధ్యచరిత్రలో

_ఉన్నాయని హరిభట్టు రచన చదివిన తరువాతనే రామలింగం ఇది చెప్పాడని ఇటీవల సూర్యదేవర రవికుమూర్‌ నిరూపించారు. (వ్యాససుధ 19౪)

తెనాలి రామకృష్ణుడు 197

ఈ పద్యంలోని వారంతా వీర్జోవులే. వారి కథలను పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో కథనం చేశాడు. తెనాలి రామలింగం అవన్నీ చదివాడు. అయితే సోమనాథుడు వ్రాసినట్టు ఉద్పటారాధ్య చరిత్రను రామలింగం చెప్పలేదు. మార్పులు చేశాడు. బసవపురాణంలోని గంధర్వుడు ఉద్చటయ్య చితిలో ఇంకొన్ని చితుకులు వేయించి పొగ వచ్చేటట్టు చేస్తే చాలు వేళ్లతోబాటు చెట్టు పెకలించుకుని కైలాసం పోతానంటాడు. భోజుడు అలా చేస్తాడు. రామలింగం దానిని మార్చి తివుడే దిగివచ్చేటట్టు ముంజభోజునిచేత పంతం పట్టించాడు. అసలు బసవపురాణంలోనే భోజుడనే ఉంటే రామలింగం ముంజభోజుడని మార్చాడు. ఈ రాజు చారిత్రక పురుషుడే. క్రీశ 10వ శతాబ్ద్టివాడు. ఉద్బటుడీకాలానికి ముందువాడు. క్రీశ. 779 నుండి 813 దాకా కాన్ళీరాన్ని పాలించిన జయాపీడుని సభలో ఉద్బటుడు విద్యాపతిగా ఉండేవాడు. ఇతజణ్జి శిష్యకవిగా తెలుగు కవులు నుతించారు. పండితయ్య తన శిష్యతత్త్వసారంలో ఇలా నుతించాడు:

హరలీలా స్తవరచనా-స్థిరనిరుపమభక్తి దనదు దేహముతోడళ

సురుచిరవిమానమున నీ-పురమున కుద్చటుడు ట్రీతి బోవడె రుద్రా! (శివ 410) ఉదృటుడు హరలీలాస్తవం రచించాడని పండితయ్య చెప్పి నుతిస్తే నన్నెచోడుడు మరికొన్ని కావ్యాల పేర్గు చెప్పాడు.

క్రమమున నుద్పటుడు గవి-త్వము మెరయు గుమారసంభవమ్ము నలంకా

రము గూఢవస్తుమయకా-వ్యముగా హరలీల జెప్పి హరు మెప్పించెన్‌.

(తుమూ. 1-21)

నన్నెచోడుడు చెప్పిన ప్రకారం ఉద్పటయ్య వ్రాసిన గ్రంథాలు మూడు అని కొందరు ఊహించారు. అవి 1. కుమారసంభవం, 2. అలంకారం, 3. హరలీల. కాని ఉచ్చటుడు కుమారసంభవమంతా వేరే రచించలేదు. కావ్యాలంకార సంగ్రహంలోని ఉదాహరణ శోకాలలో గూడంగా కుమూరసంభవమనే హరలీలను అతడు వ్రాశాడని నన్నెచోడుడు 'చెప్పాడని మరికొందరంటారు.! అయితే ఉదృటయ్య హరలీలాస్తవం వ్రాసినట్టుగాని, కాశ్మీరదేశపుకవి అనిగాని చెప్పలేదు. “ఉండె నేయాచార్యమండలేశ్వరుడు భూమండనంబగు ముదిగొండ యందు' అని చెప్పాడు (ఉద్బటా. ౩3-123). నన్నాచోడుని కుమారసంభవంగాని, ఉద్పటుని కావ్యాలుగాని రామలింగం చూడలేదనుకోవాలి; అతడు తన కాలంనాటీ ప్రబంధాలన్నీ చదివాడని చెప్పవచ్చు. మాదయ్యగారి మల్లన రాజూేేఖర చరిత్రలో ఇలా వ్రాశాడు:

నీలకంఠుని కిరసుపై నీళ్లు జల్లి - పత్తి రిసుమంత నెవ్వడు పారపైచు

గామధేనువు వానింటి గాడిపసర - మల్ల సురకాఖి వారింటి మల్లెచెట్టు.

(రాజశేఖ. 1-65)

  1. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు - 'ఉద్పటారాధ్యచరిత్ర' పీఠిక, పుట 17.
  2. తుమారసంభవవిమర్శ- శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారు. పుట 101.

198 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ పద్యభావాన్ని రామలింగం ఇలా అనుసరించాడు: “చల్లనెవ్వాడు ధూర్జటిమీద బుడిసెడు జలము లాతడు సుధాజలధి దేలు,

  • (ఉద్భటా. 1-67) " ముక్కుతిమ్మనగారి పారిజాతాహరణాన్ని కూడా రామలింగం చదివాడనడానికి పరోక్షంగా సాక్ష్యాలున్నాయి. తన కృతిపతి తండ్రీని వర్జిస్తో “సత్యభామా పతిచేత జలనమొంది బలిమిదింపనినాటి కల్చద్రోమంబు' అన్నాడు. (ఉద్భ. 1-38). ఈ కావ్యాన్ని బ్రాశాకే రామలింగం రాజధానికి వెళ్లాడేమో. విజయనగరంలో స్థిరపడ్డాడేమో. ఈ కావ్యాన్ని ఇతడు క్రీ.శ 1525 ప్రాంతాల ముగించాడు. అప్పటికి కృష్ణదేవరాయలవాకి అదృష్టభానుడు పడమటకు వాలుతున్నాడు. రాజ్యంలో అల్లరులు మొదలయ్యాయి. ఆ కిందటేడే రాయలవారి పుత్రుడు మరణించాడు. అప్పాజీపైన అనుమానం కలిగింది ఆయనను బంధించారు. అప్పాటీ కొడుకు పితూరీ చేశాడు. అభియరామరాయలు దాన్ని అణచడానికి వెడుతున్నాడు. ఈ కల్లోల పరిస్థితులలో రామలింగం రాజధానికి వెడికే అతనికి రాజదర్భనం అయినా రాయల కరుణాదృష్టి పూర్తిగా అతనిపై బడిందో లేదో! అస్థాన ప్రవేశం కోసం అతడు ప్రయత్నిస్తూ ఉండి ఉంటాడు. . విజయనగరంలో వుంటున్నప్పుడే రామలింగం మరొక కొత్త కావ్యం బ్రాశాడు. దాని. పేరు "కందర్పకేతువిలాసం." దానిలోని కథేమిటో తెలియదు. ఇప్పుడీ పుస్తకం అలభ్యం. దీనిలోంచి నాలుగు పద్యాలను పెదపాటి జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో ఉదాహరించాడు. కథానాయకుడైన కందర్పకేతుడు ఎవరినో చూసి మోహించాడు. విరహంలో పడ్డాడు. ఇలా తనతో తానో లేక ఇంకెవరితోనో చెప్పుకొంటున్నాడు: . _ అక్కమలాక్షి గన్గొనినయప్పటినుడియు నేమి చెప్పనా న. ..... తెక్కడజూచిన న్మదను డెక్కడ జూచిన రోహిణీవిభుం డెక్కడజూచినం జిలుక లెక్కడ జూచిన గమ్ముగాడ్పులిం . అెక్కడ వెట్ట యోర్వగల నీవిరహరానలకాపవేదనన్‌? (ప్రబంధ 4౫5) "ఆ ప్రీయరాలికోసం గాలిస్తున్నాడు. పద్యాలను, చేపలను, చశ్రవాకాలను. తుమ్మెదలను, హంసలను, పూవుతీగెలను పిలిచి ప్రశ్నిస్తున్నాడు: =... వారిజ మీన కోక యళివర్గ సితచృత సల్లకాపనీ . మీరుచిరాస్య మీనయన మీకుచ మీయలకాలి మీగత్తిన్‌. మీ రమణాంగి మత్చియ నమేయగతి౯ విరహాతురానక్‌ ... మీరును మీరు మీరు మరి మీరును మీరును మీరు గానరే? - (ప్రబంధ. 42) కథానాయకుడిలా వెతుకుతూ ఉంటే చంద్రోదయమైంది. చందమామను రామలింగు ఇలా వర్ధించాడు: .

తెనాలి రామకృష్ణుడు 199 కామిని చంద్రు జూచి మదిగందు సరోరుహగంధి మందిరా

రామము జూచి మ్రానుపడు రాజనిభానన సారెకు! శుక

స్తోమము జూచి యేకరును దొయ్యలి కోకిల జూచి కంట గెం

ఫొ మదలీల దాల్చు మదనానల తాపవిషాదవేదనన్‌. (ప్రబంధ. 426)

నాయికానాయకుల విరహాలు, చంద్రవర్దన తప్పించి ఇంకేమీ ఈ కందర్ప శేతువిలాసం గురించి వివరాలు తెలిత్సెన్టు. ఈ కావ్యాన్ని నాదెళ్ళ గోపమంత్రికి దగ్గర బంధువైన చిట్టమంత్రికి అంకితం ఇచ్చాడట నాదెళ్ళవారి బంధువులలో చిట్టరసు వారెవరూ కనబడరని, ఆ రోజులలో రెంటాల చిట్టరసు అనే వ్యక్తి ఉన్నాడని. బహుశా అతనికే ఈ కందర్ప కేతువిలాసం రామలింగం అంకితమిచ్చి ఉంటాడని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు.” ఈ ఊహలకు ఆధారాలేమిటో మాత్రం తెలియదు.

ఈ గ్రంథ రచన చేసి అంకితమివ్వడంవల్ల రామలింగని కేమైనా లాఖించిందో లేదో తెలియదు. ఆ రోజులో విజయనగరంలో వైష్టవానిదే పైచేయి. రాయలవారి వజ్రసింహాసనంకన్నా వారి గురువులైన తాతాచార్యులవారి ధర్మాసనమే సభలో ఒక బెత్తెడు ఎత్తుగా ఉండేది. ఆనాటి రాజకీయాలలో వైష్ణవ మత గురువుల మాటకున్నంత విలువ రాయలవారికి సైతం లేదేమో. ధూర్జటిలాంటి ఎవరో ఒకరిద్దరు వీర్హూవులకు గౌరవమర్యాదలు లఖించాయేమోగాని రామలింగం వంటి శైవునికి దేవిడిలో ప్రవేశ శలగడం గగనమే.

రాజాశ్రయం కోసమో, నిజంగా వైష్ణవ మతంపై కలిగిన నమ్మకం వల్లనో రామలింగం మతం మార్చుకోవాలనుకొన్నాడు. రాజకీయోద్యోగులకో. రాయలవారికో సిఫార్సు చేయమని అడగాలని వెళ్లినప్పుడు రామలింగం వైష్టవులతో చర్చలు జరిపి ఉంటాడు. వైష్ణవ గ్రంథాలను చదివి ఉంటాడు. అందులోని విషయాలు అతణ్ణి ఆకర్షించి ఉంటాయి. అప్పటికే చాలామంది పెద్దలు మతం మార్చుకొని మార్గదర్శకులయ్యారు. అల్లసాని పెద్దనగారు పుట్టుకచేత అద్వైతి. అయినా విశిష్టాద్వైతాన్ని చేపట్టి శకగోపయతీంద్రుల శిష్యులయ్యారు. తాళ్ళపాక అన్నమయ్య చరిత్ర సరేసరి. ఎలుగెత్తి మతం మార్చును చాటిచెప్తుండి. రామలింగం ఈ విషయాలన్నీ ఆలోచించి భట్టరు చిక్కాదార్యులవారి శిష్యుడై వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. రామకృష్ణుడని పేరు మూర్చుకొన్నాడు. అతను పేరు మార్చుకొన్నా, లోకులు మాత్రం అతణ్జి తినాలి రామలింగడనే పిలుస్తూ వచ్చారు. -

వైష్ణవాన్ని స్వీకరించాక రామకృష్ణుడు హరిలీలావిలాసమనే గ్రంథాన్ని రచించినట్టు కనబడుతుంది. ఈ కావ్యంలోంచి 21 పద్యాలను పెదపాటి జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో ఉదాహరించాడు. “కాకుత్సృవంశనగరి'లో జరిగిన లీలలు కొన్ని రామకృష్ణుడు వివరించినట్టుంది. ఈ కావ్యంలో విపులంగా పురవర్ణన చేశాడు. పెదపాటి జగ్గన్న ఎంచిన పద్యాలలో 12 పురవర్హన ఘట్టంలోనివే. వాటి వివరాలు చూడండి.

  1. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక (1914), మానవల్లి రామకృష్ణకవిగారి వ్యాసం, పుట 10.
  2. ఆంధ్రకవితరంగిణి ౪) చాగంటి శేషయ్యగారు, పుట ౫.
  3. రామకృష్ణుని రచనావైఖరి - పుట్టపర్తి నారాయణాచార్యులు, పుట 6.

200 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి (1) ఊరపేరు (ప్రబం. 445), (2) ప్రాకారాలు 40, (3) అగడ్డ 446, (4) సౌధాలు థు, (5) బ్రాహ్మణులు 446, (6) క్షత్రియులు 443, (7) వైళ్ళులు 442, (8) శూద్రులు 429 (9) గుల్రాలు 435, (10) ఏనుగులు 440, (11) స్త్రీలు 441, (12) పుష్పలావికలు 444, ఊళ్ళో పువ్వులమ్మే విలాసినుల చలాకీ మాటలను విధిగా వర్ణించాలని ఏ అలంకారశాస్త్రం చెప్పదు. ఈ పుష్పలావికావర్జనం తెలుగు ప్రబంధంలో తప్ప ఇంకెక్కడా కనబడదు. కాళిదాసు మేఘసందేశంలో ఒకచోట 'పుష్పలావీముఖానాం' అన్నాడు (మేఘ. 1-27). అయితే ఉద్యానవనంలో పువ్వులు కోసే చానలే గాని ఊళ్ళో అమ్మే జాణలు కారు. మేఘసందేశంలో క్షణపరిచితమైన ఈ మాట తెలుగు ప్రబంధాలలో హమేషా కనబడడం శృష్ణ్ణాయల ఆముక్తమాల్యదతో మొదలైంది. మధురాపురాన్ని వర్ణిస్తూ రాయలవారు. నాలుగు పద్యాలలో పుష్పలావికల చతురవచన విలాసాలు వర్దించారు (ఆముక్త. 2:19-22), “వెలది ఈ నీదండ వెల ఎంత?' అని కోడెవయసు బేరగాడు అడిగతే, 'నాదండకును వెల బెట్ట ఎవ్వరి తరంబు' అని తలవిరుసుపిల్ల మెత్తగా అనడం, “పరిభాషులాగా ఆ సరసులూ, ఈ జాణలూ శ్లేషలతో మాట్లాడుకోవడం మొదలైన గడుసుదనాలకు రాయలవారు శ్రీకారం చుట్టడంతో వాటికి రాచసిరి పట్టింది అనంతర కవులు తమ శ్లేషవైభవాన్ని యథాశక్తి ప్రదర్శించడానికి ఇది గరిడీకూటమైండి హరిలీలావిలాసంలో రామకృష్ణుడిలా పుష్పలావికలను వర్ణించాడు. వలమానచంపకోత్పలమాలికాదిసంగ్రథనచాతురి నెరకవుల బోలి దళము గెలిచిన సూత్రముననూల్కొల్పు నేర్చునయోధవీరులపాలుపుదెలిపి ఖండితత్వమున రాగము గల పల్లనావలి గోయుటల వేశ్యవలపు నెరపి . పలుతావు లరసి యెత్తులు పచరించు పెంపున జూదరుల కేవ పొడమజేసి తమనిజాంగమరీచులు తత్తదన్య పుష్పములసావి నిక్కంపు బువ్వు లమరు పేర పేర్కొను పౌరుల గేరి కేరి నవ్వుదురు పుష్పలావికానలిపములు (ప్రబంధ 4) పెదపాటి జగ్గన్న ఉదాహరించిన 21 పద్యాలలో 12 పురవర్జనకు పోగా మిగిలిన 9లో 7 పద్యాలు సూర్యాస్తమయాన్నీీ సంధ్యారాగాన్నీ, అంధకారాన్నీ చుక్కలు పొడవడాన్నీ వర్ణిస్తాయి. సాయంసంధ్యను ద్రౌపదీస్వాయంవరంతో పోల్చి రామకృష్ణుడిలా వర్ణించాడు. కాలధనంజయుండు తను గాచి దివాకరమత్సర్ట్ణయంత్రము[ గిలెడలించి సంధ్యయును కృష్ణ నుదంచితరూపవిభ్రమ శ్రీలలికాంగినిం దగ వరించి తమోమయధార్తరాష్ట్రభూ పాలకసీన నేయు నితభల్లములో యన బర్వె దారకల్‌ (ప్రబంధ. టో) ఉద్చటారాధ్య చరిత్రలో మదాలసుడనే పతితుని కథ చెప్పినట్టు హరిలీలొ విలాసంలో కూడా చెప్పాడేమో తెలియదు. మధుపానంవల్ల అపూజ్టుత కలుగుతుందని తుమ్మెదను చాటుగా పెట్టీ శ్లేషించాడు. ళా

తెనాలి రామకృష్ణుడు 201

సరసుల పొందు గల్బనగ జాలి బహూన్నతచారుశాఖలం

బెరిగి మహాద్విజావనమె పిర్మి నిజాయితీగా దనర్చి ని

రృర జనతాపసంహరణ పాత్రము లయ్యు మహీజవాటికల్‌

పురివెలినిల్బె మేటియు నపూజ్యుడగుక్‌ మధుపానుకూలతన్‌. (ప్రబంధ. 448)

జగ్గన్న ఎన్నుకొన్న ఈ పద్యాలవల్ల హరిలీలావిలాసంలో కథ ఏమీ తెలియదు. ఈ కావ్యం ఎవరికి అంకితమిచ్చాడో తెలియదు. బహుశా మంచి పలుకుబడీ కల రాజోద్యోగికి ఇచ్చి ఉంటాడు. రాయలవారి అవసాన కాలంలోనైనా రామకృష్ణునికి అస్థాన ప్రవేశం కలిగిందనుకోవచ్చు. అతడు అష్టదిగ్గజాలలో ఒకడన్న ప్రతీతి ఊరకే రాదు. రాయలవారి విద్యాగోష్టులలో రామకృష్ణునికి సంబంధించని కథలు చాలా తక్కువ, తాతాచార్యులవారిని ఏడిపించిన కథలు ఎంతో ఎక్కువ, వికటకవిగా, విదూషకుడుగా రామకృష్ణునికి దక్షిణ భారతదేశంలో ఉన్న పేరు మరెవరికీ లేదు. రామకృష్ణుడు అందరినీ వెక్కిరించవచ్చు. ఎవరినీ విడిచిపెట్టకుండా ఎకనెక్కాలు ఆడి ఉండవచ్చు. అయితే, గౌరవించవలసినవారిని ఎలా గౌరవించాలో అతనికి తెలుసు. పెద్దనగారంటే చాలా అభిమానం. తిక్కనగారితో సరిసమానంగా ఎంచుకొంటాడు.

కవి యల్లసాని పెద్దన - కవీ తిక్కనసోమయాజి గణుతింపంగా

కవి నేను రామకృష్ణుడ-గవి యను నామంబు నీరుకాకికి లేదే!

పెద్దనగారి పట్ల ఇలా అపరిమితమైన గౌరవాన్ని చూపినట్లే తాళ్ళపాక కవులసై కూడా చూపాడు. ఈ పద్యాన్ని అప్పకవి ఉదారించాడు:

చిన్నన్న ద్వాపద కెరగును - బన్నుగ పెదతిరుమలయ్య పదమున కెరగు౯

మిన్నంది మొరసె నరసిం- గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్‌. (అప్పకవి. ౩3-225)

అర్హులకు గౌరవం ఇవ్వగల సహృదయుడు కనుకనే అవసరం వచ్చినప్పుడు సరదాగా అప్రహాస్యం కూడా చెయ్యగలడు. అయితే ఈ హాస్యం ఒకప్పుడు బెడిసికొడుతుంది. ముక్కుతిమ్మునగారొకప్పుడు ఊయల మంచంపై కూర్చున్నారట. రామకృష్ణుడు వెళ్లి “తాతా ఊతునా?” అని అడిగాడట. 'ఊ' అన్నారాయన. శ్లేషమీద మోజుకొద్దీ ఉచ్మాడట. పుస్తకాల్లో అయితే సంతోషిస్తారుగాని మొహంమీద ఉమ్మితే ఎవరూరుకొంటారు? తిమ్మనగారు పాంకోడు విసిరారు. రామకృష్ణుడు విపన్నుడయ్యాడు, ఒక పన్ను రాలింది. ఆ బోసినోటినిి తనకు జరిగిన అవమానాన్ని సమంగానే కప్పిపుచ్చుకొన్నాడు. అయితే ఇలాంటివి దాగుతకాయా? రాయలవారొకసారి “రవి గాననిచో కవిగాంచునే తదా' అనే సమస్య ఇచ్చారు. భట్టుమూర్తి దాన్ని ఇలా పూరించాడట:

అరవి వీరభద్రుని పదాహతి డుల్లిన బోసినోటికిక్‌

నేరడు రామకృష్ణకవి నేరిచెబో మన ముక్కుతిమ్మరాట్‌

త్రూరపదాహతిం బడిన కొక్కిరిపంటికి దుప్పికొమ్ముప

ల్లారచియింపనౌర రవిగాననిచో కవి గాంచునేకదా।

ఈ చాటువు చాలా ప్రసిద్ధం. రాయలవారి ఆస్థానంలో ముక్కుతిమ్మనగారూ రామకృష్ణుడూ, భట్టుమూర్తి ఉన్నారన్న సంగతిని విశదం చేస్తుంది. భట్టుమూర్తి కాక ఎవరైనా పూరించడానికి అవకాశం ఉండవచ్చుగాని పద్యంలో ఉన్న పేర్లవల్ల తిమ్మనగారూ, రామకృష్ణుడూ సమకాలిక్కుఖని తేలుతూంది. తిమ్మనగారు రామకృష్ణ మోము తన్నారని ఈ పద్యం చాటుతున్నా, 'క్రామకృష్ణుడు ఈ శాస్తి ఇతరులకు చేస్తానని ఎలుగెత్తి ఘోషిస్తున్నట్టు ఒం చాటువు నిదర్శనం.

ఒకని కవిత్వం దెనయు తప్పులు నొప్పులు నాకవిత్వమం

దొకనికి దప్పుబట్ట బనియుండదు, కాదని తప్పు పట్టినక్‌

మొక మటు క్రిందుగా దివిచి ముక్కలు నోప నిసుంపకత్తితో

సిక మొదలంట గోయుదును జెప్పున గొట్టుదు మోము దన్నుదున్‌.

“పిలక ఊడదీస్తాను' అన్నదాకా బాగానే ఉందిగాని మిగతా విషయాలు మకీ మోటుగా ఉన్నాయి. పరులను తిట్టడంలో రామకృష్ణుడు కొంచెం సున్నితమైన భాషనే ఉపయోగిస్తాడని అప్పకవి జాగ్రత్త చేసిన చాటువు ఒకటి చెప్తూంది. బసవరాజుగారి గోవిందరాజనే ఒక పెద్దమనిషి ఏదో తిట్టదగిన ఎగ్గు చేస్తే రామకృష్ణుడీ పద్యం చెప్పాడు.

బసవనకు పుట్టినప్పుడె - పసరముగోవిందరాజు పసరంబైతే

గస వేటికి దిన డంటే - గసవుందిను శత్రు లాజి గవిసిన వేళన్‌, (అప్ప. 2-37)

ఈ పద్యంలోని గోవిందరాజుకన్నా కొంచెం తక్కువ అపహాస్యానికి ఎవరో తిరుమలరాయడు పాలుపడ్డాడు. పాపం అతనికి ఒంటికన్ను. అతణ్జీ, అతని ప్రియురాలినీ కలిపి రామకృష్ణుడిలా పద్యం చెప్పాడు:

అన్నాతిగూడ హరుడగు - నన్నాతింగూడకున్న నసురగురుండౌ

నన్నా తిరుమలరాయడు - కన్నాక్కటి లేదుగాని కంతుడు గాడే? ప్రియురాలితో కలిస్తే ముక్కంటి; లేకుంటే ఏకాక్షి అనీ సులభ గణితంలో చాటువు చెప్పాడు. కొంచెం కష్టమైన గుణింతంలో కూడా రామకృష్ణుడు చాటువులు చెప్పినట్టుంది.

పల్లవము బూని సకీయమేనెల్ల జేసి - పద్మగర్చుడు లాదీసి వాగుడిచ్చి

మూ విసర్జించి యప్పు డప్పూవుబోడి - డెంద మోనరించె సందేహమందనేల! సుకుమారమైన పల్గవాన్ని కఠోరమైన పనిగా మార్చాడు. తిమ్మిని బ్రహ్మని, బ్రహ్మిని తిమ్మినీ చేయగల సామర్థ్యం అక్షరాలా ఇటువంటి కవులకు సాధ్యమవుతుంది. అయితే జీవితంలో ఎవైనా ఇటువంటివి చేయడానికి ప్రయత్ని స్తే చేటు జరుగుతుందని ఆలిసినప్పుడు ఇటువంటి హాస్య చతురులు ఎన్ని కొంటెపనులైనా చేసి నిరోధించగలరు. రాచమంగలి కొండోజుకు రాయలవారు పెద్దపీట వేయడం, అమితంగా కరుణీంచడం చూసి, రామకృష్ణుడు నల్ల కుక్కను తీసుకొని వచ్చి తెల్ల కుక్కగా మార్చడానికి వ్యర్థ ప్రయత్నాలు చేసి గుణపాఠం నేర్చాడంటారు. ఈ మంగలి కొండోజు చారిత్రక పురుషే. క్రీ.శ 1544-50ల మధ్య సదాశివరాయల కాలంలోని శాసనాలలో ఇతని పేరుంది. ఈ మంగలి కొండోజే కందుతూరి రుద్రకవికి రాయలవారి దర్శనం కలుగజేశాడని ప్రతీతి.

తెనాలి రామకృష్ణుడు 203

రామలింగడు చేసిన కొంటెపనులకు, చెప్పిన చాటుపద్యాలకు ఇప్పటివారు నవ్వుకోవచ్చుగాని అప్పటివారు బాధపడి ఉంటారు. కొందరి కోపానికీ పాత్రుడై ఉంటాడు. ఆ రోజులో వైష్ణవంలోనే రెండు తెగలున్నాయి. ఒకటి ఉత్తరాది సంస్కృత నంప్రదాయాన్ని అనుసరించే వడహల తెగ; రెండోది తమిళ సంప్రదాయాన్ని పాటించే తెంగల తెగ. తాతాచార్యులవారిది చడహల సంప్రదాయం. రామకృష్ణుని గురువుగారైన భట్టరు చిక్కాచార్యులవారిది తెంగల సంప్రదాయం ఈ ఇద్దరి మధ్య స్పర్థలు ఉండవచ్చు. తాతాచార్యుల వారిని అపహాస్యం పాలు చేయడానికి రామకృష్ణుని అడ్డం పెట్టుకొని తెంగల తెగవాళ్లు కొన్ని కథలు కల్పించి ఉంటారు. కొన్ని రామకృష్ణుడే తన సహజ హాస్టాప్రియత్వంతో చేసినవి కావచ్చు. తెంగల వైష్టవులలాగే ఆస్థాన పండితులు కూడా రామకృష్ణుని వాడుకొని ఉంటారు. పరదేశ కవులు ఎవరు వచ్చినా వారిని బెదరకొట్టడానికి రామకృష్ణుని చాకచక్యం, మాటకారితనం, వెటకారం, కొంటెతనం అవసరమే. అతడు పరదేశ పండితులపాలిటి పాపాలభైరవుడు.

అష్టదిగ్గజాలలో ఒకడుగా రాయలవారి భువన విజయంలో తెనాలి రామలింగడు ఎన్నాళ్లు ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో తెలియదు. రాయలవారు మరణించాక అతడు విజయనగరం విడిచి పెట్టినట్లుంది. స్వగ్రామానికి వెళ్ళి స్థిరపడ్డాడు, కాబోలు. తెనాలి అగ్రహార నిర్దేతగా అతడు ప్రసిద్ధుడయ్యాడు. అయితే పట్టుమని పదేళ్ళీనా స్వగ్రామంలో ఉండకుండానే అతడు పొత్తపినాటికి కదిలాడు.

ఆ రోజులో ఆ సీమకు శ్రీమన్మహామండలేశ్వరులుగా గురుదేవచోడ రాజులవారి తుమారులు సదాశివరాయలవారి ఆనతిని రాయలవారి ఆజ్ఞాపాలనం చేస్తూవుండేవారు. ఈ గురురాజుగారి పెద్ద కుమూరుని పేరు సంగరాజు. అతని దగ్గర విరూరి వేదాద్రి అనే వబ్రాయసం ఉద్యోగి ఉండేవాడు. ఆయన తెనాలి రామకృష్ణుని ఆదరించాడు. ఆశ్రయమిచ్చాడు. అప్పటికి రామకృష్ణుడు ప్రొడ రచనలు చేసే పరిపక్పతను పొందాడు. సంస్కృతాన్ని తెనుగు, తెనుగును సంస్కృతం చేయగల చతురమతి, చతుర్విధ కవిత్వాలు చెప్పగల ఘనుడు, ఆశువులో మేటి.' ఎన్నో అస్థానాలలో అందరినీ మెప్పించాడు. ఇటు శైవ పురాణాలూ, అటు వైష్ణవ పురాణాలూ మథించి వాటి కథలను బ్రాయడంలో నానార్థ రచనా పటిషె మతి డు. ప్పుడతనికి తుమారభారతి అనే విరుదు వుండేది. వా! లేపు ప నమీగురూ కొనియాడుకారు.

ఇంతటి మహాకవిని ఆదరించి అతని చేత గ్రంథం బ్రాయించే అవకాశం మహామండలేశ్వ్చ్వరులకూ, రాజ్యాధిపతులకూ కాక వ్రాయసం ఉద్యోగికి వచ్చిందంటే దానికి ఏవో కారణాలుంటాయి. నిజంగా రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో అష్టదిగజాలలో ఒకడుగా పూర్వం వైభవాలు అనుభవించి ఉంటే ఇప్పుడీ బ్రాయసం ఉద్యోగి యిచ్చిన తాంబూలం పుచ్చుకొని సరస్వతి పెదవులలాంటి వక్కలు, అమె $. రామకృష్ణుని రచనావైఖరి - పుట్టపర్తి నారాయణాచార్యులు, పుట 7.

204 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చెక్కుల్లాంటి తమలపాకులు, అవిడ పలుకుల్లాంటి కర్పూరం పలుకులు ఉన్న తాంబూలం నాకు ఇచ్చాడని మురిసిపోవడంే'* నిజంగా 'కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెనో అన్న స్థితిని చెప్తుంది విరూరి వేదాద్రి ఇచ్చిన తాంబూలం పుచ్చుకొని "లోకోత్తర గుణోత్తరుండగు నా ప్రధానేఖరుండు పరమపురుష పరికర చరిత్రంబునకు నధీశ్చరుండగుట తీర్థంబును, స్వార్ధంబును జూదులందేవర ప్రసాదంబును, బుణ్బంబును పురుషార్ధంబును నయ్యె' అని రామకృష్ణుడు బ్రహ్మానందపడ్డాడు.!! పాండురంగ మాహాత్మ్యం అనే కావ్యాన్ని వ్రాసి అంకితం ఇచ్చాడు. . పాండురంగ విట్టలుడు పండరీపురంలోని దేవుడు. ఆ క్షేత్రం మహారాష్ట్ర దేశు లోనిది. తెలుగుకవి ఆ స్థలపురాణాన్ని కథనం చేయడానికి కారణం ఉండి విజయనగరంలోని ముఖ్యమైన దేవాలయాలలో విఠోబా దేవాలయం ఒకటి. రెండవ. దేవరాయల కాలంలో, అంటే క్రీ.శ.1423-78లో ప్రోలుగంటి తిప్పన అనే ఉద్యోగి ఈ అలయానికి భోగమంటపం కట్టించాడని నరసింహపురాణంలో హరిభట్టు కుమారుడు వ్రాశాడు.12 అప్పటినుంచి విఠలనాథుని ఆరాధన విజయనగరంలో ఉంది. కృష్ణరాయల కాలంలో ఈ ఆలయానికి దానాలు, ధర్మాలు విరివిగా జరిగాయి. అయితే పండరిపురం లోని విగ్రహాన్ని తొలగించి కృష్ణ్ణాయలవారెంతో భక్తితో విజయనగరంలో ప్రతిష్టించారని, ఒక భాగవతోత్తముడు వచ్చి ప్రార్థిస్తే మళ్ళీ వాపసు చేశారని ఒక కథ ప్రచారంలో ఉంది. రాయలవారు వాస్తవానికి ఉదయగిరినుండి కృష్ణ విగ్రహాన్ని తీసుకొనివచ్చి ఒక ఆలయంలో ప్రతిష్టించారు. దానిని కృష్ణస్వామి ఆలయం అంటారు. అయితే వారికి విఠోబా అంటే అమితమైన శ్రద్ధాభక్తులు. *(గ80౧౧4రఆ/8 గిజ౭ ౪26 8౧ 2069౧1 ౪05౧1006? ౦0 ౪1౧008. 706 ౪11008 ఆ *89 & ౧౧౭96 0 ౪8150౧4/3గ౫ 1౧81 ౧64౬1696 1౧ 16 1180212802 006౧౮౫ $(గ9గగ౧డరఈ4 గ8 00౧9602166 & 16౧016 ౫1 ౧15 6౭౧14 10 06 01 ౧ ౧6౬గ. 90816 8౧6౮ ౧1౧/ ౬11540 ౧41౪8 ౦1 & 80౧౧౪ 00౪16 ఇ|0౧6 61619771౧6 116 96౧౮4) ౮ 6 6౪0600 ఈ 16 04106! 10 16 9౧9[/౧66, ం గాంగ! 9ఖ/ 041 ౪100004 [86 ౧19౧651 ౧1409 1౧ గగంగిగిడరీఆ౭ గిజ89 ౧6౬గ. కృష్ణదేవరాయలేగాక అచ్యుతదేవరాయలు కూడా విఠోబాభక్తుడు. క్రీ.శ 153లో విఠలేశ్చరుని అలయంలో పురాణం చదివే శ్రీవైష్ణవ బ్రాహ్మణులకు భూదానం చేశాడు.! కృష్ణ్ణాయల కాలంలోనూ, అచ్యుతరాయల కాలంలోనూ ఉన్న రామకృష్ణునికి పాండురంగనిపై భక్తి కుదిరి పుండరీకుని కథ వ్రాయాలనే కోట 10. పాండురంగమాహాత్మ్యం, 1-29 11. పాండురంగమూహాత్మ్యం, 1-29 112. గయటంరంకంగ & 50థ31 18 లూతల ఆ సరలంంటా - 1౮. తంగా 9.393 13. ౧౧౧0199 జారే ఓ6ం్తలంరు 01 సీటాయనరా - 145. 146 ౧0.193-94. 14. గియయంటండకం౧ & 50థడజ 8 ౪౧64ల తం - 10. 1420280080, ౯9. 3౩23-24. 15. సరీ, 9. 285

తెనాలి రామకృష్ణుడు 205 కలగడంలో ఆశ్చర్యం లేదు. విళలేశ్చరుని కోవెలలో ఏ పురాణం చదివేవారోగాని రామకృష్ణుడీ కథను స్కాంద పురాణం నుండి స్వీకరించినట్టు తన గ్రంథంలో అక్కడక్కడ చెప్పాడు. విరూరి వేదాద్రి ఇలా అన్నాడట: స్కందపురాణనీరనిధి కౌస్తుభమై ప్రభవించు దేవకీ నందను సత్కథోద్యమము నవ్యకవిత్వకళాకలాపమ౯ కుందనముక ఘటించి కడుగ్రొత్తగు సామ్మొనరించి విష్ణు సే వం దులకించు నప్పరమవైష్టవకోటి నలంకరింపువమా. (పాండు. 1-26) అయితే స్కందపురాణంలో పాండురంగ మాహాత్మ్యానికి సంబంధించిన కథలేం లేవు. సంస్కృతంలో పాండురంగ మాహాత్మ్యం అనే గ్రంథాన్ని తాతాచార్యులవారు వ్రాశారని ఫాదర్‌ హీరాస్‌గారూ, వారి వ్రాతలను బట్టి టి.ఏ. మహాలింగంగారూ బ్రాశారు.!* అయితే తాతాచార్యులవారు అటువంటి గ్రంథమేమీ బ్రాయలేదు. ' ఇండియన్‌ అంటిక్వెరీ' అనే పత్రికలో జిఆర్‌ సుబ్బరామయ్యగారు వ్రాసిన వ్యాసాన్ని అపార్థం చేసుకొని ఫాదర్‌ హీరాస్‌గారు అలా వ్రాశారని మిత్రులు దేవెళ్ళ చినికృష్ణయ్యగారు తమ ప్రత్యేక పరిశోధనా వ్యాసంలో రుజువు చేశారు.!” స్కందపురాణంలో లేకపోయినా పద్మపురాణంలో పాండురంగ ప్రసక్తి కొంత ఉంది. వివిధ పురాణాల నుండి తీసుకున్న కథలతో స్థలపురాణాన్ని రామకృష్ణుడు రచించి ఉంటాడు. ఇది ఐదాశ్వాసాల కావ్యం. 1302 గద్యపద్యాలలో తొమ్మిది ముఖ్య కథల నతడు కథనం చేశాడు.

  1. పుండరీకుని కథ 6. సుశీల అనేపతివతకథ .
  2. నిగదు శర్మోపాఖ్యానం 7. ధర్మరాజు తమ్ములతో
  3. శ్రీకృష్ణావతార చరిత్ర పాండురంగక్షేత్రం దర్శించిన కథ
  4. శ్రీరాధాదేవి చరిత్ర 8. సుశర్మోపాఖ్యానం
  5. కాకి హంస పాము చిలుక 9. ఆయుత నియుతలనే ముని కుమూరుల తీనెటీగ మోక్షం పొందిన కథ చరిత్ర ఈ కథలన్నింటిలోనేకాక తెలుగు సాహిత్యంలోనే ముఖ్యమైనది నిగమశర్మో పాఖ్యానం. దానిని రామకృష్ణుడు 111 గద్యపద్యాలలో వ్రాశాడు (3-2-113). పాండురంగక్షే తంలో నరసింహదేవుడున్నాడు. ఆ స్వామివారి క్షేత్రాని కెడమపక్క మరణించినవారు సార్వభౌములవుతారు. కుడివైపున చనిపోతే ముక్తులవుతారు. వెనుకపక్క కనుమూస్తే స్వర్గానికి వెడతారు. పంచ మహాపాపాలు చేసినవాడైనా ఆ కుడిభాగాన్ని చూస్తి అన్ని పాపాలూ హరించుకుపోతాయట. ఈ విషయాన్ని చాటి చెప్పడానికి శివుడు నారుదునికి నిగమశర్మోపాఖ్యానాన్ని విశదం చేశాడు. కళిళగదేశానికి ఆభరణం వంటి పిఠాపురంలో ఒక సభాపతిగారు ఉండేవారు. ఆయనకు నిగమశర్మ అనే కుమవూరుడున్నాడు. అతడు నూనూగు మీసాల లేప్రాయం నాటికే శేరు గడయాకరంకంగ & 0031 [88 బారా ౪ఫబ్వరూతంటాత - ౧౪ 1420టూం్రజూ, ౧ 368 శే? తీ కుర్వ 0 7023 గింిగిడేయరగిడ 9 అంగీఆ - గ టట కం0గ36404 109 ఉం శంంఆ 01 1 ఓ| 01 $8రుస అలణాలాకు 6 ౨ యణయంలంత్య౭, అంం00రితతే 0 113.

206 సమగ్రాంభ్ర సాహిత్యం - రెండవ సంపుటి సకలనిగమ శాఖా రహస్యాలన్నీ తెలుసుకొన్నాడు. అయితే దైవఘటనవల్ల ధర్మార్థకామ మోక్షాలలో కామంవైపే మొగ్గాడు. ఆ నిగమశర్మ ఎప్పుడూ పులుగడిగిన ముత్యంలాగా ఇంటిదగ్గర నుంచి శుభ్రంగా బయలుదేరి యువతీభుక్తనిర్ముక్తపరిధానుడై వస్తూవుంటాడు. అతనికి పెళ్లయింది. అయితే వెలదిచనుదోయి నిండుకుండలు; కులంబు తరుణీఫాలంబు చవితిచందురుడు, వేశ్య నుదురు వానికి ప్రతిపదిందుండు నయ్యె. (పాండు. ౩-11) అతనికి నిగమశర్మ అనే పేరు నేతివీరకాయ అయింది. అతని చెడు తిరుగుళ్లు విని పెద్దలు చీవాట్లు పెట్టారు. వారికీ తెలియనంతసేపూ కొంచెం చాటుగా తిరిగేవాడు. తెలిశాక ఆ భయం కూడా పోయింది. తాతముత్తాతలు తరతరాలనుండి చీమలలాగ తూడబెట్టిన డబ్బు తగలబెట్టసాగాడు. తన ఒంటిమీద సౌమ్ములు దినవెచ్చానికి కోమటింట కుదువబెట్టాడు. తల్లి ఒంటిమీది నగలు ఈతచెట్టును గీచినట్టు గీసి లాగేసుకున్నాడు. తండ్రికి ఊళ్లోవాళ్ళిచ్చిన పత్రాలు పట్టుకువెళ్ళి ఎంత యిస్తే అంతకు అమ్మేశాడు. చక్రవడ్డీకి షాహుకార్ల దగ్గర అప్పులు చేశాడు. మడులు మాన్యాలు అమ్మబూపాడు. దొరికినన్ని చోట్ల అప్పులు చేసి, పుట్టినన్ని చోట్ల డబ్బు పుట్టించి త్రాగుడు మరిగాడు. బుణదాతలు ఒత్తిడి చేయడంతో ఊరువిడిచి అక్కడక్కడా తిరగసాగాడు. ఇతగాడి కీర్తి పారుగూళ్ళకు వ్యాపించింది. పిఠాపురానికైదారు ఆమళ్ళదూరంలోనే ఉన్న ఒక గ్రామంలో నిగమశర్మ అక్కగారుంది. తమ్ముని ప్రవర్తన ఆమె చెవిని పడింది వాడికి సన గుణపాఠం చెప్పాలనుకొంది. భర్తనూ పిల్లలనూ వెంటబెట్టుకొని పుట్టింటికి వెళ్ళింది. ఇల్లూ వాకిలీ ఎలా ఉండాలో అలా ఉన్నాయి. తల్లీ తండ్రీ విచార సముద్రములో పడి ఉన్నారు. వాళ్లని ఆమె ఊరడింఛ్ళింది, ఇంట్లో ఆరాధన, అతిథి పూవి మళ్లీ ప్రారంభించింది. పోయిన డబ్బెలాగూ పోయిందా, మిగిలినదేమైనా ఉందా అని తల్లిని అడిగి ఆ డబ్బు జాగ్రత్త చేసింది. పిల్లా మేకా అందరినీ ఒక తాటిమీదకు తెచ్చింది. ఇంట్లో పుస్తకభాండాగారం బూజుపట్టి పాడవుతూలీది. దాన్ని బాగుచేయమని భర్తను పురమాయించింది. ఊడిపోయిన కుట్లు సరిచేయమని, ఎరువుపట్టుకళ్ళిన వారివద్ద నుంచి పుస్తకాలను రాబట్టమని చెప్పింది. ఇంటికి మళ్ళీ కళ వచ్చేటట్టు చేసింది. చదువులు సంధ్యలు సాగుతున్నాయి. మళ్ళ్లూ మాన్యాలు అన్యాక్రాంతం కాకుండా కట్టుదిట్టు చేసింది. మళ్లీ ఆ యిల్లు ఇలా నిలబెట్టగలిగినందుకు సంతోషమే గాని మరదల్ని చూస్తీ అమె కడుపు చుమ్మలు చుట్టుకుపోయి కన్నీళ్లు రాలాయి. పాపం! ఆ పిల్లది పొంగుతున్న పరువం, ఎంతో వినయంగా ఉంటుంది. గుట్టుచప్పుడు కాకుండా అన్నీ దిగమింగి అత్తమామలు చెప్పినట్టు నడుచుకుంటూంది. ఈ పిల్ల జీవితం ఎలా బాగుచేయడమా అని అక్కగారు

తెనాలి రామకృష్ణుడు 207 బాధపడుతోంది. అంతలో ఒకనాడు చుక్క తెగిపడ్డట్టు నిగమశర్మ వచ్చాడు. అక్కను చూసి గతుక్కుమన్నాడు. ఎక్కడికీ పోలేక నమస్కరించాడు. తలవంచుకున్నాడు. సీమంతపు పెళ్ళికొడుకువు కమ్మని దీవించింది. అతడుక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటే తన చంకనున్న బిడ్డను తమ్ముని చేతికి అందించింది. “ఎక్కడికి వెడతావు? మీ బావ బంతిని భోజనం చేద్దువుగాని, నిమిషంలో వంటకానిస్తాను' అంది. తన వెనుకనే మరదలు ఉంది. అమెకు కనుసైగ చేసింది. ఆ పిల్ల భర్హ కాళ్లు చన్నీళ్ళతో కడిగింది.

అకాశాన్నుంచి దిగివచ్చిన దేవతకో, అంతకన్నా గొప్ప చుట్టానికో వండినట్టు నవకాయ పిండివంటలూ కనుగీటినంతలో అక్కగారు వండివార్చింది. తమ్ముడికి తలంటుపోయించింది. ఇన్నాళ్ళకు ఇంటిల్లిపాదీ ఏకబంతిని భోజనం చేశారు. చేయి కడుక్కొని మహాశిష్టుడిలాగ నిగమశర్మ తిన్నెమీద చిరునవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు. భార్య ఆకుమడుపులు అందించింది. అంతలో అక్కగారు భోజనం చేసి వచ్చింది. ఇంతింత బిడ్డలు కాళ్ళావేళ్ళా పడుతున్నారు. సందడి చేస్తున్నారు. అక్కగారు తమ్ముడీ జుట్టు ముడి విప్పింది. ఈళ్ళు క్రుక్కి, చిక్కులు విడదీసి గోరుముక్కులతో దువ్వి పేలు తీసింది మెడమట్టి నలచి జుట్టు ముడి వేసింది. మరదలు తనకు ఒకచేత్తో ఆకులు ఆఅందిస్తూంది, మరొక చేత్తో పసిడివీవన పట్టుకొని వీస్తూంది. చాసీ తెచ్చిన పీటమీద కొంచెం ఓరగా చంటిబిడ్డ పాలు త్రాగుతూ ఉంటే తమ్మునితో సంభాషణ మొదలుపెట్టింది.

ప్రారంభించిన వేదపారమునకుక[ బ్రత్యూహ మౌనంచునో

ఏరా తమ్ముడః నన్ను జూడ జనుదే వెన్నాళ్ళనోయుండి, చ

క్షూరాజీవయుగంబు వాచె నిను గనోకున్కి, మీ బావయుక్‌

నీరాకల్‌ మది గోరు జంద్రు పొడువు! నీరాకరంబుబలెన్‌. (పాండు. ౩-3) “నేను పరుల ఇంటికి అమ్ముడు పోయాను. నువ్వు పెద్దవాడివి. తమ్ముళ్ళంతా కసుగందులు. నువ్వేదో ఉద్ధరిస్తావని ఆశలు పెట్టుకొన్న అమ్మా నాన్నా ఎంత బాధపడతారో చూడు.

పరమేష్టి నుండి నీ తరముదాక విశుద్ధతరమైన వంశంబు దలపవైతి

తరిదక్కియున్న యీతలిదండ్రులం జాల పరచవై సంతోషపరచవైతి

వగ్నిసాక్షిగా బెండ్లియాడిన యిల్లాలి నిల్లాలితాకార నొల్లవైతి

ధర్మశా స్తార్థవిత్తముల విత్తములచే నలరించి విఖ్యాతినందవైతి.

శీల మఖిలంబు నిది పిల్లిశీలమనుచు

చదువు లివియెల్ల జిల్చల చదువులనుచు

దోడివారలు నవ్వ నాతోడ!

యేల- బేలవైతివి? యీగుణంబేలనీకు? (పాండు. ౩-౫) తమ్ముడిమీద కోప్పుడి ఏం లాభం! అంచేత శాంతించి ఉబ్బవేసింది. కర్ణుని తలమీద భారతసంహిత పడ్డట్టయింది అంది. అమ్మా నాన్నా పెద్దవాళ్ళు. అభం శుభం ఎరుగని తమ్ముళ్లు, కొత్తకాపురానికి వచ్చిన భార్య, పశువులు మూగజీవాలు, వీళ్ళని

208 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పనివాళ్ళపాలు చేస్తావా అంది. నా తమ్ముడు చేసే యజ్ఞంలో వేదికమీద కూర్చుంటానని అందరిముందూ చెప్పుకొంటున్నాను. నువ్వు ఇంత చెడి చెటాకులవుతావనుకోలేదు అంది. వీరావేశము దాల్చి సర్వధనముల్‌ వెచ్చింతుగాకేమి ము క్కారుం బండు నఖండసేతువృతముల్‌ కాక్ళీరఖండంపు గే దారంబుల్‌ దెగనమ్మగా జనునె? నిర్దారుండవే వెన్క నె వ్వారున్‌ లేరి సహోదరాదులు కులధ్వంసంబు నీకర్తమే? (పాండు. ౩-40) కామవికారం తగ్గించుకోలేకపోతే అయినవారి పిల్లలను వేయిమందిని పెళ్ళాడతూడదా? సంసారులు మానుల్లాగా ఉండాలేం? తులస్త్రీలు మగడీతో సరసమాడీతే తప్పా అంది. వారకాంతలని ఒక రేవు పెట్టింది. నామాట విను; నడక మార్చుకో; నీకు కావాలంటే హరికౌస్తుభమైనా తెచ్చి ఇస్తాను. నే చెప్పినట్టు వింటే బాగుపడతావు అంది. ఇంకెక్కడా కూడా నీళ్ళు దొరక్క చిక్కి శల్యమై ఇంటికి వచ్చాడు నిగమశర్మ, అక్కయ్య చెప్పినట్టే వింటున్నట్టు నటిస్తూ ఇంటిపట్టున ఉన్నాడు. రాజాలయమునకు రాకపోకలు చేయు మాసిన చదువులు మరల చదువు నిన్నాళ్ళు నెచ్చెలు లెదురైన తలవంచు కులవధూరత్నంబు గుస్తరించు నాచార్యజినము బ్రత్యహము సంభావించు నర్చావళికి నుపహారమిచ్చు నర్చించు గుతపవేళాగతాథికోటి బసినేదు దర్శించు బైరుపచ్చ తండ్రియుద్గమనీయంబు తానెయుదుకు నత్తికాభర్హతో నవ్వునల్పసరణీ గామకార్యంబు దీర్చు నంగడికి వచ్చి తేనెపూసినకత్తి ధాత్రీసురుండు. (పాండు. 3-4) ఒకరోజు, ఇంట్లో ఉన్న నగలూ నట్రూ అన్నీ చేజిక్కుంచుకొని రాత్రికి రాత్రే నిగమశర్మ ఉడాయించాడు. తల్లి నగలు, అక్కగారి ఆభరణాలు, పెళ్ళాం సౌమ్ములు అన్నీ పోయాయి. మర్నాడు ఇంటివాళ్లు గొల్లుమన్నారు. శోకించు వృద్ధభూసురు డాత్మపితృదత్తదర్చముద్రికకు చిత్తంబుగలిగి నత్తగా రిచ్చిన హరిసుదర్శనపు బేరునకు ముత్తయిదువ వనలుబొందు (గొత్తగా జేయించుకొన్న ముక్కరకునై యడలు దుర్వారయైై యాడువిడ్డ జామాతవెతబొందు వ్యామోహిర్డైు నవ గ్రహకర్ణవేష్టన భ్రంశమునకు నెంత దుర్చుద్ధి యెంత దుర్ర్రాంతి యహహః సర్వధనములు లద్దురాచారకీలు డూచముట్టుగ నిలుదోచి మురికి చనుట యెరుగరోగాక యవ్వేళ యెరెక కలదె? (పాండు. ౩-8

తెనాలి రామకృష్ణుడు 209

మోయతరంగాని నగలు మోసుకుంటూ నిగమశర్మ అడవిదారి పట్టాడు. దారిలో దొంగలు ఆటకాయించారు. అతణ్జీ చావబాది దోచుకొని చెట్టుకొకడుగా పారిపోయారు. కొనప్రాణంతో ఉన్న నిగమశర్మను ఒక రెడ్డిగారు కాపాడి ఇంటికి తీసుకువెళ్ళారు. గాయాలకు కట్టుకట్టించి, వైద్యం చేయించి కంట వత్తిపెట్టుకొని సంరక్షణ చేశాడు. నిగమశర్మ కోలుకొన్నాడు. ఆ కాపు కొడుకుకు ఒక అందమైన భార్య ఉంది. ఆ వగలాడీ నిగమశర్మను చూసి మనసుపడింది. అతని ముందు కామవికార చేష్టలు చేసింది నిగమశర్మ ఆమె అఖిప్రాయం గ్రహించాడు. గుడిలో ఉంటూ గుడిరాళ్లు తీసినట్టు కృతఘ్నుడై ప్రాణదానం చేసిన వారి భార్యను చెరిచాడు. అంతలో అమ్మవారి జాతర వచ్చింది. అందరూ ఆ సందడిలో ఉండగా ఇద్దరూ లేచిపోయారు. వెళ్లగా వెళ్లగా ఒక బోయపల్లె వచ్చింది. అక్కడ ఇద్దరూ ఆగారు. కాపురం పెట్టారు. అతడు వేటాడి మాంసం తెచ్చేవాడు. అమె వండిపెట్టేది. కొన్నాళ్ళకామె చనిపోయింది. నిగమశర్మ ఒక మాలపడుచును పెళ్ళాడాడు. పిల్లలను కన్నాడు. ఒకనాడతడు వేటనుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు తగలబడి ఉంది. దానిలో పెళ్ళాంబిడ్డలు కాలిపోయారు. నిగమశర్మకు పిచ్చెత్తినట్టయింది. ఏడ్చాడు, మొత్తుకొన్నాడు. తిండీ నీళ్ళు సహించక ఒకచోట ఉండలేక అలా నడుచుకుంటూ పోయాడు. అతనికి చావు ఆసన్నమయింది. అన్ని పాపాలూ చేసిన అతణ్జి బంధించడానికి యమదూతలు వచ్చారు. అతడు భయపడ్డాడు. అయినా, పాండురంగక్షేత్రంలోని నరసింహస్వామిసన్నిధిలో కుడివైపున ఆనాడు మరణించాడు. అందుచేత ముక్తుడయ్యాడు.

ఈ కథను రామకృష్ణుడు నిరుపమానంగా కథనం చేశాడు. వర్ణనల కోసం ఎక్కడా ఆగకుండా అనవసరమైన విషయాలేవీ చెప్పకుండా అసలుసిసలు తెలుగు కుటుంబ కథను సజీవమైన భాషలో చెప్పాడు. ఇందులోని వ్యక్తులు కథలోని పాత్రలలాగా ఉండరు. జీవచైతన్యంతో ప్రతి అక్షరంలోనూ ఊపిరి పీలుస్తూ ఊంటారు. కథలో మాటాపలుతూ - లేని నిగమశర్మ భార్య దగ్గర నుండి ఉత్తమ ఇల్లాలైన అక్కగారిదాకా ప్రతి ఒక్క పాత్ర లోనూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కనబడుతుంది. అద్బుతమైన శిల్బంతో ఈ ఉపాఖ్యానాన్ని రామకృష్ణుడు రచించాడు. నిగమశర్మ గురించి చెప్తున్న తొలి పద్యంలోనే ఎంతో శిల్బప్రావీజ్యం ఉంది, చూడండి

వనితామానససూనసాయకుడు జీవత్తాతపాదుండు భూ

జనసన్మాన్యవిశుద్ధవర్తను డుదంచత్తాాగశీలుండు చం

ద్రుని పెన్నుద్ధి సమగ్రకాందిమహిమళ్‌ నూనూగుమీసాల వే

గొనబుంబ్రాయంపు దేజుతూనస యిత డుత్కోచుండు వాచాలతన్‌. (పాండు. 3-6)

ఓం ప్రథమం అంటూ వనితామానససూన సాయకుడు అని నిగమశర్మను ప్రవేశపెట్టడంలోనే ఎంతో చాకచక్కం ఉంది. అతడు అందగాడు. ఆడవాళ్లు అతనంటే వ్యామోహపడతారు అని ఇక్కడ చెప్పడంలో ఎంతో గడుసుదనం ఉంది. నిగముశర్మను దొంగలు దోచుకొన్నారు. కొట్టి పారేశారు. అతణ్జీ ఒక కాపుకొడుకు కాపాడి ఇంటికీ తీసుకెళ్ళాడు. అతని దగ్గర చిల్లిగవ్వ లేదు. అధికారమూ లేదు. వాళ్ళ పెట్టుపోతలలో

210 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఉన్నాడు. అలొంటివాడితో ఆ యింటి కోడలు ఎందుకు లేచిపోయింది? ఏం చూసి మోహించింది? అతడు వనితామానససూనసాయకుడు కాబట్టే. ఆడవాళ్ళను తనవైపు ఇట్టే ఆకర్షించుకోగలడు. ముందు జరిగే కథతు రామకృష్ణుడిక్కడ విత్తు నాటాడు. నిగమశర్మ జీవత్తాతపాదుడని చెప్పడంలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. తండ్రీ బ్రతికి ఉన్నాడు గనుక నిగమశర్మకు బాధ్యతలు లేవు. ఆయన సభాపతి. అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. రికామీగా చెడిపోవడానికి తగినన్ని అవకాశాలు అతనికి ఉన్నాయని కవి సూచిస్తున్నాడు. ఊళోవాళ్లందరూ అతణ్జి గౌరవించే విశుద్ధవర్తనుడని చెప్పడం కథకు అవసరమే. మంచివాడని పేరు లేకపోతే అతణ్ణి నమ్మి పత్రాలు కొనరు. భూములు అమ్మకానికి పెడీడే బేరం చేయరు. ఈ విశేషణాలన్నీ ఒక ఎత్తు, నిగమశర్మ *వాచాలతలో ఉత్కోచుడు' అని చెప్పడంలో రామకృష్ణుడు చాలా సాగసుగా శిల్పాన్ని వాడాడు. "అధిక ప్రసంగంలో అతడు దిట్టి అని చెప్పాడేగాని నిగమశర్మ మాట్లాడడం ఎక్కడా వర్ణించలేదు. కథలో ఏ ఘట్టంలోనూ అతడు ఎవరితోనూ సంభాషించిన వివరాలు కవి చెప్పలేదు. అయినా అధిక ప్రసంగంలో దిట్ట కాకపోతే 'పొందుబట్టుల అప్పులు' ఎలా రాబట్టగలడు? 'దొరతనంబుల జుట్టాలను ఎలా యాచించగలడు? నిగమశర్మ అధిక ప్రసంగాలను రామకృష్ణుడు వ్రాయలేదుగాని, బ్రాయవలసివస్తే ఏ గురజాడ అప్పారావుగారో తప్పు బ్రాయలేరనిపిస్తుంది. గిరీశం కూడా వాచాలతలో ఉత్కోచుడే! ఒక్క తొలి పద్యంలోనే ఇంత అర్భాన్ని పాత్ర స్వభావాన్ని భావికథకు కావలసీన విషయాలను రామకృష్ణుడు పొదిగాడు. వాస్తవానికీ కథలోని ప్రతిపద్యంలోనూ ఎంతో అంతరార్థమో, ఏదో సాగసో లేనిది లేదు. రామకృష్ణునికి ముందు నిగమశర్మ కథ వంటిది తొందరు వ్రాశారు. తరువాత ఎందరో వ్రాశారు. అయితే ఈ రచనాశిల్పంగాని, ఈ జిగి ఈ విగ ఈ జాతీయాలుగాని, ఈ త్వరితగతిగాని, ఈ స్వభావపరిశీలనగాని, ఇంత పరిపూర్ణంగా ఇతర కథలలో కనబడదు. శ్రీనాథుని కాశీఖండంలోని గుణనిధి కథ, శివరాత్రిమాహాత్మ్యంలోని సుకుమూరునిపాత్రా , నిగమశర్మోపాఖ్యానికి ప్రోద్బలాలు కావచ్చునేమోగాని పాత్ర చిత్రణలో సంపూర్ణంగ్లా. రామకృష్ణుని ప్రతిఖే కనబడుతుంది ఒకరకంగా చూస్తే రామకృష్ణుడు తక కథలో తనను తానే అనుసరించాడు. ఉద్బ్చటారాధ్యచరిత్రలోని మదాలసుని కథతూ, నిగమశర్మోపాఖ్యానానికీ పోలిక లున్నాయి. మదాలసుని పుట్టుక చెప్తూ, “మింటిదయ్యముల నేలకు దెచ్చి కుమారుగాంచె దత్సతి' అన్నాడు (ఉద్చ. 2-115). నిగమశర్మ తూడా అలా పుట్టినవాడే. 'నింగివేల్పుల నేలకు, నేల వేల్పుకులము నింగికి దెచ్చుచుకొలువ ఇతడు పుట్టాడు (పాండు. ౩-5) మదాలసుడు 'పొటమరించిన వీటి విటుల యల్కలు దీర్చు' (ఉద్బ్ప.2-129). నిగమశర్మ అ హరిళారరించిన నారసియాపురాలంలోని వంచేహోాల్యానం వ్యా బ్రభావిచలై రావరృన్తడ నిగమశరా నాన్ని రచించా ప ప్త కు. 1 డని పరిశోధకులు ఖావించారు. (దేవెళ్ళ చిన్నికష్ణయ్యు

తెనాలి రామకృష్ణుడు 211 తూడా 'విట వాదములు దీర్చు వేగిలేచి (పాండు. 3-12). మదాలసుడు గుడికొల్లగొట్టి *ఇరులు ఓయన నడికిరేయి' వెళ్ళిపోయాడు (ఉద్బ.2-137) నిగమశర్మ ఇల్లు కొల్లగొట్టి గాడతరతమోనికరము తనకు తోడుగా వెళ్ళిపోయాడు. (పాండు ౩-49). మదాలసుడు ఎత్తుకొనివచ్చిన సొమ్ముతో కొత్త ఊరులో ఇలా అన్నాడు:

మానితలీల సజ్జినుని మాడ్కి మహీసుర డప్పురంబులో

మానవపంక్తితో కలసి మచ్చిరర్డై తలలోని నాల్కయ్చై

ధీనిధి యాతడే యనగ దేకువదేజిము గాంచియుండె. (ఉద్బటా. 2-141) తనకు ప్రాణదానం చేసిన కాపు పుత్రుని యింట్లో నిగమశర్మ తూడా ఈ మాదిరి గానే ఉన్నాడు:

తలలోపల నాలుక పూ-సలలో దారంబు పాలజల్లిన నీరుం

బలె వెలియెరుగక మనుసులు- గలసి యభేదమున కాపుకడ నత డుండున్‌.

(పాండు.3-59) రెండు కథలూ ఒకడే వబ్రాయడంవల్ల ఇటువంటి పోలికలు దొరకుతాయేమోగాని నిగముశర్మోపాఖ్యానంలో ఉన్న కథాప్రసన్నత మదాలసుని కథలో లేదు. నిగమశర్మ వాచాలుడని చెప్పి ఇక్కడ ఊరుకున్నాడు. అక్కడ మదాలసుడు విరహంలో పడి ఎంత సుదీర్ణంగా నోరు ఫాకేసుకున్నాడో చెప్పాడు. మదాలసుణ్జీ కూడా పెద్దవాళ్లు దారిలో పెట్టాలని హితోపదేశం చేస్తారు. ఇక్కడ అక్కగారు చేసిన బోధలాంటిది అక్కడ ఏ పాత్రా చేయదు. తిల్చ్బంలో శిఖరాగ్రం చేరుకొన్నాక నిగమశర్మోపాఖ్యానాన్ని ఆ జౌన్నత్యంతో రచించాడు. అటువంటి రచన మళ్ళీ రామకృష్ణుడే చేయలేనంత గొప్పగా రచించాడు. వాస్తవానికా ప్రొడిమ రామకృష్ణుడు వ్రాసిన మరో కావ్యంలో కనబడదు. విరూరి వేదాద్రికి పాండురంగ మాహాత్మ్యం అంకితం ఇచ్చాక రామకృష్ణుడు ఘటికాచలక్షేత్ర మాహాత్మ్యం అనే ఇంకొక స్థలపురాణాన్ని వ్రాశాడు. వైళలింగర్‌ అనే చోళలింగపురం 108 దివ్య తిరుపతులలో ఒకటి. ఆ స్థలపురాణాన్ని అతడు 475 గద్య పద్యాలలో, మూడాశ్వాసాల గ్రంథంగా వ్రాశాడు. ఇందులో రెండు ముఖ్య కథలు, రెండు ఉపాఖ్యానాలు ఉన్నాయి.

  1. అయోధ్యను పాలించే ధవళాంగుడనే రాజు నిండుకొలువులో ఒకనాడు ఉన్నట్టుండి కిరాతుడుగా మారిపోయాడు. రాజ్యాన్ని వదలి అరణ్యంలో జీవించ సాగాడు. ఒకనాడతను వసిష్ణుని ఆశ్రమంలోకి జొరబడ్డాడు. ఆ ముని తన దివ్యదృష్టివల్ల అ రాజు శాపగ్రస్తుడని తెలుసుకొన్నాడు. శాపమిచ్చినవాడు విశ్వామిత్రుడు. వసిష్ణుని చూచేదాకా శాపవిమోచనం లేదని చెప్పాడట. సత్సాంగత్యం వల్ల శాపవిమోచనం జరిగిందని ధవళాంగుని కథను నారదుడు భృగుమహర్డికి చెప్పాడు.

  2. నారదుడు తరువాత తన కథనే చెప్పుకొన్నాడు. హరిచత్రపురంలో గోవిందుడు అను బ్రాహ్మణుడు ఉన్నాడు. తరళ వాళ్ళింటి చాసి. ఆఅ యింటి పొరుగున హరిశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. యువకుడు. అతడు తరళను చూసి మోహించాడు. వాళ్ళకు

తౌండిన్యముని వచ్చి రెండు నెలలు మకాం చేశాడు. ప్రతిరోజూ కౌండిన్యుని సేవించి విష్ణుకథలు విన్నాడు. తల్లి మరణించాక యజమాని అనుమతితో ఘటికాచలానికి వెళ్ళి నారదుడు. తపన్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమైనా నారదుడు గుర్తించలేకపోయాడు. దేహత్యాగం చేసి దివ్వుడయ్యాడు.

3౩. సప్త్పబుషులు శతశ్చంగపర్వతంపైన తపస్సు చేస్తున్నారు. ఇంద్రుడు భయపడ్డాడు. రంభను పిలిపించాడు. తపస్సు భంగం చేయమన్నాడు. అమె అహ్పరసలతో వెళ్ళింది. వాళ్ల ఆడారు: పాడారు. అయినా మునులు చలించలేదు. వచ్చిన దారినే వెళ్ళారు. అశరీరవాణి సప్తరుషులను ఘటికాచలానవికి వెళ్ళి తపస్సు చేయమని చెప్పింది. వాళ్ళు తీర్థయాత్రలు చేనుకొంటూ. వెళ్ళారు. కాంచీపురాన్ని చూడగానే వసిష్టుడు కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. పురవర్దన చేశాడు. చివరకు సప్తరుషులు ఘటికాచలానికి చేరుకొన్నారు. అక్కడ వారి రాక కోసం ఎదురుచూస్తున్న ఇతర మునులతోపాటు తపమ్సు చేశారు ఈఊగగ్రనరసింహమూర్తి ప్రత్యక్షమయ్యాడు. మహర్దులతన్ని. శాంతింపమన్నారు. శాంతించిన నరసింహ మూర్తి “మీకేం కావాలొ అని అడిగాడు. ఈ క్షేత్రాన్ని సష్యాశ్యామలం చేయమని

4 వైఖాననులు బ్రహ్మ పంపిస్తే ఘటికాచలానికి వచ్చి తపస్సు చేశారు హ్ళీవరంటే - ఒకసారి బ్రహ్మ ఏదో యాగానికి వెడితే అక్కడెవరినో చూస్తే వీర్యస్థలనం అయి దానివల్ల భృగుడు. అత్రి మొదలైన వాళ్లు పుట్టారు. ఇందులో విఖనసుడు అనే అతడు అంబనేయుజ్జీ ప్రార్థించి ఘటికాచలాన్ని నమతలం చేయించి ఇందిరానరసింహురి

తామకృష్ణుని రచనలలోవే కాదు; కొన్ని న్గలపురాణాలలో వమహితం ఇదీ" పేలవంగా కనఐడుతుంది. ఈ గ్రంథంలో ఉన్న నాల్గు కథల గురించి నాల్గు మాటలలో తేశవరపు రామళోటికాస్త్రిగారిలా చెప్పారు :

ధవళాంగుని కథ అనుచితముగా నున్నది. నప్తమహర్తుల కథ రంభారుం భరూగమున కారణంగా కుంటువడింది. గమనమున, కాంచీపుర వర్జనలవలన చసిష్టుని చూత్రమన్నిటికంటె మేల్తరముగా నున్నదని వా అభిప్రాయం. వ -

  • ఈ కథలోని తరళ హరిశర్మల పరస్పరాకర్తణను రామకృష్ణుడు బాగా చిత్రించాడు పౌరుగింటి దాసిదృష్టిని తనవైపు మళ్ళించడానికి హరిశర్మ అటే తిరుగుతూ ఉంటాడు. మక్కువ, తమకము, కలతీపి, అక్కర నివ్వెరగు కాగా అద్బుతం, భయం, ఎక్కుడు ఈమి. కనన ననన వను త వనం శవము తకకుతననకనననన ఇ. వైమిశం - కేవవరపు రామలోటికాప్ట్రి వుడు ౫.

తినాలి రామకృష్ణుడు 213 సిగ దువ్వుక్‌ ముడి వైదు దువ్వు మరియుం జేదోయి విట్టెత్తుచు౯ విగియు౯ నిక్కుచు బెక్కు చేష్ట లరయక్‌ బెట్టావలించుక్‌ నఖా గ్రగతిం జేరి తటుక్కున బయటపడక౯్‌ ఘర్మాంబువుల్‌ జిమ్ముచుక్‌ పగ గా నంగము నంగము నుగ్గడించు ఘనరావస్ఫూర్తికంఠధ్వనిన్‌. (ఘటికా. 2-31) అ యువకుడు తనపై మరులు కొన్నాడని -శేలిశాక తరళ చేష్టలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నాడు: నునువెండికడియముల్‌ మినుమినుక్కునసారెకునుదువ్విపంకించికొప్పు వెట్టు గబ్బిగుబ్బలు బైలుగాగ టైటచెరంగు జారించు సవరించు సాంసారె కప్పుదంతపుడాలు గార్కమ్మ తళ్కుటద్దము జూచి నాఖియందముగ దిద్దు బనిలేని పని కనుంగొను నుటవాలుగ వాలుగన్నుల గరువమ్ము వరలు ముద్దుముద్దుగ కడుత్రైద్దుప్రాద్భ వన్నె పుట్టములు గట్టి చిటిపాటిపూత సొమ్ము వెట్టుమట్టెల రవళికన్పట్టుదిరుగు చిరుగుసిగ్గున పొరుగుభూసురుని యెదుట. (ఘటికా.2-35) ఘటికాచల మాహాత్మ్యంలో తరళ చేసే వికారాలు పాండురంగ మాహాత్మ్యంలో కాపు ఇంటికోడలు చేసే వికారాల ముందు బలాదూరే. నిగమశర్మను ఆకర్షించడానికి ఆమె పోయిన పోకళ్ళు ఇలా వర్ణించాడు. పలువికారంబుల కలగల్పు చూపుల రాకపోకలు బయల్‌ ప్రాకజేయు దమకంబు గమకంబు తత్తరంబును హత్తి మనసుసాగిన పజ్బజొనుపుగోర్కి కుదురుపాలిండ్లపై కొంగు జూరగ గొప్పు నీడ నూర్తక నవ్వు వెర్రినవ్వు నేరాలి పట్టిబిట్టెత్తి చెక్కిలి నొవ్చ గరచి వాడేడ్చిన కౌగలించు దండ సకిమెడబుంజూాలదండబెట్టు దిట్టుమెట్టెలు విగువంచు దెగికళాదు వనిత చిన్నారిపొన్నారివయసువాని విప్రనందను గన్నంత వెకిలి యగుచు (పాండు. ౩-62) సంచరించిందట కాపుకోడలు, పాత్రల వెకిలితనం, బలహీనతలు, ఆయువుపట్లు చూపడంలో రామకృష్ణుడు అందెవేసిన చెయ్యి. నిష్పక్షపాతంగా తాను సృష్టించిన ఉదాత్తమైన పాత్రల పట్ల కూడా ఏమాత్రం మమకారం లేకుండా రామకృష్ణుడు పరిహసించగలడు. నిగమశర్మ అక్కపాత్రను ఎంతో ఉదాత్తంగా చిత్రించాడు కదా. అమె బలహీనత ఇలా చూపించాడు. నిగమశర్మ ఇల్లు దోచుకొనిపోయాడు. మర్నాడు అక్కగారు ఏడ్చింది. '“ఎందుకనుకొన్నారు? తమ్ముడు చెడెనే అనికాదు. ఇల్లు మునిగిందనా, కాదు. కొత్తగా చేయించుకొన్న ముక్కర ఫోయెనేయని '““దార్వారయై యడరెనట!'" ఈ విధంగా వ్యాఖ్యానం చేసి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఒక సత్యం

214 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వెలిబుచ్చి చెప్పారు. “పరిహాసము పవిత్ర వస్తువును కూడా గమనింపదేమో”' అన్నారు.తొ నిజం.

అయితే, నిగమశర్మ అక్క ముక్కర పోయినందుకు ఏడవలేదు. ముత్తయిదున భాగ్యం పోతుందేమో అన్న భయంకొద్దీ ఏడిచిందని వేదాల తిరువేంగళాచార్యులుగారు సమర్థించ చూస్తున్నారు.22 ముత్తయిదువ లక్షణాల నగలు ఐదు. అవి - మట్టెలు, మంగళసూత్రం, నల్లపూసలు, ఫిల్లేళ్లు ముక్కర. ఇవి పోయాయి. “ఇవి పోవుట సౌభాగ్యమాంగల్యముల కపాయ సూచనమని భావించబడు”'నని తిరువేంగళాచార్యుల వారు వివరించారు.

ఇది కవిభావం కాదేమో. ఇదే రామకృష్ణుని ఉద్దేశమ్రైతే 'ఊచముట్టుడ నిలుదోచి యురికిచనుట యెరుగరోగాక యవ్వేళ యెరుక గలదె? (పాండు. 3-50) అని వాళ్ళు స్వల్ప

రామకృష్ణుడు ప్రతిమాటా తూచి వాడతాడు. అందుకే 'పాండురంగవిభుని పదగుంభనం' అన్న ప్రత్యేకత ఏర్పడింది. మారుమూల పదాలను, జౌచిత్యం లేని సంస్కృతాన్ని తెచ్చి చక్కని జాతీయత ఉట్టిపడే తెలుగు పదాలతో జోడించి సమాసాలు కట్టడం అతనికే తెలుసు. మిశ్రసమాసాలు చేసినా అతనికే చెల్లుతుంది. నవచన్ను దోయి (ఉద్చ. 2-174), బ్రాయసప్రవృత్తి (పాండు.1-20), దినవెచ్చం (పాండు ౩-16), తనకత్రోవి (పాండు.4-8) మొదలైన మిశ్రమసమాసాలు నిర్భయంగా వాడగలడు. నీటిమీది అలలను నీటిడొంకలు అని చెప్పగలడు (పాండు. 5-157). వంట ఇంటిని రసవతి అనగలడు. ఇష్టమైడే సంధులు చేస్తాడు, లేదా మానేస్తాడు. ఛందస్సులో కూడా స్వతంత్రిస్తాడు; నన్నయగారి కాలంనుండీ అప్పకవి దాకా షృథ్వీవృత్తంలో 12వ అక్షరం యతి చెప్తే తాను నిరర్వయంగా 9వ అక్షరం యతి అంటాడు (ఉద్బ.2-150). రామకృష్ణుని వైలిలో ఉండే రహస్యాలను, ప్రయోగాలలోని రమ్యతను విశ్చనాథ సత్యనారాయణగారు చాలా బాగా వివరించారు.3ే*ి పాండురంగ మహాత్మ్యం “ ప్రొడ్డూలీనిర్మాణనైపు జ్యముచేత కైలాస శిఖరము వంటిది. భాషలో తరువాతి కవులందరకు ప్రొడిసంపాదన కితని రచన యొరవడి”” అన్న విశ్వనాథవారి మాటలు నిజం.

రామకృష్ణుడు ప్రతిపద్యంలోనూ, 'సంస్కృతోబ్వల్లమాన్నభోజనం' వడ్డిస్తాడు.

అక్కడక్కడ చిన్నచిన్న పరిహాసాల రాళ్లు ఉంటాయి. తప్పదు! 21. అష్టదిగ్గజములు అపష్టదిగ్గజవర్ధంత్యుత్సవసమితిప్రచురణ, పు. 249 22. తెలుగుభాషానమితివారి. విజ్ఞానసర్వస్వం, ౩వ సంపుటి రామకృష్ణకవిపై వ్యాసం. పుటల

1002-1000,

కందుకూరి రుద్రకవి

కృష్ణదేవరాయలవారి ఆస్థానంలో ఉండే అష్టదిగజాలలో ఎవరెవరు ఏయే దిక్కులలో కూర్చొనేవారో తెలియదుగాని కందుకూరి రుద్రకవి మాత్రం ఈశాన్య దిశలో ఉండే సింహాసనంపై తూర్చొనేవాడని ప్రతీతి. ఇతడు ఈ స్థానంలో పన్నెండేళ్ళు ఉన్నాడని కూడ జనం చెప్పుకొంటారు. కృష్ణదేవరాయలవారు క్రీ.శ 1530లో మరణించారు. కాబట్టి రుద్రకవి నిజంగా ఒక పుష్కరం రాయలత్తారి ఆస్థానంలో ఉంటే అతడు క్రీ.శ 1518లో సభలో ప్రవేశించి ఉండాలి. అప్పటికి 'రాయలవారు తెలుగు గ్రంథాలలో బహుశా పారిజాతాపహరణమొక్కటే అంకితం పుచ్చుకొన్నారు. క్రీశ1522లోదాకా మనుచరిత్ర రచన జరగలేదు. కందుకూరి రుద్రకవి క్రీశ. 1518లోనే రాయలవారి ఆశ్రయం సంపాదించి పన్నెండేళ్ళపాటు కొలువులో ఉంటే రాయలవారికి ఇతర “సీనియర్‌ దిగ్గజాలలాగ ఏదైనా పుస్తకం అంకితం ఇచ్చి ఉండాలి. అయితే అటువంటి నిదర్శనాలేవీ ఇప్పటికి దొరకలేదు. ప్రత్యక్ష సాక్ష్యం లేదు. కనుక రుద్రకవి అష్టదిగ్గజాలలో ఒకడై ఉండడని నిర్ణయించడానికి తూడ అస్కారం లేదు. రాయలవారికి అంకితమిచ్చిన కృతులు ఇతర దిగ్గజాల విషయంలో కూడ దొరకవు. చాటువులవల్త్లా, సంప్రదాయం వల్లా కొన్ని ఊహాగానాలు చేయాలి. రుద్రకవి విషయంలో ఇవి కోకొల్లలు.

కృష్ణదేవరాయల వారి దర్శనం దొరకడం సామాన్యం కాదు. చనువుగల ఆస్తాన కవులో, పలుకుబడి వున్న మతగురువులో, సిఫార్సు చేయగలిగిన మంత్రులో ఒకమాట వేస్తేనేగాని రాయలవారికి ఎంత మహాకవి సంగతైనా తెలియడానికి వీలుండదు. కవులు, గురువులు, మంత్రులు కక్షకట్టినట్లు రుద్రకవి సంగతి రాయలవారికి తెలియనివ్వ లేదు. ముఖ్యంగా మంత్రులెందుకో మరీ పగపట్టినట్టున్నారు. “ఈ మంత్రులు మన సంగతి చెప్పకపోతే నిజమైన “మంత్రి' నామధారిచేత సిఫార్సు చేయించుకోవచ్చు''నని రుద్రకవి తలచినట్లుంది. రాయలవారికి క్షురకర్మ చేసే మంగలి కొండోబి చేత చెప్పించుకొన్నాడు. దర్శనం దొరికింది. ఆ సందర్భంలో రుద్రకవి ఈ పధ్యం చెప్పాడట:

ఎంగిలి ముచ్చు గులాములు - సంగతిగా గులముజెరుప జనుదెంచిరయా

ఇంగిత మెరిగిన ఘనుడీ - మంగలి కొండోజీ మేలు మంత్రుల కన్నన్‌

ఈ మంగలి కొండోజీ చారిత్రక పురుషుడే. శ్రీ.శ1544-50ల మధ్య విజయనగర సాభ్రూజ్యాన్ని పాలించిన సదాశివరాయలవారి ఆజ్ఞ చొప్పున వేయించిన చాలా దాన శాసనాలలో ఈ మంగలి కొండోజి పేరు కనబడుతుంది. ఒకసారి తన నేర్పంతా చూపించి క్షురకర్మ చేసి కొండోజి రాయలవారిని మెప్పించాడట. “ఏం కావాలో కోరుకో” అని వారు కటాక్షించారు. రాజ్యంలో ఉన్న మంగళ్ళందరూ ఇచ్చుకోవలసిన పన్నులు మాఫీ చేయించమని కొండోజి కోరుకొన్నాడు. ఆ కోరిక రాయశాసనమైంది. సదాశివరాయల వారి కాలంలో ఉన్న కొండోజి కృష్ణ్ణయలవారి కాలంలో కూడా ఉండడానికి

  1. చాటుపద్యమణిమంజరి - రెండవ భాగం - వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, పుట 115.

216 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అస్కారం లేకపోలేదనీ, అతడు రుద్రకవికి సభాప్రవేశం కలిగించి ఉంటాడనీ చరిత్రకారులు ఖావిస్తున్నారు.!

రాయలవారి ఆస్థానంలో పన్నెండేళ్ళున్న రుద్రకవి ఎన్నో క్లిష్ట సమస్యలు పూరించాడట. అయితే, అతనిపేర చలామణీ అయ్యే కొన్ని సమస్యలను ఇతరులు పూరించినట్టు పండితులు గుర్తించారు. తాతాచార్యులవారితో తెనాలి రామకృష్ణుడే కాక చాలా దిట్ట అని చెప్పవచ్చు. ఎంత ఉద్ధతిగా తాను తిట్టగలడో ఇలా చెప్పాడు.

తిట్టుదునా భుజంగ విషదిగ్ధదవానల ధాగ థైగచి

ట్పిట్టచిటార్చటి ప్రకటశీఘ్రమహో గ్రత దంత నిష్టురో

ద్దట్టన విస్ఫులింగంలయకారణ దారుణ అబ్ధలుబ్ధరా

ట్పట్టణగోపుర ధ్వజ నిపాతాహళాహుతిగాగ నుద్ధతిక్‌ (చాటు. ॥ పుట. 114)

రాజుగారి. కోటబురుజుమీద జండా ఊడిపడేటట్టు మాత్రమే కాదు, పట్టపురాజులు, దొరలు, పండితులు మొదలైన వాళ్ళను, ప్రబంధంలో, పురవర్ణన చేసేటప్పుడు పిర్కొనే అమాంబాపతు అందరితోపాటు కలిపి తిట్టగలనని ఇలా చెప్తున్నాడు:

తిట్టుదునా మహో గ్రకరతీవచోవరగద్యపద్యసం

ఘట్టఘరట్టఘట్ట వధగా విధిగాచిననైన మానినీ

పట్టణ వప్రసాధమణజిబంధుర సింధుర సైంధవాఢ్యులన్‌

ఐట్టపురాజులక్‌ దొరల బండితులక్‌ దురహంకృతాద్రులన్‌. (చాటు.॥ పుట 114)

తాను తిడితే ఎంత భయంకరమో, దీవిస్తే అంత్‌ -సుఖకరమని కూడా రుద్రకవికి తెలుసు. ఆ సంగతి ఇలా విశదపరుస్తున్నాడు:

తిట్టుదునా మహో గ్రకరతీవ్రవచో వరగద్భుపద్యసం

ఘట్టఫజీంద్ర కోటి ఘనకంఠ విషాగ్నుల రీతి మెట్టునన్‌

పట్టపురాజునీతి బహుభంగుల లెస్స సుఖింపగావలెన్‌ (చాటు, ॥ పుట 114)

ఇలా తన తిట్లూ దీవెనల సంగతి చెప్తూనే రుద్రకవి రాయలవారి ఆస్థానంలో ప్రవేశించాడని ప్రతీతి. ఈ పద్యాలను విన్నాక రాయలవారు అతనికి ఈశాన్య సింహాసన మిచ్చారట. అల్లసాని పెద్దనగారంత మహాకవి ఇతని కవిత్వాన్ని మెచ్చుకొని 'తగురొ! కవిరుద్ర' అని ఇలా ప్రశంసించాడటః నం 2. “అష్టదిగ్గజములు : అష్టదిగ్గజవర్థంత్యుత్సువసమితి ప్రచురణ - నేలటూరి వెంకట రమణయ్యగారీ

వ్యాసం, పుట ౫. 3. చాటుపద్య్మమణిమంజరి, క - పుట 11.

కందుకూరి రుద్రకవి 217 వ్యగ్రకవిత్వతత్వ చతురాస్యులు క్రైయట భాష్య ఫక్కి కా నుగ్రహశక్తి కల్గిన ఘనుల్‌ కవులెందరులేరు? నీదు ప్ర త్యగ్ర వచోధురీణకవితల్‌ తగురా కవిరుద్ర। రుద్రడ క్కాగ్ర సముజ్బలస్ఫురిత హల్గులకుక స్వరపాళికొబ్జలై. (చాటు.॥ పుట 117) ఈశ్వరుని డమరుకం మైోగినప్పుడు ఆదిలో అచ్చులు, హల్లులు జనించాయట 'అఇఉణ్‌ బు*క్‌ అంటూ మొదలయ్యే వ్యాకరణ సూత్రాలను మహేశ్వర సూత్రాలంటారు. సంస్కృత వ్యాకరణమంతా వీటిమీద ఆధారపడి ఉంది. సూత్రరచనకు వీలైన క్రమంలో భాషలోని వర్జాలను ఆదివ్యాకర్త పేర్కొన్నాడు. కిటుకు తెలియని వాళ్ళను ఇవి మంత్రాలలాగ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కందుకూరి రుద్రకవి కవితలు రుద్రడక్కనుండి జనించిన హల్ల్గులకు ఒజ్జలని అల్లసాని పెద్దనగారు భావించారుగాని భద్రమంత్రి అనే మహానుభావుడు వేరుగా అభిప్రాయపడ్డాడు. పాణీనీయ వ్యాకరణంలో ని అ మంత్రిగారి అనుమానం, దానినే ఇలా చెప్పారు: జబగడదష్టు లఖ్లు శషసరు కపయ్యు రముభ క్థటంచు వా జబజబలెల్ల జేసి యగసాలెల బేలల టోయపాలెపుం బబువుల దేల్చి చేతగలపైకము దోచుటగాదు రుద్ర! నీ డబడబ భద్రమంత్రి యెదుటం గొనసాగదు పోకుపోకుమీ! (చాటు, ॥ పుట 116) భద్రమంత్రి ఇలా సవాలు చేస్తి కందుకూరి రుద్రకవి స్వయంగా జవాబు చెప్పలేదుగాని అతని శిష్యుడు గొప్పలు త్రిపురాంతకుడనేవాడు ఇలా సమాధానమిచ్చాడు: భద్రాః శ్వానము మొరిగిన-రుద్రాంకీిత జంగమయ్య రూఢిక గొదువా చిద్రూపుడైన సాక్షాద్రుద్రుడయా కందుకూరి రుద్రుడు ఢధాత్రి౯. నాగళ్ళ చిట్టప్ప అనే మరోశిష్యుడు వెనువెంటనే ఇలా ప్రస్తుతించాడట: రుద్రకవి వాక్సృటుత్వము- భద్రపదయుక్తి దనరు భాసుర లీలక౯ రుత్రస్వరూపు నెదురును - క్షుద్రు లెదుర్కొనగలరె కుంఖినిలోనక్‌ (చాటు. ॥ పుట 117) రుద్రకవిని “పోవద్దు అని నిలిపి అతని శిష్యులవల్ల తిట్లుతిన్ను ఈ భద్రమంత్రి ఎప్పటివాడో తెలియదు. అసలు ఈ రుద్రకవి రాయలవారి కాలంలోనివాడేనా అని అనుమానం. ఏమంటే, ఈ కవివంశంలో రుద్రకవి నామధారులు చాలామంది ఉన్నారట. “కృష్ణదేవరాయలనాటివాడు ప్రథమ రుద్రకవి. ఇబ్రహీం నాటీవాడు ద్వితీయ రుద్రకవి. వారికి దర్వాత గూడ గవిత నేర్చిన రుద్రకవులున్నారు'' అని ఇప్పటి రుద్రకవివంశ్యులు చెప్తున్నారు. భద్రమంత్రి సవాలు చేసిన రుబ్రకవి బహుశా అర్వాచీనుడు కావచ్చు. , కృష్ణదేవరాయల కాలంలోని రుద్రకవి ఏ కావ్యాలు వ్రాశాడో తెలియదుగాని మల్కిభరాం కాలంలోని రుద్రకవి నిరంకుశోపాఖ్యానం అనే శృంగారకావ్యం చెప్పాడు. 4. చాటుపద్య మణిమంజరి |, పుట 12

218 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ కృతివల్ల రుద్రకవి నివాసం నెల్లూరి జిల్లాలోని కందుకూరని తెలుస్తుంది. ఆ ఉళ్నో ఉండే సోమేశ్వ్చరస్వామిని, జనార్దనుణ్ణి తన కావ్యంలో నుతించినా ఇతడు చిన్నప్పటి నుంచీ కాళీభక్తుడు. ఆమె వరప్రసాదంవల్ల లబ్ధవర్ణ, వర్దనీయ కవిత్వ ధౌరేయుడయ్యాడట. అమ్మవారివల్ల కవిత్వం సంపాదించిన రుద్రకవి కావ్యాన్ని వ్రాద్దామనుకొన్నప్పుడు అయ్యవారు కలలో కనబడి అది అంకితం ఇమ్మన్నాడట. 'మహాభాగ్య' మని కందుకూ సోమేశ్చరస్వామికి దానిని అంకితనిచ్చాడు. ॥ ॥

ఈ ఉపాఖ్యానాన్ని సూతుడు శౌనకాడి మహామునులకు చెప్పలేదు. ధర్మళీలుడనే రాజుకు పులహుడనే ముని కథనం చేశాడు. ఆదిలో ఆ రాజుగారికో పెద్ద ధర్మసందేహం వచ్చింది. అతడు భయపడుతూనే అడిగాడు. ఆ ప్రశ్న తామరసాక్షకీర్తనం కాదు తత్వరహస్యమూ కాదు, మరేమిటంటే -

వ్యసనములలోన బ్రథమ - వ్యసనము సంభోగకాంక్ష యది దోషమలీ

మసమనగ విందు నందుం - బ్రసరించినవాడు పాపబాహ్యుడు కలడే?

(నిరంకుశ 1-౫)

ఇది విన్నాక ముని కోపించలేదు. '“భయపడడమెందుకు? అడగడం తప్పు కాదు.

కోరికలు మాటల్లో ఉంటాయా? మనసులోకాక? రతిప్రసంగాలు తడవనంతమాత్రాన

అందరూ పెద్దమనుష్యులుకారు” అని హెచ్చరించి సురకేచ్చతప్పు తక్కిన విచారము

దూరము చేసిన మొక్కలపు మనుష్యులు కొందరు బుధులు కానని సద్గతి పొందారని నిరంకుళుని కథ చెప్పాడు.

మాణీక్యపురంలో సురశర్మ అనే కర్మిష్టి ఉన్నాడు. అతడు రెండవ భాషాపతి. అతనికో కొడుకు పుట్టాడు. ఆ చిన్నవాడు అనర్గళశేముషీ మహిమచే 'వేదాది విద్యా నిరంకుశు'డౌతాడని భావించి నిరంకుశుడనే పేరు పెట్టారు. వేదాలు చదివించారు. శాస్రాలు నేర్పారు. సంగీత సాహిత్యాలు బోధించారు. యుక్టవయసు వచ్చాక పెళ్ళి చేశారు. అతణ్జీ చూసిన ఆడపిల్లలు మోహించేవారు, అయితే ఆదిలో అతడు అపర ప్రవరాఖ్యుడు. ఆ తరువాత నిగమశర్మకు సరైన ఉజ్జీ అయ్యాడు. జూదంలో ఆరితేరాడు. కొంగున ఎప్పుడూ పాచికలు ఉండేవి. నిరంకుశుడు అంచెలంచెలుగా ఎలా చెడ్డాడో కవి ఇలా చెప్పాడు:

తల్లిదండ్రులకు సమ్మతంబుగానతిథిసత్రియ యటంచు నాకింత గిలుబుజేయు

బొరుగూళ్ళగల మాన్యభూముల ధాన్యంబు గ్రయపెట్టి విడుచు బరస్పరంబు *

దనపై బరామర్శ దప్పియుండుటెరింగి దొడ్డసామ్మేమైన దొంగిలించు

నప్పచెల్లెండ్రపై నాదరంబులుసూపి యరణములొనిపోయి యపహరించు బలపమునుగత్తి యునుబూని ప్రజలయిండ్ల

గన్న పెట్టనిదొక్కటేకాని కొదవ

కడమదుర్వృత్తులన్నియు గడచెనతడు

లంజతల్లులచేతి మల్లటకుగాగ (నిరంకుశ 2-౫)

కందుకూరి రుద్రకవి 219

“చేరి కన్నడభూమి జెరపట్టు పాళ్చాత్యనృపతికైన నొకింత కృపదలిర్చు" గాని “లంజతల్లికి దయలేదు లక్షయ్రైన' (నిరంకుశ. 2-42), కాబట్టి నిరంకుశుడు దొరికినంత డబ్బు తెచ్చి దోసిళ్ళతో వేశ్యమాత దగ్గర గుమ్మరించేవాడు. నిగమశర్మ భార్య పాపం గుట్టిక అణగి అత్తమామల చిత్తానికి నచ్చేటట్లు భక్తిశక్తులు మెరసిపాట్లుపడేది. నిరంకుశుని భార్య అలా నోరుమూసుకునే రకం కాదు. కళ్ళంట నీరు కారుతూవుంటే అత్తగారిని చూసి అడగవలసిన నాలుగూ పన్నాండు పద్యాలలో అడిగింది.

మీకతన గాదె యాయవి-వేకం బాయనకు నుద్బవిల్లుట మీ యా

త్మీకరణ మింతయుడిగిన- జేకొనునే యాత డింత శొష్టితరతక? (నిరం. 2-53) బంధువులలో ఎవరెవరు ఎలా ఎలా ఉపేక్షించారో ఆమె ఇలా చెప్పింది :

మామగారైనను “గామాంధవర్పనం బోజగా'దని పల్కనుడుగకున్నా?

వదినెయ్డైనను “వారవనితాప్రసంగంబు ల్వర్హమా'యని పల్క సణగకున్నా?

బంధువులైనను 'బథముదప్పిచరించుటే నీతి'యని పల్క మానకున్నె?

మీరైన “నీదురాచారపారీణత వలదురా'యని పల్క వదలకున్నె?

కటకటా! చూరవిడిచి యీకరణిధరణీి

సురకులాచార ధర్మంబు చూరపుచ్చు

సుతునిదుశ్చేష్టలూరక చూచుచున్న

బరువునకు లోటుతో నగు బాటురాదొ? (నిరం. 2-52) తనను చిన్నప్పుడే 'ఇంతనాడు' ఆ మూడుముళ్ళూ వేయించి తీసుకొచ్చారు, ఆ రోజునుంచి అత్తగారి అజ్ఞ చొప్పున “కోట్రం' చేస్తున్నది.

నాకేమి దేహసుఖము పు-రాకృతమేకాక నేడు రాబోనే యీ

లోకమున నేనె యరుదా - మాకోడలుగాదొ పొరుగుముంచముగాదో?

(నిరం. 2-56)

ఆ చిన్నది, పాపం ఇలా నోరువిడిచి అడగడానికి కారణం లేకపోలేదు. “మగడు సంసారనివర్తనచేసి యిట్లు తిరిగిన మనమున గోపింప కెట్టి మగనాలుండు[?”” (నిరం.2-60). కోడలు ఇలా అడిగాక అత్తగారు బాధపడింది.

ఏమిసేయుదు మదిలోన నెన్నడైన-మరచియుండెడు దాననా మగువ వాని

కర్మకౌశల మెట్లుకాగలదొకాని- యాణిముత్యముమసిబొగ్గునయ్యె నేడు.

(నిరం. 2-65)

నిగమశర్మ అక్కగారిలాగ నిరంకుశుని తల్లికూడ హితోపదేశం చేద్దామనుకొంది. ఇంటికి భోజనానికి వచ్చిన కొడుకుకు కడుపునిండా తిండిపెట్టి, అ తరువాత “ఇంటనెన్నడు లేని ఈ హీనవిద్య యెన్నడభ్యాసమయ్యెరా! కన్నతండ్రీ:'” అని ఏడిచింది. “ఊళ్ళోవున్న భోగపరాయణులు ఇంత వీధిని పడ్డారా?" అని చెప్పింది.

220 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి లేరా భోగపరాయణుల్‌ జగతిలో లీలావినోదంబుగా బోరా వేశ్ళలయిండ్లకుక్‌ వివిధసంభోగార్థులై గుట్టుతో రారా వైదిక ధర్మమార్గపథిక ప్రావీణఖ్యముంజూపరా యేరాతండ్రి పరితృజింత'రటరా యీ రీతి సత్కర్మముల్‌ొ (నిరం. 2-౫) తల్లి ఎన్ని చెప్పినా నిరంకుశుడు పల్లెత్తి జవాబు చెప్పలేదు. పొద్దుపోయింది. తలారులక్సు భయపడి ఆ రాత్రి యింట గడిపాడుగాని తల్లి చేసిన హితబోధవల్ల కాదు. ఆ యిల్లాలు వాడికి కొత్త జరీబట్టలు ఇచ్చి గంధం పూసి కోడలి గది దగ్గర వదలిపెట్టింది. నిరంకుశుని భార్య రెండు చేతులతో బాగాలు ఇవ్వబోతీ అతగాడు నిట్టూర్చి మొఖం తిప్పేసుకొన్నాడు. ఆ రాత్రి నాలుగు గడియలు ఏడాదిలాగ గడిపాడు. ఇక తెల్లారు తుందనగా పెళ్లాం నగలు - నల్లపూసాదిగా _ వొలుచుకొని ఉడాయించాడు. అయితే ఇలా ఎన్నాళ్లు సాగుతుంది? వేశ్ళ్వమాత నయానా భయానా చెప్పి అతణ్జి వెళ్ళగొట్టింది. నిరంకుశుడు అడవులు పట్టాడు. అడవిలో ఒక శివాలయముంది. ఆ పాడుగుడిలోని దేవుణ్ణి చూసి నిరంకుశుడు “నాతో జూదమాడుతావా?' అని అడిగాడు. కొంగుముడి విప్పి పాచికలు తీశాడు. “పందెం ఏమి'టని అడిగాడు. “నీ ఆయుధాలు, వాహనాలు, వస్రాలూ అక్కర్లేదుగాని లంజ లంజ పందెం వేసుకొందాం' అన్నాడు '“ఓడీనవాళ్లు గెలిచినవాళ్ళకు అడిగిన ఓక వేశ్వను సంపాదించి ఇవ్వాలి అని చెప్పాడు. ఇద్దరి తరపునా తనే పందెం వేశాడు: ధృతి పెంపాందగ సారెసారె పయిసారెం జూచుచు సారెవో వుతరిం బోవుచు జోడుగట్టుతరి రివ్వుల్మీర జోడించుచు[ జత బారా పది దచ్చి యత్తిగ దుగా చౌపంచ తీపంచ జొం కితి నానర్హ్సకియంచు నాడె నుభయాంగీకార మేపారగన్‌ (నిరం. ౩-20) నిరంకుశుడే గెలిచాడు. అనుకొన్న పందెం ప్రకారం తనకు వేశ్యను తీసుకు వచ్చి ఇమ్మన్నాడు. దేవుడు మాట్లాడకపోతే అప్పు ఎగవేసే సాధారణ మానవ మాత్రులకు దండనగా వేయించే పాగడదండ దేవుడి మెళో వేశాడు.5 తగునె పన్నిద మీక యీగతి దప్పు మౌనము దాల్చగా దగవు నీకును నాకు బెద్దలదండ బెట్టెద జండినై గగనకేశయటంచు జందురుకావిసేలు గళంబునక౯ బొగడదండ యొనర్చె నావిటభూసురా గ్రణి దిట్టయ్డై. (నిరం. ౩-౫) పౌగడదండ వేశాక ఎంత దేవుడైనా ఎలా తప్పించుకొనిపోగలడు? నిరంకుశుడు ఇలా ఛాలెంబి చేశాడు. "కేస తననన నం 5. "“కవిరాజుకంరంబు కౌగిలించెనుగదా పురవీథి నెదురెండ పౌగడదండ'' అని శ్రీనాథుడు చెప్పిన చాటువులోని పొగడదండ అప్పులున్నవాళ్ళకు వేసే ఇనుప సంతెళ్ళో తాళ్ళో అని చెప్పాలి చూ' “ఆంధ్రుల సాంఘిక చరిత్ర? _- సురవరం ప్రతాపరెడ్డిగారు, పుటలు 279-230.

శందుకూరి రుద్రకవి 221 బరిదప్పి తప్పుచేతల - బొరలక యిపు డోడినట్టీ పొలతుకదే నీ యరచేత బండ్లువచ్చిన - గరతువుగా కిక్షు కార్ముక ప్రతిపక్షాః (నిరం. ౩-32) దేవుడు ప్రత్యక్షమై, *'ఎవరు? ఏ వేశ్ళ కావాలి?” అని అడీగాడు. ''ఎందుకు పూలనేసినవాని నిర్మూలపరచి - రాలనేసినవాని హేరాళమైన లీల గరుణించితివి దయాశీల! నీకు- జాలనపరాధినంచు నాకేల వెరవ?

(నిరం. 3౩-42) భయంలేదు కనుక ఏమాత్రం మొగమాటపడకుండా నిరంకుశుడు రంభనే కావాలని కోరుకొన్నాడు. శివుడు మంజూరు చేశాడు. దేవవేశ్ళ దిగి వచ్చింది. నిరంతుశుడు ఆమెతో సుఖంగా విహరించి మెప్పించాడు. రంభ ఇలా అందట:

మనసిజకేళికి భూసుర-తనయా, నీసాటి రారు దలపగనేలా?

యనరాదుగాని దాసులు-వినువూ నలకూబరాది విజయవిశాలుట్‌ (నిరం ౩-౪)

నిరంకుశుని మీద ఉండే వ్యామోహంలో రంభ భూలోకంలోనే ఉండిపోయింది. ఒకసారి ఈ ఇద్దరూ నారదుని కళ్ళపడ్డారు, ఆ కలహభోజనుడు ఈ సంగతి ఇంద్రునితో చెప్పాడు, మహేంద్రుడు మండిపడి రంభను శపించాడు. నిరంకుశుడు తన బుద్ధి చాకచక్యంతో రంభకు శాపవిమోచనం కలిగించాడు. దేవుని దయవల్ల అతడు “ఏకవాక్యప్రతిష్థాపనాచార్యుండును ద్విజవంశ పావనుండును త్రివర్గనిరతుండును జతుర్వేదపరాయణుండును బంచశరాకారుండును షట్పాస్తపారీణుండును సప్తాశ్వ తేజుండును అష్టభోగసంపన్నుండును నవనిధానసంపన్నుండును దశదిశాపూం కీర్తిమండ లుండునై చెలంగె” (4-132). ఎలాంటి దురాచారపరాయణునకు ఎటువంటి జగత్రసిద్ధి అని ముని ధర్మశీలమహారాజుకు ఈ నిరంకుశోపాఖ్యానం చెప్పాడు. ఈ కథ రుద్రకవి చిన్నప్పుడే వ్రాసినట్టుంది. చూడండి ఈ పద్యం:

అని ముని ధర్మశీల వసుధాధిపమాళికి నేర్పరించె చె

ప్పిన కథ బాల్యచాపలము పెంపున స్వామికి విన్నవించితిక

జనకుడు బాలుడాడు నహాబ్దవచో నివహంబుచేత నె

మ్మనమున మోద మొందుక్రియ మామకవాక్కుల సంతసిల్లుమీ! (నిరం. 4-13)

బాల్యచాపల్యంతో చెప్పినా అక్కడక్కడ చక్కని సాంఘిక కావ్యంలాగ రుద్రకవి దీనిని రచించాడు. ఇది వ్రాశాక అతడు “సుగ్రీవవిజయం' అనే యక్షగానం చెప్పాడు. మన సాహిత్యంలో యక్షగానాలు ఒక ప్రత్యేకమైన శాఖకు చెందినవి. ఈ శాఖపై పూచిన తొలిపువ్వులు ఎన్నో ఉన్నాయిగాని తొలి పండు ఒక్క సుగ్రీవవిజయమే. దీనిని రుద్రకవి కందుకూరి జనార్దనస్వామికి అంకితమిచ్చాడు. కిష్కింధకాండలోని మంచి రసవత్తరమైన ఘట్టాలను ఇతడు యక్షగానంగా వ్రాశాడు. ఇందులో త్రిపుట, బంవె, తురుచజంపె, అటకాళం, ఏకతాళం మొదలైన గతులలో పాటలు, అర్థచంద్రికలు, ఏలలు, ధవళాలు,

222 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ద్విపదలు ఉన్నాయి. మొట్టమొదట ఒక ఉత్పలమాల, రమారమీ చివర ఒక సీసపద్యుం ఉన్నాయి. అక్కడక్కడ వచనాలు, గీతాలు కూడ ఉన్నాయి. తొలి ఉత్పలమాల తప్పిస్తి ఇది పూర్తిగా దేశిఛందస్సులలో వ్రాసిన రచన. దీనిని 'కరుణభాసుర యక్షగాన ప్రబంధం అని కవి పేర్కొన్నాడు. (పుట 46) నిజంగానే కరుణామయంగా వ్రాశాడు. సీతమ్మవారి నగలను చూసి రాముడిలా విలపిస్తాడు: నన్ను విడిచియు నిలువజాలక నాతి వచ్చిన తిడవి దిరుగను నిన్ను విడి యేనెట్టు లోర్తును నీలవేణీః రమణిరో నినుబాసినప్పుడె రాతిరే తివరాతి రాయెను నిముసమైనను నాదుకంటికి నిదురరాదు. తనవల్ల సూర్యవంశమే అపకీర్తిపాలైందని ఇలా బాధపడతాడు: తరణికులమున బుట్టి శరచాపములు పట్టి తరుణి గోల్చడుకంటిె మరణమే మేలు నను శౌర్యవంతుడని తనపుత్రి నిడినట్టి జనకవిభు డీవార్త విని వగువకున్నా ఒకట నొచ్చములేత యున్న రవివంశమున కకట నాచే నింత యపకీర్తివచ్చెక్‌ రామబాణం తగిలి పడిపోయిన వాలి విలాపం చాలా బాగా బ్రాశాడు. ఏడుపు, కోపం తర్కం, తిట్లు అన్నీ వరదలాగా వాలి మాటల్లో కనబడతాయి. 'నేను తప్పుచేసినా' నిక్షించడానికి నీకేం అధికారముం' దని వాలి రాముణ్జి అడుగుతాడు. తప్పుగలిగిన నాజ్ఞ వెట్టను తగును భరజేంద్రునకు న్యాయము తప్పి నీకు వధింపజెల్లునె తపసివర్యా! దీనికి రాముడిచ్చిన సమాధానం కూడ గట్టిదే. పరమధార్మికుడైన భరతవిభుపంపునను జరియించుచును దోషకరు జూడగలమ? రాముడు భరతుని అనుమతితోనే వనవాసం చేస్తున్నాడు మరి. వాలి వధ తరువాత అక్కడున్న చెంచెతలు ఏలలుపాడీ రామాయణం సుఖాంతమని ఒక్కముక్కలో చెప్తారు. దేవుడని తెలియలేక - కావరించి వాలిసచ్చె దేవ! నీతో నిగ్రహించిన - ఓ రామచంద్ర! రావణునకు నిదె పాటురా. దీనిని చదివాక రుద్రకవి రామాయణమంతా ఇలా యక్షగానంలా జబ్రాయలేదేమనే బాధ కల్గుతుందని లఖించిన తెలుగు యక్షగానాలలో ఇది మొట్టమొద్గటిది గనుక దీనిపై ప్రత్యేకమైన పరిశోధన చాలా అవసరం. ఇది ఒక కొత్త విషయాన్ని చాటి చెప్తుంది గురజాడ అప్పారావుగారు 'ముత్యాలసరం' అని పేరు పెట్టిన ఛందస్సు మన యక్షగానాలలో తొలిదగ్గరనుంచీ ఉంది. త్రిపుటతాళంలో రుద్రకవి బ్రాసినవన్నీ ముత్యాలసరాల లక్షణానికి సరిపోతాయి. ప్రతి గీర్పపాదంలోనూ. పధ్నాలుగు మాత్రలున్నాయి. హ్రస్వపాదంలో ఏడు ఉంటాయి. యతో, ప్రాసో పాదాలను కలుపుతాయి. సుగ్రీవవిజయంలోని తొలి “త్రిపుట తాళంలోని పాట చూడండీ.

శందుతూరి రుద్రకవి 223

కపికులోత్తమ నాకు జూడగ - గపట వేషము గానరాదిది

విపులపుణ్యుల బాపమతులని వెరవ నేలా.

ఇలా వ్రాస్తే ఈ యక్షగానంలోని త్రిపుటపాటలన్నీ ముత్యాలసరాలలాగే సాక్షాత్కరిస్తాయి. అయితే ఈ సాక్ష్యాలతో ముత్యాలసరం నవీనతను ప్రతిఘటించక్కర్లేదు. శ్రీశ్రీ చెప్పినట్టు “ముత్యాలసరం అంటే మనకు గురజాడ అప్పారావుగారి పేరే జ్ఞాపకం వస్తుంది. ఏ సన్ముహూర్హంలోనో అతడాగేయం పలికి దానికి 'ముత్యాలసరం' అని నామకరణం చేశాడు. ఒక నూత్నవేగానికి వాహనంగా చేకొని ఒక స్వాతంత్ర కవిత్వాన్ని విడుదల చేశాడు. గురజాడ అప్పారావుదే ఈ ఛందస్సు.”

అప్పారావుగారు చేపట్టిన ఛందస్సు పునాదులు ఎంత లోతున ఉన్నాయో రుద్రకవి యక్షగానం తెలియజేస్తుంది. ఒక్క సుగ్రీవ విజయంలోనేకాక ఇతర కృతులలో తూడ రుద్రకవి దేశిఛందస్సులను వాడాడు. అతడు కందుకూరి జనార్దనుని మీద చెప్పిన అష్టకం చాలా చక్కని దేశవాళీ శృంగార రచన, తేనెకుసైతం తీయదనం నేర్చే తెలుగు కవిత,

సిరులుమించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జారగా

చరణపద్మముమీద దేహము చంద్రకాంతులు దేరగా

మురువు చూపగ వచ్చినావో మోహనాకృతిమీరగా

గరుడవాహన దనుజమర్దన కందుకూరి జనార్దనా!

అనపెట్టిన రాకపోతివి ఆయెబో అటుమొన్ననూ

పూనిపిలువగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ

నేను చూడగ గడచిపోతివి నీటుచేసుక నిన్ననూ

కానిలేరా దనుజమర్దన కందుకూరి జనార్దనా!

విత్తరంబున మొలకకెంపులు పెదవి నెవ్వుతి ఉంచెరా

గుత్తమైన మిటారిగుబ్బలగుమ్మ యెవ్వతె మెచ్చెరా

చిత్తగించక జీరువారను చెక్కిలెవ్వతె నొక్కెరా

కత్తిగోరుల దనుజమర్దన కందుకూరి జనార్దనా!

నిన్నరాతిరి చవికెలోపల నీవు చెలి కూడుంటిరా

ఉన్న మార్గములన్నియును నే నొకతచేతను వింటిరా

విన్నమాత్రముగాదురా నిను వీధిలో గనుగొంటిరా

కన్నులారా దనుజమర్దన కందుతూరి జనార్దనా!

చెల్లబో పసుపంటినది నీ జిలుగుదుప్పుటి విప్పరా

ముల్గ్లుమోపగ సందులేదుర మోవి కెంపులుగప్పెరా

తెల్లవారినదాక ఎక్కడ తిరుగులాడీతి చెప్పరా

కల్లలాడక దనుజమర్దన కందుకూరి జనార్దనా!

పత ననననటక ానతతనతకస 8. ఉదయిని - “ముత్యాలసరం' ఒక కృషి - శ్రీశ్రీ, ఫిబ్రవరి, 135

224 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దబ్బులన్నియు తెలుసుకొంటిని తప్పుబాసలు సేయకూ మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికీ డాయకూ ఉబ్బుచేసుక తత్తరంబున నొడలిపై చేయివేయకూ గబ్బితనమున దనుజమర్దన। కందుకూరి జనార్దనా! అండబాయక కూడియుంటి ఆయె బోయెను నాటికి ఖండి మండిపడంగ నేటికి కదలు మెప్పటిచోటికి ఉండరా నీ మాటలకు నే నోర్వజాలను మాటికి

గండిదొంగవు దనుజమర్దన కందుకూరి జనార్దనా!

కొదవలన్నియు దీర్చుకొంటివి నాగుణము లెరిగీ శయ్యనూ

అదనెరిగి ఏలితివి విరవాదిపూవులశయ్యనూ

మదనకేళికి నీవె జాణవు మారు తాపము మాన్చరా

కదియరారా దనుజమర్దన కందుకూరి జనార్దనా!

తెలుగులో ఇంత తీయగా అష్టకాలు వ్రాసిన వాళ్లు అరుదు. ఈ శాఖకు రుద్రే ప్రథముడు. ఇతని తరువాత చాలామంది అష్టకాలు వ్రాశారు. వాటిలో గోరంట్ల మాధవాష్టకం, ఒంటిమిట్ట రఘునాయకాష్ట్రకం, కడపాధినాయకాష్టకం మొదలైనవి ఉన్నాయిగాని వేటిలోనూ ఇంత తీయదనం కనబడదు.” తేటతెలుగు మాటలలో జనార్దనుని మీద అష్టకం వ్రాశాక తత్సమపదాలతో పంచరత్నాలు కూడ రుద్రకవి చెప్పినట్లుంది. ఇవి అముద్రితాలు.

అనాథనాథ నాగతల్చ యజ్ఞకల్పమౌనిరం

జనా! జనార్హినాశనా! దిశాపరీష్పుడార్డశ

సనా! సనాతనా! యనాదిసత్య కందుకూరి శ్రీ

జనార్దనా జనార్దనా సాహససారిమర్దనా!

సుందరీమయాంగ నానుశోభనా నిరంజనా

సృందనీకృతోర్షాశ్రలజా మనోఖిరంజనా

మందహాస భాసకంఠ మంజుభావితాంజనా

తందుతూరిసోమ విషకామదర్చభంజనా!

ఈ కృతులేకాక రుద్రకవి ఒక శతకం కూడ చెప్పినట్టుంది. దాని మకుటం చాలా పెద్దది. “బలవదరీదరీకుహర భాస్వదరీయదరీదరీ హరీ!” అని పొడుగ్గా. పాండిత్యప్రకర్షతో ఉంటుంది. అయితే 'శతకంలోని భావాలు చాలా సరళమైనవి; చమత్కారమైనవి.

  1. _ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో గ.128లో 8 అష్టకాలు ఉన్నాయి. ఇవి అముద్రితాలు. నొ సుదీర్టపీరికతో కందుకూరి మార తాప వి.ఎ.కె. రంగారావుగారు ప్రచురించారు ఆనందమోహన కావ్యమాల, మద్రాసు 19%.

  2. [764 కందుకూరి రుద్రవిషయం అనే గ్రంథంలోని పంచచామరాలు.

కందుకూరి రుద్రకవి 225 మానవమాత్రులం మనం ఏమాత్రం సవ్వ్నడైనా నిద్రపోలేము. సముద్రము హోరు,

పాముబుసలు ఉన్నప్పుడు దేవుడెలా నిద్రపోగలడు అని కవి సందేహం. " కలశపయోధిమీద దరగల్‌ మరి హోరని మైయ వేయు భం

గుల తల పాన్చుపాము బుసకొట్టగ నేగతి నిద్రచెందెదో

యలసత దండ్రి చీమచిటుకన్నను నిద్దురరాదు మాకు నో

జలపదరీ...

ఈ శతకం సమగ్రంగా దొరకలేదు. మూడు పద్యాలను వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ చాటుపద్యమణీమంజరి ద్వితీయ భాగంలో ప్రచురించారు. కందుకూరి రుద్రకవి గరించి కొత్త వివరాలు సేకరించి వారే సమర్పించారు. మల్కిభరాముడు రుద్రకవికి మడులూ మాన్యాలూ ఇచ్చాడట.

  • క్రీశ 1558లో పుట్టిన శాసనం ఒకటి రుద్రకవి వంశ్యుల వద్ద ఉంది" అయితే దాని నిజాయితీని చారిత్రక పరిశోధకులు శంకిస్తున్నారు.19

అప్పకవి సాక్ష్యం ప్రకారం గుంటుపల్లి భాస్కరయ్యగారి కాలంలో అంటే శ్రీశ 1620లో ఒక రుద్రకవి ఉన్నాడు.!! కృష్ణదేవరాయలవారి కాలంలో ఉన్ను రుద్రకవీ, మల్కిభరామునిచేత మాన్యాలు పొందిన కవీ, గుంటుపల్లి భాస్కరుని కాలంలోని కవీ ఒక్కరే అని భావించడానికి వీలులేదు.

కందుతూరివారి వంశంలో ముగ్గురో నలుగురో రుద్రకవులు ఉంటారు. వాళ్ళలో బహుశా రెండవ రుద్రకవి నిరంకుళోపాఖ్యానం, సుగ్రీవ విజయం మొదలైన రచనలు చేసి ఉంటాడు.

ఇతడు అష్టదిగ్గజాలలో ఒకడ, రాయలవారి కొలువులో ఒక సింహాసనం అధిష్టించకపోడేనేం, తెలుగు వాళ్ళ హృదయాల్లో ఎప్పుడూ తిష్టవేసుకొని కూర్చోగలడు.

“లకనాననా న లాలకలాతననకతా కలతలు నకల వనాలను నక ననన లకి పుటలను నములు నన ననాలనా చలానా ననిన ననా కొనాలని పునాతు నాధా నాననా న పాననననినం $. సుగ్రీనవిజయంపీఠిక, పుట15. _

  1. అష్టదిగ్గజములు, నేలటూరి వెంకటరమణయ్యగారి వ్యాసం, పుటు 22,

11, అప్పకియం 5:112-114. -

ఇతర కవులు ఈ యుగంలో ఉన్నంతమంది కవులు మరే యుగంలోనూ కనిపించరు. అప్టదిగ్గజాల ముందు వీళ్ళు దివిటీల ముందు దీపాల్లాగ కనబడ్డా తక్కువవాళ్ళు కారు. వీళ్లలో కొందరు మూసినముత్యాలు. తగినన్ని ఆకరాల ఎద్దడిచేత ఈ సాహితీమూర్తుల గురించి విడివిడిగా, సుదీర్దంగా చర్చించలేకపోవడం విచారకరం, ఈ యుగంలో ఏయే ఇతర కవులు ఉన్నారో పేరు తెలియని ఒక అజ్ఞాన గ్రంథ సంధాత సంకలనం చేసిన కావ్యంలో ఉదహరించిన కవులెవరో, వాళ్ళు వ్రాసిన గ్రంథాలేమిటో కూడా తెలుసుకొని తృప్తిపడదాం.

“1. యాదవామాత్యుడు। ఇతడు క్రీ.శ 1520 దాకా జీవించి ఉండవచ్చు. జైమినీభారతంలో పీనవీరయ వ్రాసిన చంద్రహాస చరిత్రనే చంద్రహాసవిలాసమనే పేరుతో 'కదళీపాకము'గా వ్రాశాడు. చాలా అణకువగల కవి. పూర్వకవులను ఉద్దేశించి ఇలా చెప్పాడు.

నన్నుబోలిన కవిగల్గ్లకున్న ధాత్రి

వరకవీంద్రులన్‌ పేరెట్లు వచ్చు మీకు

చిన్నలుండుటచేగాదె పెద్దలనుచు

దెలియగలుగుట యార్భులు దెలిసికొనుటు

తాను చిన్నవాడీనని కవి చెప్పుకొన్నా “పిన్న చేతి దివ్వె పెద్దగా వెలుగదా” అన్నట్టు అక్కడక్కడ జీగేలుమనకపోదు. ఇతని కవిత్వం ముద్దులు మూటకట్టి కేనెలొలుకుతూ ఉంటుందని పీరీశలింగంగారు సిఫార్సు చేశారు. యాదవామాత్యుడు విక్రమార్కచరిత్రను వచన కావ్యంగా బ్రాశాడు. సింహాసనం మీది ముష్ఫయిరెండు బొమ్మలూ చెప్పిన కథలే ఇవి. ఒక్కొక్క కథతు ముందు ఒక సీసపద్యుం వ్రాశాడు. ఈ యాదవామాత్సుడు లక్షణశిరోమణీ అనే పేరుగల యాదవామాత్యచ్చందాన్ని గూడ చెప్పాడు. ఇతని గ్రంథాలన్నీ భద్రాద్రి రామునికే అంకితం. 2. పెదపాటి సోమయ్య: లాక్షణికులు ప్రామాణిక కవిగా గుర్తించి ప్రయోగాలు ఉదహరించిన ప్రాచీనులలో ఇతడొకడు. ఇతని అరుణాచల పురాణంలో నుంచి * పద్యాలు, కేదార ఖండం నుంచి 9 పద్యాలు, శివజ్ఞాన దీపిక నుంచి ౩ పద్యాలు, త్రిపురవిజయం నుంచి 1 పద్యం వేటూరి వారి ప్రబంధరత్నావళిలో ఉన్నాయి. పద్యం ఎలా ఉండాలో కేదారఖండంలో ఇలా చెప్పాడు

పదలాలిత్యము వర్ణశుద్ధియు శబ్దస్టైర్యమున్‌ మంగళా

స్పద భావంటును రాజ యోగ్యతయు దోష స్ఫూర్తి రాహిత్యమున్‌

సదలంకార విశేషముం గలిగి విశ్వప్రాణ సౌభాగ్య సం

పదమై తేజియవోలె క్రాలవలదా పద్యంబు హృద్యస్థితిన్‌? (ప్రబంధ. ౫)

సోమయ్య సందర్చానికి అతికేటట్టు తన కావ్యంలో ప్రసిద్ధ సంస్కృత శోకాలు అనువదించి చేర్చుతాడని ఊహించవచ్చు. పెళ్ళి సంబంధాలలో ఎవరెవరు ఏవి తోరుకుంటారో “కన్యావరయతేరూపం' అనే శ్లోకం వివరిస్తుంది. దీనిని ఈ కవి ఇలో చెప్పాడు.

ఇకర కవులు 227 కన్నియ రూపు గోరు, గనకంబుల గోరును దల్లి, బుద్ధిసంపన్నత గోరు దండ్రి, కులభవ్యత గోరును బంధుకోటి, పక్వాన్న ఫలాది భక్షణము లన్ఫులు గోరుదు రిట్టులన్నియున్‌ బన్నుగ నొక్కచో నొదలె, భాగ్యము సేసితి గన్య నిచ్చెదన్‌. (ప్రబంధ-503) 3, కోడూరి వల్లభయ్యః పావులూరి మల్లన తరువాత గణిత శాస్త్రాన్ని ఆంధ్రీకరించిన వాళ్ళలో ఇతడు చెప్పుకోదగ్గవాడు. రాయలవారికి అప్పుడైన బొమ్మలాట కాళయ్య ప్రోత్సాహం వల్ల ఈ కవి లీలావతి గణితంలోనుంచి పాటిగణితం తెలిగించి కాళయ్యకు అంకితమిచ్చాడు. దీని ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (౧.135; 02280). ఈ కన శౌచిత్యం బాగా తెలుసు. కృతిపతిని, కీర్తిని తూడా లెక్కించాడు. కాళయ్య తన అర్థరాశిలో సగం తన గురువుగారు కుమవూర తాతాచార్భుల కీిచ్చాడట. ద్విజులకు శ తృతీయల్‌ రెండిచ్చి శేషపాదం కవిశ్రేణి కిచ్చాడట. స్నేహంతో చెలులకు శేషనవమభాగ పంచకం ఇచ్చాడు. మిగిలిన వెయ్యిన్నూట పదహారు కవి మహేంద్రుని కిచ్చాడట. ఈ లెక్కలో వెనక్కు వెశొితీ బొమ్మలాట కాళయ్య అస్తి 15066 నాణాలని తేలుతుంది. ఆపాటి గణీతం ఎంత విలువ చేస్తుందో ఖరీదులు కట్టే షరాబులు చెప్పాలి. .- 4. బొమ్మలాట కవులు: కోడూరి వల్లభయ్య రచించిన గణితశాస్తాన్ని అంకితం పుచ్చుకొన్ను బొమ్మలాట కాళయ్య కేవలం బొమ్మలాట విరూపాధిపుడు మాత్రమే కాడు. విద్యానిధి. కృష్ణదేవరాయల వారినీ, వారి సోదరుడు అచ్చుతదేవరాయలనూ తన విద్యతో మెప్పించి మన్ననలు పొందాడు. ఆందోళికాది సత్కారాలు నోచుకున్నాడు. ఈ కాళయ్య తానాడించే బహురూపాల యక్షగాన రచనలు తానే చేసివాడో లేదో చెప్పలేము గాని ఇతని తర్వాత ఇతని ఇంటిపేరు గలవారెందరో ఎన్నో తరంవారో తెలియదుగాని, చాలామంది కవులుగా కనబడుతున్నారు. బొమ్మలాట అమృతకవి అనే సంపన్నుడు బొమ్మలాట రైతు అని పేరుపడిన చంద్రయ్య అనే వ్యక్తితో కలసి చిడిపిరాల అనే గ్రామాన్ని తెరనాటకాలు ఆడించడానికి పెద్ద చిట్టయ్య అనే వ్యక్తికి దానం ఇచ్చినట్టు శాసన ప్రమాణాలు ఉన్నాయి.! కవి, అందులోనూ బొమ్మలాట కవి ఒక గ్రామాన్ని బొమ్మలాట అడించడం కోసం దానం చేశాడంటే అది శ్లాఘనీయమైన విషయమే. బొమ్మలాటవారు అనే ఇంటిపేరుగలవారు ఇంకొందరు కవులుగా చరిత్రకెక్కారు. బొమ్మలాట సిద్ధయ్య అనే వ్యక్తీ ఎప్పటివాడో తెలియదుగాని ఇతనికీ 'మోహనకవి' అనే పేరు ఉంది. "ఇతడు సంగీత సాహిత్య సరసఠోవిదుడు. ఇతనికి చాలామంది పుత్రులున్నారు. వాళ్ళలో కొందరు ఘనకావ్యభూషణులు. ఈ వంశంలోని సాంబయ్య “కిరాతార్డునీయ'మనే యక్షగానం రచించాడు (01849). బొమ్మలాట శాసనులైన ఈ ఇంటిపేరు. గలవారిలో సాంబయ్య, శంభయ్య, శంభువీర అనే పేరుగల వారు కనబడుతున్నారు. వీరు తెలుగులోనే కాక కన్నడంలోకూడా యక్షగానాలు రచించి తనల తతతకకాాాాాాతాాలాానా.

  1. 4316041928 అని చాగంటి శేషయ్యగారు చెప్పారు.

228 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ ఆడించేవారు. క్రీ.శ 1750లో ప్రాంతాల ఒక బొమ్మలాట సాంబయ్య ఉన్నాడని “తర్జాటక కవిచరతె' తృతీయభాగంలో ఉంది. ఇతడు ఇంకా ప్రాచీనుడై ఉండవచ్చు.

క. కోదండ రామయ్యగారి రామచంద్రయ్య! కృష్ణదేవరాయలవారి ప్రేరణవల్ల పుత్తేటి రామభద్రయ్య సకల కథాసారసంగ్రహం అనే పేరుతో షట్టత్రవర్తుల చరిత్రలను కథనం చేశాడు. బహుశా ఈ యుగంలోనే కోదండరామయ్యగారి రామచంద్రయ్య అనే కవి “షట్బక్రవర్తి చరిత్రం' అనే పేరిట ఒక 'మహాప్రబంధాన్ని' రచించాడు. ఇది ఆరాశ్వాసాల కావ్యం. గగంథావతరణిక, ఆశ్వాసాంత పద్యాలు లేని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (0.851). కవి తాను కాశ్యపసగో త్రీకుడని, తన తండ్రి పేరు కోదండరామయ్య అని గద్యలో చెప్పుకున్నాడు. ఈ రామచంద్రయ్య తన గరించి చెప్పుకున్న వివరాలు ఇంతకు మించి మరేవీ దొరకనందున ఇతని కాలనిర్ణయం సులభంగా తేలే విషయం కాదు. పుత్తేటి రామభద్రయ్యకు సమకాలికుడో, ఒక తరం అర్వాచీనుడో కావచ్చు. '“సకలకథాసారసంగ్రహం'తో దీనిని తులనాత్మకంగా పరిశీలించితే కొన్ని విశేషాలు బయటపడే ఆస్కారం ఉంది.

  1. కాకమాని గంగాధరుడు: సంస్కృతంలో అగస్త్యుడు రచించిన బాలభారతం చాలా యళశోభూషణమనే అలంకార గ్రంథాన్ని రచించిన విద్యానాథుడే అగస్త్య పండితుడని పండితుల అఖిప్రాయం. అగస్త్యవిద్యానాథుల ఐక్యవాదాన్ని ఈయుణ్ణ్జీ వెంకట వీరరాఘవాచార్యులుగారు విశదం చేశారు. ఈ బాలభారతానికే అప్పాజీ తిమ్మరుసు మంత్రి మనోహర వ్యాఖ్య రచించాడు. మలిరాయల యుగంలో ఈ గ్రంథం బాగా ప్రచారం పొందిందని ఈ వ్యాఖ్యవల్ల ఊహించవచ్చు.

ఈ బాలభారతానికీ అనువాదమో కాదో చెప్పలేంగాని కాకమాని గంగాధరుడు బాలభారతమనే తెనుగుకావ్యం బ్రాళాడు. ఇందులోని పదిహేను పద్యాలను అజ్ఞాతసంధాత ఉదాహరించాడు. ఈ పద్యాలలో ఒకటి వినాయక ప్రార్ధన, అయిదు పూర్వకవిస్తుతికి సంబంధించినవి. మిగతా తొమ్మిదీ కథకు సంబంధినవి. పూర్వ కవులను స్తుతించే పద్యాలలో మూడు సంస్కృత కవులను ప్రస్తుతించేవి ఒక శార్దూలంలో వాల్మీకిని, ఇంకొకదాన్లో వ్యాసుణ్జీ కీర్షించాడు. ఒక సీసపద్యంలో కాళిదాసాదులను నుతించాడు (ఈ సంస్కృత కవుల పట్టికలో విద్యానాథుడుగాని, అగస్త్రుడుగాని లేరు). ఒక కందపద్యంలో నన్నయగారినీ, ఉత్పలమాలతో తిక్కనగారినీ సత్కరించాడు. నన్నయగారిని నుతించిన పద్యం సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యాంశాన్ని చెప్తుంది.

'నన్నయగారు. తన గురించి చెప్పుకొంటూన్న విశేషణాలలో 'విపూ శబ్దకాసను'డనేది వాడారు (అది, 1-9). ఇది ఉత్త విశషణమా, లేక విరుదా అన్నది జ సమస్య. నన్నయగారిని నుతించిన కవులలో శ్రీనాథునిదాకా ఎవరూ శబ్దశాసనుడవే 2. యస్విజోగారావు ఆంధ్ర యక్షగాన వాజ్బయ చరిత్ర - ద్వితీయ భాగం - పుట ఆ.

  1. అంధ్రప్రకాపరుద్ర యళోభూషణం (కర్త: చెలమచర్ల రంగాచార్యులుగారు) భూమిక, పుటలు ౫-*

ఇతర కవులు 229 విషయాన్ని ప్రస్తావించలేదు. శ్రీనాథుడు 'నన్నపాచార్భవర్యు' అన్నాడు. జక్కన 'శబ్దశాసన వరేణ్యులు నాగ బ్రశస్తి కెక్కిరి అని నన్నయగారిని పొగిడాడు (విక్రమార్క, 1-12). ఈ ప్రస్తావనవల్ల ఇది బిరుదో, విశేషణమో తెలియదు. అయితే ఇది బిరుదే అని తెలుగు సాహిత్యలోకం ఒకనాడు భఖావించేదని చెప్పడానికి కాకమాని గంగాధరుని పద్యం పనికివస్తుంది. ఇతడు నన్నయగారిని ఇలా నుతించాడు:

శబ్దార్థ విశారమ - శాబ్దిక మూర్ధన్యు శబ్దశాసనవిరుదుక

శబ్దాయ సమానశవిస్ఫుర - దబ్బఘటారభటి నన్న పార్యుని దలతు౯€.

(ప్రబంధ. 130)

గంగాధరుని కాలంనాటికే. అంటే క్రీశ. 16వ శతాల్లీ ప్రథమార్ధంలోనే నన్నయగారికి ఈ బిరుదు ఉండేదని చెప్పవచ్చు. అయితే 'విరుదు' అనే మాటకు ఈ నందర్చంలో “మొనగాడు, '“సమర్శుడు' అని అర్థం చేసుకోవచ్చునని, దీనిని కేవలం వీరుదువాచకంగా స్వీకరించనక్కర్లేదని నిడుదవోలు వెంకటరావుగారు అఖిప్రాయపడు తున్నారుో

పాంచాలీ పరిణయం, రాజవాహన విజయం అనే కావ్యాలు రచించిన కాకమాని _ మూర్తికవికి ఈ గంగాధరుడు బంధువో, కాడో చెప్పలేం. ఇద్దరిదీ ఒకే ఊరు కావచ్చు. కాకుమాను అనే గ్రామం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలో ఉంది. గంగాధరుడు బాసిన బాలభారతంలో ద్రౌపదీ వివాహ ఘట్టాన్ని విపులంగా వర్ణించినట్టు కనబడు తుంది. ఉదాహరించిన 15 పద్యాలలో మూడు పద్యాలు ఈ పెళ్లి గురించే ఉన్నాయి. బాలభారతంలో లాజహోమం, సన్నెకల్లు తొక్కించడం గంగాధరుడు వర్ణించాడు. పాంచాలీ పరిణయంలో ఇవి లేవు. ప్రస్తుతం లభించే ఆకరాలతో కాకమాని గంగాధరునికీ, మూర్తికవికీ గల సంబంధం చెప్పలేం. 7. రాయసం గణపయ్య: ప్రబంధ రచన ప్రచారంలోకి వచ్చాక కవులు పురాణేతిహాసాల లోని చిన్న చిన్న ఘట్టాలను తీసుకొని అష్టాదశ వర్ణనలు జోడించి కావ్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. కాకమాని మూర్తికవి మరో భారతంలోని పాంచాలీ పరిణయ ఘట్టూన్ని తీసుకొని వ్రాస్తే రాయసం గణపయ్య అంతకుముందే 'సొగంధికాపహరణాన్ని కావ్యంగా రచించాడు. ఇందులోని ఒకే ఒక పద్యాన్ని అజ్ఞాతసంధాత ఉదాహరించాడు. అది ఖీముడూ, హనుమంతుడూ సమావేశమైన ఘట్టంలోనిది.

అంతంతం గబళింపగా గడగె బాలార్కుక్‌ ఫలభ్రాంతి, వే

శంతోల్లంఘనకేళి దాటెను సరస్వంతుక్‌, మహాదానవా

శాంతారామమహీరుహంబుల నుదగ్రక్రీడ ద్రుంచెక, హనూ

మంతుడు౯ గపియు న్న విం గపులె సామన్యాటవీచారములో. (ప్రబంధ. 13) 4. తనుగుకవుల చరిత్ర, పుట 141

290 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 8. కుడిచెర్ల తిప్పరాజు: పూర్వ కవులలో దగ్గుపల్లి దుగ్గన శివకాంచీ మహాత్మాన్నీ ఆంధ్రకవి రామయ్య విష్ణుకాంచీ మాహాత్మ్యాన్నీ రచించారు. కుడిచెర్ల తిప్పరాజు కూడా కాంచీమాహాత్మ్యం అనే కావ్యాన్ని వ్రాశాడు. ఇందులోని అరడజను పద్యాలను అజాతసంధాత ఉదాహరించాడు. మూడు పద్యాలు పురవర్ణనలోనివి, ఒకటి భరద్వాజుని స్తుతించేది. మరొకటి పితామహసోమయాజి దర్చాసనంమీద తూర్చున్న తీరు తెలిేగ్ష ఆఖరిది 'అటచనికాంచె' పద్ధతిలో అనుప్రాసాలతో వర్ణించేది కావ్యంలో కవి విశేషంగా శ్లేషలు వాడి ఉంటాడని చెప్పడానికి ఈ పద్యం పనికివస్తుంది.

అరుణమణిదీప్తు లంతంత నతిశయిల్ల - విమలశకికాంతరోచులు విస్తరిల్ల

గావ్యబుధగురుసంగతి గలిగిపురము - సూర్యసోమవీథులు తడుసొంపుమిగిలె

(ప్రబంధ. 161)

పురంలో ఉండే సూర్యసోమవీథులను, నభోవీథిలోని సూర్యచంద్రుల పథాన్నీ శ్లేషతో కలిపి అయిదు గ్రహాలను పద్యంలో ఇరికించాడు. కావ్యమంతా దొరక్కుండానే కాంచీమాహాత్మ్యం వ్రాసిన ఈ కవి కథ కంచికి వెళ్ళడం విచారకరం. కావ్యాలు సంపూర్ణంగా దొరికినప్పుడు కలిగే ఆనందం ఖరీదు కట్టలేనిది. తుంటుముక్కల తిమ్మయ్య వ్రాసిన శైవాచార సంగ్రహం లోనిదని అజ్ఞాతసంధాత ఒకే ఒక పద్యాన్ని ఉదాహరించాడు. అయితే అదృష్టవశాత్తూ ఈ గ్రంథం సంపూర్ణంగా దొరికింది. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంవారు దీనిని ప్రచురించారు. ఆచార్య గంటి సోమయాజీగాడ విపులమైన పీఠిక వ్రాశారు. ఇది మూడాళశ్వాసాల కావ్యం. ఇందులో ౫ గద్యపద్యాలున్నాయి. భస్మధారణవిధి, రుద్రాక్షధారణవిధి, ముగ్గుల లక్షణం, రకరకాల పువ్వుల ఫలతారతమ్యాలు మొదలైన శవ్రైవాచార విధానాలను కవి సప్రచూణంగా వ్రాశాడు. దీనిలో 60 విషయాలున్నాయి. రచయిత సుమారు ౫ గ్రంథాలనులి ప్రమాణాలను చూపించాడు.

అచార్య సోమయాజిగారు చెప్పినట్టు “ఇది కేవలవిషయప్రధానమైన మళ గ్రంథముగావున నిందుగవిత్వమున్తు గూర్చి విశేషము వివరింపనవసరములేదు. పద్యములు పాదపూరణాదులు లేక కొంత బిగువు కలిగి ఉన్నవి.” ఈ రచయిత కాలాన్ని నిర్ణయించడంలో అఖిప్రాయ భేదాలున్నాయి. కొత్కోకం అంకితం పుచ్చుకొన్న తుంటుముక్కల మల్లయమంత్రి అన్న కొడుకే తుంటుముక్కల తిమ్మయ్య అని నిడుదవోలు వెంకటరావుగారి అభిప్రాయం. అప్పుడు ఇతని కాలం క్రీ.శ.1490. గంటీ సోమయాజిగారి తాక్కాలిక నిర్ణయం ప్రకారం కవి క్రీశ 1510లో దీనిని బ్రా ఉండవచ్చు చాగంటి శేషయ్యగారి అంచనా ప్రకారం క్రీ.శ 1520-1560 కావచ్చు.” ఇ వరదాయ. భాతి రకోక్సవ నద సన్‌ 6, శైవాచారసంగ్రహం - ఉపోద్దాతం, పుట 2. 7. అంధ్రకవితరంగిణి - ౧ పుటలు 17-172

ఇకర కవులు 2391 వైవాచారపరాయణులకు ఎలాగూ ఉపయోగపడే ఈ గ్రంథం పువ్వులు. ఆకులు, నూనెలు మొదలైన వాటిలోని భేదాలు చెప్పడంవల్ల ఇది పరిశోధకులకు నిఘంటు రచనలో తోడ్పడుతుంది. 10. రాపరది దేచిరాజు: అజ్ఞాతసంధాత ఒక్క పద్యం మాత్రమే ఉదాహరించిన శైవాచారసంగ్రహం పూర్తిగా దొరికినందుకు ఎంత సంతోషించాలో, రాపరది దేచిరాజు బ్రాసినదని చెప్పి ఇచ్చిన ఒకే పద్యం ఏ గ్రంథంలోదో సైతం తెలియనందుకు అంత విచారించాలి. ఇది పురవర్దనలోని పద్యం. ఘనవప్రోపరిభాగ కేతుకషణక గంజారివింబంబు కం దిన దంచుక్‌ బురిముగ్గ భామినులు ప్రీతి౯ గందువో దోమ జిం దన మర్థిం గొని లీల నీలరుచిమక్కాంతో రుహర్మ్యంబు లె క్కీన సంభోదతటిల్ల తావితతిమాడ్కిం బొల్తు రుద్యద్గతిక. (ప్రబంధ. 179) ఈ ఉదడ్రేక్ష వల్ల ఇతడు ప్రబంధ రచన విరివిగా సాగే రోజులలో వాడని మాత్రం ఊహించవచ్చు. 11.“పోతరాజుః జక్కన విక్రమార్కచరిత్ర వ్రాసిన దగ్గర్నుంచీ తెలుగు దేశంలో బేతాళుని కథలు, విక్రమార్కుని కథలూ ప్రచారంలో ఉన్నాయి. వెన్నెలకంటి అన్నయ్య షోడశకుమవూర చరిత్రలోనూ కూచిరాజు ఎర్రన్న సకలనీతి కథావిధానంలోనూ, వేతాళుని కథలు వ్రాశారు: ఈ ఇద్దరికన్నా చాలా పూర్వం కవిభల్లటుడు తూడా ఒక బేతాళ పంచవింశతి బ్రాసినట్టు లోకం చెప్పుతుంటున్నది.1? పోతరాజు అనే మరొక కవి వ్రాసిన బేశాశ పంచవింశతి లోనివని 10 పద్యాలను అజ్ఞాతసంధాత ఉదాహరించాడు, ప్రబంధసాధారణమైన కవిత్వం. చెప్పుతోదగ్గ విశేషాలు లేవు. 12. భీమన్న; తెలుగు సాహిత్యంలో ఎంతమంది భీమన్నలున్నారో అంతు చిక్కదుగాని భీమన అన్న పేరు వినగానే వేములవాడ భీమకవే జ్ఞాపకానికి వస్తాడు. ఒక్కటే పేరు గల వివిధాంధ్ర కవుల పట్టికనూ, దీనికి అనుబంధంగా ఒకో ఇంటిపేరు గల వివిధ ఆంధ్రకవుల జాబితానూ శిష్టా రామకృష్ణ శాస్త్రిగారు తయారు చేశారు.!! అయితే ఇందులో ఖీమన్నల లిస్టు లేదు. “ఖీమకవి దశావతార పద్య'మని అజ్ఞాతసంధాత ఈ క్రీంది పద్యాన్ని ఉదాహరించాడు. శ్రుతిసుధాక్ష్మభక్త సురజననీ వధూమల్ల శంకరధర్మ మహితబుద్ధి గగ తూర్మకిటినరమృ గకుబ్దరామరామానంత బుద్ధకల్కా్యాహ్స్హయముల నము చిమందరకతుదానవబలార్జునపంక్రిముఖముప్టిక స్త్రీ విముక్తఖలుల దుత్పచ్చకర్పరదం్టా గ్రనఖపదపరశుబాణహలంగ ఖురపుటముల 8. తొలిరాయలయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి సం॥ 2002. 8. అదే సంపుటి ౪. 'పద్మనాయకయుగం” అదే సంపుటి క31. ఉంటు ౮ ౦జి! నిజం - ౮గబాడు రో ఏఅదాజ, 06, 584 1 & £, 1969)

జః సమణ్రాంభ్ర పాహిత్యం - రెండన పంవ్వటి

జెరవి తాల్చి యెత్తి చీ ఐంధించి వి

రించి యేపి యేర్చి చెరిచి మట్ట

గడగుచున్న శౌరి కరుణావిధేయుడై

మనల గోర్కు లిచ్చి మమచుగాక. (ప్రబంధ 41)

అయితే పెదపాటి జగ్గన్న, ఇదే పద్యాన్ని ఉదాహరించినా అది కంచిరాజు సూరయ్య బ్రాసిన “కన్నప్ప చరిత్రలోనిదని చెప్పాడు. ఈ సంఠలనకర్తలలో ఎవరు పారబడ్డారో తెలియదు. అజ్ఞాతసంధాత చెప్పిన సంగతే నిజమైడే ఈ భీమకవి ఎవరో, ఏ గ్రంథంలో ఈ దశావతార పద్యం బ్రాశాడో పరిశోధించిన మీదటగాని తేలదు. దశావతార పద్యాలను బాయడం పారిజాతాపహరణంలో ముక్కు తిమ్మనగారు మొదలెట్టారు (3:28-3) తరువాత ఇది ఫ్యాషనైంది. రాయలవారూ, పెద్దనకవీ, తెనాలిరామకృష్ణకవీ మొదలైన వాళ్ళే అనుసరించారు. బహుశా ఈ భీమకవి వీళ్ళ సమకాలికుడే అని చెప్పవచ్చు. 13. రెడ్డిపల్తె ముద్దమరాజూ: అష్టమహిషి కల్యాణాన్ని తాళ్ళపాక చిన్నన్న ద్విపద కావ్యంగా ఉంటాడు. ఇతవి అష్టమహిషి కల్యాణం నుంచి రెండు పద్యాలను అజ్ఞాతసంధాత భహిందాడు. రెంతూ అవతారికలోనివే. ఒకటి మంగళాచరణం; రెండోది వాల్మీకీ ప్రశుస. ఈ కవి ఈ,న్నున్నకు అర్వాచీనుడని ఊహించవచ్చు. రెడ్డిపల్లి అనంతపురం బీల్లా కదిరి తాలూకాలో ఉంది. క4. పోతరాజు వీరయ్యః ఇతడు త్రిపుర విజయం అనే కావ్యం వ్రాశాడు. దీనిలోనుంచి వాలుగు సీన పద్యాలను అజ్ఞాతసంధాత ఉదాహరించాడు. పెదపాటి సోమయ్య కూడా త్రిపురవిజయం అనే కావ్యం బ్రాశాడు. అతని పద్యాన్ని కూడా ఒకదాన్ని ఈ సంధాళ ఉదాహరించాడు. ఇది కూడా సీసపద్యమే. వీరయ్య బహుశా సోమయ్యకు సమకాలికుడో. సమీప కాలంలోవాడో అవుతాడు. క్షే5. పిద్ధవ ద్రెగడః పిల్లలమర్రి పినవీరభద్రుడే గాక శాకుంతలాన్ని పద్యకావ్యంగా బ్రాసీన తెలుగుకవిగా సిద్దన పైగడ కనబడుతున్నాడు. ఇతని పద్యాన్ని ఒకదాన్ని అజ్ఞాతసంధాళ ఉదావారించాడు. ఇది పురవర్ణనలోనిది.

నీరజమిత్రుతో బయల నిల్చి చలంబున గిట్టి మమయిం

బోరుకు దుర్లభం బనుచు భూరి తమఃపటలంబు లొక్కమై

మారెల గోటపట్టి పొడసూపగ నొక్కొ మెదిర్చెనాగ బ్రా

కార విబుద్ధ నీలమణి కాంతి గనుంగొన నొప్పునెంతయున్‌.. (ప్రబంధ. 477) ఈ కవి గురించి ఇతర వివరాలేవీ తెలియవు. 16. కాచిరాజా బసవన్న ఇతడు లాక్షణికుడు. కవిసర్పగారుడం, ప్రయోగసారం అనే ఇతని గ్రంథాలు అముదితాలు.!*ి 2. రావూరి దొరస్వామి శర్మ, తెలుగు భాషలో ఛందోరీతులు, పుటు - ౩౬

ఇతర కవులు 233 17, త్రిలోకఖిది : ఈ కవి ద్విపద కావ్యాలుగా హరిశ్చంద్ర నవనాథ చరిత్రలు వ్రాసిన గౌరన మనుమడే. ఇతడు 'సకలధర్మసారం' అనే కావ్యం వ్రాశాడు. దీనిని ఇటీవల డా | వీరుదు రాజు రామరాజుగారు సంపాదించారు. ఈ కవి క్రీ.శ. 1465 ప్రాంతాలవాడని వారు అఖిప్రాయపడుతున్నారు. ఈ సకలధర్మసారం నాలుగాశ్వాసాల గ్రంథం. ఇందులో చానాలు, వ్రతాలు మొదలైనవాటి ప్రశంస ఉంది. ఈ కవి గురించి ఇంకా పరిశోధనలు చెయ్యాలి. తాతంభట్టు బహుశా ఈ గ్రామంవాడే కావచ్చుగాని అతడు దేశమంతా తిరిగాడు. గజపతి అశ్చపతి నరపతులచేతా, మాళవేశ్వ్చరుని చేతా మన్ననలు పొందాడు. ఇతడు అష్టభాషా ప్రక్రియల లబ్ధవరుడు, సన్నుతసాహిత్య చత్రవర్తి, అనవద్య సర్వవిద్యాసాదృశ్యుడు, విద్వజ్ఞన బ్రాత విశ్రుతుడు. అయితే ఇతడు వ్రాసిన కావ్యాలేవీ దొరకలేదు. సంక్షేప భాగవతం వ్రాశాడని తెలుస్తున్నది. అకరాలు చెప్పకుండా వీరేశలింగంగారు తాతంభట్టు పద్యాలను రెండు తమ ఆంధ్రకవుల చరిత్ర (రెండవభాగం - పుట - 8)లో ఉదాహరించారు. ఒక పద్యం సంక్షేప భారతంలోనిది కావచ్చు. చూడండి. నిన్నాడింపగవచ్చు గోపతనయల్‌ నెయ్యంబునన్‌ వేదిపై నున్నావీకడిగొమ్ము జోగుల్‌ క్రాలోన్మత్తులై వచ్చెదర్‌ వెన్నా మీగడయున్‌ ఫలంబొసగెదన్‌ వేగంచె రారమ్ముమా యన్నా యంచును వ్రేతవెట్టు హరియో యమ్మ నగున్‌ మాటికిన్‌ 1 తాతంభట్టు సంక్షేపభాగవతమంతా దొరికితే బాగుండును. ఇతని కవిచింతామణీ, ఛందోదర్స్పణం అనే లాక్షణిక గ్రంథాలు మాత్రం దొరుకుతున్నాయి. అవి సుప్రసిద్ధాలు. ఈ కవి ఏనుగులను దానం పుచ్చుకొని, వాటిని మేపగల స్తోమత గలవాడు. సాహితీ సమరాంగణ చక్రవర్తి కృష్ణ్ణయల యుగంలో సాహిత్యం ఏనుగుపాడి। 13. ఆంధ్రపత్రిక మన్మథ సంవత్సరాది సంచిక, 1955-56.

నవాబుల యుగం

నేడు ఆంధ్రుల రాజధాని ప్టైదరాబాదు నగరం. దీనిని నిర్మించి మహానగరంగా రూపొందించినవాళ్లు కులీ కుతుబ్‌షాహీ వంశీయులు. ఎక్కడో పర్షియా దేశంలోని రాజవంశంలో జన్మించి మధ్య - ఆసియాలోని తబ్రీజ్‌ హందం నగరాలను పాలించి శత్రువుల చేత పరాజితులైన కులీవంశీయులు జీవనోపాధి కోసం క్రీ.శ15వ శతాబ్ది చివర పాదంలో భారతదేశానికి వచ్చారు. బహమనీ సుల్తానులను ఆశ్రయించారు క్రీ.శ 1496లో బహమనీ ప్రభువు సుల్తాన్‌ కులీని, కుతుబ్‌-ఉల్‌-ముల్క్‌ అనే బిరుదు ఇచ్చి, తెలుగుదేశంపైన అధికారిగా నియమించాడు. సుల్తాన్‌ కులీ 1518లో బహమనీ సామంతుడుగానే సేవించాడు. ఆ తరువాత కుతుబ్‌షా అనే బిరుదాన్ని గ్రహించి స్వతంత్రుడయ్యాడు.

సుల్తాన్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ 1543 దాకా పాలించాడు. అర్థ శతాబ్దం పైగా అతడు తెలుగుదేశంలోనే ఉండి దానినే తన నిజనివాసం చేసుకొన్నాడు. బహమనీ పరిపాలనలో వరంగల్లు పరిసరాలకు మాత్రమే పరిమితమైన రాజ్యాన్ని క్రీ.శఈ1543 నాటికి మచిలీపట్టణం దాకా విస్తరించాడు. గోలకొండను కేంద్రం చేశాడు. తన రాజ్యంలోని ప్రజలు ముప్పాతికమూడు వంతులు హిందువులే కాబట్టి వాళ్ళ హృదయాలను చూరగొంటే తప్ప సుస్థిరంగా రాజ్యం చేయలేమని సుల్తాన్‌ కులీ గుర్తించాడు. తాను పరదేశీయుడనీ, ఇతర మతంవాడనీ ప్రజలు మరచిపోయేటంత అనురాగంతో అతడు పరిపాలన చేశాడు. జాతిమత భేదాలను పాటించకుండా, అర్హత ఉన్నవాళ్ళకు గొప్ప ఉద్యోగాలిచ్చాడు. ఉత్తరోత్తరా కృష్ణదేవరాయలవారి అల్లుడైన ఆరవీటి రామరాయలు మొదట ఈ సుల్తాన్‌ కులీ కొలువులో ఉన్నవాడే. ఇటువంటి తెలుగు సర్దార్ల సహాయంతో తులీ కుతుబ్‌షా ఆంధ్రదేశమంతటినీ ఒక రాజ్యం క్రిందికి తీసుకువచ్చి జాతీయ ఐక్కతకు అంకురార్పణ చేశాడు. కుతుబ్‌షాలు తాము వ్రాయించే సనదులు పార్సీలో బ్రాయించి ఇచ్చినా, ఆ విషయాలనే తెలుగులో తూడా వ్రాసి ఇచ్చేవారు. తెలుగు మండలంలో తెలుగు ద్వారానే రాజవ్యవహారాలు జరిపించారు.!

సుల్తాన్‌ కులీ సుదీర్షకాలం పరిపాలన చేశాడు. తొంభయి. సంవత్సరాల వయసులో నైతం రాజ్యమేలాడు. అతనికి నలుగురు కుమారులు. పెద్దవాడు ష్టాదర్‌కులీ తండ్రీ జీవితకాలంలోనే మరణించాడు. రెండవవాడు కుత్‌ఉద్దీన్‌ ఇతజ్జే కులీ కుతుబ్‌షా తన తరువాత రాజ్యానికి వారసునిగా ప్రకటించాడు. అయితే మూడవ కుమారుడు జంషీదు దురాశాపరుడై తండ్రిని చంపించి, అన్న కళ్ళు పీకించి పట్టం కట్టుకొన్నాడు. ఈ దుర్మార్గాలు చూసి సుల్తాన్‌ కులీ నాలుగవ కుమారుడు పారిపోయి విజయనగరంలో తలదాచుకొన్నాడు. అతనికి అలియ రామరాయలు ఆశ్రయమిచ్చాడు. 1, అయ్యంకి వెంకటరమణయ్య గారి సన్మాన సంచికలో 'ఖుతుబ్‌ షాహీల ఆంధ్రభాషాపోషణం' -

సురవరం ప్రతాపరెడ్డిగారు.

నవాబుల యుగం 236 అప్పటికి విజయనగరంలో అంతఈకలహాలు సర్దుకున్నాయి. కృష్ణదేవరాయల తరువాత రాజ్యం కోసం సవతి తమ్ముడు అచ్యుత దేవరాయలూ, అల్లుడు ఆరవీటి (ఆఅశియ) రామరాయలూ పెనుగులాడారు. అచ్యుతరాయలు మొదట విర్ర విగిసినా రామరాయలతో రాజీపడి కొంత అధికారం వదలుకొన్నాడు. శ్రీ.శ1542లో అచ్యుత రాయలు మరణించాడు. ఆ తరువాత ఆ ఒక్క ఏడాదైనా తిరక్కుండానే రామరాయలు రాజ్యమంతటినీ కైవసం చేసుకొన్నాడు. కృష్ణదేవరాయల సోదరులలో ఒకడైన సదాశివరాయలకు పట్టం కట్టి అతని పేరుమీద రాజ్యమేలాడు. ఎన్నో యుద్దాలు చేశాడు. దక్షిణాన కన్యాకుమారి దాకా తన అధికారాన్ని విస్తరింపజేశాడు. భారతదేశాన్ని పాలించిన మహారాజులలో అళియ రామరాయలు చాలా దొడ్డ ప్రభువని చెప్పాలి. అతడు ఎంతటి యోధుడో అంత శాంతికాముడు. మహమ్మదీయులకు కూడ ఈ భారతదేశమే స్వదేశమని గుర్తించాడు. సుల్తాన్‌ కులీ ఎలాగైతీ హిందూ సర్దార్గను నమ్మి పెద్ద పదవులలో నెలకొల్పాడో అలాగే రామరాయలూ మహమ్మదీయ యోధులకు ఉద్యోగాలిచ్చాడు. సైన్యంలో వేలకువేల ముసల్మానులు చేరారు. వాళ్లలో ప్రముఖులకు గొప్ప ఉద్యోగాలిచ్చి సామ్రాజ్యంలోని ఆంతరంగిక రహస్యాలను సైతం వాళ్లకు తలియనిచ్చేవాడు. వాళ్ళను బాధ్యతాయుతమైన కార్యాలలో నియోగించేవాడు. ఈ తురక సర్దార్లు చాలామంది విశ్వాసపాత్రంగా కొలుచుకున్నారు. ఇటువంటివారినే పోషించిన రామరాయలు తన మాజీ ఏలిక తుమారుడు ఇబ్రహీంకు ఆశ్రయమివ్వడంలో ఆశ్చర్యం లేదు. ఇబ్రహీం విజయనగరంలో ఏడేళ్ళపాటు తలదాచుకొన్నాడు. రాజ్యాంగ తంత్ర నైపుణ్యాన్ని అలవరచుకున్నాడు. తెలుగు సాహిత్యమంటే అఖిరుచి కలిగింది. క్రీశ1550లో జంషీదు మరణించాడు. గోలకొండ సింహాసనం ఇబ్రహీమును ఆహ్వానించింది. విజయనగరం నుంచి గోలకొండ దాకా ప్రజలు అతనికీ రెండుచేతులా స్వాగతం చెప్పారు. పట్టం కట్టుకొన్నాక ఇబ్రహీం ఎన్నో ప్రజోపయోగ కార్యాలు చేశాడు. దొంగల బాధ లేకుండా రాకపోకలు సురక్షితంగా ఉండేటట్టు చేశాడు. వర్తకం అఖివృద్ధి చేశాడు. చెరువులు తవ్వించాడు. నగరాలు నిర్మించాడు. తోటలు వేయించాడు. కవులను, పండితులను పోషించి తెలుగు కృతులు అంకితం పుచ్చుకొన్నాడు. “తపతీ సంవరణో పాఖ్యానం' బ్రాసి అద్దంకి గంగాధరకవి ఇతనికే అంకితమిచ్చాడు. తెలుగుకవుల పద్యాలలో ఇబ్రహీం ఇభరాముడయ్యాడు. ప్రభువు మహమ్మదీయుడైనా అతణ్ణీ 'ష్టాందన దేవతలు రక్షింతురుగాక అని కవులు దీవించారు. గంగాధరుడు తన కావ్యంలో మంగళాచరణం ఇలా చేశాడుః శ్రీసతి మించుగాగ తులసీదళమాలిక కౌస్తుభోజ్వలం టై సురచాపలీల జెలువందగ వేణురవంబు గర్జితం టై సాబగొంద శౌరి ఘనుడై కరుణారసవృష్టిచే నిరా యాసత బ్రోచుగావుత నృపాగ్రణి మల్కిభరాము శాంతిపున్‌. ఈ ఇభరాముడు ఎప్పుడూ “భారతీయక్షీరమయసింధు బంధు మద్యలలిత పుణ్యకథాసుధాలహరి'లో తేలుతూ ఉండేవాడని గంగాధరుడు చెప్పాడు. ఇభరాముని

236 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కొలువులో సకలవేదపురాణశాస్త్రపారంగులైన ఒంటరి విద్వాంసులు ఒక ప్రక్కా అష్టభాషలలో, ఆంధ్యం లేని హూంతకారి కవీంద్రులు ఒకప్రక్కా ఉండేవారు సంప్రదాయం ప్రకారం మనకు షట్టక్రవర్తులూ, షోడశ మహారాజులూ ఉన్నారు. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్దునుడు, వీళ్ళ తోవలో ఇభరాముణ్జీ పండితులు కలిపారు. ఇతణ్జీ ఏడవ చత్రవర్తిగా, పదిహేడవ మహారాజుగా కీర్తించారు.

ఏడు కులాద్రు లెక్కి వెస నేడు పయోధులు దాటి లీలమైై

  • నేడవు దీవులం దిరిగి యేడుగడ౯ విహరించి కీర్తి యీ రేడు జగమ్ముల౯ వెలయ నేలిన మల్కిభరామచంద్రుడే యేడవ చక్రవర్తి పదునేడవ రాజు ధరాతలమ్మునన్‌ (చాటుపద్యమణీమంజరి, పుట 45) ఇంతటితో ఊరుకోలేదు. మన పురాణాలలోని ఏ రాముడూ ఈ ఇభరాముడితో సమానం కాదన్నారు.

రాముడు దుక్కిముచ్చు, రఘురాముడు క్రోతుల రాజు, రేణుకా

రాముడు పోటుబంటు, పటురాగసమంచితుడైన గోపికా

రాముడు వెర్రిగొల్ల, డీక రాష్ట్రములందు సమాను లేరయా

రాముల నెంచిచూడ నిభరామ మహీధవభవ్యవైభవా!

ఈ సాటిలేని ఇభరాముడు తెలుగు ముషైరాలు నడిపేవాడు. తన ఆశ్రితులను వాళ్ల వాళ్ల కవులతో కొలువు కూటానికి పిలిపించుకొని ఆయా సామంతుల మీద ఆ కవులు చెప్పిన అతిశయోక్తులు విని ఆనందించేవాడు. ఇతడు విద్వాంసులను ఎలా సత్కరించిందీ ఈ క్రింది చాటువు చెప్తుంది.

నప్వానా సంగీతనాద భేదవిధిజ్ఞ ధీరాత్ములకు బదినూరు లిచ్చు

రమ్మనెనా సభాప్రొఢసత్కవివరజాలములకు బదివేల నిచ్చు

తూర్చుండు మనియెనా గురుతరశాస్త్రజ్ఞ లక్షణవిదులకు లక్షయిచ్చు

శాబాసురా యన్న సకలా శ్రికానేకకోవిదులకు మెచ్చి కోటియిచ్చు

భళిర। చతురబ్ధిమేఖలాకలితధాత్రి - చక్రనిర్వక్రపాలనాచారుకీర్తి

(చాటుపద్యమణిమంబరి, పుట 43)

ప్రభువు ఇలాగ సంగీతసాహిత్యాలను పోషిస్తూ ఉంటే రాజోద్యోగులు కూడ తమ తాహతుకు తగినట్లు తామూ సాహిత్య పోషణ చేశారు. ఇభరాముని అస్తానంలో మీర్‌జూవ్లా పదవిని వహించిన అమీర్‌ఖాన్‌ తూడ ఒక తెలుగు కావ్యాన్ని అంకీతం పుచ్చుకొన్నాడు. గోలుకొండ సామ్రాజ్యం పోషణలో తపతీ సంవరణోపాఖ్యానం బ్రాసిన అద్దంకి గంగాధరుడు, యయాతి చరిత్ర రచించిన పొన్నికంటి తెలగన్ను, వైజయంలీ విలాసం బ్రాసిన సారంగు తమ్మయ్య, సుగ్రీవ విజయం, నిరంకుళోపాఖ్యానం చెప్పిన

నవాబుల యుగం 237 కందుకూరి రుద్రకవి, నిరోష్ట్రరామాయణం అనే పేరుతో దశరథరాజనందన చరిత్ర రచించిన మరింగంటి సింగనాచార్యుడు, రాజనీతి రత్నాకరం అనే పేరుతో వైష్ణవ ఉండేవారు. ఈ కవులలో కొందరికి పాదుషాలు మడులూ మాన్యాలూ ఇచ్చారు. కుతుబ్‌షా వంశాన్ని స్థాపించిన సుల్తాన్‌ కులీ ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. “చతురవచో రచనాతిప్రతిభాసుకవిత్వతత్వపారీణు'డైన ఈడూరి ఎల్లనామాత్యునికీ సుల్తాన్‌ కులీ 'కోర్కొలను' గ్రామంపై అధికారాన్ని ఇచ్చాడు. ఈ ఎల్లనార్యుడే శంకరకవి వ్రాసిన హరిశ్చంద్రోపాఖ్యానం కృతిభర్హ. సుల్తాన్‌ కులీకి, ఈడూరి ఎల్లన్నకూ గల సంబంధం ఈ క్రింది పద్యం వల్ల తెలుస్తుంది.

అలఘుప్రతాపకుతుబన - మలకేంద్రకృపాసమ గ్రమహిమాన్వితకో

ర్కొలని గ్రామనికేతన - జలసీమారక్షణైైక చాతుర్యనిధీ * (హరి. 5-243)

తండ్రీ ప్రవేశపెట్టిన సత్సంప్రదాయాలను మల్కిభరాం చక్కగా అనుసరించాడు. కందుకూరి రుద్రకవి లాంట్‌ కవులకు మాన్యాలిచ్చాడు. తెలుగు కావ్యకన్యకలనే కాత తెలుగు కన్యకలను కూడ స్వీకరించాడు. భాగీరథి అనే ఆటవెలది ఇతని ప్రియురాలు. గోలుకొండ నగరానికి ఈమె పేరునే పెట్టి ఇభరాముడు దానిని 'భాగీరథీపట్టణ'మని పిలువసాగాడు.2 వైజయంతీ విలాసంలో సారంగు తమ్మయ్య తాను గోల్కొండ కరణాన్నని చెప్పుకొన్నాడు.

ఇనసమజేజులౌ నృపుల నెల్ల మహమ్మదుశాహి యేలు నీ

యెనుబదినాల్లు దుర్గముల నేలిన యేలిక గోలుకొండ ద

ద్దన నగరస్థలిక గరణికం బొనరించెడు దమ్మమంత్రి యా

జనపతి రమ్ముపౌమ్మన బ్రజల్‌ జయవెట్ట గృహస్తు లౌనన్‌ (వైజయంతి. 1-31)

ఇదే సారంగు తమ్మయ్య తాను భాగీరథీపట్టణానికి మంత్రినని * భక్తిసంజీవని అనే వ్యాఖ్యాన గ్రంథంలో సంస్కృతంలో ఇలా చెప్పుకొన్నాడు:

యస్యాదార్య మివాకలయ్య సతతం కర్వంతి.వాసం దివి

స్వర్ధేసుప్రముఖా పదాన్యమణయో ష్కద్యాపి నేవాగతాః

శాఘ్య స్సాధుగుణాన్వితో బుధజనై ర్బాగీరథీపట్టణే

సోయం మంత్రిధురంధరో విజయతే సారంగుతమ్మ ప్రభుఃి

వైజయంతీవిలాసంలో తాను గోలుకొండ కరణాన్నని చెప్పుకొన్న సారంగు

శ్చియ్య హరిభక్తిసుధోదయ వ్యాఖ్యానంలో భాగీరథీ పట్టణాన్ని పేర్కొనడం వల్ల ఇబ్రహీం కుతుబ్‌షా భాగీరథి అనే తన భార్య పేరు గోలకొండకు పెట్టిన తరువాత దానిని ఇ “మాహమ్న! పారసీ గ్రంథంలో భాగీరథి ప్రసక్తి ఉండదని డా! విరుదురాజు రామరాజుగారు “భాగీరథీ మ _ ఖాగ్యనగరం' అనే రక తెలియజేశారు. (“ఖుతబ్లాహీసుల్తానులు -

/ ఈంధ్ర సంస్కృతి, పుట గ. 3. పై గ్రంథంలోనే, పుట 74లో. డాక్టరు రామరాజుగారు ఉదహరించారు.

238 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తమ్మయ్య పేర్కొన్నాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఇబ్రహీం. కుతుబ్‌షాక్స ఎంతమంది భార్యలో తెలియదుగాని ముష్ఫయి మంది సంతానం ఉన్నారు. వీళ్లలో ఆరుగురు పుత్రులు, ముగ్గురు పుత్రికలు అతని మరణకాలందాకా బతికి ఉన్నారు ఈ ఆరుగురు పుత్రులలో భాగీరథికి పుట్టిన మహమ్మద్‌ కులీయే ఇబ్రహీం తరువాశ రాజయ్యాడు. ఇతడు తూడ తండ్రిలాగే తెలుగు వెలదిని చేపట్టాడు. ఆమె పేరు భాగమ& మహమ్మదు కులీ యువరాజుగా ఉంటున్నప్పుడే భాగమతిని ప్రేమించాడు. ఆమెను కలుసుకొనడానికి రోజూ మూసీనది దాటిష్లోవాడు. వాన వచ్చినా వరదలు వచ్చినా లక్ష్యపెట్టేవాడు కాదు. ఒకనాడు మూసీనది పొంగి ముంచెత్తుతున్నది. యువరాజు సాహసం చేసి ప్రియురాలిని కలుసుకొనడానికి వెళ్లడం ఇబ్రహీం చెవిని పడింది మరునాడే నదిమీద కొత్త వంతెన నిర్మించమని రాజు ఆజ్ఞాపించాడు. అదే ఈనాటి “పురానాపూల్‌ వంతెన. కొడుకు క్షేమం కోసం ఇంత అల్లాడిన తండ్రిప్రాణం తనకు తండ్రీలాగ ఆశ్రయమిచ్చిన అళియ రామరాయల పట్ల మాత్రం కృతజ్ఞత ప్రకటించలేదు. రాజ్యానికి వచ్చిన కొత్తలో మాత్రం ఇబ్రహీం విజయనగర సాధ్రాజ్బమంటే ఆదరాభఖిమానాలతో ఉండేవాడు. అళియ రామరాయలు కూడా దక్కనులో ఉండే రాజ్యాలన్నీ సఖ్యంగా ఉండాలని కలలు కన్నాడు. క్రీ.శ1557లో అహమ్మదు నగరం, గోలకొండ రాజ్యాల ఏలికలు కలిసికట్టుగా విజాపురం రాజ్యంపై ముట్టడీ చేస్తి రామరాయలు శాంతిస్థాపన చేశాడు. కృష్ణా, ఖీమరథీ సంగమస్థానంలో ఈ ముగ్గురు పాదుషాలనూ సమావేశపరచి ఒక ఒప్పందాన్ని కుదిర్పాడు. తమ నాలుగు రాజ్యాల్లో ఎవైనా మరొకరిమీద అశ్రమంగొ కయ్యానికి కాలుదువ్వితే మిగతావాళ్లు ఏకమై. అతక్రమ యుద్ధం చేసివానిపై యుద్ధం చేయాలన్నదే ఆ ఒడంబడిక. దీనిననుసరించే దక్కను ముస్లిం రాజులతో రామరాయలు ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది. పాల్గొన్న ప్రతి సమరంలోనూ విజయం చేపట్టాడు. రామరాయల ప్రతాపం చూశాక మూడిళ్ల తురకలతు కన్నుకుట్టింది. ముగ్గురూ ఏక్టై కుట్రలు పన్ని చివరకు క్రీ.శ 1565లో రక్షసి-తంగడి యుద్ధంలో కపటోపాయాలకో అళియ రామరాయలును చంపారు. రాజ్యం కోసం తండ్రినే చంపే పాడుకాలంలో తండ్రిలాంటివాడిని చంపడం ఒక లెక్కా! ం గోలకొండ నవాబులు తమ రాజ్యంలో ప్రజలను ఎంత మతసహనంతో పరిపాలించినా శత్రురాజ్యాలలోని ప్రజలన్నా, వాళ్ల ఆస్తిపాస్తులన్నా, దేవాలయాలన్నా ఏ మాత్రం జాలి చూపేవారు కాదు. ఆశ్రితమందారుడని పేరు పొందిన ఇబ్రహీం కుతుబ్షషా విజయనగరం సామ్రాజ్యంలోని దేవాలయాలను కొల్లగొట్టించాడు. నవాబు తరువాక అంత అధికారమున్న మురహరిరావు అనే మహారాష్ట్ర బ్రాహ్మణుడు స్వయంగా అహోబలంలోని నరసింహస్వామి దేవాలయాన్ని దోచుకున్నాడు. గ్రామీణులను నానొ హింసలు పెట్టి, చేనులు నిర్ధూుమధామం చేసి దేవాలయాలలోని మణిమయ విగ్రహాలను కొల్లగొట్టాడు. ఇది క్రీ.శ. 1578-79లో జరిగింది. ఈ విధ్వంసక విద్రోహాలు, అపచారాలొ 4. ఆంధ్రకవితరంగిజణి - ౫, పుట 2,

నవాబుల యుగం 239 రమారమి నూరేళ్లపాటు సాగుతూనే ఉన్నాయి. క్రీ.శ 1657లో సుల్తాను అబ్బుల్లా కుతుబ్‌షా దండనాయకుడు మీర్‌జూుమ్లా ముహమ్మద్‌ సయ్యద్‌ గండికోటలోని రాగి కంచు విగ్రహాలు దోచుకున్నాడు. వాటీని కరిగించి ఫిరంగులు చేయించుకొన్నాడు. ఇతర రాజ్యాలలో ఉన్న సాటీ ప్రజలపై ఇన్ని అత్యాచారాలు చేసినా, గోలకొండ రాజ్యంలోని కవులూ, పండితులూ, నవాబులనూ, ఆశ్రితులనూ ఆకాశానికి ఎత్తుతూ వచ్చారు. హిందూ దైవాలు అ నవాబులను రక్షిస్తూ ఉండాలని ఆశీర్వదించారు. తెలుగు సర్జార్లు ఈ నవాబుల కోసం ప్రాణాలు కూడా ఇచ్చారు. నూజవీటి సంస్థానాధిపతి విజయం అప్పారావుగారు శ్రీశ1597లో మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా కోసం గోదావరీతీరాన (సోనపుత్ర) యుద్ధంలో పోరాడి వీరస్వర్గం అలంకరించారు.5 నేటి రేపల్లె జమీందారుల మూల పురుషుడు మాణిక్కరాయనింగారు. క్రీ.శ.1575 ప్రాంతాలలో సన్మానాలు ఫౌందారు. ముర్తుజా అనే తురక సరదారు లొంగిరాకపోతే మాణిక్కరాయనింగారు అణిదారట. అందుచేత తెలనిశాన, నగరా, ప్రదీప్ణధవళ చామరద్వందము, జగజంపుగొడుగు, పంచఘంటా తలాటం భద్రగజం మొదలైన రాజచిహ్నాలను పాదుషా ఈయనకు ఇచ్చాడు. విశ్వాసపాత్రులు అనాటివాళ్లు అహోబల విగ్రహాలు తన మంత్రి పెకలించుకొని వచ్చినందుకు ఇబ్రహీం బాధపడి మంచాన పడ్డాడనీ, ఆ దిగులుతోనే చచ్చిపోయాడనీ చెప్పుకుంటారు. అతడు పోయినప్పుడు తెలుగు కవులు బ్రహ్మను ఇలా తిట్టారు: రార! విధాత! యోరిః వినరా! తగురా? తలకొట్లమారి! ని స్సారపు లోఖిరాజులను జంపక మల్కిభరామ భూవరుక్‌ జారుయళోధను౯ సుగుణి జంపితి, వర్థులకేమి దిక్కురా చేరిన నింతరాజును. సృజింపగ నీతరమా వసుంధరన్‌? (చాటుపద్యమణిమంజరి, పుట 46) ఇబ్రహీంలాంటి రాజును నిజంగానే బ్రహ్మ మళ్లీ సృష్టించలేదనుకోవాలి. క్రీశ1580లో ఇబ్రహీం మరణించాడు. అతని తరువాత మహమ్మదు కులీ రాజ్యానికి వచ్చాడు. ఇతడు తండ్రిలాగే సాహిత్యపోషకుడు. సారంగు తమ్మయ్యలాంటి కవులకు అశ్రయమిచ్చాడు. మహమ్మదు కులీ అస్థానంలో శివధర్మోత్తరం, పద్మపురాణం మొదలైనవి వ్రాసిన రాజమల్లారెడ్డి వంటి కవులు ఉన్నారు. ఈ మల్తారెడ్డే తన్న సమకాలికుడైన యింకొక కవిని ఇలా పేర్కొన్నాడు. ధీనిధి సాహితీయుతు ప్రతీతయశుక కతుతుపావనీశ్వరా స్థానమహాకవీంద్రు నిజదర్శన కౌతుకవైభవాగతుక 'శ్రీనరసింహపండితవరేణ్యకుమారు గణేశధీరు స న్మానములో నెదుర్కొని నమస్కృతి చేసి వసింపజేయుచున్‌* 5. "ఖుతుబ్‌షాహీ సుల్తానులు - ఆంధ్రసంస్కృతి'లో నిడుదవోలు శివసుందరేశ్చ్వరరావుగారి వ్యాసం కుతుబ్‌షాహీలు సంసానీధీశులు' పుట ౪. &. “ఖుతుబ్‌షాహీల అంధ్రభాషాపోషణము' అనే వ్యాసంలో సురవరం ప్రతాపరెడ్డిగారు ఈదాహరించారు.

240 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఈ పద్యంవల్ల తెలియవచ్చే మహాకవీంద్రుడు ఏమి వబ్రాశాడో మాత్రం తెలియదు. ఇతడు కుతుబ్‌షా ఆస్థానకవి అని తెలియడం సంతోషకరమైన విషయమే. ఇలాంటి తెలుగు కవుల సాహచర్యంవల్ల ప్రభువు తూడా తెలుగు పద్యాలు అల్లిడే అదేం వింతకాదు. నిజానికీ మహమ్మదు కులీ తెలుగులో స్వచ్చమైన కవిత్వం చ్చెపగలవాడట దురదృష్టవశాత్తూ అతని ఆంధ్ర రచనలేమీ మనకు దక్కలేదు. అతడు పార్సీ, ఉరుదూ ఖాషల్లో చెప్పిన కావ్యాలు లభ్యమవుతున్నాయి. తమ రచనలను 'దివాక్‌' అనే సంకలనాలుగా సేకరించిన ఉర్లో కవులలో మహమ్మద్‌ కులీ ప్రప్రథముడు. ఇతడు తన ప్రియురాలు భాగమతిపై చక్కని కవిత్వం చెప్పాడు. ఇతని గుషప్తనామం “మాని అనే పదం ఇతని దివాకలు 1800 పేజీల గ్రంథమట. ఇందులో 50 వేల పంక్తులున్నాయటు. దసరా, విజయదశమి మొదలైన పండుగలను సైతం వర్ణించాడట. ఇతని కవిత్వంలో ఎక్కువగా తెలుగు పదాల్లు 'ఉంటాయట.” చేసుకొన్నాయి. ఒక్క నవాబుల అస్థాన కవులేకాక ఇతర రాజ్యాలలోని కవులు మాడా ఈ యుగంలోని ప్రముఖ కవులు అరవీటిరాజూలతూ, ఆ ప్రభువుల ఆశ్రితులతూ అంకితాలు ఇచ్చినవాళ్ళే: తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన్న, రామరాజభూషణుడు మొదలైన నత్కవులు కూడా ఈ కాలం లోనివారే. ఇటువంటి ప్రసిద్ధుల ముందు కొందరు మరుగునపడ్డా ఈ యుగంలో నవాబుల పోషణలో వర్ధిల్లిన కవులను గరించి తెలుసుకొనడం అవసరం.

మహ్మద్‌ కులీ 1580 నుంచి 1612 దాకా పాలించాడు. రాజ్యానికి వచ్చాక తన ప్రేయసి భాగమతికి ష్రైదరీమహల్‌ అనే బిరుదు ఇచ్చాడు. ఆమె పేరు మీదుగా భాగానగరం లేక ష్టైదరాబాద్‌ అనే వెద్ద నగరం కట్టించాడు. ఈ నిర్మాణం 1591లో జరిగింది. శాస్త్రీయ నిర్మాణ పద్ధతులలో; కళాదృష్టితో అనాడు కట్టిన నగరమే నేడు మనకు రాజధాని అయింది. అవాడు వేసిన సాహిత్యవీధులు ఉత్తరోత్తరా ఘంటాపథాలు కూడా అయినాయి. 7. ఖుతుబ్‌షాహీ మల్తామలు - అంధ్రసంస్కృతిలో అదిరాజు వీరభద్రరావుగారి వ్యానం, పుటలు ౫. ౨.

నవాబుల యుగం 241 అన్నల గో కల్యాణ ట్లు [్థ స్ట అ ౨మెతుకు [గొ న కు ౮ మానుగల్లు= హక ఓ న యో ా తంఫిఐ ౮ (విజయనగర... ఆ! కందుకూరు తళ్యాల్తుల (ఈ గండిట్వో £ దుర్గ. (పెనుగొండ = అశ్చంగేరి వాళ్ళకో ఉవ్రరసముద్రం (శ అ, నం ము హ్హ్‌ లీ తంజావూరుం వ్‌ మథీక ౧ ఆరవీటిరాజులనాటి ఆంధ్రదేశము

ఆరవీటిరాజుల యుగం విజయనగర సామ్రాజ్యపు వైభవజ్యోతిని వెలిగించినవాళ్లు హరిహర _ బుక్కరాడ సోదరులు అఖండంగా ప్రకాశించిన ఈ దీపం ఆరవీటి బుక్కరాజు వంశంవాళ్ళ హయాంలో అఖరి వెలుగు వెలిగి ఘనమైైంది. రాయల సింహాసనాన్ని నాలుగు రాజ వంశాలు అధిష్టించి పాలించాయి. ఆ వివరాలు తొలి దగ్గర్నుంచీ క్రోడీకరించుకొందాం.

  1. సంగమవంశం ॥
  2. మొదటి హరిహరరాయలు ;. క్రీశ 1335-1355
  3. మొదటి బుక్కరాయలు ** : క్రీశ. 1355-1377
  4. రెండవ హరిహరరాయలు క్రీశ 1377-1404
  5. రెండవ బుక్కరాయలు ఏ. క్రీశ 1404-1406
  6. మొదటి దేవరాయలు క్రీశ 1406-1422
  7. ఇమ్మడి ప్రొడదేవరాయలు ఏ క్రీవ. 1423-1446
  8. మల్లికార్జున రాయలు ఏ. క్రీశ 1446-1465
  9. విరూపాక్షరాయలు :. క్రీశ 1465-1478
  10. రాజజేఖరరాయలు : క్రీశ 1478-
  11. ముమ్మడి దేవరాయలు ; క్రీశ 1485
  12. సాళువ వంశం
  13. నరసింహరాయలు ; క్రీశ 1485-1490
  14. తిమ్మరాయలు ; క్రీశ -1490
  15. ఇమ్మడి నరసింహరాయలు 2 క్రీశ 1490-1506
  16. తుళువ వంశం
  17. వీరనరసింహరాయలు 2 క్రీశ 1506-1509
  18. కృష్ణదేవరాయలు 2 క్రీశ 1509-1530
  19. అచ్యుతదేవరాయలు 4. ఏ క్రీశ 1530-1542
  20. వెంకటపతిదేవరాయలు ఏ క్రీశ. 1542-1543
  21. సదాశివరాయలు 2 క్రీశు 1543-1576
  22. ఆరవీటి వంశం -
  23. అళియ రామరాజు నిర్వాకం : క్రీశ 1543-1564
  24. తీరుముల దేవరాయలు 2. క్రీశ 1571-1572
  25. శ్రీరంగ దేవరాయలు ; క్రీశ 1572-1585
  26. రెండవ వెంకటపతిరాయలు : క్రీశ 1586-1614
  27. రెండవ శ్రీరంగరాయలు ; క్రీశ 1614-1619
  28. రామదేవరాయలు 2 క్రీశ 1619-1629
  29. మూడవ వెంకటపతిరాయలు : క్రీశ 1630-1642

అరవీటీరాజుల యుగం 243

ఈ తారీఖులు గమనిస్తే ఈ పరిపాలక పరంపర మూడువందల సంవత్సరాల పై చిలుకు షృథివీరాజ్యుం చేసినట్టు కనబడుతుంది. తుళువ వంశంలో కడపటి వాడైన సదాశివరాయలు ఏలుతున్న కాలంలోనే ఆరవీటివంశంలోని అళియ రామరాయలు, తిరుమల దేవరాయలు, అతని కుమారుడు శ్రీరంగ దేవరాయలు అధికారం చలాయించి నట్టు గోచరిస్తుంది. వాస్తవానికి సదాశివరాయలు ఆరవీటివారి చేతిలోని కీలుబొమ్మ. మైనంలాగా అతణ్నీ తమ చిత్తం వచ్చినట్టు వంచారు. ఆరవీటివారు బుక్కరాజుకాలం నుంచి రాయవంశాల కొలువులో ఉన్నవాళ్ళే. ప్రభువులను గద్దెమీద దండనాయకులుగా ఉండేవారు. ఎంతో తోడ్పడ్డారు. బుక్కరాజుకు “సాళువ నరసింహరాజ ప్రతిష్థాపనచార్య' అనే విరుదు ఉండేది.

ఆరవీటి బుక్కరాజు పిల్లలకోడి. “నీ యిల్లు వెయ్యిళ్ళు కావాలని ఎవరు చునస్ఫూర్హిగా దీవించారోగాని అతని వంశం దొండపాదులాగా అల్లుకుపోయిది. తామర తంష్రై వర్ధిల్లింది. బుక్కరాజు కొడుకులూ, మనుమలూ చిన్న చిన్న మండలాధిపతులయ్యారు. ఆరవీటి బుక్కరాజుకు ఇద్దరు భార్యలవల్ల ముగ్గురు కుమారులు పుట్టారు. అతనికంటే రెండాకులు ఎక్కువ చదువుకున్నారు. కొందరు నలుగురు భార్యలు కూడ కట్టుకొన్నారు. ఒక మనవడికి పదముగ్గురు కొడుకులు పుట్టారు.* బుక్కరాజు మనుమలు వేరువేరు ఊళ్ళలో అధికారులుగా ఉండడంవల్ల ఆ ప్రదేశాల పేర్లు వాళ్ళకు రమారమీ ఇంటిపేర్లు అయ్యాయి. ఆరవీటి వంశవృక్షంలో నంద్యాలవారు, పొట్లపాడువారు, కోనేటివారు అనే కొమ్మలు విస్తరించాయి. బుక్కరాయల మునిమనవళ్ళలో ఒకడైన రామరాజును శ్రీకృష్ణదేవరాయలవారు తమ అల్లుణ్జీ చేసుకొనడంతో ఆ శాఖ ప్రసిద్ధమయింది. ఆ అళియ రామరాజు లాంఛన ప్రాయంగా పట్టం కట్టుకోకపోయినా సార్వభౌమునికన్నా ఎక్కువ అధికారాలతో పాలించాడు. బంధువులందరూ మండలాధిపతులో, దండనాయకులో అయ్యారు. రాయసాభ్రూజ్యుమంతా ఆరవీటివారి విహారభూమి అయింది.

కృష్ణదేవరాయలవారికి వచ్చినంత కీర్తి రాకపోయినా, అశియ రామరాయలు తక్కువవాడు కాడు. రాజనీతి చతురుడు. దక్షిణ భారతాన్ని అంతటినీ తన అదుపులోకి తెచ్చాడు. ఉత్తరపు సరిహద్దులలో ఉన్న మహమ్మదీయ రాజ్యాలను సైతం తన చిత్తం వచ్చినట్టు ఆడించాడు. బిజాపురం, అహమ్మదునగరం, బీదరు, గోలకొండ అనే నాలుగిళ్ళ తురకలనూ రామరాజు విభజించి పాలించాడు. చివరకు వాళ్ళు నలుగురూ కలిసి రక్షసతంగడి వద్ద యుద్దానికి వచ్చారు. అధర్మ యుద్ధంలో రామరాజును చంపారు. అప్పటికి అభలియ రామరాజు సహఫ్రమాసజీవి. అతనితోనే రాయవైభవం, ధైర్యసాహసాలు తూడా అంతరించాయి.

రక్షసతంగడి యుద్యాన్నే మహమ్మదీయ చరిత్రకారులు తళ్ళికోట యుద్ధం అంటారు. ఇది క్రీ.శ. 1564లో జరిగింది. ఈ యుద్ధంలో రామరాజు మరణించాక అతని సోదరుడు ఎర్ర తిమ్మరాజు పలాయనం చిత్తగించాడు. రాజధానిలోని ప్రజలను వాళ్ళ కర్మానికీ వదిలి పదిహేను వందల ఏనుగుల మీద రత్నరాసులను ఎక్కించుకొని సదాశివరాయలతో

264 పమగ్రాంభ్ర పాహిత్యం - రెండవ పంపుట పెనుకొండ దుర్గానికి చేరురొవ్నాడు. వాలుగిళ్ళ తురకలూ చెలరేగి విజయనగరాన్ని ఆరువెలలపాటు కొల్లగొట్టారు. ఈ దోపిడీ ముగిశాక రాజధాని రాక్షసుడు పట్టి విడిచిన రంభలాగా ఉందకు.*_తగలబెట్ట గలిగినవన్నీ తగలబెట్టారు. వీలులేనివి భగ్నం చేశారు ఆదుకొనే వాథుడు లేక రాజధాని ప్రజలు చెట్టుకొకరుగా వలసపోవలసి వచ్చింది

విజయోన్మాదుల హీంపాకాండ ముగిశాక. ఆఖరి పాగలు సైతం అణగారాక పదాశివరాయలతో ఎర్రతిమ్మరాజూ రాజధానికి వచ్చాడు. ఆపదలలో అదుకొని కవచం లాగ విలబడవి రాజుమీద ప్రజల కెందుకు విశ్వాసం ఉంటుంది? ఏ ఒక్కడూ రాయలమా. ఎర్రతిమ్మరాజునూ అభిమానించలేదు. ఇంక విజయనగరం నుంచి పూర్వవైభవంతో రాజ్యం చేయలేమని ఎర్రతిమ్మరాజు మళ్ళా పెనుకొండకే మళ్ళాడు. పసదాశివరాయలము తోసిరాజని తిరుమలదేవరాయలనే పేరుతో తానే పట్టు కట్టుకొన్నాడు. ఇతనికి భట్టుమూర్తి తన వసుచరిత్ర అంకితమిచ్చాడు.

తిరుమల దేవరాయల నిర్వాకంలో ఆంధ్ర సామ్రాజ్యులక్ష్మి విజయనగరం నుంచి నీష్కమించవలసి వచ్చింది. విశాల రాజ్యం ముక్కలు ముక్కలుగా విరిగింది. అమర నాయకులు ఎక్కడీవాళ్లు అక్కడ స్వతంత్రులయ్యారు. కప్పాలు కట్టడం కూడా మానివేశారు. కేంద్ర పరిపాలన సన్నగిల్లడం ఇంతటితో ఆగలేదు. తిరుమల దేవరాయల హయాంలోనే సన్నగిల్లిన అధికారం కూడా మూడు చెక్కలయింది. ఈయనకు ముగ్గురు కొడుకులు. వాళ్ళను ముగ్గుర్నీ అతడు మూడు చోట్ల నెలకొల్పాడు. పెద్ద కొడుకు శ్రీరంగదేవరాయలు పెనుకొండ కేంద్రంగా తెలుగుదేశాన్ని పాలించాడు. రెండవ కొడుకు శ్రీ రామరాజు శ్రీరంగ పట్టణం రాజధానిగా కన్నడ దేశాన్ని కట్టుకొన్నాడు. మూడవ కొడుకు వెంకటపతిరాయలు చంద్రగిరి ముఖ్య పట్టణంగా తమిళదేశానికి పాలకుడయ్యాడు. ఈ విధంగా తిరుమల దేవరాయలవారు గద్దె నెక్కగానే భాషాభేదాన్ని ఆధారం చేసుకొని రాజ్య విభజన జరిగింది. ఇతడు అట్టేకాలం పాలించలేదు క్రీశ 1572లోనే ఇతని కథ ముగిసింది.

రాజ్యం కుక్కచింపిన విస్తరయింది. సాహిత్యంలో అక్కడక్కడ కుక్కమూతి పిందెలు కనిపించసాగాయి. అయినా ఆరవీటివారి హయాంలో జరిగినంత సాహిళ్ళ పోషణ మరే యుగంలోనూ జరిగినట్టు కనబడదు. రాజులు, వాళ్ళ బంధువులు, ఉద్యోగులూ, కృతులు అంకితం పుచ్చుకొన్నారు. పురమాయించి వ్రాయించి దేవుళ్ళకు అంకితమిప్పించారు. కొందరు తామే స్వయంగా రచనలు చేశారు. కవులను పోషించారు. ఆరవీటివాళ్ళ హయాంలో జరిగిన సాహిత్య పోషణను కొద్దిగా క్రోడీకరించి చూద్దాం

  1. అలియ రామరాజు: ఇతని సభకు భూషణంగా ఉండబట్టే భట్టుమూర్లో రామరాజభూషణుడనే పేరు వచ్చింది. సాహిత్యంతోపాటు సంగీతాన్ని ఆదరించాడు. దానిమీద ఇతడు ఎక్కువ మొగ్గాడు.

అరవీటిరాజుల యుగం 245 2. పోచిరాజు నరసరాజు ; ఇతడు అళియ రామరాజు మేనల్లుడు. ఇతని పేరుమీదుగానే భట్టుమూర్తి నరసభూపాలీయం అనే అలంకార గ్రంథాన్ని రచించాడు.

  1. తిరునములదేవరాయలు: ఇతనికే భట్టుమూర్తి తన వసుచరిత్రను కృతి ఇచ్చాడు.

  2. గొబ్బూరి నరసరాజు: ఇతడు అళియ రామరాజుగారి ఇంకో మేనల్లుడు. ఇతడు

అయ్యలరాజు రామభద్రుణ్జీ ఆదరించి రామాభ్యుదయం చెప్పించాడు.

  1. సిద్ధ (సిద్ధ) రాజు తిమ్మరాజు: ఈయన స్వయంగా కవి. అలియ రామరాజుగారి ఇంకో

మేనల్లుడు. సుప్రసిద్ధ వీరుడు. ఇతడు పరమయోగి విలాసం వ్రాశాడు. -

  1. నంద్యాల కృష్ణమరాజు: ఇతడు ఆరవీటి బుక్కరాజుగారి పెద్ద భార్యకు పుట్టిన సింగరయ్య

సంతతిలోవాడు. ఇతనికి పింగళి సూరపరాజుగారు కళాపూర్లోదయం అంకితమిచ్చారు.

  1. నంద్యాల తిమ్మరాజు: ఇతడూ, పై కృష్ణమరాజూ అన్నదమ్ముల మనుమలు. ఈయన

బొడ్డుచర్ల చినతిమ్మన చేత ప్రసన్న రాఘవనాట్యప్రబంధం వ్రాయించి అంకితం

పుచ్చుకొన్నాడు.

  1. పొట్లపాడి తిమ్మరాజు: ఇతడు అశలియ రామరాజుగారి పెదతండ్రి. ఈయనకే దోనూరి

శోనేరునాథుడు బాలభాగవతం అనే పద్యకావ్యాన్ని అంకితమిచ్చాడు. .

  1. పొట్టపాడి నల్లతిరుమలరాజు: ఇతడు పై తిమ్మరాజుగారి కుమారుడు. ఇతడే నిజానికీ

కోనేరునాథుణ్జి పోషించాడు. తండ్రీపేర పద్య బాలభాగవతం చెప్పించాడు. అంతేకాదు,

తన తమ్ముడు చినతిమ్మరాజు పేరట ఆ బాలభాగవతాన్నే ద్విపద కావ్యంగా అదే. కవిచేత బ్రాయించాడు.

  1. పొట్లపాడి చినతిమ్మరాజు: ద్విపద బాలభాగవతం కృతిపతి.

  2. రామరాజు రంగప్పరాజు: పద్యబాలభాగవతం కృతిపతియైన పొట్లపాడి తిమ్మరాజుకు

  • ఇతడు మనుమడు. తిమ్మరాజుగారికి నలుగురు భార్యలు; పదముగ్గురు కుమారులు.

ఇందులో పెద్ద భార్య పెద్ద కొడుకు పేరు పినకొండ్రాజు. ఇతనికి నలుగురు కొడుకులు. వాళ్ళలో కడపటివాడే రంగప్పరాజు. ఆరవీటి బుక్కరాజు కొడుకులలో ఒకడైన రామరాజు సంతతివాళ్ళు కనుక వీళ్ళకు రామరాజు అన్నది ఇంటిపేరులాంటి వశేషణమైంది. ఈ రంగప్పురాజు స్వయంగా కవి. సాంబోపాఖ్యానం అనే పద్యకావ్యం వ్రాసి దేవునికి అంకితమిచ్చాడు.

  1. పులిజాల సోమయ్య: పై రామరాజు రంగప్పరాజుగారి అన్నకొడుకు కోనేటి రామరాజు. ఇతని దగ్గర పులిజాల సోమయ్య అనే సేనాని ఉండేవాడు. అతనికి తెనాలి '- అన్నయ్యకవి సుదక్షిణాపరిణయం అనే పద్యకావ్యాన్ని అంకితమిచ్చాడు. -

  2. కొండ్రాజు వెంకటాద్రి: ఆరవీటిరాజులకు, తెలుగు చోళులకు బంధుత్వాలు ఉండేవి.

శ్రీరంగదేవరాయలు పాలించేకాలంలో శ్రీ.శ1584 ప్రాంతాలలో కర్నూలు మండలం *

246 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఎనర్రమపాలెంలో కొండ్రాజు వెంకటాద్రి ఉద్యోగి. ఇతడు కామందకం, రెట్టమతశాస్త్ర అనే రెండు శాస్త్ర గ్రంథాలు వ్రాయించి ఆంకితం పుచ్చుకొన్నాడు. 14. మట్ల అనంతరాజూ: క్రీశ 1586 నుంచి పాలించిన రెండవ వెంకటపతి రాయల వద్ద ఇతడు సేనాని, మండలాధిపత్తి. స్వయంగా కవి కకుత్సృవిజయం అనే కావ్యం వ్రాశాడు.

ఇంతమంది ఆరవీటి రాజులు, వారి బంధుమిత్రులు ఇలాగ సాహిత్యపోషణ చేయడం సంతోషించదగ్గ విషయమే. అయితే ప్రభువును మెప్పించడమే సాహితీపరుల ఆశయంగా పరిణమించింది. కవులు రాచవారి పంచలదగ్గర యాచకులయ్యారు. పరస్పర శత్రుత్వాలు పెంపొందించుకొన్నారు. 'రైలెక్కేదాక చోటుకోసం పోరాడేవాడు. ఎక్కిన తర్వాత మిగతావాళ్ళను రానివ్వని" మనస్తత్వం ఆదినుంచి మనిషిలో ఉంది. రాజాశ్రయం నోచుకున్న పండితులు కొత్తవాళ్ళకు రాజదర్శనం ఆవనిచ్చేవారు. కాదు “నిజగౌరవ్షాథిల్భభయంబున నితరులగు విద్యాధికులకు రాజుగృహంబున ప్రవేశంబు” కలుగనియ్యని పురోహితుల గురించి పింగళి సూరపరాజుగారు కళాపూర్జో దయంలో వ్రాశారు (6-155). సకల విద్వ్యాపిశేషజ్ఞులైనా కాకపోయినా ప్రభువుల వద్ద తమ తెలివితేటలను ఘనంగా చాటుకొనడానికీ కవులూ, పండితులూ శ్లేషలూ, చిత్ర కవిత్వాలు ప్రదర్శించేవారు. తెలుగులో ఒక అర్థం సంస్కృతంలో మరొక ఆర్థం వచ్చే పద్యాలను రచించడం కూడా మొదలైంది. పింగళి 'సూరపరాజాగారే ఇటువంటి దొకటి కళాపూర్లోదయంలో వ్రాశారు. పురోహితుని బెడదవల్ల రాజదర్భనం దొరకని నలుగురు అన్నదమ్ములు పామరులలాగ నటించి ఒక తెలుగు పద్యం చదివారటు. చూడండి

మాయమ్మానసునీవే - రాయలవై కావదేవరాజేజేజే

మాయాతుమ లానినయది-పాయక సంతోసమున్న పలమిలసామీ. (కళా. 6-161) దీనికీ తెలుగులో పదవిభాగం ఇలా ఉంటుంది

మాయమ్మ- ఆన- చు-నీవే- రాయలవై- కావన్‌- దేవరా- జే, జే, కే- మా- అతుచులు-

అనినయది- పాయక- సంతోసము- ఉన్నపలము- ఇలసామీ ఈ కందాన్నే సంస్కృతపదంగా ఇలా పదవిభాగం చేయవచ్చు.

మా-ఆయం-మాన- సునీవే- రా- అలవా- ఏకా- అవత్‌- ఏవ- రాజే- అబేవే-మా-

ఆయాతు- మలాని-న-యది- పాయక- సంతఈః- అసముత్‌- స-పల-మిల-సా-అమీ.

ఈ తెలుగు పద్యాన్ని చదవగానే రాజు సంస్కృతంలోని అర్జాన్ని గ్రహించాడట. అది కథలో సంగతి. ఈ రాజే, ఈ పండితుల్నే చూసి అలాటి విచిత్ర కవిత మీ మతులక నిపుడు దోచునొకో' అని ప్రశ్నిస్తే ఒకడు ఇలా జవాబు చెప్పాడట :

తా వినువారికి సరవిగ - భావనతో నానుపతి విభావిను తేజా

దేవర గౌరవమహిమన-మా వలసిన కవిత మరిగి మాకు నధీశా! (కళా. 6-172) ౩. ఈ పద్యానికి తెలుగులోనూ సంస్కృతంలోనూ అర్భాన్ని మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తను

వ్యాఖ్యలో పొందుపరిచారు - కళాపూర్లోదయం ( అద్దెపల్లి ప్రచురణ), పుటలు జక, ఈశ.

అరవబీటిరాజుల యుగం 247 ఈ పద్యాన్ని విని రాజు మెచ్చుకొన్నాడట. ఇచ్చిన జవాబులోనే విచిత్ర శవిత్వముందే అని హర్షించాడు రాజు. “ఎలాగో సెలవియ్యండి" అని కవీంద్రుడు చవ్వాడట. "తిరిగి చదువు' అన్నాడట రాజు. ఈ పద్యాన్ని తిరగేసి చదివితే సంస్కృతంలో అర్థం వస్తుంది. ఇది అనులోమ విలోమ ఉభయభాషా కందం. ఈ తిరుగుడు కవిత్వంలోని చమత్కారం రాజుకు, కవికీ తప్ప సభాజనానికి చప్పున బోధపడలేదని సూరపరాజుగారే కళాపూర్గోదయంలో వ్రాశారు. తిరగేసి చదివితే వచ్చే అర్ధాన్ని వారే చెప్పి '““వరుస దుది నుండి మొదలిక దిరుగ జదువ నా తెనుగుపద్యమున బుధులరసికొనుడు'' అని ప్రకటించాడు. (6-176) ఇటువంటి విచిత్ర కవిత్వాలేకాక రసవంతంగా ఉండే సీసపద్యాలు సైతం - కవి అర్థం చెప్తేనేగాని బోధపడనివి ఈ కాలంనుంచే కోకొల్లలుగా కవులు సృష్టించసాగారు. ఎవరో ఒకరిద్దరు తప్పించి మిగతా కవులు కథ చెప్పడం కోసం కావ్యాలు బ్రాయడం మానేశారు. కాబట్టి ప్రతిపద్యంలోనూ చమక్కారాల కోసం ప్రయత్నించసాగారు. కృతకృత్యులు కొద్దిమందే కావచ్చుగాని ఇందువల్లనే సాహిత్యం కొత్త తెన్నులకు మళ్ళడం జరిగింది. పూర్వ కవులను స్తుతించడంలో కూడా దిక్కుమాలిన శ్లేషలు ఎక్కువయ్యాయి. ఇది రామరాజభూషణుని ప్రభావం. ఇతణ్జి అనుసరించినవాళ్లు సమకాలికులలోనే కనబడతారు. వాల్మీకి భుజంగప్రయాతవృత్తాలకు ప్రసిద్ధుడని ఎప్పుడూ, - ఎవరూ చెప్పినట్లు లేదు. అలాగే కాళిదాసు మందాక్రాంతలకే తప్పు ఆర్యాగీతులకు ప్రసిద్ధుడు కాడు. అయినా శ్లేషించాలి కాబట్టి దామెర్ల వెంగళరాజు తన బహుళాశ్వ చరిత్రలో పూర్య ఘననాకు భవభుజంగ ప్రయాతంబెన్ని శుకకాతవింబసంశుద్ధి వొగడి . యలకాళిదాసుని యార్యసన్నుతిచేసి దండివంశస్థవృత్తము గణించి యిల మయూరకుమారు లలితసంగతి మెచ్చి బాణపుప్పితలత బ్రస్తుతించి భవభూతిశశికళా భాసురత్వంబెన్ని మరిధనంజయు వసుమతి నుతించి టౌొఢిగాంచు కవిత్రయీ ప్రణనమహిమ . సార్వభౌముని పృథ్వి భాస్కరుని కాంతి . ఛీముమత్తేభ బలమును సోము హరిణి | నటుల సమరేశ్వరుని వజపటిమ దలతు (బహుళాశ్వ, 1-9) ... శ్లేషల కోసం, గణాల కోసం వాస్తవాన్ని మార్చేసినా ఫరవాలేదనే మనస్తత్వం ఈ యుగంలోనే మొదలైంది. మనుషులకన్నా మాటలే మన కవులకు ముఖ్యమయ్యాయి. మాటలో తూడ తమ మాటలే ఎక్కువ. అందుకే రాజసభల్లో వివాదాలు జాస్తి, కృష్ణదేవరాయలవాకే సభలో ఓడిన పండితులను చాలా చక్కగా వర్ణించారు. పెదవులు తడుపుకొంటూ బయటకు వచ్చి అరుగులు చూడకుండా తమ పాదుకలు మోసే వాళ్ళకోసం వెదుక్కొనే పండితులూ, తమ ఎదుటనే ఉన్న అందలాలు చూడలేక బోయీల తోసం కేకవేసేవాళ్ళూ, నగరు వెడలేదాకా విడివిడిగా వెళ్లి తరువాత కలుసుకొనే విద్వాంసులూ మొదలైన వాళ్ళను రాయలవారు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.

248 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

పెదవులు నాకుచు వెలియరుంగులు సూడకరిగి పాదువాహు నరయువారు

తమ మైలనుండు నందలముగానక దాటి పేరెలుంగున బెస్తజీరువారు

నగరు వెల్పడుదాకా దెగిపెయి మరినిల్చి తోడివిద్వాంసుల గూడువారు

నెదురైన తమవాని గృహకృత్యమడిగి వాడనునవితప్పు నూకొనెడివారు

వాదమేమాయెనన్న భూవరునిపక్ష

పాతమాదాసరికిగల్లి బ్రతికెనసెడు

వారునేలెండెటు విమర్శదూరమైన

వాకిటవసించు నెవ్వడన్వారునగుచు (ఆముక్త. 47)

వాదంలో ఓటమిమాత్రం మన విద్వాంసులు ఛస్తే ఒప్పుకోరు. ఇది రాయలవారి కాలంలోనూ ఉంది. ఆ తర్వాత పెరిగింది. ఈ యుగంలో విద్వాంసులు రాచవాకిళ్ళలో పడిగాపులు పడుతూ ఉండేవారు. ఈనాడు సినిమా తార వస్తే జనం మూగినట్టు రాచవారి ఆడంగులు అటు వచ్చినప్పుడు జనంలో సంభ్రమం హెచ్చేది. నేటి పోలీసులు లాకీఛార చేసినట్టు ఆ కాలంలో బద్దులవాళ్ళు తెగ మోదేవారు. వైకుంఠంలో నారదాది మునులకు కలిగిన పాట్లను పింగళి సూరపరాజుగారు వర్ణించారు. పేరోలగంలో ఉన్న విష్ణువు దివ్యృవారాంగనల నాట్యం చూస్తున్నాడు. ఆ కొలువుకూటానికి ముందరున్న సింగారపు తోటనుండి హెగ్గడికత్తిలతో లక్ష్మీదేవి వచ్చిందట. అప్పుడు -

నెచ్చెలిపిండుదాసును వనీస్థలి దండ నొకింత గానగా

వచ్చెనొ రాదొ యాకమలవాసిని యంతనె యేమి చెప్పుదు

హెచ్చిన సంభ్రమంబున ననేకులు బద్దలవారలెక్కడ!

వచ్చియు మోది రాకొలువువారి గకాపికలై చనన్వడీ౯ (కళా. 24) ఇది చెప్పినవాడు నారదుడు. '“బద్దలవాళ్ళు మోదినప్పుడు బ్రహ్మంతవాడే దూరంగాపోయి నిలబడ్డాడు. మా సంగతి ఏం చెప్పను?” అని అన్నాడట. ఆరవీటి రాజుల తొలువుకూటాలలో అనాటి విద్వాంసుల గతి ఇలా ఉండేది కాబోలు. బయట పడిగాపులు పడీ ఉన్న విద్వాంసులలో ఎవరో ఒకర్ని ప్రభువు లోనికి పిలిపించేవాడు. మిగతవాళ్ళు బయట కాచుకొని తూర్పొనేవారు. కొలువులో సేవించుకొని బయటకు వచ్చిన విద్వాంసుని చుట్టూ మిగతావాళ్ళు మూగేవారు. ప్రన్నిందేవారు. విష్ణువును ఏకాంతంగా సేవించుకొని వచ్చిన తుంబురుని చుట్టూ మూగినవాళ్ళను సూరపరాజో గారు ఇలా వర్ణించారు:

“అవిసెనా యేమిచ్చె' ననుచును సంభ్రమంబున సందడించుచు మూగువారు

“సర్వేశ్చరుండు శ్రీసతితోడగానంబు వినెనట, యడుగనే' అనెడువారు

“గడునను గ్రహము నెక్కడలేని యాయీగి వసయుదెల్పెడి' నంచు బలుకువారు

“నీవొక్కడవొ మరియెవ్వారలైన నయ్యెడ నుండిరోయని యడుగువారు

నగుచు సురలు మునులు నరుదంద మేపూత

డంబుతోడ వచ్చె దుంబురుండు

అరవీటిరాజుల యుగం 249 కడలవారిని గనగస్నానమాడించు పదకమును సునేత్రపటముదాల్చి. (కళా. 2-82) సూరపరాజుగారి గ్రంథాలవల్లా, వీరి కోవలోన నడిచి కథచెప్పి ఇతర కవుల కావ్యాలవల్లా - ఇలా ఆనాటి సాంఘిక చరిత్ర చాలా బాగా తెలుస్తున్నది. ప్రభువులు చాలా రసికులు. కొలువున్నప్పుడు రాజు చుట్టూ ఆడవాళ్లు ఎక్కువ. సంకుముదపు భరిణ పట్టుకొని ఒకతి, వెలికుంచె పట్టుకొని ఇంకొకర్తె, గందవొడిభరిణతో వేరొకర్తె, సురటి ఠవణించేది మరొకర్తె చుట్టూ ఉండేవారు.్‌ రాజును చూచి సామంతులు, సామంతులను చూచి ధనవంతులు విలాసాలతో కాలం గడిపేవారు. నిగమశర్మ, నిరంకుశుడు మొదలైన అగ్రహారాలవాళ్ళ అబ్బాయిలు అప్పులు చేసి ఆస్తులమ్మి ఈ సుఖాలలో ఓలలాడేవారు. విజయనగరంలో భోగపుసానుల సంఖ్య అపారంగా ఉండేది. వాళ్ళమీద గణాచారి గుత్తపన్ను వసూలు చేసేవాడట. ఈ భోగమువారి పన్ను నగరంలో ఉండే 12,000 మంది రక్షకభటుల జీతాలకు సరిపోయేది. భోగపుసానులు సంగీత విద్యలో చాలా కృషి చేశారు. రాజులు, రసికులు మెచ్చిన సంగీత ప్రసక్తి ఈ యుగంలోని కావ్యాలలో కనబడుతుంది. రాజకుమూరుల సంగీత విద్యాభ్యాసం గురించి తరిగొప్పుల మల్లన తన చంద్రభాను చరిత్రలో విపులంగా వ్రాశాడు. తన కుమారులకు సంగీతం నేర్చమనడానికి ముందు శ్రీకృష్ణుడు నారదుని గానాన్ని ఇలా మెచ్చుకొన్నాడట: ౌరా మీటు బళిరె కంపిత మహో యాందోళిత స్ఫూర్తియో హోరే మూర్చన బాపురే శ్రుతులు మే లుల్లాసిత ప్రొఢీ మ జ్ఞారే లీనము చాగురే స్ఫురితమున్‌ శాబాసు ధాలంచు న త్యారూఢ ప్రమదోన్నతిన్‌ మురహరుం డాలించి వర్ణించున్‌. _ (చంద్ర, 1-127) కొన్నాళ్లు ద్వారకలోనే ఉండి నారదుడు శ్రీకృష్ణుని కుమూరులకు సంగీతం నేర్పాడు. ఏయే అంచెలమీద పాఠాలు చెప్పేవాడో పద్యం వివరిస్తుంది. సప్పస్వారముల మూర్చనలు తప్పకయుండ గురుతుపట్టుటకునైన కొన్ని నాళ్లు సూళాది తాళముల్పొగియ నలంకార గుంఫనం బొనగూర్చ గొన్నినాళ్లు ప్రాగ్గేయకార విరచితగీతంబులు గ్రుక్కపట్టుటకునై కొన్నినాళ్లు గౌళనాట వరాళికా ముఖ్యరాగము ల్కొదలేక పలికింప గొన్నినాళ్లు వన్నియు ప్రబంధములు మీట గొన్నినాళ్లు గోరిగాయంబులొదపింప గొన్నినాళ్లు " గాగ వారల కా జగరాగ తపసి . నిరుపమ విపంచికా ఫ్రొఢీ నేర్పి యపుడు. (చంద్ర 1-131) సంగీతంతోపాటు నాట్యం, శిల్బం మొదలైన కళలూ ఈ యుగంలో బాగా వర్ధిల్లాయి. సంగీత సాహిత్యాలను మేళవించే నాట్యకళ ఎక్కువగా వృద్ధిలోనికి వచ్చింది. అయితే ఆడవేషాలను పురుషులే ధరిస్తూ ఉండేవారు కాబోలు. కృష్ణదేవరాయలవారి 4. సాంబోపాఖ్యానంలోని 1-178 నుండి 18 దాకా 11 పద్యాలలో ఈ ఆడవాళ్ళను రామరాజు రంగప్పరాజు వర్ణించాడు. , క. ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డిగారు. పుట 268.

250 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఆముక్తమాల్యదలో * భ్రుకుంసుల' ప్రసక్తి ఉంది (4-36). స్త్రీ వేషాలు వేసి పురుషులను భుకుంసులంటారు. ఊరూరా నాటకాలు వేసే మేళాలను పింగళి సూరపరాజుగారు తము ప్రభావతీ ప్రద్యుమ్నంలో చాలా విపులంగా వర్ణించారు. రాచనగర్లలో నాటకాలు ఎలా వేసేవారో వివరించారు. ఆస్థాన మహామంటపంలో రాజు నానాబంధుమిత్ర సచివ సంఘంతో కలిసి నాటకం చూసేవాడు. రాణివాసపుజినం పరులకంట కనబడకుండా తిరలుకట్టిన ప్రత్యేకస్థలం నుంచి నాటకాలు వీక్షించేవాళ్లు. సూత్రధారుడు పూర్వరంగం జరిపించేవాడు. వేణువులు, మద్దెళ్ళు మోగేవి. ఏలలు మొదలైన ప్రబంధాలు చదివేవారు. నాంది పఠించేవారు. ప్రస్తావన పూర్తి చేసేవారు, పంచ సంధులతో నాటకాలు వేసేవారు. వేషధారణ బాగా ఉండేది. నదులు, కొండలు మొదలైన ప్రకృతి దృశ్యాలను చూపించేవారు. పశుపక్షుల విశేషరూప వృత్తులూ, అవసరమైన చోట ఆయా వస్తువులూ చూపేవారు. పందెంవేసినా సరే, చూపించిన దృశ్యాలలోని వస్తువులు కృతకాలని ఎవరూ చెప్పలేకపోయేవారట. నాటకం చూసే సామాజికులు తమ సామ్ములెల్ల ఒసగులుగా నటులపై పడవేసేవారట. ప్రభావతీ ప్రద్యుమ్నంలో 4-96 నుంచి 101 దాకా ఈ నాటక వర్ణన ఉంది. పింగళి సూరపరాజుగారు తము కాలంలో ప్రచారంలో ఉన్న గంగావతరణం నాటకాన్ని ఈ కావ్యంలో పేర్కొని దాన్నే ప్రద్యుమ్నుని చేత వేయించారు. ఈ నాటకాన్నే తరిగొప్పుల మల్లన కూడ చంద్రభానుచరిత్రలో కావేరిని వర్ణిస్తూ చెప్పాడు. తెరసంధించి ప్రఫుల్ల హల్లక శిఖాదీపచ్చటల్నించి లో గరమర్థిక్‌ జలమానుషీ ప్రతిమలంగైసేసి యీ సింధుసుం దరి గంగావతర ప్రసంగత కథానాట్యంబు సూపన్‌ సురల్‌ సరవిక్‌ వైచు నొంసగులోయనగ నంచల్‌ వ్రాలెడింజూచితే? (చంద్ర. 2-39) ఈ పద్యం వల్ల కూడా నటులపై సామాజికులు ' ఒసగులు' పడేసీవారని తెలుస్తుంది నాటకాలు మెచ్చుకొన్నా నటులను జీవితంలో అట్టే గౌరవించేవారు. కాదేమో అనిపిస్తుంది. ఊళ్ళో నాటకమేళం దిగిందంటే తుర్రకారంతా ఆ ఇంటి చుట్టూ తిరిగేవారు. మేళగాళ్ల వాలకపు సొమ్ములను కుగ్రవాళ్లు ఎత్తుకుపోవడానికి అర్రాడేవాళ్లు. అయితే మేళగాళ్లు వాళ్ళని ఏమన్నా అంటే కుర్ర సజ్ఞు అధిక్షేపించేవారు. మేళంలోని వాళ్లకూ, దొంగలకూ తీడా లేదట. “మీరు మమ్ముల్ని దొంగలంటారా?” అని ఊళ్లోని వటువులు మేళగాళ్లను ఎలా తిట్టేదీ సూరపరాజుగారు' ఈ క్రింది పద్యంలో రాశారు: ఏము మ్రుచ్చులమె యూహింప మ్రుచ్చుదనాల పుట్టిన యిండ్లు మీ బోంట్లె కాక యాటవాండ్రని నమ్మి యనుమతింపగ నెట్టి పురమైన నశ్రయంబునను జొచ్చి పగలెల్ల నాటల బ్రమయించుచును సందు గాందులెల్ల నెరింగికొనుచు రేలు కన్నగాండ్రగుచు నగళ్లు ప్రవేశించి యందునెంతటి వార లడ్డమైన జక్కడచుచు బేనుగ్రుక్కినపాటిగా నిష్టమైన యర్థమెల్ల బడసి గ్రతుకుచునికి మీ స్వభావమంతయును ద ప్పదు యథార్థ మనుచు బలుకుటయును (ప్రభావతీ, 1-1౫)

అరవీటిరాజుల యుగం 251 నటులంటే ఎంత లోకువో నాటకాలంటే అంత ఇష్టం ఈ యుగంలో కనబడుతుంది. ఈ సాంఘిక విషయాలను నాటి కావ్యాలు బాగా ప్రతిఫలించాయి. కాజాల భోగాలను ఎంత విపులంగా కధనం చేశాయో అంత విపులంగానూ కొన్ని కావ్యాలు గ్రామీణుల నిత్యజీవితాన్ని చిత్రిస్తాయి. సాధారణ ప్రజల కట్టుబొట్టూ, ఆటపాటలూ, వినోదాలూ ఈ యుగంలోని కావ్యాలవల్ల క్రోడీకరించవచ్చు.

ఈ యుగంలో కవులు తమకు ఉపదేశించిన గురువుల పేర్లను చెప్పి కృత్యాది పద్యాలలో స్తుతులు చేయడం కనబడుతుంది. చాలామంది ప్రసిద్ధులైన కవులకు ఒకే గురువు ఉండడం కూడా కద్దు. కందాళ అజ్జగారు, భట్టరు చిక్కాచార్యులు మొదలైన గురువులు ప్రసిద్ధులే. రాజగురువుల ప్రాభవానికి మేరలేదు. తాతాచార్యుల విష్యులకు లెక్కలేదు. 'తాతాచార్యులవారి ముద్ర ఎక్కడ తప్పినా వీపు తప్పదు! అనే సామెత కూడా పుట్టింది. మతగురువుల అదేశాలను అనుసరించి స్థలపురాణాలూ, కులపురాణాలు ఈ యుగంలో ఎక్కువ అయినాయి. ఇతర మతాల ఆచారాలను సైతం కొందరు కవులు గ్రంథస్థం చేశారు. రామరాజు రంగప్పరాజు తన సాంబోపాఖ్యానంలో మహమ్మదీయుల రోజూలు 'దుగానాలు' పేర్కొన్నాడు (2-10). ముసల్మానులను 'ముసలిమానులు' అని శ్లేషంచడం సాధారణమైంది. విరహంలో ఉన్న కావ్య నాయికలు చంద్రోపాలంభనలో అతణ్జీ తురకల దేవతగా తిట్టడం కూడ రివాజయింది!

కవులు పరస్పరం తిట్టుకొనడం తూడా చాటువుల ద్వారా కనబడుతుంది. అళియ రామరాయలకు వాయుదోషం వచ్చినప్పుడు రామలింగకవి అంతఃపుర కాంతలతో ఈ క్రింది పద్యం చెప్పాడట:

ఓయమ్మలార మందులు - వేయేల మకారకొమ్ము విషకవిగానిక౯

వాయెత్తకుండ జేసిన - వా యెత్తదు రామరాయ వసుధేశునకుక

(చాటు. £ పుట 124)

మకారకొమ్ము విషకవి అంటే మూర్తికవి; వాయు అంటే వాయురోగం అని అర్థం. ఇతరుల కవిత్వంలో తప్పులు పట్టుకొనడం పండితుల స్వాభావిక గుణంగా పరిణమించసాగింది. “ఇతరులకు ఏమీరాదు” అంటేనే తప్పు తన గొప్పు లోకానికి తెలియదనే సంస్కారలోపం ఈ యుగంలో ఊడలు దించసాగింది. తమ తప్పులు బాహాటంగా ఒప్పుకోవడం మహాత్ములకే చెల్లుతుంది. ధీమంతులకు సైతం ప్రమాదాలు తప్పవు. శ్లేష రచనలు చేసే ఈ యుగం కవులు వ్యాకరణం పైన ఆధారపడసాగారు. సంస్కృత వ్యాకరణం మహా సముద్రం. దాన్ని మథిస్తేనేగాని తెలుగులో తత్సమ పధ బంధాలలో కొత్త పోకడలకు అవకాశం లేదు. సృజనాత్మక రచయితకు మాతృ భాషలోని వ్యాకరణం ఎవ్వరు నేర్పక్కరలేదు. దానంతట అదే వస్తుంది. సహజ శ్లేషాలుకాక కృతక శ్లేషలు, ద్వ్యర్థి రచనలు చేసేటప్పుడు తత్సమపదభూయిష్టమైన భాషలో సంస్కృత మర్యాదలు పాటించడం అవసరమైంది. సంస్కృతంలో ప్రతిమాటా

252 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి స్త్రీలింగమో, పుంలింగమో, నపుంసకలింగమో అయి తీరాలి. “ముష్టి పదం స్త్రీలింగం. దీనిపైన రామరాజు రంగప్పరాజు ఇలా చమత్కరించాడు. అసురమన్మథతాడితుండగుచుగృష్టు - ముష్టికిని జీవధనమిచ్చి మోహియయ్యె నహహ స్త్రీ లింగమాత్రమే యంత చేసె-గేవల స్తీ మహిమ వితర్కింప నేల? (సాంబో. 1-77

ఇలాగ భాషాశాస్త్రంలోని విషయాలను చమత్కరించిన కవిత్వం వాడుకోవడం ఈ యుగంలో కనబడుతుంది.

ఈ యుగంలో తెలుగు భాషకు పకడ్చందీగా వ్యాకరణం వ్రాయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ సంగతులు ఎలకూచి బాలసరస్వతి, అనే కవి గురించి చెప్పుకొన్నప్పుడు తెలుసుకొందాం.

  • శంకర కవి

'సత్యమేవజయతే అన్నది మన జుతీయ విశ్వాసం! నేటి ప్రభుత్వ నినాదం. ప్రాణం పోయినా అబద్ధమాడకూడదన్నది గొప్పు ఆదర్శం. ఎప్పటి౭య్యది ప్రస్తుతమో అప్పటికామాట లాడడం, తప్పించుకొని తిరగడానికి రాజమార్గం కావచ్చు కాని మెప్పించి బ్రతకడానికి పనికిరాదు. ప్రజల కళ్ళలో మెలుగుతూవుండేవాడీకి నిజం చెప్పడం కన్న మంచి మార్గం ఇంకొకటి వుండదు. బహిరంగంగా నిజం చెప్పడమనేది ఒక కళ. దానిని గాంధీజీ ఆచరించాడు. కృతకృత్యుడయ్యాడు, అందుకే ఆయన మహాత్ముడు సాధారణ మానవులు అబద్దాలు ఆడటం తప్పదని మన శాస్త్రాలకు బాగా తెలుసు. “సత్యం వద' అని బోధించిన నోటితోనే కొన్ని లైసెన్సులు ఇచ్చారు. “వారిజూక్షులందు వైవాహికములందు, ప్రాణవిత్తమానభంగమందు, వసుధగోకులా గ్రవర్జరక్షణమందు బొంకవచ్చు నఘముపొంద దధిపి అని భాగవతపురాణమే ఉపదేశించింది (98-585). ఆడీతప్పని వాడు, అజాతశత్రువు అని పేరు పొందిన ధర్మరాజతంటివాడు శస్త్రగురువును చంపడానికి అబద్ధమాడవలసి వచ్చింది. అయినా సత్యవాక్యపరిపాలనలోని గొప్పతనాన్ని చాటిచెప్పడానికి అనువుగా ఆ రచయితలు ఒక హీరోను సృష్టించవలసి వచ్చింది. హరిశ్చంద్రుడనే పుడాణపురుషునికి సత్యవ్రతుడనే ఖ్యాతిని తీసుకువచ్చారు.

బుగ్వేదకాలంలో మనకొక హరిశ్చంద్రుడున్నాడు. అతడు అఆడితప్పినవాడే. ఇవ్వవలసిన బాకీ తీర్చుకొనడానికి వాయిదాలు వేసే పెద్దమనిషి తనకు బిడ్డపుడితే ఈ కొడుకును వరుణదేవునకు బలివేస్తానని మొక్కుకున్నాడు. బిడ్డ పుట్టాడు గాని రాజు బలి వేయలేదు. వరుణుడు వచ్చి తనకు రావలసినది ఇమ్మన్నాడు. బిడ్డ పురిటికందనీ నూనెకందనీ, నెలలవిడ్డనీ, అన్నప్రాశన అవలేదనీ, అక్షరాభ్యాసం చేయలేదనీ;-అలాగలాగ వాయిదాలు వేశాడు. బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు బలి ఇవ్వడానికీ రాజో సిద్ధపడినా కొడుకు ఇష్టపడలేదు. రాచబిడ్డ స్థానంలో మరో తలమాసిన వాడిని బలి

శంకర కవి 253 ఇచ్చినా చాలని వరుఖుడ్రన్నాడు. ఒక గర్చదరిద్రుని కొడుకును కొనుక్కొనివచ్చి నరమేధం చేయబోయారు. బలిపశువుగా వచ్చిన కుర్రవాడు ఏడ్చాడు. యాగశాలలో విశ్వామిత్రుణ్ణీ శరణువేడాడు. ఆ మహర్షి అభయమిచ్చి ఆ అభాగ్యుణ్జి సౌంత కొడుకులాగ చూసుకొంటానన్నాడు. అయితే విశ్వామిత్రుని స్వంతకొడుకులోో సగంమంది అడ్డు చెప్పారు... ఆ నిర్పాగ్యుణ్జి బలివేసి తీరవలసిందేనని పట్టుబట్టారు. విశ్వామిత్రునికి కోపంవచ్చి ఆ యాభైమంది కొడుకులను శపించి వెలివేశాడు. అలా బహిష్కారం ఫొందిన వాళ్ళలో మన ఆంధ్రుల పూర్వీకులు ఉన్నారు. ఇది బుగ్వేదం ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్న కధ.

వేద ప్రసిద్ధుడైన ఈ హరిశ్చంద్రుని కథకూ, లోకంలో ప్రచారం పొందిన హరిశ్చంద్రుని కథకూ పోలిక లేదు. వైదికగాథలో విశ్వామిత్రుడు కరుణామయుడు; లౌకికగాథలో ముక్కోపి, సాధుకంటకుడు. సత్యవిజయాన్ని చాటడానికి హరిశ్చంద్రుడు నాయకుడైైతే అతని ప్రతిస్పర్ధి క్రూరుడుగా రూపాంతరం పొందడం ఆశ్చర్యం కాదు. మార్కండేయ పురాణంలో ఈ మార్చు మొదటిసారిగా జరిగింది. దీనిని మారన అనువదించి మొదటిసారిగా ఆంధ్రులకు పరిచయం చేశాడు. తరువాత గౌరన ఈ గాథను ౌదిత్యవంతంగా మార్చి సంభాషణ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ నాటక్టూలిలో ద్విపద కావ్యంగా వ్రాశాడు. ఆ తరువాత ఈ కథను చాలామంది కావ్యంగా రచించారు. ఇరవయ్యో శబాబ్దంలో బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు. వ్రాసిన స్టేజి నాటకం, అంతకుముందు శంకరకవి రచించిన పద్యకావ్యం చాలా ప్రచారంలో ఉండేవి.

శంకరకవి దేచయ్యమంత్రి కుమారుడు. తెనాలి రామకృష్ణునిచేత ఉద్పటారాధ్య చరిత్ర చెప్పించి అంకితం పుచ్చుకొన్న దేచయ్యా, ఈ శంకరకవి తండ్రీ ఒక్కరే అని పరిశోధకులు కొందరు అనుమానిస్తున్నారు.2 దానికీ కారణం: ఇద్దరు దేచయ్యలదీ కౌండిన్యగో త్రమే. ఇద్దరూ శైవుల ఊర దేచయ్యగారి కులగురువు చంద్రశేఖరుడు, శంకరకవి తూడా '“శశాంకమౌళిపదసేవా లబ్ధసాహిత్య సద్ధనుడు' (హరి. 1-19). ఊర దేచయ్య కాలం క్రీ.శ. 1525 ప్రాంతాలు. శంకరకవి క్రీ.శ. 1550 ప్రాంతాలవాడైతే కాలవిరోధం ఏమీ ఉండదు. గ్రంథస్థమైన ఆకరాలవల్ల శంకరకవి ఆ కాలంవాడే అని చెప్పవచ్చు.

ఈ కవి హరిశ్చంద్ర కావ్యాన్ని ఈడూరి ఎల్లయ్యకు అంకితమిచ్చాడు. గ్రంథం చిట్టచివర అయిదో ఆక్వాసం ఆఖర్న తన కృతిపతినీ ఇలా సంబోధించాడు:

అలఘు ప్రతాపకుతుపన- మలకేం ద్రకృపాసమ గ్రమహిమాన్వితకో

ర్కొలని గ్రామనికేతన- జలసీమారక్షణైక చాతుర్యనిథీ!

ఈ పద్యంవల్ల ఈడూరి ఎల్లయ్య బల్లిసీమలోని కోర్కొలను గ్రామానికి అధికారి అని తెలుస్తూంది. ఆ గ్రామాన్ని కుతుపనమలక్‌ ఇచ్చాడు. ఇతడు క్రీ.శ.1511-43 మధ్య గోలకొండ రాజ్యాన్ని పాలించిన కులీ కుతుబ్‌షాయే అని పరిశోధకులు గుర్తించారు.

  1. ఐతరేయ బ్రాహ్మణం, 8-3-18. -

  2. ఆంధ్రకవితరంగిణి, 9 సంపుటి, పుట 1%

  3. అంధ్రకవితరంగిణి, 9 సంపుటి, పుట 192

254 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ నవాబుచేత గ్రామాధికారం పొందిన ఎల్లయ్యకు కృతి యివ్వబట్టి శంకరకవి కాలం 1550 ప్రాంతాలని చెప్పవచ్చు. శంకరకవి తనను గురించి ఇతర వివరాలేమీ చెప్పుకోలేదు. కాను నిరాఘాట వచోధురంధురుడనని విశదపరిచాడు. అతని ఉద్దేశంలో తడుముకోకుండా పద్యం చెప్పినవాడే కవి. కుకవినిందలో ఇలా అన్నాడు: వడియును బ్రాసము న్వెదకువాడు ప్రబంధము పూని యేమిచె ప్పెడి నగుబాటగుక సుకవిబ్బృందము ముందకు మాటలాడు వెం బడి నవి తమ్ము దామె సులభస్థితిలో నుచితస్థలంబులక్‌ బడిబడివచ్చినిల్చి బహుభంగుల ద్రోవల జూపకుండీనన్‌. (హరి. 1-18) శంకర కవిత్వంలో నిజంగా పదాలు వాటంతటవే వచ్చిపడినట్లుంటాయి. పద్యం నీటిధారలాగ పారుకొంటూపోతుంది. ఇతడు వ్రాసిన వెయ్యి పైచిలుకు పద్యాలలో ఏ ఒక్కటీ కుంటదు. కథ ఎక్కడా ఆగదు. మహా కావ్య లక్షణాలు తెచ్చిపెట్టుకొందుకు అష్టాదశ వర్ణనలు గుప్పించాలనే తాపత్రయం శంకర కవికి లేదు. అయితే ఇందులో శంకరకిి ప్రయోజకత్వం కొంచెం తక్కువే. గౌరన ద్విపద కావ్యాన్నే అతడు ముక్కుకు సూటీగా అనుసరించాడు. ద్వాపద కావ్యంలో లేని భావాలు స్వల్పమే. ఉన్నవాటిలో అతడు తన ప్రతిభను బాగా ప్రదర్శించాడు. హరిశ్చంద్రుణ్ణి తన ఆశ్రమం ఛాయలకు రప్పించడానికీ విశ్వామిత్రుడు ఒక మాయలేడిని సృష్టించాడు. దానిని శంకరకవి ఇలా వర్ణించాడు. బంధనం బెడలి భూభాగంబు జేరి యిచ్చాలీలవిహరించు గాలియిర్రి కుందేటితో బొత్తు కూడక వచ్చిన యుడురాజబింబంబు సడిమియిర్రి వీరభద్రుని కృప వెండియు నుద్బూతమైన దక్షమఖంబులోని యిర్రి కుధరనందన వేడికొన విసర్జించిన చేతోభవారాతిచేయి యిర్రి ననుకరించుచు మిగుల బెంపగల్లింప మంచి మురువును బరువును మదము ముదము ఫాదల గన్గుగొనువారి కింపులు ఘటిల్ల నల్లనల్లన నడయాడె నభినవముగ (హారి. 2-6) కాళీపుర గొప్పతనాన్ని చెప్తూ హరిశ్చంద్రుడు చంద్రమతితో ఇలా అంటాడు: వారాణసీ వారాణసి - వారణాసి యంచు భక్తివశుడై నరుడం భోరుహమిత్రోదయవే- ళారంభంబున దలంప నడగు నఘమ్ముల్‌.. (హరి. శ్ర-14) ఈ పద్యానికి శ్రీనాథుని వరవడి ఉంది. ఫీమఖండంలో గోదావరీ మాహాక్కాన్ని వర్ణిస్తూ ఒక పద్యం వ్రాశాడు. చూడండి. గోదావరి గోదావరి - గోదావరి యంచు బల్క గుణవంతులకుక __గోదావరితల్లీ సం-పాదింతు గదమ్మ నీవు భవ్యశుభంబుల్‌ (ఖీమ. 1-18) జ హరిశ్చంద్రోపాఖ్యానం, 1196

శంకర కవి 255 ఏడుపు పద్యం ఒకటి దవ్రాస్తూ శంకరకవి అల్లసాని పెద్దనగారిని, ముక్కు తిమ్మనగారిని అనుసరించాడు. లోహితాస్యుడు మరణించినప్పుడు చంద్రమకి ఇలా విలపించిందంట: పంచమనాదయుక్తి పికభామినికూయుతెరంగు దోప నా చంచలనేత్ర హస్తజలజంబులు మోమున జేర్చి యేడ్చె నే ఆాంచలబాప్పబిందునివహంబుల దోగు నురోజకుంభము ల్మంచున దోగు పద్మముకుళంబులతోడుత జెల్మి సేయగన్‌ (హరి. 5-69) హరిశ్చంద్రోపాఖ్యానంలో నిజానికి హరిశ్చంద్రుని పాత్రకన్నా చంద్రమతి పాత్రే గంభీరంగా ఉంటుంది. అతడు తటపటాయించినప్పుడల్లా ఆమె సలహా యిచ్చి సరైనదారిలో పెడుతుంది. రాజ్యం ధారపోయడానికి భర్హ వెనుకాడినప్పుడు ఆమె ఇలా అంటుంది మును ధర యేలి చన్న నృపముఖ్యు లనేకులు చర్చ చేసినళ_ జనవర! వారిలోన విలసన్మతిపారగు లెవ్నరైన సౌం పున దమవెంట ముంటిమొన మోపగజాలినయంత మేరయుం గొని చనిరే ధరాతలము కొంకకుమాూ యిలదానమబ్బుచో (హరి. 2-194) ఇక్కడిలా హితబోధ చేసినట్టే కాశీలో మళ్లీ తనను విక్రయించడానికి సంశయించి నప్పుడు భర్తకిలా బోధిస్తుంది: భూవరః వివరింపగ భా-ర్యావివ్రయ పాతకంబు నైనను బాయం

  • గావచ్చుగాని మరి మి-థ్యావాగ్లోషంబు బాయ దర మెవ్వరికిన్‌? (హరి. 4-52) శృశానంలో ఒకరి నొకరు గుర్తించుకొన్నాక కొడుకు మృతికి, తమకు పట్టిన గతికి విలపిస్తూన్న సందర్బంలో ముందు కర్పవ్యంగురించి ముందుగా అవిడే మేలుకొంది. భర్తతో ఇలా చెప్పి ఊరడించింది ఇనకులసార్వభౌమః మనమిద్దరమున్ధృతి దూలి యీగతి౯€ ఘనతరళశోకవహ్ని బడి క్రాగుచు నుండుట బుద్ధి కాదు నె మ్మనమున దాల్మినిల్పుడిక మానుడు దుఃఖము వేకువయ్యె బొ ద్దును బసలేదు కుక్కుటతతు ల్వెస గూయగ బొచ్చె నెల్లడన్‌. (హరి. 5-105) ఈ కావ్యంలో చంద్రమతి పాత్రలో యింతటి ఓపిక, నిబ్బరం, ధర్మపరాయణత్వం ఉన్నాయి కనుకనే, క్రమోన్మీలనం ఉంది కనుకనే చిట్టచివర చంద్రమతిని పార్వతీదేవి పొగడుతున్నప్పుడు అది నిజమే అనిపిస్తుంది. ఓ పికవాణీ నీకు గల యోపిక వాణికి లేదు వార్డివే లాపరివేష్టిత క్షితీతలంబుల నీసరి లేదు భామినుల్‌ నీ పతిభక్తి యుక్తియును నీ మతిశుద్ధియు నీవివేక వా ' ట్నైపుణ్య ముస్ఫుజంగకులనాథునకైన నుతింప శక్యమే? (శారి. 5-190)

256 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తన పాత్రకు ఉన్న ఓపిక వాణికి లేనట్టే శంకరకవికి కూడా లేదు. తాను నిరాఘాటవచోధురంధరుడే కావచ్చు, మాటలు వాటంతటవి వచ్చిపడి ఉండవచ్చు. అయితే నోటికి వచ్చిన మాటలలో జౌచిత్యముందా లేదా అని ఆలోచింపవలసిన బాధ్యత కవికి ఉండాలి. శ్మశానంలో తనను కరుణించ ప్రార్థించినప్పుడు హరిశ్చంద్రుడు : హరిపదపూజకుం దొలగి యంత్యజు గొల్చి కులాఖిమానముల్‌ సరుగున వెచ్చపెట్టి హరిచందనకీర్తులు వీటిబుచ్చి దు ష్కరమగు వల్లకాటి కధికారము వచ్చిన దుష్టబుద్ధికిక్‌ గరుణ దలంప నెక్కడిది గంధగజేంద్రసమాన గామినీ! (హరి. 5-92) ఈ పద్యంలో అఖరుపాదంలోని “గంధగజేంద్ర సమానగామినీ అనే పడికట్టు సంబోధనలో జౌచిత్యం లేదు. ఈ తప్పు ఒక పెద్ద తప్పు కాదుగాని తన కావ్యంలో గౌరన ద్విపదలను అడుగడుగునా వాడుకొంటూ ఆ పూర్వ కవిని ఎక్కడా ఒక్కసారీ పేర్కొనకపోవడం పెద్ద దోషమే. సత్యం గొప్పదని చాటిచెప్పే కావ్యంలో ఇది కృతిక్త చేయదగిన పనికాదు. వెలగపూడి వెంగన్న కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం అనే శోకాన్ని వినని తెలుగువాడు లేనట్టే చింతామణి నాటకాన్ని చూడని ప్రేక్షకుడు కూడా ఉండడు. నాటకంలోని నాయకుడు వీల్వమంగళుడే మార్చు చెందాక లీలాశుకుడనే నామాంతరంతో శ్రీకృష్ణకర్ణామృతం అనే కావ్యాన్ని రచించాడన్న సంగతి అందరికీ కాకపోయినా. కొందరికైనా తెలియవచ్చేమో గాని, లీలాశుతుని కావ్యాన్ని వెలగపూడి వెంగన్న అనే కవి రసవంతంగా అనువదించిన సంగతి చాలా తక్కువమందికి తెలుసేమో. సంస్కృత శ్రీకృష్ణకర్జామృతం వ్రాసిన లీలాశుకుడు క్రీ.శ. 1300 ప్రాంతాలవాడని కొందరు. భావిస్తున్నారు. క్రీ.శ. 1$వ శతోల్దివాడని కొందరి అనుమానం. ఇతడే ఏ కాలపువాడైనా కృష్ణాతీరవాసి, ఆంధ్రుడు, చింతామణి మూలంగా మహాభత్తుడుగా మధురకవిగా మారాడు. ఇతని గురువు బహుశా సోమగిరి. ఈ ఇద్దరి పేర్లూ ఈ క్రీంది ప్రథమ శోకంలో ఉన్నాయి. చింతామణి రయతు సోమగిరి రురు ర్మే శిక్షాగురుశ్చ భగవాక శిఖిపింఛమౌళి యత్సాదకల్పతరుపల్లవశేఖరేషు లీలాస్ప్వయంవరరసం అభతీ జయశ్రీః లీలాశుకుడు వ్రాసిన ఈ కృష్ణకర్జామృతం తెలుగు దేశంలో విరివిగా ప్రచార పొందిందనడానికి దీనికి తెలుగువాళ్లు వ్రాసిన వ్యాఖ్యలున్నాయి.! పావన లన వతతాాల ద నాలనతాానానాననావానాడాంనకాలా

  1. అఆంధ్రకవితరంగిణి, 8వ సంపుటి - శ్రీచాగంటి శేషయ్య, పుట 184.
  2. అఆంధ్రవిజ్ఞానసర్వస్వం - విశ్చసాహితి, పుట 771. పిశుపాటి ఎల్లయ్య ఒక వ్యాఖ్యానం వాళొడు సంస్కృత వాజ్బయచరిత్ర, 2వ భాగం - శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి పుట 34.

వెలగపూడి వెంగన్న 257 ఇతర ప్రాంతాలలో తూడా బహుళ ప్రచారం ఫొందింది. రూపగోస్వామి శిష్యుడు కృష్ణదాసు ఒక వ్యాఖ్యానం వ్రాశాడు. లీలాశుకుని కావ్యాన్నే తాను తెనిగిస్తున్నట్టు వెలగపూడి వెంగన్న దైవానికి ఇలా నివేదించాడు; ఫలవాంఛక హరికీర్షి గుచ్చరతియు!౯ ఫాలాక్షు సంసివయుం గల లీలాశుకవాకృముల్‌ దెలుగునక్‌ గర్జామృతఖ్యాతిగా నలరంబేసిన వెల్సపూడిమణీ పెద్దామాత్యువెంగన్ననే నలరుందోయిటిమాడ్కి గైకొనుము కృష్ణా! కల్పసంస్థాయిగన్‌. (శ్రీకృష్ణు 1-110) =. వెలగపూడి గ్రామం గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకాలో ఉంది. వెంగన్న తండ్రీ పేరు పెద్దయామాత్సుడు. లీలాశుకునికి సోమగిరి అనే గురువు ఉన్నట్టు వెంగన్నకు కృష్ణాశయుడనే యోగి గురువు. ఈ వెలగపూడి వాళ్లు తరతరాల నుంచీ కవులనీ, వాళ్లు బాసిన గ్రంథాలు చాలా ఉన్నాయనీ, ఆ కుటుంబంలోనే క్రీ.శ 1700 ప్రాంతాలలో జన్మించిన వెలగపూడి కృష్ణకవి తన భానుమద్విజయం అనే గ్రంథంలో చెప్పాడు. భూసుత గాంగేయోపా- ఖ్యానసుమంతో దయాంద్రకర్ణామృతముక్‌ మానితవజ్రభుజోపా- ఖ్యానము శుభహేతు సేతుమాహాత్మ్యంబుక దత్తాత్రేయ చరిత్రక- సత్తగు మర్యాదరామసచివు చరిత్ర౯ చిత్తరపుకృతులు చేసిన- యుత్తమ కవులెల్ల మీతులోద్బ్చవు లగుటన్‌. (భానుమద్చిజయం 3) ఈ పద్యాలనుబట్టి వెలగపూడి కవులు వ్రాసిన గ్రంథాల పట్టిక ఇది;

  1. గాంగేయోపాఖ్యానం 6. సేతు మాహాత్మ్యం
  2. సుమంతోదయం 6. దత్తాత్రేయ చరిత్ర
  3. ఆంధ్రకర్ణామృతం 7. మర్యాద రామన్న చరిత్ర
  4. వజభుజోపాఖ్యానం వీటిలో ఏ కవులు ఏ గ్రంథాలు బ్రాశారో వెలగపూడి కృష్ణకవి చెప్పలేదు. అయితే గాంగేయోపాఖ్యానం, సుమంతోదయం, ఆంధ్రకర్ణామృతం అనే మూడింటినీ వెంగన్న రచించి ఉండవచ్చు. వెంగన్న అనువదించిన కృష్ణకర్ణామృతంలోని పద్యాలను లింగమగుంట తిమ్మన తన సులక్షణసారంలో ఉదాహరించాడట. ఈ తిమ్మన తెనాలి రామకృష్ణుని మేనల్లుడు. అందుచేత వెంగన్న క్రీ.శ. 1530కి పూర్చుడని కొందరు భావిస్తున్నారు. అయితే సులక్షణసారపు ముద్రితప్రతులలో ఈ వెంగన్న పద్యాలేవీ కనబడవు. అయితే వెంగన్న కాలాన్ని నిర్ణయించడానికి గ్రంథంలోని పద్యాల శైలి పనికీ వస్తుంది. ఈ క్రింది పద్యం చూడండి:
  5. ఈ పద్యాలను చాగంటీ శేయ్యగారు ఉదాహరించారు. ఆంధ్రకవితరంగిణి 8 సంపుటి - పుట 1%.
  6. శతకకవులచరిత్ర, వంగూరి సుబ్బారావుగారు, పుకు 199.

258 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ

పాయని భక్తి మొక్కెద నపారకృపారసధేనుసౌఖ్యసం

ధాయికి లోకరక్షణవిధాయికి భాసురరాధికాకుచ

స్థాయికి బన్న గాధిపవిశాలఫణామణిసొధవీధికా

శాయికీ గోపికా నయనసారససారఫల ప్రదాయికిన్‌. (శ్రీకృష్ణ 1-7)

ఇది బమ్మెరపోతరాజుగారికి అనుకరణ. అందుచేత వెంగన్న భాగవతం ప్రచారంలోకి వచ్చాక పుట్టిన కవి అని చెప్పవచ్చు. మనుచరిత్రలో అల్లసాని పెద్ధనగారు వ్రాసిన 'ఎందే డెందము కందళించు' అనే పద్యం ప్రసిద్ధమే (మను. 2-62). దీని ఎత్తుగడలాంటి ఎత్తుగడతో వెంగన్న “ఎందేనెవ్వనిమూర్తిగాంచి' అంటూ ఒక శ్లోకం అనువదించాడు. (శ్రీకృష్ణ.3-16). పెద్దనగారి ప్రభావం అజ్ఞాతంగా వెంగన్న మీద ఉందేమో! సుప్రసిద్ధమైన 'కస్తూరీతిలకం' అనే శోకాన్ని వెంగన్న ఇలా అనువదించాడు.

నుదుటం గస్తురిబొట్టు పన్ముత్తెంబు శ్రీగంధసం

పద నెమ్మేన గరంబులం గటకము ల్వంశంబు హస్తాగ్రమం

దెదపై నిస్తులకౌస్తుభవంబు నరుతక శృంగారహారంబు నిం

పొదవళ౯్‌ కృష్ణుడు గోపికావృతుడు సర్వోత్కృష్టుడైవర్తిలున్‌. (శ్రీకృష్ణ. 2-100)

శ్రీకృష్ణుని నగుమోములోని తీయదనాన్ని తనివితీరా గ్రోలేది అతని ముర. అతని పెదవుల దగ్గిర నుంచి చెవిదాకా దానిదే రాజ్యం. తమ గోడు శ్రీకృష్ణుని చెవిని పడవేయమని ఆ మురళిని గోపికలు ప్రార్థించడంలో ఆశ్చర్యం లేదు. లీలాశుకుడు చెప్పిన శోకానువాదం విఛండీ.

హరియధరాంతికస్థలవిహారమునక్‌ స్మితపూర్ణవశక్రతా

మరస సమీర సీధురసమాధురి జెందిన నిన్ను వేడెద౯

మురళిరొ నందసూను మది నూల్కొనగా జెవిదండ నుండి యె

వ్వరు వినకుండ నాదువలపంత సమస్తము దెల్బ మైక్కెదన్‌. (శ్రీకృష్ణ2-11) శ్రీకృష్ణుని బాల్యం మాధుర్యంకంటే మధురం, చాపల్యంకన్నా చపలం అని లీలాశుకుడు ఇలా అన్నాడు.

మాధుర్యాదపి మధురం మన్మథ తాతస్యు కిమపి కైశోరం

చాపల్యాదపి చపలం చేతో మమ హారతి హంత కిం కుర్మ॥

గబ్బిమెరుంగుబోండ్లు తటకాపడి లోలగత జూచుసతంతలో

నిబ్బరయైన తత్తరము నెక్కొన నందము కన్న నందమై

యబ్బురమైన బాల్యమున సద్దిర యంగజు గన్నతండ్రీ యా ,

గుబ్బున నామదిం గులుగు గుట్టు గలంచెనికేమి సేయుదున్‌. (శ్రీకృష్ణ 1-6)

వెలగపూడి వెంగన్న 259 మూలంలో ఉన్న మాధుర్యం లోపించి ఇందులో అందమైనా, “నామదిం గలుగు గుట్టు గలంచె' అనడంతో తెలుగుదనం వచ్చింది. శ్రీకృష్ణుని బాల్యమేకాదు శరీరం, ముఖం చిరునవ్వు అన్నీ మధురంగానే లీలాశుకునికి కనబడతాయి. అందుకే ఇలా అన్నాడు; మధురం మధురం వపు రస్య విభో ర్మధురం మధురం వదనం మధురం ముధుగస్థి మృదుస్మిత మేత దహో। మధురం మధురం మధురం. ఈ శోకాన్ని వెంగన్న ఇలా అనువదించాడు. చూడంజూడగ మేన దానినుమడించుక్‌ మాధురీసంపదల్‌ సూడంజూడగ మోముగోము మది మెచ్చుల్లుల్కు ముమ్మూటికిక౯్‌ జొడంజూడ మరంద బిందువుల మించు న్మందహాసంబు నీ జాడం బల్మరు మాధురిం జెలగు నాస్వామిళ౯ విలోకించెదన్‌. (శ్రీకృష్ణ 1-91) చటపత్రశాయిగా బాలకృష్ణుని ఊహించుకొని లీలాశుకుడు మనోహరంగా ఈ శోకం చెప్పాడు: కరారవిందేన పదారవిందం ముఖారవిండే వినివేశయంతం వటస్యు పుత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. దీనిని అనువదిస్తూ వటపత్రశాయికి జోలలు పాడే యశోద భాగ్యాన్ని వెంగన్న ఇలా కొనియాడాడు: కేలుందామరచే పదాబ్ద మెలమిక్‌ గీలించి నెమ్మోముపై హాళిన్నిల్చి వటప్రవాళమృదుశయ్యం బొల్బు నబ్బాలునిన్‌ లీలాలోల విశాలలోచనుని లాలింబెట్టి లాలించుచుక్‌ జోలల్‌పాడు యశోద భాగ్యమున కే జోహారు గావించెదన్‌ (శ్రీకృష్ణ 2-68) శ్రీకృష్ణునికి జోలలు పాడుతున్న యశోద రామావతారపు గాథలు గానం చేస్తుందట. రావణుడు సీతను ఎత్తుకుపోయాడన్న మాట వినగానే నిద్రలోనే కృష్ణుడు “లక్ష్మణా. విల్లందుకో' అని కలవరించాడట. “రామో నామబభూవి అనే శ్లోకాన్ని వెంగన్న ఇలా తెలుగు చేశాడు; ఇలలో రాఘవు డొప్పు వాని సతియయ్యెక సీత వారి న్వనం బులకుం బంచె గురుండటంచు నిదురం బొందించు నయ్యంబ ప ల్కుల దానూకొని రావణుండు మహిజ గొంపోయె నా నుల్కి వి ల్విలు దే లక్ష్మణ! యంచు బల్కు హరి యుద్వేలోక్తినక్‌ బ్రోచుతన్‌. (శ్రీకృష్ణ 2-72) శ్రీకృష్ణకర్ణామృతంలోని “కస్తూరీతిలకం' అనే శోకం ప్రసిద్ధమేగాని అంతకన్నా ప్రసిద్ధమైన మరొక శ్లోకం ఉంది. దానిని, దాని అనువాదాన్నీ చూడండి.

260 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అంగనా మంగనా మంతరే మాధవో చూధవం మాధవం చాంతరే జాంగనా ఇత్ధ మాకల్పితే మండలే మధ్యగ స్సంజగౌ వేణునా దేవకీనందనః ఇరుదెస దాను నిల్చి తన కింతలు పార్శ్భ్వముల స్వసింపగా గరములు గంఠపాళి జెలగక్‌ బలఖిన్మణివిద్రుమంబులన్‌ సరమొనరించినట్లు సరసస్థితి మండల మధ్యవర్తియై మురళిరవంబునక్‌ జెలగు మోహనమూర్తి మురారి గొల్బెదన్‌. (శ్రీకృష్ణ 2-౫) ఆంధ్రదేశంలో మృదుమధురమైన సంస్కృత శ్లోకాలే ఆడవాళ్ళకు సైతం నోటపట్టడంవల్ల శ్రీకృష్ణకర్ణాచ్చుతాన్ని వెంగన్నే కాదు, ఇంకెవరు అనువదించినా ఆ శోకాల ముందా పద్యాలు సూర్యుని ముందు దివిటీలే అవుతాయి. పెనుమత్సకవులు అంగద బసవయ్య 'సప్తసంకానాలలో కృతి ప్రశస్తమైనది కనుక శాశ్వతమైన కీర్పిని తోరే చిన్న చిన్న స్థానిక పరిపాలకులు తూడా కవులను పోషించి కావ్యాలను అంకితం పుచ్చుకొనడం మన సాహిత్య చరిత్రలో సర్వసాధారణం. అయితే ఇటువంటి ప్రభువులు తామే స్వయంగా కృతులను రచించి తాము పూజించే దేవునితో, గౌరవించే ప్రభువులకో అంకితమివ్వడం తూడా లేకపోలేదు. క్రీ.శ. 1500 ప్రాంతాలకు ఓ తరం అటో ఇటో గోదావరి మండలం బమ్మెర పోతరాజుగారి మునిమనుమలు 'విష్ణు్రభజినానందం' అనే ప్రబంధం వ్రాసి పెనుమత్స నారపరాజుతు అంకితం ఇచ్చారు. ఆ కావ్యంలో కృతిపతి వంశాన్ని వర్ణిస్తూ నారపరాజు పూర్వులలో వెంకటాద్రిరాజూ, గోపరాజూ కావ్యాలు బ్రాసినట్టు చెప్పారు. శవితాప్రవర్తతుండు” అని పోతరాజుగారి మునిమనుమలు చెప్పారు. ఇందుమతీకళ్యాణము - పౌందుగ రచియించె సకలబుధులకు శ్రోత్రా నందంబుగ బద్మప్రభు - నందను డీ వెంకటాద్రి నరపతు లెంచన్‌. (విష్ణుభబనానందము) ఈ పెనుమత్స వెంకటాద్రి రచించిన ఇందుమతీ కల్యాణం నేడు అలభ్యం. రఘువంశంలోని అజమహారాజు ఇందుమతిని వివాహం చేసుకోవడం ఇందులోని ఇతి చృత్తం. కవికులగురువు కాళిదాసు రచించిన మహాకావ్యంలోని పంచమ సర్గనుంచి అష్టమ నయ తకనను కకక క సున సననస పన కపప ను సన పనా

  1. పోతరాజుగారి మునిమనుమలు కేసకవి, మల్లకవి బ్రాసిన 'విష్ణభజనానందం' అముద్రితం ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఒక ప్రతి ఉంది. ర ఆ పద్యాన్ని తరువాతి వాటిని చాగంటి శేషయ్యగారు అంధ్రకవి తరంగిణి, 6వ సంపుటం, పుటలు 228-30లలో ఉదాహరించారు.

పెనునుళ్స కవులు - అంగద బసవయ్య 261: సర్గదాళా బహుశా దీనికి మూలం అయి వుంటుంది. భారతదేశంలో ఏమాత్రం విద్యావంతులైనా పూర్వం సంస్కృతం చదువుతున్నప్పుడు విధిగా రఘువంశం పాఠం చెప్పుకొనేవారు. ఐదోసర్గ నుంచి ఎనిమిదో సర్గదాకా ఉన్న అజమహారాజు చరిత్రకు ఉత్తేటీతులై ఈ ఘట్టాన్ని తినిగించి ఉంటారు. పెనుమత్స వెంకటాద్రే కాక మరి పదకొండు మంది ఇందుమతీ కళ్యాణం కావ్యంగా వ్రాశారు. చూడండీ జాబితా. మస కాలం (రు యలు 4 | క్రీశ 1550కి వెనుముత్స వెంకటాద్రి ఇందుమతీ కల్యాణం పూర్వం (?) (అలభ్యం) 2. | 1500 తరువాత అంగద బసవయ్య పెదపాటి జగ్గయ్య (7 ఐదుపద్యాలు ప్రబంధ రత్నావళిలో ఉదాహరించారు. 3. | 150 తరువాత చిత్రకవి అనంతకవి ఇందుమతీ పరిణయం (అలభ్యం) ఓ | 155 తెనాలి రామభద్రకవి లభ్యం. అముద్రితం తంజావూరు కేటలాగు నెం. 138. క | 100 తుమారధూర్జటి ఇందుమతీ పరిణయం (ముద్రితం) 8 (190 పాలూరి గోవిందకవి అలభ్యం 7 | 729-136 అలూరి కుష్పనకవి అలభ్యం 8 | 10960) కాకునూరి కృష్ణయ్య అయిదాశ్వాసాల ప్రబంధం 9 | 1300 మండపాక పేరయ్య అలభ్యం 9. | (౪) తిమ్మకవి కొడుకు తంజావూరు కేటలాగు తిమ్మకవి 137 నెం. ఆసమగ్రం అముద్రితం గ | (౪ పూడిపెద్ది బుచ్చెన ద్చాపదరావ్యం ముద్రితం 1 | (1) పంతుల బ్రహ్మదేవకవి మద్రాను ప్రాచ్యలిఖిత గంథాలయంలో ౩ ప్రతులున్నాయి. పెనుమత్స వెంకటాద్రితో కలుపుకొని పన్నెండు మంది కవులు ఇందువతీ పరిణయం వబ్రాయడంవల్ల ఈ ఇతివృత్తం తెలుగుకవుల హృదయానికి ఎంత హత్తుకుపోయిందో ఊహించవచ్చు. వెంకటాద్రి వ్రాసిన ఇందుమతీ కల్యాణం లభించలేదుగాని, బహుశా ఇతనికి సమకాలికుడైన అంగద బసవయ్య కవి రచించిన ఇందుముతీ కళ్యాణంలోని ఐదు పద్యాలు మాత్రం దొరుకుతున్నాయి. క్రీశు 1500-60 ప్రాంతాలలో ఉన్న పెదపాటి జగ్గన తన ప్రబంధ రక్నావళిలో/ బసవయ్య పద్యాలను ఉదాహరించాడు. వాటిని పరిశీలిద్దాం. అయింది..అంగద బసవయ్య వేశ్యలను రంభ ఊర్వశి మొదలైన అహ్సరసలతో పోల్చాడు.

262 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వీద శచీవిభుండు దితిలిడ్డ లనార్యులు వారు పల్మ్కరు౯€ బాదలబెట్టగా జెరలు పట్టగ నుండుట భారమంచు రం భాదిమరున్ని వాసలసదపహ్సరసల్‌ చనుదెంచి వచ్చిరో నాదరపులపద్మవదనల్‌ విహరించుదు రప్పురంబునన్‌. (ప్రబంధ 3) అష్టాదశ వర్ణనలలో సూర్యోదయం వర్ణన ఒకటి. మన కవులు తమ భావనాశిని ఇటువంటి చోట్ల చక్కగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అంగద బసవయ్య సూర్యోదయాన్ని నరసింహావతారంతో సరిపోల్చ్బడం చాలా ప్రాఢంగా ఉంది. ఉదయ స్తంభములోపలక్‌ వెడలి తా నుద్భుత్తమోదైత్యునిం గుదియంబట్టి గభస్తిమన్న్పృహరి సత్రోధంబునక్‌ వాని దు ర్మదగాత్రంబు కరంబులం దునుమ ధారాళాస్రపూరంబుకా వి దివింబర్విన కైవడిక్‌ గలయబర్వెక్‌ సాంధ్యరాగచ్చ వుల్‌ (ప్రబంధరత్సావళి. 37) ఇందుమతీ కళ్యాణ సమయంలో కుమార్తె పైన భోజుడు అక్షింతలు చల్లి అశీర్వదించే ఘట్టంలోని దీపద్యం - లాజవిమోక్షవేళాసముద్గతహోమ ధూమవాసన మేన దొంగలింప మృగనాఖిమకరికారేఖలై మృదుగండమండలి హోమధూమములు నిలువ హోమధూమశిఖాముఖోష్టంబుచోకి పూర్ణేందుబింబాననం టెర్రవార మాటికి హోమధూమంబుచే వెడలెడు కన్నీట గాటుక కరిగి పార గురుజనోక్తవిధానానుతూల చాల (?) నిజవివాహవిలాసంబు నిర్వహించి ఖభోజు డప్పుడు వేడుక బుధకవి వి(?) తానములతోడ నార్రాక్షతములు సల్లె. (ప్రబంధరత్నావశి. 3౫) మన ప్రబంధాలలో వర్ణించి తీరవలసిన పద్ధెనిమిది వర్ణనలలో పుత్రోదయ మొకటి. దాని ముందు ఇల్లాలి చీర చిక్కడం, గర్చలావణ్యం మొదలైనవి వర్జనీయాలే బసవ కవి ఇందుమతీ కల్యాణంలో వ్రేకటి నిలా వర్ణించాడు: శశిమండలముమీద సాంద్రచంద్రికవోలె నును మొగంబున దెల్లదనమునిల్బె బసిడికుండలమీద బలఖిన్మణులువోలె వలిచన్ను ముక్కుల నలుపు లొదవె నిరుపేదమీది నిర్ణిదసంపద వోలె మధ్యభాగంబున మహిమ దాల్చి గదలిన లతమీది కమ్మపూవులు వోలె సలపని మేన సొమ్ములు దొలంగె దరుణిగమనంబు మిగుల మాంద్యము వహించె వనజపత్రాక్షి కోర్కులు కొనలుసాగె వనిత నేత్రాంతములు వసివాళ్ళు వాడె వనితతనువల్లి శయ్యల వ్రాల గడగె (ప్రబంధరత్నావళి. 310)

పెనునుత్స కవులు - అంగద బసవయ్య 263 హేమసింహసన మెక్క నుద్యోగించు మణికల్పి, తాస్థానమంటపమున విసరించుకొన జూచు వింజామరంబున వైరివీరవిలాసపతులచేత నాటింప దలచు నానాద్వీపసంధుల గెలుపుగంబంబుల వలసినన్ని దుష్టరాక్షసకోటి దునుము విచారించు మఘనమ్మఖాఖిలామరులు నొగడ సద్వరంబులు గావింప నలవరించు - నెలత నిచ్చలు నిజగర్భనివసదర్చ కప్రభావపరిప్రాప్తి గౌరవమున. (ప్రబంధరత్నావళి. 311) ఈ పద్యాలు దశరథ మహారాజు జననాన్ని వర్ణించే ఘట్టంలోవి కావచ్చు. పెదపాటి

జగ్గకవి ధర్మమా అని ఈ అయిదు పద్యాలూ దొరకబట్టి కొద్దిగానైనా అంగద బసవయ్య

బ్రాసిన ఇందుమతీ కల్యాణం రుచిచూడగలిగాం. పెనుమత్స వెంకటాద్రి కావ్యం జగ్గన్నకు దొరకలేదో, దొరికినా రచన ప్రొడంగాదని ఉదాహరించలేదో తెలియదు. 'శెంకటాద్రి సోదరుడు గోపరాజు అన్నలాగే కవి. ఇతడు ర్యాలిగ్రామంలో ఉన్న

కేశవస్వామికి “అంతర్వేది మాహాత్మ్యం' మొదలైన కావ్యాలు అంకితం ఇచ్చాడు. ఈ

సంగతి పోతరాజుగారి మునిమనుమలు చెప్పిన ఈ క్రింది పద్యంవల్ల తెలుస్తూంది. మహిమ నంతర్వేది మాహాత్మ్యమాదియౌ కృతులిచ్చె ర్యాలికేశవునకు గ్రమమొప్ప' భూసురోత్తములకు దగనిచ్చె వర్దాగనంబు లవ్వారిగాగ ప్రొఢినొనరించె పెనుమత్స పద్మనాభు - తనయుడైనట్టి గోపభూధవవరుండు.

(విష్ణభజనానందం)

ఈ గోపరాజు వ్రాసిన ఒక్క కృతిపేరే తెలుస్తున్నది. ఇతని ఇతర రచనలు ఏమిటో,

కనీసం పేర్లు తూడా తెలియవు. ఇతని రెండన కుమారుడు అనంతరాజులాగా కృతులు

రచించలేకపోయినా అంబరీష చరిత్ర మొదలైన కృతులు అంకితం పుచ్చుకొన్నట్టు

పోతరాజుగారి మునిమనుమలు చెప్పిన ఒక పద్యంవల్ల తెలుస్తున్నది. ఈ అంబరీషచరిత్రను

సప్తసంతానాలలో ప్రశస్తమైన కృతులను చెప్పి. చెప్పించుకొన్న పెన్కత్సవంఠం

వారు పోతరాజుగారి మునిమనుమల కృతివల్ల మనకు పెనుమెచ్చువారుగా తెలుస్తున్నారు. వాళ్ళు అంకితం ఇచ్చినవీ, పుచ్చుకొన్నవీ దొరికితే చిరంజీవులవుతారు.

బైచరాణు వెంకటనాథుడు

పిడుక్కీ వియ్యానికీ ఒకటే మంత్రం అని ప్రబంధాలు తెనుగుమీరిన యుగంలో పంచతంత్రాన్ని వ్రాసినా, పరమ వేదాంత గ్రంథాన్ని బ్రాసినా అందులోనే అమ్మదళ వర్ణనలూ ఇరికించి కవులు తమ నేర్పును ప్రకటించడం పరిపాటే. రాయడానికి బైచరాజు వెంకటనాథుడు పంచతంత్రాన్ని చంపూ ప్రబంధంగా చెప్పి హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు. తిక్కనగారికీ, నాచన సోమునికీ, తనకూ తప్ప హరిహరనాథుని వద్ద ఇంకెవరికీ చనువు లేదని చెప్పాడు. వెంకటనాథుడు విక్రమసింహపురంలోని క్షత్రియుడే. అయిశే అతడు ఎక్కడా రాజ్యుం చేసినట్టు లేదు సరికదా, రాజులంటే ఆతనికి అసహ్యం. అతని కాలంనాటికి బుధులు క్రిందపడ్డారు.! హీనజాతి పురుషులు హెచ్చారు. మగ విద్యల అడుగుపట్టాయి. పెంటివిద్యలు వెల్లివిరిశాయి. నాలుగు డబ్బులిచ్పేవాడిని కవుల తెగపాగడడం మొదలుపెట్టారు. ఆ ప్రభువులు న్రంచి కవిత్వం వినడం మానేసి ఏలలు, తందనాలు వినసాగారు. వెంళటనాథుడు ఇలా వ్రాశాడు.

ఏల ల్పందనతాన లేమయిన లేవే యించు బోధించునే

నూలంబెట్టగజాల మూడనృపు డోహో నా మహాసాహితీ

శూలంబు ల్సెవులాడ సొమ్మసిలు నొచ్చుం జచ్చు తద్కల్మషం

బేలా యంజలిచేసి మొక్కెద పదార్థేచ్చా నిశాచారికిన్‌ (పంచు 2-13) అ కాలంలో రాజులు విద్వాంసులకు కాక ఎటువంటి వారికి కానుక లిచ్చేవారో ఇలా చెప్పాడు:

పరిహాసకులకు నటులకు - దరుణులకును లంజెదారి తమ్ములకుం గా

పురుషులకు గాయకులకుం - బొరయింతురురాజులీరుపో సరసులకున్‌.

(పంచ 2-1౫)

అప్పటికి ఒక తరం ముందు మంచి కృతులు రచించడానికి '“నిరుపహతిస్థలం రమణీప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడెం' మొదలైనవి అల్లసాని పెద్దనగారు కోరాడ: ఇటువంటి భోగాలను బైచరాజు వెంకటనాథుడు గర్హించాడు. వాటిని గురించి ఇలా చెప్పాడు.

ఊయెల మంచము ల్బసిడియుప్పరిగ ల్లపురంపు వీడెము

ల్మాయని పుట్టము బ్రుచిరమండనముల్లడనేని త్రావ్విరు

ల్లాయనగాయనీ మధురగానసుఖంబులు గన్నగాని సీ

పాయదె యన్నమాత్రమున బస్తనుజీవికి జక్రవర్తికిన్‌ (పంచ 2-18)

బరువై తోచే కుటుంబ రక్షణకు ఆ రోజులో |[ప్రాలుమాలి కవులు గ్రంథచౌర్యం చేసీ రాజులకు అంక్షితం యిచ్చి దొరికిపోయేవారని పెద్దనగారే చెప్పారు (మను. 1-9). ఒ వెంకటనాథుని. కాలం. శ్రీశ10-150 అని డాక్టరు చిలుకూరు. నారాయణావుగాడ

నిర్ణయించారట - ఆంధ్రకవి తరంగిణి, 9 సంపుటి, పుట 121.

బైచరాజు వెంకటనాథుడు 265 గ్రంథచౌర్యంకాని రచనలను నైతం అతి కుటుంబ రక్షణ కోసం మూఢభూమి పతులకు అంకితం ఇవ్వాలా అని ఫైచరాజు వెంకటనాథుడు ప్రశ్నించాడు. అతికుటుంబరక్షణాపెక్ష బ్రాల్మిలి - కృతులు మూఢ భూమిపతుల కిచ్చి చచ్చినిరయమునకు జనుకంటె హరిహరా - రృణము జేసి సుగతిబడయరాదె? (పంచు 1-27) రాజులలా ఉంటే, సహృదయులెలా ఉన్నారో వివరించారు. కాముకులలాగ, తలవరులలాగ, బధిరులలాగ, దరిద్రులలాగు వాదులరీతి స్వర్ణకారులు మొదలైనవాళ్ళ లాగ వేటి మీద సహృదయులు మోజుపడతారో వివరించారు. ఒకడలంకారమునకు వేడుకవహించు నొకడు వార్తసమృుద్ధికి జెలంగు నొకడు శబ్ధస్ఫూర్తులకు మాయురే యను నొక డర్థసృష్టికి నుత్సహించు నొకడురసాభోగతకు మస్తముగదల్చు నొకడుపమాన చర్చికకునలరు నొకడుపదప్రొడిమకు నిచ్చలో మెచ్చు నొకడు జూతిశ్లాఘ తుబ్బుచుండు గొమిచందాన దలపరికరణీ బధిరు వలె దరిద్రునిగతీ వాడిపగిది గనక కారుచాడ్చున బంగువైఖరి గుజాతి జాడ నిందరి ముదలింపజాలు టెట్లు? (పంచ 1-14) మహానుభావులు వుండనే ఉంటారు. వాళ్ళ సంగతి ఇలా చెప్పాడు: రసవిస్ఫూర్త్హి గోరంత దీనికిది పూర్వచ్చాయ యిచ్చోట ద ప్పస దిప్పట్టున నర్థసృష్టిపసలే దచ్చోట నళ్లీల మ దెస నాదిక్కున దుస్సమాస మిది సందేహాస్పదం వీడ సం చుసుమాళంబున బాండితు ల్నెరపు నీచు న్రోత వాక్రువ్వగన్‌ (పంచ.1-13) నిజమైన కవిత్వం ఎలా ఉండాలన్న విషయంమీద వెంకటనాథునికి కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. దానినిలా చెప్పాడు: ఘనతరఘూర్డ- రీతుచయుగక్రియ గూడము గాక ద్రావిడీ స్తనగతి దేటగాక యరచాటగు నాంధ్రవధూటిచొక్కపుం జనుగవబోలి గూడమును జూటుదనంబును గాకయుండ టె ప్పినయది పో కవిత్వ మనిపించు, నగిం, చటుగాక యుండినన్‌ * (పంచ1-18) ఇటువంటి కవిత్వాన్ని చెప్తే విని సహృదయులు తామంతట తామే ఆ పుస్తకాన్ని వ్రాసుకోవాలిగాని తూలి పెట్టి చదివించే కావ్యాలు కూడ కావ్యాలేనా అని వెంకటనాథుడు ఆక్షేపించాడు. 2. ఈ పద్యంలాంటిదే పుత్తేటి రామభద్రుని సకలకథాసార సంగ్రహంలో ఉందిః అరవత గుబ్బచన్నలె బయల్చడనీకను గూర్జరాంగనా గురుకుచయుగ్మముంవలె నిగూడముగాకను నాంధ్రదేశపుం గరిత చనుంగవన్వలె నొకొనొక యించుక గానిపించిన స్పరసులు మెత్తు రక్కవిత జూణలతున్‌ గడు రంజకంబగున్‌ (1-28)

266 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఎడపక తారు దారె లిఖియించి పఠించి కృతుల్‌ ప్రతుల్‌ జగం బడిగిన నిచ్చి హెచ్చి సకలాననథంబుల దారయై దిశల్‌ విడువక తూలిబెట్టి చదివించు కృతుల్‌ గృతులే వసుంధరక? (పంచు 1-10) ఇతని కవిత్వానికి మురిసి తెనుగువాళ్లు తమంతట తామే ఈ కావ్యాన్ని వ్రాసుకొని ఆదరించారు. ఇతడు పంచతంత్రాన్ని వ్రాసిన పద్ధతినే అనుసరించి ఆనంతర కవులు చక్కనీ సాంఘిక చిత్రణతో శుకసప్తతి కథలను, హంసవింశతిని వ్రాశారు. సమకాలిక జీవితాన్ని చిత్రిస్తున్నప్పుడు వెంకటనాథునికి మూపులు మూడవుతాయి. సామెతలు, జాతీయాలు వాడడం ఇతనికి నల్లేరుమీద బండినడక. వర్ణనలు చేయడం పేలపిండి. గడుసుపోకడలు పోవడం ఇష్టం. స్వీయ ప్రతిభను చూపడం అభిమతం. వనాన్ని వర్ణిస్తున్నప్పుడు అమరంలో చెప్పిన వృక్షాల పేర్లతో సమాసం కట్టడం మన కవులకు పోతరాజుగారు నేర్పారు. వెంకటనాథుడు అటువంటి ఘట్టాలలో తెలుగు మాటలనే వాడగలడు. ఈ ఒక్క కలిగొట్టు మోదుగు కానుగు గలుగువావిలి మేడి నేరేడు నెలసు బలుసు మర్రి మంకెన మద్ది మారేడు బూరుగు గోరంట లొద్దుగు క్రోవి రావి జువ్వి మామిడి జీడి సరుగుడు మొలుగుపావట చండ్ర పసిరిక పాల రేల పొన్న బొట్టుగు పోక పొగడదాడి మిప్ప - గుముడందుగురువింద గోనురేను చిల్ల చింత మొగిలి చీకిరీ ణూడగ - నిమ్మ తమ్మ తుమికి నెమ్మి జమ్మి వేగి వేము మొదలుగాగల ్రూకుల - కాన నగుచు నొక్క కాన మెరయు. (పంచ. 4-52) కేవలం కేటలాగు కవిత్వమేకాక రసవంతమైన కథాకథనం, పాత్రచిత్రణ, సంభాషణా చాతుర్యమూ వెంకటనాథుని కావ్యంలో ఉంటాయి. తెలుగు జీవితం ఇతని రచనలో కనబడుతుంది. ఈ ఇరవయ్యో శతాబ్దంలో సైతం అత్తాకోడళ్ళ పోరు తిలుగునాట తప్పదు. వెంకటనాథుడు ఒక తల్లిచేత కొడుకుకు ఇలా చెప్పించాడు. “కొడుకా! కీ నేమననేర్తు కోడలి౯?' అని శోకాలు తీస్తూ అమె గోడు వెళ్ళబోసుకుందిః తిట్టిన దిట్టు బెట్టు జీరిదిండికి గొల్చిన గొల్పు సాగది చ్చిట్టకమన్న మూతుల జేతులు సాచు నొకప్పుడేని యి స్పీట్టదు సంతతూటముల బాయదు చేయదు చెప్పినట్టు నీ (ీరట్టడిజరత యిల్సెరిచెరా తనయా యనమానుషంగతిన్‌. (పంచు 4-43) ఇన్నీ చెప్పీ “మీయిష్ట మొచ్చినట్టు పొండి' అని తన చేతులు దులుపుకోవడం నైజమే. ఆ తల్సిఇలా అంటుంది. వీవట యేది వలస్‌న = త్రోవం జను డింక మమ్ము దూరన బనిలే క్రీవరదను కారోతల - దేవళ్ళం బడితి విసివితిం గోడలిచేన్‌ (పంచ. 4-40) ఈ మాటలు విన్న దౌర్భాగ్భుడు “తల్లి పలుకులు.కాదన తాల్మిలేకు ఉత్తమాంగన కులక్షా4ళత నొండుననక' విరక్తితో ఇల్లు వదలిపోతాడు. వెంకటనాథుడు నీతికథలకో

మెల్లి 267 బాటు బూతు కథలను గూడ నైపుణ్యంతో చెప్పాడు. ప్రబంధాలలోని రొటీను శృంగారం కన్నా ఈతని కథలలోని “రంకులో స్వచ్చత ఉంది.” చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి దృష్టిలో వెంకటనాథుడు మహాకవి. ఇతనికీ రావలసినంత ప్రచారం రాలేదని చెళ్ళపీళ్ళవారు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. వెంకటనాథుడు తిక్కనగారికి, చిమ్మపూడి అమరేశ్చరునికి, నాచనసోమునికీ శ్రీనాథునికీ తన మనసులో బ్రహ్మరథం పట్టాడు. పూర్వకవిస్తుతిలో ఇలా అన్నాడు:

హృదయబ్రహ్మరథం బతిప్రియతమం బెక్కింతు వేతోమరు

త్సదనాస్సానికి దెత్తు మానసభస్సంచారి గావింతు హృ

ద్విదితక్షీరసముద్ర ఖేలనమునన్‌ దేలింతు నుత్కృష్టన

స్తుదలం బ్రాజ్ఞుల దిక్కయజ్బ నమరేశున్‌ సోము శ్రీనాథునిన్‌ (పంచ. 1-11) ఈ నలుగురు కవులలోని మంచితనాలకు వారసుడైన బైచరాజు వెంకటనాథుణ్ణి కూడ కొందరు సహృదయులు 'హృదయబ్రహ్మరథం' ఎక్కించక పోరు.

మొల్ల

ప్రతితరంలోనూ ఎవరో ఒకరు తెనుగుభాషలో రామాయణాన్ని వ్రాస్తూనే ఉంటారు. అయితే వాటిలో యుగానికొకటి ప్రసిద్ధమవుతూ ఉంటుంది. కవిత్రయంలో ఒకరైన ఎర్రయ్యగారు వ్రాసిన రామాయణమే కాలగర్చంలో కలిసిపోయిందంటే ఇతర కవుల మూట చెప్పాలా? ఆంధ్రకవి పితామహుడనే బిరుదు గల కొరవి సత్యనారన, తాళ్ళపాక అన్నమాచార్యులు వ్రాసిన రామాయణాలకు తూడా ఎర్రయ్యగారి రామాయణానికి పట్టీన గతే పట్టింది. ఇలాంటీ మహామహుల కావ్యాలే నష్టం అవుతూ ఉండగా మొల్ల వ్రాసిన రామాయణం దొరకడం జాతి అదృష్టమే. తెలుగు భాషలో కవిత్వం చెప్పిన స్త్రీలలో ఈమె ద్వితీయురాలైనా రామాయణ రచయిత్రులలో ప్రథమురాలు.

మొల్ల మొత్తం 871 గద్యపద్యాలలో రామాయణాన్ని రచించింది. నేడు లభ్యమవుతున్న ప్రతులు సమగ్రమైనవి కావని నా అభిప్రాయం. బాలకాండ చివర ఒక వచనం ఉంది. అందులో “నారదుని వాల్మీకి మహా మునీశ్చరుండటుమీది కథావిధానం బెట్టీదని యడుగుటయు”' అని ఉంది (బాల. 99). అయితే బాలకాండ మొదలు నారదుడు ఈ కథను వాల్మీకికి చెప్తున్నట్టు ప్రారంభ వాక్యాలేవీ లేవు. “నాచేయంబూనిన మొల్ల రామాయణమునకు గథావిధానం బెట్టులనిన” అని మొదలుపెట్టి అయోధ్యావర్జనమే ఎత్తుకొన్నట్టు కనబడుతుంది. కాబట్టీ ఈనాటి ప్రతులలో కొంత లోపించిందని చెప్పవచ్చు. అయోధ్యకాండలో 43 గద్యపద్యాలు, కిష్కింధకాండలో 27 గద్యపద్యాలు

ఈమె వెల్లూరు దగ్గిర ఉన్న గోపవరం నివాసిని. అతుతూరు కేసన వరపుత్రిక అతని కన్నకూతురని గద్యవల్ల చెప్పవచ్చు. ఆతుకూరి కేసన గురులింగజంగమార్నన 3. '"కథలు-గాథలు' చెళ్ళపిళ్ల వెంకటళాస్త్రిగారు, ౩-వ సంపుటి, పుటలు 278-311.

26 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ వంపుటి పరుడు; ఇివభక్తిరతుడు: బాంధవహితుడు, గురుడు. బహుశా ఇతడు తన ఈూతురికి డీక్ష ఇచ్చి ఉంటాడు. అందుచేతనే వరపుత్రిక అని చెప్పుకొన్నది. ఈమె గోపవరంలో ఉన్న శ్రీకంఠమల్లేశ్చరుని వరంచేత కవిత్వం చెప్పడం నేర్చుకొన్నానని, తనకు ఇతర విషయాలు ఏమీ తెలియని ఈ శ్రీింది పద్యంలో చెప్పింది.

చేశీయపదములు దెనుగులు సాంస్కృతుల్‌ సంధులు మంజుల శబ్దవితతి

భావార్థములు గావ్యపరిపాకములు రసభావచమత్కృతుల్‌ పలుకు వరవె

ఖహువర్జనములు విభక్తులు ఛాతువు ల్లలితసచ్చందో విలక్షణములు

గావ్య సంపదక్రియలు నిఘంటువులును

గ్రమము లేవియు నెరుగ విఖ్యాతగోప

చరపు శ్రీకంఠమల్లేశు చరముచేత

నెరిగవిత్వంబు జెప్పగా వేర్చికొంటి (పీకిక 12) శయ్యలు, రీతులు మొదలైనవి తనకేం తెలియవని మొల్ల మొగమాటానికి చెప్పేనా, ఏది కవిత్వమో, దానిని ఎలా చెప్పాలో ఆమెకు బాగా తెలుసు. అన్నిటికన్నా ముఖ్యం తెలుగులో కవిత్వం ఎలా చెప్పకూడదో ఆమెకు నిజంగా తెలుసు.

మును సంస్కృతంబు దేటగ - దెనిగించెడి చోట నేమి దెలియక యుండన్‌

దన విద్య మెరయ గ్రమ్మర - ఘనమగు సంష్కపతము చెప్పుగా రుచియగునేః

(పీకిక 15)

సంస్కృతం తెనిగించేచోట పూర్తిగా తత్సమశబ్దాలలో బారెడు నమాసాలు కట్టీ చివర డు, ము, వు. లు చేర్చడం శ్రీనాథునితో మొదలైంది. తొలిరాయలు యుగం దాటీ నవాబులయుగం గడచి, ఆరవీటి రాజుల యుగంలో అడుగుపెట్టేసరికి శ్లేషకోసం పూర్తిగా సంస్కృతంపై అధారపడడం. నిఘంటువులు వెతుకుకొనడం మొదలైంది. గూడశబ్దాలను గూర్చి కావ్యం చెప్పడం ఆరంభమయింది. దీనిని మొల్ల ఇలా గర్హించిందిః

త్రేనెసోకనోరు తీయనయగరీతి - తోడనర్థ మెల్ల తోచకుండ

గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము - మూగ చెవిటివారి ముచ్చటుగును

(పీకిక 10)

వహించాలి. తేటగా చెప్పాలన్నది సూటిగా కాక ధ్వనిస్తేనే బాగుంటుంది. ఈ విషయాన్ని మొల్ల ఇలా చెప్పింది:

వలిపపు సన్నపయ్యదను వాసిగ గంధపుపూత తోడుతన్‌

దెలుగని చెప్పుచోట గడు దేటలమాటల గ్రొత్తరీతులం

బొలుపు వహింపకున్న మరి పొందగునే పటహాదిశబ్దములో (పీఠిక 1)

మొల్ల ఈ పద్యంలో చెప్పిన మాటలు బహుశా బైచరాజు వెంఠటనాథుడు 1-18) అనే పద్యానికి ప్రతిధ్వనియేమో!

మొల్ల 269 టైచరాజు వెంకటనాథునిదీ నెల్లూరి మండలమే. అతని పద్యాలను పోలిన పద్యాలు ఒకటి రెండు మొల్ల రామాయణంలో ఉన్నాయి... వెంకటనాథుని కాలం శ్రీశ 1550 ప్రాంతాలు. అందుచేత మొల్ల అతనికి కొద్దిగా అర్వాచీనురాలు కావచ్చు. అయితే ఈమె కృష్ణదేవరాయలవారి కాలంలో ఉండేదని ప్రతీతి. తెనాలి రామలింగని కథలో అతడు వేసిన తుంటరి ప్రశ్నలకు వాతల్లాంటి సమాధానాలు అమె చెప్పినట్లు లోకులు చెప్పుకొంటారు. ఏకాయ్రనాథుడనే తొలి చరిత్రకారుడు మొల్లను పిర్కొన్నాడు. అతడు తన ప్రతాపచరిత్రలో ఇలా వ్రాశాడు : మరియొక్కనాడు తిక్కన సోమయాజుల వరప్రసాద(0బు) చే(త) కుమ్ముర మొల్ల రామాయణంబను వచనకావ్యంబు (?) రచియించి ప్రతాపరుద్రునకు అంకితంబుగా సేయు సమయంబున ఆ రాజు సమ్ముఖంబున ఉన్న విద్వాంసులు విని ఇది శూద్రకవిత్వంబు ఇది విషిద్ధంబని నిరాకరించిన నారాజు సర్వజ్ఞుండూ గావున వారిని మెచ్చి రాజబ్రాహ్మణ కృతంటైన కావ్యంబు కావలెనని(న) యా విద్వాంసులు భాస్కరుని పిలిపించిన అతండు రచించిన శ్రీ మద్రామాయణంబు విను సమయంబున, అచటికి మొల్ల యేతెంచి రామాయణంబు మున్ను రచించియున్నానని యచట నొక పద్యంబు చిత్రంబుగా చదువుటయు యా రాజు సర్వజ్ఞాండు కావున దాని ప్రజ్ఞకు మెచ్చి విప్రజనంబుల మనంబుల నొచ్చునే యని మొల్లను పిలిపించి పల్లకియును నగరిని నిత్యబీవితంబును కట్టడజేసి తన యెదుట నుండనీక తన దేవి విశాలక్ష్మి సుమ్ముఖంబున నుండజేయుటయు, యా వార్త విని శాఖవెల్లి మల్లికార్జునభట్లు నిరోష్ట్రృరామాయణంబు రచించుటయు...! (సిద్దేశ్వర చరిత్ర, పుట 18) ఏకాయ్రనాథుడు ప్రకాపచరిత్ర వ్రాస్తున్నప్పుడు మహమ్మదు ఖుల్లీ పాదుషాహా మహావైభవదేవేంద్రుడై గోలుకొండ ఏలుతున్నాడు. మహమ్మదు ఖల్లీ క్రీశ 1681లో రాజ్యానికి వచ్చాడు. ఇతడు మల్కిభరాముని కొడుతు. 1612 దాకా పాలించాడు. అందుచేత మొల్ల క్రీ.శ 15818 పూర్వం ఉండేదని చెప్పవచ్చు. ఈమె పూర్వకవులలో చుతించిన అర్వాచీనుడు శ్రీనాథుడు. ఈమె అచ్చంగా వాల్మీకి రామాయణాన్ని అనుసరించలేదు.. ఆధ్యాత్మ రామాయణం మొదలైనవాటిలో ఉండే ఘట్టాలను అనువదించింది. నదిని దాటించే ముందు గుహండు శ్రీరాముని కాళ్లు కడిగేడన్న విషయం తెలుగు రామాయణంలో వేరక్కడా లేదు. ఈ సంగతి మొల్ల మాత్రమే ఇలా చెప్పింది సుడిగొని రామపాదములు సోకిన ధూళి మించి రాయి యే రృడ నొక కాంత యయ్యెనట పన్నుగ నాతని పాదరేణువి యెడ వడి నోడసోక నిది యేమగునో యని సంశయాత్ముడై కడిగె గుహుండు రామపదకంజయుగంబు భయమ్ము పెంపునన్‌ (అయోధ్య్భ. 3)

  1. నిరోష్ట్య్రరామాయణాన్ని మరింగంటి సింగరాచార్యులుగారు కూడా వ్రాశారు. వారు చవాబులయుగంలోవారే. 2౬ తెలుగురాజుల చరిత్ర, మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, | 749.

270 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఈ భావాలు సంస్కృత ఆధ్యాత్మ రామాయణంలో ఉన్నాయి. అందులో గుహుడు ఇలా అంటాడు.

క్షాళయామి తన పాదపంకజుం - నాధ దారుదృషదోః కీమంతరం

మానుషీకరణ చూర్ణ మస్తి తే - పాదయో రితి కథా ప్రథీయసీ

పాదాంబుజం తే విమలం హికృత్యా - పాశ్చాత్పరం తీర మహం నయామి

నోచేత్తరీ సద్కువతీ మలేన - స్యాచ్చే ద్విభోవిద్ధి కుటుంబహానిణీ

(ఆధ్యాత్మరామా, బాల, 6-3,4)

మొల్లలాగానే ఆమె సమకాలికుడైన తులసీదాసు కూడా ఈ ఆధ్యాత్మ రామాయణ భావాలను అనుసరించాడని నిడుదవోలు వెంకటరావుగారు. గుర్తించారు మొల్లకు సమకాలికుడైన తిలుగుకవి అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయంలో గుహుడు కాళ్లు కడగడం చెప్పలేదుగాని 'మీ పాదధూళి సోకితే రాళ్లు జవరాళ్లుగా మారుతాయి' అని భయపడీ, 'కాళ్లు కందుతాయి. రాళ్లమీద నడవకండి' అని సీతమ్మ

ట్టులికి సతీశతంబులగునో యను శంక మొరంగి నాధ రా

నెలవుల నూద మెట్టకుము నీ చరణాబ్దము కందు నావుడున్‌

వెలది తలం పెరింగి రఘువీరుడు నవ్వుచునేగె నవ్వలన్‌. (రామా. 5-1౫)

సంస్కృత రామాయణాలనే కాక మొల్ల తెలుగులో పూర్వకవులు బ్రాసీన రామాయణాలను తూడా అక్కడక్కడ అనుసరించింది పరశురాముడు రాముణ్జీ అడ్డగించేటప్పుడు భాస్కరరామాయణంలో ఈ జ్రింది పద్యం ఉంది.

రాజట యంతమీద మరి రాముడు దా నట ఖీకరాజులన్‌

రాబీల ద్రుంచి తత్రృసృతరక్తమునం బితృతర్చణక్రీియల్‌

రాజిలజేసియున్న భృగురాముడు తుచ్చమదాంధులైన యీ

రాజుల గీజులన్‌ వెడగురాముల గీముల జూచి సైతునే (భాస్క, బాల, ౫7) దీనిని మొల్ల ఇలా వ్రాసింది.

రాముడు గీము డంచును ధరాజను లెల్ల నుతింప దిట్టవై

భీముని చాపమున్‌ విరిచి వ్రేలెద వందుల కేమిగాని యీ

శ్రీమహిశేశు కార్ముకము జేకొని యెక్కిడుదేని నేడు నీ

తో మరిపోరుసల్చి పడద్రోతు రణస్థలి నీ శరీరమున్‌ (బాల, జ)

“శివధనుస్సు విరిచినందుకు విగర్రవీగుతున్నావు. అది పాతది” అని పరవరాముడు రామునితో అన్న మాటలు భాస్కరరామాయణంలో ఇలా ఉన్నాయి.

భారతి, ఏప్రిలు 1౫84 పుట జ.

  1. ఖారతి, మార్చి 1౫54, పుట8.

మొల్ల 271 హరు డురుబలమున బహుసం- గరముల లావెల్ల గొని తగన్‌ విడిచిన యా చిరకాలజీర్ణదాపము-వెరవారగ బట్టి నీవు విరుచుట యరుదే.

(భాస్క. బాల. 76)

ఈ భావాలనే మొల్ల ఇలా చెప్పింది: శివుని చివుకు విల్లు శీఘ్రంటి యానాడు-విరచినాడ ననుచు విగర్రవీగ వలదు నేడు నాకు వశమైన ఈ చాప - మెక్కు పెట్టి తివియు మింతెచాలు.

(మొల్ల. బాల, 94)

“చిరకాలజీర్ణ చాపం' అనకుండా చివుకువిల్లు అనడంలోనే మొల్ల తెలుగుతనం ఉంది. అయిడే ఆమె తత్సమాలు వాడదని కాదు, అవసరం వచ్చినప్పుడు వాడుతుంది. అశోకవనంలో సీతమ్మ ముందు శ్రీరాముని రూపాన్ని హనుమంతుడు వర్ణించిన పద్యంలో ఇలా చెప్పింది.

నీలమేఘచ్చాయ బోలు దేహమువాడు ధవళాబ్దపత్రనే త్రములవాడు

కంబుసన్నిభమైన కంఠంబు గలవాడు బాగరైనయట్టి గుల్భములవాడు

తిన్ననై కనుపట్టు దీర్ణ బాహులవాడు ఘనమైన దుందుఖిస్పానమువాడు

పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు చక్కని పీనవపక్షంబువాడు

కపట మెరుగని సత్యవాక్యములవాడు

రమణి రాముండు శుభలక్షణములవాడు

ఇన్ని గుణముల రూపింప నెసగువాడు

వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. (మొల్ల. సుందర, 102)

ఈ పద్యంలో చివరి రెండుపాదాలలో ఎంత గడుసుగా లక్ష్మణుని వర్ణించింది! మాటల్లో పొదుపుగా ఉంటే రసం విరివిగా నిష్పన్నం కావచ్చు. సీతను చూచివచ్చాక హనుమంతుడు అమె రూపాన్ని రాముని ముందు వర్ణించిన ఘట్టంలో కూడా మొల్ల కొసమెరుపులు ఈ పద్యంలో చూపింది

కట్టిన వస్త్రంబు కట్టుకొంగేతక్క జీర్ణించిపోయిన చీరతోడ

నుడుగని వగలచే నోరంత ప్రొద్దును జెక్కింటచేర్చిన చేయితోడ

బుడమిపై బొరలాడు నొడలు బూడిదబ్రుంగి నిరతంబు దొరగు కన్నీటితోడ

నిడుదపెన్నెరివేణి సడలించి జడలతో నిరతనిరాహారనియతితోడ

గినుక జంకించు దైత్యకామినులనడుమ దపము జేయుచు దనుజిబాధలకు నోర్చి

వనిత ప్రాణంబు దక్క సర్వము ద్యజించి నిత్యమును మిమ్ము మదిలోన

నిల్చియుండు (మొల్ల, సుందర, 248)

మొల్ల ఇలా కవిత్వం చెప్తుంది కనుకనే ఆమె కావ్యం తెలుగునకుంబొందై, రుచిర్మై. వీనులకు విందై కానిపిస్తుంది.

అయ్యలరాజు రామభద్రుడు

అస్టదిగ్గజాలలో ఉండేవాడని లోకులు చెప్పుకొనే కవులలో అయ్యలరాజు రామభద్రుడు ఒకడు. ఇతడు ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని వ్రాసిన అయ్యలరాజు తిప్పయ్యకు మనుమడో, మునిమనుముడో అయి ఉంటాడు. రామభద్రుడు కృష్ణదేవ రాయలవారి కాలంలో ఉన్నాడో, లేదో చెప్పలేంగాని క్రీ.శ1550 ప్రాంతాలలో ఉండేవాడు. ఇతడు రామాభ్యుదయం అనే పేర రామాయణాన్ని ప్రబంధరూపంలో వ్రాసీ అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితం చేశాడు. ఈ కృతిని అంకితం పుచ్చుకొన్నప్పుడు నరసరాజు చినకోట్ల ధర్మవరరాజ్యపరిపాలకుడై కర్నూలు దుర్గాన్ని సంరక్షిస్తూ ఉండేవాడు. రామభద్రునితో గొబ్బూరి నరసరాజు ఇలా అన్నాడట:

క్షీతిపతి యెవ్వడైన నగు గీర్హియ సొమ్ము నృపాలకోటికిం

గృతిపతియైన కృతకృత్యుడు గాన నొనర్చు సప్తసం

తతులకు నెక్కుడండ్రు కృతి దాశరథీద్ధకథానుధాచమ

త్కృృతకృతి రామభద్ర చెవికిం జవికొల్చు భవత్కవిత్వముల్‌ (రామా. 1-13) ఈ పద్యంలో చెప్పినట్టే రామభద్రుడు రామాయణాన్ని చమత్కృతకృతిగా ఎనిమిది ఆశ్వాసాల కావ్యంగా చెప్పాడు. ప్రబంధమన్నాక వనవిహారం, జలక్రీడ, వేట మొదలైన వర్ణనలు చెయ్యాలి కనుక తృతీయాశ్వాసంలో గాని రాముడు పుట్టడమంటూ జరగలేదు. సీతారాముల కల్యాణందాకా ఉన్న కథకే నాలుగాశ్వాసాలు పట్టింది. మిగకా నాలుగాశ్వాసాలలో మిగతా కథను కొన్నిచోట్ల టూకీగా చెప్తూ, కొన్నిచోట్ల కొంచెం విస్తరిస్తూ వర్ణిస్తూ చెప్పాడు. ఆ వర్ణనలలోనే కవిత్వమన్నది ఎలా ఉండాలో వివరించాడు. సంతానం లేదని విచారించే దశరథుడు 'ధ్వనిచాలని కావ్యం, అనపత్యదూరసంసార మొక్కతీరని వాపోతాడు (2-67). సుగ్రీవ పట్టాభిషేకం జరిగాక వానాకాలాన్ని వర్ణిస్తూ కవి ఇలా అన్నాడు:

ధారాశుద్ధి బ్రసిద్ధి గాంచి ఘనశబ్దస్ఫూర్తి వర్తిల్లగా

దోరంటైన రసస్థితిన్‌ దరళవిద్యున్మాలికాలక్షణో

ర్థారంభంబు ప్రబంధము ట్లఖిలపద్యాత్రాంత మయ్యెం దగన్‌. (రామా. 6-13) దశరథుని పుత్రకామేష్టి వ్యాకరణంలాగ ఉన్నదని ఇలా శ్లేషించాడు:

వ్యంజనవిభక్తిచాతురి నందమొంది కర్మకారకగుణవృద్ధి గరిమ నొంది

యుత్తమాగమపురుషాగమాత్త మగుచు గ్రతుభుజ క్రియ మించె వ్యాకరణసరణజీ.

(రామా. ౩-౫)

వ్యాకరణం, అలంకార శాస్త్రాలు అన్నీ తెలుసు కాబట్టి రామభద్రుడు

సాహిత్యలక్షణ చిత్రకవిత్వప్రభావంబు లొక్కొకచోట కనబడుతూ ఉండగా చక్కని

ఆయ్యలరాజు రామభద్రుడు 273 చమత్కారాలు కురిపిస్తూ ప్రబంధం బ్రాశాడు. ఆడవాళ్ళ నడుములను సింహాలతో పోలుస్తూ వాళ్ళను హరిమధ్యలనడం కవిసమయం. అయితే అది వర్దన మాత్రమే. కౌసల్యమటుకు కడుపుతో ఉన్నా హరిమధ్యే అని కవి ఇలా చెప్పాడు: హరిమధ్య యనుట వరమం-థరగామినులందు వర్జనామాత్రమగున్‌ బరమార్థము కౌసల్యాం- బురుహాక్షికి విష్ణుగర్భమున బూనుటచేతన్‌. (రామా. 3-౪) తొమ్మిది నెలలూ మోసి రాముణ్జీ కన్న కౌసల్యకు గౌరితూడ సమానం కాదటః నెలలు తొమ్మిది మోచి నిర్ణిద్రధాము రామచంద్రుని గన్న యా రామతోడ నొక్క నెల మోచి పతిమేన నొరగు గౌరి తారకారాతిజనయిత్రి ధాత్రి సరియె? (రామా. ౩3-111) ఇలా చమత్కారాలు చెప్పడంలో రామభద్రుడు గడుసువాడేగాని పాత్రపోషణలో శ్రద్ధ తీసుకోడు. వేటకు వెళ్ళి పొరపాటున మునిబాలుణ్ణీ చంపాక దశరథునికి ఆంధదంపతులు శాపం ఇస్తారు. ఈ రామభద్రుడు చిత్రించిన దశరథుడు తనవల్ల ఇంత దారుణం అని బాధపడడు. పైగా సంతోషిస్తాడు. “తదీయాగ్నిసంస్కారవిధులు నిర్వర్తించి పుత్రసంతానకారణంబగు తాపసశాపం బమోఘంబని యంతరంగంబున శోకంబు లెక్కింపక పరమసంతోషభరమగ్నుండయి మరలిపోవుచు నలరి మరియు వేటాడుచుం జనియె” (రామా. 2-54) అని వెనువెంటనే దశరథునిచేత వేటాడించాడు. దశరథుని పాత్రను ఇలా పోషిస్తే రాముని పాత్రను మరింత తగ్గించాడు. వనవాసానికి వెళుతూ ఆ సంగతి మొదట సీతతో చెప్పడు. అమె అడవులకు మామూలుగా వస్తుంది. ఏదో పిక్‌నిక్‌కు వెళ్లుతున్నట్లు కొంతదూరం వెళ్ళాక రాముణ్జీ ఇలా ప్రశ్నిస్తుంది : మన యూరెయ్యది యెంత దవ్వు మన మీమార్గంబునం బోవుటల్‌ మన మెచ్చోటికి బోయిరావలయు నేలా లేదు తే రిచ్చటన్‌ మన తోటన్వలె బువ్వుటోవరులు సమ్యుక్చంద్రకాంతస్థలుల్‌ గనరా విప్పుడదేమి నావిభుడు శోకం బాత్మలో నాగుచున్‌ (రామా. 5-87) కట్టుకొన్న ఇల్లాలు అలా అడీగాకగాని పాపం రాముడు నిజం చెప్పడు. చావుకబురు చల్లగా చెప్పినట్టు పధ్నాలుగేళ్లు అరణ్యవాసానికి పోతున్నట్లు చెప్తాడు, ఇంతి గురువాజ్ఞ బదునాలుగేండ్లు పనుల నియతి జిరియించు వ్రతము పూనితిమి నీవు విపినసంచారమున కింత వెరవవలవ దడని మునికన్క లాయాస ముడిగి మనరె? (రామా. 5-3) అడవిలో ప్రవేశించాక జిటావల్కలాలు ధరించి తపోవేషం వేసుకొన్నాక సీతమ్మ ఆ ప్రశ్న వేస్తే శ్రీరాముడు ఈ జవాబు చెప్పాడు. భర్తతో ఏదో ప్రాచీన ఫాన్సీ డ్రెస్సు పార్టీకి వెళ్లుతున్నామని సీతమ్మ అంతవరతూ భావించిందా? ఏ రామాయణాన్ని అనుసరించి

274 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి రామభద్రుడు ఇలా మార్పుచేశాడో తెలియదు. దీనికన్నా మరోఘోరం ఒకటి - లక్ష్మణడే శూర్చణఖ ముక్కూచెవులూ తోసినట్టు అన్ని రామకథలలోనూ ఉంటే ఈ రామభద్రుడు ఆ రామభద్రుని చేతిలో కత్తి పెట్టించి ఆ రక్కసి '“ముక్కరకుక నోచకుండ' ముక్క6 జేయించాడు (5-13).

ఇలాంటి అనౌచిత్యాలు ఉన్నా రామభద్రుని ప్రబంధంలో కొన్నిచోట్ల సౌగసులు ఉండబట్టే ఈ కావ్యం ఇన్నాళ్లు నిలిచింది. కొన్ని ఘట్టాలలో తన ప్రతిభను బాగా చూపించాడు. అశోకవనంలో ఆంజనేయుడు శ్రీరాముని ముద్రిక ఇచ్చినప్పుడు దాన్ని చూస్తూ సీతమ్మ అనుకొన్న మాటలు 14 పద్యాలలో ఎంతో బాగా వ్రాశాడు. ఈ పధ్నాలుగూ మణిపూసలు.

ఉగ్రధనుర్విభేదనున కో మణిముద్రిక నీవు నేను బా

జీగ్రహణం బొనర్చి కరుణించుటకుం దగియున్న యున్కి య

వ్యగ్రమతిం దలంచుకొని ప్రాణసభి న్నను బారవైవ క .

త్యుగ్ర విపద్దశ న్నాగిలియున్నదిగా యని చూడవచ్చితే? .

ఈ మణికాంతిచేత నిరు లెచ్చటికో చనజేసి నీవు గా

నామును రేలునుం బయటవైతువు నీవికి నెగ్గుసేయు శ్రీ

రాముని మోల నా కలుక రానటులం ట్రతికూలవయ్యు నా

హా మరి నేడు నా కయితి నాపద వచ్చినవేళ ముద్రికా! .

అ కరుణాజలరాశికి - నీకుం దగు నూర్మికా! గణింపగడికోకు౯

నీకతనగదా యిప్పుడు - శోకానల మారి చలువ చొప్పడె మదికిన్‌

ననుబాసి దూరమున జి-క్కిన యినకులు వ్రేలనుండ కిటు వచ్చితె యా

యన నలకువ దినదినమున్‌- గనుగొనగా లేక ముద్రికా నను వెదకన్‌:

హారమంధురవలయకేయూరకుండ- లాదులవియుండగా నేమి యడవులకును

గరమనుసరించివచ్చి నీకరణివిభుని- యొద్దనుండనె యోముద్దుటుంగరంబ

విశ్చలోకేశ్చరుడు రఘువీరు డిట్లు-పనికివత్తు వటంచు జేపట్టినపుడ

భూషణంబులు తలద్రొక్కి పూజగొంటి-చాలదే యోయలంకారచక్రవర్తి!

అనవిరోధుని మునివిరోధుని నవ్విరాధుని గూల్చి జే

చను నెడం జినకాననీవరచక్రవర్తియనుంగున -

ల్లుని కరాగ్రమువెంట బిందెడు లోహితాంబులవంబులో

యన భవన్మణిరోచు లొల్కుగదా తదా న్రీతముద్రికా। ల?

పోర విరోధుని గొని రఘు- వీరుడు కర మూచికొనుచు వేంచేయగ నా

డీరత్నరుచి నవాసృ- గ్ధార వడిసినట్లు తెరువుకడకుం బడుగా!

పలలభుక్రా ణఇపవమానపారణాప-రాయణంబైన రామదోర్దండఫణికి

గరళవైశ్వానరజ్వాల గాదెనీదు- ప్రాంతమాణికృ్కమున విడివడిన డాలు.

అయ్యలరాజు రామభద్రుడు 275 ఈ జాత్‌కెంపు కేలుట - జాటిరజాబజ్బల్యమానమగు విపినవిశ ల్యాజూలజన్యకిరణస-మాజముతో మారుమలయు మాస్టీడుగదా! మాయల లేడి నా మదికి మక్కువ గొల్పిన దెచ్చిపెట్టరా మాయని రాము నంపితిగదా! యెడ దవ్వయిపోవ నప్పుడు౯ బాయక। ముద్రికా సుకృతపాకముచే సులభానుబంధవై యాయనచెట్ట పట్టుకొని యక్కరతో జన నీకు గల్లెగా! తెరువున జఘనపయోధర- భరమున నడు గలసియిడగ బతి యూతగ నే కర మిచ్చు నాకు నవ్వలి-కర మది నీ కాణయాచిగ్నా యుంగరమా। మొగము ద్రిప్పిన వేగమున జెక్కుపై జిందుశ్రవణకైరవధూళి చక్కదుడిచి విగువురెప్పముసుంగు దీయని కనుడోయి కలితలీలాహల్లకమున నొత్తి చిరునవ్వుతమకంబు చెల్లబెట్టని మోవి కడిదిప్రాదెలనాకు మడు పాసంగి పానుపుడిగబోయి బడలిక బొరసినయడుగుదమ్మ్ముల నొప్పి యూర నంటి యినకులస్వామికరము నన్ననునయించు పలుకునకు మున్న తాన నాయలుక దీర్చు నెప్పుడప్పుడ యెరుగవే చెప్పవేమి! చిటికినవ్రేలిగోరునకు సేమమె తాగయిసియుగావునన్‌ టిటిపౌటి ముచ్చటల్‌ దనుక జెక్కులకుం గలపేది ప్రొద్దు తొ ల్లిటివి దలంచుకొన్నై లవలీదళసీమల వ్రాయజొచ్చెనో కటకటః ముద్రికా! మకరికాలత లిప్పుడు పువ్వుదేనియక్‌. (రామా. 6:157-200)

తెలుగు సాహిత్యంలో అయ్యలరాజు రామభద్రనికీ స్థానం ఇవ్వడానికి రామాభ్యుదయం పూర్తి గ్రంథం అక్కర్లేదు. ఈ పధ్నాలుగు పద్యాలే చాలు. అయినా, సకలకథాసారసంగగ్రహం రచించిన పుత్తేటీ రామభద్రుడూ, ఇతడూ ఒకరే అని పారబడడం మన సాహిత్య చరిత్రలో ఇంతవరతూ జరుగుతూ వస్తున్నది. అతడు వేరు, అయ్యలరాజువారి వంశంలో పూర్వీకుడు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీరశతకం వ్రాస్తే చానిని రామభద్రుడే వ్రాశాడని కొందరు సాహితీపరులు పారబడుతున్నారు.! రామాభ్యుదయాన్ని వ్రాసి గొబ్బూరి నరసరాజుకు అంకితమివ్వడానికి ముందో, లేక ఆ తరువాతో రామభద్రుడు గుత్తి అప్పలరాజు అనే దాతను ఆశ్రయించాడు. అయ్యలరాజు రామభద్రునిదని చెప్పాడు:

  1. మలిరాయల యుగం, నమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి.
  2. “అష్టదిగ్గజములు' - కురుగంటి సీతారామయ్యగారి వ్యాసం, పుకు 12.

276 సమగ్రాంభ్ర సాహిత్యం - రెండన సంపుటి

రాజమనోజా! విద్యా- భోజా! దీనార్థికల్పభూజా! ర6పుసం

జ్ఞాజా! వైభవ విజితవి- డౌజా! రవితేజ! గుత్తి యప్పలరాజా! (అప్ప. ౩3-142)

ఈ రామభద్రుణ్జీ అప్పకవి పూర్వకవిస్తుతిలో ప్రస్తుతించాడు. అయితే పేరుపెట్టి చెప్పలేదు. ““రామరాజభూషణ రత్నఖచితచారు మస్తకలాపాదిహారి వాక్యగౌరవము పెక్కుభంగుల గణనబేసి” అని చెప్పాడు (అప్పు. 1-27). దీనికో కథ ఉంది రామాభ్యుదయంలో దశరథుడు వేటకు వెళ్ళిన అరణ్యాన్ని వర్ణిస్తూ రామభద్రుడు ఒక సీసపద్యం చెప్పాడు. దాని ఎత్తుగితి ఇలా ఉందిః

షృథులషడ్డస్పరో ద్గీతఖిల్లపల్ల- వాధరా గీతికాకర్ణనాతిఖీతి

పరవశాత్మపటీరకోటరకుటీర- లీనఫణియగు నక్కాన కాననయ్యె.

(రామా. 2-౫)

ఇందులో పాటకు పాములు భయపడ్డట్టు కవి చెప్పాడు. 'సంగీతకళా రహస్యనిధి అని బిరుదు చెప్పుకొన్న రామరాజభూషణుడు ఈ పద్యం విని “పాటకు పాములు భయపడతాయా'. అని నిండుసభలో ఆక్షేపించాడట. “నెమళ్ళకు భయపడతాయి! షడ్డస్వరం నెమలికూతకదా!' అని రామభద్రుడు సమర్థించుకొని రామరాజభూషణుని తలదన్నడానికి చిహ్నంగా అతని కిరీటాన్ని తీయించాడట.

అయితే చిక్కదనంలోని చక్కదనంలో అయ్యలరాజు రామభద్రుడు భట్టుమూర్తి కన్నా కొన్నిపాళ్లు తక్కువే

తెనాలి కవులు - బంధువులు

గౌర్లపాటి రామయ్యగారికి సుప్రసిద్ధుడైన తెనాలి రామకృష్ణుడేకాక మరి ఇద్దరు కుమారులున్నారు. వీళ్లుకూడ కవులే, రామలింగం తరువాత పుట్టిన కవి పేరు శ్రీగిరి. ఇతడు శ్రీశ్రైలమాహాత్మ్యవ్న అనే కావ్యం వ్రాశాడు. ఇతని తమ్ముని పేరు “అన్నయ్య. ఈయన సుదక్షిణాపరిణయమనే కావ్యం వ్రాశాడు. రామయ్యగారి కొడుకులు ముగ్గురూ కవులే అయినా తమ గ్రంథంలో పరస్పర ప్రసక్తులు లేనే లేవు. అయితే వీరి బంధుత్వాలు తెలియజేసే సాక్ష్యమొకటి లఖిస్తున్నది రామకృష్ణుని పెద్ద తమ్ముడు శ్రీగిరికవికీ రామభద్రకవి అనే మనుమడున్నాడు. అతడు ఇందుమతీ కల్యాణమనే కావ్యం వ్రాశాడు. దానిలో తన తాతల గురించి, సోదరుని గురించి ఇలా చెప్పాడు *

ప్రొఢీ మీ పెదతాత పాండురంగాది సత్కృతులు చేసెను రామకృష్ణసుకవి __యనుజు డప్పన్న మీ పినతాత రచియించె బరగ సుదక్షిణాపరిణయంబు

మీతాత శ్రీగిరి చాతురీవిఖ్యాతి శ్రీ శ్రైలమాహాత్మ్యకృతి యొనర్చె

తెనాలి కవులు - బంధువులు 277

వారలను మించె మీ యన్న వీరరాఘ

నిన్న నూచానసంతాను నెన్నదరమె

ప్రాజ్ఞ హృదయాబ్దరవి రామభద్రసుకవి. (ఇందుమతీ కల్యాణం)

రామభద్రకవి ధర్మమా- అని ఈ పద్యంవల్ల తెనాలి వారి కుటుంబంలో మూడు తరాల దాకా ఎందరు కవులున్నారో తెలుస్తున్నది. రామకృష్ణుని తమ్ములు, తమ్ముని మనుమలూ మాత్రమేకాక అల్లుడూ, అల్లుని తమ్ముడు కూడ కవులే. వాళ్ళ ఇంటి పేరు లింగమగుంటవారు, రామకృష్ణుని అల్లుని పేరు రామయ్య. అల్లుని తమ్ముని పేరు తిమ్మయ్య. ఇప్పుడు ఈ తినాలి కవుల గురించీ, వాళ్ళ బంధువులను గురించీ వరుసగా తెలుసుకొందాం.

  1. శ్రీగిరికవి: రామకృష్ణుని పెద్ద తమ్ముడు. ఇతడు శ్రీశ్రైలమాహాత్మ్యం వ్రాసినట్టు ఇతని మనుమడు రామభద్రకవి చెప్పడంవల్ల తిలుస్తున్నది. అయితే ఇప్పుడా గ్రంథం అలభ్యం. 2 అన్నప్పు ; రామకృష్ణుని రెండవ తమ్ముడు. ఇతడు సుదక్షిణా పరిణయం అనే అయిదాశ్వాసాల ప్రబంధాన్ని బ్రాసి పులిజాల సోమయ్యకు అంకితమిచ్చాడు. సోమయ్య బాదాలి పట్టణంలో కోనేటి రామరాజు వద్ద ఉద్యోగిగా ఉండేవాడు. ఈ రాజు అళియ రామరాయల పెదతండ్రి మునిమనుమడు, ఇతడు క్రీ.శ. 1560 ప్రాంతాలలో బహుశా పెనుగొండపై ఆధిపత్యం వహించేవాడు. పులిజాల సోమయ్య ఒకనాడు తెనాలి అన్నయ్యను పిలిచి పుస్తకం అంకితమిమ్మన్నాడు. తన కవిత్వపు గొప్పతనాన్ని కృతిపతి నోటంటే అన్నయ్య ఇలా చెప్పించాడు:

పలుకుల కల్కి కప్పురపు బల్కులు చల్లినరీతి బండు వె

న్నైలతళుకుల్‌ విధుండు హవణీంచిన మించున శంబరారి చెం

గలువల తూపుగోపుల ముఖాముఖిజూపిన యేపుసం గృతుల్‌

పలుకగ నేర్తు పూర్వకవిపద్ధతి రామయయన్న సత్కవీ! (సుదక్షిణా. 1-15)

సరస్వతీదేవి కర్పూర పలుకులు చల్లినట్లూ, చందమామ పండు వెన్నెల తురిపించినట్లూ, మన్మథుడు చెంగలువల తూపులు వేసినట్లూ తన కవిత్వం ఉందని అన్నయ్య చెప్పుకొన్నా సరస్వతీ, చందమామా, మన్మథుడూ కాక కవే స్వయంగా చల్లినట్లు మాత్రం కవిత్వముంటుంది. ఈ ఉపమానాలు పింగళి సూరన్నగారివి. సుదక్షిణాపరిణయంలో పూర్తిగా సూరపరాజుగారిని అనుసరించకపోయినా పాత్రల చేత కథ చెప్పించడం, వాళ్ళచేత వర్ణనలు చేయించడం మొదలైన పద్ధతులను అన్నయ్య అమలు జరిపాడు. నాయికా, అమె చెలికత్తెల సంభాషణలో తన పేరు రాగానే నాయకుడు ప్రవేశించే ఘట్టంలో వసుచరిత్రను అనుకరించాడు. కథ చిన్నదే. రఘువంశంలోని దిలీపుడు సుదక్షిణ అనే రాచలిడ్డను పెళ్ళాడడం ఇందులో కథ. అష్టాదశ వర్ణనలూ ఉన్నాయి. ఒక్క _మధుపానవర్ణనలో కొంచెం కొత్తదనం ఉంది తప్పతాగిన కప్పురగంధుల మాటలు తడబడడాన్ని అన్నయ్య ఇలా వర్ణించాడు :

  1. తంజావూరు సరస్పడీమహల్‌ గ్రంథాలయం కేటలాగు (అంధ్ర విశ్చవిద్యాలయ ప్రచురణ) గగ్రంథసంఖ్య 138

278 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తతతతామరసాక్షి, తలవంత మాడకు; వివివివీణాకంఠ, వీణదెమ్ము పపపపాటలగంధి, పాటపాడు మొకింత; కుకుకుకుందస్కిత; కురులు ముడువు; ససససారసహస్త, సరిదొనవా నీవు; ననననాతుక నాలినవ్వు లేల; వవవవారిజముఖి, వలదు వాదులు చాలు; గొకొకొకోమలి, యేల తోపవేగ మనుచు దపుతప్పు లాడుచు నన్ను గనిరి మదననిర్ముక్తదుత్తూరమార్గణా గ్ర హతుల నలసిరొ యన ఖీచరాబ్బముఖులు భర్త దేల్చిరి మైరేయపానకేలి. (సుదక్షిణా. ౩-10) ఆంధ్రసాహిత్యంలో నన్నెచోడుని కాలంనుంచి ప్రబంధాలలో మధుపాన వర్దన

ఉంది గాని ఇటువంటి పద్యం కనబడదు. దీనిని పోలిన ఒక పద్యాన్ని వేలూరి

ఇివరామశాస్తిగారు ఉదాహరించారు. అది మాధవభట్టు వ్రాసిన సుభద్రాహరణం అనే శ్రీగదితమున ఉందటః:

బలరాముడు : (మద్యస్థాలిత్యముచే) ఎఎఎఎచట. ఆఆఆపపప పాపిష్టి... పొడియొనరింతునాః: హహలముం గొని నాభుభుజంబుచేత నూ ర్పిడీ బొనరింతునా! పిపిపిపిండిగ వేయుదునా! కడుంబడల్‌ పడ ధధరాస్థలిన్‌ ససకలంబుగ గూల్చుదునా! యదేల? యే ర్చడ కకకల్లు పోము పపపాత్రము నిండగ ద్రావుదుం ద్రుటిన్‌?*

తెనాలి అన్నయ్య తాను పూర్వకవి పద్ధతిని పలుకగలిగినవాడనని చెప్పుకొన్నాడు.

పూర్వకవులను మించి ఇంకెక్కడా “సరససాహిత్య సాహిత్యపరత' ప్రదర్శించలేదు.

  1. అమ్మడి రామకృష్ణుడు; ఇతడు రామకృష్ణుని పేరింటివాడు. రామకృష్ణుని పెద్ద తమ్ముని

కొడుకు. సంస్కృతాంధ్రాలలో కీర్పి పొందాడని ఇతన్ని కుమారుడు రామభద్రకవి తన

ఇందుమతీ కల్యాణంలో చెప్పాడు. ఇతని కావ్యాల పేర్లు చెప్పలేదు కాబట్టి చాటువులు రచించాడనుకోవచ్చు.

  1. వీరరాఘవుడు: ఇతడు రెండవ రామకృష్ణుని పెద్ద కొడుకు, సరసకవితా మహత్వంలో

ఈ వీరరాఘవుడు తాతతండ్రుల్నందరినీ మించినవాడని రామభద్రుడు చెప్పాడు గాని

వ్రాసిన కావ్యాలేమిటో తెలియవు.

  1. రామభద్రుడు: రెండవ రామకృష్ణుని చిన్న కొడుకు. మొదటి రామకృష్ణుడు ఇతనికీ

పెదకతాత. కాను “ప్రాజ్ఞహృదయాబ్దరవి' నని రామభద్రకవి చెప్పుకొన్నాడు. ఇతడు

ఇందుమతీ పరిణయం అనే నాలుగాశ్వాసాల కావ్యాన్ని వ్రాసి పాలచూరి కృష్ణనృపాలునికీ అంకీతమిచ్చాడు. ఈ కృతి అముద్రితం. తంజావూరు సరస్వతీమహల్‌ గ్రంథాలయంలో

ఒక ప్రతి ఉంది (సంఖ్య 108).

ళీ

  1. లింగమగుంట సర్వకవి ; ఇతడు తెనాలి రామకృష్ణుని అల్లుడైన లింగమగుంట రామయ్య

పితామహుడు. తన తాత సర్వన్న కజఫార్వభౌముడని రామయ్య చెప్పాడు. అరాశే

నాననా నానన కకక న

  1. సోముడు - ఉత్తరహరినంశవిమర్శ; వేలూరి ఇవరామకాస్త్రిగారు పుట 119

తెనాలి కవులు - బంధువులు 279 ఏ గ్రంథాలు బ్రాశాడో వివరించలేదు. పెదపాటి జిగ్గన్నలాగే వివిధ కావ్యాల నుండి పద్యాలను సికరించిన అజ్ఞాతగ్రంథ సంధాత సర్వదేవుడు అనే కవి వ్రాసిన ఆదిపురాణాల నుండి రెండు పద్యాలు, విరాటం నుండీ ఒక పద్యం ఉదాహరించాడు. ఈ పద్యాలు కన్నడంలో సర్వదేవుడనే పేరు వహించిన పొన్నకవి (క్రీశ. 953) వ్రాసి ఉంటాడని నేలటూరి వెంకట రమణయ్యగారూ,' నిడుదవోలు వెంకటరావుగారు భావిస్తున్నారు. ఉదాహరించిన పద్యాలను చూస్తే, వేటూరి ప్రభాకరశాస్త్రిగారన్నట్లు అవి ప్రాచీనతర రచనలులా గోచరించవు.! అయినా అవి ఆదిమ యుగంలోని సర్వదేవుని రచనలే పెదపాటి ఎర్రన తన మల్హణ చరిత్రలో ఒక సర్వదేవుని నుతించాడు. వినుతులొనర్హు నాంధ్ర సుకవిప్రభు నన్నయభట్టు తిక్కయ బ్వను శివదేవు భాస్కరుని జిక్కన నాచనసోము సర్వదే వుని భవదూరు వేమునల పోతన పిల్లలమర్రి వీరభ ద్రుని శరభాంకు వీరకవి ధూర్జటి గేతన భట్టబాణనిక్‌ _ ఈ పద్యంలో పెదపాటి ఎర్రన ఒక కాలక్రమాన్ని అనుసరించలేదు. ఎర్రన నుతించిన సర్వదేవుడు ప్రాచీన కన్నడకవి కృష్ణ్టాయల కాలానికి కొంచెం పూర్వుడో సమకాలికుడో అయిన లింగమగుంట సర్వ్పదేవుడు కావచ్చు. ఈ విషయం భావిపరిశోధనవల్ల తేలవచ్చు. 7. లింగమగుంట రామయ్య; ఇతడు తినాలి రామకృష్ణుని అల్లుడు. బహు గ్రంథకర్త. ఇతడు బ్రాసిన 6 పుస్తకాల పేర్లు తెలుస్తున్నాయి. _

  1. అనందకానన మాహాత్మ్యం”, 2. చతుర్వాణీకా మాహాత్మ్యరీ 3. మత్స్య పురాణం 4. వామన పురాణం 5. వేంకట మాహాత్మ్యం 6. లక్షణ తిలకం ఇందులో మొదటి రెండు గ్రంథాలే లభిస్తున్నాయి. అవి కూడా అముద్రితాలు. వీటి కాళపత్రప్రతులు మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి. ఆనందకాననం అంటే కాశీ. కవి వైష్ణవుడు కనుక కాశీని విష్ణుక్షేత్రంగా వర్ణించి, అందువల్లనే దానికి ఆ మాహాత్మ్యం వచ్చిందని చెప్పాడు. వాయుపురాణంలోని లక్ష్మీసంహితలో ఉన్న ఆనందకానన మాహాత్మా్యానికి ఇది తెనిగింపట. ఇది అయిదాశ్వాసాల కావ్యం. ఇది రామయ్యకవి ఛివరిది కావచ్చు. దీనికి ముందే మిగతా రచనలు చేసినట్టు ఈ గ్రంథంలో ఇలా చెప్పాడు: వినుము మత్స్యపురాణ వామనపురాణములును వేంకటమాహాత్మ్యమును ఫలప్ర దము చతుర్వాటికా మహత్వమును దెనుగు చేసి వెలసితి నవనిబ్రసిద్ధి దనర. (1677
  2. తెనుగుకవుల చరిత్ర, పుట ౪
  3. ప్రబంధ రత్నావళి పీఠిక, పుట 27
  4. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి, సం 2002
  5. ట్రైశేటలాగు - 4వ సంపుటి. 3వ భాగం, గ్రంథసంఖ్య ౫.677
  6. డిస్క్రిప్టివ్‌ కేటలాగు - 1వ సంపుటి, గ్రంథసంఖ్య 36.

280 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఉంది. ఇక్కడికి లింగమగుంట దగ్గరే. రామయ్య తన స్వగ్రామమైన చదలువాఢ మాహాత్మ్యాన్ని అయిదాశ్వాసాలలో వ్రాశాడు. రామయ్య తన మామగాకి స్థలపురాణాలు వ్రాయడం స్పెషలైజు చేసినట్టుంది. అయితే ఇతడు “లక్షణతిలకం' అనే ఛందో గ్రంథం తూడా బ్రాసినట్టు లక్షణశిరోమణిలో పొత్తపి వెంకటరమణకవి చెప్పాడు, 8. లింగమగుంట తిన్ముకవి; తెలుగులో ఎన్ని ఛందోగ్రంథాలున్నాా ఇవాళ తెలుగులో పద్యరచన చేయడానికి ప్రారంఖించేవానికి అప్పకవీయం పెద్దబాలశిక్ష అయితే సులక్షణసారం చిన్నబాలనిక్ష. దీనిని లింగమగుంట తిమ్మకవి వ్రాశాడు. ఇతడు తెనాలిరామకృష్ణుని అల్లుని తమ్ముడు. తన అన్నగారు రామయ్య మత్స్యపురాణం, వామనపురాణం మొదలైనవి వ్రాస్తున్నప్పుడు ఈ తిమ్మకవి వాటికి లేఖకుడుగా ఉండేవాడు. “లక్షణశాస్త్రములెల్ల బరీక్షీంచుట కొంత కొంత యెరిగినవాడ'నని ఇతడు చెప్పుకొన్నాడు. ఇతని దగ్గర గ్రంథసామాగ్రి చాలా ఉంది. గ్రంథసామగ్రి గలుగుట బ్రతిపదమున కన్ని లక్షణములు వ్రాయు దనిన నందు గ్రంథవిస్తర మగుగాన గవితమాత్ర మెన్నిటను దేటపడు నన్ని విన్నవింతు (సులక్షణ, అవతారిక -0 ఇంతకుపూర్వం ఛందోగ్రంథాలను బ్రాసినవాళ్ళ లక్షణాలు కొందరు. చెప్పినవి మరికొందరు ఒప్పుకోలేదు. అందరి అఖిప్రాయాలనూ తాను క్రోడీకరిస్తానని తిమ్మకవి ఇలా చెప్పాడు: కొంద రెంచు లక్షణము గొంద రెంచ రందరును నెంచినవి కొన్ని యవియు నవియు దొరయగా గూర్చి కవిసమ్మతులను బ్రాయు దొకటి కొకటికి సంషృతాంధ్రోత్తు ఆనయ (సులక్షణ అవతారిక-) ఈ గ్రంథం క్రీ.శ 1662 నుండి అచ్చుపడి చలామణిలో ఉంది. అయితే 1950 దాకా దీని కర్త వెల్లంగి తాతంభట్టు అని ప్రచారమైంది; కాని రావూరి దొరస్వామిశర్మగారు దీనిని బాగా పరిశీలించి పరిష్కరించాక తిమ్మకవి పేరనే వావిళ్ళవారు ప్రచురించారు. తీమ్మకవి 'బాలబోధచ్చందం' అనే మరో లక్షణ గ్రంథాన్ని కూడ రచించాడట. ఈ సంగతి కాలూరి ఆంజనేయకవి తన 'సుకవికర్ణామృతం' అనే గ్రంథంలో చెప్పాడు. ఈ బాలబోధచ్చందం ప్రతి ఒకటి కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు వారి కార్యాలయంలో ఉంది_ (సంఖ్య 909). అయితే సులక్షణసారం వ్రాశాక తిమ్మకవి యింకో గ్రంథం బ్రాయనక్కర్లేదు. అతడు గ్రంథం చివర ఒక పద్యంలో చెప్పిన మాటలు నిజం. అద్దమున గిరి కాన్చించునట్టిపగిది సంచితంబగు కవితా ప్రపంచలక్ష ఇంబు లన్నియు నింద యున్నవి గణించి తెలియ ఘటానఘటనశక్తి గలుగు రామ. (సులక్షణ. ౩౫) కొండ అద్దమందు కొంచమై ఉన్నా దాని రూపాన్ని బాగా చూడవచ్చు.

అద్దంకి గంగాధరుడు ఆంధ్రసాహిత్యాన్ని ఎంతగానో ఆదరించి, తెనుగు కవులను పోషించి మల్కిభరాం పాదుషా ఎన్నో కృతులను అంకీతం పుచ్చుకొన్నాడుగాని అతని పేరిట వాస్తవానికి ఒకే ఒక కావ్యం నేడు కనబడుతున్నది. దాని పేరు తపతీసంవరణోపాఖ్యానం. ఇది అద్దంకి గంగాధరకవి రచించాడు. ఇతడు మహమ్మదీయ ప్రభువులకు కావ్యాలను అంకితం చేసినవాళ్ళలో మొదటివాడని ప్రతీతి. అయితే తపతీసంవరణోపాఖ్యానాన్ని అంకితం పుచ్చుకొనడానికి ముందు మల్కిభరాం ఎన్నో కావ్యాలను అందుకొన్నాడు. ఈ సంగతి కవే తన కృతిలో చెప్పాడు; అతనితో మల్కిభరాం ఇలా అన్నాడటః పెక్కుకృతుల్‌ చమత్కృతులు పెంపుగ నందితిగాని నీదు స మ్యక్కృతితన్యపై గల మమత్వము వర్తిల దందు లెక్కకుం బెక్కువగాగ గోపికలు మించి వసించిన నేమి రాధపై మక్కువ యెక్కువై మిగుల మన్ననసియడె శౌరి వేడుకన్‌? (1-18) తనను శ్రీకృష్ణునితోనూ, గంగాధరకవి కావ్యకన్యను రాధతోనూ పోల్చుకొన్న మల్కి భరాముడే “భారతాఖ్యానమందు గలుగు తాపత్యచరితంబు' ఘనత మెరిసీటట్టు “వివిధ శృంగారమహిమల'తో విస్తరిస్తూ తన పేర చెప్పమని కవిని పురమాయించాడు (తపతీ. 1-19). తపతీసంవరణోపాఖ్యానం మహాభారతంలోని ఆదిపర్వంలో ఉన్నది దానిని నన్నయ్యగారు 23 గద్యపద్యాలలో వ్రాశారు (అది. 7:69:90). దీనినే గంగాధరుడు పెంచి, అష్టాదశ వర్ణనలూ చొప్పించి అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాశాడు. మహాభారతంలోని కథ చాలా చిన్నది. సూర్యునికి తపతి అనే ఒక కుమార్తె ఉంది అమెను ఎవరికిచ్చి వివాహం చేద్దామా అని ఆడపిల్లలను కన్న ప్రతి తండ్రిలాగే సూర్చుడు తూడా ఆలోచించాడు. చివరికి భూమిమీద తనలాగా వెలిగే సంవరణుని కిచ్చి వెళ్ళిచేద్దామని నిశ్చయించాడు. సంవరణుడు ఒకనాడు వేటకు వెళ్ళి ఒక కొండకోనలో ఒక అమ్మాయిని చూసి ముగ్ధుడై మోహించాడు. అంతలో ఆ పిల్ల అద్భళ్యమైంది. రాజూ నేలమీదపడి విలపించాడు. ఆమె దయతలచి కనబడింది. తనను గాంధర్వరీత్యా వివాహం చేసుకొమ్మన్నాడు. అ చిన్నది తాను తండ్రిదాటు విడ్డనని చెప్పింది. మా నాన్న నడగండన్నది. ఇంతకూ ఆ పిల్లదాని తండ్రి సూర్కుడే. అయితే తనకాపిల్ల నిద్దామని సూర్యుణ్ణి మెప్పించి, అతని అల్లుడవుదామని రాజు దీక్ష తీసుకొన్నాడు. ఆ తపస్సుతో చిక్కి సగమయ్యాడు. ఇది అతని కులగురువు వసిష్ణడు చూశాడు. వెంటనే సూర్యలోకానికి వెళ్ళి, చెప్పవలసిన నాలుగూ చెప్పి, పెళ్ళికూతుర్ని వెంటబెట్టుకొని చక్కా వచ్చాడు. లక్షణంగా పెళ్ళి జరిగింది. భారతంలోని ఈ కథను ప్రబంధంగా మార్చడానికి గంగాధరకవి చాలా మార్పులు చేశాడు. తపతికి సరియైన పెళ్ళికొడుతును వెదికే బాధ్యతను ఆమె పెంపుడు

292 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చిలుక భుజాన వేసుకొని ఊరూరూ తిరుగుతుంది. హస్తినాపురం పాలించే సంవరణని తోటలో ఆగి పనికట్టుతుని ఆ రాజుముందు తపతి అందాన్ని వర్ణిస్తుంది. ఆ అందాన్ని వినగానే అతడు మరులు కొన్నాడు. మన్మథావస్థలో పడ్డాడు. తపస్సు చేసి మెప్పిస్తే తన. తూతుర్ని ఇవ్వకపోతాడా అని సూర్యుణ్జీ గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై మాట ఇచ్చాడు. ఈలోగా చిలుక తపతివద్దకు వెళ్ళి సంవరణుని చక్కదనాన్ని వర్జించింది. ఆ వివరాలు విని తసతి అతణ్ణి ప్రేమించింది. ఆమెకూడా సహజంగా మన్మథావస్థలకు లోనై మహాచెడ్డ విరహబాధ అనుభవించసాగింది. తదుపరి సంవరణుడు వేటకు వెళ్ళాడు, తపతిని కలుసుకొన్నాడు. మూలంలోలాగ కొంత కథ నడిచింది. పెళ్ళిని కవి విపులంగా వర్ణించాడు. -

సంవరణ చరిత్రను తెలుగులో ఇంకొక కవి తూడా రచించాడు. చదలువాడ మల్లన్నచేత విప్రనారాయణ. చరిత్రను అంకితం పుచ్చుకొన్న మాకరాజు తిమ్మరాజుకు

పెక్కుమారులు పార్వతీప్రియరమాధి - పులకు జేయించె నవలక్షపూ జసములు

.' వరుస జెప్పించుకొనియె సంవరణచరిత - మెలమ్‌ మాకయలక్ష్మీపతీశ్చరుండు (విప్ర 1-48) మాకరాజు లక్ష్మీపతి చెప్పించుకొన్న 'సంవరణ చరిత్రను బహుశా చదలువాడ మల్లన్నే రచించి ఉంటాడని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ కథను సంస్కృతంలో పదవ శతాబ్దంలోనే నాటకంగా గచించినవారు లేకపోలేదు. క్రీశ. 935-955ల మధ్య కేరళదేశాన్ని పాలించిన కులశేఖరవర్మ దీనిని ఆరంభకాల దృశ్య కావ్యంగా రచించాడు. ఉరూ కవులపై కూడ ఈ సంవరణోపాఖ్యానపు ప్రభావం ఉందట. ఖులీతుతుబ్లా ఆస్థానకవి 'వరిహే' వ్రాసిన '“ఖుత్స్‌ముష్తరీ' అనే ప్రబంధంపై తపతీ సంవరణపు ప్రభావమున్నదని మిత్రులు డాక్టరు బిరుదురాజు రామరాజుగారు చెప్తున్నారు. నిజానికి మల్కిభరాముని ప్రణయగాథ తూడ. గంగాధరకవి బ్రాసిన ప్రబంధంలో సూచితమైందని వారి ఉద్దేశం '. సమకాలిక ప్రణయ సన్నివేశాల నుండి కథకు కావలసిన సందర్భాలు చేదుకొన్నాడో, లేదోగాని గంగాధరుడు తాను జీవిస్తున్న నాగరికతలోని యాంత్రిక సదుపాయాలను సమకూరుస్తున్న సాంకేతిక పరిజ్ఞాన విధాలను కొన్ని కొన్ని చోట్ల తెలియజేశాడు. సంవరణుని చూసిన చిలుక అతనితో ఇలా అంటుంది. “భశర్తర్శన ఘటీ యంత్రంబు మదీయమనఃకూప కథారసంబుల వెడలించుచున్న యది” (2-9)... అనాటి గోల్కొండ ఖిల్లాలో నూతులలోని నీళ్ళను ఘటీయంత్రాలు వెడలిస్తూ ఉండేవన్నమాట. ఇప్పటికీ. పాడుపడ్డ గోలకొండ కోటలో నీటిసరఫరా కోసం ఏర్పాటు చేసిన

  1. విప్రనారాయణ చరిత్ర (అం.సా.పరిషత్తు ప్రచురణ) ద్వితీయ ముద్రణ పీఠికలో నిడుదవోలు

వెంకటరావుగారు,పుట 31.

డె, త వాబ్బయ చరిత్ర; లౌకిక వా అ శన

వ మమమ దిక్కు ర శరాదలాహాడు ఈ

అద్దంకీ గంగాధరుడు 283 మట్టిగొట్టాల అవశేషాలు గోడల పై భాగంలో కనబడుతూ ఉంటాయి. గంగాధరుడు ఇటువంటి సమకాలిక వర్ణనలు ఇతోధికంగా చేయలేదే అన్నదే విచారం,

కవికి తన ఏలిక సరదాలేమిటో తెలుసు. వాటిని తీర్చడానికే ప్రయత్నించాడు. “నూతనాసక్తుమేగారె తలంప నెట్టి యెడలన్‌ సర్వంసహా థీశ్వరుల్‌”'' అని ఒక అర్భాంతరన్యాసంలో గంగాధరుడు ప్రశ్నించాడు (1-86). ఏలిక ఆసక్తిమేరకు, అనాటి సాహిత్యలోకపు “ఫ్యాషన్‌''లకు లోబడి వసుచరిత్ర మూసలోనిదా అనిపించేటట్టు ఈ కావ్యాన్ని రచించాడు. అందుకే సాహిత్య చరిత్రకారులూ, విమర్శకులూ కొన్ని కొన్ని అఖిప్రాయాలకు వచ్చారు.

“తపతీసంవరణము సరసమయినదై మంచి కల్పనలు గలిగి దాదాపుగా వసుచరిత్రమును బోలి వరలుచున్నది'”' అని కందుకూరి వీరేశలింగముగారు బ్రాశారుో అయితే పూండ్ల రామకృష్ణయ్యగారు తమ అముద్రితగ్రంథ చింతామణిలో దీనిని ఖండిస్తూ “వసుచరిత్రమునకు వసుచరిత్రమే సాటిగాని మరియొక గ్రంథము మన భాషలో నిప్పటికి లేదు” అన్నారు. పాటిబండ మాధవశర్మగారు తొము" పరిష్కరించిన తపతీ సంవరణము పీఠికలో రెండు కావ్యాల సంవాదములు కొన్ని చూపించి సముచిత చర్చ చేశారుో “తపతీసంవరణము 1550 ప్రాంతమున సంకల్పింపబడీ, రచింపబడి 1565 ప్రాంతమున ఇభరామునకు అంకితము చేయబడినది. వసుచరిత్రము 1570 తరువాత తిరుమల రాయలకు అంకితము చేయబడినది. ఎప్పుడు సంకల్పింపబడినదో, రచింపబడినదో చెప్పజాలము. 1550కీ పూర్వమే రచింపబడుచుండెననుట సత్యమునకు మిక్కిలి దూరము”. ఇంతటి దృఢనిశ్చయానికి వచ్చారు. కనుక మాధవశర్మగారు కచ్చితంగా ఒక విషయం ఆదిలోనే చెప్పారు. “ముందువచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములువాడి' అన్నట్లు శపతీసంవరణమే ముందు పుట్టినను, తరువాత పుట్టిన వసుచరిత్రమునకు ముందు ప్రచారము కలిగినది. వసుచరిత్ర పద్యములు ముందుగా చదివి ఉన్నవారు తపతీసంవరణ పద్యములు చదివి గంగాధరుడు, “రామరాజభూషణుని అనుసరించెననుట

సాహిత్య చరిత్రకారులకు, విమర్శకులకు భ్రమలుగాని, అభిమాన, దురఖిమానాలుగాని ఉండకూడదు. గంగాధరుడు తాను ఎవరెవరివల్ల ప్రభావితుడైనది ఒక పద్యంలో చెప్పాడు.

మున్నటి సంస్కృత కవులను విన్నాణపు దెలుగు గవుల వేడుక మీన్‌

సన్నుతులొనర్చి, యాధుని కోన్నత సత్కవుల కరుణ నూర్జిత మతినై.(తపతి.1-8)

ఈ పద్యంలో చెప్పిన ఆధునికోన్నత సత్కవుల పేర్లు తెలియవు. ఊహాగానానికి అంతుండదు. గంగాధరుని సమకాలికులే కొందరు లేనిపోని సామ్యాలు తెచ్చారేమో. కవి ఇలా అంటున్నాడు.

  1. అంధ్రకవులచరిత్ర - ద్వితీయభాగం పుట 80.
  2. అముద్రితగ్రంథ చింతామణీ - సంపుటి 11, సంచిక 12, సెప్టెంబరు 1956.
  3. మాధవశర్మ పాటిబండ,'తపతీసంవరణము' అద్దంకి గంగాధరకవి ప్రణీతము, 1౪-54, 1972

లండరి కుకవులు కొందలణు పండితమానీంద్రులగుచు బలికిన నేమీ? యొండేమి యనక వారికి దండము లొన గూర్చిరేని ధన్యులు సుకవుల్‌ (తపతి. 1-3) గంగాధరుడు ధన్యుడే. తన విషయములోనేకాదు, తన కవిత విషయంలో కూడా సత్రవర్తనను వాంఛిస్తాడు. తిన్నని పదముల నడవడి జెన్నయి పలుకులను రసము చిప్పిలు చుండన్‌ సన్నపు వార్త నటించగు నన్నువ సతివోలె గవిత యమరగవలదే! (తపతి. 1-17) సతివంటి కవితలు చెప్పిన గంగాధరుడు సత్కవే. ఇతని కావ్యం రసబంధురమే. “సుక్తమీన జలాశయంబు చందంబున కనబడే కావ్యంలో వెతికితి వసుచరిత్రలో లాగా

  • లొని గడుసుపోకడలు కనబడతాయి. రామరాబభూషణునిలాగ అద్దంకి గంగాధరుడు తూడ అక్కడక్కడ తన వైదుష్యాన్ని ప్రదర్శించుకొన్నాడు. అసంభవమైనదానిని ఆకాశపుష్పమనడం పరిపాటి ఆడవాళ్ళ నడుమును ఆకాశంతో పోల్చినప్పుడు వాళ్ళ పొక్కిలిని పొన్న పువ్వుతో పోల్చి “సభః కుసుమ మాలికా వికాసంబు లాశ్రయా సిద్ధంబు లను నైయాయిక సిద్ధాంతంబు ప్రత్యక్షప్రమాణంబున బూర్వపక్షంబు గావింపంజాలిన నెన్నడిమిపొక్కిలి పాన్నపూవుల వలనను....” అంటూ హస్తినాపురంలోని వారనారీమణులను వర్ణించే సుదీర్హ వచనంలో చెప్పాడు.” (తపతి. 1-౪) గంగాధరుడు తన తర్కశాస్త్ర పాండీత్యాన్ని ఇలా ప్రకటించాడు: నాకముననున్న దేవతానీకమెల్ల జంద్రవింబాస్థపూర్వ పక్షంబుజేసి పిదప వారల ముఖచంద్ర బింబములను నవరపక్షంబు జేనె నత్యద్చుతముగ. (2-ట) మన ప్రబంధాలలో కవులు సంగీతజ్ఞానాన్ని ఏదో ఒక కల్పనలో చూపించడం పరిపాటి. కృతిపతి ఇభరాముడు సంగీతరసైకలోలుడు (1-99) కనుక అద్దంకి గంగాధరుడు కూడ తన నైపుణ్యం ఇలా వెల్లడిస్తున్నాడు: భాస్వరంటైన మదకోకిల స్పరంబు పంచమంబని పెద్దలు పల్కవిందు మీ మధుర భాషికీమధ్య సీమకెల్ల మధ్యమం బౌట యాశ్చర్యమహిమ యెపుడు (4-6) గంగాధరుని నాయక విషయంలోనేకాదు, కవిత్వంలోకూడ “మధ్యనుం' అనువైన మాటేమో! "నాలకను వానను ననా నన ననానాణా నానా నినన
  1. ఈ సంగతిని శ్రీమతి వసుమతిగారు మొదళు చెప్పారు. ఖుతుబ్దా సుల్తానులు - అంధ్రసంస్కృతి: పుట 67.

పాన్నికంటి తెలగన్న

(క్రీస్తుశకం 575లో తెలుగు భాషలోని మొట్టమొదటి శాసనం కనబడుతున్నది. క్రీ.శ 850 ప్రాంతాలలో మొదటి కవితాసాక్ష్యాలు కనబడుతున్నాయి. అయినా అచ్చంగా _ తెలుగులోనే బ్రాసినా పూర్తి పుస్తకం క్రీశ 1575లో తప్ప వెలువడలేదు. అంటే, తెలుగుశాసనం గోచరించిన వెయ్యి సంవత్సరాలకు గాని అచ్చ తెలుగు కావ్యం ప్రభవించలేదన్నమాట. పొన్నికంటి తెలగన్న అనే కవి 'యయాతి చరిత్ర అనే కావ్యం వ్రాసి ఈ పుణ్యం కట్టుకొన్నాడు. పూర్వం మన సాహితీపరులు “సంస్కృతమే ఎల్లభఖాషలకు తల్లి అనీ, ఆ భాషలోని పదాలు లేకపోతే నిత్యజీవితంలో వ్యవహారాలూ, కావ్యరచనా సాగవనీ భావించేవారు. అయితే నిజమైన భాషాశాస్త్రవేత్తలు తెలుగు పూర్తిగా సంస్కృతంలోనుంచే జన్మించలేదని చెప్తారు. మన భాషలో తొలి వ్యాకరణం రచించిన మూలఘటిక కేతన ఆంధ్రభాషాభూషణంలో ఇలా చెప్పాడు: -

తల్లి సంస్కృతంటె యెల్లభాషలకును-దానివలన గొంత గానబడియె

గొంత తాన కలిగె నంతయు నేకమై-తెనుగుబాస నాగ వినుతికెక్కె.

(ఆంధ్రభాషా. 14)

తనంతట తానే కలిగిన కొంత తెనుగే అచ్చతెనుగు. అయితే పాలకులు, పండితులు, శిష్టులు నిత్యజీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడంచేత కావ్యభాషలో తూడా రమారమి మూడు వంతులు తత్సమాలే అధికారం చలాయించ సాగాయి. శ్రీనాథుని కాలం వచ్చేసరికి సుదీర్రసమాసాలు పద్యమంతా ఆతశ్రమించు కొన్నాయి. అతణ్ణి అనుసరించేవాళ్ళవల్ల తెనుగు మాటలకు రమారమి 'దేవిడిమన్నా' చెప్పే స్థితి వచ్చింది. అయినా ఎంత సంస్కృత పదభూయిష్టంగా పద్యం చెప్పివాడైనా పూర్తిగా అచ్చతినుగులో చెప్పిన పద్యం ఒకటైనా తన కావ్యంలో రచిస్తూ ఉండేవాడు. దానికీ లోకం పొంగిపోయేది. ఈ విషయాన్ని పొన్నికంటి తెలగన్ను ఇలా చెప్పాడు:

అచ్చతినుంగుబద్దె మొకటైనను గబ్బములోన నుండినక్‌

హెచ్చని యాడుచుందు రది యెన్నుచు నేర్పున బొత్త మెల్ల ని

ట్లచ్చ తెనుంగున న్నాడువ నందుల చంద మెరుంగువారు ని€

మెచ్చరొ యబ్బురం బనరొ మేలనరో కొనియాడరో నినుళ. (యయాతి. 1-12)

అందుకే లోకులు మెచ్చుకొంటారని తెలగన్న అచ్చుతెనుగులో కావ్యానికి కావ్యమే పూర్తిగా బ్రాయదలచాడు. ఇతనికీ సంకల్పం కలగడానికి ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులే కారణం. తిలగన్న గోలకొండ ప్రాంతాలవాడు. అతని కాలంలో ఆ రాజ్యాన్ని మల్కిభరాముడు ఏలుతూ ఉండేవాడు. ఆ నవాబుకు తిలుగు సాహిత్యమంటే ఇష్టమేగాని అచ్చ తెలుగంటే మరీ యిష్టం. అందుచేత అతని దగ్గర వుండే సరదార్లు క్ష యా ధాటి కుజ) ఖం (0 1802 70120964 & ౧౮౭2ల ర1ంయంగ (ఉం 1ంసిరా! ఈ

తం 7౭౧౮ర్హు అధిల కతం కల ుం్రనస” న్‌టుంకంలడి. గాటంరే (30ర్రాతర్హల 00 కల డజు” గంత కాజు రజి ౯ 130ర్తారంలి 06 ఓనలారాణ ౦ 14ండం0 కయ్యం, ర 281

286 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అచ్చ తెలుగును ఆదరించారు. సాహితీపరులు ఆ గ్రంథాలు చెప్పసాగారు. పొన్నికంటి తెలగన్న అచ్చ తెలుగులో కావ్యం వ్రాస్తున్నాడని అమీనుఖానుడనే వజీరు విన్నాడు అతడు మల్కిభరాము పాదుషాకు హితవరి. చదువులకు కుదురై మన్నికలకు ఎన్నికై చెన్నాందేవాడు. ఈ అమీన్‌ఖానుడు ఆ గ్రంథాన్ని అంకితం పుచ్చుకోవాలని మరింగంటి అప్పన్నగారి ద్వారా తిలగన్నకు కబురు పంపాడు. తెలగన్నను పిలిచి అప్పున్నగారు ఇలా అన్నారటః

పిలిచి పొన్నికంటి తెలగన్న! నీచేయు-నచ్చ తెనుగుగబ్బ మన్నియెడల

మించివెలయగా నమీనుఖానున కిచ్చి-పుడమిలోన సిరుల బొగడుగనుము

మున్నెవ్వరు నొడువని యీ-తెన్నిడి కడుమీరి యచ్చ తెనుగుంగబ్బం

బెన్నికమీరగ జెప్పిన-నిన్నుం బొగడంగ గలడె నెలతాల్ప్బ్పయినక?

(యయాతి. 1-10, 11)

ఈ మాటలు విన్నాక తెలగన్న మదిలో కోర్కె ననలెడ్తింది. తన కబ్బానికి తగిన రేడు అబ్బినందుకు సంతసించాడు. అమీనుఖాను సాహిత్యపోషకుడు. పట్టంచుల పచ్చడాలు, వరహాలు, గుర్రాలు, పల్లకీలు, కుంచెల అందలాలు, గొడుగులు, పడగలు మొదలైనవి దోరహత్తుగా బట్లకు ఇచ్చేవాడు (యయాతి. 1-28). బ్రాహ్మణులకు పెళ్లిళ్ల చేయించేవాడు (1-3). అతని భార్య బడేవీవి ఊళో వాళ్ళకు తలలో నాలుకలాగా ఉండేది. అందర్నీ ఆదుకొనేది. ఆమె గురించి తెలగన్న ఇలా చెప్పాడు:

అత్తవారిండ్లకు నరుగు కన్నియలకు గట్నుంబు లిచ్చుచు గారవించు

బొద్దుప్రొద్దుననె యెప్పుడు లీచి వాడల పసివిడ్డలకు నెల్ల బాలుపోయు

నాకొన్నవారల కద్దమరేళైన నారగించగ బెట్టు నరసియరసి

పాలునీ రెనసిన బాగున బెనిమిటితలపులో మెలకువ మెలగ నేర్చు

నౌర తన పుట్టినింటికి నత్తవారి

యింటికిని వన్నె దెచ్చిన తుంటవిల్తు

తల్లివంటి బడేవీవి దరమె పొగడ

దమ్మిపూవింట నెలకొన్న దంటకైన। (యయాతి. 1-6)

అమీనుఖాను మొదటి భార్య ఇటువంటి చల్లనితల్లి అయితే, అతని రెండవభార్య 'సెక్కరబీవీ చుట్టముల పాలిటి తంగేటిజున్నుు మూడవ భార్య 'సెమ్మెలీవీ కూడా అటువంటిదే. ఇల్లాళ్లు ముగ్గురూ అయిదుగురు కొడుకులను కన్నారు. పెద్ద భార్యకు గకాతఖాను, ఫాజిల్‌ ఖాను పుట్టారు. వీళ్ళలో గతాతఖాను అక్చరుచేత మెప్పులందు కొన్నాడు. ఇతనికి అరబ్బీ, పారసీ, గుజరాతీ, మహారాష్ట్రం, తెలుగు, కన్నోజి మొదలైన ఖాషల్లో వ్రాయడం, చదవడం బాగా వచ్చు. (యయాతి. 1-47) అమీర్‌ఖాక్‌ రెండన భార్యకు షేక్‌ ఇబ్రహీం, అబ్బుల్‌ అల్లీ అనే తుమారులున్నారు. వీళ్ళలో అబ్బులల్లీ కూడా అరబ్బీ ఫారసీలతోపాటు తెలుగు వబ్రాయగలడు; చదవగలడు. ఇభరాము పాదుషో హుజూరులో ఇతడు రాయకం (యయాతి. 1-57). మూడవ భార్య కొడుకు అబ్దుల్‌ కరీం చదువులప్రొడు తెలుగు భాషను, తెలుగువాళ్ళను అఖిమానించే ఇటువంటి భార్యలు:

పాన్నికంటి తెలగన్న 287 విడ్డ్ణలు ఉన్న అమీర్‌ఖానుకు తన కృతిని అంకితమివ్వడానికి తెలగన్న చాలా సంబరపడ్డాడంటే ఆశ్చర్యం లేదు.

వేసిన బాటమీద సాగిపోవడం చాలా తేలిక బాట వేయడమే కష్టం. ఏదైనా మొట్టమొదటిసారిగా ప్రారంఖిస్తున్నవాడు కొన్ని నియమాలు పెట్టుకోవాలి. తత్సమాలు లేకుండా తెలుగులో కవిత్వం చెప్పాలనుకోవడం మంచిదేగాని పేర్లు, బిరుదులు మొదలైనవి చెప్పేటప్పుడు సంస్కృత పదాలు వాడకపోతీి బోధపడదు. “చతుర్ముఖుడు! అనవలసిన చోట 'నలువ' అనీ, 'పుష్పశరుడు" అనే మాటకు “ననవిల్తుడు' అనీ వాడీతే ఫరవాలేదుగాని “పక్కిడాల్‌ వేలుపుపాక్కి:లిపసివిడ్డ' అంటే బ్రహ్మ అని తెలియడం కష్టం. అలాగే “చౌపంచములుకులు గలదంట' అంటే “పంచశరుడు' అని అనువదించుకొంటేనే అర్థమవుతుంది. సంస్కృతంలో సుప్రసిద్ధమైన పేర్లకు తెలుగులో మారుపేర్లు - పెడితే కటువుగా ఉంటుంది. అందుకే పొన్నికంటి తెలగన్న ఒక నియమం పెట్టుకొన్నాడు:

తెనుగునను మారుపిళ్ళిడి - వెనచిన వినగూడ దనుచు బిరుదులు బేళ్లుక

  • (యయాతి.1-14)

ఈ నియమానికి ఏ అయ్యా కాదనడు. యయాతి, దేవయాని, శర్మిష్ట శుత్రుడు మొదలైన పేర్లకు మారుపేర్లు పెట్టలేదని ఎవరూ దెబ్బలాడరు. తెలగన్న చాలా చక్కని నియమం పెట్టుకొని 737 గద్యపద్యాలలో యయాతి చరిత్రను వ్రాశాడు. అయితే మహాభారతంలోని కథనంతటినీ వ్రాయలేదు. యయాతి దేవయానీ శర్మిష్టలను పెళ్ళి వ్రాసిన కథకన్నా మిగిలిపోయిన కథే ఎక్కువ అనిపిస్తుంది.2 కావ్యమైతే అచ్చ తెలుగులో వనవిహారం, జలక్రీడ, విరహం, ఉపాలంభనలు, వేట మొదలైనవి అన్నీ చెప్పాడు... అచ్చ తెలుగులో చెప్పడంవల్ల కొన్ని వర్ణనలలో కొత్తదనం కొట్టవచ్చినంత స్ఫుటంగా ఉంది. అగడ్తలో తామరలు అగ్గిపిల్లలలాగ ఉన్నాయని పురవర్ణనలో చెప్పాడు.

అగడితలో గెందామర-మొగడలు గనుపట్టి జాల మూకై చూడం

దగి మున్నీటం దేలుచు-బెగడని వార్వంపుటగ్గిపిల్లలు వోలెక.(యయాతి. 1-౫)

ఎర్రతామరలు అగ్గిపిల్లలలాగ కనబడితే తెలగన్నకు తుమ్మెదలు *'చీకటిసోకుడు పిల్లల'లా గోచరించాయి (2-73). ఇది రామకథలోని వర్ణన. వ్రాస్తున్నది యయాతి చరిత్రే అయినా అందులో 101 గద్యపద్యాలలో తెలగన్న రామాయణాన్ని చెప్పాడు (2-61 నుండి 3-40 దాకా). యయాతి వేటకు వెళ్ళినప్పుడు ఒక లేడిని తరుముతూ జూబాలి ఆశ్రమాన్ని చేరుకొంటాడు. పూర్వం రాముడు ఇలాగే లేడివెంట బడ్డాడని జాబాలి రామకథ చెప్తాడు. రంభ రావణాసురునికి శాపం ఇవ్వడం దగ్గర్జుంచి కథ ఉంది. ఈ ఘట్టంలో తెలగన్న తిక్కన్నగారిని బాగా అనుసరించాడు. నిర్వచనోత్తర రామాయణంలో 2. యయాతి చరిత్ర (వావిళ్ళ ప్రచురణ 1360) పీఠిక, పుట5

తిక్కన్నగారు చకోరాలు వెన్నెలలో ఎలా విహరించిందీ విపులంగా వర్ణించారు. తెలగన్న ఆ బాణీలోనే వ్రాశాడు.

అనుకువెన్నాల దాల్చి తునిచి సేవెలు చేసి వెన్నెలపాలను జున్నానర్చి

గట్టివెన్నాల పిండిగాట్టె వెన్నెల వెన్నెగలయ వెన్నప్పాలుగా నమర్చి

గడితంపు వెన్నెల గండ్రీకల్‌ సిగరిగా దియ్య వెన్నెలలోన దెచ్చి పెట్టి

యెడల వెన్నెల చక్కెరిడి జోర్కు వెన్నెల బూనిక నాళీలుగాను గూర్చి

పండు వెన్నెల యను వెండిహ్లారముల

జెలగి యిల్గ్లాండ్రు వడ్డింప జెలులు దాము

వేడుకలు మీర బువ్వంపుగూడు గుడీచి

పొదలు తమితోడ వెన్నాలపులుగు లమరె. (యయాతి. 2-౫) ఇలా వెన్నెల పులుగులను వర్ణించడంలో రాధామాధవ కవిగూడ గట్టివాడు. అతడు చకోరాలను ఇలా వర్ణించాడు:

మొలకవెన్నెల చాలు గలిపి నెచ్చెలులకు సూడిదగా నిచ్చి యాడు నొకటి

గుజ్ఞువెన్నెల గ్రొచ్చుకొని తెచ్చి చుట్టాల బిలిచి విందులు పెట్టి మలయు నొకటి

తీగ వెన్నెలతీగె దిగిచి వేతునుకలు సేసి వల్లభ కిచ్చి చెలగు నొకటి

చిగురువెన్నెైల ద్రుంచి మగని కుత్తుక బ్రేమ గూర్కొని కూర్కొని గునియు నొకటి

లప్పవెన్నెలకుప్పు బాలలకు జూపి

మేత పెట్టించి కెలకుల మెలగు నొకటి

కేలి జంద్రోదయోత్సవన్రీల బొదవె

గోరికలు మిన్ను ముట్ట జకోరకములు, (రాధా. 4-102)

ఈ ఒక్క పద్యంలోనే కాదు. సుదీర్ణ్వమైన గద్యంలో చకోరాల వలరాచకేళి, ప్రణయ కలహాలు రాధామాధవకవి చాలా విరివిగా వర్ణించాడు. అతని ప్రభావం తెలగన్నమీద ఉంది. రాధామాధవకవిలాగ తెలగన్న తూడ 'మదనగోపాలమంత్రో పాసకుడు. రాధామాధవుడు తన గద్యలో తాను 'మదనగోపాలచరణకమలసేవా ధురీణుడనని చెప్పుకొన్నాడు. తెలగన్న కూడ గద్యలో తాను 'శ్రీ మదనగోపాల మంత్రవరప్రసాదలళ్ధి సారస్పుతసుకవిజనహిత వచోవైభవుడ'నని చెప్పుకొన్నాడు. రాధామాధవకవినేకాక ప్రబంధ కవులను కూడ తెలగన్న అనుకరించాడు. తెలుగు సాహిత్యవనంలోని రకరకాల పువ్వుల నుండి తేనెలు తెచ్చాడు. ఇతడు తన కృతిపతి వేయించిన తోటను ఇలా ప్రశంసించాడు:

వచి ననిచి పూచి కాచి పండిన యమీ౯€ - పురము మేలితోట లరసికాంచు ముసలివార్జోన బసిబిడ్డలకునైన - బండ్లు వచ్చు నలరు బ్రాయ మొదవి. (యయాతి. 1-37)

నోరూరుతుంది.

తెలగన్న అచ్చంగా తెలుగన్న!

సారంగు తమృయ్య రొజరాజనరేంద్రునికి సారంగధరుడనే కుమారుడు లేడని కచ్చితంగా చెప్పవచ్చుగాని ఆంధ్రదేశంలో అటువంటి పేరున్న వ్యక్తులు లేకపోలేదు. క్రీ.+ 1580 ప్రాంతాలలో గోలకొండ నగరానికి సారంగు తమ్మయ్య అనే కవి కరణంగా ఉండేవాడు. ఇతని మూలపురుషుని పేరు. స్రారంగధరుడట. అందుచేత వంశాన్ని సారంగువారని లోకులు పీలిచేవారు. ఈ కుటుంబంలో అందరూ గణితవిద్యావిశారదులు. మహమద్‌ కులీ కుతుబ్‌షా గోల్కొండను 84 దుర్గాలతో ఏలుతున్నప్పుడు సారంగు తమ్మయ్య గోల్కొండ కరణీకం చేస్తూ ఊండేవాడని అతడు వ్రాసిన వైజయంతీవిలాసం అనే కావ్యంలోని ఈ పద్యంవల్ల తెలుస్తూంది. ఇనసమతేజులౌ నృపుల నెల్ల మహమ్మదుశాహి యేలు నీ యెనుబదినాల్లుదుర్గముల నేలిన యేలిక గోలకొండ ద “ ద్ద్హననగరస్థలిక్‌ గరణికం బొనరించెడు దమ్మమంత్రి యా జనపతి రమ్ము పొమ్మన బ్రజల్బ్జయవెట్ట గృహస్థు లౌననన్‌ (వైజు 1-30) ఈ పద్యంవల్ల సారంగు తమ్మయ్యను మహమ్మదుషా 'రా, పో అని తన కొలువుతూటానికి పిలుస్తూ ఉండేవాడని తెలుస్తున్నది. నవాబుతో ఇంత పరిచయం ఉన్న వైజియంతీవిలాసం నాలుగాశ్వాసాల కావ్యం. మొత్తం 5888 గద్యపద్యాలలో విప్రనారాయణ చరిత్ర కవి వ్రాశాడు. పన్నిద్దరాళ్వారులలో విప్రనారాయణుడు ఒకడ". ఇతడు విష్ణుమూర్తి మెడలో వుండే “వైజయంతి” అనే మాలిక అవతారం. అందుకే కవి ఈ కావ్యానికి ఆ పేరు పెట్టాడు. శ్రీరంగంలో ఒక విప్రుని ఇంట నారాయణుడనే బిడ్డ లేకలేక పుట్టాడు. అతడు పెరిగి పెద్దవాడై విష్ణుభక్తుడై స్వామివారికి రోజూ పువ్వులు దండలు గుచ్చి పంపించేవాడు. పరుల తోటల విరులచే సరుల నెంత పెంపుగా స్వామి కే సమర్చించుచున్న దీనిచే గూలి మాత్రంటెకాని పూర్ణ ఫలము రాదని యొక్కయుపాయ మెంచి.

(వైజు 1-91) తానే స్వయంగా ఒక తోట వేయించాడు. చుట్టు పంచాది పెట్టించి అందులో చౌకంగా మూడు చేరుల చవిక కట్టించి నియమంగా ఓక తులసివనం పెంచాడు. రోజూ పువ్వులు సమర్పించేవాడు. ఒకనాతడని తోట ప్రాంతాలకు దేవదేవి అనే వేశ్య తన సోదరి చుధురవాణితో వచ్చింది. వాళ్లిద్దరూ చోళదేశంలోని రాజుగారిని తమ విద్యలతో మెప్పించారు. దేవదేవి శ్రీరంగంలో రంగశాయి గుడి పాత్ర. ఆమె నాట్యుం చేస్తే చోళరాజు “హవుదప్పాః పాత్రరాయః అహహ భళిభళి' అని మెచ్చుకున్నాడు. వేయినూట పదహార్ష కృపచేసి పంపించాడు. దేవదేవీ, మధురవాజణీ ఆ తోటలో విప్రనారాయణుని చూచి నమస్కరించారు. అతడు వాళ్లను కన్నెత్తి చూడలేదు. తన దారిని తాను పోయాడు. దేవదేవి నొచ్చుకొంది. అతణ్జి పరమవిటునిగా చేస్తానని పంతం పట్టింది.

290 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ప్రకటజికేంద్రియుల్‌ ధర బరాశరకౌనికు లంతవారు స్త్రీ

లకు వశు లంతకంటి మిగులం దృడమై మగకచ్చ బిగ్గ గ

ట్టుకొనగ నీత డెంత శుకుడో హనుమంతుడాొ ఖీష్ముడో వినా

యకుడొ తలంచుమా సరసిజాయతలోచన! నెమ్మనంబునన్‌. (వై 2-10)

ఇటువంటి అయ్యలేకదా సంజనేళ చిటుకుమనకుండా ఘటచేటీవిటులై ఊళ్లో తిరుగుతూ ఉంటారని ఆమె విశ్వాసం. విప్రనారాయణుని మార్చలేవని మధురవాణి సవాలు చేసింది. “నువ్వే కాదు, ఈ ఊళో ఇంకెవరూ అలా చేయలేరు. చేస్తే ఆ వేళ్ళకు నేను నీళ్లూ కట్టిలూ మోస్తాను అని మధురవాణి ప్రతిజ్ఞ చేసింది. అక్కచెల్లెళ్లు పందెం వేసుకున్నారు. మర్నాడు దేచదేవి దాసరిసాని వేషం వేసుకుని విప్రనారాయణుని తోటకు వెళ్లింది. అతడు ఉట్టిబెట్టిన గుమ్మడికాయలా కూర్చొన్నాడు: ఆమె మొక్కింది. 'మీ తిరువడిఘళ్‌ ఆశ్రయించడానికి వచ్చాను. ఎవరూ లేనిదానను' అంది. అతడీలా ప్రశ్నించాడు ఫి

తల్లి దండ్రి యన్నదమ్ము లెవ్వరు లేక-యొంటి మింటినుండి యుట్టీపడీతె

యింతి యింతకాల మెందుంటివి విర క్తి-కిని నిమిత్తమేమి యొనర జెపుమ.

(వైజు 2-61) తాను వేశ్యననీ, వృత్తిమీద విరక్తి కల్లి ఇలా వచ్చాననీ చెప్పింది. అది ఎంత నీచాతినీచమైన బ్రతుకో 31 గద్యపద్యాలలో వర్ణించి ఆ రోత భరించలేక వచ్చానంది.

వారసతులైన యీసీమవారివలెనె-మోడిమానిసినైన నే గోడు లేదు

జీహ్వ నాల్గచ్చరాలు నేర్చికకాన-పడపుగూటికి మనసుగొల్బకయిటైతి. (వైజు, 2-౫5) ఆమె అలా చెప్పాక అతనికి అనుమానం వేసింది. 'ఇమ్ముల వేశ్యాసహవాసమ్ములు శ్రీవైష్టవ్రులకు చందంబగునే మమ్మావల నేమందురొకొమ్మా యీ లోకులు' అని చెప్పాడు.

కాకులు రావిపండ్లు దిని కక్క కిలా మయదేవమందిరా

నీకములందు రావులు జనించును సజ్జ్దినచిత్తవృత్తి య

వ్యాతులలీల రాతిగుడివంటిది లోకములోన వేశ్ళలుం

గాతులవంటివార అటుగాన బ్రమాదము చేరనిచ్చినన్‌ (నైజ, 2-౫) రాబోయే ప్రమాదాన్ని ఆ వేదవేది చెప్పాడు. దానికామె తగిన సమి౭ధానం చెప్పింది.

1 తనకు భోగేచ్చ లేదని చెప్పింది. ఒకవేళ వుంటే, గంతలకు తగిన బొంతలు లేవా,

ఇక్కడకు రావాలా అంది. అతణ్జీ సవాలు చేస్తున్నట్టు పాత సామెత జ్ఞాపకం చేసింది.

వినవే సామెత మును తన-మనసు పదిలమైన లంజమందిరముననై

నను గాపుర ముండగనగు-ననగను నిట్లాడ నీకు నగునె మహాత్మా! (నైజ. 2-10) విప్రనారాయణుడు ఆలోచించాడు. తన మనసు సంగతి తనకు తెలుసు. దేవదేవి చిత్తశుద్ధిని నమ్మాడు.

సారంగు తమ్మయ్య 291 రూపమున గుంటి గాదు కురూపి కాదు వారసతియైై గడించు నీ వయసునందు దేశమున ఖిక్షమెత్తుకో దీని కేల మనసు గట్టి విరక్తి బొందినదిగాన (వైజ, 2-105)

అతడు ఆశ్రయం ఇచ్చాడు. ఆమె దాస్యాన్ని అంగీకరించాడు. మ్రూనిలో చేవ చొచ్చినగతి

ఆమె ప్రవేశించింది. ఈ పరదేశి పడుచును సాకమన్న ఉపేక్షాపచారం అవుతుందని అమెపట్ల కరుణ వహించాడు. ఆదరం మెల్లగా ఆశగా మారింది.

వటుమానససు క్షేత్రము - గుటిలాలక చేష్టితముల గుద్దలి గొనియి =

ట్టటు పాదుచేసి మోహపు - వటవీజము మరుడు నాటి వర్ధిలజేసెన్‌.(వైజు 2-136) ఎప్పుడు వేరే ఉద్దేశాలు అతని మనసులో ప్రవేశించాయో అప్పుడే వజ్రపంజరంలాంటి అతని మనసు కరిగి నీరుకావడం మొదలుపెట్టింది. ఈ మార్చు క్రమక్రమంగా వెలా సంభవించిందో చాలా చక్కని పద్యంలో సారంగు తమ్మయ్య చెప్పాడు.

ఆ విప్రోత్తము వజ్రపంజరనిభంటై నిశ్చలంటైన స

ద్చావం బంగన సాహచర్యగుణసంపర్కంబునక్‌ లోహమై

గ్రావంఖై దృడదారువై తరుణవృక్షంబై ఫలప్రాయమై

పూవై తన్మకరందమై కరగెబోబో నీళ్ళతుం బల్బనై. (వైజు 2-13) అతడు మనోజవేదనలో పడ్డాడని ఆమె గ్రహించింది. గారదావిన మీనులాగ తన వలకు జేరబో బోడి దాసరని ఆమె సంతోషించింది. ఒకనాడు కుంభవృష్టి కురిసింది. వాన నెపంతో ఆమె నాతడు ఆశ్రమానికి ఆహ్వానించాడు. 'వనితా, చలి నుండ నేల, వెచ్చని తావునకు రమ్మన్నాడు. చల్లకు వచ్చి యింక దాచడ మెందుకని కోరిక చెప్పాడు. ఆమె అశ్చర్యం నటించింది. 'నొసలు భక్తుడు, నోరు తోడేలు అన్నట్టుంది తీరు అంది. “సరే దేవర. చిత్తంబులోన కర్తవ్యం బేమిటి? అని ఒప్పుకొంది. అతడు తిరువళకు అపేయమన్నాడు. ఆమె ఇలా చెప్పింది:

దీపము మన్మథరాగో- ద్లీపము లక్ష్మీకరము మదికి భయహరమౌ

దీపములేని రతు ల్సుఖ-లోపము లవి చీకటింటిలో వెకిరింతల్‌. (వైజి, ౩-26)

ఏ పనులకైనా దీపం కావాలి. ఈ పనులకు తగదని అతడన్నాడు. “దీపం ఆర్బడ'

మెందుతు? దానికీ మనతూ మధ్య తెర కడతానంది. ఆ నెపంతో ఆమె తాను కట్టిన చీర

విడిచి తెర కట్టింది. తెరతోపాటు అతని ఆటతూడా కట్టింది. ఆమె వెంట సానివాడకు వెళ్ళాడు. ఆమె పంచ చేరాడు. వేశ్వమాతకు ఆశ్చర్యం వేసింది. ఇటువంటివాణ్ణి తన తూతురు ఎందుకు వలచి తీసుకువచ్చిందో అనుకొంది. దేవదేవి ఇలా చెప్పింది పొది నప్పయు నేనును బ-న్నిదమాడిన కోస మితని దెచ్చితి నికనా కొదవ పని తీరె నిక - నీ-కొదవయె యని పల్క తల్లి కూతున కనియెన్‌. (వైజ ౩-౫)

292 నమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దానితో వేశ్ళ్వమాత విజృంభించింది. విప్రనారాయణుని వెళ్ళగొట్టింది. దేవదేవి ఎడబాటును అతడు సహించలేకపోయాడు.

తలచిన నిద్ర రాదు చలిదార్కొను మోసల బేర నెవ్వనిం

విలిచిన గుండె జల్లుమను బేర్చు మనఃపరితాపవేదన

ల్నిలిచినచోట నిల్వ ధృతి నెక్కొన దక్కట! రంగరంగ తా

వలచిన యింతి బాయువగ వద్దు సుమీ పగవానికేనియున్‌. (వైజ, ౩3-115) విరహం భరించలేక విప్రనారాయణుడు దేవునిమీద భారం వేశాడు. వేశ్వమాతకు సౌమ్మ దర్శించుకుంటేగాని దేవదేవి యింట అడుగుపెట్టడానికి వీల్లేదు. దేవుడు తన గుడిలోని బంగారుపాత్రను తీసుకువెళ్లి విప్రనారాయణుని తరపున ఇచ్చాడు. వేశ్యమాత పుచ్చుకొంది. విప్రనారాయణుని తండ్రీ లక్షాధికారి. ఇలాంటి స్తామ్ములు యింకెన్ని ఉన్నాయో పుచ్చుకొందామని లేని ప్రేమతో పిలిపించింది.

గుడిలోని పాత్ర పోవడంతో అర్చకులు భయపడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. తలవరులు చక్కని ఆపరాధపరిశోధన చేసి విప్రనారాయణుని బంధించారు. శ్రీవైష్టవులకు తలకొట్టినట్టయింది. ఇతర మతాలవారిలా ఎత్తిపొడిచారు:

చోరుడనంగరా దొరుల సౌమ్ములు ముచ్చిలినం బ్రసన్నుని౯

జారుడనంగరాదు పెలుచం బరకాంతలగూడ వీడనా

చారు డనంగగూడ దనిశంబును వేశ్యలతో రమించినం

బోరన మీర లీతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్టవుల్‌. (వైజు 4-101) వాళ్ల మాటలు నిజం చేయడానికో అన్నట్టు దేవుడు కడపట ప్రత్యక్షమై విప్రనారాయణుని, దేవదేవిని చూపించి ఇలా అన్నాడు:

లీలావినోదమునకై - యీలాగున నేను వీరి నిరువురి రతిరా

ట్కేలిం గూర్చితి మద్యన-మాలిక యిత డప్పరఃప్రమదయీసతియున్‌.

(వైజు 4-15) భాగవతులు నిజంగా విప్రనారాయణునికి బ్రహ్మరథం పట్టారు.

ఈ కథను సారంగు తమ్మయ్య ఆడుతూ పాడుతూ హాయిగా వబ్రాసినట్టు కనబడుతుంది. చక్కని హాస్టుంతో, చల్లని జాతీయాలతో మెత్తగా కథ చెప్పుకుంటూ పోయాడు. ఇతడే కాకుండా. ఇంకా ఎందరో ఈ విప్రనారాయణ చరిత్రను వాసీ మెరుగులుపెట్టారు. అందుచేత ఇతడు పాత్రలను దిద్దిన తీరు బాగా రాణించలేదని కొందరు భావించవచ్చు. అయితే నిష్పక్షపాతంగా చూస్తే తమ్మయ్య చిత్రించిన తీరు బాగులేదనలేం కాడు. ఆశ్రయమిచ్చేటప్పుడే అతడు భయపడ్డాడు. అలాగే జరిగింది. ఇతర కవుల విప్రనారాయణ చరిత్రలలో నాయకుడు మనిషిలాగా ఇంత స్పష్టంగా కనబడడు. తమ్మయ్య మానవ స్వభావాన్ని అర్థం చేసుకొన్న దిట్ట

చదలువాడ మల్లన్న 293

వైజయంతీ విలాసం తప్ప ఇతడు తెలుగులో ఇంకే రచనా చేసినట్టు కనబడదు. "హరిభక్తి సుథోదయం' అనే ఇరవై అధ్యాయాలు గ్రంథానికి సంస్కృతంలో వ్యాఖ్యానం వ్రాశాడు. దానికి 'భక్తసంటీవిని' అని పేరు పెట్టాడు. అందులో ఒక సంస్కృత శోకంలో కాను భాగీరథీపట్టణానికీ మంత్రినని చెప్పుకొన్న సంగతి తొలిప్రకరణంలోనే తెలుసుకొన్నాము.*

ఆ భాగీరథీపట్టణమే మన భాగ్యనగరంగా మారింది. తమ్మయ్య రాచకార్యాలలో ఉండి ఎక్కువగా కృతులు చేయలేదనుకోవాలి.

సమకాలిక జీవితాన్ని చక్కగా చిత్రించే ఇటువంటి కవులు ఒక కావ్యం, వ్రాసినా చాలు.

చదలువాడ మల్లన

కవిత్రయంలో ఒకరైన ఎర్రయ్యగారి తరువాత ఆ వంశంలో కవులూ, పండితులూ కృతులు చెప్పి రాజసత్కారాలు పొందారు. ఎర్రయ్యగారు రెడ్డిరాజుల కొలువులో ఉండి శ్రీశ 1360 ప్రాంతాలదాకా జీవించి ఉండవచ్చు. వారి తరువాత ఒక నాలుగు తరాలు ఆ కుటుంబంలోని వాళ్ళ గురించి తెలియదుగాని క్రీ.శ. 1485-90 ప్రాంతాలలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సాళువ నరసింహరాజు చదలువాడ మల్లనగారిని సత్కరించాడు. ఆ తరువాత క్రీ.శ. 1515 దాకా ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించిన గజపతులు ఈ మల్లన్నగారి కుమారుడు ఎగ్రన్నగారిని అందలాలూ, అభరణాలూ ఇచ్చి సంతోషపెట్టారు. గజపతులను మెప్పించిన ఎర్రయ్యగారికి లింగన్న అనే కుమారు డున్నాడు. ఆయన “రాజులు మెచ్చగ' కావ్యాలు చెప్పాడు. ఈయన క్రీ.శ. 1540 ప్రాంతాలవాడు. ఇతనికి ఒక కుమారుడు పుడీతే లింగన్న తన తాత పేరు పెట్టుకొన్నాడు. ఈ మల్లన్న గురించే మనం ఇప్పుడు చెప్పుకొంటున్నాం.

ఈ పండిత కుటుంబం మొదట గుడ్తూరు సమీపాన ఉండే చదలువాడలోనూ, తరువాత కాళహస్తిలోనూ ఉండేవారు. "శ్రీ కాళహస్తీశ్వరదయాసహాయం'తో మల్లన కవిత్వం చెప్పసాగాడు, ఇతడు “అనుపమరచన' గా రుక్మాంగద చరిత్రను ద్విపదలలోచెప్పి రామయ్యగారి భాస్కరునికి అంకితమిచ్చాడు. రామయ్య భాస్కరుడే కొండవీడు ప్రాంతాలలో బాచరుసయ్య అనే పేరుతో క్రీశ1550 ప్రాంతాలలో పాలించాడు. చదలువాడ మల్లన వ్రాసిన ద్విపద రుక్మాంగద చరిత్ర ఇప్పుడు దొరకడం లేదుగాని ఒకనాడు దీనిని లాక్షణీకులు ప్రమాణంగా అంగీకరించారని చెప్పవచ్చు. అఖండయతులను చెప్పుతూ అప్పకవి ద్విపద రుక్మాంగదలో నుంచి ఈ రెండు పాదాలను ఉదాహరించాడు.

  1. నవాబులయుగం. సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి, 2003 2 ఈ శోకాన్ని డా లి. రామరాజుగారు ఉదాహరించారు. “శాంతి - సాహిత్య సంకలనం, సంధాత- భార్గవదేవ విద్యాకులపతి, గుంటూరు, పుటలు 670-672.

204 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

శ్రీకరగుణసాంద్ర చిరయశోరుంద్ర- ఆకారచంద్ర రామయభాస్కరేంద్ర।

  • (అప్ప. ౩-29)

అనుపమ రచనగా ఈ రుక్మాంగద చరిత్రను చెప్పాక చదలువాడ మల్లన కాగ్వేటినగరానికి చేరి ఉంటాడు. ఈ మండలం క్రీశ 150 దాకా సాళువెడ్ల పరిపాలనలో ఉండేది. ఆ తరువాత మాకరాజు వంశీయుల హస్తగతమైంది. క్రీ.శ 1550 ప్రాంతాలలో ఈ పరిసరాల్లో దోపిడీదొంగల ముఠా ఉండేది. ఆ గుంపును మాకరాజు అనే వీరుడు అణచివేశాడు. డెబ్బయిఏడు పాశముల మన్నీలు ఏకమై బైదగుండ్లపై వచ్చినప్పుడు ఈ మాకరాజు కోట వెలువడి అవలీలగా జయించాడట. ఈ మాకరాజు కుమారుడు తిమ్మరాజు క్రీశ 1580 ప్రాంతాలలో నేటి కార్వేటినగరాన్ని పాలిస్తూ ఉండేవాడు చదలువాడ మల్లయ్య విప్రనారాయణ చరిత్రను అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాసి ఈ తిమ్మరాజుకే అంకితమిచ్చాడు. ఇతనితో కలుపుకొని నలుగురు కవులు నలఖై సంవత్సరాలలోపున నాలుగు రకాలుగా ఈ విప్రనారాయణ చరిత్రనే రచించారు. వాళ్ళ వివరాలివిః

గ్రీశు 1545 | పరమరొగివిలాసం తాళ్ళపాక చిన్నన్న

ద్విపద - నాలుగోఆశ్వాసం క్రీశ 1564 పరమరోగివిలాసం సిద్ధరాజు తిమ్మరాజు చంపు-3:181-309

క్రీశ 1580 విప్రనారాయణ చరిత్ర చదలువాడ మల్లన

క్రీశ 1580 | వైజయంతీ విలాసం సారంగు తమ్మయ్య

ఈ నలుగురిలో మొదటి ఇద్దరి రచనాకాలం నిర్ణయించడానికి ఆధారాలున్నాయి గాని, మిగతా ఇద్దరిలో ఎవరు ముందో ఎవరు వెనకో చెప్పలేం. చివరి మూడు గ్రంథాలనూ చదివిచూస్తే *“పరమయోగివిలాసమును మల్లనకవియు, విప్రనారాయణ చరిత్రమును దమ్మయ్య కవియు జదివియుందురనియు, విప్రనారాయణ చరిత్రమునకు మెరగుపెట్టవలెనను తలంపుతో దమ్మయ్య వైజయంతీ విలాసము రచించెననియు స్ఫురింపకపోదు'” అని కొందరు పండితులు భావిస్తున్నారు. అయితే వైజయంతీవిలాసం క్రీ.శ. 1510లోనే పుట్టిందని మరికొందరు భావిస్తున్నారు. అయితే ఇరువురును దాదాపు సమకాలికులే. ఒకరి కావ్యము నొకరు చూడక వ్రాసియుందురని చెప్పి విప్రనారాయణ చరిత్ర రచనాకాలం శ్రీ.శ.1530 అని వారే అఖిప్రాయపడుతున్నారు. అయితే ఒకటీ చూత్రం చెప్పాలి. తొలి ముగ్గురి కథలూ ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. సారంగు తమ్మయ్య మార్పులు చేశాడు. అందుచేత తొలి మూడు గ్రంథాలే తొలి రచనలని చెప్పవచ్చు. వాటి సామ్యాలు చూద్దాం.

సూర్యనారాయణశాస్త్రిగారు, పుట 8.

  1. అంధ్రకవితరంగిణి: 8వ సంపుటం - చాగంటి శేషయ్యగారు, పుట ౫
  2. అంధ్రకవితరంగిణి: 10వ సంపుటం - చాగంటి శషయ్యగారు, పుట 9.

చదలువాడ మల్లన 295

విప్రనారాయణుణ్ణీ మోహపరవశుణ్జి చేస్తానని దేవదేవి పందెం వేసింది. అతని అశ్రమంలో చేరింది. అతడు ఆమె చేతికి చిక్కలేదు. 'కొనసాగని ప్రతిన ఎందుకు వ్రాసిన ద్విపద పంక్తులు ఇవి:

అని కనుమూయంగ నారంగవిభుడు - సనుదెంచి “వెరవకో సారంగనే[త

యెల్లి యీ ప్రొద్దున కెల్ల నీమనసు- జిల్లజేసెద'నని చనిన మేల్కాంచి.

(ద్విపదపరమ, 4, పుట 289)

దీనినే సిద్ధరాజు తిమ్మరాజు ఇలా వ్రాశాడు:

ఇట్టి చింతతోడ నింత యొకింతగూ-య్కటయు రంగనాయకుండు గరుణ

పౌలుపుమీర దాని కలలోన బ్రత్యక్ష-మగుచుగానిపించి యాదరమున.

ఏల విచారించెద వో- బాలిక! నీ కోర్కెయెల్ల ఫలితంబుగ నే

వాలాయము గావించెద-జాలి యడుగుమనుచు బలికి చనియెం జనినక్‌. ఇదే విషయాన్ని ఒక పద్భుంలోనూ, కొంత వచనంలోనూ చెప్పాడు:

నేరము చేసితి నెంతయు - నీరేరహనాభ కృష్ణ నీ తిరువుళ్ళం

బేరీతి నానతీవే - శ్రీరంగా రంగరంగ సేవకఫలదా! అనుచు జింతాపారవశ్యమున గొంత నిద్రించు సమయంబున నార్హజనశరణ్యుండును నిఖిలదేవతావరేణ్యుండును భక్తజనఫలప్రదాయకుండు నగు రంగనాయకుం డయ్యింతి భావంబున నావిర్భావంబు నొంది 'యిందువదనా భవదీయ మనోరథంబు సఫలంబయ్యెడు, ఎల్లి యీఫ్రొద్దు దనుకం దాళుకొ'మ్మని యనుగ్రహించి యప్పంచశర గురుండు తిరోహితుండైనం గనుంగొని చంచత్కుతూహలాద్చుత భయసంభ్రమంబులు మనంబునం బెనంగొన నాత్మగతంబున... (విప్ర ౩-43, 44)

సారంగు తమ్మయ్య కథలో దేవదేవి విచారించడంగాని, దేవుడు తలలో కనబడీ హామీ ఇవ్వడంగాని లేదు. తొలి ముగ్గురూ దైవఘటనకే ప్రాధాన్యమిచ్చారు. తమ్మయ్య మానవుల గుణాలనే చిత్రించడానికి ఎక్కువ ప్రయత్నించాడు.

దేవదేవి తల్లికి “విటకంటకి' అనే ఖ్యాతిని చిన్నన్న తిమ్మరాజు, మల్లన్నలు ముగ్గురూ వ్రాశారు. “కడుకోప మెసగి రోకలి మూపుమీద నిడుకొని ఆ వేశ్యమాత వచ్చిందని చిన్నన్న బ్రాశాడు (పుట 299). 'బుజముపై నొక్క రోకలి పూనిపట్టి గదరుకొనుచును గసరుచు బెదవులదర' దానిని మల్లన ప్రవేశపెట్టాడు (4-19), సారంగు తమ్మయ్య గిన్నె తెచ్చిన వటునికి 'బాగాలు, తెల్లనాకు, శైరవళ్లు, గంధాక్షతలు' ముందు ఇప్పించాడు.

తొలి ముగ్గురు రచయితలూ విప్రనారాయణుని పహజీ భక్తివైరాగ్యాలను తొలినుంచి చూపించారు. అతని దృడచిత్తాన్ని చూపించారు. తమ్మయ్య సృష్టిలో విప్రనారాయణుడు మానవమాత్రుడు, మల్లన సృష్టించిన విప్రనారాయణుడు వానవచ్చినరాత్రి, తన తోట ఏమైపోతుందోనని ఇలా భయపడతాడు:

206 నమల్రాంభ్ర సాహిత్యం - రెండన సంపుటి

కావేరి పూర మెక్కడ వెల్లివిరనెనో యొద్దిగాలువయెద్ది యుర్లబడెనొ

అసదైన మ్రాకులెయ్యెవి పెల్లగిల్లినో యాకు లేవంక జీ కాకుపడెనొ

కలిగాట్టు చిన్న రెమ్మల...బెట్టెనో మడిసి యే కొమ్మలు బడలుపడెనొ

గాడ్పుచే నూటాడి కారె యేమయ్యెనో లతికల చెలువ మేగతినిజనెనో

తెలియ నింతయు వర్షంబు వెలియదాయె

మొగులు మొత్తంబు లెప్పటి పగిదితోడ .

గారు శ్రమ్ముచు నున్నవో కాక కొంత

పలుక బారెనొ కనుగొనవలయుననుచు. (విప్ర ౩-6) తోటలోనికి వెల్లి మొక్కలను చూడాలనుకొంటాడుగాని ఆ తోటలోనే తోటమనిషి ఒళ్తు ఉందనే జ్ఞాపకమే మల్లనపాత్రతు లేదు. ఇక సారంగు తమ్మయ్య చిత్రించిన విప్రనారాయణుడు అదిలోనే అమెను ఉపేక్ష చేయగూడదవి ఖావిస్తాడు. దానికి కారణాలిమి:

ఏ ఐబసావడి తోటకేతెంచునందాక బనిసేయు దా ఐసాపడనులోదు

నే వేత బనివట్టితే జూచి ముందుగా దానందుకొను నొడల్‌ దాచుకొనదు

నే మేల్కనకమున్న తా మేలుకొకి దేహశుద్ధియై తిరుమూళ్ల శుద్ధిచేయు

నేనిద్రబోవుదాకా నిచ్రబోవ. దేవని చెప్పునోయని పాయకుండు

విరతిమై నంటు వేపుర విడిచివచ్చి

తోటపనిపాటుకొదిగి వాతో బ్రయాన

వడుచునున్నది పరదేశిపడుచుదీని .

పాతకున్న ను పేక్షాపచార మొదచు. (వైజయంతి. 2-12) ఉపేక్ష చేయకూడదనే తమ్మయ నాయకుడు తనకు వెరుమాళ్ళ తోవెల ప్రసాదము కట్టడివన్తూ ఉంటుందని అ శళియ వ్రసాదం అమెకు ఇస్తాడు. తమ్మయ పాత్ర భర్తుడైన మనిషే. ఇతరుల విపనారాయణులు ఎప్పుడూ మహనీయులు కొంతవరకు చిన్నన్న పాత్రవిత్రశే వాన్తవానికి దగ్గరగా ఉంటుంది. వానలో తడిసిన దేవదేవని యివ్వేళ నేకాంతమునవచ్చి యెలనాగలున్న నేకాంతులకు కూడునా అనుకొంటాడు. బడియక మావర్ణశాలలోనికి' అంటాడు. ఇప్పుడు దేవదేవి తడియార్చు చందాన కొంక పౌందర్య్యాన్ని వ్రదర్శిన్తుంధి. "ఐడలితి రొక్కింత వదములొత్తుదునో” అవి కాళ్ల వడుతుంది. చలిగాలికొరకు వీచింది అఆ మోహనాంగి చేయి అండం వ్ల వివ్రనారాయణుడు

హరికుబ్దమున్ను వెయ్య్థంబునంగలయు - కరణి వాలేమ నంగబకేశిదేల్చె

(గ్వాపదపరమ-4, వుట 25)

మెరుగులు పెట్టాడు. తడున్తున్న దేవదేవిని మల్లన విప్రవారాయణుడు దయదలలి

చదలువాడ మల్లన 297 పిలుస్తాడు. ఆమె లోనికి వస్తుంది. ఆ తరువాత ఆమెను “ఇది ముటుకోకతు, అది ముట్టుకోతు' అని హెచ్చరిస్తాడు. క తడికాళ్ళతో ద్రొక్కెదవుచుమీ యిదె కుశా స్తరణ మాత్మధ్యానసమయమయ్యె నెడలేదు వేష్టువ-లిటురమ్ము ముట్టెదు గనుక ప్రాతస్స్నానమునకు వలయు నీఠంబుపై తీర్ధ పెరుమాళ్లు వేంచేసి యున్నవా రపచార మోసరిల్లు పెట్టినారము పట్టిబుట్టిలో దులసిని జతనంబు భానువాసరము రేపు వల్ల మామూల వలపిరిచల్లు నిచట నురియు న్లీభాయ నిద్రమై నుందునచట మహితరామానుజో దీర్యమాణభాష్య ముఖబహుగగ్రంథ సామీష్ఫామునకు జనకు. (విప ౩-77) దేవదేవి సామాన్యురాలా? “ఈచలికతంబున నిద్దుర రాదు, విష్ణుగాథా పదలీలలం గడపెదం దగుప్రాద్దు అని కోకిల ధ్వనితో ఆలాపన చేసిందకు. తలిరుంబోడి దొడంగి మాధవుడు రాధంగూడీ క్రీడించూ గా థలు కుబ్దం గయికొన్న వార్తలను సత్యావాంఛ లీడేర్చుసు ద్దులు నాఫీరవధూటులందుగల పౌందున్‌ రుక్కిణీదేవిపై చెలిమిం గ్రొన్నన యిచ్చులాగు వినిపించెన్‌ మాధురీ వైఖరిన్‌. (విప్ర ౩-౭2) శృంగారరస ప్రధానమైన కథలు చెప్పిన తరువాత ““బడలినవార లిందనుక బాదులు ద్రవ్వియుగారమెత్తియున్‌* అని కాళ్లు ఒత్తుతుంది. అతనికి పులకలెత్తాయి. రంగస్వామి ప్రీరేపగా విప్రనారాయణుడు అమెతో శ్రీడించాడని మల్లన మనకు చిన్నన్న మాటలనే జ్ఞాపకం చేస్తాడు. అయితే మల్లన గారి విపనారాయణునకు దేవదేవే సమస్తం నేర్చవలసి ంది. వని చక్కెర కెమ్మోవి చవిచూచిచవిచూడనొయ్యన గొనగోరనొత్తియొత్తి చుంబన క్రియలను జొక్కించి చొక్కింపగడునోయారముగాగ గవిసికవిసి విగియారు కౌగిట సౌగియించి సొగియింప జిట్టంటుచేతల జెనకి చెనకి యుచితబంధానుబంధత నుండియుండ - సనగిపుంభావరీతుల ననగి పెనగ

  • దపసికిని నేర్పియతని మౌగ్ధ్యంబునెల్ల - రమణివిడనార్పెనతను ప్రొడిము చెలంగ (విప్ర ౩-90) మల్లన వర్జించినా దేవదేవీ విపనారాయణుల శృంగారంలో చెలగిన 'అతను ట్రొడిమ' ఎలాంటిదోగాని ఇతని కావ్యంలోచూపిన ప్రొడిమ పూర్తిగా స్వతంత్రం కాదు. తిమ్మరాజూ, మల్లనా, తమ్మయ్యల్ద రచనలు పరిశీలించాక “'“కథాసన్నివేశకౌశలమందీ ముగ్గురు కవులలో దారతమ్యము నిరూపించవలసినచో గొన్నిపట్ల దమ్మకవియే యధికుడని చెప్పదగినను ననేక ప్రధాన విషయంబుల మల్లనయే మేలనిపించుకొను”' నని జయంతి రామయ్యగారూ, మల్గాది సూర్యనారాయణశాస్త్రిగారూ అభిప్రాయపడ్డారు. అయితే ఆ ప్రధాన విషయాలు కొన్ని చిన్నన్నకు ప్రతిధ్వనులు.
  1. ఏప్రనారాయణ చరిత్ర (పరిషత్చచురణ) పీఠిక, పుట 12,

పింగళి సూరన్న అప్పటికి ఆంగ్ల సాహిత్యంలో షేక్సుపియరు అడుగుపెట్టలేదు. ఎడ్మండ్‌ స్పెన్సరు కూడ తన ప్రథమ కావ్యం రచించలేదు. నేటి బృహత్కథలకు వాడే 'నావెల్లా' అనే పదంతో ఇటాలియన్‌ భాషలో సరికొత్త సాహిత్యరూపం ప్రభవించలేదు. హాలెండు దేశంలో డచ్చి కవితాసార్వభౌముడు వాండెల్‌ జన్మించలేదు. అలాగే ఈనాటికీ కొత్త వ్యాఖ్యానాలూ, అర్థాలూ, ఆలోచనలూ రేపే “డాన్‌ కీ హోటే*ను రచించిన 'సర్వాంటెజ్‌ స్పెయిన్‌ సాహిత్యంలో ప్రవేశించలేదు. ఫ్రాన్సు దేశంలో మాత్రం అప్పుడప్పుడే 1'గర్లాంటువ' అనే విడ్తూరమైన పాత్రను సృష్టించి “రబెల్లే నవలల వంటి రచనలు చేశాడు. ఇటలీలో తూడ ఆర్గండో 'ప్యూరియానో' అనే మహాప్రతిభావంతమైన కావ్యాన్ని అప్పుడప్పుడే వ్రాశాడు. ఇది క్రీశ 1532 నుండి 1585 దాకా ఉన్న సువర్ణయుగం.

  • విశ్చ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే ఈ తారలతోబాటు మన తెలుగు సాహిత్యంలో ఒక మహాకవి ఇదే యుగంలో జన్మించాడు. అతడు పింగళి సూరన్న ఈ విశ్వకవి తొలినుంచి తన కవితా వైభవాన్ని నిఖిలసూరిలోకం అంగీకరిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో తన రచనలు చేశాడు. సమకాలిక లాక్షణికులూ, వ్యాఖ్యాతలూ ఈ సొ జన్యాజేయుణ్ణీ సూరపరాజు గారనే పేరుతో గౌరవించారు. పింగళివారిది విద్వత్కుటుంబం. నేటి మన నిజామాబాదు జిల్లాకు చేరువలో మహారాష్ట్రంలో పింగళి అనే గ్రామం ఉంది. బహుశా అది ఈ కుటుంబానికి అదిలో ఉనికిపట్టు అయివుండవచ్చు. పింగళి గ్రామంలో గోకనామాత్యుడనే కవి ఊండేవాడు. అతడు 'నందకస్తవం' అనే కావ్యం వ్రాశాడు. ఇందులో శ్రీ! మహావిష్ణువు యొక్క ఖడ్వాన్ని సూర్యనారాయణుణ్జి సేవించింది. ఆ దేవుడు కలలో కనబడి ఒక దొండచెట్టు ఇచ్చాడనీ, నాటినుంచి పింగళి గోకన్నగారి సంతానం దొండపాదులాగ విస్తరించిందనీ జనులు . కథల్లో చెప్పుకొంటారు. ఈ గోకన్నగారిని గురించి మరో విడ్డూరమైన కథకూడ ప్రచారంలో ఉంది. 'పింగళివారి పేకి' అనే సామెత సైతం పుట్టింది. , గోకన్నగారు ఒకనాడు అడవిలో పోతూవుంటే ఒక గాజుపూస దొరకిందట. దానిని ఆయన ఏ మణిశలాకగానో భావించి పెట్లో దాచుకొన్నాడు. ఆ తరువాత వాళ్లింట్లో పేకి అనే పనికత్తి కుదురుకొంది. ఒకనాడు అది పురిటి గదిలో, కూర్చున్న చోటినుంచే నాలుక చాపి దీపాన్ని ఎగసనతోసిందట. “ఇది ఎవరో దేవాంతకురా'లని ఇంటివాళ్లు దానిని వదిలించుకోజూశారు. ఎవరూ చేయలేని పనులు అది చెప్పింది తడవు, అవలీలగా చేసివేసిది. దాని బాధపడలేక పింగలివారు ఉన్న ఊరు విడిచి దేశాంతరం పోయారు. వాళ్లు విడిచిపెట్టిపోయిన పెద్ద రుబ్బురోలును-నలుగురు మనుష్యులైనా ఎత్తలేనిదాన్ని - అవలీలగా నెత్తిమీద పెట్టుకొని అది ఆ కొత్త ఊరులోనూ సిద్ధమైంది
  1. మన్మాడ్‌-పూర్తా రైలుదారిలో పష + ప్ర బాదుకు, మున్నార్‌ పూ వ్‌ పూర్ణాకు దగ్గరలో *'పింగభా రైలుసేష్టన్‌ ఉంది. సికిందరా

పింగళి సూరన్న 299 “ఏం చేస్తే నువ్వు మమ్మల్ని వదిలిపెడతావ్‌?"” అని గోకన్నగారు విసుగెత్తి అడిగారు. 'ఈ ఆ పూస ఇచ్చివేస్టి పోతా” నని అది చల్లగా చెప్పింది. ఆయన ఇచ్చాడు. అది కథతోపాటు కంచికి వెళ్లింది. ఈ కథకు కాళ్లూ చేతులూ ఉన్నాయో లేదోగాని సూరపరాజుగారే ఒక గ్రంథంలో తమ తాతగారు పేకి అనే గంధర్విని ఏలినట్లు కొన్ని పద్యపాదాలతో ఈ కథనే నడిపించారు. పేర్పెలయంగ నాఘనుడు పింగళి గోకబుధోత్తముండు గం ధర్వి నొకర్తు టేకి యనుదానిని దాసిగ నేలె యోగితా గుర్చనుభావుడై నెరపె గోపకుమారుని ఖడ్గవర్జనం బర్వపు నిండువెన్నాలలపై నెరి జూపెడు కీర్షిసంపదక్‌. (ప్రభా. 1-14 ఈ గోకన్నగారి వంశంలో నాలుగైదు తరాలు పోయాక రామయ్యగారు మొదలైన వ్యక్తులు గోదావరీ ప్రాంతాలకూ, కృష్ణాతీరానికీ, గాదయగారిలాంటివాళ్లు పల్నాడుకూ పాకనాటికీ వలస వెళ్లారు. కృష్ణా జిల్లాలోని నిడుమానూరులో కొందరూ, కృష్ణాయ సముద్రంలో కొందరూ అగ్రహారాలు సంపాదించి జీవితం గడుపుతూండేవారు. కృష్ణదేవరాయలవారు భువనవిజయాన్ని నెలకొల్పి అందులో అష్టదిగ్గజాలను ప్రతిష్టించే బంగారుకాలంలో పింగళివారి వంశంలో సూరపరాజుగారు జన్మించి ఉంటారు. క్రీ.శ.1530 ప్రాంతాలలో వారు విద్యాభ్యాసం ముగించుకొని ఉంటారు. అనన్యసామాన్యమైన పాండిత్యాన్నీ చాటుప్రబంధ రచనా పాటవాన్నీ అలవరచుకొని ఆయన సత్కావ్యరచనా విశారదులయ్యారు. సూరపరాజుగారు చిన్నప్పుడు శివభక్తులు. తాము “లలాటేక్షణభక్తిశీలురమని చెప్పుకొన్నారు. ఈ ఇివభక్తిని ప్రకటించే “గిరిజా కల్యాణం' అనే కావ్యాన్ని సూరపరాజుగారు నూనూగు మీసాల నూత్న్సయౌవనంలో బాశారు కాబోలు. ఆ కృతి నేడు కాలగర్బంలో కలిసిపోయింది. అందులో నుంచి ఒకే ఒక పద్యాన్ని అనంతర లాక్షణికులు ఉదాహరించారు. ల సంస్కృతంలో “లప అనే ధాతువుకు ఘణ్‌ ప్రత్యయం చేర్చినప్పుడు 'లాప' అనే రూపం వస్తుంది. ఇందులో వచ్చిన "ఆకారానికి విడిగా యతిని చెప్పవచ్చునట. ఈ 'ఘఖ్‌' యతికి ప్రమాణంగా పింగళి సూరన్న గారి గిరిజాకల్యాణం నుంచి ఈ ప్రయోగం కస్తూరి రంగకవి తన ఆనందరంగరాట్పందంలో (3-234)లో చూపించారు. * కోపాటోపంబున ధర- ణీపాలకచంద్రముడు మునిశిఖామణులక౯ ట్రోపించిన వారు దురా-లాపము లాడుచును బోయి రా సమయమునక్‌. సూరపరాజుగారి ఇతర కృతుల నుంచి కూడ ఉదాహరణలిచ్చిన కస్తూరిరంగకవి పొరబడడానికి ఆస్కారం లేదని, మొన్న మొన్నటిదాకా వారి గిరిజాకల్యాణం ప్రచారంలో ఉండేదని చెప్పవచ్చు. తమ లలాటేక్షణభక్తికీలాన్ని గిరిజాకల్యాణంలో ప్రదర్శించాక సూరపరాజుగారు గరుడ పురాణాన్ని తెలిగించారు. ఇది అష్టాదశ పురాణాల్లో ఒకటైనా సూరపరాజుగారి కాలందాకా దీనిని తెలిగించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇది విష్ణసంబంధమైన పురాణమేగాని ఉత్త “ఓఘాయిత్యపు'పురాణంగా లోకం భావిస్తుంది.

300 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఎవరింటనైనా పీనుగు లేచినప్పుడుగాని దీనిని చదవరు. ఇది సాక్షాత్తూ విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పినది. ఇందులో జీవుడు బొందిని విడిచిపెట్టాక ఎన్ని యాతనలు అనుభపెస్తాడో. ఏయే అంచెలు దాటుతాడో మొదలైన వివరాలు ఉన్నాయి. శొద్దాలు కర్మలు ఎలా జరపాలో ఇది విశదపరుస్తుంది. ఈ పురాణాన్ని ఎవరి కోరికమీద ఎందుకు తెలిగించారోగాని సూరపరాజుగారు తమ కవితా జీవితపు తొలిరోజులలోనే ఇది రచించారు. దీనిని వ్రాసినట్టు వారు తమ అనంతర రచనలలో చెప్పుకోవడమేగాని ఈ గ్రంథాన్ని లాక్షణికులు గూడ చూసినట్టు లేదు. ఎవరూ ఇందులోనుంచి ఉదాహరణలు ఇవ్వలేదు.

సూరపరాజుగారు. సాహిత్యరంగంలో ప్రవేశించి. “మహితప్రబంధరచనా ఘనవిశ్రుతి' బొందే కాలంనాటికి కృష్ణదేవరాయలవారు అస్తమించారు. రాయసామ్రాజ్యం అంతఃకలహాలతో ఉంది. కవులూ విద్వాంసులూ చెట్టుకోపిట్టలాగ చెదరకపోయినా చిల్లరరాజులను ఆశ్రయించవలసి వచ్చింది. కృష్ణదేవరాయలవారిని రాజమంత్రి యుద్ధంలో తమ ఖర్చుతో సేవించుకొన్న 'ఆకువీటి' ఇమ్మరాజువంశం వారు ఆ రోజుల్లో రాజధానిలో మంచి పలుకుబడి గలవారు. ఈ ఇమ్మరాజు మనుమడు పెదవెంకటార్రి ప్రాభవం విజయనగరంలో చాలా ఎక్కువగా ఉండేది. ఈ పెదవెంకటాద్రి బహుశా క్రీ.శ. 1545 ప్రాంతాలలో సూరపరాజుగారిని చేరదీశారు.

పంపానదీ తీరాన ఉండే ఆకువీడు పట్టణంలో కవీ, అతని పోషకుడూ ఉండేవాడు. సూరపరాజుగారు '“నవ్యప్రకారం'గా ఏదైనా 'భవ్యకావ్యం' వ్రాయాలని కుతూహల పడుతూ ఉండగా ఆకువీటి పెదవెంకటాద్రికి మరో కుతూహలం కలిగింది. తెలుగులో తూడ అసమాన పాండిత్యాన్ని ప్రకటించడానికీ, శ్లేషలో ఎన్నిరకాలు వీలున్నాయో అన్నీ ప్రదర్శించడానికీ అనువైన రచనలు ఎవరిచేతనైనా వ్రాయించాలని అతడు ఉబలాట పడ్డాడు. ప్రతి పద్యంలోనూ రెండర్థాలు వచ్చేటట్టు ద్వాసంధాన కావ్యం వినాలని ఉత్సాహపడ్డాడు.

రెండర్ధాలతో ఒక్క పద్యం చెప్పడమే సాధారణంగా కష్టమైన పని అటువంటప్పుడు కావ్యమంతా రెండర్ధాలతో వ్రాయడం గగనమే. అయితే అలా వ్రాసినవాని పాండిత్యానికి ఎమైనా జోహారు చేస్తారు. ఆ కావ్యం సంస్కృతంలోకాక తెలుగులో అయితేనా, ఇక చెప్పేదేముంది?! బ్రహ్మరథం పట్టవలసిందే! అయనే రామాయణభారతాలు. రెండూ జోడించి చెప్పగల మొనగాడెవరు అని ఆకువీటీ పెదవెంకటాద్రి సూపరాజుగారితో ఇలా అన్నాడు:

రెండర్థంబుల పద్య మొక్కటియు నిర్మింపంగ శక్కంబు గా

కుండుం దద్గతి గావ్యమెల్ల నగునే నోహో యనంజేయదే

పాండిత్యంబున నందునుం దెనుగుకబ్బం బద్భుతం బండ్రు ద

దుం డెవ్వా డిల రామభారతకథల్‌ జోడింప భాషాకృతి౯? (రాఘవ. 1-1)

పింగళి సూరన్న 301 అయితే రెండు ఇతిహాసార్ధాలనూ జోడించిన దక్షుడు తెలుగులోనే ఇంతకుముందు లేకపోలేదు. వేములవాడ ఖీమకవి మన భాషలోనే పూర్వం రాఘవపాండవీయమనే ద్వ్యర్థికావ్యం బ్రాసినట్టు లోకులు చెప్పుకొంటారు. అయితే అందులోని ఒక్క పద్యమైనా ఎవరూ చూసినట్టు లేదు. “ఇంతకు ముందు ఎవరు చెప్పారో ఏమిటో మనకెందుకు? రకరకాల గొప్ప ప్రబంధాలు చెప్పగలవన్న మంచికీర్ణి నీకు ఉంది కాబట్టి రెండర్థాల కావ్యం నువ్వు వ్రాయగలవనుకొంటాను” అని ఆకువీటి సూరపరాజుగారితో ఇలా అన్నాడు: భీమన తొల్లి చెప్పె నను పెద్దల మాటయెకాని యందు నొం డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరు గాన రటుండనిమ్ము, నా నామహిత ప్రబంధరచనాఘనవిశ్రుతి నీకు గల్లుటక్‌ నీమది దద్దృయార్థకృతి నైపుణియుం గలదంచు నెంచెదక. (రాఘవ. 1-11) తెలుగులో అప్పటికి రెండర్ధాల కావ్యాలు చదవుకోవడానికి ఏమీ లేకపోయినా సంస్కృతంలో కోకొల్లలు. క్రీశ. 6వ శతాబ్దంలోనే సంస్కృతద్వ్యర్థి కావ్యాలు ప్రారంభమైనాయట. సుప్రసిద్ధ అలంకారికుడైన ఆచార్య దండి ఒక ద్విసంధానం బ్రాశాడట. ఆ తరువాత ఒక నిఘంటువు వ్రాసిన రచయిత ద్వ్యర్థి కావ్య రచయితగా పేరు పొందాడు. పింగళి సూరపరాజుగారి కాలంనాటికే సంస్కృతంలో రకరకాల గారడీ రచనలు బయలుదేరాయి. రెండర్గాల కావ్యంలోనే విలోమ రచనలు చేసినవాళ్ళూ ఉన్నారు. క్రీశ14వ శతాబ్దం చివర దైవజ్ఞ సూర్యపండితుడు రామకృష్ణ విలోమకావ్యం అనే రచన చేశాడు. ఇందులో రామకృష్ణులిద్దరి చరిత్రలూ సంగ్రహంగా చెప్పడమేకాక శోకం మొదటి నుంచి చివరకూ, చివర నుంచి మొదటికి ఒకలాగే నడుస్తుంది. ఈ కావ్యంలోని నలఖై శ్లోకాలు అచ్చుపడ్డాయని మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు. ఒకటి ఉదాహరించారు. తం భూసుతాము క్రిముదారహాసం వందే యతోలవ్యభవం దయాశ్రీః శ్రీయాదవం భవ్యలతోయదేవం సంహారదాముక్తి ముతాసుభూతం. క్రీశ 14వ శతాబ్దపు చివరిరోజులలో ఇటువంటి పాండిత్య ప్రకర్ష కనబడడం విడ్డూరం కాదు. అంతకు రెండు వందల సంవత్సరాలకు ముందు మరీ ఉడ్డోలంగా బహుళార్థ రచనలు చేసినవాళ్ళు ఉన్నారు. క్రీ.శ1177లో సోమప్రభాచార్యుడనే మహాను భావుడు ఒక్క శోకమే వ్రాసి దానికి నూరురకాల అర్థాలు చెప్పాడట. అదే శకంలో 24 గరు జైనతీర్ధంకరుల వృత్తాంతాలు ఉన్నాయట. అందులోనే బ్రహ్మవిష్ణునారదాది వైదిక దేవతల ప్రస్తుతులూ ఉన్నాయట. అందులోనే వైనమతాచారులు, నలుగురు చాళుక్యరాజులు, ఓక కవి, ఒక నాగరకాగ్రణి, కవిగారి గురుదేవులు మొదలైనవాళ్ళకు విడివిడిగా అన్వయించే అర్భాలున్నాయట. ఇంతమందికి అన్వయించిన ఆ శ్లోకం ఇ సంస్కృతవా్మయచరిత్ర - ద్విడీయసంపుటం పుటం

302 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పుష్పకవిమానం కదా! చివరకు కవిపరంగా అన్వయించినా అర్థమైందట, ఈ కావ్యాన్ని శతార్థక కావ్యమనీ, ఈ కవిని శతార్థ కవి అనీ తరువాతివాళ్లు పిలువజొచ్చారు.

ఈ గారడీ రచనల్నీ ఒక యెత్తూ. రెండర్థాల నాటకం ఒక ఎత్తూను! సంస్కృత సాహిత్యంలో ఒక ద్వ్యర్థినాటకం కూడ ఉందట. శ్రవ్యకావ్యం అయితే ఇంటిదగ్గర ఇన్ని నిఘంటువులూ, వ్యాఖ్యలూ దగ్గర పడేసుకొని పాఠకుడు రెండర్థాల రచనను అర్థం చేసుకొనడానికి ప్రయత్నం చేయవచ్చు. డ్రామా హాలులో కూర్చొని దృశ్యం చూస్తున్నప్పుడు ఒకే సంభాషణను రెండు రకాలుగా అర్థం చేసుకొనడం చాలా ఇబ్బందే. సంస్కృతంలో ఈ రెండర్థాల నాటకాన్ని ఎవరు వ్రాశారో, ఎప్పుడు వ్రాశారో, దాని ఇతివృత్తం ఏమిటో ఎవరికీ తెలియదు. స్కెర్మన్‌ దొరగారి సంస్కృత [గ్రంథాల పట్టికలో దీని ప్రసక్తి ఉంది+ మొత్తంమీద సూరపరాజుగారి కాలంనాటికి సంస్కృతంలో బహుళార్థక రచనలు చాలా ఉన్నాయి. రామాయణభారతార్థాలను జోడించిన రచనలు తూడ ఎక్కువ. వాటి వివరాలు చూద్దాం. వెం. కాలం నం (నరు

క్రీ.శ. 6వ శతాబ్ది | ద్విసంధానం దండి బహుశా రాఘవపాండవీయమే

క్రీశు 3960-1006 | ద్విసంధానం నైఘంటుక | రాఘవపాండవీయమే ధనంజయుడు. | ఇందులోని ఇతివృత్తం.

క్రీశ. 11వ శతాని | రామచరితం సంధ్యాకర _ | వంగదేశాన్ని పాలించిన

నంది రామపాలుని చరిత్రనూ శ్రీరాముని చరిత్రనూ జోడించాడు.

క్రీశు 1104 రాఘవపాండవీయం | కవిరాజ సూరి | 13 సర్గల కావ్యం.

క్రీ.శ1182-౪3 పార్చరీరుక్కీణీయం | విద్యామాధవ | పార్వతీ పరిణయం.

కవి రుక్మిణీకల్యాణం జోడించి చెప్పాడు.

క్రీ.శ. 12వ శతాబ్ది | శతార్థక కావ్యం సోమప్రభా | ఒకే శోకానికి నూరర్గాలు

చార్యుడు వచ్చేటట్టు బ్రాసి అర్గాలు వివరించాడు.

క్రీశ 14వ శతాల్టి | రామకృష్ణవిలోమం | వైవజ్ఞసూర్య | రమారమి 40 శోకాలు

చివర పండితుడు అచ్చయినవి.

మొదటినుంచి చివరకు, చివరి నుండి మొదటికి శోకం ఒకలాగే నడుస్తుంది. తలా 3. 'ద్వుత్యర్థికావ్యములు'- ఈయుణ్ణ్జి వెంకటవీరరాఘవాచార్యులుగారు, పరిషత్సథి సంపుటి 24, సంచిక 2 లుగారు, ఆంధ్రసాహిత్య 4. ఆం.సా,పపత్రిక - సంపుటి 24, సంచిక 2 - ఈయుజీ వారి వ్యాసం, పుట 61.

పింగళి సూరన్న 303 తన కాలంనాటికి సంస్కృతంలో కొన్ని ద్వ్యర్థి కావ్యాలున్నా సూరపరాజుగారు తెలుగులో అటువంటి రచన మొదలుపెట్టేటప్పుడు తమకు తామే మార్గదర్శకులు. శక్యాశర్భవిచారం లేకుండా ఈ రచనకు అంగీకరించినట్టు ఆయన చెప్పినా అన్నివిధాలా ఆయన శక్కులే. తమ కృతిలో చమత్కృతి చూపిస్తామని చెప్పి తెలుగు భాషలో రెండర్థాల కావ్యాలు వ్రాసేవాళ్లెవైనా పాటించవలసిన నియమాలు కొన్ని తయారుచేసి మొదటే వాటిని బేరీజు వేశారు. ఆంధ్రభాషాసంస్కృతాిభాషాశ్లేే యొక్కొక్కచోట నొక్కొక్కచోట నుచితశబ్దోష యొక్కొక్కవోట నర్జేష యొక్కొక్కతరిని ముఖ్య గౌ ణవృత్తోషఘటన యొక్కొకతరి నర్ధాన్స్వయము వేరె యగుచు నునికి శబ్దాన్వయవిభేదసంగతి యొకొక్కక్క తరి నివి యొక్కొక్క తరిని రెండు మూడు గూడుటయు నన సముజ్బలముగ నాకు దోచిన గతి బెక్కుపోక లమర రామభారతకథలు పర్యాయద్భృష్టి జూచు సుమతుల కేర్చడ నాచరింతు. (రాఘవ 1-17) ఈ పద్యంలో చెప్పిన నియమాలు ఆరు రకాలు. వాటిని ఒక్కొక్కటీ చూద్దాం.

  1. మాట విరుపువల్ల సంప్కృతంద్వారా ఒక అర్థం, తెలుగులో వేరొక అర్థం పుట్టించడం, దీనిని సూరపరాజుగారు ఎలా సాధించారో ఒక ఉదాహరణవల్ల చూద్దాం. దశరథుడు మునిబాలుణ్జి ఏనుగనుకొని చంపాక అతణ్జీ తీసుకొని తల్లిదండ్రులకు అప్పగిస్తాడు. ఆ ఘట్టంలోనిది ఈ పద్ధుం: విని యతనిం దనపై నిడు-కొని యేగి నియమికి దగని ఘోరార్తి యొన ర్చినవాడ మీకు దండుడ- నని తను దెలుపుచును వారి కప్పనసేనె€. (రాఘవ. 1-28) భారతార్థంలో ఇదే పద్యంతో పాండురాజు మాటలను సాధించాలి. ఒక ముని తన భార్యతో లేడిరూపాన క్రీడిస్తున్నపుడు పాండురాజు వాళ్లను చంపుతాడు. తరువాత పశ్చాత్తాపం పొందుతాడు. పై పద్యంలో 'విని, యతనిం, దనపై' అనే తెలుగు మాటలనే కలిపిడే “వినియతనిందన' అనే సంస్కృత పదం వస్తుంది. “మిక్కిలి నియతమైైన నిందను పై పడవేసుకొని' అని భారతార్థంలో అర్థం చెప్పుకోవాలి.
  2. ఉచితశబ్దన్తేష. ఏ భాషలోని పదాలకు ఆ భాషలోనే శ్తేషః పై ఉదాహరణలో ఒక భాషలోని మాటనే గడుసుగా విరవడంవల్ల వేరే అర్థం సాధించడం జరిగింది. ఇప్పుడు ఏ భాషలోని పదాలను ఆ భాషలోనే రకరకాలుగా విరిచా రెండేసి అర్భాలు సాధించేమార్గం. పై పద్యానికి తరువాత, దశరథుడు బాణం టీశాక మునిబాలుడు మరణించాడు. కొడుకు పోయాక ముని భరించలేని బాధతో ఇలా “శపించాడు అని కవి ఇంకో కథగా చెప్తున్నాడు:

304 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చేసి మనుజేశ్వరుండు తచ్చాసనమున

నాత్మశరసముత్పాటనమాచరించె

దానబట్టి ప్రాణంబు లెంతయు జిలింప

నసుతతో గ్రార్తి కోర్వక యతివరుండు. (రాఘవ. 1-౫) ఈ పద్యంలో చలింపక + అసుతతా + ఉగ్రార్తి అనే పదవిభాగాలు రామాయణార్థంలో చేసుకోవాలి. భారతార్థంలో పాండురాజు బాణానికాహుతైన ముని స్వయంగా శించబోతున్నట్టు అర్థం చెప్పుకొందుకు వీలుగా అసు+తత+ఉగ్రార్హి అని అర్థం చెప్పుకోవాలి.

ఈ పద్యంలో సంస్కృత భాషలోని పదాలను రెండు రకాలుగా విరవడంవల్ల వచ్చే సభంగ్లేషను చూశాం. ఇంక తెలుగులో సభంగశ్లేష చూద్దాం. తన బాణం వల్ల పడిపోయిన వ్యక్తిని చూడగానే మొట్టమొదట దశరథుడూ, పాండురాజూ ఇలా విలపిస్తారు : ,

ఏనుం గనికర మరయక - పూనితిగా కిట్టియెడల బొసగునె యేయం

గానమె కాలనియమగతి-తో నావేట మునియుగము ద్రుంగించె దుదన్‌.

(రాఘవ. 1-2౫) రామాయణార్థంలో ఏనుంగు+ అని, కరము + ఆరయత - ఏనుగనుకొని ఏమీ చూడకుండా అని అర్థం చెప్పుకోవాలి. ఖారతార్థంలో ఏనుక + కనికరము + అరయక అని విరుచుకోవాలి. 3. అర్జోష. మాటలను వాడినప్పుడు వానార్ధాల వల్ల వివిధార్థాలను సాధించవచ్చు:

పైన చెప్పిన “ఏనుం గనికర మరయక' అనే పద్యంలో '“మునియుగము' అనే మాటలో యుగము అంటే ఆయుష్పు అనీ, జోడీ అనీ అర్ధాలున్నాయి. రామాయణార్థంలో ఆయుర్దాయమనీ, భారతార్థంలో ద్వయమనీ అర్థం చెప్పుకోవాలి. ఇది సంస్కృతంలో అర్థేష. తెలుగులో అర్థశ్లేషకు కూడ ఉదాహరణలు పై పద్యాలలోనే ఉన్నాయి. “చేసి మనుజేశ్చరుడు' అనే పద్యం మూడవ పాదంలో “దానబట్టి' అనే మాటకు రామాయణార్థంలో దానక్‌+పట్టి అని బోధపరచుకోవాలి. “పట్టి అంటే కుమారుడు, చేత అని రెండర్గాలు,

  1. ముఖ్యగౌ అవృత్తిశ్తేష ప్రపంచంలో రూఢిగా ఉన్న పదాలకు తెలివితేటలతో వేరే ఆర్గాన్ని సాధించడం:

. లోపాముద్ర ఆగస్తుని భార్య అని అందరికీ తెలుసు. ఈ మాట వాడీనప్పుడు భారతంలో వేరే అర్థం సాధించడం కష్టం. వనవాసంలో రాముడు అగస్త్రుణ్జీ చూశాడు. అర్జునునికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఘట్టంలో ఈ పద్యం చెప్పాడు:

భద్రగతి చరుగ లోపా-ముద్రానందస్వరూపమునిదర్శితని

ర్లిదప్రసన్నకాసం-పద్రురత మెరయ నేత్రపర్వ మొనర్చె౯ (రాఘవ ౩-5)

పింగళి సూరన్న 305

'భారతార్థంలో భద్రగతిక+అరుక్‌ + అలోప+అఆముద్ర + ఆనంద అని విరుచుకొని అర్థం చెప్పుకోవాలి.

ఈ ముఖ్యగౌణవృత్తోషకు రాఘవపాండవీయంలోని రెండవ పద్యంలోనే ఉదాహధణ దొరుకుతుంది.

ఆ పట్టణ మేలెడి షృథి-వీపాలుడు భ్రుకుటిమా త్రవిముఖితసమదా

టోపారి పంక్తీరథుడు- ద్దీపించు నుదారనీతి ధృతరాష్టు డనన్‌ (రాఘవ 1-2)

ధృత - ధరింపబడిన, రాష్ట్రుడు = దేశము గలవాడు అనే అర్థం దశరథునికి అన్వయించుకోవాలి.

ఈ శ్రేషలు కాక అర్భాన్వయశ్లేష శట్టాన్వయశ్లేష ఈ చెప్పిన శ్లేషల సాంకర్యాలు కలిపితే రకరకాల మార్గాలు దొరుకుతాయి. వీటన్నిటినీ ఉపయోగించి సూరపరాజుగారు తెలుగులోని ఈ తొలి ద్వ్యర్థికావ్యాన్ని బ్రాశారు. ఇది రచిస్తున్నప్పుడు సంస్కృత రాఘవపాండవీయాలు చదివి కథల జోడింపులో పూర్వులను ఎంతవరకూ అనుకరించారో తెలియదు. ఇప్పటికీ ఎవరూ ఈ పరిశోధన చేసినట్టు లేదు. రామాయణభారతాలను జోడించడం కోసం ప్రసిద్ధ కథలలో కొన్ని మార్చులు చేయక తప్పదు. సూరపరాజుగారు చేసిన మార్పులు ఏమేమిటో పండితులు పేర్కొన్నారు.5 అయితే బుద్ధున్నవాళ్లివరూ ద్వ్యర్థి కావ్యాలను కథకోసం చదవరు. కవిగారి తెలివితేటలు . ఏమాత్రమో చూద్దామని పారకుడూ, చదివేవాడు ఏమాత్రం అర్థం చేసుకోగలడో అని రచయితా పరస్పరం ఉవ్విశ్లూరుతూ. ఉంటారు. అయితే ఈయూజణ్జి వెంకట వీరరాఘవాచార్యులవారు చెప్పినట్లు బహుళార్థక కావ్యాల రచనలో రచయిత మనసూ, చదవడంలో పాఠకుని మెదడూ శ్లేశపడతాయి. వారన్నట్టు “పదములకు లేని యర్థములు దన పాండిత్యప్రొడిచేగాని, నైఘంటుక సాహాయ్యమునగాని సాధించి, భావసంపదగాని రససంపదగాని లేని తన గారడీ కవిత చేతను, దన పాండితీ కౌశలముచేతను నీ కవి పఠితల నాశ్చర్యనిమగ్నులనుగాబేయునుగాని రసపరవశులనుగా వ్రేయజాలడు"” ౨

అయితే పింగళి సూరపరాజుగారు ఆడంబరాలను అఖిలషించే చౌకబారు కళాకారులు. కారు. పోషకుడు వాంఛించి ప్రస్తుతించినప్పుడు తన కశాగ్రబుద్ధిని ప్రకటించడానికి ఇటువంటి ద్వ్యర్ధికావ్యం బ్రాశారేగాని శ్లేషకన్నాా ధ్వనికి 'ప్రాముఖ్యమివ్వాలని వారికి తెలుసు. కళ అంటే ఏమిటో, అది ఎలా పూర్ణంగా ఉదయిస్తుందో వారికి బాగా తెలుసు. సాహిత్యంపట్ల వారికి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. వాటిని ప్రకటించడానికి “నవ్యప్రకారా రచన అవసరమేగాని జ్రోత్సహించేవాడు పూర్తిగా అత్మపూర్వ రచన చేయమని ఉత్సాహపరిస్తేనేగాని మహారచనకు ఆస్కారముండదు. సూరపరాజుగారికి తగిన విధంగా ్రోత్సాహమిచ్చి, వారిచేత సరస ప్రబంధనిబంధనం 6. హరిశ్చంద్రనలోపాఖ్యానం - పీరిక, వజ్ఞల చినసీతారామస్వామి శాస్త్రిగారు, పుకు 78.

  1. అం.పా.షపత్రిక, సంపుటం 2, సంచిక 5.

306 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చేయించిన రాజు నంద్యాల కృష్ణంరాజు. ఈయన ఆరవీటి వంశంలోనివారు, ఆశియ రామరాయల బంధువు. ఎలాంటి బంధువో చెప్పవచ్చు గాని విన్న వెంటనే బంధుత్వం ఠక్కున తెలియదు. ఈ నంద్యాల కృష్ణంరాజు అళియ రామరాయల ముత్తాతగారి ఒక మనుమని మునిమనుమడు. అళియ రామరాయల ముత్తాత ఆరవీటి బుక్కరాజు. ఇతని వంశం తామరతంపర. ఇతని కొడుకులు, మనుమలు చిన్న మండలాధిపతులై నంద్యాల వారుగా, పొట్లపాడువారుగా, కోనేటివారుగా ప్రసిద్ధులయ్యారు. ఆరవీటివారు వంశవృక్షం పద్మవ్యూహంలాగా కనబడుతుంది. ఐనా కృష్ణదేవరాయలవారి అల్లుడుగా దక్షిణ భారతదేశపు రాజకీయాలలో గొప్ప వ్యక్తిగా పేరుపొందిన అళియ రామరాయలకూ, నంద్యాల కృష్ణంరాజుతూ గల సంబంధం చూసీచూడగానే తెలిసే టూకీ వంశవృక్షం ఒకటి వేసి చూద్దాం. ఆరవీటి బుక్కరాజు వా ననన ననన. అబ్బలమ్మ వలన బల్లాదేవివలన | | సింగరయ్య రావ్యరాజు | నరసిం్గరాజు శ్రీరంగరాజు నారష్థరాజు నరసింగరాజు | కృష్ణంరాజు అళియరామరాయలు తిరుములదేవరాయలు నంద్యాల కృష్ణంరాజుగారి తాత నారపరాజు క్రీ.శ 1515లో కొండవీటి వద్ద జరిగిన యుద్ధంలో కృష్ణదేవరాయల వారికి సహాయం చేశాడు. నంద్యాల కృష్ణంరాబొ కూడా అలియ రామరాయలకు ఏవో యుద్ధాలలో కొద్దిగానో, గొప్పగానో తోడ్చడివుంటాడు. బహుశా శాంతియుతంగా దేశం వర్ధిల్లినప్పుడు కేరళదేశానికి వెళ్ళిన అధికారులలో ఈ నంద్యాల కృష్ణంరాజు తూడా ఒకడై వుంటాడు. కృష్ణదేవరాయలవారి సోదరుడు ఆచ్భుతదేవరాయలు మరణించిన తరువాత అశియ రామరాజు క్రీ.శ. 1542లో సదాశివరాయలకు పట్టం కట్టూడు. వెనువెంటనే కొంత సైన్యాన్ని బ్రావిడ రాజ్యాలపైకీ పంపవలసి వచ్చింది. తిరువనంతపురం పాలించే రాజు తిరుగుబాటు చేశాడు. అశతళ్ణీ అదుపులోకి తీసుకురావడానికి అళియ రామరాజు సాక్షాత్తూ తన పెదతండ్రి కుమారులైన చినతిమ్మ విట్టలరాజులను పంపించాడు. వాళ్లు గొప్పసేనతో వెళ్లారు. తిరువాన్కూరు రాజు పాదాత్రాంతుడయ్యాడు. విజయనగరం సేనలు అనంతశయనం (తిరువనంతపురం) దాకా వెళ్లి అక్కడ అనంతపద్మనాభుణ్ణి సేవించుకున్నారు. విట్టలరాజు చూపిన శౌర్యాన్ని

పింగళి సూరన్న 307 మెచ్చుకుని అలియ రామరాయలు అతణ్జీ ద్రావిడ, కేరళ రాజ్యాలపై రాజప్రతినిధిగా నియమించాడు. క్రీశ. 1558దాకా - కనీసం 15 సంవత్సరాలు విట్టలరాజు ఈ అధికారంలో ఉన్నాడు. ఈ కాలంలో నంద్యాల కృష్ణంరాజూ, అతడు చేరదీసిన పింగళి సూరపరాజుగారూ కూడ కేరళదేశం వెళ్లి ఉంటారు.

రాఘవపాండవీయం వ్రాసిన తరువాత సూరపరాజుగారి దృక్పథంలో చాలా మార్చులు వచ్చాయి. ఆయన పూర్వం లలాటేక్షణ భక్తిశీలుడు. ఇప్పుడు విశిష్టాద్వైతిగా మారారు. ఆయన కేరళనుంచి కాశ్మీరందాకా భారతదేశాన్ని మనఃఖలకంపై చిత్రించుకొని ఒక సమైైక్కత ఆనాడే ఊహించుకోగలిగారు. పూర్వం పాండిత్యప్రకర్ష చూప సంసిద్ధులయే వారు. ఇప్పుడు భాషలో సుపరిచితమైన పదాలే వాడాలనీ, అవి సుకుమారంగా ఉండాలనీ, అఖిప్రాయాలు సరళంగా ఉండాలనీ భావింపసాగారు. ఈ మహాకవిలో వచ్చిన మార్చులు గుర్తించిన నంద్యాల కృష్ణంరాజు వారి మాధుర్యమైన ఉరువాగై్వైచిత్రిని సఫలం చేయడానికి వారిచేత నిర్ణిద్రసారస్కలీలాచిత్రమైన మహాప్రబంధం ఒకదానిని చేయించుకోదలిచాడు. సూరపరాజుగారుతూడ సకలలక్షణలక్షితమైన మహాప్రబంధమే కీర్ణికారకమని భావిస్తున్నారు. ప్రభువు తోరిక మేరకు కళాపూర్లోదయం అనే ప్రబంధం చేయదలిచారు.. ఈ మహాకావ్యంలో మూడు విశేషాలు ఉంటాయని చెప్పారు :

  1. అత్మపూర్వకథాసంవిధాన వైచిత్రి, 2. శృంగారప్రాయత, 3. పుణ్యవస్తువర్ణనా కర్ణనీయత.

సూరపరాజుగారు చెప్పిన ఈ మూడు విశేషాలూ అక్షరాలా ఈ మహాకావ్యంలో ఉన్నాయి. సూరపరాజుగారి కాలందాకా తెలుగు కవులందరూ తమ కావ్యాల ఇతివృ త్తాలను పురాణాలలోంచో. ఇతిహాసాలలోంచో తీసుకున్న వాళ్ళేగాని స్వయంగా ఒక కథను కల్పించి సజీవ పాత్రలను సృష్టించి స్వతంత్ర రచన చేయలేదు. సూరపరాజుగారే ఓం ప్రథమంగా ఈ కళాపూర్లోదయంలో అటువంటి ప్రయత్నం చేశారు. అందుచేత ఈ శథ అతి అపూర్వం. ఈ కథా సంవిధానంలో ఉన్న వైచిత్రి నిజంగా మహనీయమే. ఈ ఇరవయ్యో శతాబ్దంలో సహితం తెలుగు నవలలు నిజమైన నవలల్లాగా లేవు. అటువంటిది 1550 ప్రాంతాలలో సూరపరాజుగారు కళాపూర్జోదయాన్ని నవలలాగా వ్రాశారు. కవి స్ప్వాయంగా చెప్పి కథకన్నా పాత్రల సంభాషణల ద్వారా పూర్వకథలు తెలిపే పద్ధతి చాలా మంచిది. కళాపూర్ణోదయంలో సూరపరాజుగారు ఈ పద్ధతినే వాడారు. కొంత నవలలాగ, కొంత నాటకంలాగ, కొంత ఈనాటి సినిమాచిత్రంలాగా ఈ రచన సాగింది. జీవితంలాగే కళాపూర్లోదయం వెంటనే అర్థం కాదు. అర్థం స్ఫురించినా అంతరార్థం అవగాహన చేసుకోవడానికి చాలా వ్యవధి పడుతుంది. అయితే ఉత్త కథమాత్రమే కావలసిన వాళ్ళకు సైతం ఈ కావ్యం కమ్మని విందు చేస్తుంది.

కళాపూర్ణోదయ కథాసంగ్రహం

ప్రథమాశ్వాసం : శ్రీకృష్ణుడు ద్వారకానగరం పాలిస్తూ ఉండిన రోజులలో అఆ ఊరి చివరనున్న ఉద్యానవనంలో కలభాషిణి అనే చిన్నది చెలికత్తిలతో ఉయ్యాల లూగుతూ

308 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఉంది. ఆ జవరాలు వెలబాలిక. అమె అందం ఆ ఊరిలోని విటులను ఉవ్విళ్లూరిస్తూ ఉంటుంది. ఆ పిల్ల చాకులాంటిది. కుశా గ్రబుద్ధి. కలభాషిణీ ఉయ్యాల ఊగుతూంటే అడే సమయంలో ఆకాశంలో ఇటు శిష్యసమేతంగా నారదుడూ, అటు ప్రియునితో రంభా వస్తున్నారు. నారదుని శిష్యుడు చాలా గొప్ప కవి. ఒకసారి దండకం ఒకటి చెప్పి కృష్ణుణ్ణి మెప్పించి. ఒక మణిహారాన్ని బహుమానంగా పుచ్చుకున్నాడు. అతని పేరు మణికంధరుడు. సానిపాపలు ఉయ్యాల లూగుతుంటే ఆ కవి వర్ణించకుండా ఉండలేకపోయాడు. ఇలా పొగిడాడు: ం తమి బూదీగెల తూగుటుయ్యెలల బంతా లాడుచుం దూగునా కొమరుంబ్రాయపు గబ్బిగుబ్పెతల యంఘ్రు ల్బక్కగా జాగి మిం టిమొగంటై చనుదెంచు ఠీవి గనుగొంటే దివ్యమౌనీంద్ర నా కమృగీనేత్రలమీద గయ్యమునకుం గాల్తాచులా గొప్పెడుక్‌ (కళా. 1-44) ఇది విని నారదుడు మెచ్చుకొన్నాడు. 'దేవతాస్త్రీలతో కయ్యానికి కాలు చాచడం అంటావేమిటోయ్‌, వాళ్ళ తలదన్నడాని కన్నా తప్పులేదు' అన్నాడు దేవముని. ఈ మాటలు అంటూ ఉంటే విమానంలో అటునుంచి వస్తున్న రంభ విన్నది. దానితో అమె మనసాకలాగా అయింది. అయితే భావాలు మనసులోనే దాచుకుని నారదుణ్ణి పలకరించినట్టు పలకరించి రెండు ఎత్తిపొడుద్దామనుకుంది. నలకూబరునికి నారదుణ్జీ చూపి 'నమస్కరించిపోదాం' అన్నది. ఆ ప్రేయసీ ప్రియులు నమస్కరించారు. “ఒండొరులపై వదలని ప్రేమకలిగి భాసిల్లండి' అని నారదుడు దీవించాడు. రంభ ఒక మాట అంటించింది. “అయ్యా, మీ దీవన చేత మా ప్రేమ కొంత చెడకుండా నిలుస్తుందేమోగాని ఇతడు మానవకాంతల అందానికి ముగ్గుడవకుండా ఉంటాడా" అన్నది. “మాతలదన్నే మానవకాంతలు' అని ఆమె ఎత్తిపాడుపు. నారదుడు “ఏమిటి నీ ఉద్దేశ్యం" అన్నాడు. “రండీ, మా విమానంలో శ్రిందికి దింపుతాం. మాట్లాడుకొంటూ వెళ్ళవచ్చు” అని రంభ ఆహ్వానించి, లిఫ్ట్‌ ఆఫర్‌ చేసి ఉపచారాలు చేసింది. విమానం దిగి వస్తూ ఉంటే, ఈ శతాబ్దంలో మనమే తలెత్తి చూస్తాం. ఆ రోజుల్లో వాళ్లు చూడరా? కలభాషిణి చూసింది. ఆమె కళ్ళకు నలకూబరుని అందం కనిపించింది. ఆమె అలాగే చూస్తున్నది. విమానంలో వాళ్లు తమలో తాము చూట్లాడుకొంటున్నారు. నారదుడు “ఏమిటి నీ ఉద్దేశ్యం?" అని రంభను అడిగాడు. 'మానవకాంతలు మాతల దన్నుతారని మీరన్నారుగాని, ఎవ్వరూ మమ్మల్ని సరిపోలరనడానికి కుబేరుని కుమారుడైన నలకూబరుడే సాక్ష్యం" అన్నది రంభ. 'రోజు లొక్కలాగే ఉండవని నారదుడిలా అన్నాడు: ( నిను బోలు వనిత నీకును - వనజముఖీ, యితని బోలువా డీతనికి నెం దును గల్లి కలచునో! యి-ట్టి నిగాఢపుముదము సౌంపు ఠీవులు చనునే?

  • ఇ ఇ (కళా. 1-61) నారదుని వంటి మీని నవ్వులాటకన్నవి సైతం నిజమై ఇబ్బంది పెడతాయి. ఆ సంగతి రంభకు తెలుసు. అందుచేత 'స్వామీ, చాలించండి' అన్నది. అంతట విమానం తోటలో

పింగళి సూరన్న 309 దిగింది. నారదుణ్ణీ, అతని శిష్యుణ్జీ దింపి విమానం మళ్ళీ ఎగిరింది నలకూబరుని అందాన్ని కళ్ళతో తాగేస్తున్న కలభాషిణి చెవులు రిక్కబొడుచుకుని, విమానంలోని వారి మాటలేమైనా వినబడతాయేమో అని వినగలిగినవన్నీ విన్నది. ఆ మాటలవల్ల వాళ్లు రంభా నలకూబరులని నిర్ణయించుకున్నది. ఆ విమానం కనిపించేదాకా అతని అందాన్ని చూసి వెనక్కీ తిరిగి వచ్చింది.

నారదుడు శిష్టాసమేతుడై వెడుతున్నాడు. అతణ్జి కలభాషిణీ కలుసుకుంది. ఆమెకు వీళ్ళిద్దరూ కొత్త కానేకారు. శ్రీకృష్ణుని కొలువులో ఆమె స్వామివారిని సేవిస్తూ ఉంటుంది. మణికంధరుడు చెప్పిన దండకాన్ని ఏక సంధన గ్రహించినా అప్పచెప్పి అందరినీ ఆశ్చర్య నిమగ్నులను కావించింది. కలభాషిణి నారదుణ్ణి కలుసుకొని నమస్కరించింది. “వాళ్లు రంభానలకూబరులేనా?' అని అడీగింది. 'అవును, నీకెలా తెలుసు? విమానంలో అనుకున్న మూటలు విన్నావా?' అని ప్రన్నించాడు. చిత్తం అన్నదామె. రంభకు సవతికయ్యంలో గర్వమణుగుతుందని మాటల సందర్బంలో నారదుడన్నాాడు. 'ఎవరా సవతి?* అని కుతూహలంతో కలభాషిణి అడిగింది. నారదుడు ఇలా అన్నాడు:

సవతియన నింక నొకతెన్‌- భువిలోపల వేర వెదకబోవలయునె।; యో

ధవళాక్షీ! నీవ కానే-రవె దైవనియుక్తి గొంత ప్రాప్తి గలిగినన్‌? (కళా. 1-74)

ఈ మాటలు విని 'నాకంతటి అదృష్టమా? రంభలాంటి రూపం నాకెలా వస్తుంది?” అన్నది కలభాషిణి. “దానికేం?” అని నారదుడు మాటల ధోరణి మార్చేశాడు. “మా శిష్యుడు చెప్పిన దండకం చదువు" అన్నాశ్రు. ఆమె చదివింది. మణికంధరుని కవిత్వాన్ని మెచ్చుకుంది. కవిత్వమంటే ఎలా ఉండాలో సూచించింది. “మునీంద్రా, అంతఃపురంలోకి మీ శిష్యుడు ప్రవేశించలేడుకదా. అప్పుడు మీ వీణ మీరే మోసుకొని వెడుతున్నారు. నన్ను కనికరించి ఆ సేవ నాకు ప్రసాదించండి అని వేడింది. 'అలాగే' అని నారదుడు అంగీకరించాడు. అమె ఏదో రహస్యంగా అడగాలనుకుంటున్నదని గ్రహించి మణికంధరుడు కొంచెం దూరంగా వెళ్ళాడు. అప్పుడు కలభాషిణి “మునీంద్రా! విమానంలో తిరిగి వెళ్ళిపోతున్న రంభానలకూబరులు తమలో తాము మాట్లాడుకోవడం విన్నాను. అతడు '“కళాపూర్ణుని విషయం చెప్పు" అని ఆమె నడిగాడు. రంభ చెప్పకూడదు" అంది. దయచేసి ఆ కళాపూర్ణుని కథేమిటో చెప్తారా?” అని అడీగింది. నారదుడు దిన్య దృష్టితో చూశాడు. 'ఆ కథ నేను కూడా చెప్పకూడ'దన్నాడు. “ఎందువల్ల? అని కలభాషిణి కుతూహలంతో అడిగింది. ఆ కథ చెప్పినవాళ్లు భూలోకంలో పుత్రపొత్రాభివృద్ధిగా చిరకాలం ఆయురారోగ్యాలతో ఉంటారు. దేవతలం ఆ కథ చెప్పితే చూనవలోకంలో పుట్టాలిగా, అందుచేత అది మాకు శాపం; చెప్పం' అన్నాడు. ద్వితీయాశ్వాపం ! నారదుడు శ్రీకృష్ణుని దగ్గరికి వస్తూ పోతూ ఉండటానికి కారణం ఒకటుంది. అతనికి తుంబురుణ్ణి గానంలో ఓడించాలనే కోరిక ఒకటుంది. శ్రీకృష్ణుడూ, అతని భార్యలూ తప్ప మరెవ్వరూ తనకు దివ్యగానం నేర్చలేరని నారదునికి తెలుసు. అందుకే ఏళ్ళతరబడి వాళ్ళదగ్గర నేర్చుకొన్నాడు. అతనితోపాటు మణికంధరుడూ,

810 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కలభాషిణీ అంతటి గానకళా ప్రపూర్జ్ణులయ్యారు. విద్య పూర్తికాగానే శ్రీకృష్ణుని భార్యల నారదుణ్ణీ మెచ్చుకొన్నారు. బయటికి వచ్చాక అతనికి అనుమానం వేసింది. ఆ ఫాగర్త నిజమా? ముఖస్తుతా? 'కామరూపం ధరించగల శక్తి గనుక నాకుంటే నేను వాళ్ళ చెలికత్తెవేషంలో వెళ్ళి నిజం తెలుసుకొందును కదా?” అని కలభాషిణీ అన్నది. 'ఆ శక్తి నేను ప్రసాదిస్తాను. వెళ్ళి తెలుసుకొని రా' అని నారదుడు ఆమెకు ఆ సామర్శాాన్ని శాశ్వతంగా ప్రసాదించాడు. ఆమె తెలుసుకొని వచ్చి విన్నవించింది. నారదుడామెనిలా దీవించాడు: కొమ్మ మున్ను నీ వాత్మలో గోరినట్టీ కాంతు రంభామనోహరాకారు డగుచు మెరయువానిని గూడి రమించగలవు నమ్ము, పొమ్మిక నీ భవనమున కనియె (కళా. 2-6) కలభాషిణీని యిలా దీవించి, మణికంధరుణ్జి తీర్థయాత్రలు చేయమని, హరిని కీర్తించమని ఉపదేశించి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత చాలాకాలానికి కలభాషిణి తన గృహారామంలో కూర్చుని వీణ వాయిస్తుంటే ఒక సిద్ధుడు ఆకాశంలోంచి సింహారూడుడై దిగివచ్చాడు. అతని పేరు మణిస్తంభుడు. ఈ సిద్ధుడు ఆమె పాట వినడు తోసమే వచ్చాడట. ఆమెతోపాటు సరిసమానంగా విద్య నేర్చుకొన్న మణికంధరుడు గానం కట్టిపెట్టి ధ్యానంలో పడ్డంవల్ల సంగితం అంటే చెవికోసుకునే ఈ సిద్ధుడు, పాపం, దూరశ్రవణం మొదలైన సిద్ధులు ఉన్నాయి కనుక మణికంధరునిలాగా పాడే ఈ కలభాషిణీని దివ్యదృష్టివల్ల తెలుసుకొని కీలుసింహంమీద ఎక్కి యెకాయెకి వచ్చాడు. మణిస్తంభుడు చెప్పే విషయాలన్నీ కలభాషిజి అశ్చర్యంతో విన్నది. అతడు తన సిద్ధులను ప్రత్యక్షంగా ప్రయోగించి ఆమెకు చూపించాడు. ఆమె చెలికత్తిలను దూరంగా పంపించి, వాళ్లు ఆడుకొనే మాటలు, చేసిన చేష్టలు చెప్పాడు. అతడంటే ఆమెకు నమ్మకం కలిగింది. తనతోపాటు విద్య నేర్చుకొన్న మణికంధరుని విషయాలు తెలుసుకోవాలని అనుకుంది. అతని తీర్థయాత్రలను. తపస్సును సిద్ధుడు చెప్పాడు. ఈ మణిస్తంభుడు చెప్తున్నవన్నీ నిజమేనని ఆ దారంట పోతున్న ఒక చిలుక చెప్పింది. అది దేవలోకంలోని దట. మణీకంధరుడు చేస్తున్న తపస్సుకు భయపడి దానిని చెడగొట్టడానికి ఇంద్రుడు రంభను పంపించినట్టు ఆ చిలుక చెప్పింది. కలఖాషిణి సంతోషించి ఆ చిలుకను పంపించింది. మూడో అశ్వాసం; “అమ్మా కలభాషిణీ, నీదగ్గరకు నేను రావడం నీ పాట వినడానికి, వీణ తీసుకొని పాడు' అన్నాడు సిద్ధుడు. ఆమె కొంత పాడి “ఇప్పుడు మణికంధరుడెలా ఉన్నాడు? రంభ ఏం చేస్తూంది?" అని అడిగింది. సిద్ధుడు దివ్యదృష్టితో చూసీ కనిపించేదంతా చెప్పాడు. మణికంధరుడెలా రంభకు లోబడిందీ పూసగుచ్చినట్టు చెప్పాడు. అతని శక్తులకు అశ్చర్యపడి, కలఖాషిణి, 'మహాత్మా, మీరు మాయింట ఒకటిరెండు పూటలేనా ఉండాలి అని ప్రార్థించింది. అతడుంటానన్నాడు కొంతసేపయాక మళ్ళీ “దివ్యదృష్టితో చూస్తారా, వాళ్లేం చేస్తున్నారు?” అని అడిగిందీ

ఫింగళి సూరన్న 811 సిద్ధుడు చూశాడు. రంభామణికంధరులు రతిక్రీడలో ఉన్నారట. ఆమె పరవశంలో “నలకూబరా_ విడువిడురా' అని పలవరిస్తోందట (సిద్ధుడీ సంగతులు చెప్పగానే కలభాషిణీలో కొత్తకుతూహలం పుట్టింది. ఆమె నలతూబరుని అందానికేనాడో ముగ్భురాలైంది. మోహించింది). “ఇప్పుడు నలకూబరుడెక్కడున్నా'డని నోరు విడిచి అడిగేసింది. “రంభ ఉన్న వనందగ్గిరే ఒకచోట కనిపెట్టుకొని ఉన్నా'డని చెప్పాడు. చెప్పి ఊరుకోలేదు. “నీ మనస్సు నలకూబరునిపై వుంది. ఇంకేం పాడుతావు? వెడతా' అన్నాడు. “వెడతారా? నన్నేం చేసి పోతారు అని బాధపడి, “ఎలాగైనా నన్ను నలకూబరుని దగ్గరకు చేర్చండి' అని ప్రాథేయపడింది. “సరే, నన్ను ముట్టుకోకుండా ఈ కీలుసింహం మీద దూరంగా కూర్చో, అక్కడకు చేరుస్తాను. అన్నాడు మణిస్తంభుడు. ఆమె అలాగే తూర్చుంది. సింహం ఎగిరిపోయింది.

మేఘాలదారిలో వారికి రంభ చెలికత్తెలు ఎదురుపడ్డారు. "ఏం, మీ ట్రియసఖిని వదలివస్తున్నారేం? ఆవిడగారు మణికంధరుణ్ణి మరికొన్నాళ్లు అనుగ్రహిస్తుందా?' అని సీద్ధుడు ప్రశ్నించాడు. ““ఇంకేమి మణీకంధరుడు? ఆయనగా రెటు పోయాడో ఎవరికి తెలుసు? ఇప్పుడు రంభమ్మ నలతాబరునితో కులుకుతూంది" అని చెలికత్తెలు చెప్పారు. శలభాషిణీ గుండెలు ఒక్కక్షణం ఆగిపోయాయి. వాళ్లు పయనిస్తున్న సింహం నిజంగానే ఆగిపోయింది. ఎంత మొత్తినా కదలలేదు. దానికి కారణం ఉంది. వాళ్లు మృగేంద్రవాహన అనే శక్తి ఆలయంమీదుగా పయనిస్తున్నారు. ఎలాంటి సింహాలేనా ఆ చుట్టుప్రక్కల పయనించడానికి భయపడతాయి. కాబట్టీ, 'దిగి ఆ శక్తిని సేవించుకొని వెళ్ళడం మంచిదని సిద్ధుడు చెప్పాడు. దేవాలయందగ్గర కలభాషిజీని వదలి మణిస్తంభుడు పువ్వులకోసం వెళ్లాడు. ఆ గుడిలో ఒక పండుముసలమ్మ ఉంది. ఆమె పేరు సముఖాసత్తి. కలభాషిణీ గుడీలోకి రాగానే ఆ ముసలమ్మ గాభరాపడింది. 'అయ్యో, ఆ సిద్ధునితో ఎందుకు వచ్చావు తల్లీ! వీడు నిన్ను బలివేయడానికి తీసుకువచ్చాడు' అని చెప్పింది. కలఖాషిణీ నివ్వెరపోయింది. 'నిజం తల్లీ, ఈ శక్తీ చాలా సత్యమున్న దేవత. ఇక్కడ వ్రాసిన శాసనాలు చూడు” అని చెప్పింది. “ఇక్కడ రెండేళ్లు జీడీంద్రియత్వంతో తపస్సు చేస్తే కోరికలు సిద్ధిస్తాయి. తొందరగా వెంటనే ఈడేరాలంటే ఆ గోరు గల్లుతో కళ్లు తోడుకొన్నవాళ్ళకు దివ్యదృష్టి ఆ నారసంతో చెవులు పౌడుచుకుంటే దూరశ్రవణశక్తులు వస్తాయి. ఆ సురియతో నాల్క కోసుకొన్నవాళ్ళకు సారస్వతప్రొఢి సిద్ధిస్తుంది. ఈ గండకత్తిరతో తల ఉత్తరించుకొంటే అది మళ్లా అతుక్కొని తనను చంపదలచినవాళ్ళనే చంపే శక్తులు వస్తాయి. గానవిద్యలో ఆరతేరిన వారకాంతను - అందమైన దానిని - బలియిస్తే మహారాజ్య పదవి వస్తుంది" అని వేరువేరు శాసనాలు అక్కడ ఉన్నాయి. 'ఈ మణిస్తంభుడు నాముందే దూరదృష్టి దూరశ్రవణ శక్తులు సంపాదించాడు. నేను కాశ్మీరదేశంనుంచి వచ్చాను. నాపేరు సముఖాసత్తి. ఈ సిద్ధుడు నిన్ను బలివేస్తాడు' అని అవ్వ చెప్పింది.

అంతలో సిద్ధుడు వచ్చాడు. కలభాషిణీని నిజంగానే బలివేయబోయాడు. అవ్వ దేవిమీద ఒట్టుపెట్టిందీ. “తల్లీ, నామాట నిజమయేళుట్టు చూడు' అని మొక్కుతుంది.

312 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అయినా వాడు లక్ష్యపెట్టక కత్తి ఎత్తి అడ్డువచ్చిన అవ్వను నరికి కలభాషిణీ శిరస్సు ఖండించబోయాడు. అవ్వ పెట్టిన ఒట్టు ఫలించి, వాడు కలభాషిణితోసహా దూరంగా ఎక్కడికో ఎగిరిపోయాడు. వాళ్లు ఎగిరిపోవడం అవ్వ చూసింది. అయితే ఇప్పుడామె అవ్వకాదు. యువతి అయింది. అమె ఆ దేవాలయంలోనే యోగాభ్యాసం చేస్తూ ఉండిపోయింది. కొంతకాలం గడిచాక కలభాషిణీ అ గుడిలోకి సురక్షితంగా వచ్చిండి ' బతికొచ్చావా తల్లో అని యువతి అడిగింది. 'నువ్వ్చైెవరమ్మా' అంది కలభాషిణి. 'నేను ఆ అవ్వనే. దేవి దయవల్ల బ్రతకడమేగాక యౌవనంకూడా పొందాను" అంది సముఖాసత్తి అంతలో మణికంధరుడు అక్కడకు వచ్చాడు. తనతోపాటు గానవిద్య నేర్చుకొన్న కలభాషిణిని చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరూ యోగక్షేమాలు ప్రశ్నించుకొనేలోగా ఆ గుడిలోకి మణిస్తంభుడు కత్తిపట్టుకువచ్చాడు. “నీకోసం అన్నిచోట్లా గాలించాను' అని కలభాషిణితో చెప్పి 'ఈమె ఎవరు?" అని సముఖాసత్తిని అడీగాడు. తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. “ఇక్కడనుంచి వెళ్ళాక ఏం జరిగింది?' అని సముఖాసత్తి అడీగింది మణీస్తంభుడు ఇలా చెప్పాడు: “దేవి నన్వ్యూ ఈమెనీ ఎగరగొట్టగా వెళ్ళి ఎక్కడో ఒక పూలపాన్నుపై పడ్డాం. భయంతో ఆమె వణుకుతూంటే నాకు కామోద్రేకం కలిగింది నేనామెను బలాత్కరించబోయాను. ఆమె 'రక్షించండీ' అని కేకలు వేసింది. ఎక్కడినుంచో నలకూబరుడు వచ్చాడు. నన్ను తరిమితరిమి కొట్టాడు. నా కత్తి లాక్కొన్నాడు. అప్పుడు రంభ వచ్చి నలకూబరుణ్ణి తనతోపాటు తీసుకుపోయింది. నేను వాళ్ళ వెనుకనే వెళ్ళాను. నా కత్తి చాలా గొప్పది. దానికి మహిమలున్నాయి. దానిని పోగొట్టుకోవడం ఇష్టం లేక వెళ్ళాను. ఒక పొదరింట్లో రంభానలకూబరులు క్రీడిస్తున్నారు. కొంతసేపటికి అక్కడికీ ఇంకో రంభ వచ్చింది. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నలకూబరుడు నివ్వెరపోయాడు. ఎవరు అసలు రంభో తేల్చుకోలేకపోయాడు. రంభ లిద్దరూ మాట్లాడుకొన్నారు. ఎంతకీ తెగలేదు. అక్కడకు నారదుడు వచ్చాడు. అతడు ఈ కలహభోజనం కడుపునిండా ఆరగించి చక్కాపోయాడు. సవతుల కయ్యం సాగుతూనే ఉంది. ఒక రంభ 'పద ఇంద్రలోకానికి, అక్కడ తేల్చుకుందాం” అంది. రెండోదీ “రా'నన్నది. రానన్న రంభ నకిలీ రంభ అని తేలిపోయింది. అసలు రంభ దానిని శపించింది కత్తితో దాని తల తెగాలని శపించింది. కపట రంభ పోయింది. అసలు రంభ నలకూబరునితో క్రీడిస్తూంది. కొంతసేపు పోయాక మరో నలతూబరుడు వచ్చాడు. ఇందాకా జరిగినదానికిప్పుడు పుంభావ కలహం జరిగింది. ఎవరు సత్యనలకూబరుడో తేలలేదు. మల్లయుద్ధం చేశారు. చివరకు రంభకో ఉపాయం తట్టింది. “మిమ్మల్ని ఓ హ్రీ వేస్తాను. ఎవరు సమాధానం చెప్తే అతడే నిజమైన నలకూబరుడు" అన్నది. ఆమె అడిగిన ప్రశ్న ఏమిటంటే “మనకు కళాపూర్ణుని ప్రసక్తి ఎప్పుడు వచ్చింది? నేనేం చెప్పాను? ఈ ప్రశ్నకు కొత్తగా వచ్చినవాడే సమాధానం చెప్పాడు. మొదటివాడు తెల్లముఖం వేశాడు. వాడు మోసగాడని గ్రహించి అల్పావశిష్టాయువుగా శపించాడు. “ఎవరు నువ్వు?” ఆని ప్రశ్నించి తేల్చుకొనేలోపల రంభ నిజమైన నలకూబరుజ్ణి తీసుతుని వెళ్ళిపోయింది. నా క్తి

పింగళి సూరన్న 313 నారు దొరికింది. అది తీసుకు ఇలా వచ్చాను." ఇలా చెప్పి మణిస్తంభుడు కలభాషిణిని చూసి ఇంక నీ కథ చెప్పు అన్నాడు.

శాలుగో అశ్వాసం: “నా కథ చెప్పడాని కేముంది? అంతా నువ్వే చెప్పావు. ఆ కపట రంభను నేనే అంది కలభాషిణీ.

అందరూ ఆశ్చర్యపోయారు. కలభాషిణి విచారించింది. తాను క్రీడించింది సత్య నలకూబరునితో కాదన్నమాట. శాపగ్రస్తురాలైనా ఫలితం దక్కలేదన్నమాట. ఈనగాచి నక్కలపాలు చేసినట్టు ఇన్నాళ్లు దాచిన శీలాన్ని ఏ దుర్మార్గుని పాలు చేశానో అని వగచింది. 'విదారించకు. ఆ కపట నలకూబరుణ్ణి నేనే' అన్నాడు మణికంధరుడు. ఆమె ఆశ్చర్యపోయింది. “నిజం. నా తపస్సు చెడకొట్టి, రంభ నాతో మొదట శ్రీడించింది. పారవశ్యంలో నలకూబరుని పేరు పలవరించింది. నాకు రోత పుట్టింది. ఆమెను వదలీ వెళ్ళిపోయాను. ఆ దేవవేశ్యకు బుద్ధి చెప్పాలని నా తపో మహిమలన్నీ ధారపోసి నలకూబరుని రూపు పౌంది ఆమెకు తెలియకుండా అమెతో శ్రీడించాను. నీ ఆర్హనాదం విని రక్షించడానికి వచ్చాను. తరువాత నీకు తెలుసు అన్నాడు మణికంధరుడు. “పోనీలే, నా అందం కృతార్థమైంది. నువ్వంటే నాకు తొలినుంచి ఇష్టమే. ఆ ప్రేమను బయటపెట్టలేదు. అయినా ఇప్పుడు నామాటలు ఎవరు నమ్ముతారు' అంది కలభాషిణీ. “ప్రేమలో కొన్ని వింత తత్త్వాలుంటాయిలే' అని మణికంధరుడు కాన్మీర దేశంలోని

““కాళ్మీరదేశంలో శారదాపీఠం ఉంది. శంఖంలో పోసినదే తీర్థం. అక్కడివాళ్లు మెచ్చుకొన్నదే కవిత్వం. నా సాహిత్యస్థాయిని తేల్చుకొనడానికి కాశ్మీరం వెళ్ళాను. అక్కడో వేదగురువు ఇంటికి వెళ్లాను. అతని శిష్కుడొక పుస్తకం తెచ్చాడు. ఏమిరా ఇంత అలస్యమేం?” అని గురువు అడిగాడు. “కారణం ఉంది. నేను పూలతోటకు వెళ్ళి శాలీనుణ్ణి పుస్తకం అడిగాను. ఆయన సుగాత్రి తొడలమీద కాళ్లు పెట్టుకొని ఉన్నాడు. ఆ భార్యాభర్తలు ఏదో మాట్లాడుతుంటున్నారు. ఉన్నట్టుండి ఆయనకు కోపంవచ్చి నూరుతాళ్ళ కోనేటిలో పడిపోయాడు. అవిడకూడ అతనితోబాటు ఉరికింది. నేను పుస్తకం తెచ్చాను అని శిష్యుడు చెప్పాడు. ఆ దంపతుల మరణానికి అందరూ రోదించారు. -

ఆ పుస్తకంలో సుగాత్రీశాలీనుల కథ ఉంది. దానిని శారదాదేవి స్వయంగా వ్రాసిందట. శారదాపీఠం పూజారికి సుగాత్రి అనే కూతురు ఉంది. ఆమెను శాలీనుడనే అబ్బాయి కిచ్చి పెళ్ళి చేశారు. ఇల్లరికం ఉంచుకున్నారు. శోభనం గదిలో భార్య సర్వాలంకార శోఖితయ్రై వస్తి అతడు కన్నెత్తి చూడలేదు. ఇలా ఒకనాడు కాదు, పలునాళ్లు. ఈ సంగతి బహిరంగ రహస్యం. ఆత్తగారీ సంగతి విని అల్లుణ్నీ ఏవగించుకొంది. తోట పనులను పెట్టింది. ఒకనాడు వర్షం వచ్చింది. భర్త తోటలో తడీసిపోతున్నాడేమో అని సుగాత్రి బాధపడింది. తన అభరణాలన్నీ తీసేసి భర్తతోపాటు తోటలో పనిచేసి అలిసిపోయింది. ఇమె సహజ సౌందర్యానికి ముగ్ధుడై శాలీనుడామెను ఏలుకొన్నాడు. ఆ

314 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి రాత్రి పడకటింట్లో ఆమె మళ్ళీ ఆభరణాలతో అడుగుపెడితే కన్నెత్తి చూడలేదు. చివర్‌క్ష కొన్నాళ్లకు శాలీనుని వింత ప్రేమతత్వం అందరికీ అర్ధం అయింది. సుగాత్రి పాతివ్రత్యాని॥ి శారదాదేవి ప్రత్యక్షమైంది. వాళ్ళ చరిత్రను తానే వ్రాసి కాశ్సీరదేశంలో వ్రాయడం చదవడం వచ్చినవాళ్ళందరికీ ఇచ్చింది. ఏ కారణంవల్లనో ఆ దంపతులు కోనేటిలో ఉరి చచ్చిపోయారు.”'

ఈ కథ చెప్పి మణీకంధరుడు 'ఆ శాలీనునిలాగే నువ్వూ నీ ప్రేమలో ఒక తరహాక్స చెందినదానివి' అన్నాడు. అన్నాక సముఖాసత్తిని చూసి 'ఏమమ్మా, నువ్వు కాశ్ళీరదేశు నుంచి వచ్చానన్నావే. ఈ సుగాత్రీ కాలీనుల కథ నీకు తెలియదా?” అని ప్రశ్నించాడు. “తెలియకేం? ఆ సుగాత్రిని నేనే అంది సముఖాసత్తి. అందరూ ఆశ్చర్యపోయారు. “నూరుతాళ్ళ కోనేటిలో పడి ఎలా బ్రతికావు' అన్నారు. “నన్నో మొసలి మింగి అరిగించుకోలేక మరునాడు బయట పారేసింది. నన్ను నా పతితో చేర్చడం నీ భారమని వాణికి మొక్కుకుని తీర్థయాత్రలు చేస్తూ ముసలిదాన్ని అయ్యాను. సుముఖులు అంటీ శాస్త్రవిదులు. వాళ్ల సమీపంలో ఎప్పుడూ వర్తించడంచేత సముఖాసత్తి అని పిలిచేవారు ఇక్కడకు చేరాక నా కథ మీకు తెలుసు అంది. నేను బ్రతికానుగాని నా భర్త ఏమయ్యారో అని బాధపడింది.

నీ భర్హమాత్రం ఎందుకు జీవించడు? నేనే నీ భర్తను అని మణిస్తంభుడు అన్నాడు. అమె నమ్మలేనంత ఆశ్చర్యపడింది. అతడు వివరించాడు. ఆ మడుగులో ఒక యోగి జలస్తంభన విద్యతో సమాధిలో ఉన్నాడు. అతడు కనికరించి శాలీనుణ్ణి కాపాడి యోగవిద్యలు నేర్చి వయస్తంభనపు మణీ, మహిమలున్న కత్తి, ఎగోరో సింహం ఇచ్చాడు. స్తంభనపు మణివల్ల అతనికి మణీస్తంభుడనే పేరు వచ్చింది.

ఈ నలుగురూ ఒకరి నొకరు పరస్పరం గుర్తించుకున్నాత కలభాషిణీ మణికంధరులు వారివారి శాపాలు తలచుకొన్నారు. “అయ్యో, కళాపూర్ణుని ప్రసక్తి ద్వారక దగ్గిర వచ్చిందని చెప్పలేకపోయావా, శాపం తప్పేది" అన్నది కలభాషీణి. “నాకేం తెలుసు" అన్నాడు మణికంధరుడు. “కౌనౌను, నేను నారదమునీంద్రుణ్ణీ అడిగినప్పుడు నువ్వు దూరంగా వెళ్ళావు. ఆ కళాపూర్జుని కథ చెప్తే, చెప్పినవాళ్లూ విన్నవాళ్లూ భూలోకంలో పుత్రపొత్రాఖీ వృద్ధిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారట!' అంది కలభాషిణీ.

అప్పుడే అలఘువ్రతుడనే ఒక మలయాళ బ్రాహ్మణుడు ఆ గుడిలోకి వచ్చాడు అంత చక్కని మాహాత్మ్క్వం కల కథను వినాలనుకున్నాడు. రెండేళ్లు ఈ గుడిలో తపస్సు చేస్తే కోరికలు తీరుతాయి కనుక, ఆ విధంగా యిష్టసిద్ధి పాందాలనుకున్నాడు.

“నేనెలాగా కత్తిచేత చావవలసినదానను. నన్ను ఈ దేవికి బలివెయ్యి. నువ్వు మహారాజువి అవుతావు' అని కలభాషిణీ మణికంధరునితో చెప్పింది. అతడు తటపటాయించి బలివేశాడు. “విలంబనం చేసినందువల్ల, వచ్చే జన్మలోగాని నీకు మహారాజపదవి లభించదు. పుట్టిన వెంటనే సద్యోయౌవనం పొంది రాజువి అవుకావు అని దేవి ప్రత్యక్షమై చెప్పింది. ప్రియునికోసం ప్రాణాలు అర్చించిన కలఖాషిణిని బ్రతికీలి

పింగళి సూరన్న 316 ద్వారకలో ఆమె ఇంట పడవేసింది. మణికంధరుడు తన వీణను ఆ గుడిలో భద్రంచేసే కృష్ణుడు తనకు ఇచ్చిన మణీహారాన్ని అక్కడ తపస్సు చేసుకుంటున్న మలయాళ బ్రాహ్మణునికి కృష్ణార్చణం అని దానం చేసి శ్రీశైలం కొండమీంచి క్రిందపడి చావడానికి వెళ్లాడు.

సముఖాసత్తి మణిస్తంభులైన మాజీ సుగాశ్రీశాలీనులు తమ కీలు సింహంమీద ఎక్కి దేశం విహరించడానికి వెళ్ళారు. పూర్వం శాలీనుడు అంత కోపించుకొని చెరువులో పడడానికి కారణం ఏమిటంటే, ఆమె తనకు బిడ్డలు పుట్టకుండా దేవిచేత వరం పొందిందట. ఆ దేవే అతనికి బిడ్డలు పుడతారని వరం ఇచ్చిందట. నాకు తెలియకుండా ఇటువంటి వరం పుచ్చుకొంటావా అని చెరువులో పడ్డాడు. ఇప్పుడు భార్యాభర్తలు మళ్ళీ కలుసుకున్నాక అతడు స్త్రీ రూపం ధరించుతానన్నాడు. ఆమెను పురుషరూపం ధరించమన్నాడు. ఆమె “సరే, నేను మగవాణ్ణి అవుతాను, మీరు స్త్రీ ఆవండి' అంది. ఆమె అన్నమాట నిజమయే వరం దేవత యిచ్చింది కనుక అలాగే జరిగింది. ఐదో అశ్వాసం: రెండేళ్ళూ గడిచాయి. మలయాళ బ్రాహ్మణుడు ఉన్నట్టుండి మణిహారంతో సహా పోయి ఒక రాజసభలో పడ్డాడు. ఆ సభలో మధ్య ఒక ఉయ్యాల తొట్టిలో రెండునెలల కిశువు ఉంది. బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న హారాన్ని రాజుకు సమర్పించాడు. “ఇక్కడి కానుకలన్నీ దీని సొమ్ములు" అని ఆ హారాన్ని శిశువు మెడలో వేశారు.

“రెండేళ్ళ తరువాత మళ్ళీ ఈ హారాన్ని చూశానని ఆ నెలల బిడ్డ అందరూ అశ్చర్యపడేలా చెప్పింది. ఆ పిల్ల తన కథ ఇలా చెప్పింది:

“పోయిన జన్మలోకాక్క అంతకు ముందు జన్మలో నేను బ్రహ్మలోకంలో భారతీదేవి పెంపుడు చిలుకను. ఒకనాడు సరస్వతీ చతుర్ముఖులు ఒక చెరువువద్ద విహరిస్తున్నారు. ఆ చెరువులో ఒక మణిస్తంభం ఉంది. దాని గట్టుమీద పూలపాన్సుపైన చతుర్ముఖుడు సరస్సువైపు ముఖం పెట్టుకొని పడుకున్నాడు. సరస్పత్తీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ వుంది. ఉన్నట్టుండి ఆయనకు వాంఛలు పొడమి అమె ముఖాన్ని తనవైపు తిప్పుకొని, నాల్గు ముఖాలతోనూ ముద్దుపెట్టుకోబోయాడు. ఆమె ఇదేమిటని పెదవికి చెయ్యి అడ్డుపెట్టుకొని వెనక్కి ఒరిగింది. ఆయనామెను దగ్గరకు లాక్కొని నాల్గుముఖాలతోనూ “అధరపానం చేశాడు. ఒక నోట్లోని పన్నువల్ల ఆమె పెదవి గంటుపడింది. ఆమె పరవశించి అపూర్వమైన మధురధ్వని చేసింది. తన సుఖావస్థను కప్పిపుచ్చడానికి ఆమె పెడమోమై కాళ్లు ముడుచుకొని పడుకొంది. అప్పుడామె ముఖం కొలనులో ఉన్న మణిస్తంభంలో ప్రతిఫలించింది. చెట్టుమీద ఉన్న నేను ఆమె లక్షణాలన్నీ కామశాస్త్రంలో చెప్పినవే అని గుర్తించాను. సరిగ్గా అదే సమయానికి చతుర్ముఖుడు ఛెప్పడమా? మీరు చెప్తే వింటాను” అన్నాను. ఆయన ఇలా చెప్పాడు.

“అనగనగా కాసారపురం అనే నగరాన్ని కళాపూర్జుడనే రాజు పాలిస్తున్నాడు. అతడీ లోకంలో ఉన్న రాజులందరినీ జయించాడు. ఆ రాజు పుట్టుకతోనే యువకుడయాడు.

316 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ స్వభావుడనే సిద్ధుడు అతనికి విల్లు బాణాలు, ఒక మణీశలాక తయారుచేసి ఇచ్చాడు. ఒకనాడు మదాశయుడు అనే రాజు గూపానుభూతి అనే తన భార్యతోనూ, ధీరభావుడనే మంత్రితోనూ కళాపూర్ణునివద్దతు వచ్చాడు. అతడు విల్లెత్తి ధీరభావుణ్ణి తరిమివేసి ఆ దంపతులను తనకు దాసులను చేసుకొన్నాడు.

బ్రహ్మదేవుడు ఇంతదాకా కథ చెప్పేసరికి అమ్మవారికి ఆసక్తి పుట్టింది “కళాప్తూర్జుడేమయ్యాడో? అతని తల్లితండ్రులెవరో అడగవే చిలుకా" అని అపై నవ్వుతూ పురమాయించింది. నేను అడిగాను.

“అతడు అఖినవకౌముది అనే కాంతను వరించాడు. అతని తల్లి మణిస్తంభుడు తండ్రి సముఖాసత్తి' అని చతుర్ముఖుడు చెప్పగానే ఆమె ఆయనను కౌగలించుకొని “ఇంతలోనే తబ్బిబ్బులా? తల్లి మగవాడు తండ్రి ఆడదా? సరే, తరువాత కథ చెప్పండీ అని వీపు చరచి అడిగింది. ఆయన ఆ చేష్టకు ఆనందించి మళ్ళీ ముద్దుపెట్టుకొన్నాడు. ఒక పన్ను నాటింది. ఆమె కోపం నటించి 'తరువాత కథ చెప్పండి" అంది. అతని కౌగిలి విడిపించి రెండు చేతులతో అతని ముఖాలు సక్కకు తోసింది. ఆమె వక్షోజాల పొంగు, నడుము అందం చూసి మళ్ళీ ఆయన ఆమెను చుంబించాడు. “ఇది నేర్చుకున్నారు, బాగానే ఉంది, ఆ రాబజేమయ్యాడు' అని అమె అడీగింది.

“ఏమవుతాడు? మహారాజులా ఉన్నాడు. అతని మంత్రి సత్వదాత్ముడు పట్టాఖిషేకం చేస్తే క్రముక కంఠోత్తరం అనే పట్టణాన్ని దివ్యంగా ఏలుతున్నాడు మదాశయుడాపురికి పసిడికోటలు పెట్టాడు. ఆ మదాశయుడు, అతని భార్య కళాపూర్ణుజ్జీ సివించుకొంటున్నారు. ఆ రాజు వద్దనున్న మణిశలాక మహిమవల్ల దాన్ని చూడగానే వాళ్ళకు మధురలాలస కల్లి మధురలాలస అనే అమ్మాయి పుట్టింది. మదాశయని పురోహితులు నలుగురున్నారు. వాళ్ళు ఆ మణిశలాకను మెచ్చుకొంటున్నారు. అందులో ఒకడా మణిని గట్టిగా నొక్కేసరికి కళాపూర్ణునికి కోపం వచ్చి, ఆ పురోహితులనూ, వాళ్ళీ ఏలిక అయిన మదాశయుణ్ణీ కూడా తరిమివేశాడు. మదాశయుడు కట్టించిన పసిడికోటను ఒల్లక పడగొట్టించాడు. మదాశయుడు తన భార్యతో. బిడ్డతో, పురోహితులతో క్రమక కంలోత్తరపురం వదలిపోయాడు. వాళ్లు చుధ్యదేశంలోనికి వెళ్ళగానే మధురలాలస చిక్కిపోసాగింది. ఆ బిడ్డ బ్రతికి ఉంటే చాలు అని మళ్ళీ అందరూ కళాపూర్ణునివద్ధకే చేరారు. మణిశలాకను చూశాక మధురలాలస కోలుకొంది.

ఇలా చతుర్ముఖుడు కథ చెప్పగానే ఆమె దొంగ కోపంతో బొమలు మీవి “నామీదనా మీ కవిత్వం' అంది. 'ఇప్పుడేమైం'దని చతుర్ముఖుడు అడిగాడు. "ఈ కొలని దగ్గిర మన విహారవిలాసాలనే మీరు కథగా చెప్పారు. ఈ కొలనే కాసారపురం. ఇందులోని మణి స్తంభంలో ప్రతిఫలించిన నాముఖమే కళాపూర్ణుడు. నా చిరునప్వే అఖినవకౌముది మీ ఆశయమే మదాశయుడనే రాజు. మీ నాల్గు ముఖాలే నలుగురు పురోహితులు. నొ కనుబొమలే కళాపూర్జుని విల్లు, నా చూపులే అతని బాణాలు. నా పెదవే అతనివద్ధ ఉన్న మహిమగల మణిశలాక. ఇవి అందరికీ స్వాభావసిద్ధంగా ఉంటాయి. కనుక వీటీని స్వభావుడనే సిద్ధుడు ఇచ్చాడు అన్నారు' అని ఆయన చెప్పిన కథలో ప్రతి వాక్యానికీ

పింగళి సూరన్న 317 ప్రతి పదానికి తమ శృంగారలీలను సమన్వయం చేసింది. ఆయన నిజమేనని ఒప్పుకున్నాడు. ఆనంద పారవశ్యంలో సరస్పతి చేసిన ఆ మధురధ్వని నేను సాధకం చేసి చూసుకొంటున్నాను. అప్పుడొకసారి రంభ ఇంద్రునితోపాటు బ్రహ్మదేవునిసీవకు వచ్చింది. నేను సాధకం చేస్తున్న ధ్వని విని 'ఇది అయ్యగారి సేవలో అమ్మగారు ఉగ్గడించిందా?* అని ప్రశ్నించింది. నేను “అవునని కళాపూర్జుని కథ చెప్పాను. అంతలో సరస్వతి వచ్చి నామీద మండీపడింది. తన రహస్య క్రీడ బయటపెట్టినందుకు నన్ను వారకాంతగా పుట్టమని శపించింది. సమయానికి చతుర్ముఖుడు వచ్చి 'ఆ తరువాత జన్మలో మధురలాలసవై కళాపూర్జుని రాణీ వవుతావులే' అని దీవించాడు. “ఇంకా అదే పలవరింతా?" అని అడిగింది సరస్వతి. 'తప్పకుండా. ఈ కళాపూర్జుని కథ చెప్పినవాళ్లు, వినినవాళ్లు భూలోకంలో పుత్రపొత్రాభివృద్ధిగా చిరకాలం సంపదలతో తులతూగుతారు' అని ఆయన దీవించారు. సరస్వతి మండిపడింది. 'ఈ కథ ఎలా బయట పడుతుందో చూస్తాను. ఆ చిలుక వల్ల భయం లేదు. రంభ చెప్పదు. రంభేదీ? రంభా, నా సంగతి తెలుసా?" అని గద్దించింది. స్తంభం చాటున ఉన్న రంభ వణికిపోయింది. నేను ద్వారకా నగరంలో కలభాషిణి అనే వారకాంతనై జన్మించాను. ఆ జన్మ తరువాత ఇలా పుట్టాను.

ఇలా ఆ రెండునెలల బిడ్డ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ పిల్ల చెప్పిన కథ అక్షరాలా జరిగింది. ఆ శిశువే మధురలాలస. ఆ సభ కళాపూర్ణుని సభ అందులో మదాశయుడు,. రూపానుభూతి మొదలైన పాత్రలందరూ ఉన్నారు. ఆ విడ్తూరపు శిశువు అందులో ఉన్న ప్రతి ఒక్కరి పూర్వబన్మగాథా వివరించి చెప్పింది. మణికంధరుడే తళాపూర్ణుడై పుట్టాడు. సుగాత్రి తండ్రే స్వభావసిద్ధుడు.

ఇప్పటికి ఐదో. అశ్వాసం కూడా పూర్తికాలేదు. సూరపరాజుగారీ కావ్యాన్ని ఎనిమిది ఆశ్వాసాల మహాప్రబంధంగా బ్రాశారు. కళాపూర్లోదయం గొప్పతనాన్ని లోకానికి చాటిన ఆధునికులు కట్టమంచి రామలింగారెడ్డిగారు. వారు “కవిత్వతత్త్వవిచారం' అనే గ్రంథంలో సూరపరాజుగారి ప్రతిభను బాగా శ్లాఘించారు. లోపాలను దాచకుండా చూపించారు. రెడ్డిగారి ఉద్దేశంలో కళాపూర్ణోదయంలోని కథ 6వ ఆశ్వాసంలోని 19వ పద్యం తరువాత ట్రొడంగా లేదు.” కళాపూర్జ్చోదయానికి “భావప్రకాశిక అనే వ్యాఖ్యానం బ్రాసిన మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారి ఉద్దేశంతూడా అదే. అయితే కళాపూర్ణోదయంపై గొప్ప కృషి చేసి డాక్టరేటు పట్టం పొందిన జివి. కృష్ణారావుగారు మాత్రం దానిని ఖండించి సూరపరాజుగారు వ్రాసిన ప్రతి పద్యంలోనూ అర్థం వుందని రుజువు చేశారు. విమర్శకులు లోపాలను ఆపాదించినవాటిని పూర్వపక్షం చేశారు. కళాపూర్ణోవయంలోని అంతరార్థాన్ని విశదీకరించారు. వారి వివరణ నా మాటలలో చెప్తాను.

సూరపరాజుగారి ఉద్దేశంలో కళాపూర్లోదయంలోని ఇతివృత్తం కళయొక్క పూర్ణోదయమే. ఈ సిద్ధాంతాన్ని ఒకటి కాదు, రెండు కాదు, తొమ్మిది దృష్టాంతాలతో బలపరచవచ్చు: 1. కావ్యంలోని కథాసంవిధానవైచిత్రి, 2. కవిత్వనిర్వచనానికి కావ్యంలో శె తత్త్నవిచారం, పుకు 179 8, లహ (స గ్రంథమండలి ప్రచురణ) పిఠిక, పుట 37. 9. కయ ౧ [2ట0టూం0డజ2 0 5౯ 67. గూజలీంతి గతం, 9. 252

318 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చేసిన ప్రయత్నాలు, కావ్యంఫలశ్రుతి, 3. మణికంధరుని పూర్వగాథ, ఉత్తరచర్యలు, 4. మణిస్తంభ సుముఖాసత్తుల పేర్లు, వాళ్ల స్వదేశం, ఆరాధ్యదైవం, 5. సరస్వతీచతుర్ముఖుల రహస్యకథ, 6. కళాపూర్చుడు, అఖభినవకౌముది, మధురలాలస, వారి సంతానమైన సుప్రసాదుడు, సరసుడు అనే పేర్లు, 7. కావ్యంలో తాత్త్విక విషయాలను చెప్పడం, 8. శాస్త్ర్య్యసనాతి ధన్యమగు సజ్జనకోటి అనుగ్రహంవల్ల తన కావ్యానికి ప్రచారం ఆశించడం, 9. కావ్యానికి కళాపూర్జోదయం అనే పేరు పెట్టడం.

ఈ తొమ్మిది సత్యాలను కృష్ణారావుగారు చాలా బాగా దీర్హంగా వివరించారు.

సూరపరాజుగారి ఉద్దేశంలో కళ ప్రకృతికి ప్రతివింబమూ కాదు; అనుసరణా కాదు. కళాకారుడు ప్రపంచానికి దర్పణం కాడు. అతడు సార్వజనీనమైన విషయాలనే ఏరుకొని తన శిల్బంతో వాటికి శాశ్వతత్వాన్ని ప్రసాదించాడు. వాస్తవికవాదిమాత్రమే కాక స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నందుకు కళాకారుడు తన బహిరంతర ప్రపంచాలకు స్పందించినందువల్లనే కళ ఉదయిస్తుందని సూరపరాజుగారి విశ్వాసం. వ్యక్తిత్వంతో స్పందించి సృజించకపోతే కళ అన్నదే ఉండదు. అయితే వ్యక్తిగత స్పందనే పూర్తిగా కళ కాలేదు. ఇది కళాసృష్టికి ప్రధమ దశ రెండవదశ పరిణామం. కళాకారుని వ్యక్తిగతమైన అనుభవానికీ, అతని విశ్వాసాలకూ, సంప్రదాయాలకూ లోనై మార్చులు పొందుతుంది. మూడవ దశలో కళ స్వయంవ్యక్థమవుతుంది.

సరస్పతీచతుర్ముఖుల కథలో కళ ఇలాగే పూర్ణంగా ఉదయించింది. చతుర్ముఖుడు దివ్యకళాకారుడు. అతని వ్యక్తిగత విలాసలీల అనుభూతిగా ఉన్నప్పుడు ఒకటి; దానిని చూటల్లోనికి మార్చి కథ చెప్పినప్పుడు వేరొకటైైంది. అది భూలోకంలో జరిగినప్పుడు చిలవలు పలవలు చేరాయి. సూరపరాజుగారీ కళాపూర్లోదయంలో కళను గురించి తమకు గల సిద్ధాంతాలను చెప్పడానికే మణికంధరుణ్ణి కవిని చేశారు. కాశ్మీరం పంపించారు. జి.వి. కృష్ణారావుగారు చెప్పినట్లు మణికంధరుణ్జి కాశ్మీరు పంపడంలో ఏదో అర్థం వుండి సంస్కృత భాషలోని అలంకారికులందరూ రమారమీ కాశ్ళీరువాళ్లే. నిజానికి కాశ్మీయే శారదాపీఠం. కళాపూర్ణోదయం కళ గురించి కవి సిద్ధాంతాలను చెప్పే, గ్రంథం కనుక కళాపూర్ణుని తల్లితండ్రులను శారదాపీఠం పూజారి ఇంట సూరపరాజుగారు పుట్టించారు. కృత్రిమ అలంకారాలను ఏవగించుకొనేవాడు తల్లి అనడంలో అంతరార్థం లేకపోలేదు. శాస్త్రవిదుల సమీపాన ఉండడం కూడా అవసరమే.

డాక్టర్‌ జివి. కృష్ణారావుగారు చెప్పిన అర్జాలూ, చూపించిన సాగసులేకాక కళాపూర్ణోదయం కొత్త దృష్టితో చదివితీ ఎన్నో విషయాలు స్ఫురిస్తాయి. మృగేంద్రవాహన ఆలయం కేరళదేశంలోనే ఉందనడంలో సూరపరాజుగారు కేరళకు వెళ్లడమేగాక వేరీ అంతరార్థం ఉంది. మంత్రశాస్త్రం అక్కడ వికసించింది. అలంకారశాస్తానికి కాశ్మీరమెంతో మాంత్రికులకు కేరళ కూడా అంత ప్రసిద్ధమే. కలభాషిణి జీవితంలో రంభానలకూబరులే ఎందుకు ప్రవేశించాలి? బ్రహ్మ లోకంలో అమె చిలుకగా ఉన్నప్పుడు ఆమె జీవితంలో రంభ ప్రవేశించింది కనుక, కలభాషిణిగా చిలుక పుట్టనప్పుడు జరగని సంఘటనలు ఏమీ

పింగళి సూరన్న 319 బ్రహ్మరహస్య కథలో చెప్పలేదు, అయినా అవి అలా ఎందుకు జరిగాయి? (బ్రహ్మవాక్యమే కాదు: బ్రహ్మకుమారుని వాక్కుకూడా అమోఘం. ఉత్తమకళాకారుని సృష్టిలో కళ పూర్ణంగా ఉదయిస్తుంది; అసూయాగ్రస్తుడైన ప్రతిభావంతుని శిల్పం వల్ల తప్పుల తమాషాలు జరుగుతాయి. తళాపూర్ణోదయంపైనా, _ సూరపరాజుగారిపైనా ప్రత్యేకంగా పుస్తకాలనే బ్రాయవచ్చు. వారు కళాపూర్ణోదయం వ్రాశాక ప్రభావతీ ప్రద్యుమ్నం అనే ప్రబంధం ద్రాశారు. అయిడే రచనా దోషాలు లేకపోయినా ఇది కళాపూర్జోదయంకన్నా నికృష్ణమని కట్టమంచి రామలింగారెడ్డిగారి అంచనా. ఈ పతనానికి కారణం భావలోపాలని చెప్పారు. కళాపూర్లోదయంవంటి శిఖరాగ్రం. చేరాక సూరపరాజుగారీలాంటి ఉదాత్త మనీషి సైతం క్రిందికి దిగారు. ఎంత స్వతంత్ర రచనావిధానాన్ని చూపినా, ప్రభావతీ ప్రద్యుమ్న ప్రబంధాన్ని రొటీను ప్రబంధాల చట్రంలో ఇరికించారు. కళాపూర్జోదయాన్ని వేనోళ్ల పౌగడిన రెడ్డిగారివంటి సహృదయులే ఈ దిగుమతికి బాధపడక తప్పలేదు. అయితే రెడ్డిగారి సహృదయతను అర్థం చేసుకోలేని సనాతనులు ప్రబంధములలో వెగ్రివికారములుండునని తలంచుట పొరపాటు యొక్క లక్షణమనీ, ప్రబంధ స్త్రీల సుగుణాలను రెడ్డిగారు గ్రహించలేదనీ, మహాకవుల రచనలలో దోషాలుండవనీ సమర్ధించసాగారు.!1 ప్రభావతీ ప్రద్యుమ్నంలోని సౌగసులను వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు వ్యాఖ్యానించారు.32 సూరపరాజుగారి ఇతర రచనల గురించి కూడా చెప్పారు. మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు ఒక వ్యాసంలో సూరపరాజుగారి మూడు రచనలను గురించి చక్కగా సింహావలోకనం చేశారు. రాఘవపాండవీయం ఉభయభాషా పాండిత్యంలో బుద్ధిచాతుర్యానికీ, కళాపూర్లోదయం అద్బుత విచిత్రకళా కల్పనలో ప్రతిభా చాతుర్యానికీ, ప్రభావతీ ప్రద్యువ్నం సారవత్త్సరకవిత్వ కళలో ప్రజ్ఞాదాతుర్యానికీ సాక్ష్యమిస్తన్నాయట.1 _ స్వతంత్రంగా కథానిర్మాణ కౌశలం ఉన్న సూరసరాజుగారు సుప్రసిద్ధ కథనే తీసుకొని ప్రభావతీ ప్రద్యుమ్నాన్ని రచించారు. దీనికి హరివంశం విష్ణుపర్వంలోని కథ ఒక్కటే కాక క్రీ.శ 12వ శతాబ్దిలో తిరువనంతపురం పాలించిన రవివర్మ అనే కేరళకవి థాసిన “ప్రద్యున్నూభ్యుదయం' అనే నాటకం కూడా ఆధారం అయితే నూరపరాజుగారు. తెలుగు సాహిత్యంలో చిరకాలం నిలిచిపోయే పాత్ర నొకదానిని ఇందులో సృష్టించారు. దాని పేరు శుచిముఖి. అది హంస. బ్రహ్మదేవుని రథచోదకుడైన సారంధరుడనేవాని కూతురు. దానిని భారతీదేవి పెంచింది. దీనికి శుచిముఖి అని పేరు 11. కవిత్స తత్త్వవిచార విమర్శనం, కాళూరి వ్యాసమూర్తిగారు. 12. ప్రభావతీప్రద్యువ్నం, వెంకట్రామ గ్రంథమాల ప్రచురణ. 13. కళాపూర్ణోదయం సరస్వతీగ్రంథమాల ప్రచురణ, పీరిక, పు. 20 14. 726 90006 ౦! 92002230 గఆర్వజగుగము అనే వ్యాసంలో అదార్య పింగళి లక్ష్మీకాంతంగారు ఈ కథకు ఆధారాలను సమగ్రంగా చర్చించి శుచిముఖిపాత్రను బాగా సమీక్షించారు. ౦గజుడః కెజియింట్‌ పతకం కింలరంజరంం, రరర ౦ నశంరుంు, 1933.

320 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పెటిందామె. దాని కవిత్వానికి మెచ్చి ఉపమాతిశయోక్తి కామధేనువు అనే బీరుదు ఇవ్వ్చడమేకాక, దానిని సరస్వతీదేవి స్వయంగా దాని కాలికి తొడిగింది.

ఈ శచిముఖి ప్రభావతీప్రద్యుమ్నంలోని కథను మొత్తం నడుపుతుంది ఇంద్రోపింద్రులతు ఉపాయాలు చెప్తుంది. ప్రభావతీప్రద్యుమ్నులను కలుపుతుండి వజ్రనాభుణ్జీ చంపించి దేవతలకు మేలు చేకూరుస్తుంది. దీని కవిత్వాన్ని ఇంద్రుడిలా మెచ్చాడు:

శబ్దసంస్కార మెచ్చటను జారగనీక పదమైత్రి యర్ధసంపదల బొదల

దలపెల్ల సక్షిష్టనుబ్రదీపితముగా బునరుక్తిదోషంబు పొంత బోక

యాకాంక్షితస్ఫూర్తి యాచరించుచును శాఖాచంత్రమక్రియ గడపజనక

_ ప్రకృతార్థభావంబు పాదుకో నదుకుచు నుపపత్తి యెందు నత్యూర్జితముగ

నొకట బూర్యోత్తరవిరోధ మొందకుండ

దత్తదవయవవాక్కతాత్పర్య భేద

ములు మహాకావ్యతాత్పర్భమునకు నొనర

బలుక నేర్చుట బహుతపఃఫలముగాదె! (ప్రభా. 2)

మహాళావ్యానికి కావలసిన వేమేమిటో ఈ పద్యంలో సూరపరాజుగారు చక్కగా విశదీకరించారు. కళాపూర్ణోదయంలో కలభాషిజణిచేత మణికంధరుని కవిత్వాన్ని ప్రస్తుతింపజేస్తున్న పజేస్తున్నప్పుడు కవిత్వ నిర్వచనాలు చెప్పించారు.

పౌసగ ముత్తెపుసరు ల్పోహణించినలీల దమలోన దొరయు శబ్దములు గూర్చి

యర్థంబు వాచ్యలక్ష్యవ్యంగ్య భేదంబు లెరిగి నిర్తోషత నెసగజేసి

రసఖావములను నర్తంబుగ వైదర్చి మొదలైన రీతు లిమ్ముగ నమర్చి

నమర నుపమాదులును యమకాదులు నగు

నట్టి యర్ధశబ్దాలంత్రియలు ఘటించి

కవిత జెప్పంగ నేర్చు సత్కవివరునకు

వాంచితార్థంబు లొసగనివారు కలర? (కళా. 1-౫)

కవితాశ్రైలి ఎలా ఉండాలో ఇంకా ఇంకా వివరించారు. వెన్నెలకు కమ్మదనం ఉంటే, కమ్మదనం, చల్లదనం ఉన్న కర్పూరపు పలుకులకు నున్నదనం వస్తే, కమ్మగా చల్లగా, నున్నగా ఉండే చల్లగాలికి తీయదనం అల్బిడే అప్పుడు కవి పలుకులకు సాటికరి దనవచ్చునని కలభాషిణి మణికంధరుణ్జి ప్రశంసించింది.

సూరపరాజుగారికి తూడా ఇది వర్తిస్తుంది. డచ్చి కవితాసార్వభౌముడైన “వాండెల్‌ వైలికూడా అలంకార భరితమైన పదాడంబరమెరుగని లాలిత్యానికి పేరు పడీంది శైలిలో వాండెల్‌ను పోలిన సూరపరాజుగారు కథాసంవిధానంలో ఫ్రెంచి మహారచయిత 'రెటెలెను సరిపోలుతారు. శైలీ, కథాసంవిధానాలలో, సునిశితమైన హాస్యపోషణలో 'రెటెలె బ్రాని “గార్గంటువ ఎ పంటాగ్రుయెకోతో సాటివచ్చే కావ్యాలు కొద్దిగానే ఉంటాయి. 6

రామరాజ భూషణుడు 321 శతాబ్బాన్ని ఉర్రూతలూగించిన నవ్యాదర్శాలకు అది ప్రతిబింబం. అలాగే ఇటలీదేశపు మహాకవి లాడవికో అరిముస్తో వ్రాసిన ఆర్గోండో ప్లూరియానో అనే కావ్యం ఆ యుగంలోని ఉత్తమోత్తమ కావ్యం. స్పెయిన్‌ దేశపు దిగ్గజం సర్వాంటెజ్‌ వ్రాసిన డాన్‌ కి హోటేలోని అంతరార్థం బోధపరుచుకోడానికి ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంగ్ల కవులలో స్పెన్సరు “కవీనాం కవిః. షేక్స్పియరు వంటి నాటకకర్తలు అరుదు. విశ్వసాహిత్యంలోని ఈ కోవకు చెందిన సూరపరాజుగారు కృష్ణ్ణయలవారి అష్టదిగ్గజాలలో ఒకరు కాకపోతేనేం! రామరాజ భూషణుడు ఆంధ్ర సాహిత్యంలో అప్పుడప్పుడు మంచికో చెడ్డకో మార్పులు తెచ్చిన యుగపురుషులు కొందరున్నారు. చెప్పుకోదగిన మార్పులు తెచ్చిన ప్రాచీనులలో రామరాజభూషణుడు కడపటివాడు. అనుసరించడమే అన్నిటికన్నా మించిన ప్రశంస అనే సూక్తి నిజమైతే మన ప్రాచీనులలో ఇంతటి ప్రశంసలు పొందిన కవి ఇంకొకడు లేడని చెప్పవచ్చు. పద్యరచనా శిల్పంలో - పరాకాష్ట పొందిన సిద్ధహస్తం రామరాజభూషణునిదే. అతడు తెలుగు పద్యానికి పాట నేర్పడమేకాక దానిచే ఆటలాడించాడు. మాధుర్యానికి మారుపేరుగా చలామణి అయే పద్యాలకు అతని లేఖిని జలసూత్రస్తంభం. తెలుగు పద్యాలను రచించడమే కాక వాటిని చదవడం తూడా ఒక కళే అన్న సంగతి రామరాజభూషణునితోనే మొదలైంది. అతడు ప్రబంధ పఠన, రచనాధురంధరుడు. అసలు రామరాజభూషణుని ఇంటిపీరే ' ప్రబంధాంకం'వారు. మధురప్రబంధాలను పఠించడమే వాళ్ళ కులవృత్తి. కృష్ణదేవరాయలవారు సుఖసంకథా వినోదాలతో విద్యానగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చల్లని రోజులలో భట్టుపల్లె అనే గ్రామాన్ని ప్రబంధాంకం వారికి ఇచ్చారట. ఆ దానానికి కారణం వాళ్లు కవితా ప్రవీణులవడమే. కృష్ణదేవరాయలవారి కాలంలో ప్రబంధాంకం సింగరాజూ, అతని కుమారుడు తిమ్మరాజూ ప్రఖ్యాతులై సన్మానాలు పొందారని ఊహించవచ్చు. కృష్ణదేవరాయల తరువాత వారి సోదరుడు అచ్యుతదేవరాయలు క్రీ.శ 1531 నుండి 1542 దాకా పన్నాండు సంవత్సరాలు రాజ్యం చేశాడు. అతని తుచూరుడు వెంకటపతిదేవ మహారాయలు ఒక్క ఏడాదిపాటే సింహాసనమెక్కాడు. ఇతడు అర్బకుడనీ, అనాటి రాజకీయాల తుపానులో కొట్టుకుపోయిన అమాయకుడనీ చరిత్రకారులు భావిస్తారు. అయితే ఈ వెంకటరాయలు విద్వన్నిధీ అనడానికి శాసన ప్రమాణాలున్నాయి. ఒక శాసనంలో ఇలా ఉంది. మసక నవనవ వపసన వనన నాలా 1 కర్నూలు జిలాలోని పులివెందలకు దగ్గర్లో ఒక భట్టుపల్లె ఉంది. నేటి మైసూరు రాష్ట్రలో మన కరూన్షిలు జీల్లాను అనుకొని హోలాలగుండికి రెండున్నరమైళ్ళలో ఒక 'భట్టరహళ్ళి' ఉంది. ఓ “వసుచరిత్ర విమర్శనము'లో వజ్ఞల చినసీతారామళాస్తిగారు ఉదాహరించారు. పుట 132

322 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుక్రి

క్షితి ప్రతిష్యాపిత కీర్తిదేహి ప్రాప్తేపదం వైష్టవమచ్చ్యు తేంద్రే,

అధాస్యభద్రాసన మస్యసూనుర్వీరో బభౌ వేంకటదేవరాయః

పాస్యరాజ్యం ప్రసవాస్త్రరూపే విద్వన్నిధౌ వేంకటరాయభూపే

అభాగధేయా దచిరాత్ర్రజానాం అఖండలావాసమథాధిరూడే.

(ఎపిగ్రాఫియా ఇండికా -॥/)

ఈ శోకంవల్ల వెంకటరాయలు వీరుడు, నవమన్మథుడు, విద్వన్నిధి అని తెలుస్తున్నది. పెదతండ్రి కృష్ణదేవరాయలవారిలాగా, తండ్రి అచ్యుతదేవరాయలలాగా ఇతడు గూడ కవులను సన్మానించి ఉంటాడు. ప్రబంధాంకం సూరప్ప అనే భట్టు ఇతని కొలువుకు అలంకారప్రాయంగా ఉండేవాడు. ఆ కవి తాను వెంకట రాయభూషణుడనని చెప్పుకొన్నాడు. ఇతడు ఏ సరస కవిత్వం చెప్పాడో తెలియదు గాని చాలా ప్రసిద్ధడైనట్లు మాత్రం అతని కుమారుని పద్యం వల్ల తెలుస్తున్నది. వెంకట రాయభూషణనికి

భట్టుమూర్తి చిన్నప్పుడు అల్లసాని పెద్దనగారి వద్ద చదువుకొన్నాడని పండిత లోకంలో ప్రతీతి ఉంది. అంధ్ర కౌముది అనే లక్షణగ్రంథాన్ని మండ లక్ష్మీనరసింహా చార్యులు రచించాడు. ఇతడు భట్టుమూర్తికి నూరేళ్ళ అర్వాచీనుడు. ఈయన తాతగారి ముత్తాత భట్టుమూర్తి కాలంవాడే. ఈ లక్ష్మీ నరసింహాచార్యులు తన ఆంధ్రకౌముదిలో ఒక ప్రయోగం చూపిస్తూ, “ముప్రత్యయాభావస్య అల్లసాని పెద్దనార్యశిప్యేణ భట్టుమూర్తి నావిరచితే వసుచరిత్ర” అని వ్రాసి ఉదాహరణ ఇచ్చాడు. అందుచేత పెద్దనగాికి భట్టుమూర్తి అనే శిష్యుడున్నాడని, అతడు వసుచరిత్ర వ్రాసిన మహాకవే అని నిస్సందేహంగా ఊహించవచ్చు. అయితే పెద్దనగారి దగ్గర భట్టుమూర్తి ఎప్పుడు చదువుకొన్నాడన్నది ఒక ప్రశ్ళ, ,

రాయలవారి అష్టదిగజాలలో భట్టుమూర్తి ఒకడని పండితలోకు చెప్పుకొంటుందిగాని అందుకు ఆధారాలు తక్కువ. భట్టుమూర్తి వ్రాసిన తొలి గ్రంథ _ పేరు నరసభూపాలీయం. ఇందులో కృతిపతి వంశాన్ని వర్ణిస్తూ చెప్పిన చారిత్రక విషయాలు క్రీ.శ. 1557కు పూర్వం జరిగినవి. అందుచేత నరసభూపాలీయాన్ని భట్టుమూర్తి ఆ సంవత్సరానికి పిమ్మటనే వ్రాసి ఉండాలి. లేకపోతే అంతటి మహోన్నత స్థానం లభించదు. క్రీ.శ 1530 లోనే గొప్ప రచనలు చేసిన కవి క్రీ.శ. 1557 దాకా, అంటీ రమారమీ ఒక పావు శతాబ్దం పైచిలుకు వేరే ఇంకేమీ రచనలు చేయకుండా ఒక అలంకారశాస్త్రాన్ని అనువదించాడన్నది నమ్మలేని విషయమే. కాబట్టి భట్టుమూర్తి రాయలవారి కొలువులో లేకపోవచ్చు.

అల్లసాని పెద్దనగారు కృష్ణదేవరాయలతో దివికేగలేక కొన్నేళ్లు జీవించారు క్రీశ 1540 ప్రాంతాలలో బహుశా భట్టుమూర్తి పెద్దన్నగారి శిష్యరికం చేశాడేమో! క్రీశ 1550 ప్రాంతాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మరో ఏడేళ్ళకు రాజాశ్రయు పొందాడని భావించవచ్చు. ఇతడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండడాసి

రామరాజ భూషణుడు 323 చారిత్రకంగా అవకాశం లేకపోతీ రాయలవారికన్నా వృద్ధుడైన తిమ్మరుసు మీద ఇతడు చెప్పాడని లోకులు చెప్పుకొనే చాటువుల కథలకు కూడా అఆస్కారముండదు. తెలుగుదేశంలోని ముప్ఫయి ఇద్దరు మంత్రుల గురించి తెలిపే సీసపద్యాన్ని ఒక భట్టుకవి ఏ కాలంలోనో రచించాడు. అందులో 21వ మంత్రి గురించి ఇలా ఉంది

భట్టుమూర్తికి గిన్క రెట్టింప బచ్చల హార మర్చించె దిమ్మరసమౌళి ఈ సీసపాదంలోని తిమ్మరసు విజయనగర సామ్రాజ్యానికి శిరఃప్రధానిగా శాశ్వతకీర్తిని పొందిన అప్పాజీ సాళువ తిమ్మరసయ్యే అని ప్రతీతి. ఒక భట్టుమూర్తికి ఒకనాడు ఒకలాంటి కోపం వచ్చి తిమ్మరసుగారి పాత జీవితాన్ని కెలికి ఇలా తిట్టడం మొదలుపెట్టాడటః

గుత్తింబుల్లెలుకుట్టి చంద్రగిరిలో గూడెత్తి పెనొండలో

హత్తిక్‌సత్రమునందు వేడి బలుదుర్తాధీశు తాంబూలపుం

దిత్తుల్మోసి పదస్థులైన ఘనులక్‌ దీవింప... భట్టుమూర్తి ఇంతదాకా పద్యం చెప్పేసరికి అంత ఇిరఃప్రధానీ భయపడి తన మెడలోని పచ్చలహారం తీసి కవికి ఇచ్చుకొన్నాడట. అప్పుడు కవి ఇలా పూరించాడటః

మత్తారాతి యయాతి నాగమసుతుక[ మంత్రీశ్వరు౯్‌ తిమ్మరుక.

ఈ చాటువు ఏ సందర్బంలో పుట్టిందోగాని శిరప్రధానిగా వెలుగుతున్న తిమ్మరసయ్యను ఇలా ఒక కవి “బ్లాక్‌మెయిల్‌ చేశాడనడం అసందర్భం.

ఈ భట్టుమూర్తి ఈ పద్యం చెప్పడానికి పూర్వం “నే దిట్టకమాన' నంటూ ఒక ఉత్ప్చలమాలిక చెప్పాడట. ఇది అల్లసాని పెద్దనగారి 'పూతమెరుంగులక్‌' అనే ప్రఖ్యాత మాలికకు పూర్వమే రచితమైందని కొందరు పరిశోధకుల అఖిప్రాయంశ తాను ఎలా తిట్టగలడో, ఎలా దీవించగలడో కవి బెదరగొడుతూ చెప్తున్నాడు:

లొట్ట యిదేటిమాట వెనులోభులతో మొగమోట మేల తా

గుట్టకయున్న, వృశ్చికము గుమ్మడిపుర్వని యందు రేకదా

పట్టపురాజుపట్టి సరిపల్లె సరాసరి యాయకున్న నే

దిట్టకమాన నామతము తీచమహో గ్రభయంకరంబుగా

దిట్టితినా మహాగ్రహమతిక్‌ మకరగ్రహజర్జరీభటూ

పట్టపు దట్టఫాలఫణి భర్హృబహూకృత పర్జటస్ఫుటా

ఘట్టన దట్టణాలక విఘట్టనిరర్గ్లళ రాజభృత్యకీ

చట్టచటార్చటీనయన జర్జరకీలలు రాలగావలెక నతన ననన నకును న తనాలననాులకకునిననాకొానాపేనననానయనానానలు 3. చాటుపద్యమణీమంజరి-! వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, పుట. 73 4. వసుచరిత్ర విమర్శనం - వజ్ఞలవారు, పుట. 181

324 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి జుట్టరికంబునక్‌ బొగడజూచితినా రబజకా ద్ర్రధిత్యకా పట్టణమధ్యరంగగత భవ్య చధూవదనానుషంగసం హట్టశిరస్థగాంగరురహల్లకజూల సుధాతరంగముల్‌ చుట్టుకొనన్వలెక భువనచోద్యముగా పయదంబుగా మరిన్‌ దిట్టితినా సభాభవన ధీంకృత భీమనృసింహరాడ్ధ్వజా తాట్టమహాట్టహాసచతురాస్య సముద్రుకుటీ తటీనటీ తోట్టణ రోషజాల హృతకుంఠిత కంఠగఖీరనాద సం ఘట్టవిజ్బంభమాణగతి గావలె, దీవనపద్యమిచ్చి చే పట్టితినా మణీకనక భాజనభూషణభాసురాంబరా రట్టతురంగగంధగజరా జదమూల్యఘనాతప త్రభూ పట్టణ భర్మహర్మ్యభటపంక్షిచిరాయురనామయంబు నై గట్టిగ దోడుతో వెలయగావలె నెక్కువ ఠీవి జూడుడీ యట్టిటు మందెమేలముల నందరనుంబలె జుల్క జూచియే పట్టునైన గౌరవము పల్కకుడీ పయిపెచ్చు నందులక్‌ గొట్టుదు దుష్కవిద్విరదకోటుల బంచముఖోద్చటాకృతి౯ బెట్టదు దండముల్‌ సుకవిబ్బందము కే నతిభక్తి సారెకుక్‌ గట్టితి ముల్లె లేబదియు గాగల నూటపదారు లెయ్యెడక్‌ రట్టడి భట్టుమూర్తికవిరాయని మార్గ మెరుంగ జెప్పితిన్‌ (చాటుపద్యమణీమంజరి ఓ పుట 10) ఈ _ఉత్పలమాలిక కందుకూరిరుద్రకవి “తిట్లూదీవనల' పద్యాలను జ్ఞాపకం చేస్తుంది.5 దీనివల్ల భట్టుమూర్తిని ఎవరో కేరడమాడారసీ తెలుస్తున్నది. పట్టపురాజుగారి 'పట్టి' సరిపల్లి అనే ఊరు సరాసరి ఈయకపోతే తిడకానని ఈ కవి తిడుతున్నాడు. త పట్టపురాజుగారి పట్టికీ, తిమ్మరసయ్యగారికీ సంబంధం ఏమిటో ఇప్పటికీ ఎవరూ పరిశోధించినట్టు లేదు. “సరిపల్లౌతూ, భట్టుమూర్తికీ ఏమిటి సంబంధమో కూడ తెలియదు. ట్ర చాలిక వల్లి భట్టుమూర్తి “'యాఖైమల్లెలు' కట్టాడనీ, నూటపదార్లు సిద్ధం చేశాడనీ తిలుస్తున్నది. ఈ ఉత్చలమాలికతూ, తిమ్మరసయ్యకూ సంబంధం ఉన్నట్టు తోచడం లేదు. ఇది ఏ భట్టుమూర్తి చెప్పినదోతూడ నిర్ణయించలేము. ఖావిపరిశోధనవల్లగాని ఈ భట్టుమూర్తికీ, తిమ్మరసుతూ గల జిగడాన్ని తెలుసుకోలేము. ప్రస్తుతానికి అల్లసాని పెద్దనగారి వద్ద భట్టుమూర్తి శిష్యరికం చేశాడని మాత్రమే నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రకవితాపితామహునివద్ద శుజ్రూష చేసి భట్టుమూర్తి గ పు వైదుష్యాన్ని సంపాదించాడు. సంస్కృతాంధ్ర గ్రంథాలన్నీ కాచి వడపోసి నట్టున్నాడు. ప్రఖ్యాత కవులలో ఉండే సుగుణాలన్నీ తనలో ఉన్నట్టు ఇతడు తన తొలి [్రంథంలోనే చెప్పుకొన్నాడు. కృతిపతి ఇతణ్జి ఇలా ప్రశంసించాడటః

రామరాజ భూషణుడు 326 టాణవేగంబును, భవభూతిసుకువూర తయుమాఘ్లూత్యంబు దండిసమత యల మయూర సువర్ణకలన చోరుని యర్ధ సంగ్రహమ్ము మురారిశయ్య నేర్చు సోము ప్రసాదంబు సోమయాజుల నియమంబు భాస్కరుని సన్మార్గఘటన శ్రీనాథుని పద ప్రసిద్ధధారాశుద్ధి యమరేశ్వరుని సహస్రముఖదృష్టి నాక కల దటుగాన ననేకవదన సదనసంచారఖేదంబు సడలుపరిచి + భారతీదేవీ నీజిహ్వ బాదుకొనియె మూర్తికపిచంద్ర! విఖ్యాతకీర్తి సాంద్ర! (నరస. 1-15) ఈ పద్యంలో సంస్కృతాంధ్ర సాహిత్యాలలోని పన్నెండుమంది ప్రఖ్యాతకవుల పేర్లను, వాళ్ళ ప్రత్యేకతలను శ్షేషించాడు. తెలుగు కవులలో నన్నయ్యగారూ, ఎర్రయ్యగారూ లేరు. బహుశా శ్లేషలు అడ్డురావడంవల్ల విడిచి పెట్టాడేమో! ఇతనిలో ఉన్న ఆయాకవుల ప్రక్యేకత లివిః 2. భవభూతి-సుకుమారత 8. సోముడు- ప్రసాదగుణం 3. మాఘుడు-చల్లదనం 9. తిక్కన-నియమం 4. దండి-సమత 10. భాస్కరుడు-సన్మార్గఘటన 5. మయూరుడు- సువర్జకలనం 11. శ్రీనాథుడు-పదప్రసిద్ధధారాశుద్ధి 6. చోరుడు- అర్థసంగ్రహం 12. అమరేశ్వరుడు- సహస్రముఖదృష్టి ఇంతమంది ప్రసిద్ధుల సిద్ధుల్ని వంటపట్టించుకొన్నాడు. కాబట్టే భట్టుమూర్తి చాలా కవిత్వ విద్యలలో ఆర్‌డేరాడు. తన ప్రజలను ఒక్క పద్యంలో ఇలా చెప్పుకొని తనను కృతిపతి పిలిపించాడని విశదం చేశాడు: శతలేఖినీపద్యసంధానధౌరీయు ఘటికాశత గ్రంథకరణధుర్యు నాశుప్రబంధబంధాఖిజ్ఞు నోష్ట్యృనిరోష్ట్రజ్ఞా నచలజిహ్య్నోోక్తి నిపుణు దత్సమభాషావితానజ్ఞు బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణు నేకసంధోదితశోక భాషాకృత్యచతురు నోష్ట్య నిరోష్ట్రసంకరజ్ఞు నమితయమకాశుధీప్రబంధాంకసింగ రాజసుతతిమ్మరాజపు త్ర ప్రసిద్ధ సరసవేంకటరాయభూషణసుపుత్రు ॥ నను బుధవిధేయు శుభమూర్తి నామధేయు (నరస. 1-13) ఈ పద్యం వల్ల భట్టుమూర్తికి పది ప్రజ్ఞులున్నట్లు విశదమవుతున్నదిః

  1. శతలిభివీపద్య పంధానధారియత; అంటే నూరుగంటాలకు పద్యాలను చెప్పే నేర్చు; శతావధానం.

326 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 2 ఘటికాశత గ్రంథకరణశ్త్తి: అంటే గడియకు నూరు అనుష్టుప్‌ శ్లోకాలను చెప్పగల ప్రజ్ఞ 3. అశుప్రబంధబంధాఖిబ్ఞత: ఆశువుగా ప్రబంధాలను, బంధ కవిత్వాన్ని చెప్పడం. 4. ఓప్ట్యవిరోస్య్యబ్దత అచ్చులతో హల్లులతో పెదవులు మూసుకొనేటట్లూ మూసుకొననట్లూ పద్యం చెప్పడం. 5. అవలజిహ్వోట్షైపుణ్యం: నాలుక కదలనక్కరలేని అక్షరాలతో పద్యం చెప్పడం 6 తత్సమభాషావికావజ్దిత: పూర్తిగా తత్సమపదాలతోనే కవిత్వం చెప్పడం 7. బహుపద్యపాధిత వ్యస్తాక్షరీధురీణత: పద్యాలలోని అక్షరాల స్థానాలకు అంకెలువేసీ తారుమారు చేసి చిత్తం వచ్చిన క్రమంలో అంకెలతో అక్షరాలను చెప్తే జ్ఞాపకం పెట్టుకొని పద్యాన్ని చెప్పడం. వ్యస్తాక్షరి. ఏకకాలంలో అనేక వ్యస్తాక్షరి పద్యాలను 8. వికవంధోదిత శ్లోకభాషాకృత్యచతురత : ఒక్కసారి వినగానే శోకమంతా.. అప్పుబెప్పగలగడం. క ఓప్ప్యవిరోష్ట్యసంశరజ్ఞత: పెదవులు మూసుకొన్న వెంటనే తెరుచుకొనేటట్టు వీలుగా అక్షరాలను పేరుస్తూ పద్యం చెప్పడం 10. అమితయమళాశుధీశక్తి: అమితమైన యమకంతో అశువుగా పద్యాలను చెప్పడం. ఇన్నిరకాల ప్రజ్ఞలున్నాయని చెప్పిన ఈ పద్యంవల్లనేకాక ఇతని తొలిశ్రంథంలోని గద్యవల్ల మరికొన్ని వోషాలు తెలుస్తున్నాయి: ఇతడు (1) సారస్వతాలంకారుడు; (2) నిరంకుశప్రతిభా బంధురుడు; (3) ప్రబంధ పకన, రచనాధురంధరుడు; (4) సకలఖాషా విశేష నిరుపమావధామి ఇటువంటి అసాధారణమైన ప్రజ్ధలను ప్రకటించడానికి పైలాపచ్చీసే అనువైన " వయను. శతావధానులుగా విఖ్యాతి పొందిన తిరుపతి వెంళటకవులు తమ పందొమ్మిదవ యేటనే శతావధానం చేయడం నేటి పండితులకు తెలిసిన విషయమే. వయసు మిరే ధారణ పట్టే ఏకాగ్రత సడలుతుంది. అందుకే నూనూగుమీసాల నూత్నయౌవనంలోనే ఎన్ని అవధానాలు చేసినా 'నువ్వా నేనా అన్నట్టు చేయవచ్చు. భట్టుమూర్తి తూడా ఈ వయసులోనే చేసి ఉంటాడు. ఇంతటి ఉడ్లోలమైన పాండిత్యమున్న వాడిని ఏ రాజైనా చేరదీస్తాడు. భట్టుమూర్తిని పోచిరాజు వంశంలోని నరసరాజు అదరించాడు. ఇళడు కృష్ణరాయలవారి అల్లుడైన అశియ రామరాజుగారి మేనల్లుడు. క్రీ.శ 1557 ప్రాంతాలలో ఈ నరసరాజు తొరగంటి దుర్గాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఇతడు భట్టుమూర్తిని సత్కరించి దీనినే సాహితీపరులు నరస భూపాలీయం అని పిలుస్తారు. ఈ పేరు కూడ భట్టుమూర్తి పెట్టినదే. గద్యలో చివర చెప్పాడు. ఇది అయిదాశ్వాసాల అలంకారశాన్త్రం. సంపృృతంలో విద్యానాథుడు రవించిన ప్రతాపరుభ్రయళోభూషణానికి ఇది అనువాదంలా కనబడుతున్నదని విళ్లో

రామరాజ భూషణుడు 327 భావిస్తున్నారు. ఇది 'మహాకవివాజ్బ్యయాలకు ఉపకారావహమైై' ఉండాలని కృతిభర్త ఆశించాడు. అలంకారనికరాలను ఇరవుకొలిపి చమత్రియాఖిశోఖితమతితో కృతికర్త రచించాడు. వివిధ నాయికానాయకుల లక్షణాలు, కావ్యస్వరూపం, వృత్తులు, రీతులు, ధ్వనులు, రసాలు, దోషాలు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు మొదలైనవాటిని గురించి తడవనేనేరక వర్ణించుట గాదు. అరయ విస్తారఖీతి'' చేతనే అన్నాడు (5-242). ఇతడు కావ్యమంటే ఏమిటో ఇలా వివరించాడు:

విగతదోషంబులునుగుణాన్వితము లధిక

లసదలంకారభావోలక్షితములు

వైన శబ్దార్థములు కావ్య మనగబెల్లు. (నరస, 2-52) శబ్దార్ధాలే కావ్యమైనా ఆది శరీరం మాత్రమే. వాటికీ ముస్తాబు అవసరం.

తగువగు శబ్బార్థంబులు - ధ్వని జీవ మలంక్రియావితానము సౌమ్ముల్‌

తనరు గుణంబులు గుణములు - ఘనవృత్తులు వృత్తులౌర। కావ్యేందిరకు౯

(నరస, 2-53)

ఈ [గ్రంథంలో భట్టుమూర్తి తన అసాధారణ ప్రజ్ఞలను కొన్నింటిని ప్రదర్శించాడు. నాలుక కదలనక్కరలేని అక్షరాలతో వ్రాసిన 'అచలజిహ్వం' చూడండి:

భోగాంబువాహవాహవి- భాగేహాభావుకాంగ ఖావభవమహా

భాగమహీభాగమహా- భోగావహబాహుభోగిపుంగవభోగా। (నరస. ౩3-160) ఈ పద్యంలో అన్నీ కంఠంతోనూ, పెదిమలతోనూ పలికే అక్షరాలే ఉండడంవల్ల నాలుకను కదపనక్కరలేదు. ఇలాగే అంతస్థాలతోనూ, ఊష్మాలతోనూ ఒక పద్యం బ్రాశాడు. ఇందులో కాఖాలు, చాచ్చ్భాలు మొదలైన వర్గపంచకాలు లేవు. అన్నీ యరలవల వర్గంలో అక్షరాలే.

హారహీరసారసా రిహార్జూల వాసవో

ర్వీరుహాహిహార శేష వేషహాసలాలస

శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం

హారసార శౌర్యసూర్యహర్భవార్యసాహసా। (నరస. 5-245)

ఇటువంటి ప్రజ్ఞలే కాక గర్చకవిత్వం, బంధకవిత్వం మొదలైనవితూడ ఇందులో ప్రదర్శించాడు. అయితే ఇటువంటి గారడీలు ఎన్ని చేసినా, అలంకారం, ధ్వని లక్షణా ధికారరసాలంకారాలు ఎన్ని చెప్పినా లక్షణ గ్రంథం కావ్యమనిపించుకోదు. చక్కని కావ్యాలు చెప్పగల నేర్చున్న భట్టుమూర్తిని నరసరాజు చేరదీసినా మేనల్లుడు ఆదరించిన (ననా. .స తనక. ననకునుతతత లల 6. కావ్యాలంకార సంగ్రహం (మూడవతూర్చు) పీఠిక, బులుసు వెంకటరమణయ్యగారు, పుట 11.

328 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ కవిలోని అసాధారణ శక్తులను చూసి అశియ రామరాజు స్వయంగా భట్టుమూర్తికి ఆశ్రయమిచ్చాడు. అతణ్జీ భట్టుమూర్తి బహుసంస్కృతాంధ్రకృతులతో పలుమార్లు అగ్రహారాలూ మొదలైన సత్కారాలు పొందాడు. ధన్యుడయ్యాడు. రామరాజు సభకు భట్టుమూర్తి భూషణమయ్యాడు. అతనికి రామరాజభూషణుడనే బీరుదు వచ్చింది అందరూ అతణ్జీ ఆ పేరుతోనే వ్యవహరించసాగారు. అశియరామరాయలు క్రీ.శ. 1565లో జరిగిన రక్షసి తంగడి యుద్ధంలో మరణించాడు. అప్పటిదాకా రామరాజభూషణుడు అతని కొలువులోనే ఉండి ఏవేవో కృతులు రచించాడు. అయితే వాటిలో ఏ ఒక్కటీ మనకు దక్కలేదు. రామరాయలు మరణీంచాక అతని తమ్ముడు ఎర తిమ్మరాజు విజయనగర సామ్రాజ్యానికి పట్టం కట్టుకొన్నాడు. తిరుమల దేవరాయలనే పేరు పెట్టుకొన్నాడు. ఇతడు తన అన్నగారు పోషిస్తున్న రామరాజభూషణుని ఆదరించి అతని చేత వసుచరిత్ర అనే కృతిని అంకితం పుచ్చుకొన్నాడు. నరసభూపాలీయంలో తన ప్రజ్ఞలను చాలా విపులంగా చెప్పుకొన్న కవి ఇందులో వాటిని కొన్నిటిని, మరికొన్నిటిని చెప్పుకొన్నాడు. కృతిపతి తనను పిలిపించిన సందర్భంలో ఈ పద్యం వ్రాశాడు: నను శ్రీరామపదారవిందభజనానందున్‌ జగత్రాణనం దన కారుణ్యకటాక్షలబ్ధకవితా ధారాసుధారాశిసం జనిజైకైదిన ప్రబంధఘటికా సద్యశ్ళత గ్రంథక ల్పను సంగీత కళారహస్యూనిధి విల్వంబంచి పల్కెం గృపన్‌. (వసు. 1-19) ఈ పద్యంవల్ల రామరాజభూషణుడు ర్లోజుకొక ప్రబంధాన్నీ, గడియకు నూరు శోకాలనూ చెప్పడమే కాక సంగీతకళారహస్యనిధి అనే బిరుదును సంపాదించాడని తెలుస్తున్నది. ఈ ప్రజ్ఞను అతడు నరసభూపాలీయం బ్రాస్తున్న రోజులలో చెప్పలేదు. నరసభూపాలీయ రచన క్రీ.శ 1557 తరువాత; వసుచరిత్ర రచన క్రీ.శ 1580 తరువాత, ఈ పాతిక సంవత్సరాలలో రామరాజభూషణుడు సంగీతంలో చాలా కృషి చేశాడని చెప్పవచ్చు. దానికి రామరాజు సంగీతప్రియుడవడంతూడా కారణం కావచ్చు. అళియ రామరాయల అదరణలో ఉండే రామయామాత్స్యుడనే విద్వాంసుడు * స్పరమేళకళానిధి అనే సంగీత గ్రంథం వ్రాశాడు. కొండవీటి దుర్గాధిపతిగా మంచి పదవిలో ఉన్నాడు. అసలు కృష్ణదేవరాయలవారి కాలంనుంచీ కవులు సంగీతంపట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించసాగారు. ఆదిలో పాల్కురికి సోమనాథుడు తన రచనలను చిన్న సైజు విజ్ఞాన సర్వస్వాలుగా రూపొందించడంలో తన కాలంవాటీ సంప్రదాయాల నన్నిటిని చెప్పాడు. అతని రచనలలోని సంగీత సంప్రదాయం గురించి పరిశోధనే జరిగింది” అయిశే ఫోమన్న చెప్పిన విషయాలు “లక్షణము, లక్ష్యము లేని వట్టిపట్టీలు' అని సంగీతవేత్తలు 7. సోమననాటి సంగీతసం ప్రదాయం- బాలాంత్రపు రజనీకాంతరావుగారు (పరిశోధన, 1955 అగస్టు - నవంబరు ఉమ్మడీ సంచిక, పుట 9)

లామరాజ భూషణుడు 3929 భావిస్తారు. కవిత్రయంలో ఒక్క ఎర్రయ్యగారు తమ సంగీత రసికత్వాన్ని, విజ్ఞానాన్ని చూపించారు. కృష్ణాయలవారు స్వయంగా వీణ వాయించగలరు. ప్రబంధ కవులు ఏదో ఒక వంక పెట్టుకొని తమ సంగీత రసికత్వం పద్యాలలో కనబరచసాగారు. మిగతా కవులు ఒకటి రెండు పద్యాలలో అక్కడక్కడ ఈ పాటవాన్ని చూపితే రాధామాధవ కవి అడపాతడపా చాలాసార్లు చూపించాడు. సాక్షాత్తూ సరస్పతీదేవిచేత పద్మాసనం వేయించి వీజయందలి పట్టుగవుసెన తీయించి చేలాంచలాలతో కాయలు తుడీపించి “కొలదిగ రాగ భేదములకుక్‌ దగుసారెలు సారె కొత్తి తంత్రులు కొనగోళ్ళ' మీటించాడు (రాధా. 2-62, 63). మండలాకృతిలో కూర్చోపెట్టి మధుపానం చేయించి విలాసవతులచేత చిరుబూతు లాడించి వాళ్ళకు పసిడివీణ లిచ్చి రాధామాధవ కవి పాడించాడు.

సరిగుండక్రియ విస్తరించె గరగన్‌ సొధా గ్రరత్నావళుల్‌

తరుణీరత్న మొకర్తు కొక్కతె చసంతశ్రీ, పచారించి ఖా

తృరసంశోభులబేనె నుల్లసిలి రాగజ్ఞుల్‌ ప్రశంసింపగన్‌, (రాధా. 4-121) పంచతంత్రం. వ్రాసిన బైచరాజూ వెంకటనాథుడు చంద్రోపాలంభనలో తన సంగీత రసికత్వాన్ని చూపాడు:

కందళితానురాగములు గావు మనంబులు విన్నయంతలో

నందరు పారవశ్ళపద మందురు చల్లదనం బొకింత లే

దిందున శంకరాభరణ మెట్లయి తీవు శశాంక నీపదం

బుం దుది నంత శూన్యమగు బో వివరింపగ మాటలేటికి౯ (పంచ, 4-170)

పెద్దనగారూ, తిమ్మనగారూ, రామకృష్ణుడూ మొదలైనవాళ్లు సరేసరి, సంగీత ప్రసక్తి వచ్చినప్పుడు సూక్షసరశీలన ప్రస్ఫుటం చేశారు. పింగళి సూరపరాజుగారు వాగ్గేయకారుణ్లే కథానాయకుణ్ణి చేశారు. తెలుగు సాహిత్యంలో సంగీతం ఇలా చోటు చేసుకొంటున్నప్పుడు సంగీతం పైన ప్రత్యేకం కృషి చేసిన రామరాజభూషణుడు “సంగీత కళారహస్యనిధి' అనే తన బిరుదును సగర్వంగా చెప్పుకోవడం అవసరమే.

అప్పటి తెలుగు సాహిత్యం ఒక రకమైన విప్లవ దశలో ఉంది. పురాణాలు, స్వకపోలకల్పితమైన కథలను వ్రాయడానికి కొందరు ఉత్సహిస్తున్నారు. అత్యపూర్వ కథాసంవిధానంతో పింగళి సూరప రాజుగారు “కళాపూర్లోదయం' వ్రాసి పేరుకెక్కారు. సంప్రదాయాలను పాటించేవారు ఇటువంటి సాహసాలను సహించలేరు. రామరాజ భూషణుడు కేవలం సనాతనుడు కాడు. పాత కల్పనలకు కొత్త కల్చినలను జోడించాలనే వాడు. అందుకే తిరుమలదేవరాయలచేత ఈ మాటలు చెప్పించి వసుచరిత్ర రచనకు ఉపక్రమించాడు. లన. 8. భాషాసమితివారి విజ్ఞానసర్వస్వం-51 సంగీతం: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి వ్యాసం, పుట 838.

330 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కేవలకల్పనాకథలు కృ త్రిమరత్నము లాద్యసత్కథల్‌

వావిరి పుట్టురత్నము లవారిత సత్కవికల్పనావిభూ

షావహపూర్వవృత్తములు సానలదీరిన జాతిరత్నముల్‌

గావున నిట్టి మిశ్రకథగా నొనరింపుము నేర్చు పెంపునన్‌. (వస్తు, 1-19)

అందుకే వసుచరిత్రను మిశ్రకథగా వ్రాశాడు. ఈ కావ్యంలో మిశ్రమే ఎక్కువగాని కథ తక్కువే. మహాభారతం ఆదిపర్వంలో ఉపరిచరవసువు కథ ఉంది. నొలుగు ముక్కలలో ఆ కథ చెప్పుకోవచ్చు.

చేది దేశాన్ని వసురాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు ఒకనాడు వేటకు వెళ్ళి విరక్తి గలిగి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ఆ తపస్సుకు మెచ్చుకొని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగే ఒక విమానాన్ని, ఇంకా మరికొన్ని మహిమలున్న _ కానుకలు ఇచ్చి వసురాజు చెలిమి చేశాడు. ఆ విమానంలో వసురాజు ఉపరిలోకాలు చరించడం వల్ల అతనికి ఉపరిచర వసువు అనే పేరు వచ్చింది. అతడు ఏటేటా చేసే దానికి కోలాహలుడు అన్న కొండ ఒకసారి అడ్డంపడితీ వసురాజు కాలి కొనగోటితో ఆ కొండను తొలగించి నదికి ఆటంకం తీర్చాడు. ఈ మేలు మరవలేక శుక్తిమతి తనకు కోలాహలునివల్ల పుట్టిన వసుపదుడనే కొడుకునూ, గిరిక అనే కూతుర్నీ వసురాజుకు సమర్పించింది. అతడు గిరికను పెండ్లి చేసుకొని, బావమరిదిని సేనాపతిగా చేసుకొన్నాడు. ఈ వసురాజు మళ్ళీ ఒకనాడు వేటకు వెళ్లాడు. ఈసారి ఆయనకు కలిగినది విరక్తి కాదు; రక్తి. గిరిక మీద మోహం ఉండబట్టలేక ఆయనకు కరేతస్కలనమైంది. అది అమోఘమని బంగీకట్టి ఒక డేగ ద్వారా గిరికకు బట్వాడా చేయించాడు. ఈ డేగతు ముక్కున మాంసముందని ఇంకో డేగ దారిలోనే అడ్డం తగిలింది. బంగీ కాస్తా యమునా నదిలో పడీంది. దాన్ని ఓ చేప మింగింది. అది ఒక అప్సరస. పేరు అద్రికు అది శాపంవల్ల ఆ శదిలో చేప అయింది. వసువీర్యవిందుద్వయంవల్ల దానికి ఒక ఆడపిల్ల పుట్టింది. దానిని జాలరులు వలలువేసి తీసి దాశరాజు కిచ్చారు. ఈ పిల్లే మత్స్యగంధి. వ్యాసులవారి కల్లి.

ఇదీ మహాభారతంలో ఉపరిచర వసువుకు సంబంధించిన కథ. దానిని నన్నయ్యగారు పట్టుమని పన్నెండు గద్యపద్యాలలో వ్రాశారు (ఆది 1:22-33). ఇందులో నాలుగే నాలుగు గద్భపద్యాలలోని కథను తీసుకొని రామరాజభూషణుడు 800 పైచిలుకు గద్యపద్యాలలో సాటిలేని ప్రబంధంగా రూపొందించాడు. రెండోసారి వసురాజు వేటకు వెళ్ళడం, రక్తి కలగడం మొదలైన విషయాల జోలికి రామరాజభూషణుడు పోలేదు. పెళ్లితో కథ ఆపాడు. చిన్న ఇతివృత్తంలోని కొద్దిభాగాన్ని తీసుకొని ఆరాశ్వాసాల మహీ కావ్యంగా నగిషీలు చెక్కాడు. భారతకథలో క్రమాన్ని మార్చాడు.

ప్రథమాశ్వాసం: చేది దేశంలో అధిష్థానపురం ఉంది (దీనిని రామరాజభూషణుడు 24 పద్యాలలో రకరకాల శ్లేషలతో వర్ణించాడు). ఆ పురాన్ని వసురాజు పాలిస్తున్నాడు. అతడు పూర్వం శుక్తిమతిని కోలాహలుని బెడదనుంచి తప్పించాడు. ఈ సాహసాన్ని మెచ్చి

రామరాజ భూషణుడు 331 ఇంద్రుడు అతని చెలిమి చేశాడు. బహుమతులు ఇచ్చాడు. కోలాహలుణ్ణి మన్నించి వసురాజు అతణ్జీ తన క్రీడావైలంగా శేసుకొన్నాడు. ఇంతలో వసంతం వచ్చింది. ఎలాగ? దానిని కవి ఇలా వర్ణించాడు:

లలనాజనాపాంగవలనావసదనంగతుల నాఖికాభంగదోః ప్రసంగ

మలసానిలవిలో లదళసా సవరసాలఫలసాదరశుకాలవనవిశాల్న

మలినీగరుదనీకమలినీకృతధునీకమలినీ సుఖితకోకకులవధూక

మతికాంతసలతాంతలతికాంతరనితాంతరతికాంత రణతాంతసుతనుకాంత

మకృతకామోదకురవకావికలవకుల

ముకులసకలవనాంత ప్రమోదచలిత

కలితకలకంఠకులకంఠకాకలీవి

భాసురము వొల్చు మధుమాసవాసరంబు, (వసు. 1-126) స్త్రీ పురుషులు వసంతోత్సవం చేస్తున్నారు. పాటలు పాడుతున్నారు ఎలాగ? ఇలాగని కవి చెప్తున్నాడు:

ఆరిగా బంచమ మేవగించి నవలా లవ్వేళ హిందోళవై

ఖరి సూపం వికజాతి మాత్మరవభంగవ్యాకులంబైవనీ

ధర నాలంబితపల్లవ వ్రతవిధుల్దాల్బం దదీయధ్వనిన్‌

సరిగా రైకొనియెన్‌ వసంతము మహాసంపూర్ణభావోన్నతిన్‌. (వసు. 1-130)

ఈ పద్యంలో రామరాజభూషణుడు తన సంగీతకళా రహస్యనిధులను విప్పాడు.

స్త్రీలు హిందోళరాగం పాడితే కోయిలలు బాధపడ్డాయట. ఆ రాగంలో తమ స్వరమైన పంచమం లేదని వ్యాకులత చెంది ఆకులూ అలములూ తింటూ తపస్సు చేశాయట. ఆ ప్రతవిధులను మెచ్చి వాసంతం మహాసంపూర్ణభావంతో పంచమస్వరాన్ని స్వీకరించిం దట. పద్యకల్చనలో రెండువిషయాలు కవికితోడ్చడ్డాయి. హిందోళరాగంలో పంచమం, రిషభం ఉండవు. ఈ రెండూ ఉన్న రాగాన్ని హిందోళవసంతం అంటారు. ఈ వాస్తవిక లక్షణాలను తీసుకొని శ్లేషించాడు. “అరిగా అంటే 'శత్రువని భావించి అని ఒక అర్థం. అ “రగా అని మరొక అర్థం ఉద్దేశించాడు. ఈ పద్యానికి వ్యాఖ్యానం బ్రాష్తూ శొంఠి సంజ్ఞ గల వసంత రాగమును బాడిరని యాశయము” అని చెప్పారు.!9 కర్ణాటక వాసంతంలో పంచమం ఉండదు. రామరాజభూషణుని ఉద్దేశం స్త్రీలు పూర్వం రిషభ పంచమాలు లేని హీందోళం పాడారు; ఇప్పుడు అవి ఉన్న హిందోళవసంతం పాడుతున్నారని చెప్పడమే. సంగీతంలో సరదా ఉన్న పరిశోధకులు పూనుకుంటే రామరాజభూషణుని రహస్యాలు మరికొన్ని తెలుస్తాయి.

  1. హిందోళతు “సమగమదనిస-సనిదమగరిస అని ఆరోహణ, అవరోహణక్రమాలు ఉన్నాయి. హీందోళవసంతం అనే రాగానికి సగమపదనిదస - సనిదమగరిగస అని ఆరోహణ, అవరోహణలు. (గానకళాబోధీని - యన్‌ సి పార్థసారథి దంపతులు)

  2. వసుచరిత్ర - వావిళ్ళముద్రణ (1౫2), పుట 12

332 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి స్త్రీలు హిందోళవసంతం పాడగా వనం బాగా పూచింది. వచ్చి చూడమని వనపాలకులు వసురాజుతో విన్నవించారు. రాజు తన నర్మసఖునితో తోటలోకి వెళ్ళాడు. అక్కడ రెండు పిట్టలు అ రాజుకు ఆసన్నమయ్యే శుభాన్ని విన్నవించాయి. అతడు తన క్రీడ్రాలానికి వెళ్ళాడు. దీనితో ప్రథమాశ్వాసం ముగిసింది. ఈ మాత్రం కథను రామరాజభూషణుడు 71 గద్భపద్యాలలో చెప్పాడు. రెండో ఆశ్వాసంలో రాజుగారూ, అతని సఖుడూ ఒక పాట వింటారు. ఆ నాదం పరమానందానుసంధానం. అది ఎవరి పాటో తెలుసుకొని వస్తానని నర్మసఖుడు వెడతాడు. వెళ్ళి వెళ్ళి కొండమీద పగడాల మంజూరులు, వజ్రాల తిన్నెలు గల మణిమందిరం చూశాడు. అందులో ఒక అమ్మాయి వీణ వాయిస్తున్నది. ఈమెను చూడడానికి రాజుగారిని తీసుకురావాలని ఆ సఖుడు వెళ్ళాడు. వెళ్లి రాజుదగ్గర ఆ అమ్మాయిని నఖశిఖపర్యంతం వర్ణించసాగాడు. ఇది 17 పద్యాలు. ఆ యువతి ముక్కు నానాసూనవితానవాసనల నానందించు సారంగ మే లా నన్నాల్ల దటంచు గంధపలి బల్కాకం దపం బంది యో షానాసాకృతి బూని సర్వసుమనస్సారభ్యసంవాసమై

  • పూనెం బ్రేక్షణమాలికా మధుకరీపుంజంబు నిర్బంకలక్‌. (వసు. 2-47) ఈ పద్యం ముక్కుతిమ్మనగారు వ్రాస్తే దానిని రామరాజభూషణుడు కొనుక్కొని తన కావ్యంలో పెట్టుకొన్నాడని ఒక కట్టుకథ ప్రచారంలో ఉంది. ఇది నైషధంలోని ఒక కల్పనకు మెరుగుపెట్టడమని వసుచరిత్ర మీదా, రామరాజభూషణుని మీదా సమగ్ర. పరిశోధనలు చేసిన వజ్ఞల చినసీకారామస్వామి శాస్త్రిగారు చెప్పారు.31 పద్యం తపస్సు చేసి దమయంతీదేవి పాదరూపంలో జన్మించిందని శ్రీహర్దుడు వర్ణించాడు (నైషధం, 2-40). దీనిని శ్రీనాథుడు అనువదించలేదు. సంస్కృత నైషధమంటే ఎంతో అఖిమాన మున్న రామరాజభూషణుడు సంపంగి పువ్వుచేత తపస్సు చేయించి దానిని కథానాయిక ముక్కుగా పుట్టించాడని వారంటే దీనికి సరియైన మూల సంస్కృతశ్లోకం విద్యానాథని నలకీర్తికౌముదిలో ఉందని, దానిని పెండ్యాల నుబహ్మణ్యశాస్త్రిగారు ఆంధ్రసాహిత్య పరిషత్పత్రికలో ప్రకటించారు. కన్నార చూసిన కన్యను సఖుడు అపాదమస్తకం వర్జించాక ఆ యువతిని తానూ చూడాలని రాజు వెడతాడు. అఆ మందిరం బయట రాజు ఆగుతాడు. సఖుడు ఓక యతివేషం _ వేసుకొని _లోనికి _వెడతాడు. యోగక్షేమాలు అడిగి ఆ యవి
  1. వసుచరిత్ర విమర్శనం, పుట 4. " -
  2. మననవ రాకు ల ని ంరసలీకమో లం తన్నాసిరాభూదనుభూతగంధా 8 నేత్రీకృతభృంగసివ్యా. ఈ నిడుదవోలు

రామరాజ భూషణుడు 333 పుట్టుపూర్వోత్తరాలు అడుగుతాడు. చెలికత్తె మంజువాణీ తన సఖి జన్మవృత్తాంతం చెప్తుంది. శుక్తిమతి నదిని కోలాహలుడు ఎలా మోహించినడీ, వాళ్లు ఎలా సంభాషించుకొన్నదీ చెప్తుంది. అతని ప్రేమను శుక్తిమతి నిరాకరించింది. అతడు కోలాహలుణ్జీ కాలిగోటితో ఎగమీటాడు. తరువాత ఆ కొండను శ్రీడ్తాలం చేసుకొన్నాడు. దీనితో రెండో అశ్వాసం ముగిసింది. ఇందులో శుక్తిమతీకోలాహలుల కథను కవి చాలా శ్లేషమయంగా చెప్పాడు. వాళ్ళను నదీపర్వతాలుగానూ, మానవరూపంలోని వ్యక్తులుగానూ తూడ ఒకే పద్యంలో చూపించాడు. మూడో అశ్వాసంలో మంజువాణి పూర్వకథను పూర్తి చేస్తుంది. శుక్తిమతిని కోలాహలుని బారినుండి కాలిగోటితో రక్షించినందుకు అబ్బురపడి ఇంద్రుడు వసురాజుతో చెలిమిచేస్తాడు. టెలివిజన్‌ సెట్టు ఉన్న ఒక ఎయిర్‌ కండిషన్దు విమానం మాననీయానంత మణికాంతధామమై యిది హిమానీవేళ నింపునింపు శోణ ప్రవాళమంజులతానిశాంతమై యలరించు నిది వసంతాగమమున తరళముశ్తాదీప్తి ధారాధివాసమైై వేసవి నిది మహోల్లాస మొసగు ప్రబలవజ్రోప్రాసాదభాసమై తొలుకరి నిది కుతూహలము నిలుపు జనవరోత్తమ, యిది సర్వసమయసాఖ్య జనక మిందలి యాలేక్కసాధ్యసిద్ధ తిన్న రాంగన లవిగీతగీతనృత్య వాద్యములు సూపి నిలుతురు వలయుయెడల. (వసు. 3-15) ఈ శుభవిమానంలో వసురాజు తిరిగేవాడని మంజువాి చెప్తుంది. శుక్తిమతికి సంతానం కలగడం, కుమార్తె పేరు గిరిక అని చెప్తుంది. ఆ గిర్‌కే ఈ యువతి. చిన్నప్పట్నుంచి వసురాజు అంటే ప్రీతి అని మంజువాణి కథ ముగిస్తుంది. యతివేషంలో ఓర్వలేకపోతుంది. చెలికత్తెలు తోటలోకి తీసికెళతారు. తాము పుష్పాపచయం, జలక్రీడలు చేసి అమెకు శైత్యోపచారాలు చేసి కేళలీభవనానికి తీసుకువెళతారు. దీనితో మూడో అశ్వాసం అయింది. ం నాలుగో అశ్వాసంలో సూర్యుడస్తమించాడు. చంద్రుడు వెలుగసాగాడు. విరహాన్ని గిరిక తట్టుకోలేకపోయింది. ఉపాలంభనలు అయ్యాయి. వెన్నెల వెల్లువను అమె భరించలేకపోయింది. ॥ ఆ జావిల్లి వెలుంగు వెల్లికల డాయక్‌ లేక రాకానిశా రాజశ్రీసఖమైన మోమున బటాగ్రం బొత్తి యెల్సెడ్తి యా

334 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

రాజీవానన యేడ్చె గిన్నరవధూరాజత్కరాంభో జకాం

భో జీమేళవిపంచికారవసుధాపూరంబు తోరంబుగాక్‌. (వసు. 4-9)

ఈ పద్యంలో కాంభోజీరాగానికి మేళవించిన వీణామృతంగాలాగ గిరిక ఏడిచిందని చెప్పాడు. అళియ రామరాయల వారి కాలం దాకా వీణలు ఒకేరకంగా ఉండేవనీ, వాటిని రామరాజభూషణుడే మార్చాడనీ ప్రతీతి. అంతదాకా ఆయా రాగములకు తగినట్లు వెనుకముందులుగా సర్జుకోవలసిన వీణయెదమీది చలసారికలను అచలసారికలుగా మైనమతికించు పద్ధతిని కనిపెట్టి రామరాజభూషణుడే ఆచరణలోకి తెచ్చినట్లు ఆంధ్రదేశంలో సంప్రదాయం.!3 అయిడే ఈ ప్రఖ్యాతమైన ఏడుపు పద్యం వల్లి క్రీ.శ. 1580 దాకా రామరాజభూషణుడు ఆ చలసారికల వీణను ఆచరణలో పెట్టలేదని తెలుస్తున్నది.

గిరిక ఇలా వెన్నెలలో వెక్కివెక్కి రోదిస్తూ ఉంటే వసురాజు విరహంతో వేగుతున్నాడు. గిరిక చెలికత్తె రాయబారానికి వెళ్ళింది. చల్లని వార్తతో వచ్చింది. ఆనవాళ్ల

  • తచ్చింది. తూరుపు తెల్లవారింది. నాలుగో అశ్వాసం అయింది.

ఇలాగే రెండాశ్వాసాలు పెళ్లిమాటలు, నానాదేశపురాజులు రావడం మొదలైన వర్ణనలతో కావ్యాన్ని వెళ్లిదాకా నడిపించి. మూడుముళ్ళూ వేయించి మూడు నిద్రలూ తీయించి, వాళ్లు సుఖంగా ఉన్నారని చెప్పి కవి మనల్ని సుఖపెడతాడు. ఈ కావ్యంలో పద్యాలు నడిచినంత చక్కగా కథ నడవదు. అసలు కావ్యం వ్రాయడానికి కథ కూడా కావాలా అన్న ప్రశ్న వేయడానికి ఆస్కారం కలిగించేటంత తియ్యగా దీనిని రామరాజభూషణుడు. రచించాడు. అడుగడుగునా శ్లేష ప్రతిపద్యంలోనూ ఏదో గడుసుదనం, ఏదో గమ్మత్తు. అయితే ప్రతిపద్యంలోనూ శ్లేష ఉన్న కావ్యం పార్సెల్‌ పాసెంజరుబండిలాంటిది. అన్ని స్టేషన్లలోనూ ఆగాలి. విసుగెత్తుతుంది.

వ్యాఖ్యానం లేకుండా, నిఘంటువులు చూడకుండా, పెద్దలు చెప్పకుండా నిజానికీ వసుచరిత్ర అర్థం కాదు. నరసభూపాలీయంలో *““వరవృత్తములు మాని వాణి యెవ్వాసై వలచి నానాశ్లేషములకు బొక్క” (1-8) అని భట్టుమూర్తే సుబంధుణ్జి స్తుతించాడు. ఈ సుబంధుడు తాను ' ప్రత్యక్షర శ్లేమయ ప్రపంచవిన్యా సవిదగ్భడ'"నని చెప్పుకొన్నాడు రామరాజభూషణుడు ఠూడ అంతే. వాణి ఇతని కవిత్వంలో నానాళ్లేషముల టిక్కీ౦డీ ““భాషాపాండీత్యమును విచారించినచో నీ భట్టుమూర్తికి సంస్కృతమున నున్నంత స్వాతంత్ర్యము. తెలుగులో నున్నట్లు కనబడదు. ఇతని గ్రంథమునందలి శ్లేష లించుమించుగా నూటికి తొంబదిపాళ్లు సంస్కృత భాషకు సంబంధించినవే!” అని వేదాల తిరువెంగళాచార్కులుగారు. చెప్పిన మాటలు తెలుగు సాహితీపరులందరూ గర్తో పెట్టుకోవాలి.]5 14. అంధ్రసాహిత్యపరిషత్సత్రిక, సంపుటి 2, సంచిక 5. ఈయూణ్జివారు ఉదారించారు. 16. తెలుగుఖభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం 1] ద్వ్వూర్థికావ్యకవులు పుటలు జ1.

సంస్కృతం చదువుకొన్న పండితులే తెలుగు సాహితీపరులుగా ఉండేకాలంటో వనుచరిత్రకు ఎక్కడ లేని ఆధిక్యతా రావడంలో ఆశ్చర్యం లేదు. అందుకే తెలుగు వసుచరిత్రను సంస్కృత పండితులు ఆ భాషలోనికి వెనువెంటనే అనువదించారు. అప్పయదీక్షితులవారి శిష్యుడు కాళహస్తికవి (క్రీ.శ 1554-1626) దీనిని చాలా మటుకు యథాతథంగా అనువదించాడు. ఈ సంస్కృత వసుచరిత్రను మిత్రులు డాక్టరు వి. రామరాజుగారు పరిష్కరించి ప్రచురించారు. రామరాజభూషణుని గంధాన్ని అనువదించినా కాళహస్తికవి ఆ సంగతి ఎక్కడా చెప్పలేదు.*ీ వసుచరిత్ర సంస్కృతం లోనికి కేవలం చంపూకావ్యంగానేకాక నాటకంగా కూడా వెలసిందట. దాన్ని 'పేరుసూరి' అనే కవి వ్రాశాడు.!” వసుచరిత్ర ఒక్క సంస్కృతంలోనికే కాక తమిళ భాష లోకితూడా క్రీ.శ. 1600 ప్రాంతాలలోనే పరివర్షన చెందిందని మానవల్లి రామకృష్ణకవి గారు తెలియపరిచారట.ీకి

వసుచరిత్ర అనతికాలంలోనే ఇంత ప్రచారం పొందడంతో అనంతర కవులందరూ దాని ననుసరించడం మొదలుపెట్టారు. అసలు వసుచరిత్రలో 800పై చిలుకు పద్యాలుంటే వాటీలోనుంచి 287 పద్యాలను ఏరి, కథ చెడకుండా పిల్లవసుచరిత్రను ఏకాశ్వాస ప్రబంధంగా రామరాజభూషణుడే వ్రాసి ఉండాలి. వసుచరిత్రను అనుకరిస్తూ బయల్దేరిన కొందరి కావ్యాలను తూడ పిల్లవసుచరిత్రలంటారు. వాళ్ళను గురించి తరువాత చెప్పుకొందాం.

వసుచరిత్రను వ్రాశాక రామరాజభూషణునికి జీవితమంతా రామమయంగానూ, కవిత్స్వమంతా శ్లేేమయంగానూ కనిపించసాగింది. అతడు ఉత్త శ్లేషతో తృప్తిపడలేదు. ద్వ్యర్థికావ్య రచనకు పూనుకొన్నాడు. పింగళి సూరపరాజుగారు రాఘవపాండవీయం వాస్తే. ఇతడు హరిశ్చంద్రనలోపాఖ్యానం వ్రాశాడు. రామాయణభారతాలకు ఎక్కడేనా పోలికలు దొరుకుతాయిగాని హరిశ్చంద్రుని కథకు, నలుని కథకు సమాన ఘట్టాలు తక్కువే. అయినా రామరాజభూషణుడు తన అసాధారణ ప్రతిభతో రెండు కథలనూ జోడించాడు. ఈ ద్వ్యర్థి కావ్యాన్ని అతడు శ్రీరామునికి అంకితమిచ్చాడు. చిన్నప్పట్నించి భట్టుమూర్తి హనుమద్చక్తుడు. వార్థక్యంలో తానూ ఆంజనేయునిలాగా రామభత్తుడ య్యాడు. తన సంతానంలో చాలామంది కుమారులకు రాముడనే పేరుపెట్టాడు. దానమిచ్చిన అగ్రహారానికి రామచంద్రపురం అనే పేరు పెట్టాడు. రామాలయాలను ప్రతిష్టించాడు. చెరువులకతూ రాముని పెరే పెట్టాడు. పింగళి సూరపరాజుగారు బ్రాయకపోతే రాముని పేరు మీద ద్వ్యర్థి కావ్యం ఈయనే బ్రాసి ఉండేవాడు.

మామూలు ఏకార్థకావ్యాలలోనే రెండేసి అర్థాలు వచ్చే పద్యాలు వ్రాసే వాడు రెండరాల కావ్యాలలో ఇంకా విజ్బృంఖించడా? శ్రీనాథుడు శ్చుంగారనైషధంలో శ. వనుచరిత్ర - కాళహస్తికవి, పీఠిక పుట 21 17. వసుచరిత్ర (వావిళ్ళప్రతి) చతుర్ధముద్రణ పీఠిక - అనుబంధంలో నిడుదవోలు వెంకటరావుగారు

చెప్పారు, పుట ౫. 1 రంయండే ఈ 556 అణలణాలణ. 0508! నయలుట, ₹క0086, ౪01.8.010.2 నిడుదనోలువారు పై పీఠికలోనే (పుట 31) చెప్పారు.

336 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అనువదించని శోకాలనూ, చూపెట్టని నైపుణ్యాన్నీ ఈ ద్వ్యర్థికావ్యంలో రామరాః భూషణుడు. ఎలా పచరించినదీ వజ్ఞలవారు సోదాహరణంగా రుజువు చేశారు. వసుచరిత్రకు 162 పేజీల సుదీర్హ విమర్శ బ్రాసినట్టే హరిశ్చంద్రనలోపాఖ్యానానికి కూడా వజ్ఞలవారు 170 పేజీల విమర్శ వ్రాశారు. ఇతర కవులు వర్జించిన వర్ణనలకు మెరుగులు పెట్టడం భట్టుమూర్తి స్వభావమట. అందుకే ఎక్కువగా పెద్దనగారి పద్యాల పోలికలు ఇతని గ్రంథాలలో ఉంటాయి. అయితే అవి పరార్థవంచనలు కావు. ఇతని కావ్యాలు “రసోచితచమ త్రి యాకల్చనాకల్ప భవ్యాలుగా' ఉంటాయి. కనుక సమకాలికులు సైతం మెచ్చుకొన్నారు. ఇతరుల కవిత్వానకి వంకలు పెడతాడని పేరు మోసిన తినాలి రామకృష్ణుడే వసుచరిత్రను తన కావ్యంలో స్కరించాడు. పాండురంగని దేవాలయంలోకి ఒక పాము వచ్చిందట. అది గిరికమీద మరులుకొన్న వసురాజులాగా ఉందని కేవలం వసుచరిత్రపై గల గౌరవం కొద్దీ పోల్చాడు.

గిరికానుషక్తబుద్ధిను -పరిచరునిం జోలు నొక్క పన్నగ మొకనా

డురవడి నెచ్చటనుండియొ - మురమర్దను దివ్భభవనమున కేతెంచెక.

(పాండు. 4-24)

వసుచరిత్రను పేర్కొన్న వెనువెంటనే రామకృష్ణుడు ఆముక్టమాల్యగను కూడ

చెప్పాడు. వసురాజులాంటి పామును చూసి భయపడ్డ ఎలుకపిల్ల ఆముక్తమాల్యదగా దేవుని పాదాల చేరిందట.

యమదంతచండమగు భుజ- గమునకు వెరచరచి యాఖుకన్యశ కయిలా

రమణాంఘ్రిజేరె గురుఖీ - తమతి యగు నాముక్టమాల్యదక- నెనయగుచు!€

(పాండు. 4-24)

రామకృష్ణుడు పేర్కొన్న ఈ రెండు కావ్యాలూ, ఆంధ్ర సాహిత్యంలోని

కావ్యపంచకంలో ఫ్రొఢతరాలు. రామరాజభూషణుని రచనతో ఆంధ్ర పంచకావ్యాల

జాబితా పూర్తయింది : (1) పెద్దనగారి మనుచరిత్ర, (2) భట్టుమూర్తి నసుచరిత్ర

(3) పింగళి సూరపరాజుగారి రాఘవపాండవీయం (4) శ్రీనాథుని శృంగారనైషధం (5) రాయలవారి ఆముక్తమాల్యద.

ఈ పంచకావ్యాల పఠనం సాహిత్య విద్యార్థులకు చాలా అవసరమేగాని బహుళాంధ్రోక్సిమయ ప్రపంచంలో ఇంకా చాలా ఉంది. దానిని రామరాజభూషణుడే ఇలా శ్లేషించాడు:

మహిముక్‌ వాగనుశాసనుండు సృజియింపం గుండలీంద్రుండు ద

న్మహనీయస్థితిమూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవ న్మహా

మహులై సోముడు భాస్కరుండు వెలయింపక్‌ సౌంపు వాటించు నీ

బహుళాంధ్రోక్త్సి మయప్రపంచమున దత్రాగల్భ్య మూహించెదన్‌. (వసు. 1-10) చిరస్మరణీయుడే.

మరింగంటి సింగరాచార్యులు భావసంపదనుగాని, రససంపదనుగాని చూడక కేవలం పాండిత్య ప్రకర్షకే జనం చప్పట్లు కొట్టేటప్పుడు పింగళి సూరపరాజుగారి వంటి ఉదాత్తశిల్పి సైతం ద్విసంధానాల వంటి గారడీ రచనలు చేశాడు. రామరాజభూషణుడు సరేసరి. నూరుగంటాలకు కవిత్వం చెప్పేవాడు; ఘడియకు నూరు గ్రంథాలు రచించగలనన్నాడు; అపకవిత్వంలో అరతేరినవాడు. అతడు అచ్చులలో ఉఊలూ, ఒఓలూ, హల్గులో పఫబభమాలూ, చకారం లేకుండా నిరోష్ట్రంగా పద్యాలు చెప్పగలడు. ఏదో ఒక పద్యంలోనైతే ఇటువంటి నియమం పాటించవచ్చుగాని పూర్తిగా ఒక కావ్యమే నిరోష్ట్య్రంగా వ్రాయడం కష్టమే. సంస్కృతంలో శాకల్య మల్లన ఒక నిరోష్ట్య రచన చేసినట్టు చెప్పుకొంటారుగాని మరింగంటి సింగరాచార్యులుగారు దళరథరాజనందన చరిత్ర రచించేదాకా తెలుగులో నిరోష్ట్రృకావ్యం లేనేలేదు. ఈ సంగతి ఆయనే ఇలా చెప్పారు: మును రామాయణమున్‌ నిరోష్ట్య్రముగ నింపు ల్మీర శాకల్యమ ల్లన తా సంస్కృతభాష జేసె నన నా లావుల్‌ జెవు ల్నిండగా వినుటేకాని ధరిత్రిపై నిజముగా వీక్షింపలే, దట్టి దే దెనుగుంజేసెద నెల్లడం గవులకున్‌ దృష్టాంతమై యేర్చడన్‌. (దశరథ 1-32) ఒక ప్రక్రియలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకొన్నా ఈ కవికి తృప్పి చాలలేదు. మరొక విభాగంలో ప్రప్రథమ స్థానం అఖిలషించి సాధించాడు. అప్పటికీ అచ్చ తెనుగులో ఓక కావ్యాన్ని పొన్నికంటి తెలగన్న రచించాడు. అయితే అచ్చ తెనుగులో ఇంకా ఎవరూ నిరోష్ట్రరచన చేయలేదు. అందుకని సింగరాచార్యులు ఇలా తలపోశాడు. ఇల కవికాప్రయాసమగు నెన్నికమై యుభయార్ధ కావ్యముల్‌ గల విపుడిట్ల విన్న యది గద్దిక ముందర గల్లనేర్చునే దెలుగు నిరోష్ట్యపుం గృతి యిదే మజీదక్కగ నిప్పటందులన్‌ గలుగదు వింటలేదె యిక కాగల జూడలు నెన్ననేటికిన్‌ (సీతాకల్యాణం - 131) కవితా ప్రయాసయగు కావ్యాలు చెప్పిన ఈ సింగరాచార్యులు నవాబుల యుగం లోని పండితులు. కుతుబ్‌షాహీల కొలువులో మరింగంటి కవులు పేరు మోళారు. ఆసూరివారనే ఇంటి పేరుండేది. అయితే అసూరి* రామానుజాచార్యులవారు కూరేశభట్టారతుల వారితో శ్రీరంగం వెళ్ళినప్పుడు దేవుడే అన్న మాటలవల్ల అసూరివారికి ఆ యింటిపేరు వచ్చిందట. కంటీమి మిము కూరేశల . గంటిమి మీ వెంట వచ్చు ఘనులెనరొ మరిం గంటిమని పల్కనది మా యింటికి పేరుంట నా మహిన్‌ రహికెక్కెన్‌,

338 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపు అని మరింగంటి కవులు తమ రచనలలో చెప్పుకొంటారు. అయితే వాస్తవానికి ఈ వంశ వారు ఆదిలో “మరికల్లు' అనే గ్రామవాస్తవ్యులు కావడం వల్ల “మరికంటి మరింగంటి అని ఇంటి. పేరు రూపొంది ఉండవచ్చు. తెలంగాణాలో దేవరకొండ, నల్లగొండ మహబూబ్‌నగర్‌ తాలూకాలలో 'మరికల్లు' అనే పేరుగల గ్రామాలు ఉన్నాయని పరిశోధతులు చెప్తున్నారు.! గోలకొండను మల్కిభరాముడు పాలించే రోజులలో మరింగంటి వారి వంశంలో ఎనమండుగురు అన్నదమ్ములు చాలా ప్రసిద్ధులు. ఫీళ్ళను గురించి సింగరాచార్యులు దశరథ రాజనందన చరిత్ర అనే నిరోష్ట్య రామాయణంలో ఇలా చెప్పాడు.

ముగురు రాజులచేత మొక్కులు గన్నట్టి భగవత్సమాను డప్పులగురుండు

వేదవేదాంగాదివివిధార్థసంపత్తి నతిశయిల్లిన వేంకటార్యమౌళి

కలిత సౌందర్శరేఖావిలాసంబుల జెంగలించెడి శ్రీన్సృసింహవిభుడు

తుపితమాయావాదిగురుశాస్తహరణపారగుడైన కోనేటి రాయళౌరి

సరసశతపద్యలేఖ నావిరచనోక్తి

గల జగన్నాథసూరు లగ్రజులు గాగ

నలరి రంగప్ప నరసింగరప్పు దమ్ము

లై మెరయువాడ భువి సింగరాహ్వయుండ. (దశరథ. 1-౫)

ఈ పద్యంలోని తొలిపాదంలో చెప్పిన మరింగంటి అప్పన్నగారే పౌన్నికంటి తెలగన్నను అచ్చ తెనుగు కావ్యాన్ని వ్రాసిన అమీనుఖానుకు అంకితమిమ్మని చెప్పారు (యయాతి. 1-9). రెండు, మూడు, నాలుగు పాదాలలోని వ్యక్తులను గురించి వివరాలు తెలియవుగాని జగన్నాథసూరి మాత్రం చాలా ప్రసిద్ధుడు. అతణ్జీ నేబతి కృష్ణయా మాత్కుడు తన రాజనీతిరత్నాకరమనే పంచతంత్రంలో ఇలా ప్రస్తుతించాడు.

గురుమూర్దన్యు శతావధానవీరుదాంకుక్‌ ద్రావిడావ్నూయ త

త్త్వరసజ్ఞున్‌ వటుసంస్కృతాం ధ్రరచనాదక్షుక్‌ హయాధీశకం

ధరసంలబ్ధసువర్యవృష్టియుతు కర్ణాటక్షమాభృత్సభాం

తరపూజ్యున్‌ మరుగంటివెంగళజగన్నాథార్యు గీర్పించెదన్‌. (రాజనీతి. 1-౫)

ఈ పద్యంవల్ల మరింగంటి జగన్నాథసూరి కనకాఖిషీకం పొందిన పండితుడనీ శతావధాని అనీ, బహుగ్రంథకర్త అనీ తెలుస్తున్నదిగాని అతని [గ్రంథాల వివరాలు తెలియవు. నేబతి కృష్ణమంత్రి తన కావ్యంలో సింగరాచార్యులను కూడ ఇలొ నుతించాడు:

ఆంధ్రభాషానిరోష్టృమహాప్రబంధ - రాజిరచనాధురీణు కర్ణాటరాయ

లబ్ధకవిసార్వభౌమకల్యాణబిరుద - శాలి మరిగంటి సింగరాచార్యు దలతు.

(రాజనీతి. 1=$)

  1. శ్రీ రంగాచార్య (పరిష్కర్త) దశరథరాజనందన చరిత్ర, పీఠిక పుట 7. అధోజ్ఞాపికలో.
  2. నేబతి కృష్ణమంత్రి పద్యాలను డా॥ బి. రామరాజుగారు 'ఖుతుబ్‌షాహీసుల్తానులు - అంధ్రసంస్కృళి అనే గ్రంథంలో ఉదాహరించారు. పుటలు 97 నుండీ 112 దాకా.

చురింగంటి సింగరాచార్యులు 939

ఈ పద్యంవల్ల సింగరాచార్యునికీ కవిసార్వభౌమ వీరుదును విజయనగర పాలకులే ఇచ్చారని తిలుస్తున్నది. బహుశా అళియ రామరాయలు కాకపోవచ్చు. సింగరాచార్యులు తన గద్యలో తాను సకలైశ్చర్యధురీణుడనని చెప్పుకొన్నాడు. అయితే ఆ సిరులు తనకు దేవుడిచ్చినవే అని చాటుకొన్నాడు.

“ఇదీ శ్రీమల్లక్ష్మీ నృసింహావతార వేంకటేశ్చర వర ప్రసాద లబ్ధ సకలైశ్చ్వర్యధురీణ వాంధ్రభాషా నిరోష్థాది వింశతిప్రబంధ నిర్మాణ మౌద్గల్య గోత్రపవిత్ర తిరుమల దేశిక పౌత్ర వేంగళాచార్యపుత్ర మరింగంటి సింగరాచార్య ప్రణీతంటైన దశరథరాజ నందన చరిత్రంబునందు సర్వంబును షట్కాండ పంచమాశ్వాసంబు.

ఈ గద్యవల్ల ఇతడు ఇరవై గ్రంథాలను వ్రాసినట్టు తెలుస్తున్నది. కొన్ని రచనల పేర్లు మాత్రం తొలిపండితులు సేకరించారు. మరికొన్నిటిని ఆధునికులు సంపాదించ గలిగారు తాను రచించిన శుద్ధాంధ్ర నిరోష్ట్య సీతాకల్యాణం అనే కావ్యంలో సింగరాచార్యులే ఏయే వయసులో తాను ఏయే రచనలు చేసిందీ 6 పద్యాలలో విశదం చేశాడు. (1-14 నుండీ 18 దాకా).

9వ యేట (1) వరదరాజస్తుతి, (2) శ్రీరంగశతకం; 10వ యేట (3) చక్రలాంఛనవిధిః 11వ యేట (4) కవికదంబం; 12వ యేట (5) శతసంహిత ఆంధ్రీకరణ; 13వ యేట (6) రామకృష్ణవిజయం అనే రెండర్థాలకావ్యం: 14వ యేట (7) నాటకశాస్త్రం: 15వ యేట (9) ధనాఖిరామం (9) టప్రేమాఖిరామం; 16వ యేట (10) నలయాదవరాఘవ పాండవీయం అనే నాలుగర్జ్థాల కావ్యం; 17వ యేట (11) సకలాలంకారసం గ్రహరాధా సుధాపూరణం; 18వ యేట (12 ఆంధ్రభాషాభూషణం; 19వ యేట (13) దశరథ రాజనందనమనే నిరోష్ట్రరామాయణం; 20వ యేట (14) నిరోష్ట్య శుద్ధాంధ్రసీతా కల్యాణం (15) తారక బ్రహ్మరామ శతకం: ఆ తర్వాత ఎప్పుడోగాని (16) శ్రీకృష్ణ

-శితానందీయం, (?) (17) కృష్ణతులాభారం, (18) రతిమన్మథాభ్యుదయం, (19) రామాభ్యుదయం. ముద్రితమైనాయి - దశరథరాజనందన చరిత్ర, శుద్ధాంధ్రనిరోష్ట్రసీతాకల్యాణం. ఇవి అచ్చుపడినా దొరకడం లేదు. దొరికిన సాక్ష్యాలవల్ల పెట్టుకొన్న నియమాల పరిధిలో ఇతడు ఉద్దండకవి అని (భమించడానికీ అవకాశాలు ఉన్నాయి. ఇతణ్డీ అశ్వపతులు, నరపతులు గజపతులు సమానంగా సత్కరించారు. '“నరనాగాశ్వనృపాల సభ్యగణీతుడ' నని సింగరాచార్యులు స్వయంగా చెప్పుకొన్నాడు (దశరథ. 1-33). ఇతనికి .భాముడు మదపుటేనుగులు, వెల్లగొడుగులు, ముత్యాలహారాలు, గుర్రాలు, సింగరాచార్యులు తన ఇరవయ్యోయేట '““చెప్పురానట్టి కావ్యంబు చెప్పబూనినాడ'” 3. గోలకొండసంచిక, పుట 415. 4. ఆంధ్ర విజ్ఞానసర్వస్వం - విశ్వసాహితి, పుట 7%.

940 సమగ్రాంభ్ర సాహిత్యం - రెండవ సంపుటి

తెనుగన గొన్ని గావ్యములు దెల్లముగా రచియింపవచ్చు టే

ర్కొనగ నిరోష్ట్య కావ్యములు గొన్ని యొనర్చగ వచ్చుగాక చ

క్కననివి రెండు చందములు గ్రచ్చఅ గూజీిచి నేర్చు చేత నె

వ్వనికి రచింప శక్కమగు వాంఛ యొనర్చితి దాని సేయగన్‌.

(సీతాకల్యాణము - 1-7)

మునుపెవ్వరూ ఇలాంటి పని ఎందుకు చేయలేదంటే తనకు క్రీర్ణి తెప్పించడం తోసమే.

తొలుతటి సుకవులు ఘనులై

యిలనాంధ్ర నిరోష్ట్రృకావ్యమేలాసేయం

దలచరొ! నాకు బ్రసిద్ధము

గలుగగ నొనరించు కొకు గావలె నరయన్‌. (సీతాకల్యాణము - 1-2)

సింగరాచారులు నిజంగా కబ్బాల సింగం అనిపిస్తాడుగాని ఇతని కావ్యాలన పరిశీలించినవారు ఇలా చెప్తారు. “మనకు లభ్యమైన రెండు కృతులలో శుద్ధాంధ్ర నిరోష్థ్య సీకాకల్యాణ రచన బాగుగానున్నది. అట్టనినచో దశరథరాజనందన చరిత్ర రచన బాగులేదని కాదు. కవిత్వమంత ప్రొఢముగా లేకున్నను సులభగ్రాహ్యముగానూ లేదు” అని చెప్పక తప్పదు.5

సింగరాచార్యులు దశరథరాజనందన చరిత్రలో రామకథనే చెప్పాడుగాని పెట్టుకున్న నియమాల ప్రకారం రామలక్ష్మణ శట్టాలలో ఓష్టాలున్నాయి కాబట్టి వాటీని యథాతథంగా వాడలేకపోయాడు! "

అస్తికులకు పరమపవిత్రమైన రామనామము ఈ కబ్బంలో వాడడానికి కవిగాటీ ఇబ్బందికరమైంది!! నానన నన పప 5. _శ్రీరంగాచార్య దశరథరాజనందన చరిత్ర పీకిక పుట ఇ.

ముగ్గురు లాక్షణికులు అష్టాదశ వర్ణనలతో ప్రబంధాలు విరివిగా రచించే కాలంలో ఏకవైనా నర్వలక్షణలక్షితంగా కావ్యాన్నే బ్రాయాలనుకొంటాడుగాని-కేవలం లక్షణగ్రంథాలనే వ్రాసి తృస్తిపడడు. ఈ యుగంలోనూ ఇతర కృతులను చెప్పినా లాక్షణీకులుగా మాత్రమే చెప్పుకోదగ్గ కవులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొందరిని గురించి అక్కడక్కడ ముచ్చటించుకొన్నాం. ఇంకో ముగ్గురిని గురించి చెప్పుకొందాం.

  1. వైషధం తిమ్మమంత్రి; ఇతడు “లక్షణమంజరి అనే గ్రంథాన్ని ఏకాశ్వాసంగా రచించి గరళపురీశ్వ్చరునికి అంకితమిచ్చాడు. అందుకే దీనిని 'గరళపురీఛంద' మని పేర్కొంటారు. ఇది అముద్రితం. గ్రంథాంతాన ఇలా ఉందిః యతిగణప్రాసంబు లతులాంధ్రవిస్ఫూర్హివర్గ ఫలంబులు వరుసదత్త జేయుదుచిత గ్రహంబులు ప్రచురమౌ సంధులు తెలియ సంస్కృతమును దెనోగు విధములు గణకూట భేదంబులను భాషదోహశంబును దశదోషములను కలితప్రబంధమున్‌ ఘటియించు శభణాలమను మాతృ కార్చనంబును విచిత్ర

కవగలు ప్రత్యయము నలంకారగతుల

చందములు తతప్రభావృత్తజాలములును

జాతులుద్ధరమాలిక *జాతివృత్త

లక్షణము లేర్చరించితి దక్షవైరిః (1. 559 అప్పకవి 41 యతిఖిదాలను చెప్పాడు; ఇతడు 50 చెప్పాడు. అందుచేత ఇతడు అర్వాచీనుడని భావించనక్కరలేదు. అప్పకవికీ తరువాతిబాడైన కూచిమంచి తిమ్ముకవి 28 మాత్రిమే చెప్పాడు. నైషదం తిమ్మకప 16వ శతాబ్ది చివర ఉండవచ్చు.

2 వ్యోశ్వరమి: ప్రాచీనలక్షణ గ్రంథాలలో విశ్వేశ్చ్వర ఛందం ఒకటి ఉందని కన్తూరిరంగ కవి తన ఆనందరంగరాట్పందంలో కొన్ని పద్యాలను ఉదాహరించాడు. అవైనా రాసులు, మఘపుబ్బలు ఎలుకలు, ఉత్తరపూర్వాభాద్రలు గోవులు అంటూ ఏవేవో చెప్పాడు. మొదట చెప్పినవి పోతులు, తరువాత చెప్పినవి పెంట్లు అని యోనిపొంతనాలు చెప్పాడు (రంగు 2-241). ఈ కవి ఏకాలం వాడో, ఎక్కడీవాడో వివరాలేం తెలియవు. తెలుగు సాహిత్యంలో విశ్వేశ్చరనామధారులు ఇద్దరున్నారు: ఒకరు శివతత్త్పరసాయనం వ్రాసిన ఏన్వేశ్చరదేశికులు; రెండోకవి శేషధర్మం ఆంధ్రీకరించిన వెణుతురుబల్లి విశ్చనాథకవి. 3. చిత్రకవి పెద్దన: తెలుగులో ఎన్ని లక్షణ గ్రంథాలున్నా ఎందులోనూ నాటకానికి లక్షణం కనబడదు. మొదటిసారిగా నాటక లక్షణాన్ని చెప్పినవాడు చిత్రకవి పెద్దన్నే ఇతడు కడప బిల్లా గండికోట తాలూకాలోని వెల్లలూరు నివాసి. ఆ గ్రామంలోని హనుమంతుని భక్తుడు. కందాళ అజ్జగారి శిష్యుడు. ఈ అన్నగారి కుమారుడు ప్రసిద్ధుడైన కందాళ అప్పపండితుడు. అతడు శ్రీ.41580 తరువాత పాండురంగ మాహాత్మ్యం అంకితం పొందిన .

342 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి విరూరి వేదాద్రికి గురువు. అందుచేత కందాళ అజ్జగారూ,. ఆయన శిష్యుడూ క్రీశ150 ప్రాంతాల ఉంటారు. చిత్రకవి పెద్దన చిన్నప్పుడే ఒక శతకం బ్రాసి హనుమంతునికి అంకితమిచ్చాడు. తరువాత లక్షణసారసం గహం అనే లక్షణగ్రంథం వ్రాశాడు. ఇందులో తనకు ముందున్న లాక్షణికులను ఇలా నుతించాడు: త్ర్యక్షవర ప్రసాదకవితాడ్యుని వేములవాడ ఖీము న య్యక్షతభక్తివిస్ఫురదనంతు ననంతు గవిత్వలక్షణా ధ్రుక్షుల గాచిరాజు బసవార్యుని ఖైరవు నూత్నదండివా గ్వీక్షణకర్ణ నేత యగు వెల్లకి తాతబుధేంద్రు నెన్నుదున్‌. (లక్షణ. 1-3) పూర్వలాక్షణికులను నుతించడమేకాక వాళ్లను ఇతడు అనుసరించాడు. “ఈ టి ఛందోభాగము అనంతుని ఛందము ననుసరించి రచించెనని పరిశీలన వలన తెలియుచున్నది” అని పరిశోధకులు _చెప్తున్నారు.! ఇతర భాగాలలో ఎవరిని అనుసరించినా చిత్రకవి పెద్దన నాటక లక్షణం స్వయంగా చెప్పాడు: తెలుగున నాటకలక్షణ - మిల నెవ్వరు జేయలేదు వృషదశ్వసుతా లలితమతి నీదు కృపచే - దెలిసిన యంతయు నొనర్హు దితిజధ్వంసీ. (లక్షణ. ౩-57) 49 పద్యాలలో నాటక లక్షణాన్ని ఇతడు విపులంగానే చెప్పాడు. చివర ఇలా అన్నాడు: వివిధలక్షణలక్ష్యసంవిదు లొనర్చు నాటకములు పదార్వన్నై హాటకములు లక్షణబజ్ఞలు గాని ప్రల్లదు లొనర్చు నాటకంబులు భువి నారకూటకములు, (లక్షణ. ౩-౪) నాటక లక్షణం చెప్పాక పెద్దన తనకు ఇంటిపేరుగా నిలిచిన చిత్రకవిత్వ లక్షణాలను వివరించాడు. 'కల్ప్సితకల్పవల్లికాబంధం' అని ఒకటి చెప్పాడు. నాలుగు చంపకమాలలి నుండి పదిహేడు వృత్తాలు పుడణాయట. ఇటువంటి ఫీట్సు చేసినవాడు నిజంగా చిత్రకవేః వల నాాడనునత కనులా ననున నతనకనకనుకల నము నాననా తనన కానా నినన నన

  1. థెలుగు భాషలో ఛందోరీతులు - రావూరి దొరస్వామిశర్మగారు, వుట 3౫8.

పన్నెండు మంది వేదాంతులు

మన ప్రాచీనులు ధర్మార్థకామ మోక్షాలు నాలుగింటికీ సరిసమానమైన ప్రాముఖ్యమే ఇచ్చినా, భారతదేశం కేవలం ఆధ్యాత్మిక విద్ధుకే అంకితమై, ప్రతి ఒక్కడూ పరంలో బాగుపడడానికే ఇహంలో బ్రతుకుతున్నట్టు భావించవలసిన తాత్త్వికనిర్వేదం మన రక్తంలో జీర్ణించుకుపోయింది. దానికి కారణం “*కలగాపులగపు వేదాంతమే. భారతీయ దార్శనికులు ప్రతిపాదించిన వివిధ దర్శనాలలోని అంశాలను చిత్తం వచ్చినట్టు కలగలుపు చేసి ప్రబోధం చేసినవాళ్లు చాలామంది ఉన్నారు. ఉపనిషత్తులలోని ట్రహ్మపదార్థం, హఠయోగంలోని కుండలిని, భగవద్గీతలోని కర్మవాదం మొదలైనవన్నీ ఓక మూసలో కరిగి సామాన్యులకు వేదాంతమైంది, ఇది బోధించే గురువులు ఎక్కువగా నవాబుల యుగంలో కనబడతారు. పద్యరచన చేయగలిగిన యోగులందరూ ఈ కాలంలో వేదాంత గ్రంథాలు వ్రాశారు. కాకకీయయుగంలో ధర్మశాస్తాలూ, పురాణాలూ, పద్మనాయకయుగంలో అర్థశాస్తాలూ, రెడ్డిరాజుల యుగంలో అలంకార గ్రంథాలూ, తదనంతర యుగాలలో కామశాస్తాలూ, ప్రబంధాలూ ఏ చారిత్రక కారణాలవల్ల విరివిగా వ్రాయడం జరిగిందో ఆ చారిత్రకమైన అవసరాలవల్లనే నవాబులయుగంలో వేదాంత గ్రంథాల రచనలు అధికంగా జరిగాయి. దేశంలో రక్షించుకోవడానికి జరిగిన వివిధ ప్రయత్నాలలో ఈ రచనలు కూడా చేరతాయి. ఈ యుగంలోని వేదాంత కవులను గురించీ, రచనల సంగతీ తెలుసుకొందాం.

  1. నటమూలుడు: ఇతడు 'వటమూలమందిరా!? అనే మకుటంతో ఒక శతకం వాశాడు. అందులోని కొన్ని పద్యాలు మాత్రమే లభించాయి. శ్రీ.శ.1580 ప్రాంతాలలో ఉన్న జంటకవులు తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతీ తమ నాగరఖండంలో ఈ కవిని పేర్కొన్నారు. వటమూలుడు తన గురువులలో ఒకడని వేమన తూడ చెప్పాడు. వటమూలుడు క్రీ.శ.450 ప్రాంతాలలో ఉండి ఉంటాడని నిడుదవోలు వెంకటరావుగారు నిర్ణయించారు. అయితే ఇతడు ఎప్పటివాడో తేల్చక శ్రీ.శ1560కి పూర్చుడై ఉంటాడని చాగంటి శేషయ్యగారు అఖిప్రాయపడ్డారు.! ఈ వటమూలుడు నిజంగా వేమనకు గురువే అయితే అతడు 16వ శతాబ్దపు ఉత్తరార్థంలో ఉండి ఉంటాడని నేను భావిస్తున్నాను. ఈ కవి యోగవిషయాలను స్పష్టంగా తేటమాటలలో చక్కగా చెప్పినట్టు ఉదాహరించిన పద్యాలవల్ల తెలుస్తున్నది. వీటిని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ చాటుపద్య మణిమంజరి-%[లో ప్రచురించారు.

చూపులు రెండు ముక్కుతుద జొన్సియు జూచిన చూపు వెంటనే

లోపల జూచి చండకరులో శిగూర్చి చతుర్దళంబుపై

  1. ఖారతి, సంపుటి 13-భాగం 1 పుట 4.

  2. శతకకవుల చరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, అనుబంధం, పుకు 735.

  3. ఆంధ్రకవి తరంగిణి ౫ పుట 8.

రకత సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దీపము వెట్టి దాని తుదితేజము తానయి విశ్చ్వమంతయుక్‌ వ్యాపకుడైన పుణ్యుడు మహాత్కు డగుక్‌ వటమూలమందిరా! (చాటు | పుట, జ్ర యోగంలో కుండలినీ శక్తి ముఖ్యమైనది. దానిని తెలిసినవాడే యోగి. ఆ సంగరి వాలిన యింద్రియాలయ కవాటము లన్నియు మూసి నెమ్మది€ దాళము వెట్టి లో వెలుగు తత్వము గన్గొని- తట్టి సుందరి! లాలితనాగకన్య నుపలాలనచేసిన వాడె యోగియౌ మాలిన వేషముల్‌ జముని మార్కొనునే వటమూలమందిరా! (చాటు!,) ఈ కవి వ్రాసిన శతకం పూర్తిగా దొరికితి యోగశాస్త్రంపై చక్కని సంకలనం అవుతుంది.

  1. వామయోగి; వటమూలకవిలాగే వేదాంతవిషయాలను ప్రతిపాదించే పద్యాలను రచించిన మరొకకవి నామయోగి. ఇతడు పంచచామరాలలో వేంకటిశ్వరశతకం వ్రాశాడు. ఎలాంటివాడు యోగో ఇతడు కూడ విశదం చేశాడు.

గొప్పకన్నులున్న మంచి గొప్పసిగ్గు చన్నులుక్‌

గొప్పలౌ పిరుందులున్ను గొప్ప గొప్పు గల్లినక౯్‌

ఒప్పు మోహనాంగి రతికి నొప్పుమంచు వేడిన౯

ఒప్పుకున్నవాడే రాజయోగి వెంకటేశ్వరా రతికి ఒప్పనివాడే రాజయోగి అని చెప్పినా ఈ నామయోగి ఒకనాడు కాముకుడు. ఆ సంగతి అతడే ఇలా చెప్పుకొన్నాడు:

పామరుండనై మదించి బ్రహ్మజాతకుండనై

తామసంబు మాన్చి నన్ను ధన్యుజేయుమీ భువి౯

నామయోగి హృన్నివాసః నాథ! వెంకటేశ్వరా! ఇతడు బ్రాసిన 40 పంచచామరాల ప్రతి ఒకటి తంజావూరు సరస్వతీ మహల్‌ గ్రంథాలయంలో ఉంది

  1. సదానందయోగి : తెలుగులో శతకాలను రచించిన యోగులలో సదానందుడొకడు. 'నవ్యతరభోగి శ్రీ సదానందయోగి' అనే మకుటంతో ఇతడు ౫ పద్యాలు చెప్పాడు. ఇతడు క్రీ.శ. 1450-1500 ప్రాంతాలవాడని నిడుదవోలు వెంకట రావుగారు ఊహిస్తున్నారు.! శతకకవుల చరిత్రలో వంగూరి సుబ్బారావుగారు ఈ కవి క్రీశ 1800-1900 మధ్య ఉండి ఉంటాడని మొదట అభిప్రాయపడ్డారు. ఈశ్వర ఫణీభట్టు నాకా తానినలకకొను నునన కాలాన దనన నననానినానానా న్‌
  2. తం.స.మ. గ్రంథాలయం క్యాటలాగు (ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురణ), గ్రంథం నెంబరు 41,

పుట 14.

  1. శతకకవుల చరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, అనుబంధం, పుట 79.

అనే కవికి సదానంద యోగి అనే గురువు ఒకడున్నాడు. అతడే ఇతడిని భావించడంవల్లా, ఫజీభట్టు బహుశా పోతరాజుగారికి అర్వాచీనుడూ, పెద్దనగారికి ప్రాచీనుడూ అయి ఉంటాడనుకోవడం వల్లా ఫణిభట్టుకాలమూ, అతని గురువుకాలమూ క్రీ.శ 1450-1500 అయి ఉంటుందని పరిశోధకులు భావించారు. అయితే శ్రైలివల్ల సదానందయోగీ, అనుసరణాలవల్లా, ప్రబంధపద్ధతివల్లా ఫణిభట్టూ పెద్దనగారికి అర్వాచీనులనిపిస్తున్నది సకలతత్వార్థ్ధ సంగతులు సంగ్రహించి “నవ్యతరభోగి శ్రీ సదానందయోగి! అనే మకుటంతో సదానందయోగి ఒక గీతశతకం రచించాడు. ఇందులో ఒకటి తక్కువ నూరు పద్యాలున్నాయి. ఇతడు అనుభవం ముఖ్యమంటాడు.

ననుభవజ్ఞాన మెక్కడీ దరసిచూడ'' అని ప్రశ్నించాడు (68). “అనుభవజ్ఞానియ్డైనట్టి యమలమాూర్తి తన్ను బ్రకటన సియడు ధాత్రిలోన నివురు నుముకయు నిండిన నిప్పురీతి”' అని చెప్పాడు (69). ద్వైతం, అద్వైతం అనే విభేదాలు ఇతనికి ఇష్టం లేదు. “ఏ మతంబున నుండిన నేమి తప్పు? ముక్తి గనువారికొక్కటి ముద్రపదము, తాను సంకల్పరహితు డైతేను చాలు” అన్నాడు (98). ఇతడు నిత్యనైమిత్తికాలను పాటించక్కర్లే దన్నాడు. “నిత్యనైమిత్తికాదులు నెరవకున్న పాతకంబని వెరచునే పరమయోగి? పోతురాజుకు భయమేల భూతసంఖ్య?"* (55) అని చెప్పాడు. “ బంధముక్తులు రెండూ భ్రమే" అన్నాడు (02). “అలువిడ్డల విడిచినందువల్ల మోక్షమబ్బునె?”' అన్నాడు (91).

ఈ యోగి కవిత్వం చాలా నిరాడంబరం.

  1. ఈశ్వరఫణిభట్టు భారతంలోని అనుశాసనిక పర్వంలో హరసనత్కుమార సంవాదం ఉంది. దానిని అంపశయ్యమీద నున్న భీష్కులవారు ధర్మరాజుకు చెప్పారు. చీనిని ఆధారంగా ఈశ్వర ఫణీభట్టు పరతత్వరసాయనం అనే వేదాంత గ్రంథం వ్రాశాడు. ఇందులో కర్మయోగం, సాంఖ్యయోగం, యోగతంత్రం, రాజయోగం మొదలైనవి గురువు తనకు ఎలా ఉపదేశించాడో అలాగే కవి రచించాడట. ఇతని గురువు సదానందయోగి. ఆయన కవికి బ్రహ్మోపదేశం చేశాడు. ఈ సంగతి కవి కృత్యాదిని చెప్పాడు. గురువుకే అది అంకితమిచ్చాడు. ఇది వేదాంత విషయాలను చెప్పి గ్రంథమైనా ప్రబంధధోరణిలో వర్ణనలు ఉన్నాయి. అల్లసాని పెద్దనగారిలాగా గణపతిటాల్యాంకచేష్టను వర్ణించి విస్నేశ్చరపూజ చేశాడు. మహాభారతంలోని హరసనత్కుమార సంవాదాన్ని మొదట తిక్కనగారు అనువదించారు. ఫణిభట్టు తిక్కనగారిని పూర్వకవిస్తుతిలో నుతించాడు. అర్వాచీనులలో ఇంకెవరినీ పేర్కొనకపోవడంచల్ల ఇతడు ఎప్పటివాడో చెప్పలేని సమస్య ఏర్పడింది. ఇతని గ్రంథాన్ని మద్రాసు విశ్వవిద్యాలయంవారు ప్రచురించారు. మంచి శైలి.

క్‌, డి మల్లన్న; కృష్ణానదికి దక్షిణాన కొప్పురావూరు అనే గ్రామం ఉంది. అందుల! కే స్టా టాం తొలిరోజులలో కృష్ణమంత్రి ఒకాయన ఉండేవాడు. ఇతడు శృంగారనిధి. ఇతని తాతపేరు ముమ్మడిరాజు. అందుచేత ఈ యింటివారికి ముమ్మడివారనే పేరు వచ్చింది. ముమ్మడి కృష్ణమంత్రికి మల్లన్న అనే

346 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పుత్రుడు పుట్టాడు. ఇతడు బాల్యంలోనే వేదాంతంవైపు మొగ్గాడు. ధేనువుకొండ గ్రామంలో ఉన్న తిమ్మయాచార్యుని శుశ్రూష చేశాడు. ముమ్మడి మల్లన్న చిన్నప్పుడే తత్వచంద్రోదయం అనే ద్విపదకావ్యాన్ని వ్రాశాడు. ద్వారకలో శ్రీ కృష్ణపరమాత్ముడు రుక్కిణీదేవి కోరతీ లోకాను గ్రహకాంక్షచే అద్వైతమార్గం ఉపదేశించాడట.

ఒక యిచ్చయును లేక యుండెడి బయలు

సకలంబు తానైన చక్కని బయలు

లోకంబు లన్నియు లోగొన్న బయలు

రాకపోకలు లేక రంజిల్లు బయలు అంటూ సుమారు 100 ద్విపదలలో “బయలు” వర్ణించాడట. ఈ తత్వచంద్రోదయం ప్రతి ఒకటి కాకినాడలో ఆంధ్రసాహిత్య పరిషత్తులో ఉంది (గ్రంథసంఖ్య 77).5 శ్రీకృష్ణుడు రుక్కిణీకి ఉపదేశించిన ఈ గ్రంథాన్ని కవి శ్రీరామునికి అంకితమిచ్చాడు. తరువాత శ్రీరామమంత్ర ప్రభావాన్ని చాటే ఒక గ్రంథాన్ని వ్రాసి శ్రీకృష్ణునికి అంకితమిచ్చాడు. దీని పేరు శ్రీరామస్తవరాజం. ఇది మూడాశ్వాసాల కావ్యం. కవి దీనిని (ప్రబంధనాయక రత్నం' అన్నాడు. వ్యాసులవారు శ్రీరామమంత్ర ప్రభావాన్ని, వేదాంతవిషయాలను ధర్మరాజుకు ప్రభోదించిన వివరాలను ఈ గ్రంథంగా కవి రచించాడు. ఇది చాలా ప్రచారం పొందింది. దీనికి చాలా ప్రతులు లఖిస్తున్నాయి. “ఇతని కవిత్వం అంత మంచిది కా'దని చాగంటి శేషయ్యగారు అఖిప్రాయపడ్డారు.” ముమ్మడి మల్లన్న వ్రాసీన

  • రెండు శతకాలు బయటపడ్డాయని నిడుదవోలు వెంకటరావుగారు చెప్తున్నారు. ఒకదాని మకుటం "*కృష్ణసచివునిమల్త్లా!”, రెండవదాని మకుటం 'ముక్తికాంతాప్రియా!' అని, ప్రణవాంగనను అంగజుకేళితోతృప్తిపరచాలని కవి చెప్తున్నాడు:

బంగరునిగ్గుంబలె ప్రణ-వాంగన భ్రూమధ్యమందు సణువగుదానిక్‌

అంగజు కేళిం దనిపిన - సంగతి ముక్తెల్ల గృష్టసచివుని మల్లా!

ఈ ముమ్మడి మల్లయ్యకు చాలామంది శిష్యులున్నారు. అందులో కొందరు కవులు.

  1. ఢిల్లీ వెంకటకవి; ఇతడు ముమ్మడి మల్లయ్య శిష్యుడే. శ్రీ సీతాదేవి ప్రాటే శ్రీరాముడు బోధించిన విషయాలను ఇతడు “జ్ఞానసూర్యోదయం' అనే ద్విపదకృతిగా వ్రాసి తన గురువుకు అంకితమిచ్చాడు. దీని ప్రతి కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తులో ఉంది. గ్రంథసంఖ్య 77. ఈ కృతిలోని కొంతభాగాన్ని పరిషత్తువారు ఉదాహరించారు.

భాగంబు లానందపదలక్షణములు

ప్రాగను నొక్కటి ప్రధ్వంస మొకటి 6. పరిషత్పుస్తక భాండాగారం క్యోటలాగు |, పుట ౫.

7, అంధ్రకవితరంగిణి =) పుట 1%, 8. శతకకవులచరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, అనుబంధం, పుట ౫, 8. పరిషత్సుస్తకభాండాగారం క్యాటలాగు £, పుటలు ౩7, ౫.

పన్నెండు మంది వేదాంతులు 347 అన్యోన్య మొకటి యత్యంత మొకటి

శూన్యముల్‌ నాలుగు సొరిది నిత్యమును

వెలయును దీనిని వివరింతు వినుము

కలుగు మృత్తికయందు ఘటములు మొదట

పరికింపగా నిది ప్రాగభావంబు

వెరవైన ఘటములు వెనుక లేదనుట

పటువుగ బధ్వంస భావశూన్యంబు

ఘటములు పటమందు బటము లాఘటము

కణగిలేదనుటయె కణగి యన్యోన్య

వమన యభావం వింక నాకాశపుష్ప

మనుట యత్యంతమౌ నల యభావంబు

ఘన నిత్యపద మిధి కంజాక్షి మరియు.

కిష్టమైన విషయాలు చాలా సరళమైన పద్ధతిలో చెప్పగల ప్రతిభ ఇతనికి ఉన్నట్టు కనబడుతుంది.

  1. మారేపల్లి వెంకటయోగి: ఇతడుకూడ ముమ్మడీ మల్లయ్య శిష్యుడే. అలమేలు మంగమ్మ అర్ధిస్తే తిరుపతి వెంకటేశ్వరుడు కరుణించి చెప్పిన వేదాంతాన్ని ఇతడు “తత్వదీపిక బోధ' అనే ద్విపద కృతిగా వ్రాసి వెంకటేశ్చరునికే అంకితమిచ్చాడు. ఇది అముద్రితం. దీని ప్రతికూడ ఆంధ్రసాహిత్యపరిషత్తువారి గ్రంథాలయంలో ఉంది.

  2. పిదరామకవి: వేదాంత విషయాలను పద్యాలలోనూ, ద్యిపదలుగానే కాక వచన గ్రంథాలుగా తూడ రచించినవారు లేకపోలేదు. క్రీ.శ1560 ప్రాంతాలలో ఉన్న సీద్ధరామకవి “ప్రభుదేవర వాక్యం' అనే శ్రైవవేదాంత గ్రంథాన్ని బ్రాశాడు*ి దీనికి 'పిండచత్రనిర్ణయం' అనే నామాంతరముంది. ఇతడు కేదారదేవర శిష్కుడు. శంకరకవి బ్రాసిన హరిశ్చంద్రోపాఖ్యానం అంకితం పుచ్చుకున్న బాచయ్యకూ, తపతీసంవరణో పాఖ్యానం వ్రాసిన అద్దంకి గంగాధరునికీ కూడా ఈ కేదారదేవరే గురువు. అందుచేత సిద్ధరామకవికూడ _ ్రీ.శ.1530-1580 మధ్య ఉండి ఉంటాడని నిర్ణయించవచ్చు. “చిత్కళోద్ధామ శ్రీగురు సిద్ధరామః' అనే మకుటంతో ఇతడొక శతకం వ్రాశాడు. ఇందులో లోకంపోకడ కూడా చక్కగా చెప్పాడు.

  3. యోగానంద అవధూత ; ధేనువుకొండ తిమ్మయ్యగారికి ముమ్మడి మల్లయ్యేకాక చింతలపల్లి లింగావధాన్లు అనే శిష్యుడు తూడా ఉన్నాడు. ఈ లింగావధాన్లు ఏమైనా కృతులు బ్రాశాడో లేదోగాని ఈయన శిష్యుడు మాత్రం వ్రాళాడు. అతని పేరు యోగానందావధూత. అవ్మైకబోధము (7.479), గురుశిష్య సంవాదం (౫.98, 883) అనే ద్విపద కృతులు ఇతడు రచించాడు. వ్యాకరణం, ఛందస్సు పట్టించుతోలేదు.

  4. అంధ్రకవిసప్తశతి - బులుసు వెంకటరమణయ్యగారు, పుకు 281.

348 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అనుభవార్థం బంత యది లెస్స తెలిసి అనుదిన మీబోధ నరయుడు మీరు యతిప్రాసముల గొడవ యేలను మాకు గతి గురుడని తలచు గతి యది మాకు

అని కచ్చితంగా చెప్పాడు. యతిప్రాసల గొడవ అక్కరలేదన్న పాదంలోనే మాత్రాధిక్సం

ఉంది. సబటేః

  1. అఖిండసచ్చిదానంద అవధూత : ఇతడు మరో అవధూత ఈయన పురూరవచరిత్రమనే పద్యకావ్యం వ్రాశాడు. విషయం వేదాంతమే. పురూరవ చక్రవర్తికి నారదుడు చేసిన తత్పోపదేశాన్ని ఈయన వ్రాశాడు. ఈ పుస్తకంలో ఒక్క అశ్వాసం మాత్రమే లఖించింది (౧ 604). ఆయనకు సాంఖ్యయోగం అఖిమానమని చెప్పవచ్చు. ఈ అవధూత వివరాలేమీ తెలియవు.

  2. కంభంపాటి వారప్ప।; యతిప్రాసల గొడన పట్టించుకోని యోగానంద అవధూతకు తిమ్మయ్య అనే శిష్యుడు ఒకడున్నాడు. ఆయనకు రామబ్రహ్మం అనే ఆయన శిష్యుడు. రామబ్రహ్మానికి కంభంపాటి నారప్ప శిష్యుడు. ఈయన భగవర్గీత అనువదించాడు. మహాభారతంలో గీతను తిక్కనగారు తినిగించలేదు. ఆ భాగాన్ని ఆంధ్రీకరించి కంభంపాటి నారప్ప హరిహరనాథునికే అంకితమిచ్చాడు. ఇది ఆరాశ్వాసాల గ్రంథం. దీని అసమగ్రప్రతి ఒకటి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (౧.22). తిక్కనగారిలాగే హరిహరనాథుణ్ణి ఆదిలో నుతించాడుగాని తిక్కనగారు. *శ్రీయన గౌరినా బరగు చెల్వ' అని లక్ష్మీపార్వతులకు అభేదం చెప్పారు. ఇతడు * శ్రీయును పార్పకీ సతియు' అన్నాడు.

శ్రీయును పార్వతీసతియు జిత్తము చెల్వుగ సంతసింప వి

శ్వాయత దేహియై హరిహరంబగు మూర్తియు దాల్చి విష్ణురూ

పాయ నమ శివాయ యని ప్రాజ్ఞ లహర్నిశము€ నుతింపగా

మాయ కతీతమైన పరమాత్ముని వేడెద గార్భసిద్ధికై.

ఇతడు భగవద్గీతను ఆంధ్రీకరించివాళ్ళలో ప్రథముడు. ఇతని గ్రంథం అచ్చుపడడం అవసరం.

  1. పరమానందతీర్ణులు : ఈ యుగంలోని యోగులు ఒకటీ ఆరా శతకాలో, లంథాలో వ్రాస్తే అయిదారు పుస్తకాలు వ్రాసిన ఘనుడు పరమానందయతి.

ఇప్పటిదాకా చర్చించిన వేదాంత కవులందరికీ ఇతడు గురుస్థానంలో ఉన్నవాడు. ఇతనికి దత్తాత్రేయ యోగి గురువు.

ఈ గురుపరంపర పట్టిక చూడండీ.

పన్నెండు మంది వేదాంతులు 349 దత్తాశ్రేయ యోగి పరమానందయతి ధేనువుకొండ తిమ్మరాజయోగి చింతల లింగావధాన్లు ముమ్మడి మల్లయ్య (శ్రీరామస్తవరాజ రచయిత) యోగానంద అవధూత ('యరిప్రానం గాడేనూడు తిమ్మయ్య ఢిల్లీ వెంకటకవి ' మారేపల్లి వెంకటయోగి | (జ్ఞానసూర్యోదయ (తత్వదీపికాబోధ రామబ్రహ్మం కర్త) రచయిత) కంభంపాటి నారయ్య (భగవద్గీత అనువాదకుడు) క్రీ.శ1536 నుండి కర్ణాటక రాజ్యాన్ని పాలించిన వెంకటపతిరాయల ఆన్రితుడైన తరిగొప్పుల మల్లన్నకతూడ దత్తాత్రేయయోగి శిష్యుడే. అందుచేత పరమానందయతి కాలం పదహారోశతాబపు ఉత్తరార్తం అవుతుంది. ఇతడు వ్రాసిన పుస్తకాలు పదకొండు చి తాట గా! ఉన్నాయి. అవి (1) అనుభవదర్చణం, (2) ఉత్తరగితవ్యాఖ్య, (3) ఉపదేశత్రమం, (4) గోపాలశతకం, (5) దత్తాశ్రేయశతకం, (6) పరమానందశతకం, (7) బ్రహ్మవిద్యా నుధార్ణవం, (8) ముక్తికాంతాపరిణయం; (9) వివేశచింతామణీ, (10) వివజ్ఞానసుందరి అనే ద్విపదకావ్యం, (11) సంపంగి మన్న శతకం. వీటిలో ఉపదేశక్రమం, బ్రహ్మవిద్యా సుధార్జవం వచనకావ్యాలు అందులోనూ చక్కని వ్యానహారికవచనం. “విమలతత్వార్థ రహస్కవేత్తలైన పరమానందతీర్ణులు సమస్తలోఠోపకారార్థంగానున్ను... శ్రీమద్దత్తాత్రేయ గురుకృపాలబ్ధస్వానుభవంవల్లనున్ను పరమానందమగ్శ చిత్తుండనై ఒక అనుభవ గ్రంథం రచియింప నిశ్చయిస్తిని. అయితే అనుభవం వాక్కుననుచ్చరింపశక్కమౌనా అంటే శత్యమే కాదు. సత్యం; అయినాగాని చెరువునిండి పూర్ణమైతే' అలుగు పారినట్లు నాయందు నిండిన సచ్చిదానందమే బహిఃప్రసారియ్టై లోకులకు ఉపకరిస్తున్నది. అలుగులనున్ను మడుగుల నున్ను పారిన ఉదకాలు సమస్తమైన సస్యాదులకున్ను ఉపకరించినట్లే ఉపకరిస్తున్నది'' అని లంథం. ల 11.2.789 ట్రై కేటలాగు, మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, సంపుటి 5, పుట 180.

350 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పరమానందయతి వ్రాసిన గ్రంథాలలో అచ్చుపడి లోకులకు ఉపకరిస్తూన్న అతని శతకాలు. శివకేశవుల కభేదం కల్గించిన 'శివముకుంద పరమానందా ఆనే శతకంలో111 కందపద్యాలున్నాయి.

  1. కన్నది కన్నట్టే చనె విన్నది విన్నట్టె యణగె వినకే కనకే యున్నది యే నై యుంటిని బన్నుగ నిక శివముకుంద పరమానందా। (౪) నించైనక్‌ మాయకునికి యెక్కడిదయ్యా, యంతట దొలగక నాతో బంతంబా శివముకుంద పరమానందా! (౫)
  2. తాటాకులు త్రిప్పుచుపది- తోటులు చదువంగ నేమి? గురువాక్యంబుల్‌ పాటించి తెలియ కది యే ర్పాటౌనా శివముకుంద పరమానందా! (14
  3. _తనయింటం దానుండిన తనయిల్లే తనకు చేటు దా తెచ్చునయా తన యిల్లు కాలమేసిన పని మేలది శివముకుంద పరమానందా! (51) ఈ పరమానందశతకం కన్నా ఇతని సంపంగిమన్న శతకం అధికంగా ప్రచారు పొందింది. కవిచౌడప్పకు మార్గం చూపే మాటలతో తూకంగా ఈ శతకం సాగింది వానలు పస పైరుల కఖి-మానము పస వనితలకును మరి యోగులకున్‌ ధ్యానము పస యామీదట- జ్ఞానము పస సుప్రసన్న సంపంగిమన్నా _ (1) అని దేనికేది పసో చెప్పాడు. 'మేదిని గల విద్యలెల్ల మెతుకుల కొరకే” అన్నాడు (3) “మనస్సన్యాసము దొరకని సన్యాసము తూటికే” అని చెప్పాడు (9). తనది కూరగాయలి కవిత్వం బనక కృపావమతి గైకొనమన్నాడు (3) పరమానందయతిది కూరగాయల కవిత్వం కాదు “విద్యానిధి యగునతే సద్యోముక్తుడు” అని ప్రబోధించే కవిత జ్ఞానామృతమే. అందుకే ఇతని శతకాల పదికాలాలపాటు నిలబడుతున్నాయి!

పచ్చకప్పరపు తిరువేంగళరాజు

తెలుగుదేశంలోనేకాక ఇతర రాష్ట్రాలలో కూడా తెలుగు సాహిత్యం చాలా అఖివృద్ది చెందింది. ముఖ్యంగా అది ద్రావిడ దేశంలో ఒకనాడు గొప్ప వెలుగు వెలిగింది పదిహేడవ శతాబ్దంలో నాయక రాజుల దోహదం వల్ల ఆంధ్రసాహిత్యం తమిళ గడ్డమీద మూడు పువ్వులూ ఆరు కాయలూ కాచింది. అయితే ఆ పువ్వులు పదహారో శతాబ్బ్దంలోన్నే మొగ్గ తొడిగాయి. గోళ్ళ పెద్దదామప్పు అచ్యుత దేవరాయలవారు విజయనగరంలో కొలువుండి షృథ్వీరాజ్యం చేస్తున్నప్పుడు వారికి కుడిభుజమైై, వారి బ్రావిడ భూములలో రామనాడు తిరుపత్తూరు సీమలను ఏలుకొంటూ ఉండేవాడు. ఇతని తమ్మునిపేరు చినరామప్ప. ఈ తెలుగు నాయకులకు తమ భాషన్నా, తమ సాహిత్యమన్నా చాలా మక్కువ తమిళదేశంలో ఉంటున్నా తెలుగు కవులను ఆదరించి గ్రంథాలు చెప్పించారు.

పచ్చకప్పురపు తిరువేంగళరాజనే కవిని పిలిపించి చినరామప్పు తన అన్నగార్‌పీర చొక్కనాథ చరిత్ర అనే ద్విపద కావ్యాన్ని చెప్పించాడు. పెదరామప్పు శాసనాలు సదాళివరాయల కాలంలో తూడా కనబడుతున్నా అతణ్ణి తిరువేంగళరాజు 'అచ్యుత దేవరాయ ప్రతాపదక్షిణ బాహుదండాంకు'డని చెప్పడంచేత ఈ కావ్యం క్రీశ 1540-1542కు పూర్వం ప్రభవించి ఉంటుంది. చినరామప్పు శాసనాలు క్రీశ 1540లో కొన్ని కనబడతాయి. అందుచేత ఈ మధ్యకాలంలో వేంగళరాజు దీనిని వ్రాశాడని భావించవచ్చు.

తిరువేంగళరాజు భటనంశంలోనివాడు. ఇతని తాత తండ్రులు తూడా కవులే. ఫ్రొడదేవరాయల కాలంలో ఈ కవి తాతా, పినతాతా ఉండేవారు. తాతపేరు తిమ్మరాజు. అతడు తన చదువులతో ప్రొడదేవరాయలను మెప్పించి పచ్చకర్పూరం అందుకొన్నాడు. నాటినుండి ఈ వంశంవాళ్ళకు 'పచ్చకర్పూరంవా'రనేది యింటిపేరయింది. అనంతపురానికి ఏడుమైళ్ళ దూరంలో ఉన్న చెయ్యేరు ఈ కవుల వంశానికి స్వగ్రామం. ఆ ఊళ్ళో ఉన్న ఓరుగంటమ్మ అనే శాంభవీదేవికి తిరువేంగళరాజు భక్తుడు. ఇతడు శవిత్వంలో తన శక్తిని తాను గుర్తెరిగినవాడు.

మరి గాళిదాసఖీమనతిక్కయబజ్బ-లరయ నన్నయ్య శ్రీనాథుడగాను

ఏ నెంతవాడను....... (చొక్కనాథ. ! పుటక) ఇంత వినయమున్న అతడు 'పద సంధు లర్థముల్‌ ప్రాసంబు యతులు పదిలమై లక్షణప్రామాజ్యముగను' కల్పాంతస్త్థాయిగా చొక్కనాథచరిత్రను రచించదలచాడు.

తమిళ దేశంలోని మధుర సుప్రసిద్దక్షేత్రం. సుందరేశ్వరుడనే చొక్కనాథుడు అక్కడి దైవం. పాండ్య దేశానికి మధుర రాజధాని. ఆ రాజులకు చొక్కనాథుడు ఇలవేల్పు. తమిళ సాహిత్యచరిత్రలో సంగకాలంనుంచి మధురకు ప్రాముఖ్యముంది. ఇక్కడ కవిసంఘాలు వెలిశాయి. “సంగపలక'ను చొక్కనాథుడే ప్రసాదించాడు. అది “నాల్మూర మూరెడు విరివి చదరం. ఇంత చిన్న పలక మధురలోని కవులందరికీ ఎలా సరిపోతుంది అయితే అది దివ్యమైన సుజ్ఞానపలక కనుక నిజమైన విద్యాధికునికి చోటు ఇస్తుంది.

352 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి “ప్రజ్ఞావిేషులు, పండితోత్తములు, ఘనమైన ద్రావిడకావ్యులు' నలభై ఎనమండుగుర్త దానిని అధిష్టించేవారు. వాళ్ళలో ముగ్గురు ప్రసిద్ధులు. నక్కీరుడు, భరణుడు, కపిలుడు అనే ఈ ద్రావిడ కవిత్రయం శ్రేష్టమైన కావ్యాలు వ్రాశారు. చొక్కనాథుని లీలలలో, తమిళ కవుల పాటలలో చిరకాలం నుంచి ద్రావిడ దేశం విరాజిల్లుతూంది.

చొక్కనాథుని లీలలు లెక్కతు అరవైనాలుగు. వాటినన్నింటిని క్రమంగా నెంబర్ల వేసుకొంటూ తిరువేంగళరాజు కథనం చేశాడు. ప్రతిలీల చివరా ఇది ఇన్నో లీల అని అంతె చెప్పాడు. ఈ అరవైనాలుగు కథలనూ తిరువేంగళరాజు తొమ్మిది ఆశ్వాసాలలో రచించాడు. కృతయుగంలో ఒక పదహారు, భ్రేతాయుగంలో మరో పదహారు, ద్వాపర యుగంలో ఇంకో పదహారు, కలియుగంలో వేరే పదహారు లీలలు జరిగాయట యుగానికి పదహారు చొప్పున నాలుగు పదహార్లు ఆరవైనాలుగు లీలలు చొక్కనాథుడు జరిపాడని గ్రంథంవల్ల తెలిసినా అన్నీ భారతదేశ చరిత్రలోని ఆదిమయుగంలో జరిగాయని భావించవచ్చు. ం

ఒక లీలలో సుందరేశ్చరుడు తన నాట్యకౌశలాన్ని పతంజలికి చూపిస్తాడు. పతంజలి క్రీపూ.1855 ఫ్రాంతాలవాడు.. అప్పటి నుంచే మధురకు ప్రాముఖ్యం వచ్చిందనుతకోవచ్చు. అసలు ఈ నగరానికి హాలాస్యాపురం అనే పేరు జైనులు చేసిన చేతబడివల్లనే వచ్చింది. వాళ్లు ఒక విషసర్సాన్ని శైవులపైన పంపారట. అది 'జిహ్వాగ్రమన నగ్నిశిఖలు పర్వగను, సంహారకారియ్టై సంభమాన' వచ్చింది. దాని 'విషమంటుకతన బొలు పొందహాలాస్యపురమనబరిగె (27వ లీల). అందుచేత జైనుల రోజులలోనే ఈ లీలలు ఎక్కువగా జరిగాయని చెప్పవచ్చు.

ఈ చొక్కనాథచరిత్రనే మధురా పురాణమని, చౌషష్టిలీలావిలాసమని కూడా పిలుస్తారు. సంస్కృతంలో హలాస్యుక్షేత్రమాహాత్మ్యం అనే గ్రంథం ఉంది. దానినే తిరువేంగళరాజు మొదటిసారిగా తెనిగించాడుగ ఇతని తరువాత కొందరు దానిని చంపూళకావ్యంగానూ, వచనకావ్యంగానూ రచించారు. తిరువేంగళరాజు వ్రాసిన ద్విపద కావ్యంలోని “అఖ్యాన్టాలియు, వర్ణనాలియు బ్రౌఢములనుటకన్న బ్రసన్నములనుట మేలు” అని యీ పుస్తకాన్ని ప్రకటించిన తి. చంద్రశేఖర్‌గారు చెప్పారు.

తిరువేంగళరాజు చెప్పిన కవిత్వం ఎలా ఉన్నా, కవిత్వం ఎలా ఉండాలో అళడు చెప్పిన కథ వినదగ్గది.

మధురలో ఉండే నలఖైఎనిమిదీ మంది సంఘకవులు ఒకసారి కలహించారు. తేన కావ్యసత్యాలు చెప్పడానికి శివుడే తప్ప ఇంకెవరూ తగరని భావించారు. దేవుని దగ్గరకు వెళ్ళి ఇలా అడిగారు:

వరద మా మా కవిత్వములన్నియును - నరసి వేర్వేరుగా నందరిచేత నన క.

  1. చొక్కనాథ చరిత్ర - మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయ ప్రచురణ నెం. 35 (1354)

దోనూరి కోనేరునాథుడు 363

సమ్మతిగాగ లక్షణము లేర్చరచి - మమ్ము రక్షింపు మంబర కేశ యీశ

(54వ లీల, పుట 272)

అప్పుడు ఈశ్వరుడు మధుర సంఘానికి వెళ్ళి అందరి కవిత్వం విన్నాడు. ''ఈ ఊళ్ళో కళానాధుడనేవాడున్నాడు. అతడికి రుద్రశర్మ అనే కారణజన్ముడున్నాడు. వాడీకి వినిపించండి” అని ఆదేశించాడు. అయితే ఆ రుద్రశర్మ మూగవాడు; వెర్రివాడు. అందుకే కవులు ఆశ్చర్యపోయారు. “మీ గద్యపద్యములలో మీ కావ్యములను బాగుగా మీకు

క 000000002044. వినవయ్య యా మూగ వెగ్రివాడెట్లు

మా కావ్య తారతమ్యంబులు దెలిసి- ప్రాకటుమ్ముగ నేర్చి ఖభాషింపగలడు?”"

అప్పుడు శివుడు వివరించాడు. “ఎవరి కావ్యం విన్నాక ఆ రుద్రశర్మ కళ్ళంట నీళ్ళు కారి ఒళ్ళు పులకరిస్తుందో, అతడు గొప్పకవి అన్నాడు. కవులు వెళ్ళి చదివి వినిపించారు. రుద్రశర్మ కవిత్రయం వాళ్ళ కావ్యాలకే పులకించాడు.

ఏ భాషలోనైనా. ఏకాలంలోనైనా మాటలు రాని పామరులను సైతం కదిలించగలిగేదే నిజమైన కవిత్వం!

దోనూరి కోనేరునాథుడు

అ?య రామరాయలకు పొట్లపాడి తిమ్మరాజు అనే పెదతండ్రి ఉన్నాడు. ఈయనకు నలుగురు భార్యలు, పదముగ్గురు కుమూరులు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇతని మూడవ భార్యకు పుట్టిన నలుగురు కుమారులలో పెద్దవాడి పేరు నల్లతిమ్మరాజు. ఈయన దోనూరి కోనేరునాథుడనే కవిని పిలిపించి తన తండ్రీ పేర బాలఖాగవతాన్ని చెప్పించాడు.

కోనేరునాథుడు సంస్కృత ప్రాకృతాదిక భాషామయ కావ్యకర్త. పృథ్వీ నాయకాస్థాన రత్నకలాపం. అష్టభాషాకవిమిత్రుడు. సాహిత్యమార్గ నిశ్ళంఠుడు. వినయలక్ష్మీసనాథుడు. ఈ సంగతులన్నీ అతడు బాలభాగవతమనే పద్యకావ్యంలో చెప్పుకొన్న పద్యాలవల్లా, గద్యవల్లా తెలుస్తున్నాయి. నల్లతిమ్మరాజు ఇతణ్జీ పిలిచి ఇలా అన్నాడు: "

సకలక్ష్మాకవినాథయూధములు మెచ్చక సంస్కృతప్రాకృతా

ధికభాషా మయ కావ్యకర్తవయి పృథ్వీనాయకాస్థానర

త్నకలాపంబన బేరు గాంచిన కృతార్థశ్రేష్ణు దోనూరి కో

నకవీంద్రోత్తమః నీమహామహిమచందం బద్భుతం విద్ధర€. అని పొగిడాడు. కవిని పౌగిడాక అతడు భాగవతాన్ని ప్రస్తుతించాడు. తరువాత ఇలా అన్నాడు:

354 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంవృత అట్టీ భాగవతంబునం దలరుచున్న - ద్వాదశస్కంధకథలును వరుసగూర్చి కావ్యమొక్కటి బాలభాగవతనునగ- జెప్పిలోకోపకారంబు సేయవలయు. పోషించే రాజు లోకోపకారం చేయమన్నప్పుడు ఏ శవికి ఉత్సాహం పుట్టదు!

అయినా పోతరాజుగారి భాగవతం ప్రచారం పొంది సుప్రసిద్ధమయ్యాక తన కావ్యం

మొఖం ఎవరు చూస్తారనే భయం కలుగకమానదు. కోనేరునాథుడు ఇలాగ సి పెట్టుకొన్నాడు:

భాగవతముగల్గ బాలభాగవతంబు - ప్రియముసేయగలరు పెద్దలెల్ల

జగతితల్లి సరస జవ్వనియగుపిన్ని - జూచువార లాత్మజొక్కునట్లు.

కోనేరునాథుడు సంపూర్ణంగా వ్రాశాడుగాని అది నేడు. కొంతనడే లభ్యమవుతున్నది. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఒక అసమగ్ర ప్రతి ఉండి దానిలో ఆరవ అఆశ్చ్వాసంలో కొంత భాగందాకా మాత్రమే గగ్రంథముంది. అయిదన ఆశ్వాసంలో దశమస్కంధం పూర్ణవుతున్నది: “పోతరాజుగారు తెనిగించిన భాగవతానికి ఇది సంగ్రహంగా ఉం''దని పరిశీలించిన పండితులు చెప్తున్నారు. తల్లి భాగవతం మోషంగా ప్రచారం పొందడంవల్ల ఈ పిల్ల భాగవతాన్ని ఎవరూ అచ్చువేసీనట్ల కనబడదు. ఈ బాలభాగవతాన్ని కోనేరునాథుడు ఎప్పుడు వ్రాసినదీ కృత్యాది ఆరవీటివాళ్ళ వంశావళిని వర్ణిస్తూ అశియరాయలను గురించి చెప్పిన ఈ పద్యంవల్ల

ఏపున ద్రోహిభావము వహించిన సల్కయతిమ్మరాజు ద

త్పాపసహాయు సల్కయయుతంబుగ శార్యముమీర ద్రుంచి వి

ద్యాపురియందు జాలఘనుడయ్యె సదాశివరాయ రాజ్బసం

స్థాపకుడై సిరంగవసుధావరు రామనరేంద్రుడున్నతి€.

అళియ రామరాయలు క్రీ.శ. 1543లో సకలరాజు తిమ్మరాజును వధించి సదాశివ రాయలకు పట్టం కట్టాడు. ఈ చారిత్రక సంఘటనను పేర్కొనడంచేత బాలభాగవత రచన క్రీశ 1543 తరువాత జరిగిందని చెప్పవచ్చు. బాలభాగవతాన్ని కోనేరునాథునిచేక పద్యకావ్యంగా చెప్పించి తన తండ్రికి అంకితమిప్పించిన నల్లతిమ్మరాజే ఆ కవిచేత ఆదే పుస్తకాన్ని*ద్చిపదకావ్యంగా చెప్పించి తన చిన్నతమ్ముడు చినతిమ్మరాజుకు అంకీక మిప్పించాడు. ఆ రాజు ఇలా అన్నాడని ద్విపద బాలభాగవతంలోని ఈ పాదాల చెప్తాయి:

మాకు నాశ్రితుడవు మహనీయలీల లోకులు మెచ్చ బల్కుదు మేలుకవిత

జనపతి మణికి మబ్దనకుడౌ రామ జననాథు తిమ్మభూజానికి మున్ను

వచియించితొనన వచన కావ్యముగ బ్రచురంబుగా బాలభాగవతంబు

దో, నూరి కోనేరునాథుడు 365 వొసికి నెక్కి యివ్వసుధాతలమున భాసిల్లు నా బాలభాగవతంటె యరుదుగా నడీచిన యన్ని మార్గముల దిరముగా మా చిన తిమ్మయ్య పేర ద్విపద కావ్యంబుగా వెలయంగ జేయు మిపుడు మా కెంతయు హితమిదియనుచు. (స్కంధం, 1 135-148) ఈ పై ద్విపదలలో పూర్తి కావ్యాన్ని వచన కావ్యమని కవి పేర్కొనడం గమనించదగిన విషయం. పద్యకావ్యాన్ని వచన కావ్యమని ఎందుకన్నాడో? గాన యోగ్యమైన చంపూకావ్యాలని వచన కావ్యమని పేర్కొనడం హరిభట్టు కాలంనుంచీ కనబడుతూంది. బహుశా ఈ సంప్రదాయం చేతనే కాబోలు కోనేరునాథుడు ద్విపదగా బాసిన బాలభాగవతం తూడ పూర్తిగా అచ్చుకాలేదు. తంజనగరం దేవరాజసుధీమణి గారు పరిశోధించి పన్నెండు ఫారాల సంపుటంగా ఈ ద్విపద బాలభాగవతాన్ని ప్రచురించారు. ఇందులో చతుర్ధ స్కంధం చివరిదాకా ఉంది. దేవరాజసుధీమణిగారు ఈ కృతిని ఇలా పొగిడారు; ఇది పండితులు మెచ్చుకొను కావ్యము; ముముక్షువులు పారాయణము చేయు పురాణము; స్రీ లింపుగాబాడుకొను పాట: బాలురుసులువుగా జదువుకొను కథ. ఇది సకల పురుషార్థములకును సాధనము. దీని మాధుర్మమును, మహత్వమును జదివిననే తిలియును. శబ్దరత్నాకరకారులైన శ్రీమాన్‌ సీతారామాచార్యులవారు దీనినుండి ప్రయోగ ములను దమనిఘంటువునందుదాహరించియున్నారనగా దీని ప్రామాణికత్వమును, టబౌఢిని వేర వర్ణింపనక్కరలేదుగదా॥ి బహుజనపల్లివారు కోనేరునాథుణ్ణి అయిదవతరగతి కవిగా పరిగణించారు. బాలభాగవతం ద్విపదలు చదివితే ఈ అంచనా నిజమేననిపిస్తుంది. తల్లిభాగవతంలో శ్రీకృష్ణనిర్యాణఘట్టం చాలా కదిలిస్తుంది. శోకిస్తూ వచ్చిన ఓడీతివో శత్రువులకు? - నాడితివో సాధుదూషణాలాపంబులో గూడితివో పరసతులను? - వీడితివో మానధనము వీరులనడుమక? తప్పితివో యిచ్చెదనని? - చెప్పితివో కపటసాక్షి? చేసిన మేలుం దెప్పితివో? శరణార్థుల - రొప్పితివో ద్విజుల బసుల రోగుల సతుల[£? అడిచితివో భూసురులనూో -ఇగుడిచితివో బాఆవ్యడద్ధ గురువులు వెలిగా? విడిచితివో యాఖ్రితులను? - ముడిచితివో పరుల విత్తములు లోభమునక? పోతరాజుగారు వ్రాసిన ఈ పద్యాలలోని భావాలను దోనూరి కోనేరునాథుడు ఎలా చెప్పాడో చూద్దాం: 2. బాలభాగవతం - వేదం అండ్‌ కంపెనీ (మద్రాసు) వారి ప్రచురణ, 1914. 3. అదే పుస్తకం, పీఠిక, పుటలు 5, 6

356 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ నంపుటీ వగచెదేమిటికిట్లు వరధైర్యమహిమ - జగతిపై నొరుల మెచ్చనివాడవయ్య అర్భులకిచ్చెదనని యొడంబడిన - యర్థ మీ లేక యొండాడితో కాక శరణాగతుల విప్రజనవృద్ధ బాల - తరుణుల గావక తరమితో విడిచి తొడిబడ బంధు మిత్రుల దిగనాడి - యొడబడి భోగంబు నొందితో నీవ యో పార్థ యటుగాక యున్న నిక్కముగ - దాపంబు నీకిట్లు దగుల దే వేళ

(బాల. ప్రథమ. 11%-119) పోతరాజుగారి భాగవతంలో అర్జునుడు కన్నీరు తుడుచుకుంటూ, గద్గదస్వరంతో చెప్పిన సమాధానమిదిః మన సారథి మన సచివుడు - మననెయ్యముమనసఖుండు మనబాంధవుడుక్‌ మన విభుడుగురువుదేవర - మనలను దిగనాడి చనియె మనుజాధీశా (భాగ 1-35%) దీనికి కోనేరునాథుని ద్విపదలు ఇవి: అని పలుకునన్నతో నాధనంజయుడు - కనుగవనీరు చక్క గనొత్తుకొనుచు నెట్టకేలకు మనం వించుక నిలువ - బట్టి గద్గదము బైపడగ నిట్లనియె తల్లియు దండ్రియు దాత దైవంబు - నెల్ల బంధువులు నధీశుండు దానె యైయుండుహరినన్నునట మోస పుచ్చి - పోయె నేమందునో భూనాథచంద్ర! (బాల.ప్రథమ. 1184-1201) తల్లి భాగవతంలో పోతరాజుగారు అర్జునుని విషాదాన్ని ఇరవై రెండు పద్యాలలో బ్రాళారు. అందులో ఈ క్రింది పద్యం మకుటాయమానం: చెలికాడ రమ్మని చీరునన్నొకవేళ మన్నించు నొక వేళ మరిదియనుచు బంధుభావంబున బాటించునొకవేళ దాతయ్డై యొక వేళ ధనములిచ్చు మంత్రియై యొకవేళ మంత్రమాదేశించు బోద్ధయ్టై యొకవేళ బుద్ధిసెప్పు సారథ్య మొనరించు జనవిచ్చునొకవేళ గ్రీడించు నొకవేళ గేలిసియు నొక్కశయ్యాసనంబున నుండు గన్న తండ్రికై వడి జేసిన తప్పుగాచు హస్తములు పట్టి పొత్తున నారంగించు మనుజవల్లభ మాధవు మరవరాదు. (భాగు 1-౫7) ఈ పద్యానికి కోనేరునాథుడు వ్రాసిన ద్విపదలు ఇవి: మందహాసంబుతో మాటికి నన్ను - నందంబుగా శౌరి యంకించి పిలుచు చనవులు దలచిన జననాథయేమి - యనవచ్చు గుండెజల్లనియెడునిపుడు నాహారశయ్యాసనాదుల బొత్తు - మోహంబు నెరపు నమ్మురశాసనుండు తనతనూజుని యెడ దండ్రియపోలె - మనములో నా తప్పుమరచిమన్నించు. (బాల. ప్రథమ. 1226-12)

దోనూరి కోనేరునాథుడు 357

పోతరాజుగారి భాగవతం చదివాక దీనిని చదవమనడం తేనెలు తాగిన నోటికి నీళ్ళు అందించినట్టే అవుతుంది. అయితే కాకిపిల్ల కాకికి ముద్దు తన బాలఖాగవతాన్ని కోనేరునాథుడు ఇలా ప్రస్తుడించాడు:

ఇదియ వేదము శాస్త్రమిదియపురాణ - మిదియయలంకారమిదియయటంచు

సకలవిద్వజ్జనుల్‌ సన్నుతిసీయ - బ్రకటమౌ భువి బాల భాగవతంబు.

(భాల. ప్రథమ. 591-594) తెలుగులోనే కాక సంస్కృతంలో కూడ ఒక బాల భాగవతం ఉంది. దానిని వారణాసి ధర్మసూరి అనే ఆంధ్రుడే రచించాడు. ఇతడు క్రీ.శ 1414-1625ల మధ్య ఉండి ఉంటాడని ఈయూ ణ్ణీ వెంకటవీర రాఘవాచార్యులుగారు ఊహిస్తున్నారు. అయితే వారణాసి ధర్మసూరి క్రీ.శ 1700 ప్రాంతాలవాడని మల్లాది సూర్భనారాయణకాస్త్రిగారు చెప్పారు. సంస్కృత బాలభాగవతానికీ, తెలుగు బాలభాగవతాలకూ గల పోలికలను ఎవరూ చర్చించలేదు. కోనేరునాథుడు పద్య బాలభాగవతాన్ని క్రీ. 1543 తరువాత బ్రాశాడని ఇందాక చెప్పుకున్నాం. ద్విపద బాలభాగవతాన్ని వ్రాసిన తారీఖు క్రీశు 1547 అని అతడే ఇలా చెప్పుకొన్నాడు:

అరుదుగా శాలివాహనశకాబ్దములెన్న నిధానతర్కసా

గరశకిసంఖ్యలే వెలయు గల్లు ప్లవంగ మనంగ వించు వ

త్సరమున బల్కె దిమ్మవసుధాపతికి౯ గవిసార్వభాముడీ

హరిహితబాలభాగవత హారిపద ద్విపదప్రబంధము!.

ఈ పద్యంవల్ల కోనేరునాథునికి కవిసార్వభౌముడనే విరుదుగూడ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ 'కవిసార్వభౌముని' గ్రంథాలు పూర్తిగా అచ్చుపడితే విపులమైన అంచనా వేయడానికి వీలవుతుంది. కోనేరునాథుని గ్రంథాలు ఇప్పటిదాకా చరిత్రకారులకు చాలా పనికి వచ్చాయి. విజయనగరసామ్రాజ్యు చరిత్రలో ఆరవీటివారి వంశం పాత్రను ఈ పుస్తకాలవల్ల బాగా తెలుసుకోవచ్చు. ద్విపద బాలభాగవతం చివర తోనేరునాథుడు పరీక్షిత్తు మొదలు పొట్లపాడి తిమ్మరాజు దాకా 45 పురుషాంతరాల వంశచరిత్ర వర్ణించాడు. దీనిలో తూర్పు చాళుక్కులలో రాజరాజును గురించి బ్రాసిన అముద్రిత ద్విపద భాగాలను నిడుదవోలు వెంకటరావుగారు ప్రచురించారు.”

అతనికి దగవిమలాదిత్యుడొదవె - రతికి నీడనజాలు రత్నాజియందు

నా జగతీశుతొయ్యలి భానుమతికీ - రాజరాజనరేంద్ర రాజన్యుడొదవె

అతడు వేంగీదేశమనుహారమునకు - నతులనాయకమణీయనదగునట్టి

రాజమహేంద్రవరంబను పేరి - రాజధాని మనోహరముగ గట్టించె 4. తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం-॥ సంపుటం, పుట ౫8.

  1. సంస్కృతవాబ్బయ చరిత్ర-॥, పుట 236.

  2. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో గ్రంథసంఖ్య, 972. డిస్కీప్టివు క్యాటలాగు ౫ పుటలు 128 నుంచి 12% దాకా.

  3. దక్షిణదేశీయాంధ్ర వాబ్బ్యయము - నిడుదవోలు వెంకటరావుగారు (1980), పుట 68.

358 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నారాజమణీ కార్యుడగు పెద్దకొడుకు - సారంగధరుడతి శాంతుడైయుండీ యాసక్తి బినతల్లియైన చిత్రాంగి - చేసిన యాపద జెచ్చెర గడచి యనుఘడై 'చౌరంగి' యనుసిద్ధుడయ్యె - జననాథ నేడును జగతిపై నిలిచె నాతడె యాభారతాఖ్యానమందు - బ్రతిలేని మొదటిపద్యంబులు మూట నందె తెనుంగున నా నన్న పార్యు - డందర వెరగొందునట్లుగా నొడువ.

ఈ ద్విపదలలో చరిత్ర లేదుగాని సారంగధరుని కట్టుకథ తెలుగులో వ్యాపించిన వైనాన్ని ఇది తెలియజేస్తుంది ఈ ద్విపద భాగాలను కోనేరునాథుడే వ్రాసి ఉంటే క్రీ.శ.1547తు ముందే ఈ కట్టుకథ పుట్టిందని చెప్పవచ్చు. చరిత్రనూ, కుహనా చరిత్రనూ చెప్పే కోనేరునాథుని గ్రంథాలు పరిశోధకులకు చాలా అవసరమైనవే.

సిద్ధిరాజు తిమ్మరాజు

అహోబల నరసింహుడూ, తిరుపతి వెంకటేశ్వరుడు ఆంధ్రదేశమంతటా చాలా ప్రసిద్ధ

దైవాలు. మంగళగిరి పానకాలస్వామి తూడా అంతటి కీర్పి గలవాడే. అయితే ఇతడీ పేరిట

కవులు చెప్పిన కృతులు చాలా అరుదుగా కనబడతాయి. క్రీ.శ1548 ప్రాంతాలలో సిద్ధి

(సిద్ధ) రాజు తిమ్మరాజు అనే రాచకవి పరమయోగివిలాసం అనే కావ్యాన్ని ఈ దైవానికీ

అంకితమిచ్చాడు. పానకాలు రోజూ తాగుతూండడంవల్ల నోరు తియ్యనైన మంగళగిరి

నరసింహుడు ప్రసన్నులను రక్షించాలని ఇలా మంగళాచరణం చేశాడు:

శ్రీ రంజిల్లగ బానకం బనిశముక్‌ సేవింపగా దద్దుణం

బారూడీం బొలుపొందెనో యనగ యోగానందమాధుర్భల

క్షీరమ్యాకృతి నొప్పు మంగళగిరి శ్రీమన్న్ఫృసింహుండుస

త్కారుణ్యామృతవృష్టిచే దనువు నిత్యంబుం బ్రపన్నావళిక (పరమ. 1-1)

ఈ పద్యంలో * ప్రపన్నులు' అనే మాటలో విశేషముంది. వైష్ణవ మతంలో భక్తులను ప్రపన్నులు అంటారు. విశిష్టాద్వైత మతంలో కర్మజ్ఞానభక్తిప్రపత్తులనే నాలుగు విధాల కలుగుతుందంటారు. అందుకే ఆత్మసమర్పణ చేసీ శరణాగతిని అనుసరించే భక్తులను ప్రపన్నులంటారు. ఈ ప్రపన్నులకు అమృతప్రాయంగా దివ్యసూరుల చరిత్రలు ఉంటాయి. వైష్ణవ మతంలో పన్నెండు మంది ఆళ్వారులున్నారు. వీళ్ళనే దివ్యసూరులనీ, పరమ యోగులనీ వ్యవహరిస్తారు. “ఆళ్‌ అనే పదానికి తమిళ భాషలో “ఏలు' అని అర్థం. “అళ్చారు' అంటే 'ఏలువారు' లేక 'ఏలినవారు' అని అర్థం చెప్పవచ్చు. ఈ పన్నెండు మంది ప్రభువులూ ద్రావిడ వేదాన్ని శ్రీమంతం చేశారు. వేదమనేది గీర్వాణ భాషలోనే ఉండాలిగాని ఇతర భాషలో ఉన్నదానికి ఆ గౌరవం ఎలా వస్తుంది అన్నది చిక్క ప్రస్షే ఈ సమస్యను పరిష్కరించడానికి దివ్యసూరుల చరిత్రను వ్రాసినవాళ్లు ఒక కఠ చెప్తారు.

సిద్ధిరాజు తిమ్మరాజు 359

వైకుంఠంలో ఒకసారి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ప్రశ్నించిందిః

“స్వామీ, మీరు దశావతారాలు ఎత్తారు. వేదశాస్తాలు బోధించారు. అయినా జీవులు పాపంలో పడుతున్నారు. 'సర్వశేషివైన నీకు భేదంబుగలదె? కొందరను భవ ముక్తులను, కొందరను భవబద్దులను జేయు టెల్ల, “నీకు బాగుందా?” అని అమె అడీగింది. దేవుడు ఆమె ప్రశ్నలోని కరుణను అర్ధం చేసుకొన్నాడు. అడిగిన శ్రీదేవినీ, భూదేవినీ, నీళాదేవినీ, తన శంఖచత్రాది ఆయుధాలనూ, భూలోకంలో అవతరించి అన్ని వర్జాల వారికీ అందుబాటులో ఉండడానికి ద్రావిడ భాషలో వేదార్శాన్ని ప్రవచించమన్నాడు. ద్రావిడ భాషలోనే వ్రాయమనడానికి కారణముందని చెప్పాడు.

పూర్వం గౌరీకల్యాణం జరిగేటప్పుడు అది చూడడానికి అందరూ ఎగబడ్డారు. మునులు, దేవతలు అందరూ ఉత్తరానికి చేరుకొనడంవల్ల ఆ దిక్కున భూభారం హెచ్చి “బాలన్సు” తప్పింది. దీనికి ఉపాయం ఏమిటని దేవతలు పెద్ద “ఇంజనీయరు' విశ్చకర్మను అడిగారు. "'అగస్త్రుణ్ణీ దక్షిణాదికి పంపించండి, బరువు సర్జుకొంటుంది” అని అతడు సలహా చెప్పాడు. అందరూ సంతోషించారుగాని అగస్త్యుడు మండిపడ్డాడు. "ఎన్నాళ్ళ నుంచో చూద్దామని ఎదురుచూసిన గౌరీకల్యాణం చూడడం పడనిచ్చావుకాదు. కాబట్టి నీ కులం వాళ్లకు ఇకపైన పని ఎక్కువ, తూలి తక్కువ లఖించాలి అని అగస్త్యుడు విశ్వకర్మను శపించాడు. ““అయితే నీ వేదాలు ద్రావిడ భాషలో ఉండుగాక అని విశ్శకర్మ ప్రతిశాపమిచ్చాడు. ఈ శాపాలను నిజం చేయడానికి దేవుడు లక్ష్మీదేవినీ, పరివారాన్ని దివ్యసూరులుగా జన్మించి ద్రావిడ భాషా ప్రబంధాలను రచించమన్నాడు. ప్రపన్నులను రక్షించమన్నాడు. ఆ ఆజ్ఞ మేరకు దేవుని కుటుంబపరివారాలు అళ్వారులుగా జన్మించారు.

భూదేవి అంశతో జన్మించిన గోదాదేవిని ఆళ్వారులలో చేర్చిన వైష్ణవులు శ్రీదేవి అంశతో, నీళాదేవి అంశతో జన్మించినవాళ్లను చేర్చలేదు. వైష్ణు సంప్రదాయంలో ఆళ్వారులు పన్నెండుమందేగాని, సిద్ధిరాజు తిమ్మరాజు 15 మంది పరమయోగుల చరిత్రలను కథనం చేశాడు. తాళ్లపాక చిన్నన్న తూడా పరమయోగివిలాసాన్ని ద్విపద కావ్యంగా బ్రాశాడు. చిన్నన్ను కాలం శ్రీ.శ1545 ప్రాంతాలు. సిద్ధిరాజు తిమ్మరాజు ఇతనికి సమకాలికుడే. చిన్నన్న ద్వాపద కావ్యాన్ని చూసి ఇతడు పద్యకావ్యంగా బ్రాశాడని కొందర్శు అభిప్రాయపడుతున్నారు.! సిద్ధిరాజూ తిమ్మరాజు సుప్రసిద్ధుడైన అళియ రామరాకీల మేనల్లుడు. క్రీ.శ 1544 ప్రాంతాలలో కొండవీటికి ప్రభువయ్యాడు. ఇతడు తన గురించి కావ్యంలో ఆట్టే వ్రాసుకోలేదు. తన వంశాన్ని తూడా వర్ణించలేదు. ఒకే ఒక పద్యంలో తనను గురించి, తన బంధువుల గురించి చెప్పుకొన్నాడు,

ఏరాజుముత్తాత భూరిసా మ్రాబ్బులక్ష్మీధురీణభుజుండు సిద్ధన్ఫపతి

ఏ నరాధిపుతాత నానార్థిసంకానసంతానశాఫి యనంతళౌరి

ఏ విభుం డళిరామభూవరు తిరుమల ప్రభు వేంకటేంద్రుల భాగినేయు

డే గుణాఢ్యుని తండ్రి భోగవైభవనూత్నసుత్రాము డౌ భళస్ణోణీభర్త ॥ం విప్రనారాయణచరిత్ర (చదలవాడమల్లన) పీఠికలో నిడదవోలు వెంకటరావుగారు.

360 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ర్ట

./ వ కీన్‌ న్‌ అకికి కి ఇ క్షీ వి 1

శీ వి

గ | + న శస స్‌

న.

-/ ణ్‌ స, , శ టిసళిశీ, ఫర్ట్‌ జ ణ్‌

ణి ల్తీ 2 | ఇళ

శే లీ వ.

స్ట టం...

సాటి శ అని శతం ర.

.

శ న . న.

రం చసత తిం దకీ శం చని

లతా | ళీ జ్‌ సళ న

సిద్ధిరాబు తిమ్మరాజు 361 అట్టి తిమ్మనృపుం డాజిహతతురుష్కు రక్సళో అనదీకృత ప్రబలసలిల వితతకృష్ణానదీయళో ర్జితుడు కోన మాంబపుత్రుండు రంగరాజానుజుండు. (పరమ. 1-7) ఈ పద్యంలోని 'ఆజిహతతురుష్కరక్త శోణనది' అనే సమాసంలో అతిశయోక్తి లేదు. సిద్ధరాజు తిమ్మరాజు తన మేనమామ అళియ రామరాయలు నియోగించినప్పుడు 50 వేల ఫొజుతో కొండపల్లి మచిలీపట్టణాలపై దండు వెళ్ళాడు. గోలకొండపై రామరాజు చేసిన దండయాత్రలో పాలొన్నాడు. ఇతడు లేని వేళలో కొండవీటిని తురుష్కులు ముట్టడించారు. అప్పుడు ఆ దుర్గ రక్షణ తోసం రామరాజు ఎర్రతిమ్మురాజును నియమించాడు. వెలుగొటి చినతిమ్మనాయకుడు అనే దళపతి కొండవీడును కాపాడాడు. గోలకొండ సైన్యాల రక్తంతో కృష్ణానది ఎర్రబడింది. ఈ దండయాత్రలు క్రీశ 1557 తరువాత జరిగాయి. పరమయోగి విలాసాన్ని బహుశా శ్రీశ. 1557 తరువాత రక్షస తంగడి యుద్దానికి పూర్వం సిద్ధిరాజు ్రాసి ఉంటాడు. తన కావ్యం ఉద్యన్నవభావబంధురమనీ, రసాన్సయమనీ, సన్నుతశబ్ధశుద్ధి గలదనీ కవి ఇలా ఉన్నతి మీరగా బరమయోగివిలాసము పేరి కావ్య ము ద్యన్నవభావబంధుర రసాన్సయ సన్నుతశబ్దశుద్ధి సం పన్నత నట్లు సిద్ధనరపాలుని యౌభళతిమ్మభూవరుం డెన్నిక ేయబూని మది నెంతయు సంతస మందె ధన్యతక్‌._ (పరమ. 1-10) ఈ పద్యంలో చెప్పిన శబ్దకుద్ధి సంపన్నత నిజమే అనిపిస్తుంది. సుప్రసిద్ధ లాక్షణికుడైన అప్పకవి ఈ గ్రంథంలో నుంచి ఒక ప్రయోగాన్ని ప్రమాణంగా అంగీకరించి. ఉదాహరించాడు (అప్ప. 3-6). తాళ్ళపాక చిన్నన్న గ్రంథంలో లేని భావాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. “సామీ, నీకు పక్షపాతం తగునా?” అని ప్రశ్నించి, లోకంలో అందరికీ మోక్షం ఇమ్మని లక్ష్మీ ప్రార్థించిన ఘట్టంలో చిన్నన్న ఇలా వాకాడు: నిఫిలజీవులు నెన్న సహోీషభూతు - లఖిలజీవులకు నీవయ్య వట్లయ్యు గొందరి విగతదుఃఖుల జేసి మరియు - గొందర విహితదుఃఖుల జేయదగునె? జాడతో దేవర సకలజీవాళి - నీడేర్చువిధము నా కెరిగింపుమయ్య యన విని భేతన వ్యాననాబ్దమున- ననలొత్త దన ప్రాణనాయిక జూచి యల్లన దన కేల నాపద్మహస్త-పల్లవం బొనగూర్చి బశిబళీ యనుచు దలిరుబోడిరొ నీవు తలచిన గతినె - తలపులో నేనును దలచుచున్నాడ ననయంబు నీవు నన్నడిగినందులకు- వినుము చెప్పెద నది వివరంబుగాగ (పరమ. ద్విపద. పు. 22,23) క్ష రుల రయాంల 4 ధ్యలంంంలా కంర కు 0లలంత. కడ అడ 1 ఆలుంయాాడాత్యిని వ... 260-261.

362 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ ఘట్టంలో తిమ్మరాజు ఇలా వ్రాశాడు : === ఇందిర పలుకులు విని యయ్యంబుజాక్షుండు ఇచ్చమెచ్చుచు నత్యాదరంబున నత్తరుణీమణీ నవలోకించి -

తండ్రికంటెను దల్లికి దనయులందు

బరమవత్సలతాధర్మగరిమ మిగుల

నధిక మని పల్కుదురు గాన నబ్బవదన

యిట్టి కారుణ్య ముచితమ యెందు నీకు! (పరమ. 1-46, 46) శ్రీదేవి కారుణ్యంలోనే కాక సిద్ధరాజు తిమ్మరాజు కావ్యంలోనూ కౌచిత్యం ఉంది.

రామరాజు రంగప్పరాజు

ఆరవీటి రాజులలో స్వయంగా పుస్తకాలు వ్రాసిన కవులు ఇద్దరున్నారు. ఒకడు పరమయోగివిలాస్తం వ్రాసిన సిద్ధిరాజు తిమ్మరాజు; రెండో రామరాజు రంగప్పరాజూ. ఇతడు పొట్లపాటి తిమ్మరాజుగారి మనమడు. ఈ తిమ్మరాజుగారు అళియ రామరాజుకు పెదతండ్రి. ఈయనకు నలుగురు ఖార్యలూ, పదముగ్గురు కొడుకులూ అని ఇంతకు ముందు చెప్పుకొన్నాం. అందులో పెద్ద భార్య పెద్ద కొడుకు పేరు పిన్న కొండ్రాజు. అతని తొడుకే ఈ రంగప్పు రాజు. ఈయన తండ్రి పేరుగాని, తాత పేరుగాని, ఇంటి పేరుగాని వాడక ముత్తాత పేరును తన పేరుకు ముందే జోడించాడు. సాంబోపాఖ్యానం అనే. అయిదాశ్వాసాల కావ్యం వ్రాసి దాని గద్యలో అది “సకలకళాభోజి రామ రంగప్ప రాజప్రణీతం' అని చెప్పాడు. తన సూక్తిప్రపంచంలోని కాంచనకమలాల మాలికతో కమలాకళత్రుడైన శ్రీరంగనాథుణ్ణి పూజించడం కోసం ఇతడు ఈ కావ్యాన్ని బ్రాళాడు. “వచోరచనాచమత్రియాసన్న హనాఖిముఖ్య శుభ సంపదవాప్తికలాఖిలాష' తో బ్రహ్మను ప్రార్థించాడు (1-6). శివుణ్ణి శ్రీ వైష్టూన్వయశేఖరునిగా భావించాడు. పరిమళం, రసం, పదబంధర్రవన, శబ్బ్దానుశాసనం మొదలైన లక్షణాలు గల కవిత్వాన్ని శివుడే ప్రసాదించగలడని విశ్వసించి ఇలా ప్రార్థించాడు:

నిజశిరస్సింధునీరజరాజగంధసంభారంబు దలపించు పరిమళంబు

నిజేఖరసుధాంశునిస్సరద్ధారాళసుధబిసాళించు మెచ్చుల రసంబు

నిజశరీరార్థమానితమానినీతనూ బంధ బంధుపదబంధరచన

నిజపాణికటకాహి నేత్రస్ఫుటోక్తుల శాసించు శబ్టాను శాసనంబు

గలుగ హరిభక్తిఘనమైనఘనుల కవిత

తను దలంచినయంత మాత్రనె ఘటింప

జేయ శ్రీవైష్ణవాన్స్వయ శేఖరంబు

శివుడు మత్కృతి గొనసాగజేయుగాత., (సాంబో,1-7)

రామరాజు రంగప్పరాజ- 363 రంగప్పరాజు కోరుకున్నట్టే అతని కృతి కొనసాగింది. అందులో నన్నయ్యగారి మార్గం కొంత పరిఢవిల్లిందట. తిక్కనగారి సూక్తిఫక్కి కొంత పెంపొందిందట. ఎర్రనగారి ఫణితి, నాచనసోముని గీర్చొాభవం, రావిపాటి తిప్పన్నగారి వచస్థిమం, శ్రీనాథుని _ ఉక్తి మొదలైనవి తన కవితలో రాణీస్తాయని రంగప్పరాజు సగర్వంగా, షష్ట్యంతాల తరువాత ఇలా చెప్పుకొన్నాడు. శ్రీరంగనాథునకు - అఖివందన సహస్ర మమరించి నన్నయ్యభట్టు మార్గము కొంత పరిఢవిల్ల దిక్కనమఖి సూక్తిఫక్కిక యొకకొంత వెనుపాంద నెర్రన పైగడ ఫణితి యొకకొంత తిలకింప నొకకొంత నాచన సోము .గిర్విభవంబుసాగసు మీర త్రిపురాంతకునివచఃస్థిమంబు నొకకొంత కొరల శ్రీనాథోక్తి కొంత నిగుడ మరియు దక్కిన సుకవుల మధురవచన రచనలును గొంత రాణింప రసనిబంధ . బంధురముగాగనే నిచ్చు భవ్యకాచ్య హీరమునకు గథాక్రమం బెట్టిదనిన. (సాంబో. 1-97) ఇంతమంది ప్రథమశ్రేణి తెలుగుకవుల సుగుణాలన్నీ ఉట్టిపడే కవిత్వం చెప్పాలన్న, ఆశయం గొప్పదేః రంగప్పరాజు ఈ కవులను అనుసరించడం మటుకు స్ఫుటంగా కనబడుతుంది. నాచనసోముణ్జీ, శ్రీనాథుణ్ణీ మరీ ఎక్కువగా అనుకరించాడు. శ్రీకృష్ణునికీ, జాంబవతికీ పుట్టిన కొడుకు పేరు సాంబుడు. ఈ కుమారుడు దుర్యోధనుని కుమార్తె లక్షణను ప్రేమించాడు. తన తండ్రి రుక్కిణీదేవిని పెళ్లాడినట్టు సాంటుడు ఎవరికీ చెప్పకుండా లక్షణను ఎత్తుకొనిపోయాడు. కౌరవులతో తగాదా వచ్చింది. బలరాముడు సాయపడ్డాడు. కయ్యంమాని కౌరవులు వియ్యానికి ఒప్పుకొన్నారు. సలక్షణంగా లక్షణ . _ వెళ్ళి జరిగింది ఈ కథను రంగప్పరాజు అష్టాదశ వర్ణనలతో చెప్పాడు. సాంబుడు పుట్టడానికి ముందు జాంబవతి కల్యాణం, దానికి ముందు శ్యమంతకమణి కథ, అంతకు _ ముందు ద్వారక వర్జన, అన్నింటికీ ముందు గ్రంథాదిని శ్రీకృష్ణుని బాల్యక్రీడలు కవి వర్ణించాడు. ఇన్నోటి చేర్చడం వల్ల ఈ [గ్రంథం 1224 గద్యపద్యాల ' కావ్యమైంది. సాంబోపాఖ్యానాన్ని పరిష్కరించిన కర్రి సాంబమూర్తిగారు చెప్పినట్టు “ఈ ప్రబంధ రచనమునందు కవికి ముఖ్యోద్దేశము రసప్రకటనమేగాని కథాసంవిధానము గాదు*1 కథకు సాంబోపాఖ్యానం అని పేరుపెట్టినా చతుర్ధాశ్వాసంలోగాని సాంబుడు జన్మించడు. శ్రీకారం చుట్టి 580 గద్భపద్యాలు చెప్పాక జాంబవతి తనకు సంతానం ప్రసాదించమని కృష్ణుణ్ణి అడుగుతుంది. మరోమారు గద్యపద్యాలు చెప్పాక సాంబుడు పుడతాడు. సత్రాజిత్తు కథలో సైతం గడియారం మోగడం, భోజనాలకు లేవడం, “సరసకవిహృాదయంలాగ యుక్తాయుక్తా పదర్గావివేకకలితమైన భోజనశాలకు వెళ్ళడం (2-52). భోజనానంతరం పహారప్రదేశంలో విశ్రమించడం మొదలైన వివరాలు

  1. సాంబోపాఖ్యానం (ఆంధ్రసాహిత్య పరిషత్తు ప్రచురణ) పీఠిక, పుటలు 10, 11, .

364 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చెప్పుకుంటూపోవడంవల్ల కథ యింత పెరిగింది. ప్రబంధమన్నాక అష్టాదశ వర్ణనలు ఉండాలి కదా, అందుచేత వాటివల్ల తూడా గ్రంథం శ్రీమంతమైంది.

నిజానికి రంగప్పురాజు చేసిన వర్ణనల వల్ల మంచి కావ్యం చదువుతున్నామనే తృప్తీ కలుగుతుంది. కవికిగల స్వతంత్రభావనాశక్తి కనబడుతుంది. వైశాఖపూర్ణిమనాటి రాత్రులను ఇలా వర్ణించాడు:

పెనముపై నట్టువోసినలీల జుయ్యంచు బొల నె వెన్నైల తప్పభూద్రశిఖల

నుహ్హహ్హాన ముఖానలోద్ధతి జల్లార్చి తేటి చెందొవపూవు దేనె లాసె

నఖిలావదాతాంగి యై చురుక్కున నిసుమడుగంట బ్రియునింటి కరిగె జార

కబళించె నురక యాకటి కోర్వకచకోరి నిష్టప్తరోహిణీ నేతృకళలు

మల్లియల పూవుదుమ్ము ముమ్మరము ముర్ము

రాగ్ని శిఖ లంచు విరహి యారాటమందె

గలువ వికసించియును గసుగంది మొగము

వాల్చె వైశాఖపూర్ణిమారాత్రులందు. (సాంబో. 2-10)

సంపెంగలు, తుమ్మెదలు, మల్లెలు మొదలైన ప్రకృతి సరంజామాను తీసుకొని సమకాలిక విషయాలను చెప్పగలగడం భావనాశక్తికి మంచి నిదర్శనం. తుమ్మెదనే మహమ్మదీయుడు సంపెంగతావిని విడిచి ఉపవాసమున్నాడట. మల్లెపూవులనే చంద్రుణ్జీ చూసి రెండు నమాజులు చేశాడట. మహమ్మదీయుల ఆచారాలను తెలుసుకొన్న కవి ఈ క్రింది కల్పన చేశాడు:

చనుపకముల తావి గొనక రోజా లుండి - తేటి మలక మళ్లెతెల్ల విరుల

చందు చూచి విరహజయకాంక్ష మైదుగా - నాయొనర్చెనుత్తరాయణమున

(సాంబో. 2-10)

రోజా అంటే రంజానులో ఉండే ఉపవాసం. మలక అంటే మహమ్మదీయ ప్రభువు, దుగానా అంటే రెండు మారులు (నమాజులు). చంద్రుణ్ణి చూస్తినేగాని రంజాను నెలలో మహమ్మదీయులు భోజనం చేయరు. ఈ పద్యంలో చూపిన కల్పనాశక్తీని రంగప్పరాజు చాలాచోట్ల ప్రదర్శించాడు. అయితే కొన్ని చోట్ల ౌచిత్యం లోపించిందనాలి. ముఖ్యంగా పెళ్ళిభోజనాల ఫఘట్టూన్ని వర్జిస్తూ విందు భోంచేసే సరసులు అడిన జాణతనములంటాడు, చూడండి.

చిరునగవులతో గన్నుం - గిరుపులతో సాళగంబు గేరడములతో

దరచయ్యె జాణతనములు - నెరతన మిరువంక బంధునివహంబులకుక్‌

గుహ్య్మకేశశ్రీల గోరగింపుము నీవు పరమభద్రము ప్రజాపతి యొసంగ

సర్వేంద్రియట్రీతి చామ కియ్యది యిచ్చె గురుతరగుణరత్నకోశ మీవు

లలితశప్పుశ్యామలం బిచ్చెలువ కొప్పు కామపాలకవృద్ధి గలుగు నీకు

గడుపు సుఖంబు నీకునె కాని లేదెందు లలితంబు పంచాంగుళంబు నీకు

రామరాజు రంగప్పురాజు 365 నవ్వవిందు త్రికోణార్చణ[్రతస్తి

శాశ్వతంబగు గాకంచు జాణజనము

లాడి రిరువంక సరసు లా మేడితముగ

భుక్తి గృహకాయామానాగ్రభూములందు. (సాంబో. 5-29. 289)

విందు భోజనాలలో మేలమాడడం శ్రీనాథుని శృంగార నైషధంలో ఉంది. తన సాంబోపాఖ్యానంలో శ్రీనాథోక్సి కొంత నిగుడించినట్టు రంగప్పరాజు చెప్పాడు.

రంగప్పరాజు ఒక్క ఈ విషయంలోనే కాక ఇతరచోట్ల కూడ శ్రీనాథుణ్ణి అనుసరించాడు. నలుడు దమయంతితో గృహప్రవేశం చేయడం, తరువాత దినచర్యలో వైతాశికగీతలు మొదలైనవి శ్రీనాథుడు వ్రాశాడు. రంగప్పరాజు తూడ లక్షణతో గృహ ప్రవేశం, వైతాళికులు సాంబుని లేపడం మొదలైనవి గ్రంథం చివర వ్రాశాడు.

“శ్రీనాథోక్తిని తన కావ్యంలో పౌందుపరచినట్టే నాచనసోముని గీర్విభవాన్ని

తోసం కృష్ణుడు తపస్సు చేయడానికి వెళతాడు. ఇందులో జాంబవతి కోరితే వెళతాడు. బట్రాశాడు థి

నీవారము నీ విచ్చితీ - నీ వారము భోగనియతసుఖంబుల్‌

గావింపుము మా ప్రియములు - గావింపుము నీవు భక్తి గమ్య మురారీ.

(ఉత్తరహరి, 2-116) గూర్చి రంగప్పురాజు వ్రాశాడు.

నీ వారంబని యాదితత్వము మది న్నిత్యంబు భావించుచుక్‌

నీవారంబులు నీరము ల్భలదళానీకంబు లీకంబులుక

దైవాఠం గొన్ని మీరు సేయు తపము ల్తత్తతృలప్రాప్తులం

గైవారంబులు సేయగాదగునె యీకైలాసవాసంబునక్‌? " (సాంబో. 3౩-201) అనుకరించాడు. సోముణ్జీ, ఇతర కవులను రంగప్పరాజు ఎలా అనుకరించాడో కర్రి సాంబమూర్తిగారు సోదాహరణంగా చూపించారు.

ఈ కావ్యాన్ని రంగప్పరాజు ఎప్పుడు బ్రాళాడో తెలుసుకోవడం ఒకందుకు చాలా అవసరం. ఈ కావ్య రచనాకాలాన్ని నిర్ణయించగలిగడే తెలుగు సాహిత్యంలో తారీఖు తెలియని చాలామంది కవుల ప్రబంధంలోనూ సాయంసంధ్యను, అంధకారాన్ని, తారలను వర్ణించడం ఉంటుంది. ఈ సాంబోపాః[ణ్యానంలోనూ ఉంది. రంగప్పురాజు ఇలా చర్చించాడు:

366 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కాలధనంజయుం డదను గాంచి దివాకరమత్స గ్రయంత్రముం

గీలెడలించి సంధ్య యును కృష్ణ నుదంచిత రాగవిభమ

న్రీలలితాంగి గైకొనుడు జేరి తమఃపటలీవిరోధిభూ

పాలక సేన లేయు సితభల్లములంబలె బర్వె దారకల్‌. (సాంబో. 5-17)

ఇదే పద్యాన్ని పెదపాటి జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో ఉదాహరించాడు. అయితే అతడు ఇది సాంబోపాఖ్యానంలోని పద్యమని చెప్పలేదు. తెనాలి రామలింగయ్య బ్రాసిన హరిలీలావిలాసం అనే పుస్తకంలోనిదని ఉదాహరించాడు ( ప్రబంధ.434) హరిలీలావిలాసంలోనుంచి 21 పద్యాలను జగ్గన్న స్వీకరించాడుగాని ఈ ఒక్క పద్యం మాత్రమే సాంబోపాఖ్యానంలో కనబడుతుంది. ఈ పద్యాన్ని జగ్గన్న రంగప్పరాజు బ్రాసిన గగ్రంథంనుంచే ఎంచుకొన్నాడని విశ్వసించవచ్చు. సాంబోపాఖ్యానం రచన ఎప్పుడు జరిగిందో మనం నిర్ణయించగలిగొతే పెదపాటి జగ్గన్న కాలాన్ని అంచనా వేయవచ్చు. “తాటితోనే దబ్బనం' అని అతనితోపాటు అతడు ఉదాహరించిన కొందరు కవుల కాలాలనూ చెప్పవచ్చు.

సాంబోపాఖ్యానంలో రంగప్పరాజు తన పినతండ్రిని వర్ణిస్తూ, ఆయన

సరసము బాలభాగవతచంపువు దోనురి కోనసత్కవీ

శ్వరరచితంబు రామనృపవంద్రునితిమ్మయ చిన్న తిమ్మభూ

వరు డఖిలావనీజనశివంకరముం గయికొంట యొప్పు శం

కరుడు శశాంక రేఖయును గౌస్తుభ మంజునాభుడుంబలెక. (సాంబో. 1-2)

ఈ పద్యంలో చిన్న ఇబ్బంది ఉంది. పద్య బాలభాగవతాన్ని పొట్లపాడీ తిమ్మరాజుకూ, ద్విపద బాలభాగవతాన్ని చినతిమ్మరాజుతూ కోనేరునాథుడు అంకితమిచ్చాడు. ఈ పద్యంవల్ల ఈ చంపువును చినతిమ్మరాజుకు అంకితమిచ్చాడని స్ఫురించడానికి అవకాశముంది. అయితే పొట్లపాడి తిమ్మరాజూ, చిన తిమ్మరాజూ ఈ కృతులను శంకరుడు శశాంకరేఖనూ, విష్ణువు కౌస్తుభాన్నీ స్వీకరించినట్టు అందుకొన్నారనే అర్థం వచ్చేటట్టు కవి పద్యం చెప్పి ఉంటాడు. విలేఖరులు తప్పు బ్రాయడంవల్ల పద్యం ఇలా రూపొందింది కాబోలు. సవరించడానికి ఆస్కారముంది. “భూవరు లఖిలా వనీజన శివంకరముల్‌ గయికొంట'”' అని మూడవ పాదాన్ని మార్చవచ్చు. ఈవిధంగా పరిష్కరించకపోయినా, చినతిమ్మరాజు పేరుండడంవల్ల ఈ పద్యం ద్వాపద బాలభాగవతాన్ని ఉద్దేశించినదని భావించవచ్చు. కోనేరునాథుడు ద్విపద కావ్యాన్ని క్రీశ1547లో వ్రాశాడు. బాలభాగవతాన్ని అంకితమిచ్చిన పదిపన్నైండేళ్ళకు సాంబోపాఖ్యాన్ని రంగప్పురాజు వ్రాశాడని ఊహిస్తే తప్పు లేదు. అందుచేత క్రీ.శ 150 ప్రాంతాలలో ఈ గ్రంథ రచన జరిగిందని అంచనా వేద్దాం. ఇది గ్రంథంలోని ఆంతరంగిక సాక్ష్యానికి విరుద్ధం కాదు. సాంబోపాఖ్యానంలో కవి అలియ రామరాజును సజీవునిగానే వర్ణించాడు. తిరుమల దేవరాయలను ఎరతిమ్మరాజని పేర్కొన్నాడు. అంటే అప్పటికి రక్షస తంగడియుద్ధం జరిగి ఉంటుంది.

రామరాజు రంగప్పరాజు ౩67

ఇంకొక ఆకరంవల్ల తూడ సాంబోపాఖ్యానం రచనాకాలాన్ని నిర్ణయించవచ్చు. ఈ రంగప్పరాజుగారి గురువు పేరు తిరుమల శ్రీనివాసాచార్యులు, ఈ సంగతిని కవి గద్యలో చెప్పాడు. ఈ శ్రీనివాసాచార్యులవారే నంద్యాల కృష్ణమరాజుకు కూడా గురువు. పింగళి సూరపరాజుగారు కళాపూర్జోదయం రాసి ఈ కృష్ణమరాజుకే అంకితమిచ్చారు. కళాపూర్జోదయాన్ని వారు క్రీశ. 1550 ప్రాంతాలో వ్రాశారని మనం ఇంతకుముందు గుర్తించాం. కళాపూర్జోదయంలోని కొన్ని వర్దనలు మెచ్చుకొన్నాకనే రంగప్పురాజు సాంబోపాఖ్యానం వ్రాశాడని భావించవచ్చు. కళాపూర్లోదయంలో మణిస్తంభుడు సుముఖాసత్తితో కలిసి సముద్రాన్ని చూశాక వారిలో కామోద్రేకం కలిగిందనీ, ఆ తరువాత పుత్రజననం జరిగిందనీ సూరపరాజుగారు వ్రాశారు.

సరిగ్గా ఇదే. పద్ధతిలో రంగప్పరాజు సాంబోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు రుక్కిణీదేవితో కలిసి ఉప్పుకడలిని చూడడానికి వెళ్ళినట్టూ, ఆ తర్వాత ప్రద్యుమ్నుడు జిన్మించినట్టూ వ్రాశాడు. ఈ ఘట్టంలో 9 పద్యాలను వ్రాసి రంగప్పరాజు సముద్ర వర్ణన చేశాడు (సాంబో.1:193-201).

పింగళి సూరపరాజుగారు ప్రప్రథమశ్రేణి రచయితలు. వారిని చూచే ఇతరులు అనుకరించారని తలచవచ్చు. అందుచేత కళాపూర్లోదయం రచన జరిగాకనే సాంబోపాఖ్యానాన్ని రంగప్పరాజు వ్రాశాడని భావించవచ్చు. ఈ విధంగా కూడా క్రీశ1560 ప్రాంతాలలో ఈ కావ్యం ప్రభవించిందని నిర్ణయించవచ్చు.

రంగప్పురాజు ఎవరిని అనుకరించినా, అతని కవిత్వంలో కొన్ని సొగసులు లేకపోలేదు.

ద్వారకానగరంలోని భటులను వర్ణిస్తూ అతడు సత్కవిత్వం ఎలా ఉండాలో చెప్పాడు.

వడి గలిగి'ప్రాససంపద - నడరి పదన్యాసలీల నతిచిత్రగతుల్‌

గడలుకొని సత్కవిత్వము-వడుపున భటకోటి వీట వాలుంజాలక.

(సాంబో. 1-157) ఇవన్నీ రంగప్పురాజు కవిత్వంలో ఉన్నాయి.

జక్కరాజు వేంకటకవి అయ్యలరాజు కవులు ప్రబంధాలను అంకితం పుచ్చుకొనే కాలంలో శాస్త్రీయ గ్రంథాలను వ్రాయించి ఆ కృతులను స్వీకరించడం చెప్పుకోదగ్గ విశేషమే. అందులోనూ సామాన్య ప్రజలకు బోధపడేటట్టు రాజనీతినీ, వ్యవసాయానికి పనికివచ్చే వర్షశాస్త్రాన్నీ అనువదింపజేయడం నిజంగా లోకోపకారమని చెప్పాలి. కొండ్రాజు వెంకటాద్రి అనే మహనీయుడు రెండు శాస్త్ర గ్రంథాలను వ్రాయించాడు. జక్కరాజు వేంకటకవి అనే కవి చేత క్రీశ 1584వ సంవత్సరంలో ఇతడు కామందకాన్ని తెనిగింపజేశాడు. తెలుగులో అంతకుముందు కామందకం ఉండేది. క్రీ.శ 1355 ప్రాంతాలలోనే ఒక ప్రాచీన కవి వ్రాసిన కామందకం ప్రచారంలో ఉండేది. దానిలోనుంచి 306 పద్యాలను స్వీకరించి మడికి సింగన్న తన సకలనీతి సమ్మతంలో ఉదాహరించాడు. రెండు వందలా యాఖై సంవత్సరాలలో ఈ ప్రాచీన గ్రంథం1పాతబడడంవల్లనో, దొరకకపోవడంవల్లనో దీనిని మళ్ళీ అనువదింప వేయాలని కొండ్రాజు తిమ్మరాజు భావించాడు. 'సర్వహితంబుగా బుజువుగా భూపాల యోగ్యంబు'గా జక్కరాజు వేంకటకవి దీనిని తెనిగించాడు. నంస్కృతంలో నీతిసారం అనే 36 ప్రకరణాల గగ్రంథం ఒకటి ఉంది. దీనిని కామందకుడు వ్రాశాడు. ఇతడు ఏ దేశంవాడో, ఏ కాలపువాడో తెలియదు, అయినా ఇతని గ్రంథం పుట్టిననాటినుంచీ పండిత సంప్రదాయంలో పఠనపాఠ వ్యవహారంలో ఉంది. మల్లినాథసూరి మొదలైన వ్యాఖ్యాతలందరూ దీనిని స్మరించారు.! ఈ గ్రంథానికే “ఉపాధ్యాయనిరపేక్ష, “నయప్రకాశం' అనే రెండు వ్యాఖ్యానాలున్నాయి. ఈ కామయందకాన్ని బిక్కరాజు వేంకటకవి 1006 గద్యపద్యాలలో చక్కగా అనువదించాడు. “ఇది ప్రాచీన కామందకమంత రసవంతం కాదేమోకాని శబ్దశుద్ధియు, విషయ వైశద్యమును, ఉత్తమ రచనము మొదలగు సుగుణములతో నొప్పుచున్నది” అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చెప్పిన మాటలు నిజం.* ప్రాచీన కామందకానికీ, దీనికీ గల పోలికలు చూద్దాం. చారులున్నరాజు నిద్రపోతున్నా చూస్తూ ఉంటాడని ప్రాచీన కామందక రచయిత సూక్ష్మసూత్ర ప్రచురణముల్‌ సులభవృత్తి- బొలపకరివీరచేష్టలజూచుచుండు చారచక్షులు గలిగిన జనవరుండు - నిద్రపోవుచునైనను నెలమిజూచు. (సకలనీతి. ౫1) ఈ భావాన్నే జక్కరాజు వేంకటకవి ఇలా చంపకమాలలో చెప్పాడు : చెలగెడు సూక్ష్మసూత్రములచేత బలెం దన వేగువారిచే 2. ఆంధ్రకామందకం (మద్రాసు గవర్నమెంట్‌ ఓరియంటల్‌ సీరీస్‌ ప్రచురణ-1950) పీఠిత, పుట 11.

జక్కరాజు వేంకటకవి - అయ్యలరాజు కవులు 369 ట్లఅవున జారచక్షుడయి యందమునొందిన రాజు నిద్రచే నలరినవేళ మేల్క నినయట్టివిధంబున మించు నెంచగక్‌.(అంధ్రకామందకం, 5-82) తల్లి యింటికి వెళ్ళినా రాజు ఆ భవనాన్ని శోధించాలనీ, ఎక్కడికి వెళ్ళినా అంగరక్షకులు వెంట ఉండాలనీ, ధూళిలోనూ వానలోనూ ఉండకూడదనీ ప్రాచీన కామందక రచయిత ఒక సీసపద్యంలో చెప్పాడు. (సకలనీతి : 279) ఈ భావాలనే జక్కరాజు వెంకటకవి మూడు పద్యాలలో వ్రాశాడు: తన తల్లి యింటికైనక - జనపతి యెచ్చరిక జనగాదగు గా వున నడవికి జనియెడిచో- దనరగ నెచ్చర్‌కె లేక తగునా యరుగక్‌? ధూళిజల్లుచు విసరెడి దొడ్డగాలి - కాలమందును జడివానకాలమందు మండువేసవియందును మబ్బులోన-నరుగరా దెందు సుస్థిరుడైన పతికి కలకల ముల్లసిల్ల నల కట్టికవా రిరువంక సందడిక్‌ _ దలగ నొనర్చి దూరముగ దారు భజింప బలంబు పెంపు సౌం పులుడగ రాజవీధులనె పోవుచు వచ్చుచు నుండగా దగుక జెలగి నిజోన్నతుల్‌ జనులు చెంతల జూడ నృపాలమౌళికి€. (ఆంధ్రకామందకం, 3౩-125, 127) జక్కరాజు వేంకటకవి చేసిన అనువాదంలో ఆనాటి రాజకీయ పరిభాష బాగా కనబడుతుంది. '“ఆయుధహస్తులు' అనే చోట "“కట్టికవారు' అని వాడాడు. ఇలాగే నగరులలో ఉండే నపుంసకులను “అన్నగాం' డ్రని చెప్పాడు (3-129). సేనలలో ఉండే విభాగాలను తెలుగు మాటలలో చెప్పాడు. కైజీతపు మూకలు, ప్రాత మూకలు, తూటపు మూకలు, అడవి మూకలు అనే నాలుగు తెలుగు పదాలలో ఉన్న మూకలతోపాటు మిత్రబలాలనూ, శత్రుబలాలనూ చేరిస్తే ఆ కాలంనాటి ఆరు విధాల సేనలు తెలుస్తాయి. ఏయే బలాలను ఎవరెవరిపైన పంపాలో చక్కగా చెప్పాడు. అధర్మ యుద్ధమైనా తప్పు లేదట. మోసపు పోరిచే రిపుల మూక నవశ్యము నొంచగా నగుక్‌ వేసటలేకయుండు పృథివీపతి యీగతి శత్రు గెల్పుటల్‌ దోసముగాదు మున్నిటుల ద్రోణసుతుండును ద్రౌపదేయులం ట్రాసము బూని యేమరిన పట్టున నొంపడె నిద్ర వేళలక (ఆంధ్రకామందకం, 8-50) ఎన్ని యుద్ధాలలో గెలిచినా మగవాడు ఆడదాని దగ్గర ఓడిపోతాడు. ఈ సంగతిని జిక్కరాజు వేంకటకవి ఇలా తినిగించాడు: వలపుల సౌంపు కెంపుజిగి వన్ని వాల్గడకన్నులంగనం గలకల మంచు మించు మృదుగద్గదభాషలు నేకంతపు చ ర్యలు వెలలేని మెచ్చుల యొయారితుటారిమిటారి యొప్పులుం గల కలవాణీ యేనరుని గాకలబెట్టదు గుట్టుముట్టగన్‌? (ఆంధ్రకామందకం, 1-48)

౩70 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

వేంకటకవిచేత కామందకాన్ని తెనిగింపజేసిన వెంకటాద్రి ఆ తరువాత కొన్నాళ్ళికు అయ్యలరాజు కవులను పిలిపించి రెట్టమతశాస్త్రాన్ని తెనిగింప జేశాడు. కన్నడ భాషలో రెట్టడు అనే శాస్త్రజ్ఞుడు వ్రాసిన గ్రంథాన్ని అనువదించి తనకు అంకితమిమ్మన్నాడు. గ్రంథమేకాక గ్రంథంలోని “ప్రతి పద్యమును మదంకితముగాగ నాంధ్రభాషానిరూడీ గావ్యంబు జేయు డఖిలజనులకు నుపకారమై చెలంగ' అని ఆదేశించాడు (రెట్టమత, 1-15). జంటకవులు అలాగే చేశారు. ప్రతి పద్యంలోనూ వెంకటాద్రి పేరు వచ్చేటట్టు చూశారు. లేకపోతీ రెట్టడీ పేరైనా చెప్పారు.

ఈ జంటకవులు సుప్రసిద్ధమైన అయ్యలరాజువారి వంశంలో పుట్టినవాళ్లు ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పిన అయ్యలరాజు తిప్పయ్యగారి కోవలో పిన్నక్కయ్య గారికి అయ్యలయ్య పుట్టాడు. నాగన్నకు భాస్కరకవి పుట్టాడు. ఈ కవిద్వయం రెట్టమతాన్ని వ్రాసి వెంకటాద్రికి అంకితమిచ్చారు. అయితే కొందరు పరిశోధకులు ఈ వెంకటాద్రి ఆంధ్రకామందకం అంకితం పుచ్చుకొన్న వెంకటాద్రి కాడనీ, అతనికి వరుసకు మనుమడైన మరో వెంకటాద్రి అనీ అంటారు. రెట్టమతశాస్త్రం క్రీ.శ.1770లో రచితమైందని చెప్తారు.3 అయితే ఇది పొరపాటు అభిప్రాయం. గ్రంథాన్ని సరిగ్గా చూడక చెప్పిన మాటలు. రెట్టమతశాస్త్రంలోనే గ్రంథంలోని సంబోధనలలోనూ, ఆశ్వాసాంత పద్యాలలోనూ దానిని అంకితం పుచ్చుకొన్న రాజుయొక్క వివరాలు ఉన్నాయి. రెండు గ్రంథాల వివరాలనూ జోడిస్తే తెలుస్తుంది. ఆంధ్రకామందకం

తండ్రిపేరు రసికమందార! పెదతిమ్మరాట్కుమార!

పెదతిమ్మరాజు వేంకటక్ష్మాపు సర్వదిగ్పినతభూప! (3-29)

క్షమాధృతక్షమా! మహాభుజాపరాక్రమక్రియా

తల్లిపేరు కుమారకల్చ్ప! దానకల్ప! కుంఖినీశ పాప సం

సంగచమ్ము గమావధూమణీకుమూర! కాంతిపంకజాహితా! సమానకౌరవాధినాధ! సప్తసంతతీశ్వరా! (3-58) కామందకకావ్యనాయకః కవీంద్రేష్టారసంధాయకా! (5-74) అని జంటకవులు చెప్పారు.

ఈ _ వివరాలను తోసిరాజని గగ్రంథాంతంలో ఉన్న ప్రక్షిప్తపద్యంలోని రచనాకాలాన్ని నమ్ముకోకూడదు. ఆ పద్యం ఇది:

కలియుగప్రథమభాగము నాల్గువేల యెన్మిదినూర్లపయిని డెబ్బదియు నొకటి

శాలివాహనశకసమలిల వేయునాన్నూటతొంబది రెండు రూఢిగాగ

బ్రభవాదిగతములు పరగనిర్వదిమూడు నేండ్లయ్యె నెన్న విబుధు

లట్టికాలంబున నయ్యలు భాస్కరకవివర్యులలరా జకమలహితుని 3. రెట్టమతళాస్త్రం (వావిళ్ళ ప్రచురణ, 1994) పీఠిక-నిడుదవోలు వెంకటరావుగారు

జక్కరాజు వేంకటకవి - ఆయ్యలరాజు కవులు 871 (+! నీళ్లా శ

లే క [1

సా చ!

్దేః ౭ క్‌ ఖే | 1!

372 సమల్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

యాజ్ఞ బూర్చోక్తరెట్టముతాఖ్య కావ్య

మును నొనర్చిరి యాచంద్రముగను గీర్తి

వక్త్సృశోతలకును గల్గ వసుధమీద

నల యహోబలనృహరికి నర్చృణముగు (రెట్ట, 5-7౫)

ఈ పద్యం ప్రకారం రెట్టమతశాస్త్ర రచనాకాలం క్రీ.శ 1770 అవుతుంది. కాని గ్రంథంలోని కృతిపతి వంశం క్రీ.శ1600 ప్రాంతాలదాకానే కవులు కథనం చేశారు. మిగతా 170 సంవత్సరాల మాట ఏమిటి? రెట్టమతశాస్త్రం వల్ల తెలిసి కొండ్రాజువార వంశ వృక్షాన్ని వెంకటరాజుకుమారుల తరంతో వంశావళి కథనం పూర్తవుతుంది.

  1. కొండ్రాజువారి వంశంలో ముగ్గురే వెంకటరాజులను కవులు చెప్పారు. వీళ్ళలో ౪ నంబరు వెంకటరాబే రెట్టమతం కృతికర్త అనడానికి ఆస్కారముంది.

  2. ఈ వెంకటరాజు మాతామహుని పేరు మంగయగారి గురవరాజు. ఈ గురవరాజుగారి పెద్ద కొడుకు పెదసంగభూపాలునివద్ద విరూరి వేదాద్రి బ్రాయసంగా ఉండేవాడు. గురవరాజువద్దనే వేదాద్రి వ్రాయసమని విద్యారత్న నిడుదవోలు వెంకటరావుగారు చెప్పడం (రెట్టమతశాస్త్రం పీఠిక 6వ పుట, అధోజ్ఞాపిక) ప్రమాదజనితం.

ఇ తెనాలి రామకృష్ణుని గురువుగారైన భట్టరు చిక్కాచార్యులే ఈ వెంకటాద్రికి గురువు,

  1. క్రీ.శ. 1584లో కామందకం వెంకటాద్రి ఉన్నాడు. అతని తరువాత ఒక్కతరాన్నే 'రెట్టమతం కవులు చెప్పారు. అందుచేత రెట్టమతశాస్త్రం రచన క్రీ.41770లో అనడానికీ అస్కారం లేదు.

ఈ వంశావళిలోని వివరాలవల్ల కొండ్రాజు వెంకటాద్రి తెనాలిరామకృష్ణుని సమకాలికుడని తేలుతుంది. రెట్టమతశాస్త్రం క్రీ.శ 1584 తరువాత కొద్ది సంవత్సరాలకు అంకితం పుచ్చుకొని ఉంటాడు. ఇతడు 'పొడవిద్వత్కవీశ్వర ప్రకరవినుతగాడసత్కృతా విభుడు' అని అయ్యలరాజు కవులు చెప్పారు. కృతిపతి గురించి ఇన్ని వివరాలు చెప్పినా, కవులు తమను గురించి వివరాలేం చెప్పుకోలేదు. వీళ్లు తెనిగించిన వివరాలున్నాయి. ఇది ఒక రకంగా దోనయామాత్యుని సస్యానందంలాంటిది. ఈ గ్రంథంలో చివరి భాగు జ్యోతిషం. ప్రభవ, విభవ మొదలైన అరవై సంవత్సరాలకు ఫలితాలు ఉన్నాయి.

వానలు అకాళంలోని మేఘాలవల్ల కాక ప్రశ్న అడిగేవాళ్లు పట్టుకొన్న వస్తువులనుబట్టి, ప్రక్కనున్న శకునాలను బట్టి కురుస్తాయో, కతురవవో చెప్పవచ్చునన్న మూఢనమ్మకం ఈ గ్రంథంలో ఉంది. 'ప్రజాప్రశ్షలక్షణం' అనే ప్రకరణంలోని ఈ పద్యం

  • చూడండీ

విరులయిన ఫలములయినను - బరువడి యక్షతలనైనబట్టుక నగుచు౯€

నరసులు వానకు నడిగిన - విరివిగ వర్షంబు గురియు వేంకటనృపతీ!

(రెట్టమత. 2-2) ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎవరైనా వల, నిప్పులు మొదలైనవి పట్టుకొంటే వానలు

పడవట। (2-16)

ఇటువంటి శాస్త్రీయగ్రంథాల వల్ల నేడు ప్రయోజనం చాలా పరిమితం.

చక్రపురి రాఘవాచారి

సంస్కృత పంచకావ్యాలలో శ్రీహర్డుని నైషధీయ చరిత్రను అన్ని సంప్రదాయాలవాళ్ళూ ఏకగ్రీవంగా చేర్చకపోయినా ఆ ప్రొఢకావ్యానికి శ్రీనాథుడు చేసిన అనువాదాన్ని మాత్రం తెలుగువాళ్లు తమ పంచకావ్యాలలో లెక్కించారు. నైషధం విద్వదౌషధం అయింది. ట్రౌఢతరంగా శ్రీనాథుడు ఈ కావ్యాన్ని అనువదించాక అనంతర కవులందరూ దానిని ఒక శతాల్దిన్నర చదువుకొన్నారేగాని నలచరిత్రను మళ్ళీ రచించాలని భావించినట్టు లేదు. శ్రీహర్ల్డుని కావ్యంలోని మంచి శ్లోకాలనూ, చక్కని శ్లేషలనూ శ్రీనాథుడు విడిచిపెడితే వాటిలో కొన్నింటిని రామరాజభూషణుడు అనువదించి అనుసరించి తన వసుచరిత్రలో పెట్టుకొన్నాడు. అంతతో తనివితీరక ఏకార్థకావ్యంలో శ్రీహర్హుడు చూపిన చమత్కారాలు ద్వర్థికావ్యంలో చూపాలని అతడు హరిశ్చంద్రనలోపాఖ్యానం అనే రెండర్థాల కావ్యాన్ని వ్రాశాడు. భట్టుమూర్తి ఇలాగ మళ్ళీ నలచరిత్రను వ్రాయడానికి ఉపత్రమించిన కాలంలో ఇతర కవులు కూడా ఈ చక్రవర్తి కథను సీదాగా రచించడానికి పూనుకొన్నారు. వాళ్ళలో చక్రపురి రాఘవాచారి ఒకడు. ఈయన నలచరిత్రను ద్వాపదకావ్యంగా వ్రాసి ఘటికాచలంలోని నరసింహస్వామికి అంకితమిచ్చాడు. మద్రాసు రాష్ట్రం ఉత్తరార్కాటు జిల్లాలో ఉన్న షోలింగర్‌ అనే చోళలింగపురాన్నీ ఘటికాచల మంటారు. ఇది 10% దివ్యతిరుపతులలో ఒకటి. ఈ క్షేత్రంలో కందాళవారిది ఆచార్యపీఠం. క్రీశ. 1517లో కందాళ దొడ్డయాచార్యులవారనే ఒక గురువుగారు ఉండేవారు. ఆయనకు తన పేరిటివాడే ఒక శిష్యుడున్నాడు. శిష్యుని ఇంటిపేరు చక్రపురివారు. వీళ్ళది పండిత కుటుంబం. చక్రపురి దొడ్డయాచార్యులకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు రంగయ్య; రెండోవారి పేరు తిరువెంగళయ్య. రంగయ్య రాజపూజితుడు; సంగీత సాహిత్య నత్కళావిదుడు; సరససత్కమి తిరువెంగళయ్య ఆంధ్రవిద్యా ప్రవీణుడు. ఈయన కుమారుడే రాఘవాచార్యులు. ఇతడు విద్యావిశారదుడు. ఈ వివరాలన్నీ రాఘవాచార్యులు వ్రాసిన ద్విపద నలఛరిత్రలోని “గద్యల' వల్ల తెలుస్తున్నాయి. దీనిని కవి రెండుభాగాలుగా వ్రాశాడు. అయితే పూర్వార్థం చివర చెప్పిన సౌంతవిషయాలకూ, ఉత్తరార్థం చివర చెప్పినవాటికీ కొంచెం జేడా ఉంది. పూర్వార్థంలో కవి తనకు రంగనామాత్యుడనే పెదతండ్రి ఉన్నట్టు చెప్పాడు (2-877). ఉత్తరార్థం ' గద్య"లో ఈ పేరు కనబడదు. పెదతండ్రి పేరుండవలసిన ద్విపదలను విలేఖరి వ్రాసినట్టు లేదు. అందువల్ల అన్వయంలో ఇబ్బంది కూడా కనబడుతుంది. చక్రపురి రాఘవాచార్యులు తన పెదతండ్రీ, కావ్యానికి ఎటువంటి ఖ్యాతి రావాలో మాత్రం చెప్పుకొన్నాడు.

జలధివంద్యునకు భూజనసేవితునకు- నలువగు ఘటకా ద్రినారసింహునకు

నంకితంబుగ జేసి యవనిలోపలను- గొంకక యీకథ గోరిక సభల

  1. దీనినే బౌనుదొరగారు అయిదాశ్వాసాలుగా విభజించి ప్రచురించారు. ,
  2. నలచరిత్ర (వావిళ్ళవారిముద్రణ), పుటలు 127 & 318.

974 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

వెలయ బ్రఖ్యాతిగా వేడ్క చెన్నాంద-సలలితసారాంధ్రశబ్బసంగతుల

దెలిపెద నీకథ ద్వాపదకావ్యమున... (నల. ఉపోద్దాతం. 56-61)

ఈ కవి ఈ కథను 'అవనిలో కవిరాజు లైనట్టి సరసకవుల సత్కప తనకు శృంగారనైషధంలోని రసవంతమైన భాగాలను ఇందులో చేర్చలేదు. భారతం అరణ్య పర్వంలో నన్నయ్యగారు కథను ఎలా కథనం చేశారో దానినే రాఘవాచార్యులు మూడు వంతులా ముప్పాతిక అనుసరించాడు. నన్నయ్యగారి నలచరిత్రలో స్వయంవరానికి వచ్చిన రాజులను పెళ్ళికూతురుకు పరిచయం చేయడానికి ఎవరూ లేరు. శృంగార నైషధంలో సాక్షాత్తూ భారతీదేవి పరిచయం _ చేస్తుంది. ద్వాపదకావ్యంలో రాఘవాచార్యులు ఈ పనిని రాజపురోహితుడు వసుదేవునికి అప్పగించాడు. (నన్నయ్యగారి. భారతంలో పురోహితుని పేరు సుదేవుడు (అరణ్య. 2-14).) తొలిభాగంలో శ్రీనాథుజ్లేకాదు. మలిభాగంలో నన్నయ్యగారినికూడా మంచి ఘట్టాలలో రాఘవాచార్యులు అనుసరించలేదు. సైరంధ్రివేషంలో సుబాహుపురానికి వస్తున్న దమయంతిని రాజమాత చూస్తుంది. ఆమె దాసితో ఇలా అన్నదని నన్నయ్యగాడ వ్రాశారు.

జీర్ణమై కడుమాసిన చీర గట్టి - ధూళిధూసరాలకములు దూలుచుండ

నబల యున్మత్తవేషిణియైన లచ్చి-కరణీ నిటువచ్చుచున్నది కంటె దాసి?

(అరణ్య. 2-11)

ఒక చిన్న సమాసంలో బ్రహ్మాండమైన అర్గాన్ని మహాకవులే చెప్పగలరు. పండు ముసలియైన సుముఖాసత్తిని వర్ణిస్తూ పింగళి సూరపరాజుగారు అమె 'భావజుడు వెళ్ళిపోయిన పాడుమేడ పగిది' కన్పిస్తున్నదన్నారు (కళా. ౩-౪). విక్షువర్డీ యసినివర్ణిస్తూ శ్రీశ్రీ ఇలా అన్నాడు:

ముగ్గుబుట్టవంటి తల - ముడుతలు దేరిన దేహం

కాంతిలేని గాజుకళ్లు - తనకన్నా శవం నయం.

ఇటువంటి వర్ణనలకు నన్నయ్యగారి 'ఉన్మత్తవేషిణియైన లచ్చి' నాయనమ్మ సథసకవుల సత్కృప తనకు ఉన్నదన్న చక్రపురి రాఘవాచార్యులు ఈ ఘట్టంలో చొలా పేఖవంగా వ్రాశాడు. రాజమాత తన చెంత నుండిన తరుణంలో ఇలా అందట.

నలినారి బోలు నాచనకాంతి మించి - వలనొప్ప శ్రీలక్ష్మీ వడుపున నున్న

దీ యింతి యెవ్వరో యెరుగంగ రాదు... (నల. 4: 710-710) శవిభాజులైన సరసకవులు సత్క్సృపతో అందించిన భావాలను తూడా స్వీకరించ లేకషోవడం లోపమే. నన్నయ్యగారు దమయంతి ముఖకాంతి నలినారి కాంతి అనలేదు

చత్రపురి రాఘవాచారి 375 “దినకరప్రభాపటలధూసరితచంద్రరేఖలాగ దీప్తి విహీనర్టై డస్సినా కడురమ్యంగా ఉందన్నారు (అరణ్య. 2-116). ప్రసన్న కథాకలితార్థయుక్తి స్ఫురింపజేసి మహాకవుల రచన ముందు రాఘవాచార్యుల రచన తీసికట్టేగాని దేనితోనూ పోల్చక చదివితే అక్కడక్కడ చక్కదనాలు కొన్ని కనబడతాయి. మాటవరసకు నలుని ధర్మరాజ్యాన్ని వర్ణిస్తూ కవి తన సమకాలికులు ఎటువంటి రాజ్బం సుఖిక్షమను కొంటారో తెలియజేశాడు. నూరుమాడలకు మున్నుగ రూకవడ్డి- యేరుకిర్వదినాలుగెద్దులు దున్న పదిపాళ్ళకొకపాలు పార్థివేంద్రునకు- గొదవతొమ్మిదిపాళ్లుకొనుబంటకాపు లొలయుచు బుట్టికి నొక రూక పన్ను-గలిగి వర్తించు కాలంబునందు ' , ఇల నవగ్రహదోషమెన్నడు లేదు. (నల.;157-6) ఇలాగ సమకాలిక విషయాలనైనా వేరే చోట్ల చెప్పకపోవడం విచారకరమే. కథ చెప్పడంలో కూడ అక్కడక్కడ 'పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడకా, కొడుకు చేతి గొడ్డలీ అని చెప్పిందే, చెప్పిందే చెప్పడం విసుగెత్తిస్తుంది. అయినా నడక బాగుంది . అనుప్రాసలు, అంత్యప్రాసలు కొంచెం ఎక్కువగానే వాడీనా శ్రావ్యంగా ఉంటాయి. నలచరిత్ర వ్రాసిన రాఘవాచార్యులు విష్ణుభక్తి చరిత్ర అనే ద్విపదకావ్యం రచించాడు. ఇది విష్ణపురాణమనే పేర అచ్చుపడింది.3 కాని కవి నిర్దేశించిన పేరు భక్త చరిత్రే. . వలనొప్పఘటికా ద్రివాసు డైనట్టీ - నలినాక్షుడోంకారనారసింహునికి వెలయు నంకితముగా ద్విపదరూపమున - బలువైన శ్రీవిష్ణుభక్ట్రచరిత్ర ' విరచింతు నా నేర్చువిధమెల్ల దెలియ . .: (0-1182 . మద్రాసు ప్రాచ్చలిఖిత గ్రంథాలయంవారు ప్రచురించిన వర్ణనాత్మక క్యాటలాగులో “ఈ _ నీరసద్వాపదప్రబంధమున_ ఆళ్వార్లు మొదలగు విష్ణుభక్తుల చరిత్రములు వర్ణితములైనవి” ' అని వ్రాశారు. ఈ కావ్యాన్ని కూడా రాఘవాచార్యులు రెండు భాగాలుగా వ్రాశాడు. మొదటి భాగంలో యమలోక వర్ణనం, అక్కడకు వచ్చే పాపాత్ములు చేసే పాతకాల వివరాలు ఉన్నాయట. రెండోభాగంలో రామానుజుల ప్రభావం, ఆ మతస్థాపన, దాని మాహాత్మ్యాలు వర్ణించాడట.5 - విషయంలో ప్రథమ. స్థానాన్ని నోచుకొంటున్నాడు. ఇంతవరకూ మనకు లఖించిన యక్షగానాలలో కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవవిజయం మొదటిదనుకొంటున్నాం. రుద్రకవికాలం శ్రీ.శ+1520 ప్రాంతాలా, లేక 1620 ప్రాంతాలా అన్నది తేలదు. 8. అంధ్రవాజ్బయసూచిక - కాశీనాథుని నాగేశ్వరరావుగారు, పుట 19. 4. మద్రాసు ఓరియంటల్‌ లైబ్రరీ - డి. క్యాటలాగు, / ద్విపదకావ్యాలు, పుట 1505. 6. ఆంధ్రకవితరంగిణీ - చాగంటి శేషయ్యగారు, పుటలు 1%, 1%.

376 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఈ నూరేళ్ళ కాలంలో ఇద్దరు ముగ్గురు రుద్రకవులు ఉన్నారనుకోవడం, వాళ్ళలో రెండో రుద్రకవి సుగ్రీవవిజయం వ్రాశాడనుకోవడం భావ్యం. అప్పుడు అతని కాలం క్రీశ1558 ప్రాంతాలు అవుతుంది. సరిగ్గా ఈ కాలంలోనే చత్రపురి రాఘవాచార్యులు కూడా యక్షగానం వ్రాసిన సాక్ష్యాలు కనబడుతున్నాయి. మద్రాసు ప్రాచ్యలిఖిత గంథాలయంలో “విప్రనారాయణ చరిత్ర' మనే యక్షగానం ఒకటి ఉంది. దాని నెంబరు ౨ 1939. కర్త పేరు తెలియదు. ఇది అముద్రితం. ఈ యక్షగానాలపై పరిశోధనలు జరిపిన డా యస్‌.వి. జోగారావుగారు ఈ యక్షగానాన్ని చక్రపురి రాఘవాచార్యులే వ్రాశాడని నిరూపించారు* కర్తకాలం క్రీ.శ.1545 ప్రాంతాలు కావచ్చునని ఊహించారు. అందుచేత కందుతూరి రుద్రకవి సుగ్రీవవిజయంకన్నా ఈ విప్రనారాయణ చరిత్ర ప్రాచీనమని రాఘవాచార్యులకే లఖిస్తున్న మొదటి యక్షగాన రచయితగా తొలిపీట వేయాలని చెప్పారు. “రాఘవాచార్యుల రచన సలక్షణముగా నున్నది కాని యింత ప్రొడముగా లేదు” అని డాక్టరు జోగారావుగారు తేల్చారు. అయినా విప్రనారాయణ చరిత్రీ దొరుకుతున్న యక్షగానాలలో మొదటిదైతీ ఆ కారణంచేతనైనా అది అచ్చుపడాలి. తొలి యక్షగాన రచయితగా చక్రపురి రాఘవాచార్యుల రచనలను సమీక్షించి స్మరించాలి.

ఏకామఘ్రనాథుడు, చరిత్రకారులు

కథలంటే చెవి కోసులోని జాతి ఉండదు. కట్టుకథలు, పిట్టకథలు విన్నాక ఎప్పుడో ఒకప్పుడు ప్రతిఒక్కడూ తన జాతి చరిత్రను వినాలనుకొంటాడు. తన దేశాన్ని పాలించిన రాజుల కథలు, వాళ్ల జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకొంటాడు. “ఈ రాజీ ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు' తూచా తప్పకుండా చెప్పమంటాడు. సాంఘీక చైతన్యం మేల్కొన్న పాఠకుడు “సామ్రూజ్యపు దండయాత్రలో సామాన్నుని సాహసమెట్టిది?" మొదలైన ప్రశ్నలు వేస్తాడు.

వాస్తవానికి మన పురాణాలన్నీ అత్యంత ప్రాచీనకాలంలో దేశ చరిత్రలుగా ప్రారంభమైనవే. ప్రతి పురాణంలో వంశం, మన్వంతరం, వంశానుచరితం ఉండాలి. ప్రక్షిప్తాలతో కల్తీకాని రోజుల్లో, మన ఆదిమజీవనంలో, తొలి పురాణాలు చరిత్రల స్థానాన్ని భర్తీ చేసేవి. సత్యం కన్నా మహిమలకే ప్రాధాన్యమిచ్చే మన పూర్వులు యథార్థ గాథలకు అభూతకల్ప్చనలు జోడించి, భారతీయులు 'చరిత్రహీను'లనే అపఖ్యాతిని తీసుకొచ్చారు.

సంస్కృత వాబ్బ్యయంలో ఎన్నో శాఖలున్నాయి. కాని చరిత్ర రచన వాటీలో కనబడదు. ఎన్నిసార్లు లెక్కపెట్టినా కల్లణుని రాజతరంగిణి తప్ప మరో చారిత్రక గ్రంథ కనబడదు. ఇది సంపూర్ణదేశ చరిత్ర కాదు. ఒక్క కాశ్ళీరుకే పరిమితం. సంస్కృకీ

ఏకామ్రనాథుడు, చరిత్రకారులు కా వాజ్మయంలో కనీసం ఈ ఒక్క పుస్తకమేనా కనబడుతున్నది. “అల్లుడికి నెయ్యి లేదు, అల్లుడితో వచ్చినవాడికి నూనే లేదు అన్నట్టు సంస్కృతంలో సిసలైన చారిత్రక గ్రంథాలు లేవు; ఆ వాబ్బయాన్నే అనుకరించే తెలుగులో ఆంధ్రదేశానికి సంబంధించిన కట్టుకథల పు [ లేదు. క

మహమ్మదీయుల ఆగమనంతో మనవాళ్లు చరిత్ర విషయంలో మూసుకొన్న కళ్లు కొద్దిగా తెరుచుకొన్నారు. అరబ్బీ పారసీక భాషలలో మహమ్మదీయులు వ్రాసిన చారిత్రక గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళతో సంపర్కం ఏర్పడ్డాక హిందువులు కూడా చరిత్రలు బ్రాయసాగారు. అయితే మాతృభాషలలో వ్రాసిన పాపానపోలేదు. మూతృదేశం గురించి వాసి పుణ్యం కట్టుకోనూ లేదు. లక్ష్మీనారాయణ, చంద్రభాను మొదలైన హిందూ చరిత్ర కారులు మహమ్మదీయ భాషల్లో వ్రాసిన గ్రంథాలలో మహమ్మదీయ రాజ్యాల చరిత్రేగాని హిందూ సంస్థానాల చరిత్ర ఎక్కడా కనబడదట.! 'తల్లికిలేని ముద్దు దాదికీ వస్తుందా?" అని సామెత చెప్పినట్టు హిందూ చరిత్రకారులే వ్రాయకపోతే విజయనగర సామ్రాజ్య చరిత్రను ఫెరిస్తావంటి ముస్లిం చరిత్రకారులు వ్రాస్తారా+ి

కాకతీయ సాత్రూజ్యం పతనమయ్యాక, ఓరుగల్లు మహమ్మదీయుల వశమయ్యాక, బహమనీరాజ్యుం విస్తరిల్లుతూ వచ్చాక అరబ్పీ పారసీక భాషలను అభ్యసించి ఆ వాబ్బయంలోని ప్రాచీన, నవీన చరిత్రలను చదివే తెలుగువాళ్ళలో కనీసం ఒక్కడికైనా తాను పుట్టిన గడ్డను పాలించిన రాజవంశాల చరిత్రను రచించాలనే సంకల్పం కలగకపోతే మన జాతంత నిర్వీర్శమైన జాతి, నిస్తేజమైన జాతి ఇంకొకటి లేదని ఒప్పుకొని, వంచిన తల ఎత్తుకొనేవాళ్ళం కాదు. అయితే శ్రీ.శ 1600 ప్రాంతాలలో కొంత లేటుగానైనా, కాకతీయుల ఘనవైభవాన్ని గ్రంథస్థం చేసిన చిరస్మరణీయుడు ఒకడు మనకు ఆ అవమానం కలుగకుండా చేశాడు. అతని పేరు ఏఠాయమ్రనాథుడు. అతడు వ్రాసిన చారిత్రక గ్రంథంపేరు ప్రకాపచరిత్ర. దానిని గురించి తెలుసుకొందాం.

“వఏీకామ్రనాథుండనువాడు ఒక పుణ్యకథ పలుకందలంచి” కాకతిరాజులు

“వెయ్యేండ్లు భూమి పాలించి యేకశిలానగరంబు కట్టించి మరియు పెక్కుసాహసంబులు చేసి శాత్రవుల గెల్పిన చరిత్ర సంగ్రహించుక ఇన్న్నూరు ఇరవదేనుకథలుగా అనుత్రమణిక సర్వంబు” తెలుపుతానన్నాడు. ప్రతాపచరిత్ర వ్రాళాడు.

చంద్రవంశంలో ఎందరో గొప్పరాజులు పుట్టారు. వాళ్ళలో సోమదేవరాజు ఒకడు. అయన కందారం రాజధానిగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు కటక వల్లభునితో విరోధమొచ్చింది. గజయుద్ధంలో గజపతిచే సోమదేవరాజు మరణించాడు. అతని భార్య సీరియాలదేవి అప్పటికి గర్భిణీ. అమె శత్రువుల బారి నుండి తప్పించుకొని హన్మకొండకు పోయి తలదాచుకొంది. ఆ ప్రాంతాలను ఒక ఎరుకలరాజు పాలిస్తున్నాడు. 1, చరిత్ర రచన ప్రథమభాగం - డా! నేలటూరి వెంకటరమణయ్యగారు, పుట 2. ఒ ఖాసిం ఫెరిస్తా 'తారీఖ్‌.ఉల్‌.హింద్‌ అవే గ్రంథం బ్రాకాడు. అందు హిందూదేశంలోని అన్ని

మహమ్మదీయరాజ్యాల చరిత్రా ఈంది.

3786 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ నంపుటి అతని పురోహితుడు మాధవశర్మ ఆమెకు ఆశ్రయమిచ్చాడు. సీరియాలదేవి హనుమకొండలో ఉంటున్నట్టు కటకవల్లభునకు తెలిసింది. అతడు దండెత్తి వెళ్లాడు. సిరియాలదేవి కోసం వెతికించాడు.

“రాజగ్భృహంబులకు రాజస్త్రీజనంబులను, విప్రగృహంబులకు విప్రవరులను... నానాజాతిగృహంబులకు నానావర్గంబులవారిని నియోగించి” వాళ్ళతో “నాకు సిరియాలడదేవిని వెతకీ తెచ్చినవారికి నా రాజ్ఞంబులో అర్ధరాజ్యంబు ఇచ్చెద'” నాకు నతండునే చెలికాడు. నాకు ప్రాణబంధుండు. ఇందుకు తప్పును” అన్నాడు. వాళ్లు అట్లు రాజుచే అనుజ్ఞాతులై హన్మకొండజొచ్చి రాజగృహంబులును మేడలును రాణీవాన గృహంబులను బండార గృహంబులును నేలిమాలియును పనులుగాపిళ్లును నూతులును తోటలును నానావర్ణగాడంబులును వెతకి వచ్చిన కావుకు మగిడి వచ్చుచు చూచిన యెడల మగుడ చూచుచుసోయిన వీథికి మగుడపోవుచు ఎక్కిన మేడలు తిరుగ ఎక్కుచు ఆ విధంబున సిరియాలదేవిని కానక పురంబును నొక్కకడకు రావించి చూచునెడ కందారంబు ప్రజల నొక్కరైన గానక యేడు దినంబులు వెతకి బ్రాహ్మణ స్త్రీలలో సిరియాలదేవిని చూచి కొందరు ఇది రాజపత్మి యగుదునని తలంచి 'బహుజనంబులతో వచ్చినది, ఒంటిగా నుండ నేర్చునే? యిది విప్రాంగనయే కదా కాబోలునని మగుడువారును;

అందులో నొక్క ధూర్తు ఆ యింతిని వీక్షించి 'యీ యింతి ముఖంబు పూర్ణవింబంబు తిరస్కరించుచున్నది. యీ కుటిలకుంతలంబులును, ఈ మంద యానంబులును, ఈ విశాలనేత్రంబులును సింగిణి బొమ్మలున్ను సంపెంగ నాసికంబును ఈ బాహువులును, జక్కవస్తనంబులున్ను యీ రంభోరుహదంతలును హరి మధ్య నడుమును అష్టదళపద్మంబులచేతులు, వజ్రంబుల పలువరుసయు, ఇంద్రనీలంబుల కురులును ఈ పాద పద్మంబుల మెరుంగులును తక్కిన యితర జనకాంతలకు గలుగ నేర్చునే? యిది రాజపత్నియగు సీరియాలదేవియని తప్పుదని నిశ్చయించి తన వారల కెరింగించిన:

ఎరుకులరాజు యనుమతిని కటకవల్లభుని సముఖమునకు దోడుకొని పోవు సమయంబున ఆ పురి విప్రులు సిరియాలదేవిని మరల తీసుకొని హాహాకారంబులు చేయుచు "ఈ సతి రాజకాంత కాదు; ఇది విప్రకాంత; మా మాధవశర్మ కూతురు. ఈ చెలియ పెనిమిటి వారణాసికి పోవుచు గర్భంబుననున్న మాతగ్భహంబున నుంచి చనియె, ఇది నిజంబు. ఎట్టి ప్రమాణంబు అయిన చేసెదము” అన్నారు.కి

కటకవల్లభుడు వాళ్ళను చూసి “ఈమె వడ్డించిన అన్నం మీరు తింటే ఈమె (బాహ్మణకాంత అని నమ్ముతాము” అన్నాడు. ఆమె వడ్డించింది. వాళ్లు తిన్నారు. అమె మాధవశర్మ కూతురని అంతా నమ్మారు. ఆమె తూడా ఆ బ్రాహ్మణుని కన్నకూతురు లాగే కృతజ్ఞతతో వర్తించి తన కొడుక్కు మాధవవర్మ అని పేరు పెటుకొంది. మనల సడ ప యస వ పుడక ముక ననన యు నననము = 3. ఆంధ్రసాహిత్కపరిషత్స త్రిక, 6వ సంపుటి, పుటలు 3౫41, ౩4.

ఏకామ్రనాథుడు, చరిత్రకారులు 379 మాధవవర్మ “శాలివాహనశకవర్షంబులు ఇన్నూ్లీట ముప్ఫయి అరగు తారణనామ సంవత్సర మాఘశుద్ధపంచమీ గురువారంబున శ్రవణానక్షత్రంబున'' సింహాసనమెక్కాడని ఏకామ్రనాథుడు చెప్పాడు. ఈ మాధవవర్మ లగాయతు ప్రతాపరుద్రునిదాకా ఓరుగల్లు ఏలిన 15 మంది చరిత్రలు కథనం చేశాడు. ఏకాద్రనాథుడు చేసిన ఈ కథనం పట్నంలో రుమ్లీ వెంకన్నగారు, ఖండేరావుపంతులుగారు లెక్కచేసి కాకతి రాజుల పేర్లు వాళ్లు ఎన్నేళ్ళు పాలించారో ఆ వివరాలు ఇలా ఇచ్చారు నెం. రాబుసిరు. _ పరపాలనకాలం శాలివహనశకం

  1. మయమాధవరాజు 175 సంవత్సరాలు శకం 230 నుండి
  2. పద్మసినరాజు ఇ సంవత్సరాలు 3౩. వెన్నమరాజు 72 సంవత్సరాలు
  3. గుండమరాజు 75 సంవత్సరాలు
  4. కుంతలదేవి 9 సంవత్సరాలు
  5. ఎరుకదేవరాజు 76 సంవత్సరాలు 7, _ భువనైకమల్లుడు 76 సంవత్సరాలు
  6. త్రిభువనైకమల్లుడు 74 సంవత్సరాలు
  7. కాకతిపోతరాజు 72 సంవత్సరాలు
  8. రుద్రమరాజు 74 సంవత్సరాలు
  9. మహాదేవరాజు ౩ సంవత్సరాలు
  10. గణపతిరాజు 77 సంవత్సరాలు
  11. రుద్రమదేవులు 38 సంవత్సరాలు
  12. అన్నమదేవుడు 12 సంవత్సరాలు
  13. థశ్రీమత్రతాప 78 సంవత్సరాలు శకం 1229 దాకా వీరరుద్రమహారాజు మొత్తం 999 సంవత్సరాలు ఈ 15 మంది రాజుల పట్టికలో 8వ వ్యక్తి అయిన త్రిభువనైకమల్లుని దగ్గర నుంచి అందరూ చారిత్రక వ్యక్తులే. ఈ త్రిభువనైకమల్లుడే కాకతి బేతరాజు. ఇతడు పశ్చిమ చాళుక్యులకు సామంతుడై వాళ్ళ బిరుదులను వహించాడు. ఇతడు ఆధునిక చరిత్రకారులు చెప్పే రెండవ బేతరాజు అని గుర్తించవచ్చు. ఇతని కాలం క్రీ.శ1075-1110. ఇతని తుమారుడు కాకతి ప్రోలరాజు. ఇతడే ఓరుగల్లు నిర్మించాడని ఏకావమ్రనాథుడు చెప్పాడు. తారీఖులు కూడ ఇచ్చాడు. “శాలివాహనశక వర్షంబులు తొమ్మిదినూట తొమ్మిదియగు శుభకృత్‌నామ సంవత్సరం కార్తీకశుద్ధ పంచమి గురువారంబున రోహిణీ నక్షత్రంబున వొరంగల్లుకట్టియు'' అని ఏకామ్రనాథుడు వ్రాశాడు. క్రీ.శ 1087లో ఓరుగల్లు నిల్మాణం క్‌. అంధ్రసాహిత్యపరిషత్ప త్రిక, సం. 7 పుట 134.

380 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి జరిగిందని ఇతడు చెప్పినా ఆధునిక చరిత్రకారులు మాత్రం క్రీ.శ 1158-1145 మధ్య పాలించిన రుద్రదేవరాజే ఓరుగల్లు నిర్మించినట్టు చెప్తారు.

ఈ విధంగా ఏకావమ్రనాథుడు చాలా చారిత్రకవిరుద్ధాలైన విషయాలను చెప్పాడు. రుద్రమదేవి గణపతిదేవచ క్రవర్తి కన్నకూతురు. అయితీ ఈమె గణపతిదేవుని భార్య అని ఏకాద్రనాథుడు పారపడ్డాడు.” కృష్ణదేవరాయలవారి సమీపకాలంలో ఉండే మొల్ల తిక్కన సోమయాజి కాలం నాటిదనుకొన్నాడు. ఆమె తన రామాయణాన్ని ప్రతాప రుద్రుని కంకితమివ్వబోయిందని చెప్పాడు. ఇటువంటి చారిత్రక లోపాలు ఎన్ని ఉన్నా ప్రతాపచరిత్రకు మన సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. తన కాలంనాడు ప్రచారంలో ఉన్న విషయాలను ఏకామ్రనాథుడు గ్రంథస్థం చేశాడు.

అయితే ఏకామ్రనాథుడు ఎప్పటివాడు అన్నది ప్రశ్న ఈ సమస్యను ప్రతాపచరిత్ర లోని అంతరంగిక సాక్ష్యాలతో పరిష్కరించాలని ఖండవల్లి లక్ష్మీరంజినంగారు ప్రయత్నించారు. విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన వీరనరసింహరాయల్ని ఏకామ్ర నాథుడు పేర్కొన్నాడు. కాకతీయ రాజులలో ఏడవవాడైన భువనైకమల్లుు “చతురంగ బలంబులతో విజయనగరంబుపై వెడలి యప్పురంటేలు వీరనరసింహరాయల గెల్చి అతనితో అప్పనంబులుకొన్నా''డని ఏకామ్రనాథుడు వ్రాశాడు.” వీరనృసింహరాయలు కృష్ణదేవరాయలవారి అన్నగారు. ఇతడు క్రీ.శ. 1505-1509 మధ్య విజయనగరాన్ని పాలించాడు. ఏకామ్రనాథుడు మొల్లను కూడ పేర్కొన్నాడు. ఈ అంశాలను చర్చించిన ఖండవల్లివారు. ఏకాద్రనాథుని ప్రతాపచరిత్ర క్రీశ1550 ప్రాంతాలలో రచించిన (గ్రంథమని భఖావిస్తున్నారు.9 ప్రకాపచరిత్రకు చాలా ప్రతులు ఉన్నట్టున్నాయి. తెలుగు రాజుల చరిత్రము అనే పేర మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఒక ప్రతి ఉంది. (౧.749) దానిలో చివర ఇలా ఉంది

ప్రతాపరుద్రుడు ఏకశిలానగరంబు ఏలి నిరిచారణపోయిన వెనుక ప్రకాప వీరభద్రయ్య సులతానివశాన యేలిన యేండ్లు 3. ఆ వెనక డిల్లీశ్చ్వరుని వశంబు చేసుకొని యేలిన యేండ్లు 48. వారు చాలించుకొని పోయిన తర్వాతను ఓరుగల్లు అంతరమన్నీలు వెమానుములుకు మొదలైనవారు హనుమకొండ కాణా చేసి యేలిన యేండ్లు 14. తర్వాతను గజపతి రాయలు వెనక కేచర్లవారు రాజ్యము చేసిన యేండ్లు 53. ఆ తర్వాతను చితాపఖానుడు ఓరుగంటిలో చెట్టు నరికి కుంచాలు పోయించి పయిన గట్టించి యేలిన యేండ్లు 18. అతని కుటూరుడు దముసరమలక యేలిన యేండ్లు 7. తర్వాతను విభరాము 8. తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, నంబఐట, పుటజు 7, ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక, సం. 7, పుట 13.

  1. ఆంధ్రసాహిత్య పరిషత్సత్రిత సం. 7, పుకు 206.
  2. అదే పత్రిక, సం. 6 పుటలు 447, 44. శ. సిద్ధేశ్చ్వరచరిత్రము (ఆంభ్రరచయితల సంఘం, ష్టాదరాబాదు వారి ప్రచురణ) ఇంగ్లీషు పీఠిక పుట 5.

ఏళామ్రనాథుడు, చరిత్రకారులు 381 కొమారుడు యేలిన యేండ్లు 6 నెలలు. ఇటు యివతలను రుధిరోద్దారినామ నం। పుష్య బ 5 శనివారంనాడు మహమ్మదు ఖుల్లీపాదుషాహ మహావైభవదేవేంద్రుడై యేలుచున్నాడు.

ఈ వివరాల ప్రకారం ప్రతాపరుద్రుని కాలంనుండి తెలుగు రాజుల చరిత్ర రచనందాకా రెండువందలా ఏడున్నర సంవత్సరాలు జరిగింది.

ప్రతాపరుద్రుని నిర్యాణం క్రీశ 1328

ప్రతాపచరిత్ర రచనదాకా జరిగిన కాలం 207-6

రచనాకాలం క్రీశ 1533-06

అయితే ఈ లెక్క తప్పు అని చెప్పాలి. మహమ్మదుకులీ క్రీ.శ 1582 నుండి 1611 దాకా పాలించాడు. తెలుగు రాజుల చరిత్రలో మహమ్మదుకులీ పాదుషా పరిపాలనలో ఒక రుధిరోద్దారి వచ్చిందని తెలుస్తున్నది. క్రీ.ఈ 1564లో ఒకసారి, క్రీ.శ 1623లో &౬.కసారి రుధిరోద్దారి వస్తున్నది. అయితే ఈ శకవర్దాలలో పుష్యబహుళ పంచమి తిథి శనివారంరాడు రాదు. తిథివారాలు సరిపోయిన రుధిరోద్గారి రెండుసార్లు కనబడుతుంది. ఆ వివరాలు ఇవి:

6-1-1504రుధిరోద్దారి పుష్య బహుళపంచమి శనివారం

3-1-1564రుధిరోద్దారీ పుష్క బహుళపంచమి సోమవారం

31-12-1623 రుధిరోద్గారి పుష్య బహుళపంచమి బుధవారం

28-12-1683 రుధిరోద్గారి పుష్య బహుళపంచమి శుక్రవారం

24-12-1743 రుధిరోద్నారి పుష్య బహుళపంచమి శనివారం

తెలుగు రాజుల చరిత్ర చివర ఇచ్చిన వివరాల ప్రకారం సరిపెట్టుకోవాలనుకొంటే క్రీశ 1623లో రుధిరోద్గారి కొంచెం దగ్గర్గోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పటికి మహమ్మదు కులీ రాజ్యం అంతమై ఒక పుష్కరం దాటింది. క్రీ.శ 1612 నుండీ 1626 దాకా సుల్లా మహమ్మదు పాలించాడు: ''మహావైభవదేవేంద్రులై యేలుచున్నాడు'' అని రచయిత చెప్పిన పాదుషా ఈ సుల్తాన్‌ మహమ్మదు అని భావించవచ్చు. రచయిత చెప్పిన రాజ్ఞుకాలం లెక్కలో ఇభరాముని ముప్పయి సంవత్సరాలు కలియలేదు. ఏమయినా ఇభరాముని కాలంలోనో, లేక అతని తరువాతనో ప్రతాపచరిత్ర రచన జరిగిందని మాత్రం చెప్పవచ్చు. ఇభరాముని కాలంలో అయితే క్రీ.శ. 1664 రుధిరోద్దారి అనీ, ఇభరాముని తరువాత వచ్చినదైడే క్రీ.శ1623లో రుధిరోద్నారి అనీ చెప్పుకోవాలి. ' బహుశా ఏకాయ్రనాథుని కాలం ఈ రెంటిమధ్యుదని చెప్పుకోవడం భావ్యం.

అది దోనూరి కోనేరునాథుని కాలం. ఆయన రాజరాజనరేంద్రునికి సారంగధరుడనే తుమారుడున్నాడని చాలా ప్రచారం చేశాడు. ఏకామ్రనాథుడు తూడా “విజయాంశునకు విష్ణువర్ధనుండు జిన్మించె. అతనికి రాజరాజనరేంద్రుడు జన్మించె. రాజ నరేంద్రనికి సారంగధరుడు జన్న్మించె” అని వ్రాళాడు.!* మన రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజరాజనరేంద్రునికి సారంగధరుడు తుమూరుడని తొలిసారిగా చెప్పిన తిలుగుకవి 11, ఆంధ్రసాహిత్య పరిషత్సత్రిక, నం.6, పుటు 36.

382 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సయపుటి దోనూరి కోనేరునాథుడు అని ఇంతకు ముందు అతని చరిత్రలో చెప్పుకొన్నాం అందుచేత ఏకాయ్రనాథుడు దోనూరి కోనేరుకవికీ సమకాలికుడని చెప్పవచ్చు.

ఏకాయ్రనాథుని ప్రతాపచరిత్రవల్ల ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి. ప్రతాపరుద్రుని అస్థానంలో ఉంఢే మంత్రులు, కవులు, పండితులు మొదలైనవారి వివరాలూ, ఆనాటి వైభవాన్ని సూచించే లెక్కలూ మొదలైనవి ఏకామ్రనాథుడు ఇచ్చాడు. నాటి రాజకీయ చరిత్రను కాకపోయినా సాంఘిక చరిత్రను ఏకామ్రనాథుని రచనవల్ల బాగా తెలుసుకోవచ్చు. చారిత్రక గ్రంథాలను వ్రాసేవాళ్లకు ఏకాదమ్రనాథుడే నిజంగా మార్గదర్శకుడు. అతని రచనను ఆధారం చేసుకొని కానె సర్వప్ప అనే కవి సిద్ధేశ్వర చరిత్ర అనే ఏర కాకతీయుల చరిత్రను ద్విపదకావ్యంగా వ్రాశాడు. ఏకామనాథుడే తనకన్నా ముంచు ఈ కథ చెప్పాడని సర్వప్ప తన గ్రంథంలో చెప్పాడు.

యతని యనుమతి నేకాయనాథుండు - మతిమీర జెప్పిన కత వచించెదను.

(సిద్ధేశ్వర. 2.6-9, పుట 2)

సర్వప్ప మాటలవల్లనే అతడు ఏకాధ్రనాథునికి అర్వాచీనుడని తెలుస్తున్నది ఒకతరం తేడా ఉండవచ్చు. సర్వప్పు ముత్తాత పేరు మల్లన. ఇతడు “బయకారములు పెక్కు పద్యుకావ్యములు నయమొప్ప జెప్పిన నాగరకుడు.?”' సర్వప్ప తండ్రిపేరు కూడా మల్లప్పరాజే. అతడు తూడా గాన విద్యలలో ఆర్‌తేరినవాడు. సర్వప్ప తాను అట్టే చదువుకోలేదని చెప్పాడు.

శబ్దసంగతులును శా స్తాదివిమల-శబ్దలక్షణములు చర్చించి యెరుగ

నాటకాలంకారనవ్యరీతులను- తకూటువలుంకువల్‌ గుణదోషఛంద

వాటంబులేమియు వరుసతో నెరుగ............ (సిద్ధేశ్వర. 6-22, 7-1) ప్రతిభ లేకపోవచ్చు. వ్యుత్పత్తి అభ్యాసం కొరవడవచ్చు. కాని ఉత్తమాదర్శంతో పూర్చరాజుల కథలను చెప్పడంలో కానె సర్వప్పు చిత్తశుద్ధిమాత్రం ప్రశంసనీయం. వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు, మాత్రాధిక్యాలు ఉన్నా సిద్ధేశ్వర చరిత్రవల్ల వేరే ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని కవిత్వం కోసం చదువుకోనక్కళ్లేదు. చారిత్రక సంప్రదాయం కోసం చదవాలి. సిద్ధేశ్వర చరిత్ర చరిత్రకారులకు చాలా విషయాలను ఇచ్చింది.

సర్వప్ప ద్విపదలను వ్రాస్తున్నా ఏకాయ్రనాథుని ఒరవడిలో వచనంలోనే చారిత్రక గ్రంథాన్ని వ్రాసినవాడు మరొకడున్నాడు. అయితే అతని పేరేమిటో తెలియదు. మధుర నేలిన నాయకరాజులలో ఒక విశ్వనాథనాయనయ్యగారి స్థానాపతి తన ప్రభువుకు బ్రాసీన విన్నపం '“రాయవాచకం' అనే పేర ప్రసిద్ధమైంది. కృష్ణదేవరాయలవారి కాలంలో మధురనాయక రాజ్యాన్ని కటికం విశ్వనాథనాయకరసయ్య స్థాపించాడు. అంిశే రాయవాచకాన్ని వ్రాసినది ఇతని స్థానాపతి కాదు. క్రీ.శ 1595 నుండి 1901 దాకొ మధురను రెండవ కృష్ణప్ప అనే నాయకరాజు పాలించాడు. అతనికి విశ్వనాథుడనే

ఏకా మ్రనాథుడు, చరిత్రకారులు 383 తమ్ముడున్నాడు. ఈయన స్థానాపతే రాయవాచకాన్ని వ్రాశాడని సుప్రసిద్ద చరిత్రకారులు నేలటూరి వెంకటరమణయ్యగారు నిశ్చయించారు.2 ౦

రాయవాచకం ఆనాటి వ్యావహారికంలో వ్రాసిన చక్కని వచనగ్రంథం. ఇందులో కర్ణాటక రాజుల దినచర్య, విద్యారణ్య హంస విద్యానగర నిర్మాణం, శంకుస్థాపన ముహూర్తం, కృష్ణరాయల _ పట్టాభిషేకం, కృష్ణరాయనికి మంత్రులు రాజనీతి ఉపదేశించడం, లోకవార్తలు తేవడానికి వేగర్లను నియమించడం, కోశాది వివరణ, కృష్ణ రాయలు పట్టణ శోధనకు వెళ్ళడం, రాయల సేన వివరణ, సాళువ తిమ్మరుసు ప్రశంస, విజయాపుర వృత్తాంతం, అశ్వపతి, గజపతి, నరపతుల తారతచ్యుం, తురుష్కుల శీలం, అహమ్మదాబాదు గోలకొండల వృత్తాంతం, తురుష్కరాబ్యంలో దండనవిధం, గజపతివారికి విరోధులు విషప్రయోగం చేయించడం, రాయలు తురకలమీదకు యుదానికి

ఛి

వెళ్ళడం, వివిధ విజయాలు మొదలైనవి ఉన్నాయి. ఇది ఒకవిధంగా కృష్ణరాయచరిత్ర దీనిని వచనంలో వ్రాసినా స్థానపతి మొదటి నాలుగు పద్యాలు వ్రాశాడు.

విజయనగరవృత్తాంతము - సుజునులచే విన్నయట్టి సూనృత వాక్కుల్‌

ప్రజలకు దేటపడంగా - సృజియించితి గృష్టరాయశేఖరు చరితల్‌ (రాయ. 1)

తన ప్రభువైన విశ్చ్వనాథనాయకరసయ్యవారికి చేసుకొన్న విన్నపం ప్రజలకు చెప్పుకోవడం గమనించదగ్గది. తన గ్రంథాన్ని బ్రాయసాలు చదవాలని స్థానాపతి ఆశించాడు.

రాయలకు రాజనీతులు- నాయుడు నప్పాజి చెప్పినవి యన్నియు దా

బాయక మనసున నునిచినారాయసములు వ్రాయ జదువ రసికత గలుగున్‌:

(రాయ. 3)

తన రాయవాచకాన్ని బాలురు కూడా చదవాలని స్థానాపతి కాంక్షించాడు. ఇలా చెప్పాడు:

బాలురు చదివిన బుద్ధిని-శాలురు గావలయు శాన్తజాలంబులలో

లోలుగు నరవధచింతా-శీలురు గావలయు భక్తిశీలత నెపుడున్‌. (రాయ. 4)

చరిత్ర గ్రంథాల ప్రయోజనాలలో కొన్నిటిని స్థానాపతి బాగా వివరించాడు. తన కాలంనాటి వ్యావహారిక భాషలో వ్రాయడంవల్ల ఇవాళ్ళి వాళ్ళక. కొంచెం ఇబ్బంది పెట్టే రచన ఇది. దీని గురించి నేలటూరి వెంకటరమణయ్యగారు ఇలా అన్నారు.

రాయవాచకము. 16వ శతాబ్దాంతమున రాయసాత్రూజ్యమున రాజకార్య వ్యవహారములను నడుపు అధికారవర్గమునందు చలామణీ యందుండిన భాషయందు వ్రాయబడినది. పార్సీభాష సంపర్కమువలన ఆ భాషనుండీ రాజకీయ పారిభాషికపదము లనేకము లిందుజొచ్చినవి. తత్కారణమున నది సులభగ్రాహ్యము గాక పాఠకులకు క్లేశము కలిగించుచున్నది. అతి దీర్హ వాక్యములును ప్రాతవచన రచనావిధానమును అచటనచకు భావహైైద్యమునకు బంధకములై వృథాజనకము లగుచున్నవి. కాని, మొత్తముమీద నిందలిభాష, పాౌల్గుమాటలుగాని, యనావశ్యక వర్జనలుగాని లేక, పటుత్వము గలిగియున్నుది. 12. మధుర తంజావూరు నాయకరాజుల నాటీ “ఆంధ్రవాజ్బ్యయ చరిత్ర - దాక్షిణాత్యాంధ్రసాహిత్యం',

పుట 74

  1. దాక్షిణా-త్యాంధ్రసాహిత్యము,పుట 74,75,

384 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఇటువంటి చరిత్రలు రమారమి పాత శాసనాలవంటివి. చరిత్రకారుల శ్రమ ఊగ పోదు. ఎన్నో విషయాలు చెప్తుంది. దేశ చరిత్రకేకాక సాహిత్య చరిత్రకు కూడ రాయవాచకం ఉపయోగపడుతుంది. కృష్ణదేవరాయలవారి పట్టాఖిషేకళాలంనాటికి నగర విద్వాంసులలో చతుర్వేది రామాదీక్షితులు, అష్టభాషాకవిత్వ కృష్ణావధానులు, శాళ్డిక పాండిత్యం వెంకటరామశాస్తుర్లు సహస్రావధాని ప్రభాకరశాస్తుర్లు ఉండేవారట. వీ పేర్లు ఇతరచోట్ల కనబడవు. రాయవాచకం రచనాకాలంనాటికి ఇరవై యతిఖేదాలే ఉండే వాటి వివరాలు ఇవి: “స్వరపడి, ప్లుతపడి ఉభయపడి హృద్యునుస్వరవికల్చ ప్రాగ్సృవసంశయ వ్రభువిభాగంబుల కాకు ఆదేశనిత్యఆర్య అఖండవర్గతక్కటి యెక్కి సరసలాటవకుళలను ఇరవైవళ్ళ భేదముల...” (రాయ. పుట 24)

అనాడు మంత్రులు రాజులకు ఎలా విన్నపం చేసేవారో రాయవాచకం విశదపరుస్తుందిః “అపూర్వమైన మనుష్యులు దొరికితి సకలమును సంతరించవచ్చును' అని రాయలవారు పలకరిస్తే అయ్యమరసుగారు ఇలా విన్నపం చేశారకు.

సింహాసనస్థునకు స్త్రీలున్ను రత్నములున్ను గలిగినది అయితే అంతకన్నా అధిక మహీపతుల కనగా నీతి పద్యం.

పతి ధరిత్రియు బురుషులె - రత్నములెప్పుడు బురంధ్రి రత్నములు శిలా

రత్నము లవనీపతులకు- బత్నులెరత్నములు వగవబద్దెనరేంద్రా (నీతిశాస్త్ర నవరత్నములున్నుు చతురంగబలములనున్న సంతరించగలడు. అటు గనక అప్పాకీ సాధారణనియ్యోగిగా యెంచవద్దు. ఆయన అసాధారణ నియ్యోగి. ఉఘటనఘటనా సామర్థ్యం ఆయనకే గలదు. అవి యేలాగంటేను - అందరున్ను మనుష్కులు. అందరికీన్ని అవయవాలు సరి. ఇందులో ఉత్తములు మధ్యములు అధములు అని యెటి యేర్చరచవలెను. అది యేలాగంటేను - గుణాధిక్య్కమువల్లను యెక్కువ మరిన్ని పంచలోహములున్ను అన్నియు సరి. అందున బంగారు హెచ్చింది. యేంది అంటీ వొరియకకు రాంగా వన్నై హెచ్చించినట్టు గుణాధిక్యంవల్ల మనుష్కులలోనుగ్నీ అప్పాజీని అధికుడని యెరుగవలెను. అది యేలా గంటేను -

శో॥ శతీషు జాయతే శూరః సహసీషుచ పండితః అనే నీతి ప్రకరణకు నూటికి వక బంటును వెయ్యింటికిఒక పండితుడున్న, లక్షతు వఖడు వక్తుండై సభాస్థలిని మాట పలుకులాడును. శీమలో వఖడు దాత అనేది కలండో లేడో అన్నట్టు వొఖరు గాక అందరికిన్ని ఆ గుణములు యాల వచ్చీని అని అయ్యమయ విన్నపంవేసి. (రాయవాచకం, పుటలు శ, టి)

అందరూ మనుష్యులే అయినా ఉత్తములు వేరైనట్లు అన్నీ గ్రంథాలే అయినా వనికొచ్చేవి వేరు. రాయవాచకం మనకు చాలా విధాల ఉపకారం చేస్తుంది. కాకతీయలి చరిత్రను ఏకాద్రనాథుడు వ్రాసినట్లే విజయ నగర రాజుల చరిత్రను స్థానాపతి చక్కని

వెదపాటి జగ్గన్న 385 వచనంలో వ్రాశాడు. సర్వప్ప ఆ చరిత్రను ఛందో బద్ధం చేసినట్లే కుమారధూర్జటి తరువాతి యుగంలో ఈ చరిత్రను గణబద్ధం చేశాడు. అయినా చరిత్రలు వచనంలో వుంటేనే మంచిదని అనంతర రచయితలు గుర్తించారు.

ఏకామ్రనాథుని ప్రకాపచరిత్ర, స్థానాపతి వ్రాసిన రాయవాచకం తొలి చారిత్రక గ్రంథాలే కాక మనకు లఖించే తొలి వచన రచనలుగా కూడ మన సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమిస్తాయి.

పెదపాటి జగ్గన్న

ఆఅంధ్రసాహిత్యంలో కొన్ని గ్రంథాలు కేవలం నామమాత్రావశిష్టం కాకుండా కవీంద్ర కావ్యునామాలు తెలుపుతూ ఎన్నో కొన్ని పద్యాలను ఉదాహరిస్తూ ఒక సంకలన గ్రంథాన్ని రచించి దేశానికి ఉపకారం చేసిన చిరస్మరణీయుడు పెదపాటి జగ్గన్న, ఈవిధమైన సాహిత్య సేవ చేసినందుకు ఇతనికి తెలుగుదేశం ఎంతగానో బుణపడి ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. సంకలన గ్రంథాలను రచించినవారిలో ఇతను మూడవవాడు. ప్రప్రథముడు మడికి సింగన. తన కాలంనాటికి సుప్రసిద్ధమైన కావ్యాల నుండి నీతులను సేకరించి 'సకలనీతి సమ్మతము' అనే నీతిశాస్త్రాన్ని సింగన సంతరించాడు. ఇతడు క్రీ.శ 14వ శతాబ్ది చతుర్ధపాదంలోనివాడు.]

ఈ సింగన తరువాత చెప్పదగిన సంధానకర్త పేరు దురదృష్టవశాత్తూ మనకు తెలియదు. అతడు పెదపాటి జగ్గన్నకు కొద్దిగా ఒక తరం ప్రాచీనుడు కావచ్చు. అతని సంకలన గ్రంథం ఆంధ్రసాహిత్యపరిషత్తువారి గ్రంథాలయంలో “ఉదాహరణ పద్యములు" అనే పేరుతో అసంపూర్ణంగా ఉంది. మొదలూ తుదీ లేని ఈ సంకలన గ్రంథంవల్ల ఏఖైముగ్గురు కవుల రచనలు దేశానికి దక్కాయి. ఇందులో ముపష్ఫయ్యొక్కమంది పద్యాలు ప్రత్యేకం ఈ _ గ్రంథకర్త సంకలనంలోనే _ దొరుకుతున్నాయి. వీటిని జగ్గన్న ఉదాహరించలేదు.

పెదపాటి జగ్గన్న ఇంటిపేరు రామాప్రైగ్గడవారు. పెదపాడులో ఉండబట్టి ఆ కుటుంబాన్ని పెదపాటివారని వ్యవహరిస్తున్నాం. జగ్గన్న కావ్యలక్షణగణితాది సత్కళా ప్రజ్ఞావిశేషవైభవాలు కలవాడు. రాజసభలలోనూ, విద్వత్సభలలోనూ రసికబాంధవులచే ప్రస్తుతింపదగిన ధర్మాచారనియతి గలవాడు. అతడు జననుతులైన కవీశ్చ్వరుల సత్కృతి సారాన్ని 'కావ్యసారవర్దనం' అనే గ్రంథంగా చేయదలిచాడు. ఈ సంకల్పం కలగగానే ఇతనికి జగన్నాథుడు కలలో ప్రత్యక్షమై ఇలా అన్నాడట.

ఆరయ రామపైగ్గడ కులాగ్రణి గంగయమంత్రిజగ్గ మా "

పేరిటివాడ వెప్పుడును ట్రేమ ఘనంబగు మాకు నీపయిక్‌,

గౌరవలీల నీవు సమకట్టిన మేలిమి కావ్యసార మిం

పారగమత్సమర్ప ణము నన్నహకీర్తిగేయునావుడున్‌. (ప్రబంధ. అను.4)

  1. పద్మనాయకరెడ్డిరాజుల యుగాలు, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి, 2002

386 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ మనసులో ప్రమోదాయత్తుడై పెదపాటి జగ్గన్న ఇలా అనుకున్నాడట: జననుతులౌ కవీశ్చ్వరుల సత్కృతిసారము కావ్యసారవ ర్హన మనిచేసి నీలగిరినాథుని కర్చ్పణసేయు టొప్పు జి క్కని పదియారువన్నై కనకంబున వాసనకమ్మకస్తురిన్‌ గనదురుకాంతియున్‌ జెరకునన్‌ ఫలమబ్బుట భాగ్యమేకదా (ప్రబంధ. అను) ఈ మేలిమి కావ్యసారాన్ని. జగన్నాథునికి అంకితమివ్వడం జగ్గన తన భాగ్యమని భావించినా అది నిజంగా ఆంధ్రుల భాగ్యం. తెలుగు సాహిత్యంలోని కొన్ని మణిపూస లను అతడు భద్రపరిచాడు. 9 మంది కవులపేర్లూ, 78 గ్రంథాల నామాలూ చెప్పి కొన్ని వందల పద్యాల గుత్తులను గుచ్చాడు. అతడు చేసిన విభాగాలవల్ల ఆంధ్రసాహిత్యాన్ని ఎన్ని అంశాలుగా కేటాయించవచ్చో తెలుస్తున్నది. ఏ ప్రబంధంలోని పద్యమైనా ఈ విభాగాలలో ఏదో ఒకదానిలో ఇమడక తప్పుదు. చూడండీ : ప్రథమాశ్వాసం 2౫. ఉద్యానవనాలు

  1. నారాయణస్తుతి 7. సరోవరాలు ఓ శంకరప్రభావం 2౫. మలయమారుతం 3 ట్రిపురవిజయాఖిరామం ఇ. ఏనుగులు & అర్థనారీశ్వరం 30. గుర్రాలు ౬. హారిహరాత్మకం 31. పదాతివర్గ వర్ణన ఏ కమం వావశి టి | ర్ధిస్తు శి ర ౬ లక్షీగౌరీసరస్వతీప్రభావం 2 వో కి జ (న వె న్థత్తగీతవాద్య సాహిత్య సమంజసం
  2. చంద్రాదిత్యుల ప్రభావం “౫. క నీరాజనవిధానం గ్‌ వైనతేయశేష ప్రశంస | ౬. చప్పన్న దేశాల పేరులు జి. . గ కొత్తిచూపులు జ. మన్మథవిభ్రమం జ. అన్యోన్యవీక్షణం ళా. పురవర్దన 11. దశావస్తలు ఇ. ప్రాకారాలు, పరిఖలవర్జ్దన ఇ స్త్రీ పురుష విరహాలు ఇ. ప్రాసాదాలు. ధ్వజాలు, సాలభంజికలు 3. విరహఖభ్రాంతి గోపురాలు, దేవాలయాలు, గృవాలు ౫ కశిరోపచారాలు జ శు సఖీవాక్యాలు ౫. గ్రహ్మక్షత్రియవైశ్యశూద్ర (వర్ణన) జ. మన్మథచంద్రాదిప్రార్థనలు
  3. వుష్పలావికలవర్దన . 7. వారిని దూషించడం" లె వారాంగనలు 2. వైవాహికపతివ్రతాలక్షణాలు మ పామరకాంతలు ఇ. అభ్యంగనవిధి చెంచెతలు ౫. మాపకారపెరాబికాలు

పెదపాటి జగ్గన్న 387 2. భోజనమజ్ఞనతాంబూలాదులు 8. నిశివిడంబనం 2. కేళీ గృహాలు 30. జారసంచారలక్షణం ౫. సురతప్రకారం 31. చంద్రోదయం జ. సురతాంత్యశ్రమ ౩2. చంద్రకిరణలాంఛన చంద్రికా విభ్రమాలు ౫. సంతానవాంఛ ఇ. చతోరికావిభ్రమాలు 2. గర్చలక్షణం 3౫. చకోరికావిహారాలు ౫. పుతోదయం 35. వేగుచుక్క పాడవడం 2. బాలెంత లక్షణం ౫. కోడికూత ౫. బాలక్రీడ ౩7. చంద్రతారకాస్తమానాలు 31. వ్రోవం ౫. ప్రత్యూషం ౫. యౌవనప్రాదుర్భావం ౫. ప్రభాతమారుతం ఇ. సాముద్రికం 40. అరుణోదయం తీయాశ్వాసం 41. ప్రభాతరాగోదయం 1 రాజనీతి త మిగిలిన ఆశ్వాసాలు 2. సేవకనీతి 1. మధ్యాహ్నసూర్యవిడంబనం ఇ లోకనీతి 2, గ్రీష్మం ॥ 4 సుజనప్రవర్తన 3 వానాకాలం 5. కతుజనవ్యాప్తి 4 శరత్కాలం ఓ అన్యాపదేశాలు 5. హేమంతం 7, సూర్యాస్తమానం 6 శరం &ఒ సాంధ్యరాగం 7. వసంతం 9. సాయంకాలసమీరణం 8 వనవిహారాలు 10. దీపకశికావిధానం $. దశదోహదాలు 11. విదియచంద్రుని చందం 10. తుమ్మెదలు పక్షులు మొదలైనవాని 2. తారకావర్జన విరామ సంచార లక్షణాలు 13. చక్రవాకవియోగం 11. జలకే?ి ౫4. విటవిడంబన, లక్షణశృ్ళంగారాలు 12. వస్త్రాభరణ వర్ణన ౪. విటలక్షణం 13. మధుపానం ౫. వేశ్యాలక్షణం 4. సిద్ధపురుషప్రభావం

  1. తుటీవేళ్యాచేష్టలు ౫. యోగినీప్రభావం ౪. వేశ్వమాత ప్రగల్భాలు ౪౫. ద్యూతలక్షణం
  2. భద్ర, దత్తక, కూచిమార 17, వేట పాంచాల లక్షణాలు 9. మృగలక్షణాలు
  3. చిత్తినీ, హస్తినీ, శంఖినీ, పద్మినీ జాతులు ౫. సముద్రవర్ణన 21 బాల, యౌవన, ప్రౌఢ, లోల ౫. దాని దాటడం అనే విఖేదాల లక్షణాలు 21. సేతుబంధం
  4. కూటప్రకారం 2. నదీవర్ణన జ, రతివిశషం జ. పుణ్యక్షేత్ర ప్రభావం ౩ రతివర్షనం 2 వ్రతమాహాత్మ్యం ౫5. కళాస్తానవేోషాలు ౫. నారదుడు అగస్త్యుడు ౫. ప్రణయేకలహం మొదలైన బుషుల ప్రభావం ₹. అందులోనేతూర్మి ౫. వైరాగ్యయోగతపోలక్షణాలు 2౫. అంధకారం కళ తపోవిఘ్నం

3838 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ౫. దేవతా ప్రత్యక్షం 46. రోదనం 2౫. దండయాత్ర 46, శకునాలు 30. శంఖభేరీరావాలు తాం స్ట్రస్తపలాలు . గుణధ్వని 4. జ లు శం. నా ఇ. బాణపాతం 50. శృంగారం నో ప్రతిజ 61. భావవిస్తారం “ ఇ 62. కీర్తి ఆఅ. వీరాలాపాలు శే 53. భూభరణం 38. దూతవాళ్యాలు 54 గాంఖీర్యధైర్యగుణాలు ఇ. హీనాధిక్యాలు ణ్‌. దానవిశేషాలు ౫8. రణప్రకారం 6. ధాటీచాటు ధారావిశేషాలు య మల్లయుద్ధం 57. పరోక్షం 4. రణ ఈ. కల్పితకల్పవల్లి 41. రణాంత్యం 69. చక్రబంధం, నాగబంధం, మొ॥ 4 లొ భైన్యగుణాలు 4. పాదగోపనం, పాదభ్రమకం మొదలైనవి 4. మనోవ్యథ 61. నిరోష్ట్యం ఊఉ. ధనికులు, దరిద్రులు, క్షుధార్తులు యణ. దక్ష! మొదలైనవారి లక్షణాలు ల. నవరసోత్పత్తి తన కాలం నాటికి ప్రచారంలోనికి వచ్చిన గ్రంథాలన్నిటినీ కాచి వడబోయడం వల్ల పెదపాటి జగ్గన్న ఈవిధంగా విషయ శీర్షికలను పేర్కొనగలిగాడు. సుప్రసిద్ధ గ్రంథాలనుండి ఎన్నదగిన పద్యాలను ఈ శీర్తికలలోనికి చేర్చుకొని అయిదాశ్వాసాల కావ్యంగా అతడు సంతరించాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ సంకలన గ్రంథంలోని మూడు ఆశ్వాసాలు మాత్రమే మనకు దక్కాయి. దీని బ్రాతప్రతి తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలో ఉంది. ఈ మూడు ఆశ్వాసాల వల్లా తెలియవచ్చే ౫ మంది కవులలోనూ తెనాలి రామలింగడు ప్రసిద్ధులలో అర్వాచీనుడు. పింగళిసూరన, రామరాజభూషణుడు మొదలైనవారి గ్రంథాల నుంచి ఉదాహరించకపోవడంవల్ల పెదపాటీ జగ్గన్న వాళ్ళకు సమకాలికుడని, ఆ గ్రంథాలీసంకలనం తయారయ్యేనాటికి ప్రచారు పొందలేదని భావించవచ్చు. కచ్చితమైన ఆకరాలు దొరోోదాకా ఏ కవి కాలాన్నయినా నిర్ణయించకూడదు. పెదపాటి జగ్గన్న గురించి రాస్తూ “ఈ కవి కాలనిర్ణయమనేక కవుల నిర్ణయమునకు దోడు యగుటచే. జగ్గకవి కాలమును సరిగా దెలుసుకొనుటకై భావిపరిశోధకులకు సాహాయ్యమగునను తలపు” సాహిత్య చరిత్రకారులు తెలియజేస్తూ కొంత చర్చించారు ఈ కవి క్రీ.శ 1550-60 ప్రాంతాలవాడని అప్పటికి దొరికిన ఆకరాలతో నిర్ణయించారు. అయితే తదనంతర పరిశోధనలు కొన్ని కొత్త విషయాలను విశదం చేస్తున్నాయి పెదపాటి జగ్గన్న తన సంకలనంలో తెనాలి రామలింగయ్య రచించిన 2 తంజావూరు గ్రంథాలయం వర్ణనాత్మక కేటలాగు (అంధ్రవిశ్చవిద్యాలయ ప్రచురణ), సంఖ్య 184,పుట 47. 3. చాగంటి శేషయ్య, ఆంధ్రకవి తరంగిణి - 10వ సంపుటి - పుట ౪2 నుండి

పెదపాటి జగ్గన్న 389 హరిలీలావిలాసంలోనివని చెప్తూ 21 పద్యాలను ఉదాహరించాడు. వాటిలో ఒకటి మాత్రం రామరాజు రంగప్పరాజు రచించిన సాంబోపాఖ్యానంలోనిదని తేలింది. సాంబోపాఖ్యానాన్ని రంగప్పరాజు క్రీ.శ1560 ప్రాంతాలలో రచించి ఉంటాడని తూత అంచనా వేశాం. (176)

ఫణిధవుమాధవుడు అనే కవి రచించిన ప్రద్యువ్నువిజయం అనే కావ్యంలోనిదని చెప్తూ పెదపాటి జగ్గన్న ఈ క్రింది పద్యాన్ని ఇచ్చాడు.

అత్రిముని కంటి పసువిడ్డ డాకసమున

నుడుగుణములాడకడకు నొడ్డగిలిన

బాలభానుండు నలుగడ ఒర్నమీటు

వెండిగుండన నుదయించె వేగుజుక్క (ప్రబంధ - ౫50)

అయితే ఈ పద్యం అద్దంకి గంగాధరుడు రచించిన తపతీ సంవరణం అనే కావ్యంలోనిది (తపతీ-3-3104). కవుల పేర్లూ. కావ్యాల పేర్లూ చెప్పడంలో పెదపాటి జగ్గన్న అక్కడక్కడ పొరబడటం జరుగుతూనే ఉంది. అద్దంకి గంగాధరుడు తన కావ్యం ఎప్పుడు రాశాడో తెలుసుకొనడం ముఖ్యం. “తపతీ సంవరణము 1550 ప్రాంతమున సంకల్పింపబడి, రచింపబడి 156 ప్రాంతమున ఇభరామునకు అంకితము చేయబడినది”' అని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు.

కవి పేరు రమారమి సరిగ్గానే చెప్తూ పెదపాటి జగ్గన్న ఇంకొక కావ్యనామంలో పౌరపడీ ఒక పద్యాన్ని ఉదాహరించాడు.

'తెలతిలవాఅ నొయ్య నరుదెంచు నిశాంత రకాంతతాంతలౌ

చెలువల కింపుగా మెలగు జెక్కుల గూరిన చూర్ణతుంతలా

వళి సరసంబుగా జుడియు వాడిన నెజ్జల మీది ప్రావిరుల్‌

దొలగగజేయు నూడిగపు దొయ్యలులంబలె వేగుదెమ్మెరల్‌ (ప్రబంధ-4ు)

ఇది తెనాలి రామలింగయ రచించిన హరిలీలావిలాసంలోనిదని జగ్గన్న చెప్పాడు. అయితే ఇది తెనాలిరామకృష్ణుని పాండురంగమాహాత్మ్యంలోని పద్యం అని పరిశోధకులు గుర్తించారు (పాండురంగ 1-119). పాండురంగ మాహాత్మ్యం రచనాకాలం కూడా ఉజ్జాయింపుగా నిర్ణయించవచ్చు. రామకృష్ణుడు తన కావ్యంలో ఒకచోట వసుచరిత్రను స్మరించాడు. భట్టుమూర్తి ప్రభావం దట్టంగా ఉండేరోబులో ఆ ప్రబంధం పట్ల తన గౌరవాన్ని చూపెట్టడానికే ఈ పని రామకృష్ణుడు చేశాడు (పాండురంగమాహాత్మ్యం 4-242). వసుచరిత్ర ్రీశ.1570 తర్వాత తిరుమల రాయలకు అంకితం చేయబడిందని సాహిత్య విమర్శకులు ఖావిస్తున్నారు.. పాండురంగమాహాత్మ్యం రచన బహుశా 1575లో జరిగి ఉండవచ్చు. 4. పాటిబండ మాధవశర్మ - తపతీ సంవరణం - పీఠిత పుట ౪౫ 8. అదే పుస్తకంలో - అదే పుటలో

390 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇటీవలి పరిశోధనలవల్ల తేలిన కాల నిర్ణయాలను బేరీజు వేద్దాం.

రామరాజు రంగప్పరాజు రచించిన సాంబోపాఖ్యాన రచనాకాలం క్రీశ.158

అద్దంకి గంగాధరుని తపతీ సంవరణ అంకీతకాలం క్రీశ166

తెనాలిరామకృష్ణుని పాండురంగమాహాత్మ్యం రచన క్రీ.శ.157 ఈ ముగ్గురు కవుల గ్రంథాలలోంచీ పద్యాలను తీసుకొన్న పెదపాటి జగ్గన ఆ మూడు కావ్యాల పేర్లనూ తప్పుగా పేర్కొన్నాడు. దీనికి బహుశా ఒకటే కారణం కనబడుతుంది ఈ పద్యాల విడివిడి కమ్మలేగానీ కావ్యాల పుత్రికలు ఇంకా ప్రాచుర్యం పొందని కాలంలో వినికిడిని బట్టి జగ్గన్న ఆ గ్రంథాల పేర్లను చెప్పడంలో పొరబడి ఉండవచ్చు. జగ్గన్న ఈ కవులకు సమకాలికుడే కావచ్చును లేక ఒక తరం అర్వాచీనుడని భావించినా సంకలనం చేసి ఉంటాడు.

ఇంతటితో ఈ కాలనిర్ణయ సమస్య పరిష్కారమైపోయిందని మనం నిట్టూర్చలేము. దీనిని జటిలం చేయడానికి కొన్ని మడతపేచీలు ఉన్నాయి. వాటిని కూడా తూలంకషంగా చర్చించాలి. అప్పుడే చిక్కముళ్ళన్నీ విడిపోయి విషయం తిన్ననవుతుంది.

జగ్గన్న ఇంటి పేరు రామాప్రగడవారు. ఈ వంశీయులు ఆదిలో పాత కృష్ణా మండలం కైకలూరు తాలూకాలోని ప్రత్తిపాడులో ఉండేవారు. తమ తాతగారు రామాప్రగడ రామయ్య ప్రత్తిపాటి పురధాముడని జగ్గన్న ప్రబంధరత్నాకరం అవతారికలో చెప్పాడు (పద్యసంఖ్య 11). తన కాలంలో ఈ కుటుంటంవారు ఏలూరు తాలూకాలోని సిద్ధపాడుకు చేరుకున్నారు. తాను “శ్రీ పెదపాటి పురీ బాలగోపాల కృష్ణప్రసాదిత శ్రీల వెలసినవాడినని బజిుగ్గన్న చాటుకొన్నాడు (పద్యసంఖ్య 21). అక్కడే “కావ్య లక్షణలక్ష్యగణితాది సత్కళా ప్రజ్ఞావిశేషవైభవాలు” అతనికి కలిగాయి. దీనికి “రాజవిద్వత్సఖా రసిక బాంధవ మాననీయ ధర్మాచారనియతి'' కారణం. పెదపాటి జగ్గన్న రసీకబాంధవులలో ఆ పెదపాటి కాపురస్తులే అయిన ఇద్దరు సమకాలిక కవులు చెప్పుకోదగ్గవారున్నారు. ఒకరి పేరు పెదపాటి సోమయ్య, ఇంకొకరి పేరు పెదపాటీ ఎర్రాప్రగడ లేక ఎర్రన్న ఈ కవిమిత్రుల గ్రంథాలలోంచి తూడా చాలా పద్యాలు స్వీకరించి జగ్గన్న తన సంకలన గ్రంథంలో చేర్చాడు.

పెదపాటి సోమయ్య గురించి చాలా టూకీగా మలిరాయల యుగంలో ఇతరకవుల ప్రకరణంలో చెప్పుకొన్నాం. ఇతడు బహుకావ్యకర్త. లాక్షణికులు ఇతణ్జీ ప్రామాణీక కవిగా అంగీకరించి ఇతని ప్రయోగాలను తమ లక్షణ గగంథంలో పేర్కొన్నారు. కూచిమంచి తిమ్మకవి ఈ పెదపాటి సోమయ్యను కవిలోకబ్రహ్మ అని పేర్కొన్నాడు. ఇతని నాలుగు కావ్యాలనుండి పెదపాటి జగ్గన్న: ఇతనికి ఒక తరం ప్రాచీనుడైన అజ్ఞాత గ్రంథ సంధాత విడివిడిగా స్వీకరించిన పద్యాలు మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి. వాటి వివరాలు చూడండి.

పెదపాటి జగ్గన్న 391 క అదా కం కరా కూర హై కేదారఖండం ౩ పద్యాలు 6 పద్యాలు త్రిపురవిజయం ఆ 1 పద్యం శివజ్ఞానదీపిక __2 పద్యాలు వః __]ఎనాన్యాల | 5పద్యాలు |__7పద్యాలు | 2 పద్యాలు ఇద్దరు సంకలన కర్తలూ, ఓక లాక్షణీకుడూ మాత్రమే కాక సమకాలికులు అనుసరించేటంత మంచి పద్యాలను సోమయ్య చెప్పాడు. ఇతనికి ఎటువంటి బంధువూ, అసలు బంధుత్వం ఉందో లేదో తెలియదుగాని పెదపాడులోనే పెదపాటి ఎన్రాపైగడ త్రుమారనైషధం, మల్లణ చరిత్రలనే రెండు కావ్యాలను రచించాడు. మొదటి గ్రంథంలోంచి ఒకటి కాదు, లెండు కాదు పదిహేడు పద్యాలను స్వీకరించి పెదపాటి బిగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో చేర్చాడు. మల్హ్లణ చరిత్ర నుండి మూడు పద్యాలను మాత్రమే స్వీకరించినట్టు లెక్క తేలింది. పెదపాటి సోమయ్య రచనలను ఎర్రన్న చదివాడని, మెచ్చుకొని అనుసరించాడని కచ్చితంగా చెప్పవచ్చు. ఇద్దరూ ఒకే ఇంటిపేరువారు,. బహుశా ఒకేవంశంవారూ, ఒకే ఊరివారు అని చెప్పడానికి ఈ సంవాద రచన దాఖలా. పెదపాటి సోమన తన అరుణాచలం పురాణం పురవర్ణనలో ఈ పద్యం చెప్పాడు. అంగయుక్తంబుగా నామ్నూయములు నాల్గు చదువంగ నేరని సద్ద్విజూతి, బ్రాహ్మపాద్మాదిపురా ణాగమేతిహాసములెజుంగని బ్రహ్మసంభవుండు, స్పకులోచితములైన సప్తతంతువులెల్ల బారమెయ్దింపని బాడబుండు, కావ్యనాటకలసదలంకార ముఖ్య విద్యులన్నియు నెజుగని విప్రవరుడు పంచయజ్ఞములును లేని బ్రాహ్మణుండు వెదకి చూచిన బొడమండు వీటిలోన (ప్రబంధ. 49) ఈ పద్యంవల్ల ప్రభావితుడై పెదపాటి ఎల్రాప్రెగడ తన మళ్లణ చరిత్రలో కథానాయకుని విద్యాభ్యాసం గురించి ఇలా చెప్పాడు. అంగయుక్తంబుగా నామ్నాయములు రెండు బల్లి పారుంబుగా బరిచయించె బ్రహ్మాండ శ్రైవాది బహుపురాణంబులు కరతలామలకంబుగా నెజింగి ఖాట్ట హైైషిక ప్రముఖ శాస్త్రంబులు నవగతంబులుగాగ నభ్యసించె శుకుల వ్యాసాది దేశికుల తత్త్వార్థముల్‌ శోధించె నామూల చూడముగను నంజనాకర్షణశ్రీయ లలవిగనియె

392 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

సరససంగీత సాహిత్య సరణి దెలిసె

నఖిల విద్యావిశారదుండయ్యె నంత (మల్హణ-1-౪) పెదపాటి ఎర్రాప్రెగడ రచించిన కుమూరనైషధంలోనిదని చెప్తూ జగ్గన్న ఈ క్రింది పద్యాన్ని ఇచ్చాడు,

కురువింద వజమయగో

పురకాంతుల వలన బొద్దు పోకలు రాకల్‌

పరికింపనరిది యయ్యును

సరసిజకైరవ వికాస సంపద దెలియున్‌ (ప్రబంధ, ౫)

వాస్తవానికి ఈ పద్యం కుమారనైషధంలోనిది కాకపోవచ్చు. ఇదే పద్యం అదే పెదపాటి ఎర్రాపైగడ రచించిన మల్హణ చరిత్రలో కనబడుతుంది (1-3). బహుశా ఈ పద్యాన్ని ఎల్రాటైెగ్గడ రెండు కావ్యాలలోనూ వాడుకొని ఉండవచ్చు. అందుచేత పెదపాటి జగ్గన్న పొరబడినట్లు భావించకూడదు.

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, పెదపాటి ఎర్రావ్రైగ్గడ తుమారనైషధం రచించడానికి గల చారిత్రత కారణాలు. ఈ యుగంలో రామరాజ భూషణుడు తన హరిశ్చంద్రనలోపాఖ్యానం రచనలో అంతకుముందు శ్రీనాథుడు శృంగార నైషధంలో అనువదించని శోకాలనూ, చూపెట్టని నైపుణ్యాన్ని ప్రదర్శించడం గురించి చెప్పుకొన్నాం. ఇదే యుగంలో రామరాజు రంగప్పరాజు తన సాంటో పాఖ్యానంలో శ్రీనాథుని అనుసరిస్తూ చేసిన కల్చనలను గురించి కూడా తెలుసుకొన్నాం. ఆ రోజుల్లో నైషధం మీద కొత్త మోజు మళ్ళా తలఎత్తినట్టుంది. రామరాజు రంగప్ప రాజా గాలి పెద్దపాడుదాకా వీచి ఉండవచ్చు (లేకపోతే పెదపాటి జగ్గన్న సాంబోపాఖ్యానంలోని పద్యాన్ని తన సంకలనంలో చేర్చడానికి ఆస్కారం ఉండదు; కవి పేరుగానీ, కావ్యం పేరుగానీ సరిగ్గా ఇవ్వలేదనుకోండి. అది వేరే విషయం).

యుగధర్మంవల్ల అనాటి సాహిత్య ఫ్యాషన్లకు ఆకర్షితుడై పెదపాటి ఎర్రాప్రగడ కూడా నైషధం రచించదలిచి ఉంటాడు. వసుచరిత్రకు పిల్ల వసుచరిత్రలూ, కల్లీ భాగవతానికి పిల్లగా బాలభాగవతం; మూల భారతానికి సంక్షేపంగా బాలభారతం పుట్టుకొస్తున్న ఆ రోజుల్లో నైషధానికి ప్రతిధ్వనిగా కుమారనైషధం ప్రభవిస్తే ఆశ్చర్యం లేదు. తన గ్రామంలోనే ఉన్న ఎన్రాపైగడ రచించిన ఈ [గ్రంథం నుంచి పదిహేడు పద్యాలను జగ్గన్న స్వీకరించడం సహజమే. ఎర్రాపైగడ ఇతర కృతి మల్లణ చరిత్రనుండి మూడంటే మూడే పద్యాలను రెండే రెండు ఆశ్వాసాల నుంచి జగ్గన్న ఎంచుకొనడానికీ వేరే కారణాలుండవచ్చు. బహుశా ప్రబంధరత్నాకరం సంకలన కాలానికి అది రెండాశ్వాసాలి అసమగ్ర రచనగానే ఉండి ఉంటుంది.

ఇప్పటిదాకా చెప్పుకొన్న విషయాల సారాంశం ఏమిటంటే, కొంచెం వయస్సులో

_ తేడాలున్నా పెదపాటి సోమయ్య, పెదపాటి జగ్గన్నా, పెదపాటి ఎన్రాటైగడా జే

ఊరువారు, ఒకే కాలంవారు అని నిస్సందేహంగా భావించవచ్చు. జగ్గన్న సంకలనగ్రంథీ

పెదపాటి జగ్గన్న 393 రచన ్రీ.శ. 1900 ప్రాంతాలలో జరిగి ఉంటుంది. ఈ కాల నిర్ణయ వ్యవహారం చాల సరళంగా సాగి ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతుందిగాని దీన్ని జటిల సమస్యను చేసే నూతనాంశాలు కొన్ని బయటకొచ్చాయి.

పెదపాటి జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో పేర్కొన్న అన్ని గ్రంథాలూ దేశానికి దక్కలేదు. కొన్ని లభ్యమయ్యాయి. అటువంటివాటిలో మల్హణచరిత్ర ఓక కావ్యం. ప్రబంధరత్నాకరంలో ఉదాహరించిన మూడు పద్యాలూ ఈ గ్రంథంలో ఉండడం" అది జగ్గన్న పేర్కొన్న కావ్యమే అని భావించడానికి ఎటువంటి అభ్యంతరం ౫ ఉండ-

మల్లణచరిత్ర వ్రాతప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (౧653

శృంగార కావ్యం కనుక రెండుసార్లు ఇద్దరు విఖిన్న ప్రచురణకర్తలు దీనిని ముద్రించారుో్‌

పెదపాటి జగ్గన్న తాను ఉదాహరించిన మల్హణ చరిత్ర కావ్యకర్త పేరు పెదపాటి ఎర్రాప్రగడ అని చెప్పాడు గాని గ్రంథంలో లఖిస్తున్న వివరాలను బట్టి కవిపేరు ఎడపాటి ఎర్రన అని ప్రచురణకర్తలూ, సాహిత్యలోకమూ విశ్వసిస్తున్నారు.

ఎడపాటి ఎర్రన్న తన కావ్యాన్ని చుండి కాళయ్య అనే గ్రామకరణానికీ అంకితమిచ్చాడు. ఇది 'కృష్ణ్ణాయ జనకాంతున కీయకదాచినట్టి' కృతిగా అంకితం పద్యంలో చెప్పాడు. సర్వసాధారణంగా సాహిత్యలోకంలీ * ఖీమన అన్న పేరు చెప్పగానే వేములవాడ భీమకవి జ్ఞాపకం వచ్చినట్టు, కృష్ణ్ణాయలనగానే సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలవారే జ్ఞప్తికి రావడం సహజం. ఎడపాటి ఎర్రన్న పేర్కొన్న 'కృష్ణ్ణయజనకాంతుడు' రాయలవారు కాక మరొక'రాజై ఉంటాడన్న భావం తర్వాత ప్రచారంలోనికి వచ్చింది. ఆ రాజు ఎవరై ఉంటాడు?

ఆంధ్ర సాహిత్య చరిత్రలో నంద్యాల కృష్ణంరాజు కవిపోషకుడు. ఈయన ఆరవీటి వంశంలోనివాడు. రాయలవారి అల్లుడైన అలియ రామరాయల బంధువు, పింగళి

సూరపరాజుగారి కళాపూర్లోదయాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. ఇది శ్రీశ 1558

ప్రాంతాల జరిగింది. ఎడపాటి ఎర్రన్న నంద్యాల కృష్ణంరాజునే 'కృష్ణ్ణాయ జనకాంతుడు'

అని ఉద్దేశ్‌స్తి కవికాలం రాయలవారికి ఒక తరం అర్వాచీనం కావాలి. "

మల్లణ చరిత్రను బందరు శృంగార కావ్యమండలివారు 140లో ముద్రించారు. దీనికి చోడవరపు జానకిరామయ్యగారు. పీఠిక రాస్తూ ఈ కావ్యాన్ని అంకితం పుచ్చుకొన్న “చుండికాళుడు పదునారవ శతాబ్దానికి చెందినవాడు మాత్రముకాదు. 17వ శతాబ్బముననుండి యుండవచ్చును” అని రాశారు (పుటలు 12-13). ఈ ఊహను సమర్థించే ఉపపత్తులు వారు చూపెట్టలేదు. అయితే ఊహ కరక్టే! ఉపపత్తులు మనం సేకరించాలి.

  1. శృంగార మల్త్లణ చరిత్ర - ప్రకాశకుల జి.'యన్‌. శాస్త్రి అండ్‌ కో. మద్రాసు 197లో మొదట ప్రచురించారు. తర్వాత శృంగార కావ్య గ్రంథమండలి మచిలీపట్నంవారు 1940లో మల్హణచరి ౫ అనే పేరుతో ప్రచురించారు.

  2. చూ.. ఈ సంపుటిలోవే పింగళి సూరన్న పై ప్రకరణం.

394 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చుండి కాళయను పొగిడి తన కావ్యాన్ని అంకితమిస్తూ ఎర్రన్న చెప్పిన పద్యం ఇది ఇట్టిమహాప్రధాన పరమేశ్వరమూర్తివిగాన నీవుచే పట్టితిః మేలు! చుండిపురపాలక। కాళనమంత్రిచంద్రః మున్‌ గట్టిగ గృష్టరాయ జనకాంతుని కీయక దాచినట్టి యా రట్టడియైన యెజ్జకవిరాజిత మల్లణ కావ్య కన్యకన్‌ (యల్తణ 1-1) ఈ పద్యంలో చాలా అనుమానాలకు ఆస్కారముంది. ఎర్రకవికి 'రట్టడి' అనే విశేషణ ప్రాసస్థానంలో ఎందుకు వాడినట్టు? రట్టడి పదం గ్రామాధికారనే అర్థంలోనే వాడినట్టా? కావ్యకర్త ఎర్రన్న ఎడపాటి పురాధివుడన్నది వాస్తవమే (మల్హణ 1-10), అయితే రట్టడి పదానికి ముందు తచ్చబ్బార్థకమైన "ఆ అనే అక్షరాన్ని ఎందుకు వాడినట్టు?.......... కృష్ణ్ణాయజనకాంతునికీయక దాచిన రట్టడి ఇంకొక ఎర్రన్నా? రట్టడి అనే పదానికి నింద, అపఖ్యాతి అనే అర్ధాలు కూడా ఉన్నాయి. “రట్టడియ్చైన' అనే మాటవల్ల ఈ కావ్యంగానీ, కావ్యకర్తగానీ అపఖ్యాతి పాలైనారన్న సూచన ఉందా! మల్లణచరిత్ర అవతారికలోనే ఇంకొక పద్యం అటువంటి అనుమానానికి ఆస్కారమిస్తోండి ఎడపాటి ఎర్రన్నతో చుండికాళయ్య ఇలా అన్నాడట. పాటిగలట్టిమేటి యెడపాటి పురాధిప యెజ్జనార్య, నీ సాటిగ జెప్పినట్టి కృతి సాటువయై విలసిల్లుగా కీటన్‌ జూటుచు హీనమానవుల చాటునమాటున వ్యర్థతూటకా ర్వాట కథల్‌ వినంగ నగు బాటగుగాక రుచింపనేర్చునే? వ్యర్థతూట కార్భాటక కథలు ఏవైనా చాటుమాటున హీనమానవులు ఎడపాటి ఎగ్రన్న గురించి అతని కృతి గురించి చెప్పుకొనేవారా? చుండి కాళయ్య చెవిని పడ్డ ఆ తూటక కతలు ఆర్బాటం ఏమిటి? ఈ కావ్యాన్ని ఎడపాటి ఎర్రన కాక ఇంకెవరో పూర్చులు రచించారన్న విషయమా? | వెదపాటి జగ్గన్న తన సంకలన గ్రంథంలో చెప్పిన కావ్యకర్త ఇంటిపేరూ, పేరూ చెదపాటి ఎర్రాప్రైగడ, లోకులు సర్వసాధారణంగా ఎన్రాప్రెగ్గడ అనే వ్యక్తిని ఎర్రన్న అని చృవహరించడం కద్దు. మల్త్లణ చరిత్రను పూర్చుడైనా, అర్వాచీనుడైనా ఒక ఎగ్రన్న రచించాడని ఒప్పుకొన్నా జగ్గన్న చెప్పిన పెదపాటివారే అ తరంలోనే ఎడపాటీ వారయ్యారనడానికి దాఖలాలు ఏమిటి? ః ॥ మల్లణ చరిత్రలో ఎడపాటి ఎర్రన తన వంశం గురించి వివరాలు ముక్తసరిగా కూడా చెప్పుకోలేదు. తాము ఒకనాడు పెదపాటి వారమని సూచన ప్రాయంగానైనా చాటలేదు పాత కృష్ణామండలం ఏలూరు తాలూకాలోని పెదపాడునుంచి ఎల్రాప్రైగడగారి కుటుంబం పాఠనాడులోని చుండి పరిసరాలలోనున్న ఎరపాడుకు ఎప్పుడు వెళ్ళారు. వెళ్ళగానే 6 ఊరి గ్రామకరణీకం ఎర్రన్నకు లభించి “ఎడపాటి పురాధిపుడయ్యాడా?'

పెదపాటి జగ్గన్న 395

ఈ అనుమానాలన్నింటినీ ఒకే ఒక్క సంజాయిషీ తీర్చగలదు. క్రీశ 1600 ప్రాంతాలలోని పెదపాటి ఎర్రాపైగడ రచించిన మల్లణ చరిత్ర అనే అసంపూర్ణ కావ్యం రెండుమూడు తరాల తర్వాత పాకనాటిలో వున్న ఎడపాటి ఎర్రన్న చేతికి దఖలుపడి ఉంటుంది. అతడు కూడా కవే. మూడవ ఆశ్వాసాన్ని అతడు పూరించి వుంటాడు. మొత్తం గ్రంథోనికి తన కర్తృత్వం చెప్పుకొని వుంటాడు. లేక కొంత సత్యం చుండి కాళయ్యకు విశదపర్చి ఉంటాడు. ఎడపాటి ఎర్రన్న ఈ కృతిని ఒక కృష్ణ్ణాయజనకాంతునికి ఇవ్వాలనే భావించాడు. ఆ రాజు ఎవరై ఉంటారన్న విషయంపై ఇప్పటికీ కొన్ని పరిశోధనలు జరిగాయి.

“ఎడపాటి ఎర్రన్న చెప్పిన కృష్ణరాయలు శ్రీకృష్ణ్ణాయలు కాదు. చుండి వేజళ్ళ, తెట్టు సంస్థానాధీశ్చ్వరులలోని కృష్ణరాయలు. ఈ వివరాలు గురజాడ శ్రీరామమూర్తి పంతులుగారు 'కవి జీవితముల'లో వెన్నెలకంటి వెంకటాచలం కవియొక్క చరిత్రలో రాశారు” అంటూ పాత సంగతి నొకదాన్ని శ్రీనిడుదవోలు సుందరేశ్చరవూవుగారు ఇటీవల జ్ఞాపకం చేశారు.

కవి జీవితాలలో గురజాడ శ్రీరామమూర్తిగారు విష్ణుపురాణాన్ని ఆంధ్రీకరించిన వెన్నెలకంటి సూరన్నగారి మునిమనవడి యొక్క మునిమనవడని వెంకటాచలాన్న్ని గుర్తించారు. గురజాడ వారి లెక్క ప్రకారం ఈ వెంకటాచలం శ్రీ.శ1678 నుండి 1728 ప్రాంతాల మధ్య ఉన్నవాడు. ఇతడు కృష్ణవిలాసమనే కావ్యాన్ని చెప్పాడు. ఇందులో సంస్థానాధీశ్వరులైన వేజళ్ళవారి ప్రస్తావన ఉంది.39 వేజళ్ళవారి వంశంలో ఇద్దరు కృష్ణమ రాజులు ఉన్నారు.

వీళ్ళలో మొదటి కృష్ణమరాజు క్రీ. 1900 నుండి 1630 దాకా పాలించాడు. ఇతని మనుమడు కృష్ణమరాజు క్రీ.శ. 1678 నుండి 1693 దాకా పాలించాడు.

ఈ తెట్టు కృష్ణమరాజులలో ఏ ఒక్కరితోనైనా ఎడపాటి ఎర్రన్నకు సంబంధమున్నట్టు గురజాడవారు ఎక్కడా చెప్పలేదు. నిడదవోలు సుందరేశ్చరరావుగారు మరేవిధమైన సమాచారాన్నీ భారతి వ్యాసంలో ఎర్రన్న గురించి చెప్పలేదు. ఇతర వ్యాసాలలో చెప్పినట్టయితే ఆ విషయాన్ని అధోజ్ఞాపికలో తూడా సూచించలేదు. ఎగర్రన్నతూ ఈ తెట్టు సంస్థానాధీశులకూ ఏదైనా బాదరాయణ సంబంధాన్ని మనమే ఊహించుకోవాలి.

తెట్టు ప్రభువులలో మొదటి కృష్ణమరాజు రాజ్యానికి వచ్చినప్పుడు అతని ఈడు సుమారు మూడు సంవత్సరాల ముక్కుపచ్చలారని వయసు.

ఇతణ్జీ వెంటపెట్టుకొని ఇతని -మంత్రివర్గం కందుతూరులో లప్కరుతోపాటు ఉంటున్న ఫొజుదారును దర్శించుకొంది. అప్పుడా ఫొజుదారు కృష్ణమరాజు బాలుడనే పపము నమన మునకన నన ముత యు ప నస య మ ము 8. భారతి - జనవరి 1992 పుట 4. ముద్రణ) పుట $. గురజాడ శ్రీరామమూర్తిగారి కవిజీవితములు (6న ముద్రణ = 62 10. చూ., చం మారా ప్పుగారి “అంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణ' పుట 173.

396 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కారణం వల్ల గుడ్లూరు పరగణా మాత్రమే అతనికిచ్చి ఏడువందల వరహాలు పేష్కస్సు నిర్ణయించి తతిమ్మా పరగణాలు సర్కారులో దాఖలు చేసుకొన్నాడు. తర్వాక కృష్ణమరాజు గుడ్తూరులో కోట కట్టుకొని నలఖై రెండేళ్లు రాజ్యం చేశాడు.!3

ఎడపాటి ఎగ్రన్న మల్హ్లణ చరిత్ర రచనాకాలం బహుశా ఈ కృష్ణమరాజు రాజ్యారంభంగానీ లేక రాజ్యాంతకాలంగానీ అయివుంటుంది. రాజు ముక్కుపచ్చలారని వాడు కాబట్టీ “కృష్ణ్ణాయ జనకాంతుని కీయక' తన కావ్యాన్ని దాచి పెట్టుకొనడానికి ఆస్కారముంది. లేక రాజ్యాంతకాలం అయితే కృతి ఇద్దామని కావ్యం రాసి అనుమతి పుచ్చుకొని కృత్యాది పద్యాలు రాసేలోపున రాజు మరణించి వుంటాడు. ఎడపాటి ఎర్రన్న రెండో కృష్ణమరాజు కాలం వాడైతే క్రీ.శ 1678-1689 సంవత్సరాల వాడవుతాడు. మల్హణ చరిత్ర కావ్యాన్ని కూలంకషంగా పరిశీలిస్తే రెండో కృష్ణంరాజు రాజ్యాంత కాలంవాడని నిరూపించవచ్చు.

చుండి కాళయ్యకు అంకితమైన మల్లణ చరిత్ర అవతారికలో కవి చేసిన స్తుతివల్ల కూడా ఈ కృతి క్రీ.+1600 ప్రాంతాలలో కాక రెండు మూడు తరాల తర్వాత రచించిందని చెప్పవచ్చు. ఆ పూర్వకవిస్తుతిని చూడండి.

వినుతులొనర్తు నాంధ్ర సుకవి ప్రభునన్నయ్య భట్టు దిక్కయ

బ్బను తివదేవు భాస్కరుని జక్కన నాచన సోము సర్వదే

"వుని భవదూరువేము నల పోతన వీల్లలమళ్జి వీర భ

దర్రుని శరభాంకు వీరకవి ధూర్జటి గేతన భట్ట బాణునిన్‌. (మల్లణ 1-9)

ఈ పద్యంలో ఒక కాలక్రమాన్ని ఎడపాటి ఎర్రన్న పాటించలేదు. నుతించిన పూర్వకవులలో ఒక్క ధూర్జటి కాలం స్పష్టంగా తెలుస్తున్నదని పూర్వ పరిశోధకులు భావించారు. రాయలవారి రాజ్యాంతకాలానికి గాని ధూర్జటి, రామకృష్ణుడు యువకవులై రాజీంచలేదు. ఇటీవలి పరిశోధనల వల్ల వేమనగారి కాలం అసందిగ్ధంగా తిలియవస్తూంది. ఆయన శ్రీశ 1627-1ఐ7 ప్రాంతాలలో ఉంటారని నేను చాలా దాఖలాలలతో ధ్రువీకరించాను.]

వేమనగారి పూర్వకవిగా నుతించిన కవివారి సమకాలికుడో, అర్వాచీనుడో అయి ఉంటాడు. తెట్టుప్రభువులలో రెండవ కృష్ణమరాజు (1678-1693) పాలిస్తున్న రోజులలో ఈ కావ్య రచన పూర్తయి ఉంటుంది. ఈ కృష్ణమరాజుకే తన కృతిని ఇద్దామని ఎర్రన్న మొదట భావించి సాటి గ్రామకరణమైన చుండి కాళయ్యకు ఇవ్వవలసి వచ్చి ఉంటుండి “కృష్ణ్ణాయ జనకాంతుని కీయక దాచినట్టి'” అనే ప్రకటనకు ఒక పాఠాంతరం కూడా కనబడుతుంది. “కృష్ణరాయ జనకాంతుని కీయగ గూర్చినట్టి' అన్నదే ఈ కొత్తపాఠం. దీనికీ నెల్లూరు పరిశోధకులు విద్వాన్‌ నవులూరి సూఖై మాలెకొండయ్యగారు చూపించాడు 11. గురజాడ శ్రీరామమూర్తి కవి జీవితములు పుట 69. 12. మన వేమన పుట-44 13. విశ్రమసింహపురి మండల సర్వస్వ్పంలో ప్రాచీనాంధ్ర కవులు. పుట 236.

పెదపాటి జగ్గన్న 397 ఈ వినూత్న పాఠం వారికి ఎక్కడ దొరికిందో వారు సూచించలేదు. అయితే ఇప్పటిదాకా అందరూ ఎర్రన్న ఇంటిపేరు “ఎడపాటి' అని విశ్వసిస్తూ ఉంటే ఇది తప్పనీ, ఈ పేరులో రెండో అక్షరం టు వర్గంలోని తృతీయాక్షరం కాదనీ శకటరేఫ అనీ వారు సరిచేశారు. ఎఅపాడు, చుండీ దగ్గర గ్రామాలు, వేజెళ్ళ ప్రభువుల రాజ్బకేంద్రమైన తెట్టుకు సమీపమైనవే.

పూర్వకవి స్తుతిలో వేమనగారిని నుతించిన కావ్యకర్త మీద వేమనగారి ప్రభావంగాని, ఆటలవెలదులమీద్‌ అభిమానంగాని ఉండి తీరుతుంది. మల్లణచరిత్ర ప్రథమాశ్వాసంలో మచ్చుకైనా ఒక్క ఆటవెలదీ లేదు. సీసపద్యాల ఎత్తుగీతిలోనైనా కనీసం ఒక్క ఆటవెలదీ ప్రథమాశ్వాసంలో లేదు. ద్వితీయాశ్వాసంలో మాత్రం అయిదు ఆటవెలదులు విడిగానూ మూడుసీసాల ఎత్తుగీతి స్థానాలలోనూ కనబడతాయి. తృతీయా శ్వాసంలో పదహారు అటవెలదులు విడిగానూ మూడుసీసాల ఎత్తు గీతిస్థానాలలోనూ బాజీలోనే ఉన్నాయి. మచ్చుకు రెండు చూడండి:

సౌఖ్య మనుభవింప సంతతి పుణ్యంబు

“బోవు మూలధనము పోయినట్టు

వరుస పుణ్య ధనము వర్థిల్లునట్టుగా

నిత్య సొఖ్యమంద నేర్చుటురవు. (మల్హణ 3-65)

కన్ను విచ్చినప్పుడు కన్పింతు మనసున

తన్ను మూయ నెదుట కదలకుందు

యింద్రజాలవిద్య యెరిగి తెట్లు (మల్హణ ౩-97)

ఎర్రన్నకు వేమనగారి మీది భక్తి మూడో అశ్వాసం రాస్తున్నప్పుడు బాగా ముదిరింది. అందుకే దాచినట్టి ఈ కావ్యానికి కృతిపతి దొరికాక, కృత్యాది పద్యాలు రాస్తూ పూర్వకవి స్తుతిలో వేమనగారిని నుతించాడు: ఈ ప్రగాఢ భక్తికి కారణం ఇద్దరూ శైవులు కావడమే. ఒకప్పుడు వేమనగారు వీర్ణైవాన్ని ఉడ్డోలంగా ప్రబోధించారు.

ఎరపాటి ఎర్రన్నమీదనేగాని జగ్గన్న పేర్కొన్న పెదపాటి ఎర్రాప్రైగడమీద వేమనగారి అటవెలదుల ప్రభావం లేదని రుజువు చేయవచ్చు. ఎన్రాపైగడ కుమారనైషధం అనే కావ్యాన్ని రచించాడనీ, ఆ గ్రంథం నుంచి పెద్దపాటి జగ్గన్న 17 పద్యాలను స్వీకరించాడనీ ఇంతకు ముందు చెప్పుకొన్నాం. ఈ పదిహేడు పద్యాలలో పదమూడు సీసపద్యాలే (శ్రీనాథుని అనుసరించి తుమారనైషధం చెప్పున్న కవి సీసాలను రచించడంలో ఆశ్చర్యం లేదు). ఈ పదమూడు సీసాలలో ఒక్కటంటే ఒక్కటీ పద్యం ఎత్తుగీతిలో పెద్దపాటి ఎర్రావైగడ ఆటవెలదిని చెప్పాడు. మిగతావన్నీ తేటగీతులే.

ఇంత సుదీర్చచర్చవల్ల తేలినదేమిటంటే పెదపాటి ఎర్రాప్రెగడా, ఎరపాటి ఎర్రన్నా విఖిన్న వ్యక్తులు. వీరిలో మొదటి కవి రచించిన రెండాశ్వాసాల మళ్తణచరిత్రను రెండో

396 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వ్యక్తి పూర్తిచేసి తన పేరుమీదుగా చుండి కాళయ్యకు అంకితమిచ్చాడు. పెదహాటి ఎన్రాప్రైగడకు, ఎరపాటి ఎర్రన్న రెండు తరాల అర్వాచీనుడు. పెదపాటి ఎర్రాప్రైగడా, పెదపాటి జగ్గన్నా సమకాలికులు. ఒక ఊరివారే. వీరు క్రీ.+ 1600 ప్రాంతాలలోని వారే, జగ్గన్న పేర్కొన్న 60 మంది కవులలో ౩ మంది గూర్చి ఇంతదాకా ఆయా యుగాలలో చర్చించడం జరిగింది. వాటి వివరాలు చూడండీ. నం. టపేరు యుగం గుళలు 1 నన్నయభట్టు చాళుక్క్యయుగం భారతం 2. నన్నెచోడుడు చాళుక్క్యయుగం కళావిలాసం, కువూర సంభవం ౩. అప్పునమంత్రి కాకకీయయుగం చారుచర్య 4. మూలఘటిక కేతన కాకకీయయుగం అంధ్రభాషాభూషణం దశకుమారచరిత్ర 6. భాస్కరుని కేతన కాకకీయయుగం శాదంబరి & తిక్కన సోమయాజి కాకకీయయుగం విజయసేనం 7. రంగనాథుడు కాకకీయయుగం చాటువులు 8 చిమ్మపూడి అమరేశ్వరుడు పద్మనాయక యుగం విక్రమసేినం 9. ఎరాప్రగడ పద్మనాయక యుగం నృసింహపురాణం 10. రావిపాటి త్రిపురాంతకుడు పద్మనాయక యుగం తారావళి అంవీకాశతకం ఉదాహరణం 11. హుళక్కి భాస్కరుడు పద్మనాయక యుగం రామాయణం 12. నాచన సోముడు పద్మనాయకయుగం ఉత్తరహరివంశం 13. విన్నకోట పెద్దన రెడ్డిరాజులయుగం కావ్యాలంకారసంగ్రహం ౪ వల్లభరాయడు రెడ్డిరాజులయుగం వీథినాటకం శ్‌. శ్రీనాథుడు రెడ్డిరాజులయుగం చల్లభాభ్యుదయం *౫. మడికి సింగన రెడ్డీరాజులయుగం జ్ఞానవాసిష్టం పద్మపురాణం 17. నిశ్ళంక కొమ్మన గజపతులయుగం శివలీలావిలాసం ౭౬ జక్కన గజపతులయుగం విక్రమార్క చరిత్ర 19. దగ్గుపల్లి దుగ్గన్న గజపతులయుగం .నాచికేతోపాఖ్యానం మ. బమ్మెర పోతరాజు గజపతులయుగం భాగవతం 21. తూచిరాజు ఎర్రన తొలిరాయలయుగం కొక్కోకం, నకలపురాణసారం 22. , ఛంద్రమౌళి తొలిరాయలయుగం హరిశ్చంద్ర కళ ౫. ఖైరవుడు తొలిరాయలయుగం శ్రీరంగమాహాత్మ్యం 2౬ నంది మల్లన తొలిరాయలయుగం మదనసీినం శ. నందిఘంటల జంట తొాలిరాయలయుగం ప్రబోధచంద్రోదయం 28. పిల్లలమర్రి పినవీరయ్య తొలిరాయలయుగం శాకుంతలం 27. మలయమారుతం సర్వన్న తొలిరాయలయుగం షష్టస్కంధం 2౫. ఏర్పూరి సింగన్న తొలిరాయలయుగం కువలాశ్వచరిత్ర ఇ. నూతనకవిసూరన *' _ తొలిరాయలయుగం భాగవతం; ధనాఖిరాచుం

ఒక అజ్ఞాత గ్రంథసంధాత 399 ౫. ముక్కు తిమ్మన మలిరాయలయుగం పారిజాతాపహరణం 31. చరిగొండ ధర్మయ్య మలిరాయలయుగం చిత్రభారతం ౩2. ట్రొడకవి మలయ మలిరాయలయుగం రుక్మాంగదచరిత్ర 3. పెదపాటి సోమయ్య మలిరాయలయుగం కేదారఖండం మొదలైనవి ౫. మాదయగారి మల్లన మలిరాయలయుగం రాజశేఖర చరిత్ర అరుణాచలపురాణం వివజ్ఞాన దీపిక జ. హరిభట్టు మలిరాయలయుగం ఉత్తర నృసింహపురాణం ౫. అంగద బసవయ్య మలిరాయలయుగం ఇందువతీ కళ్యాణం కందర్పకేతు విలాసం ౩._ తెనాలి రామలింగయ్య మలిరాయలయుగం హరంిలీలా విలాసం _ చాలామంది కవుల కాలనిర్ణయాలు పెదపాటి జగ్గన్న, కాలనిర్ణయంతో ముడివేసుకుని ఉండడంవల్ల ఇతను ఎప్పటివాడో, ఏ విధమైన అనుమానాలతూ తావులేకుండా తేల్చడం సాహిత్య చరిత్రలో చాలా ముఖ్యమైన కార్యం. ఒక అజ్ఞాత గ్రంథసంధాత పెదపాటి జగ్గన్నతోపాటు మన కృతజ్ఞతలు నోచుకొన్న ప్రాచీన గ్రంథసంధాత మరొకాయన ఉన్నాడు. దురదృష్టవశాత్తూ అతని పేరు మనకు తెలియదు. అయితే ఇతని సంకలన గగ్రంథమే లేకపోతే కొంతమంది ప్రాచీన తెలుగు కవుల పేర్లూ, వాళ్ళ రచనల గురించి కొద్దిపాటి వివరాలూ మనకు తెలిసేవే కావు. పెదపాటి జగ్గన్న ఉదహరించని ౫ కావ్యాల పేర్లు చెపుతూ ఇతడు 32 కవుల పద్యాలను సేకరించాడు. ఇతడు తన సంకలన గ్రంథానికి ఏ పేరు పెట్టాడోగాని ఇప్పుడు అది “ఉదాహరణ పద్యములు" అనే పేరిట దీనిలోని కవులను, పద్యాలను పెదపాటి జగ్గన్న ప్రబంధరత్నాకరంలో కలిపి అకారాదిక్రమంలో వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వింగడించారు. ఈ నూతన సంకలనాన్ని “ప్రబంధరత్నావళా అనే పేరిట 1918లో మొదట, ప్రచురించారు. వేటూరివారి ఉద్దేశంలో పెదపాటి బుగ్గన్నకన్నా అజ్ఞాతసంధాత ఒక ఇరవై సంవత్సరాలు ప్రాచీనుడైనా అవుతాడు. అయితీ వారు మొదట ఊహించినట్టు ఇద్దరూ కొంచెం ఇంచుమించు సమకాలం వాళ్ళే అనుకోవచ్చు. ఈ సంధాత ఉదాహరించిన 32 మంది కవులలో అందరి గురించి కొద్దిగానో, గొప్పగానో ఇప్పటివరకూ వచ్చిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటిలోనూ, ఈ సంపుటిలోనూ చెప్పుకొన్నాం.

400 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇవి ఆ వివరాలు : వ.నెం. శని పేరు శావ్యంపేరు యుగం కనన "1... పద్మకవి జీనేంద్రపురాణం ఆదిమయుగం 2. సర్వదేవుడు అదిపురాణం; విరాటపర్వం ఆదిమయుగం 3. అధర్వణాచార్భులు భారతం కాకతీయ యుగం 4 కేతన కువలయాశ్వ చరిత్ర = 6, మారన్న మార్కండేయ పురాణం ౯9 6. చిమ్మపూడి అమరేశ్చరుడు విత్రమసేనం పద్మనాయక, రెడ్డిరాజుల యుగం 7. ఎల్రాపైగడ వారివంశం తం 8. చెన్నముల్లు శ్రీగిరన్న నృసింహపురాణం న ఒ౪.. పపపతి నాగనాథుడు _ శ్రీవిష్ణుపురాణం *ం 11. నిళ్ళంక కొమ్మన వీరమాహేశ్వరం ఃం 12. దగ్గుపల్లి దుగ్గన నివకాంచీ మాహాత్మ్యం 29 13. అనంతుడు ఛందం గజపతుల, తొలిరాయల యుగాలు 14. అంధ్రకవి రామయ్య విష్ణుకాంచీ మాహాత్మ్యం _ 2౭ 18. తాళ్ళపాక అన్నమయ్య _ వెంకటేశ్వర శతకం ం జి. దేవరాజు భట్టు హరిశ్చంద్ర =ం 17. పిల్లలమర్రి పినవీరయ్య పురుషార్థసారం, శాకుంతలం *ం *. అల్లసాని పెద్దన మనుచరిత్ర మలిరాయల యుగం 19. పెదపాటి సోమయ్య త్రిపుర విజయం ॥? 28. చందలూరిచిక్కయ్య నాసికేతోపాఖ్యానం ఇం 81. కానుకొలను అన్నమరాజు అమరుకం =ం 2. వాసీరాలు రామయ్య బృహన్నారదీయం ఐం 2. కాకమాని గంగాధరుడు బాలభారతం తం

  • రాయసం గణపయ్య సౌగంధికాపహరణం 29 మ. తుడిచెర్ల తిప్పరాజు కాంచీమాహాత్మ్యం ॥9 ౫. కుంటుముక్కల తిమ్మయ్య శైవాచార సంగ్రహం ఆ
  1. రాపరది దేచిరాజు పేరు తెలియదు ఇం ౫. పోతరాజు భేతాళపంచవించి ౨2 ణ. ఫీనన్న దశావతార పద్యాలు ఇం
  2. రెడ్డిపల్లె ముద్దమరాజు అష్టమహిషీ కల్యాణం ఐం ౩౫౩. సిద్ధన పైగడ శాతుంతలం = త 9 పురాతన చరిత్రము అష
  3. ? రంగనాధ శతకం ఉం

ఒక అజ్ఞాత గంథసంధాత 401 అజ్ఞాతసంధాత కావ్యాల పేర్లు మాత్రమే చెప్పి, కవుల పేర్లు ఇవ్వకుండా ఉదహరించిన పద్యాలు మూడు ఉన్నాయి. ఒకటి 'ఇంద్రసేనము' అనే ప్రబంధంలోని పురవర్జన పుడిసిటిలోన డొంకి కడు బొల్పరి యమ్మున నింకి చల్లిన౯్‌ గడపల గానవచ్చి వెస గైకొని త్రచ్చిన రొల్ల జొచ్చ్నియ జ్ఞడనిధి భంగపడ్డ గని స్రష్ట యపాయము లేని వార్థిగా గడగి యొనర్చెనో యన నగడ్త పొగడ్తల నొప్పు నప్పురిన్‌ (ప్రబంధ. 516) పురాతన చరిత్రము అనే గ్రంథంలోని పురవర్ణన విభాగంలోనుంచే మరొక పద్యాన్ని అజ్ఞాతసంధాత ఉదహరించాడు. చీటికి మాటికి వెలువడి - హాటకమయవప్ర మెక్కి యహి కన్యలు మి న్నేట విహరింతురనినను - గోటపౌడవుబరిఖలోతు గొలదియె పొగడక్‌ (ప్రబంధ. 522) మూడవ పద్యాన్ని అతడు రంగనాథశతకంలో నుంచి ఉదహరించాడు. తశురులుతుంపెసలాడ గ్రుమ్ముడియరవీడ గుచకుంభయుగళంబుగునిసియాడ గటియుగంబు నటింప గౌను కంపముటెంప సరులురంబునగల్లుచౌకళింప గనుజంకెలొరపెక్కగ గురంగముల నిక్క గర్ణపత్రములాటగతులకెక్క గంకణంబులు మోయ గలనాద మోసపోయ రసనాకలాపంబురట్టు సేయు నటుని రీతి వీరభటుని చందంబున గమ్మవిలుతు కీలుబొమ్మకరణి నుపరిభాగకిలి నొప్పెదా గావేరి రంగవిభునిగూడి రాజవదను. (ప్రబంధ. 523) పుస్తకం పేరు చెప్పి ఉదహరించిన ఈ మూడు పద్యాలూ కాక మరో 47 పద్యాలను ఈ అజ్ఞాతసంధాత ఉదహరించాడు. వాటి రచయితలెవరో, అవి ఏ గ్రంథాలలోనివో తెలియదని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రబంధరత్నావళిలో ప్రచురించారు. వీనిలో ఒకటి శ్రీనాథుని భీచముఖండంలోనిది (ప్రబంధ 535). 8 పద్యాలు “రామా! రాజచూడామణీః' అనే మకుటంతో ఉన్నవి. ఇవి ధూర్జటి శైలిని జ్ఞాపకం తెప్పిస్తాయి. తినదే చెట్టల యాకు మేక, గుహగొందిక్‌పాము నిద్రింపదే, వనవాసంబున బక్షులుక్‌ మృగములు వర్తింపనే, నీటిలో మునుగం జూడవె మత్స్యకచ్చపములుళ, ఘోక్షార్థులై ముక్తీకిక చమనసేమూలము నీదుభక్తికిని రామాః రాజచూడామణీః (ప్రబంధ. 894) ఈ సంధాత సేకరించిన ఈ చిల్లరపద్యాలలో కొన్ని ఎవరు బ్రాశారో, ఏ లంథంలోనివో తెలియనందుకు మనసు చివుక్కుమంటుంది. మాటవరుసకు భృంగి అటపాటలను చెప్పే ఈ గీతపద్యం ఎవరిదో, ఏ గ్రంథంలోనిదో తెలిస్తే ఎన్నో జాతీయ సంప్రదాయాలను బోధపరుచుకోవచ్చుననిపిస్తుంది.

402 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి గజ్జపరిద్రొక్కె జూపె భాగడవిధంబు-గీతమున కాడెజేనె సంకీర్సనంబు పాడెసూళాదిగీత ప్రబంధవితతి- భృంగిపంచాంగకంపైన పేరణమున.( ప్రబంధ. క్ట) ఈ పద్యాలు ఎవరివో తెలియవన్న బాధకన్నా ఈ సంధాత పేరో తెలియదే అన్న

విచారం కూడ ఎక్కువే. ఇతని సంకలనగ్రంథం సాహితీపరులకు చెప్పలేనంత గొప్పగా

పద్యాలతోపాటు రామాపైగడ జగ్గన్న ప్రబంధరత్నాకరాన్ని జోడించి ప్రబంధరత్నావళిని సమర్పించినందుకు వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి తెలుగుజాతి ఎంతగానో బుణపడిండి వేటూరివారి కృషిపైన ఆధారపడి అభివృద్ధి చెందుతున్న సాహిత్య పరిశోధన చక్రవృద్ధిగా వారికి అభివందనాలు చెప్పుకోవాలి.

కొందరు స్మరణీయులు

జొపకం పెట్టుకోదగ్గ ఒక్క పద్యం చెప్పిన కవినైనా సాహిత్యలోకం సర్వసాధారణంగా వ్మోరించదు. సంకలన గ్రంథాలలోనో, లక్షణగ్రంథాలలోనో కవినామాన్నీ, అశని కావ్యనామాన్ని లేక చాటువునూ భద్రం చేయడం చక్కని సంప్రదాయం. మడికి సింగన తరువాత పెదపాటి జగ్గన్న ఈ మంచిపని ఎంత చక్కగా చేశాడో చెప్పుకొన్నాం. అతడు ఇచ్చిన 60 పేర్లలో 37 మందిని గూర్చి కాలనిర్ణయాలతోపాటు ఇంతకుముందు యుగాలలో తెలుసుకొన్నాం.

జగ్గన్న సమకాలికుడైన పెదపాటి ఎర్రాపైగడ గురించి కూడా ఇంతకు ముందు ప్రకరణంలో జగ్గన్న కాలనిర్ణయం తేల్చడం కోసం సుదీర్ణంగా చర్చించాం. పెదపాటి ఎల్రాప్రైగడతో కలుపుకొని ౪ కవుల గురించి తెలిసినన్ని భోగట్టాలు క్రోడీకరించాం ఇంక 22 మంది కవులలో జగ్గన్న జాబితాలో మిగిలారు. ఈ కవుల వైనాలు కొద్దిగానో గొప్పగానో చెప్పుకొనడం సాహిత్య చరిత్రతు అవసరం. ఈ స్మరణీయులు పెదపొటీ జగ్గన్నతు ఒక తరం ప్రాచీనులో లేక సమకాలితులో అయి ఉండాలి.

  1. తేళ్ళపూడి కసవరాజు: ఇతడు కళావతీశతకం బ్రాశాడు. ఇందులో తన ప్రియురాలైన కళావతి శృంగారచేష్టలను కవి మెచ్చుకొనడమే కావ్యవస్తువులాగా కనబడుతుంది. ఈ శతకంలోని ఒకపద్యాన్ని పెదపాటి జగ్గన్న ఉదాహరించాడు.

ప్రకటితలీల గీలెదలి పాపటముత్తెపు జేరు మోముపై

దకపికలాడ గ్రక్కదలుదంతపుగమ్మల కాంతి మొత్తమై

వికచకపోలభాగముల వెన్నాల గాయుచునుండ నీవునన్‌

*4440444.-అాగులు మెత్తుగదేకళావతీ! (ప్రబంధరత్నావళి. ౫)

ఈ పద్యంలోని నాల్గవ పాదంలో చుక్కలుపెట్టిన భాగం శిథిలమైందో లేక మీ పచ్చిగా ఉందని పరిష్కర్ణలు చాటుచేశారో తెలియదు. కసవరాజు వ్రాసిన శక సుప్రసిద్ధమైనదనడానికి నిదర్శనంగా ఇందులోని ఇంకో పద్యాన్ని పూర్వసంధాత తూరొ తన ఉదాహరణ పద్యంలో చేర్చుకొన్నాడు. చూడండి:

కొందరు స్మరణీయులు 403 గురుకుచతుంభముల్లదల గ్రొమ్మడి వీడగ రాల గ్రొవ్విరుల్‌

కరమణీ కంకణక్వణనకాచనగధ్వను(?) లుల్లసిల్లగా

భరతపుబిట్ట కైవడిని బాదికి జేరెడి వెల్చెలాగునన్‌(?)

బరిపరిరీతులం జెలగుభంగులు మెత్తుగదే కళావతీ! (ప్రబంధ. 9)

ఈ కళావతీ శతకానికి బహుశా ఈ క్రింది పద్యం భరతవాక్యం కాబోలు.

ఆ కంజాననయుపరతి - కాకాశమువడకె దార అటునిటువడీయెన్‌

బోకైనగిరులుకదలెను- ఖీకరమగు తమము చంద్రబింబము గప్పెక.

(ప్రబంధ. పుట 1౫)

చంద్రబింబాన్ని తమం కప్పిందో లేదోకాని ఈ కావ్యంపై మటుకు కాలాంధకారం

కమ్ముకొంది. ఈ మూడు పద్యాలూ తప్పించి కసవరాజు వ్రాసిన కళావతీ శతకంలోని మరేమీ మనకు మిగులలేదు.

  1. _బొడ్తపాడ్‌ కొండయ్య : ఇతడు “అంగభవభంగతిరుకాళహస్తిలింగ అనే మకుటంతో శతకం చెప్పినట్టు కనబడుతుంది. ఈ శతకంలోనుంచి మూడు పద్యాలను తీసుకుని జగ్గన్న ఉదాహరించాడు. ఈ మూడూ త్రిపుర సంహారాన్ని ప్రస్తుతించేవే. బెజవాడకు 15 మైళ్ళ దూరంలో బొడ్డపాడు అనే గ్రామం ఉంది. ఈ కవి ఆ ఊరివాడు కావచ్చు.

  2. గౌరనకవి।; ద్విపద కావ్యాలుగా హరిశ్చంద్రుని కథ, నవనాథచరిత్ర వ్రాసిన గౌరన్ను చాలా సుప్రసిద్ధుడు. ఇతడు సంస్కృతంలో లక్షణదీపిక కూడా వ్రాశాడు. ఇతని గురించి గజపతుల యుగంలో చెప్పుకొన్నాం. ఈ ద్విపదకవే "“నవగ్రహస్తవం' చేశాడో, లేక మరొక గౌరనకవి తొమ్మిది పద్యాలను చెప్పాడో తెలియదు. ఈ స్తవంలోని రెండు పద్యాలను జగ్గన్న ఉదాహరించాడు.

మొక్కుల యిక్క కాంతిగల మువ్వురు వేల్పుల మూర్తి చీకటిక౯

మెక్కెడి మిత్తి పద్మముల మేలు నవగ్రహరాజు మింటిపై

నెక్కెడు మానికంబు దిన మేలిక సింహవిభుండు ముక్తి పెన్‌

జక్కెర యిందుమిత్రుడు ప్రసన్నత మాకు ప్రసన్ను డయ్యెడిన్‌.

హరుతలవూ చకోరముల యామని పాల్కడలుబ్బు మందు శ్రీ

వరుని మరంది తారకల వల్లభు డిందిరతోడబుట్టు పం

బురుహముదాయి కల్పలత ప్రోది యనంగుని మామ రేవిభుం

డరయగ గర్క టేశు డమృతాంశుడు మాకు బ్రసన్నుడయ్యెడుక.

(ప్రబంధ. 13౫4, 135)

నన్నయ్యగారు మహాభారతంలో వ్రాసిన ఉదంకునినాగస్తవంలో “మాకు

ప్రసన్నుడయ్యెడున్‌ అనే మకుటం నాలుగుసార్లు కనబడుతుంది (ఆది 1:106-109). ఈ

అత్యంత ప్రాచీన మకుటాన్ని, గౌరన వాడడం గమనించదగ్గది. అయితే నన్నయగారు

తత్సమాలు ఎక్కువ వాడారు. గౌరన దేశ్యాలపై మొగ్గుతున్నాడు. పెదపాటి జగ్గన్న తన

ప్రబంధరత్నాకరంలో చంద్రాదిత్యుల ప్రభావాన్ని మాత్రమే శీర్షికలలో చేర్చడం వల్ల మిగతా గ్రహాల స్తవం ఉదాహరించలేదు. అవీ దొరికితే బాగుండును.

404 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

  1. చిరుమూరి గంగరాజు: తిక్కనగారు వ్రాసిన నిర్వచనోత్తర రామాయణంతో - ఆంధ్రదేశంలో మొదటిసారిగా కుశలవుల చరిత్ర గ్రంథస్థమైంది. అయితే ప్రత్యేకంగా "తశలవోపాఖ్యా-౮' అనే పేరుతో కావ్యం బ్రాసిన వారిలో చిరుమూరి గంగరాజు ప్రాచీనుడు. ఇతని కావ్యంలోని ఒక పద్యాన్ని మాత్రమే జగ్గన్న ఉదాహరించాడు. అది శ్రీరాముని వర్ణన. చక్కని రచన.

పదపద్మరజిమున బాషాణపుత్రిక బూబోడి జేసిన పుణ్యుడితడు

బాలుడై హరధనుర్చంగంబు సీతకు నుంకువసేయు నిశ్ళంకుడితడు

మణిమయంబైయున్న మాయాకురంగంబుగడగి జంపిన వేటకా డీతండు

కట్టాణిముత్యంబు కైవడి మున్నీరు బాణాగ్రమున నిల్చు ప్రొఢు డితడు ప్రబలదశకంఠపటుకంఠనివిడవిపిన

చహనకీలాయమాన దోర్టండచండ

చటులకోదండనిర్ముక్సశరనికాయు

ీతడుగాకుత్‌ స్థవంశాల్టిహిమకరుండు (ప్రబంధ.117)

ఈ కావ్యంలోని సుకవిప్రశంసలో వ్యాసనుతిని ఉదాహరణ పద్యాల సంధాత ఉదాహరించాడు.

  1. గంగరాజుచౌడయ్య : ఇతడు “సాముద్రిక శాస్త్రం, 'నందనచరిత్ర' అనే రెండు గ్రంథాలు వ్రాశాడు. మొదటిదానిలోనుంచి రెండు పద్యాలను, రెండవ గ్రంథం నుంచి ఏడు పద్యాలను సంకలనకర్తలు ఉదాహరించారు. ఇష్టదేవతా ప్రార్థనలో 'ఉద్యన్నవభావశబ్ధ ఖావరసతత్వాన్ని' తన కృతికి వాణి ఎప్పుడూ ఇవ్వాలని చొడయ్య కోరుకున్నాడు (ప్రబంధ. 151). వేగుచుక్కనిలా వర్ణించాడు.

దొడ్డముత్తియంబు దోరంపు బటికంబు-వెండిగుండు మొల్ల విరుల చెండు

రసముగుళిక కప్పురంబునకరుడు నా-సౌంపు మిగిలి వేగుజుక్క వొడిచె. ,

(ప్రబంధ. 147) ఉదాహరించిన పద్యాలవల్ల నందనచరిత్రలోని కథ, నాయకుని వివరాలు తెలియవు. చౌడయ్య వ్రాసిన సాముద్రికళాస్త్రం ఎవరికి అంకితమో తూడా తెలియదు. “కసవామాత్యునికి అంకీతంగా ఒక సాముద్రిక మున్నది. అది ఈతని దగునో? ఈక డేనాటివాడో?' అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రశ్నించారు. కసవామాత్స్కునికీ గ్రంథాలయంలో అన్నామాత్యుని సాముద్రికానికి నాలుగు ప్రతులున్నాయని, నెం 2391లో దాని కర్త అన్నామాత్యుడని, తండ్రీ పేరు మారయ్య అని ఉన్నదట. ఈ సంగతులు తంజావూరు లైబ్రరీ కేటలాగు రెండవ భాగంవల్ల తెలుస్తున్నాయి. అందుచేత చౌడయ్య

  1. ప్రబంధరత్నావళి, పీఠిక, పుట. నే స్టిదానంాో దయం ఆ )నకా ఈంతియ, ₹45న4 ణా, 2005, ఆక గం. జో

కొందరు స్మరణీయులు 405 సాముద్రికం, కసవమంత్రికి అంకితమైన సాముద్రికం విఖిన్నమైనవే. చౌడయ్య నందనచరిత్ర లాగే సాముద్రికం కూడా నష్టమైంది.

  1. అమడూరి నరసింహభట్టు ; గజపతుల యుగంలో వెన్నెలకంటి అన్నయ్య షోడశకుమార చరిత్రను వ్రాసినట్టు మనకు తెలుసు. ఆ గ్రంథంకాక షోడశరాజ చరిత్ర అనే దాన్ని ఆమడూరి నరసింహభట్టు అనే కవి బ్రాసినట్టు పెదపాటి జగ్గన్న ఉదాహరించిన ఈ ఒకే ఒక పద్యంవల్ల తెలుస్తున్నది.

సంఘన్రష్టలు సంఘళఃకలశజుల్‌ సాహిత్యసర్వంకషుల్‌

సంఘర్దార్డులు కాక కాకవులు లక్ష్యంటే హలిగ్రామఘా

ఆం ఘా జ్యైకశరణ్యబల్పజ(?) నిబంధల్‌ మత్కటాక్షేక్షతున్‌ (ప్రబంధ, 12) నంప్రదాయం ప్రకారం మనకు షట్టత్రవర్తులు, షోడశమహారాజులు ఉన్నారు. 168 మంది రాజుల పట్టికను ఒక శోకం విశదం చేస్తుంది.

గయోంబరీషో ఈిలింద్వనంగౌ - పషృధుర్మరుత్వన్మరుతౌ సుహోత్రః

రామా దిలీపో నృగ రంతిదేవౌ - యయాతిమాంధాతృ భగీరథాశ్చ.

ఈ శ్లోకంలో చెప్పిన 18 మంది చరిత్రలను ఆమడూరు నరసింహభట్టు బహుశా షోడశరాజచరిత్ర అనే పేర రచించి ఉతికవచ్చు. ఈ గ్రంథం నేడు లభ్యం కాదు. ఈ సందర్భంలో షోడశరాజుల చరిత్రను విడివిడిగా ఏయే కవులు రచించారో తెలుసుకొనడం సముచితమే. సంఖ్య. రాజులపేరు. _ _గ్రంథంపేరు కకాలం

1 గయుడు గయోపాఖ్యానాలు తెలుగులో ఉన్నా అవి గంధర్వుని చరిత్ర గాని మహారాజు చరిత్ర కావు 2. అంబరీషుడు అంబరీషోపాఖ్యానం మహాఖాగవతంలో ౩ ఈిలిందుడు శకివిందుచరిత్ర సుప్రసిద్ధం చరిగొండ వరసింహకవి శ్రీ.శ. 1900 (అప్పకవి దీనిని పెర్కొన్నాడు). క్‌. వృథువు షృథుచరిత్రము పట్టమట్ట సరస్వతీ సోమయాజి (16) =... మరుత్తు మరుత్తరాట్పరిత్ర శ్రీనాథుడు

406 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 10. శ్రీరాముడు వివిధ రామాయణాలూ, ప్రబంధాలూ ఉన్నాయి 11... దిలీపుడు సుదక్షిణాపరిణయం తెనాలి అన్నయ్య (నవాబుల యుగం) దిలీప చరిత్ర కొటీకెలపూడి వెంకట కృష్ణకవి 14, యయాతి యయాతిచరిత్ర పొన్నిగంటి తెలగన్న (నవాబుల యుగం) 16. మాంధాత కవికర్ణరసాయనం సంకుసాల నరసయ్య (యలిరాయల యుగం) 16. భగీరథుడు వ. పంంలంలం

ఆమడూరి నరసింహభట్టు వ్రాసిన షోడశరాజుచరిత్ర లఖిస్తే ఈ పదహారుమంది చరిత్రలూ ఒక్కచోట చదువుకొనే అవకాశం కలిగేది. ఇతని గ్రంథంలోంచి ఒకే ఒక పద్యమైనా దొరికినందుకు సంతోషించాలి.

  1. పొన్నాడ పెద్దిరాజు: పింగళి సూరన్నగారు ప్రభావతీ ప్రద్యుమ్నూన్ని వ్రాయడానికి ముందే తెలుగుదేశంలో ప్రద్యుమ్నుని కథ ప్రచారంలో ఉండేదని చెప్పవచ్చు. పొన్నాడ పెద్దిరాజు వ్రాసిన ప్రద్యువ్ను చరిత్రనుండి 22 పద్యాలను సంకలనకర్తలు ఉదహరించారు. అయితే ఇందులో 18 పద్యాలు పురవర్జనకు సంబంధించినవే. మిగిలిన మూడింటిలో ఒకటి నాయకవర్ణన. ఇంకొకటి నాయకీ నాయకులు కలుసుకొన్నప్పటి చూపుల వర్ణన, మరొకటి పురుష విరహం. నాలుగవది చతోరికావిరహాన్ని వర్ణిస్తుంది. పొన్నాడ పెద్దిరాజు చతోరికను గంపెడు సంతానమున్న తెలుగు యిల్లాలిలాగ వర్ణించాడు.

టాతియే యిక గల్లు లేత వెన్నైలనిగ్గులుగ్గు వెట్టెద నీకు నూరకుండు

మునువుగా నీ కిత్తు ముదురు వెన్నైలపోగు సంతసంబున నుండు జాలి మాని

వేగిరింపకు నీకు వెలది వెన్నాల క్రొవ్వు గుడిపింకు చిన్నారికడుపునిండ

నిట్టి ముచ్చట వాయనీదింతు బండువెన్నెల వెల్లి బలుమారు నిన్ను జేరి

తూయకుడు మీరు సంతుష్టి గూరినపుడు

శీతలంబగు వెన్నెల చిగురుబాన్సు

నందు నిడినిద్రపుచ్చెదననుచు నాద

రించె బిడ్డ్ణలనొక చకోకిపురంధ్రి. (ప్రబంధ. ౫)

ఈ ప్రద్యుమ్న చరిత్రలోని పద్యాలవల్ల నాయిక పేరేమిటో తెలియదు. ప్రభావతి కాదేమో. ఈ గ్రంథం దొరికితే పింగళి సూరన్నగారి ప్రభావతీ ప్రద్యువ్నుంలో ఎంత సంప్రదాయసిద్ధమైన కథో, ఎంత ఆ మహాకవికల్చనో తెలుస్తుంది.

  1. ఫణీధవు మాధవుడు; ఇతడు ప్రద్యుమ్న విజయం అనే కావ్యం రచించాడు. ఇందులోంచి 13 పద్యాలను జగ్గన్న ఉదాహరించాడు. వీటిలో మూడు వేగుచుక్కను వర్ణిస్తాయి. ఒకటి సూర్యోదయ వర్ణన. ఆరు పురవర్ణన లోనివి. ఒకటి చంద్రకిరణాల

కొందరు స్మరజీయులు 407 వర్ణన. మిగిలిన రెండూ చెంచు భామలను చిత్రిస్తాయి. ఈ కథలో చెంచెత ఒక పాత్రలాగా ఉంది. అమె యౌవన విజ్బృంభణాన్ని ఇలా వర్ణించాడు.

చెంచెతగుబ్బ చన్నుగవ శీఘ్రతరంబుగ నంతనంతవ

ర్తించిన యౌవనోపగమజ్బంభణ మెక్కిన నంతకంత శో

షించెను దాని నెన్నడుము జీవితనాధుడు వాని విల్లునున్‌

జెంచులరాజులున్‌ సవతిచేడియపిండును బక్కణంబులన్‌. (ప్రబంధ. 36)

చెంచువాళ్ళలాగే జక్కులవాళ్లు తూడా మాధవుని చిత్రణలో కనబడతారు. సూర్యోదయాన్నిలా వర్ణించాడు.

నవకవు దెల్ల మ్రుగ్గు జతనంబున గూర్చి వియద్భృహంబునన్‌

దివురుచు రంగవల్లికలు దేవగణంబులు చూచి మెచ్చగా

సవరగ దీర్చి కాలమను జక్కుల ముద్దుడు వేడ్కడో దివా

యవనిక బాయదట్టెనన నంచితలీల వెలింగె దామరల్‌ (ప్రబంధ. 358) ఈ ప్రద్యుమ్న విజయం పూర్తిగా దొరికినా కొన్ని చిక్కలు విడతాయి.

  1. ఖానన పెన్మునః ఇతడు అనిరుద్ధ చరిత్రను అష్టాదశ వర్ణనలతో సలక్షణప్రబంధంగా చెప్పాడు. ఈ గ్రంథం నుండీ 68 పద్యాలు సంకలనకర్పలిద్దరూ ఉదాహరించారు. పెదపాటి జగ్గన్న 7 పద్యాలనే స్వీకరించాడు. మిగిలిన 57 పద్యాలనూ పూర్వసంధాత సేకరించాడు. పెమ్మన కాలాన్ని ఒక రకంగా నిర్ణయించడానికి ఈ పద్యాలలోని సరస్వతీ ప్రార్థన పనికి వస్తుంది.

చీటికి మాటికిన్‌ మొగువు జేతులు మౌళి ఘటించి మొక్కెద౯€

హాటకగర్చు బోటికి మహాకవికాంక్షితకల్పకాటవీ

వాటికి దారకాహృదయవల్ల భమంజులపుపష్పమంజరీ

జూటికి పల్లకీస్ఫు రితశుద్ధవరాటికి వాగ్బధూటికిన్‌. (ప్రబంధ. 26)

ఇది పోతరాజుగారికి అనుకరణ, అంచేత ఈ కవి పోతరాజుగారికి అర్వాచీనుడు. అంటే క్రీ.శ1500 తరువాత ఎప్పుడైనా ఉండవచ్చు. ఇతసి గ్రంథంలోంచి ఇన్ని పద్యాలను పూర్వసంధాత సేకరించడానికి కారణమేమిటో తెలియదు. సర్వసాధారణంగా అన్ని ప్రబంధాలలో కానవచ్చే పద్ధతిలోనే కవిత్వముంది. ఇతర కావ్యాలలో అరుదుగా కనబడే పద్యాలు ఒకటిరెండు ఉన్నాయి. శివుని ముందు ప్రమథులు చేసిన నాట్యంలో భృంగినర్హనాన్ని పెమ్మన ఇలా వర్ణించాడు:

క్షామక్షామము గీకట ప్రకటవక్షఃపీఠమున్‌ బాండుర

క్షామిశ్రావయవంబు నైన వికటూకారంబుతో నవ్వుకై

చాముండాకరతాళకుక్షీ వలయస్థానంబుగా నుఖ్ధిత

హీముద్రింబుగ టేరణీవిధము నర్హించెన్‌ మహాభృంగియున్‌. (ప్రబంధ, 2౫1)

406 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

పెమ్మన గొప్పతనం ఒకలాగా చెప్పవచ్చు. ఈ సంకలన గ్రంథంలో ఇతని పద్యాశే ఎక్కువ అమరేశ్వరుని పద్యాల సంఖ్య తరువాత చెప్పుకోతగ్గది. చిమ్మపూడి అమరేశ్వరుని నుతించిన కవులు మనకు కనబడతారుగాని అతణ్ణి అనుసరించిన వారెవరో తెలుసుకొనడం కష్టం. అమరేశ్వరుని గ్రంథం సంపూర్ణంగా లభ్యం కానందువల్ల శ పరిస్థితి ఏర్పడింది. అయినా పెమ్మన కవిమాత్రం అమరేశ్వరుని అనుసరించినట్లు చెప్పవచ్చు. “ముత్తాకేకుజముల్‌ సడల్బె మొగడల్‌ మున్నేమహీజంబులందొత్తె౯' (ప్రటం 57) అని ఈవిధంగా ప్రశ్చలతో అమరేశ్వరుడు తన విక్రమసేనంలో వనాన్ని వర్ణించాడు! వెమ్మనకవి ఇదే ఒరవడిలో వసంతాన్ని వర్ణించాడు.

తలిరులు దోచెనే తరుల దట్టములై? ననలేధరారుహం

బులదలసూపె మున్ను? పలిమొగ్గల నొప్పెడినే యనోకహం

ములు? నవగుచ్భ్చరాజినగముల్విలసిల్లెడు నెవ్వి? యన్నియున్‌

గలుగుట నే మహీజములు గన్నులపండువులయ్యె నామనిన్‌ (ప్రబంధ 24) దొరకకపోవడం దురదృష్టమే.

  1. బొడ్డపాటి పేరయ్య: ఇతడు బహు గ్రంథకర్త. కనీసం నాలుగు కావ్యాలను, రెండు శతరాలను ద్రాసినట్టు జగ్గన్న ఉదాహరించిన పద్యాలవల్ల తెలుస్తున్నది: 1. అనంక మహత్త్వం, 2. పడ్నినీవల్లభం, 3. మంగళగిరివిలాసం, 4. శంకరవిజయం అనేవి ఇతని కావ్యాలు. సూర్యశతకం, మల్లికార్డునలింగశతకం అనేవి ఇతర రచనలు. పద్మనాయక

యుగంలో ఉన్న రావిపాటి తిప్పన్న “చంద్రా రోహిణీవల్లభా' అనే మకుటంతో ఒక తారావళి బ్రాశాడు.* బహుశా దీనినే అనుకరిస్తూ బొడ్డపాటి పేరయ్య “సూర్యా! పద్మినీవల్లభా' అనే మకుటంతో సూర్యశతకం వ్రాశాడు. దీనిలోని ఒకే ఒక పద్యం మనకు లభిస్తున్నది. "

ఈగల్పోలె వ్రణంబులే వెదకుచు న్నీర్జ్యం బరున్‌ మెచ్చకే

మూగల్చోలె నిరంతరాస్యులగుచున్‌ మూర్థించి తర్కించినన్‌

వీగన్నేరని దుష్కవుల్‌ బ్రతుకనీ విక్రాంతులై వారినో |

, రాగంబోవగ నేల సత్కవులు సూర్యా! పద్మినీవల్లభా; (ప్రబంధ 2౫) బొడ్డపాటి పేరయ్యకు సూర్యుడు ఇష్టదైవం. సూర్యశతకంగాక “పద్మినీ వల్లభం అనే ప్రబంధమే వ్రాశాడు. ఈ గ్రంథంలోని ఆరు పద్యాలు మాత్రమే లఖిస్తున్నాయి. వాటివల్ల కథ తెలియదు. అయినా ఇందులో సూర్యుని మహత్త్వం చాటాడేమో? అయిశే “అనంతమహత్త్వం' అనే కావ్యంలో సూర్భుజ్జే నుతించాడు. 'పద్మినీవల్లభుడు తనపాలి వేల్చు' అని చెప్పాడు. ఈ అనంత మహత్త్వంలోని ఒకే ఒక పద్యం జగ్గన్న ఉదహరించాడు. అలాగే మంగళగిరి విలాసంలోంచి తూడా ఒకటే పద్యాన్ని ౩ పద్మనాయకయుగం, నమగ్రాంభ్రసాపిత్యం మొదట సవన ర్‌ పద్యము, సనా భ్రసాహిత్యం, మొదటి సంపుటి 2002

కొందరు, స్మరణీయులు 409 స్వీకరించాడు. పేరయ్య వ్రాసిన శంకరవిజయంలో 7 పద్యాలను చూస్తి ఇది జగద్గురు శంకరాచార్భ్యులవారి జీవితచరిత్ర కాదనిపిస్తుంది. ఇందులోని నాయిక మేనాపుత్రి. చూడండీ ఆమె వర్ణన.

సమలావణ్యము వన్నాగూడిరసముల్‌ సంధించి శృంగారవే

-.. షముతో జొక్కపుజూపు నవ్వొలయ నిచ్చాతూలికన్‌ ఖావచి

తముగా బంచశకరుండు రాగరతి జెంతం జూచుచున్‌ వ్రాసి ప్రా

ఇము నాగీశ్చరు వేడి నించె నన మేనాపుత్రి యొప్పెం గడున్‌. (ప్రబంధ ౫1)

విజయవాటి మల్లికార్డునలింగంపైన పేరయ్య మరొక శతకం వ్రాశాడు. ఇందులోని మూడు పద్యాలను జగ్గన్న ఉదహరించాడు. ఆ మూడు త్రిపుర సంహారానికి సంబంధించినవే. ఈ కవికి బంధువో కాడో తెలియదుగాని ఇదే ఇంటిపేరు గల బొడ్డపాటి కొండయ్య వ్రాసిన కాళహస్తి, లింగశతకంలో కూడా త్రిపురసంహారాన్ని వర్జించే మూడు పద్యాలనే సంకలనకర్త గ్రహించడం గమనించతగ్గది బొడ్డపాటి గ్రామంలో ఉండే ఈ ఇద్దరు కవులూ ఒకే రకపు ఖావాలతో శతకాలను చెప్పడంవల్ల ఒకరిని ఒకరు అనుకరించారనడం స్పష్టం.

  1. పోలనురాజు: ఇతడు పర్వతపురాణం అనే ప్రబంధం రచించాడు. దీనిలోంచి రెండు పద్యాలను జగ్గన్న ఉదాహరించాడు. ఒకటి సూర్యాస్తమయాన్ని వర్ణించేది. రెండోది రాజనీతికి సంబంధించినది. పాలకుడు తెలుసుకోవలసిన పదహారురకాల సంధులను ఇది వివరిస్తుంధి. తెలుగుదేశంలో పర్వతం అంటే శ్రీశ్రైలమే సంప్రదాయసిద్ధంగా స్పురిస్తుంది. కనుక ఈ పురాణం శ్రీ శ్రైలయహత్త్వం తెలియజేస్తుందని భావించవచ్చు.

  2. తులసి బసవయ్య: ఇతడు సావిత్రి కథను ప్రబంధంగా నిర్మించాడు. ఈ కావ్యంలోంచి 28 పద్యాలను పెదపాటి జగ్గన్న ఉచాహరించాడు. ఇతర ప్రబంధాలలో కనపడని వర్జనలుగాని, కల్చనలుగాని ఇందులో లేవు. కోడితూతనిలా వర్ణించాడు.

మాయపు దుంటవిల్తు మానినులారః ప్రాణముల్‌

వోయెడు నాడునాటి కిక బోవిడు డీయలుకల్‌ నిజేశులన్‌

బాయకుడీ యటంచు బరిఖాషల బాటెడు భంగి గొక్కోరో

తోయని కూత వేసె దొలికోడి పురాంతరగేహదేహళిన్‌. (ప్రబంధ. 328)

  1. నండూరి మల్లయ్య: ఇతడు హరిదత్తోపాఖ్యానం అనే ప్రబంధం వ్రాశాడు. దీనిలోంచి ఒకే ఒక పద్యాన్ని పెదపాటి జగ్గన్న ఉదాహరించాడు. అది పురవర్ణనలో తోటల గురించి చెప్పినది.

నవరుచిపల్లవస్థితి దనర్చి లసత్సు మనస్స మృద్ధివై

భవమున బొంది గంధబహుబంధురతం దగి యా శ్రితద్విజో

త్సవముల బొల్చి వారవనితామణిరీతి ద్రివిష్టపంబురే

వ వరగజంబుమాడ్కి గ్రతువాటిగతిన్‌ బురితోట లొప్పగన్‌. (ప్రబంధ.342)

410 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

  1. మద్దికాయల మల్లయ్య: ఈ కవి వ్రాసిన రేవతీపరిణయం అనే కావ్యంలోంచి మూడు పద్యాలను జగ్గయ్య ఉదాహరించాడు. ఒక పద్యంలో పుళిందవిభుడు తెచ్చిన కానుకలను చెప్పాడు. దీనివల్ల కావ్యంలో వేటను బాగా వర్ణించాడని ఊహించవచ్చు. మన కావ్యాలలో కానుకలు తెచ్చిన చెంచులు రాజును వేటకు ఆహ్వానించడం మామూలే, ఇంకో పద్యం సూర్యాస్తమయ వర్ణన. మూడో దానిలో దీపాలను వర్ణించాడు. పద్యం బాగుంది.

నిలయతమః ప్రతానము గణింప మరుంగులు సౌచ్చినట్టుగా

నలరు పిరింది నీడలు రకాంతదుకూలపరిగ్రహత్వరా

కలితవిలాసినీనివహకౌతుక హేతువులై చెలంగ ను

జ్ఞ్వలరుచి మించె గేహముల సంపెంగ మొగ్గల వంటి దీపముల్‌. (ప్రబంధ. ౩4)

  1. ఘటసాసి మల్లుభట్టు: కవులు తమ స్వగ్రామాలలో దైవాల మహత్త్వాలను చాటడానికి స్థలపుర్హాణాలు రచించడం పరిపాటే. ఘటసాసి మల్లుభట్టు జలపాలి మహత్త్వం అనే కావ్యం వ్రాశాడు. ఏలూరులో జలపాలీశ్చరుడనే దేవుడు ఉన్నాడట బహుశా ఈ దైవమహత్త్వాన్ని మల్గుభట్టు కావ్యంగా ప్రస్తుతించాడు కాబోలు. ఈ కృతిలోంచి పెదపాటి జగ్గన్న మూడు పద్యాలను స్వీకరించాడు. పతివ్రతల మహిమను చెప్పే అనసూయ కథను ఒక సీసపద్యంలో వ్రాశాడు. మరో సీసపద్యంలో వారకాంతలను ఛర్జించాడు. ఇంకో సీసపద్యంలో గర్పచిహ్నాలను పేర్కొన్నాడు. శివుడు వరమిచ్చినందువల్ల కథానాయకుని తల్లి గర్భవతి అయినట్టు తోస్తుంది. కవిత్వం మరీ సాధారణంగా ఉంది. శర. జైతరాజు ముమ్మయ్య: ప్రతికవీ తన కృతి చమత్కృతిపట్టుగా ఉండాలను కొంటాడు. బైతరాజు ముమ్మయ్య అలాగే భావించాడు, ఇతడు విష్ణుకథానిధానం అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇందులోని 43 పద్యాలను సంకలనకర్తలు ఉదాహరించారు. కొవ్యం పేరువల్ల ఇందులో విష్ణుకథలే ఉంటాయని స్ఫురించినా కవికి హరిహరరూపం అంటీ చాలా ఇష్టం. బాలకృష్ణుని ఆ విధంగా వర్ణించాడు.

అరుణజటాచయంబును దిగంబరభావము సాంద్రధూళిధూ

సరితశరీరమున్‌ వెరపుచంద మెరుంగమి యెల్ల చోటులన్‌

దిరుగుచు నున్కి యున్‌ గలిగి తెల్లముచేసె యళోదపట్టి దా

హరిహరు లేకమౌొటదనయందతి శైశవవిభ్రమంబునన్‌. (ప్రబంధ. ౫౪) ఇంకొక పద్యంలోకూడా హరిహరులను కలిపి వర్ణించాడు. (ప్రబంధ. ౫5). మూడు పద్యాలలో శివతాండవాన్ని కీర్తించాడు. చక్కని ధార.

అడెన్‌ దాండవ మార్భటిన్‌ బటహలీలాటోపవిస్ఫూర్జిత

క్రీడాడంబర ముల్లసిల్ల గరళ గ్రివుండు జూటాటవీ 5. ఆంధ్రకవితరంగిణీ, క పుట 2౫.

కొందరు స్మరణీయులు త్త] కోడాఘాటకరో టికోటరకుటీకోటీలుఠత్సంధువీ

చీడోలాపటలీపరిస్ఫుటతరస్ఫీతధ్వని ఫ్రొఢియన్‌ (ప్రబంధ ౩71)

ఆడగ గెంజుడల్‌ దొలకి యాడగ జాహ్నవి దిక్కులెల్ల న

ల్లాడగ భూతధాత్రి యసియాడగ నాకము నాకసంబు మా

టాడగ ముజ్జగంబు గొనియాడగ నిచ్చట నీవు తాండవం

బాడగ గౌరినిన్‌ సరసమాడగ జేరు నటా మహానటా! (ప్రబంధ. 370) ముమ్మయ్యకు పూర్వకవులంటే భక్తిభావమేగాని వర్ష్వమానకవులెవరికీ తీసిపోరనే

పూర్వకవీంద్రులం గొలుచు పూనికి నిప్పటివారి గొల్లు ని

ర్గర్వత నిక్కవీంద్రులు పురాణకవీంద్రులకంటె దక్కువే

యుర్విని నేటివారగుట యొచ్చె మె? నేడును దామ్రపర్ణిలో

బూర్వపుముత్తియంబులను బోలిన మౌక్తికరాజీ లేదోకో? (ప్రబంధ. 30) ముమ్మయ్య పద్యాలన్నీ ముత్యాలే!

  1. నెల్లూరి ముత్తరాజు: కృతి చమత్కృతికి ఆటపట్టుకావాలని జైతరాజు ముమ్మయ్య కోరుకున్నా నిజంగా ఆ అదృష్టం నెల్లూరి ముత్తరాజుకు పట్టీందేమో అని తోస్తుంది. ఇతడు పద్మావతీ కళ్యాణం అనే కావ్యం వ్రాశాడు. దీనిలోంచి ఒకే ఒక పద్యాన్ని జగ్గన్న ఉదాహరించాడు. అయిజే అది వెలలేని వజ్రం. విరహంలో ఉన్న కథానాయికను సఖి ఊరడిస్తున్న ఘట్టంలోనిది.

నీవెంత వేడుకొన్నను - గేవలపాతకుల కేల కృపపుట్టు మదిన్‌

దేవుడు 'నహి'* గురువున్‌ “నహి” - భావజచంద్రులకు వికచపద్మదళాక్షీ!

(ప్రబంధ. ౫2)

“దేవూనై గురువూనై' అనే సామెతను వాడి ఇంత చక్కగా చమత్కరించిన తొలికవి గ్రంథంలోని ఇతర పద్యాలు దొరకకపోవడం నిజంగా విచారింపదగిన విషయమే.

  1. ఎలకుర్తి రామయ్య : ఇతడు రామలింగశతకం రచించాడు. దీనిలోంచి ఒక పద్యాన్ని జగ్గన్న ఉదాహరించాడు. అర్ధనారీశ్వర రూపాన్ని కవి చక్కగా వర్హించాడు.

గంగాప్రవాహంబు కన్నై గేదగి రేకునమృతాంశురేఖ ముక్యాలసేస

యురగేంద్రహారంబు కురువించములపేరువిసముకప్పురముతో వీడియంబు ". ప్రాతకంకటికాలు పంకసంజాతంబుజింకపిల్లయు రాచచిలుక బోద

రుభ చర్మచేలంబు నింద్రగోపపుబట్టు భూతిపుంజము నవ్యపుష్పరజము

హేమగోత్రకోదండంబు నిక్షుధనువు

గలుగునర్థనారీశ్చరాకారమునను .. రాజహంసరథాంగ శ్రీరామలింగ (ప్రబంధ. 424)

412 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటి

  1. వాగలూటి శేషనాథుడు ; పోలమరాజులాగే ఇతడూ 'పర్వతపురాణం' రచించాడు. దీనిలోంచి ఒకే ఒక పద్యాన్ని జగ్గన్న ఉచాహరించాడు. అది ముక్కంటి ప్రశంస.

తత్తరపాటుతో నిరులు తద్దయు మాన్సగ జాలు కన్నును

వ్వెత్తున వేల్చుమూకలకు విందులు వెట్టెడు కన్ను దమ్మియున్‌

మొత్త మొలర్చ లచ్చకిని ముద్దుగ బుట్టిన ముద్దుపట్టి మే

నెత్తిన జూచు కన్ను గల యిట్టిడి వేలుపు గొల్లు నిచ్చలున్‌. (ప్రబంధ. 48) సంస్కృత స్కందపురాణంలోని శ్రీశ్రైలఖండాని కిది తెలిగింపు. దీని ప్రతి ఒకటి మద్రాసు ప్రాచ్చలిఖిత గ్రంథాలయంలో వుంది (1.39). ఇది ఆరాశ్వాసాల కావ్యం. శేషనాథుడు చక్కని వ్యాకరణశాస్త్ర పండితుడు. కవితాధారగలవాడు. తన సంగతి ఇలా చెప్పుకొన్నాడు:

ప్రణుత శ్రీగిరినాథలబ్ధకవితా ప్రజ్ఞాకళా ఖిజ్ఞుడన్‌

గణభు గ్రథమత ప్రయోగవిలుఠద్దాడార్థసంవేత్తద

తృణీభాష్యాయుతఫక్కికాదృఢపరప్రొఢీసమాఢౌకిత

ప్రణీవత్సస్ఫుటశబ్దశాస్తనివహ ప్రావీజ్యపారీణుడన్‌.

రెండు భాషలూ క్షుణ్ణంగా చదువుకున్నాడు కనుక ఆ భాషల తారతమ్యూలు ఇలా చెప్పాడు. “జనని సమస్తభాషలకు సంస్కృతభాష ధరాతలంబులోన్‌ ఘనలలితార్థగౌరవ వికాసి.*

తెనుగైన నేమి కవితా - జనితాలంకారచిత్రసంగతపదవ

ర్లనవచనరచనచతురత - విన యోగ్యంటైన కృతియ నిండ్రు మహాత్ముల్‌ “మహాత్ములు' వినే కృతిని యితడు తెలుగులో వ్రాసి శ్రీశైల మల్లికార్జున స్వామికి

_ అంకితమిచ్చాడు. అతడంటే ఈ కవికి చిన్నప్పటి నుంచీ భక్తి.

నావారున్‌ కడు చిన్న ప్రాయమున నోనామక్కులుంబ్రేమతో

శీవాయక్కులుజెప్ప నాటగొలె నే సేవింతు నీయాన నా

భావంబందున నిన్నై యెన్నుదును విభ్రాజద్భవద్భక్తిస

ద్భావజ్ఞానసుధానుభావరమగా భావింతు మల్లేశ్వరా! అని అక్షరాభ్యాసం నాటినుండి అతనంటే భక్తి అని మల్లేశ్చరునికి చెప్పాడు. ఈ దేవునికి ఈ పేరెలా వచ్చిందో వివరించే కథ ఒకటి ఈ పర్వతపురాణం నాల్గవ ఆశ్వాసంలో ఊదీ 6 కథ వింటే మహాత్ములు ఎలా భావిస్తారోగాని మామూలు వాళ్లు ఏవగించుకుంటారు.

పూర్వం చంద్రగుప్తుడనేరాజు ఉండేవాడు. అతని తూతురి పేరు చంబ్రవతీదేవి అమె అందాలబరిణె. ఆమె నానారసప్రాయభంగీలలో ప్రొఢరీతుల గీతాలు పాడీతే తండ్రే అమెను చూసి మోహించాడు. మన్మథుడు మహాదారుణం చేయించాడు. ఈ పాపానికీ

కొందరు స్మరజీయులు త్రి ప్రాయశ్చిత్తంగా ఆమె శ్రీశైలక్షేత్రానికి వెళ్ళి తండ్రీ పగ సాధించడానికి మదనాంకుని మల్లికాపుష్పాలతో పూజించింది. ఆ దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. మల్లికలతో నిన్ను పూజించాను గనుక మల్లికార్జున నామాన్ని వహించమంది.

దేవతల ప్రభావాన్ని, క్షేత్రాల మహిమలను ఆకాశానికి ఎత్తడానికి మన కవులు ఎంతటి పాపాలనైనా క్షణంలో ప్రక్షాళనం చేయించగలరు. మనకున్న సానుభూతి పరులకు ఇటువంటి గ్రంథాలపై ఉండదు. తెలుగు భాషకు ఎంతో ఉపకారం చేసిన సి.పి. బ్రౌన్‌ ఈ

టి 8 జక కుర 000% కలో అంగు 6 అగజ 0 8 ౧80 ర 18టాయాం్ర జరీ కొ

నాగనాథుడు చెప్పుకోదగిన కవి కనుకనే ఉదాహరించడానికతని గ్రంథాన్ని జగ్గన్న - ఎన్నకొన్నాడు. భద్రకవి లింగకవిలాంటి అనంతర కవులు నాగనాథుజ్జీ నుతించారు.

  1. కంచిరాజుూ సూరయ్య; ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యంలోని కన్నప్పచరిత్ర ఒక భాగమే. దానినే సవిస్తరంగా ఒక సంపూర్ణకావ్యరూపంలో కంచిరాజు సూరయ్య వ్రాసినట్టు కనబడుతుంది. ధూర్జటి ఇివభక్తుడు. సూరయ్య విష్ణుభత్తుడు. ఇతని కన్నప్పచరిత్రలోని నాల్గు పద్యాలనే జగ్గన్న ఉదాహరించాడు. అందులో రెండు విష్ణువును శీర్తించే పద్యాలు. ఒకటి వినాయకస్తుతి. నాల్గవది పుళిందగ్రామణిని కాంతలు ఎలా చూశారో చెప్పే పద్యం. సామెతలను వాడి పద్యాలను చమత్కరించడం సూరయ్యకు బాగా తెలిసినట్టుంది. కృత్యాదినే వాడాడు.

. కారణమేమి? రక్కసు నఖంబుల వ్రచ్చితి నాడు నీకు బెం

పార గుఠార మబ్బదొ? పురారివిరించులు చేరియేటికిం

గోరున బోవు సేతలకు గొడ్డలి యన్న దొరంగితో? వినం ". " గోరెద నన్న యిందిరకు గోర్కుల నిచ్చుర ముకుందు గొల్పెదక్‌ (ప్రబంధ 47). ఇతడు దేవుణ్ణి కకుణావిధేయుణ్జీ చేస్తున్నాడు.

  1. దామరాజు సోమయ్య: వివిధ శాస్త్రాలను పద్యరూపంలో వివరించడం మశ నుంచి 5 పద్యాలను జగ్గన్న ఉచాహరించాడు. మూడు పద్యాలు ఆశీర్గుచనాలు. ఒకటి రాజు ఎలా కొలువుండాలో చెప్పేది. అయిదోది నటుల లక్షణాన్ని తెలిపేది.

_ మొదలి పుష్పాంజలి ముదమున గావించి కరబాళి మొగబాళి సరవులెత్తి . ' యురుష్పధుబాళము లొగి బిల్లమురువును హస్త ప్రకరణములేననువుచరది ' "కుండలి బహురూప దండలాస్యవిలాస దేశిమార్గంబుల తెరువు లెరిగి

414 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పాత్ర గొనిపించ గొనగను బ్రౌడీరయ్డైన

వాడె నటు డనబరగు నీ వసుధయందు (ప్రబంధ. 47) భరతనాట్యాన్ని విశదపరిచే తెలుగుగంథాలలో ఇది మొదటిది.

  1. పాలపర్తి సోమేశ్వరుడు: ఇతడు వ్రాసిన గ్రంథం పేరేమిటో తెలియదుగాని త్రిపురసంహారాన్ని వర్ణించే ఇతని రెండే పద్యాలను జగ్గన్న ఉదహరించాడు. తొలి పద్యంలో '“చిరశుభాంక!। సోమశేఖరాంక!' అనేది మకుటంలాగా చివర కనబడుతోంది రెండోదానిలో “శరభలింగ' అని ఉంది. బహుశా ఈ రెండూ రెండు శతకాలేమో. ఈ పద్యాలలో మంచి నడక ఉన్నట్టు ఉదహరించిన రెండూ సాక్ష్యమిస్తున్నాయి.

తలకమ్మికొండయువిలుకమ్మికొండయుగడయును నడుముగా గలుగుడేరు

సరసిజముకుళంబు సద్వాక్యసకలంబు మాతయు నాలగు మాతలియును మిన్నుల జినువాడు కన్నుల వినువాడ నంకపర్యంకంబులైనశరము

చల్లని పవనంబు నెల్లయిన భువనంబు మేపును మోపుగా మెలగు నారి

కాకకోర్చు విల్లు గరిగల గుర్రాలు - పగలు రేయు దిరుగు బండీ కండ్లు

గలుగ బురజయంబు గైకొన్న నినుగొల్తు - చిరశుభాంక। సోమశేఖరాంక।

ం - (ప్రబంధ 511)

ఇంతవరకూ పెదపాటి జగ్గన్న పేరు చెప్పి ఉదాహరించిన కావ్యాలనూ, ఆ కవులనూ కొద్దిగా తెలుసుకున్నాం. ఏ గ్రంథంలోనివో, ఎవరు వ్రాసినవో చెప్పకుండా ఇతడు ఉదాహరించిన ఇంకో పన్నెండు పద్యాలున్నాయి. వీటిలో ఒకటిరెండు చాలా బాగున్నాయి. పీనసరోగి కస్తూరిని తెలకపిండితో సరిపోల్ప్బాడు. అందుచేత అది విచారిస్తుంది. వద్దని కవి చెప్తున్నాడు.

పీనసరోగి నిన్ను దిలపిష్ట్టమానము చేసినంతనే

వాని వివేకహీనతకు వందురనేల కురంగనాభమా

మానవతీకపోలకుచమండల మండిత చిత్రపత్రికా

నూనవితాన వాసనల నుండుట లోకమని న్నెరుంగదే? (ప్రబంధ 58) ఇంకొక కవి, బహుశా ఠుకవినిందలో కాకిని నిందిస్తున్నాడు:

ఈకలు నల్లనైన వని యెంచి విశాలరసాలశాఖయు "

చ్సీకముతోడ నెక్కి వికసించి ఫలంబులు నీవు మేయుచున్‌

_గోకిలరీతి నుందు ననుకొన్నను నంటివికాక పాపపుం

గాకమ! నీకు నమ్మధురగానము గల్నునె యెన్ని పల్కినన్‌? (ప్రబంధ. హో) దురందులను నిందించే శీర్షికలో ఇంకొక పద్యంతూడా చక్కనిది ఉంది.

అతిమాధుర్యమనోజ్ఞ చూతఫలమాహారంబుగా గల్లియున్‌

మతి గర్వింపక కోకిలంబు పలుకున్‌ మంజూళక్తి, జంబాలదూ

మట్ల అనంతలాజు 415

షితనీహారము గ్రోలిభేక మరచున్‌ జృంఖించి యాకర్ణ (న)

స్ధితి గారిన్యము దోపగా బెకటెకస్ఫీతాకులారావముల్‌. (ప్రబంధ. 525) ఇంకొక ఘట్టంలో మరొక విలక్షణమైన విధంగా ఆశీర్చదిస్తున్నాడు.

పదియు బదియు నింక బదియేను బదియేను

నిరువదేను నూట యిరువదేను

నూరు నూరు నూరును న్నూూరు నన్నూూరు

తలలవాడు నిన్న ధన్యుజేయు (ప్రబంధ. 81)

ఈ కవి ఎవరో తెలియదు గాని ఇతని మాటలలోనే సహస్రశీరుడైన విరాట్టురుషుడు పెదపాటి జగ్గన్నను ధన్యుణ్ణి చేయగలడని ఆస్తికులు దీవించగలరు.

ప్రాచీన ప్రబంధాలనుండి ఎన్నో రత్నాలను సేకరించిన ఈ సంకలనకర్త బుణాన్ని దేశం తీర్చుకోలేదు.

మట్ల అనంతరాజు (క్రీస్తుశకం పదహారో శతాబ్దపు చివరిపాదంలో తెలుగుదేశ చరిత్రను సృష్టించిన ఆరవీళో రాజుల సాయంతులలో మట్టవారు చాలా ప్రముఖులు. నిజానికి విజయనగరరాజ్యుపు దీపం కొడిగట్టకుండా స్నేహపూర్వకమైన సహాయం చేసి సింహాసనం నిలబెట్టినవాళ్ళలో మట్లవారు ప్రథమశ్రేణీలో ఉంటారు. సాధారణమైన అమరనాయతులుగా ఉండే వీళ్లు మహామండలేశ్చరులై ప్రసిద్ధులయ్యారు. మట్లవారి చరిత్రా, పదహారో శతాబ్దపు చివరిపాదంలోని ఆంధ్ర దేశచరిత్రా ఒకటే.

వసుచరిత్రను అంకితం పుచ్చుకొన్న తిరుమలదేవరాయలకు ముగ్గురు కుమారులు. రాజ్యాన్ని మూడు ముక్కలుగా విభాగించి వాటికి ముగ్గురు కుమూరులను పాలకులుగా నియమించి క్రీ.శ. 1572లో తిరుమలదేవరాయలు మరణించాడు. (1) శ్రీరంగపట్టణం కేంద్రంగా కన్నడదేశాన్ని రామరాజు ఏలుకొంటున్నాడు. (2) పెనుకొండ రాజధానిగా శ్రీరంగదేవరాయలు తెనుగుడేశాన్ని క్రీ.శ: 1572 నుండి క్రీ.శ 1585 దాకా పధ్నాలుగేళ్లు పాలించాడు. (3) చంద్రగిరి ముఖ్యపట్నంగా దక్షిణదేశాన్ని 1572 నుండి వెంకటపతి రాయలు పాలిస్తున్నాడు.

“శ్రీ.శ1585లో శ్రీరంగరాయలు మరణించగానే పెనుకొండ రాజ్యంలో ప్రతిష్టంభన వచ్చింది. శ్రీరంగరాయల కుమారులు అర్చకులు. రాజ్యం అసలే అల్లకల్లోలంగా ఉంది. ఒకవైపు నుంచి గోల్కొండవాళ్ళూ, మరొకవైపు నుంచి బిజాపురంవాళ్ళూ దాడులు చేస్తున్నారు. శ్రీరంగరాయలు పాలించిన పధ్నాలుగేళ్లూ ప్రజల గోడు అరణ్యరోదనమే. ఇప్పుడు. పసిపిల్లలు పట్టం కట్టుకొంటే పరిపాలన సుస్థిరంగా ఉండదు. అందుచేత అమరనాయకులంతా కలిసి చంద్రగిరి నేలుతున్న వెంకటపతిరాయలనే పెనుకొండ

416 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి విభాగాన్ని కూడా కట్టుకొని పాలించమని కోరారు. సామంతుల కోరిక మన్నించి వెంకటపతిరాయలు రెండు భాగాలకూ అధినేత అయ్యాడు. తన కేంద్రాన్ని చంద్రగిరి నుండి పెనుకొండకు మార్చాడు. తన తండ్రి తిరుమలదేవరాయలవల్ల తరిగిపోయిన వైభవాన్ని మళ్ళా రాయసాత్రాజ్యానికి తీసుకురావడానికి ప్రయత్నించి చాలా కృత కృత్యుడయ్యాడు. ఈ ప్రయత్నాలలో అతనికి సహకరించిన అమరనాయకులలో మట్లవారు చాలా ప్రముఖపాత్ర వహించారు.

కర్నూలు మండలంలోని సిద్ధవటం పొత్తపిసీమలలో మట్లవారికి పొందలూరు, సెనగలూరు, పొన్నంపల్లె గ్రామాలలో అమరభూములు ఉన్నాయి. ఈ మండలానికి కొండ్రాజు తిరుపతిరాజు ఏలిక ఇతడు వెంకటపతిరాయల అధికారాన్ని ప్రతిఘటించాడు. ఈయనకు నంద్యాల కృష్ణమరాజు తోడ్చడ్డాడు. ఈ కృష్ణమరాజే కళాపూర్ణోదయం కృతిభర్త. కొండ్రాజు తిరుపతిరాజు కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి రాయలకు సాయపడుతున్న అమరనాయకుల భూములను అక్రమించుకొన్నాడు. మట్లవారు రాయలకు విశ్వాసపాత్రులు. అందుచేత వాళ్ళ మాన్యాలను మండలాధిపతి తిరుమలరాజు హస్తగతం చేసుకొన్నాడు.

అప్పుడు మట్లవారిలో ఎల్లమరాజు ప్రముఖుడు. ఇతనికి నలుగురు భార్యలు; ఎదిగివచ్చిన కొడుకులు, మనుమలు ఉన్నారు. తన అమరభూముల్ని స్వామిద్రోహీ ఆక్రమించుకొంటే ఏ అమరనాయకుడు ఊరుకొంటాడు? మట్ల ఎల్లమరాజు రాయలకు ఈ సంగతి విన్నవించాడు. తన అధికారాన్ని ప్రతిఘటించిన నంద్యాల కృష్ణంరాజునూ, కొండ్రాజు తిరుపతిరాజునూ లొంగదీయాలని రాయలు నిశ్చయించాడు. తానే స్వయంగా యుద్దానికి కదిలాడు. మట్ల ఎల్లమరాజూ, పెమ్మసానివారూ, మరికొందరు నాయకులూ సేనలు నడిపించారు. కొండ్రాజు తిరుపతిరాజు ఊటుకూరుగవను కాచుకొంటున్నాడు. యుద్ధంలో నిలువలేకపోయాడు. తిరోగమించి నంద్యాల కోటలో తలదాచుకొన్నాడు. కృష్ణమరాజును వెంటాడి బంధించమని మట్ణ ఎల్లమరాజునే వెంకటపతిరాయలు పురమాయించాడు. కోటను ఎల్లమరాజు మూడు నెలలు ముట్టడి వేశాడు. కళాపూర్తో ప్రాణభిక్ష మాత్రం పెట్టించాడు. నంద్యాలవారి భూములను వెంకటపతిరాయలు పెమ్మసానివారికి, తదితరులకు పంచి పెట్టాడు. కళాపూరోదయం కృష్ణమరాజును చంద్రగిరి కోటలో ఆమరణాంతం బంధించారు.

నంద్యాలవారి భూములను రాయలు పెమ్మసాని వారికీ, ఇతరులకూ ఇచ్చాడే, మరి మట్ణ్లవారి మాటేమిటి? వాళ్ళ అమరభూములను ఆక్రమించుకొన్న కొండ్రొవో తిరుపతిరాజును పట్టుకొని ఓడించి ఆ సీమ సీమనంతటినీ కట్టుకోమని రాయలు మట్ల ఎల్లమరాజుకు అనుజ్ఞ ఇచ్చాడు. ఊటుకూరు దగ్గర కొండ్రాజు తిరుపతిరాజో సినలున్నాయి. ఎల్లమరాజు వాటిమీదికి తన బలాలు నడిపించాడు. సంకుల సమరం జరిగింది. కొండ్రాజు తిరుపతిరాజు యుద్ధంలో మరణించాడు. యుద్ధభూమిలో శత్రువును పే యుల కంలూం 01 జనుంతం్రదా౭ 10405/ ౪011, ౫౦.214, ౧.౩28.

మట్ల అనంతరాజు గ్‌ చంపడంతో ఎల్లమరాజు తృప్పిపడలేదు. ఆ రాత్రి రణము కుడిపించాడు. శత్రువుల తలపునకలో వారి రక్తంతోనే కలిపిన అన్నాన్ని పెట్టి భూతభేతాళాలకు బలి పెట్టాడు. కొండ్రాజు తిరుపతిరాజును ఇలాగ సంహరించి మట్ట ఎల్లమరాజు సిద్దవటం సీమకు అధిపతి అయ్యాడు. పులుగులనాడు, చెన్నూరు, దువ్వూరు, కామలాపురం, పోరుమామిళ్ల బద్వేలు మొదలైన భూములన్నింటికి మట్లవారు మహామండలేశ్వరు లయ్యారు. ఎల్లమరాజుకు ఈ యుద్ధంలో అతని కుమారుడు అనంతరాజు ఎంతగానో తోడ్పడ్డాడు. అతడు అనేక యుద్ధాలలో ఆర్‌డేరిన ప్రొడుడు. క్రీ.శ15938-99లో జరిగిన ఈ ఐంబులమడుగు,. ఊటుకూరు సంగ్రామాలలోనేకాక వీటికి పదేళ్ళలోపున - క్రీ.శ.1589 తరువాత జరిగిన పెనుకొండ యుద్ధంలో మట్ల అనంతరాజు విజయాలను సాధించాడు. క్రీ.శ1586లో అన్నగారు మరణించాక వెంకటపతిరాయలు పట్టం కట్టుకొని తన రాజధానిని చంద్రగిరినుండి పెనుకొండకు మార్చాడని చెప్పుకొన్నాం. తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకొని, పరరాజుల చేతిలో చిక్కిన భూభాగాలను వెంకటపతిరాయలు విడిపించుకొనసాగాడు. క్రీ.శ. 1589 నాటికి అతడు ఉదయగిరిని గోలకొండ సైన్యాల నుండి స్వాధీనం చేసుకొన్నాడు. అప్పుడు గోలకొండను మల్కిభరాముని కువూరుడు మహచ్ముదు కులీ కుతుబ్‌షా పాలిస్తున్నాడు. విజయనగరంవాళ్లు విజ్బంభించడం అతడు సహజంగా సహించలేకపోయాడు. తాను స్వయంగా సేనలు నడిపించుకొని కదిలాడు. ఇది బహుశా క్రీ.శ 1590-9ల మధ్య జరిగి ఉంటుంది. అప్పటికే గోలకొండ సైన్యాలకు రాయభూములు కొన్ని దాసోహమన్నాయి. కడప, కర్నూలు, అనంతపురం సీమలు పాదాత్రాంతమయ్యాయి. సుల్తాక్‌ స్వయంగా వస్తున్నాడని విని గోలకొండ సేనలు ఉప్బిపోయాయి. పెనుకొండను ముట్టడించారు. వెంకటపతిరాయలు ఇంతలో రాజధానిపైన ముట్టడి వస్తుందని భావించలేదు. సామంతుల సైన్యాలను దక్కించుకొనడానికి వ్యవధి కావాలి. అందుచేత రాయలు రాజనీతిని ప్రయోగించాడు. సంధి బేరాలు పెట్టి కాలయాపన చేశాడు. ఈలోగా నెలల తరబడి వాడుకోవడానికి సంభారాలు కోటలో చేర్చాడు. ముప్ఫయివేల పదాతిబలా లతో. నాలుగువేల తుపాకిఫొజుతో జగదేకరావు, తంజావూరు రఘునాథనాయకరయ్య, మట్ల అనంతరాజు మొదలైన సామంతులు కోటలో ప్రవేశించారు. బలాలు తూడదీసుకొన్నాక ఈ వీరులను ఎవరు గెలువగలరు? ఒకపక్కనుంచి మట్ల అనంతరాజు, మరొక పక్కనుంచి తంజావూరు రఘునాథనాయకరయ్య, ఇంకోపక్కనుంచి జగదేకరావు గోలకొండ సైన్యాలను ఊచకోత కోశారు. సుల్లాక్‌ ఈ పరాజయాలు తట్టుకోలేకపోయాడు. రానున్నది వర్దాకాలం. కృష్ణ పొంగవచ్చు. అందుచేత ముట్టడీ ఎత్తివేసి పలాయనం చిత్తగించాడు. ఇలాగ బహుశా క్రీశ1593లో ఇతర నాయకులతో కలిసి మట్ల అనంతరాజు పెనుకొండను నిలబెట్టాడు. 2. ఫాలదృగగ్నిదృద్వ్వలనభాపరిఖభావిభుజాసిదర్శనో సం పాలక పాలరక్తరసపానపలాశనతుష్టభూతబే తాళపరీతఖైరవపతద్రణమార్గనటద్భటద్రజా._ (కఠుత్‌ స్థ 3-18)

418 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

పారిపోతూ పారిపోతూ కడప, కర్నూలు, అనంతపురం సీమలలో తమ అధికారం ఉన్న దుర్వాలనైనా రక్షించుకోవాలని గోలకొండ సైన్యాలు భావించాయి. అయితే పెనుకొండలో జయలక్ష్మిని చేపట్టిన రాయరాణువ ఊరుకొంటుందా? పెనుకొండ సేనలు గుత్తిని స్వాధీనం చేసుకొన్నాయి. గండికోటను ముట్టడించాయి. మట్ల అనంతరాజూ, కస్తూరి రంగప్పనాయకుడూ సుల్తాన్‌ సేనలను వెంట తరిమాడు. కొచ్చెర్లకోట దాకా వెళ్ళగొట్టాడు. మట్ల అనంతరాజు మరొకపక్క విక్రమించాడు. గోలకొండ సైన్యాలకు స్థానిక నాయకులు కొందరు సాయపడ్డారు. గుర్రంకొండలో రావెళ్ళవారు పేనుకొండసేనలను ప్రతిఘటించారు. గుర్రంకొండ బలమైన దుర్గం. దానిని ఎలాగైనా పట్టుకోవాలని మట్ల అనంతరాజు సంకల్పించుకొన్నాడు. కార్చిచ్చులాగా మందుతిత్తులు కాలుతున్నా తుపాకులు నిప్పులు కక్కుతున్నా, చిత్తవానలాగా రాళ్లుపడుతున్నా లక్ష్యపెట్టకతుండా మృత్యువును ధిక్కరించి గుర్రంకొండకోటను మట్ల అనంతరాజు పట్టుకొన్నాడు. రావెళ్ళవారిని నిర్ణించాడు. ఇది అతని ఘనవిజయం. దీనిని భట్రాజులు ఇలా పాగిడారు,కి

కార్చిచ్చుకరణి పెంగాక లాకసమందు మందు తిత్తులకును సందడిలక

ఘూర్టిల్లు చిచ్చులు గ్రుమ్మరించు తుపాకి డబ్బుడిబ్బునకు తబ్బిబ్బుగాక

'జడిగొని పెనుచిత్తజల్లుగా జోరున దుమికించు రాళ్లకు దొశ్రుపడక

ప్రతిశబ్బములదిశల్‌ పగుల నార్బటిసేయు బలుఫిరంగీగుండ్ల కళుకులేత

ఆహవముచేసి పాదుశాహారులెంచ

గూలద్రోయకె గుర్రము కొండబురుజు

మట్ల యల్ల ధరాధిరాణ్మణీయనంత

రాజదేవేంద్రవిక్రమ రాఘవేంద్ర. (భత్రూజు చాటువు)

ఈ విజయానికి తోడు అతని కోలారు ముట్టడి కూడా గొప్పది. వెంకటపతి రాయల అధికారాన్ని కళాపూర్ణోదయం కృష్ణమరాజూ, కొండ్రాజు తిరుపతి రాజూ మొదలైనవాళ్లు ఎలా ప్రతిఘటించారో అలాగే కన్నడభూములలోని కోలారు ప్రాంతాలకు అమరనాయకుడైన తమ్మనగౌడకూడా ధిక్కరించాడు. ఈ విద్రోహికి కూడా బుర్గీ చెప్పాలని వెంకటపతిరాయలు నిశ్చయించాడు. మట్ల అనంతరాజు, వెలుగోటి కస్తూరి రంగప్ప. తంజావూరు రఘునాథ నాయకరయ్య _ మొదలైన మహావీరులతో వెంకటపతిరాయలు దండు వెళ్లాడు. కోలారు ముట్టడిలో కోటపై నడవడం బాధ్యత మట్ల అనంతరాజుకే అప్పజెప్పారు. కస్తూరి రంగయ్య, తంజావూరు రఘునాథనాయకరయ్య మొదలైనవాళ్లు విక్రమించి తమ్మన గౌడను బంధించారు. మట్ల అనంతరాజు విజృంభించి కోలారును స్వాధీనం చేసుకొన్నాడు.

ఈ విజయయాత్ర ఇక్కడితో ఆగలేదు. దక్షిణానికి మళ్ళింది. మధురను పాలించే పాండ్యరాజులు రాయసామ్రాజ్యానికి చాలాకాలంనుంచి అణకువగా ఉండడం లేదు. 3 గ్టళ్షర్టూద్థాన్నం్స ట్రైబ్రాగాకాణ కరా కత గఆజణంటు 5జి ఊ 10 4లుణటణగాలఖ్లూ.

మట్ల అనంతరాజు 419 అందుచేత వాళ్ళకు బుద్ధి చెప్పడానికీ ఈ మురసునాడు యుదాల తరువాత మట అనంతరాజును మధురమీదికి వెంకటపతిరాయలు పంపించాడు. “అప్పుడు మధురను వీరప్పనాయకుడు పాలిస్తున్నాడు. రాయలు తనకు ఆదేశించిన పనులను మట్ల అనంతరాజు సక్రమంగా నిర్నర్తించాడు. మధుర వీరష్పనాయకుణ్జి సంహరించి స్వామి కార్యం జయప్రదం చేశాడు*

మధురను ఒక వీరప్ప నాయకుడు క్రీ.శ1572 నుండీ 1535 దాకా పాలించాడు గనుక మట్ట అనంతరాజు మధుర నాయకుణ్ణి సంహరించిన సంవత్సరం శ్రీ.శ1595 అయివుంటుందని చరిత్రకారులు నిర్ణయించారు.

క్రీ.శ1538-99లో కళాపూర్లోదయం కృష్ణమరాజును బంధించడానికీ, కొండత్రాజు తిరుపతిరాజును నిర్జించడానికీ ముందు మట్ల అనంతరాజు ఇలా ఎన్నో యుద్ధాలలో పాలొని విజయాలు సాధించాడు. సిద్ధవటంసీమకు, పులుగులనాడుకు మహామండలేశ్చరు లయ్యాక మట్లవారు మరొక పెద్ద యుద్ధంలో పాలొన్నారు.

గోలకొండ నైన్యాలను తరిమికొట్టి, మురసునాడును అణచిపెట్టి. మధుర నాయకులను మట్టుపెట్టి, నంద్యాల రాజును బంధించి. కొండ్రాజువారిని నిర్జించి దేశాన్ని ఒక కొలికికి తఆస్తున్నాా కొందరు వెంకటపతిరాయల అధికారాన్ని ఇంకా అంగీకరించలేదు. నేటి చెంగల్పట్టు జిల్లా వేలూరును పాలించే లింగచమనాయకుడు ప్రతిఘటించాడు. దక్షిణాది దొరలను-ముఖ్యంగా మధుర, తంజావూరు, చెంబీ నాయకులను తనకు సహాయం రమ్మన్నాడు. లింగము నాయకుడు గొప్ప సైన్యాన్ని సేకరించాడు. తన బావమరిది దావుల పాపయ్యను సర్వనైన్యాధిపతిని చేశాడు. నూరు ఏనుగులు, అయిదువందల జతల గుర్రాలు, వెయ్యిమంది అందలాల సామంతుల, పదివేల విలుమూక, పన్నాండు వేలమంది తుపాకి మూక, ముష్ఫయి వేలమంది పదాతులతో పాపయ్య కదిలాడు. ఊత్తరమల్లూరువద్ద క్రీ.శ 1891లో సంకులసమరం జరిగింది. ఈ యుద్దంలో మట్ల అనంతరాబేకాక అతని కుమారుడు తిరువెంగళరాజుతూడ

స్‌ టీ

పాలొన్నాడు. దామెర్ల చెన్నయ్య మొదలైన రణవీరుల తోడ్పాటుతో మట్ల అనంతరాజు వేలూరు లింగనాయకుణ్ణి ఓడించాడు. వేలూరు కోకొను రాయలకు స్వాధీనం చేశాడు. నాటినుంచి అది రాయవేలూరు అయింది.

ఇటువంటి మహత్తర విజయాలను సాధించి మట్ల అనంతరాజు క్రీ.41606 నాటికి సిద్ధవటం రాజ్యాన్ని పాలించాడు. ఎన్నో దానాలు చేశాడు. ఎందరో కవులను పోషించాడు. తండ్రీ పేర తటాకాలు తవ్వించాడు. తనే స్వయంగా కావ్యాన్ని వ్రాసి

మట్ల అనంతరాజు ఎంతటి కదనవీరుడో అంతటి కావ్యలోలుడు. “మేధావైశద్య 4. రఘునాథనాయకాభ్యుదయం, ఇంగ్లీషుపీఠిక - నేలటూరి వెంకటరమణయ్యగారు, పుట ౭.

420 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కొలువులో ఒక 'ఆంధ్రకవితాపితామహుడు' ఉండేవాడు. ఆయన పేరు ఉప్పుగొండూరు వెంకటకవి. ఆయన '“ఉభయచ్చత్రచామర శంఖసంఘాతాంకు'డట. ఈ వెంకటకవిగారిని చూచి మట్ల ఎల్లమరాజు “శాశ్వతమైన ధర్మమేమిటి?' అని ప్రశ్నించాడు. ఆయన "కృతి శాశ్వతం” అని చెప్పి, “నీ కుమారుడే సత్కవి' అని ఇలా విశదపరిచాడు. మహినీపుత్రుడనంతుడు- బహుమహిమల జెప్ప నేర్పు భవమౌళిధునీ లహరీఘుమఘుమితవచో- మహితంబులు కృతులు స్వరమాధురి నవురా. (కకుత్‌స్థ.1-12) ఇలా ఆంధ్రకవితాపితామహుడు చెప్పాక మట్ల అనంతరాజు తన తండ్రీ అఖిప్రాయాన్ని గుర్తించి, తాను వ్రాయబోతూన్న కకుత్‌స్థవిజయాన్ని తండ్రికే అంకితమిచ్చాడు. ఇది అయిదాశ్వాసాల కావ్యం. ఇందులో 936 గద్యపద్యాలున్నాయి. అయితే ముప్పాతికామూడువంతుల పుస్తకం అయ్యేదాకా అసలు కకుత్‌స్థ విజయం మొదలవదు. 587 గద్యపద్యాలయ్యాక నాలుగో అశ్వాసం 35వ పద్యంలో కకుత్‌స్థుడు జన్సిస్తాడు. ఇతడు పురంజయుడనే పేరుతో ఇంద్రవాహనుడై దీపకేతుడనే రాక్షసుణ్ణి జయిస్తాడు. ఈ విజయాన్ని ఆధారంగా చేసుకొని మట్ల అనంతరాజు పెద్ద కథ చెప్పడానికి ప్రయత్నించాడు. కకుత్‌స్థుని తండ్రి సుకుమారుని కథా, అతని తండ్రీ ఇక్ష్వాకుని కథా మొదట చెప్పాడు. నారదసఖుడైన పర్వతుడు ఉపదేశం చేయడంవల్ల ఇక్ష్వాకు బదరికావనంలో తపస్సు చేస్తున్నాడు. అఆ ఉగ్రతపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు ప్రతి వసంతమాసంలోనూ అప్పరసలను పంపించాడు. వాళ్లు “నాట్‌ పెయిడ్‌ ఉత్తరాలలాగ తిరిగి వచ్చేస్తున్నారు. అప్పుడు కర్పూరతిలక అనే అప్సరస పంతం పట్టింది. మన్మథుడు వసంతుడు మొదలైనవాళ్ళతో తపోవనానికి వెళ్ళింది. ఆమెకూడ ఇక్ష్వాకు తపస్సును భంగం చేయలేకపోయింది. ఇక్ష్వాకు కళ్లు తెరచి, నవ్వు నవ్వి తనకు అపకారం చేయడానికి వచ్చినవాళ్ళకు ఉపకారాలు చేసి సాగనంపాడు. తన అందం ఏమీ పని చేయలేదని కర్పూరతిలక చిన్నబుచ్చుకుంది. "వంచిన తల యొత్తుట మనసించిక ఆమె యింటికి పోయింది. తాను తపస్సు చేసైనా ఇక్ష్వాకును పొందాలనుకొంది. కణ్వమహామునిని ఆశ్రయించింది. అతడు వరంలాగ మారిన శాపమిచ్చాడు. ఇది జరగడానికి ముందు బ్రహ్మాదులు తల్లడిల్లి ఇక్ష్వాకు తపస్సు ఫలించే మార్గం చూశారు. అతడు కోరేదల్లా రంగధామం తనకు లఖించాలనే. దేవుడు ఆ సంకల్పాన్ని సిద్ధింపటేశాడు. ఇక్ష్వాకు ఇంటికి వచ్చాడు. రంగశాయిని పూజిస్తున్నాడు. అతనికోసం విశ్వకర్మ రాతిప్రతిమలతో దివ్యాలయం నిర్మించాడు. ఇక్ష్వాకు పెళ్లాంవిడ్డలతో హాయిగా ఉన్నాడు. అతనికి నూరుగురు కుమూరులు. పెద్దవాడి పేరు వికుక్ష. అతజణ్జే మహర్షులు సుకుమారుడంటారు. ఒకనాడు ఇక్ష్వాకు కొలువులో ఉండగా అతనివద్దకు ఒక వడ్రంగి వచ్చాడు. | సిరసున నొక చాయ జిలుగురుమాలుతో జీరణం బొక చెంప బిక్క బెక్కి చికిలినిగ్గులు చిమ్ము చిన్నారి క్రొవ్వాడి చేబాడిద భూజా గ్రసీమజేర్చి పసిడికట్టుల బొల్చు పవడంపువిడితోడి యులిదట్టిపారవెంట మొల నమర్చి పదను దప్పుక లోహపాషాణముల బట్టు చిత్రికపల్లు డాచేత బూని

మట్ల అనంతరాజు జీ2]

నిగనిగని కెంపేముక్కును నీలినయన

కాంతులును బచ్చరెక్క లకైపుగల్లు

కృతకకీరంబు వలకేల నతిశయిల్ల

వచ్చె వడ్రంగియొకడుభూవరునికడకు. (కకుత్‌స్థ, 2-23) అఆ మాయచిలుక 'విద్దాలు' చేసింది. ఆ వడ్రంగి చక్కని గుర్రాలతో, హేషతో ఉన్న దివ్యరథాన్ని రప్పించి రాజుకు ప్రదర్శించాడు. ఈ వడ్రంగి మారువేషంలో ఉన్న దేవశిల్సే. ఒక పనిమీద వచ్చాడు. ఇక్ష్వాకు ఈ రథాన్నెక్కి ఆకాశసంచారం చేయడం దేవతలు వాంఛించారు. తీరిచ్చి దేవశిల్పి సెలవు తీసుకొన్నాడు. తన పెద్దకొడుకు రథం నడుపుతూ ఉండగా ఇక్ష్వాకు గగనసంచారం చేశాడు. బండీ తోలడం కూడా ఒక అర్డు. సుకుమారుడు ఇలా అనుకొన్నాడు: క్‌

ఒక వేల్పుతో మాటలకు నిల్పవలసిన బగ్గముల్‌ గదియంగ బట్టకున్న

గెలని వింతలు చూడదలపుగల్లిన చోట నెప్పుడప్పటివాగె త్రిప్పకున్న

ముంచిపోవు విమానములు కూడగోరిన గేలెత్తి ధేయని తోలకున్న

జగదంతరప్రజాసమ్మర్థపథముల హాధిరాయని వేగ మాగకున్న

మసలు గేడించు దిరుగు సమ్ముతిగ నరుగు

రథిక హృదయం బెరింగి యౌరాగురాలు

నొగల నొక్కండలంకార మగుటకాక

యేను సారథి నని వాని బూననేల? (కకుత్‌స్థ. 2-42)

ఈ రథం ఆకాశంలో పోతూ ఉండగా కొత్త ఎలమితో నారదుడు ఆ దారంట వస్తున్నాడు. ఆ దేవమౌనికి ఇక్ష్వాకు నమస్కరించాడు. రథం అపి ఎక్కించుకొన్నాడు. వీణను అంది పుచ్చుకొన్నాడు. “ఏమి స్వామి! వీణ ఇలా ఉంది? దుమ్ముయినా దులపలేదు. తీగలు ఊడి ఉన్నాయి. తమ కండ్లు బడలికను సూచిస్తున్నాయి” అని ఇక్ష్వాకు అడిగాడు. “కలహాలు లేక కళ్లు కాయలు కాచాయి'”' అని నారద్భుడ్లు చెప్పాడు. జగడాలు చూడ్డంకోసం ఆ రథంలో బైఠాయించాడు. ఎన్నో వింతలూ విడ్డూరాలు జరిగాయి. తన వంశం వాళ్లే అయినా ఇక్ష్వాకునూ, అతని కొడుకు వికుక్షిని చూసి కరుణించి సూర్యభగవానుడు వికుక్షి కడుపులో తన అంశను దాచాడు. ఉత్తరోత్తరా ఇతని కడుపున ఒక కాయ కాయడానికి విత్తు దాచాడు. రథం సాగుతూ ఉండగా ఆకాశంలో ఒక కాసారం ఏర్పడీంది. ఎక్కడలేని పక్షులూ వచ్చి వాలాయి. ఆది చెరువూ కాదు; అవి పక్షులూ కావు. కాసారం ఒక రాక్షసుడు; పిట్టలు అతని అనుచరులు. తండ్రీకొడుకులు యుద్ధం చేసి వాళ్ళను ఓడించారు. రథంలో నారదుడు ఇది తీరుబాటుగా చూశాడు.

తన తండ్రితో పాటు యుద్ధాలలో పాల్గొన్న మట్ల అనంతరాజు ఆ యుద్దాన్ని ఇలా వర్ణించాడు.

జనకుండు దుమికి కచుని గీటడంచిన దనయుండుష్పధురోనముతలయదల్పి

గురుడు ఖేక గ్రీవు కుత్తుక దునిమిన నురుడు రోహితుని జీవితము గొనియె

422 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దండ్రి యధ్వరవిఘాతకు బారిసమరిన గొడుకు శంఖనఖాఖ్యుగోలుమసగె నయ్య రాజీవబాహాసురు బొలిగొన్న విడ్డండు కునఖుని బవిలుకుమార్చె దివిజరాజాది దిక్సాలదేవతాక విశిఖముల నిట్లు దై తేయవిశసనంబు సలిపి రిక్ష్వాకతుసుకుమారులలయకిలమి గొంతవడి వంతువడి మరుత్కోటివొగడ., (కకుత్‌స్థ, 2119)

తన తండ్రితో కలిసి తానెలా యుద్ధం చేశాడో అలాగే మట్ల అనంతరాజుతో కలిసి అతని

కొడుకు తిరువెంగళరాజు కూడా యుద్ధాలలో పాల్గొన్నాడు. ఈ కకుత్‌స్థ విజయాన్ని బ్రాస్తున్నప్పుడు అనంతరాజుకు తన జీవితంలోని ఈ ఘట్టాలు జ్ఞాపకం వచ్చాయి కాబోలు. తండ్రీకొడుకుల ఉమ్మడి యుద్దాన్ని వర్ణించాడు. ఈ ఆకాశ సమరం జరుగుతూ ఉండగా నారదుడు ఒకపక్కనుంచి పాత కథలు చెప్పసాగాడు. 'కొలువో ఇది రణమో ఇష్టాగోష్టీ కథకతుం తల సూపె' అని మెచ్చుకొన్నాడు. గగనకాసారకథను, ఆ రాక్షసుని

జననవేళ, వాడికా పేరు అన్వర్థమని సరస్వతి పలకడం మొదలైనవి నారదుడు చెప్పాడు. ఈ

యుద్ధం ముగిశాక తండ్రీకొడుకులు దేవముని లోకాలన్నీ తిరిగారు. చివరకు నారదుడు కథనం చేశాక కర్పూరతిలకం కథకూడా ఇక్ష్వాకు విన్నాడు.

ఆమె విరహాన్ని తిలుసుకొన్నాడు. ఆమెను అనుగ్రహించాడు. ఇక్ష్వాకురాకడలు ఒక తెల్ల తుమ్మెద నాయికకు చెప్పింది, చెప్పిన తేటి గాంచి ముని చెయి మనోజునకు న్సృహాయ మీ యప్పచి కొండపుట్టె సకీయా యిక నోకడుమన్న యన్ను లం దెప్పిరి చూచె నప్పుడొక తీరున నున్న విరాళి బాలయీ త్రిప్పుల నన్ను బెట్ట డిక దెచ్చు విభున్మరుడంచు వేడుకళ. (కకుత్‌స్థ, ౩-14) ఇక్ష్వాకు తన పెద్దభార్య అనుమతి తీసుకొని ఈ కొత్తపిల్లను పెళ్లాడాడు (౩3-140). ఈ వివరం కవి వ్రాయడానికి కారణముంది. మట్ల అనంతరాజు తన తండ్రికి నాలుగో భార్య కొడుకు. బహుశా తనకు తిలియని ఏదో మానసికమైన కాంప్లెక్సు ఈ మాట బ్రాయించి ఉంటుంది. ఇక్ష్వాకు పెళ్ళి చేసుకొని గృహప్రవేశం చేశాడు. లజ్ఞాభారం వదలి దంపతులు క్రీడించారు. అధరాధరామృతం బాస్వాదనముసేయు మోహ మందగ జేసి ముద్దు బెట్టు దరహాసమాననాంబరసీమ ఘటియించు మునిపంట నొయ్యన మోవినొక్కు నెడనెడ గీల్వంటు సడలిన ముడిగాల్పు కేలాంచలంబున జెమరు తుడుచు నసదు లేబల్కుల గొసరి పేరున బిల్చుగను దోయి సౌఖ్యసంత్రమము దేల్పు గుబ్చిగుబ్బల నెదనాట గౌగలించు బారువములకు గళరవాభ్యాస మొసగు జేరి కొనగోట మక్కువ జెక్కు నొక్కు యువతిసురతంబు జల్పు నయుత్చలాక్షి. (కఠుత్‌స్థ. 4-18)

మట్ల అనంతరాజు 423

ఈ పద్యంలోని 'పారువములకు గళరవాలు నేర్పడం" అనే మాట పింగళి సూరపరాజుగారి. ప్రభావమే. కళాపూరోదయంలో సరస్వతిమణితాన్ని చిలుక నేర్చుకొంటుంది. దానినే అనంతరాజు ఇలా ప్రతిధ్వనింపటేశాడు. ఈ కకుతస్థ విజయంలో కథ చెప్పే తీరంతా కళాపూర్లోదయానికి అనుసరణమే. ఎకొచ్చి అక్కడీ కథలో శృంగారముండి రక్తి కట్టింది. ఇక్కడి కథలో వీరరసమే ముందుకు వచ్చింది. కళాపూర్ల్జోదయం పుట్టాక నారదునికి తెలుగు కావ్యాలలో గిరాకీ హెచ్చింది. అయితే కళాపూరోదయంలో అతడు ఒక లోకంలోని కథకు సూత్రధారి. ఈ కకుత్‌స్థ విజయంలో ఉత్త కథకుడే.

అప్పటికే నూరుగురు బిడ్డలను కన్న ఇక్ష్వాకుని 'భావభవబ్రహ్మానుభవా విష్పూతహృదయుణ్ణి' చేశాక మట్ల అనంతరాజు తాను వ్రాస్తున్నది కఠుత్‌స్థ విజయమనీ, ఇంకా కథానాయకుడు జన్మించలేదని గుర్తుచేసుకొన్నట్టుంది. ఇజ్ష్వాకుచేత పెద్ద కొడుక్కు పట్టం కట్టించాడు. ఆ సుకుమూరుడికీ కకుత్‌స్థుడు పుట్టాడని చెప్పాడు. ఆ కుర్రాడు పెరిగి వీరుడయ్యాడని చెప్పాడు. కకుత్‌స్థుడు వేటాడి రాక్షస సంహారంలో తన ప్రజ్ఞను చూపాడు. ఆ నేర్పు వేయికళ్లు పెట్టుకొని చూడాలని బోయరాజన్నాడు. “నేను అంతే చేశానని ఆ మాటలో ఇంద్రుడు ప్రవేశించాడు. తాను వాహనమై కఠుత్‌స్థునిచే దీపకేతుణ్ణీ సంహరింపజేశాడు.

చెప్పే తీరు ఎంత బాగున్నా, చెప్పిన కథలో పసలేకపోవడంచేత ఈ కావ్యం అంత రాజించదు. అయితే కొన్ని విషయాలలో కకుత్‌స్థ విజయం సాహిత్య చరిత్రలో ఒక ఫర్ణాంగురాయి. మన యక్షగానాలలో కొరవంజిపాత్ర కనబడుతుంది గాని ప్రబంధాలలో అది అరుదు. మట్ల అనంతరాజు ప్రక్యేకించి కొరవంజిని ఈ కావ్యాలలో కర్పూరతిలక

కతుంచియదోయి మూపులకు గోపులకు న్నెరి చూపజోటిజో

డంచు లలంకరింప గురువైన కిరీటము వెట్టి జక్కి జీ

సంచున కబ్బగంధి జలజాతసుంగంధిమణీమయ క్రియ

ల్లాంచిన బుట్ట బుట్టె డెరుక ల్నెరపెం గొరవంజి యాటలన్‌. (కకుత్‌స్థ, ౩-88)

ఈ “చెలువ కొరవంజియెరుకచే' చిన్నబోయిందట (3-%). మన ప్రబంధాలలో కొరవంజిని పేర్కొనడం ఇది తొలిసారి. కకుత్‌స్థ విజయం క్రీ.శ. 1538 తరువాత, 1600కీ పూర్వం బ్రాసినది కావడంవల్ల పదహారో శతాబ్ధపు అంతంలో కొరవంజులు తెలుగుదేశంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ కావ్యంలో మట్ల అనంతరాజు కొన్ని విశేష ప్రయోగాలు చేశాడు. వస్ట్రోయి మంది అని చెప్పడానికీ 'ముప్పండ్రూ అనే మాట యతి స్థానంలో వాడాడు. “అప్పని ద్వీపధ్వజు డెవ్వ డాస్తులుగ ముప్పండ్రైవ్వరెచ్చో గనుం-గొనగల్లె౯్‌?. (4-19)... ఇతని ప్రయోగాలు ఇప్పుడిప్పుడే నిఘంటువులను ఎక్కుతున్నాయి. 8... శబ్బరత్నాకరం - 'సవరణలు-వివరణల'తో ప్రచురించిన అనుబంధంలో నిడుదవోలు వెంకటరావు

గారు కకుత్‌స్థవిజయంలోని ప్రయోగాలు స్పీకరించారు.

424 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంప్పుటి

అనంతరాజు వోషపదప్రయోగాలనే కాక అపురూపమైన వృత్తాలను కూడా ముద్రాలంకారలతో వాడాడు. కొన్ని మరే పుస్తకాలలోనూ ఇప్పటిదాకా ఎవరూ వాడనివే. ముద్రాలంకారాల వివరాలు ఇవి:

కవిరాజ విరాజితం 3-54 మధుర గతిరగడ 2-222

తరళ 3-57, 4-139 మానిని 3=-137, 5-13

త్వరితపదగతి వృత్తం 5-15 | మాలిని 3-10

పణవవృత్తం 5-146 | రధోద్ధవృత్తం 5-14?

పద్మనాభవృత్తం 3-31 వనమయూరం 1217

ప్రహరణకలిః 55-104 సుగంధి శీ-179

బంధురవృత్తం 5-25

ఈ _విోేషవృత్తాలన్నీ అప్పకవీయంలో కనబడతాయి. అయితే కొన్నింటికి నామాంతరాలు కూడా ఉన్నాయి.

మట్ల అనంతరాజు ముద్రాలంకారాలను వాడడంవల్ల పదహారో శతాబ్దం చివరి రోజులలో ఏ పేర్లు ఈ వృత్తాలకు ఎక్కువ ప్రచారంలో ఉండేవో తెలుస్తుంది. పై విశేష వృత్తాలలో వేరే పేరులున్న వృత్తాల వివరాలు చూడండీ :

  1. త్వరితపదగతి: (పాలాశదలము) 17వ ఛందంలో 32763వ వృత్తం

  2. రధోద్ధతము: (పరాంతిక) 11వ ఛందంలో 699వ వృత్తం

౩ సుగంధి: (శాలిని, చామర, ప్రశాంతి) 15వ ఛందంలో 10923వ వృత్తం

మట్ట అనంతరాజు చేసిన వ్యాకరణ ప్రయోగాలపై కూడా పరిశోధన చాలా అవసరం. “ఈ కవికి సంస్కృత భాషయందలి పాండిత్యము మిక్కుటమైనదని కొన్ని ప్రయోగములవలన తెలియవచ్చుచున్నది. మాటలు శూర్చుటలో గూడ నీతడు మిక్కిలి తిలివిగలవాడు” అని ఇతని గ్రంథాన్ని ప్రకటించిన సరస్వతీపత్రికాధిపతులు చెప్పిన మాట నిజంగ

తెలివితీటల గురించి మట్ల అనంతరాజుకు కూడ కొన్ని అఖిప్రాయా లున్నాయి. మామూలు దృష్టికన్నా జ్ఞానదృష్టి ఎక్కువని ఇలా చెప్పాడు:

దర్పణంబు లేక తన మోము గనరాదు

దాననైన వెన్ను గానరాదు

కన్నులొప్ప నెంత గననోపు జెప్పుడా

యెరుక చూప కాంచు నెలయవియు. (కకుత్‌స్థ. 1-18)

మట్ల అనంతరాజు గ్రంథం ఆంధ్రసాహిత్యంపట్ల మన ఎరుకచూపును మరికొంత స్పష్టపరుస్తుంది. ననా లనునననాాలుననునుా ననున కలనా లావాలా నాలా నానా నాననానాా నానా ననన. 6. కతుత్‌స్థవిజయం - మొదటికూర్చు (1904) పీఠిక - కొ.రా.వేం కృష్టారావుగారు

కవి చొడప్ప

ఎ౦డలో ఎండనివాడూ, వానలో తడవనివాడూ లేనట్టే తన నీతి విననివాడు కూడా లోకంలో లేడని సగర్వంగా చెప్పుకొన్న కవి కుందవరపు చౌడప్ప, ఇతని కందాలలో కనీసం ఒకటిరెండైనా నోటికిరాని సాహితీపరుడు ఉండడు. చౌడప్ప, తాను నీతిపద్యాల రచయితననే ఎక్కువగా చెప్పుకొన్నా బూతుకవిగానే అతనికి ఎక్కడలేని పేరూ వచ్చింది. నిజానికి మన తెలుగు సాహిత్యంలో అసలుసిసలు తొలి బూతుకవి అనే: పేరుకు నోచుకొన్నవాడు చౌడప్ప, అయితే ఇతనికి బూతంటే భయమేం లేదు. అందరూ ఎప్పుడో అప్పుడు బహుశా తెలుగుదేశపు నడివీథులో అప్పుడప్పుడు బాహాటంగా వినబడే రెండక్షరాల క్రియాపదాస్సీ బహుశా అతని ఉద్దేశంలో ఉత్తమాంగాల నామవాచకా లనూ పద్యాలలో వాడడానికి వెనుదీయడు. మానవ జీవితంలో బూతు సహజమని అతని ఉద్దేశం. ఇతడు తన శతకంలో ఇలా ప్రన్నించాడు:

బూతని నగుదురు తమతమ - తాతలు ముత్తాత మొదలు తరతరములవా

కేతీరున జన్మించిరొ - ఖ్యాతిగ మరి? కుందవరపు కవి చౌడప్పా!

బూతును ఇంత సమర్ధించినా, చౌడప్ప బూతుకోసం బూతు చెప్పలేదు. అతని కాలంలో “పది నీతులు పది బూతులు - పది శృంగారములు గల్లు పద్యములు సభం- జదివినవాడే యధికుడు.” నీతిమాటకేం, కొద్దిగా బూతాడకపోతి దొరకు సభలో నవ్వుపుట్టడటు.

నీతుల కేమి యొకించుక - బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో

నీతులు బూతులు లోక - ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా!

చౌడప్ప నవ్వు పుట్టించడానికి ప్రయత్నించిన దొర మట్ల అనంతరాజు, ఇతడు కకుత్‌స్థ విజయం వ్రాసిన ప్రభువే. ఇతని గురించి ఇంతకు ముందు మనం చెప్పుకొన్నాం. ఈ అనంతరాజుగారి సభలో ఘంటన, చౌడన్నలనే హాస్యగాళ్లున్నారు. వాళ్ళలో రెండవవాడే కవి చౌడప్ప. ఈ హాస్యగాళ్ళ గురించి ఈ క్రింది పద్భుం వినవస్తుంది.

అన్నిట మంచివారు విమలాత్ములు హాస్య కళాధురంధరుల్‌

సన్నుతనీతిపాలకులు జాణల నైపుణు లెవ్వరంటిరా

పన్నుగ మట్లనంతనరపాలుని గొల్చి మహానుభావులై

వన్నెకు నెక్కి నట్టి గుణవంతులు ఘంటనచౌడగాండ్లురా।

చౌడప్పతోపాటు అనంతరాజుగారి కొలువులో హాస్యకళాధురంధరుడుగా పేరుపడ్డ ఘంటన ఎవరో తెలియదు. చౌడప్ప మాత్రం చాలా ప్రసిద్ధుడై, ధరజణీనాయకకోటిని తన కవిత్వఫ్రౌడితో మెప్పించిన సరసాగ్రేసర చక్రవర్తి అయ్యాడు. ఈ సంగతులను ఈ క్రింది పద్యం విశదం చేస్తుంది:

కరుణాసాగర హాస్యానాయక తపోగాంగేయ గోపాల త్వ

చ్చరణాంభోరుహభ్యంగ కుందవరవంశ గ్రామణీ ధీమణీ।

426 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ధరణీనాయకకోటి నెప్పుడు కవిత్వప్రొడీ మెప్పించగా సరసా గ్రేసరచక్రవర్తివి గదా చౌడా జగన్మోహనా! చౌడప్ప మెప్పించిన ధరణీనాయకకోటిలో తంజావూరి రఘునాథ నాయకరయ్య గారు ఒకరు. అయితే వారి సభలో చౌడప్ప కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకొని నవ్వు పుట్టించడానికి ప్రయత్నించినట్టుంది. దానికి ఈ క్రింది పద్యం సాక్షి. నేరుతు నని మాట్లాడగ - వారిజభవునంతవాని వశమా తంజా వూరి రఘునాథనాయని - గారెరుగగ గుందవరపు కవి చౌడప్పా! రఘునాథనాయకరయ్యగారు చాలా విషయాలలో దిట్ట. గొప్ప విద్వాంసులకే గురువులు. సంగీతసాహిత్యాలలో పండిపోయినవారు. చౌడప్ప కూడా గాన విద్యాప్రవీణుడు. అయిజే తన గానవిద్య గురించి చౌడప్ప నేర్చినట్లు వారి ముందు మాట్లాడి ఉండడు. తన శతకంలోతూడా అక్కడక్కడే గానం గురించి చెప్పాడు. అంభోజాక్షులలోపల - రంభయె కడు నందగత్తి రాగంబులలో గాంఖీర్యము గల రాగము - కాంభోజియె కుందవరపు కవి చౌడప్పా! రఘునాథనాయకరయ్యగారు తమ వాల్మీకి చరిత్రలో రంభను ఆటసానిగా, ఊర్వశిని పాటసానిగా ప్రస్తుతించారు. రంభ ఆడిన ఆటకు వాల్మీకీ చలించకపోతీ ఊర్వశి పాట పాడుతుంది. కొత్త రాగాలు సృష్టించిన నాయకరయ్యగారి దగ్గర కవి చౌడప్పు తన గానవిద్యను ప్రదర్శించాడో లేదోగాని తన గురించి చెప్పుకొన్న ఒక సీసపద్యపు చివరీ ఎత్తుగీతిలో ప్రత్యేకం ఈ ప్రజ్ఞను పేర్కొన్నారు. లోఖికి సొడ్డులోయని కేకవేస్తినా బ్రహ్మాండభాండంబు పగిలిపోవు గట్టిగా నొకసారి లొట్టలు వేస్తినా కుంభకర్ణుడు మేలుకొనగవలయు తూర్చుండీ యొకసారి కూతలు వేస్తినా ధర రెండు వ్రక్కలై యురలితీరు వెడగు లుబ్బుని బట్టి విషయింపజొస్తినా వరుసనిద్రియము లేమరకపారు ననెడు గాంేయకుందవరాన్న్వవాయ హాస్యకవి జాణ గాన విద్యాప్రవీణ నాగధీమణీ సత్పుత్ర నయచరిత్ర సకలసాభాగ్యగుణధుర్య చౌడయార్య। చౌడప్పకు లోభులంటే మంట; అసహ్యం. “తినజాలక, ఏ ధర్మము గనజాలక పరమలోఖి కష్టుడుగూర్చే ధనమెల్ల నేలపాలని కనుమప్పా;” అని హెచ్చరించాడు. చౌడప్ప ఇచ్చేవాడిపైననే పద్యం చెప్తాడు. ఏమియ్యని దొరపద్యము - నామంబిడీ చదువు టెల్ల నాలుకతీటా రామకథా భారతమా - కామింపగ కుందవరపు కవిచౌడప్పా! నిజం చెప్పడంలో కవి చౌడప్ప మొగమాటపడడు. అతడి దృష్టీలో ఇచ్చేవాడే దేవుడు.

కవి చౌడప్ప 427 దేవుడు దేవుండనగా - దేవుం డాదివమునుండి ద్తిగివచ్చేనా? ఈవిగల దొరయె దేవుడు - కావంగను గుందవరపు కవిచౌడప్పా!

అయినవాళ్ళతో కలిసి హాయిగా తినడమే వైభవమని అతని నమ్మకం.

తనపతి యిడగా మనుమలు - తనయులు తలిదండ్రు లన్నదమ్ములు బంధుల్‌

దినదినమును భుజియించుట - ఘనవిభవము కుందవరపు కవి చౌడప్పా! పండుగకు ఇతడు ఇచ్చిన నిర్వచనం కూడా గమనించదగ్గది.

పండుగ పండుగ యందురు - పండుగదిన మేది వయసుపడుచుల ప్రక్కక్‌

పండిన దినమే పండుగ - ఖండితముగ కుందవరపు కవిచౌడప్పా!

'బుణం కృత్వా ఘృతం పిటిత్తన్న చార్వాక సూత్రాన్ని సైతం ప్రచారం చేస్తాడు. అప్పయిన దీసి తినవలె - బప్పును వరికూడు, వయసు ఖామా మణులక్‌ మెప్పింపగవలె, జలువలె - కప్పగవలె కుందవరపు కవిచౌడప్పా!

కడుపునిండా తినడమేకాదు, అప్పుడప్పుడు తాంబూలం వేసుకొనడం కూడా అవసరం.

ఎప్పుడెప్పుడు వేసుకోవాలో ఇలా చెప్పాడు:

పరగడుపున సభలోపల - తరుణులయెడ భుక్తమైనతరి నొక విడెముం

దొరకని నరునకు సౌఖ్యము - కరువప్పా కుందవరపు కవిచౌడప్పా! తాంబూలంతోపాటు ఒకప్పుడు పొగాకు కూడా అవసరం అంటాడు. కొన్ని కొన్ని వెచ్చ వెచ్చని పదార్థాలుంటే చలి యేదీ అని ప్రశ్నిస్తాడు.

గుడిసెయు మంచము కుంపటి - విడియమును బొగాకుదన్ను విడనొల్లని మేల్‌

పడతియు గల్లిన జలి యె - క్కడి దప్పా కుందవరపు కవి చౌడప్పా!

మొత్తంమీద చౌడప్ప చాలా చక్కని భౌతికవాది. తాను తింటాడు; ఇతరులు తినాలంటాడు; సుఖంగా ఉండాలంటాడు. ఇయ్యలేనివాళ్లు కనీసం ఇప్పించగలగా లంటాడు.

ఇయ్యా ఇప్పించంగల - యయ్యలకేగాని మీసమన్యుల కేలా?

రొయ్యకు లేవా బారెడు - కయ్యానికి కుందవరపు కవి చౌడప్పా!

“త్రగుపాటి కవులకీయ్యని - మగముండల మూతి మీద మంగలి యేలా దిగగొరగడయ్యె మీసము” అని ప్రశ్నిస్తాడు. అతని కాలంలో మూతిమీద మీసంతోపాటే రాజులు భుజంమీద జందెం కూడా ఒకటి ముఖ్యమనుకునేవారు. దానిని ఇలా

రాచతనానకు జందెపు - బోచటరా గురుతు? రిపుల బొరిగొనుటయు జే

జాచిన నిచ్చుట శరణన - గాచుట రా గుందవరపు కవిచౌడప్పా!

ఇతనికి జీవితానుభవం జాస్తి. ప్రపంచాన్ని కాచి వడబోశాడు. ఇతని బూతు పద్యాలలో సైతం భాష మితిమీరినా భావం సూటిగా నిజాన్నే చెప్తుంది. దానిని కూడా కటువుగాకాక కమ్మగానే చెప్తాడు. తన కవిత్వాన్ని ఇలా పొగడుకొన్నాడు.

428 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చొక్కంటైన సుధారసంపు ఘుటికల్‌ చోద్యంబు నీ కావ్యముల్‌

స్రుక్కంబోవని గోస్తనీఫలతతుల్‌ శుంభదృృవత్కావ్యముల్‌

నిక్కం బన్నిట జాణు డౌదువు భళి నీ కెప్పుడుం బెల్లు నీ

ఢక్కా వాద్యపు పద్దు కుందవర చౌడా! శ్రీకవీంద్రోత్తమా!

, ఇతడు వృత్తాలు, సీసాలు ఎన్ని చెప్పాడో గాని శతకాన్ని మాత్రం కందాలల్లోనే చెప్పాడు. తిక్కనగారి తరువాత కందపద్యానికి తనే ఘనుడని లోకం మెచ్చుకొంటుందని ఆత్మస్తుతి చాలా నమ్మకంతో చేసుకొన్నాడు.

ఈ శతకాన్నే కాక ఒక నిఘంటువు కూడా ఇతడు వ్రాసినట్టుంది. 'చౌడప్పసీసాలు' అని ఒక శుద్ధాంధ్ర నిఘంటువులోని ౩ పద్యాలు దొరికాయి.! ఇవి శతకం వ్రాసిన చౌడప్పే చెప్పాడో, లేక ఇంకెవరు చెప్పారో! బహుశా వీటిని 'చౌడప్ప* రచించాడేమో। ఈ సీసాల వ్రాతప్రతి చివర “చోడప్ప సీసములు సంపూర్ణముగా క్రొత్తపల్లి లక్ష్మయ్య బ్రానెను” అని ఉంది.

తాను హాస్యగాణ్జనే చెప్పుకొన్నాడు. ఇతని పద్యాలు “గ్రామీణులకు హృదయరంజకములుగా నుండును గాని పండితజనపఠనయోగ్యములని చెప్పుటకు వీలులేదు” అని కొందరు భావిస్తారు.* ““లోకోత్తరమైన చిన్న చిన్న పద్యములను గోరుముద్దలతోబెట్టి కవ్వ్చించుచు మ్రింగజేయు కవి శక్తి వర్దనాతీతము. ఇంత గుణము కలచోట నించుక దోషమన్నది క్షంతవ్యము”' అని మరికొందరు భావిస్తున్నారు.3

' చౌడప్ప మాత్రం తానెప్పుడూ నీతి తప్పనని రొమ్ము విరుచుకొని ఇలా చెప్తాడు:

శరనిధి మేరదప్పినను శంకరు డిచ్చు వరంబు దప్పిన

సురగురు నీతి దప్పినను సూర్యుడు చంద్రుడు తోవదప్పినక్‌

పరుసతనాన రాఘవుని బాణముదప్పిన హాస్యకాండ్రలో

సరసుడు జాణ కుందవరచౌడుని పద్యము నీతి తప్పునే? ఇంతటి ఆత్మవిశ్వాసం లేనివాడు కవి కాలేడు.

చౌడప్ప పద్యం రోమబాణమే! " చా

  1. శతకకవుల చరిత్రము - వంగూరి నుబ్బారావుగారు, పుట 221.

  2. శతకవాబ్బయసర్వస్వము - వేదము వెంకటకృష్ణశర్మగారు, పుట 113

  3. శతకకవుల చరిత్ర, పుట 21౬

తరిగొప్పల మల్లన

ఇద్దరు అసాధారణ ప్రజ్ఞావంతులు ఒకేతరంలో రెండు విఖిన్నమైన బాజీలను క్రొత్తగా ప్రవేశపెట్టి సాహిత్యంలో చెరగని ముద్రలు వేసినప్పుడు ప్రథమేతర శ్రేణి రచయితకు ఏ ప్రతిభావంతుణ్ణి అనుసరించాలన్న సమస్క కలుగుతుంది. పదహారో శతాబ్దపు చివరిరోజులలో ఇటువంటి పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా ఏర్పడింది. కళాపూర్లోదయం సృష్టించి పింగళి సూరపరాజుగారు ఒక నవ్యరీతికి నాంది పలికారు. వసుచరిత్ర రచించి భట్టుమూర్తి ఒక బాణీకి బోణీ చేశాడు. కొత్త కథ కల్పించి. గమ్మత్తుగా నడిపించి మెత్తగా వినిపించడం అనే పద్ధతి సూరపరాజుగారిది. చిన్నమెత్తు పాత కథను తీసుకొని చింతాకు పతకంలాంటి కావ్యాన్ని నగిషీలు చెక్కి అడుగడుగునా తన పాండిత్యాన్ని జిగేలుమనిపించడం భట్టుమూర్తి తత్వం. పాత్ర స్వభావాల రాగప్రస్తారం చేసి కథను ఆలపించడం సూరపరాజుగారి ఆయువుపట్టు. ఎక్కడికక్కడ యమకాల గమకాలు భట్టుమూర్తి స్వభావం. అయితే ఇద్దరూ పాఠకులను ముగ్భల్ని చేయగలరు. ఇద్దరూ సమకాలిక కవులపైన ప్రగాడమైన ప్రభావాన్ని ప్రసరించినవాళ్లే.

ఈ రెండు ధోరణులనూ హర్తించి, అధ్యయనం చేసి. సుగుణాలను ఒంట బట్టించుకొని సమన్వయ శిల్పంలో సాహిత్యాన్ని సృష్టించడానికి ఎవర్టోనా కొంతకాలం పడుతుంది. ఈ ఇద్దరు మేధావంతుల సమకాలికులు మాత్రం తమ రచనలలో ఒకచోట ఒకరిని, ఇంకొకచోట ఇంకొకరిని అనుసరించడం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ పరిస్థితిని ప్రతిఫలించే దర్చణం చంద్రభాను చరిత్ర అనే కావ్యం. దీనిని తరిగొప్పుల మల్లన రచించాడు. -

కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో తరిగొప్పుల అనే గ్రామం ఊంది.! అ ఊళ్ళో శ్రీవిద్యోపాసకుల కుటుంబంలో నరసన్నుగారనే విద్యావంతుడున్నాడు. ఆయనకు అప్పయ్య, దత్తన, మల్లన అనే ముగ్గురు కుమారులున్నారు. వీళ్ళలో రెండవవాడు వ్రాయసం. “రాజాధిరాజ రాజపరమేశ సకల కర్ణాటకాంధ్రరాజధౌరేయ చిరుమల రాయతనయ చంద్రుడగు వేంకటపతిక్షితీంద్రమణీకి ఈ దత్తన్న అనుపమకార్యకర్త.'” ఇతని వ్రాతలు ద్వీపాంతర నృపులను సైతం ఆకర్షించేవి. అన్నగారిలాగే మల్లన కూడా వేంఠకటపతిరాయలవద్ద బ్రాయసం. ఇతనికి గండభేరుండ బిరుదు ఉండేది. ఇతడు ఆశు, విస్తర, చిత్ర, మధుర కవిత్వాలను చెప్పగలడు. తను చెప్పే విస్తర రచనలు సూరి హృదయాలను, ఆశువులు రసజ్ఞులను, యమకాదిచిత్రాలు మాన్యసత్కవులను, మధురకవితలు ప్రాజ్ఞులను మెప్పిస్తాయని మల్లన ఇలా చెప్పుకొన్నాడు.*

వరగంధచర్చిక ల్వాగ్నిస్తరమచర్చికలు సూరిహృదయభాగముల గూర్చు

గర్వూరమయవీటికవనాళువదధాటికలు రసజ్ఞిసుహృన్ముఖముల జేర్చు

  1. కృష్టా జిల్లాలో బందరు - బెజవాడల మధ్య కూడా ఒక తరిగొప్పుల ఉంది.

  2. సీసంలోని నాలుగవ పాదంలో మధురసదృంధవర్ణములు' అనే పాఠం కవి ఉద్దేశించాడనిపిస్తుంది. అశు, విస్తర, చిత్ర, బంధ కవిత్వాలు ప్రసిద్ధాలు,

430 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నతిచిత్రనేత్రముల్‌ యమకాదిచిత్రముల్మాన్యసత్కవిజనాత్మల ఘటించు మహితసువర్ణము ల్మధురసందర్చవర్ణములు ప్రాజ్ఞమహాశయముల నించు గండభేరుండ విరుదవిఖ్యాతమతికి రాయసము మల్లనికి గవిరాయనికిని మహిని గవిమానులును మంత్రిమాత్రులును స మానమే యన వెలసిన మానఘనుడ. (చంద్రభాను. 1-౪) అసమానమైన ఈ కవిరాయడు వెంకటపతిరాయల సభాసదుల తలలో

నాలుకలాగా ఉండేవాడు. ఇతనికీ చాలా పలుకుబడి ఉండేదని ఈ క్రింది పద్యం వల్ల

తిలుస్తుందిః నా కుపకర్త నాకు జెలి నాకు సహాయుడు నాకు బ్రా పిల న్నాకు బహుప్రదుండని మనంబున వేంకటరాట్స భాజనా నీకము సంస్క్మరింప మహనీయగుణోన్నతి గన్న యుత్తమ శోతుడ మల్లనాహ్న్బయుడ సువతు మత్కృతి నాథు నెన్నెదక్‌ (చంద్రభాను. 1-౪) మల్లన ఎన్నుకొన్న కృతినాథుడు దత్తాశ్రేయుడు, ఆ దేవుడు తరిగొప్పుల వాళ్ళే తులదైవం. అందుకే నరసన్నగారు తన రెండో కొడుక్కు దత్తన్న అనే పేరు పెట్టార్థు. పితృ ,సన్నిభుడు, హితదేశికుడు అయిన దత్తన్నగారిష్రూటను పాటించి మల్లన తన కావ్యాన్ని ఇలవేల్చుకు అంకితమిచ్చాడు. ఈ కావ్యాన్ని సత్కవిప్రకరాల కర్ట్ణాలకు సుధాపరిపూరణ 2 పద్యాలలో విపులంగా వర్ణించదగిన వైభవంతో ద్వారకానగరం విరాజిల్లుతూ ఉండేది. శ్రీకృష్ణురమాత్కుడు పాలించే ఆ రోజులో కూడా గవనిసందులలో జొరబడేవాళ్ళతు రక్షకవర్గంవాళ్లు సిక్కాగుర్తులు వేసేవాళ్ళట.

సారెకుసారెకుక్‌ గవనిసందుల నప్పురిసౌచ్చి యేగువా

డై రజనీకళత్రుడు తదగ్రతల స్థిరరక్షివర్గముం

జేరి మెయిక్‌ సికాగురుతు చేకొనబోలును గాక యున్నచో

బేరిన వెన్నవంటి శశివింబమున న్నైరకందు దోచునే? (చంద్రభాను. 1-జు

మేటికిరీటిపచ్చ రామశిగలతో మెళసిపోయే ద్వారకను పాలించే కృష్ణమూర్తికీ అందరికీ తెలిసినవిధంగా ఎనమండుగురు దేవేరులు. అందులో పెద్ద భార్యకు ముందుగొ విడ్డ పుట్టాడు. భర్త తన మందిరానికి వచ్చాక పూర్వంలాగా కాలదన్నక “చిన్న దొక్క మనవి గలదు. ఆలకించ'మని రెప్ప తుదలక నునుసిగ్గు దొలంక' భర్తను చూసింది. అతడు ముద్దుభార్య ముచ్చట ఏమిటో తెలుసుకొని కనికరించాడు. పుట్టిన బిడ్డకు చంద్రభానుడనే పేరు పెట్టారు. చంద్రభానుడు చంద్రునిలాగా ప్రవర్థమానమవుతూ, భానునిలాగొ వెలుగుతున్నాడు.

దబ్బలు పట్టుకొన్న కంచుకులు *“సముఖా' అని హెచ్చరించి. పేరుపేరన వక్కాణించగా ప్రవేశించిన రాజన్యులు సేవించుకొంటున్న జగాహజారంలో ఒకనాడు

ఉఅరిగొప్పుల మల్లన 41 కృష్ణుడు కొలువున్నాడు. అక్కడకు దివినుండి ఉట్టిపడ్డట్లు నారదుడు వచ్చాడు. “సవసవగా నేర్చినపాటియొక్క గీతము వినిపించెద' అని వీణ మీటి పాడాడు. కృష్ణుడు మెచ్చుకొన్నాడు. “మునీంద్రా! కొన్నాళ్ళపాటు మా ద్వారకలో ఉండి మా అబ్బాయిలకు సంగీతం చెప్పండి” అని కోరాడు. మౌని అంగీకరించాడు.

కళాపూర్లోదయంలో పింగళి సూరపరాజుగారు నారదునికే కృష్ణునిచేతా, ఆయన భార్యలచేతా సంగీత పాఠాలు చెప్పించారు. ఈ కావ్యంలో ఆ బాకీ చెల్లుపెట్టడానికీ కాబోలు తరిగొప్పుల మల్లన శ్రీకృష్ణుని పుత్రులకు నారదునిచేత చదువు చెప్పించాడు. అయితే ఆ గయ్యాళి తపసి పక్షపాతం చూపించాడు. చంద్రభానునికి సరిగ్గా చెప్పలేదు. పాపం, సత్యభామగారి అబ్బాయి చదువు చెప్పమంటే నారదుడు ఇలా ప్రవర్తించాడు:

పారెలు బెళికిన జక్కజేయు మటన్న నిదెవత్తు నిలుమని నదికి నేగు;

దంత్రులూడినవితగ గట్టియిమ్మన్న జపవేళ యనుచు నిశ్చలత నొందు;

శ్రుతలెల్ల డిగ్గినచో గూర్చియిమ్మన్న దేవపూజానిధి దీర్చెదనను;

నాలాపరక్తికి మేళవింపుమటన్న ధ్యానవేళ యొకీంత తాళు మనును;

మరియు నేమాట యడిగిన మమత లేక

చెంగి చెంగి చరించు నా చేష్టలెల్ల

మౌనివరు పక్షపాతంబుగా నెరింగి

చంద్రభానుడసూయావిచారుడగుచు. (చంద్రభాను. 1-13) కలిగిన విచారాన్ని కప్పిపుచ్చుకొని మృదూక్తులతో ఆ చంద్రభానుడు '“అయ్యా। నేనపకారినే? తెలపరాదా నాకు నా చందములోొ” అని ప్రార్థించి, చివరకు ''సవతి విడ్డల కిట్లు మత్సరము బెంచి చివ్వ యొనరింప నింత చేసితివిగాక'' అని నారదుణ్ణి తిట్టాడు. ఆయన తెచ్చికోలు కోపంతో ఇలా అన్నాడు: ॥

తగునయ్యా! నను నిట్లు పల్కుటకు సత్యానందనా! నీవు ము

న్నుగ నీ వీణియ మీటి యీ శ్రుతుల సంధుల్లూర్చి యీ శుద్ధసా

ళగభిదంబు లెరింగి యీ సకలమేళా ప్రాప్తము ల్నేర్చి యుం

టిగదా పెక్కులు పల్కనేల? బశిరే! నీ ిష్టతల్‌ చేకురెక! (చంద్రభాను. 1-140) అంతతో ఊరుకోత “రొమ్మున అమ్ము కట్టుకొని” షష్టగడియలూ తిండీ నిద్రా లేకుండా నేర్చినా నీ దుర్చుద్ధి ఇలా ఉంది” అన్నాడు. చంద్రభానుడు మరింక సహించలేత పోయాడు. “ఈయతక్తీ కాకపోతే తుంబురుడు లేడా? అతని దగ్గర నేర్చుకొంటాను” అని నిశ్చయించాడు. సాత్యకి కొడుకుతో కలిసి తుంబురుని కోసం బయలుదేరాడు. అంతలో ఎండాకాలం వచ్చింది. దానిని 16 పద్యాలలో కవి వర్ణించాడు. ఒక పద్యంలో బాటసారులను ఇలా చిత్రించాడు:

చక్కెరచింతపం డొడిన సందిట నేలకి చద్ది మౌళిపై

జెక్కిన కానుగాకు వలచే జలకుండిక వీజనంబు వే

రొక్క కరంబునందు బదయుగ్భుమునం బిగివాళ్లు గల్లిన

ల్దిక్కుల నధ్వగుల్బడలి త్రిమ్మరి రట్టి కడింది యెండలక. (చంద్రభాను. 1-161)

432 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

వేసవిలో వేట మంచిదని కాబోలు “ఒక ఎరుకుపాళిగాడు' వచ్చి చంద్రభానుణ్ణి వేటకు ఆహ్వానించాడు. ఆ వేటను మల్లన 50 పద్యాలలో వర్ణించాడు. దానిని ముగించుకొన్నాక చంద్రభానుడు ఒక పూపొద దగ్గర సుఖంగా ఉన్నాడు. అతని దగ్గరకు ఒక సిద్ధుడు వచ్చాడు. “తాము ఎక్కడ నుండీ ఎక్కడకు వెళ్తున్నారు?*' అని చంద్రభానుడు అడిగాడు. '“అన్ని పుణ్యక్షేత్రాలూ తిరిగి కుండినగరానికి వెళ్లాను. అక్కడ సంగీతంలో నారదుణ్ణి జయించిన తుంబురుడు కనబడితే కొన్నాళ్లుండి. ఇప్పుడు ఇలా శ్రీరంగం సేవించుకొనడానికి పోతున్నాను” అని సిద్ధుడు చెప్పాడు. చంద్రభానునికి కుతూహలం కలిగింది. “తుంబురుడు అక్కడేం చేస్తున్నట్టు? అని ప్రశ్నించాడు. “ఆయన ఆ ఊరి రాజకుమార్తెకు సంగీతం చెప్తున్నాడు. ఆ పిల్ల సామాన్యురాలు కాదు. శాపం వల్ల పుట్టిన దేవకాంత;!'” అన్నాడు సిద్ధుడు. “ఆ శాపమేమిటో వివరించ” మన్నాడు చంద్రభానుడు. సిద్ధుడు చెప్పాడు. “భరద్వాజుని తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు చంద్రకళ అనే అప్పరసను పంపాడు. ఆమె అందం 'చట్రాతిమీద వాన అయింది. చివరకు ఆమెకీ శాపం వచ్చింది. “ఈ కథను సిద్ధుడు 108 గద్యపద్యాలలో విపులంగా చెప్పాడు. తన వల్ల శాపం వచ్చిన చంద్రకళకు మానవజన్మలో పాఠాలు చెప్పడానికి ఇంద్రుడు తుంబురుణ్జీ పంపాడు. అందువల్ల ఇప్పుడు అతడు కుండినపురంలో ఉన్నాడు.

సిద్ధుడు ఇలా అయాచితంగా వచ్చి తుంబురుని అడ్రసు ఇవ్వడంవల్ల చంద్రభానుడు అ ఊరికే వెళదామని నిశ్చయించాడు. స్నేహితుడు విజయలోలునితో కలిసి బయలుదేరాడు. దారిలో దూర్వాసుని శాపంవల్ల వీళ్లు విడిపోవలసి వచ్చిండి విజయలోలుడు తిరుపతి యాత్ర చేశాడు. చంద్రభానుడు కుండిననగరం చేరాడు. తుంబురుని ద్వారా రాజకుమార్డెను చూశాడు. అమె చెలికత్తెలతో వనవిహారం, జలకే? వగైరాలు చేసింది. ప్రబంధనాయికల చెలికత్తెలు ఎలా ఓలలాడుతారో మల్లన విపులంగా

కల్లోలమున నన్ను గదిసి యీదుటకు నో యుద్వేల కచజాల యోలయోల

నూటి గొమ్మూని నాసాటి వ్రేయటకం నో యుల్లోల కరనాళ యోలయోల

చేపట్టి నావెంట జేరిపట్టుటకు నో యుద్దామకటిసీమ యోలయోల

దగలేక నాతోడ దడవు గ్రుంకుటకునో యుబ్బృంభకుచకుంభ యోలయోల

యోయువిద యిందు రాకున్న నోలయోల

యోచెలియ యూరకుండిన నోలయోల

యోసకియ యెందుబోయిన నోలయోల

యనుచు నుద్దుల గూడి పోరాడి రపుడు. (చంద్రభాను. 4-౫)

రాజకుమార్తె కుముదిని నాయకుణ్ణి చూశాక విరహబాధ పొందింది. చెలికత్తెను రాయబారం పంపింది. ప్రబంధ లక్షణాలన్నీ, మినహాయింపులు లేకుండా మల్లన పూరించాడు. అయితే అతని ప్రజ్ఞ వర్ణనలలో కనబడుతుంది. విడిపోయిన చాలాళాలానికీ చంద్రభానుడు తన స్నేహితుణ్జి కలుసుకొంటాడు. అప్పుడు విజయలోలుడు తాను చేసిన తిరుపతి యాత్రను ఇలా వర్ణించాడు:

అనశనద్రతముచే నతుల కార్శ్యంబున గనుపట్టు నోరిబీగములవారు ప్రాణముల్సిడికిట బట్టుక యిట్టట్టు దెమలని శరసుకోడములవారు దైహికాయాసంబు దలపక దొర్లుచునడతెంచు పొారలుదండములవారు నామటామట మొక్కు వారడుగునడుగు " దండములవారు మిగుల సందడి యొనర్చ నడరి పన్నగసార్వభామాచలేంద్రు గొలువ గోటాను కోట్లు పెన్గూట మరుగ ఏను వారలతో గూడి యెలమి దిగువ తిరుపతికి నేగి యాళ్చారితీర్థవారి దానములు సల్పి యుచిత కృత్యములు దీర్చి . సంతసంబున నప్పురాభ్యంతరమున. _(చంద్రభాను. 5-41, 42) కావ్యాన్ని చాలా మట్టుకు సూరపరాజుగారి ప్రభావంలోనే వ్రాసిన మల్లన చివరలో భట్టుమూర్తి ధోరణులు సైతం తాను బ్రాయగలనని ప్రకటించడానికి ఇలా “ నాళీకకాసారకేళీకలితసారనాళీకనత్తీరనాళికేర మాలీనమకరందధూళీినతమిళిందకేళీనవానందశాలికుంద మేలాలతాదోలదో లాలసమరాళబాలాలఘుముదాలవాలసాల మాలాపయుగనంగఖీలాపరవశాంగలీలాపరవిహంగజాలరంగ మమరవరతనుకరతనునమిళసుమిత ముదితకలరవకులరవముఖరశిఖర తిలకసురుచిరతరుచరగళితలలిత మధురమధురసపాళి యాకుధరమౌళి (చంద్రభాను. 5-51) ఈ ఒక్క పద్యంలోనే కాదు, మిగతా కొన్ని పద్యాలలో భట్టుమూర్తి బాణీ కొట్టవచ్చినట్లు కనబడుతుంది. చూడండి వనితాజనతావినుతా -ననతామరసంబుమలచి నను నాచెలి ఖా వినితాంతావనితాంతా-వన తాంతాపాంగ కోణవైఖరిగనుచుక్‌ (చంద్రభాను. 5-8) ఇటువంటి పద్యాలలో వసుచరిత్ర రచన్నాలి కనబడ్డా, మల్లన శ్లేషలకు కాక కథకు ప్రాముఖ్యతమిస్తాడు. కర్రి సాంబమూర్తికాస్త్రీగారు. చెప్పినట్టు మల్లన “పరకాఠిన్య్మమున కంతగా సహించువాడు కాడు.” ఈ చంద్రభాను చరిత్రతూ, సురఖి మాధవరాయలు వ్రాసిన చంద్రికాపరిణయానికీ పోలికలున్నాయని చెప్పి కగర్రివారు చాలా విపులంగా వాటిని పొందుపరిచారు. సురఖి మాధవరాయలు ఈ మల్లనకు సమీపకాలంలోని 3. చంద్రభానుచరిత్ర (ఆంధ్రసాహిత్యపరిషత్తు ప్రచురణ 14, 1922) పీఠిక, పుట

తత సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అర్వాచీనుడు. మల్లన పుస్తకాన్ని చూసి మాధవరాయలు అనుసరించాడని కరి సాంబమూర్తిశాస్త్రిగారు నిరూపించారు. ఆ గ్రంథాల పోలికలు ఇవి: చందభాను చరిత్ర చందికాపరిణయం

  1. నాయకుని పేరు చంద్రభానుడు 1. తథానాయకుడు సుచంద్రుడు
  2. నాయికపేరు కుముదిని. 2, నాయిక చంద్రిక
  3. ఈమె పూర్వజన్మలో చంద్రకళ 3. చంద్రిక తూడా పూర్వజన్మలో అనే అప్సరస చిత్రలేఖ అనే అప్సరస.
  4. చంద్రకళ భరద్వాజుని తపస్సు భగ్నం 4. ఈమె వసంతుడనే ముని తపస్సు చేయబోయి శాపం పొందుతుంది. చెరపబోయి శాపం పొందుతుంది.
  5. చంద్రభానుడు వేటలో సిద్దుణ్జి కలుసుకొని | 6. సుచంద్రుడుతూడా ఏదో పని మీద వెళుతూ నాయికావృత్తాంతం వింటాడు. దారిలో ఒక శాపగ్రస్తుడైన గంధర్వునివల్ల నాయిక సంగతి తెలుసుకొంటాడు.

ఈ కథలు మల్లనా, మాధవరాయలూ స్వయంగా కల్పించుకొన్నవే. మల్లన తన కావ్యం “నవీనతర సుధారసమధురతాబంధురమన్నాడు. 'విచిత్రానల్పచమత్రియా నిబంధన' మన్నాడు.

కిరీటిపచ్చలంటే ఇష్టపడే మల్లన కావ్యం ఆంధ్రసాహిత్యభూషణాలలోని రాయి కాకపోయినా ఉరోభూషణంలోని రవ్వ కాకపోదు.

బమ్మెరకవులు, పేరయలింగం

భాగవతాన్ని జిగద్ధితంగా చెప్పిన బమ్మెర పోతరాజుగారి వంశంలో వారి తరువాత తూడా కవులు పుట్టారు. వాళ్లు చెప్పుకొన్న విషయాలవల్లనే పోతరాజుగారి జీవితం గురించి కొన్ని సంగతులు మనకు తెలిశాయి. పోతరాజుగారి కుమారుని పేరు కేసన అని కొందరంటారు. కాదు మల్లయ్య అని కొందరంటారు. పోతరాజుగారి వంశంలో వారి కొడుకో, మనవడో తెలియదుగాని ఒక మల్లయ్య ఉన్నాడు. ఆయన కొడుకు పేరు మాత్రం కేసన. ఇతడు చాలా గొప్ప పండితుడు. కృతులు చెప్పాడు. ఇతనికి ప్రొడసరస్పతి అనే బిరుదు ఉంది. ఈయనకు ఇద్దరు భార్యలు. ఒకామె పేరు అప్పలమ్మ; మరొక భార్య పేరు వీరమ్మ. ఈ సవతులిద్దరూ చెరో కొడుకును కన్నారు. వాళ్ళలో ఒకరి పేరు కేసకవి; మరొకరి పేరు మల్లకవి. ఈ సవతి బిడ్డలు చాలా సఖ్యంగా కలిసిమెలసి కవిత్వం చెప్పారు.

బమ్మెరవారి వంశం తెలంగాణాలో పాలకుర్తికి దగ్గరలో నున్న బమ్మెర గ్రామంలో ఉండేవారు. అయితే కొన్నాళ్ళకు వాళ్లు గోదావరి జిల్లాలోని ఆచంట ప్రాంతాలకు వచ్చారు. అబ్జరం గ్రామంలో వియ్యమందారు. ఆ చుట్టుప్రక్కల మోతుబరులైన వెనుమక్సే వారి ఆశ్రయాన్ని సంపాదించారు. ఈ క్షత్రియుల పూర్వులు తూడా స్వయంగా కవిత్వం

బమ్మెరకవులు, పేరయలింగం 435 చెప్పారు. చాలా కృతులను అంకితం పుచ్చుకొన్నారు.! పెనుమత్స నారపరాజుగారు ఈ బమ్మెర కవులను పిలిపించి విష్ణభజనానందం అనే కావ్యం చెప్పమన్నారు. తమ తండ్రి కావ్యాలను వ్రాసినట్టు ఆ కవులు కృతిపతినోట ఇలా పలికించారు:

చెప్పె గృతుల్‌ సుధారసము చిప్పిల మీ జినకుండు రూడి చె

ల్వొప్పగ శబ్దశుద్ధిగ మహోన్నతి బ్రౌడసర్వతీంద్రు డా

చొప్పున మీరలుక గృతులు చోద్యముగా రచియింప నేర్తుగా

యెప్పుడు గేససత్కవి సమిద్ధ గుణాకర మల్లసత్కవీ। (2680)

ఈ ప్రొడసరస్వతిగారి అబ్బాయిలకు పెనుమత్స నారపరాజు కర్పూర తాంబూలంతోపాటు అంబరభూషా గ్రహారాదులు ఇచ్చి అంకితం పుచ్చుకొన్నాడు. ఇది ఎన్ని ఆశ్వాసాల కావ్యమో తెలియదు. బహుశా ఆరు ఆశ్చాసాలు ఉంటాయి. ఇందులో విష్ణుసేవామాహాత్మ్యాన్ని ప్రశంసించారట. ఈ ప్రబంధం అచ్చుపడలేదు. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఒక సమగ్ర ప్రతి ఉంది. (1 680) “ఈ కశుల కవిత్వం రసవంతమై దాక్షాపాకమున మనోహరముగ నున్నదని చెప్పి చాగంటి శేషయ్యగారు అయిదు పద్యాలను ఉదాహరించారు.*

ఈ సోదరకవులు విష్ణభజనానందాన్నేకాక దాక్షాయణీపరిణయమనే మరొక కావ్యాన్ని కూడా వ్రాశారు. అది కూడా అముద్రితమే. అందులోని పద్యాలను కొన్నింటిని కందుతూరి వీరేశలింగంగారు. బమ్మెరపోతరాజుగారి చరిత్రలో ఉదాహరించారు.కి ఈ దాక్షాయణీపరిణయం గురజాల మల్లన సోమయాజికి అంకితమైంది. కృతిపతి మనుమడి కాలం ( క్రీ.శ.1756) దాకా దీని ప్రతులు వ్రాసుకొంటూ ఉండేవారు. అయితే ఇది ఇప్పుడు దొరకదు.

ఈ బమ్మెర కవుల బావమరిది పేరు అజ్జరపు పేరయలింగం. ఇతడు తూడా కవే. అచంట రామేశ్వ్చరస్వామి భక్తుడు. ఒడయనంలివిలాసం అనే ఆరాశ్వాసాల శృంగార ప్రబంధాన్ని వ్రాసి అచంటలో దేవునికి అంకితమిచ్చాడు. ఈ అబ్జరపువాళ్ళ మూలపురుషుడు గజపతులను వేదశాస్తాది బహువిద్యలతో మెప్పించి అబ్జరపు గ్రామాన్ని అగ్రహారంగా పొందాడు. గజపతులు తెలుగు విద్వాంసులను గౌరవించారన్న సత్యం ఈ గగ్రంథంవల్ల తెలుస్తున్నది.

పేరయలింగం తన ప్రాంతాలలో ఉండే ఆచంటకు ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పి కథను - ఒడయనంబివిలాసంలో వ్రాశాడు. ఒడయనంబి మహాభక్తుడేగాని వేశ్యాలోలుడు. పరమనాచి అనే వేశ్య యింట్లో అతడున్నప్పుడు శివపూజకు ష్రైంది. అప్పుడు ఓడయనంవి ఆమె తుచాన్నే శివలింగంగా ఖావించి పూజించాడట. పరమనాచి వెటకారం చేస్తే అతడు “దేవా! ఇందులో నీవు లేవా?” అని ప్రశ్నించాడు.

  1. నవాబుల యుగం, సమభ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి.
  2. ఆంధ్రకవితరంగిణీ - వి.ఎ. పుటలుణ 10౫.
  3. ఆంధ్రకవుల చరిత్ర, ప్రథమభాగ౧ం, పుటలు 67, 556.

436 సమర్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఉన్నాడనుఉన్నాడను- ఉన్నాడటంచుపల్కిహో హోయనుచు[

విన్న మహాత్ములు మెచ్చగ- జన్నున రామేశ్చరుండు సంభవ మొందక్‌

తన భక్తుడు 'చన్ను బూజీంప శంభు డాచందమెరిగి చంట బలుకంగ గ్రామ మాచంటమయయ్యె' అని అజ్జరపు పేరయలింగం చెప్పాడు. ఒడయనంవి చారిత్రక పురుషుడు. ఆచంటకూ, అతనికీ సంబంధం లేదు. ఒడయనంబికే సుందరనాయనార్‌ అనే నామాంతరం ఉంది. ఇతణ్ణీ గురించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఇలా వ్రాశారు:

సుందర వాయనారు ; నంబినాయనారని, ఒడయనంబియని యితని నామాంతరములు. సుజ్ఞానిని, జిటీశ్చరుడు ఈతని తల్లిదండ్రులు. నదివరపు- నరసింహ వర్మ (నరసింహ మునయర్‌) ఈతని బెంచుకొన్నాడు. ద్రవిడ భాషలో నీతడు గొప్పకవి. తిరుత్తొండర్‌ తొఘ్టైయని యీతడు రచించిన శైవస్తోత్రమును బ్రపంచించి సోమనాథుడు కొంత తెనిగించినాడు. ఒడయనంబివిలాసమని యాతని చరిత్రమే తెలుగు బ్రబంధముగా రచితమైనదిశ

ఈ తమిళకవి క్రీ.శ.8-వ శతాబ్దపు తొలిరోజులవాడని చరిత్రకారుల అఖిప్రాయం.్‌ ఇతడు ౫,000 పదిగములు పాడాడట. అయితే నేడు ఒక్క శతకం మాత్రమే దొరుకుతోంది నుందరర్‌ 18 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఈ స్వల్ప వయస్సులో అతడు రెండుసార్లు పెళ్లాడాడు- ఒకసారి కులీనుల పిల్లను, రెండోసారి “తిరవారూరు' గుడిని సేవించుకొనే సానికూతురును చేసుకొన్నాడు. సుందరర్‌ కాలంనాటికి ద్రావిడ శైవంలో వేడి తగ్గింది. జనుల బెడద లేదు. పవిత్రవిషయాలను శైవులే అవహేళనం చేసే స్థితి ఏర్పడింది. నాయనారులు సైతం విషయవాంఛలకు లోనయ్యారు. దేవుణ్ణి స్నేహితునిగా పరిగణించేవారు. శివుడు తన భక్తులతు, భక్తురాండ్రతు మధ్య కుంటెనగాడుగా తయారయ్యాడు.

ఒడయనంబి దేవాలయానికి సైతం విటునిలాగే మ్ళీవాడు. “విర్రవీగుతూ ఎక్కుడు విటచేష్ట లేపారగా, ఎదుట నున్న వాళ్ళను లెక్కచేయకుండా" అతడు వాల్నీకేశుని గుడికివెళ్ళిన వైనం పాల్కురికి సోమనాథుడు వర్ణించాడు (బసవ 4:1452-145). ఒడయనంబి చేష్టలను కొందరు సమకాలికులు గర్హించారు. మిరుమిండనైనారు అనే భక్తుడు అభ్యంతరం చెప్పాడు; వెలివేశాడు. మిరుమిండనైనారుకు భయపడి శివుడు సాకారుడై ఒడయనంబితో కలిసి పారిపోయాడట. తరువాత వాల్మీకేశుడు ఒడయనంబికి శివభక్తుల కథలు చెప్పాడు. ఇతని “పాటలకు మెచ్చియో, భక్తికి మెచ్చియో నిత్యపడి వేయిమాడలు' దేవుడు ఇచ్చేవాడు. పైగా

కొడుకని మన్నించు గడు ముద్దు జేయు - నెడవోవు లంజియయింటికి దాన

యనురాగహితు సర్వార్థసంపదల-దనిపి నంబికి విటత్వంబు నెల్లించు ఓ పనవపురాణము (అంధ్రగ్రంథమాల ప్రచురణ - 1339) పీతక - వేటూరి ప్రభాతరాస్తార

పుటలు 58, 69.

ర్‌, కకకంగ ల ₹జ98 2ంర్రాంం &ీ ణరం - ౪ "౧౬ 5. ౪జలల! నిజిజ, 9110.

బమ్మెరకవులు, పేరయలింగం 437 నిల విదూషకుభాతి నిరువుర వలపు-లలర నన్యోన్యగుణాంకనల్‌ సేయు గరమర్థి దాన నాగరకున ట్లతని- సరసోచితాలాప సంపద దనువు ధర దాన పీఠమర్దకులీల నెల్ల పరిచర్యలును బడి పనులను జేయు వన్నియు నననేల మమ్ముడువోయి యున్నాడు శివుడు నంబెన్నకు.... (బసవ.4: 1481-1492) ఈ ఒడయనంబి ప్రేయసియైైన పరమనాచికూడా శివభత్తురాలే. అరవై ముగ్గురు

నాయనార్లలో ఈమె ఒకర్తె. ఈమెకు “వెల' యివ్వడానికే శివుడు ఒడయనంబికి రోజుకు

వెయ్యేసి మాడలు మంజూరు చేశాడు. ఈ కథను పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర మహిమప్రకరణంలో సుదీర్ణంగా కథనం చేశాడు. ఇందులో సుందరనంబి వెలయాలి స్తనాన్ని శివలింగంగా భావించి పూజించే వైనం ఉంది.

పాల్కురికీ సోమనాథుడు చెప్పిన ఒడయనంబి చరిత్రను పేరయలింగం ఆరాశ్వాసాల ప్రబంధంగా వ్రాశాడు. ఇందులో భక్తికన్నా రక్తే ఎక్కువ. ఈ కావ్యం గురించీ, కవిగురించీ కొందరు పండితులు ఇలా అభిప్రాయపడుతున్నారు.

ఈ కవి యొడయనంబివిలాసమును సారంగుతమ్మయ్య వైజయంతీ విలాసమును చూచి. రచించినట్లు తోచుచున్నది. ఇందలి కథ దానికంటెను నీతిబాహ్యమైనది. కవిత్వమునకు దానియందున్న సారస్యము గూడ లేదు. ఇందు తండ్రియే యొడయనంబికి వలసినంత ధనమిచ్చి, వేశ్యలపాలు చేసి దానినెప్తు విడువవలదని కొడుకునకు బోధించును, మరియు నిందు పాతివ్రత్యము కంటే వేశ్యావృత్తియే మేలని ఈశ్వరుడు బోధించును. ఇందులో వేశ్యావాటికలో రంకని పలికినవారిని యముడు దండించునని బ్రాయబడినది. ఇంతకంటే నీతిబాహ్యమైన గ్రంథము లేదు.

చాగంటి శేషయ్యగారు మాత్రం “ఈతని కవిత్వము లలితమై సరసజన హృదయంగమముగానున్న!'దని చెప్పారు.”

“ఒడయనంవివిలాసం' ఇంతకుముందు ఒకసారి అచ్చుపడింది. కాని ఇప్పుడు దొరకడం లేదు.

పేరయలింగం బ్రాసిన శృంగారకావ్యం, అతని బావమరదుల కృతులూ అచ్చుపడవలసిన అవసరం ఉంది.

  1. వీర్చైవాంధ్ర వాజ్మయం - శిష్టారామకృష్ణశాస్త్రిగారు. తిరుపతి దేవస్థానంవారి ప్రచురణ (1962), పుట 264.
  2. అంధ్ర కపతరంగిణి - ౫ పుటు 100.

బొడ్డుచర్ల తిమ్మన, బిజ్ణల తిమ్మరాజు

కావ్యేషు నాటకం రమ్యం అని మన పూర్చులు నాటకాలకెంతో ప్రాముఖ్యమిచ్చారు. చెయ్యి. తిరిగిన రచయిత మాత్రమే నాటకం వ్రాసి రక్తి కట్టించగలడు. ఎందరు సిద్ధహస్తులున్నా మన ప్రాచీన తెనుగు సాహిత్యంలో నాటకాల ప్రస్తోగాని నాటకాలు కనబడవు. నన్నయ్యగారి కాలంలో తెలుగువాళ్ళు నాటక ప్రదర్శనలు చూసేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి. రాజరాజనరేంద్రుడు “ఉదాత్త రసాన్వితకావ్య నాటక క్రమాలు చాలా చూశాడు (అది. 1-10). అదిపర్వంలోనే కద్రూవినతలు చూసిన గుల్రాన్ని వర్ణిస్తూ, అది “నాటకప్రయోగంబునుం బోలె ఘనరసపాత్ర శోభిత రంగ రమ్యంబైన'” దని నన్నయ్యగారు చెప్పారు (ఆది.2-27). నన్నెచోడుని కుమార సంభవంలోకూడా నాటక ప్రదర్శన గురించి ఒక ముచ్చట ఉంది. కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేసే ఘట్టంలో కలహాన్ని చూసి కడుపునింపుకొంటున్న నారదుణ్ణి చోడరాజుగారు ఇలా వర్ణించారు:

సంగరాంగణంబు రంగంబుగా దన్ను - బలసి యాడు నురుక బంధములకు

దాన మొదలి సూత్రధారుడై నాట్యాఖి-నయము లెసగ నాడె నారదుండు

(కుమార. 12-147)

తెలుగు సాహిత్యంలోని ప్రథమ కావ్యాలలో ఈ నాటకప్రసక్తులుండే తొలి యుగాలలోని ఒక రచయిత సంస్కృత నాటకకథను స్వీకరించి కావ్యాన్ని వ్రాశాడు. రాజశేఖరుడు వ్రాసిన విద్ధసాలభంజిక అనే దృశ్య కావ్యాన్ని తీసుకొని కాకతీయ యుగంలో మంచెన కేయూరబాహుచరిత్రను రూపొందించాడు. అదేయుగంలో పాల్కురికి సోమనాథుడు తెలుగుదేశంలోని నాటక ప్రదర్శనాలను ప్రదర్శించాడు! తోలుబొమ్మలూ, కీలుబొమ్మలూ, గంధర్వయక్ష విద్యాధర పాత్రలున్న నాటకాలూ అతడు చెప్పాడు. నాచన సోముడు కూడా తన ఉత్తరహరివంశంలో తరలెత్తి అడే గొండ్లిని పేర్కొన్నాడు (4-216). పద్మనాయకయుగంలో ఉన్న రావిపాటి తిప్పన్న ఒక దృశ్య కావ్యాన్ని వ్రాశాడు. ఇతని ప్రేమాఖిరామం తెలుగువాడు వ్రాసిన సంస్కృత రూపకం. దశరూపక భేదాలలోని వీథిని రావిపాటి తిప్పన్న వ్రాస్తే, భాణాన్ని పశుపతి నాగనాథుడనే మరో తెలుగు కవి బ్రాశాడు. ఇతని మదనవిలాస భాణం రెడ్డిరాజుల యుగంలో ప్రభవించింది. రావిపాటి తిప్పన్న సంస్కృతంలో వ్రాసిన వీథిని అనుసరించే శ్రీనాథుడు క్రీడాఖిరామాన్ని వ్రాశాడు. ఇది కొద్దిగానో, గొప్పగానో రూపలక్షణాలున్న తొలి తెలుగు కావ్యం. శ్రీనాథుని కాలానికి యక్షగానాలు కూడా ప్రచారంలో ఉండేవని అతని పద్యాలవల్లనే తెలుస్తున్నది (ఖీమ. 2-౪). శ్రీనాథుని కాలం నుంచీ నాటకాల గురించీ, నాట్యాల గురించీ తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా సూచనలు కనబడతాయి.

  1. కాకకీయయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి 2002
  2. పండితారాధ్య చరిత్ర (పాల్కురికి సోమనాథుడు) - పర్వత ప్రకరణం, పుటలు 436, 436

బొడ్డుచర్ల తిమ్మన, బిజ్జల తిమ్మరాజు 439

గజపతుల యుగంలోనే మొట్టమొదటిసారిగా తెలుగులో నాటకాలను వ్రాసిన కవి పేరు మనకు తెలిసింది. కొలని గణపతి దేవుడు దేశి తెనుగున నాటకాలు వ్రాసినవాడు.3 ఈ తెలుగు నాటక రచయిత పేరే గాని అతని దృశ్యకావ్యాల పేర్లు మనకు తెలియవు. తొలిరాయల యుగంలో తొలి యక్షగాన రచయిత పేరు, అతని కావ్య నామంతోపాటు మనకు తెలిసింది. ప్రోలుగంటి చెన్నయ్యమంత్రి వ్రాసిన సౌభరిచరిత్రమే ఇప్పటికి మనకు తెలిసిన ప్రాచీన యక్షగానం. ఈ తొలిరాయల యుగంలోనే ప్రథమశ్రేణి రచయితలు కొందరు ప్రఖ్యాత సంస్కృత రూపకాలను ప్రబంధాలుగా తెనిగించసాగారు. పీల్లలమ్రి పినవీరయ్య తన శృంగార శాకుంతలంలో “కాళిదాసుని నాటకక్రమము కొంత' సంతరించుకొన్నాడు (1-27). మన భాషలోని ప్రసిద్ధ జంటకవులు నందిఘంటలకవులు కృష్ణమిశ్రుని ప్రబోధ చంద్రోదయాన్ని చంపూకావ్యంగా అనువదించారు.

మలిరాయల యుగంనుంచీ తెలుగునాటకాల గురించి బోలెడన్ని వివరాలు దొరుకుతాయి. అనాటి నాటకాలు దొరక్కపోయినా కొన్ని పేర్లూ, వాటిని అడేవాళ్ళ గురించి భోగట్టాలూ తెలుస్తాయి.. తరువాతి యుగంలో నాటకరచనా శిల్పాన్ని పాటించి వ్రాసిన శ్రవ్య కావ్యాలు కనబడతాయి. పింగళి సూరపరాజుగారు. రచించిన కళాపూర్జోదయం, వచించిన ప్రభావతీ ప్రద్యుమ్నం ఆనాటి నాటక ప్రదర్శనల గురించి చాలా సంగతులు విశదపరుస్తాయి. ఆనాటి నాటక బృందాలు, వాళ్ళ సీనరీలు, పరికరాలు, వాటిని ప్రదర్శించే పద్ధతులూ, ఆ ప్రదర్శనలు జరిగేటప్పుడు సహృదయులు జల్లే మెచ్చులు మొదలైన వాటితోపాటు సంఘంలో నటులకుండే స్థానం కూడా విశదమవుతుంది.

ఇప్పటిదాకా చేసిన సింహావలోకనం వల్ల తెలుగు సాహిత్యంలోని దృళ్య కావ్యాల ప్రాథమిక దశ గురించి కనీసం కొంత అస్పష్ట చరిత్రయినా తెలుస్తున్నది. ఇది సంస్కృత రూపకాలను యథాతథంగా అనువదించని ఘట్టం. ఆంధ్రభాషలో స్వతంత్రదృశ్య కావ్యాలు ఎలా ఉండేవో తెలియని ఘట్టం. ఈ దశనుండి తెలుగు నాటకాలు ఇంకోదశకు ప్రమోషను పొందాయి. సంస్కృత నాటకాలను నూరుపాళ్ళ నాటకాలుగా గాకపోయినా ఆ దృశ్య కావ్యాసన్సే శ్రవ్య కావ్య రూపంగా కొద్ది కొద్ది మార్పులతో కొందరు రూపొందించారు. తెలుగు నాటకి-ల ఈ రెండవదశ మనకు బొడ్డుచర్లవారి పుణ్యమా అని తిలియవస్తున్నది. పదహారో శతాబ్దపు చివరి రోజులలో బొడ్డుచర్ల తిమ్మన్న అనే స్మరణీయుడు ఒక నాట్టప్రబంధాన్ని అనువదించాడు. దాని పేరు ప్రసన్న రాఘవం. ఈ గ్రంథం ఇన్నాళ్లూ మరుగునపడింది. ష్టైదరాబాదు ఆంధ్రరచయితల సంసుంవారి ధర్మనచూ అని ఇది వెలుగు. చూసింది. ఆంధ్రసాహిత్యంలోని దృశ్యకావ్య విభాగంలో ఒక విలక్షణమైన దశను తెలియజేసి ఈ కావ్యాన్ని మిత్రులు డాక్టరు వి. రామరాజుగారు సంపాదించారు. వారే పరిష్కరించి దేశానికి సమర్పించారు. 3. గజపతుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి 2002

440 సమగ్రాంధ్ర సాహిత్యం = రెండవ సంపుటి

ప్రసన్న రాఘవాన్ని సంస్కృతంలో జయదేవుడు రచించాడు. గీత గోవిందాన్ని బ్రాసిన జయదేవునికీ, ఇతనికీ సంబంధం లేదు. ఇతడు నాటకంతోపాటు సీతావిహారం, చంద్రాలోకం, రతిమంజరి మొదలైన ఇతర కృతులు వ్రాశాడు. జయదేవుడు ఎప్పటివాడనే ప్రశ్నకు తలొక సమాధానం దొరుకుతుంది. సంస్కృత ప్రసన్న రాఘవాన్ని ప్రచురించిన మహారాష్ట్ర పండితులు ఇతడు శ్రీ.శ.1485 ప్రాంతాల వాడని తేల్చారని ఖండవల్లి లక్ష్మీరంజినంగారు వ్రాశారు. వాళ్లే ఇతడు క్రీ.శ.1500-1577 నడుమ ఉన్నవాడని చెప్పినట్టు రామరాజుగారు వ్రాశారు. అయితే క్రీ.శ 13వ శతాబ్దంనుండి 16వ శతాబ్దం మధ్యభాగం దాకా జయదేవుని కాలం ఊగులాడుతూందని రామరాజుగారు వ్రాశారు. మన భాస్కర రామాయణంకన్నా జయదేవుని ప్రసన్న రాఘవం ప్రాచీనమని నిడుదవోలు వెంకటరావుగారు సప్రమాణంగా రుజువు చేశారు. రావణుడు సీతమ్మను ఎత్తుకొని పోయాక రాముని విరహాన్ని తెలియజేసే ఈ క్రింది శోకం ప్రసన్న రాఘవంలో ఉందిః

సౌమిజ్రే! నను సేవ్యతాం తరుతలం చండాంశు రుజ్జ్బృంభతే;

చండాంళోర్జి $ కా కథ రఘుపతే! చంద్రోయ మున్మీలతి;

వవ్రైత ద్విదితం కథన్ను భవతో? ధత్తే కురంగం యతః

క్వాసి ప్రేయసిః హా కురంగనయనే! చంద్రాననే! జానకి (ప్రసన్న, 6-1)

ఈ శోకానికి యథాతథంగా భాస్కరరామాయణంలో అనువాదమున్నదని నిడుదవోలువారు ఈ క్రింది పద్యాన్ని (అరణ్య. 2-264) చూపించారు:

“తపనుడు వేపజొచ్చె నను దమ్ముడ। వృక్షముక్రింద బెట్టు నా

“తపనుడు రేయి లేడు వసుధాకర। చంద్రుడు గాని? “చంద్రునిక౯

నృపసుత! ఎట్లెరింగితివిః నీవు? “మృగాంకము చూడనున్మి” “హా!

చపలమృగాక్షి! చంద్రముఖి, జానకి; యెచ్చట నున్నదానవే?

ఇందువల్ల ప్రసన్న రాఘవ కర్త క్రీ.శ1300 ప్రాంతాలకు పూర్వుడే అని నిస్సందేహంగా నిర్ణయించవచ్చు. ఈ జయదేవుడు పీయూషవర్డ బిరుదాంచితుడు. ఇతడు తన ప్రసన్న రాఘవాన్ని నాట్యప్రబంధం అని పేర్కొన్నాడు. ఒక శోకంలో తన కావ్యం పేరును గుప్తంగా పొందుపరిచాడు.

ప్రత్యంక మంకురిత సర్వరసాఖిరామం

నవ్యోల్ల సత్కుసుమ రాజీ విరాజిబంధం

ఘర్మేతరాంశుమివ వక్రతయాపి రమ్యం

నాట్యప్రబంధ మతిమంజుల సంవిధానం. మూలంలో ఇలా నామగోపనముంది కనుక తిమ్మన తన అనువాదంలో కూడ అలాగ కావ్యనామాన్ని కొంత పొందుపరిచాడు. 4 ప్రసన్న రాఘవ నాట్యప్రబంధం (తెలుగు) - ఇంగ్లీషు పరిక ఫట). 5. అదే పుస్తకం - తెలుగు ప్రరోచన, పు. 10, 2. భారతి, మార్చి 19.

బొడ్డుచర్ల తిమ్మన, బిజ్జల తిమ్మరాజు ఉక్ష1

ప్రతిరసంబును నిఖిలాంకపంక్తి నెగడ

చలిన రాజివినూత్నబంధంబు నెలగ

ఘటితవత్రతశిరేఖకరణి రమ్య

మగుచు నుతికెక్కు నాటకం బద్భుతముగు (ప్రసన్న, 1-101)

మూలంలో బంధకవిత్వం ఉన్నచోట బంధం, శ్లేషలున్న, చోట్ల శ్లేషలుమా త్రమేకాక నాటకాన్ని రమారమీ నాటకంలాగే తిమ్మన్న అనువదించాడు. ఎటొచ్చీ పాత్రల ప్రపోనిష్కమణాలు, ఆహార్యవర్ణనలు, రంగస్థల సూచనలు అన్నీ పద్యాలలో ఉన్నాయి. ఇందులో ఇటు నాటక లక్షణాలూ, అటు ప్రబంధ లక్షణాలూ ఉన్నాయి. దీనిని ఆశ్వాసాలుగాగాక అంకాలుగానే తిమ్మన విభజించాడు. ఇది ఏడంకాల కావ్యం. ఏ అంకంలో కథ ఎలా నడిచిందో టూకీగా చెప్పుకొందాం.

డ్రథమాంకం: (1-3) నాంది. (4-148) ప్రస్తావన. 'నాందంతంబున సూత్రధారుడు" ప్రవేశించి కృతిపతివంశాన్ని 78 పద్యందాకా ప్రస్తుతిస్తాడు. తరువాత 8 నుండీ 148 దాకా సంస్కృత నాటకంలోని ప్రస్తావనను కవి అనువదించాడు. (149-175) విష్కంభము. దాల్బ్యాయనుడనే ముని రెండు గండు తుమ్మెదల సంభాషణ వింటాడు. వాటిమాటల వల్ల సీత స్వయంవరానికి రావణుడు, బాణాసురుడు వస్తున్నారని తెలుస్తుంది. (176-327) స్వయంవర మంటపం, మంజీరకుడు, నూపురకుడు అనే ఇద్దరు వందిమాగధులు స్వయంవరానికి వచ్చిన రాజులను కొద్దిగా వర్ణిస్తారు. శివధనుస్సును చూపుతారు. అక్కడకు మారువేషంలో రావణుడు వస్తాడు. కొంత సంభాషణ జరిగాక తెర మరుగునకు వెళ్లి నిజరూపంతో ప్రవేశిస్తాడు. శివధనుస్సు వంచకుండానే సీతను తెమ్మంటాడు. అంతలో బాణాసురుడు వస్తాడు. ఇద్దరు రాక్షసులూ వాదులాడు కొంటారు. బాణుడు నిష్కమిస్తాడు. రావణుడు విబృంభించేలోపున ఆకాశంలోంచి మారీచుని ఆర్హనాదం వినబడుతుంది. వాణ్ణి రక్షించడానికి రావణుడు వెళ్ళిపోతాడు. సీతకు భయం తప్పిందని ఆనందిస్తూ అంతా నిష్కమిస్తారు.

ద్వితీయాంకం; (1-37). విష్కాజభం. ఒక దొంగ సన్యాసీ, మరొక కపటఖిక్షకతుడూ సంభాషించుకొంటారు. వాళ్లు రాక్షసులు, వాళ్ళ సంభాషణవల్ల విశ్వామిత్రునితోపాటు రామలక్ష్మణులు యాగ రక్షణకు వెళడం, తాటక వధ, మారీచసుబాహుల ఉదంతం, మిథీిలకు రావడం మొదలైనవి తెలుస్తాయి. (3౫8-182) ఉద్యానవనం. విశ్వామిత్రుడు యాజ్థ్యవల్క్యమునితో మాట్లాడుతున్న సమయంలో పువ్వులు కోద్దామని రామలక్ష్మణులు తోటలోకి వస్తారు. అదే సమయంలో చెలికత్తిలతో సీత వనంలోకి వస్తుంది. పరస్పర వీక్షణ. అనురాగ జననం.

తృతీయాంకం: (1-37) ప్రవేశకం. జనకుని అంతఃపురంలో కుబ్టుడు, వామనకుడు అనే కావలివాళ్లు విశ్వామిత్రుని రాక గురించి సంభాషించుకొంటారు (౫-48). రామలక్ష్మణునితో విశ్చామిత్రుని ప్రవేశం. దివాణంబు ముంగిటికీ ప్రయాణం (49-171). దివాణం. శకానందుడూ, బినకుడూ కలిసి విశ్వామిత్రునికీ, రామలక్ష్మణులకూ స్వాగతం

442 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చెప్పడం కివధనుస్సును రామునికి చూపమని విశ్వామిత్రుడు అడగడం. రాముడు దానిని చూడడానికి వెళ్ళిన సందర్బంలో పరశుర-మునివద్ద నుండి సందేశం రావడం, జనకుడు సమాధానం చెప్పి పంపడం, శివధనుర్పంగవార్త, పెళ్ళిమాటలు.

చతుర్ధాంకం: (1-40). జనకుని మంటపం, కోపంగా వచ్చిన పరశురామునితో తాండ్యాయనుడనే ముని శివధనుర్చంగ విషయం చెప్పడం, రావణుడే దానిని భంగపరిచాడని పరశురాముడు ముందు భ్రమపడడం, తరువాత నిజం తెలియడం, (41-120) ఆదేచోట, రామలక్ష్మణులు ప్రవేశించడం, వివాదం, రాముని జయం.

పంచమాంకం: (1-60) రెండు ప్రదేశాలు, గంగాయమునలు మాట్లాడుకొంటు న్నారు. రామలక్ష్మణులు సీతతో వనవాసానికి వెళ్ళి దృశ్యం గురించి చెప్పుకొంటారు. దానికి గల కారణాన్ని సరయూనది వచ్చి చెప్తుంది. భరతుడు తిరిగి వచ్చి తల్లిని నిందించడం దాకా ఆ నది కథ చెప్తుంది. (61-120) ఒక హంస వచ్చి అక్కణ్ణుంచి సీతకాపహహరణందాకా కథ చెప్తుంది. (121-125). ఈ మూడు నదులూ సముద్రుని వద్దకు వెళ్ళి ఈ విషాదగాథ చెప్పాలని వెళ్ళాయి. గోదావరి ఏదో కథ సాగరునికి చెప్తున్నది. ఆ మూడు నదులూ అక్కడకు వస్తాయి (129-148). రామాయణ కథలో రాముడు బుశ్యమూకాన్ని చేరడందాకా గోదావరి వినిపిస్తుంది. (149-183) వానరులు సీతను వెదకడానికి మవ్షో ఘట్టందాకా తుంగభడ్ర రామాయణ గాథను చెప్తుంది.

షష్టాంకం: (1-144) బుశ్యమూకం. రామలక్ష్మణులు ప్రవేశిస్తారు. రాముని విరహం, లక్ష్మణుని ఊరడింపు. తెరలో రత్సశేఖరుడు, చంపకాపీడుడు అనే విద్యాధరులు కలుసుకొంటారు. రత్నశేఖరుని కళారచన చూడాలని చంపకాపీడుడు అడుగుతాడు. రావణుని కథను అతడు అఖినయిస్తాడు. ఈ విద్యాధరుల ఇంద్రజాల విద్య వల్ల సుందరకాండమంతా ప్రదర్శితమవుతుంది. మధ్య మధ్య రాముడు విలాపిస్తాడు. ఆంజనేయుడు విజయుడై రాబోతున్నాడని చివర తెలుస్తుంది.

పప్తమాంకం : (1-27). విష్కంభం. పులస్త్యృనిష్యుడూ, కరాళతుడూ మాట్లాడు కొంటారు. రావణుని విరహం గురించి ప్రస్తానన, (28-76) లంకు రావణాసురుడు, ప్రహస్తుడు ప్రవేశిస్తారు. సేతుబంధనం చిత్రాన్ని ప్రహస్తుడు తెస్తాడు. దాని గురించి చర్చ. మండోదరి రాక, రణారంభం, (79-257). విద్యాధర మిథునం మిగతా కథను చెప్పుకొంటాయి. శ్రీరామవిజయం, అయోధ్యా ప్రవేశం.

ఈ _నాట్యప్రబంధాన్ని బొడ్డుచర్ల తిమ్మన్న అక్కడక్కడ స్వతంత్రిస్తూ అనువదించాడు. ద్వితీయాంకంలో సీతను నఖశిఖపర్క్యంతం 24 పద్యాలలో వర్ణించాడు. (2-82 నుంచి 2-౪5 దాకా). సప్తమాంకంలో పురవర్ణన చేశాడు. ఇది 22 పద్యాలలో సాగింది (7-224 నుంచి 7-245). ఇందులో ప్రబంధధోరణి కనబడుతుంది. మిగతాచోట్ల అనువాదం బాగా సాగింది. ఉద్యానవనంలో సీత మొదట లక్ష్మణుణ్ణి చూస్తుంది. అప్పుడు ఆమె మాటలు ఇవి

బొడ్డుచర్ల తిమ్మన, బిజ్జల తిమ్మరాజు తషప్ర కాకరపండు వంటి కనకంబున బోలెడువాడు ముద్దు పెం

గూకటివాడు సోగనిడుగోపుల చూపులవాడు పింఛపుం

జీకటిమ్రాని క్రాంజివురు చెర్విన వీనులాడు కంతుపే

రాకలి మాన్చువాడు చెలువా! చెలువొందెడువాని జూచితే? (2-110)

లక్ష్మణుణ్ణి చూడంగానే ఆమె చిత్తం 'వత్సలతావీచీ ప్రక్షాళనమున వేచెలు! వందిందట. ఊర్మిళ ఆమె మనసులో తోచింది (2-112). రాముణ్ణి కవి ఇలా వర్ణించాడు (2-135):

చిప్పకూకటివాని చిన్నారిపొన్నారి శీకాంశుమంతుని చెలువుమాని

వెడదకన్నులవాని వికచోత్పలము నేలు మెరుగు జామనభాయమేనివాని

కలభయానమువాని వలుదలై జానువుల్‌ గడచిన భుజపరిఘములవాని

వెలది నవ్వులవాని విజయంపు సిరి యింటి తలుపుబోలెడు నురస్థలమువాని

భద్రకరమూర్తి మరుదండ బరగువాని

తరుగువోవని గుణములు తరచువాని

జమునినేనియునని వెన్నుజరచువాని

రఘువరునిజూచెసీత విభ్రమసమేత.

ఈ నాట్యప్రబంధంలో నుంచి సుమారు 41 ప్రయోగాలు ఉదాహరించి రామరాజుగారు వాటి అర్భాలను వివరించారు. శబ్దరత్నాకరంలోనూ, సూర్యరాయాంధ్ర నిఘంటువులోనూ లేని ప్రయోగాలు కొన్ని ఇందులో ఉన్నాయి. ఈ విధంగా తూడా ఈ గంథం చాలా పనికి వస్తుంది.

ఇంతకూ ఈ గ్రంథాన్ని రచించినది బొడ్డుచర్ల తిమ్మన్నేనా అన్నది ఒక కొత్త సమస్య. గ్రంథంలో ఉన్న 1371 గద్యపద్యాలలో కవి తన గురించి ఒకే ఒక పద్యం చెప్పాడు.

ధీరుడు బొడ్డుచెర్ల చినతిమ్మయమంత్రికుమారు డంచితా

కారుడు సత్కళావిదుడు కౌశికగోత్రుడు పద్మనేత్ర సే

వారతబుద్ధి నందవరవంశ్ళుడు ప్రాకవిలోక నాథు డా

చారసమగ్రవర్హనుడు సారవచోనిధి యున్నవాడొగి€. (ప్రసన్న 1-7)

ఈ పద్యంవల్ల ప్రసన్న రాఘవాన్ని బొడ్డుచర్ల చిన తిమ్మయ్య రచించాడని డాక్టరు రామరాజుగారు నిర్ణయించారు. ఈ పద్యాన్నే ఆధారం చేసుకొని ఖండవల్లి లక్ష్మీరంజినంగారు. ఈ కవి తిమ్మయ్యకాడనీ, అతని కుమారుడు లోకనాథుడనీ భావించారు. ఈ పద్యం మూడవపాదంలోని “ప్రాకవిలోకనాథు'డనే మాటలకు “సత్కవిలోకనాథు' డనే పాఠలాంతరముంది. ఇది మెకెంజీ రికార్డులలో కనబడుతుంది.” ఈ నతడ సేసిన పను పసనీసససనపున. న అపసపక పవన న. సువ పపు.. పః 6. ప్రసన్న రాఘవనాట్యప్రబంధం - ఇంగ్లీషుపీఠిక, పుటు ౩.

  1. మెకంబీ నాటే 1౪వ సంపుటం పుట ఐలో ఇది ఉందని నిడుదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు. (భారతి, మార్చి 1383)

తీడత సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పాఠమే సరియైనదని ఖండవల్లివారి వాదం. వారి అఖిప్రాయంప్రకారం బొడ్డుచర్ల లోకనాథుని కాలం క్రీ.శ 1580-85.

బొడ్డుచర్లవారు విజయనగరసామ్రాజ్యంలో సుప్రసిద్ధులు. కృష్ణదేవరాయలతో చదరంగమాడి మెప్పించిన బొడ్డుచర్ల తిమ్మయ్య అనే మేధావి ఒకడున్నాడు. ఇతణ్ణి గురించి ఈ చాటువు (చాటు, ! పుట 155) ప్రచారంలో ఉంది.

శతసంఖ్యు లొక్కటైనను - సతతము శ్రీ, కృష్ణ్ణాయ జగతీపతితో

చతురంగ మాడీ గెలిచెను - ధృతిమంతుడు బొడ్డుచర్ల తిమ్మన భళిరీః

కొప్పోలు కైఫీయతప్రకారం బొడ్డుచర్ల పెదతిమ్మన్న, చినతిమ్మన్న అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వాళ్ళలో చినతిమ్మన్న కవీశ్చరుడు. ఇతడు 'కవీశ్చరదిగ్ధంతి అనిపించుకొని శ్రీకృష్ణదేవరాయలవద్దతు పోయి. రాయలతో చదరంగమాడుతూ ఉండేవాడు; ఆట గెలిస్తే వెయ్యారులవరతూ పందెంవేసి గెలుస్తూ వుండేవాడు. అప్పుడు “శ్రీకృష్ణదేవ మహారాయలు చాలా సంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా ధారవోసి ఇచ్చి కొప్పోల్కు ప్రతినామం కృష్ణరాయపురం అని నామం ఏర్పరిచిరి” అని స్థానిక చరిత్ర చెప్తుంది. దీనివల్ల ఒక బొడ్డుచర్ల తిమ్మయ్య కృష్ణదేవరాయలవారి కాలంలో ఉండేవాడని విశదమవుతున్నది. ఇతడే ప్రసన్న రాఘవం ఆంధ్రీకరించాడని, ఇతడు క్రీశ. 1550 ప్రాంతాలదాకా జీవించి ఉంటాడని నిడుదవోలు వెంకటరావుగారు భావిస్తున్నారు. చదరంగం ఆడిన బొడ్డుచర్ల తిమ్మయ్య మనుమడే చినతిమ్మయ్య అని రామరాజుగారి అభిప్రాయం. చదరంగం ఆడిన తిమ్మయ్య మునిమనుమడు లోకనాథుడు దీనిని వ్రాశాడని ఖండవల్లివారి ఉద్దేశం. ఈ మూడు ఊహలూకాక చదరంగం ఆడిన చినతిమ్మయ్య కుమారుడు లోకనాథుడు వ్రాశాడేమో అని నాదొక అనుమూనం ఉంది ఇతడు క్రీ.శ.1530లో పుట్టి 1575 ప్రాంతాలలో ఈ రచన చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఈ కవి గురించి ఉన్న ఖిన్నాఖిప్రాయాలను క్రోడీకరిద్దాము.

పరిశోధకుడు నాట్యప్రబంధం చదరంగం కాలం

ాశాాాాాకొసో కవరు అటగానితోసంధం నిడుదవోలువారు చినతిమ్మయ్య అఖిన్నుడు క్రీ.శ. 1550దాకా ఆరుద్ర లోకనాథుడు కొడుకు క్రీశ1575 ప్రాం ఖండవల్సివారు లోకనాథుడు మునిమనువడు క్రీశ 1580-౧6

ఇంతకూ నాట్యప్రబంధ రచయిత కాలాన్ని నిర్ణయించడానికి కృతిపతి కాలం ఏదై వుంటుందని తూడా ఆలోచించాలి. నాట్ళప్రబంధాన్ని బొడ్డుచర్ల కవి నంద్యాల తిమ్మరాజుకు అంకితమిచ్చాడు. కళాపూర్లోదయాన్ని అంకితం పుచ్చుకొన్న నంద్యాల ఇ భారతిమా్చియుపుటన యల ౨. నాట్కప్రబంధ రచయిత పేరు లోకనాథుడే అని నేను ఖండవల్లివారితో ఏకీభవిస్తున్నా,

భావిపరిశోధనలవల్ల స్థిరపడేదాకా రామరాజుగారి నిర్ణయాన్నే స్వీకరించి, కవిపేరును చినతిమ్మయ్య అని పాఠకులకు నివేదిస్తున్నాను.

బొడ్డుచర్ల తిమ్మన, బిజ్జల తిమ్మరాజు శీర్‌

కృష్ణమరాజుకు ఈ తిమ్మరాజు వరుసకు సోదరుడవుతాడు. ఈ ఇద్దరి తాతలూః అన్నదమ్ములు, కళాపూర్ణోదయం కృష్ణమరాజు రాయసింహాసనానికి ఎదురుతిరిగ్‌ క్రీశ1599-1600లో జరిగిన యుద్ధంలో వెంకటపతి దేవరాయలకు పట్టం కట్టాడు.

ఈ కృష్ణమరాజుకు సోదరుని వరుసవాడైన నంద్యాల తిమ్మరాజు అప్పటిదాకా జీవించ్చి ఉండవచ్చు. అయితే ఇతడు శ్రీ.శ1580 ప్రాంతాల జరిగిన యుద్ధంలో పాలొన్నట్లు

బొడ్డుచర్లకవి ప్రసన్న రాఘవంలో చెప్పిన పద్యాల వల్ల ఊహించవచ్చు. కవికృతిపతిని

ఇలా ప్రశంసించాడు (1-75):

యవననైన్య విభాళభువనైకమల్లకల్యా ణపురా ధ్యక్ష ్లిక్షితుండు

విరుదుమన్నావిభాళధరుణీవరాహసారాసిదుర్గవిభాళభాసితుండు

ఘనతరాత్యంబరగండ నానావర్ణమండలీకరగండమండితుండు సంగీతసాహిత్యసంగరాంగణసార్వభౌమనిళ్ళంక్ణోకట్రి బంధురుండు భండనార్జునచెలువరగండమన్నై

బెబ్బులిఖ్యాతసంజ్ఞాతప్పుథులజయుడు

రాజమాత్రుండె నరసింగరాజసుతుడు

దీప్తి దినరాజు నందేల తిమ్మరాజు.

ఈ పద్యం మొదటి పాదంలో కల్యాణదుర్గ ప్రసక్తి ఉంది. ఇది అనంతశీపురం జిల్లాలో ఉన్న కల్యాణదుర్గమా లేక గుల్చర్గదగ్గర ఉన్న కల్యాణదుర్గమా అన్నది ప్రశ్న, కల్యాణిపై జరిగిన ముట్టడుల్లో పాలొన్నాడని చెప్పవచ్చు. క్రీ.శ. 1557 తరువాత జరిగిన ఒక యుద్ధంలో విజయనగరం సేనలు కల్యాణిని ముట్టడించాయి. అప్పుడా దుర్గరక్షణభారాన్ని హుసే౯€ నిజాంషా తన భృత్యుడు భూపాలరాయడీ భుజాలపైన పెట్టి పైఠాకకు పారిపోయాడు. కల్యాణి దుర్గాన్ని సాధించమని కొంతమందిని నియమించి అళియ రామరాయలు అహమద్‌ నగరువేపు పురోగమించాడు. విజయనగరం వాళ్ళ ఛాటికి ఆగలేక భూపాలరాయడు కల్యాణీదుర్గాన్ని శత్రువులకు స్వాధీనం చేశాడు.39 ఈ సంఘటన క్రీ.శ 1560 ప్రాంతాలలో జరిగిందని ఊహించవచ్చు.

ఈ నంద్యాల తిమ్మరాజు పరాక్రమాన్నీీ సాహిత్యపోషణనూ సరిసమానంగా పింగళిసూరపరాజుగారు తమ కళాపూర్ణోదయం పీఠికలో ౩ పద్యాలలో ప్రశంసించారు. ఇతడు 'కవిత్వప్రముఖబహుకళాపారంగు' డన్నారు (1-46).

ఏ సీమ నెదురులేక వి-భాసిలు నంద్యాలతిమ్మపార్ధివు బలముల్‌

వాసిగల యతివిభాసి- ప్రాసాదులతోడ దత్ర్రబంధముల గతిక. (1-49)

సూరపరాజుగారు చెప్పిన ఈ పద్యాలవల్ల కళాపూర్లోదయం అంకితమిచ్చేనాటికే ప్రసన్న రాఘవనాట్య ప్రబంధం ఒకటి కావచ్చు.

10 గశులా 5ంటుంజ 0 '|జరంవిప్రతాంి 1181000/ - గ. లిలిపీలంరీడి 52041 & 1 ౬ ౩టూబంమవ్యానిని, ౫11 ౯ 56.

446 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

సంస్కృళులో జయదేవుడు ద్రాసిన ప్రసన్న రాఘవాన్ని 'పిల్లమురారి అంటారు.!*ే సంస్కృతంలోనే మురారి వ్రాసిన అనర్హరాఘవానికి ఇది అనుకరణ, పిల్లమురారిని బొడ్డుచర్ల కవి అనువదిస్తే, అసలు మురారి అనర్హ రాఘవాన్ని విజ్ధల తిమ్మరాజు అనే కవి తెనిగించాడు. ఇతడు కృష్ణానది పరిసరాలలోని ఆలంపూరు, ప్రాకటూరు సీమలవాడు. గద్వాల సంస్థానంలోని బీచిపల్లి గ్రామానికి దేశాయి. ఇతడు క్రీ.శ.1600 ప్రాంతాలకు ప్రాచీనుడేగాని అర్వాచీనుడు కాడు. ఈ విజ్జ్ఞల తిమ్మరాజుకు కృష్ణకవి అనే విద్వాంసుడు సహాయం చేసేవాడు. ఈయన అసదృశంగా అఖిలవిద్యలలో ప్రొడగన్నవాడు. పేరయ్యగారి మనుమడు. పేరయ్యగారిని ఒక పద్యంలో పొగిడి ఆ తరువాత తిమ్మరాజు ఇలా చెప్పాడు:

అతనికి బౌత్రుడై యసదృశాఖిలవిద్యల (బౌఢిగన్న యా

యతమతి కృష్ణసత్కవి సహాయ కవిత్స్వమనస్సమాజ సం

తతభజనాదరుండ నగు నాక నశేషవిశేషవైదుషీ

ప్రతిభ కరస్థలామలకభాస్వరమై తనరారుటబ్రమే? (౧౮౦౫)

ప్రతిభ కరతలామలకంగా ఉన్న ఈ తిమ్మరాజు అనర్హరాఘవాన్ని అయిదాశ్వాసాల ప్రబంధంగా అనువదించాడు. ప్రాకటూరి రామేశ్చరస్వామికి అంకితమిచ్చాడు. సంస్కృతంలో అనర్ధ రాఘవం చాలా ప్రసిద్ధమైన నాటకం. దీనిని వ్రాసిన మురారి విలక్షణమైనవాడు. ఇతడు క్రీ.శ. 790-840 ప్రాంతాల మధ్య ఉన్నాడని పండితుల ఊహ. ఇతని గురించి “మురారే స్పృతీ యఃపంథాః అనే నానుడి పుట్టింది. భవభూతి నాటకాలకన్నా చక్కగా ఉండాలనే ఉద్దేశంలో మురారి అనర్హ రాఘవాన్ని వ్రాశాడు. తక్కిన నాటకాలలాగా కాక భాషాజ్ఞానం కోసం దీనిని భాషాఖిమానులు చదువుతారు. మురారి తన బహుశానస్త్రవిజ్ఞానం ప్రదర్శించడానికి ఈ నాటకంలో పారిభాషిక పదాలను ఉపయోగించాడు. ఇది 'పఠనపాఠరమ్యమైనట్లు ప్రదర్శన రమ్యముకాజాల' దని మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు చెప్పారు.3* మురారి విజ్ఞానానికి కొరత రాకుండా అనర్జ రాఘవాన్ని విజ్జ్ఞల తిమ్మరాజు అనువదించాడని చాగంటి శేషయ్యగారు పయథీలించి బ్రాశారు.3 తెలుగు అనర్హ రాఘవం అచ్చుపడలేదు.

పిల్ల మురారి నాటకమైన ప్రసన్న రాఘవానికి అనువాదం అచ్చుపడి, తల్లి మురారి నాటకమైన అనర్హ రాఘవం తెనిగింపు అచ్చుపడకపోవడం అన్యాయమే. 11. సంస్కృతవాబ్మయచరిత్ర -1. మల్లాది సూర్యనారాడుణాన్తిగాద పుట: 12. సంస్కృతవాబ్బయచరిత్ర-క, పుట 411. 13. అంధ్రకవితరంగిణీ -౫, పుట 116.

ముద్దరాజు సోదరులు, చిత్రకవి పండితులు

మన తెలుగు సాహిత్యంలో రెండర్థాల కావ్యాలూ, మూడు నాలుగర్థాల పద్యాలూ ప్రవేశించాక వాటికి అర్ధాలు వివరించవలసిన వ్యాఖ్యాతలు కూడా అవసరమయ్యారు. కవి హృదయాన్ని ఆవిష్కరింపజేసి వ్యాఖ్యానాలు చేయడంలో తెలుగువాడిదే పెట్టింది పేరు. సంస్కృతంలో ఎన్నో కావ్యాలున్నాయి; ఎందరో వ్యాఖ్యాతలున్నారు. అయితే ప్రమాణ పారావార పారీణుడు; మహామహోపాధ్యాయుడు; చుళుకీకృతశాస్తజలధి, ఆయన వ్యాఖ్యానాలు రచించాకనే సంస్కృత పంచకావ్యాలకు అధిక ప్రచారం లఖించిందని లోకం చెప్పుకొంటుంది. మల్లినాథసూరి ఇంటి పేరు కోలాచలంవారు. వీరిది తెలంగాణా మెదకు జిల్లాలోని కొలచెలమగ్రామం. మల్లినాథసూరి క్రీ.శ 14వ శతాబ్దివాడు. ఈయన సంస్కృత కావ్యాలకు వ్రాసిన వ్యాఖ్యానాల ఒరవడిలోనే తెలుగు కావ్యాలకు తెలుగువాళ్లు వ్యాఖ్యానాలు బ్రాశారు. వాళ్లలో ముద్దరాలూ పెదరామన మొదటివాడు.

ముద్దరాజు వారిది ఏ గ్రామమో కచ్చితంగా తెలియదుగాని ఆ వంశంలో గణపయ్యగారనే ఒకాయన క్రీ.శఈ16వ శతాల్దిలో ఉండేవాడు. ఆయనకు ముగ్గురు తొడుకులు. ఆ ముగ్గురికీ ఆయన శ్రీరాముని పేరే పెట్టుకొన్నాడు. వ్యవహారంలో వాళ్లకు పెదరామన, చినరామన రామన అనే పేర్లు వచ్చాయి. వీళ్ళలో చినరామన పండితుడో కాదో తెలియదుగాని పెదరామన వ్యాఖ్యాత. రామన లాక్షణికుడు.

ఈ అన్నదమ్ములు మదనగోపాల భక్తులు. ఇద్దరూ ఆ దేవుని కృపాకటాక్షాలవల్ల ప్రాప్తమైన 'సారసారస్వత సంపదానందులమని వ్రాసుకొన్నారు. పెదరామన తాను సుధీమణినని చెప్పుకొన్నాడు. పింగళి సూరపరాజుగారి రాఘవపాండవీయానికి ఆదర్శాన్ని ప్రదర్శించాడు. ఆ వ్యాఖ్యానం మొద॥ః. .;౮ా చెప్పుకొన్నాడు:

అమరయ సూరయార్య రచితాంచిత రాఘవపాండవీయ కా

వ్యమహిత మాధురీమదుభయార్థ విబోధిక టీక జేనెద౯

గమల నివాసినీచరణ కాంచననూపుర శింజితార్పటిక

సమమతి సంస్కృతాంధ్ర కృతిసాధన లక్షణ లక్షితంబుగా!.

ఈ పద్యంలో చెప్పినట్టే పెదరామన సంస్కృతాంధ్ర గ్రంథాలను ప్రమాణాలుగా చూపెట్టి రాఘవపాండవీయానికి అర్జాలు వ్రాశాడు. ఈ వ్యాఖ్యానంలో అతడు పేర్కొన్న గ్రంథాలు సుమారు నలభై ఒకట. ఇందులో సంస్కృత గ్రంథాలు 32; తెలుగు పుస్తకాలు 9. వాటి వివరాలిమి

తగ సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పెదరామన వాడిన సంస్కృత (గ్రంథాలు

  1. అమరం 17. మాఘం

  2. అమరుకశతకం 18. యాదవ నిఘంటువు

  3. కామందకం “19, యోగశాస్త్రం

  4. కాళిదాసు రఘువంశం 20. రతి రహస్యం

  5. కాళిదాసు శాతుంతలం 21. రాజపుత్రీయం

  6. చంద్రాలోకం 22. రామాయణం

  7. ధాతుమూల 23. లక్షణశాస్త్రం

  8. వానార్థ రత్నమాల 24. వార్తికం

  9. న్యాయాలు (వివిధాలు) 25. విశ్చనిఘంటువు

  10. న్యాసకారులనుండీ ౫8. వేదాంత సిద్ధాంతాలు 11 నీతిసారం 27. వైజయంతి నిఘంటువు

  11. నైషధం 28. శంకరాచార్యుల శోకాలు

  12. పాణినీయం 29. శాశ్వత నిఘంటువు

  13. బాలభారతం 30, స్మృతి

  14. బ్రహ్మాండ పురాణం 31. హయలీలావతి

  15. భారవి ౩2. హలాయుధం పెదరామన వాడిన తెలుగు పుస్తకాలు

  16. అనంతుని ఛందం 6. నాచనసోముని ఉత్తర హరివంశం

  17. ఆంధ్రభాషాభూషణం 7. పిల్లలమర్రి వీరయ్యగారి ప్రయోగాలు

  18. కవిత్రయ భారతం ౬ భీముని ఛందం

  19. కవిలోక చింతామణి 9. మనుచరిత్ర

  20. రావ్యాలంకార చూడామణి

ఇన్ని గ్రంథాల ప్రమాణాలతో చక్కని వ్యావహారిక భాషలో పెదరామన వ్యాఖ్యానం వ్రాశాడు. ఉదాహరణకు కావ్యంలోని మొదటి పద్యానికి అతడు ఎలా వ్యాఖ్యానం చేశాడో చూద్దాం.

వెలయు నఖిలభువనములలోనవారణ - నగరిపురమతల్లి నాదనర్చి

రాజ్యలక్ష్మీ మిగుల బ్రబలనయోధ్యనా-రాజవినుతిగనిన రాజధాని. ఈ పద్యానికి రామాయణార్థం: __“అఖిలభువనములలోను - సకలజగత్తులలలోపలనున్ను, “విష్టపంభువనం జగదిత్యమరః. అవార్ల - అనర్గళమైన, నగరిపు - ఇంద్రుని యొక్క, రమ - సంపదకు (అవారణపదము రమావిశేషణము), మతల్లి - పోషించేది, నా - అనంగాను, “శ్రీయన గౌరినా బరగు చెల్వల' అని సోమయాజి ప్రయోగము. తనర్చి - ప్రకాశించినదై రాజ్యలక్ష్మి మిగులబ్రబలగాను, అత్ముక్తి ఇందుకు లక్షణం. చంద్రాలోకమందు

ముద్దరాజు సోదరులు, చిత్రకవి పండితులు తరి

“అత్యుక్తి రద్భుకాత్యర్థశార్యాచార్యాదివర్లనం,

త్వయిదాతరిరాజేంద్ర యాచకాః కల్చశాఖినః

భువనములలోను అవారణ అనే దిక్కున సంధికి ఆంధ్రభాషాభూషణమయందు “మానుగ విభక్తులందుక్‌ పూనిన(ను)రులులకు వచ్చుబోయిన బోవు౯” అనే లక్షణంవల్లను ఉకారలోపము. రమతల్లి అనే దిక్కున “క్షమ నకారాంత ప్రకాశితంబులైన పుల్లింగములు దక్కనన్నిటికిని, పరగ సంబంధషష్టిపై ప్రథమయగును. దంతికొమ్ములు రమ పల్కు తరువుకొమ్మ' అనే లక్షణం, షష్ట్యర్థమందు ప్రథమాంతరూపం. అయోధ్యనా

  • అయోధ్యనే పేరు కలదై. రాజవినుతిగనిన రాజధాని. వెలయును - సర్వోత్కృష్టమై వర్తించును.

“కృతిముఖమున దైవనమ- స్మృతి యొండె నఖీష్టవస్తుకీర్తన మొండెన్‌

వితతాశీఃపద మొండెను- ప్రతిపాదింపంగవలయు భద్రాపేక్షళ' అనే న్యాయాన వస్తు నిర్దేశరూప మంగళము.

“శుభసుఖరుక్‌ క్షయధనకన- కభర్జైశ్చర్యముల జేయు కవు లిడ గావ్య

ప్రభులకు గను గృతుల మొదలక్‌-మభజసనయరతగణాళి మల్లయరేచా.”” అని భీముని ఛందమందు జెప్పినది గనక ఆదియందు నగణప్రయోగము. వెలయు అనేది శుభపదము. వకారం అమృతవీజమున్ను. . భారతార్థం;

అఖిల భువనములలోన వారణనగరి - హస్తినగరము పురమతల్లి- పుర శ్రేష్టమైనది, నా-అనగాను, (“మతల్లికా మచ్చర్చికా ప్రకాండముద్దతల్లజౌ, ప్రశస్తవాచకాన్యమూని). వారణనగరి పురమతల్లి అనే దిక్కున పొసగం బల్కెడునెడ పౌ-ల్చెసగిన ప్రథమాంతము లపయిం గదిసి కడుంబ నారు కచటతపలను- గసడదవల్‌ ద్రోచివచ్చు కవిజన మిత్రా! అని ఆంధ్ర భాషాభూణముమందును,

ప్రథమాంతవిభక్తులపై- గథితములగు కచటతపలు గసడదవ లగు[€

పృథివి నవి గజడదబలగు- ప్రథమపు సున్నలుగ నాంతపదములమీదక. అని అనంతుని ఛందమందున్ను చెప్పిన లక్షణంవల్లను వకారమునకు వకారం రావలసినందుకు తాతంభట్ట్లుగారు కవిలోకచింతామణిలో

థిన్నపదప్రథములపై- నున్న వకారంబు సత్య మొందును రళులక౯

మున్ని జరూపము ప్రాసము-నన్నరూపంబు దాల్చు నాళీకాక్షా! అని విశేషవిధులుగా జెప్పి

ఆ వాలుంగనుదోయి యా నగుమొగం బా గుబ్బపాలిండ్ల పెం

పా వేణీభర మాయోవిలసనంబా యొప్పులం జెప్పిన€

గైవారం బగుగాని యయ్యెడ విరఃకంపంబుతో గూడ హా

హాపుట్టింపవె పుష్పధన్వునకు నయ్యబ్బాక్షి వీక్షించిన€.

450 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అని పిల్లలమర్రి వీరమరాజుగారి ప్రయోగమున్ను, 'భూనుతకీర్ణి బ్రాహ్మణుడు పుట్టగ తోడనె పుట్టు నుత్తమజ్ఞానము' అని యిది మొదలైన కవిత్రయంవారి ప్రయోగాలున్ను వ్రాసినందువల్లను ప్రథమ'ంత విభక్తిమీది వకారానికి వకారాదేశము ప్రాసస్థానమందు నిత్యముగా వచ్చును. యతిన్థానమందు రాదు. యితరత్రా యొందైనం జెప్పవచ్చు. సంసట్టాయగనక వారణపురమతల్లి అని చెప్పవచ్చును. నాంగానే సూరపరాజుగారు యీమీదటీ పద్యమందున్న _ “విముఖితసమదాటోపారిపంక్తి రథుడు అని రామాయణార్థమందు చెప్పినారు. ప్రకృతము, తనర్చి- ప్రకాశించినదై, అయోధ్య - యుద్ధంచాయ శక్యంకానిది. యోద్భుమశక్యా అయోధ్యా అనే అర్థమందు ''బుహలోర్జ్యత్‌ అనే సూత్రాణ్జ్యత్‌ ప్రత్యయాంతము. 'నిడువు లుడప తెనుగగు'. నా-అనగాను, రాజ- దిగ్లేశరాజులచేతను వినుతిగనిన రాజధాని సింహాసనస్థలమైనది.

పెదరామన ఇలా చక్కగా తన కాలంనాటి వ్యావహారికంలో వ్యాఖ్యానం వ్రాస్తే ఈనాటి ముద్రాపకులు దానిని మార్చేసి కృతకగ్రాంధికంలో అచ్చువేశారు.!ీ పెదరామన మాత్రమే కాదు పూర్చులు వ్రాసిన వ్యాఖ్యానాలు వ్యావహారికంలోనే ఉంటాయన్న సంగతి వ్రాతపతులను చూస్తే తెలుస్తుంది. మద్రాసు ప్రాచ్యలిఖిత గంథాలయంవారి పట్టికలలో ఈ టీక గురించి ఇలా వివరించారు.

ఈ వ్యాఖ్యానమన్నిటివలె వ్యావహారిక భాషయందే వ్రాయబడియున్నది. ఇందు బెక్కు లక్షణగ్రంథము నుండియు, నితరప్రాచీన గ్రంధములనుండియు, నిఘంటువుల నుండియు దరచుగా వ్యాఖ్యాన సమర్థనార్థము ప్రమాణములు గైకోబడినవి. ఈ గ్రంథము నకు గల యెల్ల ప్రాచీనవ్యాఖ్యానములలో నిదియ మేలైనది.

రాఘవపాండవీయానికి ఇంత మేలైన వ్యాఖ్యానం వ్రాసిన ముద్దరాజు పెదరామన మన సాహిత్య చరిత్రలలో ప్రత్యేకస్థానాన్ని పాందలేకపోయాడు. ముద్దరాజు గణపయ్య గారికి ముగ్గురు కొడుకులనీ, అంధులో పెద్దవాడే వ్యాఖ్యాత అని సరిగా గుర్తించక వీరేశలింగంగారు తమ కవుల చరిత్రలో పొరపాటున ఇలా వ్రాశారు” *'ముద్దరాజు రామన్న కవిసంజీవని యను లక్షణగ్రంథమును రచించెను. మరియునితడు రాఘవపాండవీయమునకు వ్యాఖ్యానమును గూడ జేసెను పీరేశలింగంగారి చరిత్రలో పడిన ప్రమాదం చాలామంది ఫుస్తక్టాలలో. అలాగ దొర్లుకుంటూ వస్తూంది. దీనిని రావూరి దొరస్వామ్‌శర్మగారు సవరించారు.

తెలుగు కావ్యాలకు మొదటి వ్యాఖ్యాతగా ఇప్పటికి తలియవస్తున్న ముద్దరాజో పెదరామన ఇతర గగ్రంథాలేమైనా వ్రాశాడో లేదో తెలియదు. ఇతని తమ్ముడు చినరామన సంగతికూడ బొత్తిగా తెలియదు. ఈ అన్నదమ్ములలో మూడోవాడు మాత్రం ఉద్దండపండితుణ్దని చెప్పుకొన్నాడు. తన గురించి కవిజనసంజీవనిలో ఇలా చెప్పాడు :

అందమౌ నీకీ మహాసుధానిధి నిరాఘాటలాక్షణీకతాకౌశలంబు

దొరయు నీకే కవిస్తోమస్తుతానేక నాటకాలంక్రియాపాటవంబు 1 కాఘవవాండతయం . పట్టి (వావళముత్ర 2. డీ. కేటలాగు! భాగం ॥, పుట 883 3. తెలుగుకవులచరిత్ర (1ఐ8) రెండవభాగం, పుట 145.

  1. అంధ్రసాహిత్యపరిషత్ప త్రిక, సంపుటి ౫, సంచిక 1-3, పుట 2.

ముద్దరాజు సోదరులు, చిత్రకవి పండితులు 451

తగునీకె శాబ్టిక స్తవనీయ భాష్యకైయటముఖ్య శబ్దవిద్యానిరూఢి

చెల్లు నీకే లసబ్టేగేయమానకవిత్వవైశారాధ్య విలసనంబు

ననుచు బుధులెల్ల వినుతింప నలరు ముద్ద

చంద్రపిదరామపినరామసచివమణుల

కనుగుదమ్ముడ రామభద్రాఖ్యకవిని. (కవిజన. 1-3)

ఈ జేగీయమాన కవిత్వ విశారదుడు పహ్రసిన లక్ష్య [గ్రంథాల సంగతి ఆలియదుగాని ఇతని లక్షణగ్రంథం చాలా ప్రామాణికమైనది. ఇందులో నాలుగు తరంగాలున్నాయి. యతి పద్ధతి, విభక్తి పద్ధతి. సమాస పద్ధతి, సంధి పద్దతి అని వాటిని విభజించాడు. ప్రథభమశ్రేణి కవుల గ్రంథాల నుండి ప్రమాణాలను స్వీకరించాడు - 1. అనంతుని ఛందం, 2. ఆముక్తమాల్యద, ౩. కవిత్రయ భారతం, 4. కావ్యాలంకారచూడామణి, 5. చంద్రభాను చరిత్ర, 6. నైషధం, 7. పాండురంగ మాహాత్మ్యం, 8.భాస్కర రామాయణం, 9. మనుచరిత్ర, 10. యయాతిచరిత్ర, 11. రంగనాథరామాయణం, 12. రాఘవపాండవీయం. 13. వసంత విలాసం, 14. వరాహపురాణం. 15. శృంగారషష్టం మొదలైన గ్రంథాల నుండీ ఉదాహరణలిచ్చాడు. యయాతి చరిత్రనుండి 'వలబడ్డజక్కవల్‌ వలెనున్న జిలుగు పయ్యెదలోని గుబ్బపాలిండ్లు మెరయ' అనే ప్రయోగం చూపించాడు. దీని కర్త సూరపరాజు అని కవిజనసంజీవని అచ్చుప్రతిలో ఉంది (1-120), అయితే ఈ పద్యపాదం నిజంగా పొన్నిగంటి తెలగన్ను వ్రాసిన యయాతి చరిత్రలోనిది (3-౫), ముద్దరాజు రామన చూపించిన ప్రయోగాలను అనంతర లాక్షణికులు యథాతథంగా స్వీకరించారు. అప్పకవి, అహోబల పండీతుడు, చిత్రకవి, అనంతుడు, కూచిమంచి తిమ్మన, అడిదం సూరకవి, లింగమగుంట తిమ్మన మొదలైనవాళ్ళందరూ. ముద్దరాజు రామనకు

అయితే దురదృష్టవశాత్తూ ఇతని కవిజనసంజీవని సమగ్రప్రతి లభ్యం కావడం లేదు. అన్ని తరంగాలూ అసమగ్రాలే. మధ్యలో కొన్నివోట్ల పద్యాలు పోయాయి. ఉన్నంతమట్టుకు గ్రంథాన్ని వావిళ్ళవాళ్లు వేశారు (1930). దీనిపైన రావూరి దొరస్వామిశర్మగారు పరిశోధనలు చేసి సమగ్రంగా విమర్శించారు. ముద్దర్షాజు రామన బాసిన ఈ లక్షణ గ్రంథం సమగ్ర ప్రతి దొరికిజి? అది అచ్చుపడితే మన సాహిక్యానికి చాలా ఉపయోగపడుతుంది. వాస్తవానికి దీనిని రామన వ్రాసీవ్రాయగానే సమకాలికులు వాడుకొన్నారు. చిత్రకవి అనంతకవి రామరాజభూషణుని హరిశ్చంద్రనలోపాఖ్యానానికి వ్యాఖ్యానం వ్రాస్తూ ముద్దరాజు రామన్న లక్షణంలోనుంచి ప్రయోగాలను చూపించాడు. అనంతకవి శ్రీశ: 1580 ప్రాంతాలవాడని పరిశోధకులు నిర్ణయించారు. కాబట్టి రామన్న తూడా ఆకాలంవాడే అవుతాడు. అతని గ్రంథం కొంత ముందు పుట్టి ఉంటుంది. వ ్రంెథు. చక (చయష్టైన్థుయ 0. సం (ఫటబ్రవరామార్చి 129). సం (ఏట్రిల్‌ మే

1955

  1. న హరణ వాజ్మయం - నిడుదవోలు వెంకటరావుగారు, పుట 14.

ఉ5్‌2 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ముద్దరాజు పెదరామన ఒక రెండర్థాల గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాస్తే, చిత్రకవి అనంతకవి మరోద్వ్యర్థి కావ్యానికి టీక చేశాడు. ఈ అనంతయ్య కఠినమైన ప్రబంధాలకు అర్థం చెప్పడంలో ప్రత్యేకత సాధించాడు. హరిశ్చంద్రనలోపాఖ్యానానికి వ్రాసిన వ్యాఖ్యానపు గద్యలో తాను 'పురాతనాధునాతన కఠిన ప్రబంధార్థబోధనసమర్థమాన సాంభోజుణ్జి అని చెప్పుకొన్నాడు. ఇతడు లక్షణసార సంగ్రహం వ్రాసిన చిత్రకవి పెద్దన్నగారి కుమారుడు. ఈ అనంతయ్య కుమారుడు వెంకటరమణ కూడా కఠిన తప్రబంధాలకు అర్భాలు చెప్పే పండితుడే. ఆతడు సాంబవిలాసం అనే గ్రంథం వ్రాశాడు. అందులో తన తండ్రీ హరిశ్చంద్రనలోపాఖ్యాన వ్యాఖ్య మాత్రమేకాక ఇందువతీ పరిణయం, హరిహర్హోషోదాహరణం, సకలజీవనసంజీవనం, వంశావళి అనే గ్రంధాలు వ్రాసినట్టు చెప్పాడు. తన తండ్రి ఆముక్తమాల్యద, హరిశ్చంద్రనలోపాఖ్యానాలకు మాత్రమే అర్ధాలు చెప్తే, తాను 'రాఘవపాండవీయవిష్ణుచిత్తీయ వసుచరిత్ర ప్రముఖదివ్యత్కావ్యార్థ బోధన సమర్శుణ్జి” అని గద్యలో వ్రాసుకొన్నాడు (౫ 123) ఇతడు వసుచరిత్రకు వ్రాసిన వ్యాఖ్య దొరికితీ అదే ఆ గ్రంధానికి మొదటిదవుతుంది.

ముద్దరాజు పెదరామనలాగే చిత్రకవి అనంతయ్య కూడా వ్యావహారిక భాషలోనే హరిశ్చంద్రనలోపాఖ్యానానికి వ్యాఖ్యానం వ్రాశాడు. అయితే దీనిని పండితులు కృతక భాషలోకి తర్చుమా చేశారు. ఎలా మార్చివేశారో వజ్ఞల చినసీతారామస్వామి శాస్త్రిగారు ఉదాహరణలతో సైతం చూపించారు.” అయితే వారు ఇలా చూపించిన పీఠికతో వెలువడ్డ హరిశ్చంద్రనలోపాఖ్యానం కూడా పండితులు '“అన్యాయంగా దిద్దిన కృతకటీకతో అచ్చుపడడం శోచనీయం. చిత్రకవి అనంతయ్యలాంటి ప్రామాణిక పండీతుడు వ్యావహారికంలో వ్రాసిన వ్యాఖ్యానాన్ని కాకరపర్తి కృష్ణకవి అనే మరో పండితకవి వ్యావహారికంలోనే స్వయంగా 'సౌమ్యముగ వ్రాసుకొనె, చిత్రకవి అనంతయ్య వ్యాఖ్యలో వాడీన వ్యావహారిక రూపాలు రామరాజభూషణుని ప్రయోగములవలె మనకు ఖట్రమూణములె యనకతప్పదు అని వజ్ఞలవారు చాటారు.

అనంతయ్య వ్రాసిన ఇతర గ్రంథాలు దొరకకపోవడం దురదృష్టమే. అతని "సకలజీవన సంజీవనం' బహుశా లక్షణ[గ్రంథమేమో అని నా అనుమానం. అలాగే అతని కొడుకు వెంకటరమణ వ్రాసిన '“త్రిలోకసంజీవని' తూడా లక్షణ గ్రంథమే కావచ్చు. ముద్దరాజు రామన “కవిలోక సంజీవని" అనే లక్షణగ్రంథం రచించాడు కనుక ఈ చిత్రకవి పండీతులలో తండ్రీ 'సకలజీవన సంజీవనం, కొడుకు “త్రిలోకసంజీవనం' వ్రాశారని భావించవచ్చు. ముద్దరాజు పెదరామన మొదటి ద్వ్యర్థికావ్యానికి వ్యాఖ్యానం వ్రాస్తే దానిని చూసి రెండవ ద్వ్యర్థికావ్యాన్ని అనంతయ్య బ్రాశాడని పండితులు భావిస్తున్నారు .ముద్దరాజు వారిని చూసి చిత్రకవివారు గ్రంథాలు వ్రాయడంవల్ల ఈ రెండు పండిత కుటుంబాలు ఒక ప్రాంతంలోనివే అని చెప్పవచ్చు. చిత్రకవివారి నివాసం వెల్లటూరు. ఇది ఈ పరిశోధన, ఆగస్టునెప్టెంబరు, 1954: ముద్ధరాజు రామన-కవి సంజీవని - రావూరి

దొరస్వామిశర్మగారి వ్యాసం, పుట 47.

కామినేని కవులు, ఆశ్రితులు 453 కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని గండికోట చేరువలో ఉంది. ముద్దరాజు వారు కూడా గండికోట ప్రాంతాలవాళ్ళీ అని భావించవచ్చు. మొత్తంమీద ఈ రెండు నిద్వత్కుటుంబాలవాళ్లూ మంచి సాహిత్య సేవ చేశారు. తరువాతి లాక్షణికులకు ఎంతగానో తోడ్పడ్డారు. అప్పకవి తన గ్రంథంలో చిత్రకవి వెంకటరమణ వ్రాసిన సాంబవిలాసంలోని ప్రయోగాలను రెండు ఉదాహరించాడు. ఈ గ్రంథం అచ్చుపడలేదు. ఇదేకాదు, ఇతడు వ్రాసిన ఇతర [గ్రంథాలు కూడా అముద్రితాలే. ఇతడు త్రిలోకసంజీవని కాక రామాయణం, తుమూరగురువిలాసం, అభిమన్యు విలాసం అనే గ్రంథాలు వ్రాశాడు. వెంకటరమణ రచించిన రామాయణానికి “విద్వత్కవికర్ణరసాయన'మనే నామాంతర ముంది. ఇది సకలవర్జనాపూర్ణ రామాయణమని కవి చెప్పాడు. దీనిని సుబ్బరాయడికి అంకితమిచ్చాడు. ఈ రామాయణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది పిండిఫప్రోలు లక్ష్మణకవి బ్రాసిన రావణదమ్మీయం లాంటిదని చాగంటి శేషయ్యగారు చెప్పారు. వారు ఇంకా ఇలా బ్రాశారు: “ఈ కవిపై నెవ్వరో యభియోగము డేగానాతనిని రావణునిగాను (...) రామునిగను బోల్చి యీ గ్రంథము రచించెనట. ఇందు రామాయణ మేడుకాండలును గలవు. ఈతనిపై అభియోగము దెచ్చిన యాతడెవ్వడో, యా యఖియోగము నీతని పక్షమున దీర్మానించిన న్యాయకర్త యెవ్వడో తెలిసినగాని యాతని పద్యములయందలి శ్లేషను గ్రహించి యానందింపలేము. గ్రంథము తిథిలావస్థయందుండుటచే నావిషయము లను సంపూర్ణముగ గగ్రహింపననువుగా లేవు”? ఈ విషయాలు పరిశోధించాలి. ముద్దరాజు సోదరులు, చిత్రకవి పండితులు ఏమేమి వ్రాశారో క్రోడీకరిద్దాము. పేరు గ్రంథాలు ముద్దరాజు పెదరామన | క్రీశ 1575 | రాఘవ పాండవీయానికి ఆదర్శ వ్యాఖ్య ముద్దరాజురామన | క్రీశ. 1675 | కవిజన సంజీవని (దీనికే కవిలోక సంజీవని కవిసంజీవని, కవిజీవ సంజీవని అనే పేర్లున్నాయి.) చిత్రకవి అనంతయ్య _ | క్రీ. 1580 | (1) విష్ణు చిత్తీయానికి అర్థం చెప్పాడు (2) హరిశ్చంద్ర నలోపాఖ్యానానికి ' ప్రకాశిక వ్యాఖ్య వ్రాశాడు. (3) హరిహర శ్లేషోదాహరణం 4; " 2వన సంజీవనం. చిత్రకవి వెంకటరమణ | క్రీ.శ. 18900 | (1) రాఘవ పాండవీయం వసుచరిత్ర ఆముక్తమాల్యదలకు అర్భాలు. (2) త్రిలోక సంజీవని, (3) రామాయణం (4) కుమార గురువిలాసం (5) అభిమన్యు విలాసం (6) సాంబవిలాసం ,... తెలుగువాళ్ళ కోసం తెలుగు కవులు వ్రాసిన కావ్యాలకు టీకాతాత్పర్యాలు బ్రాయవలసిన స్థితి ఏర్పడిన రోజులలో ఇటువంటి పండితకవుల అవసరం ఉండనే ఉంటుంది. మన సాహిత్యంలోని ఈ తొాలివ్యాఖ్యాతలు మరువరాని వాళ్లు.

కామినేని కవులు, ఆశితులు

ప్రదహినో శతాబ్దపు చివరిరోజులలో కృష్ణానదీ తీరంలో కర్ణాటక రాజ్యానికి సంబంధించిన ఒక దుర్గాన్ని కామినేని కాచారెడ్డి అనే యోధుడు పాలిస్తూ ఉండేవాడు. అతని ధైర్యస్టైెర్యాలను మెచ్చుకొని గోలకొండ సుల్తాను పిలిపించాడు. ఘనసన్మానం చేసి మెతుకు సీమ మీద అధికారమిచ్చాడు. దీనినే మనం నేడు (తెలంగాణాలో) మెదకు జిలా అంటున్నాం. కులీ కుతుబ్‌షా మెతుకు దుర్గాన్ని ఆక్రమించిన వైనం మనకు అద్దంకీ గంగాధరకవి రచించిన తపతీసంవరణోపాఖ్యానంలో కనబడుతుంది. “ఉత్తరంబున బకీదోడీ పారగద్రోలి మెతుకుదుర్గం బాక్రమించి మించె' అని గంగాధరుడు కులీ తుతుబ్‌షాను వర్దించాడు! (1-24). ఈ దుర్గాన్ని ఇలా ఆక్రమించాక దానిపై ఆధిపత్యాన్ని సుల్తాను కామినేని కాచారెడ్డికి ఇచ్చి ఉంటాడు. కులీ కుతుబ్‌షా క్రీ.శ 1496 నుండి గోలకొండను బహమనీసుల్లానుల తరపున వ్యవహరించాడుగాని క్రీ.శ.15611 నుండి 143 దాకా స్వతంత్రుడై పరిపాలించాడు. చక్కని పునాదులపై తన రాజ్యాన్ని నిర్మించుకొనేందుకు సుల్తాక్‌ కులీ ఎందరో తెలుగువీరులను కతూడగట్టుకొన్నాడు. కామినేని కాచారెడ్డి వాళ్ళలో ఒకడు.

ఇతడు మెదకు దుర్గానికి అధిపతి అయ్యాక అడవులు కొట్టించి, త్రూర జంతువులను, దారిదొంగలను వేటాడి మండలాన్ని భయరహితం చేసి విక్కనవోలు అనే నగరాన్ని కట్టి పాలించసాగాడు. సుల్తాను అనుజ్ఞలో ఇది సీమకు రాజధాని అయింది. ఈ కామినేని కాచారెడ్డి మనుమడి పేరు కూడా కాచారెడ్డే. అతడు తాతతండ్రులకు చేదోడువాదోడుగా ఉండి ఊరు వర్ధిల్లేటట్టు చేశాడు. ఈ చిన్న కాచారెడ్డి కాలందాకా కామినేని కవులు సాహిత్య పోషణ చేసేనట్టు ప్రత్యక్ష ప్రమాణాలు ఏమీ లేవుగాని ఇతని తుమారుడు ఎల్లారెడ్డి కవులను పోషించాడు. బాలభారతం, కిరాతార్జునీయం అనే రెండు గ్రంథాలను అంకితం పుచ్చుకొన్నాడు. ఈ గ్రంథాలను ఎవరు వ్రాశారో తెలియదు. కాకమాని గంగాధరుడనే కవి వ్రాసిన బాలభారతంలోని పద్యాలను పెదపాటి జగ్గన్న ఉదాహరించాడని ఇంతకు ముందు ఈ సంపుటిలోనే చెప్పుకున్నాం. తొలి యక్షగాన రచయితగా పేరుపొందిన ప్రోలుగంటి చెన్నయ్యమంత్రి కూడా ఒక బాలభారకాన్ని వ్రాశాడు. అది వచనకావ్యమట. కామినేని ఎల్లారెడ్డి అంకితం పుచ్చుకొన్న బాలభారతాన్ని బహుశా కాకమాని గంగాధరుడే రచించాడేమో।; ఆ గ్రంథం సంపూర్ణంగా లఖిస్తేనేగాని ఏదీ తీల్చలేం.

బాలభారత, కిరాశార్డునీయాలు అంకితం పుచ్చుకొన్న ఎల్లారెడ్డికి నలుగురు మనుమలున్నారు. వీళ్ళలో ముగ్గురు కృతిభర్తలు. అందులో ఇద్దరు స్వయంగా కృతికర్తలు.

  1. కామినేని కామిరెడ్డి: ఇతడు ఎల్లారెడ్డి రెండవ మనుమడు. క్రీ.శ. 1530-1611 మధ్య గోలకొండ రాజ్యాన్ని పాలించిన మహమ్మదు కులీ కుతుబ్‌షా కాలంలోనివాడు. ఇతని వైభవాన్ని ఇతని తమ్ముడే ఇలా వర్ణించాడు: టా 1 తెలుగు స సర్షస

వ్ర భాష్టానమితి వారి విజ్ఞాన సర్వస్వం-10. మెదకు జిల్లా చరిత్రలో ఆదిరాజు వీరభద్రరావు

కామినేని కవులు, ఆభ్రితులు 455్‌ భవ్యసులకానుమహమ్మదుషాహా- లబృభూషణలలిళఎల కికాంక పత్రచామరసామ్రాజ్య భరితవిభవ- రమ్యగుణశాలి శ్రీరా రెడ్డిమౌని (శివధర్మోత్తరం)

ఈ కామిరెడ్డీి శ్రైవుడు, మల్లికార్యన పండితారాధ_ ) వారి వంశంలోని లింగారాధ్యులవారి శిష్యుడు. ఈ గురువుగారికి మరో శిష్యుడున్నాడు. అతడు కవి. పరు పట్టమట్ట సోమనాథుడు. ఈయన రాజమహేంద్రవరం దగ్గరి వెలవలి పల్లి గ్రామంవాడు. ఘడియకు నూరు అనుష్టుప్పు శోకాలు చెప్పగల దిట్ట, వివి అవధానాలు చేస్తాడు. వ్యాకరణం బాగా చదువుకొన్నాడు. తర్కవేదాంత ధర్య ”, _క్రమాలు తెలిసినవాడు. ఇంతెందుకు? సాహిత్య సర్వంకషత్వ మహిమ గలవాడు. ఈ పట్టమట్ట సోమనాథుడూ, కామినేని కామిరెడ్డి ఒకే గురువుల శిష్యులవడంవల్ల స్నేహితులయ్యారు. సతీర్థ్యడు, అనురక్తుడు, ఆశ్రితుడు, అఖిలజ్ఞుడు అయిన సోమనాథునిచేత ౪ మిరెడ్డి స్కాందపురాణం లోని సూతసంహితను ఆంధ్రీకరింపజేసి అంకితం పుచ్చుకొన్నాడు. కవిత్వం గంగాప్రవాహం లాగా ఉండాలని సోమనాథుడు ఈ క్రింది పద్యంలో చెప్పాడు:

సర్వజ్ఞమౌళిభూషణలీల జెన్నొంది శబ్దగుణారూడి చౌకళించి

ఘనమహీభృ ద్రాజకటకస్థలుల మించి యలఘుధారాశుద్ధి నౌఘళించి

గంభఖీరనవరసోబ్బృ భణంబున బొంగి ధ్వనివిశషముల చందమున మెరసి

యఖిలలోకైకప్రియంకరస్థితి బూని యన్ని దోషంబుల నపయించి బహుముఖతరంగితంబయి పరిడవిల్లి

పొదవి సారస్వతావాసపూర్తి దనరి

వాసివహియించుగంగా ప్రవాహమట్ల

విశదరీతిగవిత్వ్సంబు వెలయవలయు.

గంగాప్రవాహంలాగా అనర్గళంగా సూతసంహితనే కాక అకలంక క్రీయావాక్యాలు చెప్పి అందలాలూ. అశ్వాలూ పుచ్చుకొని ధనమార్జించి పట్టమట్ట సోమనాథుడు యజ్ఞం చేశాడు. సోమయాజి అయ్యాడు. తిక్కనగారి తరువాత తెలుగు సాహిత్యంలో మళ్ళీ ఇతడే సోమయాజి. యజ్ఞం చేశాక సోమనాథుడు స్కాంధపురాణంలోని బ్రహ్మోత్తర ఖండాన్ని అనువదించాడు. దీనిని కామిరెడ్డి తమ్ముడు ఎల్లారెడ్డికి అంకితమిచ్చాడు.

  1. శామిసేని (అమ్మడి) ఎల్లారెడ్డి: '“భవ్యసుల్తాణ మహమ్మిదుపాదుసాహి కలము లోపల గననింత కాపుగలడె?" అని ఈ ఎల్లారెడ్డి వాసికెక్కాడు. పట్టమట్ట సోమనాథ సోమయాజి రచించిన బ్రహ్మోత్తరఖండాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. వాస్తవానికి అది తెనిగించమని ఇతడే ప్రోత్సహించాడు. ఇతడు సమరవీరుడే కాక సాహితీపరుడు. స్వయంగా గ్రంథాలు బ్రాశాడు. వాసిష్టలైంగధర్యము అనే గ్రంథాంజలిని రామలింగేశ్వరస్వామికి అర్పించాడు. ఇతడు బ్రాసినవి వాసిష్టం, లైంగకధర్మం అనే రెండు

456 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి తెలుస్తున్నదేగాని అతని కృతులు వెలుగు చూడలేదు. ఎల్లారెడ్డి కృతిభర్దే కాక కృతికర్త అనే సంగతి అతని తమ్ముడు మల్తారెడ్డి వ్రాసిన గ్రంథాలలో ఒకటైన శివధర్మోత్తరం వల్ల తెలిసింది.

  1. కామినేని మల్లారెడ్డి: ఇతడు చాలా గ్రంథాలు వ్రాశాడు. అయితే మూడు పుస్తకాలు మాత్రమే లభించి అచ్చుపడ్డాయి. అవి - 1. షట్బక్రవర్డి చరిత్ర
  2. కివధర్మోత్తరం, ౩. పద్మపురాణం. వీటిలో షట్పక్రవర్డి చరిత్రలో అవతారిక లేదు. వివధర్మోత్తరంలో కవి తన ప్రతిభను సభాసదులచేత ఇలా చెప్పించాడు"

శంకరవిసమంచద్చూతిరీతియు గవిరాజసత్కళాగౌరవంబు

శ్రీహర్షసాత్వికస్థిరగుణమహిమంబు స్తుతధనంజయుని నిర్గోషతయును శబ్ద్బకాసనబహుచాతురీవృత్తియు సూరనార్యుని మహౌజోనిరూడీి

యల వీరభద్రుని యారభటధ్వని యమరేశ్చరుని విభావానుభావ

ములు విచిత్రంబులగుచు భాసిలెభవత్ష్ర

కలితోభయభాషాధికప్రబంధ

సంఘములయందుగాచభూజానిమల్ల

రడ్డిసత్కవిరా జసర్వజ్ఞభో జ.

ఇంతమంది ప్రథమశ్రేణి తెలుగు కవుల ప్రత్యేకతలను పుణికి పుచ్చుకొన్నానన్న ఆత్మవిశ్వాసంలో అతడు శివధర్మోత్తరం వ్రాశాడు. ఆ తర్వాత పద్మపురాణంలో ఒక భాగాన్ని తెనిగించాడు. ఈ రచనకు కారణం గణేశ్చరుడనే మరో కవి. అతడు కుతుబ్‌షాహీల ఆస్థానకవి. ఆయన ఒకసారి కామినేని కామిరెడ్డిని చూడడానికి వచ్చాడు. ఆయనకు కామిరెడ్డి స్వాగతం చెప్పాడు.

“*..... ధీనిధి సాహితీయుతు బతీతయశుం డతిపావనీశ్చరా

స్థానమహాకవీం ద్రునిజదర్శనకౌతుకవైభవాగతుక

శ్రీనరసింహపండితవరేణ్య కువూరుగణేశదీరుస

న్మానముతో నెదుర్కొని నమస్కృతిజేసి వసింపజేయుచుక.

కామిరెడ్డీ ' ఇలాగా ప్రశ్నించాడు - “గణనాథసత్కవీ! నువ్వు సంస్కృతాంధ్ర భాషావరకావ్యకల్పన విచక్షణ గలవాడీవి. సకలపురాణాలను తెలుగు సత్కవులు ఆంధ్రీకరించారు. పద్మపురాణంలోని శివరాఘవుల కథ చెప్పలేదు. ఇది రచించడానికి ఎవరు సమర్శ్భలు?'” ఈ ప్రశ్నకు గణనాథకవి వెంటనే ఇలా జవాబు చెప్పాడు:

చొటచొట తేనియల్‌ వడియు సూక్తులు ప్రాక్తనజన్మపుణ్యసం

ఘటితములై కవీంద్రుల కఖండముదంబు హృదంబుజంబునక్‌

బొటమగజేయ గమ్రరసపూరములామహిత ప్రబంధముల్‌

పటుమతి సల్చగాదగిన ప్రాజ్ఞుడు మల్లనృపాలు డెంతయు౯ (పద్మ

ప్రాజ్ఞుడైన మల్లారెడ్డి అనువదించిన పద్యపురాణభాగంలో ివుడే బ్రాహ్మణ వేషంలో అయోధ్యకు వెళ్ళి శ్రీరామునికి కథలు చెప్పిన వైనముంది. ఈ కావ్యం మల్తారెడ్డీ

కామినేని కవులు, ఆశ్రితులు 4ీర్‌7 వ్రాసిన కావ్యాలన్నిటిలోనూ పరిణతకావ్యమని ఖండవల్లి లక్షీరంజనంగారు చెప్తున్నారు! “మల్లారెడ్డికి శ్లేషకవిత్వముమీదను, శబ్లాలంకారచిత్రరచన మీదను దృష్టి యధికము. ఈతని శ్లేషకవనము నాతికరినమై చక్కని కల్పనలు కల్లియున్నది. ఈతడు మంచి సంస్కృతాంధ్ర పాండిత్యము గలవాడు. తన శబ్దశాస్త్రపరిచితిని చూపించుటక్రై వ్యాకరణ పదములను, అలంకారములను రీతులను కూడ శ్లేషలలో కూర్చి పద్యములు రచించెను.”' మల్లారెడ్డి తాను శ్లేషకవినని సగర్వంగా తన గ్రంధం ఒక దాంట్లో ఇలా చెప్పించుకొ, న్నాడు:

శ్రేషకవి నీవుభాషా - శేషాహివి నీవు చంద్రశేఖరపూజా

భూషణుడ నీవు కవుల - న్వేషించిన సవతు నీకు నేరీ ధాత్రి౯ః

తొలి రచనలలో శ్లేష వైపు మొగ్గినా, మల్లారెడ్డి తన చివరి గ్రంథంలో మృదు భావాలకే ప్రాధాన్యమిచ్చాడు. ఇతడు వ్రాసిన ఇతర గ్రంధాల పేర్లు కూడా తెలియవు. ఇతడూ, ఇతడి అన్నలూ మంచి సాహిత్యసేవ చేశారు.

కామినేని చౌదర్లూ, వారి ఆశ్రితులూ ఎవరెవరో ఒక పచ్షికగా వేసుకొని నెమరువేద్దాం. +

  1. కామినేని మొదటి ఎల్లారెడ్డి బాలభారత కీరాతార్జునీయాలు అంకీతం పుచ్చుకొన్నాడు
  2. కామినేని కామిరెడ్డి పట్టమట్ట సోమనాథుడు వ్రాసిన సూతసంహితకు కృతిపతి. ౩. కామినేని ఇమ్మడి ఎల్లారెడ్డి పట్టమట్ట సోమనాథ సోమయాజి వ్రాసిన బ్రహోత్తరఖండానికి

కృతిభర్హ స్వయంగా వాసిష్ట లైంగధర్మరచన చేశాడు. 4. కామినేని మల్గారెడ్డి శ్లేషకవి ఇతని మూడు గ్రంథాలే దొరుకుతున్నాయి. అవి - 1 షట్టక్రవర్తి చరిత్ర, 2 శివధర్మోత్తరం, ౩ పద్మపురాణం.

క. పట్టమట్ట సోమనాథ సోమయాజి | నూతనసంహితము కామిరెడ్డికీ, బ్రహ్మోత్తర ఖండాన్ని ఇమ్మడీ 6. గజేశకవి కుతుబ్‌షాహీల ఆస్థానకవి. కామినేనివారిని దర్శించాడు.

ఈ పట్టికలోని ఒక్క గణేశకవి రచనల గురించి మాత్రమే మనకు కొద్దిగానైనా తెలియదు. మిగతావాళ్ళ [గ్రంథాల పేర్లూ. రచనల తీర్లూ తిలుస్తున్నాయి. వీళ్లు పరిగణింపవలసినవాళ్లి. 2. _అంధ్రసాహిత్యచరిత్ర సంగ్రహం పుట 14 .

మారన వెంకయ, మరి కొందరు శతకకవులు

ప్రబంధాలు కేవలం పాండిత్యప్రకర్షకే స్థానమైనప్పుడు కవులు తమ వ్యక్తిగతమైన భావాలూ, బాధలూ ప్రకటించుకొనడానికి శతకాలు ఆలంబనమ్హనాయి. దేవునిపట్ల భక్తి జీవితంపైన విరక్తి వెల్లడించడానికి అవే పనికివస్తాయి. లోకానికి నీతిబోధ, మనసుకు ప్రబోధం శతకాల మూలంగా జరిగినంత వేరే సాహిత్యప్రక్రియవల్ల జరగదు. మన నీలిశతకాలలో భాస్కరశతకం చాలా ప్రచారం పొందింది. దానంత ప్రఖ్యాతి గువ్వలచెన్న శతకానికి కూడ ఉంది. శతకకవుల రచనలను కూడా ప్రమాణాలుగా స్వీకరించి మన లాక్షణికులు ఈ వాబ్బయ విభాగాన్ని గౌరవించారు. అప్పకవి (క్రీశ156) తన లక్షణ గ్రంథంలో భాస్కరశతకం, మరున్నందనశతకం, వజ్రపంజర శతకం మొదలైనవాటి నుంచి ప్రయోగాలను ఉదాహరించాడు. ఆరవీటిరాజుల యుగంలోనూ అప్పకవికి పూర్వం ఉండిన కొందరు శతక కవుల గురించి కొంచెం ముచ్చటించుకొందాం.

  1. మారన వెంకయ: ప్రఖ్యాతమైన భాస్కరశతకాన్ని ఇతడే రచించినట్టు కొన్ని తాళపత్ర ప్రతులపై కనబడుతుంది. ఈ శతకంలోనుంచి ఈ క్రింది పద్యాన్ని ఉదాహరించినా, దీని కర ఎవ్వడో అప్పకవి చెప్పలేదు.

దక్షతలేని యింటికి బదార్థము వేరొక చోటనుండీ వే

లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను; గల్లకాదు; ప్ర

త్యృక్షము వాగులుక వరదలన్నియు వచ్చిన నీరు నిల్చునే

యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా! (అప్ప. ౩-14)

ఈ పద్యంలోని “పదార్థం' అనే మాటను నిత్య సమాసవిశ్రాంతులలో ఒక ఉదాహరణకు అప్పకవి చూపించాడు. అప్పకవినాటికే ఈ శతకం ప్రచారంలో ఉందంటే కవి కనీసం ఒక యాఖై సంవత్సరాలు పూర్చుడవుతాడు. ఈ శతకంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి పద్యంలోనూ మొదటిపాదాలలో కవి ఒక సత్యాన్ని ప్రకటిస్తాడు. కడపటి పాదాలలో దానిని సమర్థించడానికి ఒక దృష్టాంతరం చెప్తాడు. ఈ శతకంలో 106 పద్యాలు ఉన్నాయి. వీటిని బ్రౌనుదొర అకారాదిగా వ్రాయించినట్టుంది. ఈనాడు ప్రచారంలో ఉన్న ముద్రిత ప్రతులలో పద్యాలు అకారాదిగానే ఉన్నాయి. 91635 సంఖ్య గల బ్రాతప్రతిలో అక్షరక్రమంలో లేవు. ముద్రితప్రతిలో శ్రీకారంచుట్టాక తొలిపద్యం-

అంగన నమ్మరాదు తన యంకెకు రాని మహాబలాడ్యు వే

భంగుల మాయలొడ్డి చెరువం దలపెట్టు వివేకియైన సా

రంగధరుం బదంబులు కరంబులు గోయగజేనె దొల్లి చి

ఆాంగి యనేకముల్‌ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా. (2)

ఈ పద్యంలోని చిత్రాంగీసారంగధరులు తెలుగువాళో, లేక నవనాథచరిత్రలో గౌరన చెప్పిన కథలోని వాళో కవి వివరించలేదు. దోనేరు కోనేరునాథుడు తన కావ్యంలో

మారన వెంకయ, వరి కొందరు శతకకవులు 4ర్‌9 వీళ్ళను గురించి చెప్పినట్టు తెలుసుకొన్నాం. వీళ్ళనే వెంకయ్య కూడా దృష్టాంతరంగా తన పద్యంలో చూపించినందువల్ల బహుశా భాస్కరశతకకర్త కోనేరునాథుని సమకాలికుడని చెప్పవచ్చు.

ఇది నీతిశతకంగా ప్రసిద్ధమే కావచ్చుగాని ఇందలి భావాలు మాత్రం ప్రగతిశీలం కావు. భాగ్యరేఖ, పూర్వజన్మ సుకృతం, కర్మ అదృష్టం మొదలైన వాటినే చాటుతుందిగాని, ఈ శతకం కృషి చేయమని బోధించడం అరుదు. ధనికవర్గాల మనస్తత్వాన్ని ఇది. బాగా ప్రతిలింబిస్తుంది.. శ్రమజీవుల కష్టఫలాన్ని ఎవడో ఎత్తుకుపోవడం ఒప్పుకొంటుంది.

ఊరక వచ్చు బాటుపడకుండిననైన ఫలం బదృష్ట మే

పారగగల్గువానికి బ్రయాసమునొందిన దేవదానవుల్‌

వార లటుండగా నడుమవచ్చిన శౌరికి గల్గెగాదె శృం

గారపు బోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు ఖాస్కరా! (17)

మారన వెంకయ్య జీవితంలో చాలా నైరాశ్యాన్నే అనుభవించినట్టు కనబడుతుంది. తనకన్నా తక్కువ పాండీత్యమున్నవాళ్లు గద్దెనెక్కి పెద్ద పదవులలో ఉన్నందువల్ల అతని హృదయం గాయపడింది కాబోలు! చూడండి:

పండితులైనవారు దిగువం దగ నుండగ నల్పు డొక్కడు

ద్దండత వీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగు౯

గొండొక కోతి చెట్టుకొనకొమ్మల నుండగ గ్రింద గండభే

రుండమదేభసింహనికురుంబము లుండవె చేరి భాస్కరా! (61)

ఈ శతకకర్త తాను మదేభసింహాల కోవలోని వాణ్ణనుకోవచ్చునుగాని ఇతనికి విద్యమీద కూడ పూర్తి నమ్మకమున్నట్టు లేదు. 'సుకవితా యద్యస్త్రి రాష్ట్రేనకిం అనలేడు. చూడండి:

వానికి విద్యచేత సిరి వచ్చె నటంచును విద్య నేర్వగా

బూనిన బూనుగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం

బూనగ నెవ్వడోపు సరిపో చెవి పెంచునుగా కదృష్టతా

హీనుడు కర్ణభూషణము లెట్లు గణింపగనోపు భాస్కరా! (94)

మారన వెంకయ్య అదృష్టహీనులను గురించే ఎక్కువగా వ్రాసినా అతడు అదృష్టవంతుడే. తెలుగు సాహిత్యంలో జీవిస్తున్నాడు. ఇతనికన్నా మెరుగు భావాలను చెప్పిన భాస్కరకవి మరుగున పడ్డాడు.

  1. శ్రీపతి భాస్కరకవి: ఇతని పేరు భాస్కరుడైనా ఇతడు చెప్పిన శతకం పేరు చిత్తశతకం. వేదశాస్తాల పేరు చెప్పి లోకులను మోసపుచ్చేవాళ్ళను ఎదిరించాడు; బౌద్ధధర్మంలోని మంచిని గ్రహించాడు, వేదవిహిత కర్మలను నిరసించాడు.

460 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వేదంబుల్‌ మనుజుల్‌ రచించి రతిప్రావీణ్యంబుతో శాస్త్రముల్‌ తాదృక్చ్పద్ధతి నుద్పవిల్లై దపముల్‌ దానంబులుక్‌ ధర్మముల్‌ మోదం బబ్బును జేయుడంచు నరుల౯్‌ బోధింతు రవ్విప్రులే కాదా జంబుకియుక్తు లొల్లకు వివేకానందమా చిత్తమా! (19) తన కాలంనాటి సంఘంలోని నక్కజిత్తులన్లు బైటపెట్టిన శ్రీపతి భాస్కరకవికి మత విభేదాలు కిట్టవు. సమాదరణబుద్ధి కావాలంటాడు. ఆర్భమతంబు లిట్టివి సమాహితయుక్తిని జూడు శంకరా చార్యుడు మధ్వరాయుడును సన్నుత లక్ష్మణయోగివర్యుడు[ ధైర్భముతో మెలంగగ మతంబు లొనర్చిరిగాని వేరు గా దర్యమతేజ మన్నిట సమాదరణంబగు జూడు చిత్తమా! (౨) , శ్రీపతికవికి విగ్రహారాధన ఇష్టంలేదు. వేదపారాయణం ఒప్పుకోడు. భజనలలో, సూర్యనమస్కారాలలో నమ్మకం లేదు. అయితే తత్వజిజ్ఞాస చెయ్యమంటాడు. 'నిన్న నీవు తెలుసుకో అంటాడు. నిను రాబొమ్మల వేడుమంటినె? శ్రుతుల్‌ నిత్యంబు పారాయణం బును గావింపు మటంటినే? యల జనంబుల్‌ మెచ్చగా పాడుమం టినె? ప్రొద్దుంగని మొక్కుమంటీనటె? వింటే, నిన్ను నీలోన గ న్గాని సౌఖ్యంబును బొందుమంటి నిక సంకోచింపకే చిత్తమా। (52) ఇతడు నాస్తికుడైనంతమాత్రాన దుర్దనుడు కాదు. మంచి పౌరునకు కావలసిన నీతులన్నీ బోధిస్తాడు. వీదల కన్నవస్త్రములు పేర్మి నొసంగుము, తుచ్చసౌఖ్యసం పాదనక్రై యబద్ధముల బల్కకు, వాదము లాడబోకు, మ ర్యాద నతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టివే వేదము లంచెరుంగుము, వివేకధనం బిది నమ్ము చిత్తమా। (70) ఇటువంటి వివేకధనవంతుడు మన శతకకవుణలోనే కాదు, ప్రాచీన సాహిత్యంలోనే అరుదు. ఆదిమ యుగాలలో ఇటువంటి కవిత్వం మనభాషలో కోకొల్లలుగా ఉండేదేమో అన్న అనుమానం ఈ శతకం రేకెత్తిస్తున్నది. ఇటువంటి హేతువాదుల రచనలు బహుశా తమ కాలానికి ఎదురీది కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. ఈ శ్రీపతి భాస్కరకవిని గురించి ఏ వివరాలూ దొరకలేదు. ఇతడు 17వ శతాబ్దికి పూర్వుడని పరిశోధకులు ఖావిస్తున్నారు.! ఆదిమ చాళుక్కయుగంలో వీరైవ మతాన్ని ఆచరించి ప్రచారం చేసీన శ్రీపతి పండితుడు సుప్రసిద్ధుడు. బహుశా ఈ భాస్కరకవి ఆ శ్రీపతి పండితుని వంశంలోనివాడే కావచ్చు. తు

  1. శతకకవుల చరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, పుట 432.

మారన వెంకయ, మరి కొందరు శతకకవులు 461

  1. కొండా రామకవి; కావ్యకవులే తమ వ్యక్తిగత వివరాలను చెప్పుకొనని రోజులలో కొండా రొమకవి అనే శతకకర్త తాను విజయనగరంవాడననీ, ఆరవీటి తిరుములరాయలు తనచేత ' శ్రీగవిరంగనాథ' శతకం బ్రాయించాడనీ కావ్యలక్షణాలతో శతకారంభం చేశాడు. ఇష్టదేవతా ప్రార్థన, పూర్వకవిస్తుతి, కుకవినింద యథావిధిగా సీసపద్యాలలో వరసగా చేసుకొంటూపోయాడు. తుంగభద్రాతీరంలో విజయనగరాన్ని పేర్కొన్నాడు. “వివిధ శృంగారముల్‌ వెలయునట్టి కోటలు, పేటలు, నాటకశాలలు'' మొదలైనవి చెప్పాడు. ఆ పురాన్ని ఆర్వీటివంశాల్టి యమృతకిరణుడైన తిరుమల దేవరాయలు పాలిస్తూ ఉండేవాడని చెప్పాడు. ఆ ప్రభువు మీద తాను పంచరత్నాలు, శ్రీకరంబులునైన సీసపద్యాలు వ్రాశానని చెప్పాడు. తిరుమలరాయలవారు ఇతణ్జి చూసి “రామకవిశ్రేష్ట రంగనాథుని పేర రమ్యముగ శతకమొక్కటి రచియింపు' మన్నాడట. “గజపురంధామ శృంగారకలితసోమ - మంగళోద్దామ శ్రీగవిరంగధామ!' అనే మకుటంతో రామయ్య శతకం చెప్పాడు. దీన్ని పురమాయించిన రాయలు (క్రీ.శ. 1671-1572) సాక్షాత్తూ వసుచరిత్ర కృతిభర్తే. రక్కసితంగడి యుద్ధం ముగిశాక, రాజధానిని తురకలు కొల్లగొట్టాక ఇతడు కొన్నాళ్లు విజయనగరంలో పాలించినా పూర్వవైభవంతో వెలగలేమని పెనుగొండకు పోయాడు. రామకవి క్రీ.శ: 1571-72ల మధ్య ఈ శతకం వ్రాసి ఉంటాడు.

రామరాజభూషణుడంత ఉద్దండపండితుని చేత వసుచరిత్ర చెప్పించి కృతి పుచ్చుకొన్న తిరుమలదేవరాయలు రామకవిలాంటివాళ్ళను పోషించాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. భట్టుమూర్తి తానెంత పండితుణ్ణ్జని ప్రకటించుకొన్నాడో ఈ రామకవి అంత “పామరుణ్ణని చెప్పుకొన్నాడు.

సరసిజాపతి నీదు చరితంబు వర్ణింప నలినగర్చుకైన నలవికాదు

నరుడ నేనిన్నెన్న దరమౌనె నాకును బంచకావ్యంబుల పఠన లేదు

అమరనైషధముల నభ్యసింపగలేదు, ఆంధ్రగీర్వాణంబు లరయలేదు

గణలక్షణప్రాసక్రమము తెలియగలేదు, వేదపురాణముల్‌ వెదుకలేదు. గురుకృపాలబ్ధవరముచే గూడభక్తి- నిన్ను నుతిచేయబూనితి నీరజాక్ష! గజిపురంధామ శృంగారకలితసోమ- మంగళోద్దామ శ్రీగవిరంగ వామ!

ఈ శతకం నిజానికి అంత ఫ్రొడం కాదని పండితుల అఖిప్రాయం. అచ్చుతప్పులకంటె రచయిత తప్పులే విశేషముగా కనబడుతున్నాయని పరిశోధకులు వ్రాశారు. అయితీ ఈ కవిశతకాన్ని సైతం అనంతరకవులు అనుసరించారు. నరసీింహశతకంలో దీని భావాల పోలికలు, పదాల దొంతరలు ఉన్నాయి.

  1. శతానందయోగి. ఇతడు ఒక రామశతకం ్రాశాడు. ఇందులో 10% కందపద్యాలున్నాయి. మకుటం 'రామా' అని ఉంటుంది. ఇతడు దత్తాడ్రేయ
  2. ఈ కవి క్రీశ 180 ప్రాంతాలవాడని నిడుదవోలు వెంకటరావుగారు వ్రాశారు (శతకకవులచరిత్ర -

అనుబంధం, పుట 845). అయిడే వేదం వెంకటకృష్ణశర్మగారు మాత్రం ఇతడు ఆరవీటిరాజుల కాలంలోనివాడేనని చెప్పారు (శతకవాబ్బయసర్వస్పృం, పుట 128) 3. శతకవాబ్బయసర్వస్వం - శ్రీవేదం వెంకటకృష్ణశర్మ, పు. 13

462 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి శిష్యపరంపరలోని వాడట. అందుచేత ఇతని కాలం క్రీ.శ.1600 ప్రాంతాలని చాగంటి శేషయ్యగారు నిర్ణయించారు. కవిచౌడప్ప రచనాపద్ధతి దీనిలో కనబడుతుంది.

వెన్నెల కందము పున్నమ - కన్నుల కందంబు జూపుకనుటయు మిగుల౯€

కన్నెాలకందము సుగుణము-వెన్నులకందంబె జొన్న వేడుక రామా! (౫) ఈ శతకంలో లోకం పోకడ చెప్పాడు. వేదాంతం బోధించాడు. ఆడవాళ్ళను నమ్మవద్దన్నాడు.

పురుషు సుషుప్పుని జేసియు - బరపురుషుని సన్నజేసి పడకకు రాదీ

సి రమించి సుఖముపొందెడీ-తరుణుల నమ్మంగదగునె దశరథ రామా! (62)

అయితే మగవాడికి కీర్ణయినా, అపకీర్హయినా ఆడదే తెస్తుందని చెప్తూ ఆడవాళ్ళవల్లనే తెలివి చెడుతుందన్నాడు.

వనితలచే శృంగారము-వనితలచే గలుగు కీర్పి వంశంబునకుక

వనితలచే నపవాదము-వనితలచే జెడును తెలివి వసుధను రామా! (5) ఈ శతానందయోగిని గురించి వేరే వివరాలేం తెలియవు.

క్‌, పట్టాభిరామకవి : అప్పకవి ఉదాహరించిన మరున్నందన, వజపంజర శతకాలను పట్టాఖిరామకవి వ్రాశాడని వైయాకరణము గోపాలజయదేవరాజుగారు ఆంధ్రపత్రిక పదో సంవత్సరాది సంచికలో వ్రాశారట. ఈ రెండు శతకాలనే కాక గువ్వలచెన్న

" శతకం, మలరాజు గుండారాయణోపాఖ్యానం, శమంతకోపాఖ్యానం, కవిసర్పగారుడం, కవిమూషకమార్దాలం మొదలైన అనేక గ్రంథాలను ఈ పట్టాఖిరామకవి వ్రాశాడని ఆయనే చెప్పాడట. గువ్వలచెన్నుడి మీద పద్యాలను అల్లసాని పెద్దన చెప్పినట్టు బ్రౌనుదొరగారి పండీతులు భావించేవారు. మద్రాసుప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఒక చాటుపద్యాల సంకలనం ఉంది. దాని నెం. 14-1-18. అందులో 5 గువ్వలచెన్న పద్యాలు ఉన్నాయి. వాటిముందున్న వివరణతోపాటు ఆ పద్యాలు చూడండీ.

““అల్లసాని పెద్దన యింటికి గువ్వలచెన్నుగాడు అన్న బోయవాడు యేడాదికి పుణ్యానికి కట్టెలు మోసుకొస్తూంటే. పెద్దన్నగారు మెచ్చి చెప్పిన కందపద్యములు. (ఫోలియో.19-8)

కలిమిగలవాడె మనుజుడు- విలసితసత్కీర్తిచేత వెలయగవలదా?

కలిమేమియెల్లకాలము- కులగిరులా కదలకున్న గువ్వలచెన్నా!

కలవిద్య లెన్నియైైనను- కులవిద్యకు దీటురావు కుంఖినిలోనక౯

వెలకాంత లెందరైనను- కులకాంతకు దీటురారు గువ్వలచెన్నా!

విలువరుస దానగుణములు- కలవానికిగాక లోఖిగాడెల కేలక.

తలుపేల చాపడిసెకు- వలపావనమూర్తివన్న గువ్వలచెన్నా,

  1. శతకకవుల చరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, పు,256.

మారన వెంకయ, మరి కొందరు శతకకవులు 463 సారాసారము లెరుగని- జేరజముల బుద్ధి దెలుప బెద్దలవశమా?

నీరెంత యెత్తిపోసిన- కూరౌనా నేలవేము గువ్వలచెన్నా!"

ఈ పద్యాలను అల్లసాని పెద్దనగారు చెప్పినట్టు క్రీ.శ.1700 ప్రాంతాలలో పండితులు చెప్పుకొనేవారని బ్రౌనుదొరగారి సంకలనంలోని పై వివరణ చెప్తుంది. ఈ పద్యాలను ప్రకటించిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఎందుచేతనో మరి ఈ వివరణను ప్రచురించలేదు.

(బౌనుదొరగారి పండితులు ఈ పద్యాలను సేకరించేనాటికే వీటిని పట్టాఖిరామకవి వాశాడన్న సంగతి మరుగున పడి ఉంటుంది. వావిళ్ళవారు ఒక గువ్వలచెన్న శతకం ప్రకటించారు (నీతిశతక సంపుటం-1928). అందులో ప్లీడరు అనే ప్రయోగం ఉంది. చూడండి (వావిళ్ళ. ఆ).

ప్లీడరులమని వకీళ్ళీ-వాడుకచెడ స్వేచ్చ దిరిగి పాడు మొగములక్‌

గూడనివారిం గూడుచు-గూడెముల జరింత్రు ముందు గువ్వలచెన్నా! ఇది నిజంగా ప్రక్షిప్తం కాకపోతే ఈ గువ్వలచెన్న శతకాన్ని పట్టాఖిరామకవిగాని, అతని కాలంవాడుగాని వ్రాసి ఉండడానికీ వీలులేదు. వావిళ్ళవారి సంపూర్ణశతకంలో వకీళ్ళ మీద విసురులు చాలాసార్లు వస్తాయి. వేమన శతకంలో ఆధునికులు ప్రక్షిప్తాలను చేర్చినట్టే ఇందులోనూ చేర్చారని భావించాలి. ప్రాధమికంగా పట్టాఖిరామకవో, మరొకడో గువ్వలచెన్న శతకాన్ని క్రీ.శ.1600 ప్రాంతాలలో చెప్పాడనుకోవచ్చు. ఈ చెన్నడు బోయవాడుకాక “బిజనవేముల' వంశంలో వాడని భావించడానికీ ఆస్కారం ఉంది. ఈ శతకంలో శైలి సరళంగా ఉంది. వ్యావహారిక ప్రయోగాలున్నాయి. అయితే వజ్రపంజర, మరున్నందన శతకాలలో భాష చిక్కగా ఉంది. లుప్త విసర్గవళికి ఉదాహరణంగా అప్పకవి చూపించిన పద్యం ఇది:

కోపాటోపము గుప్పిగంతులు నిజాకుంఠీభవచ్చార్భరే

ఖాపాండిత్య మయారె! నీకును నమస్కారంబు లంకాపురీ

పాపగ్రంథికులాంగనా కుచతటీ పైరోపతద్రాహబా

హాపాటచ్చర। రామదాస! తన దాసోహ మ్మరున్నందనా! (అప్ప. ౩-19)

ఈ రెండు ప్రొడశతకాల నుండీ కొన్ని పద్యాలైనా లఖిస్తున్నాయిగాని పట్టాఖిరామ కవి వ్రాసిన ఇతర కృతుల నుండి మచ్చుపద్యాలైనా దొరకవు. అయితే రత్నంలాంటి ఒక్క పద్యం కలకాలం నిలిచినా చాలు! సప్తసంతానాలలో ఏది పోయినా చెడనిది పద్యమొక్కటే.

గుడి తూలును, నుయి పూడును, వడినీళ్ళన్‌ జెరువు తెగును, వనమును ఖిలమౌ

బెడనిది పద్యం బొకటియె కుడియెడమల గీర్తిగన్న గువ్వలచెన్నా;

అక్షరాలా నిజం!

కులవురాణాలూ, స్టలవురాణాలూ, సిసలు పురాణాలూ “ినసముదాయాలు, గుంపులుగా, తెగలుగా, ముఠాలుగా జీవిస్తూ జాతిగా ఏర్పడ్డాక, సజాతీయ సమూహాలు తమ వర్తమాన, భావిజీవితాలకు మార్గదర్శకులుగా తమ పూర్వుల అనుభవాలనూ, జ్ఞాపకాలనూ, జీవిత విశేషాలనూ అడుగడుగునా జ్ఞాపకం చేసుకొంటూ ఉంటాయి. అవే పురాణగాథలు, ఒకజాతికి సంబంధించిన జీవన విధానాల మౌలిక రూపాలను గుర్తించాలంటే ఆ జాతి పురాణాలను పరిశీలించాలి. వాటిలో ఆ జాతి ఆచార వ్యవహారాల ప్రాథమిక స్పరూపాల ఆకారాలలో పురాతన సత్యం సాక్షాత్కరిస్తుంది. ఆటవిక దశనుండి పురోగమించి మానవులు టోటమిక దశలో అడుగుపెట్టగానే ఆలోచించసాగారు. సృష్టిలో తమతోపాటు జీవిస్తున్న సకల చరాచర ప్రాణికోటి గురించి కఠాడా ఆలోచించసాగారు. వాటిలో కొన్నింటితో సాజాత్యాన్ని, కొన్నింటితో వైజాత్యాన్ని భావించుకొన్నారు. సృష్టి ప్రారంభం, విశ్వోద్చవం, వివిధ జీవుల పుట్టుక, వస్తుసముదాయాల ఉత్పత్తి, ఆదిమ దంపతుల కలయిక, వంశవిస్తరణ మొదలైనవన్నీ తీమకు అవగాహన అయినంత మట్టుకు ఎలా సాధ్యమైందో ఊహించుకొన్నారు. భాష ఉన్న ప్రతి మానవ సంఘానికి ఒక పురాణముంటుంది. అది లిపి బద్ధం కాకపోవచ్చు గానీ, 'అనంతకాలాలనాటి' నుంచి అది వాగ్రూపంలో ఆ కులంలో దానిని చెప్పుకొంటూ ఉంటారు. మానవులకు జీవనోపాధి ముఖ్యం. ఆ అవసరాలకు లోనుగా కొన్ని విలువలు ఏర్పాటు చేసుకొని ఆచారవ్యవహారాలను పాటిస్తూ కలిసికట్టుగా ఒకటిగా జీవించే కుటుంబాల కూటము కులముగా ఏర్పడుతుంది. వ్యక్తిగా సాధించలేనిది సమష్టిగా సమకూర్చుకోగలమన్న గుర్తింపు సహజీవనానికి పునాది. '“ఒక్కరికోసం అందరూ, అందరికోసం ప్రతిఒక్కరూ' జీవించడం, మరణించడం ఆదిలో కులధర్మం. వివిధ కులాల వారు ఒకే గ్రామంలో జీవిస్తూ విభిన్న వృత్తులలో ప్రావీణ్యం సంపాదించి సమిష్టీ జీవనానికి అలవాటుపడినా, తమ కులాల ఆదిమ చరిత్రలను వారు విస్మరించలేదు. వాటిని కథనం చేసే గాయకులకు ప్రత్యేకంగా జీవనోపాధిని కల్పించారు. శిష్టుల పురాణాలను కథనం చేసే సూతునిలాగా జానపదుల పురాణాలను చెప్పే 'సూతులు' చాలామంది ఉన్నారు. ఆసాదులు, కొమ్ములవారు, గరుడస్తంభం దాసరులు, చిందులవారు, జంగాలు, జక్కులవారు, జోగులవారు, డక్కలవారు, దాసరులు, పంబలవారు, పిచ్చుకుంట్లవారు, పూసల బలిజలు, బవనీలు, బాలసంతులవారు, వీరన్నలవారు, మాష్టీలు, వీరముష్పులు, ధీరవిద్యావంతులు, శారదకాండ్రు, హట్కరులు మొదలైనవారు మన జొనపద గాయకులలో కొన్ని వర్గాలవారు. వీరిలో కొందరు కొన్ని కులాలవారి కథలనే గానం చేస్తారు. అవి వారి వారి ప్ర్య్యేకతలు. ఈ కథలలో కొన్నిటిని మాత్రమే పురాణాలన్న పేరుతో వ్యవహరిస్తున్నారు. ఈ లభ్యమైన తెలుగు జానపద పురాణలలో అదిపురాణం గౌతమపురాణం, చోడుపురాణం, జాంబపురాణం, మాతపురాణం అనేవి ప్రముఖ

మైనవి. ఇది శక్తిథాచక్రంలోని వివిధ భాగాలుగల సంహితలు గగ్రామదేవతలైన అంకమ్మ, ఎల్లమ్మ, చౌడమ్మ మొదలైన అమ్మవాళ్ల కథలను ఇవి తెలియచేస్తాయి.

ఈ జానపద పురాణాలను పరిశీలించిడీ అవి గ్రామజీవనానికి సంబంధించిన విషయ సర్వస్వాలని (ఎన్‌సైక్షోపీడియాలు) చెప్పవచ్చునని, వీటిని విపులంగా పరిశీలించి మ్లోషణ చేసిన విదుషీమణి డాక్టరు (శ్రీమతి); నాయని కృష్ణకుమారిగారు సాధికారంగా చెప్తున్నారు.! సంప్రదాయ సాహిత్వుంలోని భారత, భాగవత పురాణాదులలో దీటు వచ్చే పురాణం గౌతుపురాణ సంహితం. ఇందులో జమదగ్ని తల్లిదండ్రులయిన గౌతమబ్రహ్మ టలగన్న అహల్యల కథలేగాక వాగి తల్లిదండ్రుల కథలూ, రేణుకా కథలూ ఉన్నాయి. ఇది చాలా కుటుంబగాథల సంకలనంలాగ కనబడుతుంది అంకాళమ్మ, ఈదెమ్మ, ఎల్లమ్మ మొదలైన మాతృదేవతల కథలన్నీ ఈ పురాణ సంహితం లోని విభాగాలుగ భావించవచ్చు. బు

జానపదుల పురాణాలలో జాంబపురాణం చాలా విశిష్టమైనది. దీనిని ఆఅసాదివారు, బైండ్లవారు, పంబఅవారు అనే విభిన్న పర్యాయనామాలు గల చించు మాదిగలు చెప్తారు. వారి కులానికి మూలపురుషుడైన తాత జాంబవంతుడు అవసరమైన పనిముట్లను ఇతడే తయారు చేశాడు. విశ్వకర్మ కోరగా 'కొలిమితిత్తి చేయడానికి జాంబవంతుడు తన కుమారుని చంపి డొక్కను కొలిమి చేశాడు. చర్మాన్ని తిత్తి చేశాడు. హస్తాలు సట్టుతెరలుగా, పాదాలు బాడీశలుగా, బొటనవేళ్ళనే ఆలులుగా చేసి ఇచ్చాడు. ఒక్క విశ్శకర్మకేకాక, వివిధ కులాలవారికి వాళ్ళ వాళ్ళ వృత్తులకు అవసరమైన పరికరాలన్నీ మాదిగలు పెట్టిన ఖిక్షే అని జాంబపురాణం సాహంకారంగా చాటుకొంటుంది.*

ఈ కులాలలో కాపు, మున్నూరుకాపు, బొందిలి, భోగము, తెలుగుముత్తరాసి, వడ్రంగి, కంసాలి, కంచరి, కోమటి, అట్కరి, కమ్మరి, మేదరి, పిచ్చుకుంటు, గౌండ్ల, కుమ్మరి, మంగలి మొదలైన వృత్తులవారిని జూంబపురాణం పేర్కొంటుంది.

పాతరావియుగం ప్రారంభదశలోనే పనిముట్లను తయారు చేసుకొనడం ప్రయత్నించ గానే మానవకథ వికాసం సాధ్యమైంది. ఉపకరణాలు ఏర్పడి ఉత్పత్తి సౌకర్యాలు మెరుగుపడ్డాక నాగరికతతు నాంది పలకడం జరిగింది. ఉత్పత్తి సాధనాల అఖివృద్ధిమీదనే సమాజ సంక్షేమం ఆధారపడి ఉంది. మన జానపద పురాణాలు ఈ పనిముట్ల ఆవశ్యకతను ఆదిలోనే గుర్తించడం వారి సామాజిక స్పృహకు గుర్తు. ఈ పురాణాలను ఆద్యంతం వివిధ ప్రాంతాలలో ప్రబ-రంలో ఉన్నవాటిని సికరించితే “గ్రామ జీవన సంబంధియగు అంశాల నెన్నింటినో వాజ్బయరూపంలో' భద్రపరచు కోవచ్చునని'' విజ్ఞులు భావిస్తున్నారు.

  1. నాయని కృష్ణకుమారి - తెలుగు జానపదగేయగాథలు, పుట. ౩౫.
  2. అదే పుస్తకంలో పుట. 323.

466 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

జానపదుల పురాణాలన్నీ వాగ్రూపంలో ఆదిలో ఉన్నా కొన్ని అర్వాచీన యుగాలలో అవి తాటాకులకు ఎక్కాయి. ఇతర కులాలవారి పురాణాలు కావ్యాలుగా రూపొందుతున్న ఆరవీటిరాజుల యుగంలోనే బహుశా కొన్ని జానపద పురాణాలు తూడా తాళపత్రాలలో లిపిబద్ధం చేయడం జరిగి ఉంటుంది. ఈ ప్రజ్ఞాకావ్యాలను పరిశోధకులు సేకరించారు. ఇతర కుల, స్థల పురాణాల గురించి చెప్పుకొనడానికి ముందు జానపదుల పురాణాల వివరాలు తెలియవచ్చినంత మట్టుకు ఆతలుసుకొని తర్వాత శిష్టసాహిత్యంలోని గ్రంథాల గురించి చెప్పుకొందాం.

  1. బడబాగ్ని రామచంద్రుడు: తరతరాలుగా టైండ్లవారనే బవనీండ్రు కథనం చేసే శక్తికథాచక్రంలో మాహురమ్మ అనే దేవత కథ ఉంది. ఈమెనే రేణుకా ఎల్లమ్మ అనీ, అక్కిలి దేవి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారి కథను 'మాతపురాణం' అనే పేరుతో బడబాగ్ని రామచంద్రుడనే కవి మంజరీ ద్విపదగా రచించాడు. ఓరుగల్లును ఏలే నరరుద్రరాజు వీరైవుడు. ఆడదైన దైవాన్ని కొలవనన్నాడు. “ఇలలోన దాన్ని పూజించేటి వార్ని తలపక మత్తింతు ధరణి కంపింప” అని ప్రతిజ్ఞ చేశాడు. రేణుకాశక్తి వరుసను చెడగొట్టాడు. అమ్మవారు పగపట్టి 'నరరుద్రుని రాజ్యంబు నాది వ్యాధులకు లోనుచేసి రాజును రోగగ్రస్తుణ్జి చేసి అతని అహంకారాన్ని అణచింది. రాజు దేవి మహత్తును గుర్తెరిగి తాను బవనీడయ్యాడు. అతని భార్య జేగంట పట్టి వాయించింది. అతని కొడుకులు అమ్మవారి కోలకాండ్రు అయ్యారు. రాజు కుమార్తెలు బొట్లవన్నా చీరలు కట్టి మాతంగులయ్యారు.

బడబాగ్ని, రామచంద్రుడు చెప్పిన ఈ కథాకావ్యాన్నే చాలామంది లేఖకులు బ్రాసుకొన్నట్టుంది. ఒక తాళపత్రప్రతిని డాక్టరు నాయని కృష్ణకుమారిగారు రూపొందించారు. ఇందులోని కొంతభాగాన్ని “జానపద గేయాలు-సాంఘిక చరిత్ర' అనే గంథంలో ప్రచురించారు. ఈ బడబాగ్ని రామచంద్రుడే 'గిరిరాజు కథను కూడా మంజరీద్విపదగా రచించాడు (గిరిరాజు అంటే రేణుకా ఎల్లమ్మ తండ్రి). గిరిరాజు కథలో కవి “తరెక్రయకుడు' అని చెప్పుకున్నాడు. అంటే ఇవాళ మనం రచయిత అన్న అర్థంలో వాడే మాట అనుకొందాం. గిరిరాజు కథ ప్రారంభంలో ఇలా ఉంది.

శ్రీ శారదంబకు చేతులు మోడ్చి లోకపావని సకలలోకైకమాత

ఏకవీరాంబకు వేడ్కతోమొక్కి ప్రాకటంబుగ శక్తి ప్రార్థన చేసి

వీర వైష్ణవులకు వీరైవులకు కడు వేడ్క విప్రులకు కరములు మోడీ

ధరగల జనులెల్ల తగుసంతసిల్ల కరమర్థి చెప్పిన ఘను డెవ్వడనిన

ప్రభవించు నతివేడ్క ఖైరవమంత్రి అలరు ఖైరవమంత్రి అంబకాంబకును

అతివేడ్క నుదయించె నన్నయమంత్రి మతిమంతుడైనట్టి సుతుని కల్చ్పకము

వినుతింప శ్రీ ఏకవీర మెప్పించి రచకుడు బడబాగ్ని రామచంద్రుడు

చెప్పంగ దొడగిన చతురుడై యంత ఈ గిరిరాజు కథ అసంపూర్ణం. ఇందులో కొంత భాగాన్ని వాచవిగా సాహిత్య అకాడమీ వారి సంకలనంలో చేర్చారు.

అంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురణ, ష్టైదరాబాదు, 1974.

కులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ 467 2. శసకదండి గోపాలు ; మాతపురాణంలాగే శక్తి పారమ్యాన్ని ఇంకొక కథ 'ఈదెమ్మ కథ' చెబుతుంది. ఇదీ తాళపత్ర గ్రంథరూపంలో డాక్టరు నాయని కృష్ణకుమారిగారికి లఖించింది. దీనిని పెనుగొండ పల్లెలోని యదువంశ పూజ్యుడు, యాదవఘనుడు, కన్నెసిరుల గోత్రుడు, కనకబండి వంశవర్థనుడు కొండయ్య కుమారుడు “గోపాలు చెలునొప్పు గట్టిగ చెప్పిన కథ' కవికాలం ఏమిటో నికరంగా చెప్పలేం. ఇదే కథ ఒంగోలు ప్రాంతమున “మాంధాత కథ' అనుపేరిట ప్రచారంలో ఉంది*ీ . ఈదెమ్మ కథలో నాయకుని పేరు మాంధాత. ఇతడు సూర్యునికీ యొక్కడు; చుక్కబొట్టు పెట్టడు; ఆడ దైవాలను గొల్వడు. హస్తమెత్తి మొక్కడు. ఇతని మంత్రులు ఒకనాడు ఈ రాజుకు "ఉత్తర కాంభోజీ వీరమాంకాళి శివాదేవి' గొప్పతనం చెప్పారు. ఆమె “అనంత కాలాల నాటి అకాల విధి' అనేటి శక్తి. మాంధాత ఈ విధమ్మ (ఈదెమ్మృను ధిక్కరించాడు. అమ్మవారు పండ్లు కొరికింది. 'భద్రేసు ఆయుధాలు పట్టిన చేతులి రాజుచేత “కొడవలి పట్టించి కూలి చేయింతు' అని శపథం చేసింది. ఆలువిడ్డల నుండీ దూరం చేయించింది. అడవులు పట్టించింది. ఈ సుదీర్ణ కథలో చిట్టచివర ఈశ్వరుడు మాంధాతను రక్షిస్తాడు. విధికూడ అక్కడికి వచ్చి మాంధాతను మెచ్చుకొంటుంది. “మాత్రారాధన యుచ్చస్థితిలో నుండగా దానిని అణచి శివపారమ్యము నిరూపించుటకై వీర్టూవులు కల్పించుకొన్న గాథలలో నొకటిగా” ఈదెమ్మ కథను ఉదాహరించవచ్చునని డాక్టరు నాయని కృష్ణకుమారిగారు భావిస్తున్నారు.5 ఆమె ఆదిలోనే ఒక విషయాన్ని స్పష్టం చేశారు. “వీరైవ మతోజ్బృంభణమున కెంతో ముందు కాలమునుండియు జన జీవితమునందు పాదుకొనియున్నవి మాతృదేవతల గాథలు. అందువలననే ఈ కథ గేయ నిర్మాణములో వీర్షైవమునకును, మాత్రారాధన కును మధ్య స్పర్థయు, నందొక్క పక్షము నెగ్గుటయునను వంశమునకు ప్రాధాన్యమీయబడి దాని చుట్టును కథలల్లబడీనవి'' అని చెప్పాక మాతపురాణం-మాత్రాధికృము; ఈదెమ్మ కథ - వైవాధిక్ళము అని ఉదాహరణలిచ్చారు. = వాస్తవానికి ఈ కథలు శాక్తానికి, శైవానికి మధ్య స్పర్థలులాగ కనబడుతున్నా మాతృస్వామ్య _ వ్యవస్థలోని అదారవ్యవహారాలతూ, పితృస్వామ్య వ్యవస్థలోని పురుషాధిక్య మనస్తత్వానికీ మధ్య నున్న సంఘర్షణలను ఇవి తెలియజేస్తాయి. ప్రపంచంలోని చాలా నాగరికతల్గు ఆదిలో మాతృస్వామ్యం ప్రధానమ్దేనవే. ఆనాటి . గాథలను పితృస్వామ్య వ్యవస్థలో పునఃకథనం చేస్తున్నప్పుడు సంఘర్షణ సర్దుబాట్లు తప్పవు. గ్రీకు నాగరికతలోని కథాగేయ నిర్మాణం జార్జి థాంప్సన్‌ చెప్పిన వెషయాలు మన మహాభారతానికీ, తెలుగు జానపదుల శక్తి కథాచక్రానికీ సరిగ్గా నప్పుతాయి 4. దీనిని ఆచార్య తూమాటి దొణప్పుగారు సంపాదించారు. ! 6. తెలుగు జానపద గేయగాథలు, పుట-211 " ఈ ౦౮౫౭ 0080౧ - న౭0500గం గీంం్రంజం ఈ గ్రంథంలో చాలా సందర్భాలలోనూ, ముఖ్యంగా “6 యజ% ఈ రఖూజ అనే పదమూడవ ప్రకరణంలోనూ సంస్కృతుల సంఘర్షణ గురించి థాంప్సన్‌ విశదపర్బారు. .

468 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

  1. రేటూరి భావన: జానపదులు విభిన్న నామాలతో వివిధ గ్రామదేవతలను కొలుచుకొంటారు. జాతరలు చేస్తారు. (1) అంకాళమ్మ (2) అంకమ్మ (3) ఎల్లమ్మ (4) ఐసోదమ్మ (5) గంగచ్ము (6) గంటలమ్మ (7) చమలమ్మ (8) చల్లమ్ము (9) చిన్నమ్మ (10) చిన్నింటమ్మ (11) తలుపులమ్మ (12) నూకాలమ్మ (13) పరదేశమ్మ (14) పెద్దమ్మ (15) పోలమ్మ (16) ఫైడమ్మ (17) బండ్లమ్మ (18) మామిళ్లమ్మ (19) మారమ్మ (20) ముత్యాలమ్మ (21) మైసమ్మ (22) యాపారమ్మ (23) వనమాలమ్మ (20) సీతలమ్మ (౫5) సుంకలమ్మ మొదలైనవి కొన్ని గ్రామదేవతల పేర్లు. ఇందరు దేవతలు లెక్కకు తేలుతున్నా, ఏ వేల్చుకైనా ఆదిలో గుళ్ళు లేవు. చిన్న చిన్న రాళ్ళే చిల్లర దేవతలయ్యారు. గ్రామాలు వెలిశాక గ్రామదేవతలు వెలిశారు. ఆహారోత్పత్తి సాధనాలు మెరుగుపడి పంటను నిలువచేసుకొనడం, పొరుగు ఊళ్ళతో సరుకులు మార్పిడి చేసుకొనడం వ్యాపారాలు చేయడం మొదలైన పరిణామాలు వచ్చాక కొత్త దేవతలు పుట్టుకొచ్చారు. మనుషులకు, మచ్చిక జంతువులకూ తెగుళ్ళు వస్తి పోలేరు, వాంతి, భ్రాంతి, చలి జ్వరాలు ఏకకాలంలో చాలామందిలో కనబడితీ దానికి అమ్మవారి ఆగ్రహమే కారణమని

గ్రామ సంక్షేమం కోసం ఈ కొలుపులు అవసరమైనా సంతాన ప్రాప్తికి వేరే ఆరాధనా పద్ధతులు అవసరమయ్యాయి. వృక్షాలకూ, యక్షిణీ దేవతలకు సంతానమిచ్చే శక్తులున్నాయని ఆదిలో మానవులు గ్రహించారు. అందుకే ఆ ఆరాధనలు ప్రారంభ మయ్యాయి. బౌద్ధగ్రంథాలలో పలురకాల చైత్యాల ప్రసక్తులున్నాయి. బుద్ధఘోషుడు - వీటిని “యక్కచేతియాలని” అన్నాడు. యక్కలు అంటే యక్షులు. ఆదిమ చైత్యాలలో నరబలులు, జంతుబలులు ఉండేవి. పాళీగంథాలవల్ల వైశాలినగరంలో చపలబైత్యం, ఉదేనవైత్యం, సప్తాంబికా చైత్యం, బహుపుత్త చైత్యం మొదలైనవి ఉన్నట్టు తెలుస్తుంది. సంతానం లేనివారు సప్తాంబికావైత్యంలో బహుపుత్ర చైత్యంలో కొలుపులు కొలిచేవారు.”

పాళీలోని '“సప్తాంబిక అన్న పదమే సంస్కృతంలో సప్తమాతృకలయ్యారు. బౌద్ధగ్రంథాలలో బుద్ధఘోషుడు పేర్కొన్న 'యక్క'లను తెలుగువాళ్ళు అక్కలని వ్యవహరించసాగారు. అక్కలు లెక్కకు ఏడుగురు. ఈ అక్కల కొలుపులు మనకి సింధునదీ నాగరికత రోజుల నుంచీ ఉన్నాయని చెప్పవచ్చు. మొహంజాదారో త్రవ్వకాలలో ఒక పెద్ద మడుగు బయటపడింది. దీనితి పుష్కరిణి అని పేర్కొని ఇందులో అప్సరసలు కొలనాడి కూటం చేసేవారని పరిశోదకులు ప్రతిపాదించారు! సింధు నాగరికత ముద్రకలు ఒకదానిలో ఏడుగురు ఆడవాళ్ళు వరుసగా నిలబడడం కూడొ చిత్రించారు. వీళ్ళు అక్కలేమో.

సంతానం కోసం నోచడాన్ని తెలుగువాళ్ళు “చల్లదనం చేసుకొవడం" అంటారు. అందుకు అక్కలను కొలుచుకుంటారు. చ అతత జు కతత. లాలా 8. 00 గంజగణర సతు జాడీ గింల18/ - ౧.78

కులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ 469 వారింటి అక్కల్లు కొలనాడ రండీ వీరింటి పేరంటాళ్ళు కొలనాడ రండీ

వారింటి దేవతలు కొలనాడ రండి వీరింటి కామన్న కొలనాడ రమ్మి అంటూ ఆహ్వానిస్తార ఇందులో వారూ, వీరూ అనే మాటలతో నోము నోచే కాపును, అతని అతివను సూచించడం జరుగుతున్నట్టుంది. అక్కల కొలుపులు డెలుగుగడ్డమీద శ్రీనాథుని కాలానికి ముందే జరుగుతూ ఉండేవి. క్రీడాఖిరామంలో ఇలా చెప్పాడు.

“ఇదె యీ యింటి యజమానుండు సంతాన కాంక్షియై ప్రతి బంధనోదనార్థంబు యక్షకన్యలంబరీక్షారాధనంబు సేయుచున్న వాడు గావలయు మాని భద్రకతులోద్వహులైన దేవతలు కామవల్లి శ్రీమహాలక్షితో గూడి యపేక్షిత కార్యంబు మనకు నవ్యాక్షేపంబునం జేయుదురుగాక' (క్రీడాఖిరామం - 1౫)

అక్కల కొలుపు ఇళ్ళలోనే చేస్తారు. ఆనాడు ఏడుగురు ముత్తైదువులకు అర్చనం జరుగుతుంది. వీరవాద్యాలతో ఉద్రేకజనకమైన గానఫణతిని కామేశ్వరి పాటను పాడుతారు. ఏడుగురు అక్కలూ ఉంగరాల చేతులతో పించె కుంచెలు పట్టుకొని పీటలమీద కూర్చొని ఉంటారు. ఉరుకు చప్పుళ్ళకు అదురులమైోతకు వాళ్ళకు పేరుబ్బు ఆవహిస్తుంది. ఏడుగురు అక్కలలో ఒకామె ముందు శిమొత్తి ఆడుతుంది. మెల్లగా మూర్చల జిత్తములుల్సి అక్కకేడుగురు అవలగ్నములైన తనువుల నృత్యం చేస్తారు. ఇది క్రీడాఖిరామంలోని పద్యాల వల్ల తెలియవస్తున్న ప్రాచీన సంప్రదాయం.

ఈ ఏడుగురు యక్షకన్యలూ అనంతకాలాల నాటి అక్కలైనా కొన్నాళ్ళకి వీళ్ళు పార్వతీదేవి కుమార్తెలన్న ఏశ్వాసాన్ని జనం కల్పించుకొన్నారు. మన గ్రామదేవత లందరూ పార్వతీదేవి రూపాంతరాలే. అయితే ఈ అక్కలను మాత్రం మూతుళ్ళను చేయక తప్పదు. వీళ్ళలో కడగొట్టు దానిపేరు కామన్నం. తక్కిన అక్కలందరూ వేరువేరు శరీర భాగాల నుంచి పార్వతికి పుట్టినా కామన్న మాత్రం కన్నులలోంచి పుట్టింది. ఈమెకే కామేశ్వం అన్న పేరు మాత్రమేకాక శ్రీనాథుని శాలానికి ముందే “కామవల్లీ మహాలక్ష్మీ అనే పేరు కూడ ఉంది. పార్పతి తూతురుగా పుట్టడానికి ముందు మహాలక్ష్మీ వైతుంఠంలోని ఆదిలక్ష్మీ అమె రామావతారంలో ఉన్న విష్ణవును చూసి మోహించి ఆ రూపంలోనే తనను రహిగూర్చు కౌగిట చేర్చమని మరులుకొంది. విఫల ప్రేమికురాలైంది. రాముడు, ఈమె పరస్పర శాపాలు ఇచ్చుకొన్నారు. ఈ కథ శ్రీనాథుని కాలానికే ప్రచారం లోనికి వచ్చింది కాబోలు. ఓరుగల్లు వీరులలో “కామవల్లీమహాలక్ష్మీకైటభారి వలపు వేడుచు వచ్చె జక్కుల పురంధ్రి'' అని చెప్పాడు (క్రీడాఖిరానుం పద్య సంఖ్య- 138).

ఇప్పటికీ కొన్ని తెలుగు ఇళ్ళలో కామేశ్వరీ వ్రతం నోచుతున్నారు. ఆ సందర్భంలో పాడే పాటలో "'కామవల్లీ మహాలక్ష్మీ మధుక్రటభారి వలపు” ప్రసక్తి ఏమీ కనబడదు.” అయితే కొన్ని కావ్యాలలో ఈ కథ సవిస్తరంగా ఉంది. ఆరవీటి రాజుల కాలంలో 9. 4-10-197 తేదీనాడు థ్రీగాడేపల్లి కామేశ్చరరావుగారి ఇంటుశీ కామేశ్వరీ వ్రతం జరిగింది. ఆ

సందర్భంలో ఎనఖైనాలుగు సంవత్సరాల వయసుగల వారి తల్లిగారు పాడిన పాటను క్రీడాఖిరామం నాలుగవ ముద్రణ (1988) ప్రతిలో వేటూరి ఆనందమూర్తిగారు పొందుపర్చారు. దీనిలో ఈ వలపు కథ కనబడదు.

470 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి శీటూరి భావన అనే కవి “కామేశ్వరీ చరిత్రము అనే ద్వాపదకావ్యం రచించాడు. శ్రీ మహాలక్ష్మి ఒకనాడు తన కలలో కనబడింది. కామేశ్వరి ననంగ గల మహావేల్చ శ్రీ రామచంద్రుని చేతి శాపమున ధారుణీ పుట్టితి తప్పదీ మాట శ్రీ కృష్ణ దేవుని చెలిమి కోరుచును నాకు దోడైన కన్యలు మరి కలరు ఇలా విశదం చేసి “నా కథను నీ కవిత్వ ఫ్రొడి నెలకొన'' చెప్పమంది. రేటూరి భావన చెప్పాడు. ఈ కావ్యం కాగితం ప్రతి (0౧.1045) ఒకటి చాలా ప్రాచీనమైనది. ప్రాచ్యలిఫత గ్రంథాలయంలో ఉంది. ఈ కథాసారాంశాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ ' క్రీడాఖిరామం' పీఠికలో విశదం చేసి చర్చించారు ( క్రీడాఖిరామం మొదటి ముద్రణ 1928). డాక్టరు బిరుదురాజు రామరాజుగారు రేటూరి భావన చెప్పిన కథను ద్విపద పంక్తులను ఉదాహరిస్తూ పూసగుచ్చినట్టు సవిస్తరంగా తమ “తెలుగు జానపద గేయసాహిత్యం' అనే సిద్ధాంత గ్రంథంలో కథనం చేస్తూ వ్యాఖ్యానించారు.!9 డాక్టరు నాయని కృష్ణకుమారిగారు కర్నూలు జిల్లా రుద్రవరంలో ఒక బైండ్లవాడు పాడగా “అక్కల కథ' పేరిట ఈ కామేశ్వరి కథనే విన్నారు. ఇందులోని కథకూ, బ్రాహ్మణుల ఇండ్లలో పాడుకొనే కథకు తేడాలు ఉన్నాయని చెప్పారు.!* తమకు లభించిన ఈ కథలను థైపారు వేశారు. క్రీడాఖిరామంలోని కామవల్లి కథా, ఈ అక్కలకథా ఒక్కటవుతాయో కాదో చెప్పలేమన్నారు. తిష్టులు చెప్పుకొనే కామేశ్వరి కథకూ. జానపదులు పాడుకొనే కథకూ భేదాలు సహజం. రామావతారం, కృష్ణావతారం ప్రజలలో ప్రాచుర్యం నొందాక ఆదిమ మాతృసప్తకాన్ని ఆ అవతారపురుషులతో ముడి పెట్టడానికి ప్రయత్నాలు శ్రీనాథుని కాలానికి ముందే జరిగి జనులలో వ్యాపించి ఉండవచ్చు. ఆ కథనే రేటూరి ఈ గ్రంథంలో కవి తన గురించి అట్టే చెప్పుకోలేదు. ఇతని తాత పేరు పైగడయ్య, తండ్రి పేరు రామయ్య. వీరిది శ్రీవత్సగోత్రం. రేటూరి భావన ఎర్రగుంట చెరువు అనే గ్రామంలో ఉండే కుంచెకామేశ్వరికి తన కావ్యాన్ని అంకితం చేశాడు. అనంతపురం టిల్లాలోని రెండు తాలూకాలలో ఎర్రగుంట గ్రామాలు ఉన్నాయి. “ఒకటీ అనంతపురం తాలూకాలోనిది, ఇంకొకటి హిందూపురం తాలూకాలోనిది. కడప జిల్లా కమలాపురం తాలూకాలో' ఎర్రగుంట్ల ఉంది. రాజంపేట తాలూకాలో ఎగ్రగుంట్లకోట గ్రామముంది. గుంటూరు జిల్లా స్తెనపల్లి తాలూకాలో ఒక ఎగ్రగుంట్లపాడు అనే గ్రామముంది. రేటూరి భావన ఈ గ్రామాలలో ఏ ఒక్కదానికైనా చెందినవాడు కావచ్చును. కావ్యంలో కొన్ని చోట్ల తన గ్రామం పేరు 'గుంటచెరువు' అని కూడా చెప్పాడు. ఈ కవి ఎక్కడివారైనొ అక్కల _కథలు _ఆంద్రదేశమంతటా ప్రచారంలో _ ఉన్నాయి. భారతదేశమంతటా 10, తెలుగు జానపద గేయసాహిత్యం - పుటలు 423 కుండీ 427, 11. తెలుగు జానపద గేయగాథలు - పుట 214.

కతులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ త71 అష్టోత్తరశక్తి పీఠాలు ఉన్నాయని సంప్రదాయం. అక్కల న్థానకాలు డెబ్బయి రెండు ఉన్నాయని కామేశ్వరి చరిత్రలో రేటూరి భావన చెప్పాడు. ఎర్రగుంట చెరువు, కుంచె కామేశ్వరి గురించి ఈ స్థానకాలలో ఉందో లేదో, పరరాష్టాలలో ఉన్న స్థానకాల గురించి విశదం చేయలేదేమో! కుల పురాణాలు ఆ కులంవారు తామెక్కడున్నా చెప్పుకొంటారు.

  1. భద్రకవి లింగ కవిః పరభాషా సీమలో ఉంటూ మాతృభాషను సేవించిన తెలుగు నాయకుడు ఒకడున్నాడు. క్రీ.శ1532 ప్రాంతాలలో అచ్యుతదేవరాయల వారి కాలంలో “పడవీగు'ను కాళహస్తి నాయకుడు పాలిస్తూ ఉండేవాడు. ఇది ద్రావిడ మధ్య దేశం'లో ఉంది. 'పట్టణంబుల కెల్ల బరగిన తల్లిపట్టణం బయినట్టి పడవీటిలో నూలిపొర్ణమినాడు పదివేలమంది దేవాంగులు రామేశ్చరస్వామి ముఖమంటపంపై కూర్చొని దేవాంగ మునీశ్వరుని చరిత్రను బ్రాయగల కవులెవరున్నారాయని చర్చించుకొంటూ ఉంటే కాళహస్తి నాయకుడు భద్రకవి లింగకవి పేరు చెప్పారు. ఈ కవి “తెలుగుకు నెరవాది- ద్విపదకు రాజు.” ఇతని తండ్రి 'శివధర్మశాస్త్ర కోవిదుడు', 'పరమశివజ్ఞానభరితాత్ముడు'. ఈ కవిచేత దేవాంగులు తమ కులదైవం చరిత్రను వ్రాయించుకొన్నారు. ఇది ఏడాశ్వాసాల ద్విపద కావ్యం. మొదటి ఆశ్వాసంలో దేవాంగబుషి జననం, దేవతావస్త్రనిర్మాణం ఉంది. మిగకా ఆరాశ్వాసాలలో ఆ బుషి ఎత్తిన విద్యాధర, పుష్పదంతబేతాళ. వరరుచి, దివసాళి, దేవదాసి అనే అవతారాలున్నాయి. ఈ దేవరదాసయ్య దేవాంగ కులంలో జన్మించాడు. టైనులను ఖండించి శ్రైవమతాన్ని స్థాపించాడు.

దేవాంగపురాణాన్ని వ్రాసిన లింగకవి ఈ దేవరదాసయ్య కులంలోనే జన్మించాడు. ఇతడూ శైవుడే. తన ద్విపదలలో శివకవులనే నుతించాడు. ఇతడు సానందచరిత్ర అనే మరొక ద్విపదకావ్యం వ్రాశాడు. సానందుడనే బుషి యమలోశ్రభాషల్ని నరకబాధల నుండి తప్పించే కథ వినడానికి ఆశ్చర్యమై ఉంటుంది. అది తన పేర ద్వాపదగా వ్రాయించి అంకితీం పుచ్చుకోవాలని శివయోగి వీరభద్రయ్య అనే జంగమదేవర భావించాడు. ఇతడు అరుణాచలానికీ ఉత్తరంగా ఉండే “అరుణాద్రి మంగలం' అనే ఊళ్ళో ఉంటాడు. “వెన్న చేతిలో ఉంటే నెయ్యి కోసం వెదకడం ఎందు'కని లింగయ్యను పిలిపించి ఈ చరిత్ర చెప్పించాడు. ఇది మూడాశ్వాసాల కావ్యం.

లింగయ్య తాను 'ద్విపదకు రాజూనని చెప్పుకొన్నాడు 'నవరసాకరంగా, చారుతరం'గా, “జనమనోహరం'గా కృతి చెప్పమని ఇతని కృతిపతి ఇతణ్జి ఆదేశించాడు. నిర్దేశించిన విధంగా మనోహరంగా ఇతని కృతి ఉంటుందని నిడుదవోలు వెంకటరావుగారు సాక్ష్యమిస్తున్నారు.

  1. ఎల్లకర నరసింహకవి । దేవాంగుల ప్రేరణలవల్ల భద్రకవి లింగకవి ఒక పురాణానికన్‌ వ్రాసినట్టే పద్మసాలెల ప్రోత్సాహంవల్ల _ఎల్లకర నరసింహకవి మార్కండేయ పురాణాన్ని ద్విపద కృతిగా చెప్పాడు. ఈ కవి తిరుమల లక్ష్మణార్యుని
  2. దక్షిణదేశీయాంధ్ర వాబ్బ్యయం (ద్విరీయ ముద్రణ), పుట 13.

472 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి విష్కుడు క్రీ.శ. 1511-1588 మధ్యనున్న వైష్టవచార్యుడు. “వావిర్‌ ముల్లోకవాసుల కెల్ల, నెనరొప్పు పంచవన్నాల వస్తసమిలి, నిన చంద్రసోక్షిగా' ఇచ్చినవాళ్లు, ఒంటికంబపు మేడ సాధించినవాళ్లు, కాలువసేనుణ్ణి యుద్ధరంగంలో ఓడించినవాళ్లు, బుషి వంశంలో వాళ్లూ అయిన పద్మసాలెలు ఈ కవిని పిలిపించారు. సంస్కృతంలో ఉన్న మార్కండేయ పురాణం అందరూ చదువుకోలేరు కాబట్టి ద్విపదగా చెప్పమన్నారు. నరసింహకవి ఆ కృతిని రచించి కొమరవోలు రాజగోపాలస్వామికి అంకితమిచ్చాడు. దీని అముద్రితప్రతి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (2132). దీన్ని బ్రాయడానికి ముందు ఎరసింహకవి “భారతసావిత్రి రచించాడట. “ప్రచమర వాకయములచే భరతసావిత్రి రచియించితివి కవిరాజులౌననగ'' భారతసావిత్రి సంస్కృత గ్రంథం. రాయబారానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు విదారుని యింట విందుభోజనం చేయడం ఇందులో ఉంటుంది. దీనిని ఎల్లకర నరసింహకవి ద్వొపదగా అనువదింగాడో. వచనంగా బ్రాశాడో తెలియదు. అయితే వచనరచనగా భారతసావిత్రి మంచి ప్రచారంలో ఉంది. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో దీనికి నాలుగు ప్రతులున్నాయి. (౧447 (9 ॥.801, 1.910 () [979 (6. ఈ వచనకావ్యం రచయిత ఎవరో తెలియదు. బహుశా ఎల్ల నరసింహమే కావచ్చు.

  1. భాస్కరాచార్యులు: స్థలపురాణాలేకాక ఈ యుగంలో కుల పురాణాల రచనలు కూడా మొదలైనట్టు గమనించాం. వీటిలో చాలా ప్రసిద్ధమైనది వాసవీమాహాత్మ్యం వైశ్యులకు అంకితమిచ్చాడు. ఈ భాస్కం"*చార్యులు వైశ్యుల కులగురువు. నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో నగరేశ్వరుని ముఖమంటపంలో అష్టాదశ పట్టణాలలో నున్న నూటయాభైమంది నగరస్వాములు సమావేశమైనారు. ఆ వైశ్య సంఘం తము కులగురువుకు సాగిలపడి మొక్కి వైశ్య పురాణాన్ని రచించమన్నారు. మునుపు నైమిశారణ్యంలో సాలంకాయనమహర్షి వైశ్ళవరులకు చెప్పిన కథను భాస్కరాచార్యులు “చిప్పల అమృతంపుసోనచిలికిన మాడ్కి, కప్పురమున విరిపొట్లము విప్పినక్రియ'' రచించాలని మనసులో అనుకొన్నాడు. వైశ్ళులు మళ్ళీ ప్రార్థించారు.

తెనుగుంగాన్యము జెప్పవయ్య మృదువై దేశీయమై భవ్యమై

విననింపై సరస్వతమై విరళమై విఖ్యాతమై కీర్తిమై

జనతామోదక హృద్యపద్యయుతమై సద్ధర్మమై చోద్యమై

తనరం బల్క వె చింతలయేలయనుచుక ధర్మజ్ఞభాషింపవే. (వైశ్ళ. 1-33

వాళ్లు కోరినట్టే భాస్కరాచార్యులు వ్రాసిన పురాణం విఖ్యాతమ్రైంది. ఈ పురాణంలో మొదటి నాలుగాశ్వాసాలలో సృష్టి నిర్మాణం, వైళ్ళుకుల సంభవం, బ్రహ్మ తుడితొడనుంచి 714 గురు వైళ్ళులు సతీయుతులై జనించడం, వాళ్లు కైలాసానికి వెళ్ళడం, చిత్రకేతుడనే గంధర్వుడు వైశ్ళులను శపించడం, వాళ్లు అతనికి ప్రతిశాపమివ్వడం, కామదహనం, రతీవిలాపం, గిరిజాకల్యాణం మొదలైన కథలున్నాయి. పంచమాశ్వాసం నుంచి వాసవీ చరిత్ర గౌతమితీరాన ఉన్న పెనుగొండలో కుసుమొౌట్టి అనే వైళ్ళుడున్నాడు. అతనికి ఒక కుమారునితోపాటు వాసవి అనే పుత్రిక జన్మించింది. ఈమె యుక్తవయసుకు ,వచ్చిన తరుణంలో ఆ వూరికి రాజమహేంద్రవరాన్ని పాలించే

కుంపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ 473 విష్ణువర్ధనుడు అనే రాజు వచ్చాడు. అతనికి హారతి యిచ్చిన స్త్రీజనంలో వాసవీకన్య కూడా వుంది. ఆ అందాన్ని చూసి మోహించి రాజు ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకొన్నారు. కూతురి నిమ్మని కుసుమశెట్టిని అడిగాడు. ఈకపోరాదు. “ఈకున్న ఎగ్గుపుట్టు'. ఇవ్వకపోతే రాజు బలవంతం చేస్తాడు. కనుక అతడు కులంవాళ్ళతో సంప్రదించాడు. అపకీర్పిశన్నా అగ్నిప్రవేశం మేలనుకొన్నారు. 714 గోత్రాలవారిలో 102 ఇళ్ళవారు ఈ త్యాగం చేశారు (వైశ్య. 8-172).

మాకులమునందు జక్కని -యీకన్నియ పుట్టుకతన నిటు గావలసెళ్‌

లోకేశ యింతనుండియు - జేకొని యిటువంటి సతుల సృబియింపకుమీ. అని వాళ్ళు బ్రహ్మదేవుణ్ణీ ప్రాగ్గించారు. కులంలో చక్కదనం వద్దు, గుణమే కావాలి అని వాసవి కూడా ప్రార్థించింది. 102 గోత్రాల వారితో గుండంలో దూకింది. ఆమె ఇలవేలుపైంది. ఈ గాథ చారిత్రక సత్యం కాదని చిలుకూరు వీరభద్రరావుగారు ఆంధ్రుల చరిత్రలో వ్రాశారు. అయితే ఈ గాథ ఆధునికులను ఉక్తేజపరుస్తూనే ఉంది. గురజుడ అప్పారావుగారు కన్యకచరిత్రను ముత్యాలసరాలలో కథనం చేశారు. ఇటీవల కొందరు బుర్రకథలు వ్రాసి ప్రచారం చేశారు. కన్యకను కోరిన రాజు ఎవరో గాని గురజాడ అప్పారావుగారు చెప్పినట్టు “పద్యంపద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్‌!” కన్యక కీర్షినీ, రాజు అపకీర్షినీ గ్రంథస్థం చేసిన భాస్కరాచార్ములు తన గ్రంథానై ఏ ఒక్కరికోకాక ఒక సంఘంలోని ప్రజలందరికీ అంకితమిచ్చిన ఈ గాథ నేటికీ ప్రజా కవిత్వమవడం గమనించదగ్గదే.

  1. మల్లారెడ్డి దేశాయి: కాకిపిల్ల కాకికి ముద్దు. ఎవరి ఊరు వాళ్లకు గొప్ప. స్వగ్రామానికి మహత్వం ఆపాదించి రచనలు చేసిన వాళ్లు కోకొల్లలు. సుల్లా కులీ కుతుబ్‌షా గోలకొండరాజ్యాన్ని పాలిస్తున్న రోజుల్లో (క్రీశ1518-1543) ఆ సీమలో గంగాపురం అనే గ్రామంలో మల్లారెడ్డి అనే మోతుబరి ఉన్నాడు. కుతుబ్‌షా అతణ్ణి మెచ్చుకొని, అందలాలు మొదలైనవి బహూకరించి 'పట్టణచౌదరిని చేశాడు. ఈ ముల్తారెడ్డి తమ్ముని మనుమని పేరుకూడా మల్లారెడ్డే. ఇతడు కవి. స్వాన్థానమైన గంగాపురం గొప్పదని, దాని "సుక్షేత్రమహింబు తెలిసి పలుళ దరమె శంభుని కైన విధాతకైన' అని భావించి తానే 'గంగాపుర మాహాత్మ్యం' అనే కావ్యం వ్రాశారు. ఇది అముద్రితం కాదుగానీ అసమగ్రం.

1%46లో వివేఠవర్ధినీ పరిషత్తువారు గంగాపురమాహాత్మ్యం గురించి ప్రచురిస్తున్న ప్పుడు సురవరం ప్రతాపరెడ్డిగాగు 27 పుటల సుడీర్హమ్టైన పీఠికను వ్రాశారు. అందులో 'కవి తనకన్న పూర్వులగు తెనుగు కవులను స్మరించినాడు. అందు బమ్మెర పోతన తుదివాడు. కుతుణ్‌షాహీల రాజ్యుమేర్చడకమున్నే పోతన యుండెను. కాన అది మనకు కవికాల నిర్భయమున కుపయోగించదు'' అని రాశారు (పుట 22). అయితే కవి చేసిన పూర్వకవుల స్తుతి పూర్తి పాఠం మాత్రం ఉంది.

తాత సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చెనుగు సత్కృతులను దెరువున బెట్టిన యట్టి నన్నయభట్టు నఖినుతింతు సౌబగొందు తిక్కన సోమయాజికి మొక్కి శంభుదాసు దలంచి జృంభణోక్తి నాచనసోముని ధీచర్య గొనియాడి శ్రీనాథసుకవి వరిష్టుగొలిచి రామాయణాఖ్యానరంజితు భాస్కరు పింగళి సూరయ్య రంగనాథు

భీమనాథ దయాధాము ఖీమనార్యు

పుణ్యగుణ ధుర్యు బమ్మెర పోతనార్యు

సరసమహితాంధ్ర వివిధభాషా కవిత్వ

పట్టభద్రుల వరభక్తి బ్రస్తుతింతు. (గంగాపురమాహాత్మ్యం 1-9)

ఈ సీసపద్యంలోని నాలుగవ పాదం ఉత్తరార్థంలో ఉన్న “పింగళి సూరయ్య! అనే పేరు ప్రతాషండ్డిగారి దృష్టిలో ఎందుకు పడలేదో దురూహ్యం. పింగళి సూరయ్య కవికి సమకాలికుడో ఒక తరం అర్వాచీనుడో కావచ్చు.

గంగాపురం చాలా ప్రాచీన గ్రామం. ఎంతలేదన్నా ఇది 1500 సంవత్సరాల కింద నిర్మితమై ఉంటుంది. అప్పుడు దాని పేరు మాయాపురం. గంగేశ్వరలింగ ప్రతిష్టవల్ల పేరు మారి ఉంటుంది. పశ్చిమ చాళుక్య శాసనాలలో ఈ ఊరు పలుమార్లు ప్రసక్తమైంది. మాయాపురీ, మత్స్యపురి, దురిత కోలాహలం, గంగాపురీ అనే పేర్లు ఈ గ్రామానికి నాలుగు యుగాలలో ఉన్నాయట. గంగాపురమాహాత్మ్యం స్కాందపురాణం తీర్థఖండంలో ఉందని ఆదిలోనే చెప్పాడు. ఈ సందర్బంలో సురవరం ప్రతాపరెడ్డిగారు ఇచ్చిన వివరణ గమనించదగ్గది.

“భారతదేశంలోని తీర్థస్థలాలకు పుట్టినిల్లు స్కాందపురాణము. అది యీనాటికి పెరుగుతూనేయున్నది. ఏ స్థలమైనా ఎక్కువగా భక్తుల నాకర్షించినచో ఎవ్వరైనా పనిలేనివాడు సత్క్కృతములో ఆ స్థలమాహాత్మ్యమును గురించి కథలు కల్పించి వ్రాయించి యుంచి అది స్కాంద పురాణాంతర్గతమంటే సరిపోతుంది.” (పుట -18). ఇది ఈ కావ్యానికి కూడా వర్తిస్తుంది. కవిని మల్లారెడ్డి దేశాయి అని పెేర్కొంటున్నా అతని పేరు రెడ్రెడ్డీవారు.

  1. కలిదిండి భావనారాయణ: పుక్కిటి పురాణాల నంగతి అలా ఉంచి అసలు సినలు పురాణం గురించి తెలుసుకొందాం. అష్టాదశ పురాణాలలో కొన్నింటిని మన కవులు తెనిగించారు. ఒకే పురాణాన్ని ఇద్దరు ముగ్గురు అనువదించడం కూడా పరిపాటే, వెన్నెలకంటి సూరన్న విష్ణుపురాణాన్ని తెనుగుచేశాడు. అతనికి కొద్దిగా అర్వాచీనుడు కలిదిండి భావనారాయణ కూడా దీనిని ఆంధ్రీకరించాడు. విష్ణు పురాణంలోని ఆరంశాలనూ సూరన్న అనువదించాడు. భావనారాయణ నాలుగే తెనిగించాడు. ఇతడు కృష్ణా జిల్లా కలిదిండి నివాసి. ఇతని గురువు కందాళ శ్రీరంగగురుడు. సరసత, మృదుత్వం, చక్కదనం, అలంక్రియాస్ఫురణ ఉన్న కావ్యం దేవునికే అంకితమిస్తే సాధ్వీ అవుతుందిట. ఆ గుణాలే ఉన్నా పరులకిస్తి దుష్ఫృతి అవుతుందట. ఇతడు తన విష్ణుపురాణాన్ని పూరీజగన్నాథస్వామికి అంకితమిచ్చాడు. ఇతడు జగన్నాథంలోని

కతులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ జర్‌ సుభద్రాదేవి భక్తుడు. ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని చాటే “పురుషోత్తమఖండాన్ని' కూడా ఆంధ్రీకరించాడు. అది నష్టమయిందిగాని విష్ణుపురాణం దొరుకుతున్నది. మద్రాసు విశ్చవిద్యాలయంవారు ప్రచురించారు.

  1. పొన్నతోట ఓబళకవి: ఇతడు వామనపురాణాన్ని అనువదించి రాణా జిగదేవరాయనికి అంకితమిచ్చాడు. ఈ కవే అంతకుముందు మార్కండేయ పురాణాన్ని తూడా ఆంధ్రీకరించి ఆ ప్రభువుకే కృతి యిచ్చాడని వామనపురాణంలోని అవతారికవల్ల తిలుస్తున్నది. ఇండు అనువదించిన మార్కండేయపురాణం కాలగర్చంలో కలిసిపోయింది. వామనపురాణం పది ఆశ్వాసాల కావ్యం. అముద్రితం. ఈ కవి గురువు పేరు కందాళ శ్రీరంగగురుడు. ఈ కవి వల్ల మార్కండేయ, వామనపురాణాలు అంకీతం పుచ్చుకొన్న రాణా జగదేవరాయలు అన్నిటోనూ సరసుడు. సాహిత్య సార్వభౌముడు. అతడు అధ్యాత్మ రామాయణాన్ని తెనిగించాడట. ఓబళకవి ఇలా చెప్పాడు:

*. అమిత మధ్యాత్మరామాయణము తెనుంగు

కబ్బము గూర్చిపట్టి యక్కవ్సి రేడు

పరుల కవితా ప్రవీణత లయ నేర్చు

నని వచింపగలవయునే యద్భ్బుతముగ?ేకి (౧607

ఓబళకవి పురాణాలూ, జగదేవరాయల అధ్యాత్మ రామాయణం వెలుగు చూడకపోవడ దురదృష్టమే.

  1. రాజలింగ కవి; అష్టాదడశపురాణాల్లో ప్రధానమైన వాటిని పూర్చులు తెనిగిస్తే తూర్మపురాణాన్ని ఈయన తినిగించాడు. ఇతడు కొరపుట్లపురంవాడు. ఇది బహుశా కోరాపుట్టి కావచ్చు. ఈ పురానికి చెరుకు లక్ష్మణమంత్రి అధికారిగా ఉండేవాడు. అతనికి రాజలింగకవి మేలువాడై, ఆప్పుడై, సచివుడై మహాహితవ్రై సఖుడై చరించేవాడు. ఇద్దరూ ఎప్పుడూ ఎడబాయకుండా ఉండేవారు. రాజలింగకవి వీర్షావశా స్తాగమమార్గ నిర్ణయరిరంసుడు. లక్ష్మణమంత్రికి ఎప్పుడూ మృదూక్తులతో శివకథాకథనాలు చేసేవాడు. ఆయన _ ప్రోద్చలంతోటే కూర్మపురాణాన్ని తెనిగించి శ్రీ శ్రాలమల్లికార్డునునికి అంకితమిచ్చాడు. ఇది తామసపురాణాలలో ఒకటి. ఇందులో 17000 శోకాలున్నాయి. దీనిని రాజలింగకవి ఆరాశ్వాసాల కావ్యంగా తెనిగించాడు. ఇది అముద్రితం. ఇందులో కవి శివకవులను, ఇతర కవులను వేరువేరుగా నుతించాడు. శతివకవులలో శరభాంకుడు, ఘటిక సిద్ధేశుడు ఉన్నారు. ఇందులో చివరి కవి గురించి అట్టే తెలియదు. రాజలింగకవి నుతించిన ఇతర కవులలో పింగళి సూరపరాజుగారు, ప్రొడకవి మల్లన అర్వాచీనులు. ఈ పద్యం (0 11) చివర కొంతపోయింది.

నన్నయ్యభట్టు దిక్కన్నను నెర్రయ్య కవిని ఖీమయను భాస్కరుని బోత

రాజును శ్రీనాథు రామలింగయ్యను రంగనాథుని రామలింగకవిని

సూరపరాజును గౌరపాహ్వయు ప్రొడకవిమల్లుగుకవి టైరవుని బెద్ద

నార్నుుని ముక్కుతిమ్మన్నను జిన్తున్న యాదిగారసికులౌనాం ధ్రకవుల...

  1. మద్రాసు టైళ్యాటలాగు, సం[/ పు, 118

476 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ కవి తన గురించి మరే వివరాలూ చెప్పుకోలేదు. తూర్మపురాణంలో నుంచి అప్పకవి ఒక గోదకవృత్తాన్ని అభేద ప్రాసానికి ప్రమాణంగా చూపించాడు. (అప్ప. ౩3-371)

తాలిమీ దూలిన తాపసపత్నుల్‌ - ద్రీడ మనంబున వీడ్కొని జారళ

లోలమదాలసలోచనపంకిక్‌ - జాల దలిర్చిరి శంకరలీలల్‌.

రాజలింగకవి అనువదించింది పురాణమైనా, కవిత్వం ప్రబంధ ధోరణిలోనే ఉంది. వీరేశలింగంగారు ఉదాహరించిన పద్యం చూడండీి.*ే

భంబుగదే నఖావళి నభంబుగదే నడుముక్‌ మదద్విడే

భంబుగదే కచంబు దిగిభంబుగదే నడతీరు హేమకుం

భంబుగదే కుచంబు కరభంబుగదే తొడ పూర్ణచంద్రికా

భంబుగదే స్మ్కితం బురుపభంబుగదే వచనంబు బోటికిక్‌

ఈ కవి వచనంబులు కూడా శుభంబులే. మన సాహిత్యంలో కూర్మపురాణాన్ని అనువదించిన తొలికవిగా ఇతనికి ప్రథమస్థానం ఉంటుంది.

  1. ఒడ్డెపూడి పెద్దయ్య : బెజవాడ దగ్గర్లో ఉన్న కొండపల్లి వద్ద పురుషోత్తమ పట్నం అనేది ఒకటి ఉంది. దీనిని కటుకం గజఎతులు నిర్మించారు. క్రీ.శ. 1550 ప్రాంతాలలో ఈ పట్టణానికెల్లా మోతుబరిగా, కమ్మచౌదరీ పట్టభద్రుడుగా దాసరి చినగంగన్న ఉండేవాడు. ఈయన బాగా చదువుకొన్నాడు. పురాణాలు విన్నాడు. శాస్తితిహాసాలూ, నాటకకావ్య లక్షణాలూ, లక్షణ గ్రంథాలూ, జ్యోతిషాగమ సంగీత రహస్యాలూ సమబుద్ధి ప్రతిభతో విమర్శించాడు. కటకగజపతుల సామంతుడు, నైనికోద్యోగి అయిన బాహుబలేంద్ర హరిశ్చంద్రుడు ఈ చినగంగన్నను బహునుతులతో సత్కరించాడు. ఈయన ఒడ్డేపూడీ పెద్దయకవిని పిలిపించి వాయుపురాణంలో ఉన్న మాఘ మాహాత్మ్యాన్ని చమత్కృతికృతిగా చెప్పించాడు. ఇదే గ్రంథాన్ని ఇంతకు ముందు పిల్లలమర్రి పినవీరయ్య రచించాడు. అయితే బహుశా అది పురాణ్డాలిలో ఉండడంవల్లనేమో చమత్కృతికృతిగా చెప్పించడానికి మళ్ళీ చినగంగన్న ప్రయత్నించి ఉంటాడు. పెద్దయ్య చినఒడ్డెపూడీ గ్రామానికి కరణం. సింహాచల నరసింహస్వామి భక్తుడు. కృతి వారకాంతలాగ ఉండాలని భావించే రోజులలో పతివ్రతలాగ శోఖించాలని భావించే కవి.

లక్షణయుక్తమై కనదలంకృతితో నతులార్థ సంగ్రహో

ద్వీక్షణ గల్లి భర్హతు సుదీర్ణయశంబును గల్లజేయుచున్‌

దక్షతతోడుతన్‌ వినిన దారితకల్మషయే పతివ్రతా

బ్లాక్షి యనంగ నొప్పవలదా కృతి సర్వసభాంతరంబులన్‌? (140 తతా 14. ఆంధ్రకవుల చరిత్రము, ॥ (1898) పుట. 131

ఇతర కవులు 477

పతివ్రతలాంటి కావ్యం సభాంతరాలలో బాగా ఒప్పాలని కవి ఆశించినా ఈ గ్రంథం ఇంకా వెలుగుచూడలేదు. దీని తాళపత్ర ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. (1.409)

కులపురాణాలూ, స్థలపురాణాలూ, పురాణాంతర్గతమాహాత్మ్యాలూ కవిత్వంలో సత్తా ఉంటే ఏనాటికైనా వెలుగు చూస్తాయి. లేదా పరిశోధకులకు మాత్రమే ప్రయోజనకారులుగా మిగులుతాయి.

ఇతర కవులు మలిరాయల యుగంలో సాహిత్యం ఏనుగుపాడి అయితే ఆగవీటిరాజుల హయాంలో అది తామరతంపర. పూవులకన్నా ఆకులే ఎక్కువనిపిస్తుంది. కొన్ని రేతులూడిన కమలాలు, కొన్ని బాగా విడనివి. అన్నింటినీ కొద్దిగా పరిశీలిద్దాం.

  1. పెదకెంపరాయడు ; మైసూరు రాష్ట్రంలోని బెంగుళూరును తిలుగువాడైన పెదకెంపరాయడు క్రీ.శ.1537లో నిర్మించాడు. ఇతని పూర్వులు కంచినుండి కన్నడదేశానికి వెళ్ళి బెంగుళూరుకు 8 మైళ్ళ దూరంలో ఉన్న ఎలహంకలో స్థిరపడ్డారు. వీళ్ళ ఇలవేల్పు పాలించేవాడు. విద్యానగర నిర్మాణానికి చెప్పే “కుందేళ్ళు కుక్కను తరిమే కథ' ఈ నగర నిర్మాణ చరిత్రలో కూడ చెప్పుకొంటారు. ఈ బెంగుళూరు కోటను కట్టేప్పుడు సింహద్వారపు కోటలు పడిపోతూ ఉంటే కెంపరాయని కోడలు లక్ష్మమ్మ నరబలిగా ఆహుతయిందట. కెంపగాయడు క్రీశ. 1569 దాకా పాలించాడు. అతడు తెలుగులో మంచి కవిత్వం చెప్పగలడు.

సుకవులకు సారమై బహు కుకవుల కెదశూలమై యకుంరితధారై

చకీతచకీత వాద్యములై వికసించును బెద్దకెంపవిభు సత్కవితల్‌ |

చకితచకితవాద్యాలై వికసించే కవిత్వాన్ని చెప్పేవాడు, ఆడడానికి వీలైన యక్షగానం బ్రాయడంలో ఆశ్చర్యం లేదు. ఇతడు “గంగాగౌరీవిలాసం' అనే యక్షగానం వ్రాశాడు. ఇది పూర్తిగా లభించలేదు. ఇందులోని రెండు పద్యాలను, రెండు పదాలను ఉదాహరిస్తూ నిడుదవోలు వెంకటరావుగారు ఈ కవి గురించి విపులంగా వ్రాశారు. ఇతని పదాలలో

“కేల ముమ్మొనవాలు, నీ-కేలనే వానిమీద మోజు

పూనెను దలపై నొక యన్ను, యట్టి-వానిపై నేలనే కన్ను జడలలోన నెలవంక, వాని-కడియాస లేలనే యింక తెలిమేనిపైని విభూతి, వాని-చెలువము నీకేమి బ్రాతి అన్నింట కొరగానివాడు, ఓ-కన్నారో! నీ కీడు గాడు.”

త7రి సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

యక్షగాన రచయితలలో ్రోలుగంటి చెన్నయ్య ప్రథముడు. అతని తరువాత పెదకెంపరాయడు చెప్పదగిన యక్షగానకర్త. ఇతని రచన కొంతైనా లభ్యమయింది. అందుకు సంతోషించాలి.

  1. కావూరి ఎల్లయ్య: గుంటూరు జిల్లా నరసారావుపేట తాలూకాలో కావూరు అనే గ్రామం ఉంది. బహుశా ఈ గ్రామానికి చెందిన ఎల్లయ్య రెండు కావ్యాలు రచించాడు; మిత్రవిందాపరిణయం; బ్రహ్మాండపురాణం. దీనిలో మొదటి కావ్యంలో తన వంశచరిత్రను విస్తరంగా చెప్పాడట. అందుచేత ఆ విషయాలన్నీ రెండవ గ్రంథంలో చెప్పక్కర్లేదని వ్రాశాడు. అయితే మొదటిది కాలగర్భంలో మరుగుపడింది. బ్రహ్మాండపురాణం ఆరాశ్వాసాలకావ్యం. ఇందులో పరశరామ, బలరామ, కృష్ణావతారాల చరిత్ర ఉందట. ఈ కవి నన్నయగారిని నుతించడంలో గుర్తించదగిన మాటలు వాడాడు. “అంధ్ర కవీంద్రులకాదియైన శబ్దానుశాసను చరణముల్‌ సేవించి" అన్నాడు.] రామరాజభూషణుడు తన వసుచరిత్రలో నన్నయ్యగారిని “వాగను శాసనుడు' అనడానికి తగినంత సంప్రదాయం కనబడుతున్నది. సంస్కృత బ్రహ్మాండ పురాణంలోని క్రమానికీ, ఇందులో వరుసకతూ సంబంధం లేదట. ఈ కావ్యం అర్థపంచక వివరణఖండానికి మాత్రమే తెనిగింపు.

  2. గూళికల్లు వేంఠటరమణకవి: ఇతడు హరివంశాన్ని పూర్తిగా ఆంధ్రీకరించి ఏడుకొండలవారికి అంకితమిచ్చాడు. అయితే ఆ పుస్తకం నామామాత్రావశిష్టమయింది. ఇతడు ఒకనాడు ఏదైనా “ప్రబంధ రచనా చమత్కృతి" నెగడించాలని తలచాడు. ఆ రాత్రి నిద్రపోయాడు. కలలో ఏడుకొండలవాడు ప్రత్యక్షమయ్యాడు.

మునుపు హరివంశమంతయు దెనుగు చేసి

యంకిత మొనర్చితివి; విక్రమార్క చరిత

మిక బ్రబంధ మొనర్చి మాకిమ్ము సిరులు

శుభము లొసగెద నని పల్కి సుముఖుడగుచు 431)

దేవుడు అంతర్జ్భానమయ్యాడు. ఏడుకొండలవాడు కావ్యవస్తువును నిర్జేకించినా గూళికల్లుకవి దానికి “కనకరంజిత శిఖామణీపరిణయం' అని పేరు పెట్టాడు. ఇది ఆరాశ్వాసాల ప్రబంధం. విక్రమార్కునికి భట్టి అనే వైశ్య సోదరుడున్నాడు. అతడు కనకరంజితశిఖామణిని పెళ్ళి చేసుకోవడం ప్రబంధంలో ప్రధాన కథను చేసి వెంకటరమణయ్య వర్ణించాడు. ఈ కావ్యం అసమగ్రం; అముద్రితం. “కటకటా! ఇట్టీ కుసుమ కోమలిందెగజూడుండని యా తలారులకు రా జెట్లు నోరాడి నెలివిచ్చె...?” అనే ప్రశ్నతో ఈ కావ్యం అసంపూర్ణంగా ఆగిపోతుంది. నేటి సినిమా కరపత్రాలలో సినిమా కథల్లాగా మంచి కుతూహలం రేకెత్తించే ఘట్టంలోనే కథ ఆగిపోయి ప్రశ్న మొదలైంది. సినిమా కథల్లో తరువాయి తెరపైన చూసే అవకాశమైనా ఉంటుంది. ఈ వన తనము శయన నన వసనన న కన

  1. అంధ్రకవి తరంగిణి, 9 పుట 240
  2. మద్రాసు టైక్యాటలాగు, 13, . 01, పుట 615.

ఇతర కవులు తాం “కనకరంజితశిఖామణి పరిణయం'లో కథ ఏమైందో, ఎలా చెప్పాడో మనకు తెలియదు. అసలు చెప్పినంత మట్టుకైనా కథ వెలుగుచూడలేదు.

ఈ కవి 'సుమతీంద్ర సమ్మనీంద్ర' ప్రియశిష్యుడట. ఈ సుమతికీ, సుముతీశతక కవికీ బాదరాయణ సంబంధమో, లేక మరేదైనా సంబంధముందో తెలియదు. గూళికల్లుకవి పూర్వకవులను నుతించడంలో (0431) రామలింగణ్ణీ, తిమ్మనగారినీ పేర్కొన్నాడు. కాబట్టి ఇతడు క్రీ.శ 1600 ప్రాంతంవాడు కావచ్చు.

వల్మీకసంభవ్యాస జైమిని భరద్వాజ బిల్లణకాళిదాసదండి

భవభూతి జయదేవబాణధోయిమయూరచోరభారవిమాఘవీరఖీమ

నన్నయాధర్వణాచార్య తిక్కన పోతరాజు శ్రీనాథ గౌరన్న రంగ

నాధ భాస్కర పెద్దనార్యసూూరన్న యెర్రా పైేగడసోమరామభద్ర

రామలింగనతిమ్మన 'ప్రముఖులగుచు- వేదవేదాంగబహుకళావితతి సంస్కృ

తాంధ్రభాషా కవీంద్రులైనట్టి ఘనుల- భక్తిసేవింతు సుకవితల్‌ పట్టువడగ,

సుకవితలు పట్టుపడడానికి యింతమందిని తలచుకొన్నా విక్రమార్క చరిత్రను బ్రాస్తున్నప్పుడు ప్రాచీనుడైన జక్కన్నను పేర్కొనకపోవడం వింతే!

  1. తామరపల్లి తిమ్మయ్య: హరివంశంలో అశ్చర్యపర్వం అని ఒకటుంది. అందులో ధర్మబోధలు చేసే కథలున్నాయి. వాటిని శేషధర్మాలు అంటారు. సంస్కృత హరివంశంలోని కొన్ని పర్వాలను ఎర్రయ్యగారు ఆంధ్రీకరించలేదు. వారు విడిచిన వజ్రనాభవధ మొదలైన కథలను పింగళి సూరపరాజుగారి వంటి కవులు ప్రబంధాలను చేశారు. శేషధర్మాన్ని ఈ తిమ్మయ్య అనువదించాడు. పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి వెంటపెట్టుకొని కామ్యకవనానికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజుకు తాను స్వయంగా కొన్ని కథలు చెప్పాడు. భీష్ముడు మరికొన్ని చెప్పాడు. భూదానం, అన్నదానం, జలదానం, కన్యాదానం మొదలైన దానాలవల్ల వచ్చే పుణ్యం తిరుపతి, సింహాచలం, హేమకూటం, కుంభకోణం మొదలైన క్షేత్రాలను దర్శించినందువల్ల కలిగే మేలు, శివరాత్రి మొదలైన కొన్ని వ్రతాల లక్షణాలూ ఈ కథలు బోధిస్తాయి. ప్రబంధయుగంలో ఉంటున్నా. ఈ శేషధర్మాన్ని చాలావరకు పురాణ ధోరణిలోనే తిమ్మయ్య అనువదించాడు. ఇతని తండ్రి పేరు శరణుమంత్రి. ఆయన సభాఖిరామం అనే కావ్యం బ్రాశాడట. ఆ సంగతి అవతారికలో తిమ్మయ్య చెప్పాడు. తామరపల్లివారికి పూర్వం పైడిగంటంవారనే ఇంటిపేరు ఉండేది. తిమ్మయ్యకు ఏడవతరంలోని అబ్బమంత్రి అనే పూర్వీకుడు ప్రొడదేవరాయలను (క్రీ.శ1423-1450) మెప్పించి పైడీగంటం బహుమానం పుచ్చుకొన్నాడు. అబ్బమంత్రి ప్రొడదేవరాయల కాలంలో ఉంటే, తరానికి పాతికేళ్ళు లెక్కిస్తే తిమ్మయ్య క్రీ.శ. 1575 ప్రాంతాలవాడవుతాడు. తిమ్మయ్యను ఇందుపురేమి ధర్మాజీవారు పిలిపించి శేషధర్మాలు అనువదింపజేసి శ్రీరామానికి అంకితం ఇప్పించాడు. ఈ ధర్మాజీగారి పెదతండ్రి నారాయణరావు గోలకొండ నవాబులవద్ద ఉద్యోగి. “ప్రబల సుల్తాక మహమ్మదు పాదుషాయ మహిమ సా మ్రాజ్యవైభవమజుందారు

480 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వాయహేళి నారాయణరాయమౌళా అని కవి ఇతణ్జీ వర్ణించాడు (1-50). కుతుబుషా క్రీశ. 1580 నుండి పాలించాడు. ధర్మాజీ కూడా గోలకొండ నవాబుల వద్ద ఉద్యోగి కావచ్చు. “ఇందుపురేమి' గ్రామానికి అధికారి. ఇది తెలంగాణాలో ఉండవచ్చు. కని గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకావాడు. అక్కడ తామరవనల్లి అనే గ్రామముంది. తిమ్మయ్య వ్రాశాక శేషధర్మం చాలా ప్రచారం పొందింది. దాత కోసం పూర్వపురాణ కథలు చెవుల కింపుగా చెప్పడం కూలి ఇచ్చి చెరుకులు తినడమంత సుఖమైనదంటాడు ఇతడు.

పౌర దెరలించుక్‌ మిగియపుం బొడి శర్కర దార్చి చేతికిం

జెరకులు కూలికిందినగ జేతము దార్చుట గాదె దాతయు

క్కర గని బూర్చపుణ్యకథ కర్ణసుఖక్రీయ దేల్చి వారిచే

బొరసిన యర్ధసిద్ధి నిహాముంబరముంగనే నేర్పు గల్లుటక. (కష. 1-2౫) ఐతే తిమ్మయ్య కూలికి దిన్న చెరుకులో పుచ్చులు హెచ్చుగా లేవు.

  1. మోచర్హ నన్నయ్య: ఆదికవి నన్నయ్య తరువాత మళ్ళీ ఆ పేరింటి కవి 17వ శతాబ్బ్దంలొ కనబడుతున్నాడు. నన్నయ్యభట్టుది ముద్గలగోత్రం. ఇతనిది భారద్వాజస గోత్రం; మోచర్ల మాధవయ్యగారి కుమారుడు. ఈ నన్నయ్యకూ, పింగళి సూరపరాజు గారికీ బంధుత్వం ఉంది. పింగళివారు ఇతని మాతామహులు ఆ సంగతి క్రింది పద్యం వల్ల తెలుస్తున్నది. (౫ 495)

ధరనాంధ్ర కవితాపితామహనన్నయ్యభట్టు సద్బక్తితో బ్రణుతిజేసి

భారతసాగరోత్తరణనిపుణు దిక్కనసోమాయాజుల వినుతిజేసి

హరివంశభరతాఖ్యానావధానసజ్జనను నెర్ర పైగ్గడను భజబించి

ప్రేమ మదీయమాతామహవంశవిహారు వింగళిసూరపార్యు దలచి

వెలయ శ్రీనాథభట్టారకులను బోత-రాజకవివర్యులను మొక్కి రామలింగ

పెద్దనార్యుల గొనియాడి బిరుదులైన- వర్తమాన కవీంద్రుల వరుస దలచి.

ఆంధ్రకవితా పితామహబిరుదు అల్లసాని పెద్దనగారికి సుప్రసిద్ధం. అయితే దానిని ఈ నన్నయ్య ఆ నన్నయ్యగారికి సమర్పించాడు. మోచర్ల వారిది నెల్లూరు జిల్లా తుమ్మిడీ గ్రామం. ఆ గ్రామంలోని బాలగోపాలుని వరక్రసాదంవల్ల నన్నయ్య కవిత్వాచాతుర్య ధుర్యుడయ్యాడట. ఇతడు కాశీఖండాన్ని ద్విపద కావ్యంగా చెప్పి నరాంకితం చేశాడు. అయితే దానివల్ల లాఖించలేదు. అందుచేత సర్వలక్షణాలూ లక్షించి సాంబోపాఖ్యానం అనే అయిదాశ్వాసాల ప్రబంధాన్ని చెప్పి దేవునికే అంకితమిచ్చాడు.

కాశీఖండము వేడ్కతో ద్విపదగావింపగా నేర్చితి౯

వాసి న్మీర నరాంకితంబుగ దానక్‌ లాభమేమంచును

ల్లాసం బొప్పుగ సర్వలక్షణముల౯ లక్షించి సాంబోదయం

బాసర్వేశ్సరు కంకితంబుగను జేయంబూని యున్నట్టిచోక. (1494)

ఇతర కవులు శరీ] సర్వలక్షణాలూ లక్షించి చెప్పిన లాక్షణికులు గుర్తించారనే చెప్పాలి. అప్పకవి ఒక

సాంబోపాఖ్యానంలోంచి రెండు ప్రయోగాలు స్వీకరించాడు. అయితే కర్తపేరు చెప్పలేదు.

ఒక పద్యాన్ని అభేదవర్ణయతులలో ఫకారానికి ఉదాహరణగా ఇచ్చాడు (౩3-102). మురసంహరు నాటోప- స్ఫురణమ్మునకుక సదాళివుండైనరణ

స్థిర నిలువగలడె బాణా-సురునకు దోడుపడ వచ్చి సౌలయుట వినరే? ఇంకో పద్యాన్ని 'యుష్మదస్మచ్చబ్బయతులను' పేర్కొన్న సందర్భంలో ఉదాహరించాడు (అప్ప. ౩3-123)

చతురానననందనది- వ్యతపోధనవర్యయుష్మదాగమనమునక్‌

గృతకృత్యుడనైతిని నే- నతిపావనమయ్యె నస్కదన్వయ మెల్లక్‌.

సాంబోపాఖ్యానాన్ని ఈ నన్నయ్య ఒక్కడేకాక రామరాజు రంగప్పరాజు తూడా బ్రాశాడు. అయితీ ఈ పద్యాలు రంగప్పరాజు వ్రాసిన కావ్యంలో లేవట. అందుచేత నన్నయ్య గగ్రంథంలోనివే అని చెప్పవచ్చు. నన్నయ్య వ్రాసిన ద్విపద కాశీఖండం బయటపడలేదు. సాంబోపాఖ్యానం అచ్చుపడలేదు. పద్యకావ్యాలను ద్విపదలుగా మార్చడం మన సాహిత్యంలో మామూలే. ఈ కవి కాశీఖండాన్ని ద్వాపదగా చెప్పాడట. ఇతని మనుమడు అధ్యాత్మరామాయణం వ్రాశాడు. అందులో తన తాత గురించి (కవిత) రచనలు కుల్కెడు పల్కు అమర, శబ్బనాటకాలంకార సరణులొప్ప, జెలుపు మొరయ కాశీఖండామెలమి ద్విపదజేనె గంచర్ల యయ్యనశణ్రీలు ప్రబల” అని చెప్పాడు. కావ్యాన్ని రచించడమే కాక ఈ కవి ఇతర సత్కార్యాలు తూడా తవ్వించాడు. మధురకు మో త్రోవలో రావిచెట్లు పాతించాడు. దేవ ప్రతిష్టలు చేశాడు. ఇతని ముత్తాత మేడూరి కరణం. శ్రీకాకుళ ఆంధ్ర విష్ణువు సేవ కోసం అయ్యన్న ముత్తాత క్రీ.శ1438లో భూదానం చేశాడు. ఈ కంచెర్లవారు నాటినుండి స్థితిమంతులు. కొందరు కవిత్వం చెప్పారు. ద్వాపద కాశీఖండం అలభ్యం.

  1. వారన్నగారి సూరన్న; అశియ రామరాయల వద్ద బయకార రామప్పయ్య అనే సంగీత విద్వాంసుడు దండనాయకుడుగా ఉండేవాడు. అతని వద్ద ముడియం భాస్కరుడనే వ్యక్తి సైనికోద్యోగిగా ఉండేవాడు. ఈ ఖాస్కరుడు ఏదైనా కావ్యాన్ని అంకీతంగా పుచ్చుకోవాలనుకొన్నాడు. నారన్నగారి సూరన్న అనే కవి 'ఉదయనోదయం' అనే కావ్యాన్ని వ్రాసి మరణించాడు. అతని కొడుకు నారన్న ఈ కావ్యాన్ని ఎవరైనా కృతి ఇవ్వాలనుకొంటున్నాడు. అప్పుడు భాస్కరుడు కవిగారి కొడుకును పిలిపించి ఆ పుస్తకాన్ని అంకీతం పుచ్చుకొన్నాడు. నారన్నగాలి సూరన్న ఇం ద్రేశ్వరేశ్వరభక్తుడు. గజరావువీరుదాంకులైన రాచవారికి హితుడు. ' ఉదయనోదయం'లో వత్సరాజు కథను, అతని తండ్రీ చరిత్రను చెప్పాక వర్ణించాడు. ఈ గ్రంథం ఆముద్రితం. తంజావూరు సరస్వతీ

482 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మహల్‌ గ్రంథాలయంలో ఒక ప్రతి ఉంది. ఈ ఉదయనోదయం వ్రాయడానికి ముందు నారన్నగారి సూరన్న వనమాలివిలాసమనే కావ్యం వ్రాశాడు. ఇందులో మిత్రావిందా పరిణయం వర్ణించాడు. ఇదికూడా అముద్రితమే. ఇతని కవిత్వం 'సలక్షణమై మృదువుగా' ఉందని కందుకూరి పీరేశలింగంగారూ,* ఫ్రొడమైన సరసహృదయానురంజకముగా' ఉందని చాగంటి శషయ్యగారూ అభిప్రాయపడ్డారు.

  1. రాయసం వేంకటపతి; వసుచరిత్ర అంకితం పుచ్చుకొన్న తిరుమలరాయలకు శ్రీరంగరాయలనే కుమారుడున్నాడు. ఇతడు తండ్రి జీవితకాలంలోనే (క్రీ.శ. 1574-1581) రాజ్యభారం వహించాడు. ఈ శ్రీరంగరాయల వద్ద రాయసం ఉద్యోగిగా వేంకటపతి ఉండేవాడు. ఇతడు రాయలచిత్తం చిగురింపగా రాయసం వ్రాయడమేగాక మంచి పద్యాలు కూడా చెప్తాడు. ఇతనికి ఇష్టదైవం తిరుపతి వెంకన్న కలలో కనపడీ ఇలా అనతిచ్చాడటః

ప్రతిపద్యశిరః కంపము - ప్రతిపదచిత్రార్థగోచరము ప్రతి వాక్య

  • . స్థితిరసబంధురమైయు-న్నతి గాంచ బ్రబంధమివొనర్చుముహరికిన్‌ ఆ మాట శిరసావహించి ఈ కవి లక్ష్మీవిలాసమనే 58 ఆశ్వాసాల ప్రబంధాన్ని వ్రాశాడు. క్షీరసాగరమథనం, హాలాహలం, అమృతం పుట్టడం, మోహినీరూపంలో విష్ణువు బంతిలో వలపక్షం చేయడం, లక్ష్మి అఆవిర్చవించడం, సముద్రుడు ఆమెను విష్ణువుకు మీదుకట్టడం, ఆమె విరహం, లక్ష్మీనారాయణుల కల్యాణం ఇందులో ఉన్నాయి. ఈ లక్ష్మీవిలాసంలోని 650 గద్భుపద్యాలలో వాణీవిలాసమే ఎక్కువ.
  1. ఉప్పుగుండూరి కవులు: మట్ల అనంతరాజుగారి కాలంలో సిద్ధవటసీమలో ఒక *అంధ్రకవితాపితామహు' డున్నాడని తెలుసుకొన్నాం. అతని పేరు వెంకటకవి. ఆయన వ్రాసిన గగ్రంథాలేమిటో తెలియవు. అయినా ఇంకొక ఉప్పుగుండూరి కవి సంగతి తెలుస్తున్నది. ఎవరో వెంకటకవికుమారుడు పెరియన్నకవి “మీనకేతనాభ్యుదయం' అనే కావ్యాన్ని వ్రాసి అశలియ రామరాయల మనుమడు పెదవేంఠటరాయలకు అంకితమిచ్చాడు. (రామరాయల 5వ కుమారుడు శ్రీరంగ రాయలు. ఈయన కొడుకే పెదవెంకటరాయలు) మట్లవారి కొలువులో ఉన్న ఉప్పుగుండూరి వెంకటకవి అంధ్రకవితా పితామహుడైతీ, ఈ ఆరవీటివారికి కృతి అంకితమిచ్చిన పెరియన్న “సత్కవివేశ్యాభుజంగుడు.” తిక్కన కాలం నుండి రాజులను '“రాయవేశ్యాభుబింగు' లనడం ఆనవాయికేగాని కవుల పట్ల ఈ బిరుదు వాడడం అరుదు. 'మీనకేతనాభ్యూుదయం' అచ్చుకాలేదు. ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఈ కావ్యానికి రెండు 'ప్రతులున్నాయి.. ఆంధ్రకవితాపితామహుడైన ఉప్పుగుండూరు వెంకటకవీ, ఈ నత్కవివేశ్యాభుజంగుడూ బహుశా తండ్రీకొడుకులు కావచ్చు.

  2. డి. క్యాటలాగు పుట 24, నెం.139

  3. అంధ్రకవుల చరిత్ర

  4. ఆంధ్రకపితరంగిణీ, 0 పుట 84. _

ఇతర కవులు న!

  1. కుందుర్తి పండితులు: అరవీటిరాజులు దేశాన్ని పాలించే రోజుల్లో నుప్రసిద్ధమైన పండిత కుటుంబాలలో కుందుర్తివారిది ఒకటి. అహోబల మంత్రి అనే పండితుడు అశ్వపతులను, గజపతులను తన పాండిత్యంచేత మెప్పించాడు. ఈ సంగతి ఇతని మునిమనమడు వ్రాసిన మిత్రవిందాపరిణయంవల్ల తెలుస్తున్నది అహోబల మంత్రి గురించి అందులో ఇలా ఉందిః

మెప్పించెక్‌గటకాధాపాశ్చ్వపతిభూమిపండిత శ్రేణి దా

నిప్పించెక్‌ శిఫికర్ణఖేచరుఅయట్లిష్టార్థ మర్థాళికి౯

గప్పించెన్నిజకీర్షిచంద్రికలు దిక్కాండంబు యజ్ఞంబులక్‌

రప్పించెక్‌ హవిరంశభుక్తికి హరిబ్రహ్మాదుల న్నిచ్చలుక్‌. (0.645)

ఈ విద్వక్కిసరికి గోవిందయ్య అనే తువ్లూర్డుడు పుట్టాడు. ఇతడు కవి. భారతీపరిణయం అనే కావ్యాన్ని వ్రాసిన వీరవేంకటవెత్‌ రాయలకు (క్రీ.శ 1586-1684 అంకితమిచ్చాడు. ' విశ్చ్వపరితోషకారి గోవిందశౌరి' గురించి అందులో ఇలా ఉంది

పటుతరగోస్తనీ మధురపాకసమంచిత మైరసోర్మిప

ర్కటమగు భారతీపరిణయం బను కావ్య మొసంగి వీఠవేం

కటపతిరాయలందనిపి కాంచె మణీకనకాఖిషీక ము

త్కటగతి నమ్మహామతి సుఖస్థితి శోఖి యళోఖిరాముడై. (౧.648

వేంకటపతి రాయలచేత తనకాఖిషికం చేయించుకొన్నా గోవిందయ్య కావ్యం నేడు అలభ్యం.

  1. రేటూరి కవులు : గుంటూరు జిల్లా బాపట్లకు 8 మైళ్ళ దూరంలో రేటూరు అనే గ్రామం ఉంది. బహుశా ఈ గ్రామంలో పూర్వం ఉండడంవల్ల ఒక కవి కుటుంబానికీ రేటూరివారని పేరు వచ్చింది. రేటూరి రంగరాజు అనే కవి ఆరవీటిరాజుల కాలంలో ఉండేవాడు. చాలా గట్టివాడు. అష్టావధానాలూ, శతావధానాలూ చేసేవాడు. వెలుగోటి వారికి ఆభ్రితుడు. భానుమతీపరిణయం అనే నాలుగాశ్వాసాల కావ్యం వ్రాసి వెలుగోటి రాయప్ప నాయనికి అంకితం చేశాడు. ఈ కావ్యంలోని నాయిక శ్రీకృష్ణుని పినతండ్రికూతురు భానుమతి. ఈమె పాండవుల్లో కడగొట్టువాడు సహదేవుణ్ణి పెళ్ళిచేసుకొంది. “ఇతివృత్తంలో విశేషం లేదు అని చాగంటి శేషయ్యగారు వ్రాశారు ఈ కావ్యాన్ని వ్రాసిన రంగరాజు తన గురించి చెప్పుకొన్న పద్యంలో మాత్రం ఒక విశేషముంది. అందులో తన ప్రజ్ఞలను కృతిపతి చేత ఇలా ప్రశంసింపజేసుకొన్నాడు:

వ్యస్తాక్షరీధుర్య విస్తీర్ణభావంబు కముకసంఖ్యాఖ్యానకౌశలంబు

నారోహణావరోహణలేఖనప్రొడి యగ్రపద్య గ్రహణాభఖిరక్తి

యనవలోకితశారికాఖిఖేలనరీతి వరసమస్యస్ఫూర్తి వైభవంబు

సముదర్ర నేక్షితచతురంగబలకేళివిలాసము నేకకాలముననె .ం 8. అంధ్రకవితరంగిణి-౫0, పుట 171

తీర్రిత సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి యలర బ్రకటింప నేర్తు వష్టావధాన

కవితశతలేఖినీ పద్యగద్యశక్తి

బాటిమిరితి నాంధ్రకర్ణాటకచోళ

రాజసభలను రేటూరి రంగనార్య! (౧.602

ఈ పద్యంవల్ల అనాటి అష్టావధానాలలోని అంశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. నేటి అష్టావధానాలలో కావ్యపాఠం, కవిత్వం, శాస్తార్ధ. అకాశపురాణం, లోకాఖి రామాయణం, వ్యస్తాక్షరి, చదరంగం, పుష్పగణనం అనే అంశాలున్నాయి. ఇందులో కొన్నింటికి మారుగా దత్తపది, నిషిద్ధాక్షరి, పదహరుగళ్లున్న చదరంగంలో ఎటుకూడీనా ఒకే అంకె వచ్చే యాంత్రికచిత్రం, చదరంగంలో అన్ని గళ్ళలోనూ గుర్రాన్ని దాటించడం, గంటలు లెక్కపెట్టడం మొదలైనవి చేరుస్తారు.” రంగరాజు చెప్పిన ఎనిమిది అంశాలూ మన అష్టావధానాలలో కొన్నింటికి సరిపోతాయి. శౌరికాఫిఖేలనం ఏమిటో తెలియదు.

ఈ ప్రాచీన అష్టావధానిచేత అంకితం పుచ్చుకొన్న రాయప్ప నాయడు వెలుగోటివారి వంశంలోని ఇరవయ్యోతంంవాడు. వెంకటపతి రాయలవారి కాలంలో సుప్రసిద్ధుడైన కస్తూరి రంగప్పనాయనికి ఈ రాయప్ప, పెదతండ్రి మనుమడు.! క్రీ.శ 1520 ప్రాంతాల నుంచి రంగప్పు ఆరవీటి రాయలకు తోడ్పడ్డాడు. అతని తరువాతి తరంలోని రంగరాజుకాలం నిస్సందేహంగా 1675-1600 ప్రాంతాలని భావించవచ్చు.

ఈ రంగరాజుకు ఏవిధంగా బంధువో తెలియదుగాని ఈ ఇంటిపేరుతోనే భావనామాత్యుడనే కవి ఒకడు కనబడుతున్నాడు. ఇద్దరూ శ్రీవత్సగోత్రులే. ఇద్దరూ అద్దంకి సింగరాచార్యుల శిష్యులే. అందుచేత వీళ్ళు ఒక కుటుంబంలోని వాళ్ళూ, ఒక కాలంలోని వాళ్ళు అని నిర్ణయించవచ్చు. రంగరాజ శతావధానికి ఈ భావన పినతండ్రి కావచ్చు. ఇతడు కామేశ్వరి చరిత్రం అనే ద్విపదకావ్యం వ్రాశాడు.

ఈ కావ్యం గురించీ ఈ కవి గురించీ 'కులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ' అనే ప్రకరణంలో ఇంతకుముందు చెప్పుకొన్నాం.

  1. ఎలుగంటి పెద్దన : తొలి యుగాలలో పూర్వులు అనువదించిన శాస్త్ర గ్రంథాలను ఆరవీటిరాజుల యుగంలో మళ్ళీ కొత్తగా తెనిగించడం జరిగింది. కామందకం మొదలైనవి అలాగే తిరిగి తర్జుమా చేశారు. వీరాచార్యుల సారసంగ్రహగణీతాన్ని చాళుక్కయుగంలో పావులూరి మల్లన్న అనువదించాడు. ఈ యుగంలో ఎలుగంటి పెద్దన తెనిగించాడు. ఈ క్రింది కారణం చెప్పాడు ఫ్‌

వీరాచార్యులు సంస్కృతాన గణితాల్‌ విఖ్యాతిగా జేనె దా

నారూడిం బది పావులూరికవి మల్లామాత్యు తెల్గించె నక్‌

పెరేగాని' గుణించలేరు గణకుల్‌ ఖిన్న ప్రకీర్ణంబు లీ

తీరెనక ఎలుగంటి పెద్దన యవిక్‌ దెల్పెక్‌ గుణించక్‌ ధరళ. (1114) 8. వెలుగోటివారి వంశావళి - నేలటూరి వెంకటరమణయ్యగారి పరిష్కరణ, పుట 60 తర్వాత వంశవృక్షం.

ఇతర కవులు 4ీ8్రిగ్‌ ఈయన ఏ ఊరివాడో, ఎప్పటివాడో సరిగ్గా తెలియదు. ఇతడు సకలగణిత పద్ధతుల్లో పారీణణ్ణీ అని చెప్పుకొన్నాడు. రాజసభలలో ధీరుడు. ఇతని ఖిన్న ప్రకీర్ణగణితాల ప్రతి ఒకటి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో అసమగ్రంగా ఉంది.

  1. బద్దెవీటి దత్తప్పు; ఎలుగంటి పెద్దన్న ఏ రాజు సభలో ధీరుడో చెప్పలేంగాని దత్తప్పు అనే మరొక గణితశాస్త్రవేత్త మాత్రం సుగుటూరి చిక్కరాయల కొలువులో ఉండేవాడు. ఆ ప్రభువు అజ్ఞాపిస్తే 'గణితదీపికు అనే గ్రంథాన్ని పద్యాలలోవ్రాశాడు. ఇది తూడా అముద్రితమే. దీని ప్రతి అడయారు గ్రంథాలయంలో ఉంది. చిక్కరాయల కాలం 1510-75 ప్రాంతాలు కనుక ఈయన కూడా అప్పటివాడేనని పండితులు లెక్కించారు.

  2. నెప్పల్లె అప్పన్న ; ఇతడు శైవాగమశిఖామణీ అనే 5 ఆశ్వాసాల మతగ్రంథు వ్రాసి శ్రీశ్రైాలమల్లికార్డునునికి అంకితమిచ్చాడు. విభూతి, రుద్రాక్షలు, శివలింగం మొదలైనవి ఎలా ధరించాలో, ధరిస్తే ఏమిటి ఫలమో, శివపూజలో ఎంత మహత్వం ఉందో ఈ గ్రంథంలో కవి వివరించాడు. ఇతడు ఇవలూరి వామనారాధ్యుల శిష్యుడు. ఈ వైవాగమశిఖామణి అముద్రితం (2462 దీని గద్యలో కవి తాను సరస కవితాచాతుర్యం గలవాడనని చెప్పుకొన్నాడు. ఆ చాతుర్యం ప్రకటించే కావ్యాలు ఇతడేం వ్రాశాడో!

  3. మల్లవరపు వీరేశ్వరుడు : అప్పన్నలాగే సరసకవితాచాతుర్యం గలవాడు మరొకడున్నాడు. అతడు కూడా ఇవటూరి వామనారాధ్యుని కిష్యుడే. భల్లాణ చరిత్ర అనే 5 ఆశ్వాసాల పద్యకావ్యం వ్రాసి మల్లవరంలోని నాగేశ్చరునికి అంకితమిచ్చాడు. ఈ మల్లవరం కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలో ఉంది. భల్లాణుడనే ఒక రాజువద్దతు ఒకనాడు ఈశ్వరుడు మిండజంగం వేషంలో వచ్చి తనకు వారకాంత కావాలని అడుగుతాడు. ఈ కథను మరికొన్ని గాథలతోనూ, విభూతిధారణఫలం, పంచాక్షరీ మహిమ మొదలైనవాటితోనూ కలిపి వీరేశ్చరుడు రచించాడు. ఇతని రచనలో “దేవతామాహాత్మ్యములే కాక కవితా లక్షణమైన చమత్కారముగూడ కలుగుటచే కావ్యసిద్ధియు నేర్చడినది. మరియు ధారాశుద్ధి గలిగియుండుటచే వివిధ కవులు రచించిన భల్లాణచరిత్రములలో నిది యుత్తమమైనదనియు చెప్పవచ్చును”. అని పరిశోధకుల అఖిప్రాయం.*? ఈ భల్లాణచరిత్ర అచ్చుపడలేదు (0.598)

  4. పెనుమర్తి వెంకటార్యుడు ; లాక్షణికులు అనేకులు “అనేకదార్ల ఛందాలు చెప్పారని, స్వేచ్చాయుతబుద్ధితో లక్షణ విలాసమనే గ్రంథాన్ని ఈయన వ్రాశాడు. ఇందులో 'ఇరువదార్యతు లిర్వది ప్రాసభేదముల్‌ చెప్పాడు. ప్రాచీన లక్షణగ్రంథాలు ఎన్నింటినో చూచి లక్ష్యలక్షణాలను చేర్చాడు. ఈ '“లక్షణవిలాసం' అసమగ్రం; అముద్రితం. దీనిని అప్పకవి తన పుస్తకంలో పేర్కొన్నాడు. లక్షణ విలాసంలో ఉదాహరించిన కొన్ని గ్రంథాలు నేడు దొరకవు. అవి ఇవి: 1. ఆదినారాయణవిలాసం.

  5. అదిపురాణం, ౩. కవికంఠాభరణం, 4. నీతిభూషణం, 5. మర్రికంటివారి ప్రయోగం,

  6. విజయసేనం.

  7. ఆంధ్ర కవిసప్తశతి' - బులుసు వెంకటరమణయ్యగారు, పుట 9.

  8. వీర్దోవాంధ్ర వాజ్మయం - శిష్టా రామకృష్ణశాస్త్రిగారు.పుట 2ట.

486 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

విజయసేనంలోనిదని చెప్పి అప్పకవి ఒక పద్యాన్ని (3254) ఉదాహరించినాడు. బహుశా దానిని ఈ లక్షణవిలాసంనుంచే స్వీకరించి ఉంటాడు. వెంకటార్యుడు చూపించిన మగ్రికంటివారి. ప్రయోగం ఒకవేళ మరింగంటి వారి ప్రయోగమేమో అని అనుమానించవచ్చు. అయితే “మర్రిఛందం' అనే పుస్తకం ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (౧.1308). ఇది చదలువాడ రామునికి అంకితం. లక్షణవిలాసాన్ని, మర్రిఛందాన్ని తైపారువేయాలి.

  1. కోట శివరామకవి; శృంగారవీరరసాలకే పెద్దపీటలు వేసి ప్రబంధాలు నిర్మించే కాలంలో భయానక, వీభత్సరసాలకు ప్రాముఖ్యమిచ్చి శాంతరసాన్ని దృష్టిలో పెట్టుకొని రచించడమనేది వింతగానే ఉంటుంది. ఇది కోట శివరామకవి చేశాడు. ఇతడు అఖినవ ధూర్జటి శిష్యుడు. ఈ ధూర్జటి అష్టదిగ్గజాలలో ఒకడైన కవిధూర్జటే కావచ్చు. తన గురువు సారచిత్ర కవిత్వగరిమ ప్రబంధసంఘాలు చేసినవాడని శివరామకవి చెప్పాడు. ఇతడు కాళీభత్తుడు. ఆమె వరప్రసాదలబ్ధ సాహిత్యవైభవుడు. కాళహస్తికి దగ్గరి కోట గ్రామానికి కరణీకమొనరించినవాళ్ళ వంశంలో పుట్టాడు. ఇతని తాత పేరును బట్టి చూస్తే ఇతడు తమిళుడేమో అనిపిస్తున్నది. అరవవాళ్ళలో అన్నయ్య అనడానికి “అణ్డాచ్చి' అంటారు. ఇివరామకవి తన తాత పేరు 'అణ్ఞాచ్చి' అని చెప్పాడు. అయితే తండ్రిపేరు మాత్రర

సానందోపాఖ్యానం అద్బుతలోకోత్తరమైన ఇతిహాసమని ధూర్జటే చెప్పినట్టు కవి విశదం చేశాడు. ధర్మప్రసంగుడనే ముని ఒకనాడు చెప్పిన కథలు చెప్పాడు. “పుణ్య మొనరించువారలు వొందుగతులు, బాప మొనరించువారలు పడెడు వెతలు” అని ఆయన చెప్పాడు. వీటిని సానందుడనే బుషి విన్నాడు. బాధపడ్డాడు. “కొందరిట్లా మహనీయవైభములంది సుఖించుటేమిటికి? కొందరీబాములు బొందు టేమిటికి?”” అని వితర్కించుకొన్నాడు. సర్వజీవదయాపర్వతం, సర్వదేవవిభుత్వం గల దేవుడు ఇలా పక్షపాతం చూపడం బాగులేదనుకొన్నాడు.

కపటనాటకసూత్రాధికారి శివుడు - వసుధలోపల జన్మించువారి కెల్ల

జిన్మయానందనిర్మలచిత్త మొసగ-దనదు బండార మేమైన దరగిపోనొ? అని సానందుడనుకొన్నాడు. నరకాన్ని కళ్ళారా చూడాలనుకొన్నాడు. చూశాడు. అతని గుండె కరిగింది. శివపంచాక్షరీ మంత్రంతో అక్కడి పాపులందరికీ విమోచనం కలిగించాడు. ఈ కావ్యంలో యమయాతనలను, నరకబాధలను కవి కళ్ళకు కట్టినట్లే కాక కలలోకి వచ్చేటంత భయంకరంగా చిత్రించాడు. యమలోకానికి వ్ళ్ళో దారిలోనే వీలైనన్ని చిత్రహింసలూ వర్ణించాడు. ఆ దారిలో రొంపిగలిసిన కొత్త సున్నంపుటిళ్ళూ. పెద్దచీకట్లు గ్రమ్మెడు పెద్దపాదలూ ఉంటాయట. గ్రామ గంగ జాతరకు దామెనలు కట్టి కొంచుబోవు దారిగొర్రైలట్లు పాపమతులను బట్టీ బల్మిగా యమభటులు తీసుకుపోతారట. వీడికి పువ్వులదండలు వేడుక అని తేళ్ళ్చదండలు వేస్తారట. మానవుడు చెయ్యగలిగినన్ని పాపాలనూ, వాటికి వెయ్యగలిగినంత దుర్భర కరినశిక్షలనూ

ఇతర కవులు వతి? ఇివరామకవి చర్జించాడు. కొందరికి మంచి గతులు, కొందరికి పాడువెతలు ఎందుకు కలగాలి? అని సానందునిలాగ ఆలోచించడం ప్రతియుగంలోనూ అవసరమే.

  1. కొటికెలపూడి సోమనాథుడు; నవాబుల పాలనలో వినుకొండ పరగణాను రామలింగభాస్కరుడు పరిపాలించేవాడు, ఇతనికి ముద్రమంత్రి అనే దత్తపుత్రుడున్నాడు. ఈ ముత్తయ్య జనక తండ్రి గుంటుపల్లి వెదవీరరాజు; పినతండ్రి గుంటుపల్లి తిప్పయ్య. కొటికెలపూడి సోమనాథుడనే కవి విష్ణుమిత్రోపాఖ్యానం అనే 5 అశ్వాసాల ప్రొడకావ్యాన్ని ఈ తిప్పమంత్రికి అంకితమిచ్చాడు. తన కవిత్వం ఎలా ఉంటుందో కృతిపతి నోటంట కవి ఇలా చెప్పించాడు:

సరసాగ్రేసర కోటనార్యుని తనూజా! సోమ! విద్వత్పురం

దర నీ చాటువచోవిజబ్బంభణములుద్దాటించు నర్జేందుశే

ఖరకో టీరకుటీరకోటరలుఠద్గంగోర్మిధారాశివం

కరఘంఘంఘమచ క్రమచత్కార ప్రగల్పార్భటి€.

ఈ కవి తండ్రి కోటయ్య గొప్ప పండితుడు. కుకవికుంజరఘలూపంచాననుడు. తండ్రీలాగే సోమనాథుడు కూడా కుకవులపాలిటి గొడ్డలి. కృతిపతి ఇలా చెప్పాడట.

కొటికెలపూడి సోమవిధు కోటయసోమ సరస్పతీశిరః

తటకకిరీటరత్న ఘటికామహనీయధగద్ధగప్రభా

పటలతిరద్కియాధిగతపాటవముల్‌ భవదీయవాక్యముల్‌

కుటిలవిరోధియోధకవిలోక కఠోరవనీకుళారముల్‌

ఈ కవికి 'శారదాభరణాంకు'డనే బిరుదు కూడా ఉంది. ఆంధ్రదేశంలో రెండు కొటికలపూడి గ్రామాలున్నాయి - ఒకటి గుంటూరు బిల్లా ఒంగోలు తాలూకాలో; ఇంకొకటి కృష్ణా బీల్లా నందిగామ తాలూకాలో. కవి ఏ గ్రామంవాడో చెప్పలేం. ఇతడు బ్రాసిన విష్ణుమిత్రోపాఖ్యానం ముద్రితమే. తిప్పయ్యలాగే అతని అన్న కొడుకు ముత్తమంత్రి కూడా విద్యాపోషకుడు. దాశార్హచరిత్ర అనే కృతిని అంకితం పుచ్చుకొన్నాడు. ఇతనిపై ఎందరో కవులు చాటువులు చెప్పారట. వాటిలో కొన్నిటిని తొణిదెన బాలకృష్ణయ్యగారు శ్రీముఖసంవత్సరాది సంచికలో ఉదాహరించారు.

నావిద్వత్కవితావిశ్స్శంఖలవచో పుణ్యధారాళధా

రావష్టంభ విజ్బంభణమ్మునకు నౌరా। వీరముత్తప్రధా

నావిర్బూతవితీర్ణిగల్లవలె, లేదా యన్యులక్‌ వేడనా?

ఛీ వాచార్చటిః ఛీ కవిత్వముః చి ఛీ ఛీ యర్థకాంక్షగతుల్‌!

ఈ ముత్తమంత్రి అంకితం పుచ్చుకొన్న దాశార్హచరిత్ర ఎవరు బ్రాశారో తెలియదు.

19, వేఐది కృష్ణమంత్రి; ఇతడు నిజంగా మండ్రే. ఏదో చిన్న గ్రామానికి అధికారిగా ఉండే ఉద్యోగి దగ్గర కరణీకపు లెక్కలు వ్రాసే మంత్రి కాడు. క్రీ.శ. 1580-1612ల మధ్య గోలకొండ రాజ్యాన్ని పాలించిన ఖులీ కుతుబ్‌షా ప్రధాని మండలిలో ఒకడు, ఇతని

488 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వంశంలో 6వ తరంలోని తాతగారు బెడందకోట సుల్తాక్‌ షా వద్ద “నేబతి' పదవిలో ఉన్నాడు. నేబతి అనే మాట “నియాబత్‌' అనే పదానికి తెలుగురూపం. దీనికి రాయబారి, స్థానాపతి అని అర్థం. కృష్ణమంత్రి తండ్రి కమల మంత్రి. పానుగంటి పట్టణాధ్యక్షుడ్డు. కృష్ణమంత్రి పంచతంత్రాన్ని వైష్ణవప్రబంధంగా మార్చి రచించాడు. దానికి రాజనీతి రత్నాకరమనే పేరు పెట్టాడు. కథను శ్రీరంగంలో మొదలుపెట్టాడు. విష్ణుశర్మ ఆ ఊరిలో రాజుగారి బిడ్డలకు కథలు చెప్తాడు. సంజీవుకుణ్జి టేహారి తిరుపతి వెంకన్నకు సమర్పించి అచ్చుపోసి విడిచివేస్తాడు. కృష్ణమంత్రిని చరిత్రకెక్కని చరితార్థునిగా . ఆంధ్రదేశానికి పరిచయం చేసినవారు మిత్రులు డా! వి. రామరాజుగారు. '““పంచతంత్రముపై వైష్ణవ ముద్రయు, మరియు నాంధ్రత్వ ముద్రయు నచ్చొత్తి రాజనీతిరత్నాకరమును వెలయించినాడీ గోలకొండ నియోగి మంత్రి” యని వారు చెప్తున్నారు. ఈ కవి కవిత్వాన్ని అతని గురువు కందాళ రంగాచార్యులుగారు ఇలా మెచ్చుకొన్నారట.

పరువపు బొండుమల్లియల బంతులొకో మరి జాజులో యనన్‌ .

విరవిరవాది పువ్వు లన వెన్నెలలో కుముదంబులో యనన్‌

సరసిజకర్ణికా కృతులు చల్లని తావుల పిక్కటిల్లుచున్‌ -

నెరనె భవత్కవిత్వములు నేబతి కృష్ణకళాధురంధరా! (రాజ. 1-37) ఈ కళాధురంధరుని కృతి అచ్చుపడడం అవసరమే.

  1. పెద్దరాజుగారి రామరాజు: ఇంద్రాణి, రుద్రాణి అని ఎవరో కొందరు ఆడవాళ్ళను భర్తల భార్యలుగా వ్యవహరించినా మన దేవతలలో చాలామంది వాళ్ళ భార్యల భర్తలుగానే మనం గుర్తిస్తాం. ఉమాపతి, లక్ష్మీపతి, సీతాపతి మొదలైన పేర్లు దానికి నిదర్శనం. అయితే దేవతా స్త్రీలలో చాలా కొద్దిమందిమీద విడిగా మనవాళ్లు శతకాలు చెప్పారు. తాళ్ళపాక అన్నమయ్య లాంటి కవి ప్రతిపద్యంలోనూ అలమేలుమంగను పేర్కొన్నా శతకాన్ని వెంకటేశ్వరా అన్న మకుటంతోనే రచించాడు. శ్రీరామునిపై దేశంలో ఉన్న శతకాలకు తక్కువలేదుగాని, సీతమ్మపైన ప్రత్యేకంగా శతకమున్నట్టు కనబడదు. అయితీ ఈవని రామరాజు అనే కవి చెప్పిన రెండు చాటుపద్యాలలో సీతమ్మను సంబోధించడం జరిగింది వ్యక్తుల నామాలలో ఉన్న సంధుల వల్ల వచ్చే అఖండయతులను పేర్కొంటూ 'అమ్మా' అనుటకు ఈవని పెద్దిరాజు రామరాజు చాటుధార అని అప్పకవి ఈ క్రింది పద్యాలను ఉదాహరించాడు. (అప్ప. 3౩-232, 23);

ఇమ్మహిలో మహనీయగు- ణమ్ముల నీ పాటి గలరె నానావిధదే

శమ్ముల శ్రీరాముని సీ-తమ్మా మాయమ్మ నిత్య వర్షములిమ్మా!

. ఇమ్మా మదఖీష్టంబులు- కొమ్మా మా మొక్కులెల్ల గురమతితో మా

యమ్మా రఘునందను సీ-తమ్మా సౌభాగ్యసిద్ధిదాయిని వమ్మా।

ఈ రెండు చాటుధారలని అప్పకవి చెప్పాడు. అయితే ఇవి ఒక శతకంలోనివేమో అన్న అనుమానం కలుగుతున్నది. 3, 4 పాదాల ప్రాసల మలుపులో “సీతమ్మా! అనే మకుటం ఉందేమో! శతకమయితీ ఆ సంగతి అప్పకవి చెప్పనే చెప్పేవాడు. ఏమైనా

ఇతర కవులు 489 అప్పకవిలాంటి లాక్షణికుడు ప్రమాణంగా స్వీకరించిన కవి తక్కువవాడు మాత్రం కాదు. ఏవో మంచి పుస్తకాలే రచించి ఉంటాడు. అయితే వ్రాసిన కావ్యాలేమిటో తెలియవు. ఇతని ఇంటిపేరు 'ఈవని' వారని మాత్రమే అప్పకవి చెప్పినదానివల్ల విశదమవుతున్నది.

  1. పలకలూరి గోపన్న; అళియ రామరాయల వద్ద ఉన్న బయకార రామప్ప అనే సంగీత విద్వాంసుడు 'స్వరమేళకళానిధి' అనే కృతి రచించాడు. ఇతడు దండనాథుడుగా కూడా పనిచేశాడు. ఈ రామప్పకు బాచమరుసయ్య అనే పినతండ్రి ఉన్నాడు. ఇతడు అచ్యుతదేవరాయలవారి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు. పౌదిరి కుప్పం ఇతని స్వగ్రామం. తిరుపతి దేవస్థానానికి ఎన్నో దానాలు చేశాడు. ఇతని శాసనాలు క్రీ,.శ.1534 నుండీ 1547 దాకా కనబడతాయి. కొండవీడులో గోపీనాథస్వామిని ప్రతిష్టించాడు. గోపీనాథపురాన్ని నిర్మించాడు. ధైర్యసాహసాలతో యవనుల బలాన్ని గెలిచాడు. అయితే ఉద్యోగరీత్యా బాచమరుసయ్య కొందరు బ్రాహ్మణులను హింసించి నట్టుంది. ఆ బాధ పొందినవాళ్లలో ఈ గోపన్న ఒకడు. ఇక చాటుపద్యం చెప్పాడు.

గోలకొండమలకగోవుల భక్షించు - గౌంవీటి విప్రకులము నెల్ల

బాచమరుసు చేరి భక్షించుచున్నాడు - మలకమేలో? బాచమరుసు మేలో? గోపన్న చెప్పిన ఈ పద్యాన్ని అప్పకవి ప్రమాణం!” స్వీకరించి నామాఖండ విశ్రమాలు చెప్పి సందర్భంలో (3౩-231) “అరుసు' అనే మాటను పేర్కొంటూ ఉదాహరించాడు. గుంటూరు తాలూకాలో పెద్ద పలకలూరు, చిన్న పలకలూరు అనే గ్రామాలున్నాయి. గోపన్న బహుశా వీనిలో ఒకదానికి చెందినవాడవుతాడు. నవాబుల యుగంలో ఈ పలకలూరు కొండవీటి మండలంలో ఉండేది కాబోలు. గోపన్న కేవలం ఒక చాటువు చెప్పిన కవి కాడని, ఏవైనా గ్రంథాలు రచించి ఉంటాడని, అందుకే అతణ్జి అప్పకవి ప్రామాణికుణ్ణిగా స్వీకరించాడని చాగంటి శేషయ్యగారు భావించారు.]1 గోపన్న వ్రాసిన కావ్యాలు పేరైనా తెలియకపోవడం దురదృష్టమే.

  1. ఎడవల్లి పర్వతన్నః అప్పకవి ధర్మమా అని కొంతమంది కవుల పుస్తకాల పేర్లు కాకపోతే కనీసం చాటుధారలైనా దొరుకుతున్నాయి. అతడు ఎడవల్లి పర్వతన్న పద్యాలు రెండు ఉదాహరించాడు. ఒకటి తిట్టుపద్యం. ఆరింట '“త'కారం పెట్టి పద్యంతో ఎవరినైనా తిడితీ అది పాముకాటే అని మనవాళ్ళ విశ్వాసం. అలాగే అయిదింట 'హ' కారం కూడా ప్రచూదకరమే. ఎవరో బంగారు కామయ్యను పర్వతన్న ఇలా తిట్టాడలు (అప్ప. 2-377).

అంగజసంహారుండగు - సంగరభీముండు ప్రళయసమయో గ్రుండై

యింగలపుగంట జూచిన - బంగరు కామయ్య మేను భస్మం బయ్యె౯€. ఇటువంటి తిట్టుపద్యం చెప్పిన పర్వతన్న దీవనపద్యాలు గూడ చెప్పగలడు. కర్నూలును పాలించిన గోపాలరాజుగారి కత్తిమీద అతను చెప్పిన పద్యాన్ని బువళికి చూపించిన ప్రామాణిక ప్రయోగాలలో అప్పకవి ఉదాహరించాడు.

రణరంగంబున నీ శితాసి యరినోరం బూరిరైకొన్న దా

నణు మాత్రంబును వానిపైన దెగ దాహా! చిత్ర మూహింపగా

490 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దృణమే కవలె దారికట్టు మొనకట్టిద్దారుణీ మండలి౯

ట్రణుత ప్రాభవకందనోలిపురగోపాలా! క్షమావల్లభా! (ఆప్ప. ౩-3)

ఈ గోపాలరాజుగారు అలియ రామరాయల తమ్ముని మనుమడని చాగంటి శేషయ్యగారు ఊహించారు.]*2 పర్వతన్న వ్రాసిన గంథాలేమిటో తలియవు.

  1. పొట్టూరి గోపన్న: ఏ గ్రంథం బ్రాశాడో తెలియదుగాని ఈ కవిని ప్రామాణికునిగా ఎంచి, అప్పకవి, నామాఖండ విశ్రమాలను చెప్తూ, ఇతనిదో పద్యం ఉదాహరించాడు.

అన్నలుడు రూపమున సిరి-యన్న కళాయుక్తి భరతునన్న కరుణచే

నన్న సముద్ర పెద చి-న్నన్న కుమూరుండు వేంగళామాత్యు డిలన్‌. (అప్ప. ౩3-224)

అప్పకవి కొన్ని గ్రంథాల పేర్లు చెప్పాడుగాని వాటి కవుల పేర్లు తెలియవు. అవి చమత్కార రామాయణం, చారుధేష్టచరిత్ర, దేవీ విజయం, మధుసేనం, శారదాదర్చణం. వీటిలో కడపటిది లక్షణ గ్రంథం. వీటిలో ఒకటో, లేక మరేదో గోపన్న వ్రాసినడి ఈ పద్యంలో చెప్పిన వెంగళామాత్యునికో, అతని వంశంవాళ్ళకో బహుశా అంకితమై ఉంటుంది. పొట్టూరు గుంటూరు తాలూకాలో ఉంది. కవి ఆ ఊరివాడే కావచ్చు.

  1. వణుకూరి గురనరాజు: అప్పకవి కవి పేరూ, గ్రంథం పేరూ చెప్పి ఉదాహరించిన పద్యాలు తూడా కొన్ని లేకపోలేదు. నామాఖండా విశ్రాంతుల ఘట్టంలోనే వ్యక్తుల పేర్ల చివర “ఆయి' అని చేర్చితే యతి నిల్పడానికి ప్రయోగాలు చూపెట్టాడు. గురవరాజు వ్రాసిన శమంతకమణిచరిత్ర కావ్యంలోని కృత్యాది పద్యాన్ని ఉదాహరించాడు.

కాయవచోమనస్థలన కల్పిత దోషములెల్ల బాయగ

నాయెదలోన నిత్యము సనాతనధర్మము బూని యర్మిలిన్‌

బాయక కొల్లు రామనరపాలనిరంతర సౌఖ్యదాయి సీ

తాయిసమస్త శోభనవిధాయి మహతృ్భలసిద్ధిదాయిగన్‌ (అప్ప. ౩-27) ఈ శమంతకమణి చరిత్ర దొరకడం లేదు,

  1. రాచపూడి వెంకటయ్య ; గురవరాజులాగే పేరు చివర ' అయి చేర్చి పద్యం చెప్పిన మరొక కవి ఈయన గంగానదిని గంగాయి అన్నాడు. (అప్పకవి. ౩3-236)

వ్యాయామజనితమాయో- పాయసమస్తాఘములు నివారణమగు దు

మాయంబు పూతమగు గం-గాయిని బొడగన్న దానమాడీన మాత్రక.

ఇది ఫలానా గగ్రంథంలోనిదని అప్పకవి చెప్పలేదు. ““దాచపూడి వెంకటయ్య చాటుధార' అని పేర్కొన్నాడు. రాచపూడి గ్రామం ఒంగోలు తాలూకాలో ఉంది. కవి ఆ ప్రాంతంవాడై, అప్పకవినాటికి అతని పేరు సుప్రసిద్ధమైందనుకోవాలి.

  1. అంధ్రకవితరంగిణి, 5. పుట 252.

ఇతర కవులు షం]

  1. గౌరరాజు : వెంకటయ్యలాగే అప్పకవి కాలంనాటికి ప్రసిద్ధుడైన మరొక కవి గౌరరాజు, ఇతని చాటుధారగా అప్పకవి ఈ పద్యాన్ని, నితృసమాసవిశ్రాంతుల సందర్బంలో *“నాక' శబ్దానికి ఉదాహరణగా చూపెట్టాడు (అప్ప. ౩3-158)

ప్రాకటదర్చులై సకలరాయని లక్క నృపాలు వాజిలో

దాకు విరోధిసైన్యము మదం బొదవన్‌ వరియింపవచ్చుచో

నాకస మెల్ల గ్రమ్ముకొను నంచిత దివ్య విమానసంచర

న్నాక విలాసినీ చరణ హంసకభూరి రుణం రుణధ్వనుల్‌.

కడప టీల్లా రాజంపేట తాలూకా గుండ్తూరులో లక్కనృపాలుని శాసనా లున్నాయని, అవి క్రీ.శ.15 శతాల్లి ఉత్తరార్థంలోనివని చాగంటి శేషయ్యగారు వ్రాశారు.]ేకి అక్కయ్యదేవమహారాజు పొత్తపి నాటికి అధిపతి. అందుచేత గౌరరాజు ఆ ప్రాంతాలవాడని చెప్పవచ్చు. క్రీ.శ1600కు పూర్వుడని కచ్చితంగా అనుకోవచ్చు.

  1. తంచి వీరశరభయ్య ; ఆద్యసత్కథలనే కావ్యాలుగా రచించాలనే పట్టింపులున్న ఏ సాహిత్యంలోనైనా ఒకరు వ్రాసిన కావ్యాలనే ఇంకొకరు వ్రాయడం పరిపాటే. అయితే ఈ కవులలో ఎవరు ప్రాచీనులో, ఎవరు ఆర్వాచీనులో తేల్చుకోవడం కొంత ఇబ్బందికరమే. మన కవులు తమకు పూర్వం ఈ గ్రంథాలు వ్రాసిన వాళ్ళ పేర్లు వివరాలు చెప్పరు. తన కన్నా ముందు కొందరు హరిశ్చంద్రుని కథ వ్రాశారనీ, వారికి మెరుగుపెట్టేటట్టు దాన్ని బ్రాస్తున్నాననీ కనీసం ఒక కవి చెప్పాడు. అతడు కంచి వీరశరభయ్య. ఇతని తల్లి పండితారాధ్యుల వంశంవాళ్ళ ఆడపడుచు. వీరశరభయ్య తన హరిశ్చంద్రోపాఖ్యానాన్ని శ్రీశ్రైలమల్లికార్జునస్వామికీ అంకితమిచ్చాడు. తన కావ్యంలో

“హరిశ్చంద్ర మహాసార్వభౌమోత్తముసద్దుణసంఘాతంబు లెక్కింప విధాతకైన శక్యంబు గాదని మనంబున గణీయించి యందందు గొందరు కవిజనోత్తములందంబు బంధురంబుగా రచియించిన తెరంగు కంటి మెరుంగు పెట్టినట్లు భవ్యంబగు నిమ్మహాకావ్యంబు...” (932

ఇతరకవుల రచనలకు ఇతడు ఎలా మెరుగుపెట్టాడో తెలియదు. శంకరకవి కవిత్వంకంటె ఈ కావ్యంలో మరి అధికమేంలేదని చాగంటి శేషయ్యగారు చెప్పారు. ఈ తవి కంచివాడని, ఇతని గ్రంథాన్ని కంచికావ్యం అంటారనీ బౌక్‌దొరగారు వ్రాసి పెట్టారు.25 వీరశరభయ్య బ్రాసిన హరిశ్చంద్రోపాఖ్యానం ముద్రితమైనా దొరకడంలేదు. దీనికి వ్యాఖ్యానం కూడా ఒకటి అముద్రిత గ్రంథాలలో ఉంది (0 936) బ్రౌనుదొరగారు ఈ శరభయ్య కవిగ్రంథాన్ని ఇలా మెచ్చుకొన్నారు. 13. అంధ్రకవితరంగిణి 1/0] పుట ణి. 14. ఆంధ్రకవితరంగిణి, ౫, పుట ౫ 15. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం డీ. తేటలాగు, కె, పుట 1228,

492 వమణ్రాంభ్ర పాహిత్యం - రెండవ సంపుటి

గౌ ౯ ర [గారే ణంరాం క లంజలని 5 లాుంం౭యాం్‌ ౧౦౧? ఆ అంగాభింతితరీ హౌ ఏ అలలటనీ యజ అల? కనీజ ౩ అ త ంభ్ర కమ శ1యుర్రై ౧౦ అరే శ షజి య తిమంనాంై అంరంంత (0.935).

ఈ కంచికావ్యంలోని కథ కంచికి పోకుండా సాహిదీపరులు కొంచెం

  1. సర్వజ్ఞ పద్మనాయకభూపాలుడు ; శ్రీ.ఈ145 ప్రాంతాలలోనే తెలంగాణాను పాలించిన పద్మనాయకుల రాజ్యం అంతరించింది. గోలకొండ నవాబులు గద్దె ఎక్కారు. అయితే 'చాపచిరిగినా చదరంత' అని పద్మనాయకుల వంశంలోని కొందరు చిన్న చిన్న రాజ్యాన్ని స్థాపించడానికి ముందు ఈ వంశీయులు శ్రీశైలానికి ఉత్తరాన ఉన్న ఉమాచలంలో ఉండేవాళ్లు సామ్రాజ్యం పోయాక పద్మనాయకులలో ముగ్గురు మారేళ్ళకాలంలో ఒక సర్వజ్ఞ పద్మనాయకభూపాలుడు సారంగధర చరిత్రను యక్షగానంగా బ్రాళాడు. పద్మనాయకులలో ముగ్గురు సర్వజ్ఞ సింగభూపాలురు ప్రసిద్ధులు. వాళ్ళ ముగ్గురి తల్లుల పేర్లూ పోచమదేవులే! యక్షగాన రచయిత అయిన సర్వజ్ఞుడు కాచమనేని గారాబు సుతుడు. అందుచేత ఆ సర్వబజ్ఞులలోని ఏ ఒక్కడూ ఈ సర్వజ్ఞుడు కాడు. ఇతనికి ఆగమ పురాణే౭ిహాసాలు ఇష్టం. వీణాది సంగీతవిద్యావినోది. వాణీ వివేకాది వరచత్రవర్తి. సహజ విత్రమకీర్తి. సర్వజ్ఞమూర్తి. ఇతడు సనాతన “గానశాస్త్ర ప్రబంధకర్తల కరుణపడసి' “కడునొప్పు సారంగి కత దిగంతముల పుడమీశ్వరులు మెచ్చ బుధులు చరియింప-సరసులు గొనియాడజాణలౌననగ” రచించాడు. సారంగధరుని చరిత్రను మొట్టమొదట తెనుగు దేశానికి పరిచయం చేసినవాడు గౌరన. మన రాజమంశ్రీని పాలించిన రాజురాజుతూ ఈ కథకూ గౌరనకాలంలో ఏమాత్రం సంబంధం లేదు. అయితే సర్వజ్ఞ పద్మనాయకుడు బ్రాసిన యక్షగానంలో అక్షరాలా ఈనాటి కథే ఉంది రాజమహేంద్రవరం, రాజరాజ నరేంద్రుడు, రత్నాంగి, చిత్రాంగి. సారంగధరుడు మొదలైన వివరాలతో పద్యకావ్యంగా ఈ గాథను వ్రాసినవాడు చేమకూర వెంకటకవి (17వ శతాబ్ది). ఇతని యక్షగానం అముద్రితం. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారి కార్యాలయంలో దీని ప్రతి ఉంది. ఈ కవిని 'మరుగుపడిన మాణిక్కం'గా డాక్టరు వి. రామరాజుగారు తొలిసారి ఆంధ్రదేశానికి పరిచయం చేశారు.ే*

  2. వెణుతుర్హ ఒడ్దెయ్య : కర్నూలు జిల్లాలో వెణుతుర్ల అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో అనుపమ బ్రహ్మవిద్యావిహారుణ్ణీ, అఎధ్ర గీర్వాణ భాషాదభ్ర కోపదుణ్ణీ, నాటకాలంకార నయవిశారదుణ్ణీ, మేదుర శృంగారమృదు కవిత్వధురీణుణ్ణి, వరవచశ్ళుభ నికాయుణ్జీ అనుకునే ఒక కవి ఉండేవాడు. ఆయన పేరు ఒడ్డెయ్య. ఇతడు “శృంగార పేరుతో మూడాశ్వాసాల ప్రబంధాన్ని వ్రాశాడు. నగ్నజిత్తు అనే తోశల రాజు కుమార్తె

  3. “మరుగుపడిన మాణిక్యాలు గోలకొండ పత్రిక ప్రచురణ, పుట

ఇతర కవులు 490 నీలను శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవడమే ఇందులోని ఇతివృత్తం. దీనికి హరివంశమే మూలం. ఈ కథనే కూచిమంచి తిమ్మకవి ఉత్తరోత్తరా నీలాసుందరీ పరిణయం అనే అచ్చ తెనుగు కావ్యంగా! ఈ కవి బహుశా సేలం కృష్ణభూపాలుని మంత్రిగారి ప్రోత్సాహంతో బాలగోపాల విలాసాన్ని రచించాడేమో అని చాగంటి శేషయ్యగారు భావించారు.!” ఇతని కాలం క్రీ.శ 1800 ప్రాంతాలని అభిప్రాయపడ్డారు.

ఒడ్డెయ్యకవి తన గ్రంథాలను దేవునికే అంకితమిచ్చాడు. శృంగారరసాలవాలంతో కృష్ణదేవుడు సల్పిన క్రీడలు ఆంధ్రభాషలో శృంగారరసంలో ఏర్పరిచాడు. దీనిని “పూర్వసత్కవిని కాయ కావ్యలక్షణ లక్ష్యసంగతులు ఎరింగి' రచించాడు. అయితే ఇతని పరిశోధకులు భావిస్తున్నారు.!కి

  1. ముడియం వెంకటరమణకవి ; తెలుగు కవులు తెలుగులో నాటకాలు బ్రాయకపోయినా సంస్కృతంలో వ్రాసేవారని చెప్పడానికి ఈయన కావ్యమొకటి పనికి వస్తుంది. ఇతడు సంస్కృతంలో రాధామాధవం అనే నాటకం వ్రాశాడు. ఇది నేడు దొరకదు గాని ఇతడు తెలుగులో వ్రాసిన కళాధరోపాఖ్యానమనే కావ్యంలో (434) ఈ సంగతి తెలుస్తుంది. అందులో తన గురించి ఇలా చెప్పుకొన్నాడు:

చేసితి రాధామాధవ - మా సంస్కృత ధాటి నాటకాగమనంబు[౯

వ్యాసక్తీ నిం నాంధ్రము - చేసెద నొక కావ్య మతివిచిత్ర కథాప్తిన్‌. ఈ కావ్యంలో కళాధరుడు నాయకుడు అతడు శ్వేతద్వీపంలో పుట్టాడు. సాక్షాత్తూ ఒక విష్కంభంగా కవి బ్రాశాడని ఈ కావ్యాన్ని పరిశోధించిన పండితులు చెప్పారు. ఇది అముద్రితం. ఈయన _ పెమ్మసానివారి అస్తానంలో ఉండేవాడు. పెమ్మసాని తిచ్మూనారోకుడు క్రీ.శ 1580 ప్రాంతాలవాడు. అందుచేత ఈ కవి కూడా ఆ కాలంవాడే. ఇతడు దత్తాత్రేయ భక్తుడు. తన కావ్యాన్ని ఆ దైవానికి అంకితమిచ్చాడు. బహుశా దత్తాత్రేయయోగి శిష్యుడు కూడా కావచ్చు.

  1. వేగివాటి కొండన్న: వెంకటరమణయ్యలాగే మరొక దత్తాత్రేయ శిష్యుడు తూడా ఈ యుగంలో ఉన్నాడు. అతని ఇంటిపేరు బళ్ళపల్లివారు. పేరు కొండన్న, ఇతడు “వేగినాటివంశపయః పారావారనిశాకళత్రుణ్ణి అని గద్యలో చెప్పుకోబట్టి ఇతణ్ణి వేగినాటి కొండయ్య అని చరిత్రకారులు పేర్కొనసాగారు. ఇతడు వివేకసింధువు అనే వేదాంత గ్రంథాన్ని దత్తాత్రేయునికి అంకితమిచ్చాడు. 'దత్తయోగీంద్రకావ్యం' అనే సీస శతకాన్ని కూడా ఇతడు ద్రాసినట్టుంది. ఇది అముద్రితం. ఇందులో వేదాంత విషయాలూ, నీతివిషయాలూ ఉన్నాయి.
  2. అంధ్రకవితరంగిణి-%౫, పుట 209.
  3. అంధ్రాలంకార వాబ్మయచరిత్రము - బులుసు వెంకటరమణయ్యగారు.

494 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కొండన్నకు పూర్వమే. వివేకసింధువు వచన కావ్యంగా ఉండేది. దానిని

ముకుందయోగి రచించి, సజ్జనులను బ్రోచాడని కొండన్న ఇలా నమస్కరించాడు. వినుతింపక్‌ భవరోగవైద్యమగు నీ వేదాంత శాస్త్రంబు పా

వనమై యుండ బ్రవీణతక వచన కావ్యం బొప్పుగాబేసి స

జ్ఞనులం బోచిన పుణ్యమూర్తి విమల స్వాంతుండు విజ్ఞానశా

సనుడైనట్టి ముకుందమౌనికి నమస్కారంబు గావించెదక.

ఈ పద్యంలో పేర్కొన్న ముకుందయోగి మహారాష్ట్ర భాషలో వివేకసింధువును రచిస్తే దానిని కాశీ చెన్న బసవేశ్వరుడనే కవి తెలుగులో వచన గ్రంథంగా వ్రాశాడు. కొండన్న బహుశా మహారాష్ట్ర భాషనుంచే పద్యకావ్యాన్ని అనువదించి ఉంటాడు. చెన్నబసవ కాలం శ్రీ.శ 1600 ప్రాంతాలని బులుసు వెం6టరమణయ్యగారు చెప్పారు. కొండన్న కూడా అప్పటివాడే కావచ్చు.

  1. చెన్న బసవయ్య : వివేకసింధువును వచనకావ్యంగా వ్రాసిన ఈయనే, బహుశా వాడుక భాషలో ఉంది. సాంఖ్య సూత్రాలు, వాటికి అనుగుణమైన ఇతర శోకాలూ ఉదహరించి అద్వైత సిద్ధాంతాన్ని బాగా విశదపరిచాడు.

  2. ముకుందయోగి ; వివేకసింధువును మహారాష్ట్ర భాషలో వ్రాసిన ముకుందుడు కాక తెలుగులో ఒక ముకుందయోగి ఉన్నాడు. కోవిల కందాళ అన్నంగారి కుమారుడు అప్పలాచార్యుల వారికీ ఈ ముకుందుడు శిష్యుడు. వైష్ణవమతం తెలుగుదేశంలో బాగా ప్రచారం పొందాక తెనుగు కవులు చేపట్టిన కథావస్తువులలో ' శ్రీరంగమాహాత్మ్యం' ఒకటి. రంగనాథునికి తమ గ్రంథాన్ని అంకితమిచ్చి అ దేవునిలీలనే కృతిపతివంశంలాగ వర్ణించిన కవులు తూడా ఉన్నారు. పద్యకావ్యంగా శ్రీరంగమాహాత్న్యాన్ని వర్డించిన వాళ్ళలో _ ఖైరవుడు, చెన్నమల్లు శ్రీగిరన్న ప్రథములు. ఇదే స్థలపురాణాన్ని ముకుందయోగి ద్విపదగా రచించాడు. ఇది అముద్రితం. తంజావూరు సరస్వతీమహల్‌ గ్రంథాలయంలో రెండు ప్రతులున్నాయి (నెం.362, 36).

  3. చరిగొండ నరసింహకవిః ఇతడు శనిబిందు చరిత్రం అనే పద్యకావ్యం వ్రాశాడు. దీనిలోంచి ౩ పద్యాలను ప్రమాణాలుగా స్వీకరించి అప్పకవి ఉదాహరించాడు. శశివిందుడు ఒక రాజు. ఇతనికి లక్షమంది భార్యలున్నారట. ఒక్కొక్కత్తెకూ చాలామంది విడ్డలట. ఈ రాజు చాలా యాగాలు చేశాడట. లక్షమంది భార్యలలో ఎవరి వివాహాన్ని వర్ణించాడో గాని నరసింహకవి శిబిందుచరిత్రలో శృంగారాన్ని మఠీ పచ్చిగా బ్రాసినట్టుంది. చూడండి ఈ పద్యం.

పయ్యెద బాపి గుబ్బలను బాహుల బట్టగనిచ్చి మోవిపై

దియ్యని మోవియుక్‌ మనసుదీరగ గ్రోలగనిచ్చి యిష్పుడో 20. పూర్చగాథాలహరి, పుట 44.

ఇతర కవులు 495

తొాయ్యలి నీవి ముట్టినను ద్రోచెద వేనుగునిచ్చి యంకుశం

వియ్యక కయ్యమిడదగునే? నను నీగతి నేచబాడియే? (అప్ప. 2-27)

ఈ కావ్యనాయిక అందాన్నీ నఖశిఖపర్యంతం వర్ణిస్తున్న ఘట్టంలోనిది కాబోలు మరొక పద్యాన్ని అప్పకవి ఉదాహరించాడు (2-254).

నూవుంబువ్వును సంపెంగ-పూవు గెలిచి బిరుదుముత్తెపుంజల్లి దగక్‌

దా వైచెననగ ఘుంగర-తో వనరుహనేత్రనాసతుల లే కొప్పు. ఈ కవికాలాన్ని ఉజ్ఞాయింపుగా చెప్పవచ్చు. ఇతడు కందుకూరి రుద్రయ్యకు కొద్దిగా పూర్వుడనుకోవచ్చు. “వెలగ అనే మూటకు వెల్లు అనే రూపాన్ని చరిగొండకవి ప్రయోగించాడట. ఇది చూసి “మొలక అనే మాటకు 'మొల్క'* అనే రూపాన్ని రుద్రకవి పుట్టించాడని అప్పకవి ఇలా నవ్వుకొన్నాడు (అప్ప. 5-112).

కొలదిగ మున్ను జెప్పె జరిగొండ నృసింహుడు వెలయంచు నీ

వల నగసాలిరుద్రపనువాడును మొల్క లటంచు గూరిచెం

దెలియక కొందరిట్లు వికృతిం బదమధ్యమునక౯ లకారరే

ఫలదలపై యకారమును బాపుదు రార్యులు నవ్వునట్లుగళ. అప్పకవికన్నా ముందుగానే ఎవరో రుద్రకవిని ఈ ప్రయోగానికి అక్షేపిస్తే అతడే చరిగొండ నృసింహకవి ప్రయోగాన్ని చూసి వినుకొండలో గుంటిపల్లి భాస్కరయ్యగారి సముఖంలో ఇలా చెప్పాడట:

వెలగకు వెల్ల యంచు సరపిం జరికొండ నృసింహుడాడగా

మొలకకు మొల్క యంచు గవిముఖ్యుడు రుద్రప వల్క దోసమే

భళిభళిః మంచి మాటయె ప్రబంధమునా జలరాశి యందులో

వల నెరసుల్‌ గ్రహింతురె యపారములౌ మణులెల్ల నుండగ౯? (అప్ప. 65-114)

నిజమే. మణులే స్వీకరించాలి. ప్రబంధమే కాదు, ప్రబంధాలు తోకొల్లలుగా విరిసిన ఈ యుగంలోని సాహిత్యం తూడా జలరాశే. దానిలోని కొన్ని రత్నాలే

నిజమైన మాణిక్యాలు ఎన్నటికైనా బయటపడతాయి! అదీ ఆశ

నాయకరాజుల యుగం

శ్రీకృష్ణదేవరాయలవారు పృథివీరాజ్యం చేస్తున్నప్పుడు దక్షిణాన కన్యాకుమారి దాకా తమ రాజ్యుం విస్తరింపజేసుకొన్నారు. తమిళ దేశంలో చోళ, పాండ్య, చేర మండలాలు అనాది నుంచి ప్రసిద్ధాలు. చోళ రాజ్యానికి తంజావూరు, పాండ్య రాజ్యానికి మధుర, చేర మండలానికి తిరువనంతపురాలు రాజధానులు. వీటితోపాటు తుండీర మండలం తూడా రాయలవారి కాలంలో ప్రముఖమైంది. దానికి చెంజి ముఖ్యదుర్గం. ఒక్క చేర దేశంలో తప్ప మిగతా మూడు మండలాలలో రాజప్రతినిధులుగా ఆంధ్ర నాయకులు తొలినుంచి అధిపత్యం వహించారు. క్రమంగా చుండలేశ్చ్వరులయ్యారు. నాయకరాజ్యాలు స్థాపించు కొని రాయసింహాసనానికి అణకువగా ఉంటూ కప్పాలు చెల్లించేవారు. క్రీ.శ1564లో జరిగిన రాక్షసి తంగడి యుద్ధంలో రాయసామ్రాజ్యం ఓడిపోయింది. క్రమేపీ చాపచిరిగి చదరంత అయింది. సామంతులు స్వతంత్రులవజొచ్చారు.

మధుర, తంజావూరు, చెంజి మండలాల నాయకరాజులలో ఒక్క తంజావూరు తప్ప మిగతా రెండు రాజ్యాలూ రాయసింహాసనాధికారాన్ని ప్రతిఘటిస్తూనే వచ్చారు. ఈ రెండూ సఖ్యంగా ఉండి చక్రవర్తిపై తిరగబడుతూ ఉండడం, ఓడిపోవడం, మళ్లా కాళ్లు నిలదొక్కుకోవడం, తిరుగుబాటు చేయడం సుమారు ఒక శతాబ్దంపాటు జరిగింది. ఈ రాజ్యాల రాజకీయ చరిత్రను స్పష్టంగా" అర్థం చేసుకొంటేనేగాని క్రీ.శ1600 నుంచి 1675 దాకా నడీచిన సాహిత్య చరిత్రను అర్థం చేసుకొనడం కష్టం. మధుర, తంజావూరు నాయకరాజుల చరిత్రలను విపులంగా చరిత్రకారులు వ్రాశారుగాని, చెంజి చరిత్ర స్పష్టంగా ఇంతవరకూ ఎవరూ వ్రాయలేదు. ఎంతమంది రాజులు ఎప్పటి నుండి ఎప్పటి దాకా చెంజిని పాలించారో ఇప్పటి దాకా ఏ చరిత్రకారుడూ ఒక క్రమంలో చెప్పలేదు. దీని గురించి తరువాత విపులంగా చర్చించుకొందాం. ప్రస్తుతం ఈ యుగంలోని రాజకీయ చరిత్రను అవగాహన చేసుకొనడానికి రాయసింహాసనంపై ఏయే వ్యక్తులు పట్టం కట్టుకొన్నప్పుడు మూడు దక్షిణ రాజ్యాలలో ఏయే నాయకరాజులు పాలించారో ఏకకాలంలో కనబడేటట్టు క్రోడీకరించుతాను.

ఈ యుగం ప్రారంభమైనప్పుడు, అంటే క్రీ.శ1600లో రాయ సింహాసనంపై రెండవ వెంకటపతిరాయలు ఉన్నాడు. మధురలో కుమార కృష్ణప్ప, తంజావూరులో రఘునాథ రాయలు, చెంజిలో కృష్ణష్పనాయకుడు రాజ్యం చేస్తున్నారు. ఒక్క మధుర తప్ప, మిగతా రెండు నాయకరాజ్యాలలో సాహిత్య పోషణ అంతకు ముందే ప్రారంభం అయింది. తంజావూరు అచ్యుతప్పనాయకుడి కాలంలో సంస్కృత వాబ్బయ రచన విరివిగా సాగింది.

చెంజిలో క్రీ.శ1550లో ఒక సూరప్పనాయకుడు ఉండేవాడు. అతనికి రాజి తుటుంబంతో ఏమి సంబంధమో తెలియదు. సూరప్పనాయకుడు చక్కని సాహిత్య పోషకుడు. సంస్కృత వాజ్బయంలో ప్రసిద్ధుడైన రత్నభేట శ్రీనివాసదీక్షితులు చెంజిలో

స ల్‌ లీ, | 1111 01 .

| ( కి క్రీ క్ల క్ష క్రీ శీ సీ కకక

496 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నూరప్పనాయకుని ఆఖ్రితుడు. ఆయన భావనా పురుషోత్తమం అనే- అయిదంకాల నాటకాన్ని వ్రాసి సూరప్పకు అంకితం ఇచ్చాడు. రత్నఖేట శ్రీనివాస దీక్షితులు ఖైష్మీపరిణయం అనే చంపువు కూడా రచించాడు. తంజావూరులో నాయకరాజ్యు స్థాపన జరుగుతున్నప్పుడే చెంజిలో సాహిత్యపోషణ జరిగిందని చెప్పవచ్చును.

ఏ కాలంలో వ్రాశాడో తెలియదుగాని చెంజిలో ఉండే బాలశయన వెంకటకవి కూడా సంస్కృతంలో 'విబుధానంద ప్రబంధం' అనే చంపూకావ్యం బ్రాశాడు.] క్రీ.శ. 1600 తరువాత చెంజిలో పాలించిన తుపాకుల కృష్ణపష్పమీదనే బహుశా క్షేత్రయ్య పదాలు చెప్పాడు. క్రీ.శ.1630 ప్రాంతాలలో ఉండే సవరం చిననారాయణ నాయకునికి చెంజితో సంబంధముంది. అతడు కువలయాశ్వచరిత్ర వ్రాశాడు. గణపవరపు వెంకటకవి తాను తుండీర మండలాధిపతి చేత బహుమానాలు పొందినట్టు చెప్పుకొన్నాడు. శృంగార గాధేయోపాఖ్యానం వ్రాసిన కేవూరి అనంతయజ్వ కూడా చెంజి రాజుల సన్మానాలు అందుకున్నాడు. చెంజి పాలకులలో కడపటివాడైన వరదప్పు నాయకుని ఆస్థానంలో తిరువెంగళకవి ఒకాయన ఉండేవాడు. ఇతడేం దబ్రాశాడో తెలియదుగాని ఇతని శిష్యుడు బుగ్వేదకవి వెంకటాచలపతి తరువాతి యుగంలో చంపూరామాయణం వ్రాశాడు. తన గురువుగారు 'చెంజివరదేంద్రు నాస్థాన వసుధయందు మంతుకెక్కి' నట్టు చెప్పాడు (చంపూరామాయణం, 1-31). ఈ వివరాలన్నీ చూస్తే సాహితీపోషణలో మూడు నాయకరాజ్యాలలో చెంజి రాజులే సీనియర్లు అని చెప్పాలి. క్రీ.శ.1550 నుంచి 1650 దాకా వాళ్లు చేసిన సేవ కనబడుతున్నది. చెంజి నాయకరాజుల చరిత్ర గురించి విపులమైన పరిశీలన అవసరం. భావి పరిశోధనవల్ల చాలా విషయాలు బయటపడతాయనే దృడంగా నమ్మవచ్చు.

చెంజి తరువాత సాహిత్య సేవలో పరీగణించవలసిన రాజ్యం తంజావూరే. క్రీ.శ. 1550లో తంజావూరు నాయకరాజ్య స్థాపన జరిగినా రఘునాథుడు ప్రాజ్ఞుడయ్యే దాకా ఇక్కడీ సాహిత్య లత మొగ్గ తొడగలేదు. అయితే, అది జళసారి పూయడం మొదలుపెట్టాక గుత్తులు గుత్తులుగా విరియబూచి గుబాళించసాగింది. ఈ పరిమళాల మత్తులో పరిసర రాజ్యాల వాసనలు మునిగిపోయాయి. నాయకరాజుల యుగం అనగానే “యుగకర్తల కింద తంజావూరి ప్రభువులనే ఎవైనా గౌరవించక తప్పదు. ఈ నాయకరాజ్యంలో నలుగురే నలుగురు గద్దెఎక్కి పాలించస్రాగారు. కాని వాళ్ళలో కడపటి ఇద్దరే తెలుగు సాహిత్యాన్ని రెండుచేతులా పోషించారు. తంజావూరు ప్రభువులలో మొదటివాడు చినచెవ్వప్ప నాయకుడు. ఇతడు క్రీ.శ1540 ప్రాంతాలలో ఉత్తరార్కాటు జిల్లా అర్నిజాగీరులో ప్రముఖుడుగా ఉండేవాడు. ఈయన కృష్ణదేవరాయలవారి సోదరునికి తోడల్లుడు. క్రీ.శ1530లో కృష్ణదేవరాయలు మరణించాక అచ్యుతదేవ రాయలు రాజ్యానికి వచ్చాడు. అతడు తన మరదలు మూర్తిమాంబ భర్తకు ఒక మండలాధిపత్యం ఇవ్వాలని తంజావూరిపై అధికారాన్ని ఇచ్చినట్టుంది. ఇది క్రీశు 1542 తరువాతనే జరిగి ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు.

  1. రఘునాథనాయకాభ్యుదయం, తెలుగు పీఠిక మల్లంపల్లి సోమశేఖరశర్మగారు.

నాయకరాజుల యుగం 499

కృష్ణదేవరాయలవారూ, వారి తమ్ముడు అచ్యుతదేవరాయలవారూ దక్షిణ మండలాలపై రాజప్రతినిధులను నియమించడంలో ఒక ప్రత్యేకమైన పాలిసీలే అవలంబించినట్టు కనబడుతూంది. మన రాజుల దగ్గర మంత్రులు, దండనాధులు మొదలైన ఉద్యోగులలాగే మరికొందరు ఆంతరంగికులు ఉండేవారు. వాళ్లలో “అడపం' ఒకడు. ప్రభువు తాంబూలం వేసుకొనేటప్పుడు ఆకు మడుపులు అందిస్తూ హమేషా తాంబూలం పేటికను పట్టుకొనేవాళ్ళను 'అడపకాళ్లు', 'అడపకత్తెలు' అని పిలుస్తారు. వీరాధివీరులైన ప్రముఖులు చక్రవర్తి దగ్గర అడపాలుగా ఉండేవారు. కృష్ణదేవరాయలవారు తమవద్ద అడపకాళ్ళుగా ఉండే నమ్ముకస్థులకు మండలాధిపత్యం ఇవ్వడం ప్రారంభించారు. క్రీశ 1529కి ముందు విశ్చనాథనాయకుడనే ఉద్యోగి కృష్ణ్ణాయలవద్ద అడపంగా ఉండేవాడు. అతడు మహావీరుడు. ఒకసారి దేవీనవరాత్రులలో అమ్మవారికి బలివేయడానికి ఒక అడవిదున్నను తీసుకువచ్చారు. దాని తలను ఒక్కవేటులో తెగగొట్టే బలశాలి ఎవరూ కనబడలేదు. అంతా తటపటాయిస్తున్నప్పుడు విశ్చనాథనాయకుడే ముందుకు వచ్చి ఒక్క వేటున తల ఎగురగొట్టాడు. ఈ అడపకాడే ఉత్తరోత్తరా మధుర నాయక రాజ్యానికి అధిపతి అయ్యాడు. దానికో రసవత్తరమైన కారణాన్ని కథగా చెప్తారు.

కృష్ణదేవరాయలవారు రాజ్యంచేసే రోజులలో మధుర రాజధానిగా పాండ్యుడూ, తంజావూరు రాజధానిగా చోళుడు పాలిస్తూ ఉండేవారు. పాండ్యుని ఓడించి ఆ రాజ్యాన్ని చోళుడు కట్టుకొన్నాడు. తన రాజ్యం తనకీ ఇప్పించమని పాండ్యుడు రాయలవారిని ప్రార్థించాడు. వారు తమ కోశేఖానా అధికారి నాగమనాయకుణ్ణి దండుతో పంపించి, ఎవరి రాజ్యాలు వాళ్లు పాలించుకొనే బందోబస్తు చేయమన్నారు. అయితే నాగమ నాయకుడు ఆ రెండు రాజ్యాలూ తానే కట్టుకొని ఏలుకోసాగాడు. ఇది రాజద్రోహం. ఈ నేరగాణ్జీ ఎవరు బంధించి తేగలరు? అడవిదున్న తలగొట్టిన విశ్చ్వనాథనాయకుడే వెడతానన్నాడు. అతడు సాక్షాత్తూ నాగమనాయకుని కుమారుడు. “మీరు వెళ్ళి మీ తండ్రిగారితో చేరుదామనుకుంటున్నారా?' అని రాయలు అనుమానించినా విశ్వనాథనాయకుణ్ణి రాచకార్యంమీద పంపారు. కొడుకు తండ్రిని ఓడించి బంధించి రాయలవారి సన్నిధిలో హాజరుపెట్టాడు. ఈ విశ్వాసానికి ప్రతిఫలంగా రాయలవారు విశ్చ్వనాథనాయకుణ్ణి దక్షిణ సింహాసనాధిపతిని చేశారు. చోళపాండ్య రాజ్యాలు రెండూ తమ యేలుబడీకిందనే పెట్టుకొని విశ్చనాథనాయకుడు చాలాకాలం పాలించాడుగాని కృష్ణ్ణాయలవారి తరువాత రాజ్యానికొచ్చిన అచ్యుతదేవరాయలు చోళరాజ్యాన్ని స్రీధనంగా తన మరదలు మూర్తిమాంబకు ఇచ్చి తన తోడల్లుడు చెవ్వప్పనాయకుణ్ణి తంజూవూరు అధిపతిని చేశారట.

ఈ కథ కొద్దిగానే నిజం. దానిని మధురనాయక రాజులు కల్పించారు. స్రీధనంగా రాయలు ఇచ్చినట్టు ఎక్కడా సాక్ష్యం కనబడదు. చెవ్వప్ప నాయకుడు తూడా 3౩ శ [00042౧ కంఠం, 8 550008, ౯230 4. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డిగారు. పు.26

500 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి విశ్వనాథనాయకునిలాగే అడపంగా ఉండేవాడని భావించవచ్చు. అతని తమ్ముడు మల్లప్పనాయకుడు అడపం అని చెప్పడానికి సాక్ష్యం ఉంది! చెంజి నాయక రాజులలో తూడా కొందరు బంధువులు అడపాలే. రత్నఖేట శ్రీనివాసదీక్షితులను పోషించిన సూరప్పనాయకుడు అడపకాడే.* అచ్యుతదేవరాయలు తనకు నమ్మకస్థలైనవారిని దక్షిణ మండలాలకు అధిపతులను చేశాడని భావించవచ్చు.

చెవ్వప్పనాయకుడూ, అతని తండ్రీ తిమ్మప్ప నాయకుడూ కృష్ణదేవరాయలవారి కాలం నుంచీ సార్వభాముల కొలువులో ఉన్నారని రుజువు చేయడానికి శాసన ప్రమాణాలు ఉన్నాయి. తిమ్మప్ప నేటి ఆర్కాటు జిల్లాలోని కొంత భాగానికి అమర నాయకుడే కాక రాయలవారి హజారాన్ని హమేషా సంరక్షించవలసిన దక్షుడు. రాయలవారే ఒక శాసనంలో తిమ్మప్ప ద్వారపాలకునిగా తమ్ము సంసేవించుకొని అత్యున్నత గౌరవానికి నోచుకొన్నాడనీ, అంతేకాక రాయచూరు ముట్టడిలో తమతోపాటు ఉన్నాడనీ ప్రకటించారు." రాయలవారి వాకిలి కాచే తిమ్మప్ప ఒకడున్నాడని చాటుపద్యం కూడా కనబడుతుంది. రాయలవారు ఇచ్చిన పచ్చడాన్ని కప్పుకొని తిమ్మప్ప ఒకనాడు మొగిలి వాకిట ఉండగా అష్టదిగజ*లలో కొందరు కవులు లోనికి వెళుశూ ఒక్కొక్కరు ఒకపాదం వొప్పున ఒక కందపద్యం చెప్పారట.

పెద్దనగారు: వాకీటి కావలి తిమవ్మూ

భట్టుమూర్తి: ప్రాకటుముగ సుకవినరుల పాలిటీ సొమ్మా

ముక్కుతిమ్మన: నీకిదె పద్యము కొమ్మా

గామలింగడు: నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా ఈ చాటువులో సత్యమెంతో తెలియదుగాని తిమ్మప్ప నాయకుడు రాయలవారి కొలువులో ఉన్నత పదవులు పౌొందినవాడే. తమిళంలో వాకిలిని వాసల్‌ అంటారు. తిమ్మప్పనాయకుని 'వాసల్‌ తిమ్మప్ప' అని వ్యవహరిస్తారు. ఇతని కుమారుడు చెవ్వప్ప నాయకుడు రాయలవారి కాలంలోనే రాణువలో రాణించిన యోధుడు. దళవాయిగా ఆ కాలంలోనే గణన కెక్కాడు. తొండ మండలంలో అమరనాయంకారం సంపాదించాడు. అత్యున్నత _పదవులలోనున్న అత్యంత విశ్చసనీయులనే చక్రవర్తులు తమకు తాంబూలమందించే అడపాలుగా నియమించుకొంటారు.

చినచెవ్వప్పు నాయకుడు తొండమండలంలోని దేవికాపురం ప్రాంతాలవాడు. ఇది కృష్ణదేవరాయలవారి పూర్వీకులకు తూడా జన్మస్థలమే. తుశువవారు, సాళువవారు దేవికాపురంలో అమ్మవారికి చాలా దానాలు చేశారు.పి చెవ్వప్ప నాయకుడు తంబా క్‌ తగకతతం 1912 ననన 6. 111100 0 6066౭ 2౧6 19 గిటటా ౧5 5గంగజంయటో, క 9-90 7. 1906వ సంవత్సరపు 455వ నెంబరు శాసనం, 192 నాటి 182వ నెంబరు శాసనం ఈ నంగతులు

చెప్తాయి. చూ | [సుంట రిల - 6 7808 ౧౦టర్యా? దూరఆ *0829030ట పు, ౫7.

కి చాటుపద్య రత్నాకరం = పుట 17. $. 1324వ సంవత్సరపు 146వ నెంబరు శాసనం. కృష్ణస్వామిగారి పైన పెర్కొన్న పుస్తకంలో అదే పుట. 10. గజపతుల యుగం, సమగ్రాంధ్రసాహిత్యుం, మొదటి సంపుటి 2002

నాయకరాజుల యుగం 501 వూరికి రాజుగా వెళ్ళినా తొండమండలంలోని నెడుంగున్రం గ్రామాన్ని మరచిపోలేదు. చాలా దానధర్మాలు చేశాడు. శ్రీశ1550 ప్రాంతాలలోనే అతని శాసనాలు తంజావూరులో కనబడుతున్నాయి. అతడు క్రీ.శ1500 దాకా పాలించాడు. అతని తరువాత అతని కొడుకు రాజయ్యాడు. చెవ్వప్పు తన తోడల్లుని పేరే కుమారునికి పెట్టుకొన్నాడు. అచ్యుతప్ప నాయకుడు 1580 నుండి 1600 దాకా తంజావూరు పాలించాడు. ఈ తండ్రీకొడుకులు చాలా పుణ్యకార్యాలు చేశారు. పినచెవ్వప్ప అరుణాచలంలోనూ, వృద్ధాచలంలోనూ గోపురాలు కట్టించాడు. తిరువణ్డూమలైలోని గోపురం పదకొండు అంతరువులది. దీని నిర్మాణాన్ని ప్రశంసించుతూ కవులు ద్రాసిన పద్యాలు సంస్కృతంలోనూ, తమిళంలోనూ కనబడుతాయి.!1 అచ్చుతప్పు నాయకుడు శ్రీరంగంలో బంగారుసజ్జలు, ప్రాకారాలు కట్టించాడు. శృంగార వనాలు వేయించాడు. కీరీటరాజ్యాన్ని సమర్పించాడు. ఈ తండ్రీకొడుకులు తెలుగు సాహిత్యాన్ని పోపిస్తే ఆ సంగతి ఇంకా వెల్లడి కాలేదు.

సాహిత్య పోషణ చేసినట్టు సాక్ష్యాధారాలు లభించకపోయినా అచ్యుతప్పు నాయకుడు నాట్యకళకు శాశ్వతమైన స్థానాన్ని తంజావూరు రాజ్యంలో నెలకొల్పాడని చెప్పడానికి ఎన్నో దాఖలాలు నేటికీ కనబడుతున్నాయి. తంజావూరు రాజ్యపాలకునిగా చెవ్వప్పు నాయకుడు తన నాయంకరం నుండి సకుటుంబ సపరివారంగా తరలివచ్చి నప్పుడు అతనితోపాటు కవులు, గాయకులు, నట్టువమేళాలవారూ, భట్టులూ, బ్రాహ్మణులూ వచ్చి కావేరీ ప్రాంతాలలో స్థిరపడినా, కర్ణాటక సావమ్రాజ్యుం నుండీ నాట్యమేళాల వారు మాత్రం అచ్యుతప్ప నాయకుని కాలంలోనే వలస వచ్చినట్లు కనబడుతుంది. నాటి నెల్లూరు మండలంలోని పిశుపాడు పరిసరాలలోని కొన్ని ట్రాహ్మణ కుటుంబాలు బహుశా నాట్యవిద్యాపారంగతులు, తంజావూరు సీమకు (్రతుకు తెరువుకోసం వచ్చారు. వారికి అచ్భుతప్పు నాయకుడు ఒక అగ్రహారాన్ని దానం చేశాడు. ఈ దానానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అచ్యుతప్పనాయకుడు ఒకనాడు పరాకుగా ఎడమ చేతితో తన అడపం నుండి ఆతుమడుపులు పుచ్చుకొని నోట పెట్టకొన్నాడు. తాంబూలం సేవిస్తూ ఉంటే తాను చేసిన తప్పు తెలిసింది. ఆచార విరుద్ధమైన పని తెలిసి చేసినా తెలియక చేసినా పాతకమే. ఈ పాపపరిహారార్థం అప్పుడే పిశుపాడు నుండి వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలకు ఒక అగ్రహారాన్ని దానం చేశాడు. అ వూరికి మేలట్టూరు అని పేరు. తమిళంలో మేల్‌ అంటే ఎగువ, ఉన్నతం అని అర్థం. ఈ గ్రామాన్నే 'ఉన్నతపురి' అని సంస్కృతీకరించి సిలువసాగారు. దానమిచ్చాళ దానిని అచ్చుతపురమనీ, అచ్యుకాల్టిపురమనీ ప్యవహరించసాగారు. అచ్యుతపురి అగ్రహారం నదీతీరాన ఉంది. అచ్యుతప్పు నాయకుడు గ్రామాన్ని 510 ఖండాలుగి? విభాగించాడు. 500 భాగాలను పిశుపాడు బ్రాహ్మణులకూ, మిగతా 10 భాగాలను కోమట్టూ, గ్రామశిల్పులైన ఇతర కులాలవారికీ ఇచ్చాడు. బ్రాహ్మణ కుటుంబాలలో ప్రతిఒక్కరికీ 11. రఘునాథనాయకాభ్యుదయం, తెనుగుపీఠిక, పుటలు 5-6

502 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఒకటిన్నర ఎకరాల పౌలమేకాకు ఒక్కొక్క కుటుంబానికి పెరట్లో బావి తవ్వించిన ఒక్కొక్క యిల్లూ అచ్యుతప్ప నాయకుడు ప్రసాదించాడు. దాన శాసనాన్ని ఇచ్చాడు. శాసనాన్ని స్వీకరించిన వారి ఇంటిపేరు పిశుపాటికి బదులుగా అరక్కొండవారని అనాటి నుంచీ మారింది. రాజముద్రికను అరక్కు అంటారు. దానిని పుచ్చుకొన్నవారు “అరక్కొండ'వారు. ఈ ఇంటిపేరు గలవారు ఇప్పటికీ మేలట్టూరులో ఉన్నారు. తెలుగు మాట్లాడుతారు.]2 అచ్యుతప్పు నాయకుడు ఈ ఒక్కగ్రామాన్నే కాదు మరికొన్ని అగ్రహారాలను కూడా ఆ సీమలోనే నాట్టవిద్యాకోవిదులకు ఇచ్చాడు. శాలియ మంగళం అనే గ్రామములోని నాట్య కుటుంబాలవారు తమ గ్రామానికి అచ్యుతపురమనే పేరు ఉందని, వాస్తవానికి తమ అగ్రహారయే ఆ నాయకుడిచ్చిన దానాలలో మొదటిదనీ చెప్పుకొంటారు. ఉత్తరోత్తరా మేలట్టూరులో భాగవతమేళా నాట్యనాటక ప్రదర్శనలు ఎలా విస్తరించాయో, అలాగ శాలియమంగళంలో కూడూ పల్లవించాయి. ఈ గ్రామంతోపాటు శూలమంగళం, నల్లూరు, ఊత్తుకాడు, తెప్పెరుమనల్లూరు అనే అగ్రహారాలు కూడా వెలిశాయి. భాగవతమేళా నాటకాలకు ఆలవాలయ్యాయి. ఇది అచ్యుతప్పు నాయకుని ఆదరణవల్లనే సాధ్యమైంది. ఇంకా ఎన్ని మంచి పనులు ఇతడు చేశాడో? “అచ్యుతాభ్యుదయ ప్రబంధం' అనే ద్విపద కావ్యాన్ని రఘునాథనాయకుడు రచించాడు. ఇందులో తన తండ్రి జీవిత హోషాలను కథనం చేసి ఉంటాడు. దురదృష్ట వశాత్తూ ఈ గ్రంథం నష్టమైంది. లేకపోతే చాలా విషయాలు వెలుగులోనికి వచ్చేవి. అచ్యుతప్ప నాయకునికి ౩70 మంది భార్యలట. ఈయన క్రీ.శ1600లో మరణించినప్పుడు ఆ భార్మలందరూ సహగమనం చేశారట. అచ్యుతప్పు నాయకుని తరువాత రఘునాథుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు రెండో కృష్ణదేవరాయలు; మరో భోజుడు. స్వయంగా రసపుష్టిగల రచనలు చేయగల జాణ. తవిత్వం చెప్పి ఇతణ్జి మెప్పించడం ఒక గౌరవమే. అందుకే చేమకూర వెంకటరాజుగారిలొ అన్నారు. తారసపుష్టిమైప్రతిపదంబున జూతియు వార్తయున్‌ జమ క్కారము నర్థగౌరవము గల్లు ననేకకృతుల్‌ ప్రసన్నగం ఫీరగతిన్‌ రచించి మహి మించినచో నిక శక్తులెవ్వర య్యా! రఘునాథభూప రసికాగ్రణికిన్‌ జెవి సోక జెప్పుగన్‌: - (విజయవిలాసం, పీఠిక 31) 12. కృష్ణా బిల్లా దివిసీమలోని నేటి కూచిపూడినుండే ఆదిలో నాట్యమేళాల కుటుంబాలు తంజావూరు వెళ్ళి ఈ దానాలు పొందినట్టు కూచిపూడివారు చాటుకొంటారు. వారి మాటను కొందరు నాట్యకళాఖిమానులు బలపరుస్తారు. అయితే ఇందుకు వారివారి ప్రగాడవాంఛలేతప్పు ప్రబలమైన చారిత్రక ప్రమాణాలు ప్రస్తుతం ప్రచారంలో లేవు. మేంట్టూరులో పిశుపాటి వారితోపాటు “తోమండూరు' వారు తూడా వచ్చి స్థిరపడ్డారు. చూ 'శ్రుతి' అంగ్ల పత్రికలో వ్యాసం. (శ్రుతి-సంచిక నెంబరు 22) 13. న్‌ - ఉతముం ర౧ట4వగ/ - పు, 400

నాయకరాజుల యుగం 503

కవిత్వం ఎలాగ ఉండాలో రఘునాథనాయకునికి బాగా తెలుసు. కప్పురాలు కుప్పలు పోసినట్లు, కుంకుమ పై పై గుప్పిన క్రియ, విరిపాట్లము విప్పినగతి కవిత్వం ఘుమ్ముమనాలట. చెవులకు చవులై చల్లగా కవులను తవులై సమస్త కావ్యకళా బంధువులై రసికసింధువుఖలై “అవురా!? అనిపించాలట. తన రచనలలో కవితాలక్షణాలు చెప్పి రఘునాథుడు రసవంతమైన రచనలే చేశాడు. అతని తరువాత రాజ్యానికి వచ్చిన విజయరాఘవ నాయకుడు కూడా కమ్మని రచనలు కావించాడు. ఈ తండ్రీ కొడుకులు చేసిన సాహిత్యసేవ అపారం. పోషించిన కవులు, చెప్పిన కావ్యాలూ, అందిన కృతులూ అసంఖ్యాకాలు. ఈ ఇద్దరి జీవిత చరిత్రలూ ప్రత్యేక వ్యాసరూపంలో విపులంగా తలుసుకొందాం.

తంజావూరు తరువాత చెప్పుకోవలసిన సాహిత్యపీఠం మధుర. క్రీ.శ 1529లోనే మధురలోనే నాయకరాజ్యం స్థాపన జరిగినా క్రీ.శ. 1623 దాకా, అంటీ రమారమి వంద సంవత్సరాల గాకా, ఈ నాయకరాజులు ఆదరించిన కవుల పేర్లు అయినా తెలియవు, క్రీ.శ1623లో రాజ్యానికి వచ్చిన తిరుమలనాయకుడు సాహిత్యపోషణ చేశాడు. ఈయన మీద క్షేత్రయ్య రెండువేల పదాలు చెప్పి మెప్పించి మంచి బహుమానాలు పొందాడు. ఈ తిరుమలనాయకుడు లింగనమఖి తిరుకామయ్య అనే కవిని ' కూడా ఘనంగా సత్కరించాడు. ముత్యాల గుత్తులున్న వెల్లగొడుగులు, వింజామరలు, సీకుదాన, బంగారు పల్లకీ మొదలైన బహుమానాలు ఇచ్చాడు. తిరుకామయ్యను యింత గొప్పగా సన్మానించడానికి, అతడు ఏవో రచనలు తిరుమలనాయకునికి అంకితం ఇచ్చి ఉంటాడు, అయితీ వాటి వివవూలు తెలియవు. తిరుమలనాయకుడు 1659లో మరణించాడు. తరువాత అతని కొడుకు చినముద్దు వీరప్ప ఆర్నెల్లపాటే పాలించాడు. ఆ పిమ్మట తిరుమలనాయకుని పెద్ద మనుమడు చొక్కనాథుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడూ, ఇతని తమ్ముడూ సాహిత్యపోషణ చేసినవారే. చినముద్దు వీరప్పుకు నలుగురు భార్యలు. నలుగురు పెళ్ళాలకు నలుగురు కొడుకులు. వారి పేర్లూ, సాహిత్యసేవా విపులంగా తెలుసుకొందాం.

  1. చొక్కనాథుడు: ఇతడు మీనాక్షమ్మ పుత్రుడు. 1659 నుండి 18692 దాకా మధుర పాలించాడు. తన తాతగారిలాగే ఈయన తఈూడా లింగనమఖి తిరుకామయ్యను పోషించాడు. వచన గ్రంథాలు, రచనలు ప్రోత్సాహించాడు. ధేనుమాహాత్మ్యం అనే వచనకావ్యాన్ని వ్రాసి తిరుకామయ్య చొక్కనాథునికి అంకితం ఇచ్చాడు. ఇతని తమ్ముల చేత సత్కారాలు పొందిన కవులందరూ ఇతని చేత కూడా బహుమానాలు పొంది ఉంటారు.

  2. ముద్దు అళగిరి ; మధుర నాయకరాజులందరిలో ఇతడే ఎక్కువగా సంగీతసాహిత్య వినోదాలలో కాలం గడిపాడని చెప్పవచ్చు. ఈయన చొక్కనాథుని సవతి తమ్ముడు. లింగమ్మగారి కొడుకు, తంజావూరిలో విజయరాఘవ నాయకుడెంత భోగలాలసుడో మధురలో అళగిరి అంత శృంగార పురుషుడు. ఈయనను కలియుగ గోపాలుడని జనులు పిలిచేవారు. మంచి వయసులో ఉన్న సాగసుకత్తెలెప్పుడూ ఇతని చుట్టూ కిక్కిరిసి ఉండేవారు. ఇతడు సకలవిద్యాప్రొఢీ, సర్వజ్ఞుడని కవులు పౌగిడేవారు.

504 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈయన స్వయంగా కవిత్వం చెప్పేవాడు. ముద్దళగిరి సాహిత్యరచన ఎలా చేసేవాడో అతని అన్థాన విద్వాంసుడు ఇలా వర్ణించాడు.

చల్లని మల్లెపూజుల్లు లెత్తిన భాతి, ననకేనెసోనలు నునుచురీతి

గమ్మక పువు దుమారమ్ముల చందాల, వింతకస్తురి వీణ విష్పులీల

బన్నీటి చిట్టేట పరిఢవిల్లిన జాతి, బల్కునెచ్చెలి వీణె పల్కురీతి

జల్లదన ముల్లసిల్లంగ నెల్లవారు-నౌర సెబాసు మేలు మజ్ఞారె యనగ

బ్రౌడి మెరయంగ సాహిత్యరచన సేయు- నెపుడు ముద్దళఘరిశారి రిపువిపారి

(సత్యభామాసాంత్వనం, 1-112) అందరు సెబాసు, మేలు, మజ్ఞారె అనేటట్టు సాహిత్య రచన చేసే ముద్దళగిరి వ్రాసిన కావ్యమేమిటో దొరకలేదు. కనీసం వాటి పేర్లయినా తెలియవు. అయితే అతడు అంకితం పుచ్చుకొన్ను గ్రంథాల వివరాలు తెలుస్తున్నాయి. లింగనమఖి తిరుకామయ్య చేత రుక్కిణీ పరిణయం, సత్యభామా సాంత్వనం అనే కావ్యాలు బ్రాయించి అంకితం పుచ్చుకొన్నాడు. గణపవరపు వెంకటకవి ఇతని పోషణలో ఉండి విద్యావతీదండకం వ్రాశాడు. ముద్దళగిరి క్రీశ1674లో తంజావూరుతు ప్రభువయినప్పుడు అతనితోపాటు వెంకటకవి తూడా వెళ్లాడు. అతని తాత్కాలిక విజయాలను ఘనంగా ప్రశంసించాడు.

  1. అచ్యుతప్పవాయకుడు: ఇతడు చొక్కనాథునికి మరో సవతి తమ్ముడు. చినముద్దు వీరప్పగారి మూడవ భార్య నాజమ్మకు పుట్టినవాడు. ఇతడు సర్వవిద్యా నిపుణుడని, కవితాచతురుడని లింగనమఖి తిరుకామయ్య చెప్పిన ఒక పర్యంవల్ల తెలుస్తోంది (సత్య. 1-100). “మృదువెరుంగక మున్న పౌదలెను సాహిత్యఖేలనంబు కవీంద్రలాలనంబు అని మరో పద్యంవల్ల తెలుస్తోంది (1-101). అయికీ అచ్చ్యుతప్పు నాయకుడు వ్రాసిన గంథాలుగాని, పోషించిన కవుల పివరాలుగాని తెలియవు.

  2. నరసింహనాయకుడు ; ఇతడు ముద్దువీరప్పు నాయకుని నాల్లవభార్య కొడుకు. ఆమె పేరు మధురనాయకి. నరసింహుడు “కవివచనజాతహర్డుడు' అని నింగనమఖి తిరుకామయ్య చెప్పాడు (సత్య. 1-103). ఇంతకు మించి ఇతని సాహిత్యప్రీతి మనకు తెలియదు.

ఈ విధంగా చొక్కనాథుడూ, అతని ముగ్గురు తమ్ములూ తరువాత తిరుమల నాయకునిలాగే కవులను పోషించి సన్మానించి తెలుగు సాహిత్సాన్టిి మధురలో వెలయించారు. ఈ అన్నతమ్ములు తరుమలనాయకుని మనుమలని సత్యభామా సాంత్వనంనాటి సమకాలిక గగ్రంథాలవల్లా, ప్రసిద్ధ చరిత్రకారుల పరిశోధనవల్లా తేలుతున్నా నేలటూరి వెంకటరమణయ్యగారు మాత్రం వేరుగా చెప్పారు. తిరుమల నాయకుని గురించి చెప్పి “ఇతనివలె ఇతని తమ్ముని పుత్రులు చొక్కనాథనరపతియు. ముద్దళగిరియు. భాషాపోషకులు” అని వ్రాశారు.ే తిరుకామయ్య వ్రాసిన ధేను మాహాత్మాన్ని అంకితం పుచ్చుకొన్నా '“చొక్కనాథుడు కామేశ్చరకవి కాశ్రయమొసగెనే 14. దక్షిణాంధ్రసాహిత్యం, పుట 10.

నాయకరాజుల యుగం 505 కాని గ్రంథరచనకు బురికొల్పినట్టగపడదు” అని ఏ కారణంవల్లనో నేలటూరివారు బ్రాశారు.]5 మధురనాయకరాజుల గురించి ఇంకా విస్పష్టమైన పరిశోధనలు అవసరమని ఇందువల్ల డేలుతుంది.

దక్షిణాన వున్న నాయకరాజ్యాలలో ఈ విధంగా గ్రంథ రచన సాగుతూ ఉంటీ తక్కిన ఆంధ్రదేశంలో బహుముఖాల సాహిత్య రచనలు సాగాయి. రాయసింహాసనంపై పాలించిన మూడవ వెంకటపతిరాయలు (క్రీ.శ1630-1612) కవుల కాశ్రయమిచ్చి పోషించాడు. తనపేర కృతులు చెప్పించుకొన్నాడు. సత్కవివేశ్యాభుజంగురనే విరుదుగల ఉప్పగుండూరు వెరియన్న 'మీనకేతాభ్యుదయం' అనే (గ్రంథాన్ని వెంకటపతిరాయలకి అంకితమిచ్చాడు. బుగ్వేది తిరువేంగళయ్య అనే కవిని 'కొలకులాయపు దేజీబలురౌత'ని వెంకటపతిరాయలు మెచ్చుకొని సత్కరించాడు. బహుశ గణపవరపు వెంకటపతిని తూడా సన్మానించి ఉంటాడు.

వెంకటపతిరాయల దండకం అని ఇతని పేర ఒక దండకం కూడ ఉంది. ఈ యుగంలోనే, నేటి నెల్లూరు జిల్లాలో చాలామంది ప్రముఖ కవులు కనబడతారు. పుష్పగిరి తిమ్మనగారు, వారి కవిమిత్రులు ప్రశస్తమైన రచనలు చేశారు. పల్నాడులో అప్పకవి, జటప్రోలు, బోరవెల్లి మొదలైన తెలంగాణా సంస్థెనాలలో ఎలకూచి బాలసరస్వతి, మాధవరాయలు వంటి మహోపాధ్యాయులు, కవులు కనబడుశకారు. నూజివీడు, పెద్దాపురం వంటి సంస్థానాల సాహిత్య పోషణ కూడా ఈ యుగంలో చిగురించింది. గోలకొండ సుల్తానులు తూడా క్షేత్రయ్య పదాలను మెచ్చుకొనడం కాశ '“ముషైరాల వాదాలు పెట్టించినట్టుంది.

ఈ యుగంలో భారత భాగవత రామాయణాలు మూడు ద్విపద కావ్యాలుగా రూపొందాయి. భాగవతం వచనరూపం తూడా సంతరించుకొంది. యక్షగానాలు, వ్యాకరణ శాస్త్రాలను పకడుబందుగా నిర్మిస్తూ ఉంటే, మరోపక్క యథేచ్చగా కవులు రచనలు చేస్తూవచ్చారు. జాతివార్తాచమక్కారాలు గుప్పించే కావ్యాలు కొందరు బ్రాస్తే, చిత్రబంధగర్చ కవిత్వాల ఫీట్లు మరికొందరి దృష్టిలో ప్రజ్ఞ అనిపించుకొంది. రాజును పొగడన చిల్లర కవులు సపాతం అందలాలెక్కారు. పుష్పగిరి తిమ్మనలాంటి సజ్జనులు దరిద్రంతో బాధపడ్డారు. సామాన్య ప్రజల బాధలు ఈ యుగంలోని సాహిత్యంలో అంతగా కనబడవు. అయితే ప్రజాజీవితం సుఖవంతంగా ఉందనుకోడానికి ఆస్కారం లేదు. ప్రభువుల భోగలాలసత్వాన్ని పరిపరివిధాల స్తుతించే కవుల పద్యాల హోరులో జనసామాన్యం గోడు వినబడలేదు. శృంగార కావ్యాల పరిమళం చివికిన ప్రజాజీవితపు వాసనలను బయటపడనీయడం లేదు. దక్షిణాది కవిత్వంలోని మాధుర్యం మిగతా చేదునిజాలకు పంచదార పూత అయింది. నూజీివీటి ప్రభువులు చెప్పినమాట అక్షరాలా నిజం. తన ప్రాంతాల వారి కవిత్వాన్ని నరసింహ అప్పారావుగారు ఇలా మెచ్చుకొన్నారని కుమారధూర్దటి చెప్పాడు.

  1. దక్షిణాంధ్రసాహిత్యం, పుట 10.

506 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దాక్షీణాత్యకవులు ద్రాక్షేక్తుముధురస- మాధురీధురీణమహితదివ్య భవ్యకావ్యనవ్యపటువాక్చమత్కార- పటిమ దనరినట్టి ప్రొఢులంద్రు

(ఇందుమతి. 1-32) ఈ పద్యంలో చెప్పినట్టే నాయకరాజుల యుగంలోని ద్రాక్షాసవం, చెరుకుపానకం వెల్లువలుగా పారుతాయి. వాక్యచమత్కారాలు కోకొల్లలుగా కనబడుతాయి. ఈ మాధుర్యాలు విడీవిడిగా ఆస్వాదించుదాం. (మ కల్యాణ అ సరుకు ఓర్టుల్ల సెంహ్మ్తల్తు గుల్బర్ల్గ ఆ గోల్మ్రిండ పెదాపురం వాపు కంది] జా వరక కొండవీడు బెజవాడ్తగ కంపిలి ట్‌ అయన రమ ఇ! కందుక లి ఇ స్ట కాం గ్య ళ టి ఈ పెనుగొండ లొ పులికాట్‌ శృంగేరి ఖ్‌ అ ధదాటాళ్రా సరము గ్‌ా వెంటీజణ ఉమ్మత్తూర దమం యయ! తంజావూర్‌ పుదు టు మ్మో ల నాయకరాజులనాటి దక్షిణదేశము

ద్విపద భారత కవిత్రయం

గౌసటవీసటే చదివి గాథలు తవ్వుకొనే తెలుగు జాతికి కవిత్రయంవారు సంపూర్ణమైన భారతాన్ని ప్రసాదించారు. పంచమ వేదాన్ని స్వీకరించి ఆంధ్రులు కళ్ళకు అద్దుకొన్నారు. అది పరమ ప్రామాణికం అయింది సంస్కృతంలోని భారతం తెలుగులో పద్యరూపంలో వచ్చాక, ఈ పద్య కావ్యమే ద్విపదగా, ప్రజలకు మరింత దగ్గరకు వస్తే బాగుంటుందనే అఖిప్రాయం కొందరికి కలిగింది. పద్యభారతం సంపూర్ణ స్వరూపాన్ని సంతరించుకొన్న పాకనాటి సీమలోనే ఈ ఆశయం మొలకెత్తి కొనసాగి ఫలించింది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలో ఆత్మకూరు, బట్టేపాడు అనే రెండు గ్రామాలున్నాయి. ఈ జంట గ్రామాలు ఉదయగిరి రాజ్యలక్ష్మికి పాదపద్మాలని మన పూర్వులు భావించేవారు.

ఉదయగిరి రాజ్యులక్ష్మికి - సదనము నెల్లూరు, అట్టి సాధ్వీమణికిన్‌

వదనంబు కందుకూరగు - పదయుగళము ఆత్మకూరు బట్టేపాడున్‌. అనే చాటువు కూడా ప్రచారంలో ఉంది. బట్టీపాడు గ్రామంలో తిరుమలభట్టు అనే కవి ఒకాయన ఉండేవాడు. అతని తండ్రీ పేరు వల్లభసూరి. ఈ తిరుమలభట్టుగారినే తిమ్మన్న అని పిలిచేవారు. ఇతని కవిత్వం ఫ్రొడోక్తులతో నిండి ఉండేది. క్రీ.శ1600 ప్రాంతాలలో బట్టేపాడు పరిసరాలో నరసయ్యగారి చౌడయ్య అనే ఉద్యోగి ఉండేవాడు. ఆయన “అసమాన దాన విద్యావినోదాలతో దెసల కీర్తిల్లే మంత్రి. అంతేకాదు, 'పంచమవేద ప్రబంధసత్కిర్తిని మించిన సత్యధర్శ్మి" ఈ నరసయ్యగారి చౌడయ్య కర్జ్ణావతారుడు; జాస్త్రపురాణార్థసారవివేకుడు. ఇతడు బట్టేపాటి తిమ్మయ్యను ప్రోత్సహించాడు. భారతాన్ని ద్విపదగా రచించమన్నాాడు. పాదాలలో శ్రీరాముణ్జీ రామాయణక్రమంలో నుతించాడు.

జయజయగుణధామ జయజయరఘురామ- జయనిత్యకళ్యాణ చకితసంత్రాణ

నీకునే చెప్పబూనిన కథా క్రమము-చేకొని విన్నవించెద చిత్తగింపు.

(ద్వాభా.ఆగి. పుట 2) అని అదిపర్వాన్ని 8 ఆశ్వాసాలుగా వ్రాశాడు. తొలి మూడు ఆశ్వాసాలు శ్రీరామునికి అంకితం ఇచ్చినట్టు కనబడుతుంది. నాలుగో అశ్వాసం నుంచి నరసయ్య చౌడుడే కృతిపతిగా కన్పిస్తాడు. ఆయనని తిరుమలభట్టు "పంచమ వేద ప్రబంధైకనాధు'డని నాలుగో అశ్వాసం చివర సంభోధించాడు. వాస్తవానికి ఆదిపర్వమంతా తిరుములభట్టువారు నరసయ్యచౌడునికే అంకితం యిస్తే లేఖకులు అఆ్బూాసాల ఆద్యంకాలలో మార్చులూ తూర్పులూ చేసినట్టుంది.

  1. ద్విపద భారతాన్ని పరిష్కరించి విపులమైన పీరికబ్రాసిన ఆదార్య పింగ?ి లక్ష్మీకాంతంగారు ఉదాహరించారు. ద్విపద భారతం, తొలిసంపుటం, పుట 4.

508 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

తిరుమలభట్టుగారు ఆదిపర్వం రాస్తున్నప్పుడు వారి తిష్యుడో, మిత్రుడో బాలసరస్వతి సభాపర్వాన్ని రెండాశ్వాసాల ద్విపద కావ్యంగా వ్రాశాడు. ఈ బాల సరస్వతి తాను అసమసాహిత్యవిద్యా చతుర్ముఖుణ్జీ అని చెప్పుకొన్నాడు. ఆయన చాలా రసికుడు. సభాపర్వాన్ని పసగా చెప్పినట్టు అతడు భావించాడు. తిరుమలభట్టుగారు అదిపర్వాన్ని నరసయ్యచౌడునికి అంకితం యిస్త, సభాపర్వాన్ని బాలసరస్వతి రంగయ్యగారి అనంతయ్యకీ అంకితం ఇచ్చాడు. ఈ అనంతుడు దానకర్ణావతారుడట. అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాసి రామునికే అంకితం ఇచ్చాడు. అరణ్యపర్వం బ్రాసేనాటికి చౌడుడు ఏమయ్యాడో తెలియదు. రాజకీయ పరిస్థితుల మార్పువల్ల బహుశా ఎక్కడికైనా కదలిపోయాడో, మరణించాడో తెలియదు. పోషకుడున్నా లేకపోయినా తిరుమలభట్టు భారత రచన కొనసాగించాడు.

ఆయన విరాటపర్వం మొదలుపెట్టేసరికి బట్టేపాడులోనే ఉండే జంగాల ముమ్మయ్యా అనే పంటరెడ్డి ప్రభువు ద్వాపద కావ్యాన్ని అంకితం పుచ్చుకొని కవిని పోషింపదలిచాడు. విరాటపర్వం తనకు అంకితం ఇవ్వమన్నాడు. ఈ పంటరంెడ్డే బహుశా బట్టేపాడు పాలకులు కాబోలు. ముమ్మయ్య తండ్రిపేరు దానయ్యరెడ్డి: తాత పేరు మలిరెడ్డి. వాళ్ళకు చలమర్తి గండ, కర్ణాటక తిలక మొదలైన బిరుదులున్నాయి.

_. విరాటపర్వాన్ని ముగించాక మళ్ళా ఏ కారణాల చేతనో తిరుమలభట్టుగారి పోషకులు తరువాతి పర్వాలను అంకితం పుచ్చుకోలేదు. ఉద్యోగభీష్మద్రోణ పర్వాలు మూడింటినీ ముగించి తిరుమలభట్టుగారు. దేవునికే అంకితం ఇచ్చారు. పోషకులు తప్పుకొన్నట్టే. సాయం చేసే శిష్యులు కూడా జారుకొన్నారేమో తెలియదు. బాలసరస్వతి ఒక్క సభాపర్వం మాత్రమే రచించాడు. ఆ తరువాతి పర్వాలను గురువుగారికే వదిలివేశాడు. ఆదిలో ఇద్దరూ చెరోపర్వం చొప్పున చెప్పుకుంటూ పోదామనుకున్నా రేమో, సభాపర్వం చెప్పాక, ఏ అవాంతర కారణాలవల్లనో బాలసరస్వతి భారత రచన కొనసాగించలేదు. తిరుమలభట్టుగారు ద్రోణపర్వందాకా ఒక్క చేతిమీద ద్విపద భారతం వ్రాశారు.

ఆ తరువాత ఆత్మకూరు సోమన్న అందుకొన్నాడు. భారతాన్ని తుదముట్టా రచించాడు. ఇతని తండ్రీ పేరు కూడా తిమ్మయ్య. బట్టేపాడు తిమ్మయ్యగారూ, ఈయనా విఖిన్నలు. బట్టేపాడు తిమ్మయ్యగారు సదాశివ భక్తులు; సోమన్న తిరుపతి వేంకటేశ్చర ఆరాధకుడు. తన తండ్రి పేరు ఆతుకూరి తిచ్మయ్య అనీ, తాను వెంకటాచలాధీశుని 2. ఈ నరసయ్య చౌడుడెవరో ఇదమిత్థంగా తెలియకపోయినా ఆయన జంగాల ముమ్మయ్యగారి మంత్రి

ఆశ్రయం సంపాదించడానికి తిరుమలభట్టుగారు ముందు నరసయ్య చౌడుని మంచి చేసుకొని కొన్ని ఆశ్వాసాలు అంకితమిచ్చాడని కొమ్మనమంచివారి ఊహ. చూ॥ పరిశోధన - సంచిక 12. ఫిబ్రవరి 1966 పుట 26. అధోజ్ఞాపిక

ద్విపద భారత కవిత్రయం 509 భక్తుజ్జనీ మాత్రమే సోమన్న చెప్పుకొన్నాడు. కర్ణపర్వం దగ్గిర నుంచి స్వర్గారోహణపర్వం దాకా పదకొండు పర్వాలు వ్రాసినా వాటిలో సోమన్న ఎక్కడా తనని గురించి చెప్పుకోలేదు. ఈ పదకొండు పర్వాలే కాక సోమన్న భారత రచనలో మరికొంత పాత్ర వహించాడు. తిరుమలభట్టుగారు అరణ్యపర్వంలో కొన్ని కథలను విడిచిపెట్టారు. ఆయన వదలిన కథలను సొంతంగా చెప్పి అయిదాశ్చాసాల పర్వాస్ని సోమన్న ఏడాశ్వాసాలు చేసీ ఈ సంగతి చివరి గద్యంలో చెప్పాడు.

అరణ్యపర్వంలో కొన్ని కథలను విడిచిపెట్టడానికి తిమ్మయ్యగారికో కారణం ఉంది. భారతాన్నే కాక వారు ఇతర ద్విపద కావ్యాలను తూడా వ్రాశారు. భారత గాథలనే తీసుకొని ప్రత్యేక గ్రంథాలుగా వ్రాయదలచినట్టుంది. మూడాశ్వాసాల ద్విపద కావ్యంగా బట్టేపాట్‌ తిమ్మయ్యగారు నలచరిత్రను చెప్పారు. ఇది అముద్రితం. దీనికి 7 ప్రతులు మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి. (1166 9, ౨ 1070, 1071, 1072, 1074, 1075, 1076) వీటిలో 0 1070 ఒక్కటే సమగ్రంగా ఉంది. దానిలో గద్య ఇలా

ఇది సదాశివ భక్తహిత గుణాసక్త - సదయస్వరూప కాశ్ళపగోత్రదీప

శ్రుతిపాత్రవల్లభసూరిసత్ప్సుత్ర - మతి మద్విధేయ తిమ్మననామధేయ

విరచిత నలచక్రవిభు సుచరిత్ర (0 1070 ఇది శ్రీరామునికే అంకితం ఇచ్చారు. "కాకుత్‌స్థకులసోమకళ్యాణనావమ, నీ కర్పితంబుగా నే రచియింతు' అని మొదట చెప్పారు. తరువాత ఇలా అన్నారు:

భఖారతకథలోన పంచమవేద - సారంబు కీర్తిగా సాధించెగాన

వార్తగా నలచక్రవర్తి చరిత్ర - కీర్డింప హరికి నంకితముగా ద్విపద గావింతు...

(1070

ఈ నలచరిత్ర చాలా వ్రచారం పొందిందని చెప్పవచ్చు. ఎందరో వీటికి ప్రతులు బ్రాసుకొన్నారు. అక్కడితో ఆగక సౌంతపాఠాలు కూడా చొప్పించారు. మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్న ఏడు ప్రతులలోనూ పాఠాలు చాలా భేదిస్తాయి. ఒక ప్రతిలో కవి తాను రంగనాథుని భక్తుడని, ఉభయ కావేరీ మధ్యవాడని ఇలా ఉందిః

చారణసిద్ధఖేచరశుభాకారు - గారుణ్యగుణధాము ఘను రంగధాము

నిష్కళంకోన్నతి నెరనొప్పు చంద్ర-పుష్కరణీతటంబున మహోన్నతిని

విలసిల్లు ఉభయకావేరిమధ్యమున - జెలువొందు గోవిందు జీరతరానందు

పరమమౌని నిఒవేల్పు ఫణిరాబితల్పు - మరవక భావించి మదిని సేవించి 1 1072)

అళ్వారులను. రామానుజులను, తిరుమలాచార్భుల వారినీ కూడా సేవించి "ఈ చరిత్రముమను వొప్ప రంగనాథుని కటాక్షమున వివరింతు' అని కవి వ్రాశాడు. అయితే ఈ ప్రతిలో కవి పేరు లేదు. కాని కావ్యం తిమ్మయ్యగారి రచనే. పాఠభేదాలు చాలా ఉన్నాయి. కావేరీతీరం వారెవరో గ్రంథచౌర్యం చేసినట్టు కనబడ.తుంది. బట్టేపాటి వారి రచనలు ఇటు

510 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తంజావూరు దాకా, అటు తెలంగాణా దాకా బాగా వ్యాపించాయి. ద్విపద భారతానికి శాహాజీమహారాజు (క్రీ.శ. 1684-1712) పుత్రికలు వ్రాయించాడు. వ్రాయసకాడు తన గద్యను కూడా ద్విపదభారతంలో సుదీర్దంగా చొప్పించాడు. అసలు కవులు నాలుగైదు పంక్తులతో ముక్తసరిగా తమ సంగతి చెప్పుకొంటే, వ్రాయసకాడు సుమారు 72 పంక్తులలో తన గద్య వ్రాసుకొన్నాడు. ఇతని పేరు కుప్పయ్య. ప్రతులు బ్రాస్తున్నప్పుడు ఇతగాడు ఆదిపర్వంలో కృతిపతి విషయంలో కొంచెం వంచన చేసినట్టుందని పింగళి లక్ష్మీకాంతంగారు. భావించారు. ఈ _ ద్విపదభారత ప్రతులు తంజావూరు గ్రంథాలయంలో ఉన్నాయి. వాటికి నకళ్లు వ్రాయించి తెప్పించి ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు నాల్గు సంపుటాలుగా ప్రచురించారు.ే పింగళి లక్ష్మీకాంతంగారీ గంధాన్ని పరిష్కరించి విపులమైన పీరిక వ్రాశారు. అందులో ఆంధ్ర సహృదయులకు వారొక మనవి చేశారు. “ఈ భారతమును గవిత్రయ భారతముతో బోల్చి చూచి యిందు “అవిలేవివిలేవని యీసడీంపకుందురుగాక. దాని స్వారూపము వేరు; దీని స్వరూపమే వేరు. దాని ప్రయోజనమొకటి; దీని ప్రయోజనమింకొకటి. అది పుట్టిన దొక జాతిపాఠక లోకమునకు; ఇది పుట్టిన దింకొక జాతివారికి. కావున నొకజాతి వాబ్బయమునకు చెందిన యీ గ్రంథమును వేరొక జాతిదైన కవిత్రయ భారతముతో బోల్చ యత్నింపక దీని గుణమును బట్టియే దీని నాదరింపజూచు సరసులకు ఇది మెచ్చుగొల్పునేగాని నిరసన భాజనము గాదు”.

లక్ష్మీకాంతంగారి మాటలు సబబైనవేగాని సరిపోల్బడం సాహిత్యంలో సహజం. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుని జననఘట్టంలో నన్నయ్యగారు ఎలా వ్రాకారో, బట్టేపాటి తిమ్మయ్యగారెలా బ్రాశారో కొంచెం చూద్దాం. పరాశరుడు యమున దాటదలిచాడు. మత్స్యగంధి ఆయనను పడవలో ఎక్కించుకొంది. ఆమె లావణ్యానికి ఆయన ముగ్భడయ్యాడు. దానియందు మదనపరవశుడయ్యాడు.

ఈ ఘట్టంలో తిమ్మయ్యగారు ఎత్తుగడ బాగా చేశారు. పరాశరుణ్ణి చూసిన మత్స్యగంధి “దట్టపు భవవార్ధి దాటెడు నీకు ఇట్టి కాలువ లెంత యేతెంతుగాక' అని పడవ ఎక్కించుకొంటుంది. ఆమె కుడిచేయి పట్టుకొని ఆయన పడవ ఎక్కి ఉచితాసనంపై కూర్చున్నాడు. పడవ ఎక్కేముందు పాణిగ్రహణం చేయడం చాలా బాగుంది. ఓడలో ఉచితాసనం పై కూర్చుని -

“అంగజు సాక్షిగా నబల, యిచ్పోట-సంగమ మగుగాక సరి నీకు నాకు

ఉఊత్తమసతితోడ యోగమౌనేని-హత్తిన బ్రహ్మచర్యము చెర్గిపోదు

  1. ద్విపద భారతం, మొదటి సంపుటం, పీరిక, పుట 13.

  2. ఈ ద్విపద భారతంలోని విరాటపర్వం మాత్రం 1911లోనే అచ్చుపడింది. పనప్పాకం 'శ్రీనివాసాదార్యులుగారు పరిష్కరించారు. *ఈ గ్రంథమును ముద్రణకై సంస్కరించునెడ కొన్ని పాదములను మార్చియు ననేకములగు క్రొత్త పాదముల బేర్చియు సమగ్రమొనర్చి ముద్రించి యున్నాడ''అని వారు వ్రాశారు. ఇది చెన్నపురి శ్రీ, వైజయంతి' ముద్రాక్షరశాలలో అచ్చువేశారు.

  3. ద్విపద భారతం |, పీఠిక, పుట 41.

ద్వాపద భారత కవిత్రయం 511 చెరిగిపోయిన బోయె జెప్పెడి దేమి? - తెజవ, నీపొత్తు సంధిలవలదె నాకు చూచితి శర్వాణి, చూచితి రతిని. జూచితి హరిరాణి, జూచితి రంభ వింత పుట్టియెరుంగ, వేయేల నేడు-కాంత నీయెడల నయ్యెగన్నుల మరులు”

(ద్విపద భారతం, ఆది. పుటలు 105.106) తాను చూచిన వాళ్ళలో లక్ష్మీపార్వతులున్నారని, వాళ్ళని చూసినప్పుడు మరులు కలుగలేదని పరాశరుడు అనడం నేటి మర్యాదల దృష్టా ఏదోలా ఉంది. ఇటువంటి ఘట్టాలలో నన్నయ్యగారిలాగా మితంగా రాస్తేనే కథ ప్రసన్నమవుతుంది. మంచి ఎత్తుగడతో కథనం మొదలుపెట్టి తిమ్మయ్యగారిలా వ్రాసినందుకు సనాతనుల మనసు చివుక్కుమంటుంది. అయిడే విచ్చలవిడిగా శృంగారాన్ని కవులు బ్రాసే కాలం. ఆయన కొంత నిగ్రహంతోనే ఇతర చోట్ల రచన చేసినందుకు హర్షించాలి.

బట్టేపాటి &మ్మయ్యగారి కాలాన్ని ఇదమిత్సమని నిర్ణయించడానికి ఆధారా టేకుమళ్ల రంగశాయి ఇలా స్తుతించాడు:

రామాయణంబు భారతము ద్విపద-లై మీర చేసిన యా రంగనాధు

ధీరు బట్టేపాటి తిరుమలభట్టు- గారి ప్రొడోక్తులు గలుగ స్మరించి. (౫. 765)

టేకుమళ్ళ రంగశాయి తన ద్విపద భాగవతాన్ని పుష్పగిరి తిమ్మనగారి సాయంతో బ్రాశాడు. పుష్పగిరి వారి కాలం క్రీ.శ. 1625-50 అని చెప్పవచ్చు. బట్టేపాటి తిమ్మయ్యగారు వీరికి ఒకతరం ప్రాచీనులు కావచ్చు. ద్విపద భారత కవిత్రయంలోని మిగతా ఇద్దరూ ఇదే కాలంవాళ్లు అవుతారు. ఆత్మకూరి సోమన్న క్రీ.శ1600-1650 ప్రాంతాలలోను, బట్టేపాటి తిమ్మయ్య 1550-1600లోను ఉండి ఉంటారని పింగళి లక్ష్మీకాంతంగారు నిర్ణయించారు. "ఈ కవిత్రయంలోని బాలసరస్వతి ప్రొడుడు కాడు. బాలసరస్వతీశ్చరుని సభాపర్వమందలి రచన కేవలం బాలకవిత్వంవలె ఉన్నది. గ్రంథ సంపూర్ణతకు వెలితి లేకుండుటకై సభాపర్వము ప్రకటింపక తప్పినది కాదు”” అని లక్ష్మీకాంతంగారన్నారు. బాలసరస్వతి రచన పేలవమే. సోమన్న ఘటికుడే. చక్కగా బ్రాస్తాడు. ఉదాహరణకు ఒకటి చూద్దాం. మడుగులోంచి బయటకు వచ్చిన దుర్యోధనుడు భీమునితో ఇలా అన్నాడని తిక్కనగారు వ్రాశారు.

వ్యూహాభావముసూచి నన్ననదుగా నూహించెదో భామమ

ద్వాహాచండిమసారదుర్హమగదాదండంబు దీవ్యదృవ

ద్దేహోల్లాసము నెట్టు దీనదశకుందెనోపునో చూడుమీ

యాహాపుట్టెడు లాతి చూపరకు హాహాపుట్టు మీవారికిన్‌ (శల్య. 2-246)

ఈ ఘట్టంలో సోమన్న దుర్యోధనుని చేత ఇలా అనిపించాడు:

  1. ద్విపద భారతం, పుట 8. పీఠిక.

  2. అదే పుటట

512 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చపలారితిమిర ప్రచండ మార్తాండ - నిపుణుండ నాకు దా నీ వన నెంత పలుకుల వెరచునే ఫణికేతనుండు - కలదు ఒక్కటి నన్ను గడునెన్నమీకు గొలను జొచ్చిన యిది కొరగాదుగాక - అలసుగా జూచెద, వట్లు జూడకుము కలన నిన్నేటికి గైకొందు భీమ - కలితారివిత్రమ గర్వాపహారి నా గదాదండంబునకు బలిగాగ - నీ గర్చమడచి యెంతే నొంతు నిన్ను తగ జోద్యపరతు బృందారకావళిని - వగపు పుట్టింతు నావార్‌కెల్ల నీవనగా నెంత నిర్జరేంద్రాది - దేవతలు నన్నుదృష్టింప లేరు నీవెట్లు నాతోడ నెగడుదు గదను - ఈ వేళ నీ సత్త్వమిది ఎంత గలదు అడరంగ నీదు ఫాలాక్షరశ్రేణీ - తుడిచెద నాతోడ దొడరు మాజికిని,

(ద్విపద భారతం. శల్య. 2. పు 61, 62)

దుర్యోధనుడు ఖీమసినుని ఫాలాక్షర శ్రేణిని తుడుస్తానన్నా తుడవలేకపోయాడు. ద్విపద భారత కవిత్రయం అక్షరాలను గూడా కాలం తుడవలేదు.

ఎలకూచి బాలసరస్వతి - సురథి మాధవఠాయలు నిజమైన పండితుడు ఏదైనా బిరుదు ధరించడానికి ముందు అందుకు తనకు తగిన అర్హతలు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాడు. అన్ని బిరుదులూ ఒక ఎత్తు. “మహామహోపాధ్యాయా అనేది మరో ఎత్తు. ఇదెంత ఫీకరమైనదో అంత బరువైనది. 'కింకవీంద్రఘటా పంచానన' వంటి సవాలు బీరుదులనే ధరించిన తిరుపతి వేంకటకవుల పాండిత్యం అపారమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే చెళ్ళపిళ్ళ వెంకటశాస్రిగారంతటివారు మహామహోపాధ్యాయ అనిపించుకోణానికి వెనక తీశారు. ఆయన ఒకసారి ఇలా ట్రాశారు: “మన బిరుదాల విషయంలో ప్రభుత్వం జోక్యం కలిగించుకోదు. మహామహోపాధ్యాయ బిరుదం మాత్రమే వారి అధికారానికి లోబడేది. ఆ విరుదాన్ని వారు (అయాచితంగానే అనుకుందాం) యిచ్చినా, తన పాండిత్యమెంతో తెలిసిన వెంకటశాస్త్రి దానికి ఒక దండు పెడతాడు."'* విద్య వినయాన్ని ప్రసాదిస్తుందనడానికీ ప్రాఫెసరన్నమాట. అడిగిందల్లా చెప్పగలిగే సర్వతోముఖ పాండిత్యం ఉన్నవాడే ఆ వీరుదు పెట్టుకోడానికి అర్హుడు. మన తెలుగు సాహిత్యంలో మొదటి కవి మహోపాధ్యాయుడు ఎలకూచి బాలసరస్వతి అనే పండితుడు.

ఎలకూచివారిది పాకనాటిలో పండిత కుటుంబం. అందులో తిరుమలయ్య అనే ఉద్దండపండితుడు ఉండేవాడు. ఆయన అళియ రామరాయలు రాయసా[మ్రాజ్యం నిర్వహించే రోజులలో, అంటే క్రీ.శ1543 నుండి 1564 మధ్యనుండే పాతికేళ్ళలో ఎప్పుడో ఒకసారి అళియ రామరాయలను దర్శించి మెప్పించాడు. వెల్లగొడుగులు, పసిడీ

  1. నేటి విరుదుల పరమ రహస్యం కథలు, గాథలు - ౩వ ఖాగం, పుట 538.

ఎలకూచి బాలసరస్వతి - సురఖి మాధవరాయలు 65139 చామరాలు, పల్లకీలు, మణిహారాలు మొదలైనవాటితోపాటు బహుశా నెల్లూరు జిల్లా పొదిలి తాలూకాలో ఎడవిల్లి అనే అగ్రహారాన్ని బహుమానంగా పొందారు. ఈ తిరుమలయ్యకు ముగ్గురు తమ్ముళ్ళు. వాళ్ళలో రామన్న పెద్దవాడు. ఆయన మనవడి పేరు కృష్ణయ్య. ఇతడు పాకనాటి సుకవిపండితముఖ జనాచార్భుడు. ఈయనకు వెంకట కృష్ణయ్య. ఆదిత్యుడు అనే కుమారులు పుట్టారు. వీళ్ళలో పెద్దవాడు చిన్నప్పుడే విద్యలో పెద్దవాడయ్యాడు. ఇతడీలా చెప్పుకొన్నాడు: బాల్యమున బల్క ప్రవిముగ్ధభాషణముల తోడనె కవిత్వ పద్య సూక్తులును బల్క నేర్చెవిఖ్యాతి మెజసి పండితవరుండ నైతి, నిది శారద యనుగ్రహంబుగాదె? + (50) బాల్యంలోనే గొప్ప పాండిత్యం చూపడం వల్ల ఎలకూచి వెంకటకృష్ణయ్యను బాలసరస్వతి అని అందరూ పిలిచేవారు. బవిరుదే వ్యవహారనామం అయింది. అరు భాషలలో పాండిత్యం సంపాదించడమేకాక 'షడ్చాషావివరణం' అనే గ్రంథాన్ని ఇతడు ప్రత్యేకంగా వ్రాశాడు. ఇటువంటి శాస్త్ర గ్రంథాలనే కాక రంగకౌముది అనే నాటకాన్ని, కార్తకేయాభ్యుదయం, వామనపురాణం, బాహాటం అనే ప్రబంధాలు రచించాడు. భ్రమరగీతలు బ్రాశాడు. ఇతడు వామనపురాణాన్ని తినిగిస్తే ఇతని తమ్ముడు ఆదిత్య పురాణాన్ని రచించాడు. ఎలకూచివారిది పాకనాడేగాని వారు కొన్నాళ్లు విజయనగరంలో ఉండేవారు. బాలసరస్వతి విజయనగరంలో నివసించేటప్పుడు శివయోగి అనే అచింత్యకారణో పాగమ స్నేహసాహచర్యుడు ఒకాయన వచ్చాడు. ఆయన సిద్ధుడు. మతంగపర్వత నివాసి. విజయనగరానికి ఎందుకొచ్చినా బాలసరస్వతి చేత లోకోపకారం చేయించాలని శతాబ్దాల తరబడి అంతర్చూతమైన ఒక తెలుగు వ్యాకరణాన్ని సిద్ధుడు ఇచ్చాడు. దాని పేరు అంధ్రశబ్ద చింతామణి. దాన్నే బాలసరస్వతి శబ్బానుశాసనం అని పిలిచేవాడు. ఇది సంస్కృతంలో రచించిన చిన్న గ్రంథం. ఇందులో అది నన్నయభట్టుగారు విరచించారని సిద్ధుడు చెప్పాడు. బాలసరస్వతి ఆశ్చర్యపోయాడు. ఏమి మహాద్చుతం బిది హరీహరిః యెక్కడి యాంధ్రశబ్దచిం తామణీ ఫక్కి యెక్కడి మతంగనగంబు యుగాది సంభవుం డై మని చన్న నన్న్మయమహాకవి యెవ్వడు సిద్ధు డెవ్వడా..... హాః మదగణ్య పుజ్యసముదగ్రత బేకురెగాదె యిన్నియునో (బాలసరస్వతీయం, అవతారిక 8) 2. బాలసరస్వతి తన తమ్ముని పేరు అదిత్కుడని చెప్పాడు. ఇతడినే పిన్సయ ప్రఖాకరుడని వ్యవహరించేవారు. బాలసరస్వతి పెదతండ్రి ఒకాయన అదిత్యుడున్నాడు. అంచేత చిన్న ఆఅదిళ్కుణ్ణీ పిన్నయ ప్రభాకరం అని పిలిచేవారు కాబోలు. పిన్నయ భాస్టుర్గుడు చతుర్విధ కవిత్వం చెప్పగలడు. అదిత్స్వపురాణం ప్రతి ఒకటి పరిష రి లయంలో కుతి బాగా నన? సంచికలో నన తనా లగు 403). కా చెసము పౌంపూరి గురవమంత్రికి అంకితం ఇచ్చాడు.

6514 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ గ్రంథం తన పుణ్యంకొద్దీ లభించిందని బాలసరస్వతి తలపోయడంలో ఆశ్చర్యం లేదు. దీనిని నిజంగా నన్నయగారే రచిస్తే ఇన్నాళ్లు ఎందుకు అంతర్పూతమైంది? దీనికి టీక బ్రాయడానికి లోకంలో ఇంకెవ్వరూ లేరా? పుస్తకాలు వ్రాయలేదా? తన నొసటనే ఈ పొద్దు ఎందుకు పొడిచింది? ఈ ప్రశ్నలు బాలసరస్వతి తనకు తానే వేసుకొన్నాడు.

అ సిద్ధుడు తన ఇష్టదైవమైన విరూపాక్షుడే అని ఎంతగా నమ్మాడో అంతకన్నా ఎక్కువ నమ్మకంతో ఆంధ్రశబ్బచింతామణిని నన్నయగారే బ్రాశారని బాలసరస్వతి భావించాడు. అతని తరువాత చాలామంది లాక్షణికులు, సాహితీపరులు అదే విశ్వాసంతో ఈ వ్యాకరణానికి వివరణలూ, వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఆధునికులు మాత్రం దీన్ని సందేహిస్తారు. ఈ వ్యాకరణాన్ని బాలసరస్వతీ వ్రాసి దానికి గౌరవం కల్గించడం కోసం నన్నయగారి పేరు పెట్టాడని కందుకూరి వీరేశలింగంగారు భావించారు. త వాదాన్ని డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు మొదలైనవారు ఆమోదించారు. వజ్ఞల చిన సీతారామస్వామి శాస్త్రిగారు దీనిని ఖండించారు. ఆంధ్ర సాహిత్యలోకంలో కొందరిటూ, కొందరటూ మొగ్గుతున్నారు. ఇప్పటికీ వాదోపవాదాలు సాగుతున్నాయి. కొందరు మధ్యేమార్గం అనుసరిస్తున్నారు. “ఈ సూత్రాలు నన్నయగారి కాలం నాటి వేంగీ విద్వత్సభలలో జన్న్మించాయి. తరతరాలుగా పండితులు వాటిని వాడుకొనేవారు. చెల్లాచెదురుగా ఉన్న ఈ సూత్రాలను గ్రంథస్థం చేసి కర్హృత్వం నన్నయగార్‌కెవరో ఆపాదించారు. ఆ పుస్తకమే బాలసరస్వతికి సిద్దుడు ఇచ్చాడు” అని కొందరు భావిస్తున్నారు.* వేంగీ విద్వత్సభలు నిజంగా సంస్కృతంలో తెలుగు వ్యాకరణ సూత్రాలను రచిస్తే వేంగీ దేశంలోని వెంటిరాల గ్రామంవాడైన మూలఘటిక కేతనకు ఈ సంగతి ఎందుకు తెలియదు అనే ప్రశ్న జనిస్తుంది ఆయన మొట్టమొదటి తెలుగు వ్యాకరణంలో ఇలా అన్నాడు:

మున్ను తెనుగునకు లక్షణ

మెన్నడు నెవ్వరును జెప్పరే జెప్పెద వి

ద్వన్ని కరము మది మెచ్చగ

నన్నయభట్టాదిక విజనంబుల కరుణ.

సంస్కృత ప్రాకృతాది లక్షణము జెప్పి

తెనుగునకు లక్షణము జెప్పకునికి యెల్ల

గవిజనంబుల నేరమి గాదు నన్ను

ధన్యు గావింప దలచిన తలపుగాని. (ఆంధ్రభాషాభూషణం, 6,7) ఈ పద్యాలవల్ల కేతనకు పూర్వం ఎన్నడూ ఎవ్వరూ తెలుగు వ్యాకరణ సూత్రాలను బాయలేదని చెప్పాలి. అందుచేత, బాలసరస్వతికి లఖించిన గ్రంథం, మూలఘటిక కేతన కాలానికి అంటే క్రీ.శ1260కి అర్వాచీనమే అని కేలుతుంది. ఈ పుస్తకం బాలసరస్వతికి ౩. అంధ్రకవుల చరిత్ర మొదటి లాగంపుత లాలా

  • కవిశిరోభూషణం. ఆంధ్రరచయితల సంఘం, హైదరాబాదు ప్రచురణ. ఇంగ్లీషు ఉపోద్దాతంలో

ఖండవల్లి లక్ష్మీరంజనంగారు, పుటు 10.

ఎలకూచి బాలసరస్వతి - సురఖి మాధవరాయలు 515 క్రీశ 1608లో దొరికింది. అది కీలకనామ సంవత్సరం. ఈ సంగతి అప్పకవి తన పుస్తకంలో చెప్పాడు. ఆంధ్రశబ్దచింతామణీ నన్నయగారు వ్రాయడమేకాక సారంగధరునికి పాఠం చెప్పారట. ఆ శిష్యుడే సిద్ధుడయ్యాడట. అతడే ఎన్నిచందల సంవత్సరాలో బ్రతికి బాలసరస్పతికి ఈ గ్రంథాన్ని ఇచ్చాడని అప్పకవి విశ్వాసం.

ఆలోకనుతుడు మున్నటి- కీలకసమమున మతంగగిరికడ నొసగె౯్‌

బాలసరస్వతు లనునత-డోలి దెలుగుటీక దాని కొప్పుగ బేనె౯.

*.... (అప్పకవీయ పీఠిక, 50)

(గంథం దొరికినా బాలసరస్వతి వెంటనే దానికి టీక వ్రాయలేదు. తొన్నాళ్ళు అగి, మననం చేసుకొని, అఖిలబుధనుతంగా బ్రాశాడు. 'సత్కవీంద్రమస్తకమాణికృమౌచు ప్రశస్తమై విభాసిలుత' అని ఆశించాడు. అతడు లోకానికి ప్రకటించిన ఈ ఆంధ్రశబ్ద చింతామణి ఈ వ్యాకరణ సూత్రాలను నన్నయగారో, మరో ప్రాచీనుడోకాక, బాలసరస్వతో రచించి ఉంటే అతడు చాలా ప్రజ్ఞావంతుడని చెప్పాలి. అయితే ఎంతటి వ్యాకరణ పాండిత్యమున్నా ఆ ప్రతిభకు కావ్యమే సాక్ష్యమవుతుంది. ఒకనాడు బాలసరస్వతి ఇలా ఆలోచించాడు:

ప్రజ్ఞకు సాక్షియరయగ గబ్బంబుగాన - నద్భుతంబైన నా ప్రజ్ఞ కనుగుణంబు

గా నితరదుష్కరంబైన కబ్బమెద్ది - సేయువాడవొ యంచు యోచించి మదిని.

(0. 637 ఇంకెవన్లూ బ్రాయలేని కావ్యం ఏమిటి? తన భాషా జ్ఞానమంతా ప్రదర్శించుకొనే మార్గమేమిటి? అని ఆలోచిస్తే మూడర్గాల కావ్యం రచించడమే అని అతనికి తట్టింది. ఆదికవుల గ్రంథాలకన్నా ఎక్కువ కీర్షి సంపాదించాలని రాఘవయాదవ పాండవీయం అనే కావ్యాన్ని బ్రాయదలచినట్లు ఈ క్రింది పద్యంలో చెప్పాడు.

మెండైనట్టి విచిత్రవైఖరులచే మీదౌ మహాకావ్యముల్‌

దండిం దొల్లియ చేసి రాదిములు తక్కావ్యాధికశ్తాఘమై

చుండక్‌ రాఘవకృష్ణపాండవకథాయుక్తప్రబంధంబు వా

క్పాండీత్యం బలరార శ్లేషరచనైక ప్రొఢీ నే వేసెద€౯. ఇ. 687 వాళక్సాండిత్యం అలరారే ఈ కావ్యం నాలుగాశ్వాసాల గ్రంథం. దీనిని తిరుపతి వెంకటేశ్చరునికి అంకితం ఇచ్చాడు. ఈ త్ర్యర్థికావ్యం ఆముద్రితం. మద్రాసు ప్రాచ్చలిఖిత గ్రంథాలయంలో సమగ్రమైన ప్రతి ఒకటి ఉంది. (687 దీనిలో కొన్ని చోట్ల

_శట్టోషాధికరచనా, కొన్ని చోట్ల అర్థ్లేషక్టప్తి ఉందని కవే చెప్పుకొన్నాడు. ఈ కావ్యం

బ్రాశాక బాలసరస్వతి పర్తియాల సంస్థానానికి వెళ్ళాడు. అది బెజవాడకు దగ్గరలోని తిలంగాణాలో ఉంది. ఆ సంస్థానాన్ని 17వ శతాల్లి ప్రథమపాదంలో జూపల్లి వెంకటాద్రి పాలిస్తూ ఉండేవాడు. ఆ వంశంలోని వాళ్ళందరూ 'వివిధ శాస్త్రకవితా సంగీతరహస్యాలూ తెలిసినవాళ్ళు. శారదపైన భక్తికలవాళ్ళు. అందుచేత బాలసరస్పతిచేత జూపల్లి వెంకటాద్రి ఒక కావ్యం చెప్పించి. సరస్వతీదేవికే అంకితం ఇప్పించాడు. శృంగారవీర

516 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అద్భుతరసాలలో ప్రయోగార్హమైన పదాలనే వాడుతూ బాలసరస్వతి చంద్రికాపరిణయం అనే కావ్యం వ్రాశాడు. నాయిక కాశీరాజు తూతురు. నాయకుడు పాండవవీరుడు భీముడు ఈమెను స్వయంవరంలో భీముడు పెళ్ళిచేసుకున్నట్టు ఆదిపర్వంలో ఉందకు. దానికి కల్పనా కథలు జోడించి బాలసరస్వతి ప్రబంధాన్ని వ్రాశాడు. ఇది ఎన్ని ఆశ్వాసాల కావ్యమో తెలియదు. రెండో అశ్వాస ప్రారంభంలో ఒక ప్రతి నిలచిపోయింది ఈ అసమగ్ర ప్రతి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (0.508. ఈ తాటాకుల పుస్తకాన్ని పురుగులు బాగా కొట్టివేశాయి. శిథిలమై పోయేటట్టు ఉంది. “సర్వపురుషార్థ కరియగు వాగీశ్వరి కీవిశ్సంబున భవ్యకావ్య ప్రదానరూప ట్రైంకర్యంబునం బరితోషంబు' కావించాలని బాలసరస్వతి వ్రాసిన ఈ కావ్యంలో దొరికినంత ఖాగంతూడా వంశచరిత్ర చాలా విపులంగా ఉంది. జూపల్లివారి చేత సన్మానాలు పొందాక బాలసరస్వతి జటప్రోలు సంస్యానానికి చేరాడు. దానిని సురఖి ముమ్మడి మల్లానాయుడు అప్పుడు పాలిస్తూ ఉండేవాడు. ఈ సురఖిగ్రామం ఈ వంశీయుల జన్మస్థానం. దానినీ 'గోదలు' అని పూర్వం పిలిచేవారు. ఇప్పుడు '“గోడల్‌ అంటున్నారు. ఈ సురఖివారు విజయనగర రాయసింహాసనానికి అణకువగా ఉండీ గోలకొండ సుల్తానులతో యుద్ధాలు చేస్తూ ఉండేవారు. ముమ్మడి మల్తానాయని తండ్రీ ఇమ్మడి మల్గ్లానాయుడు ఒక యుద్ధంలో విజయం ఫాంది “వింకోలు గండ' అనే విరుదాన్ని అర్జించాడు. విక్కనవోలు పురాన్ని పాలించే కామినేనివారు గోలకొండ సుల్తానుల తరపున యుద్ధం చేసినప్పుడు సురఖి ఇమ్మడి మల్గానాయుడు వాళ్ళను వీరవెంకటపతి రాయల పక్షాన జయించాడు. క్రీశ1591లో (ఫసలి 1000) వీరవెంకటపతిరాయలు లింకోలుగండ ఇమ్మడి మల్గ్లానాయనికి జటప్రోలు సంస్థానాన్ని ప్రసాదించాడు. ఈయనకు అయిదుగురు ఖార్యలు. పెద్ద భార్య లింగమ్మకు పుట్టిన పెద్దవాడికి మల్లానాయుడని పేరు పెట్టూరు, ఇతణ్జీ ముమ్మడి మల్లానాయుడంటారు. తండ్రి తరువాత ఇతడు రాజ్యం చేశాడు. ఈయనకు నలుగురు భార్యలు. ఐదుగురు కుమారులు. పెద్దభార్య చెన్నమ్మతు ముగ్గురు పుత్రులు కలిగారు. వారిలో పెద్దవాడి. పేరు రామానాయుడు. ఇతనికి కటారిరామానాయుడనే బిరుదు ఉంది. రెండోవాడు వాబ్బయప్రపంచంలో విహరించే మనిషి ఈ మాధవరాయలే ఎలతూచి బాలసరస్పతిని 5. జటప్రోలు సంస్థానాన్ని అలియ రామరాయలు ఫసలి 100లో సురఖివారికి ఇచ్చాడని ప్రతీతి. ఇది అసంభవం. అప్పటికి అలియ రామరాయలు లేడు. తిరుమలదేవరాయల కుచూరుడు రామరాజు రాజప్రతినిధిగా బహుశా ఈ సంస్థానాన్ని సురఖివారికీ వాగ్దానం చేశాడని, దానిని వీరవెంకట రాయల చెలిందాడని. ఖండవల్లి లక్ష్మీరంజనంగారు. చాలా “సమంజసంగా నిర్ధారణ చేశారు అంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహం, పుట 147. 14.

ఎలకూచి బాలసరస్వతి - సురఖి మాధవరాయలు 517 అడిగాడు. ప్రతిపద్యంలోనూ సురభి మల్గానాయుడి పేరు వచ్చేటట్టు సుఖాషితాలను బాలసరస్వతి తెనిగించాడు. నీతిశతకంలో “సురఖిమల్లా నీతివాచస్పతీ' అనే మకుటం ఉంది. శృంగారశతకంలో “సురఖిమల్లా, మానినీమన్మథా' అనే సంభోధన చేశాడు. వైరాగ్య శతకానికి 'సురఖిమల్లా వైదుషీభూషణా' అనే మకుటం పెట్టాడు. మన సాహిత్యంలో భర్హృహరి సుభాషితాలను తొలిసారిగా తెనిగించిన ఘనత బాలసరన్వతికి చెందుతుంది. ఇతని అనువాదానికి 'మల్లభూపాలీయం' అనే పేరు వచ్చింది. ఇది చాలా ప్రొడంగా ఇతడు వ్రాశాడు. ఇంతకన్నా సులభంగా అనంతర కవులు అనువాదం చేయడంవల్ల ఇతని అనువాదం అంతగా ప్రచారం పొందలేదు. తెలుగుతనాన్ని అనువాదంలో అక్కడక్కడ తెచ్చాడు. 'కూపేపశ్ళ పయోనిధావపి ఘటోగృష్టాతి తుల్యం జలం' అనే పాదాన్ని చక్కగా సామెతలాగ తెనిగించాడు.'

దేవుండిచ్చినయంత గల్గు నడవిక్‌ దేవాద్రినైన౯ జడుం

డై విత్తాడ్యుల కేకరళ్‌ వలదు తోయం బిద్దరక్‌ కుండకుక్‌

బావిక ముంచిన గుండెడుక్‌ జలధి ముంపక్‌ బుట్టెడు! బుట్టునా

లావణ్యాపరమన్మథా సురఖిమల్లా నీతివాచస్పతీ. (నీతి. 40) ఈ అనువాదంలో అక్కడక్కడ పూర్వకవుల ప్రసిద్ధ పదాలను వాడుకొన్నాడు. శృంగారశతకంలో ఈ క్రింది శోకాన్ని చూడండి:

దన్యాస్త ఏవ ధవళాయత లోచనానాం-తారుణ్యదర్చ ఘనపీన పయోధారణాం

క్షామోదరోపరిలస త్రవళీిలతానాం- దృష్ట్రాకృతింవికృతి మేతిమనొస యేషాం.

(శృంగార 61)

దీనిని బాలసరస్వతి ఇలా అనువదించాడు:

పంచారించిన గుబ్బచన్ను గవతో భాస్వ్పద్వళుల్‌ మీదగ

న్పించక బొల్చు నలంతి నెన్నడుముతో వెంపొందు నేభటవుక్‌ |

మించు! బోడి బెడంగు జూచి మది గంపించంగ నీకుండువా

డంచద్దైర్భఘమండిల సురఖిమల్లా మానినీ మన్మథా. ఈ పద్యంలో పంచారించడం శ్రీనాథుని మగువల కాపీరైటు, శృంగారశతకం తెనిగించేటప్పుడు బాలసరస్పతికి శ్రీనాథుడు జ్ఞాపకం రావడంలో అశ్చర్యం లేదు. బాలసరస్వతి ఇతర రచనలు లభ్యం కావడం లేదు కాని ఇతడు ఎక్కడెక్కడ పూర్వకవులను అనుసరించాడో పరిశీలించాలి. ఇతని రచనలలో దేని తరువాత ఏది బ్రాశాడో ఎంత పరిశోధించినా కేల్చలేం. ప్రస్తుతం ఇతని పుస్తకాలు మూడు దొరుకుతున్నాయి. వాటిలో చెప్పిన గ్రంథాల జాబితాను చూస్తే గ్రంథాల పూర్వాపరాలు నిర్ణయించలేం.

518 నమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఎలకూచి బాలసరస్వతి రచనలు వ్యాఖ్యలో చెప్పినవి చెప్పినవి పాండవీయంలో చెప్పినవి

  1. ఖాష్యాదిక గ్రంథాలు 1. కార్తకేయాభ్యుదయం 1. రంగ కౌముది

  2. కౌముదీ నాటకం 2. ఆంధ్రశబ్ద చింతామణి 2. చంద్రికాపరిణయం

౩. ఖాషావివరణం ౩. వామనపురాణం 3. ఆంధ్రశబ్దచింతామణీ వ్యాఖ్య

  1. బాహాటం 4. బాహాటం 4. ఖాషావివరణం

  2. చంద్రికాపరిణయం 5. షడ్చాషావివరణం 6. వేదశాస్తపురాణాలు

  3. వామనపురాణం 6. రంగకౌముది

  4. రాఘవయాదవ పాండవీయం

ఈ పట్టిక ప్రకారం ఆంధ్రశబ్దచింతామణిలో చంద్రికా పరిణయం, రాఘవయాదవ పాండవీయాలను చెప్పాడు. అందుచేత అవి వ్రాశాక చింతామణి వ్యాఖ్య ద్రాశాడను కోడానికి వీల్లేదు. వాటిలో చింతామణి సంగతి చెప్పాడు. ఈ మూడింటిలోనూ భర్హృహరి సుభాషితాల ప్రసక్తి లేకపోవడం వల్ల అదే అతని కడపటి రచన అని మాధవరాయలు రెండువేల దీనారాలు బాలసరస్వతికి ఇచ్చాడట. మాధవరాయలు స్వయంగా కవి. పాండిత్యప్రకర్ణ చాలా ఇష్టం. అటువంటివానికి మహోపాధ్యాయనికి ప్రజ్ఞ పట్ల గౌరవం ఉండడంలో ఆశ్చర్యం లేదు. బాలసరస్వతి ఒక చంద్రికాపరిణయం వ్రాస్తే మాధవరాయలు ఇంకొక చంద్రికాపరిణయం బ్రాశాడు. మాధవరాయల గ్రంథంలో సుచంద్రుడనే రాజు తమిస్రాసురుణ్ణి సంహరించి

చంద్రికను పరిణయం ఆడాడు. ఈ కథను ఆరాశ్వాసాలలో, 902 గద్యపద్యాలలో కవి చెప్పాడు. అడుగడుగునా శ్లేషలు. ప్రతిపద్యంలోనూ పాండిత్యప్రకర్ణణ ప్రయత్న పూర్వకమైన క్లిష్టత వెల్లివిరసీ ఈ కావ్యం కడు పాండిత్యాన్ని ప్రదర్శించడానికి వ్రాసిన నిష్కండైకరచన. మన సాహిత్యంలో రామరాజభూషణుడు ప్రవేశపెట్టిన శ్లేషము, ప్రాసభూయిష్టమైన రచన ఇందులో ఘనీభవించింది. ఈ కావ్యంలోని కథానాయకుడు తొలిసారి నాయికను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె హరి వసుపీఠికాసీనర్టై విపంచి గలసి గానము చేస్తోందట (చంద్రికా. ౩-44). రామరాజభూషణుని వసుచరిత్రలో గిరిక తూడా గానం చేస్తున్నప్పుడే వసురాజు చూస్తాడు. వసుచరిత్రలో నాయికా నాయకులు మాట్లాడుకొనడం కొంతసాగాక తల్లి కబురుపెట్టింది. ఒక చెలికత్తి వచ్చి చెప్తుంది (వసు. 3-72). చంద్రికాపరిణయంలో కూడా 'చెలియా నిన్ను రమ్మనె నిప్పుడు వీజణియన్‌ విన జనయిత్రి అని చెలికత్తె చెపుతుంది (చంద్రికా. ౩-89). గిరికాదేవి వెళ్లగానే వసురాజామె వెళ్ళిన దారిలో వెడుతూ “కాబోలు నివి బాల కమనీయపదలీల లిచట బల్లవజాల మినుమడించె' అని వరుసగా ఒక సీసపద్యంలో భావించాడు (వసు. ౩-9). చంద్రికాపరిణయంలో తొలిసారి నాయికను చూసినప్పుడు సుచంద్రుడు "కాబోలు నీ హేమగాత్రి క్రొత్తగ సానదీరిన కాలరేని చారుహితి' అని తలపోస్తాడు (చంద్రికా 6-53).

ఎలకూచి బాలసరస్వతి - సురఖిమాధవరాయలు 519 ఇలాగ పోలికలు చాలా చూపవచ్చు. అయితే కవి అనుకోని కౌచిత్యం ఒకటి కనబడుతుంది. చంద్రికాపరిణయంలో నాయిక వసుపీఠికాసీనరయ్టై మొదట మనకు కనబడుతుంది. ఈ కావ్యంలో నాయికే కాదు; కవిత్స్వమంతా వసుపీఠికాసీనమే. కాని “వసుచరిత్రకారుని భాషామార్దవం, సంగీతానుకూలమైన పద్యరచన, కౌచిత్యపరిజ్ఞానం చంద్రికాపరిణయమందు లేవు” అని ఖండవల్లి లక్ష్మీరంజనంగారు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. అయితే ఇందులోని వైదుష్యం అపారం. “'వసుచరిత్రకన్న శ్లేష గాంభీర్యము. గల్లి రసనిష్యందనంబున విజయవిలాసముం బురణించుచు, కల్పనా ట్రొడియందు ఆముక్టమాల్యదను దలపించుచు నటనట కావ్యహైైషికాది శాస్త్రమర్యాదలను సంధించుచు నుండు నీ యతిప్రొడ ప్రబంధము.... అర్థమును ఖేదించుట సామాన్య పండితులకును, అశాస్త్రజ్ఞులకును శక్యము కాదు'' అని వేదం వెంకటరాయశాస్త్రిగారు అభిప్రాయపడ్డారు.” ఈ గ్రంథానికి అవధానం శేషశాస్తిగారు. వెల్లాల సదాళివ శాస్త్రులుగారు కలిసి టీక వ్రాశారు. శరదాగమ సమాఖ్య వ్యాఖ్య జతచేశారు. ఎన్నో “పొగసులు' చూపించారు. అవన్నీ అద్భుతంగా కనబడతాయి. ఈ గగ్రంథంలోనే నాయకుడు తమిస్రాసురుణ్ణి చంపడానికి వెడుతూ హేమకూటంలో మజిలీ చేస్తాడు. అక్కడ ఒక మణిమయమండపంలో నాయకుడు కూర్చుంటాడు. అప్పుడు ఆ మండపంలోని బొమ్మలు ఇలా' అద్భుతమైన ఉపచారాలు చేశాయట.

ఒకమణిపుత్రిక యొయ్యారమునజేరి కపురంపువలపు బాగా లొసంగె,

నొక సాలభంజిక యుదిరిపువ్వుల కెంపుబావడనేరు పేర్పడగ వీచె

నొక వసుప్రతిమయింపూన్సు తెల్లని తావిబొదివించెడు కలాచి పూని నిలచె

నొక చొకాటపుబొమ్మ యొయ్యనొయ్యన పొన్నవిరిదాలుగూర్చిన సురటి వినరె

నిటులు పాంచాలికామణిపటల మూడి

గము లుచితరీతిదార్చ నాయమరకేళి

మండవ శ్రీ నుతించుచు మనుజభర్హ

దండ బెలిగొల్వ సుఖలీల నుండె నంత, (చంద్రికా. 2-25) కవిత్వం చూపిన ప్రజ్ఞలు తూడా అపురూపంగా ఉంటాయి. కృతి సప్తసంతానాలలో ఒకటి. మాధవరాయలు ఇతర సంతానవంతుడు. పండితులకెందరికో అగ్రహారాలిచ్చాడు. ఆలయాన్నీ, సింగపట్టంలో నృసింహాలయాన్ని నిర్మించాడు. జటఫ్రోలులో నాయనిపేట సింగపట్టంలో మాధవరాయపేట ఇతడు కట్టించినవే. ఈయన చేసిన ప్రజోపయోగ కార్యలకల్లా గొప్పది నరసింహసాగరమనే తటాకం. ఇది సింగపట్టంలో నిర్మించాడు. ఈ మహాతటాకంవల్ల ఎంతో వ్యవసాయాభివృద్ధి జరిగిందట. సురఖి మాధవరాయలు తవ్వించిన ఈ చెరువులోని నీళ్లు ఇప్పటికీ వాడుకొంటున్నారో లేదో తెలియదుగాని ఇతని కృతిలోని జలాలను ఏ సాధారణ సాహితీపరుడూ ఆచమించడం లేదు. 7. చంద్రికాపరిణయం - జటప్రోలువారి ప్రచురణ, 1904, గ్రంథాదిని ఇచ్చిన అఖిప్రాయం,

భట్ల పెనుమర్తి కోదండరామయ్య

వమనం ఆంధ్రులం. అయినా మన జాతి ప్రాచీన చరిత్రను చెప్పే గ్రంథాలు మన భాషలో లేనే లేవు. ఎన్నో అవతారాలు, ఎన్నెన్నో పేర్లు ఉన్న విష్ణువుకు “ఆంధ్రవిష్ణువు” అనే పేరు పెట్టుకొని అతణ్జి మనవాణ్జి చేసుకొన్న మన పూర్చులు అతని పేర శ్రీకాకుళంలో గుడి కట్టించారేగాని ఆయన చరిత్రను చెప్పి కావ్యాలు బవ్రాయించలేదు. కాకతీయుల కాలంనుంచి శ్రీకాకొలని వల్లభుని పేరు శాసనాలలో కనబడుతూంది. భోజరాజీయం బ్రాసిన అనంతమాత్యుని తండ్రీ “ప్రత్యక్ష పరమపదం' అయిన శ్రీకాకుళాన్ని సేవించుకొంటూ తన వంశాన్ని పాలించాడు.! అయినా కొడుకు చేత ఆంధ్రవిష్ణువు చరిత్రను బ్రాయించలేదు. శ్రీకాకొలను తిరునాళ్ళను క్రీడాఖిరామంలో శ్రీనాథుడు వర్ణించినా ఆ దేవుని చరిత్రను కావ్యంగా వ్రాశాడో లేదో తెలియదు. శ్రీనాథుని వల్లభాభ్యుదయంలోనిదంటూ పెదపాటి జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో పద్యం ఉదాహరించాడు.

రజనీవధూకర్ణరజతతాటకంబు వలరాజుధవళోష్టవారణంబు

శ్రోషితయువతి హృత్పుటభేదదాత్రంబు బహుచకోరకుటుంబపానపాత్ర

మధుకైటభాసురమథను దాపటికన్ను చక్రవాకమ్ముల చల్లచేపు

దుగ్గపాథోరాశి తొలిచూలిసంతతి రోహిణీదేవి తారుణ్యఫలము

చంద్రకాంతశిలానునిలనృపీట(?) - నిర్ణరాంధోవ్యధామోక్షనియమవైద్యు

డంధకారచ్చటాహలహలహరుండు-చంద్రు డొప్పారె గాంతినిస్తంద్రుడగుచు.

(ప్రబంధరతక్నావళి, 461)

చంద్రవర్దన చేసే ఈ పద్యం ఏ రకం కావ్యంలోనిదో చెప్పలేం. క్రీ.శ 1432 ప్రాంతాలలో ములికినాటి మోపూరును పాలించే వల్లభరాయని పేర క్రీడాఖిరామం వ్రాసి అందులోనే ఆయన వంశాన్ని శ్రీనాథుడు ప్రశంసించాడు. దానినే వల్లభాభ్యుదయం అనడానికి అస్కారం చాలదు. అయినా పెదపాటి జగ్గన్న ఉదహరించిన పై పద్యం క్రీడాఖిరామంలో లేదు. కనుక శ్రీనాథుడు వేరే కథనే వల్లభాభ్యుదయం పేరిట వ్రాసి ఉండాలి. అది శ్రీకాకుళ ఆంధ్రదేవుని చరిత్రే అయి ఉంటే అది నష్టం కావడం ఆంధ్రుల దురదృష్టాలలో మొట్టమొదటిది అవుతుంది. శ్రీనాథుడంతటివాడు వ్రాసిన ఆంధ్రవిష్ణువు

అంధ్రవిష్ణువు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలవారి కలలో కనబడి ఓక కావ్యం బ్రాయమని పురమాయించాడు. అయితే కన్నడరాయడి చేత ద్రవిడదేశపు కథ బ్రాయించాడే గాని ఈ తెలుగు వల్లభుడు తన కథ చెప్పమనలేదు. ఎన్నో పురాణాలు తెనిగించిన ఆంధ్రకవులు బ్రహ్మాండపురాణంలో ఉత్తరఖండంలో ఉన్న శ్రీకాకుళక్షేత్ర మాహాత్మ్మ్యాన్ని ఎంతకాలానికీ తెనిగించలేదు. చివరకు వేచివేచి విసుగెత్తి, మరేకవీ ఈ కథ బ్రాయడని నిశ్చయించుకుని దేవుడు భట్ల పెనుమర్తి కోదండరామయ్య అనే కవి

  1. భోజరాజీయం, 1-8

భట్ల పెనుమర్తి కోదండరామయ్య 521 స్వప్నంలో కనబడి “నీవు ఆంధ్ర కావ్యరచనాసామర్థ్యం కలవాడిమి అని ప్రశంసించాడు. అతనికి ఒక సంస్కృత కోశం ఇచ్చి ఇందులో శ్రీకాకుళక్షేత్రమాహాత్మ్యం వ్యత్యస్తంగా ఉంది; యథాక్రమంగా రచించమన్నాడు; ఒకటి రెండుసార్లు కలలో కనబడి హెచ్చరించాడు. పాపం, కోదండరామయ్య సంస్కృత వ్యాకరణం కౌముది తూడా చదువుకోలేదు. దేవుడు వరమిచ్చినా పూజారి మంజూరు చేయనట్టు దేవుడే వ్రాయమన్నా పండితులు ఒప్పుకొంటారా?

కౌముదియైనళ్‌ చదువకకరచియించె నటంచు జిత్తముల్‌

కోమలమేల(?) శబ్దచయగుంభన లక్షణ లక్ష్య వైఖరి౯

(ట్రేమదలిర్చ జేనెద గరిష్టబుధాగ్రణులార వల్లభ

స్వామి వరప్రసాద విభవం విది సత్కృృతిగా దలంపుడీ. (వల్లభా. 1-9) ఈ పద్యంవల్ల కోదండరామయ్యది సహజ పాండిత్యం అని తెలుస్తూంది. లక్ష్యలక్షణ జ్ఞానంతో వల్లభాభ్యుదయాన్ని ఆయన 593 గద్యపద్యాలలో చెప్పాడు. ఆదిలో బ్రహ్మ గంగాతీరాన తపస్సు చేశాడట. దేవుడు ప్రత్యక్షమై, కృష్ణానదీ తీరాన తపస్సు చేయమన్నాడు. బ్రహ్మ తెలుగుదేశానికి వచ్చి ఆ అందాన్ని చూసి ముగ్ధుడై ఒక్కరూపంలో చూడడంవల్ల తనివితీరక పలురూపాల్లో సందర్శించాడు. తపస్సు చేశాడు. ఒకచోట దేవుడు మళ్లా ప్రత్యక్షమైనప్పుడు, స్వామి సాక్షాత్కరించినచోట వారి విగ్రహాన్ని ప్రతిష్టించి (ట్రహ్మ ఇలా ప్రార్థించాడు:

అప్పుడు నిన్ను గూర్చి యిట నేనొకడం దపమాచరింప నీ

దెప్పరపు న్నివాసము విధిప్రవరాకులమయ్యెగావునళ€్‌

దప్పక కాకుళాహ్వయ మొనర్చితి దేవ యనుగ్రహింపమే. (వల్లభా 1-106)

సంస్కృత ఏకాక్షరనిఘంటువులో 'క అంటే బ్రహ్మ అని అర్థం - క = బ్రహ్మచేత, ఆకుల = వ్యాస్తమైనది కాబట్టి ఆ చోటుకు శ్రీకాకులం అనే పేరు వచ్చిందని సంస్కృత పండితులు అర్థం చెప్పారు. అయితే నిజానికి శ్రీకాకుళం అనే పేరు ద్రవిడ భాషాపదం. (బ్రహ్మ అనగా ఆర్యులు మన ప్రాంతాలకు వచ్చిన తొలిరోజులో కృష్ణా జిల్లాలో మహారణ్యాలు ఉండేవి. అడవి మధ్య ఒకచోట పెద్ద కొలను ఉండేది. దానిని 'కారుకొళం' అనేవారు. కారు అంటే అడవి అని, కొళం అంటే కొలను అని అర్థం. దానినే చక్రతీర్థం అని వ్యవహరించేవారు. కారుకొళం ఉచ్చారణలో కార్‌కొళంగా మారి క్రమేణా కాకుళం అయింది. ఇక్కడ స్థిరపడ్డ ప్రాచీన ఆంధ్రులలో మొదటి రాజు ఆంధ్రవిష్ణువు. అతని విగ్రహానికే తరువాత వారు గుడీ కట్టారు. ఎన్నో శతాబ్దాలు పూజాపునస్కారాలు నడిచాయి. హారీతి పుత్రశాతకర్ణికాలం నుంచి, అంటే శ్రీ. పూర్వం నుంచి శ్రీశ.1146 ప్రాంతాలలో కళింగాన్ని పాలించిన అనంగభఖీముని కాలం దాకా కాకొలను దేవుజ్జి వివిధ రాజులు పూజించి అఖీష్టాలు నెరవేర్చుకొన్నారు. వాళ్లలో శాతవాహనుని వంశంలోని ఇఒ వల్లభాభ్యుదయం. 228

522 సమగ్రాంధ్ర సాహిత్యం = రెండవ సంపుటి సుమత్‌, ముక్కంటి కాడువెట్టి అని పేరుపొందిన త్రిలోచన పల్లవుడూ,! కళింగులసేనాని అనంతపాలుడూ ప్రముఖులు. ఈ చారిత్రకవ్యక్తుల గాథలను పూర్తిగా కాకపోతే పెనుమర్హి కోదండరామయ్య ప్రశంసనీయుడు.

ప్రాచీనుల చరిత్రను వ్రాసినా ఈ కవి పుస్తకంలో తన చరిత్రను ఏమీ వ్రాసుకోలేదు. తెలుగు సాహిత్యంలో స్వవిషయం చెప్పుకోని కవులు ఎందరో ఉన్నారుగాని, ఇతనిలాగ తన వంశాన్ని వర్ణించడం దండుగ అని భావించినవాళ్ళు లేరు.

తొలిజన్మసంప్రదాయము-లెలమి వితర్కించి చూడ నెయ్యెయ్యవియో

తెలియవు ఇక ముందర రా-గల తత్తత్సంప్రదాయకథ యెయ్యెదియో!।

వ యని వితర్కించి చూడ బ్రకృతి నన్మదీయతనుబంధనంబంధా

నయపరంపరాఖివర్ణ్షనము చేయుట వృథానులాపంబని మనంబున నిశ్చయించి...

(వల్లభా. 1-14, 15)

తన కథ ఏమీ చెప్పుకోకుండా ఆంధ్రవిష్ణువు అభ్యుదయాన్నే వర్ణించాడు. అందుచేత ఈ కవి ఎప్పటివాడో ఏమిటో సరిగ్గా చెప్పలేము. అయితే ఇతడు తన గురువుగారి పేరు తిరుమల తాకాచార్యులవారని చెప్పాడు. 17వ శతాబ్దిలో ప్రసిద్ధులైన తిరుమల తాతాచార్యులున్నారు. కోదండరామయ్య కూడ బహుశా అప్పటివాడే కావచ్చు. ఈ కాలాన్ని నిర్ణయించడానికి మరొక డొంకతిరుగుడు మార్గం ఉంది. ఏ ముహూర్తాన తిక్కనగారి కలలో హరిహరనాథుడు కనబడ్డాడోగాని ఆంధ్రకవుల స్వపష్నాలలో సాక్షాత్కరించడం కూడా భగవంతుని పనులలో ఒకటైంది. అయితే అపురూపం అయిన మూలగ్రంథాలను కవులకు అందించడం మటుకు ఎలకూచి బాలసరస్వతి కాలంలోనే మొదలైంది. ఈ కోదండరామయ్యకు కూడా దేవుడు ఒక పురాతన సంస్కృత శ్రీకోశం బట్వాడా చేయించాడు. అందుచేత ఎలకూచి బాలసరస్వతి కితడు సమకాలికుడో కొద్దిగా అర్వాచీనుడో అని భావించవచ్చు. అంటే, ఇతడు 17వ శతాబ్ది తొలిభాగంలో ఉంటాడు. : |

కోదండరామయ్యకు ఈ దేవుడు స్వయంగా పురాణం అందచేసినా నేడు ప్రకటితం అయిన సంస్కృత బ్రహ్మాండపురాణంలో శ్రీకాకుళ మాహాత్మ్య కథలు ఏమీ లేవు. “వ్యత్యస్తముగా చిరకాలమునుండి దేశమున వ్యాపించియున్న స్థలమాహాత్మ్యమును గూర్చిన గాథలన్నిటిని ప్రోగు చేసి యీతడే యొక ప్రణాళిక నేర్చరచుకొని రచించియుండున'”ని పండితులు అఖిప్రాయపడుతున్నారు.! ఇదే నిజం కావచ్చు. ఈ కావ్యంలో స్థలపురాణాన్ని బాగా క్రోడీకరించాడు. ఇందులో 593 గద్యపద్యాలున్నా సుమారు 500 పద్యాలలో ముక్టసరిగా కథ చెప్పడమే గాని ముచ్చటగా కవిత్వం 4, ఈ కావ్యంలోని చారిత్రకాంశాలను కోరాడ రామకృష్ణయ్యగారు. శ్రీపాద లక్ష్మీపతిశాస్తిగారు చాలా 5. వల్లభాభ్యుదయపీఠిక, పుట 9.

భట్ల వెనుమర్హి తోదండరామయ్య 523 ఆంధ్రవిష్ణువు ఊరేగేటప్పుడు ఉప్పరిగ లెక్కి చోద్యం నిక్కిచూసే కాంతలను ఒక పది పద్యాలలో వర్ణించాడు. వాళ్ళా దేవుని దశావతారాలు కీర్షించడం మరొక పది పద్యాలున్నాయి. ఆ తరువాత కొంచెం ఆహ్లాదకరంగా లక్షీశ్రీహరుల సంవాదం బ్రాశాడు. స్వామివారు తిరువీథుల కేగి తిరిగి వచ్చేటప్పుడు అమ్మవారు తలుపులు విడాయించింది. చెలికత్తెను “వారెవరో కనుక్కో'మంది. ఆయన స్వవిషయం చెప్పుకొన్నారు. అమ్మవారు చాలా ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేసింది.

కాముకవృత్తి నింత కనికారము లేక భవశ్చ్రసేవక

స్తోమయుతంబుగా రజని దొంగలు ద్రిమ్మరునట్టి ప్రొద్దునం

బామరురీతిగా దిరిగి పాయని కూరిమితోడ వచ్చి తౌ

నేమము గల్లు నీదు కరుణీయము తేటపడన్‌ జనార్దనా; (వల్లభా. 4-137)

““నీ శరీరంనిండా ఆ గోళ్లనొక్కు లేమిటి?” అని అడిగింది. 'అడవిలో తిరిగినప్పుడు మండ్రస కొంకిముళ్లచేత ఒడలు జీరలయ్యాయి; ఇవి గోళ్ల గుర్తులు కావని ఆయన సంజాయిషీ చెప్పుకొన్నాడు. అప్పుడామె “నీ పెదవిమీది ఈ పంటినొక్కు లేమి'టని ప్రశ్నించింది. దానికీ స్వామివారిలా సమాధానం చెప్పారు.

సురసముదాయమాన్యము వచోపరుషాసురనైన్యదైన్యమున్‌

బరువడి నొందజేయు శశిభాసురపాండురపాంచజన్యమున్‌

ఉరవడి నొత్తియూద నధరోష్టతలంబున నిట్లు గంట్లుగా

నొరసిన యట్టి నొక్కు లివి యో కలశాంబుధికన్యకామణీః: (వల్లభా. 4-156) ఆమె ఎంతకీ నమ్మలేదు. కావాలంటే సాక్షులున్నారన్నాడాయన. ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణీ, మన్మథుజణ్జీ అడుగు అన్నాడు. 'ఆహా! ఏం సాక్షులు?" అని ఆమె వాళ్ళ సంగతులు కడిగింది. మునిగారి పంచన తోడికూత కూసి కానిచేత చేసిన పెద్దమనిషి ఇంద్రుడు. ఇక చంద్రుడా?

జనకుని వెల్లబుచ్చి సహజాగృహవాటికి జేటొనర్చి పం

చన గురుపత్ని జెందియు నిశాచరుడైన కళంకదేహి పు

ట్టిన సుతుతోడ వైరము కడిందిగ బూనుచుక్‌ బ్రదోష మం

దున నవతారమైన బహుదోషి నిశాపతి సాక్షి కర్ణమా? (వల్లభా. 4-18) ఆమె దృష్టిలో కర్మసాక్షీ ఒక్కడే తగిన సాక్షి. సూర్యునిచేత సాక్ష్యమిప్పిస్తే “తిరుక్కావులు' తీయిస్తానంది. భాస్కరుణ్ణి శ్రీహరి తలచుకొన్నాడు. తూర్పు ఎర్రగా కావిరి పారింది. దాంతో ప్రణయకలహం తెల్లవారింది.

తెలుగు సాహిత్యంలో పాటల రూపాల తలుపుల దగ్గర సంవాదం చేసే సంప్రదాయ ఉంది. దేవాలయాల్లోని రంగభోగాలలో ఈ తలుపు దగ్గర పాటలను గుడిసానులు పాడే ఆచారం ఉంది. అర్వాచీనుడు, గోగులుపాటి కూర్మనాథుడు ఇటువంటి రచనలు చేశాడు.

524 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి భట్ల పెనుమర్త్హి కోదండరామయ్య కావ్యంలో కూడా సుదీర్ణంగా ఇది వ్రాశాడు. తెలుగు వల్లభుని చరిత్రలో తెలుగుదనం సముచితమే.

ఆంధ్రవిష్ణువు కథను తొలిసారిగా ఇలాంటి కావ్యరూపంలో వ్రాసిన తోదండరామయ్యకు మన సాహిత్యంలో ప్రముఖస్థానం కాకపోయినా ప్రత్యేకమైన ప్రశంస మాత్రం లఖిస్తుంది.

రఘునాథ నాయకుడు

పదిహిడో శతాబ్దంలో ఇంకో కృష్ణదేవరాయలు, ఇంకో భోజుడు తెలుగు గద్దెమీద పాలించారు.. ఆ ఇద్దరి గొప్పదనం ఒకే వ్యక్తిలో మూర్తీభవించి మూడు పువ్వులై పూచి ఆరు కాయలై కాచి నూరు హ్హా పండింది. ఆ చిరస్మరణీయుని పేరు రఘునాథ నాయకుడు. అతడెప్పుడు పుట్టాడో నికరంగా చెప్పలేం, కాని అతని తాతగారు చెవ్వప్పనాయకుడు మనవణ్ణి చూసి మహదానందం పొందాడు. ముక్కుపచ్చలారని బిడ్డగా ఉన్నప్పుడే రఘునాథుడు ముద్దులు మూటకట్టడంతోబాటు “ముందు ముందు నా ప్రతిభ ఇలా వికసింపబోతోం'దన్నట్టు ఆటపాటలలో తన వ్యక్తిత్వం ప్రదర్శించేవాడట. అచ్యుతప్ప నాయకునికి ఇద్దరో ముగ్గురో కుమారులు. వాళ్లలో రఘునాథుడొకడు. నాయకుని హయాంలో దీక్షితులవారు మంత్రిగా, మార్గదర్శిగా ఉండేవారు. వారు సర్వతంత్ర స్వతంత్రులు. శ్రీపదవాక్య ప్రమాణ పారావారపారీణులు. అద్వైతవిద్యాచార్యులు. వారి మిత్రులు కూడా ఉద్దండ పండితులు. 108 గ్రంథాలు రచించి సంస్కృత వాజ్మయంలో అచంచలమైన స్థానాన్ని ఏర్పరచుకొన్న అప్పయ్య దీక్షితులుగారు ఒకసారి తంజావూరు వచ్చారు. చెవ్వప్పు నాయకునిచేత సత్కారాలు పొందారు. ఈ మహాపండితుల ఆసమాన ప్రతిభ బాల రఘునాథుని హృదయంలో బాగా ముద్రవేసుకొని ఉంటుంది. వారి అడుగుజాడలలో నడిచి రఘునాథుడు కొత్త దారిని వేసుకొన్నాడు. మంత్రి గోవింద దీక్షితులవారు శాస్త్రపారీణులు. తండ్రి అచ్యుతప్పు శాస్త్రవిద్యా పారంగతుడు. ఈ ఇద్దరి గురించి ఒక చాటువు ఉంది.

తీనామాద్యంత నామానౌ మహీక్షిద్దీక్షి తాపుభౌ

శస్తే శాస్త్రే చ కుశలౌ అహవేషు హవేషుచ

అచ్యుత, అనంత, గోవింద అనే మూడు పేర్లలో ఆద్యంతనామాలున్న రాజు గురించి, ఆతని మంత్రి గురించి చెప్పిన శోకం అది. శస్తశాస్తాలలో, ఆహవహవాలలో కౌశల్యం గల ఈ అచ్యుతగోవిందులిద్దరినీ మించి మెప్పించిన మేధావి రఘునాథుడు. అతడు సంగీత సాహిత్యాలలో ఎంత అందెవేసీన చెయ్యో సమరవిద్యలలో అంత

  1. రఘునాథుడు క్రీ.శ 1575లో జన్మించి ఉంటాడని వి. వృద్ధగిరీశంగారు భావిస్తున్నారు

౧౫6 జిం 01 ౧గంా-డంంబుజేత లలంక/ 11640గ0421! 5లజ, గం 3, ౯119)

  1. కొందరు తంజావూరు కవులు, పండితులు- కురుగంటి సీతారామయ్యగారు, పుట 31. త. సజు గజ, ల.0.[. ఓర, ౪01.8.159

రఘునాథ నాయకుడు 525 సిద్ధహస్తుడు. ఎటువంటి యుద్ధంలోనైనా అతడు రేకమోపక చూస్తే మెచ్చుకొనేవారు. “మన. ప్రతిష్ట నిలబెట్టగల సమర్భడు వీడే. అని చెవ్వప్ప చెప్పడం ఆనాటి రాజోద్యోగులందరూ విన్నారు. నిజానికి రఘునాథుని సామర్థ్యం చిన్నప్పుడే వెల్లడయింది. మొగ్గ విరియకముందే అతని మెదడు పరిమళింపసాగింది. అంతఃపురంలోని మిగిలిన పిల్లలు ఆటపాటలాడుకొనే అతి చిన్న వయసులో రఘునాథుడు ఆసక్తితో అన్నీ చదువుకొనేవాడు. ఇది చూసి తండ్రి అచ్భుతప్ప చాలా పౌంగిపోయేవాడుగాని తల్లి మూర్తిమాంబ మాత్రం సహజంగా ఆరాటపడేది. చెక్కులు చిదిమితే పాలుగారే చిన్న వయసులోనే తన బిడ్డను చదివిస్తున్నందుకు ఆ తల్లి బాధపడ్డ సంగతి సమకాలికులకు బాగా తెలుసు. నవరత్న ఖచితమైన పలకమీద ఓనమాలు దిద్దిన రఘునాథుడు ఉత్తరోత్తరా సాహిత్యరత్నాలన్నిటికి నికషోపలమయ్యాడు. మహాపండితులు గోవింద దీక్షితులుగారి తర్భీదులో అతడు నీతికోవిదుడయ్యాడు.

గోవింద దీక్షితులవారు మూడు తరాల నాయకులకు ముఖ్యమంత్రిగా, కుడిభుజంగా ప్రవర్తించినవారు. వారు చెవ్వప్ప నాయకుని కొలువులో బహుశా క్రీశ 1565లో చేరారు. క్రీశ 1580లో రాజ్యానికి వచ్చిన అచ్యుతప్ప గెలిచే సమర నిశ్ళంకుడు. ఒంటిమీద కత్తిగీట్లు పడకుండా యుద్ధం చేయగల సామర్థ్యం ఎంతో సాధనవల్లగాని రాదు. బాలరఘునాథుడు ఏరకమైన ఆయుధంతోనైనా యుద్ధం చేయగల విద్యను నేర్చుకొన్నాడు. మెరుపులాగ కత్తి తిప్పి చేతోనే ఒడుపుగా వీణమీద గమకాలు పలికించడం కూడా రఘునాథునికి చిన్నప్పుడే అలవడింది.

యుద్ధాలంటే చెవి కోసుకొనే రఘునాథునికి చెవినిల్లు కట్టుకొని సంగీతం ఎవరు నేర్పారో తెలియదుగాని రఘునాథుని యుద్ధట్రీతిని, వాద్య ప్రతిభను కలిపి ఒక కవి చమత్కరించాడు. కలహభోజనుడైన నారదుడే సాక్షాత్తూ రఘునాథుని వీణగురువై ఉండాలి. లేకుంటే యుద్ధప్రియుడైన రాజకుమారునికి విపంచికావాదనంలో ఇంతటి సామర్థ్యం రావడానికీ అవకాశం లేదు అని సమకాలికులు చెప్పారు.”

సమర, సంగీత వైదుష్కాల సంగతి అలా ఉండగా సాహిత్యంలో రఘునాథుడు చక్కని ప్రతిభ చూపించాడు. చతుర్విధ కవిత్వాలలో చాతుర్యం సంపాదించాడు. తాను నేర్చుకొన్నంత విద్యను ఇతరులకు బోధింపగల నైపుణ్యం తూడా రఘునాకునిలో ఉంది. షడ్డర్శనీ పారంగతుడైన యజ్ఞనారాయణ దీక్షితులంతటివాడు రఘునాథుని శిష్యరికం చేసి సంస్కృత పండితుడయ్యాడు. ఈయన గోవిందదీక్షితులవారి పెద్ద కొడురు. ఇతడు తన గురువు రఘునాథ నాయకుడు సర్వజ్ఞుడని, కావ్యాలంకృతి నాటకాది కల్పనాపాండ శ్యం అద్భుతమని తన అలంకారరత్నాకరంలో చెప్పాడు. తన గురువు గారికి తానంతో 4. _ఆస్మాకమేడేనభవేత్ప త్రిష్వా, ఛర్తుంనమర్థశ్చన ఏవరాజ్యం' అని చెవ్వప్ప అన్నకు సంగిశపుధ'

అవతారికలో న నయా వ్రాశారు.

క. ఇది యజ్ఞనారాయణ డీక్షితులవారు తమ సాహిత్యరత్నాకరంలో చెప్పారు. 6. విజయవిలాసం, అవతారిక, 40 7. సాహిత్యరత్నాకరం, 5-8

526 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి బుణపడి ఉన్నానని చాటుకొన్నాడు. తాను గురుదక్షిణ ఇవ్వడానికి బదులు శిష్యుడే తన కర్గ్ణాలంకారాలు, పతకాలూ, పాదాంగదాలు, కంకణాలూ ఇచ్చాడని యజ్ఞనారాయణుడు వివరించాడు. ఈయన అలంకారరత్నాకరం అనే లక్షణ గ్రంథాన్ని, సాహిత్యరత్నాకరం అనే కావ్యాన్ని రఘునాథ భూపాలీయం అనే నాటకాన్ని ఉత్తరోత్తరా రచించాడు.

శిష్యుడు సంస్కృతంలో అటువంటి గ్రంథరచన చేస్తే గురువు తెలుగు కావ్యాలను రచించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాడు. అత్యాశుకవిత్వం ఆయనకు ఒకప్పుడు సరదా, ఒకనాటి రాత్రి చుట్టూ లేఖకులను కూర్చోపెట్టుకొని రఘునాథుడు పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని ఆశువుగా చెప్పుకొంటూపోయాడు. ఆ శైలి మాకందకందళం, మరంద బంధురం. మొదలుపెట్టిన రెండు యామాలలో, అంటే ఆరు గంటలలో ఆ కావ్యాన్ని రఘునాథుడు ముగించాడు. అతడెంత త్వరితంగా చెప్పుకొనిపోయాడంటే అతికష్టంమీద తప్ప వ్రాయసకాళ్లు లిఖించలేకపోయారు.! ఒక్కరాత్రిలో ఇంతటి కావ్యం తన కొడుకు రచించాడని అచ్యుతప్పనాయకుడు పొంగిపోయాడు. దానిని విబుధులంతా విని మెచ్చుకొన్నారు. కుమారుని నైపుణ్యాన్ని తగినరీతిగా గుర్తించి సత్కరించాలని అచ్యుతుడు నిండుసభలో రఘునాథునికి కనకాఖిషేకం చేశాడు.

తన ప్రతిభను అలా ఎన్నికచేసిన తండ్రికి రఘునాథుడు అమోఘమైన సేవ చేశాడు. అచ్చుతప్ప నిర్మలసత్కీర్తి నిఖిలదేశాల నెగడేటట్లు కొడుకు అచ్యుతాభ్యుదయం అనే ద్విపద కావ్యాన్ని వ్రాశాడు. చారిత్రక పురుషుల జీవిత విశేషాలను పొందుపరుస్తూ వ్రాసీ కావ్యాలను అభ్యుదయ కావ్యాలుగా మన పూర్వులు పేర్కొనేవారు. సాళువ తుళువ వంశాలవారు రాయసింహాసనం ఎక్కి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే రోజులలో రాజనాథ డీండిముడు అనే కవి సంస్కృతంలో రెండు అభ్యుదయ కావ్యాలు వ్రాశాడు. ఒకటి సాళ్వాభ్యుదయం. ఇందులో సాళువ నరసింహదేవరాయలు ప్రతాప వితరణాల చరిత్ర ఉంది. ఇది పదమూడు సర్గల మహాకావ్యం. ఈ సాళువ నరసింహదేవరాయలు క్రీ.శ.1485-90 దాకా రాయసింహాసనంపై పాలించాడు. ఇతడు స్వయంగా కవి. రామాభ్యుదయం అనే కావ్యాన్ని వ్రాశాడు. అనేక కృతులు అంకితం పుచ్చుకొన్నాడు" ఈ సాళువరాయల పేర సాళ్వాభ్యుదయం వ్రాసిన రాజనాథ డిండిముడు మరి కొన్నాళ్ళకు అచ్యుతరామాభ్యుదయం అనే కావ్యం వ్రాశాడు. ఈ కావ్యసందర్చంలో ఒక విషయం ప్రస్తావించాలని నిడుదవోలు వెంకటరావుగారు ఇలా వ్రాశారు. “ అచ్యుతరామాభ్యుదయ మనగా _ శ్రీకృష్ణదేవరాయల తండ్రియగు నచ్యుతదేవరాయలేకాని వేరు కాదు. కృష్ణదేవరాయల తండ్రి చరిత్రమునే నచ్యుతదేవరాయల యాస్థానకవి రాజనాథ డిండిముడు రచియించెను.”** ఈ వాళ్యాలతో నిడుదవోలువారు కొత్త చరిత్ర సృష్టించారు. జగత్రసిద్ధుడైన కృష్ణదేవరాయలవారి తండ్రి పేరు నరసనాయుకుడు. ఇతణ్జి నరసింహు డంటారు అని మిడిల్‌ స్కూల్‌ పార్షగ్రంథాలలో సైతం కనబడుతూంది.11 అయితే 8. సాహిత్యరత్నాకరం 5-30 8. తొలిరాయలయుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటం 2002 10. దక్షిణదేశీయాంధ్ర వాజ్బ్యయము, ద్వితీయముద్రణ, పీరిక, పుట 64. 11. తెలుగువాచకము, ఆరవతరగతి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణము, పుట 26.

రఘునాథ నాయకుడు 6527 “పరిశోధనా పరమేశ్వరు'లైన నిడుదవోలు వారు మాత్రం కృష్ణదేవరాయల తండ్రీ అచ్యుతరాయలని ఒకటికి రెండుసార్లు ఒకే పేరాలో చెప్పి చరిత్రనే ఎందుకు మార్చారో తెలియదు. అచ్యుతరాయలు వాస్తవానికి కృష్ణదేవరాయలకు సవతి తమ్ముడు. క్రీ.శ1530-1542 దాకా సామ్రూజ్యాన్ని పరిపాలించాడు. ఇతని మరదలినే తంజావూరు చెవ్వప్పనాయకుడు పెళ్లాడాడు. తన ప్రభువూ, తోడల్లుడూ అయిన అచ్య్భుతరాయల పేరునే చెవ్వప్ప తన కుమారునికి పెట్టుకొన్నాడు. సంస్కృతంలో ఆ అచ్యుతరాయల అభ్యుదయాన్ని రాజనాథ డిండిముడు వర్జిస్తే తరువాత ఇంకోతరానికి ఈ అచ్యుతుని అభ్యుదయాన్ని రఘునాథుడు తెలుగులో ద్విపదగా వ్రాశాడు.

ఈ అచ్యుతాభ్యుదయాన్ని ఆనాడు తంజావూరు కొలువులో అప్పుడప్పుడు కొందరు చదివి విన్పిస్తూ ఉండేవారు. అయితే ఇది ఇప్పుడు అలభ్యం. ఈ కావ్యం దొరికితే అనాటి చారిత్రక వోషాలు చాలా సప్రామాణికంగా దొరికేవి. రఘునాథుడు బ్రాసిన ఈ కావ్యంలాగే మరికొన్ని తూడా నేడు దొరకవు. అలా నష్టమైన కావ్యాల పేర్లయినా తిలుస్తున్నందుకు కొద్దిగా సంతోషించాలి. గబేంద్రమోక్షం, జానకీ పరిణయం, రుక్మిణీ కృష్ణవివాహం అనే మూడు కావ్యాలు రఘునాథుడు వ్రాసినట్టు తెలుస్తున్నా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. ఆయన రచించిన నలచరిత్ర అనే ద్విపదకావ్యం, వాల్మీకిచరిత్ర అనే పద్యకావ్యం, రామాయణ బాలకాండలో కొంతభాగం దొరుకుతున్నాయి. వీటిలో నలచరిత్ర ఎనిమిది ఆశ్వాసాల రచన, దానిని సుఘటితమైన నవరసస్ఫుట శబ్దాలతో రమ్యవాగ్దాలం గల రఘునాథుడు రచించాడు. నవరసాలపై అతనికి ప్రత్యేకమైన మక్కువ ఉన్నట్టుంది. శ్రీనాథుణ్ణీి ఆయన నవరసనాథుడన్నాడు. ద్విపద నలచరిత్రలో ఆయన కవిత్రయం వారిని చాలా చక్కగా వినుతించాడు.

శిలలోపల వెన్న చిలికిన కరణి-నలఘసంస్కృతముల యర్థంబు లెల్ల

దెలుగుమవూటల దేట తెల్లంబు గాగ - జెలువొంద బల్కనేర్చిన

నన్నపార్యు దిక్కయబ్బను నెజ్జ ధీమణి దలచి (నలచరిత్ర 1-295 నుండి 209)

ఈ కావ్యాన్ని వ్రాశాడు. ఆయన చెప్పినట్టు కవిత్రయంవారు శిలలలో వెన్న చిలికిన వాళ్లే! రఘునాథునికి శ్రీనాథుడంటే ప్రత్యేకమైన అభిమానం. తన రచనలన్నిటిలోనూ అతణ్ణి ప్రత్యీకం ప్రస్తుతించాడు. నలచరిత్రలో ఇలా భూషించాడు:

అక్కజంబుగ నిటులౌన ననుభయ- భాషల నానార్థభంగు లింపార

నైషధాది ప్రబంధంబుల లెన్నేని - భువినిల్పిసత్కీర్తి బొందిన యట్టి

నవరసనాథు శ్రీనాథునిబొగడి. (నలచరిత్ర 1-110 నుండి 114)

దీని తరువాత వ్రాసిన వాల్మీకిచరిత్రలో కూడా శ్రీనాథుని రసశ్రీలను రఘునాశుడు మెచ్చుకొన్నాడు.

సందర్చంబున వార్థగర్చమగుచుం జాటుక్రియక్‌ మించగా

జిందుల్‌ద్రొక్కుచు నిండి యంతట రసశ్రీమెచ్చు గొల్బంగ నా

528 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నందాంభోదితరంగముల్‌ వలె బ్రబంధమ్ముల్‌ భువిక నిల్పి దా నం దెల్లంబుగ గీర్డిగాంచి మను శ్రీనాథుక్‌ మదిం గొల్పెదళ€. (వాల్మీకీ చరిత్రము, 1-12) ఈ పద్యంలో సందర్పానికి తగిన రీతిగా వైదుష్యాన్ని ప్రకటించే శ్రీనాథుని ఆయన _మెచ్చుకొన్నాడు. ఇదే సుగుణాన్ని మళ్ళా రామాయణంలో చేసిన స్తుతిలో కూడా రఘునాథుడు పేర్కొన్నాడు. నానాశాస్త్రపురాణ- జ్ఞానము సందర్చమున బొనంగగ గృతు లె న్నేని యెనరించి మించిన - శ్రీనాథుని వచనవైఖరిన్మది దలతుక. (రఘునాథరామాయణము, 1-12) శ్రీనాథుణ్జి ఇలా మెచ్చుకొనే రఘునాథుడు చిన్నప్పుడే శృంగారనైషధాన్ని చదివి అందులో నలచరిత్ర సగమే ఉంది కాబట్టి పూర్తిగా చెప్పాలని భావించి ఉంటాడు. అయితే అప్పటికే ఇద్దరు కవులు ద్విపదకావ్యంగా నలచరిత్రను వ్రాశారు. చక్రపురి రాఘవాచార్యులు, బట్టేపాటి తిమ్మయ్యల ద్విపదల చరిత్రలు ఒకనాడు బాగా ప్రచారంలో ఉన్నాయి. అయినా వాళ్ళ రచనలు రఘునాథుడు చూడలేదు కాబోలు. చూసినా నచ్చలేదు కాబోలు. సౌంతంగా దానిని రచించాడు. చక్రపురి రాఘవచార్యుల రచన పేలవంగా ఉంది. శ్రీనాథుడు చూపిన సౌగసు లతడెక్కడా వాడుకోలేదు. అందుకే రఘునాథుని మనసు చివుక్కుమని తానే స్వయంగా వ్రాశాడు. తొలుత నలుడు హంసను పట్టుకొన్నప్పుడు అది నలునితో “మామీద దండనీతిం బ్రయోగింప నీకుం దగునె? అదియుం గాక అని తన సంగతి చాలా విపులంగా చెప్పుకొన్నట్టు శ్రీనాథుడు ఒక సీసంలో చిత్రించాడు. అది చాలా తెలుగుతనం ఉట్టిపడే పద్యం. తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు గాన దిప్పుడు మూడు కాళ్ళ ముసలి యిల్లాలు గడుసాధ్వినే మియు నెలుగదు పరమపాతివ్రత్య భవ్యచరిత వెనుకముందర లేరు నెనరైన చుట్టాలు లేవడి యెంతేని జీవనంబు గానక కన్న సంతానంబు శిశువులు జీవన స్థితి కేన తావలంటబు కృప దలంపగదయ్య యో నృపవరేణ్య యభయ మీవయ్య యో తుహినాంశువంశ కావగదవయ్య యర్శార్థికల్చశాఖి నిగ్రహింపకుమయ్య యో నిషధరాజ (శృంగారనైషధం, 1-109) ఈ పద్యాన్ని రాఘవాచార్యులు తన ద్విపదలో స్మరింపనేలేదు. రఘునాథుడు చాలా చక్కగా మరింత తెలుగుతనం వెల్లివిరిసేటట్టు వ్రాశాడు. చూడండి. ఒంటిగాడనె నాకు నూరంత బలగ - మింటికెల్లను గర్హ నే నొక్కరుండ నాతల్లి యెంతయైనను గలదయ్య - నాతల్లికూటికి నవయదెన్నడును నూరేండ్లపండు కన్నులుగానవిపుడు - గారంబుపట్టి నొక్కరుడ నేనరయ నిల్లాలు కడుగోల నెండకన్నైరుగ - దల్లడిల్లగనుండు నట్టిది యేను

రఘునాథ నాయకుడు 520 తొడుకులుగుడ్డలో కూనలు నన్ను - నెడబాయరెన్నడు పెంచినమమత విసఖండములు దెచ్చి పెట్టునందాక-దెసలచూచుచు నోరు దెరచి యుండుదురు కన్నవారికి బోలె కాన్సించునయ్య - విన్నవారల కట్టివెదనలెల్ల దయచూడుమయ్యనంతపనీయచరిత - నయమెంచవయ్య యో నవనీతఖావ.

(నలచరిత్ర)

శ్రీనాథుని పద్యానికీ ద్విపద నిజంగా మెరుగుపెట్టడమే. శ్రీనాథుని హంస తన

తల్లి పెద్ద. అని చెప్పినచోట రఘునాథుని హంస అమెను “నూరేండ్లపండు' అంటుంది. శ్రీనాథుని హంస “కడుసాధ్యి యేమి యెరుగదు' అంటే రఘునాథుని హంస తన ఇల్లాలు “కడుగోల అంటుంది. శ్రీనాథుడు *కానక కన్న సంతానంబు శిశువులు, అంటే రఘునాథుడు వాళ్ళను “గుడ్డలో తూనలు' అని చెప్పాడు. బొత్తిగా పౌత్తిళ్ళలో ఉండే విడ్డలు కనుకనే కూటికోసం నోరు తెరచుకొని ఉంటారు. శ్రీనాథుని హంసకు వెనక ముందర నెనరైన చుట్టాలు లేరుగాని, రఘునాథుని హంసకు బోలెడంత బలగం. అయితే ఇద్దరి హంసలూ రెక్కాడితేగాని డొక్కాడదంటాయి. శ్రీనాథుని హంస “జీవనస్థితి కేన తావలంబు' అని రమారమి చివరను అంటే రఘునాథుని హంస “'ఇంటికెల్లను గర్హ నేనొక్కరుండ' అని మొదటే చెప్తుంది. ఇద్దరి హంసలూ 'నిగ్రహింపకుముయ్య' అని నలచరిత్రలన్నింటిలో రఘునాథుని కావ్యానికీ ఒక విశిష్టస్థానం ఉంటుంది. అయితే ఇది విరివిగా ప్రచారంలో లేకపోవడమే శోచనీయం. ఈ ద్విపదను ఆదిలో చెలికాని లచ్చారావుగారు తమ “ఆంధ్రభాషా విలాసిని. పత్రికలో అచ్చువేశారు. ఆ తరువాత ఇది క్రీ.శ. 1929లో గ్రంథరూపంలో వచ్చింది.

ముద్రించాలి.!3 ఇది రఘునాథుని తొలిరచనలలో చేరినది. దీని గద్య చాలా

సాధారణంగా ఉంది. ఇది రామచంద్రమహితదయా సాంద్ర-విదితసాహిత్య నవీనసాహిత్య చినచెవ్యయాద్యుతక్షితిపాలతనయ- రఘునాథభూపాలరమ్యవాగ్దాల సుఘటిత నవరసస్ఫుటశబ్బమహిమ- దనరెడునలచరిత్రమను ప్రబంధ మున (బ్రథమాశ్వాస మనదగు శ్రీల

ఈ గద్యలో ద్విపదకావ్యాన్ని ప్రబంధమనడం గమనించతగ్గది. రఘునాథుడు ఆరు

గంటలలో చెప్పిన పారిజాతాపహరణం తూడా ప్రబంధమే అని సమకాలికులు

ఇచ్చారు. (దక్షిణదేశీయాంధ్ర వాబ్మయము-ద్వితీయ ముద్రణం, పుటలు ౫-41). వారి ఉదాహరణలే నేను వాడినవి. అందుకు కృతజ్ఞత తెల్పుతున్నాను.

  1. అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణగా ఇది 184లో వెలువడింది. డాక్టర్‌ రామాపంతుల

లక్ష్మీకామేశ్చరరావుగారు పరిష్కరించారు.

530 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అన్నారు.పే ఇది కూడా ద్వాపద కావ్యమే కాబోలు. నలచరిత్ర గద్యలో రఘునాథుడు తాను భూపాలుణ్జిని చెప్పుకొన్నాడు. విరుదులేం వేసుకోకుండా నిరాడంబరంగా స్వవిషయం తెలియజేయడంవల్ల, ఆ రచన చేసేటప్పటికి అతడు యువరాజైనా అయ్యాడో లేదో చెప్పలేం. రఘునాథుని యువరాజ పట్టాభిషేకం చాలా అసాధారణమైన రాజకీయ పరిస్థితులలో ్రీ.ఈ.1594లో జరిగింది. అప్పటికతనికి పట్టుమని ఇరవై సంవత్సరాలు ఉండవచ్చును. అతని తండ్రికి మటుకు ఏళ్ళు మీరాయి. అచ్యుతప్పనాయకుడు తన తండ్రితో కలసి క్రీ.శ1561నుంచి పాలిస్తున్నాడు. క్రీ.శ15934 నాటికి ఏభయిఎనిమిది సంవత్సరాలు పైబడి ఉంటాయి. రమారమి ముప్ఫయి మూడేళ్ళ సుదీర్హ పాలన చేశాడు. ఆ వయసులో సైన్యాలను నడిపించుకుని యుద్ధంలో అతడు పాలొనలేడు. అయినా తప్పనిసరిగ యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది. 1594-95లో గోల్కొండ సైన్యాలు పెనుకొండపై దాడి చేశాయి. కోటను ముట్టడించాయి. అప్పుడు రాయసాత్రూజ్యాన్ని రెండవ వెంకటపతిరాయలు పాలిస్తూ ఉండేవాడు. రక్షసి తంగడి యుద్ధంలో పాతికేళ్ళ క్రిందట పతనమైన ప్రతిష్టను మళ్ళీ నిలబెట్టి కూలిపోయిన రాజ్యాన్ని కూడదీసు కొనడానికి ఇమ్మడి వెంకటపతిరాయలు ప్రయత్నించాడు. అందుచేత గోల్కొండ సుల్తానులకు కన్నెర్ర అయింది. ముట్టడించారు. తన సామంతులందరికీ సేనలతో వచ్చి సహాయం చేయమని రాయలు కబురు పంపించారు.

ఆదినుంచీ రాయసింహాసనాన్ని. తంజావూరు చాలా అణకువగా సేవించుకుంటూంది. సార్వభౌముడు సహాయం చేయమన్నప్పుడు తప్పనిసరిగా సైన్యాలు తరలించుకొని వెళ్ళాలి. అదనుకు దళాలు తేవాలన్న షరతులోనే అమరభూములను చక్రవర్తి ప్రసాదిస్తాడు. తాను స్వయంగా సేనలను తీసుకొని వెళ్ళలేక, ఏం చెయ్యాలో అన్న డోళాందోళనలో అచ్యుతప్పనాయకుడు పడ్డాడు. అప్పుడు మహామంత్రి గోవింద దీక్షితులువారు రఘునాథుణ్ణీ సేనలతో పంపమన్నారు. అయితే రఘునాథుడు రాజకుమారులలో ఒకడు మాత్రమే. అతని శక్తిసామర్థ్యాలు తండ్రికీ, మంత్రికీ తెలియవచ్చును గాని ఇతరులకెలా తెలుస్తాయి? చక్రవర్తి చాలా కష్రాలలో ఉన్నప్పుడు ఎవడో పసివాడికి సైన్యాలిచ్చి పంపడం ఏం బాగుంటుంది? ఇది విషమ సమస్యే. దానిని గోవింద దీక్షితులువారు చక్కగా పరిష్కరించారు. రఘునాథునికి యువరాజ పట్టాభిషేకం చేసి పంపిస్తే ఎవరి గౌరవానికీ భంగం ఉండదు. ఈ ఏర్పాటుకు రఘునాథుని అన్నగారు మాత్రం బాధపడి ఉంటాడుగాని మిగిలినవాళ్ళంతా సంతోషించారు.

తంజావూరు దళాలను తీసుకొని రఘునాథుడు పెళ్ళికి వెళ్ళినట్టు తరలి వెళ్లాడు. అతడు వస్తున్నాడని వినగానే పెనుగొండను ముట్టడిస్తున్న గోల్కొండ సైన్యాలలో కలవరం ఏర్చడింది.!5! ఒక పక్కనుంచి రఘునాథుడు, మరొక పక్కనుండి మట్ల అనంతరాజు, ఇంకొకవైపునుంచి వెలుగోటివారు సైన్యాలు తరలించుకొోని వచ్చారు. 14. "శ్రీ పారిజాతాపహహరణాఖిధానో- యేనైకరా ద్రేణకృతఃప్రబంధః అని రాజచూడామజి దీక్షితులు

తన రుక్కిజీ షరిణయంలో రఘునాథుని రచనలను గురించి చెప్పాడు. 16. పెనుగొండముట్టడి 1534-35లో జరిగిందని ఇటీవల చరిత్రకారులు నిర్ణయించారు. చూ రఘునాథనాయకాభ్యుదయం, నేలటూరి ఇంగ్లీషుపీరిక, పుట ౫.

రఘునాథ నాయకుడు 531 ఇమ్మడి వెంకటపతిరాయలకు ధైర్యం ఇనుమడించింది. కోటలోని సైన్యాల ఉత్సాహం పెరిగింది. గోల్కొండ సైన్యాలను తరిమికొట్టారు. అఖండవిబయాన్ని సాధించారు, పరరాజ్యపు సైన్యాలను ఓడించాక ఇమ్మడి వెంకటపతిరాయలు తనకు సహాయం చేయని సామంతులను శిక్షింపదలిచాడు. నేటి కోలారు ప్రాంతాలను ఆనాడు మురసనాడు అనేవారు. భళ్ళాలపురం కోటలోని తమ్మయ్య గౌడుడనే సామంతుడు సార్వభౌముని ధిక్కరించాడు. అతనికి గుణపాఠం చెప్పమని మట్ల అనంతరాజును, తంజావూరు రఘునాథుణ్ణీ, వెలుగోటి కస్తూరి రంగప్పును ఇమ్మడి వెంకటపతిరాయలు పంపించాడు. ఈ వీరాధివీరులు అవలీలగా ఆ పని సాధించారు. తమ్మయ్య గౌడుని బంధించి రాయల పాదాశ్రాంతుణ్ణి చేశారు. వయసులో చిన్నవాడైనా, ఎంతో అనుభవజ్ఞునిలాగ తనకు తోడ్చడ్డ రఘునాథుణ్ణి నిండు సభలో రాయలు ప్రశంసించారు. రాజ్యం నిష్కంటక మైనందుకు సంతోషించి సముచిత సత్కారాలు చేశాడు. సార్వభౌముని దృష్టిలో పడి ఇంత గౌరవాన్ని నోచుకున్న రఘునాథుని పలుకుబడి ఇతరులు ఉపయోగించుకోవా లనుకొన్నారు. ఇమ్మడి వెంకటపతిరాయలకు తొలినుంచీ తంజావూరు విధేయంగా ఉన్నా మధుర చెంజీ రాజ్యాలు మటుకు ప్రతికూలంగా ఉండేవి. చెంజీని పాలించే కృష్ణపష్పనాయకుణ్ణి అంతకుముందే ఎప్పుడో ఓడించి వెంకటపతిరాయలు చెరలో అంతఃపుర స్త్రీలు ప్రయత్నించారు. రఘునాథుని వద్ద మొరపెట్టుకున్నారు. ఆ యువకుని మనసు కరిగింది. సాటి సామంతుడు చెరలో బాధపడడం సహించలేకపోయాడు. సార్వభౌముని కోరాడు. సౌంతానికేం కోరుకొనక, పరోపకారం చేస్తున్న రఘునాథుణ్ణీ ప్రశంసించి సార్వభౌముడు వెంటనే చెంజి కృష్ణప్పను విడిచిపెట్టాడు. తనకు స్వేచ్చను ప్రసాదించిన రఘునాథుని బుణం తీర్చుకొనడానికి వేరేమార్గం లేని కృష్ణప్ప తన తూతురినిచ్చి పెళ్ళిచేశాడు. పెళ్ళికి వెళ్ళినట్టు యుద్ధానికి వెళ్ళిన రఘునాథుడు పెళ్ళి చేసుకుని వచ్చాడు.

ఈ చెంటి రాకుమార్తె పేరు లక్ష్మచ్ము. ఈమె కాక రఘునాథునికి మరి ముగ్గురు భార్యలున్నారు. వెంపరాజుగారి కుమార్తె “కళావతి' అతని పెద్ద భార్య. పేరేమిటో తలియదుగాని పేరయ్యగారి కుమార్తె రెండవ భార్య, మూడవ భార్యపేరు వెంకటమ్మ, పెనుకొండ ముట్టడిలోను, మురసనాడు యుద్ధంలోను పాల్గొని విజయాలను సాధించిన రఘునాథుడు విజయలక్ష్మితోపాటు లక్ష్మమ్మ అనే పెళ్ళికూతురుతో సహా వస్తున్నాడని తెలిసి అచ్యుతప్పనాయకుడు సంబరపడ్డాడు. స్వయంగా ఎదురేగి స్వాగతం చెప్పాడు. రఘునాథునికి ప్రజల ఆదరాఖిమానాలు లభించాయి. తండ్రికి ఇష్టుడయ్యాడు. ఇదంతా చూసిన అతని అన్నగారికి అసూయ కల్గింది. రాజ్యం తనకు రాకుండా పోతుందని భయపడి ఏదో కుట్రపన్ని ఎదురుతిరిగినట్టుంది. రఘునాథునిపై పక్షపాతంతో అచ్యుతప్ప తన పెద్దకొడుకుని కారాగారంలో బంధించాడు. రాజ్యభారమంతా రఘునాథునికే అప్పచెప్పి అచ్యుతప్ప నాయకుడు వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. తన 376 మంది భార్యలతో అతడు శ్రీరంగంలో నివాసం ఏర్పరచుకొన్నాడు. అచ్యుతప్ప నాయకుని

(షం 11

532 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ నంపుటి కడపటి శాసనం శ్రీశ 1596లో ఉంది. అది రఘునాథుడు పెనుకొండ, మురసనాడు యుద్దాలనుండి తిరిగివచ్చిన ఏడు, క్రీ.శ1597లో మన దేశానికి వచ్చిన నికలాయ్‌ పెమంటా అనే జెసూట్‌ ఫాదరీ వ్రాసిన వ్రాతలవల్ల ఆ దరిమిలాని అచ్యుతప్పు నాయకుడు రాబజ్యపరిత్యాగం చేసినట్టు తిలుస్తూంది.కే

తండ్రి వానప్రస్తానికి వెళ్ళిన తరువాత రఘునాథుడు మూడేళ్ళు అధికారాన్ని నిలదొక్కుకున్నాడు. మంత్రివర్గ్మమంతా అతని పక్షమే. మొదట ఎవరైన సుముఖంగా లేకపోతీ ఈలోపున రఘునాథుడు వాళ్ళను తనవైపు తిప్పుకొన్నాడు. క్రీ.శ 1600లో అచ్యుతప్పనాయకుడు మరణించాడు. అతని 370 మంది భార్యలూ అతనితో సహగమనం చేశారు. తండ్రి మరణించగానే రఘునాథుడు చెరలో ఉన్న సోదరుణ్ణి హత్య చేయించాడన్న సంగతి విదేశం నుండి వచ్చిన సమకాలికులు గ్రంథస్థం చేశారు.” అయితే, స్థానికులెవ్చరూ ఈ సంఘటన గురించి ఏమీ చెప్పకపోవడం అటుంచి అచ్యుతప్పనాయకుని కితర పుత్రసంతానమున్నట్టు కూడా తప్పిజారైన పేర్కొనలేదు. అస్థాన కవులెందరో రఘునాథుని జీవిత విశేషాలను వ్రాశారు. వాళ్లందరూ అతడపర శ్రీరాముడని చిత్రించారు. ఫాదరీల సాక్ష్యం త్రోసిపారేయలేని చరిత్రకారులు ఇంకేవైనా బలవత్తరమైన ఆకరాలు దొర్‌కేదాకా రాజ్యంకోసం రఘునాథుడు భ్రాతృహత్య చేయించాడో లేదో ఇదమిత్ధం అని తేల్చరాదంటారు.కేకి

క్రీశ1600లో రఘునాథుడు పట్టం కట్టుకొన్నాడు. గోవింద దీక్షితులవారు స్వయంగా అఖిషికం చేశారు. రాజ్యానికొచ్చిన పది సంవత్సరాలదాకా రఘునాథునికి పరరాజులవల్ల ఏ బెడదా రాలేదు. పెనుగొండ యుద్ధంలో అతడు సాధించిన ఘనవిజయం వల్ల అతని శార్భప్రతాపాలు వెల్లడి అయ్యాయి. అందుచేత పారుగు నాయకరాజులు అతనితో ఎటువంటి ఘర్షణా పెట్టుకోలేదు. అయితే క్రీ.శ 1609లో కొన్ని మార్చులు జరిగాయి. ఆ యేడు మధురను పాలించే కృష్ణప్పనాయకుడు మరణించాడు. మొదటి ముద్దువీరప్పు నాయకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు తన తండ్రిలాగ తంజావూరుతో విధిలేక సర్గ్దుకుపోదలచలేదు. తన సామంతులలో ఒకడైన ఎరుకై మట్టె నాయకుజణ్ణీ తంజావూరిపై తోలాడు.** అతడు తంజావూరు సరిహద్దులు దాటి కొన్ని గ్రామాలను పట్టుకొన్నాడు. దానితో యుద్ధం చెలరేగింది. రఘునాథనాయకుడు 1611 అక్లోబరులో మధురను ఓడించి వీరప్ప నాయకుబొమ్మ పెట్టాడు.

బొమ్మ పెట్టడం అన్నది మన వీరసాంప్రదాయాలలో చాలా ప్రాచీనమైనది విజయవీరుడు తాను ఓడించిన శత్రువుల చిన్నసైజు బొమ్మలు చేయించి తన కాలి గండపెండేరానికి కట్టి తొడుక్కుంటాడు. బొమ్మ పెట్టడాన్నే బొమ్మ కట్టడం అని తూడా అంటారు. రఘునాథుడు మధురనాయకుణ్ణి ఓడించి బొమ్మకట్టడాన్ని రఘునాథుని 16 జాలు రిలుఖ ఆంగ గణనం లలా కే? గూంతరు 0౨కు 0 నెలా. 1. టా, ౯401-22 ౫. రఘునాథాభ్యుదయం, నేలటూరివారి ఇంగ్లీషు పీఠిక పుట 27 19. 6 బలం 0 జుం, ౯46

రఘునాథ నాయకుడు 533 తొడుకే వర్ణించాడు. తన తండ్రీ ప్రతిరోజూ చేసుకొనే కొలువుసింగారాన్ని పిర్కొనే సందర్భంలో విజయరాఘవ నాయకుడు ఇలా వ్రాశాడు:

అకలంసూత్న రత్నాంగులీయములు-చిలికివైడూర్యంపు ేయంబుబూని

పరగపాండ్యనృపాలఫాలపట్టమున- మురువైననవరత్నములదీర్చినట్టి

విరుదు పెండేరంబు పెరమదీపింప-జరణాంబుజంబున సవరించి యట్లు

కొలువుసింగారమై.......... (రఘునాథనాయకాభ్యుదయం నుండి 611)

శత్రువులను అవమానించడంలో తూడా యథోచిత గౌరవాన్ని రఘునాథుడు పాటించేవాడు. పాండ్యదేశాధిపతి అంతస్తుకు తగినట్టు ముత్తువీరప్పు ఫాలభాగాన నవరత్నాలు తాపడం చేసిన పెండేరాన్ని తన తండ్రీ ధరించేవాడని విజయరాఘవుడు చెప్పాడు. రఘునాథనాయకునికితడొక్కడే సంతానం కాదు. ఇతనికి ముందు ఇద్దరు పుత్రులున్నారు. పెద్దవానికి అచ్భుతప్పు అని తండ్రిపేరే పెట్టుకొన్నాడు. రెండోవానికి అచ్యుతరామభద్రుడు అనే పేరు పెట్టాడు. ఏదో యుద్ధంలో జయించిన సందర్బంలో పుట్టడంవల్ల మూడో కొడుకుకి విజయరాఘవుడని నామకరణం చేసి ఉంటాడు.వి శ్ర మూడో కొడుకే తండ్రి తరువాత రాజ్యానికి వచ్చి రఘునాథుని జీవిత వేషాలను కొన్నిటిని తన కావ్యాలలో చెప్పాడు. పాండ్యరాజ్యాధిపతి అయిన ముత్తువీరప్పకం బొమ్మపెట్టడాన్ని ఇలాగ స్పష్టంగా ఇంకెవరూ చెప్పలేదు.

క్రీశ1611లో మధురపై విజయం పొందిన నాలుగైదేళ్ళలో మళ్ళీ రఘునాథుడు పెద్ద యుద్ధాలలో పాలొనవలసి వచ్చింది లోగడ అతడు చెంజి రాజకాంతలు పారే కృష్ణపష్పనాయకుని చెరనుండి విడుదల చేయించాడు. బహుశా ఆ ఉదంతం విని, ఆపదలో అదుకొంటాడని ఈసారి నేపాళ రాజకాంతలు రఘునాధుని వద్దకు వచ్చి మొరపెట్టుకొన్నారు. నేపాళమంటే హిమాలయపర్వత ప్రాంతాలలో ఉన్న నేటి నేపాల్‌ కాదు. సింహళంలోని జాఫ్నాను మనవాళ్ళు యార్చాణం అనేవారు. అదే ఉచ్చారణలో నేపాళం అయింది. క్రీశ 1615లో యార్ప్చాణం పాలించే ఎడిర్‌ మజ్జసింగఅర్భుడనే పరరాజశేఖరుడు మరణించాడు.

అతని కుమారుడు మూడేళ్లవాడు. ఆ పసివిడ్డ తరపున అరసకేసరి పండారుణ్ణి సంరక్షకునిగా నియమించే పరరాజశేఖరుడు మరణించాడు. ఈ నియామకాన్ని పోర్చుగీసువారు అమోదింపవలసి ఉంది. క్రీ.శ 1597లో సింహళప్రభువైన “డాంజాన్‌ ధర్మపాలుడు' మరణించాక ఆ ద్వీపానికి పోర్చుగీసువారు ఏలికలయ్యారు. నేపాళ సింటోసనాన్ని ఎక్కే పాలకులను గోవాలోని పోర్చుగీసు వైస్రాయి ఆమోదించడం ఒక లాంఛనం. ఆయేడే, అంటే శ్రీశ 1615లోనే పోర్చుగీసు వైస్రాయి కూడా మరణించాడు. వేపాళరాజ్యంలోని వారసత్వం అంగీకరించేలోపున మరొక విప్లవం జరిగింది. ఒక తుత్రులో పసివిడ్డా, అతని సంరక్షణకుడూ మరణించారు. అ తరువాత సంకీలితుమారుడనే ౫. రఘునాథనాయకాభ్యుదయం, యక్షగానం (పుట 54)లో "విజయ కారణముగ వెలసిన పుత్రునికి

విజయరాఘవనామకరణముచేసిరొ”' అనే చరణం ఉంది.

534 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి రాజబంధువు గద్దెకెక్కాడు. అయితే రాజ్యంలోని కొందరు వీరనాయకులూ, పోర్చుగీసువారూ ఇందుకు సమ్మతించలేదు. సంకిలిని రాజ్యభ్రష్టుని చేశారు. అతని భార్యలు తంజావూరు చేరారు. రఘునాథుణ్ణీ ఆశ్రయం ఇవ్వమని ప్రార్థించారు. అతడు అభయమిచ్చాడు. సంకిలి కూడా తంజావూరు వచ్చాడు.

ఈ నేపాళరాజుని గద్దెమీద నిలుపవలసిన బాధ్యత ఒకటి వుండగా మరొక అవాంతరం వచ్చింది. కావేరి సముద్రంలో కలిసీచోట చాలా పాయలుగా చీలింది. ఒక పాయను కోలరూను అంటారు. దీని లోపలి గట్టున సముద్రం వద్ద దేవకోట అనే ఒక దుర్గం ఉంది. దీనిని చోళగుడు అనే మహాభయంకరుడు పాలిస్తూండేవాడు. వాడు అపర రావణాసురుడు. వాడి దుర్గం చుట్టూ నదిలో పెంపుడు మొసళ్లు ఉండేవి. తన శత్రువులను బ్రతికి ఉండగానే సంచులపెట్టి కట్టివేసి రోకళ్లతో కొట్టి మొసళ్లకు పడేసివాడు. తన శత్రువులను కాక మిత్రులను పొరపాటున భక్షిస్తే మొసళ్ళను తూడా శిక్షించేవాడు. తన ప్రజలను పొట్టపెట్టుకొన్న దొంగమొసళ్ళను ఏరి బురదనీళ్లలో పడేసి తిండిపెట్టక చంపేవాడు.* ఈ చోళగుడు వాస్తవానికి చెంజినాయకరాజులకు సామంతుడు; పోర్చుగీసు వాళ్లకు మిత్రుడు. ఈ రాక్షసుణ్ణి ఓడిస్తేగాని దేశంలో శాంతి ఉండదని, పోర్చుగీసుల కోరలు పీకడం పడదని రఘునాథుడు భావించాడు.

ఇంతలో మరోపెద్ద రాచకార్యం వచ్చిపడింది. క్రీ.శ. 1614లో ఇమ్మడి వెంకటపతి రాయలు మరణించాడు. అతనికి చాలాకాలంవరతూ సంతతి లేదు. అందుచేత అతని అన్నకొడుకు శ్రీరంగరాయలు రాజవుతాడని అందరూ ఆశించారు. అయితే ఇచ్ముడీ వెంకటపతిరాయల అవసాన కాలంలో అతని పట్టమహిషి వెంకటమ్మ ఒక కుమారుని కన్నది. ఆమె గొబ్బూరు జగ్గరాజుగారి కూతురు. తన మనుమడే రాయసింహాసనం ఎక్కాలని జగ్గరాజు సహజంగా పట్టుపట్టాడు. అయితే అది దొంగ కాన్సని, ఎవరిబిడ్డనో తీసుకొనివచ్చి తనకు పుట్టాడని రాణి నటించిందనిన సంగతి అనాటి బహిరంగ ఈహస్యం. చివరకిది ఇమ్మడి వెంకటపతిరాయలకు కూడా తెలుసు. ఆయన పోతూపోతూ, తన అన్నకొడుకే రాజవాలని నియమించి కన్నుమూశాడు. శ్రీరంగరాయలని, అతని అదృష్టవశాత్తూ శ్రీరంగరాయల కొడుకును వెలుగోటి యాచమనాయకుడు రక్షించ గలిగాడు. ఆ తిశువును మాసిన బట్టలమూటలో దాచిపెట్టి చాకలివాడు చెరలోనుంచి బయటకు తెచ్చివేశాడు. వెలుగోటి యాచమనాయకుడు కాపాడిన బాలరామదేవ రాయలను సింహాసనంపై ఎక్కించాలని కొందరమరనాయకులు సంకల్పించుకొన్నారు. గొబ్బూరి జగ్గరాజుగారి దొంగమనవజ్జే గద్దె ఎక్కించాలని కొందరు పట్టుపట్టారు. సాధమ్రాజ్యంలోని వీరులంతా రెండు పక్షాలుగా చీలిపోయారు. రఘునాథుని సహాయాన్ని వెలుగోటి యాచమనాయకుడు అర్థించి బాలరాయలని తీసుకొని తంజావూరు వచ్చాడు. రఘునాథుడు తన సమ్మతిని తెల్పి దిగ్విజయ యాత్రకు కదిలాడు,

ఇ నాలం లు టం లగా

రఘునాథ నాయకుడు 5్‌రిక్‌

అతడు తన దిగ్విజయంలో మూడు ఘట్టాలుంటాయని నిర్ణయించుకొన్నాడు. చోళగుని ఓడించడం, నేపాళరాజుకు పట్టం కట్టడం, రామరాయలని సింహాసనంపై నిలబెట్టడం అనే మూడు మహత్తర కార్యాలు సాధించాలని తీర్మానించుకొన్నాడు. అసమాన కదనపాండిత్యాన్ని ప్రదర్శించి తొలిరెండూ సాధించాడు. పడవల మీద వంతెనలు కట్టి జలదుర్గంపై దాడి వెళ్ళాడు. అదే ప్రయోగాన్ని వినియోగించి పోర్చుగీసువారిని వెళ్ళగొట్టి నేపాళంలో సంకిలి కుమారునికి పట్టం కట్టాడు. ఈ రెండు విజయాలను ముగించుకొని 1616 జూన్‌ 8వ తారీకునాటికి పలమనేరు ప్రాంతాలకు రఘునాథుడు తన సైన్యాలను తరలించుకువచ్చాడు. అప్పటికే గొబ్బూరి జగ్గరాజు తన దండుతో తంజావూరు పరిసరాలకు వచ్చాడు. అతనికి మధుర చెంజినాయకుల మద్దతు ఉంది. సాఘ్రాబ్యంలోని సామంతులందరూ. తాము బలపరచేపక్షాలకు సహాయం చేయడానికి సేనలతో తరలివచ్చారు. క్రీ.శ. 1616 డిసెంబరు 12 తేదీనాటికి తోపూరు మైదానంలో ఇరుపక్షాలూ మోహరించాయి.!* తరువాత సంకుల సమరం జరిగింది. ఆ యుద్ధంలో గొబ్బూరి జగ్గరాజు మరణించాడు. చెంజినాయకుడు పారిపోయాడు. మధురవాళ్ళు సిగ్గుతో తలవంచారు. రఘునాథుడూ, యాచమనాయకుడూ అఖండ విజయాన్ని సాధించారు. యుద్ధభూమిలోనే రఘునాథుడు రామదేవరాయలకు పట్టాభిషేకం చేశాడు.

ఈ మహత్తర రాచకార్యాన్ని సాధించాక ఆ విజయ సూచకంగా తోపూరులోనే రఘునాథుడు ఒక స్తంభం నాటాడని చెప్పుకొంటారు. కాని అదెక్కడా కనబడదు. అయితే ఈ విజయాలను గురించి రఘునాథుడు సగర్వంగా తన గద్యలో చెప్పుకొన్నాడు. క్రీశ 1617 తరువాత అతడు వ్రాసిన పుస్తకాల గద్యలలో చోళగునిపై విజయాన్ని సూచిస్తూ '“సాధితసముద్రాంతరద్వీప' అనే బిరుదు వుండి. సంకిలికి పట్టం కట్టినదానికి నిదర్శనంగా “నేపాళభూపాలన్థాపనాచార్య' అనే సమాసం ఉంది. రామరాయల చేత టహ్రాంసలు పొందినందుకు సాక్ష్యంగా “కర్ణాటక రాజపూజనీయధౌరంధర్య' అనే బిరుదు కనబడుతుంది. ఈ పోేషణాలన్నీ రఘునాథుడు వ్రాసిన రామాయణంలో మొదట కనబడుతాయి. ఆయన ఒకనాడు ఇలా అనుకున్నాడు.

మాటికి రసపరిపాటికి - మేటికవులు మెచ్చి మేలుమేలన గూర్తుం

దేటగ రామాయణకథ-మాటల పొందికలు గుమగుము బిసాళింపన్‌.

(రఘునాథరామాయణం, 1-18)

ఇది చాలా కష్టసాధ్యమైన పని అని ఆయనకు తెలుసు. ఇది “లోయలన్నియు నొక్కట జేయూతగ నీద తలపుసేయుటి అని ఆయనకు తెలుసు. అయినా ఆయన గట్టెక్కాడు. రామాయణాన్ని సంపూర్ణంగా రచించి తన ఇష్టదైనం రామునికే అంకితం ఇచ్చాడు. రఘునాథుడు దీనిని పూర్తిగా రచించినా ప్రస్తుతం బాలకాండలోని కొంత మాత్రమే దొరుకుతూంది. మూడు సంపూర్ణ ఆశ్వాసాలూ, నాలో అశ్వాసంలోని ౫ 2 యాగం ం?గంణ, 069 లాలా

536 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పద్యాలూ కలిసి మొత్తం 487 గద్యపద్యాలు లభించాయి. వీటిలో బుష్యశృంగచరిత్ర రమారమి నాలోవంతు. మొదట 13 గద్యపద్యాలలోనూ, తరువాత సవిస్తరంగా 101 గద్యపద్యాలలోనూ రసవత్తరంగా రఘునాథుడు రచించాడు. రామాయణంలో గగ్రంథాదిని అవతారిక తరువాత సంగ్రహరామాయణాన్ని 50 పద్యాలలో వ్రాశాడు. ఈ పద్యాలలో రామరాజ్యాన్ని చివర ఇలా వర్ణించాడు: శ్రీధాన్యకటకమై చెన్నాందె నగరంబు; రాష్ట్రంబు సౌరాజ్యరమ్యమయ్యె నయమొప్ప (బ్రజలెల్ల జయవెట్టసాగిరి:; నెలమూడువానలు నింగిగురిసె. (రఘునాథరామాయణం, 1-95) రఘునాథుడు తన రామాయణంలో కోసలదేశంలోని రకరకాల ధాన్యాలను పిర్కొని పురవర్దన చేశాడు. వాస్తవానికాయన తన కాలంలో ఉన్న 22 విధాల ధాన్యాలను చెప్పాడు. పుష్పమంజరు లిప్పపువ్వు రాజనములుకస్తూరినిగరాలు గంధసరులు గంగాజలంబులు బంగారుతీగియలేనుంగు దంతముల్‌ దీనసరులు నన్నవంకెలుముత్తెసరులు ప్రాసంగులు రాయమెచ్చులు నీశ్చరప్రియములు నయములు రామబాణములు సీతాభోగములు బాలకేసరుల్‌ మోసనములు కజీయమేనులు సన్నబంకవూండ్ల మఅయు గలుగు ధాన్యంబులెల్ల ముక్కాణుబండీ నిండి యెల్లెడజూచిన నెగడుచుండు క్షామమనుపేరు నెణుగ రాభూమ్‌ప్రజలు. (రఘునాథరామాయణం, 2-11) ఈ పద్యం అంతా బాగుంది కాని కథ మొదలుపెట్టడానికి ముందు శ్రీరాముని జన్మానికి పూర్వమే దేశంలో '“రామబాణాలు, సీతాభోగాలు' అనే ధాన్యాలున్నాయని చెప్పడంలో కవిగారి సమకాలిక జీవితచిత్రణాసక్తి కనపడ్డా సమయవిరోధం ఉంటుంది. ఈ పద్యంవల్ల అనాటి తంజావూరు ఎంత సుఖిక్షంగా ఉందో తెలుస్తుంది. అయితే క్షామాలు కూడా అనాటి ప్రజల అనుభవంలో ఉన్నట్టున్నాయి. బుష్యశ్ళంగుని రాకకు పూర్వం రోమపాదుని రాజ్యంలో చినుతు బంగారమైందట! మినుకుమినుకున నొకనాడు మెఅపుగనము గగనమున నెంద జేటంత మొగులు లేదు గాడ్చు నొక్కింత మెదల దే కారణంబొ? (రఘునాథరామాయణం, 2-92) ఈ దుర్భరక్షామాన్ని తొలగించడం ఒక్క బుష్యశృంగునికే చేతనౌను; అతజ్లీ తీసుకురమ్మని రాజు సానితూతుళ్ళకు పురమాయించాడు. “మీఅంతవారికి అలమునీంద్రుని వలపించుట అంటీ ఎంత?” అని రోమపాదుడు ఇలా చెప్పాడు: నేలకుమింటికిన్‌ దొడరి నేర్చున నూత్రమువన్న మంచు గుం చాలను గొల్బ ద్రాళ్ళిసుకదాలునబేనగ జుక్కలెన్న జ

రఘునాథ నాయకుడు 537

ట్రాలనునారలొల్చి నెగడ న్వడగండ్లను గుళ్లుగట్టగా

జాలిన మీకు నిచ్చటికి సంయమి దెచ్చుట యేమి చోద్యమో?

(రఘునాథరామాయణం, 2-112)

రఘునాథుని రాజ్యంలో అందరూ భోగపరాయణులే. ఎవరిని చూసినా జవ్వాది బుగబుగలే. ఎవరిని చూసినా పూలరంగళ్లే. ఎవరిని చూసినా సీమసీమంతినులను గూడి కాముకేళి వేడుకల జెందువారలే. ఆ రాజ్యంలోని గణికలు ఈనాటి వన్నెైలవిసనకగర్రలలాగే పయ్యెదలు కవలసురటులకొని విసురుకొంటూ ఉంటారు. మేకప్‌ చెడిపోకుండా ఫెస్‌పొడరు అద్దుకొనే నేటికాలపు వాళ్ళలాగే నిద్దంపుటద్దంపువిళ్ళలు కొని యషప్పటప్పటికి సింగారంబులు చెదరకుండ జూచుకుంటారు. ఆ ఊరి వేశ్ళనాటి మదనతంత్రసిద్ధాంతమణీపేటి. కొందరు వీణలు పల్కిస్తూ ఉంటారు. కొందరు ప్రబంధాలు చదువుతూ ఉంటారు. కొందరు పక్షి మోషరవాలు సాధన చేస్తూ ఉంటారు. రఘునాథుడు తంజావూరులోని వేశ్ళ్యవాటికను కన్నులకు కట్టేటట్టు చిత్రించగలడు." వేశ్ళ్వవాటికనే కాక యజ్ఞవాటికను కూడా అంత సహజంగా చిత్రించాడు. దశరథుడు అశ్వమేధాన్ని తరువాత పుత్రకామేష్టిని చేశాడు. వాటిని రఘునాథుడు 3-25 నుండీ చివరిదాకా 75 గద్యపద్యాలలో వర్ణించాడు. ఈ రెండు యాగాలనే కాక జ్యోతిష్టోమం, అప్తోవ్యామం, అభిజిత్తు. విశ్చజిత్తు మొదలైనటువంటి ఉత్తర క్రతువులను పేర్కొన్నాడు. ఈ యాగాలు చాలా రఘునాథుడు చూసినవే.

తంజావూరు రాజ్యానికి మహామంత్రి గోవిందు దీక్షితులవారు సాగ్ని చిత్యం, వాజపేయం, సర్వతోముఖసత్రయాగం మొదలైన క్రతువులు ఎన్నో చేశారు. ఈ యజ్ఞాలను వారు చేస్తున్నప్పుడు రఘునాథుడు స్వహస్తాలతో వారికి వెల్లగొడుగులు పట్టాడు. దీక్షితులవారు చేసిన దానాలన్నింటికీ ధనం రఘునాథుడే ఇచ్చాడు. ఆయన ఒక్కొక్క తిథి పేరిట ఒక్కొక్క గ్రామాన్ని దానం చేయదలిస్తే, ఆ పదిహేను అగ్రహారాలను రఘునాథుడే ఇచ్చాడు. ఆనాడు ఇచ్చిన ఏకాదశ అగ్రహారాన్నే నేడు ఎచ్చంగూడు అంటారు. తన మంత్రి చేసిన యాగాలను, దానాలను చూశాడు కనుక రఘునాథుడు తన రామాయణంలో చాలా వాస్తవికంగా యాగశాలను చిత్రింపగలిగాడు. “హవి ర్గంధాలు, వేద గానాలు, తోలాహలాలు, బ్రాహ్మణుల భోజనాలు, వేశ్యల నాట్యాలు, అగ్నిచయనాలు యూపాలు, పశువిశసనాలు, కప్పలమూటలాటి బ్రాహ్మణగణాలకు దానాలు ఇవ్వడాలు మొదలైన దృశ్యాలన్నింటిని తైలవర్ణ చిత్రంలాగా రఘునాథుడు చిత్రించాడు. ఉప్పులేకే ముష్పందుం అని అసమగ్రమైన ఈ కావ్యంలోనే సమకాలిక విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. పూర్తిగా గ్రంథం దొరికితే ఇక చెప్పాలా? ఎన్నెన్ని అపూర్వమైన సంగతులు తెలిసివో! ఆంధ్రుల సాంఘిక చరిత్రలో పెద్ద ప్రకరణానికి రఘునాథుని రామాయణం తోడ్చడేది.

ఈ రామకథ నతడు పూర్తిగా బ్రాశాడని లోకులు చెప్పుకొంటారు. అతని రచనలే మధురవాణి అనే అస్థాన కవయిత్రి సంస్కృతంలోనికి పరివర్తనం చేసిందంటారు. అమె వ్రాసిన 14 సర్గల కావ్యం మాత్రం దొరికింది. అందులో 1500 శోకాలు ఉన్నాయి. ఈ 23. రఘునాథరామాయణం, 2-13. 24. రఘునాథ రా. 2-105

536 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ శ్రీరామాయణసార కావ్యతిలకాన్ని దొరికినంతవరతూ రఘునాథుని రామాయణంతో ఖైపారు వేసినవారు రెండూ రెండు సొంత కావ్యాలని చెప్తారు. పూర్ణగ్రంథం లభించాక పరిశోధించితే బహుశా రఘునాథుని రామాయణాన్ని నిజంగా మధురవాణి సంస్కృతంలోకి పరివర్తనం చేసిందనే విషయం డేలవచ్చు. ఆయన తెలుగులో తాను వ్రాసిన తన రామాయణాన్ని ఎవరు సంస్కృతీకరించగలరా అని ఆలోచనలో పడినప్పుడు సాక్షాత్తూ శ్రీరాముడే కలలో కనపడీ సలహా యిచ్చాడు. మధురవాణి అందుకు నియోగించాడని సంస్కృతంలో గగ్రంథస్థమైన సాక్ష్యం ఉంది.

రామాయణాన్ని బ్రాశాక నవ్యోద్యమనవ్యార్థ్ధచమక్కారభవ్యమైన కావ్యాన్ని రఘునాథుడు బ్రాయదలచాడు. ఆయన పుస్తకాలన్నింటినీ గుత్తగా అంకిం పుచ్చుకొన డానికి ఇష్టపడే శ్రీరాముడే కలలో కనపడి ఇలా అన్నాడు.

నీ కవితావిలాసము గణింప సుధారసధారకంటిె నిం

పై కనిపించు దానగృతియ్రైనను మిక్కిలిసాౌంపు నింపదే

నాకథ దొల్లి యర్ధరచనారుచిమించగ జెప్పి తట్టె వా

ల్మీకిచరిత్రముక్‌ నొడుపుమచ్చుగ నీవిపు డచ్యుతాత్మ జా (వాల్మీకి చరిత్ర, 2-21)

దైవమే ఇతివృత్తం కూడా నిర్ణయించాడు. ఆ సలహాని పాటించి రఘునాథుడు మూడాశ్వాసాల కావ్యంగా వాల్మీకి చరిత్రను రచించాడు. ఇందులో 450 గద్యపద్యా లున్నాయి. వాస్తవానికి ఇన్ని పద్యాలు ఈ కథకు అక్కరలేదు. అయినా రఘునాథుడు విసుగు పుట్టించకుండా ఇంత గ్రంథం పెంచాడు. బదరికావనంలోని మునులు ఒకసారి నారదుని చూసి శ్రీవిష్ణుస్మరణకథ నొకదాన్ని చెప్పమన్నారు. ఆయన 'నాకు తీరిక ఎక్కడిది? నా నేస్తం పర్వతుడా కథ చెప్తాడు' అని పురమాయించాడు. పర్వతుడు చెప్పడం మొదలుపెట్టాడు,

పూర్వం కొంతమంది మునులు పాలకడలిలో దీపించే శ్వేతద్వీపానికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శించి అక్కడినుండి తీర్థయాత్రలు చేసుకుంటూ దారి తప్పి ఒక బోయపల్లి పరిసరాలకు వచ్చారు. ఈ సంగతి రఘునాథుడు ప్రథమాళ్వాసం మొదలుపెట్ట రెండో అశ్వాసంలో సగం దాకా చెప్తూనే వచ్చాడు. మొత్తం 160 గద్యపద్యాలలో ఈ పూర్ణయాత్రలను రఘునాథుడు నడిపించాడు. దారి తప్పిన ఈ మునులను ఒక పచ్చిబోయ అడ్డగించాడు. పశువులని బాదినట్లు బాదినా వాళ్ళ దగ్గిర '"పచ్చపైకం' కనబడలేదు. “మాలాంటి వాళ్ళను హింసించావు, పాపం కదట్రా?' అన్నారు మునులు. “అలిబిడ్డల కోసం అంపకోలపట్టిన నాకేం పాపం అంటుకుంటుంది?” అన్నాడు వాడు. “నీ పాపాలలో వాళ్ళు పాలు పంచుకొంటే సరేసరి. అది తేల్చుకొన్నావా?' అని మునులు అడిగారు. వాళ్ళ ముఖావలోకనం చేయగానే జ్ఞానం పొడిమిన ఆ బోయ 'ఇది నిజంగా తీల్చుకోవలసిన సమస్యే' అని భావించాడు. “ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని తన తాటింటికి వెళ్లాడు. అది తాటాకుపాకే అయినా లోన చందనపు రోలున ఏనుగుకొమ్ము రోకలితో వాని ఖార్య వెదురులవియ్యం దంపుతోంది (2-114). దానిని పిలిచి 'తన పాపంబుల దలప నీకు పనిగలదో?' నాకే పనియొ? “కాక చెరిసగమై పరగునోః' చెప్పమన్నాడు. 'నువ్వు

రఘునాథ నాయకుడు 539 తెరువుదోచుకు తెత్తువో, జూదమాడి తెత్తువో, నాకు నేటి కా తఠవఠవ?”' నీవు తెచ్చినవి దాచక వండగ బాడీ నిచ్చలుకొ అని చెప్పింది (2-119). కొడుకులూ అంతే అన్నారు. పాపాలలో పాలు పంచుకోమన్నారు. దానితో ఆ బోయకు విరక్తి కలిగింది. 'దోసములకు బని లేదట! నాసౌమ్ములు వారికి దినం బనికలదె' అని సంసారాన్ని పరిత్యజించాడు. ఆ మునుల వద్దకు వెళ్లి చెప్పుకొన్నాడు. వాళ్లు కనికరించి 'మరమరా' అనే మంత్రం చెప్పారు, దానిని జపిస్తూ ఆ బోయ అక్కడే ఉండిపోయాడు. పల్లెలోని కులం వాళ్లంతా వాడు ఇంటికి రాకపోవడం చూసి వెతుక్కుంటూ వెళ్లారు. వాడీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు. ఆ రావిచెట్టుకింద బాపన దెయ్యం వాణ్జీ పట్టుకొంది అనుకున్నారు (2-134). చెడామడా చివాట్లు పెట్టారు. చెప్పవలసినవి చెప్పారు. ప్రార్థించారు. పెళ్లాం విడ్డలకోసం రమ్మన్నారు. అప్పుడాబోయ ఇలా అన్నాడు: సతులెవ్వరు సుతులెవ్వరు-హితులెవ్వా, రేటివజద నెందేనొకచో జతగూడిన కాష్టంబుల - గతి నించుక గూడీ విచ్చి కదులుదు రవలక€్‌ (వాల్మీకి చరిత్ర, 2-153) ఈ సమాధానంతో కులంవాళ్ళు ఆశలు వదలుకున్నారు. వెళ్ళిపోయారు. అతడు జపం చేసుకొంటూ అచలుడయ్యాడు. ఈ ఉగ్రతపస్సు సంగతి దేవేంద్రునికి తెలిసింది. 'అతని వల్ల నీకు భయం లేదు. గుండెలపై చెయ్యి వేసుకుని సుఖంగా ఉండ'మని నారదుడు చెప్పాడు. అయినా ఇంద్రుడు వెంటనే రంభకు కబురు పెట్టాడు. ఆమె రతనాల మేడలో కెంపు రాళ్ళ అంచులున్న అరుగుమీద కూర్చుని నలకూబరునితో నెత్తాలాడుతున్నది. "నీ వల్ల ఒక ఘనకార్యం జరగాలి" అన్నాడు దేవేంద్రుడు. *చిత్తం, నామీద మీరుంచిన నమ్మకానికి కృతజ్ఞురాలను. మీరు నన్ను బహుమానం చేస్తే సమస్త దిక్చతులూ మెచ్చుకుంటున్నారుగాని ఆ ఊర్వశి ఉంది చూశారూ, అది లోగడ మీరు నాకిచ్చిన విరుదుచూసి ఏమందో తెలుసా?” అని ఇలా చెప్పింది. విరుదెవ్వరిచ్చిరే యీ - దొరకతున్నీకు నిక గీర్హి దొరకుంగద నా సరిపాత్రవె నీకెక్కడీ - వీరుదుని కళళలగలమేలుచూపంగ వలయుగాక (వాల్మీకి చరిత్ర, ౩-24) తనను తిడితే రంభ బాధపడదు. తనను స్వీకరించిన వానిని కూడా ఊర్వశి తిట్టిందంట! “సభనిన్ను భంగమొనర్హు, నీపయిన్‌ దయగలయట్టి యర్థపతినందనుండుం దలవంచ' అని ఊర్వశి శపథం చేసింది. ఈ సంగతి కొలువులో చెప్తూ *ఇండ్లనున్న దొరబిడ్డల నాడుదురే సురేంద్ర?" అని ఫిర్యాదు చేసింది. ఈ పల్కులన్నీ విని దేవేంద్రుడు పకపక నవ్వాడు. “జౌరా ఊర్వశి గర్వం' అనుకున్నాడు. ఆ తంపరిని పిలిపించాడు. అప్పుడు ఊర్వశి ఇంద్ర నీలమణులున్న, ఇంటి నాట్క్ళమందిరంలో నాట్యం నేర్చుతోంది. కబురు రాగానే నృత్త చేషంతోనే కొలువుకు వెళ్ళింది. వచ్చి జోహారు చేసిన ఊర్వశిని చూసి 'రంభతో మచ్చరమేటికిన్‌, బిరుదుమాటల పనియేమి' అన్నాడు. ఊర్వశి మర్యాదగా “యెదురాడడం చనవైన విన్నవింతు'నని తన కథ చెప్పింది.

6540 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఏలినవారు మెచ్చి బీరుదిచ్చిన వార్తలు విన్న దానవై

తాళితిగాత తా వీరుదుదాల్చితి నంచు మహించె నొక్కొనా

వేళనీ యందుగనగవే బిరుదుల్‌ తెగగోసి దానిచే

బ్రాలన నీడిపించి కొనివత్తుజుమీ యిటకుళసురోత్తమా! (వాల్మీకీ చరిత్ర, ౩-37) నాట్య సంగీతకళలు రెండూ నాకు వచ్చు; ఆ రంభ నాదగ్గిలీ నేర్చుకొంది; నావద్ద దిద్దుపడిన పొలతి యెన్నటికిని నన్ను బోలగలదే అని ప్రన్నించింది. ఆ తరువాత ఒక్క ఇరవై పద్యాలలో రంభాఊర్వశులు చెడామడా కలహించారు. ఇది నిజానికి ఇంద్రసభ కాదు. వాళ్ళు దేవవేశ్వలూ కారు. తంజావూరులో తన కొలువులో కీచులాడుకొనే విదుషీమణులనే రఘునాథుడు ఇలా సజీవంగా చిత్రించాడు. వాళ్ళ నోట తనకు తెలిసిన సంగీత నాట్య కళారహస్యాలు పలికించాడు. ఈ ఘట్టం చదవితే నాట్యసభ కళ్ళకుకడుతుంది.

తమ విద్యలో పరస్పరాధిక్కన్యూనతలు ఎంచి చెప్పుమని ఆ వన్నాలాడులడిగారు. అది హరికూడా తేల్చి చెప్పలేడు. అప్పుడు తమసానదీ తీరాన ఒక బోయ తపస్సు చేసుకొంటున్నాడు. అతణ్జీ ఎవరు చలింపవేస్తే వాళ్ళు గొప్ప అని దేవేంద్రుడు పందెం పెట్టాడు. రంభా ఊర్వశులు వెంటనే ప్రయాణమయ్యారు. భూలోకంలో యజ్ఞయాగాలు చేసిన సోమయాజులు, పొండరీకులు మొదలైన వాళ్ళు రంభ ఇంట సుఖం మరిగారు. ఆమె ఊరికి ప్రయాణం అవుతుంటే వాళ్ళ సంరంభం చూడండి.

నడచిరి యంత రంభ భవనంబుననుండెడు సోమయాజులు లె

క్కుడు తమిబాయలేమి వడి గూడగ రండిటు బాజపేయులె

క్కడి పయనంబువచ్చె మనకర్మము లీగతినుండె నేటికి౯

జడినెడు పొండరీతులని సారెకు బల్కుచునెండకల్కుచుక. (వాల్మీకిచరిత్ర, 3-౪) ఎండకు తాళలేని వాళ్ళకు పెంజెమటలు జారుతున్నాయి. ధోవతి పింజెలు కాళ్ళకు అడ్డం పడుతున్నాయి. రంభ ప్రయాణానికా వేదమూర్తులిలా వెట్టిచాకిరి చేశారట.

రత్నకంబళమతిరాత్రులు గొంచురా సర్వతోముఖులు వేసరగనేల

తాళవృత్తంబుమీపాలిది చయనులు జగడంబులాడకచనుడుకడకు

గవురంబుబెట్టె మీకట్టడయెణుగరా సత్రయాజుల కింత చలముగలదె

ముత్యాల చౌకట్ల మూటమోపొటతిలియదే వాజపేయులకు నెపుడు

నాడెక్రతువులు రామార్చణముగజేయ

తునికియేపాటు వాటిల్లెమనలకనుచు

సొరిది జనుదెంచు యబ్వలజూచి నవ్వి

యవ్విబుధకామినులు వారిననిపియచట (వాల్మీకిచరిత్ర, ౩-౫5)

పిచ్చికాముకులు నవ్వులపాలు కాక తప్పదు. అ శ్రోత్రియులను వారించి రంభా, ఊర్వశీ భూలోకానికి వెళ్లారు. (పన్నెండు పద్యాలలో ప్రయాణం) తరువాత మిట్టపల్లాలు లేనిచోట గుడారాలు పాతారు. ఆటలు, పాటలు, తీరుబాటుగా విహారాలు (రగడ). ఆ తరువాత మునిని చలింపజేయడానికి విడిగా ప్రయత్నాలు. రంభ నాట్యం

రఘునాథ నాయకుడు క541 చేసింది. అయినా రాయిలాగా బోయ కదలలేదు. రంభ చిన్నబోయింది. ఊర్వశి ఊరంతగా ప్రయత్నం చేసి వీణ వాయించింది. అతడు చలించలేదు. ఇద్దరూ ఏకాఖిప్రాయానికి వచ్చారు. “ఘనుల తపంబుల చెరుచంబనిచిన నిత చనగవలదు పదివేలైనన్‌ అని చెంపలు వేసుకున్నారు. అప్పాచెల్లోలాగ ఉందామని తూడ బలుక్కుని పాశం ఎత్తి వెళ్లిపోయారు. ఈ కథను 144 గద్య్భపద్యాలలో రఘునాథుడు సొంపుగా చెప్పాడు.

ఆ తరువాత ఇంక కథ లేదు. పాతిక పద్యాలలో తేల్చివేశాడు. తపస్సు చేసుకొంటున్న వాని చుట్టూ వున్న పుట్ట పెరిగింది. ఆదిలో ఉపదేశం చేసిన మునులు వచ్చి చూసి ముక్కుమీద వేలేసుకున్నారు. తరువాత అ వల్మీకం నుండి జనించినందుకు అతడు వాల్మీకీ అయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రామాయణం వ్రాయమని ఆదేశించి అంతర్థానమయ్యాడు. కథ కంచికి వెళ్ళినా మనం ఇంటికి రావాలనిపించదు. అర్భసతక్కథలను తీసుకొని వాటిని సానపెట్టాలనే చాదస్తాన్ని పెట్టుకోకుండా రఘునాథుడు సొంతంగా తన కాలంనాటి కథను తీసుకొని చెప్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. అరుదుగా కనిపించే మంచి కవులలో రఘునాథుడు ఒకడు. వాల్మీకి కవిత్వాన్ని ఒకచోట ఇలా మెచ్చుకున్నాడుః

ఈనయమిట్టిసోదయ- మీ నుడికారముతెఅంగునిట మునుపెచటం

గానమసాధారణమీ-మౌనిగ్రామణికవిత్సమహిమ దలంపక.(రామాయణం, 1-24)

రఘునాథుని రచనలో తూడా నయం. రసోదయం, నుడికారం అను మూడు త్రివేజిలాగా ప్రవహిస్తూ ఉంటాయి. అతను వ్రాసిన గ్రంథాలన్నీ లభించకపోవడం దురదృష్టమే. రఘునాథుడు చేసిన రచనలను సమకాలికులు చాలామంది పేర్కొన్నారు.3క్‌ వివరించారు. ఈ తబ్సీళ్ళవల్ల రఘునాథుడు మొత్తం 11 రచనలు చేశాడని తెలుస్తూంది.

పంప్క్పుతం: (1) భారతకథాసంగ్రహం, (2) రామాయణకథాసారం, (3) సంగీతసుధు తెలుగు: ప్రబంధాలు : (1) పారేజాతాపహరణం (2) రామాయణం (3) వాల్మీకి చరిత్ర

ద్విపదలు: (1) అచ్యుతాభ్యుదయం (2) గజేంద్రమోక్షం (3) నలచరిత్ర.

యక్షగావాలు: (1) జానకీపరిణయం (2) రుక్మిణీ కృష్ణ వివాహం.

అతని సమకాలికులు ఎవరూ చెప్పని మరొక రచన రఘునాథుడు చేసి ఉంటాడని ఇటీవలివారు కొందరు భావిస్తున్నారు. తంజావూరు సరస్వతీ మహల్‌ గ్రంథాలయంలో ౩. సాహిత్యసుధలో యజ్ఞనారాయణ దీక్షితులు రఘునాథుని రచనలను గురించి ఇలా చెప్పారు :

శ్రీపారిజాతాపహరణ ప్రబంధచిత్రంచ, వాల్మీకిచరిత్రకావ్యం కథాచ్యుతేంబ్రాభ్యుదయం గజేంద్రమోక్షం చరిత్రం చ నలస్యచరితం 'శ్రీరుక్మిజీకృష్ణవవాహయక్షగానం ప్రబంధానటినైకఖేదాన్‌ నిర్మాయవారగ్శిర్నిపుణార్థర్పిద్వత్కవీనాం విదధాపిహర్హం

నంజ: ౮ ౮ఫకనగుద్రమిని [సతంగ - 5. కరఆటింతిలాలం స్రనింంనా : ౧. 269

542 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సౌవిత్రీకల్యాణం అనే అసమగ్రకావ్యం ఒకటి ఉంది. ఆంధ్రవిశ్చ్వవిద్యాలయం వారి తంజావూరు కేటలాగు [గ్రంథ సంఖ్య 28. ఈ ప్రబంధానికి అవతారికగాని, గద్యగాని ఏమీ లేవు. ఎవరు బ్రాశారో తెలియదు. దీనిని మానవల్లి రామకృష్ణకవిగారు స్వహస్తాలతో వ్రాసుకొని తెచ్చుకొన్నారు. దానిని శృంగారగ్రంథమాల నంపాదకులు గంటి సూర్యనారాయణకాస్త్రిగారు తీసుకొని అచ్చు వేయదలచారు. ఆ ప్రయత్నాన్ని హర్తించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పీఠిక విషయాలు చెప్పారు. శృంగార గ్రంథమాల వారి ప్రచురణ కనుక దానికి శృంగారసావిత్రి అని పేరు పెట్టి దానిని రఘునాథనాయకుడు బ్రాశాడని ప్రకటించారు. గ్రంథాంతాన ఈ కందపద్యాన్ని పొందుపరిచారు.

తంజాపురి రఘునాథుని-లంజెయొ యితడో వచోవిలా సమెజయ[౯

రంజిల్లబుధులు రచనా- మంజిమ సావిత్రిచరిత మహిరచియించె౯.

ఈ వివరణ మానవల్లివారో, ప్రభాకరశాస్తులవారో, లేక ప్రకాశకులో ఎవరో వ్రాసుకొని ఉండాలి. ఈ పద్యం తంజావూరి మూలప్రతిలో లేదట. ఈ కందంలోని సాక్ష్యం తప్పిస్తి సావిత్రిచరిత్రకీ, రఘునాథునికీ ఏవిధమైన సంబంధం లేదు. శ్రీ రఘునాథ నాయక మహాకవి రచించిన రామాయణమునందలి పద్యములు (బుష్యశృంగ తపోభంగము పట్టున నున్నవి). ఈ గగ్రంథమునందున నుండుటచే తత్కర్హయే యేతత్కర్హ యగునని మే మూహించితిమి అని ప్రకాశకులు చెప్పారు. కాని బుష్యశ్చంగ ఘట్టంలోని ఒక్క పద్యం కూడా శృంగారసావిత్రిలో లేదని పరిశోధకుల అఖిప్రాయం.*” తంజావూరి రఘునాధుడుగాని, అతని లంబెలుగాని వాడని ఉర్దూ పదాలు శృంగార సావిత్రిలో ఉన్నాయి.

ఇది ఎన్ని ఆశ్వాసాల కావ్యమో తెలియదుగాని ప్రకాశకులు రెండు ఆశ్వాసాల క్రింద విడగొట్టి ప్రచురించారు. కాని మూడుగా విభజించవచ్చును. 'అవధరింపుము పాండవేయా గ్రజునకు' అనే ఎత్తుగడతో 'బుషివరుడు మార్కండేయుడిట్టులనియె అనే గీత పద్యం మూడుసార్లు ఈ గ్రంథంలో కనబడుతుంది (1-1. 2-1, 2-99), పుట 78). అందుచేత నిజానికది మూడాశ్వాసాల కావ్యం అనుకోవచ్చు. ఇందులో 42 గద్భుపద్యాలున్నాయి (1-999, 2-227). దీనినెవరు వ్రాసినా ఇదొకసారి చదువదగ్గ కావ్యమే. అక్కడక్కడ మంచి పద్యాలున్నాయి. తెలుగు సాహిత్యంలో ఇద్దరు సావిత్రి చరిత్ర వ్రాసినట్టు తెలుస్తుంది. ఒకడు కుమార ధూర్జటి, ఇంకొకడు తులసి బసవయ్య. కుమార ధూర్జటి వ్రాసిన సావిత్రి చరిత్ర దొరకలేదు. అతని గురించి ఇదే సంపుటంలో వేరే ఒక చోట వ్రాశాను. తులసి బసవయ్య వ్రాసిన సావిత్రికథలో ఒకే పద్యాన్ని పెదపాటి 2. శృంగారసావిత్రిపీరిక, పుట 6 27. దక్షిణదేశీయాంధ్రవాబ్బయము, పుట 48 28. హుజూరు 1-4, హుజూరుపాత్ర 1-47, నిఖా 1-9; పరమాణుపర్మానా 1-%, ఫిరాదు 1-౫.

జులబులు- సాహెబూపంపు 2-50; వజీరు 2-61, బరవనము 2-110 (బరవనము అంటే బరోసా ఇది హిందూస్మానీ అని సూర్భరాయాంధ్రనిఘంటువు చెప్తోంది. తిక్కనగారి ప్రయోగం ఉంది మరో ఊద్యోగ. 4-20)

రఘునాథ నాయకుడు 543 జగ్గన్న ఉదహరించాడు. ఆ పద్యం శృంగారసావిత్రిలో కనబడలేదు. దీనిని పింగళి సూరపరాజుగారు బిడారంలో ప్రయాణం చేసిన కవి యెవడో వ్రాశాడని చెప్పవచ్చు. కథ చెప్పడంలో నాటకీయత ఉంది. కళాపూర్లోదయంలో మణిస్తంభుడు తపస్సు చేస్తున్న సంగతిని ఒక తోటమాలి ఇంద్రునితో చెప్తాడు. (కళా. 2-174). అలాగే ఇందులో పాకశాసనుడు నిండోలగంలో ఉన్నప్పుడు అతని "హుజూరునందొక చారుడొక్కడు విరబిర పారుదెంచి. తాను బదరికాశ్రమం నుంచి వచ్చానని, అక్కడెవడో నృపుడు ఉగ్రతపస్సు చేస్తున్నాడని చెప్తాడు. ఇంత ఉగ్రతపస్సు చేసేవాళ్లు ఇద్దరే ఉన్నారు. ఒకడు విశ్వామిత్రుడు. ఆయన దేవలోకంలోనే మేనక ఇంట భోగలాలసుడై ఉన్నాడు. మేనకకోసం చేసిన గుజరాతి మేలుకోపులువచ్చి చూడమని ఇంతసేపు పట్టుపట్టాడు. ఇక ఉగ్రతపస్సు చేసే రాజు మద్ర దేశాధిపతి కావాలి" అని ఇంద్రుడనుకొన్నాడు. ఆయన తపస్సు చెడగొట్టడానికి మేనకను పంపించాడు. బదరికావనానికి వెళ్ళడానికి మేనక విమానం ఎక్కుతూ ఉంటే విశ్వామిత్రుడు వెంటపడ్డాడట. తానును చెలికత్తెలు - బూనుకొని విమాన మెక్కబోవగ నిలుమో మేనకయని కౌశికముని-తోనరిగెను బొజ్జగదల ధోవతివదలక. (శృంగారసావిత్రి, 1-25) వాల్మీకి చరిత్రలో రఘునాథుడు రంభా ఊర్వశులు తపోభంగం చేయడానికి వెడుతున్నపుడు వైదికులకు వర్ణించిన తీరు గమనించాలి. పెంజెమట జార దోవతి-పింజెలు మాటికిని గాళ్ళ బెనగాన గడుపుల్‌ గుంజెలు వెట్టగ వేలుపు - లంజల గూడంగ జనిహళాహళి మెరయున్‌ (వాల్మీకి చరిత్ర ౩-84) వాల్మీకి చరిత్రలో ఈ సోమరాజులకేంగాని సావిత్రి చరిత్రలో విశ్వామిత్రుడంతటి వాడు బొబ్బకదల ధోవతి వదల వెంటపడి విలపించాడు. అక్కట నీవు నన్ను విడనాడి చనం బదమెట్టులాడు, నే నెక్కడనిల్తు, నిల్చిమతజి యెవ్వరిజూతును, చూసిప్రాణమే నిక్కముగాగ నేకరణినిల్పుదు, నిల్పినలాభమేమి నీ వక్కరకైనదానవని హా మదినమ్మితి దేహమమ్మితిక్‌ (శృంగారసావిత్రి. 1-28) విశ్వామిత్రునికి తనమీద ఇంత వ్యామోహం అని మేనకకు తెలుసు, లోకానికీ తెలుసు. అతనికి ముక్కుమీద కోపం ఉంటుందని కూడా అందరికీ తెలుసు. ఈ రెండు సంగతులనూ జోడించి మేనక బ్రహ్మాండమైన కట్టుకథ ఒకటి కట్టి మద్రదేశాధిపతిని బుట్టలో పడేస్తుంది. తపస్సు చేసుకొంటున్న ఆ పెద్దమనిషి దగ్గరకీమె వచ్చింది. ఒయ్యారాలు ఒలకపోసింది. అతడు కన్ను తెరచి గోరంత ప్రపంచం చూసిసరికి ఆమె కల్పిత కథ చెప్పసాగింది. '““నా గొప్ప నేను చెప్పుకోకూడదుగాని ఇంద్రుని హుజూరు ౫. అరవీటి రాజులయుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటి.

| ం | 544 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవసంపుటి | | | పాత్రలందరికీ నేను గుండెలో గాలాన్ని, వాళ్ళు మచ్చరంతో ఒకసారి నాకు, తుంబురునికి వ్ర . మాట జగడం పెట్టారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాం. నేను ఇంటికి వచ్చేశాను. . అతడు నావెంట వచ్చాడు. గాయకుడవడంచేత రతులం గాయకుడై నన్న కరిగించాడు. | -! | ఈ సంగతి విశ్వామిత్రునికి తెలిసి ఇలా బెదిరించాడు: క మ! నేడు మొదలుగ నెవ్వని తోడనైన- బలికితేనిబ్రాణానకలుగువాడ 7 గాకయొకడుమహించుకోగలిగెనేని- యెన్ను మా బ్రహ్మనైన నిట్టట్టు సేతు. ఇ | (శృంగారసావిత్రి, 1-౫) ( :/ ఈ మాటలు వినగానే తుంబురుడు దొంగబంటులాగా పారిపోయాడు. అయితే బయట ( . అతని విరహం అగ్గలమైంది. ఇంట్లో విశ్వామిత్రుని పోరు ఇనుమడించింది. . - - గడియసే పింద్రు కొలువున దడయరాదు- చెట్టపట్టుకబాసలు సేయుమనును . కంటికితవైనవారితో గలయకుండ-నొంటిమరికాపురానతు నుండవలసె. . . . (శృంగారసావిత్రి 1-59). ఎక్కడకు వెళ్ళినా వెంటపడుతున్నాడు. ఇది భరింపలేకపోయాను. అప్పుడు తుంబురుడు .... తొడబడి యేడకేగినను దోడన వాడును రాకపోవ డె | య్యెడ జన్నియున్న నిన్ను వహియించుకొనంగలవానిగా నమా పుడమిభరించునశ్చపతిపొంతకుబొమ్మతడైన బూనినిక౯ వం విడువక వీకతో వెనుకవేసుకొనంగల డెంచి చూచినక్‌ , _ (శృంగారసావిత్రి, 1) " అ ఉపాయం విని నీదగ్గరకు వచ్చాను అని మేనక చెప్పిన ఈ కట్టుకథ | మద్రదేశాధిపతి విన్నాడు. మెల్లగా మరులుకొన్నాడు. తుంబురుని తెప్పించడం తప్ప | . నువ్వేంకోరినా చేస్తానన్నాడు. అతని వ్రతం చెడగొట్టాక ఇంద్రుడు సిఖావేసి ఒక లేఖ | . | పంపించాడు. దానిలో ఇలా ఉందిః | | | . శ్రీమన్మహాదేవసింహాసనాధ్యక్షచక్షుస్సహ ్రకటాక్షజాల

  1. వీక్షణా లంకారదక్షరా జశిక్షణభువన త్రయరక్షణ ప్రభావ | . .... వైభవనిధియైన వాసవుండు విరుదుపాత్రనీమేనకపాలికనువు = | ౫. పరమాణువిధి నిన్న బ్రహ్మవిశ్వామిత్రునాడకుపిలిపించినతని మీద . ముట్టినపిరాదుచేదనముదలలేక . .,... రాకమునకేగవలవదన్నాడుకనుక . | నపుడు పడిగమీపాదమాన రావలయునీవు. (శృంగారసావిత్రి, 1-౫) . న్‌ పద్యాలలో కమ్మవక్కణాలు వ్రాసి రివాజు నాయకరాజుల యుగంలో జాస్తీ | [ం గ్లో అయింది. కుమార ధూర్జటి ఇందుమకీపరిణయంలో ఒక శుభలేఖలో ఇలా పద్యం ఏ. బ్రాశాడు. ఈ శృంగారసావిత్రి అతను వ్రాసినదే అని అనుమానించవచ్చు. కొని

పుటి రఘునాథ నాయకుడు 5్‌4ీర్‌ న్‌ కుమార ధూర్జటి ఇందుమతీపరిణయం ఈ సావిత్రిలో తైపారువేసి చూశాక అతడు డు _బ్రాయలేదని చెప్పవచ్చు. రెండు రచనలలో కొట్టొచ్చే పోలికలు లేవు. . , రఘునాథుడు తాను సౌంతంగా ఇన్ని గ్రంథాలు వ్రాయడమే కాకుండా ఎన్నో _. . కృతులు అంకితం పుచ్చుకొన్నాడు. అతని కొలువులో ఉద్దండపండితులు, | ' _ మధురకవులు, సంగీత విద్వాంసులు, చిత్రకారులు ఎందరో ఉండేవారు. తన విజయాలను చిత్రపటాలుగా వ్రాయించి తన మందిరాలలో పెట్టుకొనేవాడు.లో తెల్లవారుజామున 50) లేచీలేవగానే రఘునాథుని సాహిత్య గోష్టి మొదలయ్యేది. నామతీర్థమనడానికి ముందు ఏట! శయన మెరుపులమంచంపై కూర్చుంటే బిరుదు పాత్రలు విజృంఖించేవారు. రూపవతి పదచారిక వినిపించేది. చంద్రలేఖ పేరణి, శేఖ జక్కణి - ఇలా ఒక్కొక్కరు | ఒక్కొక్కరకంగా నాట్యం చేసేవారు. మరి రచాయి తంబురా స్వరమండలం _ | రావణహస్తం మొదలైన వాద్యాలు వాయించేవారు. కొందరతని కావ్యాల నుంచి మంచి . ఘట్టాలు చదివి వినిపించేవారు. కొంతమంది విదుషీమణులకు కవులు సమస్యలు ఏడు వేకువజామునే ఇంతటి సాహిత్యపోషణ చేసే నాయకుని హయాంలో కళలన్నీ సంపూర్ణంగా ఉదయించడంలో ఆశ్చర్యం లేదు. రాజు స్వయంగా కవి. రాజకుమారులు | ఇ గ్రంథసాంగులు. మంత్రి మహాపండితుడు. యాగాలు చేయడమేకాక రాగాలు పాడడం | తెలిసినవాడు. సంగీతసుధ అనే [గ్రంథం రఘునాథునితో కలిసి రచించాడు. న గోవిందదీక్షితులవారి కుమారులంతా విద్వాంసులు. దీక్షితులవారి కుటుంబంలో ్‌

  1. అందరూ సంస్కృత బ్రంథాలే వ్రాశారు. అయితే వాటి అవతారికలన్నీ నాయకరాజుల చరిత్రకు చాలా అవసరం. మంత్రి కుమారులే కాక మరెందరో పండితులు రఘునాథుని కథ అస్థానంలో ఉండేవారు. వారంతా తెనుగు సాహిత్యాన్ని ఎంతో శ్రీమంతం చేశారు. వాళ్ళ ప్ప గురించి విడివిడిగా తెలుసుకొందాం. రఘునాథుని సభలో మెప్పుపొందడం అర్హత లేఖ ఉన్నవాళ్ళకే సాధ్యమవుతుంది. కవి చౌడప్పలాంటివాడే ఇలా అన్నాడు. నేరుతునని మాట్లాడగ - వారిజ భవునంతవాని వశమా తంజా | వూరి రఘునాథనాయని - గారెరుగగ కుందవరపు కవిచౌడప్పా! . నిజమే, కవిత్వంపట్ల రఘునాథునికి కొన్ని విశ్వాసాలూ, కొలబద్దలూ ఉన్నాయి. . | ఆయన రామాయణంలో ఇలా చెప్పాడు: 1 . .. పలుకగవలె నవరసములు - కులుకంబద్యములు చెవులకుక హృద్యముగా నళుకక యటుగాకున్నం- బలుకకయుండుటయెమేలు బహుమానముగక్‌ , కళాకారునికి ఎక్కడ మొదలుపెట్టాలో మాత్రమే కాదు; ఎప్పుడు మానెయ్యాలో జ్ర) కూడా తెలియాలి! ద్భం ॥ . . కాని ౩0. రఘునాథనాయకాభ్యుదయం, ద్విపద 1,446-468 దాకా.

చేమకూర వెంకటకవి

చదువుకొన్నవాళ్ళకు మచ్చరం, రాజులకు గర్భం, మిగతావాళ్ళు తెలివితక్కువవాళ్ళు. నేను చెప్పి మంచిమాటలు కాస్తా నాలోనే జీర్ణించుకుపోయాయి - అని భర్హ్చృహరి బాధపడ్డాడు. కీర్షి రాకముందు ప్రతి ప్రథమశ్రేణి రచయితా ఇలాగ కుమిలిపోక తప్పదు కాబోలు. నాయకరాజుల యుగంలో అగ్రతాంబూలం పుచ్చుకోడానికి అన్నివిధాలా తగినవాడు చేమకూర వెంకటరాజుగారు. “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా' అని ఆదిలో ఆయన నొచ్చుకొన్నారు. అయితే ఆయన వ్రాసిన విజయవిలాసం అనే కావ్యం దిగ్విజయం చేయగానే సమకాలంవారే మెచ్చుకొన్నారు. రసికులు ఆనందించారు. లాక్షణికులు దాన్ని ప్రామాణికగ్రంథంగా వెనువెంటనే ఆమోదించారు. ఇప్పటికీ తెలుగు భాషలో “పంచదారవెనుతీయగ' తీయగా చెప్పిన ళొద్జి కావ్యాలలో అదే మొదటిది. అక్షరాలా అద్వితీయమని చెప్పగల మార్గం చేమకూర వెంకటరాజుగారిదే.

తెలుగు దేశంలోని కొన్ని ప్రసిద్ధ కుటుంబాలలో చేమకూరవారిదొకటి. చెప్పుకోతగ్గ మోషాలతో ముష్ఫయ్యిద్దరు మంత్రులు మన చరిత్రలో గణన కెళ్కారు. వాళ్ళలో చేమకూర అప్పరాజుగారొకరు. ఆయన ఏ రాజుదగ్గిర మంత్రిత్వం నెరపాడో తెలియదుగాని అతనిపై రెండు చాటువులున్నాయి.

దాతతో నర్భల తారతమ్యమము జెప్పి యిప్పింపనేర్చు, దానీయనేర్చు

నవరసాలంకార నయకవిత్వపఫ్రాడి దెలియనేర్చును, నన్యు దెలుపనేర్చు

భట్టు వాగ్ధట్ట సంఘట్ట కవిత్వంబు చదువగా విన నేర్చు, జదువనేర్చు

మానవోత్తములైన మహితలాధీశుల మెప్పింపనేర్చు, దా మెచ్చనేర్చు

దాతకవి భట్టురాజును దానయగుచు

మహిమనుత్‌తెక్క ధారుణీమండలమున

వీరరిపుదంతి మథనకంఠీరవుండు

రమ్యశ్రీ చేమకూరప్పు రాజు మంత్రి; (చాటుపద్యమణిమంజరి 1. పుట 10%) ఈ చాటువువల్ల చేమకూర అప్పరాజుగారు స్వయంగా దాత, కవి, భట్టురాజు అని తెలుస్తోంది. ఈయన వితరణం చాలా అబ్బురమైనది. నీడ తొక్కినవేళ దానమిస్తాడట. “నీ దొక్కెడువేళ నెరి నర్థి కఖిమతం బిప్పించె బేమతూరప్పరాజు' అని ముష్ఫయిరెండు మంది మంత్రుల సీసమాలికలో ఉంది! మరొక చాటువులోనూ ఈ సంగతి ఎవరో కీరించారు.

అనుదినము నీడద్రొక్కగ-నొనరగ సురభూజ మీయ దొక కాపైనన్‌

దినదినము సుకవి జనులకు-ననయము శ్రీ చేమకూర యప్పన యిచ్చున్‌.

(చాటుపద్య. 1 పుట 1%)

ఇంత ప్రసిద్ధులైన అప్పరాజుగారికి బంధువులో కారో చెప్పలేం కాని, తంజావూరులో క్రీశ. 1600 ప్రాంతాలలో ఒక చేమకూర వారి కుటుంబం ఉండేదీ.

  1. చాటుపద్య మణీమంజరి, 1వ భాగం, వేటూరి ప్రభాకతళాస్త్రగారు పున

చేమకూర వెంకటకవి 547 అప్పరాజుగారిలాగే ఈ కుటుంబంలోవాళ్లు కూడా మంత్రులే. చేమకూర లచ్చన్నగారనే మోతుబరికి చాలాకాలం పిల్లలు లేరు. అతడు సూర్యనారాయణ భక్తుడు. ఆ దేవుని వరంవల్ల ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డకు తన తండ్రి పేరో, తాత పేరో పెట్టుకున్నాడు. అతడే సుప్రసిద్ధకవి చేమకూర వెంకటరాజుగారు. ఈయన తరువాత లచ్చన్నగారికి మరికొందరు కొడుకులు పుట్టారు. ఈ అన్నదమ్ములంతా తంజావూరు కొలువులో ప్రవేశించారు. రాణువలో చేరి “క్షత్రధర్మం' ప్రదర్శించారు. వెంకటరాజుగారి తమ్ముళ్లేకాక ఆయన కొడుకులు, చుట్టాలు కూడా రాచకొలువులో ఉండేవారు. క్షతధర్మాన్ని పాటించిన వెంకటరాజుగారు సేనలో, బహుశా ఏ పడవాలుగానో ఉండీ యుద్దాలలో పాలొని ఉంటారు. కదనపాండిత్యంతో పాటు కమ్మని కవిత్వం తూడా చెప్పడం ఆయన నేర్చుకొని, విజయవిలాసాన్ని రచించారు. అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరి ఉలూచిని, చిత్రాంగదను, సుభద్రను వివాహమాడే కథను మూడాశ్వాసా లలో చెప్పారు. దీనిని తన ప్రభువు రఘునాథనాయకునికి అంకితం ఇచ్చారు. ఆ కృతిని స్వీకరిస్తూ రఘునాథుడు ఇలా అన్నాడు:

క్షత్రధర్మమె కద నీకు గలది మొదల

దమ్ములు సుతుల్‌ హితులు గూడ మమ్ము గొలిచి

తిపుడు కృతియును జెప్పి మా కింపొనర్చి

తొకటగా వన్నిటనుబ్రయోజకుడ వీవు. (విజయ. పీఠిక 51)

అన్నిటిలోను ప్రయోజకుడైన వెంకటరాజుగారిమీద రఘునాథునికి 'ఇంతింత అనరాని వత్సలత్వం' ఉంది. ఆ ప్రభువు పట్ట ఆయనకు కూడా చెప్పలేనంత భక్తి విశ్వాసాలున్నాయి. రఘునాథుని కొలువులో తప్ప యింకెవరి సేవలోనూ ఉండకూడదని వెంకటరాజుగారు దీక్ష పూనారు. తాము వ్రాసిన కావ్యాలు మరెవ్వరికీ అంకితం ఇవ్వకూడదని ప్రతిజ్ఞ పట్టారు. “పలికిన ప్రతిజ్ఞ చెల్లింపవలదెయిట్లు వాజ్నియమరూడి నీ యంతవాడీకేడి?' అని రఘునాథనాయకుడే మెచ్చుకొన్నాడు (విజ. పీఠిక 48). భక్తీవిశ్వాసాలతో తనను సేవించుకొంటున్నాడన్న ఆశ్రితపక్షపాతంతో కాక 'వెలితిపడని' కవిత్వం చెప్పగలవాడన్న నమ్మకంతోనే రఘునాథుడు చేమకూర వెంకటరాజుగారిని మెచ్చుకొన్నాడు.

అనితరసాధ్యమైన మార్గంలో పయనించే ఈ హ్రైక కవిని రఘునాథుడు గొప్పగా మెచ్చుకొని ఘనంగా సత్కరించాడు. మంజుల పదార్శాలూ, భూషణాంబరాలూ, ఏనుగులూ, గుర్రాలూ మొదలైన వాహనాలూ యిచ్చి అసాధారణంగా రఘునాథుడు మన్నన చేసినట్టు వెంకటరాజుగారే చెప్పుకొన్నారు (విజయపీలిక 52). ఈ సన్మానాలన్నీ ఒక ఎత్తు, రఘునాథుడు సౌంతచేతులతో ఇచ్చిన ముత్యాల కడియం మరొక ఎత్తు. సకలకళాప్రవీణుడైన ఆ రాజు యిచ్చిన హస్తముక్తాకటకం సగర్వంగా ధరించి చేమకూర వెంకటరాజుగారు నిజంగా అందెవేసిన చెయ్యి అయ్యారు.

రఘునాథుని మెప్పుపొందడం సామాన్యం కాదు. అతడు రసపుష్టితో అలరారు రచనలు చేయగల జాణ. ఈ సంగతి వెంకటరాజుగారు ఇలా చెప్పారు:

548 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ నంపుటీ తారసపుష్టిమై ప్రతిపదంబున జూతియు వార్తయుక౯్‌ జమ త్కారము నర్ధగౌరవము గల్లు ననేకకృ్ళతుల్‌ ప్రసన్నగం ఫీరగతిన్‌ రచించి మహిమించినచో నికశక్తులెవ్వర య్యా! రఘునాథభూపరసికాగ్రణికి౯ జెవిసోక జెప్పగాన్‌? (నిజ పీఠిక 31) ఈ పద్యంలో చెప్పిన శుభలక్షణాలన్నీ చేమకూరవారి కావ్యంలో తూడా ఉన్నాయి. ఒకరకంగా చూస్తే మంచి కవిత్వానికి ఈ పద్యంలో వెంకటరాజుగారు నిర్వచనం చెప్పారు. రసపుష్టితోపాటు ప్రతిపదంలో జాతి, వార్త, చమత్కారం; అర్థగౌరవం ఉండాలి. కావ్యం ప్రసన్నగంభీరంగా ఉండాలి. ఈ లక్షణాల గురించి కొంత ముచ్చటించుదాం. జాతివార్తా చమత్కారాలనే మాటలకు అర్థాలేమిటో తెలుసుకొందాం. చేమతూరవారి పుస్తకాలకు పేరుమోసిన పండితులు టీకలు వ్రాశారు. జాతి అనే మాటకు స్వభావం అని వేదం వెంకటరాయశాస్త్రిగారు అర్ధం చెప్పారు. బులుసు వెంకటరమణయ్యగారు తమ ముకురటీకలో జాతి అంటే స్వభావోక్తి అన్నారు. నాయకరాజుల యుగంలో జాతి అంటే హానెష్టిక్సీ అని అర్థం. జాతి చెప్పి నవ్వించడం అప్పుడు పరిపాటి. సవరం చిననారాయణ తన కువలయాశ్వచరిత్రలో మదాలస మదనవేదన వర్ణించే ఘట్టంలో ఈ పద్యం బ్రాశాడు: మనవులు విన్నవించిన వినునోయంచు జేరుకన్నియమిన్న చిన్నబోవ నవబంతి కానుకిచ్చిన జూచునో యంచు వచ్చునెచ్చెలి తలవంచుకొనగ నెనరుతో హెచ్చరించిన బల్కునోయంచు గదియుపైదలిసిగ్గుగాంచి యొదుగ గనిపించి జాతిచెప్పిన నవ్వునో యంచు నరుదెంచు నలినాక్షి యివలికరుగ వినకచూడక పలుకక వేదనాప్తి నవ్వకాపద్మనయన కాంతవశరాగ్న్ని తప్పకిసలయ ముక్తనూతన పునఃప్ర వాళకృతశయ్య బొరలాడు వేళయందు (కువల. 4-4) ఈ పద్యంవల్ల ఆనాటి “జాతికి ఈనాటి “జోక్‌ అని అర్థం చెప్పవచ్చు. కవిత్వంలో నవ్వించే గుణాలుండాలని జాతి అనే మాటతో చేమకూర వెంకటరాబజుగారు భావించారని నికరంగా నిర్ణయించవచ్చును. ఇక “వార్త” అంటే ఆయన ఉద్దేశంలో సామెత అని అర్థం. విజయవిలాసంలోని అర్జునుడు సౌభద్రతీర్గానికి. వస్తాడు. అక్కడ అయిదు వచ్చిన వాళ్ళెవరూ తీర్థమాడరు. అర్జునుడు మడుగులో దిగబోతే అక్కడీవాళ్ళు వారించారు. ఈ విషయం వెంకటరాజుగారిలా చెప్పారు: మోక్షమునకు బోవ మొసలెత్తుకొనిపోయె- ననెడు వార్త నిత్కమగు నటంచు గుంకవెరతు రెవ్వరు మీరలటుపోకు- డనిన నవ్వుకొనుచు నర్జునుండు. (విజ 2-ట) 2. విజయవిలాసం-సవ్యాఖ్యానం, వేదం వారి ప్రచురణ 1911, పుట 14. 3 విజయవిలాసం-వావిళ్ల ప్రచురణ (1902) పుట 2.

చేమకూర వెంకటకవి ర్‌49 ఈ పద్యంలో “మోక్షానికి పోతీ మొసలి ఎత్తుకు పోయిం'దనే సామెతను వాడుతూ దానిని వార్త అని వెంకటరాజుగారు అన్నారు. రసపుష్టిగల కావ్యంలో జాతితోపాటు వార్త ఉండాలనడంలో వారి ఉద్దేశ్యం సముచితమైన సామెతలు వాడడమే అనవచ్చును. అయితే వార్త అంటే వృత్తి అని వ్యాఖ్యాతలు వేరే అర్థం చెప్పున్నారు.! ఇక చమత్కారమంటే ఏమిటో చూద్దాం. ఈపదానికి విస్మయం, నేర్చు అనే రెండు అర్ధాలు నిఘంటువుల్లో కనబడుతాయి. బహుశా ఈ రెండూ వెంకటరాజుగారు నిర్జీశించి ఉంటారు. వారి దృష్టిలో నేర్చు అంటే శ్లేష అని చెప్పాలి. సొభద్రతీర్ధంలోని మొసళ్ళు నిజంగా శాపగ్రస్తలైన అప్సరసలు. ఈ శాపానికి ముందు వాళ్ళయిదుగురూ ఒకతోటలో విహరిస్తూ ఆ వనాన్ని ఇలా మెచ్చుకొన్నారు:

విహరించుక్‌ మలయానిలం విచట దావింజిల్కి నెమ్మేనియా

విహరించు! వికనాదముల్‌ చెవికి గావించుక జవుల్‌.... పోదమా

సహకారాళిపదంబు జూడగ వయస్యా హాళివాటిల్లెడున్‌

సహకారాళిపదంబు జూడగ వయస్యా హాళియౌనే కదా! (విజ. 2-53) ఈపద్యంలో కొన్ని చమత్కారాలున్నాయి. ఆ తోటలో విహరించే మలయానిలుడు తావిచిల్కి ఒంటిమీది అని హరిస్తాడు అని ఒక అహ్సరస అంది. తావింజిల్కి అనే మాటను “తాన్‌+'విన్‌+చిల్కి' అని విరిస్తే తాను “వి అనే అక్షరాన్ని త్యజించుకొని - అని అర్థం వస్తుంది. అప్పుడు “విహరిస్తున్న మలయానిలుడు' హరిస్తున్న మలయానిలుడు' అవుతాడు. ఒక అప్సరస ఇలా చమత్కరిస్తే ఇంకొళకామె మరో మాట నేర్చు చూపింది. “తియ్యమామిడితోపు చూడాలని మనసొతోంది' అనే అర్థంలో 'సహకారాళిపదంబు చూడగ వయస్యా హాళి వాటిల్లెడునో అని ఒక చెలి అంది సహకారం అంటే తియ్యమామిడీ; హాళి అంటే అసక్తి. అళ€ి అంటే నానార్గాలున్నాయి. కాని ఇక్కడ సమూహం అని అర్ధం. హాళి, సహకారాళి అనే పదాలను తన చెలికత్తె వాడికే ఆమెకన్నా రెండాకులెక్కువ చదివిన అప్సరస 'హ కారంతో తూడుకొన్న అళివల్లర హాళి అనే మాట వాటిల్లుతుందని “-సహకారాళి పదంబు చూడగ వయస్యా హాళియౌనేకదా!' అంది. ఈపద్యంలో ,ఇతరేతర చమత్కారోక్తి నిగుంభన ఉందని తరువాతి పద్యంలో వెంకటరాజుగారే అన్నారు. అబ్బురమైన కొత్త విరుపులకు ఆస్కారముండే రచనే ఆయన

నవ్వు పుట్టించే జాతి, నలుగురికీ తెలిసి నానుడిలాంటి వార్త, నవ్యార్థాల చమతక్కారాల ఉన్న కావ్యంలో నిజానికి పాల్గ్లుమాటలు ఉండకూడదు. ప్రతిపదం సముచితంగా ఉండాలి. దానినే అర్థగౌరవం అన్నారు. ఈ లక్షణాలున్న కావ్యాలు తెలుగులో లేకపోలేదు. శ్లేషకతు పట్టంకట్టిన రామరాజభూషణుని వసుచరిత్రలోని ప్రతిపద్యం చమక్కారాల పుట్ట. అయితే ఆ కావ్యం చదివీచదవగానే ఏపుట్టలో ఏ పాముందో తెలియదు. శ్లేషప్రధానమైన కావ్యాలు గంభీరంగా ఉండకతప్పదు. గంఖీరమంటే లోతని అర్ధం. 'దిగకేగాని లోతు తెలియ'దని సామెత. అయితే గట్టుమీద 5. వేదంవారి విజయవిలాసం - పుట 14; బులుసువారి టీక, పుట ౫.

550 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నిలబడితే లోతు తెలియాలని వెంకటరాజుగారి అభిమతం. అందుకే కావ్యంలో “ప్రసన్నగంఖీరత' ఉండాలని ఆయన చెప్పారు.

ఈ _సద్గుణాలన్నింటితో కావ్యం నినదించాలన్న ఆశయం చేమకూర వెంకటరాజుగారికి తొలినుంచి ఉంది. విజయవిలాసం వ్రాయడానికి ముందు ఆయన సారంగధర చరిత్రను కూడా మూడాశ్వాసాల కావ్యంగా వ్రాశారు. అయితే దానిని అంకితమివ్వలేదు. అవతారిక వ్రాయలేదు. ఇవాళ సారంగధర చరిత్రలోని కథ అందరికీ తెలిసినదే. నాయకరాజుల యుగంలో కూడా అది ప్రచారం పొందిందిగాని మన రాజమండ్రీని పాలించిన రాజరాజనరేంద్రునికీ, ఈ కథకూ ఆనాడు సంబంధం లేదు. ఇది మాళవదేశంలో జరిగింది. సారంగధర కథను మొట్టమొదట తెలుగు సాహిత్యంలో కథనం చేసినవాడు గౌరన. అతని నవనాథచరిత్రలోని చౌరంగి వృత్తాంతమే ఈ కథ. గౌరన వ్రాసిన ద్విపద కావ్యాన్ని చదివాడో లేదోగాని దోనేరు కోనేరునాథుడు సారంగధర కథను తెచ్చి తెలుగుదేశానికి ముడిపెట్టాడు. చేమకూరవారు మాత్రం అది మాళవదేశంలో జరిగినదేనని చెప్పారు. ఆ దేశంలో ఒక రాజమహేంద్రవరం కట్టారు.

మహిని రాజనరేంద్రుడు మాళవపతి - రాజరాజనరేంద్రుండు రాజరాజు

ననగబేరెన్నికకునెక్కి యతిశయిల్లు - నింద్రవిభవుండు రాజమహేంద్రవిభుడు.

(సారంగ 1-5) ఈ పద్యంవల్ల మాళవపతి రాజమహేంద్రవిభుడని తెలుస్తోంది. ఈ సమాసాన్ని రాజమహేంద్రుడనే విభుడు అని సంభావనాపూర్వపదకర్మధారయం కింద జమకట్టుకొనవచ్చును గాని రాజమహేంద్రం యొక్క విభుడు అనే షప్టీతత్పురుషాన్నే చేమకూరవారు ఉద్దేశించారని భావించాలి. ఎందుకంటే ఈ కావ్యంలోనే సారంగధరునిపై చిత్రాంగి నేరారోపణ చేశాక రాజనరేంద్రుడు అమె మేడనుంచి బయటకు వే సందర్పంలో 'అచ్చోటు వాసి, మాటవాసిగల రాజమహేంద్రవాసి' అని అనుప్రాసాన్ని వాడారు (2-238). దానివల్ల రాజమహేంద్రం చేమకూరవారి దృష్టిలో ఒక ఊరనేది తేలుతోంది. గౌరనమాత్రం మాళవదేశంలోని మాంధాతపురమే రాజమహేంద్రని రాజధాని అని చెప్పాడు. ఏవో ఇలాంటి చిన్నచిన్న పేర్లలో మార్పులు చేశారేగాని వెంకటరాజుగారు. నవనాథ చరిత్రలోని కథలో ఏం మార్పులు తెచ్చిపెట్టలేదు. చేమకూరవారి తరువాత సారంగధర వ్రాసిన ప్రతి ఒక్కరూ ఈ కథ ఆంధ్రదేశంలోనే జరిగినట్టు చెప్పారు. తెలుగు సాహిత్యంలో సారంగధరుని ప్రసక్తికల రచనల వివరాలు ఇవిః

(1) గౌరన తన నవనాథ చరిత్రలో సారంగధరుని కథ పూర్తిగా చెప్పాడు.

(౫ దోనేరు కోనేరునాథుడు బాలభాగవతం అనే ద్విపదకావ్యంలో చిట్టవివర చంద్రవంశపురాజుల జానితా ఇస్తూ వేంగీదేశంలోని రాజరాజనరేంద్రుని కుమారునిగా సారంగధరుణ్జి పేర్కొన్నాడు. సవతితల్లివల్ల కాళ్ళూ చేతులూ పోగొట్టుకున్నట్లు చెప్పాడు.

చేమకూర వెంకటకవి 551

(3) భాస్కర శతకకర్త 'అంగననమ్మ రాదు" అనే పద్యంలో పేర్కొన్నాడు.

(4) చేమకూర వెంకటరాజుగారు చిన్న మార్పులతో గౌరన చెప్పిన కథనే చెప్పారు.

(5) అప్పకవి తన లక్షణ గ్రంథంలోని అవతారికలో సారంగధరునికి నన్నయగారి విష్యరికం కటాక్షించారు.

(69 బాణాల శంభుదాసు సారంగధర చరిత్ర అనే ద్విపదకావ్యంలో ఒక వరం ప్రసాదించి చేమకూరవారి రాజమహేంద్రాన్ని రాజమహేంద్రవరం చేశాడు.

(7) తూచిమంచి తిమ్మకవి సారంగధర చరిత్ర అనే ద్విపదకావ్యం వ్రాసి చిత్రాంగిని రాజకుమూర్తెను చేశాడు. సారంగధరుని కోసం వెతికిన పెండ్లికుమూర్తెలలో చిత్రాంగిని కలిపాడు. నేడు ప్రసిద్ధమైన కథ తిమ్మకవిగారి ద్వాపదలోనే సాక్షాత్కరిస్తుంది.

ఈ ఏడుగురు ప్రాచీనులు కాక అర్వాచీనులు చాలామంది ఈ కథను వివిధ ప్రక్రియాఖేదాలతో వ్రాశారు. వాటి వివరాలివి:

  1. యక్షగానాలు: (1) సిరిప్రగడ సుబ్బారాయుడు (1700-1750) (2) కోదండరామ కవి (3) వారాల కృష్ణయ్య (31౪౫6 ప్రచురణ) (4) ముషీరాబాద్‌ ప్రచురణ (1951 ప్రతి) (5) సిద్ధనగౌడు (ఎన్‌.వి. గోపాల్‌ ప్రచురణ)

  2. _ నాటకాలు; (1) ధర్మవరం కృష్ణమాచార్యులు (2) పానుగంటి లక్ష్మీనరసింహారావు (3) కాకరపర్తి నృసింహం (4) శ్రీపాద సుబమణ్యుశాస్త్రి (రాజరాజు అను పేర)

  3. వచన కావ్యాలు: (1) సముఖం వెంకటకృష్ణప్ప నాయకుడు

  4. గేయాలు: (1) కుప్పుస్వామి ముదలియారు ఈ కథ ఇంత సుప్రసిద్ధమైనా దానిని మొట్టమొదట పద్యకావ్యంగా వ్రాసిన

చేమకూరవారి. ప్రబంధం మాత్రం తగినంత ప్రచారం పొందలేదని చెప్పాలి.

విజయవిలాసంలోని సౌగసులన్నీ మొదట ఈ కావ్యంలోనే మొలక ఎత్తాయి. సామెతల మీద చమత్కరించడం చేమతూరవారికి సరదా. బిడ్డడులేని రాజమహేంద్రుడు సంతానం కోసం వివుణ్ణి ఆరాధిస్తాడు. అతడు పెట్టిన నైవేద్యాలు ఆరగించిన దేవుడు భక్తుణ్ణి మెచ్చుకొన్నాడు. అప్పుడు పార్వతి “సారెకు గుత్తుక విషము, నాలుక బెల్లము వెట్టి యాడుటల్‌ మేరలటయ్య సామి” యని “'మేలము' లాడిందట (సారంగ. 1-23). లోకానికి సామెత అయినా శ్రీరంళుని విషయంలో ఇది సార్ధకమే. పార్వతి చమత్కారం ఇక్కడ తోకకు రావడం అనేదిలా వాడారు.

సకలము కాలకూటసహజన్మిసుధాకర దండ్రు నిక్కమౌ

. నొకొ యిది యంచు నో సితమయూఖ నినుం దెలియంగ గోరి యూ రక యిటు చేరినంత దలప్రాణముదోకకువచ్చె లెక్కసే యక దిగమింగెనేని యకటా యిలరాహువుమన్కి గాంచునే? (సారంగ 2-175)

552 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇది చిత్రాంగిని ఎడబాసి వేటకు వెళ్ళిన రాజరాజు చేసే చంద్రదూషణ ఘట్టంలోనిది చంద్రుడు కాలకూటం తోడబుట్టిన వాడన్న సంగతి నిజమో కాదో తేల్చుకోవాలని సర్పరూపమైన రాహువు కొద్దిగా దగ్గరకు చేరగానే ప్రాణం తోకకు వచ్చిందట. అందుకే దిగమింగక వదలి వేసిందట. సామెతలపై చమత్కరించడం సారంగధర చరిత్రలో ఒకసారి, రెండుసార్లు కాదు - కొన్ని డజనుసార్లు చేమకూరవారు చేశారు. తొలి కావ్యంలో వారు వాడిన సామెతలు, జాతీయాలు, పలుకుబళ్లు మొదలైనవాటి పట్టిక వేస్తే రమారమి నూరుదాకా డేలుతున్నాయి. అయితీ ఇలా సామెతలు లెక్కపెట్టిచూస్తే చాలదు. వాటిని వాడడంలో వెంకటరాజుగారు చూపించిన ప్రజ్ఞను గమనించాలి. సామెతల ఆమెతలేకాక మాటల విరుపులు కూడా ఈ సారంగధర చరిత్రనిండా ఉన్నాయి. తన మేడమీదికి వచ్చిన సారంగధరుణ్ణి చిత్రాంగి పడకగదిలోనికి తీసుకువెళ్ళి బొమ్మలు చూపెట్టసాగింది. అప్పుడు వాళ్ళ సంభాషణలను వెంకటరాజుగారిలా నడీపించారు. అల్లన గాధిరాజసుతుడర్మిలి మేనక ముందొనర్చ్ప రా గిల్లి కుచంబులాన దమకించుట గంటివె రాకుమవూర యౌ నల్ల నగాధిరాజసుతుడర్మిలి మేనక ముందొనర్చ రా గిల్లికుచంబులాన దమకించుట బాల్యముగాదె మానినీ, (సారం. 2-79) గాధిరాజసుతుడైన _ విశ్వామిత్రుడు మేనకప్రియుడు. నగాధిరాజసుతుడైన మైనాకుడు ఆమె కుమారుడు. చిత్రాంగి మునినీ, సారంగధరుడు విడ్డనూ ఉద్దేశించారు. అతడు “ఆ కామిని యనువాక్యము లెల్ల వేరె యర్థముగా నేర్పున విరిచి మాటలాడా'డని చేమకూరవారు. చెప్పారు (సారంగ. 2-82). ఇటువంటి నేర్చు విరుపులేకాక వెంకటరాజుగారికి వెన్నతోపెట్టిన యమకాలూ, అనుప్రాసలూ నల్లేరుమీద బండీలాగా సారంగధర చరిత్రలో సాగుతాయి. అయితే ' అన్నీ ఉన్నాయి. అయిదోతనమే తక్కువ' అని ఈ కావ్యంలో పెద్ద లోపం ఒకటి ఉంది. ఇది స్వతంత్ర కావ్యం కాదు. గౌరన నవనాథచరిత్రను యథాతథంగా వెంకటరాజుగారు పద్యరూపంలో వ్రాశారు. అతడు వాడిన మాటలే వాడారు. అతడు చెప్పిన భావాలే చెప్పారు. అతడు చూపిన సామ్యాలే చూపారు. గౌరనగారి రాజు పాదరసంలాంటి గుర్రాన్నెక్కితే, వెంకటరాజుగారి రావా తూడా పాదరసంలాంటి గుర్రానస్నే ఎక్కుతాడు. గౌరనగారి పావురం జగవిరుదువేసి పించినదైతే వెంకటరాజుగారిదీ అంతే. గౌరనగారి చిత్రాంగి 'ఛాయలపిడి' బాకు చూస్తే వెంకటరాజుగారి చిత్రాంగీ అంతే -చేస్తుంది. రెండు కావ్యాలనూ శ్రద్ధగా వైపారు వేసినవాళ్ళకు వందలాది పోలికలు కనబడతాయి. గౌరనకు అచ్చంగా అనుసరణమైన సారంగధర చరిత్రను సమకాలంవారు మెచ్చుకోకపోయేసరికి వెంకటరాజుగారు నిరుత్సాహపడలేదు. స్వాకపోల కల్పితమైన కావ్యాన్ని బ్రాయాలని కంకణం కట్టుకొన్నారు. ఇంతటి ప్రతిభావంతుణ్ణీ ఆ స్థాయిలోవాళ్లే అర్థం చేసుకోగలరు. వెంకటరాజుగారు అకుంఠిత రాజభక్తి పరాయణులు. భక్తివిశ్వాసములు ఆయన సొమ్ములు. అయితే సారంగధర చరిత్రలో రాజులను నిందించే సామెతలుగాని, అర్భాంతరన్యాసాలుగాని పన్నెండు ఉన్నాయి. చూడండి.

చేమకూర వెంకటకవి 553

  1. రాజుల చిత్తము ల్టెలియరా దెటుపోయెటు వచ్చునో కదా (2-7) 2, _రాజునకుందమ్ములమీద కాంక్షలవి యెచ్చోబుట్టగా నేర్చునో (2-273) ౩. తోపమే చూతురుగాని విడ్డడని చూడరుగా ధరణీతలాధిపుల్‌ (3-22)
  2. _మనుజాధీశుడు నట్ల సేయదగునే మందుల్లదా భూపతుల్‌ (3-30)
  3. ధరణీపతి ననుట వెళ్టితనము (ఓ ఏ యెడ గోపగించి ధరణీశుడు గొల్చినవారి నేక్రీియం జేయుడటన్న గాదనక చేయవలెం గద (3-37)
  4. _ చెవులె కన్నులు రాజులకుం దలంపగన్‌ (3-52)
  5. రాజ్యాంతే నరకం ధ్రువం (3-65)
  6. వెదుళ్ల పందిరియు రాజుల మాటలు చిక్కనౌ గదా (3-72)
  7. ఎంత కఠినాత్ముల్‌ రాజులూహింపగన్‌ (3-75)
  8. రాజు మొత్తగా నలమొగసాలకున్మాజ (3-80)
  9. దొరల చిత్తంబు లీకరణ బాటిల్లు (3-121) ఛాయాచోరుడనే నిందతోపాటు స్వామిభక్తి లేనివాడనే వాదుతూడా ఈ సామెతల వల్ల వెంకటరాజుగారిపై ఆనాటి అసూయాగ్రస్తులు పడవేసి ఉంటారు. రాజుతో కొండేలు చెప్పి ఉంటారు. అయితే రఘునాథుడు వేయి తప్పులున్నా మన్నిస్తాడు. నమ్మినవారిపట్ల మాట దెల్లిస్తాడు. “ఒకొండొరుమీద కొండెముల్‌ నెప్పిన వానికై మనవి చెప్పిన రీతిగ' ఎంచుతాడు (విజయ. పీఠిక 26). సారంగధర రచనలో నిజానికి చేమకూరవారి జారుపాట్లు లేకపోలేదు. కాని ఆయనలో ఉన్న మంచినే రఘునాథుడు మెచ్చుకొన్నాడు. ఈ సంగతినే విజయవిలాసంలోని ఒక అర్భాంతరన్యాసంలో "జౌ, నెయ్యెడ మేలె జూతురు, బ్రహింపరు జాణలు జారుపాటులన్‌ (1-107) అని వెంకటరాజుగారు చెప్పారు. మేలు చూశాడు కనుకనే రఘునాథుడు చేమకూరవారికీ 'బహుళసన్మానం' చేశాడు. (పీఠిక 30). తన కృతజ్ఞత చెప్పుకోడానికి వెంకటరాజుగారు విజయవిలాసం కృతిగా ఇచ్చారు. “సభల గణింప మన్నన యొనర్చ' ప్రబంధాన్ని సూడిద చేశారు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. విజయవిలాసాన్ని గణీంచని సభ లేదు; మన్నన చేయనివాడంటూ కనబడడు. అది విలక్షణమైన కావ్యం. అడుగడుగునా కవి ప్రతిభ చల్లగాలిలాగా వీస్తుంది. ఇతర ప్రబంధకవులలాగే లాక్షణికుల శాసనాలకు లోబడి రచించినా, ఇందులో కవి నిరంకుశుడనే సత్యం కనబడుతుంది. నిజానికీ కావ్యప్రణాళికనుగాని, కవిసమయాలనుగాని చూస్తే విజయవిలాసం అన్ని ప్రబంధాల ఉపాలంభనలు, వివాహం, పుత్రోదయం మొదలైన పడికట్టు సన్నివేశాలన్నీ ఇందులోనూ కనబడుతుంది.

554 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మన కవులు స్త్రీలను వర్జించేటప్పుడు అతివ, ఇంతి, పొలతి, రమణి అని ఎన్నో పర్యాయ పదాలు వాడుతారు. విజయవిలాసంలోని 3 ఆశ్వాసాలలో మొత్తం 683 గద్యపద్యాలున్నాయి. వీటిలో ౩75 సార్లు ఈ పర్యాయ పదాలను వెంకటరాజుగారు వాడారు. ఆయన ఉపయోగించిన పదాలు 174. అవి ఆయన ప్రయోగించినప్పుడు అతికినట్టు ఉంటాయి. విజయవిలాసంలోని మొత్తంమీద 71 పద్యాలు నాయికానాయకుల వర్హన. అన్నిటిలోనూ పాత కవిసమయాలనే వాడారు. అయిడే చేసిన వర్ణన మళ్లా చేయనట్టు స్ఫురించేవిధంగా రచించబట్టి ప్రతి పద్యం కొత్తగానే ఉంటుంది. స్త్రీల వక్షోజాలను కొండలతోనూ, నూగారును పాముతోను, కురులను మేఘాలతోనూ సరిపోల్చిడం సనాతన కవిసమయమే. ఈ పోలికలతోనే పద్యం బ్రాస్తూ వెంకటరాజుగారు ఎంత చమత్కరించారో చూడండి. అర్జునునితో గదుడు సుభద్రను గురించి ఇలా చెప్పాడు: అతివకుచంబులు న్మెణుగుటారును దేవలియున్‌ ధరాధిపో న్నతియు నహీనభూతికలసంబు ఘనాభ్యుదయంబు నిప్పుడొం దితిమని మాటిమాటికిని నిక్కెడు నీల్లెడు విల్డవీగెడున్‌ క్షీతినటుగాదె యొక్కొ.కరికి న్నడుమంత్రపు గల్మి కల్గినక? (విజయ. 1-34) ఆడవాళ్ళకు కుచకచాలు, మెరుగుటారు మధ్యలో వచ్చేవే. నడమంత్రపుసిరి వస్తే ఎవైనా నిక్కుతూ నీల్లుతూ విర్రవీగుతారు. కుచాలు నిక్కడం, నూగారు నీల్లడం, కొప్పు విర్రవీగడం చాలా అందంగా ఉంటాయి. సముచితమైన చోట చక్కగా అతికేటట్టు జాతీయాలను, కవిసమయాలను జోడిస్తేనే ఆహ్లాదం కల్గుతుంది. చూడండి. పురవర్దన చేస్తున్నప్పుడు ఆ ఊళ్ళో ఆకాశాన్నందుకొనే సౌధాలున్నాయని చెప్పడం పరిపాటే. ఒకానొక ఊళ్ళోని మేడలమీద ఆడుకొనే ఆడపిల్లలకు చంద్రుడు అడ్డమొస్తాడని, ఆ చంద్రునిలోని మచ్చకు ఏవోపేర్లు పెడతారని చిమ్మపూడి అమరేశ్చరుడు తన కావ్యంలో వ్రాశాడు. వెంకటరాజుగారు కూడా ఇంద్రప్రస్థంలోని మేడలమీద ఆడపిల్లలచేత ఆటలాడించారు. చంద్రుణ్ణి అడ్డంగా ప్రవేశపెట్టారు. ఈ సద్యం చూడండి _.... రేలమృకతాంశులో శకము రెమ్ముదమంచు దలంచి జాళువా మేలి పసిండిసోయగపు మేడల గుజ్జెనగూళ్ళ సందడీ౯ బాలికలుండి యావల జనంగని చింతిలి 'వంటయింటి కుం దే'లిది యెందు పోగలదు నేటికినేమని యుందురందులన్‌ (విజయ. 1-6) అమరేశ్చరుని పద్యంలో లేని సౌగసులు కొన్ని ఈ పద్యంలో ఉన్నాయి. ఇద్దరి పద్యాలలో మేడమీద ఆడపిల్లలు ఆడుకొంటారు. చంద్రులోని చెవులపిల్లిని చూస్తారు. అయితే చేమకూరవారి ఆడపిల్లలు దాన్ని వంటయింటీ తుందేలంటారు. ఈ సామెత వాడినందువల్ల పద్యానికి అందం వచ్చింది. నిజమే. అయితే మేడ వంటిల్లు ఎలా అయింది? ఈ సందేహం వచ్చినవాళ్లకు సమాధానంగా వెంకటరాజుగారు ఆ ఆడపిల్లలచేత మేడమీద గుజ్జనగూళ్ళు వండించారు. అందుచేత అది వంటిల్లే అవుతుంది. సామెత చక్కగా అతుకుతుంది. 6. పద్మనాయక యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటం, 2002

చేమతూర వెంకటకవి 555

ఏ పద్యంలో జాతి వాడాలి, ఏ ఘట్టంలో వార్త చెప్పాలి; ఎక్కడ చమత్కరించా లన్నది వెంకటరాజుగార్‌కే తెలుసు. జాతివార్హలతో అర్భాలంకారాలు, అక్కరలేనిచోట ఉలూచి చూచింది. ఈ సంగతి కథనం చేయడానికి అర్ధాలంకారం అక్కరలేదు. అందుచేత “...కలకలన్‌ నగుచుండెడి సవ్యసాచి నింబ్రోపలరోచిజూచి తలయూచి యులూచి రసోచితంబుగన్‌ో' అని అనుప్రాసం వాడుతారు (1-6). కథాకథనంలోనేకాక పాత్రల సంభాషణలో తూడా సాధారణ ప్రశ్నలు వేయించేటప్పుడు తూడా అనుప్రాసాన్నే వెంకటరాజుగారు ఉపయోగిస్తారు. మాయా ముని వేషం వేసుకొని అర్జునుడు ద్వారకలో తూర్చున్నాడు. ఆయన తీర్థయాత్రలు చేశాడని సుభద్రకు తెలుసు. ఈ ముని తన మేనత్త కొడుకును ఎక్కడైనా చూశాడా అని అడగాలి. కొన్ని ప్రశ్నలు వేశాక ““మీరందందు నరుగ నరు గా నరుగా?”' అని సుభద్రచేత వెంకటరాజుగారు అడిగిస్తారు (విజయ. 2-165).

శబ్దాలంకారాలలో అనుప్రాస తరువాత వెంకటరాజుగారు తరుచుగా వాడేది యమకం. కథాకథనంలో, పాత్రల సంభాషణలో, వర్ణనలలో ఇది సాక్షాత్కరిస్తుంది. సుభద్ర అందాన్ని తలచుకొంటున్న అర్జునుడు ఇలా అనుకొంటున్నాడ్రు.

అర చందమామ నేలిన - దొరగా నెన్నుదురు నెన్నుదురు బిత్తరికిన్‌

బరువంపు మొల్లమొగ్గల-దొరగా బల్కుదురు బల్కుదురు జవ్వనికిన్‌

(విజయ. 2-78)

సుభద్ర నెన్నెదురు అర్ధచంద్రాకారాన్ని ఏలుతుందని ఎంచుతారు. ఆమె పళ్ళవరుస మొల్లమొగ్గలను పాలించుతుందని పల్కుతారు. ఈ అర్భాన్ని “నెన్నుదురు నెన్నుదురు”, “పల్కుదురు పల్కుదురు” అనే యమకంతో చక్కగా చెప్పాడు. పాత కవిసమయాలనే తీసుకొన్నా చెప్పడంలో కొత్తదనం ఉంది. విజయవిలాసంలో వెంకటరాజుగారు 50 పద్యాలలో స్త్రీ వర్ణన, 21 పద్యాలలో పురుష వర్ణన చేశారు. ఇతర ప్రబంధకవులు చేసినట్టే అంగాంగ వర్ణన చేశారు గాని అన్నీ ఒక్కసారే, ఒకే ఘట్టంలో చేయలేదు. మొట్టమొదట ఇంద్రప్రస్థానికి వచ్చి గదుడు సుభద్ర అందాన్ని అర్జునుని ముందు వర్ణిస్తాడు. 9 పద్యాలు అయ్యాక -

ఎక్కడ బెప్పినాడ దరశేక్షణ చక్కదనంబు? లింకన

మ్మక్క! యదేమనంగ నిపుడందు శతాంశము దెల్చలేదు నే

నొక్కొక యంగ మెంచవలయుం బదివేల ముఖంబు లాయెబో

చొక్కొపు జూపులో సౌలపు జూచినగాక యెరుంగవచ్చునేః (విజయ. 1-41) అని శతాంశం చెప్పలేదంటాడు. ఈ పద్యం బ్రాశాక ఈ ఘట్టంలో స్త్రీ వర్ణన చేమకూరవారు ఆపుచేసి కథలోనికి వెళ్ళారు. మరే ఇతర కవైనా అగి 'పదివేల ముఖంబుల నొక్కొక్క యంగం' ఎంచేవాడు. తన సరదాకోసం పాఠకుణ్ణీ విసిగించగలడు. వెంకటరాజుగారు ఈ పారపాటు చేయరు. కథాకథనంలో ““టెంపో'' చెడగొట్టరు. ఈ శిల్చ

556 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి రహస్యం వారికి బాగా అలవడ్డది. ఈ విద్యలో వెంకటరాజుగారు ఇతరులను తోసిరాజంటారు. విజయవిలాసంలో 'తోసిరాజు, “తెరచిరాజుూ అనే చదరంగ పరిభాషను వాడారు. గదుడు సుభద్రను వర్టించడంలో “కలికి ముఖారవింద మలకల్వలరాయని తోసిరాజనున్‌ అంటాడు (1-37). చంద్రుని గెలిచేటంత అందమైన ముఖం ఆమెది. చంద్రుణ్ణి 'రాజు అంటారు. అందుచేత 'తోసిరాజు' అనే ప్రయోగం ఇక్కడ రక్తికడుతుంది. సుభద్ర పెదవులు అమృతం చిందుతాయి. ఆమె చూపులు కలువలను, చకోరాలను ఏలుకొంటాయి. ముఖం కమలాల కళలు గ్రహిస్తుంది. ఇవి చంద్రుని లక్షణాలు. కాబట్టి ఆమె ముఖవింబం చంద్రవింబమే. అయితే పెళ్ళిలో వధూవరుల మధ్య తెర ఉంది. దానిని తొలగిస్తే అమృత మొలుకు నధరంబున - గుముదచకోరముల నేలుకొను శుభదృష్టిక గమలముల కళలు పైకొను - రమణీ మణీ ముఖము దెరచి రాజనవలయున్‌. . (విజయ. 3౩-114) తెరచి చూస్తి తరచి చూస్తి దొరికే సౌగసులెన్నో విజయవిలాసం నిండా ఉన్నాయి. సమర్శులు వ్యాఖ్యానిస్తే విజయవిలాసం ఎంతో అఆహ్హాదమిస్తుంది. చేమకూరవారి రెండు కావ్యాలను వేదం వెంకటరాయశాస్త్రిగారు తొలిసారి టీకావ్యాఖ్యానాలతో ప్రచురించారు. “ఈ చేమకూర చక్కెరమడిలో అమృతము పారించి పెంచినదిగాని మట్టిలో నీరుపారించి పెంచినది కాదు. ఇందు పూ మొగ్గలు పోలెతామే విడు శ్లేషలును, ద్రాక్షాపాకంబున నోరూర రసమొల్కు రచనలును” ఉన్నాయని మెచ్చుకొన్నారు.” వేదంవారి పరిష్కరణలో లోపాలున్నాయని, వ్యాఖ్యానంలో సౌగసులు లేవని భావించి విజయవిలాసంలోని అసలైన అందచందాలను వూరూరా తిరిగి తాపీ ధర్మారావుగారు ప్రదర్శించారు. విజయవిలాస వ్యాఖ్యాన విధానం ఎలా ఉండాలో చెప్తూ వ్యాసపరంపర బ్రాశారుగీ ఆహా అనిపించే కవిత్వాన్ని వెంకటరాజుగారు వ్రాస్తే ఓహో అనిపించే వ్యాఖ్యానాలను ధర్మారావుగారు చేశారు. ఉదాహరణకు ఒక మాటవిరుపు చూడండి. చిత్రాంగదను చూసి అర్జునుడు మోహించాడు. రాత్రల్లా విరహవేదన అనుభవించాడు. ఆమెను పెళ్ళాడదలిచాడు. తెల్లవారి పెద్దలవద్దకు తన చెలికాణ్జి పంపాడు. ఆ ఘట్టంలోని పద్యం ఇది. అపుడునృపుడు ప్రపుల్ల నవాంబుజప్ర-సన్న ముఖుడయి 'మలయధ్వజక్షితీశ కమలహితునకు మామకాగమనవార్త-దెలుపు"మనుచు విశారదు విలిపనిచె. (విజయ. 1-52) ఈ పద్యంలోని 'మామకాగమనవార్హ' అనే చోట 'మామక+ ఆగమన వార్త' అనీ, “మామకున్‌+ఆగమన వార్త అనీ రెండు విరుపులున్నాయని జూలూరు అప్పయ్యగారూ, వేదం వెంకటరాయశాస్త్రిగారూ మొదలైనవారు వ్యాఖ్యానం చేశారు. ధర్మారావుగారు 7. సారంగధర చరిత్ర వేదంవారి ప్రచురణ, (1510) విజ్ఞప్తి పుట: ౨ 8. భారతి 192 - సంపుటి 9, నంచికలు ౩ చుండి 7 వరకు

చేమకూర వెంకటకవి 557 మాత్రం "“మామ+కాగా+మన+వార్హ' అని తెలుగు విరుపులు చూపించారు. ఇటువంటి ఆహ్లాదకరమైన చతుర వ్యాఖ్యానం చేమకూరవారి అన్ని పద్యాలతూ అవసరం. విజయ విలాసానికి సంపూర్ణమైన వ్యాఖ్యానాన్ని తాపీ ధర్మారావుగారే రచించి ప్రచురించారు.!* వారు బయటు రత్నాలు భాషా సరస్వతి తలమీద పెట్టుకుంది.

పూర్వకవులను అనుసరించినా చేమకూర వారు బయటపడకుండా అనుసరిస్తారనీ, అనుకరణలో కూడా తన స్వాతంత్రాన్ని ప్రదర్శిస్తారనీ తాపీ ధర్మారావు గారు నిరూపించారు.!కే అయితే తాళ్ళపాక తిమ్మక్కగారి సుభద్రా కళ్యాణానికీ, విజయవిలాసం లోని కొన్ని పద్యాలకూ పోలికలున్నాయి.!* ఇక్కడ చేమకూరవారు దొరికిపోతున్నారు. అయితే సుభద్రాకళ్యాణం ద్విపద అర్వాచీనమని కాము భావిస్తున్నట్టు తాపీవారు నాతో చెప్పారు. తిమ్మక్కగారి సుభద్రాకళ్యాణం - వేటూరివారు పరిష్కరించినది - 1950లో తిరుపతి దేవస్థానంవారు ప్రచురించారు. ఇందులో చివర - "అవనిలో తాళ్ళపాకయ్యగారి - తరుణి తిమ్మక్క చెప్పె తాను సుభద్ర కళ్యాణము పాట' అయితే ఈ ద్విపదకావ్యం 1910లో ఒకసారి అచ్చుపడింది. కాకినాడలో మంగువారు ప్రచురించారు. దానిలో చివర -

“పరకవి తాళ్ళపాక తిమ్మప్ప

చెప్పెను విష్ణుకథను జగతిలోపలను” అని ఉంది. తాళ్ళపాకవారి వంశంలో ఎవరో తిమ్మప్ప అనే పురుషుడు - బహుశా చేమకూరవారికి అర్వాచీనుడు - ఈ ద్విపద వ్రాసి ఉంటాడని తాపీవారు తలపోస్తున్నారు. అయితే తిరుపతివారి ప్రచురణకు మూలమైన తాళపత్ర ప్రతిలో చివర ఇలా ఉంది.]ేకి

ధరలోను తాళ్ళపాక అన్నయ్యగారు - ధరణి తిమ్మక చెప్పెధరలోను వెలయ “దీనిని తరుణితిమ్మక్క' అని ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరించారు. సుభద్రా కళ్యాణం ద్విపదగా వ్రాసినది ఎవరో అర్వాచీన పురుషుడే అని అనుమానించిన తాపీవారిని బలపరచడానికి నాకు కొన్ని అధారాలు దొరికాయి. శాలివాహన శకవర్హాలు 1662 నళనామ సంవత్సర పుష్యశుద్ధ సప్పమీ బుధవారంనాడు ఒక తాళ్లపాక తిమ్మాదార్యులవారు పంజ వెంకట్రెడ్డిగారికి ఏడుకొండల రంగనాథ రామాయణం కాపీచేసి ఇచ్చారు. ఈయన క్రీశ1740లో ఉన్నాడు. ఇతడే ద్విపద సుభద్రకళ్యాణం వ్రాశాడేమో అన్న అనుమానం ఖావిపరిశోధనవల్ల తేలాలి. 9. ఖారతి, అంగీరస ఆషాడం, 9 సంపుటి సంచిక ?. 10. విజయవిలాసం - హృదయోల్లాసవ్యాఖ్య, ప్టైదరాబాద్‌- 1338 11. తిలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం, సంపుటి ౩, పుటలు 11%, 1107 12. గజపతుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి 2002 13. వెంకటేశ్వర ప్రాచ్యలిఖిత గ్రంథాలయం సంఖ్య తె. 7627 14. ఆంధ్రసాహిత్య పరిషత్తులో 2810 సంఖ్యగల మైరావణచరిత్ర ఒకటి ఉంది. ఆ గ్రంథం చివర ఈ

సంగతులు ఉన్నాయి. చూ॥ పరిషత్పత్రిక సంపుటి 6, పుటలు 238-240.

నన | 558 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి . అయితే ఈ సమస్యను ఇంకొంచెం చిక్కుపెట్టడానికి ద్విపద సుభద్రా కళ్యాణం . రచయిత మరొకరు కావచ్చుననే అనుమానం కలుగుతుంది. ఆంధ్ర సారస్వత పరిషత్తువారు

  • ప్రచురించిన స్త్రీల పాటలలో ఒక సుభద్రా కళ్యాణం ఉంది. కొద్ది పాఠభేదాలతో అదీ . అచ్చంగా వేటూరివారు ప్రచురించినదే. దానిలో చివర ఇలా ఉందిః ధరణిలో హేమాద్రి తనయుడప్పన్న- గురుభక్తితిమ్మక్క మధుభక్తిరతియు |
  • మలయుపూర్ణా సుభద్రావివాహ- యివ్వరు పాడినాయవ్వరు విన్న...!5 ఈ హేమాద్రిగారి అప్పన్ను పులిమీద పుట్రలాగ వచ్చాడు. ఇతనికీ, తిమ్మక్కకీ ఏమిటి | | సమగ్రాంధ్ర సాహిత్యంలో తాళ్ళపాక తిమ్మక్కగార్‌పై రాసిన ప్రకరణంలో సుభద్రాకళ్యాణం-స్త్రీలపాట తాళ్ళపాక వారింటనే పుట్టిందనీ అది తంజావూరు దాకా 1 | పాకిందని నిరూపించాను. తాళ్ళపాకవారి సంకీర్తనలు ముఖ్యంగా తోడయమంగళంలోని _ అయిదు పాటలు నేటికీ తంజావూరు భజన సంప్రదాయంలోనూ భాగవత మేళా . ॥ ప్రదర్శనల ప్రారంభంలోనూ సజీవంగా ఉన్న సంగతి తెలియచేశాను. తమ ఇళ్ళలో | | ఆడవాళ్ళు పాడుకొనే పాటల్లోని సౌగసులను, వర్ణనలనూ చేమకూరవారు వాడుకొని | విజయవిలాసంలో తిమ్మక్కగారిని కాకపోయినా ఇతరులను స్పష్టంగా | ॥ "| వెంకటరాజుగారు అనుసరించారు.!* అయితే అందువల్ల వారికి వచ్చిన న్యూనత ఏమీ ల! లేదు. ఎక్కడ నుంచి ముడిసరుకు తీసుకున్నా దానిని పుటంపెట్టి శుద్ధిచేసి ఎన్నో నగిషీలు " చెక్కందే వెంకటరాజుగారు కావ్యంలో పొదగరు. సారంగధర చరిత్రలో మక్కికిమక్కి ] అనుసరిస్తున్న తావులలో తూడా తావులు విరజిమ్మిన ప్రతిభాశాలి. చేమకూర | . వెంకటరాజుగారి విజయవిలాసంలోకన్నా సారంగధరలోనే ప్రొఢమైన శ్లేషాది ] .. చమత్కృతులున్నాయని. దీపాల పిచ్చయ్యశాస్త్రీగారు. భావిస్తున్నారు.!” వేదంవారి " స్‌ సారంగధర వ్యాఖ్యానంలో 'పాదపాదమునా పాఠదోషం, అడుగడుగునా అర్థదోషం' | ఉండడంవల్ల కొత్తగా "జితకాశా అనే విపుల వ్యాఖ్యానంతో పిచ్చయ్యశాస్త్రిగారు |
  • సారంగధర చరిత్రను ప్రచురించారు. ఎన్నో సౌగసులు చూపించారు. . స్ట .... చేమకూరవారి కవితాగుణాల గురించి ఎవరికీ అఖిప్రాయభేదాలుండవుగాని | య... ఆయన కులం గురించే వాదోపవాదాలు ఉన్నాయి. ఆయన కులం తక్కువవాడనే వదంతి జై. ఒకటి చిరకాలం నుంచీ ప్రచారంలో ఉంది. వాసిరెడ్డి వెంకటాద్రిగారి ఆస్థానంలో | . | బుచ్చివెంకు అనే కవి ఉండేవాడు. అతణ్జి 'బుధజనాటవ్యటన్న్యంకు బుచ్చివెంకూ అని గ + వెంకటాద్రిగారు మెచ్చుకొన్నారు. 'న్యంకు' అంటే జింక అని సంస్కృతంలో అర్థం ఉంది. త బుధజనులనే అరణ్యంలో చరించే జింక అని ఆ ప్రశంసకు అర్థం. 'న్యంకు' అనే పదమే _ అనో 15. స్త్రీల పొరాణికపు పాటలు (భారత భాగవత కథలపాటలు), ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రచురణ, పుట జా మీ ౫. దక్షిణ దేశీయాంధ్రవాజ్బయం, నిడుదవోలు వెంకటరావుగారు, పుటల.

టప న తాపం. టి చేమకూర వెంకటకవి ర59, |. ం కాక 'రంకు' అనే పర్యాయపదం కూడా జింకతు ఉంది. "కృష్ణసారరు రన్యంకురంకుశంబర కు రౌహితాః అని అమరంలో పర్యాయపదాలు ఉన్నాయి. బుచ్చివెంకును ప్రభువు |. ద్ర “న్యంకు'తో ప్రశంసించితే తోడిపండితులు “రంకు'తో ఈసడించి ఇలా చెప్పారు: ___ | కొంకక తమవాడిన యిది-బొంకేలగు? వెంకటాద్రిభూపాలక యీ _ | న్యంకేల? వానికింగల-రంకే యిచ్చోట నిల్చ్బరసవంతమగున్‌. =. -. ః . (చాటుపద్యరత్నాకరం, 156 పద్యం) టి | అసూయాపరులైన పండితులు గుణాన్ని కాక కులాన్ని చూడడంవల్ల బాధపడీ |. , బుచ్చివెంకు ఈ క్రింది పద్యం చెప్పాడు. | గో... పన్నిన సత్రబంధమన బాగునునోగునుచూడకీసుచే మ కా | మన్నన మాలి మాకులము మాట దలంతురె? చేమకూరి వెం - ని. కన్నకు లోపమేమి? కులమా కవనానకు? వెంకటా ద్రిరా ( : బన్న గణించి వారలు దయామతి జూచిననాకుజాలదే? . చాటుపద్యరత్నాకరం, 157 య. ని! .. ( ) | ఈ పద్యం చెప్పిన బుచ్చివెంకు వేశ్యాపుత్రుడట. అతడు చేమకూర వెంకన్నగారి ఇ | ప్రసక్తి తేవడంవల్ల ఆయన కూడా ఇటువంటి కులంలోనివాడేనని పాతకాలపు పండితుల హ్‌ గా. ల " శ లు. బ్రాహ్మణుల పుస్తకాలలోంచి తప్ప ప్రామాణిక ప్రయోగాలు స్వీకరించని | క్కి | అప్పకవి చేమకూరవారి రెండు గ్రంథాలలోంచి పదిపద్యాలు ఉదాహరించాడు. ఈ | ార గ్రంథాల గద్యలో తాము లక్ష్మణామాత్యుని కుమారులమని వెంకటరాజుగారు | షం' చేమకూరవారు నాయుళ్ళలో ఇప్పటికీ ఉన్నారని, ఆడవాళ్ళ పేరు బయటికి ళ్‌, రు. రానీయని ఆ శూరవంశంలోనే వెంకటరాజుగారు పుట్టారని తాపీధర్మారావు గారి | . ఉద్దేశం.!5 " గాని | ఇంతతూ ఏ తల్లి కన్నదోగాని, వెంకటరాజుగారు తమ తల్లి కడుపు చల్లగా, ంతి | కలకాలం బ్రతికే కవి. . | ,.. చెట్లున్నా చేమ ఒక్కటే ఉందిః న్‌ 18. తెలుగు భాషాసమితివారి విజ్ఞాన సర్వస్వం, సంపుటం, పుట 1109. వ.

కొందరు తిట్టు కవులు అనుగ్రహిస్తే దీవిచడం బాగా ఉంటుంది గాని ఆగ్రహిస్తే శపించడం - మంచిది కాకపోయినా మానవనైజం. సహజంగా కోపంవచ్చిన మనిషికి మాటలు రావుగాని కవికీ మాత్రం అవి పిలిస్తే పలుకుతాయి. తిట్టడం అందరికీ చేతనవుతుందిగాని కవి తిట్టిన తిట్టుమాత్రం గట్టిగా పనిచేస్తుందని జనం నమ్ముతారు. శాపానుగ్రహ సమర్శులైన కవుల గురించి రకరకాల కట్టుకథలు ప్రచారంలో ఉన్నాయి. ఇటువంటి మహానుభావులలో వేములవాడ ఖీమకవి ఆద్యుడు. అతని తిట్లూ, దీవనపద్యాలు మాత్రం మనకి దక్కాయి. తిక్కనగారి తాతగారు మంత్రి భాస్కరుడు కూడా శాపానుగ్రహ శక్రియుతుడని కేతన వ్రాసిన పద్యాలవల్ల తెలుస్తున్నది.! అయితే మంత్రి భాస్కరుని చాటువులేమైనా ఊంటే అవి కాలగర్చంలో కలిసిపోయాయి. చాళుక్య కాకతీయ యుగాలలో ఇటువంటి కవులున్నారని చెప్పుకోవచ్చునుగాని తిట్టుకవుల ప్రభ తరువాత యుగాలలో బాగా ఉంది. కందుతూరి రుద్రకవి ఈ విద్యలో ఘటికుడు. రామరాజభూషణుడతనికేం తీసిపోడు. కుట్టని తీలును చూసి కిట్టనివాళ్ళు పురుగుక్రింద భావిస్తారని బాధపడి, అతను తిట్టకమాననన్నాడు. “తాకుట్టకయున్న వృశ్చికము గుమ్మరిపుర్వని యందురేకదా' అన్న అతని పద్యపాదం చాలా ప్రసిద్ధమైనది!

  • లోకంలో బాగా ప్రచారం పొందిన ఇటువంటి పద్యాలను కొన్నింటిని అప్పకవి సికరించాడు. తిట్టుకవిత్వానికీ, ఇతర పద్యాలకూ తేడా ఏమిటి? రెండింటిలోనూ యతిప్రాసలూ, గణాలూ సమానమే. రెండింటినీ చెప్పేవాడు కవే. మామూలు పద్యానికి లేని ఫోర్సు దీనికెలా వస్తుంది అని సహజంగా ఎవరైనా ఆలోచిస్తారు. తిట్టపద్యాలలో ఫలానాచోట ఫలానా అక్షరం వాడినందువల్లే ఇది సాధ్యం అని లాక్షణితుల విశ్వాసం. పద్యంలోని మూడు, అయిదు, ఆరు, ఏడు సంఖ్య స్థానాలలో కొన్ని విషమాక్షరాలు నిలపతూడదట. పదకొండో స్థానంలో కూడా కొన్ని వాడకూడదు. ఇతరచోట్ల వాడినప్పుడీ అక్షరాలవల్ల ప్రమాదం లేదు. ఆ ప్రమాదభరితమైన స్థానాలూ, అక్షరాలూ అప్పకవి లెక్కప్రకారం ఏమిటంటే -
  1. పద్యంలోని 3-5-6-7-11 స్థానాలలో అకారం, కచటతపలలో మొదటి అక్షరాలు, దంత్యోష్మాలూ వాడకూడదు. (అప్ప. 2-36)
  2. మూడవచోట మొదటి మూడు సరళాలూ, మూడవ అచ్చు మూడవ ఊష్మాగ్షరం వాడతూడదు. (అప్ప. 2-368)
  3. అరవచోట షోడశాకారం - అంటే తకారం పెట్టి పద్యం చెప్తే తిట్టు తినేవాడు చస్తాడు. (అప్ప. 2-363) అలల లల లలనా వకుల తననాలనానా ననిన ననన దినాన నా నో
  4. దశకుమారచరిత్ర, 1-32
  5. నవాబులయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటం

కొందరు తిట్టు కవులు 561 కీలక స్థానాలలో విషమాక్షరాలు ప్రయోగించి శపించిన తిట్టుకవులు పదిమందిని అప్పకవి ఉదాహరించాడు. వాళ్ళపేర్లు, యుగాలు చూడండి.

  1. వేములవాడ భీమకవి చాళుక్కయుగం

  2. మేధావిభట్టు తొలిరాయలయుగం

  3. ప్రొడకవి మల్లన మలిరాయలయుగం

  4. తెనాలి రామకృష్ణయ్య మలిరాయలయుగం

  5. ఎడవల్లి పర్పతన్న ఆరవీటిరాజులయుగం

  6. రంగరాజు లింగయ్య అప్పకవికి పూర్వం

  7. చలూరి శేషయ్య అప్పకవికి పూర్వం

  8. పింగళి రామరాజు అప్పకవికి పూర్వం

  9. నెల్లూరి తిరుమలయ్య అప్పకవికి పూర్వం ఈ కవులలో కొందరి గురించి ఇంతకుముందు ఆయా యుగాలలో చెప్పుకొన్నాం. అప్పుడు విడిచిపెట్టినవాళ్ళ గురించి ఇప్పుడు ముచ్చటించుకొందాం.

  10. బడబానల భట్టు; ఇతడేకాలంవాడో, ఏ ఊరివాడో కచ్చితంగా చెప్పలేం. కాని ఒకసారి ఈయన త్రిపురాంతకం నుంచి శ్రీశైలానికి వెళుతున్నాడు. ఒకచోట మకాం చేశాన. తెల్లవారుజామున స్నానం చేసి సూర్యునికి అర్హ్యం యిస్తున్నప్పుడు అతని చేతి ఉంగరం జారి చెరువులో పడిపోయింది. వెంటవే అతడు ఏడింట టకారం పెట్టి ఈ పద్యం చెప్పాడు:

బడబానల భట్టారకు - కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్హ్యం

విడువేళ నూడి నీలో- బడియె దటాకంబ!। నీటి బాయుము వేగన్‌. (అప్ప. 2-374) ఈ పద్యం చెప్పిన నాలుగు గడియలకు చెరువు ఎండిపోయిందట. కవిగారు తన ఉంగరాన్ని తీసుకొని చక్కాపోయాడు. ఇతడు ఎండబెట్టిన తటాకాన్ని తెలుగు రాయలు కట్టించాడు. వేములవాడ ఖీమకవి ఒక తెలుంగాధీశుణ్ణి పచ్చకర్పూరం ఇచ్చి లాలించ మన్నాడు. శ్రీనాథుడింకొక తెలుంగాధీశుణ్ణి కస్తూరై ప్రస్తుతించాడు. ఈ ఇద్దరిలో ఏ తెలుగురాయడు కట్టించిన తటాకంలో బడబానలభట్టుగారి ఉంగరం పడ్డదో తెలియదు. బహుశా రెడ్డిరాజుల కాలంలోనివాడు కావచ్చు. ఈ బడబానలభట్టు ఇదికాక ఇంకా

  1. మేధావి భట్టు: ఇతడు సాళువ పెదతిమ్మరాజుగారి కాలంవాడు. ఒకసారి రాజుగారు కవిగారున్న ప్రాంతాలకు వచ్చారట. అప్పుడు పద్యం రాయడానికి మేధావి భట్టు చేతిలో ఒక తాటాకు తూడా లేకపోయింది అయితే ఎదుళ్కు కోపీచెట్టు ఒకటుంది. ఎక్కి ఆకులు కోయడానికి అవకాశం లేదు. అందుచేత మేధావి భట్టు తక్షణం ఆరింట తకారంపెట్టి ఈ పద్యం చెప్పాడు:

562 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సాళువ పెదతిమ్మమహీ-పాలవరుడు వీడె వచ్చె బద్యము వ్రాయన్‌

గేలను లే దాకొకటియు-దాళము తుత్తునియలగుచు ధరపై బడుమీ.(అప్ప. 2-371) ఈ పద్యం చెప్పిన గడియకు తాటిచెట్టు మూడు ముక్కలై కిందపడిందట. సాళువరాజుపై కవి పద్యం వ్రాశాడు. ఈరాజు తొలిరాయల యుగంవాడు.

  1. ప్రొథఢకవి మల్లనః ఇతని గురించి మనం మలిరాయలయుగంలో చెప్పుకొన్నాం. అయినా ఇతడు తిట్టిన చాటుధార గురించి కొద్దిగా చెప్పుకొన్నాం. ఈయన ఒకసారి కొండపల్లినగరం పడమటికి గుడి అన్నంరాజుగారిని కలుసుకొనేందుకు వెళ్లాడు. అక్కడో బ్రహ్మదండిచెట్టు ఉంది. డాని ముళ్లు కవిగారి కుడిపాదానికి గుచ్చుకొన్నాయి. ఆ బాధలో మూడింట అకారం నిలిపి ఆయన ఇలా తిట్టాడు:

గుడిఅన్న నృపతిబొడగన - నడవంగా గొండపల్లి నగరిపడమటన్‌

గడియడుగమడమగాడిన-చెడుముండులు బ్రహ్మదండిచెట్టున డుల్లుక్‌

(అప్ప. 2-372)

ఇలా తిట్టిన రెండు గడీయలకు అ చెట్టు ముళ్ళన్నీ రాలిపోయాయని ప్రతీతి. ఈ పద్యాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ప్రొడకవి సంధినియమాన్ని పాటించలేదని చెప్పాలి. 'గుడి అన్ననృపతి' అని విసంధిగానే. యడాగమం లేకుండా, చదవకపోతీ మూడీంట *అ'కారానికి బదులు 'యి'కారం వస్తుంది. విసంధి చాలా శక్తివంతమైనదని ఇందలి నీతి.

  1. రంగరాజు లింగయ్య: మూడింట అకారం పెట్టి ప్రొడకవి మల్లన్న తిడీకే అదేచోట కకారం నిలిపి రంగరాజు లింగయ్య గూడంగా జూపల్లి లింగణ్ణ్జి తిట్టాడు. ఈయన చేసిన నేరమేమిటో కవిగారికి ఎందుకు ఆగ్రహం వచ్చిందో తెలియదు. జూపల్లి లింగడి భవనంలో నక్కలు తిరగాలని శ్లేషగా తిట్టాడు. 'శివా' అనే ఆకారాంత స్త్రీలింగ పదానికి నానార్ధాలున్నాయి. ఒకటి పార్వతీదేవికి పర్యాయపదం. ఇంకొకటి నక్కకి పేరు. ఉసిరిక చెట్టుకి కూడా 'శివ అని పేరు ఉంది. ఈ నానార్ధాలలో నక్కను మనసులో పెట్టుకుని “నీయిల్లు నక్కల పాలుగాను' అని తిడుతూ రంగరాజు లింగయ్య ఇలా గూఢంగా పద్యం చెప్పాడు:

రవికోటిధామమయమై- నవకాంచనయుతము నగుచు నానాటి కొగి౯

భువిని శివాన్విత మగు నీ-భవనము జూపల్లిలింగ) భవగుణసంగా!

(అప్ప. 2-38)

జూపల్లి లింగని భవనం శివాన్వితమైందో లేదో, ఆసలీయన ఎవరో తెలియదు.

ఎలకూచి బాలసరస్వతి తన చంద్రికాపరిణయాన్ని జూపల్లి వెంకటాద్రికి అంకితం

ఇచ్చాడు. ఈ వెంకటాద్రి వంశంలో ముగ్గురు లింగన్నలున్నారు. బహుశా వాళ్ళలో ఒకరిపై రంగరాజు లింగయ్య పై తిట్టుపద్యం చెప్పి ఉంటాడు. జూపల్లి తెలంగాణాలో ఉంది.

= 5, వీలూరి శేషయ్య: ఈయన శ్రీశ్రైలంవాడు. ఒకసారి తుక్కరను అనే మంత్రిగారు

కొందరు తిట్టు కవులూ 583 తీయించాడో తెలియదుగాని ఏలూరి శేషయ్య దానిని అపచారంగా ఖావించి, ఇలా దోచుకుపోవడం సహించలేకపోయాడు. అందుచేత ఐదింట 'కకారం నిలిపి ఇలా తిట్టాడు:

మునుపౌక కేల రావణుడు మోదమున న్రజతాద్రి నెత్తినం

తనె హరు డప్పుడే తనపదంబున ద్రొక్కి మదం బడంచె గా

వనమయగోరి తుక్కసచివా యిల శ్రీగిరి గడ్డపారలక

గనలుచు ద్రవ్వి సర్వమును గైకొని నీకిపు డాత డోపునే? (అప్ప. 2-375) ఈ తిట్టు తిన్న మూడు రోజులకు తుక్కరసు చచ్చిపోయాడట.

  1. పింగలి రామరాజు: శ్రీశైలాన్ని దోచుకున్న తుక్కరసు ఎలాంటివాడో ఏమో చెప్పలేంగాని తంగెడ కొండడు అనే వాడొకడు బకాసురునిలాగా పింగళి గ్రామంలో పెచ్చురేగాడు. ఈ ఎంగిలిముచ్చును చంపడానికి ఎవరికీ దమ్ములు లేకపోయాయి. అప్పుడు పింగళి రామరాజు అనే కవి అయిదింట క కారం, ఆరింట చకారం పెట్టి ఇలా

పింగళి ఏకచక్రపురి, పెంపుగ నందు వసించియున్న యా

తంగెడ కొండడే బకుడు, తథ్యము, మానవులార। వాని బా

ధం గడముట్టజేసె లమును ధర్మజుతమ్ముడు భీము, డిప్పుడీ

యెంగిలిముచ్చు జంపుటకు నీశ్చరు వేడుడు భీము డయ్యెడిక్‌ (అప్ప. 2-378) ఈ పద్యం చెప్పిన తరువాత తంగెడ కొండణ్ణీ ఈశ్వరుడెలా చంపాడో, ఎన్ని గడియలకు తిట్టు ఫలించిందో, ఎన్నిరోజులకు బకుడు చచ్చాడో అప్పకవి వివరించలేదు. అయితే ఆ ప్రజాకంటకుణ్ణి ఏ ఖీముడో చంపే ఉంటాడు. ఈ పింగళి రామరాజు ఇతర గ్రంథాలేమైనా బ్రాశాడో లేదో తెలియదు. ఈయన కళాపూర్లోదయం బ్రాసిన సూరపరాజుగారికిగాని, తోభ్యుచరిత్ర రచించిన పింగళి ఎల్లన్నకుగాని బంధువో, కాడో తూడా తెలియదు.

  1. నెల్లూరి తిరునములయ్య: తమకొచ్చిన కష్టాన్ని రామరాజు భారత కథతో పోలిస్తే, నెల్లూరి తిరుమలయ్య తన బాధని రామాయణంతో అన్వయించాడు. ఈయనకొక గుజ్జం ఉండేది. దానిని శ్రీపతిరాజు పోతరాజనే దుష్టుడు అపహరించాడు. అప్పుడు కడుపుమండి తిరుమలయ్య ఇలా తిట్టాడు:

హయ మది సీత, పోతవసుధాధిపు డారయ రావణుండు ని

శ్చయముగ నేను రాఘవుడ, జాహ్నవి వారిధి, మారు డంజనా

ప్రియతనయుండు, లచ్చన విఖీషణు, డా గుడిమెట్ట లంక, నా

జయమును బోతరక్కసుని చావును నేడవనాడు సూడుడీ. (అప్ప. 2-376) ఈ పద్యంలో ఆరింట తకారం ఉంది. ఈ తిట్టుపద్యంలో ఆశించినట్టు ఏడవనాడు శ్రీపతి పోతరాజు మరణించాడని అప్పకవి చెప్పాడు. అయినా గుడిమెట్ట పాలకుడు త్యాగి పోతరాజుగారేగాని శ్రీపతిరాజు పోతరాజు కాడు. త్యాగి పోతరాజు శ్రీ.శ+1199

564 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి లోకంలో ప్రతీతి.

  1. కవి భానుడు: వేములవాడ ఖీమకవే చాళుక్క చొక్కభూపాలుని చూసినప్పుడు ఈ క్రింది పద్యం చెప్పాడని కొందరు భావిస్తారు.

గడియలోపల దాడి కడిగి ముత్తునియగా దిట్టిన మేధావిభట్టుకంటె

రెండుగడెల బ్రహ్మదండిముండ్లన్నియు డుల్లదిట్టిన కవిమల్లుకంటె

మూడుగడెలకు దా మొనసి యెత్తిన గండి పగులదిట్టిన కవి భానుకంటె

నరజాములోపల చెరువునీల్లినుకంగదిట్టిన బడబాగ్నిభట్టుకంటె

నుగ్రకోపి నేను నోపును శపియింప- గ్రమ్మరింప శక్తి కలదు నాకు

వట్టిమాన జిగురు బుట్టింప గిట్టింప - బిరుదు వేములాడ ఖీమకవిని.

(కవిజీవితములు, పుట 18)

ఈ పద్యంలోని మూడవ పాదంలో “కవిభాను' డనే తిట్టుకవి “మొనసియెత్తినగండి' పగిలించాడని తెలుస్తూంది. ఈ భానుడు శాపానుగ్రహశక్తియుక్తుడైన భాస్కరమంత్రో లేక ఉన్నాడు. భాస్కరులు నల్గురున్నారు. వాళ్ళ వివరాలివి:

  1. మంత్రిభాస్కరుడు తిక్కనగారి తాతగారు

2 హుళక్కిభాస్కరుడు రామాయణ రచయిత

  1. శ్రీపతి భాస్కరుడు చిత్రశతకం వ్రాశాడు

, 4 భాస్కరాచార్యుడు వై్ళ్ళోపురాణకర్త

ఈ నల్గురిలో మంత్రిభాస్కరుడు మాత్రమే శాపాను గ్రహదక్షుడు. భీమకవి చెప్పాడన్ను ఈ సీసపద్యం వల్ల కవిభానుడనే తిట్టుకవి పేరు మాత్రం తెలుస్తోంది. మిగతా పాదాలలోని కవులందరి గురించి మనం ముచ్చటించుకొన్నాం. ఈ కవి భానుని సంగతి అప్పకవి

విషమస్థానాలలో దుష్కాక్షరాలు పెట్టి పద్యం వ్రాసినా, లక్షణం తెలియక తిడితే తిట్టు దీవన అవుతుందట; దీవిస్తే తిట్టు అవుతుందట; ఇంతకీ ఏడింట చకార పెట్టకూడదని లాక్షణికులు భావించినా నన్నయ్యగారు ఆంధ్రమహాభారతంలోని మంగళాచరణంలో ఏడింట చకారం వాడారు. శ్రీవాణీ గిరిజా శ్పిరాయి అనే సమాసంలో ఏడింట చకారం ఉంది. అయితే నన్నయగారు దానికేం భయపడలేదు. ఆంధ్ర “సాహిత్యంలోని తొలి పద్యంలోనే విషమాక్షరం ఉంటే, భారతీయ సాహిత్యంలోని తొలి మనక స నడ ప సస. పనన ననన నన నక 3. గురజాడ శ్రీరామమూర్తిగారు వేములవాడ భీమకవి గురించి బ్రాస్తూ “కవిజీవితములు' ప్రథమ

ఖాగంలో ఈ పద్యం మొదట ఉదహరించారు.

కొందరు తిట్టు కవులు 5665 శోకం తిట్టుకవిత్వమే! ఏటికి స్నానానికి వెళ్లిన వాల్మీకి కళ్ళకు నిషాదుడు చేస్తున్న దారుణం కళ్ళబడింది. కొంచపిట్టల జంట ఒక చెట్టు మీద క్రీడిస్తూ ఉంటే బోయవాడు బాణం వేసి అందులో పోతుపిట్టను కొట్టివేశాడు. ఈ దారుణం చేసిన దుర్మార్గుడు అట్టేకాలం బ్రతకతూడదని వాల్మీకి వెంటనే, అనుకోకుండా ఈ శోకం చెప్పాడు:

మా నిషాద! ప్రతిష్థాం త్వ మగమ శ్ళాశ్వతీ స్పృమాః

యత్రౌంచమిథునా దేక మవధీ: కామమోహితం. (1-15)

ఈ ళోకంలో ఆరింట తకారం ఉంది! వాల్మీకి బుషి కాబట్టే అతని శోకం శోకమైందని సాహిత్యలోక విశ్వాసం. బుషికానివాడు కావ్యం రచించలేడు (నాన్ఫషిః తురుతేకావ్యం). వేదకాలంలో కవులంతా బుషులే. బుషులందరూ కవులే. బుషి దైవసమానుడు. బుగ్వేదంలో అగ్నీ ఆదిమ దైవం. అగ్నిని కవిగా, పురోహితునిగా, హోతగా ఖావించారు. సత్కవి వాక్యం రిత్తపోదని జనం నమ్ముతారు. కవి భవిష్యం చెప్పగలడు కాబట్టి ఆడినమాట మంచైనా, చెడయినా నిజమవుతుందనే నమ్మకం అత్యంత ప్రాచీనకాలం నుండి అన్ని మానవ సమాజాలలోనూ ప్రచారంలో ఉంది. గ్రీకు కవుల గురించి జార్జి థాంప్సన్‌ ఇలా వ్రాశాడు.

“8 ఉం [001 06 ౧౦౪ ౧౧౮౩6౩ 1౧40 46 ౧౫౧౭౪ 16 ౧౧1౧9౯౦౭19 ౧౮౦౧. ౪88 ఆడాంర. 86106 1001864 6 గం౧ంంటేం, ౧౦996506, [౧6 ౪/25 & 0౧౦90౧61 85 ౭|| &8 & ౧౦౯. 12 య300ల6 10 10004 66 ఓరూ౭. 50 *4 తరింకిం [౯౧96 [16 ౦0౧౦౪064 000160 ఇలు ౧౮౨౦ 0606806 ౯ గంసా౭ 9060) గ౧౧తం ఓ 6 ౪౭0౧166 0? 21 10గాం ౦1 ౧9౩18] ఆఆండ2కం౧, పయేయయాం 06 ౧1000660 ౧౯2౧౦౭. ౧6 ౪08 21 0౧0౭ ౧౦౪౯, ౧౦౧౧ల, గణక

  • ఉం గాజం ౧గ65 ౦ & 160౫8 యో గీకు కవుల గురించి థాంప్సన్‌ చెప్పిన మాటలు మనకూ వర్తిస్తాయి. మాతృస్వామ్య వ్యవస్థలోనే ఆదిమ మంత్రచర్యలు ప్రారంభమైనాయి. అప్పుడు స్త్రీలే తంతు నడిపించేవారు. భవిష్యం చెప్పేవారు. రాగల మేలు కీడుల గురించి రాగ వరుసలో సుదీర్ణంగా చెప్పేవారిని “గద్దె చెప్పేవారని” ఇప్పటికీ తెలుగువారు గుర్తిస్తారు. ఈ విద్యను ఎరుక, గద్దె, తల, రంగం, సవాలు, సోది అని కూడా పిలుస్తారు.

సర్వసామాన్యంగా స్త్రీలే ఈ విషయాలలో మేటివారు. పురుషాధిక్కం పెరిగాక మగవాడు మగువల మంత్రవిధుల స్థానాన్ని ఆశ్రమించుకొన్నాడు. అడకట్టు కట్టుకొని అడిపాడసాగాడు. కైగట్టి గట్టివాడయ్యాడు.

ఆదిమ యుగాలలో సంఘంలోని వారందరూ సమష్టిగా జర్‌పే కొలుపులూ, చెల్లించే మొక్కులూ, ఫ్యూడల్‌ వ్యవస్థలో కొన్ని కొన్ని కుటుంబాల సభ్యులు నోచుకొనే నోములూ, చేసే వ్రతాలూ అయ్యాయి. ప్రతి వ్రకానికీ ఒక కథ ఉంటుంది. ఈ కథలను ఆదిలో గానం చేసేవారు.

శ 6జంల గుంణుంం - ల నెణసకంగం గంగ. నటుల 9 గడల! 6ణలుండతి 45

566 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

మధ్యతరగతి ఇళ్లలో చేసే కొన్ని వ్రతాలలో పాటలు ఉన్నా నోములలోని కథలను వచన రూపంలో కూడా చెప్పుకొంటారు. చిట్టచివర ““కథలోపమైనా వ్రతలోపం కాతూడదు. భక్తి తప్పినా ఫలం తప్పదు” అనే హెచ్చరిక స్త్రీల వ్రతకథలలో సర్వత్రా కనబడుతుంది.

ద్రతానికంత మహత్తు ఉందో కవిత్వానికి తూడా అంత మహత్తు ఉంటుందని ప్రజల నమ్మకం. అందుకే వ్రతాల గురించి చెప్పినట్టే మత విషయంలో కూడా “సరము తప్పయినా ప్రాసం తప్పకూడదు” అనే సామెత పుట్టింది.

కవిత్వానికి గణాలూ, యతిప్రాసలూ ముఖ్యం. సాధారణ ప్రజలు గణాలనూ, గూడ యతులనూ గుర్తించలేకపోవచ్చునుగానీ ప్రాసలను పోల్చుకోగలరు. అందుకే జనం

“కైగట్టడాన్ని ప్రాసం పెట్టడం'తో కూడా వ్యవహరిస్తారు.

అందరూ కవిత్వం చెప్పలేరు గనుక చెప్పగలిగే వారిలో ఏదో మహత్తు ఉండి ఉండాలని భావిస్తారు. కోపగించిన కవి ప్రాసంపెట్టి చంపేస్తాడన్న భయం కూడా కొందరిలో కనబడుతుంది. అందుకే తిట్టు కవుల ప్రభ ఒకప్పుడు వెలిగింది. అయితే జన సామాన్యంలోనే “శాపాలకు చచ్చేవాడూ లేడు, దీవనలకు బత్‌కేవాడూ లేడు” అనే ధైర్యం కూడా క్రమేణా వచ్చి సామెత స్థిరమైంది. ఇది శుభసూచకం.

  1. కన్యాశుల్కం నాటకంలో పూజారి గవరయ్య ఒకచోట పోలిశెట్టి మీద పద్యం చెప్పాడు ““పోలొట్టీ ముఖము. 'పోలిరొట్టెను బోలు; పోలొట్టి ముక్క పౌడుముడొక్కు” అని పద్యం ఎత్తుకోగానే భయపడి పోలిశిట్టి “వొద్దు వొద్దు వొద్దు నామాటిను ప్రాసం పెట్టి సంపేస్తావా యేటి” అని మొత్తుకొంటాడు. 'ఎంత శెడ్డా శాపనాకారం మాశెడ్డది' అని తాడు (కన్యాశుల్కం - పంచమాంకం రెండో స్థలం - పేకాట సీను.) నమ్ము, కన్యా

పుష్పగిరి తిమ్మన్న, అతని కవిమితశ్రులు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విద్వాంసుడు సజీవ విద్యాపీఠంగా ప్రసిద్ధుడవుతాడు. అతనిమీది గౌరవంతో సమకాలికులు తాము వ్రాసిన కావ్యాలను మొదట ఆయనకే చదివి వినిపించి అఖిప్రాయం అడుగుతారు. చేయమన్న మార్పులు చేస్తారు. చెప్పిన సలహాలు పాటిస్తారు. ఆయన ఇచ్చిన బిరుదులు ధరిస్తారు. ఆయన మెచ్చుకొంటే పొంగిపోతారు. కాకతీయ యుగంలో తిక్కనగారికి కవిమిత్రుడనే బిరుదు ఉంది. మళ్ళీ నాయకరాజుల యుగంలో అలా కవిమిత్రుడనే ప్రశంసకు తగినవాడొకాయన ప్రసిద్ధుడయ్యాడు. ఆయన పేరు పుష్పగిరి తిమ్మన. ఆయన కవిత్వ మహత్వవిదుడు. సరసార్థగౌరవంలో భారవి అంతటివాడు. ఉదారవాక్చతురత కలవాడు. ఆధ్యాత్మిక విద్య, పరతత్త్వమార్గ విచారం తెలిసినవాడు. కవిత్వ తత్వంలో కూడా నేర్పరి. ఈయనేకాక ఇతనితోపాటు చదువుకొన్నవాళ్లంతా మంచి కవులయ్యారు. వాళ్లకీయన గ్రంథరచనలో తోడ్పడ్డారు. ఆ నన్నయగారు తమ భారత రచనకు నారాయణభట్టు మాట సహాయం చేసినట్టు చెప్పుకొన్నారు. 'పాయక పాక శాసనునికి భారత ఘోరరణమ్మునందు నారాయణు' డట్లు నారాయణభట్టు తనకు తోడ్చడినందుకు నన్నయగారు కృతజ్ఞత చెప్పుకొన్నారు (అది. 1-25). చాళుక్కయుగంలో తాము బుణపడ్డవారి పేర్లు గ్రంథంలో పేర్కొనడం మొదటిసారిగా జరిగింది. మళ్ళా నాయకరాజుల యుగంలో పుష్పగిరి తిమ్మనగారి మిత్రులే శమకు తోడ్పడ్డవాళ్ళను పేర్కొన్నారు. కంకంటి పాపరాజుగారు విష్ణమాయాపిలాసం అనే యక్షగానాన్నీ, ఉత్తరరామాయణాన్నీ వ్రాశాడు. అ రచనలో పుష్పగిరి తిమ్మనగారి తూడా తిమ్మనగారి సహాయాన్ని స్వీకరించాడు. పాపరాజుగారి తమ్ముడు కంకంటి నరసింహం విష్ణుమాయా విలాసాన్ని తిమ్మనగారి తోడ్పాటువల్లనే ద్విపదగా రచించాడు. ఈ ముగ్గురూ తమ కృతజ్ఞతలెలా చెప్పుకొన్నారో చూడండి కంకంటి పాపరాజు చెప్పినవి:

  1. _ మదీయహితకార్యఘటనాది ముఖ్యులైన కవి తిమ్మనార్య ప్రముఖులు... (విష్ణమాయావిలాసం, యక్షగానం, పుట 3౩)
  2. అనేకాంధ్రకృతి ప్రకల్చ్పన సమర్షుడు... నా సహతశ్రోత (ఉ.రా. 1-24)
  3. కిరీటికి శౌరి తోడైనట్టు లమ్మహాకవి సాహాయ్య మాచరింప. (ఉ.రా. 1-26) టీకుమళ్ల రంగశాయి చెప్పినది :
  4. నా సహశ్రోత - చారుకవిత్వ సుజ్ఞానరహస్యపారుజ్ఞు దిమ్మనసత్కవి బిలిచి అతని సహాయతనతులోక్తియుక్తి.... (ద్వా భాగవతం, ॥.765)

శ క్‌ి | 5686 , సమగ్రాంభ్ర సాహిత్యం - రెండవ సంపుటి | ॥ అనఘుని పుష్పగిర్యప్పున్న తనయు-ఘను సంస్కృృతాంధైక కపవాతిదక్షు | యాయన్నసఖని తిమ్మనకవి కృతిస-హాయనని బిలిపించి యమ్మేటి కూడ. | (ద్విపదవిష్ణువిలాసం) ఈ ముగ్గురేకాక ధరణిదేవుల రామమంత్రి అనే కవి కూడా తిమ్మనగారి సహాయం ; వల్లనే దశావతార చరిత్ర రచించినట్టు సాహిత్యలోకం చెప్పుకొంటుంది. నిజానికి కంకంటి పాపరాజుగారి ఉత్తరరామాయణాన్ని, ధరణిదేవుల రామమంత్రి వ్రాసిన దశావతార

  • చరిత్రను పుష్పగిరి తిమ్మనగారే వ్రాసి వాళ్ళ పేరు పెట్టారనే అపవాదొకటి ప్రచారంలో ఉంది. ఈ పాపరాజుగారి రచనలో చాలాభాగం తిమ్మనగారు చెప్పి ఉండవచ్చునుగాని | ధరణిదేవుల రామయ్యకూ, తిమ్మనగారికీ సంబంధం ఉన్నుట్టు లేదు. దశావతార చరిత్రలో తిమ్మనగారిని రామయ్య పేర్కొనలేదు. ఈ విషయాలు చర్చించేముందు ఈ | 1. పుష్పగిరి తిమ్మన: కడప జిల్లాలో పుష్పగిరి చాలా సుప్రసిద్ధమైనది ఆదిశంకరులు ఇక్కడ తమ మఠాన్ని స్థాపించారు. అప్పటి నుంచి తెలుగుదేశంలోని అద్వైత . మతానికి పుష్పగికే పట్టుకొమ్మ: ఈ శంకరమళం వల్లనే బహుశా ఆ మండలంలో | | చేదాంతబోధకులు, అవధూతలు, అంతర్ముఖులు ఎందరో ఉద్భవించారు.! పుష్పగిరి | .! “ గ్రామంలో ఉండే ఒక శోత్రియ కుటుంబంలో అప్పన్నగారనే గృహస్థుకు ముగ్గురు | . కొడుకులు పుట్టారు. పెద్దవాడు వెంకటకృష్ణయ్య బ్రహ్మవేత్త. రెండవవాడు వెంకటయ్య | న కవి. ఇతడు ఏ గ్రంథాలు వ్రాశాడో తెలియదు. మూడవవాడు తిమ్మన్న; ఈయనే | ," చాలామంది కవులకు మిత్రుడై అనేక కావ్యాలు వ్రాశాడు. | తిమ్మన్నగారు. చిన్నప్పటినుండీ అంజనేయభక్తుడు. ఆయనకు హనుమంతుడే . . తత్వమసి మొదలైన వాక్యాల అర్ధాన్ని కలలో బోధించిన గురువట. అంజనేయ్డే | . అర్నెల్లు ఆరాధిస్తే సత్కవిత్వం వస్తుందని తిమ్మనగారి నమ్మకం. “షణ్మాసజపమున /] | సత్కవిత్వము నేర్పు, నొకయేట సుజ్ఞానయుక్తి నలరు అని సమీరకుమార విజయంలో . బ్రాశారు (6-2). హనుమంతుడు కేవలం కపీంద్రుడే కాదు - కవులలో ఉత్తమ ' ం! కవివరుడు; విద్వజ్ఞనులలో విద్వచ్భిరోమణి అని తిమ్మనగారి విశ్వాసం. ఆయన భక్తితోనే . అంజనేయుణ్జి త్రిమూర్తులుగా, పరమహంసగా నుతిస్తారు. ా సరసభాషాసక్తి సత్యవైభవయుక్తి భావింపంకజభవప్రభుతదోవ . గనకాంగదస్ఫూర్తి దనుజాపహృత్కీర్తి దన హరిత్వము యథార్హముగ దోప సజ " 1 న్మరవిఖేదప్రొఢి బురవిదాహనిరూఢి సర్వజ్ఞగతి మహేశ్వ్చరత దోప | | య . బుష్కరాశ్రయరీతి బోధహీతుఖ్యాతి హంసత్వమును దనయందె దోప .. 1.1 స్వప్నమున మున్ను నాకు సాక్షాత్కరించి | కు. “తత్వమస్యాదివాక్కసంతతికి నర్థ - ల నానతిచ్చిన హనుమంతు నఖినుతింతు. (సమీరకుమార విజయం, 1-7) , [ స (| 1“ సంగ్రవోంధ్రవిజ్ఞానకోశం, 2వ సంపుటి, పుట 451. /|

అననం పుటీ పుష్పగిరి తిమ్మన్న్య, అతని కవిమిత్రులు 569 =. కృత్యాదిని ఆంజనేయుణ్జీ ప్రత్యేకంగా నుతించడం పుష్పగిరి తిమ్మనగారి పుస్తకాలతోనే మొదలవుతున్నది. ఆయన కవిమిత్రులు, సమకాలికులు అందరూ

  • అంజనేయుణ్జీ ఇష్టదేవతా ప్రార్థన-.* కీర్తించారు. వాళ్లందరికన్నా, బాగా నుతించినవాడు సం) తంజావూరు రఘునాథనాయకుడు. . . యం యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజలిం - ంటీ భాప్పవారి పరిపూర్ణలోచనం - భావయామి పవమాననందనం. . లా, ంలో అనే శోకం చాలా సుప్రసిద్ధం. దానిని రఘునాథనాయకుడు తన వాల్మీకి చరిత్ర గాని కృత్యాదిని ఇలా అనుకరించాడు: ల . , తార | ఎక్కడ రామకీర్తన మొకించుక యే విననైన వేడ్కదా బు. ఈ. నక్కడ వచ్చి రంజిలి కృతాంజలియై ప్రమదాశ్రుపూరముల్‌ మ పిక్కటిలంగ మైబులకబ్బందము బాదుకొనంగ బాడుచున్‌ . పనది. -”.. .జొక్కుచు నాడు నయ్యనిలసూను ప్రభానత భావు గొల్బెదన్‌. (వాల్మీకి. 1-3) ఐద్రైత రామకీర్సన జరిగే చోటల్లా హనుమంతుడలాగ తియ్యని కన్నీళ్లు పెట్టుకొంటే, ంలో '____అంజనేయుడంటేనే పుష్పగిరి తిమ్మనగారు పరవశిస్తారు. ఆయన హనుమంతుని దయవల్ల సృగిరి అబ్బిన కవిత్వంతో జననమంది మనుటకెల్ల ఫలము గల్గ గృతియొక్కటి రచింపదలచారు. ుగ్గురు అప్పుడు బ్రహ్మవేత్త అయిన ఆయన అన్నగారు వెంకటకృష్ణయ్యగారు, తాడీపరి టర .... శ్రేశవవెరుమళ్ళు,. ప్రబల రఘుపతయ్య అనే మిత్రులు ఇష్టాగోప్టిలో ఉండి. “నీవు |: | అపరబ్రహ్మవు, అందుకే వాజి నీ జిహ్వాగ్రాన ఉంటుం'దని ఇలా అన్నారు: -. ! | ంంతుడే రసికుడవై భావించిన - ప్రసవభవుని హృదయవీధి భావించుట నీ " యుణీ రసనాగ్రంబున బాయక - వసియించిన దజుని కొమ్మ పరకవి తిమ్మా, నుంలో | . ఇలా అన్నవాళ్ళు సామాన్యులు కారు. అంతర్ముఖులు. ముఖ్యంగా ప్రబల | ఉత్తమ. రఘుపతయ్య రాజయోగి. ఈ జీవబ్రహ్మతత్వ నిగూఢమనస్కులు ఇంకా ఇలా / క్తితోనే అంటున్నారు: “ఈ రోజుల్లో అష్టాదశవర్ణనలు ప్రారంభించి వర్జించుకొంటూ మేమూ | /.... శృతులు వ్రాశామని కొందరంటారు. వర్ణనలు ఎందునా పొందవు. నీవు ఉభయలోక 1 . శ్రీకారంగా కృతి నిర్మించు” అని చెప్పి ఇలా నిర్దేశించారు: - నీవు కవిత్వతత్వములు నేర్పరి వౌటకు సత్ఫలంబుగా ం | బావని నీకు సద్గురుడు బ్రాణవిభుండు నఖీష్టదైవము న | గావున దచ్చరిత్ర లొడికంబుగ గూరిచి సేయుమా జగ . | త్పావనమై ప్రవర్తిల బ్రబంధము దుషృతబంధముక్తికిన్‌. (సమీర, 1-14) . | | ఆ పెద్దలు అలా చెప్పిన తరువాత పురాణేతిహాసాలలో హనుమంతుని గురించి | ౦, 1-7). ఎక్కడే ఘట్టమున్నదీ వెదికి, అవన్నీ ఒక ప్రబంధంగా తిమ్మనగారు నిర్మించదలిచారు. | లో శివాలయం దగ్గిర ఒక తెల్లవారుజామున కూర్చుని, “ఈ కృతికి ఎవరిని అధిపతిని ||

570 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చేద్దామా' అని భావిస్తా స్వాస్తికాసనం వేసుకొని పవనం బంధించి యోగనిద్రలో తూర్చున్నారట. ఆ వింత సుప్తిలో శతకోటి మదనశృంగారమూర్తి కనిపించాడట. అతడు శ్రీరాముడు. తన బంటుమీద అతని బంటు చెప్పే కావ్యాన్ని అడగడానికి ధర్మపత్నీ సమేతంగా వచ్చాడు. తిమ్మనగారు బ్రహ్మానంద భరితులై ఇలా భావించారు:

మో మటు ద్రిప్పబోడు కయిమోడ్చీన మెచ్చును మెచ్చి మింగడే

కామితమైన నీకలడు కాదన నొప్పును దప్పు గల్లినన్‌

నేమిటి కీనరాధములు కిత్తురొ యుత్తమకావ్యముల్‌ కవులో (సమీర. 1-27) తన ఉత్తమ కావ్యాన్ని శ్రీరామాంకితంగా రచించాడు. ఇందులో 1602 గద్యపద్యా లున్నాయి. ఇది ఏడాశ్వాసాల కావ్యం. సమకాలికులందరూ తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి, సరదాలు తీర్చుకొనడానికీ ఏమాత్రం కథ లేని శృంగార ప్రబంధాలని నిర్మిస్తూంటే తిమ్మనగారు పెద్ద పురాణం వంటి ఇతివృత్తాన్ని తీసుకొని ప్రయోజనాత్మకమైైన రచన చేశారు. దీనినొక రకంగా హనుమత్సురాణం అనవచ్చు. ఏయే ఆశ్వాసాలలో ఏఏ కథ ఉందో చూడండి.

ప్రథమాశ్వాసం: రావణుని చంపాక శ్రీరామచంద్రుడు సాకేతపురంలో సుఖంగా రాజ్యం చేస్తున్నాడు. ఆయన దగ్గరకు అగస్త్యుడు వచ్చాడు. “నువ్వు దశకంఠుని సంహరించావు, బాగానే ఉంది. ఇప్పుడు శతకంఠ రావణాసురుడు దాపురించాడు. నిన్ను గెలుస్తానని చిందులు తొక్కుతున్నాడు అని చెప్పాడు. ఈ పులిమీద పుశ్రులాంటి శతకంరుణ్ణి ఎలాగ చంపడం అని రాముడు ఆలోచించాడు. అంజనేయుణ్జి చూసి “నీవు ఏకపాద రుద్రుడవు. నువ్వు చేయగల కార్యాన్ని ఇలా ఉపేక్ష చేయడం న్యాయమా? వెళ్ళి నా పగ దీర్చు' అని ఆదేశించాడు హనుమంతుణ్ణి. ఇలా ప్రస్తుతించుతున్న రాముణ్ణి సీతమ్మ చూసింది. “ఏకపాదరుద్రుడా ఈ కపీశ్వరుడు? ఆ కథేమిటో చెప్పండి" అని భర్తను అడిగింది. రామయ్య కథ చెప్పసాగాడు. ఒకనాడు శివుడు వనవిహారం చేస్తున్నాడు. చల్లగాలి అల్లరి చేస్తూంది. ఆ వాయువుని చూపించి శివుడు పార్వతితో ఇలా అన్నాడు:

చిగురాక పయ్యంట చెరగొకింత దెమల్చి సముద్రగ్రమంజరీ స్తనములంటి

కడగి పుప్పాడి గందవొడిమీద నించి కాసారనాఖిప్రదేశములు పుణికి

తమ్మిపూనెమ్మో ముతావుల సాంపౌని బలురీతి వింబోష్టతలము నొలసి

లవలీదళకపోలలాలితస్థితి గాంచి కడవన్నై యనటి వపెందొడలనడరి

రావి చిగురాకు మరుహజారము రమించి

వసవనజగంధి నలరించె వాయువిటుడు

కంటె? తెలికంటిః యనుచు ముక్కంటి నొడువ

నాన నా ననబోడి యాసనము వంచె. (సమీర. 1-132) రతి ప్రసక్తి తెచ్చి శివుడు పార్వతితో క్రీడించసాగాడు. అప్పుడక్కడొక మర్కటమిథునం తూడా రమిస్తోంది. అది చూసి పార్వతి సిగ్గుపడింది. "సరే, మనమూ ఆ రూపం ధరిస్తే

పుష్పగిరి తిమ్మన్ను అతని కపమిత్రులు 571 సిగ్గుపడనక్కరలేదు' అని పార్వతీపరమేశ్వరులు చిగురుబంగరుకటారివజీరుని కేళిలో తేలారు. శివుని ఉేజాన్ని ఆమె భరింపలేకపోయింది.

ఏడుశ్రైలము లేడు వారిధు లేడు దీవులు మోచినన్‌

వాడు చెందని నాకు దేవరవారి తిజము దాల్చగా

గూడనున్నది వానికంటెను ఘోరమైనది దీని నీ

వేడనైనను నిల్చవే పరమేశ మొక్కెద నాపుడన్‌. (సమీరు 1-138) పార్పతీదేవే భరింపలేని ఈ తేజాన్ని ఎవరు భరించగలరని శివుడు వాయుదేవుణ్ణి పిలిచాడు. దానిని భరించమన్నాడు. ఆ మహాబలుడు వెయ్యేళ్లు దానిని భరించి ఆ తరువాత అంజనాదేవికి ఇచ్చాడు.

ఈ ఘట్టంలో తిమ్మన్నగారు చాలా గొప్ప రచనా శిల్చం చూపీంచారు. వైవమైన తేజాన్ని వాయుడు ఉత్తరోత్తరా ధరించాలి కనుక శివపార్వతుల క్రీడకు ముందు వాయువిటుణ్ణీ వర్ణించాడు. ఉత్తమ కథాశిల్పం తెలిసిన రచయితలే ఇలాగ ప్రధాన పాత్రలను ముందే గడుసుగా పరిచయం చేస్తారు. శివతేజాన్ని అంజనకు వాయువు ఇచ్చాడని చెప్పాక - ఆమె ఎవరు? అని సీత ప్రశ్నించింది. రామయ్య కేసరి అనే వానరుని వృత్తాంతం చెప్పాడు. అతడు శంబసాధసుడనే రాక్షసుని చంపిన కథ తెలిపాడు. ఆ కేసరి అంతదాకా బ్రహ్మచర్యం ఆచరించాడు. ఇంక గృహస్థాశ్రమం స్వీకరించాలనుకొన్నాడు. ఇది ఇలా ఉండగా బ్రహ్మ అహల్య అనే కన్యను సృజించి గౌతమునికి భార్యగా ఇచ్చాడు. ఆమెను ఇంద్రుడు మోహించి దొంగతనంగా రమించాడు. గౌతముడు శపించాడు. అప్పుడు బ్రహ్మ తూతురిమీది మమకారంతో వచ్చాడు.

అల్లుణ్జి చూసి “నామాట విని ఉవిద కిదిగాక నేరంబు లొకటి రెండు గావు'మని బ్రహ్మ ప్రార్థించాడు. గౌతముడు ఒప్పుకొన్నాడు, ఇంద్రుణ్జ్ణీ కూడడంవల్ల అహల్య ఒక కొడుకును కన్నది. తరువాత ఒక తూతుర్ని కన్నది. కొడుకు పేరు వాలి; కూతురి పేరు అంజన. ఆ తరువాత అహల్క ఒకనాడు తోటలో పువ్వులు కోస్తూంది. అప్పుడామె అందాన్ని సూర్యుడు చూశాడు. మక్కువ పడ్డాడు. చల్లని రూపు దాల్చి వచ్చాడు. “మన్మథునికి భయపడ్డాను. నీ చనుగొండలు రెండిపుడాశ్రయింపగా వచ్చితిని, శత్రుఖీతుడగువాని నను గరుణించు కోమలీ* అన్నాడు. తన పగవాళ్ళందరినీ ఆమె వెనకేసుకుని మన్నిస్తోంది. చాలా చమత్కారంగా ఇలా అన్నాడు.

వెరపుమాలిచి నీవు వెనుకవైచికొనంగ వేణిర్టై తిమిరంబు వెలయలేదొ

వగపుమానిచి నీవు మొగమాటసేయంగ ముఖలీల జంద్రుండు మురియలేదొ

కలక జారిచి నీవు కనుసన్న గాప్‌ంప దీక్షణోన్నతి గల్వ్బ లెనగలేదొ

రహిచూపి నీవాచరణయుక్తి మొనయింప బదనఖస్థితినుడుల్‌ బ్రబలలేదొ

తమము నెలకల్వలుడులు నా దాయలయ్యు

దెరవ! నిను జెంది నేనన్న వెరవకున్న

తెరువు నరిపూని నేను నీ మరుగుసొచ్చి ॥

-... చెరతువిల్కాని నొకయింత సరకుచేయ. (సమీర. 1-19)

572 సమగ్రాంభ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఈ పద్యంలోని కిల్చం చేమకూర వెంకటరాజుగారి రచనకు సరిసమానంగా ఉంది. చీకటి, చంద్రుడు, కలువలు, చుక్కలు అనేవి సూర్యునికి శత్రువులు. అవి ఆమెను ఆశ్రయించాయి. చీకటిని వెనకేసుకుని రావడంవల్ల అది ఆమె జడ అయిందట. చంద్రునికి మొహమాటపడడంవల్ల అతడామె ముఖమయ్యాడట. కలువలకు కనుసన్న చేయడం వల్ల అవి కన్నులు అయ్యాయి. చుక్కలను కాళ్లవద్దకు చేరదీయడంవల్ల అవి కాళ్లగోళయాయట. కవిసమయాలను జాతీయాలతో జోడించి చమత్కరించే కవులు అరుదు. పుష్పగిరి తిమ్మనగారు ప్రథమశ్రేణి కవులలో ఒకరు. 'నా శత్రువులైన చీకటి, చంద్రుడు, కలువలు, చుక్కలు నిన్ను చేరాక నన్ను చూసి భయపడలేదంటే నేను నిన్ను ఆశ్రయించికే మన్మథుణ్జి మాట్లాడే అందగాణ్జీ అహల్య ఎలా పౌమ్మంటుంది? 'ఊ' అంది. వాళ్లు లలిత రతికేళికానందలహరిలో తేలారు.

ఆరగంటిసౌక్కులు చిరునవ్వుటెక్కులు మరులూను చెయ్య్వులు ముజీపములును

గిలిగింతకైపులు మెలికొన్న రూపులు జిలిబిలిముచ్చటల్‌ కులుకునటలు

నరసంపు మురుపులు సరిగాంచు హరువులు కళలంటు వెరవులు కలికివగలు

రతిసూను సన్నలు రాకొట్టు చిన్నెలు కొదలేని మమతలు గూర్చు జతలు

మీరి యొకయింత యరలేని వారిరువురి

సురతసౌఖ్యాంబునిధి కీడుజోడుకలదె?

యివ్విధం బెవ్వరైనచో నెజిగరేని

సిగ్గుచేటను వెజపౌండు చెరచెగాక. (సమీర.1-205) ఎవరేనా చూస్తే సిగ్గచేటన్న సంగతి కవి గుర్తుచేస్తున్నప్పుడే గౌతముడు వచ్చాడు. సూర్యుజ్జీ చూసి “కటకటా, ఎంతవాడవు, ఈ కిటుకుపనికి ఎటుల మొగ్గితివి అని రాహు గ్రస్తుడవై పొమ్మని శపించాడు. సూర్యుడు ప్రార్టస్తే గూణ సమయాన్ని పుణ్యకాలంగా దీవించాడు. భార్యతో రమించినవాడిని శపించినా గౌతముడు భార్యను మటుకు క్షమించాడు ఇంతకుముందు బ్రహ్మదేవుడు ఒకటికి రెండు తప్పులు మన్నించమని అడిగాడా మర మామగారిమీది గౌరవంతో గౌతముడు ఊరుకొన్నాడు. సూర్యునితో క్రీడించడంవల్ల అహల్యకు ఒక కొడుకు పుట్టాడు. ఈ బిడ్డకు సుగ్రీవుడని పేరు పెట్టారు.

భర్త ఊరుకొంటున్నాడని కాబోలు అహల్య మళ్లా చీకటి తప్పు చేసింది. ఈసారి ఇంద్రుడు అర్ధరాత్రి కోడై తూశాడు. గౌతముడు ఏటికి వెళ్ళాడు. తిరిగి వచ్చేలోగా ఇంద్రుడామెను తూడడం, ఒక కొడుతు పుట్టడం తూడా జరిగింది. సూర్యుని కూడినప్పుడు ఎవరేనా చూస్తే సిగ్గుచేటని భావించిన అహల్య ఈసారి అ పట్టింపులేం పెట్టుకోలేదు కాబోలు. కన్నతూతురు అంజన కళ్ళపడేటట్టు రంకు సాగించింది గౌతముడు తిరిగి రాగానే తూతురు ఇదంతా తండ్రికి చెప్పింది. గౌతముడిక ఊరుకోలేకపోయాడు. “రాయివై పో అని పెళ్లాన్ని శపించాడు. అహల్య సిగ్గుతో తలవంచుకొని, ఇంద్రునికి కొత్తగా కనిన కొడుకుని భర్తకి అప్పగించింది. గౌతముడా

పుష్పగిరి తిమ్మన్స్క అతని కవిమిశ్రులు 573 బిడ్డకు, శకానందుడని పేరు పెట్టి. నిజనందనులందరూ అన్యజాతులు అనే సిగ్గుతో వాలిసుగ్రీవులు కోతిరూపాన పుట్టి ఒకే ఇంతికి భర్తలై కొట్టుకుచావాలని శపించాడు. తమకీశాపం రావడానికి అంజనే కారణం అని, అది చెప్పకపోతే ఏం జరిగేది కాదని కోపించి వాలి ఆమెను కూడా వానరకాంతవు కమ్మని శపించాడు. వాలి సుగ్రీవులు తమ

ద్వితీయాశ్వాసం: శతానందుణ్ణీ, అంజనను తీసుకొని గౌతముడు బయలుదేరాడు. తొడుకును జనకుని పురోహితుని చేశాడు. కూతురికి తగిన సంబంధాలు చేయాలని ప్రయత్నాలు చేశాడు. అంజనాదేవికి అన్నగారిచ్చిన శాపమేగాక పూర్వజన్మంలో మరో శాపం ఉంది. ఆమె తొలి జన్మలో ఒక విద్యాధరుని పుత్రిక ఆమె ఒకసారి వాయువుని చూసి నవ్వింది. అతడు శంకరుని వీర్యం ధరించి భరించలేక 'యుగ్గుచు నగ్గుచుం బడుచు మూల్లుచు నీల్లుచు దూలబోవుచున్‌ వగ్గుతనం' తో నడుస్తున్నాడు. ఆ స్థితిలో నున్న తనని చూసి నవ్విన ఆ పిల్లను వాయువు శపించాడు.

తొదమమిటారిగప్పిచనుగుబ్బల నుబ్బెడు నిండుపాయవుక్‌

మదమున గన్నుగాన కవమానముచేసితిగాన జూానః యీ

యుదుటున నీశరీర మతి యొండొకరూపున కీశపల్నివై

యిది భరియించి పుత్రు గనుమీ యని శాప మొసంగి పోవుటక్‌. (సమీర, 2-22)

ఆ శాపమే ఈనాడిలా ప్రాప్తించింది. “అమ్మా నువ్వు కామరూపిణివై వానరుణ్ణీ పెళ్ళిచేసుకో” అని గౌతముడు చెప్పాడు. కుంజరుడనే వానరుడు సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు. తన పుత్రిక నతనికి కుమార్తెగా యిచ్చాడు గౌతముడు. అంజనకు యౌవనం వచ్చింది.

సంపూర్ణ యౌవనవతి అయిన అంజనాదేవిని కేసరికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ దంపతులు పిల్లల కోసం నోములు నోచారు. 'ఆకైనదెల్ల పత్తిరి ఏకడ రార్టైన దెల్ల నీశ్వరు'డని పూజించారు. అంజన నోచిన నోములస్నీ తిమ్మనగారి కాలంలో తెలుగుతల్లులు నోచేవే. వాజి వివరాలు చూడండీ.

జలధికట్ట వినాయకులు సూర్యచంద్రుల వరలక్ష్మీ నల మార్గశిరము లక్ష్మి

గజిగౌరి నుత్తరాగౌరి సాంవత్సరగౌరిని బదియారు గౌరి బనువు

పట్టె మహాగౌరి నిట్టుప్పు గౌరి దంగేటిగౌరిని జల్లతూటిగౌరి

సావిత్రిగౌరిని జల్టిగౌరి నయ్యాయదిత్యగౌరి గూర్చి

నోచె విని మున్నుగాగ మున్నీటిమీద

నంజనాదేవి నెవ్వ రేమాచరింపు

మనిరొ యది యెల్ల దోడోడ నాచరించె. (సమీర. 2-61) ఇన్ని నోములు నోచినా అమె కడుపు పండలేదు. ఒడీ నిండలేదు. అప్పుడు ధర్మదేవత ఎరుకలసాని వేషంలో వచ్చి ఎరుక చెప్పింది అంజనాదేవి భర్త అనుమతితో వాయుదేవుని

574 సమల్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి గురించి తపస్సు చేసింది. బుతువులు మారాయి. చివరకు ఉన్నట్టుండి ఆమెకు గర్భం వచ్చింది. తపస్సు చేసుకొంటున్నదానికీ కటికవేకటి ఏమిటి? “మనసెరగిన కల్ల, ఒడలు మరచిన సివం' లేదన్నారు. భర్తకెలాగ ఇది చెప్పడం అని బాధపడుతున్నప్పుడు గగనభారతి అన్ని సంగతులూ చెప్పింది. వాయుదేవుడు కనికరించి శివుని వీర్యం ఆమెలో నిలిపి గర్పీకరించాడు. పిదప ఆంజనేయుడు జనించాడు. సూర్యుణ్హి చూసి ఫలమనుకోవడం, ఇంద్రుడు ఆ బాలుణ్ణి వజ్రాయుధంతో కొట్టడం, వాయుదేవుని కోసం దేవతలు వరాలు ఇవ్వడం, హనుమంతుడనే పేరు రావడం, సూర్యునివద్ద చదువుకోడం, సుగ్రీవునివద్ద చేరడం మొదలైన గాథలన్నీ తరువాత తిమ్మనగారు విపులంగా చెప్పారు.

తృతీయాశ్వాసం: ఇందులో పూర్తిగా రామాయణగాథే వుంది. లామసుగ్రీవులు కలుసుకొనడం దగ్గిర నుంచి సంజీవి తెచ్చి లక్ష్మణప్రాణదానం చేయడం దాకా ఉన్న కథలను తిమ్మనగారు విపులంగా కథనం చేశారు. కొన్ని ఘట్టాలు చాలా రసోచిశంగా ఉన్నాయి. సీతను ఎడబాసి విలపిస్తూ తిరుగుతున్న రాముడు తొలిసారి హనుమంతుణ్ణి దూరంగా చూశాడు. అప్పుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు:

బంగారుపట్టుగోచి నునుపచ్చని ముంజియు నొంటిజందెముక

ముంగయికంకణంబు జిగమోహనహారము మండల ప్రభా

భంగకపోలముల్‌ తరుణభానుసమానముఖాంబుజంబు మీ

  • అంగ వటుక్రియక శివుడు రాడుగదా మన చింత దీర్చగళ€. (సమీర. ౩-2)

ఈ పద్యంలో “శివుడు రాడు గదా మన చింతదీర్చగన్‌ అనే మాటలో ఎంతో జొచిత్యం ఉంది. హనుమంతుడు ఏకపాదరుద్రుడు. అతజ్జి ఎంతటి దూరంనుంచి చూసినా రామునివంటి అవతారపురుషుడు అవ్యక్తంగా గుర్తించకమానడు. అందుకే ఈ మాటలు రాముని నోట తిమ్మనగారు పలికించారు. ఈ ఆశ్వాసంలో ధాన్యమాలి వృత్తాంతం చాలా విపులంగా, శృంగారవంతంగా చెప్పారు. మన్మథుడు విబజ్బృంభఖించాడని చెప్పడానికి “చిగురాకు బాకుతురకాయన కోయని యార్చిజానినే జా చెయిజాచి' వేశాడన్నారు. ధాన్యమాలిని మకరివికమ్మని ఒక ముని శాపమిచ్చాడు. ఆడవారు కొన్ని చోట్లనే మకరికా పత్రాలు ధరించకలరు. ఒళ్లంతా మకరరూపం దాల్చడం కష్టం. “ఒక్కొక్కచో గదా మకరికోజ్జలతల్‌వహియింతు రెక్కడళ, జక్కెర బొమ్మ లాగతి పొసంగదు'”, అయినా శాపంవల్ల కర్కశదేహం కల్గింది అని చెప్తారు.

చతుర్ధాశ్వాసం: ఇందులో పూర్తిగా మైరావణ కథ, రావణవధ, సత్యలోకానికీ పోయి. గంధమాదనుణ్ణి తీసుకురావడం, లింగప్రతిష్ట హనుమత్తీర్ధ మహత్హ్వం మాయాపురప్రవేశం, ఆ సరోవర వర్ణన ఉన్నాయి. ఈ ఆశ్వాసంలో ఒక ప్రత్యేకత ఉంది పుష్పగిరి తిమ్మనగారికి పాండిత్యప్రకర్ష అంటే ఇష్టమే. అయితే కథను సాగనివ్వని చిత్రబంధ కవిత్వాలని చూస్తూ చూస్తూ ఆయన వ్రాయలేదు. అందుచేత ఒక కొత్త టెక్నీక్‌ శఈనిపెట్టారు. తన పిరింటి పెద్దకవి ఒకాయన ఇటువంటి ప్రజ్ఞను ప్రదర్శించిన మార్గు అనుసరించాలనుకొన్నారు. కథలోని పాత్రలేమైనా దైవప్రార్థనలు, స్తోత్రాలు చేయవలనీ

పుష్పగిరి తిమ్మన్న; అతని కవిమిత్రులు 576 వస్తి అక్కడ ఈ బంధగర్చ్భకవిత్వాలను లోగడ ముక్కు తిమ్మనగారు పారిజాతా పహరణంలో వరసపెట్టి వాడారు. దానిని ఈ తిమ్మనగారు అనుసరించారు. రావణుని వధించి ఆ బ్రహ్మహత్యాదోషం పోవడానికి శ్రీరాముడు లింగప్రతిష్ట చేస్తాడు. అప్పుడు చేసిన స్తుతులలో చిత్రకవిత్వ ప్రక్రియలను తిమ్మనగారు ఇలాగ వాడాడు.

  1. కందద్వయగర్చితసరసిజవృత్తం (4-71)

  2. కందద్వయగర్చితభాస్కర విలసితవృత్తం (4-72)

  3. ప్రగ్విణీభుజంగప్రయాతగర్చితవృత్తం (4-73)

  4. నాగబంధం (4-78)

  5. కందగర్చితమజిగణనికరం (4-79)

  6. అనులోమవిలోమకందం (4-80)

ఇలాగే ఇంకో ప్రార్థనల ఘట్టంగా ఈ ఆ్వ్వాసంలోనే నిరోష్ట్య్రదండకం (4-145) వ్రాశారు. అయితే చిన్నయసూరి శాసనంవల్ల ఇందులో" ఓష్ట్యాలను ముద్రాపకులు చొప్పించారు. సూరిగారు బాలవ్యాకరణములో 'ఆగమాస్యచ కారంబుల కద్దారుక్తంబు లకు ముత్తు పరంబగునపుడు పవలగు' అని ఒక సూత్రం చెప్పారు (శ్రీయ. 88). ఈ సూత్రంవల్ల “ఘటించగా, నటించగా, క్రీడించగా, రక్షించగా' అనే క్రీయలలోని చకాగానికి వకారం వస్తుంది. చిన్నయసూరి శాసించారు గనుక పండితులు దాన్ని విరసావహించాలి. 'మొగ్రో నేను నిరోష్ట్రంకందం రాస్తున్నాను' అని కవి మొత్తుకున్నాసరే అతడు “హల్లకా స్రారిదారిక గ్రసించక్‌ హృసీకేశతాసక్తి రక్షించగంజానవాఖ్యం జగజ్వాత సృష్టిక్‌ ఘటించక, నటించక్‌' అని వ్రాసిన చోట్ల “గ్రసింపక్‌, రక్షింప౯, ఘటింప, రక్షింప, ఘటింప, నటింహ'ని పరిష్కర్తలు దిద్దిపారేశారు. ఈ దండకంలో పరిష్కర్తల పకారాలు చాలా అపకారాలు చేశాయి. చిత్రకవిత్వంలోని నియమాలు ఉల్లంఘిస్తు న్నప్పుడైనా తాము వ్యాకరణ దోషాలనుకొనేవాటిని పరిష్కర్తలు దిద్దకుండా ఉంటే బాగుండేది.

కావ్యంలోని పాత్రలు చేసి స్తవాలలో చిత్రకవిత్వాన్ని ప్రదర్శించడం తిమ్మన్నగారు తిరిగి మొదలుపెట్టాక చాలామంది దానిని అనుసరించారు. దామెర్ల అంకన్ను వీళ్లలో ఘనుడు. అయితే పుష్పగిరి తిమ్మనగారి స్తవాలలో కథ ఆగిపోయినట్టు కనబడదు.

పంచమాశ్వాసం: ఇందులో కపిలకాలకేయాది యుద్ధాలు, పంచ ముఖావతారం, శతకంఠరావణుని చంపడం, అయోధ్యాపురప్రవేశం, రాముని దినచర్య, అశ్వమేధ యాగం, అమృతం తెచ్చి భరత శత్రుఘ్నులను బ్రతికించడం మొదలైన కథలున్నాయి.

షష్టాశ్వాసం: ఇందులో హనుమంతుని మాహాత్మ్యాన్ని వర్ణించడం, తారకాసుర వధ, తుంబురు నారదుల వివాదం, గరుడగర్వభంగం, ఆంజనేయుని సంగీతవిద్యా ప్రావీణ్యం మొదలైన కథలున్నాయి. ఈ అశ్వాసంలో తిమ్మనగారు తమ సంగీత వైదుష్యాన్ని కనబరిచారు. 2. మలిరాయలయుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటం, ౩. _వావిళ్ళవారి సమీరకుమారవిజయం, పుట "22 |

576 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

సస్తమాశ్వాసం: ఇందులో అర్జున శరసేతుభంగం, సౌగంధికల కోసం వ్లో ఖీముని గర్వభంగం, పురుషామృగ ఆగమన మొదలైన కథలున్నాయి.

ఆంజనేయుని కథలన్నిటిని ఒకచోట చేర్చాలనే ఉద్దేశంతో బ్రాయడంవల్ల సమీరకుమారవిజయం సుదీర్హంగా అయింది. దీనిని వ్రాయడానికి ముందో, వ్రాశాకనో పుష్పగిరి తిమ్మనగారు భర్చృహరి సుభాషితాన్ని తెనిగించారు. ఆంజనేయ భక్తులైనా వాకికి శివపూజ ఇష్టమే. అందుకే శివాంఘిపూజలుగ సుభాషితాన్ని తెనిగించామని చెప్పారు.

ఈ యుగంలో సుభాషితాన్ని తిమ్మనగారే కాక ఎలకూచి బాలసరస్వతి కూడా తెనిగించాడు. అయితే ఇద్దరి అనువాదాలకన్నా ఏనుగు లక్ష్మణకవి తెనిగింపే ఇంపుగా ఉందని సాహిత్యలోకం దానినే ఆదరించింది. కాని ఏనుగు కవికి పూర్వకవులిద్ధరూ ఘంటాపథాన్ని ఏర్పరచారు. కొన్ని పద్యాల ఎత్తుగడలలో ఏనుగు లక్ష్మణకవి సరిగ్గా పుష్పగిరి తిమ్మనగారినే అనుసరించారు. 'యద్ధాత్రా నిజఫాలపట్ట లిఖితం' అనే సుభాషితాన్ని తిమ్మనగారు 'వనజ భవుండు మున్నాసట వ్రాసిన దెంతయు' అని తెనిగించారు. ఏనుగు లక్ష్మణకవి 'వనజభవుండు నెన్నొసట వ్రాసిన సొమ్ము అని ఎత్తుకొని తెనిగించాడు (నీతి 40). 'సుజనపద్దతి'లో *విపది ధైర్య మథాభ్యుదయే క్షమా' అనే సుభాషితాన్ని తిమ్మనగారు 'ఆపదలందు ధైర్యగుణ'మని తెనిగిస్తే ఏనుగు లక్ష్మణకవి తూడా సరిగ్గా '“ఆపదయందు ధైర్యగుణ'మని ఎత్తుకొన్నాడు. నిజానికి కొన్ని సుభాషితాలు తిమ్మనగారు వ్రాసినవే బాగున్నాయి. “సర్వే గుణాః కాంచన మాశ్ర యంతి

వాడె కులీను డుత్తముడు వాడె రసజ్ఞుడు వాడె యార్యుడుక౯

వాడె బహుశ్రుతుండు మతీ వాడె గుణాడ్యుడు వాడె వక్టయుక్‌

వాడె సురూపి యంచు ధనవంతుని నందలు నెంతు రెంతయు౯

బోడిమిగాన సర్వగుణముల్‌ గనకాశ్రయభూతముల్లదా (నీతిశతకము 2)

సర్వగుణాలూ కాంచనాన్ని ఆశ్రయించినా తిమ్మనగారు దానినెప్పుడూ ఆశ్రయించలేదు. తన కావ్యాలు నరాంకితం చేయలేదు. ఏ రాజుకు శృతి ఇచ్చినా ఆయనకు డబ్బుకేం లోటు వచ్చేది కాదు. అయినా ఆయన నరాంకితంకన్నా దారిద్రృమే మేలని భావించారు. ఆయనకు గంపెడు సంతానమున్నట్టుంది. ఆడపిల్లల పెళ్ళి కష్టాలు ఆయనకు తిలిసినంత మరొకళ్ళకు తెలియవేమో. సమీరకుమారవిజయంలో అంజనాదేవికి పెళ్ళి చేయాలనే తాపత్రయంతో గౌతముడు పడే ఆవేదన వారు బాగా చిత్రించారు. ఆడపిల్లల తండ్రి కష్టాన్ని ఇలా చెప్పారు:

వరుని పాలింతె యేపాటి వేడుకయంచు బుట్టినప్పుడె పుట్టు బెట్టగు నెగు

లింతయై యంతయ్రై యెదుగగానే యెవ్వ డొడయుడో దీని కం చడరు జాలి

యనువైనచో నిచ్చి యత్తవా రేలాగు నడిపింతురో యంచు బొడమునడలు

మగడు లాలనసేయ మట్టుమీరి కుమారి యెటులగునో యంచునెనయువనట

పువ్చగిరి తిమ్మన అతని కవిమిత్రులు 577

యప్పటప్పటి కరిగి మేలరయకున్న

వెచ్చ నూర్చునొ సుత యంచు జింత

కన్యకను గాంచుటెల్ల దుఃఖంబు కొరకె

మానశాలికి ఓ తల్లి మాటలేల? (సమీర. 2-5)

పుష్పగిరి తిమ్మునగారు మానశాలేః “కుమారికన్‌ దగినవేళ యొసంగకయున్న తండ్రీకిం జూల దురంతచింత యగు' అని వారికి తెలుసు (2-4). అందుకే ఆడపిల్ల పెళ్ళికోసం అప్పు చేసినట్టున్నారు. సాధారణంగా చేసిన అప్పులే తీర్చడం కష్టం. పెళ్ళికి తీర్చలేక దేవతలమీద భారం వేశారు. ఆయన జన్మించిన ములికినాడులో (కడప, అనంతపురం ప్రాంతాలు) చిత్రావతి అనే చిన్న నది ఉంది. దీనికి తుశావతి అనే ఉపనది ఉంది. ఈ నది యొడ్డున ఎక్కడో నుగంధిపురం అనేటి ఉండాలి. ఆ గ్రామంలో తిరువడంబ అనే పేరిట పార్వతీదేవి ఉంది. పెళ్ళికోసం చేసిన అప్పుల బాధ తీర్చమని పుష్పగిరి తిమ్మనగారు ఆ దేవత నిలా ప్రార్థించారు :

కంబు లొనగూర్చు నుదకంబు గల శ్రీకుశాన దింబరిఘగగొనిస్థలంబులమహాళ్లా

ఘ్యంబగు సుగంధినగరంబున గజేశసహితంబుగను జేరి వితతంబగు దయాశీ

లంబున జెలంగెడు నిను బొగడితిం బరిణయంబునకు దీసిన రుణం బుడుపవే హే

రంబజననీ తిరువడాంబ। ముఖరమ్య శి బింబ! ప్రషితాశ్రితకదంబ జగదంబా!

(నెం. 50)

ఈ వృత్తంలో చెప్పిన కుశానది హిందూపురం తాలూకాలోని కుశావతి అని నేను గుర్తించాను. అక్కడ సుగంధిపురం ఏదైనా ఉందేమో స్థలజ్ఞులు చెప్పాలి. ఇది దేశ్యానికి తత్సమీకరణ కావచ్చును. కుశానదీ. సుగంధిపురాలెక్కడ ఉన్నాయో, అవి ఉన్నచోట గణపతితో కూడుకున్న తిరువడాంబ దేవాలయం ఉందో లేదో ఇంకా పరిళోధించాలి. ఈ దేవతపై పుష్పగిరి తిమ్మనగారు ఒక శతకం చెప్పినట్టు మరొత వృత్తం వల్ల తెలుస్తోంది.

ఈ తిరువడాంబ శతకంలోని 50 పద్యాలు మాత్రమే నేడు లఖిస్తున్నవి. దీని గురించి మొట్టమేదట _ మిత్రులు విద్వాన్‌ నవులూరి మాలెకొండయ్యగారి వ్యాసంవల్ల తెలుసుకొన్నానుల వారు ఈ అర్థశతకాన్నే కాక తిమ్మనగారి మరికొన్ని రచనలను కూడ పుష్పగిరివారి కుటుంబం నుంచి సంపాదించి నాకు పంపించారు. ఈ తోడ్చాటువలననే తిమ్మనగారపై విపులమైన పరిశోధనకు ఆస్కారం కల్గింది. తిరువడాంబ శతకంలో “ఇక్కాలంబున వదాన్యుడొకడుం బలుకడని తిమ్మనగారు నిరుత్సాహపడినా ఆయనను మిత్రులు మరచిపోలేదు. వారితోపాటు చదువుకున్న టేకుమళ్ళ రంగశాయి, కంకంటి 4. అనంతపురం జిల్లా హిందూపురం తాలూకాలో ఉంది. చూ* విజ్ఞానసర్వస్వం (భాషాసమితి), 4న

సంపుటి, పుట 1347.

క. మీంగ80ం60జ 1% 01 ౮మొంజి - స436 కారణం, 1924 అనే సంచికలో సుగంధిపురం లేదు. 6. విక్రమసింహపురిమండల సర్వస్వం, పుట 230

578 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పాపరాజుగారు అనే స్నేహితులు వారిని ఆదుకొన్నట్టుంది. అనంతపురం జిల్లాలోనే ములికినాటగాని, _పౌత్తపినాటగాని ఉందేమో పరిశోధించాలి. హిందూపురం తాలూకాలో టేకులేడు అనే ఊరు ఉంది.

ఈ ఇంటిపేర్లు ఎలా వచ్చినా కంకంటి. పాపరాజుగారు మాత్రం క్రీశ 1610 ప్రాంతాలలో నెల్లూరు జిల్లా గూడూరు తాలూకాలోని దుగరాజపట్నంలో చేరారు. అప్పుడప్పుడే మన దేశానికి డచ్చివారు వ్యాపారం కోసం వస్తున్నారు. డచ్చివారి తరువాత ఇంగ్లీషువారు అక్కడ నెలకొన్నారు. ఈ పరదేశీయులకు దుబాసీలు అవసరం అయ్యారు. పాపరాజుగారు విదేశీయులతో సంబంధాలు పెట్టుకొని బాగా శ్రీమంతులైనట్టుంది. ఆయన తన స్నేహితుణ్జి రప్పించుకొని తన వద్ద పెట్టుకొని తన రచనావ్యాసంగంలో వారి సలహాలు తీసుకొని ఉంటాడు. ఉత్తర రామాయణంలో చాలా పద్యాలు తిమ్మనగారి సహాయంవల్లనే నడిచి ఉంటాయి. అందుకే రుణం తీర్చుకొనడానికి గాను తిమ్మనగారు ఉత్తర రామాయణం వ్రాసి పాపరాజుగారి పేరు పెట్టారనే వదంతి పుట్టింది. ఇది నిరాధారమైనదని కందుకూరి వీరేశలింగంగారు అన్నారు. “పాపరాజుగారి కవిత్వమునకు బుష్పగిరి తిమ్మన కవిత్వమునకు భేదమున్నందున ఈ యపవాదము సరిర్దైనదిగా నుండదు” అని వ్రాశారు.” వీరేశలింగంగారి రచన చదివిన అనంతర పరిశోధకులంతా అలాగే భావించారు. _

“సమీరకుమారవిజయ శ్రైలికిని, ఉత్తరరామాయణ శ్రైలికిని విశేషభేదమున్నదనియు నందుచే నా యుభయ గ్రంథకర్తలు నొక్కరు గారనియు బండితు లఖిప్రాయము నిచ్చియున్నారు. ఈ రెండు గ్రంథములు విమర్శనాపూర్వకముగా జదివినవారిట్లే తలచెదరు” అని చాగంటి శేషయ్యగారు బవ్రాశారుక్‌ అయితీ వారు విమర్శనాపూర్వకముగా ఆ రెండూ చదువలేదని చెప్పడానికి విచారిస్తున్నాను. రెండింటిని ఉత్తరరామాయణంలో తిమ్మనగారి కవిత్వం ముప్పాతికపాలైనా ఉందిగాని లేకపోలేదు అని చెప్పారు రెండింటి వైలికీ భేదమున్నా కొన్ని పద్యాలు యథాతథంగా ఉన్నాయి. రెండింటిలోనూ సరిసమానమే.

ఈ రెండు గ్రంథాల నుంచీ పది పోలికలను మద్దులపల్లివారు చూపించారు. నేను మరో పది గుర్తించాను. వీటన్నిటినీ ఒక పట్టికలో చూపిస్తున్నాను. చూడండి.

7: అంధ్రకవుల చరిత్ర మూడవభాగం పుట$॥. $. అంధ్రకవితరంగణి, 12వ భాగం, పుట 70. 9. _వావిళ్ళవారి సమీరకుమారవిజయం, ఉపోద్దాతం, పుట 15.

వుష్పగిరి తిమ్మన్న, అతని కవిమిత్రులు 579 స్నేహితుల రచనలలో పోలికలు న గారి సమీరకుమారవిజయం | పాపరాజుగారి ఉత్తరరావమాయణం

  1. చక్రసంయుక్తి చక్రీవేషంబు బోలి కేతుస్థితిం గరమొప్పా రుకున బ్రమున్‌ __ కేతువిస్ఫూర్తి .. (1-6) బొరసి చ క్రస్ఫూర్తి వర్ధిల్లుటన్‌ (1-18) ఒ పురిఖేయంబు పయోనిధింగని (1-౫8) | పరిఖేయంబుపయోనిధింగని (యథాతథంగా సాంతం ఉంది) (1-89)
  2. వెనదన్నితివో ప్రసవించెనళోకంబు గోరంట నెదనుంచి కొమ్మయళోకంబు (సాంతంపోలికలు) (1-12) తన్ని (అడుగడుగునా సమీరవిజయంలోని పద్యాన్ని జ్ఞాపకం చేస్తుంది) (6-3)
  3. నేప్రయత్నంబుచేసి ఈ యిందువదన నే ప్రయత్నంబుసేసి యన్నైలంతకన్ను సృజనసేయుట (1-1౫) గవముక్కు (5-౫8) క. మొదట రగడలోకాక సీసపద్యంలో సీసంలో పుష్పాచయం (1-12) పుష్పాపచయం చేయడం (2-16) _
  4. తరుణిరో ఈ సదాగతి సదా సదాగతియ సదాగతియని గతిగామదినుంచి (2-81) యుగ్రతపంబొనరించె (5-91) 7, ఒంటిజందెమువాని నొరపుంచు నెరమించు మంజురుచి పుంజిగానుహోన్నుమౌంబి _. మరపించు బంగారుమౌంబీి వాని మంచి వాని బసిమి గనుపట్టు నును బట్టు మదివాని గ్రొంబట్టు పంచెవాని (2-118) | పంచెవాని ౯ (5-85)
  5. ఈతడు సర్వలోకహితుడు (2-7) | జగదుపకారి ఈ ప్లవగచంద్రుడు " (5-10) €. వేడిమి చూపకుండెనెనరుక్‌ (2-13) భానుడుక€ వేడిమిచూపడయ్యె (5-10%) జంభాఖియాతికసలి (2-157) దెరలజంభారికనలి (56-110)
  6. సరస్వతీ లతాంగి స్తనపద్యకో పలుకువెలందితళుకుబెక్కుల రక మృగీమద పత్ర విచిత్ర విచిత్రపత్రముల బ్రాయనేర్చినపాజి లేఖన ప్రస్తుత హస్తపద్మమున నవిలసుతు నెమ్మేను నిమిరిన (5-22) స్పర్శ మొనర్చిన... (2-17)
  7. ననలకైనిక్కు గ్రన్నన నీవిసడ నిగిడి నిక్కిన జారు నీవి కనాను లిన.... (సాంతంపోలికలున్నాయి) (2-19) నాన (సాంతం పోలికలున్నాయి) (8-౫)
  8. మున్‌బలినర్థించి త్రివిక్రమ స్ఫురణ జూపం మును హరి త్రివిక్రమాకృతిగనిపిం బూను విష్ణుండను బలె (2-217) చినయటుల (56-139)
  9. భానుండద్భుతచిత్తుడెసలిక భానుండద్భుతమందేనంత (5-137) (ఎత్తుగడపోలిక) (2-22)
  10. కొప్పాకచేతబట్టి తళుకు[నును కొప్పాకచేతపట్టి మదిళోరికలీరిక చెక్కిలి నొక్కిజేనియల్‌ చిప్పలు లెత్త దేనియల్‌ చిప్పిలు మైోవిగ్రోలి (4-1౫) మోవిపంట (3-26)
  11. ఆహారము ఖావిబీత న్థరాహార్తము (5-85) | అహారములోకైకమనుహారము (65-306)
  12. చెలువొందు నొకవేళ శ్రీరుక్కి శ్రీరుక్కిణీముకరికలు చెక్కుల 1-44 కుచద్రసవమంజరులపై భ్రమరలీల (68-113) చెక్కుల బ్రాసి. (1౧4)
  13. గవునెనల్‌సడలించి కవవీజెలూని (6-20) | గవిసెనతీసి హోన్నూ జిగకాయలు (68-134
  14. స్వరసందర్భ మయారె। మేల్‌ శ్రుతులు స్వరములయారె। మేలుశ్రుతిదాగురె (6-15) (సాంతం) (6-20)
  15. ఖానుతేజుండవని ప్రస్తుతించెదమన్న శ్రోవంబునె భాస్కరుమ్రింగె నితని పుట్టినప్పుడె భాను పట్టినావు _ చేజమున కేఘనుడింక సదృశుడనుచు (1- (సాంతం) (8-22)

580 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఇన్ని పోలికలున్నాక ఉత్తరరామాయణ రచనలో ప్రధాన పాత్ర తిమ్మనగారిదే అని చెప్పక తప్పదు. శారి రథం ఎలా నడిపిస్తే కిరీటి అక్కడకు వెళ్ళాడు. ఎక్కడ గురిచూడమంటే అక్కడ విల్లెక్కు పెట్టాడు. అందుకే పాపరాజుగారంత కృతజ్ఞత చెప్పుకున్నారు. తిమ్మనగారు వారికి బుణపడ్డారో లేదోగాని పాపరాజుగారే చాలా బాకీపడ్డారు. ఇదెప్పటికీ తీరని బాకీ. పాపరాజుగారు తమ మిత్రుణ్ణి ఆదుకున్నటే టేకుమళ్ళ రంగశాయి తూడా తిమ్మనగారిని పిలిపించి వారి సహాయంతో భాగవతాన్ని ద్విపదగా వ్రాశాడు. ఈ రచనలో పుష్పగిరివారి పాలు ఎంత ఉందో తెలియదుగాని తిమ్మనగారు. భాగవతసారం అనే గ్రంథాన్ని వచనంగా స్వయంగా బ్రాసినట్టు పరిశోధకులు ఊహిస్తున్నారు. మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో భాగవత సారమనే ఐదు స్కంధాల వచన గ్రంథం ఉంది. ద్వితీయం నుండి షష్టస్కంధం దాకా మాత్రమే ఉంది. (౧. 1437. గంథాంతాన 'ఇది శ్రీమహాభాగవత మహాపురాణకవి తిమ్మనార్యుడు లోకోపకారముగా రచించిన వచనకావ్యం అని ఉంది. ఈ తిమ్మనార్యుడు పుష్పగిరి తిమ్మనగారే అని ప్రాచ్యలిఖిత గ్రంథాలయ పండితులు భావించారు.ఃీ అరవంలో తూడా ఒక భాగవతం ఉంది. దానిని పుష్పగిరి తిమ్మనగారి రచనను అనుసరించి బ్రాశానని తమిళ రచయిత ఇలా చెప్పాడు: “ఇంద పని రెండు స్కందంగళుం విష్ణుపియ తిలుంగిలె పుష్పగిరి తిమ్మయప్పన్‌ యెళిదినదై పారై యివ్వారే వాద్యార్‌ చిన్నయన్‌ తమిళవచనత్తినాల్‌ యెళిదినార్‌' అని తమిళ గ్రంథంలో ఉంది. (తమిళ కేటలాగు. 432)

తెలుగు భాగవతసారం రచన చాలా సరళంగా ఉంది. ““వింటిరా మునులాగ సంసార మగ్నులకు ఈ తత్వము తెలియగూడదు. పశు శిశు భార్యాదుల మీది మోహము చేత కాలము క్రమించి కడపట చత్తురు. కాల మహిమ కనియు గానలేరు. విష్ణుతత్వము వినియు వినలేరు” అని సూతుడు చెప్పారు. ఈ భావాలకు, సమీరకుమవూరవిజయంలోని ఈ పద్యానికి పోలిక చూడండి:

చనియెడువేళ భోజనము సల్చెడువేళ శయనించువేళ లే

చినయెడ కామినీరతి వసించినవేళ కృతాంతు డీజగ

జ్ఞగముల వెంబడి౯ విడువజాలక ద్రిమ్మరుచున్కి నిచ్చలో

గనుగొనలేక లోకు లధికస్పృహ మాన రదేమొ మేనిపైః (సమీర, 4-10)

తమిళ రచయిత తిమ్మనగారి పన్నెండు స్కంధాలనూ చూసి వ్రాశానన్నాడు. ఈ గ్రంథం అంతా దొరక్కపోవడం దురదృష్టం. చక్కని వ్యావహారికంలో సాగిన ఈ రచన దొరికినంతమట్టుకేనా అచ్చుపడాలి. 'మాతండ్రి వ్యాసులు భాగవతము నిర్మించి నాచే అదివించెను. నేనున్నూ హరిగుణములకు లోనై చదివితిని అని శుకయోగి వాడుక ఖాషలో చెప్పాడు. ఎవైనా ఈ శైలికి లోనై అచ్చువేస్తే బాగుండును.

నెల్లూరు మండలానికి వచ్చాక పుష్పగిరి తిమ్మనగారు తిరుపతికి వెళ్ళినట్టు కనబడుతుంది. శేష్టాలవిహార శతకాన్ని వారు చెప్పారు. క్షేత్రయ్య ఏ ఊరు వెళ్ళి ఏ

పుష్పగిరి తిమ్మన్న, అతని కవిమిత్రులు 681 దేవునిమీద పదం చెప్పినా మువ్వగోపాలుణ్జి తలచుకొన్నట్టు తిమ్మనగారు హనుమంతుణ్ణి మరచిపోలేదు. వెంకటేశ్చరునిపై ఇలా చెప్పారు!

శాంతుని మతిమంతుని హను-మంతుని నీబంటునెంతు మన్నింపుదృఢ

స్వాంతతపశ్చింతిత పద-సంతత గంఖీరశేష్టైలవిహారా. (నెం.556) ఈ శతకంలో అన్నీ ఏరిన పువ్వులే అని తిమ్మనగారే ఇలా చెప్పారు!

ఏర్చిన వాక్కుసుమములు నొ-నర్చిన నీయర్చనంబునను విభవకళా

వర్చస్విబేయుమినజా- చర్చితాపాటీరశేష్రైలవిహారా. (నెం.584)

ఇందులో సౌంత బాధలు అట్టే చెప్పుకోలేదు. 'నా తలపులు, నాయలపులు నీతో వివరింపనేల నీకే తెలియు౯* అని చెప్పారు (నెం.104). అయితే బావురుమని తన బాధలన్నీ దేవునితో చెప్పుకోవలసిన అవసరం తిమ్మనగారికి వచ్చింది. స్నేహితుల నహాయం ఆగినట్టుంది. ముసలితనం వచ్చింది. '“రఘునాథా సాధుమేధానిధీ' అని ఒక శతకం వ్రాసి గోడు వెళ్ళబోసుకొన్నారు.

తిరిగే ఓపికలేని ఈ వయసులో లేమివల్ల అడ్డమైన వాళ్ళనీ నుతించవలసి వస్తోంది. ఆ బాధ ఇలా చెప్పుకొన్నారు:

దారిద్ర్రంబు ఘటించి తద్‌వ్యథలచే దైన్యంబు గల్పించి సం

సారభ్రాంతి దనప్రమత్తుల నుతించంజేసి యాశాగతుల్‌

మీరం జిక్కుల బెట్టె దేమిటికి స్వామీ నన్‌ కనద్వాక్సుధా

ధారాయూధ యనాథనాథ రఘునాధా సాధుమేధానిధి. (నెం. 59) నరులను కొలిస్తే కోరికలు తీరుస్తారు; నువ్వెందుకు కనికరించవు అని దేవుణ్ణి ఇలాగ నిలబెట్టి అడుగుతున్నారు.

అవురా యొక్క ధనాఢ్యు గొల్పిన నభీష్టార్ధంబు లిప్పించి నా

సవిధస్థుండని పక్షముంచి మనుచు; సర్వేశు నిళ గొల్చి నీ

కవినై నీకృతులే యొనర్చి పాగడంగా పల్కవేమయ్య! భ

క్తవనీరాధ యనాథనాథ రఘునాథా సాధుమేధానిధీ. (నెం.6)

ఈ శతకంలోని పద్యాలను చూస్తే తిమ్మనగారు అవసానకాలంలో దుర్చరమైైన దరిద్రం అనుభవించినట్టు కనబడుతుంది. ఆయన ఏయే ఊళ్ళలో జీవితం గడిపారో గాని చివరతు నెల్లూరు జబీల్లా కోవూరు తాలూకాలో స్థిరపడ్డారు. చివరికీ తిమ్మనగారి వంశస్థులు వున్నారు. వారిచ్చిన వంశత్రమంవల్ల .తిమ్మనగారి నుండి నేటికి అక్కడే 8 పురుషాంతరాలు కనబడుతున్నాయి. ఆ వంశవృక్షాన్ని పొందుపరుస్తున్నాను. చూడండీ.

(ఈ వంశవృక్షంలో 8వ తరంలోని శ్రీ వెంకటకృష్ణయ్యగారు చిరంజీవులు. వ్యాకరణవిద్యాప్రవీణులు. ప్రస్తుతం నెల్లూరు మూలపిటలో వేదసంస్కృత కళాశాలలో ఉన్నారు. వీరు దక్షిణామూర్తిగారికి 35వ ఏట జన్మించారు. ఈ వంశావళిలో తరానికి 40

582 నమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సంవత్సరాల చొప్పున లెక్క పెట్టడం సనుంజసమే అని తోస్తుంది. ఆ లెక్కన తిమ్మయ్యగారు క్రీ.శ 1592లో జన్మించి ఉంటారని భావించవచ్చు.) పుష్పగిరి తిమ్మన గారి వంశవృక్షం తరం అప్పన భార్మ ఓబళాంబ [నన లలల

  1. వెంకటకృష్ణయ్య వెంకటకవి తిమ్మన్న (నిస్సంతు) (నిన్సంతు) 2 లక్ష్మీపతి | వె వెంతటాచలమయ్య | 4 అప్పయ్య | క. లక్షీఫ్రతి నానన ననన
  2. వెంకటకృష్ణయ్య. వెంకటూాచలమయ్య రామయ్య సుబ్బయ్య ?-1906 మరణం పురుషసంతతి లేదు పురుష సంతతి (నిస్సంతు) ట్రీ.శ.1946-19038 లేదు (% సంవత్సరాలు) టం!
  3. దక్షిణామూర్తి సీతారామయ్య శంకరయ్య శ్రీ.శ.1877-1947 (పురుషసంతతి లేదు) ట్రహ్మదారి గాలం వలను
  4. వెంకటకృష్ణయ్య జననం: 16-7- 1912 వేరే చారిత్రక ఆధారాలవల్ల తిమ్మన గారి రచనా కాలం క్రీ.శ1630 అని కచ్చితంగా నిర్ణయించవచ్చును. ఆయన కంకంటి పాపరాజుగారి సహశ్రోత అనే సంగతి సంవత్సర పుష్య బహుళ ఏకాదశీలు మందవారం వరకు” బ్రాసుకొన్నాడు (0.9). ఇది శ్రీశ 1632 జనవరి 6వ తేదీ శనివారం అయింది. అంటే ఉత్తరరామాయణ రచన కనీసం 16౦కి పూర్వం అయి ఉండాలి. కంకంటి పాపరాజుగారూ. వారి సహశ్రోత నికరంగా చెప్పవచ్చు.*డే ఈ కవిమిత్రులలో మిగిలినవారిని గురించి తెలుసుకుందాం.
  5. ఈ కాలనిర్ణయాన్ని చేయడానికి ఆధారాలను మిత్రులు యస్వీ జోగారావుగారు తొలిసారి గుర్తించారు. ఆంధ్రపట్రిక సారస్వతానుబంధం, ఆదివారం, 7-8-1955.

పుష్పగిరి తిమ్మన్న; అతని కవిమిత్రులు 583

  1. కంకంటి పాపరాజు : ఈయన రాజనీతి గణిత శాస్ర్తాలు బాగా చదువుకొన్నాడు. తను గణితశాస్త్ర రత్నాకరుణ్ణని గద్యలో చెప్పుకొన్నాడు. రాజయోగి, మదనగోపాల భక్తుడు. అతని దయవల్ల కలిగిన కవిత్వసాహిత్యశాలి. గోపాలుని భత్తుడు కనుక ఆ దేవుజ్ణీ ప్రస్తుతించే గ్రంథాలు ఇష్టపడి చదివాడు. చింతపూడి ఎల్లన్ను వ్రాసిన రాధామాధవం, విష్ణమాయా నాటకాలను చదివి సంతోషించి ఉంటాడు. ఎల్లన్నగారు నాటకం అని పేరు పెట్టినా ప్రబంధమే వ్రాశారు. ఆ కథను ఎందుకు యక్షగానంగా మార్చకూడదు అనే ఉద్దేశం పాపరాజుగారికి కల్లినట్టుంది. వెంటనే విష్ణుమాయావిలాసం బ్రాయాలనుకొన్నారు. పుష్పగిరి తిమ్మన్న వంటి హితకావ్యా ఘటనావిముఖులకు చెప్పారు. వాళ్ళు ఆ యక్షగానం వ్రాసి "భక్తి గృతి నిమ్ము మదనగోపాలునకు సద్దుణనిధాన పాపరాజ ప్రధాన! అన్నారు. ఆయన అలాగే చేశాడు.

ఈ యక్షగానాన్ని పాపరాజుగారు 1600 ప్రాంతాలలోగాని, అంతకుముందుగాని వ్రాసి ఉండవచ్చు. రచనా ప్రక్రియ చూస్తి ప్రాచీనత కనబడుతుంది. కందుకూరి రుద్రకవి సుగ్రీవవిజయంలాగ పాత పద్ధతిలోనే నడుస్తుంది. ఇందులో విష్ణుమూర్తి మోహినీవేషంలో

మగతనంబున నుండి జగముల-మరులుగొల్బెడు వన్నై కానిని

మగువతనముల భ్రమలపెట్టుట- మరియు నరుదా!

నలువనేర్చున సృజనచేసిన - చెలువలకు బుధులెల్ల భ్రమయగ

నలువ తండ్రియె చెలువర్చైడే-వలచుటెంత? (విష్ణమాయానాటకం, పుట 6)

ఈ యక్షగానాన్ని 1955లో వావిళ్ళవారు ప్రకటించారు. నేలటూరి వెంకట రమణయ్యగారు. సుదీర్రమైన ఉపోద్దాతం వ్రాశారు. చాలా చారిత్రక విషయాలను చర్చించారు. దీని ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ యక్షగానాన్ని బ్రాశాక పాపరాజుగారు ఉత్తర రామాయణాన్ని తెనిగించాలని అనుకొన్నారు. మన సాహిత్యంలో తిక్కనగారంతటి మహాకవి నిర్వచనంగా దీనిని వ్రాశారు. మళ్ళీ అదే కావ్యాన్ని బ్రాద్దామనుకోవడం సాహసమే. అయినా పాపరాజుగారు ఇలా జవాబు చెప్పారు:

వరుసం దిక్కనయజబ్బు నిర్వచనకావ్యంటై తగం జేసెను

త్తరరామాయణ మందుక౯ మరి ప్రబంధంబూని నిర్మించుటే

సరసత్వంబని ప్రాజ్ఞులార నిరసింపంబోకుడీ రాఘవే

శ్వరు చారిత్రము నెంద రెన్నిగతులక వర్ణించినం గ్రాలదే? (ఉత్తర. 1-14)

తిక్కనగారు చివరలో వదలిపెట్టిన భాగాలను కూడా పాపరాజుగారు తెనిగించారు. “మృదువచోధారార్థ సందర్చ నిర్బరతత్తద్రసముల్‌ రహింహ' ఇది రచింపబూనారు (1-13). పుష్పగిరి తిమ్మనగారి సహాయంతో తుదముట్టా రచించారు. కొంతమంది సాహితీపరుల దృష్టికి తిక్కనగారి ఉత్తరరామాయణం కన్నా పాపరాజుగారిదే చాలా బాగుంటుంది.-ఆ మాటకొస్తే వాల్మీకికన్నా కొన్ని ఘట్టాలలో పాపరాజుగారే మిన్న అనేవాళ్ళు ఉన్నారు.!కి

హనుమదచ్చాస్త్రిగారు పాపరాజుగారి పాగసులు చూపించారు.

ర్‌ఢిశీ సమభ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సీతమ్మను అడవులలో వదలిపెడుతున్నప్పుడు లక్ష్మణుడు వాల్మీకి ఆశ్రమాన్ని చూపించి “పుణ్యంచ రమణీయంచ మా విషాదం కృధాః శుభే" అంటాడు, ఇది అస్పభావికం అని పాపరాజుగారి లక్ష్మణుడు “మితిలేని యీ మిడిమేలంపు మొకముల బలగమే జననినీక్సు” అని ఏడుస్తున్నాడు (6-273). అసలు పాపరాజుగారి లక్ష్మణుడు ఆ వార్త చెప్పడానికి నోరు 'తెరవలేకపోతాడు. “నన్ను శపించు” అని కాళ్ళమీద పడి ఏడుస్తాడు. పెదవులు తడుపుకొంటాడు. మహనీయుడు ఇంతటి దీనావస్థలో ఉండడం జానకి చేశావా? అంటుంది. 'అన్నపై ఉన్న భక్తి తొలగిందా?” అంటుంది.

గురునింద యాచించితో-పరదూషణ చేసితో కృపారహితుడవై

శరణన్నవారిద్రోచితో- యరులకు వెన్నిచ్చి వేగ యరుదెంచితో (ఉత్తర. 6-261) సరిగ్గా ఇలాగే ధర్మరాజు తూడా అర్జునుణ్ణి ప్రన్నించాడు. కృష్ణ నిర్యాణం చెప్పలేక కన్నీళ్ళు పెట్టుకొన్న తమ్ముణ్జీ చూసి ధర్మరాజు వరసపెట్టి ప్రశ్నలు కురిపించాడు. (భాగవతం. 1-352, 354)

బమ్మెర పోతరాజుగారంత ఆవేశంతోనూ కంకంటి పాపరాజుగారు రచన చేస్తారు. అందుకే వెంటనే వారి పద్యాలు హృదయానికి హత్తుకుంటాయి. తిక్కనగారి కవిత్వం కన్నా పసందుగా ఉందనిపిస్తుంది. తిక్కనగారు ఒక మాట చెప్తే మనం పది ఊహించుకోవాలి. పాపరాజుగారు పది మనం ఊహించుకోమంటే పన్నెండు పదమూడు చెప్పేస్తారు. కొన్ని దృశ్యాలు చక్కగా చూపెడతారు. లక్ష్మణుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతడు మళ్ళీ వస్తాడేవెశా అని సీతమ్మ ఆ త్రోవనే చూస్తూ నిలబడిపోయింది. ఇక్కడ పాపరాజుగారు రెండు గొప్ప పద్యాలు వ్రాశారు.

రమణీ మరికొంత వడిదాక రథము జూచు _. దరుణి మరికొంతసేపు కేతనము జూచు

గాంత మరి మీద రథపరాగంబు జూచు

బడతి మరి యంతటను పట్టి బయలుసూచు

చూచి చూచి చొక్కి స్రుక్కి తాలిమిదక్కి

పగల బొగిలి యూర్చు నెగల నొగిలి

దిగులు దిగులు గుంది పగజెంది బెగడొంది

యలసి సొలసి మూర్చలొలసి తెలిసె. (ఉత్తర. 6,299-30) మూర్చతీరాక తాను అడవులకు వెడతానంటే రాముడు ఒప్పుకొనడాన్ని తలచుకొంటుంది. “కోరిన పనికియ్యకొనుటది కరుణా ప్రబంధమ్మునకు ఫల గ్రంథమేమొ' అని విలపిస్తుంది. పాపరాజుగారి సీతమ్మ నిజంగా కరుణా ప్రబంధమే. ఈ ఘట్టంలో వీరిని ఇంత మెచ్చుకొన్నా వేరే చోట్ల హర్షించలేం. రావణాసురుడు రంభను బలాత్కారం చేస్తాడు. అ సందర్బంలో తిక్కనగారు 'అనంగాక్రీడా సంగతి నెంగిలి కావించె' అని మర్యాదగా అన్నారు (ని. 6-74). పాపరాజుగారు అలా పోనిస్తారా?

పుష్పగిరి తిమ్మన్న్య అతని కవిమిత్రులు ర్‌ఠిర్‌ కుసుమమంజరు లన మించు గుబ్బచన్ను లగడువడ బిట్టు కరముల నలమియలమి నీవి సడలించు బడలించె నెలత నపుడు కఠినరతుల నలంచె రాక్షసవిభుడు. (ఉత్తర. 4-217) అప్పుడప్పుడే పచ్చి శృంగారాన్ని పదాలుగా పాడడం, బహిరంగంగా మెచ్చుకోవడం మొదలవుతోంది. తంజావూరి ప్రభావం ఉత్తరాదికి కూడా పాకసాగింది. ఇటువంటి పరిస్థితులలో ఏ కొద్దిమందో శృంగార ప్రబంధాలు బ్రాయకుండా విజ్ఞానసర్వస్వాలూ మొదలైనవి వ్రాస్తారు. అటువంటి అరుదైనవాళ్ళలో టేకుమళ్ళ రంగశాయి ఒకడు.

  1. టేకుమళ్ళ రంగశాయి: కంకంటి పాపరాజులాగే పుష్పగిరి తిమ్మనగారితో టేకుమళ్ళ రంగశాయి కలిసి చదువుకున్నాడు. ఆయన ధర్మపురి నివాసి. రామభద్రయ్యగారి నిష్యుడు. తిరువళ్ళూరు ప్రాంతంలో ఉన్నాడు. ఆ గ్రామంలో ఉండే దైవం వీరరాఘవస్వామి. ఆయనమీద రంగశాయి ఒక శతకం చెప్పాడు. కృష్ణరాజ దండకం ఒకటి విరచించాడు. పాపరాజుగారు విష్ణుమాయావిలాస నాటకం వ్రాస్తే ఇతడు జానకీ బ్రాయాలని అతనికి తోచింది. విద్యానిధేకాక తన సహశ్రోత అయిన పుష్పగిరి తిమ్మనగారి సహాయం తీసుకొని పన్నెండు స్కంధాలను బ్రాద్దామనుకొన్నాడు.

“వ్యాసప్రోక్స భాగవతము తూచార్దైన వదలిపోనీక' వ్రాసిన రసిక బమ్మెర పోతరాజుగారిని నుతించి రామాయణ భారతాలను ద్విపద కావ్యాలుగా వ్రాసిన రంగనాథుణ్ణీ,. చిట్టేపాటి తిరుమలభట్టుగారినీ స్తుతించి చారుకవిత్వ సుజ్ఞాన రహస్య సారజ్ఞుడైన తిమ్మనగారిని పిలిచి అతని సహాయత నతులోక్టియుక్తి చాతుర్యశాలియ్దై టేకుమళ్ళ రంగశాయి. భాగవతాన్ని ద్వాపదగా బ్రాశాడు. పుష్పగిరి తిమ్మనగారు ఈ రచనలో తోడ్పడ్డ సంగతి కవి గంథం అద్యంతాలలో స్పష్టంగా ప్రకటించాడు. పోతరాజుగారి గ్రంథాన్ని సరిగ్గా అనుసరించి రచించాడు. అతడు తుదముట్టా రచించినా ఈ ద్విపద భాగవతం నేడు పూర్తిగా దొరకడం లేదు. నాలుగు స్కంధాలు మాత్రమే లఖిస్తున్నాయి. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో దీని ప్రతి ఒకటి ఉంది. (౫.765)

రంగశాయి ద్విపదగా భాగవకాన్నే కాక వాజీవిలాస వనమాలిక అనే మరో గ్రంథాన్ని బ్రాశాడు. ఇది చాలా కొత్త తరహా రచన. వేదాలు, పురాణాలు, ఉపపురాణాలు, స్మృతులు, షడ్డర్శనాలు, శిక్ష. వ్యాకరణం, నిరుక్తం, ఆయుర్వేదం - ఒకటేమిటి? అన్నింటి సారాన్నీ సేకరించి ఒక విజ్ఞాన సర్వస్వాన్ని క్రోడీకరించాడు. 2574 గద్భ్యుపద్యాలను నాలుగాశ్వాసాలుగా వ్రాశాడు. ఇంకా చాలా గ్రంథం ఉండి ఉంటుంది. వేదశాఖా సూత్రకల్పాంగ సంఖ్యానంతో మొదలుపెట్టి వాస్తుశాస్త్రం దాకా వివరాలు సేకరించి దండ గుచ్చాడు. వనమాలలో అన్ని బుతువుల పుష్పాలూ ఉండాలంట. వనమాలా లక్షణం ఇలా ఉంటుంది.]ేకి 13. వాణీవిలాసవనమాలిక, మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయ ప్రచురణ, నెం.2౫8, పీఠిక పుట 22లో

ఉదాహరించారు.

566 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అజానులంబీనీ మాలా సర్వర్తు కుసుమోబ్ద్విలా

మధ్యస్తూలకదంబాడ్యా వనమాలేతి కథ్యతే.

ఈ గ్రంథంలో వనమాలా లక్షణాలు ఉన్నాయి. నైమిశారణ్యంలో పూసిన వివిధ పురాణపుష్పాలన్నీ ఇందులో సూతుడు గుచ్చాడు. శౌనకాది మహామునులు ఎన్నో పురాణాలు వేరువేరుగా విన్నారు. అందుకే వారు సూతుణ్ణీ ఇలా అడీగారు.

మున్ను పురాణార్థములే - వున్నవి యేవర్గురీతి నమరగసంక్షే

పోన్నతి విస్పష్టముగా - సన్నుతసారార్థమెల్ల జతురత జెపుమవూ (వాజీ. 1-5)

ఈ గ్రంథంలో రంగశాయి అన్నింటినీ వర్గీకరించి సంక్షేమంగా స్పష్టంగా చెప్పాడు. అయితే ఇతడు చెప్పుకొన్న సౌంత విషయాలలో కొంత అస్పష్టత ఉంది. వాణీవిలాస చనమాలిక టాద్దామనుకొన్నప్పుడు అతని బంధువులిలా అన్నారట.

ఉరుశుభనన్మతి౯ దిరువళూరిపురాధిప వీరరాఘవ

స్థిరశతకంబు కృష్ణగుణదీపితదండక మొప్పుజానకీ

పరిణయ యక్షగానమును భాగవత ద్విపద ప్రబంధము!

విరచన చేసినట్టు లిది వేడు నొనర్చుము రంగథీనిఢీ (వాజణీ.1-2౫)

ఈ పద్యం వల్ల అప్పటికే రంగశాయి భాగవత ద్వాపద ప్రబంధ రచన చేసినట్లు తెలుస్తూంది. దాని తరువాతనే వాణీవిలాస వనమాలిక వ్రాశాడనుకోవాలి. కాని భాగవత అవతారికలో ఇలా ఉందిః

సరసత రచియించి సకలశాస్త్రముల - వరసారములుగూర్చి వాణీవిలాస

వనమాలికాఖ్యకావ్యము నొనర్చితివి- జననుతుండవు రంగశాయి మంత్రీంద్ర. అవతారికలో ఇలా చెప్పుకొనడమే కాక ద్విపద భాగవతం గద్యలో తూడా ఈ గ్రంథాన్ని పేర్కొన్నాడు:

కళ్యాణమయశుభంకరవాసు పేరు - కల్యాణవెంకటాగనివాసు పేరు

అంకీతంబుగ తత్పదాంబుజధ్యాస - సంకీర్తనాదినిశ్చ లభక్తితత్త

వనజాతభాస్కరవాజీవిలాస - వనమాలికాకృతివరనిర్మాణ

బంధురశేముషీపాండిత్యసత్య- సంధానభాషా ప్రసంగ ప్రవీణ (2.765) ఇలా వాణీవిలాస వనమాలికను భాగవతంలోనూ, భాగవతాన్ని అందులోనూ పేర్కొనడం వల్ల ఏది ముందు వ్రాశాడో, ఏది తరువాత వ్రాశాడో తెలియదు. రెండూ భారీ ఎత్తు రచనలే. ఒకటి పన్నెండు స్కంధాల కావ్యం; రెండోది సకల శాస్త్రాల వరసారం. వీటిలో ఏది ముందు బ్రాశాడో తెలియదు. ద్వాపద భాగవత రచనతు పుష్పగిరి తిమ్మనగారు సహాయం చేసినట్టే వాణీవిలాస వనమాలికకతు తూడా ఇంకొక కవ తోడ్పడ్డారు. అతని పేరు మహంకాళి వెంకటపతి.

  1. మహంశాళి వెంకటపతి; మొట్టమొదట వాణీవిలాస వనమాలికను వ్రాయాలనే సంకల్పం రంగశాయికి కల్గినప్పుడు దేవుడు కలలో కనబడి “నా భత్తుడొకడు నీకు

పుష్పగిరి తిమ్మన్న, అతని కవిమిత్రులు 5కి” ఇందులో సాయపడతా'డని చెప్పాడు. “అగణిత సుగుణుండును ప్రబంధ కల్పనా ధురంధరుండును నగు మద్దా సుండొకరుండు సహాయుండుగా” ఉండే ఆ కృతిని దేవుడు తనకు అంకితం ఇమ్మన్నాడు.*ే ఈ కల సంగతి బంధువులకు చెప్తే వాళ్లు మహంకాళి వెంకటపతి సహాయం స్వీకరించమన్నారు. అతని గురించి ఇలా చెప్పారు:

వరకవి బహుశ్రుతుడు శేషగిరినివాస- భక్తుడు వివేకియు బహు ప్రబంధకర్త

విశదమతి శ్రీమహంకాళి వేంకటపతి-చెలిమికా డొట దగు కార్యసిద్ధి నీకు

(వాజీ. 1-28)

ఈ చెలిమికాడు చతుర్విధ రచనలు ఎరిగినవాడని, అతడు నీ కృతిని నిర్వహిస్తాడని చెప్పాడు. అతడు తుదముట్టా తోడ్పడి నిర్వహించాడు. రంగశాయి అందుకు కృతజ్ఞత చెప్పుకున్నాడు. గద్యలో ప్రతి ఆశ్వాసంలోనూ మొదట మహంకాళి వెంకటపతిని పేర్కొన్నాడు. వాణీ విలాస చనమాలికా గద్య ఇలా మొదలవుతుంది

“ఇది శ్రీమదలమేల్మంగా వేంకటేశ్వరవరప్రసాదకవితావిచిత్ర కుత్సగోత్ర పవిత్ర మహంకాళి అప్పకొండార్యపుత్రసకలకవిస్తోత్రపాత్ర వినయగుణసమేత వెంకటపతి సహాయటేకుమళ్ళ్లాన్నయ... రంగశాయి ప్రణీతంటైన వాణీవిలాసవనమాలిక'"

మహంకాళి వెంకటపతి బహుగ్రంథకర్త అని రంగశాయి చెప్పాడు. అయితే ఆయన బ్రాసిన కావ్యాల పేర్లు అయినా మనకు తెలియవు. అయితే టేకుమళ్ళ రంగశాయి నిజాయతీ ధర్మమా అని కనీసం ఇతని పేరైనా మనకు తెలిసింది. పుష్పగిరి తిమ్మనగారి సహశ్రోతలందరూ చిత్తశుద్ధి కలవారు. తమకు చేయూతనిచ్చినవారి పేరు మరువరు. వారి నహశ్రోతలే కాక సమకాలికులు కూడా అలాంటివారే. కంకంటి పాపరాజుగారి తమ్ముడు నరసింహరాజు కూడా తనకు తిమ్మనగారు తోడ్పడిన సంగతి విశదం చేశారు.

  1. కంకంటి నరసింహరాజు ; ఈయన సరసవిద్వత్కవి. జనులకు తాను శరణ్యుడనని చెప్పుకొన్నాడు. ఇతడు కలం పట్టుకునేనాటికి పాపరాజు మరణించాడు. అన్నగారు విష్ణమాయావిలాసం యక్షగానంగా రచించి పేరు పొందారు. ఆ యక్షగానంలో శివ గర్వభంగమే ఉంది. విష్ణమాయలు చాలా ఉన్నాయి. వాటినన్నింటినీ మలిరాయల యుగంలోని చింతపూడి ఎల్లన్న అయిదాశ్వాసాల ప్రబంధంగా రచించాడు.

. విష్ణమాయానాటకం అని పేరు పెట్టారు. అది చాలా రసవంతంగా ఉంటుంది. దానిని చదివిన నరసింహరాజుకు తాను కూడా అదే విషయాన్ని ద్విపదకావ్యుంగా వ్రాయాలని సంకల్పం కలిగింది. అయిడే ఎవరికి అంకీతం ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు అన్నగారు కలలో కనబడీ ఆ సమస్కును పరిష్కరించాడట.

అతులమౌ విష్ణమాయానాటకంబు- వితతవాగ్వైఖరి ద్విపద గావించి

యీ విశ్చహితకృతి కేవేల్చు నధిపు-గావింతు నని యాత్మ గణియించు నపుడు

దురితసరోరుహతుహినభానుండు- సరసుండు పాపరాజప్రధానుండు

నాకలలో నొక్కనాడు గాన్బించి-యేకతంబున గూర్మి నెనగ నిట్లనియె 14. వాణీవిలాసవనమాలిక, 1-17

588 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నాతూర్శిసోదర నరసింహ నీవు-చేకొని ద్వొాపదగా జేసినయట్టి అనుపమవిష్ణమాయానాటకమున- కనురూపవిభు డెవ్వడని తలంచెదవు దానికి విభుడు సీతామనోహరుడె-కాని తదన్యుడు కలడె లోకమున?

(విష్ణుమాయా, ద్విపద)*క కృతిపతిని వరించుకొన్నాక కంకంటి నరసింహం ఈ గ్రంథ రచనలో తనకు సహాయుడు కావాలని భావించాడు. అన్నగారి స్నేహితుజ్జే పిలిపించాడు.

అనముని పుష్ప గిర్యప్పన్నతనయు-ఘను సంస్కృతాంధైక కపనాతిదక్షు

మాయన్న సఖుని తిమ్మనకవి గృతిస-హాయుని విలిపించి యమ్మేటితోడ.

ద్విపద విష్ణమాయానాటకాన్ని కంకంటి నరసింహం రచించాడు. అయితే ఇందులో నరసింహం ప్రజ్ఞగాని, ఉపజ్ఞగాని ఏం లేదు. చింతలపూడి ఎల్లన్న బ్రాసిన పద్యకావ్యానికి ఎల్లనగారి వర్ణనలు, లోకోక్తులు అన్నీ నరసింహరాజు ద్విపదలోనికి దిగుమతి చేశాడు. పద్యాలకు పద్యాలు ద్విపదలుగా మార్చడానికి సహితం పుష్పగిరి తిమ్మనగారి సహాయం ఎందుకు కావలసి వచ్చిందో తెలియదు. ఈ ఉపకారం చేసినందుకు తిమ్మనగారి పేరు చెప్పిన నరసింహరాజు ఏ కారణం వల్లనో చింతలపూడి ఎల్లన్నను ఎక్కడా స్కరించనైనా లేదు. ఈ లోపం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీనికన్నా చిత్రమైనది ఇంకొకటి ఉంది. పద్యకావ్యం వ్రాసిన చింతలపూడి ఎల్లన్నను కాక దానిని అనుసరించి ద్విపద వ్రాసిన నరసింహరాజునే నిఘంటుకారులు ప్రామాణీకంగా పరిగణించారు. శబ్దరతాకరంలో బహుజనపల్లివారు ఇతణ్జీ అయిదో తరగతి కవిగా అంచనా వేశారు. ప్రయోగాలను స్వీకరించారు. చింతలపూడి ఎల్లన్నకు రావలసిన కీర్తి రాలేదు. కంకంటి నరసింహరాజు వ్రాసిన ద్విపద ముందుగా అచ్చుపడడం దీనికి ఒక కారణం. ఈ కావ్యాన్ని క్రీ.శ. 1965లోనే విద్వన్మనోరంజని ప్రెస్సువారు ప్రకటించారు. పాలపర్తి నాగేశ్చర కశాస్తులుగారు పరిష్కరించారు. ఈ ద్విపద కావ్యాన్స్సీ చింతలపూడి వారి కావ్యాన్నీ తైపారు వేసి నేలటూరి వెంకటరమణయ్యగారు చాలా విషయాలు తెలియజేశారు. పుష్పగిరి తిమ్మన తానే చాలా

విషయాలు తెలియజేశారు; పుష్పగిరి తిమ్మనగారే కంకంటి నారసింహము పేరిట ఈ

గ్రంథాన్నీ రచించాగేమో విచారించవలసిందని నేలటూరివారు. భావిస్తున్నారు.

ఖావిపరిశోధకుల పరిశ్రమవల్ల దీనిలోని నిజం వెలువడవలసి ఊందన్నారు.3* వాస్తవానికీ పుష్పగిరి తిమ్మనగారి గురించి, వారి కవిమిత్రుల గురించి ఎంతైనా పరిశోధన చేయవలసి ఉంది.

  1. ధరణ్‌దేవుల రామయమంత్రి : పుష్పగిరి తిమ్మనగారు ధరణిదేవుల రామయ్య అనే మరొక కవికి కూడా ఒక కావ్యం వ్రాసి పెట్టారని లోకంలో పుకారుంది. ఆ కావ్యం పేరు దశావతార చరిత్ర. క్రీ.ఈ+1600 ప్రాంతాలలో నెల్లూరి మండలంలో ధరణీదేవుల వారి
  2. ఈ పాదాలను నేలటూరి వెంంటరమ వి

పయనం కుమా లాలా

*. విష్టమాయావిలాసం, యక్షగానం, పీఠిక ఖుటలు 14-16.

పుష్పగిరి తిమ్మన్న అతని కవిమిత్రులు 589 తుటుంబం ఉండేది. నాగమంత్రి అనే ఆయన మంచి ప్రయోజకుడు. ఎందరికో రోజూ అన్నదానం చేసేవాడు. అతని కుమారుడే రామయ్య. ఈయన అష్టభాషాకవిత్వతత్త్వ సంవేది. రోజుకో ప్రబంధం రచించగల దక్షత కలవాడు. శ్లేషపదాల చెలువాలు చూపిస్తూ పదకావ్యార్థ దోషాలు విసర్జించి సరసమైన రత్యాదిస్థాయా భావాలు, శృంగారాది రసాలు లలితంగా సత్కవి మాత్రమే చెప్పగలడని రామయ్య నమ్మకం. ఇతడు మగదల కృష్ణయ్య అనే ప్రముఖునికి ఆప్పుడు.

క్రీశ 1600 ప్రాంతాలలో ప్రళయకావేరి పట్టణంలో మగదల వారిది చాలా పలుకుబడికల కుటుంబం. మగదల తిమ్మన్నగారు రాజభోగాలు అనుభవిస్తూ ఉండేవారు. వీరవెంకటసతిరాయలవారాయనకు ఉభయ చామరాలు, పట్టపేనుగు, దంతాల పల్లకి మొదలైనవి మంజూరు చేశారు. పూర్వకాలం రాజుగారు అనుమతి ఇవ్వకపోతే ఇటువంటివి ఎంత ధనవంతుడైనా వాడుకోకూడదు. మగదల తిమ్మన్నగారికీ పద్మనాభం అనే తమ్ముడున్నాడు. ఆయన గొప్పు పండితుడు. భర్హ్చృహరి సుభాషితాలు శతకత్రయంలోని ప్రతి శోకానికి వ్యాఖ్యానాలు చెయ్యగలడు. రామాయణూది అనేక గ్రంథాలలో సిద్ధాంత పూర్వపక్షాలు చేయగల విద్వాంసుడు. ఈ పద్మనాభంగారికి అయిదుగురు కొడుకులు. వారిలో రెండవవాని పేరు కృష్ణయ్య. మంచి పండితుడు. మేధావి. అయితే దుబాసీగా ఉద్యోగం చేసేవాడు. పళయకావేరి పట్టణంలో డచ్చివారి గిడ్డంగులు ఉండేవి. స్థానికులతో వ్యవహరించడానికి వాళ్ళకి రెండు భాషలూ తెలిసినవాడు కావలసి వచ్చాడు. బహుశ వాళ్ళు ఆరబ్పీ, పారసీక భాషల్లో మొదట సంభాషించేవారేమో! మగదల కృష్ణయ్య క్రమేణా డచ్చివారి భాషను నేర్చుకొన్నాడేమోః ఈ వివరాలేం తెలియవుగాని మగదల కృష్ణయ్యకు బైగోవరక్కంగు పారసీ, మక్కా, మలాక మొదలైన రకరకాల అంతద్సీపాల ధరణీపతులు పట్టపు టేనుగులు, పట్టుబట్టలు, పచ్చకర్పూరాలు, పడమటి పన్నీరు చెంబులు, పరిచారికా జనాలను కానుకలుగా పంపేవారు. మగదల కృష్ణయ్య భోగం

కృష్ణయ్యు చాలా మంచి కవులను పోషించినట్టుంది. ఇతని మీద ఎందరో “విరుదావలీ, చత్రవాశభోగావళీ, త్యాగఘోషణాయక్షగానోదాహరణ తారావళీ శతకాది శవితా రచనా విశేషాలు” రచించేవారు. వాటిని మెచ్చుకొనే రసజ్ఞత కృష్ణయ్యకు ఉండేది. ఈయన ధరణిదేవుల రామయ్యను పిలిపించి కృష్ణుని దశావతారాలు కృతిగా రచించి అంకితం ఇమ్మని ఆడిగాడు. “రసికజన కంఠాభరణ శ్రీకృష్ణ దశావతార చరిత్ర' ఆనే పేరు కంఠాభరణం కనుకు అవసరం ఉన్నా లేకపోయినా అవకాశాలు సృష్టించి, అడుగడుగునా శృంగార వర్జనలు చేశాడు. ఇది పది ఆశ్వాసాల సుదీర్హ కావ్యం. ఇందులో 2477 గద్యపద్యాలున్నాయి.

తూర్మావతార కథను చాలా విపులంగా 83 గద్యపద్యాలతో చెప్పాడు. దూర్వాసుని పుట్టుక నుంచి అతనికి ఒక చిన్నది పువ్వులదండ ఇవ్వడం, దానినతడు దేవేంద్రునికి బహూకరించడం. ఆ మదాంధుడు దానిని బరావతానికి ఇవ్వడం, ఆ మదగజం

500 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అపచారం చేయడం దగ్గిరనుంచి విపులంగా అన్నీ వరించడంతో ఇంత కథ పెరిగింది. ఈ యుగంలోని కొన్ని కావ్యాలలో అన్ని ఆశ్వాసాలూ కలిపితే 643 గద్యపద్యాలుండవు. అటువంటిది రామయ్య ఒక్క తూర్మావతారమే ఇంత వర్దించాడు.

అయితీ ఈ దశావతార గాథలను బమ్మెరపోతరాజుగారు విపులంగా, ఉత్తేజ కరంగా, ఉద్రేకంతో తమ భాగవతంలో కథనం చేశారు. ఉదాహరణకు, కూర్మావతార ఘట్టంల్‌ శ బివ్రుడు హాలాహలం భక్షించే ఘట్టంలో పోతరాజుగారు ఈ పద్యం వ్రాశారు:

మింగెడీవాడు విభుండని- మింగెడీదియు గరళమనియు మేలని ప్రజలన్‌

ట్రింగుమనెడి సర్వమంగళ-మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో.(భాగు 8౭-241)

ధరణీదేవుల రామమంత్రి చిత్రించిన పార్వతి ఇంత ఉదాత్తంగా లేదు. సురాసురులు భయపడి వచ్చారు. వాళ్ళ భయం వారించాలని శివుడు అనుకొన్నాడు. అప్పుడు పార్వతి చిన్నపోయింది. ఆయన దరహాసం ఇగురులొత్త “భామా, ఏటికి చిన్నబోయెదవు” అని “ఏమయినగానీ దద్విషము భక్షింతు వినోదంబుగాన్‌ అని శివుడు అన్నాడు. ఇంకా ఈ పార్వతికి ఇలా హితోపదేశం చేయవలసి వచ్చిందిః

వచ్చినవారికి నాపద-వచ్చిన నది పరిహరించు వాని ప్రభుత్వం

బెచ్చేనుగాని మరి పొర-పొచ్చెము గావించినం బ్రభుత్వముగలదే? (2-22)

ఈ ఒక్క ఘట్టంలోనే కాదు, ఇతర సన్నివేశాలలో కూడా పోతరాజుగారి ముందు రామయ్య _ పాలిఫోతాడు. భాగవతములోని వామనావతారఫఘుట్టంలో "ఇంతింతై వటుడీండై' అనే పద్యం సుప్రసిద్ధం (86-260). రామయ్య వ్రాసినది చూడండీ.

పెరిగె౯్‌ వామన డంత దంతిపౌడవై పృథ్వీధరంబంతయ్రై

శరదంభో రుహమి త్రశీతకరనక్షతగ్రహస్వర్మహా

స్ఫురింతుండై జనలోకమవ్వలిజగంబు న్సత్యవ + న్మించుచుక

హరిదంతంబులు నిండి మెండుకొనె నత్యాశ్చర్య మేపారగక్‌ (దశ 5-112)

పోతరాజుగారు వామనుణ్జి పెంచుతున్నప్పుడు ఏనుగులు, కొండలు మొదలైనవి ఎక్కడ కనబడతాయి? ధరణీదేవుల రామయ్య ఇతర ఘట్టాలలో తూడా భాగవతం చదివినవాళ్ళకు తృప్తి ఇవ్వడు. ప్రహ్హాదచరిత్రలో హిరణ్యకశిపుని చేత “చదువని వాడజ్ఞాండగు' అని చెప్పించారు (భాగ 7-130). రామయ్య చండామార్కులచేత “దానవ నాయక, చదివినగాని వివేకంబురాదు గావున మేమే వాని చదివించి మతిగలవానిం జేసెద' అంటారు. (దశా. 4=-149)

పోతరాజుగాళి భాగవతంతో తులతూగకపోయినా దశావతార చరిత్రకు మన సాహిత్యంలో విలక్షణమైన ప్రత్యేక స్థానం ఉంది. ఈ కావ్యంతోనే పరకీయ శృంగారం పచ్చి దేరింది. రామావకారఘట్టంలో రామయ్య వర్ణించిన అహల్య చరిత్ర చదివితే “రామ రామ' అనక తప్పుదు. 120 గద్యపద్యాలలో విచ్చలవిడిగా ఈ ఘట్టం వ్రాశాడు. దీని గురించి సముఖం కృష్ణష్పనాయకుని అహల్యా సంశ్రందనం చర్చించేటప్పుడు చెప్పుకొందాం. ఇక

పుష్పగిరి తిమ్మున్ను అతని కవిమిత్రులు 591 వరాహావతారకథలో దితికి పుత్రవాంఛ కలిగి భర్తవద్దకు వళ్ళో ఘట్టంలో రామయ్య విశ్చంఖల శృంగారమే వ్రాశాడు. దితి తన చెలికత్తతో తన భర్త గురించి ఇలా చెప్పుకొంటుందిః

తానయి చేరలిల్చి సురతట్రియుడై యొకనాటికైన స

మ్మూనము సేయగా నెరుగ, మానిని యేమని తెల్పుకొందునే

నేనయి యెన్నడైన దమిహెచ్చినచో దను చేరి యెంత ప్రా

దైన బదంబులొత్త క్షణ మప్పటి కేమొ ఘటించు గోరికల్‌. (దశ. 8-25)

ఈ కవి చిత్రించిన దితి కూడా అందరు భారతీయ స్త్రీలలాగే 'భర్హ దైవం' అనుకొంటుంది. కాని దానికి కారణం వేరే చెప్తుంది. అనవతరసొఖ్య సంధాతర్డైన నేతకంటె దైవంబు కల్గునె కామినులకు' అని అంటుంది. దితి ఒక్కర్తే కాదు. ఈ కావ్యంలోని వాళ్లంతా కామినులే. కృష్ణావతార ఘట్టంలో సాక్షాత్తూ రాధ వారకాంతలాగ మజాగా ఉంటుందని వ్రాశాడు.

కొప్పున జాజులుక్‌ విగువుగుబ్బలకుంకుమ కేనె మోవిపై

గప్పురవీడియంబు జిగికస్తురిబొట్టును నిత్యచల్వయుం

జొప్పడు వారకాంతవలె జూడ్కికి విందొనరించెగాని యొ

క్కప్పుడు మైల దోప నడయాడదు రాధ ముకుందముందటక్‌. (దశ 8-57)

ధరణీదేవుల రామయ్య వ్రాసిన రాధామాధవుల శృంగారం గురించి కూడా చాలా చెప్పుకోవాలి. వెలిదండ్ల వెంకటకవి వ్రాసిన రాధామాధవ సంవాదం అనే కావ్యం గురించి చర్చించేటప్పుడు ముచ్చటించుకొందాము. రామయ్య ప్రభావం అనంతరకవులపై చాలా వుంది.

ఇతడు చాలా గొప్ప పండితుడు. అష్టభాషా పాండిత్యమున్నవాడు. చిత్రబంధ సోమయ్యలలాగ ఎటువంటి సంస్కృత లోళోక్తినైనా, శోకాన్నైనా తెలుగు పద్యంలో ఇట్టే యిమడ్చగల ప్రవీణుడు. సమకాలిక వ్యావహారిక ప్రయోగాలను యథేచ్చగా వాడుకోగల స్వతంత్రుడు. ఇతడి ప్రయోగాలలో చక్కని వ్యాకరణాంశాలు దొరుకుతున్నాయి.

నన్నయగారు “కమ్మని లతాంతములకు మొనసి వచ్చు మధుపమ్ముల” అని ఒక లయగ్రాహిలో లకాంతముకులన్‌+మొనసి అనే సంధిలో పమ్మొనసి అనే మకారపు జడ్డతో ప్రయోగం వాడారు (భారతం, ఆది. 5-138). దీనికి చిన్నయసూరి తన వ్యాకరణంలో గతి కల్పించలేదు. ప్రొఢవ్యాకరణంలో బహుజనపల్లివారు సూత్రీకరించారు. “ప్రాసంబున మకారంబు పరంబగుచో ద్రుతంబునకు మకారాదేశంబగు' అని గతి కల్పించారు (ఫొడససంధి22). నన్నయగారిదే మరొక ప్రయోగం (అరణ్య.3-113) తూడా బహుబనపల్లివారు ఇచ్చారు. ధరణిదేవుల రామయ్య తూడా మకారం పరమైనప్పుడు ప్రాసంతో ద్రుతంపై మకారపుజడ్డ ఒకటికి రెండుసార్లు వాడారు. కృతిపతి పెదతండ్రి తిమ్మయ్యగారిని ఇలా వర్ణించారు:

592 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

తిమ్మన మట తేనియలు తేరగ బల్కగ నేర్చు బంధుజా

తిమ్మనజూచు బ్రోచు నతిథిప్రకరమ్ముల గైటభాఖియా

తిమ్మనసార గొల్సు నతిధీరత వెంకటమం త్రిపుత్రుడౌ

తిమ్మనమంత్రిపాటి జగతీస్థలిలోపల మంత్రి గల్లునే? (దశపీఠిక, 3)

ఇందులో బంధుజాతిన్‌+మనజూచు అనే చోట, కైటభాఖియాతిన్‌+మనసార అనీ రెండు పాదాలలో రెండు చోట్ల ప్రయోగించాడు. జాగ్రత్తగా వెదికితీ రామయ్య రచనలో ఇలాంటి వాడుకలు చాలా దొరుకుతాయి. రఘునాథనాయకుడు వ్రాశాడనుకొనే శృంగార సావిత్రిలో ఫికాచేయడం, పాదుషా, ఫరమానా పంపడం మొదలైన ప్రయోగాలు ఉన్నాయి ఈ దశావతార చరిత్రలో చంద్రోదయ వర్ణన ఇలా సాగింది:

ప్రాణనాయక యిదెచూడు పతులగూడి-పాయకుడటంచునతుల నుబల్కు డేజి

పాదుషాహుశికాచేసిపంపుకాగి- తంపుఫరమానువోలె సుధాకరుండు.

(దశ. ౩-45)

రామయ్యమంత్రికి పాదుషాలూ, వాళ్లు పంపే ఫర్మానాలు స్వయంగా తెలుసు. ఈ దశావతార చరిత్రను అంకితం పుచ్చుకొన్న మగదల కృష్ణయ్యగారి పినతండ్రి ఒకాయన “నవాబుసాహెబూవితీర్ధ సువర్య జాంబూనదాంబ రాసుసమ గ్రామ బహుమానాలు పొందాడు (పీఠిక58). ఈ నవాబు సాహెబు మరెవరో కాదు. క్రీ.శ 19లో ఒకసారీ, మళ్ళా పదేళ్ళకు క్రీ.శ.1649లో ఒకసారీ ప్రళయ కావేరీపై దండెత్తిన గోలకొండ నవాబు సయ్యద్‌ మహమ్మద్‌ మీర్‌ జువ్లూ, ఈ నవాబు సాహెబును పేర్కొన్న ఈ కావ్యం క్రీ.శ.1650 తరువాత రచించడం జరిగిందని భావించవచ్చు.

అయితే ఈ కావ్యాన్ని ఎవరు వ్రాశారు? లోకంలో కొందరనుకొనేటట్టు పుష్పగిరి తిమ్మనగారే వ్రాసి రామయ్య పేళు పెట్టారా అన్నది పెద్ద ప్రశ్న పాపరాజుగాో ఉత్తరరామాయణంలో తిమ్మనగారి చేయి కనబడినంత దశావతార చరిత్రలో కనబడదు. శైలి. దృక్చథం అన్నీ విభేదాలే. అయినా భూతద్దం పట్టుకొని పరిశీలిస్తి అక్కడక్కడ కొన్ని పోలికలు కనబడతాయి. తిమ్మనగారు పూర్వకని స్తుతిలో “మహాకవి రాజుల సంస్కరించెదన్‌ అన్నారు (సమీర.1-9). రామయ్యగారు తూడా విద్వత్కవిరాజులి వచశ్షీల నెంచారు (దశపీఠిక 9). ఇలాంటి సమానపదాలు ఎంత విరివిగా ఇద్దరూ వాడారో తైపారు వేయడం కష్టసాధ్యమైన పరిశోధన. ఓపికతో ఈ కొండ తవ్వితీ ఎలురైనా దొరక్కపోవచ్చును.

పుష్పగిరి తిమ్మనగారికీ. ధరణిదేవుల రామయ్యకూ నిజంగా స్నేహం ఉంటే ఈ సంగతి తిమ్మనగారి ఇతర మిత్రులలాగ రామయ్య చెప్పుకోకపోవడం ఆశ్చర్యమే... ఈ లోపంవల్ల తిమ్మనగారికి నష్టం రాదు. వారు స్వయంగా కవులు. జరామరణభయం లేని యశస్సు వారికుంది. భర్చృహరి ఇలా అన్నాడు:

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్చరాః

నాస్తి యేషాం యశఃణాయే జరామరణజం భయం. (నీతి. 2)

కట్టూ వరదరాజు 593 దానిని పుష్పగిరి తిమ్మనగారు ఇలా అనువదించారు: చతురమతిప్రసిద్ధియు పచణపరిశుద్ధి ప్రబంధవర్ణన స్థితికలనాసమృద్ధి రససిద్ధియు గాంచి యగణ్యపుణ్యభా గతులితకీర్పిదేహధరులై సుకవీశ్చరు లెయ్యెడక్‌ జరా మృతిజనితో గ్రఖీతులువహింపకయిప్పుడునున్నవారిలక్‌ (నీతి. 20) ఇది తిమ్మనగారి పట్ట నిజమే. కట్టా వరదరాజు దక్షిణ భారతదేశాన్ని క్రీ.శ. 485లో కరికాళ చోళుడు గొప్పగా పరిపాలించాడు. అతని వంశంలో జన్మించిన అనేకులు అటు తమిళదేశాన్నీ, ఇటు తెలుగుదేశాన్నీ పాలించారు. కరికాలుని రాజ్యం అంతరించిన 750 సంవత్సరాల తరువాత కూడా అతని సంతతివారు నెల్లూరిని పాలించినట్లు తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం వల్ల తెలుస్తూంది. మరి నాల్గువందల సంవత్సరాలకు, అంటే క్రీ.శ.1650 ప్రాంతాలలో కరికాలుని వంశంలోని వాళ్లు తెలుగుదేశంలో ఉన్నారు. ఆదిలో కరికాలుడు కావేరికి ఆనకట్ట కట్టించాడు. అందుచేత అతని సంతతి వాళ్ళకు_కృట్టావారనే "ఇంటిపేరు వచ్చిందట. ఈ సంగతి కట్టా వరదరాజనే కవి తన గ్రంథంలో ఇలా చెప్పుకొన్నాడు: ఆ కరికాళచోళాధీశు కీర్తి యాకర్ణనీయ మియ్యవని నెయ్యెడల నతడు కావేరి కల్లన కట్టగట్ట- నడిశయించెను తదీయాన్వయమున బుట్టిన రవివంశభూభుజావశికి- కట్టాన్సయు లనంగ... " ఈ వైనం నిజం అయితే కరికాళుని వంశం సుమారు పన్నెండువందల సంవత్సరాలు తెలుగునాట వర్ధిల్లుతూ ఉండేదని చెప్పవచ్చును. కట్టా వారికి ప్రాచీన చోళ వంశంతో సంబంధం లేకపోయినా, విజయనగర సాభ్రూజ్యాధిపతులతో బాంధవ్యం ఉంది. వసుచరిత్రను అంకితం పుచ్చుకొన్న తిరుమల దేవరాయల మునిమనుమడి పేరు రామదేవరాయలు. ఈయనా, కట్టా వరదరాజుగారి తండ్రీ తోడల్లుళ్ళు. పోచిరాజువారి ఆడపడుచులను చేసుకొన్నారు. వరదరాజుగారి తండ్రీ పేరు హరిదాసరాజు. ఈయన క్రీశ. 1636-37లో కడప జిల్లా మాధవాపురంలోని హనుమంతరాయని ఆలయంలో ఒక దానం చేసి శాసనం వేయించాడు. తండ్రి క్రీ.శ1636లో ఉన్నాడు. కనుక కుమారుడు మరో పాతికేళ్ళకు ప్రాజ్జుడయ్యాడనుకొంటే వరదరాజు క్రీ.శ 1680 ప్రాంక్తాలవాడవుతాడు.* ఈ కవి తాను 'సాహితీ భోజుడినని చెప్పుకొన్నాడు. తన చాటుధార నిరాఘాటంగా సాగుతుందనీ, సరస చతుర్విధ కవిత్వాలు చెప్పగలననీ, రచనా

  1. శ్రీరామాయణం, ద్విపద. కట్టా వరదరాజు, బాలకొండ, పంక్తులు 173-178.
  2. ఇతడి తాత శ్రీరంగరాజూ, ముత్తాత రంగప్పరాజూ తోపూరు యుద్ధంలో పాలొన్నారు. అది శ్రీశ 1516లో జరిగింది. తాతముత్తాతలతు, మనవడికి 50 సంవత్సరాలు కీడా ఉండవచ్చు.

6594 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చమత్కారం తనలో ఉందనీ కూడా ఇతను చాటుకొన్నాడు. ఇతని తొలి రచన “పరము భాగవత చరిత్ర' ఇది బహుశా 8 ఆశ్వాసాల ప్రబంధం. ఇందులో పధ్నాలుగు మంది పరమ భాగవతుల కథలను కవి రచించాడు. మన సంప్రదాయం ప్రకారం హరిభక్తులలో కొందరు మాత్రమే పరమభాగవతులు. వాళ్ళ పేర్లు శోకంలో ఉన్నాయి.

ప్రహ్లాదనారదపరాశరపుండరీక- వ్యాసాం బరీషశుకకౌనకఖీష్కదాల్బా్యా౯ .

రుక్మాంగదార్జునవసిష్టవిఖీషణాదీన్‌- పుణ్యానిమాన్‌ పరమభాగవతాన్‌స్మరామి.

(1) ప్రహ్లాదుడు, (2) నారదుడు (3) పరాశరుడు (4) పుండరీకుడు (5) వ్యాసుడు (6) అంబరీషుడు (7) శుకుడు (8) శౌనకుడు (9) భీష్ముడు (10) దాల్భ్యాయనుడు (11) రుక్మాంగదుడు (12) అర్జునుడు (13) వసిష్టుడు (14) విభీషణుడు.

ఈ పరమ భాగవతుల చరిత్రను వరదరాజు సంగ్రహంగా రచించినా, ఈ గ్రంథంలోని రెండాశ్వాసాలు మాత్రమే నేడు లఖిస్తున్నాయి. ఒకాశ్వాసంలో పుండరీక చరిత్ర ఉంది. దీని ప్రతి తంజావూరు గ్రంథాలయంలో ఉంది (సంఖ్య 19). , జనమేజయునకు వైశంపాయనుడు ఈ కథలను చెప్పినట్టు కవి రచించాడు.

నినుబోలన్‌ రచియింప నొక్క ఘను డెందే కంటిమే కాన మ

జ్ఞననంబున్‌ సఫలంబు సేయుమన వైశంపాయనుం డిట్లనున్‌

వినిపింతున్‌ ఘనుడమ్మహారథుని సద్వృత్తంబు నానాసభా

జనసంభావన మిష్టకామితము లీజాలున్‌ విశేషించియున్‌

, (తంజావూరు సంఖ్య. 1౫)

నానా సభల్లోని జనులచేత సంభావనమయ్యే ఈ గ్రంథం 8వ ఆశ్వాసంలో రుక్మాంగద చరిత్ర ఉంది (తంజావూరు చంథాలయం సంఖ్య 177). పరమ భాగవత చరిత్ర సంపూర్ణంగా దొరక్కపోవడం దురదృష్టమే. తెలుగు సాహిత్యంలో ఇతడొక్కడే కాక మరికొంతమంది కూడా పరమ భాగవత చరిత్రను రచించారు. ఆ గ్రంథాలలో తూడా ఏ ఒక్కటీ దొరకలేదు. ఆ రచయితల వివరాలు ఇవి: ॥ ల

  1. -గణపవరపు వెంకటకవి . క్రీశ 1674 ప్రాంతాలు . _ 4. శృంగారకవి తిరుమలనాథుడు -- క్రీశ 1750 ప్రాంతాలు .. ఈ నలుగురూ వ్రాసిన పరమ భాగవత చరిత్రలలో ' వరదరాజు ' గ్రంథం నుండి వరదరాజు తిరుపతి వెంకటేశ్వరునికి అంకితం ఇచ్చాడు. మరికొన్నాళ్ళకు ఇంకొత గ్రంథం రాద్దామనుకొంటుండగా ఆ దేవుడే కలలో కనపడి ఇలా అన్నాడట.

మున్ను నాపేర నంకితంబుగ నొనర్చి-తవని బొగడొంద బరమభాగవతచరిత

మిపుడొనర్చు ప్రబంధమ్ము నిమ్ము నాకు-నంకితంబుగ నే వెంకటాధిపతిని.

కట్టా వరదరాజు 595 వరదరాజు కవిత్వాన్ని విన్నాక ఎంగటిశ్చరునికి 'పెరకవుల కృతులపై. అరుచి జనించిందంట. అందుకే వరదరాజును చూసి 'యుష్మదచ్చీకర వాక్యంబులందు చిత్తము వొడమెన్‌ అని దేవుడన్నాడు.. గారుడ సంహితలోని శతాధ్యాయాన్ని శ్రీరంగమాహాత్మ్యంగా తెనిగించమన్నాడు. ఇలా కితాబు ఇచ్చాడు:

చేయరె తొల్లి సత్కవు లశేషపురాణములున్‌ దెనుంగునం

దీయితిహాస మెందు రచియింపమి తావక పుణఖ్యమెంత యా

చ్నూయ చతుష్కసారము సనాతనగారుడ సంహితాశతా

ధ్యాయి తెనుంగుసేయ నొక డర్హుడె నేటి కవీంద్రకోటిలోన్‌?

తనకన్నా ముందు ముగ్గరు తెలుగు భాషలో శ్రీరంగమాహాత్మం వ్రాళాగని వరదరాజుకు తెలియకపోతే పోయింది. కలలో కనపడ్డ దేవునికీ ఆ సంగతి తెలియదు. చెన్నమల్లు శ్రీగిరన్న ఖైరవుడు అనే కవులిద్దరు పద్యకావ్యాలుగా శ్రీరంగమాహాత్మా్యాన్ని వ్రాశారు. ముకుందయోగి ద్విపదగా చెప్పాడు. ఇంకా మరికొందరు పూర్వులు తమ గ్రంథాల కృత్యాదిని శ్రీరంగచరిత్రను వర్ణించారు. వీటినన్నింటిని కట్టా వరదరాజు చూడనేలేదు కాబోలు. తానే తొలిసారిగా శ్రీరంగమాహాత్మ్యాన్ని చెపుతున్నా'నని చాటుకొని పది ఆశ్వాసాలలో దాన్ని రచించాడు. తాను పూర్వకవుల కవితావీధులను చూసి దానిలోనే పయనించడానికి ఉత్సహించినట్లు ఇలా చెప్పుకొన్నాడు:

నన్నయభట్టు బెగడనునాచనసోమునిసార్వభౌము ది

క్కన్ననుబెద్దిరాజుమొదలై తగు నాంధ్రకవీంద్రముఖ్యులక

సన్నుతిచేసి వారు రచనల్‌ పాసగించినత్రోవ గాంచి యా

యెన్నిక నేను గొంత రచియించుటకుక మది నుత్సహించితిన్‌

పూర్వకవుల చూర్తాన రచిస్తున్నా ' వరదరాజు వ్యావహారిక రూపాలను ప్రయోగించగలడు. ఇతని పెదతండ్రి పేరు కట్టరాజు. అతణ్ణి 'కట్రాజు అని లోకులు పిలిచేవారు. పెదతండ్రీని నుతిస్తూ చెప్పిన పద్యపాదం చూడండి:

చట్రూతిపై నార యెట్రా మొలిచె గట్టి

కట్రూజనుచు రిపుల్‌ కంప మెసగు

పెదతండ్రి చభ్రూతి నుండి నారను ఒలిచినట్టే వరదరాజు తూడా పురాణం నుండీ తూడా తైపారు వేయాలి. వరదరాజు వ్రాసిన గ్రంథం నుండి గణపవరపు వెంకటకవి ఒక పద్యాన్ని సంగ్రహించాడని నిడుదవోలు వెంకట్రావుగారు ఉదహరించారు.కి

ఎకతాళంబున వీరమద్దెలరవం బేకంబుగా నట్టువల్‌

ధికతోంతత్తకరుంకురుంకుకి ణుతాంధిత్తాంగినాలో ధికం

దితతిత్తియ్యధిధిక్కు ధిక్కు ధిక్తణాధికాదితాళంబులన్‌

కకుబంతంబుల మారుబల్కు కొనగోల్క శ్యాందమున్నాడగాన్‌. (46-161) 3 శ్రీరామాయణం. ద్విపద. కట్టా వరదరాజు. బాల అయోధ్య కౌశలం. పీఠిక. పుట ౫.

596 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

  • మద్దెల మోతలాగా వృత్తాలను నడీపించే వరదరాజు పద్యాలను విడీచిపెట్టి ద్విపదను చేపట్టాడు. పరమభాగవత చరిత్రను, శ్రీరంగమాహాత్మ్యాన్ని రచించాక అతడు యథావాల్మీకంగా రామాయణాన్ని ద్విపదలలో రచించాడు. ఈసారి తూడా వెంకటేశ్వరుడు కలలో కనబడి పాత రచనలు జ్ఞాపకం చేసి ఈ ద్వాపద కావ్యాన్ని -బ్రాయమని ఆజ్ఞాపించాడు. ఈ కల సంగతి తన కొలువులో ఉన్న వారితో వరదరాజు చెప్పాడు. వాల్మీకి అంతటివాడు రామాయణాన్ని వ్రాయగా సంతోషించక దేవుడు పని కట్టుకొని ఈ వరదరాజుగారిని ఎందుకు ప్రత్యేకంగా పురమాయించినట్టు? కట్టా వారి ఆభ్రితులు ఇలా అఖిప్రాయపడి వరదరాజుతో అది విన్ననించారుః ఇనకులంబున వేంకటేశుండు మున్ను- జినియించి తన పుణ్యచారి త్రమెల్ల బోయకులంబునబుట్టువాల్మీకి-సేయనందు బ్రమోదచిత్తుండుగాక రచియింపుమనియె............... (బాలకాండ. 151-157) ఈ ఆదిమ కావ్యాన్ని అందంగా, తేటపుట్టేటట్టు, నవరసాలు చిందేటట్టు జల్లిమాటలూ, అపశబ్బాలూ, జబ్బు అల్లికలూ, ప్రాసల కోసం, యతుల కోసం కక్కుర్తి పదాలు అతుకులు వేయడం మొదలైన దోషాలు లేకుండా లక్షణ సమ్మతంగా, కర్పూరం వెదజల్లినట్టు, ధ్వనులు, వ్యంగ్యాలు, వింతలు,-జాతి వార్తలు ఉపమలు గుప్పిస్తూ- ఒకవమట కన్నవేరొక మాట వింత-యొకపాదమున కన్న వొక పాదమొఅవు యొకదళం బుకన్ననొ కదళం బంద- మొకయుత్తరముమించనొకయుత్తరంబు వెలయంగద్విపదగావింప చిత్తమున- (బాలకాండ. 81-జ) వరదరాజు తలచాడు. ఆరుకాండలూ తుదముట్టా 23,570 ద్విపదలలో వ్రాశాడు. ఈ కావ్యాన్ని నాల్గు సంపుటాలుగా తంజావూరు సరస్వతీమహల్‌ గ్రంథాలయం వారు ప్రచురించారు. నిడుదవోలు వెంకటరావుగారు పరిష్కరించి ప్రతి సంపుటంలోనూ విపులమైన పీఠికలు వ్రాశారు. వరదరాజు వ్రాసిన రామాయణంలోని ద్విపదలు లేఖకులు అలాగే అందులోకి చేరాయి. వరదరాజు కావ్యం నుండి రంగనాథ రామాయణంలో చేరిన ద్చిపదలను నిడుదవోలువారు విపులంగా గుర్తించారు. ఇప్పుడు రంగనాథ రామాయణాన్ని సరిగ్గా పరిష్కరించడానికి ఆస్కారం ఉంది. వరదరాజు రామాయణంలోని ఏఏ భాగాలను లేఖకులు మెచ్చుకొని ఇంకొకచోట వ్రాసుకొన్నారో కూడా తెలుసుకోవచ్చు. వరదరాజు యథావాల్మీకంగానే తన కావ్యాన్ని బ్రాసినా తన సమకాలిక సంఘాన్ని అందులో అక్కడక్కడ చిత్రించాడు. జాతివార్తా చమక్కారాలు చూపించాడు. కొన్నిచోట్ల ఒక శ్లోకానికి పదిపదిహేను ద్విపదలు తూడా వ్రాశాడు. ఉదాహరణకు బాలకాండలో శ్రీరామునికి విశ్వామిత్రుడు ఒక శ్లోకంలో మేలుకొలుపు పాడాడు. అది చాలా సుప్రసిద్ధం. తౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికమ్‌. (బాల, 23.2)

కట్టా వరదరాజు 597

ఈ ఒక్క శ్లోకాన్ని వరదరాజు పన్నెండు రెళ్లు ఇరవైనాల్లు ద్వాపదలలో ఇలా వ్రాశాడు:

తృ ణశయ్యలందుని ద్రించివేగుటయు- గుణశాలియౌకౌళికుడుకోసలేంద్ర

కన్యకాగర్చ్భముక్తాఫలః రాగ- దన్న్మయతనుప్రభాతంబయ్యెనిపుడు

తఆావితోసురలుబ్బృందారకాస్యముల- తో వికసిల్లెనిద్దురమేలుకొనుము!

శ్రీరామ మునికోటిచింతతోదమము- దూరమైతొ లగెనిద్దురమేలుకొనుము!

బలరక్కసుల ప్రతాపంబుతో డ- దొ లగెతారకలునిద్దురమేలుకొనుము

మొగినెరక్కసిముదితలకన్ను- దొగలతో దొ గలునిద్దురమేలుకొనుము!

దశరథరాజసుధాపయోరాశి-శకిధర నిద్దురదాలింపవయ్య।

భరతాదిసోదరభావమిళింద- సరసిజ నిద్దురచాలింపవయ్య।

మలసియగస్తా్యాశ్రమంబు ఖేదములు- తొలగింపవలయునిద్దురలేవవయ్య!

మాయా నిశాచరమదవన్మరాళ- తోయదరామ నిద్దురలేవవయ్య!

పర్జన్యముఖదేనపాలనశార్య- దుర్ణయరామః। నిద్దురరేవవయ్య।

సరణిలో నర్థయో జసమా త్రజిన్న- దురమున్నదొకటినిద్దురలేవవయ్య!

నకినాజన్నంబు చెరచుదానవుల- దునిమింపవలయునిద్దురలేవవయ్య!

అనుచు మేల్కొలుప నొయ్యనలేచి.......... (బాల. 2075-2101)

ఈ మేలుకొలుపు వ్రాశాక ఒక జోల పాట కూడా వ్రాయాలని వరదరాజు భావించాడు. మూలంలో లేకపోయినా వ్రాశాడు. యాగసంరక్షణ చేశాక విశ్వామిత్రుడు విశ్వామిత్ర కౌశికీనదుల గాథ చెప్తాడు. ఆ కథలతో ప్రొద్దుపోతుంది. అప్పుడు మూలంలో రాత్రిని వర్ణిస్తూ వరదరాజు ఇలా అనువదించాడు :

ప్రాద్దుగూకియు ప్రాద్దుబోయెను మీకు- నిద్దురలేకున్న నేరరు టేపు

పయనమై రా నిందు పవశింపుడబ్ద-నయనముల్‌ ముగుడించి నాసమీపమున

చూడుమల్లపుడె పక్షులుగూళ్లు చేరె- నీడద్రుమంబుల నిద్రింపవయ్య!

గగనంబు మేనెల్ల కన్నులోయనగ-నెగడె తారకములు నిదురింపవయ్య

మెండుగాదిశలనేమియు గాననీక- నిండెను చీకటుల్‌ నిదురింపవయ్య!

ఎచ్చోట వెన్నెల లెసగించి కలువ-నెచ్చెలి పొడసూపె నిదురింపవయ్య!

ధారాళమకరంద ధారల నీల- నీరజంబులమించె నిదురింపవయ్య!

పొగరు వెన్నెలలాని పొట్టల నిండ-నిగుడెజకోరముల్‌ నిదురింపవయ్య!

పావనరఘురామ బడలికల్లీర- నీవును తమ్ముండు నిదురింపరయ్య.

(బాల జట-594)

పరిశోధిస్తే వరదరాజు రామాయణంలో ఎన్నో హోషాలుంటాయి. సాంఘిక

విషయాలు, విశేష ప్రయోగాలు చాలా దొరుకుతాయి. వరదరాజు రామాయణంపై

596 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ప్రత్యేక పరిశీలన అవసరం. తెలుగు సాహిత్యంలో లభ్యమవుతున్న ద్విపద రామాయణాలలో ఇది ద్వితీయమైనా కొన్ని విషయాలలో అద్వితీయమే.* అందుగుల వెంకయ్య, ధూర్దటి కవులు మహమ్మద్నీయ ప్రభువులు తమ పూర్వుల చరిత్రలను, తమ చరిత్రలను బ్రాయించుకోవడం చూశాక హిందూ రాజులు కూడా చారిత్రక కావ్యాలను బ్రాయించమని తమ అఆశ్రితులను జ్రోత్సహించసాగారు. సుప్రసిద్దమైన ఆరవీటి బుక్కరాయల వంశంలోని కోదండరామరాజు క్రీ.శ.1630 ప్రాంతాలలో ఒక చారిత్రక ల్రంథాన్ని వ్రాయించాడు. దీని పేరు రామరాజీయం. దీనిని అందుగుల వెంకయ్య అనే కవి బ్రాళశాడు. ఇందులో చంద్రుని దగ్గిరనుండి, కృతిపతి రామరాజు కొడుకుల దాకా ఆరవీటి రాజుల వంశక్రమం ఉంది. కృతిపతి కోదండరామరాజుకి రామరాజు అనే నామాంతరం ఉంది. ఇతడు ప్రసిద్ధుడైన అళియ రామరాయల మనుమడి మనుమడు. ఈ తోదండరామరాజు ఒకనాడు అందుగుల వెంకయ్యను సత్కరించాడు. రాజరాజనరేంద్రుడు నన్నయగారితో అన్నట్టే పంచమ వేదమైన భారతం తనకెప్పుడో ఇష్టమని కవితో చెప్పాడు. తరువాత ఇలా అన్నాడు: ఆారలెన్నవచ్చు, వారిధినవలీల- దాటవచ్చు, గిరుల మీటవచ్చు భారతార్థమెరిగి పలుకంగవచ్చునే- చిలువరేన్దైన నలువైైన? (రామరాజీయం, 5) నన్నయగారు భారతాన్ని తుదముట్టా రచించకపోయినా ఆ మహాకావ్యం తరువాత పూర్తి అయింది. ఈ సంగతి కోదండరామరాజు అందుగుల వెంకయ్యతో ఇలా అన్నాడు: తన్నంతబుధులచేతను- విన్నంతయునాంధ్రభాష వివరింపబడెన్‌ జెన్నులరగ భారత మా- నన్నయభట్టాదికవిజనంబులచేతన్‌ (రామరాజీయం, ౫) ఈ విద్వత్కవులందరూ మా వంశపు క్రమాన్ని ఏ విధంగా చెప్పారో ఇతర కృతులు చూసి నువ్వు సంక్షేపంగా అ పేర్లూ, ఆ ఘనచర్యలూ ఒక కృతిరూపంలో చెప్పమని కోదండరామరాజు కోరాడు. అందుగుల వెంకయ్య మృదువచో బృందగరిమతో కావ్యాన్ని వ్రాశాడు. పురాణాల్లో చెప్పిన చంద్రవంశాన్ని విపులంగా కథనం చేశాడు. చనా 4. తెలుగులో ద్విపదరామాయణాల వివరాలు

  1. రంగనాథ రామాయణం 1340 ముద్రితం 3౩. వరదరాజుల రామాయణం 190 ముద్రితం
  2. బోనక ఏతోజి రామాయణం 175 అముద్రితం
  3. దూపాటి రాఘవరెడ్డి రామాయణం తెలంగాణ కవి

అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 599 కళ్యాణపురాన్ని పాలించిన విజ్జ్ఞలుడు ఆ వంశంలో పుట్టిన వైనాన్ని చెప్పాడు. ఈ బిబ్దలుని నుండి ఆరవీటి బుక్కరాయలదాకా ఉన్న దొరల సంగతి కథనం చేశాడు. అక్కడినుండి తన కృతిపతి కొడుకుల దాకా ప్రతిరాజుని పేర్కొన్నాడు. వాళ్ళ భార్యల పేర్లు చెప్పాడు. విజయాలను తెలియదేశాడు. విరుదుగద్యల నిచ్చాడు. ఇందులోని కొన్ని వింతగా ఉన్నాయి. కళ్యాణబిజ్ఞలుని వీరుదుగద్య గమ్మత్తుగా ఉంది.

జయజయ, స్వస్తి, నమదగజపంచమమహాశబ్ద, మహామండలేశ్వర, కళ్యాణపుర వరాధీశు ఆశ్రేయసగోత్ర, క్షత్రియాచారకులపవిత్ర, చాళుకనారాయణ, చాళుక్కచక్రవర్తి, మండలీకరధరవరాహా, _ వెంగిత్రిభువనీమల్ల, పాయికాఖణుపయకేజుబ్టూరుబొల్లిలే జొల్లియాన్‌. సాములామణివిలేమణినియాన్‌, సాములాజిక్కిడినరాజాయతెక్కిడీలు మన్నియాన్‌, సాములాఠాకుఉత్సాయిబాహుఆలవీతోమన్నియాన్‌, సాములాజాలు కాళుపడుకాయితే మన్నియాన్‌, సాములాయబాలుతలెసలితెమన్నియాన్‌, సాములా బయత్సానైతవిసాపాణవిడేమన్నియాన్‌, సాములాకాలేఖిడిప్రాడిపాతుకాయాతు మన్ని యాన్‌: సాములాభర్తరూదిగుడాకుంజి కాళా ఘోరా సాళా బహుత్తువర్న మన్నియాన్‌, సాములాపోడు ఉరగరాశిఉపరిదేఖతేమన్నియాన్‌, సాభర్తాలు, శ్రీరాజరాజ పరమేశ్వర, శ్రీరాజరాజేశ్చర దివ్యశ్రీపాదపద్మారాధకాది మహాబిరుదుపదానోజ్వల కల్యాణ విజ్దలేశ్వర ఏజయీభవ, దిగ్విజయీభవ. __ (రామరాజీయం, 168) ఈ ఒక్క గద్యలోనే భాష ఇలా ఉందిగాని మిగిలిన వీరుదుగద్యలలో తత్సమపదాలే ఉన్నాయి. అందుగుల వెంకయ్య వ్రాసిన గ్రంథం చరిత్రకారులకు బాగా తోడ్పడుతుంది. దీనిని కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి సాయంతో “గస్తోవ్‌ ఓపర్డ్‌' అనే తిల్లదొర క్రీ.శ1893లో పరిష్కరించాడు.! ఈ చారిత్రక గ్రంథం దేశ చరిత్రకేకాక సాహిత్య చరిత్రకు తూడ ఒకటిరెండు చిన్న విషయాలను కానుక ఇస్తుంది. వ్రాస్తున్నది రాజుల వంశావళి. అయినా ఇందులోనే చిత్ర, గర్బకవిత్వాలను అందుగుల వెంకయ్య ప్రదర్శించాడు. కొన్ని అపూర్వవృత్తాలను వ్రాశాడు. వాటి వివరాలు ఇవి బంధకవిత్వం:

  1. చత్రబంధం పద్యసంఖ్యు 336

  2. నాగబంధం పద్యసంఖ్య 3౫7

౩ గోమూత్రికాబంధం పద్యసంఖ్య 33 గర్భకవిత్వం:

  1. చతుశ్చరణగర్చకందం పద్యసంఖ్య ౩

  2. ద్వాకందగర్భత్రౌాంచపదవృత్తం పద్యసంఖ్య 342 చిత్రశవిత్వం:

  3. నవగ్రహాలు, అష్టదిక్సాలక, దశావతారాలు ఉన్న కందం 345

  4. ఈ ఓవర్త్‌దొర మద్రాసు ప్రైసిడెన్సీ కళాశాలలో సంస్కృత-తులనాత్మక భాషా శాస్త్ర శాఖలలో

అచార్భుడు.

600 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇవికాక, అందుగుల వెంకయ్య కొన్ని అపూర్వ వృత్తాలను వాడాడు. మొదట ప్రహరణ కలితవృత్తాన్ని వ్రాశాడు (3%). దీనికి అప్పకవి లక్షణం చెప్పాడు. ఇది 14వ ఛందంలోని 8128వ వృత్తం. దీని తరువాత అందుగుల వెంకయ్య పాలాశదలవృత్తం వ్రాశాడు. దీనినే త్వరితగతి అంటారు. ఇది 17వ ఛందంలోని 32768న వృత్తం. దీనికి తూడా అప్పకవి లక్షణం చెప్పాడు. అయితే రామరాజీయాన్ని పరిష్కరించి అచ్చువేసిన వాళ్ళు దీనిని ఫలసదనవృత్తం అని పేర్కొన్నారు. అది 18వ ఛందంలోనిది. రామరాజీయంలోని

" పద్యంలో పాదానికి 17 అక్షరాలున్నాయి కనుక అది 17వ ఛందంలోనిదనే చెప్పాలి.

నిటలతటమునబొమలునిచికలనియందార్వీటితిరుములనృ పశకివితతకరహేతి

స్ఫుటతబఅపసరితతిపాలతులెడలంతంతటవనములకు జనిరిదడ బడుచుఖీతిన్‌ (రామరాజీయం. 3%)

ఈ _మవోషవృత్తాన్ని వాడాక వెంకయ్య మరొకటి వ్రాశాడు. దీని పేరు కసుమితలతావేల్లితవృత్తం. ఇది 18వ ఛందంలోనిది. దీనికి తూడా అప్పకవి లక్షణం చెప్పాడు.

ఈ విధమైన వివరాలేకాక రామరాజీయంవల్ల ఆరవీటివంశంలోని రాజులు రాణులు ఏవిధమైన సాహిత్య సేవ చేశారో కూడా తెలుస్తుంది. రామరాజీయాన్ని చెప్పించిన కోదండరామరాజుగారి తమ్ముడు ఆర్వీటి తిరుమల రాజు (తిమ్మరాజు) ఓక ద్విపద రామాయణ కావ్యం వ్రాసి విరూపాక్షునికి అంకితం ఇచ్చాడట. ఈ తిరుమలరావు భార్యపేరు కోనేటమ్మ. ఆమె కవులను పోషించి కృతులను అంకితం పొందిందని అందుగుల వెంకయ్య ఇలా చెప్పాడు:

దుర్ణయరాజన్యదోళ్ళక్తులుడిగించి సర్వసర్వంసహాచక్రభార

భరణదక్షతమహాప్రాడులౌ శ్రీకృష్ణ్ణంయలునార్వీటీరామరాజు

తిరుమలరాయాదిధరణినాయకులును వారల దేవులు వసుధగీర్హి

గనరె యీకీర్తికి జననంబు పోషితకవిజనసన్నుతికాదె యిట్టి

కవిజనాధారవిఖ్యాతిగాంచి మిగుల

గవులబోషించి తన్నుతికబ్బములను

తింపవెలసెను నార్వీటితిరుమలక్ష

మానవేంద్రుకోనేటమ్మ మహినిమిగుల (రామరాజీయం, 40)

ఈ పద్యంవల్ల ఒక సరికొత్త విషయం తెలుస్తూంది. విజయనగర సాత్రూజ్యాన్ని పాలించిన కృష్ణదేవరాయలవారు, అళియ రామరాజు, తిరుమలదేవ రాయలు మొదలైన మగవారేకాక వాళ్ళ దేవేరులు కూడా కవులను పోషించి కీర్తి పొందారట. వాళ్ళలాగే తోనేటమ్మ పుస్తకాలు చెప్పించిందట. ఈమె పోషించిన కవులెవరో, వారు రచించిన

నిజానికి అందుగుల వెంకయ్య గురించి తూడా పరిశోధన చెయ్యాలి. ఇతని వివరాలు కూడా ఏమీ లభించలేదు. ఈ కవి తండ్రి పేరు సూరయ్య. అతడు కరణమో

అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 601 మంత్రో అయి ఉంటాడు. ఆరవీటి రాజుల చరిత్రను వ్రాసిన కవి తన చరిత్రను బ్రాసుకొనకపోవడం విచారింపతగ్గ మషయమే. అయితీ అందుగుల వెంకయ్య కాలాన్ని నిర్ణయించడానికి కొన్ని డొంక తిరుగుడు మార్గాలు కనబడుతున్నాయి. ఇతని తండ్రీ పేరు సూరయ్య. ఒక అందుగుల సూరయ్య శాసనాన్ని చాగంటి శేషయ్యగారు గుర్తించారు. అయితే ఇది క్రీశ 1546 ప్రాంతాలనాటిది. ఈ అందుగులవారు నందేలవారికీ కావలసినవారు. నందేల తిమ్మరాజయ్య, నారపరాజయ్యల పుణ్యం కొరకు కడప బిల్లా తమలాపురం తాలూకాలోని పోట్లదుర్తి గ్రామంలో చెన్నకేశవాలయానికి అందుగుల సూరయ్య తన అన్నతోపాటు ఇంకొకరితో ఈ దానాన్ని చేశారు. ఈ అందుగుల సూరయ్య మనుమడే నరపతివిజయం కృతికర్త తండ్రి సూరయ్య కావచ్చునని చాగంటివారు భావించారు. అప్పుడు క్రీ.శ. 1546 నుండి రెండు తరాలు హెచ్చిస్తే ఈ సూరయ్య క్రీ.శ. 1606 నాటివాడు అవుతాడు. కావ్యరచనాకాలం సరిపడదు. శాసనంలోని సూరయ్య మనుమని మనుముడే కృతికర్త తండ్రి సూరయ్య అనుకొనడానికీ ఆస్కారముంటే కవి తండ్రి క్రీ.శ. 1666 ప్రాంతాలవాడు కాగలడు. అపుడు అందుగుల వెంకయ్య శ్రీశ. 1660 ప్రాంతాలలో ఉండగలడు.

ఈ కాలనిర్ణయం ఒక్క కృతికర్త విషయంలోనేకాక కృతిభర్త కోదండరామరాజుకు తూడా సరిపోతుంది. ఇతడు అళియ రామరాజు కడగొట్టు కుమూరుని మనుమని తుమారుడు.

  1. అశియరామరాజూ క్రీ.+15656లో జరిగిన రక్షసి తంగడి యుద్ధంలో

మరణించాడు.

  1. అళియరామరాజు అయిదుగురు కుమారులలో కడగొట్టు కొడుకు శ్రీ, రంగరాజు క్రీశ 1570 ప్రాంతాలవాడు అనవచ్చు.

౩. పై శ్రీ రంగరాజు రెండో కుమారుడు చిన వెంకటరాజు క్రీశ. 16౫ ప్రాంతాలలో ఉండవచ్చు.

  1. చినవెంకటరాజు రెండో కుమారుడు వెంకటరాజు అప్పుడు 1650 ప్రాంతాలవాడుగా తేలుతాడు.

  2. ఈ వెంకటరాజు రెండో కుమారుడే కృతిభర్హ కోదండరామరాజా. ఇతని తండ్రీ కాలం క్రీశ 1850 అని తేలింది. కనుక ఇతని కాలం శ్రీశ 1680 అనీ కచ్చితంగా చెప్పుకోవచ్చు.

కాలం శ్రీ.శ+1630 అని ఇంతకు ముందు ఊహించాము. కృతికర్త, కృతిభర్త ఒకే కాలంవారు అవుతున్నారు. “రామరాజీయం' కావ్యం 1490 ప్రాతాలనాటిది. ఈ రామరాజీయానికి నరపతివిజయం అనే నామాంతరం ఉంది. విజయనగర రాజులకు నరపతులనే పెరు సుప్రసిద్ధం. మహమ్మదీయులకు అశ్వపతులు, కటకం రాజులకు గజపతులు అనే పేర్లు ఉన్నాయి.

  1. ఆంధ్రకవితరంగిణి - 11వ సంపుటం - పుట 209

602 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ

గజపతులను, అశ్చపతులను జయించిన కృష్ణదేవరాయలవారి విజయాన్ని గురించి తూడా ప్రత్యేకంగా ఒక కావ్యరూపంలో వ్రాయించాలన్న సంకల్పం రామరాజీయం చెప్పించిన కోదండరామరాజు కుమారుడు చినవెంకటరాజుకీ కల్గింది. తండ్రి అందుగుల వెంకయ్య చేత కావ్యం వ్రాయిస్తే కొడుకు కుమారధూర్దటి అనే కవిచేత కృష్ణరాయ విజయాన్ని చెప్పించి శ్రీరామునికి అంకితం చేయించాడు. అష్టదిగ్గజాలలో ఒకడైన ధూర్జటి వంశంలో ఈ కుమారధూర్జటి పుట్టాడు. బహుశా మొదటి ధూర్జటికి ఇతడు మనుమడి మనుమడై ఉంటాడు.

అప్పటికి కుమారధూర్దటికి అట్టే వయసు లేదు. కృతిపతి అతణ్జీ “బాలుడవయ్యును విద్యాశీలుడవు' అన్నాడు. ఆ వయసులోనే అతడు గంఖీర మధుర శృంగార కళాలాలిత చాతుర్యంగల కవి (కృష్ణాయ విజయం 1-24) ఇంతకన్నా బాల్యం నుండీ కుమారధూర్జటి గ్రంథ రచన చేస్తూ వచ్చాడు. చిన్నప్పుడే సావిత్రి చరిత్రను, ఇందుమతీ వివాహాన్ని పద్యకావ్యాలుగా రచించాడు. ఈ సంగతి కోదండరామరాజుగారి చినవెంకటరాజు ఇలా చెప్పాడు:

చిత్రముగాగ జిన్నపుడె చేసితివౌ రసముల్‌ చెలంగ సా

విత్రిచరిత్రముక మిగులవేడుక నిందుమతీ వివాహము౯

స్తోత్రమొనర్చ నర్హమగు సూక్తిగతి౯ రచించితౌగదా

ధాత్రిబ్రసిద్ధిగాంచితివి ధన్యుడ వౌర కుమారధూర్థటి (కృష్ణరాయ విజయం, 1-౫)

ఇలా ప్రసిద్ధిపొందిన కుమారధూర్జటి అసలు పేరు వెంకటయ్య. అయితే ధూర్జటి వంశంలోని వాడు గాబట్టి తుమారధూర్జటి అనే విరుదనామం వచ్చింది. కృష్ణదేవరాయల వారు తొలి ధూర్జటిని మెచ్చుకొనేవారని చినవెంకటపతిరాజిలా ప్రశంసించాడు:

స్తుతమతియైన యాంధ్రకవిధూర్జటిపల్కుల కెట్లు గల్లెనో

యతులితమాధురీమహిమ నామును మీపెదతాత చాలస

నున్నతిగనె కృష్ణ్ణయల మనోజ్ఞసభక్‌ విను మీవు నట్లు మ

తృృతిబహుమానవైఖరుల గీర్హివహింపుము ధాత్రిలోపలక.

(కృష్ణరాయ విజయం, 1-2)

కుమారధూర్దటికి బహుమానాలిచ్చి వెంకటపతిరాజు కృష్ణరాయ విజయాన్ని చెప్పించాడు. ఇది ఇంతకు ముందు ప్రసిద్ధమైన రాయ వాచకానికి పద్యరూపమైన మార్చు.3 ఈ గ్రంథము చరిత్రకారుల కంతగా ఉపయోగపడదు. ఇది ప్రబంధ దృష్టితో రచింపబడినది. కాని చారిత్రక దృష్టితో వ్రాయబడినది కాదు' అని చాగంటి శేషయ్యగారు అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయ చరిత్రకిది తోడ్పడక పోవచ్చునుగాని సాంఘిక చరిత్రకు కొంత పనికివస్తుంది. సురవరం ప్రతాపరెడ్డిగారీ గ్రంథాన్ని కొల వాడుకొన్నారు.! 4. అంధ్రకవితరంగిజి, 12వ సంపుటం, పుట ౪ 5, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, పుటలు 226-227

అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 663

చరిత్రకు సైతం అంతంత మాత్రంగా పనికివచ్చే ఈ గ్రంథం సాహిత్యంలో పెద్ద పీట నోచుకొనదు. తుమారధూర్జటి బాల్యంలో వ్రాసిన గ్రంథం కాబట్టి ఇందులో ప్రతిభ రాణించలేదనుకోడానికి వీలులేదు.

ఇంతకన్నా చిన్నతనంలో వ్రాసిన 'ఇందుమతీ పరిణయం” చక్కగా ఉంది. దీనిని తుమారధూర్దటి 'అభంగ శృంగార రససంగతం'గా వ్రాసి నూజివీడు పాలించిన మేకా వీరనరసప్పారావుగారికి అంకితమిచ్చాడు. ఈయన రెండవ విజయఅప్పారావుగారి మనుమడు. నూజివీడు ప్రభువులలో మొదటి విజయ అప్పారావుగారు గోలకొండ సుల్తానుల పక్షాన యుద్దాలు చేశారు. ఇబ్రహీం కుతుబ్‌షాతోటీ, అతని కొడుకు మహమ్మద్‌ కులీ కుతుబ్‌షాతోనూ సఖ్యంగా ఉండేవారు. మొగలాయీ సైన్యాలను ఓడించి 'విజయ' బిరుదాన్ని పొందారు. ఈయన క్రీ.శ.1597లో గోదావరీ తీరాన జరిగిన సోనపుత్ర యుద్ధంలో మరణించారు. వీరి మనుమని మనుమడు నరసప్పాగావుగారు బహుశా క్రీ.శ. 1700 ప్రాంతాలలో నూజివీడు పాలిస్తూ ఉండేవారని బావించవచ్చును.

ఏ కారణంవల్లనో దక్షిణాదివాడైన కుమూరధూర్జటి నూజివీడు వచ్చాడు. అతణ్ణి నరసప్పారావుగారు ఇలా మెచ్చుకొన్నారు:

దాక్షిణాత్యకవులు బ్రాక్షేక్షుముధురస- మాధురీధురీణమహితదివ్య

ం (ఇందుమతీవిజయం, 1-32)

ఈ ప్రాడుణ్జి మెచ్చుకొని తనకో పుస్తకం అంకితమివ్వమన్నారు. సాధారణంగా మన సాహిత్యంలో కవులకు కలలు రావడం, వాటిలో దేవతలు కనబడి కృతులు ఇమ్మనడం రివాజు. ఇక్కడ నరసప్పారావుగారికి కల వచ్చింది. అందులో హరిహరులు, సరస్వతి కనబడ్డారు. వాణి వారికి ఒక పుస్తకం ఇచ్చింది. మరునాడు తమ కల చెప్పిన అప్పారావుగారికి ఒక పుస్తకం అంకితం పుచ్చుకోమని సభాసదులు సలహా ఇచ్చారు. ఆయన కుమారధూర్జటి విరచించిన ఇందుమతీ పరిణయం అందుకున్నారు.

అది ఆరాశ్వాసాల ప్రబంధం. ౫4 గద్భపద్యాలున్నాయి. రఘువంశంలోని 5, 6 సర్గలను ఆధారం చేసుకొనే కుమారధూర్జటి దీనిని వ్రాసినా చాలా మార్పులు చేశాడు. రెండవ ఆశ్వాసంలో అజ మహారాజు కీర్తిని విని ఇందుమతి అతణ్ణి ప్రేమిస్తుంది. కలలు కంటుంది. ఆమె విదర్చ దేశాధిపతి చెల్లెలు. వాళ్ళది కుండిన నగరం. ద్వాపర యుగంలో రుక్మిణీ ఇదే కుండిన నగరంనుండి శ్రీకృష్ణుని వద్దకు ఒక బ్రాహ్మణుని రాయబారం పంపిన సంగతి కుమారధూర్దటికి తెలుసు. అంతకు ముందు యుగంలో ఉన్న ఇందుమతి అలా చేయకుండా ఉంటుందా అని భావించాడు. శివర్మ అనే బ్రాహ్మణుడి చేత ఇందుమతి రాయబారం పంపిందని కల్పించాడు. ఆ శివశర్మ ఇలా ప్రయాణం చేశాడట

వలిపెనీర్కావిదోవతి జుట్టి శిరముపైబూన్చినశా స్పెకపుస్తకంబు

దావళి మడిపట్టుదోవతి దేవపూ జాపేటిగలమూటచంకతాళి 6. "ఖుతుబ్దాహీలు - ఆంధ్ర సంసృతి' అనే పుస్తకంలో "గోలకొండ ఖుతుబ్హాహీలు - అంధ్రదేశపు

నంస్థానాధీశ్చరులు' - నిడుదవోలు సుందరేశ్చరరావుగారి వ్యాసం, పుట ౫5.

ఈ04 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపు

వేలిమినమిదత్రోవియు వేణుదండంబు పలకేలడాలీను వ్యజనమొకటి

యురమున రుద్రాక్షసరములు ముంజేత జపమాలికయుదాల్చి సత్వరముగ

తండులాదికతా మ్రపా త్రములతోడ- నెనగుసంచియునగలబొక్కసముదాల్చి

వెంటశిష్యుండుచనుదేర విప్రముఖ్యు- డజునిజాడ నయోధ్యకునరిగెనంతు

(ఇందుమతీపరిణయం, 2-11)

అయోధ్యలో ఆ బ్రాహ్మణుడు అజ మహారాజును దర్శించి ఇందుమకి రూపురేఖల్ని విపులంగా వర్ణించి చెప్పడమే కాక “తాళగజాలవేని వనితామణి జూవెడ చూడుమంచు గ్రొమ్మేలిమిపల్కపై దమకు మించదదాకృతి వ్రాసి చూపాడు (2-1౫). ఈ ట్రాహ్మణుడు ఎంతకీ తిరిగి రాకపోవడంవల్ల ఇందుమతి ఆరాటం చెందింది.

అల్ల ద్వాజుండు రాడు తడవాయెగదా నరనాథనందనుం

డుల్లమెలర్పనన్‌వినియెనో విని యుద్వహనేచ్చ యాత్మలో

నుల్లసిలంగ నోచెనో మరొక్కతి నెవ్వతనైననెంచెనో

పల్లవపాణణలారా! యలభావజుబారిబడంగశక్యమే? (ఇందుమతీ. ౩-10)

ఇది పోతరాజుగారి పద్యాన్ని (భాగ. దశమ. 1-1724) చూసి వ్రాసిందేగాని, దాన్ని మించలేదు సరికదా దరిదాపులకు రాలేదు. అందులో రుక్కిణి 'నా భాగ్యమెట్లున్నదో అని యీశ్వరుణ్ణీ, అర్యామహాదేవినీ తలచుకుంటుంది. ఇందుమతి ప్రబంధనాయిక అందుచేత అమెకు సవతి గురించే ఆలోచనలు పోతాయి. భావజుడే జ్ఞాపకమొస్తాడు. ఇందుముతీ పరిజయంలోని మన్మథోపాలంభనం ఇలా ఉంది.

నీ బాణయులు రాల, నీ ధనువుఖండీభూతమైపోవ, నీ

జాబిల్లి ఫణీయంట, నీబలము లాశావీధిపాలైచనన్‌

నీ బంట్రౌతుతనంబు స్త్రీలయెడనే, నిన్నెవ్వరున్‌ నవ్వరే

మాబాలామణీనేచబోతు మకటా మర్యాదగా దాత్మజా! (ఇందువతీ. 4-3)

ఈ పద్యంలో కొంత చమత్కారం ఉంది. మన్మథుని బాణాలు పువ్వులు: అవి రాలిపోతాయి. అతని ధనుస్సు చెరకుగడ; దాన్ని ఎలాగా ఖండాలు చేస్తారు. సహజంగొ లోకంలో జరిగే వాటినే తిట్ల కీంద వాడి కవి చమత్కరించాడు. వాస్తవానికి ఈ కావ్యంలో ప్రతిపద్య చమత్కృతి చూపించాలని ధూర్జటి తలచాడు.

ప్రతిపద్యచమత్కృతితొ- సతిహృద్యంవిదియటంచు నఖిలకవీంద్రుల్‌

మతిజోద్యలీలవినగా- గృతిసద్యశమలరబేయ గృతనిశ్చయతక్‌. (ఇందుముతీ. 1-4) -.... ప్రతిపద్య చమత్కృతి ఒక్క చేమకూరకే చెల్లు ఇందులో కుమూరధూర్జటీ ఈక్కడక్కడ చేమకూరని అనుసరించాడు. ఇతర కవులను ఎక్కడ అనుకరించినదీ కొం తిరుపతి వేంకటకవులు తమ పీఠికలో చూపించారు. ఇందుమతీ పరిణయాన్ని నూజీవీటివారు ప్రచురించారు. తిరుపతి కవులు పరిష్కరించారు. గుంటూరు చంద్రికొ వైస్‌ వారు ప్రచురించారు. “ఈ ఇందుమతీ పరిణయమును మిక్కిలి చిన్నతనమునందే బ్రాసినట్లూహింపవలసియున్నను, నది నతిశయోక్తిగా ఖావించి మేమితడీ గ్రంథమును

అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 6065 యౌవనదశలోనే వ్రాసినట్లఖిప్రాయపడుచున్నాము”' అని తిరుపతి కవులు చెప్పారు. అయినా దీనిని నూనూగు మీసాల నూత్న్సయౌవనానికి ముందే వ్రాశాడని నేను భావిస్తున్నాను. ఇందుమతీ పరిణయం గద్యలో కుమార ధూర్జటి తాను 'కాళయామాత్య లక్ష్మాంబా తుమారుణ్జి అని మాత్రమే చెప్పుకొన్నాడు. కృష్ణాయ విజయంలో “కాళయామాత్యలక్ష్యాంబికా దత్తప్రోలమంత్రి గురువమాంబికా కుమూర ధూర్జటి'నని చెప్పుకొన్నాడు. ఇందుమతీ పరిణయం వ్రాశాక ఇతణ్జీ ప్రోలమంత్రి దత్తత చేసుకున్నాడు. మరీ యౌవనంలో ఉన్నవాణ్ణి దత్తత చేసుకొనడం అరుదు. దక్షిణాదిని ఉండే కాళయ్యగారి ధూర్జటిని నూజివీటి ప్రాంతాలలో స్థిరపడిన శప్రోలమంత్రి దత్తత చేసుకోవాలనుకొన్నాడు కాబోలు. నూజివీటికి వచ్చిన బాలకవికి రాజదర్శనం ప్రాప్తించింది. అంతకు ముండే పూర్తిచేసి ఎవరికీ అంకితం ఇవ్వని ఇందువతీ పరిణయాన్ని రాజు పుచ్చుకొన్నాడు. కృతి స్వీకరణ తర్వాత దత్తత జరిగి ఉంటుంది. అందుకే గద్యలో కుమారధూర్జటి తన జనక తండ్రినీ, తల్లినీ మాత్రమే పేర్కొన్నాడు. ఈ కృతి సమర్పణ క్రీ.శ 1700 ప్రాంతాలలో జరిగి ఉంటుంది. ఈ ఊహకు కూడా సబవులు ఉన్నాయి. ఇందుమతీ పరిణయం కృతిభర్త నరసప్పారావుగారు. ఈయన రాజ్యానికి వచ్చిన కాలం నిక్కచ్చిగా తెలియదు. అయినా ఈ వంశంలోని ఇతర వ్యక్తుల కాలాలనుండీ దీనిని ఊహించవచ్చు. జ్రీ.శ41%87లో రెండవ విజయఅప్పారావుగారు గోలుకొండ కుతుబ్‌షాహీల వల్ల ఖిరుదులు అందుకొన్నారు. ఆ సంవత్సరమే ఆయన గొల్లపల్లికి వచ్చారు. శ్రిశ1౪0లో నూజివీడు కోటను కట్టారు. ఈయన ఎంతకాలం పాలించారో తెలియదు. తర్వాత వెంకటాద్రిగారు. వారి తర్వాత నరసప్పారావుగారు రాజ్యానికి వచ్చారు. నరసప్పారావుగారు సప్త సంతానాలలో ఒకటైన కృతిని అందుకొన్నా నిస్సంతుగానే పోయారు. వీరి తర్వాత జ్ఞాతులలో ఒకరైన రామచంద్రయ్య నరసింహఅప్పారావు అనే పేరుతో రాజ్యం స్వీకరించారు. వీరి కాలంలోనే అసఫ్‌జాహీలతో తగువు వచ్చింది. శ్రీ.ఈ1707లో జౌరంగబేబు మరణానంతరం శ్రీ 1708-1712 సంవత్సరాల మధ్య కలోలాలు జరిగాయి. ఈ కాలంలోనే ఫొౌజుదార్‌ రుస్తుం అలీఖాన్‌ నూజివీడుపై దండెత్తి రామచంద్ర అప్పారావుగారి తలకొట్టి ఏలూరు తోటగుమ్మానికి కట్టూడు.]* ఈ చారిత్రక కారణాలవల్ల ఇందుమతీపరిణయాన్ని అంకితం పుచ్చుకొన్న చరసప్పారావుగారు క్రీ.శ1706కి చాలాకాలం కిందనే, అంటే అయిదారు సంవత్సరాల పూర్వం గతించి ఉండాలి. కృతి స్వీకారం క్రీ.శ+1700 అనుకొంటే అభ్యంతరం ఉండదు. ఈ అంకితం జరిగాకనే కుమారధూర్జటిని ప్రోలమంత్రి దత్తుని చేసుకొన్నాడు. తర్వాత లి. 030౧ 10యల0లంజనం రిఆలోర 1120021683 పుట 26. ఈ అప్పారావుగారితే “విజయ' అనే బిరుదు వాచకం లఖించిందని సంప్రదాయం. నిడుదవోలు సుందరేశ్వరరావు ఇంతకుముందు చెప్పిన విషయాన్ని ఇంకా పరిశీలించి ఖరారు చేయాలేమో.

$. శ్రీ మదప్పారాయాన్వయ చరిత్రము - పుట 11.

10 గగగం 0జకోరో జాాజీ - 9.27

606 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుకీ ఆరవీటీ కోదండరాజు (1680) రెండవ కుమారుడు చినవెంకటరాజు (1710) కుమారధూర్జటి చేత శ్రీకృష్ణాయ విజయాన్ని చెప్పించాడు. ఈ కాలనిర్ణయాణ తుమారధూర్జటి వయసుకు సరిపోతాయి.

పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇందుమతీ పరిణయాన్ని తరువాత ఒకటి రెండేళ్ళకు కృష్ణరాయ విజయాన్ని కుమారధూర్జటి వ్రాశాడు భావించవచ్చును. పైలాపచ్చీసుకు ముందే ఇలాంటి గ్రంథాలను వ్రాసినవాడు తరువాశ కూడా ఏవో రచించి ఉండాలి. ఇతడు ఫ్రాఢవయసులో ఏ కావ్యాలు చెప్పాడో తిలియదుగాని ఇతని కొడుకూ, మనుమడూ చెప్పిన కావ్యాల పేర్లు తెలుస్తున్నాయి కుమారధూర్జటి కొడుకు పేరు లింగరాజు. ఇతడు రాబజసభలలో బంగారు జరీబట్టలు, మణిహారాలు, అగ్రహారాలు, పల్లకీలు, ఏనుగులు మొదలైన బహుమానాలు పొందాడు. & లింగరాజును సత్కరించిన రాజులు కాళహస్తి ప్రభువులు. దామెర్ల అక్కప్పు నాయకువి కుమారుడు వెంకటపతిరాయడు ఈ కవిచేత పెదకాళహస్తి మాహాత్మ్యం అనే పద్యకావ్యం చెప్పించాడు. ఇది 12 ఆశ్వాసాల గ్రంథం. ఇంతకు ముందు కృష్ణదేవరాయల వా! కాలంలో పెదధూర్జటి ఒక కాళహస్తిమాహాత్మ్యాన్ని నాలుగాశ్వాసాలుగా చెప్పాడు అయితే దామెర్ల వెంకటపతిరాయలకు దానితో తృప్తి కలుగలేదు. లింగరాజును పిలి ఇలాగ చెప్పాడు:

వినుకాళహస్తిమహిమం- బనుపమమైైవెలయ మునుషడధ్యాయకథక

దెనుగున కావ్యముగనొన-ర్చెను పెదధూర్జటికవీం ద్రశేఖరుడనఘా. ఈ పద్యంవల్ల తొలిధూర్జటికి ఆరధ్యాయాల [గ్రంథమే మూలమని తెలుస్తోంది. అదీ స్కాందంలో ఉంది. శివరహస్యుఖండంలో నూటయిరవై అధ్యాయాలున్నాయట. వాటినీ ఆనిగించమని దామెర్ల వెంకటపతిరాజు లింగరాజుతో చెప్పాడు.

బహుపురా ణమథిత భవ్యార్థకివతత్త్వ- సారమెల్లనైక్యసరణిబొదలి

జిగతిశివరహస్యాసంగ్రహమను నితి- హాసమొనరువిబుధులభఖినుతింప.]1

(వెదకాళహస్తి

అ యితిహాసమందలి యుత్తర భాగంబునందు భాస్వన్నిరూఢీ

గాళహస్తిమహత్త్వకథ నూటయిర్వది యధ్యాయముల జెలువమరుచుండు

దత్కథ దెనుగున ద్రాక్షారసోర్మికా పరిపాకవిస్ఫూర్తి బరిఢవిల్ల

గృతియొనర్చుము మదంకితముగా శబ్ద చమత్కృతి పండితుల్‌ మదిగడింప.

లింగరాజీ పెదమహత్వాన్ని వ్రాసి దామెర్లవారిచేత బహుమతులు పొందాడు. విషయాన్ని ఇతని కుమారుడు తెలియజేశాడు. అతడు తూడా కవే. రత్నావళీ పరిణయ అనే కావ్యాన్ని వ్రాశాడు. అందులో తన తండ్రి గురించి ఈ పద్యం చెప్పాడు.

(వెంకట్రామా ప్రచురణ)లో ఉదహరించారు., పుటలు ౩-4.

అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 607 ఘనగౌరీశకటాక్షలబ్ధకవితా గాంభీర్యసంతుష్టభూ జనరాడ్డత్తసువర్ణచేలమణిభూషా గ్రామపల్యంకికా ఘనదంతావళ ఘటకాదిబహుసక్కార ప్రతిష్థాత్ము మ జ్దనకు౯ ధూర్జటిలింగరా జకవిరాజ శ్రేష్టు గీర్డించెదక. (రత్నావళీ పరిణయం, 2 664

ఈ రత్నావళి పరిణయాన్ని వ్రాసిన కవిపేరు ధూర్జటి వెంకటపతి. ఇది నాలుగాశ్వాసాల

ట్రొఢకావ్యం. ఇందులో కాశీలోని రత్నలింగేశ్చ్వర మాహాత్మ్యాన్ని కవి వర్ణించాడు.

రత్నచూడుడనే నాగరాజు పుత్రుడు రత్నావళి అనే రాజకుమార్తెను ప్రేమించాడు. అమె గంధర్వపతి కుమార్తె. ఈమె పరిణయాన్ని శృంగారకావ్యంగా వ్రాసి, కవి చేకూరి రామస్వామి అనే మంత్రికి అంకితం ఇచ్చాడు. ఈయన నేటి దక్షిణార్కాడు జిల్లా తిరుపాపుళియూరులో ఉండేవాడు. ఆ రోజులలో దానిని పాటలపురం అనేవారు. తన కృతిపతినివాసాన్ని ధూర్జటి వెంకటరాయడు ఇలా చెప్పాడు: పరగనమ్మేటిధారుణిగరుడసింధు- దక్షి ణపినాకినీతటస్థానపూర్వ శరధిసంగమపాటలపురనివాస-మహితకే? రామస్వామిమంత్రిమాళి (0664) ఈ రామస్వామిగారు చాలా చదువుకొన్నవాడట. ఈయన మాననీయ కవి రాజులు వ్రాసిన అనవద్యతర గద్యపద్యమయ ప్రబంధాలలోని సాహితీ చమక్కారాలను గ్రహించగలడని ధూర్జటి వెంకటరాయడు చెప్పాడు. ఈ కవి రత్నావళి పరిణయాన్ని బ్రాయడానికి ముందు ఉభయభాషలలో మంచి కవిత్వం చెప్పే శక్తినీ. వ్యాకరణ నాటక అమరాన్ని పద్యుకావ్యంగా అనువాదం చేసి రామునికి అంకితం ఇచ్చాడు. ఈ విషయాలను కవి రత్నావళీ పరిణయంలో మూడు పద్యాలలో చెప్పాడు. ధూర్దటి కవుల వివరాలను క్రోడీకరిద్దాం సంఖ్య కని కాలం పోషకులు లంథాలు 1... తుమూర ధూర్జటి త్రీ.శ1700 నూజివీటి నరస సావిత్రీ చరిత్ర- వెంకటరాయడు నుండి ప్పారావు, ఆరవీటి ఇందుమతీ పరిణయం 1710 మధ్య చినవెంకటపతి కృష్ణరాయ విజయం 2 లింగరాజు 1730 దామెర్ల వెంకటపతి పెదకాళహస్తి మాహాత్మ్యం 3... ధూర్జటి వెంకట బహుశా చేతూరి రామస్వామి శతకాలు దండకాలు రాయడు క్రీశ 1750 అమరం తెనిగింపు రత్నావళి పరిణయం మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో రత్నావళీ పరిణయానికి రెండు ప్రతులు ఉన్నాయి. ఇతని ఇతర రచనలు దొరకలేదు. రత్నావళీ పరిణయాన్ని బ్రౌనుదొర నిథిలమవుతున్న వ్రాతప్రతినుండి వ్రాయించారు కనుక దక్కింది. (0 664)

కృష్ణాధ్వరి, శ్లేష కవులు జొ౭ వార్తా చమక్కారాలున్న ప్రబంధాలనే మెచ్చుకునే నాయకరాజుల హయాంలో కేవలం పాండిత్యప్రకర్తను ప్రదర్శించే రెండర్థాల కావ్యాలను వ్రాసే కవులు కూడా వన్నాకెక్కడం గమనించదగ్గ విషయం. రఘునాథనాయకుని ఆస్థానంలో కృష్ణాధ్వరి అనే కవి ఉండేవాడు. ఆయన నైషధపారిజాతం అనే “పుణ్యశోక్లోషు ప్రబంధాన్ని వ్రాసి రఘునాథునికి అంకితం ఇచ్చాడు. ఈ రెండర్థాల కావ్యంలో నలచరిత్రను, చమత్కృతులు, వస్త్వలంకృతులు, ధ్వని అష్టాదశ వర్ణనలు పరిపూర్ణంగా తాను చెప్పినట్టు కవి భావించాడు (1-3). తన పదకావ్యాలు విద్వత్కవిప్రియాలని తలచాడు (1-13). అలంకారికులు తన కావ్యాన్ని చదివి హర్షిస్తారని భావించాడు (1-8). అయితే చేమకూర వెంకటరాజుగారు. చెప్పినట్టు పండితులు ఈర్చాళువులు. అందుకే ఆయన తన విజయవిలాసంలో ఇలా వాపోయారు. _ ఎందును విద్యమేలెజుగ లెవ్వ, రెకింగిన గొంతమాత్రమే

యందును సాహితీగసమహత్త్వమెలుంగ, రెజింగిరేని యీ

న్నుందగు నచ్చుడేంద్ర రఘునాథవిభుండె ప్రవీణుడన్నిటక్‌. (విజయ. పీఠిక ౪)

ఈ పద్యంలో వెంకటరాజుగారు భావించినట్టే కృష్ణాధ్వరి కూడా ఒక్క రఘునాథనాయకుడు తన కావ్యాన్ని మెచ్చుకోగలడనీ, ఆ రాజు మెచ్చుకొంటే చాలుననీ తృష్తిపడ్డాడు. అందుకే ఈ పద్యం చెప్పాడు:

ఆలంకారికహర్హమత్కృతికరంబాజానసారస్వత

శ్రీలుండే రఘునాథళౌరి గని హర్షింపంగ నన్యుల్‌ వృథా

స్థూలంభావుకులైన కొందరు దృడహ్యాతోష్టతీతాసూచితో

పాలంధుల్‌కనకున్న నేమి కుహనాహలోహలున్‌లోహలుల్‌ (నైపా. 1-8)

ఈ రెండర్గ్థాల కావ్యాన్ని కృష్ణాధ్వరి నిజంగా రఘునాథనాయకుని సంతోషం కోసమే వ్రాశాడు. ఆ సంగతి ఇలా చెప్పాడు:

నైషధపారిజాతహర ఇద్చికథార్థసమర్థనధ్వని

శేషగతి ప్రబంధము రచించిన మా రఘునాథళౌరి సం

తో షమునందునక[కణకణోదశదిగ్దయశో ితద్యశో

భూషణమైన యీకృతికి బూనితి బ్రౌఢీ నిగూడి చెందగన్‌. (నైపా. 1-6) ఈ ద్వ్యర్థికావ్యాన్నే రచిస్తే రఘునాథుడు సంతోషం చెందడానికి తగినంత కారణముంది. పారిజాతాపహరణాన్ని అశువుగానూ, నలచరిత్రను ద్విపదగానూ అంతకు ముందే రఘునాథుడు రచించాడు. ఈ రెండింటినీ జోడించితీ తన ప్రభువు సంతోషిస్తాడని కవి భావించాడు. నైషధపారిజాతాన్ని వ్రాయడానికి ముందు కృష్ణాధ్వరి అయిదు కావ్యాలు

కృష్ణాధ్వరి. శే కవులు 609 వ్రాసి రఘునాథునికే అంకితం ఇచ్చాడు. ఈ కొత్త కృతి అయిదుగురు అక్కల చెల్లెలని ఇలా చెప్పాడు:!

నవరస ' శ్రీ రఘునాథభూపాలీయ' నామభీమాభాష్టనాయకుండు

కళ్యాణ “క్రైముదీకందర్ప' నాటక కన్యోద్వహన బద్ధకంకణుండు

అమరుకాహంకారహారిభంగీక “శృంగారసంజీవనీ' కాముకుండు

తాళచింతామణీవధూతత్పరుండు- మంచిజామాతరఘునాథమనుజచేత

తెలియనైషధపారిజాతీయకృ తియు- నేవురక్కల చెల్లెలై హెచ్చుననుచు.

(నైపా. 1-14)

ఈ పద్యంలోని రెండవ పాదాన్ని బుద్ధిపూర్వకంగానే నేను ఉదాహరించలేదు. దానికి కారణం ఉంది. ఈ పాదంలో గణభంగం, యతిభంగం ఉంది. నైషధపారిజాతీయం అచ్చుపడలేదు. దీని ప్రతిఒకటి తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలో ఉంది. (0.172-235). అందులోని పద్యం రెండోపాదం ఎలా ఉందో అలా ముందు పొందుపరుస్తాను.

నైషధపారిజాతావతారికాహృ దయకా

వ్యవర్యా స్వయంవర వల్లభుండు. (నైపా.1-%)

ఛందోభంగం ఉన్నాసరే వ్రాతప్రతిలో ఉన్న పాఠాన్ని యథాతథంగా ప్రచరించాలి కనుక నైషధపారిజాతం గురించి ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు తమ కేటలాగులో క్రీ.శ.1933లో పై పాఠాన్నే చూపించారు. సరస్వతీ మహల్‌వారి లిఖిత గ్రంథాలను గురించి ఆంధ్రవిశ్చవిద్యాలయంలోలాగే మద్రాసు యూనివర్సిటీ వారుతూడా శ్రద్ధ వహించారు. క్రీశ 197లో తంజావూరిలోని అముద్రిత గ్రంథాలను పరిశీలించడానికి తమ పండితులను విశ్వవిద్యాలయం వారు పంపారు. శ్రీ చల్లా సత్యనారాయణగారు ఇతర గ్రంథాలతోపాటు కృష్ణాధ్వరి నైషధపారిజాతాన్ని పరిశీలించి దానిపై విపులమైన విమర్శకవ్యాసాన్ని ప్రకటించారు. అందులో ఈ సీసపద్యాన్ని ఉదాహరించి రెండవ పాదాన్ని, ప్రతిలో ఉన్నట్టుకాక, పరిష్కరించి ఇలా ప్రకటించారు: దీనివల్ల గణాలు సరిపోయాయి గాని కవి వాడిన 'హృదయం' పోయింది. ప్రథమార్థంలో యతికూడా పోయింది. ఈ పాఠంవల్ల “నైషధపారిజాతం' అనే కావ్యావతారికను ప్రత్యేకంగా రఘునాథునికి అంకితం ఇచ్చినట్టు తేలుతుంది. అవతారికను ఎవరూ కృతి

  1. తంజావూరు సరస్వతీమహలులోని ప్రతినుండి కృష్ణాధ్వరి నైషధపారిజాతం పద్యాలను మిత్రులు

ఎస్‌.వి. రామారావుగారు నాకోసం కాపీచేసి ఇచ్చారు. వారికి కృతజ్ఞాణ్డి. 2 రజియ ౧20902 ఈ యర్రా సోతంయిదం టం 9 కం జ్యుం సర్‌ 5. 4. జరు ఉంయణ అణాల 5ంగజ, 10 11, ౧౩

3 గంట ౦ 0౧౯౪ గిణలాయు ౮౧ బాకు/ 0 రలు, ౪01.5 1937-38. ౯% ఓ

6810 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇవ్వరు. కాబట్టి ఈ పాఠాన్ని నిరాకరించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మరొకలాగ సంస్కరించారు. 'దక్షిణదేశమందలి ఆంధ్ర వాజ్బయములు' అనే వ్యాసంలో కృష్ణాధ్వరిని గురించి విపులంగా వ్రాస్తూ వేటూరివారు రెండవ పాదాన్ని ఇలా ఇచ్చారు. సరసనైషధపారిజాతకాహ్వయకావ్య వర్యాస్వయంవరవల్లభు ఈ పారంవల్ల కృష్ణాధ్వరి అంతకుముందే ఒక నైషధపారిజాతాన్ని రచించి రఘునాథునికి కృతి ఇచ్చినట్టు భావించక తప్పదు. పూర్వమే ఒక నైషధపారిజాతాన్ని తెలుగులో వ్రాస్తే దాని చెల్లెలు అదే కావ్యాన్ని అంకితం ఇవ్వడం ఎలా పొసగుతుంది? అందుచేత ఆఖరి గ్రంథం ఒక్కటే తెలుగుదనీ, మిగతావన్నీ సంస్కృత గ్రంథాలనీ వేటూరివారు భావించారు. అందుకే ఈ పద్యం ఎత్తుగీతిలోని 'తెలియనైషధ పారిజాతీయకృతియు' అనే పాదంలో “తెలియ' అనే మాటను 'తెలుగు' అని మార్చాలా అన్న సందేహంలో పడి, ఒక శబ్దార్థకచిహ్నాన్ని ఇచ్చారు. కృష్ణాధ్వరి లోగడ ఒక నైషధపారిజాతాన్ని సంస్కృతంలో చెప్పి అంకితం యిస్తే రఘునాథుడు అప్పుడే సంతోషించి ఉంటాడు. మళ్లా “ఈ ద్వికథార్థ సమర్థనధ్వని శ్లేషగతి ప్రబంధము” రచించిన మా రఘునాధశారి సంతోషము నందునన్‌ కణక' కృష్ణాధ్వరికి రావలసిన అవసరం లేదు. అందుచేత వేటూరివారి పాఠం అమోదయోగ్యం కాదు. పద్యంలోని రెండవపాదాన్ని నిడుదవోలు వెంకటరావుగారు ఇలా ఇచ్చారు. పారిజాతకథావతారికాహృదయకా వ్యస్వయంవరవరవల్లభుండు. ఈ పారంలో ఛందోభంగం లేదు. తంజావూరు ప్రతిలోని పద్యపాదాన్ని అట్టే మార్చడం కూడా లేదు. "మా అందరిలోనూ మా నల్ల కృష్ణుడే తెల్లవాడు" అని సామెత చెప్పినట్టు ఉన్న పాఠాలలో ఇదే మెరుగని చెప్పాలి. దీనినే మనం స్వీకరించవచ్చునుగాని 1952లో ఈ పారాన్నిచ్చిన నిడుదవోలువారే దీనిని 1960లో నిరాకరించారు. తమ విపులమైన గ్రంథంలో వేటూరివారి పాఠాన్నే తీసుకొన్నారు. తెలుగు నైషధ పారిజాతానికీ "ఏవురక్కలైన' కృష్ణాధ్వరి తొలి కృతులన్నీ సంస్కృత కావ్యాలే అని నిడుదవోలువారు తూడా భావించారు. వేటూరివారి పారంలో “సరసనైషధ పారిజాతకాహ్వయ' కావ్యం అని కొత్తగా 'సరస'త్వాన్ని చేర్చినా చేర్చడంలో సరసత్వం లేదు. అందుకే కాబోలు భారతి పత్రికలో “కృష్ణాధ్వరి నైషధపారిజాతీయం'పై వ్యాసం వ్రాస్తూ శ్రీవాత్సవగారు ఈ రెండవ పాదాన్ని ఉదాహరించడంలో నిడుదవోలువారి మొదటి పాఠాన్నే స్వీకరించారు.” నాకుకూడా ఇదే. బాగున్నట్టుంది. అయితే ప్రస్తుతం మనం ఏదీ తేల్చలేం. నైషధపారిజాతీయానికి ప్రస్తుతం ఒకే ఒక ప్రతి తంజావూరులో ఉంది. మరో ప్రతి లేకపోతే పాఠనిర్ణయం కష్టం. 4. భారతి రజతోత్సవ సంచిక, 1949, పుట 348-350 5, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రిగారి షష్టిపూర్తి సంపుటం, పుట 20. 6. దక్షిణదేశీయాంధ్రవాజ్ఞయం, పుట 76. 7. ఖారతి, డిసెంబరు 1965.

కృష్ణాధ్వరి, శ్లేష కవులు 611

ఇవాళ ఈ రెండర్థాల కావ్యానికి ఒక్క ప్రతీ దొరుకుతున్నదిగాని ఒకనాడు ఇది ప్రచారంలో ఉందని చెప్పవచ్చును. క్రిందటి శతాల్సీ చివరిపాదంలో అముద్రిత గంథచింతామణీ అధిపతులు పూండ్ల రామకృష్ణయ్యగారు నైషధపారిజాతీయాన్ని చూశారు. రామరాజభూషణుని హరిశ్చంద్రనలోపాఖ్యానికి పీఠిక వ్రాస్తూ కృష్ణాధ్వరి పద్యాన్ని ఒకదాన్ని ఉదాహరించారు. తెలుగులో లఖించే ద్వ్యర్థి కావ్యాలకు ఆద్యుడు పింగళి సూరపరాజుగారు; రెండోవాడు భట్టుమూర్తి. ఈ ఇద్దర్నీ పేర్కొంటూ కృష్ణాధ్వరి ఈ పద్యం చెప్పాడు:

ప్రేషములేమియుంగనమి బింగళిసూరపరామరాజు న

ద్పూషణభాషితంబులగు పుణ్యకథాద్వయసం గ్రహాద్బుతుల్‌

శ్లేషకృతుల్‌ ప్రసిద్ధి గని శ్రీరఘునాథనృపాలమౌళినా

నైషధపారిజాతకృతినాయకరత్నము జెంది హెచ్చగళ్‌. -

పూండ్లవారు ఉదహరించిన పై పద్యాన్ని గురజాడ శ్రీరామమూర్తిగారు ఉటంకించారు. పూండ్లవారు చూసిన ప్రతిలో ఈ సీసంలోని రెండవపాదం ఎలా ఉందో తెలియదు. ఇవాళ నైషధపారిజాతీయానికి వేరే ప్రతులు దొరకుతాయో లేదో చెప్పలేం. ఈ కృతిని వ్రాసి దానిని నాయక రత్నాన్ని చేయకముందు కృష్ణాధ్వరి రచించిన ఇతర గ్రంథాలు మనకి నేడు దొరకవు. వాటి పేర్లు (1) రఘునాథ భూపాలీయం (2) పారిజాతకథ (3) కల్యాణకందర్చనాటకం (4) శృంగార సంజీవని. (5) తఆాళచింతామణి. ఇన్ని గ్రంథాలు వ్రాసినట్టు చెప్పుకొన్నా, కృష్ణాధ్వరి ఈ కావ్యంలో తన జీవితం గురించి ఏమీ చెప్పుకోలేదు. నైషధపారిజాతీయం కూడా సమగ్రంగా లభించలేదు. ఈ కావ్యంపై మొదట విపులంగా చల్తావారు వ్యాసం వ్రాసి ఇందులోని సొగసులు చూపించారు. చెప్పవలసినవన్నీ చెప్పారు. నిడుదవోలు వారుకూడా 'యిట్టీ యుత్తమ కావ్యమింతవరకు ముద్రితము కాకుండుట యాంధ్రుల దురదృష్టము. దీనిని గురించి మద్రాసు విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనాశాఖ పత్రికలో చల్లా సత్యనారాయణగారి వ్యాసము చూడదగినది' అని వ్రాశారు" అయితే నిడుదవోలు వారి వ్యాసం చూశాక చల్తావారిది చూడనక్కరలేదు. ఎందుకంటే చల్లావారి వ్యాసంలోని భాగాలు, అధోజ్ఞాపికలతో సైతం, పేరాలకు పేరాలు, పేజీలకు పేజీలు నిడుదవోలు వారి గ్రంథంలో కొల్లలుగా సాక్షాత్కరిస్తాయి. .

నైషధపారిజాతాన్ని ఆమూలాగ్రం చదివిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ కావ్యం ఆముక్తమాల్యద రచనాన్ని తలపిస్తోందని చెప్పారు.!9 గూడంగా వ్యాప్తంగా శబ్బార్థ్షేషా లంకారాలున్నాయన్నారు. ఈ గ్రంథం గురించి వారు చెప్పిన మరికొన్ని మాటలు వినండి: 8. కవిజీవితములు, 1955 ముద్రణ, పుకు 314. 9. దక్షిణఐదేశీయాంధ్రవాబ్బ్మయము, పుట ౫, అధోజ్ఞాపిక 16. మీగడతరకలు, పుట 177. (భారతి రజతోత్సవ సంచికలోని వ్యాసమే ఇందులో ఉంది.)

612 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కవి తనే దీనిని వ్యాఖ్యానించిన బాగుగా నుండెడిది. పెక్కేండ్లకు ముందే యథామాతృకముగా దీని ప్రతి వ్రాయించుకొని సవ్యాఖ్యానముగా బ్రకటింప నుత్సావా పడితిని. కాని వెక్కుచోట్ల శ్లేచమత్కృతి దుర్గహముగా నుండుటచే నింతదాక దానిని ముగింపజాలకుంటిని. -

వేటూరి ప్రభాకరశాస్త్రిగారి వంటి పండితులకే ఈ కావ్యంలోని శ్లేషలు బోధపడలేదంటే ఇంక సాధారణ పాఠకుల సంగతి చెప్పనక్కరలేదు. ఇనుపగుగ్గిళ్ళ వంటి ఈ కావ్యాన్ని అచ్చువేయిద్దామనే సంకల్పం ఎందుకు కల్గిందో వేటూరివారిలా చెప్పారు: ““దీనిని ప్రకటించుటకు కృష్ణాధ్వరి మీది గౌరవముగాని, శ్లేషకవిత మీది యాదరముగాని, అముద్రిత గ్రంథ ప్రకటనము మీది యౌత్సుక్కము గాని కారణములు గావు. మహనీయుడైన రఘునాథరాయలమీది యాదరమే యీ ఉద్ధంథ ప్రకటనమునకు నన్ను ఉత్సాహపరుచుచున్నది.” అని నిర్మొహమాటంగా చెప్పేశారు.1ేే రఘునాథుని ముఖం చూసి వేటూరివారు దీనిని అచ్చువేసి ఉంటే వారి పేరును చూసి దీనిని ఆంధ్రులు ఆదరించి ఉండేవారు.

ఈ ద్వ్యర్థి కావ్యంలోని కథల జోడింపును చల్లావారు చక్కగా పొందుపరిచారు. కొన్ని శ్లేల చమక్కారాలను చూపించారు. కృష్ణాధ్వరిలాగే మరికొందయణు శ్లేషకవులు బహుళార్థ కావ్యాలను ఈ యుగంలో వ్రాశారు. మహోపాధ్యాయ ఎలకూచి బాలసరస్వతి రాఘవయాదవపాండవీయం అనే మూడర్గాల కావ్యం బ్రాశాడు (0.687. ఈయన మూడు కథలనే జోడిస్తే నాలుగర్భాల కావ్యాన్ని సంపుటీకరించిన మొనగాడొకాయన ఈ యుగంలోనే ఉన్నాడు. ఆయన శ్లేషకవితా పితామహుడని పేరు కెక్కీనవాడట. అతని. పేరు గునుగుటూరు. వెంకటకృష్ణకవి. ఈయన “నలయాదవరాఘవపాండవీయం' అనే నాలుగర్గాల కావ్యం వ్రాశాడు. అయితే ఇలాంటి ఫీటు ఇంతకుముందే మరింగంటి సింగరాచార్యులవారు. చేశారు.3 గునుగుటూరు వెంకటకృష్ణయ్య సంగతి అతని మేనల్లుడు కోడూరు వెంకటాచలం బ్రాసిన “శివరహస్య ఖండం' అనే కావ్యం వల్ల తెలుస్తుంది (1.80). కోడూరి వెంకటాచలం క్రీ.శ.170 ప్రాంతాలలో ఉన్నాడు. అతని మేనమామ ఒకతరం ముందుగా ప్రసిద్ధుడై ఉండీ ఉంటాడు.

కృష్ణాధ్యరి ధర్మమా అని ఇప్పుడు శ్లేష కావ్యకర్తల వివరాలు జ్రోడీకరిద్దాం: రెండర్ధాల కావ్యాలుః

  1. రాఘవపాండవీయం భీమన (నష్టం)

  2. రాఘవపాండవీయం పింగళి సూరపరాజు

౩. హరిశ్చంద్రనలోపాఖ్యానం భట్టుమూర్తి

  1. _రామకృష్ణవిజయం మరింగంటి సింగరాచార్యులు

  2. ఈ గ్రంథాన్ని ప్రకటించుకుండానే వారు కీర్తేశషులవడం దురదృష్టం. మిత్రులు వేటూరి ఆనందమూర్తీ దీనిని ప్రచురించి తండ్రిగారి అఖిలాషను పూర్తిచేస్తే బాగుంటుంది.

  3. నవాబులయుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటం.

కృష్ణాధ్వరి. శ్లేష కవులు 613

  1. రాఘవవాసుదేవీయం, 0.688 చిత్రకవి సింగరాచార్యులు

7 రావణదమ్మీయం పిండిప్రోలు లక్ష్మణకవి

  1. యాదవభారతీయం చెన్నకృష్ణకవి

  2. ధరాత్మజాపరిణయం కొత్తలంక మృత్యుంజయుడు

  3. శివరామాభ్యుదయం పౌడూక పెద్దరామయ్య

  4. కృష్ణార్జున చరిత్ర మంత్రిప్రగడ సూర్య ప్రకాశం

  5. అచలాత్మజాపరిణయం తిరుమలబుక్కపట్టణం వెంకటాచార్యుడు

మూడర్గాల కావ్యాలు:

  1. రాఘవయాదవపాండవీయం, 9.687 ఎలకూచి బాలసరస్వతి

  2. రాఘవయాదవపాండవీయం, ॥.414 అయ్యగారి వీరభద్రయ్య

౩ యాదవరాఘవపాండవీయం నెల్లూరి వీరరాఘవుడు

  1. రామకృష్ణార్ణునరూపనారాయణీయం ఓరుగంటి సోమశేఖరం

నాలుగర్థాల కావ్యాలు;

  1. నలయాదవరాఘవపాండవీయం మరింగంటి సింగరాచార్యులు

  2. నలయాదవరాఘవపాండవీయం గునుగుటూరి వెంకటకృష్ణయ్య పెద్దాపురం ప్రభువులు, వారి అఆశితులు

దక్షిణాన మధురలోనూ, తంజూవూరులోనూ రాయసామంతులు స్వతంత్ర రాజ్యాలను

ఏర్పరచుకొని సాహిత్యసివ చేస్తున్న రోజులలోనే ఉత్తరాన గోదావరి మండలంలో సాగి

పోతరాజుగారి వంశంలోని వత్సవాయి చతుర్చుజ తిమ్మరాజుగారు పెద్దాపుర సంస్థానం

సంపాదించి పృథివీరాజ్యం ప్రారంభించారు. నాయకరాజులు రాయసింహాసనావికి

అణుకువగా ఉంటే పెద్దాపురం ప్రభువులు గోలకొండ సుల్తానులకు మిత్రులుగా

ఉండేవారు. చతుర్చుజ తిమ్మరాజుగారు క్రీ.శ1555 నుండి 1907 దాకా పాలించారు. వీరి

భైర్యాన్ని మెచ్చుకొని గోలకొండ సర్దారు షేక్‌ మహమ్మద్‌ఖాన్‌ పసిడి ఖడాన్ని

బహూకరించాడు. ఇది ఏ సందర్భంలో ఇచ్చాడో తెలియదు. చతుర్భుజ తిమ్మరాజుగారు

“పెద్దాపురంబున బిరుదాంతపురిలోన యవన వీరుల పరాహతుల చేనె' అని అనంతర

గ్రంథాలవల్ల తెలుస్తోంది.! అటు తిరుపతివద్దా, ఇటు తూరుపునాట యుద్ధాలలో వారు

పాల్గొన్నారు. సమరాలలోనే కాక సాహిత్యసేవలో కూడా ఈ తిమ్మరాజుగారు శ్రద్ధ

చూపేవారు. ఈయన వద్ద సకల కశాన్త్రప్రశంసులైన విద్వాంసులు, 'ఉభయభాషాకవిత్వ

నిర్మాణ” సామర్థ్యం ఉన్న కవులు ఉండేవారు. వారి ప్రధానులు పరతంత్రభేదనప్రభావ

  1. రాయవిలాసం, ఏనుగు లక్ష్మణకవి, 1-ఐ.
  1. సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కవితావధానులు, నిజానికి చతుర్చుజ తిమ్మరాజుగారికి మిగతా రెండుభుజాలుగా ప్రధానులు ప్రఖ్యాతులయ్యారు.

గుణవిభూషు డేనుగు గుర్చ్వమంత్రి ధీరుడగు పోలపైగడ సూరమంత్రి

కడమ రెండు భుజంబులుగాగ బ్రబలె మహి చతుర్చుజ రహిని దిమ్ముప్రభుండు.

(౧. 78)

తిమ్మరాజుగారి కుడిభుజంలాంటి ఏనుగు గురవమంత్రిగారు. పండితవంశంలో పుట్టినవారు. వీరి ఇంటిపేరు నిజానికి పైడిపాటివారు. అయితే క్రీ.శ 1500 ప్రాంతాలలోను, అంతకు పూర్వమో పైడిపాటి జలపాలమంత్రిగారు కళింగ గజపతులను మెప్పించి ఒక ఏనుగును, సోమేశ్చర అగ్రహారాన్ని పొందారు. ఏనుగును దానంగా పుచ్చుకొనడంవల్ల పైడిపాటివారికి ఏనుగువారనే ఇంటిపేరు వచ్చింది. ఈ జలపాలమంత్రి మనుమడే తిమ్మరాజుగారి భుజంలాగా ఉన్న ఏనుగు గురవమంత్రి.

గురవమంత్రిగారికి గురురాజయ్య అనే సోదరుడు ఉన్నాడు. ఈయన దిట్టకవి వెంకటయ్యగారి కుమార్తె పేరమ్మను వివాహం చేసుకొన్నాడు. చాలా చక్కని కవిత్వం చెప్తాడు. అంచేత ఈ వెంకటయ్య గారికి దిట్టకవి అనే వీరుదు వచ్చింది గాని వారి ఇంటిపేరు వెణుకుదురుపల్లివారు. దిట్టకవి వెంకటయ్యగారు ఏ గ్రంథాలు వ్రాశారో తెలియదుగాని ఆయన కొడుకు విశ్వనాథం మంచికవి. చిన్నప్పుడే శ్రీరామవిజయం అనే యక్షగానం బ్రాకాడు. తరువాత గౌరీవివాహం అనే ద్విపదకావ్యాన్ని కవిజనశ్రవణసౌఖ్యంగా బ్రాశాడు. యక్షగానాలూ, ద్విపదలే కాక చిత్రకవితలో కూడా దిట్టకవి వెంకటయ్యగారి కుమారుడు దిట్ట, నిరోష్ట్యృప్రబంధంగా హరిశ్చంద్ర చరిత్ర వ్రాశాడు. ఒక్క తెలుగులోనేకాక సంస్కృతంలోకూడా వెణుకుదురుపల్లి విశ్చనాథం దిట్టమైన కవిత్వం చెప్పగలడు. దేవఖాషలో పారిజాతాపహరణం బ్రాశాడు.

తన బావమరిది - ఇన్ని గ్రంథాలు బ్రాసిన నేర్పరి - హరివంశంలోని ఆశ్చర్య పర్వాన ఉండే శేషధర్మాలను అనువదింపదలచాడని గురురాజు తన అన్నగారైన గురవ మంత్రికి చెప్పాడు. తమ్ముని బావమరిదికి రాజసక్కారాలు చేయాలని గురవమంత్రి తలచాడు. వెణుకుదురుపల్లివారు దక్షారామంలో ఉండేవారు... చతుర్చుజి తిమ్మరాజా గ్రామం విచ్చేసినప్పుడు విశ్వనాథానికి గుర్వమంత్రి రాజదర్శనం చేయించాడు. తిమ్మరాజుగారు కవిని చూసి ఇలా ప్రస్తుతించాడు:

ఏరీ నీకు సమాను లిప్పటి తజి న్విద్వత్కవిగ్రామణుల్‌

పారావారపరీతసర్వవసుధాభాగంబునం దున్నట

ద్థౌరీకాంత జటా భటాంతరరటద్గంగాతరంగావళి

భూరిశ్రవ్యఘళంఘళధ్వనుల దెల్పు న్నీవచోగుంభనల్‌: (178)

ఆ వచోగుంభనలకు ముగ్గులై చతుర్చుజ తిమ్మరాజుగారు కవిని 'ఇప్పుడు నీవు చెప్పబూనిన కావ్యంబు శేషధర్మమంకితము చేయు మాపేర ననఘచరిత' అని అర్థించారు. విశ్వనాథం దానిని మూడాశ్వాసాల కావ్యంగా రచించాడు. ఇది కొంతమాత్రమే

పెద్దాపురం ప్రభువులు, వారి ఆఖ్రితులు 615 అచ్చుపడింది. వత్సవాయవారి వంశాన్ని కవి వర్ణించాడు కనుక అవతారిక మాత్రమే ముద్రించారట. శేషధర్మాల అముద్రితద్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (2 78. వెణుకుదురుపల్లి విశ్చనాథం వ్రాసిన ఇతర గ్రంథాల పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి గాని వాటిలో ఏ ఒక్కటీ మిగలలేదు. ఇతని కావ్యాలేకాక ఇతని కుమారుని గ్రంథాలుకూడ దొరక్కపోవడం దురదృష్టం.

వెణుకుదురుపల్లి విశ్చనాథం తన కొడుక్కు తండ్రీ పేరు పెట్టుకొన్నాడు. ఆ కుగ్రవాడీకి తాతగారి విరుదే ఇంటిపేరు అయింది. దిట్టకవి వెంకటపతి చదవకుండానే సర్వశాస్త్రపాండిత్యం సంగ్రహించాడు. చిన్నప్పటినుంచి ఆంధ్రగీర్వాణ భాషలలో కృతులు రచించాడు. విష్ణుపురాణం మొదలైనవి తెనిగించాడు. మిథ్యావాదంలో మనోభయంకరులైన విద్వాంసులను గెలిచాడు. ఇతడేవో లక్షణ గ్రంథాలు కూడా వ్రాశాడు కాబోలు. కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సారసంగ్రహంలో దిట్టకవి వెంకటకవి చెప్పినదానిని ఖండించాడు.

పదముమొదలనిడుదతుదితదృవంబుల- రేఫగానిశకటరేఫకాదు

నిక్కమనుచునుగుణనిధిదిట్టకవివేంఠ- టార్యవరుడు నుడివె నది హుళక్కి.

(సర్వలక్షణ. 2 శకటరేఫ 10)

దిట్టకవి చెప్పినది హుళక్కి కావచ్చునుగాని ఆయన సుగుణనిధి అని అంగీకరించడం తిమ్మకవి సహృదయతను చాటుతుంది. దిట్టకవి వెంకటయ్యను సమకాలికులందరూ సమ్మతించారు. వెణుకుదురుపల్లి విశ్వనాథకవిని నుతించిన ప్రతికవీ వెంటనే అతని కొడుకును కూడా విద్యావిశారదునిగా ప్రశంసించాడు.

వెణుకుదురుపల్లి విశ్వనాథం కొడుకే కాదు, మేనల్లుడు తూడా కవి. ఏనుగు గురవరాజుగారి అబ్బాయి పేరు లక్ష్మణకవి. సరసప్రొఢవచోవిలాసాలు, ప్రబంధ రచనాదక్షత అలవరచుకొన్నాడు. మనోజ్ఞశబ్దాలకు దండి, ఉపమానాలకు రెండన కాళిదాసు, రసనీతి ఉట్టిపడే సూక్తులకు కుండలీంద్రుడని అందరూ మెచ్చుకొనేవారు. ఈయన గీతారహస్కువేది. రసోచితంగా ఇతడు రాజశేఖరచరిత్ర రాశాడు. దీనిని ఎవరికీ అంకితం ఇచ్చాడో తెలియదు. దీనికి తరువాత ఏనుగు లక్ష్మణకవి తుల్యానదీమాహాత్మ్యం అనే కావ్యాన్ని అర్థగౌరవం కులికేటట్లు రచించాడు. దీనిని వత్సవాయివారి వంశంలోనే కస్తూరి రంగరాజుగారి కుమారుడు జగ్గరాజుకతు అంకితం ఇచ్చాడు. తరువాత పటుచమత్కార గుంభనంతో ద్రౌపదీ పరిణయాన్ని రచించాడు. ఈ కావ్యాన్ని పెద్దాపురం ప్రభువు సార్వభౌమ తిమ్మరాజుకి అంకీతం ఇచ్చాడు. ఈ తిమ్మరాజుగారు పెద్దాపుర సంస్థానం సంపాదించిన చతుర్చుజ తిమ్మరాజుగారి పెద్దమనుమడు. ద్రౌపదీ పరిణయాన్ని అంకితం పుచ్చుకొని సార్వభౌమ తిమ్మరాజుగారు ఏనుగు లక్ష్మణకవిని బాగా సత్కరించారు. అశ్వాలూ, మణిభూషణాలూ, అందలాలూ ఇచ్చి పెద్దాడ కరణీకాన్ని ప్రసాదించారు.

616 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ద్రౌపదీ పరిణయాన్ని వ్రాసిన పిమ్మట లక్ష్మణకవి ధ్రువచరిత్రను వ్రాశాడు. దీనిని రాజబంధువు వెంకటరాజుగారి జగ్గరాజుకు అంకితం ఇచ్చాడు. ఈ కావ్యాన్ని మహాకవిపుంగవులు మెచ్చుకొన్నారట. లక్ష్మణకవి కవికులసార్వభౌముడని అతని మనుమడు ప్రస్తుతించాడు. ఆ మనుమడి పేరు కూడా లక్ష్మణకవే. చాలా ప్రసిద్ధుడు. భర్హ్చృహరి సుభాషితాన్ని తెనిగించాడు. ఈ చినలక్ష్మణకవి తన గురించి చేసిన టహ్రూంసలవల్లనే పెదలక్ష్మణకవి గొప్పతనం తెలియవస్తున్నది.

పెదలక్ష్మణకవి ఖీమసేనవిజయం, భళ్లాణనారాయణచరిత్ర అనే కావ్యాలు కూడా వ్రాశాడు. వీటిలో ఫీమసేనవిజయం నేడు దొరుకుతున్నది. ఇది అముద్రితం. తాళపత్రప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (14-13-18 ౫.1030 0 29981). ఈ పుస్తక వివరాలు ఇంకా గ్రంథాలయంవారు వర్ణనాత్మక కేటలాగులో వ్రాయలేదు. ప్రస్తుతం ఇది మద్రాసు నుండి తిరుపతి తరలించిన పుస్తకాలలో ఉంది. తుల్యా మాహాత్మ్యం కొంత మాత్రం చిత్రాడలోని అముద్రిత ఆంధ్రసర్వస్వం వారికీ లఖించిందట.* మిగిలిన గ్రంథాలు చెప్పుతుందుకే గాని చదువుకొందుకు మిగలలేదు. మొత్తంమీద ఏనుగు పెదలక్ష్మణకవి బ్రాసిన గ్రంథాలు ఏవీ వెలుగుచూడలేదు.

పెదలక్ష్మణకవి _్రౌపదీపరిణయం అంకితం పుచ్చుకొన్న సార్వభౌమ తిమ్మరాజుగారు స్వయంగా కవిత్వం చెప్పలేదుగాని వారి తమ్ముడు బలభద్రరాజు స్వయంగా కవి. ఈయన శ్రీరామశతకాన్ని రచించాడు. సాహిత్య సర్వజ్ఞుడై భోజురాజంత కీర్తిని అర్జించాడు. స్వయంగా కవిత్వం చెప్పటమేకాక కిరాతార్జునీయం అనే కావ్యాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. 'ఇది అమిత ఖ్యాతిమూలమైన కృతి' అని చినలక్ష్మణకవి చెప్పాడుగాని అంత కీర్తిని పొందిన కావ్యాన్ని ఎవరు రచించారో కూడా తెలియదు. బహుశా దిట్టకవి వెంకటకవి చెప్పినది కావచ్చు.

ఈ _బలభద్రరాజుగారి కుమారుడు ఉత్తరోత్తరా వెద్దాపుర సంస్ఫానానికీ వారసుడయ్యాడు. సార్వభౌమ తిమ్మరాజుగారు క్రీశ1648 నుండి 1698 దాకా పాలించారు. వారికి సంతానం లేదు. అందుచేత తమ్ముని కొడుకు రాయప్పరాజుకే పట్టం కట్టారు. ఇతడు పినతండ్రీలాగా కృతులు అంకితం పుచ్చుకోలేదు. తండ్రీలాగా చెప్పనూలేదు. రాయప్పరాజు నాట్యకళను పోషించినట్టుంది. “రాజవిద్వస్సభానాట్యు రంగములకు గవితనిజరంక్తి ఘనరక్తిగాగదనరౌ అని ఈ రాజుని ఏనుగ చినలక్ష్మణకవి వర్ణించాడు. ఈ రాయపరాజుగార్‌నే ఉద్దండరాయ జగపతిరాజు అంటారు. ఈ వంశంలోని వాళ్ళు తరువాత స్వయంగా కృతులు చెప్పారు. అంకితాలు పుచ్చుకొన్నారు. ఆ వివరాలు తరువాతి యుగంలో చెప్పుకొందాం. మొత్తంమీద వత్సవాయి జగపతులు తొలిదగ్గరనుండీ కవితాపోషకులని చెప్పవచ్చును* ఇప్పుడు నాయకరాజుల 2. ఆంధ్రకవితరంగిణి, 12వ సంపుటి, పుట 1. $. రామవిలాసం, 1-10%

  1. _ వత్సవాయివారి వంశంలో ఆఅ ఇంటిపేరు తెచ్చిన రామరాజుగారి సోదరుడు తెలుగురాయలు. “విక్రమార్కచరిత్రోత్తమకావ్యనాయకుడు' అని ఏనుగు లక్ష్మణకవి బ్రాసిన రామవిలాసంవల్లి తెలుస్తూంది. 1-40.

పెద్దాపురం ప్రభువులు, వారి ఆభ్రితులు 617 సమకాలికులైన జగపతుల గురించీ, వారి అన్రితుల గురించీ తెలిసిన విషయాలు తోడీకరిద్దాం.

  1. _ వెణుకుదురుపల్లి వెంకయ్య: దిట్టకవి అనే వీరుదు పొందాడు. ఏ గ్రంథాలు వ్రాశాడో తెలియదు. ఏనుగు వారి వియ్యంకుడు. విశ్చ్వనాథ కవికి తండ్రి.

  2. వెణుకుదురుపల్లి విశ్వనాథకవి: శ్రీరామవిజయం (యక్షగానం), గౌరీవివాహం (ద్విపద), హరిశ్చంద్ర చరిత్ర (నిరోష్ట్రం), పారిజాతాపహరణం (సంస్కృతం), శేషధర్మాలు రచించాడు. అఖరు కావ్యం చతుర్చుజ తిమ్మరాజుగారి కంకితం ఇచ్చాడు. ఏనుగు లక్ష్మణ కవికి మేనమామ. ఏవీ దక్కలేదు. ఇతడు చెప్పిన కిరాతార్డునీయం ప్రతి అసమగ్రమైనా లఖిస్తోంది (౧. 808)

  3. _ చతుర్భుజ తిమ్మరాజు : క్రీ.శ 1555 నుండి 1607 దాకా పాలించాడు. పెద్దాపుర సంస్థాన సంపాదకుడు. శేషధర్మాలు అంకితం పుచ్చుకొన్నాడు.

  4. _ రాయప్పరాజు : చతుర్చుజ తిమ్మరాజుగారి పుత్రుడు. క్రీ.శ. 1607 నుండి 1649 దాకా పెద్దాపురం పాలించాడు. ఈయన ఏ కవులనూ సత్కరించినట్టు తెలియదుగాని, ఈయనను మాత్రం మాటిమాటికి అక్కన్న మాదన్నలు, తానీషా సత్కరించేవారు.

  5. పార్వభౌము తిమ్మరాజు: క్రీ.శ 1649 నుండి 1658 దాకా పెద్దాపురం పాలించాడు. ఏనుగు లక్ష్మణకవిచేత ద్రౌపదీపరిణయం అంకితం పుచ్చుకొన్నాడు.

  6. బలభద్రరాజుగారు ; సార్వభౌమ తిమ్మరాజుగారి తమ్ముడు. శ్రీరామశతకం బ్రాశాడు. కిరకార్డునీయం అంకితం పుచ్చుకొన్నాడు.

  7. వీనుగు లక్ష్మణకవి ; కవికులసార్వభౌముడు అని మన్ననలు పొందాడు. (1) రాజోఖరచరిత్ర (2) తుల్యానదీ మాహాత్మ్యం (3) ద్రౌపదీపరిణయం (4) భ్రువచరిత్ర (5) ఫీమసేనవిజయం (6) భళ్లాణరాజచరిత్ర అనే గ్రంథాలు బాళాడు.

  8. _ కస్తూరి రంగరాజుగారి జగ్గరాజు: పెదలక్ష్మణకవిగారి తుల్యానదీ మాహాత్మ్యం అంకితం పుచ్చుకొన్నాడు.

  9. వత్సవాయి వెంకటరాజుగారి జగ్గరాజు ; పెద్దలక్ష్మణ కవిగారి ధ్రువచరిత్రకు కృతిపతి.

తొలి తరం ఇతర కవులు మాటల వేర్పులా? సరసమార్గములా? పాటల గంధులా! కళల భఖాగ్యములా? వాటకళశాలలా? - అన్నింటోనూ రఘునాథనాయకుడు కీర్తిలోలుడే అని చేమకూర వెంకటరాజుగారు ప్రశంసించారు (విజయపీఠిక, 23). ఈ యుగంలోని కవులు కూడా అంతటి కీర్తిలోలురే! పద్యకావ్యాలా, ద్విపద కావ్యాలా, యక్షగానాలా, వచనకావ్యాలా? ఒకటేమిటి, అన్నిరకాల ప్రక్రియలను చేతబట్టారు. యథాశక్తి తమ నేర్పుల్ని ప్రకటించారు. అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేసినవాళ్ళలో లోకేరావు సోమన ఒకడు.

  1. లోకేరావు పోమన : కాకతీయ మహాసాత్రూజ్యానికి జ్రీ.శ1250 ప్రాంతాలలో శివదేవయ్య మహామంత్రిగా ఉండేవాడు. ఆయన సంస్కృతాంధ్రకవితాపికామహుండు. పురుషార్థసారం, ఇవదేవధీమణి శతకం అనే గ్రంథాలు రచించాడు. ఆయన గోత్రం ఏమిటో తెలియదుగాని అశ్వలాయన శాఖలో హరితసగోత్రీకుడైన ఒక శివదేవమంత్రి పూర్వం “లోకేరావు' అవే ఊరు నిర్మించాడు. ఈ ఇద్దరు ఇివదేవమంత్రులకీ ఏదైనా బాదరాయణ సంబంధం ఉందో లేదో తెలియదు. లోకేరావు పురాన్ని నిర్మించిన శివదేవమంత్రి కుటుంబానికి ఆ వూరి పేరే ఇంటిపేరు అయింది. ఆ వంశంలో సోమన్న అనే కవి జన్మించాడు. అతడు చాలా కావ్యాలు బభ్రాశాడు. అలంకారయుక్తంగా, కవిరాజులు ఇిరఃకంపనం చేసిటట్టు, భావజ్ఞుల చెవులకు పండుగా బలభద్రవిజయం అనే ద్విపదకావ్యం ఒకటి రచించాడు. అందులో తాను అంతకుముందు రచించిన కావ్యాల సంగతి ఇలా చెప్పాడు:

సుమహితంబుగ నేను సోమనాహ్వయుడ

బల్లాడచరితంబు పద్యకావ్యంబుగ- యెల్లవారలుమెచ్చ యేజేసినాడ

అలశివరాత్రిమహత్వము తెనుంగు-వలనుగా వచనకావ్యము చేసినాడ

లక్షణాదేవికల్యాణంబుద్వొపద- యక్షగానంబుగా నమరించినాడ

గంఖీరమగు యక్షగావంబు శుకుని- రంభసంవాదంబు రచియించినాడు

(తంజావూరు కేటలాగు సంఖ్య, 306)

ఈ ద్విపదలో లోకేరావు సోమన తాను శివరాత్రిమాహాత్మ్స్యాన్ని వచనకావ్యంగా బ్రాశానని చెప్పినా ఆది నిజానికి పద్యకావ్యం.* పూర్వం హరిభట్టు కూడా ఇలాగే తన వరాహ, నరసింహపురాణ ప్రబంధాలను వచనకావ్యాలని చెప్పుకొన్నాడు. లోకేరావు సోమన రచించిన ఇతర గ్రంథాల పేర్లు పై ద్విపదభాగంవల్ల తెలుస్తున్నాయిగాని కావ్యాలు అలభ్యాలు. శా

  1. సింహాద్రి వెంకటయ్య : వానపాల నరసింహరాజు: లోకేరావు సోమనేకాక, ఈ యుగంలోని ఇతర కవులు తూడా 'లక్షణ' కల్యాణాన్ని కథనం చేశారు. అమె శ్రీకృష్ణుని అష్టభార్యలలో అఖరిది. మద్రదేశం పాలించే బృహక్సేనమహారాజు కుమార్తె
  2. కాకరకీయయుగం, సమగ్రాంధసాహిత్యం, మొదటి సంపుటి 2002
  3. అంధ్రవచనావాజ్బ్యయము - నిడుదవోలు వెంకటరావు, పుట 23.

తొలి తరం ఇతర కవులు 619 అర్జునునిలాగే శ్రీకృష్ణుడు కూడా మత్స్యయంత్రాన్ని కొట్టాకనే ఈ రాకుమార్తెను పెళ్లి చేసుకొన్నాడు. లక్షణాపరిణయాన్ని సుమారు 1200 ద్విపద పాదాలలో తాళ్ళపాక చిన్నన్న తన అష్టమహిషీ కళ్యాణంలో వర్ణించాడు (పంచమాశ్వాసం 6300 పాదంనుండి కడదాకా). ఈ రచనా క్రీ.శ. 1545 ప్రాంతాలలో జరిగింది. ఆ తరువాత లక్షణా పరిణయాన్ని విడిగా ఒక శృంగారప్రబంధంగా వ్రాసిన వాళ్ళలో మొదటివాడు సింహాద్రి వెంకటయ్య. దీనికి చమత్కారమంజరి అనే నామాంతరం ఉంది. ఈ వెంకటయ్య నవనవకవితాదక్షుడు. రసికపరిషత్తుచేత “ఆహాం అనిపించగలవాడు. తన గురించి కావ్యంలో ఒకే ఒక పద్యం చెప్పుకొన్నాడు: అక్షయకృష్ణ బ్రహ్మక- టాక్షో దితరసికపరిషదాహాకృతినం ధుక్షిత నవనవకవితా- దక్షుడ సింహా ద్రివెంకటాఖ్యాకుండ€. (0510) ఇతడు తన పాండిత్యంతో రసికపరిషత్తును నిజంగా అహా అనిపించే ఉండాలి. ఈ గ్రంథంనుంచి అప్పకవి రెండు పద్యాలను ప్రమాణాలుగా స్వీకరించాడు. ఒకటి యకార భేదాలను వివరిస్తూ భూతాది క్రియార్థాలు తెలుపని కడపటి యకారానికి ఉదాహరణగా యిచ్చిన ఈ క్రింది పద్యం. ధరలోన౯ ద్విజరాజనామమున సత్సంగంబునన్‌ సత్కళా నిరతి నిర్మించియు నుత్ప్సలప్రియు డవనిన్నిత్యంబు రాజీవనం హరణంబేకరజూలమున్‌ సౌనిపి చేయంబూను నీచంద్రుడో తరుణీ, వీనికి నెంత చేసిన దయాదాక్షిణ్యముల్‌ గల్నునే? (అప్ప. 2-182) చమత్కారమంజరి నుండి అప్పకవి ఉదహరించిన రెండోపద్యం (0 510-378) అభేదయతులలో వకారబకారాలకు భేదం లేదని చెప్పే సందర్భంలో చూపినది. బంగరుదుప్పటంబు వలెచాటుగ నొప్ప హసన్ముఖాబ్బుడై రింగున నారి గోల నమరించి తటాలున ద్రుంచె నాధను శ్చంగుడు గోపయౌవతభుజంగుడు మోదితనంగుడం గృపా పాంగుడు దృష్తదర్చబల భంజనయంత్రము మత్స్యయంత్రమున్‌. (అప్పు. ౩-92) అప్పకవి వంటి లాక్షణికుడు అంగీకరించిన కవి ఘటికుడే అని చెప్పాలి. అయితే ఈ చమత్కార మంజరి ఎందుకూ పనికిరాని కావ్యమని బ్రౌను దొరగారు అభిప్రాయపడ్డారు. మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉన్న ప్రతిలో (510) 149వ ఫోొలియోలో ''ఈ చమత్కార మంజరీ గ్రంథం నిష్ఫలమైనది. యోగ్యమైన కవి కృతి కాదు” అని ఒక నోటు తెలుగులో ఉంది. దాని కింద (బౌను దొరగారు ఇంగ్లీషులో ఇలా వ్రాశారు: ఇం ౧౦6౧౫) 5 ౪౭1653 1[ 1 00౧౧౦9౭4 1 8 086 ౧ంరజాకం కేం తగరీ 19 1౧ ౧౧8౧౦? ౧1806 ఇంతే? టూ1ల1016 20% ఓ గాయ తడ00టం6 6 90006 1౭కూంలే ]లీంం్రయం 06 అ0)ం6 0 46 సంజ 19 ౧౧౬౫౫౭౩6 ౦% గురు[ంతి, “శయ 2 906 లుం 0 ౩1200 00600 అి౪ర్ర ౧౦౭003 బ్రౌను దొరగారి సాహిత్యాఖిరుచి ఎన్నిక చేయదగ్గదే. వారిలాగే మరి కొందరికి తూడా ఈ [గ్రంథం రుచించక పోవచ్చును. సింహాద్రి వెంకటయ్యకు ఇది తెలుసు. తన

620 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి గంథాన్ని అఖినందించలేనివాళ్లంతా అరసికులనే అతని అభిప్రాయం. ఆ అవివేకులని ఇలా నిందించాడు: రసికుడుగాని యర్థమధురంబగు కావ్యగభీరభూరివా గ్వీసరమెరుంగనేర డవివేకి యొకానొక కారణంబునక్‌ వెన జని రాజగేహమున విద్రుమపంజరకీరజూచితా పిసనెలతగ్గుదూడయని పిల్చును గొల్లడు జాతిభాషలక (చమత్కార, 1-8) అవివేకులని తిట్టే ఈ పద్యం ఒక చాటువును జ్ఞాపకం చేస్తుంది. ఇందులో రామచిలుకను చూసి గొల్లడు “పిసనెల తగ్గుదూడ' అంటే చాటువులో కస్తూరి గురించి వెర్రి ప్రశ్నలు వేస్తాడు. చూడండి: _ “నల్లనిదేంది బేరి?” మృగనాఖిర గొల్లడః “దాన్ని తిందురా?” “అల్లటు గాదు. స్త్రీలు చనులందున బూతురు' “పూసినంతనే జల్లున చేపు వచ్చి తెగజారున?” “కాదు సుగంధ మబ్బు''మా పిల్లకు కాస్తపెట్లు' మన బేరియు గస్తురి బూసె గ్రక్కున క క =టి ఖు వత మనసులో పెట్టుకొని వ్రాసి ఉంటాడు. రసికుణ్జీ తన కవిత్వం అలరిస్తుందని వెంకటయ్య చాటుకొన్నాా అతని పద్యం బ్రౌను దొరగారి వంటి సహృదయులను మెప్పించలేకపోవడం గమనించతగ్గ విషయం. బ్రౌను దొరగారి లెక్కలో కనీసం ఇరవై కావ్యాలలో లక్షణా పరిణయం ఇతివృత్తంగా ఉన్నట్టు కనపడ్డా నిజానికి ఈవాళటి వరకు వెలువడిన గ్రంథాలన్నింటినీ కలిపినా అవి పట్టుమని పది తేలుతాయి. తెలుగులో లక్షణాపరిణయాన్ని కథనం చేసిన లంథాల వివరాలు చూడండీ 2. _ చమక్కారమంజరి - సింహాద్రి వెం6టయ్య = _పద్భుకావ్యం 3. లక్షణాపరిణయం - వానపాల నరసింహరాజు - పద్యకావ్యం 4. " లక్షణాపరిణయం - మద్దికాయల మల్లయ్య - నష్టమైంది 5. లక్షణాపరిణయం - తిరుపతి వేంకటకవులు 6. లక్షణాపరిణయం - గుడుపూడి ఇందుటుతీదేవి 7, లక్షణాపరిణయం - శృంగారకవి సర్వారాయుడు. ఇవి కాక మరో మూడు యక్షగాననాటకాలు ఉన్నాయి. వాటిని యస్వీ జోగారావుగారు తమ ఆంధ్రయక్షగాన వాబజ్బ్యయచరిత్ర ద్వితీయ భాగంలో పేర్కొన్నారు. ఆ వివరాలినిః కనన నక వనన నన పున పన వన తన నన న. ప ననుకత న న జ ౩. ఈ చాటువును ప్రకటించినది దీపాల పిచ్చయ్యశాస్త్రీగారు. దీనికి పాఠాంతరాన్ని కూడా తరువాత చాటుపద్యరత్నాకరంలో చూపించారు. పుట 282.

తొలి తరం ఇతర కవులు 621

  1. లక్షణాపరిణయం - వడకండ్ల స్వామిరాయకవి

  2. లక్షణాపరిణయం - బొడ్డుచర్ల సుబ్బకవి

  3. లక్షణాపరిణయం - కర్తపేరు తెలియదు

వీటితోపాటు శిష్టా రామకృష్ణశాస్త్రిగారు పెర్కొన్న యక్షగానం మరొకటి ఉంది. అది సోమన్న బ్రాశాడటే వీటన్నిటిని కూడితే పదవుతున్నాయి.! ఈ పట్టికలో లక్షణా పరిణయాన్ని మొదట పూర్తి కావ్యంగా వ్రాసిన కవి సింహాద్రి వెంకటయ్య. రెండవవాడు వానపాల నరసింహం. ఈ నరసింహం వ్రాసిన లక్షణాకళ్యాణం అఆరాశ్వాసాల కావ్యం. కవి తాను 'సాహితీ తంత్ర స్వతంత్ర మిత్రుడ'నని చెప్పుకొన్నాడు.

ఈ కవి ఏకాలంవాడో తెలియదు. అయితే పూర్వకవిస్తుతిలో పింగళి సూరపరాజుగారి పేరు కూడా కనపడడంచేత క్రీ.శ. 1600 తరువాతి వాడని చెప్పవచ్చును.

తలచెద దంత్రపద్ధతి స్వతంత్రులన్‌ విహరించి మారులే

కిల దెలుగుంబబంధముల కేర్చడగా విషయారులుండగా

బలికి సుధీప్రరోచకత భాసిలు నన్నయభట్టు సోమయా

జులను నధర్వణున్‌ మరియు సూరన పెద్దన పోతనార్యులన్‌ (1. 650) కవిత్రయంలో ఒకరైన ఎర్రయ్య గారిని పిర్కొనకుండా ఈ వానపాల నరసింహరాజుగారు లక్షణాకల్యాణం అచ్చుపడలేదు. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్న వ్రాతప్రతి సమగ్రమైనా బోలెడు తప్పులున్నాయి. మద్దికాయల మల్లయ్య ఓక లక్షణాపరిజయం బ్రాసినట్టు శిష్టా రామకృష్ణశాస్తిగారు. జమకట్టారు. గాని పెదపాటి జగ్గన్న ప్రబంధరత్నాకరంలో ఇచ్చిన పద్యాల వల్ల మల్లయ్య రేవతీ పరిణయమే బ్రాసినట్టు తెలుస్తూంది.” లక్షణాపరిణయాన్ని కూడా అతడు వ్రాశాడేమో పరిశోధించాలి.

  1. పూసపాటి తమ్మరాజు : శ్రీకృష్ణుడు ఎనమండుగురు భార్యలనేకాక పదహారువేల మందిని కూడా చేపట్టాడు. ఇది 'నరకాసురసంహారం' తరువాత జరిగింది. ఈ గాథను పూసపాటి తమ్మరాజు శ్రీకృష్ణవిజయం అనే అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాసి బెజవాడ కనకదుర్గకు అంకితం ఇచ్చాడు. ఈ రాజకవి మాధవవర్మ, మైలమభఖీముడు మొదలైనవాళ్ళ సంతతిలోనివాడు. 899 పద్యాలలో తన వంశావళిని విపులంగా వర్ణించాడు. పూసపాటి రాజులు మొదట విజయనగరం కొలువులో ఫ్రొడదేవరాయల కాలంలో ఉండేవారు. తరువాత గజపతులసినలు నడిపి వాళ్ళతో వియ్యమందారు. “మహామండలేశ్వ్చర,

  2. భారతి - జనవరి 192లో శిష్టావారి పటిక.

  3. బెజవాడ రామ్మోహన గ్రంథాలయంలో పండిత నిష్టల సింహాచల శాస్త్రిగారి లక్షణాపరిణయ ప్రతి ఒకటి ఉంది. (భా.190)

  4. భారతి, జనవరి 1%92.

  5. మలిరాయలయుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటం

622 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి క్రీ.శ. 1458 ప్రాంతాలలో ఉండే ఇమ్మడితమ్మరాజు దగ్గర్నుంచీ ఈ వంశంలోని రాజులు సాహితీప్రియులు. కొందరు గ్రంథాలు వ్రాశారు. కొందరు కవులను పోషించారు. ఈ ఇమ్మడితమ్మరాజుకు ఏడవతరంలో, అంటే శ్రీ.శ.103లో ఉన్న మరో తమ్మరాకే శ్రీకృష్ణవిజయం రచయిత. ఇందులో నరకాసురవధ, పదహారువేల మంది శ్రీకృష్ణుని మోహించడం, పారిజాతాపహరణం, పదహారువేల మందితో కృష్ణుని పెళ్లీ విపులంగా కవి వర్ణించాడు. కవిత్వం మంచిది. సత్యభామ నరకునితో యుద్ధం చేయడాన్ని అంతకుముందు నాచనసోముడూ, బమ్మెరపోతరాజుగారూ గొప్పగా వర్టించారు. సత్యభామ ఆ యుద్దాన్ని పట్టిన దగ్గిరనుంచి 11 పద్యాలలో తమ్మరాజు యుద్ధశోభను వర్ణించాడు. నవమందహాసకందళలీలహరిచోటనరిచోటనట్టహాసాకురంబు నమృతంబుజిల్కు నెయ్యపుబల్కు; హరిచాయనరిచాయగోపనిష్ట్ణురతోక్తి విరితూపురూపుబిత్తరిచూపు హరిచెంతనరిచెంత కిఖశిఖా భరనిరీక్ష చటులవిద్యుల్లకాసమవృత్తి హరిపజ్జనరిపజ్జ ననలకీలానువృత్తి వెలయశ్ళంగారరసమును వీరరసము నిరుదెసలయందు వెదజల్లు నిగురుబోడీ షోడ్తీమితెరంగుగాంచు గీర్వాణలీల వేణులాశ్చర్యరసధుర్భ్యవాణులైరి. (శ్రీకృ. ౩-9) సత్యభామలో శృంగారవీరరసాలనేకాక ఇతర ఘట్టాలలో కూడా శృంగారవీర రసాలను తమ్మరాజు చక్కగా వర్ణించాడు. ఇదే యుగంలో ఇదే కథను తీసుకొని లింగనముఖి తిరుకామయ్య శృంగారంపేరిట చిత్తమొచ్చినట్టు విచ్చలవిడిగా కలం నడిపించాడు. తమ్మరాజు మాత్రం ఇందులో పురాణపాత్రల స్థాయిని తగ్గించలేదు విప్రలంభ శృంగారాన్ని పదహారువేలమంది కన్యల విషయంలో వర్ణించాడు. అక్కడ తూడా ఇతర ప్రబంధకవుల పోకడలేపోయాడు. మితిమీరలేదు. అయితే ఇతనికి మోతాదు మించిన శృంగారం వరించడం చేతకాక ఇలా చేశాడనుకోరాదు. కౌచిత్యం తెలిసే ఆగాడు. కటువుగా తూడా పూసపాటి తమ్మరాజు వర్ణించగలడు. అంధకారంలో జారసతుల సంతోషాన్ని ఇలా చెప్పాడు: వదిన చెంతనె చంద్రవదనయొక్కతె యొక్కమదనాతురునకు చుంబనమొసంగె నత్తడాసినభయాత్తగాక యొకతున్‌ మత్తయ్రైవిటునితో హత్తియుండె దోడికోడలితోడగూడి చేడియయోర్తు వేడుకకానిచే వీడెమందె తల్లిసన్నిధిని నొకపల్లవాధర తనపల్లపుకడజూపె బ్రల్లదంబు చొనమనుయొక్క కొరతయ కాని కాని పనులు తమరెన్ని చేసిన బరులచేరె గానగానీని చీకటి కన్నగలదె జారసతులకు సంతోషకారణంబు, (శ్రీ కృ. 4-61) జారసతుల సంతోషం అలా ఉంటే ఆ కాలంలోని కవుల సరదాలు వేరే ఉన్నాయి. అవకాశం వస్తే చిత్రకవిత్వ బంధకవిత్వాలను ప్రదర్శించడం, యమకాలు, శ్రేషల

తొలి తరం ఇతర కవులు _ 623 గుప్పించడం ఆనాటి రివాజు, ఈ కావ్యంలో తమ్మరాజు తూడా భూదేవి చేసిన స్తవంలో చక్ర. ఖడ్గ పుష్పమాలికా బంధాలు, చతుర్చాధ కందం, పాపగోపనం, నామగోపనం (శ్రీజయవాటీ కనకదుర్వాంవిక అని సీసంలో పాదాల తొలి అక్షరాలున్నాయి), ప్రగ్విణీగర్చిత భుజంగ ప్రయాతం, ద్వ్యక్షరం, నాగబంధం, గోమూత్రికాబంధం, తలకట్ల పద్యం (3:159-169 దాకా) మొదలైనవి చెప్పాడు. శ్రీకృష్ణుని నుతించేటప్పుడుగాని, నిందించేటప్పుడుగాని శ్లేషలో దశావతారాలను చాలాసార్లు పేర్కొన్నాడు. ముక్కుతిమ్మన గారిలాగే అదితిచేత దశావతారాల వర్ణన చేయించాడు. పూర్వకవులను అనుసరించినా ఉదాత్తంగా రచనల చేసే రచయితలలో ఇతడొకడు.

  1. చెన్నమరాజు చెన్నమరాజు: శ్రీకృష్ణుని వివాహాలనేకాక అతని కుమారుల పరిణయాలను కూడా ఈ యుగంలోని కవులు కావ్యవస్తువుగా స్వీకరించారు. శ్రీకృష్ణునికి చారుచంద్రుడనే కొడుకు ఒకడు. అతని కథను చారుచంద్రోదయమనే కావ్యంగా చెన్నమరాజు అనే కవి వ్రాశాడు. మూడవ వెంకటపతి రాయలవారు క్రీ.శ.1630-1642 సంవత్సరాల మధ్య పృథివీరాజ్యం చేసే రోజులలో కడప జిల్లాలోని గండికోట ప్రాంతాలను పెమ్మసాని వారు ఏలుకొంటూ వుంటే వారి వద్ద చెన్నమరాజు వారి కుటుంబంలోని వ్యక్తులు మంత్రులుగా ఉండేవారు. ఈ చెన్నమరాజుగారి ఇంటీ పేరు ఆదిలో అన్యచింతలవారు; అయితే ఆ వంశంలో క్రీశ. 1500 ప్రాంతంలో ఒక చెన్నమరాజుగారనే మంత్రి సు ప్రసిద్ధుడయ్యాడు. ఆ కుటుంబానికి ఆయన పేరే ఇంటిపేరు అయింది. ఈయన మనవడికి ఇతని పేరే పెట్టారు. ఈ రెండవ చెన్నమరాజు కవిసార్వభౌముడైన శ్రీనాథునిలాగా “సన్నుతకవిత్వవిద్యాభ్యున్నతి' పొందినవాడు. అయితే ఇతడు వ్రాసిన గ్రంథాలేమిటో తెలియవు. ఇతని మనువడికి ఈయన పేరే పెట్టుకొన్నారు. అతడు కూడా కవే అయ్యాడు. సంస్కృతాంధ్ర భాషా వేష సారసారస్య పరిజ్ఞానధురీణ మానసాంభోజుడయ్యాడు. “చారు చంద్రోదయం' అనే శృంగార కావ్యాన్ని బ్రాసి తన స్వగ్రామమైన తాడిపర్తిలోని శ్రీ గోపాలస్వామికి అంకితమిచ్చాడు. శ్రీకృష్ణుని పుత్రుడు చారుచంద్రుడు కుముద్వతి అనే రాజకుమార్తెను ట్రేమించాడు. అమె రత్నకేతనపురాన్ని పాలించే పద్మాకరుని కుమార్తె. ఈమెను పెళ్ళి చేసుకొనడానికి ముందు చారుచంద్రుడు పుష్కరుడనే రాక్షసుని సంహరించాడు. ఈ కథను చెన్నమరాజు అయిదాశ్వాసాలలో చెప్పాడు. ప్రాచీన ప్రబంధకవుల 'పోకడలన్నీ అలవర్చుకొన్నాడు. పురవీధులలోని సాగటాలాటనిలా వర్ణించాతు:

పంచారించిన గుబ్బచన్నులు చలింప గెంపురాదిన్నెలక

మించుంబోడుల గుంపు సొంపు మదిలో మించక్‌ దుగా, బార, తీ =... పంచా, యిత్తిగె, దచిచక్కునత చౌపంచీ పదీ తొమ్మిదీ

యంచు బల్లవరాజితోడ సాగటాలాడుక౯బురీవీధుల౯. ఛు. *512 పై పద్యం ఎత్తుగడలో శ్రీనాధుని ట్రేడుమార్కు ఉంది. 'పంచారించడం' అతని కావ్యకన్యల సాత్తు. సౌగటాల పరిభాష మొదట నాచనసోముని కావ్యంలో ప్రవేశించినది (ఉత్తర హరివంశం 3౩-121). చెన్నమరాజు బాగా అనుకరించగలడని, చక్కగా పద్యం నడిపించగలడని చెప్పవచ్చు.

624 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

చెన్నమరాజు కవితలో జీవంజీవమనోజ్ఞత ఉన్నట్టుంది. చదువుతున్నంతసేపూ ఆహ్లాదం ఇచ్చే గుణం పద్యం నడకలో ఉంది. ఈ కవి వెంకటపతిరాయల వారివద్దనుండీ ప్రభువైన పెమ్మసాని తిమ్మరాజుతు ఇచ్చాడు. "కుంచ కాళాంజొ పట్టించుకొనే హక్కును వెంకటపతిరాయలీకవికి ప్రసాదించాడు. రాయదత్తంబులైన కుళ్లాయి. మీదిపాగ ధవళశంఖాలు పల్లకి తళిచౌకళ్ళు ఇతనికి పెమ్మసాని చిమ్మనాయకుడిచ్చాడు. తన కాలం నాడు సకల సన్మానాలు పౌందిన ఈ కవి కృతి అచ్చుపడీతే నేటి పాఠకులు కూడా అతని పాగలో మరొక తురాయి పెడతారు.

  1. పైడి మర్రి వెంకటపతి : కృష్ణుని కొడుకు కథను చెన్నమరాజు చెప్తే ఈ కాలంలోని మరికొందరు కవులు మరికొందరు పురాణ పురుషుల మనుమల కథలను చెప్పసాగారు. ఏ ముహూర్తంలో కేవల కల్పనాకథలు కృత్రిమరత్నాలని భట్టుమూర్తి చెప్పాడోగాని మన కవులు ఆద్య సత్కతల కోసం ఎగబడి పురాణ పురుషుల వంశంలో ప్రతి ఒక్కనికీ పెళ్ళి చేయడం మొదలుపెట్టారు.

అళియరామరాయల వారి ఆస్థానానికి అలంకారమై రాణించడం వల్ల భట్టుమూర్తికి రామరాజభూషణుడనే పేరు వచ్చింది. అతని తండ్రి పేరు ప్రబంధాంకం సూరప్ప. ఆయన కృష్ణదేవరాయలవారి సోదరుని కుమారుడైన వెంకటపతిరాయల సభకు వన్నై తేవడంవల్ల వెంకటరాయభూషణుడనే పేరు తెచ్చుకున్నాడు. కృష్ణదేవరాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలుండి ఆంధ్రకవిత్వానికే మణిభూషణాలయ్యారు. ఆ కొలువులో ఇంకా ఎందరో విద్వాంసులున్నారు. వారిలో రామరాజు అనే కవి కూడా ఒకడున్నాడు. ఈయనకి కృష్ణ్ణాయభూషణుడనే బిరుదు ఉన్నట్టుంది. ఇతని సంతతివాళ్ళకది ఇంటి పేరయిండి రామరాజుగారి కుమారుని పేరు కేశవుడు. ఆయన కొడుకు పేరు పర్వతరాజు. ఇతనికి ఐదుగురు కుమారులున్నారు. ఐదుగురూ కవులే. వాళ్ళ వివరాలివి.

(1) పెద పర్వతన్న ఇతడు సకల సత్కవి పూజ్యుడు సుకవిత్వ సామ్రాజ్య నిర్వాహకుడు. (2) బోడి పర్వతన్న: ఇతగాడు వివిధ భాషాచార్యుడు; విరచనాచాతుర్య సర్వంకషుడు. (3) తిరుమలన్న: ఇతడు వరపద్యదాకారు వాచా చమత్కారనిరుపమ మతిశాలి. (4) కేశవన్న: ఈయన అవధానాలు చేయడంలోను, గర్చకవిత్వం చెప్పడంలోను మంచి పేరు సంపాదించుకొన్నాడు. (5) వెంకటప్ప: ఇతడు “చంద్రాంగదచరిత్ర'మనే ప్రబంధాన్ని రచించాడు. ఈయన వ్రాసిన ఈ కావ్యంలోని ఒకే పద్యం వల్ల ఈ కృష్ణ్ణయభూషణుని వంశంలోని యిందరు కవుల గురించి తెలుస్తోంది. వెంకటపతి బ్రాసిన కావ్యం తప్ప ఈ కుటుంబంలోని కవులు వ్రాసిన గ్రంథాలేవీ లభించలేదు. ఈ వెంకటపతి పైడిమర్రి పద్మనాభయ్యగారి శిష్యుడు. ఆయన సకల శాస్త్ర పండితుడు. ఏదో యజ్ఞం చేశాడు. ఈ గురువుగారి ఊరిపేరే శిష్యుని పేరుతో కలిపి ఈనాడు సాహిత్య చరిత్రకారులు పైడిమర్రి వెంకటపతి అని పేర్కొంటున్నారు.

ఈ కావ్యాన్ని పైడిమర్రి వెంకటపతి శ్రీరామునికి అంకితం యిచ్చాడు. ఇదీ ఆరాశ్వాసాల ప్రబంధం. నలచక్రవర్తి మనుమడు సీమంతిని అనే రాజకుమార్తెను వివాహం

తొలి తరం ఇతర కవులు 625 చేసుకోడం ఇందులోని ఇతివృత్తం. ఇది స్కందపురాణంలోని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. మూలంలో యిది సోమవార మాహాత్మ్యాన్ని ఉగ్గడిస్తుంది. అయితే వెంకటపతి దీనిని తన కావ్యంలో చాటలేదు. ఈ పుస్తకంపై పరిశోధనలు చేసి పట్టికలు తయారుచేసిన బౌనుదొరగారి పండితులు ఆదిలో యిలా వ్రాశారు: "ఈ కావ్యం స్కాందంలో బ్రహోత్తర ఖండమందు సోమవారవ్రతమాహాత్మ్యమందు 30-31 ఈ అధ్యాయములలో నుంచి పుట్టినది. ఈ కథ కొంచెం భేదముగా నున్నది. మెట్టుకు గీర్వాణంలో సాంగంగా ఉన్నది. ఈ కావ్యంలో వివాహపర్యంతము ఉన్నది.” ఈ ప్రబంధాన్ని ప్రామాణికంగా ఎన్నుకొని, ఇందులోని పదాలకు పట్టికలు వ్రాయించి బ్రౌనుదొరగారు తమ నిఘంటువులో వాడుకొన్నారు. బహుజనపల్లి సీతారామాచార్యులుగారు తూడా పైడిమర్రి వెంకటపతిని ప్రామాణికంగా స్వీకరించారు. ఇతణ్జి నాల్గవ తరగతి కవిగా పరిగణించారు. శబ్దరత్నాకరంలో యితని ప్రమాణాలు యిచ్చారు.

ఈ చంద్రాంగదచరిత్రంలో చరిత్ర అట్టే లేదు. అష్టాదశ వర్దనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా బుతువర్ణన లెక్కువ. ద్వితీయాశ్వాసంలో వేసవిని 19 పద్యాలలో వర్ణించాడు. చతుర్దాశ్వాసంలో మిగిలిన ఐదు బుతువులను 84 పద్యాలలో వర్ణించాడు. అంటే మొత్తానికో శతకానికి పైబడ్డ పద్యాలలో యితడు బుతుసంహారం చేశాడు.

వనవిహారం చేస్తున్న నాయిక చెలికత్తిల తోటలోని దృశ్యం పీర్లగుండం తొక్కుతున్నట్టనిపించించట. ముల్లాలు ఖురాను చదవడం, నీళ్ళు జల్లడం, పీర్లను పట్టుకొని నిప్పుతొక్కడం బాగా రూపించాడు.

లలనామావియలాకవంతునిరోజాల మొగ్గపూముల్కిని

చ్చలపుం దుమ్మెద గుబ్బపూరజపు నేజా నిల్చిపైకారవం

బుల ముల్లా పరియింపుచుక్‌ మధుజలంబుల్‌ జల్లివేగాడ్పుభా

నులచేబై త్రపుసైదు జీర్ణదళవహ్న్నల్‌ గంటె త్రొక్కింపగక. (చంద్రా.4-208)

ఈ కావ్యంలోని పాత్రలకేకాకు కవికి తూడ తిట్లు టాగా వచ్చు. కుకవులను రామసింహాలన్నాడు. ధారుణీపాలనాసభలలో సుకవులు చరించాలంటే ఈ కుక్కలను నిజవచోదండాలతో బెదరగొట్టాలట.

ఉసికొల్చ శబ్దంబు లొకకొన్ని పచరించి త్రూరమార్నాన్వేషరూఢీ గాంచి

యర్థచోరక్రియాహారిత బెనుపాంది కడిమిపై పట్టుపట్టెడల సరిగి

ఘనపాకశయ్యలేకడలేక చరియించి వడిమీరు కలవార్త వలన మించి

రసదాళి సరిపదరచనగానకపోల్చియనువైన తలంపులు గనక నిల్చి

యడరుకాకవిగ్రామసింహములుగవియ

పతులు నిజవచోదండసంహతులబెదరు

పరువకుండిన ధారుణీపాలసభల

కలగబారక సుకవులు మెలగుటెట్లు? (చంద్రా. పీఠిక 16) 8. మద్రాసు ప్రాచ్యలిథితగంథధాలయంలో ఈ ప్రతి ఉంది. సంఖ్య ౨ 500

626 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

పైడీమగ్రి వెంకటపతి ఏ ధరణీపాలుని సభలో మెలగినవాడో తెలియదు. ఇతని గురించిన ఇతర వివరాలేమీ తెలియవు. ఇతని కావ్యాన్ని 1897లో అముద్రితగ్రంథ చింతామణి పత్రికాధిపతి పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రకటించారు వారు వెంకటపతికాలం గురించి వీరేశలింగంగారితో ఏకీభవించలేదు. కందుకూరివారు ఇతణ్జీ 1700 ప్రాంతాల కవిగా పరిగణించారు.ీ దానికి వారు చూపిన ఆధారం ఈ కవి చేసిన ప్రయోగాలను అప్పకవి స్వీకరించకపోవడమే. అయితే దానితో మిగతా పరిశోధకులు అంగీకరించడం లేదు. చాగంటివారు ఇతడు క్రీ.శ1650 ప్రాంతాలవాడని భావించారు. వెంకటపతి ముత్తాత కృష్ణదేవరాయలవారి కాలంలో ఉన్నాడు కనుక తరానికి పాతికేళ్ళు లెక్కపెడ్‌తే వెంకటపతి క్రీ.శ1630 ప్రాంతాలవాడు అవుతాడు. పైడిమర్రి వెంకటపతి ఎప్పుడు జీవించినా అతని కావ్యంలోని కొన్ని పద్యాలు ఎప్పుడూ జీవిస్తాయి.

  1. మట్ల కుమారఅనంతరాజు: విజయనగర సామ్రాజ్యం ఆరిపోకుండా స్నేహంతో, విశ్వాసంతో సేవచేసిన అమరనాయకులలో మట్లవారు చాలా ముఖ్యులు. వీరు కర్నూలు మండలంలోని సిద్ధవటం పౌత్తపి సీమలను ఏలుతూ ఉండేవారు. ఈ రాజవంశంలో అనంతరాజనే ప్రసిద్ధుడు స్వయంగా కవి. కాకుత్ధృవిజయం అనే కావ్యాన్ని వ్రాశాడు. ఈ అనంతరాజుగారి పేరే అతని మనుమడికి కూడా పెట్టారు. తాకామనవళ్ళను గుర్తించడానికి వీలుగా పౌత్రుణ్జీ కుమారఅనంతరాజు అని వ్యవహరించేవారు. ఈ మనువడు తూడా కవే తాతగారు సమరాలలో వన్నాకెక్కాడు. క్రీ.ఈ1605కు ముందే అతడు ప్రాజ్ఞుడయినాడు. వైణీఠా గ్రేసరు లతనిని సాక్షాత్తూ సరస్వత్తీదేవి అవతారం అనేవారు. పాండిత్యంలో శేష్పుజ్జి మించినవాడు అని పొగిడేవారు. కువూరఅనంతుడు కుముద్వతీకళ్యాణమనే కావ్యాన్ని బ్రాశాడు. శ్రీరాములవారి కుమూరుడు కుశుడు కుముద్వతి అనే రాజకుమార్తెను పెళ్తాడడం ఇందులోని విషయం. ఈ కావ్యం అసమగ్రం, అముద్రితం. ఈ కావ్యానికొక తాళపత్రప్రతి అడయారు లైబ్రరీలో ఉంది (సంఖ్య 75056). ఈ తాటాకుల పుస్తకంలో 3౫ కమ్మలున్నాయి. చివరి కమ్మలు కొన్ని చిరిగిపోయాయి. అక్కడక్కడ శైథిల్యాలున్నాయి. ఇదెన్ని ఆశ్వాసాల కావ్యమో తెలియదు. తృతీయాశ్వాసం వరతు గ్రంథం లఖిస్తూంది. దీనిలోని గద్యవల్ల కుమూరఅనంతుడు వెంకటాచలంనుండి .శ్రీశైలందాకా ఉండే మధ్యదేశంలో ప్రతి గ్రామంలోనూ మృష్టాన్నసత్రాలు వేయించాడని ఆలుస్తూంది. ఇతడు తన కవిత్వం ఎలా ఉంటుందో ఒక పద్యంలో చెప్పాడు.

మల్లీనవవల్లీమ- త్తల్లీసుమవేల్లికాచరసాగధ్యో

ద్యల్లీవాధికసొరభ- హల్లీసకముల్‌ కుమూరనంతునికవితల్‌. (అ.లై.32-55) హల్లీసకాలవంటి కవితలు వ్రాస్తానని చెప్పుకొనే కువూరఅనంతుడు తన కావ్యాన్ని వాణీరసరూడం చెయ్యాలని ఆశించాడు. ఈ కావ్యం సంపూర్తిగా లఫించకపోవడం 9. ఈ పుస్తకాన్ని, దీనితోపాటు చాలా అమూల్యమైన ప్రాచీన ప్రకరణములు దయతో నాకు ఇచ్చిన

మిత్రులు శ్రీ నేలనూతుల శ్రీకృష్ణమూర్తిగారికి చాలా కృతజ్ఞుణ్డీ. 10. ఆంధ్రకవులచరిత్ర, మూడవభాగం, పుట 2౫. 11. అంధ్రకవితరంగిణీ, 11వ సంపుటి, పుట 190.

తొలి తరం ఇతర కవులు 627 దురదృష్టం. దొరికినంత గ్రంథమైనా జాగ్రత్తగా పరిష్కరించడానికి 'మైక్రోఫిలిం' ప్రతినొ తీయించుతున్నాను. బాగా పరిళోధించాక ఈ కావ్యం రసారూఢమో, కాదో చెప్పవచ్చును.

  1. దివి రమణయ్య ; రసవంతమైన కావ్యాన్ని నిర్వచించే సంస్కృతంలో అలంకార శాస్త్ర గ్రంథాలకు కరువులేదు. తెలుగులో తూడా ఎందరో వాటిని రచించారు. అయినా ప్రతీతరంలోనూ ఒకరు కొత్తగా ఏదో ఒక అలంకారశా స్రాన్ని అనువదించాలనుకొంటారు. కతుతుబ్‌షాలు గోలుకొండను, తీరాంధ్రాన్ని పాలించే రోజులలో అమరావతీ సంస్తానానికి వాసిరెడ్డివారు ప్రభువులుగా ఉండేవారు. ఈ కుటుంబంలోని రామలింగంగారు శృంగార దామం అనే అలంకార గ్రంథాన్ని తెలుగులో చేయించాలనుకొన్నారు. దివి రమణయ్య అనే కవిని దీనికి పురమాయించారు.

ఇలనవరసములలోపల- బలువగుశ్చంగారరసము భావజ్ఞులకుక

తలివిపడనాయికామణీి- లలనల నేర్చరిచి లక్ష్యలక్షణరీతిన్‌

శమదమయుక్తివంతుడవు సాగరరాజతనూభవామనో

రమణకటాక్షలబ్ధరమ్యుడ వీవు రసప్రమాధురీ

కర్రమరసమంజరీమధురకావ్యము తెలొనరించి చెప్పుమీ

రమణకవీ సుధామధురసత్కవిరంజితరాజపుంగవా. (శృంగా. 1-20, 21)

వాసిరెడ్డిప్రభువిలా పురమాయించాక దివి రమణకవి 195 గద్యపద్యాలలో రసమంజరిని తెనిగించి శృంగారదామం అని పేరు పెట్టాడు. ఇది రెండాశ్వాసాల కావ్యం. ప్రథభమాశ్వాసంలో (1) స్వీయాది నాయికా నిర్ణయం (2) ధీరాదిగుణప్రకారం (3) దివ్యాదివ్యాదిజూతిభేదాలు (4) జ్యేష్థాకనిష్థాదిస్నేహభేదాలు (5) సముదాయగుణ రీతులు (6) షోడశ నాయికా నిర్ణయం అనే ఆరు విభాగాలున్నాయి. ఇది 125 గద్య పద్యాలలో చెప్పాడు. రెండో ఆశ్వాసంలో (1) అష్టవిధనాయికా ప్రకరణ (2) సఖీదూతికా లక్షణాలు ఉన్నాయి. ఈ అలంకార శాస్త్రాన్ని దివి రమణయ్య మంగళగిరిలోని పానకాలస్వామికి అంకితం ఇచ్చాడు. ఆ దేవుడు వాసిరెడ్డిగారి కులదైవం. ఈ కావ్యం లలితచమక్రియా పదవిలసితమని వాసిరెడ్డి రామలింగయ్య భావించాడు (1-22). కాని ఈ కవి నిరోషమైన పదప్రయోగాలు చేయలేడని వీరేశలింగంగారు భావించారు. ఈ అలంకారశాస్త్రం అముద్రితం. దీని ప్రతి ఒకటి మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. 9.796 నంబరుగల పుస్తకంలో నాలుగైదు ఇతర కావ్యాలతోపాటు ఇది తూడా ఉంది.

  1. రాజవోలు సుబ్బారాయుడు : అలంకార శాస్త్రాలు ఏం చెప్పినా, అలాంటివి ఎన్ని చదివినా ప్రతిభ లేని కవి కల్చనాకావ్యాలు రచించలేడు. మన సాహిత్యంలో కేవల కల్చనాకథలకు పింగళి సూరపరాజుగారు ఆద్యులు. ఆయన కళాపూర్ణోదయం రచించి ఆంధ్రసాహిత్యంలో కొత్త ఘంటాపథాన్ని నిర్మించాక ఆ త్రోవలో పయనించిన వాళ్లెవరూ మన దృష్టికి కొట్టవచ్చినట్టు కనపడరు. అయితే కొందరు కవులు ఎలుగెత్తి ఆ బాటనే తాము సాగుతున్నట్టు చాటుకోకపోలేదు. రాజవోలు సుబ్బారాయుడనే కవి జయవిజయాభ్యుదయ
  2. అంధ్రకవులచరిత్ర, ౩న భాగం, పుట 72.

628 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మనే కల్పనాకథను వ్రాసి, పింగళి సూరపరాజుగారే తనకు మార్గదర్శి అని ఇలా చెప్పుకొన్నాడు:

ఘను డాపింగళిసూరపార్య కవిలోకశ్రేష్ట డెంతో రహి

మునుజెప్పెక విదితాంధ్రభాషను గళాపూర్లోదయ గ్రంథము

వనవీధిక౯ గజబ్బందముల్‌ చనిన త్రోవం జీమ లిచ్చారతిం

జినునే తద్గతినే నొనర్హు కృతి శేషా ద్రీశు కారుణ్యతన్‌.

కథాకల్పనలోను, పేర్లు పెట్టడంలోను ఇతడు పింగళి సూరపరాజుగారిని అనుకరించినా చాతుర్యంలో ఇతని కావ్యం కళాపూర్లోదయానికి సాటిరాదని పుస్తకాన్ని చూసినవాళ్ళు భావిస్తున్నారు.* ఇతని జయవిజయాభ్యుదయం నాకు దొరకలేదు. ఇతని ఇతర గ్రంథాలు దేశానికీ లభించలేదు. అయితే ఆ పుస్తకాల పేర్లు తెలుస్తున్నాయి. కవి తన గురించి ఇలా చెప్పుకొన్నాడు:

గంఖీరశబ్దగుంభనాచాతురి మెజయు చిత్రాంగదాపరిణయంబు

రమణవాగ్గాటీ నిరాఘాటవిస్ఫూర్హిగరుడాంజనేయవా గ్వాదకథయు

శృంగారమృదువాక్యసంగతిద్విపదకావ్యముగా సుదంతావివాహకథయు

సరసకృష్ణార్దున సంవాదమహాప్రబంధమును గవిజనానందముగను

వెలయ నొనరించినాడ నార్వేలవంశ-వననిధిసుధాకరుండ శ్రీవత్సగోత్ర

సంభవుడు రాజవోల్పు రీస్థానపరుడ- రసికజనరంజనుడ సుబ్బరాయకవిని.

ఈ రాజవోలుపురం కర్నూలు జిల్లా సిరిసిల్ల తాలూకాలోని రాజోలు కావచ్చును. తనకు గంఖీరశబ్దార్ధగుంభనా చాతుర్యం, వాగ్యాటి, శృంగారమృదువాక్యరచనాశక్తి ఉందని చెప్పుకొన్నాడు. ఇతనికి శబ్ద శాస్త్ర లక్షణజ్ఞానం కల్పించిన విద్యాగురువుపేరు రమణయ్య. పరాశర వెంకటభట్టరు దీక్షాగురువు. ఈ కవికాలాన్ని నిర్ణయించడానికి పరిశోధకులకు ఆధారాలు దొరకలేదు. ఇతడు వ్రాసిన ఈ క్రింది కావ్యాల పేర్లే చెప్పుకొని సంతోషించాలి. (1) చిత్రాంగదాపరిణయం (2) గరుడాంజనేయసంవాదం (3) సుదంతావివాహం (ద్విపద) (4) కృష్ణార్ణునసంవాదం (5) జయవిజయాభ్యుదయం.

  1. వెన్నెలకంటి వెంకటాచలం; మన సాహిత్య చరిత్రలో కవుల కాలనిర్ణయాలు చేయడమే ఒక పెద్ద సమస్కగా నేటికీ మిగిలిపోయింది. కొందరు కవులు తమ గురించి ఏమీ చెప్పుకోకపోయినా ఈ వంశంలోని అనంతర కవులు చెప్పేదానిని బట్టి కనీసం కాలనిర్ణయమైనా చేయడానికి వీలవుతుంది. మన దేశంలో పండిత కుటుంబాలు చాలా ఉన్నాయి. అయ్యలరాజువారు, తాళ్ళపాకవారు మొదలైన ప్రసిద్ధ వంశాలలో

విష్ణుపురాణం ఆంధ్రీకరించి ప్రఖ్యాతుడైన వెన్నెలకంటి సూరన్న మలిరాయల యుగంలోని కవి.** ఇతని మనవడి మనవడు సూరపరాజు. ఈయన కడగొట్టు తమ్ముడు 13. ఆంధ్రకవితరంగిణి, 11వ సంపుటి. శ్రీ చాగంటి శేషయ్య, పుట 130.

  1. మలిరాయల యుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటి

తొలి తరం ఇతర కవులు 629 వెంకన్న మంత్రి వేజర్లవారి దగ్గర గుడ్తూరులో మంత్రిగా ఉండేవారు. శ్రీరంగరాయలవారిని మెప్పించి పంచవన్నెల డాలు తీసుకువచ్చాడు. ఈ వెంకన్న మంత్రి గురించి వాళ్ళ వంశంలోని అనంతర కవి యిలా ప్రస్తుతించాడు.కేక్‌

వేజెళ్ళనర్రాజువిభవాధిపత్యంబు పూనిన సర్వజ్ఞ పుణ్యమూర్తి

పొలుపొంద నాకృష్ణభూపాలుబాలుని దొరచేసికొని కార్యమరసినడిపె

'శ్రీరంగరాయలచే నొప్పుగొని తెచ్చి పంచవన్నెల డాలు పరగ జేసె

కొండవీటిసరద్దుగుడూరిదనుకను ఏలించె కృష్ణభూపాలునెమ్మి

సకలప్రజ్ఞానదక్షుడై జనుల బ్రోచె

రాజసన్మానములచేత దేజమలరె

బంధుజనముల సకలసంపదలదనిపె

మహితయశుడగు వెంగనమంత్రియపుడు. (కవిజీ పుట 637)

వేజెళ్ళ కృష్ణమరాజు క్రీ.*.1600 నుండి నలభైరంండు సంవత్సరాలు గుడ్లూరు పాలించాడు. ఇతణ్జి గద్దెమీద నిల్పినవాడు వెన్నెలకంటి వెంకన్నే. ఈ మంత్రి మెప్పించిన శ్రీరంగరాయలు రెండవ శశ్రీరంగరాయలు కావచ్చును (క్రీశ1614-1619). ఈ వెంకన్న మంత్రి పెద్దన్న సూరపరాజుగారి మనుమడి పేరు వెంకటాచల కవి. ఇతడు కృష్ణవిలాసం అనే ప్రబంధం వ్రాసి జలదంకి పట్టణంలో ఉన్న జానకిరామయ్యకు అంకితం యిచ్చాడు. ఈ కావ్యంలో అతడు వెన్నెలకంటి వారి వంశావళిని విపులంగా వర్ణించాడు. తన ముత్తాతగారి

సూరపకాంతిచే సూర్యప్రకాశుండు వేదాదివిద్యల వెలసినాడు

విష్ణుపురాణంబు వేడుక దెనిగించి విమలయశంబున వెలసినాడు

రావూరిబసవన్న రమణతో నిచ్చిన యల మొగుళ్ళూరగ్రహార మందె

వెలుగోటి తిమ్మభూవిభునిచే గొనియె దానాందోళికాఛత్రమగుపదవిని

కవితపుట్టిల్లు వెన్నెలకంటి యిల్లు

ననెడు పొరుషనామధేయంబిు నిలిపె

సరసగుణములు కలిగిన సాదుసుకవి

మాననీయుడు సూరనామాత్యవరుడు. (కవిజీపుట 634)

ఈ పద్యంలోని వెలుగోటి తిమ్మ భూపాలుడు మలిరాయల యుగంలో ఉన్నాడు. ఈయన వెలుగోటి రంగనాయకుని కుమారుడు. ఇతని శాసనం ఒకటి నెల్లూరు కనిగిరి తాలూకా దాసాలపల్లి గ్రామంలో ఉంది. దాని కాలం క్రీ.శ1538. వెన్నెలకంటి సూరన్న అప్పటివాడే. ఆయనకు ఆరవతరంలో ఉన్న వెంకటాచలం తన తాత, ముత్తాతల నందరినీ పరిష్కారమైంది. కృష్ణలీలా విలాసంలో వెంకటాచలం ములుగ గురులింగాచారి శిష్యుణ్ణి అని చెప్పుకొన్నాడు. పూర్వ కవుల నిలా స్తుతించాడు: 16. ఈ సందర్భంలోని పద్యాలన్నీ గురజాడ శ్రీరామమూర్తిగారు తమ కవిజీవితాలులో ఉదహరించినవే.

630 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కాళిదాసుని దిక్కకవినన్నపార్యుని భారవి భవభూతి పాండుసుకవి

మల్హణు విల్లణు మాఘు మయూరుని చోరుని నాచనసోము ఖీము

పింగళిసూరన్న పెద్దనామాత్యుని పొలుపొంద బమ్మెరపోతరాజు

పంచేటి రంగన్న భాస్కరమంత్రిని వెల్లంకి తాతప్ప మల్లుభట్టు

మహిమమీరంగ నాస్థానమంటపముల

సకలరాజులచేతను సన్నుతింప

బడిన సుకవుల నందర బస్తుతింతు

నింపుమీరంగ గృతిరచియింపబూని (కవిజీవితములు, పుట 681)

సంస్కృతాంధ్రకవులనిలా కలగలిపి చెప్పడం చాలా అరుదు. '“వంచేటి రంగన్న పేరు గమనించతగ్గది. వెన్నెలకంటి వెంకటాచలం ఈ [గ్రంథంలో తాను "అష్టాంగ యోగములలవడీ తన్మయత నంది - యానందించే' వాడనని చెప్పుకొన్నాడు. అటువంటీ ఆనందం కేవలం బుషులకే లఖిస్తుందని సనాతనుల అభిప్రాయం.

  1. చల్లా గురవయ్య : మన ప్రాచీన బుషులలో యాజ్ఞవల్కు్యడు చాలా ప్రసిద్ధుడు. అతడు శుళకయజుర్వేదాన్ని వ్యాపింపచేశాడు. జనకుని అస్థానదార్శనికుడు. ఇతని యాధ్యాత్మికోపదేశాలు శతపథబ్రాహ్మణంలోనూ, బృహదారణ్యకోపనిషత్తులోనూ కొల్లలుగా ఉన్నాయి. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మైత్రేయి; ప్రవృత్తిమార్గాన్ని అనుసరించింది. రెండవభార్య కాత్యాయిని ఆధ్యాత్మిక నిష్టకో ఉండేది. యాజ్ఞవల్కుుడు మైత్రీయితో చేసిన సంవాదం ముఖ్యం అయినది. ఈ బుషిచరిత్రను ద్విపదకావ్యంగా చల్లా గురవయ్య అనే కవి వ్రాశాడు. .

ఈ ద్విపదకావ్యాన్ని వ్రాసిన చల్లా గురవయ్య బెజవాడదగ్గిర కొండపల్లి నివాసి. ఇతనికి దుర్గావరప్రసాదంవల్ల కవిత్వం వచ్చిందట. బాలసరస్వతి అనే బిరుదును పొందాడు. కొన్నాళ్ళకు కొండపల్లినుండి కొండవీటి దుర్గానికి వెళ్లాడు. ఈ దుర్గం ఇంతకుపూర్వం కొన్నాళ్ళు గజపతుల పాలనలో ఉండేది. అప్పుడాగ్రామంలో కొచ్చెర్లకోటవారనే కరణాలుండేవారు. వాళ్ళకు గజపతులు మహాపాత్ర బీరుదాన్ని ఇచ్చారు. గజపతులనుండి కొండవీటి దుర్గాన్ని కృష్ణదేవరాయలవారు గెల్చుకొన్నాక తూడా ఈ మహాపాత్రుల కుటుంబంలోని వ్యక్తులు కొండవీటి దుర్గానికి స్థలకరణాలుగా ఉండేవారు. ఎర్రయ్య మహాపాత్రుడు. ప్రజలను బాధపెట్టే సుంకాలను తొలగింపజేశాడు.

తనరంగ నాచంద్రతారార్కముగను- ఘనముగా బెండ్లీసుంకములుమాన్చించి

వినుతికెక్కి నకీర్తివిజయుండనంగ- నెలమహాపా త్రుండెలమిజన్నించె. (2492

గురవయ్య ఈ ఎగర్రయ్యను కీర్తించాడు. ఈ కుటుంబంలో కృష్ణా మహాపాత్రుడు పుట్టాడు. అతని కుమారుడు వెంకటమంత్రి. ఈయన శుక్రయజుశ్ళాఖవాడు. యజుర్వేదాన్ని వ్యాపింపజేసిన యాజ్ఞవల్క్యమహర్షి చరిత్రను రచించమని చల్లా గురవయ్యను ఈ కృష్ణా పాత్రుని వెంకటమంత్రే ్రేరేపించాడు. కవి ఈ చరిత్రను శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. ఇందులో అరుకాండలున్నాయని కవి చెప్పినా నాలుగు కాండలే దొరికాయి. అయిదోకాండ

తొలి తరం ఇతర కవులు 41 అసమగ్రంగా ఉంది. యాజ్ఞవల్క్యమహర్షి చరిత్రను అనంతరకవి ఘట్టుప్రభువు కూడా రచించాడు. గురవయ్య రచన అముద్రితం.

  1. సుగ్గుటూరి ముమ్మడి తమ్మప్ప।; మన సాహిత్య చరిత్రలో కొంతమంది గ్రంథాలు అముద్రితాలైతే చాలామంది రచనలు అలభ్యాలు. పుస్తకాల పేర్లు మాత్రమే తెలిసే రచయితలలో సుగ్గుటూరి తమ్మప్పు ఒకడు. అళియ రామరాయలు రాయసాత్రూజ్యాన్ని నిర్వహిస్తున్న కాలం నుంచీ మైసూరులోని “కోలారు' ప్రాంకాలలో హొస్కోటె, ఆనెగల్లు ప్రదేశాలను సుగుటూరు కుటుంబంలోని వాళ్ళు పాలిస్తూ వచ్చారు. వీళ్ళ వంశానికి మూల పురుషుడు దేవయ్య. ఈయన సుజ్ఞానమూర్తి కరుణా కటాక్షాల వల్ల అభ్యుదయం పొందాడు. అతని మనుమడి పేరు తమ్మరాజు. ఈయన శ్రీశ1560-75 దాకా రాయసామంతునిగా పెనుగొండపై దాడి చేసినప్పుడు తురకల్ని యితడు కొట్టాడు. కర్ణాటపతిని మెప్పించి “చిక్కరాయ' బిరుదాన్ని, గరుడ చిహ్నాన్ని అందుకొన్నాడు. ఈయన జడలతోనే పుట్టాడని ప్రతీతి. ఇతని భార్య పేరు వీరాంబ. వీళ్ళకి యిమ్మడి తమ్మప్ప జన్మించాడు. ఇతడు కూడా తండ్రిలాగే శూరుడు; శ్రైవుడు, భీమాదిదుర్గం పట్టుకొన్నాడు. కర్ణాటకస్వామి ద్రోహులను నాశనం చేసి రాయలను మెప్పించి స్వర్ణవృషభ వీరభద్ర లాంఛనాలను బహుమతులుగా స్వీకరించాడు. ఇతని భార్య పేరు వెంకటాంబ. వీరికి పుట్టిన బిడ్డకు కూడా తమ్మప్పు అని పేరు పెట్టారు. ఈ కుటుంబంలోని ఆ పేరింటి వాళ్ళలో మూడవవాడు. కనుక యితణ్ణి ముమ్మడి తమ్మప్ప అంటారు. (ఇతనికాలం శ్రీశ 1614-1630). ఈయన శ్రైశవంలోనే మూడు భాషలలో మంచి వైదుష్యాన్ని సంపాదించాడు. మీసకట్టు మొలుస్తూ ఉండే కాలంలో కుమారార్జునీయం అనే ఆంధ్ర కావ్యం వ్రాశాడు. ప్రొడవయసులో సుందరేశచరిత్ర అనే తెలుగు కావ్యం రచించాడు. తరువాత ఆశువుగా కన్నడంలో ఒక యక్షగానం చెప్పాడు. పిమ్మట కౌముదీ వ్యాఖ్యానం అనే రచన సంస్కృతంలో చేశాడు. బ్రాహ్మణులచేత శివదర్పణమనే గ్రంథాన్ని సంకలనం చేయించాడు. ఇతని ఆస్థానంలోని ప్రజల కోరిక మీద కన్నడ భాషలో శంకరసంహితను రచించాడు. ఈ కవి గురించి లూయిస్‌ రైసు దొరగారు మొదట తెలియజేశారు. ఇతడు వ్రాసిన తెలుగు గ్రంథాలు ఏ ఒక్కటీ దొరక్కపోవడం దురదృష్టమే.

  2. అనఘం కోదండరామయ్య : మండలాధిపతులేకాక దండనాధులు, అమర నాయకులు గూడ ఈ యుగంలో సాహిత్యసేవ చేశారు. క్రీశ1616 దాకా రాయసా మ్రాజ్బపు రాజకీయాలలో తలమునకలుగా పాలొన్న వెలుగోటి యాచమనాయకుడు సాహిత్య పోషణ కూడా చేశాడు. అనఘం కొండయ్య అనే కవికి యాచమనాయకుడు ' అభినవదండి' అనే బిరుదు ప్రసాదించాడు. కొండయ్య అన్నగారి కొడుకు కోదండరామయ్య (1000-1650) ఈ నంగతిని గ్రంథస్థం చేశాడు. అతడు తన పినతండ్రి గురించి ఇలాగ చెప్పాడు.

కొండకవీంద్రుం డఖినవ-దండియనగ బేరుగాంచె ధారుణినాధా

ఖండలుడును వెలోటికుల-మండనుడై యొప్పుయాచమహిపతిచేతన్‌ 16 కధాంంగుణ యాంఃకణ, ౪01 00 10905, ౧4 25, 26

632 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

అభినవదండియని యాచమనాయకునిచేత బిరుదుపొందిన కొండయ్య ఏ గ్రంథాలు బ్రాశాడో తెలియదుగాని అతని అన్నగారి కొడుకు మాత్రం 'రుక్కావతీ పరిణయము' అనే శృంగార ప్రబంధాన్ని అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాశాడు.!” ప్రద్యుమ్నుడు తన మేనమామ కూతురిని పెళ్ళి చేసుకోవడం ఇందులోని కథ. “కవిత్వము మిక్కిలి రసవంతము, నిర్జష్టము కాకపోయినను శైలి ధారాళముగా నుండును” అని పరిశోధకుల అభిప్రాయం.

అనఘంవారి మూలపురుషుడు త్రిపురాంతకం - రాజుపాలెం మిట్టపాలెం వేళ్ళపల్లి ఉప్పర్లపల్లి మొదలైన మిరాసిగ్రామాలు సంపాదించాడు. అతని పేరు అనఘయామాత్యుడు. ఆయన పేరే అతని మనుమలకు మునిమనుమలకు ఇంటిపేరైంది. ఈవంశంలోని గాదిరాజు అనే ఆయన ఒకడు వినుకొండసీమలోని తలార్లపల్లె కరణీకం సంపాదించాడు. అనఘం వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. గుంటూరు జిల్లా నుంచి కొండకవి దక్షణాదికి వచ్చి యాచమ నాయకుని దర్శించి ఉంటాడు. మహాధీరుడైన యాచమనాయకుని సాహిత్యసేవ గురించి చెప్పిన ఆనఘం కోదండరామయ్య అనఘుడే

విజయరాఘవ నాయకుడు

కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. అయితే మన తెలుగు సాహిత్యంలో ఎన్ని రమ్యమైన కావ్యాలున్నా అసలైన నాటకాలు నిన్న నిన్నటిదాకా లేవనే అపోహ ఒకటీ ప్రచారంలో ఉంది. నిజానికి మన సంప్రదాయానికీ, పరిస్థితులతూ సరిపోయే దృశ్యకావ్యాలు మనకు చాలా కాలం నుంచీ ఉండేవి. ఓక రకంగా యక్షగానాలు నాటకాలే. కాని వాటిలో పాత్రల సంభాషణలు విపులంగా ఉండవు గనుక వాటిని నృత్య నాటికలుగానో, గేయప్రబంధంగానో పరిగణించడం అలవాటైంది. అయిడే తాము నాటకాలను వ్రాస్తున్నామని కచ్చితంగా చెప్పి యక్షగాన కృతులను నాటకరీతులలో నడిపించిన కవులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ప్రథముడు విజయరాఘవ నాయకుడు. అతడు ఆంధ్ర నాటకకర్తలలో ప్రథముడైనా తంజావూరు పాలించిన ప్రముఖ నాయకరాజులలో చివరివాడు. తెలుగు నాటకాలను వ్రాసి, ఆదరించి ఎంత పుణ్యం కట్టుకున్నాడో తెలుగు రాజ్యాన్ని ఇడుములపాలు చేసి అంత పాపం ఒడీకట్టుకొన్నాడు.

పదవీ వ్యామోహం పాపిస్టిది. రఘునాథనాయకుడంతటివాడు రాజ్యం కోసం అన్నగారిని చెరలో పెట్టి చంపించాడని సమకాలికులైన ఫాదరీలు వ్రాశారు. రఘునాథుడు

| సోదరుజణ్ణే తొలగించి గద్దెకెక్కితీి అతని మూడో కొడుకు విజయరాఘవుడు క్రీశ 1630లో మరణించాడు. ఆయన రాజ్యకాలంలో తన ముగ్గురి కుమారులలో ఏ ఒక్కరికైనా యువరాజ్యు పట్టాఖిషేకం చేశాడో లేదో తెలియదు. అతని పెద్దదుమారులిద్దరూ 17. అంధ్ర సాహిత్య పరిషత్తు కార్యాలయంలో దీని ప్రతి ఉంది. పరిషత్సుస్తకభాండాగారం, ప్రథమభఖాగం, క్రమసంఖ్య ౪

విజయరాఘవ నాయకుడు 433 అతనితోబాటు యుద్దాలలో పాల్గొనేవారు. క్రీ.శ1617లో జరిగిన తోపూరు యుద్ధంలో రఘునాథుని రెండో కొడుకు రామభద్రుడు పాలొన్నాడు.!

రఘునాధనాయకుడు ముగ్గురు కొడుకులతో ఊరేగేవాడని విజయరాఘవుడే తన గ్రంథంలో ఒకచోట చెప్పాడు. తండ్రీ తరువాత పెద్దకొడుకు రాజవ్వాలి. లేదా రెండోవాడు గద్దెనెక్కాలి. కాని రఘునాథనాయకుని తరువాత మూడోవాడే పట్టాఖిషేకం చేసుకొన్నాడు. రఘునాథుడు క్రీ.శ.160లో పోయినా, 163 దాకా విజయరాఘవుడు సింహాసనంపై అధిష్టింపలేకపోయాడు. ఈ మూడేళ్ళూ అన్నదమ్ములు రాజ్యం కోసం యుద్దాలు చేశారు. రఘునాథుని మంత్రి గోవింద దీక్షితుల వారి పుత్రులు మంచి పలుకుబడి గల ఉద్యోగాలలో ఉన్నారు. ద్వితీయ పుత్రుడు వెంకటమఖికి ' ప్రతిష్థాపిత చోళక్ష్యాజూని' అనే విరుదు ఉంది. విజయరాఘవుడు క్రీ.శ1633లో శ్రీముఖనామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి బుధవారంనాడు పట్టం కట్టుకొన్నాడు. ఆనాడతడు షోడశ మహాదానాలు చేశాడు. అప్పటి కతని వయసు 15, 16 సంవత్సరాలని పరదేశస్థుల అంచనా. బహుశా పాత్‌కేళ్ళవాడు కావచ్చును. వెంకటమఖి వంటి మంత్రులు ఇతణ్జి ఎందుకు బలపర్చారో తెలియదు.

విజయరాఘవుడు చాలా శూరుడు. రోజుకు అయిదారామడలు అవలీలగా దాడిచేసి రాగలడు. స్వారి చేస్తున్నప్పుడొక గుజ్జం మీద నుంచి మరొక గుజ్ఞం మీదికి లంఘించగలడు. మావటీలకు లొంగని ఏనుగులను అదుపులో పెట్టకలడు. సానాకత్తి పట్టుకొంటే చాలు అవతలవాడు ఎంత బలవంతుడైనా సరే ఇట్టే ఆయువుపట్లని గాయపర్చకలడు. ఇలాంటి వీరయువకుని పక్షమే రాజోద్యోగులు వహించడంలో ఆశ్చర్యం లేదు. రాజ్యము కోసం అన్నదమ్ములు కలహించారని, సోదరులను విజయ రాఘవుడు చెరలో పెట్టించాడని చరిత్రకారులు భావిస్తున్నా తన తండ్రే తనతు పట్టాభిషేకం చేశాడని విజయరాఘవుడు వ్రాసుకొన్నాడు. అతడు రఘునాథనాయకాభ్యుదయం అనే ద్వాపద కావ్యం ఒకటీ వ్రాశాడు. దానినే కొన్నాళ్ళు పోయాక నాటకంగా మార్చాడు. ఆ నాటకం చివర విజయరాఘవుడిలా చెప్పాడు:

“నిజలీలావిలాస శృంగాటంబుగా నాటకంబు హవణీంచిన తన ముద్దుపట్టియగు విజయరాఘవ పట్టభద్రునకు పట్టంబు గట్టి ఇతడు గావించు వివిధోపదారంబులను హర్షించుచు...” రఘునాథుడు శుభోదర్కంగా ఉండేవాడట. ఇది విజయరాఘవుని కల్పన. ఈయన ఈ మాత్రం అబద్ధం ఆడీ “ఇదిగో పులి అనగానే దాని తోకను పట్టుకొని అతని అశ్రితులు కల్లలకారడివిలోకీ చల్లగా వేటకు వెళ్ళారు. రాజుగారికి పెద్ద కొడుకు ఉంటే ఉండుగాక, దైవాంశ సంభూతుడైన కడగొట్టువాడే అన్నలందరి కన్న మిన్న అని

  1. రఘునాథాభ్యుదయం, నాటకం, పుట 3 ర రాజచూడామణి దీక్షితులు తన గురువు వెంకటమఖి గురించి చెప్తూ, ఈ బిరుదును తన

తంత్రశిఖామణీలో పేర్కొన్నాడు. 3. రఘునాథనాయకాభ్యుదయం, ఆంగ్ల పీఠిక, పుట ౫. 4. రాజగోపాల విలాసం, 1-71.

634 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి స్ఫురింపచేయడానికి రంగాజమ్మ అనే ఆవిడ కొన్ని కట్టుకథలు తయారు చేసింది. ఆమె అతని భోగపత్ని. విజయరాఘవుని విలాసాన్ని ప్రబంధంగా వ్రాసింది. అతడు మన్నారు గుడిలోని రాజగోపాలస్వామి భక్తుడు. అందుచేత మన్నారుదాసుడనే పేరు పెట్టుకొన్నాడు. రంగాజమ్మ మన్నారుదాసవిలాసమనే ప్రబంధంలో విజయరాఘవుని అవతారం గురించి ఇలా చెప్పింది “రఘునాథనాయకయ్యగారికి చెంటీ లక్ష్మమ్మ కళావతమ్మ అనే భార్యలున్నారు. వారు పుత్రసంతానం కోసం రాజగోపాలుణ్జి పూజించి దానాలూ వ్రతాలూ చేశారు. రఘునాథుడొకనాడాభార్యలతోపాటు తీర్థమాడి పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, “సీకేం వరం కావాలో కోరుకో” అన్నాడు. విజయ మహిమలతో *“ఈ మహీమండలమంతా ఏలగలిగే కొడుకును మాకియ్యి” అని రఘునాథుడు ప్రార్థించాడు. '“మెచ్చుకున్నాను. నీకు మచ్చికతనయుణ్జయి అచ్చంగా నీ సాధ్విగర్పాన పుడతాను” అని వరమిచ్చిందికాక పుట్టని పాపకు దేవుడే ఇలా పేరు కూడా పెట్టుకొన్నాడు: ఠీవి విజయాడ్యు సుతుని వేడితిని కనుక లీలమెయి రాఘవునిగ గొల్చితివి గనుక విజయరాఘవ నామంబు వెలయ దాల్చి చెలగి వెయ్యేళ్ళు పుడమి రక్షింపుచుందు. (మన్నారు - ప్రబంధం, 1-51) ఈ అవతార గాథతో ఊరుకోకుండా రంగాజమ్మ మరో కల్పన చేసింది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కాళిందిని వివాహం చేసుకొన్నాడు. ఆమె సూర్చుని తూతురు. ఈ పెళ్ళి చూశాక చంద్రుడు కూడా తన కూతుర్ని కృష్ణునికి ఇవ్వాలనుకున్నాడు. అయితే కృష్ణుడు కొంచెం మొహమాటపడ్డాడు. చంద్రుడు కృష్ణునికి బావమరిది వరస, (లక్ష్మీదేవి అతని సోదరి కదా!) ద్వాపర యుగంలో మేనకోడలిని పెళ్ళి చేసుకోతూడ దన్నారు కాబోలు, కలియుగంలో పెళ్ళాడుతానన్నాడు. ఆ చంద్రుడు రాజచంద్రుడై తంజావూరులో పుట్టాడు. అతని కూతురి పేరు కాంతిమతి. ఆమెను విజయరాఘవుడు పెళ్ళొడడమే మన్నారుదాసవిలాస కథ భోగపత్ని రంగాజమ్మ ఈ అవతారకథ అద్బుత కల్పనలతో సృష్టిస్త, అమెకు తీసిపోతానా అన్నట్లు విజయరాఘవుని పట్టంపుకవి కామరసు వెంకటపతి సోమయాళీ మరొక అపూర్వ గాథను సృష్టించాడు. విజయరాఘవుడు ద్వాపరంలోని ఒక్క కృష్ణుడే కాదు. ఆయనే వాస్తవానికి విజయుడు. అర్జునుణ్ణి ఊర్వశి ప్రేమించడం జగద్దాదితం. ద్వాపరంలో ఆమెను పాపమని ఒద్దు పొమ్మన్నాడు. శాపానికి ఒడికట్టాడు. ఆ తరువాత చాలా బాధపడి కలియుగం దాకా ఆగాడు. ఆ ఊర్వశే తంజావూరులో లీలావతి అనే వేశ్యగా జన్మించిందని అర్జునుడు తెలుసుకొన్నాడు. ఆ పిల్ల కలలో ప్రత్యక్షమయ్యాడు. “నేను అర్జునుణ్ణి, నువ్వు ఊర్వశిని. ఇప్పుడు నేను విజయరాఘవుణ్ణయి తంజావూరు ఏలుతున్నాను. ద్వాపరంలోని నీ కోరిక తీర్చలేదు. కలియుగంలో నీ కోరిక తీరుతుందని ఇంద్రుడు నీకు వరమిచ్చాడు. నిన్ను పెళ్ళాడుతాను'' అని హామీ ఇచ్చాడు. ఈ లీలావతిని విజయరాఘవుడు పెళ్ళి చేసుకోవడమే ఒక నాటకంగా వ్రాసి విజయరాఘన చంద్రికావిహారమని కామరసుకవి పేరు పెట్టాడు.

విజయరాఘవ నాయకుడు 636 భోగపత్నులు, పట్టపు కవులు ఇలా బోలెడు పుక్కిటి పురాణాలు సృష్టించి తనకు అంటగట్టినా, విజయరాఘవుడు తను విజయుణ్జీగాను, కృష్ణుణ్ణిగాను అని చెప్పాడు. ఆయన సాక్షాత్తూ రాజగోపాలస్వామి వారి కుమారుడు, అంతే. అంతకన్న ఎక్కువ కాడు, తక్కువ కాడు. విజయరాఘవుని ఉద్దేశంలో రఘునాథనాయకుడే రాజగోపాలుని అవతారం. తన తల్లి అక్షరాలా అరుణాబ్దవల్లి. ఆమె చనుబాలు తొను గ్రోలాడు. ఒకసారి రాజగోపాలుడు అరుణాబ్బవల్లితో కలిసి విజయరాఘవుని కలలో కనబడి ఇలా అన్నాడట: ...-.. బాగుగా నిన్ను జేబట్టి మాపట్టి వని యెంచి మీతల్లి యరణాబ్దవల్లి - చనుబాలు గ్రోలించి చాల లాలించి తొలుదొల్త నీ మేని దురితంబులెల్ల - దొలగించి రాజ్యంబు ధ్రువముగానొసగి సొంపుగ నిను దయజూచు పురాణ - దంపతులము నీకు తల్లిదండ్రులము (రఘునాథ. ద్విపద. 1-92 నుండీ) దేవుడే స్వయంగా ప్రక్షాళనం చేయవలసినన్ని పాపాలు విజయరాఘవుని దేహంలో ఎందుకున్నాయన్న సందేహం ఇవాళ మనకు రావడం సహజమే. ఇతడు రఘునాథ నాయకునికి అధర్మయుక్తమైన వారసుడే అని చరిత్రకారుల ఊహ. అన్యాయంగా అధికారాన్ని హస్తగతం చేసుకొని ఈ కళంకాన్ని కప్పిపెట్టుకొనడానికే పుక్కిటి పురాణాలు సృష్టింపచేశాడు. హలకులిశ రేఖలున్న పాదాలు గోపాలునికి, విజయరాఘవ భూపాలునికీ తప్ప ఇంకెవరికీ లేవనే నమ్మకాన్ని ప్రజలలో నాటుకొనేటట్టు చేశాడు. తన ఆశ్రయంలో ఉన్న, కవులందరూ తాను శ్రీకృష్ణుని అవతారమని పని గట్టుకొని పాగడితే, ఆ మాటలు విని విని, శ్రీకృష్ణునిలాగ విచ్చలవిడి శృంగారాన్ని గుత్తపుచ్చుకొన్నాడు. కొలువుకూటంలో తాను చేసే కాముక చేష్టలను సగర్వంగా ఇలా చాటుకొన్నాడు. “నములుతున్న తాంబూలాన్ని ఒక పడుచుపిల్ల నోటికి ఇచ్చేవాడు. ఒక శృంగారవతి కీలుజడను లాగేవాడు. పాదాల దగ్గిర తూర్చున్న ఒక పిల్లదాని పోకముడిని బొటనవ్రేలితో సడలించేవాడు. ఇంకో పడుచు రొమ్ముపై గోటితో గిల్లేవాడు. మరో వెలయాలిని పెదవిపై ముద్దుపెట్టుకొనేవాడు. ఒక వన్నాలాడి వష్షోజూలపై కస్తూరి పులిమేవాడు. మరో పిల్లని గట్టిగా కౌగలించేవాడు. ఇంకో విలాసవతిని తొడపై తూర్చోపెట్టుకొనేవాడు'* తన ఘనతను విజయరాఘవుడు ఇలా చాటుకొంటే, రంగాజమ్మ అతని వైభవాన్ని మరికొంత వర్ణించింది. అతని కొలువుకూటం పేరు రాజగోపాలవిలాసం. అందులో అతడు సభతీరే తీరు ఆమె చెప్పింది. ఒక పడతి అడపం, మరో మంజువాణీ కాళంటి, ఒక పువ్వుబోడి పావడ, ఒక బీత్తరి బెత్తం, ఒక వాలుగంటి వాలు, ఒక అండజయాన గిండీ పట్టుకొని దగ్గరలో నిలబడేవారు. నాజమ్మ, చంపకవల్లి అనే ఇద్దరు భోగపత్నుల మధ్య ఒరసుకొని విజయరాఘవుడు తూర్చునేవాడు. ఈ ఘనకార్యాన్ని అతని కొడుకులు, మనవలు, కూతుళ్ళు వీక్షించేవారు. కస్తూరి. అంబుజవల్లి, శశిరేఖ, మోహనమూర్తి, కృష్ణాజీ, అలిమేలు, సీత మదనరేఖ మొదలైనవాళ్ళు వసంతకేళి వినిపించేవారు. 5 ౫౫౫ ౦ 7జ్యుంణ 6 ౪ గయతిం080, 5127 6. విప్రనారాయణ చరిత్ర, పుట 15. తన తండ్రి కూడా అచ్చంగా ఇలాగే చలున చప్పరంలో నరసమాడేవాడని రఘునాథాభ్యుదయంలో విజయరాఘవుడు చెప్పాడు. (3.559 నుండి) శృంగార నాయక శేఖరుడగుచు... జిగిమించు తొడలపై వేర్చునొక్కతెను...

636 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుళీ

రాజగోపాలవిలాసం అనే కొలువుకూటంలో విజయరాఘవుని వైభవాన్ని రంగాజమ్మ ఇలా వర్జిస్తే, చెంగల్ప కాళయ్య రాజగోపాలవిలాసం అనే కావ్యంలో అతని నాట్యసభను మరింత వర్ణించాడు. విజయరాఘవవిలాసమనే మందిరంలో ఒకర్తె వీజ వాయించేది. ఇంకొకతె కీన్నార పలికించేది. ముఖవీణ ఒకరు వాయిస్తే. మరొకర్తె పిల్లన గ్రోవి ఊదేది. ఒకతి తంబుర మీటేది, మరొక చిన్నది స్వరమండలం మీటేది కొందర రావణహస్తం ఉడుకు మొదలైనవి వాయించేవాళ్ళు. విజయరాఘవుని నాట్యసభలో ఆడవాళ్ళ వాద్యబ్బందమే ఉండేది. ఈ సంగీతానికి అనువుగా కొందరు వీరుదుపాత్రలు రకరకాల నాటు విశేషాలను అఖినయం చేసేవారు. ఎవరెవరు ఎందులో ప్రవీణులో కాళకవి చెప్పాడు.”

చౌపదాలు - రూపవతి కొరవంజి - కోమలవల్లి

శబ్దచూడామణీ - చంపకవల్లో నవపదాలు - లోకనాయకి

బిక్కిణీ _ మూర్తి దేశి = శపిరేఖ

దరుపదాలు - రత్నగిరి పేఠరణీ = భాగీరథి

ఇంకా మరికొందరు మదన పదాలు, నవరత్నమాలికలు వినిపించేవారు. విజయరాఘవుడీవిధంగా కొలువు తీరేటప్పుడు అతని “సాహిత్యరాయ పెండేరం' ఉండేది దీనిమీద చెంగల్వ కాళయ్య పంచరత్నాలు చెప్పాడు. పాదానికిటువంటి పెండేరం ఉంటే పక్కన శారదా ధ్వజం ఉండేది. దీనిమీద కాళకని పద్యాలు చెప్పాడు:

ఒక్కొక్కయెడ జీనిచక్కెర పానకం బానిన ట్లాహ్లాద మావహిల్ల

నొక్కొక్కయెడ దాని నెక్కొన విరజాది సరము లెత్తినరీతి పరిమళింప

నొక్కొకయెడ జల్వ లుప్పతిల్లగ మంద మారుతంబులు వీచుమహిమచెలగ

నొక్కొక యెడ మేను జొక్కు సంపాదించు వెలదివెన్నైల తేట విధము మించ

తవిత రచియింప విజయరాఘవ విభుండె

నేర్చు నని వాణి వర్ణించు నేర్పు మీర

జామరానిల కందళ చలిత మగుచు

దనరు సభయందు నల శారదాధ్వజంబు. (రాజగోపాల విలాసం, 1-18)

మధురకవితలు తను చెప్తూ, ఇతరులు చెప్పినవి వింటూ విజయరాఘవుడు ఎప్పుడూ ఆడవాళ్ళతోనే గడిపేవాడని భావించవచ్చును. ప్రజల గురించి అతడేమీ పట్టించుకొనేవాడు కాదు. ప్రజలు కూడా అతణ్జీ పట్టించుకోలేదు. 700 మంది భార్యలతో, 3500 మంది ఉఊంపుడుకత్తెలతో పొద్దస్తమానం గడిపే రాజును ఏ పౌరుడు మెచ్చుకోగలడు?]* పైగా 8. చంద్రరేఖ శబ్దచింతామణిని వినిపించేదని మల్లంపల్లి వారిచ్చిన పాఠంవల్ల తెలుస్తోంది రి న పీకికు స ఎత్తుగితిలో చివర 'జౌర రాయ | పండేరనునరు' అనే మకుటం చంద సీసపద్యాలు సాహిత్య 10. విజయరాఘవుని భార్యల సంఖ్య గురించి కాలః గి 6 “జుం అనే గ్రంథంలో

డా॥ కె.ఆర్‌. సుబ్రహ్మణ్యంగారు ఉదాహరించారు. పుట 9, 10.

విజయరాఘవ నాయకుడు 637 కప్పాలుగా అర్చించడానికి ప్రజలను పీడించి, హింసించి ద్రవ్యాన్ని పోగుచేసివాడు. పరసేనలు దండెత్తి వస్తున్నాయని తెలియగానే విజయరాఘవుడు తక్షణం రాజధానిని వదలిపెట్టి ఏ వల్లంకోటలోనో తల దాచుకొనేవాడు. అక్కడకు కూడా వాళ్ళు వెంటాడివస్తే - ఒకడే పాదాగక్రాంతుడై వాళ్ళడిగినంత డబ్బిచ్చేవాడు. లేదా గండం గడిచేదాకా అడవులలోనక్కి ఉండేవాడు. యౌవనంలో ఎంతటి వీరుడైనా, సుఖం మరిగి విజయరాఘవుడు కత్తి పట్టడం మానేశాడు. పూర్వం కురులుకూడనినాడే పడమటిదొరను, అంటే మధురనాయకరాజును అతడు జయించినట్టు తెలుస్తూంది. సవరం వెంకటపతిని పారదోలి ఒక్క గడియలో పందనల్తూరును పట్టుకొన్నాడట.1! ఈ విజయాలు తప్ప విజయరాఘవుడు సాధించినవింకేం లేవు.

క్రీశు 1642లో కర్టాటక రాజ్యం పాలించే మూడవ వెంకటపతిరాయలు మరణించాడు. తరువాత అతని తమ్ముని కొడుకు మూడవ శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చాడు. కేంద్రంలో ప్రభువులు మారగానే సామంతులు స్వ్పతంత్రించాలనుకోవడం సహజం. రాయలకీంత అణకువగా మనం ఉండవలసిన అవసరం లేదని మధుర, చెంజి నాయకులు భావించారు. తమతోపాటు తంజావూరు కలిస్తి బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు. విజయరాఘవుడీ ప్రయత్నాన్ని హర్షించి వారితోటే చేరాడు. దక్షిణాదిన ఉండే ముగ్గురు సామంతులూ ఎదురుతిరిగారని తెలియగానే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలని శ్రీరంగరాయలు సేనతో కదలివచ్చాడు. ముందు చెంజిని ముట్టడించాడు. రాయలు రాణువతో రాగానే విజయరాఘవుడు మిత్రద్రోహం చేశాడు. మధుర, చెంజీ నాయకులను వారి కర్మానికి విడిచిపెట్టి రాయలతో చెయ్యి కలిపాడు. శ్రీరంగరాయల దాడీని తట్టుకోలేక మధురనాయకుడు ఒక రాజకీయపుటెత్తు ప్రయోగించాడు. మిత్రుడనుకున్న విజయరాఘవుడు శత్రువు అయ్యాడు కనుక శత్రువులనుకొన్న గోల్కొండ సుల్తానులతో సఖ్యం చేసుకోవాలనుకొన్నాడు. రాయలు చెంజిని ముట్టడిస్తూండగా సామ్రాజ్యపు రాజధాని అయిన వెల్లూరిపై దండయాత్ర చేయమని గోల్కొండవారిని మధుర నాయకుడు ప్రార్థించాడు. వాళ్ళు సరే అని, సర్వసైన్యాలతో కదిలారు. రాయలు తన రాజధానిని కాపాడుకొనడానికి చెంజి ముట్టడిని ఆపీ సేనలతో వెళ్ళిపోయాడు.

మధురనాయకరాజు ఇచ్చిన అఆహ్వానంతో గోల్కొండ సైన్యాలు వెల్లూరును ముట్టడించాయి గాని అక్కడితో ఆగలేదు. మొదట కొద్దిగా పరాజయాలు పొందినా ఆ తరువాత ఇంకా దక్షిణాదికీ తూడా దాడివచ్చాయి. గోల్కొండ పైన్యాలే కాక వీజపూరు సేనలు కూడా అడపా తడపా వస్తూనే ఉన్నాయి. 'తల్లి చెవులు తెంపినవాడీకి పినతల్లి చెవులు వీరపువ్వులు' అని వెల్లూరు రాయలను అడవులు పట్టించిన మహమ్మదీయులకు ఇతర నాయకరాజుల మీద అపేక్ష వుంటుందా? క్రీ.శ. 1646లో చెంజిని పట్టుకొన్నారు. తరువాత తంజావూరుపై దాడిచేశారు. విజయరాఘవుడు లంచమిచ్చి సంధి చేసుకొన్నాడు. 11. రఘునాథనాయకాభు్షుదయం, 1-22.

636 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మధుర ముందుగానే మహమ్మదీయులతో రాజీ చేసుకుంది. క్రీ.శ 18653 దాకా దక్షిణ దేశంలో పరసేనలు మగ్గంలో కండెలాగా తిరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత ఒక్క అరేళ్ళపాటు తంజావూరు కాస్త ఊపిరి తీసుకోకల్లింది.

క్రీశ. 1659లో మధుర తిరుమలనాయకుడు మరణించాడు. అతని కుమారుడు రెండవ ముత్తువీరప్పు నాయకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు లోగడ విజయరాఘవుడ్రు మధురకు చేసిన ద్రోహానికి ప్రతీకారం చేయదలిచాడు. తన కోటలన్నీ బలపరచసాగాడు. వీజపూరుకు ఇవ్వవలసిన కప్పం మానేశాడు. విజయరాఘవుడు ఇదే అదను అని వీజపూరు సుల్తానుకు విన్నపం పంపించాడు. "దయచేసి మధురపై దండయాత్ర చేయండి* అని ప్రార్థించాడు. వీజపూరు నుండి షాహజీ, ముల్లాలు సేనలతో వెల్లూరు, మధురనేకాక తంజావూరును తూడా ముట్టడించారు. విజయరాఘవుడు ప్రతిఘటించడానికే మాత్రం ప్రయత్నించలేదు. ఈ పిరికితనానికి తంజావూరు కొలువులో ఉన్న రాచవాడ సిగ్గుపడ్డారు. యుద్ధం చేసి వీరమరణం పొందడం ఉచితమని వారు చెప్పినా విజయ రాఘవుడు తన స్త్రీ జనంతో వల్లంకోటకు పారిపోయాడు. ముందుగానే ధనమంకా అక్కడికి తరలించాడు. రాచవారు కత్తులుదూసి వీజపూరు సైన్యాల నెదుర్కొని మరణించారు.

అడ్డగించేవారు లేక తంజావూరులో పరనైన్యాలు అడుగుపెట్టి యథేచ్చగా కొల్లగొట్టారు. మన్నారుగుడి దోచుకొని వల్లంకోటకు బయలుదేరారు. పరసేనలు వస్తున్నాయని భయపడి విజయరాఘవుడు ఆత్మీయులను వారి కర్మానికి వదలి అరణ్యానికి పారిపోయాడు. రాజు పారిపోతీ బంట్లు ఉంటారా? వాళ్ళు కూడా కోటలో ఉన్న బంగారాన్ని నవరత్నాలను మొయ్యగలిగినంత పట్టుకొని పారిపోయారు. మహమ్మదీయ సైన్యాలు రావడానికి ముందు వల్లంకోటలో బందిపోటు దొంగలు జొరపడ్డారు. తోశాగారంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టి పట్టుకుపోయారు. అక్కడ ఉన్న సొమ్మ లెక్కించడానికి సాధ్యపడక కుంచాలతో కొలచేవారు. మహమ్మదీయ సేనలు వచ్చేసరికీ కోటలో పూచికపుల్ల కూడా లేదు. ధనాగారం తలుపులు తెరవడానికి ముందు కారాగారు తలుపులు తెరచారు దొంగలు. ఖైదీలంతా బయటపడ్డారు. వాళ్ళలో విజయరాఘవుని సోదరులున్నారు. ఎప్పుడో పోయినవారి కళ్ళకు కొద్దిణ* ఆకారేఖలు కనబడి ఉంటాయి.

వల్లంకోటను ఆక్రమించుకొని మహమ్మదీయ సైన్యాలు మధురపైకి వెళ్ళాయి. వెళ్ళిపోయాక విజయరాఘవుడు తగుదునమ్మూ అని మళ్ళీ తంజావూరు చేరుకొన్నాడు. బొక్కసంలో చిల్లిగవ్వ కూడా లేని అనామక రాజుని చూసి బందిపోటు దొంగలకు జాలి కల్గింది. తాము దోచుకొన్న సంపదలో కొంత వాపసు చేశారు. ఈ దొంగల సహాయంతో ప్రజలను అదుపులో పెట్టి విజయరాఘవుడు మళ్ళీ సింహాసనం ఎక్కాడు. అయితే మళ్ళీ కష్టాలు మొదలు అయ్యాయి. మధుర రెండవ ముత్తువీరప్ప ఆరునెలలు మాత్రమే రాజ్యుం చేసీ మరణించాడు. అతని పెద్ద కొడుకు చొక్కనాథుడు పట్టాఖిషేకం చేసుకున్నాడు పరిస్థితులను చక్కపరిచాడు. క్రీశ 1660-61లో తంజావూరిపై దాడి వెడలి విజయ

విజయరాఘవ నాయకుడు ౮౦9 రాఘవుని ఓడించి పాదాక్రాంతుని చేసుకొన్నాడు. దానితో కొన్నాళ్ళు శాంతి ఏర్పడింది. అయితే అది శృశానంలోని శాంతిలాంటిది. విడుపులేని యుద్ధాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. వచ్చే సేనలూ పోయే సేనలూ ప్రజలను కొల్లగొట్టాయి. దేశంలో కాటకం ఏర్పడింది. రమారమి నూరేళ్ళ కిందట రక్కసి తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం దోపిడీ పాలైతే ఎన్నో కుటుంబాలు తంజావూరుకు వలస వచ్చాయి. ఇప్పుడు దురదృష్టవశాత్తూ తంజావూరును విడిచిపెట్టి ప్రజలు మధుర, శాంతోమ్‌ మొదలైన చోట్లకు పోవలసి వచ్చింది. తూటికి గతిలేని ఈ పేద ప్రజలను ఆదరించి అన్నం పెడుతున్నట్టు నటించి డచ్చివారు పరమ ఘోరాలు చేశారు. ఎందరినో నమ్మించి పడవ లెక్కించి విదేశాలకు బానిసలుగా అమ్మేశారు. “సిగ్గుపడాలి, శాశ్చతంగా డచ్చివారు సిగ్గుపడాలి. ఇండియనుల కష్టాలను "తమ వ్యాపారానికి ఘోరంగా వినియోగించుకొన్నందుకు తలవంచుకోవాలి” అని జెసూట్‌ ఫాదరీలు వ్రాశారు.12

నిజానికి డచ్చివారి కంటే ఎక్కువగా సిగ్గపడవలసింది విజయరాఘవుడు. తన ప్రజ కూటికి లేక అష్టకష్టాలు పడీ అమ్ముడుపోతూ ఉంటే, శృంగార పదాలు చెప్పుకుంటూ ఆనందించే ఈ నాయకరాజును ఏమనాలో తెలియదు. ఇతడు నిజానికి నీరో చత్రవర్తిలాటివాడు. రోము నగరం తగలబడుతూంటే ఆ చక్రవర్తి ఆనందగీతాలు పాడాడు. శత్రువులు కోటను ముట్టడిస్తూ ఉంటే విజయరాఘవుడు పూజలో ఉండి మంత్రాలు చదువుకుంటూ ఉండేవాడు. క్రీ.శ. 1673లో మధుర చొక్కనాథుడు చివరిసారి తంజావూరుపై సేనలు పంపించాడు. అతడు రాజ్యానికి రాగానే ఒకసారి 1660-61లో తంజావూరును దండించాడు. దానితో సఖ్యంగా ఉంటానని మాట ఇచ్చిన వివయరాఘవుడు తప్పాడు. ఉండీ ఉడిగీ రెండు రాజ్యాలకూ యుద్దాలు జోరుగానే వచ్చాయి. విజయరాఘవుడు కూడా కొన్ని కోటలు బలపరచుకోసాగాడు. చొక్కనాథుడు ఆఖరున క్రీ.శ1673లో తన దళవాయి వెంకటకృష్ణపష్పనాయుణ్డీ. పేష్కారు చిన్నతంబి

మధుర సేనలు ఫిరంగులు వెట్టి కొట్టగానే కోట తలుపులు పడిపోయాయి. ఇడిసిపడిన తోవల వెంట, వాకిళ్ళ వెంట శత్రువులు హల్లా చేసి కోటలో చొచ్చుకున్నారు. “ఈ సంగతులు నడిచే తరుణమందు అచ్యుతవిజయరాఘవనాయనివారు నామతీర్థం కొలువులో వుండి తదేకధ్యానంతో జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడు వారి ఇలాకా మనుషులు - ఓ మహారాజా! పగతులు మన కోట హల్లా చేసి లోజొచ్చినారు అని విన్నవించారు. అతడు మహా నారాయణభక్తి కలవాడు కనుక ఆ పూజ విడిచి లేవక, రానీ చూచుకొందామని సన్న చేసినారు” అని తంజావూరు కైఫీయతు చెప్తోంది.33

దైవభక్తి వాంఛనీయమేగాని ఇంతటి విడ్త్డూరపు ఆచారం భక్తి అనిపించుకోదు. అది ఉన్మాదం. విజయరాఘవుడు వీరవైష్టవుడు. అతడు చతుర్వేది శతగ్రతు శ్రీనివాస 13. తంజావూరి యాంధ్ర రాజుల చరిత్ర, వేటూరి ప్రభాకరళాస్త్రి సంపాదకత్వం, పుట ౫.

640 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తాతాచార్యుల వారి శిష్కుడు.*ే అతనికి గురువుగారు ఎంత చెపిజే అంత! ఆయన ప్రేరణవల్ల విజయరాఘవుడు పరమతాలను ఎంతమాత్రం అదరించలేదు. దీనిని పెద్ద ఘనకార్యంగా రంగాజమ్మ పొగిడింది. 'పరమతంబుల నెల్ల నిరసించి యేమేటి వైషు మతమ శాశ్వతము జేసె అని మెచ్చుకొంది (ఉషా. 1-5). కోనేటి దీక్షితులు, పురుషోత్తమ దీక్షితులు మొదలైన కవులు శ్రీనివాసతాతాచార్యుల శిష్యులవడం వల్లనే బహుశా విజయరాఘవుని మెప్పుపాంది ఉంటారు. రాజ్యంలో వైష్టవుడు నేరం చేస్తే వాడిమీద చర్య తీసుకొనడానికి అధికారులు జంకేవాళ్ళు.15 రఘునాథనాయకుడూ, అతని తండ్రి అచ్యుతప్పా వైష్ణవులేగాని ఇతర మతాలను ఈసడించలేదు. అద్వైతులు పరమశివావతారంగా చూసే అప్పయ్య దీక్షితులవారిని అచ్భుతప్పు సత్కరించాడు. రఘునాథుడు సురేంద్ర సుధీంద్రులనే ఇద్దరు మధ్వ గురువులను గౌరవించాడు. వీరిలో సుధీంధ్రులకు కనకాఖిషేకం కూడా చేశాడు. స్మార్తుడైన గోవింద దీక్షితులవారిని రఘునాథుడు మంత్రిగా పూజించి అర్భాసనం ఇచ్చాడు. తాతతండ్రులలాగా అన్ని మతాలను సమంగా చూడక విజయరాఘవుడు ప్రజలకు దూరం అయాడు.

మతం గురించి ఇంత పిచ్చి పట్టుదల ఉన్నందుకు విజయరాఘవుణ్ణి చూసి విచారించినా, కుటుంబగౌరవం అంటే వెరి పౌరుషం ఉన్నందుకు అతణ్జీ అర్థం చేసుకొని మెచ్చుకోవాలి. తంజావూరు వారి అఆడపడుచును ఇచ్చి పెళ్ళిచెయ్యమని మధుర చొక్కనాథుడు క్రీ.శ. 1673లో వర్పమానం చేశాడు. ససేమిరా మీకు మా పిల్లని ఇవ్వమని విజయరాఘవుడు చెప్పాడు. పెళ్ళి మాటలకోసం వచ్చిన వాళ్ళను వెళ్ళగొట్టాడు. ఇది సాకుగా మధుర సైన్యాలు తంజావూరిపై దండెత్తాయి. శత్రువులు కోటను ముట్టడిస్తూ ఉంటే విజయరాఘవుడు పూజలో కూర్చున్నాడు. కోటలోనికి ప్రవేశిస్తూ మధుర దళవాయి ఇప్పటికైనా రాజీ చేసుకోమన్నాడు. విజయరాఘవుడు వినలేదు. అంతకుముందు ఎప్పుడో ఏదో కోపం వచ్చి ఖైదు చేసిన తన కొడుకు మన్నారుదేవుణ్ణి విడుదల చేసి అతనితోపాటు యుద్దానికి వెళ్ళాడు. ఎంత విపరీతంగా ప్రవర్తించినా విజయరాఘవునిలో మానవత్వం ఉంది. కదనానికి పోతున్నప్పుడు జరిగిన ఒక విశేషాన్ని కైఫీయతు వ్రాసింది కొడుకును చూసి విజయరాఘవుడిలా అన్నాడట: “నీవైతే నాకు ముందుగా నడుస్తున్నావు. మనకిద్దరికిన్ని మరణం సిద్ధంగా ఉన్నది. అయినా నా కళ్ళ ముందర నీవు ఎదుటివారిచేత తగులుపడ్డా, మరణమైనా మహత్తరమైన పుత్రశోకం కదా కళ్ళలోజలు వచ్చును. ఈ యుద్ధరంగాన అలా అయితే పరలోక హాని గనుక నాకు వెనుక నిలచి నా పని అయిన పిమ్మట నీకు సరిపోయినట్టు చూసుకో” అని వెనుకకు చెయ్యి పట్టి యీడవగా ఆ తుమారుడు మీరు రాజులు, నేను బంటును అని ముందునకు దూకాడు.” 14. ఈ తాతాదార్యులగారితోనే తెనాలి రామలింగని కలిపి కట్టుళథలు కల్పించి ఆనాటివారు ప్రచారు

చేశారని ప్రతీతి.

  1. విజయరాఘవుని విప్రనారాయణచరిత్ర, పుట 56
  2. తంజావూరు అంధ్రనాయకచరిత్ర - కురుగంటి సీతారామయ్యగారు, పుటు 254.
  3. తంజావూరు ఆంధ్రరాజులచరిత్ర, పుట 2.

విజయరాఘవ నాయకుడు 641 ఆ యుద్ధంలో తండ్రీ కొడుకులిద్దరూ మరణించారు. రాణివాసపు స్త్రీలంతా అంతకు ముందే మందుకుండలు చుట్టూ పెట్టుకొని దగ్ధమయ్యారు. దీనితో తంజావూరులో నాయకరాజుల పాలన అంతమైంది. వీరునిగా రాజ్యానికి వచ్చిన విజయరాఘవుడు వీరునిగానే మరణించాడు. మధ్యలో ఎన్ని అక్రమాలు చేసినా ఈ వీరమరణాన్ని పొందినందుకు విజయరాఘవుణ్ణీ అందరూ మెచ్చుకుంటారు. పరిపాలన ఎలా ఉన్నా సాహిత్య సేవ చేసినందుకతణ్ధి సాహితీపరులు క్షమిస్తున్నారు. ఎందరో కవులు, కవయిత్రులకు ఆశ్రయం ఇచ్చి “వారితో సంగీత సాహిత్య నాట్యవిద్యావినోదముల నానందించుచు వచ్చిన విజయరాఘవ భూవరుడు ఇతర విషయముల నెట్టివాడైన నీ విషయమున ప్రస్తుతి పాత్రుడు కదా!” అని మల్లంపల్లి సోమశేఖరశర్మగారు అన్నారు. నిజమే. విజయరాఘవుడు చేసినంత సంగిత సాహిత్య సేవ ఇంకొకరు చేసినట్టు శనబడదు. అతని హయాంలో ఇతర రచయితలు వ్రాసిన గ్రంథాలకన్నా అతను స్వయంగా వాసినవి చాలా ఎక్కువ. అతని రచనలు ప్రస్తుతం ఏడు దొరుకుతున్నాయి. అందులో ఆరు నాటకాలు, ఒకటి ద్విపద కావ్యం. ఇవన్నీ అచ్చుపడ్డాయి.

  1. కాళియమర్దనం, 2. కృష్ణవిలాసం, 3. విప్రనారాయణ, 4. రఘునాథాభ్యుదయం,
  2. పూతనహరణం;: 6. ప్రహ్హాదచరిత్ర నాటకాలు, 7. రఘునాథనాయకాభ్యుదయం, ద్విపద. వీటిలో కడపటి నాటకంలో విజయరాఘవుడు తాను అంతకు ముందు వ్రాసిన గ్రంథాల పేర్కొంటూ తన ప్రత్యేక ప్రజ్ఞను విశదం చేశాడు. ఈ సీసమాలిక వల్ల అతడు 40 గ్రంథాలు బ్రాసినట్టు తెలుస్తూంది. ఇవి కాక మరో పదిహేడు రకాల మధుర కవితలు చెప్పాడు. వాటి పట్టికను చూడండీ. విజయరాఘవ వాయకుని రచనలు వరుస రచనపేరు.......... ట్రశ్రియాభీదం స్రజ్ర
  3. రాజగోపాల విలాసం నాటకం సుకవివంద్యుడు 2, చెంగమవల్లీ పరిణయం నాటకం ప్రతిభానిదానుడు
  4. గోవర్థనోద్ధరణము నాటకం కల్పనాధురీణుడు
  5. రతీమన్మథ విలాసం నాటకం ప్రాబంధిక పట్టభద్రుడు 5... రాసక్రీడ నాటకం
  6. నవనీతిచోరం నాటకం * మహానుభావుడు
  7. పారిజాతాపహరణం నాటకం చృదువచనధుర్యుడు
  8. రుక్మిణీ కల్యాణం నాటకం బుధసార్వభొాముడు
  9. రాధామాధవ వివాదం నాటకం
  10. రఘునాథనాయకాభ్యుదయం, తెలుగు పీఠిక, పుటు ఈ.

642 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వరుస రచనపేరు _ట్రక్రీయాభీదం 6కి 10. ధనాఖిరామం నాటకం సర్వజ్ఞతిలకుడు 11. సత్యభామా వివాహం నాటకం పాండీత్య కవిరాజరాజు 12. ఉషా పరిణయం నాటకం శారదావకారం 13. దక్షిణద్వారకాస్థల వర్ణన ఖ ప్రసిద్ధ చరితుడు 14. కాళీయమర్దనం నాటకం 15. రఘునాథనాయకాభ్యుదయం _ ద్విపద ధీరవర్యుడు 16. రఘునాథాభ్యుదయం నాటకం 17. మోహినీ విలాసం ద్విపద 18. మోహినీ విలాసం నాటకం నలసమానుడు 19. ప్రహ్హాద చరిత్రం నాటకం మనీషాధురీణుడు 20. పూతనాహరణం నాటకం శృంగార లోలుడు 21. మంజరీ ద్విపద ప్రబంధం " 22. మంజరీ ద్విపద నాటకం గానచతురుడు 23. విప్రనారాయణ నాటకం ధీనిధానుడు 24. సముద్రమథనం నాటకం భువనమోహనచరిత్రుడు 25. కృష్ణవిలాసం నాటకం అష్టభాషాధురీణుడు 28. పాదుకా సహస్రం ద్విపద 27. ప్రణయ కలహం ద్విపద చమత్కృతిధురీణుడు 28. కంసవిజయం ద్విపద అతులిత ఫ్రొఢుడు 29. జానకీ కల్యాణం నాటకం వావదూకా గ్రగణ్యుడు 30. పుణ్యక వ్రతం నాటకం వాగ్విశేషశేషుడు 31. గోపికాగీతాలు అనువాదం అద్యతనభోజుడు 32. భ్రమరగీతాలు అనువాదం అద్యతనభోజుడు 3. ఫాల్గ్లుణోత్సవం రగడ చౌపదాలు భవ్యచరితుడు 34. రాజగోపాలదండకం దండకం విద్వత్కవీంద్రుడు 35. వీరశృంగారసాంగత్యం సాంగత్యం రసికుల మేలుబంతి 36. మన్నారుసాంగత్యం సాంగత్యం నెరజాణరాయుడు 37. మదనబలదూత్యం నాట్యుకృతి 38. శారదాసామ్రాజ్యం నాట్యకృతి నవరసజ్ఞుడు 39. సవతిమత్సరం నాట్యుకృతి నవరసజ్ఞాడు 40. నాట్యకదంబం నాట్యకృతి నవరసజ్ఞుడు 41. వేడికోలు విన్నపాలు వచనాలు 42. దరువులు గేయాలు

విజయరాఘవ నాయకుడు 643 వరుస _ రచన పేరు ప్రక్రీయాభిదం ప్రజ్ఞ 44. _ఆధ్యాత్మసంకీర్తనలు పాటలు 458. వాల్విజీ విడిపదాలు 48. గుజ్జరి విడిపదాలు 47, విల్వేడు విడిపదాలు 48. దండలాస్యకం విడిపదాలు 49. కందుక క్రీడ విడిపదాలు 50. అల్లిక విడిపదాలు 51. కొరవంజి విడీపదాలు 52. శుభలీల విడిపదాలు 53. గుజరాతి (కోపు) విడిపదాలు 54. దేశి విడిపదాలు 55. చౌపదము విడిపదాలు 56. జిక్కిణీ విడిపదాలు 57. దురుపదం విడిపదాలు పూతనాహరణం : దీనిని విజయరాఘవుడు క్రీశ 1651లో వచ్చిన ఖరనామ సంవత్సరంలో వ్రాశాడని ఆంతరంగిక సాక్ష్యంవల్ల చెప్పవచ్చు. ఇది శృంగార నాటకం అన్నాడు. బాలగోపాలుణ్ణీ యశోద, గోపికలు ఆడించి జోలలు పాడుతారు. బాలింతరూపం పూని పూతన అక్కడకు వస్తుంది. “అది రాజుల యిండ్ల అనిశంబు నేను - దాదినై వర్తింతు ధవళాయకాక్షి” అని పరిచయం చేసుకొంటుంది. “ఎలమి నేబెంచిన నీ కుమూరుండు పాలతి చుక్కలు మొలపూసగా పెరుగు” అని చెప్పింది. “పాలిస్తానంది. “'పెనగకు పిలువని పేరంటమునకు”' అని యళోద -చెప్తూన్నా వినక పాలిచ్చింది. బాలగోపాలుడు దాని ప్రాణమారుతాలు లాగేశాడు. అప్పుడు పూతన ఇలా వివరించింది. విడువిడు నాచన్ను విడువిడురా యోరి బడలితిరా చాల బాల గోపాల! అమ్మక్క చెల్ల ఇది యేమిరా నీవు రొమ్మెక్కి తే తలకు దిమ్మెక్కె గదరా! చిన్నవాడని యుంటీి జెల్లబో నీవునా చన్నంటితే యుసురు మిన్నంటే గదరా! ఇలా విలపించి పూతన ప్రాణాలు విడిచింది. గోపికలు హాహాకారాలు చేశారు. నందుడు వచ్చాడు. పూతన కళేబరాన్ని పరికించడానికి గొల్లలను పిలిచాడు. వాళ్ళు “గొల్లలారో' అని పాట పాడుకుంటూ పాత్రోచిత భాషలో సంభాషించుకుంటారు. జోక్సు సామిదారం కడనే కాచుకు ఉంటిరా!'” అంటాడు వాడు. ద్వారం అనడానికి బదులువాడు దారం అన్నాడు కనుక ““నువ్వు దారం కాచుక ఉంటే నేను సూది యెతుకులాడుతూ

644 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఉంటిన్రా'” అంటాడు రెండోవాడు. వాళ్ళు ఊళటెట్టి రెండు పదాలు గొణుగుతారు. శివాలు ఆడుతారు. ఆ తరువాత స్వస్తి వాచనం చేయడానికి పురోహితులను పిలిపిస్తారు. రంగావధాన్లు, సింగావధాన్లు అనే ఇద్దరు వస్తారు. ఇలా మాట్లాడుకొంటారు. సింగా : ఓయి రంగావధాన్లు! రంగా : ఏమయ్యా సింగావధానులు? సింగా : నేడు నందుడుగారు మనలను పిలువనంపిన ప్రయోజనమేదో? ఏమైనా పెండ్లి పేరంటాలు సాగేనో? సింగా : కొన్ని తప్పుమంత్రాలు చెప్పి దబ్బర హోమాలు చేసి నాలుగు పాడియావులు గ్రహించుకోవచ్చునే. రంగా : అషంచున్నాడవో? నీ మార్గమల్లా నే బయలు చేస్తేనో? సింగా : అషంధురా వెళ్డీ నే నీకు సగం పంచి యిచ్చేగాని యూరకుండరా. రంగా : అప్పా, నాకు సగం చాలదు. మూడు పాళ్ళు ఇచ్చేవు నే వూరకుండేగాని. సింగా : అదేంషిరా అయిదు తరాలకు పురోహితుండను, నేనషుండగా నీకు మూడుపాళ్ల అనా నేంషిరా? రంగా : ఓరీ వజశుంఠా! నీతు ఒక పాలు చాలదషరా? (యక్షగానములు, సంపుటి 1, పుటలు 76-77) తంజావూరు నాటకాలలో పురోహితులు, కవులు, పండితులు ఒకరి నొకరు వజ్రశుంఠ అని తిట్టుకోవడం పరిపాటి. ఈ పురోహితుల జగడాన్ని ఆపి వాళ్ళచేత స్పాస్తి వాచనం చేయిస్తారు. వాళ్ళు సంకల్పం చేస్తూ అది ఖరనామ సంవత్సరమని చెప్తారు. ఇది క్రీశు 1651లో వచ్చింది. ఈ నాటకంలో పాత్రోచిత భాష అనాటి పాటలు పదాలు ఆలుస్తున్నాయి. విప్రనారాయణ చరిత్ర; విజయరాఘవుడు ఈ నాటకాన్ని వ్రాయడానికి ముందు తెలుగు సాహిత్యంలో చాలామంది విప్రనారాయణుని కథను ద్విపద రూపంలోనూ, ప్రబంధంగానూ చెప్పారు. వాళ్ళు చెప్పిన కథను విజయరాఘవుడు మార్చేశాడు. తన విరోధులైన పాండ్యరాజుల సీమలో విప్రనారాయణుడు జీవించాడని చెప్పడం ఇష్టంలేక ఆ తథ శ్రీరంగంలో జరగడానికి బదులు మన్నారుగుడిలో జరిగినట్టు వ్రాశాడు. దేవదేవి మొదట తన సభలో నాట్యం చేసి ఆ తరువాత విప్రనారాయణుని తన సభలోనే అధికారులు హాజరుపెట్టారు. చరిత్రపట్ల తీసుకోరాని చనువు తీసుకున్నా రచన బాగానే చేశాడు. పాటలలో సంవాదాలు, పసందైన సంబాషణలు వున్నా ఈ రచన యక్షగానానికీ, నాటకానికి మధ్యలో ఉంది. సుదీర్హమైన ద్విపదలలో కవి కథను కథనం చేశాడు. సంతత వీరవైష్టవ గోష్టివలన - నెంతో విరక్తుడై యిల్లెల్ల రోసి తల్లియు తండ్రియుత్తరువు బాలింప - నిల్లాలి బుట్టిన యింటి కంపించి యాచార్యునిచేత చశ్రాంకితుండౌచు.

విజయరాఘవ నాయకుడు 645 విప్రనారాయణుడు సన్యసించాడట. ఇతడొక శుభముహూర్తంలో ““విష్వుక్సేనునకు నార్‌కేళంబు సమర్పించి” మన్నారుకోవెలలో ఒక తోట నిర్మించాడు. అక్కడకు దేవదేవి తన అక్కతో వచ్చింది. అమె అంతకుముందు విజయరాఘవుని కొలువులో నాట్టుమాడింది. ఈ ఘట్టంలో విజయరాఘవుడు తన ఘనతను వర్ణించే ద్విపద నొకదాన్ని పొందుపరిచాడు. దీనిని అతని పట్టపుకవి కామరసు వేంకటపతిసోమయాజి వ్రాసిన 40 పాదాల ద్విపదలోంచి 36 పాదాలు విజయరాఘవుడు వాడుకొన్నాడు. కామరసుకవి ద్విపద అతని విజయరాఘవ చంద్రికావిహారం అనే నాటకంలో ఉంది. అల్లసాని పెద్దనగారి పద్యాలను కృష్ణదేవరాయలవారు అవతారికలో వాడుకొన్నట్టే విజయరాఘవుడు తన పట్టపుకపి రచనను తీసుకొన్నాడని భావించాలి.

అయితే విప్రనారాయణ చరిత్రను ఎవరో సరసుడైన కవి వ్రాసి విజయరాఘనవుని పేరు పెట్టాడని ఈ నాటకాన్ని పరిష్కరించిన పండితులు భావించారు.! విజయరాఘవుడు దీన్ని రచించాడని చెప్పడానికి ఒక్కటే ఆధారం కనబడుతున్నదని పరిష్కర్తలు అనిబ్నరు. అతని నాటకాలన్నింటికి మొదట ఈ సీసపద్యం నాందిగా ఉంటుంది.

భోజక న్యాముఖాంభోబజరాజమరాళ సత్యాఘనస్తన స్తబకభృంగ

జాంబవతీవిలోచనచకోరశశాంక మిత్రవిందాతటి న్మేఘరూప

భద్రావశావశభద్రదం తావళవరసుదం తొామనోవనమృగేంద్ర లక్షణారూపకలాపినీ పర్జన్య భానునుతా లతాపారిజాత

షోడ*స్త్రీ సహస్ర చక్షుః ప్రసార

హారసారమసార మోహనశరీర

విజయరాఘవభూపాలభజనలోక

కేలు మోడ్చెద రాజగోపాల, నీకు.

ఈ పద్యం విప్రనారాయణ చరిత్రలో మొదట ఉంది. “విజయరాఘవ నాయక పరాకతుః స్వామివారు హవణించిన విప్రనారాయణ చరిత్రంబను విచిత్రనాటకంబు నటన పటిమ గనుపింప వినిపించేము” అని నటకులు అంటారు. ఈ నాటకాన్ని విజయరాఘవుడే రచించాడని చెప్పడానికీ ఇవికాక ఇంకా వేరే ఆధారాలున్నాయి. వాటీని పరిష్కర్తలు “త్రీ రాజగోపాల! చిరకీర్తిజాల! కారుణ్యగుణనీల! కళ్యాణలోల!”' అనే పదిపాదాల ద్విపదలో రాజగోపాలస్తవం వుంటుంది. దాని తరువాత 'కలశాంబునిధి కన్ళ కళ్యాణ ధన్యసలితసౌజన్యజగదేకమాన్య' అనే ఎత్తుగడతో పదిపాదాల కనకాబ్దవల్లీస్తవం కూడా ఉంటుంది. ఇవి మొట్టమొదట విప్రనారాయణ చరిత్రలో విప్రనారాయణుడే చేసినట్టు కవి బ్రాశాడు. తన ఇష్టదైవాలపైన పాత్ర చేయించిన స్తుతులు తనకు నచ్చినవాటిని ఆ తరువాత బాసిన కొన్ని నాటకాలలో దేవతా ప్రార్థనగా పొందుపరిచాడు. ఈ అంతరంగిక సాక్ష్యం వల్ల విజయరాఘవుడే విప్రనారాయణ చరిత్రను వ్రాసినట్టు చెప్పవచ్చు.

  1. విప్రనారాయణ చరిత్ర - యక్షగానం. పరిష్కర్తలు : మి సుందరశర్మ, అ. మహదేవశాస్త్రి, తంజూవూరు సరస్పదీమహలు ప్రచురణ. ఉపోద్దాతం, పుట 12,

646 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇది మొగలాయీల సంపర్కం దక్షిణదేశానికి కలిగిన తరువాత వ్రాశాడు. “మొగలాయివాడవై మోహపుట్టించి పగలును రేయిని పానుపు దిగవు” అని వేశ్ళ్యమాత విప్రనారాయణుని తిడుతుంది. అతడు మొదట దేవదేవితో ““సరిపోవు మీనూమేరలు మాసంగడీకాండ్రు పకీరులు” అంటాడు. ఆమె నెడబాశాక “మోముచూతునా దానికి సలాముచేతునా” అని వాపోతాడు. సమకాలిక భాష నిలా ప్రధాన పాత్రలకు కూడా వాడాడు. ఈ నాటకంలో కొన్ని పాత్రలు పూర్తిగా అరవమే మాట్లాడుతాయి. దేవదేవీ విప్రనారాయణులు తొలిసారి కలుసుకొన్నప్పుడు సంస్కృతంలో సంభాషిస్తారు. కాలీయమర్దనం: ఇది నాటకం అని విజయరాఘవుడు వ్రాశాడు. గాని యక్షగాన లక్షణాలే జాస్తిగా ఉన్నాయి. హేమాబ్బ్దనాయకాసమేతుడైన రాజగోపాలస్వామివద్ధకు గోఖిల ప్రళయులు వచ్చారు.** ఆ మునులు రాజగోపాలుని చూసి “రాజగోపాలః మాపాల ప్రసన్నులై మున్ను మీరు నటించిన బాలలీలలు చూపితిరి కదా. కాళీయ భుజంగ భంగ నాట్యప్రసంగం వింకొకపరి చూడ వేడుకగుచున్నది. మమ్మనుగ్రహింపవయ్య*” అని ప్రార్థించారు. కల్పితకాళిందీతీరానికి వాళ్లను పంపించి రాజగోపాలుడు గోపాంగనలతో యమునావిహారం చేద్దామన్నాడు. వాళ్లు “కాళీయుడున్నాడు. వానినెడలించి మా భయం అందెలు గబ్టెలు నందంద మెరయంగ - కుందనపుసొౌమ్ములు గునిసియాడంగ కందుమీరగా కాళీయఫణముపై - నందనందనుడు నటియించె నపుడు తరువాత జలక్రీడ చేశాడు. పిమ్మట దక్షిణ ద్వారక ప్రవేశించాడు. నీరజముఖులు నీరాజనమిచ్చారు. ఇందులో నాటకీయత, సంభాషణల చాతుర్యం ఏమీ లేదు. ఇదీ విజయరాఘవుడు ఏర్పరచిన ప్రథమ కథాసంవిధానం. ప్రదర్శనలో నటీనటకులు చేసే చెణుకులు ఏమీ గ్రంథస్థం అయినట్టు లేదు. మిగతా రచనల ప్రదర్శనానంతర కథా సంవిధానాలే గ్రంథస్థమైనట్టు కనబడుతుంది. రఘునాథనాయకాభ్యుదయం:; విప్రనారాయణ చరిత్రని వ్రాశాక ఈ ద్విపద కావ్యాన్ని విజయరాఘవుడు వ్రాశాడని తలచవచ్చు. *“'శ్రీరాజగోపాల చిరకీర్తి జాల!” అనే పది ద్విపదలు. “కలశాంబునిధి కన్య, కల్యాణధన్య'' అనే పది ద్విపదలు బ్రాసి ఇష్టదేవతా ప్రార్ధన చేశాడు. తన తండ్రి రఘునాథనాయకుడు వీధిలో స్వారి వెడుతున్నప్పుడు చిత్రలేఖ అనే గణీక అతణ్జీ చూసి మోహించింది. తన చిలుక చేత రాయబారం పంపింది. రఘునాథుడది విని అమె యింటికి వెళ్లి ఆమెను లాలించాడు. ఈ కథను విజయరాఘవుడు మూడాశ్వాసాల ద్విపదకావ్యంగా రచించాడు. ఇందులో ఆనాటి తంజావూరు చునముందు సాక్షాత్కరిస్తుంది. నాయకరాజుల దినచర్య తెలుస్తుంది. రఘునాథాభ్యుదయం : పై ద్విపద కావ్యాన్నే తరువాత ఎప్పుడో నాటకంగా మార్చాడు. అదే కథ. అక్కడక్కడ పొడిగించిన అవే ద్విపదలు. ఈ నాటకం కాని, ద్వీపదకావ్యం గాని సాహిత్య చరిత్ర రచనకే తోడ్పడుతాయి గాని రసానందం కల్సించవు. 20. వీరు వహ్నిముఖుడనే మునికుమారులు గోప్రళయుడే మన్నారుగుడిని దక్షిణద్వారకగా రూపౌొందించమని కృష్ణుని కోరాడు. చూ: చెంగల్బకవి రాజగోపాలవిలాసం.

విజయరాఘవ నాయకుడు 647

కృష్ణవిలాసం: దీనిని ఇటీవలనే పదేళ్లక్రిందట విజయరాఘవుని రచనగా గుర్తించి పరిశోధకులు ప్రకటించారు. సత్యభామ ఇంటికి వస్తానన్న కృష్ణుడు రుక్మిణి ఇంటికి వెళ్లి క్రీడిస్తూ ఉంటాడు. ఆ మందిరానికి వెళ్లి వచ్చిన దూతిక ద్వారా సత్యభామకు ఈ సంగతి తెలుస్తుంది. ఎకాయెకిని తన ఇంటికి వచ్చి తల కట్టుకొని పడుకుంటుంది. కృష్ణుడొచ్చి కాళ్లమీద పడి క్షమాపణ చెప్పుకొంటాడు. దీనిని విజయరాఘవుడు నాటకమన్నా ఇందులో గేయసంవాదాలేగాని సంభాషణలు లేవు.

ప్రహ్లాదచరిత్ర: ఇది విజయరాఘవుని రచనలన్నింటిలోను ఆఖరిది కావచ్చు. దీని మొదట 'భోజకన్యా” అనే పద్యం లేదు గాని 'శ్రీరాజగోపాల చిరకీర్ణిజాల' అనే ఇష్టదేవతా ప్రార్థన ఉంది. దీనిని విజయరాఘవుడు నాటకచాటుకావ్యం అన్నాడు. హిరణ్యకశిపుడు ప్రవేశించి కటికవాణ్జి పిలిపించి '“హాస్యరసంపు బలుకుల నవ్వింపనేర్పరియైన విదూషకుని రప్పించరా” అని చెప్తాడు.

కోలకేతుడనే హాస్యగాడు వస్తాడు. ' ఇక్కడ విదూషకుడు హాస్యపు మాటలాడేది'

తంజావూరు నాటకాలలో హాస్యపాత్రలు స్టేజిమీద తమ చిత్తమొచ్చినవన్నీ మాట్లాడేవారని దీనివల్ల తెలుస్తోంది. భాగవతంలోని ప్రహ్లాద కథను ఇందులో రసవంతంగా చెప్పాడు. పాములవాళ్లు, పురోహితులు మొదలైనవాళ్లు పాత్రోచితభాష మాట్లాడుతారు.

విజయరాఘవనాయకుని కృతులలో ' ఒక క్రమపరిణతి కనిపిస్తుంది. ““అతని కృతులంతకంతకు గేయధర్మమును తగ్గించుకొని రూపకకళ నెక్కువ సంతరించుకొన్నవి. వాటిపై మార్గనాటక ప్రభావమించుక పొడసూపినది. విజయరాఘవుడుద్దేశ పూర్వకముగ యక్షగానమునకా పేరిడి ప్రత్యామ్నాయముగ నాటకనామకరణము చేసినట్టు తోచును” అని యస్వీ బోగారావుగారు చెప్పారు.*! అది నిజమే.

విజయరాఘవునిపై మార్గనాటక ప్రభావం పడితే, అతని ప్రభావం అతని ఆశ్రితులపై పూర్తిగా పడింది. అతని ఆశ్రితులలో కొందరు నాటకాలు వ్రాశారు. వాళ్లను గురించి, వారి రచనల గురించి విడిగా చెప్పుకొందాం. ఇతని హయాంలో మధుర కవితలు వెల్లివిరిసినంత ప్రబంధాలు రాజించలేదు.

విజయరాఘవుని జీవితం కూడా పాటలాగే సాగింది. ముళ్తాయింపుతో ముగిసింది. 21. అంధ్రయక్షగానవా బ్బయచరిత్ర, ద్వితీయభాగం, పుట 25.

దామెరల కవులు కాకమావనిమూర్తి కవి

మన ప్రబంధాలన్నీ ఒకలాగే ఉంటాయి. ఒకటి చదివితే చాలు, మిగిలినవన్నీ ఎలా ఉంటాయో చెప్పవచ్చునన్న అభిప్రాయం చాలామంది సాహితీపరులకు సహితం ఉండి నిజమే. కథ కోసం చదివితే ఈ ప్రబంధాలన్నీ పరస్పర ప్రతిధ్వనులు అనిపిస్తాయి. కల్పనలు తూడా అంతే. ఏ కావ్యంలో చూసినా నాయికా నాయకులు కలుసుకొంటారు; ప్రేమించుకొంటారు; విడిపోతారు; విరహంలో పడతారు; మళ్ళీ కలుసుకుంటారు; పెళ్లాడుతారు; సుఖంగా ఉంటారు. ఏ ప్రబంధాన్నైనా ఇదే నిర్మాణసూత్రం. ఏ దండలో చూసినా ఇదే దారం. ఇటువంటి చట్రాలు మన ఆంధ్రసాహిత్యంలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఉన్నాయి. అమెరికాలో హాలీవుడ్‌ సినిమా కథలలోనూ, బ్రాడ్వే నాటకాలలోనూ కథాప్రణాళిక ఇలాగే ఉంటుంది. 'బాయ్‌ మీట్స్‌ ది గర్ల్‌, 'బాయ్‌ లూజెన్‌ ది గర్ల్‌, 'బాయ్‌ గెట్స్‌ ది గర్ల్‌ ఫార్ములా మీదనే ప్రచారం కోరే కథలన్నీ ఆధారపడి ఉంటాయి. మన ప్రాచీన సంస్కృత నాటకాలలో కూడా ఇలాంటి అంచెలు ఉన్నాయి ప్రతి ప్రధాన ఇతివృత్తంలోనూ కొన్ని సంధులు ఉండాలని భరతుడు చెప్పాడు.! ముఖసంధి, ప్రతిముఖసంధి, గర్బసంధి, విమర్శసంధి, నిర్వహణసంధి అని ముఖ్యమైనవి అయిదురకాలు. ఈ అంచెలలో ఇతివృత్త నిర్మాణం రొటీనుకే దారితీస్తుంది. ఇటువంటి రెడీమేడ్‌ మూసలలో పోతపోయకుండా ఎవైనా కావ్యం వ్రాయగలిగతే అత్ణీ తప్పకుండా అఖినందించాలి.

క్రీ.శ.1625 ప్రాంతాలలో ఒక తెలుగుకవి తన కావ్యానికి అటువంటి మూసకథ అక్కరలేదనుకున్నాడు. నాయికానాయకులు పరస్పరం ట్రిమించుకొనడం, విరహంలో పడడం వగైరా సన్నివేశాలు లేకుండానే ప్రబంధం బ్రాద్దామనుకొన్నాడు. ఒకటి కాదు రెండు కాదు అయిదాశ్వాసాల కావ్యం వ్రాశాడు. 683 గద్యపద్యాలు చెప్పాడు. ఆ ఘటికుని పేరు దామెర్ల వెంగళరాజు. అతని కావ్యం పేరు బహుళాశ్వచరిత్ర. నిజానికిందులో చరిక్ర అన్నది ఏమీ లేదు. ఎంత విపులంగా ఇందులోని కథ గురించి చెప్పాలన్నా అది టూకీగానే చెప్పినట్టవుతుంది. మిథిలానగరాన్ని ద్వాపరయుగంలో బహుళాశ్చుడనే రాకా పరిపాలిస్తున్నాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు ఆ రాజుగారింటికి అతిథిగా వచ్చి విందు భోజను చేసి సంతోషించాడు. భుక్తాయాసం తీర్చుకొనడానికి చల్లగా కబుర్లు చెప్పుకున్నాడు. ఇణే కథః ఈ మాత్రం కథాబీజాన్ని నాటి అయిదాశ్వాసాల మొక్కని పెంచడానికి బాగా కృషీ చేయాలి. 'చిన్నం కావాలి, చింతాకు కావాలి; మేలిమి కావాలి, మెడ తిరగాలి అని సామె చెప్పినట్టు చిన్నమెత్తు బంగారంతో చింతాకుపతకం చేయడం చాలా గొప్ప విద్య ఇంత చిన్న కథతో అన్నివందల పద్యాలు దామెరల వెంగళరాజు ఎలా బ్రాశారో పరిశీలిద్దాం.

  • నాట్యశాస్త్రం = పోదంకి శ్రీరామ అమ్బారావుగారి అనువాదం పుటణ.

దామెరల కవులు - కాకమానిమూర్తి కపి 649

శ్రీకారం చుట్టాక 74 గద్యపద్యాలలో కవి ఇష్టదేవతా ప్రార్థన, స్వవిషయం, షష్ట్యంతాలు రచించాడు. తరువాత 'బహుళాశ్వచరిత్రంబను ప్రబంధరత్నంబునకు కథా ప్రారంభమెట్టిదనిన' అని, వెంటనే ఒకే ఒక పద్యంలో శుకయోగిని చూసి పరీక్షిత్తు ఈ కథని చెప్పమన్నాడని, ఆయన చెప్పడం మొదలుపెట్టాడని తెలియజేశాడు.

విదేహదేశంలో మిథిలానగరం ఉంది (13 పద్యాలలో పురవర్ణన). ఆ ఊరిని బహుళాశ్వుడనే రాజు పాలిస్తున్నాడు. (3౩ పద్యాలలో అతని ప్రస్తి). ఆ రాజుగారి పురోహితుని పేరు శ్రుతదేవుడు (2 పద్యాలలో ఇతని సంగతి). ఒకనాడీ బహుళాశ్వమహారాజుని చూడడానికి వ్యాసవసిష్టపరాశరాది మునులు వచ్చారు; చూశారు. వెంటనే ద్వారకా నగరానికి వెళ్లారు (2 పద్యాలు). ద్వారక ద్వారందూరి ఊరు చూశారు. ఇదిగో సాత్యకిమేడ. ఈ బ్రాహ్మణవాడ పదిహేను ఇళ్లు దాటాక శ్రీడిసదనం. అది బలరామునిది. ఇది అశ్వశాల. ఇదిగో గజశాల అని ఒక పద్యంలోనే చెప్పుకొన్నారు. మరోపద్యంలో పూలంగడి దాటారు. ప్రద్యుమ్నుని నగరు, అమ్రూరుని అంగణం గమించారు. ఇంకో సీసపద్యంలో బహిరంగణం మెచ్చుకున్నారు. తరువాతి పద్యంలో ఆ మహామునులు శ్రీకృష్ణుని హజారానికి వచ్చారు. ఆయన ఎక్కడున్నాడో అని మరొక పద్యంలో తర్కించుకున్నారు. ఇది సీసపద్యం. నాల్గపాదాలలో నాలుగురెళ్లు ఎనమండుగురు భార్యల సంగతీ చెప్పుకుని, ఎత్తుగీతిలో రాధతో క్రీడిస్తున్నాడా అని ప్రశ్నించుకున్నారు. వీల్లీపద్యంలో ఇలా అనుకుంటూ ఉండగానే, తరువాతి పద్యంలో కృష్ణుడు తన హజారానికి వచ్చాడు. తివాసీ మీద పచ్చగద్దియపై తూర్చున్నాడు. మొక్కులు స్వీకరించి పరివారాన్ని కూర్చోమన్నాడు (3 పద్యాలలో కొలువువర్జన). వచ్చినవాళ్లు మహామునులే కావచ్చు - సభాప్రవేశానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మునులను గొల్లలు సావిడిలోనే ఉంచారు. వెళ్లి విన్నవించారు. కృష్ణుడు కొలువున్నాక “రారయ్యా' అని పిలిచారు. అంతటి మహర్షులను ఇలా హెచ్చరించారు:

ప్రభుగోష్టి వేగిరిపడకు విశ్వామిత్ర వాల్మీకి వాణిలోపత్తుగాని

భరత ప్రపంచంబుహరియెక్క డడుగునో జడియక యుత్తరంబిడుముపులహ

యొక్క చోదర్శోక్తి ద్రొక్కుడుపడు దీపు తెచ్చుకోనెమరున కిచ్చవత్స

యొక్కొక్కరెప్రసంగ మొసగెడుచో గొందఅడ్డగజ్ఞలు వల దత్రిమౌని

శాస్త్ర సాహిత్యములు మాకెచాలజీత

మంచు గలగూరగంపనేబనులంబాద

రాయణకవిత్వసందర్చరసము నిలుపు

మనుచుదౌవారిక ద్వారమపుడుదాటి (బహుళా. 1-110)

మహాప్రభువును చూడబోతున్నామే అని అ మునులు కూడ కొంబెం ఉత్సాహోద్రేకాలు పొందటం సహజం. తడబాటులో మర్యాదలు మరిచిపోకుండా, చేతిలోనివి క్రింద పడెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేయడం సబవు. రాచమర్యాదలు పాటించాలి.

650 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

అస్థానంలోనికి వాళ్లు ప్రవేశించడం, కృష్ణుడు వారి యోగక్షేమాలు అడగడం రెండు పద్యాలు. మునులు అతజ్జీ నుతించడం రెండు పద్యాలు. తాము బహుళాశ్వుని ఊరినుంచి వస్తున్నామని ఒక పద్యంలో చెప్పారు. అతణ్ణి మూడు పద్యాలలో పొగిడారు. 'అవును, ఆ బహుళాశ్చ్వుడు మాకు తెలుసు. అతణ్ణి చూడాలి. రేపే బయలుదేరుదాం అని కృష్ణుడు వెలవిచ్చాడు. నగరులోనికి వెళ్ళిపోయాడు. దానితో 125 గద్భపద్యాల ప్రథామాశ్వాసం ముగిసింది.

ద్వితీయాశ్వాసంలో కవి మొదట ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఒక పెద్ద వచనంలో కృష్ణుని ప్రయాణం వర్ణించాడు. మునులతోనేకాక, అతడు వనితాజనసమేతంగా కదిలాడు. కతిపయప్రయాణాలలో హూణ, కరూశ దేశాలు దాటి కోసలదేశానికి వచ్చాడు. అక్కడ విడిదిలో ప్రవేశించాడు. ఆ రాత్రి భోజనం చేసి కృష్ణుడీలా నిద్రపోయాడటః:

అచ్చట పచ్చటాకునిలయంబున గొజ్జగసెబ్జ కౌగిటం

గ్రుచ్చినమచ్చెకంటి విరిక్రొమ్ముడి వ్రాలు తమిం దలాడగా

నిచ్చిన చేయి గుబ్బకొకయింత మరల్చి రదచ్చదంబు వి

వ్వచ్చుని నేస్తకా డరిదివాచవిచూచుచుగూర్కెనత్తరిన్‌. =. (బహుళ. 2-9)

అంతలో వసంతం వచ్చింది. ప్రయాణంలోనే శ్రీకృష్ణుని అంతఃపురకాంతలు వనవిహారం చేశారు. జలక్రీడలాడారు. వనభోజనాలు చేశారు. సంగీతసాహిత్యాలతో పొద్దుపుచ్చారు. ద్వాపరయుగంలో కాకపోయినా దామెర్ల వెంగళరాజుగారి కాలంలో కన్నడంతోపాటు పారశీకానికి తూడా ప్రాముఖ్యం ఉంది. కృష్ణుని సంగీతసాహిత్య వినోదాలను కవి ఇలా వర్ణించాడు:

వీణా వాద్యముగద్యపద్యకవితావిద్యావినోదంబు క

ల్యాణీకన్నడపారశీముఖ ముఖాలాపంబు లాసద్ధక

ల్యాజణీభూత విచిత్రలాస్యము ప్రశస్యాంభోరుహా స్వామిణుల్‌

తాణంజూప మురాపహారిహరి యుద్యానోర్వినుండెన్‌ దగన్‌. (బహుళ 2-73)

కృష్ణుడిలా ఉద్యానోర్విలో ఉండగా రెండో అశ్వాసం ముగిసింది. ఈ మజిలీని 77

మూడో అశ్వాసం మొదలుపెట్టేసరికి కవి చేస్తున్న ఈ ఆలస్యానికి కృష్ణుడు బాధపడినట్టుంది. ఆడవాళ్లను అంతఃపురంలో వదిలేసి సర్వబలాలను పురప్రాంతాలలో దించి గరుత్మంతుని తలచుకొన్నాడు. అతడు రాగానే ఎక్కి మిథిలానగరానికి వెళ్లాడు. ఆకాశయానాన్ని కవి విపులంగా కథనం చేశాడు. కృష్ణుడు తన ఇంటికి రాగానే బహుళాశ్చుడు బ్రహ్మానందం పొందాడు. కమ్మని కన్నీళ్లతో కాళ్లు కడిగాడు. తన భాగ్యానికి పొంగిపోయాడు. 'రాజబుషివయ్య బహుళాశ్వరాజవర్య!' అని కృష్ణుడు మెచ్చుకొన్నాడు. మిథిలానగరంలోని _ విడిదిలో “పడుకింటిపసిడిచప్పరమంచంపై' పవ్వళించాడు. బహుళాళ్వుడు ఊడిగంపుచాతురి చూపాడు. ఆ మంచం చుట్టూ ఉన్న ఆడపిల్లలతో కృష్ణుడు సరసల్గ్లాపాలు మొదలుపెట్టాడు. అఆ కాముక వ్యాపారాలను చూస్తున్నా బహుళాళ్చుడు చెక్కుచెదరకుండా తననే సేవించుకొనడం చూసి కృష్ణుడు మెచ్చుకొన్నాడు.

చామెరల కవులు - కాకమానిమూర్తి కవి 651

అంతలో సూర్భుడు అస్తమించాడు. సంజ ఎర్రబారింది. చీకటి పడింది. కాముకులు చెలరేగారు.

ఆ చిమ్మచీకటిమాత్రం ఎంతసేపు? వెన్నైాల వచ్చింది. సారాచొక్కులతో బజారు చూటలు మాట్లాడుతూ కన్నెలు విహరించారట.

ఇలాగ విచ్చలవిడిగా విహరించే వెన్నెలవేళు పాపం, అక్కడ కృష్ణుడు విడిచిపెట్టిన గోపికాజనం. విరహంలో పడ్డారు. చిలకలను, చంద్రుని. మన్మథుణ్ణి, చల్లగాలిని యథావిధిగా తిట్టిపోశారు. రేయి గడిచింది. వేగుచుక్క పొడిచింది. కోడి కూసింది. చల్లగాలి వీచింది. తెల్లవారింది. రాజ పరమేశ్వరుడు సూర్యుడు ఉదయగిరి సింహపీ8పై ఉన్నాడు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా 81 గద్యపద్యాలలో దామెర్ల వెంగళరాజు వ్రాశాడు. దీనితో తృతీయాశ్వాసం ముగిసింది. ఇందులో మొత్తం 105 గద్భుపద్యాలున్నాయి. ఈ ఆశ్వాసాంతంలో కవి ఒక అపూర్వవృత్తాన్ని వాడాడు. దాని పేరు భ్రమరకూజితవృత్తం. ఇది 21వ ఛందంలో ఉంటుంది. రాసారానారస-ర అనే గణాలుంటాయి. 13వ అక్షరం యతి. దీని సంగతి అప్పకవీయంలో లేదు. ఈ వృత్తం చూడండి.

శారదాలలిత చార దాయి సారసాంకురిత సౌరభా

సౌరభానుపవిహార ఫాలశిఖిసన్మహః పవన సారథీ

సారథీనమిత గీరిధీన కలిసంస్తుతస్వగుణ గౌరవా

గౌరవారిరుహు హీరవాద విలసద్యశః కృతవిశారదా! (బహుళా. ౩3-105) ఇందులో పాదానికో సమాసం ఉంది. సమాసాలు ముక్తపదగ్రస్తాలు. పద్యంలో మొట్టమొదటి పదం, కట్టకడపటి పదం ఒకటే.

నాలుగో అశ్వాసం ఎత్తుకోగానే కవి బహుళాళ్ళునిచేత కృష్ణునికి విందు పెట్టించారు. ఓక పెద్ద వచనంలో అనుష్థానాలు పూర్తిచేయించి కృష్ణుని భోజనశాలకు నడిపించారు. 4వ పద్యంలో వంట అమిరి బోనకత్తెచేత ప్రకటన చేయించి, 55వ పద్యంలో చెయ్యి తడిగించారు. అంటే 52 పద్యాలలో విందు వర్ణించారు. వులిచారు, కాచిన మజ్జిగరసం, కాంచ్న ఒబ్జ పాల తిమ్మనం ఒకటేమిటి చప్పన్న పదార్థాలు వండారు. తినడానికి కృష్ణునికి ఒక చెయ్యి చాలలేదట.

భోజనాలు చేశాక అకులు వేసుకున్నారు. తనను ధన్యుణ్ణి చేసినందుకు బహుళాళ్చుడు కృష్ణుణ్ణి కీర్తించాడు.

ఒక యింతగుడినెలో నొదుగుట యొప్పెగా నలజగత్సరిపూర్ణుడైనతండ్రీ

యడుగు దోనెడు నీట గడుగుట కలరెగా మిన్నేణుబదమునగన్న ఫ్రోడ

తావి చేరెడు పాల దనిసెగానిలపాలమున్నీటిలో నోలగన్నమేటి

యిచ్చినయొక్క సౌమ్మెదబూని మెచ్చెగాసిరికి గాపురమైన యురమువాడు

662 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి భక్తియే కారణము కదా భక్తులిడ్డ యొక్క తులసీదళంబుననుత్సహించి - భక్తిముక్తులు దయసేయు పుణ్యమణికి * జిగతిననిపించితివి పుణ్యజనశరణ్య,. (బహుళా. 4-౪) కృష్ణుడు ఇలా బహుప్రకారాల కీర్తించాక ఈ మిథిలానగరంలో పూర్వజన్మలో తాను సీతను పెళ్లాడడం జ్ఞాపకం చేసుకొని రామాయణగాథను కథనం చేయమని విశ్వామిత్రుణ్ణ అడుగుతాడు. ఆయన బహుళాశ్వనికి సీతారాముల వివాహం, శోభనం రాత్రి సరసాలు విపులంగా 58 పద్యాలలో చెప్పాడు. ఆ మొదటిరాత్రి సీతమ్మ చాలా సిగ్గుపడింది. మోవియొసంగదాడ దొక ముచ్చట గుబ్బపయంటమీద జే వైవగనీదు కాదుకడవక్కయు నాకిడి కొమ్మటంటక్రై యేవగనుండినాడొ హృదయేశుడు గుండియగూడువట్టి దేవుడుగాన కొంత కడతేజె మనో భవుఢాకకన్యుడే? (బహుళా. 4-118) అయితే కొంచెంసేపట్లో ఆమె 'మదనకదనంబు మహిభర్త మదిగరంచె' (4-121) విశ్వామిత్రుడు ఈ కథ చెప్పాక కృష్ణుడు కొన్నాళ్లు మిథిలలో ఉండి ద్వారకకు వెళ్లాడు. ఈ కథ ముగిస్తూ శుకయోగి ఇలా అన్నాడు: అందలిరాజు భాగవతుడౌటను జేసి పురంబులోని వా రందరు బుణ్యు లందరు గృతార్జ్థులు భాగవతోత్తముల్‌వణి జ్నందనుడౌ; కళానిధిగుణంబులు గానివి ద్రోచివైచిగో విందునిచేత మెచ్చుగొని వారల నిద్దతి మించె నిద్ధరన్‌. (బహుళా.4-13౫) ఈ పద్యంలో కళానిధి అనే కొత్తపాత్ర సంగతి శుకయోగి చెప్పాడు. 'ఆయనెవడు? 6 కథ చెప్పు అని పరీక్షిత్తు అడిగాడు. ఇంతటితో నాలుగో అశ్వాసం ముగిసింది. 44 గద్భపద్యాలలో ఒకే ఒక వాక్యంలో వబ్రాయదగ్గ శ్రీకృష్ణుహుళాశ్వుల కథని చెప్పాడు. అయిదవ ఆశ్వాసంలో కళానిధి కథను శుకయోగి పరీక్షిత్తుకు చెప్పాడు. దానికీ అసలు కథతూ సంబంధం లేదు. బహుళాశ్వుడు పాలించే మిథిలలో ఈ కళానిధి ఒకడున్నాడన్న బాదరాయణ సంబంధమే, ఊడిపోయే జారుముడిగా ఈ కథలను కలుపుతూంది. కళానిధి కథ ఒక పతితుని కథ. వేశ్యా వ్యామోహంలో పడి అంకా పోగొట్టుకొన్న వైశ్యతుమారుని కథ 237 గద్యపద్యాలలో కవి చెప్పాడు. ఉద్పటారాధ్య చరిత్ర, నిగమశర్మోపాఖ్యానం, నిరంకుశోపాఖ్యానం, విప్రనారాయణచరిత్ర, వైజయంకీ విలాసం మొదలైన ప్రబంధగాథలలో పూర్వులు వర్ణించినంత విపులంగా సానివాడలు అందులోని విహారవిలాసాలు, మోదాలు, మోసాలు విపులంగా వర్ణించాడు. అయిే ఇందులోని ప్రక్యేకత - అనాటి వైళ్ళుల జీవితాన్నీ, వేళ్ళల జీవితాన్నీ బాగా చిత్రించాడు లేదు. పడికొంచెంబుగ రాచు నుప్పుడులకుం బానీయ మర్చించు ద క్కెడగట్టుం దినమెచ్చుగుందులుగ బూన్మెన్‌ నేతిలో నూనియల్‌

దామెరల కవులు - కాకమానిమూర్తి కవి 653 మిడుచున్‌ నూనియ నాముదంబు గలుపున్‌ మేలాముదం బందువె

ల్మిడినించుం గదియించు బ్రాదవుడు హాళిం గ్రొత్స వియ్యంబునన్‌:( బహుళ. 5-10) ఇటువంటి రత్నాకరశ్రేకష్టికి సముద్రంలో చంద్రుడు పుట్టినట్టు కళానిధి పుట్టాడు. చంద్రునిలాగ పెరిగాడు. అతడు ఒకనాడు గుడిలో జరిగే వసంత మహోత్సవం చూడడానికి వెళ్లాడు. “అబ్బాయి, గుడిసివచూడగూడ'దని తండ్రీ చెపుతూనే వున్నాడు. కాని కొడుకు లక్ష్ర్యపెట్టలేదు. ఆ వూరి దేవాలయంలో స్వామిని సేవించే భోగకాంతలు చాలామంది వున్నారు. వారిలో మజీమంజరి చాలా అందగత్తె. అ చిన్నదాన్ని చూసి కళానిధి మోహించాడు. కాని ఆ వేశ్య ఎవరికో “గుత్త అని కొందరనుకొంటారు. “తోవెలజియ్యలకీ యొయారికిన్‌ హత్తుగడ' అని కొందరనుకొంటారు. అయినాసరే దానితో రమించాలని వైశ్ళ్యపుత్రుడు కళానిధి అనుకొన్నాడు.

ఆ రాత్రి వేశ్యగురువైన విప్రుణ్జి పిలిచి వేవేలిచ్చి 'భవదంతేవాసినిం గూర్చుడు' అన్నాడు. ఆయన వెళ్ళి వేశ్ళదాసి కీ సంగతి చెప్పాడు. అది తీరుబాటుగా పని చక్కబెట్టింది. ఈలోగా దుకాణంలో వ్యాపారం చేస్తున్న కళానిధికి పరధ్యానం జాస్తి అయింది.

నొక్కనికొకకొన్ని రొక్కరూకలొసంగి కాసులలెక్కలో వ్రాసికొనియె

వక్కలలో దక్కువకు వైచిన బరీదులొకనికి సరుకుతో నొడినివైచె

టైకమిచ్చిన నొంటిపడి కంగడికి నిడ్డ కలపెనల్‌ గంపెడు గొలిచివిడిచె

మాట యరవిన్కి నారునిపై నాటుజూడ్కి

బయిలు పయికంబునకుజూచు బాణీ లంజె

తగవునకు గొంత పిస వెళ్లి నగవుగనియె

వేశ్యసుద్దికి జెవియిచ్చి వైశ్వసుతుడు. (బహుళ. 5-96) అ దుకాణం దగ్గరకు వెలయాలి పరిచారిక వచ్చింది. తన ఏలికసాని సంగతి సెట్టితో చెప్పింది. అరటిపళ్ళు ఒలిచి చక్కెర అద్దుకుంటూ తింటూ కబుర్లు చెప్పింది. డబ్బు ఖర్చుకు వెనుకతీయవద్దంది. “ధనం నిన్ను గడించిందా? ధనాన్ని నువ్వు గడించావా?' అంది. “ఎందరెందరో కోరినా మా చిన్నది ఒప్పుకోలేదు; నిన్ను రమ్మంది” అని ఆ చెలికత్తె చెప్పిపోయింది. కళానిధి వేళ్ళవాటికకు 'బాపన చెలికాండ్రు వెంట నంట' బయలుదేరాడు.

ఒకనికి దుప్పటి యొకనికి - సితవస్త్రము వేరొకనికి సికళణాయెతులిం

టికి వచ్చి యిత్తుననియె-శకునము బాగాయె నన్న సంభ్రమపరుడై.

(బహుళ. 5-110) వేశ్వ యింటికి చేరాడు. చప్పరంలో పడకింటిముందర చాది తిన్నెపై వన్నైల తివాసి ఉంది. దానిపై “వీజూవైష్టవుడు'. “ద్వాపదబాపడు', “చదివించువిప్రుడు', “చెల్లెల భరయమాయ గారు, “విడెమిచ్చుపడతి' మొదలైన వేశ్యాపరిచారం వుంది. ఆ కొలువులో కళానిధి గోరకస్తూరి వాదివంటి కానుకలు తెచ్చి కూర్చున్నాడు. మణిమంజరి వచ్చింది. తమ్ముడు తిచ్చియిచ్చిన వీణ తీసుకొని వాయించింది. కొంత పాడి 'అమ్మను పిలువే' అంది. తల్లివచ్చి

654 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి “ఈ కానుకలు ఎవరు తెచ్చా'రంది. కూతరు కళానిధిని చూపెట్టింది. వేశ్ళమాశ ఆమోదించింది. 'ఈయన స్నేహింపదగువాడు. చేపట్టు కుంచం, రాజులచేతి నిమ్మపండు మన పాలిటి దేవుడు, ఇతణ్జీ విడువకు' అని చెప్పింది. మణిమంజరి అతణ్జి విడువలేదు. రతులలో ఓలలాడించింది.

దాసుడైనా ఆ కళానిధి “ఇదే పరమానందం. ఇదే పరబ్రహ్మ మనుకొన్నాడు. డట్బేకాక ప్రతిరోజూ నూనె, సీకాయి, పంచదార, కొత్తపోకలు, మిరియాలు, ఇంగువ, బెల్లం, ముత్తెసరులు, పెసలు “గుత్త లంజన నెత్తి పుత్తించి' సెట్టి అంగడి రిత్త చేశాడు. ఆ వేళ్ళ యింట్లో ఎవరు పడితే వారు అతణ్జీ దోచుకొన్నారు.

అల్లుడటంచు తల్లి, తమ యాత డటంచును గూతు, రన్నిటం

బల్లిదుడేలికే ననుచు బానినె వానిని బావయంచు న

చ్చెల్లెలు వచ్చినట్లు పయిజేతులు వైచుచు ముద్దువెట్టి పై

ద్రైళ్ళుచు నల్లివిల్లి వగతీసిరి నాసివరాలు రాసిగన్‌ (బహుళ. 5-14) కళానిధి చేతికి ఎముక లేదు - ఉంపుడుకత్తి యెదుట అడిగితే ఇంక చెప్పాలా?

ఉద్యోగరాఘవుండని - పద్యంబులు నూక గేరి పంచల చదువన్‌

విద్యాధికులకు పల్లము - చోద్యంబుగ విడిచి లంజ చూడగ నిచ్చున్‌,

(బహుళ. 5-19) ఇలాగ మంచి నీళ్లలాగ డబ్బు ఖర్చుపెట్టి ఇల్లు గుల్ల చేసిన కొడుకు సంగతి తండ్రికి తెలిసింది. బావురుమన్నాడు. “నీవలె నీవల తిరిగరె కోవెలె వెలయాండ్రవంటి కోమటీ విడ్డల్‌ అని ప్రశ్నించాడు.

ఎక్కువ తెచ్చి తక్కువకు నింటికడన్సరకమ్మ జూచుటో

వక్కలు నాకు లమ్ము బుధవారపుసంతకు జట్టిగట్టుటో

లెక్కల సంపుటంబు బ్రబలించుటొ కోమటివారి పిన్నవా

డెక్కడ లంజబేర మది ఎక్కడ నెక్కడి కెక్క డక్కటా! (బహుళ 5-157) నెత్తీనోరూ మొత్తుకొని హితోపదేశం చేశాడు. 'కుంచెడు కుంచము తూడబెట్టినన్‌ మంచము మాయచేసిందనే సామెత నిజం చేశావన్నాడు. సానులెలా డబ్బు లాగుకారో తెలియజేశాడు. 17 పద్యాలలో చీవాట్లు పెట్టాడు. అయినా కొడుకు చెవిని పెట్టలేదు ఇంటిల్లిపాదీ అతణ్జి ఏవగించుకొన్నారు. కేపిస్తాను, ఎల్లుండిస్తానని చెపుతూ కళానిధి వేశ్ళకు గడువు పెట్టాడు. ఇవ్వలేకపోయాడు. దానితో వేశ్యమాతకు ఒళ్ళుమండింది. తిట్టి మెడపట్ళీ వెళ్లగొట్టింది. తల్లీ, తండ్రీ ఇంటికి రానివ్వరు. ఎక్కడా డబ్బు పుట్టదు. ఏం చెయ్యాలో తోచక కళానిధి అత్తవారింటికి వెళ్లాడు. వారి యిల్లు దూరి కమ్మలు, కడియాలు పట్టుకొని మళ్ళీ సానియిల్లు చేరాడు. ఆ సౌమ్ము చెల్లగానే వేశ్చమాత వెళ్లగొట్టింది. “రెంటికి గొరగాని తొంటి రేవణుడై' కళానిధి దేవాలయందగ్గిర పడిగాపులు పడ్డాడు. అక్కడ దేవుని సివకోసం మణిమంజరి వస్తుంది. దేవునిని 'కాలాటపు పాట' పాడి ఆమె యింటీకీ

దామెరల కవులు - కాకమానిమూర్తి కవి 655 వెళ్లిపోయేటప్పుడు “కానెమోసుకొని ఇంటికి వెళితే. మనసు కరుగుతుందనుకొన్నాడు. దేవుని మంటపం దగ్గిర కూర్చున్నాడు. విశ్రాంతి తీసుకున్నాడు. పశ్చాత్తాపం పడ్డాడు. ఆ సాని పాపకు “కలవిత్తంటెల్ల హత్తించానే' అని బాధపడ్డాడు.

నేనాద్రవ్యము వెట్టి గట్టిగుడియేనీ కట్టిన ట్లాయెనా

కానీ మీకు మణీకిరీట ముఖ కైంకర్యంబు గావించుచో

అ నారీమణి కిచ్చుటల్‌ త్వదనుకంపానర్దుడై తింగదా

యేనా దేవరమాయు దాటుట తండ్రీ జానకీ వల్లభా! (బహుళా. 5-220) అని దేవుణ్ణీ తలచుకొన్నాడు. మరికొంత బాధపడీ కన్ను మూశాడు. నిద్రపోయాడు. కలగన్నాడు. ఆ స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించారు. అనుగ్రహించారు. సిరులు మళ్లీ కలిగాయి. తల్లిదండ్రులు ఆదరించారు. కీర్షిప్రతిష్టలు వచ్చాయి.

ఈ కళానిధి కథను శుకయోగి పరీక్షిత్తుకు చెప్పాడు. దానితో వెంగళరాజు కావ్యం పద్ధతిలో కథగాని కథను ఆయన చెప్పాడు.

దామెర్ల వెంగళరాజు కాలం ఏది? అన్నది ఒక ప్రశ్న వీరేశలింగంగారు ఇతడు 1602 ప్రాంతాలవాడని చెప్పారు. క్రీ.శ.1580లో బహుళాశ్వచరిత్ర విరచితమైనది చాగంటి శేషయ్యగారు అభిప్రాయపడ్డారు. అయితే దీనిని కవి క్రీ.శ+1620 ప్రాంతాలలో వ్రాశాడని చెప్పవచ్చును. దానికి చారిత్రక ఆధారాలున్నాయి.

దామెర్ల వారిది సుప్రసిద్ధమైన కుటుంబం. వీళ్లకు, వెలుగోటివాళ్లకు సంబంధ బాంధవ్యాలున్నాయి. వెలుగోటి యాచమనాయకుడు ఈ వెంగళరాజుగారికీ మేనత్త కొడుకు. 17వ శతాబ్దం తొలిపాదంలోని రాజకీయాలలో ఈ యాచవ నాయకుడు పాలొన్నాడు. క్రీ.శ 1614 నుండి 1619 దాకా పాలించిన శ్రీరంగరాయలకు యాచమ నాయకుడు ఒక్కడే అండదండగా ఉన్నాడు. క్రీ.శ.1619లో గద్దెనెక్కిన రామదేవరాయలు నిజానికి యాచమనాయకునికి పూర్తిగా బుణపడి ఉన్నాడు. రామదేవరాయల తోసం యాచమనాయకుడు ఎన్నో యుద్ధాలు చేశాడు. తన మేనత్త కొడుకును దామెర్ల వెంగళరాజు

ఉత్తరమల్లూరి యొద్ద దావలపాప విభునిగొట్టిననాటి విజయకలన

తిరుమలచేరి ధాత్రిని మన్నెరాజుల బారద్రోలిన నాటి బాహుబలము

చెంగలిపట్టు వీక్షించి లగ్గలుపట్టి యాత్రమించిన నాటి విక్రమంబు

పాలెంబుకోట వెల్పట నాజి యతిరాజు జరగచేసిననాటి శౌర్యపటిమ

మున్నైతో వూరుజగ్గరాణ్ముఖులనొంచి

మధుర దొర చెంచి మన్నీని మదమడీంచి

తిరిచినాపలి బారదోలు తేజముగల

మేటి వెలుగోటియాబనీ సాటిగలరె? (బహుళ 1-37) 2. అఆంధ్రకవుల చరిత్ర, రెండవ భాగం. . 3. అఆంధ్రకవితరంగిణి 10వ సంపుటి, 58 పుట.

656 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ పద్యంలో ఎన్నో యుద్ధాల ప్రసక్తి ఉంది. తోపూరు యుద్ధం క్రీ.శ 1617లో జరిగింది. ఆ యుద్ధాలను పేర్కొన్న బహుళాశ్వచరిత్ర క్రీ.శ. 1620 ప్రాంతాలలో వ్రాయడం సంభవమవుతుంది. ఈ కావ్యాన్ని దామెర్ల వెంకటరాజు తండ్రీ వెంకటాద్రి కంకితం ఇచ్చాడు. ఈయనకు నలుగురు కొడుకులు. పెద్దవాడి పేరు చెన్నప్పరాజు. ఇతని పేరనే చెన్నపట్టణం కట్టారు. అదే ఉత్తరోత్తర మదరాసు అయింది. దామెర్ల వెంగళరాజుగారు బహుళాశ్వచరిత్ర వ్రాసేసరికి చెన్నప్పరాజు చాలా వైభవంగా రాజ్యుం చేస్తున్నాడు. అందుకే గద్యలో _ 'వెంకటాధీశపుత్ర. చెన్నభూపాలకలిత సొభాత్ర అని వెంగళరాజు “చెప్పుకొన్నాడు. చెన్నప్పరాజుకు నలుగురు భార్యలు, అయిదుగురు కుమూరులు. పెద్దవాడు కృష్ణమ్మ తుమారుడు వెంకటరాజు. రెండవవాడు తిమ్మమ్మ కుమారుడు అంకరాజు. మూడవవాడు లింగమ్మ కుమారుడు అయ్యప్పరాజు. నాల్లవవాడు తిమ్మమ్మకు అంకయ్య తరువాత పుట్టిన తిమ్మరాజు. నాల్గవ భార్య వెంగమ్మకు చినవెంకటరాజు జన్మించాడు. ఇతడు అయిదవవాడు. ఇతడిని వెంకటప్పురాజు అనికూడా పిలుస్తారు. వెంకటప్పరాజు వందవాసి రాజధానిగా పాలించేవాడు, అయ్యప్పరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతని కాలంలోనే ప్రళయకావేరిలోని డచ్చివారు, మైలాపూరులోని పోర్చుగీసువారు పరస్పరం పోట్లాడుకొంటూ ఉండేవారు. ఈ యుద్ధాలను ఆపడానికీ ఆ రెండు పట్టణాలకి మధ్య తన తండ్రిపేర చెన్నపట్టణం నిర్మించాడు. ఈ సంగతి దామెర్ల అంకరాజు తన ఉషాపరిణయంలో ఇలా చెప్పాడు: ప్రళయకావేరి మైలాపురంబుగల్మి- వీరమున బోరనది మట్టుపెట్ట తండ్రీ పేర దన్మధ్యభూమిని బృథువిభూతి - నలపరిచె చెన్నపట్టణమయ్యనృపతి. (ఉషాపరిణయం, 1-9%) ప్రళయకావేరిని ఇప్పుడు పులికాట్‌ అంటారు. ఇది పొన్నేరికి 10 మైళ్ల దూరంలో ఉంది. మైలాపూరు నేడు మద్రాసులో ఒక పేట. ఈ రెండింటి మధ్య చెన్నపట్టణాన్ని ఎప్పుడు నిర్మించారన్నది ఒక ప్రశ్న క్రీ.శ 1544 అని టంగుటూరి ప్రకాశంగారు, 1550 అని నిడుదవోలు వెంకటరావుగారు చెప్పారట. అయితే ఈ తారీఖులు చారిత్రకంగా నిలుస్తాయా లేదా అని చూడాలి. డచ్చివాళ్ల వ్యాపార నౌక మొట్టమొదట క్రీ.శ 1595 ఏప్రిల్‌ 2వ తారీఖున తూర్పు సముద్రాలపై ప్రయాణం చేసింది. ఈ నౌకాయానానికి ఆజ్ఞలు జారీ చేసిన జూన్‌ హ్యూషెన్‌వాన్‌ లిన్స్‌చోటెన్‌ క్రీ.శ1563లోగాని జన్మించలేదు. ఈ వ్యాపార నౌక క్రీశ 1597 ఆగస్టు 20 తేదీన కొన్ని విలువైన దిగుమతులతో మాతృదేశం చేరుకొంది హాలెండ్‌లోని వర్తకులు ఈ నౌకాయానం పురస్కరించుకొని క్రీశ1602 మార్చి ణి 4. 1816లో జరిగిందని నేలటూరి వెంకటరమణయ్యగారి భావం. తోపూరు యుద్దానికి వెడుతూ తంజావూరు రఘునాథనాయకుడు క్రీ.శ. 18616 జూన్‌ 8వ తారీఖున పలమనేరులో మకాం చేశాడు. (రఘునాథనాయకాభ్యుదయం, ఇంగ్లీషు పీఠిక, పుట 23) 5. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం 131 పుట 728

దామెరల కవులు - కాకమానిమూర్తి కవి 657 తారీఖున డచ్చి ఈస్తుఇండియా కంపెనీ స్థాపించారు. డచ్చివారికీ, పోర్చుగీసువారికీ అంకన్న చెప్పాడు. డచ్చివాళ్లు క్రీ.41602లోగాని వ్యాపార సంస్థను నిర్మించలేదు. క్రీశ1610లోనే వాళ్లు పులికాట్‌ వద్ద ఫ్యాక్టరీ నిర్మించారు.” ఇది చూసి పోర్చుగీసువారు మండిపడి క్రీ.శ. 1612-13లో డచ్చివాళ్లతో యుద్ధం చేసి వాళ్లను వెళ్లగొట్టారు. మళ్లీ క్రీ.శ 1614లో పులికాట్‌ డచ్చివాళ్ల స్వాధీనం అయింది. ప్రళయకావేరికీ, మైలాపూరుకూ క్రీశ 1615 దాకా తొలియుద్దాలు నడిచాయి. శ్రీ.శ. 1621లో ఇంగ్లీషువాళ్లు కూడా పులికాట్‌లో ఒక గిడ్డంగి కట్టుకొన్నారుగాని డచ్చివారితో గొడవులు పెట్టుకోలేక దానిని క్రీశ 1623లో విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ పరిస్థితుల దృష్టా అయ్యప్ప క్రీ.శ 1625 ప్రాంతాలలో తన తండ్రిపేర చెన్నపట్టణం నిర్మించాడని భావించవచ్చును. 1639లో ఇంగ్లీషువారు చెన్నపట్నం చేరుకొన్నారు.

చెన్నపట్టణ నిర్మాణానికి కారణం చెప్పిన అంకరాజు ఆ నగరం కట్టిన తరువాతనే తన గ్రంథం బ్రాసి ఉంటాడని వేరే చెప్పనక్కరలేదుగాని చెన్నపట్టణం కట్టిన కాలంలో అంకన్న తన ఇంకో సోదరుడు వెంకటాద్రి చెంజిరాజుని ఓడించి తన తండ్రీపేరిట సాగరం ఒకటి నిర్మింపచేసి అదే పేరుతో పక్కన ఒక ఊరు కట్టించినట్టు చెప్పాడు (ఉషా. 1-92). క్రీశు 1649లో చెంబిదుర్వాన్ని వరదప్పనాయకుడు మహమ్మదీయుల కైవసం చేశాడు. అంతతో చెంజినాయకరాజ చరిత్ర సమాష్తమైంది.* అందుచేత ఉషాపరిణయం శ్రీ.శ.1649కి ముందు, 1625కి తరువాత పుట్టిందని చెప్పచ్చు.

ఇది అయిదాశ్వాసాల కావ్యం. దీనిని కలలో కనబడి అడగడం వల్ల అంకన్న దేవునికి అంకితం ఇచ్చాడు. తన కల సంగతి చెప్పగానే సోదరుడు వెంకటా ద్రి నిండుసభలో ఇలా అన్నాడట

అనఘాత్ములారః మాయం - కన నిన్నటి రేయిగన్న కల వింటిరె మ

మ్మునుగృతి తన కిమ్మనెన - య్యినకులు కారుజ్యమహిమయెంతనవచ్చున్‌?

(ఉషా. 1-42) ఈ పద్యం వల్ల అంకన్నేకాక అతని సోదరుడు వెంకటాద్రి తూడా ఒక కావ్యం వ్రాసి శ్రీరామునికి సమర్పించాడని తెలుస్తూంది. అయినా ఆ కావ్యం పేరుగానీ, అందులోని విషయంగాని ఏమీ చరిత్ర తెక్కలేదు. తన తమ్ముని కల సంగతి చెప్పాక సభలోనివాళ్లు "రఘురామునకున్‌ అంకితమొనరింప మీరంకనృపతి కానతియొసంగు'డని చెప్పారట. దేవునికి కావ్యం ఇవ్వటానికి తూడా ఆ రోజులలో రాజాజ్ఞ కావాలి కాబోలు. ఆ 6. దొండెంంంయు కరగటం, ౪0 7 (0769 7. జ్య రకంగ 0% సంరులు. గెంర్రంం - కు నంత 8. మధుర తంజావూరు నాయకరాజుల నాటి ఆంధ్ర వాబ్బయ చరిత్ర - నేలటూరి వెంకటరమణయ్యగారు, పుట 70, అధోజ్ఞాపీకు

656 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అలర జేయగ నేర్తు వవహాయశూరత ఘటికాశత గ్రంథకల్చనంబు సవరింపనేర్తువు సర్వతోభద్ర కంకణబంధముఖ చిత్రకావ్యరచన ప్రకటింపనేర్తువు వికచపంజకబ్బంద మకరంద నిష్య్కంద మధురఫణితి ఘటియింపనేర్తువు కమనీయపదబంధ సంధాన సరస విస్తరణ సరణి నీ౭ తగునౌ నచుంబితార్జెక తాస జాతి వార్తాఢ్యకవనలీలాతిరూఢీ యరినృపాఖర్వగర్వ సంహరణజా గ్ర దాగ్రహాటోపదామెరంకయ్యభూపష. (ఉషా. 1-46) ఈ పద్యంలోని ఇతర గుణాల సంగతి ఎలా ఉన్నా సర్వతోభద్ర కంకణబంధాల వంటి చిత్రకవిత్వ రచన అంటే అంకన్నకు చాలా ఇష్టమని చెప్పవచ్చును. ఒక పద్యంలోనే పద్మబంధం, శ్లషబంధం అనే ఆరు బంధాలకు ఈ పద్యం చెప్పాడు. సురచరవరహారం సుత - పరభార హర ధర ధరదర కరపరతారధరి స్థిరతర ఖరపుర హర - శరసుర పరభర పరమురహర హరసుర సారకరా. (ఉషా. 2-61) వాములు మింగే స్వాములవారికి గడ్డిమోపులు ఫలహారం. ఒక పద్యంలో 10౫ అంకన్నతు ఒక పద్యాన్ని అరేడుబంధాలకు సరిపోయేటట్టు వ్రాయడం నల్లేరు మీద బండినడక. 1068 కందాలను సాధించగల పద్యాన్ని ఏకాదశబంధగర్చ కంకణ బంధకందం అన్నాడు. ఇందులో ' ప్రదక్షిణమాన విష్ణుస్తుతిని పద్యాలేభయినాలుగున్నుు అప్రదక్షీణ త్రమాన శివస్తుతిపరాలైన కందాలేభయి నాలుగున్ను కలిపి, 108 కందాలు, గర్చిత కందాలు, ఖడ్గబంధమున్ను, అష్టాదశదళ పద్మబంధమున్ను చక్రబంధమున్ను, ద్వాదశదళ పద్మబంధ మున్ను, ద్వాత్రింశద్దళ పద్మబంధమున్ను. షడ్డళపద్మమున్ను. షట్కోణబంధమున్ను, గోమూత్రికాబంధమున్ను' ఉన్నాయి. ఆ సర్కసు పద్భుం చూడండీ. వరదా వరదా భరదా - పరద పరద భరద వరద పరదా భరదా వరదా సరదా భరదా - పరద పరద భరద వరద సరదా భరదా. (౧. 427 పుట 18) ఈ పద్యంలోని పరదాలకు, వరదలకు ఏకాక్షరనిఘంటువుతో అర్థం చెప్పుకోవాలి. ఇందులో 54 అక్షరాలున్నాయి. ఈ అక్షరాలనే పొడిగించి, పొట్టిచేసి ప్రదక్షిణక్రమంలోను, అప్రదక్షిణక్రమంలోను 108 కందాలు చచ్చి చెడీ ఇసుకలోంచి శైలం పిండినట్టు పిండవచ్చు. వరదాలు పరదాలూ కొంతసేపటికి 'పదరా పదరా భదరా'లుగ మారుతాయి. మరికొంతసిపటికి “ధరవా దరభా దరపా' అని మారుతాయి. ఈ ఫలకంబు మీద నేబదినాల్గు లఘు వర్ణములు గంకణాకారముగ లిఖించి ప్లుతయుత సంబుద్ధి పాసగించి వేర్చేర సగణత్రయం' బాది సంఘటించి

దామెరల కవులు - కాకమానిమూర్తి కపి 659

నలఘుత్రయిలోన నెలకొల్పిమరింటి యట్టుల సగణ ద్వయంబమర్చ

దళమగు రెండవ దళము నిట్టు లమర్చి వళులు ప్రాసంబులు గలుగజేయ

గదమను ప్రతివర్జ మీగతి బైదక్షి

ణ ప్రదక్షిణారచనల హరిహరనుతి

నూట యెనుబదికందముల్‌ నూలుకొలిపె

దామరంకనసుకవి సంతతులు మెచ్చ. (౧.427, పుట 180

ఈ రకంగా వచ్చే 108 పద్యాలలోని 1728 గణాలతో ఏర్పడే రెండువేల పైచిలుకు మాటలకు అర్గాలు చెప్పుకొన్న పీమ్మటే పాఠకుడు తరువాత పద్యానికి సాగాలి. బొత్తిగా పొద్దుపోనివాడు తప్పించి ఇంత సాహిత్యజంజాటం పెట్టుకోలేడు. ఉషా పరిణయం చాలాకాలందాకా అచ్చుకాలేదు? దాని అముద్రిత ప్రతి మద్రాసు ప్రాచ్చలిఖిత లంథాలయంలో ఉంది (0427). తొలిపుటలో ఎవరో బహుశా బౌనుదొరగారు "గ ౧ంరేతరం ౦0౧౧౧౦౪6౦౧ ఈ ఇం8కీ ౪౪4 (“కొద్దిపాటి విలువగల విద్యాగర్వభూయిష్టరచన') అని వ్రాశారు. అది అక్షరాలా నిజం. ఈ కావ్యంలో కవిత్వం కంటే కసరత్తే ఎక్కువ.

దామెర్ల అంకన్న తన పినతండ్రి వెంగళరాజుగారి లాగ సాఫీగా కవిత్వం చెప్పనట్టు కన్పించినా కొన్నిచోట్ల ఆయన పోలికలు లేకపోలేదు. బాణాసురుడు ఈ కావ్యంలో ఆఖర్న ఒక విందుభోజనం పెడతాడు. దీనిని వర్ణిస్తున్నప్పుడు అంకన్న బహుళాశ్వచరిత్రలో లాగే సుదీర్తంగా బ్రాశాడు. '"సరసకావ్యంబునకు బలె నానారససమన్వితంబును, రంగస్థలంబును, ననేక సువర్ణ పాత్రాంచితంబును' అయిన భోజనశాలను పెద్ద వచనంలో టహ్రాంసించి, అందులో హరిహరులను ప్రవేశపెట్టి 33 గద్యపద్యాలలో దామెర్ల అంకన్న విందు చేయించాడు. వెంగళరాజుగారి బహుళాశ్వ చరిత్రలో 52 గద్యపద్యాల విందుంది. రెండింటిలోనూ విస్తళ్లు వేయడం దగ్గిరనుంచి చేతులు కడుక్కోడందాకా విపులమైన వర్ణన ఉంది. ఈ రెండు కావ్యాలలోనే కాక కాకమాని మూర్తి అనే మరోకవి వ్రాసిన కావ్యాలలో కూడా ఇలాగే భోజనవర్ణన సుదీర్రంగా ఉంది. అతడు రాజవాహనవిజయం అనే ప్రబంధంలో ఒక విందును 13 పద్యాలలో వర్ణించాడు (2-96 నుంచి 108 దాళా). పాంచాలీపరిణయం అనే మరొళ కావ్యంలో 27 పద్యాలలో విస్తళ్లముందు కూర్చోవడం మొదలు చేతులు కడుక్కోవడందాకా వర్ణించాడు (4-34 నుండీ 60 దాకా). ఈ రెండు కృతులే కాత కాకమాని మూర్తి తూడా బహుళాశ్వవిజయం అనే కావ్యం వ్రాశాడని ఒక అనంతరలాక్షణికుడు చెప్పాడు. అందులోని ఉదాహరణలను ప్రమాణాలుగా చూపించాడు. అయితే అవన్నీ దామెర్ల వెంగళరాజుగారి బహుళాశ్వచరిత్రలో కనబడతాయి. ఈ ప్రయోగాలు ఇచ్చిన లాక్షణికుడు కూచిమంచి తిమ్మకవి. ఇతడు క్రీ.శ1715 నుంచి 1750 దాకా రచనలు చేశాడు. ఇతని లక్షణ గ్రంథం పేరు సర్వలక్షణసార సంగ్రహం. అందులో “కాకమాని రాయని బహుళాశ్వచరిత్ర నుండి అని చెప్పి ఉదాహరించిన పద్యాలను, అవి వెంగళరాజుగారి పుస్తకంలో ఏ ఆశ్వాసంలో ఎన్నో నెంబరు పద్యాలో ఈ పట్టికలో పొందుపరిచాను. చూడండీ. 9. 198లో డాక్టర్‌ గాలి గుణశేఖర్‌ దీనిని సంళోధించి చక్కని ముద్రణం వెలువర్చారు.

660 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి బహుళాశ్చ చరిత్రనుండి తిమ్మకవి ఉదాహరించిన పద్యాలు పారసంగ్రహం | కాళ్చ చరిత్ర

  1. | అంచువ్రాయడి వన్నైరాబులు గుటేడాసీనులూతలొనం బంచాస్యంబుల డుల్లు పాపదొరగ్రామ్య బ్రహ్మచారుల్డునా 1-సంధి-210 క5-218 లించం బచ్చన బాత్ర లూడీపడు మేల్కీల్లుణ్ణ మన్కంబులౌ చంచద్వాహములుంచు మంటపము పంచం జేరివిశ్రాంతుడై,
  2. | లెక్కలు పెట్టగవచ్చుం - జుక్కల దద్బక్ష్యభోజ్య చోష్యాదుల క చృుక్క మణిలెక్కయెక్కడి - దక్కడ యొక్కొక్క కడీవెయారులు సేయున్‌ 2-6-శబ్ద -118 (4-53
  3. | అంగమునన్‌ కురంగమద మందముగాగ నలంది మౌళి సం పంగి విరుల్‌ సిరుల్లన రుమాలుధరిం బిరుటంపుడంగి ఫై రంగుమెఅంగు బంగరు చెజంగుల రెంటెము నాల్గుకొంగులు నింగులు వారగట్టి సుమణీ రమణీయ సరాఖి రాముడై (దీనిలో పాదాన్నే తిమ్మకవి ఉదాహరించాడు) ౩-సాధురేఫ-51 (4-5
  4. | అరేడు వగలబారు- ల్నూరువిధంబుల రసావళుల్‌ వేయువహల్‌ తూరలు బచ్చళ్ళూ ర్చిండ్లూరుంగాయలకు లెక్కయున్‌ మజికలదే 5, | కరారుమెణుగు తలనుదారున్‌ నారుల్వోసిన విలోకనమ్ముల నారుల్‌| ౩-శరేఫ- 19 (4-92 యారాజువగలబెట్టిన యూరుంగాయలుఘటించి కొండొరులెడలన్‌!! ౩ - శ రేఫ - 161 ౩-శరేఫ- 18 4-3
  5. | ఒకమాట చక్కెర పానకమా చను సౌరు సామనసకందు కమా తృకనూ ఈ నాతుక మానికమా మొకమోసరోజనారి ఫరగనూ | సర్వ 1-సంధి4? దామెర్లవారి గద్భు కనబడుతున్న పుస్తకంలోంచి ఉదాహరణలిస్తూ “కాకమాని రాయని బహుళాశ్వచరిత్రలోంచి' అని కూచిమంచి తిమ్మకవి ఎందుకు చెప్పాడో భావి పరిశోధనవల్ల గాని తీలదు. కాకమానిరాయని గ్రంథాలలోనూ, దామెర్లవారి కావ్యాల లోనూ భోజన ఘట్టాలు ఒకేరకంగా ఉన్నాయి. కాకమాని మూర్తికవి దామెర్లవారి ఆఖ్రితుడై వాళ్లతు కావ్యరచనలో సహాయం చేసీ ఉంటాడు. అతడే కొన్ని వ్రాసి వాళ్ళ పేరు పెట్టాడని అనుమానించడం చాలా సులభమేగాని నిరూపించడం ఎంతో కష్టం. సాహిత్య డిటెక్టివులు ఎన్నో విషయాలు దర్యాప్తు చేస్తినేగాని ఈ సమస్య తేలదు. ప్రస్తుతానికి దామెర్లవాళ్లూ, కాకమాని మూర్తీ ఒక కాలంవాళ్ళని మాత్రం చెప్పవచ్చును. ఇతడు వ్రాసిన ఇతర గ్రంథాలు రెండు లఖిస్తున్నాయి. గాని అందులో ఇతని గురించి వివరాలేం లేవు. ఇతని తండ్రీ రామలింగభట్టు. వీళ్లది తౌండిన్య గోత్రం. కాకుమాను అనే గ్రామం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలో ఊది. మూర్తికవి పూర్వీకులు ఈ గ్రామంనుంచి కర్ణాటక రాజ్యానికి వచ్చి ఉంటారు. తన

దామెరల కవులు - కాకమానిమూర్తి కవి 661 గ్రంథాల గురించేగాని తన గురించి కవే చెప్పుకోలేదు కనుక మనం తూడా వాటిని గురించే చెప్పుకొందాం.

మన ప్రబంధకవులలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. పెద్దనగారి అల్లికలో జిగి, బిగి ఉంటాయి. ముక్కు తిమ్మనగారి పలుకులు ముద్దు ముద్దుగా ఉంటాయి. రామకృష్ణుడు పదగుంభనానికి ప్రసిద్ధుడు. ఈ ప్రత్యేకతలను తొలిసారిగా పేర్కొని అవన్నీ తనలోనే ఉన్నాయని కాకమాని మూర్తి చెప్పుకొన్నాడు. అతడు పాంచాలీ పరిణయం వ్రాద్దామనుకొనే రోజుల్లో ఒకనాడు కలలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై అతనితో ఇలా అన్నాడట:

బాండురంగ సుకవి పద్యంపు హరువును - గాకమానిరాయ నీకె కలదు

(పాంచాలి 1-13)

అంతటితో దేవుడు ఊరుకోలేదు. శ్రీమూర్తికవిని *“తెనుంగు కవితావిరించివి” అని హ్రాంసించి పాంచాలీ పరిణయం అంకితం పుచ్చుకొన్నాడు. మరోసారి మూర్తి కవి ఇంతో కావ్య కథనానికీ గ్రథనానికీ సమకట్టి ఉన్న సమయంలో మళ్లా దేవుడు కలలో కనబడి ఆ పుస్తకం తూడా తనకు ఇమ్మన్నాడు. కవినిలా మెచ్చుకొన్నాడు:

కృతిలో ప్రతిపద్య చమ-త్కృతి గులుకగ బలుకనేర్చు కృతివీవుమహా

కృతిచమూ కొనరుచుభాషా-కృతి భారవి కాకమాని శ్రీమూర్తికవీ. (రాజు 1-19)

దేవుడు *ప్రతిపద్య చమత్కృతి అని అంటే భక్తుడు తన రచనలో ప్రతి పద్యమే కాదు. వాటిలోని ప్రతి వాక్ళమూ ఉన్నతి ఉన్నదే అన్నాడు. అసలు కృతి మొదలు పెడుతున్నప్పుడు దేవతలను చమత్కృతికోసమే ప్రార్థించాడు. 'గజూన్యుం డీచ్చు కృతికిష్ట వచోరచనా చమత్కృతుల్‌ (రాజ 1-5) అనీ, “భారతి ఇచ్చుగాత బతిభారతి మత్కృతికిం జమత్కృతినో (రాజ 1-6) అనీ అర్థించాడు. అంకితం అడగడానికి కలలో ఏడుకొండలవాడు ప్రత్యక్షమైన వైనం కవి ఇలా చెప్పాడు:

ప్రత్యక్షంభై నాపై - ప్రత్యక్షరహృద్యగద్య పద్య సముద్య

త్కృత్యక్షయ రచనార్థ - ప్రత్యక్షరఫణితిపైగృపారసమొల్కన్‌. (రాజ, 1-6)

ప్రతిపద్యంలోనూ,. ప్రత్యక్షరంలోనూ చమత్కృతి చూపించాలనే తాపత్రయం చేమకూర వెంకటరాజుగారి విజయవిలాసం ప్రచారంలోకి వచ్చాక ఎక్కువైంది. చమత్కార బంధురంగానే గాత రాజవాహన విజయాన్ని కాకమాని రాయడు సలక్షణ ప్రబంధంగా రూఫొందించాడు. ఇందులోని కథ పాతదే, దండి రచించిన దశకుమార చరిత్రలో రాజవాహనుడు కథానాయకుడు, రాజకుమారుడు. ఇతని కథతోపాటు మరి తొమ్మండుగురు కుమారుల కథలు కలిపి దండి దండిగా దశకుమారచరిత్రను వ్రాశాడు. దానిని మూలఘటిత కేతన కాకతీయ యుగంలోనే అనువదించాడు. దశకుమారచరిత్ర లోని ఇతర కుమారుల కథలను మినహాయించినా అష్టాదశ వర్ణనలలో ఏ ఒక్కటి

662 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మినహాయించకుండా ఒక్క రాజవాహనుని చరిత్రనే మూర్తి కవి అయిదాశ్వాసాల ప్రబంధంగా వ్రాశాడు. కావ్యంలో కథానాయకుని ప్రతిభకన్న కవిగారి ప్రభే అతిగా ప్రకాశించాలనుకొనేకాలం కనుక మూర్తి కవి తన ప్రజ్ఞ చూపెట్టడానికే ఈ కావ్యం రచించాడు. అది రకరకాల పోకడలు పోయింది. రాజవాహనుని పురిటివార్తను రాజుగారికి చెలికత్తెలు వినిపించారు. “పురుడు' అనే మాటకు సమానం అనే అర్థం తూడా ఉంది. చమత్కరించడానికి అవకాశం ఉంటే కవిగారు ఊరుకొంటారా? పురిటి సమయంలో 'పురుడు' అనే మాట పట్టుకొని ఇలా పద్యం చెప్పాడు వ్‌ పురుడుపరిపాలితాలకాపురు శేష - భుజగనూపురుడును గాక పుడమిగలడె? యనగ సిరిగన్న రాజన్య తనయమణిని-హర్షమందిరి యంతఃపురాబ్బ్దముఖులు. (రాజ 2-17) పురిటికందు అలకాపురం పాలించే కుబేరునికి, భుజగనూపురాన్ని ధరించే ివునికి సమానుడట. సమాసాలు కట్టడానికి సరిపోతాయి కాబట్టి ఈ సామ్యాలు తెచ్చాడేగాని చమత్కరిస్తున్నప్పుడు ఈ పద్యంలో ఇవే మాటలు ఎందుకు వాడాలి, ఈ పోలికలే ఎందుకు తేవాలి అన్న ఆలోచనలు మనకి వస్తాయిగాని కవిగారికి రాలేదు. ప్రతి పద్యంలోనూ చమత్కరించాలన్న తాపత్రయమేగాని అది అతుకుతుందా అతకదా అన్న గొడవే లేదు. అవసరం లేని చమత్కారాలు చేసినా, మూర్తి కవిలో ఒక సుగుణం ఉంది. తన కావ్యంలో సమకాలిక జీవితాన్ని బాగా ప్రతిఫలింపజేస్తాడు. రాజవాహనుడు యువరాజు పట్టం కట్టుకొని దిగ్బ్విజయానికి బయలుదేరాడు. ఆ యాత్రను మూర్తి విపులంగా వర్ణించాడు. సలాము చేస్తూ యవనవాాతం వచ్చింది. తరువాత క్రైజీతపురాజులు, కత్తులూ, అరిగెలూ పట్టుకొన్న బంట్లు ఒంటరిమూకలు కదిలాయి. దండుతోపాటు దండుముండలు కదిలారు. ఒకరితో ఒకరు పరిహాసాలు అఆడుకొన్నారు. రాజుగారి భోగపత్ని పరదాలున్న పల్లకిలో కదలింది. పట్టెవర్థనాలున్న ఇద్దరు బ్రాహ్మణులు రాఘవాష్టకం చదువుతూ కదిలారు. రాజుగారి ముద్దులమరిది అప్పగారి పల్లకిలోనే కదిలాడు. కథ చెప్పుతూ ద్విపద పాడే బ్రాహ్మణుడు వెంటరాగా రాచమూకలు సాగాయి. పంటపొలాలు దున్నేస్తూ, అడవులు తగలెడుతూ పంటకాపులు కంట నీరు పెట్టేటట్టు రాజు దండు దిగాడు. భోజనం చేశాక ఈగలు తోలుకొనేవారు. గుర్రపు వెంట్రుకల కుంచెతో విసురుకొంటూ గజ్జితో బాధపడేవారు, చాపలతో కట్టిన పాఠలో ఉన్న అంతఃపుర స్త్రీలను కొలుచుకొనే గణికలు, దండు కదలినప్పుడు ఇష్టమైన ధాన్యాలూ అవీ వదిలేశామే అని ఏడ్చేవాళ్లు - ఇలాగ రకరకాలవాళ్లు ఆ దండులో ఉన్నారు. అందులో లెక్కలు వ్రాసే నియోగితూడా ఉన్నాడట. అతడు ఎప్పుడూ అంతెలలాగే కన్పిస్తాడట. చలిగాలి వీచి విల్లు వంగినట్టు వంగొతే ఒకటి (౧) లాగా ఉంటాడట. గుండెలమీద తలపెట్టుకొంటే రెండు (౨) లాగా ఉంటాడట. కాళ్లు ముడుచుకొని పడుకొంటే మూడు (3) లాగా కనబడుతాడట. నిద్దరపోతున్నా ఈ బక్క నియోగి లెక్కలు మానడని భటులంటూ వుంటారకటు.

దామెరల కవులు - కాకమానిమూర్తి కవి 663 ఇలాంటి వాళ్లందరితోటి దండెత్తిన రాజవాహనుడు ఒక్క సీస పద్యంలో కుంతల సింధు సౌరాష్ట్ర గాంధారాది దేశాధిపతులని అవలీలగా, అద్బుతంగా జయించాడు. రాజవాహనుడు వింధ్య శైలం దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక తపోవనం ఉంది. అది శాండిల్యమునిది. రామాయణంలో భరద్వాజుడు విందు చేసినట్టు ఈ మునికూడా రాజవాహనుణ్జీ సేనాసమేతంగా భోజనానికీ పిలిచాడు. కవి రాజవాహనునిచేత స్నానం చేయించి, బొట్టు పెట్టించాడు. పసిడి హ్లారాల చుట్టూ “తెగబారె డనటి మేలిమి చిగురాకులు' వేయించి నీళ్లు చిలికించాడు. విందు వర్ణింపసాగాడు. బంతుల వెంబడీ వడివడిగా వడ్డనలు చేయించాడు. షడ్రసోపేతంగా తినిపించాడు. చల్లని నీటితో చేతులు తాంబూలాలిప్పించాడు. అంతటితో పొద్దు వాలింది.

దండయాత్రకు బయలుదేరిన రాజవాహనుడు మెల్లగా విందుభోజనాలు చేస్తూ మాళవదేశానికి వచ్చాడు. ఆ దేశపు ,రాజకుమార్తె అవంతి సుందరి వనవిహారం చేయడం చూశాడు. ఆమె అతణ్ణి చూసింది. చూసీ చూడగానే ఆ రాకుమారికి వచ్చిన భావాలు మహాదొడ్డవి. ఈ అబ్బాయి పెదవి మీద గంటుపెట్టగలిగే యువతి భాగ్యం ఎలాంటిదో తన చెలికత్తె నడిగింది.

కంటీవె కల్పకంటి మనకంటికి వేలుపు గట్టుచంకీ పా

లింటికి దుంటవింటిదొర లీలలమీరిన మేటిబోటియా

పంటవలంతి రేడు మణివంటి చొకారపు మోవిపై

గంటి యొకింత సేయు కలకంఠి యకుంఠిత భాగ్యమెట్టిదో। (రాజ 3౩-132) ముద్దుపెట్టుకొనడం కాక పెదవి గంటు చేద్దామనే కోరిక తొలిచూపులోనే కలిగే ముగ్ధలు ప్రబంధాలలోనే ఉంటారు. శ్లేషలో విరహబాధనుపడే నాయకులు ఠూడా అక్కడే కనబడతారు. రాజవాహనుడు అవంతిసుందరి కోసం పరితపిస్తూ ఎలా తన భావాలు చెప్పాడో చూడండి

అతిమధురంబుగా వెదవి యభముగా నెరికొప్పు జ్యోత్సగా

సతతము లేతనవ్వు ఘనసారముగా నునుదేటమాట యం

చితదరదంబుగా గళము చిత్రముగా నిలువబ్ద నేత్రస

మృతి గనుగొన్‌ రసజ్ఞునకు మందునకుం దగ వందమందదే? _ (రాజ, 4-12) ఇందులో రెండర్గాలున్నాయి. అ చిన్నదాన్ని చూస్తే పెదవి అతి మధురంగా, కొప్పుమేఘంలాగా, నవ్వువెన్నెలలాగు పలుకులు పచ్చ కర్పూరంలాగా, కంఠం శంఖాన్ని చీల్చే దరదంలాగా సరసునికే కనపడినప్పుడు మూఢులు ఎందుకు మోహించరు అని ఒక అర్థం. రసవైద్యం చేసే వైద్యుని కీ అమ్మాయి పెదవి అతిమధురం అనే గ్రంథ్యాణంలాగ, కొప్పు అభ్రకంలాగు నవ్వు పొట్టతీగెలాగు పలుకులు పచ్చకర్పూరంలాగ, కంఠం పాదరసంలాగ కనబడతాయట. అందం మందుకు తగినట్టు అమరుతుందట.

664 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అయితే మన ప్రబంధ నాయకుల విరహానికి మందు వివాహమే. మూర్తి కవి త చిత్తమొచ్చినంత టైము తీసుకొని ఇష్టమొచ్చిన వర్ణనలు చేసి చివరకు నాయికా నాయకులక్ష పెళ్ళి చేశాడు. సారెగదిలో భార్యాభర్తలు ప్రవేశించారు. అతడామె పైట లాగాడు. అమె చేతులతో గుండె కప్పుకుంది. అప్పుడా రెండు చేతులూ స్వస్తిక బంధంలో రెండు భుజాలను అంటుకున్నాయి. ఆమె కుస్తీకి తలపడే మల్లు జిబ్బ చరుస్తున్నట్టు కనబడిందట! అష్టాదశ వర్ణనలలో ఒకటైన రతినితూడా వర్ణించాక కావ్యాన్ని అంతం చేయవచ్చు. అయితే మూర్తి కవి ఒక్కసారి లెక్కవేసి చూసుకొన్నాడు. అన్ని ప్రబంధాలలో ఉండే వేసవి వర్జన తన కావ్యంలో లేదు. ఎందుకేనా మంచిదని ఒక నాల్గు పద్యాలలో ఎండాకాలాన్ని వర్ణించి కావ్యం అయిందనిపించాడు. ఈ ప్రబంధంలో మొత్తం 581 గద్యపద్యాలున్నాయి. కాని కథ లేదు. దశకుమార చరిత్రలో దండి బోలెడు కథ చెప్పాడు. దానిని ఇంత క్లుప్తంగా ప్రబంధీకరించడానికి ధైర్భ్యముండాలి. దండి కావ్యంలోని సజీవ పాత్రలను మూర్తి కవి ఉత్త కీలుబొమ్మలుగా చేసినందుకు బాధ కల్గుతుందిగాని, దండిలాగే ఇతడూ తన సమకాలిక జీవితాన్ని కావ్యంలో ప్రతిఫలింపజేసినందుకు అఖినందించాలి. ఆ కాలంలో రాజులు సామంతులు ఎలా దండు కదలేవారో, ఆనాటి ఆచార వ్యవహారాలేమిటో రాజవాహన విజయం బాగా స్పష్టపరుస్తుంది అనాటి దండయాత్రలలోని సాంఘిక వివరాలను ఈ గగ్రంథంలోనుంచి క్రోడీకరించి సురవరం ప్రతాహరెడ్డిగారు సుదీర్ణంగా పొందుపరిచారు* రాజవాహన విజయం వ్రాశాకనో, దానికీ ముందో మూర్తి కవి పాంచాలీ పరిణయం అనే అయిదాశ్వాసాల కావ్యాన్ని వ్రాశాడు. నన్నయగారు సుమారు 130 గద్యపద్యాలలో చెప్పిన ద్రౌపదీ కల్యాణ కథను మూర్తి కవి 403 గద్య పద్యాలలో ప్రబంధంగా బ్రాశాడు ఇది బహుశా అతని ప్రాథమిక రచన కావచ్చును. పద్య రచనలో అల్లసానివాని అల్లికను అనుసరించడం కనపడ్డా, పాండురంగవిభుని పదగుంఫనం జటిలంగా లేదు. అచటి ప్రాజ్ఞుల కమర్తాాచార్యు డజ్ఞాతఫణితి పత్రిక వ్రాసి పంట తెలియు అచటి రాజనివాస మస్రాసనాభ్యాస భాగ్యంబునకు గాచు భార్గవుండు అచటి కోమటుల యీక్షాధ్యక్షుడవసరంటై యప్పు పదియ్రైదులడుగబంపు అచటి రెడ్డికొమాళ్ల నలహలాయుధపాణి నాగునకడుగు ధాన్యంబుకొంత అచటి యొకపాటి దొరమదహస్తులకును అచటి వేరాచలాయింపుటలతి తేజ కింత రెండవతరబడి యింద్రహయము. (పాంచాలీ 1-౫) రాజవాహన విజయంలో లేని ఒక సుగుణం పాంచాలీపరిణయంలో కనబడుతుంది మొదటిదానిలో సమకాలిక జీవనమే కనబడుతుంది గాని రెండోదానిలో దానితోపాటు సమకాలిక భాష తూడా వినబడుతుంది. పాంచాలీపరిణయాన్ని చూడడానికి గ్రామ సుధీజనం వచ్చిన వైనాన్ని మూర్తికవి ఇలా చెప్పాడు. ననననన తస నన ఎ తనంనననన వనం 10. అంధ్రుల సాంఘిక చరిత్ర, పుట 220-223.

దామెరల కవులు - కాకమానిమూర్తి కవి 665

ఇప్పుడేతెంచితిరే లెస్సలా మీపురాణంబు విందురా రాచవారు

రామవధానికి క్షేమమా సామమాద్యంతముల్‌ మా వద్ద నభ్యసించె

మా శిష్యుడే వారి మాధ్వరి పిన్నవాడ మును చెప్పితిమి కాండ త్రయంబు

నోహుహోహో కంటిమేహరిన్‌ మన జనార్దను సూత్ర పాఠమెందాకవచ్చె

నారసింహముపేరిటి నడిమివాని

వడుగుచేసితిరో లేదో పడుచు పెండ్లి

వింటి మేక దయను కొండ్రువీధిజేరి

యుత్సవము జూడవచ్చినయూళ్లద్విజులు (పాంచాలీ 1-71)

ఈ స్మార్తులేకాక అళఘుసింగరి ఉప్పళి అప్పయాళ్ళార్‌, భట్టరు పాటరు, వడగునంబి అప్పుగారు మొదలైన ఆచార్యపురుషులు శ్రీనివాసాయ గారే అడియేనో అనుకొంటూ వచ్చారు. వైదికజూతి ముత్తయిదువులు తూడా వచ్చారు. కూనలమ్మ కోక ఎగగట్టిన కోమట్లు, కోడెరెడ్డు, రెడ్డిసాన్లు మొదలైనవాళ్లు వచ్చారు. వీళ్లతోపాటు పాండవులూ వచ్చారు. వాళ్లు ఒక కమ్మరి ఇంటికీ వెళ్లారు. దానిని మూర్తి కవి కన్నులకు కట్టినట్టు వర్ణించాడు.

అలతి యరంగు ముంజవికి యావపుబూడీద పూతకోత పెం

కల మధురందు నిండుఘటికాత్రయ ధాన్యపు గువ్వలాసనం

బులు గొటెతోళ్ళు బజాగిలపు ముంగిలిచట్టులు చట్టిమూతలుం

గలుగు కులాల గేహము ప్రఘాణము చేరిరి పాండునందనుల్‌ (పాంచాలీ 2-4)

ఆ యింటి యజమానితో 'సెట్టీ, ఈ పూట కిచట వసించెద. మిమ్మీ పట్టని యిచ్చట కుంతిని బెట్టి పాండవులు స్వయంవరానికి వెళ్లారు. విప్రవేషంలో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు. తామే కొట్టినట్టు గ్రామ్యభూసురులు గెంతులు వేసి గొంతులు రాయ, గోయని కూతలు పెట్టారు. రాజులు ద్రుపదునిపై రేగారు. పాండవులు ఆదుకొన్నారు. రెచ్చిన రాజులు జారుకున్నారు. వచ్చిన ప్రజలు తప్పుకొన్నారు.

కలవారి లోగిలిలోని పెళ్ళిళ్ళను కూడా మూర్తి కవి బాగా వర్ణిస్తాడు. ద్రౌపదిని పెళ్ళికూతురిని చేశారు. ముత్తయిదువలు గౌరికళ్యాణం పాడసాగారు. వైష్ణవం పెరిగిన రోజు లాయె. 'గౌరి కళ్యాణమునకేమి కంతుగన్న తల్లి ధవళంబు పాడరాదా లతాంగి' (4-22) అని అభిప్రాయపడ్డారు. పాటలు పాడేవాళ్లు తమలో తాము దెబ్బలాడుకున్నారు.

నీ కేవచ్చు సువాలయుం ధవళ మింతీ యలో నేరేళ్లు గౌ

రీ కళ్యాణము లంచు నింటికడనేరీతిం విజ్బంఖింతువే

నాకే వచ్చటనంచు నిద్దణుసతుల్‌ వాక్యోపవాక్కంబులన్‌

గాకై ముందలపట్లకుం దొడగి రాకళ్యాణ వేదిస్థలిన్‌. (పాంచాలీ 4-24) ఈ ఆడవాళ్లు చేరిన కల్యాణవేదికపై బ్రాహ్మణులు ఎలా ఉన్నారంటే,

అర్జుషలోచనల్‌ పలుకునప్పుడు విప్రులు హోమవేళ మీ

రోర్టులు రండు తెండు సమిధోత్కరమీ యవధాని బ్రహ్మయీ

66 " సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

యర్హుము లోన యీపనస యన్న వసిష్ణులు మీరు శ్రాతముం

దర్వురెయించు బంచుకొని రందలు వేల్చుచు ద్రవ్య దక్షిణల్‌ (పాంచాలీ 4-2) ఈ విధంగా బ్రాహ్మలు సంభాషించుకొంటూ చేయించిన పెళ్లీ అయింది. అందరూ భోజనాలకి కూర్చున్నారు. సుమారు ముప్ఫయి పద్యాలలో మూర్తికవి విందు భోజనాన్ని వర్ణించాడు. సంతర్పణలు వర్ణించడం అంటే మూర్తి కవికి ఒళ్లంతా నోళ్లవుతాయి. తృప్తిగా మూర్తికవి వర్దించగలడు. శ్రీనాథుని తరువాత ఇంతగా భోజనాలను వర్ణించే కవి మరొకడు కనబడడు. (పాంచాలీ. 4-4)

లాక్షణికులు ప్రామాణిక కవిగా పరిగణించిన మూర్తి కవి రచనలను నేటి సాహితీపరులు పూర్తిగా చదివితీ ఎన్నో సాంఘిక విషయాలు తెలుస్తాయి. సాహిత్య చరిత్రలో పేర్కొనవలసిన కొన్ని వివరాలు దొరుకుతాయి. అయితే ఇతర ప్రఖ్యాత కవుల గంథాలలోని రసాలవల్ల కడుపు నిండిన సాధారణ పాఠకులు ఇటువంటి ప్రబంధాలను అక్కడక్కడ రుచి చూసి వదిలేస్తారు.

కడుపు నిండాక గారెలు చేదు. అయిడే నిజానికి కాకమాని మూర్తి కవి కావ్యాలు మసాలా గారెలు. కొన్ని తిరుపతి ప్రసాదం గారెలు. మూర్తి కవి “చంద్రగరి కోట హనుమంతు సన్నుతింతు' (రాజ 1-7) అని చెప్పాడు. కనుక చంద్రగిరిలోగాని, ఆ ప్రాంతాలలోగాని అతని నివాసం ఉండాలి. ఈ గ్రంథం తిరుపతి వెంకన్నకు అంకీతం.

క్షేత్రయ్య

తెలుగు భాషలోని తీయదనాన్నంతా గుత్తకు పుచ్చుకొన్న కవుల తూటంలో పెద్ద వాటాదారుడు ఎవరంటే నిస్సందేహంగా క్షేత్రయ్యే అని చెప్పాలి. తేనెకన్నా మధురంగా, వానకన్నా చల్లగా, గాలికన్నా స్వేచ్చగా పాటపాడి, పాడినదంతా పచ్చి బంగారంగా చేసే పాటవిక శిఖామణులను ఎన్నిసార్లు లెక్కపెట్టినా క్షేత్రయ్య ఒక్కడే గణనకు వస్తాడు. అతడు భక్తులలో పెద్ద భత్తుడు; రసికులలో మొదటి రసితుడు; వీథిని పడీ వేడుకతో నడుచుకొన్న విటరాయుడు. వెళ్లిన ప్రతి ఊళోనూ స్వామివారిని దర్శించి, సానివాడను హర్షించి ఇద్దరినీ ఏకకాలంలో చరితార్థం చేసిన బయకారుడు; శృంగారాన్ని కాచి వడబోసిన వెజ్ఞు దేవునో లాగిన ఆకతాయి. పరమాత్మతో నేస్తం కట్టిన యోగి; పరస్త్రీల రహస్యాలు తెలిసిన భోగి ప్రజయంలో ఎన్నిరకాల సన్నివేశాలు రాగలవో అన్నీ అనుభవించిన అదృష్టవంతుడు. మువ్వ గోపాలుని చల్లని మోవీ, పిల్లనగ్రోవీ తానే అయిన ధన్యుడు. క్షేత్రయ్య పాడని ప్రణయవేళ చూడని మధురలీలలు లేనేలేవు. అతడు చూచిన ప్రతి దృశ్యంపైనా పదం పొడీ లక్షణ గ్రంథాలకే ఖిక్షపెట్టిన జాణ.

క్షేతయ్య 667 క్షేత్రయ్య జీవితచరిత్ర నిన్నటిదాకా ఎవరికీ తెలియదు. రేపటికిగాని తేలదు.

ఇవాళమాత్రం ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకోవాలి.

“ఈయన ఊరేమిటి? పేరేమిటి? సాధన ఎలాంటిది? సిద్ధి ఏరూపాన కల్గింది" అనే ప్రశ్నలు తండోపతండాలు. “ఇలాంటి ప్రశ్నలన్నింటికీ వెరసి సమాధానం ఒక్కటే. నిజం చెప్పాలంటే మనకు తెలియదు. తెలుసుకొనేందుకు తెలాంటి ఆధారమున్న యింతవరకు బ్రాళారు.! క్షేత్రయ్యను గురించిన భోగట్టాలూ ఇంతవరకు తెలిసిన తలిసీళ్లను వారు ఇలా ఖేరీజు వేశారు.

పేరు వరదయ్య; కన్నవారి నామములెవరూ పేర్కొనలేదు.

2 చిన్నతనంలో చదువు సంధ్య లబ్బని జులాయితనం.

3౩ వయసులో, చేరువనున్న సానివాడలో విహరించుతూ ఆ తగులాటం ఫలితంగా ఆటపాటలంటే అసక్తి కల్గింది మరో లెక్క ప్రకారం - ఒక గొప్పు పడుచుతో చెలిమిచేసి శృంగారి అయినాడు! ఆ ప్రణయం తాలూకు వన్నచిన్నాలే ఈ శృంగార పదములు.

  1. బందరులో మేనమామ వేణుగోపాలస్వామి అలయం ధర్మకర్త. ఆయన కుమార్తె - అనగా వరపుత్రి - రుక్కిణీ. ఆ చిన్నదాని చెప్పుచేతులలో మెలగి చిన్నవాడు జాణ అయినాడు. మనిషి కొమ్ములు తిరిగిన దక్షిణనాయకుడు!

  2. సదరుహీ మేనమామకు సయాం కుమార్తె మరో రుక్కిణి. చిన్నప్పుడే తలచెడి, మువ్వలో ఉంటూంది! ఆ అమ్మాయికి వయసు వచ్చిన తదుపరి, ఈ వరదయ్య మూలకంగా రగడ జరిగి, పెద్దలు ఇతగాడిని దుయ్యబట్టుకోగా, ఈ కుర్రవాడు ఊళో ఉండడానికి మొగం చెల్లక, సంచారంపోగా, ఎవరో ఒక యతి దారిలో తగిలి గోపాలమంత్రం ఉపదేశించి ఉద్ధరించినాడు: ఆనాటినుండి వరదయ్య పదకర్త అయినాడు.

  3. కంచిలో, *'మగువ తన తేళికామందిరము వెడలెన్‌ రచన: - విజయరాఘవ నాయకుడు ఆహ్వానించగా తంజావూరు వెళ్లడం, అక్కడనే ఉంటున్న రోజులలో మధురకు కూడా వెళ్లడం, ఆ తరువాతనేమో గోలుకొండ పాదుషావారు కోరగా, వారి ఆస్థానంలో కొంతకాలం ఉండి కొన్ని పదములు రచించడమున్నూూ జరిగింది. అతగాడు అక్కడే - అంటే తంజావూరిలోనే - చరమ జీవితం గడిపాడు.

  4. _ పుణ్యక్షేత్రములన్నింటినీ సందర్భ్శించినందువలన వరదయ్య “క్షేత్రయ్య' అయినాడు. కొంతకాలం సంస్థానాలను అంటిపెట్టుకొని ఉండి, సన్యసించి, తిరిగి మువ్వగ్రామం జేరుకొవి గోపాలుని పన్నిధిలో తరించాడు! ముక్తసరిగా యిదీ యింతవరకు తెలిసిన వైనం - చిల్లర మల్లర విషయాలు

మినహాయించి:

  1. తెలుగు మహాజనసమాజం, మదరాసు - అష్టమబార్డిక సంచిక, 183.

668 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుక

క్షేతయ్య అసలు పేరు మువ్వ వరదయ్య అనే సంగతిని ప్రతిపాదించి, అతడ కృష్ణా జిల్లా దివి తాలూకాలోని మువ్వ కాపురస్తుడని ప్రచారం చేసినవారు విస్సా అప్పారావుగారు. అంతటివరతూ గుజిలీ పుస్తకాలలో ఉండే క్షేత్రయ్యపదాలను చక్కగా ముద్రించి విపులమైన పీఠిక బ్రాస్తూ అప్పారావుగారీ వైనాలు చెప్పారు. ఇవాళ రమారమి అందరూ ఈ విషయాలను చర్చించకుండా అమోదిస్తున్నారు. అయితే చాలా ముఖ్యమైన సందేహాలు లేకపోలేదు. ఆ శంకలను మా గురువుగారే ఇలా అడిగారు:

  1. కృష్ణామండలంలో “మొవ్వ' “మువ్వ' ఎలా అవుతుంది? రాయలసీమ లోదికాదా! దివి తాలూకాలోనిదే అయితీ దేవరకోట సంస్థానపు దండకవిలెలో ఎక్కడా ఈ ప్రసక్తి లేదేం, - అదినుంచికూడా, తమ పరగణాలలో ఉన్న మహామహులను గౌరవించ నోచుకొన్న దేవరకోట సంస్థానాధీశ్చరులు క్షేత్రయ్యను ఎందుకు గౌరవించలేదు? కాసుల పురుషోత్తమకవి అయినా, తన శతకములలో క్షేత్రయ్య పేర ఎత్తకపోవడానికీి కారణం వేరే ఏదైనా ఉన్నదా? లేక పదకవిత అంటే అప్పట్లో ప్రభువులకు, ప్రజలకు ఆదరణ లేదా?

  2. తాళ్లపాక తిమ్మక్క పేర్కొన్న మువ్వ గోపాలుడు మాటేమిటి? క్షేత్రయ్యకు ఇష్టదైమ అతడేల కారాదు? అయివుండరాదు?

  3. _ కృష్ణామండలం వాడయితే ఆ ప్రాంతాన్ని ఎరుగనట్టు ఎందుకు ఊరుకున్నాడు? ఆ పరగణాలలో ఎందరో ప్రభువులుండిరే - ఒక్కడూ ఈ మహాకవిని గర్తింి అదరించనేలేదా? కృష్ణామండలంలో క్షేత్రయ్య పదాల వ్రాతప్రతి మచ్చుకైనా ఈనాటికీ దొరక్కపోవడానికిన్నీ ఏమిటి హేతువు?

ఇవి తేల్చుకోవలసిన ప్రశ్నలే. విస్సా అప్పారావుగారు పరిశోధనలు చేయకముందూ

వాటిని తెలియజేశారు.

  1. టి.యన్‌. వాసుదేవన్‌గారు - కృష్ణా జీల్లా మొవ్వ

  2. సి.ఆర్‌. శ్రీనివాసఅయ్యంగారు: ఉత్సరార్కాడు జిల్లా మోవపురం.!

  3. పి. సాంబమూర్తి ప్రభృతులు - చిత్తూరు బిల్లా చంద్రగిరి తాలూకా మువ్వరి

ఈ మూడు వాదాలలో మూడవ వాదాన్ని ఖండించి మొదటిదానినే అప్పారావుగారు స్వీకరించి నిరూపించడానికి ప్రయత్నించారు. శ్రీనివాస అయ్యంగాడు చెప్పిన మోవపురి ఎందుకు క్షేత్రయ్య స్వగామం కాలేదో వారు ఖండించడానైనా ప్రయత్నించలేదు. “కృష్ణా జిల్లాలోని మువ్వ తప్పించి ఇంకెక్కడా మువ్వపురి లేదు' అని

వము ననన. ముక. నకును. కనన కవకుటనన వనముననన కన 2.

  1. క్షేత్రయ్య పదములు - సంపాదకుడు. విస్సా అప్పారావుగారు ఆంధ్రగానకళాపరిషత్తు

రాజమహేంద్రవరము, 1950. 3. ఉత్తరార్కాడులో మోవూరు లేదు. దక్షిణార్కాడు జిల్లాలో చిదంబరం తాలూకాలో త్రీ చూ॥ [4 01 ట్రం 01 సేండణం కిారలంం/ (1924) ౧. 41

క్షేతయ్య 689 విస్సావారు అభిప్రాయపడ్డారు. అయితే దక్షిణాదిన మోవ అనే పదభాగాలున్న గ్రామాలకు కొదవలేదు. చూడండి.

  1. చెంగల్పట్టు జిల్లా తిరువళ్ళూరు తాలూకాలో మోవూరు

  2. ఉత్తరార్కాడు జిల్లా ఆరణీ తాలూకాలో మువ్వాంపళ్లం

౩. దక్షిణార్కాడు జిల్లా చిదంబరం తాలూకాలో మోవూరు

  1. తంజావూరు జిల్లా అరంతాంగి తాలూకాలో మూవనూరుఉక్కడై

  2. తంజావూరు జిల్లా మన్నారుగుడి తాలూకాలో మూవనల్లూరు

  3. తంజావూరు జిల్లా మాయవరం తాలూకాలో మూవలూరు

వీటిలో ఏ ఒక్కటైనా క్షేత్రయ్య స్వగ్రామం ఎందుకు కాకూడదు? నిజానికి ఈ గ్రామాలలో ప్రతిదాన్నీ ఖండిస్తేనేగాని కృష్ణా జిల్లా మొవ్వను స్వీకరించరాదు. క్షేత్రయ్య మోవూరుకు నూరుమైళ్ళ కైవారంలో ఉన్నాయి. నేను దక్షిణాదిని ఉన్న మూడు మోవూరు బగామాలు చూశాను. వాటి వివరాలు తెలుపుతాను.

తిరువళ్ళూరు దగ్గర మోవూరుః ఇది సుప్రసిద్ధమైన వీరరాఘవక్షేత్రానికి అయిదారు మైళ్ళ దూరంలో వుంది. తిరువళ్ళూరు వీరరాఘవునిపై క్షేత్రయ్య పదాలు చెప్పాడు. క్రీశ 1600 ప్రాంతాలలో ఈ ప్రదేశం తెలుగు కవిత్వం మారుమయోగుతూ వుండేది. చింతలపన్లి కవులలో వాసికెక్కిన వీరరాఘవుడు, టేకుమళ్ళ రంగశాయి తిరువళ్లూరు వాళ్ళే. క్షేత్రయ్య ఈ ప్రాంతాలవాడు కావచ్చునని మోవూరుకు వెళ్ళాను. అది కుగ్రామం, రెండు మూడు వందల సంవత్సరాల కిందట అక్కడ కురుంబ గొల్లలు ఉండేవారట. కొందరు తెలుగురెడ్లు ఎక్కడో మోవూరునుంచి వలసవచ్చి ఇక్కడ ఆ పేరు పెట్టుకొన్నారు. ప్రతిష్ట జరిగిన దేవాలయం ఏదీ లేదు.

కొడియాళ మోవూరు: దక్షిణార్కాడుజిల్లాలోని మరొక సుప్రసిద్ధ క్షేత్రం చిదంబరం. దీనినే తిల్ల్వవూ పిలిచేవారు. తిల్ల గోవిందరాజులపై క్షేత్రయ్య కొన్ని పదాలు చెప్పాడు. చిదంబరానికి ఏడెనిమిది మైళ్ళ దూరంలో మోవూరు అనే గ్రామం ఒకటి ఉంది. దీనినే కొడియాళమోవూరు అంటారు. ఇదికూడా తిరువళ్లూరు దగ్గర నున్న మోవూరులాంటి కుగ్రామం. అమ్మవారిగుడి తప్ప మరే ఆలయాలూ ఇక్కడ లేవు.

ముటం - మోవూరు, ఇది కూడా చిదంబరం తాలూకాలోనే ఉంది. చిదంబరానికి పాతికమైళ్ళ దూరంలో నున్న కాట్టుమన్నారు గుడికి సమీపంలో ఈ మోవూరు ఉంది. కొడియాళ మోవూరుకూ, దీనికీ తేడా తెలియడానికి దీనిని పక్కనున్న ముట్టం గ్రామంతో కలిపి 'ముట్టం - మోవూరు' అని పిలుస్తారు. వీటిలో ముట్టం గ్రామం చాలా ప్రాచీనమైనది. విజయరాఘవనాయకుడు డచ్చివారికి కట్టడిచేసిన పది గ్రామాలలో ముట్టం ఒకటి. ఈ శ. 7౧6 1/30408580 9౭౧ కొంగ కం క8టరర )యా. సత ౧|జజం6 కళ్ళా! 144 , కగ006౭6కర

0 ఉం హీరేజంి [1హంగంం! గిలంంాట ంగాలకలంగి, 1937 ౪0136 ౭896 42 ఈ శాసనాన్ని నిడుదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు. - “' దక్షిణదేశీయాంధ్ర వాబ్మయం”, పుటు 546.

670 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి గ్రామానికి పక్కనున్న మోవూరు కూడా నాయకరాజుల కాలంలో ఉన్నదనే భావించవచ్చు. ఇది ఇప్పుడు సుమారయిన గ్రామం. పూర్వం ఒక వీధి వీధంతా బ్రాహ్మణ వాడకట్టు ఉండేదట. ఇవాళ నాలుగైదు కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామానికి ప్రస్తుతం తెలుగువాళ్ళ కరణీకం చేస్తున్నారు. అయినా ఈ మోవూరు క్షేత్రయ్య స్వగ్రామం అనడానికి అస్కారం మరింత పరిశోధన జేస్తేగాని లభించదు. ఈ గ్రామం ప్రాచీనమేగాని ఇక్కడ గోపాలస్వామి గుడి ఏదీ లేదు. రెండు ఆలయాలున్నాయి. ఒకటి శివాలయం. రెండోది లక్ష్మీనారాయణ పెరుమాళ్ళది. నాయకరాజుల కాలంనాటి గ్రామమే అయినా దీనికి మోవూరు అనే పేరు ఎప్పటినుంచి ఉందో తెలియదు. మధ్యలో ఎవరో చంద్రశేఖర హ్టాయారు పాలించడంవల్ల ఈ గ్రామానికి కొన్నాళ్లు చంద్రశేఖరపురం అనే నామాంతరం ఉండేదని కొందరు స్థానికులు చెప్తారు.5 దక్షిణాన ఉన్న ఇతర “'మోవ' గ్రామాలను కూడా చూసి ఆ తరువాత క్షేత్రయ్య స్వగ్రామం ఏదో నిర్ణయించడం బాగుంటుంది. ఆనాటి 'మూవ' నేటికీ అదే పేరుతో ఉందో లేదో నిర్ణయించాలి. చాలా పరిశోధన జరగాలి. క్షేత్రయ్య ఏ ఊరివాడో తీలకపోయినా అతని జీవితచరిత్రను కొంత కాకపోతీ కొంతయినా ఊహించవచ్చు. క్షేత్రయ్య అసలు పేరు - విస్సా అప్పారావు చెప్పినట్టు వరదయ్యే కావచ్చు. అతడు

చిన్నతనంలో ఒక సానిపిల్లతో స్నేహం కట్టి ఉండవచ్చు. ఆ ప్రణయాన్నే చాలా మటుకు మువ్వ్నగోపాలపదాలలో అతడు ప్రతిఫలింపజేసి ఉండవచ్చు. ఈ జీవితచరిత్ర ఇలా నడవడానికి, అతడు కృష్ణా జిల్లాలోని మొవ్వలోనే జన్మించనక్కరలేదు. అతడు దక్షిణాన ఉన్న ఏదో మోవూరులో పుట్టి పెరిగాడు. కంచిలో చదువుకొన్నాడు అని ఊహించవచ్చును. చిన్నప్పటినుంచీ “సూనశరుని పాటలు సౌంపుమీర' పాడుకొంటూ ఉండేవాడు. తాళ్లపాక అన్నమయ్యగారి శృంగార కీర్తనలన్నీ కరతలామలకం చేసుకొన్నాడు. ఆ బాణీలు అలవరచుకొని సొంత గొంతుక విప్పాడు. అన్నమయ్య ఆదిలో ఎన్నో క్షేత్రాలు దర్శించాడు. వెళ్ళిన ఊళ్ళో ప్రతి దేవుణ్ణీ వెంకటేశునిగా భావించి వేంకటేశముద్రతో కీర్హనలు రచించాడు. ఉదాహరణకు, మధుర చొక్కనాధునిపై రచించిన సంకీర్తనలో ముద్ర ఇలా వేశాడు: "పూనిక వెంకటాద్రి నుండి వచ్చి నను గూకె సూనాస్త్రుగురుడైన చొక్కనాథుడు.* అలాగే “శృంగారాలే తరచాయె శ్రీరంగనాథ' అని పాడుతూ ' శ్రీ, వెంకటాద్రిమీద చేకొని నిల్చితివి. యేవేళ చూచిన నీవె యిటు శ్రీరంగనాథ” అన్నాడు.” ఇలాగ ఇతర క్షేత్రాల దేవుళ్ళకు తన ఇష్టదైవంతో అభేదం కల్పించే తారుకాణలు అన్నమయ్యగారి రచనలలో కోకొల్లలు కనబడతాయి. తాళ్ళపాక కవుల రచనలన్నీ పుజీకీ పుచ్చుకొన్న క్షేత్రయ్య ఆ అభేదముద్రను అన్నమయ్యదగ్గిరే నేర్చుకొని ఏవూరు వెళ్ళినా ౪ దేవుణ్ణి 'మువ్వ గోపాల' అని పిలిచి పదాలు వ్రాశాడు.

  1. ముట్టం - మోవూరు గ్రామకరణం శ్రీ అత్తనూరు రామస్వామిగారు తెలుగువారే. ఆయన ఈ

ఆలయాలు నాకు చూపించిన వివరాలు చెప్పారు. అందుకు కృతబ్ఞాణ్డి. 6౬. తాళ్లపాక కవుల కృతులు : శృంగారసంకీర్తనలు - ౩న సంపుటి, పుట 159. 7. అందులోనే పుట 162.

క్షేతయ్య 671 కంచిలో క్షేత్రయ్యకు మీసాల నూత్న్సయౌవనం వచ్చి వుంటుంది. కాంచీపురం నిజంగా శృంగారదేవతకు కాంచీధామమే. “కంచి అరవత లసమాస్తు ఖడ్గలతలు' అని శ్రీనాథుడు కీర్తించాడు. ఈ సంగతి స్వానుభవంపై తెలుసుకొని క్షేత్రయ్య 'కాయజుని తలిరు పదను కత్తులయ్య ఈ చెలులు' అని పాడాడు. అతడా ఊరిలో ఉన్నప్పుడు ఒక చిన్నదానిని వలచాడు. ఆ సానిపాప చాలా వైభవం కలది. అడపకత్తెలు గల సిరి సంపదలున్నాయి (వి. 122). ఆమెను క్షేత్రయ్య చూశాడు. మోహించాడు. కబురు పెట్టాడు. “చక్కని యీ చెలిని గూడని జన్మమేమిటికి జన్మమే” అన్నాడట. ఈ సంగతి చెప్పిన దూతిక “ఇంతిరో వరదునికి నీపై నెంత మోహమే'' అని ఆశ్చర్యపోయింది. ఆ సానిపాప పేరు పిరుందేవి. ఆమెకూడా వరదుని చూసి మనసుపడింది. “నా మనసువంటిది నీ మనసైతే నా నోము ఫలమీడేరురా- అదికాక వేమారు చెరతున పండు పండినట్లు వేడుక లినుమడించేరా ఓరోరి వరద అని ఆమె భావించింది. అప్పటీకే వరదుడు కంచిలో చాలా గ్రంథసాంగుడు. “ననుబోటిసఖులెల్ల నీవు నాసఖుడంటే వినసంతోషమై యుండురా” అని ఆమె అనుకొంది. “ఎనసిన తమ రహస్యమిది నీక తెలియు, నేనెవరితో విన్నవింతురా'' అని దాచుకొంది. (గి. ౩-62) _ వరదుడు వచ్చాడు. అతని వద్దకు వెళ్ళమన్నారు చెలులు. “చిన్నదాన నేనేమెరుగ సీగ్గాయెనమ్మా?'" అని తలతిప్పుకొని నవ్వుకొంది. “మదన శాస్త్రము నేను చదివినదానగాను సదయుడని వానితోను సరసమాడుదు నేను” అని విడియపడింది (వి.174). ఆ రాత్రి వాళ్ళ కలయిక “చక్కెర వలె నున్నది చల్లనై ఉన్నది. కలిసి మెలసి ఉంటే నిద్దురరాదు” (వి. 213). అలసి సౌలసి ఉంటే ఆమె ఉరముపై వరదుడు పడుకొన్నాడు. తెల్లవారింది. శాంతరసం మూర్తీభవించినట్టు “మగువ తన తేళికామందిరము వెడలి" వెళ్ళడం వరదుడు చూశాడు (వి.248). అతడంటే పేరుందేవికి ఉన్నంత ప్రేమ ఆ వాడకట్టులోని ప్రతి వెలయాలికి ఉంది. అతనిపై అందరూ కన్నువేశారు. వరదుణ్ణ్జి ఎక్కడ దాచుకోవడమనే పెద్ద సమస్య వచ్చిపడిందామెకు. అతను వచ్చేదారిలో అడ్డంపడి మొక్కేవాళ్ళూ మోవి ఇవ్వ్చమనేవాళ్ళూ. పైట తీసి పరవసింప చేసేవాళ్ళూ, నోరువిడిచి 'నన్నుంచుకో' మనేవాళ్ళూ కోకొల్లలు. (వి-187) (| నిజానికి వరదుడు వంచకుడు. “కొత్తవలపురెణ్నూళ్ళు' పేరుందేవిని విడిచి ఇతరచోట్ల విహరించాడు (వి.221). అతణ్జి పిలిపించాలనుకొందా ముద్దరాలు. కబురు పెట్టించింది. దూతిక వెడితే “ఎవరు నువ్వు అన్నాడు. పంపించిన వలపువక్కాణం తెరచి చదువలేదు. అయితే ముద్దియదయ మరువకుమని ముమ్మాటికీ చెప్పమన్నాడట. అంచేత వచ్చేమనసో రానిమనసో తెలుసుకోమని దూతిక అన్నది (వి-283). అయినా వరదుడు రాలేదు. అతడు రాకపోతే ' వలరాయుడున్నాడు నేనున్నాను' అని ఆమె నిస్పృహ చెందింది (వి.184). అతడు వస్తాడని మళ్ళీ ఆశలు పెట్టుకొంది. రాగానే బెట్టు చేయాలనుకొంది. అతడు పడకిల్లు చొచ్చితీ నిద్దుర లేపవద్దని చెప్పమంది. నాలుగైదు దినాలదాకా బతిమాలించాక గాని 8. కాశీఖండం, 3౩-109

672 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ భయం పుట్టబోదంది (వి.302). అయితే అతడు రాగానే వాని మోము చూచినప్పుడే వలపుగెట్టించి చాలా “ఈనినమలినాటికోప' మెక్కడికో పోయింది అతడు వచ్చాక 'మునపటివలె నాపై నెనరున్నదో' అని అడిగింది. 'చిన్ననాటినుంచి చేసిన దెంచక నన్ను చౌకచేసేది న్యాయమా?" అని అడిగింది (వి-257). “'ముంచేవో దరి చేర్చేవో మోహాంబుధిలో' అని విన్నవించుకొంది (వి-153). వాళ్లు మళ్ళీ కలుసుకొన్నాక ఎన్నాళ్లు సుఖంగా గడిపారో తెలియదు. ఒకనాడు "ఈ రాతిరే పైన' మన్నాడు. ఆమెను విడిచి వెళ్ళిపోతున్నాడు. “తాళగలనా? కంచి వరదా! నే నిన్ను నెడబాయ' అని ఆమె వాపోయింది. అతడు వెళ్ళక తప్పలేదు. ఆమె ఆ కడసారి వీడ్కోలును మరచిపోలేకపోయింది. '“తిన్నగ ఊరికి పోవుచు నన్నే తిరిగి తిరిగి చూసిన వగలెన్ని తలచుకొందునమ్మా'' అని చింతించింది (వి-100. అతనితోపాటు ఊరికి వెళ్లడం భావ్యం అనుకొంది. 'ఊరికి పోక నీడుండేది మేరః' అని బాధపడింది. వెళ్ళిందో లేదో తెలియదు. మళ్ళీ వాళ్ళు కలుసుకొన్నారో లేదో తూడా ఊహించలేం. ఇదీ క్షేత్రయ్య పదాలనుండి మనం క్రోడీకరింపతగ్గ అతని చేమ కథ. అతని పేరు వరదయ్యే అనీ, అతడు తన కథనే “కంచివరద', “వరద' అనే ఉపముద్రలున్న పదాలలో చెప్పాడనీ మనం భావించడం సమంజసమయినప్పుడే ఈ కథకి కాళ్ళూ చేతులూ ఉంటాయి. క్షేతయ్య చెప్పిన వందలాది పదాలలో దాదాపు ముప్ఫయి పదాలలో మాత్రం కంచివరద, వరద, కరిగిరివరద, ఇభరాజవరద అనే ఉపముద్రలున్నాయి. వాటీ వివరాలు ఇమీ

కంచివరద: విస్సావారి ప్రతిలో 77, 100, 122. 153, 164, 170, 173, 174, 18 213, 221, 226, 248, 257, 283, 302; గిడుగువారి ప్రతిలో ౩-56. మొత్తం-17.

వరద: విస్సావారి ప్రతిలో 32, 4, 9, 148, 184, 227; గిడుగువారి ప్రతిలో ౩-9 మొత్తం - 7

కరిగిరివరద: విస్సావారి ప్రతి ౪, 309. షరా. వి. 32లో కంచి వరద, తరిగిరివరద అనే రెండు ఉపముద్రలు ఉన్నాయి. మొత్తం - 2

ఇభరాజవరద: విస్సావారి ప్రతి 51. మొత్తం - 1

మువ్వ గోపాల ముద్ర లేని పదాలలో వరదుని పేరున్నవి గిడుగువారి ప్రతిలో 4(9)-14, (?) 22.

ఈ ఉపముద్రలున్న పదాలలో కాక వేరే సాధారణ పదాలలో తూడా క్షేత్రయ్య జీవితం ప్రతివింబిస్తుంది. నిజానికి విస్సా అప్పారావుగారు ఇతర పదాలలోంచి కూడొ అతని కథను ఊహించారు. “పిలువనంపె నన్నీవేళ అనే పదంలోని రెండవ చరణంలో ఇళొ ఉందిః $, గ, 1-౪. ఇందులో వరదముద్ర లేదు.

క్షేత్రయ్య 673

ఎమ్మెకాడు నేను నెనసిన చిన్ననాడే

సమ్మతిగా నొకచోట జదువుచుండగ

నమ్మిన వేడుకతో భామ నీవు ప్రొఢపైతే

కమ్మవిల్తుని కేళి కలిసిమన్నది నిజమై పిలువనంపె (వి-237)

ఈ చరణంవల్ల వరదయ్యా, అతని ప్రేయసీ కలిసి చదువుకొన్నారని విస్సావారు ఊహించారు.1* అయితే ఇందులో అల మువ్వ గోపాలుడగు వెంకటేశుని కథే గాని వరదయ్య కథ లేదు. అలాగే క్షేత్రయ్య అసామాన్యతను ఊహించడానికి తీసుకొన్న “సామాన్యముకాదే వాని పొందు' అనే పదం తూడా వరదయ్యకు సంబంధించినది కాదు. అది విజయరాఘవ నాయకునిపైన క్షేత్రయ్య చెప్పిన పదం.

వాస్తవానికి క్షేత్రయ్య జీవిత చరిత్రను ఊహించడానికి అతడు తన పదాలలో చెప్పిన విటుల కథలను గాక, అతనికి ఏయే చారిత్రక వ్యక్తులతో సంబంధం ఉందో చూడాలి. దాని ప్రకారం అతని జీవితగాథను ప్రతిపాదించాలి. క్షేత్రయ్య స్వగ్రామం చెంటి మండలానికి దగ్గిరలో ఉండవచ్చు. అతడు విద్యాభ్యాసం ముగించుకొని, ఆ కాలంలో చెంజీని పాలిస్తున్న తుపాఠుల వెంకటకృష్ణయ్య ఆశ్రయం సంపాదించుకొన్నాడు. ఆ ప్రభువు మీద ఎన్ని పదాలు చెప్పాడో తెలియదుగాని నేడు ముచ్చటగా మూడు మాత్రమే దొరికాయి. ఇక నాయిక ఇలా తన సవతుల గురించి చెప్పుకొంది.

ఓయమ్మ పీంత ఓర్వజూలరమ్మ

సోయగమున తుపాకి కృష్ణుడు నేను గూడియుంటే.

పంటికొద్ది నామోవిపై విభుడు నొక్కిన

గంటు జూచి నవ్వే నా కలికి

జంటబాయక నాతో ముచ్చటలాడవద్దని

కొంటెతనమున గసరుకొనియె నా మగువ - ఓయమ్మ.

ఒత్తి వాని మోవి నామోవిపై నుంచగా జూచి

బత్తిగాదనియె నా తరుణి

హత్తి మోవితో మడుపులందీయ వెరగంది

యిత్తరి యివిగాక దయలనియె నాయింతి - ఓయమ్మ.

వన్నెమీర విభుడు నావద్దకి రాగానె మొక్కీత

ఎన్ని నేర్చెననియె నాఖభామ

నన్ను గూడి తుపాకి కృష్ణ పరనాథు డాదరించితె

తన్ను తిట్టుకొనియె నా తామరసనేత్రి - ఓయమ్మ. (గి. 3-40) 10. “క్షేత్రయ్య పదములు' - విస్సావారి సంపాదకత్వం, పీఠిక, పుట 12. 11. అందులోనే - పీఠిక, పుట 14.

674 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి క్షేతయ్య ఆశ్రయించిన ఈ తుపాకులరాయడు 'గొప్ప సరదారై యుండవలెను" అని విస్సా అప్పారావుగారు భావించారు.!* కాని ఈ పదంవల్ల తుపాకి కృష్ణుడు నరనాథుడని స్పష్టమవుతోంది. చెంజి నాయకరాజ్యాన్ని క్రీ.శ.1620 దాకా కృష్ణపష్పనాయకుడు పాలించాడు. ఇతజ్జే ఒకసారి తంజావూరు రఘునాథనాయకుడు క్రీ.శ 1595 ప్రాంతాలలో రాయ కారాగారంనుండీి విడుదల చేయించాడు. ఈ కృష్ణష్పనాయకుడు వీరవైష్టవుడు. ఇతని మండలంలో చిదంబరం అనే క్షేత్రం ఉంది. అది ఆదినుంచీ శైవక్షేత్రం. అయితే వైష్ణవులు దీనిని తమ పట్టుకొమ్మగా మార్చడానికి చాలా ప్రయత్నాలు ఎన్నో శతాబ్దాల నుంచీ చేస్తున్నారు. శైవులు ప్రతిఘటిస్తూ వచ్చారు. కృష్ణష్పనాయకుని హయాంలో శ్రతి మించింది. కృష్ణప్పు రాయ కారాగారంనుండి విడుదల కాగానే క్రీశ 1597లో చిదంబరంలోని వైష్ణవ దేవాలయాలకు స్వయంగా మరమ్మత్తును చేయించాడు. ివక్షేత్రంలో వైష్ణవ విగ్రహం ప్రతిష్టింపదలచాడు. శైవ ధర్మకర్తలు ప్రతిఘటించారు. కృష్ణష్పనాయకుడు లక్ష్యపెట్టలేదు. ఆ పేదభక్తులు దేవాలయం గోపురం ఎక్కి కిందికి దుమికి ప్రాణత్యాగం చేసుకొంటామని హెచ్చరిక చేశారు. కృష్ణప్ప పెడచెవిన పెట్టాడు. అన్న ప్రకారం ఒక ధర్మకర్త ఆత్మార్పణ చేశాడు. కృష్ణప్ప చూసీ చూడనట్టు ఊరుకుని మరమ్మత్తులు కొనసాగించాడు. ఒకరి తరువాత ఒకరు చొప్పున ఇరవైమంది శైవులు ఇలాగ గోపురంయయీద నుంచి దుమికి ప్రాణాలు ఇచ్చారు. ప్రజలు రెచ్చిపోయారు కృష్ణపష్పనాయకుడు ఆగ్రహించాడు. ప్రజలపై తుపాకులు పేల్పించాడు. ఒక ఇల్లాలు కోధావేశంతో గొంతుక ఉత్తరించుకుంది.3 అయితే పేదవాళ్ల కోపం పెదవికే కాక ప్రాణాలకే చేటైంది. తుపాకుల బలంతో కృష్ణప్ప నాయకుడు తన ఆశయం నెరవేర్చుకొని చిదంబరంలో గోవిందరాజులను ప్రతిష్టించాడు. ఆదిలో చిదంబరం ప్రాంతాలలో అగరుచెట్లు చాలా ఉండేవి. వాటిని తిల్లచెట్లు అంటారు. అందువల్ల ఆ ప్రాంతాలకు 'తిల్లారణ్య్బం' అని సంస్కృతీకరించి పేరు పెట్టారు. చిదంబరాన్ని తిల్ల అని స్థానికులు వ్యవహరించేవారు. గోవిందరాజస్వామిని తిల్ల గోవిందరాజని క్షేత్రయ్య స్తుతించాడు. ఈ దైవంపై అతడు చెప్పిన పదాలలో నేడు 4 మాత్రమే దొరుకుతున్నాయి (గిడుగువారి ప్రతిలో 1-41, 1-147, 1-6, 3-77). తన పోషకుడు తుపాకులతో ప్రతిష్టించిన దైవంపైన క్షేత్రయ్య నాలుగు పదాలనే చెప్పాడా! ఇంకొ ఎన్నో చెప్పి ఉంటాడు. అతడు తుపాకులరాయడిపై తూడా అనేకం చెప్పాడనుకోవచ్చు. వాటిలో కనీసం మూడైనా కాలగర్భంలో కలవకుండా మిగలడం హోేషమే. చెంజీ కృష్ణప్పనాయకుడు క్రీ.శ. 1580 నుండి 1620 దాకా పాలించాడని చారిత్రకులు భావిస్తున్నారు.** క్షేత్రయ్య కీర్పించిన ప్రభువితడే అయితే క్రీ.శ. 1620లో ఇతడు గతించాక 12. విస్సావారి 'క్షేత్రయ్లు పదములు - పీఠిక, పుట 2౫. 13 గ 1181050 0! ౮౩౫ జుం 12 గిటీలా - 9 గ8ం కతత? 0.5. కగంగతయతగ, లి 121. 14. ౧ ౧౪౦! 6944 ౩1 06 ఇర 0 4 166, ఆంటూ - 0 గిలా. 11682, కాయితం బూరయుతిం, ₹01ో, బాయల 1925.

క్షేతయ్య 8ి75్‌ వేరే ఆశ్రయం అర్ధించుతూ క్షేత్రయ్య పోయి ఉంటాడని భావించవచ్చు. తంజావూరులో రఘునాథనాయకుణ్ణి అతడు దర్శించినప్పుడు “ఎందుకొచ్చా'వని ఆ ప్రభువు అడిగాడు. అప్పుడు మువ్వగోపాల భత్తుడైన క్షేత్రయ్య ఇలా సమాధానం చెప్పాడని లోకులు చెప్పుకొన్నారు.

తము తామె వత్తు రర్భులు - క్రమ మెరిగిన దాత కడకు. రమ్మన్నారా

ఈ సమాధానానికి రఘునాథుడు సంతోషించి ఉంటాడు. కాని అటువంటి ప్రశ్నకు ఇటువంటి జవాబులు చెప్పడం క్రొత్తీమీ కాదు. చింతలపూడి ఎల్లన్న తన రాధామాధవంలో అంతకు నూరేళ్ల క్రిందటే ఇలా వ్రాశాడు:

సరసులు చిత్తగింపుడని బాటను మామకవాజీ సన్మనో

హర యగునేని వారి హృదయంబుల కింపొనరింపకున్నా, యె

వ్వరు పిలువంగవచ్చి యశళివర్గము లాత్మల జొక్కు దేనియల్‌

గురియు ప్రసూనగుచ్చభర కుంచిత మల్లిమతల్లి కావనిన్‌.

| (రాధామాధవం, 1-16)

తన ప్రాచీనుల పద్యాలలోని యుక్తిని అనుసరించి రఘునాథుని కొలువులో పద్యం చెప్పిన క్షేత్రయ్య ఆ నాయక రాజుపైన పద్యాలు చెప్పాడో లేదో గాని చేమకూర వెంకటరాజుగారి పద్యాలను అనువదించి కొన్ని రచనలు చేశాడు. విజయవిలాసంలో సుభద్ర తన మేనబావను 'ఎగుభుజంబులవాడు మృగరాజ మధ్యుంబు బుడికి పుచ్చుకొను నెన్నడుము వాడు' అని వర్జించినట్టు వెంకటరాజుగారు వ్రాశారు (2-164). ఈ పద్యంలోని భావాలను వారు తాళ్ళపాక తిమ్మక్కగారి ద్విపదలోంచి తీసుకొన్నారో లేదో దేవుడికే తెలియాలిగాని చేమకూరవారి పద్యం చదివాకనే బహుశా క్షేత్రయ్య ఈ క్రింది పద్యం చెప్పాడనుకోవచ్చును:

ఎంత చక్కని వాడే నాసామి వీ - డెంత చక్కనివాడే

ఇంతి మువ్వగోపాలుడు సంతతము నామది

మొలక నవ్వులవాడె ముద్దు మాటలవాడె

తళుకారు చెక్కు.టద్దముల వాడె

తలిరాకు జిగి దెగడ దగు మోవి కలవాడె

చిరుతప్రాయమువాడె చెలువొందు విదియచం

దురు గేరు-నొసలచే మెరయువాడే 16. మండ లక్ష్మీనరసింహకవి తన అంధ్రకౌముదిలో దీనిని చెప్పాడు. “మువ్వ గోపాలభక్తేన క్షేత్రజ్ఞ కవి

ఉర్తత్వాచ్చ' అని పద్యం ఉదాహరించాడు.

676 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చెరకు విల్తుని గన్న దొరవలె నున్నాడే మెరుగు చామనచాయ మేనమరువాడే “ఎంత” పాదలు కెందామరల పెంపొందు పదములవాడే కొదమసింగపు నడుము కొమరమరువాడే మదకరి కరముల మరుపు చేతులవాడే సుదతి మువ్వగోపాలు డెంతసౌగసుగలవాడే “ఎంత” (విస్సా. ౫) రఘునాథనాయకుని ఆస్థానంలో ఎన్నాళ్ళున్నాడో తెలియదుగాని క్షేత్రయ్య తంజావూరునుండి మధురకు వెళ్ళాడని భావించవచ్చు. అప్పుడు మధురను తిరుమల నాయకుడు పాలిస్తూ ఉండేవాడు. అతడు క్షేతయ్యను ఆదరించాడు. ఆదినుంచీ చెం మధుర నాయకులకు ప్రాణస్నేహం. ఈ రెండు రాజ్యాలవారూ కలిసికట్టుగానే రాయసింహాసనంపై తిరుగుబాట్లు చేస్తూ వచ్చారు. చెంజి కృష్ణప్పు పోషణలో కొన్నాళ్లన్న క్షేతయ్యను తిరుమల నాయకుడు గౌరవించడంలో ఆశ్చర్యం లేదు. అతడు మంచి బహుమానమొసగి ఎదుట తూర్పోమని చెప్పి పదాలు చెప్పించుకొన్నాడు. మధురలో క్షేత్రయ్య రెండువేల పదాలు పాడీ ఎంచుకోమన్నాడట. అప్పుడు చదురుమీద నున్న సామికి సంతోషమైందట. మధురలో క్షేత్రయ్య పాడినవస్నీ మువ్వగోపాలపదాలే కావచ్చు. అతడు తిరుమలేంద్రుని పై ఏమైనా రచనలు చేశాడో లేదో తెలియదు. ఈ నాయకరాజు క్రీ.శ. 142 నుండి 1659 దాకా పాలించాడు. ఈ 36 సంవత్సరాలలో ఏ ఒకటి రెండేళ్ళో మధురలో ఉండి ఉంటాడు. తరువాత తంజావూరు చేరి విజయరాఘవుని ఆశ్రయించినట్టు చెప్పవచ్చు. శ్రీశ 193లో విజయరాఘవుడు పట్టం కట్టుకొన్నాడు. అతడు ప్రబంధ రచనలకన్న మధురకవితలనే మన్నన చేసే రసికుడు; క్షేత్రయ్య కీర్షి విని అతణ్జి రప్పించుకొని ఉంటాడు. చలువ చప్పరంలో ఉన్న విజయరాఘవుడు మనుజుల వెంబడీని తన పొడగాంి పలుకరించగానే క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడట. మువ్వగోపాలుని శృంగారలీలలకన్నా మితిమించిన విహారాలు చేసే విజయరాఘవుడు తనమీద తూడా ఎన్నో పదాలను క్షేత్రయ్య చేత చెప్పించుకొన్నాడు. వాటిలో 12 మాత్రమే నేడు మిగిలాయి. విజియరాఘవుని విపరీత చర్యలకు, క్షేత్రయ్య విచ్చలవిడి పదాలకు సరిపోయింది. విజయరాఘవుడు పల్లకీదొర. అందుచేత కనపడ్డ ప్రతిస్త్రీ పైటపై చెయ్యి వేయగలడు. అది క్షేత్రయ్య వర్డించగలడు (గి. 2-98). తన విశ్చంఖలి విహారాన్ని కీర్తించే క్షేత్రయ్య అంటే విజయరాఘవునకు అభిమానం. ఇతర ఆస్థాన కవులకు ఉత్రోషం సహజంగా పెరుగుతూ ఉంటాయి. ప్రతి పదంలోనూ క్షేత్రయ్య నాయకుణ్ణీ 'రో కొట్టిస్తాడు - “ఏరా' *పోరా' అని ఇంత చౌకచేసే పదకర్షను మన్నించడమేమిటని ఆస్థాన కవులు అక్షేపించారటు. క్షేత్రయ్య ఇది విన్నాడు. తనలాంటి కవి మరొకడు లేడు కనుకనే రాజు తనను ఆరాధిస్తున్నాడని వాళ్లకు చెప్పాలనుకొన్నాడు. వాళ్ళలో ఏ ఒక్కరో తన దరిదాపులకు రాలేరని బుజువు చేయదలచుకొన్నాడు. వెంటనే ఒక పదం ఇలొ మొదలుపెట్టాడు:

క్షేతయ్య 677

వదరక పోపోవె పోవే వాడేల వచ్చీని వద్దు రావద్దనవేః

అదియొక్క యుగము వేరే జన్మ మిపుడు

అత డెవ్వరో నే నెవ్వరో ॥వదరక॥

నిచ్చ నిచ్చలు నేడే వచ్చీని రేపైన వచ్చీననుచు మదిలో

నిచ్చలుగా బలువేడి నిట్టూర్పులచేత నింతిరో పెదవులెండి

హెచ్చైన వెన్నెల చిచ్చులరాత్రులు యెన్నైన్నో గడిపితి నిక నేటిమాటలే? ॥వదరక॥

వలపుకా డిదే కదా వచ్చు ననుచు దెరుపులు చూచి వేసారితి

సెలలెంచి యలసితి నిలువరాని ప్రేమ నెమ్మది నడుచుకొంటి

కలకంఠ శుకవాదములు వినుచు మధుమాసములు గడీపి తీవట్టి ముచ్చట లిక నేలే

॥వదరక॥

భామరో శతునములడిగితి మువ్చగోపాలుడు వచ్చు ననుచు

కామించి నాధుల గలయు చెలుల జూచి కరగి చింతనొందితీ. ఇక్కడిదాకా పదం చెప్పి చివరి చరణంలో కడమ పాదం ఎవరైనా పూరించమని సవాలుచేసి సేతుస్నానానికి వెళ్లిపోయాడట. ఆయన తిరిగి వచ్చాడు గాని అది పూరించవలసిన భావం ఏ ఒక్కరికీ రాలేదు. 'మీరే చెప్పండి" అన్నారట. అప్పుడు క్షేత్రయ్య తడుముకోకుండా.

రామరామ ఈ మేనితో వాని - మోము జూడవలెనా మొదటి పొందే చాలు. అని పూరించాడు. కవులందరూ జోహారులు చేశారు. "నువ్వు సాక్షాత్తూ మువ్వ్చగోపాలుడివే' చాలు" అనే భావం పదంలో చెప్పడం క్షేత్రయ్యకు కొత్తకాదు. ఇంకో రెండు పదాలలో వాడాడు. “ఇక నేలనే వాడీ గొడవ?” అనే పదంలో “తొలిపాౌందె చాలు చాలు పదవే మీ చెలిచేతిలో దారపోసితిగదవే' అని నాయిక కట్టకడపట అనుకొంటుంది. (గి 1-50). ఇలాగే “ఎందుకు నాపై బాళొ అనే పదంలో చివర “తిల్లగోవింద, మునపటి పౌందె చాలు' అనే ముగింపు ఉంది (గ. 1-63). ఒక భావాన్నిలా పలుసార్లు చెప్పడం కొంత సహజమే. ప్రతి మనిషికీ ఏదో ఊతపదం ఉన్నట్టు ప్రతికవికీ కొన్ని ఊతభావాలూ, ఊత సామెతలూ ఆశించడం అనేది వాడడం క్షేత్రయ్యకు ఇష్టం. గి. 1-64, 1-149, 2-52 పదాలలో ఇది కనబడుతుంది. క్షేత్రయ్య పదాలను కూలంకషంగా పరిశోధిస్తినే ఇలాంటి పోలికలు భూయిష్టములై ఒక్క మచ్చుననే యున్నట్లు కనబడినను నే రెండు పదములలోని భావములు నొక్క తీరున నుండవు” అనిపిస్తుంది.1* ఇలా అనిపించబట్టే విజయరాఘవుడు అంత

  1. గిడుగువారి "క్షేత్రయ్య పదములు” - ప్రస్తావన, పుల ౫౦

678 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి గౌరవించాడు. పలుకరించుకోగానే వేయి పదాలు చెప్పించుకొన్నవాడు ప్రతిరోజూ ఎన్ని వినిపించుకొనేవాడదో। విజయరాఘవుని పోషణలో క్షేత్రయ్య అట్టేకాలం లేడు. క్రీ.శ. 1646లో గోలకొండ సైన్యాలు దక్షిణాదికి వచ్చాయి. ఆ తరువాత అలాగ తంజావూరుపై దాడీ చేస్తూనే ఉన్నాయి. నమ్ముకున్నవాళ్లను నట్టేట విడిచి విజయరాఘవుడు అడవులు పట్టాడు. గోలకొండ నైన్యాలు తంజావూరు కొల్లకొట్టాయి గాని వాళ్ల సర్వాధికారి సాహిత్యాఖిమాని కాబోలు. గోలకొండ సుల్తాను అబ్బుల్లా కుతుబ్‌షా పంపున మీర్‌జున్లూ ఈ ప్రాంతాలపై దండెత్తాడు. అతడు క్షేత్రయ్యను ఆదరించి తానే పదాలు చెప్పించుకొన్నాడో, లేక గోలకొండకు పంపించాడో తెలియదు. బలవంతుడైన గోలకొండ పాదుషా మెచ్చుకొని బహుమానమిచ్చి తులసిమూర్తి అనే కవితో వాదం పెట్టిస్తే 40 రోజులలో 1500 పదాలు తాను చెప్పినట్టు ఒక పదంలో వివరించాడు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని పదాలు తాను చెప్పినదీ వివరిస్తూ క్షేత్రయ్య బ్రాసిన పదాన్ని మేరువపదం అంటారు. చూడండీ. వేడుకతో నడుచుకొన్న విటరాయడే ఏడుమూడు తరాలనుండి యెందునాగాని యెవతె తూడుకొని మువ్వగోపాలుడు కృపగల్లిన విభుడు 1వేడు॥ మధుర తిరుమలేంద్రుడు మంచి బహుమాన మొసగి యెదుట కూర్చుండుమని యెన్నిన యిమ్మనెనే యిదిగో రెండువేల పదము లిపు డెంచుకొమ్మనిన చదురుమీదనే నున్న సామికి సంతోస మింతింత గాదె వేడు! అళిమీర తంజూపురి నెలకొన్న విజయరాఘవుని వెలయ మంజుల వెంబడి వేగమె పొడగాంచి చలువ చప్పుఠరమున నుండగ చక్కగ వేయిపదముల పలుకరించుతోగానే బహుమాన మిచ్చె నావేళ , వేడు! బలవంతుడై గోలకొండ పాదుషా బహుమానమిచ్చి తులసిమూర్తితో వాదుదలచె నావేళ వెలయ మువ్వగోపాలుడు వెయ్యిన్నే నూరు పదములు నలవది దినములలోన నన్ను గలిసి వినిపించెనే 1వేడు! ఈ పదంలో చెప్పిన లెక్కలనుబట్టి క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండాలి. అయిే ఇవాళ 450 పదాలు తూడా లభించడం లేదు. తంజావూరులో విజయరాఘవుని మీదీ చెప్పిన వేయి పదాలలో మచ్చుకు కొన్నయినా దొరుకుతున్నాయిగానీ మధురలోనూ. గోలకొండలోనూ చెప్పిన వాటి వైనాలు సైతం తెలియవు. ..... శైతయ్యను మెచ్చి బహుమానమిచ్చిన బలవంతుడైన గోలకొండ పాదుషా మరెవరో కాదు అబుల్‌ హసన్‌ తానీషా (క్రీ.శ 1620-72)యే. ఇతడు సంగీత సాహిత్య పోషకుడు.

క్షేత్రయ్య 679 బడేసాహెబ్‌ అనే నామాంతరం గల అక్బర్‌ షా ఇతని సహాధ్యాయి. గురువు-షా రాజుగారి కుమారుడు సంస్కృతాంధ్ర భాషలలో అక్చర్‌షా పండితుడు, గ్రంథకర్త. ఇతడు “శృంగారమంజరి' అనే అలంకార శాస్త్రాన్ని మొదట తెలుగులో రచించి తర్వాత దానిని సంస్కృతంలోనికి పరివర్హనం చేశాడు. ఆ గ్రంథంలో తానీషాను ఇలాగ ప్రస్తుతించాడు. “చతుర్ధి వేష్టిత సర్వం సహేశమతః శౌర్య ధైర్య! మనోహర' లావణ్య సంగీతలవిత! సాహిత్య భఖావజ్ఞుతా! సహృక్షా త్య కవిత సులతాన్‌ అబుల్‌ మసన్‌ ద్షోణీశ...” (శ్చృంగారమంజరి-16 తర్వాత వచనం) తన సహాధ్యాయి అక్బర్‌ షా రచించిన శృంగారమంజరిలో చెప్పిన నాయికా నాయక లక్షణాలకు క్షేత్రయ్య పదాలు ఎటువంటి లక్ష్యాలో తెలుసుకోవాలని తానీషాకు కుతూహలం కలిగి ఉంటుంది. తన ఆస్థానంలో సంగీత సాహిత్యవేత్తలు చాలామంది ఉన్నారు. వారితో అలంకారశాస్త్ర చర్చ చేయడానికి తానీషా క్షేతయ్యకు బహుమానమిచ్చి రప్పించి ఉంటాడు. అక్బర్‌ షా తన శృంగారమంజరిలో తానూ కవిపోషకుజ్జని (ప్రథమ పురుషలో) చెప్పుకొన్నాడు. (శోకం. 14. తెలుగులో రచించిన శృంగారమంజరికి సంస్కృ తానువాదం స్వయంగా చేసినట్టు చెప్పాడు. అక్చ్సర్‌ షా తాను స్వయంగా రెండు భాషలో శృంగారమంజరి రచించనట్టు అనుమానం సహజంగా వస్తుందని పండితులు భావిస్తున్నారు. బౌద్దులూ, టైనులూ శృంగార శాస్త్రం పైన రచించగా లేనిది ముస్లిం రాయతూడదా అని చెప్తూనే అక్బరు షా ఆశ్రితులలో ఉన్న ఏ తెలుగుకవో మొదట ఆంధ్రభాషలో శృంగార మంజరిని విరచిస్తే తర్వాత ఇంకొక సంస్కృత పండితుడు. దానిని సురభాషలోనికి అనువదించి ఉండవచ్చునని శంకిస్తున్నారు.!1” ఈ శంకకు కారణం లేకపోలేదు. శృంగారమంజరిలోని 49, 62, 108, 109. 281, 284, 298 సంఖ్యలుగల శోకాలలోని నాయకునిగా అక్బరు షానే భూషించడం కనబడుతుంది. శృంగారమంజరి అనే అలంకారశాస్త్రగ్రంథం భానుదత్తుని రసమంజరి అనే పూర్వగ్రంథంపై ఆధారపడి, దానిని చాలాచోట్ల విమర్శిస్తూ చేసిన రచన. భానుదత్తుడు తన గ్రంథంలో సాత్త్విక భావాలను విశదపరుస్తూ నిజాం ధరణిపాలుణ్జీ పిర్కొన్నాడు (శోకం 121). ఈ రాజు దౌలతాబాదును పాలించిన నిజాం కా.కీ. వంశాన్ని స్థాపించిన అహమద్‌ నిజాం షా (1490-1507) అని రసమంజరికి వ్యాఖ్యానం రచించిన అనంతపండీతుడు చెప్పాడు. రసమంజరికి ఇంకా చాలామంది వ్యాఖ్యానాలు రాశారు. వారిలో గురజాల 17. డాక్టర్‌ వి. రాఘవన్‌ - శృంగారమంజరీ ఆఫ్‌ అక్బర్‌ షా-పు 7 అక్బరు షా శృంగారమంజరి ప్రతులను: గుర్తించి, వాటిని పరిష్కరించి విపులమైన పీరికతో ప్రకటించి ఎన్నో సంగతులను తెలియపరచిన రాఘవన్‌గారు సాహిత్యానికి ఎనలేని మేలు చేశారు.

680 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ రంగశాయి. ముఖ్యుడు. ఇతని ఆమోదవ్యాఖ్యును అకృరుషా తన శృంగారమంజరిలో ఆమోదించారు. రంగశాయిని “ఆమోదకారులు' అని బహువచనంలో సగౌరవంగా పేర్కొన్నారు.

గురజాల గ్రామము గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో ఉంది. ఈ గ్రామంలో చిలకమగ్రు వెంకటాచార్యులవారు గొప్ప పండితుడు. నాడీవివేకమనే వైద్యగ్రంథం రచించాడు. ఇతని నాలుగవ కుమారుడు ధర్మసూరి అని ప్రసిద్ధుడైన ధర్మాచార్యులు, ఈయనకే రంగశాయి జనించాడు. పూర్వం చిలకమర్రి వారు అనే ఇంటిపేరు ఉన్నా గురజాల గ్రామనామంతోనే ఇతడు విఖ్యాతుడయ్యాడు. ఇతడు 1600-1650 మధ్య జన్మించి ఉండాలని, క్షేత్రయ్యకు సమకాలికుడని పండితులు నిర్ణయించారు.

రసమంజరి ఆమోదవ్యాఖ్యానం మాత్రమే కాక గురజాల రంగశాయి శృంగార లహరి అనే గ్రంథం రచించాడు. తాను వాగ్గేయకార చక్రవర్తినని, నృత్యప్రబంధాలు తన రచనలలో ఉన్నాయని చెప్పుకొన్నాడు. ఇతడు తెలుగులో నాయికా భేదాలను లక్షణాలనే కాక లక్ష్యాలుగా శృంగార పదాలను కూడా విరచించాడని డాక్టర్‌ వి. రాఘవన్‌గాడ భావిస్తున్నారు. ఈ పదకర్త క్షేత్రయ్యకు సమకాలికుడై గోలకొండ అస్థానకవిగా ఉండీ ఉండవచ్చునని తూడా ఆయన ఊహిస్తున్నారు.

గురజాల రంగశాయికీ, క్షేతయ్యవాదం పెట్టుకొన్న తులసిమూర్తికీ ఏమిటి సంబంధమో ప్రస్తుతమున్న ఆకరాలవల్ల తెలియదు. క్షేత్రయ్య భానుదత్తుని రసమంబరిని అనుసరించి లక్ష్యాలు చెప్పాడని భావిస్తే తులసిమూర్తి అక్చ్సరు షా ఆమోదకారులు రంగశాయి మతాన్ని అనుసరించి పదాలు చెప్పేడేమో. ఈ వాదంలో క్షేత్రయ్య నలై రోజులలో వేయిన్నూరు పదాలు వినిపించాడని మేరువా పదం వల్ల తెలుస్తుంది. ఇవన్నీ నష్టమవడం దురదృష్టకరం.

మేరువా పదం మూడవ చరణం విస్సావారి ప్రతిలోనూ, గిడుగువారి ప్రతిలోనూ ఒకలాగే ఉందిగాని కొన్ని ప్రతులలో ఉన్న పాఠాన్ని రాళ్ళపల్ళి అనంతకృష్ణశర్మగారు. (చిలుకూరి) పాపయ్యశాస్త్రిగారు వేరువిధంగా ఉన్నట్టు గమనించారు.

“.... గోలకొండ పాదుషా కొకవేళనిలచి

తొలసి మూర్తివారు బిలచిన వేళ...

వెలయ మువ్వగోపాలుడు వేయిన్నూరు పదములు

నలువది దినములలోగానను గలసి వినిపించెనే'

ఈ అసమగ్ర పాఠంలో “బలవంతుడైన అనిగాని, ముఖ్యంగా 'వాదు' అనే పదంగాని కనబడవు. విస్సా అప్పారావుగారు సంప్రదించిన ప్రతులలో 182. 1*ో 1874, 1877. 1894 సంవత్సరాలలో ముద్రితాలైన 5 గత శతాబ్దపు ప్రతులున్నాలు వాటిలోని పాఠాలేమిటో తెలియవు. రాళ్ళపల్లివారు, పాపయ్యశాస్త్రి గారు, రాఘవన్‌గారీ 18. డాక్టర్‌ వి. రాఘవన్‌ - పై గ్రంథంలోనే - పుట 14.

  1. అందులోనే - పుతు8

క్షేతయ్య 681 చెప్పిన పాఠం 1౪81లోనూ, 1912లోనూ ప్రకటితాలయిన పుస్తకంలోనివి. విస్సావారి పాఠం ప్రకారం క్షేత్రయ్య గోలకొండలో ఎవరితోనో అలంకారశాస్త్రలక్ష్య్యాల గురించి వివాదంలో పాల్గొని పదాలు వినిపించడం చారిత్రక సత్యమే కావచ్చు. ఎవరితో వాదం పెట్టకొన్నట్టు? అ ప్రతిస్పర్థి ఏ పదాలు చెప్పాడు? అతనికీ, క్షేత్రయ్యకూ ప్రమాణగ్రంథం ఏమిటి? ప్రతిస్పర్థికి అక్పరు షా రచించిన శృంగారమంజరి, క్షేత్రయ్యకు ఖానుదత్తుని రసమంజరీ ఆమోదయోగ్యాలా? లేక ఇద్దరూ రెండు గ్రంథాలలోని లక్షణాలకు రెండు విరుద్ధమైన లక్ష్యాలను ఇచ్చారా? ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలే. విస్సావారు తమ ప్రచురణకు అనుబంధంగా వెంకటగిరి సంస్థానంలో దొరికిన శృంగార రసమంజరి అనే వివరణ గ్రంథాన్ని ప్రచురించారు. ఇందులో 150 నాయికా నాయక విభేదాలు చెప్పి... ఒక్కొక్కదాని కింద లక్షణాలకు సరిపోయే శృంగారపదాలు ఎవరో అజ్ఞాత రచయిత ఉదహరించాడు. అవి చాలావరకు క్షేత్రయ్య పదాలే గాని కొద్దిగా ఇతర ముద్రలతో రచనలు కూడా ఇచ్చారు. ఈ క్రీంది పదాలు శృంగార రసమంజరిలో ఉదాహరణలో ఇతరుల కృతులుగా ఉన్నాయి.

  1. నిదుర వచ్చునా కంటికి ఆ వేళలో
  2. ఎంతో మనసున నెరచి కొన్నందుకు నంతలో కోడికూనెనే ౩. నా మేను నీమేననుచు పలికిన (శెట్టి పుణ్యము పదము)
  3. _నన్ననవలెగాని నిన్నన పనియేమి (పదము దొరకలేదు)
  4. తలచినపుడే లేనిదానవు (వరాహుని పదము)
  5. అత్తవారూరికి నంపేరు మావారు.
  6. మాటలాడి మనసు మర్మము తెలియనివాడు
  7. ఎందుకు బొంకేవురా లేదని నాతో
  8. నామనసు వంటిది నీమనసైతే
  9. చక్కెరమోవి నొక్కి చొక్కించిన వాని
  10. ఇచ్చిన మంచిదే - ఈకున్న (సారంగపాణి పదం)
  11. మగువ ఊరు దూరమైతే మనసు దూరమా శృంగార రసమంజరిలో క్షేత్రయ్య రచనలు కాని ఈ పన్నెండులో విస్సావారు కొందరు పదకర్తలను గుర్తించారు. మిగతా పదాలలో ఎన్ని తులసిమూర్తిగానీ,- గురజాల రంగశాయిగాని చెప్పినవి? ఈ పదాల పూర్తి పాఠాలు చూసి ముద్రలు గుర్తిస్తేగాని చెప్పలేము. వెంకటగిరి వ్రాతప్రతిని చూడాలి. ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలోని 2560; ౨. 2562 అనే ప్రతులను పరిశీలించాలి. - క్షేత్రయ్య పదాలు తిరిగీ వాటి గొప్పస్థానంలో ప్రతిష్టించడానికి భగీరథ ప్రయత్నాలు చేసి కృతకృత్యులైన విస్సా అప్పారావుగారు ఎన్నో అముద్రిత ప్రతులను, గుజిలీ పుస్తకాలను శోధించి 30 పదాలను సేకరించి చక్కగా ప్రచురించారు. వాటి తల్సీళ్లు ఇవి.

682 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుళ్తి మువ్వగోపాల ముద్ర ఉన్నవి. 315 విజయరాఘవ ముద్ర ఉన్నవి 12 తుపాకుల ముద్ర ఉన్నవి 3 మొత్తం నరు అయితే ఇందులో ఒక ముద్ర పునరుక్తమైంది. “ఎంచలేదని యెంచకురా' అనే 83వ పదాన్నే మళ్లీ “ఇంత లేదని యెంచకురా' అని 309వ పదంగా అచ్చువేశారు. ఈ అదనాన్ని మినహాయిస్తి విస్సావారు ప్రచురించిన పదాల సంఖ్య 329 అవుతాయి. అప్పారావుగాడ 1950లో ఇవి ప్రచురించారు. మరి రెండేళ్ళకు గిడుగు సీతాపతిగారు అదనపు పదాలను సేకరించి ప్రచురించారు. క్షేత్రయ్య పదాలనేకాక క్షేత్రయ్య పదాలేమో అనే సందేహం ఉన్నవి, క్షేత్రయ్యలాగ వ్రాసిన ఇతర కవులవి తూడ ఇందులో ప్రచరించారు. సందేహమున్నవీ, ఇతరులవీ తప్పిస్తే గిడుగువారు సంపాదించినవాటిలో అచ్చంగా ౫1 క్షేత్రయ్య పదాలే అవి సంఖ్యవల్ల కనబడతాయి. అయితే వాటిలో చాలా పునరుక్తాలున్నాయి. కొన్ని అను పల్లవులను పల్లవులుగా భావించడంవల్ల అవి కొత్త పదాలుగా భ్రమపెడతాయి. సీతాపతిగారు తమ ప్రతిని మూడు విభాగాలుగా చేశారు స్వీయ, పరకీయ, సామాన్య అనే శీర్షికలలో పదాలను విభజించారు. అయితే ఒక భాగంలో ప్రచురించిన పదాలనే ఇంకో భాగంలో మళ్ళీ అచ్చువేశారు. ఈ పునరుక్తాల జాబితా ఇదీ

  1. ఏల తెల్లవారె 1-21ని మళ్లా 1-93గా వేశారు.
  2. ఎందుకు బొంకావురా 1-22 ౩-26 ౩. ఇటువంటి నావలపు 1-52 అ.పుతో 1-174 “చిటుకుమన్నకోపం' అనే పల్లవి చేర్చారు.
  3. ఎటువంటి వాడని 1-55 మళ్లా 3౩-25గా వేశారు
  4. ఎక్కడి నేస్తము 1-75 2-16
  5. తలిరుబోణి వారు 1-162లో పల్లవి ౩-87 “వలచేది ఒకరి కోసం" అ.ప. వేశారు.
  6. ఊరకే చాలమ 1-160 . 2-15గా వేశారు 8 విడిచిపోలేక 2-106 అనే పదం ౩-20 ఈ రీతి మదన సా[మ్రాజ్యమనే పదభాగాలు 9, ఇంత లేదని ౩-0 అనేదే మళ్లా ౩-24లో ఎంతలేదని ఇచ్చారు ఈ తొమ్మిది పునరుక్తాలు పోగా గిడుగువారి క్షేత్రయ్య పదాలు నికరంగా 37 తేలుతాయి. విస్సావారి ప్రతిలో 329 ఉన్నాయి. రెండింటికీ తేడా 4 పదాలు. అయిశే గిడుగువారిచ్చిన కొత్తవాటిలో 12 పదాలకు మువ్వగోపాల ముద్ర లేదు.) మిగతా 31 పదాలలో ముద్రలున్నాయి. వీటిలో 'మంచిదినము నేడే మహరాజుగ రమ్మనవె' అనే
  7. వాటి వివరాలు ఇవి 1-20, 1-28, 2-68, 2-71, 2-97, 3-2, 3-18, 3-58, 3-62, ౩-74, 3-69, 3-8

క్షేత్రయ్య " 683 సుప్రసిద్ధమైనది కూడా ఉంది (1-26). ఈ అదనపు పదాలలో కంచి వరదునిమీద, శ్వేత వరదుని మీద, సత్యపురి వాసుదేవునిమీద, శ్రీశైలనిలయుని మీద తలొక పదం లఖిస్తూంది. క్షేత్రయ్య పదాలలో ఉన్న ఈ ఉపముద్రవల్ల అతడు యేయే క్షేత్రాలను దర్శించాడో తెలుస్తుంది. విస్సావారి క్షేత్రాలలో కొన్నిటినే వివరించారు. వేదపురి, చలువ చక్కెరపురం, కరిగిరి మొదలైన క్షేత్రాలు వారు గుర్తించలేదు. ఇప్పటివరకు లభించిన పదాలను పట్టి క్షేత్రయ్య చూసిన క్షేత్రాలను జిల్లా వారీగా తాలూకాల విభజనతో పొందుపరుస్తున్నాను.

ఈ పట్టికవల్ల క్షేత్రయ్య రాయలసీమలోనూ, తమిళ జిల్లాలోనూ మాత్రమే పర్యటనం చేసినట్టు కనబడుతుంది. క్షేత్రయ్య రాయలసీమవాడే అనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ సంగతి చెప్తూ మిత్రులు తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు ఇలా బ్రాశారు: “కొన్ని అప్రసిద్ధములైనా సాధారణంగా దక్షిణదేశ యాత్రికుని మార్గంలో తగులని గ్రామదైవతములమీద క్షేత్రయ్య పదాలు చెప్పి ఉండడంచేత క్షేత్రయ్య ఈ ప్రాంకాలవాడే యేమో అనే సందేహానికి కూడా అవకాశం కల్గుతోంది. క్షేత్రయ్య దర్శించిన స్థలములను బట్టి మాత్రమే కాక ఇతడు తన పదములలో వాడిన భాష్క నానుడులు, పదప్రయోగములు, కారకములుకూడ కొన్ని ఇతనికి దత్తమండల ప్రాంతీయతను ధువపర్చుచున్నవి” అని ఉదాహరణలిచ్చారు.*! ఒక పదంలో “క్షేత్రయ్య పామాడీ జోగివలె పాయెనా బ్రతుకు” అన్నాడు (వి-13). పామిడి అనంతపురం జిల్లాలో ఉంది. ఆ వూళ్ళో మెట్ట వేదాంతులుండేవారట.

క్షేత్రయ్య జీవితంలో మెట్ట వేదాంతం ఉందో లేదోగాని అతని పదాలలో నాయికతో క్రీడిస్తూ ఆ మంచంమీదకే మరొక ప్రేయసిని రప్పించుకొన్నాడు. మరునాడు నాయిక ప్రశ్నించింది. ““ఇద్దరిసందున పవ్వళించిన యింతిపేరేమిటిరా? గద్దరివగల మువ్వగోపాల, గాజుల చప్పుడు నే వింటిగదరా' అంది. ఇందులో నాయిక జీవాత్మ; నాయకుడు పరమాత్మ సందున పడుకొన్నది మాయ అని వ్యాఖ్యానం తూడా చేస్తున్నారు.22 మువ్వ గోపాలుడు పరమాత్ముడంటే అంగీకరించవచ్చును. “క్షేత్రయ్య తన పదములందు ధ్వనింప జేసిన వేదాంతమిది! విజయరాఘవుడే పరమాత్మ, జీవులు స్త్రీ ప్రాణులు, రాఘవుడు ప్రియతముడు” అని చెప్పినవారే మొత్తం మీద క్షేత్రయ్య వివరించారు.3ి

క్షేత్రయ్య పదములలో వేదాంతం కోసం వెతకడం ఉత్త శ్రమ। “అలౌకికమైన భక్తి శృంగారం క్షేత్రయ్య పదాలలో నాకు ఎక్కడా కనపడదు. గోపాల మకుటం వున్నంత చూత్రాన లౌకికం అలౌకికం అవుతుందా?” అని పాకాల రాజమన్నారుగారు నిలదీసి 21. భారతి, ఆగష్టు, 1951. 2 నం 51 పదములు - పీఠిక, ఆ, ఆ 3. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము - సంపుటి 3, పుట 6.

684 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ |

క

|

11 ఈ సేం! న జం !!

క శ్లైన్లే సాడీ ప! |

ళ్‌ (

111 | 111ష1! న.

క్షేత్రయ్య 685 ప్రశ్నిస్తున్నారు.డో నిజమే. క్షేతయ్యలో పచ్చి శృంగారం పరవళ్ళు తొక్కుతుంది. అతని నాయికలు కొంచెకత్తిలు కారు. సమర్హాడి నెలపూటలయిన దగ్గిరనుండి, కారం తింటూ కరకరలాడే పచ్చి ఒడలున్న బాలెంతలదాకా అన్ని వయసుల వాళ్ళూ ఉన్నారు. “ఒక్కసార్‌కే ఇలాగైతే ఓహో ఇదేమి రతిరా?” అని ప్రశ్నించగలరు (వి.150). “ఇంకొక్కసారి నేనే ఓలలాడీంతునే?” అని నిర్మొహమాటంగా అడగగలరున్‌ (వి. 16). అత్తవారి ఊరికి పోతూ ““కత్తికోతగాడు మగడేమిచేసునొ?' అని బాధపడి, పోరాడి యెటులైన బొంకి వస్తాననే వాళ్లున్నారు. (1-13). క్షేత్రయ్య నాయికలలో బర్‌తెగించినవాళ్ళు మళ్ళీ కాదు. ఇంకా ఉన్నారు. ఎప్పుడైనా మువ్వ గోపాలుడే దోషం, నీచం అనే పట్టింపులు పెట్టుకోవచ్చు. నాయికలకు మాత్రం ఆ బెడదలు లేవు. 'చెరగుమాసి ఉన్నానని యోచన సేయవద్దుర సామిః దొరర్టైున మువ్వగోపాల, పరసతులకు దోసమెన్నడు లేదుర అని హితోపదేశం చేస్తుంది. పైగా 'ఇన్నాళ్ళవలె కాదురా నేటి సుఖమెరిగోడే మరవవురా నా సామి' అని ఊరిస్తుంది (గి. 2-93). అయితే "'చెరకు తీపని వేరుతో పెకలించవద్ద''ని చెప్తూ అత్తింటి కాపురాలు చేస్తారు. 'బొట్టుకట్టిన' వాడింటికీ వెడతారు. చీర చిక్కితి వెదకి వేరు వెల్లంకి తెమ్మంటారు. ఇలాంటి నాయికలను చూసి క్షేత్రయ్య ఒక ప్రశ్న వేశాడు :

చూడరె అది నడిచె హెయలు సుదతి చేయు జాడలు

ఆడది కులకాంత అత్తింటి కోడలు

అల గోపాలుని విడిదికి వెడలెను ॥చూడరె॥

కొండంత కాపురము రానుపోను కోమలి కందలమె

దండున గెలిచే మగడు తక్కువేమే

తలవ్రా లెవరికి తప్పించవశమే. ॥చూడరె॥

పైట కొంగు జారినను తెలియక భయ మించుకయు లేక

తోటివారు నవ్వుదురని యెంచక

దోచునటె అది గయ్యాళి బల్‌ జాణ ॥చూడరె॥

అత్త చమూమ బావమరదులను తిట్టి అవమానము వడినిగట్టి

గుత్తగాను మువ్వ గోపాలదేవుని

గూడునటె అది మనిషా మ్రూకా. (చూడం! (గి. 1-17) అది మనిషి కాదు. మదనలతలు పూచిన త్రూకే! 'క్షేత్రయ్యవనంలో నిత్యం వసంతమే. అతని పువ్వుల చుట్టూ ఉన్న ముళ్ళు చాలా సౌంపుగా ఉంటాయి. ఈ ముళ్లు గుచ్చుకొన్నాా మెత్తగనే ఉండొచ్చు. అయితే అది వేరే విషయం. క్షేత్రయ్య పదాలలోని అశ్లీలాలను గురించి చర్చ మొదలు పెట్టి సాహిత్య ప్రాడ్వివాకులు పాకాల రాజమన్నారుగారు ప్యూడల్‌ రసికతను అనుసరించి ఇలా అన్నారు: ల! వారి పదాలు' - తొలి పలుకు, పుట ౪ జ. ఎన వర టేరరన పదాల లము పట షడం గమనించదగిన విషయం

686 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ

“ఈ కాలం వారు కొందరు ఈ పదాలలో పచ్చి శృంగారం చాలా ఉందని అక్షేపించవచ్చును. ఆ తప్పు (అది తప్పయితే) ఆయనది కాదు; బలహీనులైన ఈ కాలంవారిదే. అజీర్ణవ్యాధి గ్రస్తునకు పనసకూర అపథ్యమైతే తప్పు పనసతూరదా? మన తాతలు తిన్నంత మనం తినగల్లుతున్నామా? మన జీర్ణశక్తి తగ్గిపోయింది. జీర్ణశక్తితో పాటు రసాస్వాదన శక్తి తూడా మనకు తగ్గిపోయింది. అందే! కొన్ని పదాలు విని కొందరు చెవులు మూసుకోవచ్చు. ఏ పదంగాని రసవంతమైతీ అశ్లీలం ఎలాగ అవుతుంది? ఇదీ నా సమాధానం”

ఇది తీర్పు! దీనికి అప్పీలు లేదు!

చెంగల్వ కాళయ్య

దొమెర్ల వెంగళరాజుగారి బహుళాశ్వ చరీత్రవల్ల ఆ కాలంలో వేశ్యలకు విద్యాగురువులుగా విప్రులుండేవారని తెలుస్తూంది. తంజావూరులో రఘునాథనాయకుని కాలంలో ఉన్న రామభద్రమ్మకు, విజయరాఘవుని కాలంలో రాణించిన కృష్టాజీకి తెలుగు కవిత్వం నేర్చిన గురువు పేరు చెంగల్వ కాళకవి. ఈయన పాకనాటివాడు; కాళహస్తీశ్వర భక్తుడు. ఇతని తండ్రీ ఎవరో శ్రీకంఠునివద్ద మంత్రిగా ఉండేవాడు. ఆయన పేరు వెంకటయ్య. అతడు తూడా కే పార్వతీ పరిణయం అనే ప్రొడ కావ్యాన్ని వ్రాశాడు. అది నేడు నష్టమైంది. పాకనాటినుండీ చెంగల్చవారు ఎప్పుడు తంజావూరు వచ్చారో తెలియదు. 'రణరంగ గంధవారణ' అనే బిరుదు ధరించిన శ్రీకంఠునివద్ద తండ్రీ మంత్రిత్వం చేస్తే కాళకవి తంజావూరులో విద్యా వ్యాసంగం చేశాడు. నాగవాసంలోని జవరాళ్లకు చదువులు చెప్పాడు.

రామభద్రమ్మకు చదువులు చెప్పినా ఈ కవి రఘునాథనాయకుని దృష్టిలో పడలేదు. ఇతణ్జీ విజయరాఘవుడే ఆదరించాడు. చెలికత్తిలతోపాటు స్వయంగా కాళయ్య ఇంటికి విజయరాఘవుడు విచ్చేసి విందులు ఆరగించి ఇంటిల్లి పాదికీ బహుమతుల ఇచ్చేవాడు. ఎంతటి భాగ్యశాలి, ఇతడెంతటి ధన్యుడని భావిస్తూ పాండురా జకుమార్తెవంటీ అంతఃపురకాంతలు కొలుస్తూ ఉండగా విజయరాఘవుడు ఇతణ్జి కన్నులనప్పుకొంటూ అత్యంత బహుకృతులు సలిపేవాడు.

తన ఇంటికి ఏ చెలికత్తితోపాటు విజయరాఘవుడు వచ్చేవాడో చెప్పలేదుగాని, 6 నాయకుని మనసు రంజింపజేసే తొమ్మండుగురు నాట్యకత్తెల పేర్లను అతడు “రాజగోపారి విలాసం' అనే కావ్యంలో చెప్పాడు. విజయరాఘవుని కొలువులో ముద్దు చంద్రరేఖ అనే నర్తకి ప్రముఖన్థానం అలంకరించింది. ఈ జాణ వీరవెంకటరాయలవారిని మెప్పింి విరుదులు పొందింది. ఈమె తంజావూరు వచ్చి విజయరాఘవనాయకుని ప్రేయసి అయిండీ బహుశా ఈమె మూలంగానే కాళకవికి విజయరాఘవుసాతిక్తానం లఖించింది కాబోలు ఆమె సిఫార్సువల్లే విజయరాఘవుడీ కాళయ్య రచించిన రాజగోపాల విలాసం కనే కావ్యాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. ఆమె మేలు మరచిపోలేక కాబోలు, కాళకవి ప్రీ

చెంగల్ప కాళయ్య 687 అశ్వాసం చివర ఆమె పేరు తలుచుకొన్నాడు. విజయరాఘవుని ముద్దు చంద్రరేఖానాధునిగా సంబోధించాడు. రాజగోపాలవిలాసాన్ని చంద్రరేఖా చిహ్నితం చేశాడు. రాజగోపాలుడు మన్నారుగుడిలోని దేవుడు. ఇతడు విజయరాఘవ నాయకుని ఇష్టదైవం. మన్నారుదాసుడనేది విజయరాఘవునికి ఇంకో పేరుగా రూఢీ అయింది. ఆ రాజగోపాలస్వామి విలాసాలనూ, ఆ స్థలపురాణాన్నీ అంకితం పుచ్చుకొనడానికి చంద్రరేఖ సిఫార్సు లేకపోయినా విజయరాఘవుడు అంగీకరించేవాడు. అతడు క్రీశ 163లో గద్దెనెక్కిన వెనువెంటనే అంకితం పుచ్చుకొన్న గ్రంథాలలో ఇది మొదటిది. ఇది అయిదాశ్వాసాల కావ్యమేగాని ఇందులో 440 గద్భ్యపద్యాలకన్న ఎక్కువ లేవు. అయినా ఈ కావ్యంలో ఒక ప్రమ్యేకత వుంది. మన అలంకార శాస్త్రాలలో శృంగార నాయికలను వివిధ రీతులలో విఖాగించారు. అవస్థా భేదాలవల్ల అష్టవిధ నాయికలను అందరూ పేర్కొన్నారు. శాస్త్రజ్ఞులు ఉదాహరణలిచ్చారు. నాయికాఖీేదాలెలా ఊంటాయంటే -

  1. గుణమువల్ల - ఉత్తమ, మధ్యమ. అధమ
  2. వయసు, కౌశలము - ముగ్ధ. మధ్యమ, ప్రగల్ఫ
  3. ధైర్యంవల్ల - ధీర, అధీర
  4. పరిగ్రహణంవల్ల - స్వీయ.
  5. అపరిగ్రహంవల్ల - అన్క.
  6. అవస్థలవల్ల - స్వాధీనపతికాది ఎనమండుగురు వీళ్లుకాక ఊడానూడలు, ఉదాత్త, శాంతలలితలు, సామాన్య, పునర్చువు, స్వైరణీ, రూపాజీవ, గణిక, విలాసినులు అనేక రకాలు. నాయిక, ప్రతినాయిక, ఉపనాయిక అనే భేదాలు ఉన్నాయి. సరస్వతీకంఠాభరణం ప్రకారం నాయికా ఫేదాలు32. సాహిత్య దర్పణం ప్రకారం 384 మంది! శాస్త్రరీత్యా ఇన్ని తేడాలున్నా స్వాధీనపతికాది ఎనమండుగురే ప్రసిద్ధులు. ఈ అష్టవిధ నాయికలను ఒకే కావ్యంలో చిత్రించాలని కాళయ్య భావించాడు. కృష్ణునికి ఎనమండుగురు భార్యలున్నారు. ఈ అష్ట మహిషులని అష్టవిధ నాయికలుగా అతడు ఊహించి రాజగోపాలవిలాసాన్ని బ్రాశాడు. ఈ కావ్యాన్ని తంజావూరు సరస్వడీమహలు గగ్రంథాలయంవాళ్లు ప్రచురించారు. నిడుదవోలు వెంకటరావుగారు విమర్శనాత్మకంగా _ పరిష్కరించి సుదీర్హమైన పీఠికను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ వ్రాశారు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ అనుబంధాలు చేర్చారు. రాజగోపాలుని పట్టమహిషులలో ప్రతిఒక్కరూ కృష్ణుడు తమనే వలచాడని తమకంలో భావించుకొనేటట్టు ఆయన వారిని అనందవార్డిలో తేల్చాడు. అష్టవిధ నాయికల లీలలు అలరగోరి ఆ అష్టమహిషులను, ఆ జాడలను కృష్ణుడు అనువుపరచాడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరి వద్దకు దూ-తలను పంపించాడు. తనమీద నేరంమోపి, తప తననన పప వసన లాను
  7. ప్రతాపరుద్ర యళోభూషణం (నాయికా ప్రకరణం) - చలమచర్ల రంగాచార్యులవారి రచన, పుట 31.

6886 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుకి ఎంత వేడుకొన్నా అలుక తీరకుండా రుక్కిణి ఉన్నదని తెలిసి ముందు ఆమె మేడలోనిక వెళ్లాడు. పొంచి అక్కడి సంగతులు విన్నాడు. రుక్కిణి బాధపడుతోంది. “ఎందుకు కొండెములు విన్నాను! ఎందుకతనితో దెబ్బలాడాను? ఇప్పుడెలాగ వేడుకొంటాను' ఆని పహ్పూత్తాపం చెంది ఇలా తలపోసిందిః

చెలువుడ నీవు నా డచట చెక్కులపై కొనగోర కస్తురిన్‌

వలపున మన్మథాంకములు వ్రాయుచు నేర్పిన నాటసూదినన్‌

చెలులు కనుంగొనంగ జడచే నిను కొట్టిన యట్టి నేరముల్‌

తలపున నిల్పి నీవు దయతప్పిన నిప్పుడు తాళనేర్తునే? (రాజగో. 1-1౫)

ఈ విధంగా బాధపడే శృంగార నాయికను కలహాంతరిత అంటారు. సర్వ సింగభూపాలుడు రసార్హవ సుధాకరంలో ఇలా నిర్వచించాడు:

యా సఖీనాం పురః పాదపతితం వల్లభం రుషా,

. నిరస్క్య పశ్చాత్తపతి కలహాంతరితా తు సా. (రంజనోలాసం, 1-౫) పొందేది కలహాంతరిత. రాజగోపాలవిలాసంలో రుక్మిణి అవస్థ ఈ లక్షణాలకు సరిపోతుంది. అయితే కావ్యపరిష్కర్తలు ఇక్కడ రుక్మిణిని స్వీయ అని పేర్కొన్నారు! అష్టవిధ నాయికా ఖేదాలలో స్వీయ అనే పేరు ఉండదు. ఈ కావ్యంలో కాళి అవస్థావిభాగంలోని అష్టవిధనాయికలనే తీసుకొన్నాడు. అదీకాక శ్రీకృష్ణుని భార్యల ఎనమండుగురూ స్వీయలేగాని పరకీయలు గారు. రుక్కిణినే స్ప్వీయగా పేర్కొనడం తప్పు

చెలుల ముందు నాథుని చులకన చేశానని బాధపడుతున్న, రుక్కిణి ఇంకా ఇలా బాధపడింది

వాటములైన బంగరు కవాటములం గలయట్టి యందముల్‌

నీటున మీటు నీయురము నిండగ గుబ్బల నాని పల్‌ మొనల్‌

నాటగ నొక్కి చొక్కి జితనంబున వాతెరతేనె యానకే

మాటల దీరునా యువతి మన్మథ మన్మథతాపవేదనలో (రాజ. 1-11)

ఆమె మన్మథ తాపాన్ని తీర్చాలని కృష్ణుడు కనికరించాడు. కలసి క్రీడించాడు. ఇక్కడ రుక్మిణి ఇంట ఇలా ఉండగా భద్ర ఇంట్లో అమెనొక దూతిక కలుసుకొంది. “నువ్వు వచ్చేదాకా సురపొన్నలపజ్ది తేటమించు తెలివాకల మావిమూకల గొజ్జంగి పరిమళాల మధ్య స్వామివారు ఉంటామన్నారు అని సంకేతం చెప్పి,

సమయోచిత శృంగారము - సముచితముగ బూనవమ్మ సారసముఖి నీ

రమణుడు నాతో చెప్పిన - సమయస్థలి చేర నిపుడె చనవలయుజుమా!

(రాజ, 2-13) గానో 2. ఒకచోట కాదు, రెండుచోట్ల - గ్రంథంలో 1-ఇపై ఉపశీర్షికలోనూ, పీకిక 4 పుటలోనూ రుక్మ

స్వీయగా పేర్కొనబడింది.

చెంగల్వ కాళయ్య 689 అని దూతిక హెచ్చరిక చేసింది. భద్ర అలంకరించుకొని వెళ్లింది. ప్రియుని కలుసుకొనడానికి వ్లో శృంగార నాయికను అఖిసారిక అంటారు. కాని ఈ కావ్య పరిష్కర్త నిడుదవోలు వెంకటరావుగారు భద్ర “జారిజీ' అని 2-4 పైన ఉపశీర్ణికలో అన్నారు. పీఠికలో ఈమె కలహాంతరిత అన్నారు (పుట. 45). రాజగోపాలవిలాసంలోని పద్యాలను సరిగా పరిశీలిస్తే రుక్మిణీ కలహాంతరిత అనీ, భద్ర అఖిసారిక అనీ తెలుస్తుంది. జారిణి అనే పేరు అష్టవిధ శృంగార నాయికలలో లేదు. కట్టుకున్న భార్య తన కాంతుణ్జి కలుసుకోడానికి వెడితే జారిణి ఎలా అవుతుంది? అఖిసారికగా భద్ర తనను కలుసుకోవచ్చేలోపున సంకేత స్థలంలో కృష్ణుడు విరహాన్ని అనుభవిస్తాడు. “క్రీగన్నుల నవ్వునట్టి కలకంఠిని కౌగిట చేర్చుటెన్నడో” అని పలవరిస్తాడు.

అంతలో ఆ సంకేత స్థలానికి అభిసారిక భద్ర వచ్చింది. నాయికా నాయకులు శ్రీడించారు... వారి బడలికలు ఆ పరిసర కాసారతీరంలో ఉండే హంసలు రెక్కల విసనకర్రలతో హరింపబేశాయి. ఇక్కడ ఇలా ఉండగా, లక్షణ కాంతుడు వస్తాడని ఇల్లంతా అలంకరించింది. ఒళ్లంతా ముస్తాబు చేసుకొంది. నాయకుని కోసం అలంకరించి ఎదురుచూసే నాయికను 'వాసక సజ్జిక అంటారు. స్త్రీల గృహద్వారాన్ని వానకమని భరతముని చెప్పాడు. వంతుదినాన్ని తూడా వానకము అంటారు. రాజగోపాల విలాసంలో లక్షణ అనాడు తన వంతు దినమని అలంకరించుకొంటుంది...

వారము నేడె యంచు యదువల్లభు రాకను గోరి లక్ష్మణా

సారసగంధి కేళిమణిసొధము తా గయిచేసి వేడుకన్‌

హారపదాంగద ప్రముఖ హారిణియై తపనీయ మందిర

ద్వారమునందు నిల్వ నొక వారిజలోచన చేరి యిట్లనెన్‌. (రాజ 2-42) ఆ చెలికత్తెను లక్షణ నాయకునివద్దకు పంపింది. అతడు వచ్చాడు. ఆమెతో భాషించి జ్రీడించాడు. అంతలోనే ఒక ప్రణయకలహం వచ్చింది. 'లోలాక్షి, నీకటాక్ష సరసాలోకంబులో కాళిందీవిలాస వైఖరుల జోకల్‌ మించె' అని కృష్ణుడు అన్నాడు. సవతి పేరు ఎత్తినందుకు లక్షణ ముఖం చిన్నబుచ్చుకుంది. ఎడమోము పెడమోమై ఏకశయ్యను విరహతాపంలో మగ్గిపోయారు. అతడు చివరకు అనునయించాడు. ఈ కావ్యంలో లక్షణను వాసక సజ్జీకగా కవి చిత్రించినా ఆమె కూడా “జారిణి' అని పరష్కర్హలు 2-42 పద్యంపై ఉపశీర్షికలు ప్రకటించారు.

లక్షణ నావిధంగా డేలించిన కృష్ణుడు జాంబవతి ఇంటీకీ వెళ్లాడు. ఆమె దూతికలతో చెప్పే మాటలను వినాలని చిగురాకు జొంపాల సందున దాగాడు. అతడు వస్తాడని రాలేదు, వంచించాడు. “చెలువని వంచనకు తనదు చిత్తములోన' బాధపడుతూ జూంబవతి వాపోయింది. ఈ విధమైన శృంగార నాయికను విప్రలబ్ధ అంటారు. కావ్యాలంకార చూడామణిలో విన్నకోట పెద్దన ఇలా నిర్వచించాడు:

పంచిన యెడ కేతెంచక - పంచించిన దయతుతో వివాదము సంపా

దించి చెలితోడ దుఃఖో- దంచితయగు విప్రలబ్ధతత్పరబుద్ధిన్‌.

(చూడామణి, 3౩-70)

690 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఈ లక్షణానికి సరిపోయేటట్టు జాంబవతి దూతికతో తన గోడు వెళ్లటోసు కుంటూంది. 'వల్లభుడాడు మాట నెరవంచన యంచు తలంచనైతిని' అంటుంది.

ఈ విప్రలబ్బ తన భర్తనిలా నిందిస్తే చెలికత్తి ఊరడించి “కులకాంతల్‌ పతినేర్చు నేరముల కెగ్గుల్‌పట్టి పల్తార్తురే” అని హితోపదేశం చేసింది. ఆ తరువాత కృష్ణుడు వచ్చాడు. ఆమెను ఆనందింపజేశాడు. జాంబవతితో క్రీడించిన గుర్తులతోనే కృష్ణుడు మిత్రవింద ఇంటికి వెళ్లాడు. అతని ఆకారాన్ని చూసి మిత్రవింద కోపించింది.

చెక్కిట గోరులున్‌ నిదురచిన్నాలు చూపెడి వాలుచూపులున్‌

బుక్కటి వీడియంబును గుబుల్‌కొను మేను జవాదివాసనల్‌

టెక్కులు చూపి మీన్‌బిరుదు టెక్కెము వాని విలాసవైఖరిన్‌

జొక్కుచువచ్చి! నాయకుని చూసి కషాయితలోచనాంతయై. _ (రాజ. 3-2) హితుగర్చంగా చీవాట్లు పెట్టింది. అన్యకాంతతో క్రీడించి వచ్చిన పతిని చూసి కోపించే నాయికను ఖండీత అంటారు. మిత్రవింద అన్నమాటలన్నీ విని ఆమెనెలాగో అనునయించి కృష్ణుడు అమెతో రమించాడు. తరువాత విరహదురంతమైన సుదంతను చూడాలని వెళ్లాడు. ఆమె ఎలదోటలో ఒక మనోహరమైనచోట చలువగంధపు గిన్నెలు, తాటాకు విసనకగ్రలు తామరతూళ్లు మొదలైనవి పట్టుకొని చెలికత్తిలామెను ఊరడిస్తున్నారు. “సౌలపుల్‌ మీరగ వాడు వచ్చి కను మెచ్చుల్‌చేయడేమందునే! అని అమె విచారించింది. అతని దోషాలు

లెక్కించుదామనుకొంది. అతనిపై నేరముల నెన్ను నట్టి వేళ నతని సద్గుణములే యాత్మ దోచు మమత లిటువంటి నతనికి మరులుకొంటి తామసించిన నింక నే తాళజాల. (రాజ. ౩-ట) కాంతుని శంకించక, రాత్రంతా అతని ఎడబాటుకి విలపించే నాయికను 'విరహోత్కంఠిళ అంటారు. కావ్యాలంకార చూడామణిలో విన్నకోట పెద్దరాజు ఇలా నిర్వచనం చెప్పాడు: వరుడనురక్తుం డయ్యు ని - తరమగు పని గలిగి రాక తడయుట విభా వరియందు నగలు పొలతుక - విరహోత్కంఠిత యనంగ విశ్రుతికెక్కున్‌. (చూడామణి. ౩-6) సుదంత ఇలాగ విరహవేదన పొంది చంద్రుని, మన్మథుని, చల్లగాలిని నిందిస్తుడి ఆ తరువాత రాజగోపాలుడు వచ్చి ఆమెను రతులలో తేల్చుతాడు. ఆ పిమ్మట కాళిందివద్దతు దూతికను పంపించాడు. తను పౌరుగూరు వెడుతున్నట్లు వర్తమాను తెలియజేశాడు. అమె ఇలా బాధపడింది. వద్దకు వచ్చు నాధుడను వార్తలు నీ వన నమ్మియుండి యే నద్దమ రేయిదాక నడియాసల నాతని రాక గోరగా ప్రొద్దును వోదు నన్ను మరి ప్రోషితభర్హ్చృకగా నొనర్చియే గద్దరిసుద్దు లెంచి వడిగా జనెనో హరి గొల్లపల్లెకున్‌ (రాజు 4+)

చెంగల్వ కాళయ్య 691 మగడు వేరే స్థలానికి వెళ్లినప్పుడు వియోగానికి విలపించే నాయికను ప్రోషిత భర్హృక అంటారు. ఈ లక్షణానికి సరిపోయేటట్టు చిత్రించడానికి శ్రీకృష్ణుడు గొల్లపల్లెకు వెళ్లాడనే భావాన్ని కాళిందికి చెంగల్వ కాళకవి కల్పించాడు. ఆమె ఇలా విలపిస్తుందిః పలుకుల దెచ్చుకోల్వలపు పై బచరించుచు వింత వింతలౌ కులుకుల లేని మచ్చికల గూర్చుచు గైతవనర్మ మర్మముల్‌ సాలపుల జూపు జంతలకు జొక్కుదు రింతయ కాక గట్టిగా వలచినవారిపట్ల మగవారల కెక్కడి మోహమక్కటా! (రాజ. 4-9) నిజానికి కృష్ణునికి ఆమెమీద మోహముంది. కొంతసేపు అమెను కోపింపనిచ్చి కృష్ణుడు అక్కడకు వచ్చి ఆమెను అనురాగంతో తేలించాడు. అక్కడినుంచి అతడు సత్యభామ ఇంటికి వెళ్లాడు. వచ్చిన కృష్ణునికి ఆమె ఎదురువెళ్లి కైదండ తీసుకొని రాజసంతో శెంపుల మేడకు తీసుకువెళ్లింది. ఆడలో పూలపాన్నుపై కూర్చుని సరస సల్లాపాలాడుకొన్నారు. వరుడు కైవసమైన నాయికను స్వాధీనపతిక అంటారు. సత్యభామకు, కృష్ణునికి సమానురాగాలు కల్గాయి. వాళ్లు ఆనందాల్థిలో ఓలలాడారు. అంతటితో తెల్లవారింది. రాజగోపాలవిలాసంలో అష్టమహిషులను ఇలాగ అష్టవిధ నాయికలుగా చెంగల్వ కాళకవి రూపొందించాడు. ఇవాళ సాధారణ ప్రజల ఉద్దేశంలో సత్యభామ ఖండితగా, కలహాంతరితగా కనబడుతుంది. రుక్కిణిని నిత్య స్వాధీనపతికగా ఊహించుకుంటాం. అయినా కాళకవి సత్యను సంతుష్టితాత్మగా సృష్టించాడు. అత డేనాయికను ఏ మహిషిని రూపొందించాడో క్రోడీకరించాను. వరుస [మహిపి [బాయి [కం [నం పరం 1... | రుక్కిజీ కలహాంతరిత (మొదట ట్రియుని తూలనాడి ప్రథమ 92-125 పశ్చాత్తాపం పొందేది (౫ పద్యాలు) 2 భద అఖిసారిక ప్రియునివద్దకు వ్లేది ద్వితీ ౩-40 (౫ పద్యాలు) ర లక్షణ వాసకసజ్జీక ఇళ్ళు ఒళ్ళు అలంకరించుకొనేది | ద్విడీ. 42-79 (౫ పద్యాలు) 4. | జాంబవతి | విప్రలబ్ధ ప్రియుడు వస్తానని రాకపోతె | తృతీ. ౩-27 వంచితురాలైనది (25 పద్యాలు) 5. | మిత్రవింద | ఖండీత అన్యకాంతతో గడీపి వచ్చిన | తృడీ. 23-55 వాళణ్ణీ చూసి కోపించేది (28 పద్యాలు) 6. | సునంద _. | విరహోత్కంఠిత | అనురత్తుడైన ప్రియుని తృతీ 58-% ఎడబాటుకు బాధపడేది (౫ పద్యాలు) 7. | కాళింది | ప్రోషితభర్హృక | పొరుగూరు వెళ్ళిన భర్తకై చతుర్థ. 3-28 విచారించేది (24 పద్యాలు) 8. | సత్యభామ | స్వాధీనపతిక | భర్తను స్వాధీనం చేసుకొన్నది | చతుర్థ. 27-50 (24 పద్యాలు)

692 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ

ఈ విధంగా నాలుగాశ్వాసాలలో అష్టవిధ నాయికలుగా అష్టమహిషులని చిత్రించాక 29 పద్యాలలో ద్వారకా నగరాన్ని వర్ణించాడు.

పంచమాశ్వాసంలో దక్షిణ _ద్వారకగా పేరుగాంచిన మన్నారుకోవెల స్థలపురాణాన్ని, మహత్వాన్ని వర్డించాడు. ఈ క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలోని విష్ణుక్షేత్ర ఖండం ఉత్తరభాగంలో ఉంది.

ఈ కవి గురించి నిడుదవోలు వెంకటరావుగారు పీఠికలో చాలా ప్రశంసించారు. “ఈతని సమాన రచన నన్నయ శ్రీనాథుల రచన దలపించును”. “నన్నయవలె మత్తేభ వృత్తము నడిపించుటయందు కాళకవి గట్టివాడు. వస్తువర్ణన గావింపక భావస్ఫోరణీయ ముగా సంభాషణమూలముననే శృంగారరసావిష్కరణము కావించిన కాళకవి ప్రతిభ యసమానమైనది. అని మెచ్చుకొన్నారు. గాని వారి మాటలు “వ్రతానాముత్తమం ఛ్రతమనున్యాయముబడి చెప్పిన మాటలని తోచుచున్న' దని నేలటూరివారు అన్నారు*

కాళయ్య కవిత్వంలో స్వాతంత్ర కల్పనలేవీ లేవు. వివిధ అలంకార శాస్త్రాలలో వివరించిన అష్టవిధనాయికల మనోభావాలను మ్‌ంచి ఇతడు చెప్పినది అట్టే లేదు. ఇతని పద్యం కుంటదుగాని సమాస కల్చనలలో శ్రీనాథునిలాగా ప్రతిభా వ్యుత్చత్తులు ప్రదర్శింపలేడు.

రఘునాథనాయకుని కాలంలో ఉన్నా అప్పుడు రాజణించక, విజయరాఘవుని కొలువులో సత్కారాలు పొందడంలోనే కాళయ్య ఎంతటివాడో తెలుస్తుంది.

సాధారణ కవులు రఘునాథుని విద్యల మెప్పించ శక్కంకాదని చేమకూర వెంకటరాజుగారన్న మాటలు సత్యం. అతనన నాలనానననాా నాణాలని 3. రాజగోపాల విలాసం, పీరిక 48, 47, 48.

  1. మధుర తంజావూరు నాయక రాజులనాటి అంధ్ర వాజ్బయ చరిత్ర - నేలటూరి వెంకటరమణయ్య పుట 3.

రామభద్రమ్మ, రంగాజమ్మ, మరికొందరు స్త్రీని దేవతగా ఒక పక్క అరాధిస్తున్నా, నిత్యజీవితంలో ఆమెకు ఇవ్వవలసిన స్వాతంత్ర్యాన్నిగాని, సముచిత స్థానాన్నిగాని మన పూర్వులు ఇవ్వకపోవడంచేత మన సాహిత్యంలో మహిళా రచయితలు ఇవాళదాకా కొద్ది సంఖ్యలోనే కనబడతారు. తెలుగులో కవిత్వం చెప్పిన తొలితరం ముత్తయిదువులను వేళ్లమీదనే లెక్కపెట్టవచ్చు. నాయకరాజుల యుగం మొదలయ్యేదాకా, ఎంతసేపు లెక్కించినా తాళ్లపాక తిమ్మక్క, మొల్ల మాత్రమే కావ్యాలు వ్రాసినట్టు తేలుతుంది. చాటువులు చెప్పిన ఒకరిద్దరిని కూడా కలుపుకొనవచ్చు. ఖడ్గతిక్కన భార్య చానమ్మ, అతని తల్లి పోలమ్మ చెరొక చాటువూ చెప్పారని సంప్రదాయంవల్ల తెలుస్తూంది. యుద్ధంలో ఓడిపోయి. వచ్చిన భర్తను నులకమంచం చాటున, చిరుబంతిపసుపాడమని చానమ్మ ఏర్పాటు చేసింది. ఈ అవమానానికి అతను వగచినప్పుడు ఆమె ఈ క్రింది పద్యం చెప్పిందట. పగరకు వెన్నిచ్చినచో - నగరే నిను మగతనంపునాయకు లెందున్‌ ముగురాడవారమైతిమి - వగ పేటికి జలకమాడ వచ్చినచోటన్‌? గోరుచుట్టుమీద రోకటిపోటులాగ, భార్య చేసిన పరాభవం చాలదన్నట్టు, విస్తట్లో అన్నంపెట్టి విరిగిన పాలు వడ్డించిన తల్లి ఇలాగ సంజాయిషీ చెప్పిందట: అసదృశముగ నరివీరుల - మసిపుచ్చక విరిగివచ్చు మగవంద క్రియన్‌ గసవున్‌ మేయగ బోయిన - పసులున్‌ తిరిగినవి తిక్క! పాలు విరిగెన్‌ ఈ చాటువులను చెప్పిన అత్తాకోడళ్ళు మన తొలి తెలుగు రచయిత్రులని కొందరు భావిస్తున్నారు. ఈ చాటువులు చెప్పిన కాంతల కాలం క్రీ.శ. 1260 ప్రాంతాలు, తాళ్లపాక తిమ్మక్క 1460 ప్రాంతాలలో ఉంది. అంటే రెండు వందల సంవత్సరాలదాకా చాటువులు చెప్పే మగువల పేర్లు సైతం మరుగున పడ్డాయన్నమాట. తిమ్మక్క తరువాత నూరేళ్ళకు మొల్ల పేరు వినబడింది. ఆ తరువాత ఓ ముప్పాతిత శతాబ్దం పైన శ్రీ.శ. 160 ప్రాంతాలలో పసుపులేటి రంగాజమ్మ ప్రముఖ రచయిత్రిగా పేరు పొందింది. ఆమె వ్రాసిన కావ్యాలు రంగాజమ్మ పేరు రమణీయ పతాకంగా రెపరెపలాడుతుంది. ఆమెకు విజయరాఘవ నాయకుడు కనకాభిషేకం చేశాడు. కావ్యాలు బ్రాసీ, కనకాభిషేకం చేయించుకొని తెలుగులో రంగాజమ్మ ప్రసిద్ధురాలైనా, అమెకు ముందు తంజావూరులో రచనలు చేసిన విదుషీమణలు, కనకాఖిషేకం చేయించుకొన్న కవయిత్రులు లేకపోలేదు. రఘునాథనాయకుడు మధురవాణి అనే రచయిత్రికి కనకాఖిషికం చేశాడు. అమె సంస్కృత భాషలో సుందరకాండదాళా రామాయణాన్ని వ్రాసింది. ఆ కావ్యం తొమ్మిదోసర్గ చివర తాను “మాధుర్యైక ధురంధరాంభ్ర కవితా నిర్మాణ సమ్మాన్య'నని చెప్పుకొంది. అయితే అమె బ్రాసిన

  1. అఖిల భారత కవయిత్రులు - ఊటుతూరి లక్ష్మీకాంతమ్మగారి సంకలనం, పుటు 52.

694 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అంధ్రకవిత ఏమీ మనకు దక్కలేదు. మధురవాణి అశేష ప్రజ్ఞగల విదుషీమణి, ఘటికార్థంలో నూరు శ్లోకాలు నిర్మించగలదు. సద్యోవిస్మయం కల్లించే కవిత్వం - అందులోనూ నిరోష్ట్యంగా _ చెప్పగలదు. ఆశువుగా షడ్చాషా రచనలు చేయగలదు. రఘునాథనాయకుడు తనకు స్వర్దాఖిషేకం చేశాడని ఈమే తన రామాయణం పదకొండో సర్గ చివర చెప్పుకొంది.

మధురవాణిలాగ కనకాఖిషికం చేయించుకోకపోయినా రఘునాథుని మన్నన పొందిన మరొక కవయిత్రి పేరు రామభద్రాంబ. ఈమెకూడా మధురవాణిలాగ ఆశుకవిత్వంలో దిట్ట. తాను 'శతలేఖినీ సమసమయలేఖినీ యాష్టభాషాకల్పిత చతుర్విధ కవితానుప్రాణిత సాహిత్యసాయ్రాబ్బు భద్ర పీఠారూడ'నని చెప్పుకొంది. ఈమె పన్నెండు సర్గలలో “రఘునాథనాయకాభ్యుదయం' అనే చారిత్రక కావ్యాన్ని సంస్కృతంలో బ్రాసింది. 900 శోకాలున్న ఈ గ్రంథం నాయకరాజుల చరిత్రను తెలుసుకొనడానికి మన చరిత్రకారులకు పనికివస్తూంది. ఈమె చెంగల్వ కాళకవి అనే తెలుగుకవి శిష్కురాలు, మధురవాణితోపాటు ఈమె రఘునాథనాయకుని విద్యావినోదాలలో పాల్గొనేది.

ఆ పడుచులిద్దరూ గీర్వాణ ప్రాకృత సమస్యలు పూరించడానికి ఉబలాటపడేవారు. రఘునాథనాయకుడు కొల్పుదీరి, ఆ సభలో అష్టభాషా కవిసార్వభౌములచేత వాళ్ళను పరీక్షింపజేసేవాడు. “అమ్మయ్య! స్వామినగర లక్ష్మీసరస్వతులు సాక్షాత్కరించి యుండగా పరీక్షలెందుకయ్య? అయినను మీ రానతిచ్చిన మీరరాదు” అని ఆ కవి రాజులు రాజుతో చెప్పి పరీక్షించేవారు. 'రారాజని యచ్చ్యుడేంద్రు రఘునాథనృషపా' అనే తెలుగు సమస్యను రామభద్రమ్మ ఇలా పూరించిందట.

ఏరీ నీ సరిరాజులు - భూరమణులు నిన్ను జాల బొగడుదురు భళీ

స్వారాబని రేరాజని - రారాజని యచ్యుతింద్రు రఘునాథనృషా!

రఘునాథనాయకుని ఆస్థానంలో ఎందరెందరో తెలుగు కవయిత్రులున్నా, వాళ్ళీ రచనల మింజుమలె ఈ ఒక్క సమస్య మాత్రమే మనకు లఖిస్తూంది. విజయరాఘవ నాయకుని కాలంలో వెలసినవాళ్ల రచనలు మాత్రమే గ్రంథరూపంలో దొరుకుతున్నాయి. అయితీ అందరి రచనలూ లఖించడం లేదు. విజయరాఘవ నాయకుని ఆస్థానంలో కృష్టాజీ అనే కవయిత్రి ఉండేది. ఈమెకూడా రామభద్రమ్మలాగా చెంగల్వ కాళకవి శిష్యురాలు, ఈమె గొప్పతనాన్ని గురువుగారే తాను వ్రాసిన కావ్యంలో ఇలా ప్రశంసించారు.

ప్రస్తారసంఖ్యను పదమూడు కోటులు నలువది రెండు లక్షల పదేడు

వేలు నేళ్లూరును వింశతియును నాణు వృత్తంబులందు నీ వృత్తమునకు

నీవర్ణన సమస్య నీవు కూర్చు మటన్న నా వృత్తమున సమస్యను రచించి

యందుకు శోకంబు లాశువుగా జెప్పి యవి తెలుంగునను పద్యములుచేసి

ఇరువదారును ఛందంబు లెరిగి యిట్లు

కవిత చెప్పినవార లీ భువిని కలరె 2. రఘునాథనాయకాభ్యుదయం (యక్షగానం) - కర్త విజయ రాఘవనాయకుడు, పుట 19

రామభద్రమ్మ, రంగాజమ్మ, మరికొందరు 695

యనుచు నందరు వినుతింపఘనత గాంచె

కీరనీయగుణాలంబ కృష్ణమాంబ. (రాజగోపాల విలానం, 1-27)

13, 42, 17, 726 వృత్తాలలో అడిగిన వృత్తంలో కోరిన సమస్యను రచించి, దానికి శోకాన్ని చెప్పి అది తెనిగించగల్లిన ప్రతిభ కృష్టాజీకి ఉందట. ఇంతటి సామర్థ్యమున్న ఈ కవయిత్రి వ్రాసిన గ్రంథాలేవీ మనకు మిగలలేదు. ఈమె విజయరాఘవుని కొలువులో ఇతర విదుషీమణులతోపాటు వసంతకేళిక వినిపించేదని రంగాజమ్మ వ్రాసిన వాక్యాలవల్ల తెలుస్తోంది.

మరియు నా దండ నిస్తుల గుణప్రశస్తయగు కస్తురమ్మయు, నతివిశాల నయనాంబుబజయగు యంబుజ వల్లెమ్మయు, విశదగుణరేఖయగు శశిరేఖమ్మయు, ప్రఖ్యాత కర్రల మోహనమూర్తమ్మయు, సరసగుణ నిష్టాత యగు కృష్ణాజమ్మయు... మొదలుగా గల కాంతామణులు సంతసంబున వసంతకేళిక వినిపింప...

(మన్నారుదాస విలాస ప్రబంధం, 1-15) విజయరాఘవుడు కొలువులో ఉండేవాడు. అందులో “తాము రచించిన సరస మధురంబులగు ప్రబంధములు' ఆ వెలదులు వినిపించేవారు. ఇటువంటి సభలోనే ఒకనాడు విజయరాఘవ నాయకుడు తూర్చుని రంగాజమ్మను చూసి అమె నొక కావ్యాన్ని బ్రాయమన్నాడు. ఎటువంటి కావ్యం బ్రాయాలో విజయరాఘవుడే నిర్దేశించాడు. ఇతివృత్తాన్ని ఆదేశించాడు.

శృంగారైక రసంబులౌపదములన్‌ చెల్పొంద మెప్పించితౌొ

సంగీతజ్ఞులు మేలునా నుభయభాషాచాతురిన్‌ నీ వికన్‌

రంగ త్రౌడి ప్రబంధ మొక్కటి యొనర్చంగావలెన్‌ మత్కథన్‌

రంగాజీ భవదీయ వాగమృుత ధారావైఖరుల్‌ మీరగన్‌

(మ.దా.విలాస ప్రబంధం, 1-19)

నిండు కొలువులో అందరి ముందు విజయరాఘవుడు ఇలా అదేశించగానే రంగాజీ “ధన్యోస్మి అనుకొంది. దానికి కారణం ఉంది“... మద్చర్హవు, మహీభర్తవునైన స్వామి సకల విద్యా విశేషంబుల సవతులేని నా సవతులైన యిందరిందుముఖుల ముందరనుం గటాక్షించి యింపుమీర గృతి నిర్మింపుమని యానతిచ్చిరి (మ.దా.వి. ప్రబంధం 1-20). ఈ వచనంవల్ల విజయరాఘవనాయకుని భోగపత్నులలో రంగాజమ్మ ఒకర్తె అని తెలుస్తూంది. ఆమె పసుపులేటి వెంకటాద్రి కుమార్తె. అప్పటికే ఆమె రామాయణ, భారత, భాగవతాలకు సంగ్రహాలు వ్రాసింది. ఈమె ఎవరి శిష్యురాలో తెలియదుగాని తాను అసాధారణ ప్రతిభావంతురాలనని చాటుకొంది. అమె వ్రాసిన గ్రంథాల చివర చెప్పిన గద్యవల్ల ఆమె బైదుష్యం తెలుస్తుంది. అమె ప్రజ్ఞలివిః

  1. అనుక్షణ ప్రవర్థమాన సారస్వత ధురీణ, 2, 3, 4,5, 6.

  2. విచిత్రతర పత్రికాశత లిఖిత వాచికార్ధావగాహన ప్రవీణ.

696 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

౩. తత్రతి పత్రికా శత స్వహస్తలేఖన ప్రశస్తకీర్తి.

  1. శృంగార రసతరంగిత పద కవిత్వ మహనీయ మతిస్ఫూర్తి.

  2. అతులితాష్ట భాషాకవితా సర్వంకషామహోష విశారద

  3. రాజనీతి విద్యా విశారద.

ఇన్ని ప్రజ్ఞలున్నట్టు చెప్పుకున్నా మన్నారుదాసవిలాసం అనే ప్రబంధాన్ని బ్రాయడంలో ఆమె ప్రతిభ అంతటినీ వినియోగించినట్టు లేదు. ఇది అయిదాశ్వాసాల కావ్యం. తంజావూరు పాలకుడైన విజయరాఘవ నాయకుడు ఒకనాడు రాజగోపాలస్వామి వారి తిరువీధి మహోత్సవాన్ని తిలకించాడు. అప్పుడతణ్జి కాంతిమతి అనే రాజకుమార్తె చూసి మోహిస్తుంది. ఎన్ని కైత్యోపదారాలు చేసినా మదనతాపం తీరదు. ఆ జవరాలు తన చెలికత్తిను విజయరాఘవునివద్దకు రాయబారం పంపిస్తుంది. నాయకుడు కూడా నాయికను చూసి అనురక్తుడయ్యాడు. అతని మోహాన్ని తెలుసుకొన్న గురువు శతక్రతు శ్రీనివాసకాతాచార్యులవారు ఈ ప్రేమకు పూర్వజన్మలోని ఒక సంఘటన కారణం అని ఒక కథ చెప్తాడు: అది బ్రహ్మాండమైన అబద్ధం. అతిశయోక్తి వినండి

ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరమాత్ములవారు సూర్యుని కుమార్తె అయిన కాళిందిని పెళ్లిచేసుతున్నారు. ఇది చూసిన చంద్రుడు ఊరుకోలేకపోయాడు. 'సూర్యునికన్నా నేనేం తీసిపోయాను? నా కూతుర్చి తూడా స్వామివారు పెళ్ళాడాలి' అనుకున్నాడు. శ్రీకృష్ణని దర్శనం చేసుకొని “ప్రభూ, సూర్భ్యుడూ, నేనూ తమకు రెండు కళ్ళు కదా. ఈ రెండింటికీ భేదం లేదని చాటడానికి తాము నా కుమార్తెను కూడా పెళ్ళాడా' లని విన్నవించుకొన్నాడు. పదహారువేల మందిని పరిణయం ఆడిన ఆయనకు ఇంకోపెళ్ళి భారం అవదుగాని వావీ వరుస కొంచెం చూడాలనుకొన్నాడు. అందుచేత చంద్రుని కూతురు మేనగోడలి వరస అవుతుంది. ''కలియుగంలో తంజావూరులో విజయరాఘవ నాయకునిగా అవతరించినప్పుడు నీ తూతుర్నీ చేసుకొంటాను” అని బాస చేశారు. ఆ చంద్రుడే ఈ రాజచంద్రుడు, అతని కూతురే కాంతిమతి.

ఇలా ఒక పూర్వజన్మ వృత్తాంతాన్ని సృష్టించి మన్నారుదాసుణ్ణి గురువుగారు సంతోషపెట్టారు. దాన్ని గ్రంథస్థం చేసి రంగాజమ్మ పుణ్యం కట్టుకొంది. మన్నాడ్‌ దాస చరిత్ర విన్నా చదివినా, వ్రాసినా “ఆయురారోగ్యపుత్ర పొత్రాఖివృద్ధి, “ధన కనక వస్తువాహన సమృద్ధి" మాత్రమే కాక “నిరుపమాన కవిత్వ పాండిత్య మహిమ' రూడా కల్గుతుందని రంగాజమ్మ ఫలశ్రుతి తూడా చెప్పింది. ఇవాళ మనకు ధన కనీ వస్తువాహనాలు లఖించినా లఖించకపోయినా అనాడు ఈ కావ్యాన్ని వ్రాసినందుకూ సభలో చదివినందుకూ, అందరికీ వినిపించినందుకూ విజయరాఘవుడు మెచ్చుకొన్నాడు. కనకాఖిషేకం చేశాడు. కావలసినంత గౌరవం చేసి ఆమెను ధర్మపత్నిని చేసుకొన్నాడు.

చెప్పుకొంది. అనంతర కృతుల గద్కలో “విజయరాఘవ మహీపాల విరచిత కనకాఖిషేక నని చాటుకొంది.

రామభద్రమ్మ, రంగాజమ్మ, మరికొందరు 6097 ఆమెతోనే ప్రొద్దస్తమానం గడిపేవాడు. ఇది చూసి పట్టమహిషి కోపం పట్టలేకపోయింది. తిడుతూ తన చెలికత్తెచేత కబురంపింది. దానికి జవాబుగా రంగాజమ్మ ఈ క్రీంది పద్యం బ్రాసీ పంపిందటః:

ఏ వనితల్‌ మముం దలప నేమిపనో? తమ రాడువారు గా

రో? వలపించు నేర్చెరుగరో? తమ కౌగిటిలోన నుండగా

రావదియేమిరా విజయరాఘవ యం చిలుదూరి బల్మిచే

దీనరకత్తినై పెనగి తీసుకువచ్చితినా తలోదరీ?

(చాటుపద్య మణిమంజరి, పుట 1-64) బలిమిచేత కాక చెలిమితోనే రంగాజమ్మ విజయరాఘవ నాయకుణ్ణి కట్టేసుకుంది. అతణ్జీ అద్భుతంగా పొగడడం ఆమెకు తెలుసు. నిజానికి ఆమెకే తెలుసేమో. ఒకసారి ఆయన మంచంపై కూర్చున్నప్పుడు ఈ చాటువు చెప్పింది:

ఇంతీ, పానుపుపై నిదె - కంతుడు తూర్చున్నవాడు కనుగొను వహవా

కంతు డనంగుడు నీ తెలి - వింతేనా విజయరాఘవేంద్రుడు చెలియా! విజయరాఘవుడు మన్మథాకారుడే కాకు సుమక"మలుడని చెప్పడానికి ఇంకో సంవాద పద్యం వ్రాసింది.

“రాజసభానినాః సరసురాలవు, జబ్బుగ నల్లినా వదే

మే జడ!” "“యింతకంటిె వలెనే?" వలనొప్ప బిగించి యల్లనే

యోజవరాల 'వేటె పని యున్నది. దోసమె, దోసమే మహా

రా జగునట్టి యవ్విజయరాఘవు మై చిగురాకె కోమలీ.

(చాటుపద్య చుణిమంజరి-1, పుట 64)

విజయరాఘవ నాయకుని విలాసాలను శీర్తించే మన్నారుదాస విలాస ప్రబంధాన్ని సభలో వినిపించినప్పుడే హరివంశ కథయైన ఉషాపరిణయాన్ని ప్రబంధంగా వ్రాయమని రాజు రంగాజమ్మను ఆజ్ఞాపించాడు. ఆమె వ్రాసింది. అందులో అయిదు ఆశ్వాసాలు ఉన్నట్టున్నాయి కాబోలు. నేడు నాలుగో ఆశ్వాసంలోని 70 పద్యాల దాకానే గ్రంథం దొరుకుతూంది. ఈ కావ్యం ఏమంత గొప్పదీ. చెప్పుకోతగ్గదీ కాదు.

ఈమె “కృతియందు కావ్యశిల్పముగాని, కథాకథనమున నైపుణిగాని కానరాదు. _ అయినను ఇందలి శైలి సమాసాడంబరము లేక చక్కని పలుకుబడితో సులభగ్రాహ్యమై ఉన్నది. తంజావూరి నాయకరాజుల కాలము నాటి ఆచార వృవహారములును అంతఈపురమున జరుగు శృంగార క్షియాకలాపములును నిందు వర్ణితములగుటచే ఇది వాజ్బయ చరిత్రకారులకు నుపయుక్తము' అని నిడుదవోలు వెంకటరావుగారు వ్రాశారు. ఇది కూడా సానుభూతితో అన్నదేగాని చరిత్రకారులకు ఉషాపరిణయం అట్టే తోడ్చడదు. 4. ఉషాపరిణయం, తంజావూరు - సరస్పతీమహల్‌ ప్రచురణ, పీరిక, పుట 1

698 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అయితే ఉషాపరిణయాన్ని ప్రత్యేక గ్రంథంగా వ్రాసినవాళ్లలో రంగాజమ్మ ప్రథమురాలని పరిశోధకులు భావిస్తున్నారు. కాని తాళ్ళపాక తిరువెంగళనాథుడు (క్రీశ 1498-1561) దీనిని ద్వాపదకావ్యంగా మొదట చెప్పాడు. ప్రజ్యేక పద్యకావ్యంగా బ్రాసిన వాళ్ళలో రంగాజమ్మ మొదటిది అనుకోవచ్చు. తెలుగులో ఉషాపరిణయం కథనం చేసే గ్రంథాలు పాతిక పైచిలుకే ఉంటాయి. ఈ పాతిక గ్రంథాలలో మొదటి మూడు గ్రంథాలలోనే ఉన్న ఫ్రొడ రచన రంగాజమ్మ కావ్యంలో కనబడదు. వరుస గ్రంథం పీరు రచయిత __విాలు

  1. | హరివంశం ఎర్రాప్రగడ ఉత్తరభాగం-7,8 ఆశ్వాసాలు 2... | ఉత్తరహరివంశం. | నాచనసోముడు పంచమాశ్వాసం 46వ పద్యం మొదలు ౩. | భాగవతం బమ్మెరపోతన దశమస్కంధం ఉత్తర భాగం 311 నుండి 447 దాకా 136 పద్యాలు
  2. | ఉషాపరిణయం తాళ్ళపాక తిరువెంగళనాధుడు ద్విపద (ముద్రితం)
  3. | అనిరుద్ధచరిత్ర భావన పెమ్మన పద్యకావ్యం 67 పద్యాలు, పెదపాటి జగ్గన్న ఉదహరించాడు
  4. ' ఉషాపరిణయం దామెర్ల అంకరాజు పద్యకావ్యం, అముద్రితం 7... | ఉషాపరిణయం రంగాజమ్మ పద్యకావ్యం, అసమగ్రం
  5. | వజ్రాభ్యుదయం కోన నారాయణ పద్యకావ్యం, అసమగ్రం త ఉషాపరిణయం విజయరాఘవ నాయకుడు యక్షగానం (నష్టం)
  6. | ఉషాపరిణయం శ్రీనివాసుడు యక్షగానం
  7. | ఉషాపరిణయం అనంత కవి యక్షగానం
  8. | ఉషాపరిణయం విరిపాటి నృసింహకవి | యక్షగానం
  9. | ఉషాపరిణయం యమ్మనూరి వెంకట- సుబ్బ గానం
  10. | ఉషాపరిణయం రలు. వెంకట యక్ష సుబ్బయ్య కవి యక్షగానం
  11. | ఉషాపరిణయం మీసరగండ ఓబుళరాజు | యక్షగానం
  12. | ఉషాపరిణయం తిరువీధి చెంచుసుబ్బదాసు| యక్షగానం
  13. | అనిరుద్ధ చరిత్ర గురురాజకవి యక్షగానం 1$. ' ఉషాపరిణయం అనందదాసు యక్షగానం
  14. | ఉషాపరిణయం మెరట్టూరి
  15. | ఉషాపరిణయం చెన్నయ్య యక్షగానం
  16. | ఉషాపరిణయం వైపా మానయ్య కవి పద్యకావ్యం
  17. | ఉషాపరిణయం మూళగిరి యక్షగానం ౫. ' ఉషాపరిణయం పోతుల వెంకటరామయ్య | యక్షగానం
  18. | ఉషాపరిణయం నడిమింటిరామజోగి | గేయం
  19. | ఉషాపరిణయం దుర్గరాజు చిదంబరం యక్షగానం
  20. | ఉషాపరిణయం ధర్మవరం కృష్ణమాచారి | స్టేజినాటకం
  21. | ఉషాపరిణయం వేదం వెంకటరాయశాస్త్రి | యక్షగానం
  22. దక్షిణదేశీయాంధ్ర వాజ్మయం, పుట 14.

రామభద్రమ్మ, రంగాజమ్మ, మరికొందరు 699. ఆ రోజులలో చలామణీలో ఉండే వాద్యాల పేర్లు ఒగ పద్యం వల్ల తెలుస్తాయి. చెలికత్తెలతో ఉష వినోదిస్తుంది. అప్పుడు జరిగిన సంగీత మేళాన్ని రంగాజమ్మ బాగా పిర్కొంది. దండె తంబుర స్వరమండలంబు రబాబు వేటుగబ్బలు ముఖవీణె డక్క చెంగు కామాచి యుపాంగంబు కిన్నెర వీణె తాళంబు(ను) బిల్లగోవి చిటితాళము రముయు శేషనాదంబు రావణహస్తమును జంద్రవలయములను మురజంబు నావజంబును మొదలు గాగల్గకమనీయవాద్యముల్‌ గరిమెదాల్చి రంగురక్తులు గులుకంగ రాజముఖలు ముం గలను వేరి త్రిభువన మోహనముగ వెలగి సంగీత మేళంబు జేసి కొలువ వేడుకలు మీర నెంతయు విభవమలర. (ఉషాపరిణయం, 2-4) నాయకరాజుల కాలంలో రాజాంతఃపురంలోని ఈతల చెరువులో జారుడు బల్లలు ఉండేవి. మాటిమాటికి జారుడువీట లెక్కి - సారసాక్షులు కొందరు జారి సారె నొండొరుల మీద జలములు నిండుకొనగ - జల్లులాడిరి సరసిలో సరసముగను

  • (ఉషా. 2-12) అందరూ విచ్చలవిడిగా విహరించే ఆ రోజులలో కూడా వారకాంత పొందుకు వ్లోవారు. బాహాటంగా ఇంటికి రావడానికీ సిగ్గుపడేవారు కాబోలు. ద్వారకలో అనిరుద్ధుడు కనబడనప్పుడు అతణ్జీ వెతుకుతున్న కాంతలు ఇలా అనుకొన్నారు. పురిని గల వారకాంతల పౌందుగోరి - మదనకేశిక నలయుచు నిదురబోయి తెల్లవారిన కతమున నుల్లమునను - సిగ్గపడీ రాకయున్నాడొ? చెలువలారః। _ (౩3-101) రంగాజమ్మ వ్రాసిన ఉషాపరిణయం వల్ల కాక మన్నారుదాస విలాస నాటకంవల్ల అనాటి సాంఘిక పరిస్థితులు కొన్ని తెలుస్తాయి. అంతకు ముందు తాను ప్రబంధంగా బ్రాసిన విలాసాన్నే ఆమె యక్షగానంగా రూపొందించింది. రెండింటి కథలలో మార్పేమీ లేదు. ప్రబంధంలోని మొదటి నాలుగు ఆశ్వాసాలలో కొత్తదనం ఏమీలేదు. సాంఘికచరిత్రకు నిశ్చయ తాంబూలం నుండి నిషేకందాకా అన్నీ తీరుబాటుగా వివరించింది. పెళ్ళి చుంత్రాన్ని సైతం అనువదించింది. 'మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా" అనే చుంత్రం ఇలా తెనిగించిందిః ఎలమిని మదీయజీవన హేతువైన యట్టి మాంగల్యతంతువు నమరబూని

700 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపులి

కోరికలు (మీర నను) గూడి వారిజాక్ష

యింపుతోడుత ధాత్రి వెయ్యేళ్ళు మనుము. (మన్నారు- ప్రబంధం, 5-4) మంగళసూత్రధారణ తరువాత కొంగుముళ్ళు వేయడం, సప్పపదులు మెట్టడం మొదలైనవి వర్ణించింది. పెళ్ళి భోజనాలను ఒక వచనంలో వివరించింది. 67 రకాల వంటకాలన పేర్కొంది. ఈ పలు వగల వంటకాలలో శాకాహారాలే కావు, మాంసాహారాలు తూడ్రా ఉన్నాయి. విందుభోజనాల తరువాత నాగవల్లి వేడుకలను వర్ణించింది. ఉప్పేనుగుల పప్పేనుగులు ఇరుగడల వ్రాకారట. నాగపసానిచేత దేవతల పూజ చేయించారు. నాగి కుతికంటు మంత్రోక్తంగా కట్టాక వేడుకలు ఇలా జరిగాయని రంగాజమ్మ వర్జించింది.

ఆచార్యవర్యుండునప్పుడు ప్రోలున-కిరుగడ నవ్వధూవరుల నునుప

నుప్పేను గిచ్చెద బప్పిను గిమ్మని-విజయరాఘవమహీవిభుడు బల్కి

సిగ్గుచే నయ్యెడ జెలగినా యేనుగ-పదిలక్ష లని పల్కె భామ నగుచు

బప్పేను గిచ్చెద నుప్పేను గిమ్మని-పెండ్లికూతు రదుగ (బ్రేమ మీర

గొమ్మ నా యేనుగిది పదికోటు లనుచు

బలుక మన్నారుదాసుడా పడతితోడ

నతులితామోదమునను దంపతుల జూచి

నవ్విరందరు కలకలనాదమెసగ (మన్నారు- ప్రబంధ, 5-6)

నాగవల్లిలో ఈ ఉప్పేనుగు - పప్పేనుగల బేరాలయ్యాక, పొన్సు, మూసి నాయనాల మొదలైనవి రంగాజమ్మ వర్ణించింది. తెలుగుతనం ఉట్టిపడే ఈ వివరాలన్నీ ప్రబంధంలో ఉన్నా నాటకంలో లోపించాయి. అయితే నాటకంలో సాంఘిక వాతావరణ కనబడుతుంది. పంచాంగం బ్రాహ్మణులు, విద్వాంసులు, పునిస్తీలు ఒకరినొకరు తిట్టుకోవడం జాస్తి, పామర వినోదం ఎక్కువ. విజయ రాఘవనాయకుని ఆస్థానంలో వెలసిన ఇతర యక్షగానం బాజీ నాటకాలలో ఉండే మాదిరిగానే ఇదీ ఉంది. రంగాజమ్మ తాను శృంగారరసతరంగిత పదకవిత్వాన్ని చెప్పగలనని గద్యలో వ్రాసుకొందిగాని, చున్నారుదాసు విలాసంలోని పద్యాలు, దరువులు కూడా ఏమంత గొప్పగా లేవు “కులకాంత లేయూరు వలపు లేయూరు”' (పుట.16) అనిపించింది. ఇది స్త్రీ కవిత్సమగుట చేతను పండితాదరము నొందకపోదని నమ్ముచున్నారము అని వ్రాసింది*

ఇది నేడు పండికాదరం పొందడం సంగతి అటుంచుదాం. అనాడు రాజాదరు పొందింది. ప్రభువును మెప్పించే విద్య రంగాజమ్మకు తెలుసు కనుక ఆమె రచనలను అనంతర రచయిత్రులు కొల్లగొట్టారు. సొందరి అనే రచయిత్రి ఒకామె రంగాజమ్మ రచనలను యథాతథంగా తీసుకొని పాత్రల పేర్లు మార్చి తన పేర ప్రకాశం చేసింది. మన్నారుదాస విలాసాన్ని అక్కడక్కడ మార్చి 'అల్లాడ విజయసింహభూపతి సింహ విలాసం' అనే పేరిట సొందరి చాటుకొన్నది. సౌందరి గ్రంథం ప్రతి ప్రాచ్చ లిఖిత గ్రంథాలయంలో ఊరి (డి-73). డిద్కిప్టివ్‌ కాటలాగులో ఇలా వ్రాశారు:

రామభద్రమ్మ, రంగాజమ్మ, మరికొందరు 701 “రాజరాజనరేంద్రుని అనంతరము రాజమహేంద్రపురాధీశ్వరుడయిన యల్తాడ విజయభూపతిసింహుని శృంగారచరిత్రము నాతని భార్యయు, రాచవీటి నరపతికిని మౌక్తికాంబకును గూతురును నగు సౌందరీదేవి, అల్లాడ విజయభూపతి సింహవిలాసమను పేర ప్రబంధముగా రచించినట్టిందు గలదు. ఇది వట్టి బూటకముగా తెలియవచ్చుచున్నది. తంజావూరి తెలుగురాజై సుప్రఖ్యాతుడైన విజయరాఘవనాయకుని ప్రేమపాత్రమగు రంగాజీ యను స్త్రీ రచించిన విజయరాఘవనాటక చరిత్రమే యగు మన్నారుదాస విలాసమను ప్రబంధమే యిది యగును. కర్త పేరు, కృతినాయకుని పేరు మొదలగు నవిందన్యధీకరింపబడినవి. ఇందిప్పుడున్న విధమున గృతినాయకాదులు చరిత్రాంశ పరికీలనకు గోచరింపకున్నారు. (కేటలాగు, సంపుటి 2, భాగం 2, పు 1041) మన్నారుదాస విలాషమేకాక రంగాజమ్మ వ్రాసిన ఒక దండకాన్ని సహితం దొంగిలించి అల్లాడ విజయసింహభూపతికి అంకితంగా అంటకట్టిన సంగతి కూడా గ్రంథాలయ పరిశోధకులు తెలియజేశారు (డి. 2001). యక్షగానాలు- దండకాలు అను శీరికను మదరాసు ఓరియంటల్‌ లైబ్రరీవారు ప్రకటించిన డి. కేటలాగు 8వ సంపుటి పుట 225లో ఈ సంగతులు ఉన్నాయి. విజయరాఘవుడు మెచ్చిన రచనలు చౌర్యం చేసైనా తన రాజుకు అంకితం ఇస్తే రంగాజమ్మలాగ కనకాఖిషేకాలు చేయించుకోవచ్చునని సొందరి భావించిందేమో. అయితే రంగాజమ్మలాంటి గౌరవం నోచుకొనేవాళ్లు చాలా అరుదు. రాతకోతలో రాణించగల అవకాశాలు కొందరు రమణులకు నాయకరాజుల హయాంలో లఖించాయి. ఆటపాటలేగాక చదువు సంధ్యలూ, సాహిత్య వ్యాసంగాలూ ' మొదలైనవి కనీసం ఒక వర్గం స్త్రీలైనా అక్కడ లభించడం గమనించదగ్గ విషయం. భోగలాలస వల్లనే గావచ్చు లేక పోతుటీగ చొరబడకూడని అంతఃపురాలలోనే రాచకార్యాలు కూడా ప్రభువులు చూసుకొనడం వల్ల వచ్చిన కమ్మవక్కణాలు చదవడం, వాటికి జవాబులు లిఖించడం మొదలైన రాయసం పనులు చేసే స్త్రీలు అవసరమయ్యారు. నాగవాసం నుండి రాజీవాసం దాకా ఈ వర్గం వ్యాపించింది. మన్నారు దేవుడు రచించిన 'హేమాబ్దనాయికా స్వయంవరం' అనే యక్షగానంలో పాలమున్నీటి మన్నీడు మన్నారుదేవునికి నారదునిచేత ఒక పసుపు పత్రికను పంపించారు. “మన్నారు. దేవుడు కనుసన్న సేయనొక రాయసంపుకొమ్మ యాకొమ్మ వేఠొని సమ్ముకమ్మున నిలచి చదివెనట ఎటువలెనో? రాయసంపు చెలి, చదివే పద్యం” అని విజయరాఘవుని కుమారుడు పొందుపరిచాడు.” దీనివల్ల స్వామి సన్నిధిలో రాయసంపు పడచులు ఉంటారని విశదమవుతోంది. 1 రంగాజమ్మ తన “మన్నారుదాస విలాసం' అనే ప్రబంధంలో తన కవితాశక్తుల గురించి ఇతరులు చెప్పుకొన్న సీసపద్యం చివర ఎత్తుగితిలో ఇలా ప్రకటింపచేసింది. తననన పు 7, హైమాబ్దనాయికా స్వయంవరం - పుట

702 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుళి

““అనిశమును రాయసములు బ్రాయంగ జదువ సమయ మెరుగుచు గార్యభాగమల దెలుప నిపుణ భావంబు జగతిలో నీకజెల్లు” (మ.దా.స.విలాసం 1-17)

ఈ పద్యభాగం వల్ల రాయసం పడుచులు కేవలం రాతకోతలకేకాక స్వామి సమయ; తెలుసుకొని కార్యభాగములు నివేదించే ప్రయివేట్‌ నెక్రటరీలుగా తూడా పనిచేసేవార్సి ఊహించవచ్చు.

రంగాజమ్మ రాయసం పడుచుగా కొలువులో చేరి రాజపత్నిగా ఎదిగింది.

ప్రతిభలు రకరకాలు.

కొందరు నాటకకర్తలు

నాయకరాజుల యుగం ఒకరకంగా నాటకాలయుగం అని చెప్పవచ్చును. అంతదాకా పండిత సభలోనే పాలాన్న సాహితి కాళ్లకు గబ్జెకట్టి బహిరంగ వేదిక ఎక్కింది. రాజులూ రసికులూ, పండితులూ, పామరులూ అందరూ 'కాపష్యేషు నాటకం రమ్యం' ఆని గుర్తించారు. రాఘవయాదవపాండవీయం వంటి శ్లేష కావ్యాలు వ్రాస్తేగాని తన ప్ర బయటపడదనే ఎలకూచి బాలసరస్వతివంటివాడు 'రంగకౌముది' అనే నాటకం వ్రాశాడు ఆంధ్రశబ్దచింతామణీ వంటి వ్యాకరణ గ్రంథానికి వ్యాఖ్యానంగా లక్షణ గ్రంథాన్ని వ్రాసుకొన్న అప్పకవిలాంటి శాస్త్రకారుడు 'అంబీకావాదం' అనే యక్షగానం వ్రాశాడు ఉత్తరరామాయణాన్ని వ్రాసిన కంకంటీ పాపరాజు తన రచనావ్యాసంగాన్ని 'విష్ణుమాయా విలాసం' అనే యక్షగానంతోనే ప్రారంభించి తాను '“విష్టమాయా విలాసాఖిదాన యక్షగాననిర్మాణ ప్రవీణతా విధానుణ్ణని సగర్వంగా ఉత్తర రామాయణ గడ్భలో చెప్పుకొన్నాడు. వాణీవిలాసవనమాలిక లాంటి విజ్ఞాన సర్వస్వాలు వ్రాసిన టేకుమళ్ళ రంగశాయి 'జానకీ పరిణయం' అనే యక్షగానం మొదట వ్రాశాడు. శేషధర్మాలను తెనిగించిన వెణుతురుపల్లి విశ్చనాథం కూడా ' శ్రీరామవిజయం' అనే యక్షగానం వ్రాశాడు వీళ్ళంతా నాయకరాజుల కాలంలో ఉన్నా నాయకరాజుల సీమకు వెలుపల ఉన్నవాళ్ళు

తంజావూరులో యక్షగానాలు మొదట ప్రఖ్యాతమైై అవి నాటకాలుగా మారాయి. వ్రాసే కృష్ణాధ్వరి కూడా 'కల్యాణకౌముదీ కందర్ప నాటకం' అనే దృశ్యకావ్యం వ్రాశాడు తంజావూరులో నవరత్నమయమైన నాటకశాల తొలినుంచీ ఉండేది. ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. దానిని ప్రస్తుతం “సంగీత మహలు' అని పిలుస్తున్నారు. దీనిని రంగస్థల రంగస్థలాలేకాక నాయకరాజుల కాలంలో బయట నాటకశాలలు కూడా ఉండేమి “విజయరాఘవనాయనయ్య వారవధరింపగదరయ్య! దేవర పదపద్మములను మీ బైట తాతను ననున నతతకతననడోననాలాలా నాననా నానన కే ౧౯ 5తంర్తలలక3 1308 ఒసయ్‌ 6 ౧౦౪ జా 00604 01 అంతలా క తింంటుకీయ లయిక 10౯ 4 ఆరో

న8గ4 0 ఉం 1664 0౭౧౧. 9౭06 1౧10 52936 '4టినీ ౮ 5 6౦౧౧౫జ్జ.

కొందరు నాటకకర్తలు 703 నాటకశాల పడుచనై లీలావతిని పదివేల దండంబులు వెట్టి చేయం గల విన్నపంబు”' అని ఒక కమ్మవక్కణాన్ని ఒక రచయిత వ్రాశాడు. దీనివల్ల నగర నాటకశాలలో నటించేవారూ, బైట నాటకశాలలో నటించేవారూ వేరు వేరు అని ఊహించవచ్చును. రఘునాథ నాయకుడే నాటకశాలలో స్త్రీ పాత్రలను స్త్రీలే వేసే పద్ధతిని పెట్టినట్టుంది. చేమతూర వెంకటరాజుగారు 'రఘునాథుడు భరతవిద్యాధురంధరుడొట రంగస్థలరామాకృతం' చేశాడని చెప్పారు (విజయ: పీఠిక 21). నాటక రంగంలో మాత్రం విజయరాఘవుడు తండ్రిని మించిన కొడుకు. స్వయంగా పాతిక ముష్ఫయి నాటకాలు వ్రాసి యక్షగానాలలో రూపకకళలను ప్రవేశపెట్టారు. తంజావూరు నాటకకర్తలందరూ ఇతణ్జీ అనుసరించారు. విజయరాఘవుని నాటకాల గురించి ఇంతకు ముందు విపులంగా చెప్పుకున్నాం. ఇప్పుడతని ఆధ్రితుల గురించి తిలుసుకొందాం. కానురసు వెంకటపతి సోమయాజి: ఈయన విజయరాఘవుని పట్టపు కవి. ఇంతకుమించి ఇతని గురించి వివరాలేం తెలియవు. అయితే పట్టపు కవికి కావలసినంత ప్రతిభ ఇతనిలో ఉంది. పదకవితలో దిట్ట. క్షేత్రయ్య తరువాత అంత బాగా తీయగా పదాలు వబ్రాయగల ప్రొడత్వం ఇతనిలో రాణిస్తుంది. నిజానికితని పదాలు కొన్ని క్షేత్రయ్య పదాలుగా చలామణి అవుతున్నాయి. ఈయన విజయరాఘవ చంద్రికావిహారం అనే నాటక చాటు కావ్యం వ్రాశాడు. ఇందులో కథేం లేదు. విజయరాఘవుడు ఒకనాడు పాదచారియ్టై వెన్నెలవేళ సానివాడకు వెడతాడు. అప్పుడతన్ని బైట నాటకశాల పడుచు లీలావతి చూసి మరులుకొంటుంది. కమ్మవక్కణం ఒకటి వ్రాసి పంపుతుంది. విజయరాఘవుడామెను కనికరిస్తాడు. పెళ్ళాడుతాడు. ఆ నారీమణితో 'రత్నసింహాసనం'పైన కూర్చుంటాడు. ఈ నాటకంలో విజయరాఘవుడు సానివాడకు వచ్చినప్పుడు ఒక పడుచు వువ్విళ్ళూరుతూ ఒక పదం ఇలా పాడుతుంది. సుదినమాయెనే ఈపొద్దు సుదినమాయెనే యీ మయదనావతారుని సేవ మనకు గల్గెగా ప్రొద్దున నిలువుటద్దము పొడగన్న ఫలము - ఇతని ముద్దుమోము చూడగల్లె ముద్దుల గుమ్మ 1సు। ఈ పొద్దు పూర్ణ కుంభము లెదురైన ఫలము - ఈ భూపాలతుంజరు నే పొడగంటి నమ్మా ద్విజరాజుల సేవించిన దివ్యశకునముచేత విజయరాఘవ శౌరి వీధిలో గంటి. 1సు॥ నాటకంలో పాత్ర. ఈమె ఒక కవయిత్రి అని పొరబడి ఈమె బ్రాసిన కమ్మవక్కణం లభ్యం అయిందని నిడుదవోలువారు బ్రాశారు తంజావూరు నాటకాలలో పాలకడలి రాజు వంటి పాత్రల కమ్మవక్కణాలు చాలా ఉన్నాయి. వాళ్ళంతా కవులు, కవయిత్రులు అనుకోరాదు.

704 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇది విజయరాఘవముద్ర గల క్షేత్రయ్య పదంగా నేడు ప్రచారంలో ఉంది! క్షేతయ్యలాగే ఈ కవి అంత్యప్రాసలు, అనుకోని తళుకులు చాలా బాగా గుప్పించగలడు, క్షేతయ్యలాగ పచ్చిగా కూడా వ్రాయగలడు. “అక్కరో ఓర్వలేని వారు” అనే పదంలో క్షేత్రయ్య. “రామా! వాని వలచినపుడే రవికె క్రిక్కిరిసెగుబ్బ; లేమా రొమ్మెల్ల నిండునే వాని మాటంటే నా మనసు పైపై నుండునే” అని వ్రాశాడు. ఇంతకన్నా పెచ్చురేగి కామరుసుకవి ఈ చంద్రికావిహారంలో ఒక ప్రొఢకాంత రవికె కీలు పట్టుక్కున తెంపాడు. కటాకటా ఈ రాజకందర్చుని నాకన్నులు చూచినప్పుడె నా బటువుగుబ్బ లుబ్సి పట్టురవికె కీలు పట్టుక్కున వీడెగాదే! అని ఒక జక్కన గబ్బెతచేత కామరసుకవి పాడించాడు. క్షేతయ్య పదాలను నాటి నాటక రచయితలు బాగా అనుకరించేవారు. విజయరాఘవుడే తన విప్రనారాయణ చరిత్రలో బంగారు గిన్నె ఇచ్చాక దేవదేవిని విప్రనారాయణుడు కూడినప్పుడు “అలుకలు దీరెనటే మీ ఇద్దరి యలుకలు దీరెనటే'' అనే పదం వ్రాశాడు. సారంగరాగంలో “అలుకలు తీరెనా - నేడైనా మీయలుకలు దీరెనా” అని క్షేత్రయ్య వ్రాసిన పదం విన్న తరువాత దీనిని విజయరాఘవుడు వ్రాశాడు కాబోలు. అయితే క్షేత్రయ్య రచనాశిల్బం కామరసు సోమయాజులకు పట్టుపడినట్టు ఆనాటి కవులలో ఇంకెవరికీ అబ్బలేదు. విజయరాఘవుడు చం ద్రికావిహారానికి వెళ్లినప్పుడు ఒక ఉత్తమాంగనే తన ఫ్రోడ చేడియతో ఇలా ఆడుకుందని కామరసు సోమయాజులు వ్రాశాడు. వేడుకైన జూడకూడదు వింతవారిని, నా తోడికోడలు నన్ను తొంగిచూడ నియ్యదు పాడిదప్పి మగడు పగచాటును, ఈ మేడమీదికి వచ్చేనంటే మొదలనియ్యడు. వంచన చేసి ఇతని జూడవచ్చే నంటేను పొంచియుండు మజది ఇరుగుపొరుగుపంచల పంచశరుని మించిన యీ పట్టభద్రుని ఇంచుక సేపు జూడకూడ దేమిసేతును అత్తచేత జోరు మిగుల నధికమాయెను కత్తిమీద సాము నాకు గదలరాదుగా బత్తితో విజయరాఘవపార్థివేంద్రుని నేడు కొత్తగా జూచిన చూపు కోటిసేయదా! ఈ పదంలోని “కొత్తగా జూచిన చూపు కోటిసీయదా”'” అనే కొసమెరుపు చక్కని పదకర్లో చేతనవుతుంది. పదాలు వ్రాయడంలో పదునుతేరిన కామరుసుకవి చంద్రికావిహారంలో ఎక్కువగా గేయాలే నింపాడు. పదాలలో యమకాలు గుప్పించాడు. ఇటువంటీ యమకాలు చేమకూరవెంకటరాజుగారు తంజావూరులో ప్రచారం చేశారు. ఆ సొగసులు పదకర్తలు కూడా వాడడం విశేషం. చంద్రికావిహారంలో ఈ యమకాలు వాడిన నాయిక పూర్వజన్మలో ఊర్వశి అని కవి ఉద్దేశం. అందుచేత ఆమె విరహంలో పడినప్పుడు రంభ ఎరుకలసాని వేషం వేసుకొని ౩. గిడుగు సీతాపతిగారి క్షేతయ్య పదాలలో ఇది సామాన్య-3౫8. విస్సావారి క్షేత్రయ్య పదాలలో విజయరాఘవ విభాగంలో నెం.11 4. విస్సావారి క్షేత్రయ్య పదాలు, నెం.5

వస్తుంది. తంజావూరి నాటకాలలోనేకాక ఆంధ్ర యక్షగానాలలోనే తొలిసారిగా కొరవంజి ప్రవేశించడం ఈ చంద్రికావిహారంలోనే.

మన సాహిత్యంలో ఎరుక చెప్పించడం బమ్మెరపోతరాజుగారి గ్రంథంలో మొదట కనబడుతుంది. పార్వతి విరహంలో ఉన్నప్పుడు ““వెలదిమేన కల్లు వీరుడు వెలదిర్టై యెరుక యెరుక యనుచు నేగుదెంచె” అని పోతరాజుగారు వ్రాశారు (వీరభద్రవిజయం, 2-170). బాలా విపులంగా 45 పద్యాలలో ఎరుక ఘట్టం వ్రాశారు (2:168-210). అయ్యలరాజు రామభద్రుడు కొరవంజిమేళాల సంగతి చెప్పాడు (రామాభ్యుదయం, 2-131). గానివారు ఎరుక చెప్పారని విశదం చేయలేదు. మట్ల అనంతరాజుగారు కొరవంజిచే ఎరుక నెరపించారు (కకుత్‌స్థవిజయం, 3-86). పుష్పగిరి తిమ్మనగారి సమీర కుమారవిజయంలో ధర్మదేవత ఎరుకతవేషం వేసుకొని అంజనాదేవికి ఎరుక చెప్తుంది. “ధర్మువు కొరవంజితీరు దాల్చి” వచ్చిందని ఆయన కొరవంజిని పెర్కొన్నారు (2-64). తరువాత కామరుసు సోమయాజి నాటకాలలో ఎరుకలసాని కొరవంజి దరువులు పాడుకొంటూ వస్తుంది. ముత్యాలు తెప్పించి మొరిపెలో నిండించి చెయ్యి చూస్తుంది. పాత్రోచిత భాషలోనే కామరుసు సోమయాజులు ఎరుక చెప్పించాడుగాని ఈ నాటకంలో సంభాషణలు చాలా తక్కువ అవీ హుందాగానే సాగాయి. ప్రాంతీయ పదాలు, చౌకబారు హాస్యాలు, సమకాలిక మోసాలపై విసురులు ఇలాంటినేమీ ఇందులో లేవు. అవి రంగాజమ్మ వ్రాసిన మన్నారుదాసవిలాసంలో కొల్లలుగా కనబడతాయి.

రంగాజమ్మ: రంగాజమ్మ నాటకాలను వ్రాసిన మొదటి మహిళగా కన్పడుతుంది. అయితే బాలపాపాంబ అనే కవయిత్రి 'అక్కమహాదేవిచరిత్ర అనే యక్షగానాన్ని వ్రాసింది. “ఈమె సంగీతసాహిత్య సరసలక్షణల రంగు మీరిన యట్టి రమణి' అని తెలుస్తూంది. తను వీరవసంతరాయల పెద్దతూతుర్నని చెప్పుకొంది. సేలం, కోయంబత్తూరు. జిల్లాలలో క్రీశ.1567 నుంచి 87 దాకా ఒక వీరవసంతరాయల శాసనాలు కనబడుతున్నాయి. బాలపాపమ్మ అతని కుమార్తే అయితే అమె ప్రప్రథమాంధ్ర యక్షగాన రచయిత్రిగా విశిష్ట స్థానాన్ని ఆక్రమిస్తుందని యస్వీ జోగారావుగారు బ్రాశారు. బాలపాపమ్మ వ్రాసిన యక్షగాన ప్రతి ఒక్కటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (01834). ఇందులో షష్ట్రంతాలు మొదలైనవి ఉన్నాయి. “అవనిలో యక్షగానవశికెల్ల రవళిమించిన శిరోరత్స్నమా యనగ' ఈ కృతిని తను ఇంగితజ్ఞానినై బ్రాశానని బాలపాపమ్మ చెప్పుకొంది.

మన సాహిత్యంలో తొలి యక్షగానాన్ని వ్రాసిన రచయిత్రిగా బాలపాపమ్మను గౌరవిస్తూనే రంగాజమ్మను తొలి తెలుగు నాటకాన్ని బ్రాసిన మహిళగా పేర్కొనాలి. ఈమె బాసిన మన్నారుదాసవిలాసం అనే నాటిక చాలా విలక్షణమైనది. దానిని ఆమె క్రీశ 160లో వచ్చిన శుభకృత్‌లో బ్రాసింది. అప్పటికి తంజావూరులో చాలా 5. అం గాన వాబ్బయచరిత్ర, ద్వితీయభాగం, పుట 18.

706 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుి నాటకాలను విజయరాఘవుడు చాలా వ్రాశాడు. అతడు ప్రపోపెట్టిన పద్ధతులను రంగాజమ్మ అనుసరించింది. గొల్లల వెకిలిమాటలు, వెర్రిశివాలు, పురోహితుం చిన్నగుణాలు మొదలైన చెణుకులు ఉన్నాయి.

నిజయరాఘవుడు పూతనాహరణంలో దబ్బరమంత్రాలు చెప్పి గోదానాణ పుచ్చుకోవాలనుకొన్న పురోహితులపై వ్యంగ్యంగా వాతలు వేస్తే, నగరింటి సహస్రనావ పూజలో సువర్ణపుష్పాలు అపహరించి వాటి బదులు మొలాము చేసిన పూలు పెట్టీ నరసంభట్లులాంటి వాళ్ల మోసాలు ఈమె బయట పెట్టింది. తంజావూరు నాటకాలలో ఇటువంటి ఘట్టాలు ధ్రాసి ఆనాటి ''రచయితలు తమ సంఘంలోని అవినీకిని విమర్శించేవారు కొందరిని అపహాస్యం చేసేవారు. '“కులకాంత లేయూరు - వలు లేయూరు”* అనే భావంగల రంగాజమ్మ ఆనాటి బాపన ముత్తయిదువుల తాంబూలమైనా వేసుకోలేని అనాగరిళస్థితిమీద విసుర్లు విసిరింది. “నగరింటి పెండ్లినాడైనా ఒక వక్కజ్య వేసుకొని నవలరా దషవో' అని పోలుభట్లు యెల్లమ్మను రంగావర్టుల తిమ్మక్క అడుగుతుంది. ''నాకు వక్కబద్ధ వొకటి కొదవా? నిన్న మా వారు సుక్కరారం ఒ0తలో పిండికూర కంచున్ను గానుగలిండి దెచ్చిరి. పెళ్లి పందిట్లో నోరు మెదలించవలె నంచున్న యింత తెచ్చుక తించున్నానింతే!”' అని యెల్లమ్మ జవాబు చెప్పింది. రంగాజమ్మ నాటకంలో కూడా పండితులు “త్వమేవ శునకః త్వమేవ సూకరః'” అని తిట్టుకొంటారు. నిజంగా తంజావూరి కొలువులో, విజయరాఘవనాయకుని సమక్షంలో ఇలాగ పండితుల తిట్టుకొంటే అది శోచనీయమే.

చంద్రికావిహారంలో కామరుసు కవి రంభచేత ఎరుకచెప్పిస్తే, మన్నారుదాన విలాసంలో రంగాజమ్మ హీమాబ్దనాయికచేత ఎరుక చెప్పించింది. అనాటి ఎరుకతణ యేనాది మానవతులని ఈ నాటకంవల్ల తెలుస్తుంది. మన్నారుదాస విలాసం ప్రో! కావ్యములలో నెన్నదగినది కాకపోయినను దేశచరిత్ర పరిశోధనకును నుపయోగించును గావునను స్త్రీకవిత్స్వమగుటచేతను పండితాదరము*' పొందుతున్నదని జయంతి రామయ్య గారు భావించారు.” ఈమె వాడిన సంభాషణలెంతో పరిశోధకులకు ఉపయోగిస్తె యనడంలో సందేహం ఏమీ లేదు. అయితే ఈమెకన్నా ఎక్కువగా సంభాషణలతోనే నాటకం నడిపిన నాటక రచయిత ఇంకొకడున్నాడు.

పురుషోత్తమ దీక్షితులు: తంజావూరు నాటకాలలో సంభాషణలు కేనలు ప్రహసనాల ధోరణిలో ఉన్నా వాటిలోని నాయికానాయకులు ఉత్తమ పాత్రలు కనుకే న్థాయి పూర్తిగా దిగిపోలేదు. నీచపాత్రలనే సృష్టించి అదినుంచి అంతందాకా శ ప్రహసనాలు కూడా ఆనాడే లేకపోలేదు. పురుషోత్తమ దీక్షితులు అనే నాటక రచయికీ “సత్రమరులు” అనే ప్రహసనం వ్రాశాడు. దీనికే అతడు “తంజావూరు అన్నదాన మహానాటకం'” అనే పెద్ద పేరు పెట్టాడుగాని ఉత్త ఫార్సు. న క 6. మన్నారుదాసవిలాసనాటకం పుట 16 7. _మన్నారుదాన విలాస నాటకం, ఆంధ్రసాహిత్యపరిషత్‌ ప్రచురణ.

కొందరు నాటకకర్తలు 707 తంజావూరు నాయకరాజులు అన్నదానానికి ప్రసిద్ధులు. రఘునాథనాయకుడు ““నిరతవారితాన్నసత్రసంతోషితపంచాశత్సహస్రభూసుర'”నే బిరుదును తన గద్యలో చెప్పుకొన్నాడు. ఆయన హయాంలో మొదలైన అన్నసత్రాలు చివరిదాకా కొనసాగాయి. "తంతుమాత్రపువాడైనా తంజావూర ఉపవాసం ఉండరాదు' అని నాయకరాజుల శాసనం. భుజంమీద జందెమున్న ప్రతి బ్రాహ్మణునికి బొజ్బనిండా తిండి పెట్టడానికి సత్రాలు వేయించారు. రామానుజకూటం, మధ్వకతూటం, పెద్దసత్రం మొదలైన చోట్ల రోజూ అన్నదానం జరిగేది. సత్రాలలో భుజించని ఆచారవంతులకు స్వాయంపాకాలు ఇచ్చేవారు. ఈ సత్రాలలో పడీ తినడానికీ ఎక్కడలేని సోమరిపోతులూ హాజరయ్యేవారు. వాళ్ళ వెకిలిచేష్టలను, చిన్నబుద్ధులను బయటపెట్టే పహసనమే ఈ అన్నదాన నాటకం.

సత్రంవేళ కాకముందే పప్పుతిప్పాభట్లు అనే (బ్రాహ్మణుడు సకుటుంబంగా విచ్చేశాడు. అతనేకాక అతని కొడుకూ సోమరిపోతీ। తిప్పాభట్లు 'అదె వర్రా మంచిగా' అని కొడుకును పిలుస్తాడు. '“ఓపలేనే' అని సుపుత్రుడు జవాబు చెప్తాడు. “ఏమిరా పీిలువకమునుపే ఓపలే ననేవు?' అని తండ్రి ప్రశ్నిస్తాడు.

“పనిలేక పిలుతువటె?*” అని మంచిగాడీ జవాబు. ఈవూరిసత్రం అధికారి నెల్లూరి యల్లమరాజు మహాధర్మాత్ముడు అని తిప్పాభట్లు అయిదో వేదంలో ఎనిమిది అట్టాలకు ఆవలి అట్టంలోని మంత్రాలలో ఆశీర్వచనం చేస్తాడు. సత్రం అధికారి “ఒక ప్రశ్న చెప్పండి" అంటే ఇలా చెప్పాడు:

““ఒహోహో మామహా చెప్పేమే. ఉదయారూడచత్రాలు చూసి చెప్పేము. ఉదయం

తూర్చునను, ఛత్రంరాజు దగ్గరను, ఆరూడం మేషం అశ్వని భరణీ కృత్తికాః పాదం మేషం, భరణి పెట్టెలోను, మేషం మేకల మందలోను, వృషభం ఆవులమందలోను, మిథునం స్త్రీపురుషులు గూడినచోటను, కర్కాటం బొక్కలోను, సింహం అడవిలోను, కన్య పుట్టింటను, తుల సెట్టివాని ఇంటిలోను, వృన్చికం పిడకల కుచ్చెలోను, ధనుస్సు పట్టిన వానిచేతను, మకరం సముద్రంలోను, కుంభం కుమ్మరివాని ఇంటిలోను, మీనం చెరువులోను పండ్రెడు రాసులును యెక్కడివక్కడనే ఉండేవి. (అన్నదాన, పుట 200) ఈ జ్యోతిషం విన్నాక పొంతనాలు చెప్పించుకొని “మీరు వృషభం, మీకు వాహనం శునకం' అనిపించుకొని 'మహమేలయ్య, ఎండనక వాననక, మంచనక మాలనక మహా వస్తిరయ్య, సత్రం వేళయితే విడిచేముగాని అటు గూర్చుండుండ' అని సత్రం అధికారి అన్నాడు. అప్పుడు భోగాలవాళ్లు త్యాగాల కోసం వచ్చేరు. *“భోగాలవారంటే ఆడవారేనా? అంతా ఆడవారో। కొంత ఆడవారో' అనే అనుమానం తిప్పాభట్లుకి కలుగుతుంది. వాళ్లు నిద్రకు పైడి తీస్తారని తెలుసుకుంటాడు. “నిద్రకు పైడితీస్తే మేలుకొంటే పైడితీతురే అనుకొంటాడు. ఆ సానులలో ఒకదాని పేరు వెంగసాని. దానిని 'లంజమ్మ' అని గౌరవంగా పిలుస్తూ తిప్పాభట్లు ప్రేమలో పడి కవిత్వం కూడా చెప్పాడు.

708 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి త్రూస్సు న్నున్నవి కోకిలంబు లివిగో కోలాహలప్రక్రియన్‌ వేస్సున్నాడు మనోభవుం డషిషుగా వేమారు నీవు న్ననున్‌ _

చూస్సుందానవు నీకు ధర్మమష వే శుద్ద్ధాత్ముడన్‌ బ్రాహ్మడన్‌

త్రెస్సున్నా నిదె గూర్త మొక్కటి రతిం దేలింపవే లంరుమూ!

(అన్నదాన, పుట 2100)

ఈ తిప్పాభట్లు గురజాడ అప్పారావుగారి కొండుభట్లుకి ముత్తాతకోవలో వాడని చెప్పాలి. అప్పారావుగారి కొండుభట్లు కూడా శార్దూలంలో “ధర్మం కాదిది మంజువాణీ వినువూ' అంటూ ఒక పద్యం చెప్తాడు (తృతీయాంకం పుట 81). రకరకాల శోకాల వరుసలో సంభాషిస్తాడు. అప్పారావు గారీ అన్నదానం ఫార్సు చదవకుండా ఈ పోలికల రచన చేయడం ఒక మోషమే. అన్నదాన సత్రానికి వచ్చిన తెలుగువాడు తిప్పాంభట్లు. అప్పంవాత్యారి అనే అరవ బ్రాహ్మణుడు కూడా ఇంత వెకిలిగానూ ఉంటాడు. ఇద్దరూ సానులను చూసి మోహపడతారు. భోజనాలు చేశాక అధికారి ఇలా అంటాడు: “అదెవరో వెంగసాని, యేమో జక్కులరంగసాని రావో, పలుకసాని ముద్దు! ఈ పప్పు తిప్పాభట్లు అప్పం వాత్యారిగారు మహా దూరదేశాన్నుంచి వచ్చినారు. మంచి యోగ్యులు. వీరికి వూరికే ఉండవశంగాదట. వీరిని సంతోషపెట్టుండ'' (పుట 232). ఆ సానులు సరే అంటారు. “తిప్పాభట్లుగారు. మీరు ఈ రూపాన ఉంటే స్త్రీలు తీసిపోదురు. మీ తపోమహిమచేతను మున్నుచ్యవన మహాముని రీతిని దివ్యరూపము ధరించి వేడుకగా వీరితో విహరించవయ్యా'”” అని అధికారి వేడుకొంటాడు. తిప్పాభట్లు మన్మథుడవుతాడు. సానులతనితో కూరిమితీరా ఆడుతారు.

ఈ ప్రహసనం చాలా విలక్షణమైనది. నిజానికి తెలుగు సాహిత్యంలోని తొలి ప్రహసనం ఇదే అని చెప్పవచ్చును. దీనిని పురుషోత్తమ దీక్షితులు క్రీ.శ. 1669లో వచ్చిన కీలకలో వ్రాశాడు. ఇతడు విజయరాఘవుణ్ణి కైవారంలో చాలా పొగడాడు. కృతయుగంలో మరుత్తుడట. త్రేతాయుగంలో నాభాగుడు. ద్వాపరంలో మద్రరాజాంత తుడైన కుంతీసుతుడు. కలియుగంలో విజయరాఘవుడు. ఇటువంటి పొగడ్తలకు విజయరాఘవుడు చాలా ఆనందిస్తాడు. ఆస్తానకవులు ఇలా వ్రాస్తే విజయరాఘవుని తుమూరుడు మన్నారు దేవుడు తండ్రిని కాలాతీతవ్యక్తిగా చిత్రించాడు. ఆ వైనం విందాం.

మన్నారుదేవుడు : ఇతడు విజయరాఘవుని ప్రియపుత్రుడు. అయినా కోపించి విజయరాఘవుడు ఒకసారి ఇతణ్జీ బంగారు సంకెళ్లు వేయించి చెరలో పెట్టాడు. ఎందుకు బంధించవలసివచ్చిందో తెలియదు. తండ్రిని మెప్పించడానికి మన్నారు. దేవుడు “హీమాబ్దనాయికా స్వయంవరం' అనే నాటకం వ్రాసి తన తండ్రే అ ఆదిదంపతుల వివాహాన్ని జరిపించినట్టు వ్రాశాడు. క్షీరసాగరమథనం అయ్యాక హేమాబ్దనాయిక రాజగోపాలస్వామిని చూసి మరులుకొంది. చెలికత్తిచే కబురుపెట్టింది. రాజగోపాలుడు తన ముద్దులపట్టి అయిన విజయరాఘవుణ్ణి పిలిచి “రయమున నీఫ్రొద్దు కడలిరాజుతో మాటలాడీ ప్రియముగా మాకు ఈ పెండ్లి యొనగూర్చ్పుము” అంటాడు. విజయరాఘవుడు పెళ్లిళ్ల పేరయ్య అవుతాడు. పెళ్ళి పురోహితులు యథాప్రకారం పరస్పరం '“వజ్రశుంఠ' అని

కొందరు నాటకకర్తలు 709 తిట్టుకొంటారు. బ్రాహ్మణ ముత్తయిదువులు మకీ అనౌచిత్యం మాట్లాడుకొంటారు. “ఓనమ్మా! మీవార్ని మావార్నీ మార్చుకొందామనే! “ఓనమ్మ! నీకు నడుమేల పట్టుకొనెనే' ఓసెమ్మ వింటివషే! మావారు నిన్న రాత్రి గంపెడేసి బందాలు పట్టించేరే:? అనే సంభాషణలు జరుగుతాయి. ఈ పేరంటాళ్లు దేవుని పెళ్లికి సువ్వాలలు పాడుతారు. ఈ పెళ్లి జరిపించినందుకు రాజగోపాలస్వామి మెచ్చుకొని ఇలా దీవించాడటః విజయరాఘవవత్స ఈ పెండ్లి నీవు సంఘటింపగ మామది చల్లనయ్యె ప్రబళి నీవాయురారోగ్య భాగ్యములను ధరణి వర్ధిల్లు మాచంద్రతారకముగ దేవుడిలా దీవించిన మూడేళ్లకు విజయరాఘవుడు మరణించాడు. ఈ నాటకాన్ని మన్నారుదేవుడు శ్రీ.శ1670లో వచ్చిన సౌమ్మవైత్రంలో వ్రాశాడు. క్రీశ 1673లో తంజావూరు పతనం అయింది. అయితే* ఈలోగా విజయరాఘవునికీ ఒక నాటకంలో గొప్ప కల్యాణాన్ని అతని ఆస్థానకవి జరిపించాడు. - కోనేటి దీక్షితచంద్రుడు: ఇతడు క్రీ.శ 1670లో వచ్చిన సౌమ్యవైశాఖంలో “విజయరాఘవకళ్యాణం' అను సుదీర్హమైన నాటకం వ్రాశాడు. ఈయన సంగీత సాహిత్య విద్యాగురీణవరేణ్యుడనని చెప్పుకొన్నాడు. ఇతని తండ్రి పేరు రామానుజాచార్యులు. రాజగురువు తాతాచార్యులవారికి కోనేటి దీక్షితులుకూడా శిష్యుడు. ఇది నవరస శృంగాటకమైన నాటకం అని రచయిత చెప్పుకొన్నాడు. ఇది కూడా మిగిలిన తంజావూరి నాటకాల మూసలోని కథనే చెప్తుంది. విజయరాఘవుడు ఒకసారి వేటకు వెళ్లాడు. మదనమంజరి అనే రాజపుత్రిక వనకేశికి వచ్చి అతణ్జీ చూసింది. వలపు, విరహం, దూతికను పంపడం, రాజు సుముఖుడు కావడం, ఎరుకసాని రావడం, పెళ్లి, పురోహితుల మాటలు, ముత్తయిదువుల కబుర్లు - ఇలా ఇది కూడా పాతసంవిధానంలోనే సాగింది. అయితే ఇందులోని వేట చాలా సహజంగా వర్ణించాడు. అనాటి పల్లెపదాలను చాలా పేర్కొన్నాడు. వాటికి పారడీలు వ్రాశాడు. అల్లీలాలు లేవు. హాస్యం బాగానే ఉంది. “శాస్త్ర ప్రసంగః కవేరుద్బాటన మంత్రః అని చర్చ వేస్తారు. బ్రాహ్మణ ముత్తయిదువులు యథాప్రకారం “విడెమనేవి కారమేగాని గానుగపిండికి గలిగినంత కమ్మదనం వున్నాదషమ్మ!'' అని తెలకపిండే తింటారు. నాయకరాజుల పోషణలో వెలసిన నాటకాలు చాలా మటుకు తెలకపిండీ వడియాలే!। పతనాలు 8. హేమాబ్దనాయికా స్వయంవరం (యక్షగానము). తంజావూరు, ఆంధ్రవిశ్చవిద్యాలయ ప్రచురణ, పుట 15.

సవరం చిననారాయణ

మధుర, తంజావూరు నాయకరాజ్యాల సాహిత్య చరిత్రలు ఒక కొమ్మనే పూచిన రెండు పువ్వులైతే చెంజిచరిత్ర ఆకుచాటున దాగిన అరవిరిమొగ్గ విజయనగరసా[మ్రాజ్యం స్థాపించిన కొద్దిరోజులనుండీ చెంజిపై తెలుగువాళ్ల అధికారం నెలకొంది. క్రీ.శ. 1355 నుండి 1377 దాకా పాలించిన మొదటి చొక్కరాయల కాలంలో కుమారకంపరాయలు దక్షిణదిగ్వాజయం _ చేశాడు. మధురను ఆక్రమించుకొన్న మహమ్మదీయులను తరిమివేయడమే ఆ దండయాత్ర ముఖ్యోద్దేశ్యం. అతనితోబాటు సాళువ మంగరాజు, గోపన్న మొదలైన సేనానులు వెళ్లారు. తుండీరమండలాన్ని జయించారు. చెంజిరాజ్యాన్నే తుండీరమండలం అంటారు. ఆ కాలంలో చెంజిని కృష్ణాపురం అని పిలిచేవారు. ప్రక్కనే సింగవరం ఉండేది. సింగవరం కొండగుహాలలో కొన్నాళ్లపాటు శ్రీరంగనాథుని దేవాలయంలోని విగ్రహాలు ఉండేవి. మధురను మహమ్మదీయులు స్వాధీనం చేసుకొన్నప్పుడు శ్రీరంగంలోని పూజారులు భయపడి విగ్రహాలను తిరుపతికి చేరవేశారు. తుమారకంపరాయల సేనలో ఉన్న గోపన్నకు ఒకనాడు కల వచ్చింది. రంగనాధుడు కనబడి తిరిగి తనను శ్రీరంగంలో ప్రతిష్టించమని కోరాడు. తిరుపతినుండి విగ్రహాలను తీసుకొని మధ్యలో చెంజిలో మకాం వేసి గోపన్న శ్రీరంగానికి వెళ్లి విగ్రహాలను ప్రతిష్టించాడు. ఈసంగతి అనంతార్యుడు తన ' ప్రసన్నామృతం'లో చెప్పాడు.

అయితే సాళువమంగరాజు ఈ పుణ్యకార్యం చేశాడని తెలుగు సాహిత్యంలో సాక్ష్యం ఉంది. పిల్లలమర్రి పినవీరయ్య తన జైమినీభారతంలో కంలోక్తిగా ఈ ఘనత సాళువమంగుకే దక్కించాడు (1-32). ఇతర దక్షిణ దుర్గాలతోపాటు చెంజీని కూడా సాళువ నరసింహుడు స్వాధీనం చేసుకొన్నాడు. తొలిరాయల యుగంలోని పినవీరయ్యగారి జైమినిభారతం నుండి ఈ యుగంలోని దామెర్ల అంకన్నదాకా అక్కడక్కడ తెలుగు సాహిత్యంలో చెంజి ప్రసక్తి కనబడుతుంది. అయితే యథాలాపంగా చెప్పిన ఈ కొద్దిపాటి భోగట్టాలవల్ల చెంజీ చరిత్ర తెలియదు. ఇప్పటిదాకా ఎవరూ సమగ్రంగా చెంజినాయక రాజ్బుచరిత్రను. తెలుగులో వ్రాయలేదు. ఉన్నంతలో నిడుదవోలు సుందరేశ్చరరావుగారి వ్యాసమే విపులంగా ఉంది. ఇంగ్లీషులో వ్రాసిన దానికితూడా ఆకరాలు తక్కువ కావడంవల్ల అది సంతృప్తికరంగా లేదు. ఇతర ప్రాంతాల చరిత్రలు వ్రాయించినట్టే కర్నల్‌ మెకంజీ చెంజీ గురించి తూడా స్థానిక చరిత్రను సేకరించాడు. '“కర్నాటకరాజాక్కళ్‌ సవిస్తార చరిత్తిరం' అనే పేరిట తమిళభాషలో నారాయణకోన్‌ అనే స్థానికుడు చాలా భోగట్టాలను కాగితంపై పెట్టాడు. దానిని మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంవారు 1352లో ప్రచురించారు. ఈ శై కియా 0 జనతా కంగు భ35్‌ ననన 2 సనం ౧8 3. సంగ్రహాంధ్రవిజ్ఞానకోశం, 4న సంపుటి - చెంబికోట శ. గ [040౧01౧౫ జు4 (1 సుల ౪ 0.5. కరరాలంయటో, నంటు! లంత, బంగయో

5316 110. 12

సవరం చిననారాయణ 711 క్రఫీయుతువల్ల _చెంజీని పాలించిన నాయకరాజుల జాబితాను చరిత్రకారులిలా రూపొందించారు.5

  1. వైయప్ప నాయకుడు శ్రీశ 14%

  2. తుపాకీకృష్ణప్పునాయకుడు క్రీశ 1490-1520

  3. అచ్యుతవిజయరామచంద్ర నాయకుడు క్రీశ 1520-1540

  4. ముత్యాలనాయకుడు క్రీ శు 1540-1550

  5. వెంకటప్పనాయకుడు క్రీశ 1570-1600

  6. వరదప్పనాయకుడు క్రీశ 1600-1620

  7. అప్పానాయకుడు క్రీశ 1620-1643

ఈ జాబితా నిర్దుష్టమైనది కాదు. ఎన్‌.ఎమ్‌. ఎడ్వర్హుగారు మరొక వంశావళిని సేకరించాడు. ఎవరో ప్రాచీనలేఖకుడు పీచుకాగితాలపై మోడీ లిపిలో వ్రాసిన విషయాలను ఎడ్వర్హుగారు ' ఇండియన్‌ ఆంటిక్వరీ'లో ప్రకటించారుో

  1. ముత్యాల నాయకుడు క్రీశు 1476

  2. కృష్ణప్ప నాయకుడు క్రీశు 1516

౩. చెన్నమనాయకుడు క్రీశ 1536

  1. విజయప్ప నాయకుడు క్రీశ 1555 -

  2. గంగమ నాయకుడు క్రీశ 1580

  3. వెంకటకృష్ణ నాయకుడు క్రీశ 1605

  4. వెంకటరామనాయకుడు క్రీశ 1625

  5. త్రియంబకమల్లప్ప కృష్ణప్ప నాయకుడు శ్రీ.శ 1646

  6. వరదప్ప నాయకుడు క్రీశు 1655

రెండు జావితాలలోనూ చాలా విభేదాలున్నాయి. ఈ రెండింటినీ సమన్వయం చేయాలంటే శాసనాల ఆధారం కావాలి. చెంజినాయక రాజుల శాసనాలు చాలా కొద్దిగా బయటపడ్డాయి. సర్కారువారు వాటిని రిపోర్టు చేశారేగాని పూర్తిగా ప్రకటించలేదు. వాస్తవానికి చెంజీ నాయకరాజులలో కడపటివాడు వరదప్పు శ్రీ.శ. 1660లో చేసిన దానశాసనం ఒకటి లభిస్తోంది.” మధుర తాలూళా తిరుప్పరకుండ్రం సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని గోపురం తుడివైపు గోడమీద ఒక తెలుగు శాసనం ఉంది. దానిలో వరదప్ప నాయకునిదాకా 25 పురుషాంతరాల చెంజీ నాయకరాజుల వంశావళి వర్ణన క ంంందంంంంననుంణపటు ఈ. అయం గరిట ౪01 55(1926) 5 1-2 7 ఉక 860 ఈ 1917

712 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఉంది. ఈ ఇాసనాన్ని జయంతి రామయ్యగారు చంపూరామాయణ పీఠికలో కొద్దిగా ఉదాహరించారు.! క్రీ.శ. 1918 గెజిటు (శాసన నివేదికలో మరికొన్ని వివరాలు ఉన్నాయి ఈ శాసనంలో వరదప్పనాయకుడు తన పూర్చులు మణినాగరంనుండి వలస వచ్చారని చెప్పాడు. అలహాబాదు దగ్గర మణిఖపూరే ఈ మణినాగపురమని చరిత్రకారులు గుర్పించారు.39 చెంజి నాయకరాజులకేకాక సవరంవారనే మరొక వీరకుటుంబానికి కూడా మజీనాగపురంతో సంబంధం కనబడుతోంది. క్రీ.శ 1650 ప్రాంతాలలో సవరం చిననారాయణ అనే ఉత్తమకవి కువలయాశ్వ చరిత్ర అనే జాతి వార్తా చమత్కారమయమైన ప్రబంధాన్ని వ్రాసి తన పెంపుడు తండ్రి పెదనారాయణకు అంకితం ఇచ్చాడు. షష్ట్యృంతాలలో ఇలా ప్రశంసించాడు: మజణీనాగనగర కాంతున - కణుమధ్యాజన మనోజయంతునకు గుభృ తద్గణ గణిత రామణీయక మణిఘృణి ఫణితాతిమంబిమ నిశాంతునకున్‌ (కతువలయాశ్వ చరిత్ర, 1-6) ఈ పద్యంలోని మణినాగనగర ప్రశస్తిని గుర్తించి. సవరం చిననారాయణ కూడా చెంజిరాజ్యు కుటుంబానికి చెందినవాడై ఉంటాడని నేలటూరు వెంకటరమణయ్యగారు సమన్నయం చేశారు.!* చిననారాయణ తన కావ్యంలో తనతో కలుపుకొని ఏడుతరాల వంశవృక్షాన్ని యిచ్చాడు. తన ముత్తాత తిప్పరాజుగారు హిందూఖాన్‌ అనే తురక సర్హారుతో యుద్ధం చేసి జయించినట్టు చెప్పాడు (1-32, 3). తిప్పరాజుగారి తుమారుడు తిమ్మయ్య కూడా చాలా యుద్ధాలలో మహమ్మదీయ సైన్యాలను జయించాడు (1-౫ నుండి 41). తన తాతముత్తాతల శార్యాలను కీర్తించాడేగాని వాళ్లు ఏ దుర్గాల వద్ద యుద్ధాలు చేశారో చిననారాయణ చెప్పలేదు. కతువలయాశ్వ చరిత్రలో కీర్తించిన వంశావళిలో కనబడడుగాని సవరం చిన్నప్పనాయకుడనే ఒక మహావీరుడు క్రీ.శ. 1563 నుండి రాయసామ్రాజ్యుపు కొలువులో ఉన్నాడు. పెనుగొండ పెద్దకోటకు ప్రతి పిల్లకోట వాకిళ్లు బురుజులు, అగడ్తలు మొదలైనవి కట్టించాడు. 1568లో అదిల్లా దండెత్తినప్పుడు సవరం చిన్నప్పనాయకుడే ఎదిరించి జయించాడు. మళ్లీ క్రీ.శ 1576లో అలీ ఆదిల్‌షా పెనుగొండపై దాడి చేశాడు. అప్పుడు శ్రీరంగదేవరాయలు సిరిసంపదలన్నింటినీ తరలించుకొని చంద్రగిరికి వెళ్లిపోతూ మార్గశిర బహుళపాడ్యమినాడు సవరం చిన్నప్ప అదిల్‌షాను జయించినట్టు ఒక శాసనంవల్ల తెలుస్తూంది. ఇది క్రీశు 21-12-1576కి సరిపోతుంది. 8. చంపూ రామాయణం, బుగ్వేదకవి వెంకటాచలపతి - పీఠిక, పుట - ౩ 9. 6.010109 ౨ ౫-81916 10 4 [1106/ 01 (103% ౧ 78 11. దక్షిణాంధ్ర సాహిత్యం, పుట - 9 12, దక్షిణ భారతశాసన సంపుటి, ఖా.7, నంబరు 56

సవరం చిననారాయణ 713

ఈ సవరం చిన్నప్పనాయకుడికీ, ఈ కువలయాశ్వచరిత్రలోని సవరంవారికీ ఏమిటి సంబంధమో తెలియదు. ఇంతటి మహావీరుని గురించి చిననారాయణ ఎందుకు చెప్పలేదో బోధపడదు. తువలయాశ్వచరిత్రలోనూ, మెకంజీ కైఫీయతలలోని సవిస్తారచరిత్రలోనూ కనబడకపోయినా ఎన్‌. ఎమ్‌.ఎడ్వర్జ్సుగారు ప్రకటించిన చెంజి నాయకరాజుల జాబితాలో క్రీశ 1536 నుండి ఒక చెన్నమనాయకుడు కనబడుతున్నాడు. పెనుగొండ దుర్గాన్ని రక్షించిన చెన్నప్పనాయకుడే ఈ చెంజి చెన్నప్పు అని గుర్తించడానికి భావిపరిశోధన చాలా అవసరం. చెంజివారి మణీనాగపుర సంబంధం సవరం వారికి సంక్రమించడానికి ఇదొక అవకాశం అయి ఉండవచ్చు. ఇంకా ఇతర కారణాలు ఉన్నాయేమో పరిశీలించాలి.

సవరం చిననారాయణ తన తాత తిమ్యరాజుగారు ఎందరో యవనులకు వీరస్వర్గం కల్గించినట్టు వ్రాశాడు. స్వర్గానికెళ్లినా సవతిపోరు తప్పవచ్చుగాని తురకపోరు తప్పదు. తిమ్మరాజుగారి 'చిలికిదోదమ్మి దారి బలిమిదెగటార' తురకలు స్పర్గానికివెళ్లి దేవవేశ్వలను బాధించారట. మంజుఘోషను మోచేతో కొట్టారు. ఘృతాచిని దేశీయపు తిట్టు తిట్టారు. తిలోత్తమ ముచ్చెవాట్లు పడింది. ఊర్వశి చౌకువేట్లు పడింది. స్వర్గం తారుమారైంది. అమర నాయకునిపై కాక పాదుషాపై ఆశ పల్లవించింది. రుద్రవీణల బదులు రబాబులు చూరుమోగాయి. అబ్ద్బహితుని వివిధనామాలు మాటుమణిగి కర్తారు శబ్దమే రూఢీకెక్కింది. యవనుల దారుణాల గురించి చెప్పుకొంటూ మగ్గంలో కండెలాగా నారదుడు తిరుగుతాడట. చిననారాయణ ఇలా రసకల్చన చేశారు.

నికరంబు పోసులకు మొక్కు మనుచు దేవేంద్రనందను బట్టి యీడ్చిరనుచు

జేష్టలుమాని దేశీయముల్‌ వినిపించు మంచు దుంబురు నడ్డగించి రనుచు

సారాయికొపెర గంజాపొడుల్‌ దెమ్మంచు నంగడుల్‌ పడీ గొల్లలాడి రనుచు

లాయంబులో బసుల్‌ గావింప రమ్మంచు హరిణితో గడునెగ్గులాడి రనుచు

దిమ్మునృ్సుపహతయవను లొందించులూటి

నమరపురి జేరవెరచు దిశాధిపతుల

తెరుగ జేయంగ నచ్చటి కిచ్చటికిని

నారదుం డాసుగ్రోవిచందమున దిరుగు (కువల. 1-41)

స్వర్గం మాట సత్యం కాకపోయినా క్రీ.శ. 1600 ప్రాంతాలలో తెలుగు దుర్గాలలో పరసీనల జులుం యీ పద్యాలవల్ల తెలుస్తాయి. సవరం తిమ్మరాజుగారు ఏ తురక సర్దారులను జయించాడో తెలిస్తే మరికొంత స్పష్టంగా వీళ్ల చరిత్రను చెప్పుకొనేవాళ్లం. ఈ తిమ్మరాజుగారికి ఆరుగురు భార్యలు, ఎనమండుగురు కొడుకులు. వీళ్ళలో రెండో భార్య మూర్తిమాంబ కుమారుడే పెదనారాయణ. ఇతడు కర్ణాటకాధీశ్చ్వర దయాసానిద్రుడు. క్రీ.శ 1630-42 దాకా రాయసింహాసనాన్ని, అధిష్టించిన మూడవ వెంకటపతిరాయలకు విశ్వాసపాత్రుడు. అతని కరుణవల్ల చాలా పలుకుబడి సంపాదించాడు. ఏవో యుద్ధాలలో పాలొని “వయిఖందుఖాన సప్తాంగహరణు'డనే బిరుదు పొందాడు (1-16). ఇతని ప్రాభవాన్ని చిననారాయణ ఇలా వర్జించాడు:

714 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తన మాట కాంచికాతంజాపురీమధురాధినాధులకు నెయ్యంబు నెరుప దనచీటి గోలకొండనరేం ద్రముఖధరాధవపద్మబంధు లౌదల దలంప దన కీర్తి మట్ల నంతనృపాల ముఖ్య గోత్రామరేంద్రులు గొనియాడికొనగ దన దానగుణము గోజూవరీతీరభూనిర్జరేశ్చరులు వర్ణించుకొనగ వెలయు వేదండగండ నిర్గ్లళ దనర్గ ళ మదధారాధునీ నాధకుముదబంధు కార్య కృడ్డిండిమారావధుర్యనైన్యు డతడు ప్రభుమాత్రుడే నారనాధినేత. (కువల. 1-90) ఈ పద్యంలో కంచి, తంజావూరు, మధుర. గోల్కొండ, సిద్ధవటం, గోదావరీ ప్రాంతాలు పేర్కొన్నా ఆనాటి ముఖ్యరాజ్యాలలో ఒకటైన చెంజిని చిననారాయణ పేర్కొనలేదు. అందుచేత పెదనారాయణ పాలించిన ప్రదేశం తుండీర మండలంలోని భాగమేమో అని అనుమానించవచ్చు. క్రీ.శ 1630 దాకా చెంజి నాయకరాజులు రాయసింహాసనాన్ని ఎదిరిస్తూ వచ్చినా వీరవెంకటపతి రాయల కాలంలోనే చెంజి అత్యంత విశ్వాసంగా కర్ణాటక చక్రవర్తికి సహాయం చేసింది. వీరవెంకటపతిరాయల కరుణకు పాత్రమైన చెంబి రాజ్యుం చక్రవర్తికి మరీ ఆత్మీయంగా మారడం చూసి మధుర తంజావూరు నాయకరాజులే కన్ను కుట్టికున్నారు. మిత్రభేదం పెట్టడానికి కుట్ర పన్నారు.!క పరులు అసూయ చెందేటంత పలుకుబడితో చెంజిగానీ, సవరంవారు గాని క్రీ.శ. 1635 నుండి 1642 దాకా వెలుగు వెలిగారు. బహుశా ఆ మధ్యకాలంలోనే చిననారాయణ కువలయాళ్చ్వ చరిత్రను రచించి పెదనారాయణకు అంకితం ఇచ్చాడు. పెదనారాయణకు పిల్లలు లేరు. అతనికి శ్రీరంగరాజు, కృష్ణంరాజు అనే ఇద్దరు సవతి అన్నగార్లు ఉన్నారు. రంగరాజుగారి ఏడుగురు కుమారులలో చిననారాయణ ఒకడు. కృష్ణంరాజుగారి నలుగురు కొడుకులలో మూడవవాడు వెంకటపతి. ఈ ఇద్దరినీ పెదనారాయణ పెంచుకొన్నాడు. తండ్రీ తరువాతనో, తండ్రితోపాటో వెంకటపతి రాజ్యం చేశాడు. ఇతణ్ణీ తంజావూరు విజయరాఘవుడు ఓడించాడు. ఈ విజయాన్ని అతని ఆశ్రితులు కీర్తించారు. వీరుడౌ సవరము వెంకటపతిని - పారదోలించి నీపనుపులచేత బట్టైన సీమలో బందనల్లూరు - కట్టించితివి ఘటికామాత్రముననె. (రఘునా. 1-12) మరీ దక్షిణాన తెంకాసి - కుర్తాలంవద్ద ఒక పందనల్తూరు ఉంది. ఇదీ విజయరాఘవుని అన్నగారు ఏలుకొన్న గ్రామం.1* ఈ పందనల్లూరులోనే సవరం వెంకటపతి ఓడిపోయాడని చరిత్రకారులు భావిస్తున్నారు.5 అయితే చెంజికీ, సవరంవారికీ ఏదైనా సంబంధం ఉందనుకొంటే తుండీరమండలం వాలాజాపేటలోని పాండ్టునల్లూరే ఈ పందనల్లూరని భావించవచ్చును. పెంపుడు తండ్రీ, సోదరుడూ ఎన్నో యుద్ధాలలో 13. గలను? 5ంటూం 01 బగారంజు 1154007, క 340-341. కేశ. 1బనుఆ 01 1200079 0 రయం ఆాజటా, 9. 127 15. రఘునాథనాయకాభ్యుదయం, నేలటూరివారి ఇంగ్లీషు పీఠిక, పుట 32.

సవరం చిననారాయణ 7165 పాలొన్నా చిననారాయణ మాత్రం కలమే గాని కత్తి పట్టుకొన్నట్టు కనబడదు. ఎప్పుడూ భారతం, భాగవతం మొదలైన గ్రంథాలు వినడంలోనే కాలం గడిపాడు. తన గద్యలో “సంతత భారతభాగవతాదిశ్రవణానంద' అనే విశేషణం వాడుకొన్నాడు.

చిననారాయణ సరసకవితావైభవుడు. జాతివార్తాకవి, జనామోద సంధాయకుడు. ఏ కావ్యంలోనైనా కొన్నిచోట్ల శబ్దనిగుంభనాలు, కొన్నిచోట్ల యుక్తి క్రీయా గౌరవాలు, మరికొన్నిపట్లలో అవసరమైన రసప్రకరాలు కనిపిస్తేనే అది ఆహ్లాదమవుతుందని అతనికి తెలుసు. ఆంధ్రప్రబంధహేలానిధులైన కవిత్రయం వారినీ, శ్రీనాథనాచనసోములను అతడు క్షుణ్ణంగా చదువుకొని కవితారహస్యాలు తెలుసుకొన్నాడు. బహువిధకథావిచిత్రమైన తువలయాశ్వచరిత్ర అనే కావ్యాన్ని సరసజనసేవ్యంగా వ్రాయాలని సంకల్పించుకొన్నాడు.

నిజంగా ఈ కావ్యంలో కథావైచిత్రి కనబడుతుంది. ఇది సరసజనసేవ్యమనే చెప్పాలి. చిననారాయణ తీసుకున్న కథ చాలా పాతదే. మార్కండేయ పురాణంలో మదాలస కథ వుంది. ఆమె కువలయాశ్వుని ప్రేమించి పెళ్లిచేసుకొని వియోగం పొంది మళ్లా కలుసుకొంది. ఈ కథను మారన తన మార్కండేయపురాణంలో సుమారు 200 గద్యపద్యాలలో చెప్పాడు (2:254-3:100 దాకా). ఆయన చెప్పిన కథ టూకీగా ఇది:

పూర్వం శత్రుజిత్తు అనే రాజు ఉన్నాడు. అతనికి బుతధ్వజుడనే కుమారుడున్నాడు. ఆ రాకుమారుడు మిత్రులతో వివిధ విహారాలు చేస్తూ ఉండేవాడు. అతనితో నేస్తం కట్టాలని నాగలోకంలోని వాళ్లుకూడా ఉవ్విళ్లూరేవారు. నాగలోకాన్ని అశ్వతరుడనే రాజు పాలించేవాడు. అతని కొడుకులు మారువేషం వేసుకొని బుతధ్వజుని స్నేహం చేసి హాయిగా ఉంటూ ఉండేవారు. పగలు భూలోకంలో గడపి రాత్రి నాగలోకానికి వచ్చేవారు. ఒకసారి కొడుకులు ఇంట్లో కనబడకపోయేసరికి అశ్వతరునికి సందేహం కల్లింది. '“ఏమిరా అబ్బాయిలూ, రోజల్లా ఎక్కడ గడుపుతున్నారు” అని అడిగాడు. “బుతధ్వజునితో విహరిస్తున్నా'”మని. చెప్పి, వాళ్ళు అతణ్ణి కీర్తించారు. అతడు ఉపఠారపరుడు, స్నేహబాంధవుడు, గుణక్తాలి అని కొడుకులు చెప్పగానే అశ్వతరుడు ఆనందించాడు. "అటువంటి స్నేహితునికి మీరేం ప్రత్యుపకారం చేశా''రని అడిగాడు.

నిజానికి బుతధ్వజుడు చాలా కష్టాలలో ఉన్నాడు. అయితే అతణ్జీ ఆదుకొనేవాళ్లివరూ లేరు. ఆ త్రిమూర్తులు తప్పించి అతని కష్టాన్ని పోగొట్టలేరు. ఈ విషయం తన కుమారులు చెప్పగానే అశ్వతరుడు బాధపడ్డాడు. “మీ స్నేహితునికి వచ్చిన ఆపద ఏమిటోచెప్పండి”' అన్నాడు. కొడుకులు చెప్పారు:

శత్రుజిత్తు మహారాజు వద్దకు ఒక అపురూపమైన గుర్రాన్ని వెంట పెట్టుకుని గాలవుడనే ముని వచ్చాడు. తన ఆశ్రమంలో ఒక రాక్షసుడు నానా గొడవా పెడుతున్నాడని మొరపెట్టాడు. ఆ రాక్షసుడు నిజరూపంతో రాడు. సింహంలాగ, పెద్దపులిలాగ అకారం ధరించి వస్తాడు. వాణ్ణి ఎవరు సంహరిస్తారా అని ముని దుఃఖపడుతూ ఉంటే ఆకాశం నుంచి ఒక గుర్రం దిగి వచ్చింది. ఆకాశవాణి ఆదేశాన్ని ఇచ్చింది. “ఈ గుల్రాన్ని తీసుకువెళ్లి శత్రుజిత్తు కుమారుడు బుతధ్వజునికి సమర్పించు. అతడు దీన్ని ఎక్కి ఆ రాక్షసుణ్ణీ

716 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సంహరిస్తాడు” అని గగనవాణి పల్కింది. ఆ గుర్రం పేరు కువలయాశ్వం అని చెప్పింది గాలవుడు దాన్ని శత్రుజిత్తుకు ఇచ్చాడు. రాజు తన కొడుక్కు ఇచ్చిడు. కువలయం అనే గుర్రాన్ని అధిరోహించడంవల్ల బుతధ్వజునికి కువలయాళశ్చుడనే పేరు వచ్చింది.

గుర్రం ఎక్కి కువలయాశ్చుడు మునితో ఆశ్రమానికి వెళ్లాడు. రాక్షసుడొక ఊగ్రవరాహరూపం దాల్చాడు. వాడీని కువలయాశ్వుడు వెంట తరిమాడు. ఆ వరాహం పాతాళంలోకి వెళ్ళింది. కువలయాశ్వుడు తూడా పాతాళంలోకి వెళ్ళాడు. వరాహం కనబడలేదుగాని ఒయ్యారిని చూశాడు. ఆమె రసాతల దేవతో, రసమయశ్రీయో అని తువలయాశ్వుడు అనుకున్నాడు. అతడు మారుడో, జయంతుడో అని ఆమె అనుకొంది వచ్చినవాడికి హృదయం ఇచ్చేసి ముచ్చటగా మూర్చపోయింది. అప్పుడు కుండల అనే చెలికత్తె సేదతీర్చింది. 'ఈ జవ్వని ఎవ్వరు? ఏమిటీ ఈ అమ్మాయి కథ? అని కతువలయాళశ్చుడు అడిగాడు. కుండల ఇలా చెప్పిందిః . | విశ్వావసుడనే గంధర్వరాజు ఉన్నాడు. అతనికి మదాలస అనే కుమార్తె ఉంది. ఆమె ఒకనాడు తోటలో విహరిస్తున్నప్పుడు పాతాళకేతుడనే రాక్షసుడు మరులుకొని మాయాబలంతో ఎత్తుకు పోయాడు. పొత్తు కోరాడు. పాతాళంలో పెట్టాడు. మదాలస మరణించాలని అనుకొంది. అయితే ఈ రాక్షసుని చంపినవాడే ఆమెకు భర్త అవుతాడనే సంగతి తెలుసుకొని ఆ ప్రయత్నాలు మానుకొంది. కుండల విద్యావంతుని కూతురు. పుష్కరశాలి భార్య, అతణ్ణి ఎవడో రాక్షసుడు చంపేశాడు. భర్తతో పాటు పుణ్యలోకాలకు పోతున్నప్పుడు సూకరరూపంలోనున్న పాతాళకేతుణ్ణి రాజకుమారుడు వెంట తరమడం ఆకాశంలోంచి చూసింది. పాతాళందాకా అనుసరించింది. మదాలస కథను చెప్పాక కుండల “అయ్యా, మీరెవరు?” అని అడిగింది. అతడు చెప్పాడు. 'బాబూ, ఈ మదాలసను మీరు పెళ్లి చేసుకోండి. దీని పెళ్లి అయిపోతే నేను పోయి తపస్సు చేసుకొని చనిపోయిన భర్తను పౌందాలి' అని కుండల చెప్పింది. సమ్మతించి కువలయాశ్వుడు మదాలసను పెళ్ళి చేసుకున్నాడు. కుండల తపస్సుకు కూర్చుంది. దివ్యగతికి వెళ్లింది.

మదాలసను గుర్రంమీద ఎక్కించుకుని కువలయాశ్వుడు వెళ్లిపోయాడు. పాతాళకేతుడు తెచ్చిన పిల్లను ఎవరో మానవుడు తీసుకుపోతున్నాడని రాక్షసులలో కలకలం రేగింది. పాతాళకేతువు సేనలతో అడ్డగించాడు. కువలయాశ్వుడు అందర్నీ సంహరించాడు. పెళ్లికూతురితో రాజధానికి వెళ్లాడు. తండ్రి సంతోషించాడు. దంపతులు సుఖంగా ఉన్నారు. అయితే దానికి అంతరాయం కల్లింది.

కువలయాళశ్చుడు గుర్రాన్నెక్కి రోజూ కొన్ని గంటలు భూప్రదక్షిణర చేసీ శాంతిభద్రతలు కాపాడేవాడు. 'ఒకనాడతడలా సంచరిస్తుండగా ఒక మాయామని ఎదురుపడ్డాడు. వాడు పాతాళకేతుని తమ్ముడు; తాళకేతుడు. అన్ను చావుకు ప్రతీకారు చేయాలని నిశ్చయించాడు. కువలయాశ్వుని చూసి 'అయ్యా, నేను యాగం చేసుకొంటాను. దక్షిణగా మీ మెడలో ఉన్న కంఠహారం ఇవ్వండి" అన్నాడు. కువలయాశ్పుడు ఇచ్చాడు.

సవరం చిననారాయణ 717 “ఇప్పుడే స్నానం చేసివస్తాను. నా ఆశ్రమాన్ని అంతదాకా కాపాడుతూ ఉండండి' అని పురమాయించి కంఠహారాన్ని పట్టుకొని పాతాళకేతుడు వెళ్లాడు. ఇక్కడ నదిలో మునిగి, మదాలస దగ్గర తేలాడు. 'నీ భర్త మరణించాడు, అతనికి కొందరు శూద్రమునులు అగ్ని సంస్కారం చేశారు. ఇదిగో అతని కంఠహారం' అని తాళకేతువు చూపించాడు. ఆ వార్త వినగానే మదాలస గుండె పగిలింది. మరణించింది. కొడుతూ, కోడలూ ఇద్దరూ మరణించారని రాజదంపతులు వైరాగ్యం పొందారు. పగ తీర్చుకొని తాళకేతుడు తన దొంగ ఆశ్రమం వద్దకు వచ్చాడు. అంతదాకా కువలయాశ్చుడు అక్కడే ఉన్నాడు. “అయ్యా, చూడు, నువ్వు కదలకుండా వుండడం వల్ల నాకోరిక తీరింది. ఇంక వేంచెయ్యి' అని రాక్షసుడు వీడ్కోలు చెప్పాడు. ఇంటికి వచ్చిన కతువలయాశ్చుడు బావురుమన్నాడు. “నా మరణవార్త వినగానే భార్య ప్రాణాలు విడిచింది. అమె మృతిచెందిన వార్త తెలిసి ఇంకా జీవిస్తున్నాను. నా గుండె ఎంత కఠినమైనది? అని అతడు వాపోయాడు, భార్యకు అంత్యక్రియలు చేశాడు. ప్రాణముండగా రెండోపెళ్లి చేసుకోనని శపథం చేశాడు. తమ మిత్రునికి ఇంత కష్టమొచ్చిందని ఈ కథనంతా నాగకుమారులు తమ తండ్రికి చెప్పారు. “అతని ఈడువాళ్లం మేము పొందే సుఖాలు అతనికి లేవు. ఈ కష్టం మరిపించడానికి కువలయాశ్చునితో పొద్దుపుచ్చుతున్నాం”' అని వివరించారు. అశ్వతరుని గుండె కరిగింది. ఎలాగైనా మదాలసను తెచ్చి కువలయాశ్ళునికి ఇవ్వాలని అనుకున్నాడు. సరస్వతీదేవిని ప్రార్ధించి గానప్రావీణ్యం పాందాడు. ఆ పాటతో తివుణ్జి మెప్పించాడు. కావలసిన వరం కోరుకోమన్నప్పుడు మదాలస తన కుమార్తెగా ప్రభవించాలని అర్థించాడు. శివుడు వరమిచ్చాడు. పుత్రిక జనించింది. తరువాత కొన్నాళ్ళకు అశ్వతరుడు కొడుకులని పిలిచి “మీ స్నేహితుణ్ణి తీసుకురండి' అన్నాడు. వాళ్ళు వెళ్ళి కువలయాశ్ళుని తీసుకువచ్చారు. అశ్వ్చతరుడు ఆతిథ్యం యిచ్చి “అయ్యా, నీకేం కావాలి?" అన్నాడు. “వ్రీ దయవల్ల నాకేం కొరత! అన్నాడు కువలయాశ్వుడు. “నీ మదాలసను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు అశ్వతరుడు. “చచ్చినవాళ్లని మళ్ళీ తేగలవా!: మాయ కాదుకదా” అని తువలయాశ్చుడు ఆశ్చర్యపోయాడు. “పోనీ లెండి, మాయారూపంలో ఉన్నా నా మదాలసను చూస్తే చాలు' అన్నాడు. అశ్వతరుడు ఆమెను చూపించి మళ్ళీ ఎలా పుట్టిందో వివరించాడు. కువలయాశ్వమదాలసల వివాహం చేశాడు. ఇదీ మార్కండేయపురాణంలో మారన చెప్పిన కథ. ఈ ఇతివృత్తాన్నే తీసుకుని మార్చులు చేసి చిననారాయణ చాలా రసవంతంగా రచించాడు. మూలంలోనున్న శత్రుబిత్తు మహారాజు సంగజేం చిననారాయణ చెప్పలేదు. పూర్వం సాకేతపురం వుండేదని చెప్పాడు. దానిని ఇరవై పద్యాలలో వర్జించాడు (1-69 నుండి 1-28 దాకా), నగరాన్ని పెళ్ళిపందిరితో సరిపోల్చి, కళ్యాణమని ఎత్తుగడలో నే చెప్పాడు (1-70). ఆ సాకేతనగరాన్నిి బుతధ్వజుడు పాలిస్తున్నాడని ప్రకటించి అయిదు పద్యాలలో అతజ్జీ వర్ణించాడు. ఆ

718 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తరువాత వేసవి వచ్చిందని చెప్పి దాన్ని 11 పద్యాలలో వర్ణించాడు. దాంతో మొదటి ఆశ్వాసం అయిపోయింది. రెండో ఆశ్వాసంలో బుతధ్వజుడు కొలువు సింగారమై సభలోకి వచ్చాడు. అతని వద్దకు గాలవుడు కువలయాశ్వాన్ని తీసుకొనివచ్చి పాతాళకేతుని అక్రమాలు చెప్తాడు. అంతకుముందా రాక్షసుడు చాలా వినయ విధేయతలతో ఉండేవాడట. ఉన్నట్టుండి ప్రాణగొడ్డమయ్యాడు. వాడిలో వచ్చిన మార్పుని గాలవుడు ఇలా చెప్పాడు: పాడగన్న సాష్టాంగముగ వ్రాలి చనువాడె ఎదురుగా రారంచుబదరసాగె బిలిచి పెట్టిన వన్యఖిక్ష రైకొనువాడె కోర్‌పెట్ట రటంచు గొణగసాగె నిలుచుండి చంక చేతులు కట్టుకొనువాడె కొలువరాదేమంచు గెలయసాగె వినయంబుతో చేరి పని ఏమి యనువాడె యరయ కడ్డాదిడ్డులను పసాగె దన వచోదోషము క్షమింపు డనువాడె, యేమనిన లేని నాతప్పులెంచసాగె వినుము మహికాంత కొండంత పనికి నైన బలుకు లేటికి గిల్లాకు పనుపసాగె (కతువల 2-24) ఇలా ఏకమేకై కూర్చున్న పాతాళకేతుడు ఒకసారి ఆశ్రమంలో నానాగొడవా చేశాడు. ఒక అడవిలేడికి పొద్దులవేళ మునికన్యలంతా ఆ ముచ్చటలో ఉన్నప్పుడు రాక్షసుడు పేరంటాలి రూపంలో ప్రవేశించి సింహంలాగ మారిపోయాడు. అంకా గగ్గోలుపడ్డారు. వాణ్ణి శపిద్దామా అని గాలవుడు అనుకొన్నాడట. అయినా “కుమ్మరి కొక్క యేడునుం గుదియ కొక్కపెట్టు అన్నట్టు ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించిన తపశ్ళక్తులు వాడిమీద వృథా చేయడం ఎందుకనుకున్నాడు. అప్పుడు ఆకాశంనుండీ గుభ్రం వచ్చింది. అశరీరవాణి సలహా యిచ్చింది. గాలవుడు గుర్రాన్ని బుతధ్వజునికి యిచ్చాడు అతడు కతువలయాశ్వుడు అయ్యాడు. అతడు గుగ్రమెక్కి ఆశ్రమానికి వెళ్లాడు. ఇతర మునులకు నమస్కరించాడు. వాళ్ళు ఇలా అన్నారు: అయ్యయొ మాకు దండమిడినంత ఫలంబు నకీింద్ర యీ దయ్యముతొడి జాగరము దాటగబేసి సుఖమ్ము లిమ్ము లే వయ్య కొమాళ్ళ తండ్రి వయి యాశ్రితరక్షణ దుష్టశ్‌క్షణా క్రయ్య దయా పరాత్రమ విశాలుడవైమనుమయ్య యిమ్మహిన్‌ _ (కువల. 2-79) రాజు ముందు వెళ్లాక సైన్యం తరువాత వచ్చింది. ఆశ్రమం దగ్గి విడిసింది కువలయాళశ్చుడు డేరిజ వేయించి గుడారాలు ఎత్తించాడు (2-84). ఈ దండు ఎలా విడిసినరీ చిననారాయణ చాలా వివరంగా 3 గద్యపద్యాలలో వర్ణించాడు (2-84 నుండి 1% దాకా). తరువాత దానవసేన వర్దన. తెల్లవారింది. జానకితాళ్ళు, తుపాకులు, ఫిరంగులు మొదలైనవాటితో యుద్ధం జరిగింది. ఇది చూస్తున్న శౌనకుడు, విశ్వామిత్రుడు మొదలైన మునులు తమలో తాము పందాలు వేసుకొన్నారు. ఈ యుద్ధం ముగియకముందే ఆశ్వాసు ముగిసింది.

సవరం చిననారాయణ 719

మూడో అఆశ్వాసంలో రాజు ముత్తిక వేయించాడు. దానవుని తోట లగ్గలు పట్టించాడు. తుపాకిగుళ్ళు కురిపించి రాక్షసులను గెలిచి రాజు కోటలోనికి ప్రవేశించాడు. మేడలు, మిద్దెలు, గుళ్ళు, గృహాంగణాలు చూసుకొంటూ వెడుతూ ఉంటే ఒక చోట ఇద్దరాడువారి మాటలు వినిపించాయి. తన గురించే మాట్లాడుకొనే ఆ ఆడవాళ్ళు మదాలసా, ఆమె చెలికత్తె కుండల. ఇంతకుముందే ఎప్పుడో బుతుధ్వజుడు వేటకు వెళ్ళినప్పుడు చూసి మదాలస మరులుకొందకు. అతడు మాత్రం చూడలేదు. ప్రేమించిన క్షణంనుంచి ఆమె విరహంలో మునిగిపోయింది. అతణ్ణి పెళ్ళాడగలనా అని తలపోస్తున్న మదాలసను పాతాళకేతుడు ఎత్తుకువచ్చాడు. వాణ్జ్ణీ బుతధ్వజుడు ఓడిస్తున్నాడు. ఇంక వస్తాడని కుండల చెప్తుంది.

రాజు ఆ మందిరంలో ప్రవేశించాడు. “మీరెవరు?” అని అడిగాడు. కుండల కథ చెప్పింది. కథేం కర్మ? కావ్యమే చెప్పింది, 3-65 నుండీ 4-43 దాకా 144 గద్య పద్యాల్లో వనవిహారం, టప్రియదర్శనం, విరహం, ఉపాలంభనలు, కాక్షసుడు ఎత్తుకుపోవడం వగైరాలన్నీ చెప్పింది. మదాలసను పెళ్ళిచేసుకోమని అర్థించింది మదాలసతోపాటు కుండలను కూడా తీసుకొని తన రాజ్యానికి వెళ్ళాడు.

పాతాళకేతుడు మరణించిన సంగతి అతని తమ్ముడు తాళకేతునికి విచిత్రంగా తెలిసింది. వాడు ఇంద్రుని వద్దకు ఒక రాయబారిని పంపాడు. దేవవేశ్వలలో తారారంభలు మంచి హుషారైనవాళ్ళు. వాళ్ళను తనకు అప్పచెప్పమని శ్రీముఖం పంపాడు. వెళ్ళిన రాయబారికి దేవసభలో ప్రవేశం కలుగలేదు. వాడు పడ్డ పాట్లు ఇన్నీ అన్నీ కావు.

దొర కాప్తులై కార్యసరణి తెల్పెడి కవీశ్వరులకు లంచపంచంబు లొసగి

సమ్ముఖమ్మున నుండి చనుదెంచు నలవ్రాయసమువారి కాశపాశలు ఘటించి

బోనవెచ్చము గొంచుబోవు శచీదేవి దాదులకును బరిధానమిచ్చి

పిలువ నేతెంచు వేగులవారి వెంటనే యరుగు నియోగుల ననుసరించి

నేను వచ్చిన మాట దేవేంద్రుతోడ

దెలుపుమని యెంత వేడిన దెలుపరరి

విని వినమి చేసెనో గాని వేల్చురేడు. (కువల. 4-61)

చివరకు శుక్రాచార్యుని సహాయంవల్ల దేవేంద్రునివద్దకు వెళ్ళిన ఆ రాయబారి తన దొరగారి కోరికను చెప్పాడు. దేవేంద్రుడు నవ్వాడు. వాడి అయ్యగారి అన్న చచ్చి వాళ్ళ దగ్గిరకు చేరుకున్నాడని చెప్పాడు. రాయబారి తెచ్చిన ఈ వార్త విని తాళకేతు ఆగ్రహించాడు. మదాలస కోసం అన్నగారు వెళ్ళడం వాడికీ తెలుసు. ఆ యువతిమూలంగానే పాతాళకేతు మరణించాడు కనుక అమెకు హాని చెయ్యాలనుకొన్నాడు. మాయా మునివేషంతో కువలయాశ్వుని వద్దకు వెళ్ళి తన యాగం రక్షించమన్నాడు. గుర్రంమీద వాణ్ణీ తూడా ఎక్కించుకొని రాజు కదిలాడు. అది పొరకాంతలు చూశారు. “అయ్యో, నిన్న గాలవునితో

720 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వెళ్ళాడు. కొత్త పెళ్ళికొడుకైనా ముద్దూ ముచ్చటా లేకుండా మౌని వెంట వెడుతున్నాడే అని నొచ్చుకున్నారు. దొర నయ్యెద నని కోరుదు - రరయగ జను లెవ్వరైన నాపెను బెడదల్‌ పరికింపరు దొరతనపున్‌ - సరవుల్‌ మరి కత్తిమీది సాములు సుమ్మీ (కువల. 4-2) రాజరికం అంటే రసికునిలాగా భోగించడం కాదని తెలియజేసే ఇంకో పద్యం చిననారాయణ రచించాడు. మంత్రులకు మర్మకర్మాలు ఎరిగించడం, ఈతిబాధలు లేకుండా చూడడం మొదలైన రాచకార్యాలలో శ్రద్ధ చూపాలి గాని “మనసు నచ్చిన మిటారి తూడీ తమిమీర సయ్యాటలాడికొనుచు నడువగూడునె మేదినీ నాయకులకు అని పౌొరకాంతల చేత అనిపించాడు (4-8). మాయామునితో కువలయాశ్చుడు వెళ్ళాడు. మోసపోయి మణిహారం ఇచ్చాడు. కుండలతోపాటు మదాలసను మాయావిమానం ఎక్కించుకొని తాళకేతుడు ఎగరేసుకు పోయాడు. వారిని బంధించి బలవంతులను కాపు పెట్టాడు. తిరిగి వచ్చిన కువలయాశ్వుడు “అక్కట యెందు బోయెనొ యొయారపుసంచుల ముద్దు గుమ్మ అనుకున్నాడు. ఆ నడలు, ఆ మెరుంగు తొడలు, ఆ కడగంటన చూచు సోయగాలు' అని తలచుకున్నాడు. రాచకార్యాలు మానేసి చింతా క్రాంతుడయ్యాడు. అతని స్నేహితులు నాగకుమారులీ దురవస్థ చూచి తమ తండ్రితో చెప్పారు. తనయుల స్నేహలాంఛనవిధానము లెంచి ఉపకారం చేయడానికి అశ్వతరుడు కైలాసానికి వెళ్ళాడు. పార్వతితో పరమేశ్వరుడు చదరంగం ఆడుతున్నాడు. గొప్ప పాటగాడు వచ్చాడని ఆడుతున్న, ఆట అలా ఉంచారు. అశ్చతరుని పాట విని పార్వతి మెచ్చుకొంది. అడిగినవరం ఇవ్వబోయింది. అయికే సవతి మీద ఉండే అసూయకొద్దీ గంగ అడ్డుపడింది. పరమేశ్వరుడు తుని తగవులాగ సర్టిపెట్టాడు. మదాలస ముందు విడుదల పొందుతుందని, తరువాత కుండలకు విమోచనం లభిస్తుందని చెప్పాడు. మూలంలో కుండలను అసలు రాజ్యానికి తీసుకురావడంగాని, ఆమెను తాళకేతుడు తీసుకుపోవడంగాని లేవు. ఆమెను కూడా అనంతరకథలో చేర్చడంవల్ల చిననారాయణ ఈ మార్చు చేశాడు. కుండల ఆలస్యంగా ఠావడానికొక కారణం కల్పించి, వచ్చే విధానానికొక ష్లాయి సృష్టించాడు. స్వర్గంలో తార అనే దేవవేశ్య ఉంది. ఆమె అందాన్ని జయంతుడు గుత్తకు మరులుకొంది. చాటుగా చీట్లు వ్రాసి మాటుగా రప్పించుకొంది. నారదుడు ఈ రహస్యాన్ని వెల్లడి చేశాడు. తారకోసం నలకూబరుడూ, జయంతుడూ కాట్లాడుకొన్నారు. అయితే చివరలో ఇద్దరూ తాళకేతును సంహరించి కుండలను రక్షించారు. ఈ కథ అనవసరం అయినా హాయిగా 114 గద్యపద్యాలలో (4:176-5:76 దాకా) చిననారాయణ కథనం

నవరం చిననారాయణ 721 చేశాడు. ఇది పూర్తిగా నాయకరాజుల యుగంలోని రాజకుమారులు భోగపుసానుల కోసం పెట్టుకొనే జగడాలను చిత్రిస్తుంది. అడుగడుగునా ఆ వాతావరణం కనబడుతుంది. ప్రతి పద్యంలోనూ వాస్తవికత ఆాండవిస్తుంది. ఈ ఘట్టంలోనే కాదు - కువలయాశ్వ చరిత్రలో ఎక్కడ చూసినా కవికి ఉన్న అసమానవస్తు పరిశీలనాశక్తి గోచరిస్తుంది. గొల్లసివాలు, దమ్మరాజు కతలు, కోడిపందాలు, కొల్లారుబళ్ళు, పరంగిపీటలు, నమ్మికకమ్మలు, త్రోవ బత్యాలు ఇలాంటివెన్నో కనబడతాయి. ప్రతిపద్యంలోను జాతీయత సజీవంగా కనబడుతు,ది. ఇది తెలుగువాడే తప్ప యింకొకడు వ్రాయలేడన్నంత చక్కగా దేశ్యాలు ఇందులో గుబాళిస్తాయి. నాచన సోముని తరువాత అంత విరివిగా సామెతలు, జాతీయాలు గుప్పించే కవి చిననారాయణే అని చెప్పాలి. అతడు వాడిన నానుడులు, పలుకుబళ్ళు కొన్ని చూడండీ.

గుడినెకై జిల్లేడుకొట్టడం (1-27), అసుక్రోవిచందం (1-41), కరువుకు తోడు ఆవపంట (1-101), ఇందు రమ్మన్నచో ఇల్లెల్లగొనుట (2-23, 5-44) తుచ్మురి కొక యేడు గుదియకొక పెట్టు (2-37), పారెడు బళ్ళకు కాళ్ళు చాచడం (2-38), పిలవని పేరంటం (3-85), అడుగులకు మడుగు లొత్తడం (3-86), గుండెలో గాలం (4-27), మూడుకాళ్ళ ముసలి (4-28), తడిపాతతో గొంతు కోయడం (4-30), తేనెపూసిన కత్తి (4-30), శత్తిమీద సాములు (4-82), సిగపట్లు (5-87), గురువులకు బొమ్మపెట్టడం (6-45).

నాచనసోముని నవీనగుణాలిలా జాతీయాలు వాడడంలోనే కాక ఇతరత్రా కూడా స్ఫుటంగా కనబడతాయి. సోముని ఉత్తరహరివంశంలో ఆనాటి తురకదాడులు, ముట్టడులు కొల్లలు కనబడినట్టే చిననారాయణ కావ్యంలో కనబడతాయి. పురాణగాథను కథనం చేస్తూన్నా తుపాకులు, ఫిరంగులు వంటి ఆయుధాలు, రబాబులవంటి వాద్యాలు ఉపయోగిస్తాడు. “పారసీలిపిని జొప్పడ భగవద్గీత లెన్నిక వ్రాసిన చిన్నిపలక'లు తూడా మనకు చూపిస్తాడు (2-88). చిననారాయణ ఇరవయ్యో శతాబ్దంలో జీవించి ఉంటే కువలయాశ్వచరిత్రలో యాటంబాంబులు, టేపురికార్డర్లు, సోఫా-కమ్‌- టెడ్లు వాడగల్లినంత వర్తమానకవి.

అతని శైలికి, లాలిత్యానికి, వస్తు పరిశీలనాశక్తికి ఎంత ముగ్భలమైనా పాత్రపోషణలో శద్ద తీసుకొననందుకు నొచ్చుకోక తప్పదు. నేటి సాహితీపరులు చిననారాయణను చాలా శ్లాఘీస్తారు. “కథాసంవిధానమును కొలికి పూసవలె నమర్చుటయందును చిననారాయణ నాయకుడు. పింగళిసూరనకు సాటి రాగలడు. పాత్ర సంభాషణములు మంచినీళ్ళ ప్రాయముగా జలజల ప్రవహించు సెలయేళ్ళవలె పరిగెత్తును. పింగళిసూరన తరువాత నింత మధురకవి మరియొకడు లేడు” అని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు చెప్పారు.3*

నాకు మాత్రం చిననారాయణలో కొద్దిగా పింగళి సూరపరాజుగారు. ముద్దుగా నాచనసోముడు కనబడుతున్నారు. “మార్కండేయపురాణంలో మారన చెప్పిన తీరు 18. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం, పుట 1.

722 సమగ్రాంధ్ర సాహిత్యం = రెండవ సంపుటి చూశాక చిననారాయణ కథనం వింటే మనసు చివుక్కుమంటుంది. మూలంలో లాగా నాగకుమారులు అశ్వతరునికి కథ చెప్పిన క్రమంలోనే కథ వ్రాస్తే ఎంతో జౌచిత్యం ఉండేది, మారన్న కథనక్రమమే శిల్పదృష్ట్యా మెరుగనిపిస్తుంది. అందులో బిగువు కనబడుతుంది. అశ్వతరుడు కైలాసానికి వెళ్లడానికి తగినంత కారణం తొలినుంచీ మారన చెప్పిన కథలో మారుమైోగుతూ ఉంటుంది.

మారన కథలో కువలయాశ్వుడు భార్యావియోగానికి ఉదాత్తంగా శోకిస్తాడు. చిననారాయణ కథలో విప్రలంభ శృంగారపు ఫైపారలే అతికినట్టు ఉంటుంది. మారన కథలో భార్యతోపాటు తాను మరణించనందుకు, గట్టిగా ఏడవలేనందుకు కువలయావ్వడు ధార్మిక కారణాలు తలపోసుకుంటూ తపిస్తాడు.

చిననారాయణ చిత్రించిన కువలయాశ్వుడు కామాతురుని లాగే కనబడతాడు. సాధారణ ప్రబంధనాయకుల స్థాయిని మించడు. చిననారాయణ మారన కథను చదివాడు. ఆ పోలిక పద్యాలు కొన్ని బ్రాశాడు. నాగకుమారులు కువలయాశ్చుణ్జి తమ లోకానికి ఆహ్వానించే ఘట్టంలో మారన ఈ పద్యం వ్రాశాడు.

శ్రీయుత నీవు ప్రియమ్మున - మా యింటికి రాగవలయు నావుడు మాయిల్‌

మీయిల్లని వేరడ మిటు - సేయుదురే యది సఖిత్వశీలము తెరగే

(మార్కండేయపురాణం, 3-6)

ఈ సన్నివేశంలో చిననారాయణ చెప్పినది చూడండి: “మా నాన్న నీ గుణాలు విన్నాడు. నిన్ను చూడాలనుకొని బయలుదేరాడు. మేము ఆపాము. నిన్ను తీసుకు

మాయురె తా రావలెనా - యాయెడ కే నరుగుదెంతు నాయిల్లనగా

నీయిల్లనగా వేరా - వోయగ రావిట్టులైన భువిసఖ్యంబుల్‌ (తువ 4-12) ఇలాంటి పద్యాలలో కాక కథనక్రమంలో మారన్నను అనుసరిస్తే కువలయాశ్వ చరిత్ర ఇంతకు పదింతలు రాణీించేది,

ఈ కావ్యం ఆంధ్రసాహీతికి సవరమే గాని నిజవేణి కాదు అని ఎవైనా అనవచ్చు. అయితేనేమి? నైలాను సవరంలాగా చాలా మెత్తన!

గణపవరపు వెంకటకవి

కవిత్వాన్ని మన పూర్వులు నాలుగు రకాలుగా విభజించారు. ఆశు, చిత్ర, మధుర, విస్తర కవితలని ఆ చతుర్విధానాలకు పేర్లు పెట్టారు. క్రీ.శ. 1285 ప్రాంతాలలో తెలుగు చోడుల అస్థానంలో ఉన్న పెద్దయామాత్యుడు ఆశు, చిత్ర కవిత్వాలలో అద్భుడు. ఆనాటి నుంచి మన తెలుగు కవులు తమ చతుర్విధకవితా ప్రావీణ్యాన్ని అప్పుడప్పుడు అక్కడక్కడ చూపిస్తూనే వస్తున్నారు. కాని నోరు విప్పితే చిత్రకవిత్వం చెప్పడానికి ప్రయత్నించేవాళ్లు అరుదు. అడుగడుగునా విలక్షణంగా రచన చేస్తూ పాండిత్యప్రాగల్భ్యాన్ని ప్రదర్శిస్తూ చిత్రకవిత్వ శిఖరాగ్రంపై తిష్టవేసుకొని కూర్చున్న వ్యక్తి ఒకడే ఒకడు మన సాహిత్యంలో కనిపిస్తాడు. అతని పేరు గణపవరపు వెంకటకవి.

ఆయన వ్రాసిన అపూర్వ గ్రంథాలలో ఒకదాని పేరు "ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం.” అందులో ఆయన ప్రయత్నించని చిత్రకవితా ప్రక్రీయ లేనేలేదని చెప్పాలి. అనులోమ విలోమాలు, అచల జిహ్వాలు, పాదగోపనాలు, పద్యభ్రమకాలు, సర్వత్ర యమకాలు, రకరకాల బంధాలు, పద్యాలలో పద్యాలు, ఒకటేమిటి, ఎన్నివిధాలుగా ఫీట్లు చెయ్యాలో అన్నీ చేశాడు. ఈనాడు కొంతమంది కలవారి ఇళ్ళలో సీసాలలో చొప్పించిన స్టీమర్ల బొమ్మలను అలంకారప్రాయంగా చూస్తాం. గణపవరపు వెంకటకవి తన సీసాలలో చొప్పించే వింతలకు అంతే లేదు. సీసపద్యంలో ద్విపదలు, మత్త కోకిలలు, కందాలు, మత్తీభాలు ఇలాగ ఎన్నో ఇరికించగలడు. వాస్తవానికి అతడు ఒకే ఒక గర్చకవిత్వమున్న సీసపద్యంలోనే ఇరవైబంధాలలో ఇమిడే కందాన్ని వ్రాశాడు. ఇటువంటి పద్యం మన సాహిత్యంలో “న భూతో న భవిష్యతి ఇది చిత్రకవిత్వాలాపనలో అతి తారస్థాయి. పరాకాష్ట

ఇంతటి ఉద్దండ పాండిత్యప్రకర్త గల ఈయన కాటేపల్లి అనే గ్రామానికి దగ్గరలో ఉన్న గణపవరంలో పుట్టాడు. ఈ ఊరు ఎక్కడుందో సరిగ్గా చెప్పలేం. కాచేపల్లినే పొరపాటున లేఖకులు కాటేపల్లి అని వ్రాసుకొని ఉంటారు. గుంటూరు బిల్లా నరసారావుపేట తాలూకాలో కాచేపల్లి, గణపవరాలు ఉన్నాయి. కవి బహుశా అక్కడివాడే కావచ్చును. ఇతని బాల్యంలోనే ఈ కుటుంబంవారు తుండీర మండలంలోని శ్రీ పెరుంబుదూరు ప్రాంతాలకు వచ్చారు. వెంకటకవి ఆ గ్రామంలోని యతిరాజాచార్యుల వారి దగ్గర విద్యలు నేర్చుకొన్నాడు. చిన్నప్పటినుంచి కవిత్వం చెప్పడం మొదలుపెట్టాడు. పన్నెండో ఏటనే తారావళులు బ్రాశాడు. మునిముని మీసాలు మొలచేటప్పుడు యమకశతకం రచించాడు. ఇరవయ్యో ఏటనే శృంగార మంజరి రచించాడు. పాతిక సంవత్సరాల వయసు రాగానే కృష్ణమల్లకథను చతుర్చద్రగా చెప్పాడు. బాలరామాయణాన్ని ద్వాపదగా చెప్పాడు.* తరువాత సర్వలక్షణశిరోమణి అనే గొప్ప లక్షణ గ్రంథాన్ని తలపెట్టాడు. ఇందులో పది ఉల్లాసాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే నేడు లఖించాయి. వాటీ వివరాలు ఇమిః

  1. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని 25న పద్యంలో ఈ వివరాలు ఉన్నాయి.

724 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వరుస ఉల్లావం | రచయిత ___________ వరణ 2. | ద్వితీయోల్లాసం | వేంకటేశాంధ్రం - నిఘంటువు (ఆమరానికి బదులు చెప్పాడు 120 పద్యాలు). | ముద్రితం 3 తృతీయోల్లాసం ఆంధ్రకౌముది (వ్యాకరణం) - వేయి చరణాల సీసమాలిక ముద్రితం 4. | చతుర్తోల్లాసం షట్ర్రత్యయాల ప్రస్తారసరణి, ఇర్వదారు ఛందముల వచనం అనే రెండు ప్రకరణాలిందులో ఉంటాయి. అముద్రితం 65. | పంచమోల్లాసం నిఖిల రేఫణకార నిర్ణయ పద్ధతి ఆసమగ్రం 8. | ఆరునుంచి తొమ్మిది | వీటిలో ఎందులో ఏది ఉల్లాసాలు ఉంటుందో తెలియదు గాని కవితా లక్షణం, | నాయికా నాయక లక్షణాలు, కావ్య లక్షణం, రస ప్రకరణం, కావ్యదోష ప్రకరణం అనేవి ఉంటాయి అలభ్యం 7. | దశమోల్తాసం ద్విరూపకోశం అలభ్యం తెలుగు భాషలో మొట్టమొదటి నిఘంటువు. రెండుతరాల క్రీందటిదాకా తెలుగు వాళ్ళ ప్రాథమికవిద్య అమరకోశం వల్లె వేయడంతో ప్రారంభమయ్యేది. సంస్కృతంలోని అమరం లాగే తెలుగులో కూడా ఒక నిఘంటువు అవసరం అని గుర్తించి గణపవరపు వెంకటకవి దానిని వ్రాశాడు. వేంకటేశ్చరునికి అంకీతం ఇచ్చాడు. కనుక దీనికి *“వెంకటేశాంధ్రం' అని పేరు పెట్టారు. . అమరసింహసమానమై యతులసకల కవులు బొగడంగ లోకోపకారముగను క్షితి నాంధ్ర నిఘంటువుగా జేసినాడ నంకితంబుగ నీ పేర వెంకటేశ (వెంక - 3) ఈ లోకోపకారపు నిఘంటువులోని అచ్చతెలుగు పేర్లు గద్ముత్తుగా ఉంటాయి. “ఏనుమొగముల సాహేబు' అంటే శివుడు. 'నలుమోముపాదుషా' అంటీ (బ్రహ్మ గరుత్మంతుడికి గరుటూమంతుడనే పర్యాయపదం ఉంది. ఈ వెంకటేశాంధ్రాన్ని అనుసరించే పైడిపాటి లక్ష్మణకవి తన ఆంధ్రనామసంగగ్రహాన్ని రచించాడు. ఇదే నేడు ప్రచారంలో ఉంది. తెలుగులోఉన్న పద్య నిఘంటువులకు గణపవరపు వెంకటకవి ఒరవడి పెట్టాడని ఈ పట్టీక చూస్తే తెలుస్తుంది. వరుస కాలం వు త 1! క్రీశ 180 వేంకటీశ్థాంధ్రం గణపవరపు వేంకటకవి 2ఒ | క్రీశ 1650 అకారాది దేశీయాంధ్ర నిఘంటువు | గణపవరపు వేంకటకవి 3 క్రీశు 1700 అంధ్రనామ సంగ్రహం పైడిపాటి ఏకామ్ర మంత్రిగారి లక్ష్మణకవి

గజపవరపు వెంకటకవి 726 4 | శ్రీశ 170 అంధ్రరత్నాకరం పైడిపాటి అమరయ్య గారి లక్ష్మణకవి క్‌. శ్రీశ 1750 ఆంధ్రనామశేషం అడీదం సూరకవి ఈ క్రీశ 150 సాంబ నిఘంటువు కస్తూరి రంగకవి 7 | క్రీశ 1784 అంధ్రఖాషార్దవం నుదురుపాటి వేంకటకవి 8. | శ్రీశ 18900 తర్వాత | ఆంధ్ర పదాకరం పూసపాటి వీరపరాజు [| పైగడపువారి కందలు 10. చౌడప్ప సీసాలు 11. నానార్థ నిఘంటువు (0 1379 కర్తపేరు తెలియదు) 12. నానార్థసార సంగ్రహం లక్ష్మణకవి (0 1382) (అసమగ్రం) తెలుగులోని మొట్టమొదటి పద్యనిఘంటువు వ్రాయడమేకాక అకారాదిగా తూడా

  • ఒక దేశీయ నిఘంటువును కూడా గణపవరపు వెంకటకవి రచించినట్టు తెలుస్తూంది. మన భాషలోని పద్యనిఘంటువుల పట్టికలో చౌడప్పసీసాలు అనేవి ముప్ఫయి ఉన్నాయి.కి వీటిని సుప్రసిద్ధుడైన కవి చౌడప్పే రచించి ఉంటే ఈ ముప్పయి సీసాలే తెలుగులోని మొదటి నిఘంటు రచనా ప్రయత్నమని చెప్పాలి. ఈ సీసాలకు పీఠికగా ముందు కందపద్యం ఒకటి వుంది. కప్పుమెయిరేని పేరిట ముప్పది సీసంబు లాంధ్రమున జెప్పెను చౌ డప్పయ నీకబ్బంబున _ శప్పెంచక డార్యులార తగనుతిచేతున్‌ (1 863) ఈ ముప్ఫయి సీసాలలో చాలావాటికి 'నూరిజనకల్చ వరదం దంశూక తల్ప:” డంబు కరివేల్చ - పిట్టసిడంబుదాల్చ' అనే మకుటం ఉంటే ఐదవ పద్యంలో '“డంబు కరివేల్ప హెన్పచ్చరంబు దాల్బ' అనే మకుటం కనబడుతుంది. 'బంగరుబరీ బెడంగు మణుంగు దాల్చ' అనే మకుటం 10వ పద్యంలో కనపడుతుంది. ఈ మకుటంవల్ల కవి , బహుశా వైదర్సు అప్పయ్యగారి కాలంలోవాడో, అతనికి అర్వాచీనుడో అని చెప్పాలి. క్రీ.శ 1710 ప్రాంతాలలో కాకర్గపూడి పాయకరావుగారి పాలనలో విశాఖ జిల్లా ఉపమాక గామంలో వైదర్సు అప్పయ్య ఉండేవాడు. ఆయన “భళిర కరివేల్చ పసిడిదువ్వలు పదాల్చ' అనే మకుటంతో గునుగుసీసాల శతకం వ్రాశాడు. ఈ చౌడప్ప సీసాలలోని మకుటానికి, వైదర్సు అప్పయ్య మకుటానికి పోలికలు ఉన్నాయి. అందుచేత గణపవరపు వెంకటకవే మన భాషలోని తొలి నిఘంటువు రచయిత అని ప్రస్తుతానికి చెప్పుకోవచ్చు. అమరంలాంటి నిఘంటువును వెంకటకవి వ్రాశాక ఆంధ్రకౌముది అనే వ్యాకరణం రచించాడు. మన భాషలోని తొలివ్యాకరణం వాసినవాడు మూలఘటిక కేతన.
  1. సూర్యరాయాంధ్ర నిఘంటువు పీఠికలో జయంతి రామయ్యగారు చెప్పారు.
  2. మద్రాసు ప్రాచ్యలిఖిత గంథాలయంవారి బులెటిన్‌ ౩వ సంపుటి 2వ సంచికలో వీటిని నిడుదవోలు సుందరేశ్చరరావుగారు పరిష్కరించి ప్రకటించారు.

726 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటి ఈ ఆంధ్రకౌముది, ఇప్పుడు కవులకు రానున్న కవులకెల్ల నుపకారముగ' వ్రాశాడు. ఇది వెయ్యి చరణాల సీసమాలిక. ఇందులో 'తొల్లి ఘనులు చెప్పిన ప్రయోగాలు' తూడా ఇచ్చాడు. అప్పకవిలాగ విపులంగా ఇవ్వలేదుగాని వెంకటకవి ఉదహరించిన గ్రంథాలు

  1. తిక్కనగారి భారతభాగం
  2. పెద్దనగారి మనుచరిత్ర
  3. తవుల షష్టం
  4. భట్టుమూర్తి హరిశ్చంద్రనలోపాఖ్యానం 5%, పినవీరయ్యగారి శాకుంతలం
  5. భాస్కరరామాయణ యుద్ధకాండ
  6. సూరపరాజుగారి రాఘవపాండవీయం
  7. చంద్రమౌళి వ్రాసిన హరిశ్చంద్ర కథ ఇలా కొద్దిపాటి పూర్చకవి ప్రయోగాలను ఇస్తూ వ్యాకరణం రచించిన గణపవరపు వెంకటకవి తను చెప్పిన లక్షణాలనే ఈ గ్రంథంలో పాటించలేదు. ' గ్రామాలు, అబాలు, పురాణాలు, దోషాలు, శాస్త్రాలు, వేదాలు" అనే మాటలు గ్రామ్యాలని చెప్పాడు. వాటిని “తెగడునెడ నగవుతరి' మాత్రమే వాడాలన్నాడు. అయితే ఈ లక్షణగ్రంథంలోనే “ఇంక వట్రువసుడీ పౌంకమూ శబ్దాలపేరులు చెప్తాను అనే చోట గ్రామ్య ప్రయోగం చేశాడు. శిష్టులు నిత్యం వాడే మాటలు కొన్ని గ్రామ్యాలని వెలివేయడంవల్ల వచ్చే బాధలు ఇన్నీ అన్నీ కావు. అర్థంలేని మడికట్టుకొన్న లాక్షణికులే ఇలాగ మైలపడతారు. ఆంధ్రకౌముదిలోనే కాక ఇతర గ్రంథాలలో కూడా వెంకటకవి చిత్తమొచ్చిన ప్రయోగాలు విచ్చలవిడిగా చేశాడు. అన్య దేశ్యాలను సంకోచించకుండా వాడుకొన్నాడు. అతని దృష్టిలో అన్య దేశ్యాలంటూ వేరే భాషావిభాగం లేదు. వాడుకలో ఉండే ఇతర భాషా పదాలు దేశ్యాలకిందే లెక్క. గుంటూరు సీమనుంచి పాండ్య మండలందాకా సంచరించి అన్నిప్రాంతాల పలుకుబళ్ళూ వాడుకొన్నాడు. గణపవరపు వెంకటకవి సత్కారాలు పొందిన రాజసభలు చాలా ఉన్నాయి. తాను ఆంధ్రకవితాసామ్రాజ్య ధురంధరుణ్జని చెప్పుకొన్నాడు. కర్ణాట, తుండీర, చోళ, పాండ్క మండలాల ప్రభువులు తనను సత్కరించి మత్తసింధురసైంధవాలు, ఆందోళికలు, ఇళ్ళూ వాకిళ్ళూ ఇచ్చారట. ఇతణ్జీ సన్మానించిన కర్ణాటప్రభువు శ్రీ.శ 1630 నుండి 1642 దాకా పాలించిన మూడవ వెంకటపతిరాయలు కావచ్చును. కర్తాటంనుండి వెంకటపతి తుండీరమండలానికీ వెళ్ళాడు. అంటే చెంజి రాజ్యమన్నమాటు. క్రీ.శ. 1649 దాకా చెంకీ తోటను వరదప్పనాయకుడు పాలించేవాడు. ఆయనపై వెంకటకవి ఏమైనా పద్యాలు చెప్పాడు కాబోలు. కనీసం ఒక గ్రంథమైనా చెప్పి ఉంటాడు. చెంజినుండి తంజావూరు వెళ్లి విజయరాఘచుని సభలో మన్ననలు పొంది చివరకు వెంకటకవి మధురలో స్థిరపడ్డాడు. క్రీశ 1659 నుండి 1882 దాకా మధుర రాజ్యాన్ని చొక్కనాథనాయకుడు పాలించేవాడు. అతనికి ముద్దు అళగిరి అనే సవతి తమ్ముడు ఉండేవాడు. అతడు కలియగ

గణపవరపు వెంకటకవి 727 గోపాలుడు అని పీరు మోశాడు. మంచి విలాసపురుషుడు. సాహిత్యలోలుడు. అతడు వెంకటకవిని పోషించాడు. ముద్దళగిరిని మెప్పించడానికి వెంకటకవి విద్యావతీ దండకం అనే ఒక రచన చేశాడు. ఇది బమ్మెరపోతరాజుగారి భోగినీదండకంలాంటిది. సర్వజ్ఞసింగభూపాలుడు దారంట పోతున్నప్పుడు భోగిని అనే వేశ్య అతజ్నీ చూసి మోహించింది. అతణ్ని కూర్చమని తల్లిని కోరుకొంది. తల్లి మొదట అది సాధ్యంకాదంది. చివరకు సాధించింది. ఇది పోతరాజుగారి భోగినీదండకంలోని ఇతివృత్తం. సరిగ్గా ఇలాగే విద్యావతీ దండకం తూడా ఉంటుంది. ఒకనాడు 'చౌపంచపూదూపు సాహేబురాచిల్కపై నెక్కుమేటెక్కుజక్కినో ముద్దళగిరి గుర్రంపై ఎక్కి ఊళ్లో షికారు వెళ్లారు. 'ముద్దళ్లరిక్షోణీ పాలుండు సొౌజన్యశీలుండు వాహ్యాళిగా వచ్చు నవ్వేళతత్పౌరవారాంగనాకోటి వీక్షింపనా స్త్రీలలో రూపరేఖావయశ్షీలచే మించుగన్మించు బల్మించు విద్యావతీభామ చౌపంచవన్నాన్‌ దువాళింపుచున్‌” అతణ్ణి చూసింది. మరులుకొంది. తల్లిని చూసి తన కోర్కె చెప్పింది. ఈ పొద్దు ముద్దళ్లరిస్వామితో నిన్నునే గూర్చగా జాలనే' అని వేశ్యమాత చెప్పింది సాధారణవిటులను ఎలా ఆకర్షించాలో, ఎలా దోచుకోవాలో వివరించింది. పెద్దదుండలకు ఎసరుపెట్టక ఉన్నదానితో తృష్తిపడమంది. విద్యావతి వినలేదు. “నాతోడ యమ్మ ప్రసంగించవస్తే పొసంగీనటే సౌంపెనంగీనటే?” అని చెప్పింది. ఖీష్కించుకొని తూర్చుంది. వేశ్వమాత చివరకు ముద్దళగిరిని చూసి పడిపడి దండాలు పెట్టింది. నమస్కారానికి పర్యాయపదాలయిన జోహారు, చేమోడ్పు, టెంకణాలు, చేమొక్కు, సలాము మొదలైన మాటలను కవి విరివిగా వాడాడు. వేశ్వమాత చేసిన వర్ణన, చెప్పిన తీరు విన్నాక కవీంద్రాళిపారిజాతుడైన ముద్దళగిరి పల్లకీ పంపించి విద్యావతిని పిలిపించి “అత్మీయమౌనాట్యస్థలీ పాత్రలందెల్లసన్మానపాత్రంబుగా. చేశాడు “మన్మథాభోగ సామ్రాజ్యభోగమ్ములం' తేలించాడు.

ఈ దండకాన్ని గణపవరపు వెంకటకవి పుష్పకోదండకం అన్నాడు. ఇది చాలాకాలం మరుగుపడి మొన్నమొన్ననే వెలుగు చూసింది* దీనిని ప్రకటించడంవల్ల గణపవరపు వెంకటకవికాలం ఇదమిత్థంగా నిర్ణయించడానికి వీలయింది. ముద్దళగిరి క్రీశ 1673లో తంజావూరును పాలించాడు. ఈ విద్యావతీదండకం అంతకు ముందు బ్రాసినదే అవుతుంది. ఈ దండకాన్ని వ్రాసినందుకు ముద్దళగిరి వెంకటకవి ఒకనాడు నిత్యకృత్యాలు తీర్చుకొని బహువిధభోజనామూల్య జాంబూనదాంబరసార గంధసార రుచిర విచికిల ఘనసారతాంబూల ప్రియకామినీసంగీతగోష్టి సుమశయ్యాష్ట భోగాభోగ సంగతుడై '“హంసతూలికాతల్పంమీద వేతువ. తేకువ సుఖసుప్తిలో' ఉన్నప్పుడు తిరుపతిలోని బాలవెంకటేశ్చరుడు కలలో ప్రత్యక్షమయ్యాడు. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసాన్ని అంకితం ఇమ్మని కోరాడు.

ఇదొక అపూర్వ గ్రంథం. అప్పటిదాకా ఎన్నో లక్షణగ్రంథాలను మనవాళ్ళు వ్రాశారు. అందులో పద్ధెనిమిది వెంకటకవి చదువుకున్నాడు. వాటిలో చెప్పిన ఇ నద ద్రానవ్రషలనళదారాలయానాద బ్రసందాడు డా 66060202

ఓరి, కరుణ ౪01 10! 94 కొ-142

728 పమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి లక్షణాలన్నింటికీ ఇది లక్ష్యగ్రంథంగా ఉండాలని ఆశించాడు. ఆయన దగ్గిర ఇరవైనాలుగు నిఘంటువులున్నాయి.. అందులోని పదాలకు అస్పదంగా తన కావ్యం ఉఊండాలనుకొన్నాడు. అరవైరకాల యతిభేదాలు తనకు తెలుసు. అన్నింటినీ చూపించా లనుకొన్నాడు. రకరకాల చిత్రకవితలు అతనికి వచ్చు. అయిదిరవయిలు అంతకుముందే ఒక కావ్యంలో జొప్పించాడు. దాని పేరు 'కల్పిత కల్పలత. దాని సంగతి ఇలా చెప్పుకొన్నాడు:

జగతిన్‌ వృత్తచతుష్టయ - మగణీత మతిచిత్రకవిత లైదిరువదులొ

ప్పుగ మెప్పుగనం దగురూ - ఢ్లిగ గల్పితగల్ప్బలత ఘటించిన ఫ్రోడన్‌. పూర్వం కల్పిత, కల్ప్చలతలో చూపించిన చిత్ర కవితలన్నీ ఈ కావ్యంలో కూడా చేయదలిచాడు. ఇందులో బ్రొడికి ఫ్రొఢి, దేటుకు తేట ఉండాలనుకొన్నాడు. ఇది సనాతన విద్వత్కవుల రచనావిధానాలకు ఘంటాపథం అన్నాడు. “ఇదానీంతన సత్కవిని కాయమ్మునకు, సహాయమ్మును భవితవ్యకవికలాపంబున కాచార్యరూపంబును, నిఖిల భాషా మోోషంబుల కున్మేషణంబును, మూడజాతులకు బోధహితువును, బ్రౌడతతికి సమ్మతియును, సర్వజననికరమ్ము కాశ్చర్యాకరమ్మును, బహువిధంబులీ కవితా చమత్కృతికివసతి”' అయేటట్లు ఈ కావ్యం నిర్మించదలిచాడు. గ్రంథంలో ఇన్ని ఉన్నా కథ

తిరుపతి వెంకటేశ్వరుడు ఒకనాడు వేటకు వెళ్ళాడు. ఆయన కేలిడేగ వెళ్లి ఆకాశరాజుగారి అంతఃపురంలో వాలింది. రాజకుమూర్తె నాంచారుదేవి అక్కడ ఉందీ. డేగకోసం వెళ్ళిన స్వామివారు ఆమెను చూశారు. ఆమె సంగతి తెలుసుకోమని మంత్రిని పంపారు. అతడు తెలుసుకొని వచ్చి ఆమెను నఖశిఖ పర్యంతరం వర్ణించాడు. ఈమెను వివాహం చేసుకోవాలని స్వామివారు సంబరపడ్డారు. మంత్రిని పెళ్లిమాటలకు పంపారు. ఆకాశరాజు. వెంటనే పెళ్ళిచేశాడు. తూతుర్ష్ని కాపురానికి పంపించాడు. దారిలో నాగదత్తుడనే దొంగ అడ్డగించాడు. యుద్ధం జరిగింది. దొంగల ముఠా స్వామిపుష్కరిజిలో పడి సారూష్యుం పొందారు. అష్టదిక్పాలకులు స్వామివారిని స్తుతించారు.

ఈ చిన్న కథను గణపవరపు వెంకటకవి 82 పద్యాలలో చెప్పాడు. వాటీని ఆశ్వాసాలుగా విభజించలేదు. నాగదత్తోపాఖ్యానాన్ని చాలా విపులంగా 150 పైచిలుకు పద్యాలలో చెప్పాడు. అయితే ఈ కథ తెనాలి రామకృష్ణుని నిగమశర్మోపాఖ్యానానికీ, కందుకూరి రుద్రకవి నిరంకుళోపాఖ్యానానికి పచ్చి అనుసరణ. నాగదత్తుడు చక్కని సత్కర్ముల యింట పుట్టాడు. పెరిగి పెద్దవాడు కాగానే తల్లిదండ్రులు పెళ్లిచేశారు; గాని అతడు కాపురం చేయలేదు. విటవిద్యకు బిరుదు వేశాడు. జూదంలో ఆరితేరాడు. ఒక వెలయాలిని వలచాడు. ఆ సానిపాపకు కూడా అతడంటే మక్కువ. నాగదత్తుణ్ణీ తప్ప మరో విటుణ్జీి చూడడం మానేసింది. ఇది వేశ్చమాతకు దుర్భరమైంది. తూతురికీ హితోపదేశం చేసింది. నాగదత్తుడు ఉన్న డబ్బంతా వెచ్చించి ఇంటికి వెళ్ళాడు. బంధువులందరూ చీదరించుకున్నారు. తల్లి మాత్రం మొగసాలనున్న కొడుకును వగదాలకు లోపలకు తీసుకు వచ్చింది.

గణపవరపు వెంకటకవి 7209

ఇంటియిల్లాలిచే తలయంట జేసి మజ్జనము భోజనంబునమర్చి పిదప

వీడియ మొసంగి సాత్వికజాడనున్నకొడుకు తల దువ్వుచును తల్లి నుడివెనిట్లు అని అచ్చంగా నిగమశర్మ అక్కగారికో చెల్లెలిని సృష్టించాడు గణపవరపు వెంకటకవి

అన్నా నిక్‌ గని యొత్తి పెంచి యాపనీకాన్వీతు గావించియీ

కన్నెన్‌ బెండ్లి యొనర్చి మీరిరువురున్‌ గారాము చేనొప్పుగా

కన్నుల్‌ జల్లగ జూతునంచు మది గాంక్షల్‌ మీర నే నుండగా

జీన్నంబుచ్చితి విన్ని నాళ్లునను దుశ్శీలుండవై పుత్రకా. (ప్రబంధ. 702) ఆ తల్లి ఎంత మొత్తుకున్నా వాడు ఉలకలేదు; పలకలేదు. ఆమె ఇలా ఏడ్చింది

ఏమీ పల్కవు నేను బిల్వ దయలేదే నీకు నా యయ్య, ని

న్నేమంటిన్‌ సుకుమార, నాయెడను తప్పేదీ కుమారా గ్రణీ,

నామీదన్‌ జల మేలరా తనయ, నన్‌ మన్నించరా వెన్నిధీ,

నీముద్దుల్‌ గన నోచినా గదర తండ్రీ, నీతిపారంగతా. (ప్రబంధ. 705)

నాగదత్తుడు ఒకనాడు నీతిపారంగతుడే. తల్లి ఇలాగ శోకించాక కరిగినట్టు కనబడ్డాడు. మారినట్టు నటించాడు. “వానిపై మమత యెంతో గాని పైనున్న సొమ్ము ఆ తల్లి కోడలి కిచ్చింది. దాన్ని కాస్తా నాగదత్తుడు తస్కరించి సానిపాపకు పెట్టాడు. ఆ సొమ్ము చెల్లిపోయాక వేరే దారిలేక దొంగగా మారాడు. గణపవరపు వెంకటకవి ఈ కథలో పూర్వులను అనుసరించిన సంగతి స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఈ కావ్యంలోని 28 పద్యాలు స్పష్టంగా రామరాజభూషణుని నరసభూపాలీయంలోని పద్యాలకు అనుకరణలని పూండ్ల రామకృష్ణయ్యగారు నిరూపించారు.5 పూర్వులనే కాక తననే తాను అనుకరించుకొన్నాడు. విద్యావతీ దండకంలో వేశ్యమాత చేసే ఉపదేశంలోని భావాలను మళ్ళీ ఇక్కడ వాడాడు. వెలయాలి వలపు చెప్పుడు విద్య బిరుదులాంటిదట. మాస్టీని వీరం, ముష్టిపండు అందం, పలనాటి గొల్లలపాట, జాతిదొమ్మరి పెద్దతనం, శ్రోత్రియుని తెలుగు కవిత ఎలాంటివో సానిదాని వలపూ అలాగే ఉంటుందట. (ప్రబంధ. 762). విద్యావతీదండకంలో ఇలా వ్రాశాడు: “పఠాజీలవావుల్‌ ఖనోజీలవియ్యాల్‌:. దుబాసీల బాసల్‌. పవాడంపు మాస్టీల సుద్దుల్‌ వినన్‌రాని పద్దుల్‌ మొసల్మీను మాటల్‌, కనున్‌ మెచ్చుటాటల్‌. కువాడంపు రీతుల్‌ విలాసంపు బూతల్‌ నెరాగొల్ల సంగీతముల్‌ మూర్ధసాహిత్యముల్‌ మూగసన్నల్‌ వీటిలాగ సానివలపు ప్రసన్నత్వమింపొంద” ఉండాలట. విద్యావతీదండకంలో నమస్కార శబ్దానికీ పర్యాయపదాలు చాలా వాడాడు. ప్రబంధరాజంలో నమస్కారశబ్దకందద్వయగర్చితవచనం'' ఒకటి వ్రాళాడు (నెం. ౪0). ఇందులో నమస్కార శబ్దానికి 108 పర్యాయపదాలేకాక 108 దివ్యతిరుపతుల పేర్లూ వ్రాశాడు. గ్రంథంలోని కొన్ని పద్యాలకు ఇతడు పెట్టిన పేర్లు వాళ్యాలలాగా ఉంటాయి. కొన్ని పేర్లు పెద్ద పేఠరాగ్రాపులే. నాలుగైదు చూద్దాం. 5. ప్రబంధరాజ వెంకటేశ్వర విజయవిలాసం. అముద్రితగ్రంథ చింతామణి ప్రచురణ, పీఠిక పుటు 14.

730 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

  1. _ ఏక ద్విత్రి చతుఃపంచషట్సప్ప్తాష్టాక్షర క్రమపాద నియమ సీసము. (ఇందులో మొదటి పాదంనిండా ఒకటే అక్షరగుణింతం, రెండోపాదంలో రెండు, మూడోపాదంలో మూడు- ఇలాగే ఉంటాయి.) (సంఖ్య 879)
  2. పుష్పమాలికా బంధముక్త్స కంద మదనవిలసిత శ్లోక గర్చితస్రగ్ధరావృత్తం. ౩. _ పుష్పమాలికాబంధ గోమూత్రికాబంధ గుచ్చబంధ హలబంధ ఛత్రబంధ పంచక నిరోష్ట్యకందం. (సంఖ్య ౪1)
  3. _ దశావతారగర్చిత గుణితవర్జాచలజిహ్వకోష్ట్రవర్ద భుజంగ ప్రయాత వృత్తగర్భిత నిరోష్థ్యాచలజిహ్వస్రగ్విజీ వృత్త గర్చితామ్య్యాచల జిహ్వనిరోష్యాచల జిహ్వసంకీర్ణ వర్ణ సమగణదండకం. (సంఖ్య ౪2)
  4. బహువిధ, చిత్రకంకణబంధ, ద్విగుణితసీసచరణ చతుష్టయ గర్భ్చిత, కందద్వయ, సమవృత్త, చౌపదయుగళాటవెలది, తేటగీతి, మదన విలసిత, తురంగ వృత్త బహువిధ తాళవృత్తాష్టక, ధవళ. శోభానగానారాత్రికు గానజంపె, ట్రిపుటార్థ చంద్రిక, సువ్వాల, లాలిపదేలా, మంజరి, సమతాడిండిమతాళవృత్త, మణీగణ నికర, తురగవల్గనరగడోదాహరణ సంబుద్ధికళికోత్కళికా, ర్థాహిరీరాగ దళ కాంభోదిరాగ సమపద, కన్నడరాగ సాంగత్య, కొరవంజిదళ రేవగుప్తిరాగసమపద సావేరిరాగైకదాళతళ విలహరి రాగాటతాళ సమపద, పుష్పమాలికాబంధ, గోమూత్రికాబంధ, శార్‌బ్లబంధ, షోడశదళపద్మబంధ, పాదుకాబంధ, నవరంగ బంధ, ఖడ్గబంధ, గుచ్చబంధ, ఛత్రబంధ, చామరబంధ, గదాబంధ, చక్రబంధ, శకటబంధ, నాగబంధు రథబంధ, వీణాబంధ, శంఖబంధ, మృదంగబంధు పాదభ్రమకబంధ, పాదార్థభ్రమకవింశతిబంధ, భేదకందానుష్టున్‌ శ్లోకాంతర్గత చతుర్చద్ర, నవరంగ, సర్వతోభద్రాందోళికాబంధయుక్తా నులోమవిలోమకందు ఖాషాశ్లేషకంద, కందాటవెలది గర్భితాంత్యడేటగీతియుక్త చౌషష్టి భేదచిత్రసీసము. (సంఖ్య 90%)
  • ఈ అఖరుదే సుప్రసిద్ధమైన గారడీపద్యం. ఇందుతో నలఖైగర్చితాలు, ఇరవై బంధాలూ ఉన్నాయి. గ్రంథవిస్తరఖీతి ఉన్నా ఈ పద్యాన్ని, అందులో గర్చితమైన వివిధ పద్యాలను పూండ్లవారి ప్రచురణనుండి ఉదాహరిస్తున్నాను. సారా గ్రసారససమనేత్రయుగళ నారదరుచికాంతి నరఘన వనిత సారాగధీరవిశదవీనతురగ ఖైరవభవబైత్ర భరశుభకరణ సారాతిహారవిసరచారణ హరిసారసహితచంద్రశరజ జయసుత వారాశి నారదవర పూజిత పదగౌరవ కటిఖడ్గ గరళగళసఖ హరినగనిలయ గిరిధర యనురళన మణిమయమకుట సురమణి మధువిశరణ శరివరద కువరరుచిరతర పసన న రహరిలసితదరనిగమవిహరణ హరి.

గణపవరపు వెంకటకవి 731

పై పద్యమునందలి గర్చితములు :

1 ద్విపద: ''సారా గ్ర్యసారసమనేత్రయుగళ - నారదరుచికాంతి నరఘన వనిత సారాగధీరవిశదవీనతురగ - ఖైరవభవవైత్ర భరశుభకరణ సారాతివిహార విసరచారణహరిసార సహిత చంద్ర శరజజయసుత వారాశినారద వరపూజితపద వరపూజితపద గౌరవకటిఖడ్ల గరళగళనభఖ,

2 _ ట్రథమకందము; సారససమనేత్రయుగళ - నారదరుచికాంతి నరఘనవనిత సారా ధీరవిశదవీనతురగ ఖైరవభవజై త్రభరశుభకరణ సారా

౩ _ ద్వితీయకందము: హారవిసరచారణహరి - సారసహితచంద్ర శరజ జయసుతవా నారదవరపూజితపద - గౌరవకటిఖడ్ల గరళగళసఖ సారా

4 _ సమవృత్తము: సారాసారససమ నేత్రయుగళ - సారాధీరవిశదవీనతురగ సారాహారవిసరచారణహరి - వారానాదవరపూజితపద

5౬ ప్రథమమహానవమి చౌపదిః సారా గ్ర్రృసారసమనేత్రయుగళ - నారదరుచికాంతి నరఘనవనిత్ర సారాగధీరవిశదవీనతురగ - ఖైరవభవజై త్ర భవశుభకరణ సారాతిహారవిసరచారణహరి - సారసహిత చంద్ర శరజజయనుత వారాశినారదవరపూజితపద - గౌరవకటిఖడ్ల గరళగళసఖ

  1. _అటవెలది; నారదరుచికాంతి నరఘనవనిత సా - ఖైరవభవబవైత్ర భరశుభకర సారసహితచంద్ర శరజజయనుతవా - గౌరవకటిఖడ్గ గరళగళస

౬ _తేటగితి: సారససమ నేత్రయుగళ నారదరుచి - ధీరవిశదవీనతురగఖైరవభవ హారవిసరచారణ మారిసారసహిత - నాదవరపూజిత పదగౌరవకటి

  1. మదనవిలసితవృత్తము ; నరఘనసనితా భరశుభకరణా-శనజజయనుతా గరళగళసఖా,

  2. తురంగవృత్తము ; తాతానన సారససమనేత్రయుగళ నారదరుచికాంతి నరఘనవనిత ఢీరవిశదవీన తురగ ఖైరవభవబైత్రభర శుభకరణ హారవిసరచారణహరిసారసహిత చంద్రశరజజయనుత నారదవరపూజితపదగౌరవ కటిఖడ్ల గరళగళసఖ.

  3. ఐహువిధతాళవృత్తము : తానాతందనాతానా నారదరుచిధీరవిశదచారణహరిసార సహిత | నారదవరగౌరవకటి ।

  4. అష్టకము: సారస సమ నేత్రయుగళ నారదరుచిరఘనవనితా

, ధీరవిశదవీనతురగ ఖైరవభవభరశుభా హారవిసరచారణహరి సారసహితజయసుతా నారదకరపూజీతపద గౌరవకటిఖడ్గసా.

౫. ధవళము, సారస మనేత్రయుగళ నారదనరఘనవనిత ధీరవిశద వీనతురగ ఖైరభవశుభకరణ

  • శోభాన; సారససమనేత్రయుగళ ధథీరవిశదవీనతుఠగ హారనిసరచారణహరి | నారదవరపూజిత పదు

శ. హారతి; (అనగా గానారాత్రికము) సారా గ్రసారసము నేత్రయుగళఘన - ఖైరవభవబై త్రభరకు భకర సారాతిహార విసరచారణహరిజయ - గౌరవకటిఖడ్గ గరళగళసఖ

732 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ౪౫. జంపి: సారా గ్ర్రృసారసమనేత్ర సరనుత - గౌరవకటిఖడ్ల గరళగళసఖ, 7. త్రిపుట రేకులు; హారవిసరదారణహ రిసారసహిత చంద్రజయసుత నారదవకపూ జితాపదగౌరవకటి నారదరుచికాంతి నరఘనసారస సమనేత్రయుగళ థీరవిశదవీనతురగఖైరవభవ జి. అర్థవంద్రికలుః కరివరదకువర హరి నగనిలయ శ. మవ్వాలః సారససమనేత్రయుగళ నారదరుచి నరఘన ధీరవిశద వీనతురగ భైరవభవ. ౫. లాలి: సారసమనేత్ర నారదరుచి ఖైరవభవజైత్ర భరవుభకరణ 21. వీల; ధీరవిశద వీనతురగ సారససమనేత్రయుగళ హారవిసర చారణహరి సారసహిత నారదవరపూజితపద 22. మంజరి : నారదరుచికాంతి నరఘనవనిత, వీనతురగహార విసర శుభకర సారససమనేత్ర చంద్రజయసుత,శరజవారాశివిశద పూజితపద మధువిశరణ మణిమయమకుటహరి, కరివరదహరినగనిలయనిగమ. 2. సమళఠాడిండిమ తాళవృత్తము ; తక్కతోంగధిక్కతోంగధిమిత తోంగధిమిత తా తనన తనన తనన తనన తనన తనన తనననా సారస సమనేత్రయుగళ నారదరుచినరఘనా ధీరవిశద వీనతురగ, ఖైరవభవ భరశుభా హారవిసరచారణహరి, సారసహితజయనుతా నారదవరపూజితపద, గౌరవకటిఖడ్గగా హరిన, గనిల, యగిరి, ధరయ, సురద, ళనమ, జీమయమా. 2. మజణిగణనిశరము: నరఘననుతభవభర శుభకరణా హరిజయనుత వరగరళగళసఖా సురమణిమధు విహ హరినగనిలయా కరివరదకువర నరహరినిగమా. 2౫. తురగవల్లసరగడ ; హారవిసరదారణహరి సారసహిత చంద్రశరజ నారదవరపూజితపదగౌరవకటి గరళగళస ధీరవిశద వీనతురగభైరవభవ భరశుభకర సారససమ నేత్రయుగళ నారదరుచి నరఘననుత. ౫. ఉదాహరణ సంబుద్ద్ధి కళికార్థము: గౌ రవకటిగరళగలస హారవిసరబారణహరి సారసహిత చంద్రశరజ నారదవరపూజితపద ఖైరవభవభరశుభకర సారససమ నేత్రయుగళ నారదరుచినరఘననుత ధీరవిశదవీనతురగ. ₹. ఉత్కలికార్థము : హరినగనిలయ గిరిధరయ సురదళన మణిమయమకుట సురమణీకరివరదకువర నరహరి లసితదరనిగమ ౫. అహిరీరాగదరువు ; సారా గ్యసారస సమనేత్రయుగళ సారాగధీర విశదవీనతురగ 2. ముఖారిరాగదరువు. అటతాళము : సారాగ్ర్యసారస సమనేత్రయుగళ ఖైరవభవజై త్రభరశుభకరణా!

గణపవరపు వెంకటకవి 733

ఖు. ఎబుకల కాంభోదిరాగదరువు, రూపకతాళముః సారాశిహరవి సరదారణహరి నారాశినారదవరపూజితపద.

  1. కాంభోదిరాగనమపద దరువు సారససమనేత్రయుగళ - నారదరుచికాంతి నరఘనవనిత సారాగధీరవిశదవీనతురగ - ఖైరవభవబై త్ర భరకుభకరణ.

౩. కన్నడరాగ పాంగత్యదరువు పదముః సారాగ్ర్రృసారససమ నేత్రయుగళ - నారదరుచికాంతి నరఘనవనిత సారాగధీర విశదవీనతురగ - ఖైరవభవజైత్రభరశుభకరణ,

౫. కొరవేపజిదళ, రేవగుప్తిరాగ సమపదదువు సారాతివిహారవిసర చారణహరి సారసహిత చంద్రవరజ జయనుత వారాశినారదవరపూజితపద గైరవకటిఖడ్ల గరళగళసఖ,

3ఓ పావేరిరా గైక తాళదరువు హరినగనిలయ గిరిధర యసురదళశనమణిమయమతుట సురమణీమధువిశరణ కరివరదకువరలసితవల

౫౨. బిలహరి రాగాటతాళ సమపదదరువుః సారాగధీరవిశదవీనతురగ నారదరుచికాంతి నరఘనవనిత

  1. వింశతిబంధకందము: సారవరహారవారా - సారహరీనరహరి హరశర కరసారా గౌరథరధీరచారా - సారహరీ సురహరి నరనరసారభరా అర్థము: సారవర = న్యాయముచేత శ్రేష్టమైనవాండా! హారవారా = హర సమూహము గలవాడా! సారహరీ = స్థిరాంశము గలిగిన స్వామీ! నరహరి = నరసింహావతారా! హరశర = ఈశ్వరునికి బాణమైనవాండా! కరసారా = భుజబలము గలవాడా! గౌరధరధీరచారా = మేరువువంటి ధైర్యప్రభావము గలవాడా? సారహరీ = అతిశయమైన నాగేంద్రుని గలవాడా! సురహరి = అమరకేంద్రుని గలవాడా! నరసర సారభరా! = అర్జునుని యొక్క సరసము చేత మిక్కిలి యతిశయమైనవాడా!

౩ అనుష్టుప్‌ శ్లోకము: సారసారరసారాసా! రాగ హారరహాగరా, సాహాయసాసాయహాసా। రరసామమసారరు అర్థము- సార = స్థిరమైన అసార = అవిభేదము గలిగిన, రస = శృంగారరసమే, అ = భూషణమైన, రాసా = రాసక్రీడగలవాడా! రాగహార, రాగ = అనురాగమే, హార = హారముగా గలవాడా! రహాగరా, ర = శ్రేష్టమైన, హ = హంసలు గలిగిన, అగ = పర్వతమునందు, ర = మనోహరమైన అ = విష్ణువైనవాడా! సాహాయ; సా = కాంతికిని, హా = ఈవికిని య = నిలయమైనవాడాః సాసాయహాసారరసామ, అసాయ = నాశరహితమైన హాస = నవ్వుయొక్క, అ= భఖావముచేత,,6 = నిపుణులైన రసా = భూమితోడను, మ = లక్ష్మితోడను, నజ సహితుడైనవాడా! (ఈ సవర్ణము సమాన ప్రథమాక్షరము) మసారరః మ = ఈశ్చరునివంటి సార = బలముయొక్క, ర = గౌరవము గలవాడా (నిఘంటన్వధారములు ఉన్నవి.)

౫. అందోళికా బంధయుక్తానులో మవిలోనుకందము: మారామాసాదయభర భారశరాసా జలజసువదన నిజరసా పారజ నినదవనుజలజ సారాశర భారభయద సామారామా.

734 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అర్థము - మారామాసాదయ; మారాము = లక్ష్మీదేవిని, అసాత్‌ = పొందిన అయ = శుభమును గలవాడా! భరభారశరాసా; భర = అతిశయమును, భార = భరించినటువంటి, శరాసా = విల్లుగలవాండా! జలజ సువదన = జలజమువలె శోభనమైన ముఖము గలవాండా! నిజరసా = సహజమైన రసము గలవాడా! సారజనినదవనుజలజి; సారజ = సారమువలన బుట్టిన; నినద = ధ్వనిచేత, వసు = శ్రేష్టమైన, జలజ = శంఖముగలవాడా! సారాశరభార భయద; సార = బలవంతులైన, అశర = రాక్షసులయొక్క,. భా = కాంతిని, ర= గ్రహించిన, భయ = భయమును, ద = ఇచ్చినవాడా! సామారామా! సామ = సామవేదమే, అఆరామా = ఉద్యానవనముగా గలవాడా?

ఇ. ఖాషాశ్తేషకందము: మేలా నాయక బలిరా - యేలా చలమానగానదేరాలి వల న్నీలాగీతేరగనా = వేలము దయ కావగదరః వేంకటరమణా పై పద్యమున కాదిభాషార్థము (సంస్కృతము) మేలానాయక; మా = లక్షీకిని, ఇలా = భూమికిని నాయక = నాయకుడైనవాడా! బలిరా-బలి = బలివద్దనుండి రా = బహించేవాడా! ఏలాచలమానగానదేరాలివలత్‌: ఏలా = ఏలకితీగలచేత, అచల = నిశ్చలమైన, మ = కాంతియే, ఆ = భూషణముగా గలిగిన, నగ = పర్వతముయొక్క, అ = అంగమందలి, నద = నదము యొక్క, ఇరా = జలము యొక్క; అలి = సమూహమందు, వలక్‌ = సంచరించువాడా, నీలాగీతీరగు; నీలా = నీలాదేవియొక్క; గీత = గానమును, ఇర = ప్రేరేచునటువంటి, గు = వాక్కులుగలవాడా! నావేల ముదయ; నా = జ్ఞానముచేత, అవేల = అధికమైన, ముత్‌ = సంతోషముగలవారలకు, అయ = శుభావహవిధియైనవాడా! కావగదర క = బ్రహ్మయొక్క, అవ = రక్షణమును, గ = పొందిన, దర = శంఖము గలవాడా, వేంకటరమణః = వేంకటరమణుడైనవాడా। అ = విష్ణువైనవాండా!

  1. ఎత్తుగీతి యందలి కందముః హరినగనిలయ గిరిధరయ - సురధశన మణిమయమకుట సురమణిమధువీ శరణ కరి వరదకువర రు-చిరతరవసన నరహరి లసితదరనిగమా.

  2. ఎత్తుగీతియందలి అటవెలదిః హరినగనిలయ గిరిదరయసురదళన మణిమయ మకుట సురమజణీ మధువిశ రణకరివరద కువరరుచిర తరవస- ననరహరిలసితదరనిగహ.

(పై పద్యమునందలి గర్చ్భితములును, బంధభేదములును జేరి చౌషష్టి భేదములని యెరుంగనది. మరియు ననుష్టుప్‌ శోకమునకు అనులోమ విలోమకందమునకు రెండు వర్ణములను భాషాశ్లేషకందమునకు నారువర్ణములును నీ సీసములోనివి కావని యెరుంగునది).

ఈ అసామాన్య పద్యంలోని ఇరవైబంధాల బొమ్మలు కూడా ప్రకటించాలనే ఊడి గాని పుటల సంఖ్య పెరుగుతుందని ప్రకటించలేనందుకు విచారిస్తున్నాను. ప్రబంధ రాజవెంకటేశ్చ్వర విజయవిలాసం ఎప్పుడో శ్రీ.శ 1892లో అచ్చుపడింది. దానిని పూండ్ల రామకృష్ణయ్యగారు. పరిష్కరించి సుదీర్హమైన పీఠికను బ్రాశారు. అరు ప్రతులను సంప్రదించారు. ౩5 పుటల పీఠికలో ఎన్నో సంగతులు చెప్పారు. తెలుగు సాహిత్యంలో చిత్రకవిత్స ప్రక్రియలను చేసిన గ్రంథాల వివరాలను విపులంగా ఇచ్చారు. ఈ ప్రబంధరాజం మళ్ళీ ప్రచురణ్మ పొందడం చాలా అవసరం. కవిత్వం తక్కువైనా కసరత్తుల

గణపవరపు వెంకటకవి 75 రికార్డు ఒకదగ్గిర ఉండడం ముఖ్యం. గణపవరపు వెంకటకవి తన ఇతర గ్రంథాలలో తూడా ఇటువంటి ఫీట్లుచేసి ఉంటాడు. అయితే దురదృష్టవశాత్తూ అతని గ్రంథాలన్నీ దొరకలేదు: అయినా కనీసం వాటి పేర్లు తెలుస్తూన్నందుకు సంతోషించాలి. ఆ జాబితాను చూడండి.

  1. తారావళులు 16. ఇరవైఆరు ఛందాల వచనం

  2. యమకశతకం 17. అలంకారసారం

  3. శృంగారమంజరి 18. పరమభాగవతచరిత్ర

  4. ఉదాహరణం 19. కల్పిత కల్పలత

  5. కృష్ణమల్లకథ 20. వసంతతిలకభాణం

  6. బాలరామాయణద్విపద 21. కఠినప్రాస శతకం

  7. చాటుపద్యాలు 22. ద్విరూపకోశం

  8. లింగనిర్ణయం 23. ఆంధ్రప్రక్రీయాకౌముది

  9. ఆంధ్రప్రతాపరుద్రీయం 24. యతిరాజువిరుదుగద్య

  10. రేఫఆకారనిర్ణయం 25. జాంబవతీ విలాసం

  11. అఖినవాంధ్రనిఘంటువు 26. విద్యావతీదండకం

  12. ఆంధ్రకొముది 27. చక్రవాళతారావళి

  13. గణయతిప్రాసలక్షణసీసమాలిక 28. అఖిలపురాణసారం

  14. అఆంధ్రప్రయోగరత్నాకరం 29. యతిప్రాసలసీసమాలిక

  15. షట్రత్యయప్రస్తారసరణీ 30. ప్రబంధరాజం

ఈ పట్టికలో అతడు ప్రబంధరాజంలో పేర్కొన్న గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. ఈ కావ్యాలు వ్రాశాక అతడు ఎన్నోో వ్రాసి ఉంటాడు. ముద్దళగిరి క్రీ.శ1673లో విజయరాఘవనాయకుని జయించాక తంజావూరును పాలించాడు. ఆ తరువాత మహారాషులతో యుద్ధం చేయవలసి వచ్చింది. శివాజీ తమ్ముడు ఏకోజీ తంజావూరుపై దండెత్తాడు. ముద్దళగిరి అతణ్ణి నాలుగు రోజులలో ఓడించాడు. ఈ విజయాన్ని నాలుగు ఉత్చలమాలికలుగా గణపవరపు వెంకటకవి వర్ణించాడు. దానిని తంజావూరు కోట నాలుగు ద్వారాలకు నాలుగు మాలికలుగా వ్రాశాడు. తూర్పు మాలికకు 74 పాదా లున్నాయి. ఇది తక్కిన మూడు మాలికలలాగా శ్రీకారంతోనే ప్రారంఖించలేదు. దక్షిణ మాలికలో 119, పడమటిమాలికలో 69, ఉత్తరపు మాలికలో 162 పాదాలున్నాయి. మొత్తం 424 పాదాలు. దీనిని మద్రాసు ప్రాచ్చలిఖిత గ్రంథాలయంవారు ప్రచురించారు కర్తపిరు తెలియదని ప్రచురణకర్తలన్నారు. అయికే దానిని గణపవరపు వెంకటకవి బ్రాశాడని నిడుదవోలు వెంకటరావుగారు చెప్తున్నారు.”

ఇటువంటి పొడుగాటి మాలికలు వ్రాయడం వెంకటకవికి మంచినీళ్ళప్రాయం. ఈ మాలికలలో “మకరబెబ్బులి, ఖత్తిసత్యములు' 'బజారులు, కిరీబురికీబు, బడాఫకీరులు, కిలేదారులు వంటి మాటలు వాడాడు. 'ఇక్కవి శబ్దములు ప్రయోగించుటయంద ఈ 306 60౫ ౦౧౯౬౧2౧డాో రుణం, కముణు, ౪07%. ౧కు 7. దక్షిణ దేశీయాంధ్రవాబ్బయచరిత్ర, పీఠిక పుట 27.

736 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సర్వతంత్రస్వతంత్రుడైనందున కొన్ని యప్రశస్తప్రయోగములు గ్రంథమునందగుపడు చున్నవి అని దోషాలను పూండ్ల రామకృష్ణయ్యగారు చూపించారు. అయితే ఇటువంటి దోషారోపణకు గణపవరపు వెంకటకవి జంకడు. 'చంద్రునిలో మచ్చ ఉంటేనేం? వెన్నెల

ఈ కవిచంద్రునిలో ఒకటికాదు, చాలా మచ్చలున్నాయి. ఇతడు ప్రవృద్ధమవగానే చెరగని కారుమబ్బులు మూయడం దురదృష్టమే.

లింగనమఖి తిరుకామయ్య

మన ప్రాచీనులు ధర్మానికీ, అర్గానికీ ఎంత ప్రాముఖ్యమిచ్చారో కామానికి కూడా అంత ప్రాధాన్యం ఉన్నదని గుర్తించారు. సుఖపడడం వాళ్ళ దృష్టిలో ఎన్నడూ నేరం కాదు. నెక్సుని పాపంకింద ఎప్పుడూ మనవాళ్లు జమకట్టలేదు. సరికదా, కాపురం చేసి సంతానాన్ని కనకపోడే పెద్దలు తరించరని చెప్పారు. గృహస్థాశ్రమాన్ని ఎప్పుడో ఒకప్పుడు స్వీకరించాలని శాసించారు. ఏకపత్నీవ్రతాన్ని శ్లాఘిస్తూనే బహుభార్యలను చేసుకొన్నా తప్పులేదన్నారు. దక్షిణనాయకుని ఘనతను ఉగ్గడించారు. సవతుల కయ్యాలను చూసి సంతోషించారు. పదహారువేలమందిని ఏకకాలంలో ఏలుతున్న శ్రీకృష్ణుడు మన సాహిత్యంలో పరమనాయకుడయ్యాడు.

శ్రీకృష్ణుడు దేశంలోని ప్రజలకు ఆరాధ్యదైవం అయితే మంచిదికాని ఆ గోపికాలోలునిలాగ దేశమేలే రాజు కనపడ్డ ప్రతి ఆడదానినీ కామిస్తే ప్రమాదం. నాయకరాజుల యుగంలో ఇటు తంజావూరులో విజయరాఘవ నాయకుడు, అటు మధురలో ముద్దళగిరి నాయకుడూ తాము సాక్షాత్తూ శ్రీకృష్ణులమనుకొని పచ్చి కాముకులై జీవించారు. వాళ్ళ కాముక చర్యలను కవులు తెగ పొగిడారు. వాళ్ళ వ్యఖిచారం ప్రచారం పొందింది. “పదారువేల సీమంతినులన్‌ నిరంతరము మన్ననసేయు మురారి క్రైవడీన్‌ స్కర్శకళావిలాసములు మెరయ లాలించేవాడు. అతణ్జీ జనులు కలియుగ గోపాలుడని పిలిచేవారు.

విజయరాఘవ నాయకుడు ఎప్పుడూ అందమైన ఆడవాళ్ళ మధ్యనే కాలం గడిపేవాడు. ఒకతె పదాలు పాడేది, ఇంకొకతె జక్కీణీ, మరొకతి పేరణి, ఇలా తలొకరు తలొకరకంగా అతణ్జి ఆనందింపటేసీవారని విజయరాఘవుని ఆస్థానకవి చెంగల్వ కాళయ్య బ్రాశాడు.! ముద్దళగిరి తీసిపోయాడా? అతడూ ఇంత వైభవంతో ఉండేవాడని మధుర నాయకరాజుల ఆస్థానకవి లింగనమఖి తిరుకామయ్య సత్యభామా సాంత్వనం అనే కావ్యంలో వర్ణించాడు 8. ప్రబంధరాజం పీఠిక

  1. రాజగోపాలవిలాసం, 1-23, 24.

లింగనమఖి తిరుకామయ్య 737 నునుపుగా నొక వేళ గనకాంగి యొక్కతె శుభలీల బదముల నఖినయింప పనుపుగా నొకవేళ ననబోడి యొక్కతె వీణానినాదంబు వినికిసియ తనువుగా నొకవేళ దరలేక్షణ యొకర్తు వంతు మార్గపు పాట వింత చూప నినుపుగా నొకవేళ నీలవేణి యొకర్తు హితవైన శృంగారకృతులు చదువ బనుపుగా నొక పంకజపత్రనేత్ర మదవతుల రాయబారంపు మాటలాడ

"జనులు కలియుగగోపాలుడనగ వెలనె

సరసగుణహారి ముదులోరి మురారి. (సత్య. 1-25)

ఈ కలియుగ గోపాలుని పేర అంకితంగా అ ద్వాపర గోపాలుని చరిత్రలో ఒక భాగం బ్రాసి తిరుకామయ్య దానికి 'సత్యభామాసాంత్వనం' అని పేరు పెట్టారు. సాంత్వనం అంటే ఊరడించడం అని అర్థం. అలిగిన పెళ్ళాన్ని తియ్యారించడం జీవితంలో ఇబ్బందే కాని కావ్యంలో కమ్మగా ఉంటుంది. మొగుడిమీద అలిగే భార్యలలో సత్యభామకే ' అగ్రతాంబూలం ఇవ్వాలి. తనను కాదని ఒక సవతికి పారిజాతం ఇచ్చినందుకు ఒకసారి మగనిని కాలితో తన్నిందని ముక్కుతిమ్మనగారు వ్రాశారు. పదహారువేలమంది సవతులను తెచ్చినందుకు అలిగి జడతో కొట్టిందని తిరుకామయ్య సత్యభామా సాంత్వనంలో చెప్పాడు.

ఈ కావ్యాన్ని బ్రాయడానికి ముందు చాలాకాలం నుంచీ తిరుకామయ్య మధురనాయకుల ఆస్థానంలో ఉండేవాడు. అయితే అతని జన్మస్థానం కాళహస్తి కావచ్చు. అతడు కాళహస్తీశ్చరుని భత్తుడు. జ్ఞానప్రసూనాంబ దయవల్ల సారస్వత సంపన్ను డయ్యాడు. కాళహస్తి ప్రాంతాలలో వెంగన్నగారి లింగన్న అనే ఒక సదాచార పరాయణుడు ఒకసారి యజ్ఞం చేశాడు. అతణ్ణీ అందరూ లింగనమఖి అనేవారు. ఆ పేరే ఇంటిపేరై అతని సంతతివారు లింగనమభఖివారయ్యారు. ఈ కుటుంబంలో ఎన్నోతరంవాడో తెలియదుగాని నాగన్నగారనే ఒకాయన ఉండేవాడు. అతడు కవిత్వం చెప్పేవాడు. అతని కొడుకే తిరుకామయ్య. తన తండ్రీ 'నాగనకవిరాజు' అని తిరుకామయ్య చెప్పాడు. అయితే ఆ కవిరాజు వ్రాసిన గ్రంథాలేమిటో మనకు తెలియవు.

చిన్నప్పటి నుంచీ తిరుకామయ్య సంగీతసాహిత్యాలలో ప్రజ్ఞ సంపాదించుకొన్నాడు. వీణ వాయించడంలో అతడు ధురీణుడు. మన సంగీత సంప్రదాయంలో వర్జాలూ గీతాలూ నేడు సుప్రసిద్ధాలయినా నాయకరాజుల కాలంలో అవి కొత్తవి. ఈ నవీనకల్చ్పనలలో తిరుకామయ్య ప్రవీణుడు. “వల్లకీవాదనధురీణ' వర్జగీణాదిగాంధర్వసర్వనవీనకల్పనా ప్రవీణఅనే బిరుదులను తిరుకామయ్య తన గద్యలో బ్రాసుకొన్నాడు. అతడు తన పాటలతోకాక మాటలతో తూడా ఇతరులను రంజీంపజేస్తాడు. 'ధీరజన " హృదయరంజకవిహార' అనే ఇంకో హ్లోషణాన్ని అతడు చెప్పుకొన్నాడు.

ఏ మాటలతోరంబింపజేశాడోగాని తిరుకామయ్యను తిరుములనాయకుడు 'దాలో గొప్పగా సత్కరించాడు. ముత్యాల గుత్తులున్న వెల్లగొడుగులు, వింజామరలు,

736 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తమ్మపడిగలు, బంగారు అందలాలు మొదలైన రాజోపచారాలతో తిరుమలనాయకుడు తనను సన్మానించాడని తిరుకామయ్య చెప్పుకొన్నాడు. తిరుమలనాయకుడు క్రీ.శ. 1623 నుండి 59 దాకా మధుర పాలించాడు. బహుశా 1650 ప్రాంతాలలోనో, లేక ఇంకా అలస్యంగానో తిరుకామయ్య మధురకు వచ్చి వుంటాడు. తిరుమలనాయకుని తరువాత అతని కొడుకు ముద్దవీరప్ప ఆర్నెల్లు రాజ్యం చేశాడు. ఆ పిమ్మట ముద్దవీరప్ప పెద్ద కొడుకు చొక్కనాధుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు క్రీ.శ. 1659 నుండీ 82 దాకా పాలించాడు. ఇతని సవతి తమ్ముడే ముద్దుఅళగిరి. ఈ అన్నదమ్ములిద్దరూ తిరుకామయ్యను పోషించ్వారు. మొదట బహుశా అళగిరి ఆశ్రయాన్నే తిరుకామయ్య పౌందాడనుకోవచ్చును. “రుక్మిణీ పరిణయం' అనే కావ్యాన్ని వ్రాసి అంకితం ఇచ్చాడు. ఆ తరువాత అభంగురమైన శృంగారరసతరంగాల వచనరచనానుబంధంగా ఒక ప్రబంధం వ్రాద్దామనుకొన్నాడు. అప్పుడు ముద్దళగిరి ఇలా ఆనతిచ్చాడు:

అనువుగా రుక్కిణీపరిణయంబును మున్‌ హవణించి యార్యులౌ

నన దనియించినావు మము నప్రతిమంబుగ నవ్యకావ్య మిం

పునరచియించుమీ సౌగసు పోడమి మీరగ సత్యభామసాం

త్వన మన గప్పురంపు చలువన్‌ గెలువన్‌ దిరుకామసత్కవీః (సత్య, 1-32) కృతిపతి కోరినట్టే తిరుకామయ్య కావ్యాన్ని బ్రాశాడు. నాలుగాశ్వాసాలలో 64% గద్భపద్యాలు చెప్పాడు. మొదటి అశ్వాసంలో అవతారిక, కృతిపతి వంశావళి, షష్టృంతాలదాకా 121 గద్యపద్యాలు చెప్పాడు. తరువాత పాతిక పద్యాలలో ద్వారకానగర వర్ణన. శ్రీకృష్ణుని ప్రశంస చేశాడు. అంతకుముందు ఏ కావ్యంలోనూ ఏ కవీ వర్ణించని “తంటెనకత్తియలగుంపు”' పురవర్దనలో పేర్కొన్నాడు (1-131). జందెపు మోపు నీటుకాండ్రు, పూయప్రాయపు భాషనబోనకత్తిలు ద్వారకానగరంలో ఉండేవారట (1-132). సాత్యకి, చంద్రభానుడు, శివుడు, సాంబుడు మొదలైన యాదవ ర్థాజకుమారు లంతా వేశ్వ వాటికలో నిత్యమూ క్రీడ సల్పుతారట (1-13). దాదుల ఇళ్ళలో చీకటినేస్తపు చెలులు చేరుతారట (1-139). ద్వారకలో ఎప్పుడూ గొల్లభామలు చల్లలమ్ముతారట. ఆ సంగతి ఇలా వర్జించాడు:

ఉల్లాసం బొనగూడ జగ్గునడతో నొయ్యారపుం జూపు లు

ద్యల్లీలం దగ జేతు లెత్తి బసవుం దళ్కొత్తు పాలిండ్లతో

మల్గ్లాడం దగు నిండు పైడికడవల్‌ మౌళిస్థలిం బూనుచున్‌

చల్లో చల్లని చల్ల యమ్ముదురు నిచ్చల్‌ గొల్లచానల్‌ పురిన్‌ (సత్య. 1-142)

ఇటువంటీ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు పాలించేవాడని చెప్పి తిరుకామయ్య ప్రథమాశ్వాసం ముగించాడు. ద్వితీయాశ్వాసంలో ఇంద్రాదులు ద్వారకకు వస్తారు. విమానం నుండి తివాసులు, దిళ్లు, పరంగిపీటలు మొదలైనవి సేవకులు దింపుతారు. ఇంద్రాదులు నరకాసురుని దారుణాలు శ్రీకృష్ణునికి చెప్పుకొంటారు. ఆ రాక్షసుని సంహరిస్తానని కృష్ణుడు మాట ఇస్తాడు. తరువాత వసంతోత్సవం జరుగుతుంది. కృష్ణుడు

లింగనమఖి తిరుకామయ్య 739 విహరిస్తాడు. సత్యభామతో క్రీడిస్తాడు. మణితాలు, చిరుమూల్లులు, ఊరడింపులు, గరిసింపులు, గాయకాలు, కనరులు, కొనరులు, మురిపాలు మొదలైన సరసాలన్నీ వర్ణించాడు. తరువాత నరకాసురునితో యుద్దానికి వెడతానని కృష్ణుడు చెప్పాడు. "కంస శాసనా! నీవు నరకాసుర విజయంబు సేయుట ఈ దేవీ సమాజంబునకు విజయంబు సేయవలయు' నని సత్యభామ హెచ్చరించింది. (2-108) అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడట:

వెరవక పోరు జూచుటలు వెన్నెలకుప్పలొ కాక గవ్వలో

గురుగులో బొమ్మరిండ్లా మజి గుజ్జనగూడులో పెండ్లివీడులో

పొరిపారి నిచ్చలున్‌ విసరు పువ్వులలో రువ్వులో చేటనవ్వులో

యరయరు కార్యముల్‌ మృగము లట్ల వెలందుల దెల్చ శక్యమే? (సత్య, 2-109) చృగాలలాగ ఆడవాళ్ళు కార్యాలు తెలుసుకోలేరని పెద్ద అభాండమే వేసి కృష్ణుడు సత్యభామని యుద్దానికి రావద్దన్నాడు. ఆమె 'చతురురాలు' కనుక ఊరుకొని దీవెన వీడెమిచ్చి యుద్దానికి పంపింది. కృష్ణుడు పగవాళ్ల సీమ పాళెం విడీయించాడు. దానితో ద్వితీయాశ్వాసం ముగిసింది. దీనితో తిరుకామయ్య చేసిన మార్చు మొదలవుతుంది. సత్యభామ కృష్ణునితో కలిసి యుద్ధానికి వెళ్లిందన్న సంగతి పురాణప్రసిద్ధం. అయినా ప్రబంధంలో విప్రలంభ శృంగారం ఉండాలి కనుక మొగుడూ పెళ్ళాలను తిరుకామయ్య విడదీసి కథ నడిపాడు.

యుద్దానికి వెళ్లిన కృష్ణుడు టేతుకంబాలు, రతనాలు కుట్టుపన్నులున్న "తుతినీగుడారు'లో కొంతసేపు కూర్చున్నాడు. తరువాత దూదిచిమ్మిన నకాసిగుడారులో చేరాడు. తీరుబాటుగా విరహంలో పడ్డాడు. ప్రమదలు లేనిచోట మగవాళ్ళ మనసు రాయి అనీ, నేరం తలచవద్దనీ వస్తానన్న సత్యభామను తలచుకోసాగాడు. నేస్తకాండ్రు వినేటట్టు తమ శృంగారక్రీడలు పచ్చిపచ్చిగా నెమరువేసుకోసాగాడు. ఆమె కుచాలు, తన చేతులు ఎప్పుడు వియ్యమందుతాయో అని బాధపడ్డాడు. ఎదురుమంచాలెక్కి ఉయ్యాలలూగి పనుమొనలతో ఆకుమడపులు ఇచ్చుకోవడం ఇంకెప్పుడో అని బాధపడ్డాడు.

సత్యభామ లేని గుడారు ఉత్త విడారు అయిందని బాధపడ్డాడు. యుద్దానికి దళకర్త చంపక యకట నేనె యేలవచ్చితి' అని పచ్చికాముకునిలాగ చింతించాడు (3-59), శ్రీకృష్ణునివంటి ఉదాత్తనాయకుడు తిరుకామయ్య దృష్టిలో ఇంత దిగజారిపోయాడు. ముద్దు అళగిరి లాంటి శుద్ధభోగలాలసులు యుద్దానికి దళకర్తలను పంపి తాము క్రీడిస్తూ ఉండవచ్చు. తిరుకామయ్య తన ప్రభువులాగే కృష్ణుని తూడా చిత్రించడం చాలా శోచనీయం. ఇటువంటి ఖీరవాక్యాలు ధీరోదాత్తుని నోట రాకూడదు. 'అందుకే కృష్ణుని చెలికాండ్రే ఇలా చీవాట్లు పెట్టారు.

వలచినవారలు లేరో - వలపించినవారు లేరొ వనితల నిట్లా

తలచుకొని సమరముఖమున - బలవించినవారు గలరె పద్మదళాక్షా! (సత్య. ౩-62)

శ్రీకృష్ణుని విరహం ఉడ్లోలంగా, విడ్డూరంగా ఉంది. ఆమె పెదవి అనుకొన్నట్టు తన మోవి కానే అనుకొంటున్నాడు; అమె కౌగిట చేర్చినట్టు తన రొమ్ము తానే

740 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అదుముకొంటున్నాడు (3-%). తన తొడలు తానే గదియించుకొంటున్నాడు. ఆమె రైక ఎంత తపం చేసిందో, ఆమె పావడ ఎంత భాగ్యం నోచిందో అని నోరెత్తి అరుస్తున్నాడు (3-67). అప్పుడు కలవింకుడనే హాస్యగాడు ఇలా అన్నాడట: నలినాక్ష విరహమనగా - నలుపో తెలుపో యిదేటి నటనలు బశళిరా। నలుపైన చీకటేదియొ - తెలుపైనన్‌ వెన్నెలేది తెలిసిటు చెపువూ. (సత్య. ౩-74) ఆ హాస్యగాడు అంతతో అగొతీ బాగుండును. అధిక ప్రసంగం చేశాడు. యుద్దానికి వచ్చినప్పుడు వట్టి గొడవ ఇల్లాలిపై బాళి అన్నాడు (3-79). వెలయాండ్రు తర్వయినారొకో అన్నాడు (3-82). తిరుకామయ్య చిత్రించిన శ్రీకృష్ణుడు పరమ కాముకుడే కావచ్చునుగాని కొంచెం మడికట్టుకొన్నవాడే. పేరు పేరు వరసలు చెప్పి ఆ వారకాంతలలో ఒకదానిని 'తళుకు గలదానిగా చిన్నదానిగా పౌంకముగా నేర్చరించి అలంకరించి తోడి తెచ్చెద' అని కలవింకుడు అనగానే కృష్ణుడు ఏవగించుకొన్నాడు. “ఏమిరా పాపజాతి నీవు బాపన జాతి నెటువలె పుట్టితివో... యేపని రోయవు' అని తిట్టాడు. ప్రేమ సంగతి పప్పునుమెక్కు కేమయినాను తెలుసునా?” అన్నాడు కృష్ణుడు (3-90). వెలకాంతలనిలా తిట్టాడు: వలపొకచో లిలు పోకచో - బలుకులు వేరొక్కచోట భావం బొకచో వెలయించు వెలమిటారుల - పలకగపడి మోసపోవు వారలుగలరే? (సత్య. ౩-%) వెలకాంతలనిలా నిందించాక కృష్ణుడు కులకాంతలనిలా మెచ్చుకొన్నాడు: మేలెంతురు కులకాంతలు-తేలింతురు రతుల గొంకు తీర్చినకొలదిన్‌ పాలింతురు కులధర్మము-తాలిమి పచరింతు రెంత తహతహర్చైనన్‌.(సత్య, ౩-౫) ఆ తరువాత మహా విరహంలో పడ్డాడు. అప్పుడు సత్యభామ పెంపుడు చిలుక అక్కడికి వచ్చింది. అది సాధారణ శుకం కాదట. శివుని సభలో పార్వతి ముందర గడియ కనేక పద్యాలు గ్రక్కున ఠచించే నేర్చున్నది. కృష్ణుని వరించాలని ఆదిలో సత్యభామ గౌరినోము నోచింది. అప్పుడు అంబ ప్రత్యక్షమై వరంతోపాటు చిలుకను తూడా 'ఇచ్చింది. అదే చిలుక ఇప్పుడు రాయబారం చేసింది. కృష్ణుడు ఎంత విరహబాధ పడుతున్నాడో సత్య తూడా అలాగే సతమతమవుతోంది. “ఇంకా మేలిమితోడ నుండదు సుమీ యేణాక్షీ (౩3-132) అని చెప్పి ఆపందగునట్టివారి ననిపి సత్యభామను రప్పించమని చిలుక సలహా యిస్తుంది. “మీ పిన్నమ్మను తీసుకురా' అని చెప్పి ప్రద్యుమ్న కుమూరుణ్ణ్జీ కృష్ణుడు ద్వారకకు పంపిస్తాడు. దానితో మూడో అశ్వాసం ముగిసింది. - అయితే తిరుకామయ్య చేసిన మార్చులు ముగియలేదు. అసలు కథ చిన్నదని మరొక కొత్త కథ కలిపాడు. నరకాసురుని గూఢచారి ఒకడు మారువేషంలో వచ్చి ఇక్కడి యుద్ధ సన్నాహాలు చూస్తున్నాడు. వాజ్జి భటులు పట్టుకొన్నారు. కృష్ణుని ముందు పెట్టారు. ఈ రాక్షసుడు నిజంగా శాపగ్రస్తుడు. పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు. చెడుతిరుగుళ్ళు తిరిగాడు. నీలాటిరేవుకు వచ్చే ఒక ఇల్లాలిని మోసగించి క్రీడించాడు. అతని కాముక చర్యలు బోలెడు. తన ఇల్లాలిని చెరిచాడని ఒక ముని కోపించి ఆ బ్రాహ్మణునికీ శాప

లింగనమఖి తిరుకామయ్య 741 ప్రయోజనం గ్రంథం పెరగడం తప్పు మరేం లేదు.

సత్యభామ వచ్చాక బుతువర్ణన, తరువాత యుద్ధం, నరకాసుర సంహారం, భూదేవి రావడం, కుండలాలు ఇవ్వడం, వాటితో ఇంద్రలోకానికి వెళ్ళడం, అదితికి ఇవ్వడం, భగదత్తుని పట్టాఖిషేకం, ఆ తరువాత నరకుని చెరలో ఉన్న పదహారువేలమంది కన్యలను కృష్ణుడు పెళ్లాడడం తిరుకామయ్య చెప్పాడు. ఇంతమంది సవతులు రావడం అష్టమహిషులకు కోపం కల్గించింది.

కొరకొరమించె రుక్మిణికి, ఘూర్డిలె లక్షణ యెంతయేని, చు

త్కురమనె భద్ర, జాంబవతి కుందె, గళిందజ గందెజాల, వే

సరుకొనె మిత్రవింద, నగెజాల దపించె సుదంత వారిలో

నరయగ సత్య తా సరసురాలగుటక్‌ మది కిన్మ మాటుచున్‌. (సత్య, 4-129) సరసురాలు కనుక సత్యభామ వారిని ఊరడించింది. తాను బాధపడసాగింది. “మగ డెడసి చౌకచేసిన మగువకు కాదనతరంబె' అనుకొంది. “కదిసి సుఖించగా సవతుల పదియార్వేలైనా నెట్లు బ్రతకగవచ్చు”' అనుకొంది. అప్పుడు చెలికత్తెలు ఇలా అన్నారు:

సౌగసా తావికి తుమ్మెద - జగతిని వేవేల లతల జయించదొకో

మగవాడు నటులె కాదా - మగువలయెడ నీకు నచట మచ్చరమేలే; (సత్య. 4-169) ఇలా హితోపదేశం చేసిన చెలికత్తిలకు కృష్ణుడు లంచం యిచ్చాడని సత్య తిట్టిపోసింది. కృష్ణునిమీద అలిగింది. కృష్ణుడు వచ్చాడు. సౌగసులు చెల్లించుకోమని వారకాంతలన్నారు: .

అనినం గాంతలచేత వీడుగద యట్లాడించె నంచున్‌ మనం.

బున గోపం బుబుకంగ నీదు వినయమ్ముం గంటిగా నంచు బై

క్కని శారిన్‌ జడగొట్టె గంకణరుణత్కారంబు తోరంబుగన్‌ (సత్య. 4-18) జడతో కొడితే నీచేయి నొవ్వలేదా అని కృష్ణుడన్నాడు. తరువాత “'మోముప్రోయాలి పదయుగళమునను జేర్చి సాగిలెను శౌరి వలపుల బాగుమీరి (4-19). అప్పుడు హరి జారుసిగను కోపం తీరేటట్టు తన్నింది. తాయెతలు, అందెలు ఘల్గ్లుమన్నాయి. తన్నిన కాలు మునిపంట పట్టుకొని శృంగారచేష్ట చేయగానే సత్యకోపం మంచులా కరిగిపోయింది.

సత్యభామను ఇలా తియ్యారించి కృష్ణుడు ఏలుకొన్నాడ్రు. దంపతీనిష్టమైన శృంగారమే 'సాంఘికాభ్యుదయహేతువు' అని ప్రబోధించే యీ కావ్యకర్త గొప్ప శృంగారరసవివేచనకలవాడని నిడుదవోలు వెంకటరావుగారు భావిస్తున్నారు. 2. దక్షిణదేశీయాంధ్ర వాజ్బయము,' పీఠిక,పుట 2.

742 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మేవగింపు పుట్టింపకపోదు' అని చెప్పి, “కామేశ్వర కవి ప్రతిభావంతుడే కాని స్వశక్తికొలది యెరుగక మహాకవులతో దులతూగపోయి చతికిలబడినవాడు' అని రుజువు చేశారు.

నంది తిమ్మనగారి పారిజాతాపహరణంలోని మంచి పద్యాలను కొన్ని తిరుకామయ్య అనుకరించాడు. అయిడే ఇతని 'చెడ్డ' పద్యాలను తరువాత శృంగార చేష్టలను నాయకుడు తలపోసుకొని విరహం పొందడం ఈ కావ్యంతో మొదలైంది.

సత్యభామాసాంత్వనం వ్రాశాక తిరుకామయ్య ధేనుమాహాత్మ్యం అనే వచన గ్రంథం రచించి చొక్కనాథునికి అంకితం ఇచ్చాడు. ఇందులో ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన అవుల మాహాత్న్యాన్ని రచయిత దేటమాటలతో వివరించాడు. ఈ గ్రంథం అచ్చుపడలేదు. .తంబావూరి సరస్వతీమహలు గ్రంథాలయంలో దీని ప్రతులు రెండు ఉన్నాయి. గద్యలోని పద్యంవల్ల దానిని తిరుకామయ్య రచించాడని తెలుస్తూంది. (తంజావూరు, ల. 676)

మరొక ప్రతిలోని ఆదిపద్యంవల్ల ఈ ఆవుల మాహాత్మ్యం చొక్కనాథునికి అంకితం అని తెలుస్తూంది. (తంజావూరు 9.677)

. ఆద్యంతాలలో పద్యాలున్నా ఇది వచనగ్రంథం. మధురలో వెలువడిన వచన రచనలలో ఇది మొదటిది. ఇదికాక తిరుకామయ్య మరేమైనా గ్రంథాలు బ్రాశాడేమో తెలియదు. ఆవుల మాహాత్మ్యంలో ధర్మాలు చెప్పినా తిరుకామయ్య రచనలు చాలామటుకు శృంగారకృతులే అని చెప్పాలి. వాగ్దేవి ముఖమనే ఇందూదయంలో తన చిత్తశుద్ధికలశాంభోరాశిపై తేరే పాలతేట పలుకుల పోల్చే రత్నాలే తన శృంగారకృతులని అతడు చెప్పాడు (సత్య. 1-17). “మహీపతుల్‌ కూర్చిన్‌ వాని జేకోరొకో'" అన్నాడు. తన కాలంలోని మహీపతులను మెప్పించడానికి సమకాలిక భోగలాలసత్వం పురాణ పురుషులకు అంటగట్టూడ్రు. వనమాలిబైసిమాలిగా వర్ణించడం అలాగ ఉంచుదాం. కృష్ణుని కొలువు కూడా ముద్దళగిరి కొలువేః

నట్టి గొలువున్న వసిగాపు సామిసరస

తామరసపత్రనేత్ర లందలు వినంగు (సత్య, 2-2 ఒక వాద్యురవం వినబడిందంట. సామిసరసను తామరసనేత్రలేకాని కవులు, మంత్రులు, పంఢితులు మొదలైనవాళ్లు ఈ నాయకరాజుల కొలువులో కనబడరు! .

పెంటివిద్యలు పెరిగిపోయాయని వాపోయిన బైచరాజు వెంకటనాధుని శోకం ఈ "యుగంలో తారస్థాయిని అందుకొంది. అతనా ననత ననన కనన నకాతన కడా ననన నినణానని నినా ననన ననన 3. దక్షిణాత్యాంధ్ర సాహిత్యము, పుట 41.

నారాయణతీర్ణులు, సిద్ధేంద్రయోగి పాటకచ్చేరీలోనో, భజనకూటంలోనో లేక కూచిపూడివారి నాట్యంలోనో ఎక్కడో ఒక దగ్గిర ఎప్పుడో ఒకప్పుడు తరంగాలు వినని సంస్కారవంతుడు ఉండడు. వేదికపైన తూర్చున్న గాయకుడు “జయజయ గోకులబాల' అని కురంజిలో పాడడంగాని, చిరతలు పట్టుకొన్న భక్తుడు “ఏహి ముదం దేహి, కృష్ణా, కృష్ణా" అని పరవశించి ప్రార్థించడంగాని ఇప్పుడు అరుదుగా వినిపించినా తూచిపూడివారి ధర్మమా అని నేడు వివిధ రంగస్థలాలమీద “బాలగోపాల మా ముద్ధర' అనే తరంగం మోహనరాగంలో వినబడుతున్నది. అందులో మరీ ప్రత్యేకంగా “ఇందిరా మందీరా భక్తా-సుందర హృదయారవింద అనే పాదభాగం రకరకాల కాలాలలో ఒక గంటసేపు వినబడుతుంది. ఈ తరంగాలన్నీ “కృష్ణలీలా తరంగిణి అనే పెద్ద సంస్కృత యక్షగానంలోనివి. దానిని శివనారాయణ తీర్థులవారు రచించారు. భాగవతం దశమస్కంధంలోని కృష్ణచరిత్రను తీసుకొని పన్నెండు తరంగాలుగా విభజించి 156 కీర్తనలను, మధ్య మధ్య ఎన్నో శోకాలను అనుసంధిస్తూ బ్రాశారు. తీర్ణులవారు తమ యక్షగానంలోని అంకాలను తరంగాలన్నా గాయకులు, సాహితీపరులు ఆయన వ్రాసిన కీర్షనలకు తరంగాలని పేరు పెట్టారు. నారాయణ తీర్థులవారి అసలు పేరు గోవిందశాస్త్రి అని లోకులు చెప్పుకొంటారు. పూర్వాశ్రమంలో వారిది ఇదే పేరని చెప్పడానికి ఆధారాలు లేకపోయినా ఇది వాస్తవమే కావచ్చు. వీరి స్వగ్రామం ఆదిలో కూచిమంచి అగ్రహారం. ఇది నేడు ఖమ్మం జిల్లాలో ఉంది. రెండు నరసింహక్షేత్రాలైన వేదాద్రికి, కంభంమెట్టుకు నడుము ఉన్నది. కృష్ణానదికి మహా అయితే మూడు ఆమడల దూరంలో ఉంటుంది కనుక ఈ అగ్రహారం కృష్టా తీరంలోనిదని చెప్పవచ్చు. ఆదిలో తీర్థులవారి ఇంటిపేరు పీసపాటివారు. బహుశా ఇదే పిశుపాటి అని పరిణామం చెంది ఉండవచ్చు. ఎన్నోతరంలోనోగాని ఈ ఇంటిపేరు తల్గ్లావజ్ఞలవారు అని మార్చు చెందింది. తీర్ధులవారి తండ్రిపేరు నీలకంఠశాస్త్రిగారు - గొప్ప సంగీతవేత్త. గాంధర్వదేవుడనే బిరుదు పొందిన'విద్వాంసుడు. తండ్రిగారి వద్దనే తీర్థులవారు 'గానకళ నేర్చుకొని ఉంటారు. * తీరులవారి గురువుగారి పేరు పూర్వాశ్రమంలో ధర్మసూరి. తర్వాత రామానందుల వారు. ఈ ధర్మసూరి సాహిత్యరత్నాకరం రచించిన వారణాసి ధర్మసూరిగారు గాక

  1. తీర్ధులవారి స్వగ్రామం కూచిమంచి అగ్రహారమని దివాన్‌ బహదూర్‌ కెయన్‌. రామస్వామి శాస్త్రీగారూ, ఎస్‌.పి. నరసింహాదార్యగారు వావిళ్ళవారి కృష్ణలీలా తరంగిణీ (1953) ప్రచురణలో నా న న ష్టమాచార్యులుగారు తమ సంస్కృత సా! చరి | వ్షమాంా నాక ఇ ర యేట తంజావూరు స్వామినాథ అయ్యర్‌గారూ ఇదే అభిప్రాయం ప్రకటించారు.
  2. స్వామి శ్రీ శివశంకర శాస్త్రి, శ్రీవావిళ్ళవారి షష్టిపూర్తి సంచికలో వ్యాసం - పుట 72.
  3. అందులోనే

744 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చిలకమర్రు ధర్మసూరిగారు కావచ్చును. ఈయన భానుదత్తుని రసమంజరికి ఆమోద వ్యాఖ్యను రచించిన రంగశాయి జనకులు. రంగశాయి శృంగారలహరి అనే ఇంకోరచన చేశాడు వాగ్గేయకారుడు. నృత్య ప్రబంధ నిర్మాత.* తీర్ణలవారు ధర్మసూరివద్ద శాస్త్రాలూ, రంగశాయి వద్ద సంగీత సాహిత్య రచనల రహస్యాలు నేర్చుకొని ఉంటారు. హరిభట్టు నరసింహపురాణం రచించినప్పుటుంచీ కంభంమెట్టు ప్రాంతాలలో నారసింహ భక్తులు ఎక్కువయ్యారు. హరిభట్టు పూరీజగన్నాథునికి అంకితంగా తన భాగవతం షష్టస్కంధం ఆంధ్రీకరించాడు. వైష్ణవం ప్రాచుర్యం పొందింది. తీర్గులవారికి నారసింహ ఉపాసనా, విష్ణుభక్తీ ఇనుమడించింది. వేదాద్రి, శోభనాద్రి. మంగళగిరి మొదలైన నారసింహ క్షేత్రాలలోనూ, శ్రీకాకుళం వంటి ఇతర వైష్ణవ క్షేత్రాలలోనూ ఆరాధనలు చేసి సంస్కృత గీతాలు పాడేవారు కాబోలు. అకిరిపల్లిలో అనంతభక్తుడు, అచ్యుతభక్తుడు అనే ఇద్దరు దేవులపల్లి సోదరులు ఉండేవారు. వీరి కలలో దేవుడు కనబడి శివకేశవ రూపాలలో తాను ఆ కొండపై ఒకచోట వెలసినట్టు చెప్పాడట. ఆ భక్తులు కొండంతా గాలించి స్వామి వెలసిన చోటూ, దానికి సమీపంలో ఉన్న వరాహపుష్కరణిని కనుక్కోగలిగారు. నితశ్యేపచారాలకు ఏర్పాట్లు చేశారు. క్రీశ. 1626లో దేవులపల్లి అచ్యుతభాగవతులకు అగ్రహారాన్ని ఒక పోషకుడు దానం చేశాడు. శోభనాద్రిని తరచు దర్శించుకొనే తీరులవారు ఈ అచ్యుత, అనంత భాగవతుల ప్రభావంతో నాట్కరసోత్కట రచనలవైపు మొగ్గి ఉంటారు. తీర్ణులవారి గురువులు చాలామంది. వాసుదేవ పండితులనే మహాశాస్త్రజ్ఞులవద్ధ ఆయన షడ్డర్శనాలు, సర్వశాస్తాలు నేర్చుకుని మహాపండితులయ్యారు. శాండిల్క భక్తిసూత్రాలకు వ్యాఖ్యానం వ్రాశారు. సాంఖ్యకారికలకు, సాంఖ్యతత్వానికి వ్యాఖ్యానాలు రచించారు. న్యాయకుసుమాంజలికి టీక వ్రాసి తమ తర్కశాస్త్ర పాండిత్యాన్ని చూపించారు. తీరులవారు సంస్కృతంలో 14 గ్రంథాలు వ్రాశారు. ఇంతటి శాస్త్ర పాండితృ్యమున్నా ఆయన సంగీత సాహిత్యాలపై మక్కువ చూపీవారనుకోవాలి. వేదాద్రి, శోభనాద్రి, శ్రీకాకుళం, కటకం, జగన్నాధం మొదలైన క్షేత్రాలు దర్శించి ఆ దేవతలపై ఎన్నో సంకీర్తనలు రచించారు. ఆయన యౌవనంలో సన్యాసం స్వీకరించి ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. తీర్ణులవాడు సన్యాసం స్వీకరించడానికి ఒక కారణం ఉంది. దానిని ఒక కథగా చెప్తారు. కృష్ణకు అవతలి ఒడ్డున ఉన్న అత్తగారి గ్రామానికి ఆయన ఒకనాడు ఆత్రుతతో వెడుతున్నారు. ఇంతలో వరద వచ్చింది. మునిగిపోతాం అనుకొని ఆయన ఆపత్సన్యాసం స్వీకరించారు. అలా సన్యసించగానే ఇలా గండం తప్పింది. ఒడ్డుకు చేరి అత్తవారింటికి వెళ్ళి భార్య అనుమతి తీసుకొని తీర్థలవారు దేశాలు పట్టారు. పరిణామశూలతో బాధపడుతూ దక్షిణాదికి చేరుకొన్నారు. తంజావూరు జిల్లాలో కావేరీతీరాన ఉన్న వరహూరు చేరుకోగానే వారి వ్యాధి నయం అయింది. అంచేత కావేరితీరాన్నే వారు స్థిరపడ్డారు. 7 వ రాఘవకగూడు ఫంాంమంంంటతళ పున 5. 1౫. గింత - 1000829 జరీ ఓ2ంంంయి ౦ నుంయు౭ ౧౧60 - ౧ 106

నారాయణతీర్థులు, సిద్ధేంద్రయోగి 745

అవి తంజావూరు రాజ్యాన్ని నాయకరాజులు పాలిస్తున్న రోజులు, కావేరితీరాన మేలటూరు అనే గ్రామాన్ని భాగవతమేళాలు ప్రదర్శించే కుటుంబాలకు అచ్యుతప్పు నాయకుడు పూర్వం దానం చేశాడు. అందువల్ల ఆ గ్రామానికి అచ్చుతాల్టి అనే పేరు వచ్చింది. మేలటూరువారు పూర్వం పిశుపాటివారే. తీర్ధులవారి పూర్వాశ్రమ జ్ఞాతులు అక్కడ ఉండీ ఉంటారు. వారి కోరికపై నారాయణతీర్థలవారు ఈ ఊరిలోనే స్థిరపడ్డారు. ఊరివారంతా భాగవతులే కనుక వాళ్ళు ప్రదర్శించడానికి వీలుగా సంస్కృతంలో కృష్ణలీలాతరంగిణి అనే యక్షగానాన్ని రచించారని భావించవచ్చును. మాతృభాష అయిన తెలుగులో కూడా ఆయన పారిజాతాపహరణం, అనే యక్షగానం వ్రాశారు. అందుకే ఆంధ్రకవిగా ఆయన చరిత్ర యిక్కడ చెప్పుకొంటున్నాం.

నారాయణతీర్థులవారి పారిజాతాపహరణం ఇప్పుడు ప్రచారంలో లేదు. దీని సమగ్ర ప్రతికూడా ఒకచోట దొరకదు. తంజావూరు సరస్వ్పతీమహల్‌ గ్రంథాలయంలో ఒక అసమగ్ర ప్రతి ఉంది* మేలటూరులో మరొక ప్రతి ఉంది”

ఈ రెండు ప్రతులూ కలిపిడేనే సమగ్ర ప్రతి తయారవుతుందని పరిశోధకుల అభిప్రాయం. ఈ యక్షగానంలో మొదట తీర్థలవారు కథా సంగ్రహాన్ని అయిదు శ్లోకాలలో చెప్పారు. దాని ప్రకారం మొదట రుక్మిణి ఇంట్లో కృష్ణుడు ఉండగా నారదుడు రావడం, పారిజాతం ఇవ్వడం, సత్యభామ కోపం, రుక్కిణి సత్యభామల సంవాదం, సత్యభామ అలుక, తరువాత కృష్ణుడామె చిత్తరంజినం చేయడం, గరుత్మంతుణ్ణి ఎక్కి ఆకాశయానం, భామతో కలిసి నరకాసుర సంహారం, నందనోద్యానవనానికి వెళ్ళడం, పారిజాతాపహరణం, ఇంద్రస్తుతి, సత్యభామ పెరట్లో పారిజాతం నాటడం మొదలైన ఘట్టాలుంటాయి.. దీనిని తీర్ణులవారు యక్షగానం అనక నాటకమనే అన్నారు. “పారిజాతాపహరణాఖ్యం నాటక మఖినీయతే'' అని గ్రంథాదిని ఉంది. ““అవురా ఈ విధంబున అంతట పారిజాత నాటక నాట్య వైఖరికి విఘ్నంబు గాకుండు విఘ్నేశ్చరుండు వచ్చే మార్గంబు పరాకు” అని సంధి వచనం, తరువాత ఒక దరువు ఉంది

వచ్చెనే గణపతిదిగో బాల-వరదుడై మిగులను వన్నై మీరగను. గణపతి ప్రవేశదరువును తెలుగులో వ్రాసినా కృష్ణుడు, నారదుడు మొదలైన పాత్రల ప్రవేశాలను సంస్కృత దరువులలోనే. వ్రాశారు. నిజానికి వాటిని క్రొత్తగా వ్రాయలేదు. కృష్ణుని ప్రవేశం అచ్చంగా కృష్ణలీలాతరంగిణిలోనిదే ఇందులో ఉంది.

శంఖీ చక్రీ గదీ పడ్మీ శార్డీ కిరీటకుండలీ శ్రీవత్స కౌస్తుఫీ దివ్యపీతాంబరో విరాజతే.

(తరంగిణి. 1-34) 7. లంటూ! 0! సటరణు స గండంంా, 1942, 10.14, ౧.74 9. తంజావూరు యక్షగానాలలో వినాయకుని ప్రవేశం భోసలరాజుల కాలంలోనే ప్రారంభమైంది. తీర్ణులవారు బహుశా శహాజీ కాలం (1853-1712) పారిజాతం రచించి ఉంటారు.

746 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ

నారదుని ప్రవేశం కూడా సంస్కృత దరువులోనే ఉంది. ఆ ముని పారిజాత పుష్పాన్ని రుక్కిణికి ఇచ్చాడని తెలిశాక సత్యభామకి కోపం వస్తుంది. ఉతోషం పుట్టుకొస్తుంది.

పుడమిలోపల నాడు పుట్టువుకంటె నడవిలో నొక పుష్పమై యున్న మేలు. అని భావిస్తుంది. చెలికత్తిలతో తన గోడు చెప్పుకొంటుంది.

ఎంత దుడుకువాడు గోపాలు డమ్మ - దాని వలపులకె వశమాయెనమ్మ

తలచుకొంటె నే తాళలేనమ్ము - నారాయణ తీర్థనామ ధేయుడమ్మ

హరిహరిహరి అనంద గోపకుమారుడు - అలిగొతే నన్నాదరించువా రెవరు?

ఎన్నరాని గుణరత్నాకరు తీర్థ - చిత్తవృత్తి రంగనటన వినోది - ఇలా బాధపడ్డాక చెలికత్తిలతో కలిసి సత్యభామ రుక్మిణి మందిరానికి వెడుతుంది. అక్కడున్న కృష్ణుని తనతో రమ్మంటుంది. రుక్మిణి ఊరుకొంటుందా?

భామా నీ కింతైన భయములేదా? నా మరుపున పిలువ న్యాయమా నీకు

మగువ నాలాగె నిన్ను మన్నించునటే తగవేమే నాతో నీకు తరుణీ పోపోవే అని దయచేయమంది.

“అంతట నీలాగున రుక్కిణి అమ్మవారిచేత సత్యభామ అవమానం పొంది తన యింటికి వచ్చి కోపాగారమందు ప్రవేశించేటపుడు యేమని ప్రలాపిస్తున్నది” అని సంధివచనం చెప్పాక తీరులవారు దరువులు వ్రాశారు.

ఏమి సేతునే ఓయమ్మా - బంగారుబొమ్మా ముద్దులగుమ్మా! ఆమె ఏమి చేయనక్కరలేకుండానే కృష్ణుడు వచ్చి అనునయిస్తాడు. సంవాదం జరుగుతుంది. సాంతంగా కథ ముగుస్తుంది. చిట్టచివర స్తుతిలో తీరులవారు అచ్యుతాల్థిని పేర్కొన్నారు.

శరణం శరణం మునీంద్రసన్నుత - శరణం కమల నాయక

శరణ మచ్యుతపురనివాస - స్వామి వరదరాజప్రభో!

ఈ పారిజాతాపహరణంలోని రచన పేలవంగా ఉంది. కృష్ణలీలా తరంగిణీ! ప్రక్కన పెట్టి చూస్తే సూర్యునియందు దివిటీలాగ ఉంటుంది.

తీర్ణులవారు దక్షిణూదికి వెళ్ళకముందే “పారిజాతం” వ్రాశారని విశ్వనాథ సత్యనారాయణగారి అఖిప్రాయం.

చల్లపల్లి ముళ్తాల సంస్థానములను

పండితాఖండలుండయి ప్రతిభ జూపి

మహిత నాట్యప్రబంధ నిర్మాతయగుచు

బారిజాతాపహరణంబు వ్రాసె కృతిని (11) అని శ్రీ నారాయణతీర్ణులవారి చరిత్రలో విశ్వనాథవారు వ్రాశారు.

(చూ. కృష్ణలీలా తరంగిణి - నూజివీటివారి ప్రచురణ)

నారాయణతీర్ణులు, సిద్ధేంద్రయోగి 747

చల్లపల్లి ముక్త్యాల ప్రభువులు తీర్గులవారిని సత్కరించి పోషించారన్నది చారిత్రక విరుద్ధం కావచ్చును. యార్లగడ్డవారి వంశంలో కళాపోషణ చేసిన మొట్టమొదటి చల్లపల్లి ప్రభువు కోదండరామన్న దేశాయిగారే. ఈయన కాలం 1746-1791. ముక్త్యాల కోటకట్టీన రాజారామలింగంగారి కాలం 1745-1783. ఈ వంశంలో సాహిత్యపోషణ చేసిన వారిలో ప్రథములుగా 1787-1828 మధ్య పాలించిన చినవెంకటాద్రిగారే కనబడుతున్నారు.19 శ్ర రెండు సంస్థానాలలో సాహిత్య పోషణ ప్రారంభం కావడానికి ఎన్నోతరాలు పూర్వమే తీర్ణులవారు దక్షిణాదికి వెళ్ళి ఉంటారు.

పారిజాతాన్ని కూడా తీర్ణులవారు కృష్ణలీలాతరంగిణి ప్రక్రియగానే రచించి ఉంటారు. అడి చూపించడానికి వ్రాసినా తరంగిణి పాడి వినిపించే ప్రయోజనాన్ని ఎక్కువగా సాధించింది. అందుకే దాని ఫలశ్రుతితో ఇలా చెప్పారు.

కామదాకామినామేషా ముముక్షూణాంచమోక్షదా

శజ్వతాం గాయతాం భక్తా కృష్ణలీలా తరంగిణీ (12-57) తీర్ణులవారికాలంనాటికి *“వినికిసియు' యక్షగానాలు తెలుగు పరగణాలలోనూ, దక్షిణాదినీ ప్రచారాలలో ఉండేవి. గణపవరపు వెంకటకవి కలలో కనబడి ప్రబంధ రాజవెంకటేశ్వర విజయవిలాసాన్ని ఎలా రచించాలో దేవుడే పురమాయించాడు.

మనువు నిపుడు గవులొనర్చు ననుపు దెనుగు

గబ్బములలోన దెరనాటకంబు లెస్స

గా వినికి సియుగతి నలంకార సరణి

వెలయ రచియించు... (ప్రబంధ. 3) తిర నాటకాన్ని రచించి వినిపించడం అనాటి ఫ్యాషను కాబోలు. మేలటూరు వారు ప్రదర్శించడానికే తీర్థులవారు పారిజాతాన్ని రచించినా అందులో రక్తి కట్టే రసపట్టులు ఎన్ని ఉన్నాయో తెలియదు. మిగతా తంజావూరు యక్షగానాల జోరుకు తట్టుకోలేక పోయిందేమో. అందుకే ప్రచారం పొందలేదేమో. తీర్ణులవారు దక్షిణానికి ప్రవేశపెట్టిన భజన సంప్రదాయం, నారసింహపూజావిధానం బాగా ప్రచారం పొందాయి. మేలటూరు వరదరాజ పెరుమాళ్లు కోవెలలో నరసింహస్వామి కరాళం ప్రత్యేకంగా ఒక పేటికలో పెట్టి గోడకు వేలాడదీసి ఉంచుతారు. నరసింహ జయంతినాడు పూజిస్తారు. భాగవతమేళా నాట్యనాటక ప్రదర్శనలు జరిగే ప్రతి తంజావూరు అగ్రహారంలోనూ నరసింహ పూజలు నేటికీ జరుగుతున్నాయి. ఆశ్వయుజ మాసములోని ముష్ఫయి రోజులూ అగ్రహారికులు సంకీర్తనలో తీర్ణులవారి తరంగాలను ఇప్పటికీ గానం చేస్తూ నడుస్తారు.

దక్షిణాదికి వెళ్ళడానికి ముందే తీర్థులవారు తరంగిణిలోని చాలా కీర్థనలను రచించారు. వాటిని వివిధ పుణ్యక్షేత్రాలలోని శిష్యులతూ, భత్తులకూ వారు నేర్పారు. అరవై ననన నన టు 10. చూ ఆచార్య తూమాటి దొణప్ప - అంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణ.

7408 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి గ్రామాలవారు ఇవి నేర్చుకొన్నారట. దక్షిణాదికి వెళ్ళాక తీర్ణలవారు మళ్ళా ఆంధ్రదేశానికి వచ్చారో లేదో తెలియదు. వచ్చారనీ, వివిధ ప్రదేశాలలో ప్రబోధం చేశారు చెప్పుకొంటారు. తీర్థలవారి వంశంవారే పీసపాటి అనే ఇంటి పేరుతోకాక తల్గావబ్ధల వారనే కొత్త ఇంటిపేరుతో కాజలో స్థిరపడ్డారట. వారికి కూడా ఉపదేశం చేశారట. తీరులవారు ఆంధ్రప్రాంతాలకు మళ్ళీ వచ్చినప్పుడు వారితో సిద్ధేంద్రుడనే శిష్యుడు వెంట ఉన్నాడట. కూచిపూడి నాట్య పద్ధతి ప్రచారం చేయమని ఈ శిష్యుని తీర్థులవారు నియోగించారట. సిద్ధేంద్రుడనే వ్యక్తి ఎవరో కాదని, తీర్భలవారినే సిద్ధేంద్రులుగా తెలుగువారు వ్యవహరించేవారనే వాదం ఒకటి ఉంది.ే దీనికి ఆధారంగా కృష్ణలీలా తరంగిణిలో “సిదనారాయణ తీర్థ సేవిత పాదం' (11-౩3). “శివనారాయణ తీర్థసిద్ధానందదాయకం' (9-10 అనే ముద్రలు కనబడతాయి. ప్రస్తుతం లభ్యమవుతున్న ఆశుచరిత్రల వల్లి తీర్ణులవారు, సిద్దేంద్రుడూ అఖిన్నులో, విఖిన్నులో చేల్చడం చాలా కష్టం. ఇద్దరి చరిత్రలూ ఒక్కలాగే కనబడతాయి. అయితే తూచిపూడి నాట్యానికి మూలపురుషుడని భావించే సిద్దేంద్ర యోగి కూడా తీర్ణులవారిలాగే అత్తవారింటికి వెడుతున్నప్పుడే నదిలో ఆపద్ధర్మ సన్యాసం స్వీకరించినట్టు లోతులు. చెప్పుకొంటారు. ఆయన ఆడవాళ్ళని దూరంగా ఉంచి ఫక్తు మగవారితోనే నాట్య బృందాలు ఏర్పాటుచేసి తర్ఫీదు ఇచ్చాడనే నమ్మకం ఒకటి ప్రబలింది. ఇది సామాజిక నాట్యశాస్త్రవరిత్ర తెలియక ప్రచారమైన ఊహ. ఇవాళ తూచిపూడివారు ప్రదర్శించే యక్షగాన నాటకనాట్యాలు ఎన్నో ఉన్నాయి. కాని జనశ్రతి ప్రకారం సిద్ధేంద్రుడు వ్రాసినవి రెండే. ఒకటి భామాకలాపమనే పేర ప్రసిద్ధమైన పారిజాతం, రెండోది గొల్లకలాపం.]* సిద్ధేంద్రయోగి మిథ్యావ్యక్తి కాక చారిత్రక పురుషుడే అయితే జీవిత చరిత్రను కతూచిపూడివారే స్పష్టంగా చెప్పలేకపోవడం విచారించతగ్గ విషయం. సన్యాసం స్వీకరించడానికి ముందు అతని పేరేమిటో ఊరేమిటో తెలియదు. అయితే నటరాజ రామకృష్ణగారు చెప్పినదానినిబట్టి సిద్ధయ్య రాయలసీమవాడు, బ్రహ్మచారి. ఆయన దేశాటనం చేస్తూ కూచిపూడి చేరాడు. ఆ రోజులో సువాణంవారు ఆ గ్రామంలో ప్రసిద్ధ భాగవతులు. సువాణం జోగావధాన్లవారి పుత్రికను ఈ రాయలసీమ చిన్నవాడు పెళ్లాడీ అక్కడే స్థిరపడిపోయాడు. కొంతకాలానికి సన్యసించి సిద్ధేంద్రయోగి అయ్యాడు.కి స్త్రీలను రంగస్థలానికి దూరం చేసి మగవారు ఆడపాత్రలను తూడ ధరించి ప్రదర్శన కళలలో పాల్గొనడం తూచిపూడి భాగవతులకే పరిమితమైన సంప్రదాయం కాదు. భారతదేశమంతటా, ఆ మాటకు వస్తే ప్రపంచమంతటా ఒక చారిత్రక దశలో స్త్రీల కశ 5. ౫26380 - 56 క్యూనంిత 412 732009 ౧866 - 210 12. గొల్లకలాపం భాగవతుల రామయ్యగారి రచన అని గొట్జెపాటి వెంకటసుబ్బయ్యగారి అభిప్రాయ తీన్నైర. 1954-సంపుటి 6 మాతృ భూతయ్య (1757-1736) వ్రాసిన పారిజాతంలో గొల్లకలాహ, దాదినమ్మ మొదలైనవి ఉన్నాయి. 13. ఆంధ్రుల నాట్యకళ - నటరాజ రామకృష్ణ నృత్యనికేతనం ప్రచురణ (వివేకనగరు, చిక్కడపల్లి హ్టైదరాబాదు) పుట ౫, అధోజ్ఞాపికు

నారాయణతీర్థులు, సిద్ధేంద్రయోగి 749 మంత్రచర్యారంగంపై పురుషులు దురాక్రమణ చేశారు. తాము "అఆడకట్టు' కట్టుకొని నాట్యుం చేయసాగారు. భారతదేశంలో ఏయే ప్రాంతాలలో పురుషులే ప్రదర్శనలలో పాలొనే నాట్టుసంప్రదాయాల జాబితా చూడండీ:

  1. కర్ణాటక :; బయలాట, యక్షగానం

  2. గుబరాత్‌ ః భవాయ్‌

ర్‌, రాజస్తాన్‌ ఫ్‌ ఖయాల్‌

  1. హర్యానా ః స్వాంగ్‌

  2. ఉత్తరప్రదేశ్‌ : నౌటంకీ (ఆగ్రాలో), భారత్‌ (బ్రజ భూమిలో),

  • రాసలీల (వారణాసిలో), రామలీల (రామ్‌నగర్‌లో).
  1. బెంగాల్‌ 2 బాత్ర

  2. మణిపూర్‌ ; జొత్ర

  3. అస్సాం ; అంకియ నట్‌

  4. పశ్చిమబెంగాల్‌ : 'చావ్‌ లేక *చౌ”

  5. వీహార్‌ -.. : “చావ్‌ లేక 'చౌ'

  6. ఒరిస్సా : “చావో లేక 'చౌ, గోటిపువా

  7. ఆంధ్ర : తూచిపూడీ. తూర్పుభాగవతం, వీధిభాగవతాలు

ఈ జాబితాలో రమారమీ భారతదేశంలోని తాష్ట్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. తూచిపూడిలో భాగవతమేళా ప్రదర్శనలలో బ్రాహ్మణులే పాలొనాలి. అలాగే రామలీల ప్రదర్శనలో సీకారామలక్ష్మణ పాత్రధారులు బ్రాహ్మణులే అయి ఉండాలి. రాసలీలకు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులోని పాత్రధారులు తొమ్మిదీ, పధ్నాలుగు సంవత్సరాల లోపున ఉన్న బాలుకే. వయోపరిమితి దాటాక ఆ కుర్రాళ్ళు వేషధారణకు స్వస్తి చెప్పాలి. ప్రదర్శనలలో ఒజ్జలుగా ఉండవచ్చు. రామలీలలోని పాత్రధారులకు ఆటాపాటా రానక్కర్లేదు. ఒరిస్సాలోని 'గోటిపువా'లో బాలురు పద్ధెనిమిది సంవత్సరాల వయసు వచ్చేదాకా నటించవచ్చు.

పై సింహావలోకనం వల్ల సిద్ధేంద్రుడుగాని, మరెవరుగాని కేవలం తూచిపూడీ. సంప్రదాయంలోనే స్త్రీలను బహిష్కరించారని చెప్పడానికీ ఆస్కారం లేదు. ప్రతాపరుద్రున్‌ కాలంలో ఉండే సంకీర్షనాచార్యుడు కృష్ణమాచార్యులు తన దర్శనం కోసం అహోబల నరసింహుని నాట్యవినోదులు పౌతకమూరి అన్నలు వచ్చినప్పుడు 'తలమీసములు బోడించుకొని, స్నానమాచరించి, శిఖాయజ్లోపవీతములు ధరించి, కటిసూత్రమున కాషాయ వస్త్రము ఆడకట్టుగా ధరియించి సంకీర్తన వాక్సూజలు చేశాడు. ఈ పొతకమూరి భాగవతులు పటము పన్నించి శ్రీమహోబలేశుని పటము చాటున నాళ్యుమాడింపిస్తారు.ే నాట్య ప్రదర్శనకు ఆడకట్టు ప్రాచీనమైన సంప్రదాయమే. దీనినే సామాజిక శాస్త్రబద్ధమైన 14. డాక్టర్‌ ఎం. కులశేఖరరావు - సింహగిరి వచనాలు (వచనం నెంబరు 32)

750 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కారణాలవల్ల కూచిపూడిలో ఎవరో మూలపురుషుడు, బహుశా ఒక సిద్ధేంద్రుడు అమలుపరిచాడు. కూచిపూడి ప్రసక్తి వీరనరసింహరాయల కాలం నుంచీ, అంటే క్రీశ1506-1509 మధ్య నుండీ మొదటిసారిగా చరిత్ర చెప్పుకొనడం కనబడుతుండి అప్పుడు ప్రదర్శించిన కేళికాకీర్సన సిద్ధేంద్రుని రచనలో, కావో తెలియదు. (మాచుపల్లి క్రైఫీయత్‌ [7 56 పేజి 65 గా) సిద్ధేంద్రుడు బ్రాసిన భామాకలాపం నేడు యథాతథంగా ఎవరూ ఆడడం లేదు దీనికతడు “పారిజాతం” అని పేరు పెట్టినా ఇవాళ పారిజాతకథ భామాకలాపంలో వు చూత్రం గోచరించదు. ఒక్క సత్యభామే అష్టవిధనాయికల రూపంలో అభినయించడానికి అనువుగా భాగవతులు కథను దిద్దుకొన్నారు. “భామనే నత్యభామనే' అని నాయిక ప్రవేశిస్తుంది. ఇవాళ ప్రచారంలో ఉన్ను దరువు ఇదిః భామనే సత్యభామనే భామనే పదియారువేల కోమలు లందరిలోన రామరో గోపాలమూర్తికి ప్రేమదామమైన ముద్దుల ॥భా॥ అట్టహాసము జేసి సురల నట్టి గెలిచి పారిజాతము చెట్టు దెచ్చినాదు పెరట ఘట్టిగా నాటించుకొన్నా ॥1భా॥ అయితే సిద్ధేంద్రుడు ఇలా వ్రాయలేదు. ఆయన బ్రాసిన దరువు ఇంతకన్నా ఫప్రొఢంగా ఉంది. భామనే సత్యభామనే భామరో శృంగార జగదఖిరామనే _ ముఖవిజితహేమా ధామనే చ్వారకాపురాఢ్యురామనే వయ్యారి సత్యా 1భా॥ మదనజనకుని వదలకను నా యెదను నదుముకు సుదతిరో మరు కదన మరుదుగ సలిపి నెమ్మది ముదముగదియగనున్న సత్య ॥(భా॥(౧0 1916 ఇటువంటి దరువులు ఇతర ప్రదర్శన కళలో తూడా కనబడతాయి. జానపదుల గౌతుపురాణం కుటుంబ గాథలలో జమదగ్ని చెల్లెలైన తరిదేవి కథ ప్రసిద్ధం. అందులో అమె ప్రవేశ దరువు సంధివచనాలు ఇలా ఉంటాయి.కేక్‌ దేవినే కాని ఖాది(?) దేవినే దేవినే నే దేవకాల నమ్మిన దేవినే కాంతనే కరిరాజ వరదూని వేడెద కాంతనే కాంతను నేనిక తాళజాలనే వచనం: అమ్మ మీ రెవ్వరూ మోము చందురుని మించూ, ముఖము కాంతి సూర్యుని మించూ సుందరి నీ నామము, వీ భర్త పేరు, నీ పట్నము పేరు, నీ అత్త మామల పేరు, నీ తల్లిదండ్రుల పేరు మాకు 5. డాక్టర్‌ నాయని కృష్ణకుమారి తెలుగు జానపద గేయగాథలు - పుట ౬.

నారాయణతీర్థులు, సిద్ధేంద్రయోగి 751 విన్నవింపవే కోమలాంగీ - కోరితి మీ ముచ్చట కొదువ లేకా దరువు: నా నామము తరిదేవీ నయమూతో వినవమ్మా మోహనాంగీ నానాథుడూ సిద్ధరాజు వినవమ్మా మా జనకుడూ గౌతమా మునీశ్చరుడూ, జనని అహల్యాదేవి జగతిలో వెలనెనూ. యక్షగానాలు ప్రచారంలోనికి వచ్చాక జానపద పురాణాలలో ఈ పద్ధతి ప్రవేశించిందో లేక జానపదుల నుండే యక్షగాన విధానాలు రూపు సంతరించుకొన్నాయో పరిశీలించవలసిన విషయాలు. తెలుగులో ముక్కుతిమ్మనగారి “పారిజాతాపహరణం కావ్యం ప్రచారం పొందాక సత్యభామ ఆంధ్రుల అల్లారుముద్దుల ఆడవిడ్డ అయింది. యక్షగానాలలో అఖిమాన నాయిక అయింది. ం తంజావూరు విజయరాఘవనాయకుడు తెలుగులో మొదటిసారిగా పారిజాతాప హరణ నాట్టునాటక కావ్యాన్ని రచించాడు. తర్వాత వచ్చినది తీర్థులవారి పారిజాతం. నరకూరు నారాయణ (1777-1805), మాతృభూతయ్య (1740-1800), పులిజాల లక్ష్మీనారాయణ (1799 ప్రాంతాలు), భారతి రామరాజు (1795 ప్రాంతాలు) మొదలైనవారు పారిజాతాలు రచించారు. వీటిలోంచి ఎన్నెన్ని దరువులను భాగవతులు స్వీకరించారో పరిశీలించాలి. వీటన్నిటినీ ఆటభాగవతాలు అంటారు. వీటిని ప్రదర్శించే వారిని భాగవతులంటారు. అంధ్రదేశంలో రకరకాల భాగవతులు ఉన్నారు. వారి వివరాలు ఇవి : [| ఎగ్రగొల్ల భాగవతులు 10. జనగాలపల్లి భాగవతులు 2. తూచిపూడి భాగవతులు 11. తూర్పు భాగవతులు 3. తొత్త ఇండ్ల భాగవతులు 12. దాసరి భాగవతులు 4. కోటకొండ భాగవతులు 13. దేవదాసీ భాగవతులు 5. గంటె భాగవతులు 14. _పిచ్చుగుంట భాగవతులు 6. చిందు భాగవతులు 15. పొతకమూరి భాగవతులు 7. చిన్నిమాదిగ భాగవతులు 16. బలిజ భాగవతులు 8. చిలకల భాగవతులు 17. మాల భాగవతులు 9. జంగం భాగవతులు 18. యానాది ఖాగవతులు వీరిలో అందరూ పారిజాతాన్నికానీ, భామాకలాపాన్నిగాని ప్రదర్శించరు. కొందరే హ్యేక కృషి చేశారు. భామాకలాపంలో ఒక నిర్దిష్టమైన రచనాప్రణాళిక ఉంటుంది. పదకొండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి అన్నిటిలోనూ సర్వసామాన్యం. వాటి వివరాలు : ం.

7652 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

  1. ప్రస్తావన 7. మన్మథ ఉపాలంభన

  2. విరహం 8. చంద్రోపాలంభన

  3. దూతికా సంవాదం 9. వాయు ఉపాలంభన

  4. స్వప్పావస్థ 10. మూర్చావస్థ

  5. అవధి 11. సపత్నీ వివాదం -

  6. భామా సంవాదం "

తీర్థులవారు పారిజాతాపహరణానికి చెప్పిన ప్రణాళికకూ, ఈ భామాకలాప ప్రణాళికతూ చాలా తేడా ఉంది. శృంగారకావ్యాలు చలామణీ అయ్యాక వాటి ప్రభావం యక్షగానాలపై పడి కథకన్నా కథానాయిక మనోభావాలకే ప్రాధాన్యం ఏర్పడి కలాపాలు రూపం సంతరించుకొన్నాయి అని చెప్పవచ్చు. కూచిపూడి వారు ఏ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ప్రదర్శనలు ఇచ్చేవారో తెలియదుగాని తమ గ్రంథాన్ని సిద్ధేంద్రుడు రచించినట్టు ఖావించేవారు.

భామాకలాపం నాట్టకావ్యాన్ని ఎందరెందరో ప్రదర్శించేవారు. ఎన్ని ప్రాంతాలలోనో అది ప్రచారం పొందింది. జన్మస్థానం తూచిపూడి అయినా అలంపురం దగ్గిర ఉన్న కోటకొండ భాగవతులూ, విశాఖ జిల్లాలోని బొబ్బిలి, జామి, నిమ్మలవలస, కసింఠోట. చోడవరం మొదలైన గ్రామాల భాగవతులు, అమలాపురం, పేరూరు, మానంపల్లి, మండపేట, పిఠాపురం మొదలైన ప్రాంతాల నర్హతులూ భామాకలాపాన్ని ప్రదర్శించేవారు.

తూచిపూడిలో బ్రాహ్మణ'-బాలురకే ఈ విద్య నేర్చినా పిఠాపురం ఖ్రొఢ, పెండ్యాల సత్యభామ, మారంపల్లి అక్కచెల్లెళ్లు, చిత్తజల్లు వైదేహి, చిత్తజల్లు ఇందువదనలు మొదలైన విద్వాంసురాళ్లు ఈ కలాపాలు ఆడి బాగా రాణించారు. పెండ్యాల వారింట్లో మూడు తరాలనుండి ఈ విద్య ఉంది. పెండ్యాల సత్యభామగారికి 1958లో 90 సంవత్సరాల వయసు ఉండేది. అమె అమ్మమ్మగారి పేరు కూడా సత్యభామే. భామాకలాపంలో సత్యభామ వేషం కట్టి ఒప్పించినందుకు ఆ పేరు వచ్చింది. ఇవాళ కుమారి యామినీ శృష్ణమూర్తి వచ్చి భామాకలాపానికి అఖిల భారత ఖ్యాతి, అంతర్జాతీయ ప్రశంసలు సంపాదించింది. 1992లోనే రాగిణీదేవి కూచిపూడి వారి వద్ద కొన్ని శబ్లాలు నేర్చుకొందీ తన కుమార్తె ఇంద్రాజికి నేర్పించింది. వివిధ నాట్యసంప్రదాయాల వారు తూచిపూడిలో తూడా లిక్షణ పొందుతున్నారు. శోభానాయుడు, మంజుభార్గవి, స్వప్నసుందరి మొదలైనవాళ్ళు చక్కగా ప్రదర్శనలు ఇస్తున్నారు. డాక్టరు వెంపటి చినసత్యంగాడు కఈూచిపూడి సంప్రదాయానికీ ఎల్లలు విస్తరింపచేశారు. వారి శిష్యులు ప్రపంచమంతటా వ్యాపించారు.

ఇంతమంది ఆడామగా ప్రదర్శించే భామాకలాపానికి అధికారిక ప్రతి ఒకటీ లేదు సిద్ధేంద్రుడు వ్రాసినది కాక ఆరువిధాలైన కలాపాలను నర్హకులు ప్రదర్శిస్తున్నారట.*ీ 16. ఆంధ్రుల చరిత్ర నటరాజ రామకృష్ణ పుట 27.

నారాయణతీర్థులు, సిద్ధేంద్రయోగి 7863

భామాకలాపాన్ని మంగు జగన్నాథరావుగారు. 1913లో కాకినాడనుండి ప్రచురించారు. ఈ గ్రంథంలో శృంగనృత్యాది వీరేశలింగం శారదావాసు వెంకటశాస్త్రి మొదలైన వారి పేర్లు కొన్ని భాగాల కర్తలుగా కనబడతాయి. ఇందులోని తొన్ని దరువులలో వల్లూరు, నెల్లిమర్ల పోట్ట్లదుర్తి మొదలైన గ్రామాలలోని దైవాల ముద్రలున్నాయి. చివర దశావతార శబ్దం కాశీనాథ చంద్రశేఖరుని చరణము నమ్మిన ఖోసల కులచంద్రుడు శరభోజి మహారాజు సలాం చెప్పేది, మొత్తము మీద మంగువారి గ్రంథం వివిధ ప్రాంతాలలో ప్రచారంలో ఉన్న దరువుల సంకలనంగా కనబడుతుంది. మళ్ళీ 1964లో వేదాంతం పార్వతీశంగారు అచ్చువేశారు. అయితే ఈ రెండూ అచ్చంగా సిద్ధేంద్రుని కృతులు కావు. మంగు జగన్నాథంగారు సిద్ధేంద్రుని ప్రొఢరచనలు సరళం చేశారు. మూల కలాపం దోషభూయిష్టమై దాని నిజరూపం తూడ గుర్తింపరాని స్థితిలో ఉండడంవల్ల వేదాంతం పార్వతీశంగారు దానిని పూరించి, హాస్యగాడి వచనాలు మొదలైనవి కూడా పొందుపరిచి ప్రచురించారు. అయితే ఇది అసలు లోటు తీర్చదు. వివిధ ప్రాంతాలలో ప్రచారంలో ఉన్న భామాకలాప ప్రతులను, ప్రాచీన తాళపత్ర ప్రతులను సరిపోల్చి సిద్ధేంద్రుని రచన ఏదో గుర్తించాలి, అప్పుడు ప్రచురించాలి. కూచిపూడి కళాక్షేత్రం వారి ఆధ్వర్యాన మహాంకాళి లక్ష్మీనరసింహంగారి చేత బందా కనకలింగేశ్చరరావుగారు ఈ పని చేయించి సరైన పాఠాలు నిర్ణయించడానికి ప్రయత్నాలు జరిపించారు. అయితే అవి ఫలించలేదు. మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 7 పారిజాతాలు, 4 భామా కలాపాలు ఉన్నాయి.” వీటిలో కొన్ని చాలా ప్రాచీనాలు, వీటి సహాయంతో పరిష్కరణ జరగాలి. మిత్రులు వెంపటి చినసత్యంగారు నాచేత భామాకలాపం మూలప్రతి పాఠనిర్ణయం చేయించాలని ఆశించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్‌ నృత్య అకాడమీవారు ఆ పనిని చేపట్టడం వల్ల మా ప్రయత్నాలు ఆపుచేశాను. ఇప్పుడు నృత్య అకాడమీయే లేదు. తెలుగు విశ్చవిద్యాలయం వారు ఏమి చేస్తారో చూడాలి.

నేటి భామాకలాప ప్రదర్శన మొదట వేణీప్రబంధం ఉంటుంది. భామ తెరమీద జడవేస్తుంది. ఆ జడకు బోలెడు కథ ఉంది. దానిని సిద్ధేంద్రుడు బ్రాయలేదు. ఎవరో వెంకటశాస్త్రి రచించాడు. కృత్యాది ఇలా ఉంది.

శ్రీరమణు భవుని పద్మజు - వారణముఖ సకల దేవవర్గము నేడున్‌

తోరి భజియించు నీ కృతి చారుతరాకృతిగ వెలయు శ్రేయము లొసగున్‌ జడ కథలో ద్విపదలు, దరువులు, కందాలు, సీసాలు ఉన్నాయి. చివర ఇలా ఉంది.

వేణీ ప్రబంధ మిలలో - మానక పఠియింప వినిన మానవులకు స

న్మానము కల్గును వారికీ - దీనత్వము లేదు కృష్ణదేవుని కరుణన్‌ ఇది అర్వాచీన రచన. భామ తెరమీద జడవేయడం ఎప్పుడు మొదలైందో తెలియదుగాని ఇది ప్రేక్షకులకు సవాలు. ఎటువంటి శాస్త్రీయ ప్రశ్షలకైనా సమాధానం చెప్తానని భామవేషధారి ఈ జడ వేయడంతో ప్రకటించడం జరుగుతుంది. ఓడిపోతే జడ కత్తిరించవచ్చు. ఈ 17. పారిజాతాలు. 1900 నుండి 190౫. భామవేషాలు నుండి 01916 నుండి0 3939 18. ఈ జడ పూర్వోత్తరాలు మిత్రులు వెంపటి చినసత్యంగారి బ్రాతప్రతినుండి ఉదాహరిస్తున్నాను.

754 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సంప్రదాయం సిద్ధేంద్రుని కాలంనుండీ వస్తూందో. లేదో, మధ్యలో వచ్చినదో పరిశోధించాలి. భామాకలాపం కథను తుమ్మలపల్లి సీతారామారావుగారు విపులంగా కథనం చేశారు. వారన్నట్టు 'కలాపములో కథాసంవిధానముకంటే రసస్మోరకమైన భావచిత్రణ నైపుణి సామాజికులకు అలంకారిక వైభవము'లు సాక్షాత్కరింపజేస్తుంది.19 విప్రలంభ శృంగారమే వివిధ స్థాయిలలో కనబడుతుంది. ఈ కలాపాన్నే విజ్ఞానసర్వ్పస్వంగా చేయడానికి మంచి దిక్కులు, వశీకరణ జౌషధాలు మొదలైన వివరాలన్నీ చేర్చారు. భఖామాకలాపంలో కన్నా గొల్లకలాపంలో ఎక్కువ విజ్ఞానచర్చ ఉంది.

సిద్ధేంద్రుడే గొల్లకలాపం కూడా రచించాడని చెప్పుకొంటారుగాని భావి పరిశోధనవల్లగాని యథార్థం తేలదు. భామాకలాపాన్ని ఆడేటప్పుడు ప్రదర్శనారంభంలో ఒక గోపిక ద్రేక్షకులకు వినోదం కల్లించేది. విదూషకుడు ప్రవేశించి అమెతో సంభాషించేవాడు. ఈ ప్రశ్నోత్తరాలు సుదీర్ణంగా సాగేవి. భామ రంగంమీదికి రావడానికీ ముందే ఇది జరిగింది. మాతృభూతయ్య రచించిన పారిజాతాపహరణం ప్రథమాంకం ఈ సంగతి రుజువు చేస్తోంది. కొంతకాలానికి గొల్ల కలాపాన్ని భామాకలాపం నుండీ పండితులు వేరుచేశారు. గొల్లభామతో విదూషకుని విపుల సంభాషణలు, వేదాంత చర్చా తూడా అర్వాచీనమైన కల్పన. క్రీ.శ. 1800 ప్రాంతాల ఇది ప్రారంభమై ఉండవచ్చునని నాట్యకళలో కృషి చేసినవారు భావిస్తున్నారు. దానిని భాగవతుల రామయ్యగారు రచించారని ప్రతీతి.

కొన్ని రాత్రులపాటు వరుసగా ఆడే ఈ ఆట భాగవతాల విశ్వరూప తెలుసుకోవాలంటే ప్రాచ్యలిఫీత గ్రంథాలయంలో భద్రంగా ఉన్న వివిధ వేష కథల వైనాలు తోడీకరించాలి. ఆ పట్టికను చూడండీ.

కృష్ణజననం - బాలెంత వేషకథ-0 1859; కృష్ణవేష కథ - అష్టభార్యలను అన్వేషించడం, రాధను కలవడం - 5 1860; కృష్ణవేష కథ - 0 1861; కృష్ణవేష కథ 0 1862 కృష్ణ విలాసం (ఏలలు, వెన్నెల పదాలు ఉన్నాయి). కర్త : వెన్నముద్ద గణపతి పెద్ద-9 186) గొల్ల వేష కథ. కర్త భారతి రామరాజు. సుంకర కొండడీ భాగోతం ఉంది. పోట్లదుర్తి హరికీ అంకితం-0 1873; గొల్లవేష కథ - 9 1874; గొల్లవేష కథ (సుంకర కొండడీ భాగోతం లేదు) -9 1875; గొల్లవేష కథ - 0 1876; గొల్లవేష కథ. ఆత్రేయపురం తమ్మయ్య రచన (సుంకరి కొండడు లేడు, రోత లేదు)-0 1877; గొల్లవేష కథ - ఏడిద భాగవతం - 9 1878, గొల్లవేష కథ (దుగ్గిరాల రంగసానికూతురు శ్యామలాంబ ఈ (గ్రంథం తాడీపర్తి చలమయ్య వద్ద చదువుకొంది. ఇదీ ఏడిద భాగవతమే) -0 1879; జలక్రీడ గోపికా వస్తాపహరణ కథ రచయిత ఎవరో తెలియదు. మాతృభూతయ్య పారిజాతంలో చివర ఈ ఘట్టం ఉండడం గమనించదగ్గ విషయం -0 1881; జలక్రీడ తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి అంకీతం - 9 1882; దాదిని వేష కథ అర్లమపాడువాసి ఎవరో కర్త (పగటి భాగవతులు ఈ వేషం వేస్తారట.) - 0 1886; పారిజాత ప్రబంధం (వెంకటగిరి సంస్థానంలోని వాడైన నరతూరి 20. ఆంధ్రుల నాట్యకళ, నటరాజ రామకృష్ణ, పుటలు జ, జి.

వారాయణతీర్థులు, సిద్ధేంద్రయోగి 755 నారాయణ రచన) - 0 1889; పారిజాత కథ (నరకతూరి మురారి ప్రస్తుతి ఉంది) - 0 1900; పారిజాత కథ. నందవరం సింగన్న రచన - ౨ 1901; పారిజాత కథ -0 1902; పారిజాతం (మాధవి పాత్ర, లేఖ ఉన్నాయి) - 9 1903; పారుజూతము (సింహాచలం భాగవతమా?) - ౨ 1904; పారిజాతాపహరణం - 9-1905; పారిజాత ద్విపద - 0 1906; భామావేష కథ - 01916; భామావేష కథ - 9 1917; భామా వేష కథ (రాధవేష కథ తూడా ఈ సంపుటిలో ఉంది.) - 9 1918; రాధావేష కథ (విప్రలంభ శృంగారం ఇతర భార్భలతూ ఇందులో ప్రవేశం ఉంది.) - 9 1933; రాధావేష కథ - ల 1934; రుక్మిణీ వేషకథ (రుక్కిణి విప్రలంభ శృంగార వర్ణన) - 0 1936; రుక్కిణీ వేష కథ - 9 1937.

పై ముష్ఫుయి గ్రంథాలు ఒక్క ప్రాచ్చ లిఖిత గ్రంథాలయంలో ఉన్నవి మాత్రమే. దేశంలో ఇంకా చాలా ప్రతులు ఉంటాయి. ఒక గ్రంథంలోని దరువులు ఇంకొక గ్రంథంలో కనబడవచ్చు. ఆటభాగవతాల సంప్రదాయం నిలువ నీరు కాదు. నిరంతరం పారుతున్న జీవనది. ఉపనదులను కలుపుకొనడం సహజం. ఆ

తాచిపూడి సంప్రదాయానికి మూలపురుషుడు సిద్ధేంద్రుడో. మరొక మహనీయుడో, కథ ప్రకారం జీవితంలో సన్యసించినా నృత్యవిద్యా సన్యాసం చేయలేదు. ఆయన గోలకొండ సుల్తానులను మెప్పించి భాగవతుల కోసం కూచిపూడి అగ్రహారాన్ని పొందాడట. క్రీ.శ 1672-1685ల మధ్య పాలించిన తానాషా అబుల్‌ హసన్‌ భామా కలాపాన్ని మెచ్చుకొని ఆ సక్కారం చేశాడని జనశ్రుతి. ఇది కృష్ణా జిల్లా దివిసీిమలో ఉన్న తూచిపూడి అగ్రహారమే అని స్థానికులు చెప్పుకొంటారుగాని లిఖిత పూర్వకమైన సాక్ష్యాధారాలు లేవు. ,

దివిసీమలోని కూచిపూడి ఎప్పట్నుంచి ఉందో నికరంగా చెప్పలేము. 1763 ఆగస్టు 24వ తేదీనాడు ఆ గ్రామంలో ఉండే 15 కుటుంబాల మహాజనులంతా బకమత్యమై వ్రాసుకొన్న ధర్మశాసన పట్టి ఒక్కటే ఇప్పటికి లఖిస్తున్న లిఖిత సాక్ష్య్యాలలో ప్రప్రథమమైనది. “1122 ఫసలీ పూర్వం మజ్నూరు గ్రామం కొంతకాలం నాటినుంచి అగ్రహారం బిలుమక్తా శ్రోత్రియం నడుస్తూ ఉండి నేటి వర్కు అనుభవనియ్యంగా ఉందే గనుక, ఆ పూర్వపు రాజులు వ్రాయించిన సృదలు పాయగన్క... తగాదాలు పెట్టుకొని...” తర్వాత ఒక్క ఒప్పందానికి వచ్చారు. ఈ పత్రంలో తానాషా అగ్రహారాన్ని ఇచ్చినట్టు లేదు. సిద్ధేంద్రుడు గాని, కూచిపూడి మూలపురుషుడుగాని ఈ పంపకాల పత్రం తారీఖుకన్నా చాలా ప్రాచీనులే

వివిధ ప్రముఖ విమర్శక పండితుల అంచనాల ప్రకారం సిద్ధేంద్రుడు 11వ శతాబ్దం మొదలు 18వ శతాబ్దం దాకా ఉన్న మధ్యకాలంలో ఎప్పుడేనా ఉండవచ్చు.! ఈ మహనీయుడు తూచిపూడి వారికి శిక్షణ ఇచ్చాడన్నది వాస్తవమైైతే ఆ కూచిపూడి దివిసీమలోనిది కాదు. దేశంలో చాలా కూచిపూడి గ్రామాలు ఉన్నాయి. మాచుపల్లి శైఫీయతు పేర్కొనే కూచిపూడి గ్రామం వినుకొండ - బెల్లంకొండ తట్టున ఉన్నదని

756 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటీ లోతప్సీళ్ళ వల్ల విశదమవుతోంది. “బ్రాహ్మణ భాగవతులనే 'వేషధారులు' చాలా విద్యావంతులు ఆ గ్రామం నుండి వీరనరసింహరాయల దర్శనానికి వెళ్ళారు (అయిశే వినుకొండ సీమ పదహారు సముతులలో 207 గ్రామాలున్నాయి. గాని వాటిలో తూచిపూడి లేదు). కొండవీటి సీమ పధ్నాలుగు సముతులలో తూచిపూడి ఒకటి. దీనిని దాచిన ధనంబు వంటిది తూచిపూడి అని చెప్పుకొంటారు. ఇది తెనాలి తాలూకాలో ఉంది. ఇదికాక రేపల్లె తాలూకాలో ఒక కూచిపూడి ఉంది. నెల్లూరు జిల్లా పొదిలి డివిజన్‌లో తూచిపూడి అనే జమీందారీ గ్రామం ఉంది. నల్గొండ బిల్లా కోదాడ తాలూకాలో జగ్గయ్యపేటకు మో దారిలో ఒక కూచిపూడి గ్రామం ఉంది.

పై కూచిపూడి గ్రామాలన్నింటిలో తెనాలి తాలూకా తూచిపూడీకే చాలా ప్రాచీన చరిత్ర ఉంది. మెకంజీ కైఫీయతలో ప్రత్యేకంగా ఒక కూచిపూడి స్థానిక చరిత్రను గ్రంథస్థం చేశారు.2 “కయిఫియ్యత్‌ కసుటే కూచిపూడి తాలూకే చింతపల్లి సర్కారు ముర్తుజా నగరు యిలాకే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహుదూర్‌ మన్నై సుల్తాన్‌” శీర్షికతో ఈ తూచిపూడీ కైఫియత్‌ చాలా వివరాలు విశదం చేస్తుంది. (1% 56 ౧? 65 %,)

తెనాలి తూచిపూడి సాధారణ గ్రామం కాదు. “కసుబా' ఈ మాటకు అర్థం పెద్ధ ఊరు, గుడిస్థలం. ఈ కసుబా కింద మొత్తం నలఖై నాలుగు గామాలు ఉండేవి. ఈ కసుబాలో పరశురామస్వాములవారు ప్రతిష్ట చేసిన రామలింగేశ్వర ఆలయం ఆదినుంలీ ఉఊంది. శాలివాహన శక సంవత్సరం 10566 అంటే క్రీ.శ 1134 నుంచీ ఈ తూచిపూడికీ చరిత్ర ఉంది. కైఫీయతు రచనా కాలం 1812 డీసెంబరు 26వ తేదీ నాటికి భారద్వాజ గో త్రీకులై పసుమర్తి వెంకయ్యగారు రామలింగేశ్వర ఆలయంలో అర్చకులు. ఈ తూచిపూడిలోనే శాలివాహన శకసంవత్సరాలు 1240 అంటే క్రీ.శ. 1318లో రెడ్లు ప్రభుత్వం చేసేటప్పుడు దేవాలయం కట్టించి శ్రీగోపాలస్వామి వారిని ప్రతిష్ట చేశారు. ఈ ఆలయానికి శైఫీయకు రచనా కాలం నాటికి ఆశ్రేయసగోత్రం వేదాంతం వారు అర్చకులు. పూర్వం నుంచీ ఈ కుటుంబం వారే అర్చకులు. వీరు వైఖానసులు.

ఈ కూచిపూడి శైఫీయతు వల్ల పసుమర్తి వారూ, వేదాంతం వారూ కొండవీటీ సీమలోని కూచిపూడి కసుబా గుడిలో ఉండేవారని తెలుస్తూంది. ఇక్కడ నుంచే కొన్ని కుటుంబాలవారు దివిసీమ తూచిపూడికి వలసవెళ్ళి అక్కడ స్థిరపడ్డారనీ, రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ట చేసుతున్నారనీ ఊహించడం ఏమంత కష్టంకాదు గానీ రుజ చేయడానికి ఇతోధికమైన ఆధారాలు కావాలి.

  • దివిసీమ కూచిపూడి పూర్వ చరిత్ర చుట్టూ ఇంకా దట్టంగా పొగమంచు తెరణ ఉన్నాయి. ఆ తెరలు తొలిగేదాకా నారాయణతీర్ణుల వారుగానీ, సిద్ధేంద్రుడుగానీ తూచిపూడికి సంబంధించినవారై కొండవీటి సీమలోని తూచిపూడిలోనే తమ ధనాన్స జ. కూచిపూడి గ్రామంయొక్క పూర్వోత్తరాలు - బ్రౌన్‌ పుట్టించిన లోకల్‌ రికార్డు అయిడో

సంపుటి 409వ పుట నుంచి.

చింతలపల్లి పండితులు - లయగ్రాహి కవులు - బోరవెల్లి సంస్థానం

మన సాహిత్యంలో ప్రఖ్యాతమైన పండిత కుటుంబాలు చాలా కనబడుతాయి. వారిలో చింతలపల్లి వారిది ముఖ్యమైనది. ఈ వంశంలోని ఒకానొకతరంలో పుట్టినవాళ్లంతా నూతన కాళిదాసులే అని ఒక చింతలపల్లి కవి భావించాడు. ఇది అతిశయోక్తి అని మనం కొట్టిపారవేసినా ఈ కుటుంబంలో తరతరాలనుంచి మంచి కవులు జనిస్తూ తమ అఖండపాండిత్యంలో రాజులను మెప్పించి, పండితులను ఒప్పించి, ప్రజల గౌరవానికి పాశత్రులయ్యారని అంగీకరించక తప్పదు. చింతపల్లివారిలో మనకు తెలిసిన అత్యంత ప్రాచీనుడు ఎల్లయ్యగారు. ఆయన అచ్చుతదేవరాయల కాలం నాటివాడు. అంటే క్రీశ 1530-1542 మధ్య జీవించాడు.

చింతలపల్లి ఎల్లయ్యగారు మంచి పండితులు; విద్వత్కవులు, సిద్ధాంత రాద్ధాంతా లలో రాటుకేరినవారు; కాళీభక్తులు. ఈయన తన కుటుంబంలో పుట్టినవాళ్ళంతా కవులే కావాలన్న వరం కోరుకొన్నారట. ఈయన హరితత్వ బోధనకు పుష్పగిరిలో ఉన్న దుర్గ ఇచ్చిన వరం సాక్ష్యమట. ఈయన గ్రంథకర్తట; గాని వ్రాసిన పుస్తకాల పేళ్లేమిటో తెలియవు. వీరిని అచ్యుతదేవరాయలు సత్కరించి వలపులాడి దుల్చులాడి అనే సహకార యుగ్మాన్నీ. చందనచర్చకు వీలుగా బహుళాగ్రహారాలు ఇచ్చారట. ఈ చింతలపల్లి ఎల్లయ్యగారు కమలాపురంలో కాపురం ఉండేవారు.

ఈయన కొడుకులూ, మనుమలూ ఏఏ కావ్యాలు చెప్పారో, ఏ రాజులను మెప్పించారో తెలియదుగాని మునిమనుముల పాండిత్యం మాత్రం తెలియవస్తూంది. ఎల్లయ్యగారికి జోగయ్య, వెంకటయ్య అనే ఇద్దరు మునిమనుమలున్నారు. ఇద్దరూ శవితాస్వాయత్తులే. వీళ్ళలో జోగయ్యగారు వైయాకరణి, నవ్యవరరుచి అని ప్రసిద్ధు డయ్యాడు. వరరుచి అంటే ప్రాచీన సంస్కృత ప్రాకృత వ్యాకర్తల పరమ ప్రామాణికుడు. ఈ జోగయ్యగారి తమ్ముడు వెంకటయ్య నైయాయికుడు. అన్నగారు వరరుచి అయిడే ఈయన అభినవ గౌతముడు. మన షడ్డదర్శనాలలో ఒకట్టున న్యాయానికి గౌతముడే సూత్రకర్త.

ఈ అన్నదమ్ములలో జోగయ్యగారికి మూర్తి కవి అనే కుమారుడు కలిగాడు. ఈయన విద్యాలంకారుడు. ప్రొఢాలంకారిక చత్రవర్తి. బహుశాస్త్రవేత్త. జ్యోతిషంలో అర్‌తేరినవాడు. ఇతడు తిరువళ్లూరు గ్రామంలో స్థిరపడినట్టుంది. తన కుమారునికి ఆ ఊళో

“సుప్రసిద్ధడైన దైవం వీరరాఘవుని పేరు పెట్టుకొన్నారు. మూర్తి కవి వ్రాసిన గ్రంథాలహే్లైనా

తెలియకపోవడం దురదృష్టమే. ఇతని కుమారుడు వీరరాఘవుడు గొప్ప పండితుడు. వైయాయికుడు, శాబ్దికుడు. ఈయన మట్ల అనంతరాజుగారి కొలువులో వేదపరీక్ష యిచ్చి ఉత్తీర్ణుడై వేయిచత్రాల బహుమానం పొందాడు. వీరరాఘవకవి అంతటితో ఆగలేదు. రాజువారివద్ద రాణువను ఏటి దళవాయితనం స్వీకరించాడు. రాణఖువసంబళాల నిమిత్తం చాలా గ్రామాలపై పెత్తనం చలాయించాడు.

7658 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చింతలపల్లి వీరరాఘవకవికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు లచ్చమాంబ; రెండో భార్య నరసమ్మ. వీళ్ళలో పెద్దావిడకెందరు సంతానమో తెలియదుగాని, రెండవ భార్యకు ఆరుగురు కొడుకులు. ఈ ఆరుగురూ నూతనకాళిదాసులని తరువాత కవి ఒకడు పొగిడాడు. వీళ్ళలో పెద్దవాడు గోపాలయ్య. ఇతడు జాములోపల ఆర్యాశతకాన్ని చెప్పాడట. ఇతనికి ఇద్దరు భార్యలు. వీరిలో రెండవామెకు శేషళాయి, ఛాయాపతి అనే కుమారులు కలిగారు శేషశాయి ఏవైనా గ్రంథాలు వ్రాశాడో లేదోగాని ఛాయాపతి మాత్రం రాఘవాభ్యుదయం అనే కావ్యం వ్రాశాడు. చింతలపల్లి వారెన్ని గ్రంథాలు బ్రాసినా, లభ్యమయ్యే మొదటి గ్రంథం ఇది. దీనిని ఆంధ్రప్రదేళ్‌ సాహిత్య అకాడమీవారు ప్రచురించారు. ఈ కావ్యం గురించి తరువాత చెప్పుకొందాం. చింతలపల్లి వీరరాఘవుని పెద్ద కొడుకు గోపాలయ్య గురించి, ఆయన కొడుకు ఛాయాపతి గురించి తెలుసుకొన్నాక చెప్పుకోతగ్గవారు. వీరరాఘవయ్యగారి నాలో కుమారుడు వెంకటయ్య. ఈయన సర్వతంత్ర స్వతంత్రుడు. ఎన్నో రాజసభలలో ప్రశంసలు పౌందాడు. ఇతడు తనకు పుట్టిన ఒక బిడ్డకు తన తండ్రిపేరే పెట్టుకొన్నాడు. ఈ చినకాఘవయ్య సకలశాస్త్రజ్ఞుడు. అభినవ సరస్వతీ వల్లభుడు. ఇతడు “మధురవాణీ విలాసం" అనే కావ్యం వ్రాశాడు. ఇదికూడా నేడు లఖిస్తూంది. ఇతని గురించి తరువాత చెప్పుకొందాం. పెదవీరరాఘవయ్య ఐదోకొడుకు పేరు అప్పయ్య. ఇతడు కవి. అవధానాలు చేసి దేశీయులను మెప్పించాడు. ఇతని కొడుకు పేరు సంజీవయ్య. ఈయన విద్యానిధి సాహితీనిపుణుడు. రాబస్థానాలలో వాగ్గాటీని ప్రదర్శించిన ప్రబంధకర్త. చంద్రాంగదో పాజ్యానంలాంటి కావ్యాలు వ్రాసి రాజులకు అంకితం ఇచ్చాడు. ఈ సంజీవ కవి చెప్పిన లంథాలేవీ ఇప్పుడు లభించడం లేదు. తరువాత తెలుసుకోవలసిన వ్యక్తి పెదవీరరాఘవయ్యగారి కడగొట్టువాడు యాగయ్య. ఈయన వేదపండితుడు. పురాణాలూ, ఇతిహాసాలూ బాగా మధథించినవాడు ఈయనకు నల్గురు కొడుకులు. వాళ్ళందరూ కళాభావజ్ఞులు. సంహితయాగ ప్రాజ్ఞాలు కవిత్వం తెలిసినవాళ్లు. ఇప్పుడీ చింతలపల్లివారి కుటుంబంలోని ముఖ్య వ్యక్తుల గురిచి ఒక్కసారి క్రోడీకరిద్దాం. బాంధవ్వం ఓ. | ఎల్లయ్య తాతగారిముత్తాత | వంశానికి మూలపురుషుడు అచ్యుతదేవరాయల కాలంవాడు. గ్రంథకర్త 2 | జోగయ్యతాత వైయాకరణి ౩ | వెంళటయ్య పినతాత నైయాయికుడు 4 | మూర్తికవి తండ్రి జ్యోతిష్కుడు - ౬ వీరరాఘవయ్య మట్ల అనంతరాజుచేత సత్కారాలు పొందాడు. దళవాయితనం చేశాడు. శ్రీశ 140.

చింతలపల్లి పండితులు - లయగ్రాహి కవులు - బోరవెల్లి సంస్థానం 759 & | గోపాలకవి పెద్దకొడుకు ఆర్యాశతకం చెప్పాడు. క్రీ.శ 1625 7 | ఛాయాపతి మనుమడు రాఘవాభ్యుదయం రచించాడు. (పెద్దకొడుకు ముద్రితం. క్రీ.శ 1650. కుమారుడు). ౬ | వీరరాఘవుడు | మనుమడు మధురవాణీవిలాసం వ్రాశాడు. (నాలో కొడుకు (అముద్రితం) కొడుకు) 9. | సంజీవ కవి మనుమడు చంద్రాంగదోపాఖ్యానం (ఐదో కొడుకు వ్రాశాడు. (నష్టం) కొడుకు ఈ పట్టికద్వారా తెలిసిన వ్యక్తులలో ఇద్దరి గ్రంథాలే లభ్యం అవుతున్నాయి. వారిలో మొదటివాడు- గోపాల కవికుమారుని గురించి చెప్పుకొందాం. చింతలపల్లి ఛాయాపతిః ఇతడు తాను చాలా గొప్పవాడినని తాను బ్రాసిన రాఘవాభ్యుదయంలో చెప్పుకొన్నాడు. ఆంధ్రగీర్వాణభాషలలో నవఘంట సురత్రాణ బిరుదాంకితుడు. సర్వంకషప్రజ్ఞి కలవాడు. అష్టావధానాలు చేశాడు. వ్యస్తాక్షరిలో గొప్ప ప్రతిభ ఉంది. ద్విసంధా ప్రావీణ్యం కలవాడు. కొత్త శోకాలను అనులోమ విలోమ క్రమంలో పఠించగలడు. ఇతడు మురళిగోపాల భక్తుడు. తిరుమల శ్రీనివాసాచార్యులవారి శిష్యుడు. తన గురువుగారినితడిలా నుతించాడు: తద్దితమూడఢుడైన నను తద్ధితమూడుని జేసి వాక్యసం సిద్ధి ఘటించినట్టి బహుచిత్రిత శాస్త్రలాపధన్యులన్‌ ఇద్ధవదాన్య తిర్భలకులేశ్చర మాన్యుల శ్రీనివాస స ద్భుద్ధి మదగ్రగణ్యులను బుణ్యుల మాన్యుల సన్నుతించెదన్‌. _ (రాఘవ. 1-21) “తద్ధితమూఢాఃపాణినీయా?" అనే సామెతను ఇలాగ చమత్కరించాడు. ఇటువంటి చమత్కారాలు రాఘవాభ్యుదయంలో చాలా చేశాడు. ఈ కావ్యాన్ని ఛాయాపతి కేశవస్వామికి అంకితం ఇచ్చాడు. ఇతడు బోరవెల్లి సంస్థానంవారి ఇష్టదైవం. ఈ రాజ్యం ఇప్పుడు గద్వాలలో కలిసిపోయింది. గాని ఒకనాడు స్వ్పతంత్రరాజ్యంగా ఉండేది. బోరవెల్లిని క్రీ.శ 1360 ప్రాంతాలలో వెంకటరెడ్డి అనే ప్రభువు పాలిస్తూ ఉండేవాడు. ఈయన ఛాయాపతిని తన ఆస్థానానికి రమ్మని అర్ధించాడు. అప్పటిదాకా ఛాయాపతి దేవరకొండసీమలోని బోయినపల్లిలో ఉండేవారు. బోరవెల్లి వెంకటరెడ్డి పిలిపించి, ఒక కృతి చెప్పే కేశవస్వామికి సమర్చించమని ఛాయాపతిని కోరాడు. కవి అంగేకరించాడు. ఛాయాపతికి _ కవిత్వంపట్ల, _కవులపట్ట కృతినాయకులపట్ల కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. హీననాయకాధీనాలు చేసే కృతులు కీర్త్‌కెక్కవని చెప్తూ పూనుక సత్కవుల్‌ కృతులు పూని రచింతు మటంచునూరకే న్యూనత సంతరించుకొను టొక్కటే కాని ధరిత్రిలోన దు ర్మానసదుర్యశోదురఖిమానదురా గ్రహ హీననాయకా ధీనము చేయుకబ్బమది దిక్కుల నిక్కునె కీర్తి కెక్కునే? (రాఘవా, 1-ఊ)

760 పమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి హీననాయకులకు అంకితం ఇస్తే వశముచెడినా సుఖము దక్కదని ఛాయాపతి ఉద్దేశం. పట్టుమని కాసు చేతం

బెట్టెడువా డొకడు లేడు బీదల కిలలో

కట్టెడి లోఖి నరాధము

లిట్టి దురాత్కులకు సుకృతు లీయందగవే? (రాఘవా. 1-5) కృతి భర్త గురించి ఇటువంటి అభిప్రాయం ఉన్నట్టే కృతికర్త గురించి కూడా అతనికి నమ్మకాలున్నాయి. సుకవి ఇలాగ ఉంటాడని చెప్పాడు:

శుచియు దక్షుండు శాంతుండు సుజననుతుడు

సూనృతోక్తి కళావేది శోభనాంగు

డాత్మదైవజ్ఞుడు కృతజ్ఞు డగ్రకతులజు

డతి మధురవాగ్శి ఛందస్వి యతడు సుకవి (రాఘవా. 1-41) అగ్రకులజుడు కానివాడు సత్కవి కాడని ఆనాడు చాలామంది నమ్మేవారు. ముఖ్యంగా అగ్రకులంవారే ఇది ప్రచారం చేశారు. ఛాయాపతికి కూడా భావన అదే.

ఈ ప్రబంధ సద్పాషితాలు చాలా ప్రభావం గలవని ఛాయాపతి నమ్మకం. అయికే అగ్రకవులు మునుపటి మహానుభావులలాగ ఈనాడు తమ మహత్తు చూపలేకపోతున్నారు. దీనికి ఛాయాపతి ఇలాగా సంజాయిషీ ఇచ్చాడు.

కేవలసరసవదాన్యుం - డీవసుమతి లేడు, కలిగెనేని కవిత్వ

శ్రీవెలయకజేసి కవులు ప్ర-భావంబులు సూపరే ప్రబంధ క్రియలన్‌?

(రాఘవా. 1-4)

ఛాయాపతి గొప్ప ధిషణాహంకారంతో “ఆ మేటి కవిప్రభావంబుల మించే

వచింపరు నేటివారలున్‌” అని పూర్వకవులతో సాటి తెచ్చుకొన్నప్పుడు ““మునుపటీ

కవులలాగ మీరెక్కడ పద్యాలు వ్రాయకలరు? “బాణోచ్చిష్టం జగత్రయం' అని కదా” అని ఎవరో అన్నారు. దానికి ఛాయాపతి కోపం తెచ్చుకొన్నాడు.

మొగి వర్తకు డొఠచో మణు-లగపడి చెడనాడ వార్ధియవగత సారం

బగునెటు “బాణోచ్చిష్టం - జగత్రయం' బన నిషేధశాస్త్రం బగునే?

(రాఘవా. 1-8)

ఇంతతో ఆగక ఛాయాపతి ఇంకా రెండు పద్యాలు చెప్పాడు. “ధర్మార్థ కామ మోక్షాధికార కారణాకారరేఖానుకార సారశారద సదాక్షరస్వర శబ్దమూర్తి' అటువంటీదీ “బాణునుచ్చిష్ట మగుననె పాపమేమి?' అని ప్రశ్నించాడు (1-53). అసలు ప్రపంచమే ధర్మపాలన లేనందువల్ల కలుషితం అయిందని అతని ఉద్దేశం. (రాఘవా. 1-67). ఛాయాపతికి ఉచితబ్ఞుడై బహుళదాతగు నేత దొరికాడు. బోరవెల్లి వెంకటర్తో బాగా సత్కరించి దేవునికే కావ్యాన్ని అంకీతం చేయించాడు. ఛాయాపతి షష్ట్యంతాలు

చింతలపల్లి పండితులు - లయగ్రాహి కవులు - బోరవెల్లి సంస్థానం 761 తొమ్మిది పద్యాలు వ్రాశాడు. సాధారణంగా అందరు కవులూ ఈ పద్యాలలో ' అభ్యుదయ పరంపరాఖివృద్ధిగా నాయొనర్చ్పంబూను' అని వ్రాస్తారు. ఛాయాపతి అందరిలాంటివాడు కాదు. షష్ట్యంతాల తరువాత ఇలాగ బ్రాశాడు:

“గక్రేశవస్వాములకున్‌) సమర్ప్చితంబుగా నవరసానుప్రాసభాసుర వృత్తి చ్చేకాద్య లంకార పాత్రచిత్ర కవితానుబంధంబుగా నా యొనర్చంబూనిన రాఘవాభ్యుదయంబను మహాప్రబంధమునతు”, (రాఘవా. 1-158) ఇందులో చెప్పినట్టే కావ్యంలో శబ్బాలంకారాలు, చిత్రకవితలు ఉన్నాయి. ఛాయాపతి టోలెడు బంధాలు, చిత్రాలు, ముద్రాలంకారాలు ఈ కావ్యంలో చెప్పాడు. వాటి వివరాలివి : ఐబంధకవిత్వంః

  1. ఖడ్గబంధం (1-210) 7, ఛత్రబంధం (4-245)

  2. తులాలికాచక్రబంధం (1-211) 8. ఛత్రబంధం (4-246)

  3. చంద్రహాసబంధం (2-27) 9. భుజగరాజబంధం (5-215)

  4. ఛత్రబంధం (2-258) 10. చత్రబంధం (6-362)

  5. శకటచక్రబంధం (3-29) 11. ఖడ్గబంధం (6-34)

  6. పుష్పమాలికాబంధం (3-294) చిత్రశనిత్వం:

  7. ఉభయార్థదచ్చేదకత్రయ వినోద కందం(5-216)

  8. విలోమార్థపూరణీయానులోమ కందం (5-217) ముద్రాలంకారాలుః

  9. ఉత్సాహ (1-207)

  10. భూనుత (1-208)

3౩. మాలిని (1-209, 5-212)

  1. ప్రగ్విణి (2-254)

  2. మంజుభాషిణీ (2-254)

  3. పంచచామరం (2-250, 3౩-299, 4-242)

  4. తరళ (3-210)

  5. కవిరాజవిరాజితం (3-291. 6-359)

  6. భజంగప్రయాతం (3౩-292)

  7. మజణీగణనికరం (4-24)

  8. శరశ్చంద్రశ్రీవృత్తం (4-244)

  9. మహాస్రద్ధర (5-211)

  10. వనమయూరం (5-213)

  11. మత్తకోకిల (56-214)

  12. మంగళమహీశ్రీ, (6-౫1)

762 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఇన్నిరకాలుగా చిత్రాలు చూపించి ఛాయాపతి షష్ట్య్రంతాల తరువాత చిత్రకవితానుబంధంగా ఈ కావ్యాన్ని బ్రాస్తానని చెప్పుకొన్న మాట నిలబెట్టాడు. ఇడి అరాశ్వాసాల కావ్యం. కాళిదాసు రచించిన రఘువంశానికి ఇది కొంత అనువాదం అందులోని 4, 5, 6, 7 సర్గలలోని కథ ఆధారంగా ఛాయాపతి దీనిని రచించాడు కొన్నిచోట్ల మూలాన్ని యథాతథంగా అనువదించాడు; కొన్నిచోట్ల తనకు నచ్చినట్లు ఉర్జూమాటలు, మాండలికాలు జొప్పించాడు. కొన్నిచోట్ల వ్యాకరణ మార్గాలను తప్పించాడు. ఈ కావ్యాన్ని వి. రామరాజుగారు పరిష్కరించారు. అంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారు 1965లో ప్రకటించారు. ఈ [గ్రంథం అచ్చుపడడంవల్ల ఎన్నో విషయాలు తెలిశాయి. ఇది మన సాహిత్యం చేసుకొన్న అదృష్టం. అయిడే ఛాయాపతి పినతండ్రి కొడుకు చినవీరరాఘవయ్య వ్రాసిన మధుర వాణీవిలాసం ఇప్పటికీ వెల్లుచూడకపోవడం శోచనీయమే. తెలిసినంతమటుకు అతన్ని గురించి చెప్పుకొందాం.

చింతలపల్లి చినవీరరాఘవనయ్య: ఇతడు కూడా ఛాయాపతిలాగే చి త్రకవితాఖినీకుడు. నానావిధాలయిన అవధాన లాషువం గలవాడు. సాహిత్యం, కవిత్వం, వివిధశాస్త్రప్రజ్ఞ తత్స్వబోధ, త్రిస్కంధాత్మకమైన జ్యోతిషం ఆయన స్పాభావాలట. ఈ చినవీరరాఘవయ్య ఒకసారి రాయదుర్గంలో జాములోపల ఒక శతకాన్ని చెప్పి కంకణాలు మొదలైన బహుమానాలు పొందాడు ఇతడు రకరకాల అవధానాలు చేస్తే ఎవరో మల్లధీరుడు మెచ్చుకొని నాలుగు నగలూ, ఒక గుర్రం ఇచ్చాడు. ఇతడు పాండిత్యంతో చాలా కీీ గడించాడు. ఇతని కొకనాడు తిరుపతి వెంకటేశ్వరుడు కలలో కనబడి తనపేఠ మధురవాజణీవిలాసం అనే కావ్యం చెప్పమన్నాడు. మధురవాణి పాంచాల రాజుకుమార్తె. ఈమెను కార్త్యవీర్యార్డునుడు పెళ్లిచేసుకొన్నాడు. ఈ కథను చినవీరరాఘవయ్య ఎన్ని ఆశ్వాసాలలో చెప్పాడోగాని ఇప్పుడిది కొంత అసమగ్రంగానే దొరుకుతుంటీ మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో రెండు ప్రతులున్నాయి. చినవీరరాఘవయ్య త్రిస్కంధాత్మక బ్యోతిషంలో పండితుబ్దని చెప్పుకొన్నాడు. అందుచేత కవిత్వంలో కూడా జ్యోతిషాన్ని బాగా జొప్పించాడు. పెళ్లికి లగ్నం పెట్టే ఘట్టంలో నాలుగైదు పద్యాలు వ్రాశాడు:

ప్రభుని యుక్తి ననంత ప్రభావలగ్న వీక్షణమొనర్చ వచ్చినారిటకుగాన

ప్రభునియుక్తిననంతప్రభావలగ్నవీక్షణ మొనర్చుటిది మీకువిహితమనుచు॥

దైవజ్ఞు లన నితర పర దైవజ్ఞుల జేరి చేరి తగు వేడుకతో

భావజ్ఞులు మీరలు ప్రతిభావజ్ఞులు లగ్న మొకటి పరికింపుడనన్‌ ॥

కలితపంచాంగుల గతి కరస్థము చేసి కునవాంశమొకటి చేకొదువచేసి

రాజస గ్రహవృత్తి రాశిగా నిర్మించి నేర్పుతో విషనాడి నెరి గమించి

చిత్తజామిత్రమౌ స్థితి వింగడమొనర్చి జాతిదోషములు చేజేతదీర్చి

స్పామిసంగతి రీతి సొమ్యుదృష్టి దలంచి భావంబు శోభనప్రాప్తి గాంచి

ప్రముఖవీక్షి తచం ద్రతారకబలము

గతిగి చెన్నొందుచెలిఆ-నెకన్నాయౌట

చింఠలపల్లి పండితులు - లయగ్రాహి కవులు - బోరవెల్లి సంస్థానం 763

కన్య కనుకూలమగునుగా కన్య కిట్టి

గణీతవితరణ లగ్నవిఖ్యాతి గలదె? (0 372, 5వ అశ్వాసం. 19-21) గణీతమంటే చినవీరరాఘవయ్యకు ఇష్టం. సంప్రదాయసిద్ధమైన కల్చ్పనాపాండిత్యం కూడా ఉన్నవాడే. అయితే తగిన నాధుడు లేకపోవడంచేత ఇతడు కవిత్వాన్ని విడీచిపెట్టేద్దామను కొన్నాడు.

నిజమే. “కావిద్యా కవితా వనా?' అయినా రసజ్ఞుడు లేనిదే, ఏ కవిగారి మధురవాణీ వినిపించదు. ఈ సంగతి చినవీరరాఘవయ్య తన కావ్యంలోనే శ్లేషించాడు.

అల రసజ్ఞుని పొడగాంచునది మొదలుగ

మధురవాణికి తెల్వి యను మరులు దోచె

అల రసజ్ఞుని పొడగాంచునది మొదలుగ

మధురవాణికి తెల్వి ధర్మంబెగాదె (0 372-366)

చినవీరరాఘవయ్య ఏి రసజ్ఞుని పొడగాంచాడో మనకు తెలియదు. ఛాయాపతిలాగే ఇతడు తూడా బోరవెల్లివారిని ఆశ్రయించాడో లేదో చింతలపల్లివారికే కాక ఇతర కవివంశాలకు తూడా బోరవెల్లి రాజకుటుంబం ఆశ్రయం ఇచ్చింది. భఛాయాపతిచేత రాఘవాభ్యుదయం చెప్పించిన వెంకటరెడ్డి బోరవెల్లి వారికి దత్తపుత్రుడు. గద్వాల సంస్థానం స్థాపించి క్రీ.శ. 1683-1712 దాకా పెదసోమనాద్రి పాలించాడు. ఇతని కుమార్తె గిరియమ్మ. ఈమె తనకు పిల్లలు లేకపోతే తన బావగారి అబ్బాయి వెంకటరెడ్డిని పెంచుకుంది. కవులను పోషించడం ఇతడు పెంపుడుతల్లి దగ్గరే నేర్చుకొన్నాడు. ఈమె వనితాశిరోమణి. ఎందరో విద్యార్థులకు అన్నంపెట్టి చదివించింది. కవులను పోషించి కృతులను చెప్పించింది. ఇప్పించింది. ఆ గ్రంథంలో కవి ఈమె చేసిన సత్కార్యాల నిలా నుతించాడు:

కట్టించె కేశవాగారంబు భూమిపై బరగు కుబేరపుష్పుక మనంగ

సేవించె నారామసితు కాశీ మధ్య వ్యస్థలంబులు తెగువమీర

వేయించె వనము లుర్చిని చైత్రరథనందనోద్యానముల కీతి హృద్యముగను

చదివించె విద్యార్థిజనుల కన్నము బెట్టి వేదశాస్త్రపురా ఇవిద్యలెల్ల

జన్నములొనర్చ జేసినిర్జరగణంబు

గణుతియొనరింపవి ప్రసపంఘములచేత

ననుచు ప్రజలెల్లవర్ధిల్లై ననుదిసంబు

పరమసద్దుణనికురంబ గిరియనూంబ॥ (కౌసలే, 1-%)

ఈమె వేయించిన అన్నసత్రాల గురించి మరొక చక్కని వర్ణన గరుడాచలం వ్రాశాడు. ఒకనాడు బ్రహ్మ నారదుణ్ణి చూసి వేసిన ప్రశ్నలూ, వాటికి కొడుకు చెప్పిన సమాధానాలూ కవి వ్రాశాడు:

పుత్రక, యెందుబోయితివి? బోర్పెలిలో గిరియమ్మ బెట్టు ఐ

ల్సత్రములో భుజించుటకు। సత్రవేేషము లేమి? చూడు నా

764 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటి

గాత్రముః శ్రావితో సుధ? జగజ్జనులందరు ద్రా(వ)త్రావుటి

చిత్రము నే నటంచు వచించును బ్రహ్మకు నారదుం డటన్‌. (కౌసలే. 1-౪)

బోరవెల్లి గిరియమ్మ వేయించిన సత్రంలో నారదుడు తిన్నాడో లేదో గాని గరుడాచలం భుజించే ఉంటాడు. ఇతడు ఉభయభాషానిరంకుశుడు. అష్టభాషా కవిత్వ సంపన్నుడు. చింతపల్లివారివి, లయగ్రాహివారివి కూడా పండిత కుటుంబాలు. చింతలపల్లివారి మూలపురుషుణ్జి అచ్భుతదేవరాయలవారు సత్కరిస్తే లయగ్రాహివారి మూలపురుషుణ్ణి కృష్ణదేవరాయలవారే ఏనుగులిచ్చి సన్మానించారు. గరుడాచలం తన తాతగారి ముత్తాత గురించి ఇలా బ్రాళాడుః

మాధవభక్తియుక్తు డసమానకవిత్వగురుండు కృష్ణరా

యాధిపదత్త సద్గజి వరాది మహాబహుమానశాలి గం

గాధరకీర్తిసాంద్రుడు మతక్కులేంద్రుడౌ

మాధవు డస్కదాదులకు మాన్యుడు గాడె దలంచి చూచినన్‌! (కౌసలే 1-11)

అసమాన కవిత్వగురుడైన మాధవుని కుటుంబంలోని వాళ్లుకూడా అంతా కవులే అయితే, ఈ లయగ్రాహి వారి రచనలలో ఒక్క గరుడాచలం వ్రాసిన కౌసలేయ చరిత్రం మాత్రమే నేడు దొరుకుతూంది. ఇది అముద్రితం. ఈ కవి గురించి, ఇతని పోషతురాలిని గురించి తొలిసారి మిత్రులు వి. రామరాజుగారు తెలియజేశారు. భఛాయాపతి రాఘవాభ్యుదయంలాగే ఈ కౌసలేయచరిత్రం కూడా ముద్రించాలి. ఈ కవులను పోషించిన నాడగౌడు ముష్టిపల్లివారి వంశంలో గగ్రంథకర్తలు తూడా కొందరు లేకపోలేదు గిరియమ్మకూ, ఆమె దత్తపుత్రుడు వెంకటరెడ్డికీ ఏమవుతాడో తెలియదుగాని గద్వాలలోని రాజులలో ఉండే ఒక నాడగౌడు ముష్టిపల్లి వెంకట భూపాలుడు తూడా కావ్యాలు బ్రాళాడు. “దివ్యదేశమాహాత్మ్యదీపిక అనే చిన్న ద్విపదకావ్యాన్ని బ్రాశాడు. ఇందులో 1% దివ్యతిరుపతుల వివరాలున్నాయకు. ఈయనే రాజవోలి వెంకటిశ్చర శతకం, రాజనోలి వెంకటేశ్వర కీర్తనలు బ్రాశాడు. ఇవి ఒకటీ రెండూ కావు. 3,476 కీర్తనలు, ఇవన్నీ అముద్రితాలే. ఈ ముష్టిపల్లి వెంకటభూపాలుని గురించి తొలిసారిగా దేశానికీ తలియజేసీన వి రామరాజుగారు ఈ కవి 17వ శతాల్లీ చివరనో, 18వ శతాల్లి మొదటనో ఉంటాడని భావిస్తున్నారు. “పరమభక్తాగ్రేసరుడైన ఈ ప్రభువు అంధ్ర వాగ్గేయకారుల యగ్రశ్రేణీలో జేరదగినవా'డని మనవి చేశారు. ఇతడు చింతలపల్లి కవులకు సమకాలికుడేమో భావిపరిశోధనవల్ల తేలాలి. బోరవెల్లి సంస్థానం శ్రీ.శ 1689లో గద్వాలలో విలీన అయింది. గిరియమ్మ దత్తపుత్రుడే దానికి ఉమ్మడి ఏలిక అయ్యాడు. “గద-వాలు' కలిసిన సంస్థానానికి బోరవెల్లివారు గంటంతూడా ప్రసాదించారు. ఈ సంస్థానం ఒకానొక పండిక కుటుంబానికి ఇంటిపేరు కూడా అయింది. దాని సంగతి తరువాత తెలుసుకుందాం.

  1. మరుగుపడన మాణిర్యాలు,పుటలు & ముండి 90,
  2. మరుగుపడిన మాణిక్యాలు, పుటు ఈ
  3. వఫంలత్రహాంధ్ర విజ్ఞానతోశం, ౩న సంపుటి, పుటు 305.

కాకునూరి అప్పకవి

నిన్నటిదాకా మన తెలుగు పండితులు దేవున్జైనా భయపడేవారు కాదుగాని ఇద్దరి పేర్లు చెపికేచాలు, ఎక్కడలేని భయభక్తులూ చూపించేవారు. వారిలో ఒకరు కాకునూరి అప్పకవి. రెండో ఆయన పరవస్తు చిన్నయసూరి. ఈ ఇద్దరూ వ్యాకరణ గ్రంథాలే బ్రాశారుగాని అప్పకవిగ్రంథం ఛందోగ్రంథంగానే చలామణి అవుతోంది. అప్పకవి నాయకరాజుల కాలంవాడు. చిన్నయసూరి నిన్నటివాడు. ఈ ఇద్దరు చెప్పిన లక్షణాలకు లొంగని పూర్వకవి ప్రయోగాలను దిద్దిపారేయడాన్దైనా మన పరిష్కర్తలు వెనుదీయలేదంటే ఈ లాక్షణితుల ప్రభావమెంతో బోధపడుతుంది. ఈ ఇద్దరి గ్రంథాలకూ ఎవరో నన్నయగారు బ్రాశారనుకొనే ఆంధ్రశబ్దచింతామణే మూలం.

వాస్తవానికి అప్పకవి తన పుస్తకానికి తూడా ఆంధ్రశబ్దచింతామణీ అని పేరు పెట్టాడు. అయితే దానిని సాహిత్యలోకంలో అప్పకవీయం అనే పిలుస్తున్నారు. మన భాషలో లక్షణగ్రంథాలను వాటి రచయితల పేర్లతో పిలవడం రివాజే. భీమన కవిజనా శ్రయాన్ని బ్రాశాడనుకొని దావికి ఖీమనఛందం అని పేరు పెట్టారు. అనంతామాత్యుడు విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణీ రచిస్తే దానిని పెద్దిరాజు అలంకారం అని పూర్వంనుండీ పేర్కొనేవారు. అదే నేడు పరమప్రామాణికమైన లక్షణగ్రంథం. దీనిని అప్పకవి “పౌరపాదపం” అన్నాడు. అది నిజంగా కల్చ్పతరువే. పాలసముద్రంలోంచి కల్చచ్భృక్షం వ్రాయడానికి చాలా కృషి చేశాడు. అతడు చక్కని పండితుడు. కవిత్వాన్నే విద్యగా భావించే సాహితీపరుడు. లోకోపకారంకోసం తన పాండిత్యాన్ని వినియోగించిన మహనీయుడు. అతని వైదుష్కం అసమానమైనది. వాస్తవానికి కాకునూరివారింట్లో అందరూ పండితులే. అప్పకవి తకాతముత్తాతలు తమ విద్యతో ఎందరో రాజులను మెప్పించి అగ్రహారాలు పొందారు.*

“కాకునూరి అగ్రహారం పూర్వం చరికొండసీమలో ఉండేది. ఇప్పుడాప్రాంతాన్ని దూరంలో లేమావిడి అనే గ్రామం ఉంది. ఇక్కడే అప్పకవి తాతగారి తాత కాపురం ఉండేవాడు. వారి కుటుంబంలో ఏ శుభకార్యం వచ్చినా ముందు సరస్వ్పతీపూజే చేస్తారంటే వాళ్ళు విద్యతెంత ప్రాముఖ్యమిస్తారో ఊహించవచ్చును. అప్పకవి తాత పెదసోమయ్య పండితుడే కాక శ్రీమంతుడు. ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. లోతులు వాడుకొనేందుతు నూతులు తవ్వించాడు. పశువులు తాగడానికి కుంటలు కట్టించాడు. త్రోవలో మజిలీ చేయడానికి తోటలు వేయించాడు. అప్పకవి తండ్రీ వెంగన్న గొప్పు వేదపండితుడు. పల్నాటిసీమలో నూటతొంలైనాలుగు గ్రామాలలో అటువంటి వేదవేదాంగవేత్త లేడు. అందుకే “మారట బ్రహ్మ అని లోకులతనికి దండం పెట్టేవారు.

  1. తొలి రాయలయుగం. సమగ్రాంధ్రసాహిత్యం, మొదటి సంపుటి

766 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

తండ్రీవంక వారిటవంటి పండితులైడే అప్పకవి తల్లివంకవారు కవులు. వాళ్ళు ఏవ్లో ప్రబంధాలు వ్రాశారు. అప్పకవి తన మేనమామల ఇంటనే కామెపల్లెలో పెరిగాడు. ఇది కృష్ణానదికి దక్షిణాన పల్నాడు తాలూకాలో ఉంది. బహుశా ఈ గ్రామంలోన్సో, పరిసరాలలోనో అప్పకవి చదువుకొన్నాడు. అతని విద్య బహుముఖాలది. మూర్తి సర్వన్నగారి దగ్గిర యజుర్వేదం చెప్పుకొన్నాడు. కాండూరి గిరయ్యగారి వద్ద వ్యాకరణం చదువుకొన్నాడు. సూరభట్టుగారు సకలసిద్ధాంతాలూ నేర్పారు. వీటికి తోడు కొలిచెల మల్ల సింగన్నగారి దగ్గిర స్మార్హకర్మలు తెలుసుకొన్నాడు. రాజయోగిగారివద్ద ఆగమాలు ఉపదేశం పొందాడు. ఇవికాక మంచికంటి ఓబన్నుగారనే కవి దగ్గర లక్షణ గ్రంథాలు చదువుకొన్నాడు. ఆయనే అప్పకవిని ఒక లక్షణకవిగా తీర్చిదిద్దాడు.

ఇంత చదువు చదువుకొన్నాక అప్పకవి శ్రీశైలం వెళ్లాడు. ఆ రోజుల్లో ఎవరో భోగి విభూషణుడనే ఆయన ఆ ప్రాంతాలకు అధికారి. అతడి పట్టపుకవిగా కొన్నాళ్లపాటు అప్పకవి శ్రీశైలంలో ఉనిల్నడు. సంస్కృతంలోనూ, ఆంధ్రంలోనూ పుస్తకాలు రచించాడు స్మార్హకర్మల గురించి బాగా తెలుసుకొన్నవాడు కావడంచేత దానికో నిబంధనగ్రంథం వ్రాయాలని ఆపస్తంబ షట్కర్మనిబంధనమనే సంస్కృత రచన చేశాడు. అప్పకవి పెదతాశ తిరుమలభట్టు గొప్ప జ్యోతిష్కుడు. ఆయన కాలామృతం అనే గ్రంథం వ్రాశాడు పెదతాతగారిలాగే అప్పకవి కూడా జ్యోతిష్యంలో కృషి చేశాడు. కాలబాలార్జవ సంిశ అనే జ్యోతిషగ్రంథానికి శోకరూపమైన సం[గహాన్ని, వ్రాశాడు. ఈ సంస్కృత రచనలే కాక స్రీలకు పనికివచ్చే “సాధ్వీజనధర్మం' అనే ద్విపదకావ్యాన్ని, “అనంతవ్రతకల్ప' మనే కావ్యాన్ని వ్రాశాడు. శ్రీశ్రలంలలో ఉండడంవల్ల ఆ దేవునిమీద నిందాస్తుతితో శ్లేషగర్పితమ్చైన శతకం ఒకటి చెప్పాడు. అ రోజులలో ఉద్దండపండితులైనవాళ్లుకూడా ప్రదర్శనార్థం వీటితోపాటు “కవికల్పకం' అనే లక్షణ గ్రంథాన్ని రచించాడు. ఇది బహుశా మంచికంటీ ఓబన్నగారి ప్రోద్చలంవల్ల బ్రాశాడు కాబోలు. వారికి కృతజ్ఞత చెప్పుకొంటూ “నన్ను లక్షణవేత్త గావించిన ఘను మంచికంటి యోబన కవీంద్రుదలతు' అని అప్పకవీయంలో గురుస్తుతి చేశాడు. అప్పకవి వ్రాసిన ఈ గ్రంథాలలో ఏ ఒక్కటీ నేడు దొరకదు.

ఇవన్నీ ఆయన క్రీ.శ. 1656కి పూర్వమే వ్రాశాడు. అది మన్మథ సంవత్సరం. ఆ యేడు కృష్ణాష్టమినాడు మడికట్టుకొని కల్పోక్సమార్గంలో సంకల్పం చెప్పి కామెపల్లిలోని గోపాలస్వామి ఆలయంలో అప్పకవి పూజలు చేశాడు. ఆ రాత్రంతా పురాణశ్రవణంతో గడుపుతున్నాడు. కాని ఒక రాత్రప్పుడు చిన్న తునుకుపట్టి పెద్ద కల వచ్చింది. అందులో రెండుపక్కలా ఇద్దరు కాంతలు, రెండు చేతులా పరికరాలున్న పరమాత్ముడు కనిపించాడు ఆ ఆయుధాలను చూసి అతడు దేవుడని అప్పకవి గుర్తించాడు. భక్తుడు తనను పోల్చుకొన్నందుకు దేవుడు సంతోషించాడు. స్వయంగా పరిచయం చేసుకొన్నాడు. పెళ్ళాల పేర్లు చెప్పాడు. తరువాత పాతిక పద్యాలలో తను వచ్చిన కార్యాన్నీ, అప్పకవి చేయవలసిన కావ్యాన్నీ వివరించాడు. 2. నరసరావు పేట తాలూకాలో మరో కామెపల్లి ఉంది. అయికే పల్నాడు తాలూకాలోనిదే అప్పకవి

మేనమామల ఊరని భావించడం సమంజసం.

కాకునూరి అప్పకవి 767

“నన్నయఫక్కి. అనే కావ్యం ఉంది. దాన్ని అప్పకవి తెనిగిస్తే శాశ్వతమైన కీర్తి వస్తుంది. ఆ భక్తునిమీద ఉండే ప్రేమకొద్దీ దేవుడు ఇలా అదేశించాడు. అయితే అంతకుముందు ఈ నన్నయఫక్కీ గురించి ఎవరూ కనీ వినీ ఎరుగరు. అప్పకవి దాని ముఖం కూడా చూడలేదు, పురమే లేదు, అంతఃపురమేమిటి? పుస్తకమే లేదు - దాన్ని తెనిగించడం ఎలాగ అని అప్పకవి బాధపడకూడదని దేవుడు చెప్పాడు. ఆ పుస్తకం లభించే మార్గం విశదపరిచాడు. అసలు నన్నయఫక్కీ ఎలా పుట్టిందో తెలియజేశాడు.

ఆదిలో నన్నయగారు ఆంధ్రశబ్దచింతామణి అనే వ్యాకరణాన్ని ప్రప్రథమంగా రచించారట. దానిలోని సూత్రాలను ఆధారం చేసుకొనే ఆంధ్రమహాభారతంలోని మూడు పర్వాలూ వారు రచించారట. ఆయనమీద వేములవాడ ఖీమకవికి పగ. ఎందుకంటే తను బ్రాసిన రాఘవపాండవీయం అనే కావ్యాన్ని నన్నయగారు అణచివేశారట. ప్రతీకారం చేయడానికి ఖీమకవి సంకల్పించాడు. ఆంధ్రశబ్ద చింతామణిీని దొంగిలించి గోదావరిలో కలిపి రూపుమాపాడు. అయితే నన్నయగారు ఒక తలివైనపని చేశారు. వ్యాకరణం బ్రాయగానే దాన్ని మూలపడవెయ్యలేదు. శిష్యులకు దానిని పాఠం చెప్పారు. రాజరాజనరేంద్రుని కొడుకు సారంగధరుడు లేడూ - ఆ యువరాజు ఈ వ్యాకరణాన్ని పూర్తిగా కంఠస్థం చేశాడు. వాళ్ళ నాన్న కాళ్ళూ చేతులూ కొట్టించేశాడుగాని కంఠం ఉత్తరింపజేయలేదు కాబట్టి సారంగధరుని గొంతుకలో ఈ వ్యాకరణ గ్రంథం సురక్షితంగా ఉంది. ఏడాదీ రెండేళ్ళూ కాదు. కొన్ని వందల సంవత్సరాలు సారంగధరుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకొన్నాడు. తండ్రి లిక్షించాక అతడు సిద్ధుడయ్యాడు. అందుచేత ఎన్ని శతాబ్బ్దాలైనా జీవించగలడు.

అలా జీవించేస్తూ సారంగధరుడు ఇంకా ఈ వ్యాకరణాన్ని గళపట్టులో దాచడం కష్టం అనుకొన్నాడు కాబోలు, ఒక మంచి ముహూర్తం చూసి, కీలకనామ సంవత్సరంలో, ఆ పుస్తకాన్ని కాస్తా ఎలకూచి బాలసరస్వతిగారికి మతంగ పర్వతం దగ్గిర ధారాదత్తం చేశాడు. ఇంతతూ నన్నయగారు రచించిన వ్యాకరణం పెద్దది కాదు. అందులో ఎనభైరెండు అర్య్భలున్నాయి. వాటినే అయిదు పరిచ్చేదాలకింద విభజించారు. ఈ గ్రంథం మతంగపర్వతం మీద ఉండే విప్రుడు తీసుకువచ్చి అప్పకవికి ఇస్తాడట. దాన్ని అందుకోగానే విస్తరంగా తెనిగించమని దేవుడు ఆదేశించాడు. భారతరచనలో నన్నయగారికి నార్గేయణభట్టు తోడ్చడినట్టు తానే స్వయంగా అప్పకవికి తోడవుతానని పరమాత్ముడు హామీ ఇచ్చాడు.

ఇంత విపులంగా చెప్పి దేవుడు అంతర్ధానమయ్యాడు. ఆ మరునాడే కంపిలినుంచి కాళీకి పోతున్న ఒక బ్రాహ్మడు కామెపల్లిలోమజీలీవేశాడు. ఆయన కాకునూరి వారింట్లోనే బస చేశాడు. భోజనాలయ్యాక లోకాఖిరామాయణం చెప్పుకొంటున్నప్పుడు ఆ బ్రాహ్మడు '“విశ్వశ్రేయఃకావ్యం' అనే శ్లోకాన్ని చదివాడు. అప్పటికి అప్పకవి ఎన్నో లక్షణ గ్రంథాలు చూశాడుగాని ఈ శోకమెందులోనూ ఆయనకు తగలలేదు. 'ఇదెక్కడిది? అని అడిగాడు. “అయ్యో, మీకు తెలియదా! నన్నయభట్టీయంలోని ప్రథమార్య కదండీ అందులో 82 ఉన్నాయి' అని కంపిలిశాస్తుర్లు చెప్పాడు. ఒక పుస్తకం విప్పాడు 'మహాద్భుతం' అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మరింత ఆశ్చర్యం కలిగేటట్టు అప్పకవి తన కల

768 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సంగతి చెప్పాడు. అతని తల్లి పుట్టింటి వారంతా ఆనందించి వెంటనే ఆ గ్రంథాన్ని తినిగించమన్నారు. అప్పకవి ఒప్పుకున్నాడు. వెనువెంటనే ఆ బ్రాహ్మడి పుస్తకంలోని నన్నయఫక్కికి సరైన నకలు కాపీ తీసుకొని ఆయనని కాశీ పంపించాడు. ఇది నవమినాడు జరిగింది. 'శుభస్కళీ[్రుం' అని దశమినాడే అప్పకవి అది తెనిగించసాగాడు. మూలంలో తిలియని పదాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటి అర్థం దేవుడే చెప్తాడన్న ధైర్యంతో నిజానికా వ్యాకరణాన్ని అర్థం చేసుకోడానికి, అనువదించడానికి కావలసినంత పాండిత్యం అప్పకవికి ఎప్పటినుంచో ఉంది. అతడు 42 లక్షణ గ్రంథాలను కూలంకషంగా పరిశీలించాడు. 73 తెలుగు కావ్యాలను ఆమూలాగ్రం శోధించాడు. 315 పద్యాలలోనీ విలక్షణప్రయోగాలను గుర్తించి జ్ఞాపకం పెట్టుకొన్నాడు. ఇవి కాక 23 కవుల చాటుపద్యాలలోని విశేషాలను గమనించాడు. అప్పటికే కవికల్బకమనే లక్షణ గ్రంథాన్ని బ్రాశాడు. ఇంతటి పరిశ్రమ చేసి సిద్ధంగా ఉన్నాడు కనుకనే ఆంధ్రశబ్దచింతామణీని ఇలాగ కాపీ చేసుకొని అలా తెనిగింపు ప్రారంభించాడు. అయితే వాస్తవానికి అది అనువాదం కాదు; వ్యాఖ్యానరూపం అయిన స్వతంత్రగ్రంథం. బాలసరస్వతి టీక ్రాసిన శబ్తానుశాసనీయమే అధారంగా అప్పటి ఆంధ్రశబ్దచింతామణీని రచించాడు. మూలంలో అయిదే పరిచ్చేదాలున్నాయి. వాటికీ సంక = సంధి - తత్సమ - దేశ్య - క్రీయాపరిచ్చేదాలు అని పేర్ణున్నాయి. ఇవే విస్తరించి అప్ప॥వి ఎనిమిది అళ్వాసాలుగా రచింపదలిచాడు. వాటికి భాషా పరిచ్ళేదం, వర్ణపరిచ్చేదం, దేశ్యపరిచ్చేదం, క్రియాపరిచ్చేదం అనే పేర్లు పెట్టాలనుకొన్నాడు. ఈ ఎనిమిదింటిలోనూ మూలంలో 82 ఆర్భలూ తెనిగించదలిచాడు. అయితే ఆయన వ్రాసిన 5 అశ్బాసాలే నేడు లభిస్తున్నాయి. వాటిలో 50 ఆర్భలకు మాత్రమే వ్యాఖ్యానం ఉంది. ఏఏ ఆశ్వాసాలలో ఎన్నెన్ని ఆర్యలను ఎంత విస్తరంగా తెనిగించాడో చూడండి. అశ్వాసం మూలంలోని అప్పకవీయం పద్యాల సంఖ్య ప్రథమ భాషాపరిచ్చేదం 6 134 ద్వితీయ వర్ణపరిచ్చేదం 20 47 తృతీయ వళిప్రాసపరిచ్చేదం 1 398 చతుర్ధ పద్యపరిచ్చేదం ర్‌ 440 పంచమ సంధిపరిచ్చేదం 18 193 ఈ లెక్కన చూస్తే ఒక ఆర్భగీతానికి వివరణగా సగటున 300పై చిలుకు పద్యాలను అప్పకవి బ్రాసినట్టు కనబడుతుంది. మూడవ అశ్వాసెంలో ఒకే ఒక అర్భతు 3368 పద్యాల చెప్పాడు. ఇంత పరిశ్రమ చేసిన గ్రంథాన్ని అనువాదం అనడం అపచారమే. లోకంలో లక్షణ గ్రంథాలెన్నో ఉన్నాయి. వాటిలో తాను చదివిన గ్రంథాల పేర్లను మొదటే అప్పి

కాకునూరి అప్పుకవి 769 పేర్కొన్నాడు (1-5). అతడు గ్రంథకర్పల పేర్లు చెప్పలేదు. గుర్తించకల్లినన్ని రచయితల పేర్లతో పట్టికను పొందుపరుస్తున్నాను చూడండి. . "వరుస. గ్రంథంపేరు. కవి కాలం...

  1. | ప్రకాపరుద్రీయం విశ్చ్వనాథుడు కాకతీయ
  2. | కువలయానందం అప్పయదీక్షితులు 1550-1620
  3. | చంద్రాలోకం జయదేవుడు 1300
  4. | రసమంజరి భానుదత్తుడు 1320
  5. | సాహిత్యచంద్రోదయం ఎఎ ఒం
  6. | సాహిత్యరత్నాకరం (?) వారణాసి ధర్మసూరి 1700
  7. | వృత్తరత్నాకరం కేదారభట్టు ?
  8. | చమక్కారచంద్రిక ఎం ఒం
  9. | షడ్చాషాచంద్రిక ఒం = 10.| షడ్చాషావివరణం ఎలకూచిబాలసరస్వతి | నాయక 11.| త్రివిత్రమవృత్తి త్రివిక్రముడు -- 12.| హేమచందఫక్కి హేమచంద్రుడు 1150 13.| కవిభల్లటఫక్కి కవిభల్లటుడు రెడ్డిరాజుల 14.| అధోక్షజఫక్కి అధోక్షజుడు ఎం 15.| శబ్దానుశాసనీయం బాలసరస్పతిటీక నాయక 16.| కవిరాక్షసీయం కవిరాక్షసుడు రెడ్డిరాజుల
  10. | కవికంఠపాశం కవిసర్పగారుడంలో ఉదాహరించాడు మలిరాయల 18.| కవిమూషికమార్తాలం పట్టాఖిరామకవి 1600
  11. కవిగజాంకుశం ఖైరవుడు తొలిరాయల
  12. | కవిసర్పగారుడం తూచిరాజు బసవన మలిరాయల 21.| కవిజనాశ్రయం మల్లియ రేచన చాళుక్క 22.| కవిలోక సంజీవని ముదరాజు రామన ఆరవీటి 23.| కవికంఠా భరణం లక్షణవిలాసంలో పెనుమర్తి వెంకటార్యుడు పేర్కొన్నాడు ఆరవీటి 24.| కావ్యాలంకార చూడామణీ విన్నకోట పెద్దన రెడ్డిరాజుల
  13. | కవిచింతామణిీ తాతంభట్టు మలిరాయల 26.| అథర్వణఛందం అథర్వణుడు కాకతీయ 27.| గోకర్ణభందం గోకర్లుడు అజ
  14. శ్రీధరఛందం శ్రీధరుడు ఆఆ
  15. | అనంతునిఛందం అనంతుడు గజపతుల

770 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 30. ఛందోదర్పణం తాతంభట్టు మలిరాయల 31.| అలంకారసం గ్రహం ఆజ ఆజ 32. అలంకారరత్నావళి ఆలు ఆల 33.| ఆంధ్రభాషాభూషణం కేతన కాకతీయ 34.| రేఫఆకారనిర్ణయం తాళ్లపాక పెదతిరుములయ్య | మలిరాయల 35.| లక్షణవిలాసం పెనుమర్తి వెంకటార్యుడు | ఆరవీటి 36. | సలక్షణసారం లింగమగుంట తిమ్మన | --

  1. | సర్వలక్షణసారసంగ్రహం | చిత్రకవి పెద్దన నవాబు
  2. | లక్షణదీపిక గౌరన గజపతుల 39.| శారదాదీపిక అం ?
  3. |! శారదాముకుటం జాం ళ్గ 41.1 శారదాతిలకం కవిసర్పగారుడంలో ? ఉదాహరించాడు 42.| పాగీంద్రచూడామణీ వాగీంద్రుడు $ 43.| నరసభూపాలీయం భట్టుమూర్తి నవాబుల వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు సంపాదించిన అప్పకవీయం తాళపత్రప్రతిలో సాహిత్యరత్నాకరం పేరు లేదు. ఆ పాఠమే సముచితం. వారణాసి ధర్మసూరికాలం క్రీ.శ.1700; అప్పకవీయం రచన క్రీ.శ. 1656. లక్షణగగ్రంథాలు లక్షోపలక్షలున్నాయని చెప్పే వాటిగురించి అప్పకవి ఇలా అన్నాడు: ఒకదానికంటె మరివే-రొకటి విశేషంబు జెప్పుచుండు కతమునన్‌ సకలగ్రంథములును జదు-వక తెలియునె లక్షణ ప్రపంచంబెల్లన్‌? (అప్పకవీయం, 1-6) అప్పకవి తాను చదివిన గ్రంథాలలోని అంశాలన్నింటిని వెదికి సారమంకా చెప్పాడో కొద్దిగా తెలుసుకొందాం. ప్రథమాశ్వాసం: ప్రామాణిక గ్రంథాల జాబితా ఇచ్చాక లక్షణవేత్తలలో మూడు రకాలవాళ్లు ఉన్నారని చెప్పాడు. లక్ష్యలక్షణ పద్యాలన్నీ తెలిసినవాడే ఉత్తముడు. లక్ష్ర్యపద్యాలు మాత్రమే తెలిసినవాడు మధ్యముడు. లక్షణపద్యాలు మాత్రమే నేర్చుకొన్నవాడు అధముడు. మొదట లక్షణసూత్రాలు తెలుసుకొని తరువాత లక్ష్యాలు గుర్తించి లక్షణలక్ష్యాలు రెండూ పాఠం చేయాలని అప్పకవి ఉపదేశించాడు. “విశ్వశ్రేయః కావ్యం అన్న తొలి సూత్రానికి 18 పద్యాల వివరణ వ్రాశాడు. సప్తసంతానాలను పేర్కొని వాటిలో కృతే ఎందుకు ప్రశస్తమో చెప్పాడు. ఏ కులంవాడి కావ్యం పవిత్రా విశదీకరించాడు. కావ్య భేదాలు చెప్పి ఇరవైరెండ్డు వర్ణనల జావీతా ఇచ్చాడు. నాలుగురకాల ఉదాహరణలు వగరైరాలూ పదిహేను రకాల ముక్తకాది సంఖ్యాబద్ధమైన రచనలూ చెప్పాడు.

కాకునూరి అప్పకవి 771

తరువాత ఇతర సూత్రాలు వివరించాడు. శబ్దార్థలక్షణాలూ, అలంకారాలూ ఒక సీసమాలికలో బోధపరిచాడు. అనుప్రాసల తేడాలు - చెప్పాడు. 8 రకాల యమకాలు వివరించాడు. చిత్రకవిత్వం, గర్చకవిత్వం, బంధకవిత్వం మొదలైనవి ఎలాంటివో కొద్దిగా చెప్పాడు. తరువాత 16 రకాల శబ్దగతదోషాలు, 50 అర్థ దోషాలు పేర్కొన్నాడు. నవరసాల వివరణ, నాయకనిర్ణయం, సుకవిమాహాత్మ్యం, సత్కవిలక్షణం, ఏడురకాల కవుల తేడాలు వివరించాడు. కవితాప్రశంస చేశాడు. తరువాత దేశభాషావిశేషాలు చెప్పాడు. సంస్కృత ప్రాకృతాలకు తెలుగు- వికృతి అన్నాడు. సంస్కృతంలోంచి పుట్టిన తెలుగు మాటలేవో, ప్రాకృతంలోంచి పుట్టినవేవో వివరించాడు. చందురుడు, లచ్చి, జూదం, సాన, రాచమూకు, జుక్కులు అనే పదాలను సంస్కృతప్రాకృత సూత్రాలతో చర్చించాడు. అప్పకవి ఉద్దేశ్యంలో లక్ష్మీశబ్దానికి ప్రాక్సృతభవమైన లచ్చి అనే తెలుగు మాటేగాని సంస్కృత జనితమైన “లక్కిమి* అనే రూపం లేదు. ఆ సంగతి ఇలా చెప్పాడు:

నాకుల భాషను ముట్టక - ప్రాకృతమున లచ్చి దా బరగు లచ్చిమనన్‌

నాకోక్తియైన లక్ష్మీకి - బ్రాకటముగ లక్కిమి యని పలుకగ వలదే? (అప్ప. 1-90)

ఈ పద్యం చెప్పాక “పూర్వకవులు ప్రబంధములయందు లచ్చియని ప్రయోగించినారు గాని లకిమి అని ప్రయోగించినవారు కాదు' అని తెలియ చేశాడు. అయితే పూర్వకవి ప్రయోగాలు లేకపోలేదు. తాళ్ళపాకవారు చాలాసార్లు వాడారు. అన్నమయ్య ఒక శృంగార కీరనలో యతిప్రాసల స్థానంలో ఇలా ప్రయోగించాడు.

లకిమమ్మ కేమైనా లంచము లిమ్మనరో

శుకవాణీ తలుపు మూసుక తియ్యదు. (12-8)

“లకిమి' అన్న ప్రయోగాన్ని అన్నమయ్య ఈ ఒక్కచోటే కాదు, ఇతరత్రా తూడా చేశాడు. (12-15). దానికి 'లగిమమ్మ'” అనే రూపాంతరం తూడా ఉన్నట్టుంది. సంక్షీర్షనము లలో ఉన్న ప్రయోగం కనుక అప్పకవి దృష్టిని ఈ మాట తప్పించుకొందనుకోవాలి. అతడు ప్రబంధాలే చూశాడు. వాటినే చెప్పాడు. కొన్ని శబ్దాలను చర్చించాక 58 మాటలను పేర్కొని అవి ఏఏ సంస్కృత శబ్దాలనుండి పుట్టాయో వివరించాడు (1098). *ఆంధ్రమున సుప్రసిద్ధంబులైన పూర్వకవి సమయసిద్ధ పదములుగాని చొరవు' అని శాసించాడు.

ద్వితీయాశ్వాసం: ఇది వర్దపరిచ్చేదం. ఇందులో అక్షరాల ఉచ్చారణ ఎలా ఉంటుందో వ్రాశాడు. వాటి స్వరూపాలు వర్ణించాడు. తరుచుగా లేఖకులు చేసి తప్పులు తోడీకరించాడు. ఏమాటలలో జ్రారకొమ్ములు వాడాలో, ఎక్కడ వట్రసుడి వ్రాయాలో వివరించాడు. తెలుగువాళ్లం కొందరం వట్రసుడిని క్రారకొమ్ములాగా ఉచ్చరిస్తాం. అందుచేత ఈ తబ్చిబ్బులు వస్తాయి. ఉదాహరణకు 'గృహము' అని వ్రాసి ' గ్రహము' అని ఉచ్చరిస్తాం. అందుకే అప్పకవి ఇలాగా చెప్పవలసి వచ్చింది. అయితే ఈ ధీమంతుడు కూడా అవే పారపాట్లు చేశాడు. ధ్రువము అనే మాటలో క్రారకొమ్ము ఉందని అతడే 1-%లో చెప్పాడు. గాని యతిస్థానంలో వట్రసుడిలో "ధృవసన్నుతా!" అని వా వాడు (4-326). మరొకసారి 4672లో కూడా ఇలాగే వట్రసుడితో ప్రయోగించాడు 3. ఆాళ్లపాకవారి ేయరచనములు - సంపుటి 12, పుట 11లో అధోజ్ఞాపీక.

772 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మామూలు “రా' ఉందో, ఏమాటలో “బండీరా' ఉందో చెప్పాడు. అతని ఉద్దేశంలో కేఫ అకారాలు దేవదానవులవంటివి. అందుచేత ఆ రెండింటికి సంకరం చేయకూడదు. అందుకే ఆదికవీంద్ర కావ్యాలన్నీ శోధించి క్రమంగా వాటిని పొందుపరిచాడు. అంతకుముందు తాళ్ళపాక కవులలో పెదతిరుములయ్య రేఫఆకార నిర్ణయమనే గ్రంథం వ్రాశాడు. 'వారలు మనుపు రచించిన యివి యెల్ల జాలవా యనగ వలదు వెండియు నొకకొన్ని వెదకితూర్చితి అని అప్పకవి సంజాయిషీ ఇస్తూ ఈ మాటలను ఏకరువు పెట్టాడు. అతను చెప్పిన పదాలలో రకారమున్నవి 420; బండిరా ఉన్న మాటలు 40%. అప్పకవి ఇంత కష్టపడి వాటిని కేటాయించినా కొన్ని నల్లగొ రైలు తెల్లమందలో కలిసిపోయాయి. ఈ వర్జసాంకర్యం ఒకరు ఆపితే అగేది కాదు. లోకవ్యవహారంలో రేఫఆకార ఖిన్నోచ్చారణ లేనప్పుడు వ్రాతలో భేదాలు పెట్టాలంటే కుదరని పని. లాక్షణికులు తప్ప మరెవ్వరూ ఈ పట్టింపులు పెట్టుకోలేరు. ఠకిఫణకారాల విషయంలో అప్పకవి కవిత్రయసోమభాస్కరుల గ్రంథాలను ప్రమాణాలుగా తీసుకొన్నాడు (2-197). అయితే వాళ్ళ గ్రంథాలలో కూడా ఒకేమాట శకటరేఫతోనూ మామూలు రేఫతోనూ కనబడితే విధిలేక రెండు రూపాలున్నాయని ఒప్పుకోవలసి వచ్చింది. అప్పకవి ఏదైనా సహిస్తాడు గాని ఈ సాంకర్యం ఒప్పుకోడు. బమ్మెర పోతరాజుగారంటే అతనికి భక్తి. అయితే ఆయన ఈ సాంకర్యం చేశారు కనుక వారి ప్రయోగాలను లాక్షణికులు స్వీకరించలేదని చెప్పాడు. లాక్షణికులు ఉదాహరించకపోతే ఎవరికి తక్కువ? కోడీ కుంపటి లేకపోతే తెల్లవారదా? పోతరాజుగారిని కాదనడానికి అప్పకవికి మనస్కరించలేదు. అంచేత ఎక్కడో నాలుగో ఆశ్వాసంలో శుభగణాలను చెప్తూ ఫోతరాజుగారి పద్యం ఒకటి ఉదాహరించాడు (4-69). ఇంతకు మించి భాగవతంలోని ప్రయోగం ఏదీ చూపించలేదు.

రేఫఅకారాల తేడాలు చెప్పాత అక్షరవీజాలు, వాటి లింగాలు, పూజా విధానాలు, సారస్వత జౌషధాలు చెప్పాడు. ఏ స్థానంలో ఏ అక్షరం వాడతూడదో వివరించాడు. కొందరు తిట్టుకవుల పద్యాలు ఉదహరించాడు. అతడు మూడు మందుల గురించి ముచ్చటించాడు. ఒకటి రూకెత్తు తింటే సూక్తులు ఘటీిస్తాయి (2-430); ఇంకొకటి ఉసిరికాయంత తింటే గడియకో పద్యశతకం చెప్పే సామర్థ్యం కలుగుతుంది (2-431); మూడోమందు చిన్నమెత్తు సేవిస్తే ఆ నాలుకమీద నలువచెలువ కాపురముంటుందిటు (12-432).

తృతీయాశ్వాసం: ఇందులో యతిప్రాసల గురించి చెప్పాడు. తొలి ఛందో గ్రంథం కవిజనాశ్రయంలో పది యతులు మాత్రమే ఉండేవి. అనంతామాత్యుడు వాటిని రెట్టింపు చేశాడు. తరువాతవాళ్లు మరో ఏడు చేర్చారు. అప్పకవి వాటిని 41 దాకా పెంచాడు. ఇవి నాలుగురకాలు: (1) స్వరయతులు, (2) వ్యంజనాక్షరయతులు, (3) ఉభయయతులు, (4) ప్రాసయతులు. వీటిలో స్పరయతులలో 7 రకాలు, వ్యంజనాక్షరయతులలో 21 తేడాలు, ఉభయయతులలో 12 భేదాలు చెప్పాడు. ప్రాసయతి ఒక్కటే ఒక్కటి ఉంది నిజానికి ఇన్ని రకాల యతులకి అవసరం లేదు.

అప్పకవి అఖండవడిని ఒప్పుకోడు. మన “నవ్యపండితు లీయతి నాదరింత్రు' అని ఒక పద్యపాదంలో వ్రాసి 'నవ్య'లోని నకారానికీ, సంధిలో వచ్చిన “నాదరింత్రు' లోని

కాకునూరి అప్పకవి 773 నకారానికీ యతి సరిపడితే అప్పకవి దెబ్బలాడుతాడు. 'ఆదరింత్రు' అనే మాటకు యతి విషయంలో స్వీకరించాలనే పట్టింపు అప్పకవికి ఉంది. పూర్చకవులలో నన్నయగారివంటి వారే అఖండయతి వాడారు. మాద్రిని తూడ సంతానం కనమని పాండురాజు చెప్పే ఘట్టంలో “చూవె మనంబున దలంచుచుండుదు నెపుడున్‌' అని నన్నయగారు ఒక కందంలో చివరిపాదం చెప్పారు (ఆది 5-131). 'తలంచుచుండుదు'లో “చుండుదు' అనే ప్రత్యేక శబ్దం లేదు. 'ఉండుదు' అనే మాట సంధిలో అలా వచ్చింది. ఇది అఖండయతి, అందుచేత శుద్ధ తప్పు. నన్నయగారు వ్రాస్తినేం? మార్చెయ్యాలి. 'చూవె మనంబున దలంతు సుందరి యెపుడునో అని అప్పకవి సవరించాడు (3-204). ఇలాగ ఈ ఒక్కచోటే కాదు, ఏడు పూర్వ ప్రయోగాలు దిద్దేశాడు. నిజానికి తెలుగు సాహిత్యంలో అఖండయతి వాడని కవి అంటూ లేదు. కవిత్రయభారతం నుండి తిరుపతి కవుల గ్రంథాలదాకా గాలిస్తే కొన్ని వందల ప్రయోగాలు కనబడతాయి. రావూరి దొరస్వామిశర్మగారు సుమూరు వంద ప్రయోగాలు సేకరించి ప్రకటించారు!

అప్పకవి అఖండవడిని అంగీకరిస్తే యతల సంఖ్య తగ్గేది. అయితే ఇతడు 41 దాకా వీటిని పెంచితే, అనంతర లాక్షణికులు తక్కువ తిన్నారా? కూచిమంచి వెంకట్రాయకవి అనే మహానుభావుడు 72 యతులున్నాయని చెప్పాడు. వాటికి చమహాకవిలక్ష్యాలను ఇచ్చాడు. ఇది 'సుకవిజన మనోరంజని'లో వ్రాశాడు. ఈ యతుల జాబితాలు చూస్తి గిరీశం ఇచ్చిన పుస్తకాల పట్టిక జ్ఞాపకం వస్తుంది. సెలవులో వెంకటేశం చదవవలసిన పేర్లు వ్రాయమని నలచరిత్ర, రాజేఖరచరిత్ర, షెప్పర్ట్స్‌ జనరల్‌ ఇంగ్లీషు, వెంకటసుబ్బారావు మేడిజీ అంటూ కొన్ని చెప్పాడు. ఈ పుస్తకాల సంఖ్య తొమ్మిదే అయ్యాయి. అందుచేత మరి ఒకటి బ్రాయమని “కుప్పుస్వామయ్యరు మేడ్‌డిఫికల్టు' అనే పేరు కలిపాడు.* వాస్తవానికి మన లక్షణగ్రంథాలు కొన్ని మేడిజీలు కాక మేడ్‌డిఫికల్టులే!

41 యతిభేదాలు చెప్పాక అప్పకవి 17 రకాల ప్రాసలు తెలియచేశాడు. యతులు పెంచినట్టే ప్రాసలు తూడా అప్పకవి పెంచాడు. అనంతుడు 12 భేదాలే చెప్తే ఈయన మరో అయిదు కలిపాడు.

చతుర్గాశ్వాసం : ఇది పద్యపరిచ్చేదం. ఇందులో గద్భపద్య భేదాలు, షట్ర్రత్యయాలు, ఇరవైఆరు ఛందాలలో ఉండే కొన్ని సమవృత్తాల రూపాలు, గౌణ వృత్తాలు, మాలికా వృత్తాలు, చిత్రకవిత్వాలు, గర్బ్భకవిత్వాలు, బంధాల రూపాలు చాలా విపులంగా చెప్పాడు. లెక్కపెడీతే, ఎవరైనా పదమూడు కోట్ల పైచిలుకు వృత్తాలు వ్రాయడానికి అవకాశం ఉంది. వాస్తవానికి ఆ సంఖ్య 13,42,17,726 అయితే ఏ పిచ్చివాడూ ఇన్ని వృత్తాలు బ్రాయడు. సర్వసాధారణంగా మనకు తారసపడే వృత్తాలు వంద కూడా వుండవు. అప్పకవి 186 సమవృత్తాలు వివరించాడు. 35_ ముఖ్యచ్చుత్తాలు తెలియజేశాడు. యక్షగానాలు, 4. తెలుగుభాషలో ఛందోరీతులు - రావూరి దొరస్వామిశర్మ, పుటలు 306 నుండీ 30౫8 దాకా. 9

అఖండవడి ప్రయోగాలు చూపించారు. 6. తెలుగుభాషలో ఛందోరీతులు - పుట 300. 6. కన్యాశుల్కం, ప్రథమాంకం - 1వ స్థలం.

774 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఉదాహరణలు, లాలిపాట, పెళ్ళిపాట, ధవళం, అర్థ్ధచంద్రిక మొదలైనవాటి లక్షణాలు ఈూడా చెప్పాడు.

పంచమాశ్వాసం: ఇది సంధిపరిచ్చేదం. ఇందులో కళలేవో, ద్రుత ప్రకృతికాలేవో విచారించాడు. సంధి లక్షణాలు ఇచ్చాడు. సంధుల వివరాలు తెలిపాడు. శ్రీనాథునివంటి వాళ్ళనే విసంధులు చేశారని అక్షేపించాడు (5-68). ఇది నన్నయగారు వ్రాసిన వ్యాకరణ గ్రంథానికి వివరణ అయినా మూలంలో కవిభల్లట-మత సంధులు, అధర్వణమత సంధులు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా నన్నయగారే పొందుపర్పారని భావించి అప్పశఫి వివరించాడు. .

ఈ గ్రంథాన్ని అప్పకవి సాంతం రచించాడో లేదో తెలియదు. అయిదాశ్వాసాలు చూత్రమే ప్రచారంలో ఉన్నాయి. మిగత మూడాశ్వాసాలలోని కొన్ని పత్రాలు మాత్రం ఆంధ్రసాహిత్యపరిషత్తువారి కార్యాలయంలో ఉన్నాయట. తత్సమపరిచ్చేదం కొంత లఖిస్తోంది.” -

ఇప్పటికి ఈ పుస్తకాన్ని వావిళ్ళవారే ఆరుసార్లు అచ్చువేశారు. తొలిసారి 1850లో ముద్రించారు. 1962లో తాజాముద్రణ జరిగింది. ఈ ఆరవ ముద్రణకు (గ్రంథాన్ని రావూరి దొరస్వామిశర్మగారు పరిష్కరించారు. ఈ ముద్రణలోనే మళ్ళీ అప్పకవీయంలో వ్యావహారిక వచనాలు కనబడుతున్నాయి. వీటిని గిడుగు రామ్మూర్తిపంతులుగారు మొదట చూపించారు. వావిళ్ళవారు 1922లో వేసిన ముద్రణకు చాలా విపులమైన పీఠిక వ్రాసిన గిడుగువారు ఎన్నో విషయాలు తెలిపారు. ఆ తరువాత అచ్చుపడిన ముద్రణలో వ్యావహారిక రూపాలు మాయమయ్యాయి. మళ్ళీ వాటిని సమగ్రంగా అచ్చు వేయడం సంతోషింపతగ్గ విషయం.

అయితే ఒకందుకు చింతించాలి. అప్పకవీయానికి మరొక తాళపత్ర ప్రతి 1950లో బయటపడింది. దానిని వడ్డమూడి గోపాలకృష్ణయ్యగారు సంపాదించారు. ఇందులో ఎన్నో పాఠాంతరాలు (చాలా మంచివికూడా) కనబడుతున్నాయి. వాటన్నిటినీ విపులంగా వడ్డమూడివారు పొందుపరిచారు. అయితే ఈ పాఠాల గురించి వావిళ్ళవారి 192 ముద్రణలో మాటవరసకైనా తలపెట్టలేదు. అప్పకవీయం వంటి పరమప్రామాణీక గ్రంథాన్ని పరిష్కరిస్తున్నప్పుడు దానిని ఎప్పటికప్పుడు సమగ్రం చేయడానికీ కప్రయత్నించాలి.

ఈ లక్షణ [గ్రంథం సంపూర్ణంగా దొరకకపోవడం చాలా దురదృష్టం. అప్పకపిలాంటీ శాస్త్రీయ దృక్పథమున్న లాక్షణికులు చాలా అరుదు. అతడు తెలుగు మాటల వ్యుత్పత్తి అర్జాలు సైతం చెప్పాడు. ఉయ్యల, పయ్యద, తాయెత్తులు మొదలైన పదాల పుట్టుక తొలి ఆశ్వాసాలలోనే చక్కగా వివరించాడు (2-18 నుండి). అతనికి తమిళ భాష కూడా వచ్చు 7, * పరిషత్పుస్తకభాండాగారం, గ్రంథసంఖ్య 51.

  1. భారతి, జూలై 1950, వడ్గమూడివారి వ్యాసంలో అచ్చుప్రతి నుండి విఖేదాలుగాని, పాఠాంతరాలు గాని 14 ఉన్నాయి.

కాకునూరి అప్పకవి 775 కాబోలు. తాయెత్తులు అనే పదానికి ఇలా అర్థం చెప్పాడు. 'ఎత్తులనగా దక్షిణదేశమున దండలకు పేరు. దాని జడ్డను తీలపలికిన 'యెతు' లాయెను. 'తాయి' అనగా 'తల్లి.' ఆ తాయి విశువులకు శరీర రక్షతుగాను కట్టునవి యతులు గనుక తాయెతులు. ఈ అర్థవివరణ ప్రచాదజనితమే.

తాయెతులు అనే మాట దేశం కాదు. “తావీజ్‌ అనే అరబ్బీపదం నుండి “తాయెత్తు వచ్చింది. దీని గురించి విపులంగా తూమాటి దొణప్పుగారు చర్చించారు. అప్పకవి పారపడీనా చక్కని కృషి చేశాడు. భాషా శాస్త్ర పరిశోధనాదృష్టి అలవరచుకొన్నాడు. తమిళ పదాలనుండి తెలుగు అర్గాలు పిండడం శాస్త్రీయ దృక్పథాన్ని అమలులో పెట్టి ఒకరకంగా అప్పకవే ద్రావిడ భాషావాదానికి ఆదిమ పురుషుడయ్యాడనవచ్చును. ఇంత చక్కగా శబోత్పత్తిని వివరించడానికి ప్రయత్నించే లాక్షణికుడు దేశ్యపరిచ్చేదం వ్రాస్తే అది మన లక్షణ గ్రంథాలలో ఎవరెస్టు-శిఖరంలా ఉండేది.

అయికేనేం, ఇప్పటికీ అప్పకవీయాన్ని మించిన ప్రామాణిక గ్రంథం లేదు. అతడు చెప్పబట్టి కొందరు కవుల పేర్లు, గ్రంథాలు తెలిశాయి. ఆయన ఇచ్చిన ప్రయోగాతే కొందరి శవిత్వరూపాన్ని తెలియచేస్తాయి. అప్పకవి చేసినది ఒక్కటే ఒక్క తప్పుంది. చాలా వినయవిధేయతలతో అతడు పండితుల కొక విజ్ఞాపన చేశాడు.

కాళిదాసమయూరాదికవులకైన - గలవు తప్పులనంగ నన్యులకు లేవే?

దిద్దదగుపట్ల దిద్దుడు, దిద్దరాని - యెడల నానేరములు క్షమియించుటొప్పు.

(అప్ప. పీఠిక 1-28)

తన గ్రంథంలోని తప్పులను దిద్దేయమని అప్పకవి లైసెన్సు ఇస్తే దాన్ని పురస్కరించుకొని మన పరిష్కర్తలు తమకు తప్పని తోచిన చోట్లలో మహాకవుల ప్రయోగాలే దిద్దిపారేశారు. ఆ దిద్దడానికి ముందు ఎన్ని జూ గ్రత్తలు తీసుకోవాలో అప్పకవి చెప్పనే చెప్పాడు. వినాలి. తరువాత పుస్తకంలో చూడాలి. పెద్దల నడగాలి. ఆ తరువాత తప్పనాలిగాని తెలియనివన్నీ దోషాలకీంద జమకట్టకూడదని భావిజనులకు చెప్పారు. ఇది ఎవరూ పట్టించుకోలేదు. సకలగ్రంథాలూ చదవనిదే లక్షణప్రపంచం తెలియదని అప్పకవి చెప్పాడు. అయినా తన గ్రంథం గురించి ఇలా అన్నాడు:

ఇది చదివిన పిమ్మట - యెదియేనియు ఐిదువు బుద్ధి యేలా వొడమున్‌

బదపడి గ్రంథము లన్నియు - వెదకివెదకి సారమెల్ల వివరింపంగన్‌. (అప్పు. 1-7)

ఇది అక్షరాల నిజం అయితూర్చుంది. అప్పకవీయం చదివాక ఇంకేవీ చదవాలనిపించదు! పతన 9. భారతి, జూన్‌ 1959 (వికృతివివేకకర్తృత్వం అనే వ్యాసం).

పదిమంది శతకకవులు

నాయకరాజుల యుగంలో యక్షగానాలూ, నాటకాలూ వృద్ధిచెందినంత ఇతర ప్రక్రియలు ప్రచారం పౌందనట్టు కనిపిస్తుందిగాని ఈ యుగంలో శతకాలూ, దండకాలూ మొదలైనవి తూడా విరివిగానే కవులు విరచించారు. ఎలకూచి బాలసరస్వతి, గణపవరపు వెంకటకవి కాకునూరి అప్పకవివంటి ప్రసిద్ధులు బ్రాసిన శతకాల గురించి వాళ్ల చరిత్రలో తెలుసుకున్నాం. ఇప్పుడీయుగంలోని శతకకవుల గురించి ముచ్చటించుకుందాం.

శ్రీగిరి విరూపాక్షయ్య ; ఇతడు కాళహస్తి లింగశతకం వ్రాశాడు. ఇది బహుళప్రచారం పొందింది. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలోనే దీనికి 17 ప్రతులు ఉన్నాయంటే ఇది ఎంత పేరుమోసిందో తెలుస్తుంది. ఈ కవికాలమేదో నికరంగా చెప్పలేము. వంగునూరి సుబ్బారావుగారు. ఇతడు క్రీ.శ.1700కి పూర్వుడని ఊహించారు. నిడుదవోలు వెంకటరావుగారు మాత్రం ఇతడు క్రీ.శ 1400 వాడని భావించారు. ప్రాచ్చులిఖిత (గ్రంథాలయంలో 14 తాళపత్రప్రతులలో సగం చాలా ప్రాచీనప్రతులలాగా కనబడు తున్నాయి. ఒకదానిలో లేఖకుడు తారీఖు బ్రాసుకొన్నాడు. అది 'ప్రభవనామ సంవత్సర భాద్రపద బహుళ 13 మంగళవారం' (0 1509) దీనికి స్రైన ఇంగ్లీషు తేదీ 29-9-1807. కవి ఈ కాలానికి నూరు, నూటయేభయి సంవత్సరాల ముందువాడు కావచ్చును.

ఇది సీసపద్య శతకం. ఇందులో లోకనీతి, శివస్తుతి ఉన్నాయి. క్షత్రియ లక్షణాలు ఎక్కువగా చెప్పాడు. చివరి పద్యంలో తన తండ్రిపేరు శ్రీగిరి పాపరాజు అని, తన పేరు విరూపాక్షయ్య అని చెప్పుకున్నాడు. మకుటం గీతపద్యంలోని చివరి రెండుపాదాలలో ఉంది. అది: ప్రణుతధవళాంగ మౌనిహృత్పద్మభృంగ - అమితభవభంగ శ్రీకాళహస్తీ లింగో

ఈ కని 'పూర్ణవిద్యలు రాజపూజితుగా జేయు, నీతిమార్గంబున నెగడు సిరులు అని నమ్మినవాడు. 'అవధరింపుము నా నేర్చినట్లు నీకు విన్నవించెద శతకంబుల్‌ అని తన దేవునితో చెప్పాడు. శతకం చదివితే ఇతడు నేర్చరే అని తోస్తుంది.

ఉడుమూడి సూరపరాజు: మామూలుగా మన శతకాలలో సంఖ్యానిర్ణయం, మకుటనియమం ఉంటాయిగాని శతకమంతా ఒకే ప్రాసలో చెప్పడమనే నియమం కొందరే పెట్టుకొంటారు. ఉడుమూడి సూరపరాజు “ర'కార ప్రాసతోనే వెంకటాచలపతి శతకాన్ని వ్రాశాడు. ఏకప్రాసశతకం వ్రాస్తున్నట్టు ఇలా చెప్పాడు:

పరయతిలక్షణజ్ఞులగు వందితసత్కవు లెల్ల మెచ్చగా

గరిమను నేకప్రాసశతకం బొనగూర్చి సుపుష్పమాలగా

  1. మద్రాసు ఓ.లై.డిడ్కిప్టివ్‌ కేటలాగు 5వ సంపుటిలో 1503 నుండి 0 1519 దాకా ఈ శతకప్రతులి

వివరణ ఉంది.

  1. శతకకవుల చరిత్ర, పుట 304
  2. శతకకవుల చరిత్ర, పుట 73.
  3. శతకకవుల చరిత్ర, పుట 559,

పదిమంది శతకకవులు 777 నరహరి మీ కొనర్చెదను నారదగానవిలోల ద్వారకా తిరుపతి వెంకటాచలపతీః నను బ్రోవుము వేగ శ్రీపతీః సత్కవులు మెచ్చేటట్టు శతకం చెప్తానని ఇతడు ప్రకటించినా సాహిత్య చరిత్రకారులు మాత్రం ఇతని కవిత్వంలో భావాలు సంపూర్ణత పొందలేదనీ, క్రొత్తవి కావనీ భావిస్తున్నారు. ఈ కవి గోదావరి జిల్లాలోని జొన్నాడ కాపురస్తుడు. భట్రాజు పూర్వకవిస్తుతిలో భట్టుమూర్తిని స్తుతించాడు. ఇదే ఇతని కాలనిర్ణయానికి కొండ గుర్తు. పుసులూరి సోమరాజు: ఏకప్రాసశతకాలు వ్రాసినా ప్రొడంగా వ్రాసిన వాళ్ళలో పుసులూరి సోమరాజు ఒకడు. ఇతడు బాలగోపాలకృష్ణుని భత్తుడు. అందుచేత ఇతణ్జి “బాలకృష్ణదాసు' అని కూడ పిలిచేవారు. ఈయన గుంటూరు జిల్లా పుసులూరు గ్రామవాసి, అయినా దేశాలు పట్టిపోయాడు. నీలాచలమనే పేరుగల పూరీ జగన్నాథం వెళ్ళాడు. వైతన్యుని ప్రభావంలో పరవశించాడు. మధురభక్తిని ప్రకటించే మూడు మనోహర శతకాలు వ్రాశాడు. ఒకటి దూతకావ్యం. 'ఇందూ! నందుని మంధదనుండి కద నీవేతించుటల్‌ రాకలన్‌. అనే మకుటం గలది చంద్రదూతశతకం. దీనినే ఇందు శతకం అని కూడా పిలుస్తారు. విరహిణి అయిన గోపికలాగా 'మందన్‌ రాధ యెరుంగకుండ బ్రజభామల్‌ కానకుండగ గోవిందున్‌ మెల్లనె తోడితెమ్ము'ని కవి ఆత్మ ప్రార్థిస్తుంది. పోనుపోను భక్తి పరవళ్లు తొక్కుతుంది. రసం వెల్లివిరుస్తుంది. తన్మయత్వంలో కవి ప్రేలాపన చేస్తాడు. గీతగోవిందం, శ్రీకృష్ణకర్ణామృతం మొదలైన మధురకావ్యాల సారాన్ని ప్రచహింపచేస్తాడు. ఇందు సందేశం ఫలించి దగ్గరకు వచ్చిన నందనందనుణ్ణీ చూసి సోమరాజు “నీ చక్కదనంబు చూడ మననైనది చూపుము నందనందనా' అనే మకుటంతో మరో మధురశతకం వ్రాశాడు. ఈయనే బాలగోపాల శతకాన్ని బ్రాళాడు. సంస్కృత భక్తికావ్యాలే కాక ఈయన ద్రావిడ వేదంలోని పాశురాలు కూడా బాగా చదివినవాడని తెలుస్తుంది. తన పద్యశతకం ఎలా ఉందో ఈయన చక్కగా వివరించాడు ప్రాచేతసార్చిత రామాయణము భంగి, వ్యాస కల్పిత భాగవతము మాడ్కి ద్రావిడవాజ్బయోదార వేదమురీతి, నారదమధుర గానంబుసరణి, లీలాశుకస్తుతి లాలసప్రక్రియ, జయదేవకవి సరస్వతి విధమున, బమ్మెరపోతన భారత క్రమమున, దాసగీత ప్రబంధములపోల్కి. బాలకృష్టాంఘీదాసోక్ట్స పద్యశతము దయనుకనుగొను మాచంద్ర బాలగోపాలకరుణాలవాలనీల శైలాపనీపాలచారులీల. (తారకముగ 9 1622 పద్యం ర) క. ఈ బాలగోపాల శతకం ప్రతులు మూడు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో (ఉన్నాయి. ఈ.1624 సంఖ్య గల ప్రతిలోని లేఖనకాలం “శార్వరినామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి శనివారం” అని ఉంది. క్రీ.శ 1800 నుండి 1900 దాకా వచ్చిన శార్వరినామ సంవత్సరాలలో ఏఒక్కటీ ఆశ్చయుజశుద్ధ దశమి శనివారంనాడు రాలేదు. 2-10-1790 దశమి అదివారమైంది. ఆయేడు శనివారంనాడు తిథులు లుప్తం. 6. డి కేటలాగు సంపుటి 7, పుట 152.

778 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ పద్యంలో అతిశయోక్తులేం లేవు. సోమరాజుగారి కవిత్వంలో ఇందరి భావలాలిత్యం, భక్తిపారవశ్యం ననలెత్తాయి. బాలగోపాల శతకాన్ని ఉపకర్ణామృతమని కవే చెప్పుకొన్నాడు. పుసులూరి సోమరాజుగారి మూడు శతకాలు మూడు రసభాండాలు. సింహాద్రి అంకన్న: పూరీ జగన్నాథుని భక్తుడైనా పుసులూరి సోమరాజు ఆ దైవంపై ప్రత్యేకంగా శతకం చెప్పలేదుగాని ఎవరో సింహద్రిగారి అంకన్న ““దారూ జగన్నాయకా! అనే మకుటంతో చక్కని శతకం చెప్పాడు. ఇతని తండ్రీపేరు సింహాద్రి. ఈయన బెహెరాగారి సత్కారాలు పౌందాడు. “కవుల్‌ గాణల్‌ బుధుల్‌ జాణలున్‌ భిరా యంచు నుతించు' నూరు పద్యాలు కవి చెప్పాడు. తన విషయం ఇలా చెప్పుకొన్నాడు: ఘనతల్‌ మీశ్రుభ నామకీర్తన లపేక్షంజేయు మీభృత్యులన్‌ అనఘుం డామహనీయు డన్న బెహరార్యస్తైత్రపాత్రుండ స జ్ఞనమాన్యుండ నృసింహసేవకుడ సౌజున్యుండ సింహాద్రినం దను డంకేంద్ర కవీంద్ర నామకుడ నే దారూ జగన్నాయకా. (90.1563 పద్యం 100) ఈ పద్యంలో చివర “సింహాద్రినందనున్‌ కద్రకపీంద్రనామకుండ' అనే పాఠాంతరం ఉంది. దీనినిబట్టి ఈ కవిపేరు కద్రయ్య అని పరిశోధకులు భావించారు.” అంకయ్య అన్నదే సమంజసంగా తోస్తుంది. ఈ అంకయ్య వ్రాసినదో, లేక ఇంకెవరైనా వ్రాశారోగాని మరొక తండ్రీ! నాయెడ నీకు న్నెనరులేదా దైనచూడామణీ గుండ్రాతిన్‌ సతిజేయు వార్త విని నీకుక మైక్కుచున్‌ వేడుచున్‌ వేండ్రంబైన భవాబ్టి బాపి దయతో వీక్షించి దైన్యంబుతో నుండ్రేనీకు భయంబు లే దన వదేమో హా జగన్నాయకా! (9.1562 ఈ రెండు జగన్నాయక శతకాలకన్నా విఖిన్నమైనది మరొకటి ఊది “నీలకుధరాధ్యక్షా జగన్నాయకా' అని మకుటం. దాని కర్తపేరు కూడా తెలియదు. అది సంస్కృతసమాస భూయిష్టం. అనుప్రాసల పుట్ట. “ఇది ఒక పనికిమాలిన క్లిష్టరచన'మని టౌనుదొరగారి రిమార్కు (10.1561) _ తిరునగరి వెంకటాచార్యులు: ఈ కాలంలోనే రసవత్తరమైన మరొక శతకకర్త తిరునగరి వెంకటూచార్యులు.. ఇతడు హనుమకొండవాసి. ఆ ఊరిపేరు ఇమిడ్చి 'యతిపతీ హనుమద్గిరిరాజమందిరా' అనే మకుటంతో శతకం వ్రాశారు. ఇది ముద్రితమనీ, రసవత్తరమనీ శేషాద్రి రమణకవులు వ్రాశారు. ఈ శతకం అచ్చుప్రతి నాకు దొరకలేదుగాని అంధ్ర విశ్చవిద్యాలయంవారి గ్రంథాలయంలో దీని ప్రతి ఒకటి ఉంది. అది బాగొ శిథిలమయిపోతున్న తాళపత్ర గ్రంథం. (నెం.7:114;25-1. ఇందులో ఆధునితులకు అట్టే నచ్చని చాదస్తం ఎక్కువగా ఉన్నా “తినగ తినంగ వేపకును దియ్యదనంబొన గూడినట్లు 7, గోలకొండ కవుల సంచిక, పుట 411. 8. శతకకవుల చరిత్ర, పుట 302. '

పదిమంది శతకకవులు 779 నాలుగు పద్యాలు చదివిడీ కవిత్వం మధురంగా రుచిస్తుంది. ప్రపన్నులను కవి ఇలా హ్రాంసించాడు:

క్షితితల మెల్ల పావనము జేతురు వేదము వేదమార్గమున్‌

గతి జెడకుండ గాతురు త్రికాలపరిజ్ఞత విష్ణువైష్టవ

ద్రతసుఖనిష్టులై జనుల వర్ధిలజేతురు మీపదాంబుజి

ద్వాతయసమాశ్రితుల్‌ యతిపతీ హనుమద్గిరిరాజమందిరా. (పద్యం 24) ఈ శతకం గతిచెడకుండా ఉండడం తూడా అవసరమే.

గద్దె రామలింగయ్య: మనదేశంలో శివలింగాలకు. లెక్కలేదు. ప్రతిష్టించినవారి పేరిట కొన్ని శివలింగాలు ప్రసిద్ధమవుతాయి. ఉదాహరణకు చోడుడు స్థాపించిన లింగం చోడలింగమని, సీత పూజించిన లింగం సీతలింగమని పేరుకెక్కాయి. ఈ లింగాలు గోదావరీ మండలంలో ఉన్నాయి. భీమవరం దగ్గిర ఉన్న బొండాడ గ్రామంలో ఉండే గద్దె రామలింగయ్య అనే కవి 'చోడలింగమా' అనే మకుటంతో ఒక శతకం చెప్పాడు. దీనికి ఇతడు పరవాదిగజాంకుశమనే పేరు పెట్టినట్టు ఇలా చెప్పాడు:

వరుసను విన్నవింతు పరవాదిగజాంకుశమంచు కావ్యమి

ద్ధరను ప్రసిద్ధిగాను నిరతంబును ముక్తికి మూలమైన సు

స్థిరముగ వేదశాస్త్రములు చెప్పిన పద్ధతి నాంధ్రభాషనే

పరకృతిగాను సత్కవుల వర్ణన చేసెద చోడలింగమా. (0౧.1610 పద్యం 18) ఈ శతకకావ్యంలో రామలింగయ్య పీర్జైవాన్ని వివరించాడు. ఇతని తండ్రీ ఆగమవేత్త నాగయ్య, గురువు సిద్ధరామయ్య. ఈ శతకంలో వీర్దావుడగు జంగమతీర్థ ప్రసాదభోగి పాల్కురికి ఘనుండు సోమగురు గొల్చి, రామలింగయ్య శతకాన్ని రచించాడు.

రామలింగయ్యగారి అబ్బాయి: బహుశా ఈ రామలింగయ్యగారి కుమారుడే బొండాడలో ఉన్న నగరేశ్వరస్వామిపై రెండు శతకాలు చెప్పినట్టు ఉంది. ఒకదాంట్లో “నగరేశా' (.1592 అనీ, ఒకదాంటో “నగరేశశివా' అనీ మకుటాలు ఉన్నాయి. రెండూ కోమట్ల దైవమైన నగరేశునిపై చెప్పినవే.

ప్రియభక్తు లనుచు వైశ్యులు- ప్రీయంబున బూజింప మీరు ప్రత్యక్షంటై

జయమైన వరము లిచ్చితి - నయమున బొండాడ నున్న నగరేశశివా!: (09.1591)

ఈ శతకాల కర్త ఎవరో తెలియదని ప్రాచ్యలిఖిత గ్రంథాలయ పరిశోధకులు వ్రాసిన “బంధురరామలింగపుత్రవిరచితమ'ని ఉండడంవల్ల చోడలింగశతకకర్త కుమారుడే నగరేశశతక రచయిత అని వంగూరి సుబ్బారావుగారు భావించారు. ఇతని శతకంలో యతిభంగాలు కనబడతాయి.

తాళ్ళపాక శ్రీనివాసుడు: యతిభంగాలు, వ్యాకరణ దోషాలు, విసంధులూ మొదలైన తప్పుల తడకలతో మరొకడు కూడా శతకం చెప్పాడు. అతడు సుప్రసిద్దులైన తాళ్లపాకవారి $. శతకకవుల చరిశ్ర, పుట 302.

యయా 1010 ఆఆఆ భన . 780 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఓ వంశంలోనివాడవడం గమనించదగ్గ విషయం. అన్నమయ్యగారికి ఎన్నోతరంలోన్సి ఇ మనుమడోగాని శ్రీనివాసుడనే ఉబలాటపరుడు “కమలవసుధేశ సర్వయుగాధిపే॥ ల . విమలశి కోటిసంకాశ వెంకటేశ అనే మకుటంతో ఒక శతకం వ్రాళాడు. దీని ప్రతి ఒకట 2 కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్‌ కార్యాలయంలో ఉంది (సంఖ్య.3396). శతకం చెప్పాలనే . " కోరిక ఎంతగా ఉందో తెలుపడానికి తప్ప ఇది మరెందుకతూ ఉపయోగపడదు. వులిని . చూసి వాతలు చేసుకొన్న కవిత్వం. | పులిపర్రు రాజయ్య: గుంటూరు జిల్లాలో పులిపర్రు అనే గ్రామం ఉంది. ఆ ఊల్లో . .. చెప్పాడు. దాని అసమగ్రప్రతి ఒకటి. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (1003. 1: లోకనీతులు కూడా ఉన్నాయి. బంగారంపైన మంచి పద్యం ఉంది. . | అరయ ననాకారి కంగనామణికైన కాంతిబుట్టించు నీకాంచనంబు . | ప్రాణంబు గొనవచ్చు పగతురక్రైనను కరుణ పుట్టించు నీకాంచనంబు . 1. - అనుకూలపరులైన అన్నదమ్ములకైన కలత బుట్టించు నీకాంచనంబు | ,' ఇట్టి వస్తువు మరి లేదు యిహమునందు | / | రాజకవిదాసమానసోల్లాసహాస 111 చంద్రరేఖోత్తమాంగ నరేంద్రలింగ .. ॥; ఈ శతకాన్ని నగేంద్రలింగ శతకమని లేఖకుడు వ్రాసుకొన్నాడు. అయితే పులిపగ్రులోని . (1 దేవుని పేరు నరేంద్రస్వామివారు కనుక శతకం పేరు అదే అయి ఉంటుంది. దీని కర్పపేడ గ ప్రతిపద్యంలోనూ ఉన్నా ఇతని కాలం తెలియదు. నాయకరాజులయుగం లోనివాడు .. ప్రిగగపల్లి పోతయ్యః గోదావరీతీరాన ఎంతమందో కవులు పుట్టారు. గంటు జే ౯. పట్టారు. అయితే గోదావరిపై కావ్యాలుగాని, శతకాలుగాని చెప్పినవారు చాలా ఫల. “కొద్దిమంది. ప్రెగ్గడపల్లి పోతయ్య అనే కవి మళత్తేభకార్జూలవృత్తాలలో గోదావరీ శతకాన్ని న్‌. బ్రాశాడు. అఖండగౌతమిలాంటి శైలి. ఈ శతకం సంపూర్ణంగా లభించలేదని చెప్తూ గ, 1 || నిడుదవోలు వెంకటరావుగారు ఒక పద్యాన్ని ఉదాహరించారు.!1*9 స స్థిరపుణ్యోదయ మేదినీందువదనా సీమంతవీథఢీలస జ ద్గురుముక్తాఫలసూత్రమో! సురుచిరక్షోణీపురంధ్రీ యళో 5 1 హరసంవ్యాస మొ నాగ నీదగు ప్రవాహం బొప్పు గోదావరీ. లో మనోహర కృతులు ఎన్ని నష్టమైపోయాయో! |! 10. శతకకవులచరిత్ర, అనుబంధం, పుట 7%. కవి క్రీ.శ 1468 వాడని నిడుదవోలువారి నిర్ణయం.

న కనన రల _ రాడిగోళ్ళ కదిరీపతి, అయ్యలరాజు నారాయణ . క రొజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తి మొట్టబుద్ధి అయితే మన సాహిత్యంలో ఊరేగే . పుల్లిని రాజులను చూసి ఒళ్ళుమరిచిపోయి ఊరన్ని కలలుకన్న పౌరకాంతలు కోకొల్లలు. వీళ్ళు రాజును చూస్తే ఫరవాలేదుగాని వీళ్లలో ఏ ఒక్కరిని రాజు చూసి మక్కువపడినా ఇబ్బందికీ తక్కువ ఉండదు. “రాజుకు కంటిలో విషం; పొములో పంటిలో విషం? అన్నారు. . క ఊళ్లో | మగనాలిపై మరులు కొన్న కాముకుడు చెడతాడని రామాయణం మొదలుకొని ఎన్నో . 0.15)% | చెవులతోనే రంకాడి సుఖపడ్డవాళ్ల సాహస కథలను వినాలని జనం ఉవ్విళ్లూరడం . కథాసరిత్సాగరం దగ్గిరనుంచీ కనబడుతూనే ఉంది. . సంస్కృతంలో రంకు కథలు కోకొల్లలు. బాలురకు హితోపదేశం చేసే పంచతంత్రం |. లోనే బూతుకథలు ఉన్నాయి. నేడు మన కథలు కంచికి పోయినా ఆదిలో చాలా 1 సంస్కృత కథలు అరేవియాతు పోయి. వేయిన్నొక్క రాత్రులలో కలిసిపోయేవి. | నీతికథలలాగే బూతుకథలు కూడా సార్వజనికం కనుక ఒక దేశంలోని కథ మరొక . దేశంలోని కథలాగా రూపాంతరం చెందగలదు. అరేబియన్‌ నైట్సులోని కథలలాగే తదితర || దేశాల సాహితీపరులు కథలను సృష్టించుకొన్నారు. పదినీతులూ, పదిబూతులూ కలిపిన _. (| కావ్యాలు జనించాయి. తెలుగులో మంచెన చెప్పిన కేయారబాహుచరిత్ర, జక్కన వ్రాసిన శ విక్రమార్కచరిత్ర, అనంతామాత్యుడు కల్పించిన భోజరాజీయం, కొరవి గోపరాజు | నులోని రచించిన సింహాసద్వాత్రింశిక మొదలైనవి చాలా నీతికథలతో కొన్ని బూతుకథలు కథనం . న చేశాయి. 1 నివాడు “ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌' అని పేరుపడిన మన తెలుగులో మంచన తొలిసారిగా ... నీతికథలను కథనం చేసిన కాలానికి దగ్గిరగా ఇటాలియన్‌ భాషలో జియోవాని భి! గంటి | మైరాన్‌. ఇటలీలో ఒకసారి అంటువ్యాధి వచ్చింది. ముగ్గురు యువకులు, ఏడుగురు న చాలొ యువతులు ఊరు వదలి కొండలకు వలస వెళ్ళారు. అక్కడ కాలం గడుపుతూ పదిరోజులు రాన్ని | _ చెప్పుకొన్నట్టు ఈ రంకు కథలను బొకాచియో శ్రీ.శ1350 ప్రాంతాలలో కల్పించాడు. స చెప్తూ | ఇంచుమించు ఈ కాలంలోనే ఇంగ్లాండులో కూడా జాథ్రీ చాసర్‌ అనే కవి కాంటర్‌బరీ / గాథలనే గ్రంథంలో శృంగార కథలను వ్రాశాడు. ఇరవైతొమ్మండుగురు యాత్రికులు . తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్థలానికి వెళ్లేటప్పుడు తలో రెండూ, వచ్చేటప్పుడు తలో 1. రెండూ కథలు చెప్పుకోవాలని అనుకొన్నారు. కాంటర్‌బరీ మజిలీలలో నూటయిరవై క కథలు ఉంటాయని ఛాసర్‌ చెప్పినా అందులో ఇరవైమాత్రమే సంపూర్ణమైనవి. రెండు న అసంపూర్ణంగా, రెండు అసమగ్రంగా ఛాసర్‌ వదిలివేశాడు. ఇటలీలోనూ, (+ చంటీ ఇంగ్లండులోనూ క్రీ.శ 1350 ప్రాంతాలలోనే ఇలాంటి కథలు పుట్టినా ఫ్రాన్సులో “నవారె |. రాణి మార్గరెట్‌ వ్రాసిన 'హెప్టామెరన్‌ క్రీ.శ 1530 ప్రాంతాలలోగాని రాలేదు. హెప్పా మెరన్‌ |. లా అంటే '“ద్వాసప్తతికథ'లన్నమాట. 1

782 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి విదేశ సాహిత్యాలలో ప్రభవించినట్టే మన తెలుగు సాహిత్యంలో తూడా కేవలం కాముకల కథలు చెప్పే కావ్యాలు పుట్టకపోలేదు. శృంగారం మదనశివాలు తొక్కి, నాయిక పరకీయ అయికేగాని రక్తికట్టదని పదకర్తలు భావించే నాయకరాజుల కాలంలోనే రెండు “రంకు' పురాణ కావ్యాలు జనించాయి. ఒకటి “శుకసప్తతి' రెండోది “హంసవింశతి. రెండింటిలోనూ ఒకలాంటి కథానిర్మాణమే ఉంది. రెండింటిలోనూ అనగనగా ఒక మగనాలిని పట్టపు రాజు కామిస్తాడు. కబురు పెడతాడు. రెండింటిలోనూ ఆ యిల్తాలి భర్త వ్యాపారం కోసం దేశాంతరం వెళతాడు. రెండింటిలోనూ నాయిక రాత్రి ముస్తాబు చేసుకొని రాజుని కలుసుకోడానికి వెళ్లటోతే ఇంట్లో ఉన్న పెంపుడు పక్షులు అపి ఆకర్షణీయంగా కథలు చెప్తాయి. శుకసప్తతిలో చిలకా, హంసవింశతిలో హంసా ఉన్నాయి. రెండు కావ్యాలలోనూ నాయికలు అడుగుజారడానికి అవకాశం లేనంత ఆసక్తితో కథలకు చెవులూ, ఇంటికి కాళ్లూ అప్పచెప్పేస్తారు. రెండింటిలోనూ పిట్టలు ప్రతికథలోనూ ఒక_ మడతపేచీ వేస్తాయి. దీనికి జవాబు చెప్పకల్లితీ రాజుదగ్గిరకి వెళ్ళమని సవాలు చేస్తాయి. రెండింటిలోనూ నాయికలు చెప్పలేక పిట్టనే చెప్పమంటారు. ప్రతిరాత్రీ ఇలాగే గడిచిపోతుంది. రెండింటిలోనూ నాయికలు ఇలాగ తెలియని ఖాయిదాలో ఉంటారు. రెండింటిలోనూ భర్తలు ఇంటికి రాగానే కథానాయికలోని కామం కంచికి వెడుతుంది.

ఈ రసవత్తరమైన కావ్యాలలో శుకసప్తతిని తాడిగోళ్ల కదిరీపతీ, హంసవింశతిని అయ్యలరాజు నారాయణా రచించారు. ఈ ఇద్దరూ నాయకరాజుల యుగంలో నివాళ్లే, కదిరీపతి కొద్దిగా పూర్వుడు. నారాయణ ఒక తరం అర్వాచీనుడు. కదిరీపతి కోలారు ప్రాంకాలవాడు. నారాయణ నెల్లూరు పరిసరాలవాడు. కదిరీపతి ఆంధ్రా బొకాచియో అయితే, నారాయణ తెలుగు ఛాసరు. బొకాచియో రాసిన డికెమెరాన్‌లోని కథలనే ఛాసరు యథాతథంగా అనువదించాడని ప్రతీతి. కదిరీపతి కావ్యంలోని వర్జనలు, సామెతలు, పంక్తులు, భావాలు యథాతథంగా నారాయణ కూడా అనుసరించాడు. విశ్వసాహిత్యం లోని ఆ యిద్దరు కవులకూ, ఈ ఇద్దరు తెలుగు కవులకూ పోలిక సరిగ్గా నప్పుతుంది.

వాస్తవానికి డీకెమెరాన్‌: కాంటర్‌బరీ మజిలీ కథలతో శుకసప్తతికీ, హంసవింశతికీ అద్యసత్కథలను రచయితలు ,న్వీకరించే రోజులుండేవి. పాత ఇతివృత్తాలు విడీచిపెళ్టీ సమకాలిక జీవితంలోని వ్యక్తులను; వాళ్ల స్పాభావాలను తీసుకొని తాను జీవించే సంఘానికి దర్చణంగా డికెమెరాన్‌ కావ్యాన్ని, బొకాచియో నిర్మించాడు. అదొక ప్రపంచం దాని నిండా సజీవపాత్రలే ఉంటాయి. బొకాచియోలాగే ఛాసరు కూడా సమకాలిక జీవితాన్ని కాంటర్‌బరీ మజిలీలలో చిత్రించాడు. అతడు చేసిన వ్యక్తుల వర్ణనలు హృద్యంగా ఉంటాయి. సంఘంలో కనిపించే అన్నిరకాల వ్యక్తులూ, అన్ని వృత్తుల మనుషులూ అందులో ఉంటారు. ఈ విశ్వకవుల కావ్యాలలోలాగే మన తెలుగు కవులి “కావ్యాలలో తూడా సంఘహృదయం సజీవంగా స్పందిస్తుంది. తెలుగుతనంతో తెలుగువాళ్లతో. ప్రతికథా గుబాశిస్తుంది. అష్టాదశవర్ధాలవాళ్ళూ. తమ. భార్యలతో బంధువులతో, వేషభాషలతో, లోటుపాట్లతో, మాటతో" మంచితనంతో. మానవత్వంతో మన కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తారు.

తాడీగోళ్ళ కదిరీపతి అయ్యలరాజు నారాయణ 783

ఈ పోలికలు ఇంతటితో ఆగలేదు. డికామెరాన్‌లో కథకులు విసుగెత్తినారుగాని కథలు విసుగెత్తించవు; కాంటర్‌బరీ మజిలీలలో కథలు విసుగెత్తిస్తాయిగాని కథకులు విసుగెత్తించరు అని విమర్శకులు చెప్తారు. శుకసప్తతిలో కథలుగాని, కథకులుగాని విసుగెత్తించరుగాని హంసవింశతిలో కథలు హృద్యంగా ఉన్నా కథకుడు “బోరు కొట్టిస్తాడు. అయితే ఛాసరు వ్రాసిన వర్ణనలలాగా నారాయణ చేసిన వర్ణనలు, చెప్పిన వివరాలు, ఇచ్చిన భోగట్టాలు చరిత్రకారులకు పనికివస్తాయి. కదిరీపతి సందర్భోచితంగా చెప్పిన సాంఘిక విషయాలను నారాయణ, సందు దొరికితే చాలు సాంతం గుప్పించేస్తాడు. బొకాచియోని అనుసరించినా ఛాసరూ, కదిరీపతిని కాపీ కొట్టినా నారాయణా నిలబడగలిగారంటే వాళ్లకు చిత్తశుద్ధీ, సిద్ధహస్తం ఉండడంవల్లనే. అయ్యలరాజు నారాయణ 'సుమధుమధుర సుధావచస్సూర్త్హి కోసం, “సర్వశబ్దార్థవిజ్ఞానసరళి కోసం ప్రయత్నించిన వాడు. కదిరీపతి నైఘంటిక పదానునయరూడి కన్నా ముందు కావ్యనైపుణికే పెద్దపీట వేస్తాడు. పాలకడలిలోంచి చిలికి తీసిన అమృతంలాగా కావ్యరసాన్ని పాఠకులకి సునాయాసంగా అందిస్తాడు.

కదిరీపతి తన వంశం పాలవెల్లిలాంటిదని భావించాడు. తాడిగోళ్ళవారి వంశం పేరు అదిలో పాలవేకరివాళ్ళు. నేటి మైసూరులోని కోలారుమండలం శ్రీనివాసపురం తాలూకాలో పూర్వం పాలవేకరివారు ఉండేవారు. విజయనగర సామ్రాజ్యాన్ని అశియ రామరాయలు నిర్వహించే రోజులలో, అంటే క్రీ.శ1542-1565 మధ్య ఓబళనాయకుడు కర్షగా పేరెన్నిక పొందాడు. గుల్రాలు, ఏనుగులు, రత్నాలు మొదలైనవి బహుమతులుగా పొందాడు. తాడిగోళ్ళ గ్రామానికి అధికారం కూడా పొంది ఉంటాడు. ఈ పెద ఓబళనాయకునిలాగా అతని మునిమనుముడు కరెమాణిక్కృనాయకుగు మళ్లీ రాయసత్కారాలు పౌందాడు. క్రీ.శ 1618 నుండీ 160 దాకా కర్ణాటకాన్ని పాలించిన రామదేవరాయల సరిగద్దెమీద ఈ కరెమాణీక్కనాయకుడు కూర్పొనగలిగాడు.

కరెమాణికృనాయకునికి నలుగురు కొడుకులు. రెండో కొడుకు రామప్పనాయకుడు తన తండ్రికి పుణ్యంగా యిచ్చిన దానశాసనాలు క్రీ.శ. 167 నుండి కనబడతాయి. ఈ రామప్పగారి కొడుకు రఘుపతినాయకుడు శ్రీశ. 1648లోనే మహానాయకాచార్యుడై దానాలు ఇచ్చినట్టు శాసనాలు కనబడతున్నాయి. కరెమాణిక్య నాయకుని కడగొట్లు కొడుకు పేరు కదురరాజు. ఇతని భార్య పేరు కదురమ్మ,. వీళ్ళకి శదిరీపతి జన్మించాడు. కరెమాజీిక్యంగారి రెండో కొడుకు కన్న కొడుకు శ్రీశ. 1648 నాటికే ప్రాజ్ఞుడై దానధర్మాలు చేస్తే, కడగొట్టుకొడుకు నోచుకున్న కొడుకు, కదిరీపతి అనాటికి కావ్యనిర్మాణం చేసి ఉండడా?

  1. కొాందేంంతం643 80200108, ౪01. 3, ? 769 &. రతి నములరు 14 ఓ పతి - శుకసప గారి వ్యాసం, భారతి, + వ దప కన నల సుయ టి గ చ్చడు రోలురుటిలలో ఈ

వాయకుల శాసనాలు చాలా కనబడుతున్నాయి. వాటిలో తమ యింటిపేరు తాడిగోళ్ళ అని చాలాసార్లు చెప్పుకొన్నారు. కదిరీపతి కూడా గద్యలోనూ,. ఒక పద్యంలోనూ తాము పాలవేకరి . వాళ్ళమని'చెప్పినా అవతారికలో తమ ఇంటిపేరును 'తాడిగోళ్ల అనేవాడాడు. __

784 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వాస్తవానికి క్రీశ 1648 ప్రాంతాలకే కదిరీపతికి కావ్యనైపుణ్యమే కాక శబ్దగౌరవ ప్రాగల్భ రిం, అర్భావనాసక్రి, లక్ష్యలక్షణగుణశాఘ్యతాపటిమ పట్టుబడ్డాయి. సకల గలడు. రక్తి కల్పించు గీతాలు తెలుసు. ఇంపొనర్చే ప్రసంగవార్తలు ఘటించగలడు. అద్బుతం బొసంగే కావ్యవైభవం చెప్పగలడు. తన చుట్టూ ఉన్న తెలుగు సంఘాన్నే కాక విచిత్ర వేషభాషాఖిరాములగు పరంగులతోడి నెయ్యం అతనికి తెలుసు కాబోలు (శుక 1-19). ఇంగిలీసుల ముఖాముల నతడు చూశాడు (1-175). 'తలారికి బులావు ధగిడీకే అని గద్దించే తురకభటుణ్ణి, వాడు క్రొత్తగా తలమీద పెట్టుకొన్న తెలిపరంగి ముడాసునిసైతం తదిరీపతి గమనించాడు. అతని కన్ను చూడని వింత, కలం తొక్కని పుంతా లేవు. అడుగడుగు అబ్బురాలు కదిరీపతి వ్రాసిన ముష్ఫయి కథలలోనూ కనబడతాయి.

“ముప్ఫుది కథలలోనే యిన్ని చమక్కులున్నవియే. డెబ్బదిలోనెన్ని యున్నవో? అవి మనకు లభింపలేదయ్యో గదాయని విచారింపవలసి వచ్చినది” అని పరిశోధకులు బాధపడతారు. శుకసప్తతి అన్నది కావ్యనామం. సప్తతి అంటే డెబ్బయి. కాబట్టి ఇందులో డెబ్బయి కథలు ఉండితీరాలని అందరూ భావిస్తారు. దానిలో ముప్ఫయి కథలే ఉన్నాయి కనుక దీనికి “శుకత్రింశతి' అనే పేరు పెట్టాలని పండితులు భావించినట్టు బౌనుదొరగారు తాము సేకరించి పరిష్కరింపచేసిన శుకసప్తతి ప్రతిలో వ్రాశారు. అయితే ఆదిలో జూలూరు అప్పయ్యపంతులుగారి దగ్గిరనుంచి నేటి నిడుదవోలు వెంకటరావుగారిదాకా అందరూ కథల సంఖ్య డెబ్బయి అని పొరబడ్డారు. వాస్తవానికి శుకసప్త అంటే “చిలుక చెప్పిన డెబ్బయి కథ'లని భావించడంకన్నా “చిలుక డెబ్బయిరాత్రులు చెప్పిన కథలే' అని నిర్ణయించడం మంచిది. ఇది 'డెబ్బయిరాత్రుల కథ'లని సురవరం ప్రతాపరెడ్డిగారు సరిగ్గా ఊహించారు అయితే ఈ ఊహని బలపరిచే సాక్ష్యాన్ని వారు గ్రంథంలో చూపలేదు. శుకసప్తతి కావ్యం యించుమించు. పూర్తిగా లఖించిందేగాని అంతా వెలుగు చూడలేదు. అచ్చుపడ్డీ కావ్యంలోని ఆఖరు పద్యాలు పరిశోధకుల దృష్టిలో పడలేదు కాబోలు. చిట్టచివర కథానాయికతో చిలుక “నీవిభుండు మమతం మరి డెబ్బదినాళ్లనాటి కిలుజేరుదునని వాత్రుచ్చి చను టెరుంగవె మగువా?' అని అడుగుతుంది. (4-326)

ఈ కావ్యనిర్మాణ నైపుణ్యాన్ని అయ్యలరాజు నారాయణ మెచ్చుకొని ఈ ఫక్కీలోనే మక్కికి నుక్కి అనుకరణ చేశాడు. అయినా “ప్రతిభావంతుడు కనుక అనుకరణానికి కూడా స్వతంత్ర హోదాను తీసుకురాగలిగినాడు'' అని సహృదయులు భావించడంలో తప్పులేదు.” తరతరాలుగా తమ వంశంలో ఉన్న సత్కవితారరచనాఢ్యుల వారసత్వాన్ని నారాయణ తన కావ్యంలో కనబర్బాడు. వాళ్ళనిలా ఆదిలో స్తుతించాడు 4. శుకసప్తతి ద్వితీయ ముద్రణ పీఠికలో కొత్తపల్లి సూర్యారావుగారు. (వావిళ్ల ప్రచురణ).

  1. ఓలై. ఈ. 6?

  2. శుకసప్తతి (వావిళ్ల ప్రచురణ) మూడవముద్రణ ఉపోద్దాతం, పుట ౫

  3. హంసవింశతి, (బందరు శృంగారకావ్య గ్రంథమండలి ప్రచురణ) తొలిపలుకులలో మల్లా రామకృష్ణశాస్త్రిగారు, పుట 17,

తాడిగోళ్ళ కదిరీపతి అయ్యలరాజు నారాయణ 785 అయ్యలరాజు దిష్పసచివాగ్రణి బర్వతరాజు రామభ ద్రయ్యను భాస్కరాగ్రణి బ్రదానవరుండగు కొండధీరునిం జయ్యన దిమ్మయ ప్రభుని సత్కవితారచనాఢ్యులైన మా యయ్యల రాజవంశజుల నాదికవీంద్రుల సన్నుతించెదన్‌. (హంస 1-12) ఈ పద్యంలో అరడజనుమందిని సత్కవితారచనాఢ్యులుగా నారాయణ పేర్కొన్నా వీరిలో కొందరి గురించే మన సాహిత్య చరిత్రలు చెప్పగలుగుతున్నాయి. ఇప్పటిదాకా కాలనిర్ణయాలు నికరంగా చేసిన అయ్యలరాజు కవుల పేర్లు వారి గ్రంథాలను చూడండి. కప యుగ "

  1. | తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీరళశతకం | గజపతులయుగం
  2. | రామభద్రుడు రామాభ్యుదయం | నవాబులయుగం ౩. | అయ్యల భాస్కరకవులు | రెట్టమత ఆరవీటిరాజుల యుగం ఒంటిమిట్ట రఘువీరశతకాన్ని చెప్పిన అయ్యలకాజు తిప్పయ్యగారికి పర్వతన్న అనే తమ్ముడు ఉన్నాడు. ఈయన కూడా కవే అని నారాయణ ప్రస్తుతించాడు. ఈ పర్వతన్నగారి మనవడీ మునిమనుమడే నారాయణ. అంటే పర్వ్పతన్నగారికి అయిదోతరంలో నారాయణ ఉన్నాడు. తరానికి ముప్ఫయి సంవత్సరాలు లెక్కకడితే 150 సంవత్సరాల తేడా ఉంది. అయ్యలరాజు నారాయణ శ్రీ.శ1660 ప్రాంతాలవాడని భావిస్తున్నారు. దీనికి ఆధారం వారాయణ తన తండ్రి గురించి చెప్పిన ఒక పద్యమే. చూడండి తౌండిన్యసదోత్ర కల్చకంబగు పర్వత ప్రైగ్గడెవ్వాని తాతతాత కవిచకోరనిశాక (?) రయశస్ఫుర దయ్యలామాత్యుడెవ్వానియబ్బకబ్బ సుకవితాక్షుద్రద్రుకుద్దాలసముడు భాస్కరమంత్రి యెవ్వాని కన్నతండ్రి హంసవింశతి ప్రబంధాకల్చునారాయణాఖ్యుడౌనే నేమహాత్ముసుతుడ నట్టియయ్యలరాజాన్వయాంబురాళి భగణహృన్నాధుగొండ మూంబాసనాధు నిఖిలక కుబంతరాళనిర్హిద్రకీర్తి మజ్జనతు సూరపామాత్యుమాన్యుదలతు. ఇది “దశావతారకథాసంగ్రహము' అనే కావ్యం అవతారికలోని పద్యం. హంసవింశతి బ్రాశాక ఈ కావ్యాన్ని నారాయణ రచించాడు. ఇది మూడాశ్వాసాల గ్రంథం. ఇతని సమశాలికుడే కాక సమీప గ్రామాలలో ఉండే ధరణీదేవుల రామయ్య దశావతారచరిత్రను సుదీర్జింగా వ్రాస్తే నారాయణ అదే కథను కుదించాడు కాబోలు. రెండింటినీ శైపారు వెయ్యాలి. తలల పలతలతతలననతతనలానతాలానాలు
  3. శతకకవుల చరిత్ర, వంగూరు సుబ్బారావుగారు, పుకు 278.

786 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ధరణిదేవుల రామయ్య నెల్లూరు మండలంవాడు. ప్రళయ కావేరిపట్నంలోని మగదలవారి ఆన్రితుడు. అయ్యలరాజు నారాయణ తూడా నెల్లూరు మండలంవాడే. కొచ్చెర్లకోట తాలూకాలోని గోరుగుంతల గ్రామంలో ఉండేవాడు. ఆ గ్రామంలో ఆంజనేయస్వామి గుడి ఉండేది కాబోలు. ఆ దేవునిపై, బహుశా బాల్యంలో, నారాయణ ఒక శతకం చెప్పాడు: అయితే తన స్వగ్రామం పేరు హుందాగా లేదని దానిని సంస్కృత్తీ కరించాడు. గోరు అంటే నఖం. గుంట అంటే గర్హ. పాడు అంటే పురం. అందుచేత గోరుగుంతలపాడుని నఖగర్హపురం అన్నాడు. చెప్పేది కందపద్యశతకం కనుక “నఖగర్హ పురాంజనేయ నతజనగేయా' అని మకుటం పెట్టాడు. ఈ శతకంలో అంజనేయుణ్ణి ఏ 'గేయమానమైన భావాలతో నారాయణ కీర్ణించాడో తెలియదు. ఈ శతకం దొరకలేదు. ఈ ఆంజనేయభక్తి నారాయణకు పుష్పగిరి తిమ్మన్నగారివల్ల వచ్చిందేమో

పుష్పగిరి తిమ్మన్నగారు కంకంటి పాపరాజులాంటి వారికీ కవిత్వరచనలో సహాయం చేశారు. ధరణీదేవుల రామయ్యకు కూడా ఆయన సాయపడినట్లు ప్రతీ&. రామయ్య వ్రాసిన దశావతార చరిత్రకు ఇతరుల సహాయం కావలసి వచ్చిందిగాని తనకు అక్కరలేదని ఎత్తిపాడవడానికి కాబోలు అయ్యలరాజు నారాయణ గద్యలో తాను “నిస్సహాయ కవిత్వ నిర్మాణ చాతుర్యనిస్తంద్రుణ్ణి అని చెప్పుకొన్నాడు. అయితే ఇతరుల గ్రంథాన్ని ఆధారం చేసుకొని అనుకరిస్తూ తన ప్రతిభను చూపించేవాడు ఇలాగా చాటుకొనడం బాగుండదు.

నారాయణ వ్రాసిన హంసవింశతినీ, కదిరీపతి వ్రాసిన శుకసప్తతినీ పక్కపక్కన పెట్టుకొని చదివితే నూటికి పైగా అనుకరణలు కనబడతాయి. అభ్యుదయపరంపరాఖి వృద్ధిగా కథను ప్రారంభించి ఆ కథ జరిగే ఊరిని పాలించే రాజు 'చంద్రమతీనాధు చందాన, నలుని వైఖరిని వగైరా వైరా షట్టక్రవర్తులు షోడశమహారాజులు వెరసి ఇరవై ఇద్దరు ప్రాచీనుల తీరున పాలించుచున్నాడని కదిరీపతి చెప్పాడు (1-93). నారాయణ తూడా డీటో డిటోగా తన కథలోని రాజును 'వెరయ హరిశ్చంద్ర విధంబున, నలుని వీకను' వగైూ పద్ధతిలో పాలించమన్నాడు (1-42). శుకసప్తతిలోని నాయికను రంకాడమని జ్రోత్సహించిన కుంటెనకత్తె ఇలా ఎత్తిపాడిచిందిః

మగని ప్రక్కనెయుండి తగజేరి జోకొట్టి మోసపుచ్చని దేటి ముద్దరాలు

పసులగోడలనైన వసుథనిచ్చెన లేక యెక్క నేరని దేటి యెమ్మెలాడీ

తలవరుల్‌ గనుగొన్న దప్పునొప్పు ఘటించి బొంక నేరని దేటి పువ్వుబోణీ

దొరలు గద్దింప గల్లరివార్త నిజముగా నిర్వహింపని దేటి నీటుకత్తె

యత్తమామల గృహకర్పలగుచు మెలగు

నట్టిధూర్తుల నెల్ల నోరదిమి గదిమి

పొంచియువనాధుతోడగ్రీడించిమించి

చక్కటికిదిద్దుకొననిదేసరసురాలు (శుకు 1-13)

ఈ పద్యాన్నే చదివి బట్టీపెట్టి హంసవింశతిలోని హేల తన మాటలో ఇలా కొద్దీ మార్చులు చేసి చెప్పిందిః

తాడిగోళ్ళ కదిరీపతి అయ్యలరాజు నారాయణ 787 కోటగోడలనైన మాటుగా నెగబ్రాకి దాఓచేరని దేటి తలిరుబోడి? ఘుఘుమార్చాటితోడ ఘోషించునదులైన నీదిపోవని దేటి యెమ్మెలాడీ! తనమీదితప్పు నొక్కనిమీది నిజముగా బెట్టజాలని దెట్టి విసరుహాక్షి? ధవుడైన దనజాడ తగదని పట్టిన నిర్వహింపనిదేటి నీటుకత్తె? తలవరులుగన్నచో లేని తాల్మిబూని బొంకు తథ్యంబు తథ్యంబుబొంకుగాగ నెంచియుపనాధుతోడ గీడించిమించి చక్కటికిదేని దదియేటిసరసురాలు? (హం. 1-102) రెండు కావ్యాలలోని కథాకథనభాగంలో వందలాది పద్యాలను కాక ఈ రెండు

పద్యాలను చూస్తేనే చాలు నారాయణ చేసినది పచ్చి చౌర్యం అని ఎవరేనా అనగలరు. కాని

నారాయణ శుకసప్తతిలో లేని వివరాలను ఎన్నో సొంతంగా చేర్చి హంసవింశతిని ఒక నిఘంటువుగా రూపొందించాడు. విజ్ఞానసర్వస్పంలాగా రచించాడు. ఆటపాటల పేర్లు, చెట్లుచేమల పేర్లు, నదుల పేర్లు, ధాన్యాల పేర్లు, అష్టాదశవర్జాలవాళ్ళ వేషధారణరీతులు, వశీకరణ మంత్రాలు తంత్రాలు, మచ్చుమందులు, వివిధ శాస్రాలు-శస్తాలు ఒకటేమిటి? తనకు తెలిసినవన్నీ గుదిగుచ్చాడు. తాను చేసిన కృషిని అడుగడుగునా చూపిస్తాడు. - కదిరీపతిమాత్రం, తాను చేసిన కృషినే కాక చూసిన సమాజాన్నీ సత్యాన్నీ కూడా మనకు అడుగడుగునా ప్రదర్శిస్తాడు. ఇద్దరికీ కొరవి గోపరాజే ఒరవడి. సింహాసన ద్వాత్రింశికలో గోపరాజు ఒకవంక తన పరిశీలనా దృష్టినీ, మనస్తత్వచిత్రణాకౌశలాన్నీ చూపిస్తూ తన కావ్యాన్ని ఒక విజ్ఞానసర్వస్వం చేయదలిచాడు. “సర్వజ్ఞుడు కానివాడు సత్కవి యగునే' అని చెప్పాడు. గోపరాజులోని నిశిత పరిశీలనాశక్తిని కదిరీపతి అలవరచుకొన్నాడు. నిఘంటు నిర్మాణాసక్తిని నారాయణచేత పట్టుకొన్నాడు. తాము వ్రాస్తున్న కథలలో కేవలం జారత్వమేకాక లోకోపకారకమైన విషయాలు ఉండాలని ఇద్దరికీ మనసులో తహతహ లేకపోలేదు. అయితే ఉపదేశాన్ని '“'జాతివార్తలు దొలక రసంబు గులుక కవిత రచించి” కథలు కల్పించి చెప్పాలని కదిరీపతికి తెలుసు,

నారాయణతూ తెలుసు. వాళ్లు “తమ కాలంలోని రకరకాల మానవుల స్వభావాలను .

తెలుసుకొన్నారు. ముఖ్యంగా కులస్త్రీలలో అణచిపెట్టిన సెక్సువాంఛలను తెలిసినవాళ్లు

మగనాలికి ఎందుకు పరపురుష వ్యామోహం కలుగుతుందో నారాయణ ఇలా వ్రాశాడు:

కేరగరాదు నవ్వి గిలిగింతలు పెట్టగరాదు చెక్కులం

జీరగరాదు గుబ్బలు ఖచిక్కున గ్రుమ్ముగరాదు కేళిలో

మీరగరాదు పైకొని రమింపగ రాదు గళారవంబులిం

పారగ సల్చరాదు మదిరాక్షుల భర్హల గూడు వేళలన్‌ (హంస. 1-94) ప్రకృతిలో పశుపక్షులకు సహితం సెక్సు అడ్డంకులు లేవు. మనుషులకెందుకు? అనే చింతన కొందరిలో ఉందని కదిరీపతి ఇలా చెప్పాడు:

788 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నోరెరుంగని యట్టి జంతువులు సైత - మంబుజానన యిచ్భావిహారమందు బ్రతుక నేర్చినతనువొక్క పతికొసంగి - బంగరమువంటి మనసు గెంటంగ నేల?

(శుక, 1-531) జంతువులకు లేనివీ, మానవులకు తప్పనివీ వావివరసలు. అయిడీ కామం ప్రకోపించినపుడు, వాంఛ చెలరేగినప్పుడు పట్టలేనివాళ్లు వావివరుసలు పట్టించుకోలేరు.

ఇవి రంకుపురాణాలనిపించుకొనే ఇలాంటి గగ్రంథాలలోనే కాదు, పంచ కావ్యాలలో చేరిన మనుచరిత్రవంటి ప్రబంధాలలో నాయికలు కూడా తలచే తలపులే,

. సిగ్గుపోనాడని పతివ్రతల కథలు చెప్పి “ఇలాగే నడచుకొండి” అంటే ఎవరికీ అది రుచించదు. కుంచం నిలువునా వీల్లేకపోతే అడ్డంగా కొలిస్తే కొన్ని గింజలేనా నిలుస్తాయి! అందుకే చెడా మడా చెడిపోయి అతి సాహసంగా రంకాడి అంతకు రెట్టింపు ధైర్యంతో బొంక గలిగిన జగబ్దంతల కథలు చెప్పి 'వాళ్ళంత తెగువా, తెలివీ ఉంటే నువ్వూ చిత్తమొచ్చినట్టు తిరుగు" అని సవాలుచేస్తే ' నిజమే, వాళ్లు దేనికైనా తగినవాళ్ళు. మనకా చాకచక్యం రానూ రాదు, మనం గిరి దాటిపోనూ పోము' అని కొంద్రైనా అనుకుంటారు. మానసిక వ్యభిచారం చేసేవాళ్ల కోరికలను సబ్లిమేట్‌ చేయడానికి ఈ తరహా రచనలు అవసరమే. అందుకే అన్ని దేశాల సాహిత్యంలో అనాదినుంచీ ఇలాంటి కథలు ప్రచారంలో ఉన్నాయి.

పుణ్యకథల ఫలశ్రుతిలోని నిజమెంతో తెలియదుగాని ఈ కథలకు మాత్రం ఇలా ఫలశ్రుతి చెప్పవచ్చును. రాజుమీద మోజుపడ్డ మగనాలు ఈ రంకు కథలు విన్నాక “రాజు రాకడా ఉండదు! త్రోవనూకుడూ ఉండదు!

మలితరం ఇతర కవులు

“మరుగునపడిన మాణిక్యాలు." మరికొందరు “చరిత్రకెక్కని చరితార్థులు." వీళ్ళ పాండిత్యాలు రకరకాలు. కొందరు వ్యాకరణవేత్తలయితే మరికొందరు విలక్షణ ప్రయోగాలు చేసేవారు. తొందరు భక్తిగానాలు పాడితే, కొందరు యక్షగానాలు చెప్పారు. కొందరు అన్నిరకాల రచనా ప్రక్రియలను చేపట్టినవారు. వీళ్ళలో కొందరి జీవితాలను గేయాలుగా ఇతర కవులు గానం చేశారు. వీళ్ళలో పెద్దదాసుకు కనీసం పేరులో పెద్దరికం ఉంది కనుక, మొదటి పీట వేయవచ్చు.

పెద్దదాసుః విజయరాఘవుడు తంజావూరు పాలించే రోజులలో ఆ నగరంలో శేషాచలం. అనే గాజులనెట్టి ఒకాయన ఉండేవాడు. అతడు చేసిన పూజలకోర్తీ అపురూపమైన కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకు పద్దదాసు అనే పేరు పెట్టారు. కొడుకు పెరిగి పెద్దవాడయ్యాక కొలువులో చేరుతాడని శేషాచలం అనుకొన్నాడు. కాని పెద్దదాసు

మలితరం ఇతర కవులు . 789 కొలిచితే వేణుగోపాలుణ్జీ కొలవాలన్నాడు. తొన్నాళ్ళు తులధర్మాన్ని పాటించి గాజులమల్లారాన్ని భుజాన వేసుకొని ఆ ఊరి సౌఖాగ్యవతులను దీవించాడు. ఆ పిమ్మట తల్లితండ్రులు కాలం చేయగానే వృత్తి మానేసి పాటలుకట్టి పాడుకొంటూ కాలం గడీపేవాడు. అతని భక్తివైరాగ్యాలు ఊరంతా చెప్పుకొనేవారు.

ఇతని కీర్డి యువరాజు చెవిని పడింది. విజయరాఘవనాయకునికి మన్నారు దేవుడనే కొడుకు ఉన్నాడు. అతన్ని మన్నారప్పనాయనింవారనీ, మన్నార్నాయనింవారనీ పీలిచేవారు. అతనికోసారి వైరాగ్యం వచ్చింది. అతడు వేసిన ప్రశ్నలకు ఊరిలోని విద్వాంసులు సమాధానాలు చెప్పలేకపోయారు. పెద్దదాసే ఆ ధర్మసందేహాలు తీర్చకలడని అంతా అనుకొన్నారు. ఆ భక్తుని కోసం రాజభటులు వెళ్ళారు. “నరహరి కొలువును విడిచిపెట్టి ఒక నరుని కడకు రా'నని పెద్దదాసు చెప్పాడు. మన్నారుదేవుడు తానే స్వయంగా వెళ్ళి సందేహాలు తీర్చుకొన్నాడు. పెద్దదాసు పాడే పాటలు విని ఆనందించాడు. తన తండ్రి వంశావళిని వర్ణించి తనమీద పాటలు కడితే బాగుంటుందనుకొన్నాడు; కోరాడు. “నారసింహుని బాడిన నోట ఊరసింహమును బాడను' అని పెద్దదాసు నిర్భయంగా చెప్పాడు. తన తండ్రిని గ్రామసింహమన్నాడని కోపించి మన్నారుదేవుడు ఆ భక్తునిచేత కుక్కకన్నాా నీచమైన గాడిదకు దండం పెట్టించాడు. చెప్పరాని బాధలు పెట్టాడు. అన్నీ ఓర్చుకొని పెద్దదాసు దేవునితో మొరపెట్టుకొన్నాడు. భగవంతుడు కొరడాపట్టుకొని శిక్షించేగాకా మన్నారునాయనికి బుద్ధిరాలేదు. వెంటనే చెంపలు వేసుకొని క్షమార్చణ చెప్పుకొని పెద్దదాసుని విడిపించాడు. తరువాత కొన్నాళ్ళకు పెద్దదాసు శ్రీరంగంలో ముక్తి పొందాడు.

ఈ కథను సింగరిదాసు అనే జానపదగేయ రచయిత చెప్పాడు. 'పెద్దదాసు చరిత్రము అను గుజలీపుస్తకం చాలా ప్రచారం పొందింది. ప్రచారానికి తగినంత ప్రశస్తమైన రచన కాకపోయినా నాయకరాజుల కాలంలోని ఒక గేయకర్త గురించి పెద్దదాసును బాధించిన రాజు విజయరాఘవనాయకుడే అని కొందరు పరిశోధకుల అఖిప్రాయం.! సింగరిదాసు పారపడి మన్నారునాయకుణ్ణి తంజావూరి రాజుగా పెద్దదాసు చరిత్రలో పేర్కొనడంవల్ల పరిశోధకులు కూడా విజయరాఘవుడే హరిభక్తులను హింసించాడనుకొని ఉంటారు. అయితే అతడు వైష్టవపక్షపాతి. వాళ్ళు ఏ నేరం చేసినా దండించడు. పైగా వైష్ణవులను బాధించేవాళ్ళనే శిక్షిస్తాడని చెప్పవచ్చును. తంజావూరు పతనానికి ముందు మన్నారుదేవుణ్ణి విజయరాఘవుడు బంధించాడు. “ఇంతకుమునుపు, ఒకప్పుడేదో కోపం కల్లి తన కొమారుడు మన్నారప్పనాయనింవారికి బంగారుసంకెళ్ళు వేసి బందుచేసి ఉంచిరి అని దండకవిలెలో ఉంది. వైష్ణవులను హింసించిన వెంటనే విజయరాఘవుడు తన కొడుకును బంధించాడేమో. ఇది భావిపరిశోధనవల్ల తేలాలి.

పెద్దదాసు ఏవో కీర్తనలు బ్రాశాడనే తెలుస్తున్నదిగాని అతను కట్టిన పాటలేవో గుర్తించడానికి ఆధారాలు లేవు. పెద్దదాసు పదాలని పరిశోధకులు చెప్పి పదాలు నిజానికి 1 దక్షిణదేశీయాంధ్రవాబ్బయం, నిడుదవోలు వెంకటరావుగారు, పుట 14.

2 తంజావూరి ఆంధ్రరాజుల చరిత్ర, వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సంపాదితం, పుట 27.

720 సమగ్రాంధ్ర సాహిత్యం = రెండవ సంపుటి సింగరిదాసు పదాలే. నిడుదవోలు వెంకటరావుగారు పెద్దదాసువని చెప్పి రెండు పదాలను ఉదాహరించారు.3 వాటిలో రెండవ దానిలో చివరి చరణం ఇలా ఇచ్చారు; ఇందుముఖుల పొందు గోరము పర-నింద కొడిగట్టి తిరుగము ఫొందుగ నరసింహ పెద్దదాసును జూచు ఇందిరేశుభజనానందులైయున్నాము ఈ చరణంలో పెద్దదాసు అనే ముద్ర కనబడుతుంది కనుక అతడే వ్రాశాడనుకోవచ్చు. అయితే దీని అసలు పాఠం ఇంకోలా ఉంది

దీనిని బట్టి ఈ కీర్తన సింగరిదాసు రచనే అనే చెప్పాలి. భావిపరిశోధన వల్ల పెద్దదాసు కీర్తనలు లఖించితే అవి రామదాసుకీర్తనల తోవలోనివేమో పరిశీలించవచ్చు.

కంచెర్ల గోపన్న తెలుగుదేశంలో ఎందరు రామభక్తులున్నా ఒక్కడే రామదాసు! అతడు కంచెర్ల గోపన్న, ఖమ్మంజిల్లా భద్రాచలం తాలూకాలో నెలకొండపల్లె అనే గ్రామం ఉంది. అందులో క్రీ.ఈ1620 ప్రాంతాలలో కంచర్ల లింగన్న అనే కరణమో, గణకుడో ఉండేవాడు. అతనికి పింగళివారు పీలిచి పిల్లనిచ్చినట్టుంది. హనుమకొండలో “ఆమిల్‌ వద్ధ పింగళి భానుజయ్యగారనే ఉద్యోగి ఒకాయన ఉండేవాడు. ఆయన తన కూతురు కామమ్మను కంచెర్ల లింగన్నకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఈ దంపతులకు గోపన్న పుట్టాడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు గోపన్నకు చిన్నతనంనుంచీ రామభక్తి అలవడీ రామదాసు అయ్యాడు.

ఏ గురువువద్ద కవిత్వం నేర్చుకొన్నాడోగాని రఘునాథభట్టాచార్యులవారి వద్ధ గోపన్న వైష్ణవం ప్పీకరించాడు. కబీరుదాసుదగ్గిర తారకమంత్రం ఉపదేశం పొందాడు. రామనామంతోపాటు అతడు కావ్యరచన కూడా చేసేవాడు. జీవనోపాధి కోసమో, ఎందుకోగాని గోపన్ను తన కావ్యాలను దురాత్ములకిచ్చి మోసపోయాడు. రేగుపళ్ళ కోసం ముత్యాలు పోసినట్టు అతడు బాధపడ్డాడు. ఆ సంగతి ఇలా దేవునితో మొరపెట్టుకొన్నాడు:

మసగొని రేగుపండ్లకును మౌక్తికముల్‌ వెలపోసినట్లు దు

ర్వ్యసనము చెంది కావ్యము దురాత్ముల కిచ్చితి మోసమయ్యెనా

రసనకు చూతవృత్తి సుకరమ్ముగ జేకూరునట్లు వాక్సుధా

రసములు చిల్క బద్యముఖరంగమునందు నటింపవయ్య సం

తసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ. (నెం.7)

గోపన్న కోరినట్టే అతనికి వాళ్సుధారసములు చిలికే స్వచ్చంద కవిత్వం అలవడింది అతడు భద్రాచలంలోని రాముని సివలోనేకాక సర్కారు కొలువులో కూడా ఉండేవాడు. అతని మేనమామలు అక్కన్న మాదన్నలు. క్రీ.శ. 1650 ప్రాంతాలలో గోలకొండలో చిన్న ఉద్యోగులు: మీర్‌జుమ్లావద్ద కొద్దిపాటి జీతంతో వాళ్ళు పనిచేస్తూ ఉండేవారు. మేనల్లునికీ భద్రాచలంలో చిన్న ఉద్యోగం ఇప్పించారు. గోపన్న, క్రమేపీ తహసీల్దారు అయ్యాడు. తనవవననన మం వనన నను. కనన 3. దక్షిణ దేశీయాంధ్రవాబజ్బ్యయం, 1౫-167.

  1. _పెద్దదాసు చరిత్ర 16 పేజీలుగల పుస్తకం, ఎన్‌ వి. గోపాల్‌ అండ్‌ కో. మద్రాసు ప్రచురణ, పుట6

మలితరం ఇతర కవులు 791 అక్కడీ రామాలయాన్ని ఉద్ధరించాడు. ఆ రాముని మహిమవల్ల తన కొడుకు చచ్చి ట్రతికాడని విశ్వసించాడు. తన జీవితాన్నేకాక వసూలు చేసిన పన్నులు కూడా ప్రపన్నుల కోసం రామార్ప్చణ చేశాడు. భద్రాచలమాహాత్మ్యం లోకానికీ, రామదాసు సంగతి సర్కారువారికీ తెలిసింది. అధికారులు అతన్ని బంధించి ఖైదులో పెట్టారు. మేనల్లుడికి ఉద్యోగం _వేయించేపాటి పలుకుబడేగాని చెర తప్పించేంత అధికారం అక్కన్న మాదన్నలకు అప్పటికి లేదు.

గోపన్న పన్నెండేళ్ళు బందిఖానాలో మగ్గాడు. రోజుకో పాటతో తన ఆరాటాన్ని దేవునికి చెప్పుకొనేవాడు.

రక్షింప నిది యేమొ రాచకార్యము పుట్టె రామచంద్రా నన్ను

రక్షింపతున్నను రక్షకు లవరయ్య రామచంద్రా

అప్పులవారిదె అరికట్టుచున్నారు రామచంద్రా, స్వామి

చెప్పు శక్యము కాదు చక్షురోచరమాయె రామచంద్రా అని మొరపెట్టాడు; “నీటుతో నీ నామకోటి వ్రాసితిని, నీకు సాటిలేదని సారెసారెకు వేడితిని" నిన్నరికట్టుదు నింక దిక్కు కల్లితి మొరపెట్టుకోరా' అని దేవునికే దిక్కలిదన్నాడు. “తుదురుగ తూర్చుండనియ్యను నీతు - కోపము వచ్చిన భయపడను" అని దేవుడినే అడుగుదాటి కదలనియ్యనన్నాడు. “రాతికైన జెమట రంజిల్లు రామా, ఆ తీరు నీ మనసు నొందదు' అన్నాడు. 'నీ తలపుల లేదె సీతచెర దాశరథీ కరుణాపయోనిధీ" అని ఎత్తి పొడీచాడు. సీతతో “నను బోవవిని చెప్పవే' అని విన్నవించుకొన్నాడు.

క్రీశ 1674 నాటికి పరిస్థితులు మారాయి. అక్కన్న మాదన్నలు అంచెలమీద గొప్ప పదవులు సంపాదించారు. మాదన్న మీర్‌జువ్లూ అయ్యాడు. అక్కన్న షర్‌లప్కరు అయ్యాడు. వాళ్ళు చివరకు గోపన్నను విడిపించారు. విముక్తి పొందాక గోపన్న ఎలా జీవించాడో, ఏ రచనలు చేశాడో తెలియగుగాని బందిఖానా నుండి బయశఈ'పడేదాకా అతడు చెప్పిన పద్యాలు, కట్టిన పాటలూ అత్యంత ప్రచారంలోకి వచ్చాయి. అతని కీర్సనలు పాడని భక్సజనకూటమూ, అతని శతకంలోని పద్యాలు రాని భక్తుడూ తెలుగుదేశంలో లేడు. గోపన్న తన జీవితశేషాన్ని రామునికి సాటిలేరని చెప్పడంలో గడిపి ఉంటాడు. తన దీక్షను అతనిలా విశదపరిచాడు:

భండనఖీము డార్తబనబాంధవు డుజ్బ్వలబాణతూణకో

దండకళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికీన్‌

రెండవసాటిదైవ మిల లేడనుచున్‌ గడకట్టీ భేరికా

డాండడ డాండ డాండనినదంబుల జాండమునిండ మత్తనే

దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. (నెం. 34) రామదాసు కీర్తనల నినాదంబులతో నేడు తెలుగు అజాండము నిండిపోయింది.

792 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పైడిపాటి వెంకటనరసయ్యః రామదాసు భక్తీ, అతడు కట్టించిన భద్రాచల దేవాలయపు కీర్తీ అచిరకాలంల్‌ 3శే ఆంధ్రదేశమంతా అల్లుకొనిపోయింది కాబోలు. దూరాన నెల్లూరు మండలంలో ఉండే కవులు కూడా గోదావరీతీరాన ఉండే ఈ భద్రాద్రియుగ్గాన శ్రీకరుణ్ణి గైకొనమంటూ శతకాలు బ్రాశారు. “నన్ను గైకొను ముపేంద్రా రామచంద్రాహకీ అనే మకుటంతో పైడిపాటి వెంకటనరసయ్య అనే కవి భద్రాద్రెరామునికి అంకితంగా ఒక శతకం చెప్పాడు. ఇతడు నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకాలోని పైడిపాడు గ్రామంవాడు. ఆ ఊరికి అతని పూర్వీకుల కాలంనుంచీ పైడిపాటివారే కరణాలు. కరణీకమే కాక పైడిపాటివారి కుటుంబంలో అందరికీ ప్రవిమలపుణ్యకీర్తి, హరిభక్తీ కవిత్వతరోక్తీ ఉన్నాయట. పైడిపాటి లక్ష్మీపతి అనే ఆయన వరసమ్య్మక్కవికా చమత్కృతమతిగా, ఉత్పమకళా ప్రత్యక్షచంద్రునిగా పెరుపడ్డవాడు. అతని పెద్ద కొడుకు వెంకటనరసయ్య మాత్రం తండ్రి దగ్గిరే చదువు మొదలుపెట్టాడు. తరువాత ఎందరో దేనికుల ఉపదేశం వల్ల కవిత్వోపయోగవిద్యను పొందాడు. ఉభయ వ్యాకరణాలూ నేర్చాడు. వాగర్థజ్ఞాన సమర్థుడు అయ్యాడు. శతకాలు చెప్పాడు. ఒక్కొక్క శతకంలో పదకొండు దిశకాలు వ్రాశాడు. రామచంద్ర శతకంలో ఇలా చెప్పాడు: క్షితి నేకాదశసంఖ్యచే దశకముల్‌ చెన్నొంద మాణిక్యవ జతతిం గూర్చినహారపంక్తిగతి గీర్వాణాంధ్రశబ్దంబులన్‌ శతకగ్రంథ మొనర్చి నీ కొసగెదన్‌ సర్వేశ యస్కత్కవి త్వతపస్సిద్ధికి నన్ను గైకొను ముపేంద్రాః రామచంద్రా! హరీః 2. 1672 ఇతని కవిత్వ తపస్సు ఈ శతకంలోనేకాక మన్నారు కృష్ణశతకంలో కొనసాగిండి “చారుతరవందహాస పోలారివాస వారితామిత శృష్ట మన్నారు కృష్ణు అనే మకుటంతో వెంకమునరసయ్య ఒక సీసపద్య శతకం చెప్పాడు. ఇందులోనూ పదకొండు దశకాలున్నాయి. ఈ శతకంలోని మన్నారుకృష్ణుడు నెల్లూరి జిల్లా సూళ్ళూరుపేట తాలూకాలోని మన్నారుపోలూరు గ్రామంలోని చేవుడు. పైడిపాటి వెంకటనరసయ్యకు మన్నారుపోలూరు అత్తవారి |గగామం. భద్రాద్రిరాముని దేవాలయాన్ని రామదాసు ఉద్ధరించినట్టు మన్ని కృష్ణుని గుడిని వెంకటనరసయ్య ఉద్దరించాడు. “వినిపంతు నిదె నా కవిత్వంబు తాళా తాళరారైకనృత్యప్రమోద' అని దేవుణ్ణి కొంచెం ఆపి గుడి కట్టించినట్టుంది. అయితే "కృతి చెప్పుమని పల్కరింపనే చాలవా చాలవాచాలకశక్తి కరిగి అని భక్తుడే దేవుణ్ణి ముందు రెచ్చగొట్టాడు. వెకటనరసయ్య ఈ శతకంలో తన వాచాలకత్వాన్ని నిరూపియ కున్నాడు. ప్రతిసీసంలోనూ ప్రశిపాదార్థముక్తపద గ్రస్తాన్ని నియమంగా వాడాడు. మొదటీ దశకంలో పై నియమంతోపాటు పాదపాదానికీ ముక్తపదగ్రస్తం వాడాడు. శతకం ఎంకో శ్రావ్యంగా ఉంది. ఇతని రెండు శతకాలలో దశావతార శతకం అని ఒక విభాగం ఊదీ కంచెర్ల గోపన్నగారి దాశరథీ శతకంలో కూడా దశావతార దశకం ఉంది. గోపన్నను వెంకటనరసయ్య తన శతకాల్లో ఇలా అనుసరించాడు. శనవనమననవనము న తనకు క వన 5. ఆంధ్రసాహిత్యపరిషత్తువారు “శతకసముచ్చయం' ద్వితీయభాగంలో ఈ శతకాన్ని ప్రకటించారు.

నులితరం ఇతర కవులు 793

పై శతకాలు వ్రాశాక, 'శ్రీనివాసదేవుని యనంతావతారంబులని దశావతార తయంబు చిరకాలాభ్యుదయంబు గావున రామకృష్ణదైవంబులకు వృత్త సీస శతక ద్వయంబు చెప్పి యర్పించి నృసింహదేవునకు '“భవ్యంబగు కావ్యం ఒకటి వెంకట నరసయ్య చెప్పదలిచాడు. “లక్ష్మీన్ససెంహవిలాసం' అనే పేర చెంచులక్ష్మి కథను మూడాశ్వాసాలలో చెప్పాడు. ఈ కావ్యం వ్రాసేనాటికి అతడు కవితామతచమత్కార కారణుడు, అష్టభాషాసంస్కార పరిష్కార మనీషాఏిశేషుడూ అయ్యాడు ౧.733. ఇతడు ఎంతటి పండితుడో అంతటి పవిత్రుడు. కామక్రోధాలు లేనివాడు. అందుకే ఇతని మేనల్లుడు ఇతణ్జీ ఇలా నుతించాడు:

కామాదికషడ్‌ దుర్చృుద - భీముని శశ్రీపైడిపాటి వెంకటనరసిం

హామాత్య కవికులేంద్రుని - నా మాతులుని న్నుతింతు నతశీర్దుడనై.

ఇలా తలవంచుకొని నమస్కరించే మేనల్లుడు ఎవరో అనామకకవి కాడు. హంసవింశతి రచించిన అయ్యలరాజు నారాయణ

పొనుగోటి జగన్నాధరాయలు: సర్కారు ద్రవ్యాన్ని రెండు చేతులా కైంకర్యం చేసి సద్బక్తుడని పట్టా పొందినవాళ్ళలో కంచెర్ల గోపన్న 17వ శతాబ్ది నుండి సుప్రసిద్ధుడైనా అదికాలంలోనే ఇటువంటి చరిత్ర కల మహానుభావుడు లేకపోలేదు. వైష్ణవమకాన్ని ప్రచారం చేసిన పన్నెండుమంది ఆళ్వారులలో ఒక దివ్యసూగి ఇటువంటివాడే. ఆయన పేరు పరకాలుడు; చోళదేశంలో ఒక ఊరికి అధికారి. ఆ వూళ్ళో ఒక వైద్యుడున్నాడు. అతనికి పిల్లలు లేరు. ఒకనాడా వైద్యుడు కోనేటికి వెళ్తాడు. అక్కడొక ఆడపిల్ల అళనికి దొరికింది. ఆమెను ఆ వైద్యుడు పెంచాడు. పెద్దదాన్ని చేశాడు. ఆ పిల్ల అందాన్ని చూసిన పరకాలుడు ఆమెను పెళ్ళాడదలిచాడు. పంచసంస్కారాలుూ పొందిన వైష్ణవునిగాని వివాహం ఆడనని ఆ చిన్నది ప్రతిజ్ఞ చేసింది. పరతాలుడు వైష్ణవుడై ఆమెను వివాహం చేసుకొన్నాడు. పరమభాగవతులకు నిత్యం షడ్రసోపేతంగా విందులు చేసేవాడు. దానికై రాజద్రవ్యాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. రామదాసు కథలోలాగే పరకాలుని కథలో తూడా రాబుకి కోపం వచ్చింది. డబ్బుకోసం కబురుపెట్టాడు. మనుషులను పంపాడు. పరకాలుడు వాళ్ళని తిరగగొట్టి రాజుమీద తిరగపడ్డాడు. యుద్ధం చేశాడు. చివరకు 'మీ సొమ్ము మీకు ఇస్తాను, కంచికి రండి" అని రాజోద్యోగులను తీసుకువెళ్ళాడు. ఎవరో అడ్నపడి డబ్బు ఇచ్చారు. రాజు పరకాలుణ్జి దేశబహిష్కారం చేశాడు. ఆ భక్తుడు భార్యతో బయటపడ్డాడు. నిత్యం వైష్ణవులకు సంతర్పణ చేయాలి. డబ్బేదీ? అంచేత పరకాలుడు టొంగతనాలు చేసేవాడు. అయితే, తనకోసం చేసిన అధర్మం కూడా ధర్మమేనని విష్ణువు లోగడ సెలవిచ్చాడు. అందుచేత పరకాలుడు చేసేది తప్పుకాదని అతని భార్య తలపోసేది. అతడు శ్రీమహావిష్ణువు ధరించే కార్ముకం అంశతొ పుట్టిన మహానుభావుడు. అతణ్ణి తమిళ ఖాషలో తిరుమంగైయాళ్వార్‌ అంటారు. అతని భార్య లక్ష్మీదేవి అవతారమే. అమె పేరు కుముదవల్లి. ఈ _ఆళ్వారుచరిత్రను “తుముదవల్లీ విలాస'మనే పేరిట పొనుగోటి జగన్నాధరాయలు ఒక ప్రబంధాన్ని వ్రాశాడు. ఈయన నలగొండ జిల్లాలో ఉండే పెనుగోడు నివాసి. ఇతనికి గోలకొండ నవాబు గుర్రాలు, ఏనుగులు, ఛత్రాలు, బామళాలు

794 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మొదలైనవి ఇచ్చాడు. నవాబులకు అణకువగా దేవాద్రిపట్టణాన్ని జగన్నాధరాయలు పాలించేవాడు. ఇతడు వైష్ణవుడు. సముద్రాల తిరుమలాచార్యులవారి శిష్యుడు. తాను రచించిన కుముదవల్లీ విలాసాన్ని కవి తన గురువుగారకే అంకితం ఇచ్చాడు. ఇది ఐదాళశ్వాసాల గ్రంథం. కవి తొమ్మిదోతరంలోని మనుమడు. దీనిని క్రీ.శ 1925లో అచ్చు వేయించారు. తరానికి ముప్పయి సంవత్సరాల చొప్పున లెక్కిస్తే కవి క్రీ.శ పదిహేడో శకాల్టి

వేములవాడ సోమనాథుడు: తెలంగాణలో ఉన్న వేములవాడకు లేయులవాడ అని మరొక పేరుంది. లకారయుక్తమైన ప్రయోగాన్ని తన వసుచరిత్ర వ్యాఖ్యానంలో సోమనాథకవి యతిస్తానంలో వాడాడు.

శ్రీ మెజయన్‌ సమస్త మునిసేవితమై విలసిల్లుచున్న యీ

లేములవాడలో వివిధలీలలు జూసి జగంబు బోచునా

సామికీ రాజలింగమను చక్కని నామము గల్గువానికిన్‌ _

గామితదాయి కర్పితముగా నొనరించెద నీనింబధమున్‌ 0 759

వసుచరిత్రకు అర్థం చెప్పినవాళ్ళలో ఇతడు మొట్టమొదటివాడు కాదు. చిత్రకవి వెంకటరమణ అద్బూడు (7.123. అయినా నేడు లభ్యం అవుతున్న వ్యాఖ్యానాలలో పోమనాథునిదే ప్రాచీనమైనది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతాలవాడు అని బ్రౌనుదొరగారు అభిప్రాయపడ్డారు. గోలకొండ కవుల సంచిక సంపాదకులు మాత్రం ఈ కవి క్రీ.శ 160 ప్రాంతాలవాడని చెప్పారు (పుట 415). ఈ వ్యాఖ్యానానికి “విద్వజ్జ్ఞనరంజని' అని పేరుంది ఈ టీక ఒక్కటే కాక సోమనాథుడు మరికొన్ని గ్రంథాలుకూడా రచించాడు. (1) చతుర్చుజాఖిషేకం, (2) ధ్రువచరిత్ర, (3) మరుత్సందేశం (4) ముద్రాలాభం (5) గంగాగౌరీ సంవాదం అనే ప్రబంధాలు చెప్పినట్టు వసుచరిత్ర వ్యాఖ్య అవతారికలో తెలియజేశాడు. ఈ ప్రబంధాలలో 'హృద్యబహుళార్థ చమత్కృతి శబ్దచిత్రముల్‌ ఉన్నాయట. అయితే దురదృష్టవశాత్తూ ఈ గ్రంథాలు కొన్ని అముద్రితాలు, కొన్ని అలభ్యాలు. “విద్వజ్ఞనరంజనీ' వ్యాఖ్యానం వల్ల సోమనాథు డాంధ్ర సాహిత్యానికి గొప్ప ఉపకారం చేశాడు. వసుచరిత్రను వ్రాసిన కవి పేరు భట్టుమూర్తి అనే సంగతిలా గ్రంథస్థు చేశాడుః

కారణజన్ముడై కవిని కాయము మెచ్చగ గార్యకర్తయై

భూరికళాకలాపుడయి పౌల్పు వహించెడు భట్టుమూర్తిచే

నీరితమై ఘనార్థవరహీన పదాస్పదమై యీవసు

క్షారమణప్రవృత్తము సుసాధ్యము కాదు తలంచి చూడగన్‌. (0.74

వసుచర్ధిత్రలోని అర్థాలను సుసాధ్యం చేసిన సోమనాథుడు స్వయంగా రచించిన బహుళార్థచమత్కృతులను చవిచూసే అదృష్టం మనకు కొరవడింది.

మలితరం ఇతర కవులు 795

కోన నారాయణః మన భాషలో ఒకే కథను పదిమంది వ్రాయడం పరిపాటే ఉషాపరిణయాన్ని ఎందరో వ్రాశారు. తమ కావ్యానికి ఉష పేరో, అనిరుద్ధుని పేరో పెట్టుకొన్నారుగాని వారికి పుట్టిన బిడ్డ పేరు పెట్టలేదు. కోన నారాయణ అనే తెలంగాణా కవిమాత్రం 'వజ్రాభ్యుదయం' అనే పేరుతో ఉషాకల్యాణం వ్రాశాడు. ఈ కావ్యానికిలా దేవుడే నామకరణం చేశాడట. కవిగారి కలలో కనబడి ఫ్రోత్సహించి “అయ్యనిరుద్ధచరిత్ర శంక వజ్రాభ్యుదయం బటన్న యఖిధాంతర మొప్ప నొనర్చుమూ కృతినో అని అనతిచ్చాడట. ఆనతిచ్చిన దేవుడు హయగీవుడు.

కోన నారాయణ ఒనర్చిన ఈ కావ్యం అచ్చుపడలేదు. ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఒక అసమగ్రప్రతి ఉంది (గంథసంఖ్య_ 3523). అవతారికలోని పద్యాలవల్ల ఇతని యింటి పేరు కోనవారు అని పరిశోధకులు భావించారు. అయితే ఆ యింటి పేరు 'నెల్లుట్ల' వారని శేషాద్రిరమణ కవులు వ్రాశారు.” ఇప్పటి తెలంగాణాలోని బమ్మెరగ్రామంలో నెల్లుట్లవారున్నారని, వారింట్లో వజ్రాభ్యుదయం జీర్ణప్రతి ఒకటి దొరికిందనీ, ఈ [గ్రంథకర్త బమ్మెర పోతరాజుగారి వంశంలోవాడని కూడా శేషాద్రిరమణ కవులు చెప్పారుగాని 'బమ్మెరవారికిని' నెల్లుట్లవారికిని కౌండిన్యసగోత్రసామ్య మొక్కటి దక్క వేరు సంబంధమేమియు లేదు అని కందుకూరి వీరేశలింగంగారు ఖండించారు. నారాయణ నిజంగా పోతరాజుగారి వంశంలోనివాడైతే ఆ సంగతి అవతారికలో చెప్పుకొనేవాడు. న

కోనళబ్ద మేమహాసూనవిభవున- కన్వయార్థ మగుచు నతిశయిల్లు

నక్కుమార కోనపార్యునస్మత్కులా- చార్యు గొలుతువాత్స్యజాతధుర్యు అని ఒక ఎత్తుగీతిలో తన కులకర్తగా కోనప్పునే నారాయణ కీర్షించాడు. ఈ కవి తండ్రిపేరు అచార్యులుగారు. గురువు బోయనపల్లి నరసింహంగారు. ఈయన మహాపండితుడేకాక చక్కగా చదువు చెప్తాడు. “వజ శుంఠీయునైన వచ్చి యేఘనువొద్ద సంచికబట్టబేన్వతి కవితాధార భాగీరథీరయ మధురతాభర' మని కూడా శిష్యుడు చెప్పాడు. అయితే ఆ ధారను ఆస్వాదించడానికాయన పుస్తకాలు దొరకలేదు. గురువుగారి రచనలు పూర్తిగా దొరకలేదు గాని శిష్యుని రచన కొంతైనా లఖిస్తున్నందుకు సంతోషించాలి. “వజ్రాభ్యుదయంలోని కవిత్వం చక్కగా నున్నది. సంస్కృత పాండీత్య మసమానమని కొన్ని ఘట్టములు సూచించుచున్నవి' అని పరిశీలకులు చెప్తున్నారు. ఈ కావ్యం ఉన్నంతమటుక3ైనా అచ్చుపడితే మంచిది.

బోరవెలి కవులు - బోయినపలి దొర ఈనాడు మనలో ఇంటిపేర్లు త్వరగా మారిపోవుగాని, ఒకనాడు రెండు మూడు తరాలలోనే అవి మారిపోతూ ఉండేవని చెప్పవచ్చు. క్రీశ 1580-1614 ప్రాంతాలలో తరిగొప్పుల మల్లన్న అనే కవి 8. అంధ్రసాహిత్యపరిషత్తు పత్రిక సంపుటి 8, సంచిక€. పుట ౫41. 7. గోలకొండకవుల సంచిక, పుట 41. 8. తెలుగుకవులచరిత్ర ప్రథమభాగం బమ్మెర పోతన, పుట 898.

7906 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చంద్ర భానుచరిత్ర రచించాడు. ఇతడు తన పూర్వుల ఇంటిపేరు తరిగొప్పులవారు అని చెప్పుకొన్నాడు. అయితే ఈయన రెండవ వెంకటపతి రాయలవారి వద్ద వ్రాయసంగా ఉండబట్టి ఇతని కుటుంబానికి రాయసంవారనే ఇంటిపేరు వచ్చింది. కాని మల్లన్నగారి మనుమలు, మునిమనుమలు గద్వాలదగ్గిర ఉన్న బోరవెల్లిలో స్థిరపడడంవల్ల కొన్నాళ్ళకు వారికా సంస్థానపు పేరే ఇంటీపీరు అయింది. తరిగొప్పుల మల్లన్నగారి మనుమడీ మనుమడు నరసింహం అనే కవిని సమకాలికులు బోరవెల్లి నరసింహం అని పిలిచేవారు. ఇతడు “సాపర్దాఖ్యానం' అనే కావ్యాన్ని వ్రాశాడు. దీనిని అలంపూరు నరసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఈ కావ్యంలో ఉభయ భాషా మోషోక్తులు ఉన్నాయని, ఇది సాంప్రదాయ ప్రసిద్ధిని పాందినదని తెలుస్తోంది. ఈ కవిగారి తండ్రీ కృష్ణప్ప కూడా కృత్తికర్తు ఆయన “యయాతి చరెత్ర'ను రచించాడు. అతని తండ్రీ దత్తన్నగారు శబ్దశాస్త్రప్రవీణుడు. ఈ బోరవెల్లి వారి గ్రంథాలేవీ దొరకడం లేదుగాని వీళ్ళ చరిత్రమాత్రం ఇతరుల కావ్యాలవల్ల తెలుస్తోందీ. బోరవెల్లి నరసింహం ఒకనాడు ప్రసిద్ధుడు. సంస్థానాధిపతులకు గురువు అతడు రాజసభలకు వెడుతున్నప్పుడు నెంబడీనే లేఖకులు, పాఠకులు నడిచేవారు. ఉత్తపదార్థగౌరవాలు అడుగుతూ స్లోవారు. ఈ నరసింహకవికి పెదపానుగల్లు గుర్గాధిపతి విష్కుడు. అతని పేరు బోయనపల్లి కుమారవెంకటరాయలు. ఆయన ద్రౌపదీ కళ్యాణం అనే కావ్యం వ్రాశాడు. అందులో తన గురువు గారినీ, వారి తాతముత్తాతలనూ ఇలా కీర్డించాడు. మీ తాతతాతకు భాతృజసూతిగ దారాయసము మల్లసూరి “చంద్ర ఖానుచరిత్ర' మొప్పగ జెప్పె మీ తాత దత్తన్న శబ్దశాస్త్ర ప్రవీణు డతిని సుతుండు కృష్ణప్ప 'యయాతి చరిత్ర మిశ్రకావ్య మొనర్చె మీజనకుడు చేసితి వీవు దక్షిణ కాశ్యలంపురిన్సృహరిదయోదయా మహిత కలిత కృతి యతనికంకితముగ బండితుల మతుల నెనయ సౌపర్జకాభ్యామనమనగనొకటి యుభయ భాషామోషోక్సియు (శిథిలము) సిద్ధముగ సంప్రదాయ ప్రసిద్ధి గినుచు. (బౌపరి 1-4) ఇంతటి చరిత్రగల బోరవెల్లికవుల గురించి మిత్రులు డాక్టరు వి. రామరాజుగారీ “మరుగుపడిన మాణిక్యాలు" అను గ్రంథంలో ఉదాహరించిన పద్యాలవల్ల పై వివరాలు సేకరించాను. తెలుగుదేశానికి తొలిసారిగా ఈ కవుల ఉనికి తెలియచేసినందుకు రామరాజుగారికి మనం బుణపడి ఉన్నాం. అయితే బోరవెల్లి నరసింహం గురించి అయ కొద్దిగా పారబడ్డారు. లయగ్రాహి గరుడాచలకవికి ఇతడు తండ్రి అని వారిలా ట్రాశాడ “లయగ్రాహి గేరుడాచలకవి తండ్రి అయిన బోరవెల్లి నరసింహకవియే. ట్రౌపీ కళ్యాణమును (అముద్రితము) రచించిన బోయనపల్లి కుమారవెంకట రాయలను పాలుగట్లి వెలమరాజునకు గురుతుల్యుడు'"'19 లయగ్రాహి గరుడాచలంగారి తండ్రిపేరు కూడా నరసింహకవే. వారి స్వగ్రామం బోరవెల్లే. అయిడే లయగ్రాహివారిది హరితస గోత్ర పానగల్లు దుర్గాధిపతుల గురువైన నరసింహకవిది స్వతంత్రకపి గోత్రం. ఈ సంగ 9. ఆరవీటిరాజుల యుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటి 10. రాఘవాభ్యుదయం, చింతలపల్లి ఛాయాపతికృతి - పీఠిక పుట 9.

మలితరం ఇతర కవులు 797 కుమారవెంకటరాయల [గ్రంథంవల్ల తెలుస్తూంది. తన సభలోనికి వచ్చిన గురువుగారిని అతడు ఇలా సంబోధించాడు.]ే

అర్వేలాన్స్వయ గేయ రాయసము మల్తామాత్య సూర్యస్వ వా

యోర్వీదేవ మత స్వతంత్రకపిగోత్రోద్పూత దత్తాహ్వయాం

బోర్వెల్లిపుర నారసింహకవి సంబోధించి ఇట్లంటొగిన్‌. (ద్రౌపదీ. 1-46) తరిగొస్పుల మల్లన్నది కూడా ఇదే గోత్రమని చంద్రభానుచరిత్ర అవతారికలోని ఈ క్రీంది పద్యంవల్ల తెలుస్తూంది:

శ్రీవిద్యావిభవాస్పదంబయిన యార్వేలాన్వవాయంబుసం

భావిత్రాఖినుత స్వతంత్రకపిసన్మానీంద్ర గోత్రుల్‌ ధరా

దేవోత్తంసులు మించి రందు బెడగొందెక్‌ భూజనశ్రేణ్‌ సం

భావింపం దరిగొప్పు లాంకుడగు శ్రీమల్ల ప్రధానుండిలన్‌ (చంద్ర. 1-25)

ఈ చర్చవల్ల తరిగొప్పుల మల్లన వంశంలోని నాలురైదు తరాల కవుల పేర్లు, వాళ్ల గ్రంథాలూ తెలిశాయి. మల్లన క్రీ.శ 1580 ప్రాంతాలవాడు. అతనికి నాల్గు తరాల తరువాత వాళ్లు 1670 ప్రాంతాలలో ఉన్నారని భావించవచ్చు. ఈ సంగతులను తెలియజేసే ద్రౌపదీకల్యాణం మన సాహిత్య చరిత్రకు ఎంతో ఉపయోగపడింది. ఈ గ్రంథాన్ని వ్రాసిన పద్మనాయక ప్రభువు తుమార వెంకటరాయలు. ఇతని పూర్వులు కుతుబ్‌షాహిలకు అణకువగా ఉండి మెతకుదుర్గాన్ని పాలించేవారు. కాని ఈ బోయినపల్లి ప్రభువులలో వెంకటరాయలనే దొర పెదపానుగల్లు దుర్గాధిపతిగా ఉండేవాడు. ఈయనకు కృష్ణానదిలో ఈదడం ఇష్టం. అందుకే కృష్ణవేణీ జలక్రీడావినోదనా బిరుదు ఇతనికి ఉండేది. ఇతని తుమారుని పేరుకూడా వెంకటరాయలే. అందుచేత కొడుకుని కుమూరవెంకటరాయలని పిలిచేవారు. ఇతనే ద్రౌపదీ కల్యాణాన్ని బ్రాశాడు. ఇది అయిదాశ్వాసాల కావ్యం, అముద్రితం. ఈ తాళపత్ర గ్రంథాన్ని గద్వాల సంస్థానంవారు ఆంధ్రసాహిత్య అకాడమీకి ఇచ్చారు. ఈ కవిని గురించి, కావ్యం గురించి డాక్టరు విరుదురాజు రామరాబుగారు తమ “మరుగుపడిన మాణిక్యాలు'లో విపులంగా తెలియచేశారు.

కుమార వెంకటరాయలు అనవద్యవిద్యానిశంకటుడు. మేష కృతులలోనూ, బంధగర్చ్భ కవిత్వాలలోనూ అందెవేసినవాడు. ఇతడు వైష్ణవుడు, శరన్నవరాత్రులలో సరస్పతీలక్ష్మీపూజలు చేసేవాడు. ఒకసారి దసరా రోజులలోనే తిరుపతి వెంకటేశ్వరస్వామి కలలో కనబడి ద్రౌపదీకళ్యాణాన్ని వ్రాయచుని ఆనతిచ్చాడు. కవి, నవఠసాలంకారాంకీ తంగా ఆ కావ్యాన్ని వ్రాసి దేవునికే అంకితం ఇచ్చాడు. గ్రంథాంతంలో ఇలా చెప్పాడు.

అతులంబై యకలంకమై ప్రభుసమాజాకర్ణ్యమై వర్ణ్యమై

యతిపాపాపహమై శుభావహమునై యాచంద్రతారార్క సు

స్థితమై యుండెడుగాక వెంకట నగాధిస్వామి యుష్మద్గుణాం కీర మేతత్కృతి యీక్షితిన్‌ కవిజనాంగీకారసారోన్నరిన్‌ 11. ఈ పద్యాన్ని దానిముందు ఉదాహరించిన దానినీ డాక్టరు రామరాజుగారి “మరుగుపడిన

మాణిక్యాల' నుండి తీసుకొన్నాను. పుట 21.

798 సమ(గాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ ద్రౌపదీకల్యాణం అచ్చుపడితే కవిజనాంగీకారం పొందవచ్చును. అంగర నరసింహం: కవిజనాంగీకారం పొందిన కావ్యాలలో కూడా వ్యాకరణ దోషాలు ఉంటే లాక్షణికులు ఒప్పుకోరు. వ్యాకరణరీత్యా చేయు, కోయు, వ్రాయు, మొదలైన ధాతువులలోని 'యా'కు కొన్ని సందర్పాలలోనే సకారం వస్తుంది (బాల. క్రీయ-54). తద్ధర్మాదులలో సాధారణంగా 'యా'కు నకారం రాదు. చేయుట, కోయుట, బ్రాయుట అంటామేగాని, చేసుట, కోసుట, వ్రాసుట అనే ప్రయోగాలు చేయడం ఇప్పుడు ఎక్కడా కనబడదు. అయితీ అంగర నరసింహం అనే కవి ఓంప్రథమం తొలిపద్యంలోనే “వ్రాసుటి అనే ప్రయోగం చేశాడు. ఒకసారి కాదు, రెండుసార్లు అదే పద్యంలో చేశాడు. అతని 'రాజరాజాఖిషేకం' అనే అయిదాశ్వాసాల కావ్యంలోని మొదటి పద్యం చూడండి. శ్రీపతిచన్ను గ్రేవలను జెక్కుల నొక్కుట చిత్రభంగముల్‌ బ్రాసుటకున్‌ విరించి నిటలంబుల నొక్కట భాగ్యవర్టముల్‌ వ్రాసుటకున్‌ జతుర్చుజవిలాసము పూనిన వేల్పు సత్కృపో ల్లాస మెలర్చ బ్రోచు శుభలక్షణు గొప్పుల వల్లభూవరున్‌ అయితే ఇటువంటి ప్రయోగాలు ఈ కని ఒక్కడు మాత్రమే చేయలేదు. కట్టా వరదరాజులాంటి వారుకూడా చేశారు. ద్విపద రామాయణం అయోధ్యకాండలో రామపట్టాఖిషేక ప్రయత్నాలు జరుగుతున్న సంగతి చెప్పిన మంధరతో కైకేయి తన సంతోషం వెల్లడిస్తుంది. ఆ సందర్బంలో రాముడు తననెంత ట్రీతిగా చూసుకొనేదీ ఇలా చెప్పిందని వరదరాజు వ్రాశాడు. కౌసల్య గడవ రాఘవుడు నాయందు వేసుమిక్కిలి ప్రీతి చెప్పెడి దేవి. (అయోధ్య. 70) కట్టా వరదరాజు క్రీ.శ 1650 ప్రాంతాలు. వరదరాజు చేసిన ప్రయోగాలవంటివి చేసిన అంగర నరసింహం తూడా అకాలంవాడే అనుకోవచ్చు. ఇతడు తన ' “రాజరాజాఖిషేకాన్ని! కొట్టాపురం పాలించే కొప్పుల వల్లభరాజుకి అంకితం ఇచ్చాడు. ఇది విశాఖపట్నం జిల్లా శృంగవరపుకోట తాలూకాలోని కొట్టాం కావచ్చు. ఈ గ్రామాన్ని పాలించే రాజుని 'పట్టుతలాటు కేళాదీరాయ రాజదేవేంద్ర రాజాధిరాజచం ద్ర గాయిగోవాళ జగనొబ్బగండబిరుదశాలి' అని కవి చెప్పాడు. అయితే కవి గురించిగాని, కృతిపతి గురించిగాని అట్టే వివరాలు తెలియవు. రాజరాజాఫిషేకం అముద్రితం, అలభ్యం. దీనిని గురించి కందుకూరి వీరేశలింగంగారు తమ ఆంధ్రకవుల చరిత్ర మూడవభాగంలో చెప్పారు. లక్షణదోషాలు ఎన్నో ఉన్నా మొత్తంమీద కవిత్వం రసవంతంగానే ఉందన్నారు. అంగర నరసింహం ఈ కావ్యంలోని పూర్వకవిస్తుతిలో చిమ్మపూడి అమరేశ్వరుని వచః ప్రసాదసంసిద్ధుడని నుతించాడు. శ్రీనాథుని తరువాత నున్న ఏ కవీ పెర్కొనలేదు. ఇతని గ్రంథం నాకు లఖించలేదు. అనాలా న ధాత కొతన కుకు నాతుత తననన ననన నభా కనా ననిన నిన్‌ 12, ఈ ప్రకటరణం వల్ల తేలిన క్రొత్త గ్రంథాలు మూడు కవులు. ముగ్గురు 1. బోరవెల్లి కృష్ణప్ప - యయాతి చరిత్ర. 2. బోరవెల్లి నరసింహం - సౌపర్దాఖ్యానం, 3. బోయినపల్లి కుమార వెంకటరాయలు - ద్రౌపదీ కల్యాణం.

మలితరం ఇతర కవులు 799 కాడూరి శోభనాద్రి: అంగర నరసింహం యతిప్రాసల కోసం 'వ్రాసుటి మొదలైన ప్రయోగాలు చేస్తే, గణాల కోసం పేర్లను పొట్టిచేసే కవులు - అందులోనూ తన పేరును తప్పు వర్ణక్రమంలో వాసేవాళ్లు లేకపోలేదు. తంజావూరులో విజయరాఘవనాయకుడు పూతనాహరణం, కాఖీయమర్దనం మొదలైన కృష్ణలీలలను నృత్యనాటికలుగా వ్రాస్తున్న కాలంలో కౌడూరులో దేవవరపు శోభనా ద్రి అనే కవి! బాల క్రీడావిహారం' అనే యక్షగానం రచించాడు. ఇందులో బలరామకృష్ణుల బాల్యక్రీడలున్నాయి. తన గురించి, తన పుస్తకం గురించి అతడిలా చెప్పుకొన్నాడు: వేడుకతోడను బాల - క్రీడవిహారంబు రామకృష్ణుల మహిమల్‌ నొడెముగ వినుడి మీరలు - తౌడూరి శొభనాద్రిదాసు కవితారచనన్‌

  • (అం,సా.నెం. 2894) ఇందులో 'ఎమితిని సెపితివి కపితము' లాగ 'శొభనాద్రి. అనే పొట్టిదనం కనబడుతుంది. రచన ఒకమాదిరిదని, ఇందులో మంత్రసానివాలకమనేది ఒక విశేషమని డాక్టరు యస్వీ జోగారావుగారు చెప్పారు.13 ఈ యక్షగానపు ప్రతి ఒకటి ఆంధ్రసాహిత్య పరిషత్తువారి గ్రంథాలయంలో ఉంది. పుస్తకం చివర, దానిని ప్రమాదీనామ సంవత్సర భా ద్రపదశుద్ధ షష్టీ శనివారంనాడు లిఖించినట్టు కనబడుతుంది. ఇది క్రీ.శ. 6-9-1973 తేదీకి సరిపోతుంది. శోభనాద్రి నాయకరాజుల యుగంలోనివాడని తేలుతోంది. శేషభట్టరు అప్పులాచారిః కౌడూరు శోభనాద్రే కాక మరొక కవితూడా బలరామ కృష్ణుల లీలలను కావ్యంగా వ్రాశాడు. అతని పేరు శేషభట్టరు అప్పలాచారి 'శృంగారవాజ్మాధురి'తో 'లాలిత్యంబగు శబ్ద సంగతుల నల్గ్లావణ్య యుక్తంబు'గా ప్రబంధం. ఈ కవి గూడ శైలసీమలోని దొడ్డేటి పట్టణంవాడు. ఆ ఊళో మర్రి పేరయ్య నాయుడనే మోతుబరి ఉన్నాడు: ఆయన కవిని పిలిచి ఈ కావ్యం వ్రాయించి భద్రాద్రి రామునకు అంకితం ఇప్పించాడు. శైలి చాలా బాగున్న ఈ కావ్యం ప్రతి ఒకటి ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది. (గ్రంథసంఖ్య 3416) కవికాలం తెలియదు. నాయకరాజుల యుగంలోని కావ్యాలు ఇంకా ఎన్నో ఎక్కడెక్కడో మూలుగుతూ ఉండవచ్చు. ఈ యుగాన్ని నిన్నటిదాకా చాలామంది క్షీణయుగం అని పెర్కొన్నారు.కే మరికొందరు అలా అనకూడదంటున్నారు.!్‌ ఈ యుగంలోని కవులలో ప్రతిభ క్షీణించిందో లేదోగాని పునరుక్తులను చదివి సంతోషించే ఓపిక, ఉత్తపాండిత్య ప్రకర్షను సహించే తీరిక పాఠతునికి క్షీణించడం మాత్రం నిజం! దత
  1. ఆంధ్రయక్షగాన వాబ్బయచరిత్ర, ద్వితీయభాగం, పుటు ౫. వప సట వ్‌ ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు. పుటు ఈ. ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహంలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు, పుట 119. అంధ్రవాబ్యయ చరిత్రములో డాక్టరు దివాకర్ల వేంకటావధానిగారు పుట 71) క. శారదాధ్వజములో యండమూరి సత్యనారాయణరావుగారు, పుటలు 18-23.

కడపటిరాజుల యుగం ఈ యుగం క్రీశ 1674లో ప్రారంభమవుతుంది. ఆంధ్రదేశ చరిత్రలో ఆ సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఆ యేడే గోల్కొండ సామ్రాజ్యంలో ఇద్దరు ఆంధ్రులు మహోన్నత పదవులు పొందారు. తానీషా అనే పేరుతో సుప్రసిద్ధుడైన అబుల్‌హసన్‌ కుతుబ్‌ షా తన రాజ్యానికి పింగళి మాదన్న గారిని మీర్‌ జువ్లూగా నియమించాడు; వారి సోదరుడు అక్కన్నగారికి పేష్కర్‌ పదవి ఇచ్చాడు. మీర్‌జువ్లూ అంటే అర్థిక వ్యవహారాలకు సర్వాధికారి అని అర్థం. మాదన్నగారు ప్రధానమంత్రిగానే వ్యవహరించారు. పదవీ స్వీకారం చేసిన సంవత్సరమే ఉత్తరాన శ్రీకాకుళంనుండి దక్షిణాన చెంగల్పట్టుదాకా 480 మైళ్లు తూర్పు కోస్తాలో వ్యాపించిన గోల్కొండరాజ్యుంలో నాలుగు నెలలు పర్యటనం చేసి రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టారు. క్రీ.శ. 1674 ఆంధ్రదేశచరిత్రలోనేకాక భారతదేశ చరిత్రలో కూడా ముఖ్యమైనది. ఆ యేడే మహారాష్ట్రవీరుడు శివాజీ “మహరాజ బిరుదంతో రాయగడదుర్గంలో పట్టాఫిషిక్తుడయ్యాడు. ఆ యేడే మధురలో చొక్కనాథ నాయకుడు “కర్ణాటక చక్రవర్తో అనే విరుదును ప్రకటించుకొన్నాడు. ఉత్తరోత్తరా ఆంధ్రదేశచరిత్రను మార్చివేసిన ఫ్రెంచివాచ్ల క్రీ.శ 1674లోనే చెంజి దుర్వాధిపతి షేర్‌ఖాన్‌వద్ద పుదుచ్చేరి కేవును కొనుక్కున్నారు. ఈ సంవత్సరమే శివాజీ సవతితమ్ముడు ఏకోజి తంజావూరును స్వాధీనం చేసుకున్నాడు. మహారాష్ట్ర రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ ఎంతటి ప్రజ్ఞావంతుడో తెలుగు రాజ్యానికి మహామంత్రిగా ఉన్న పింగళి మాదన్నగారు అంతటి ప్రతిభావంతులు. ఇద్దరూ రాజనీతి విశారదులే. ఇద్దరూ దూరదృష్టి కలవాళ్ళీ. అందుచేత మాదన్నగారు శివాజీతో -అానీషాకు మైత్రి కుదిర్చారు. శివాజీ పైైదరాబాదుకు వచ్చి ఆతిథ్యం స్వీకరించాడు. ఒక సంధిపత్రం పైన సంతకం చేశాడు. దక్షిణాపథంలో ఈ రెండు ప్రభుత్వాలూ సుస్థిరం అయ్యాయి. ఇంక మాదన్నగారు దేశాన్ని సుఖిక్షం చేసుకొనే యత్నంలో ఉన్నారు. ఆ రోజులలో గ్రామాలను వేలం వేసేవారు. ఇజారాదారులు ఊళ్లు కొనుక్కున్నాక త్రూరంగా ప్రవర్తించేవారు. మాదన్నగారు ఈ పద్ధతిని మార్చించారు. గ్రామాధికారులను నియమించారు... వాళ్లు స్వతంత్రం ప్రకటించుకోడానికి అస్కారం లేకుండా మూడేళ్ల కొకసారి అధికారులను బదిలీ చేయిస్తూ ఉండేవారు. జాగీరులకు బదులుగా వాళ్ళకు ' జీకాలు ఏర్పాటు చేశారు. ఈ సంస్కరణలవల్ల తమ ప్రత్యేకత కోల్పోయిన ఉత్రూవులు, మున్సబులు తిరుగుబాటు చేశారు. దానిని మాదన్నగారు పూర్తిగా అణచివేశారు. దేశాన్ని మూడు ఖండాలు చేసి వాటిని సర్కార్లు, పరగణాలు, మహళ్లు అనే ఎభాగాలుగా కేటాయించారు. ఆనాతు గోల్కొండ రాజ్యంలో తెలంగాణం, కర్షాటకం, ఆర్కాటు అనే మూడు ఖండాలు ఉండేవి, ఈ మూడింటిలోనూ 58 సర్కారులు, 654 పరగణాలు ఉండేవి. అన్నీ కలవారి సిరిసంపదలతో కళకళలాడుతూ ఉండేవి. ] .... మాదన్నగారి పరిపాలనా నైపుణ్యానికి సంతోషించి తానీషా ఆయనకు “అలంపనాహ్‌' అనే బిరుదు ఇచ్చాడు. దేశం పచ్చగా ఉన్నందుకు ప్రజల కళ్లు ఎంశే చల్లబడ్డాయో జౌరంగజేబు ఒళ్లు అంత మండింది. దక్షిణాదిని ఇద్దరు బలవంతులు వేళ్ళు

కడపటిరాజుల యుగం 801 నిలదొక్కుకుంటున్నారని కళ్లు కుట్టుకున్నాడు. వాళ్లను విడదీసి ఆ రాజ్యాలను నాశనం చేయడానికి అతనికి ఆస్కారం వెంటనే లేకపోయింది. అయితే దురదృష్టవశాత్తూ శివాజీ మహారాజు 1680లో మరణించాడు. పౌరంగజేబు రొటె విరిగి నేతిలో పడింది. ఆ మరుసంవత్సరమే దక్షిణాపథానికి సేనలను పంపాడు. "

అయిదేళ్లపాటు మొగలాయి సైన్యాల ముట్టడిని గోల్కొండ తట్టుకుంది. అక్కన్న మాదన్నలు బతికి ఉన్నంతకాలం రాజ్యం స్వాధీనం కాదని కౌరంగజేబుతు తెలుసు. అందుచేత విద్రోహులకు లంచం ఇచ్చాడు. క్రీ.శ 1686లో అక్కన్న మాదన్నలను హత్య చేయించాడు. ఆ యేడు బిజాపురాన్నీ, ఆ మరుసటి సంవత్సరం గోల్కొండనూ కబళించాడు. తరువాత మైసూరులోని మరాఠీ జాగీరులను స్వాధీనం చేసుకొన్నాడు. దక్షిణాదిని పూనమల్లి, వందవాసి ప్రాంతాలదాకా వచ్చాడు. మధుర, తంజావూరు లీనమైంది.

నర్మదకు దక్షిణాన వున్న రాజ్యాన్నంతా దక్కను అని పిలిచేవారు. దీనికి మొగలు ప్రతినిధిగా ఒక సుబిదారును చక్రవర్తి నియమించాడు. కన్యాకుమారిదాకా ఉన్న దేశాన్నంతా ఈయన పాలించేవాడు. ఇతని కింద నవాబులు, మహారాజులు ఉండేవారు. కొన్ని సర్కారులను ఫౌజుదారులు పాలించేవారు. ఆ రోజులో తెలుగువాళ్లు జీవించిన ప్రాంతాలేకాక తెలుగు భాష రాణించిన ప్రాంతాలు, తెలుగువాళ్లు పాలించిన రాజ్యాలు దక్షిణాపథంలో ఉండేవి. మన సాహిత్య చరిత్రను అర్ధం చేసుకోవడానికి ఆనాటి విభాగాలను, వాటి రాజకీయ చరిత్రను టూకీగా తెలుసుకోవాలి.

దక్కనుకు మొదటి 'సుబేదారుగా కమ్రుద్దీఖాన్‌ అనే అతణ్జీ 'నవాబ్‌ మీర్‌ కమ్రద్దీన్‌ ఖాన్‌-చీన్‌ కలీజ్‌ఖాన్‌ పతహజంగు నిజాముల్‌ముల్కు ఆసఫ్‌జా' అనే పేర్లతో బిరుదులతో నియమించారు. నిజాం అనే వీరుదూ, అసఫ్‌జా అనే వంశనామం స్థిరపడ్డాయి. మొదటి నిజామును క్రీ.శ. 1713లో నియమించారు. ఆయన 1724లో తన బలాన్ని ప్రకటించుకొని హైదరాబాదు రాజధానిగా దక్కను సుబాను పాలించసాగాడు. ఇతనికింద కర్నూలులో ఒక నవాబు, కడపలో ఒక నవాబు, ఆర్కాటులో ఒక నవాబు ఉండేవాడు. మైసూరు, మధుర, తంజావూరు రాజులు ఇతనికి కప్పం పంపించేవారు. తూర్పున కోస్తా సర్కారులు ఉండేవి. తెలంగాణాలో పాయగాలు, జాగీరుదారులు ఉండేవారు.

మొదటి నిజాం కాలంలోనే కోస్తాపట్టణంలో తెల్లవాళ్లు గిడ్డంగులు కట్టుకొన్నారు. మచిలీపట్నంలో అన్ని జాతులవారు, అన్ని దేశాలవారు ఉండేవారు. మిగతా రేవులలో కొందరికి ప్రత్యేకమైన హక్కులు ఉండేవీ. ఏయే రేవులలో ఏఏ దేశాలవాళ్లుండేవారో చూడండి "

  1. డచ్చివాళ్లు? (1) ప్రళయ కావేరి (2) బందరు (3) పాలకొల్లు (4) నరసాపురం (5) జగన్నాయక పురం (6) గొల్లపాలెం (7) గుండవరం (8) భీమునిపట్నం
  2. ఫ్రించివాళ్లు : (1) బందరు ఫ్రెంచి పేట (2) పుదుచ్చేరి (3) యానాం

802 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి జొరంగాబాద్‌ పుబా వరంగల్‌ ఘుబా ఢళి న్న అత్రాపుబల్లా జ్జ గం ఇల్లీ 1 మెదక్‌ సుజా ఖ్‌ సర్కారు బందరు న్యు | శిరాసుబా ళ్‌ మైసూరు జో (74 పట్నం పుదుష్పరి క ( కడపటిరాజుల యుగంలో దక్షిణదేశం

కడపటిరాజుల యుగం 803 3. అంగ్రీసువారుః (1) దుగరాజపట్నం (2) మదరాసు (3) నిజాంపట్నం (4) బందరు (5) మాధవాయిపాలెం (6) ఇంజరం (7) బెండమూర్లంక (8) విశాఖపట్నం ఈ పట్టణాలలో ఉండే తెల్లవాళ్లు తమ వ్యాపారం తాము చేసుకోకుండా పరిసర రాజకీయాలలో వేలుపెట్టారు. ఇంగ్లీషువాళ్లు మొదట్లో తలబిరుసుగా ఉండేవారు. వాళ్లమీద మొగలు సేనలు ఆగ్రహించాయి; బందరు, విశాఖపట్నంలోని తెల్లవాళ్లను క్రీశ 1689లో హతమార్చాాయి. మరుసటి సంవత్సరం ఇంగ్లీషువాళ్లు మెత్తపడ్డారు. మద్రాసులోని ఇంగ్లీషు గవర్నరు మొగలు సైన్యాలక్తు తోడ్చడ్డాడు. వాళ్లకు మందుగుండు సామగ్రి సరఫరా చేశాడు. ఈ తెల్లవాళ్లలో ఫ్రెంచివాళ్లు చాలా చొరవ తీసుకున్నారు. రాజ్యాల వారసత్వపు తగాదాలలో తలదూర్చేరు. మొదటి నిజాము మరణించాక అతని రెండో కొడుతూ, కూతురి కొడుతూ రాజ్యంకోసం ఒకరిమీద ఒకరు కత్తులు నూరారు. ఈ నిజాం పిట్టల తగువులు ఫ్రెంచి పిల్లి తీర్చింది. వాళ్ళిద్దరూ యుద్ధభూమిలో హతమయ్యాక సలాబత్‌జంగ్‌ అనే మరో వారసుజ్జి ఫ్రెంచివాళ్లు నిజాముగా నిలిపారు. ఫ్రెంచి వాళ్ల పలుకుబడి ష్టాదరాబాదులో చాలా హెచ్చింది. ముసా బుస్సీ అనే ఫ్రించి దళపతి నిజాము తరువాత నిజాములాగా చాలా బలవంతుడయ్యాడు. ఫ్రెంచి సేనల రక్షణ లేకపోతే నిజాము గద్దెమీద నిలువలేని స్థితి వచ్చింది. ఆ సైన్యాల ఖర్చుకు నిజాము బోలెడు సొమ్ము పోసేవాడు. బుస్సీ గీసినగీటు నిజాము దాటేవాడు కాదు. ఇది దివానుకు అసూయ కలిగించింది. ఫ్రెంచి సేనలకు జీకాలు, భోజనసామగ్రి సకాలంలో అందకుండా చేశాడు. దీనితో సైనికులలో అసంతృప్తి వచ్చింది. నిజాముదగ్గర చేరి ఎలాగైనా ముసా బుస్సీని బర్తరఫ్‌ చేయమని నూరిపోళశాడు; దివాను మాటలను సలాబత్‌ జంగ్‌ విన్నాడు. అయితే బుస్సీ తన పరాత్రమంతో, రాజనీతితో మళ్లీ నిజాముదగ్గర తన పలుకుబడి పెంచుకున్నాడు. తన సేనలను తానే పోషించుకుంటానని, ఖర్చుల నిమిత్తం తనకు కొన్ని సర్కారులు జాగీరుగా ఇవ్వమని ముసా బుస్సీ నిజామును అడిగాడు. ఉత్తరసర్కార్లు నాలుగింటినీ నిజాము ఇచ్చాడు. ఆఅ రోజులలో ఉత్తర సర్కార్లకు జాఫరల్లీ ఫొజుదారుగా ఉండేవాడు. తన ఉద్యోగానికి బుస్సీ ఎసరు. పెట్టాడని జాఫరల్లీ కక్షకట్టాడు. ఉత్తర సర్కార్లలోని సంస్థానాధీశులను కూడ కట్టుకుని బుస్సీని ఎదిరించాలని ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం నిఫలమైంది. ప్రముఖ సంస్థానాధిపతి విజయనగరం పాలించే రాజును బుస్సీ తనవైపు తిస్పుకొన్నాడు. కప్పం తగ్గిస్తానని వాగ్దానం చేశాడు. విజయరామరాజు తన రాజ్యాన్ని విస్తరింపచేసుకోవాలసీ బుస్సీ సహాయంతో బొబ్పిలికోటపై క్రీ.శ 1767లో దాడీ చేశాడు. ఆ సందర్భంలోనే తాండ్ర పాపయ్య రాత్రిపూట విజయరామరాజును పొడిచి చంపాడు. ఆ తరువాత విజయనగర సంస్థానానికి ఆనందరాజు పాలకుడయ్యాడు. అయన బుస్సీనీదా, ఫ్రెంచివాళ్లమీదా పగపట్టాడు. ఉత్తర సర్కార్లలోంచి. వాళ్లను వ్లగొట్టడానికి ఇంగ్లీపువాళ్లతో చేతులు కలిపాడు.

804 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

ఆ రోజులలో కలకత్తాలో రాబర్జు క్లెవు ఉండేవాడు. ఆనందరాజు తమ సహాయం

వి ॥ అలలై

అర్ధించాడని విని సేనలను పంపించాడు. క్రీ.+. 1758 ఆగస్టులో కర్షల్‌ ఫోర్లు విశాఖ పట్నంలో సేనలతో దిగాడు. అక్షోబరులో ఆ సేనలు కసింకోటలో ఆనందరాజును కలుసుకొన్నాయి. సెప్టెంబరులో చందుర్హి దగ్గర యుద్ధం జరిగింది. ఇందులో ఫ్రెంచి సెనలు పూర్తిగా ఓడిపోయాయి. వెంట తరుముతూ కర్నల్‌ ఫోర్జు 1759 ఏప్రిల్‌లో బందురును

తనకు రక్షణ యిస్తాయనుకొన్న ఫ్రెంచిసేనలు ఓడిపోవడంతో సలాబత్‌జంగ్‌ గాభరాపడ్డాడు. ఎవరో ఒకరు పరాయివాళ్లు తనకు సహాయంగా ఉంటేగాని తనకు సుజేదారీ నిలవదు. అందుచేత నిజాము ఇంగ్లీషువాళ్లను ఆదరించాడు. 1759 మే నెలలో ఎనిమిది పరగణాలతో మచిలీపట్నం వాళ్లకు ఈనాంగా యిచ్చాడు. పదిహేను'రోజులలో కృష్ణ దాటిపొమ్మని ఫ్రెంచివాళ్లకి హుకుం ఇచ్చాడు. ఆనందరాజు పగదీర్చుకొనడమేకాక ఫ్రెంచి వాళ్ల ధనాన్ని దోచుకున్నాడు. ఎంత దోచుకున్నావని నిజాం అడగలేదు.

తమకు వ్యాపారంలో విరోధులైన ఫ్రెంచివాళ్లకు నిలువనీడ లేకుండా చేయాలని ఇంగ్లీషువాళ్లు ఈ యుద్దాలు చేశారేగాని వాళ్లకి అప్పటికీ రాజ్యకాంక్ష లేదు. అందుకే నిజాముకు వాళ్లు నైనిక రక్షణ ఇవ్వలేదు. ఫ్రెంచివారు పోయాక సలాబత్‌జంగ్‌ దిక్కులేనివాడయ్యాడు. అతణ్ణి అతని తమ్ముడు నిజామ్‌ అలీ 1761లో బంధించాడు. తన సుబేదారీ ప్రకటించుకొన్నాడు. ఇంగ్లీషువాళ్లని తనకు సైనిక సహాయం చేయమని కోరాడు. ఖర్చుల నిమిత్తం శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి సర్కారులు నాలుగూ ఇచ్చాడు. అయితే ఇంగ్లీషువాళ్లు వాటిని పూర్తిగా స్వీకరించలేదు. కావలసినప్పుడు పుచ్చుకొంటామని చెప్పారు. ఇది 1762లో జరిగింది. ఆ తరువాత మరి నాలుగేళ్లకి రాజ్యకాంక్ష ముదిరాక ఈ నాలుగు సర్కారులను పుచ్చుకొన్నారు. క్రమంగా దేశమంతా వ్యాపించారు. అంతటితో కడపటిరాజుల యుగం అంతమై కుంపిణీ యుగం ప్రారంభమయింది.

కడపటి రాజుల యుగంలో ప్రజల కడగళ్లకు అంతులేదు. ఎక్కడ చూసినా యుద్దాలే. సైనికులు ఊళ్లను కొల్లగొట్టడం సామాన్యమైైపోయింది. పన్నులు వసూలు చేయడమే తప్పించి ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడమన్నదే అబ్బురమైంది. పాతకాలపు నాటి వనరులు పాడైపోతూవుంటే పాలకులు చూస్తూ ఊరుకొన్నారుగాని తమ సంచులు విప్పి మరమ్మతు చేయించలేదు. వ్యవసాయం చేసే రైతును అందరూ పీక్కుతినేవాశ్లే. ఈ యుగంలోని ప్రముఖ కవి కూచిమంచి తిమ్మయ్య తన కుక్కుటేశ్చర శతకంలో రైతుల స్థితిని వాళ్ల మాటలతోనే ఇలా చెప్పాడు.]

ఎద్దుమందను గూర్చి యెగసాయ మిడితిను తుద నది యదికారి దోసుకొనియె

దావుదప్పుల కంట దరమకర్చుల కంట కాసువీసము లాగె కరణపయ్య

  1. తిమ్మకవికి రైతులపట్ల సానుభూతి లేదు. ఇలా గోడు పెట్టుకొనేవాళ్లు మోటువాళ్లని అతని ఉద్దేశం.

కడపటిరాజుల యుగం 905 సల్లమ్మి సతకమ్మి సిల్లర దాసితే కోమటి బాబంటు కొడుకు దొబ్బె కళ్లముకంకులు గాలి బట్టగ బోతె బట్టు బాపనోళ్లు బతకనీరు (నెం. 32)

పీడించేవారు. 'సెడుగు బాపడు నాబంటు కొడు కబ్బబ్బ యెంట పడి' అని

విసుక్కునేదాకా వేధించేవారు. ఈ భట్లూ, కవులూ చెప్పే కవిత్వాలు సామాన్య ప్రజలకు బోధపడేవి కావు. “తల బరువు వెట్టి తొందరగాగ దండకాల్‌ నతకాలు సోకాలు నతుకుకొంటా' ఊదరకొట్టే వల్లీ గద్యపద్య విచిత్ర కవితలకంటే గొల్లసుద్దుల కథలే పామరులకు కర్ణపీయంగా ఉండేవి. ఈ యుగంలో వేద శాస్త్ర పురాణ విద్యలకన్నా పరిహాస విద్యలే పనికి వచ్చాయి. దేవకాభాషల తీరుకన్నా పారసీకోక్తులే ప్రణుతి కెక్క్ళాయి.! కాలానుగుణంగా కవిత్వం మారకపోవడంవల్ల సామాన్య జనానికీ, సాహిత్యానికీ దూరం ఎక్కువ అయింది. అయితే కవుల సంఖ్యకు కరువు లేదు. అడిదం సూరకవి ఇలా చెప్పాడు.

దేవునావ మున్ను దేశాన కొక కవి - యిష్పు డూరనూర నింట నింట

నేగు రార్డు రేడ్లు రెనమండ్రు తొమ్మండ్రు-పదుగురేస్‌ కవులు భవ్యచరిత

నిజంగా ఇంటికి పదిమంది చొప్పున సాహిత్య వ్యాసంగం చేస్తే ఇకనేం? ఈ “కవులు

కక్కుర్తి నిసుమంత కడుపుకొరకు' అందరినీ పొగడుతారని కూచిమంచి తిమ్మయ్య

చెప్పాడు. వేమనగారు చెప్పినట్టు ఈ యుగం కవులు 'తోటకూరకైన దొగ్గలికైనను తవిటి కుడుముకైన తవిటికైన' కావ్యాలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇచ్చే యిసుమంత త్యాగానికీ ప్రభువులు తిప్పుతారని కూచిమంచి జగ్గన్న తన భక్తమందారశతకంలో ఇలా తిట్టాడు:

గడీయల్‌ రెండిక సైచి రా వెనుక రా కాసింతసే పుండి రా

విడిదింటక్‌ గడి సేద తీర్చుకొని రా వేగంబె భోం చేసిరా

యెడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్‌ హీనప్రభుం డీగతిన్‌

మడతల్‌ పల్కుచు ద్రిప్పు గాసిడక రామా! భక్తమందారమా! (75)

ఈ యుగంలోని ప్రభువులందరూ హీన ప్రభువులే అని భావించడానికి వీలులేదు. సాహిత్యాఫిలాష ఉన్నవాళ్ళూ, స్వయంగా కావ్యాలు చెప్పినవాళ్ళూ, సమర్థులకు సక్కారాలు చేసినవాళ్లూ లేకపోలేదు. రాజకీయాలలో క్రూరంగా ఉండడం, సాహిత్య విషయాలలో మెత్తపడడం ఆనాటి సంస్కారుల లక్షణం అనుకోవాలి. గద్వాల, మైసూరు, మధుర, తంజావూరు, పెద్దాపురం, విజయనగరం రాజ్యాలలో రాజులూ, వాళ్ల ఆశ్రితులూ చాలా రచనలు చేశారు. గద్వాలలో భారత రామాయణాలకు యథాశోకానువాదాలు, మైసూరు, మధుర రాజ్యాలలో వచన వాక్యరచనలు, తంజావూరులో చదురునృత్యానికి

2 కుక్కుటేశ్వర శతకం, నెం. 21

3 అడిదం సూరకవి జీవితం. వావిళ్ల ప్రచురణ,పుట 4

ఓ కుక్కుటేశ్వర శతకం, ఈ.

6806 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ అనువైన సంగీత రచనలూ, గేయ నాటకాలూ, పెద్దాపురం విజయనగరాలలో ప్రాచీన ధోరణిలో ప్రబంధాలూ విరివిగా పుట్టాయి. సాహితీపరులంతా సంప్రదాయ విధేయులే. కొత్తగా కైస్తవం పుచ్చుకొన్న వారికోసం కవులు ప్రబంధ ఫక్కీలోనే బైబిలు కథలు బ్రాశారు. ఈనాటి కావ్యాలలో సమకాలిక జీవితం వెతికితేనేగాని కనబడదు. శతకాలలో వ్యక్తిగత సమస్కులూ, సమాజంలోని సంక్షోభాలూ కొట్టవచ్చినట్టు కనబడతాయి.

ఈ యుగంలో మతసూనం చాలా తక్కువగా కనబడుతుంది. హిందువుల దేవాలయాలను తురకలు నాశనం చేయడం సాధారణమైన విషయమైైపోయింది. కొత్తగా కాళ్లు నిలదొక్కుకున్న ఫ్రెంచివాళ్లు సైతం ఈ దారుణాలు చేశారు. క్రీశ 1709లో పుదుచ్చేరిలోని జైస్తవులు హిందూ దేవాలయాన్ని నాశనం చేశారు. చాలా కొట్లాటలు జరిగాయి. క్రీ.శ. 1743లో కడప బిల్లా కంబాలదిన్నెలోని ఫాదిరిగుడిని నిజాం సైనికులు నేలమట్టం చేశారు. ముదిగుబ్బ కృష్ణాపురాలలోని క్రైస్తవగుళ్లను కూడా పడకొట్టించారు. దేవాలయాలను నాశనం చేస్తున్నప్పుడు కవులు ఆవేశం పట్టలేకపోయారు. కాశీలోని విశ్వనాథుని ఆలయాన్ని జౌరంగజేబు బలాలు పడగొడుతున్నప్పుడు వేల్పూరి విస్సన్న అనే తెలుగుకవి 73 పద్యాలు చెప్పాడు.

మితిలేనిలింగాలు చితుకగొట్టెడు వేళ మండపంబులు రూపుమాపువేళ

చమిరిమఠాల్‌ గుమ్మటములు గట్టెడివేళ గుళ్ళలో నావులు గోయువేళ

. . విగ్రహంబుల జూచి విరుగనేసెడువేళ దివిరి సాధువుల బాధించువేళ జపహోమకృత్యముల్‌ సాగనీయనివేళ నుపచారమంతయు నుడువువేళ

చేరి గుడియె మసీదుగా బేయువేళ

మరిచియున్నావొ యవనుల మద మడంచ

దామసించిన దిది నీకు దంటతనమె?

విజితపరయూధ కాళికావిశ్చనాథ! 2. 579 యవనుల దారుణాలు కాశీలోనేకాక తిరుపతిలో తూడా దావానలం గేపాయి. తురక సైన్యాలు మోవిగుంట, కావలి, బలదంకి, కొడవలూరు, గండవరం గ్రామాలను కలవరపెట్టి తిరుపతిపై పడ్డాయి. ఎవరో కవి దేవునితో ఇలా మొరపెట్టుకున్నాడు:

పొట్టేళ్ళగతి పట్టి బోడిసన్యాసుల ఢీయని తాకులాడించు నొకడు

సోమయాజుల బ్రహ్మసూత్రముల్‌ దంచి సింగాణీవిండ్లకు నల్లెగట్టు నొకడు

ఖూజ్‌ఘోడాయంచు గుడికిలు గుజ్జము నెక్కి ధేయని తరటెత్తు నొకడు

పైకాలు గొమ్మని బల్మి గోమటివారి చెలువపై బడి బూతసేయు నొకడు

యవనసమ్మర్దదుర్దినంటైన దిగువ

తిరుపతిని జూడు మటువంటి తజిని నిదుర

పోవుచున్నాడు మీయన్న లేవలేక

శత్రుసంహార వెంకటాచలవిహారః (0.1710 పద్యసంఖ్య 15) ననన న య నాం. 5. ఇతని మునిమనుమడు శ్రీ.ఈ 1793లో ఈ శతకంలోని కొదవ పద్యాలు చెప్పి పూర్తి చేశాడు.

కడపటిరాజుల యుగం 807 దిగువ తిరుపతిలోని ఘోరాలు ఎగువ తిరుపతిలోకి వ్యాపించకుండా భక్తుడు ఆత్రోశించాడు. ఈ విధంగా వివిధ ప్రాంతాలలోని వివిధ దశాబ్తాలలోని కవులు తమ కళ్ల మందు జర్‌గే ఘాతుజాలకు తల్లడిల్లారు. మహోద్రేకంతో శతకాలు చెప్పారుశ ఇటువంటి సంక్షోభాలలోనే ఈ యుగంలోని కవులు సాంఘిక చైతన్యాన్ని ప్రదర్శించారు. మిగతావేళల్లో పుస్తకాలలోని శృంగార సరస్సులలో మునిగి చేలేవాళ్లు

శృంగారం ఈ యుగంలో వేసినన్ని వెర్రితలలు ఇంకే కాలంలోనూ వెయ్యలేదు. ఇంతకుముందు యుగాలలోని కవులు సుకుమారుడు, నిగమశర్మ వంటి వారి కథలు తీసుకొని శృంగారం రాస్తే, ఈ యుగంలోనివాళ్లు పురాణాలలోని రంతుకథలను తీసుకుని రసవత్తగంగా కావ్యాలు చెప్పారు. శశాంకవిజయం, అహల్యాసంత్రందనం, రాధికాసాంత్వనం వంటివి బహుళ ప్రచారం పొందాయి. రాధామాధవుల ప్రణయం పేరిట కామశాస్త్రాన్ని ఈ యుగంలోని కవులు కవిత్వంలోనికి దిగుమతి చేశారు. సంభోగ శృంగారాన్ని రకరకాలుగా వర్ణించారు. సారంగపాణిలాంటివాళ్లు సానివాడలోనే సాహిత్య గుడారాన్ని పాతుకొని ఇల్లిల్లూ తప్పక పదాలు పాడారు. శిష్టులు కానివాళ్ల వ్యావహారిక భాషలో సహితం పదాలు చెప్పారు. కూచిమంచి తిమ్మయ్యలాంటి వాళ్లు ఆ పామర భాషను వాడుతూ పద్యాలు వ్రాశారు.

మన లాక్షణికులు గ్రామ్యాన్ని కావ్యాలలో నిషిధించారేగాని తిట్టేటప్పుడు మాత్రం అది తప్పు కాదు, ఒప్పే అన్నారు.” అందుచేత ఈ కవులు దానిని చక్కగా వాడుకొన్నారు. నోటికొచ్చినట్టూ తిట్టారు. అడిదం సూరన్న 'నోరువాడైన బూతే రచింపగజూచు' అని చెప్పినది అక్షరాలా నిజం. ఈ యుగంలో నోరు పెట్టుకొని బూతులు బ్రాసీనవాళ్లు ఉన్నారు. అనగొందిలోని వికటకవి గోపాలయ్య, ప్రోలునాడులోని కూచిమంచి జగ్గన్నేకాక పచ్చిబూతుబుంగలు వ్రాసినవాళ్లు కూడా ఉన్నారు. అశ్లీలం శావ్యదోషాలలో ఒకటని లాక్షణికులు చెప్పినా ఈ తెగ కవులు వినరు.

ఈ యుగంలో లక్షణ గ్రంథాలు, చ్యాకరణాలు, నిఘంటువులు చాలా వెలిశాయి. దేవభాష వచ్చినవాడికి తప్ప తెలుగుశాస్త్రం అర్థంకానంత జటిలంగా సూత్రాలు రచించారు. ఈ విద్వాంసులు పాండిత్యమే ప్రధానమనుకున్నారుగాని ప్రసాదగుణాన్ని చిన్నచూపు చూశారు. ప్రజలు వీళ్లను పెద్ద తోపు తోశారు. తనుకు కావలసిన సాహిత్యాన్నీ, సమకాలిక ఇతివృత్తాలనూ అనాటి కవులు స్వీకరించకపోతే సామాన్యులు ఊరుకోలేదు. గేయ సాహిత్యాన్ని సృష్టించుకొన్నారు. కాటమరాజు కథల దగ్గరనుంచి బొబ్బిలి యుద్ధందాకా ఎన్నో వీరగాథలను జానపదులు పాడుకొన్నారు. ఈ యుగంలోని కొన్ని వీరగాథల జావితా చూడండి:

  1. “గ్రాచ్యు మనగ నెవరు నొప్పు రొరుల దెగడుచోట నొప్పునదియు. అంధ్రభాషాభూషణం, పద్యసంఖ్య 27.

808 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

  1. తుమూర రాముని కథ (కంపిలిరాజ్యపు సారంగధర)

  2. సర్వాయి పాపని కథ (వరంగల్లు సుబావీరుడు)

  3. సదాశివ రెడ్డి కథ (మెదకు సుబావీరుడు)

  4. రాణీ శంకరమ్మ కథ (మెదకు సుబారాయవీగం కథ)

  5. రాజా సోమనాది కథ (గద్వాల స్థాపకుని కథ)

  6. దేశింగురాజు కథ (చెంజివీరుని కథ)

  7. బొవ్బీలి కథ (సుప్రసిద్ధ యుద్ధ గాథ)

  8. పెద్దాపురం కోడిపందాల కథ (బొబ్బిలియుద్ధం తరువాత కథ) ఇంకా సమకాలిక వ్యక్తుల వీరోచిత గాథలను మరికొన్ని గ్రామీణులు పాటలుగా కట్టుకొన్నారు. ప్రాచీన వీరగాథలను కూడా మళ్లీ రచించారు. కావ్యకవుల రచనలలో కనబడని స్వచ్చత ఈ సుదీర్ణ గేయాలలో తాండవిస్తుంది. ఈ కథలలోని నాయకులకు ముంజేతికి మీసాలు ఉంటే ఈ జానపద రచయితల నిలువెల్లా తెలుగుతనమే మెరుస్తూ ఉంటుంది. ఈ యుగంలోని తెలుగువాళ్లు కొత్తవేషాలు చూశారు; కొత్త భాషలు నేర్చుకొన్నారు. పోర్చుగీసువాళ్లు పాగాకు తోటలు, కొత్త మాటలు మనకి ఇచ్చారు. ఈవాళ మన '“ఇస్తరీ, “కమీజులు' దాచుకొనే అల్మారా, దాని తాళం చెవి మొదలైనవి పోర్చుగీసు పదాలే. మనం తెలుగు మాటలు అనుకునేవి చాలామటుకు ఆదిలో పోర్చుగీసు పదాలే. ఇలాంటివి మన భాషలో వందలకొలది ఉన్నాయి. అనాసపళ్ళూ, బొప్పాయిపళ్ళ్లూ వీళ్ళు ఇచ్చినవే. పోర్చుగీసువాళ్లు ఈ పళ్లు ఇస్తే డచ్చివాళ్లు బత్తాయితోటలు తెలుగునాట పాతారు. క్రీ.శ. 1712లోనే ఫాదరీలు మొదటి అచ్చుయంత్రాన్ని దిగుమతి చేశారు. నేడు మన జీవితాలలో సర్వసామాన్యంగా కనిపించే కాఫీ పొగాకులకు ఆనాడే కొందరు అలవాటుపడ్డారు. క్రీ.శ. 17౪4లో మొదటి నిజాము తనని చూడడానికీ వచ్చే గొప్పవాళ్లకు తాంబూలంతోపాటు కాఫీ సత్కారాలు కూడా చేసేవాడు పొగాకు గొప్పవాళ్లలోనేకాక సాధారణ జనంలో తూడా వ్యాపించింది. దేవుని కన్నా ఇదే ముఖ్యమైంది. తంజావూరు నాటకాలలో ఒక పాత్ర గుడీ తెరచి పూజ చేయనందుకు ఇలా సంజాయిషీ చెప్తాడు.19 సూత్రధారుడు: నీవు ఇంతసేపయి వచ్చి పూజచేయక ఎక్కడికి పోయివుంటివి. పూజారి; మాకొక పొగాకుతోట కద్దు. అందులకు పొత్తుల కాపు వీరంభట్లంచు ఓక బ్రాహ్మడు కద్దు. ఆ పొగాకుతోటకు నీరు చల్లేందుకు ఉదయమయ్యేటందుకు నాలుగ గడియలకే వచ్చి లేచి పిలుచుకుపోయెను. కాబట్టి ఆ పొగాకు తోట కంతకును నీళ్ళు ౩. చెలుగులో -బుడతకీచు నుడులు' ఆస్‌ తూమాటి దొణప్ప గాడ భారతిలో (౫లో ఏద్రలనత జూన్‌ దాళా ౩ సంచికలలో) విపులంగా చర్చించి నిఘంటువు కూర్చారు.,

  9. 4 [1840౧ 0.4౭ 9060౫1 - 9 ౮.9.8. 6౮౫08, ౪01.8 ౯. 12, 13.

*. శచీపురందర నాటకం, శాహజీరచన, యక్షగానములు, సం.3, అంభ్రవిశ్చవిద్యాలయ ప్రచురణ, పుట.144-5.

కడపటిరాజుల యుగం 809 చల్లితిని, నాతు కడుపు నొప్పి కద్దు కాబట్టి మలశుద్ధి కాదు. అందుకోసం రెండు చుట్టల ధూమపానం చేసి చెరువులోపలికి పోయి... శుద్ధాచమనం చేసుకొని అతిశీఘ్రంగా

దక్షిణాదిని తంజావూరులోని ఒక నాటకంలో ఇలాగ పొగాకు ప్రసక్తి ఉంటే ఉత్తరాదిని కళింగసీమలో అడిదం సూరకవిలాంటివాళ్లు పద్యాలే చెప్పారు.31

పాగత్రాగనట్టినోరును-పొగడంగా బ్రతకనట్టీ భూపడిబ్రతుకు౯

మగడొల్లని సతిబ్రతుకును-వెగటుసుమీ పొణుగుపాటి వెంకటమంత్రీ.

అప్పటికే పాగ త్రాగని నోరు వెగటయింది. “పొగతాగనినాడు దున్నపోతై పుట్టున్‌' అని శాస్త్రవచనం కూడా రూఢీ చేశారు. “పౌగత్రోవికి సతిమోవికి' ఎంగిలి లేదన్నారు.

పంకాలలో సైతం పౌగాకు ప్రవేశించింది బొల్బిలికోట నాశనం చేస్తాననే విజయరామరాజు ఇలా శపథం చేశాడని జానపద రచయిత ద్రాశాడు;

పుట్టకోట చప్పంగా దున్ని-పౌగ మొక్కలు వేతు

పాటి పొగాకు పుచ్చుకోక - నాపగలేతీరేనా (బొబ్బిలికథ 138, 4) పొగాకు ఇలా అన్నివిధాలా, అన్ని ప్రాంతాలలో, అన్ని సుబాలలో వ్యాపించింది.

పరిపాలనా సౌకర్యం కోసం దేశాన్ని ప్రాంతాలుగా, సర్కారులుగా విభజించినా సాహిత్యంలో ఇటువంటి విభజనలు తూడా సౌకర్యం కోసం చేసుకోవాలి.

కడపటిరాజుల యుగంలో తెలుగువాళ్లు జీవించిన ప్రాంతాలు, తెలుగు భాష రాణించిన రాజ్యాలూ ఏయే విభాగాల పేర్లతో చలామణీ అయేవో ఆ ప్రధాన విభాగాలు గానే అనాటి ఆంధ్రసాహిత్య ప్రాంతాలను తూడా విభజించుకోవచ్చు.

ఈ పరగణాలలో పెంపొందించిన చరిత్రను వీలైనంత విస్తరంగా మనవి చేస్తాను. ననన నాననా భనానన నా న్రాన ననన వానననుడు. 11. అడిదం సూరకవి జీవితం (వావిళ్ళ), పుట 21.

వరంగల్లు సుబాకవులు కౌకతీయ సామ్రాజ్యానికి ఓరుగల్లు హృదయం. అది ఒకనాడు ఆంధ్రదేశమంతటికీ రాజధాని. మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ సామ్రాజ్యం పతనం అయింది ఓరుగల్లు తన వైభవాన్ని కోల్పోయింది. రాజకీయంగా ఎంత ప్రాముఖ్యం తగ్గినా సాహిత్య చరిత్రలో మాత్రం దాని సిగపూవు వాడలేదు. ఆంధ్రమహాభాగవతంలోని స్కంధాలు ఈ సీమలోనే పుప్పించాయి. కవితావ్యాసంగం అన్ని యుగాలలోనూ చురుకుగానే సాగిదయి .

కడపటిరాజుల యుగంలో తెలంగాణా మూడు సుబాలలో విస్తరించి ఉండేది వాటిలో వరంగల్లు సుబా ఒగటి. ఇందులో నాలుగు జిల్లాలూ, ముప్ఫయి తాలూకాలు ఉండేవి. అయితే ఆ ముష్ఫయి పరగణాలలోనూ సాహిత్య కృషి జరిగిందని చెప్పలేంగాని కొన్ని ప్రాంతాలలో చక్కని కవులు మంచి కవిత్వం చెప్పారు. ఈ తాలూకాలు చాలాభాగం జాగీరుదార్ల భూములు. షాకత్‌బంగు వంటి ముస్లిం జాగీరులే కాక తెలుగు సంస్థానాలు తూడ+ ఈ సుబాలో ఉండేవి. వాటి వివరాలు చూడండి:

ఓ... 1. ప్రాలనంచ సంస్థానం వరంగల్లు జిల్లాలోని ప్రసిద్ధ సంస్థానం.

  1. దోమకొండ పంష్థానం: నిజామాబాదు జిల్లా, కామారెడ్డి తాలూకా.

నిజామాబాదు జిల్లాలో కామారెడ్డి తాలూకాలో ఉంది.

ఈ నాలుగు సంస్థానాలలో కడపటి రెండూ దోమకొండ సంస్థానంలోని భాగాలే అనుకొంటాను. మొత్తంమీద వరంగల్లు సుబాలో అనాడు రెండు ప్రముఖ సంస్థానాలు మాత్రమే. వాటి చరిత్రలు, సాహిత్యపోషణ వివరాలూ తెలుసుకొందాం.

పాల్వంచ సంస్తానం: వరంగల్లు జిల్లాలోని పాల్వంచ శాలూకాయే కాక భద్రాచలం, రేకపల్లి పరగణాలు కాడా ఈ సంస్థానంలోని భాగాలే. కాకతీయుల కాలంలో పాల్వంచను శంకరగిరి అని పిలిచేవారు. ప్రతాపరుదుని కాలంలో ఈ శంకరగి౦ మాన్యాలను పాలించే అప్పన్నగారు ఒక పెంకిగుత్తాన్ని లొంగడీశారు. ప్రతాపరుద్రుడు మెచ్చుకొని ఆయనను ఆశ్వారాయడు అని ప్రశంసించాడు. అదే ఈ సంస్థానాధీశుల పేరు చివర వచ్చే బిరుదయింది. క్రీశ. 1324లో అప్పన్న ఆఅశ్వారావుగారు పాల్వంచ హసనాబాద పరగణాలకు సన్నదు పౌందారు. ఆయన దగ్గిరనుంచి 18 తరాలవరకు, అంటే క్రీ.శ 1698 దాకా ఈ పరగణాలు ఈ వంశంలోనే ఉన్నాయి.

ఈ సంస్థానం కుంపిణీయుగంలోనూ,. తరువాతా ప్రసిద్ధికెక్కింది. అయితే ఈ సంస్థానం చేసిన సాహిత్యపోషణ మాత్రం చరీత్ర కెక్కలేదు. అసలు ఇక్కడ ఎంతమంది కవులు ఏయేకాలాలో ఉన్నారో కూడా లెక్క తేలలేదు.

కడపటిరాజుల యుగం 811

ఈ యుగంలోనూ, తరువాతి యుగంలోనూ శ్రీనాథుని వెంకటరామయ్య అనే కవి. వీళ్ళ పోషణలో ఉన్నాడని మాత్రం నికరంగా తెలుస్తూంది. ఈయన అశ్వారాయచరిత్ర, లేక శ్రీరామపట్టాఖిషేకం అనే కావ్యం వ్రాశాడు. అయితే ఇది అముద్రితమేకాక అలభ్యం తూడా. ఇందులో పాల్వంచ సంస్థానాధీశ్వరులకు, జాఫరుద్దౌలాతు జరిగిన సంగ్రామాలు చరిత్రానుకూలంగా అఖివర్ణితమయ్యాయని శేషాద్రి రమణకవుల మాటల వల తెలుస్తోంది! ఈ కావ్యానికొక ప్రతి సిరిపురంలో ఉన్నట్లు వినికిడి అని కూడా వాడే చెప్పారు. ఈ కావ్యం బయటపడితే పాల్వంచ సంస్థానాధిపతుల వంశావళి, వాళ్ళు ఏవైనా

దోమకొండ: విక్కనవోలు రాజధానిగా పాలించిన కామినేనివారు ఈ సంస్థానానికి ఆదిపురుషులు. కుతుబ్‌షాహీల కాలంలో విక్కనవోలు రాజం చాలా వర్ధిల్లింది. కామినేనివారు చేసిన సాహిత్యపోషణ, రచించిన గ్రంథాలు చరిత్రకెక్కాయి.! ఈ వంశంలో రాజన్నచౌదరి అనే ఆయన విక్కనవోలు- నుంచి మూడుకోసుల దూరంలో ఉన్న దోమకొండకు రాజధాని మార్చాడు. అప్పటినుంచీ దీనిని దోమకొండ సంస్థానం అని పీలువసాగారు.

క్రీశ 1703 ప్రాంతాలలో దోమకొండను రాజన్నచౌదరి పాలించేవాడు. ఈయన తన పూర్చులలాగా స్వయంగా రచనలు చేయకపోయినా కవులను పోషించాడు. రాపాక లక్ష్మీపతి అనే కవిని పోషించాడు. కావ్యం అంకితం పుచ్చుకొన్నాడు.

రాపాక లక్ష్మీపతి చాలా కృతులు చెప్పాడు. 1. అపరోక్షానుభూతి, 2. ఆచార్య విజయం, 3. శ్రీమదుపాఖ్యానం, 4. నీలావివాహం, 5. శ్రీకృష్ణవిలాసం, 6. భదబ్రాయు రభ్యుదయం అనే ఆరు కృతుల పేర్లు తెలుస్తున్నాయి. వీటిలో ఆచార్య విజయం ప్రతి ఒక్కటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (3877 ఈ ప్రతి చాలా శిథిలమ్టైపోయింది. ఇగి ఆనందగిరి సంస్కృతంలో బ్రాసిన శంకరాచార్య చరిత్రతు అనువాదం, శ్రీకృష్ణ విలానం, భద్రాయురభ్యుదయం అచ్చుపడ్డాయి. దోమకొండ సంస్థానాధిపతులే అచ్చువేశారు.

భద్రాయురభ్యూుదయంలోని కథలో తప్పు కథనంలో కొత్తదనం లేదు. వర్ణనలూ అవీ 'రొటీను' ప్రబంధాలలో మాదిరిగా ఉన్నాయి. ఈ ప్రబంధాన్ని చెప్పమని రాపాక లక్ష్మీపతికి ఈ కావ్యం ఎలా ఉండాలో కామినేని రాజన్న చౌదరి ఇలా నిర్దేశించాడు:

అసమానముభయ భాషా- రసమానము వృత్తిరీతిరసశయ్యా వ

ల్ల సమానము చిత్చైత్య-స్వసమానముగా రచింప జర్చింపదగున్‌.

(భదాయు. 1-76) అయితే ఈ కావ్యం అంత గొప్పగా లేదు. ఇది ఇంతకన్నా “చర్చింపతగదు. అవతారికలో ఈవి చేసిన పూర్వకవిస్తుతి కొంచెం గమనిస్తే చాలు.

ఒ అరపీటి రాజులయుగం, సమగ్ర అంధ్రసాహిత్యం. ఇదే సంపుటి.

812 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

సాధారణంగా మన కవులు మహాకావ్యాలను బ్రాసిన మహాకవులనేగాని లాక్షణికులను కృత్యాదిని నుతించరు. రాపాక లక్ష్మీపతిమాత్రం తన కావ్యంలో వాళ్ళతోపాటు ఛందోకర్తలను స్కరించాడు.

శ్రీరామాయణ భారతాఖ్యరచనా జేగీయమాన ప్రభా

ధౌరంధర్య సమేత వాస్తవ కథాధన్యాత్మ వల్మీకభూ

పారాశర్యుల గొల్చి ఛందముల సంపాదించి వృత్తిప్రభే

దారూఢస్థితు లెంచు పింగళభుజంగాధీశ్వరున్‌ గొల్బెదన్‌. (భద్రా. 1-2) తొన్నాడు. నన్నయగారిని ఎలా నుతించారో చూడండి.

॥ ప్రాకృతసంస్కృతాంధ్రపదభాగము లుల్లసిలంగ వైక్సత

వ్యాకరణంబు జేసి బుధవత్సలతన్‌ సకలార్థవత్సురా

ణాకలి తేతిహాసములన్ని వచించిన నన్నయార్యు సు

శోకుని దిక్కయజ్బను వచోనియతిన్‌ వినుతింతు మత్కృతిన్‌. (భద్రా. 1-2)

నన్నయగారు వైకృతవ్యాకరణం రచించారన్న అబద్ధం రాపాక లక్ష్మీపతి వచోనిరతివల్ల " సుస్థిరంగా తెలుగుదేశంలో వేళ్ళూనడమేకాక 1736 నాటికే మూడు పువ్వులు ముప్ఫయి ముళ్ళుగా ననలెత్తిందని చెప్పవచ్చు. ఈ అబద్ద్ధానికి అంతూ లేదు; ఆంధ్రులకు చింతా లేదు.

రాపాక లక్ష్మీపతికి వెంకటదాసు అనే సోదరుడు ఉన్నాడు. అతడు కూడా కవే శైవుడే. శివరహస్య ఖండాన్ని తెనిగించి వేములవాడ రాజేశ్వరునికి అంకితం ఇచ్చాడు. సంస్థానాలలో రాణించినట్టు లేదు. ఈ శివరహస్య ఖండం అముద్రితం.

ఈ రాపాక సోదరులకు ఏవిధమైన బంధువోగాని రాపాక శ్రీరాములు అనే కవి ఆధ్యాత్మరామాయణం రచించినట్టు తెలుస్తోంది. ఈయన కూడా పై ఇద్దరిలాగా పరకాల గ్రామంలో నివసించేవాడు. ఇతని కాలం 1780 ప్రాంతాలు అని పరిశోధకులు అన్నారు! అయితే ఈయన కూడా పైవాళ్ళ సమకాలికుడు కావచ్చును.

ఈ ముగ్గురు రాపాక కవులేకాక మరెందరు దోమకొండ సంస్థానంలో ఉన్నారో తెలియదు. అయిజీ వరంగల్లు సుబాలో ఈ కాలంలో చాలామంది సాహితీపరులు ఉన్నారు. ఓరుగల్లుకు దగ్గిరలో ఉన్న మట్టెవాడలో పరశురామ పంతులవారీ కుటుంబంలో చాలా ప్రసిద్ధకవులు ఎన్నో గ్రంథాలు బ్రాశారు.

పరశురామపంతుల లింగమూర్తి: భారతీయుల కున్నంత అధ్యాత్మ చింతన ప్రపంచంలో ఇంకెవరికీ ఉన్నట్టులేదు. పండితులకేకాక పామరులకు కూడా ఈ విజ్ఞానం టినా ననా లాలన నను తకకుననకు తనక ననన ననిన కాననా 3. గోలుకొండకవుల సంచిక, పుట 412.

  1. అదే సంచికలో పుట 414.

కడపటిరాజుల యుగం 813 నేర్చుకోవాలనే కోరిక లేకపోలేదు. తగుపాటి తెలుగు భాషా పరిచయం ఉన్న ప్రజలకు వేదాంత గ్రంథాలు చాలాకాలం అందుబాటులో లేవు. ఆ లోటును పరశురామపంతుల వారి కుటుంబంలోని వ్యక్తులు తీర్చారు. అందులో మరీ ముఖ్యంగా లింగమూర్తిగారు తెలుగువారికి పెట్టిన ఖిక్ష నిజంగా అక్షయం అని చెప్పాలి.

లింగమూర్తిగారి పూర్వులు తెలుగువాళ్లు కారు. ఏవో రాజకీయ కారణాల వల్ల కొన్ని మహారాష్ట్ర కుటుంబాలు తెలుగుదేశానికి వచ్చి స్థిరపడిపోయాయి. వాటిలో పరశురామపంతులవారి కుటుంబం ఒకటి. ఈ ఇంటివాళ్ళను పరశురామపంత్‌గారి తాలూకా అని వ్యవహరించడంతో అదే యింటి పేరయి, తెలుగు బహువచన లకారం కూడా పేరు చివర వచ్చింది. పరశురామపంతులవారి కుటుంబంలో ఎన్నోవాడోగాని శ్రీశ 1710 ప్రాంతాలలోనే లింగమూర్తిగారు వరంగల్లుసీమలో తెలుగు కవిత్వం చెప్పసాగాడు.

ఈయన మొట్టమొదట రతీమన్మథవిలాసమనే శృంగారకావ్యం వ్రాశాడు. ఇది మూడాశ్వాసాల ప్రబంధం. ధారాశుద్ధి లేదు. భావలోపాలతో, వ్యాకరణదోషాలు ఇందులో చాలా ఉన్నాయట. ఇటువంటి ప్రథమ రచన చేసిన లింగమూర్తి కొద్దికాలం లోనే అనర్గళమైన ధారను అలవర్చుకొన్నాడు. నిర్దుష్టమైన రచన చేయసాగాడు. శృంగార కావ్యాలు మానేసి వేదాంత గ్రంథాలు వ్రాయసాగాడు.

లింగమూర్తికి నారాయణగురువు అనే ఆయన మంత్రోపదేశం చేశాడు. అది రామతారకమంత్రం 'అరగడియలోన రాముని సిరి బొందగ నొక్కయుక్తిచే దెలిపిన శ్రీగురు నారాయణయోగుల మరువకుమా' అని లింగమూర్తి తన మనసుకు హెచ్చరిక చేసుకొన్నాడు. “మతములు నిర్వాణప్రతిబంధకములు' అని తెలుసుకొన్నాడు. “'మంత్రంబులన్నియు నడుమంత్రంబులు' అని గుర్తించాడు. 'అంబరగమనాదులు గడుడంబమ్ములు' అని, “దూరదృష్టి దూరశ్రవణాదులు మాయ'లని గ్రహించాడు.

వెలుగులకెల్ల వెలుంగై- వెలిగింపక వెలుగబోక వెలుగుచు దానే

వెలుగై అంతట వెలుగం - గల సీతారామభద్రు గనుగొనుమనసా, (85) విజ్ఞానజ్యోతి ఒక్కటే అని ఆత్మప్రబోధం చేసుకొన్నాడు. సీతారాములు ప్రభోధించిన యోగశాస్త్రాన్ని మధించాడు. తెనిగించాడు. దాని పేరు సీతారామాంజనేయ సంవాదం. ఇది మూడాశ్వాసాల యోగశాస్త్రం. దీనికి ఆధ్యాత్మరామాయణం బాలకాండలోని ప్రథమసర్గ ఆధారం. అందులో పార్వతీదేవికి పరమేశ్వరుడు శ్రీరామహృదయాన్ని ఏభయి శోకాలలో చెప్పాడు. వాటిని అధ్యయనం చేసి లింగమూర్తి సుమారు 600 గద్యపద్యా లలో ఈ సంవాదాన్ని వ్రాశాడు. ఇది రాజయోగనిరూపక గ్రంథం.

. ఇందులోని విషయం ఇనుపగుగ్గిళ్ళు. అయితే లింగమూర్తి పాకం చాలా గొప్పది. ఆయన చేతిలో ఈ కఠిన విషయాలు సగ్గువియ్యంలాగా మెత్తపడ్డాయి. ఏదో ప్రబంధం చదువుకొంటున్నంత సరదాగా ఈ పద్యాలను చదువుకోవచ్చును. మొదలుపెడితే, పద్యం దానంతట అదే సాగిపోతుంది. అందుకే ఈ (గ్రంథాన్ని చాలామంది చదువుకొనేవారు;

814 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చదువుకొంటున్నారు. యోగశాస్త్రవిషయాలేకాక నీతులు, నిర్వచనాలు ఉన్నాయి సత్యాన్ని ఇలాగ నిర్వచించాడు:

ఉన్నది కన్నది విన్నది - యన్నట్టుగ బలుకుటయు నొరునకు సత్యా

పన్నత కలుగగ గల్యా- జోన్నతి గల కల్లమాటయును సత్యమగున్‌. (సీకా. 1-9) బ్రహ్మజ్ఞాని ఎలాగ నిత్యానందం పొందుతాడో చక్కగా వివరించాడు.

గాలిందూలిన, వానచే దడిసినన్‌, గాఢాగ్నిచే గాలినన్‌

వ్యాలం బాత్మ విముక్తకంచుకముపై వ్యామోహముం దాల్చన

ట్లా లోలాంగముపై నిరూఢ మమతాహంకారముల్లేక యా

త్యాలోక స్థితి నుండు బండితుడు నిత్యానందముం బొందుచున్‌, (3౩-177)

ఇలాంటి సులభ విషయాలనేకాక పరిభాషతో నిండిన పద్యాలు కూడా సాఫీగా సాగుతాయి. ఈ యోగశాస్త్ర గ్రంథాన్ని అందరూ చదువుకోగలరో లేదో అని లింగమూర్తి బాధపడ్డాడు. ఈయన చాలామందికి గురువు అయ్యాడు. ఈయనను లింగమూర్తిగారు అని పిలవడం మానేసి గురుమూర్తి అని గౌరవించేవారు. ఈయన, సర్వులూ పాడుకొనడానికి వీలుగా సీతారామాంజనేయ సంవాదాన్ని పాటగా రచించాడు. ఆ సంగతి ఇలా చెప్పాడు:

“ ఆర్హారక్షణ కళాస్ఫూర్తియుగ శ్రీలింగమూర్తి గురుమూర్తి యొక్కనాడు

అర్హులకు బ్రహ్మవిద్యా రహస్యార్థంబు కీర్తించి రక్షింపదలచి

వరుసతో నేనూరు వాక్యముల ముత్యాల సరులు కూర్చిన భంగికూర్చి

సరస సీతారాను సంవాద మను పాట విరచించె జనులార వినుడి

ఈ ముత్యాలసరాల వంటి పాటను 'సీతపాటి అంటారు. ఇది చాలా ప్రచారమైనది. తెలంగాణలో స్త్రీలలో తూడా ఇది వ్యాపించింది. ఈ పాటనేకాక గురుమూర్తి అనే బిరుదువచ్చాక లింగమూర్తిగారు కొన్ని శతకాలను కూడా రచించారు వాటిలో అత్నారామశతకం, గోవిందశతకం ఇటీవల దొరికాయి మొత్తంమీద లింగమూర్తిగారి రచనలు లెక్కకు పది తేలుతున్నాయి. వాటి వివరాలు ఇవి: 4. సాంఖ్యయోగం, 5. తారకయోగం, 6. మానసశతకం, 7. సీతారామాంజనేయ సంవాదు. 8. సీత పాట, 9. ఆత్మారామళశతకం, 10. గోవింద శతకం.

వీటిలో మానస శతకం, సీకారామాంజనేయ సంవాదం, సీతపాట అచ్చుపడ్డాయి మిగిలినవన్నీ అముద్రితాలే అయినా ప్రతులు దొరుకుతున్నాయట.” ఇతని గ్రంథాలేకాకీ ఇతని కొడుకు రామమూర్తి రచనలు కూడా లభిస్తున్నాయి. ఈయన కూడా తండ్రీలాగే వేదాంత గ్రంథాలనే వ్రాశాడు. ఈయనవి కూడా పది రచనలు ఉన్నాయి. 5. తెలుగు జానపద గేయసాహిత్యం - బి. రామరాజు, పుట 39. 6. 'చరిత్ర కెక్కిన చరితార్థులు' వి. రామరాజు 7. సీతారామాంజనేయ సంవాదం - వావిళ్ళ 1954. పీఠిక - శేషాద్రి రమణ కవులు, పుట 5.

కడపటిరాజుల యుగం 815

  1. శ్రీరామహృదయం (ద్విపద), 2. జీవన్ముక్తి ప్రకరణం (పద్యాలు), ౩. వివేకసారం, 1. వేదాంత కీర్తనలు, 5. ఈదులవాయి రామశతకం, 6. పరశురామశతక ద్వయం, 7. మహీతనయా మనోసహారశతకం, 8. అధ్యాత్మ రామాయణం (పద్యాలు), $. శుకచరిత్ర, 10. సీకారామాంజనేయం (గేయం)

వీటిలో కొన్నిమూత్రమే ముద్రితమయ్యాయి. పరశురామపంతులవారి కుటుంబం ఎక్కువగా మట్టివాడ పరిసరాలలో ఉన్నా ఈదులవాయి, అంబాల మొదలైన రామశతకాన్ని, అంబాలమహీతనయామనోహర శతకాన్నీ చెప్పాడు. తన కాలంనాటికి (శ్రీశ1740) వేమనపద్యాలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. అందుచేత రామమూర్తి ఆ బాజీలో 'పటుగుణాఖిరామపరశురామ' అనే మకుటంతో రెండు వందలారు పద్యాలు చెప్పాడు. కొన్ని అచ్చంగా వేమనపద్యాలలాగే ఉంటాయి. చూడండి

భక్తి కలుగ సకల పాపంబు అణగును-బాప మణగ గలుగు భావశుద్ధి

భావశుద్ధి గలుగ బరమార్థమబ్బురా పటుగుణాఖిరామ పరశురామ. (7)

ఈ శతకాలలోనే కాక రామమూర్తి తన కావ్యాలలో కూడా తండ్రిని అనుకరించాడు. శుకచరిత్ర రమారమి సీతారామాంజనేయ సంవాదంవంటి యోగశాస్త్రమే. అయితే ఎడనెడ లౌకికాలు దూర్చాడు. పాత ప్రబంధాల ధోరణీలోనే వ్రాశాడు. శుకుడు జన్మించడం, అతనికి నారదుడు ముక్తికాంతను గురించి చెప్పడం. శుకుని విరహం, ముక్తికాంత స్వయంవరం వగైరాలు ఉన్నాయి. సీతారామాంజనేయ సంవాదం చదువుకొన్నంత హాయిగా దీన్ని చదవలేం.

లింగమూర్తి కూడా ప్రబంధకవుల గమ్మత్తులన్నీ తన యోగశానస్త్ర గ్రంథంలో చొప్పించకపోలేదు. అయితే అతని ఏక అక్షరకందాలు, రెండక్షరాల పద్యాలు, వివీధవృ త్తాలు, యమకాలు, శ్లేషలు విసుగు ఫుట్టించవు. హాయిగా ఉంటాయి. రామమూర్తి గ్రంథం మాత్రం నడవనియ్యదు. పరశురామపంతులవారి శతకాలను వ్రాసుకొనడానికి ఆ రోజులలో తెలంగాణాలోనివారు చాలామంది నడిచిమ్లోవారు. ఈ యుగంలోనే ప్రసిద్ధుడైన మరొక వరంగల్లు సుబాకవి రావూరు సంజీవరాయడు. ఈయన కూడా శతకాలు బ్రాళాడు.

రావూరు సంజీవయ్య: ఇపుడు చాలా కుగ్రామంగా ఉందిగాని ఒకప్పుడు వరంగల్లుసీమలోని కొలనుపాక చాలా ప్రముఖమైన గ్రామం ఇది నేటికీ వైనుల పుణ్యక్షేత్రం. ఈ గ్రామంలో వీరనారాయణస్వామివారి దేవాలయం ఉంది. అ దేవునిమీద ఒక శతకం చెప్పించాలని గోపరాజు రాయన్న అనే స్తానిక శ్రీమంతునికి ఆసక్తి కలిగింది. రావూరి సంజీవయ్య అనే కవిని సత్కరించి ఆ కోరిక తీర్చుకొన్నాడు. “కొలనుపాక వీరనారాయణముకుంద విశ్చకుంద' అనే మకుటంతో సంజీవయ్య ఒక సీసపద్యశతకం చెప్పాడు. ఇందులో చాలా మటుకు గునుగు సీసాలు దశావతారాలు, కృష్ణలీలలు మొదలైన అంశాలను కూడా వర్ణిస్తూ చెప్పిన శతకం ఇది.

816 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

రావూరి సంజీవయ్య తండ్రికూడా. కవే. అతని పేరు గురవయ్య. ఈయన కొండవీటిలో ఉండేవాడు కాబోలు. అందుచేత కొండవీటి పెదరావు గురవయ్య అని ఇతణ్జీ పిలిచేవారు. వీళ్లు ఆదిలో తెలంగాణావాళ్లే. అయినా కొండవీడులోనూ, తెనాలిదగ్గిర రావూరులోనూ ఉండడంవల్ల ఆవూరి పేర్లు ఇంటిపేర్లు అయ్యాయి. వీళ్లు “అనుమకొండలు' అనే ఉపశాఖసంజ్ఞగల ప్రథమ శాఖవారు. దీనినిబట్టి వీళ్ళ పూర్వులు ఓరుగల్లు ప్రాంతాలవాళ్లేనని భావించవచ్చు. రావూరు సంజీవయ్య తెలంగాణాలోనే చదువుకొన్నాడు. రాత్రిపూట పాఠాలు చింతనచేసుకోడానికి దివ్వెలు లేక వల్లకాటిలో శవాల వెలుగులో చదువుకొనేవాడని ప్రతీతి. ఈయన కొలనుపాకలో వీరనారాయణ స్వామివారి ఆలయాఖివృద్ధికి తోడ్చడినట్లుంది.

వీరనారాయణశతకమే కాక “కృష్ణహరీ వసుదేవనందనా' అనే శతకాన్ని కూడా అతడు చెప్పాడు. ఈ శతకంలోనే తాను “సుధారసతుల్యకవిత్వకల్పనాస్రావిని కొండవీటి పెదరావుగుర్వతనూజు సంజీవిని అని చెప్పుకొన్నాడు. కవిత్వమేకాక జాతక సిద్ధాంత గ్రంథాలలో ప్రావీజ్యమున్నవాడు. రుక్మిణీ పరిణయం అసో కావ్యాన్ని వ్రాశాడు. ఇది అచ్చుపడింది. కాశీ కృష్టాచార్యులుగారు పీఠిక వ్రాశారు. మైదవోలు వెంకమ్మ, మారెళ్ల బసవమ్మగార్లు ప్రకటించారు. ఈ పుస్తకం గద్యంలో చాలా తకరార్లు ఉన్నాయి.

రావూరి సంజీవయ్య తన వీరనారాయణ శతకాన్ని క్రీ.శ1731లో రుక్కిజీ పరిణయాన్ని క్రీ.శ1787లో రచించాడు. ఈమధ్యకాలంలో అతడు వసుదేవనందన శతకాన్నే కాక మరే రచనలు చేశాడో తెలియదు. జనానికి తన పద్యాలకు అర్గాలు బోధపడడంలేదని సంస్కృతంలో వివరణలు. బవ్రాశాడట. అవి ఎంతవందికీ బోధపడ్డాయో! +

సామాన్య ప్రజలకు దూరంగా ఉండే సాహిత్యాన్ని ఇలాంటీ పండిత కవులు సృష్టించడంవల్ల సాధారణమైన తెలుగువాళ్ళకూ, తెలుగుకవిత్వానికి చూపులు తప్పిపోయే పరిస్థితి వచ్చింది. గ్రామీణులు తమకు కావలసిన పాటలు తాము కట్టుకొనడం ప్రారంభించారు. ఈ యుగంలో వరంగల్లు సుబాలో సర్వాయి పాపడు తన ప్రతాపాన్ని చూపించాడు. కొలనుపాకకు ఎనిమిది క్రోసుల దూరంలో షాపురంలో దుర్గం కట్టి దానికీ పాపారావుపేట అని పేరు పెట్టాడు. కౌరంగజేబునే ఎదిరించాడు. వీరమరణం పొందాడు. ఇతని కథను గ్రామీణులు పాటగా కట్టుకొన్నారు. ఇది ఆంధ్రదేశంలో బహుళప్రచారం పొందింది.

సర్వాయి పాపడీ కథను గురించి మిత్రులు బి. రామరాజుగారు విపులమైన పరిశోధన చేశారు.3? పాపడు గవండ్లకులంలో పుట్టాడు. ఆ కులపురాణాన్నే మల్లికార్డున సిద్దయోగి '“గౌడపురాణం' అనే పేర వ్రాశాడు. ఇది ద్విపదకావ్యం అముద్రితం! 8. సాహిత్యపరిషత్ప్సత్రిక, సంపుటి ౩ (?) 9. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక, 4వ సంపుటిలో చివుకుల అప్పయ్య శాస్త్రిగారి వ్యాసంలో రావూరీ

సంజీవయ్య వివరాలు ఉన్నాయి.

  1. తెలుగు జానపద గేయసాహిత్యం, పుటలు 220-228.
  2. గోలుకొండకవుల సంచిక, పుట 404.

కడపటిరాజుల యుగం 817 ఇందులో పాపడి గురించి ఏమైనా ఉందేమో శోధించాలి. ఈ మల్సికార్తున సిద్దయోగి పారమార్ధిక గ్రంథాలు వ్రాశాడో లేదోగాని ఈ ప్రాంతాలలో మరొక కవి జిబ్తాసతో గ్రంథరచన చేశాడు. క

ఖైరవయ్య గారి మాచన్నః ఈ ప్రపరచం ఎలా పుట్టింది? సకల జగత్తులు ఉత్పత్తి స్థితిలయకారకులయిన త్రిమూర్తులు ఎలా పుట్టారు? అనే ప్రశ్నలు మానవమాత్రులకే కాదు, సాక్షాత్తు పార్వతీదేవికి కూడా వచ్చాయి. జవాబు చెప్పమని ఆమె శంకరుణ్ణి అడిగింది ఆయన ఈ బ్రహ్మాండనిర్మాణమెట్టిదో చెప్పాడు. ఈ కథనాన్ని భైరవయ్యగారి కొడుకు మాచన్న వచన రూపంలో వ్రాశాడు. నాలుగు వేదాలూ, అష్టాదశపురాణాలూ చదివి వాటి సారాంశంగా ఈ బహ్మాండవచనం ఇతడు రచించాడట (౧.2142 ఇతడు

  • శ్రీమన్నారాయణ, _ శ్రీమహాదేవచరణ ధ్యానానందుణ్ణని గద్యలో చెప్పుకొన్నాడు.

వేదాంత గ్రంథాలకు పెట్టిన పేరైనా పరశురామపంతుల లింగమూర్తి కూడా తన గద్యను ఇలాగే వ్రాసుకొన్నాడు. కనక ఖైరవుని మాచన్న అతని సమకాలికుడని పరిశోధకులు నిర్ణయించారు.]2

ఇద్దరూ ఒకే కాలంవారేకాక ఒక ప్రాంతంవారు కూడా కావచ్చు.

మెదకు సుబాకవులు

ఇది చాలా చరిత్రగల సీమ. ఈ సుబాలోనే పద్మనాయకయుగానికి కర్తలైన ప్రసిద్ధులు పూర్వం తమ రాజ్యాలను స్థాపించుకొన్నారు. వాటీ రాజధానులుగా విఖ్యాతమైన రాచకొండ, దేవరకొండ దుర్గాలు ఈ సీమలోనే ఉన్నాయి. ఒక పక్క ఏలేశ్వరం, ఇంకోపక్క ఆలంపురంవంటి క్షేత్రాలున్నాయి. మల్లికార్జున పండితారాధ్యుల కాలంనుంచీ ఈ సీమలో కవులు సంచారం చేశారు. అంటే చాళుక్కయుగంనుంచీ ఇక్కడ కవితా వ్యాసంగం ఉందన్నమాట. ఇక్కడి ప్రభువుల సభలోనే “ఎటుల మెప్పింతువో' అని శ్రీనాథుడంతటివాడు శారదాంబకు మొక్కుకున్నాడు. ఈ సీమలో సాహిత్యపోషణ బాగా జరిగింది.

ఇంతటి ప్రాచీన చరిత్రగల ఈ సుబాలో కడపటిరాజుల యుగంనాటికి నాలుగు వీల్లాలు ఉండేవి. వీటిలో పూర్వం చాలా ముఖ్యమైన సంస్థానాలు ఐదు ఉండేవి. అనాటి రాజకీయాలలో ప్రముఖపాత్ర వహించిన రాజులు ప్రజలను పాలించారు; ప్రజ్ఞను చూపించారు; ప్రతిభను లాలించారు.

  1. దుబ్బాకుల సంస్థానం మెదకు జిల్లా సిద్ధిపేట తాలూకా

  2. పాపన్నపేట సంస్థానం మెదకు జిల్లా అందోలు తాలూకా

౩ జటప్రోలు సంస్థానం మహబూబునగరు జిల్లా నాగర్‌కర్నూలు తాలూకా

818 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

4, అమరచింత మహబూబునగరు బిల్లా ఆత్మకూరు తాలూకా

  1. వనపర్తి మహబూబునగరు జిల్లా

ఈ అయిదు ముఖ్యమైన సంస్త్థానాలలో దుబ్బాకుల జాగీరు రాజకీయ చరిత్రను గురించిగాని, సాహిత్యపోషణ గురించి గాని వివరాలు ఎక్కడా నాకు దొరకలేదు. మిగతా నాలుగూ ఎంతో చరిత్ర సృష్టించాయి.

పాపన్నపేట సంస్థానం: ఈ సంస్థానం ఇప్పుడు చాలా చిన్నదైనా పూర్వం మెదకుసీమ అంతా దీనికిందనే చెల్లుతూ ఉండేది. ఇక్కడి రాజులూ, రాణులూ శార్యసాహసాలు కలవాళ్లు. ఈ సంస్థానానికి మూలపురుషుడు రామిరెడ్డి అనే రైతు. ఈయన చక్రవర్తి ఫిరోజ్‌షా కాలంలోనివాడు, అంటే క్రీ.శ. 1357-13%8 నాటివాడు. ఫిరోజ్‌షా దక్షిణ దిగ్విజయం చేశాడు. అందోలు దగ్గిరకు వచ్చేసరికి ఆయనకు దాహం వేసింది. రామిరెడ్డి చెంబుడు చెరుకుపానకం యిచ్చాడు. చక్రవర్తి అనుగ్రహించాడు. రామిరెడ్డి రామినేడు అయ్యాడు. కల్చగూరు అందోలు పరగణాలకు అధికారి అయ్యాడు.

ఈ రామినేడు సంతతిలో నాలుగోతరం అల్లమరెడ్డి వీరుడుగా ప్రసిద్ధుడయ్యాడు. తన పేర అల్లమయ్యపేట కట్టించాడు. ఈయన తరువాత ఏడవతరంలో రాజీ లింగాయమ్మ చాలా ప్రఖ్యాతురాలైంది. ఈమెకాలంలో సంస్థానం 18 పరగణాలకు విస్తరిల్లింది. తరువాత ఆరు తరాలవాళ్లు పాలించారు.

కడపటి రాజులయుగంలో పన్నెండోతరంలో పెద్ద నరసింహారెడ్డి పాలించాడు. ఇతని భార్య శంకరమ్మ. కాకతీయ రుద్రమదేవే మళ్ళీ ఈమె రూపంలో అవతరించిందని జనులు తలచేవారు. ఈమె చాలా చదువుకొన్న వ్యక్తి. పండితులను పోషించింది. భర్త గతించిన తరువాత ఈమె రాజ్యపాలన చేసింది. నిజాము తరపున మహారాష్త్రులతో యుద్ధాలు చేసింది. రాయబేగం అనే బిరుదు పొందింది. ఈమెపై కవులు చెప్పిన పద్యాలు ఏవీ దొరకలేదు గాని ఈమె కథను గ్రామీణులు పాడుకొంటారు. తెలంగాణాలో రాజీ శంకరమ్మ పాట చాలా ప్రచారంలో ఉంది. ఈమె దత్తపుత్రుడు సదాశివరెడ్డి గొప్ప వీరుడు. అతనిమీద తూడా సుదీర్హమైన జానపదవీరగీతం ఒకటి ప్రచారంలో ఉంది పాపన్నపేట పాలకుల వంశవృక్షాలు, వీళ్ల ప్రశంసలూ అముద్రితంగానే ఉన్నాయి. వీటిపైన మిత్రులు బిరుదురాజు రామరాజుగారు చాలా విపులమైన పరిశోధన చేసి 'తెలుగువీరుడు' అనే నవల వ్రాశారు. తమ పరిశోధనా గ్రంథంలో ప్రత్యేకంగా కొన్ని పుటలలో ఈ వీరగీతాల గురించి చర్చించారు.

జటప్రోలు సంస్థానం: ఇది సాహిత్యపోషణలో పేరుకెక్కిన సంస్థానం: ఎలకూవి బాలసరస్వ్పతిచేత భర్హృహరి సుభాషితాలు అనువాదం చేయించి తన తండ్రికి యిప్పించిన సురఖి మాధవరావు ఈ సంస్థానం ప్రభువే ఆయన వసుచరిత్రతు కార్చనుకాపీగౌ చంద్రికాపరిణయం అనే ఒక ప్రబంధాన్ని కూడా రచించాడు.* ఈయన క్రీ.శ. 1650 దాకొ

  1. తెలుగు జానపద గేయ సాహిత్యం, పుటలు 253-261
  2. నాయికరాజుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి.

మెదకు సుణాకవులు 819 పాలించాడు. తరువాత ఇతని కొడుకు నారాయణరావు చాలాకాలం పాలించాడు. ఈయనకు తిరుమలరావు, నరసింగరావు అనే తమ్ముళ్లు ఉన్నారు. సురఖి నరసింగరావు మాపూరులో ఉండి వ్యవహారాలు చూచుకొంటూ ఉండేవాడు. ఈయన సంస్కృత భాషలో రచనలు చేయగలడు. “నక్షత్రఖీలనం' అనే గ్రంథాన్ని రచించినట్టు తెలుస్తోంది. ఈయన కుమూరుడు చిన్న మాధవరావు కూడా విద్వాంసుడే. *శూద్రస్కృతి' అనే గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాశాడు. ఇది ఆయన ఎవరిచేతనో రచింపజేసినట్టు సురఖివారి వంశచరిత్రలో ఉందట. ఈ సంస్థానంలో చాలామంది పండితులు ఉండేవారు.

కవితార్కికసింహ శ్రీనివాసాచార్యులు ; ఈయన క్రీ.శ168%4లో జన్మించారు. జటప్రోలుకు దగ్గరగా ఉండే మంచాలకట్ట వీరి స్వగ్రామం. ఈయన సంస్కృతంలో రచించిన గ్రంథాల వివరాలే తెలుస్తున్నాయిగాని తెలుగు రచనలు చేశారో లేదో కూడా తెలియవు. వీరు వ్రాసిన 68 గ్రంథాలలో ఒకటేనా తెలుగుది ఉండకపోదు. ఆనాటి మోతుబరులు కూడా ఈయనను సత్కరించారు. వీరికి సురవరం అనంతరెడ్డిగారు క్రీశ 1706లో కోయిలకొండ దగ్గరగా ఒక గ్రామాన్ని దానం చేశారు. ఈయనే కాక 'కవితార్కికసింహ లీ విద్యారణ్యంలో ఇంకా ఉన్నారు.

ఈ సంస్థానంలో తెలుగు గ్రంథాలను ్రాసిన కవిగా మనకు శేషభట్టరు సింగరాచార్యులు కనబడతారు. ఈయనకు చినమాధవరావు పోషకుడు. ఈయన తన పెదతండ్రి నారాయణరావు తరువాత రాజయ్యాడు. సన్నదుమాత్రం క్రీ.శ. 1742లో వచ్చింది. ఈయన తన తాతతండ్రులలాగ స్వయంగా రచనలు చేయకపోయినా కవులను పురమాయించి గ్రంథాలను వ్రాయించాడు.

శేషభట్టరు ఏంగరాచార్యులు : ఈయన గడియకు నూరు పద్యాలు చెప్పి దిట్ట. రోజుకో గ్రంథం వబ్రాయగల సమర్థుడు. అయినా ఇతడు రచించిన గ్రంథాలలో శేశనవిలాసం' అనే ప్రబంధం పేరు మాత్రమే కనబడుతోంది. దీనిని వ్రాశాక సురఖి చినమూధవరావు ఈయనను పిలిపించి శూద్రధర్మాలు వివరించే ధర్మశాస్త్రం బ్రాయ మన్నాడు. 'శూద్రధర్మోత్సల ద్యోతినీస్మృతికౌముది' అనే పెద్దపేరుతో మూడాశ్వాసాల

అయితే ఇది శ్రీరాయమదనగోపాలుడు రచించిన గీర్వాణ గ్రంథానికి వ్యాఖ్యాన రూపమైన అనువాదం. వచనాలు వాడుక భాషలో బ్రాళాడు. శూద్రులకు గర్భదానాది సంస్కార విషయాలలో అధికారం ఉందా లేదా అన్న పాయింటు దగ్గిరనుంచి హ్లాలా తోముకోవాలి. ఎలా పడుకోవాలి అన్న నియమాలదాకా చాలా సంగతులు ఇందులో ఉన్నాయి. శేషభట్టరు సింగరాచార్యులు ఇలాంటి ధర్మగ్రంథాలనేకాక కావ్యాలు కూడా చాలా వ్రాయగలడని శైలినిబట్టి పోల్చవచ్చు. కృతిభర్త మాధవరావుగారి తండ్రి పేరు చరసీంగరావు. అందుచేత తన ప్రభువును 'నరసింగమాధవేంద్రుడు' అన్నాడు. ఈ మాట కనననన నమమకన నన వనన వపను య 3 గోలకొండసంచిక, పుట 39

820 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అన్నాక రాయలనాటి చాటువు జ్ఞాపకం వచ్చి ఆ పద్ధతిలో చిన్న మాధవరావును ఇలా కీర్షించాడున నరసింగమాధవేంద్రుని - స్థిరతరసత్కీర్తిచెలగ దిశలన్‌ మిగులన్‌ కరఖిద్ధర గిరిభిచ్చరి- కరిభద్వర శైలతుల్య కాంతిస్ఫురణన్‌ దీనికి మాతృకలాంటి తొలిపద్యం చూడండీ: నరసింహ కృష్ణరాయని - కరమరుదగు కీర్తి యొప్పె గరిఖిద్గరి ఖి త్కరి శరఖిగ్గిరి కిరిఖి - త్కరి ఖిద్గిరి ఖిత్తురంగ కమనీయంబటై. (చాటుపద్యుమణిమంజరి. 1-150) శేషభట్టరు సింగరాచార్యులు వ్రాసిన కేశవవిలాసంవంటీ గ్రంథాలు బయటపడితే అతని కీర్పి ఎలాంటిదో చెప్పగలం. ప్రస్తుతానికి కడపటిరాజుల యుగంలో జటప్రోలు సంస్థానం పోషించిన తెలుగుకవి ఇతడొక్కడే అని చెప్పాలి. ఈ సంస్థానపు పోషణలో ఉన్నాడో లేదోగాని ఈ యుగంలో ధర్మయ్య అనే మరోకవి కనబడుతున్నాడు. బారిగడుపుల ధర్మయ్య: జటప్రోలు సంస్థానంలో బారిగడుపుల అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడి దేవుడు నరసింహస్వామి. ఆ గ్రామంలో ధర్మయ్య అనే కవి ఉండేవాడు. ఇతని తండ్రిపేరు తిమ్మప్ప. ఆయనే. నరసింహస్వామి కలలో కనపడి అజ్బ్ఞాప్‌స్తే ఆ దేవునిపేర బారిగడుపులలో కోవెలను కట్టించాడు. తండ్రి గుడి కట్టించిన దేవుని చరిత్రనే కొడుకు ధర్మయ్య ద్వాపదకావ్యంగా చేయించి దైవానికి అంకితం చేశాడు. ఎవరిచేత చేయించాడో తెలియదు. ఆ తరువాత అదే నృసింహపురాణాన్ని పద్యకావ్యంగా రచించి దేవుడు అంకితంగా యివ్వమన్నాడట. ఆయన ఇలా ఆర్డరు వేశాడు. ఒగినరసింహపురాణం - బగడితమది వచనంబై భువిబరగం దగ రచియింపుదు ఈకృతి - జగతిబ్రవర్సిల్లుచుండు శాశ్వతముగాన్‌ (1-13) ఈ పద్యంలో పద్యకావ్యాన్ని దేవుడు వచనం అనడం విడ్డూరంగా లేదుగాని ఈ గ్రంథాన్ని కాపీచేసినవాళ్లు ఆ మాటను వచన కావ్యంగా మార్చెయ్యడమే వింత. బారిగడువుల ధర్మయ్య వ్రాసిన నృసింహపురాణం అచ్చు కాలేదు. దీని ప్రతి ఒకటీ గద్వాల సంస్థానంనుంచి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారి కార్యస్థానానికీ చేరింది వారు ఆ కాళపత్రగ్రంథానికి పుత్రికను బ్రాయించారు. (క్రమసంఖ్య 9) లేఖకులు మాటను మార్చేశారు. డాక్టరు వి. రామరాజుగారు ఈ కవి గురించి మొట్టమొదట తెలియచేస్తూ ఫై పద్యాన్ని తాటాకుల గ్రంథం నుంచి యథాతథంగా ఉదాహరించారు.్‌ అయనే ధర్మయ్యుకు బారిగడుపుల అనే ఇంటిపేరును ప్రసాదించారు. బతక నాడా డననాడానాిణానా నానన 4. ఈ పద్యాన్నేకాక ఈ కవి గురించి మొదట చెప్పినవారు డా. బిరుదరాజు రామరాజుగారు “మరుగుపడిన మాణిక్యాలు' పుట 7-12 5. మరుగు పడిన మాణిక్యాలు, పుట 2

మెదకు సుబాకవులు 621

నరసింహపురాణం ఆరాశ్వాసాల గ్రంథం. ఇందులో జయవిజయుల మూడు జన్మల కథలూ కవి కథనం చేశారు. ప్రహ్హాదచరిత్రలో ధర్మయ్య పోతరాజుగారిని యథాతథంగా అనుకరించారు. “మందారమకరంద' అనే సీసపద్యాన్ని విరిచి నాలుగు కందాలను తయారు చేశారు.

  1. _ మందారకుసుమముల మక-రందము సుఖవృత్తిగ్రోలు భమరంబులు యిం

పొందని మదనము చేరు మంధరదరు దాసుదొండు మతముల జనునే? 2. అమరతటీతరగం అంబు-నమరగ నోలాడు రాజహంజము చనునే?

'ప్రమదముతో శైవలినీ సముదయముల గికికట్టి దుర్విచారము లేలా? 3. దీకొని వేడుక రాకాసు-ధాకర కిరణములు గ్రోలునట్టి చకోరం

బేకరణి జను హిమానీ - శీకరముల కిట్టి తగని శిక్ష లవేలా? 4 _ అవని సహకారపల్లవ-ములాఖాదియగుచు యిష్టముల నుండెడు కో

కిల కుటజములకు బోవునె - జలజాక్షుభక్తు డన్యభజనశాయదలచునే?

= (నృసింహ 89వ కమ్మ

ఈ పద్యంవల్ల బారిగడుపుల ధర్మయ్యలోని అనుకరణశక్తి తెలుస్తుంది.

అమరచింత: కాకతీయుల కాలంలో గోనబుద్ధారెడ్డి అధీనంలో వర్థమానపురం ఉండేది. దీనికి గోపాలరెడ్డి అనే ఆయన దేశాయిగా ఉండేవాడు. ఈయన సేవలు బుద్దారెడ్డి గారు మెచ్చుకున్నారు. మక్తలపరగణాను నాడగౌడికం ఇచ్చారు. ఇది క్రీ.శ. 1292లో జరిగింది. ఆ తరువాత గోపాలరెడ్డి రెండో కొడుకు చిన్న గోపిరెడ్డి అయిదుమహళ్ళ నాడగౌడికం పుచ్చుకొన్నాడు. వాటిలో అమరచింత ఒకటి. ఇదే సంస్థానానికి ముఖ్యమైంది. అది వృద్ధి పొందింది. ఈ చిన్నగోపిరెడ్డి మనవడి మనవడి పేరు కూడా గోపిరెడ్డే. ఇతణ్జి ఇమ్మడి గోపిరెడ్డి అంటారు. ఇతడు తూడా తండ్రికి చిన్నకొడుకే.

ఇమ్మడి గోపిరెడ్డి క్రీ.శ 1654 ప్రాంతాలవాడు ఈయన అన్నగారితో విడిపోయాడు. ఈయనవంతు అమరచింత, వర్గమానపురాలు వచ్చాయి. పెద్దాయన సాహెబుంెడ్డి క్రీశ 1676 ప్రాంతాలలో నాడేగౌడానికి వచ్చాడు. చాలా అభ్యుదయ విధానాలు కలవాడు. నీటివనరులు పెంచడానికి పెద్దవాగుకు ఆనకట్ట కట్టించాడు. ఇతడు జౌరంగజేబు సైన్యాలకు సాయం చేశాడు. జండా, నగారా 500 నవార్లు మొదలైన రాజలాంఛనాలు పొందాడు. ఈయన తరువాత వరుసగా ఆరుగురు రాజులీ సంస్థానాన్ని పాలించారు. ఈ యుగంలో ఈ అమరచింత సంస్థానమే ఉత్తరోత్తరా అత్మతూరు అనే పేరుతో ప్రసిద్ధమైంది.

కడపటిరాజుల *'యుగంలో ఈ సంస్థానం చేసిన సాహిత్యసోషణ ఏమిటో

వనపర్తి, దీనిని పూర్వం నూగూరు సంస్థానం అని పిలిచేవారు. కడప ప్రాంతాలనుంచి వీరకృష్ణారెడ్డి అనే క్షాత్రవంతుడు విజయనగర సామ్రాజ్యం వెలుగుతున్న

822 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి రోజులలో ఈ సీమకు వచ్చి పాతపల్లె, నూగూరు గ్రామాలను కొని అభివృద్ధి చేశాడు. ఇతని మునిమనుమడు గోపాలరావు క్రీ.ఈ 1676 నాటికి చాలా గొప్పు పండితుడు. ఎనిమిది భాషలలో విద్వాంసుడు. అందుచేతనే ఈయనను అష్టభాషల గోపాలరావు అంటారు. ఈయనకు ఈ విరుదు పండితులు యిస్తే గోల్కొండ సుల్తానులు “బహిరో అనే కితాబు ఇచ్చారు.

అష్టభాషల గోపాలరావుగారు. తిరుపతి, కంచి, శ్రీరంగం మొదలైన క్షేత్రాలు దర్శించారు. ఆయా పుజ్యస్థలాలలో ఉండే మంచి పండితులను సత్కరించడమేకాక వెంటపెట్టుకొని నూగూరికి తీసుకొని వచ్చాడు. తన సంస్థానంలో శ్రీరంగపురం అనే క్షేత్రాన్ని నిర్మించాడు. ఈయన రామచంద్రోదయం అనే శ్లేషకావ్యాన్నీ శృంగారమంజరి అనే భాణాన్నీ సంస్కృతంలో రచించాడు. తెలుగులో ఏం వ్రాశాడో తెలియదు. ఇతని మేనల్లుడు విజుల తిమ్మరాజు అనర్హరాఘవం తెనిగించాడని పరిశోధకులు అంటున్నారు! అయితే అనర్హరాఘవం అవతారికలో బిజ్ఞుల తిమ్మరాజు ఎక్కడా ఈ బంధుత్వాన్ని చెప్పుకోలేదు. పైగా తన తల్లి జమపల్లి వెంకటరాజుకుమార్తె బచ్చమాంబ అని చెప్పాడు (1-89). కాబట్టి అష్టభాషల గోపాలరావుకు, విజ్ఞుల తిమ్మరాజుకు ఈ సంబంధం లేదు; ఏ సంబంధమైనా ఉందేమో భావిపరిశోధన వల్ల తేలాలి.

అష్టభాషల గోపాలరావుకు చాలాకాలందాకా పిల్లలు లేరు. అతడు వెంకటరెడ్డి అనే బంధువుల బిడ్డను దత్తత చేసుకొన్నాడు. ఇతణ్జి పెంచుకొన్న తరువాత కుమారబహిరీ గోపాలరావు అనే కొడుకు పుట్టాడు. అయితే ఈ ఖాసాకొడుకు అవివాహితుడుగానే క్రీశ. 1691లో పోయాడు. అందుచేత దత్తుడే సంస్థానానికి రాజయ్యాడు.

వెంకటరెడ్డి చాలా అఖిమానవంతుడు. మొగలు సామ్రాజ్యపు అధికారాన్ని లక్ష్యపెట్టలేదు. పన్నులు కట్టకపోతే జనకతండ్రినైనా క్షమించలేదు. తన దత్తు తల్లిపేర జానంపేటను, దత్తు తండ్రిపిర గోపాలపేటను కట్టాడు. ఈ గోపాలపేట కూడా ఉత్తరోత్తరా ఒక ప్రత్యేక సంస్థానం అయింది. ఇతని స్వతంత్ర విధానాలను దక్కను సుబేదారు సహించలేదు. జానంపేటను ముట్టడించాడు. ధైర్యంగా పోరాడి, శత్రువులకు చిక్కకుండా వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇతని వీరగాథను గ్రామీణులు వెంటనే పాటకట్టుకొని పాడుకొన్నారు. ఇప్పటికీ తెలంగాణాలో శారదగాండ్రు రీన్ని గానం చేస్తారు.

వెంకటరెడ్డి తరువాత అతని కొడుకు బహిరీ గోపాలరావు రాజయ్యాడు. మొగలు సామ్రాజ్యానికి తండ్రి ఎంతటి విరోధో కొడుకు అంత విశ్చసనీయుడైనాడు. ఆర్కాటుమీద యుద్దానికి వెడుతున్న అసఫ్‌జా తన రాజధాని బాధ్యతను గోపాలరావు చేతులలో పెట్టాడంటే ఆ నమ్మకం ఎంత గట్టిదో తెలుస్తుంది. ఈయన శ్రీశ 1746లో పోయాడు. తరువాత ఇతని కొడుతు సవై వెంకటరెడ్డికి నన్నదు ఇచ్చారు. ఈయన రాజధానిని నూగూరునుంచి శ్రీరంగపురానికి మార్చాడు. 50 సంవత్సరాలు అదే 6. గోలుకొండకవుల సంచిక, పుట 38.

మెదకు సుబాకవులు 823 ముఖ్య పట్టణమైంది (ఆ తరువాత వారసులు వనపర్తికి రాజధానిని మార్చుకొన్నారు). సవై వెంకటరెడ్డి 176లో పోయాడు.

ఈ యుగంలో వనపర్తి ప్రభువులలో అష్టభాషాగోపాలరావు స్ప్వాయంగా రచనలు చేశాడనీ, అతని దత్తపుత్రుడు వెంకటరెడ్డిపై ప్రజలు పాటలు కట్లుకొన్నారనీ మాత్రం చెప్పుకోవాలి. ఈ సంస్థానంలో ఎవరి ఆశయంలో ఉన్నాడోగాని చింతలపల్లి సంజీవి (బహుశా 1734లో) చంద్రాంగదోపాఖ్యానం అనే కావ్యాన్ని వ్రాశాడు. ఇది నష్టమైనట్టుంది. వనపర్తి సంస్థానంలోనే చెన్నకృష్ణయ్య అనే మరోకవి ఉండేవాడు. ఈయన యాదవభారతీయం అనే పేరుతో ఒక ద్వ్యర్థికావ్యాన్ని వ్రాశాడు. ఇందులో భారత భాగవతాల కథలు జోడించాడు. ఈ కావ్యాన్ని వనపర్తి సంస్థానంవాళ్లు అచ్చువేశార్వట. ఇతడు క్రీ.శ. 1737 ప్రాంతాలలో ఉండేవాడని శేషాద్రిరమణకవులు వ్రాశారు.” వనపర్తి ప్రాంతాలలో ఉండే మరొకళవి గురించి మిత్రులు రామరాజుగారు నాకారు.

ఏదుట్ల శేషాచలం: మన సాహిత్యంలో కలరాని కవీ, దేవుడు కనిపించి ఆజ్ఞాపించని కావ్యం లేవు. అయితే మన కవులు రిపోర్టు చేసిన తమ కలలో ఏ ఒక్కటీ తలాతోకా లేనివి లేవు. వాస్తవానికి కలలో అన్నీ కలగాపులగంగా ఉండాలి. స్వపష్నచిత్రాల మాంటేజ్‌ విచిత్రంగా ఉంటుంది. ఇటువంటి కల వచ్చినవాడు మన సాహిత్యంలో ఏదుట్ల శేషాచలం ఒక్కడే కనిపిస్తున్నాడు.

ఈయన కలలో కూడా దేవుడు కనిపించాడు. అయితే ఒంటరిగా కాదు, సాదాగా తూడా కాదు. అర్ధనారీశ్వరుడు కనిపించాడు. ఆయన కుడిచేతిపక్క ఒక శ్రీవైష్ణవుడు ఉన్నాడు. వాళ్లకి ముందు విభూతి, సింధూరం పెట్టుకొని, కిరీటం ఛరించి, వేణువు పట్టుకొన్న వ్యక్తి నాట్యంచేస్తూ అన్నిటా శివుడున్నాడని చాటుతోంది. అర్ధనారీశ్చరుడు “హరేరామ గోవిందా” అని జపిస్తున్నాడు. ఈ వింతకల ఏమిటా అని కలలోనే శేషాచలం ప్రశ్నించాడు. కలలోనే దేవతల దగ్గిర ఉన్న వైష్ణవుడు ఇదే జగన్నాటకం అని చెప్పాడు.

స్వప్నంలో చూసిన జగన్నాటకాన్ని కావ్యంగా బ్రాస్తున్నప్పుడు అది అధ్యాత్మవిద్యానుసారంగా, భరతశా స్తానుసారంగా శేషాచలం వ్రాశాడ:. పరబ్రహ్మనుండీ జీవుడు, ప్రకృతి జన్మించడం, ప్రపంచ నాటకం ఆరంఖించడం మొదలైనవి వ్రాశాడు. ప్రబోధచంద్రోదయంలోని కథనే తీసుకొన్నా ముక్తికాంకా పరిణయం, రాజరంజన విద్యావిలాసనాటకంలాంటి ఆధ్యాత్మిక యక్షగానాల కోవలోకి ఇదీ చేరుతుంది.

ఈ కావ్యంలో భక్తిరసైకనిష్ట ఉందని పరిశోధకులు చెప్పారు. ఏదుట్ల శేషాచలం సంగీతసాహిత్య భరతశాస్తాది కళాప్రవీణుడని చెప్పుకొన్నాడు. ఈ విద్యలు బహుశా ఇతనికి తాతతండ్రుల వద్దనుంచి అబ్బి ఉంటాయి. కాత చెన్నయ్య, తండ్రీ నాగేశం ఎంతటి పండితులో తెలియదు. ఏదుట్ల అనే గ్రామం జటప్రోలు సంస్థానంలో ఉంది. అయినా ఈ కనన నకును నమ చన సనన యాతన వకు వపను పక సున ప 7. నోలుకొండకవుల సంచిక, పుట ౪.

  1. మరుగుపడిన మాణిక్యాలు, పుటలు 77-55.

824 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఏదుట్లవారు వనపర్తి సంస్థానంలో వనపర్తికి దగ్గరగా ఉన్న ఖిల్లా గణపురనివాసులు. బహుశా ఈ కుటుంబం వాళ్లకు ఆదిలో జటప్రోలుతో, తరువాత వనపర్తితో సంబంధం ఉండి ఉండవచ్చును.

ఈ సుబాలోని నాలుగు సంస్థానాలలోనేకాక ఈ యుగంలో ఇతర పరగణా గ్రామాలలో తూడా కొందరు కవులు ఉన్నారు. వాళ్లలో మరింగంటివారు ప్రముఖులు. నల్లగొండ జిల్లా కనగల్లు గ్రామంలో మరింగంటివారు ఉన్నారు. ఈ పండిత కుటుంబంలో సింగరాచార్యులు. ఆద్యుడు, ప్రసిద్ధుడు. ఈయన 'నవాబుల యుగంలోనివాడు. మల్కిభరాంకాలంవాడు. అంటే క్రీ.శ. 1550 ప్రాంతాలవాడు" ఈయనకు ఆరవతరం, అంటే తరానికి 30.సంవత్సరాలు లెక్కకట్టినా క్రీ.శ. 1730లో వెంకటనరసింహాచార్యుడు అనే మరో ఉద్దండుడు ఉన్నాడు. ఈయనను పెదనరసింహాచార్యులని వ్యవహరించాలి. ఇతని తరువాత మరో రెండు తరాలకు ఇంకో నరసింహాచార్యులు ఉన్నాడు. ఆయనా కే.

మరింగంటి పెదనరసింహాచార్యులు ఒకటీ రెండూ కాదు, పదమూడు గ్రంథాలు వ్రాశాడు. "

  1. జనకసుతాభ్యుదయం, 2. శ్రీకృష్ణశతానందీయం, 3. చిలువపడిగరేని పేరణం,
  2. నృకంఠీరవాభ్యుదయం, 5. క్షత్రబంధోపాఖ్యానం, 6. జాంబవతీీకుమూరశృంగార విలాసం, 7. రామానుజాభ్యుదయం, 8. శెల్వపిళ్లరాయ చరిత్రము, 9. విష్ణుక్సేన ప్రకారం,
  3. గోదావధూటీపరిణయం, 11. పద్మినీకన్యకాభ్యుదయం, 12. రతీమన్మథా భ్యుదయం, 13. మిత్రవిందోపాఖ్యానం.

పెదనరసింహాచార్యులు ఇన్ని గ్రంథాలు వ్రాసినా ఒక్కటి అచ్చుపడింది. అది గోదావధూటీపరిణయం. మిగతా గ్రంథాలలో ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో కొన్ని, కనగల్లులో మరింగంటివారింటో అన్నీ ఉన్నాయి. వీటిలో *శెల్వపిళ్లాయ చరిత్రను ఇతడు పదోఏట వ్రాశాడట (౧686. మేలుకోటలోని దేవుని కథను ఇందులో చెప్పాడు. పదకొండోయేట కృష్ణశతానందీయం వ్రాశాడు (౧.473. పన్నెండోయేట “కృష్ణవిలాసం' రచించాడు (7.743. పేరుకు కృష్ణవిలాసమే అయినా నరసింహావతారగాథ, రామావతాక వర్జన కూడా ఉన్నాయి. చిలువపడిగరేని కథ అచ్చతెనుగుకావ్యం (౫.662). ఇందులో దుర్యోధనుడి పెళ్లికథను కవి చెప్పాడు. ఈ రచనలన్నీ అచ్చుపడితే బాగుండును.

మరింగంటివారింటోనే సింగరాచార్యులనే ఆయన కూడా కవిత్వం చెప్పాడు. ఈయన ప్రతివాదభయంకర నరసింహాచార్యులవారి శిష్యుడు. అర్చిరాదిప్రబంధమనే ద్విపదకావ్యం వ్రాశాడు. దీని ప్రతి వరంగల్లు పరిశోధక మండలిలో ఉందట.

మరింగంటివారింట కవులు కావ్యాలు వ్రాసినా ఈ సీమలోని పండితులు ఎక్కువగా ఆధ్యాత్మిక గగ్రంథాలవైపు మొగ్గినట్టు కనబడుతుంది. భారతీయ తత్వానికీ 9. నవాబుల యుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటి. లలన. 10. విజ్ఞానసర్వస్వం (భాషా సమితి), 6వ సంపుటం, విశ్చసాహితి పుట. 755. 11. గోలుకొండ కవుల సంచిక, పుట 416.

మెదకు సుబాకవులు 825 భగవద్గీతీ పరమప్రామాణిక గ్రంథం. దానిని చక్కగా తెనిగించడానికి నవాబుల యుగంనుంచీ ప్రయత్నాలు జరిగాయి. పద్యరూపంలో అనువాదాలు వచ్చాయి. ఈయుగంలో కొందరు భగవద్గీతను తెనిగించారు. కర్పూరం కృష్ణమాచార్యులు ;: భగవద్గీతను కొందరు “కవులు పద్యాలలో అనువదించితే మరికొందరు ద్విపదలుగా తెనిగించారు. వాళ్లలో కర్బూరం కృష్ణమా చార్యులు ఒకరు. ఈయన నల్లగొండ జిల్లాలోని చల్లపల్లి నివాసి. తన ద్విపద భగవద్గీతను ఈయన చల్లపల్లి కేశవస్వామికి అంకితం చేశారు. ఈ ద్వాపదకావ్యపు ప్రతి ఒకటి నిజాము కాలేజీలో ఉందని శేషాద్రిరమణ కవులు వ్రాశారు. , . శాండ్రవీటి రామానుజాచార్యులు : కేవలం సంస్కృతం నుంచే కాకుండా బ్రవిడ భాషల నుంచి కూడా మన పూర్వులు పవిత్ర గ్రంథాలను అనువదిస్తూ వచ్చారు. తరువాయి మొళి(భ్ర) వైష్ణవుల వేదం. దీనిని తమిళ భాషలోని దివ్యసూరులు కొందరు గానం చేశారు. ఆ భాషరాని తెలుగువారికోసం దానిని రామానుజాచార్యులు ద్విపదగా తెనిగించాడు. ఎందుకు, ఎలాగ అనువదిస్తున్నదీ ఇలాగ చెప్పాడు: సర్వవర్టమునకు సతులకు కర్ణ-పర్వమై చెలువొంద పాడిన యిట్టి తిరువాయి మొళియను దివ్యకావ్యంబు - సరసమై శబ్బార్థసంగమలు యిచ్చు సరసులు గొనియాడ సత్కవుల్‌ పొగడ-స్థిరమతితోడ నే ద్విపదగావింతు. " (అవతారిక) తన కావ్యం సరసులూ, సత్కవులూ కొనియాడాలని ప్రతికవీ కోరుకొంటాడు గాని ఈ కాండ్రవీటి కవి చేసిన అనువాదాన్ని పండితులకన్న స్త్రీ బాల పామరజనులే చదివి అనందించగలరని కొందరు ఆధునికులు అంచనా వేస్తున్నారు. 'మూలము చదివినవార లకు మాత్రము మీ తెలుగు చప్పుగాను, రుచిలేక యుండునుగాని కేవలము భగవత్‌ ధ్యానామృతములు సేవింపగోరు ప్రపన్నులకు ద్రవిడభాషా పరిచయము లేనివారలకు ఇది సరససముగా నుండక మానదని తోచుచున్నది అని కూడా భావిస్తున్నారు.*ే సరసమై శబ్బార్థసంగతులొప్పే తన కవితను రామానుజాచార్యులు సీతారాములకు అంకితం ఇచ్చాడు. కూళలకు అంకితం ఇవ్వకూడదని అతని మతం. “వమ్మిన్‌ పులవీర్‌ అనే మూలంలోని పాటను ఈయన ఇలా అనువదించాడు: పారిజాతములు దర్భల గట్టినట్లు- మారులేకున్న నీ మధురవాక్యములు ఏపుమై కూళల కిచ్చుటకన్న- గోపాళ మెత్తుక కుడుచుట మేలు పరిపరివిధముల పాడితిరేని దీపింపదే వారి దేవుడైనట్టి. ' పరిపరివిధాల శ్రీపతి గురించి పాడిన పాటలను అనువదించిన కాండ్రవీటి కవికీ సంగారకవిరాయలనే బిరుదు వుంది._ఈ మతగ్రంధాస్సి అనువదించడానికి ముందు 12. నవాబుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి 13. గోలుకొండ కవుల సంచిక, పుట 37. 1ఓ తిరువాయిమొళి ప్రచురించిన మానవల్లివారే ఇలా చెప్పారు.

826 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇతడేవో శృంగార గ్రంథాలు రచించి ఉంటాడని ఈ బిరుదువల్ల తెలుస్తూంది. కాని ఈ గ్రంథాల పేర్లయినా నేడు దొరకవు. అయినా ఈ తిరువాయి మొళిలోనే అతడు చక్కని దివ్యశ్చంగారాన్ని బాగా అనువదించాడు. మూలంలో పంచమదశకంలోనే ఉన్న “వ్రాముళకప్పటుత్తి' అనే పాటను ఇలా అనువదించాడు:

ప్రియసఖి వింటివే ప్రియుడు నన్నిపుడు-దయ దాసిగాచేసి తనలోనుపరచి

క్షీరవారిధిలోన శేషునిమీద- నీరధిపుత్రితో నిద్రింపదొణగె

భావజజినకుని పజ్జను నేను-సివింపబోయిన సీమపై వారు

మెంతకాతురపడుచనుచు- రంతులు సేతురు రాయిడిగాక. (5-7) ఇలాంటీ కవిత్వం తీయని పానకంలాగా ఉంటుంది. అయితే పానకంలో పుడకల్లాగ దానిలో ““శబ్దకాస్తదోషములు పెక్కులు గలవు. కొన్నియెడల నీ కవిరాయనికి సింహబ్రహ్మాదిశబ్బస్వరూపములు కూడా తెలియవని కొందరి ఆక్షేపణ.15 అయితే కాండ్రవీటి కవి అక్కడక్కడ ప్రాసస్థానంలో మంచి విలక్షణ ప్రయోగాలు చేశాడు. స్వర్గము అనే పదానికి సౌగ్గము అనే వికృతి వాడాడు.

సొగ్గంబు నరకంబు సుఖము దుఃఖంబు నగ్గలంబగు బుణ్య మగునుపాపంబు. అయితే ఇతని కవిత్వం శబ్బార్థసంగతులకుకాక ఇతర కారణాల కోసం చదవాలి. ఈ టగంథానికి రెండు తాటాకు ప్రతులు మానవల్లి రామకృష్ణకవిగారికీ లఖించాయి. రెండూ చాలా ప్రాచీనమైనవి. 300 సంవత్సరాలకు తక్కువ కానివి. అక్కడక్కడ శిథిలాలు ఉన్నాయి. లోపాలున్నాయి. లోపించిన పాటలను రామకృష్ణకవిగారు మూలానుసారంగా అనువదించి ప్రచురించారు. (5వ దశకంలోని 7, 8, వూడులోని 9 పాటలు). రామకృష్ణ కపేగారు తాము ప్రచురించిన తిరువాయిమొళి(() కాండ్రవీటి రామానుజాచార్యులదే అని స్పష్టంగా ప్రకటించినా అతని రచన వేరే గ్రంథంగా ఒకటి ఉందని శేషాద్రి రమణకవుల భావన.” ఈ రెండింటిని సరిపోల్పాలి.

ఈ రామానుజాచార్యుల నివాసం కాండ్రవీడు గ్రామమే అని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ఊరు ఏ జిల్లాలోనిదో నాకు తెలియదు. అంతదాకా మెదకు సుబాలో జమకట్టుకొన్నాను. భావిపరిశోధనవల్ల నికరంగా నిర్ణయించవచ్చు.

అత్తాను రామానుజాచార్యులు: ఈ సుబాలోనే మహబూబ్‌నగరు జిల్లాలోని పాండ్రాజువారి వంశంలోనివాడు. మదనగోపాల భక్తుడు. ఈయన రుక్కిణీకల్యాణాన్ని తురవంజి రూపంలో రచించాడు. ఇందులో చక్కగా ధవళాలు, సువ్వాలలు, మంగో వారతులు మొదలైన దేశిరచనలు ఉన్నాయని పరిశోధకులు ఖావిస్తున్నారు.3% కొట్నాలు ఇ గొలుకొంతకవులనంచిక పుటట 18. గోలుకొండకవుల సంచిక, పుట 407 17. గోలుకొండకవుల సంచిక, పుట 40).

  1. మరుగుపడిన మాణీక్కాలు, డాక్టర్‌ వి. రామరాజు - పుటలు 6-౫.

మెదతు సుబాకవులు 827

దంచేటప్పుడు జిలుగువన్నై చంద్రకావిచీర లిచ్చారట. 'కుసుముపూల ఛాయరంగు

తుందనపుపూత మెరయ పసుపుపట్టు రవికెకెల్ల' పంచి యిచ్చాడట. ఆ ముత్తయిదువులు వన్నై సన్ననూదిపచ్చ గన్నై రాలుకృష్ణభోగి

సన్నరాజనాలు జీలసర్లు దంపుచూ

ఉబ్పినిక్కిజంగజాచి ఉవిదలెల్ల చెమటజార

గవ్బిగుబ్బ లదరగాను కలయ దంచిడీ

ఇలాంటి చక్కని దేశిరచన అముద్రితంగానే ఉండిపోయింది. ఈ రుక్మిణీ కురవంజొ ప్రతి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారి కార్యాలయంలో ఉంది.

ముదిగొండ బ్రహ్మయలింగం : మధుర కవితలతోబాటు ఈ సీమలో వచన రచనలు తూడా బయలుదేరాయి. ముదిగొండ (బ్రహ్మయలింగం ఈ సీమలోనివాడు. శివరహస్య ఖండాన్ని వచనంలో వ్రాశాడు; అయితే తత్స ప్రకాశిని అనే పేరు పెట్తాడు. ఈ వచనకాచ్యం ముద్రితం. ఇది ఫ్రొడ్డైలిగల వచనకావ్యుమని శేషాద్రిరమణకవులు చెప్పారు.1? ఇతడు 1852 ప్రాంతాలవాడని నిడుదవోలు వెంకటరావుగారు భావిస్తున్నారు.** క్రీ.శ 1700లో ఉన్నాడని శేషా ద్రికరమణకవులు ఊహించారు."

ఈ సుబాలోని కవులగురించి ఇంకా విపులమైన పరిశోధన జరిగాలి.

సురవురం సంస్థానం పూర్వం నిజాంగాజ్యం నాలుగు సుబాలుగా ఉండేది. వాటిలో వరంగల్లు, మెదకు సుబాకవుల గురించి తెలిసినంత చెప్పుకున్నాం. జొరంగాబాదు సుబా గురించి ఏమీ తెలియదు. దాని గురించి చెప్పుకోనక్కరలేదేమో! ఇకపోతీ గుల్చర్గ సుబా మిగిలింది. ఇందులో నాలుగు జీల్లాలున్నా తెలుగువాళ్ళు నివసించిన భాగాలుగాని, తెలుగు భాష రాజించిన రాజ్యాలుగాని ఒక్క రాయచూరు జిల్లాలోనే ఉండేవి. అనాడు ఈ సీమలో రండు ముఖ్యమైన సంస్థానాలు వర్ధిల్లాయి.

  1. సురపురం: ఇది రాయచూరు జిల్లా లింగనూగూరులో ఉండేది. .ఆదిలో దీని ముఖ్యపట్టణం వాగినగిరి. దానిని ఇప్పుడు వాకిన్‌ఖేడ్‌ అంటారు. ఈ రాజ్యం ఇప్పుడు మైసూరులో కలిసిపోయింది. దీనిని గురుగుంట సంస్థానం అని తూడా పిలిచేవారు.

  2. గద్వాల: పూర్వం రాయచూరు జిల్లాలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక దీనిని మహబూబ్‌నగరుజిల్లాలో కలిపారు. అయితే దీని ప్రాచీన చరిత్రకు కర్నూలు సుబాతో చాలా సంబంధం ఉంది కాబట్టి ఈ సంస్థానం గురించి ఆ సుబాలో చెప్పుకొందాం.

ఈ సంస్థానాల చరిత్రలు సమగ్రంగా దొరుకుతున్నాయి... “సురపురం రాజవంశావశి అనే గ్రంథాన్ని మెకంజీ గుమాస్తాలు సేకరించారు. ప్రాచ్యలిఖిత 18. గోలుకొండ కవుల సంచిక, పుట 404.

౫. అంధ్ర వచన వాబ్మ్యయము, పుట ౪. 21. గోలుకొండ కవుల సంచిక, పుట 40౫.

828 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటి గ్రంథాలయంలో దీనికి మూడు ప్రతులు ఉన్నాయి.! పూర్వం కంచి, కాళహస్తి ప్రాంతాల నుంచి కృష్ణాఖీమనదుల మధ్యనున్న అంతర్వేదికి కొందరు బోయవీరులు వెళ్లి స్థిరపడ్డారు. మన బోయల్ని కన్నడంలో బేడర్లు అంటారు. ఈ బేడర్లు అక్కడ స్థానికంగా చాలా దెబ్బలాటలు పెట్టుకున్నారు. బహిరీ బసవంతరావు అనే ఆయన విజాపురానికి అణకువగా ముదగల్లు గ్రామానికి దేశాయిగా ఉండేవాడు. అతణ్జీ హన్మినాయకుడు అనే బేడరు జయించాడు. అతని బహిరీ బిరుదును లాక్కొన్నాడు. అప్పట్నుంచీ ఈ వంశస్థులు ఈ విరుదును ధరించారు ( 02655 పుటలు 11). వాగినగిరి రాజధానిగా నాడగౌడికం చేశారు.

ఈ వంశంలోని పదిహిడవ తరంలో పెద్దపెడ్నాయక పీతాంబరబహిరి అనే నాయకుడు క్రీ.శ 1713లో సురపురం నిర్మించాడు. నాటినుండి ఈ సంస్థానానికి ఆ పేరు స్థిరపడింది. ఈయన తండ్రి పేరు పెద్దపామనాయకుడు. అతడు జౌరంగటేబుపై తాత్కాలికమైన ఘనవిజయాన్ని సాధించాడు. “స్పసమర్థతాకృతపట హధణంధణా రావవిపరీత పతనక్రియా ఢిల్లీ కాధీశమందుఖిధ్వాన కోలాహల' మొదలైన బిరుదులు ధరించాడు. వీటిని ఇతని సంతతివాళ్లు వంశపారంపర్యంగా ధరిస్తూ వచ్చారు.

ఈ వెదపామనాయకుని మునిమనవడి పేరు కూడా పామనాయకుడే. ఈతణ్జి రాజా బహిరీసామినాయక భూపాలుడని పిలుసారు. ఈయనకు రాఘవ నాయకుడనే మరో పేరు తూడా ఉంది. ఈయన రాజగోపాల భక్తుడు. పండితుడు, మంచి కవి, చక్కని అభిరుచులు కలవాడు. విష్ణుపురాణాన్ని రసికులెన్నగా ఎవరిచేతో రచింపజేసి దేవునికి అంకితం ఇప్పించాడు. ఆ తరువాత తానే స్వయంగా భార్గవపురాణాన్ని తెనిగించాడు. ఇదీ వైష్ణవగ్రంథం. పన్నిద్ద రాళ్వారుల చరిత్రను ఎనిమిది ఆశ్వాసాలతో రచించాడు.

పరమయోగివిలాసమనే పేరిట ఈ కథలను ఇంతకుముందు మొదట తెలుగులో తాళ్లపాక చిన్నన్న బ్రాళాడు.* తరువాత సిద్ధిరాజు తిమ్మరాజు చెప్పాడు.3 వీళ్లలో చిన్నన్నదీ ద్విపద కావ్యం; తిమ్మరాజుది పద్యకావ్యం. పామనాయకునిది కూడా పద్యకావ్యమే.

మొదటి ఇద్దరి కావ్యాలూ అచ్చుపడ్డాయి. పామనాయకుని కావ్యం మరుగునపడిన

మాణిక్యం అయింది. దీని ప్రతి ఒకటి ఆంధ్రసాహిత్య అకాడమీ వారి కార్యాలయంలో ఉంది* ఈ రాజకవి గురించి, ఇతని కావ్యం గురించీ మిత్రులు బిరుదురాజు రామరాజుగారు ఒక వ్యాసంలో విపులంగా వ్రాశారు.

పామనాయకుడు సద్వ్వైష్టవుడు. విశిష్టమతప్రచారకుడు. ప్రఖ్యాత వైష్టవమక గురువులను సేవించుకొని పోషించినవాడు. తెలంగాణాలోనేకాక యావద్భారతంలో సుప్రసిద్ధులయిన తిరుమల బుక్కపట్ట్నంవారి వంశంలోని నాలుగు తరాల పండితులు,

  1. మెకంజిసంపుటాలు!(4,1దో ఇందులో రెండోది మొదటి దాన్‌ పుత్రిక 0266. దానిలో ప్రతితరు

రాజుగురించీ పద్యాలు ఉన్నాయి. అవి సంపత్కుమారీయం అనే అనంతర గ్రంథంలోనివి. 2. _ఆరవీటిరాజుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి 3. మలిరాయలయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి 4. మరుగు పడిన మాణిక్యాలు, డాక్టరు బి. రామరాజు, పుటణ 5. అదే పుస్తకంలో. వారే. పుటలు ఐ-౫

సురపురం సంస్థానం 829 దేశికులు ఈ సురపురం సంస్థానంలో ఉన్నవారే. తిరుమల బుక్కపట్నంవారు మొదట ధర్మపురిలో ఉండేవారు. అయితే కోసలవంశీయులకు రాజగురువులై సురపురానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. ధర్మపురిలో తిరుమల బుక్కపట్నం శ్రీనివాస తాతాచార్యుల వారు అఖండ విద్వాంసులుగా పేరు పొందారు. 'రసోదారభాణం' అనే కృతి నిర్మించారు. వీరికి అజ్జయ్య దీక్షితులు, శ్రీనివాసాచార్యులు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఈ ఇద్దరూ సురపురంవారికి గురువులయ్యారు.

అజ్జయ్య దీక్షితులవారు ఎన్నో యజ్ఞాలు చేశారు. గీతార్థసంగ్రహానికి వ్యాఖ్యను బ్రాశారు. 'విరోధివరూధినీప్రమాధినీ అనే రచన చేశారు. వీరి తమ్ముడు శ్రీనివాసాచార్యులవారు వేదవేదాంగాలు కరతలామలకం చేసుకున్నారు. తత్త్వమార్తాండ మనే గ్రంథాన్ని వ్రాశారు. ఇందులో 24,000 శోకాలున్నాయి. వీరి సంస్కృత రచనలు చాలా ఉన్నాయి. తెలుగులో ఈ అన్నదమ్ములు ఏ రచనలు చేశారో తెలియదుగాని అజ్జయ్య దీక్షీతులవారి కొడుకులిద్దరూ తెలుగు కవులే. ఆ

అణ్జయ్యగారి పెద్దకొడుకు పేరు వెంకటాచార్యులు. ఈయన ఉద్దండ పండీతుడు. పెదతండ్రీగారి దగ్గిర చదువుకొన్నారు. సకల పాండిత్య తర్కాలంకారవాగీశ్చర విరుదు పొందారు. అంతేకాదు. వెంకటాచార్యులుగారు సర్వతంత్ర స్వతంత్రులు. సకలభాషా హోషధురంధరులు. ప్రతిదినప్రబంధపరమేశ్వరులు. శ్లేషేయమకచకక్రవర్తి. మహావిద్వాంసుల తోనేగాకు మఠాధిపతులను ఢీకొని వాదాలు పెట్టుకొన్నారు. అహోబలపీఠాధిపతిని జయించారు. కాశీలో శాస్త్రవాదం చేసి విద్వాంసులను ఓడించారు. విజయసూచకంగా కిరీటాన్ని ధరించాడు. అందుకే ఈయనను కిరీటి వెంకటాచార్యులు అంటారు. ఈయన కిరీటానికి విశిష్టాద్వైతమనే పేరు పెట్టుకొన్నారు. రాచమర్యాదలతో జోడు వింజామరలు విసిరించుకొనేవారు. ఆ చామరాలకు తూడా పేర్లు పెట్టుకొన్నారు. ఒకదాన్ని స్పమతస్థాపనం అనీ, రెండోదాన్ని పరమతఖండనం అనీ పిలిచేవారు. వెంకటాచార్యులు గారు అంతటితో ఆగలేదు. తాము తొడుక్కునే పావుతోళ్లకు తూడా రెండు పేర్లు పెట్టారు. ఒకటి ద్వైతం; రెండోది అద్వైతం.

దేశదేశాలూ తిరిగి పరమతఖండనం చేసిన కిరీటి వెంకటాచార్యులుగారు ప్రొఢ నిర్చ్భరవయఃపరిపాకం పండకముందే ౩2వ ఏట మరణించాడు. ఆ చిన్ని వయసులో ఇన్ని విజయాలు పొంది ఎన్నో గ్రంథాలు రచించారు. అవి ఇవిః

  1. అచలాత్మజాపరిణయం, 2. అలంకారకౌస్తుభం, 3. ఉషాపరిణయ నాటకం,
  2. గజసూత్రవాదం, 5. గదాధరీయఖండనం (రుంరూ మారుతం), 6. దశావతార స్తోత్రం, 7. భావశతకం, 8. యతిరాజ దండకం, 9. రసికమానసోల్లాసభాణం,
  3. శకాఖిపతనం, 11. శృంగార తరంగిణీ, 12. శృంగారలహరి, 13. హయ గ్రీవదండకం.

వీటిలో అచలాత్మకజాపరిణయం, గజసూత్రవాదం, ఖభావళతకం, శృంగారలహరులు మాత్రమే అచ్చుపడ్డాయి. కిరీటి వెంకటాచార్యులుగారు వైష్ణవులేకాని శైవకథను జోడించి రెండర్ధాల కావ్యం వ్రాశారు. అచలం అంటే భూమి అనీ, కొండ అనీ రెండర్ధాలున్నాయి.

830 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అచలాత్మజ అంటే ఒక అర్ధంలో సీత, రెండో అర్ధంలో పార్వతి అవుతుండి నైమిశారణ్యంలో ఒకనాడు సూతుణ్జీ చూసి శౌనకముని అచలాత్మజాపరిణయం చెప్పమన్నాడు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడటః

సంతస మొంద కొంత మది సంధిల సూతసుతుండు బల్కె నో

శాంతిని శాంతసద్వచనచాతురిచే నచలాత్మజూ మహే

దంతము దెల్పుమంటి వది నంలిక బెండ్లియొ సీత పెండ్లియో

వింతగ రెండునొక్క పరి వెల్వడ జెప్పెదనంచు హృష్టుడై (అచలా 1-14)

సూతుడు “వింతగ రెండు నొక్కపరి చెప్పిన ఈ కావ్యం ఆది ద్వ్యర్థి కవులను మించకపోయినా చాలా ప్రొఢంగా, రసవంతంగా ఉంది. రెండు కథలకు సమానమైన వర్ణనలు చాలా ఉన్నాయి. సీత యౌవనాన్ని పార్వతి సొందర్యాన్ని వర్ణిస్తూ రెండో ఆశ్వాసంలో 29 పద్యాలు (2-35 నుండి 63 దాకా) పూర్వప్రబంధధోరణిలో ఉన్నాయి. ఆ తరువాత వనవిహారం కూడా రెండు కథలకూ సమానమే. ఇందులో ౩9 గద్యపద్యాలు (2-64 నుండి 2-102 దాకా) ఉన్నాయి. ప్రథమాశ్వాసంలోని శరత్కాల వర్ణన కూడా రెండు కథలకూ సమానమే.

కిరీటి వెంళటాచార్యులగారి పద్యాలలో తత్సమపదాలు ఎక్కువగా ఉన్నా భావంలో దేశ్యం నిండుగా ఉంటుంది. ప్రభాతసేవలలో ఇచ్చే హారతి, బురదనీరును తేటపరిచే చిల్లగింజ, ఏకులు వడికే రాట్నం మొదలైన ఉపమాన వస్తువులతో శరత్కాలాన్ని వర్ణించారు. నాయిక అంగాంగ వర్ణనలో క్రాస్‌వర్డు పజిల్‌లాంటి కవిత్వం గుమ్మరించారు. పాత కవి సమయాలను కొత్త చమక్కారాలతో శోఖింపజేశారు. నోటిపళ్లను మొగ్గలతో, మేనికాంతిని మొగిలి పువ్వుతో, తొడలను అరటిబోదెలతో నూగారును నాచుతో, కురులను తుమ్మెదలతో పోల్చటం పరిపాటే. అచలాత్మః పలుకుదురును ఎదిరించి రాలేక కోరకాలు చివరకు పాలిండ్లు అయ్యాయట. ఇలాగ ఏవేవి ఓడిపోయి ఏ అవయవాలు అయ్యాయో ఇలా చెప్పారు:

రదపాళి కెదురించి రాలేక పాలిండ్ల గౌరవంబు వహించె గోరకములు

తనుకాంతి కాసించి తా నిల్వలేమికి కేతకి నెరికొప్పు రీతి గాంచె

నెరతొడలను బోలి దరహితస్థితి గాంచి కదళికల్‌ నఖరసంపదలబొదలె

మెరుగారుగణియించి మిగులవాదిగ నిల్చి శ్రైవాలము పిరుందు ఛాయనెననె

మధుకరమ్ములు కుంతల ప్రథిమ నెంచి

క్రమముగా నద్వితీయవర్ణముగ నిల్చి

జంఘలకు క్రీిందు పడెనౌర జలజనేత్ర

గాత్రముల దీటులచరిత్రచి త్రమయ్యె. (అచల. 7-4)

ఈ పద్యంలో చాలా గమ్మత్తులున్నాయి. కోరకాలు, అంటే మొగ్గలు, నోటిహ్లాను ఎదిరిరాలేకపోయాయి. అన్నాడు కవి. బాగానే ఉంది. అవి పాలిండ్ల గౌరవాన్ని వహించాయి అనడం ఏం సబబు? కావ్యనాయికల వక్షోజాలు గబ్బిగుబ్బలు అనాలి గొని

మరపురం సంస్థానం , 831 మొగ్గలలాగ చిన్నవి అంటే ఎంతమాట. వాటిని చక్రవాకాలతో పోల్చి నాయికను కోకస్తని అని కవులు పిలుస్తారు. కిరీటి వెంకటాచార్యులు తూడా అలాగే పిల్చారుగాని గుంభనంగా చెప్పారు. కోరకాలు రదపాళికి ఎదురించిరాలేక పాలిండ్ల గౌరవాన్ని వహించాయి అన్నారు. “రాలేక అంటే రా అనే అక్షరం లేక అని చమత్కారం. కోరకాలలో “రాలేకపోతే కోకాలు అవుతాయి. అంటే చశ్రవాకాలన్నమాట. ఇలాగే మిగతా పద్యపాదాలలోనూ గడుసుదనాలు ఉన్నాయి. 'కా' నిల్వలేని కేతకీ (మొగలి) కేకి (నెమలి) అవుతుంది. “ద రహితమైన కదళిక (అరటి) కళిక (మొగ్గ) అవుతుంది. “వా'దిగనిల్పిన శైవాలం (నాచు) శైలం (కొండ) అవుతుంది. అద్వితీయవర్ణమైన మధుకరం మకరమవుతుంది. ఒకమాటలో ఏ అక్షరాలు లోపింపజేసి, ఏ అక్షరాలు మిగుల్చుకొని అనందించాలో పద్యంలో కవే చెప్తాడు. ఈ విద్యకు రామరాజభూషణుడు ఒరవడీ పెట్టాడు. కిరీటి వెంకటాచార్యులవారిందులో అఆరితేరారు.

ఇలాంటి చమత్కారాలు అందరూ ఒకటో అరో చూపగలరుగాని రెండర్థాల కావ్యంలో కవి తెలివితేటలను పరీక్షించే ఘట్టాలు ఇవి కావు. సీత జనకునికి భూమిలో దొరికింది. పార్వతి మేనక కడుపున పుట్టింది. ఈ రెండు కథలను కిరీటి వెంకటాచార్యులవారు ఒకే పద్యంలో చక్కగానే జోడించారు. ఈ ఇద్దరు అచలాత్మజలను ప్రసిద్ధమైన సీత, అంవిక అనే నామకరణాలు చేసే ఘట్టంలో ఇలా బ్రాశారు:

అతులనతసీతసుమనః - ప్రతినిధి యని గుడలు వేరుపడ నలసవన

క్షితిలోనంబికనాద-హితముగ నొక పేర బలికి రింతులు చాలన్‌ (అచలా. 2-3)

ఈ పద్యాన్ని పార్వతిపరంగా అర్థం చెప్పుకొనేటప్పుడు అతులన్‌+ అతసీ+ ఇత+సుమః ప్రతినిధి అలస+వనక్షితిలో+ అంవికనాన్‌ అని విరుచుకోవాలి. తోటలో పార్వతిని చూసిన పేరంటాళ్లు ఆమె అసమానమైన అగిసి పువ్వులాంటిదని అంబిక అని పేరు పెట్టారట. ఈ పద్యాన్ని సీతపరంగా అర్థం చెప్పుకొనేటప్పుడు అతులనతన్‌+సీత+ సుమనః ప్రతినిధి; అల+నవనక్షితి లోనన్‌+పికనాదమహితముగా అని విరుచుకోవాలి. రెండర్ధాల కావ్యం కనుక పార్వతి కథలో అతసీవృక్షం పూయవలసి వచ్చింది. కవిగారు పూయమంటే ఏ చెట్టయినా పూయక తప్పదు.

కిరీటి వెంకటాచార్యులవారి సాహిత్యలతమీద పూచిన ఇతర కుసుమాల సౌరభాలు వ్యాపించలేదు. ఈ అచలాత్మకజాపరిణయం తూడా ఆకుచాటు పిందెలాగే ఉంది, యావద్భారతఖ్యాతి పొంది కిరీటి వెంకటూచార్యులవారి రచనలే ప్రచారం పొందలేదంటేీ వారి తమ్ముని గ్రంథాలు మరుగునపడ్డంలో వింతలేదు. కిరీటి వెంకటాచార్యులవారి తమ్ముని పేరు తూడా వెంకటాచార్యులే. అందుకే ఆయనను బుచ్చివెంకటాచార్యులంటారు. ఈయన చతుళ్శాస్త్రపారీణుడు. వేదాంతకారికావళి. అభినవశ్చంగారరసమంజరి అనే భాణం, కల్యాణపురంజరం, శృంగారసర్వస్వం అనే రచనలు చేశారు. గద్వాల సంస్థానంలో ఉండేవారు. అన్నగారు 22 సంవత్సరాలే బ్రతికినా ఈయన 75 సంచత్సరాలు జీవించారు. .

832 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి భార్గవపురాణాన్ని వ్రాసిన సురపురం అధిపతి పామనాయకుడు క్రీ.శ. 1695 దాకా జీవించాడు. ఆయన గ్రంథం వ్రాతప్రతిగానైనా ఊపిరి పీలుస్తూంది. అయితే ఈ సంస్థానంలో వర్ధిల్లిన ఇతర కవుల రచనలు మాత్రం అసలు జీవిస్తున్నట్టే కనబడవు. గద్వాల సంస్థానం, కర్నూలు నుబా క్రీశ. 1650 ప్రాంతాలలో ముష్టిపల్లి చీరారెడ్డి అనే సమర్థుడు అయిజ, దరూరు మొదలైన మహళ్లకు నాడగౌడుగా ఉంటూ ఉండేవాడు. ఇవి కృష్ణా తుంగభద్రల మధ్యనున్న అంతర్వేదిలో ఉన్నాయి. వీరారెడ్డికి మగ సంతానం లేదు. పైగా ఒక్కత్తీ కూతురు. అంచేత అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత పెద్దారెడ్డి నాడగౌడు అయ్యాడు. ఇతని హయాంలో మరికొన్ని పరగణాలు దఖలుపడ్డాయి. పెద్దారెడ్డికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు ఆనందగిరి; రెండో కొడుకు సోమన్న అనే సోమగిరి. ఇతడే సోమనాద్రి. పెదసోమ భూపాలుడు అని ప్రసిద్ధుడయ్యాడు. పెద్దారెడ్డీ తరువాత రెండోకొడుకు సోమన్న, క్రీ.శ. 1704 నుండి నాడగౌడీకం చేశాడు. కృష్ణానది దక్షిణతీరాన గద్వాల కోటను నిర్మించాడు. తుంగభద్రకు చాలా దక్షిణంగా రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతని అధికారం చెల్లీ. పరగణాలను ఓక అనంతరకవి ఇలా పేర్కొన్నాడు.

ఐజదరూరుల కధిపుడై విలసిల్లి బన్న్లానిపల్లె దోర్చలత చెంది

శిరువళ్ళ నందేల సిద్ధాపురం బులుభండాత్మకూ రహోబలపు సీమ

సాధించి తురకల సంహార మొనరించి కందనూల్‌ ముట్టడిగా నమర్చి

దుర్గంబు సాధించి తొలగంగ నాదవేన్‌ పుర మాత్మవశత బెంపాందబేసి

విక్రమంబున సకలభూచత్ర మెల్ల

నాక్రమించి దిగంతంబులందు కీర్తి

నించి గాద్వలపుతీ మధిష్టించి వెలసె

నృపతి మాత్రుండె.సోమావనీ విభుండు.

ఈ పద్యం వల్ల గద్వాల సోమన్న పాలించిన ఊళ్ల పేర్లన్నీ తెలుస్తున్నాయి. అయిక దరూరు, బనగానిపల్లె, శిరువెళ్లు నంద్యాల, సిద్ధాపురం, ఆత్మకూరు. అహోబల సీమ. కర్నూలు, అదవాని దుర్గాలేకాక వాటికింద చెల్లే గ్రామాలు కూడా ఈయనకు స్వాధీను అయాయని చెప్పవచ్చు. మొగలాయి సేనలకు సహితం వెరవని మరాకీబలాలు ఇక చూసి భయపడతాయట. సోమనాద్రి మొగలు చక్రవర్తితో చాలా సన్నిహితంగొ ఉండేవాడు. ఢిల్లీకి, గద్వాలతు మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి. సోమళ్ళే తనకు సహాయం చేస్తి కర్నాట రాజ్యమంతా అతనికి ఇస్తానని ఢిల్లీ చక్రవర్తి ఒక ఉత్తరంలో

  1. యథాళోకతాత్పర్యరామాయణం ( అవతారిక), 1-%

గద్వాల సంస్థానం, కర్నూలు సుబా 833 వాగ్దానం చేశాడు.* అప్పటికి దక్కను సుబేదారుగా ఉన్న మొదటి నిజాము తన స్వాతంత్రాన్ని ప్రకటించుకోలేదు. అసలు దక్కను సుబేదారుగా మొదటి నిజాముకు బిరుదు యిచ్చి నియమించనేలేదు.

సోమన్న కీర్తి ఢిల్లీదాకా ప్రాకగా లేనిది ఆంధ్రదేశంలో విస్తరించదా? అతని దర్శనం చేసుకొని సత్కారాలు పొందాలని కొందరు కవులు గద్వాల వెళ్లారు. వారిలో కొటికలపూడి వీరరాఘవయ్య ఒకడు. ఈయనకు నూతన తిక్కనసోమయాజి అనే వీరుదును సోమన్న ఇచ్చాడు. దానికి కారణం ఉంది.

కొటికెలపూడి వీరరాఘనయ్య: కొటికెలపూడివారిది వినుకొండ. వీరిది పండిత కుటుంబం. వీరరాఘవయ్య ముత్తాతపేరు సూరకవి. రాయలవారి నభలో సత్కారాలు పొందాడు. ఈ సూరకవిగారి కొడుకు శ్రీరంగకాయి మల్కిభరాముని సభలో వాదించి జయశ్రీలను పొందాడు. ఈ సూరకవిగారి కొడుకు రంగయ్య. ఈయన అచ్చంగా తండ్రిగారికి ప్రతిబింబం. ఇతడు కవిత్వం చెప్పి ప్రొడి చెందాడు. ఈ కవుల కుటుంబంలో పుట్టిన వీరరాఘవయ్య గద్వాల సోమన్న ప్రభావం విని వినుకొండనుంచి ఆ సంస్థానానికి వెళ్లాడు.

రాజదర్శనం చేసుకొన్న వీరరాఘవయ్య కొన్ని గ్రంథాలు రచించి సోమన్నకు వినిపించాడు. “ఆ నృపాగ్రణి నా కవిత్వనైపుణికి మెచ్చి, 'నీ కవిత్వంబు తిక్కన సోమయాజుల కవిత్వంబునకు దీటగు; శ్రీ కేశవస్వామి యనుమతి నీకు నూతన తిక్కన సోమయాజులనియెడు పేరొసంగెద' అన్నా''డని వీరరాఘవయ్య చెప్పుకొన్నాడు. తన ఇష్టదైవమైన వూడూరు కేశవస్వామి పర్మిషన్‌ తీసుకొని సోమన్న ఈ బిరుదు ఇవ్వడమే కాక మరొక నిబంధన పెట్టాడు. తిక్కనగారు భారతాన్ని సంగ్రహించి రచించారు. భీష్మపర్వంలో, మరీ కొన్ని మూలశోకాలను విడిచిపెట్టేశారు. అవన్నీ పూరింపజేయమని ఆ దేవుడు సోమన్నకు చెప్పాడట. అందుచేత వీరరాఘవయ్యకు ఈ పని చేయమని, సోమన్న పురమాయించాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించలేక వీరరాఘవయ్య తనకి తోచినట్లు కొంత పూర్వరచిత శేషగ్రంథంబు తెనిగించి పూర్వోత్తర గ్రంథంబుల నడుమనడుమ సందర్భ్చించి అందులోనే పూరించాడు. అంటే కవిత్రయ భారతంలో ప్రక్షిప్తాలను ప్రవేశపెట్టాడు.

ఈ సాహిత్యమరామత్తు కార్యక్రమాన్ని పూర్తిచేశాక గద్వాల సోమనాద్రి వీరరాఘవయ్యను అభినందించి, గద్వాలలోనే ఉండిపామ్మన్నాడు. “మావూరు వెళ్లి వచ్చేస్తానని వీరరాఘవయ్య వినుకొండ వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోతే సోమనాద్రి కబురుపెట్టి పిలిపించాడు. మొదట ఉద్యోగపర్వాన్ని ఎత్తుకొని భారతాన్ని మళ్లీ యథాశోకంగా అనువాదం చేయమన్నాడు. వీరరాఘవయ్య ఉద్యోగపర్వాన్ని ఎనిమిది ఆశ్వాసాల గ్రంథంగా అనువదించి పూడూరు కేశవస్వామికి అంకితం ఇచ్చాడు. అశ్వాస విభజన పెట్టుకొన్నా వీరరాఘవయ్య సంస్కృత భారతంలోని అధ్యాయాల సంఖ్యను ఇస్తూ అనువాదం చేశాడు.

  1. ఉద్యోగపర్వం 1-94

834 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తిక్కనగారి అనువాదం యథాశోకంగా లేకపోయినా మూలంలోని అందాన్ని చెడగొట్టదు. పైగా మెరుగులు పెడుతుంది. ఇక ఈ అనువాదం యథాళ్లోకానువాదమే కావచ్చునుగాని తిక్కనగారి అనువాదంలోఉన్న చేవ ఇందులో లేదు. పైగా మూలం లోని అందాన్ని అక్కడక్కడ చెడగొట్టింది. ఇతని ఉద్యోగపర్వాన్ని విమర్శించుకొంటూ సీరియస్‌గా చదివితే ఇది నిలబడదు. 'కవిత్రయమువారి భారతంముందు మరెవరి భారతం నిలబడుట లేదు. దానికి కారణము వారు కవులు, మిగిలినవారు అనువాదకులు” అనీ మిత్రులు కేతవరపు రామకోటిశాస్త్రిగారు అన్న మాటలు అక్షరాలా నిజం. వీరరాఘవయ్య ఉద్యోగపర్వంమీద రామకోటిశాస్త్రిగారు. విమర్శనాత్మక వ్యాసం వ్రాశారు! ఉద్యోగపర్వాన్నే కాక ద్రోణపర్వాన్ని కూడా వీరరాఘవయ్య రచించినట్టు తెలుస్తోంది ఇందులోని కొంత భాగాన్ని మిత్రులు వి. రామరాజుగారు గుర్తించారు. ద్రోఇపర్వం అసమగ్రం; అముద్రితం. ఉద్యోగపర్వాన్ని గద్వాల సంస్థానం వారే క్రీ.శ 1900లో అచ్చువేశారు. వీరరాఘవయ్య యింకా ఎన్ని పర్వాలు అనువదించాడో తెలియదు. ఉద్యోగపర్వం తెనిగించే కాలానికి పెదసోమనాద్రికి ఒక్కడే కొడుకు. అతని పేరు తిరుమలయ్య. అవతారిక వ్రాసే రోజులలో ఇతడు చంటివిడ్డ కూడా కావచ్చును. ప్రశంసలు ఏమీ లేవు. అయితే సోమన్నకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు రామన్న ఈయనను బోరవెల్లి గిరియమ్మ పెంచుకొంది. గద్వాల పెదసోమన్న శ్రీ.శ 1711లో పోయాడు. అప్పటికి కొడుకులిద్దరూ చాలా పసివాళ్ళు. అందుచేత సోమన్న భార్యలిద్దరూ వరసగా సంస్థానపు వ్యవహారాల చూసుకొన్నారు. క్రీ.శ. 1738లో, అంటే తండ్రి పోయిన ఇరవైఏడు సంవత్సరాలకు తిరుమలయ్య సంస్థానానికి నన్నదు పొందాడు. ఈయన సత్కవిసమాజరసిక రచనవచన పరితస్థితమహత్వవైభవుడు' అని అనంతర గ్రంథాలవల్ల తెలుస్తూంది.* అయితే ఇతని తిరుమలయ్య _బదుసంవత్సరాలు మాత్రమే పాలించాడు. క్రీశ 1742లో పోయాడు. ఇతనికి చినసోమన్న చినరామన్న అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు గాని వాళ్ళకు యుక్తవయసు రాలేదు. అందుచేత తిరుమలయ్య తమ్ముడు పెదరామన్నే సంస్థాన వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది. ఈయన ముందే బోరవెల్లి సంస్థానానికి దత్తువెళ్లాడు. అందుచేత రెండు జాగీరులుగా ఉమ్మడిగా పాలించాడు. పెదరామన్న క్రీశ 1742 నుండి 1762 దాకా 21 సంవత్సరాలు నాడగౌడీకం చేశాడు. తరువా తమ్ముని పెద్దకొడుక్కి రాజ్యం అప్పగించాడు. గద్వాల చినసోమన్న క్రీశ 1782లో రాజ్యానికి వచ్చినా క్రీశ 1747లో అంటీ పదిహేను సంవత్సరాలకు ముందు ప్రాజ్ఞుడై సైనికవిస్యాసాలలో ఆర్‌తేరినట్టు ఊదీ 4. భారతి, డిసెంబరు, 190. 5. మరుగు పడిన మాణిక్యాలు, పుటలు 13-18. 6. యథోశోక తాత్చర్యగామాయణం, అవతారిక. 11-25.

గద్వాల సంస్థానం. కర్నూలు సుబా 835 ఈయన ప్రజ్ఞను మెచ్చుకొని నిజాము రెండువేల రూపాయల పారితోషికం యిచ్చాడు. ఆ సౌమ్మును పేష్కను నుండి మినహాయించాడు.” మరో ఆరేళ్లకు, అంటే క్రీ.శ 1753లో చిన్న సోమన్న పైలాపచ్చీసులో ఉన్నాడని భావించవచ్చు. ఈయన కుంపిణీయుగంలో 33 ఏళ్లు పాలించి చాలా సాహిత్యపోషణ చేశాడు. అది గద్వాల చరిత్రలో స్వర్ణయుగం.

పెదసోమన్స్న తెలుగు కవులనేకాక సంస్కృత పండితులను తూడా పోషించాడు. ఈయన ఆస్థానంలోని బుచ్చి వెంకటాచార్యులు రచించిన నాలుగు గ్రంథాల పేర్లు తెలుస్తున్నాయి: (1) అభినవశృంగార రసమంజరీభాణము, (2) కల్యాణపురంజనం, (3) శృంగారసర్వస్వం, (4) వేదాంతకారికావళి. ఈయన తెలుగు రచనలు చేశాడో లేదో తెలియదు. అయితే ఈ కాలంలో ఇతర తెలుగు కవులు గద్వాల పరగణాలలో లేకపోలేదు.

పూడూరి కృష్ణయ్యః పూడూరు గద్వాలకు దగ్గిరలోనే వుంది ఈ ఊళోని కేశవస్వామి పెదసోమన్నకూ, గద్వాల ప్రభువులకూ ఇలవేల్పు. ఈ పూడూరులోనే కృష్ణయ్య అనే కవి ఒకడు ఉండేవాడు. సోమన్న ఆదిలో వీరరాఘవయ్యచేత భీష్మపర్వాన్ని పూరింపజేయడానికి కారణం అందులో భగవర్గీతకు అనువాదం సాంతం లేకపోవడమే. పూడూరి కృష్ణయ్య తనుకూడా ఈ లోపాన్ని పూర్తిచేయదలిచాడు. భగవద్గీతను పద్యరూపంలో తెనిగించాడు.

ఇతని తండ్రీ పేరు కొండయ్య. గురువు పేరు యోగానందుడు. ఆయన కృష్ణయ్యకు వాసుదేవద్వాదశాక్షరీ మంత్రవీజాన్ని ఉపదేశించాడు. ఈ యోగానంద అవధూత క్రీశ 16వ శతాబ్దం చివరిలోనివాడు కాడేమో.! శిష్యుడు 17వ శతాబ్దిలోనివాడు. గురువు. కూడా అప్పటివాడే కావచ్చును. కృష్ణయ్య భగవర్గీకార్థదర్చణం అనే పేరుతో గీతను అనువదించాడు. ఇది పదిహేడు అధ్యాయాల గ్రంథం. అముద్రితం. ఈ తాళపత్ర గ్రంథప్రతి ఒకటి ఆంధ్ర సాహిత్య అకాడమీలో ఉంది. ఈ కవిగురించి మొదట తెలిపినవారు డాక్టరు బి. రామరాజుగారు* కృష్ణయ్య అనువాదం సరళంగా ఉంది. ఇంతకు ముందు భగవర్గీతను అనువదించిన కంభంపాటి నారప్పకు కూడా యోగానందుడే గురువుకావడం గమనించతగిన విషయం.

గద్వాల పెదసోమనాద్రి తన భుజిబలంతో కర్నూలు సుబాలోని చాలా భాగాలను ఆక్రమించి అధికారం ప్రకటించుకొన్నా ఆది కాక్కాలికం అని భావించాలి. వీజాపూరు సుల్తానులకాలంలోనూ, మొగలు సాభమ్రాజ్యకాలంలోనూ కర్నూలు మండలం ప్రత్యేకం ఒక సుబాగా ఉండేది. దానిని తరతరాలుగా నవాబులు పాలించేవారు. ఈ సుబాలో కర్నూలుదుర్గం కాక 8 పరగణాలు ఉండేవి: (1) చాగలమర్రి, (2) సిరివెళ్ల (3) నంద్యాల, (4) పాణ్యెం, (5) బ్రోణాచలం, (6) గూడూరు, (7) నందికొట్కూరు, (8) ఆత్మకూరు. ఈ ఎనిమిది పరగణాలలో చాలామంది పాలెగాళ్ళు ఉన్నారు. వీళ్లను ఆశ్రయించుకొన్న వాళ్లుకూడా చాలామంది ఉంటారు. రెండు గ్రామాలు ఇజారాను తీసుకొన్నువాడు తూడా 7. యంగ గ్యరలాంంిి6, ౪01.8. 620 8. మలిరాయల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి $. మరుగు పడిన మాణిక్యాలు, పుట 35.

836 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మండలేశ్చరుని కింద విగ్రవీగడం అరుదు కాదు. ఈ సుబాలో పాలెగార్లు ఒకరిద్దరు తప్ప సాహిత్యాఖిలాష చూపించినట్టులేదు. కోయిలకుంట్ల తాలూకాలో ఉయ్యలవాడ సింగపట్నం అనే ఊళ్ళు ఉన్నాయి. వీటికి మజ్ఞరివాళ్లు జమీందారులు. మల్లారెడ్డి సింగపట్టణం పాలెగారుగా మన్రోగారి నివేదికలో నమోదు అయ్యాడు.!9

మబజ్జరివారు పూర్వం గుత్తిలో ఉండేవారు కాబోలు. ఉద్యోగ ధర్మంలో కోయిలకుంట్ల వచ్చి ఉంటారు. గుత్తి మల్లారెడ్డి అనే వీరుని మీద పదాలు, పద్యాలు కనబడుతున్నాయి. ఈయన పెమ్మసాని తిమ్మరాజు కొలువులో ఉండేవాడు. చాలా యుద్ధాలలో పాలొన్నాడు. ఇతని వెంబడిని ఎప్పుడూ ఒక భట్టు ఉండేవాడు కాబోలు, “మత్తిల్లు వైరి కోటుల ముత్తైదొరక్రైతి భట్టు మూర్చనికేలా' అని ఒక కందంలో భట్టు చెప్పాడు. ఈ మజ్జరివాళ్ళ చరిత్ర ఉయ్యలవాడ కైఫీయతలో ఉంది. ఎనిమిది తరాల పేర్లు తెలుస్తున్నాయి. ఇందులో నలుగురు మల్తారెడ్లు ఉన్నారు. వీళ్లలో ఆఖరివాడు కషి శకుంతలా పరిణయం అనే పద్యకావ్యం బ్రాశాడు. దీనిలోని వంశావళి పద్యాలను మాత్రం మెకంజీ గుమస్తాలు సంపాదించారు. గ్రంథం నష్టమైంది. వంశావళి పద్యాలు చూస్తి కవిత్వం ప్రొఢంగా లేదని చెప్పవచ్చు. అయితే, లేని బావకన్నా. గుడ్డిబావ నయం అన్నట్లు ఈ సుబాలో ఈ ఒక్క పాలెగారైనా కవిగా కనిపించినందుకు సంతోషించాలి. సామాన్య ప్రజలలో కూడా ఒక్కడే సాహితీపరుడు కనబడుతున్నాడు. అతని పేరు ఘట్టుప్రభువు. ఈయన సామెతల పుట్ట.

ఘట్టుప్రభువుః “సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు అని సామెత చెప్తారు గాని ముద్ద ముద్దకూ బిస్మిల్లా అని అదే పనిగా సామెతలు వాడితే అదోలా ఊంటుండీ ఆదినుండి మన కవులు తమ కావ్యాలలో అవసరమైన చోట్లల్లా సామెతలు మితంగా వాడుతూనే ఉన్నారు. మధ్యకాలపు కవులలో నాచన సోమన్నాా, తరువాతి కవులలో చేమకూర వెంకటరాజుగారే ఎక్కువ సామెతలు వాడడంలో ఘనులు. వాళ్లకన్నా నేనేం తక్కువ తినలేదని సగర్వంగా ముందుకొచ్చే కవి ఇంకో ఆయన ఉన్నాడు. అతని పేరు ఘట్టుప్రభువు, -

ఇతని అసలు పేరు ఘట్టు శేషయ్య. ఈయన శ్రీశ్రెలం ప్రాంతంవాడు. భ్రమరాంబ భక్తుడు. అమ్మవారు స్వయంగా తన నాలుకమీద అక్షరాలు వ్రాసిందని చెప్పుకొన్నాడు. ఈయన గడియకు నూరు పద్యాలు చెప్పగల సమర్శ్థుడు. పదిహీనురోజులలో ప్రబంధం బ్రాయగలడు. మహా అయితే నెల్లాళ్లు మించదు. చతుర్విధ కవిత్వాలలో దిట్ట. ఇతని తండ్రీ

నందికొట్కూరు తాలూకాలో పాములపాడు అనే గ్రామం ఉంది. ఇది పూర్వం ఈ సీమలో ప్రసిద్ధమైనది. శ్రీశ్రైలమార్గంలో ఉంది. ఆ వూళో '*నాళ్ల గట్టు వారు చాలొ 11. మెకంజీ కైఫీయతులు, సంపుటి 13. - 12. మెకంజీ కైఫీయతులు సం. 13, టై. కేటలాగు 14లో నెం. 132 అని నెంబరు తప్పుగా ప్రకటించారు

గద్బాల సంస్థానం, కర్నూలు సుబా 837 ప్రముఖులు. శ్రీశైలానికి మ్లో యాత్రికుల కోసం తోటలు వేయించారు. బావులు తవ్వించారు. అన్నదానాలు చేశారు. ఈ నాళ్లగట్టు వాళ్ళలో చినలింగయ్య చాలా ప్రసిద్ధుడు. అతని మనుమడు ఎల్లయ్య భానుముక్కుల అనే గ్రామానికి దగ్గరలో నున్న రామాపురానికి కరణం. ఆ రోజుల్లో అది కొత్తగా వెలసిన ఊరు. భానుముక్కుల, రామాపురాలు రెండూ నందికొట్కూరు తాలూకాలోనే ఉన్నాయి. రామాపురం కరణం వంశమున సరసుడవయ్య శేషకవీంద్ర నీవు కావున నొక్క ప్రఖ్యాత కావ్యం చెప్పు” విజయాన్ని కావ్యంగా వ్రాసి దేవునికి అంకితం యిచ్చాడు.

ఇది నవీనసాహిత్యసారాఖిలాషతో శేషయ్య బ్రాశాడు. సామెతలు వాడే నాచనసోముడు నవీనగుణనాథుడు. అతడు ఉత్తర హరివంశంలో సత్యభామా విజయాన్ని కూడా బ్రాశాడు. అదే ఇతివృత్తాన్ని తీసుకొన్న శేషయ్య, నాచనసోముని బాగా చదువుకొని ఆ “నవీనతకు' ముగ్భడై దాన్ని అనుసరించాడేమో. ఘట్టు శేషయ్య వ్రాసిన సక్యాభామావిజయం అముద్రితం. దీని ప్రతి ఒకటి ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉంది ౯.871, ఈయన మరో మూడు కావ్యాలు వ్రాశాడు. అవి అచ్చుపడ్డాయి. వాటిలో అకారాదిగా చెప్పాలంటే, కుచేలోపాఖ్యానం మొదటిది.

ఇది మూడాశ్వాసాల చిన్న కావ్యం. ఇందులో మొత్తం ౪68 గద్యపద్యాలున్నయి. కుచేలుని ఉపాఖ్యానం సుప్రసిద్ధమైంది. భాగవతంలో ఇదే కథను పోతరాజుగారు 70 గద్యపద్యాలలో చెప్పారు (దశమస్కంధం ఉత్తరభాగం 961 నుండి 1030 దాకా). ఫఘట్టు శేషయ్య దీనిని రమారమి ఆరురెట్లు పెంచాడు. అన్ని రెట్లు రసవంతంగా తూడా చేశాడు.

కృష్ణునివద్దకు వెళ్ళడానికి, భార్య పోర్‌తే కుచేలుడు ఒప్పుకొన్నాడు. “చంద్రునికో చూలుపోగు' అనేటట్లు ఏదైనా కానుక పట్టుకెళ్లాలని చెప్పాడు. ఆమె అటుకులు ఇచ్చింది పోతరాజుగారు 9 గద్యపద్యాలలో చెప్పిన ఘట్టాన్ని ఘట్టు శేషయ్య 90 పద్యాలలో చెప్పాడు. ఒక్క ప్రథమాశ్వాసంలో ౩32 సంస్కృత లోకోక్తులు, 8 తెలుగు సామెతలు వాడేడు.

స్నెహితుడివద్దకు వెళ్లాడుగాని కుచేలుడు మాత్రం 'మాధవునియందు చిత్తంబు మట్టుపరచి ప్రపంచంబంతయు' మరచాడు. కృష్ణుడే అతణ్జీ అర్ధం చేసుకొని చిన్ననాటి సంగతులు ముచ్చటించాడు. నాకేం తెచ్చావని అడిగాడు. పిడికెడు అటుకులు పుచ్చుకొని భక్షించాక ఇంకో పిడికెడు తినపోడీ రుక్కిణి ఆపింది.

ఈ కథను పోతరాజుగారు కథనం చేస్తున్నప్పుడు పరీక్షిత్తుకు సంశయం రాలేదు. ఘట్టు శేషయ్య వ్రాస్తున్నప్పుడే అనుమానం వచ్చింది. అందుకే శుకయోగిని ఇలా అడిగాడు:

అధిపు డారగింప నంబుజేక్షణలును - టెలగి సంతసింపవలయు గాక

కుడువవలదటంచునడ్డుపడియెడు - కాంతలెచట నైన కలరెజగతి. (కుచే. 2-24)

6838 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అవకాశం రావాలేగాని, పాత శోకాలను పద్యంలోకి దింపడానికి ఘట్టు శేషయ్య కాచుకొని కూర్చుంటాడు. పరీక్షిత్తు వేసిన ఈ ప్రశ్నకు “కార్యేషు దాసి కరణేషు మంత్రీ

పనులు సేయునెడల బానిసవలె, బుద్ధి - గఅపునెడ బధానికరణి, భోజ

నంబు లిడెడియెడల నంబకైవడీ బ్రియం- బాచరింపవలయునండ్రు సతులు

(కఈకచే. 2-౪)

రుక్మిణి వారిస్తే అటుకులు తినడం చాలించి ఆ తరువాత స్నేహితుణ్ణి సాగనంపాడు కృష్ణుడు. ఉత్తచేతులతో వెడుతున్న కుచేలుణ్జి చూసి జనులు ఇలా అనుకొన్నారట:

కుడువగట్టకోకయు లేకను - జేరినట్టి తొంటి చెలిమికాని

బూటకములు పలికి బొమ్మని పంచె నీ - జలజలోచనునకు సత్యమేది?

(కుచే 2-107 ఇది ఎలాగుందో ఒక సామెత చెప్పనిదే ఘట్టు శేషయ్య ఊరుకోలేడు. “మగడు రాజైనా గాజుకడీయమే' అన్నట్టయిందట. కుచేలుడు ఇంటికి వెళ్ళాడు. సిరులను చూచుకొన్నాడు. బాధతో కృష్ణుని తలచుకొన్నాడు: .

ఏడీచెడిపిన్న వాండ్రకు నిన్ని పప్పు-గింజ లిడి పోరు మాన్చినక్రీియను జాల

దుచ్చమగు సంపదలొసంగి తొలగి నన్ను-మత్తునిగ జేసినావు నీ చిత్తమికను.

(తఈుచే. ౩-౪)

కృష్ణుడు దర్శనమిచ్చి, హితోపదేశం చేసి తామరాకుపై నీటిబొట్టుగా జీవించ మన్నాడు. ఈ కుచేలుడలాగే జీవించాడు. ఈ కథలో శేషయ్య విశేషంగా లోకోక్తులు గుప్పించాడు. మొత్తం మూడు ఆశ్వాసాలలో 67 సంస్కృత సూక్తులు. 18 తెలుగ జాతీయాలు ఉన్నాయి. ఇతని ఇతర కృతులలో ఇన్ని లేవేమో!

శేషయ్య వ్రాసిన కావ్యంలో తరువాత చెప్పవలసినది యాజ్ఞవల్క్యచరిత్ర. మన ప్రాచీన బుషులలో యాజ్ఞవల్కుుడు ప్రసిద్ధుడు. శుకయజుర్వేద ప్రవర్తకుడు జినకుని ఆస్థాన దార్శనికుడు. మన ధర్మశాస్త్ర రచయితలలో ప్రముఖుడు. మనుస్కృతికన్నా యాజ్ఞవల్క్య స్మృతిలోనే న్యాయసిద్ధాంత సమీకరణ సరళత, నియమబద్ధమైన ప్రస్ఫుటత్వం ఉన్నాయని పరిశోధకులు భావిస్తారు. యాజ్ఞవల్క్యుడు క్రీశ 2న శతాబ్దివాడని ఆధునికుల అంచనా. ఇతని న్యాయశాస్త్రంలోని భాగాలు ప్రాచీన శిలాశాసనాలలో తూడా కనబడతాయి, ఇతని స్మృతిపై చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాటిలో విజ్ఞానేశ్చరునిది ప్రసిద్ధమైనది. దానిని మితాక్షరి అంటారు. ఇదే నేడు మనకు పరమప్రామాణీకం.

ఇంతటి గొప్పదార్భనికుడు, స్కృతికారుడు చక్కని చరిత్ర కలవాడే అవుతాడు. అయితే మన ప్రాచీన పురాణగాథలలో మాహాత్మ్యాల దుమారాలు చరిత్రలను ప్రసన్నం కానీయవు. యాజ్ఞవల్కు్కని చరిత్ర కూడా అంతే అయింది. 'ఇతడు బదేళ్ళదాకా కల్లి

గద్వాల సంస్థానం, కర్నూలు సుబా 839 గర్భంలోనే ఉన్నాడట. తరువాత దైవోపదేశం వల్ల వెలువడ్డాడట. వైశంపాయనుని బ్రహ్మహత్యాదోషాన్ని తప్పించాడు. చాలా మహిమలు కనబరచాడు. ఈ గాథలను మన పురాణాలు కథనం చేశాయి. ఈ కథనాన్ని తెలుగులో ఇద్దరు కావ్యాలుగా చెప్పారు. ఒకరు ఘట్టు శేషయ్య. ఈయన వ్రాసినది పద్యకావ్యం. చల్లా గురవయ్య ద్విపదకావ్యంగా రచించాడు (1.491). శేషయ్య వ్రాసిన యాజ్ఞవల్క్యచరిత్ర అచ్చుపడింది. దీని గద్యలోనూ, కుచేలోపాఖ్యానపుగద్యలోనూ తేడా ఉంది. యాజ్ఞవల్క్యచరిత్రలో *“భమరాంవీకా వరప్రసాదలబ్ధ కవితాధురంధర పూర్వకవిప్రయోగ శబ్దానుబంధబంధురసరసకవిమి త్ర" అని ఉంటే, కుచేలోపాఖ్యానం గద్యలో 'పూర్వకవిప్రయోగశబ్దానుబంధబంధుర' అనే ప్రజ్ఞ చెప్పుకోలేదు.

శేషయ్య వ్రాసిన మరో కావ్యంలో కూడా ఈ ప్రజ్ఞను చెప్పుకొనని గద్యే ఉంది. దాని పేరు 'సురాభాండేశ్వరం'. కాశీలో మరణించిన ప్రతిఒక్కరూ శివలింగాలుగా మారుతారు. ఒక విప్రుడు కాశీలో చాలాకాలం నియమంగా ఉండి. ఒక ఈడిగదాన్ని చూసి మోహించాడు. దాని యింటికి వెళ్ళి క్రీడిస్తూ ఉండగా ఒక చిన్న చిక్కొచ్చింది. అది మగనాలు. దాని భర్హ సరిగ్గా అదే సమయానికి వచ్చి తలుపు తట్టాడు. విప్రుడు కల్గుగూనలో దాక్కొన్నాడు. ఈ _ సురాభాండేశ్వరలింగకథ స్కాందపురాణం, కాశీఖండంలో ఉంది. దీనిని ఘట్టుప్రభువు ఏడాశ్వాసాల కావ్యంగా వ్రాశాడు. ఈ కథను మన సాహిత్యంలో చాలామంది అనంతరకవులు వివిధ ప్రక్రియలలో విరచించారు. కాని ఫఘట్టుప్రభువుదే. ప్రసిద్ధం. ఈయన క్రీ.శ. 1730-50 ప్రాంతాలవాడని పరిశోధకులు నిర్ణయించారు.]1కి ఈ కథను కావ్యంగా వ్రాసిన వాళ్ళలో ఇతడే ప్రథముడు. ఘట్టుప్రభువు కాలాన్నీ అందరూ సరిగ్గానే నిర్ణయించారుగాని ఇతడు నెల్లూరువాడని పొరబడుతున్నారు. నెల్లూరు మండల చరిత్ర అధారంగా వీరేశలింగంగారు తమ కవుల చరిత్రలో ఇతని నివాససీమను పేర్కొన్నారు. మన పరిశోధకులందరూ దీనిని అంగీకరించారు. అయితే ఇతని కృతులను చూస్తే అతడు కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకావాడని చెప్పవచ్చు. సత్యభామా విజయంలో పేర్కొన్న గ్రామాలన్నీ ఆ తాలూకాలోనే ఉన్నాయి. యాజ్ఞవల్క్యచరిత్ర కూడా దానినే బలపరుస్తూంది. ఈ కావ్యాన్ని ఆయన ఉద్ధండలింగయ్యగారి ప్రోద్చలంవల్ల రాశాడు. ఆ కృతిపతిని ఘట్టు శేషయ్య ఒక ఎత్తుగీతిలో ఇలా దీవించాడు.

ప్రాతకోటమహాగ్రామపట్టభద్రు- డైన శ్రీనాగభూషణుడగు హరుండు

మంత్రిమణియైన యుద్దండ మల్లధరుని- లింగయామాత్యునకు శ్రీలొసంగుగాత.

(యాజ్ఞ. 1-2)

ఈ పద్యంలో చెప్పిన ప్రాతకోట కూడా నందికొట్కూరు అఆాలూకాలోనే ఉంది. రెండు కావ్యాలను కర్నూలు మండలంలో వ్రాసిన గట్టు ప్రభువు ఆ ప్రాంతంవాడేనని నికరంగా చెప్పవచ్చు.

అయితే బంగారం ఏ గనిలో పుట్టినా. గీటురాయి దాని విలువ తేలుస్తుంది. 13. యాజ్ఞవల్క్య చరిత్ర, పీఠిక. నిడుదవోలు వెంకటరావుగారు.

ం + వేనును నీజానికి తక్కువ మాటలలో ఎక్కువ భావాన్ని చెప్పగలవాడే నిజమైన కవి. ఒక్క చేశారు పాల్లుమాట కూడా వాడకుండా మర్రివిత్తనం అంత చిన్న పద్యంలో మహా వృక్షమంత అనుభవాన్ని ఇవ్వగలవాడు మహాకవి. మాటలు పొదుపుగా వాడడం అనే సుగుణం మన | కావాళ సాహిత్యంలో కవిత్రయంవారితోనే కరువైపోయింది. ఆ ముగ్గురి తరువాత ఈ మంచి కర్తలం' లక్షణాలున్న మహనీయుడెవరా అని వెతికితి, ఒక్క వేమనగారు తప్ప ఇంకెవరూ సమకొ కనుచూపుమేరలో సైతం లేరు. కవిత్రయం వారిలో కూడా లేని ఇంకొక గొప్పతనం అంచె ఒకలా వేమనగారిలో కనబడుతోంది. అది పుస్తకాల్లోని పదాలు కాక జీవితంలోని ఏర్చ్పరు మాటలే వాడడం. వేమనగారిని నిన్నటిదాకా సాహిత్య చరిత్రకారులు మహాకవిగా పరిగణింపక విజ్ఞాన పోవడం అటుంచి కవిగా కూడా జమకట్టుకోలేదు. పండితుల దృష్టిలోలాగా పామరుల సంఘః దృష్టిలో కూడా వేమనగారు కవులు కారు. వాళ్ల ఉద్దేశంలో ఆయన దేవుడు. బట్టీ అవతారపురుషుడు. మహిమలు చూపిన మహాయోగి. వేమనగారిని కవిగా గుర్తించినవారు ప్రవక్షః ఆధునికులే. కొమర్రాజు లక్ష్మణరావుగారు ఇల్లలికారు; కట్టమంచి రామలింగారెడ్డిగారు లవుక ముగ్గు పెట్టారు; వంగూరివారు పీట వేశారు. వేటూరివారు, బండారువారు, తనువు శేషాద్రిరమణకవులు మొదలైనవారు. ప్రస్తుతించారు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు రర్మరొ మహాకవిగా ప్రతిష్టించారు. సుమారు ఏభయి సంవత్సరాల సాహిత్యచర్చల ఫలితాలను సంసా: సమన్వయం చేసుకొని వేమనగారి జీవితచరిత్రను సంగ్రహంగా చెప్పుకొనే వీలు నేటికి అక్క మనకు లఖించింది. ... ఠొత్త విషయాలు సేకరించే ముందు పూర్వ పరిశోధకులు చేసిన కృషిని ఒక్కసారి పునశ్చరణ చేయాలి. 1923లోనే వేమూరి విశ్వనాథ శర్మగారు ఆంధ్రపత్రిక సారస్వతాను భార్య బంధంలో 'వేమన కులము-కుటుంబము' అనే వ్యాసం రాశారు. 1928లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు తమ ఉపన్యాసాలలో “వేమన సంసార స్థితిగతులు" అనే అంశంమీద ఒక సుదీర్ణ సమాలోచనం చేశారు. ఇతర పరిశోధకులు చాలామటుకు రాళ్లపల్లి వారి బాటలోనే సాగారు. కొందరు కొంచెం కుదించారు. కొందరు చాలా సాగదీశారు. మొత్తంమీద అందరూ వేమనగారు ప్రభురెడ్డ కుటుంబంలో పుట్టి పెరిగినట్టు భావించారు. సమా రాళ్ళపల్లివారి అంచనాలను “కట్టి- కొట్టె-తెచ్చె* అన్నట్టు క్లుప్తంగా కూడా చెప్పుకోవచ్చు. చేసు! వేమనగారు కలవారి ఇంట పుట్టారు. గారాబంగా పెరిగారు. గాలి చదువు | భోజ చదువుకొన్నారు. జులాయిగా తిరిగారు. వారకాంతలను మరిగారు. పెద్దలు కుదిర్చినపెళ్ళి | శర్తొః చేసుకొన్నారు. పెళ్ళాం గయ్యాళి. ఆమెను వంచలేకపోయారు. అన్నదమ్ములతో వేరుపడ్డారు. ఇంటిలోన పోరు ఇంతింతకాకపోయినా సంసారం చేశారు. సంతానాన్ని కన్నారు. వాళ్లు తల్లిదండ్రీ మీద దయలేని బిడ్డలు, వేమనగారు అప్పులపాలయ్యారు. భావి లేమిని అనుభవించారు. సంసారంమీద విరక్తిపుట్టి సన్యసించారు. తత్తాన్ని కారి తెలుసుకొనడానికి ఎందర్నోో ఆశ్రయించారు. అన్ని దర్శనాలను అవలోకించారు. తృప్తీ కులా

కలగలేదు. తమ దారినే ఒక ప్రత్యేక తత్త్వాన్ని దేశసంచారం చేస్తూ శిష్యులకు ఉపదేశం 1 చేశారు. వార్థక్యంలో కాలం చేశారు. వన , య 1 ప్రపంచాన్ని ప్రజల కళ్ళకు కట్టేటట్టు చేయడమే కవితా లక్షణం. దీనికి భావనాశక్తి |. కావాలి. అందులోనూ స్వాతంత్ర భావనాశక్తి అవసరం. ఈ సుగుణం తెలుగు 1. | భ్రలందరిలో ఒక్క వేమనగారిలోనే కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ఆయన తమ 1: సమకాలిక జీవితాన్ని సాంఘిక న్యాయాలను, మతాలను, అఖిమతాలను, - .. | అంచెలంచెలుగా అయినప్పటికీ - సంపూర్ణంగా పరిశీలించారు. సమగ్రమైన అవగాహన | _ఏర్చరుచుకొన్నారు. తాము తెలుసుకొన్న సత్యాన్ని ప్రజలందరికీ ప్రబోధించారు. ఛే వేమనగారు గొప్పు తత్తన్షవేత్తలే, ఆదర్శ్భవంతమైన' దార్భనికులే. విచారణ శక్తిగల నే ( సంఘంలో అతనికుండే ఉనికినిబట్టే అతని చైతన్యం ఉద్భవిస్తుందిగాని అతని చైతన్యాన్ని బట్టీ ఉనికి ఉద్భవించదు. చైతన్యవంతులైన దార్శనికులు ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారు. | ప్రవక్తలు మాత్రమే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. కొంతవరకూ కృతకృత్యు | ) లవుతారు. వేమనగారు అభ్యుదయప్రవక్తలు. తమ దేశకాల పరిస్థితులవల్లా, తమ తనువులో పుట్టిన తత్త్వంవల్లా వేమనగారు ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు, | ) కర్మకాండలూ, ధర్మశాస్రాలు చూసి, కాచి వడపోసి ఒక సిద్ధాంతానికి వచ్చారు. దాన్ని ) సంసార యోగమన్నారు. అదే “పనికట్టుకొని ప్రచారం చేశారు. ఇదుంటే స్వర్గం | అక్కరలేదన్నారు: “సుగుణవంతురాలు సుదతియ్రై యుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప | స్వర్గ మేటికయ్య సంసారి కింకను విశ్చదాఖిరామ వినురవేమ. (వే.సూ.ర. 3903) భార్భ అనుకూలవతి అయితే, కొడుకులు గుణవంతులైతే ఇంటిని మించిన స్పార్గం లేదు. 1 “మోల్కిజూచి తెలిసి పూర్వాపరంబులు తడుపు గుడుపు నడుపు తత్త్వమెరిగి / నడువ నేర్చినట్టి నరుడు గృహస్టుడు విశ్వదాఖిరామ వినురవేమ. [ | (బౌను అకాడెమీ ప్రతి పుట 79 పద్యం 294) న | సమాజ జీవనంలో చాలా సామ్యాలున్నాయి. ఆ పోలికలను గుర్తించి, సమన్వయళీ | , చేసుకొని జ్ఞానం యొక్క పూర్వాపరాలనూ, స్నానాదికాలైన శుచి శుభతలూ, . ) భోజనాదికాలైన ఆహార నియమాలను, ఆచార వ్యవహారాదికాలైన జీవనప్రవర్తనల ) శత్త్వాన్నీ తెలుసుకొని బతుకనేర్చినపుడే గృహస్తుడు: . ో జాతి నీతి వేరు బన్నమ్ము లొకటి అరయ తిళ్లు వేరె ఆకలొకటి దర్శనములు వేరు దైవం బదొక్కటి విశ్వదాభిరామ వినురవేమ (వే.సూ.ర. 1585) | భూమిమీద/ మనుషులంతా ఒకలాగే పుడతారు. జన్మలొక్కటీ అయినా జనులు ఏ | | గాతిలో పుడితే ఆ జాతివారైపోతారు. జాతికో రకం నీతి ఉంటుంది. తూటి విషయంలో / క్ట కులాచారాలు పాటించాలి. అందరికీ ఆకలొకటే అయినా ఆహార పదార్థాలలో |

842 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి విఖేదాలుంటాయి, ఆచారాన్ని అతిక్రమించిన వాడీకీ కులం పోతుంది. కులం పోడే కూడు పుట్టదు. కొన్ని కొన్ని తులాలు కొన్ని మతాలను అనుసరిస్తాయి. కొన్ని దైవాలనే లెక్క ప్రకారం ఆరు దర్శనాలున్నాయి. ఇన్ని దర్శనాలున్నా దైవం ఒక్కటే. జన్మలొక్కటే, ఆకలొక్కటే, దైవం ఒక్కటే అయినప్పుడు జనులంతా ఒక్కటిగా జీవించాలని వేమనగారి ఆకాంక్ష. దీనికి ఆహారం అడ్డం రాకూడదు:

“ఉర్వివారి కెల్ల నొక్క కంచము బెట్టి పొత్తుగుడీపి కులము పొలయ చేసి

తలను చేయిబెట్టి తగనమ్మ జెప్పరా విశ్వదాభిరామ వినురవేమ (వేసూ.ర. 548) ఎవ్వరూ పంక్తి బాహ్యులు కారు. అందరూ ఒక్క కంచాన తింటే అన్ని అనర్థాలకూ హేతువైన కులభేదం రూపుమాసిపోతుంది. సఖ్యత ఉంటుంది. సమానత్వం ఏర్పడుతుంది. ఇది ఆరు దర్శనాలనుండీ, ఆరు మతాలనుండీ, అన్నిశా స్తాలనుండీ వేమనగారు పిండిన సారం. మనకు ఆరు ఆస్తిక దర్శనాలూ, ఆరు నాస్తిక దర్శనాలూ ఉన్నాయి. వేదప్రామాణ్యాన్ని అస్తిక దర్శనాలు అంగీకరిస్తాయి. నాస్తిక దర్శనాలు ఎంతమాత్రం ఒప్పుకోవు.

ఆఫ్రిక దర్శనాలు వాస్తిక దర్శనాలు

  1. న్యాయము 2. చార్వాకము

  2. హైైషికము 2. సొ తాంత్రికము

  3. వేదాంతము 3. వైభాషికము

  4. మీమాంస 4. యోగాచారము

  5. సాంఖ్యము 5. మాధ్యమికము

  6. యోగము 6. అర్హమతము

ఆస్తిక దర్శనాలను అవలంబించి ఆరు మతాలు వర్ధిల్లాయి. 1. శైవం,2. వైష్ణవం. 3. శాక్తం, 4. గాణాపత్యం, 5. సౌరం, 6. కాపాలికం అనే ఆరూ దేశంలో ఇప్పటికీ అంతో ఇంతో ప్రచారంలో ఉన్నవే. నాస్తిక దర్శనాలను ఆరు పేర్లతో పిలిచినా నిజానికి అవి మూడే. సౌత్రాంతికం, వైభాషికం, యోగాచారం, మాధ్యమికం అనేవి బౌద్ధమతంలో ని విఖేదాలు. బౌద్ధాన్ని సొగత్యం అని కూడా పిలుస్తారు. అర్హమతమంటే బైనమన్నమాట. నాస్తిక దర్శనాలలో చార్వాకం, బౌద్ధం, జైనం ఈ మూడే ఉన్నాయి. వేమనగారు ఆస్తీ! నాస్తిక దర్శ్భనాలనీ పర్శోలించారు. ఈ పరిశీలనకు తగినంతా ఆయన చదువుకొన్నారొ! కట్టమంచి రామలింగారెడ్డిగారి ప్రకారం వేమనగారికి పుస్తక జ్ఞానం ఇంచుమించు సున్న వ్యాకరణము, ఛందస్సు, అలంకార శాస్త్రము మొదలగువానిలో నీతనికి శక్తి యె తక్కువో భక్తియు నంత తక్కువ! రాళ్ళపల్లివారి అంచనాను బట్టి “వేమన సామాన్యమగ బ్రాత చదువులు చక్కగా వచ్చువరకు కొన్నాళ్లు బడిపంతుల బెత్తపు దెబ్బలు తిని

  1. కవిత్వతత్వ విచారము - పుట 5.

వేమన, కడప సుబాకవులు 843 తరువాత భారతము, రామాయణము, బసవపురాణము, శివపురాణము మొదలగు గ్రంథములు పలుమారులు తండ్రిగారికి చదివి వినిపించి యుండును. పురాణములందలి కథలలో సామాన్యముగ నందరు నెరుగని కథల నీతడెరిగినట్లు అనేక పద్యములు తెల్చును'* వేమనగారిది శ్రుత పాండిత్యమని రాళ్లపల్లివారు నమ్ముతారు.

“వేమన చిన్ననాటినుండి తమ యింటికి వచ్చి పోవుచుండు చదువరుల, కవుల సహవాసమున సంస్కారమును బొందినవాడు”' అని శర్మగారు చెప్పారు. వావిళ్ళ వేంఠటేశ్చర శాస్తులవారు. చెప్పిన మాటల? వేరు. “వేమనతు వేదములయు, ఉపనిషత్తులయు జ్ఞానముగాని, తుదకు సంస్కృత భాషా జ్ఞానముగాని లేదని కొందరు వచింతురు. వేమన పద్యములలో నుపనిషచ్చాయలు పెక్కు గోచరములగును. కావున ఈతనికి సంస్కృత భాషా జ్ఞానముండెనని యంగీకరింప తప్పదు" అని వారంటారు ఒక్క ఉపనిషత్తులేకాదు, యోగశాస్త్రం, తంత్రశాస్త్ర మొదలైన గుప్తవిద్యలలోని శోకాల భావాలు కూడా వేమనగారికి తెలుసునని నేను రాసిన వేమనవేదం వ్యాఖ్యానంలో చాలా చోట్ల మూల శోకాలను ఉదాహరిస్తూ చెప్పాను.5 -

రాళ్ళపల్లివారు చెప్పినట్టు వేమనగారు బళ్ళో చదువుకొని ఉండవచ్చు. విలియం హావర్జు క్యాంబెల్‌ చెప్పినట్టు వేమనగారు చదువుకొన్న వీధిబడిలో బ్రాహ్మణుడో, భట్రాజో అయ్యవారుగా ఉంటాడు. క్యాంబెల్‌ ఈ సంగతి చెప్తూ హిందూ దేశములో ఒకటి రెండు శతాబ్బముల కాలము ప్రజల ఆచార వ్యవహారములలో గుర్డించ తగినంత చూర్చును చూపించజాలదు.” అన్నారు. వేమనగారి స్వస్థలాలనుకొన్న ప్రాంతాలలో పర్యటన చేస్తూ క్యాంబెల్‌ చూసిన వీధి బళో భట్రాజులు కూడా అయ్యవార్లుగా ఉండి ఉంటారు. వేమనగారు భట్రాజుల దగ్గర చదువుకొన్నారన్న ప్రతిపాదనవైపు నేను మొగ్గుకాను. వారికీ ఎన్నో చాటువులూ, నీతిపద్యాలు కంఠతా వచ్చినట్టు చెప్పవచ్చు. నీతిశాస్త్ర ముక్తావళి, సుమతి శతకం, సకల నీతి కథా నిదానం మొదలైన పుస్తకాలలోని పద్యాలెన్నో వేమనగారికి వాచో విధేయాలని చెప్పడానికి ఆధారాలున్నాయి.

జన్మతః వేమనగారు శైవులు. వారి కాలానికీ రాయలసీమలో వీరైవం ప్రచారంలో ఉంది. సామాన్య ప్రజల కోసం వీర్రైవం ద్విపద కావ్యాలను ప్రోత్సహించింది. శతకాలు, యక్షగానాలు తూడా వీర్టైవ కవులు రచించారు. అయితే పామరులను కూడా ఆకట్టుకొనేది పాటలే. తాళ్లపాకవారి ఆధ్యాత్మ సంకీర్తనలలాగే శైవులు కూడా శైవ సంక్షీర్సనలు రచించుకొన్నారు. తత్త్వాలు యాలలు చాలా ప్రచారంలో ఉండేవి. ఇప్పటికీ యాగంటివారి తత్త్వాలు తెలుగుదేశంలోని చాలా ప్రాంతాలలో బవేవనభ లలన 3. అదే పుస్తకంలో - ఆదే పుట 4 వేమన పద్యములు - వావిళ్ళ ప్రచురణ 1855 సంవత్సరపు ప్రతి.

క. వేమన వేదం - ఆరుద్ర ఓ వేమన - పాశ్చాత్యులు - మరుపూరివారి అనువాదం, పుట ౫3. 7. వేమన - పాశ్చాత్యులు - పుట 78

844 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ వినబడుతూనే ఉంటాయి. వేమనగారిమీద యాగంటివారి రచనల ప్రభావం చిన్నప్పుడు గట్టిగానే, ఉండేది. వీర్చైవంలో భక్తులకు జాతిభేదాలు లేవు. స్త్రీ పురుష విభేదాలూ లేవు. చదువు సంధ్యల అవసరం లేదు. పురిటిమైల, చావుమైల పాటించరు. వర్గవిభేదాలు లేవు. వర్ణ భేదాలనూ, ధర్మాన్ని ప్రతిష్టించుతూ నూతన వ్యవస్థను నిర్మించాలన్న ఉద్దేశంతో వీర్వైవం అదిలో ఉద్యమంగా సాగింది. ఆర్థిక అసమానతలను, అవమానకరమైన జాతి భేదాలనూ తొలగించే మతం కనుక అగ్రవర్దాలవారికన్నా అడుగువర్గాలవారు, అట్టడుగు వృత్తులవారు ఈ మతంవైపు ఆకర్షితులయ్యారు. ఏ మతాన్నయినా గురువు బోధించాలి, శిష్యుడు తెలుసుకోవాలి. ఇంటి దగ్గర నేర్చుకోగలిగినంత నేర్చుకున్నాక వేమనగారు తెలిసినవాళ్ళ దగ్గర నేర్చుకొనడానికి ప్రయత్నించారు. అన్వేషించారు. గొట్టెలు పదివేలు గుంపుగా ఉన్నా వాటిలో తన తల్లిదగ్గరకే కొదమ వెళ్లి చేరుతుంది. అలాగే భక్తుడు పరమ యోగిని తెలుసుకొని వెళ్లగలడు. వేమనగారు లంబికాశివయోగి అనే గురువును ఆశ్రయింి యోగవిద్యలు అఖ్యసించారు. ఆయన నేర్పినదేమిటో, వీరు నేర్చుకున్నదేమిటోగాని అన్నిటిమీదా విరక్తి కలిగి సంచరించడం మొదలుపెట్టారు. సర్వం పరిత్యజించినవాడీ మానం కప్పుకోవాలనే అభిమానం, తాపత్రయం ఉండదు. పెట్టుకొన్న కౌపీనం ఊడినా వేమనగారు పట్టించుకోలేదు. అయితే లోకం ఊరుకుంటుందా? “గోచి ఊడెననుత కోతాటలాడించి వెర్రియోగి నూరువెడల' గొట్టారు. 'తల్లిగర్చ్భమందు తాబుట్టీనప్పుడు మొదల బట్టలేదు, తుదను లేదు. నడుమ బట్ట గట్ట నగుబాటుకాదొకో* అని వేమనగాడ నవ్వుకొన్నారు. తాను నవ్వుకొనడమే కాదు. లోకులను నవ్విస్తూ హితోపదేు చేయాలని అనుకొన్నారు. మత విద్వేషాలతో, కులభేదాలతో, మూఢాచారాలకో గబ్బుకంపు కొడుతున్న సంఘాన్ని కడగడానికి ఒక రేవు పెట్టారు. శైవులను, వైష్టవులన, వాళ్లలో ఉన్న చెడ్డను సరిసమానంగా నిందించారు. అష్టాదశవర్దాలలో ఏ ఒక్కటీ ఊరుకోలేదు. పరమలోభులను, కల్లయోగులను పట్టుకొని తిట్టారు. పాపపుణ్యాల ఏమిటో వివరించారు. 'పాపమనగ వేరె పరదేశమున లేదు తాను చేయపనురి దగిలియుండు' అని బోధపరిచారు.

వర్ణాశ్రమ ధర్మాలను, తరతరాల ఆచారాలను ఎవరేనా ఎదిరిస్తే వాటివల్ల లాభాల పొందుతున్నవాళ్లు సహజంగా నొచ్చుకొంటారు. కర్రపుచ్చుకుంటారు. అటువటీ స్వార్థపరులను ఎదిరించడానికి వేమనగారు హాస్యాన్నే ఆయుధంగా ధరించారు. మ సాహిత్యంలో హాస్కమంటే ఆ రోజులలో ముతక సామెతలూ. మోటుమాటే వేమనగారి హాస్యం తూడా ఆదిలో పనసతొక్కంత పెళుసుగానే ఉండేది. అది రానుఠాన పనసతొనలంత తియ్యగా కమ్మగా మారింది.

వేనున కడప సుబాకవులు 845

వేదవిద్యలు చదువుకొన్నవాళ్ళ్లూ, ఉపనయనం చేసుకొన్నవాళ్లూ వేమనగారిని పట్టుకొని చదువులేనివాడివనీ, ఆర్హవిద్యలకు అర్హతలేనివాడవనీ నిందించారు. ఒడుగు చేసుకొనకపోతే బ్రాహ్మణుడు శూద్రునితో లెక్క. ఒడుగు చేసుకొంటే తప్పించి వేదాధ్యయనానికి వీలులేదు. బ్రాహ్మణులను వారి వేలుతోనే వేమనగారు నొక్కేశారు. బ్రాహ్మణ కాంతలకు ఉపనయన సంస్కారం లేదు. “తల్లి శూద్రురాలు తానెట్లు బాపడొ' అని వెక్కిరించారు. “పుస్తకములు చదువ పొందునా మోక్షంటబు' అని డెలియజేశారు. యోగుల దృష్టిలో ఇతర విద్యలు అసలు విద్యలు కావు. 'వేదవిద్యలెల్ల వేశ్ళలవంటివి. గుప్త విద్యయొకటె కులకాంతవంటిది.' ఈ విద్యలోని సారాన్ని గుట్టుగా బోధించడానికే వేమనగారు దేశమంతటా సంచరించారు. ఎవరేది ప్రశ్నించినా చిన్న పద్యంలో పెద్ద జవాబు యిచ్చేవారు. ఎవరికేది చెప్పాలనుకొన్నా అచ్చుతెలుగు ఆటవెలది ద్వారా అదేశించేవారు.

ఏది కులమునీకునేది స్థలంబురా పాదుకొనుము మదిని బక్వమెరిగి

యాచరించు వాని నవలీల ముట్టరా విశ్చదాఖిరామ వినురవేమ

(వేమన సూక్తి రత్నాకరం - 740)

ఎదుటనున్న శిష్యుణ్ణి చూసో, లేక తమ్ముతాము ఉద్దేశించుకొనో వేమనగారు ఈ పద్యం చెప్పారు. పరిపక్వమైన మనసుకు తులంగాని, స్థలంగాని అనవసరం. అయినా మనిషన్నవాడు భారతీయ సమాజంలో ఏదో ఒక కులంలో పుడతాడు; ఏదో ఒక స్థలంలో పెరుగుతాడు. పుట్టిన కులాన్ని బట్టీ, పెరిగిన స్థలాన్ని బట్టీ ఒక వ్యక్తి చైతన్యం ఎదగవచ్చు లేదా కుదించుకుపోవచ్చు. సంస్కారవంతమైన వాతావరణంలో పెరిగినవాళ్లు సమగ్రమైన చైతన్యపు రూపురేఖలు సంతరించుకొంటారు. వేమనగారు కులాలతూ, స్థలాలకూ అతీ్తీతులైన విశ్చకుటుంబే. అయినా వారు ఎక్కడ పుట్టారు? ఏ కులంలో పుట్టారు? ఎలా పెరిగారు? ఎలా ఎదిగారు? మొదలైన ప్రశ్నలు చరిత్రకారులు వేసుకోకతప్పుదు - వేమనగారి వంటి చాటుకవులు చెప్పిన అనేకానేక పద్యాలలోనుంచి వారి జీవిత విశేషాలనూ, ఊరు, నాడూ, కులమూ, కుటుంబమూ మొదలైన వాటి వివరాలను సేకరించాలి. ఒక పద్యంలో వేమనగారు తమ చిరునామాను స్పష్టపరచారని పరిశోధకులు భావిస్తున్నారు.

ఊరుకొండవీడు ఉనికి పశ్చిమవీధి మూగసితకెల్ల మొదటియిల్లు

యరసి చూడ నదిముక్తి మార్గమే విశ్చదాఖిరామ వినురవేమ (0-174వ 467)

ఈ పద్యంచల్ల వేమనగారు కొండవీడుకు సంబంధించినవారనీ ఆ ఊళో పశ్చిమ వీధిలో వారిల్లుందనీ భావిస్తే అది పొరపాటుగా కనిపించకపోవచ్చు. ఈ పద్యాన్ని బ్రౌను దొరగారు 1824లో నవంబరు మాసంలోనే గుర్తించారు. వారు వ్రాయించిన ప్రతులలో ఇదీ కనబడుతుంది. అయితే ఈ పద్యుం బ్రౌను దొరగాను తాము అచ్చువేసిన వేమన పద్యాల సంకలనంలో 1829లోగానీ, 1ఇ9లోగాని చేర్చలేదు. ఈ పద్యంలో ఏదో గూఢార్థం ఉందని, ఆ గూఢార్థం ఏమిటో నికరంగా తేలేదాకా ఈ పద్యాన్ని

846 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అచ్చువేయకూడదని ఆయన భావించి ఉంటారు. ఈ పద్యానికి ఆయన ఇలాగ ఇంగ్లీషులో వివరణ ఇచ్చారు. 16 అంంల 0[0టా 0060 ₹ ఆటం ఈల తజిటు రజల ఏ 0 10 (06 గఆరే, 14 క 080% కంల (6 9టాల). -౧ఆ౭ ౪ 9కేజాం8 ౪ ఈం సీకో గంయిల టం 3326 జారే 00౧కమకి చలం క, 08 ౪ టం 1088 01 0686066౬ (0-1774 ౪ల౩౭ 46) టౌను దొరగారి ఆంగ్ల వివరణలున్న ఈ కాగితం ప్రతిని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు 1967లో ప్రచురించారు. అయితీ ఈ పద్యం ఇతర ముద్రిత ప్రతులలో చాలాకాలం కిందటే చోటు చేసుకొంది. 1913లో రాయవరపు పూర్ణయాచార సంకలనం, వేమన సూక్తీరత్నాకరం అచ్చుపడింది. దీనిని బందరు ప్రతి అని పరిశోధకుల పేర్కొంటారు. అందులో ఈ పద్యం ఇలా ఉంది. ఊరుకొండవీడు నునికి పక్చిమ వీధి మూగ చింతపల్లె మొదటిఇల్లు అరసిచూడ బయలునదె ముక్తి శివుడయా విశ్చదాఖిరామ వినురవేమ (వే.సూ.ర. క) బందరు ప్రతిలో కనబడే ఈ పద్యం బ్రౌను దొరగారి సంకలనాల్లో ఇదే పాఠంతో ఉంది (0. 1769 ప. 171). ఇది చాలా ఊహాగానాలకు ఆస్కారమైంది. కొండవీడు అనే ఊరి పేరేకాక మూగచింతపల్లె అనే గ్రామం కూడా ఈ పాఠంవల్ల తెలియవస్తుంది వేమనగారి పూర్వీకులు మూగచింతపల్లెలో ఉండేవారనీ, ఎప్పుడో కొండవీడు వలసవెళ్ళీ అక్కడ పడమటి వీధిలో స్థిరపడ్డారనీ ఈ పద్యంవల్ల పూర్వ పరిశోధకులు భావించాడు అండేశాదు అధునిక పరిశోధకులు ఒక అడుగు ముందుకెళ్ళి “కొండవీటి హన్చిత వీధిలోని బయలు (మైదానం)లో శివాలయం ఉండీ ఉంటుంది. ఆ దాపుననే వేమన నివసించే యిల్లు. ఇంటి చిరునామాకు వివరాలు చెప్పే పద్ధతి ఇది” అని చాటుతున్నార వేమనగారు ఈ పద్యంలో స్వకీయమైన సాకీను విశదపరుస్తున్నారని భాహ్ల్‌ ఇందులోని కొండవీడు అనే మాట పట్ల ఎవరికీ పేచీ ఉండదు. ఇది సుప్రసిద్ధప్టై చారిత్రాత్మక స్థలం. పోతీ రెండో పాదంలోని 'మూగచింతపల్లె ఎక్కడుంది? కనబడతాయి. వాటిని డాక్టర్‌ గోపి బేరీజు వేశారు. 11, మూగచింతపల్లి మొదటి ఇల్లు (0-1723-504) 2. ఊరుకొండపల్లె ఉనికి పశ్చిమ వీధి మూకచింతపల్లె మొదటి యిల్లు ఆత్మరాకపోక అదియె పోతత్త్వంబు (0-1725-646) ౩. మూల చింత కడకు ముందరిల్లు అరశి చూడ బయలు ఆడనె శివుడుండు (0-1727-324) 9. డాక్టర్‌ ఎన్‌. గోపి ' ప్రజాకవి వేమన' పుట 112.

  1. _మూగసేత కెల్ల మొదటివీడు అరశి చూడనది ముక్తిమూర్గమో (0-17735-900) బ్రౌను వ్రాత ప్రతులలో ఈ పాఠ్యాంతరాలుకాక, వావిళ్ళవారు ప్రకటించిన ఒక పద్య సంకలనంలో ఈ పద్యం ఇలాగ రూపాంతరం చెందింది. ఊరు కొండవీడు నునికి పశ్చిమవీధి మూగచింతలెల్ల మొదటియిల్లు వడ్డె రెడ్డికుల మదేమని తెల్పుదు విశ్చదాఖిరామ వినురవేమ (వావిళ్ల (1955) ప. 1034) ఈ పాఠాంతరాలన్నీ ఇలా ఉండగా ఇటీవల పారిస్‌ ప్రతి నకళ్లు మన దేశానికి వచ్చాయి. ఈ ప్రతిని 1730లో సంజీవనాథస్వామి అనే జెసూటు ఫాదిరి పారిస్‌ నగరానికి పంపించారు. ఈ ప్రతిలో ఉన్న పాఠం కొంచెం ప్రాచీనం కాబట్టి దీనిని విశ్చసించవలసిన ఆవసరం ఉంటుంది. అందులో ఈ పద్యం ఇలా ఉంది. విడు కొండ్డ విడు విధి పంచ్చమహా విధి మొలక చింత్తలలొన మొదటి యిల్లు వెర్రి వెమననంగ వెదాంత వెత్తరా విశ్వదాఖిరామ వినురా వేమ అనాటి లేఖన పద్ధతులను బోధపర్చుకొని లేఖక దోషాలను పరిహరించి మాత్రాధికృతను తొలగించి పరిష్కరించితీ ఈ పద్యం ఇలాగ చదువుకోవచ్చు. వీడు కొండ వీడు పశ్చిమ వీధి మొలక చింతలోన మొదటి యిల్లు వెర్రి వేమననగ వేదాంత వేత్తరా విశ్చదాఖిరామ వినుర వేమ ఈ పద్యం మూడవపాదంలోని పాఠాంతరం అన్నిటికన్నా విభిన్నంగా విలక్షణంగా ఉంది. ఇందులో కులప్రసక్తిగాని, బయలుగాని, తివుడుగాని ముక్తిమార్గంగానీ లేవు. ఇది కేవలం వేమనగారి ప్రశస్తి. ఆయన తమ్ము తాము వెర్రి వేమన అని పిలుచుకొనడం తూడా కనబడుతుంది. ఈ ముచ్చట ఇతర వేమన పద్యాలలో తూడా ఉంది. ఉదాహరణకు సిగ్గు గల దటండ్రు సృష్టిలోపలివారు వెర్రి వేమన గనివెరగువారు తమకు గల్లు సిగ్గు దైవమే యెరుగురా విశ్వదాభిరామ వినుర వేమ (వేసూ.ర. 3896) ఈ *“వెర్రివేమన' అనే పాఠాంతరం వల్ల ఈ పద్యంలో 'చిరునామాకు వివరాలు చెప్పే పద్ధతి లేదనుకోవాలి. రెండోపాదంలో మూగచింతపల్లె తూడా లేదు. 'మొలత చింత' అని ఉంది. ఇతర పాఠాంతరాలలో 'మూగసేత', 'మూగ చింత' అనే ప్రయోగాలు కనబడతాయి. చింత అనే పదం వేమనగారు తాత్త్విక చింతనకు పర్యాయపదంగా చాలాసార్లు వాడారు. “చింతలోనచింతి చిన్మయంబు' (వే.సూ.ర.3806). 'చింతదీర్చి చూడ చిన్నయ జ్యోతి (వే.సూ.ర. 3309). ఒక కవి స్వస్థలాన్ని. అందులోనూ వేమనగారి వంటి వాటుకవి ఉనికిపట్టును నిర్ణయించేటప్పుడు కేవలం ఒక పద్యాన్ని పట్టుకొని ప్రాకులాడడం అంత సముచితం కాదు. వేమనగారు తమ పద్యాలన్నింటిలోనూ వాడిన స్థలనామాలను పరిశీలించిడే కొంత లాభసాటిగా ఉండవచ్చు. వేమన సూక్తి

848 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి రత్నాకరంలోనూ, బ్రౌను అకాడమీ ప్రతిలోనూ కనిపించే స్థలనామాలను అకారాదిగా పొందుపరుస్తున్నాను. కుండలీకరణాల్లో ఉత్తసంఖ్య ఇస్తే. అది వేమన సూక్తి రత్నాకరంలోని పద్య సంఖ్యను సూచిస్తుంది. అదే గ్రంథంలో వచనంలోనూ ఇతర ఛందంలోనూ స్థలం నామాలు వస్తే ఆ సంగతి కూడా తెలియపరిచాను.

  1. ఉదయపర్వతం: (777)
  2. కంబము: (9330) ఇది ఊరపేరేనా? ౩. కటారు పల్లె (౪87)
  3. కదిరి: (387) అచ్చు తప్పు 'కదిలి' అని ఉంది.
  4. కనక నగరం: (992)
  5. కనక పర్వతం: (893)
  6. కాంచి: (1107); (1262లో గరుడసేవ)
  7. కాఃతి: (352); 1097 నుండీ 1110 దాకా పధ్నాలుగు పద్యాలలో కాశీయాత్ర నిష్ఫలమని చెప్పారు). (1172); (1485); (1943); 1944; 1948; (2201. 3929).
  8. కులగిరి: (మలయాద్రి) - 1707 (అకాడమీ) 620
  9. కొంకణం: (1172); (అకాడమి 819)
  10. తొండవీడు: 390 వచనం; 474 వచనం; (569) కొండవీటి అఖిరామయ్య; పేరు (2123 చంపకమాల) (2807 సీస పద్యం)
  11. కైలాసం: (1847); (2759); (2760)
  12. గంగ (1232); (1234); (1235)
  13. గండికోటః (1247)
  14. గయః (1107); (1232)
  15. గోదావరి: (298); (1944)
  16. తిరుపతి: (194)
  17. తిరుపతులు: (1919), దివ్య తిరుపతుల సూచన.
  18. తిరుమల: (1944)
  19. నందిదుర్గం: (397), (2155) నిటలదుర్గం అనే ప్రయోగాలు
  20. పర్వతము: (శ్రీశైలం); (165); (419); (3369); (అకాడమీ 965)
  21. ప్రయాగ (1107)
  22. బదరి: (3929)
  23. మక్కా: (2879)
  24. మధుర: (1107)

వేమన, కడపసుబా కవులు 849

  1. మూగచింతల: (390 వచనం); (569)

  2. మోపిదేవి (గుడి): (3116)

  3. మేరు శిఖరము: (524)

  4. రంగధామము: (అకాడెమీ 877)

  5. రామనాథం: (అకాడమీ 819)

  6. వింధ్య: (2151)

  7. సేతువు: (1107); (1512); (3929)

లెక్కకు ముష్ఫుది మూడు స్థలనామాలు వేమనగారి పద్యాలలో కనబడుతున్నా, కాశి, వారణాసి, ఒకటే కనుకు ఛందస్సుకోసం విడివిడిగా వాడారు కనుక వెరసి ముప్ఫయి రెండు స్థలనామాలే అని చెప్పాలి. వేమనగారి స్థల నిర్ణయం చేసేటప్పుడు వింధ్యనూ, దానికి ఉత్తరాన ఉన్న వాటిని మినహాయించాలి. కనకనగరం. కనక పర్వతం, కాశి, వారణాసి, కైలాసం, గంగు గయ, ప్రయాగ బదరి, మేరు శిఖరం, వింథ్య అనే పదినామాలూ పరిగణనలోనికి తీసుకోనక్కర్లేదు. అలాగే మక్కా కూడా మన పరిధిలోనికి రాదు. అంటే ముప్ఫయి. రెండు స్థలనామాలో పదకొండు లెక్కించనక్కర్లేదన్నమాట. మిగతా ఇరవైయొక్క స్థలనామాలు మాత్రమే పరిశీలిస్తే చాలునన్నమాట.

1, ఉదయ పర్వతం అంటే ఉదయగిరి అని అర్థం చెప్పుకొంటే అది నెల్లూరు సీమలోని సుప్రసిద్ధ దుర్గం. 2. కంబం రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉన్న తాలూకా కేంద్రం. కంబం అనే ప్రథమావయ్యంర్లల గ్రామనామాలు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో కూడా కనబడతాయి. 3. కటారుపల్లె అనంతపురం జిల్లా తదిరి కాలూకాలో ఉంది. అయితే చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకాలో ఒక కటార్లపల్లె ఉంది. 4. కదిరి అనంతపురం జిల్లాలోని తాలూకా కేంద్రం. 5. కాంచీపురం సుప్రసిద్ధమైన పురాతన క్షేత్రం. పల్లవుల రాజధాని. రాయలసీమకు చేరువలోనే ఉంది. తమిళనాడులో ఉన్నా తెలుగువాళ్ళకు సంబంధమున్న స్థలం. 6. కొండవీడు కూడా సుప్రసిద్ధమైన దుర్గం. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఉంది. 7. గండికోట కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో ఉంది. 8. తిరుపతి, తిరుమలలు చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. 9. నందిదుర్గం అనే మాటలో నందికొండను సూచిస్తున్నారనుకొంటే ఇది నల్గొండ జిల్లాలో ఇప్పుడుంది. గుంటూరు జిల్లాలో కృష్ణకు అద్దరిని ఉన్న స్థలం ఇది. 10. 'మూగచింతల' గ్రామాలు కనీసం మూడు కనబడుతున్నాయి. ఒకటీ చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకాలో ఉంది. మిగతావి నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకాలో పొదిలి డివిజన్‌ లోనూ ఉన్నాయి. మూగచింతన పల్లె అనే గ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకాలో ఉంది. 11. మోపిదేవి కృష్ణా జిల్లా దివి తాలూకాలో ఉంది.

ముట్లు చాకలికిని మును మంగలికి నంటు కురులు మోపి దేవి గుడికి చేరు

మొక్కులన్ని చేరు మొగి విశ్చకర్మకు విశ్చ్వదాభిరామ వినురవేమ (వే.సూ.ర. 311)

య ధనా 850 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వేన | పై పద్యంలోని మోపిదేవి గుడి దివిసీమలోనిదే అని వేమనగారు భావించారో లేదో గ్‌ | తెలియదు. మోపిదేవిలో నేటికీ ఏటేటా పెద్దపెట్టున సుబ్రహ్మణ్యుస్వామి ఉత్సవాలు బ! స జరుగుతాయని విన్నాను. అక్కడ తలనీలాలు కూడా మొక్కుకొన్నవాళ్ళు ఇస్తారట. ఈ అ ॥ పద్యం పూర్వ పరిశోధకుల దృష్టిలో పడలేదు. శ్రీ శైలాన్ని శైవులు పర్వతం అన్న " పేరుతోనే పెిర్కొంటారు. వేమనగారూ అదే చేశారు. ఇది అత్యంత ప్రాచీన క్షేత్రం. శైవుల పః . /. యాత్రాస్థలం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. బై | 1 ఈ పన్నెండే వేమనగారి పద్యాలలోగానీ, వారి పేరున చలామణీ అయే ఆ . పద్యాలలోగానీ కనిపించే తెలుగు గ్రామనామాలు. స్థలనామాలలో గోదావరి కూడా స | ఉంది గాని ఏ ప్రదేశంలో, ఏ ఊరి దగ్గర గోదావరిని వారు పేర్కొన్నారో తెలియదు. “నొ . ఇకపోతీ మధుర, రంగధామం (శ్రీరంగం), రామనాధం, సేతువూ తమిళనాడులో ప్ర . ఉన్నాయి. ఛత్రపతి శివాజీ రాజ్యాన్ని వేమనగారి కాలంలో కొంకణం అని పిలిచేవారు. అ 1.౨. . ఉత్తరాన గోదావరి నుండి దక్షిణాన సేతువు దాకా, తూర్పున దివిసీమలోని మోపిదేవి | నుండి పశ్చిమాన కొంకణం దాకా వేమనగారు పర్యటించిన విస్తృత దేశమని చెప్పవచ్చు. ఇలాగ ప్రత్యేకంగా ఊర్లను' పేర్కొన్న పద్యాలను గుర్తించి వేమనగారు తిరిగిన | ప్రదేశాలను గుర్తించవచ్చు. వారు తమిళదేశంలో తంజావూరు ప్రాంతాలకు కూడా శీ! మేనరికం ఎంత. అభిలషణీయమో అరవవాళ్ళలో అంత నిషిద్ధం. ఒక పద్యంలో ఖే. వేమనగారు ఇలా చెప్పారు: మేనమామవిడ్డ మెరసి పెళ్ళిమాయె - అరవలందు చెల్లెలాయె నదియు ఏ1. వలసిన పుణ్యంబు, వలదన్న దోషంబు - విశ్చ్వదాఫిరామ వినుర వేమ. ర [ స . (ఓ.లె. 13-4-10) (& గ్‌ దక్షిణాదిన గల రెడ్డందరూ. ఒకనాడు మాతృస్వామ్యంగల ద్రావిడ జాతులకు క్‌ . చెందినవాళ్ళే. మేనరికం మాతృస్వామ్యానికి నిదర్శనం. రెడ్డలో మేనరికముంది. . (| ఇల్లరికముంది. ఏ సీమ నుంచి ఏ సీమకు వలస వెళ్ళినా ఈ ఆచారాలు మారవు. | వేమనగారి పూర్వులు గండికోటకు వలసకెళ్ళాక వారు గండికోట రెడ్డుతో / . కలిశారేమో తెలియదు. అయితే ఒకటిమటుకు వాస్తవం. గండికోటండ్లే వలసవెళ్ళి త తు దక్షిణాదిన మధుర, తిరునల్వేలి జిల్లాలో స్థిరపడ్డారు. వేమనగారికి తమిళనాడులో , పరిచయముంది. అక్కడ సంచరించారు. గండికోట రెడ్డతో సంబంధం ఉండడం వల్లగానీ, లేక వారు గండికోట రెడ్డే కావడం వల్లగానీ ఇది సంభవించిందేమో. చ్‌ శ వేమనగారు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి, ఏ దేశాలో తిరిగినా కడసారి కడప జిల్లా ఈ న పామూరు వద్ద కొండలో ప్రవేశించారని లోకులు చెప్పుకుంటారు. కదిరి పరగణా జ న్య కటార్లపల్లెలో వారి సమాధి ఉంది. ఏటేటా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 1 | వేమన్నగారి శిష్యపరంపరలోని వారమని. కొందరు బక్క గుగ్రాలెక్కి ఊరేగుతారు. జీవి ॥ [| 10. 80ంబా ంకోంరి - 6౫ జారే సరం 0! 5044, కొటి ౪012 0227 జత 2.246 1

జీవిని చంపడం పాపమని బోధించిన వేమనగారి విగ్రహం ముందు పూర్వం వేటపోతులను |

బలివేసేవారు. ఇప్పటికీ వేస్తున్నారేమో తెలియదు. విశాఖపట్నం జిల్లాలో *'గాంధీ

అమ్మోరు'కు కోడిపెట్టలను బలివేయడం ఈ శతాబ్దంలో జరిగిన విడ్డూరమే! -

పరిశోధనతో కూడుకొన్న పని. వేమన్నగారి పద్యాలను పట్టించుకొని ఎక్కడలేని

బాతప్రతులూ తెప్పించి ఎంతో పరిశోధన చేసిన బ్రౌనుదొరగారు క్రీశ 17వ శతాబ్దం 1 ఆరంభంలో వేమన్నగారు ఉన్నట్లు భావించారు. అయితే తాము బ్రాసిపెట్టకొన్న

సంపుటాలలో వేమనగారు 1652లో జన్మించినట్టు, 1725 ప్రాంతాలలో సిద్ధీపొందినట్టు .

  • నోటు చేసుకొన్నారు.ఓ* ఈ సంవత్సరాలను బ్రౌనుదొరగారు పరిష్కరించిన సంకలనాన్ని | ప్రకటించినవాళ్లు స్పష్టపరచలేదు. అందుచేత మన పరిశోధకులు తలొకరూ తలొకవిధంగా . అంచనా వేశారు. వాటి ఏవరాలు చూడండే : |
  1. వంగూరి సుబ్బారావుగారు. 1412-1480 శతకకవుల చరిత్ర పు. 108 .
  2. శేషాద్రిరమణకవులు 1460-1600 వావిళ్ళ ప్రచురణ పు. ఈ
  3. వేదం వెంకటకృష్ణశర్మగారు 1565-1625 శతక వాజ్బయసర్వస్వం 141 .
  4. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. 1650 ఆంధ్రపత్రిక ఉగాది సంచిక 1926 '
  5. బండారు తమ్మయ్యగారు 1625-1725 ఆంధ్రపత్రిక ఉగాది సంచిక 1926 /
  6. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు. 1700-? వేమన పుట 40 - / వేమనగారు 1600-1752 మధ్య ఎప్పుడో ఉన్నట్టు సురవరం ప్రతాహరడ్డిగారు | బ్రౌను దొరగారి అముద్రిత నిర్ణయానికి దగ్గర్లో ఉన్నారు. నాకూ ఇదే అమోదకరం. దానికి | ౫ తా అటే దుబాయ్‌ అనే పరాసు ఫాదిరీ దక్షిణ భారతదేశంలో 1792 నుండి 1823 దాకా శ నాన్న టు. పర్భటనం చేశాడు. “హిందువుల ఆచారాలు” అనే గ్రంథం' రాశాడు. అందులో వేమనగారి హ్‌ క ం | * గరించి చెప్పాడు. 1906లో రచించిన ఈ గ్రథంలో పదిహేడో శతాబ్ధి చివరి భాగంలో ళీ. వేమనగారు ఉండేవారని నిర్ధారణమైనట్టు చెప్పాడు. అంటే క్రీశ 150 ప్రాంతాల ణ్‌. తర్వాతనన్నమాట.12 ఇది వినికిడి వల్ల రాసిన సంగతే గాని వాస్తవానికి దగ్గర్గో ఉంది. గ క్రీశ 1715లో తొలిసారిగా రాయలసీమలో తెలుగువారు కైస్తవ మతంలో చేరారు. | ల్త్తో వారికి గురువైన జెసూట్‌ ఫాదిరీ సంజీవనాధ స్వామి అనేపేరుతో ప్రచారం చేసే ఫాదర్‌ లీగాక్‌ స ఈయన మతంలో చేరిన వారి దగ్గర ఉండే హిందూ గ్రంథాలను సేకరించి 1730లో పారిస్‌ !. నగరంలో ఉండే ఫ్రెంచి రాజుగారి గ్రంథాలయానికి పంపించాడు! ఈ గ్రంథాలలో న. 2 ఎమునసన.. పసన. సకస కనిప ప న లా | |
  7. ఓ.లై. 0.1773 - వేమనపద్యాలు 1వ భాగంలో మరణకాలం, నాలుగోభాగంలో జననకాలం నోట్‌ . చేశారు. - !
  8. 4006 ౮.4. ర4001 - 11044 11200ల9 36 54600 90.2745 " ॥
  9. జర్నల్‌ ఆఫ్‌ బోంబే హిస్టారికల్‌ సాసైటీ - 4వ సంపుటి (1%) - పుటలు. జి-౯. |

852 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వేమనగారి పద్యాల సంకలనం ఉంది. ఇందులో మూడువందల పైచిలుకు పద్యాలున్నాయి. వేమనగారి పద్య సంకలనాలలో ఇది ప్రాచీనతమ ప్రతి అని భావించవచ్చు. 1730 నాటికే వేమనగారి చాటువులు ప్రచారంలో ఉండడమే కాక తాటాకులకు ఎక్కాయి.

ఏ సాహితీపరుడైనా వేమనగారి వంటి ప్రతిభావంతుల వల్ల ప్రభావితులు కాక తప్పదు. ప్రస్తుత్తించక తప్పదు. అనుకరణ అత్యుత్తమ ప్రశంస అంటారు. మన సాహిత్యంలో చెప్పుకోదగ్గ కవులెవరెవరు వేమనగారిని అనుకరించారో చూద్దాం.

కూచిమంచి తిమ్మయ్యగారు సుప్రసిద్ధులు. కవిసార్వభౌమ బిరుదాంకితులు. లాక్షణికులు. బహుకావ్యకర్పలు. ఆయన 1715 నాటికే రుక్మిణీ పరిణయం అనే కావ్యం మొదలుపెట్టారు. 1720 ప్రాంతాలలో రాజశేఖర విలాసం అనే కావ్యం చెప్పారు. అందులో వేమనగారిని ఒకటి కాదు రెండు పద్యాలలో అనుకరించారు. “కామిగాకమోక్షగామి గాడు' అన్న పద్యపాదం వేమనగారి పద్యాలలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని కూచిమంచి తిమ్మయ్యగారు ఎలాగ వాడుకొన్నదీ చూడండి:

కోరియాచార్యు భామిని గూడినట్టి కైరవాప్తుడు మిక్కిలి కామిగాడె

కామి గాకున్న యట్టి యస్థృలితుడెవడు? కామిగాడేని నిర్వాణ కామ్‌ యగునె?

(రాజశేఖర. ౩3-110) ఈ పద్యం ఆటవెలదిలో కాక తేటగీతిలో చెప్పడం గమనించదగ్గ విషయం. అయితే తూచిమంచి తిమ్మయ్యగారు ఆటవెలదిలో కూడా వేమనగారి భావాలను అనుకరించక పోలేదు. రాజశేఖరవిలాసంలోనే ఈ పద్యం వినండి :

ధనము గల్లియుండ ధర్మంబు సేయక యెన్ననదియు బరులకొదవుగాదె

తీటులెల్ల గూడీ తేనియ గూర్చీన నొరుల కబ్పినట్లు లెరుగు కొనిన

(రాజశేఖర - 1-97) ఇందులోని భావాలేకాక కొన్ని మాటలు కూడా వేమనగారి పద్యంలోనివే కావడం ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను దినక లెస్స దాచు గాక

తీనె నీగ కూర్చి తెరువరి కీయదా విశ్చదాఖిరామ వినురవేమ

(టౌను 19) పుట 19 పద్యం 12) వేమనగారి పద్యంలో పొదుపు ఉంటుంది. అదే భావాన్ని ఇతరులు నాలుగ పాదాల్లోకి సాగదీయాలి. కూచిమంచి తిమ్మయ్యగారు అదే చేశారు.

వ్రాత వెంటగాని వరమీదు దైవంబు సేత కొలదిగాని బ్రాతకాదు

బ్రాత కజుడు కర్ష సితకుదా కర్త విశ్చదాఖిరామ వినుర వేమ

(టౌను 189 - పుట 1803 2౫) ఇది వేమనగారి సుప్రసిద్ధ పద్యం. దీనిని కనుమర్తి అబ్బయ్య అనుకరించాడు. ఉష కలలోకన్న చిన్నవాడెవడో తేల్చుకొనడానికి చిత్రలేఖ వివిధ రాకుమారుల చిత్రపటాలు

వేమన, కడప సుబాకవులు 853 గీస్తుంది. ఆ సందర్బంలో వేమనగారి పద్యాన్నే తీసుకొని చమత్కరిస్తూ అబ్బయ్య అనిరుద్ధ చరిత్రలో ఇలా పద్యం చెప్పాడు: “ బ్రాతకజుడు గర్హ సేతకు దా గర్హ యనుటకిది విరోధమైననేమి సేత కజుడు కర్త వ్రాతకు దా గర్హ యంచు చిత్రలేఖ దనగవచ్చు. (అనిరుద్ధ - 2-98) కనుమర్తి అబ్బయ్య 1745 నాటికి అనిరుద్ధ చరిత్ర రాసి ఉంటాడని చరిత్రకారుల నిర్ణయం. ఒక్క అనిరుద్ధ చరిత్రలోనే కాదు. కవిరాజ మనోరంజనం అనే “పురూరవ చరిత్రలో కూడా అబ్బయ్య వేమనగారి నడకని అక్కడక్కడ అనుసరించాడు: సుదతి వ్రతము చెడిన సుఖము దక్కగవలె నన్నమాట దలచు కొన్నదేమొ? కాపురంబు జేనె గలికి ముచ్చటదీర మగని విడిచి తేరమగని యింట (కవిరాజు - 2-7) కనుమర్హి అబ్బయ్య ప్రౌఢ కవులలో ప్రసిద్ధుడు. కూచిమంచి జగ్గన్న ఇంకొకరకంగా ప్రసిద్ధుడు. ఇతడు కూడా వేమనగారిని అనుసరించినవాడే. వేశ్యలమీద వేమనగారు ఎన్నో పద్యాలు చెప్పారు. వాటిలో బాగా ప్రచారంలో ఉన్నది వినండి: లంజె లంజెకాని లావెల్ల కొనియాడు లంజె తల్లి వాని లజ్జి కడుగు తల్లి గలుగు లంజె తగులుట దోషంబు విశ్వదాఖిరామ వినురవేమ (బౌను (అకాడెమీ ప్రతి) 355) ఈ పద్యంలోని భావాన్నే కూచిమంచి జగ్గన్న చంద్రరేఖావిలాపంలో ఇలా చెప్పాడు: వెల్లు కల్లలల్లి బొల్లి మాటలు జల్లి మెల్లమెల్ల నిల్లు గుల్ల జేయు తల్లి గలుగు లంజె నునులోలమతి జేరు వల్లవులకు సౌఖ్యమిల్ల జగతి (చంద్రరేఖ 2-30) ఏది ఏమైనా, 1720 నాటికే రాజశేఖరచరిత్ర రచించిన కూచిమంచి తిమ్మయ్యగారి కాలానికి వేమనగారి పద్యాలు చాలా ప్రచారంలో ఉన్నాయంటే 1730లో సంజీవనాధస్వామి (లీగాక్‌ ఫాదిరి) పారిస్‌ నగరానికి వేమన పద్య సంకలనాన్ని పంపగలగడంలో విడ్డూరమేమీ ఉండదు. వేమనగారు క్రీ.శ. 1700 నాటికే సుప్రసిద్ధులని నిరూపించడం ఇలా జరిగింది గాని ఆయన కచ్చితంగా ఏయే సంవత్సరాలలో జీవిచారో పరిశోధించాలి. ఇది తూడా కొంత శ్రమపడితే సాధ్యమే. మరికొన్ని ఆకారాలను పరిశీలించుదాం. వేమనగారి పద్యాలు తెలుగు ప్రాంతాలలో ఎంత బహుళ ప్రచారం పొందాయో, తంజావూరులోనూ అంతే ప్రాచుర్యం పొందాయి. తంజావూరు సరస్వతీ మహలులో వేమన పద్యాల కాళపత్ర ప్రతులు నాలుగు ఉన్నాయి.ే నాగరలిపిలో కాగితాలమీద రాసిన ప్రతి ఇంకొకటి ఉంది.]5

  • తజావూడు కేటలాగ ప్రయ సంపుటిలో 2.౮1? నుండి డి 14 దాకా ఉన్న ప్రతులు *. తండి.415

854 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

నాగరలిపిలో రాసిన ప్రతి మహారాష్ట్ర రాజులకోసం తయారు చేసినదే కావచ్చు. తాళపత్ర గ్రంథాలు తిలుగు లిపిలోనే రాశారు. మహారాష్ట్ర రాజుల మాతృదేశం కొంకణం. తంజావూరులో వారు కొంకణేశ్వరునికి ఆలయం కట్టారు భోసల రాజులలో ఆఖరివాడైన శీవాజీ (1832-1855). తన “అన్నపూర్ణా పరిణయం' అనే నాటకంలో “కొంకణేశ్చర అన్నపూర్ణల పూర్వోదంతము వారి పరిణయం” వర్ణించాడు. వేమనగారి కాలంలో మహారాష్ట్రాన్ని కొంకణమనే పిల్చేవారు కాబోలు. వారు చెప్పిన రెండు పద్యాలలో కొంకణం ప్రసక్తి కనబడుతుంది.

మొరుగు రాజ్యమెల్ల మొక్క బోవును కొంత రామనాధమేగి రట్టు పడును

వినని వింతలెల్ల వినును కొంకణమందు విశ్వదాభిరామ వినురవేమ

(బౌను (అకాడమీ ప్రతి) 819)

ఈ పద్యం మొదటి పాదంలోని మొదటి మాట 'మొరుగు' అనేది అసాధు పాఠం. మొరకు రాజ్యం అని వేమనగారు ఉద్దేశించారేమో. బ్రౌను దొరగారి 1839 ప్రతి పునర్ముద్రణ పీఠికలో ఈ పద్యాన్నే ఉటంకించి బంగోరె 'మొరసురాజ్యం అనే పాఠాన్నే ఇచ్చాడు. మైసూరు రాష్ట్రంలోని కోలారు ప్రాంతాలను 'మొరసునాడు' అంటారు. ఇది ఒక మండలంలోని నాడేగాని ప్రత్యేకంగా రాజ్యం కాకపోవచ్చు. బ్రౌను దొరగారు ఈ పద్యానువాదంలో “ఫూల్సు” అను మాట వాడారు కనుక సాధుపాఠం 'మొరకు కావచ్చు. ఇాహాజీ పరిపాలనా కాలంలో ఛత్రపతి శివాజీ కుమూరుడు రాజారాం చెంబీకోటలో ఉండేవాడు. మొగలాయి సైన్యాలు చెంజీని 1691 నుండీ 1697 దాకా ముట్టడీంచాయి. రాజారాం సహాయార్థం శాహాజీ సేనలను పంపించవలసిన తరుణంలోనే సేతుపతి తన రాజ్యాన్ని మధురనాయక రాజులు కలోలపరుస్తున్నారని మొరపెట్టుకొంటూ సహాయం అర్థించాడు. శాహాజీ తన సేనలను చెంజికి పంపించకుండా రామనాథునికి పంపాడు. ఆ సేనలు పగవాళ్ళను ఓడించి సేతుపతి రాజ్యాన్ని నిలబెట్టాయి.” రామనాథునికి వెల్లి రట్టుపడినవాళ్లు మధుర నాయకరాజు “'మొరకు' అన్నదే వేమనగారి పాఠం అయిడే ఈ చారిత్రక విషయాలు ఈ పద్యానికి నప్పుతాయి. చెంజికోట మొగలాయి ముట్టడీని తట్టుకొంది. కొంకణంలో ఈ వార్త వింతగానే వినబడి ఉండవచ్చు.

ఇది వేమనగారి పద్యమే అయితే ఆయన తంజావూరులో 1697 లోపున ఉండడానికి ఆస్కారం ఉంది. వేద ప్రామాణ్యాన్ని యజ్ఞయాగాదులనూ, బ్రాహ్మణారి కృతనూ, విగ్రహారాధననూ అంగీకరించకపోయినా వేమనగారు తత్త్వబోధన చేస్తో సంసారయోగాన్ని ఉపదేశించారు. తంజావూరు రాచనగరంలో వారి ప్రభావం భోసలి రాజుల మీద ప్రగాఢంగా ఉండితీరాలి. శాహాజీ, శరభోజి, తుళజూజీలు ముగ్గురూ సంస్కృతాంధ్ర మహారాష్ట్ర భాషలో సాహిత్య రచనలు చేసినవాళ్ళే. శాహాజీ కాలంలో యక్షగానాలు, శృంగారపదాలు విరివిగా కవులు చెప్తున్నా ఈ రాజు మాత్రం వైరాగ్య 17. స్రధర వెంకటిపల శాహాజీ విలాసం. పంచమసర్గ - ౮-55 శ్లోకాలు షష్టస్సర్ణఅునుండి ౫ దాకా ఉన్న

కాలు.

నీతిపద్యాలు త్యాగేశముద్రతో విరచించాడు. ఈ పదాలలో వేమనగారి ప్రభావం ఏమైనా ఉందేమో చూడాలి : తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్చదాఖిరామ వినుర వేమ (టౌను 9381) పుట 12 పద్యం 74) ఇది వేమనగారి సుప్రసిద్ధ పద్యం. దీని ఛాయలు శాహాజీ ముఖారి రాగంలో ఒక పద్య, టో ఉన్నాయి.కేకి పుట్టినప్పుడే కీర్పి పుణ్యమార్జించే వాని పుట్టుక సఫలము పోనే అట్టు శాయనివాని పుట్టుక యాలనే పుట్టలో చీమలు పుట్టలేదటవే. వేమనగారి పద్యంలోని చెదలు శాహాజీ పదంలో చీమలయ్యాయి. తంజావూరు భోసలరాజులు చెప్పిన నీతి వైరాగ్య పదాల మీద కొద్దిగానైనా పరిశోధనలు ప్రారంభం కాలేదు. సరస్వతీ మహలు గ్రంథాలయంలోని తెలుగు పండీతులు ఎన్‌. విశ్చ్వనాథంగారి సంపాదకత్వంలో శాహాజీ మరాటీలో చెప్పిన త్యాగేశపదాల సంకలనం ఇటీవల నాగర లిపిలో వెలువడింది. ఈ మరాటీ పదాలను తెలుగు లిపిలోనే మొదట రాశారు. శాహజీ చెప్పిన తెలుగు పదాలను కొన్నింటిని విశ్చనాథంగారు నోటు చేసుకొన్నారు. కాంభోజిరాగంలో చెప్పిన 'చదివితేనే జ్ఞాని ఆయనా?” అనే పదం డీ. 44 ప్రతిలోనిదే. ఇది కాకర్ల త్యాగరాజస్వామి రచనగా పరిశోధకులు పౌరపడ్డారు.!9 వేమనగారు సంసార యోగాన్ని ప్రశస్తయోగంగా ప్రబోధించడం వల్లనే తుళజాజీ 'రాజరంజన విద్యావిలాసం'లో గృహస్థాశ్రమాన్ని పాటిస్తూనే మోక్షం సంపాదించవచ్చని కచ్చితంగా చెప్పాడు: సకల ధర్మంబులు సకల కామ్యములు సకల పుణ్యములు మోక్షము వీలుగాన నార్జింతు రీ గృహస్థానాశ్రంబునను వర్ణించి పాపాది వర్గంబు నెపుడు (రాజరంజన-పుట 3) మోక్షం బ్రహ్మజ్ఞానం వల్లనే వస్తుంది. వేమనగారు ఇలా చెప్పారు: ట్రహ్మమనగవేరం పరదేశమునలేదు (బ్రహ్మమనగ తానె బట్టబయలు తన్నుదా నెరిగిన తానెపో (బ్రహ్మంబు విశ్చ్వదాఖిరాము వినురవేమ (బౌను (19) పుట 47 పద్యం 313) తుళజాజి కూడా సరిగ్గా ఈ మాటనే రాజరంజన విద్యావిలాసంలో “దండిగా తాను తెలియ తానెపో బ్రహ్మ'మన్నాడు.2) తుళబాజి క్రీశ 1729 నుండ్‌ 1792 దాకా శంజావూరును పాలించాడు. ననన 18. తం.మ.స. కేటలాగు ప్రథమ సంపుటి డి. 34

  1. "ప్రజాకవి వేమన' - డాక్టర్‌ ఎన్‌. గోపి పుట 402. ౫. రాజరంజన విద్యావిలాస నాటకం - పుట ౫.

856 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి భోసల రాజుల కాలంనాటి సుప్రసిద్ధ ప్రబంధకవులు వెలిదండ్ల వెంకటపతి, ముద్దపళని మొదలైనవారు. వెంకటపతి “రాధామాధవ సంవాదం' రచించాడు. వెలిదండ వెంకటపతి రాధామాధవ సంవాదంలో ఆరు ఆటవెలదులు రాశాడు. నడకలో: విరుపులలో ఇవి వేమనగారి బాణీలోనే ఉన్నాయి.** ఈ కవి 1700 ప్రాంతాలవాడు, ఇంకొంచెం ముందువాడు కావచ్చు. భోసలరాజులలో ప్రతాపసింహుడు కూడా ప్రసిద్ధుడే. ఇతడు 1739 నుండి 176 దాకా తంజావూరు పాలించాడు. ఇతని ఆదరణలోనే ముద్దుపళని ఉండేది. ఈమె “రాధికా సాంత్వనం' అనే కావ్యంలో 14 ఆటవెలదులు రాసింది. బాణీ వేమనగారిదే: సౌమ్ము నియ్యవచ్చు సమ్మంద మియవచు నియ్యరాని ప్రాణ మియ్యవచ్చు దనదు విభుని వేరు తరుణి చేతికినిచ్చి తాళవశమె యెట్టి దానికైన (రాధికా సాంత్వనం 1-74) ఈ కావ్యంలోని మిగతా ఆటవెలది పద్యాలు కూడా ఇంత సాఫీగా నడుస్తాయి. వేమనగారి ఆటవెలదులు తెలుగు సాహిత్యంలో ప్రవేశించాక ఏ కవి చెప్పినవైనా ఆ విరుపులు, ఆ సాంపులూ సంతరించుకోక తప్పదు. తంజావూరులోనే జయసింహుని ఆస్థానకవి నెల్లూరి కివరామయ్య వేమనగారిని అనుకరించాడు.22ో గ్రంథవిస్తర భీతి చేత చెప్పడం లేదు గాని పద్దెనిమిదో శతాబ్ది ఉత్తరార్థంలో చాలామంది కవులపై వేమనగారి పద్య రచనా శిల్స ప్రభావం ముమ్మరంగా ఉంది. ఈ ప్రకరణంలో ఇప్పటిదాకా చూసిన ఉదాహరణలు చాలు. వేమనగారిని అనుకరించిన కవుల పేర్లను చారిత్రక కాలక్రమంలో క్రోడీకరిస్తే నిర్దిష్టమైన సాక్ష్యాలతో వారి ప్రభావ ప్రచారం విశదమవుతుంది. వరుస పేరు రచన పేరు కాలం క్రీశ

  1. కాహజీ వైరాగ్యనీతిపదాలు 16-1710 2 వెలిదండ్ల వెంకటపతి రాధామాధవసంవాదం 1700 ప్రాంతం
  2. కూచిమంచి తిమ్మకవి రాజశేఖర విలాసం 1720 రచనా కాలం &.. తుళజాజీ రాజరంజన విద్యావిలాసం 1729-1732
  3. కూచిమంచి జగ్గన్న చంద్రలేఖా విలాపం 1730 ప్రాంతం &ఓ ముద్దుపళని రాధికాసాంత్వనం 1739-1763
  4. నెల్లూరి శివరామయ్య కామకళానిధి రామగితలు 1740 & కనుపర్తి అబ్బయ్య అనిరుద్ధచరిత్ర 1745 ప్రాంతం కవిజన మనోరంజనం లభ్యమవుతున్న వేమనగారి పద్య సంకలనాలలో అత్యంత ప్రాచీనమైన తాళపత్ర ప్రతి 173 అనీ, దీని లేఖన కాలం 1691 ఏప్రిల్‌ 24 అనీ పరిశోధకులు భావిస్తున్నారు.ే
  5. రాధామాధవ సంవాదంలోని ప్రథమాశ్వాసంలోని 19, 41, 90 నెంబరు పద్యాలూ, ద్వితీయాశ్వాసా లోని 51, 2, 92 నెంబరు పద్యాలు ఆటవెలదులు. 2 కడపటిరాయల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటీ. 224 ప్రజాకవి వేమన - పుట 6.

వేమన. కడప సుబాకవులు 857 ఇప్పటిదాకా చూసిన సాక్ష్యాలవల్ల వేమనగారి కాలనిరయం సుఖాసుఖాల శ్రేలిపోయినట్టే లెక్క. క్రీశ. 1650 నుండి 1700 దాకా వారు దేశంలో సంచారం చేసి ఉంటారు. ఈ విషయంలో నాకుగాని, ఈ రుజువులు గమనించిన మీకుగాని ఈషణ్మాత్రం అనుమానం సైతం లేకపోవచ్చును: వారు ఎంతకాలం జీవించారు? బాల్య వార్థకములు పరగంగ బొందిది సప్త దశకమనెడు సరణిసుమ్ము (వివరమెంచి) జూచి వేదాంతమెరుగడీ విశ్చదాఖిరామ వినురవేమ. ఈ పద్యం పారిస్‌ ప్రతిలోనేగాని బందరువారి వేమన సూక్తి రత్నాకరంలో లేదు. నేదునూరివారి సంకలనంలో కూడా లేదు. ఈ పద్యంలో డెబ్బయి సంవత్సరాల పరిమితిని సూచించారు. ఇంకో పద్యంలో పండు ముసలితనాన్ని చెప్పారు. అంగమెల్ల వొంగి అటుదంతములు వీడి తనువు జరయుచేత తరచు వణికీ ముప్పు తిప్పలు బడ మోహంబు లూడవో విశ్చదాఖిరామ వినురవేమ (పారిస్‌ ప్రతి - నెం. 116) నడుము వంగిపోయి, పళ్ళు ఊడిపోయి, ఒళ్లు వణుకుతున్న వార్థక్యాన్ని ఈ పద్యం సూచిస్తోంది. ఇందులో వేమనగారు స్వీయ ప్రాయాన్నే వర్ణించుకొన్నారా? ఆయన క్రీశ 1697లో డెబ్బయ్యోయేట తంజావూరులో వుండి 'మొరకురాజ్యం' పద్యం చెప్పారనుకొంటే 1627 ప్రాంతాలలో జన్మించారని ఊహించవచ్చు. వేమనగారు ఎప్పుడు కాలం చేశారో చెప్పలేము. ఆయన పోయినా ఆయన పద్యాల భావాలూ, ప్రభావాలూ శాశ్వతంగా ఇప్పటికీ ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. ఏడు మతములాన యెవ్వడైనాగాని మత మెరింగినట్టి మర్కిలేడు మతము మూల మెరుగ మరణమే లేదయా విశ్చదాఖిరామ వినురవేమ (పారిస్‌ ప్రతి - నెం. 316) వేమన్నగారు ఎన్ని పద్యాలు వ్రాశారో ఎవరూ తేల్చలేదు. బ్రౌనుదొరగారు సేకరించినవి 2500. అయితే పాఠాంతరాలను కేటాయిస్తే ఆ సంఖ్య 2000 కన్నా మించదు. అయితే అద్దేపల్లి అండ్‌ కో వారు 5010 పద్యాలను ప్రచురించారు.లే ఇందులోని పొనఃపున్యాలను, పాఠాంతరాలను ఓపికగా వేరు చేస్తే ఇవి కూడా 3000 దాటకపోవచ్చు. దేశంలో ఉన్న అముద్రిత ప్రతులను పట్టి ఒక అధికార పరిష్కరణ జరగాలి. వేమన పద్యాలు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 58 సంపుటాలలో ఉన్నాయి (0-1721 నుండీ 5- 1774 దాకా 54 ప్రతులూ, 0-1830 నుండి 0-1833 దాకా 4 ప్రతులూ వెరసి 58 ప్రతులు). తంజావూరులో 5 ప్రతులు ఉన్నాయి. మద్రాసులోని తొలి 54లోనూ చివరి రెండూ ఇంగ్లీషు వ్యాఖ్యానాలతో బ్రౌనుదొరగారు రూపొందించిన సంకలనాలు 3,228 పద్యాలు 5 భాగాలలో ఉన్నాయి. ఈ విభాగాలకు బ్రౌనుదొరగారు ఆశ్వాసాలని పేర్లు పెట్టారు. ప వచన పద్యాల నమగాగా చచలుదాలనే సంకల్పం మిత్రులు అద్జేపల్లి నాగేశ్వరరావుగారిక్‌ కలగడం చాలా హరింపతగది. ఈ సంకలనాన్ని సేకరించిన నేదునూరి గంగాధరంవారికీ వ్యుత్చత్తికన్నా ఉత్సాహమే దొలా ఎక్కువ కావడంచేత పరిష్కరణ నిర్జష్టంగాలేదు.

858 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి మొదటి మూడు భాగాలనే ప్రచురించారు. చిల్లర పద్యాల భాగంకాక అల్లీల పర్వం అవే పేరిట బూతుపద్యాలను వ్రాసి, వివరణ ఇంగ్లీషులోకాక లాటిన్‌లో వ్రాసుకొన్నారు. అన్లీలపర్వంకాక మిగతావే బ్రౌనుదొరగారు పరిష్కరించినవి ఒక వెయ్యి పద్యాలు ఉంటాయి. వీటిని ఏ ఆకాడమీవారో ప్రచురించి పుణ్యం కట్టుకొంటే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు వేమన పద్యాలను 100 ఏరి సంస్కృతం లోనికి అనువాదం వేయించి ప్రచురించారు. ఈ తర్జుమూ ఎస్‌.టి.జి. వరదాచార్యులవారు చేశారు. “విశ్వదాఖిరామ వినురవేమ అనే మకుటాన్ని పెట్టడానికి “వేమవిశ్వద* అని ప్రతిళోకం చివరా వచ్చేలా చూశారు. వరదాచార్యులవారే కాక మరికొందరు కూడా వేమన పద్యాలను సంస్కృతంలోనికి అనువదించారు. గద్వాల ఆస్థాన కవులు శతావధానులు గంథం శ్రీరామమూర్తిగారు, ఇర్రింకి నరసింహమూర్తిగారూ, “వేమనగీత' అనే పేరుతో అనుష్టుపష్పు శోకాలుగా అనువదించారు. వేమ అనే మకుటపదం శోకంలో

  • ఎక్కడో ఒకచోట వచ్చేటట్లు తర్జుమా చేశారు. అయితే వీరు వేమన్నగారి కాలనిర్ణయంలో మాత్రం కొన్ని విడ్డూరాలు చెప్పారు. వేమన్నగారు. బమ్మెరపోతరాజుగారి సహాధ్యాయులట!

ఈ గద్వాల శకావధానులేకాక మరికొందరు కూడా వేమన్నగారి గురించి అపూర్వమైన విషయాలు చెప్తున్నారు. చార్లెసు ఇ గోవరుదొర వేమన్నగారు నన్నయకు పూర్వుడని ఊహాగానం చేశాడు. ఈయన (బబౌనుదొరగారి భావానువాదాన్ని ఆధారు చేసుకొని వేమన్నగారి సూక్తులతు ఇంగ్లీషు పద్యానువాదం చేశాడు. టేతుమ్లో కామేశ్వరరావుగారు ఇటీవల వేమన్నగారిని తీసుకువెళ్లి శంకరాచార్యులవారి పక్కన పెట్టారు. ఆ ఇద్దరూ సమకాలికులకుః శ్రీశ 800 ప్రాంతాలలో ఉన్నారట. వేమన బాహ్మడేనట. 'విశ్చదాఖిరామ వినుర వేమ' అనే మకుటంలో మొదటి సమాసానికి అర్థం “బ్రాహ్మణా అని చెప్పుకోవాలట (విశ్చదుడు అంటే జగత్తు నిచ్చినవాడు - బ్రహ్మ అతనికి అభిరాముడు అనగా టబ్రీతియైనవాడు బ్రాహ్మణుడు). టేకుమళ్ళవారు ఈ వాదాన్ని ఇటీవల ప్రకటించారు.*్‌్‌ ఇది ఎవరూ తలకు చుట్టుకొనని రోకలి!

వేమన్నగారి పద్యాలలో కొన్నింటిని అధునిక రసాయనళాన్తజ్ఞానంతో పరిశీలించాలి. ఆయన చాలా పద్యాలలో హేమకారక విద్య గురించి చెప్పారు. చౌక లోహాలను బంగారం చేసి విద్యను వారా పదాలలో విడమర్చినట్టు పండితలోకు చెప్పుకొంటుంది. వేమన్నగారు జీవితంలో నిజంగా బంగారం చేశారో లేదోగాని వాళు పలికిన పలుకులే బంగారం చేశారు.

వేమన్నగారు సంచారం చేస్తున్న రోజులలో కడప సుబాలో నడిమింటి వెంకటపతి అనే కవి మట్లవారి ఆశ్రితుడై ఉండేవాడు. అనాడు కడపలో సిద్ధవటంసీమ చాలా ప్రముఖమైనది. అది మట్టవారి అమరం. తెలుగు సాహిత్యంలో మట్లవారు తరతరాలుగొ 24 ౫ గక 5ంం్రా ఆ కంకలా ఇత - ఆ యాజ ౬ రణ మగుట తరు 191 జ. అంధ్రపరిషత్ప్సత్రికు సంపుటి 5 సంచికలు. 5-6

వేమన, కడప సుబాకవులు 85౪ ప్రసిద్దులయ్యారు. మట్ల అనంతరాజుగారు కాకుత్‌స్థ విజయం వ్రాశారు... ఈయన మనుమడు కుమూర అనంతరాజూ కుముద్నతీపరిణయాన్ని రచించాడు.2” ఈయనకు మణుగుభోజనం అనంతరాజుగారనే మారుపేరు ఉంది. ఈయన అన్నపానాదులకు సహా వేళకు మణుగు. ఎత్తుకల్లిన పదార్థాలు భోజనం చేసేవారని మట్లవారి కైఫీయత్తులో ఉంది ఈ అనంతరాజేకాక ఇతని తమ్ముడు ఎల్లమరాజు కూడా కవే. ఈయన ఒకసారి అవిధేయుడైతే అన్నగారు సిద్ధవటంలో ఖైదు చేయించారు. అప్పుడు ఎల్లమరాజు ఒక కృతి చెప్పి భట్రాజుల చేత అన్నగారికి పంపించాడు. అది ఉదాహరణ కావ్యం. దానిలోని ఒక పద్యం మాత్రమే దక్కింది.

శాంతిక్‌ దుర్గుణదోష సంఘముల నెంచంబోకు కారుణ్యసం

క్రాంత స్వాంతమునన్‌ శుభాన్వితునిగా గావించి పోషించు థీ

మంతా మట్లకుమారానంతనృప సమ్యగ్వాప్రసూనావళీ

కాంతంబై తగు నీ యుదాహరణమున్‌ గల్పించి పూరించితిన్‌.

(లో.రి. 22, పు. 221)

మట్ల ఎల్లమరాజు పూరించిన ఈ ఉదాహరణం విని మణుగు భోజనం అనంతరాజు సంతోషించాడు. తమ్ముణ్ణి ఖైదునుంచి విడుదల చేశాడు. రాచకార్యాలు అప్పచెప్పాడు. ఈ అనంతరాజుకు సంతానం లేదు. అంచేత తన రెండో తమ్ముడి మనవణ్ణో పెంచుకున్నాడు. ఇతని పేరుకూడా అనంతరాజే. వాస్తవానికి మట్లవారి తుటుంబంలో ఈయన భారాన్ని మణుగు భోజనం అనంతరాజు తన తమ్ముడు ఎల్లమరాజు పైన పెట్టి పన్నెండు సంవత్సరాలు పాలించి మరణించాడు.

ఇమ్మడి తుమూర అనంతరాజు పినతండ్రీతో సహా కొన్నాళ్లు పాలించి మీర్‌జుమ్లా దాడికి తట్టుకోలేక రాణీవాసంతో సహా హ్కోరిబసవాపురం పారిపోయాడు. ఈయనా, ఈతని తమ్ముడు వెంకటరామరాజు దావూద్‌ఖాన్‌ కొలువులో చేరారు. చాలా శ్రద్ధగా ఆరికాడు, గుత్తి, గుర్రంకొండ, పెనుగొండ మొదలైన స్థలాలలో ఉండే పాశెగాళ్ళమీద యుద్ధాలు చేశారు. ఈ విశ్వాసం వల్లనే దావూద్‌ఖాను వీళ్లకు మళ్ళీ సిద్ధవటంసీమ ఇప్పించాడు. ఇమ్మడి కుమార అనంతుడు పోయినా అతని కొడుతు తిరువెంగళరాజు పేర ఈ ఫర్మానా వచ్చింది. తమ్ముడి కొడుకును వెంకటరామరాజు సంస్థానంలో నిలిపాడు. తిరువెంగళరాజుకే అప్పయ్యరాజని మారు పేరు ఉంది.

శ్రీశ 1703లో అప్పయ్యరాజా సిద్ధవటం, పోరుమామిళ్ల బద్దెవోలు సీమలలోని మన్నెకావలి సాధించుకొని అనుభవించసాగాడు. తనకోసం పినతండ్రి వెంకటరామరాజు ఎంతో పాటుపడ్డాడు. అంచేత ఆయన కీర్తి శాశ్వతంగా ఉండాలని తన అఆశ్రితుడు వడిమింటి వెంకటపతిచేత ఒక కావ్యం చెప్పించి పినతండ్రికి అంకితం ఇప్పేందాడు. _ ౫. మలిరాయల యుగం. సమగ్రాంధ్ర సాహిత్యం. ఇదే సంపుటి. ₹. వాయకరాజుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి ౫. వ్యానిక చరిత్రలు, బ్రౌను సంపుటాలు, వెం. 2 పుట 221.

860 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

నడిమింటి వెంకటపతి; ఈయన కుటుంబం గురించి వివరాలు ఏమీ తెలియవు చాతుర్యసంపత్తితో చాలా సంస్కృతకావ్యాలు తెనిగించాడు. భోజచంపువును అఖిషిక్తరాఘవం అనే పేరిట అనువదించాడు. అందుకే కావ్యాదిని భోజరాజును హంసించాడు.

రాజిల్లున్‌ మహినెవ్వరిన్‌ గనినచో రాజీవభూజాయయున్‌

భాజన్నిర్మలకీర్తియున్‌ నృపసదఃపాండిత్యమున్‌ సత్కళా

రాజి ప్రాప్తియు నర్ధ సంపదయు జిత్రం బగ్గురున్‌ సచ్చదం

భోజున్‌ భోజు నుతించుగాత మనిశంబున్‌ నామసంబెంతయున్‌ (0.380 భోజుణ్జీ గురువుగా భావించి తెలుగులో కవిత్వం చెప్పేవాడి రచన ప్రొఢంగానే ఉండాలి మరి.

వెంకటపతి రచించిన ఇతర కృతులేమిటో తెలియవు. అయితే ఇతను ఇతర సమకాలిక కవులకు చాలా తోడ్పడేవాడు. వాళ్ళలో రావు కొండలరాయుడు ఒకడు. ఈ సంగతి సహాయం పొందిన రచయితల రచనలవల్ల తెలుస్తూంది.

రావు కొండలరాయుడుః కడపటి రాజుల యుగంలో చిత్ర కవిత్వానికి చప్పట్లు కొట్టే చదువరులు చాలామంది ఉన్నారు. అయితే చిత్రకవిత్వ ప్రక్రియలను బోధించే గంథాలు చాలా తక్కువ

అప్పకవీయం వంటి గగ్రంథాలున్నా అవి చిత్రకవిత్సం బోధించవు. అందుచేత రావుకొండలరాయుడు అనే ఆయన చిత్ర కవితాదర్చణం అనే గ్రంథాన్ని తూర్చాడు ఇందులో సంస్కృతాంధ్ర కవుల ప్రబంధాలలోని చిత్రాలన్నీ పొందుపరిచాడు. కొన్ని చిత్రబంధాలు కల్పించాడు. వాటికి తగిన పద్యాలను నడీమికంటి వెంకటపతి చేత రచింపజేశాడు.

ఈ చిత్ర కవిత్వదర్చణం సమగ్రమేగాని అముద్రితం. దీని పూర్వభాగంలో %, ఉఊత్తరభాగంలో 6 వెరసి చిత్రప్రక్రియలు ఉన్నాయి. దీని ప్రతి ఒకటి ప్రాచ్చలిీ బగ్రంథాలయంలో ఉంది. (0 1045)

ఈ యుగంలో కడప సుబాలో తుగమెళ్ల రామన్న అనే కవి కూడా ఉన్నాడు ఆయన శేషధర్మాలు రచించాడు. ఇతని గురించి ఇదే సంపుటిలో శేషధర్మాలు రచించిన మరి ఇద్దరితోపాటు చెప్పుకొందాం.

శిరాసుబా కవులు

'నేటి అనంతపురం బళ్లారి జిల్లాలూ, కోలారు, మైసూరు ప్రాంతాలు మొదలైనవి అన్నీ కలిసి పూర్వం ఒక ప్రత్యేక సుబాగా ఉండేవి. వీజాపూరు, గోలుకొండ రాజ్యాలను జయించి వాటీని తమ విశాల సామ్రాజ్యంలో కలుపుకొన్నాక జౌరంగజేబు క్రీశ 1657లో ఈ కొత్త సుబాను సృష్టించాడు. దానికి శిరా అనే కోటను రాజధానిగా చేశాడు. ఇది శ్రీరంగపట్టణానికి ఉత్తరంగా తుముకూరు జిల్లాలో ఉంది. ఈనాడు ఇది కుగ్రామంగాని అనాడు చాలా ప్రాముఖ్యమైనది. ఈ శిరాసుబాకు చెందుతూ ఈ పరగణాలు ఉండేవి.

  1. ఐసవాపట్టం, 2. బూదిహాలు, 3. శిరా, 4. పెనుకొండ, 6. దొడ్డబళ్లాపురం,
  2. హస్కోట, 7. కోలారు. ఈ ఏడు పరగణాలేకాక శిరాసుబా తొశేఖానాకు అడమానంగా 1. హర్చనహల్లి, 2. కొండర్చి, ౩. అనెగొంది, 4. చెందోరు, 5. చిత్రదుర్గం,
  3. మైసూరు ఉండేవి. ॥

ఈ అడమానం రాజ్యాలలో మొదటిదైన హర్పనహళ్లి సర్కారులో ఆదోని, అలూరు, బళ్లారి హడగల్లి, గూళ్ళెం, గుత్తి, పంచపాళెం, తాడిపత్రి, అనంతపురం, మడకశిర, ధర్మవరం మొదలైన నాలుగు తెలుగు ప్రాంతాలన్నీ ఉన్నాయి. శిరాసుబా లోనూ, అడమానం రాజ్యాలలోనూ ఈ యుగంలో సాహిత్య కృషి బాగానే జరిగింది. అది ఇతర పరగణాలలోకన్నా మైసూరులో అధికంగా కనబడుతూంది.

కొందరు మైసూరు ప్రభువులు తెలుగు సాహిత్యాన్ని పోషించడమేకాత స్వయంగానూ కావ్యాలు వ్రాశారు. ప్రభువులేకాక వారి సైన్యాధిపతులూ, సర్వాధికారులూ తూడా రచనలు చేశారు: రచయితలను ప్రోత్సహించారు.

చిక్కదేవరాజు: శ్రీరంగపట్టుం రాజధానిగా నేటి మైసూరు సీమను పాలించిన రాజులలో తెలుగు భాషను పోషించిన ప్రథముడు చిక్క దేవరాజు. ఇతడు 1672-1704 దాకా రాజ్యం చేశాడు. సాహిత్యాన్ని పోషించాడు. ఇతని అస్థాన విద్వాంసులు చిలుకల్లాంటివారు.

పంజరమ్మున నుంచి పండ్లు చక్కెర లిచ్చి మాట నేర్చి చిలుక మునుపునట్లు

నిండ్లొసంగి ధనము లిచ్చి విద్యలు నేర్పి ప్రోవు బుధుల చిక్కదేవవిభుడు.

(చాటుపద్యమణిమంజరి పు. 52) ఏ 'శష్క'యోగి వ్రాళాడోగాని చిక్కదేవరాజుమీద ఇలాంటి చాటువులు చాలా ఉన్నాయి. ఇళ్ళూ, ధనమూ, విద్యా ఉంటే చాలు. పేరు అక్కరలేదనుకొనే కవి ఎవరో 'చిక్కదేవరాయల* విలాసం” అనే యక్షగానం ఒకటి వ్రాశాడు. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది [0.1880). చిక్కదేవరాయలు షికారుకు వెళ్లినప్పుడు చంద్రలేఖ అనే వారకాంత చూసీ మరులుకొంది. విరహవేదనతో సతమతమై రాజువద్దతు శ అింటలే రజాంరంజు 0 1008 : స్వోకంణ & 000%. 9.19

862 సమగ్రాంధ్ర సాహిత్యం = రెండవ సంపుటి యక్షగానాన్ని ఎవరో తంజావూరు కవి వ్రాసి ఉంటాడని పరిశోధకుల అభిప్రాయం అయితే మధురలోని పదకర్తలు చిక్కదేవరాజును ఆశ్రయించడానికి ఎక్కువ ఆస్కారు ఉంది. మైసూరు, మధుర ఇరుగుపొరుగు రాజ్యాలు బహుకాలం నుంచి పరస్పరు యుద్దాలు చేసుకొనేవారు. చిక్కదేవరాజు క్రీశ 1679లో ఒకసారి మధురను ఓడించాడు. అప్పటినుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. క్రీ.శ. 1689 నుంచి మధుర రాజ్యం రాజీ మంగమ్మ సంరక్షణలోనికి వెళ్లింది. ఆమె తెలుగు కవులపట్ల ఉదాసీనంగా ఉండేగీ బహుశా వీళ్ళలో ఎవరైనా మైసూరు ప్రభువును ఆశ్రయించి ఉండవచ్చు.

చిక్కదేవరాజు ఆ్రితమందారుడే, సాహిత్యవినోదే. విశాలాక్షిపండితుడు తిరుమలయ్యంగారు, షడాక్షరయ్య, చిక్కోపాధ్యాయులు, లింగన్నయ్య అనే సాహితీవేత్తలు ప్రతిభావంతులు అతని మంత్రిమండలిలో ఉండేవారు. ఈ మంత్రిమండలిలోని ప్రతిఒక్కరూ సంస్కృత కర్టాట భాషలలో గ్రంథాలు వ్రాశారు. చిక్కదేవరాజుగారి ప్రధాని తిరుమలయ్యంగారు. కన్నడంలో గ్రంథాలు వ్రాస్తే, దళవాయి. వీరరాజు కన్నడంలోనూ, తెలుగులోనూ కూడా గ్రంథాలు వ్రాశాడు. ఆ కాలంలోని దక్షిణ రాజ్యాలలో ప్రధాని, దళవాయి, సర్వాధికారి అనే పదవులుండేవి. చిక్కదేవరాజువర్ద కళులెవారు దళవాయిగా, సర్వాధికారిగా పనిచేశారు. కళులె వీరరాజు తెలుగులో వచన భారతం వ్రాశాడు. వీరరాజుగారి రెండో అబ్బాయి నంజరాజు కన్నడంలో వచనభారతం వ్రాశాడు. దీనికి నంజవాణీవిలాసం అనే నామాంతరం ఉంది. ఈ కన్నడ వచన భారతంలో చిక్కదేవరాజు కూడా కొంత రచన చేశాడు. శల్య, గదా, సౌప్తికపర్వాలూ నల మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వాలూ చిక్కదేవరాజుగారి గద్యతోనే కనబడతాయి

కన్నడంలో వచన భారతాన్నేకాక చిక్కదేవరాజు మేలుకోటలోని దైవంపై విన్నపాణ బ్రాశాడు. మైసూరు యాదవరాజులకు మేలుకోట పుట్టిల్లు. ఆదిలో క్రీ.4 1390లో యదురాజ ఒడయరు ఈ రాజ్యానికి అంకురార్పణ చేస్తున్నప్పుడు మేలుకోట దుర్వాన్ని కట్టాడు. ఈ వంశంలో పుట్టిన చిక్కరాజుకు మేలుకోట దైవం ఇలవేల్పు. ఈ విన్నపాన్ని “చిక్కరాజ విన్నపం' అంటారు. ఈ రాజు త్రిపదులు, సప్పపదులు కూడా రచించాడు గీతగోవిందం బాణీలో గీతగోపాలం అనే కావ్యాన్ని చిక్కదేవరాజు వ్రాశాడు. ఉ లలితకావ్యం కన్నడంలో ప్రసిద్ధం. ఇంతటి సరస్వతీ కటాక్షమున్న చిక్కదేవరాజుకీ ఇంతకు కోటింతల లక్ష్మీప్రసన్నం ఉంది. తన బొక్కసంలో తొమ్మిదికోట్ల వరహాల నిలువచేసి “నవకోటినారాయణుడు' అనే బిరుదు పొందాడు. నిజానికీ ప్రతిరోజొ కోశాధికారి ఒక నిర్ణీత ద్రవాన్ని బొక్కసంలో జమకట్టడం కళ్లారా చూసిగాని చిక్కదేవరాజు భోజనం చేసేవాడు కాదు. కాను ఇన్నికోట్లు పోగుచేసినా రాజ్యంలో ఇంకెవరూ ధనవంతులు కాకుండా ఉండడానికి అన్నిరకాల వృత్తి వ్యాపారాలపైనా ౫ రకాల పన్నులు వేశాడు. అయితే చిక్కదేవరాజు ప్రజోపయోగ కార్యాలు కూడా చేశాడు. కావేరికి ఆనకట్ట కట్టించి నీటివనరులు కలిగించవచ్చునని ఆనాడే ప్లానులు వేశాడు. 2. మదరాసు ప్రాచ్చలిఖిత గ్రంథాలయం, కన్నడ డి. కేటలాగు, 104 నుండి 106; 111-113.

శిరాసుబా కవులు - 863

ఇతని కీర్తి ఢిల్లీదాకా ప్రాకింది. అలంగీరు పాదుషావారి కొలువులో చిక్కదేవరాజుగారి రాయభ్గారి ఉన్నాడు. కౌరంగజేబు చాలా మెచ్చుకొని ఇతనికీ “రాజజిగదేవో అనే విరుదు ఇచ్చాడు. “రాజుచిక్కదేవరాజు చుహమ్మదు శాహీ' అనే మొహరు ఒక్కటి చెక్కించి పంపించాడు. చిక్కదేవరాజుగారి తేజాన్ని వర్ణిస్తూ ఒక తెలుగు కవి ఇలా చాటువు చెప్పాడు:

కడగివై రాగడాగడగడాగడ పడం-తుల పాపటలకు సిందూరరజము

గోలకొండ బెందకోట విజాపుర-స్త్రీల చన్నులకు గాళ్ళీరరసము

కటకకళ్యాణమక్తావధూకబరీభ- రములకు జంపకప్రసవసమితి

ఆముదానగర ఢిబ్లీమాహురాపురాం- గనల మోవులకు లాక్షాద్రవంబు

తానయ్టెయుండు నేయశోధనుని తేజ

మతడుపాగడొందు నెందునునసమసమర

సాహసకళావిహారి దుస్సహవిరోధి

రాణ్మదవిదారి చికదేవరాయశారి (చాటు. పుట 51)

ఇది ఎవరు వ్రాశారోగాని చిక్కదేవరాయవిలాసం వ్రాసిన కవే ఈ చాటువులు చెప్పాడని భావించవచ్చు. ఒక శృంగార శతకాన్ని తూడా మరెవరో రచించారు. ఇది చిక్కదేవరాయలకు శృంగారనటనల నేర్పుకాగల శతకమట. అయితే కవి తాతకు దగ్గులు నేర్చదలిచాడు. చిక్కదేవరాయలు సామాన్యుడు కాడు. "వింతగా బొడగన్న వెలది నవలీల సాధించు. దేవవేశ్యాభుజంగుడు'- “ముందర పొడగట్టు మొగనాలినైనను దొరకించుకొనునట్టి దుండగీడు'. అంతేకాదు “తిరునాళ్ళకని వచ్చు పరువంపువెలదుల ననుపుల దేలించు నటనకాడు'. ఈ శృంగార సీసపద్య శతకం ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (కన్నడ 9 4-13). దీనికీ లోకోత్తరస్వారస్యయుత శతతమని మరో పేరుంది. ఇతని కావ్యాలు అమృతోపమానాలట. ఒక చాటువు వాటినిలా

అమృతం బానకయున్న దద్రుచులపై నాసక్తియే కల్ల దా

యమృతం బానినపిదప మానవశమా? యాహాః భవద్విస్ఫుర .

తృ్కృమనీయోక్తులు నట్లు గాదె? యికమీదన్‌ గ్రోల కెట్లుందునే .

నిమిషం బేనియు జిక్కదేవనృపతీ నిస్తంద్రసాంద్రద్యుతీ! (చాటు. 1, పుట 54) అయితే అతని కుమారుని మధురకృతులు చాలా దొరుకుతున్నాయి.

శంతీరన నరసరాజు; చిక్కదేవరాయలు క్రీ.శ 1701లో మరణించాడు. తరువాత రాజమాతా, ప్రధానీ కలిసి అతని కుమారుడు కంఠీరవ నరసరాజును గద్దె ఎక్కించారు. ఇతడు పుట్టుమూగి. ఏమీ వినిపించేది కాదు. అందుకే ఇతణ్జీ 'మూకరసు' అని పిలిచేవారు. చేతి సైగలతోనే నిత్యవ్యవహారాలు నిర్వహించేవాడు. పట్టం కట్టుకొన్నప్పుడితనికి 31 సంవత్సరాల వయసు. డవేజరు మహారాణీ దేవాజమ్మగారు, ప్రధాని తిరుమలయ్య దక్షత

864 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కలవారు గనుక రాచకార్యాలు చూసుకొనేవారు. అయితే కంఠీరవ నరసరాజు గద్దె ఎక్కిన రెండేళ్లకు క్రీ.శ 1706లో తిరుమలయ్యగారు పోయారు. కళులె వారు ప్రముఖులయ్యారు. మూగిచెవిటిరాజును వినోదాలకు మీదుకట్టారు. కంఠీరవ నరసరాజు క్రీ.శ. 1704 నుండీ 1714 దాకా పాలించాడు. తంజావూరు లోని విజయరాఘవునిలాగా, శఇజాహాజీలాగ ఇతని కొలువుకూటం కూడా ఆటపాటలతో మారుమోగేది. మల్లిక, మందారిక, మంజుభాషిణి, మధురవాహీని మొదలైన బిరుదులు గల పాత్రలు నాట్యుం చేసేవారు. తెలుగు, తమిళ. కన్నడ, కర్నాటక ప్రాకృత, సంస్కృతభాషా కవులు ప్రశంసించేవారు. బహుశా ఈ నట్టువకత్తెలు కవుల రచనలను ప్రదర్శించేవారు కాబోలు. అయితే కంఠీరవ నరసరాజు చేసిన రచనలను అతని అస్థాన నాట్యవిద్యావిలాసినులు అభినయించేవారని అతని రచనలవల్ల తెలుస్తోంది. నోరులేనివాడు- పుట్టుచెవిటివాడు ఈ రచనలు ఎలా చేశాడన్నది పెద్ద ప్రశ్నే బహణా అస్థాన కవులు వ్రాసి ఇతని పేరు పెట్టారా అనే అనుమానం కలుగుతుందిగాని ప్రతి రచనలోనూ తానే కృతికర్తనని కంఠీరవ నరసరాజు ఉద్దాటించాడు. ఇతని రచనలు ఎనిమిది దొరికాయి. అవి: 1. అష్టదిక్సాలక విలాసం, 2. కలవాజీవిలాసం, 3. కొరవంజికట్లె 4. నాట్యవిద్యావిలాసం, 5. పంచాయుదకట్లె, 6. లక్ష్మీవిలాసం, 7. వసంతోత్సవ విలాసం, 8. విభక్తికాంతావిలాసం ఈ మధుర రచనలేకాక కంఠీరవ నరసరాజుపై పదాలు కొన్ని ఉన్నాయి. 'పదరి నన్నంట వచ్చెవేర' అనే పదంలో ఇలా ఉంది “అనరాని మాటలాడేవేర' అవురా చాలురా - అదేరా నీకామేరు లెవయ్యెరా దినమున నేలుదాని భారమౌర దేవరాజేంద్రుని కుమార కంఠీరవేంద్రా. పుట్టుమూగివాడు అనరాని మాటలు ఎలా అడేడో? నిజానికి ఈ ఎనిమిది రచనలూ నరసరాజు చెప్పిన కృతులుకాక నరసరాజుపై చెప్పిన కృతులని భావించాలి. కన్నడ కేటలాగులో ఈ రచనలు “ఆరసనవరమేలన నాటకగళు' అనే శీర్షికలో కనబడతాయి. వీటిని రచించిన తెలుగుకవుల పేర్లయినా తెలియకపోవడం శోచనీయమే. బహుశా కళలి వారి ఆశ్రితులు కొందరివి వ్రాసి ఉండవచ్చు. కళులె వీరరాజు: చిక్కదేవరాజు వద్ద సైన్యాధిపతిగా కళులె వీరరాజు అనే మహావీరుడొకాయన ఉండేవాడు. మహారాష్రులతో, మధుర నాయకరాజులతో చాలా యుద్దాలు చేశాడు. ఓడించిన రాజుల దగ్గిరనుండి రత్నరాసులు పుచ్చుకొన్నాడు. నిత్యాన్నదానాలు చేశాడు. శా స్రోక్సదానదీక్షావిచక్షుడు. ఎందరో కవులకు అగ్రహారాలు ఆరామాలూ, ఇళ్లూ వాకిళ్లూ ఇచ్చాడు. ఈ వీరరాజుగారు ఆంజనేయభక్తుడు. ఆ దేవుని దయవల్ల అబ్బిన గీర్వాణాం ధ్రకర్ణాటకాది నానాభాషల్లో కావ్యరచనాచతురుడయ్యాడు. 3. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, కన్నడ కేటలాగు. 4, కంఠీరవ నరసరాజు పదాలు తొమ్మిదింటిని నిడదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు దక్షిణ దేశీయాంధభ్ర వాబజ్బయము. పు. 458-484.

విరాసుబా కవులు 865

కళులె వీరరాజు కావ్యరచనాలోలుడైన కార్యఖడ్గ ప్రవీణుడు. చిక్కదేవరాజువద్ల దళవాయిగా ఎప్పటినుండి ఉండేవాడో తెలియదుగాని క్రీశ 1679 నుండి ఉండి మధురపై జరిగిన యుద్దాలలో పాలొన్నాడని భావించవచ్చు. 'మధురానాధమదవిమరన' అనేది ఇతని బిరుదులలో ఒకటి. మధురను జయించడమేకాఠ కళులె వీరరాజు మధురలకని రచయితలనూ, కవులనూ తన మంచితనంతో జయించి తనతో మైసూరు తీసుకువెళ్లి నట్టుంది. ఆ రోజులలో మధుర సైన్యంలో తుపాకుల అనంతయ్య అనే చురుకైన యువకుడు దళవాయిగా ఉండేవాడు. ఇతడు చంద్రగిరి కృష్ణప్పగారి కుమూరుడు. మధురనాయకరాజు చొక్కనాథునికి ఆలివంక చుట్టం. .

తుపాకుల లింగమనాయకుని కూతురు మంగమ్మనే చొక్కనాథుడు పెళ్లి చేసుకొన్నాడు. మధురను జయించిన రోజులలోనే వీరరాజు అక్కడున్న తుపాకుల అనంతయ్యతో స్నేహం చేసి అతణ్నీ తనతోపాటు శ్రీరంగవట్నం తీసుకుపోయి ఉంటాడు.

సైనిక విజయాలు ఎలా ఉన్నా, కళులె వీరరాజు సాహిత్య యజ్ఞాలు చేశాడు. వ్యాస భారతానికి వచచనరూపంలో అనువాదం మొదలుపెట్టాడు. ఇతనికి తుపాకుల అనంతయ్య, నారాయణయ్య మొదలైనవాళ్లు తోడ్పడ్డారు. వీరరాజు వ్రాసిన భారతంలో అది సభా భీష్మపర్వాలు లఖిస్తున్నాయి. వీటిలో చివరి రెండూ సమగ్రాలు. వీరరాజు వ్యాస భారతాన్ని అనుసరించే యీ వచన భారతం రచించాడు. అయితే మక్కీకి మక్కీ తెనిగించలేదు. సంస్కృత భారతంలోలాగే అధ్యాయ విభజన చేశాడు. అందరికీ అర్ధమయ్యే శైలిలో వ్రాశాడు. స్పష్టత కోసం విసంధులు చేశాడు. వీరరాజుగారి వచన భారతంలోంచి ఉదాహరణలు యిస్తూ పరిశోధకులు చక్కని వ్యాసాలు వ్రాశారు!

వచన భారత రచన ఎప్పుడు ప్రారంఖించాడోగాని వీరరాజు సభాపర్వాన్ని మాత్రం 1730లో పూర్తి చేశాడు. ఇతర పర్వాలను ఇతరులు పూరించిన తారీఖులు దొరకలేదు. రాచకార్యాలలో తలమునకలుగా ఉండే వీరరాజు తీరిక చేసుకొని రచన సాగించడమే గొప్ప. చిక్కదేవరాజుకాలంలో యుద్దాలతోనే సరిపోయింది. కంఠీరవ మూకరసు పాలన పదేళ్ల. ఆ తరువాత కుట్రలు, కుహకాలు. దళవాయికి రెండు చేతులా పని. ఒక్క తెలుగు భారతమేకాక కన్నడ గ్రంథాలు కూడా ఆయన వ్రాశాడు. 'సకలవైద్య సహితా సారార్టవం' అనే కన్నడ గ్రంథం కూడా ఆయన రచించాడు. అందుచేత వీరరాజు భారత రచన మందగించి ఉంటుంది.

కళులె వీరరాజు ఎవరెవరిని పోషించాడోగాని - ఓక లాక్షణికుడు 'వీరభూపాలీయం' అనే లక్షణగ్రంథం వ్రాశాడు. ఇది ఆంధ్రశబ్ద చింతామణికి తెనిగింపు. ఈ వీరభూపాలీయం సమగ్రమేగాని అముద్రితం. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గుథాలయంలో ఉంది (0.1/19). ఈ లాక్షణికుని పేరు తెలియదు. వీరరాజు పోషించిన

ఆంధ్రవచనారచనపరిణామం' గొబ్బూరి వెంకటానందరాఘవరావుగారు, పుటలు 102-105.

866 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇతర కవుల పేర్లు కూడా తెలియవు. అతని సహచరులలో ఒక్కరు తుపాకుల అనంతయ్మ్యే పిరుకెక్కినవాడు. -

తుపాకుల అనంతయ్య: ఇతడు కళులె వీరరాజుతో కలసి వచన భారతం వ్రాశాడుగాని ఇతడు ఎక్కడ నివసించేవాడో తెలియదు. ఇతని తండ్రీ తుపాకుల వెంకటప్ప చంద్రగిరివాసుడు. ఆయన క్రీ.శ. 167లో చెంజి రాజులవద్ద సేనానిగా ఉండేవాడు. క్రీ.శ. 1648లో చెంజి మహమ్మదీయుల వశమైంది. అప్పుడు గోల్కొండ సర్వాధికారి మీర్‌ జుమ్లావద్ద కృష్ణప్ప చేరాడు. ఈ మీర్‌ జుమ్లూ విద్రోహిగా మా జౌరంగజేబుతో చేరాడు. తన సనానిక సైన్యాలను కృష్ణష్పకు అప్ఫగించాడు. గోల్కొండసుల్తానుల సేనాని తులీబేగు పులికాటువద్ద కృష్ణపష్పును బంధించాడు. అప్పుడు తుపాకులవారి కుటుంబం మధురకు చేరింది. రాచవియ్యమంది తుపాకుల లింగమనాయకుడు మొదలైనవాళ్లు మంచి పదవులు అధిష్టించారు. తుపాకుల అనంతయ్య తూడా మధుర కొలువులో ఉండగానే కళులె వీరరాజుగారి పరిచయం కలిగినట్టుండి ఆయనతో కలిసి వచనభారతం అనువదించాడు.

అనంతయ్య శ్రీకృష్ణ భక్తుడు. నిఖిలపురాణేతిహాసాల కథానుసంవిధానంలో నిరుపమాన విజ్ఞానం కలవాడు. చతుర్విధ కవితాసామ్రాజ్యుభోజుడు. విద్వాంసులకు కావేరీతీరంలో అగ్రహారాలు మొదలైనవి ఇచ్చాడు. చాలా వైభవంగా జీవించాడు. సభాపర్వంలోనూ, ఖీష్మపర్వంలోనూ ఇతని గద్యకూడా వీరరాజుగారి గద్భుతో కనబడుతుంది. అనుశాసనిక పర్వం పూర్తిగా ఇతని గద్యతోనే ఉంది (తంజావూరు డీ. 682). వచన భారతంలో భగవద్గీతలు ఇతని గద్యతోనే ముద్రణ పొందాయీ భారతమే కాక వఏష్ణుపురాణాన్నీ రామాయణంలోని సుందరకాండను కూడా వచనంగానే అనంతయ్య తెనిగించాడు. విష్ణుపురాణం ముద్రితం అయినా ప్రస్తుత అలభ్యం. రామాయణం అముద్రితం.

తుపాకుల అనంతయ్యగారి విష్ణుపురాణం చాలా సులభ్జాలిలో ఉంటుందీ వెన్నెలకంటి సూరయ్యగారి కావ్యంకన్నా విపులంగా సంస్కృత మూలాన్ని అనుసరిస్తున్నదని పరిశోధకుల అభిప్రాయం.” వచన ఖారతంకన్నా ఇందులో రచ ట్రొఢంగా ఉందట. వచన రామాయణంలోని సుందరకాండ ప్రతి కాకినాడ అంగ్ర సాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది. ఇది అనంతయ్య రచనలలో అర్వావీన మని చెప్పవచ్చు. భారత రచనలో “వచన రచనా వైచక్షణ్య' అనే సమాసం లేదు భారతగద్యలో ఒక్క కావేరీ తీరంలోనే అగ్రహారాలు ఇచ్చినట్టు చెప్పుకొన్నాడు రామయణగద్యలో _ వేగవతి, తామ్రపర్ణి మొదలైన ప్రముఖ నదీతీరాలలో అ గ్రహారాలిచ్చినట్టు చెప్పాడు. 6. ఎలమంచిలి ఆంధ్రావళీ సమాజంవారు 1994లో ఈ భగవద్గీత రెండువేల ప్రతులు అచ్చువేసే ఉచితంగా

పంచిపెట్టారు. -

  1. _మీగడతరకలు, పుట ఇ.
  2. పరిషత్పత్రిక, సంపుటి 4, పుట 199.

శిరాసుబా కవులు 067 తన గద్యలలో తుపాకుల అనంతయ్య తాను చతుర్విధోభయ సాహిత్యపరుణ్జి అని చెప్పుకొన్నా అతడు వచన రచయితగానే నిలుస్తున్నాడు. అతని పద్యకావ్యాలేమీ దొరకలేదు. ఇతడు తన గద్యలో కళులె వీరరాజును పేర్కొనకపోవడం గమనించతగ్గదే. కళులె నంజరాజుః: కళులె వీరరాజుగారికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ రాజోద్యోగులే. పెద్దవాడు దేవరాజు దళవాయిగా, రెండోవాడు నంజరాజు సర్వాధికారిగా మైసూరు చరిత్రలో చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. కంఠీరవ మూకరసు శ్రీశ 1714లో పోయాడు. అప్పటికతని కుమారుడు దొడ్డ కృష్ణరాజుతు పన్నెండేళ్లు ఈ బాలుడికి పట్టం కట్టి దళవాయి, సర్వాధికారుల సమర్థతతో 2 సంవత్సరాలు పాలించారు. క్రీశ 1732లో దొడ్డ కృష్ణరాజ మరణించాడు. అతనికి సంతానం లేదు. అతని భార్య అంకనహల్లి చామరాజును దత్తత చేసుకుంది. దత్తునికి అప్పటికి 28 సంవత్సరాల వయసు. ఆయన దళవాయి సర్వాధికారులను ధిక్కరించాడు. వాళ్లని పదవీభ్రష్టులను చేయాలని చూశాడు. కళులె సోదరులు ఇది క్షమించలేకపోయారు. కోట ముట్టడించి రాజును బంధించి కబ్బల దుర్గంలో బంధించారు. కళులె సోదరులకు ముసలిరాణీ దేవాజమ్మణ్జిగారి మద్దతు ఉంది. ఆమె ఒక కుగ్రాణ్జి దత్తత చేసుకొంది. ఆ బాలునికి ఇమ్మడి కృష్ణరాజు ఒడయరు అని పేరు పెట్టి దళవాయి సర్వాధికారులు పాలించసాగారు. కళులె సోదరులు సమర్శలే, సాహసవంతులే, అయికే తమకంటే ఘటికుడు ప్టైదరాలికి ఆశ్రయం ఇచ్చారు. ప్రోత్సహించారు. అతడు వటవృక్షంలాగా పెరిగిపోయాడు. క్రూరంగా ప్రవర్తించసాగాడు. క్రీ.శ. 1756 నాటికి ష్టాదరాలీ ఎవరూ ఎదిరించలేనంతగా వేళ్లు తన్నుకొన్నాడు. దళవాయి దేవరాజు సర్వాధికారి నంజరాజూ హ్టైదరాలీతో కలిసి కుగ్రులు పన్నారు; ఇవి రాజుకు తెలిశాయి. దండించపోయాడు. నంజరాజు, ష్టైదరాలీ మేలుకొన్నారు. తమ గురించి రాజుకు చెప్పిన వాళ్ళను పట్టుకొని రాజు ముందే హింసించసాగారు. ఈ హింసాకాండ చూసి దళవాయి దేవరాజు ఏవగించుకొని రాజకీయాలు వదిలిపెట్టి సత్యమంగళం వెళ్లిపోయాడు. అప్పటికి దళవాయి దేవరాజు ముసలివాడట. అతని తమ్ముడైన నంజరాజు కూడా క్రీ.శ 1756 నాటికి కనీసం ఆ సంవత్సరాల వాడై ఉంటాడు. అన్నగారు దేవరాజు మద్దతు లేకపోయేసరికి నంజరాజు ఒంటరి అయ్యాడు. హ్టైదరాలీ ఇతర ఉద్యోగులనేకాక మైసూరు రాజ్యాన్నే కబళించాడు. ముసలితనంలో ఎలా ఉన్నా యౌవనంలో ప్రొఢనిర్భర వయఃపరిపాకంలో కళులె నంజరాజు మంచి సాహిత్యసేవ చేశాడు. అతడు కన్నడంలో వచనభారతం వ్రాశాడు. దానికి నంజరాజవాణీవిలాసం అనే మారుపేరు ఉన్నట్టు ఇంతకుముందు చూశాం. చిక్కదేవరాయలు ( క్రీ.శ1672-1704) తూడా ఈ భారత రచనలో కొన్ని పద్యాలు బ్రాశాడంటే నంజరాజు శ్రీశ. 1704 నాటికి పూర్వమే కన్నడభారతం వచనంలో వ్రాసి ఉండాలి. అఆ భాషలో ఒక్క భారతమేకాక ఇతర రచనలు తూడా చేశాడు. సకలనిగమాగమ పురాణార్థాలు వివరించి తివభక్తి విలాసం, భద్రగిరి మాహాత్మ్యం అనే శివపురాణాలు వ్రాశాడు 1 డశాగ(బ్న్రడవబల డ్య

868 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కన్నడంలో మొదట వ్రాసిన హాలాస్యచరిత్రనే నంజరాజు తెలుగులో మీ బ్రాశాడు. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. (215). అసమగ్ర ఇతడు కన్నడంలో బ్రాసిన వాటినే తెనిగించాడనడానికి కాశీమహిమార్థదర్చణం అనే గ్రంథమే సాక్ష్యం. దాని చివర ఇలా ఉందిః

“మరియు గర్జాట భాషా విరచితంబుగా మహీశూర సేనాధిపదొడ్డరాజ పౌత్ర వీరరాజపుత్ర దళపతి దేవారాజానుజ కళులె నంజరాజ భూపాలుండు స్కంధ పురాణోక్టంబుగా కాశీమహిమార్థదర్చణమందు మణికర్ణిక యుత్పత్తి చెప్పిన యిరువది యారవ యధ్యాయము”. (౫.757) ఈ పుస్తకం అముద్రితం. నంజరాజు పుస్తకాలు రెండూ అచ్చుపడలేదు. ఇతడు తెలుగులో ఇంకే రచనలూ చేసినట్టు లేదు. తన తండ్రి వీరరాజుగారిలాగే నంజరాజు కూడా లాక్షణికులను, కవులను పోషించాడు. వీరరాజు పేర వీరభూపాలీయం అనే లక్షణ గ్రంథం పుడితే- నంజరాజుపైన నంజరాజయశోభూషణమనే గ్రంథం పుట్టింది. దీనిని ఆలూ నరసింహం వ్రాకాడు.

అలూరి నరసింహం: ఇతనికి 'నవీనకాళిదాసు' అనే వీరుదు ఉంది. సంస్కృత పండితుడు. ఈయన వ్రాసిన నంజరాజయశోభూషణంలోని నాటకప్రకరణాన్ని ఎవరో తెనిగించారు. ఈ అనువాదం ఎవరు చేశారో తెలియదు. ఆలూరి నరసింహశాస్తుర్లో, అతని శిష్యులో అనువదించి ఉంటారు. నంజరాజువద్ద ఉండే ఇతర తెలుగు విద్వాంసులెవరో తెలియదుగాని, ఈ కాలంలో మైసూరు మండలంలోని సామంతులవర్ద ఉండే కవులలో ఒకరిని గురించి బాగా చెప్పుకోవచ్చు.

కోడూరి వెంకటాచలం: మైసూరులోని కోలారు ప్రాంతాలకు సుగ్గుటూరివారు ఏలికలు. వీళ్ళ వియ్యాలవారు ఖైరవమూరివారు. క్రీ.శ 1700 ప్రాంతాలలో ఖైరవమూరి ముళువాగళురాజు అనే ఆయన కొంత సాహిత్యసేవ చేశాడు. ఈయన కోడూరి వెంకటాచలాన్ని పిలిపించి స్కాందపురాణంలోని కివరహస్యఖండాన్ని తెనిగింపజేశాడు.

వెంకటాచలం చిన్నప్పుడే పాండీత్యం ప్రదర్శించాడు. అతనికి 'బాలసరస్వతి' అనే విరుదు ఉంది. ఇతడు నానాకళాఖిజ్ఞుడు. కవితాధారాగరిష్టుడు. ఈయనకు మేనమామ పోలికలు వచ్చాయి. వెంకటాచలంగారి మేనమాన గునుగుటూరి వెంకటకృష్ణయ్య. ఆయన శ్లేషకవితాపితామహుడనే ప్రఖ్యాతి పొందాడు. నలరాఘవయాదవ పాండవీయం వంటీ మహాప్రబంధాలు వ్రాశాడు. వెంకటాచలంగారి మేనమామేకాక గురువు కూడా కవే ఆయన పేరు యడవల్లి వెంకటయ్య. ఇతణ్జీ కోడూరి వెంకటాచలం ఇలా నుతించాడు:

అతని అఖిరామవాసుదేవాది కావ్య-ములను రచియించి ప్రఖ్యాతి నందినట్టీ

ఘనునినెడవల్లి వెంకటకవివరేణ్యు- నస్మదీయవిద్యాగురు నఖినుతింతు. 322 ఈ యడవల్లి వెంకటయ్యగారు రచించిన అఖిరామవాసుదేవం దొరకలేదుగాని ఇంకెవరో యడవల్లి వెంకటకవి వ్రాసిన పతితపావనచరిత్ర అనే కావ్యం ఒకటి లఖిస్తూంది. 2.116)

ఖిరాసుబా.కవులు 869 వెంకటూచలంగారి విద్యాగురువు వ్రాసిన ఇతర గగ్రంథాలేమిటో తెలియవు. వాస్తవానికి ివరహస్యు ఖండం తప్పించి కోడూరి వెంకటాచలం వ్రాసిన గగ్రంథాలేమిటో కూడా తిలియవు. ఇది. 28 ఆశ్వాసాల గ్రంథం. మొత్తం ఏడు కాండలు ఉన్నాయి. కొన్ని కాండలూ, ఆశ్వాసాలు సమగ్రంగా దొరికాయి. ఈ గ్రంథం ఒకసారి అచ్చుపడింది.

మైసూరులోని రచనలు ఇన్ని తెలుస్తున్నా శిరసుబాకు అడమానమైన తెలుగు ప్రాంతాలలో కవుల గురించి వివరాలేం అట్టే దొరకవు. .అనంతపురంలో ఒక్కడే కవి కనబడుతున్నాడు.

పొత్తపి వెంళటయ్య: ఈయన యింటిపేరుకు కారణభూతమైన పొత్తపి కడప జిలాలో ఉన్నా ఇతని పూర్వులు పౌత్తపినుండి అనంతపురం పరగణాతు వచ్చి స్థిరపడ్డారు. ధర్మవరం తాలూకాలోని రావులచెరువు గ్రామంలో పొత్తపి వెంకటయ్య ఉన్నట్టున్నాడు. ఆ ఊళ్లో ఉండే చినరెడ్డిగారి సుంకిరెడ్డి ఈయన్ని పిలిచి 108 దివ్యతిరుపతులను వరుసలో వర్ణించి సుబ్బరాయడి పేరు మీద ఒక శతకం చెప్పమన్నాడు. వెంకటయ్య ఒక సీసశతకం చెప్పాడు. “మహితరూపాయ ధూర్జటి మత విధేయ సూర్య శతకోటి విభవాయ సుబ్బరాయ' అనే మకుటంతో అన్ని దివ్యతిరుపతులనూ ఏకరువు పెట్టాడు. చివర కొన్ని నీతులు కూడా ఉన్నాయి. ఇదేమంత ప్రొఢమైన రచన కాదని పరిశోధకుల అంచనా.!* అప్రొఢమైన రచనలు తూడా కొన్ని చరిత్ర రచనకు ఉపయోగపడతాయి. ఇది అందుకు తూడా పనికిరాదు. అయితే ఈ సుబాలోనే అనెగొందిలో చాలా లాఖించే తుచ్చపు రచన ఒకటి బయలుదేరింది.

అనెగొంది సంస్థానం: దక్షిణాపథంలో ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిన విజయనగర సామ్రాజ్యం ఆరిపోయాక హంపీక్షేత్రాన్ని విడిచిపెట్టి 'ఆరవీటిరాజులు పెనుగొండ, చంద్రగిరి, వేలూరు మొదలైన దుర్గాలు పట్టారు. చివరకు ఈ ప్రదేశాలలో కూడా వాళ్లకు నిలువ నీడలేకపోయింది. మళ్ళీ తుంగభద్రకు అద్దరిని ఉన్న ఆనెగొందిని చేరుకొన్నారు. ఈ దేశం మహారాష్ట్రల చేతికి వచ్చింది. శివాజీ దయతలచి ఆరవీటివారసులకు ఆనెగొంది సంస్థానాన్ని ఇచ్చాడు. క్రీ.శ 1657 ప్రాంతాలలో ఉన్న తిరుములరాజు ఈ రాజ్యాన్ని సంపాదించాడు. ఈయనకు ఎలాంటి బంధువో గాని చిన వెంగమరాజు అనే ఆయన క్రీ.శ 1689-1706 ప్రాంతాలలో అనెగొందిలో ఉండేవాడు. ఈయన తెలుగు భాషలో మొట్టమొదట బండబూతుల కావ్యానికి కారకుడయ్యాడు. దీనిని వ్రాసిచవాడు బుచ్చాలి గోపాలయ్య. ఈయనకు వికటకవి అనే బిరుదు వుంది.

" బుచ్చాలి గోపాలయ్య : ఈయన దక్షిణాదిన ఉండే అరియలూరు గ్రామాన్ని ఆదరువు చేసుకొని సుఖంగా ఆ కుడియెడమల బహుసంసార సమేతుడుగా ఉండేవాడు. మేనత్తా, ఆమెతోపాటు ఇతని భార్యా ఇతణ్జీ తీర్థయాత్రలకు ప్రోత్సహించారు. గోపాలయ్య సరే అన్నాడు. ఉంఛవృత్తి ఉత్తమమని కృష్ణాతీరం లగాయతు కాశీదాకా వెళ్లాలని నిశ్చయించాడు. ఆనెగొంది ప్రాంతాలకు వచ్చాడు.

870 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

“ఆ దేశానికి తురకలవల్ల క్షోభ లేదు. వారే ఉమిసిన తమ్ముల మని త్యజించి కాపాడుకు వచ్చి యిచ్చింది. తిరిగి పుచ్చుకోమని నమ్మిక యిచ్చి ఆ యింటిని కాపాడుక వస్తున్నారని విన్నాడు. ఆనెగొంది నరపతిసింహాసనం దొడ్డవారని కూడా విన్నాడు. విరూపాక్షస్వామిని సందర్శనం చేసుకొంటూ ఉండే అనెగొంది చినవెంగమరాయల పరిచయం కలిగింది.

బుచ్చాలి గోపాలయ్య వికటకవి అని ఆయన విన్నాడు. ఆ రోజులలో వికటం అంటే బూతే. 'బూతాడక దొరకు నవ్వుపుట్టదు సభలో అని కవిచౌడప్పే ఆదిలో చెప్పాడు. అందుకే ఆనెగొంది చినవెంగమరాజుకి నవ్వు పుట్టడానికి గోపాలయ్య రంగనాయకాంకితతారావళి అనేది వినిపించాడు. ఇందులో మధుర నేలుతున్న రాణిమంగమ్మ మీద చిరుబూతులున్నాయి కాబోలు. దీనిని విని ఇంతకన్న విపులమైనది చినవెంగమరాజు బ్రాయమన్నాడు. గోపాలయ్య మహబాగు అని 'మంగా దుష్పాంసులావిలాసం' అనే బూతుల బుంగను వ్రాసి విరూపాక్షదేవునికి అంకితం ఇచ్చాడు. ఇది మంజరీద్విపద.!

“తెలియగ నిప్పుడు త్రిశరఃపురమున - వెలనెడీ వింతలు వివరించెద నొక

మంజరి కృతిగా మాలమాదిగలు - లంజ కొడుకులు లజ్జ లేకనే

బసివెద్దులగుమి పశువుల వెంబడి - విసుగక తరుముచు వేట్లా డెడుగతి

మంగాపుంశ్చలి ఇంగిత మెరుగక - వంగి దురద మెయి సంగాపేక్షను....” ఈ విధంగా ఆరంభమయిన ఇది పచ్చిబూతులలోకి దిగుతుంది; అయినా ఇటునంటీ అన్లీలమంజరితో చినవెంగమరాజుకు తృప్తి కలిగినట్టు లేదు. వచన కావ్యంగా “మధురమంగాపుంశ్చలీవిలాసాన్ని' చెప్పమన్నాడు. బుచ్చాలి గోపయ్య ఎక జుగుప్సాకరంగా వ్రాయాలో అంత అన్లీలంగానూ వ్రాశాడు. చినవెంగమరాజు సభలో దినమొక కథగా వినిపించాడు. రంగనిభేటి, పక్షిక్రీడ, చినవెంగమరాజు దినచర్క శాక్ట్రేయమతం మొదలైన శీర్ణికలు ఉన్నాయి. .

ఇంత నికృష్ణపు రచన చేయడంలో బుచ్చాలి గోపాలయ్య ఉద్దేశం ఉదరపోషణే అయితే అతడు కలలో తూడా అనుకోని ఘోరం ఒకటి జరిగింది. అతని భార వయసులో ఉన్నది. ఆమెను ఆనెగొంది చినవెంగమరాజు బలాత్కరించాడు. అప్పుడు గోపాలయ్య ఇంటోలేడు. కబురు వెళ్లింది. “నావున్న తావుకు చెప్పి అంపించె నంటి మిటమిట మధ్యాహ్నము యెండయని యేమరితిని. ఇంట్లో దాన్ని కొండముచ్చు చిక్కించుకొన్నట్లు చిక్కించుకుపోడని అ వేళనే నిలచిన అడుగు నిలువక పదివేల ఉపాయాల జాలిపడి ఆ సీమ వెల్వడివచ్చి హాః దైవమా! ఇదంతా మగరంకులాడీ... గులాముని వల్ల వచ్చిన ఆపద గదా' అని విలపించి, రాణీమంగమ్మమీదా, అనెగొందీ చినవెంగమరాజు మీద మరింత బూతులు రచించాడు.

ఇరాసుబా కవులు 871

ఈసారి ఈ రచనలు ముళువాయి హనుమంతునికి అరియలూరు గామదేవతకు అంకీతం చేశాడు. హనుమద్విన్నపంలో తన భార్యను ఆనెగొంది చినవెంగమరాజు ఎలా చెరచినదీ చెప్పుకొని ' ఆలికాబాల్యం అది మంచి వానికి మంచిదానికి పుట్టిన సాధుకన్యక ముళువాయి హనుమంతా ఆ నిర్చాగ్యచినవెంకన్ని చంపవే” అని గోపాలయ్య ప్రార్థించాడు.

ఇతని అక్లీల రచనలో ఒక పిచ్చి అవేదన కనబడుతుంది. భార్యకు జరిగిన అత్యాచారానికి ఈవిధంగా కసి తీర్చుకున్నాడు. ఈ బూతుపురాణంలో ఇంత జాలి కథ కూడా ఉందని బుచ్చాలి గోపాలయ్య వ్రాసిన 'మధురమంగా పుంశ్చలీవిలాసం అంతా చదివితే తేలుతుంది. అయితే పరిశోధకులు తప్ప ఎవరూ చదవలేని గ్రంథం ఇది. దీని ప్రతులు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి (0.144922 510 ౫౧. 1043). ఈ పుస్తకంలో 3565 [గ్రంథాలున్నాయి. (గ్రంథం అంటే 32 అక్షరాలు). ఒక్క తెలుగు భాషలోనేకాక కన్నడ తమిళ భాషలలోని బూతులు కూడా వ్రాశాడు. ఆనాటి రాజకీయ వృక్తులైన రాజారాం, కాంబక్షు మొదలైనవాళ్లందరికీ మధురమంగమ్మతో కామసంబంధాలు గోపాలయ్య కల్పించాడు. అయితే మంగమ్మ చాలా దానధర్మ పరాయణురాలు. నీతిగా బ్రతికింది.

అనెగొంది సంస్థానంవల్ల ఈ అపకీర్తికావ్యమేతప్పు మరేవి ఈ యుగంలో పుట్టినట్టు కనబడదు. “చెట్టు చెడే కాలానికి కుక్కమూతిపిందెలు' అంటారు కాని ఈ చెట్టున ఒకే ఒక పిందె. అయితే శిరాసుబా తోటలో మిగతా చెట్లు ఫలించాయి. మైసూరు రాజ్యానికి అణకువగా వుండే సేలంలో మంచి సంస్కృతాంధ్ర పండితులు చక్కని రచనలు చేశారు.

రేవూరి కవులు: సర్వసామాన్యంగా మన తెలుగు కవులందరూ సంస్కృతం నుంచి కావ్యాలను అనువదించేవాళ్లే. అయితే ఒకానొక కవి తెలుగు సాహిత్యంలోని అనన్యకావ్యం వసుచరిత్రను సంస్కృతంలోనికి పరివర్తనం చేశాడు. అతని పేరు రేవూరి కాళహస్తికవి. ఈయన కాళహస్తిలో పుట్టీ పెరిగాడుగాని యౌవనంలోనే దక్షిణదేశానికి వెళ్లాడు. క్రీశ 1554 నుండి 16286 దాకా జీవించిన సుప్రసిద్ధ పండితులు అప్పయ దీక్షితులవారి శిష్యరికం చేశాడు. తెలుగుకవుల శ్రేషనైపుణ్యాన్ని సంస్కృతీకరించడానికి వసుచరిత్రను అనువదించాడు.!* ఇతని సంతతివాళ్ళందరూ కవులే. దక్షిణాదినే స్థిరపడ్డారు. అందరూ సాహితీపరులే. కాళహస్తిగారి మనుమడు లింగన్న కూడా కవే. అయితే అతడు ఏం పుస్తకాలు వ్రాశాడో, అవి తెలుగులో వ్రాశాడో సంస్కృతంలో చెప్పాడో తిలియదు. ఈ కేవూరి లింగన్నకు ఆరుగురు కొడుకులు. పెద్ద కొడుక్కి తన తండ్రిపేరే పెట్టూడు.

ఇమ్మడి కాళహస్తికవి తన తాతగారంత ప్రజ్ఞావంతుడు. అష్టభాషల్లో ఆశువుగా ప్రబంధాలు నిర్మించే చాతుర్యం కలవాడు శకావధానమే కాదు, సహస్రావధానమూ చేయగల దిట్ట. వ్యస్తాక్షరి, ఓష్ట్యం, నిరోష్ట్యం, చలాచల జిహ్విక మొదలైన చిత్రకవిత్వాలు చేస్తాడు. ఇతడు కేవలం చిత్రకవి మాత్రమే కాడు, అఖిలలక్ష్యలక్షణ కోవిదుడు. పాణినీయం కరతలామలకం చేసుకున్న వ్యాకరణవేత్త. షడ్డర్భనీపారంగతుడు. ఇతడు

872 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుకి ఏ గ్రంథాలు బవ్రాశాడో తెలియదుగాని ఇతని తమ్ముడు అనంతయ్యగారి గ్రంథాల మాత్రం దొరుకుతున్నాయి.

కేవూరి అనంతయ్య తన అన్నగారు ఇమ్మడి కాళహస్తిగారంత గొప్ప కవి. ఇతడ్స ఐదో ఏటనే వేదం అప్పచెప్పితీ విబుధులు నివ్వెరపోయారు. పట్టుమని పదేళ్ల నిండకముందే అనంతయ్య అష్టభాషల్లో చతుర్విధ కవిత్వాలు. చెప్పగల చాతుర్యం అలవరచుకొన్నాడు. నూరుగడియలకో ప్రబంధం చొప్పున ఇతడు రచించగలడు. ఈ ప్రతిభను చూపిస్తే ఇతనికి 'మైసూరి చెంజిండ్ల మెచ్చులు ఘటించె'. బహుశా చెంజీలోని తుపాకుల లింగప్ప, మైసూరులోని చిక్కదేవరాయలు రేవూరి అనంతయ్యను సన్మానించి ఉంటారు. చిక్కదేవరాయలు క్రీ.శ. 1673 నుండి 1704 దాకా మైసూరు పాలించాడు. ఇతని కాలంలోనే కర్ణాటక రాజధాని శ్రీరంగపట్నుం సక్కారాలు నోచుకుంది.

మైసూరు చిక్కదేవరాయలమీద పాతిక తెలుగు చాటువులు లఖిస్తున్నాయి..]క వీట్రీని బహుశా మైసూరు చెంజిండ్ల మెచ్చులు ఘటించిన రేవూరి అనంతయ్య చెప్పాడేమో మైసూరులో ఇతడు శతావధానాలూ చేసి ఉంటాడు. ఇతడు 'నూరుఘంటముల్టై నోరారగ ఘనాఘనంబున కవిత మిన్నంద' పలికాడట. అనంతయ్య ఏకసంథాగ్రాహి ఇతడు మైసూరు చెంజిండ్లలో ఏ కావ్యాలు వ్రాశాడోగాని సేలం చేరి అక్కడ కావ్యాల వ్రాశాడు.

ఆ రోజులలో సేలంలో బదిరవాళ్లు చాలా మోతుబర్లు పాలకులు. బరి చిన్నప్పనాయకుడూ, అతని తండ్రీ మైసూరురాజ్యానికి అణకువగా ఉండి వాళ్ల తరపున యుద్దాలలో పాలొన్నారు. మైసూరురాజులు యాదవరాజులు. బదిరవాళ్లతు “యాదు రాయరాజ్య సంస్త్థాపనాచార్య' అనే బిరుదు ఉంది. మైసూరు శత్రువులంతా బదిరివాటీ శత్రువులే. “చేరచోళపాండ్యబళ్లాణరాయ మనోభయంకర' అనే బిరుదు కూడా బది వాళ్లకు వుంది. రేవూరి అనంతయ్య బదిర చిన్నప్పమీదా, అతని తండ్రీమీదా తారామల దండకాలు మొదలైన కృతులు చెప్పాడు. వాళ్లు సంతోషించి ఏనుగులు, గుర్రాట గ్రామాలు మొదలైనవి ఇచ్చి సత్కరించారు. తన తాతతండ్రులపైన కవిత్వం చెప్పే! అనంతయ్యను బదిర కృష్ణప్పనాయకుడు ఒకనాడు పిలిచి పాతవిషయాలు జ్ఞాపకం చే “నిన్ను మా విరుదుకవిగా భావించుకుంటున్నాం. చూవంటివాళ్లకు నీవు భవత్కి కన్యకాపతిత్వం సమకూర్చాలి అన్నాడు.

“అలింతురొ లాలింతురొ - పాలింతురొ మూఢజానపదు లతుల రస

శ్రీలాలిత మోహనపాం-చాలీలాలిత్య నిత్యచంచత్కవితల్‌: (11

కనుకనే సుమతులకెక్కు _ “మరందకందళితమైన మృదుసూక్తులళో గాధేయోషాఖ్యానం రచించి తనకు అంకితం ఇవ్వమన్నాడు. బదిర కృష్ణప్ప నాయకుని అభిమతం మన్నించి అనంతయ్య అయిదాశ్వాల ప్రబంధంగా గాధేయోపాఖ్యానాన్లీ రచించాడు. ఇది విశ్వామిత్రుని చరిత్ర. అతడు రాజ్యం చేయడం, వనానికి వెళ్లినప్పుడీ 13. చాటుపద్య్మమణిమంజరి, 1, ప్తుటలు 4-54.

శిరాసుబా కవులు 873 వసిష్టుని కామధేనువుని చూడడం, దాని తోసం తగాదాపడడం, తపస్సు చేసి బ్రహ్మర్షి కావడం దాకా కథ ఉంది. గాథేయోపాఖ్యానం పూర్తిగా అచ్చుపడలేదు. మదరాసు ప్రొచ్చలిఖిత గ్రంథాలయంలో 5 ప్రతులున్నాయి.*ే కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు కార్యాలయంలో ఒక సంపూర్ణప్రతి ఉంది.5 శ్ర్య కావ్యంలోని శృంగారఘట్టాన్ని ప్రష్యేకంగా శృంగార గాధేయోపాఖ్యానం' అనే పేరుతో 1929లో గంటి సూర్భనారాయణ శాస్త్రిగారు ప్రకటించారు. ఇది మూలగ్రంథంలోని ఆఖరు అశ్వాసం మాత్రమే.

గాథేయోపాఖ్యానంలోని కవిత్వం కమ్మగా ఉంది. అనంతయ్య శబ్లాలంకారాలపై ఎక్కువ మొగ్గుతాడు. అందులోనూ యమకం అంటే మహాబ్రీతి. మేనక విశ్వామిత్రుణ్ణీ చూసి “యువతి మనోరాగాధేయా రమింపరాగాధేయా' అంటుంది (5-66). “పరాకా రూపరా కాశసీ అని అడుగుతుంది (5-68). మునికూడా “నమ్మినవాడ ' నీకు మేన మ్మినవాడ' అని శబాలంకారంతోనే సమాధానం చెప్తాడు (5-119). గాధేయోపాఖ్యా నంలో కవి శబ్దాలంకారాల పట్ల తీసుకున్న శ్రద్ధ అర్భాలంకారాలలో కనబడదు. కొత్తకల్చనలుగాని, నూతన భావాలుగాని అట్టేలేవు.

ఈ గాధేయోపాఖ్యానం వ్రాశాకనో, లేక దీనికి ముందో అనంతయ్య వృద్ధాచల మాహాత్మ్యాన్ని వ్రాసి పంట లింగారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఈ కృతిభర్త తిరుచినాపల్లి బీల్లాలోని వెంగుళం కాపురస్థుడు. ఇతని వంశంలోని వాళ్లంతా తురయూరు పాలిస్తూ వచ్చారు. ఇతడు కూడా క్రీ.శ. 1632 నుండి 1667 దాకా ఆ వూరు పాలించి తరువాత వెంగుళంలో స్థిరపడ్డాడు. దానికి కారణం ఉంది. లింగారెడ్డి భార్య ఎర్రమ్మకు వృద్ధాచలేశ్వరుడు కలలో కనిపించి వెంగుళంలో గుడికట్టించమన్నాడట. అందుకే లింగారెడ్డి ఆ గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం కాపురం పెట్టి ఉంటాడు. అనంతయ్య చేత వృద్ధాచలమాహాత్మ్య్యం వ్రాయించాడు. ఈ కావ్యంకూడా అముద్రితమే. దీని ప్రతి కాకినాడ పరిషత్తు కార్యాలయంలో ఉంది.

అనంతయ్య తమ్ముళ్లు కూడా కవులే. ఏకామ్రయ్య, గురవయ్య, శివానందుడు అన్న వాళ్ళే పేర్లు మాత్రమే తెలుస్తున్నాయికాని వాళ్లు వ్రాసిన తెలుగు కావ్యాలు ఏమిటో తెలియదు. ఏకామ్రయ్య జాంబవతీ పరిణయం, సకత్యాపరిణయం అనే సంస్కృత కావ్యాలు బ్రాశాడు. అనంతయ్యకు శిష్యులున్నారో, లేదో తెలియదుగాని ఆతని అన్నగారు కాళహస్తికవికి మాత్రం మంచి సమర్భడైన శిష్యుడున్నాడు.** పేరు కుందుర్తి వెంకటాచలం, ఆయన మధురలో రాజసతక్కారాలు పొందాడు.

14 £. 18, 2 714, 0 482, 483, 484 15. ఆం పరిష సంపుటి ౩, పుట 358 14 న ద టలము ము మవజన హృదయానందంలో నుతెంచాడు.

మధుర నాయకరాజులు, ఆశితులు

మధురలో నాయకరాజ్య స్థాపన క్రీ. 1529లో జరిగినా క్రీ.శ. 1623 దాకా సాహిత్య పోషణ జరిగినట్టు దాఖలాలు ఏమీ కనబడవు. మధురను పాలించిన తిరుమలనాయకుడు కవులను సత్కరించాడు. తరువాత ఇతని కొడుకు చినముద్దువీరప్ప అర్నెల్లే రాజ్యం చేశాడు. అటుపిమ్మట చొక్కనాథుడు క్రీ.శ. 1659-82 దాళా 24 సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఇతడూ, ఇతని ముగ్గురు తమ్ముళ్ళూ సాహిత్యపోషణ చేశారు.

ఇతని కాలం నుంచీ మధురను ముగ్గురు నాయకరాజులు, ఇద్దరు రాణులు పరిపాలించారు. వీళ్లలో చివరి రాణి తప్పు మిగతావాళ్లందరూ నాటి సాహిత్యంతో సంబంధం ఉన్నవాళ్లే. ఈ ఏలికలేకాక వీళ్ల దళవాయిలు, ప్రధానులు, ఇతర ఉద్యోగుల తూడా సాహిత్యాన్ని పోషించారు. కొందరు స్వయంగా రచనలు చేశారు. ఆ వివరాల చెప్పుకొందాం.

చొక్కనాథనాయకుడు (క్రీ.శ. 1659-82): ఈయన క్రీ.శ. 1643లో జన్మించాడు. పట్టు కట్టుకొన్నప్పుడు 16 సంవత్సరాల వయసువాడు. 40 యేళ్ళు నిండకముయే మరణించాడు. పాలించిన 24 యిళ్లలో ఇతడు అంకితం పుచ్చుకొన్న గ్రంథం ఒక్కటీ ఒక్కటి కనబడుతుంది. అది లింగనమఖి తిరుకామయ్య వ్రాసిన ధేనుమాహాత్మ్యం.*

"ముమ్మడి ముద్దువీరప్పు ఇతని పూర్తిపేరు రంగకృష్ణ ముద్దువీరప్ప. ఈయన రాజ్యానికి వచ్చినప్పుడు ఎన్నేళ్ళవాడో చెప్పలేం. కొందరు 7 ఏళ్ల వయసువాడంటారు మరికొందరు 15 ఏళ్లుంటారు. మరికొందరు 25 ఏళ్లవాడంటారు. బహుశా ఏ పన్నెండు పదమూడు సంవత్సరాలవాడో కావచ్చు. తల్లి పెంపకం వల్లనో, లేక స్వయంగా అలి వరచుకోవడంవల్లనో ముద్దువీరప్పుకు తన కాలపు వాళ్లకు విరుద్ధమైన గుణాలు వచ్చాయి. వారకాంతలను ఏవగించుకొనేవాడు. అంతఃపురంలోని వేశ్యల జనాభాకి స్వస్తి చెప్పాడు ఏకపర్నీవ్రతం ఆచరించాడు. ఎవరికి అన్యాయం జరిగినా సహించేవాడుకాదు ముద్దువీరప్ప వారకాంతలను బహిష్కరించినా అస్తాన కవులలోఎవరో ఒకాయన మాత్రు ఇతనికి లేని రసికతను అంటకట్టాడు. ముద్దువీరప్పు. పైన రెండు శృంగారపదాల కనబడుతున్నాయి. ముద్దువీరప్పు చేసిన 'పచ్చితేనేమోవిగంటికి' ఒక నాయిక *పదివేరి దండములు” పెట్టింది *'చెలువరంగ రమ్మని చేరదీసిన నేస్తము తలచుకొన్న నా మనసు ర్సుల్లురుల్లనెనే అని మరొక నాయిక చెప్పుకొంద్‌ి. ఈమె పదాలు పాడే జాణ అని చరణ తెలుస్తోంది!

వదరకపోవే - ప్రాణేశాయని యుపరతుల మదనకేళిని గూడిన - మగువగనుక ఆ

ముదిత నీవు పాడిన - పదములు తలుచుకొంటె కదిస్తిన రూపమెల్ల - కన్నుల గట్టినట్టున్నరీ 2. నాయకరాజుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 3౩ భారతి, అకోబరు, 1953, పుట హు. (చల్లా రాధాకృష్ణశర్మ గారి వ్యాసం) 4. 100100 000 జజ 01 1136402 - 0 ౧. 5820203608 త్యుంల ౯. 192 5. ఖారతి, 152 ఫిబ్రవరి - తిమ్మావజ్ఞల తోదండరామయ్యగారి వ్యాసం

మధుర నాయకరాజులు, ఆథ్రితులు 875"

ముమ్మడి ముద్దువీరప్పపై పదాలు చెప్పిన ఈ కవి ఎవరో తెలియదు. ఈ నాయకరాజుకు తెలుగు సాహిత్యంతో యింతకంటె ఎక్కువ సంబంధం ఉందో లేదో తూడా చెప్పలేం. ఇతడు అకాల మరణం చెందాడు. ఇతడు చనిపోయేటప్పుడు భార్య ముద్దమ్మ గర్బవతి. ఆ స్థితిలో ఈమె సహగమనం చేస్తానంటే అత్తగారు మంగమ్మ వారించింది. ఒక మగబిడ్డను కని వెంటనే ముత్తమ్మ ఆత్మహత్య చేసుకొంది. మనుమనికి తన భర్తపేరు - విజయరంగ చొక్కనాథుడని - పెట్టుకొని మంగమ్మ రాజ్యం ఏలింది.

మంగమ్మ దక్షత (క్రీ.శ. 1684-1706): మనుమడి తరపున పరిపాలన చేస్తున్న రోజులలో మంగమ్మ మంచి బలజవ్వనంలో ఉన్న ప్రగల్బ. తన బుద్ధి చాతుర్యంతో మధురనాయక రాజ్యాని : ప్రాణం పోసింది. ఆమె చేసిన దానధర్మాలు అసంఖ్యాకాలు. అన్నసత్రాలూ, చలివేంద్రాలూ వేయించింది. దారుల పక్క బారులుగా చెట్లు నాటించింది. ఈమె రాజకీయ జీవితం ఎంత ఉబ్బ్వలమో వ్యక్తిగత జీవిశం అంత కలుషాచ్చాదితం. ఆమె కామానికి కళ్లెం వేసినట్టు కనబడదు. ఆనాడు మధుర కొలువులో ఉన్న ప్రతి మగవాడితోటీ ఈమెకు రంకు కట్టిన సాహసులు ఉన్నారు. అనెగొందిరాజు యిచ్చే నాలుగు డబ్బులకు ఆశపడీ వికటకవి గోపాలయ్య ఈ మంగన్ము మీద "మధుర మంగాపుంశ్చలీ లీలావిలాసం'. 'మంగమ్మ దండకం” వంటి బూతుల బుంగలు సృష్టించాడు. ఈ బుట్టలో పెట్టిన అభూతకల్పనలన్నీ మనం నమ్మకూడదు. మంగమ్మ ప్రేమపురాణాలలోని నిజం ఈ తిట్టు రచనవల్ల నిర్ణయించలేం. దానికి కారణం కొందరు వివరించారు.” ' ఆమెకు భాషాఖిమానం లేదు. కవుల కాశ్రయం ఇచ్చి వారిని కావ్యరచనకు పురికొల్పలేదు. స్వయంగా కవయిత్రియు గాదు' అని పరిశోధకులు అంటారు.

మంగమ్మ సుమారు 18 సంవత్సరాలు మనుమడి తరపున రాచకార్యాలు చూసుకొంది. ఈ డజనున్నర సంవత్సరాలలో మధురలోని కవులకు దివాణంలోంచి ఒక్క వరహా తూడా దక్కలేదంటే నమ్మలేం. ఒకటిన్నర పుష్కరాల కాలంలో ఒక్కసారి కూడా మంగమ్మ ఒక కొత్తపాటగాని, కొత్త పద్యంగాని, ఒక పురాణంగాని వినలేదంటే నమ్మలేని మాట. ఏ రాజకీయ కారణాలవల్లనో ఆమెమీద చెప్పిన చాటువులు సైతం అణగారిపోయాయని భావించడం ఉత్తమం.

మంగమ్మమీద ఆనాటి కవులు కనీసం కొన్ని పద్యాలు చెప్పే ఉంటారు. 'ఈ మంగమ్మను గూర్చిన రెండు మనోహరమైన చాటువుల నుదాహరింతును' అని పరళోధకులుగా ప్రఖ్యాతులైన నిడుదవోలు వెంకటరావుగారు రెండు కమ్మని పద్యాలు చూపించారు. అయితే అవి దురదృష్టవశాత్తూ మధుర మంగమ్మమీది చాటువులు కావు. తంజావూరులో ఏకోజీ కాలంలో ఉండిన ముద్దుమంగ అనే వారకాంతపై ఎవరో చెప్పినమి. 8 వికటకవి గోవాలమ్య వివరాలు ఆనెగొంది సంస్థానం గురించి చెప్పుకొన్నప్పుడు వశదం చేశాను. 7. దాక్షీణాత్యాంధ్రసాహిత్యం - నేలటూరి వెంకటరమణయ్యగారు, పుట 10. 8. దక్షిణ దేశీయాంధ్ర వాబ్బయము, పుట ౩౫.

876 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సయ్య

దళవాయి నరసప్పయ్యః ఈయన మంగమ్మ కుడిభుజం. మంచి యోధుడు. ప్ర వినయం, నేర్చు, సంపద వున్నవాడు. పాండ్యరాజుల క్రీగంట ప్రబలినవాడ మధురరాజుల రాజ్యానికి దళవాయిగా ఉండీ ఎన్నో యుద్దాలు జయించినవాడ్ష యుద్ధభూమిలోనే క్రీ.శ. 1702లో మరణించిన వీరుడు. “సరసభోజనుత్తి' అనే స సమకాలిక కవులు ఇతనిపై చెప్పిన పద్యాలు కొన్ని లఖఫించాయి. బహుశా ఇవి | శతకంలోనివి కొవచ్చు అని పరిశోధకుల అభిప్రాయం. ఈ అసమగ్ర సంకలనప్రతిలో మొదటి పద్యం ఇలా ఉందిః

శ్రీరంగనాథుని చెన్నాంద మదిలోన కోరి పూజలు చేసి మీరినావు

జంబునాథస్వామి సద్బక్తి సివించి వరములు కొని కీర్తి నిలిపినావు

చెవ్వందిలింగని చేరి సన్నుతు లీవు గావించి పుణ్యముల్‌ గాంచినావు

  • ఎన్ని కార్యములైన నీడేర్చి ప్రభువుచే బహుమానములు చాల బడసినావు ట్రొఢీ వినయంబు నేర్చు సంపదలు పొదల

పాండ్యరాజేంద్రుక్రీగన్న ప్రబలినావు

భానుసమతేజదీక్షయప్రభుతనూజ

వరగుణసమాజదళవాయిసరసభోజ (తం. 0%

దళవాయి నరసప్పయ్యపై పద్యాలేకాక శృంగారపదాలు కూడా అనాటి కవల చెప్పారు. మిత్రులు తిమ్మూవజ్ఞల కోదండరామయ్యగారు గుర్తించి ప్రకటించడంవల్ల 6 పదాలలో కనీసం ఒకటైనా మనం చెప్పుకొందుకు దక్కింది.19 ఇందులో కొణ లుప్తమైంది.

ఒళువెల్లదెలిసేరా ఒరోరి జాణ

దళవాయి సరసవజీరా దాతలరాయనీ ॥ఒ॥

నిన్నదాని నేలుకొన్న వగలెల్ల నేను

విన్న చిలుకతాళి-మున్న యిచ్చి సుప్ర

సన్న సరసాన నున్న ॥ఒ|

రాకయేతురా ప-రాక? దానికి సరిగా

తోక లిచ్చితే..............

వరుసదప్పక నన్ను వరుసమానయేలి యొక*

వరుస సొమ్ము లొసగిన నీ-సరిసాటి యెవ్వారు

సరస దళవాయి నరసా ళు!

ఈ పదాన్నిగాని, పై పద్యాన్నిగాని దళవాయి నరసప్పయ్య మీద ఎవరు చెప్పాగో తెలియదు. ఈ దళవాయి విజయరంగచొక్కనాథుని కాలంలో కూడా ఉన్నాడని కొంద భావిస్తున్నారు.!కే గాని నరసప్పయ్య క్రీశ 1702లోనే మరణించడం వల్ల అ 10. భారతి, ఫిబ్రవరి, 1952.

  1. భారతి, ఫిబ్రవరి, 1952. తిమ్మావజ్ఞలవారు.

మధుర నాయకరాజులు, ఆశ్రితులు 877 ఉండడానికి ఆస్కారం లేదు. విజయరంగ చొక్కనాథుడు క్రీశ 17%6లో రాజ్యాధికారాన్ని స్వీకరించాడు.

విజయరంగచాక్కనాథుడు (క్రీ.శ. 1706-32): విజయరంగ చొక్కన్న సాహితీ ప్రీయుడు. స్వయంగా రచయిత. ఇతని కాలంలో ఉన్నంతమంది తెలుగు కవులు మధురలో మరెవరి కాలంలోనూ కనబడరు. శృంగార ప్రబంధ నిర్మాతలు, మధుర వాగ్గేయకారులు, వచన గగ్రంథసంధాతలు, యక్షగాన రచయితలు, రమారమి అన్ని ప్రక్రియలలో రచనలు చేసినవాళ్ళు 14 మంది చొక్కన్న కాలంలో లెక్కతేలుతారు.

వీళ్లు కాక ఇంకా ఎందరో ఈ కాలంలో మధురలో ఉన్నారు. వాళ్లలో ఎవరో విజయరంగ చొక్కనాథునిపై శృంగారపదాలు చెప్పారు. ఇప్పటికి అరు పదాలు దొరికాయి.1* చొక్కన్న కొలువులోని వారకాంతలు కూడా కవిత్వాలు రచించేవారనీ, కల్చనలు పొసగించేవారనీ తెలుస్తోంది. “ఎటువలె వలపించేవే - ఓ జాణ విటరాయడైన మా విజయరంగ చొక్కేంద్రుని' అనే ఎరుకల కాంభోజి పదంలోని రెండో చరణం ఇలా ఉందిః

కవితాలు రచియించి కల్పన పొసగించి - హవుసుగా వినిపింతువా?

వానిచేత అవురౌరా అనిపింతు మా చెంగట - సనపురుమెరయించేది

చాలునుయీ చిన్నైె లువిదా చెల్లునా? వాడు - నవరసరసికుడె. ॥ఎటు॥ ఈ నవరస రసికునిపై ఎవరో కవి 'చొక్కవజీరు' శతకం చెప్పినట్టుంది. 7 పద్యాలు మాత్రమే దొరికాయి. అందులోనివి సైతం మూడు పూర్తిగా లేవు. విజయరంగ చొక్కనాథుని మీద ఈవాళ ఈ మాత్రమే పదాలు, పద్యాలు దొరుకుతున్నాయిగాని అనాడు ఎన్నో ఎందరో వ్రాసి ఎన్ని రకాలుగానో ప్రశంసించారు. ఆశ్రితులు ఆకాశానికి ఎత్తినా నిష్పక్షపాతంగా చరిత్రకారులు మాత్రం విజయరంగ చొక్కనాథుని గురించి ఏ మాత్రం ఘనంగా చెప్పరు. రాజకీయంగా విజయరంగచొక్కనాథుని ప్రవర్తన ప్రశంసనీయం కాకపోయినా సాహిత్య వ్యాసంగంలో మటుకు ప్రస్తుతింపతగ్గవాడే. ఇతడు స్వయంగా రెండు వచనకావ్యాలు బ్రాశాడు. మొదటిది ' శ్రీరంగమాహాత్మ్యం' (10 అధ్యాయాలు), రెండోది “మాఘమాహాత్మ్యం' (158 అధ్యాయాలు). ఈ రెండు వచనరచనలు ఇప్పటికీ అచ్చుపడలేదు. వీటి ప్రతులు కాకినాడ సాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉన్నాయి.*ేీ విజయనగరం చొక్కనాథుని ఒక రకంగా వచనభోజుడని చెప్పాలి. ఇతని ఆదరణవల్లనే వచన కావ్యాలు ఈ యుగంలో ఇనుమడించాయి.

తన రెండు వచనకావ్యాలను 20 యేళ్ల రాజ్యకాలంలో విజయరంగ చొక్కనాథుడు ఎప్పుడు వ్రాశాడో తెలియదు. ఇవి గాక ఇంకేమైనా ఇతర రచనలు చేశాడో లేదో తూడా తెలియదు. ఇతడు క్రీశ 1732లో నిస్సంతుగా పోయాడు. ఇతని భార్య మీనాక్షి నాలుగేళ్ళు పాలించింది. అయితే ఆర్కాటు నవాబుల మోసాలకు తట్టుకోలేకపోయింది. ఇ వీటిని తిమ్మావజ్ఞలవారు ప్రకటించారు. భారతి. ఫీబ్రవర. 1952. 13. దాటుపద్యరత్నాకరంలో దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు ప్రకటించారు. పద్య సంఖ్యలు 75-81. 14 ఆంధ్రసాహిత్య పరిషత్తు పత్రిక, సంపుటి ౩, పుటలు 21-29.

878 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంప ఆత్మహత్య చేసుకుంది. ఆమె పెంచుకున్న బిడ్డ కివగంగకు పారిపోయాడు మర! నాయకరాజ్యుం గంగపాలైంది. అయితే తాత చొక్కనాథుని కాలంనుంచి మనుమడ విజయరంగ చొక్కనాథుని కాలందాకా మధురలో ఉన్న కవులూ వారు చేసిన రవనల్లు తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ సాహితీపరుల గట్టి తెలుసుకొందాం

సముఖం వెంకటక్ళష్ణప్పు విజయరంగ చొక్కనాథుట్లే కాక అలిమేలక్క అనే కన్యను కూడా మంగమ్మ సాకింది. ఆ పోషణలో అలిమేలక్క సరససంగీతసత్కళాశారదాం అయింది ఆమెకు పెళ్ళీడు రాగానే సముఖం మీనాక్షయ్య అనే సన్నిధానవర్తి కిచ్చి పి చేసింది. ఈ పెళ్ళి వల్లనో లేక అంతకు ముందునుంచో సముఖం వారు మధుర కొలువులో ప్రబలులయ్యారు. మీనాక్షయ్య అన్న సత్రాలు కట్టించాడు మంచి నీటి తటాకా తవ్వించాడు ఇతనికి చిత్రకళ అంటే ఇష్టంలాగుంది. మధురలోని సుందరేశ్వరస్వావి దేవాలయంలో వ్రాతచిత్రాలు చిత్రింపజేశాడు ఆ దేవాలయంలోనే మహామంటపు కట్టించాడు

తండ్రీగారి చిత్రకళానురక్షికీ తల్లిగారి సంగీతకళాసక్తికీ వారసుడుగా 4 దంపతులకు వెంకటకృష్ణప్పు అనే బిడ్డ పుట్టాడు ఇతడికి సాహితీశక్తి కూడా అలవడీంగ అనర్గళంగా చదవడం నేర్చుకొన్నాడు పండితులూ అపండితులూ కూూ మెచ్చుకొనేటట్లు పాడడం నేర్చుకొన్నాడు చమత్కారంగా పలకడం అనేక లిపుల బ్రాయడం నేర్చుకొన్నాడు అన్నింటికన్నా మిన్నగా కవితల మేల్మి తెలిసి మెచ్చడ నేర్చుకొన్నాడు శేషం వెంకటపతి బుణిగె కృష్ణయ్య మొదలైన కవులు అతనికి ఆప్పసఖల సముఖం వెంకటకృష్ణప్ప ఉన్నతోన్నతి పొంది విజయరంగచొక్కనాథుని అత్యంతరు! సామాజికుడయ్యాడు

చొక్కనాథుని కొలువులో చేరిన కొత్తలోనే వెంకటకృష్ణప్పు జైమినీ భారకాన్ని అయిదాశ్వాసాల వచనకావ్యంగా నిర్మించాడు దానిని చొక్కనాథునికే అంకీకు ఇచ్చాడు ఇది వచనకావ్యమైనా దీని అవతారికను వెంకటకృష్ణప్పు పద్యాలో రచించాడు మధుర నాయకరాజుల వంశాన్ని క్రమంగా వర్ణించాడు విజయరగ చొక్కనాథుణ్ణి విశేషంగా కీర్తించాడు 15 ఈ వచన కావ్యాన్ని అంకీతం ఇవ్వడానికి ముే వెంకటకృష్ణప్పుకు రాజు ఏను్సులు గుళ్తాలు పల్లకీలు మొదలైన రాజభోగాటి కలుగబేశాడు

టైమినీ భారతం పద్యకావ్యంగా ఇంతకుమ.౦దే మన సాహిత్యంలో ఉంది. దాగి పిల్లలమర్రి పినవీరయ్య సంస్కృతం నుంచి అనువదించాడు ** ఈ కావ్యాన్ని దగ పెట్టుకుని దానిలోని పద్యాలను వచనంగా పచనం చేసుకుంటూ వెంకటకృష్ణప్ప టీ “క జైమినీ భారతం ఆంధ్రసాహిత్య పరిషత్తువారు అచ్చుపేశారు అయినా అందులో అవకారకాధాడ

లేదు ఈ పద్యాలు అడయారు లైటరీలోని బ్రాతప్రతిలో ఉన్నాయి 3253] నిడుదవోల వెంకటరావుగారు మొదటిసారిగా ప్రకటించారు. (దక్షిణ దేశీయాంధ్రవాబ్బయము. అనుబంధ

6 గజపతుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటి.

మధుర నాయకరాజులు ఆన్రితులు 879 గద్యకావ్యాన్ని బ్రాశాడు మధ్యలో మసాలా తగిలించడానికి శృంగార ఘట్టాలలోనూ యుద్ధ వర్ణనలలోనూ స్వకవిత్వమును గూడ గొంతవర కిందు జొనిపాడు పీల్లలమర్రిని కృష్ణప్ప ఎలా అనుకరించాడో అరడజను పద్యాలు ఉదాహరించి మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు ప్రకటించారు 17” అరడజనే కాదు ఆరు డజన్ల ఉదాహరణలు ఇవ్వవచ్చు

టైమిని భారతంలో మొదటి తెలుగు సామెత గోరుచుట్టుపై రోకటిపోటు. వ్యాసులవారు వచ్చి ధర్మరాజును అశ్వమేధయాగం చేయమంటే అసలే యుద్ధం వల చివికిపోయినవారిదగ్గిర డబ్బు లాగడం గోరుచుట్టుపై రోకటిపోటుకదా అని ధర్మరాజు అంటాడు

రాజవంశముల నెల్ల సమూలంబుగా బెల్లగించి- కులంబునీరువేసిన యట్టి రోసంబునంగాక బ్రజలం బాధించి ధనంబు దండుగలం గొనంద లంచితిమేని గోరుచుట్టుపై రోకటిపోటు చందంబున జనులు నొవ్వడరి నన్ను జూచి నవ్వుదురు. (పుట 4)

పినవీరయ్య కావ్యం నుండి మక్కికి మక్కి కొట్టేసిన పాపం ఒడికట్టడం వెంకట కృష్ణప్పుకు ఇష్టం లేదు అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి వెంకట కృష్ణప్ప వచనంలో కొన్ని స్వతంత్రమైన జాతీయాలు లేకపోలేదు వ్యాసుల వారిదగ్గర ధర్మరాజు ఏడుస్తూ రాజ్యంకోసం ఖీష్మద్రోణకర్ణుల నూరక వధించితి అన్నాడని పినవీరయ్య పద్యంలో ఊంది (1-56) వెంకటకృష్ణయ్య వచనంలో రాజ్యంబు కొరకు త్రూరత్వంబున కొడికట్టి పితామహుండైన భీష్ముని వగైరాలను వధించినట్టు కనబడుతుంది (పుట 2) ఇందులో కట్టిన ఒడి వెంకట కృష్ణప్పుదే ఈవిధంగా పరిశీలించుకుంటూ పోతీ ఎన్నో సౌగసులు కనబడతాయి

బైమినీ భారతం కాక మరి మూడు రచనలు వెంకటకృష్ణష్ప చేశాడు అయితే ఇదొక్కటే విజయరంగ చొక్కనాథునికి అంకితం ఇచ్చాడు మిగతా మూడు దేవునికే కృతి ఇచ్చాడు వాటి పేర్లు () సారంగధర చరిత్ర (2) అహల్యా సంక్రందనం (3) రాధికాసాంత్వనం వీటిలో దేని తరువాత ఏది వ్రాశాడో చెప్పలేం.

సారంగధర చరిత్ర కూడా టైమినీ భారతంలాగే వచన కావ్యం తొలి రచనలో పిల్లలమర్రి పినవీరయ్యను అనుకరించిడే రెండవ వచనకావ్యంలో చేమతూర వెంకటరాజుగారిని అనుకరించాడు నిజానికి గౌరన ద్వీపదగా బ్రాసిన సారంగధరనే వెంకటరాజుగారు చాలా చోట్ల పద్యాలను చేశారు ఆ పద్యాలను వెంకటకృష్ణప్పు వచనం చేశాడు సారంగధర వచనకావ్యం అచ్చు పడలేదు దీని ప్రతి ఒకటి కాకినాడ అంధ్ర సాహిత్య పరిషత్తులో ఉంది దీనిని గురించి తెలియజేస్తూ పరిషత్పుస్తక భాండాగారం అనే శీర్షికలో మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు శ్రైలికోసం కొన్ని పంక్తులు ఉదాహరించారు ఈ కావ్యంలోని రసవత్తరమైన కొన్ని పేజీలను బందరు శృంగార కావ్య గ్రంథమండలివారు అచ్చునేశారు

880 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపృక్రి

అచ్చుపడిన ఈ భాగాలను ఆధారం చేసుకునే వెంకటకృష్ణపష్ప సారంగధరమీగ పరిశోధన చేయాలి ఈ భాగంలోని కొన్ని వచనాలకు వెంకటరాజుగారి పద్యాలక్రో పోలికలను నిడుదవోలు వెంకటరావుగారు. గుర్తించి విశదపరిచారు కాకినాడ పరిషత్తులోని ప్రతి చాలాకాలం క్రిందటే థిలమైంది.

తన వచనకావ్యాలలో పూర్వకవులు అనుసరించిన సంప్రదాయాలను విస్మరించకుండా కృష్ణప్ప అహల్యా సంక్రందనం అనే పద్య కావ్యాన్ని వ్రాశాడు మన సాహిత్యంలో రామాయణ కావ్యాల లగాయితు చాలా కావ్యాలలో అహల్యా సంక్రందనుల కథలు ఉన్నాయి వాటి వివరాలు (1) భాస్కర రామాయణం - బాలకాండ, (2 రంగనాథ రామాయణం - బాలకాండ (3) మడికిసింగనగా6 పద్మపురాణం - మూడో ఆశ్వాసం (4) పుష్పగిరి తిమ్మనగారి సమీరకుమార విజయం అంజన వృత్తాంత సందర్పంలో (5) కంకంటి పాపరాజుగారి ఉత్తరరామాయణంలో 5వ ఆశ్వాసంలో (6) ధరణిదేవుల రామయ్య దశావతార చరిత్రలో రామావతార కథలో భాగం ఈ పూర్వకావ్యాలలోని అహల్యా ఇంద్రుల కధలను చదివాక ఎక్కువగా ధరణిదేవులవారి శిల్పానికి ముగ్భుడై సముఖం వెంకటకృష్ణపష్పు తన శృంగార కావ్యాన్ని భబాశాడు

ద్వితీయాశ్వాసం దగ్గిరనుంచీ కృష్ణప్ప ఇంచుమించు ధరణిదేవులవారి మార్గంలోకే నడిచాడు అయితే ఆయన వ్యంగ్యంగా ధ్వనించిన ఎన్నో చోట్ల ఇతడు అవే భావాలను వాచ్యంగా చెప్పి చౌకపడ్డాడు ఉదాహరణకు అహల్యను చూసి మరులుకొన్న ఇంద్రుడు ఆమెవద్దకు చాటుగా ఒక దూతికను పంపాడు. ఆ రాయబారం జరిగిన తరువాత, రాత్రి అహల్మ భర్త దగ్గిర శయనిద్దామని అనుకొంటుంది. ధరణిదేవుల రామయ్య ఇలా వ్రాశాడు:

అనాటి నిశి నహల్యా - మానిని పతిపదము లొత్తి మక్కువ మీరం

గా నొద్ద బవ్వళించిన-నానాతిమనం బెరింగి యాతడు నగుచున్‌

ఇంతీ పర్వము నేడటన్ను నపుడే యేమైన దానేమిపో

యంతేకాక మకేమి యందులకు మిమృ్మర్థించినానే బళా

యెంతే కంటికి నిద్ర దొట్టుకొనిరా నీచెంతి గోరంత ని

ద్రింతుంగాకని పండినా ననుచు నీరజాక్షి లే నవ్వునన్‌

మారు మొగంబు వెట్టుకొని మారుని వేదన తాళలేక వే

మారు గటాక్షవీక్షసుకుమూరతనుం బియు జూచుకొం చయో

కోరినవేళ నాయకుని కూటమి గల్లి సుఖించువార తే

మేరను నోచిరో యనుచు మించిన చింత నొకింత గూర్కగన్‌

(దశావతార 7 60- 2

ఈ పద్యాలను సముఖం వెంకటకృష్ణప్ప ఎలా అనుసరించాడో చూడండి.

పవళింపన్‌ రమణీశిరోమణి రతిప్రారంభ సంరంభతన్‌

ధవు పాదంబులు పట్టి యొత్తెడు వితానన్‌ గోరు సోకించినన్‌

నవలా నీదు చెరంగు మాసి పదియార్‌ నాళ్ళాయె గాలయిుద

మధుర నాయకరాజులు ఆశ్రితులు 881 ప్పె వృధాదోషమిదేల మాను మన నవ్వేళన్‌ విలోలాత్మయై త్రిదశాధిపుడై తేగద - యద నెరుగుచు గోర్కె దీర్చు నని తనలోన్‌ మదనాశుగ మదనాశుగ - మదనాశుగ ధాటి కదిరి మానిని మునితోన్‌ జౌలెం డంతకుమున్నై మాకు బనిలే దాచోదనే నిద్రపై బాళిన్‌ మీపదమూలమందు శయనింపన్‌ వచ్చితిన్‌ జోలిచాల్‌ చాలుం బొమ్మని యల్క మారుమొగమై చంద్రాస్య నిదింప న వ్వేళళ శాతమహార్ణవం బనగ సంవేశించె నమ్మానియున్‌ (అహల్యా 3 68-70) ధరణిదేవుల రామయ్య రచించిన అహల్యా ఇంద్రుల కథ చదవకపోతే సముఖం వెంకట కృష్ణప్పు కావ్యం చాలా బాగుందనిపిస్తుంది. తిక్కనను మించిపోయింది ఈతని దర్శకత్వం అని వెంకటకృష్ణపష్పను మెచ్చుకొనేవాళ్లు లేకపోలేదు 18 ధరణిదేవులవారి నడుందాకా రాని కృష్ణప్ప తిక్కనగారి మోకాళ్లు కూడా దాటలేడు ఈ పసిడిపూల పందిళ్ల పక్కన లేకపోతీ సముఖంవారి మొక్క చక్కగానే ఉంటుంది. ఈ యుగంలో వెంకటకృష్ణప్పే కాక ఇంకా కొందరు తూడా ఈ కథను వ్రాశారు ఏనుగు చినలక్ష్మన్ను తన జాహ్నవీ మాహత్మ్యంలో ఒక చినఘట్టంగా 43 గద్యపద్యాలతో అహల్యా ఇంద్రుల కథను చెప్పాడు (464- 06) అయిడే అది మడికి సింగన్నకు పచ్చి కాపీ ఇది ప్రచారం పొందలేదు వాస్తవానికి సముఖం వెంకటకృష్ణప్పు కావ్యానికి వచ్చిన ప్రచారం దేనికీ రాలేదు సర్వ మధురమైన సద్హంథం గా అది పేరు మోసింది అహల్యా సంక్రందనాన్ని బ్రాశాక సముఖం కృష్ణప్ప రాధికాసాంత్వనం అనే చాటు ప్రబంధాన్ని ఏకాశ్వాసంగా రచించాడని ప్రతీతి దీనిలో 126 గద్య పద్యాలు మాత్రమే ఉన్నాయి ఇందులో సగానికి పైగా ముద్దుపళని వ్రాసిన రాధికా సాంత్వనంలో కనబడుతున్నాయి వెంకటకృష్ణప్ప ఆమెకు నూరేళ్లు ముందువాడని, ఇతని గ్రంథమే ఆమె కావ్యానికి మాతృక అని నిడుదవోలు వారు చెప్పారు 1 మహా అయితే ఈ ఇద్దరికీ ఒక దశాబ్దమేగాని శతాబ్దం దూరం లేదు శ్రీ.శ. 1706-32 దాకా మధుర నేలిన విజయరంగ చొక్కనాథుని కాలంలో కృష్ణప్ప ఉన్నాడు శ్రీ.శ.1739 నుండి 63 దాకా తంజావూరు పాలించిన ప్రతాపసింహుని కొలువులో ముద్దుహోని వుంది. ఈ ఇద్దరి రాధికా సాంత్సనాలకు సంబంధం ఉందా? అసలు వెంకటకృష్ణప్ప ఏకాశ్వాస చాటుప్రబంధం రచించాడా అన్న విషయాలు ముద్దుపళని గురించి ముచ్చటించుకునేటప్పుడు చెప్పుకుందాం కృష్ణప్పనాయకుని అహల్యా సంక్రందనం నిజంగా మధుర కృతులకు నాయకమే అని కావ్యానందులు అంగీకరించి తీరవలసినదని రసికుల శాసనం *ో ఆనందంలో చరమావస్థ బ్రహ్మానందం అదేమిటో అల్లసానివారి వరూధిని ఇలా చెప్పింది 8 మా గురువుగారు మల్తాది రామకృష్ణశాస్త్రిగారే ఇలా అన్నారు బందరు శృంగార కావ్యమండలి వారు ప్రచురించిన అహల్యాసంతక్రందనం భూమిక పుట 2 అయితే వారు ధరణిదేవుల ప్రభావం కృష్ణష్పమీద ఎంత ఉందో గ్రహించలేదు

9 దక్షిణదేశీయాంధ్రవాబ్బ్యయం పుట 3౫52

౫ అహల్యా సంక్రందనం బందరు ప్రచురణ భూమిక పుట3

882 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఎందే డెందము గందళింప రహిచే నేకాగ్రతన్‌ నిర్చృతిం జెందున్‌ గుంభగత ప్రదీపకళికా శ్రీదోవ నెందెందు బో కెందే నింద్రియముల్‌ సుఖంబుగను నా యింపే పరబహ్మ మా నందో బ్రహ్మ యటన్న ప్రాజదువు నంతర్చుద్ధి నూహింపుమూ (యనుచరిత్ర 2-4 ఈ వరూధిని దగ్గర శిష్టరికం చేసిందేమో కృష్ణప్ప సృష్టించిన కుంటెన కత్తి ఇలాగే అహల్యకు బోధించి ఇంకా విడమర్చిందిః ఎందును సంచరింప కఖిలేంద్రియముల్‌ సుఖమొంద డెందమున్‌ బొందుగ దన్ను దా మరువ బుద్ధి కగోచరమైన యిట్టి యా నందము బ్రహ్మమందు రది నవృవయోనవమోహానాంగియౌ చందనగంధికిన్‌ దొరకు జిక్కని మక్కువకాడు జిక్కినన్‌(అహల్యా 3-27)” అయిడే చక్కని మక్కువకాడు చిక్కిన చందగంధి మన పురాణాలలో ఒక్కర్తే ఉండి ఆ సంగతి స్పష్టం చేస్తూ ఆహల్య ఇలా అంది. తారావధూటి యొక్కతె - తారాపతి యొక్కరుండు ధన్యులు జగతిన్‌ వారివలె సాహసింపగ - నేరికి శక్యంబు మగల కింతులకైనన్‌ (అహల్యా 3-౪ ఈ తారాశశాంకుల కథను ఈ యుగంలోనే ఒక కవి పరమశ్ళంగార కావ్యంగా వ్రాశాడు. అతడు సముఖం కృష్ణప్పతు ఆప్తమిత్రుడు పేరు శేషం వెంకటపతి అతడు మధా పురంలో ఆనాడు ప్రసిద్ధుడే. శేషం వెంకటపతి; విజయరంగ చొతక్కనాథుని అత్యంతరంగ సామాజీకుని ఆప్పసఖుడంటే రాజధానిలో చాలా పలుకుబడి కలవాళ్లలో ప్రముఖుడన్నచూట. షష వెంకటపతి అంత గౌరవం నోచుకున్న కవి. ఒక్క సముఖం వెంకటకృష్ణప్స స్నేహమేకాక వంగల సీనయ్యగారి ప్రాపకం కూడా వెంకటపతికి లభించింది. వంగలవారు మధురలో రాజ్యాంగ ప్రముఖులు ఇలాంటి ప్రథమశ్రేణి ఉద్యోగుల ఆదరాఖిమానాలతో చు వెంకటపతి నిరూడకవితా సామ్రాజ్ఞుడై రసపేశల కౌశలంతో రసికుల కింపుగొ మృదూక్తులతో కృతి పరంపరలు రచించి కీర్తి పొందాడు వెంకటపతి తను కృ పరంపరలు వ్రాసినట్టు చెప్పుకొన్నాడు కనుక మనం ఆ సంగతి చెప్పుకొంటున్నాంగాని అతడు రచించిన గ్రంథాలన్నిటికీ మింజుమలె ఒక్క శశాంక విజయమే లభిస్తోంది. టి కృత్యాది పద్యాలవల్లా గద్యవల్లా ఇతని గురువుగారి పేరు కందాళ రామానుజయ్యగాటీ అతని కటాక్షంవల్ల శిష్యునికి కవిత్వం అప్బిందనీ తెలుస్తోంది. వెంకటపతి తండ్రీ పేర కృష్ణయ్య అన్న సంగతి తప్ప శేషంవారి కుటుంబం గురించి మరే వివరాలూ తెలియవు తన పాండిత్య వివరాలను కూడా వెంకటపతి విశేషంగా చెప్పుకోలేదు అయితే శశాంక విజయం శృంగారభంగతరంగితమైన ప్రబంధంగా రచించాలి అతడు ఆశించాడు మకరంద బిందు సందోహ నిష్యందమాధురీ సాధురీత్యానుబగీ

మధుర నాయకరాజులు ఆన్రితులు 883 పదని బంధ బంధురం గా ఉండాలని తలచాడు ఈ రెండు ఆశయాలూ చాలావరకు ఫలించాయి ఈ యుగంలో వచ్చిన శృంగార కావ్యాల సముద్రంలో ఈ వీచి ఒడునే రసతరంగాలు ఉవ్వెత్తుగా లేచాయి ఈ ప్రబంధవనంలో తేనెజల్లులు బాగానే తురిశాయి శశాంకవిజయం అయిదాశ్వాసాల ప్రబంధం కొంత పాత ప్రబంధాల పోత విగ్రహాలను పోలి ఉన్నా దీనికి ఒక హృదయం ఉంది. అది స్రవిస్తుంది. దీనిలోని పాత్రలు సజీవ వ్యక్తులలాగా కనబడతారు గాని రొటీను ప్రబంధాలలో ఆడే బుట్టటొమ్మలలాగా ఉండరు అయితే శేషం వెంకటపతి తన కావ్యకన్యక ఒంటినిండా అనవసరపు ఎరుపు అలంకారాలు తగిలించి సహజ సౌందర్యాన్ని మరుగుపరిచినందుకు బాధ కలుగుతుంది. ఈ ప్రబంధంలో 578 గద్యపద్యాలు ఉన్నాయి వీటిలో సగానికి సగం తగ్గిస్తే కావ్యం ఎంతో బాగుంటుందనిపిస్తుంది.*! తారాశశాంకుల ప్రజయగాథ అందరికీ తెలిసినదే. ఈ కావ్యంలో అత్రి ధర్మపత్నీ సమేతంగా తపస్సు చేయడం త్రిమూర్తులు ప్రత్యక్షమై తమ అంశలున్న ముగ్గురు కుమారులను ప్రసాదించడం తన అంశవల్ల పుట్టిన చంద్రుని పట్ల బ్రహ్మకు ప్రత్యేకమైన అభిమానం చంద్రుని కోసం విశ్వకర్మ చేత ఒక నగరం నిర్మింపజేయడం దాని వర్ణన మొదలైన బోలెడు కథ చెప్పాక చంద్రుణ్ణి చదువుకోవడం కోసం బృహస్పతి దగ్గిరతు పంపిస్తాడు ఇక్కడినుంచి కథ రక్తికడుతుంది. గురుకులవాసంలో చంద్రునికి యౌవనం వచ్చేదాకా అతనిమీద ఎవరి కన్నూ పడలేదు ఆశ్రమవాటికలో అందరు ఆడవాళ్లూ చూసి ముచ్చట పడినట్లే తారకూడా ఆ చక్కదనానికి మక్కువపడింది. అయినా వ్యాకులత చెందింది. ప్రమదారత్నము తార చంద్రు నెనయ న్న్బావించు దోడ్లోన న్యా యము గాదంచు దలంచు దాళగలనా యంచున్‌ వితర్కించు వం శము శీలంబు మదిం గణీంచును బ్రతిష్టల్‌ సూచినం దీరునా తమియంచుం గమకించు ఖీతి మదిలో దర్శించు గాంచున్‌ వెతన్‌ (శశాంక 2-71) తార ప్రతిష్టలు చూచుకోలేదు తమి తీర్చుకోవాలనే ఆశించింది. ఎవరూ లేనప్పుడు హావభావచేష్టలతో అతణ్జి ఆకర్షించజూసింది. అతడు చూస్తుండగా నెరికొప్పు విప్పి కీల్గంటు ఘటించడం రైక సడలించి యారజపు పైట ఘటించి అది మేలో యిది మేలో అని అడగటం నువ్వు ఎతో నేను ఎత్తో చూసుకుందామని భుజాలు సోకేటట్టు సరి నిలువులూ ఆకుమడుపులు అందివ్వడాలూ చేసింది. చంద్రుడు ఈ వలపుదోపులాటలు చూపుల తూపులూ తటుకోలేకపోయాడు నెలత గనొని సాక్క నిచ్చలు తనకిదే మరులాయెనని హరిస్మరణ చేసుకొనేవాడు అయితే వయసులోని వేడి అతణ్ణి రకరకాల వేగించి నావా 2 బ్రౌను దొరగారు ఇలాగే భావించారు ఓలై ౧809 బ్రాత ప్రతిలో ౪ కోరం 0౮1 లగ౭గంంటి అలా ఈ ంంలా యుం్ర౦ 08 ప్రాజజర్తే. త0ిగరప్తలే. అండీ కటు అరలాంరే గంణ ౧౦04౫ అనే రిమార్కు బాశారు.

884 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

చెంద దనంత నింతి కడు జేరిక సేయగ సంతసంబున

న్గంతుడు రంతొనర్చ బరకాంత యటంచు నధర్మమంచు లో

నెంతయు జింతనొందు మన సిట్టుల కొట్టుకనాడ సాహసం

వింత భయం బొకింత రుచి యింత యసమ్మతి యింత గన్పడన్‌ (శశాంక 2-90) ఇంతింత భావాలతో సతమతమై చంద్రుడు చివరకు కామపరవశుడయ్యాడు ఈ యింతి గూడిన తనువు తనువు అని మనసులో అనుకున్నాడు

అంతలో వసంతం వచ్చింది ఇంద్రుడు ఏదో యాగం చేయదలచి గురువుగారిని రమ్మని కబురంపాడు బృహస్పతి పయనం అవుతూ తారను ఇల్లూ వాకిలీ చూసుకో మన్నాడు చంద్రుణ్ణి అప్పచెప్పాడు మరికొన్ని ధర్మాలు బోధించాడు

అలకలు దువ్వ్చరాదు సరసాన్నములన్‌ భుజీయింపరాదు మై

కలప మలందరాదు తిలకంబు రకంబుగ దిద్దరాదు సౌ

మ్ములు గయిసేయరాదు సుమముల్‌ ధరియింపగ రాదు సాధ్వియౌ

నలినదళాయతాగ్షికిని నాథుడు చెంగట లేక యుండినన్‌ (శకాం. 2-126) నాథుడు చెంగట లేనప్పుడు చంద్రునితో క్రీడించవచ్చునని తార భావించింది. భర్తతో నేనూ మీతోపాటు వస్తా నని మాటవరసకంది. స్వర్గంలో నటులు. విటులు వారవధూటులు వుంటారు నీలాంటివాళ్లు రాతూడ దని బృహస్పతి చెప్పాడు తార అతనితో కాపురం చేస్తూ కామానికి వాచిపోయింది. ఆ సంగతి స్పష్టంగా అతనితోనే చెప్పింది.

తీర్గారవెంబడి తిరుగుట గొన్నాళ్లు జన్నంపుదీక్షల గొన్నినాళ్లు

తుదలేని యొక ప్రాద్దువలచేత గొన్నాళ్లు ఘోరతపంబుల కొన్నినాళ్లు

గురుకుల వాసపుగోప్టిచే కొన్నాళ్లు పున్నమ చూసంచుకొన్నినాళ్ళు

బుతుదినంబులటంచు మతి నెంచి కొన్నాళ్లు పన్నిన వేసట గొన్నినాళ్ళు

గాగ నెలప్రాయమెల్ల నీ కరణి నేగె

నెన్నడును నీదు కౌగలి యెరుగనైతి

యిపుడు నీవద్ద నుండుటకేని యోర్వ

దాయె బగదాయె దైవమేదారి యకట! (శశాంక 2- ౫)

తార ఉద్దేశంలో మన్మథక్రతువుకన్నా మరో జన్మం లేదు అయిడే బృహస్పతి నొ చవచనంబులకు బతివచనంబులు రచింప కని ఆమెను ఇంటి దగ్గిర వదలిపెట్టాడు చంద్రుడు ఒంటిగా ఉన్నందు కామె సంబరపడింది. అతనికి తలంటింది. కడుపునిండా విందులు పెట్టింది. అతడు తోటలో తూర్చుని ఊహాగానాలు చేశాడు తీరా తార దగ్గిరకు వచ్చాక కోరిక చెప్పాక ఇది నీకు తగునా? చేపట్టిన మగవానికి జగతిలో నగవు ఆరడి అవయశు కలగవా అని ప్రశ్నించాడు సతికి జారసమాగమాకాంక్ష చెల్లునే అన్నాడు ఇంకా ఇలా హెచ్చరించాడు

మధుర నాయకరాజులు ఆశ్రితులు 885 కోపము వల దిది నీవీ-పాపమునకు జొచ్చినం బ్రపంచంబున నిం కేపొలతి మగనియొద్దం- గాపుర మొనరించు వలదు కాపథ మనినన్‌ (శశాంక ౩-77) ఇలాంటి ప్రశ్నలకు తార తగిన సమాధానాలు ఆలోచించే ఉంచింది. తడుముకోకుండా మొదట ఇలా చెప్పింది మగని నతిక్రమించుటలు మానినికిం దగదంటి వొప్పితిన్‌ మగడు మగం డనంగ మది మక్కువ యెవ్వ్చనియందొ కంటి కిం పగు నత డెవ్చడో యతడు గాదని యన్యు గూడినన్‌ దగ దిది కాముకీజనుల ధర్మము మర్మము నేనెరెంగుదున్‌ (శశాంక. ౩-79) ధర్మపన్నాలు చెప్పేవాళ్ళు చేవలేనివాళ్ళే అని చెంపదెబ్బలాంటి సమాధానం ఇంకొకటి చెప్పింది: లోకములోన కొంద రబలుల్‌ సతులం దనియింపలేక య స్తోకమనీష నన్యపురుషుల్‌ దమ కాంతల నంటకుండ దా టాకులలోన వ్రాసిరి బరాంగన నంటుట బాపమంచు న య్యాకులపాటు జూచి యిపు డాకులపా టెనయంగ నేటికిన్‌? (శశాంక 3-82) పాపాన్ని మరిచిపోమనీ తాపాన్ని చూడమనీ చెప్పింది. ఒట్టు. పెట్టింది. పైబడీ కౌగిలించింది. చంద్రుడు కరిగిపోయాడు ఇద్దరూ కామక్రీడలలో మునిగతేలుతూ ఓలలాడారు తరువాత బృహస్పతి ఇంటికీ వచ్చాడు తారను పిలిచి ఇంక దాళవలదు నీవె చెనకితివో లేక వాడే చెనకెనో తెల్పు తెలిసి శిక్షితు అని గద్దించాడు తార చెక్కు చెదరలేదు తప్పుచేసిన వాళ్లని దండిస్తామన్నారుగానీ లోకంలో తప్పుచేయనివాళ్లు ఉన్నారా అని ఎదురు పన్నించింది. అబ్ద్బభవు కూతురైన అహల్య మొదలు-నేర మొనరించెననినచో నేర్చునడువ నొకరితరమౌనె? మగ వారలోర్వవలయు- గానిచోవట్టి నగుబాటుకాదెమీకు? (శశాంక. 4-20) జరిగినది పట్టించుకోవద్దని ధైర్యంగా భర్తకి చెప్పింది బృహస్పతి తన కోపాన్ని దీగమింగాడు శిష్యుణ్జీ ఇక మీ గ్రామానికి పో అన్నాడు కామసంగ్రామకిరీటి యైన విీటరాయడు వెళ్లిపోయాక తార వియోగాన్ని తట్టుకోలేకపోయింది. తన బాల్యసఖి వస్తే అమెతో తన గోడు చెప్పుకొని చంద్రునివద్దకు రాయబారం పంపింది. చంద్రుడు తూడా విరహుంలో తల్లడిల్లుతున్నాడు దూతిక వచ్చి సంకేతం చెప్పింది ఇంటి చెంగటి పూపొదరింటికి ఇప్పుడే రమ్మందని తెలియజేసింది. చంద్రుడు రెక్కలు కట్టుకొని వెళ్లాడు తార పతిని ముందరిజాము మాటలలో నిద్ర పుచ్చింది. తనపై అతడుంచిన కేలు కెమల్పింది. పానుపునుంచి దిగి పదనూపురములు సడలించి తలుపు నేరుపుగా మూసి గొళ్లెం పెట్టింది. నల్లశాలువ ముసుగుపెట్టి తోట గోడ దాటి చంద్రుణ్ణి కలుసుకొంది

886 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఆమెనతడు లేవదీసుకొని పోయాడు బృహస్పతి మంచయీద పెళ్లాం కోస తడుముకొన్నాడు ఆమె చేతికి దొరక్కపోవడంతో సంగతి అర్థం చేసుకొన్నాడు | దేవేంద్రుని దగ్గిర మొరపెట్టుకొన్నాడు గురువుగారి పెళ్లాన్ని ఆయనకు అప్పచెప్పిం డానికి సర్వులూ తంటాలు పడ్డారు చంద్రుని చేత మాటలూ పడ్డారు యుద్ధం చేశారు చివరకు తారను బృహస్పతికి ఇప్పించారు మనసు చంద్రునికడ ఉంచి మ్రానుపడిన తనువుతో వెళ్లింది అప్పుడామె గర్భవతి బిడ్డ పుట్టాక తండ్రీ ఎవరో చెప్పమని ఆమె ప్రాణాలు తీశారు మేలె నన్ను రచ్చలకు నీడ్వ అని అంటూ చంద్రుని బిడ్డే అందీ ఆ పసికందుని బ్రహ్మ చంద్రనికి ఇప్పించాడు తరువాత చంద్రునికి నక్షత్ర కన్యలతో వివాహం అయింది.

ఈ శృంగార కావ్యం అసభ్యకరం అని చాలామంది సనాతనుల అభిప్రాయం చక్కెరమెత్తిన విషమువలె నీతిమాలిన ఈ కథ మనోహరములైన తేటమాటలతో నింపుగా చెప్పబడినందున అనేకులైన యౌవన పురుషుల నాకర్షించి పాడుచేయుచున్నది అని వీరేశలింగంగారు ఆరోపించారు 22 అయినా కవిత్వము మొత్తముమీద ద్రాక్షాపాక్ళై మిగుల రసవంతమై యున్నదని ఒప్పుకుంటూనే మరో అభియోగం తెచ్చారు. తారాశశాంక గాథను వెంకటపతికి కొందరు పూర్వులు సమకాలికులు అర్వాచీనులు కూడా వ్రాశారు శ్రీనాథుని ప్రొడకావ్యాలుగాని కనుపర్తి అబ్బయ్య చెప్పిన నీతిబోధక కావ్యాలుగాని ఈ కారాశశాంకంలో లేవని వీరేశలింగంగారు అన్నారు శ్రీనాథుని ప్రొడిమ చాలామంది ప్రథమశ్రేణి రచయితలలోనే లేదు దానిని తప్పుపట్టనక్కరలేదు. ఇకపోతి కావ్యప్రయోజనం శుద్ధ నీతిబోధన ఒక్కటే కానక్కరలేదు అయినా తన పాత్రలోని అవినీతిని బాహాటంగా ఖండించలేదని దుయ్యపట్టడం భావ్యం కాదు.

తారాశశాంక గాథను శేషం వెంకటపతికి ముందూ తరువాతా ఎందరో కథనం చేశారు ఎంతమంది ఎన్నిరకాల ప్రక్రియలలోనో కొద్దిగానో విపులంగానో తారాశశాంకం వ్రాసినా శేషం వెంకటపతి కావ్యానికే ప్రచారం వచ్చిందంటే అదీ రసవత్తరం కాబట్టే అని వేరే చెప్పనక్కరలేదు సముఖం వెంకటకృష్ణప్ప వెలిదండ్ల వెంకటపతి మొదలైనవారి మంచి పట్లన్నీ శేషం వెంకటపతిలో ఉన్నాయి

పరిశీలించుకొంటూ వెడితే అప్తసఖుల కావ్యాలలో సమాన ధర్మాలు గ పద్యాలు చాలా దొరకుతాయి సముఖం వెంకటకృష్ణప్ప తన అప్తసఖుడైనా ఈ కావ్యాన్ని శేషం వెంకటపతి అతనికి అంకితం ఇవ్వలేదు ఆ రోజులలో మధురలో చాలా ప్రమః రాజ్యాంగ వ్యక్తిగా పేరుబడసిన వంగల సీనయ్యకు ఇచ్చాడు సీనయ్య చొక్కనాథుని మంత్రులలో ఒకడేకాక పేర్కొనదగిన సాహితీపరుడు

వంగల సీనయ్య నేటికీ ఆంధ్రదేశంలోనేకాక తమిళనాడులో కూడా వివదీక్షాపరురాలనురా అనే శృంగారపదం చాలా ప్రచారంలో ఉంది. దీనిని వంగల సీనయ్యే రచించాడు ఈ సదాన్నేకాక ఇంకా ఎన్నో అతడు చెప్పాడు ఇతని పదాలలో 2 అంధ్రకవుల చరిత్ర 3నభాగం వుటఖ లాలా

మధుర నాయకరాజులు ఆజ్రితులు 887 మన్నారరంగము[ద్ర_ వుంటుంది. సీనయ్య రంగనాథస్వామి. వారి భక్తుడు. సంగీత విద్యావిశారదుడు సాహిత్యవేత్త సా

వంగలవారిది దక్షిణ రాజ్యాలలో పేరుపడ్డ రాజకీయ కుటుంబం వంగల వెంకట శృష్ణయ్యగారు చెంజి వెంకటకృష్ణపష్పనాయకుని పాలనలో మంత్రిగా ఉండేవారు ఈ కుటుంబం ఎప్పుడు మధురకు వెళ్లి స్థిరపడ్డదో తెలియదు వెంకటకృష్ణప్పగారి అయిదోతరంలో వంగల వెంకటరాఘవ సోమయాజి ప్రసిద్ధుడయ్యాడు ఆయన మధురసీమలో వేదపారశాలలు పెట్టించాడు శ్రీరంగంలో ప్రాకారాలూ మండపాలూ కట్టించాడు. పందిళ్ళూ పాకలూ వేయించాడు వాజపేయం చేశాడు ఈ రాఘవ పోమయాజికి సీనయ్య జన్మించాడు ఇతడు నలుగురు అన్నదమ్ములలో రెండోవాడు

సీనయ్య సంస్కృత వ్యాకరణం బాగా చదువుకొన్నాడు కౌముదీ ప్రజ్ఞానగౌరవం వహించాడు లక్షణ గగ్రంథజ్ఞానం కూడా గడించాడు అలంకారిక సమ్మతమైన ఉబ్బ్వల కవిత్వం చెప్ప నేర్చాడు సంగీతంలో ఘనమైన ప్రజ్ఞను సంపాదించి ఘనం సీనయ్య అనే పీరు పొందాడు అందుకే శేషం వెంకటపతి ఆయనను ఇలా ప్రస్తుతించాడు:

హాహాహూహులు గానగర్వమున హాహాహూహువంచున్‌ స్వరా

రోహప్రక్రియగా దురంగతనులై రూపష్యంబునానన్‌ వృథా

సాహంకారులు మర్చ్యగాయకులు జోడా నీకు బాండ్యేశ్వ్చర

స్నేహాలంకృతవంగలాన్నయమణీ సీనా కవిగ్రామణీ! (శశాంక, 1-57)

పాండ్యేశ్చరుని స్నేహాలంకృతుడైన సీనయ్య గొప్పగొప్ప రాచపదవులలో ఉంటూ సాహిత్య వ్యాసంగం చేసేవాడు మన్నారురంగ పదాలను ఎన్ని చెప్పాడోగాని నేడు ఎనిమిది పదాలు దొరుకుతున్నాయి ఈ ముద్రతో శృంగార గేయాలే కాక భక్తిగీతాలను కూడా బ్రాశాడు అన్నచుయ్య క్షేత్రయ్యలలాగ ప్రధాన ముద్రతోపాటు స్థానికదైవాల ఉపముద్రలు తూడా సీనయ్య తన పదాలలో వాడాడు ఇప్పటికి దొరికినన్ని మన్నారు రంగ పదాలను మిత్రులు తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు సేకరించి ఒక వ్యాసంలో ప్రకటించారు 23 సీనయ్య గురించి విపులంగా వ్రాశారు శివదీక్షా పరురాలనురా అనే పదం పూర్తిగా ఇచ్చారు-

శివదీక్షాపరురాలనురా-నే-శీల మెంతైన విడువజాలనురా

శివశివ గురునాజ్ఞ మీరనురా-నే- శ్రీవైష్ణవుడంటే చేరనురా

వడీగ వచ్చి మరము జొరకురా-ి- వార్చనవేళ తలుపు తిరవకురా

మడుగుకావిచెరగు దియ్యకురా- నన్ను-మాటిమాటికి నోరు ముయ్యకురా

అబ్జచూచి చను లదుముకురా-నా-సజ్జి గొలుసుబట్టి గదమకురా

బుజ్జగించకు పసిగోలనురా-నాకె-మ్మో వి నొక్కకు భత్తురాలనురా

పంచాక్షరీజపశీలనురా- కూకి-పలుకులు వినజాలనురా జ భారతి ఫిబ్రవరి ౫2

888 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

మోము మోమునను చేర్చకురా-నీ-నామముతోడ భూతి కూర్చుకురా

వేమరు '“తొడఖిక్ష' వేడకురా - పోపో- రా మన్నారు రంగ మల్తాడకురా. బసివిని పట్టుకొని తొడఖిక్ష అడిగి రసపారవశ్యంలో ముంచే మన్నారురంగని కొంటెతనానికీ పదం నిదర్శనమో కాదోగాని సంగీతసాహిత్యాలలో వంగల సీనయ్యకు గల ప్రజ్ఞకూ, వ్యంగ్య వైభవానికీ ఇది తార్కాణం. ఇలాంటీ శ్రీవైష్ణవ పదాలు చెప్పడమేకాక 'రామానుజచరిత్ర' అనే పద్యకావ్యాన్ని వ్రాసి తిరుపతి వెంకటేశ్వరునికి అంకితం ఇచ్చాడు. ఈ [గ్రంథం దొరకలేదుగానీ దీనిని సీనయ్య రచించినట్లు శశాంకవిజయంలోని అవతారికవల్ల తెలుస్తోంది. శేషం వెంకటపతి తన సంగతి ఏమీ అట్టీ చెప్పుకోక తన కృతిపతి సీనయ్య ప్రజ్ఞలనే విపులంగా చెప్పాడు. ఆయన సరసపర్‌ పద్యగద్యు రచనా భోజుడని తెలియజేశాడు. సీనయ్య వచన గ్రంథాలను కూడా రచించాడని దీని వల్ల ఊహించవచ్చు. భావిపరిశోధన వల్ల ఇతని వచన రచనలు కూడా బయటపడవచ్చును. ఆనాడు మధురలో చాలామంది రాజోద్యోగులు స్వయంగా వచన రచనలు చేశారు. లేదా చేసినవారిని ఆదరించారు.

వెలగపూడి కృష్ణయ్యః విజయరంగ చొక్కనాథుని వద్ద బొప్పూరి సాంబయ్యగార దళవాయిగా ఉండేవారు. ఈయన నలభైవేలమంది భటులపైనా, నాలుగువేల గుర్రాలపైనా అధిపతి. ఈ సాంబయ్యగారు ఆర్కాడు సాదతుల్లాఖానుతో, తంజావూరు. ఆనంద రావుతో యుద్దాలు చేశారు. మైసూరు నంజరాజుగారితో సంధి చేసుకొన్నారు సమరవిద్యలోనేకాక ఈయనకు ఇతర శాస్త్రాలపట్ల ఆసక్తి ఉంది. ఇతర దానాలతోపాటు విద్యాదానం చేశారు. ఈయన '“సర్వవిద్యాభ్యాస సంవత్సరగ్రాస రక్షిత పాఠశాలల రచించా'డని కవులు కీర్తించారు.

ఈ సాంబయ్యగారి సోదరిని వెలగపూడీ నరహరయ్య పెళ్ళాడాడు. సాంబయ్యగాడు దళవాయిగా ఉన్న కొలువులోనే చరహరయ్య సముఖంలోని సంప్రతి- కరణంగా ఉండేవాడు. విజయరంగ చొక్కనాథుడీయనను చాలా సత్కరించాడు. నరహరయ్యగాట్‌ లెక్కలు వ్రాయడానికి బంగారు మలాము చేసిన గంటం వాడేవారు. దానికి సింగారపు వెండి ఒర ఉండేది. ఈయనకు ఐదుగురు కొడుకులు. వాళ్ళలో మధ్యవాని పేరు కృష్ణయ్య వెలగపూడి కృష్ణయ్య దత్తాడ్రేయ భక్తుడు. రామచంద్రయతి. శిష్యుడు. ఈయన పరమహంస, దత్తాత్రేయుని లీలావతారమని జనులు భావించేవారు. ఈయన వే కృష్ణయ్య యోగశాస్తాన్ని నేర్చుకొన్నాడు. ఈ విద్యకాక కృష్ణయ్య చతుర 5ఏికా విచిత్రుడు, సుకవిజనమిత్రుడు. ఇతని మేనమరిది బొప్పూడి సాంబయ్యగారి కుమారుడ గోవిందయ్య సంగీతసాహిత్యవేత్త. సంస్కృతాంధ్ర కవిత్వాల మర్మాలు తెలిసినవాడు ఈ గోవిందయ్య ఎప్పుడూ కృష్ట్ణయ్యను ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఇతనితో సరససల్లాపా లాడుతూ కృష్ణయ్య కృతులు రచించేవాడు.

మొదట ఈయన మాలినీమాధవీయం అనే శృంగారకావ్యం రచించాడు. తరువాక “గౌళికాశాస్త్రం అనే బల్లిపలుకు ఫలితాలను ఏకాశ్వాసంగా రచించాడు. ఏదో జీ కందపద్యాల శతకాన్ని తూడా చెప్పాడు. దత్తాత్రేయ భక్తుడు కనుక ఇతనికి యోగశొస్తబై

మధుర నాయకరాజులు, ఆ్రితులు 889 మక్కువ మంత్ర, లయ, హఠ, రాజయోగాలను యోగచతుష్టయమని పేర్కొంటారు. బహుశా ఈ నాలుగు యోగాలనూ సులువుపరచే “వేదాంతసారసంగ్రహం' అనే ఇాస్త్రగ్రంథాన్ని వచనంలో రచించాడు. ఇవికాక చాలా చాటుకృతులు చెప్పాడు.

ఇన్ని [గ్రంథాలు వ్రాసిన వెలగపూడి కృష్ణయ్య దళవాయిగారి మేనల్లుడూ సంప్రతికరణం కొడుకూ అయినా ఇతడు ఏ గ్రంథాన్నీ విజయరంగచొక్కనాథునికిగాని, రాజోద్యోగులకుగాని అంకితం యివ్వలేదు. అన్నీ దేవునికే అంకీతం ఇచ్చాడు. ఈ గ్రంథాలలో ఒక్క గౌళికాశాస్త్రం తప్ప మిగతావి దొరకలేదు. గౌళికాశాస్త్రం తూడా కర్తపేరు లేకుండా అచ్చుపడిందని పరిశోధకులు భావిస్తున్నారు.షో

ఈ గ్రంథాలన్నీ వ్రాశాక వెలగపూడి కృష్ణయ్య భానుమద్వాజయం అనే ప్రబంధం రచించాడు. స్కాందపురాణంలోని ఉత్తర కాశీఖండంలో కథను తీసుకొని అయిదాశ్వా సాల కావ్యంగా వ్రాశాడు. భానుమంతుడనే బ్రాహ్మణ కుమారుడు ఉజ్జయిని రాజకుమార్తె పద్మావతిని పెళ్ళిచేసుకొనడం యిందులోని యితివృత్తం. పంచమా శ్వాసంలో యోగశాస్త్రం గురించి విపులంగా వ్రాశాడు. ఈ శావ్యం వినోదభరితమేకాక చాలా ఉపయోగకరమని (బబౌనుదొరగారు మెచ్చుకొన్నారు.25 ఈ [గ్రంథం తమిళ భాషలోనికి ఎవరో అనువదించారని తూడా దొరగారు నోట్‌ చేశారు. రామరాజ భూషణుని వసుచరిత్ర, పుష్పగిరి తిమ్మనగారి భాగవతసారం మొదలైన కొద్ది గ్రంథాలే తెలుగునుండి తమిళ భాషలోనికి వెళ్ళాయి. వెలగపూడి కృష్ణయ్యు బ్రాసిన భానుమదాజయం ఆ గ్రంథాల కోవలో మెరుస్తూ ఉంటుంది.

ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఈ కావ్యానికి ఏడు 'ప్రతులున్నాయి (౨ 606-612). ఇవి వెలుగు చూడలేదు.

బద్దెపూడి ఎర్రయ్యః ఒక కవి తీసుకొన్న కథనే స్వీకరించి మరొకరు కావ్యం బ్రాయడం మన సాహిత్యంలో పరిపాటే. అయితే ఒకే వూళ్లో ఉండే ఇద్దరు సమకాలికులు ఓకే కావ్యాన్ని రచించడం అరుదు. అందులోనూ ఒకరి ప్రబంధం బాగా పేరుతెచ్చుకొన్నాక ఇంకొకరు అదే కథను వ్రాయడానికి ప్రయత్నిస్తే. దానిని సాహసం అనడంకన్నా ఉత్సాహం అనడమే మంచిది. శేషం వెంకటపతిగారి తారాశశాంకం వ్రాసిన కొద్దిరోజులోనే, మధురలోనేకాక యావదాంధ్రలో సుప్రసిద్ధమయింది. ఛాందసులకేమో చెప్పలేం గాని యువకులు మాత్రం దాన్ని చదివి ఆనందించారు. ఈ శృంగార ప్రబంధం “యువజన హృదయానందం' కనుక అదే పేరుపెట్టి -బద్దెపూడి ఎర్రయ్య అనే ఉక్సాహవంతుడు తారాశశాంకాన్ని రచించాడు.

ఎర్రయ్య _ పంటరెడ్డి వంశంలోనివాడు. విజయరంగ చొక్కనాథునివల్ల బంగారుదండం, ప్రకీర్ణధ్వజం మొదలైన రాజలాంఛనాలు పొంది బద్దెపూడీ నగరానికి పాలకుడయ్యాడు. ఇతనిపై రేవూరి అనంతయ్యగారి ప్రభావం ఉంది. ఆయనను ఇలా ౫ దక్షిణదేశీయాంధ్రవాజ్బ్యయం - నిడుదవోలు వెంకటరావుగారు, పుళటు ౩౫. జ డీ. కేటలాగు, సంపుటి 2. పుటు 774

890 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పాయని భక్తి మద్గురుల పాదసరోరుహయుగ్మము న్నుపా

ధ్యాయత నొప్పునప్పుర ధరామరవర్యు దలంచి భారతీ

నాయకతుల్యు రేవురి యనంతకవీంద్రుని గొల్చి భూరితే

బోయుతులైన సత్కవుల సొంపు దలిర్చ నుతింతు నెప్పుడున్‌.

ఈ భారతీనాయకతుల్యుడైన అనంతయ్యగారు బహుశా చిన్న అనంతయ్యగారు కావచ్చును. అతడు బద్దెపూడి ఎర్రయ్యకు సమకాలికుడు. ఈయన ఈ శృంగార గ్రంథ రచనలో ఎర్రయ్యకు తోడ్పడి ఉంటాడని మల్లాది సూర్యనారాయణశాస్త్రీగార అఖిప్రాయం.పో 'యువజన హృదయానందం' పూర్తిగా దొరకలేదు. రెండు ఆశ్వాసాలు మాత్రమే లఖిస్తున్నాయి. ఈ అసమగ్ర. కావ్యప్రతి ఒకటి కాకినాడ పరిషత్తు కార్యాలయంలో ఉంది (రంథసంఖ్య 390). కవిత్వం జటిలంగా ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం.

విశ్వేశ్వర పండితుడు: తోటి ప్రజలుకాక సాటి కవులు మూత్రమే చదివి ఆనందించడానికి చాలామంది ఆంధ్రకవులు గ్రంథాలు బాశారు. ఈ ఆశయంతో చెప్పీ కావ్యాలలో విలక్షణ ప్రయోగాలు, విశేష లక్షణాలు కవులు గుప్పించేస్తారు. పూర్వ సాహిత్యంలోని లక్ష్యలక్షణాలను చదువుకొన్నవాడే వాటిని అర్థం చేసుకోగలుగుతాడు. మిగతావాళ్లకు అటువంటి కావ్యం దుర్గమదుర్గం. ఇటువంటి క్లిష్ట రచనలను చేశానని సగర్వంగా చెప్పుకొనే కవులు కొందరు కనబడతారు. వాళ్లలో వి్వేశ్చరపండితుడు ఒకడు. ఈయన ఇలా చాటుకొన్నాడు.

కర్కశం బగునట్టి తర్కశాస్త్రంబున మిగుల శిరోమణి మించినట్లు

రాణ దలిర్చు పురాణంబులందెల్ల ఖాగవతంబు చొప్పడీనపగిది

భవ్యసంస్కృత నవ్య కావ్యంబులం దెల్ల కడు నైషధంబొప్పు గాంచినట్లు

బాగైన యాంధ్ర ప్రబంధములం దెల్ల నాముక్తమూల్యద యలకరణి

నేను రచియించినట్టి సంస్కృతకృతులును

తిలుగుకృతులును గ్లూఢార్థకలన గలుగ

సంస్కృతాం ధ్రవిలక్ష్యలక్షణములందు

దెలియజాలనివారికి తెలియ వశమె? గూఢార్థకల్పనలో ఆముక్టమాల్యదలాగ బ్రాయగలనని చాటుకొనే విశ్వేశ్చరపండితుడు తిరుచునాపల్లి జిల్లాలోని నామక్కల్లువాడు. ఈ ప్రాంతాలను శ్రీ.4 1600 ప్రాంతాల నుంీ కొందరు తెలుగు రెడ్లు వశపరచుకొన్నారు. ఈ సీమలో తలమల అనే ఒక కొండ ఉంది ౪ కొండపై పాపిరెడ్డి అనే తెలుగు వీరుడు గుడి కట్టించాడు. ఈ రెడ్లకు తలమలవాడే ఇంటిపేరు వచ్చింది. క్రీ.4 1652లో పుట్టి 1718 దాకా జీవించిన తలమల రామచంద్రారో సాహిత్యపోషకుడు. ఆయన విశ్వేశ్వర పండితునిచేత కృష్ణవిలాసం అనే కావ్యం చెప్పించి అంకితం పుచ్చుకొన్నాడు.

మధుర నాయకరాజులు, ఆనభ్రితులు 891 విశ్వేశ్వరయ్య మంచి సంస్కృత పండితుడు. కవితార్కిక శిరోమణి అనే బిరుదు

పొందాడు. ఇతని తండ్రీ పద్మనాభయ్య కూడా సంస్కృతభాషా కోవిదుడు. ఈ వంశంలోని వారంతా యజ్ఞయాగాదులు చేశారు. పద్మనాభయ్యను పద్మనాభ అధ్వరి అంటారు. అతని తండ్రిపేరు అక్కలయజ్వ, ఇటువంటి నైప్టీకులయింట పుట్టినా విశ్వేశ్వరయ్య శృంగారప్రబంధమే రచించాడు. కృష్ణవిలాసం అయిదాశ్వాసాల కావ్యం. భాగవతంలోని కృష్ణచరిత్రను శృంగార ప్రధానంగా చెప్పాడు. కవితార్కితుడేగాని శైలి కర్కశం కాదని పరిశోధకుల అభిప్రాయం. మృదువుగా తెలుగు మాటలతోనే కవిత్వం సాగిందని మల్లాది సూర్యనారాయణశాస్త్రీగారు చెప్పారు. ఈ కృష్ణవిలాస ప్రతి ఒకటి ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది. అముద్రిఠం.*”

కుందుర్తి కవులు: విశ్వేశ్చ్వరయ్యలాంటివాళ్లేకాక ఈ సీమలో చాలామంది పండితులు ఉండేవాళ్లు. వాళ్లలో కుందుర్తివారి కుటుంబం అనాడు ప్రసిద్ధం. వాళ్లు తొలినుంచీ సక్కావ్యాలు వ్రాసి సత్కారాలు పౌొందినవాళ్లే,

కుందుర్తివారిది పండిత కుటుంబం. తుందుర్తి అహోబలయ్య గజపతులను, అశ్వపతులను, నరపతులను మెప్పించాడు. ఆయన కొడుకు కుందుర్తి గోవిందయ్య భారతీపరిణయం అనే కావ్యం వ్రాసి వీరవెంకటపతిరాయలకు అంకితం ఇచ్చాడు. కనకాఖిషికం చేయించుకున్నాడు. ఇది క్రీశ. 1614లోనో, అంతకుముందో జరిగి ఉంటుంది. ఈ సన్మానం జరిగాకనే గోవిందయ్యగారికి తొలిచూలు కొడుకు పుట్టాడు. అతనికి వెంకటపతి అని పేరు పెట్టుకొన్నారు. తుందుర్తి గోవిందయ్యగారికి ఆరుగురు కొడుకులు. అందులో కడగొట్టువాని పేరు రామయ్య. ఆయన మధురనాయకరాజులకు అప్తుడయ్యాడు.

కుందుర్తి రామయ్యకు ఒక్కడే కొడుకు. అతని పేరు వెంకటాచలం. చిన్నప్పుడే కేవూరి కాళహస్తిగారి దగ్గర ఇతడు విద్యలు నేర్చుకొన్నాడు. ప్రాజ్ఞుడయ్యాడు. తండ్రి రాజులవద్ద మంత్రిగా ఉంటే కొడుకు ఆస్థాన విద్వాంసుడయ్యాడు. క్రీశ 1706 నుండి 32 దాకా పాలించిన విజయరంగ చొక్కనాథుని సభలో ఉంటూ వెంకటాచలం భారత భాగవత రామాయణాలు వచనకావ్యాలుగా రచించాడు. ద్రాక్షాపాకంలో ఎన్నో నాటకాలు రచించాడు. చాటువులు చెప్పాడు. చతుర్విధ కవిత్వాలలో ప్రజ్ఞ చూపించాడు. “కథాశుకవి' అని పేరు పొందాడు. విజయరంగ చొక్కనాథుడు ఇతనికి పసిడినగలూ, పల్లకీలూ ఇచ్చాడు.

పట్టపురాజు ఒక్కడేకాక సామంతులు తూడా వెంకటాచలాన్ని పోషించారు. తిరుచునాపల్లికి 27 మైళ్ళ దూరంలో తురయూరు ఉంది. అవూరి పంటరెడ్లు చాలా ప్రముఖులు. వారిలో లింగారెడ్డి లోగడ రేవూరి అనంతయ్యను ఆదరించాడు. ఆ లింగారెడ్డి మనుమడు _ వెంకటాచలరెడ్డీ కుందుర్తి వెంకటాచలాన్ని పిలిపించి కార్టీకమాహాత్మ్యం అనే 'ఆరాశ్వాసాల ప్రబంధాన్ని బ్రాయించి దేవునికి అంకితం ₹ లాధ్రనాహాత్యవయ్పభైభ నవనవ పులజ

892 సమగ్రాంధ్ర సాహిత్యం = రెండవ సంపుటి ఇప్పించాడు. తుందుర్తి వెంకటాచలం తన రచనలన్నీ దైవాంకితాలే చేశాడు. ఒక పంటి దేవుని పేర వెంకటాచలంచేత కార్తీకమాహాత్మ్యం చెప్పిస్తే దేవుడే స్వయంగా కలలో కనబడి కుందుర్తికవిని ఒక కావ్యం వ్రాసి ఇమ్మని కోరాడు. మిత్రవిందాపరిణయం అనే ఆరాశ్వాసాల ప్రబంధం వెంకటాచలం రచించాడు. తెలుగు ప్రబంధాలలో సాధారణంగా ఉండే అన్ని వర్ణనలూ గుప్పించాడు. 723 గద్యపద్యాలున్నాయి - మిత్రవింద బాల్య క్రీడలను ఇలా వర్ణించాడు. తలుపుమూలను డాగి తలజూపి దోబూచి యని తల్లి నెమ్మోము గనుచు నవ్వు చందమామా రావె జాబిల్లి రా రావె యని గరాబ్బమ్ము లల్గార్చి పిలుచు బంగరుగురిగె లుప్పాంగుచు జేబట్టి యాటల భక్షణ లడిగి కొసరు కమ్మపుప్పాడి గూర్చి బొమ్మరిండులు గట్టి తనతోడి చెలుల దోకొనుచు నాడు నాడునాటికి బడుచుదనంబుమీర చేరి తల్లిని వలసిన దారి గోరి వేడుబుడుతలతో గూడి విులబొదల తుదల కొలకుల కెలకుల తొడరితిరుగు. (మిత్ర. 2-౫) ఈ పద్యంలోని మ్‌త్రవిందలాగే ఈ ప్రబంధంలోని కవితాకన్క కూడా ఆడుకొంటుంది. మిత్రవింద తన తల్లిని వలసినదారికోరి వేడుకొన్నట్టే వెంకటాచలు కవితాకన్య కూడా ప్రాచీన ఆంధ్రసరస్పతిని అడిగి కావలసిన పప్పుబెల్లాలు తెచ్చుకొని తియ్యని విందులు చేస్తుంది. వెలిదండ్ల అళగిరి; కుందుర్తి వెంకటాచలంలాగే విజయరంగ చొక్కనాథని కొలువులో ఉన్న మరొక కవి వెలిదండ్లవారి కుటుంబంలోనివాడు. ఈ విద్వత్కుటుంబం అర్కాడు సీమలో ఉండేవారు. వెలిదండ్ల పెదరాఘవయ్య విజయరగ చొక్కనాథునికి పరమాప్తుడైన పారిషదుడు. ఈయన కూడా “మధురాంధ్ర కవనగుంఘే కళాచతురుడు' అనే కాక “కవితాపద్య శతసహస్రుడు' అని పేరుకెక్కాడు. అయితే ఇతడు బ్రాసిన కావ్యాలు ఏమీ దొరకలేదు. ఈ పెదరాఘవయ్య కొడుకు అళగిరి తూడా విజయరంగచొక్కనాథుని కాలంలోనివాడే. ఆ రాజు అళగిరిని పిలిపించి “నాకు అరోగ్య భాగ్యాలూ, నీకు ప్రతిభా ఇచ్చేకావ్యం వ్రాసి శ్రీరంగనాథునికి అంకితం ఇవ్వ'మన్నాప. వెలిదండ్ల అళగిరి 'సుదంతా కళ్యాణం' అనే ఒక కావ్యాన్ని బ్రాశాడు. ఇది నాలుగాశ్వాసాల ప్రబంధం. అచ్చుపడలేదు. దీని ప్రతి కాకీనో సాహిత్యపరిషత్తువారి కార్యాలయంలో ఉంది.*కి సుదంత శ్రీకృష్ణుని అష్టమహిషులలో ఒకతె అని పరిశోధకులు చెప్తున్నారు. ఆ నాయకీ నాయకుల పెళ్ళి కథను రొటీన ప్రబంధంగా అళగిరి వ్రాశాడు కాబోలు. అయితే మన కవులు చేసే అష్టమహిషి లిస్టులో కొంత్ర తికమక ఉన్నట్టుంది. తాళ్ళపాక తిరువెంగళనాథుడు అష్టమహిషీ కళ్యాణ వ్రాశాడు. చెంగల్వ కాళయ్య వాళ్ళ కాపురాల గురించి బ్రాశాడు. ఈ ఇద్దరూ ఇచ్చిన 28. అంధ్ర సాహిత్యపరిషత్సత్రిక, సంపుటి ౩, పుట 300. గ్రంథ సంఖ్య 21.

మధుర నాయకరాజులు, ఆథభ్రితులు 893 పేర్లలో తేడాలు ఉన్నాయి. శ్రీకృష్ణుని ఆరోభార్య సత్యకీర్షి అని కాళ్ళపాకవారు వ్రాశారు. సునంద అని చెంగల్వ కాళయ్య వ్రాశాడు. వెలిదండ్ల అళగిరి సుదంత అన్నాడు. తాళ్లపాకవారి సత్యకీర్పి కోసలరాజపుత్రి. ఆ రాజ్యంలో పోట్లగిత్తలు ఉన్నాయి. వాటిని అణచిపెట్టిన వారికి కూతురిని ఇస్తానని రాజు ప్రకటించాడు. కృష్ణుడు సాధించాడు. పెళ్ళి చేసుకొన్నాడు. ఇదే కథను నీలాసుందరీ పరిణయం అని కూచిమంచి తిమ్మయ్య ఈ యుగంలో వ్రాశాడు. వెలిదండ్ల అళగిరి ఏ కథ రాశాడో తెలియదు.

వెంకట 'సోనుయాజిగారి తిరుమలయ్య: మధురలో ఎందరో సాహితీపరులు పద్యకావ్యాలూ, పదాలూ, వచనగ్రంథాలూ వ్రాశారు. గాని ఒక్కడు తప్పు ఎవరూ యక్షగానాలు రచించినట్టు కనబడదు. మధుర తరపున దొరికిన ఏకైక యక్షగాన (గ్రంథకర్త పేరు తిరుమలయ్య. మధురనాయకరాజుల పోషణలో ఒక బాలసరస్వతిగారు ఉండేవారు. ఆయన యాగం చేశాడు. అతని కొడుకులలో వెంకట సోమయాటి ప్రముఖుడయ్యాడు. ఈయన నిస్తుల కళాప్రొడి కలవాడట. ఇతని కొడుకు తిరుమలయ్య గ్రంథకర్త. సంగీత సాహిత్య చతురుడు. ఇతనికి విజయరంగ చొక్కనాథుడు కుండలాలు, కంకణాలు, అందలాలు, అగ్రహారాలూ ఇచ్చాడు. తనకు ఇంత ఘన బహుమానాలు యిచ్చిన విజయరంగ చొక్కనాథుని పేర తిరుమలయ్య ఒక యక్షగాన కృతి రచించాడు. దానిపేరు చిత్రకూట మాహాత్మ్యం. అందులో నటరాజు కాళికాదేవిని నాట్యంలో ఓడించే కథ ఉంది. ఇది నర్తనయోగ్యమైన రచన. సాహిత్యం తక్కువైనా మృదంగ తాళ శబ్దాలతో దీనిని నాలుగు రాత్రులు వరుసగా ఆడేవారు కాబోలు. ఈ నాటకాన్ని వచన చమత్కార వైఖరి మీరగా వ్రాకానని కవి చెప్పుకొన్నాడు. గాని చమత్కారం సంగీతంలో ఉంది కాబోలు; సాహిత్యంలో స్వల్పం. కాళికాదేవి కలగంది. అందులోని అందగాణ్ణే శిమ్మంది, అప్పుడు చెలికత్తిలు లా పాడారు:

కలను జూచినట్టి నీటుగాని తొడితెమ్మనేవు

కలికి యతని యూరు పేరు తెలియు టెలాగే?

అందమైన కొలనినీటియందు గానుపించునట్టి

చందమామ నొడిసిపట్టు చందమెలాగే!?

యొప్పులాడి యుద్ధమునను గుప్పున కనిపించునట్టి

గొప్పముడుపు చేయిసాచికొనుట యొలాగే? ఇలాగ అక్కడక్కడ బాగున్న పాటలు ఉన్నాయి.

మధుర నాయకరాజు హయాంలో యక్షగానాలు రమారమీ లేనట్టే అనిపించినో పాండ్య “మండలంలోనే ఉన్న రాజపాళయంలో ఈ ప్రక్రియ బహుళంగా సాగినట్టు కనబడుతుంది. విజయనగర సామ్రాజ్య విస్తరణ సాగినప్పుడు మధురనాయక రాజులతోపాటు, తిరుమల నాయకుని కాలంలో కొందరు రాచవారు రామనాథపురం కీల్లాలోని శ్రీవిల్లిపుత్తూరు తాలూకాలో ఉన్న సంజీవి పర్వతం దరిదాపులలో స్థిరపడ్డారు. రాచవారు పాశెం చేసుకొన్న స్థలం కనుక దీనికి రాజపాళయం అనే సార్థక

894 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నామం వచ్చింది. వీరిలో పూసపాటివారు, గొట్టుముక్కలవారూ ప్రముఖులు. తమి దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నాా వీరు తెలుగు మరచిపోలేదు. తెలుగు సాహిత్యాన్ని దూరం చేసుకోలేదు. గొట్టముక్కలవారు స్వయంగా సాహిత్య నిర్మాణం చేశారు. ప్రత్యేకంగా యక్షగానాలు రచించారు. ఈ ఇంటిపేరు గల ముగ్గురు రాచవారు చెప్పిన కృతులు ఈ మధ్య వెలుగు చూశాయి. “రాజపాళయం రాజకవుల యక్షగానములు' అని ఆ పట్టణంలోని తెలుగు విద్యాలయము వారు మూడు కృతులను 1981లో ప్రచురించారు. వాటి వివరాలు: దొట్టుముక్కల కృష్ణమరాజుగారి =. సీకాకల్యాణం గొట్టుముక్కల సింగరాజుగారి =. పారిజాతాపహరణం గొట్టుముక్కల కుమారపెద్దిరాజుగారి - సావిత్రి ఈ రాజకవుల యక్షగానాలనే కాక బహుశా వారి ఆశ్రితులైన భాస్కర శేషాచల తిరుమెక్కాళ్‌: తిరువెంగళాచార్యులు రచించిన “నాంచ్చార్‌ పరిణయం”, “కూరత్తాళ్వార చరిత్ర. అనే యక్షగానాలు కూడా రాజపాళయంలోనే దొరికాయి. ముద్రితమయ్యాయి. రాజపాళయం యక్షగానాలపై ఇంకా విస్తృత పరిశోధన అవసరం. రాజకవులు కాళ ఆశ్రితకవులు ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా మధుర కూడా సందర్శించే వుంటారు. శేవలం మధురలోనే నివాసం ఏర్పరచుకొని రచనలు చేసేవాళ్లేకాక ఇతర ప్రాంకార ప్రభువులను ఆశ్రయించుకొని కారణాంతరాలవల్ల మధురకు వచ్చి ప్రముఖుల పోషణలో కొన్నాళ్లుండి మళ్ళీ వెళ్ళిపోయిన కవులు కూడా ఈ యుగంలో ఉన్నారు. అలాంకీ టూరింగు కవులలో రేవూరి అనంతయ్య ఒకడు. రేవూరివారు సేలం జిల్లాలోని మైసూర సామంతుల అస్థాన కవులు. కొన్నాళ్ళకు తిరుచినాపల్లిదగ్గిర స్థిరపడ్డారు. శీవూరి చిన అనంతయ్య: రేవూరి అనంతయ్యగ్గారి మనుమడి పేరు కూర అనంతయ్యే. ఇతజ్జీ మనం చిన అనంతయ్య అని పిలుద్దాం. తాతగారు వృద్యాచి మాహాత్మ్యం. రాస్తే మనుమడు శ్రీముష్టమాహాత్మ్యం చెప్పాడు. దీనిని వ్రాయమని వెంగుళంలోని శ్రీమంతుడు కృష్ణయ్య ప్రోత్సహించి అంకితం పుచ్చుకొన్నాడు. ఖీ అయిదాశ్వాసాల ప్రబంధం. శైలి చాలా ప్రాఢంగానూ, మనోహరంగానూ ఉఊంటుంటి పరిశోధకులు భావిస్తున్నారు. ఇది అముద్రితం. దీని ప్రతి ఒకటి కాకినాడ ఆంధ్రసాహిశే పరిషత్తు కార్యాలయంలో ఉంది. = శ్రీముష్టం దక్షిణదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దీని మహిమను తెలుగు కవుల చాలామంది కీర్తించారు. కేవలం రంకుకథేల పుస్తకం అనుకొనే శుకసప్తతిలో కది శ్రీముష్టమహిమను రెండు కథలలో చెప్పాడు (శుక. 4-141 నుండి 210). రేవూరు య అనంతీయ్య ఒక కావ్యమే. వ్రాశాడు. ఈ గ్రంథాన్ని బ్రాశాక ఇతడు నల్లందిా ఆశ్రయంలో ఉన్నట్లుంది. మధురను పాలించిన విజయరంగ చొక్కనాథుని దగ్గిర నల్లందివారు అప్తులై మిత్రో అధికులై ఉండేవారు. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు: (1) నల్డందిగళు అయ్యవారరే 29. పరిషత్పత్రిక సంపుటి ౩, పుట 3౫1.

మధుర నాయకరాజులు, ఇఖ్రితులు 895 (2) నల్లందిగళు శేషయ్య (3) నల్లందిగళు వెంకటరాఘవయ్య (4) నల్లందిగళు కస్తూరయ్య,. వ్లలో మూడోవాడు. వెంకటరాఘవయ్య అందరికన్నా అధికంగా రాజసన్నేధిలో మెలగేవాడు. సకలాధికారాలు పొందాడు. ఈయన చిన్నన్నగారు శేషయ్య కవులకు న్షోపంలాంటివాడు. ఇతనిమీద చిన అనంతయ్య ఒక ఉదాహరణ కావ్యం చెప్పాడు. దీనిని శేషార్యోదాహరణం అంటారు. రచన సామాన్యం. దీనిని నిడుదవోలు వెంకటరావుగారు ప్రచురించారు. ఈ ఉదాహరణం చెప్పాకో, చెప్పకముందో చిన అనంతయ్య మరో లఘుకావ్యం బ్రాశాడు. ఈ నల్లంది సోదరులలో పెద్దవాడైన అయ్యవారయ్యతు అంకితంగా 'నల్లందిగళు వంశావళి అనే సీసమాలికలో చెప్పాడు. ఇది తూడా ఇటీవల ప్రచురితం అయింది. దీనివల్ల నల్లంది సోదరుల వైభవం, వాళ్ళ పూర్వీకుల ప్రతిభ మహత్తు తెలుస్తాయి. నల్లంది సోదరుల ఆశ్రయంలో ఎన్నాళ్లున్నాడోగాని కేవూరి చినఅనంతయ్య చివరకు తురయూరు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ స్థిరపడినట్లున్నాడు. స్కాందపురాణంలోని శివరహస్యా ఖండాన్ని తెనిగించి తురయూరు నందీశ్వరునికి అంకీతం ఇచ్చారు. ఇది తొమ్మిదాశ్వాసాల గ్రంథం. అయినా ఇందులో నాలుగు కాండలే ఉన్నాయి. శివరహస్య ఖండంలో అసలు ఏడు కాండలు ఉంటాయి. ఈ పురాణాన్ని ఇంతకుముందే ఈ యుగంలోనే కోడూరి వెంకటాచలం తెనిగించి ముళువాగళు రాజుకు అంకీతం ఇచ్చాడు. రేవూరి చిన అనంతయ్య అంతా సంపూర్ణంగా అనువదించాడో లేదో తెలియదు. ఈ ఇద్దరు కవులేకాక ఈ యుగంలో మరికొందరు కవులు తూడా శివ రహస్య ఖండం అనువదించారు. ఒకరు రాపాక వెంకటదాసు; ఇంకొకరు ముదిగొండ ప్రహ్మయలింగం. ఇన్ని అనువాదాలున్నా ఏవీ ప్రసిద్ధం కాలేదు. కాండ కోడూరి కావ్యం రేవూరి కావ్యం

  1. సంభవకాండ 5 ఆశ్వాసాలు 4 ఆశ్వాసాలు
  2. అసురకాండ 2 ఆశ్వాసాలు ఏకాశ్వాసం
  3. వీరమాహేశ్వరకాండ ఏకాశ్వాసం ఏకాశ్వాసం
  4. యుద్ధకాండ 4 ఆశ్వాసాలు 3 ఆశ్వాసాలు
  5. దేవకాండ 2 ఆశ్వాసాలు ల
  6. దక్షకాండ 4 ఆశ్వాసాలు = కేపూరి చిన అనంతయ్యలాగ మధురరాజ్యానికి వచ్చిపోయే కవులు కాక మరి కొందరు స్థానికులు కూడా ఉన్నారు. అసహాయశ్యామారాయడు, శ్రీపతి రామభద్రకవి, కవిధాటి బలభద్రయ్య, భాస్కర వెంకటాచలం వంటి రచయితలు ఉన్నారు. వీళ్ళు రామాయణాలూ, వివిధ మాహాత్మ్యాలూ బ్రాసినవాళ్ళు. వాళ్ళ గురించి వేరే
  7. మదరాసు, ఓలై. బులెటిన్‌, సంపుటి 5, సంచిక 1.

696 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ మూకఉమ్మడి శీర్షికలో తెలుసుకొందాం. ఈ తెలుగువాళ్ళీ కాక ఒక పాశ్చాత్యుడు కూడా ఆంధ్ర గ్రంథాలు వ్రాశాడని ప్రతీతి. క్రైస్తవమత ప్రచారం చేయడానికి వచ్చిన రాబర్ల డి నోబీలి అనే జెసూట్‌ ఫాదిరి తమిళంలో చాలా గ్రంథాలు వ్రాశాడు. ఇతనికీ వివధర్మయ్య అనే తెలుగు బ్రాహ్మణుడే సంస్కృతం నేర్పాడు. వేదశాస్రాలు బోధించాడు. ఆనాటి తెలుగు శ్రీమంతులు డి నోబిలికి ఆశ్రమం కట్టించి ఇచ్చారు. తెలుగువాళ్లతో సంబంధంగల డి నోవిలి తెలుగు గ్రంథాలు వ్రాసేవుంటారు. అయితే అవి వెలుగు చూడలేదు.

మధురలో బయటపడీన కొన్ని కావ్యాలు మృదుమధురమే!

తంజావూరు మహారాష్ట్ర రాజులు

మధుర, తంజావూరు నాయకరాజుల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గున మండేది. క్రీశ 1673లో ఆరని జ్వాల రగిలింది. అందులో తంజావూరు తెలుగు నాయకుల రాజ్యం ఆహుతయిండి విజయరాఘవనాయకుడు ఎనఖై సంవత్సరాల వృద్ధాప్యంలో కత్తిపట్టి వీరమరణం ఫౌందాడు. అతని రాణివాసపు స్రీలందరూ మందుకుండలు అంటించుకుని మరణీంచారు. తమ శత్రువులను 'పుత్రమిత్రకళత్రాదులతో సహా హతపరచినామనే సంతోషం మనసున పెంపొందగా' మధుర నేలే చొక్కనాథనాయకుడు తన తమ్ముడు ఆళగిరిని తంజావూరు ఏలికగా పంపించాడు. అయితే విజయరాఘవనాయకుని వంశం సమూలంగా నాశనం కాలేదు. చెంగమలదాసనే నాలుగేళ్ల చిన్నవాడు సజీవుడే. ఆ బిడ్డను ఒక దాది రక్షించింది. రహస్యంగా నాగపట్నానికి చేర్చింది. ఒక వర్తకుడు వాళ్లకు ఆశ్రయం ఇచ్చాడు.

చెంగమలదాసు నాయకరాజ్యానికి వారసుడు. అతడు విజయరాఘవ నాయకుని మనుమడు. ఈ బిడ్డను గద్దె ఎక్కించాలని రాయసం వెంకన్న అనే ఉద్యోగి భగీరథ ప్రయత్నాలు చేశాడు. బిడ్డను తీసుకొని విజాపురానికి వెళ్లాడు. ఆదిల్లాను దర్శించుకొని సహాయాన్ని అర్థించాడు. తంజావూరు గద్దెపై తెలుగు దొరవిడ్డను నిలబెట్టమని అదిల్లా తన వజీరులలో ఒకనికి అజ్ఞ ఇచ్చాడు. ఆ రోజులో ఆదిల్హావద్ద శాంహాజీ అనే మహారాష్ట్ర పాలకుడు వజీరుగా ఉండేవాడు. ఈయన మరెవరోకాదు ఛత్రపతిగా ఉత్తరోత్తరా పేరు మోసిన శివాజీకి కన్నతండ్రి. శాహజీకి ఏకోజీ అనే మరొక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఏకోబీ శివాజీ సవతి తమ్ముడు. శివాజీ అంత కాకపోయినా కార్యదక్షుడు.

తంజావూరు రాజ్యాన్ని నిలబెట్టే సత్కార్యాన్ని శాహాజీ పూర్తిగా ఏకోకీ భుజాలపై పెట్టాడు. పన్నెండువేల గుర్రపుఫొజును, తగిన కాలిదళాన్నీ తీసుకొని ఏకోజీ తంజావూరు వెళ్లాడు. అళగిరిని ముట్టడించాడు. మొదట ఓడిపోయినా చివరకు ఏకోకీ గెలిచాడు. అళగిరికి మధురనుండి ఏవిధమైన సహాయం రాలేదు. దానికి కారణ లేకపోలేదు. తంజావూరు చేతికి రాగానే అళగిరి స్వతంత్రించాడు. స్వామిద్రోహం చేశాడు. ఇది చొక్కనాథునికి బాధ కల్గించింది. అందుకే సమయానికి ఆదుకోలేదు. మహారాష్త్రుల

తంజావూరు మహారాష్ట్ర రాజులు 897 తాకిడికి తట్టుకోలేక అళగిరి పారిపోయాడు. తంజావూరు సింహాసనంపె ఏకోజీ చెంగమలచాసుని ప్రతిష్టించాడు. ల్‌

తాను నిలబెట్టిన బిడ్డ రాజయ్యాక తనకు దళకర్థ ప్రధానికం లభిస్తుందని రాయసం వెంకన్న ఆశలు పెట్టుకొన్నాడు. అయితే చెంగంమలదాసు ఆ పదవిని 'నాగపట్టంసెట్తికి ఇచ్చాడు. ఆదిలో ఆశ్రయం అడిగినప్పుడు దాది సెట్టికి బాస చేసింది. “తంజావూరు రాజ్యం ఈ బిడ్డకు వస్తే నీకు దళకర్త ప్రధానికం ఇస్తున్నాము అని చెప్పింది; పైగా ఆ దాదికి నెట్టి వలపు మగడు. ఈ రెండు కారణాలచేతా సెట్టికి దళకర్త ప్రధానికం లభించింది. పదవి రాకపోయేసరికి రాయసం వెంకన్న బాధపడ్డాడు, పగపట్టాడు. ఒక ఎత్తు వేశాడు. చెంగమలదాసును గద్దెమీద నిలబెట్టిన ఏకఠోజీ తన దారిఖర్చుల నిమిత్తం కేటాయించిన పన్నులు వసూలు చేసుకొందుకు ఇంకా చోళదేశంలోనే ఉన్నాడు; రాయసం వెంకన్న అతని దగ్గిరకు వెళ్లాడు. 'ఈ దేశం ఏడామడల విస్తారంలో కోటి ద్రవ్యం ఎత్తున్ను ఈ రాజ్యమున్ను, ఈ కోట, యిటువంటి సామ్రాజ్యం విడిచిపెట్టి ఏల ఆ కొండల రాజ్యానికి పోవలెను?” అని చెప్పి తంజావూరును పట్టుకోమన్నాడు. ఇతని మాటలు విని “రాజ్యకాంక్షకు లోబడితే అపకీర్పిన్ని దోషము సంభవించేదే కాక పొచ్చాయితో విరోధం తూడా వచ్చును. మా తండ్రికిని, ఇంకా అచ్చట ఉండే మావారికిని హాని వచ్చును. తెనుగువాని దొరతనానికి మనం పుట్టినామా?' అని ఏకోజీ ఒప్పుకోలేదు.

అయిడీ తెలుగువాని దొరతనానికే ఏకోజీ పుట్టినట్టుంది. అతడు చోళదేశాన్ని విడిచిపెట్టి వ్లోైలోగా విజాపూరులో పరిస్థితులు మారాయి. సుల్తాను మరణించాడు. శివాజీ స్పతంట్రించాడు. ఇక్కడ ఈ తంజూవూరు రాజ్యాన్ని కట్టుకుంటేనే మంచిది అనే అభిప్రాయం ఏకోజీకి కల్గింది. రాయసం వెంకన్న పథకం ఫలించింది. చెంగమలదాసును భయపెట్టి, అతని దళకర్త ప్రధానిని బెదరకొట్టాడు. వాళ్లు పలాయనం చిత్తగించారు. తమిళదేశంలోని తెలుగు గద్దెమీద మరారి నాయకుడు రాజు అయ్యాడు.

ఏకోజీ క్రీ.శ 1676లో పట్టాఖిషేకం చేసుకొన్నాడు. తన వాళ్లందరికీ పెద్ద పదవులు యిచ్చాడు. “వెంకన్న దేవాంతకుడు; అతడు మనని పిండిబొమ్మలాగా ఆడిస్తాడు; అందుకు సమర్శడు; కనుక వాణ్ణి పట్టి భద్రం చేయాలి" అని ఏకోజీ అనుకున్నాడు. అనుకున్నది అమలు పెట్టేలోగా వెంకన్న జా గ్రత్తపడ్డాడు. వికారి వేషం వేసుకొని పారిపోయాడు. నాటినుండి తంజావూరులో మహారాష్ట్ర రాజులు అవిచ్చిన్నంగా పరిపాలన సాగించారు. చాలా మంచి తెలుగు సాహిత్యాన్ని పోషించారు. స్వయంగా రచనలు చేశారు. వాళ్ల పాలన గురించీ, సాహిత్యలాలన గురించీ తెలుసుకుందాం.

ఏకోజీ (క్రీ.శ 1676-1683): తంజావూరు గద్దెమీద ఇతడు పట్టుమని పదేళ్లు తూడా కూర్చోలేదు. పాలించిన ఎనిమిది సంవత్సరాలలో రాజ్యాన్ని నిలబెట్టుకోవడంతోనే సరిపోయింది. అందుచేత ఆయన తెలుగుపై కాకపోయినా కనీసం సంస్కృత 'సాహిత్యం పట్ట శ్రద్ధ చూపించి ఉంటాడు. అతని మంత్రులు, మంత్రుల కుమారులు పంగరబ్రత పండితులు. సుప్రసిద్ధలైన అప్పయ్యదీక్షితుల వారి వంశంలోని గంగాధరు

898 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వ్యాఖ్య రచించాడు. అందులో భోసలవంశావళి అనే పేరుతో మహారాష్ట్ర రాజుల వంశచరిత్రను వ్రాశాడు. గంగాధరునికి ముగ్గురు కొడుకులు; ముగ్గురూ గ్రంథకర్తలే.

  1. నరసింహరాయ మఖి: త్రిపురవిజయంచంపువు వ్రాశాడు.

  2. త్రియంబకరాయ మఖి: రామాయణానికి _ ధర్మకోత్తమనే వ్యాఖ్యానం

బ్రాశాడు. స్త్రీధర్మం రచించాడు. 3. భగవంతరాయ మఖి: రాఘవాభ్యుదయనాటకం, ముకుంద విలాసం, ఉత్తర చంపువులు రచించాడు.

హ్లీోకాక ఇతర సంస్కృత పండితులను కూడా ఏకోజీ ఆదరించి ఉంటాడు. అతడు మహారాషుడు కనుక సంస్కృతం తప్పించి ఇతర దేశ భాషలలోని సౌగసుల ఆస్వ్పాదించలేక పోవచ్చును. ఆ భాషలను నేర్చుకోడానికి కావలసినంత తీరికా, ఓపికా అతనికి లేవు. అయిజే ఆ లోపాన్ని అతని కొడుకులు తీర్చారు. ఏకోజీ తంజావూరులో స్పిరపడ్డప్పుడు క్రీ.శ. 1676లో అతనికి నాలుగేళ్ల పెద్ద కొడుకూ, ఏడాది చిన్న కొడుకూ, ఉన్నారు. పెద్దవాడికి తన తండ్రిపేరు శాహాజీ అని పెట్టుకున్నాడు. రెండోవాడీ పేరు శరభోజి. ఈ ఇద్దరే కాక ఏకోజీకి మరో కొడుకు కూడా ఉన్నాడు. అతడు తంజావూరులో పట్టం కట్టుకొన్న మరుసటి సంవత్సరం పుట్టాడు. ఆ బిడ్డకు తన తల్లిపేరు పెట్టుకొన్నాడు. ఆమె పేరు తులజాదేవి కనుక ఆ విడ్డకు తులజాజీ అని నామకరణం చేశాడు. ముద్దుగా తుక్కోజీ అని పిలిచేవారు. పుట్టింది మహారాష్ట్రల వంశంలో అయినా ఏకోజీ కొడుకులు ముగ్గురూ తెలుగు వాతావరణంలో పెరిగి ఉంటారు. తంజావూరు రాచనగరంతా ఆ రోజులలో తెలుగు నొకర్గతో, చాకర్గతో నిండివుండేది. రాణివాసంలోని పరిచారికలు తెలుగువాళ్లే. రాచనగరులో నాటకాలు వేసే భాగవతులు తెలుగువాళ్లే. వాళ్లు వేసి నాటకాలు శశెలుగువే. అంచేత రాచబిడ్డలు ముగ్గురూ పీల్చే ప్రాణవాయువునిండా తెలుగు అక్షరాలే ఏక్కువ ఉండి ఉండవచ్చు. వ్యో అక్షరాభ్యాసం కూడా తంజావూరులోనే జరిగింది. సంస్కృత పండితుల వద్దే కాక తెలుగు కవుల దగ్గిర తూడా రాచవిడ్డలు విద్య నేర్చుకొనే ఉంటారు.

తన తరువాత రాజ్బం చేయడానికి కావలసిన విద్యాబుద్ధులన్నీ కొడుకులకు చెప్పించటమేకాక ఇతర ఏర్పాట్లను తూడా ఏకోజీ చేశాడు. గంగాధరమఖిగారి రెండో కొడుకు త్రియంబకరాయ మఖిని తన పెద్ద కొడుకు శాహాజీకి మంత్రిగా ఏరోకీ నియమించాడు. తనకు అవసానకాలం ప్రాప్తిస్తోందని ఏకోజీ ముందుగానే జా గ్రత్తపడినట్టుంది. అతడు క్రీ.శ. 1693లో కన్నుమూశాడు. అతనికి ఇద్దరు భార్యలు: తొమ్మండుగురు భోగపత్నులూ, పదిమంది కొడుకులూ ఉన్నారు. అయితే ధర్మసర్ని దీపాంబకు పుట్టిన కొడుకే రాజయ్యాడు.

శాహాజీ (క్రీ.శ. 1683-1712): రాజ్యానికి వచ్చినప్పుడు శాహజీ పన్నెండో బాలారమారుడు విద్యాభ్యాసాన్ని సహితం సరిగ్గా పూర్తిచేయలేదు. అయే

కమఖి తర్భీదులో శాహాజీ ఒకవంక రాచవిద్యలు చదువుకుంటూ మరోవకీ

రాజ్బుం చేశాడు. చిన్నప్పటినుండి చూసి యక్షగానాలంటే కాహాజీకి మక్కువ యక్షగానాలు వ్రాసే దర్చా గిరిరాజూ, అతని తమ్ముడు కవిగిరి మొదలైన కవులను శాహజీ ఆదరించాడు. శృంగార పదాలను వ్రాసే చల్లపల్లి వెంకన్న, సోమయ్య అనే మధుర కవులు తూడా శాహజీని ఆశ్రయించుకొని ఉండేవారు. ఆంధ్రపాణీని అనే వీరుదు పొందిన నివృత్తి

అంధ్ర లక్షణ గగ్రంథాలనేకాక లక్ష్యగ్రంథాలను తూడా కాహజీ బాగా చదువుకొన్నాడు. అతనికోసం మరాఠీ ఉద్యోగులు తెలుగు లేఖతులచే పుస్తకాలు బ్రాయించేవారు. నింబాజీ అనే ఉద్యోగి కుష్పయ్య చేత ద్విపద భారతాన్ని పూర్తిగా కాపీ చేయించాడు. అతడు గద్య ఇలా వ్రాసుకున్నాడు:

భోసలాన్వయసుధాంభోధి చంద్రునకు- బాసురకౌర్యానుభావసాంద్రునకు

భవసముత్కటజటాభరణాయమాన- ధవళకీరి మనోజ్ఞతరగాంగభంగ

గాహనైకపవిత్ర గంధర్వగాన- మోహితా మరవధూముఖకాంక్షణీయ

మనుజభావునకు రామామనో జునకు- ననఘసన్నుతికి శాహావనీపతికి

నింబాజివ్రాయించె నిఖిలార్థవితతి- కంభోధియగుచుండునట్టి భారతము

నిటలాక్షపదపద్మ నిహిత ప్రసన్న-పటుచిత్తుడైన కుష్పయమంత్రిచేత.

(ద్విభా. ఉద్యో. పు 97)

ఈ కుష్పయ మంత్రిగారి తండ్రిపేరు వెంకటపతయ్య,. బహుశా వాళ్ల ఇంటిపేరు పాలగిరివారు. కవిత్రయ భారతాన్ని పాలగిరి కచ్చాలప్పు అనే లేఖకుడు క్రీ.శ 1692లో బ్రాశాడు.! అప్పటికి శాహాజీకి ఇరవై సంవత్సరాల వయసు. అర్థం అయ్యే ప్రాయంలో కవిత్రయ భారతాన్ని శాహజీ పఠించి ఉంటాడు. పాలగిరి కచ్చాలప్పేగాక నంబటూరి బుచ్చన్న గారి మనుమడు పాపరాజు తూడా కవిత్రయ భారతానికి కాపీలు వ్రాశాడు. చరిగొండ గురవరాజుగారి కొడుకు అయ్యప్పరాజు. మనవడు పెద్దిరాజు మొదలైన వాళ్లుకూడా తంజావూరులో భారత ప్రతులు బ్రాసినవాళ్లే. చరిగొండవాళ్లు క్రీశ 1690లోనే ఇవి తయారు చేశారు.

అంధ్ర మహాభారతాన్నే కాక ఇతర తెలుగు కావ్యాలను తూడా శాహాజీ చదువుకొని ఉంటాడు. ప్రబంధాలన్నింటినీ అమూలాగ్రంగా కాకపోయినా ప్రబంధసారాన్ని రుచిచూసి ఉంటాడు. తంజావూరులో కళావతి అనే మహిళ ప్రబంధసారశనిరోమణి అనే సంకలన గ్రంథాన్ని తయారుచేసి వ్రాసుకొంది.

కళావతిలాగే ఎవరో కమలనాభయ్యగారి కుమారుడు కూడా ఒక సంకలన గ్రంథాన్ని తయారు చేశాడు. కాశీఖండం, భీమఖండం, మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైన కూర్చిన ప్రబంధరత్నాకరం ప్రతి తూడా తంజావూరులో ఉంది. వీటిని లేఖతులందరూ ఎవం ప్రబంధరత్నాకరం ప్రతి కూడా తంబావూదల ఉంట = లఖులం టా

  1. తంజావూరు కేటలాగు, 9.110 14. 79 శల్యపర్వం ₹ తంజావూరు కేటలాగు 0.110, 4.70 ద్రోణపర్వం

900 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుక్ర శాహాజీ కోసమే వ్రాసి ఉండనక్కరలేదు. అనాడు రాజు దగ్గిరనుంచి రాజోద్యోగుల దా రామాయణాన్ని వ్రాయించుకొన్నాడు. ఎవరో దండె భూమయ్య అనే ఆయన అనకనూ) చెలువ రంగప్పచేత రామదండకాన్ని వ్రాయించుకొన్నాడు. అనికొండ రామభట్టు చెప్పిన ఈ దండకాన్ని రంగప్పు జాములోపల కాపీచేసి ఇచ్చాడు (తం.డి. 424). తెలుగు లిపీ రాని మరాఠి ఉద్యోగుల కోసం తెలుగు గ్రంథాలను నాగరలిపిలో బ్రాసిపెట్టేవాళ్లు కూడ ఉన్నారు. ప్రతాపరాయడనేవాడు వాళ్లలో ఒకడు. ఇతని అసలు పేరు విఠలుడు “ప్రతాపరాయనామ్నాతుక దేవనుత విఠలేన లిఖితం' అని వ్రాసుకొన్నాడు. (తం.డీ 57)

ప్రాచీన గంథపఠనంతోపాటు సమకాలిక సాహిత్య వినోదాలలో తూడా శాహాజీ పాల్గొనేవాడు. అతని చుట్టూ తెలుగు కవులు ఉండేవారు. చాటువులు చెప్పేవారు పరరాజుల చెంత తప్పు కవులు వర్ధిల్లలేరని ఎవరో ఇలా మనవి చేసుకొన్నారు.

కరిరాజులు కవిరాజులు - వరరాజుల చెంతగాక వర్ధిల్లుగతిన్‌

బెరయెడల బ్రబలగలరా- గురుతరనిజబలములానుకొని శాహేంద్రా

(తం. ౨.౪2)

శాహేంద్రుని దగ్గర ప్రబలిన ఈ కవి ఎవరోగాని ఘనమైన పద్యం ఒకటీ చెప్పాడు.

గిరి ఘనము దానికన్నను-శరధి ఘనము దాని కాకసము ఘన మయ్యం

బరమునకు ఘనము బ్రహ్మము-మరి దానికి ఘనము తృష్ణ మహిశాహేంద్రా.

(తం.0.82))

బ్రహ్మాండంకన్నా ఘనమైన ఈ తృష్టను శాహీంద్రుడు ఎలా తృప్తి పరచాడోగాని అతని ఈవిని చాటుకవి ఇలా చివర ప్రశంసించాడు:

నయమున భూమియేలి కదనంబున శత్రుల బారదోలి వా

బృయమున బ్రహ్మ గెల్బియు సమస్తమనీషిజనాళి మెచ్చ నీ

వియు ప్రభవించుచున్‌ భువనవిశ్రుతశాశ్వతకీర్తి యెల్లెడన్‌

రయమున బర్వజేసితివిరా భళి! శాహనృపాల శేఖరా. (తం.0 827) ఈ పద్యంలో శాహాజీ వాజ్బయమున బ్రహ్మను గెల్బ్పినట్టు కవి పొగిడీతే అతిశయో! లేదంటే అతిశయోక్తి లేదు. శాహజీకి సంగీత సాహిత్యాలలో అసమాన పాండిత్యం అట్సింది. అతడు సాధారణ శృంగార ప్రబంధాలు రచించలేదుగానీ 23 రచనలు చేశాడు. వాటిలో ఎక్కువ నాటకాలు, ప్రదర్శన కుపయోగించేవే. శాహాజీ కాలంలో నాటకరంగానికి నిత్య కళ్యాణంగా ఉండేది. శాహాజీ వ్రాసిన 22 నాటకాలలో తొమ్మిరీ కళ్యాణాలే. ఇతని కృతులలో అయిదు మాత్రమే ' అచ్చుపడ్డాయి.. మిగఠావి తంజావూరు-సరస్వతీ మహలులో ఉన్నాయి. శాహాజీ కృతుల వివరాలు చూడండీ

  1. రామాయణ గాథలు: (1) శాంతాకల్యాణం: బుష్యశ్ళంగుని చరిత్ర. అముద్రితం మూడు ప్రతులున్నాయి. తం.డి. 628-30(2) సీతా కళ్యాణం: ఇది తూడా అముద్రితమే

తంజావూరు మహారాష్ట్ర రాజులు 901 దీనికి పది ప్రతులు తంజావూరులో ఉన్నాయి. (3) రామపట్టూఖిషేకం: దీనికి ఆరు ప్రతులు ఉన్నాయి. ప్రాంతీయ భాషలు ఇందులో బాగా వాడాడు. 'ఈం.డి. 572-77.

  1. భారత గాథలు: (1) ద్రౌపదీకళ్యాణం: ఇది ముద్రితం. ఆంధ్రవిశ్చవిద్యాలయం వారు ప్రచురించిన యక్షగాన సంపుటాలలో ఉంది.

  2. భాగవత వైష్ణవ కథలుః (1) కృష్ణలీలావిలాసం: కృష్ణ జననం నుంచి సత్యభామా కళ్యాణందాకా ఉన్న కథ ఇందులో ఉంది. అముద్రితం. రెండు ప్రతులు ఉన్నాయి. తం.డీ. 505-06. (2) జలక్రీడలు: గోపికా వస్తాపహరణగాథ. అముద్రితం. ఏడుప్రతులు ఉన్నాయి. తం.డి. 521-27. (3) రుక్కిణీసత్యభామాసంవాదం: సవతుల కయ్యమే కాక అలుమగల కీచులాట కూడా ఉంది. అముద్రితం. నాలుగు ప్రతులు ఉన్నాయి. తం.ఢీ, 583-856. (4) సతీపతిదానవిలాసం: శ్రీకృష్ణతులాభారం. అముద్రితం. ఏడు ప్రతులు ఉన్నాయి. తం.డి. 645-50. (5) విష్ణుపల్లకిసేవాప్రబంధం. లక్ష్మీదేవి పల్లకి పంపించి విష్ణువును పీలిపించుకొనే కథ. ముద్రితం. -

  3. శ్రైవగాథలు: (1) కిరాతవిలాసం: పార్వతితో జూదమాడి ఓడిపోయిన శివుడు నారదుని సలహాపై కిరాత వేషంలో అడవికి పోతాడు. ఖిల్లాంగనలాగా వచ్చి పార్వతి కలుసుకొంటుంది. అముద్రితం. నాలుగు ప్రతులున్నాయి. తం.డి. 501-04. (2) గంగా పార్వతీ సంవాదం: సవతుల కయ్యం. ఉపపాత్రల ద్వారా అపహాస్యం చాలా వ్రాశాడు. అముద్రితం. ఆరు ప్రతులున్నాయి. తం.డి. 513-18. (3) త్యాగవినోదచిత్రప్రబంధం : కాళీగర్వభంగం. ఆమెతో పోటీచేసి కివుడు నటరాజు అవడం. అముద్రితం. ఆరుప్రతులు ఉన్నాయి. తం.డి. 530-34. (4) పార్వతీ కల్యాణం: వృద్ధ బ్రాహ్మణరూపంలో శివుడు పార్వతిని పరీక్షించడం నుంచి కథ ప్రారంభం. దీన్ని ఎవరు వ్రాశారన్న సంగతి గురించి కొంత వివాదం ఉంది. అముద్రితం. తొమ్మిది ప్రతులు ఉన్నాయి. తండి. 545-53. (5) భక్తవత్సల లీలావిలాసం: బాణాసురునికి వరం యిచ్చి శివుడు పార్వతికి దూరం తవడం. వాళ్ళ విరహం. అముద్రితం దీనికి ఒకటే ప్రతి ఉంది. తం.డి.832 (8) వల్లీకళ్యాణం: వల్లి అనే చెంచితను కుమూరస్వామి పెళ్లి చేసుకోవడం. అముద్రితం. ఏడు ప్రతులు ఉన్నాయి. తం.డి. 5930-96. (7) విఘ్నేశ్వరకల్యాణం సిద్ధి, బుద్ధి కన్యలను వినాయకుడు పెళ్ళాడే కథ. అముద్రితం. ఏడు ప్రతులున్నాయి. తం.డి. 610-16 (8) శంకరసేవాపల్లకి ప్రబంధం: పార్వతీదేవి పల్లకి పంపించి శివుణ్ణి రప్పించుకొనడం. ముద్రితం.

5, ఇతర పురాణ గాథలు: (1) రతీకళ్యాణం: రతికోసం మన్మథుని విరహం. శరువాత పెళ్లి. ముద్రితం. (2) శచీపురందరం: శచీదేవితో దేవేంద్రనని పెళ్లి. ముద్రితం.

  1. ప్వకపోలకల్పితాలు: (1) పంచరత్న ప్రబంధం: పరమేశ్వరుని కొలువులో కొందరు నాట్యుం చేయడం తప్ప మరేం కథలేదు. నవసిద్ధజోగి మొదలైన మానవులు దేవుణ్ణి సేవించుకొనడం. ఈ నృత్యప్రబంధం అముద్రితం. తం.డి. 540 (2) సతీ

902 సమగ్రాంధ్ర సాహిత్యం = రెండన సంవ దచానశూరం: తన భార్యపై మరులుకొన్న బ్రాహ్మణునికి భర్డే అమెను దానం చేయడు ముద్రితం. (3) త్యాగేశ పదాలు: త్యాగేశునిపై వందలాది శృంగారపదాలు అముద్రికాల్న ఆరు ప్రతులు ఉన్నాయి. (తం. డీ. 4331-33, 470, 8652-53). 7. శాస్త్ర గ్రంథాలు: (1) రాగమేళవివేకం. ఎనిమిది ప్రకరణాలలో రాగలక్షణాల్సు వివరించాడు. అముద్రితం. తం.డి. 931. శాహాజీ తన జీవితకాలంలో చేసిన తెలుగు రచనలు మొత్తం 23 కనబడుతున్నారు ఇందులో కొన్ని తన అస్థాన విద్వాంసుల సహాయంతో రచించి ఉంటాడు. రంగస్థల ప్రదర్శించడానికి అనువుగా 21 మధురరచనలు శాహజీ చేశాడుగాని ఏవో రెండు మూఢ తప్పించి మిగతావి శుద్ధ సాధారణ రచనలు. అన్నీ ఒక్కమూసలో పోసినవే. మన శృంగా! ప్రబంధాలు చాలా మటుకు ఎలాగ పరస్పర ప్రతిధ్వనులో శాహజీ నాటకాలు కూ ఒకదానికొకటి ప్రతిబింబాలు. ఆమాటకొస్తే తంజావూరు నాటకాలన్నీ రమాథమి ఒక్కలాగే ఉంటాయి. శాహజీ నాటకాలలో ఆదినుంచి అంతందాకా ఒక బాజీ వుండీ జయజియధ్వానాల '“తోడయంి, దరువుతో నాటకం ప్రారంభం అవుతుంది. దైవప్రార్థన తరువాత సూత్రధారవచనం, ద్విపదలో కథాసంగ్రహం చెప్పడం, తరువాత వినాయకుని ప్రవేశం, గణపతిపూజ, తరువాత 'అస్థానసంతోషి'గాని, కటికవాశుగాని ప్రసంగ చేయడం ఉంటాయి (చాలా నాటకాలలో ప్రసంగాలు అధిక ప్రసంగాలే; అసభ్యాలే). 6 తరువాత కథ మొదలవుతుంది. కల్యాణ కథలన్నీ ఒకలాగే ఉంటాయి. పాత్రల పేర్లలో తీడాలేగాని దరువులన్నీ ఎరువు తెచ్చుకొన్నట్టే ఉంటాయి. ఇంద్రుని పెళ్లి అయినా మన్మథుని పెళ్లి అయినా తంజావూరులో జరుగుతుంది. పెళ్లి కాగానే శోభనగీతాలతోన, మంగళ హారతితోను నాటకం ముగుస్తుంది. శాహజీ వ్రాసిన నాటకాలలో 'సతీదానశూరం' మాత్రమే “ఓహో; అనేట్టు ఉంది. ఇందులోని కథ విలక్షణమైనది. మారోపంతులు అనే బ్రాహ్మణుడు ఒక మాతంగ యువతిని చూనీ మరులుకొన్నాడు. అతని శిష్యుడూ, ఆ యువతీ ఎంత వారించినా వినడు. శిష్యుడు ఎన్నో శోకాలు ఉదాహరించి కామం తూడదంటాడు. గురువు మరిన్ని శోకాలు ఏఠరువువె్త “నీవీమోక్షమేమోక్ష మంటాడు. యాగాలు చేసేది రంభభోగములకేకద: భోగముకన్న మే పుజ్యము గలదా' అంటాడు. మాతంగికి ఒక భర్హ ఉన్నాడు. అతడు వచ్చి వాటి చూస్తాడు. లాభం లేక తన భార్యను దానం చేస్తాడు. ఆమె ఇరుకున పడుతుంది. శివుడు ప్రత్యక్షమై మాదిగ వాడికి సాయుజ్యసారూప్యసామీష్య సాలోళ్యాలు ఇచ్చాడు. ఈ నాటకంలో 'యాకుందేందు తుషారహారధవళా", “శాంతాకారం” మొదలుకొని ౩7 శ్లోకాలు ఉన్నాయి. ఉదాహరణకు సంస్కృతం బోధపడదని చాలా ళోకాం అర్థవివరణ చక్కగా ఉంది. ఈ నాటకంలో నలుగురే ముఖ్య పాత్రలు. ఒకడు గురవు కలో ఉంది ది వపను చ పనాుక యరీగా ను

తంజావూరు మహారాష్ట్ర రాజులు 903 శెండోవాడు శిష్యుడు. మిగిలిన ఇద్దరూ మాదిగ దంపతులు. వీళ్లలో ఎవరు అధికులనే ప్రశ్న జనించక మానదు. నాటకం చివర పద్యరూపంలో ఎవరో ఆ ప్రశ్న వేశారు.

మేటిశహరాజవిరచిత - నాటకరత్నమున మెలగు నలుగురిలోనన్‌

బాటింప బెద్ద యెవ్వరు? - తేటగ విద్వాంసులారా తెలుపగవలయున్‌.

ఇందులో పెద్ద ఎవరో తేటగా విద్వాంసులు తెలిపినా, తెలుపకపోయినా శాహజీ నాటకాలలో ఇదే రత్నమని చెప్పక తప్పదు. మిగతా రచనలు చేయకపోయినా ఈ ఒక్క రచనతోనే శాహజీ తెలుగు సాహిత్యంలో స్థానం ఏర్పరనుకోగలడు. ఇతని ఇతర రచనలోని అసభ్య భాగాలు అనాటి ప్రసంగులు నోటికి వచ్చినట్లు పేలినవే కావచ్చు, లేక కొందరు అస్థానవిద్వాంసులు కలిపిన భాగాలు కావచ్చు.

శాహజీ అస్థానంలో తెలుగు కవులేకాక చాలామంది సంస్కృత పండితులు తూడా ఉన్నారు. అభినవ పతంజలి విరుదాంకితుడైన రామభద్రదీక్షితులు, శ్రీధరవెంకటేశ్చరులు మొదలైన ఉద్దండపండితులూ, కవులూ 46గురు శాహజీ కాలంలో ఉన్నారు. వీరందరికీ శాహజీ ఒక గ్రామాన్ని దానం చేశాడు. సంస్కృత పండితులను సత్కరించి వారి సాహిత్యంలోని సారస్యాన్ని గ్రహించడమే కాక స్వయంగా గీర్వాణ రచనలు తూడా శాహజీ చేయగలడు. శబ్బరత్న సమన్వయం, శబ్దార్థసం గ్రహం అనే రెండు నిఘంటువులు వ్రాళాడు. ఆశువుగా కూడా శోకాలు చెప్పగలడు.

కేవలం సాహిత్య విషయాలలోనేకాక శాహజీ దార్భనిక చింతనకు కూడా ఆదరణ చూపాడు. మహారాష్ట్ర రాజులు గద్దె ఎక్కడానికి ముందు నాయకరాజుల అవసానకాలంలో వీరవైష్ణవం రాజులకు అఖిమతమైన మతం అయింది. అయితే భోసల రాజులు రాగానే అద్వైతం, దానితోపాటు ఇతర మతాలూ తిరిగి తల ఎత్తుకున్నాయి. శాహాజీ కాలంలో భాసురానందనాథుడనే దీక్షానామం గల భాస్కర రాయలవారూ, పరమ శివేంద్ర సరస్వతులు, కృష్టానందులూ అద్వైతాన్ని ప్రబోధించారు. “మానససంచంరే' వంటి శీర్తనలు చెప్పిన సదాశివబ్రహ్మేందులవారు ఈ పరమ కివేంద్రసరస్వకుల కిష్యులే. శ్రీధర వెంకటేశ్వర దీక్షితులూ బోధేంద్రయతీ నామ సిద్ధాంతాన్నీ, భజన పద్ధతినీ ప్రవేశపెట్టారు. తంజావూరు రాజ్యంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయింది.

శాహజీ కేవలం షణ్బ్మతాలకూ, షడ్డర్శనాలకూ మాత్రమే ప్రోత్సాహం ఇచ్చి ఊరుకోలేదు. గంగాధర, వాజపేయి ఆధ్వర్యంలో “అవైదిక దర్శన సంగ్రహం అనే గ్రంథాన్ని సంకలనం చేయించాడు. నాస్తిక దర్శనాలను కూడా అవగాహన చేసుకోవాలనే సహృదయత ఆ రాజ్యంలో ఉంది. “రామభద్రదీక్షితులనూ, మరో ఆఅరుగురినీ “షడ్డర్భన సిద్ధాంత సంగ్రహం' సంకలనం చేయడానికీ శాహజీ నియమించాడు. అప్పటికే తెలుగులో వేదాంత శతకాలు చెప్పిన దత్తాశ్రేయయోగి, పరమానందతీర్ణులు తంజావూరు రాజ్యంలోని మన్నారుగుడిలో ఉన్నారు. మన్నారుగుడిలో రాజప్రతినిధిగా ఉన్న, శాహజీ రెండో తమ్ముడు తుక్కోజీ మీద ఈ అధ్యాత్మిక చింతన బాగా పనిచేసింది.

904 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

చనిపోయేవరకూ శాహజీ సాంస్కృతిక రక్షణ, సర్వదర్శనపోషణ సాహిత్య వినోదాలతో కాలం గడిపేవాడు. ఎక్కడ కొత్త పుస్తకం ఉన్నా వ్రాయించి చదువుకొనే వాడు. 1711లో, అంటే ఇంకో ఏడాదికి పోతాడనగా శాహజీ కొత్తగా తెనాలివారి గ్రంథాలతో పరిచయం ఏర్పరచుకొన్నాడు. తెనాలి అన్నయ్య రచించిన సుదక్షిణా పరిణయానికీ, రామభద్రుని ఇందుమతి పరిణయానికి కాపీలు వ్రాసి కంచెర రంగధాముడనే లేకరి 'మహరాజాసాయెబువార్రికి' ఇచ్చాడు. శాహజీ ఇలాగే ఎన్నో పుస్తకాల పుత్రికలు వ్రాయించి తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టాడు. అతనికి పుత్రులు లేకపోయినా అతని కావ్యపుత్రికలు నేటికీ సజీవంగా ఉన్నాయి.

మొదటి శరభోజి (క్రీ.శ. 1712-1728): శాహజీకి సంతానం లేకపోవడంవల్ల అతని పెద్ద తమ్ముడు శరభోజి రాజయ్యాడు. పట్టం కట్టుకొంటున్నప్పుడు అతనికి ముష్ఫయ్యెనిమిది సంవత్సరాల నయసు. అన్నగారి రాజ్యకాలంలో అతడు కుంభకోణం సుబాకు అధికారిగా ఉండేవాడు. అన్నతో కలిసి ఉమ్మడిగా తంజావూరును పాలించినట్టు మరాఠీ శాసనాలలో ఉంది. అయితే మొదటి శరభోజి అన్నగారి జీవితకాలంలో శక్కోటలో వేరే ఉండేవారు. అన్నగారు పోషించిన తెలుగు కవులందరినీ ఇతడు కూడా పోషించాడు. దర్భాగిరిరాజు ఇతనిమీద కూడా పదాలు చెప్పాడు. ఒక నాయిక ఇలా అంటుంది:

పాయకగందవడినాపైని వేయకు మొక్కె-మాయత్త కోపగత్తెరా!

గిరిరా జకవిసుతశరభో జినృపా నన్ను. మరుకేళి గూడవేరా. (తం.డి.448)

పదాలు చెప్పడమేకాక లీలావతికళ్యాణమనే నాటకం వ్రాసి అందులో శరభోజీలీలావతుల పెళ్లిని గిరిరాజు వర్దించాడు.* దానిని శరభోజికి అంకితం ఇచ్చాడు. గిరిరాజులాగే ఇంకా ఎందరు శరభోజిమీద పదాలు చెప్పారో తెలియదు. ఇతడు కూడా తన అన్నగారిలాగా తెలుగు కవులను పోషించాడు. ఒక బీద విద్వాంసుడు వచ్చి శరభోజి దగ్గిర ఇలా మొరపెట్టుకొన్నాడు:

ఒక్కడగాను భోసలపయోనిధిపూర్ణశకాంకః చుట్టముల్‌

పెక్కగు సోదరుల్‌ హితులు బిడ్డలు పాపలు తల్లి మామలున్‌

డొక్కకు తెమ్ము తెమ్మని కఠోరముగా విడనాడ లేమిచే

చిక్కితి నన్న సంబళము చేసి ననుక్‌ దయచూడు మియ్యెడన్‌ (తం.డి. 310717)

శరభోజిరాజు తెలుగు సాహిత్యంలోని ప్రసిద్ధ కావ్యాలు చదివే ఉంటాడు. రెండు కావ్యాలపై శ్లేషిస్తూ పై వీద విద్వాంసుడే ఇలా మరో పద్యం చెప్పాడు:

మనుచరిత్రంబు కలిగిన మనుజచంద్ర-వసుచరిత్రంబు తెలుసుకో వచ్చినాడ

అన్న సంబళమిప్పించి మనుపు నన్ను- రమ్యగుణసాంద్ర శరభోజి రాజచంద్ర. 5. బంక గటి 0 )జ్యుంం, 0 కని. జగడం లి26 6. లీలావతీ కల్యాణం ముద్రితమయింది. యక్షగాన పంపుటి 6, అంధ్ర విశ్చవిద్యాలయ ప్రచురణ.

తంజావూరు మహారాష్ట్ర రాజులు తక్‌ తన దగ్గిరకు వచ్చి, అన్నసంబళం యిప్పించమని అడిగే కవులందరినీ యేవేనా ప్రాచీన గ్రంథాలున్నాయా అని శరభోజి అడిగేవాడు కాబోలు. ఈ అన్నార్హుణ్ణి కూడా ఏదో పుస్తకం తెమ్మన్నాడు. అప్పుడాయన ఈ పద్యం చెప్పాడు.”

సంబళముచేసి నిలిపి న-యింబున నేపుస్తకంబు నెక్కడనైనా

సంబాళించుక తెచ్చెద - శంబరహరతుల్యరూప శరభోజినృపా. (తం.డి.10717) శరభోజి అడిగిన పుస్తకమేదో, సంబాళించుకొని ఆ కవి యిచ్చినదేదో తెలియదు. బహుశా వైద్యగ్రంథం కావచ్చు. శరభోజీ ఇంకెందరు తెలుగు కవులకు అన్న సంబళమిచ్చాడో కూడా తెలియదు. ఈయన తన అన్నగారిలాగా స్వయంగా రచనలు చేసినట్టు కనిపించదు. చాలామంది సంస్కృత కవులను పోషించాడు. అగ్రహారాలు యిచ్చాడు. ఇతని మంత్రులు కూడా కవులను పోషించారు. ఆశ్రితులు వ్రాసిన గ్రంథాలను కొందరు తమ పేర ప్రకటించుకొన్నారు.

తన అన్నగారు శాహజీకి సంతానం లేనందువల్ల తను రాజ్యానికి రావడం శరభోజి మనసును బాగా పట్టేసింది. తనతూ సంతానం లేదు. పుత్రుల కోసం శరభోజి వివిధ క్షేత్రాలలోని దేవతలకు మొక్కుకొన్నాడు. ఆ మొక్కులు చెల్లించడానికి తన తరపున తన అస్థాన విద్వాంసుడు మలహరి పండితుణ్ణి ఆయా క్షేత్రాలకు పంపించాడు. పుణ్యక్షేత్రాలు దర్శించుకొంటూ మలహరి పండితుడు దాసాంబాపురానికి వచ్చాడు. అది శరభోజీ తల్లిపేర నిర్మించిన ఊరు. అక్కడే సదాశీవబ్రహ్మేంద్రులు ఉంటున్నారు. వారిని దర్శించుకొని మూడు ఖిక్షలు నివేదించి సేవించుకొని పండితుడు తన రాజుగారి పుత్రవాంఛను విన్నవించుకొన్నాడు. సదాశివ బ్రహ్మేంద్రులు అనుగ్రహించి, శరభోజిని దీవిస్తూ తమ కృతి 'ఆత్మవిద్యావిలాసం' ప్రతినొకదానిని రాజుకు పండితుని ద్వారా పంపించారు. రాజవంశం వర్థిల్లుతుందని దీవించినట్టు కనబడుతుంది.

సదాశివబ్రహ్మేంద్రుల దీవన కబురు రాచనగరుకు చేరే ఉంటుంది. మహాత్ములు అకీర్చదించినా శాహజీలాగే శరభోజికి సంతానం లేదు. అయితే ఇతని రెండో భార్య ఒక మాయానాటకం ఆడింది. దొంగ కాను నటించి దాసీ పుత్రుణ్ణి తన పుత్రుడుగా ప్రకటించుకొంది. అయితీ ఈ కుట్ర శరభోజికి తెలిసిపోయింది. అందుచేత తన తరువాత తన తమ్ముడు తుక్కోజికే రాజ్యం సంక్రమించాలని శాసించాడు. పదిహేడు సంవత్సరాలు పాలించి క్రీ.శ 1728లో మొదటి శరభోజీ మరణించాడు. ఇతని ఆంధ్ర సాహిత్య పోషణ గరించి పరిశోధించవలసిన అవసరం సజీవంగానే ఉంది.

తుక్కోజీ (క్రీశ 1728-1730): చిన్నన్న శరభోటి ఆదేశం ప్రకారం తుక్కోజీ

తంజావూరు గద్దెకు వారసుడయ్యాడు. 61వ ఏట గద్దె ఎక్కాడు. అయితే అంతకు ముందునుంచే తుక్కోజీ పరిపాలనాదక్షుడు. పెద్దన్న శాహజీ జీవితకాలంలో తుక్కోజీ మన్నారుగుడి సుబాపై అధికారిగా, రాజప్రతినిధిగా ఉండేవాడు. ఇతడు అన్నలిద్దరితో అకమునత చపకవవ తననన త త కవాలా లు న ళభౌజ్‌ మహరావమేద్‌ పద్యాలు సేకరించి 'చెదరినముత్యాలు'గా మిత్రులు విట్టలదేవుని

సుందరశర్మగారు ప్రకటించారు. తంజావూరు కేటలాగు, సంపుటి 2, అనుబంధం - పుటు ౪2 త 0౧ గంగు - (064) రజల తమల 0 కరయటాలాలనేం12క8 18005 (1952 ?.19

906 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కలీసి రాజ్యం చేసేవాడని మరాఠా శాసనాలు చెప్తాయి. ఇతడు మొదట మహాదేవిపట్నంలో ఉండేవాడు. సంగీత సాహిత్యాలు రెండూ పోషించినా సంగీతంపట్ల ఇతనికి మక్కు; ఎక్కువ. “సంగీత సారామృతం' అనే గ్రంథాన్ని వ్రాశాడు. పాతపడీ వృవహారంలోల్చి తొలగిపోయిన మేళాలబదులు కొత్త రాగాల గురించి చెప్పాడు.

బహుశా ఈ రాగాలనే అతడు తన నాటకకృతులలో వాడి ఉంటాడు. తుక్ళోశ్లీ తెలుగులో వ్రాసిన రచనలు రెండు. ఒకటి కివకామసుందరీపరిణయం. రెండు రాజరంజనవిద్యావిలాసం. మొదటిదానిలో నాటకభాగంకన్నా కథన భాగం ఎక్కువ అంత ప్రొఢమైన రచన కాదని పరిశోధకులు భావిస్తారు.19 అముద్రితం. దీనికి మూడు ప్రతులు తంజావూరులో ఉన్నాయి" (తండి. (63-35). రాజరంజనవిలాస అచ్చుపడింది. సరస్వతీమహల్‌ అధికారులే దీన్ని ప్రకటించారు. ఇది ఆధ్యాత్మికరూపకం. ఆత్మమహారాజు చిదాకాశపీఠంమీద కొలువుండే నాటకం. మాయాజీవుల వాగ్వాదం. “సంసారములో నున్నప్పటికిన్ని నిస్సంసారిత్టై నిరామయుండవై వుండవోయి' అని పరమేశ్చురుడు జీవునికి ఉపదేశం చేస్తాడు. తనకు కోడలు కావాలని మాయ కాలునికి పెళ్లి చేయిస్తుంది. రచన సాఫీగా ఉంది.

ఈ రెండూకాక తుక్కోజీ మరే రచనలు చేశాడో తెలియదు. ఇతడు నీతిపదాలను చెప్పాడని నిడుదవోలు వెంకటరావుగారు భావిస్తున్నారు.!! అయిడే అవి ఇతని కొడుకు ఏకోజీ తండ్రిమీద చెప్పినవేగాని తుక్కోజీ స్వయంగా రచించినవి కావు వెంకత్రూవుగారు ఉదాహరించిన మూడు పదాల ముద్రలలో '“ఏకేంద్రవినుతుశైన తుళజేంద్రుని' పేరే కనబడుతోంది. తండ్రి పట్టం కట్టుకొన్ననాటికి, అంటే క్రీ.శ 1728లో ఏతోజీకి ౩2 సంవత్సరాల వయస్సుంది. తండ్రి తరువాత ఏకోజీ గద్దె ఎక్కాడు.

భోసలరాజులు, ఆదర్శ సోదరులు, అన్యోన్యంగా ఉండేవారు. తుక్కోజీ కాలంలో చిత్రకళ కూడా తంజావూరులో మంచి ఆదరణ నోచుకొంది. ఏకోజీతో అతని పెర్గ కొడుకులు శాహజీ, శరభోణీలు కొలువులో ఉన్న దృశ్యాన్ని చాలా భారీ శైలవర చిత్రంగా చిత్రింపచేశారు. ఇది ఒక పెద్ద గోడ సైజులో ఉండేది. చాలాకాలు తంజావూరులోని మహారాష్ట్ర రాజుల దర్చారు హజారంలో ఉండేది. తంజావూరు రాజనగరులోనే ఈ వంశాన్ని దీవించిన సదాశివ బ్రహ్మేంద్రుల డైలవర్ణ పటాన్ని కూడా నిలుపుకొన్నారు. ఈయన దిగంబర సన్యాసి. నామసిద్ధాంతంతోపాటు. భవినీ సంప్రదాయాన్ని తంజావూరు రాజ్యంలో ప్రచారం చేశారు. సదాశివ బ్రహ్మేంద్రుల దీవనలవల్లనో లేక మరెందుచేతనో తుక్కోజీ బహుపుత్రవంతుడు.

ఇ అంధ్రవాన్గేయకార చరిత్ర బాలాంత్రపు రజనీఠాంతూవు పుట:

  1. ఆంధ్రయక్షగానవాబ్మయచరిత్ర, 2వ భాగం, పుట ౩౫.

  2. దక్షిణ దేశీయాంధ్ర వాబ్బ్మయం, పుట 245.

  3. 1922 సూటికి ఆంధ్రసాహిత్య పరిశోధకులకు తెలిసిన దిగంటర సన్యాసీ ఒక్క వేమనగారే. అందుదేక తంజావూరులోని రాచనగరులోని చిత్రపటం వాకిదే అనుకొని వంగూరు సుబ్బారావుగాడు భావించారు. దాని నకలును తీసి తము గ్రంథంలో ప్రచురించారు. వావిళ్ళవారు తూడా అంతే చేశారు తంజావూరు రాచనగరుతూ, వేమనగారికీ గల సంబంధం ఏమిటో మృగ్యం.

తంజావూరు మహారాష్ట్ర రాజులు 907

తుక్కోజీకి ఏతోజీ ఒక్కడే కొడుకు కాడు. చాలామంది ఉన్నార్తు. అతనికీ ఎనమండుగురు భార్యలు, ఎందరో కొడుకులు ఉన్నారు. వాళ్లలో ధర్మపతవ్షల కొడుకులు కొందరూ, _ఖడ్గపత్నుల పుత్రులు మరికొందరూ. వీళ్లందరూ. పటం కట్టుకొని ప్రాలించకపోయినా పందాలు వేసుకొని సాహిత్య పోషణ చేసినటు కనపడతారు. వాళ గురించి తెలుసుకొందాం, న న

హరిశ్చంద్ర మహారాజు; ఇతడు తుక్కోజీకి సుందరీబాయి వల్ల పుట్టిన కొడుతు. బహుశా ఇతడే తుక్కోజీ పుత్రులలో జ్యేష్టుడు కావచ్చు. ఇతని ఆశ్రయంలో ఎందరు కవులుండేవారో తెలియదుగాని ఇతని నగరులో తెలుగు పుస్తకాలు చాలా ఉండేవని ఊహించవచ్చు. భాగవతులు సుబ్బయ్య అనే లేఖకుడు హరిశ్చంద్ర మహారాజువారి శ్రీనగరి పుస్తకాలయాన ద్రౌపదీ కల్యాణం, శ్రీకృష్టలీలావిలాసనాటకాల ప్రతులు బ్రాసుకొన్నట్టు దాఖలా ఉంది (తం.డి.538-69). హరిశ్చంద్రుడు తండ్రికంటే ముందే - అంటే క్రీశ. 1736కి ముందే మరణించాడు. భావిపరిశోధనవల్ల ఇతని సాహిత్య జీవితం గురించి చాలా విశదంగా తలియవచ్చు.

జయసింహుడు : ఇతడు తుక్కోజీకి రాధాబాయివల్ల పుట్టిన కొడుతు, జయసింహుని కొలువులో 'బహువిధరచనావిశేషాలు' ప్రచురపరిచే సత్కవివ్యూహాలూ, వహుశాస్త్ర ఫక్కికలు ఉపన్యసించే కోవిదులూ ఉండేవారు. నేల్లూరి వీరరాఘవయ్యగారి కుమారుడూ, అంధ్రపాణీని శేషాచలంగారి శిష్యుటా అయిన శివరామయ్య ఈ ఐయసింహుని పోషణలో ఉండేవాడు. కామశాస్త్రాన్ని తెనిగించి జయసింహునికి అంకితం ఇచ్చాడు. ఇతడు మరేగ్రంథాలు చెప్పించాడో తెలియదు. హరిశ్చంద్రునిలాగే తండ్రి కళ్లముందు జయసింహుడు కూడా మరణించినట్టుంది.]3

ఈ ఇద్దరు కుమారులకన్నా తుక్కోజీయే ఆయుఃప్రమాణంలో నయం అనిపిస్తాడు. కనీసం 59 సంవత్సరాలు జీవించాడు. ఇతని సాహిత్యజీవితం ఎలా ఉన్నా రాజకీయ జీవితం ఏమంత చెప్పుకోదగ్గంత గొప్పగా లేదు. రాజ్యావసానకాలంలో చెప్పుడు మాటలు వినేవాడు. ప్రజలు విసుగెత్తిపోయారు. ఎనిమిదేళ్లు పాలించాడు. అతని తరువాత ఏరోజీరాజయ్యాడు.

ఇమ్మడి ఏకోజీ (క్రీ.శ 1736-1737): ఇతనికి బాబాసాహేబు అనే నామాంతరం ఉంది. ఇతడు తుక్కోజీకి రాజకుమారిబాయివల్ల పుట్టినవాడు. అధికారానికీ వచ్చినప్పుడు 40 సంవత్సరాల ప్రొఢ్డుడు. తండ్రి జీవితకాలంలో ఇతడు పట్టుళోటలో ఉండేవాడు కాబోలు. ఏకోజీ తండ్రిమీదనే శృంగారపదాలు చెప్పిన మొనగాడు.

సంతోసమాయరా చాల వోరి నా సామి

మంతుకెక్కిన తుళజమహిపాలచంద్ర 1సం॥

విరహము చెంది నేను విరులశయ్య నుండగ

సరసుడ నామనసు తెలిసి సరసకు వచ్చినప్పుడే /సం॥ లు గాము ల రా 13 4 ఈబారుం గెలు 0! ]జగలా - 6 క. కంణనగావాయి, 9. 42

908 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ వలరాజు బారికి నేను కలగుచున్నది జూచి

తలిరుబోడి వెరువలదని దయచేసి కౌగలించినపుడే సం॥

చతుర ఏకేంద్రవినుత సదయ తుళజరాబేంద్ర

చతురత రతికేళిని చేరి నన్ను తూడినప్పుడే ॥1సం॥ తండ్రిపైన ఒకటి కాదు, రెండు కాదు 27 శృంగార పదాలను ఏకోజీ కొత్తగా పట్టుకోటలో బ్రాశాడు. ఏకోజీ రసికుడు. వేశ్వనాట్యగానవిలోలుడు. ఇతని ఆస్థానంలో ముద్ధుమంగ అనే వారకాంత ఉండేది. ఆమెమీద ఎవరో కవి ఇలా చాటువు చెప్పాడు.*ీ-

కొద్దిగ జిలించె నామది-నిద్దావా తెరకు జెరకు నేజాసురరా

ఇబ్ముద్దియవా? యొకతీయని-ముద్దియవా చెలి కొసంగ ముద్దుల మంగా.

ఈ ముద్దులమంగ చాలా వైభవంగా జీవించేది. ఈమెకు ఏకోజీ ముత్యాల కుచ్చులు, వింజామరలు, బీరుదు కాహళులు మొదలైనవి ఇచ్చాడు. ఎవరో ఏ ముద్దుమంగమీద చెప్పిన మరొక పద్యంలో ఈ సన్మాన వివరాలున్నాయి.

పదచాళి వినిపించు వైభవస్ఫురణకు కొమరొంద ముత్తేల కుచ్చు చెల్లు

జక్కిణి వినిపించు చాతుర్యమహిమను రంజిల్లు వింజామరలతో చెల్లు

తాళవిన్యాస భేదన నాట్యానకు దులలేని బిరుదు కాహళులు చెల్లు

అభినయం బొనరించు నతిశయప్రొఢికి నిరతంబు ఢవిళమల్తరులు జెల్లు

ననుచు నేకోజీ భూపాలుడనుదినంబు

మెచ్చి ముత్తెలకిచ్చు నీకిచ్చు సభను

గలిత గుణ పేటి యా్రితకల్చవాటి

భావజునిఘోటి ముద్దుమంగా వధూటి

ముద్దుమంగలాంటి మన్మథుని గుర్రాలు ఏకోజీ పోషణలో ఎందరు ఉండేవారో తెలియదు. ఇతడు వ్రాసే శృంగార పదాలను ఈ భావజఘోటులు సదా అభినయం చేసేవారు కాబోలు. అయితే ఏమాట కామాట చెప్పుకోవాలి. ఏకోజీ తండ్రీమీద శృంగార పదాలేకాక నీతి పదాలు కూడా చెప్పాడు. 'నీతి కలిగిన యెందు నిత్యతేజమువచ్చు' అని నమ్మినవాడు. ఏతోజీ పద సాహిత్యానికి తంజావూరులో అయిదు ప్రతులున్నాయి (డి. 4410-42 డి 850-561). ఇవి అముద్రితాలు. పదాలనేకాక నాటకాలను, ద్విపద కావ్యాలను తూడా ఇమ్మడి ఏకోజీ వ్రాశాడు. తన పెదతండ్రీ శాహజీని అనుకరిస్తూ ఇతడు విఘ్నేశ్వర పరిణయం అనే నాటకం బ్రాళాడు. రచన ఒక మోస్తరుదని పరిశోధకుల అఖిప్రాయం.15 అయితే తాను “సరస సాహిత్య చక్రవర్తిననే ధైర్యం ఏకోజీకి ఉంది. రామాయణం ఆరు కాండలను ద్విపదగా రచించాడు. ఈ రచన సమగ్రమేగాని అముద్రితం.

౪ దీనిని, దీని తరువాత పద్యాన్ని సోమేభరబ్యగాడ ఉదాహరిందారు. (శండావూరు మహా __భూపతులు, ఆంధ్ర సాహిత్యం భారతి, జనవరి, 1954) 15. అంధ్ర యక్షగాన వాజ్మయం, చరిత్ర, పుట ౩౫.

తంజావూరు మహారాష్ట్ర రాజులు 909

ఏకోజీ సాహిత్య రచనలన్నీ అతడు రాజ్యానికి రాకముందే చేసి ఉండాలి. అతడు పట్టుమని ఒక ఏడాది తూడా పాలించలేదు. రాజ్యానికి రాగానే జబ్బుపడాడు. అనారోగ్యంతోనే భీషణ యుద్ధం ఒకటి చేశాడు. తిరుచిరాపల్లిని ముట్టడించడానికీ వెడుతున్న చందాసాహెబు దారిలోనున్న తంజావూరుపై తూడా దండెత్తాడు. ఏకోజీ ధైర్యంగా పోరాడి చందాసాహెబును వెళ్లకొట్టాడు. ఇతడు మరణించాక తంజావూరు మూడేళ్లపాటు అరాచకమైంది. ఏకోజీ భార్య సుజనాబాయి రెండేళ్లు పాలించింది గాని కుట్రలు, కుహకాలు, దొంగవారసత్వాలు తట్టుకోలేకపోయింది. అందుచేత మంత్రులందరూ కలిసి ఏకోజీ సవతి తమ్ముడు ప్రకాపసింహుణ్ణీ రాజును చేశారు.

ప్రతాపసింహుడు (క్రీ.శ 1739-1763): ఇతడు తుక్కో జీకి ఉమాబాయివల్ల పుట్టిన కొడుకు, ఉమాబాయి తుక్కోజీ పట్టమహిషి కాదు. ఖడ్గపత్ని. దేశాన్ని అరాచకం నుండి తప్పించడానికి మంత్రులు ఇతణ్జి రాజును చేయదలచినా అనిష్టంతోనే ప్రతాపసింహుడు రాజ్యాన్ని స్వీకరించాడు. జ్ఞాతి వైరంవల్ల కొన్నాళ్లు యుద్ధాలు జరిగాయి. ఇతని దాయాదులు ఫ్రెంచివాళ్ల సహాయాన్ని అర్థిస్తే ఇతడు ఇంగ్లీషువాళ్లను తోడ్చడమని అడిగాడు. ప్రతాపసింహుని కాలంలోనే తొలిసారిగా ఇంగ్లీషువారు భారతీయ ప్రభువుల వారసత్వపు తగాదాలలో జోక్యం కలుగజేసుకోవడం ప్రారంభించారు.

యుక్తవయసు రాకముందే ప్రతాపసింహుడు రాజ్యానికి వచ్చాడు. అప్పుడు సయ్యద్‌ అనే ఖిలేదారు చేతిలో కొన్నాళ్లు తంజావూరు రాజ్యం కీలుబొమ్మలాగా ఉండిపోయింది. సుటేదారుల ఆగక్రవమాలవల్ల ప్రజలు నానాబాధలు పడ్డారు. బాలరాజుకు సరిగ్గా హితోపదేశం చేసేవాళ్లు లేరు. ఇంతకు ముందు ఏకోజీ దగ్గిర కుట్టికవి వాంఛేశ్వరుడు మంత్రిగా ఉండేవారు. ప్రతాపసింహుణ్ణి దారిలో పెట్టడానికి సంస్కృతంలో మహిషశతం అనే శ్లేషకవిత్వం చెప్పాడు. దున్నసపోతులాంటివాడు రాజయ్యాడనీ, దున్నపోతుల్లాంటి రాజోద్యోగులు చెలరేగారనీ తిట్టిపోళశాడు. ప్రతాపుడు తన తప్పులు తిలుసుకొన్నాడు. తరువాత జనరంజకంగా పాలించాడు.

ఇతడు మొత్తం రాజ్యం చేసిన పాతిక సంవత్సరాలలో ఎందరు తెలుగు కవులను పోషించాడో తెలియదు. ఇతని భోగపత్ని ముద్దుపళని మాత్రం ముద్దొచ్చే కవిత్వం చెప్పింది. రాధికాసాంత్వనం రచించింది. ప్రతాపసింహుడు సర్వవిద్యావిధాన మేధాస్ఫూర్తి కలవాడని చెప్పింది. ఈమె ఒక్కర్తేతప్ప మరెవ్వరూ ప్రతాపసింహుని తమ కావ్యాలలో పేర్కొనలేదు. అయితే ఇతనిపై ఎవరో కొన్ని శృంగారపదాలు చెప్పారు.!” సాహిత్య పోషణ చేసినా చేయకపోయినా ప్రతాపుడు చాలా సమర్శ్థడైన రాజు. మహారాషులలో ఇతడే చిట్టచివరి-గోప్పవాడు. ఇతని తరువాత వచ్చినవాళ్లు కూడా తెలుగు భాషలో స్వయంగా రచనలు చేశారు. తెలుగు కవులను పోషించారు. అంటా సు ంయయంణ అనన కుంతల? క 17. ఓలై. 580లో ప్రతాపసిహేంద్రపదాలు ఉన్నాయి.

910 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ

ఈ కడపటి రాజుల యుగంలో ఆరుగురు మహారాష్ట్ర రాజులు తెలుగు రాజ్యాన్ని ఏలుకొన్నారు. ఆంధ్రులు వీళ్ల చేతిలో మొదట ఓడీపోయారని బాధపడనక్కరలేదు. నేలటూరి వెంకటరమణయ్యగారు చెప్పినట్లు 1;. మహారాష్షులాంధ్రులను జయించి తము ప్రభుత్వమును స్థాపించినను ఆంధ్రులచే వారును పరాజితులైరి. మహారాష్ష్రుల విజయము రాజకీయము. ఆంధ్ర విజయము సాంస్కృతికము'.3* ఆంధ్రభాషా పరిచయం రసికతత్స ముఖ్యచిహ్నం, ఆంధ్రకవిత నొసటి మాణీక్యం అన్న వారి మాటలు అక్షరాల నిజం.

మహారాష్ట్ర రాజులు మంచి రసికులు; వారి కవితలు చూణీక్యసమానాలు కాకపోవచ్చునుగాని మంచి గంధపులలాటతిలకాలు!

తంజావూరులో తెలుగు కవులు

మహారాష్ట్ర నాయకరాజుల కాలంలో ఎందరో తెలుగు కవులున్నారు. కొందరు కవులకు ఆంధ్రపాణిని, అఖినవ కాళిదాసు వంటి బిరుదులు లఖించాయి. నివర్తి శేషాచలం అనే పండితకవికి ఆంధ్రపాణిని అనే ప్రశస్తి వచ్చింది. ఆలూరి కుప్పన అనే కవికి ఆంధ్రకాళిదాసు అనే బిరుదు ఇచ్చారు. ఈ ఇద్దరిలో ఆంధ్రపాణిని క్రీ.శ. 1384 నుండీ 1712 ధాకా పాలించిన శాహాజీ కొలువులో ఉన్నాడు. ఆంధ్రకాళిదాసు క్రీశ 1728 నుండి 1736 దాకా పాలించిన తుక్కోజీ సభలో ఉండేవాడు.

ఆంధ్రపాణిని శేషాచలం: సంస్కృతాంధ్రాలలో నివర్తి శేషాచలం గ్రంథరచనలు చేశాడు. అష్టభాషాధురీణుడు. కావ్యాదివ్చవహార చారుచతురుడు. తెలుగు భాషకు సంస్కృతంలో వ్యాకరణం రచించాడు. దీనికి 'అంధ్రశబ్దానుశాసనం" అని పేరు. సూత్రాలనేకాక వార్తికాలను తూడా ఇతడే రచించాడు. 'ఆఇజఉణ్‌ బుక్‌ అనే మాహిశ్వరసూత్రాలతోనే తన గ్రంథాన్ని మొదలుపెట్టాడు. ఈ వ్యాకరణం ఇంతచరకూ తెలుగులో లేదుగాని, ఒకనాడు తంజావూరులో ప్రసిద్ధమని చెప్పవచ్చు. సరస్వతీమహలు గ్రంథాలయంలో మూడు ప్రతులున్నాయి (తం. 9.773, 774, 775). ఈ మూడింటిలో పాఠఖేదాలున్నాయి. బహుశా రచయితే మార్చి ఉంటాడు. ఈ వ్యాకరణం రచించబట్టే శేషాచలానికి ఆంధ్రపాణిని అనే బిరుదు వచ్చింది.

ఈ విరుదు యివ్వడమేకాక శాహబీ శేషాచలాన్ని ఘనంగా సత్కరించాడు. కనకాఖిషేకం చేసి అందలాలు మొదలైన బహుమతులు ఇచ్చాడు. ఈ సన్మానాలన్నీ శేషాచలం '“భోసలకోసలీయం' అనే సంస్కృతకావ్యం చివర చెప్పుకొన్నాడు. ఇదీ శాహటీకి అంకీతం.

ఈ సంస్కృత గ్రంథాలనేకాక శేషాచలం తెలుగులో తూడా రచనలు చేశాడు. వాటిలో మొదట చెప్పుకోవలసినది శాహరాజవిలాసం అనే నాటకం (తం. 632). దీనిని ధీచమత్కృతి వెలసేటట్టు రచించాలని కవి ఆశించినా ఆనాటి అన్ని నాటకాలలాగే ఇదీ 18. మధుర తంజావూరు నాయకరాజులనాటి ఆంధ్ర వాబ్బయ చరిత్ర : 'దాక్షీణాత్యాంధ్రసాహిత్యం'

పుట ౫.

తంజావూరులో తెలుగు కవులు 911 ఉంది. తాను' '“అష్టభాషాకవిత్వంబులమరే సుకృతి'నని చెప్పుకొన్నా ఈ నాటకంలో ఆష్టభాషలను బలవంతంగా చొప్పించలేదు. అందుకు సంతోషించాలి. ఈ నాటకాన్ని తన పేరనే రచించినా సరస్వతీ కళ్యాణం అనే నాటకాన్ని తాను వ్రాసి శాహాజీ పేరు పెట్టాడు. ఈ సంగతి గ్రంథాదిని స్పష్టంగా చెప్పాడు (తం.డి. 651). అయితే సూత్రధారుడీ నాటకం 'శాహజీప్రణీతం' అని చెప్పాడు. కారణం తెలియదు. ఇందులో ద్విపద లెక్కువగా ఉన్నా గ్రంథం మంచి నాటకపు వాటం కల్లిఉందని పరిశోధకుల అభిప్రాయం. తంజావూరు కవులు చేయించిన ఇతర కళ్యాణాలలాగే సరస్వతీ కళ్యాణంలో సరస్వతీ బ్రహ్మల పెళ్లి నాయకరాజుల సమక్షంలోనే జరుగుతుంది. ఈ నాటకానికీ 7 ప్రతులున్నాయి. తం.డి. 653 ప్రతిలో మంగళాష్టకాలున్నాయి.

ఈ సరస్వతీకల్యాణమే కాక రతీకల్యాణం కూడా శేషాచలమే కొంత వ్రాసి శాహజీ పేరు పెట్టాడేమో అన్న అనుమానానికి ఆస్కారం ఉంది. శాహజీ ఆసాన కవులు ప్రభువు పేరిట తాము బ్రాసిన నాటకాలలో. ఇలా తమ పేర్లు లౌవాలనో, అనుకోతుండానో చొప్పిస్తూండేవారని చెప్పవచ్చు. శేషాచలం ఇంకే రచనలేనా చేశాడో శదో తెలియదుగాని ఇతని కృతులేవీ అచ్చుపడలేదు ఇతని శిష్యుడు నెల్లూరి శివరామయ్య బాసిన కామకళానిధి అచ్చుపడింది.

  • వెల్లూరి కవులు; పూర్వం పాకనాటిలో దేశిరాజు కొండన్నగారనే విద్వాంసుడు సంగీత సాహిత్యాలలో అందెవేసిన చేయి అని ప్రసిద్దుడయ్యాడు. ప్రొఢరాజుల చేనిమ్మపండుగా వినుతికెక్కాడు. అతనికి ఆరుగురు కొడుకులు. అందరూ ప్రతిభా వంతులే. విద్వాంసులే. వాళ్లలో కడగొట్టువాడు వెంకటాచలం. బాగా రాణించాడు. శ్రీశ 1630-1642 దాకా కర్ణాటకాన్ని పాలించిన పెదవెంకట రాయలవద్ద దళవాయిగా పనిచేశాడు. ఇతడు వీణ కమ్మగా వాయించేవాడు, కలుపుగోలుతనంతో అందరికీ తలలో నాలుకగా ఉండేవాడు. ఈ వెంకటాచలానికి నలుగురు కొడుకులు. అందులో రెండోవాడు వెంగన్న చెట్లు చిగిరించేటట్లు వీణ వాయించగలడు. ఇతని పాట విని పెదవెంకటసతిరాయలు ముత్యాలకుచ్చు బిరుదులిచ్చాడు. ఈ వెంకన్నగారి అన్నగారు రంగన్న అపరనారదుడే కాక కవిత్వం తూడా చెప్పగలడు.

దేశిరాజు రంగన్నా, అతని తాతతండ్రులూ, తోడబుట్టినవాళ్లూ అంతా వీణ వాయించడంలో ప్రజ్ఞానిధులు కనుక ఆ కుటుంబానికి దేశిరాజు అనే పేరు పోయి వీజావారనే కొత్త పేరు వచ్చింది. రంగన్నకు నలుగురు కొడుకులు. వాళ్లలో పెద్దవాడు వెంకటపతి. ఇతడు ప్రాజ్ఞుడయ్యేసరికీ కర్నాటక రాజ్యం చితికిపోయింది. నంగీత విజ్ఞానం, సాహిత్య సామర్థ్యం. భాషా చమత్కారం మొదలైనవి వెంకటపతి గోలకొండ సుల్తాను ఆబుళహసన్‌ కొలువులో ప్రదర్శించి మెప్పులు పొందాడు. అయితే గోలకొండ రాజ్యం ఆస్తమించడంవల్లనో, మరెందువల్లనో ఈయన దక్షిణాదిని తిరునల్వేలిలో స్థిరపడి నట్టున్నాడు. ఇతని ఇంటి పేరు వీణావారైనా ఈయన నెల్లూరి నుంచి రావడంవల్ల ఈ కుటుంబానికి నెల్లూరివారనే కొత్త పేరు వచ్చింది. - ననన నవస కానా

  1. అంధ్ర యక్షగాన వాజ్బయచరిత్ర, రెండవభాగం, డాక్టర్‌ యస్వీ జోగారావు, పుట ము.

912 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

నెల్లూరి వెంకటపతికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు వీరరాఘవయ్య సంస్కృతం లోనూ, తెలుగులోనూ అసమాన పాండిత్యం సంపాదించాడు. పుణ్యకోటి సోమయాజులుగారి దగ్గిర చదువుకొన్నాడు. మంత్రశాస్త్రం తెలుసుకొన్నాడు. ఛందస్సు వ్యాకరణం, అలంకారం మొదలైన శాస్రాలేకాక గణితంలో కూడా కృషీ చేశాడు. రత్నపరీక్ష, గజపరీక్ష తెలుసుకొన్నాడు. ప్రాకృతం మొదలైన షడ్ప్చాషావ్యాకరణాలేకాక తెలుగు వ్యాకరణం కూడా మథించాడు. శతావధానం చేసేవాడు. ఇంతటి అసమాన పాండీత్యంతో నెల్లూరి వీరరాఘవయ్య ఎన్నో రచనలు చేశాడు. వాటి సంఖ్య మొత్తం 61. అందులో పన్నెండు తెలుగు రచనలు. వాటి వివరాలు ఇవి:

  1. అష్టదిగ్గజాల సీసాలు 7. యాదవ రాఘవ పాండవీయం

  2. కృష్ణభుజంగం 8. రసమంజరి

తె కృష్ణ్టలీలామృతం 9. వసుంధరాపరిణజయం

  1. చాటువులు 10. సర్వలోకేశ శతకం

  2. త్రిపురారిదండకం 11. సానంద చరిత్ర

  3. మంత్రపాదస్తవం 12. స్తంభోద్చవగద్య.

ఈ పన్నెండు రచనలలో రెండే రెండు లభ్యమై అచ్చుపడ్డాయి. వీటిలో యాదవ రాఘవ పాండవీయం మొదటిది. దీనిని వీరరాఘవయ్య క్రీశ. 1717లో వ్రాశాడు. ఇదీ మూడర్శ్ధాల శ్రేషకావ్యం. రామాయణ భారత భాగవతాల మూడు కథలూ నాలుగా శ్వాసాలలో యిమిడి చెప్పాడు. ఈ సాహిత్య సర్కసు నడిపాక నెల్లూరి వీరరాఘవయ్య వసుంధరా పరిణయం అనే కావ్యాన్ని వ్రాశాడు. పూర్వభాగాన్ని పూర్తిగానూ ఉత్తరభాగంలో ఒక ఆశ్వాసాన్నీ పూండ్ల రామకృష్ణయ్యగారు అముద్రిత గ్రంథచింతామజీ తరపున ప్రకటించారు. యాదవ రాఘవ పాండవీయాన్ని కూడా వారే ప్రకటించారు. వసుంధరాపరిణయం వ్రాసేనాటికి వీరరాఘవయ్య _ ఇంకొంచెం. స్వాతిశయం ప్రకటించుకోవాలని అనుకున్నాడు. తన నిరుపమాన ప్రతిభా విశేషాలన్నీ ప్రదర్శించాలని తలచాడు. ఒకచోట శబ్బార్ధాల వైచిత్రి, ఇంకోచోట మాధుర్యం, మరోచోట ధ్వని వేరొకచోట శ్లేష - ఇలాగ రకరకాలుగా వైదుష్యం ప్రకటించి తన రచన పండితపామరులీ ఆనందం ఇచ్చేటట్లు చేయాలనుకొన్నాడు.

పండితపామరమతమైై- యుండగ వర్ణనయు, గథయు నొనరుతు జెవికిన్‌

బండువుగా నార్‌కేళా- ఖండద్రాక్షాదిపాక కరినమధురతన్‌. (వసుం. 1-9)

ఈ పద్యంలో చెప్పినట్టూ ఈ పద్యం తత్సమపదభూయిష్టం అయినప్పుడు నారికేళపాకంగానూ, ఇతరచోట్ల ద్రాక్షాపాకంలోనూ ఉంది. ఈ కావ్యం ఇంకోరకంగా తూడా విలక్షణమైంది. మన పురాణ కథలో ఎవరేనా ముని ఉగ్రతపస్సు చేయడు మొదలుపెడితే అది చెడకొట్టేదాకా ఇంద్రునికి నిద్రపట్టదు. చెడ్డాకగాని కళ్లు చల్లపడవు తపోవనానికి రంభనో, ఊర్వశినో, మరో అహ్సరసనో పంపిస్తాడు. మగవాళ్లు తపస్సు చేస్త ఇలా చేస్తాడుగాని ఆడదాని తపస్సు ఎలా చెడగొట్టడం? అది సరదా అయిన చిక్కుహా

తంజావూరులో తెలుగు కవులు 913 వసుంధరా పరిణయంలో భూదేవి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఒకసారి విష్ణుమూర్తి వరాహావతారంలో అమెను ప్రేమించాడు. ఇదరూ కాపురం చేశారు. శామక్రీడలతో ఎన్నాళ్లు గడిపారో తెలియదు. అలాగ భోగరసావీలో వేలాక వారికో కొడుకు పుట్టాడు. వాని పేరు నరకుడు. బిడ్డ పుట్టాక స్వామివారు ఒకనాడు అవతారం చాలించారు. ఆ వియోగం భరించలేక భూదేవి ఉగ్రతపస్సు మొదలుపెట్టింది. ఆ వేడిలో మంత్రాక్షర దేవతలు మలమల మాడిపోసాగారు. వాళ్ళు లక్ష్మీదేవితో ' చెప్పుకొన్నారు. అమె ఇంద్రునికి కబురుపెట్టింది. ఆ తపస్సు చెడగొట్టే మార్గం చూడమంది. “దానికేం భాగ్యం, కంతుడు, జయంతుడు, వసంతుడు, చందమామ, మందమారుతం ఉండనే ఉన్నారు. ఎవరిని పంపినా చాలు' అని ఇంద్రుడు వాళ్ల యోగ్యతలు ఇలా మెచ్చుకొన్నాడు. తను జెంద గురుపత్ని దానె రాజేయడే సుందరాకృతి గల్లు చందురుండు

తన తనూజ వరింపు తలపు బుట్టింపడే బ్రహ్మంతవానికి భావజుండు

శాపాంతమృతి నోర్చి సతి గూడజేయడే మహి బాండురాజును మాధవుండు

కనినంత గులకాంత మనసైన కరిగించు నను నందమందడే జయంతు డెలిమిసోకునసాక్కించు సౌలపుగనడె

మలయపవనుండు వారలవిలిచిపనుపు

ధరణివ్రతభంగ మొనరించి ధైర్భముడిపి

తత్తపోవిఘ్న మొనరించివత్తురనిన. (వసుం. ౩-47)

ఇంద్రుడు వాళ్లనిలా ఆకాశానికెత్తినా జయంతుడు తప్ప మిగతా ఎవ్వరూ ఈ పనికి ఒడికట్టలేదు. అట్టహాసంతో పరివారంతో జయంతుడు తపోవనానికి వెళ్లాడు. మారువేషం వేసుకొన్నాడు. మరులు తెలిపాడు. వసుంధర అతని నిజస్వరూపం తెలుసుకొని “కాకివై లోకంలో తిరగమని శపించింది. 'నేను నీ కొడుకులాంటివాడీని. నాకు శాపం ఇచ్చావు కనుక వచ్చే జన్మలో నీ చేతులతో నువ్వు నీ కొడుకునే చంపుకో' అని శపించాడు. (కొడుకు లాంటివాడైతే ఎందుకు తల్లిమీద వసంతాలు చల్లపోయాడన్నదానికి జవాబులేదు). ఈ శాపం వల్లనే సత్యభామగా భూదేవి అవతరించింది.

ఈ కథను నారదుడు కృష్ణునికి చెప్పాడు. “నీకోసం సత్యభామ పుట్టింది. ఎదిగి పెల్లికి సిద్ధంగా ఉందని" తెలియజేశాడు. ఈ సంగతి రెండో అశ్వాసం చిట్టచివర చెప్పి శాపకథను మూడో ఆశ్వాసంలో వీరరాఘవయ్య కథనం చేశాడు. మొదటి ఆశ్వాసంలోని కథాభాగంలో 444 గద్యపద్యాలు ఉన్నాయి. అవి పురవర్ణనకు సరిపోయాయి. . అందరిలాగా చిన్న వచనాలు బ్రాయడం వీరరాఘవయ్యకు చేతకాదు. కొండవీటి చేంతాళ్లంత పొడుగ్గా వ్రాస్తాడు. రెండో ఆశ్వాసంలో ద్వారకాధిపతి అయిన కృష్ణుణ్ణి 25 పద్యాలలో వర్ణించాడు. భారత భాగవత హరివంశగాథలలోని విషయాలన్నీ చెప్పేశాడు. తరవాత నారదుడు రావడం, 28 భుజంగ ప్రయాతాలలో. సంస్కృతంలో స్తుతించడం, పోనీలే అని తెలుగులోనూ ప్రార్థించడంతో రెండో అశ్వాసం చివరికి వచ్చింది.

" ఈ విధంగా వెంచుకుపోవడంవల్ల అడవిలాగా ఈ కావ్యం పెరిగింది. ఇందులో పూచిన పూవులని ఏరతెచ్చుకొంటే బాగానే ఉంటాయి. మహాకవులకు కావలసిన

1 | / | 914 . సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి త ॥ మితభాషణ లేకపోయినా పండితులు ప్రకటించుకొనే ప్రకర్షణం మాత్రం నెల్లూరి బె టు వీరరాఘవయ్యలో బోలెడంత కనబడుతుంది. ఇతడింతటి ఉద్దండపండితుడయినా ఇతని / | (1 . కొడుకు శివరామయ్య ఆంధ్రపాణిని శేషాచలం దగ్గిరే చదువుకొన్నాడు. ॥ . . గురువుగారు శాహజీ ఆస్థానంలో ఉండే శిష్యుడు జయసింహుని కొలువులో .. " | ॥ ఉన్నాడు. ఇతడు తుక్కోజీ రెండోకొడుకు. అకాల మరణం పొందినా జయసింహుడు శ |. . బ్రతికినంతకాలం తెలుగు సాహిత్యాన్ని అఖిమానించాడు. నెల్లూరి శివరామయ్యచేత ప . || కామకళానిధి అనే కామశాస్త్రాన్ని చెప్పించి అంకితం పుచ్చుకొన్నాడు. ఇది క . ॥ ॥ నాలుగాశ్వాసాల గ్రంథం. శాస్త్రంలోని లక్షణాలు తెలుసుకోకపోతే సుఖవృద్ధి లేదని ఇ . ఆదిలోనే చెప్పాడు. గ్‌ శ్‌ . ళ్‌ . | | _పశువులాగకాక రసికతతో వారిజాక్షులను ట్రీతిలచేసేటప్పుడు పౌందేసుఖమే క . | బ్రహ్మానందం అన్నాడు. . | / | ధారుణి సర్వేంద్రియసుఖ-మారయ నానందమయ్యె, నది బాహ్యంతః శ | | సారసురతముల గలుగున-పారపరబ్రహ్మసౌఖ్య పదమన మిగులున్‌. (కామ. 10%) | ఇదీ గణబద్ధమైన శాస్త్రగ్రంథం. కవిత్వం లేదుగాని చెప్పవలసిన లక్షణాలన్నీ ( వ. స్పష్టంగా చెప్పాడు. ఏఏ బంధాల కేయే పేర్గో, ఏఏ చుంబనాల కేయే పేరో వివరించాడు. + ( ఈ శాస్త్రగ్రంథం అచ్చుపడింది. దీని వ్రాతప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో . ఉంది (1.320). కామకళానిధి వ్రాశాక శివరామయ్య మరేమైనా గ్రంథాలు తంజావూరు నం! కొలువులో చెప్పాడో లేదో తెలియదు. తనను పోషించిన జయసింహుడు అకాలమరణం. ్ట. పొందాక వేరే శ్రీమంతులను శివరామయ్య ఆశ్రయించి ఉంటాడు. మర్రి కృష్ణయ్య అనే వ్యా ఎర్జారు రామకృష్ణాపురంలో ఉండేవాడు. ఆయన శివరామయ్యచేత కృతి చెప్పించి శే దేవునికే అంకితం ఇప్పించాడు. జయసింహుని కొలువులో కామశాస్త్రాన్ని తెనిగించికే టీ మర్రికృష్ణయ్య పోషణలో యోగశాస్తాన్ని తెనిగించాడు. ఇది ఆరు ఉల్లాసాల గ్రంథం. " జ! | ““విటులకు సయితం భావశుద్ధి కలిగేటట్టు' దీనిని ివరామయ్య వ్రాస్తానన్నాడు. చాలా శ. నీతులు చెప్పాడు. తపస్సు మూడురకాలట. ప, క చలిచీమలనైనత్రొక్కమి- తలపులనందైన కీడుతలపమి యెవరిన్‌ స టీ చులకగ ప్రల్లదమాడమి। యిల త్రివిధమ్ము లగు తపము లవి యనబరగున్‌ బూ (1.276 పుట 21) ప. ఇంకొక ఎత్తుగితిలో ఎవర్‌కెవరు అనే సత్యాన్ని విడమర్భి చెప్పాడు: |] ప్ర .... "తనువు లెక్కడి సరము, విత్తము లేడ - పుత్రులెవ్వరు, తనదు కళత్రమెవతి 1 1. తనకు దేహంబునకు బంధకము లేక-యుండునప్పుడు తగుమైనదొకటి కలదె? |. ఇివరామయ్య ఈ గ్రంథరచన చేసి కాలానికి వేమన పద్యాలు బాగా ప్రచారంలోకి లో -. వచ్చినట్టు కనబడుతోంది. వేమన నడిపించినట్టు ఆటవెలదిని నడపడం, యతులు ప్రాసలు నకును నస. న నప. సు ప య లా అం

తం / టి తంజావూరులో తెలుగు కవులు 915 . రి చెవికి స్పష్టంగా వినబడేటట్టు, గణవిభజన తెలిసిటట్టు పద్యం చెప్పడం శివరామయ్య |. ని గ్రంథంలో కనబడుతుంది. . ధనము తనదికాదు తనువు నిత్యము కాదు-విభవమనుటెగాని వెతలు వెతలు . శి లోన నుండు రోత కానంగవలదొకో-ఘనుల కనెడు బుద్ధి గలుగవలదె? (7.726) . పే ఈ పద్యంలో చివరిపాదం తీసివేసి *విశ్చదాఖిరామ వినురవేమ” అని తగిలిస్తే వేమన ] డి పద్యంలాగే చలామణీ అయిపోతుంది. శాస్త్రగంథాలను ఇంత సరళంగా వ్రాయడం చాలా . | అవసరం. నెల్లూరి శివరామయ్య కథాకావ్యాలను వ్రాశాడో లేదో తెలియదు. గద్యలో . ని తాను సంస్కృతాంధ్రసాహిత్య సార్వభౌముజ్దని చెప్పుకొన్నాడు. దొరికిన రెండు న పుస్తకాల సాక్ష్యంతో అంత బిరుదు ఎవరూ చూసి చూసి ఇతనికి ఇవ్వలేరు. ఇతని తండ్రీ (| న్స వీరరాఘవయ్య సంస్కృతంలో చెప్పిన విశషరామాయణంవంటి కృతులు దొరుకుతాయి . గాని ఇతని సంస్కృత రచనలేమిటో కూడా తెలియవు. అయితే ఒకటిమాత్రం ఖాయం. న | శీవరామయ్య తాను ఉత్త పండితపుత్రుణ్ణి కానని మాత్రం రుజువుచేసుకున్నాడు. . ్ర) దర్భా సోదరులు: నెల్లూరివారిదేకాక తంజావూరిలో దర్చావారి కుటుంబం కూడా న ్ని ప్రసిద్ధమైంది. దర్భా ఓబయ్యగారు శాస్త్రపురాణాలు బాగా చదువుకొన్నవాడు. ఆయనకు జ: | నలుగురు కొడుకులు. పెద్దకొడుకు గోపన్న, రెండోవాడు గిరిరాజు. మూడోవాడు లీ వెంగన్న్య కడగొట్టువాడు వెంకటగిరి. వాళ్లలో పెద్దవాడు ఏం చదువుకున్నాడో, సా గో ఏ సభలలో రాణించాడో తెలియదుగాని అతడు కులదీపకుడు. రెండోవాడు గిరిరాజు రు పదకర్ష. చాలా నాటకాలు బ్రాశాడు. శాహజీ కొలువులోనూ, తరువాత శరభోజి స శం పాలనలోనూ ఉన్నాడు. మూడోవాడు-వెంగన్న - “సంగీతకళారహస్యము గన్నవాడు.” | నే... | అఖరివాడు వెంకటగిరి మహారాష్ట్ర సామంతులైన విచితరాయుడి పోషణలోనూ, అతని _ శ, | చి కొడుకు ఖండోబి హయాంలోనూ ఉన్నాడు. ఈ వెంకటగిరి తన వంశం గురించీ, అన్నల ల నే ం గరించి చెప్పాడు. హ్‌ లా దర్భాగిరిరాజు ఆరు నాటకాలు బ్రాశాడు. ఇందులో ఐదు శాహజీ కొలువులో [1] లో ఉంటూ అతనిపై వ్రాశాడు. ఆరవది శరభోజిరాజ్య కాలంలో అతనిపై రచించాడు. ఇతని | . నాటకాలన్నీ ఒక్కలాగే ఉంటాయి. అన్నింటిలోనూ కథ ఒకటే, ఎవరో రాజు కూతురో, 1. సానికూతురో తంజావూరు ప్రభువును చూసి మరులుకొంటుంది. విరహంతో వేగుతుంది. లం. దూతిచేత రాయబారం చేయిస్తుంది. చివరకు రాజును పెళ్ళాడుతుంది. చెలికత్తెలు మంగళం /

  1. పాడుతారు. ఈ నాటకాలన్నీ నాట్యోచితమైనవే. వాటి పేర్లు: (1) శాహేంద్రవిజయం .. (2) వాదవిజయం (3) రాజమోహనకొరవంజి (4) సర్వాంగసుందరీ విలాసం . / (5) రాజకన్యాపరిణయం (6) లీలావతీకల్యాణం. ఈ ఆరు నాటకాలూ అచ్చుపడ్డాయి. . ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ప్రచురించ్రారు.3 వీటిలో మొదటి రెండింటిలో సానిపిల్లలు | ోక్రీ నాయికలు, శాహరాజును చూసి వీళ్లు మోహిస్తే, తొలి నాటకంలో వేశ్య్వమాత హితబోధ . లు చేస్తుంది. వాదవిజయంలో నాయిక అక్కదండకంలో బుద్ధి చెప్తుంది. రాజమోహన . రా ఆ

916 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుక్రి తురవంజిలో నాటకంకన్నా జాగ్రఫీ ఎక్కువ. దర్చా గిరిరాజు తన నాటకాలలో తగిన్రశ వైవిధ్యం ఉండాలని కోరుకున్నా అది కనబడదు. పైపెచ్చు వ్రాసినవి ఆరు నాటకాకే అయినా అందులో నాలుగింటిలో ఒకే పదము అచ్చివచ్చినట్టు పెట్టాడు. ప్రతి నాయికా చివర “నన్నై పెండ్లాడుము' అని పాడుతుంది ఈ పదం రాజమోహనకురవంక్షి వాదవిజయం, రాజకన్యాపరిణయం, సర్వాంగసుందరీపరిణయం - నాలుగు నాటకాల లోనూ ఉంది. ఇలాగే ఒకే పదం కాక ఒకేరకమైన మంగళం తూడా గిరిరాజు తగ నాటకాలలో వాడాడు. మూడు నాటకాలలో మాత్రమే ఈ మంగళం కనబడుతుంది సర్వాంగసుందరీ పరిణయంలో వాసుదేవకవి వ్రాసిన మంగళం ఏ కారణంచేతనో వచ్చి చేరింది. లేఖకుని పొరపాటు కావచ్చు. సాధారణంగా తన నాటకాలలో పాడే పదాలలో దర్చా గిరిరాజు తన ముద్ర వేసుకొంటాడు. 'గిరిరాజసన్నుత' అని ఉంటుంది. అయికే శాహేంద్రచరిత్రము అనే కృతిలో వేరే ముద్ర వేశాడు. ఇది కూడా లేఖక దోషం కావచ్చు.

దర్చాగిరిరాజు పద్యకావ్యాలు ఏమిటి వ్రాకాడో తెలియదుగాని లీలావీ కల్యాణం అనే నాటకంలో ఎక్కువగా వృత్తాలు, జాతులు, ఉపజాతులు వ్రాశాడు వినాయక ప్రార్థన చూడండి.

జనని స్తన్యము లానుచో గటసరోజాతంబుపైగమ్ము చి

క్కని భృంగంబులు జాంబవంబులని యా్రూణించి తన్మంద

ధ్వనికిన్‌ ఖీతిలి గౌరిచేత చిలుకన్‌ తాటించు మాద్యుచ్చిరం

తనదంతావళరత్నమున్‌ గొలుకు మత్కావ్యార్థసంసిద్ధికిన్‌. (లీలా.పు. 1౫)

గిరిరాజకవి పద్యాలు బాగా ప్రాఢంగా వ్రాయకపోయినా పదాలు శ్రావ్యంగా వ్రాస్తాడు* దర్చా గిరిరాజుకన్నా అతని తమ్ముడు వెంకటగిరి పద్భుకావ్యాలు ఎక్కువగా రాసినట్టుంది. అన్న నాయకరాజుల ఆస్థానంలో ఉంటే, తమ్ముడు సామంతుల కొలువుల్లో వున్నాడు. ఆ కాలంలోని మహారాష్ట్ర రాజకుటుంబానికి ఏవిధంగా సంబంధీంచినవాళ్లో తెలియదుగాని తంజావూరులో 'మాళి వంశం మహారాషులు ఉండేవారు. కవికి అసలు పేరు మరుగునపడి విచిత్రరాయవతంసుడనే బిరుదు సార్థకమైంది. ఈ విచిత్రరాయడి తుమూరుడు ఖండోజీ కూడా సాహిత్యపోషకుడు. దర్చా వెంకటగిరిచేత రుక్మాంగద చరిత్రను ద్వాపదకావ్యంగా చెప్పించాడు. శ్రీహరికి అంకితం ఇప్పించాడు. దీని ప్రతి ఒకటీ తంజావూరులో ఉంది (తం.డి. 355). ఈ ద్వాపద కావ్యం వల్లనే దర్భావారి కుటుం వివరాలు తెలుస్తున్నాయి. మిగతా కావ్యాలలో వెంకటగిరి ఈ వివరాలు చెప్పనేలేదు.

రుక్మాంగద చరిత్ర వ్రాశాక వెంకటగిరి అఖినయదర్పణం అనే నాట్యళ్వస్త గ్రంథాన్ని పద్యాలలో వ్రాశాడు. ఇది ఖండోజికి అంకితం. ఇది సమగ్రం కాదు. దీని ప్రి తూడా తంజావూరులో ఉంది (తం.డి.716). ఖండోబికి పద్యకావ్యాలు అంకీఈ పుచ్చుకోవడం ఇష్టం కాబోలు. ఇతని వద్దకు ఒకనాడు ఒక పెద్దమనిషి వచ్చాడు. తొను తెనాలి రామకృష్ణుని మనవణ్జి అని చెప్పాడు. తమ తాతగారు వ్రాసిన ఘటికాచలక్షేక

తంజావూరులో తెలుగు కవులు 917 మాహాత్క్యాన్ని అంకితం పుచ్చుకొమ్మని చెప్పాడు. అప్పటికి పన

ధరణి తొమ్మిది లిబ్బులు దాచుకొన్న-వానికైనను ధనకాంక్ష పోనియట్లు

కృతులు పదివేలు గైకొన్న గీర్హి కాము-డైన వానికి జనదు కావ్యాఖిలాష

(ఘటికా. 1-19)

ఖండోజీ కీర్తికాముకుడే. అతనికి కావ్యాఖిలాష పోలేదు. అందుచేత తెనాలి రామకృష్ణుని మనుమనికి డవ్పిచ్చి ఆ కావ్యాన్ని తీసుకొన్నాడు. దర్చా వెంకటగిరిని పీలిచి ఆ గ్రంథానికి అవతారిక చెప్పమన్నాడు. అందులో తన వంశాన్ని కీర్తించమన్నాడు.

ఖండోజీ కోరినట్లే వెంకటగిరి చెప్పాడు. ఇవి అరవై గద్యపద్యాలు. వీటితోనే ప్రస్తుతం ఘటికాచలక్షేత్రమాహాత్మ్యం ప్రచురితమయింది. దర్చా వెంకటగిరి ఇలా పూరించిన గ్రంథం అచ్చుపడిందిగాని అతని సౌంతకృతులు వెలుగు చూడలేదు. వెలుగు చూసిన గద్యాలలోనూ ఆత్మస్తుతులలో ఇతడు తన అన్నగారి పేరు విధిగా చెప్పుకోవడం కనిపిస్తుంది. 'గిరిరాజుగారి సోదరుణ్ణి" అని చెప్పుకొందుకితను గర్వపడ్డాడు. అయితే తెలుగు సాహిత్యం గర్వపడడానికి తగినంత గొప్ప పద్యకృతులు దర్చా గిరిరాజు చెప్పలేదు. మన సాహిత్యంలో ఇతని స్థానం గురించి పోరబడడానికి ఆస్కారం లేదు. అయితే ఇతని పుత్రపొత్రాదుల గురించి మాత్రం కొందరు పరిశోధకులు చాలా ప్రారపడ్డారు.

ఆంధ్రవాగ్గేయకారులలోనేగ”క కర్ణాటక సంగీత మూర్తితయంలోనూ త్యాగరాజస్వామి సుప్రసిద్ధుడు. వారి తాతగారి పేరు గిరిరాజ బ్రహ్మం. ఆయన కూడా తంజావూరులో ఉండేవాడు. ఈ సామ్యాలవల్ల శాహజీ ఆస్థానంలో ఉండే గిరిరాజే సాక్షాత్తు త్యాగరాజస్వామి తాతగారని సంగీత పరిశోధకులు ఫౌరపడ్డారు. ఈ అభిప్రాయాలను విశ్చసించి బాలాంత్రపు రజనీకాంతరావుగారు. గ్రంథస్థం చేశారు! యండమూరి సత్యనారాయణరావుగారు ఈ పొరపాటును కూడా స్వీకరించారుల

వాస్తవానికి శాహజీ కొలువులోని గిరిరాజూ, త్యాగరాజు తాతగారైన గిరిరాజూ విఖిన్నులు. ఇంటిపేరూ, గోత్రాలు వేరు వేరు. శాహజీ కొలువులోని గిరిరాజు ఇంటిపేరు దర్చావారు; త్యాగరాజస్వామి ఇంటిపేరు కాకర్లవారు. దర్భావారు లోహితగో శ్రీకులు. కాకర్ల్గవారు భారద్వాజసగో త్రీకులు.

శాహరాజు సభలోని గిరిరాజుతు, త్యాగరాజస్వామి తాతగారికి సంబంధం లేదని నిరూపించవచ్చు. గిరిరాజు రచించిన పదాలలోని సంగిత్చూలీ, కూర్పూ త్యాగరాజ స్వామివారి కీరనలలో తూడా కనిపించడానికి తాకామనుమళ్ల వరసీ కారణం అని మిత్రులు రజనీకాంతరావుగారు భావించారు.” బంధుత్వం లేకపోయినా. రచనలో ననన. వననసునననుననను. నుత... పకన క య క. అంధ్రవాగ్గేయకారచరిత్రము, పుటలు 238, ౫0, ౫3 ఓ కారదాధ్వజం, పుటలు 15, 198. 7. అంధ్ర వాగ్గేయకార చరిత్రలు, పుట 30

9168 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటి పోలికలు ఉండవచ్చు. అయితే దర్భా గిరిరాజు ప్రభావం అనంతర వాగ్గేయకారులపై ఎక ఉందో ఇప్పుడే తేల్చిచెప్పలేం.

పోమయ్య: తంజావూరులో సంగీతసాహిత్యజ్ఞానాలు రెండూ వున్నవాళ్లలాగా కేవలం సాహిత్యజ్ఞానమే ఉన్నవాళ్లు రాణించలేరు. వాగ్గేయకారులకు రాజాశ్రయం త్వరగా లఖించేది. సాధారణ స్థానికకవుల భుక్తికే ఇబ్బందిగా వుంటే ఇతర ప్రాంతాలనుండి కవులు రాజాశయంకోసం వచ్చేవారని ఈ చాటువు చెప్తోంది

పురమున నుండే కవులే - చొరబడి తిన కూడులేక చుంవించంగా

బరకవు లేటికి వచ్చిరి- తరమెరుగక అరికివిరికి తంజాపురికిన్‌

తంజావూరిలో జొరపడీ తినే కవులలో సోమయ్య ఒకడు. ఇతడు శాహరాజుమీద ఎన్ని శృంగారపదాలు చెప్పాడోగాని 17 పదాలు మాత్రం లభిస్తున్నాయి. ఒక నాయిక ఇశాహరాజు గురించి ఇలా చెప్పుందిః

మంచివానివలె వచ్చి వేగ నామంచముపై నెక్కెను,

అంచగమన మన మాలి మొగుడాటలు పంచశరకేళి నటించలెమ్మ నేని.

పౌంగుచు కేక వేసి నాదు పైటకొంగు జారవేసి

బంగారు నా గుబ్బలపై పగవారుసంధికీతి అంగడి బెట్టసాగెనమ్మ ఈవేళ

వెలయ సోమసుకవియంచమించెనా చెలువుడు శాహభూపతి

కతులయాల నేనని కుయ్యగా వేవేగ బలిమిని నోరుమూసి బాగుగ తూడేని

(తం.డి. జు)

జీల్ళిమిని నోరుమూసి బాగుగా కులయాలిని కూడే శాహరాజుని కృష్ణుణ్ణి చేసి సోమర్య ఇంకో ఎన్ని పదాలు చెప్పాడో భావిపరిశోధనవల్ల తేలాలి. తంజావూరులో పదాల కీర్తనలు, పాటలు మొదలైనవి - సంకలన గ్రంథాలు చాలా ఉన్నాయి. వాటినన్నిటిని పరిశీలించి బోలెడన్ని కేటాయింపులు చేయాలి. సోమయ పదాలను త్యాగేశపదాలలో ఖైపారు వేయాలి. ఈ పదసాహిత్యం ఏ పరిశోధకునికైనా చేతినిండా పని కల్పిస్తుంది

స్రోలూరి గోవిందయ్య. చల్లపల్లి వెంకయ్య: కేవలం సంగీతజ్ఞానంతో తంజావూరులో రాజాశ్రయం సంపాదించుకొన్న కవులుంటే సంగిత గ్రంథాలనే వ్రాయించిన దాతల కూడా ఇక్కడ ఉండేవారు. దక్షిణాదిని చెరుతూరువారనే పంటరెడ్డ్లు ఉండేవారు. వాళ్లలో సదాశివనాయకుడనే శ్రీమంతుడు సంగీతసాహిత్యాలను చాలా ఆదరించాడు. ఆశని పోషణలో పోలూరి గోవిందయ్య, గురిపల్లి గోపన్న, చల్లా వెంకయ్య మొదలైన కవులు ఉండేవారు. భరతం వీరరాఘవయ్య అనే మహానటుడు ఉండేవాడు. వీరందరితో కలీ చెరుకూరి సదాశివుడు విద్యావినోదాలలో కాలం గడిపేవాడు. ఆ శ్రీమంతుడు పోలూగ అనా నాుతతాలకునాలకు నునన భకుతడు కోన లనకనా నాననా ని ననానన నాన 7, _అంధ్రవాగ్లేయకారచరిత్ర, పుట 300. 8. దీనిని మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఉదాహరించారు. భారతి, జనవరి 164 - .

తంజావూరులో తెలుగు కవులు 919 గోవిందయ్యను పిలిచి ఒక సంగీత గ్రంథం బ్రాయించాడు. దానిపేరు “తాళదశప్రాణదీపిక.* అయితే ఇది అతని మొదటి రచన కాదు. ఇంతకుముందే పర్వతనారదోపాఖ్యానం అనే ఘనకావ్యాన్ని. వ్రాసి చెరుకూరి సదాశివునికి గోవిందయ్య అంకితం ఇచ్చాడు. ఈ సంగతిని సంగీత గ్రంథంలో ఇలా చెప్పాడు:

మునుపును పర్వత నారద - మునినాముల చరితమును సముత్క టఫణితిన్‌

ఘనకార్యంబుగ నొనరిచి-తనకిచ్చిన ఘనుడవౌగదా ప్రమదమునన్‌. (తాళ 1-16)

అయితే సముత్కటఫణితలో పోలూరి గోవిందయ్య చెప్పిన ఈ ఘనకావ్యం నేడు లభించదు. చెరుకూరి సదాశివుని తమ్ముడు ఉదవినాయకుడనే పెద్దమనిషి తానో పర్వత నారదోపాఖ్యానాన్ని వ్రాసినట్టు చెప్పుకొన్నాడు. ఈ గ్రంథానికో అసమగ్రప్రతి తంజావూరు గ్రంథాలయంలో ఉంది (తం.డి. 180). చెరుకూరి ఉదవినాయకుడు కట్టమోరివారికి దత్తు వెళ్లినట్టుంది. సదాశివనాయకుని తమ్ముణ్జని చెప్పుకొంటూ ఉదవినాయకుడు తాను కట్టమూరి నాగయ్యగారి అత్మజుణ్జి అని వ్రాసుకొన్నాడు. చెరుతూరి సదాశివుని తండ్రి పేరు రామలింగయ్య. తల్లిపేరు రామక్క. ఉదవినాయకుడు వీళ్ల రెండో కొడుకు. ఇతడు వాగర్థప్రతిభావంతుడని సదాతివుని కొలువులో వాళ్లు ఇలా అన్నారుటః

వాగర్థప్రతిభాగఖీరతర కావ్య ఫ్రొఢనిర్మాణ రే

ఖాగీర్వాణమనోమనోహరసమాఖ్యన్‌ మీరె మా తమ్ముడా

నాగక్ష్యాధిపపాలితాత్మజుడు నానాసత్కవిస్తోయమా

నాగేయస్ఫుటధీవిహారియుదవిందాఖ్య ప్రభుం డెంతయున్‌. (తం.డి. 120) ఇలా పొగడిన సత్కవుల పేర్లు కూడా ఉదవినాయకుడు మరో పద్యంలో చెప్పాడు.

భావార్దోక్తిగభీరకావ్యరచనా ప్రాగల్బ్య కావ్యోపమా

స్రావిద్ధాత్ములు శ్రీయహో బలనృసింహాఖ్యుల్‌పు త్రుల్‌ బుధా

భీవిఖ్యాతులు పోలురీ గులిపల్లివంశృముళ్తావళుల్‌

గోవిందాహ్వయగోపనాఖ్యకవిముఖ్యుల్‌ మున్ను గానందరున్‌. (తం.డి.18) బుధాశివిఖ్యాతులైన పోలూరి గోవిందయ్య తానొక పర్వతనారదోపాఖ్యానాన్ని వ్రాసి చెరుకూరి సదాశివునికి అంకితం ఇచ్చాక మళ్ళీ అదే కథను సదాశివుని తమ్ముడు చెప్ప సంకల్పించినప్పుడు ప్రోత్సహించాడు కాబోలు. లేక గోవిందయ్య వ్రాసి ఇచ్చిన గ్రంథానికి ఉదవినాయకుడు తన పేరు పెట్టుతున్నాడేమో తెలియదు. భావిపరిశోధన వల్లగాని ఇది తేలదు. కట్టమూరి ఉదవినాయకునికి చాటుగా గ్రంథం వ్రాశాడో లేదోగాని ఎవరో కట్టమూరీ బుస్సన్న గారి ప్రోద్బలంతో పోలూరి గోవిందయ్య మరో సంగీతగ్రంథం రచించాడు. దాని పేరు రాగతాళచింతామణి. ఈ గ్రంథాన్ని మద్రాసు ప్రొచ్యలిఖిత గ్రంథాలయంవారు ప్రచురించారు.

రొగతాళదింతామణీ రచనలో ఎవరి సహాయం తీసుకోని గోవిందయ్య ఇతరుల

| 920 సమగ్రాంభ్ర సాహిత్యం - రెండవ సంపుటి త్‌ | రచనలకు మాత్రం సాయం చేస్తూ వచ్చాడు. ఇతని మిత్రుడు చల్లపల్లి వెంకయ్య తాను శ . | | “అశ్రాంతోబ్ద్బ్వలవాగ్విలాసం' కలవాడినని విశ్చసించాడు. అతడు శ్రీకృష్ణవిలాసం అనే వ్‌ || కావ్యం బ్రాద్దామనుకొంటూ ఉంటే దేవుడు కలలో కనబడి తనకే ఇమ్మన్నాడు. అ | (| తప్రతిఫలంగా సౌఖ్యములతో “నాయురారోగ్యభాగ్యంబులన్‌' ఇస్తానన్నాడు. మర్నాడు ఏం గ . జరిగిందో చల్లపల్లి వెంకయ్య ఇలా చెప్పాడు: వ్‌ || ..... ఫొందుగ నాదు సన్నిధికి పోలూరి ఓబనమంత్రిపుత్రుడు గో కొ . విందకవీంద్రు మత్సఖుని వేడ్క దలిర్బగ జేరబిల్చి తా | వ /|| నందముగా నికిం గనిన యా కల దెల్పిన నాలకించి యా వబ 1|| నందము మీద నాసుకవినాయకు డిట్లనియెన్‌ మృదూక్తులన్‌. _ (తం.డి. 270) & | సన్నిధికి _పిలిపించుకొన్న సఖుడు మృదూకత్తులతో చెప్పినది విన్నాక .యీ వ్‌ . మహామహడిట్టి కావ్యాకృతికి తోడుగ మెలగంగ చల్లపల్లి వెంకయ్య శ్రీళృష్టవిలాసం. _

  1. / రచించాడు. ఇది నాలుగాశ్వాసాల కావ్యం. ఇందులో శ్రీకృష్ణ చరిత్రంబు సవిస్తరంబుగా శ | | సూతుడు శౌనకాదిమహామునులకు చెప్తే వాళ్లానందించి కథకుణ్జి పొగిడారు. ఈ కావ్యం . అముద్రితం. తంజావూరు. గ్రంథాలయంలో" దీనికి రెండు ప్రతులు ఉన్నాయి. ఈ న . | కావ్యంకాక ఇంకేమైనా చల్లపల్లి వెంళయ్య రచించాడో లేదో తెలియదు. పోలూరి - | "| /. | * గోవిందయ్యతోపాటు చెరుకూరివారి కొలువులో ఉన్స గురిపల గోపన్స గురించి ఇతర క . య్య న్న గురిపల్ల గోపన్న . వివరాలు లఖించవు. భావిపరిశోధనవల్ల లెక్క తేలుతాయేమో చూడాలి. అన్నట్లు వి
  2. | పోలూరి గోవించయ్యకు కవులంటే ఇష్టం. మరెవ్వరో సాధారణంగా నుతించని వ్‌ . | - గణితాధారము సర్వలోక మరయంగా నందులో బెద్దయున్‌ శ ॥ గణీతాధారము నాట్యశాస్త్ర మెరుగం గావునన్‌ మేటిచ్చై - ప్ర | - 1 గణీతాంభోధి దరించె సత్క్ఫృతుల విఖ్యాతంబుగా నెవ్వడా ౯. | . గణకగ్రామణి పావులూరి కవి నిక్కం బెంచెదన్‌ మల్లనన్‌. (తాళ1-9) | స స పావులూరి మల్లన్నను ఇలాగ పొగడీన వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇందులోనే కాక ఇతరత్రా కూడా పోలూరి గోవిందయ్య గణనకెక్కుతాడు. - ల! "వాసుదేవ దీక్షితులు: శాహజీ లెక్కకు ఇరవై నాటకాలు వ్రాసినట్టు ప్రతీతేగాని అన్నీ | జే అతడు స్వయంగా రచించినవి కావు. అతని అస్థాన విద్వాంసులు కొందరు తాము బ్రాసిన న టై నాటకాలకు అతని పేరు పెట్టారు. ఈ సంగతి గ్రంథాదిని ప్రకటించారు. మరికొందరు వ . స్పష్టంగా చెప్పకపోయినా ఆయా నాటకాలలో ఉన్న పదాలలోని ముద్రలను బట్టీ, (| ప్రోంసలను బట్టీ ఫలానా కవి ఫలానా నాటకం వ్రాసి ఉంటాడని చెప - శాహజీ నం పి దా చెప్పవచ్చు ము కృతమనుకొనే పార్వతీకళ్యాణం చివర ఈ మంగళం ఉంది. & ..మహింద్రరాజశాహాయ మంగళం నిత్యమహితకల్యాణాయ మంగళం ( న్నా భోగదేవేంద్రాయ భోసలకులదీపాయ వాగీశపాండీత్యాయ మంగళం - గ్ర ర్‌ భూధరధైర్యాయ భువనైకవీరాయ మాధుర్యనిలయాయ మంగళం 1 . స 'శ్రీచోశనాయకా శ్రీవాసుదేవకవివాచాసంతుష్టాయ మంగళం _ (తండి. 545) ' ము ననన.

నను. , టి తంజావూరులో తెలుగు కవులు న్న 92 | ను ఈ మంగళంలో . వాసుదేవకవి పేరుంది. అందుచేత పార్పతీపరిణయాన్ని ఎవతో | అనే వాసుదేవుడు వ్రాసి శాహజీ పేరు పెట్టి ఉంటాడనే అనుమవూనం సహజంగా కలుతుంది. 11 డు. అయితే వాసుదేవముద్రగల ఈ మంగళం కనబడ్డ ప్రతి నాటకం అతడే వ్రాశాడనుకో | ఏం కూడదు. దర్భా గిరిరాజు రచించిన “సర్వాంగసుందరీ విలాసం" అనే నాటకం చివర . వాసుదేవముద్రగల పై మంగళమే. "ఉంది? ఇది బహుశా ప్రతివిలేఖకుని పొరపాటు . కావచ్చు. గిరిరాజు స్వయంగా కవి. మంచి పదకర్త. అతడు వాసుదేవకవి రచించిన. ) '_ | మంగళాన్ని వాడుకోవలసిన అవసరం లేదు. శాహజీ కృతులలో ఇతరుల పదాలు . | బోలెడన్ని ఉంటాయి. కనుక పార్వతీపరిణయాన్ని రచించడంలో వాసుదేవకవి తోడ్పడి | 0) ఉండవచ్చు. లేదా పూర్తిగా వ్రాసి శాహజీ పేరు పెట్టి ఉండవచ్చు. అయితే ఈ ] న వాసుదేవుడెవరు? | సం - శాహజీ దగ్గర త్రయంబకరాయమఖి అనే పండితుడు మంత్రిగా ఉండేవాడు. | గౌ ఈయన శాహజీ సహాయంతో క్రీ.శ 1698లో యజ్ఞాన్ని చేశాడు. రామాయణానికి నం నూతన వ్యాఖ్యానం బ్రాశాడు. ఇతని అన్నగారి పేరు నరసింహరాయమఖి. ఈయన రి. | 'తిపురవిజయచంపువు' అనే సంస్కృత కావ్యం రచించాడు. ఈ నరసింహరాయల / కర కుమారుడు తూడా పండితుడే.. అతని పేరు ఆనందరాయమఖి. ఈయన . టు విద్వత్సార్వఖౌముడు. ఈ ఆనందరాయలకు అప్పాదీక్షితులు వంటి ఆశ్రితులూ, . నీ వాసుదేవదీక్షితుల వంటి. శిష్యులూ ఉన్నారు. వాసుదేవదీక్షితులు సిద్ధాంతకౌముదికి జ్ర బాలమనోరమ అనే వ్యాఖ్యానాన్ని రచించాడు. జగ ఇలా ప్రసిద్ధుడైన వాసుదేవదీక్షితులే పార్వతీపరిణయాన్ని బ్రాసిన వాసుదేవుడని ల ఉష, పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.!9 ఇది నిజమే కావచ్చు. పార్చతీపరిణయం రచన (సస ప్రొఢమే. మంచి శోకాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా ఈ నాటకంలో హాస్యం ఈ. న్‌ క). | - కొట్టవచ్చినట్టు కనబడుతుంది. అది ప్రహసనతుల్యం. గ స్ట క ప్రహసనాల పేరిట సంస్కూతరూపకాలలో కొన్ని పచ్చిబూతులబుంగలు _ | శ్తే న్నీ ప్రహసనం తలమానికం వంటిది: ఈ కోవలోనిదే మరొక రవ్వ ఉంది. దానిపేరు స! న సుభగానంద ప్రహసనం. దీనిని వాసుదేవకవి రచించాడు.!! బహుశా ఈ ప్రహసనకర్త న ఏ | పార్చరీపరిణయం తూడా బ్రాళాడేమో. . . దీనికి 9 ప్రతులు తంజావూరు. సరస్వతీమహలు_ గ్రంథాలయంలో ఉన్నాయి . 8, యక్షగ్గానములు _ తంజావూరు, వ్‌ 6 అంధ్రవిశ్టనిద్యా అయ ప్రచురణ, పుట 150. ం. | . 1 ॥ 0 య లు వెంకటరావుగారు, ల

922 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సయ్య నాగరప్రతి శాహజీ చదువుకొనడానికి లిఖించినదేమో. అతనికి తెలుగులిపి రాదేమో. శ ప్రతులన్నింటిలో పాఠ భేదాలు చాలా ఉన్నాయట. ఈ నాటకాన్ని యస్వీ జోగార్య గారు చాలా విపులంగా సమీక్షించారు.!* కవి హాస్యం కోసం అసభ్యతను ఆదరించి ఘట్టాలను చూపించారు. పార్వతీపరమేశ్వరుల పెళ్లికి ముందు నిశ్చయతాంబూల ఘట్టంలో సప్తమహర్ష్హులు చెప్పిన సంకల్పంలో “అస్మిన్‌ వర్హమాన వ్యావహారిక చాంద్రమానే అష్షడ్ల॥ నామసంవత్సరే అభాసమాసే' అనే మాటలున్నాయి. పెళ్లిలో చదివిన మంగళాష్టకాలలో “చెంబూ కంబళి నంబి వానిది కదా చేంతాడు మందేకదా, గంతల్‌ బొంత లోఖివానిదికదా గార్థభంబు చాకింటిదే. అన్నా తమ్ముడు యిద్దరుక్‌ యెకతెకే కుర్వంకు వాం మైథునం' అనే యద్దేవాలు ఉన్నాయి. ఈ కారణాలవల్ల కవి యెంత విదగ్గడైనా రచనలో ఉదాత్తత ప్రకటించలేకపోయాడని యస్వీ జోగారావుగారు సమీక్షించారు.

అయితే నిడుదవోలు వెంకటరావుగారు వాసుదేవకవిని వెనకేసుకొచ్చారు అతళ్లేకాక, తంజావూరు నాటకాలలో ఎక్కడ బూతులున్నా వాటికి అర్థం ఉందన్నారు పరిశోధకక్షీరకంఠులకు తొమ్మిది పేజీల చీవాట్లు పెట్టారు. వాటిలో ఒక పేరా చూడండి

““సమీక్షకర్త “అన్నా తమ్ముడు... యొకర్తెనే కుర్వంతు వాం మైథునం” అనుపాదమ నత్యంతము నసభ్యమని వ్రాసి యున్నాడు. కాని యన్న చనిపోయిన వెనుక తమ్మడు అన్నయొక్క భార్యను పెండ్లియాడు నాచార ముత్కళదేశమున నున్నదని యితని కెరుకలేదు. మతజియు టిబెట్టు దేశమున నేటికి సోదరులిరువురికి నొక్కతే భార్య యుండునను విషయము (వివేకానంద స్వామివంటి మహనీయుడు తెలిపినది) వ్యాసకర్తకు కలలోనైనా కనుపించలేదు. వాసుదేవకవి వివాహ సంకల్ప సమయముననే సందర్చశుద్ధిగా ఇళ్టీ యాచారమును, సంప్రదాయమును తెలిపినందువలన కవిని ప్రశంసించవలసినదే కాని అసభ్యమని విమర్శించుట విమర్శకునికి సభ్యతాలోపము..”

ఈ _ విషయంలో _వాసుదేవకవిని ప్రశంసించవలసినదే అన్నవాళ్లు ప్రశంసించవలసినదే అనేవాళ్లు కూడా ఉంటారేమో!! లోకం చిత్రమైంది!

తంజావూరులోని సాహిత్యలోకంలో ప్రబంధకవులకన్నా నాటకక్లేే ఎక్కువగా కనబడతారు. కొందరు ఏ ప్రభువుల కొలువులో ఉన్నారో చెప్పలేం. అయినా దక్షీణాదిన ఉన్న నాటకకర్తలు ఇంచుమించుగా శాహజీకి సమకాలికులని నిర్ణయించవచ్చు. వాళ్ల గురించి ముచ్చటించుకొందాం.

బాలకవి సుబ్బన్న; ఇతని పేరిట పూర్తిగా గద్యకల నాటకం ఒకటే కనబడుతున్నా ఈయన మూడు నాటకాలు వ్రాశాడని ఇతర ఆధారాలతో పరిశోధకుల నిర్ణయిస్తున్నారు.*ే ఇందులో రెండు శాహజీమీద వ్రాసినవి. “లీలావతి శాహరాజీయ అనే నాటకంలో శాహరాజు కాశ్మీర రాకుమారి లీలావతిని పెండ్లిచేసుకొనే కథ ఉంది 12. అంధ్రపత్రిక సారస్వతానుబంధం, 15-4-58. 13. ఆంధ్రయక్షగాన వాబ్బ్యయచరిత్ర - రెండవ భాగం, పుట 309. 14. అంధ్రయక్షగాన వాజఖ్మ్యయచరిత్ర - రెండవ భాగం, పుట 3౫.

తంజావూరులో తెలుగు కవులు 923 ఇందులో భావప్రొఢి లేదు. సందర్చశుద్ధి తక్కువ అని విమర్శకుల అంచనా.!5్‌ ఇది అముద్రితం (తం.డి. 5889). 'శాహమహారాబ కళ్యాణం" అనేది మరొక నాటకం. ఇందులో రూపవతి అనే మరోరాజకన్యను శాహజీ పెళ్లాడడమే ఇతివృత్తం. ఇది కూడా అముద్రితం (తం.డి. 631). ఇది కొంచెం చెయ్యి. తిరగిన రచన. శాహరాజు కథానాయకుడుగా కాక కృతిభర్తగా “పంచకన్యాపరిణయం' అనే మరో నాటకాన్ని బాలకవి సుబ్బన్న వ్రాశాడు. ఇది అచ్చుపడింది.3*

సుదామునితో బంతి ఆట ఆడడానికి వెడుతున్న కృష్ణునికి ఐదుగురు కన్యలు ఎదురుపడ్డారు. ఆ పంచకన్యలు జలక్రీడలు చేస్తున్నప్పుడు వాళ్ల వస్త్రాలు కాస్తా కృష్ణుడు తస్కరించాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. 'వలరాజు కేళి రువారుగా గూడి నామనం బలరించితే”' మీ చీరలు ఇస్తానన్నాడు. ఆ పంచకన్యలు ఒక గీతపద్యంలో ఇలా అభ్యంతరం చెప్పారు:

బాలగోపాల మమ్మొక్క సారి నీవు-గలయ నెవ్వరు మరి బొట్టుగట్టబోరు

గాన నొల్లము సంసారహానియ్డైన- యిట్టిపని సేయ, వలువలనిమ్ము దయను. ఇటువంటి అభ్యంతరానికి కృష్ణుడు సమాధానం చెప్పగలడు. ఎవరూ పెళ్ళాడకపోతే నేనే అ పుణ్యం కట్టుకుంటానన్నాడు. అన్నమాట నిలబెట్టుకొని ఆ ఐదుగురిని పెళ్లిచేసుకొన్నాడు. ఈ ఉమ్మడి శృంగారం చాలదన్నట్టు నాటకం మధ్యలో దీర్ణదంత అనే పెరుగుది వచ్చి 'కొన్ని హాస్యంబులు చేయుచున్న సమయంబున కృష్ణుండు మెల్లంగా దధిభాండంబు లంకించి దాని బూతుజేయ' నెంచినట్లు బాలకవి సుబ్బన్న తెలియజేశాడు.

తంజావూరుకంబళిలో అన్నంతింటూ ఈ బాలకవి తలనీలాలను లెక్కించడం దండుగ

అక్కయ్య: కొందరు కవులు చౌకబారు హాస్యంతో యక్షగానం వంటి నాటకాలు వ్రాసినా మహారాష్రుల హయాంలో మంచి ఉదాత్తమైన దేశీయ రూపకాలు వెలువడకపోలేదు. అక్కయ్యకవి అనే ప్రొఢుడు గోపికా వస్తాపహరణాన్నే బాలకవి సుబ్బన్న కన్నా హుందాగా వ్రాశాడు. దాని పేరు “శ్రీకృష్ణలీలావిలాసం'. ఇతడు ఏ ఊరివాడో, ఏనాటివాడో తెలియదు గాని ఇతని తాతపేరు రామయ్య; తండ్రి పేరు తిమ్మయ్య. ఈయన దండనాథుడు. తన తండ్రి ఏ రాజుదగ్గిర సేనానో అక్కయ్య చెప్పలేదు. తన గురించి కూడా ఇంతతన్నా చెప్పుకోలేదు. ఇతడు వ్రాసిన రెండు దృశ్యకావ్యాలలో ఒకటి భాగవత గాథ, రెండోది భారత కథ. తిక్కనగారి పద్యాలను దరువులకింద మార్చాడు. కొన్ని వృత్తాలను సులభ్రూలిలోనికి అనువదించాడు. ఉదాహరణతు, శీచకుని బారినుండి తప్పించుకొనడానికి ద్రౌపది విరటుని కొలువులోనికి పరుగెత్తుతుంది. తన భార్యను. పరపురుషుడు అవమానం చేస్తున్నప్పుడు భీముడు సహించలేకపోయాడు. కీచకుణ్ణి చంపడానికి ఒక చెట్టు పెకలించాడు. అప్పుడతణ్ణీ వారిస్తూ ధర్మరాజు అన్యాపదేశంగా ఇలా అన్నట్టు తిక్కనగారు బాశాడ *. ఆంధ్రయక్షగాన వాజ్మయం, పుట 310. ౪. యక్షగానములు (తంజావూరు) - సంపుటి ౩.

924 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సయ్యక్ష

వలలుం డెక్కడ జూచె దొండెడ నసేవ్యక్ష్యాజముల్‌ పుట్టవే

ఫలితంబై పరశాఖ లొప్పు గననల్చ ట్రీతి సంధించుచున్‌

విలసచ్చాయ నుపాశ్రితప్రతతికిన్‌ విశ్రాంతి గావింపగా

గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపగా నేటికిన్‌? (విరాట. 2-13) ఈ పద్యాన్ని అక్కయ్య ఎంత సింపుల్‌గా గీతపద్యంలోకి మార్చాడో చూడండీ.

వలల నీదృష్టి ఎక్కడ నిలచె నిపుడు - ఫలమహీరుహ మదిగాకనిలువ నీడ

చెట్టు మరి పుట్టదా వంటకట్టియలకు - అందులకు దానిఖండింప నర్ణమగునె।

(ఫీమసేన. పుటలు 26)

ఈ విధంగానే మొత్తం విరాటపర్వంలోని తిక్కనగారి పద్యాలను అక్కడ్యు చక్కగా పరివర్తన చేశాడు. సౌంపైన యక్షగానాన్ని వ్రాశాడు. ఖీమసేన విజయంలో ఇలా తిక్కనగారిని అనుసరిస్తే శ్రీకృష్ణలీలావిలాసం అనే కావ్యంలో పోతరాజుగారిని బాగా జీర్ణించుకొని మనోహరంగా గోపికా వస్తాపహరణాన్ని రాస విహారాన్నీ వ్రాశాడు అక్కయ్య కృతులు రెండూ అచ్చుపడ్డాయి.!” భాగవత కథను అక్కయ్య ప్రదర్శించడానికి బ్రాళాడో, చదువుకొందుకు రచించాడో తెలియదు.

అకృన్నః పంచకన్యా పరిణయంలో సుబ్బన్న, శ్రీకృష్ణలీలావిలాసంలో అక్కయ్య బ్రాసినట్టే మరొక కవికూడా కృష్ణచరిత్ర నాటకరూపంలో బ్రాశాడు. “బాలకృష్ణ లీలావిలాసం' అనే పేరుపెట్టినా ఇందులో కవి రుక్కిణీ సత్యభామల కయ్యాన్ని చిత్రించాడు. ఇతని పేరు అక్కన్న ఈయన తండ్రీ పేరు నరబాద లింగోజీ. ఇంతకన్న ఇతని గురించిన వివరాలు తెలియదు. తిమ్మయ్యగారి అక్కయ్య తన కృష్ణవిలాసంలో పోతనగారి పద్యాలను. అనువదించలేదుగాని లింగోజిగారి అక్కన్న మాత్రు అనుసరించాడు. భాగవతంలోని “నల్లనివాడు పద్మనయనంబులవాడు' అనే పద్మం సుప్రసిద్ధమే. దానినితడిలా మార్చి వాడుకొన్నాడు;

నల్లని మేనివాని చిరునవ్వు ఘటించెడు మోమువాని శో

ఖిల్లెడు కాంతివాని శిఖిపింఛము చేనమరున్న వాని రా

జీల్లెడు వేణువువాని సరసీరుహనేత్రములొప్పువాని నో

మొల్లసుగంధులార, నవమోహనుడైన కృపాళు చూపరే! (తం.డీ. 5) ఈ బాలకృష్ణ లీలావిలాసం అముద్రితం. దీని ప్రతి తంజావూరు గ్రంథాలయంలో ఉండి రచన ఒక మోస్తరు అని విమర్శకుల భావన. .

అష్టావధానకవి, రుక్మిణీ సత్యభామల్స-,మధ్య కయ్యం పెట్టడానికి నారదుడు పాలిజాతం తీసుకురావడం సుప్రసిద్ధం. ఈ' కథనే లింగోజిగారి అక్కన్ను బ్రాసిన్టు నొతితొ భనకునుానుతననకనునతనన నాల ననన నాననా ననన 17. యక్షగానములు (తంజావూరు) సంపుటి 4. ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ ప్రచురణ. 18. ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర, రెండవ భాగం, పుట 415.

తంజావూరులో తెలుగు కవులు 825 ఇప్పుడిప్పుడే చెప్పుకొన్నాం. ఈ సన్నివేశాన్ని శివపరంగా మార్చి ఎవరో అష్టావధాని చంద్రశేఖర విలాసం అనే యక్షగానం వ్రాశాడు. గంగాగౌరుల మధ్య కయ్యానికి నారదుడు పారిజాతం వాడుతాడు. ఈ రచన అసమగ్రం. దీని ప్రతి ఒకటి తంజావూరు చెంగల్వపురివాడని ఊహించవచ్చు. చంద్రశేఖర విలాసంలోనే చివర ఒక సురతాణి జక్కీణీ ఉంది. బహుశా దీనిని కూడా అష్టావధానే వ్రాశాడని ఊహించవచ్చు. దీని ప్రతి ఒకటి విడిగా కూడా తంజావూరు గ్రంథాలయంలో ఉంది (తం.డి. 816). అందులో ఇలా ఉంది.

చెంగల్లపురినిలయ శ్రితముని హృదయ-రంగుగా పట్టాఖిరాముని యెదుట

సురతాణి జిక్కిణి సాంపుమీరగను- ఒరపుగా నటియింతు నొప్పుగా నిపుడు. చెంగల్వపురి గురించిగాని, అష్టావధాని గురించిగాని ఇతర వివరాలేం తెలియవు.

చల్లా సూరయ్యః కేవలం శృంగార నాటకాలేకాక ఆధ్యాత్మికమైన కృతులు కూడా ఈ యుగంలో నాటకకర్తలు రచించారు. తంజావూరు జిల్లా మన్నారుగుడిలోని రాజగోపాలస్వామి కంకితంగా చల్లా సూరయ్య అనే కవి ఒక యక్షగాన నాటకాన్ని ఛ్రాకాడు. దానిపేరు వివేకవిజయం. కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయాన్ని అనుసరించి పరమానందయతి 'ముక్తికాంతా పరిణయం” అనే దృశ్యకావ్యాన్ని శుద్ధవేదాంత ప్రచారం కోసం వ్రాశాడు. అదే బాణిలో సుదీర్దంగా ఈ వివేకవిజయాన్ని సూరయ్య వ్రాశాడు. అద్వైత సార్వభౌముడైన జీవేశ్చ్వరుడు ముక్తికాంతను పెళ్లాడి అమందతరానందకందళితుడై ఉండడం దీనిలోని సారాంశం. ఈ యక్షగానం అచ్చుపడింది. దీని అవతారికలో శవితాచమత్కృతి గాంచినవాడననీ, 'కవిశూర' అను పేరు గాంచినవాడననీ సూరయ్య చెప్పుకొన్నాడుగాని, ఈయనకు వేదాంత మతవాదములతో గల పరిచయం ఇతరత్రా కనబడలేదనే విమర్శకుల మాటలు నిజమే. చమత్కారం అనాడు సానివాడలలో తప్ప సన్యాసులసత్రంలో కనబడేది కాదు.

ముద్దుపళని, తంజావూరులో నాగవాసంలో తంజనాయకి అనే వేశ్య ఉండేది. అమె వీణ అద్భుతంగా వాయించేది. క్రీవిగా నటించేది. కమ్మగా పాడేది. పన్నీరు జల్లుతున్నట్టు సభలో కమ్మగా మాట్లాడేది. ఆమెను చాలామంది “దొరాదొరలు' ఎన్నిక చేశారు. ఈ విద్యాసుందరికి పిల్లలను పెంచుకోవాలనే కోరిక పుట్టింది. ఆ ఊళ్ళోనే అయ్యావయ్య అనే ఒక సామాన్యుడున్నాడు. అతనికొక తూతురూ, ఒక కొడుతూ పుట్టారు. వాళ్ళని తంజనాయకి పెంచుకొంది. అమ్మాయి పేరు కూడా తంజనాయకే. అబ్బాయి పేరు మాత్రం ముత్యాలు.

చిన్న తంజనాయకి కూడా నెరజాణ అయింది. కవులు మెచ్చగా, ఒయ్యారం కనమనయయనననవనన వన జ. యక్షగానములు - తంజావూరు, సంపుటి 4.

926 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఆ పిల్ల పేరు రామామణి. అమె కూడా అమ్మమ్మలాగ, తల్లిలాగ తంజావూరులో గణుతికెక్కింది. ఎంత ఆర్జించిందో అంతకు రెట్టీంపు పుణ్యకార్యాలు చేసేది. తన పేర రామాంబాపురం అనే అగ్రహారం దానమిచ్చింది. శివప్రతిష్టలు చేయించింది. నిత్యాన్నదానానికి సత్రాలు పెట్టించింది. ఈ రామామణీకి ఎంత పేరుప్రతిష్టలు వచ్చాయో ఈమె మేనమామ తూతురికి తూడా అంత కీర్తీ లభించింది.

చిన్న తంజనాయకి సోదరుడు ముత్యాలు హాయిగా పెళ్లి చేసుకొని ఏడుగురు సంతానాన్ని పొందాడు. అందులో ముగ్గురు ఆడపిల్లలు. ఈ ముత్యాలు సుబ్రహ్మణ్యస్వామి భత్తుడు. కొడుకులకు వేలాయుధం, కుమారస్వామి అని పేర్లు పెట్టుకున్నాడు. దక్షిణాదిని “పళని' అనే క్షేత్రంలో తుమూరస్వామి ఆలయం సుప్రసిద్ధం. ముత్యాలు తన పెద్ద కూతురికి ఆ క్షేత్రం పేరే పళని అని పెట్టాడు. పిల్లల పేరు ముందు “ముద్దు అనే ఆప్యాయపదం పెట్టడం దక్షిణాదిని సర్వసామాన్యం. అందుచేత ముత్యాలు పెద్దకూతురిని ముద్దుపళని అని అందరూ పిలిచేవారు.

యౌవనం వచ్చేలోగా ముద్దుపళని సాహిత్యవిద్యావిశారద అయింది. లలిత కళలలో ఆర్‌తేరింది. ఆమె ఈడేరగానే 'దొరాదొరలు' ఎగబడ్డారు; పొగిడారు. అమె గడీతేరింది. విటులేకాక విద్వాంసులు కూడా ఆమె ఇంట మసలేవారు; వాళ్లకామె సక్కారాలు చేసింది. తాను కవిత్వం చెప్పడమేకాక కృతులు అంకితం పుచ్చుకుంది. ఆమె అందచందాలు, ఆటపాటలు పట్టపురాజు ప్రతాపసింహుడు విన్నాడు. ఆమెను ఆదరించాడు. సంగీతసాహిత్య _భరతశాస్తాలవంటి విద్యలలో పారంగతురాలైన ముద్దుపళనికి తగిన సత్కారాలు చేశాడు. ఎన్నో బహుమానాలు ఇచ్చాడు.

రాజు మెచ్చిన రంభగా, రసికురాలుగా, విద్వాంసులు ఆశ్రయించే విశారదగా జీవించే ముద్దుపళని చాలా భక్తురాలు. తిరుమల తాతాచార్యుల వంశంలోని రాఘవాచార్యులామె గురువు. చిన్నకృష్ణుడంటే ఆమెకు మక్కువేగాని రాముడంటే గురిలేకపోలేదు. ఆమె ఇతరులచేత రామకోటి వ్రాయించి, తాను స్వయంగా ఒక రవసత్తరమైన కావ్యం వ్రాసి చిన్నికృష్ణునికి అంకితం ఇచ్చింది. ముద్దుపళని బ్రాసీన కావ్యం పేరు రాధికాసాంత్వనం. దీనికి ఇళాదేవీయం అనే మరో పేరు కూడా ఉంది. రాధ కృష్ణుని మేనత్త. ఇళ మేనమామ తూతురు. ఈ ఇద్దరు అందకత్తిలూ ఆదిలో ఎంత సఖ్యంగా ఉండేవారో చివరకు అంతటి విరోధులయ్యారు. ఇళమీద ఏదో విధిలేక మక్కువ చూపిన కృష్ణునిమీద రాధ అలిగింది. ఆ అలుకను తీర్చి సముదాయించడమే ఈ కావ్యంలోని వస్తువు.

ఇతివృత్తం ఇంత చిన్నదైనా దీనినే ముద్దుపళని విపులంగా విస్తరించింది. నాలుగు ముక్కలలో చెప్పుకొనే కథను నాలుగాశ్వాసాలుగా పెంచింది. 585 గద్యపద్యాలు వ్రాసింది. ఇందులో కొన్ని పద్యాలు కథ పెంచడానికి వ్రాసినవే తప్ప కల్పనలు నిండుకున్నవి. ఆ కోలంలోని అన్ని ప్రబంధాలలో కనిపించే అంగాంగవర్ణనలు వియోగవిరహాలలో - మన్మథుణ్ణి సపరివారంగా తిట్టే రొటీనుపద్యాలవంటివి. ఓక నూటీఖైదాకా తీసేస్తే ఈ కావ్యం వన్నెకేం లోపం రాదు. సరికదా బాగా మెరుస్తుంది

తంజావూరులో తెలుగు కవులు 927

వాస్తవానికి ముద్దుపళని కావ్యంలో గొప్ప కవిత్వ ధోరణులుగాని, విశేష చనుత్కారాలుగాని చదువరులకు కనబడవు. అయితే సమకాలిక కవుల పాండిత్య ఫాటవాలు ఈమెలో లేనట్టే వాళ్ల లోపాలు కూడా లేవు. శేషం వెంకటపతిలాగ అక్కడక్కడ సంప్రదాయాభ్యాసం ప్రదర్శించుకున్నా ముద్దుపళని ఎక్కడా సముఖం వెంకటకృష్ణప్పులాగా శబ్బాడంబర నైపుణ్యం చూపించదు. కనుపర్తి అబ్బయ్య, కూచిమంచి త్మున్న మొదలైనవాళ్లలాగా పిల్లవసుచరిత్ర వ్రాయాలనే కాపత్రయం ఈమెలో ఎప్పుడూ లేదు. గాలి ఓబయ్యలాగా ఇనుపగుగ్గెళ్లు సాతాళించదు. గింజలు లేని తియ్య ద్రాక్షరసం అందిస్తుంది. ఈ యుగంలోని ఉత్తమ రచయితల లోపాలు లేనట్టే ఉత్తమ రచయితల సుగుణాలు కొన్నే ముద్దుపళనిలో ఉన్నాయి. వెలిదండ్ల వెంకటపతిలాగ సంభాషణల ద్వారా పాత్రల మానసిక చిత్రణ చేస్తుందేగాని మధ్యలో తాను బొరబడదు. అనవసరపు వ్యాఖ్యానాలు చెయ్యదు. తనకు తెలిసిన విషయాలు మనకు తెలియని విధంగా ఊహించి ఆందరికీ తెలిసే భాషలో చెప్తుంది.

ముద్దుపళనికంటే ముందే ఈ యుగంలో వెలిదండ్ల వెంకటపతి రాధామాధవుల శృంగారాన్ని చక్కని కావ్యంగా వ్రాశాడు. దానికతడు సాంత్వనం అనే పేరు కలుపలేదు. “రాధామాధవ సంవాదం' అన్నాడు. అతడార్కాటు సుబాకవి. ముద్దుపళనికి చాలాచోట్ల వెలిదండ్ల వెంకటపతి మార్గదర్శకుడయ్యాడు (అతనికి ధరణీదేవుల రామయ్యా ఒరవళ్లు పెట్టాడు). వెలిదండ్ల వెంకటపతి ఎక్కువగా సామెతలు వాడినట్లు ముద్దుపళని కూడా జబొతీయాలు ఇంపుగా వాడింది.

చందమామలాంటి చక్కని కావ్యం ్రాసిన ముద్దుహానిలో కూడా పరిశోధకులొక మచ్చ చూశారు. ఈమెకు ఒక తరం ముందున్న సముఖం వెంకటకృష్ణప్ప ఓక రాధికా సాంత్వనం బ్రాశాడట. అందులో 126 గద్యపద్యాలున్నాయి. అది ఏకాశ్వాస చాటు ప్రబంధం. రెండుసార్లు ఇది అచ్చుపడింది. బందరు శృంగార కావ్య గ్రంథమండలి 1ములోనే ఈ ఏకాశ్వాసాన్ని వేశారు. ఆ తర్వాత యస్వీ జోగారావుగారి పరిష్కరణతో ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు 1953లో ప్రచురించారు.

ఇందులోని చాలా పద్యాలు ముద్దహాని కావ్యంలో వివిధ అశ్వాసాలలో కనబడుతున్నాయి. సముఖంవారి చిన్న కావ్యంలోని బాలా పద్యాలు యథాతథంగా ముద్దుపళని ప్రబంధంలో ఉన్నప్పటికీ అది గ్రంథచౌర్యం కాదనీ, అమె ప్రత్యేకతతు భంగం లేదనీ పరిశోధకుల అఖిప్రాయం.22 అయితే సముఖం వెంకటకృష్ణప్పు నిజంగా ఒక రాధికాసాంత్వనం బ్రాశాడా అన్నది ప్రశ్న; దీనికి మా గురువుగారు మల్లాది రామకృష్ణ శాస్టీగారు ఇలా సమాధానం యిచ్చారు. టక క రాం యిది నాలా ౫. రాధికాసాంత్వనం - సముఖం రచన, ఆంధ్ర సాహిత్య పరిషత్‌ ప్రచురణ, పీఠిక -

యస్వీ జోగారావుగారు. పుట 0%.

ర దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయం - నిడుదవోలు వెంకటరావుగారు, పుట 35- 2. ఆహల్యా సంత్రందనం, శృంగార కావ్య గ్రంథచుండలి, పీకిత 19.

928 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

“...ఎవరో చిలిపితనానికి వెంకటకృష్ణపష్పు నాయకునికి అనవసరఖ్యాతి ముద్దుపళనికి అపఖ్యాతి కలిగించడానికి చేసిన పని అనిపిస్తుందేగాని రెండు కావ్యాలూ పరిశీలనగా చదివితే ఒకరు సంగ్రహంగా కూర్చినదానికే మరొకరు వెనుకా ముందూ అదుకులు వేసి గ్రంథమంతా కేవల, స్వకపోల కల్పితమనే ప్రతిష్ట కలిగించుకునేందుకు ప్రయత్నించారు అని సూచనగా అయినా కనబడకపోవడమే కాకుండా స్పష్టంగా ఈ విషయంలో ముద్దుపళనికి అన్యాయం జరిగిందని తెలుస్తుంది.”

ఈ అన్యాయం చేసినవాళ్లు ఎవరు? ఇది పరిశోధన వల్ల బయట పెడుతున్నాను, ముద్దుపళని కాలంలోనే తంజావూరు నాగవాసంలో బాగూరు రంగశాయి అనే వారకాంత ఉంది. ఆమె కుమార్తె పేరు అమ్మి, ఈమెకు ఆ ఊళోనే ఉండే వెంకటసామి నాయుడు అనే కవి రాధికాసాంత్వనం స్వహస్త లిఖితంగా వ్రాసిపెట్టి ఇచ్చాడు. ఇతడు ఇచ్చిన ప్రతిలో సముఖం వెంకటకృష్ణయ్య గద్య కనబడుతుంది. ఈ అమ్మ్‌కి బహుశా ముద్దుపళని అంటే కిట్టకపోవచ్చు. ఆమెను తృప్తిపరచడానికీ వెంకటస్వామి ఈ అన్యాయం చేసి ఉండవచ్చు. అయితే బాగూరు అమ్మి, వెంకటస్వామి ఎప్పటివాళ్లు? ముద్దుపళనికీ ఎంతటీ దగ్గర కాలంవాళ్లు? అమె రాధికాసాంత్వనం రచించాకనే ఈ అన్యాయం జరిగిందనడానికి సాక్ష్యం ఉందా? ఈ ప్రస్తలకు జవాబులు సులభంగానే దొరుకుతాయి. ముద్దుపళని ప్రతాపసింహుని మన్ననలు బడసింది. అతడు క్రీ.శ. 1739-1763 మధ్య తంజావూరు పాలించాడు. ముద్దుపళని ఆ కాలంలోనే కావ్యం వ్రాసింది. వెంకటస్వామి స్పహస్తలిఖితంగా వ్రాసిన ప్రతి ఎప్పటిదో తెలుసుకోడానికి అస్కారం ఉంది. దానిని కీలకనామసంవత్సర మార్గశిర బహుళ షష్టీ శుక్రవారంనాడు బ్రాశాడు. కీలక క్రీశ 1728లో తొలిసారి, 17౫లో ఒకసారి వచ్చింది. ఇందులో 1728 నాటి కీలకలో మార్గశిర బహుళ షష్టీ శుక్రవారం నాడు రాలేదు. అది బుధవారం. క్రీ.శ. 1788లోనూ శుక్రవారం రాలేదు. గురువారమైంది. ఈ రెండు సంవత్సరాలలో క్రీ.శ. 178 ఒక్కటే ప్రతిలేఖన కీలకమని నిర్ణయించడానికి ఆస్కారం ఉంది. వెంకటస్వామి పొరబడీ గురువారానికి బదులు శుక్రవారమని వ్రాసి ఉండవచ్చు.

వెంకటస్వామి లిఖించిన చాటుప్రబంధంలో ఇళ అనే పేరు బదులు సత్య అనే పేరు వస్తుంది. ముద్దుపళని కావ్యంలోని పద్యాలనే తీసుకొని వెంకటస్వామి సత్య అనే పేరు మార్చాడని రుజువు చేయవచ్చు. చిలుక రాయబారానికి వెళ్లి వచ్చాక ముద్దుపళని కావ్యంలో ఇలా అంటుంది.

చూపులోపల నొక వింత చూపు తళకు నడుపులోపల నొక వింత నడుపు చెళుకు

నుండు నునికికి నొక వింత నుండు కులుకు వచ్చెగదవమ్మ మన ఇళావనిత కిపుడు.

(రాధికా. ౩-17) ఈ పద్యం సముఖం గద్యప్రతిలో ఇలా ఉందిః చూపులోపల నొక వింత చూపు తళుకు నడుపులందుల నొక వింత నడుపుబెళుతు యుండుయనికిని నొకవింత నుండు కులుకు వచ్చెగదవమ్మ సత్యభామతును నేడు. (సముఖం. నెం జ)

తంజావూరులో తెలుగు కవులు 9209

ఈ పద్యం తూటకరణమని నాలుగవ పాదమే చెప్తోంది. వెంకటస్వామి చేసిన మార్చువల్ల 'వకార' “మకార యతిమైత్రి తెలుగు లాక్షణికులు అంగీకరించరు, విందుపూర్వక వకారానికే మకారమందు యతి చెల్లుతుంది.** ఈ యతిభంగంవల్ల దొంగ కన్నలో దొరికిపోతున్నాడు. ఇంతకన్నా ప్రత్యక్ష తార్కాణం ఇంకో పద్యంలో కనబడుతుంది. తన శిష్కురాలే తనకు ఎదురు తిరిగినప్పుడు ముద్దుపళని కావ్యంలో రాధ ఇలా మండిపడింది:

మరచెనో నాచేతి మణితంబులన్నియు, బలుక నేర్చిన నాటి పంజరింపు

తెలియదో నాచేతి దేశ్ళంపుగుజరాతి, విత మెరింగిననాటి వేడికోళ్ళు

ఎంచదో నాచేత నిలజంత్రగా త్రంబులభ్యసించిననాటియణుకువెల్ల

వేడదో నాచేత వెడవిల్తు శాస్త్రంబు, లెరుగబూనిననాటి తిరుగుమరుగు

గణనసీయదొ మరుసాము గమనములకు

దాను నాచేతబడిన బెత్తంపు పెట్లు

పరులు గని కేరి నవ్వ దబ్బరమురారి

లాలనకె పొంగి ఇప్పు డిళాలతాంగి. (రాధికా. ౩-7) ఈ పద్భుం ఆద్యంతం ఇళకే వర్తిస్తుంది. ఇందులో ఇళ అన్న పేరు తీసేసి సత్యని యిరికించడమేకాక కృష్ణుని పేరు కూడా వెంకటస్వామి తగిలించాడు. పద్యాన్ని ఎలా మార్చాడో చూడండి?

మరచెనో నాచేత మణితోక్తులన్నియు బలుకనేర్చిన నాటి పల్కరింపు

ఎంచడో నాచేత నెలజంత్రగాత్రంబుల భ్యసించిననాటి యనుసరింపు

తలచడో నాచేత తగు దేశ్యగుజరాతి విత మెరింగిననాటి వేడికోళ్లు

వీడెనో నాచేత వెడవిల్తుశాస్త్రంబు, తెలియబూనిననాటి తెరపుమరపు

గణనసేయడొమరుసాము గమనములకు

ధాను నాచేత బడిన టెత్తంపుపెట్లు

పరులుగని కేరి నవ్వ దబ్బర మురారి

చూయలకెపొంగె సత్యభామాలతాంగి (సముఖం. ౫) ఈ మార్చు పద్యంలోని ఎత్తుగితిలోని మొదటి రెండు పాదాలదాకా కర్ప కృష్ణుడు. చివర సత్యప్రసక్తీ రావడం వెంకటస్వామిలాంటివాడు తేవాలేగాని సముఖం వెంకటకృష్ణప్ప లాంటి ప్రొఢుడు చేసే పని కాదు. అతడు శిల్చ్బ సౌందర్యం చెడకొట్టలేని మంచికవి. ఇంతకూ దేశి గుజరాతీ నాట్యాలు ఆడవారు చేసేవి. రాధ ఇళకు నేర్పాలేగాని కృష్ణుడు నేర్చుభోవలసినవి కావు. ముద్దుపళని ఈ పద్యం ప్రథమాశ్వాసంలోనే ఒక పునాది వేసింది. రాధ ఇళకు విద్యాబుద్ధులు ఎలా నేర్చిందో వివరించింది.

పౌడించు నొకవేశ బహుదేశ్యరాగము, ల్సాగించు నొకవేశ జంత్రవాద్య ౫. అవందరంగరాట్పందం, ౩-18 నుండీ 3౩-192 దాకా మఠార యతి గురించి ఉంది.

930 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

నెగడించు నొకవేళ నెరి కావ్యసంగతు ల్గనుపించు నొకవేళ కవనరీతి

బోధించు నొకవేళ బూవిల్తుశాస్త్రంబు జిదివించు నొకవేళ శయ్యలోలి

నూరిపోయునొకమరొకవేళ నారజంబు

వచ్చెననిపించు నొకవేళ వాద్యవిధము

నెపుడు చూచునొ యిది శౌరి నెనయ ననుచు

దయనపుడు. పొంగి యిళకతు రాధాలతాంగి. (రాధికా. 1-౪౫)

ప్రథమాశ్వాసంలోనే ఇలా ఇళకు నూరిపోసిందని చెప్పిన ముద్దుపళనే 'మరవెనో! అన్న సీసపద్యం రచించడానికి ఆస్కారం ఉంటుంది. ఆమె పద్యంలో సాంతం 2కే క్త కనబడుతుంది. ఆమె పద్యమే అర్థవంతం. ఇదొక్కటే వెంకటస్వామి చేసిన కూటకరణాన్ని రుజువుచేస్తుంది.

విపులమైన దృష్టాంతాలవల్ల ముద్దుపళనికి జరిగిన అన్యాయాన్ని నిరూపించవచ్చు. వెంకటస్వామి వ్రాసిన ప్రతిలో ఆఖరు నాలుగు గద్యపద్యాలే సముఖం వెంకట కృష్ణప్ప నాయకునివి. అహల్యా సంక్రందనంలో ఇంద్రుడు అహల్య కాళ్లమీద పడడం, అమె లేవనెత్తడం, ఇద్దరూ _ క్రీడించడం మొదలైనవి వర్ణిస్తూ వెంకటకృష్ణప్ప చెప్పిన గద్యపద్యాలను వెంకటస్వామి చివర కాపీ చేశాడు. ఈ పుంజీడు గద్యపద్యాల పుణ్యమా అని గద్య సముఖం వారికి గట్టాడు. ముద్దుపళనికి లేని గ్రంథచౌర్య దోషం తెచ్చిపెట్టాడు.

అయితే ముద్దుపళని పూర్వులను, సమకాలికులను అనుసరించకపోలేదు. వెలిదండ్ల వెంకటపతిని శేషం వెంకటపతిని అక్కడక్కడ అనుసరించింది. అయితే తనకు పది పదిహేను సంవత్సరాల ముందున్న కవిగ్రంథం నుంచి ఆరు డజన్ల గద్భపద్యాలను యథాతథంగా సంగ్రహించవలసినంత సాహిత్య దరిద్రం ఆమెకు పట్టలేదు. పసందుగా ప్రథమాశ్చాసం రచించిన జాణ దిగజారలేదు.

ముద్దుపళనికి లేని కళంకం వెంకటస్వామి తెచ్చిపెడ్‌కే అక్కరలేని కీర్తిని ఆధునికులు కట్టిపెట్టారు. తమిళంలో చూడికుడుత్తనాంచారు వ్రాసిన “తిరుప్పావై పాశురాలలో కొన్ని ఈమె సప్పపదులనే పేరుతో ఆంధ్రీకరించిందని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. భ్రమపడ్డారు. శ్రీనివాసాచార్యులనే సురపురం కవి ద్రావిడ పాశురాలను అనువదించాడు. అతడు వైష్ణవ గురువు. మొదటి పాశురంలో ఇలా ఉందిః

శ్రీనివాసగురువు విష్ణుచిత్తుకూర్మి ముద్దుపట్టి

పూని చేయ ద్రవిడపాటలోని భావము

చెలగి తెలియగాను నాదు జిహ్వ కొనను నిలచి ఇటుల

పలికి తిరుప్పావు సప్పపదిపరంబుగా ఈ పాటలోని 'ముద్దుపట్టి అనే మాట బహుశా ముద్దుపళని అని ఉండవచ్చునని వేటూరివారు భావించారు. "శ్రీనివాసగురుని తలచి చిత్తమునను ముద్దపళని' అని మార్చారు. ఆమె పది పాశురాలనే తెనిగించిందని మిగతా 20 పూరించారు. ఈ తొలి పది అనువదించినది శ్రీనివాసాచార్యులుగారని బులుసు వెంకటరమణయ్యగారు సప్రమాణంగా

అల్కాటు సుబా కవులు 931 నిరూపించారు. ప్రాచీన లిఖిత గ్రంథాలయంలోని సప్తపదులకు ఓక వ్రాతప్రతిలో 8.220 ముద్ధపట్టి అని అక్షరాలు ఉండేచోట శైథిల్యాలను పూరించడంలో వేటూరివారు పొరపడ్డారుగాని మిగతా పాశురాల అనువాదం చక్కగా చేశారు.

ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో రాధికాసాంతనానికి ఏడు ప్రతులున్నాయి [0.707 నుండీ 718 దాకా). వీటినేకాక, దేలు ఉస ప్రతులు ఏమైనా మ గ సంప్రదించి ఒక అధికారి ప్రతి తయారు చేయడం అవసరం. గుజిలీ పుస్తకాలలో మధ్య మధ్య కొన్ని పద్యాలు కూడా లేవని, మరికొన్ని చోట్ల పద్యాల చరణాలే వావిళ్లవారు అచ్చువేశారు. వెంకటస్వామి లిఖించిన ప్రతిలో కొన్ని అదనపు పద్యాలు ఉన్నాయి. అవి కూడా ముద్దుపళని రచనలే కావచ్చు. అధికారిక ప్రతి తయారు చేసినప్పుడు వీటి ఉనికి కూడా బయటపడవచ్చు.

రాధికా సాంత్వనం * తంజావూరులో వెలువడిన శృంగార కావ్యాలలో కట్టకడపటిదని కొందరు భావిస్తారు. అయితే చదివినకొద్దీ చవులూరించే కావ్యాలలో ఇది మొట్టమొదటిదే. అది శృంగారరసరాజ్యానికి రాజధాని.

మహారాష్ట్ర రాణుల కాలంలో తంజావూరు తెలుగు సాహీత్యానికి ప్రత్యేక కేంద్రం కాకపోయినా చెప్పుకోదగ్గ కార్థానా!

అర్కాటు సుబా కవులు

స్త మహర్షులలో ఆరుగురు పూర్వం ఒక అడవిలో తపస్సు చేశారట (ఏడో ఆయన ఎందుకు చేయలేదో తెలియదు). వాళ్లు తపస్సు చేసిన అడవి అరవదేశంలో ఉంది. పాత తెలుగులోనూ, తమిళంలోనూ అడవిని “కాడు అంటారు. ఆరుగురు బుషు౪ తపస్సు చేసిన అడవిని పూర్వులు “ఆరుకాడు' అని పిలిచేవారు. అదే అర్కాడుగా మారి అక్కాటుగా తెల్లదొరల నోళ్లలో పడింది. ఈ పేరునే 'షడారణ్యం' అని సంస్కృతీక రించారు... అరవ పేరుతో చెల్లుతున్న ఈ తెలుగు రాజ్యాన్ని ఈ యుగంలో మహమ్మదీయుల నవాబుల పాలించేవారు.

ఈ సుబాలోనే చెంగల్పట్టు, ఉత్తరార్కాడు, దక్షిణార్కాడు జిల్లాలు నేటి చిత్తూరు నెల్లూరు జీల్లాలలో కొన్ని భాగాలు ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే 'గుండ్లకమ్మకు' దక్షిణాన ఉన్న పరగణాలన్నీ ఈ సుబాలోనివే అని చెప్పాలి. శ్రీశ 169లో దావూదుఖాను ఈ పరగణాలకు ఫొజుదారు అయ్యాడు. అప్పుడు చెంజికోటే ఈ సీమకు ముఖ్య పట్టణం. క్రీ.శ 1712 తరువాత సాదతుల్లాఖాను నవాబు అయ్యాడు. చెంజినుండి అర్కాడుకోటకు రాజధాని మారింది. దక్కను రాజకీయాలలో ఆర్కాడు సుబా చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఆర్కాడు నవాబుల యుద్ధాలలో అనాటి స్థానిక రాజులందరూ ఏదోఒకవిధంగా పాలొన్నారు.

ఈ సుబాలోనే పూర్వం చంద్రగిరి రాజ్యం ఉండేది. మట్లవారు, దామెర్లవారు, వెలుగోటివారు అమరనాయకులై కీర్తిప్రతిష్టలు ఆర్జించారు. ఈ యుగంలో కాళహస్తి.

932 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటీ కార్వేటినగరం, వెంకటగిరి మొదలైన సంస్థానాధీశ్వరులు యథాశక్తి సాహిత్యసేవ చేశార్న కాళహస్తి సంస్థానం దామెర్లవారిది. ఈ వీరులను ఆశ్రయించుకొని చాలామంది భట్రాజు బ్రతికేవారు. ఈ సుబాలోని ప్రముఖ నాయకులంతా అనాడు ఫ్రెంచి దొరల సహాయం కోసం పుదుచ్చేరిలో మకాం వేసేవారు. అక్కడ మొదలియారుగా దుబాసీగా ఉండే వెళంబూరు ఆనందరంగప్పగారి కొలువుకూటాన్ని ఒక కవి ఇలా వర్ణించాడు:

సరసరాజా రామచంద్రరాయాగ్రణి జాకోటినింబాళు జనవరుండు

ధైర్యవంతుడు సులతాన్‌ జనింబాళును మాధవరావు దామెర్లవారు

మట్ట్లవారును హనుమంతరావు బరికివేంకటరావు కపీలజంగు

నలరామరాబేంద్రు డేచభూపాలుండు మగరాలవారును మాకరాజు

వారు తక్కిన పాళయప్పట్లదొరలు

ప్రబలుమోకోజిపంతులు రామదాస

పండితార్యులు మొదలైన ప్రభువులెల్ల

వేడ్క వచ్చిరి శ్రీరంగవిభునిసభకు. (ఆనందరంగరాట్పందము, పీ. 114) ఈ పద్యంలో పేర్కొన్న చాలామంది ప్రముఖులు ఆనాడు తెలుగు సాహిత్యాన్ని పోషించారు. ఈ పద్యానికి నాయకుడైన ఆనందరంగప్ప తమిళుడేగాని తెలుగు పుస్తకాలు అంకితం పుచ్చుకొన్నాడు. ఇచ్చిన కవిపిరు కస్తూరి రంగయ్య. ఇంటిపేరు కస్తూరివారు కాదు; వెచ్చావారు. అయినా ఇతని కవిత్వం కూడా పరిమళించింది.

వెచ్చా కస్తూరిరంగయ్య : ఈయన పుట్టినది తిరుచునాపల్లి; పెరిగినది ఎక్కడోగాని నఖ 1748 నాటికీయన పుదుచ్చేరిలో ఆనందరంగప్పగారి ఆశ్రయం సంపాదించాడు.

శ్ల మొదలియారుగా వర్తకవ్యాపారాలు చేస్తూ చెంగల్పట్టు జాగీరు సంపాదించిన

ఆనందరంగప్పగారి మీద ఈ కవి శృంగారపదాలు వ్రాస్తే తిరుచినాపల్లి మంగపతయ్య వాటిని స్వరపరచాడు. ఎవరో వారకాంతలు ఆ పదాలు బహిరంగసభలో అభినయించారు.*ే ఆనందరంగప్పగారి పట్టపుకవిగా ఉంటూ కస్తూరి రంగయ్య ఓక లక్షణగ్రంథం వ్రాశాడు. దానికతడు లక్షణ చూడామణీ అని పేరు పెట్టాడుగాని కృతి భర్త పేరుతో 'ఆనందరంగరాట్ళందం' అని అది ప్రసిద్ధమైంది. తనకు పూర్వం ఉన్న పది ఛందోగ్రంథాలూ, తొమ్మిది లక్షణకావ్యాలూ పరిశీలించి వాటిలోని కవితాలక్షణ ప్రకరణాలు అన్నీ క్రోడీకరించి నాలుగాశ్వాసాల గ్రంథాన్ని బ్రాశాడు. ఇది సాహిత్య పరిశోధకులకు చాలా ఉపయోగపడే గ్రంథం.

లక్షణగ్రంథాన్ని బ్రాశాక కస్తూరి రంగయ్య “సాంబనిఘంటువు' రచించాడు. జల్లిపదాలూ, వ్యర్థపదాలూ లేకుండా నడక కుంటకుండా ఒక సీసశతకంలో ఈ నిఘంటువు వ్రాయాలని అతడు ప్రతిజ్ఞ చేశాడు. 95 పద్యాలు వ్రాశాక ఇలా ఆశించాడు.

నిస్తులలక్షణకవియగు- కస్తూరీరంగకవిఘటియించిన యా

సి స్తగు నాంధ్రనిఘంటు ప్ర-శస్తంబై వెలయుగాక జగతిని సాంబా. (నెం %)

ఆర్కాటు సుబా కవులు 933 నిజానికీ ఛందోనిఘంటు గ్రంథాలకు వచ్చిన ప్రశస్తి ఇతడు రచించిన కృష్ణార్జున సంవాదం అనే పద్యకావ్యానికి రాలేదు. దానిని కస్తూరి రంగయ్య ఎప్పుడు " రచించాడో తిలియదుగాని సింగరాజుగారి రామరాజుకు అంకితం ఇచ్చాడు. ఇది అయిదాశ్వాసాల కావ్యం. అముద్రితం. దీనికి రెండు ప్రతులు ప్రాచ్య్చలిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి 0.478, 479). గయోపాఖ్యానమే ఇందులో కవి కథనం చేశాడు. ఆనందరంగప్పగారి కొలువులో కొన్నాళ్లు ఉండి కస్తూరి రంగయ్య రామరాజును ఆశ్రయించి కృష్ణార్జున సంవాదం అంకీతం ఇచ్చాడు. ఆ తరువాత తురయూరు రెడ్డదగ్గిర వకీలుగా ఉండేవాడు.2 తరువాత పద్మనాయకుల పోషణలో ఉన్నట్టుంది. కస్తూరిరంగయ్య “పద్మనాయక చరిత్ర'ను వ్రాసినట్టు కొందరు భావిస్తున్నారు

కస్తూరి రంగయ్య ఎన్నాళ్లు జీవించాడో తెలియదు. ఇతని శిష్యుడు ఆలూరు కుప్పన్న ఆంధ్ర కాళిదాసు అనే విరుదు పొందాడు. తంజావూరులో క్రీ.శ 1765 నుండి పాలించిన ఇమ్మడి తుళజాజీ పాలనలో ప్రసిద్ధుడయ్యాడు. గురువు తస్తూరి రంగయ్య పుదుచ్చేరి వదిలాక ఎక్కడ స్థిరపడ్డాడో తెలియదు. పుదుచ్చేరి తరువాత ఆర్కాడు సుబాలో చెప్పుకోదగ్గ రాజకీయ కేంద్రాలు చెన్నపట్టణం, పులికాటులు. పులికాటుకే పహ్రాయకావేరి అని తొలిపేరు ఉంది.

వెలిదండ్ల వెంకటపతి : ఆ పట్టణంలో మగదలవారిదే కలవారి లోగిలి. మగదల కృష్ణయ్య డచ్చివాళ్ల దుబాసీగా ప్రసిద్ధుడయ్యాడు. తవిపండితులను పోషించాడు. ఇతనికే ధరణిఎవుల రామయ్య దశావతార చరిత్ర వ్రాసి అంకితం ఇచ్చాడు ఈ మగదల కృష్ణయ్యగారికి అయిదుగురు కుమారులు. వాళ్లలో పెద్దవాడు రామదాసు తండ్రిలాగే దక్షుడేగాక ప్రళయకావేరి మహాపట్టణాధ్యుక్షుడు తూడా అయ్యాడు. చతురతరమైన వచనరచనా చతురానన అనే ప్రశంసలు పొందాడు. రామదాసు కూడా కవిత్వలోలుడే. వెలిదండ్ల వెంకటపతి అనే కవిని చేరదీసి రాధామాధవ సంవాదం అనే కృతిని చెప్పించుకున్నాడు. వెలిదండ్ల వారిది కూడా పండిత కుటుంబం. ఈ ఇంట రెండుమూడు తరాల కవులు కనబడుతున్నారు. వెలిదండ్ల తిరువెంగళయ్యగారి అయిదుగురు కొడుకులలో కనీసం ముగ్గురు కవులు. పెద్దవాడు వెంకటపతి సాహిత్యవేత్తీకాక సంగీత విద్వాంసుడు. రెండోవాడు పెదరాఘవయ్య సకల దేశాధీశులకు సమ్మతమైన పేశలకవనం చెప్పగలడు. అతని తమ్ముడు చినరాఘవయ్య జనమనోరంజకమైన సరససల్లాపధార కలవాడు. నాలుగోవాడు నరసన్న మంచి మాటకారి మధుర వాక్యాలకు పేరుపడ్డాడు. కడగొట్టువాడు లక్ష్మీపతి. మాటలలో చమక్కారం ఉండేది.

ఈ అయిదుగురు అన్నదమ్ములలో పెద్దవాడే మగదల రామదాసుకు అంకితంగా 'రాధామాధవసంవాదం' రచించాడు. అయితే ఈ కావ్యం బ్రాయడానికి ముందు కొన్ని వ అనందరంగహ్లి డైరీలు, సంపుటి, పుటలు జ, 18, 308.

  1. దక్షిణదేశీయాంధ్ర వాబ్బయము, పుటు 252. 4 వాయకరాజులయుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి.

934 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంక వచ్చింది. రాధామాధవ సంవాదం రచించాక '“కవిసార్వభౌమ' అనే బిరుదు కూడా వెంకటపతికి ఎవరో ఇచ్చినట్టుంది. వెంకటపతి తన గద్యలో తాను 'శృంగార కవిళ్ళ సంస్కృత గ్రంథం వ్రాశాడు. దాని గద్యలో తన తండ్రి రాధామాధవసంవాధం మొదలై; అనేక ప్రబంధాలు నిర్మించాడనీ, కవిసార్వభాముడనీ అయ్యన్న చెప్పాడు.

నందుని ఇంట ఆడపడుచుగా రాధను మొదట చిత్రించిన తెలుగు కవి ధరణిదేవ్రల రామయ్య. అతడు తన దశావతార చరిత్రలో రాధామాధవుల శృంగార కథను కృష్ణావకాక ఘట్టంలో చాలా విపులంగా బ్రాశాడు. దీనిని ఆధారంగా చేసుకొని వెలిదండ్ల వెంకటపతి తన 'రాధామాధవసంవాదంి రచించాడు. రెండు కావ్యాల కథానిర్మాణంలో పోలికలు చూడండి.

ధరణిదేవులవారి కథనం వెలిదండ్రవారి సంవాదం

  1. రాధ చిన్నప్పటినుంచి కృష్ణుని పెంచింది. అతన్ని 1. రాధ నందుని చెల్లెలు. ఒక అనామధేయుని పెళ్లాం

ముద్దులాడ్డం తప్పించి అమెకు వేరే పనిలేదు. పాలు పట్టే బాలప్రాయం నుంచి కృష్ణని పెంచింది. గోపికలు వచ్చి యళోదకు కాక రాధే ఫిర్యాదు చేసేవారు.

  1. కృష్ణునిపై రాధ మరులుకొంది. అతడు కూడా 2. రాధ కృష్ణునికి తన మనసు తెలియవేసిండి చిన్నప్పటినుంచీ కన్ను వేశాడు. తరువాత అతడు ధర్మపన్నాలు చెప్పాడు. అమె అన్నింటిని లంకించుతున్నాడు. ఖండించింది.

  2. రాధామాధవులు శృంగార క్రీడలలో . రాధామాధవులు శృంగార క్రీడలలో పడ్డారు ఓలలాడారు.

  3. గోపికలు కృష్ణునిపై మరులుకొన్నారు. అతని (4. కృష్ణుడు వ్రేపల్లె విడిచిపోయాడు. ఉత్తరోళ్తూ పాట విని వెళ్లారు. అష్టమహిషులని పెళ్లాడాడు.

  4. వెన్నెలలో గోపకాంతలతో విచ్చలవిడి ప్రణయం 6. ఎనమండుగురితో కాపురం చేస్తున్నా అడుగడు జరుగుతూ ఉండగా రాధ వెళ్లి చూసింది. గునా కృష్ణునికి రాధ జ్ఞాపకానికి వచ్చేది అసూయచెంది దూరంగా వెల్లిపోయింది.

  5. ఒంటరిగా తూర్చున్ను రాధవద్దకు చిలుక - కృష్ణుడు తన ప్రాజనఖుడైన ఉద్ధవునితో రాధా వచ్చింది. ఊరడించింది. రాధ తన గోడు ప్రణయం గరించి చెప్పుకొన్నాడు. రాధ చిలుక చెప్పుకొంది. మధురస్మృతులు తలచుకొంది. | చేత రాయబారం పంపింది.

  6. కృష్ణుడు వచ్చి రాధను అనునయించాడు. . కృష్ణుడు వచ్చి రాధను దర్శించాడు. అమె నిష్ట ఇద్దరూ రాజీ పడ్డారు. మాడింది. ఎనమండుగురు.. భార్చులని పెళ్లార

  • డానికి ఏవో కారణాలు చెప్పాడు. ఇద్దరూ రొకీ పడ్డారు.
  1. గోపికలు వచ్చి రాధను కూడా తమతో . రాధను ద్వారకకు తీసుతువెళ్తాడు. అప్ప కలుపుకోకపోతే లాభం లేదనుకున్నారు. మహిషులు తగువు పెట్టారు. రాధను కూరొ రాధతోపాటు అంతా కలిసి రాసక్రీడలు కలుపుకోకపోతే లాభం లేదని నిశ్చయించారు ఆడారు. ఒక నెలలో పదహారువేల మందికి పదహారు

రోజులు లక్షణ మొదలైన అరుగురికీ అరు రోజులు సత్యకు రెండు, రుక్కిజికి మూడు, మిగిలిన దినాలు రాధకు అనిపించుకొన్నారు

అర్కాటు సుబా కవులు 936

కథా నిర్మాణంలో పోలికలున్నా వెలిదండ్ల వెంకటపతి నిర్వహణలో చాలా ప్రతిభ చూపించాడు. సంవాదం అని పేరు పెట్టినందుకు కావ్యాన్ని రమారమి పాత్రల సంభాషణల ద్వారా నడిపాడు. వెంకటపతిగారి రాధ ఆరిందా, నిండు కుండ. పువ్వుల్లాటి సుకుమారమైన మాటలతో కొట్టి గుండెలు బొప్పికట్టించగలదు. సున్నితమైన కోపంతో సుందరమైన గాయాలు చేయకలదు. వెలిదండ్తవారి కృష్ణుడు కూడా చక్కని మాటకారి. దేనికైనా సంజాయిషీ ఇచ్చి ఇట్టే నమ్మించగలడు.

ఈ యుగంలో ఒక తరం తరువాత ముద్దుపళని రాధికాసాంత్వనం వ్రాసింది. రమారమి ఇదే రకమైన శృంగార కథ, వియోగ వ్యథ, కామక్షుధ కథనం చేసింది. ముద్దుపళని పాత్రలు రసికులు. వెలిదండ్లవారి పాత్రలు 'ఇంటలెక్టువల్‌ లెవల్‌ వాళ్లు. సెక్సుగాథల మీద విపులమైన పరిశోధన జరపాలి. ఆ గాథలు:

  1. లింగనమఖితిరుకామయ్యగారి సతృ్యభామాసాంత్వనం

  2. _ధరణిదేవుల రామయ్యగారి అహల్యావిలాసం

  3. ధరణిదేవుల రామయ్యగారి రాధామాధవప్రణయం

  4. _వెలిదండ్ల వెంకటపతిగారి రాధామాధవసంవాదం

  5. శేషం వెంకటపతిగారి శశాంకవిజయం

  6. సముఖం కృష్ణపష్పగారి అహల్యాసంక్రందనం

  7. _ముద్దుహానిగారి రాధికాసాంత్వనం ఈ ఏడు నెక్సు కావ్యాల ప్రభావం అనంతర కవులపై చాలా ఉంది. శతకాలు వ్రాసినా, ప్రబంధాలు బ్రాసినా సంభోగశ్ళంగార వర్ణనలో వీళ్ల ఒరవ్లో కనబడతాయి. కాపీరైటు అనేది ఈనాడు వచ్చిందికాని కాపీచేసే రైటు మన కవులకు జన్మహక్కు. మహామహావాళ్ల లోనే ఈ మచ్చ కనబడుతుంది. పూర్వకవులు కావ్యాల నుంచి రెండుచేతులా కొల్లగొట్టిన శవి ఈ యుగంలోనే ఈ సుబాలోనే ఉన్నాడు. అతడు వెంకటగిరి సంస్థానంవాడు.

రోసనూరి వెంకటపతి; “తావలచినది రంభ తా మునిగినది గంగు నాలుగు డబ్బులిచ్చి పోషించిన ప్రతిప్రభువునీ మన కవులు భోజుడనీ, ఇంద్రుడనీ, చంద్రుడనీ పొగడడం సర్వసామాన్యమే. ఈ యుగంలో పాలకులు తూడా తమ ఆశ్రితులకు పెద్దపెద్ద విరుదుల్నివ్వడం మొదలుపెట్టారు. అంధ్ర కాళిదాసులూ, అభినవ ఫలానాలూ ఈ యుగంలో నుండి ఎక్కువ కాజొచ్చారు. క్రీ.4 1690 నుండి 1748 దాకా వెంకటగిరి సంస్థానాన్ని పరిపాలించిన కుమారయాచమ నాయకుని అస్థానంలో రోసనూరి వెంకటపతి అనే కవి ఉండేవాడు. అతణ్ణి రాజుగారు మెచ్చుకొని 'తిక్కయజబ్బ' అనే బిరుదు యిచ్చారు. ఇంతటి గొప్ప కితాబు పొందడానికీ వెంకటపతి ఏ మహాకావ్యాన్ని వ్రాశాడో శెలియడు. ఇతని శబ్బసొష్టవచిత్రార్థాలుగాని, సలక్షణ క్రమనిరూఢ ప్రక్రియలు గాని ఉన్నాయో లేదో తెలియదుగాని శః వెంకటపతి. గురువు పేరూరి పెద్దనలో అవన్నీ ఉన్నాయని శిష్యుడే ఇలా మెచ్చుకున్నాడు.

936 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంవుకి స్వవశంబైతగు కాళికావరకృపాసంపూర్ణతన్‌ శబ్దసౌ షంవచిత్రార్థ సలక్షణక్రమనిరూఢ ప్రక్రియాన్వీతమౌ కవితాతత్వమహత్త్వమున్‌సభల వకాక్రిణించె నేమేటి భ వ్యవచోమాధురి నాపెరూరివిపి పెద్దామాత్యుగీర్తించెదన్‌. (విష్ణు. 1-18) ఈ పెద్దన కూడా బహుశా వెంకటగిరి ప్రభువు కువూర యాచమనాయకుని సభలోనే శ్ర భవ్యవచోమాధురి చూపించి ఉంటాడు. ఈ రాజుగారి కొడుకు సభలో కూడా వెంకటపతి ఉన్నాడు. ఆయన పేరు బంగారు యాచమనాయకుడు (క్రీ.శ. 1722 నుండి 1777). ఈ రాజుగారు వెంకటపతిని పిలిచాడు. ఆయన వ్రాయబోయీే 'బహువిధ శృంగారావిర్పమగు' వెంకటపతి విష్ణుమాయావిలాసం అనే మూడాశ్వాసాల కావ్య వాసి సమర్చించాడు. మన సాహిత్యంలో విష్ణుమాయ నుగ్గడించే గ్రంథాలలో ఇది నాలుగో మొట్టమొదట చింతలపూడి ఎల్లన విష్ణుమాయానాటకాన్ని వ్రాశాడు. అందులో కథనే కంకంటి పాపరాజుగారు *“విష్ణుమాయావిలాసం' అనే యక్షగానంగా వ్రాశాడ ఈ పాపరాజుగారి తమ్ముడు నరసింహం అదే కథను ద్విపదగా వ్రాశాడు. ఈ ముగ్గ8 రచనలూ చూశాక రోసనూరి వెంకటపతి ఈ కథను అవలీలగా 'సకలరీతి శృంగారకళా క్రాంతం'గా చేసివేశాడు. ఈ '“తిక్కయజ్వుగారీ రచన ఎడమచేత్తో, ఏమాత్రు అలసిపోకుండా రాసివేసి ఉంటారు. కాపీ కొట్టడంలో తూడా అలసిపోయేవాడు ఏమంశ ప్రయోజకుడు కాడు. రోసనూరి వెంకటపతి వ్రాసిన విష్ణుమాయావిలాసంలో కంకలీ పాపరాజుగారి భావాలూ, పదాలూ, కల్చనలూ, సౌగసులూ. కోకొల్లలుగా తనబడతాయి. ఇచ్చేరాజు ఏ బిరుదు ఇచ్చినా, పుచ్చుకొనేవాడు తనకా తాహతు ఉందా అని ఆలోచించాలి. వెంకటగిరి ప్రభువులు ఇంకెవరికైనా బిరుదులు ఇచ్చారో లేదోగాని ఈ సీమలో మరికొందరు కవులు లేకపోలేదు. వాళ్ళలో ఎరపాటి ఎర్రన్న ఒకడు. ఆయన మల్లణచరిత్ర అనే మూడాశ్వాసాల గ్రంథం అంకితమిచ్చాడు. ఎరపాటి ఎర్రన్న: ఈ కవి మల్లణ చరిత్ర రచించాడని చెప్పకుండా అంకీతమిచ్చాడని ప్రకటించడంలో ఒక సాహిత్య వైపరీత్యం అణిగి ఉంది. నవాబుల - “ఆరవీటి రాజు యుగాలలో పెదపాటి జగ్గన్న అనే సంకలనకర్త ఉన్నారు. ఎందరో కవుల గ్రంథాల నుడీ మంచి పద్యాలను సమకూర్చి ఒక చక్కని కానుకను ఆంధ్ర సాహిత్య సరస్వజీ సమర్పించాడు. అందులో తన సమకాలికుడైన పెదపాటి ఎర్రన్న రచించిన మల్తణ చరి అనే కావ్యంలోని తొలి రెండు ఆశ్వాసాలనుంచే మూడు పద్యాలను తన సంకలనంలో చేర్చాడు, ఈ పద్యాలు ఒక మూడాశ్వాసాల మళల్హణచరిత్రలో ఉత్తరోత్తరా కనబడ్డాయి గ్రంథకర్త పేరు తూడా ఎగ్రన్నే అయితే ఇంటిపేరు పెదపాటివారు కాదు ఎరపాటివారు ఏలూరు ప్రాంతాలనుండి పెదపాటివారు నెల్లూరు మండలానికి వలస వెళ్లినప్పుడు ఇంటిపేరు మారి ఉంటుంది. నో 6. నవాబుల యుగం, సమగ్ర అంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి

అర్కాటు సుబా కవులు 837

రెండాశ్వాసాల మళల్లణ చరిత్ర పెదపాటి ఎరన్న రచించినా మూడాశ్వాసాల మండలంలో నివాడు. అంకితమిచ్చిన కవి చుండి దగ్గర్లోనే ఉన్న ఎరపాడు అనే గ్రామానికి కరణం. ఈ మండలంలోనే ఉన్న తెట్టు సంస్థానాధిపతి కృష్ణమరాజు (క్రీశ 1678-163)కు ఈ గ్రంథాన్ని. ఇద్దామని ఎర్రన్న దాచాడుగానీ సాటి గ్రామకరణమైన చుండి కాళయ్యతే దఖలు పర్చాడు. అంకితమిస్తూ “కృష్ణాయ జనకాంతున కీయక దాచినట్టి యా రట్టడియైన ఎర్రకవి రాజిత మల్హ్లణ కావ్య కన్యకను” చుండి పురపాలకునికి ఇస్తున్నట్టు చెప్పాడు. (మల్హణ 1-19), ల

ఏలూరు ప్రాంతాలలోని తమ వంశం కవి పూర్వం రచించిన రెండాశ్వాసాల కావ్యాన్ని ఈ ఎరపాటి కరణం పూర్తిచేసి అంకితమిచ్చాడని విపుల పరిశోధన ఫలితంగా నేను నిరూపించాను.* ఈ సంగతులు పెదపాటి జగ్గన్నపై రాసిన ప్రకరణంపై వివరించాను.” పూర్వ పరిశోధకులు ఈ కవి ఇంటిపేరు “ఎడపాటి' అని పేర్కొన్నారు. ఇది వాస్తవానికీ “ఎరపాడు' అని ఉండాలని కూడా ఇతర సాహిత్య పరిశోధకుల సాక్ష్యం ఆధారంగా చెప్పాను. మల్లణచరిత్ర మూడో అశ్వాసం నుంచీ శేషపూరణ చేసిన ఎర్రన్నపై వేమనగారి ప్రభావం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తది. పూర్వకవి స్తుతిలో ఎరపాటి ఎర్రన్న వేమనగారిని పేర్కొన్నాడు. ఇద్దరూ వీరైవులే.

మల్లణచరిత్రలో _ ఇతివృత్తం వీరైవవాజ్మయానికి చెందినదే. పాల్కురికి సోమనాథుడు తన పండీికారాధ్యచరిత్ర పురాతన ప్రకరణంలో శ్వేతుని కథా, మల్తణుని కథా ఒకదాని తరువాత ఒకటి కథనం చేశాడు. ఈ రెండింటిలో మల్హణుని చరిత్రను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని చివర మల్లణునికి శ్వేతుని కథను ఒక పాత్రచేత చెప్పించాలని పథకం వేసుకొని పెదపాటి ఎర్రన్న ఈ కావ్యాన్ని రూపొందించదలచినట్టు ఉంది. అతడు ఎంత చెప్పాడో తెలియదు. ఆ అసంపూర్ణ కావ్యం ఎరపాటి ఎర్రన్నకు దక్కీనట్టుంది. ధనదత్తుడనే వైశ్యుని కథను జోడించి ఎరపాటి ఎగ్రన్న ఈ మల్హణ చరిత్రను ఒక అతుకులబొంతగా తయారు చేశాడు. కథా నిర్మాణంలో నేర్పులేదుగాని అక్కడక్కడ సమకాలిక సమాజాన్ని రేఖామాత్రంగా చూపించాడు. గ్రంథం సొంతంగా పరిశీలించిన వారికి ఈ కవి “ఇంతకు పూర్వము కావ్య రచనానుభవము లేనివాడని నిరూపించ వచ్చునినే భావం కలుగుతుంది.. చుండి కాళయ్యకు అంకితమిచ్చిన ఎరపాటి ఎగర్రన్నకు అంతగా కావ్య నిర్మాణానుభవం లేకపోవచ్చుగాని ఇతని ప్రాచీనుడైన పెదపాటి ఎర్రన్న చేయి. తిరిగినవాడే. అతని కుమారనైషధంలో కనబడే ప్రొఢీమను పరిశోధకులు గుర్తించారు. ఆ ఫ్రొఢకవికి ఈ సాధారణ కవి బహుశా మనుమడు కావచ్చును. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకొన్నాడేమో. రాయాలనే ఉబలాటం సహజమే. రసవంతమైన కావ్యం చెప్పడం కష్టం. కష్టమైన ఈ పని తలపెట్టిన ఇంకొక కవి ఈ మండలంలో ఇదే కాలంలో 7. అరవీటి రాజుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం. ఇదే సంపుటి $. మల్హణ చరిత్ర - పీఠిక - చోడవరపు జూనకీరామయ్య, పుట 23,

938 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇంకొకడున్నాడు. అతడు మాచవరపు పాపన్న, ఈయన 'నందవరీకచరిత్ర అనే రెండాశ్వాసాల కావ్యం చెప్పాడు.

మాచవరపు పాపన్న ఇతని ముత్తాతగారు బెల్లంకొండ దగ్గిర ఉన్న మాచవరంలో ఉండబట్టి అదే ఇంటిపేరయింది. మాచవరపు పాపయ్య 'వెంకటగిరిసీమను నేసంకటములు లేత రెండు సంవత్సరము'లున్నాడు. ఆ సీమలో 'కలువలవూడను పురమున నెలకొని యుండగ నందవరీక చరిత్ర రచించాడు. క్రీ.శ. 1695లో వెంకటగిరి రాజ్యం ఏర్పడింది కనుక వెంకటగిరి పేర్కొనిన ఈ కవి 1695 తర్వాత ఎప్పుడైనా ఉండి ఉంటాడు. ఇతడు 1740 ప్రాంతాలలో ఉండి ఉంటాడని వీరేశలింగంగారు భావించారు.

పూర్వం ఎప్పుడో ఉఊత్తరాదినుండి పదమూడు గోత్రాల బ్రాహ్మలు వలసవచ్చి కర్నూలు సీమలోని నందవరంలో నివాసం ఏర్పరచుకొన్నారు. వారు కరువు కాటకాలవల్ల కాశీనుండి కడుపు చేత పట్టుకొని వచ్చారు. వాళ్లు అలా రావడానికొక పూర్వగాథ ఉందని నందవరీకుల నమ్మకం. ఆదిలో నందుడునే రాజు కర్నాటక దేశంనుంచి రోజూ కాశీ వచ్చి పోతూ ఉండేవాడట. ఆయనకు మంత్రశక్తులున్నాయి. యోగవాగలు ఎక్కి రోజూ ఈ నిత్యయాత్ర చేస్తూ ఉండేవాడు. ఒకనాడు రాణిగారు నన్న తూడా తీసుకువెళ్లి తీరాలి అని పట్టుపట్టింది. రాజుగారు 'సరే' అన్నారు. తీరా కాశీకి వెళ్లాక ఆమె చెరగు మాసింది. ఆ మైలవల్ల యోగవాగలు పనిచేయలేదు. అప్పుడు కాశీలోని బ్రాహ్మలు తమ మంత్ర ప్రభావంతో ఆమెను శుద్ద్ధురాలిని చేశారు. అయితే ముందో షరతు పెట్టారు. తమకు ఆ రాజు కర్నాటకంలో వృత్తులు యిచ్చే పక్షంలో శుద్ధిస్నానం చేయిస్తామన్నారు. అవసరం కొద్దీ ఆ రాజు చాముండేశ్వరీ దేవి సన్నిధిలో మాట యిచ్చాడుగాని తీరా ఆ బ్రాహ్మలు కొన్నాళ్లు పోయాక వలసవచ్చి చేసిన బాస చెల్లించుకోమన్నప్పుడు, 'అనాటీ బ్రాహ్మలు మీరే అని చెప్పడానికి సాక్ష్యం ఏముంది? అని అడిగాడు. వాళ్లు కాశీనుండి చాముండేశ్వరీ దేవినే రప్పించి సాక్ష్యమిప్పించారు. నందుడు అశ్చర్యపడి, తన పేర ఊరు కట్టించి వారికిద్చాడట. నాటినుండి ఈ పదమూడు గోత్రాల వాళ్లూ నందవరీకులయ్యారు. -

ఈ కథ నిజమో కాదోగాని నందవరీకులకు చౌడేశ్వరిదేవి ఇలవేల్పు. మాచవరపు పాపన్న కృత్యాదిని చౌడేశ్వరిని ప్రార్ధించాడు. ఈ కవి తన వాక్కులకు ఎంత తోడు రమ్మన్నా ఆవిడ వచ్చినట్టు లేదు (0.538). వానమామల కోనప్పాచార్యులుగా రీయన గురువు. ఆయన “దానజన రక్షణోపాయ ధన్యుడ'ట. ఆయన కూడా శిష్యుని కవిత్వాన్ని రక్షించలేదు. మాచవరపు పాపయ్యగానీ, అతని గురువుగానీ వెంకటగిరి సంస్థానంలో ఉన్నారో లేదో తెలియదు.

వెంకటగిరి తరువాత ఈ సుబాలో చెప్పుకోతగ్గది కార్వేటినగర సంస్థానం. శ్రీశ 1718 నుండి 1732 దాకా పాలించిన మాకరాజు వెంకట పెరుమాళ్లరాజు కార్చేటీ నగరాన్ని నిర్మించాడు. ఇతనికి పుత్రసంతానం లేదు. అందుచేత చిన్నన్నగారి కొడుకు 8. అంధ్రకవుల చరిత్ర, 3వ భాగం, పుట ౫7.

ల్కాటు సుబా కవులు 939 శావేటిరాజుకు రాజ్యం ఇచ్చాడు. కావేటిరాజు పిచ్చివాడు. ఎవరో మునిశాపంవల ఈ ఉన్మాదం ప్రాప్తించిందని అశ్రితులు సంజాయిషీ పుట్టించారు. ఇతని మామగారు బొప్పరాజు వెంకటనరసింహరాజుగారు వ్యవహారదక్షుడు. అల్లుని తరపున రాజ్యపాలన చేశాడు. ఈ నరసింహరాజు కొడుకు తూడా ప్రయోజకుడు. పేరు కసవరాజు. ఆయన శూడా బావమరిది తరపున రాజ్యం చేశాడు. కవులను పోషించి కృతులు అంకితం పుచ్చుకొన్నాడు. -

బుగ్వేదకవి వెంకటాచలం: ఈయన కసవరాజుకతు ఆశ్రితుడు: టొఢకవి. కవిరాజికంఠీరవ బిరుదాంకితుడు. దామెర్ల అంకన్నగారి సభలో ఇతర కవులను ఓడించి అపవుగా పద్యాలు చెప్పి ఇతడు ఈ బిరుదును పొందాడు. ఇతని గురువు తిరువెంగళయ్య గారు వీరవెంకటరాయలవారి సభలో చెంజి వరదప్పసన్నిధిలో మంతుకెక్కిన మనీషి, మధురవాజీవిలాసభారతి. ఇటువంటి గురువుగారికి శిష్యుడు కావడంవల్ల సుదీర్లమైన సుకుమార వచః ప్రతిభా నిరూఢీలో గద్యపద్యచయం అశుగతిని రచించి ఎన్నో సభలలో వెంకటాచలం కూడా మంతుకెక్కాడు. కసవరాజుగారి కోరికపై మొదట కార్వేటినగరంలోని ప్రసన్న వెంకటేశ్వ్చరునిపై వెంకటాచలం ఒక అష్టకం చెప్పాడు. తరువాత భోజరాజు బ్రాసిన చంపూరామాయణాన్ని తెనిగించాడు. ఆదిలో ఇలా వాంఛించాడు:

ధారుణి గద్యసూక్తి మిశితంబగు పద్యము హృద్యవాద్భురే

ఖారమణీయమైన మృదుగానమురీతి రహించుగాన నా

నారసవత్కవిత్వకలనాచతురానను లిచ్చ మెచ్చగా

నారసనంబు చంపురచనంబు దిరంబుగ జేయుగావుతన్‌ (చంపూ. 1-15) నిజంగా తెలుగు చంపూరామాయణం మృదుగానమురితి సాఫీగా నడిచి క్రావ్చంగా ఉంటుంది. మూలాన్ని అతిక్రమించడం తెలుగు కవుల కాపీరైటు కనుక బుగ్వేదకవి వెంకటాచలం తూడా పూర్వులను వినయవీధేయతలతో అనుసరించి నూర్చులూ తూర్చులు చేశాడు. అయితే ఇతనిది రసదృష్టి. పాండిత్య ప్రకర్ష తోసం పాఠులాడడు. మిథిలా నగరాన్ని వర్జించి రామునికి చెప్పే విశ్వామిత్రుడు తొలిసారి సీతన్మ ఎలా ప్రశంసించాడో చూడండి:

మొగలింగేదగిరేకు వంశకతుహళిన్‌ ముత్యంబు చట్రూతిలో

మొగరాతళ్క్ళనటన్‌ మిటారి కపురంబుబల్కు గాకాకాదీ

వగతిన్‌ లేజీగు రుద్బవిల్లునటు లీవైదేహు యాగక్రీయా

జగతింబాల యొకర్తు సీతయను సంజ్ఞంగల్లివర్థిల్లగన్‌ (చంపూ. 3-71) శెబగు చంపూరామాయణం తూడా మొగలి పొదలో గేదకి కేతులాగ వెదురు గుబురులో ముక్య్కంలాగ చట్రాతిలో వజ్రంలాగ కమ్మగా, నున్నగా మెరుస్తూ ఉంటుంది. ఈ యుగంలోని చాలా నిస్సారమైన రచనలు చదివిన వాళ్లకి ఈ ధార రసం అనందం యస్తాయి.

940 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ

కార్వేటినగరం తరువాత లెక్కలోనికి వచ్చేది కాళహస్తి సంస్థానం. దీనిని పాలించిన దామెర్లవారి కుటుంబంలోనే పూర్వం మంచి కవులు ఉండేవారు. క్రీశ 16 నుండి 1700 దాకా అక్కప్పనాయనింవారు కాళహస్తి పాలించారు. ఆయన తరువాత ఆయన కొడుకు పెదవెంకటప్ప. తమ్ముని కొడుకు కుమవూర వెంకటప్పలు రాజ్యం ఏలుకొన్నారు. వీళ్లదగ్గిర ఏ కవులు ఉండేవారో తెలియదు. వాళ్లు బుగ్నేదటి వెంకటాచలం చేతిలో ఓడిపోయారు. దామెర్ల వాళ్లు వెంకటాచలాన్ని సత్కరించినట్టే ఇతరులను కూడా ఆదరించి ఉండవచ్చు. అయితే కాళహస్తిలో కవులకన్నా భభ్రాజుల సంఖ్య ఎక్కువ కాబోలు, చాలామంది భట్లు దామెర్లవారిపై పద్యాలు చెప్పారు ఈ భట్టలో రత్నాకరంవారు ప్రసిద్ధులు.

రత్నాకరం గోపాలరాజు: వసుచరిత్ర రచించి వాసికెక్కిన భట్టుమూర్తి ఇంటిపేరు ప్రబంధాంకంవారు. ఆదిలో ఇదే ఇంటిపేరుగల కవులు కొంతమంది అతని అర్వాచీనులు ఉన్నారు. భట్టుమూర్తికి ఎన్నోతరంవాడోగాని “ప్రబంధాంకాంద్ర శబ్దజాల లక్షణ బహుచిత్ర కవిత్వరచనా చమత్కార రత్నాకరు' డొకాయన ఉన్నాడు. ఇతడు కృష్ణమరాజు గర్భరత్నాకర సుధాకరుడు. ఈయన పేరు గోపాలరాజు. ఇతనితోనో, లేక అంతకుముందో యీ వంశంవారికి రత్నాకరం వారనే ఇంటిపేరు వచ్చింది. ం

ఈ రత్నాకరంవారు నెల్లూరు బిల్లా ఆత్మకూరు తాలూకాలోని గుడిపాడు గ్రామంలో ఉండేవారని చెప్పవచ్చు. పూర్వం యీ ప్రాంతాలను కొచ్చెర్లకోట సీమ అనేవారు. గుడిపాడులో కోట పెట్టించుకొని రావెళ్లవారనే వీరులు మన్నారికం చేస్తూ ఉండేవాళ్లు. కృష్ణదేవరాయలవారి కాలంనుంచీ కడపటి ఆరవీటి రాజుదాకా ఎందరెందరు రాయసింహాసనం ఎక్కారో అందరికీ అణకువగా ఉంటూ యీ రావెళ్లవారు రాజఖ్తే ప్రకటించుకొన్నారు. ఈ కుటుంబంలోని ప్రసిద్ధులపై చాలా చాటువులు వున్నాయి. ఎన్నో యుద్దాలలో పాలొని వీళ్లు చాలా విరుదులు పొందారు. ఈ వీరులందరూ సాహిత్య పోషణ చేశారో లేదోగాని రావెళ్ల లింగచమనాయకుడు మాత్రం రత్నాకరు గోపాలరాజును ఆదరించి అతనిచేత గ్రంథాలు చెప్పించి అంకితం పుచ్చుకొన్నాడు. ఈ వీరుడు క్రీ.శ 1617 నుంచి 1670 దాకా గోల్కొండను పాలించిన సుల్తాన్‌ అబ్బుల్లాకీ సమకాలికుడు. రత్నాకరం గోపాలరాజు కూడా యీ కాలంవాడే అని చెప్పవచ్చు.

గోపాలరాజు చాలా ఫ్రొఢకవి. పండితుడు సరస చాతుర్యంతోపాటు లక్ష్యలక్షణజ్ఞానం ఉన్నవాడు. తన కాలంలోని రచయితలు ఏవో ఒకటి రెండు పద్యాలు నిరోష్ట్రంగా, నిరనునాసికంగా చెప్తే ఈయన శతకాలకు శతకాలే చెప్పిన మేటీ అనునాసికలైన అష్టవర్జాలను రానివ్వకుండా ఒక తారావళిని రచించాడు. కౌముడికీ దీపాంధ్ర శబ్దంబులు ఎలమిమీర రచించిన నేర్పరి. కవులు మెచ్చుకొనేటట్లు పెక్కుకట్ల మార్గంబులు అవలీలగా చెప్పాడు. బహులిపి మర్మచాతుర్య మహిమలు తెలిసినవాడు. ఇతడు చతుర్విధ కవిత్వాలు చెప్పగలిగినవాడైనా యీయన బ్రాసిన రెండు , రత్నాకరం గోపాలరాజు వ్రాసిన ద్విపద కావ్యాలలో మొదటిది భాగవత దశమస్కంధం.

అర్కాటు నుబా కవులు తథ!

మన్నీటి రాజులు మాటిమాటికిని - సన్నుతిచేయగ సత్కవుల్‌ మెచ్చ

పావనంబగు పూర్వ్చభాగంబు ద్విపద-గావింతు. (2.784 గోపాలరాజు దశమస్కంధంలోని ఒక పూర్వభాగాన్నే రచించినట్టుంది. అందులోని అశేష పుణ్యసత్కథలు పూర్వకావ్య కవిత్వపుణ్యులు జౌననేటట్లు వ్రాసి మదనగోపాలస్వామికీ అంకితం ఇచ్చాడు. ఇది అముద్రితం. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. భాగవతంలో కొంత భాగం ద్విపద చెప్పినట్టే భారతంలోని ఒక భాగాన్ని తూడా గోపాలరాజు రచించాడు. అరణ్యపర్వంలోని సౌగంధికాపహరణ గాథను చక్కని ద్విపద కావ్యంగా చెప్పి రావెళ్ల లింగమనాయకునికి అంకితం ఇచ్చాడు. గౌరనగారి ద్విపదలెంత ప్రసన్న గంభీరంగా ఉంటాయో అంత చక్కగానూ గోపాలరాజు ద్విపదలు ఉంటాయి.

ఈ కథను మూడాశ్వాసాలలో 6700 పాదాల కావ్యంగా గోపాలరాజు చెప్పాడు. కథతోపాటు చక్కని వర్ణనలు చేశాడు. కడిమివిదృలజూపు గారుడసాని కడుపున చంద్రికావైఖరులు వెలిశాయట (1-1533). చందురుడనే మాంత్రికుడు మలయుచు దఊలన్నీ చిత్రించినట్టి తగన- ధకారబూతమ్ముల దరిమిపాగడొంద జిల్లు విభూతిలాగ వెన్నెల ఉందట (1-519). చంద్రోదయాన్ని వర్ణించిన గోపాలరాజు సూర్యోదయాన్ని కూడా గారడీలాగే చిత్రించాడు.

ఏపున జెలరేగి యింద్రజాలికుడు - రూపించి సమయగారుడవిద్యవాడు

సురలెల్ల భావించిజూచి మెచ్చగను-హరిహయః బహుపరాకని హెచ్చరించి. "

రంగుమీరగ నెర్రగ కాగినట్టి - బంగరు గుండ్రను బరువడి మింగి

నడుమువే నులిబెట్టి నాలుక సాచి-మెడ కొంత నిక్కించి మిక్కిలి గొంతు

సరచుచు జేతుల జప్పట లిడుటు-మరల దెప్పించి విషయముగా నగుచు

చెలగుచు మునిపండ్లచే గొంత నిల్పి-

యెలమితో నింగికి యెలనూ పెననగ

సముదకరసహస్రప్రఖభాజాల

మమరగా నుదయించె నబ్బబాంధవుడు (సొగ 2-551 నుండీ)

గడిగడిక్కీ గారడిని జ్ఞాపకం చేసుకొనే ఈ కవి మాటలతో అట్టే గారడీ చెయ్యలేదు. కృత్యాదిని తన చిత్రకవిత్వ చాతుర్యాన్ని చెప్పుకొన్నా ప్రథమాశ్వాసం చివర ఉపమాది ప్రోొల్ల నదలంకార బహువిధలక్షణఫణతినే ఘనంగా చెప్పుకొన్నాడు. వ్రాశాడు.

అందంబుగ దశవిధముల - చందంబుల లక్షణములు సకలకృతులలో

జెందిన ప్రయోగవితతులు - పొంచికగా గూర్చినాడ బుధు కాననగన్‌.

_ (అం.సా.ప 3417)

సకలకృతులలో చెందిన ప్రయోగాలు ఇవ్వడం కష్టమేగాని ఈ పద్యంలో ఆరిశమోక్తి లేదనిపిస్తుంది. గోపాలరాజు కొన్ని అపూర్వమైన కావ్యాలలోంచి ఉదాహరణలు చూపించాడు. మచ్చుకు కొన్ని పుస్తకాలు పేర్లు చూడండి:

942 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

  1. అంబాలబాణం, 2. కమలాకరచరిత్ర, 3. చంద్రశేఖరచరిత్ర, 4. దశరథక్పమార చరిత్ర, 5. పంచబాణవిలాసం, 8. పద్మావతీచరిత్ర, 7. రాజనరేంద్రచరిత్ర.

ఇలాంటి అపురూపమైన కావ్యాలలోంచి ప్రయోగాలు చూపించే ఈ లక్షణ గ్రంథం ఇంతదాకా వెలుగు చూడకపోవడం దురదృష్టమే. దీని ప్రతి ఒకటి కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది.!శే రతాకరం గోపాలరాజు రచించిన గ్రంథాలు ఎన్నోగాని మూడు దొరుకుతున్నాయి. అందులో ఒక్క సౌగంధికా కతుసుము ప్రసవాపహరణమే అచ్చుపడింది. 1949లో వావిళ్లవారు ప్రకటించారు. అవతారికలోని చారిత్రక విషయాలను విశదపరుస్తూ తుందూరు ఈశ్చరదత్తుగారు విపులమైన ఉపోద్దాతం వ్రాశారు.

ఈ ద్విపద కావ్యాన్ని ఒక అనంతరకవి పద్యగ్రంథంగా మార్చాడు. అతడూ రత్నాకరం వారింటిలో పుట్టినవాడే. గోపాలరాజుగారి వంశంలోనివాడే.. పేరు అప్పప్పకవి. ఇతడు గోపాలరాజుగారు తన వంశకర్త అని యీ పద్యసౌగంధికలో చెప్పుకొన్నాడు. గాని ఇతర కృతులలో యీయన పేరు చెప్పలేదు. శశరేఖభాపరిణయం అనే మూడాశ్వాసాల పద్యకృతిని కూడా అప్పకవి వ్రాశాడు. ఇందులో తన తాతముత్తాతల గురించి చెప్పాడుగాని వారిలో గోపాలరాజుగారి పేరు లేదు. కారణం తెలియదు.

ఈ సుబాలో కస్తూరి రంగయ్య ఒక లక్షణ గగ్రంథాన్నీ, నిఘంటువునూ రచించికే రత్నాకరం గోపాలరాజు ఒక లక్షణ గ్రంథాన్నే వ్రాశాడుగాని మరోకవి కూడా నిఘంటువు రచించకపోలేదు. అతని పేరు పైడిపాటి లచ్చన్న. అతని నిఘంటువే చాలా ప్రచారం పొందింది.

పైడిపాటి లచ్చన్న నెల్లూరు సీమలో పైడిపాడు గ్రామం కందుతూరు తాలూకాలో ఉంది. పైడిపాటి ఏకామ్రయ్యగారి కొడుకు లచ్చన్న చిన్నప్పుడే అమరం వల్లెేవేయడంతోనే తన విద్యాభ్యాసం ప్రారంఖించి ఉంటాడు. అలాంటి నిఘంటువు తెలుగులో లేవనో ఉన్నా చాలదనో భావించి 'ఆంధ్రనామసంగ్రహం' అనే గ్రంథంలో 'తెలుగుపేళ్లు అరసి' కూర్చాడు. ఇది అసంపూర్ణం అని భావించి అడిదం సూరన్న ఒకటో రెండో తరాలు పోయాక '“ఆంధ్రనామశేషం' వ్రాశాడు. ఈ రెండింటితోపాటు కస్తూరి రంగయ్య బ్రాసిన “సాంబ నిఘంటువు'ను తూడా "అనంతర సాహితీపరులు కలుపుకొన్నారు. వీటిని నిఘంటుత్రయం అని పరిగణించారు.

పైడిపాటి ఏకామ్రయ్యగారినే అమరయ్య అని కూడా పిలిచేవారు కాటోలు. మన భాషలో పైడిపాటి అమరయ్యగారి కొడుకు లచ్చన్న అనే ఆయన 'ఆంధభ్ర భాషా రత్నాకరం' అనే రెండాశ్వాసాల నిఘంటువు వ్రాశాడు. అది అముద్రితం. దీని ప్రతి కాకినాడ సారస్వత పరిషత్తులో ఉంది. ఆంధ్ర నామసంగ్రహం వ్రాసిన లచ్చన్నే దీనిని తూడా వ్రాశాడేమో పరిళోధించాలి.

ఆర్కాడు సుబాలోని చెన్నపట్టణంలో కొందరు క్రైస్తవ మిషనరీలు కూడా తెలుగు గ్రంథాలు వ్రాశారు. వాళ్లగురించి కుంఫిజీయుగంలో విన్నవించుకొంటాను. అతన కప వ సు ననన కన ముత ననన 11. ఆంధ్రసాహిత్యపరిషత్స త్రిక, సంపుటి 6, సంచిక 8లో ఈ గ్రంథం గురించి కొంచెం తెలియజేసారు.

కొండవీడు బందరు సర్కారులు

ఆంధ్రదేశంలోని కోస్తా ప్రాంతాలను పూర్వం వివిధ సర్కారులుగా విభజించారు. వాటిలో కొండవీడు బందరు సర్కారులు దక్షిణాన ఉన్నాయి. కొండవీడు సర్కారు బసాలత్‌బంగుగారి జాగీరు. ఈయన రెండన నిజాముకు సాక్షాత్తూ తమ్ముడు. ఈ సర్కారులలో అయిదు పరగణాలున్నాయి. అయిదు సంసానాలు కూడా ఉండేవి. వీటిని పాలించినవాళ్ళు ప్రసిద్ధవంశాల వాళ్ళే.

  1. చింతలపల్లి - వాసిరెడ్డివారి సంస్థానం, 2. రేపల్లె - మాణిక్యాలరావువారిది,
  2. చిలుకలూరిపాడు - మానూరివారి సంస్థానం, 4. వినుకొండ - మల్రాజువారిది, క. కొల్లూరు - నూజివీడు సంస్థానంలో ఒక భాగం.

కొండవీడు సర్కారు నిజాము తమ్ముని జాగీరయితే బందరు సర్కారులో చాలా హవేలీమహళ్లీ ఉండేవి. ఒకటి రెండు పరగణాలు దేవరకోట సంస్థానంలోనూ, మొగలితుర్రు సంస్థానంలోనూ ఉండేవి. స్త

ఈ రెండు సర్కారులలో ఇన్ని సంస్థానాలు ఉన్నా ఈ యుగంలో సాహిత్య పోషణకు ఇళ్లు అలకడమేగాని ముగ్గులు పెట్టినట్టు కనబడదు. ఈ సీమలో కనుపర్తి అబ్బయ్యా, గాలి ఓబళయ్యలాంటి ప్రముఖులు లేకపోలేదుగాని వాళ్లు ప్రత్యేకంగా ఒక సంస్థానాన్ని అంటిపెట్టుకుని లేరు. కొన్ని సంస్థానాలలో సాహిత్య సరస్వతి పూర్ణగర్భిణేగాని ఏ బిడ్డ పుడుతుందో ఎవరూ జోస్యం చెప్పలేదు.

శనుపర్తి అబ్బయ్య: ఆధునిక వైద్యశాస్త్రం మహోన్నతంగా అభివృద్ధి చెందడం వల్ల అపరేషన్లు చేసి ఆడవాళ్లుగా పుట్టినవాళ్లను మగవాళ్లుగా, మగవాళ్లుగా పుట్టిన వాళ్లను అడవాళ్లుగా మార్చివేయడం సాధ్యం అవుతున్నది. అయితే ఆదిమకాలంలోనూ ఇలాంటి గురిమార్పిడి కథలు లేకపోలేదు. మన పురాణాలలో చాలామంది వ్యక్తులు ఆడవాళ్లుగా పుట్టి మగవాళ్ళుగా మారడం, శాపంవల్ల మగవాళ్లు ఆడవాళ్లవడం ఉంది.

పూర్వం వైవస్వత మనువు' పుత్రునికోసం యజ్ఞం చేశాడు. అయితే అతని భార్య పుత్రిక కావాలని కోరుకోవడంతో ఆడపిల్లే పుట్టింది. ఆ పిల్లపేరు ఇలాకన్య. తూతురు పుట్టడం తండ్రికి ఇష్టంలేదు. అతడు వసిష్ణులవారితో “ఇదేమిటీ యజ్ఞం వమ్మయింది' అని మొరపెట్టుకున్నాడు. వసిష్టులవారు నారాయణుని మెప్పించి ఆడపిల్లను కాస్తా మగపిల్లవానిని చేశారు. సుద్యుమ్నుడని పేరుపెట్టారు. ఈ కగ్రవాడు ఎదిగి ఒకనాడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినవాడు జంతువులను చంపి చక్కారాక అక్కడో తోట కనిపిస్తే అందులోకి వెళ్ళాడు. అది శాపాలతోట. అందులో అడుగుపెట్టిన మగప్రాణులు ఆడతనం పాందక తప్పదు. ఇది ఈశ్వరుని శాపం. వసిష్టులవారు చచ్చీచెడి మగవాణ్జీ చేసిన ఇలాకన్య ఇలా మళ్ళీ ఆడదికాక తప్పలేదు. ఈ కొత్త ఆడపిల్లను బుధుడు చూళాడు. ప్రేమించాడు. ఈ ఇద్దరికీ కొడుకు పుట్టా ఏ. అతని పేరు పురూరవుడు. బిడ్డపుట్టాక, మళ్ళీ వసిష్టులవారు జాలితలచి దేవుని దయవల్ల మగవాజణ్ణీ చేశారు. ఈసారి దేవుడు కొంచెం

94క సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ జాగ్రత్తపడి షరతులు పెట్టాడు. ఈ ఆసామి ఒక నెల ఆడదానిగా, ఒక నెల మగవానిగా ఉంటాడన్నాడు. నెలకో లింగంతో బ్రతికిన ఇలా సుద్యుమ్నుడు కొన్నేళ్ల తరువాశ తుమారునికి పట్టం కట్టాడు.

ఈ కథ వివిధ పురాణాలలో ఉంది. దానిని తెలుగులో కావ్యరూపంలో చెప్పినవాడు కనుపర్తి అబ్బయ్య. పురూరవుని జన్మవృత్తాంతమే కాక అతడు రాజ్యమేలడం, అతని కీర్తి విని ఊర్వశి మరులుకొనడం, వాళ్లిద్దరూ సుఖించడం, విడిపోవడం, మళ్లీ సమాగమం మొదలైన కథలన్నిటితో ఈ కావ్యాన్ని అబ్బయ్య రసవంతంగా రచించాడు. దీనికి 'కవిరాజమనోరంజనం' అని పేరు పెట్టాడు. తన కావ్యాన్ని “రసజ్ఞులు మెచ్చినన్‌ చాలదే' అని భావించాడు. దీనిని రసజ్ఞులు మెచ్చుకొన్నారు. దీనికి పిల్లవసుచరిత్ర అనే కితాబు యిచ్చారు. వసుచరిత్రను అనుకరిస్తూ కావ్యం వ్రాయడమే ఘనత అని నమ్మేరోజులలో పుట్టాడు కనుక కనుపర్తి అబ్బయ్య ఆ ఘనకార్యం సాధించాడు.

కనుపర్తి అనే గ్రామం కొండవీటిసీమలో ఉంది. గుంటూరు జిల్లా నర్సారావుపేట తాలూకాలోని కనుపర్రులో అబ్బయ్యగారి పూర్వీకులు కరణాలుగా ఉండేవారు. ఇప్పటికీ యీ గ్రామానికి కనుపర్తివారే కరణాలు. కొండవీటిసీమ విజయనగర సామ్రాజ్భంలో ఉండేటప్పుడు కనుపర్తి బసవన్నగారనే ఒకాయన ఆ రాజులవద్ద మంత్రిగా ఉండేవాడు. కనుపర్తి బుక్కపట్టణాల కరణీకం సంపాదించాడు. ఈ బసవన్నగారి మునిమనవడి పేరు రాయన్న. ఇతడు అందరికీ తలలో నాలుకలాగా

=. కనుపర్రులో పుట్టి పెరిగిన అబ్బయ్య మంగళగిరి పానకాలస్వామి. భక్తుడు. చిన్నప్పుడే ఆ దేవునివలన తనకు కవిత్సమబ్చిందని చెప్పుకొన్నాడు. “అనిరుద్ధచరిత్రను అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాసి అబ్బయ్య దేవునికే అంకితం యిచ్చాడు. 'చతుర కవిత్వ తత్వ పటుసంపద యొక్కరి సొమ్ము కాదు' అని చాటి, పూర్వకవుల పాటి జటిల సమాసకల్పన, పాండిత్య ప్రకర్త తనకూ వచ్చునని రుజవు చేసుకొన్నాడేగాని కథ చెప్పే తీరులో నేర్చు. సరసత, కౌచిత్యం మొదలైనవి చూసుకోలేదు. ప్రథమాశ్వాసంలోనే అనిరుద్ద్ధునికి ఒక పెళ్లి చేశాడు. తరువాత అతణ్ణి ఉష కలలో ప్రేమించడం, గుట్టగా పెళ్లాడడం, నెల తప్పడం మొదలైన ఘట్టాలు వ్రాశాడు. కథకోసంగానీ, కమ్మదనం కోసంగానీ అనిరుద్ధచరిత్ర చదవనక్కరలేదు. అబ్బయ్య తొలిరచనలోని వైదుష్టం తెలుసుకోడానికే చదవాలి. తన కాలంనాటి కావ్యగంతలు కట్టుకొని ఆ గాడీలోనే పయనించాడు. అబ్బయ్య ఏకాలంవాడో నిర్ణయించడానికి ప్రత్యక్ష ప్రమాణాలేమీ లేవు ఇతడు పద్దెనిమిదో శతాబ్దపు మధ్య కాలంలో, అంటే క్రీ.శ. 1750లో ఉండేవాడని వీరేశలింగంగారు ఊహించారు.* కొంత అంతరంగిక సాక్ష్యంతో యీ ఊహను కొమర్రాజు లక్ష్మణరావుగారు బలపరిచారు.

  1. అఆంధ్రకవుల చరిత్ర, మూడవ భాగం, పుట 115. 2 అంధ్ర విజ్ఞాన సర్వస్వం (ఆంధ్ర పత్రిక), రెండవ సంపుటం, పుట 164.

కొండవీడు బందరు సర్కారులు 945 అబ్బయ్య తన అనిరుద్ధచరిత్రలో సమకాలిక హిందూస్తానీ పదాలు వాడాడు. ఉషాకన్య విరహాన్ని వర్ణించే ఘట్టంలో మదను “పాదుషా' దగ్గిర వసంత “పీష్వా మంత్రి ఆని అబ్బయ్య చెప్పాడు (3-19). క్రీశ 1740 నుండి 1761 దాకా పీష్వాగిరీ నడిపిన బాలాజీ బాజీరావు కాలంలోనే పూనా పీష్వాలఖ్యాతి ఆంధ్రదేశానికి ప్రాకింది. పీష్వాను పేర్కొన్న అబ్బయ్య అంతకు ముందువాడవడని లక్ష్మణరావుగారు. నిర్ణయించారు. కనుపర్తివారి వంశంలో అబ్బయ్య దగ్గిరనుంచి 1924 దాకా అరు పుడషాంతరాల వ్యర్తులున్నారని శేషాద్రిరమణ కవులు చెప్పారు. ఆ వంశవృక్ష ప్రకారం కూడా అబ్బయ్య క్రీ 1750 ప్రాంతాలవాడనే వారు నిర్ణయించారు. అబ్బయ్య క్రీ.శ 1725లో పుట్టీ 1745 నాటికి అనిరుద్ధచరిత్ర వ్రాసి ఉండవచ్చు. అనిరుద్ధచరిత్ర వ్రాశాక అబ్బయ్యలో బాగా ప్రొడత్వం వచ్చింది. ఛాందసత్వం పోయింది. లక్షణాలకు భయపడే రోజులు వెళ్లిపోయాయి. శ్లేష యమకం, చమత్కారం మొదలైనవాటితో కమ్మగా కవిత్వం చెప్పడం అలవాటు చేసుకొన్నాడు. కవిరాజమనోరంజనమనే పేరుతో పురూరవచరిత్ర వ్రాశాడు. అందులో మొదటే ఇలా చెప్పాడు: జెల్లమి జేసి కారొకటి జెప్పగ ఛాందసవిస్తరంబు సం ధిల్లుట గావ్యశంక లవనిం దరుచయ్యె రసజ్ఞులార నా యుల్లపుసాధవీధి గొలువున్న సరస్వతి సత్యవాణీ నా తల్లి యొసంగు పల్కు లివి తప్పులుసేయక చిత్తగింపుడీ. (కవిరా. 1-11) ఈ పద్యంలో ఐదు పాదాలున్నాయి. అబ్బయ్య తరచుగా పంచపాదులు రచిస్తాడు. ఇది అనిరుద్ధచరిత్ర దగ్గిరనుండీ అతనికి అలవాటు. తన అలవాట్లేకాక ప్రబంధకవుల అలవాట్లన్నీ అలవర్చుకొని అబ్బయ్య కవిరాజమనోరంజనం చెప్పాడు. పింగళి సూరపరాజుగారిలాగ కథ. భట్టుమూర్తిలాగ కవిత్వం చెప్పాలని భావించాడు. రెండూ పూర్తిగా చేయలేకపోయాడు. పురూరవసుని కథ మొట్టమొదట బుగ్వేదంలో కనేబడుతుంది. ఊర్వశీ పురూరవసుల సంవాదరూపంలో 18 బుక్కులు ఉన్నాయి (10-8-5). చారిత్రకంగా సమన్వయం చేయవలసివస్తే యీ కథ ఆదిమానవులు అగ్ని కనిపెట్టిన రోజులలో నిదన్ని చెప్పాలి. అప్పుడప్పుడే బట్టలు కట్టుకొని జంతువులను మచ్చిక చేసుకొని పెంచడరీ మొదలైన నాజూకుతనాలు మొదలైన రోజుల్లో యీ కథ జరిగి ఉంటుంది. దీనినే తరువాత పురాణాలు చిలవలూ పలవలూ చేర్చి కథనం చేశాయి. పురూరవునికి విక్రముడనే మరో పేరుంది. ఈ పురాణ గాథలనే స్వీకరించి చక్కగా సంస్కరించి కాళిదాసు విశ్రమోర్వకీయం అనే నాటకం వ్రాశాడు. కనుపర్తి అబ్బయ్య కాళిదాసు చేసిన మార్చులను ఏమాత్రం స్వీకరించకుండా పురాణంలోని కథనం తీసుకొనే కావ్యం వ్రాశాడు. ఈ కావ్యాన్ని అబ్బయ్య 1152 గద్య పద్యాలలో చెప్పాడు. నారదునిచేత కథ మృంచడం. చిలుకలు సాయం చేయడం మొదలైనవి సింగ సూరపరాజగారి బాణీలా 1 కవిరాజమనోరంజనం, వావిళ్ళముద్రణ, 1924 పీఠిక పుట 2.

946 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి నడవాలనే ప్రయత్నాన్ని సూచిస్తాయి. అయితీ అబ్బయ్యగారి త్రాసు భట్టుమూర్లైే తూగింది. అందుకే కవిరాజమనోరంజనం పిల్లవసుచరిత్ర అయింది. ఇందులో భట్టుమూర్తి అనుకరణలు కోకొల్లలుగా కనబడతాయిగాని సూరపరాజుగారికి అనుకరణల కోస వెదికితీ దొరకకపోవు

పూర్వకవులను అనుకరించినా సమకాలికులులాగా రతివర్ణన అతిగా చేయడం తూడా అబ్బయ్యకు అబ్బింది. గర్భలావణ్యాన్ని వర్ణించేటప్పుడు సైతం రతికి అడ్డవునే వర్ణిస్తాడు. పురూరవుడు చంద్రవంశంలో _ పుట్టాడు. అంచేత తారాశాంకుల ప్రణయగాథను వర్ణిస్తూ తార గర్భం దాల్చటాన్ని ఇలా చెప్పాడు:

రతిబంధ ప్రతిబంధకం బురుపరీరంభక్రియా స్తంభవం

బతిహీలామణితాంతరాయము నిజప్రాణేశకేళిజిదా

యతమీనధ్వజయుద్ధతంత్రపటు తాహంకారశంకాంకురం

బతులస్ఫూర్తి నెసంగె గర్భము నవవ్యాకోచపద్మాక్షి కిన్‌. (కవిరా. 2-3) అయికే పురుడు పోసుకున్నాక రెండునెలలు కళ్లుమూసుకొంటే చాలు! పురూరవుడు పుట్టాక ఆ బాలింతరాలితో బుధుడు కేళిసల్పాడట.

అది ఎంచడానికి అలవికానట్టే యీ ప్రబంధకవుల రతివర్ణ్షనలు ఎంచడం కూడా అలవికాదు. అయితే గుడ్డిలోమెల్ల! అబ్బయ్య మరీ తెలుగు మీరలేదు. కవిత్వం కొంచెం గూఢంగా ఉండాలని అతనికి తెలుసు. ఊర్వశి తన చెలికత్తెలతో జలక్రీడ చేసి సరస్సులోంచి తడిబట్టలతో బయటికి రావడాన్ని ఇలా వర్ణించాడు:

తడసిన వల్ల పయ్యెదలు దాకొని పైపయి నంటియుండగా

నుడువ నగోచరంబగు వినూత్నవిలాసన నొప్పెనప్పుడ

ప్పడతుల గుబ్బచన్సవలు ఫ్రొఢకవీంద్రులచే రచింపగా

బడు మృదుగూఢపాకరసబంధురకావ్యవచస్సమంబులై, (తవిరాజు, 4-10) తాను ప్రొఢ కవీంద్రుడననీ, తన కావ్యం మృదుగూఢపాక రసబంధురమనీ అబ్బయ్యకు బాగా తెలుసు. అయితే ఎవరికీ వారు మెచ్చుకొంటే చాలదు. అందుకే కృత్యాదినే ఇలా చెప్పాడు:

తను దా మెచ్చుకొనంగ నేటికి గవిత్వప్రాఢీ యాంధ్రీఘన

ఖినదాలంకరణార్థ సూచనల సంప్రీతిన్‌ మనోవీధులన్‌

జొనుపంగల్లిన నింపుతో విని రసజ్ఞుల్‌ మెచ్చినం జాలదే? (కవిరాజు, 1-18) ఈ పద్యంలో కూడా కవిత్వప్రౌఢీ “ఆంధ్రీఘనస్తన కుంభస్ఫురణ'లో ఉండాలని అబ్బయ్య సూచించాడు. బైచరాజు వెంకటనాథుడు చేసిన నిర్వచనమే అబ్బయ్య మనసులో టు లుం పాలు రప 4. _కళాపూర్ణోదయంలో సూరపరాజుగారు గీర్వాణ భాషాశ్లేష చెప్పారు (1-161). దాని వరవడిలో

అబ్బయ్య తూడా ఒకటి రచించాడు (కవిరాజ 4-176).

కొండవీడు బందరు సర్కారులు 947 పెట్టుకొన్నాడు.5 ఇటువంటి ట్రొడకవుల రచనలలో ఇది వర్తిస్తుంది కాని దురదృష్ట వళాత్తూ మన తెలుగు కావ్యకన్యకలు చాలామటుకు ఆహరేషనువల్ల ఆడవాళ్లయినవాళ్లే! గాలి ఓబళయ్య: ఇంగ్లీషు భాషలోని పండితులకు డాక్షరేటు బిరుదులు ఇసారు. శామ్యూల్‌ జాన్సన్‌ వంటి ఉద్ధండపండితులకు డాక్టరు బిరుదులు ఉన్నాయి. మన భాషలో తూడా భేషజంకల మహావిద్వాంసులు లేకపోలేదు. ఈ యుగంలోని భాషా భిషక్కులలో గొప్పవాడు గాలి ఓబళయ్య. ఈయనకు సంస్కృతంలో ఉడోలమైన పాండిత్యం ఊంది. బహుశా అందుకే తన తెలుగు యింటిపేరుగానీ, పేరుగాని నచ్చలేదు. ఆ రెండింటినీ సంస్కృతీకరించాడు. ఓబళయ్య అనే పేరును సులభంగా అహోబలపత్సి అని మార్చవచ్చునుగాని 'గాలి అనే పేరును ఏం చేయాలో తోచక ఒకసారి ' ప్రభంజనం వారని, కొన్నిసార్లు 'వాతూలి వారని పేర్కొన్నాడు. చరిత్రకారులితని పేరు గాలి నరసయ్య అన్నారు. అయితే తన పేరు కౌబళపండితుడని తూడా ఇతడే స్వయంగా చెప్పుకొన్నాడు. అయితీ ఇతని పేరు ఓబళశాస్త్రి ఓబయ్య అనడమే సముచితమని పండితుల ఊహ.” గుండ్లకమ్మతీరాన గోకనకొండవద్ద గాలివారు ఉండేవారు. ఓబయ్య తల్లితండ్రుల పేరు తెలియదు. చిన్నప్పుడే కన్నవారిద్దరూ పోతీ మేనమామల ఇంటో పెరిగాడు. అక్కడే విద్యాభ్యాసం చేశాడు. ఓబయ్య మేనమామ పేరు పోలూరి మాధవసోమయాజి. ఆయన పధ్నాలుగు విద్యలు నేర్చిన పండితుడు. అయితే మేనమామకన్నా ఓబయ్య నాలుగాకులు ఎత్కువ చదువుకొన్నాడు. తర్కం, వ్యాకరణం, ఉభయమీమాంసలు, కావ్యాలంకారాలు శౌపోసన పట్టాడు. వాటికి తోడు తెలుగు కవిత్వం చెప్పనేర్చాడు. కవిమహోపాధ్యాయ లీరుదు పొందాడు. మళ్లీ నన్నయభట్టే తన రూపంలో పుట్టాడని ఓబయ్య భావించాడు. నన్నయగారి సారస్యం, ప్రసన్నత, అక్షరరమ్యత కంచుకాగడాపెట్టి వెతికినా ఓబయ్యలో కనబడవు. ఇతడు కాళిందీకన్యాపరిణయం అనే ఆరాశ్వాసాల గ్రంథం రచించాడు. ఇతని కళ్లకు సర్వం ఛందోవ్యాకరణమయం. “చెలువకటి పాణీనీయంబుచెన్ను గాంచు అంటాడు. (1-176). కాళింది విరహాన్ని వర్ణిస్తూ 'నీకోర్కి యజ్ఞరచితకావ్యవైఖరి గాంచి హాస్యపరముగా నున్నది" అంటాడు (2-26). ఆడవారి వక్షోజాలు సహితం ఇతనికీ పుస్తకాలలాగే కనబడతాయి. కలయ ప్రసాదమొప్ప నధికస్ఫుటమై మధురత్వ మొంద గే వలపరుషస్వాభావపటుబంధము మీర సమస్తభూషణా వలులు దలిర్చ సర్వరసవాసిత గావ్యమునా జెలంగు నె చ్చెలివనుదోయి క్షిష్టతను జేకొనిమానదువో విసంధితన్‌___ (కాళింది 1-18) 6. ఆరవీటిరాజుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం ఇదే సంపుటి. ఓ అంధ్రసా! పరిష సంపుటి 15, సంచిక 2 పుట 4

948 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కాళిందీపరిణయంలో 1368 గద్యపద్యాలున్నా కనీసం వందకో పద్యమైన తెలుగు దేశంలో ప్రచారం పొందలేదు. గాలి ఓబయ్యను వ్యాకరణవేత్తగానే తెలుగు సాహితీపరులు ప్రస్తుతించుతారు. ఇతడు సంస్కృత భాషలో తెలుగు వ్యాకరణభాష్యం వ్రాశాడు. దానికి కవిశిరోభూషణం అని పేరు పెట్టాడు. అది అహోబలపండితీయం అని ప్రసిద్ధమైనడి బాలసరస్వతో, ఇంకెవరో నన్నయగారి పేర సూత్రాలు వ్రాస్తే ఇతడు అధర్వణాచారి పేరిట కారికలు వ్రాశాడు. ఆ సూత్రాలకూ ఈ కారికలకూ వ్యాఖ్యానం బ్రాశాడు. ఈ గ్రంథానికి సంస్కృత వ్యాకరణం గౌరవాన్ని ఇవ్వదలిచాడు. ఆ భాషలో సూత్రాలు చెప్పిన పాణిని ప్రథమాచార్భుడు. వార్తికాలు కూర్చిపెట్టిన వరరుచి ద్వాతీయాచార్యుడు. మహాభాష్యం వ్రాసిన పతంజలి తృతీయాచార్యుడు. ఈ పదవులు దృష్టిలో పెట్టుకొని నన్నయగారు ప్రథమాచార్యులనీ, అధర్వణుడు ద్వితీయాచార్యుడనీ అహోబలపతి పేర్కొన్నాడు. తాను పతంజలి అంతటివాడు. అహోబలపండితీయంలో గొప్ప పాండిత్య నిదర్శనలు కనబడతాయి. మొదటి పదిసూత్రాల వ్యాఖ్యానంలో తాను చదువుకున్నదంతా పిండి కుండల కెత్తాడు. ఈ పాండిత్యపానకం అలవాటుపడ్డవాళ్లకి రుచిస్తుందిగాని సామాన్యుల గొంతు దిగదు. అసామాన్యులకు కూడా అమ్మో అనిపిస్తుంది. అహోబల పండీతీయం చదువుకొని ఉన్న మతి పోగొట్టుకోవలెను అని గిడుగు రామ్మూర్తి పంతులుగారే అన్నారు.

ఉన్ను మతి పోయేలోపున ఇంకో కావ్యసీమకు పోదాం!

చింతకుంట కోదండరామయ్య: కొండవీటి దుర్గాన్నే కాక ఈ సీమలో మరి మూడు దుర్గాలను, పధ్నాల్లు దేశాలను గుంటుపల్లి ముత్తన్నగారు క్రీ.శ. 1623 దాకా పాలించారు ఆయన మహాదాత, గుంటుపల్లి ముత్తన్నగారి భార్య చింతగుంటవారి అడపడుచు. ఈ తరం నుంచీ రెండు కుటుంబాలలో పిల్లలను ఇచ్చిపుచ్చుకోవడం విరివిగా సాగింది ముత్తనగారి కొడుకు భాస్కరుడు కూడా చాలా ప్రసిద్ధుడు. గారడీ విద్యలో అఖండప్రజ్థి కలవాడు. విప్రవినోదులకు ఇతనిదే ఆచార్యపీఠం. సంస్కృత వ్యాకరణంలో అర్థశోధన చేసిన మహామనీషి అని తూడా పేరుపొందాడు. ఈ గుంటుపల్లి భాస్కరుని కూతురు మల్లమ్మను చింతగుంట సర్వన్నకు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు అయిదో తరంలో అంకన్న పుట్టాడు. అతడు కోదండరామయ్యను పెంచుకున్నాడు.

దత్తతవల్ల _ప్రసిద్దుల యింటిపేరు వచ్చినట్టే ఆలివంక చుట్టాలవల్ల కూడా చింతకుంట కోదండరామయ్య పేరు పొందాడు. తెలుగుదేశంలో శాశ్వత యశస్సు పొందిన ముష్ఫయిఇద్దరు మంత్రులలో రాయని బాచన్న ప్రముఖుడు. ఈ వంశంలో పుట్టిన వెంకట నరసయ్యగారి కూతురు రామమ్మను చింతకుంట కోదండరామయ్య వెళి చేసుకున్నాడు. కొడుకులను కన్నాడు. మనుమళ్లను ఎత్తుకున్నాడు.

కోదండరామయ్యగారిది సహజ పాండిత్యం. ఇతణ్జీ చాలామంది రాజొలు సన్మానించారు. సాటికవులకు తలలో నాలుకలాగా ఉండేవాడు. సుకవిజనవశీకరుడని

కొండవీడు బందరు సర్కారులు 949 కోదండరామయ్య చెప్పుకొన్నాడు. సరసులు మెచ్చుకొనేటట్టు సునందాపరిణయం అనే అయిదాశ్వాసాల కావ్యాన్ని వ్రాశాడు. సునంద ఖీమసేనుని కూతురు. ఈమెను ప్రదీపుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ కథను మూసప్రబంధంగా కోదండరామయ్య రచించినట్టుంది. దీనిప్రతులు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో మూడు వున్నాయి (0.893-895). ర చింతగుంట కోదండరామయ్య క్రీ.+ 1790 ప్రాంతాలలో ఉన్నాడని వీరేశలింగం గారు పౌరపడ్డారు.. అయితే క్రీ.శ. 1605-23 నాటి గుంటుపల్లి భాస్కరునికి అయిదో తరంలో యీకవి దత్తుడు కనుక క్రీశ 1750 ప్రాంతాలవాడని భావించవచ్చు. ఇతని కవిత్వం మొత్తంమీద రసవంతమై హృద్యముగానే యున్నదని అఖిప్రాయపడుతూ వీరేశలింగంగారు అయిదు పద్యాలు ఉదాహరించారు. నాయిక చెలికత్తెలతో ఇలా మొరపెట్టుకుంది. అన్నువులార నావలపు నంగడి పెట్టకురమ్మ చాలు మీ మన్నన లింక నన్ను బలుమారును వేడకురమ్మ ప్రాణముల్‌ కొన్ననవింటి దేవతలకు గొంకక ఇచ్చెద నమ్మ వాని నే మున్ను, రవంత పోవిడుట మోసము వచ్చె గదమ్మ బుద్ధికిన్‌. (సునంద-4) ఈ పద్యంలో నాయిక వేడుకున్నట్టు చెలికత్తెలు ప్రవర్తించారేమోగాని మన ప్రబంధకవులు అందరూ నాయికల వలపు అంగడీపెట్టినవాళ్ళే! కొండపల్లి ఏలూరు సర్కారులు ఆ౦ధ్రదేశపు సుప్రసిద్ధ దుర్గాలలో కొండపల్లి ఒకటి. ఈ జిల్లాకింద 24 మహళ్లు ఉండేవి. ఇవి పది సంస్థానాలకి చెల్లుతూ ఉండేవి. వీటిలో చెప్పుకోతగ్గవి నూజీవీడు, దేవరకోట సంస్థానాలు. నూజివీడు సంస్థానమే పంపకాలవల్ల చిల్లర జమీందారీలుగా విడిపోయింది. బెజవాడ, మైలవరం, వరిగొండ, నందిగామ, లింగగిరి మొదలైన చిన్న సంస్థానాలు కూడా కొండపల్లి సర్కారులో ఉన్నవే. ఒక్క నూజివీడులో తప్ప ఇతర సంస్థానాల వాళ్లు ఈ యుగంలో సాహిత్యపోషణ చేసినట్టు యిప్పటివరతూ దొరికిన ఆధారాలవల్ల చెప్పలేం. నూజివీడు సంస్థానంలో ఒక్క కొండపల్లి మహతళ్లేకాక ఏలూరు సర్కారులోని మహళ్లు కూడా చేరాయి. నిజానికి ఈ సంస్థానానికి ముఖ్యపట్టణమైన నూజేరు ఏలూరు సర్కారులోనే ఉంది. నూజివీడు కాక మరి మూడు జమీందారీలు కూడా ఏలూరి ఫౌజుదారికి అణకువగా ఉండేవి. మొగలితుర్రు, చింతలపూడి, తెలికిచర్గవంటి దేశముఖీలుకాక ఒలందావారి పొలాలు కూడా ఏలూరు పరగణాలలో ఉండేవి. నాడా 8. ఆంధ్రకవుల చరిత్ర, ౩3వ భాగం, పుట 179.

950 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

సాహిత్యపోషణ చేసిన నూజివీటి ప్రభువులలో మేకా నరసప్పారావుగారు ప్రముఖులు. ఈయన నూజీవీడు నగరాన్ని నిర్మించిన ఇమ్మడీ విజయ అప్పారావుగారి మనుమడు. క్రీ.శ. 1698 తరువాత నరసప్పారావుగారు తఖ్తుమీదకు వచ్చారు. ఈయన దిట్టకవి పాపరాజు అనే కవికి పెద్దమద్దాలి (గ్రామంలో 150 కత్తుల మాన్యం ఇచ్చారు. ఈ కవి 'రామకథాసారసంగ్రహం' రచించాడు.! కుమూర ధూర్జటికి కూడా నరసప్పారావు గారే పోషకులు. నూజివీటి వంశావళిలో ఇద్దరు విజయష్పారావులు ఉన్నారు. వాళ్లలో రెండోసారి మనుమడి కాలంలో కుమార ధూర్జటి ఉన్నాడని ఇంతతు ముందు చెప్పుకొన్నాం.*

తుమారధూర్జటివంటి కవులనేకాక కాకరపర్రులో ఉండే పండితులను కూడా నరసప్పారావుగారు పోషించారు. మధుర, తంజావూరు వంటి దక్షిణరాజ్యాలనుండి అనాడు చాలామంది పండితులు వలస వచ్చి నూజివీడు సంస్థానానికి చెందిన గ్రామాలలో స్థిరపడ్డారు. కాకరపగ్రులోని పండితులకు ఆరామద్రావిడులని పేరు వచ్చింది. వీరిలో అణివెళ్లవారు ప్రముఖులు. వారికీ చెరుతూరివారనే ఇంటిపేరు ఉండేది అాబోలు.

అణీవెళ్ళ వెంకటశాస్త్రి: కాకరపగ్రులోని ఆణివెళ్ళ యజ్ఞనారాయణకు మంచి సాహిత్యజ్ఞానం ఉంది. క్లిష్టమైన శ్లేష కవిత్వానికి అర్థం చెప్పగలడు. ఇతని కొడుకు వెంకటశాస్త్రి ఉద్దండ పండితుడు. ఛందస్సు, సాహిత్యమే కాకుండా మీమాంసా జ్యోతిషాలలోనూ మంచి సర్వతోముఖ పాండిత్యం సంపాదించాడు. చిన్నప్పుడే వేదం చదువుతున్నాడు. శ్రౌత సూత్రాలకు భాష్యం వ్రాశాడు. ఈ పాండిత్యాలతోపాటు వెంకటశాస్త్రికి కవితా ప్రజ్ఞ కూడా ఉంది. సంస్కృతంలో చిత్రబంధ రామాయణం అనే విడ్త్డూరమైన రచన చేశాడు. ఎన్నో గారడీ ఫీట్లతో వెంకటశాస్త్రి చేసిన ఈ రచనను సామాన్యుడేకాదు, తగు మాత్రపు సాహితీపరుడు కూడా అర్థం చేసుకోలేడు. బోలెడన్ని బంధాలతో అడుగడుగునా యమకాలతో ఇబ్బంది పెట్టే ఈ కావ్యం నలుగురికీ బోధపడాలని యజ్ఞనారాయణే స్వయంగా వ్యాఖ్యానం వ్రాశాడు. తండ్రే వ్యాఖ్యానం బ్రాయవలసిన గడ్డు కావ్యాన్ని వ్రాశాక అణివెళ్ల వెంకటశాస్త్రి కీర్పి బాగా విస్తరించింది. చూజివీటి నరసప్పారావుగారి ప్రాపకం దొరికింది. ఆయనకు అంకితంగా '“అప్పారాయ యశశ్చంద్రోదయం' అనే అలంకార గ్రంథాన్ని వ్రాశాడు. ఇది సంస్కృత కావ్యమైనా ఇందులోని బంధ కవిత్వంలో కొన్ని తెలుగు మాటలను వెంకటశాస్త్రి జొప్పించాడు. ఒక సంస్కృత శోక బంధంలో “నృసింహా పరాయః పది కత్తుల భూమితేః” అనే తెలుగు డిమాండు దాక్కుని ఉంది. ఈ కొంటె కోరిక విన్నాక నరసప్పారావుగారు 'పదికత్తుల భూమేనా, ఒక భట మాన్యమే ఇస్తాను' అన్నారు. వల్లూరు పల్లెను అగ్రహారంగా అణీమ్లో వారికీ ఇచ్చారు. ఇది క్రీ.శ. 1735లో దానం చేసినట్టు కనబడుతుంది. ఈ దానమిచ్చిన

  1. శ్రీమదప్పారాయాన్వయ చరిత్రము - ముదిరాజు సుబ్బారావుగారు, పుట 2. అధోజ్ఞాపికు
  2. నాయకరాజుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి.
  3. తెలుగు 'పరాశరీయహోర' - దువ్వూరి జగన్నాథశర్చ్హు ప్రస్తావన పుట ౫61

కొండపల్లి ఏలూరు సర్కారులు 951 కొద్దికాలానికి నరసప్పారావుగారు పోయి ఉండాలి. వారి తమ్ముడు శొబ్బన్నగారు కొన్ని ఇబ్బందుల పాలయ్యారు. క్రీ.శ1732 నుండి ఫొజుదారుగా వచ్చిన రుస్తుంఖాన్‌ ఉతర సర్కారులలో ఉన్న సంస్థానాధిపతులను నానావిధాలా హింసించాడు. ఇతడు పగబటిన పాలకులు శంకరగిరి మాన్యాలకు పోయి తలదాచుకొన్నారు. 12 స శ నూజివీడు సంస్థానం మహమ్మదీయుల చేతిలో పడింది. గామి ౧ చంవక్సరాలపాటు

ప్రభువు ఇచ్చిన అగ్రహారాన్ని అనుభవించడానికి నోచుకోక అణివెళ్ల వెంకటశాస్త్ర కింగసీమకు పోయాడు. అక్కడ దార్గ్లపూడి పరగణాలలో చింతలపాటి వారి ఆశ్రయం లఫీంచింది.

నేటి విశాఖ జిల్లా సర్వసిద్ధి తాలూకాలో ఉన్న బోయగాల్లాం గ్రామంలో అజీప్లో వెంకటశాస్త్రి స్థిరపడ్డాడు. చింతలపాటి నీలాద్రిరాజు సహాయంతో పెద యజం చేశాడు. వేద పండితుడు, బ్యోతిర్వేత్త, చిత్రబంధకవిత్వాలు చెప్పే జాణ, పైగా యజ్ఞం చేసినవాడు కనుక వెంకటశాస్త్రికి ఆ పరగణాలో పలుకుబడీ హెచ్చింది. అతేని ప్రభావంలో పడిన నీలాద్రిరాజు తెలుగు కవులను, అందులో ముఖ్యంగా కూచిమంచి జగ్గన్నును చిన్నచూపు చూశాడు. ఈ కక్ష మనసులో పెట్టుకొని జగ్గన్న తన చంద్రరేఖా విలాపంలో వెంకటకాస్త్రిని విలన్‌గా చిత్రించాడు. విరోధి కలంపోటు వెన్నులో పడినా వెంకటకాస్త్రి వైదుష్యానికేం ఢోకా లేదు. అతడు సంస్కృతంలో బహు గ్రంథకర్త ఈయన తెలుగులో వ్రాసిన గ్రంథాలేవీ బయటపడక పోయినా ఇతని ముని మనుమడు అణీవెళ్ల సీతారాముడు జానకీ పరిణయం అనే ఆంధ్ర శతకం రచించాడు. దానిలో ఇతని సంగతి చెప్పాడు.

నిజానికి అణివెళ్ల వారి గురించి ఇంకా చర్చ జరగాలి. ఇప్పటికి జరిగిన కొన్ని పరిశోధనలు చాలా ప్రమాదభరితాలుగా ఉన్నాయి. వెంకటశాస్త్రి తండ్రీ పేరు యజ్ఞనారాయణ. సంస్కృత సాహిత్యంలో మరొక యజ్ఞనారాయణ దీక్షితులు ఉన్నాడు. ఆయన తంజావూరు రఘునాథనాయకుని శిష్యుడు. గోవిందదీక్షితులుగారి కుమారుడు సాహిత్య రత్నాకరం మొదలైనవి వ్రాశాడు. తంజావూరులో ప్రసిద్ధుడు. అణివెళ్ళవారు తంజావూరు ప్రాంతాలనుండి వచ్చారు. అందుచేత ఇద్దరు యజ్ఞనారాయణులూ ఒకరే అని ఓక పరిశోధకుడు భ్రమపడడం జరిగింది* మరొక పరిశోధనా పరమేశ్వరుల ఆమోదముద్ర దానిమీద పడడం తూడా జరిగింది. అయితే ఈ ఇద్దరూ కూడా చారిత్రక కాలాన్ని విస్మరించారు. గోవింద దీక్షితులవారు మూడు తరాల నాయకరాజులకి ముఖ్యమంత్రి. ఆయన మంత్రాంగం క్రీ.శ 1565 నుంచి కనబడుతుంది. అప్పటికాయనకు ముప్ఫయి. సంవత్సరాలకి తక్కువ ఉండదని భావించాలి. యజ్ఞనారాయణగారి పెద్దకొడుకు బహుశ క్రీ.శ. 1565లోనే పుట్టి ఉంటాడు. క్రీ.శ 1600 ప్రాంతాలలో సాహిత్యరత్నాకరం వ్రాసి ఉంటాడు. ఇంక ఆణివెళ్ళ వెంకటశాస్త్రి క్రీ.శ 1735లో 6 మగ పరాణేయమోూర అనే గ్రధులో దవ్వ్యర్‌ వగ్నార శ్కగాడు ఈ ప్రమాదాన్ని ఇచ్చి

రు, ఓ ఆ గ్రంధానికి పీఠిక బ్రాస్తూ నిడుదవోలు వారీ తప్పుని ఆమోదించారు.

952 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుత్ర వల్తూరుదానం స్వీకరించారు. అతని తండ్రీ 1730 దాకా జీవించి చిత్రబంధరామాయణ వ్యాఖ్యానం వ్రాసి ఉంటాడు. క్రీశ 1600 ప్రాంతాలలో సాహిత్యరత్నాకరం వాసీన యజ్ఞనారాయణే క్రీ.శ. 17356 వల్లూరుదానం పొందిన వెంకటశాస్త్రి తండ్రీ అని ఎం ప్రబంధ పరమేశ్వరులు చెప్పినా అది సత్యానికి 135 సంవత్సరాల దూరంలో ఉంటుండి అణీవెళ్ళ వెంకటశాస్త్రికి కూచిమంచి జగ్గన్న ఒకరకంగా అపకారం చేస్తే తెలుగ పరిశోధకులు చారిత్రక క్రమాన్ని గుర్తించక మరొక రకం అపకారం చేశారు. ఆధుని॥ పరిశోధన పద్ధతులు వ్యాపీంచిన ఈకాలంలోనే ఇలాంటి ప్రమాదాలు జరగ్గాలేన్సిద్రి రెండువందలా ఏభై సంవత్సరాల క్రిందట కట్టుకథలకు చరిత్ర కట్టుపడీపోవడ్రం వింతకాదు. కొండపల్లి ఏలూరు సర్కారుల దగ్గిరే మరొక కవి తెలుగు చరిత్రలోన్సి అభూతకల్పనలకు తానూ ఒక్కటేమిటి, నాలుగు సమిధలు ఆహుతిచ్చాడు. అతని పేవ బాణాల శంభుదాసు. అతని కావ్యం సారంగధరచరిత్ర, బాణాల శంభుదాసు; ఆంధ్రదేశంలో సారంగధరచరిత్ర చాలా ప్రసిద్ధమైనది ఆదిలో గౌరన తన నవనాథ చరిత్రలో కథనం చేశాడు. ఈ ద్విపద కావ్యాన్ని ఆధారంగా చేసుకొని చేమకూర వెంకటరాజుగారు పద్యకావ్యాన్ని బ్రాశారు. ఈ రెండింటినీ దగ్గిర పెట్టుకొని బాణాల శంభుదాసు మళ్ళా ద్విపద కావ్యంగా సారంగధరచరిత్ర థాశాడు. చేమకూర వెంకటరాజుగారిని అనుసరించాడు కనుక శంభుదాసు క్రీశ 140 తరువాతవాడని చెప్పవచ్చు. ఇతని ద్వాపద కావ్యానికి 14 ప్రతులు ప్రాచ్యలిఖిత భంథాలయంలో ఉన్నాయి. వీటిలో కొన్ని బ్రౌనుదొరగారు వ్రాయించినవి. ఆయన తయారు చేయించిన మొదటి ప్రతి కాలం క్రీ.శ 1827. చేమకూర వెంకటరాటజుగారికీ బ్రౌను దొరగారికీ గల మధ్యకాలంలో ఎప్పుడో బహుశా క్రీ.శ 1750లో బాణాల శంభుదాసు ఉండి ఉంటాడు. ఇతని కాలాన్ని యిదమిత్ధంగా నిర్ణయించలేకపోయినా ఇతని (గామాన్ని మాత్రం చెప్పగలం. బెజవాడ దగ్గిర ఉన్న కొండపల్లి ప్రాంతాలలో శంభుదాసు ఉండేవాడు. “పరమాత్ముడగు కొండపల్లి గోపాలవరలబ్ధంబుగ గవిత్వప్రొడీ మెరసినవాడ'నని చెప్పుకొన్నాడు. '*తగుభంగి సారంగధరచరిత్రను వ్రాశాడు. తన కృతికి చేమకూర అప్పనగారి కావ్యం ఆధారమని గ్రంథం చివర ప్రకటించాడు. ఈ _సారంగధరచరిత్ర అచ్చుపడింది అయితే వ్రాతప్రతులలోని గద్యకూ, వేదంవారు అచ్చువేసిన గద్యకూ చేడా ఉంది. గద్యలలోనేకాక గ్రంథంలోని పాదాలలో కూడా చాలా తేడాలున్నాయి. పాఠభేదాలేకాక కథాంశభేదాలు ఠతూడా ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు శంభుదాసు వ్రాసిన ద్విపద కావ్యంపైనా, ముఖ్యంగా సారంగధరునిచరి త్రపైనా టౌనుదొరగారు చాలా పరిశోధన చేశారు. పాశ్చాత్య వాబ్బయంలో ఇలాంటి పోలికలు గల కథలు ఏమేమి ఉన్నాయో నోటు చేశారు (90.1793).

కొండపల్లి ఏలూరు సర్కారులు 953

పాశ్చాత్య వాబ్బ్మయంలోని కథలనేగాక తెలుగులో ఉన్న అన్ని సారంగధర కథలను కూడా బౌను దొరగారు పరిశీలించి శంభుదాసు రచనపై ఇలా అభిప్రాయాన్ని వ్రాశారు.

సం ?0ల౧, కల 5జయంంయజంయటరం, ారతిరేత, 6 ౧౧లల్వీ, & గంఘంగి 0 ఉత నవనాథచరిత్ర *[౧బజా కం కంగు ఏ 0౯64ల 106 ౯ & కంటం కుకీ: 2 ఈ4 ౧౯6౧1 ౪00006 జ ఏ ౧౮౦౧ 2000141064 జంరే ఏ 105 ౧1౭8900. (042 0జి జం 00గాం౪ల6 గంగ ఆంజ 9 ౧౦౪౧ నవనాథచరిత్ర ౪౫౦౦౪ జటం04866ంలులట అటు కతిణరే 88 తి ౧8౧౧౯ ౦౦64౩ 9 04 185 ౧౭66 0 5జ00064'9 ౧౦౭౧౫.

  1. 1 406 1౬ ౧866 ౦1 46 ౧౦౯౫. భూతల ౧౦6౦6, ఉల బుకుం? ౦౧0) తయం041టబంజి శం ౧౭ [8 ౦0౧౧౧866 03 ఇ తరేంండం? ౦ ౦ల౫ఖేర/8 గంగంజగ8'5 5822003608 యజగతి 0క ఉంజ ౧01 8 జ] గాలాడం౧ జరనంం్ర తం 00208 0 [ఏ 90ల౧ (0. 1203).

గౌరన నవనాథచరిత్రలోని ప్వ్పాపదపాదాలను, శంభుదాసు రచననూ సరిపోల్చి చూస్తే ట్రౌనుదొరగారి అభిప్రాయం రైటే అనిపిస్తుంది. అడవిలో సారంగధరుడు కనబడకపోయినా అతని నెత్తురుచిన్నాలు చూసి రత్నాంగి ఇలా విలపించినట్టు గౌరన

కొడుక చిట్టాడింపగోరి నిన్నైలమి - నడుగిడుమనెడి నీయడగులీవయ్య

తటుకన రమ్ము నాతండ్రీ నీ వనుచు - జిటికెలు వెట్టు నీచేతులీవయ్య

ఒత్తిన చన్నిచ్చి యోమిన మేని - నెత్తురా యీకొత్తనెత్తు రోయన్న

(నవనాథ 2 పుట 91)

ఈ ద్విపదపాదాలను శంభుదాసు ఇలా అనుకరించినట్టు కనబడుతుంది.

రహిమనిఇప్పుడా రత్నాంగిదేవి - మహిమీద బ్రాలి కుమారయ్యెయ్యె

చనుబాలధారలు చనువుగాగొన్స- తనువులోపలి రక్సధారలాయివియు

బారావతము వెంబడి వీధులందు- బారాడు నీమృదుపదము లాయివియు

దలితండ్రులే యిష్టదైవంబులనుచు - జెలువారగా మొక్కు జేతులాయివియు

(సారంగ ౩3-231 నుండి)

ఈ పోలికలు యిలా కనబడుచున్నా నిజానికి 'శంభుదాసు వీటిని చేమకూరవారి సారంగధర నుంచి కూడా తీసుకొనడానికి ఆస్కారం ఉంది (పద్యసారంగధర ౩3-245), నవనాథచరిత్రలోని వర్ణనలూ, వోషాలూ కొన్ని చేమకూరవారి పద్భుకొవ్యంలో కనబడతాయి. అవి యథాతథంగా. శంభుదాసు ద్విపదలో కూడా ఉన్నాయి. సారంగధరుడు ఎగిరిపోయిన పావురాన్ని పిలవడం, సంగడీలు కంటికి ఓరచెయ్యి పెట్టుకోని హౌడిడం. మొదలైనవి నవనాథ చరిత్రలో లేవు. చేమరూరవారి కావ్యాన్ని చూసి శంభుదాసు వ్రాశాడు. ఇలాంటి పోలికలు ఎన్నయినా ఉన్నాయి. అయితే గౌరనగాని, చేమకూరవారుగాని చెయ్యని కల్పనలు శంభుదాసు కథలో కూడా చేశాడు.

954 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి . శంభుదాసు చిత్రాంగిని సాధారణంగా చంపించలేదు. కత్తికింతంత కండలు కోయించి ఉప్పుపాతరలో ఉంచి ఆ తరువాత కనబడకుండా పైన మన్ను కప్పించాడు. ఇంత కసిదీరా చంపించినా శంభుదాసు చివర ఒక అద్భుతం చేయించాడు; సారంగధరుడు సిద్గుడై తిరిగి వచ్చాడు. తల్లితండ్రులను చూశాడు. అందరి యోగక్షేమాలు అడిగాడు. “చిత్రాంగి ఏదీ అని అడిగాడు. ఆమెకు పట్టిన గతికి 'అయ్యో పాపం” అనుకొన్నాడు. “ఆ నుయ్యి ఎక్కడ' అని అడిగాడు. అక్కడకు వెళ్లాడు. సంజీవకరణి మోపి చిత్రాంగిని బ్రతికించాడు. ఆమె దిగ్గున లేచివచ్చి మొక్కింది. మృతిని బొందినచోటి మృత్తిక దెచ్చి - సతిని గావించెను సారంగధరుడు అపరాధిని యటంచు నామెబోనీక-యుపకార మొనరించెనుర్వి హాయటంచు

  • . (ద్విప.సారం. 3౩-479 నుండీ) సారంగధరుడు చేసిన ఉపకారాన్ని జనులు సన్నుతించారు. శంభుదాసు చేసిన యీ మార్పుకి పాఠకులు అబ్బురపడతారు. అయినా సారంగధరచరిత్ర ఉన్నంతకాలం చిత్రాంగి బ్రతికే ఉంటుంది. తుమ్మలపల్లి నాగభూషణం: మన సాహిత్యంలో కలకాలం నిలిచే పాత్రలు కొన్ని ఉన్నా బతకని కావ్యాలూ, (బతుకుతున్నా కొనప్రాణంతో ఉండేవీ చాలా ఉన్నాయి. వాటిలో తుమ్మలపల్లి నాగభూషణం వ్రాసిన కావ్యాలు రెండు కనబడతాయి. బసవవిజయం అనే మూడాశ్వాసాల కావ్యాన్ని సోమవారవ్రతమాహాత్మ్యుం అనే ఏకాశ్వాస కావ్యాన్ని ఇతడు రచించాడు. మొదటిది అచ్చుపడింది. రెండోది ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. రెండింటిలో ఒకే పద్యాన్ని వ్రాసి నాగభూషణం తన సంగతి ఆంధ్ర దేశంబునందున నమరియున్న- ప్రాభవంటైన గుడివాడపట్టణమున- ప్రకటింతబై. తుమ్మలపల్లివంశ-సంభవుండను నాగభూషణుడ నేను. (2.744) కవి ఇంత ' స్పష్టంగా తన ఇంటిపేరు చెప్పుకొన్నా వీరేశలింగంగారు ఏ కారణంవల్లనో ఇతని. ఇంటిపేరు మల్గంపల్లివారని మార్చారు.” ఇతడు శ్రీ.41740 ప్రాంతాలవాడని నిర్ణయించారు. ఇతని బసవవిజయం ఒక్కటే వారికి దొరికింది సోమవార మాహాత్ముం ఇంకా అముద్రితం. తుమ్మలపల్లి నాగభూషణం రచించిన బసవవిజయాన్ని నల్లగండ్ల నాగనాథం అనే కవి ద్విపదగా మార్చాడు. అతడు కౌసలనాడులోని పొట్లచెరువు సీమవాడు. తుమ్ములపల్లివారి పేరెక్కడా ద్విపదలో చెప్పలేదుగాని పూర్తిగా పద్యకావ్యానికీ ద్విపద కాపీ. అయితే నాగభూషణం పద్యాలే ఏమంత గొప్పగా లేవు. వాటి ననుసరించిన ద్విపదలిక చెప్పాలా! .... ఈ రెండు దొందుకు దొందే.

ప్రోలునాటి కవులు నేటి తూర్పు గోదావరి జిల్లాలోని మరీ తూర్పు భాగాలను *ఫ్రోలునాడు అని పిర్కొనేవారు. క్రీ.శ1084 నుంచీ ఈ పేరు ప్రచారంలో ఉన్నట్టు శాసన ప్రమాణం కనబడుతున్నది. * అత్యంత ప్రాచీనమైన ఈ పేరు నేటికీ వ్యాప్తిలో ఉంది. అయితే ప్రజల నోళ్లలో పడీ అది పొర్గునాడుగా మారింది. పెద్దాపురం, కాకినాడ, పిఠాపురం, తుని ప్రాంకాలు కలిసి ప్రోలునాడుగా ఏర్పడ్డాయి.

ఈ సీమలో పెద్దాపురం, పిఠాపురం సంస్థానాలు చరిత్ర కల రాజ్యాలు. అవి ఒక చెట్టున పండీన రెండు తీయని పళ్లు. ఆనాటి ఆంధ్ర రాజకీయాలలో ఈ రెండు సంస్థానాలూ ప్రముఖ పాత్ర వహించాయి. పరస్పరం హార్థికంగా, ఆర్థికంగా సహసరిహద్దు తగాదాలు లేక సఖ్యంగా ఉండేవి. పెద్దాపురం రాజులు పిఠాపురం దొరకు పెళ్లి సంబంధాలు శుదిర్చారు. గ్రామాలను పెళ్లి కానుకలు చేశారు. రాజకీయాలలో ఈ రెండు సంస్థానాలు సృష్టించిన చరిత్ర అలా ఉంచి అవి చేసిన సాహిత్యసేవ అనల్బం. ఎందరో కవులను పోషించి ఎన్నో కృతులు నిర్మింపజేసిన ఘనత ఈ రాజ్యాలకు దక్కింది. ఈ యుగంలో ఏయే ప్రభువులు ఎన్నాళ్లు పాలించారో ముందు తెలుసుకొంటే ఏయే కవులు ఈ కాలంలో ఉన్నదీ తరువాత విశదపరచుకోవచ్చు.

పెదాపురం పిఠాపురం

  1. సార్వభౌమ తిమ్మరాజుగారు (క్రీశ 1649-) | రామచంద్రరాయణింగారు (1447-71) /

2 ఉద్దండ రాయపరాజు పెదమాధవరాయణింగారు (1%- 1714 పైవారి తమ్ములు) (1671-1704)

౩ ముమ్మడీ తిమ్మరాజు (1714-34) నరసింహ రాయణీంవారు

(170%4-20 ఫైవారి తమ్ములు)

  • ఫైవారు పోయినదగ్గిరనుంచీ అరాచకం, వెంకటరాయణింగారు (3720-28) ఫా 1734 నుండీ 1749 దాకా పదహారు సంవత్సరాలు | కుమాళ్లు) వీరు అపుత్రకులు. అంచేత వీరి రుస్తుంఖాను పాలించాడు. తరువాత ముత్తాతగారి మనుమడు బుచ్చారాయణీిం వారసులు జగపతిరాజు విజయనగరంలో గారు రాజ్యానికి వచ్చారు. పెరుగుతున్నారు.

5 జగపతిరాజుగారు (1749-58) బుచ్చారాయజీంగారు (1728-59) వీరు

బాలురు. అందుచేత జ్ఞాతులు రాజ్య సంరక్షకులయ్యారు. జనార్ధనరావుగారు రాయణింగారు కొన్నాళ్లూ పాలించారు.

ఓ నాలుగవ ౮+ఎ'గారు (1760-97) చినమాధవరాయణింగారు (1753-61)

ఈ _పట్టికవల్ల క్రీ.శ. 1650 నుండి 1760 దాకా నూటపదేళ్లలో ఇటు పెద్దాపురంలోనూ, అటు పిఠాపురంలోనూ చెరో ఆరుగురు ప్రభువులు కనబడుతున్నారు. వీళ్ల ఏలుబడీలో ఉన్న కవుల గురించి చెప్పుకొందాం. కం తనటక నే మునక తపు మం కన కస

  1. దక్షిణభారత శాసన సంపుటి, 4వ భాగం, శా.స. 1015.

2 ప్రాచీనాంధ్ర భూగోళం - కుందూరి ఈశ్చరదత్తుగారు, పుట 234.

956 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

కూచిమంచి తిమ్మయ్య: పౌర్గువాడు గర్వించదగ్గ ప్రాచీన పట్టణం పిఠాపురం. ఈ రాజధానికి చేరువలో కందరాడ అనే గ్రామం ఉంది. దానికి కూచిమంచివారు కరణాలు, వారు స్థితిమంతులు, నెరదాతలు. కూచిమంచి గంగన్న స్వయంగా సాహిత్యవిద్యా ప్రవీణుడో కాదోగాని నిరంతరం కవులకు, విద్వాంసులకు, భభ్రాజులకు దానం చేసే విద్యలో మటుకు పరాయణుడు. ఈ గంగన్న తమ్ములు అన్నదానంలో అంధదెవేసీన చేతులు. తూచిమంచివారి లోగిట్లో ఎందరో కవులూ, పండితులూ విస్తరిచేసి తాము విందులు భోంచేసి యింటివారికి సాహిత్య విందులు పెట్టివుంటారు. ఈ సాహిత్య సంతర్ప్చణలో కూచిమంచి గంగన్నవారి పెద్ద కొడుకు తిమ్మయ్యా, మూడోవాడు జగ్గన్నా దోసిళ్లకొద్దీ సారస్ప్వతామృతం జుర్రుకొని ఉంటారు. వాళ్లలో సాహిత్యపిపాస జనించింది ప్రబంధాలలోని ప్రాచీనధారలు గొంతుకదాకా గ్రోలారు. కవిత్వం అబ్బింది.

తూచిమంచి తిమ్మయ్య ఏ సంవత్సరంలో పుట్టాడోగాని క్రీశ 1715 నాటికి ఒక శృంగారకావ్యాన్ని పూర్తిచేసి నేర్చు వచ్చింది. దానిపేరు రుక్మిణీ పరిణయం. ఈకావ్యాన్ని అతడు క్రీ.శ 1715లో పూర్తిచేసినా పదకొండు సంవత్సరాలకు పూర్వమే ప్రారంభించి ఉండాలి. ఏమంటే దీని అవతారికలో తిమ్మయ్య పిఠాపురాన్ని వర్ణించాడు. అది “రావుమూధవనృపపరిరక్షితంబు, భోగనికరంబు' అని చెప్పాడు (1-24). అయితే పీఠాపురాన్ని క్రీ.శ. 1715లో మాధవరాయణింగారుకాక వారి తమ్ముడు నరసింహ రాయణింగారు పాలిస్తున్నారు. పెదమాధవరాయజణింగారు క్రీ.శ. 1671-1704 దాకా రాజ్యం చేశారు. రుక్కిణీపరిణయం అవతారికను తిమ్మయ్య విధిగా 1704కు ముందే ప్రారంఖించి ఉండాలి. అప్పుడతడు నూనూగుమీసాల వయసువాడు కావచ్చు. పుట్టింది కందరాడ గ్రామంలోనైనా యౌవనం రాగానే తిమ్మయ్య పిఠాపురంలోనే ఎక్కువ కాలం గడీపినట్టు కనబడుతుంది. కవులూ, పండితులూ ఉండే రాజధానిలో ఉండాలని ఏ యువకుడైనా భావిస్తాడు. తిమ్మయ్య యువకుడేకాక భక్తుడు. పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి అతని ఇష్టదైవం. అతడు 'దేవతా సార్వభౌముడు. అందుకే తన భక్తునికి కవితాసాయ్రాజ్బుధురంధరత్వాన్ని మొదటి కావ్యంనుంచీ ఇచ్చేశాడు. దేవుడు 1716లో ఈ పదవిని ఇచ్చినా మరో మూడు పుష్కరాలు గడిచాక కాని తిమ్మయ్యకు కవి సార్వభౌముడనే బిరుదాన్ని పిఠాపురం రాజులు ఇవ్వలేదు. 1750లో తిమ్మయ్య రసికజనమనోఖిరామం అనే పిల్లవసుచరిత్రను రచించాడు. అందులో "“రావునీలాద్రి మాధవ రాయనృపతిచేతం గవిసార్వభౌమ విఖ్యాత బిరుద మందిన ఘనుండ' అని చెప్పుకొన్నాడు (1-26). ఈ రాజుగారిని చిన్నమాధవరాయణింగారని పిలుస్తారు. తిమ్మయ్యకు బిరుదు యిచ్చినప్పుడు ఈయన యువరాజు; 1759లోగాని రాజ్యానికి రాలేదు. అప్పటికి తిమ్మయ్య మరణించి ఉంటాడు.

క్రీ.శ 1704లో పెదమాధవరాయణిరగారు రాజ్యం చాలించే రోజుల్లో శ్రీకారు చుట్టి క్రీశ 1759లో చినమాధవరాయణింగారు. రాజ్యానికి వచ్చే తరుణంలో కన్నుమూసిన కూచిమంచి తిమ్మయ్య తన 56 సంవత్సరాల సాహిత్యజీవితంలో 3. _రసికజనమనోఖిరామం, 1-10

ఫ్రోలునాటి కవులు 957 15 కావ్యాలు వ్రాశాడు. వీటిలో ఒకటి లక్షణగగ్రంథం, ఒకటి ద్విపద కావ్యం, ఒకటి దండకం, మూడు శతకాలు, తొమ్మిది పద్యకావ్యాలు ఉన్నాయి. ఈ పద్యకావ్యాలలో రెండు పూర్తిగా అచ్చ తెనుగువి. తన రచనలలో ఏడు గ్రంథాల చివర వాటినెప్పుడు పూర్తిచేసినదీ తిమ్మయ్య స్పష్టంగా పేర్కొన్నాడు. తన చిట్టచివరికావ్యం శివలీలా విలాసంలో తాను వ్రాసిన పది గ్రంథాల పేర్లు చెప్పాడు. తిమ్మయ్య చెప్పిన విడిదండకాలు తప్ప మిగతా రచనలన్నీ దొరుకుతున్నాయి. రమారమి అన్నీ అచ్చుపడ్డాయి. ఒక్క కృష్ణ దండకం అముద్రితంగా ఉండిపోయింది. దీనితో కలుపుకొని తిమ్మయ్య రచనల జాబితా ఇలా తేలుతుంది. కాలం__| పరు | వివాలు 1 1755 రుక్కిణీపరిణయం అయిదాశ్వాసాల కావ్యం. దీనిని తిమ్మయ్య క్రీశ 1704కు ముందే ప్రారంభించి ఉండాలి. రచన ఇదే. కై = కృష్ణదండకం తాను చాలా దండకాలు రాశానని చెప్పినా మిగతావాటి పేర్లు, వివరాలూ తెలియవు. ఈ కృష్ణదండకం అముద్రితం. 2924 (1 శీ చా చిరవిభవశతకం భక్తీశతకం. ఎక్కువ శైవగాథలు ఉన్నాయి. క్‌ సా సింహాచలమాహాత్మం ప్రబంధం. టా నీలాసుందరిపరిణయం అచ్చతెనుగు కావ్యం. దీని తెలుగు పేరు నీలపెండ్లికత. గ ఆ అచ్చ తెనుగు రామాయణం | ఆరుకాండల గ్రంథం & క్రీశ 1723 సారంగధరచరిత్ర ద్విపద. చాలాచోట్ల ఇథిలం. ఏ 1729 భరశతకం శైవకథలే కొక లోకనీతులు ఉన్నాయి. జ. సాగరసంగమాహాత్మ్యం ప్రబంధం. బ్రహ్మకైవర్త పురాణంలోని కథ. 11 78 సకలలక్షణసారసంగ్రహం | లక్షణగ్రంథం. . ౪౭ 1790 | రసికజనమనోఖిరామం అరాశ్వాసాల శృంగార కావ్యం ఇ 7% | సర్బపుర మాహాత్వుం మూడాళ్వాసాల కావ్యం జ 708 శివలీలామాహాత్మ్రం 31 రోజుల్లో చెప్పిన చిన్నకావ్యం క కుక్కుటేశ్వర శతకం అసంపూర్ణం. 92 పద్యాలే ఉన్నాయి. రచనలు చేసినా వీటిలో ఓహో అనిపించే కవిత్వం కూచిమంచి తిమ్మయ్య ఇన్ని ర ్తరాలపు ప్ర ప్రతిధ్వనించుతాయే గాని సమకాలపు. సమాజం. ప్రతిఫలించదు.. సాంప్రదాయ విధేయడేగాని

958 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి స్వాతంత్రోత్సాహం కనబడదు. ప్రాచీన కవుల పద్యాలను అనుసరించడమే కాక తన పద్యాలను తానే అనుకరిస్తాడు. ఒక కావ్యంలోని పద్యాలు ఇంకో కావ్యంలో యథాతథంగా కనబడతాయి. కొన్ని పద్యకావ్యాలు, దండకాలు, శతకాలు చెప్పాక తిమ్మయ్యకు అచ్చతినుగు కావ్యాలపై మోజుపడీంది. మొదట నీలాసుందరీ పరిణయం అనే మూడాశ్నాసాల ప్రబంధం రచించాడు. ఈ 356 గద్యపద్యాలలో భాష అచ్చ తెనుగేగాని భావాలు పాత ప్రబంధాలలోనివే. తిమ్మయ్య తాను అంతకుముందే రుక్కిణీపరిణయంలో వ్రాసిన కొన్ని పద్యాలనే ఇందులో తెనిగించాడు. కొన్ని విభవాలు పోతరాజుగారి ఖజానాలోనిమి “మందారమకరంద' అనే పోతరాజుగారి ప్రసిద్ధ పద్యానికి అచ్చు తెనుగు తర్జుమా కొంత చూడండీ. - దట్టంపు మిన్వాక చాలునదేల తెలిపుల్లు బురద గోతులకు జనునె వుడుకుమ్రాన్నిరితావి పువ్వుదేనియలాసుమగ దేటితుమ్మికొమ్మలకు చనునె (నీల 2-70) షోతరాజుగారి కవితాభమరం తుమ్మికొమ్మలమీదనే వ్రాలినట్టుంది. ఇలాంటి మారుమోతలు నీలాసుందరీ పరిణయంలోనే కాదు. భల్లాణ చరిత్రలో తూడా కనబడుతాయి (రాజు 1-113). ఈ ప్రతిధ్వనులు, పునరుక్తులు ఎలాగైనా భరించవచ్చును గాని అచ్చ తెనుగు పేరిట చేటపెయ్యలలాంటి మాటలను తయారు చేస్తే బాధ కలుగుతుంది. రుద్రాక్షలు అనడానికి బదులు “చిచ్చరకంటి దొరకంటి పేరింట పేరులు అంటే ఎలాగో ఉంటుంది. “భూసురా' అనడానికి “పుడమిదయ్యమ' అంటే వికారంగా ఉంటుంది. ' బ్రహ్మాండ'మైన కవిత్వం చదువుకోదలచినవాడు “నల్వగ్రుడ్డు లాంటి కైతనే వినాలి. నీలాసుందరీపరిణయం బ్రాశాక కూడా తిమ్మయ్య అచ్చ తెనుగు మోజు తగ్గలేదు 1354 గద్యపద్యాలతో రామాయణం ఆరు కాండలూ అచ్చ తెనుగులో రచించాడు. ఈసారి కలలో దేవుడు ఇలా హెచ్చరించాడు. ఒసరబేరులు బిరుదులు తెలుగసీయ- బోలదని మున్ను పెద్దలు బూనిత్రోవ యిడిరిగావున గూరువుమిదియునట్లు-తెలుగుతెర గెల్ల నేర్చడ దిమ్ముప్రగడ (అచ్చరా. పీఠిక 19) దేవుడు చెప్పినానరే తిమ్మయ్య కొన్ని పేర్లను తెనుగుచేయక మానలేదు. దశరథుడు తొన్ని చోట్ల “పదితేరులదొర' అయ్యాడు. మరి కొన్నిచోట్ల 'పంతొతేర్లదొర' అయ్యాడు. గణాలకోసం “జమిలిచౌవంచతేర్ల రాచలి వెలుగు అయ్యాడు. నీలాసుందరీ పరిణయంలో వేసినన్ని వెర్రితలలు ఈ “అచ్చపుందెనుగు కబ్బం'లో కూడా తిమ్మయ్య కవిత్వం వేసింది. అందులోని పదాలేకాక పాదాలకు పాదాలు. యిందులో కనబడుతున్నాయి. నీలాసుందరి తరపున రాయబారానికి వెళ్లిన విప్రుడు కృష్ణుని చూసి అచ్చతెలుగులో ఒక దండకం చదువుతాడు. రామాయణంలో యుద్ధకాండలో

ప్రోలునాటి కవులు 959 ఇంద్రజీత్తువల్ల ప్రుక్కుతున్న రాముడివద్ధకు నారదుడు వచ్చి ఒక దండకం చదువుతాడు. రెండింటిలోనూ దశావతారాల స్తుతి ఒకే పదజాలంతో నడుస్తుంది. *బమ్మెగ్రుడ్డంగముల్‌ నీమెయిన్‌ మేడిపండ్లుంబలె బ్రోవులై యుండు' ఈ దండకంలో చెప్పిన ఉమ్మడి సంగతి ఎలా ఉన్నా ఈ జమిలికబ్బాలలో మాటలు విభూతిపళ్ల ప్రోవులై తెగకనబడతాయి.

అచ్చతెనుగు రామాయణాన్ని రాసిన తరువాత తిమ్మయ్య సారంగధర చరిత్ర రచించాడు. ఈ కథ రాజమండ్రిలో జరిగిందని తిమ్మయ్య ఖాయం చేశాడు. రాజరాజుకు రత్నాంగి ధర్మపత్ని అనీ, ఈ చిత్రాంగి భోగతరుణి అనీ మొకరరు చేశాడు. గౌరన, చేమకూర వెంకటరాజుగారు, బాణాల శంభుదాసు మొదలైనవాళ్లు సారంగధరచరిత్ర రచించారు. వాళ్ల కథనంతో ఖేదించే ఈ మార్పులు తప్పు తిమ్మయ్య "చూపించిన కొత్త నేర్చులు ఏమీలేవు. అతని కథాకావ్యాలలో కనిపించని సమకాలిక సమాజం అతని శతకాలలో కొంచెం తొంగిచూస్తుంది. ఆ రోజులో సాహితీపరులకు, సామాన్య రైతులకు దూరం పెరిగిపోయింది. ఎవరుపడితే వాళ్ల దగ్గిర చెయ్యిజాపే పండితులు మరీ లోకువ అయిపోయారు. వాళ్లపాట్లను తిమ్మయ్య ఒక కొత్స శతకంలో ఇలా చెప్పాడు:

పోపోబాపడ, దోసెడూదలిడినం బోలేక పేరాసల

న్వాపోజాగితి వేమి నీసదువు తిర్నామంబులో సుద్దులో

భూపాళంబులొ లంకసత్తిలొ బలా బొల్హ్ల్యావుపోట్లాటలో

కాపాటింపనటండ్రు బాలిశులు భర్ణా పార్వతీవల్లభా (నెం.౪౫4) నిజమే. పండితుల చదువులు వీళ్లకు ఎందుకూ పనికిరావు. గొల్లసుద్దులలాగ, కాటమరాజు కథలోని బొల్లావు పోట్లాటలాగ ఆనందం యివ్వవు. వాళ్లు పిల్లవసుచరిత్రలు ఎలా మెచ్చుకోగలరు? ఏమి ఇచ్చుకోగలరు? దోనెడు ఊదలు చాలవని యాచకుని భావన, గిద్దడే ఎక్కువ అని ఇచ్చేవాడి అంచనా. తన దాతృత్వం గురించి వాడు ఇలా చెప్పుకొంటాడట:

అదుగో బాపనయల్లుభొట్లయను ముందప్పయ్య తీర్తంబులో

నదనం గిద్దెడు కొర్రనూక లిడితిన్‌ అబ్బబ్బ! తిర్నామముల్‌

చదువంజాగిన మాలదాసరయలన్‌ సంతోసనాల్‌ సేసితిం

గద యంచుం బలుమోటు లాడుదురు భర్తా పార్పడీవల్లభా (నెం. 85)

ఈ భరశతకంలో తన కాలంనాటి సమాజం ఈమాత్రం కనిపించాక తూచిమంచి తిచ్మన్న మళ్లీ గతకాలంలోకి నిష్క్రమించాడు. 'సాగరసంగమహాత్మ్యం' అనే కావ్యం రచించాడు. దీనినే *సప్తార్షవసంగమాహాత్మ్యకం' అని కవి పేర్కొన్నాడు. దీని తరువాత అతడు 'సకలలక్షణసారసంగ్రహం' అనే లక్షణగ్రంథాన్ని బ్రాకాడు. ఇది జగదుపకారం రోసం కొత్తగా లక్షణలక్ష్యాలు వితర్కించి రచించాడు. అప్పటికే తెలుగులో ఎన్నో లక్షణ

ఇందులో అనంతుడు మొదలుకొని అప్పకవి, అహోబలపతులాదాళా పన్నెండుమంది లాక్షణితుల వాదాలను, ప్రయోగాలను చర్చించాడు. ఎక్కువగా

960 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ముద్దరాజు రామన్నను ఉదాహరించాడు. నాలుగు చాటుధారలను కాక పూర్వప్రబంధాల నుండి 57 ప్రయోగాలను ఇచ్చాడు. ఇది మూడాశ్వాసాల గ్రంథం. సాహిత్య పరిశోధకుల కీది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది గుజిలీ పుస్తకంగా క్రిందటి శతాబ్దంలో ఒకసారి అచ్చుపడింది. తరువాత క్రీ.శ. 1901లో మంత్రిప్రగడ భుజంగరావుగారు 500 ప్రతులు అచ్చువేశారు. ఇది మళ్లీ ముద్రించడం అవసరం. ఈ గ్రంథాన్ని తిమ్మయ్య 1740లో నిర్మించాడు. ఈ రచనవల్లనే తిమ్మయ్యకు 'అఖీినవవాగనుశాసను' డనే విరుదు వచ్చినట్టుంది. ఈ [గ్రంథం బ్రాసిన తరువాత తిమ్మయ్య తన గద్యలో 'సకల సంస్కృతాంధ్ర లక్షణ కళాకౌశలాఖిరామా' అనే మీషణూన్ని తగిలించుకున్నాడు. లక్షణగ్రంథం కోసం ఎంతో పరిశోధనలు చేసిన తిమ్మయ్య లక్ష్యగ్రంథం కోసం తూడా అంత పరిశ్రమించాడు. బహు పురాణాలూ, ప్రబంధాలూ, లక్షణశాస్తాలూ,. వివిధ అష్టాదశాధిక వర్ణనలలో రచించాలని ఆశించాడు. అది రసికజనుల మనసులకు అభికామంగా ఉండాలని భావించాడు. ఇంత పెద్ద సంకల్పంతో మొదలుపెట్టిన ప్రబంధంలో కథ లేకపోయినా ఫరవాలేదు. తన కాలానికి ముందు ఏ ప్రబంధంలో కథ ఉంది కనుక? అయినా ఒక చిన్న కథాసూత్రాన్ని ఎంచుకొంటే ఫరవాలేదు. కాబట్టి ఒక పురాణగాథ తీసుకున్నాడు. తన పరగణాకు దగ్గిరలో ఉన్న గోదావరి గొప్పుతనాన్నే గోదావరి ధవశీశ్చరం దిగువన రెండు పాయలుగా చీలుతుంది. పడమటి పాయను వాసిష్ట అనీ, తూర్పు పాయను గౌతమి అనే పిలుస్తారు. వీటిలో గౌతమికి కొన్ని ప్రశ్యేక మహిమలున్నాయట. దానిలో మునిగిన ముసలివాళ్ళు పడుచువాళ్ళవుతారట. ఈ సంగతి బ్రహ్మపురాణంలో గోదావరి ఖండంలో ఉందట. ఆ పురాణంలోని “వృద్ధస్రవంతీ సరిత్సతి సంగమాహాత్మ్యం' అనే కథను కూచిమంచి తిమ్మయ్య “రసిక టినమనోఖిరామం' అనే పేరిట ఆరాశ్వాసాల శృంగార ప్రబంధంగా వ్రాశాడు. గౌతమీ మాహాత్మ్యం వినండీ. పూర్వం గౌతముడనే మునిబాలుడు ఒకడుండేవాడు. ఆ కుర్రవాడు అంగవైకల్యంతో పుట్టాడు. అతనికి ముక్కు లేదు. అంతేకాక పొట్ట చీల్చేతే అక్షరం ముక్కే తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలను చేరుకున్నాడు. అక్కడ ఒక కొండ గుహలోకి నేరకపోయి ప్రవేశించాడు. ఆ గుహలో ఒక స్త్రీ తపస్సు చేసుకుంటూంది అతడు నమస్కరించాడు. "అయ్యా, నువ్వు నాభర్తవు. నాకు నమస్క రించకూడదు' ఆందీ ఆమె. అతడు విస్తుపోయాడు. ఆమె పండు ముసలిది. ఆమె తండ్రి ఎనఖైవేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఆ తరువాత అతని కొడుకు పదివేల సంవత్సరాలు పాలించాడు. అమె పుట్టిన దగ్గిరనుంచి తపస్సు చేసుకుంటూంది. దానికి కారణం ఉంది. అమె తండ్రిపేరు బుతద్వజ మహారాజు. తల్లి సుశ్యామ అనే గంధర్వకాంకే వాళ్లిద్దరూ ఒకసారి అడవిలో కలుసుకొన్నారు. మరులు కొన్నారు. ఒక బిడ్డ పుట్టేదొకొ

ప్రోలునాటి కవులు 961 రమించారు. ఈ ఆడబిడ్డ పుట్టాక విడిపోయారు. పోతూపోతూ బిడ్డను చూసి, “అమ్మా, ఈ గుహలో నువ్వు తపస్సు చేసుకొంటూ ఉండు. ఎవరు మొదట ఇందులో ప్రవేశిస్తారో అతడే నీ భర్హ అని తల్లి చెప్పింది. వీడ్డ అలాగే వేలకువేల సంవత్సరాలు తపస్సు చేసుకొంటూంది. ఆమె పుణ్యం అన్నేళ్లకు పండి గౌతముడు వచ్చాడు. ఈ కథ చెప్పి ఆ పండుముసలిది తనని పెళ్లి చేసుకోమంది. “తల్లితండ్రులు లేని స్వతంత్రురాలను. రాజకన్యను' అని చెప్పింది. అతడు తటపటాయించాడు. వరహీనం పనికిరాదుగా, అతను తూడా _వేయిసంచత్సరాల బాలాకుమారుడే. అమె తొంభయివేల సంవత్సరాల తొయ్యలి. పైగా అతడు తన ముక్కు, చదువుముఖం ఎరగనివాడు. తనకు సురూపం, సువిద్య లఖిస్తేనేగాని పెళ్లి వద్దన్నాడు.

దొరక్క దొరక్క పెళ్లికొడుకు వస్తే ఆమె పోనిస్తుందా, తన తపోశక్తులతో అతని వాంఛలు ఈడేర్చింది. ఇద్దరూ కాపురం చేయడం మొదలుపెట్టారు. అయితే లోకం పరిహసించడం ఆరంభించింది.

పడతిరొ నిజముగ నీతడు-కొడుకో మనుమండాొ నీకు గొంచింపక యే

ర్పడ దెలుపుము మా కనుచుం-గడు నగి రొకకొంద రుత్సుకత మీరంగన్‌,

(రసిక. 6-161) అంతతో వాళ్లు వూరుకోలేదు.

వృద్ధునకు యువతి విషమగు-వృద్ధసతికి యువజనుండు వెలయగ సుధయే

సిద్ధమని కొంద రపు డా-వృద్ధాగౌతముల కెగ్గు లెన్నిరి పెలుచన్‌. (రసిక. 6-16)

వాళ్లు ఎగ్గులెన్నడంతో ఆ దంపతులు సిగ్గుపడ్డారు. భరించలేకపోయారు. అగస్తుని వద్దకు వెళ్లి ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. ఆయన గౌతమీగంగలో మునగమని సలహా ఇచ్చాడు. వాళ్ళు అలాగే చేసి ధన్యులయ్యారు. యౌవనం మళ్ళా వచ్చిన ఆ దంపతులకు మునులంతా ఇంకోసారి పెళ్ళి చేశారు.

ఈ వృద్ధా గౌతముల కథను 103 గద్యపద్యాలలో కూచిమంచి తిమ్మయ్య చెప్పాడు. అయితే ముసలి సరసం రసికజనుల మనోఖిరామంగా ఉండదు. అందుచేత వృద్ధకన్య పుట్టడానికి ముందు ఆమె తల్లితండ్రుల శృంగారగాథను ఆరున్నర అశ్వాసాలలో 867 గద్భపద్యాలతో కథనం చేశాడు. తన కాలంలోని రసికజనులకు పాత ప్రబంధాల మూసలో వసుచరిత్ర యాసతో చెప్పిన కావ్యాలే మనోఖిరామాలని తిమ్మయ్య ఆ పద్ధతిలోనే రచన చేశాడు. ఈ ప్రబంధంలో మెత్తదనం ఉన్న పద్యాలను చూపమంటే ఎన్ని పద్యాలైనా ఉదాహరింపవచ్చుగాని కొత్తదనం ఉన్నవి ఏవని ప్రశ్నిస్తే, గాలిస్తే కొన్ని చూపెట్టడానికి వీలవుతుంది. ఇందులోని నాయకుడు ధీరోదాత్తుడు కాడు. కౌచిత్యం తెలిసినవాడు కాడు. ఒక్క మదన విద్యలోనే అసాధ్యుడు. మన పోలీసువాళ్లు వేలిముద్రలను పట్టి దొంగను పట్టుకున్నట్టు ఈయన కాలిముద్రలను పట్టి ఏ దంపతులు ఏ బంధంలో క్రీడించారో చెప్పగలడు. తన ప్రేయసితో వనవిహారం చేస్తూ దివిజసుందరులు మదనక్రీడల విహరించిన రీతులను వరసగా చెప్పసాగాడు.

962 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ధేనుక బంధంబున నొక-చాప బల్లవుడు గ్రీడ సలిపిరి తమి ని

చ్చోవారు కరపదంబులు-గానంబడె జూడు వికచకంజాతముఖీ. (రసిక. 6-18) ఇలాంటి పద్యాలు ఆనాటి రసికజున మనోఖిరామాలని తిమ్మయ్య తలపోసినట్టుంది. శ పద్యాల నతడు తన తమ్ముని కొడుకులకు చెప్పి బ్రాసుకోమన్నాడు. వాళ్లు లేఖక పాఠకులై అతని కృతులను ప్రబల జేశారు. అదృష్టవశాత్తూ కామశాస్త్రంలోని ఎనఖై బంధాలనూ తిమ్మయ్య వివరించలేక ఎనిమిదే వర్ణించాడు. తన ప్రబంధంలో ' ప్రవిమల శృంగార భావగౌరవాలు' ఉంటాయని తిమ్మయ్య మొదటే మనకు హామీ ఇచ్చాడు (1-17). బహుశ అందుచేత ఎనిమిదింటితో ఆగాడు.

వసుచరిత్ర చదివిన వాళ్ళకు ఈ [గ్రంథం వెగటనిపిస్తుంది. ఆ శార్జూలాన్ని చూసి చాలామంది వాతలు పెట్టుకున్నారు. తిమ్మయ్య ఒళ్ళంతా ఎన్ని చారలు పులుము తున్నాడో వజ్ఞల చినసీతారామశాస్త్రిగారు. విపులంగా లెక్కకట్టారు*. రసికజన మనోఖిరామం ఎంత విరసంగా ఉన్నదీ వివరించారు. ఇందులో స్త్రీవర్దనలు వెర్రిగా చేశాడని ఎవరైనా భావిస్తారు.

ఆ తరువాత రెండేళ్లకు విలాసం అనే చిన్న కావ్యం రచించాడు. 3% గద్యపద్యాలున్న ఈ రెండాశ్వాసాల గ్రంథాన్ని 31 రోజులో చెప్పాడు. గంగా వివాహం, గంగా గౌరీ సంవాదం ఇందులోని ఇతివృత్తాలు. పాత గ్రంథాల ఛాయలు ఇందులో చాలా ఉన్నాయి. ఈ కావ్యం చెప్పాక తిమ్మయ్య కుక్కుటేశ్వర శతకం రచించాడు. బహుశా ఇదే అతని చివరి రచన. ఈ శతకం ఒక్కటే తిమ్మయ్యకు పేరు తీసుకురాగలదు. ఇందులో చిత్తశుద్ధి, ఆవేదన, లోకజ్ఞానం, సమకాలిక పరిస్థితుల ప్రభావం ఎంతగానో ఉన్నాయి. భర్గ శతకంలో తొంగిచూసిన ప్రతిభ మళ్ళీ ఇందులో సాక్షాత్కరించింది.

కుక్కుటేశ్చర శతకాన్ని తిమ్మయ్య వార్థక్యంలో వ్రాసినా దీని మకుటం అతని ప్రాథమిక రచన రుక్కిణీపరిణయంలోనే కనబడుతుంది. ఇందులో 92 పద్యాలే ఉన్నాయి. 12 పద్యాలలో లోభులని దుయ్యపట్టాడు. 10 పద్యాలలో పామరులను వారి మాటల తోనే వెక్కిరించాడు. 12 పద్యాలలో నీతులు చెప్పాడు. ఈ శతకం ప్రచారంలోకి వచ్చాక దీనిని అనుసరిస్తూ ఎన్నో శతకాలు పుట్టాయి. ఈ కోవలో ఈ మణిపూస తొలిపూస. డెబ్బయి సంవత్సరాల లోకానుభవాలను ఇందులో దండగుచ్చాడు. ముసలితనం గురించి అతడు చెప్పిన పద్యం జూలిపుట్టిస్తుంది.

నోరు చేదై కూడుగూరలు చవిదప్పు, గడగడ నొడలెల్ల పడకుచుండు

జెవుడున నేమియు జెవులకు వినరాదు, తెగులను జింతయు దగులుకొనుచు

కన్నుల బొరగప్పి కానరా దెద్దియు, సిగొకించుకయ్టైన జేరబోదు

బాలురందరు గూడి గేలి గావింతురు, మగువలు పకపక నగుచునుంద్రు

మదితలంపగ గటకటా! ముదిమి యంత

రోత లేదుగదా ధారుణీతలమున

బుధనుతవిలాసః పీఠికాపురనివాన।

'" కముదటాతకోటిసంకోశ కుక్కుటేశ (నెం.౪) 4. వసుచరిత్ర విమర్శనం. పుటలు 33-45 5, అఆంధ్రకవుల చరిత్ర ౩వ ఖాగం. కందుకూరి వీరేశలింగంగారు. పుట 80.

ప్రోలునాటి కవులు 963

ముసలితనం రోత కావచ్చుగాని ఈ పద్యానికి జోత అనక తప్పదు. ఇందులో పరాయిచోట ఉండవలసి వచ్చింది. అది బొబ్బిలియుద్ధం జరుగుతున్నకాలం. కళింగసీమ అంతా కల్లోలంగా ఉంది. సంస్థానాధీశుల సేనలు, మరాఠీల దండులు, ఫ్రెంచివాళ్ళ పటాలాలూ అదే పనిగా అటూ ఇటూ తిరుగాడుతున్న రోజులవి. కందరాడకీ సేనల తాకిడి చాలా ఉంది. అది తట్టుకోలేక స్వగ్రామాన్ని వదిలి తిమ్మయ్య చంద్రమ్మపాలెం అనే ఊరు చేరుకున్నాడు. అతనికి పిల్లలు లేరు. తమ్ముడు జగ్గన్న, అతని కొడుకులూ తప్ప ఆదుకునేవాళ్ళు లేరు. భార్య పోయింది. ఈ అనుభవాన్ని తిమ్మయ్య ఇలా చెప్పుకొన్నాడు:

అన్నంబు నాలుక కరుచియ్రై కనుపట్టు, నిలచినచో, నిల్వ నలవిగా దు

మనుజేంద్రుతో నైన మాటాడసైపదు, పనులయం దేమియు మనసు లేదు

నడుచుచో నడుగులు తడబాటు గైకొను, దగ బండువులనైన నగవురాదు

తెవులు పుట్టిన రీతి దేహంబు కృశియించు, గలనైన నిద్దుర కలుగబోదు

శివశివాధాత్రిదావలచిన వధూటి

బాయువెత వద్దు సుమ్మెట్టి పలువకైన

భూసుతవిలాసపీఠికాపురనివాస

కుముదహితకోటిసంకాశ కుక్కుటేశ (నె92)

ఇదే శతకంలోని చివరి పద్యం బహుశ తిమ్మయ్య చెప్పిన ఆఖరు పద్యం కావచ్చు. పండుగ రోజులలో కూడా నవ్వు రాకు పడుకొంటే కలలో తూడా నిద్దరరాక కృశించిపోతున్న వృద్ధుణ్ణి చూస్తే ఎవరికి సానుభూతి జనించదు? కవిసార్వభౌముడనే వీరుదు ధరించినందుకు తిమ్మయ్య కూడా పాపం శ్రీనాథునిలాగా అవసానకాలంలో అష్టకష్టాలు పడ్డట్టుంది. శ్రీనాథునికి తమ్ముడు లేడు. ఈయనకు ఉన్నాడు. అవసాన కాలంలో ఇద్దరికీ ఇంతే తేడా. ం .

శ్రీనాథుణ్ణి సమకాలికులూ, అనంతరకవులూ పొగిడితే తిమ్మయ్యను స్నేహితులు మెచ్చుకొన్నారు. ఏనుగు చినలక్ష్మన్న యిలా ప్రశంసించాడు:

. హాటకగర్భ వధూ లీ-లాటన చలికాంఘీ నూపురారావత్రీ

పాటచ్చరములు తేనియ-తేటలు మా కూచిమంచి తిమ్మయమాటల్‌ (చాటువు)

తన మాటలు తేనియ తేటలయినా, వాటిని ఎంత వడకట్టినా అందులో నలుసులున్నాయని తిమ్మయ్యకు తెలుసు. అందుకే రసికజనమనోభిరామంలో ఇలా విన్నపం చేశాడు:

మంచిడేనియ జనుల్‌ వేమరు కడంఠ నరసి వడపోసి యునిచిన నందులోన

నలుసు లొకకొన్ని యిందంత కలుగకున్నై భవ్యమతులార కవిబుధప్రవరులార

  • (రసి. 1-16)

తిద్ముయ్య వడబోసిన తేనెలోన నలుసులు కవులూ, బుధులూ పట్టించుకున్నారో లేదోగానీ అతని తమ్ముడు జగ్గన్న తన అన్నగారి గొప్పతనాన్నే తప్ప ఇంకేదీ చూడలేదు.

964 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తాను 'సర్వలక్షణసారంసం గ్రహోద్దామ శుద్ధాంధ్ర రామాయణప్రముఖ ప్రబంధ నిబంధన బంధుర విధాన నవీన శబ్బశాసన బిరుదాఖిరామ తిమ్మకవి సార్వభౌమ' సహోదరుడినని సగర్వంగా చాటుకొన్నాడు. జగ్గన్న జీవితంలోనేకాక కవిత్వంలో నిరంకుశుడు. అలాంటి వాడు తలవంచి గౌరవిస్తే నిజంగా అది ఘనమైనదే.

కూచిమంచి. జగ్గన్సః కూచిమంచి తిమ్మయ్యకు ముగ్గురు తమ్ముళ్ళు. వాళ్లలో రెండోవాడు జగ్గన్న; ఇతడు ఎప్పుడు పుట్టాడోగాని తిమ్మయ్య సింహాచల మాహాత్మ్యం రాస్తున్న కాలానికి (బహుశా క్రీ.శ 1720 ప్రాంతాలకు) 'నమంచి కవితాచతురు' డయ్యాడు. తన తమ్ముడు 'రాజన్య సభారూట నిరాఘాటనటచ్చాటుకవిత్వాంకు డయ్యాడని తిమ్మయ్య సింహాచల మాహాత్మ్యం అవతారికలో చెప్పాడు. రాజసభలలో నిరాఘాటంగా చాటు కవిత్వం చెప్పి మెప్పించాలంటే ఎంత లేదన్నా ఇరవై సంవత్సరాల వయసయినా ఉండాలి.

పొర్గునాడులోనూ, కళింగసీమలోనూ ఉన్న చిన్న చిన్న సరదార్ల సభలలో తూచిమంచి జగ్గన్న తన ఆశుకవిత్వాన్ని ప్రదర్శించుతూ పేరు తెచ్చుకున్నట్టుంది చాటువులే కాకుండా గ్రంథరచన కూడా అతడు యౌవనంలో చేశాడు. జానకీపరిణయం అనే ప్రబంధాన్నీ, రాధాకృష్ణచరిత్ర అనే ద్విపదకావ్యాన్నీ రచించాడు. ఈ రెండు గ్రంథాలూ నష్టమయ్యాయి.! వీటి తరువాత అతడు భక్తమందారశతకం వ్రాశాడు. అదృష్టవశాత్తూ ఇది దొరికింది. అచ్చూ పడింది. ఇది క్రీ.శ. 1714-1734 దాకా పెద్దాపురాన్ని పాలించిన ముమ్మడి తిమ్మరాజుగారి కాలంలో వ్రాసి ఉంటాడు. ఆ రాజుగారే జగ్గకవికి 'బేబదల్‌ అనే వీరుదు ఇచ్చినట్టుంది. శతకంలో కవి ఇలా

సరసప్రస్తుత కూచిమంచి కులభాస్వ్పద్బార్థి రాకాసుధా

కరుడక్‌ గంగనమంత్రి నందనుడ రంగత్తిమ్మ భూమండలే

శ్చరవర్యార్చిత బేబదల్‌ విరుదవిస్ఫాయజ్జగన్నాథనా

మరసజ్ఞుండను, బ్రోవు మెప్పు నను రామా! భక్తమందారమా! (నెం. 101)

" తిమ్మరాజుగారు జగ్గకవికి బేబదల్‌ అనే బిరుదు ఇచ్చినారుగాని కావ్యం ఏదీ

అంకితం పుచ్చుకొన్నట్టు లేదు. రాజు గౌరవంగా పిలిచి అడిగెడేనేగాని కృతి ఇవ్వకూడదనే పట్టుదల జగ్గకవికి చాలా ఉంది. అ సంగతి ఇలా చెప్పాడు:

ఇటు రారమ్మని పిల్చి గౌరవముగా హేమాంబరాందోళికా

కటకప్రాకట భూషణాదులిక్తి వేడ్కన్‌ రేడు ప్రార్ధింప వి

స్ఫుటభంగిం దగు కావ్యకన్య నిడనొప్పున్‌ గానిచో నుర్చికో

మటిమేనర్క మె బల్మి గట్టగను రామా! భక్తమందారమా! (నెం. 71)

ప్రచురిస్తామని 1947లో సుభద్రాపరిణయం ఉపోద్దాతంలో వ్రాశారుకాని అచ్చుపడినళ్డు లేదు.

ఫ్రోలునాటి 5ఎులు 965

కోమటిమేనరికంలాగ జగ్గన్న తన రచనలని ఎవరికీ వంతాన అంకితం ఇవ్వలేదు. తన కవిత్వాన్ని విద్వన్మహాపురుషశ్రేష్టులే పరీక్షించి మెచ్చుకొంటారనే ధీషణాహంకారం జగ్గన్నకు జాస్తి.

బహుశ ఈ శతకం చెప్పడానికి ముందే జగ్గన్న ఒక శృంగార రస ప్రబంధాన్ని రచించి తన పేరింటి దేవుడు పూరీ జగన్నాథునికి అంకితం ఇచ్చాడు. దేవుడు కలలోనికీ దిగివచ్చి అడిగినాకనే ఆరాశ్వాసాల సుభద్రా పరిణయాన్ని సారకవితావైచిత్రితో చెప్పాడు.

ఈ కావ్యం మనోహరంగా కనబడుతున్నదని సాహిత్య చరిత్రకారులు భావించారు.” అయితే ఈ మనోహరత్వానికి చేమకూర వెంకటరాజుగారే మూడువంతులు కారణం. వారి విజయవిలాసాన్ని జగ్గన్న చాలా అనుకరించాడు. రెండు కావ్యాలలోనూ కొన్ని వందల పోలికలు చూపించవచ్చు. వెంకటరాజుగారిని అనుకరించిన చోట చాలా అరుదుగానే మనోహరత్వం కనబడుతుంది. ఈ కావ్యంలోని గొప్ప సుగుణం గ్రంథాదిని సుకవుల స్తుతీగాని కుకవినింద లేకపోవడం. అయితే జగ్గన్నకు చేతకాక వూరుకోలేదు. అతడు బూతులలో పరిపూర్ణుడు. భక్తమందారశతకంలో ఇలా తిట్టాడు:

కుకవుల్‌ కూళలు కొంటెతొత్తుకొడుకుల్‌ కొండీలు కోనారులుం

దకతైత్తలవారు పాచకులు జూదంబాడువారున్‌ మహిం

బ్రకటంబై సిరిగాంచి రీకలియుగ ప్రామాణ్య మాశ్చర్య మో

మకరాక్షాసుర గర్వసంహరణ రామా! భక్టమందారమా! (నెం.5) జగ్గన్న తిట్లు చుట్టుప్రక్కల పరగణాలలో మారుమోగాయి.. బండబూతులు కోరుకొండగా వర్ణన చేస్తాడనే పేరు బాగా వచ్చింది. తన కీర్డి సంచరించిన సంస్థానాలకు జగ్గన్న కూడా వెళ్లినట్టుంది. ఆ రోజులలో విశాఖపట్నం జిల్లాలోని దార్గపూడికి చింతలపాటివారు సరదారులు. విజయనగర సంస్థానాధీశులతో వియ్యం అందినవాళ్ళు. చింతలపాటి నీలాద్రిరాజూ అనే ఆయన శొంఠి సుబ్బయ్య, ప్రయాగ బాపన్న మొదలైనవాళ్ళకు మాన్యాలు, వార్షికాలు ఇచ్చాడు. పెద విజయరామరాజుకు సాక్షాత్తూ బావమరిది. ఆనాటి రాజకీయాలలో నీలాద్రిరాజు తలమునకలుగా పాలొన్నాడు. అయన సాహిత్య పోషణ కూడా చేశాడు.

అనకాపల్లి తాలూకా కొప్పాకలో ఒకసారి చింతలపాటి నీలాద్రిరాజు ఉంటున్నప్పుడు జగ్గకవి ఆయనను దర్శించుకొన్నాడు. తన కవిత్వం వినిపించాడు. ఆయన సంతోషించి తనకొక శృంగార కావ్యాన్ని అంకీతం ఇవ్వమన్నాడు. నీలాద్రి రాజుకు చంద్రలేఖా విలాసం అనే ప్రబంధాన్ని చెప్పదలిచాడు. అదే సభలో అణీవెళ్ల వెంకటుళాస్త్రి అనే సంస్కృత పండితునికి ఒక అలంకారశాస్తాన్ని, బ్రాయమని నీలా ద్రిరాజు తాంబూలం ఇచ్చాడు.

వెంకటశాస్త్రి తన గ్రంథాన్ని బ్రాసి అంకితం ఇచ్చి సన్మానాలు పొందాడు. పైగా 7. అంధ్రకవులచరిత్ర, ౩3వ భాగం, వీరేశలింగంగారు, 1950 పుకు అ.

966 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి పట్టుకొని నీలాద్రిరాజూ దగ్గరకు వెళ్ళాడు. అయితే దురదృష్టవశాత్తూ అప్పుడు నీలాద్రిరాజు చిక్కలలో ఉన్నాడు. అతనిమీద కిట్టనివాళ్ళు విజయరామరాజుకు ఫిర్యాదు చేశారు. ఆ మన్నాసుల్తాన్‌ ఆగ్రహించి, బావమరిది అనైనా మొహమాటపడకుండా పన్నైెండువేల రూపాయలు జుల్మానా వేశాడు. కరువులో అధికమాసం అని ఇచ్చాపురంలో ఉన్నప్పుడు నీలాద్రిరాజు డేరాలో దొంగలు పడ్డారు. గుత్తాన్ని, వెండిజీనూ, పదివేల వరహాలు ఎత్తుకుపోయారు. నీలాద్రిరాజు ఇజారాకు పుచ్చుకొన్న గ్రామాలను మెవరికో ఇచ్చేశారు. ఇలాంటి చిక్కులలో ఉన్నప్పుడు జగ్గన్న వస్తే సహజంగా డబ్బులే'దని నీలాద్రిరాజు అన్నాడు. దానితో కవి రేగిపోయాడు. చంద్రలేఖా “విలాసానికి' బదులు “విలాపం అనే బూతుకావ్యం వ్రాశాడు.

ఈ కథను తంబళ్ల వీరభద్రయ్యకు నంవి నరసింహాచార్యులు చెప్పాడట. కథలో అణీవెళ్ళ వెంకటశాస్త్రి బోయగాల్లావుపల్లి అనే గ్రామంలో ఉంటున్నాడు. అతడు కటకపు వెంకటసానికి ప్రియుడు. ఆ వృద్ధవేశ్వ తన కూతురు చంద్రరేఖతో వచ్చి వెంకటశాస్ర్రివద్ద వుంటూంది. ఆయన యజ్ఞం తలపెట్టాడు. ఆ యాగాన్ని చూడడానికి నీలాద్రిరాజు వచ్చాడు. చంద్రరేఖను చూశాడు. ఇద్దరూ మరులుకొన్నారు. విరహంలో పడ్డారు. వెంకటశాస్త్రి వాళ్ళకు సంధానం చేశాడు. వాళ్ళు రతులలో ఓలలాడారు. ఈ కథను 414 గద్యపద్యాలతో జగ్గన్న వర్ణించాడు. వీటిలో సగం పద్యాలలో అన్లీలపదాలు ఎంత నగ్నంగా ఉండాలో అంత నగ్నంగా ఉన్నాయి. మిగతా సగంలో బూతుమాటలు లేకపోయినా సగం పద్యాలు జుగుప్స కలిగిస్తాయి. ఇది హాస్యరసమని జగ్గన్న ఉద్దేశం. కాని అపహాస్యరసమే అని చెప్పాలి. ఈ విరస కావ్యంలో ఎంతసిపూ నీలాద్రి రాజునే నోటికి వచ్చినట్టూ అన్నాడుగాని అతని నెక్కడా అమ్మా అలీ తిట్లు తిట్టలేదు. పైగా నీలాద్రి రాజు బ్రతికి ఉండడానికి కారణం అతని పెళ్ళాం చేసుకున్న పుణ్యమే అని వేశ్వమాత హితోపదేశంలో అనిపించాడు.

ఖలుడైన నీలన్ఫపు డీ-యిలపై నిన్నాళ్ళు బ్రతుకునే? నరసాంబా

గళకలిత కనకమయమం- గళసూ త్రోత్కలష్టమహిమ గాక కుమూరీ?

(చంద్ర. 2-72) వాస్తవానికీ బూతుకావ్యాన్ని నరసమ్మగారి అన్నదమ్ములు వినవలసే వచ్చింది. తమ తోడుబుట్టుదాన్ని కవి ఏమాత్రం దూషించినా చంపెయ్యడానికి కత్తులుమీద చెయ్యి వేసుకొని నిలబడ్డారట. ఈ పద్యం విని చెయ్యి దింపారట. చంద్రరేఖావిలాపాన్ని బ్రాయడమేకాక దానిని ఆసాంతం నీలాద్రిరాజుకు వినిపించేదాకా జగ్గకవికీ నిద్రపట్టలేదు. నిజాము సర్కారు సహాయంతో ఒక బలవంతపు సభలోనికీ నీలాద్రిరాజును రప్పించి కావ్యపఠనం చేశాడట. జగ్గన్నది మొండిభైర్యం. గ్రంథాంతంలో ఇలా సవాల్‌ చేశాడు:

ఈకృతికి సమముగా గృతి-నేకవులును జెప్పజాల రిది విరుదము భూ

లోకము రాజుల లోపల-నీకు దొరకె హాస్యలీల నీలన్ఫపాలా! (చంద్ర. 3-16)

ప్రోలునాటి కవులు 57 చంద్రరేఖా విలాపంలాంటి గంథాలు తెలుగులో మరికొన్ని లేకపోలేదు. అయితే డీనికి వచ్చినంత ఖ్యాతి మరి దేనికీ రాలేదు. జగ్గకవి ఈ కావ్యం తరువాత సోమడేవరాజీయం అనే చారిత్రక ప్రబంధం బాసి మందపాటి నారాయణరాజుకు అంకితం ఇచ్చాడు. ఇది అతనికి పేరు తేలేదు. అతడు బూతుకవిగానే మిగిలాడు.

తురగా రామకవి : మన సాహిత్యంలో కూచిమంచి జగ్గతవి ఒక్కడే తిటుకవి కాడు. దాలామంది ఉన్నారు. వాస్తవానికి చంద్రరేఖా విలాపంలో జగ్గన్న కొందరు తిట్టుకవులను, బూతుకవులను ఆదిలో ఇలా ప్రార్థించాడు: ౧

రామకవి ముఖ్యులను బ్రో-ద్దామగతిం జిత్తవీధి దలచి కడంకన్‌ (చంద్ర 1-8)

ఈ కవులలో శ్రీనాథుని తరువాత చెప్పిన రామకవి శురగారామకవే కావచ్చు. ఈయన నోటికి హద్దూ పద్దూ లేదు. పెద్దాపురం పాలించిన తిమ్మరాజాగారిని ఇలా తిట్టాడు:

అద్దిర శ్రీ బూ నీలలు-ముద్దియ లా వారికి కలరు ముగు రందరిలో

విద్దమ్మ నాట్యమాడు- దిద్దమ్మని వత్సవాయి తిమ్మని యింటక్‌

(చాటుపద్య మణిమంజరి. 1 పుట 163)

ఈ తిమ్మరాజుగారు క్రీశ 1714 నుంచి 3 దాళా పాలించినవారు కావచ్చు. రాజుగారిని తురగారామకవి అసలు యాచించదలుచుకోలేదు. అతనికి అమలాపురం తాలూకా బంటుమిల్లి గ్రామంలో భూములు ఉన్నాయి. అతనికీ పెండీల నాగి, పెద్ది. గంగి అనే ముగ్గురు వేశ్ళలున్నారు. అయితే భూమి పండలేదు. అందుచేత యాచించవలపీ వచ్చిందని చెప్పాడు:

ఆ రోజులలో తురగా రామకవికే కాదు. ఇతర కవులకు కూడా వేశ్యలు ఉండేవారు. కూచిమంచి తిమ్మయ్య . .ంచి రసికుడని ప్రతీతి. అతని గురించి విన్న ఒక సానిపాప ఒకనాడు నడివీధిలో ఆయనను ఆపీ కౌగలించుకొందట. ఆయన వెడముఖం పెట్టాడు. అప్పుడాసరసురాలు ఇలా అంది:

చతురులలోన నెంతయును జాణవటంచును నేను గౌగలిం

చితి నిటు మారుమోవిడగ జెల్లునె యో రసికాగ్రగణ్యుః తౌగలించుకోడమే కాకుండా కవిత్వంలో ప్రన్నించేసరికి కూచిమంచి తిమ్మయ్య తేరుకొవి ఇలా జవాబు చెప్పాడు:

అ-ద్భ్బుతమగునట్టి బంగరపు బొంగరపుంగవబోలు నీకుచ

ద్వితయము రొమ్ము నాటి యల వీపున దూనె నటంబు జూచితి€ 8. ముళ్ళపూడి తిమ్మరాజుగారు ప్రచురించారు. వ మండలి, తణుకు

268 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ సంఘటనలోని సత్యాన్ని సాహిత్తీపరులు చాలామంది శంకిస్తున్నారు. అయితే నిప్ప లేనిదే పొగరాదు. నిజంమీద కప్పుకొన్న నివురును ఊదాలి. కూచిమంచి తిమ్మయ్యకు శ్రీనాథుని కవిసార్వభౌమ విరుదంతోపాటు రసికత కూడా సంక్రమించిందనడానికి వేరే సాక్ష్యాలు లేవుగాని ఇతరులు చెప్పిన శృంగారచాటువులు మాత్రం ఎన్నో శ్రీనాథుని పేర చలామణి అయిపోయాయి.

జీవితంలో శృంగారం, కవిత్వంలో వెటకారం ఉన్న రామకవికి ముక్కుమీద కోపం ఉంటుంది. ఒకసారి ఎవరో లేటవరపు పోతరాజును చూడడానికో, డబ్బు అడగడానికో రామకవి వెళ్ళాడు. ఆయన లేడని ఇంట్లో వాళ్ళు చెప్పారు. వెంటనే రామకవి ఇలా చెప్పాడు. కం

తూటికి కాకులు వెడలెను - ఏటావలమూక చేరి ఏడువదొడగెన్‌

గాటికి కట్టెలు చేరెను - లేటవరపు పోతరాజు లేడా! లేడా?

(చాటుపద్య రత్నాకరం, 170)

ఈ తిట్టుపద్యం వినగానే పోతరాజు ముఖం తిరిగ చాపచుట్టలాగా పడిపోయాడు. వెంటనే అతని భార్య వెళ్ళి రామకవి కాళ్ళు పట్టుకొంది. ఆయన మరో పద్యం చెప్పాడు;

మేటిరఘురాము తమ్ముడు-పాటిగ సంజీవిచేత బ్రతికిన కరణీ€౯

గాటికి బో నీ కేటికి-లేటవరపు పోతరాజ లెమ్మా రమ్మాః (చాటు.రత్నా, 171) ఇలాంటి తిట్లూ దీవెనలేకాక మంచి రసవత్తరమైన కావ్యాలు తూడా తురగా రామకవి చెప్పాడో లేదో తెలియదు. బహుశ ఇతడే చింతలపాటి నీలా ద్రీరాజుమీద మూడు పద్యాలు పౌగడుతూ చెప్పాడు కాబోలు. వాటిని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సేకరించారు. ఒకటి చూడండి:

నవరసవిస్స్ఫార నాటకాలంకార సాహితీపరిపూర్ణకక్తిశాలి

హృద్యానవద్యాంధ్ర విద్యావినిర్నిద్ర పాండిత్య కౌశలీ పరివృతుండు

పారశీకవిేశేషభాషాచమత్కార బంధురప్రతిభా ధురంధరుండు

ప్రకట శస్త్రగజాశ్చరత్నాది కానేక శాస్త్రపరీక్షా విచక్షణుండు

షృథుతరాటోప కవితకీర్పి ప్రతాప

కాంతిపూరిత సకలదిగంతరుండు |

వితతవితరణ నిర్వక్ర విక్రమాది

రమ్యగుణపాళి నీలాద్రిరాజమౌళి. (చాటు.మణి.(2) పుట 17)

ఈ పద్యంలోని నీలాద్రిరాజు నిజంగా చింతలపాటి రాజే అయితే అతనిమీద కూచిమంచి జగ్గన్న పూసిన బురద అంతా దీనితో కడుక్కొని పోతుంది. జగ్గన్న తన 9... క్రీడాభిరామం పీరికలో ప్రభాకరశాస్త్రిగారు. శ్రీనాథుని పద్యంగా ఉదహరించారు. పుట జ

చాటుపద్యమణిమంజరిలో తురగా రామకవి అని వారే సవరించారు. పుట 1%. 10. ఈ పద్యాన్ని దీని తరువాత దాన్ని దీపాల పిచ్చయ్యశాస్తిగారు తమ చాటుపద్యరత్నాకరంలో ఉదాహరించారు. పుటలు 9, 100.

ప్రోలునాటి కవులు 969 కావ్యంలో రాక్షసునిగా చిత్రించిన అణివెళ్ళ వెంకటశాస్త్రి నిజంగా ఉద్దండ పండితుడు. అతణ్ణి నూజివీడు ప్రభువులు, పెద్దాపురం రజులు కూడా సన్మానించారు. ఆయన తెలుగులో. రచనలు చేశాడో లేదో తెలియదుగాని సంస్కృతంలో అతడు వ్రాసిన గురించి యింకా విపులమైన పరిశోధనలు జరగాలి. కూచిమంచి జగ్గన్న చేసిన అన్యాయం ఎంతో తేల్చాలి. కూచిమంచి సోదరుల సమకాలికులలో ఇంకో కవిచరిత్ర తూడా బాగా బయటపడలేదు. ఆయన పేరు సత్యవోలు భగవంతం. అతడు కూడా తూచిమంచి తిమ్మయ్యలాగా రుక్కిణీపరిణయం వ్రాశాడు.

సత్యవోలు భగవంతం రుక్కిణీపరిణయాన్నే ఈ యుగంలో రొటీను ప్రబంధంగా తూచిమంచి తిమ్మకవి వ్రాస్తే విలక్షణపంథాలో సత్యవోలు భగవంతం రచించాడు. భగవంతుడు వ్రాసిన కావ్యానికి తగినంత ప్రచారం రాలేదుగాని అది పోతరాజుగారి రుక్మిణీఠళ్యాణంతో తులతూగుతుంది. కూచిమంచివారితో తూచి మంచితనం చెప్పాలంటే ముల్లు సత్యవోలు వారివైపే హెచ్చు వాలుతుంది.

పోతరాజుగారి ఘట్టంలో లేని సొగసులు కూడా సత్యవోలువారి కావ్యంలో విచ్చుకున్నాయి. పోతరాజుగారి రుక్కిణి 'అప్తుడగు బ్రాహ్మణునొక్కని జీర కృష్ణునివద్దకు పంపించింది. ఆ భూసురుని వైవేటు జీవితం ఏమిటో మనకు తెలియదు. వ్యక్తిత్వం కొంతే తెలుస్తుంది. సత్యవోలువారి కావ్యంలో ఆ బ్రాహ్మణుని చిత్రణ సహజంగా; కథని చెడగొట్టకుండా, నిండుగా ఉంది.

రుక్కిణీదేవి తనను ఎందుకు పిలిపించిందో అతనికి తిలియదు. అయినా దైవవాక్యంలాగ ఎక్కడికేనా పంపిస్తే “సానుకూలంగా చేస్తానని హామీ ఇవ్వడం ఆమెకు కొండంత ఉత్సాహం ఇస్తుంది. నిస్సంకోచంగా ఇతణ్ణి పంపవచ్చుననే ధైర్కం వస్తుంది. అందుకే రుక్కిజీ విపులంగా సందేశం పంపింది. వెంటనే వెళ్లమంది. ఆ బ్రాహ్మడు తనమీద యీమె ఇంత భారం పెట్టిందే అని గర్వపడ్డాడు. ఉబ్బిపోయాడు. వెంటనే వెళ్ళాలి. అయితే ఇంట్లో పిడికెడు గింజలు కూడా లేవు. 'బిడ్డలాకటికి సైపరు. దాపరికమేల! బాలతోః నయెదనన్న చిన్నతనంబంచు దలంచి విరక్తుడైనాడు' (2-198). అయినా వెళ్లడానికి కాళ్లు రావు.

వెసవెస కొంతదవ్వు చను-వేమరు బారురీతి నాతిపై

నిసువులపై దలంపులిడి- నెవ్వను నెవ్వగ నొందు నందులో

బస పొసగించి రాజసుత- ప్రాపున నేపున సంచరించినం

గసరక పెంచు నంచు-జిను గ్రమ్మర ముమ్మరమైన వేడుక. (2-19) ద్వారక చేరుకున్నాడు (తూచిమంచివారి బ్రాహ్మడు పూర్ణయాతా స్పెషల్‌లో ఎక్కాడు). సత్యవోలువారి పేదబ్రాహ్మడు సత్వరంగా కార్యాన్ని సానుకూలం చేసుకొని వచ్చాడు. అ సంగతి చెప్పాడు. “ఆ దేనదేవునకు దేవేరివి కమ్ము. ఇది నా దీవన' అన్నాడు. అమె

970 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి (బ్రాహ్మణ్జీి చూసి సంతోషించింది. ““మీరు చేసిన మేలు మనసులో జ్ఞాపకం పెట్టుకుంటాను. రేపు రండి” అని ఉత్తచేతులతో పంపించింది. బ్రాహ్మణుడు చిన్నముఖం వేసుకున్నాడు. ఇంటికిపోతూ 'కన్యారత్న మేమీక పొమ్మనె, నాలేమి ఎరుంగదు, నేనుడువరాదు అన్యోపదేశంబు. కార్యనిగూఢంబు అదికాక రేపు నన్ను రమ్మంచుం టబ్రియంబార బల్కెను' అని పరిపరివిధాల అనుకున్నాడు. “దరిద్రతాన్వితుడు ఎప్పుడెట్టివారి. కడ నెభ్చంగి ప్రవర్తించినం దుదమేలొందదు' అని గుండె రాయిచేసుకున్నాడు. ఇది నిజమో కాదో రేపు చూద్దాంలే అనుకున్నాడు. అయితే రేపటిదాకా ఆగవలసిన అవసరం లేకపోయింది. ఉత్తచేతులతో పంపినా రుక్మిణి కృతఘ్నురాలు కాదు. ఆమె సాక్షాత్తూ లక్ష్మీదేవి. కడగంటి చూపు చూస్తి చాలు కలిమి ప్రసాదించుతుంది. వాస్తవానికామె భూసురుడు దీవించగానే దయతో చూచింది. “రమణి చూచినపుడె రాజిల్లు రాజిల్లు చందమునను విప్రసదన మలరె నఖిలవైభవముల

ఇది ఇంకోరకం కుచేలోపాఖ్యానం. ముఖ్యకథతో అత్‌కేటట్టు రసానుభూతి కలిగేటట్టు సత్యవోలు భగవంతం దీనిని బ్రాశాడు. పాత్రల మనస్తత్వ చిత్రణలో పూర్వపరాలలో వైరుద్ధుం లేకుండా కథ నడపడంలో కొందరే సిద్ధహస్తులుంటారు. సత్యవోలు భగవంతం వాళ్ళలో ఒకడు. ఈయన బ్రాహ్మణుని పాత్రలాగే రుక్మిణి పాత్ర తూడా కడుసమర్థతతో చిత్రించాడు. పాత్రపోషణలో ఇలాగ కద్ధ తీసుకునేవాళ్లే నిజంగా ప్రథమ శ్రేణి రచయితలు. వీళ్లు వ్రాసిన అన్ని కావ్యాలూ చదవాలనే ఆసక్తి మనలో కల్గుతుంది.

సత్యవోలు భగవంతం నిజానికి చాలా రచనలు చేశాడు. రుక్కిణీ పరిణయం అవతారికలో ఇలా చెప్పుకొన్నాడు.

ధీరత శతశతకంబులు-దారావళులుక్‌ దశావతారావళులుం .

జారూదాహరణంబులు- శ్రీరాజిత దండకములు జెప్పినవాడక్‌. (1-19) నూరు శతకాలూ, తారావళులూ, ఉదాహరణలు, దండకాలు - ఇన్ని చెప్పినా అందులో ఏ ఒక్కటీ దక్కలేదు. సత్యవోలువారు రచించిన దశవతారావళి మాత్రమే లభిస్తోంది అదికూడా రుక్మిణీ పరిణయంలోనే కవి పొందుపరచడంవల్ల గుర్తించడానికి వీలుగా ఉంది. 'వైకుంఠనాథలక్ష్మీసనాథ లక్షణ పరాయణుండ నారాయణుండ' అనే మకుటంతో ఈ దశావతార సీసపద్యాలు ఉంటాయి.! ఇవి చాలా ప్రచారం పొందాయి. సంతర్చణలో భోజనాలు చేస్తున్నప్పుడు చాలామంది సత్యవోలువారి దశావతార పద్యాలు చదువుతూ ఉండేవారు. ఈ పద్యరత్నాలకు లఖించిన ప్రచారం చూసి_ఇమిటేషను రత్నాలు కూడా పుట్టుకువచ్చాయి. దిట్టకవి ప్రకాశం, కాశీచైనుల లచ్చన మొదలైనవాళ్ళు నకిలీ పద్యాలు చెప్పారు. కలలో కనబడి “దిట్టకవి పద్యాలకన్న నీవే వన్నై కలిగియున్న'వని దేవుడే

కావ్యంలోని షష్ట్రంతాలు కూడా దశావతారాలే.

ప్రోలునాటి కవులు 971 మెచ్చుకొన్నాడని కాశీచైనుల కవి సంబరపడ్డాడు.3ి అనునరణ సత్యవోలువారి మకుటాన్ని సహితం కాశీవైనులాయన కొ టట హ్రంన. భగవంతం బ్రాసిన నూరు శతకాలమకుటాలు ఏమిటో తెలియదు. 'వైకుంఠనాథ లక్షీసనాథ' వగైరా మకుటంతో ఒక శతకం చెప్పాడు కాబోలు. రుక్కిణీపరిణయంలో చాలా పద్యాలు కనబడుతున్నాయి (1-67:69). మూడు పద్యాలు, 3-135:137 మూడు పద్యాలు, 4-101:111 పదకొండు పద్యాలు వెరసి పదిహేడు) ఇవి గునుగు సీసాలు. అవే అఆ రోజులలో చెయ్యి తిరిగిన కవులకు మోజు. సత్యవోలు భగవంతం ఎప్పటివాడో నికరంగా నిర్ణయించడానికి ప్రత్యక్ష ప్రమాణాలు లేవుగాని ఇతడు ఏనుగు లక్ష్మణకవి సమకాలికుడని చెప్పుకొంటారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా బొన్నాడ గ్రామంలో, ఐహంశ క్రీ.శ. 1720 ప్రాంతాలలో సత్యవోలు జనార్జనంగారనే ఆయన ఉండేవారు. ఆయన నడకుదుటి రామయ్యగారి అల్లుడు. నడకుదుటి వారికి రామచంద్రాపురం తాలూకా శహాపురం కరణీకం ఉండేది. రామన్నగారు గతించి క్రీ.శ 1904 నాటికి ఆరు తరాలు అయిందట.** తరానికి ముప్ఫయి. సంవత్సరాలు లెక్కవేస్తే ఆయన శ్రీశ 1724 ప్రాంతాలవాడని తేలుతోంది.!15 మాతామహుడు రామన్నగారు క్రీశ 1724లో ఉండే మనుమడు భగవంతం క్రీ. 1750 ప్రాంతాలలో ప్రాజ్ఞుడై ఉండవచ్చు. తన తల్లితండ్రుల గురించి, మేనమామ తల్లితండ్రుల గురించి ఒక పద్యంలో భగవంతం ఇలా చెప్పాడు: ర్మల యశుడైన నడ్కుదుటి రామన సూరమ పుత్రికం గృపా కలితను రామచంద్రవర గంగనసోదరి చేరమాంబ నిం పలర వివాహమయ్యె నమృతకాల్లిసుతం గమలాక్షుడుం బలెక. (రుక్మిణీ 1-15) ఈ పద్యమొక్కటే భగవంతంగారి కాలనిర్ణయానికి పనికివస్తుంది. ఇతడు కూచిమంచి పౌరులకు కొద్దిగా అర్వాచీనుడని చెప్పవచ్చు. ఆ అన్నదమ్ముల ధోరణీ ఇతనికి కూడా పట్టుపడింది. ఎంతటి ప్రతిభావంతుడైనా సమకాలిక ప్రభావాలకు, సంప్రదాయాలకు లోబడక తప్పదు. కావ్యాలలో మధుపానాన్ని వర్ణించడం నన్నెచోడుని కాలంనుంచీ కనబడుతోంది. ఎర్రయ్యగారు నృసింహ పురాణంలో చేసిన మధుపాన వర్ణన కూచిమంచి తిమ్మయ్య బాగా పట్టుకొన్నాడు. రుక్కిణీ పరిణయంలో కన్నెల చేతికీ నెలరాగిన్నై లిప్పించి వాటినిండా మధువు పోయించాడు. ఒక కన్ని 'ఎలమిని మోరఎత్తి ఎహిహీ యని నవ్వె మదంబు పెంపునన్‌' అని చెప్పి తిమ్మయ్య మరో కన్నెపిల్ల గురించి ఇలా వ్రాశాడు. 12. శతకకవుల చరిత్ర, వంగూరి సుబ్బారావుగారు, పుట 7౫4. వ మరల రంత వనర మనని ప్రచురణ, పీలిక పుట 2. జ న న రాలు జీవించిన యింకో నడకుదుటి రామన్నగారు కూడా ఉన్నారు. (ఆంధ్ర కవుల లనే భాగం, పుట 3౫. బహుశా ఈ రామన్నగారికి తాతగార్‌పేరు పెట్టుకున్నారు కాబోలు).

972 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి చెలువ యొక తె తనదు మదిరా-కలశంబులుగొనగ నీకు కారణమేమే తులువ యని యొకతి గురుకుచ-కలశంబులు పట్టి లాగె గ్రద్దరి యగుచున్‌ (తూచి.రుక్కిణి ౩-%) అన్నగారిలా రుక్కిణీదేవి చెలికత్తెల చేత చేయిస్తే ఆయనకన్న మరో నాలుగు గిన్నెలు తమ్ముడు ఎక్కువ పోయించకలడు. జగ్గకవి సుభద్రా పరిణయంలో సుభద్ర చెలికత్తెలచేత సౌక్కుతూ సోలుతూ తాగించాడు. అది మామూలు మధువు కాదు. 'బహుళతరువ రసంజాత పత్రమూలఫల కుసుమసార శర్కరామిళితం. “ఆ వారుణీపాన కలనా ప్రవర్థ్ధమాన మదభరోన్మాదమున' సుభద్ర చెలికత్తిలు చేసిన చేష్టలు చూడండి: మదిరాక్షి యొక్కతె యిదె ప్రియుండరుదెంచె నంచు బయల్లౌగలించుకొనియె వెలది యొక్క తె భర్హ విడెము చుట్టిడె నంచు దివురొప్పగా నోరుదెరచుకొనియె జెలువ యొక్క తె పతిజిలుగుపయ్యద యీడ్చె నంచు రొమ్మున జేతులాను కొనియె బడతి యొక్క తె నీవి సడలించె విభుడంచు మరునిల్లునరుకేల మాటుకొనియె నింతి యొక్క తె ధవుడు గిల్లింత లిడియె నంచు నెమ్మేన బులకములంకురింప నులికిపడుచుండె నయ్యారె బలితమైన మధుమదోన్మాదమున నొడల్‌ మరిచియిపుడు. (సుభద్రా. ౩-౫) తూచిమంచి కవులు వర్జించిన ఈ మధుమదోన్నాదానికి ఏమాత్రం తీసిపోకుండా సత్యవోలు భగవంతం కూడా వ్రాశాడు. ఒక రకంగా ఇతని మధువులో నిషా ఎక్కువగా ఉంది. సత్యవోలువారి కావ్యంలో రుక్మిణి చెలికత్తెలు చేసిన చేష్టలు చూడండి: ఉన్మాదదశను మేనూగ నట్టిట్టేగు తెరవ గట్టిన చీర దిగిచె నొకతె తనుకంపమున మేడతలుపు చేరిన తన్వి నక్కున జేర్చి ముద్దాడెనొకతె వమనక్రీయార్థమై వంగిన తన్వంగి ధైనుకరతి జూపి తనిసె నొకతె పారవశ్శమ్మున బడియున్న చెలి జేరి పురుషాయితపుకేళి బూనె నొకతె కొంగవలె కోతివలె గండుకోయిలవలె టీలుకవలె జల్వవలె సోకు చేడియవలె వచనములు నిద్రబయకృతివరుసగాొనిరి (సత్య. రుక్కిణీ. 2-122) ఎంత ఆడపిల్లలు తాగినా యీ కొంగజపం, తోతిచేష్టలు, కేకలు, అల్స వచనాలు చూసేవాళ్లకు భయంకరంగా ఉంటాయి. చెలికత్తెలు చేసే గొడవ చూసి సత్యవోలువారి రుక్కిణి నిజంగా భయపడింది. ఈ సంగతి భగవంతం గట్టిగా చెప్పించాడు. ఈలాగు నున్న కన్నెల - బాలామణీ చూచి లేచి భయపడి తనతో హాలారసవర్ణితలగు - లోలాక్షుల తోడ మేడలోనికి బనియెళ (సత్య. రుక్కిజీ. 2-12)

ప్రోలనాటీ కవులు 973 మేడలోనికి వెళ్లి ఊరుకోలేదు. *చెలుల వేరిడితనమువో నౌషధములు' దయతో నిప్పంచింది. అసలు తాగడానికి కూడా అమె అనుమతి మొదట కావలసి వచ్చింది. “అమ్మ కుసుమాసవంబాన నానతియ్యవలయు జలకేళి శ్రైత్యనివారణము' అని ప్రార్థించాక గన్నెలనెలకొలిపి రెండు కెలకులనిడి తనకు నగసరిచాక అనతిచ్చింది. అయితే అందరూ తాగలేదు. “కొందరు సుందరు లమ్మహీశ తనయచందాన మధువాన తలపరైరి (1-115) అని సత్యవోలు భగవంతం స్పష్టంగా చెప్పాడు. తూచిమంచి జగ్గన్న కావ్యంలోని 'వనజవదనలెల్ల..... గుటుకుగుటుకన' గ్రోలారు.. సుభద్ర చెలికత్తెల చేష్టలకు భయపడలేదు. వదిలిపెట్టిపోలేదు. వాళ్లతో బెరసిక్రమ్మర నగరుకు వెళ్లింది. ఆ స్థితిలో ఉన్న నాయికను కూచిమంచి జగ్గన్నగారి అర్జునుడు చూసి మోహించాడు. తమ్మునికన్నా అన్న నయం. ఈ స్థితిలో రుక్మిణి 'సందేశం పంపీంచిందని వ్రాయలేదు. మదిరాప్రానం మెక్కుబడి అయ్యాక రుక్మిణి చంద్ర దూషణం మొదలైనవి లాక్షణికుల సంతృష్తికోసం ప్రారంభించింది. లక్షణ గ్రంథాల నిర్దేశాలను పాటిస్తూనే మంచి కవిత్వం చెప్పనచ్చునని సత్యవోలు భగవంతం రుజువు చేశాడు. పాత్రల మనస్తత్వాలను చిత్రించడానికి ప్రయత్నించి కృతకృత్యుడయ్యాడు. ఏ యుగంలోని కవులైనా ఇంత శ్రద్ధతో రచనలు చేస్తే అది స్వర్ణయుగం అవుతుంది. ఎచరో కొందగే ఒకటీ అరా కావ్యాలలో ఈ ప్రతిభను వ్యక్తపరిచారు. వాళ్లలో ఏనుగు చినలచ్చన్న ఒకడు. ఏనుగు చినలచ్చన్నః; మన ప్రబంధాలలో మొట్టమొదట పురవర్జన ఎంత తప్పనిసరో వేశ్యావర్జన తూడా అందులో అంత విధిగా ఉండి తీరాలి. బురుజుల ఎత్తూ, అగడ్తల లోతూ మొదలైనవి వరసగా ఇరవై ముప్ఫయి పద్యాలలో చెప్పిన తరువాత ఆ వూరి వేశ్ళలచేత యథాశక్తి ఒకటి రెండు పద్యాలలో రంభ తలా, ఊర్వశి సిగా తన్నించి మన కవులు అసలు కథలో పడతారు. లింగనమఖి తిరుకామయ్యలాటి బుద్ధిమంతులు ఎత్తుకొంటూనే పురవర్దనలో కందర్పసంగరాలూ, వేశ్చవాటికలూ వర్జించుతారు. ఇంక వేశ్యలే ప్రధాన పాత్రలయిన కావ్యాలయితే చెప్పాలా? మనోజరుజలు, మదన కదనాలు, మరులు మచ్చీకలు, మగపనుల నేర్చరుల - ఒకటేమిటి? శృంగారం బహుభంగుల క్రైపెక్కుతుంది. వెలయాలు విలాసవస్తువేగాని ఆమె తూడా మనిషే ఆమెకూ ఒక మనసుంటుంది. అందులో ఆలోచనలుంటాయి; ఆరాటాలుంటాయి అన్న సంగతులు మన ప్రబంధ కవులు చాలామంది విస్కరిస్తారు. - ఇటువంటి సాహిత్య వాతావరణంలో కొద్దిగా మానసిక సంఘర్షణ కల వొరకాంతను చిత్రించే కావ్యం కనబడితే ప్రాణం లేచివస్తుంది. ఏనుగు చినలక్ష్మన్న జాహ్నవీ మాహాత్మ్యం అనే "ప్రబంధం రచించాడు. దాని చతుర్గాశ్వాసంలో ఒక పానిపాపకథ ఉంది. వినండి, పూర్వం కళింగపురంలో. ఒక వారకాంత ఇంట్లో ఒక చిన్నది పుట్టింది. అల్లారుముద్దుగా పెరిగింది. అమెకు యౌవనం వచ్చింది. 'తరిపి వెన్నెల నీట తడిపిన

74 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి యద్దంబు గతి మొగంబున కొత్త కాంతి పౌొడమింది. "అమె సకలవిద్యాప్రవీణ అయి విటచిత్తాలు ఆకర్షించి భోగమనుభవిస్తూ ఉండేది. పైలాపచ్చీసులో ఉన్నప్పుడు ఆమెకో వింత అనుభూతి కల్గింది. ఆ సంగతి ఆమె ఇలా కథనం చేసింది: “నిండు జవ్వనంబునను నివ్వటిల్లునప్పు డొకనా డొక విటశ్రేష్టు రాక గోరి పెద్దయుం బొద్దు చనునంతకు నేకాకినై హంసతూలికాతల్చం బున బవ్వళించియుండీ వాని రామికి ఉమ్మలికంబు జెంది “నే నెవ్వతిను? వా డెవ్వడు? వాని రాక కెదురుచూచుచు నింతవంతం బడీ వగవనేటికి? నిద్రవిడిచి మిడుకనేల? యేల వలచితి? నే నింతకాలం బిట్లు పడసి యేమి సాధించితి? మహాదురిత భాజనంబగు నీ జన్మంబు నాకు నేల కల్లె? ఎక్కడి తల్లి? ఎక్కడి చెలులు? ఈ ధనంబున నేమి పని యయ్యెడు?! (జాహ్నవీ. 4-43) ఆమె విరక్తి చెందింది. ఆ వైరాగ్యం ముదిరింది. ఆ ఊళో వుండే రాజపురోహితుణ్ణి కలుసుకొంది. మోక్షం ఎలా లఖిస్తుందని ప్రశ్నించింది. ఈ పాపం ఎలా ప్రక్షాళనం చేసుకోవడం అని అడిగింది. ఆయన ఉపదేశం చేశాడు. అహల్యా గమనం వల్ల అంటిన పాపాన్ని ఇంద్రుడు ఎలా కడిగేసుకొన్నాడో చెప్పాడు. ప్రయాగకు వెళ్లి మాఘంలో గంగాస్నానం చేయమని బోధించాడు. ఆమె చేసింది. ఆ పుణ్యం వల్ల అమెకు ఉత్తమగతులు లఫించాయి. సుమేరుడనే గంధర్వరాజుతు పుత్రిక అయి జన్మించింది. కాంచనమాలిని అనే పేరుతో పెరిగి, రజతగిరిపై కాత్యాయని కొలువులో రాణిస్తూ ఉండేది. ఇంతటి సువ్రతాన్ని నోచుకున్నా అమె మాఘమాసంలో గంగాస్నానాలు మానలేదు. ఒకసారి స్నానం చేసి ఒడ్డుకురాగానే ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడ్డాడు. మన సాహిత్యంలో అల్లసాని పెద్దనగారి బ్రహ్మరాక్షసుడు చాలా ప్రసిద్దుడు. మనుచరిత్ర పుట్టాక బ్రహ్మరాక్షసులంతా ఒకటే మచ్చు. ఆడపిల్లల వెంటపడీ తొరుక్కుతినాలని చూస్తారు. కానైతే జాహ్నవీ మాహాత్మ్యంలోని బ్రహ్మరాక్షసుడు అందులోని వేశ్ళలాగా విలక్షణమైనవాడు. 'తులకించు తడిచీర తొడలపై హత్తి జోకగా లోజిగిచౌకళింపా ఏ ఆడది కనబడ్డా మానవులకు కామోద్రేకం కలుగవచ్చు. కొని ఉవిద నీ తడిచీర బిందువులు తలను సోకినంతనె దయపుట్టె సూవె మదిని ప్రాణుల భుజించు నాకు క్రౌర్యంబు మాని ప్రియము గదిరెడు నీరూపురేఖ చూడ (జాహ్నవీ 4-2) దయపుట్టి ప్రియమవడంతోపాటు ఎవరో ఆత్మీయులను చూసినట్లయింది. ఆ రక్కసి మక్కువతో ఇలా అన్నాడు: తల్లివలె జాయబుట్టిన - చెల్లెలివలె నిన్ను జూచి చిత్తము కడు రం బీల్లెన్‌ నీమధురోత్తులు - తల్లీ విన వేడుకయ్యె దద్దయు నాకున్‌. (జాహ్నవీ. 4-జ)

ప్రోలునాటి కవులు 975 అతని వేడుక తీరేటట్టు మధురోక్తులతో ఆమె తన కథ చెప్పింది. విన్నాక అతడు తనను ఉద్ధరించమన్నాడు. అమె తన పుణ్యంలో మూడో వంతు ధారపోసింది. తడికావిచీరచెంగున- విడిచిన తోయముల వేల్పు విత్తరిఫలమి ప్పుడు ధారవోనె నతనికి దడయకదేవత్వమందె దగరక్కసుడున్‌.

(జాహ్నవీ. 4-121) జాహ్నవీ మాహాత్మ్యంలోని ఈ బ్రహ్మరాక్షసోపాఖ్యానం చదువుతూ వుంటే ఎడారిలో ఒయాసిస్సు చేరుకొన్నట్టు ఉంటుంది. ఇంత చక్కని ఘట్టాలు దురదృష్టవశాత్తు ఏనుగు చినలచ్చన్న బ్రాసిన ఇతర (గగ్రంథాలలోనే కాదు, ఈ కావ్యంలో కూడా కనబడవు. “వ్యాకరణ _శుద్ధిలేని భాషణంబును, ధ్వనిలేని కావ్యంబును, గంగలేని దేశంబును హీనత్వంబునొందు' అని లచ్చన్న చెప్పాడు (1-20). అయితే జాహ్నవీమాహాత్మ్యంలో కొన్ని భాషణాలకు వ్యాకరణశుద్ధి ఉన్నా కొన్ని ఘట్టాలలో ధ్వని ఉందని చెప్పలేం.

ఏనుగు చినలచ్చన్నకు కవీశ్వరుడని బిరుదుతెచ్చిన కబ్బం మాత్రం అతని సుభాషిత రత్నావళి, భర్హ్చృహరి సుభాషితాలను ఎందరనువదించినా ఇతని తెనిగింపే యింపుగా ఉందని సాహితీపరులు భావిస్తారు. ఇప్పటిదాకా సుభాషిత శతకాల అనువాదకులు ఎనమండుగురు కనబడుతున్నారు.

  1. ఎలకూచిబాలసరస్వతి మల్లభూపాలీయం అనే పేర ప్రచారం పొందింది.

  2. పుష్పగిరితిమ్మన్న ఒక్క నీతిశతకమే అనువదించాడు.

౩. ఏనుగు చినలచ్చన్న అత్యంత ప్రచారం పొందినది

  1. పోచిరాజువీరన నష్టకావ్యం

  2. పడకిండ్ల గురురాజు అలభ్యం

  3. వెల్లాల నరసింగయ్య కందపద్యాలలో అనువదించాడు

  4. కొక్కండ వెంకటరత్నం నీతిపద్యాలలో టీకరాస్తూ కొన్ని పద్యాలు

తెనిగించాడు

  1. గుర్రం వెంకటసుబ్రహ్మణ్యం మూడు శతకాలు అనువదించాడు. ఇంతమంది అనువదించినా చినలచ్చన్న భాషాంతరీకరణమే భేషుగ్గా ఉండడానికి కారణం లేకపోలేదు. సంస్కృత శ్లోకాన్ని తెనిగించడంలో గల మెళకువలు శ్రీనాథుని తరువాత చినలచ్చన్నకే పట్టుపడ్డాయి. మూలంలోని కొన్ని పదాలను యథాతథంగా దిగుమతి చేసి పాదగవలసినచోట్ల పొదిగి ఓహో అనిపించడం కొందరికే చేతనవుతుంది. ఎలకూచివారి అనువాదాలు, పుష్పగిరివారి తెనిగింపూ చినలచ్చన్న చూశాడు. వాటికీ మెరుగులు దిద్దుతూ సుభాషితాలను తన సౌమ్ము చేసుకున్నాడు. “య ద్యాత్రా నిజఫాల పట్ట లిఖితం' అనే సుభాషితానికి పుష్పగిరివారి అనువాదాన్ని, లచ్చన్న అనుసరణని చూస్తే యీ సంగతి తెలుస్తుంది.

వనజభవుండు ము న్నాసట వ్రాసిన దెంతయొ యెంత కొంచెమో

ఘనమొ సురాద్రి నున్న మరుఘట్టము చేరిన వచ్చు, హెచ్చు రా

976 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దనఘ వృథావ్యథల్‌గనకు మౌఢ్యుల చెంత. ధరింపు ధైర్యమూ నిన ఘటి కెచ్చునే జలము నీరధి ముంచిన నూత ముంచినన్‌. (పుష్పగిరి. నీతి, 40) వనజభవుండు నెన్నొసటవ్రాసిన సౌమ్ము ఘనంబొ కొంచెమో విను మరుభూమి కేగిన లిఖించును మేరువు జేరబోయినన్‌ ధన మధికంబు రాదు దైన్యము మాను ధనాఢ్యులందు న వ్వననిధి నూత దుల్యముగ వారి గ్రహించు ఘటంబుసూడుమా. (ఏనుగు. గీతి 40) ఈ రెండు పద్యాలలోనేకాదు మరో నాలుగు సుభాషితాల ఎత్తుగడలో పుష్పగిరివారి పోలికలు కనబడతాయి (3, 52, 53, 81). ఇలాగే ఎలకూచి వారిలో కూడా పోలికలు ఉన్నాయి. అవే ఎత్తుగడలు, అవే మూలంలో లేని సమాసాలు మొదలైన సారూప్యాలు ఎలకూచివారి నీతిశతకంతో తైపారువేస్తి అరడజను ఉన్నాయి (3, 58, 59, 64, 67, 74). ఇలాగ పూర్వుల ప్రభావం ఉండబట్టే చినలచ్చన్న అనువదించిన సుభాషితాలు రాణించాయి. ఇతడు నీతిని తెనిగించాకనే యీ భావాలను సమకాలికులు తమ శతకాలలో, కావ్యాలలో బాగా వాడుకొన్నారేమో. కూచిమంచి తిమ్మకవి అంతటివాడే తన కుక్కుటేశ్చర శతకంలో సుభాషితాలను అనుసరించాడు. తిమ్మయ్య అంటీ చినలచ్చన్నకు గౌరవం. అందుకే జాహ్నవీమాహాత్మ్యం వి స్తుడిలో వర్తమాన కవీశ్చ్వరవరునిగా అతణ్ణీ నుతించాడు. తిమ్మయ్యకు తూడా లచ్చన్న అంటే అభిమానం. ఇలాగ ఒక చాటువులో శ్లాఘించాడు. భారతీవదనాంబుజ భాజిమాన- కవితకర్పూర తాంబూలకళలగూఢ బంధురంబులు నీమంజుభాషణములు- లలితగుణధుర్య యేనుగులక్ష్మణార్మ్క. భారతీదేవి వేసుకొనే కప్పురవిడెంలాగ ఘమఘమలాడే కవిత్వం చెప్పే లచ్చన్నగారిని అభిమానించి కర్పూర తాంబూలాలు ఇచ్చి కావ్యాలు చెప్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాహ్నవీమాహాత్మ్యంలో వర్తమాన కవులనే కాక సమకాలిక ప్రముఖులను తూడా చినలచ్చన్న పేర్కొన్నాడు. నండూరి కామరాజు, భద్రరాజు మల్లన్న, పిండిప్రోలు వెంకటరామయ్య మొదలగువారి పిర్లు అతను చెప్పాడు. నండూరి కామరాజుగారు ఆ రోజులలో కాకినాడ శలపాక మహళ్ళకు స్థలపతిగా ఉండేవాడు. చాలామందికీ పోషకుడు. ఆయన జ్రోద్చలం వల్ల చినలచ్చన్న జాహ్నవీమాహాత్మ్యం వ్రాసి వెంటూరి సోమేశ్వరునికి అంకితం ఇచ్చాడు. ఈ మంచిపని చేయమని భద్రరాజు మల్లన్న ప్రోత్సహించాడు. ఆదిలో యీ మల్లన్నే చినలచ్చన్నను ఆదరించి, రామేశ్చ్వరమాహాత్మ్యం అనే కావ్యం వ్రాయించి గురజానపల్లి మల్లేశ్వరస్వామికి అంకితం ఇప్పించాడు. అప్పుడు ఆ మంచిపని చేయమని నండూరి కామరాజును ్రోత్సహించాడట. అత్మీయులు ప్రోత్సహించినా, ఆత్మ ప్రబోధించినా చినలచ్చన్న తన స్వగ్రామంలోని సోమేశ్వర స్వామికీ 'అంకీతం ఇచ్చాడు. విశ్వేశ్వరోదాహరణం, నరసింహదండకం, కాళిదండకం, ఆదిత్యహృదయం, సంస్కృతంలో సూర్యశతకం మొదలైనవి బ్రాసి అ దేవుళ్ల

ప్రోలునాటి కవులు 977 సమర్పించాడు. విశ్వామిత్ర చరిత్ర అనే కావ్యం కూడా చినలచ్చన్న వ్రాశాడు. ఇది ఎవరి ప్రోత్సాహంతో బ్రాశాడో, ఏ దేవునికి అంకితం యిచ్చాడో తెలియదు.

సమకాలిక కవులకు తలలో నాలుకలాగ మెలుగుతూ సక్కావ్యాలు వ్రాసిన లచ్చన్న కీర్తి పెద్దాపురం రాజబంధువుల చెవిని పడింది. కాకినాడ తాలూకా కాండ్రేగుల పట్టణంలో వత్సవాయి గోపరాజుగారనే ఒకాయన ఉన్నాడు. వీరి ముత్తాతగారి చిన్నన్న కొడుకుకే ఏనుగుపెదలచ్చన్నగారు. తుల్యమాహాత్మ్యం అంకితం యిచ్చారు. గోపరాజుగారు రాజలక్షణసంపన్నుడే కాక మహాప్రసన్నుడే. ఆయనకు ఏదైనా కావ్యం అంకితం పుచ్చుకోవాలని ఉంది. ఏనుగు చినలచ్చన్న 'రామాయణరమ్యకథానుసారి గా రామవిలాసం అనే కావ్యం రచింపబోతున్నాడని గోపరాజుగారు విన్నారు. దానిని తన

గండి తెగి చెరువుపాడగు, - ఖండింప నశించు వనము, ఘనవృష్టిమరు

త్తాండవముల గుడీ కూలు, న-ఖండితమై కావ్యమలరు గలకాలంబున్‌.

(రామ. 1-27)

వత్సవాయి గోపరాజుగారు అఖండితమై అమరేకావ్యం యివ్వమని కోరగానే చినలచ్చన్న_ అంగీకరించి అంకితం ఇచ్చాడుగాని నేడిది ఖండితమైన రూపంలో అచ్చుపడింది. రామవిలాసం అవతారికలోనే 478 గద్యపద్యాలున్నాయి. ఇవి వత్సవాయి వారి వంశాన్ని విపులంగా వర్ణించి చెప్పాయి. చారిత్రక ప్రయోజనాలకోసం అవతారికను మాత్రమే ప్రచురించారు.*ీ రామవిలాసం పూర్తిగా అచ్చుపడడం అవసరం.

కావ్యాన్ని అంకితం పుచ్చుకొన్న వత్సవాయి గోపరాజుగారు ఉత్తరోత్తరా చినలచ్చన్నకు రాజదర్శనం చేయించి అశ్రయమిప్పించారేమో. పెదలచ్చన్నగారికి క్రీశ 1649-1688 మధ్యగల సార్వభౌమతిమ్మరాజుగారి ఆశ్రయం లఖించినా చినలచ్చన్నకు ఆ రాజుగారి మనుముల ప్రాపకం దొరకడానికి పరిస్థితులు అనుకూలించ లేదేమో. రాజవంశం అనాడు చాలా చిక్కులలో ఉంది.

చినలచ్చన్న రచించిన విశ్వామిత్ర చరిత్ర బయటపడితే పెద్దాపురం రాజులకు అంకితం యిచ్చి మిక్కిలి సొమ్ములు, పాలకీలు పుచ్చుకొన్నాడేమో చూడాలి. అయితే దాన్ని సుభాషితరత్నావశికి పూర్వమే వ్రాశాడు. సుభాషితాన్ని స్వగ్రామంలోని దేవునికి అంకితం ఇచ్చాడు. కనుక విశ్వామిత్ర చరిత్రను కూడా బాహ్నవీమాహాత్మ్యంలాగు రామేశ్చ్వరమాహాత్మ్యంలాగ దేవునికే సమర్పించి ఉండవచ్చు.

రామేశ్వరమాహాత్మ్యం అయిదాశ్వాసాల కావ్యం. బహుశా ఇదే లచ్చన్న ప్రథమ కృతి కావచ్చు. స్కాందపుర్తాణంలోని సితుమాహాత్మ్యాన్ని తీసుకొని వ్రాశాడు. పురాణంమీద' భక్తిశద్ధలున్ను--వాళ్తు ఓపిగ్గా చదువుకోవాలిగాని ఈ గగ్రంథంవల్ల ఇ. రామవిలానం ప్రకాశకులు శ్రీ వత్సవాయి రాయజగపతివర్మగారు. ఇది 1934 నాటికి నాలుగుసార్లు

అచ్చుపడింది.

978 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి “శ్రీరామునిచేత నిర్మితంబగు సేతుబంధంబున ననేకకోటి తీర్ధంబులు కలవు. వాని నామంబులు సంఖ్యయు' శేషుడు కూడా చెప్పలేడు. అయినా చినలచ్చన్న వాటి వివరాలు విశదపరిచాడు.

ఒక తీర్ధంలో స్నానం చేసి నలకూబరుడు రంభాసంభోగం కాంచాడట. మరొక తీర్ధంలో గ్రుంకి పురూరవుడు ఊర్వశీసంభోగసుఖం పొందాడట. “అగస్త్య భ్రాత యమృతుండైన కారణంబున ఇది యమృతవాహి యయ్యె' అని పౌరాణికుడు చెప్పాడు (1-119). తెలుగు సాహిత్యంలో ఆ మాటకొస్తీ చినలచ్చన్ను వ్రాసిన గ్రంథాలలో ఈ రామేశ్చరమాహాత్మ్యం అగస్త్యభ్రాతలాంటి కావ్యమే.

వీనుగు అనంతయ్య: అగస్త్యభ్రాతగారి పేరేమిటో మనకు తెలియదుగాని ఏనుగు చినలచ్చన్నగారి అన్నయ్యపేరు అనంతయ్య. ఈయన కూడా కవే. ఏనుగువారింట్లో అందరూ కవులే అని చెప్పవచ్చు. తాత పెదలచ్చన్నగారు సుప్రసిద్ధులు. తండ్రి తిమ్మయ్య కవితారసార్కుడు. కవితానిధి. సరసకవితాప్రవీణుడు. దివ్యభారతి అని చినలచ్చన్న చెప్పాడు. ఏనుగు తిమ్మయ్య పార్ధివాస్థాన పూజితుడు; భాగ్యవంతుడు అని కూడా ఈ క్రీంది పద్యంవల్ల తెలుస్తోంది. రామవిలాసంలో తన తండ్రినిలా చినలచ్చన్న తలుచుకున్నాడు.

పార్గివేశ్చ్వరపూ జాకృ తార్థుసకల- పార్థివాన్థాన పూ జితుభాగ్యవంతు

సరసకవితా ప్రవీణు మబ్బనకుదలతు- దివ్య భారతి ఏనుగుతిమ్మకవిని.

(రామ. 1-19)

దివ్యభారతి అని పాగడడానికి తగినట్టు ఏనుగు తిమ్మయ్య ఏ కావ్యాలు చెప్పాడో కొడుకు విశదపరచలేదు. తండ్రి వ్రాసిన గ్రంథాల గురించి చెప్పకపోయినా అన్న అనంతయ్యనూ, అతడు రచించిన కావ్యాన్నీ సుభాషితరత్నావళితో చినలచ్చన్న ఇలాగ పేర్కొన్నాడు:

గౌరీపరిణయకావ్యము-సూరీంద్రులు మెచ్చ జెప్పి శుంభత్కవితా

పారీణవీరుదుమందిన భూరియశోఘను డనంత బుధవరుడందున్‌. (సుభా1)

సూరీంద్రులను మెప్పించి శుంభత్కవితాపారీణుడని బిరుదు పొందిన ఈ అనంతయ్య కవిత్వాన్ని చదివి మెచ్చుకోడానికి అతని కావ్యం దక్కలేదు. తాతగారు సంపాదించిన పెద్దాడ కరణీకాన్ని చేసుకొంటూ అనంతయ్య స్వగ్రామంలోనే ఉండిపోయి ఉంటాడు. ఇతనికి చినలచ్చన్నేకాక వీరభద్రం అనే మరో తమ్ముడు కూడా ఉన్నాడు. ఏనుగు వీరభద్రయ్య ఏ రచనలు చేశాడో అతను కవి అవునో కాదో తూడా తెలియదు.

వక్కలంక వీరభద్రయ్య। ఏనుగు వీరభద్రయ్య కవి అయినా కాకపోయినా అతని కాలంలో ఆ పేరింటివాడొకాయన ప్రోలునాటిలో పెద్దకవిగా మన్ననలు పొందాడు. ఆయన వక్కలంక వీరభద్రయ్య, ఈతణ్జి వీరన్నగారని తూడా పిలిచేవారు. వక్కలంకవారిది పండిత కుటుంబం. తరతరాలనుండి పిఠాపురం ప్రభువులకు హీతులుగా, అశ్రితులుగా ఆ వంశం వాళ్లు రాణించారు. వక్కలంక చంద్రశేఖరంగారు

ప్రోలునాటి కవులు 979 భాషాఖిలశేషాహిగా లోకవిఖ్యాతులయ్యారు. వారి కొడుకు బాచన్న 'చాటువాగార్థక విత్రప్రబంధ కల్పనాశాలి.' ఈ బాచన్నకు వెణతురుపల్లి విశ్చనాథంగారు తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. విశ్చ్వనాథంగారంటే శేషధర్మాలు తెనిగించి వత్సవాయి ముసలి తిమ్మరాజుగారికి అంకితం ఇచ్చిన దిట్ట. విశ్చ్వనాథంగారి కొడుకు దిట్టకవి వెంకటకవి విష్ణుపురాణం మొదలైనవి రచించాడు.

తండ్రీవంకవాళ్లూ, తల్లివంకవాళ్లూ ఇంతటి సాహితీపరులైతే ఆ ఇంటి గోడలకు తూడా కవిత్వం అబ్బుతుంది. చిన్నతనంలో వీరభద్రయ్యకు చదవకుండానే కవిత్వం రావడం ఒక ఘనకార్యం కాదు. తాతతండ్రులో, మేనమామలో శిష్యులకు పాఠం చెప్తున్నప్పుడే వీరయ్య కాళిదాసు కుమూరసంభవాన్ని విని ధారణ పట్టివుంటాడు. దానిని బాల్యంలోనే తెనిగించాడు. అతని ప్రజ్ఞకు అంతా అబ్బురపడ్డారు.

ఎవరిదగ్గిరా చదవకుండానే కావ్యాలు రచించడం మొదలుపెట్టినా వక్కలంక వీరయ్య విద్యాభ్యాసం చేయకపోలేదు. ఈయన ఈదులపల్లి భవానీశంతో కలిసి చదువుకొన్నాడు. ఈ ఇద్దరికి దిట్టకవి వెంకటాద్రే విద్యాగురువు.]” వెంకటాద్రిని "ప్రబంధ నిబంధనబంధుర _ క్రీయాభారుహతుల్యసూత్రు'డనీ, తన _ గురుడనీ భవానీశం ప్రస్తుతించాడు. వక్కలంక వీరయ్య, ఈదులపల్లి భవానీశం సహాధ్యాయులని ఏనుగు చినలచ్చన్న చెప్పాడు. వెణుతురుపల్లి విశ్చనాథంగారూ, వారి కొడుకూ, అతని శిష్యులూ అందరూ ఏనుగు చినలచ్చన్నకు ఆత్మీయులే.

ఏనుగు చినలచ్చన్న కలం పట్టి కవిత్వం చెప్పడానికి మొదలుపెట్టిన రోజులకే వీరయ్యా, ఈదులపల్లి భవానీశం కృతికర్తలయ్యారు. వక్కలంక వారికి కాతతండ్రుల కాలంనుంచి పిఠాపురం వారి ఆశ్రయం ఉంది. వీరయ్యను గూడా పట్టపురాబజు పిలిపించి కృతి చెప్పమని ఆదేశించాడు. క్రీ.శ. 1679 నుండీ 1704 దాకా పిఠాపురాన్ని పాలించిన మాధవరాయణింవారు వీరయ్యను సత్కరించి వాసవదత్తాపరిణయాన్ని స్వీకరించారు.

సంస్కృతంలో వాసవదత్త మొదటి గద్యకావ్యం. దీనిని సుబంధుడు రచించాడు. ఇతడు క్రీ.శ. 750 ప్రాంతాలవాడు.** అంత ప్రాచీనకాలంలోనే అతడు వాసవదత్తను చక్కని శృంగార కావ్యంగా రచించాడు. కందర్పకేతువు అనే రాజపుత్రుడు ఒకనాడు కలగన్నాడు. అందులో ఒక అమ్మాయిని చూశాడు. మరులుకొన్నాడు. తెలివివచ్చాక స్నేహితునితో కలిసి వనానికి వెళ్లాడు. అక్కడ ఒక నేరేడు చెట్టుమీద రెండు పక్షులు తూర్పొని లోకాఖిరామాయణం చెప్పుకొంటున్నాయి. వాసవదత్త అనే వన్నైెలాడి కలలో ఒక చిన్నవానిని చూసి వలచిందట. ఆ ముచ్చటే పక్షులు చెప్పుకొంటున్నాయి. ఆమె మనసిచ్చిన యువకుడు కందర్పకేతుడే. వాసవదత్త ప్రేమించి ఊరుకోలేదు. తన పెంపుడు గోరువంకను రాజకుమారునివద్దతు పంపింది. ఆ పక్షి రాజకుమారుడు తోటలోనికి వచ్చేసరికి కాచుకుని తూర్చుంది. ఈ కథ క్రీ.శ. 1750 నాటికి పాతబడ్డదే కావచ్చునుగాని 17. దిట్టకవి వెంకటాద్రి కూడా చదవకయే సర్వశాస్త్ర పాండిత్యం సంగ్రహించాడని ఈదులపట్లి భవానీశం జ. సంస్కృతవాజ్క్యయ చరిత్ర. ద్వితీయఖాగం - మల్లాది సూర్భనారాయణశాస్త్రిగారు, పుట 351.

980 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి సుబంధుని కాలంలో నవ్యసాహిత్యమే. ఈ ఇతివృత్తాన్ని సుబంధుడు ప్రొఢతరంగా రచించాడు.

సుబంధుని కావ్యాన్ని సాహితీపరులు మెచ్చుకున్నారు దండిలాంటివాడే ప్రస్తుతించాడు. ఘనతరమనీషతో సుబంధుడు ప్రతిపదశ్లేష గద్యప్రబంధంగా చెప్పిన ఈ కావ్యాన్ని వక్కలంక వీరయ్య ప్రొఢ వాగ్గుంభనతో వైదర్సీ రీతితో అనుదించాడు. ఈ తన కావ్యం విద్యచ్చరిగణ్యం అవుతుందని ఆశించాడు. వాసవదత్తా పరిణయం ఒకసారి ఎప్పుడో అచ్చుపడింది.*ి మళ్లా ముద్రించడం అవసరం. సుబంధుణ్ణి సంస్కృత కవులు ఎంత కొనియాడారో వక్కలంక వీరయ్యను సమకాలికులు అంతగా మెచ్చుకున్నారు.

వాసవదత్తా పరిణయాన్ని పీఠాపురం రాజుకు అంకితం ఇచ్చాక వక్కలంక వీరయ్య పెద్దాపురం సంస్థానంలో తూడా సత్కారాలు పొందాడు. క్రీ.శ. 1749-58 మధ్య పెద్దాపురాన్ని పాలించిన జగపతిరాజుగారిపై ఇతడు చెప్పిన రెండు చాటువులు మాత్రం దొరికాయి. ఒకటి ఎత్తుగీతిలో ఇలా ఉందిః

సంతతోత్సవశాలియ్రై జగతికేవ-నలరు మిల వక్కలంక వీరయను బోవు

వత్సవయ రాయ జగపతీశ్వర తనూజ-రాయజగపతిరాజగో త్రావిడౌజ

(చాటు. మంజరి ॥, పుట 128)

వత్సవాయివారికి అంకితంగా వీరయ్య ఏవైనా కృతులు చెప్పాడో లేదో తెలియదు. ఇతడు క్రీ.శ 1750 దాకా జీవించి ఉంటాడని వీరేశలింగంగారు సరిగ్గానే ఊహించారు. వార్థక్కంలో వీరయ్య సన్యసించాడట. ముమ్మడివరంలో ఈ వృద్ధయోగి సిద్ధిపొందాడట. అయితే అంతకుముందే యీ సుకృతాత్ముడు రససిద్ధుడయ్యాడు.

ఈదులపల్లి భవానీశం: వక్కలంక వీరయ్యలాగే అతని సహాధ్యాయి భవానీశానికీ కూడా సమకాలికుల మన్ననలు సిద్ధించాయి. దిట్టకవి వెంకటాద్రి తన 'కారుణ్య రసాకలన' వలన భవానీశం ప్రబంధకర్తగా అలరినందుకు గర్వపడ్డాడట. కావ్యరచన ప్రారంభించి భవానీశం ఏ ప్రబంధాలు చెప్పాడో తెలియదుగాని నందవరపు పర్వతవర్ధనకవి సంస్కృతంలో చెప్పిన శృంగార మంజరిని ఏకాశ్వాసంగా తెనిగించాడు. మూలం రచించిన కవి గురించి భవానీశం ఇలా చెప్పాడు: .

హరియురంబునదిరమగు కౌస్తుభమువోలె హరుశిరంబున సుధాకరుడువోలె

ధరశాకమూరిమాధవసుత శ్రీరంగ రాజసభాస్థలి బ్రబలువాడు

స్థిరతరంబగ నందవరపురాన్వయు డప్పయకు రంగమాంబకునాత్మజాతు

సకలకలుషహరంబుగా సంస్కృతమున - హరిచరిత్రముశ్చంగార సరణిచెప్పె

నదియు నే నేర్చు తెరగున నాంధ్రభాష- గబ్బమిరవుగ జేసితికవులుపాగడ (2341 |

కవులు పౌగిడేటట్టు తెనిగించిన ఈ శృంగారమంజరిని 'వక్కలంకాన్వయకలశ జలధిశశివీరభద్రునుత్సఖు నుతించి తదనుమతి కృతి యొనరింతు ముదముతోడ' అని పకన నునన. సస పడ న పససపనన నన మ స 19. క్రీ.శ 1ఇ7లో వక్కలంక ఖీమశంకరంగారు రాజమండ్రీ వివేకవర్ధిని ముబ్రాక్షరశాలలో అచ్చువేశారు.

ఫ్రోలునాటి కవులు 981 భవానీశం చెప్పాడంటే వీరయ్య అంటే అతనికి ఎంతటి ప్రేమాఖిమానాలో తెలుస్తుంది. ఇద్దరూ ఒకరిదగ్గిర చదువుకొని ఒక ప్రాణంలా ఉన్నారు మరి! వీరిద్దరికీ విద్యాగురువు ఓకరే అయినా మంత్రగురువులు వేరువేరు. ఆ రోజుల్లో ఫ్రోలునాటిలో ప్రతికవికీ ఒక చుంత్ర గురువు ఉన్నట్టుంది. ఏయే కవులకు ఎవరెవరు గురువులో చూడండి. గురువులు శిష్యులు దెందులూరి వీరన్న 1. వక్కలంక వీరయ్య, 2. కూచిమంచి తిమ్మయ్య ఇవటూరి శంభులింగం ఈదులపల్లి భవానీశం ఆకరపల్లి కోదండరాముడు ఏనుగు చినలచ్చన్న న పస వట భవానీశానికి మంత్రగురువులైన ఇవటూరి సాంబయ్యగారు అమలాపురం తాలూకాలోనివారు. అదే తాలూకాలోని ఈదరపల్లే భవానీశ స్వగ్రామం. ఆ ఊళో చరసన్నుగారనే ఒకాయన నిరతాన్నదానానికి ప్రసిద్ధులు. అతని మనుమడే భవానీశం. సహాధ్యాయి రాజులకు అంకితం ఇచ్చినా భవానీశ దేవునికే తన కృతులు అంకితం ఇచ్చాడు. అమృతలింగరూపంలో ఉండే శ్రీశ్రైలమల్లికార్డునుడు ఇతని ఇష్టదైవం. శృంగార మంజరి తినిగించాక ధర్మఖండమనే గ్రంథాన్ని రచించి ఆ దేవునికే అంకితం ఇచ్చాడు. ధర్మఖండం స్కాందపురాణంలోని యాభై ఖండాలలో ఒకటి. దీనిలో భారతభాగవత రామాయణ గాథలు, మరికొన్ని ప్రాచీన గాథలు ఉన్నా ముఖ్యంగా వాల్మీకి చరిత్రను ఇది కథనం చేస్తుంది. దీనిని తొమ్మిది ఆశ్వాసాలుగా భవానీశం బాశాడు. రఘునాథనాయకుని వాల్మీకి చరిత్ర చదివాక ఇది అట్టే రసానుభూతి కల్గించదు. రఘునాథుని రచన కావ్యఫక్కి. ఇది పురాణమార్గంలో నడిచింది. మూలంనుండి బహుశా సమకాలిక సంఘాన్ని కావ్యంలో ప్రతిఫలింపజేయడానికి ఇటువంటి ఇతివృత్తాలు ఉపకరించవు. అయినా అక్కడక్కడ భవానీశం తన ఉబలాటం తీర్చుకున్నాడు. ప్రతివృత్తి వాళ్లకు ఒక పరిభాష ఉంటుంది. వేదమంత్రాలలోని కొన్ని పదాలను తీసుకొని పూర్చ్వపదాన్నో ఉత్తరపదాన్నో పట్టుకుని వైదికులు సంకేతాలు పెట్టుకున్నారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకొనేటప్పుడు ఇవి వాడుకొంటారు. కొంతమంది బ్రాహ్మణులు ఒకరింటికి భోజనానికి వెళ్లారు. భోజనం చేస్తూ 'అల్లావారింట్లో అన్నం ఉండదు. ఫలానవారింట్లో నెయ్యిపప్పూ కావలసినంత పెడతా'రని చెప్పుకొన్నారట. వాళ్ళెలా పరిభాషలో సంభాషించుకొన్నదీ భవానీశం ఇలా బ్రాశాడు: తగవేరొక్కనియింట వోదనమ “యేతత్సామగాయంబు' మె చ్చుగ నివ్విప్రునియింటి భోజనము 'తేజోవా పృణంతంచియున్‌ సౌగసులు మీర 'యదశ్వ మేధ'యని యంచున్‌ వేదభాషావిశే షగతిన్‌ భూమిసురభ్రజంబు రసనాచాపల్య మేపారగన్‌. (ధర్మ. 4-226) ఈ పద్యంలోని పారిభాషిక పదాలు, వాటి అర్ధాలు చూడండి:

982 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

పారిభాషికపదం అరం మంత్రం

  1. ఏతత్సామగాయం నాస్తి ఏతత్సామగాయం నాస్తి

  2. తీజోవా నెయ్యి తేజోవా ఆజ్యం

౩. పృణంతంచ పప్పు షృణంతంచవపురించ

  1. యదశ్వమేధ సమృద్ది యదశ్వమేధస్పమృద్దె

వైదికుల పరిభాషలోని కొన్ని పదాలు నేడు మన నిత్యవ్యావహారికంలో చేరిపోయాయి. యద్దేవా, తేభ్యం మొదలైనవి కొన్ని ఉదాహరణలు. వైదికుల పరిభాషల గురించి మిత్రుడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి విపులమైన వ్యాసం వ్రాశాడు ఇతర వృత్తుల పరిభాషల గురించి కూడా విపులమైన పరిశోధనలు జరగాలి.

భవానీశం ధర్మచింతనకోసం తెనిగించిన గ్రంథంలో మనం సాహిత్య పిపాసను తీర్చుకో ప్రయత్నించనక్కరలేదు గాని అక్కడక్కడ చిన్ని మంచినీటి ఊటలు ఉన్నాయి. పరమభాగవతుడైన ప్రహ్ల్హాదుడే రాజ్యం రాగానే ఏమైనదీ చదువుతున్నప్పుడు మన కుతూహలం హలం పట్టుకుంటుంది. చూడండి:

అతడు రాజ్యలక్ష్మి గనినంతనె తొంటి విరక్తి డించి తా

నాతరినింద్రియ ప్రతతి నాపగజాలక భోగలోలుడై,

భూతల మేలు చుండె సిరి పాంపిరినోపగ జిత్తనిగ్రహ

ఖ్యాతి బెలంగ శర్వునకు గాక పొసంగునె యొండు దేహికిన్‌? (ధర్మ6-110) ఇలాగ మారిన ప్రహ్లాదునికి నారదుడు ఒక ఉపదేశం చేశాడు. * శ్రీమదాంధునకు దారిద్ర్యం పరమౌషధం' అని మనస్సులో అనుకొని విష్ణుమూర్తి మీదకే దండెత్తమని ప్రోత్సహించాడు. ఇటువంటి ఘట్టాలు ఎంత ముక్తసరిగా చెప్పినా రక్తికడతాయి. అయితే ఈ గ్రంథంలో నీతులు ఎక్కువ. అవి గూడా లోకానుభవంతో చెప్పినవే.

నెలతయు భోజనంబును నిధువనంబు

హితము లగు; నవి గల్గిన గృహము గృహము

పతియె పతి యివి లేని తదృవన ముగ్ర

వనము, తద్వల్లభుండు జీవన్మృతుండు (ధర్మ. 2-150)

అయ్యగారి పెదబాపయ్య శాస్త్రి. ఈయన తిమ్మజగపతిరాయణింగారి ఆస్థాన విద్వాంసులు. వారిపై పంచరత్నాలు సంగీతరత్నాలు చెప్పారు. ఇరవైపుట్ల ఇనాంభూమిని పారితోషికంగా పొందారు. (పెదబాపయ్యగారు ఉమామహేశ్వరశాస్త్రికి ప్రపితామహులు. ఉమామహేశ్వరంగారు 1857లో జన్మించారు. చూ॥ భారతి - అంగీరస - వైత్రం, 1932 ఏప్రిల్‌)

నెలతలకు ఏది హితమైనా సాహితీపరులకు రామణీయకత కావాలి. కథ లేకపోయినా తమ కావ్యాలలో ఈ యుగం కవులూ, ఈ ఫప్రోలునాటి కవులూ రామణీయకతకోసం ప్రయత్నించారు. ఒకరిద్దరు మాత్రమే సాధించారు. 20. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, 1941.

కళింగ కవులు క్రూటకంలో విజయనగర సామ్రాజ్యం క్షీణిస్తున్న సమయంలోనే _కళింగసీమలో విజయనగర సంస్థానానికి పునాదులు పడ్డాయి. కొండపల్లి సర్కారులో కుతుబ్‌షాల కొలువులో క్రీశ 1632 ప్రాంతాల పూసపాటి రఘునాథరాజుగారు సర్దారుగా ఉండేవారు. కృష్ణవిజయం అనే ప్రబంధం వ్రాసిన పూసపాటి తమ్మిరాజుకు ఈ రఘునాథరాజు సాక్షాత్తూ అన్నగారు. ఆయన చాలా బలవంతుడని, శూరా గ్రగణ్యులు వినుతించేవారని తమ్మిరాజు తన కావ్యంలో వ్రాశాడు.

రఘునాథరాజుగారి ప్రతాపాన్ని తమ్ముడు వర్జించినట్లే తోడి సర్దారులు కూడా మెచ్చుకొనేవారు. ఆయనను మాధవవర్మ అని పిలిచేవారు.

మాధవవర్మ పూసపాటివారి మూలపురుషుడు. కొండపల్లి సర్కారు నుంచి రఘునాథరాజుగారు చికాకోలు సర్కారుకు బదిలీ అయ్యారు. క్రీ.శ1655 నాటికి, మన్మథ సంవత్సరంలో, ఆయన షెిరుమహమ్మదుఖాను సిబ్బందిలో ఉంటూ ఆ ఫొజుదారుతో పాటే కళింగసీమకు వచ్చారు. కుమిలి పరగణాలోని భోగాపురం మొదలైన గ్రామాలను ఇబారాకు పుచ్చుకొని అక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి సర్కారులో ఉన్న తమ కుటుంబాన్నీ, పరివారాన్నీ కళింగ సీమకు పిలిపించుకున్నారు. వాళ్లతోపాటు చాలామంది పూసపాటి వీరులు చికాళకోలు సర్కారుకు వలసవచ్చి స్థిరపడ్డారు. రఘునాథరాజుగారి లగాయతు పదిమంది గజపతులు ఈ యుగంలో కళింగసీమను పాలించారు. వాళ్ల వివరాలు చూడండీ.

  1. రఘునాథరాజుగారు. (1652-1685): మాధవవర్మ అని నామాంతరం. విజయనగరం సంస్థానాధిపతులకు ఆద్యుడు. కృష్ణవిజయకర్తకు అన్నగారు.

  2. పీతారామచంద్రుడు (1685-1697): పై రఘునాథరాజుగారి కుమారుడు. కౌలు గ్రామాలను విస్తరింపజేశాడు.

  3. అన్నమరాజు (1697): సీకారామచంద్రుని పెద్దదుమారుడు. ఆర్నెల్లు సరదారీ చేశాడు.

  4. తమ్మిరాజు (1697-1700): సీతారామరాజుగారి రెండో కుమారుడు. ఈయన అపుత్రకుడు. తాళ్లపాలెంలోని కృష్ణరాజుగారి కొడుకు ఆనందరాజును దత్తత చేసుకున్నా రు.

  5. ఆనందరాజు (1760-1770): పై తమ్మిరాజుగారి దత్తులు. నవరామాయణం కృతికర్త. విజయనగరం రాతికోటకు పునాది వేశాడు.

  6. వెంకటపతిరాజు (1700-?): ఆనందరాజుగారి అన్నగారు. ఉషాభ్యుదయం రళించారు. ఈ కావ్యం 'వివరాలు విస్కృ్రతాంధ్ర కళింగ కవులు' (అడిదం రామారావు గా ౩ రనన పుటలు 3-45)లో ఉన్నాయి.

న వి. ఖమండలచరిత్ర = కవికొండల సత్యనారాయణము ర్తి 1927. పుట 41.

984 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

  1. సీతారామరాజు (1717-1741): సార్వభౌమ బిరుదు పొందారు. వెంకటపతి రాజుగారి కొడుకు. రాజ్యాన్ని సామర్థ్యంతో పాలించారు. విషప్రయోగంవల్ల మరణించారు.

  2. పెదవిజయరామరాజు : (1741-1757): పై రాజుగారి పెదతండ్రీ కొడుకు సీతారామరాజు గారికి విషం పెట్టించి అధికారం హస్తగతం చేసుకొన్నారు. బుస్సీతో కలిసి బొబ్బిలిమీద దాడిచేశారు. తాండ్ర పాపయ్య చేతిలో మరణించారు.

  3. అమ్మడి ఆనందరాజు (1757-1760): సీకారామరాజుగారి కొమాళ్లు, ఫ్రెంచి వాళ్లమీద కోపంకొద్దీ ఇంగ్లీషువాళ్ళతో సఖ్యం చేశారు.

  4. చినవిజయరామరాజు (1760-1794): పెదవిజయరామరాజుగారి భార్య, భర్త మరణానంతరం ఈయనను పెంచుకొంది.

ఈ పదిమంది గజపతుల కాలంలో కళింగసీమలో చాలామంది కవులు వర్థిల్లారు. గజపతులకేకాక వారి బంధువులకూ, తాబేదార్లకూ కృతులు అంకితం ఇచ్చాగు. ఈ గజపతుల కాలంలోని కవులలో ముఖ్యుల గురించి విపులంగా చెప్పుకొందాం.

పెనుమళ్ల సోమయ్య; 'వాణి నారాణి' అని సగర్వంగా చెప్పుకొన్నట్టు లోకులు చెప్పుకొనే పిల్లలమర్రి పినవీరయ్యగారికి ఇద్దరు కొడుకులు. చిన్నవాడి పేరు మల్లేశ్వరుడు. ఇతనికి క్రీ.శ. 16వ శతాబ్దంలోని కళింగ గజపతులలో ఒక ప్రభువు పెనుమళ్ల గ్రామాన్ని ఇచ్చాడు. అప్పటినుంచీ పిల్లలమగ్రివారిలో ఒక కోవ వెనుమళ్లవారు అయ్యారు. వెనుమళ్ల అగ్రహారికుడు మల్లేశ్చరునికి పెదసోమన్స చినసోమన్స, పాపిడిసోమన్ను అని ముగ్గురు మునిమనమలు. వీళ్లలో చినసోమన్నగారి వంశంలోపుట్టిన బసవన్నగారు జయపురం కొలువులో ఉన్నారు (ఈ బసవన్నగారు చినసోమన్నకు మునిమనుముడు). జయపురాన్నే పూర్వం నందాపురం అనేవారు. క్రీశ 1671-81 దాకా ఆ సంస్థానాన్ని పాలించిన మల్లకీమర్ధన కృష్ణదేవుగారివద్దనో లేక క్రీ.శ. 1666-1706 దాకా పాలించిన రఘునాథ కృష్ణదేవువద్దనో పెనుమళ్ల బసవన్న మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ యుగం మొదలుకాగానే పెనుమళ్ల వారిలో కొందరు కళింగసీమకు వచ్చినట్టు కనబడుతుంది.

వెనుమళ్ల పాపిడి సోమన్నగారికి పెదనీలన్న, చిననీలన్న అని ఇద్దరు మనుమలు ఉన్నారు. వీళ్లలో చిననీలన్న అందగాడు. విద్వాంసుడు. కావ్యపఠనంలో చాలా

భారతభాగవతాలు రసోచితంగా చదివే ఈ పినతండ్రిదగ్గరే పెనుమళ్ల సోమయ్యకు కావ్యశిక్షణ మొదట లఖించి ఉంటుంది. అయ్యగారి ఎల్లన్న ఇతని మంత్రగురువు. ఆయన ఆరాధ్యుడు. అందుకే శివపురాణం అంటే వెనుమళ్ల సోమయ్యకు ఇష్టం. “శబ్బార్థసంగత చమత్కారంబును బ్రకటితశివభక్తి సారంబును నగు నొక్క నూతనకావ్యంబు' రచించాలని సోమయ్య సంకల్పించాడు. స్కాందపురాణంలోని బ్రహ్మోత్తరఖండంలోని సోమవార చతమహోత్సవ కథను సీమంతినీపరిణయం అనే పేరిట అయిదాశ్వాసాల కావ్యంగా బాసి శ్రీశ్రైలమల్లికార్డునస్వామికి అంకితం ఇచ్చాడు.

కళింగ కవులు 985 దీనిని సోమయ్య సంప్రదాయసిద్ధంగా ప్రాచీన ప్రబంధాల ఒరవడిలోనేే రచించాడు. అయితే శృంగారఘట్టాలలో కాక ధర్మబోధ చేసేటప్పుడు ఇతని పద్యాలు హాయిగా కనబడతాయి. కథానాయిక సీమంతినికి యాజ్ఞివల్క్యుని భార్య హీతోపదేశం చేస్తుంది. సద్గుణాలు సహజంగా వస్తాయని ఇలా చెప్పింది. క్‌ ప్రాణీతోడనె తూడ నుద్పవము జెందు-గాని సద్గుణ మొకచోట గల్లిరాదు పువ్వు జనియించు వేళనె పుట్టుగాని- పట్టియొకచోట దెచ్చిరే పరిమళంబు? (సీమంతి. 2-17) సజ్జనునిలోని సద్గుణాలు పెరిగొతే అందరికీ ఉపకారమే. అలాగే దుర్షనుల సంపద పెరిగితే అందరికీ హానే! ఆ సంగతిని ఇలా యాజ్ఞివల్కుుని శ్రీమతి చెప్పింది. దుర్దనుని కల్మి దురితంపు త్రోవ కగును - సజ్జనుని కల్మి పుణ్యంబు సరణీకగును పాము బలిసిన గరళంబు ప్రబలమగును- గోవు బలిసిన దుగ్ధంబుగురియుచుండు. (సీమంతి. 2-31) వెనుమళ్ల సోమయ్య వ్రాసిన ఈ నీతిపద్యాలు పాఠ్యగ్రంథాలలో పెట్టదగినంత బాగున్నాయి. మళ్లీ ప్రచారం పొందవలసిన భాగాలు ఇందులో ఉన్నాయి. నిజానికీ ఇది ఒకనాడు ప్రసిద్ధమైనదే. అనంతరకవులు ఇందులోని పద్యాలను “ముక్కస్యముక్క' అనుకరించినవాళ్లే. ఉదాహరణకు సీమంతినీ చంద్రాంగదుల దాంపక్యాన్ని సోమయ్య దినము నొక వింత నెయ్యంపు దియ్యదనము దినము నొక కొత్తరతికళావినియమంబు దినము నొక వన్నె యుత్సాహమునుజనింప జనియె నా దంపతుల మిథస్సంగమంబు. (సీమంతి. 4-3) ఈ పద్యంలోని భావాలనూ, పద్యాలనూ అనువదించి అడిదం సూరన్న తన కవిజనరంజనంలోని దంపతులను వర్ణించాడు. చూడండి: దినదినంబున నొకవింత దిట్టతనము- దినదినంబున నొక వింత తెజగు చెయువు దినదినంబున నొక వింత తిపుట గలిగి-జరిగె నాదంపతుల మిథస్సంగమంబు. (తవిజన. 3౩-104) అయితే సోమయ్య పద్యంలోని తియ్యదనం, వన్న అక్షరాలా సూరన్న పద్యంలో లోపించాయి. సోమయ్య తన గగ్రంథాదిని తాను 'సకలకవిజనానందజినక మధుర నవ్యతర కావ్యకల్పనానల్చ్బయోగు'డని చెప్పుకొన్నమాట నిజమే. అతని కవిత్వంలో మధురిమ ఉంది. దానితోపాటు జొచిత్యం కూడా తెలిసినవాడు. సుకవికీ కుకవికీ ఫేడా కౌచిత్యంలోనే ఉందని ఇలా చెప్పాడు: ఛంద మెరుగుట, శబ్దశాస్త్రము చదువుట- బహునిఘంటుపరిజ్ఞానపాటవంబు గాదు తుకవుల కవితకు కారణంబు- లుచితలజ్ఞాపరిత్యాగ మొకటిగాని. (సీమంతి. 1-7)

986 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి కౌచిత్యం, వినయం కల మంచి కవి తాబట్టే పెనుమళ్ల సోమయ్య చాలామంది రాజుల అస్థానాలలో మెప్పులు పొందాడు. ఇతడు పూసపాటి తమ్మిరాజుగారి దగ్గిర మంత్రిగా ఉన్నాడు. ఆయన కృష్ణవిజయం రచించిన కవి. తన అన్నగారు రఘునాథరాజుగారు కళింగసీమలో గ్రామాలు ఇజారాకు పుచ్చుకొన్నప్పుడు ఆయన కూడా వలసవెళి ఉంటారు. అతనితోబాటే వెనుమళ్ల సోమయ్య కూడా విజయనగర ప్రాంతాలకు వచ్చి ఉంటాడు. ఇతడు వ్రాసిన ఇతరకావ్యాలు ఏవో తెలియదు. అయినా అతని శ్రీర్దిక సీమంతినీ కళ్యాణం చాలు.

అడిదం బాలభాస్కరుడు; కళింగసీమలోని పండిత కుటుంబాలలో పెనుమళ్ల వారిలాగే అడిదంవారు సుత్రసిద్ధులు. పెనుమళ్లవారిని కటకం గజపతులు సత్కరించి గ్రామాలు ఇచ్చినట్టే అడిదంవాళ్లను కూడా సత్కరించారు. ప్రభువులు మెచ్చి ఒక అడిదాన్ని ఇవ్వడంవల్ల వీళ్లకు అడిదంవారని ఇంటిపేరు వచ్చింది. క్రీశ. 1700 ప్రాంతాలలో విజయనగరానికి అయిదు క్రోసుల దూరంలో భూపాలరాజురేగలో అడిదం భాస్కరయ్య ఉండేవాడు. ఈయన మంచి లక్ష్యలక్షణజ్ఞానం గల కవి. అచ్చతెనుగు అంటీ ఇష్టం. అందుచేత శుద్ధాంధ్రరామాయణం అనే అచ్చతెనుగు కావ్యాన్ని వ్రాశాడు. పొన్నగంటి తెలగన్న యయాతిచరిత్ర అనే అచ్చతెనుగు గ్రంథం వ్రాశాక మళ్లీ పూర్తిగా శుద్ధాంధ్రలో ఒక కావ్యాన్ని ఇంకెవరూ వ్రాయలేదు. భాస్కరయ్యే ద్వితీయుడు.

ఈ కావ్యంలో ఖాస్కరయ్య మృదుపదాలు వాడాడనీ, తన శేముషిని ప్రదర్థించాడనీ భావించవచ్చు. తన తండ్రీ అచ్చతెనుగు రామాయణాన్ని వ్రాశాడని అడిదం సూరన్న సగర్వంగా తన గద్యలో చెప్పుకొన్నాడు. “ఇది శ్రీమదశేషమనీషి హృదయంగమ _ మృదుపదనీరంధ్ర _శుద్ధాంధ్రరామాయణ _ ఘటనావైదుషీధురంధ రాడిదము బాలభాస్కరకవితనూభవ' అని విశదం చేశాడు. ఈ రామాయణం లఖిస్తే భాస్కరయ్యగారి వైదుష్యం తెలిసేది ఆయితే ఈ శుద్ధాంధ్రరామాయణం నష్టమయింది, ఇందులోని ఒక చంపకమాలికాపాదాన్ని ఇతని కొడుతు అడిదం సూరన్న తన లక్షణ గ్రంథంలో ఉదాహరించాడు. ఇకార సంధికి లక్ష్యంగా *“నిగిడిరువైపులన్‌ వెడల 'నేటయి నీటగువీటికోట' అనే పాదభాగాన్ని ఇచ్చాడు. గ్రంథం అంతా లఖించి ఉంటే ఖాస్కరయ్య అచ్చతెనుగు కవులలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్ప్చరుచుకొనేవాడు.

భాస్కరయ్య వ్రాసిన కావ్యమే నష్టమై అతడు సమకూర్చిన లక్షణగ్రంథం లఖించింది. దానిపేరు లక్షణసారం. ఇందులో లక్షణాలేగాని లక్ష్యాలు లేవని కొందరు చెప్తున్నారు. అయిడే లక్ష్యాలను కూడా భాస్కరయ్య ఇచ్చాడని గ్రంథాన్ని చూసినవాళ్లు తెలియజేశారు. భారతం, భాగవతం, రామాయణం వంటి లక్ష్య[గ్రంథాలనేకాక 13 లక్షణ గ్రంథాలను కూడా ఖాస్కరయ్య పేర్కొన్నాడు. వాటిని అకారాదిగా యిస్తున్నాను. ర కవిసంశయవిచ్చేదం, 1-22.

  1. విజయనగర సంస్థానం: అంధ్రవాబజ్బ్యయపోషణ - నిడుదవోలు వెంకటరావుగారు. 1965. పుట జ.

  2. విస్కృతకళింగాంధ్రకవులు - ప్రథమభఖాగం. అడిదము రామారావుగారు, పుట 82.

  3. అధర్వణ ఛందం 8. కవిజనాశ్రయం

  4. ఉత్తమగండ ఛందం 9. కవితాలక్షణసారం

౩. ఉభయభాషాకవిమనోహరం 10. గోకర్ణభందం

  1. రవికంఠపాశం 11. నరసింహభాగవత ఛందం

  2. కవికుముదసుధాకరం 12. శ్రీధర ఛందం

  3. కవిగజూంకుశం 13. సులక్షణసారం

  4. కఠవిజనచింతామణి

ఇందులో కొన్ని అపురూపమైన (గంథాలున్నాయి. ఇవి ఇతరులు చెప్పినమి బాలభాస్కరయ్యగారి లక్షణసారం అముద్రితం. ఒకప్పుడు ఇది ప్రచారంలో ఉందని చెప్పవచ్చు. సమీపకాలంలో ఉన్న కస్తూరిరంగకవి తన ఆనందరంగరాట్బందంలో ఒక భాస్కరఛందాన్ని పేర్కొన్నాడు (3-5). ఇది బాలభాస్కరయ్యగారి లక్షణసారమే కాబోలు. ఈ సంగతి భావిపరిశోధనవల్ల తేలాలి. పరిశోధకులు ఉదాహరించిన పద్యాలవల్ల బాలభాస్కరయ్య ఎంత అచ్చతెనుగుకవి అయినా తత్సమరచనలో కూడా సిద్ధహస్తుడే అని చెప్పవచ్చు.

అడిదం సూరన్న: అడిదం భాస్కరయ్యగారు మా నాన్నగారని కొడుకు ఎంత గర్వంగా చాటుకొన్నాడో అంత గొప్పగా 'సూరన్న నాకొడుకసి' చెప్పతగ్గకవి సూరకవి. ఇతడు క్రీ.శ. 1720 ప్రాంతాలలో జన్మించాడు. తండ్రిగారిదగ్గిరే కావ్యాలంకారాలూ, ఛందస్సు. సంస్కృత వ్యాకరణం చెప్పుకొన్నాడు. చిన్నప్పుడే కవిత్వంలోని మెలకువలన్నీ నేర్చుకొన్నాడు. భాస్కరయ్యగారు చనిపోయాక సూరన్న స్వాగ్రామమైన సూరపరాజు రేగను విడిచిపెట్టి చీపురుపల్లికి దగ్గిరలో ఉన్న రామచంద్రపురంలో స్థిరపడ్డాడు. దీనిని 'గురివిందాడ' అని కూడా పిలుస్తారు. ఇది విజయనగరానికి ఇరవైమైళ్ల దూరంలో ఉంది. ఆ ఊరికి దగ్గిరలోని 'కంచరాల' అనే గ్రామంలో సూరపరాజూగారికీ మాన్యం ఉంది. మాన్యమన్న మాటేగాని అది పండదు. అందుచేత మన్యదేశాలు తిరిగి సూరన్న కావలసిన వస్తువులు తెచ్చుకొనేవాడు. ఇచ్చినవాడిని ఇంద్రుడనీ, చంద్రుడనీ మెచ్చుకోవడం, ఇవ్వనివాడిని చెడామడా తిట్టడం ఈయనకు అలవాటయిపోయింది. గడియకు నూరు పద్యాలు గంటం లేకుండా చెప్పేవాడు. పద్యాలతోనే సంభాషించేవాడు. పర్దాకిమిడి, బొబ్బిలి. పాలకొండ, పాచిపెంట, చెముడు. శృంగవరపుకోట మొదలైన సంస్థానాలకు పోయి అక్కడ రాజులను, ఉద్యోగులను ఆశ్రయించి వాళ్లమీద పద్యాలు చెప్పేవాడు. కోమట్ల ఇళ్లలో పెళ్లిళ్ల సంభావనలూ మొదలైనవి పుచ్చుకొనేవాడు. అట్టే భాషాజ్ఞానం లేని పామరులు సయితం విని మెచ్చుకోవలసిన చాటువులు కనుక సూరపరాజు తేలిక భాషలోనూ, శుద్ధ వ్యావహారికంలోనూ చెప్పేవాడు. చింతకాయ లిచ్చిన వాళ్లమీదా, పంచలచాపులిచ్చినవాళ్లమీదా, మంచి గంటం చేసిపెట్టిన వాడిమీదొ భయమే. “సూరకవి తిట్టు కమసాలి సుత్తి పెట్టు అనే భయం దేశం అంతటా అల్లుకుపోయింది! చిల్లర సంస్థానాధిపతులనూ, మధ్యతరగతి సంసాగులనూ, రైతులనూ యాచించినా సూరన్నను ఎక్కువగా శృంగవరపుగోట గివాను జ అుగుపాటి వెంకట

966 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటే రామదాసు ఆదరించాడు. సంవత్సరానికి మూడు నాలుగు నెలలు పౌొణుగుపాటివారింటనే సూరకవి ఉండేవాడు. వెంకటరామదాసుకే వెంకటమంత్రి అన్నది మరో పేర్స “పాణుగుపాటి వెంకటమంత్రీ అనే పేరుతో చాలా కందపద్యాలను సూరన్న చాటువులుగా చెప్పాడు. అవన్నీ కళింగసీమలో చాలా ప్రచారం పొందాయి. సూరన్న చెప్పిన చాటువులవల్ల, తిట్టుకవిత్వంవల్ల అతనికి ప్రజలలో ఎంతపేరు

వచ్చినా సాహిత్యలోకంలో అతనికి కీర్తి తెచ్చినవి అతని గ్రంథాలే. వాటిలో మొదటిది కవిజనరంజనం. కథ అట్టే లేకుండా కావ్యాన్ని వ్రాసి విద్వాంసులను మెప్పించడం ఒక ఫీటే. కవులు మెచ్చుకొంటే చాలు అనే ఆశయం మన సాహిత్యంలోని చాలామంది కావ్యకర్తలకు ఉంది. పురాణ పురుషుల వివాహకథను తీసుకొని వాటికి నాయికానాయకుల పేర్లు పెట్టక కవులు, రసికులు, యువకులు మెచ్చుకొనే కావ్యం అన్న అర్థం వచ్చేటట్టు పేరు పెట్టడం మలిరాయల యుగంనుంచి వస్తున్నదే. చూడండి ఈ అకారాది పట్టిక:

  1. తవికర్ణరసాయనం సంకుసాల నరసయ్య

  2. _కవిచకోర చందోదయం అల్లమరాజు రామకృష్ణకవి

  3. కవిజనమనోరంజనం అల్లమరాజు రామకృష్ణకవి

  4. _కవిజనమనోహరం కరాలపాటి రంగయ్య

  5. కవిరాజమనోరంజనం కనుపర్తి అబ్బయ్య

  6. యువజనహృదయానందం బద్దెపూడి ఎర్రయ్య

  7. _ రసికజనమనోఖిరామం తూచిమంచి తిమ్మయ్య

  8. _రసికమనోరంజనం సుగుటూరి ముమ్మడితిమ్మప్ప

  9. రసికమానసోల్లాసం తిరుమలబుక్కపట్టణం వెంకటాచార్భులు

  10. సరసజనమనోరంజనం కందుకూరి రుద్రకవి

  11. _సుమనోమనోఖిరంజనం ఓగిరాల జగన్నాథం ఈ పదకొండుతో కలుపుకొంటే పన్నెండోది అడిదం సూరన్న వ్రాసిన కవిజనరంజినం. ఇందులో హరిశ్చంద్రుడు చంద్రమతిని పెళ్లాడిన కథను మూడాశ్వాసాలలో చెప్పాడు. మొత్తం కావ్యం అంతా కలుపుకొని 260 పద్యాలే అయినా దానికి పిల్లవసుచరిత్ర అనే ప్రసిద్ధి వచ్చింది. హరిశ్చంద్రుని కథ కనుక శ్రీనాథుని నైషధంలోని పద్యాలకూ, కవిజనరంజనం కనుక సంకుసాల నరసయ్య బ్రాసిన కవికర్ణరసాయనంలోని పద్యాలకూ పోలికలున్నాయి. పిల్లవసుచరిత్ర కనుక భట్టుమూర్హోషలకు తులతూగదలచిన కల్పనలు ఉన్నాయి. వీటితోపాటు సూరన్న స్వయంగా బాగా చెప్పిన పద్యాలు తూడా లేకపోలేదు. శోభనం గదిలోనికి పంపిస్తూ చంద్రమతి చెలికత్తెలు ప్రేమ విడెమొసగ గైకొనువా, మగని కేగతి తెడపెట్టకుమూ' అని హెచ్చరించారు. ఆ తరువాత అమె సిగ్గు ఎలా ఉన్నదీ

  12. దొరికినంతమట్టుకు వీటిని సేకరించి వెంకటరావుగారు ప్రకటించారు. వావిళ్ళవారు ప్రచురించిన (1)

అడిదం సూరకవి జీవితం పీఠిక. (2) కవి సంళయవిచ్చేదం పీఠిక

కింగ కవులు 989 సఖులు ప్రార్థించు తరిని లజ్ఞాస్రవంతి బడకయిలు సేరుతరి మొలబంటి యయ్యె పద్మగంధికి మోకాటి బంటియయ్యె బతిని డాయంగ బుక్కిలిబంటి యయ్యె.

(కవిజన. 3-79) తొలినాడు ఇంత సిగ్గుపడిన చంద్రమతి కొన్నాళ్లకు ఎలా గడితేరినదీ సూరన్న మరో పద్యంలో చెప్పాడు.

పది పిల్పులకు దా బలుకగొంకెడు కాంత పలుమారు వింతగా బలుకనేర్చె

వేయిసాచిన నోరసిలు పయోజానన కులుకుగుబ్బల రొమ్ము గుమ్మనేర్చె

బ్రార్ధింప మొగమెత్తి పారజూడని చాన చురుకు వాల్చూపుల జూడనేర్చె

మోవిపంటను నొక్క మోము ద్రిప్పెడు లేమ తియ్యని మోవియందియ్య నేర్చె

రతికి జులుకగ మైకోని రాజవదన

ప్రబలపుంభావసంభోగ పటిమదేల్చె

నసమసాయకకేళిలో ననుదినంబు

నంతకంతతు గడితేరి యామిటారి. (కవిజన. ౩-78)

ఈ యుగంలోని నాయికలందరూ ఇలా గడీతేరిన మిటారులే. సూరన్న ఒకే ఒక కావ్యం బ్రాశాడుగనుక సరిపోయింది. లేకపోతే కూచిమంచి తిమ్మయ్యలాగ ప్రతికావ్యం లోనూ నాయికలను గడిడేరించేవాడు. తిమ్మయ్యలాగ ఎక్కువ కావ్యాలను బ్రాయకపోయినా అడిదం సూరన్న అతనిలాగే ఒక లక్షణగ్రంథం బ్రాళాడు. కవిసంశయవిచ్చేదం అనే పేరుతో వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశాడు. ఇందులో మూడు తరంగాలు ఉన్నాయి. మొదటి తరంగంలో సంధులు, శబ్దాలు చెప్పాడు. రెండో ఈరంగంలో శకటరేఫ నిర్ణయం చేస్తూ భారతంలోని కవిత్రయ ప్రయోగాలన్నీ వరుసగా చూపించాడు. మూడో తరంగంలో తద్బవరూపాలు చూపించాడు. ఇంత విపులంగా సంస్కృత సూత్రాలతో చెప్పడం పరిపాట్టైందని అతడు కోపగించుకున్నాడు. ఆ వేలం వెర్రిని ఇలా ఖండించాడు:

ఆంభ్రమర్శంబు తెలియంగ ననుపుపడునె ప్రకటసంస్కృతరచిత సూత్రములచేత

నవని బాణిని ఘటితసూత్రార్థసరణీ తెనుగటీకలచేత సాధింపనగునె?

(కవిసంశయ. 1-5) తన ముందున్న వ్యాకర్తలు చెప్పిన పద్ధతిలో కాక వేరే పద్ధతిలో “కవిత్రయ సుకవిత్వానుసరణీగా దానిని బ్రాశాడు. -

కవిసంశయవిచ్చేదంలాంటి వ్యాకరణ [గ్రంథం రచించాక అలంకారశాస్తాన్ని కూడా వ్రాయాలని సంకల్పించే కోటే సూరపరాజు చంద్రాలోకాన్ని. తెనిగించాడు. సంస్కృతంలో జయదేవకవిగా పేరుపొందిన పీయూషవర్డుడు చంద్రాలోకాన్ని బ్రాళాడు. అప్పయదీక్షితులవారు. “కువలయానందం' అనే అలంకార గ్రంథాన్ని బ్రాశారు. అందులోని కారికలు జయదేవుని చంద్రాలోకంగా ప్రచారం పొందాయి. దీక్షితులవారి

990 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి గ్రంథాన్నే సూరపరాజు అనువదించాడు. అయినా అది కాళిదాసు రచించిన గ్రంథమని చెప్పాడు. పైగా ఇది బాలురకు కూడా తెలిసేదని చెప్పాడు.

బాలురకునైన తిలియంగకాళిదాసు - మునురచించె జంద్రాలోకమును త్రిలింగ

భాషజేసితి నీక్సృప భవ్యముగను - దీని గరుణించికైకొమ్ము దేవదేవ! (చంద్రా.!) అని దేవునికి అంకితం ఇచ్చాడు. అయితే సూరన్న తెనిగించినది అప్పయ దీక్షితులవారి రమణయ్యగారు. నిస్సందేహంగా తేల్చారు సవిస్తరంగా చర్చించారు. సూరన్న బంథంలో నూరు అలంకారాలకు లక్ష్యలక్షణాలు ఉన్నాయి. వ్యాకరణ గ్రంథం, అలంకారశా స్రాన్నేకాక నిఘంటు రచన కూడా సూరన్న చేశాడు. పైడిపాటి లక్ష్మన్న ఆంధ్రనామసంగ్రహమనే నిఘంటువు వ్రాశాడు. అయితే అందులో కొన్ని మాటలను చెప్పలేదు. ఆ లోపాన్ని తీర్చడానికి సూరన్న ఆంధ్రనామశేషాన్ని రచించాడు.

అచ్చతెనుగు మాటలు అడిదంవారి అస్తి. భాస్కరయ్యగారు. శుద్దాంధ్ర రామాయణం వ్రాసిన కవి కదా మరిః తండ్రిగారి కావ్యంలోని పదాలను ఇందులో పేర్చి ఉంటాడు. భాస్కరయ్య అచ్చతెనుగులో రామాయణాన్ని వ్రాస్తే సూరన్న దండకంలో రామకథ అంతటినీ చెప్పాడు. దీనిని శ్రీరామదండకం అంటారు. ఇది ఒక విలక్షణమైనది ఇందులో రాముడు, హనుమంతుడు మొదలైనవారి నంభాషణలు సంస్కృతంలో ఉంటాయి. మాయలేడి ఘట్టం అయ్యాక రాముడు సీతను వెతుకుతూ 'హాః తటిద్దాతి హా; మానసాహ్హాద సంధాత్రి హా! ప్రేయసిక్వాసి' అంటూ వెతుకుతూ సంస్కృతంలో విలపిస్తాడు. సీతను చూసివచ్చాక హనుమంతుడు “లంకాపురో ద్యానమధ్యస్థికాం దానవీసంవృతాం, త్వద్నియో గవ్యథాక్షిష్టగా త్రీం విదేహేంద్రపుత్రీ మవశ్యంరఘూత్తంస' అని సంస్కృతంలోనే చెప్పాడు. ఈ దండకంలోనేకాక, కవిజనరంజనంలో కాడా ఇలాగ సంస్కృత సంభాషణలు సూరన్న వ్రాశాడు. చంద్రమతి తండ్రీ హరిశ్చంద్రుని వద్దకు ఒక పురోహితుణ్ణి పెళ్లిమాటలకు పంపిస్తాడు. అతనితో హరిశ్చంద్రుని సంభాషణ సూరన్న ఇలాగే వ్రాశాడు. (2-45).

సూరన్న బ్రాసిన ఈ గ్రంథాలన్నీ ఒక ఎత్తు. అతను చెప్పిన రామలింగ శతకం ఒక ఎత్తూను. దీనినతడు కష్టదశలో వ్రాశాడు. బొబ్బిలియుద్ధం అయిపోయాక, ఆనందరాజు మరణించాక చినవిజయరామరాజు ఈ కళింగసీమకు రాజయ్యాడు. అతడు బాలుడు కనుక అన్నగారు సీతారామరాజు పాలించాడు. ఇతడు చండశాసనుడు. సాటీ సంస్థానాధిపతులు . బలహీనులందరినీ ఖైదుచేసి వాళ్ల భూములు ఆక్రమించాడు. 'శ్రీమంతులనేకాక అందరినీ బాధించాడు. ఆ పరిపాలనలో ప్రజలూ, కవులూ కష్టాలను సూరన్ను తన స్వగ్రామంలోని రామలింగేశునితో ఇలా మొరపెట్టుకున్నాడు:

అగ్రహారములు నామావశిష్టములయ్యె మాన్యంబులన్నియు మంటగలినె

బత్తింబునకుదొంటి పడీకట్టుతప్పెను బుధజనంబుల రాకపోకలుడీగె

కళింగ కవులు ॥| 1 వర్దాశనంబులు వరదపాలైపోయె మలవతీలనుబ్రజల్‌ మాసిచనిరి నశియించిపోయెవంటరులు దుష్కరులు గజతురంగములు కాకట్టువడియె ధార్మికన్థానమునకిట్టి తళ్లుపుట్టి గతినచిత్తుని రాజ్యాధికారిజేసి యింతపీడించితివి సత్కవీంద్రకోటి రామలింగేశరామచంద్ర పురవాస, (నెం.౫)

అ కఠినచిత్తుని రాజ్యంలో 'పాపమార్డించుటకుకాక ప్రాభవంబు ప్రజల యాపద నోపదు

గదయ్య' అన్నాడు. 'మేలుచేసిన యట్టి మిత్రుని చెడగొట్టి పెద్ద కిరీటంబు పెట్టనేల' అని

ప్రశ్నించాడు. 'పాపకర్క్ముండు కావించు బాధ కడలి యవధి లేదని కృళియింతురవనిజనులు తెలియబడేవె సుయోధనాదుల చరితలు' అని ధైర్యం తెచ్చుకొన్నాడు. 'నేర్చి తిరిగినవానికి నిందలేదు' అని తన నేర్పును ప్రకటిస్తూ నీతిబోధ చేశాడు. 'పోషకుడు రాజు బ్రజలెల్ల పుత్రసములు వారి కన్యోన్యకలహంబు వచ్చినప్పుడు ప్రభువరుల నీతిసమపక్షపాతరీతి' అని చెప్పాడు.

రామలింగేశశతకం. చెప్పాక సూరన్నకు మళ్లీ రాజాశ్రయం లఖించినట్టు కనబడుతుంది. ఈయన పెదవిజయరామరాజు కాలంలోనే ఎక్కువగా ఉన్నాడు. చిన విజయరామరాజు క్రీ.శ 1760 నాటికి బాలుడు. అతనికి యుక్స్రవయసు వచ్చేసరికి సూరన్న వృద్ధుడయ్యాడు. ఇతడు పెదవిజయరామరాజుపై చెప్పిన ప్రశంసాపద్యాలే ఎక్కువ. ఇతని చాటువులలోని సంస్థానాధీపతుల కాలాలు, వివరాలు పరిశోధించి ఆనాటి చరిత్రను వివరంగా వ్రాయవచ్చు. సూరన్న సమకాలికులపై ఎన్నో చాటువులు చెప్తే అతనిమీద

ఆ కాలంలోని కవులు కూడా పద్యాలు చెప్పారు. కొట్రా వెంకటేశ్చరుడు అనే బాలకవి

ఇలా అన్నాడు: దంతివినీతోసమమా - కాంతాసుమబాణ సూరకవి నెరజాణా

సూరన్న యౌవనంలో ఉన్నప్పుడు ఈ పద్యాన్ని కొట్రాకవి చెప్పాడు. తనమీద ఇంత

చక్కని పద్యం చెప్పిన స్నేహితుణ్ణి సూరన్న ఇలా మెచ్చుకున్నాడు:

భట్రాజున్ని రసించి సత్కృతులు చెప్పంబూనుచో మేటియ్మై చట్రూతింబలెనున్న వానికిని నిచ్చల్‌ దెల్విబుట్టించు నే కుజ్రుల్‌ చేయని సత్యసంధుడని లోకుల్‌ మెచ్చవర్తించు కొట్రాబాలకవీందుశేఖరుడు మాకుంబూజ్యూ డెల్లప్పుడున్‌.

సూరన్న వంటి సమకాలికులకు పూజ్యుడైన కొట్రా కవిని గురించి చెప్పుకొందాం. కొట్రా వెంకటేశ్వరులు: అడిదంవారు విజయనగర సంస్థానాధీశులకు అశ్రితులైతే

కొట్రావారు బొల్బిలి పండితులు. కళింగసీమలో ఈ రెండు సంస్థానాలూ ఒక్కసారే

మొలకెత్తాయి. క్రీ.శ 1652లో షేర్‌ మహమ్మద్‌ఖాను చికాకోలు సర్కారుకు ఫొజుదారుగా

992 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి వచ్చినప్పుడు అతనితో పూసపాటి రఘునాథరాజేకాక పెదరాయడనే వెలమ వీరుడు కూడా వచ్చాడు. పూసపాటివారికి భోగాపురం ఇజారాగా ఇస్తే పెదరాయుడికి షేర్‌ మహమ్మదు రాజాముహుండాను గుత్తగా యిచ్చాడు. అందుకు కృతజ్ఞతగా పెదరాయడు ఆ ఫొజుదారుపేర ఒక కోట కట్టుకున్నాడు. షేర్‌ అంటే పులి. పెదరాయడు తన కోటకు బెబ్బులి అనే పేరుపెడితే ప్రజల నోళ్లలోపడి అది బొవ్బీలి అయింది. ఈ యుగంలో బొబ్బీలిని ఆరుతరాల రాజులు పాలించారు.

వాళ్లలో ఎవరో కొట్రావారికీ ఒక అగ్రహారం ఇచ్చారు. అది రాజాము దగ్గిర ఉన్న ఇల్లంనాయుడు వలస. ఇది కూడా అడిదంవారి మాన్యాలలాగా పండదు కాబోలు. కొట్రావారు దేశాటనం చేసి సంపాదించుకోవలసి వచ్చింది. కొట్రా వెంకటేశ్వరుడు ఇలా విలపించాడు:

చేకొని యాచకత్వమునజేసి సమస్తదిగంతరాశికిన్‌

బోకయు రాక దీరదది బుద్ధికిగల్లినమోసమై స్వయం

పాకపునిష్టయంచు బ్రతిబంధక మొక్కటి దెచ్చికొంటి నే

నాకటికోర్వ వంట కసమర్భడ శిష్యులుకూడీరారు “తా

జాకల' మౌనుగాని కొనసాగెడు చందము దోచ దీశ్వరా. పచనంలో అసమర్శుడైనా రచనంలో మాత్రం వెంకటేశ్వరులు గట్టీవాడు. వంటెప్పుడూ పాఠానపడకపోయినా రచన పాకాన పడుతుంది. స్వగ్రామమైన ఇల్లమనాయుడువలసలోనే చీడి యల్లమనాయుడనే మోతుబరి ఉన్నాడు కాబోలు. అతనిమీద చక్కని శతకాన్ని చెప్పాడు. ఇందులో 13 పద్యాలున్నాయి. ఇది అముద్రితం. దీని ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. మొదటి పద్యం ఇలా ఉందిః

సిరులపైకమ్ములసిరుల బిసాళించు, జిడ్డు సంద్రము పుట్టు దొడ్డకెంపు

కన్నుల సింగాణి మన్నీనిగన్న కెం, దలిరుటాకుంబోడిగల వెడంద

రొమ్ముపై నీలపురాలుతమ్మి కెంపులమాని, కాలుపచ్చల పుల్లురాలు మూల

రాలుగీలుకొలుపు మేలిమిబంగరు, సందికడెముల బెంపొందు నలుబు

జములు ధరియించి దేవకీసతికి బొడము

చిన్నికృష్ణుడు నీకిడు సిరులగములు

అరికరిమృగేంద్ర చీడికులాట్టి చంద్ర

నవ్యగుణసాంద్ర యల్లమనాయకేంద్ర! (1 419 “చక్కని తెలుగు పలుకుబడులచే హృద్యమైన ఈ శతకమునకు కర్త ఎవరో తెలియదని (గ్రంథాలయ పండితులు వ్రాశారు.” అయితే ఇది కొట్రా బాలకవే వ్రాశాడని నిడుదవోలు వెంకటరావుగారు. చెప్తున్నారు. ఈ శతకాన్ని వారి నాన్నగారి దగ్గిరనుంచే గంథాలయంవారు కొన్నారు. ఇది అచ్చుపడవలసిన శతకం. దీన్ని రచించాక కావ్యరచన చేయాలనే సంకల్పం కొట్రా వెంకటేశ్చరులకి కలిగింది. 7 ట్రై కేటలాగు, సంపుటి ౩, భాగం 3, పుట 114. 8. శతకకవుల చరిత్రము - వంగూరు సుబ్బారావుగారు అనుబంధం, పుట 757.

కళింగ కవులు 993 ప్రతిపదప్రాపితార్థగౌరవము బాక-రీతి వృత్తి చమత్కార జాత్తివార్హ లలర దోచినగతిగూర్చియలర మాధ-వునకు నిచ్చెద వెంకటేశనకు కృతిని. (1.564 అని ఒక కావ్యాన్ని రచించదలిచాడు. ఈ ప్రబంధం పేరు విమలాంగీ పరిణయం సాకేతపురాన్ని పాలించే మాంధాత కుంతలదేశపు రాకుమారి విమలాంగిని వెళ్లాడే కథ ఇందులో ఉంది. అన్ని ప్రబంధాలలాగే బుతువర్ణన, వనవిహారం, వేట, నాయకుడు నాయిక చిత్రపటాన్ని చూసి మోహించడం, తన చిత్రాన్ని పంపించడం, ఆమె విరహం, భీతలోపచారాలు, వనవిహార, జలక్రీడ వగైరాలు ఇందులో ఉన్నాయి. ఇది అముద్రితం, అఆసమగ్రం. ఈ కావ్యంలో రెండాశ్వాసాలు మాత్రమే దొరికాయి. ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంధాలయంలో ఉంది (౫.564. ఈ కావ్యాన్ని వెంకటేశ్చర్లు ఏ వయసులో రచించాడోగాని చాలా చిన్నప్పుడే ఇతడు కవిత్వం మొదలుపెట్టాడు. బాలకవి అనే వీరుదు పొందాడు. అశుకవిత్వం చెప్పేవాడు. పదిమందిని ఆశ్రయించి తెచ్చుకొన్న పప్పులూ కూరలు ఎలుకలూ పందికొక్కులు ఎత్తుకుపోయేవి. కవిత్వంలో వాటికిలా శాపాలు పెట్టేవాడు. ఎలుకలు పందికొక్కులును నేపుగ గోడల గాదెమూలలన్‌ తలుగులు వెట్టి లోగొనియె గందులు నువ్వులు గాయగూరలన్‌ బొలయగ దిట్టెదన్‌ బయికి బోవగ నిచ్చిన జూములోపలన్‌ బలుకులు కావు బాలకవివాక్కులు కర్కశ బాణజాలముల్‌ ఎలుకలూ పందికొక్కులే కాక కాతులు కూడా ఈ బాలకవిని చాలా బాధపెట్టేమీ. ఎండపెట్టుకొంటున్న తాండ్రను కాకులు పొడిచాయని ఇలాగ తిట్టి హెచ్చరించాడు: నీ ఈటిలత్వమున్‌ విడువనేరవు తిట్టెద తాండ్రగైకొనన్‌ రాకు పరాకు చేనయిన రాకతః వివేకము దెచ్చుకొమ్ము నా వాకులుదప్ప వారయ ధధ్రువంబుగనమ్ము మనంబులోన యో కాకమ। నీకు దెల్చెద జికాకొనరింపకు నేగవీంద్రుడన్‌. కాకులను తిట్టినట్టే కవులతో తూడా కొట్రా బాలకవి దెబ్బలాటలు పెట్టుకొనేవాడు. పాలకొండలో పర్వతాలు అనే స్థానిక కవితో వాదం వచ్చింది. అప్పుడు అడిదం సూరన్న సహాయంతో అతణ్జీ బాలకవి ఓడించాడు. ఆ సందర్భంలో ఈ పద్యం చెప్పాడు! నరుని నొగలుమీద హరియున్న చందాన - సూరకవివరేణ్యు జోక గూడు కొత్రబాలకవి యకుంఠితవాగ్యాటికి - బర్వతాలుగాడు పారిపోయె. తనది అకుంఠితవాగ్థాటి అయినా కవిత్వతత్వం మటుకు అడీదం సూరన్నకే తెలుసునని బాలకవి ఇలా మెచ్చుకొన్నాడు. రవియెరుగును భువితత్తము-భువిలోపలి జనులనెల్ల బోషించు సదా శివుడెరుగును నాట్యతత్త్స్వము- కవితాతత్స్వంబు సూరకవియే యెరుగున్‌.

994 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి బాలకవిలాంటి వాళ్లు అడిదం సూరన్నకి కవిత్వతత్త్వం తెలుసునని ఇలా హంసించికే అతనికేం తెలియదని చాటిచెప్పే సమకాలికులు లేకపోలేదు. రేకపల్లి సోమనాథం అనే కవి సూరన్నకు బద్ధవైరి. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే చిచ్చురేగుతుంది. పరస్పరం వాళ్ల తిట్టుకున్న పద్యాలు కళింగసీమలో మారుమోగాయి. ఆంధ్రసాహిత్యంలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. రేకపల్లి సోమనాథం; రేకపల్లివారు సత్యవరం సంస్థానాధిపతుల ఆథ్రితులు, విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి దగ్గిర పూర్వం ఈ సంస్థానం ఉండేది.' కాకర్లపూడి వారు ఈ పరగణా ఇజారాకు తీసుకున్నారు. మహమ్మదు కులీకుతుబ్‌షా కాలంలో గోలుకొండ కొలువులో పూర్వం కాకర్లపూడి అప్పలరాజుగారనే సరదారు ఉండేవాడు. అతను ముకుంద బాహుబలేంద్రుణ్ణి ఒక యుద్ధంలో “పాయకనిలచి' ఓడించాడు. అందుచేత అతనికి 'పాయకరావు* అనే బిరుదును సుల్తాను ఇచ్చాడు. “ముకుందడదేవ దుగ్ధపయోధీ మధించి విజయరమను గ్రహించిన' ఈ అప్పల పాయకరావుని నాలుగు తరాల తరువాత రేకపల్లి సోమనాథం ఇలాగ కీర్షించాడు తన రుక్మిణీ పరిణయంలో. ఆ మహమ్మదుకుతుబుశాహాశ్వపతికి - ప్రాణధారణమెవని కృపాణధార యతని నుతియింపదరమె మాధ్యమికలోక- రక్షునప్పలపాయకరాయఘనుని. (రుక్మి, 1-55 ఎత్తుగీతి) కళింగసీమను తమ స్వాధీనంలోకి తెచ్చిపెట్టినందుకు కాకర్లపూడివారికి అనకాపల్లి, సత్యవరం, మెళుపాక గ్రామాలను గుత్తగా గోలుకొండవారు ఇచ్చారు. అప్పటినుంచీ సత్యవరం సంస్థానం వెలిసింది. ఇది తునిదగ్గిర తాండవనదీ తీరాన ఉండేది. తరవాతి రాజులందరూ పాయకరావు బిరుదును తన పేర్ల చివర ధరించారు. మొదటి పాయకరావుగారి తమ్ముడి కొడుకు రామభద్రపాయకరావు మంచి కవి. ఆయన పద్మినీపరిణయం అనే కావ్యాన్ని, నీలగిరినాథ శతకాన్ని, చాలా చాటువులను చెప్పారట (రుక్కి. 1-62). ఈయన కావ్యాలేవీ దక్కలేదు. ఈయనిలా కావ్యాలు రచిస్తే వీరి పినతాతగారి మనుమడు చినజగన్నాథ రాజుగారు కవులకు కంకణాలు యిచ్చేవారు (1-6). కాకర్లపూడివారి ఆస్థానంలో శానంపూడి తిమ్మకవి, వెలివెల గౌతమరాజు అనే కవులు ఉండేవారు. ఈ ఇద్దరూ ఏ ఏ గ్రంథాలు వ్రాశారో తెలియదు. చినజగన్నాథ రాజుచేత కంకణాలు పొందారేమో. కంకణాలిచ్చే ఈ రాజుగారి అన్నగారిపేరు వెదజగన్నాథరాజు. ఆయనకు ఆరుగురు కొడుకులు. వీరిలో కడగొట్టువాడి పేరు కూడా జగన్నాథమే. అతనికి గోపాలపాయకరావు అనే వీరుడు పుట్టాడు. క్రీశు 1602 నుండి 1739 దాకా రుస్తుంఖాన్‌ అనే చండశాసనుడు ఉత్తర సర్కారులను అట్టుడికించేశాడు. అతణ్ణి అతడి కొడుకే చంపి ఆ నిరంకుశత్వాన్ని కహటననేసున హన. పస ప నను స న. ము. న పసు. $. శ్రీ.శ.1626 లోపున ఉండే మహమ్మదుకులీకాలంలో అప్పలరాజు ఉండేవాడని ఈ పద్యంవల్లి తెలుస్తున్నా మాదన్నగారు 1676లో పాయకరావు బిరుదు ఇచ్చారని సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో బ్రాళారు. సంపుటి 1. పుట 6జ

కళింగ కవులు 995 అపవలసి వచ్చింది. రుస్తుంఖాను తరువాత పితృహంతకుడు నూరుద్దీన్‌ హుస్సేను బీల్లాదారు అయ్యాడు. ఇతడు తూడా దేశముఖులను బాధించసాగాడు. పెదాపురం సంస్థానాధిపతిని _ చెరలో పెట్టాడు. అతజ్జి విడిపించడానికి విజయనగరం వెదవిజయరామరాజుగారు సైన్యాలతో కదిలారు. ఆ దండులో గోపాలపాయకరావుగారి అనకాపల్లి బోయలు కూడా ఉన్నారు. నూరుద్దీన్‌ హుస్సినును చుట్టుముట్టి పాయకరావుగారే తలకొట్టారు. ఈ విజయాన్ని రేకపల్లి సోమనాథం ఇలా కీర్షించాడు: క

రుస్తుమఖానతనూ భవ- మస్తకబలిపూర్వకార్తిమహితఘనశ్రీ

నిస్తుల సువిదిత నిధిసుని- రస్టైెకాంతనిధి రాజరా వైశ్వర్యా। (రుక్కి. 1-18)

నూరుద్దీన్‌ హుస్సేనుఖానునే కాక ఇకితయార్‌ఖానును, రూప్‌షా మొదలైనవారిని తూడ గోపాలపాయకరావు ఓడించారు. ఈ వీరుని కొలువులోనే రేకపల్లి సోమనాథం ఉండేవాడు. రేకపల్లివారు మొదట గోదావరి మండలంలోని తాళ్లపూడిలో ఉండేవారు. రేకపల్లి సూర్యనారాయణ సోమయాజి మంచి వేదపండితుడేగాని తాళ్లపూడిలో గడువక సత్యవరం సంస్థానానికి వచ్చాడు. ఈయన కొడుకే సోమనాథం. తర్క వ్యాకరణాలలో గట్టివాడు. అయితే ఆ రోజుల్లో శాస్తపాండిత్యానికన్న కవిత్వానికే ఆదరమెక్కువ. అందుచేత సోమనాథం విధిగా కవిత్వం నేర్చుకోవలసి వచ్చింది. వెలివెల గౌతన్నగారి దగ్గిర ఛందస్సు నేర్చుకొన్నాడు. తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన గ్రంథాలు చదివాడు. కవిత్రయభారతం, భాస్కర రామాయణం, పోతరాజుగారి భాగవతం బాగా పరిశీలించాడు. తెలుగులో కవిత్వం చెప్పడం మొదలుపెట్టి శానంపూడీ తిమ్మున్న తరువాత సోమనాథమే కాకర్లపూడివారి ఆస్థానకవి అయ్యాడు.

సత్యవరం సంస్థానంలోనే కాక ఇతర సంస్థానాలకు తూడా సోమనాథం వెడుతూ ఉండేవాడు. విభూతి కుండలాలు ధరించి పుస్తకాలు చంకనపెట్టుకుని శిష్యులతో సంచారం చేసివాడు. ఎవరు ఎంత చక్కని శోకం చెప్పినా, పద్యం చెప్పినా సోమనాథం తప్పులు పట్టేవాడు. సభలో ఉన్న ప్రతి ఒకడినీ 'ఇతడు పండితుడు కాడు "ఇతడు తార్కికుడు కాడు' “ఇతడు శాల్టీకుడు కాడు" 'ఇతడు సత్రియారసబజ్ఞాడు కాడు” అని చులకనగా కొట్టిపారేసేవాడు. ఒకసారి అడిదం సూరన్నతో ఇతనికి పేచీ వచ్చింది. ఆయన గడియకు నూరు పద్యాలు గంటం లేకుండా చెప్పగల దిట్ట. అంతటి అశుధార ఉన్నా శాస్త్రజ్ఞానం లేదని ఆయనను దృష్టిలో పెట్టుకొనే సోమనాథం ఈ పద్యం చెప్పాడు.

వరకవులందుగొందరట వారలు సాహితిలేకయే కవీ

శ్వరులట వాగ్ధరీకలన చాలగగల్డట చిత్రమయ్యెడిన్‌

వరములొసంగుదైవములు వ్యాగ్ధరినిచ్చు ఇాస్త్రసంగతిన్‌

వరమిడలేవె సిగ్గెడలు వాదులుగాక కవిత్వరీతులే. (రుక్మి, 1-21) ఇలా ఎత్తిపాడిస్తే సూరన్న ఊరుకొంటాడా? అతడు తిట్టు కవిత్వం గుత్తతు పుచ్చుకున్నవాడాయె. నా గుట్టేమిటి నీ గుట్టే బయటపెడకాను అన్నట్టు సూరకవి బోలెడు చాటువుల్లోనూ, పన్నాండుపాదాల సీసమాలికలోనూ సోమనాథాన్ని తిట్టాడు. అతడు

996 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దుష్పండిత బ్రహ్మరాక్షసుడని, ఇలాంటివాళ్లచేత కవితారసజ్ఞత పడిపోయిందని చెప్పాడు. దానితో నియోగీ తగాదాలు వచ్చాయి. సోమనాథం ఇలా బావురుమన్నాడు:

జిలిబిలిపలుకుల వెలదీ - పలుగాకినకారగుళ్ల పాలైతిగదే

ఇలలో వైదికవిద్య-త్తిలకంబులకేమిదిక్కు తెల్పితివమ్మా, ఈ ఇద్దరూ కాట్లాడుకొని చివరిపద్యంలో పెట్టిన చిచ్చు నిన్నటిదాకా రగులుతూనే ఉంది. ఆనాడు ఆశ్రయమిచ్చిన రాజులు ఈ దెబ్బలాటలను ఆపారో లేదో తెలియదు. గోపాలపాయకరావు బహుశా ఈ శుష్కవాదాలు ఎందుకని సోమనాథాన్నీ పిలిపించి ఇలా అన్నారట:

ప్రతిభదలిర్చ నీహృదయభాసురసీమ జనించినట్టి స

న్నుత కవితాలతావళులనూన విభావితసాహితీరస

ప్రతతుల బోషితంబులయి బాగుగ నేర్చువహించెదానికిన్‌

జతురత నీవొనర్చు కృతి సత్ఫలమై రుచి సంఘటింపడదే. (రుక్కి, 1-2౫) తన కవితాలత ఫలించాలని సోమనాథం రుక్కవతీపరిణయం అనే ప్రబంధాన్ని రచించాడు. రుక్కిణీకృష్ణులకు ప్రద్యుమ్నుడు పుట్టినది మొదలు అతడు రుక్కవతిని పెళ్లాడడందాకా భాగవతంలో ఉన్న కథను అయిదాశ్చాసాల ప్రబంధంగా వ్రాశాడు.

సోమనాథం రచించిన ఈ కావ్యం చివరిదాకా చదివి ఇతడు గొప్ప పండితుడేగాని కవిత్వంలో ప్రజ్ఞ కలవాడు కాడని ఎవరేనా చెప్తారు.* నూతన భావాలుగాని, కల్పనలుగాని అట్టే గోచరించవు. ఈ కావ్యం నుంచి సమకాలిక చరిత్రకు పనికివచ్చే పద్యాలే తప్ప సరదాగా చదువుకొనేవి ఎంచడం కష్టం. భట్రాజులు మాత్రం ఇతని కవిత్వాన్ని మెచ్చుకొన్నారు.

అప్పా రేకపలిసో- మప్పా విబుధాళిపాళి- యమృతపులప్పా!

ఒప్పులు నీ కవితలు వె-న్నప్పాలకు సాటివచ్చునే భళిరుచులనన్‌. అని ఒక భట్రాజు ఇతన్ని ఉబ్బించి రాజుగారు ఇచ్చిన పచ్చడాన్ని పుచ్చేసుకున్నాడు. సభలో సోమనాథం కనబరచే నిరాఘాటవాగ్గుంభనానికి మెచ్చి గోపాలపాయకరావు గారు ఆదరించి ఉంటారు. ఆయన కృష్ణలీలా సుధారససరసకృతులవంటివి తూడా సత్యవరం సంస్థానంలో ఉన్న కవులలో గ్రంథకర్తగా చెప్పుకోతగ్గవాడు వైదర్సు అప్పయ్య అనే శతకకవి.

వైదర్సు అప్పయ్య; రేకపల్లి సోమనాథాన్ని అస్థానకవిగా చేసుకుని అగ్రహారం యిచ్చిన గోపాలరావు పాయకరావుగారికి రామభద్ర పాయకరావు అనే కుమారులున్నారు. ఈయన తండ్రి అంతటి వీరుడు. ఆనాటి రాజకీయాలలో తలమునకలుగా పాలొన్నాడు. ననన యయా య మ. సనక. కడ... స కకకనననకననన సన సన. న క 10. విన్మృతకళింగాంధ్రకవులు - ప్రథమభాగం, పుట ౫.

బొల్బీలి యుద్ధంలో వెదవిజయరామరాజుతోపాటు ఈయన పాలొన్నాడు.11 ఆ తరువాత రెండో అనందరాజుగారు. పెద్దాపురం. ప్రభువు జగపతిరాజుగారిపై ఉండూరులో క్రీశ 1670లో యుద్ధం చేసినప్పుడు కూడా ఈ రామభద్ర పాయకరావు పాలొన్నాడు.] ఈయన సమరాల్లో పాలొనడమేకాక సాహితీపోషణ తూడా చేశాడు. 'నా కవిత దీనిని బ్రోవుమనుచు. శ్రీ కాకర్లపూడి రామభద్రపాయకరాయనృపాళితోనయిన సెలవీయరాదో మరేది విబుధలోకేశ యుపమాక వెంకటేశ' అని వైదర్సు అప్పయ్య అనే కవి దేవుని చేత సిపార్సు చేయించుకున్నాడు. ఈ ఉపమాక విశాఖ జిల్లాలోని సర్వసిద్ధి తాలూకాలో అగ్రహారం. ఆనాడు సత్యవరం సంస్థానంలో చంది. ఈ గ్రామంలో దేవుడు వెంకటేశ్చరుడు. ఆ స్వామి శృంగారలీలా వైభవాన్ని వర్ణిస్తూ కీర్షిని పాయకరావుకు, కృతిని దేవునికీ వైదర్సు అప్పయ్య ఇచ్చాడు. ఆ సంగతి ఇలా చెప్పాడు : సారస్యమేర్చడసాహితీకలశావ్టీ శేముషీమంథా ద్రిచేమథించి

యాకీర్తి రాకాసుధాకరుగాకర్లపూడి వంశాంబుధిపూర్ణచంద్రు

డగు రామభద్రపాయకరాయరాజమౌళికొసంగి యీ మాధుకీసుధా ర

సంబు కాక విదనుజ నికరముల గికురించి బుధతతికర్ప్చించిగరిను

గాంచి సాలంకృతయగు శృంగారసీస

శతకరాజ్యలక్ష్మిని సంతసంబుగడగ

నుడువలకనిత్తు నీకునహోపరాకు

విబుధలోకేశ యుపమాక వెంకటేశ (90.1713)

ఈ శృంగార సీసశతకరాజ్యలక్ష్మీ అసూర్యంపశ్య, ఈ అముద్రిత గ్రంథం ప్రతి ఒకటి ప్రాచ్చలిఖిత గ్రంథాలయంలో ఉంది. ఇందులో అన్నీ గునుగు సీసాలే. ''ఇందు పదములు చరణ చరణమునకు విచ్చేదము చెందక వంకర నడకలు గలవై తెంపులేక సాగియుండును” అని ప్రాచ్చలిఖిత గ్రంథాలయ పండితులు బ్రాశారు.!క

ఈ ఉపమాక వెంకటేశ్చరశతకమే కాక బళిరకరివేల్పు శతకం కూడా వైదర్సు అప్పయ్య రచించాడు. అది అసంపూర్ణం అయినా అచ్చుపడింది. అందులో 78 సీసాలే ఉన్నాయి. అన్నీ కాకపోయినా కొన్ని గునుగుసీసాలు. అచ్చుతెనుగు పదాలే ఎక్కువ వాడాడు. “బళిరకరివేల్చ పసిడిదువ్వలువతాల్చ' అని మకుటం. మొదటి తొమ్మిది పద్యాలలో కృష్ణుని బాల్యక్రీడలు వర్ణించాడు. మిగతావన్నీ శృంగారగుళికలే. రాధా మాధవుల విచ్చలవిడి శృంగారాన్ని అచ్చ తెనుగు పదాలలో వర్ణించాడు. పచ్చికామాన్ని ముచ్చటగా చిత్రించాడు.

“రాధప్రాయంబు బొత్తిగాను గుత్తకొంటివిదేమిరా యత్తయనక' అని కవి చాలాసార్లు ప్రశ్నించాడు. “రాధవగగన్న మది నిల్వరాదురన్న అని జవాబు చెప్పాడు. 11. “పాలుపాందగాకర్లపూడి జగన్నాథరాజుగారొక కొంత ఫౌజుతోడ సత్యవరపుస్వామియౌ

నలరామభద్రరాజొక కొంతబలముతోడ'' వచ్చారు. రంగారావు చరిత్ర ౩. 12. పూసపాటి శైఫీయత్‌, పుట 7. 13. డి. కేటలాగు, ఓ.లై. మదరాసు - సంపుటం. 7 శతకాలు.

998 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి అయితే ఈ నిలవలేకపోవడం అనేది ఉభయత్రా ఉంది. అందుకే రాధగని నీవు నినుగనిరాధ తాల్మినిలుపుటలు వేపుగా యొక్కనిముసమైన' అని అన్నాడు. నిజానికి రాధ 'ఇంచువిలుకాని యెలగోలునంచు' కృష్ణునికి కామపాఠాలు చెప్పిన పంతులమ్మ. ఉస్తాదే కాదు, బిరుదు వస్తాదు. ఆ సంగతిలా వైదర్సు అప్పయ్య చాటాడు. కలికినెమ్మెయిసాము కంబంబు బెసగించి, మోవిమార్పులవెక్క ముగ్గునిల్చి కలయికదారుమారులడింకితొలగించి, మిసిమినున్లాడల గొక్కెసఘటించి కొనగోటచిక్కటార్మొనగావించి, పొాలయల్కమార్శ్మోము తొలగదెలిపి రాణీంచుకీల్చడరాణా విసరుజూసి, చక్కలిగింత హెచ్చరిక దెల్సి యెదనుగుబ్బలకుంకుమ యెగర్రమట్టి! - నిలిపితన చెల్పుగరిడిలో నీకుమరుని సాముగరపిన విరుదువస్తాదురాధ... (నెం. 55) ఈ శతకంలో రాధను రకరకాల భంగిమల్లో, సన్నివేశాలలో అప్పయ్య చిత్రించాడు. పొదలో వెదుకుతూ, గదిలోకి వస్తూ, పరిపూర్ణమైన హాయిలో, అరకౌగలింతలో. పంతగించి అలిగినప్పుడు, దొంతరరతులలో తేలియాడినప్పుడు ఒకటేమిటి అన్ని అవస్థలలోనూ వర్ణించాడు. ఫలందక్కిన ఈ ప్రణయంలో *వేగిరంబెంత? వెరగెంత? వేసటెంత? వెల్లబాటెంత' వెగటెంత? వేగుటెంత? అని కవి ప్రశ్నిస్తాడు. ఇందులో 'సోయగం బెంత? సౌలపెంత? సాక్కుటెంత సాహసం బెంత సౌరెంత సరసమెంత' అని కూడా ప్రశ్నిస్తాడుగాని ఈ శతకం అంతా సాహసమే. అంతా సౌరి. అంతా సరసమే. ఇందులోని ప్రతిపద్యం 'జిలుకు లాహిరిదారు బలుకినేరా జరీ వజమీరు బలుఫొజురాజు' తొడుక్కొనివచ్చి మన కళ్లముందు స్ట్రిప్‌టీజ్‌ చేస్తుంది. రాధకు నిర్వచనం చెప్తూ వైదర్సు అప్పయ్య ఒకదగ్గిర ఇలా అన్నాడు: చిత్తజుమిటారి గేదంగి చిక్కటారి- కమ్మవిలుకాని జుల్మతీకత్తలాని కాయజో పనిషద్ధాథకదరరాధ- బళిరకరివేల్చ పసిడిదువ్వలుపదాల్ప. _ (నె. 52) ఈ శతకం కాయజోపనిషత్తే. దేవుడైనాసరే ఇలా విహరించడం మంచిది కాదనుతునే నీతిమంతులు కళ్లకు కట్టినట్టు ఇంత శృంగారాన్ని కమ్మగా వర్ణించినందుకు వైదర్సు అప్పయ్య కళ్లుపోయాయని చెప్తారు. ఉపమాక వెంకటేశ్చర శతకం వ్రాసి మళ్లీ చూపు తఆచ్చుకొన్నట్టూ చెప్తారు. ఈ కట్టుకథలే తప్పు ఈ కవి గురించి ఇక ఏ వివరాలూ ప్రస్తుకానికి తెలియవు. ఈ యుగంలో వివరాలు తెలియవచ్చే మరోకవి రేగులవలన విజయరామరాజు. అతడు రాజబంధువు. పూసపాటి విజయరామరాజు; బొబ్బిలి యుద్ధంలో దారుణంగా చనిపోయిన వెదవిజయరామరాజు నలభై సంవత్సరాలు పాలించాడు. ప్రసిద్ధుడయ్యాడు. అతని ఏలుబడిలో ఉన్న బంధువులూ, అశ్రితులూ తమ బిడ్డలకు విజయరాముడనే పేరు పెట్టుకోవడం సహజమే. పూసపాటివారి వంశంలోనే రేగులవలసతు చెందిన భూపాలరాజు తన రెండవ కొడుకుకు తన్నేలిన సంస్థానాధీశుని పేరు పెట్టుకొన్నాడు. ఈ రేగులవలస విజయరామరాజుకు ముత్తాత కొండల్రాజుగారి దగ్గిరనుంచి సాహిత్యాఖిలాష

కళింగ కవులు 999 సంక్రమించినట్టుంది. కొండలాజుగారు వెంకటాచలమాహాత్మ్యం అనే విపులకృతిని రచించారు. ఆశ్రితులీతనిని 'సర్వజ్ఞమణి' అని పిలిచేవారు.!*

ఈ సర్వజ్ఞమణీ కొండల్రాజుగారి మునిమనుమడు విజయరామరాజు రాజగురువైన తిరుములపెద్దింటి సంపత్కుమారాచార్యుల వారివద్దనే చదువుకొన్నాడు. ఆయన తన విద్యాగురువు అని స్పష్టంగా చెప్పుకొన్నాడు.1! ఈ అయ్యవార్గంగారే గోగులపాటి కూర్మనాథానికి కూడా గురువు. బహుశా రేగులవలస విజయరామరాజు రామతీర్థాలులో కూర్మనాథునితోపాటు చదువుకొని ఉండవచ్చు. వైష్ణవ గురువుల వద్ద విద్యాభ్యాసం చేయడంవల్ల విజయరామరాజుకు సహజంగా వైష్ట కథలపై అభిమానం కల్గింది. పన్నిద్దరాళ్వారులలో ఒకరైన కులశేఖరుల చరిత్రను తీసుకొని విష్ణుభక్తి సుధాకరం అనే అయిదాశ్వాసాల ప్రబంధంగా వ్రాశాడు. కులశేఖరుల పుత్రిక నీల శ్రీరంగనాథుని పెళ్లి చేసుకోవడం దాకా ఇందులో కథనం చేశారు. సాధారణంగా తెలుగు ప్రబంధాలలో ఉండే అష్టాదశ వర్ణనలూ, విరహాలూ, ఉపాలంభనలూ, అన్నీ యిందులో ఉన్నాయి.

విష్ణుభక్తీసుధాకరం అముద్రితం. దీని తాళపత్రప్రతిని మిత్రులు బులుసు వెంకటరమణయ్యగారు దయతో నాకు అరువు యిచ్చారు. ఇందులో మొత్తం 260 కమ్మలున్నాయి. ద్వితీయాశ్వాసంలో కొంత పోయింది. గ్రంథాదిని తొలి నాలుగు పద్యాలూ పోయాయి. మొత్తంమీద కావ్యం చాలామటుకు లఖించిందనే మ ఇందులో కవిత్వగౌరవం కంటె కథాగౌరవమే అధికం అని గ్రంథాన్ని బాగా పరిశీలి వెంకట రమణయ్య గారు చెప్పారు.1* ఈ కావ్యాన్ని ఇంకొకవిధంగా మనం గౌరవించాలి. పూసపాటివారి వంశావళిని స్పష్టంగా చెప్పే గ్రంథాలలో ఇది ప్రముఖమైనది. విజయనగర సంస్థానంలో ఈ శతాబ్దపు తొలిరోజులలో ఒక పెద్ద వారసత్వపు దావా చెలరేగింది. దీన్ని పెద్ద దావా అంటారు. ఆ సందర్భంలో ఇరుపక్షాలవాళ్లూ వంశ వృక్షాలనూ, పాత వివరాలనూ దిద్దిపారేశారు. తమకు ఇబ్బందికరమైన గ్రంథాలను వెలుగు చూడనివ్వలేదు. తమ ఆశ్రితులచేత తమకు అనుకూలమైన వంశావళులు తయారు చేయించారు.

ఆ లావాదేవీల ప్రభావం ఈ విష్ణుభక్తిసుధాకరంపై కూడా తరువాత పడింది. దీనిని శేగులవలస విజయరామరాజు అనే తాటేదారు వ్రాయలేదు అనే వాదం బయలుదేరింది. బొబ్బిలియుద్ధంలో మరణించిన పెదవిజయరామరాజూుగారే. దీనిని రచించారనే సమ్యేతరమైన విషయాన్ని చాటడానికి కొందరు నడుం కట్టుకొన్నారు; కలం పట్టుకొన్నారు. వాళ్లలో ఆద్యులు దువ్వూరి జగన్నాథశర్మగారు. ఈయన కళింగసీమలోని కొన్న క్షత్రియ కుటుంబాలకు విధేయుడు. వాళ్ల శ్రేయోఖిలాషి. ఇప్పుడు చాలా వృద్ధులు, ఏనాటినుంచో క్షత్రియ కీర్తినే ఆశ్రయించుకొన్నారు. పూసపాటివారిలో రేగులవలస కోవకే 14. నరసభూపాలరాజీయం - ఓరుగంటీ సోమశేఖరం, 1-౫.

  1. విష్ణుభక్తి సుధాకరం, 1-18.
  2. గజపతీరాజుల తెలుగు సాహిత్య పోషణము, పుట 191

1000 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తఖ్తుమీదకు వచ్చిందనీ వీరు ప్రచారం చేయదలచుకొన్నారు. అందుకోసం వీత విష్ణుభక్తిసుధాకరంలోని కొన్ని పద్యాలనే ఉదాహరించి తమ వాదాన్ని ప్రకటించారు. “తిలుగుపరాశరీయహోర' అనే గ్రంథాదిని విపులమైన చారిత్రక సమీక్ష చేస్తూ దువ్వూరివారు ఈ వ్యళికాన్ని ప్రతిపాదించారు.” ఆ గ్రంథానికి నిడుదవోలు వెంకటరావుగారు. పీఠిక వ్రాశారు. ఆంధ్ర పారాశరీయహోర అనే శీర్షికలో వెంకటరావుగారు ఇలా చెప్పారు.

“దీనికిగర్ణయగు విజయరామరాజేంద్రుడు శ్రీ.శ1670-1756 మధ్య జీవించి యుండెననియు, నాతడే విజయనగరముకోట కట్టించి, విష్ణుభక్తి సుధాకరాది గ్రంథములు రచించి బొబ్బిలియుద్ధమున మరణించిన మహారాజనియు శ్రీ, శర్మగారు సోపపత్తికముగ

అయితే ఈ గ్రంథములో శర్మగారు తమ రాజభక్తిని తప్ప మరేడీ నిరూపించలేదు. పైగా సత్యాన్ని దాచేశారు. విష్ణుభక్తిసుధాకరం అవతారికలో స్పష్టంగా బొన్బిలి యుద్ధంలో చనిపోయిన విజయరామరాజూ, ఈ కావ్యకర్తా విఖిన్నులని ఉంటే, ఆ పద్యాలను ఉదాహరించక ఇక్కడో పాదం, అక్కడో వాక్యం ఉదాహరించి పాఠకులను మభ్యపెట్టారు. మూలగ్రంథాన్ని చూడకపోతీ నిడుదవోలువారేకాదు, ఎవరైనా దువ్వూరి జగన్నాథశర్మగారి సాహిత్య కృత్రిమాన్ని నమ్మక తప్పదు. నిడుదవోలువారు చెప్పినట్టు సత్యాన్వేషణయే చరిత్రకు పరమార్థం. అందుకే ఈ సంగతులు బయటపెడుతున్నాము.

(ఈ దువ్వూరి జగన్నాథశర్మగారే రాచిరాజుసీసమాలిక అనేది ఒకటి ప్రకటించారు. వసిష్టగో త్రక్షత్రియుల ఇంటిపేర్లు ఇందులో ఉన్నాయి. ఇది 56 పాదాల సీసపద్యం. క్రీశ 1458లో ఉన్న రాచిరాజు దీన్ని వ్రాశాడని అందులోని తప్సీళ్ళవల్ల తెలుస్తుంది అంతేకాదు వేములవాడ ఖీమకవి క్రీశ 1175లో దానరాజునకు ఒక పుస్తకం అంకీతం ఇచ్చాడని కూడా ఈ సీసమాలిక చెప్తూంది. ఈ సంగతి నిజమనుకొని నిడుదవోలు వెంకటరావుగారు, చాగంటి శేషయ్యగారు మొదలైన పరిశోధకులు వేములవాడ భీమన్న కాలనిర్ణయం చేశారు. అయితే ఈ సీసమాలిక ప్రక్షిప్తం. దీనిని ఎవరో అర్వాచీనులు సృష్టించారు. ఈ సాహిత్య ఫోర్టరీని దువ్వ్యూరివారు ప్రకటించారు. ఈ సీసమాలిక అంత ప్రాచీనం కాదని రుజువు చేయడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఇందులోని ఛప్పన్న తుటుంబాలలో నందేల కృష్ణంరాజుగారిది కూడా ఒకటని 37వ పాదంలో స్పష్టంగా ఉంది. నంద్యాల కృష్ణంరాజు సుప్రసిద్ధుడు. పింగళి సూరపరాజుగారి కళాపూర్లోదయం అంకితం పుచ్చుకొన్నాడు. ఇతడు క్రీ.శ. 1550 ప్రాంతాలవాడు. ఇతని గురించి నూరేళ్లముందు 1458లో ఉన్న రాచిరాజు ఎలాగ వబ్రాయగలడు? ఎవరో ఎందుకో 17. తెలుగుపారాశరీయహోర- నటశ్రీ ప్రచురణాలయం, కోటగేటు వద్ద రామచంద్రపురం - గోదావరి

బిల్లా, 1965. 18. అడే గ్రంథం, పీఠిక, పుట 16. 19. ఆంధ్రవిజ్ఞానం- ప్రసాదభూపాలుడు (దేవిడీజమీందారులు) అయిదవ సంపుటుం, పుటలు 2701-03.

తంగ కవులు 1001 సృష్టించినదే తప్పు ఈ సీసమాలిక రాచిరాజుది కాదు. ఖావిపరిశోధనవల్ల ఈ ఫోర్డరీ చేసినదెవరో బయపడవచ్చును.) క్‌

విష్ణుభక్తిసుధాకరంలోని అవతారిక పద్యాలను పథీలించిడే బొన్బిలియుద్దం విజయరామరాజు కాళ్లపాలెం కోవలో వెదబగన్నాథరాజుగారి వంశంలో పుట్టినవాడే, గ్రంథకర్త రేగులవలస కోవలోని చినజగన్నాథరాజుగారి కోవలోని వాడనీ తెలుస్తుంది. గ్రంథకర్త ఈ అన్నదమ్ముల కోవలలో మొదట చినజగన్నాథరాజుగారి వంశంలో తన తాతతండ్రుల గురించీ, తన గురించీ చెప్పుకొన్నాడు (1-50 నుండి 104). అ తరువాత వెదజగన్నాథరాజుగారి కోవ గురించి చెప్పాడు.

జగతిమత్రృపితామహ జనకజనకు-డగు జగన్నాథనృపతి తిలకాగ్రజుండు

(విష్ణుషు 1-106)

అని చెప్పి వరుసగా ఆ కోవలోనివాళ్లని వర్ణించాడు. ఆనందరాజుగారికి సీకాంబవల్ల విజయరామరాజు పుట్టాడని, అతడు మణికీరీటి అని స్పష్టపరిచాడు. 'రాకోటవెట్టి విజయనగర మహాస్థాని నిజమాఖ్యమహితముగ జేసె విజయరామనృపమౌళి అని అసందిగ్ధంగా చెప్పాడు. ఇంకా అతణ్ణి ఇలా వర్ణించాడు:

“4 నీలగిరివాసు భక్తిదైవార యథాస్థాన వాసుజేసి

యవనులదోలి కృష్ణాపగాపర్యంత జలరాజసంస్థానములను నిలపె

నఖిలభూవిభులచే నప్పనంబులగొన్న ప్రబలమహారాష్ట్రపతుల నణచె

భూరి విజయరామభూషణ కృతినందె నగ్రహారంబులు విప్రాశికిచ్చె

మణికిరీటాంచదభయాంక మదగజరథ

హయచయపదాతి వీరకాహళవిశిష్ట

కావనీధవబహుబిరుదాంక లలిత

విజయరామమహారాజు వినుతిగాంచె. (విష్ణు. సు, 1-116) ఈ పద్యాల సాక్ష్యంవల్ల రేగులవలస విజయరామరాజే విష్ణుభక్తి సుధాకరం వ్రాశాడని, అతడు ఎన్నడూ తఖ్లు ఎక్కలేదనీ నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ గ్రంథాన్నేశాక ఇతడు “పారాశరీయహోర' అనే జ్యోతిషగ్రంథాన్ని తెనిగించాడు. మూలాన్ని అణీవెళ్ల వెంకటశాస్త్రి రచించాడు. అతడు పెదవిజయరామరాజుగారి బావమరిది అయిన చింతలపాటి నీలాద్రిరాజుగారి ఆశ్రితుడు. (తూచిమంచి జగ్గన్న విరోధి). ఈ అనువాద గ్రంథంలో 121 గద్భపద్యాలు ఉన్నాయి. శాస్త్రగ్రంథం కనుక కవిత్వం ప్రసక్తే లేదు. గణబద్ధమైన రచన.

“చరిగొండ హెన్నయ్యః అణివెళ వెంకటశాస్త్రి వంటివాళ్లే కాక మరికొందరు జ్యోతిషవేత్తలు కూడా అనాడు కళింగసీమకు వచ్చి రాజులను ఆశ్రయించినట్టు కనబడుతుంది. వాళ్లలో చరిగొండ హెన్నయ్య ఒకడు. ఈయన మహబూబునగరు జిల్లాలోని చరిగొండనివాసి. చిత్రభారతం వ్రాసిన చరిగొండ ధర్మన్న వంశంలోనివాడు.

1002 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈయన జోగతిషరత్నాకరం అనే గ్రంథాన్ని వ్రాసి రంగరాజు సింహాద్రికి అంకితం ఇచ్చాడు.” అయితే ఇదే గ్రంథాన్ని విజయనగరం దగ్గిర ఉన్న రామతీర్ణాలులోని దేవునికి అర్చిస్తూ ఒక కృత్యాది కనబడుతుంది.

శ్రీరామ తీర్థపతికి గృ-పారస వారాశికఖిల వందితునకు సీ

తారామున కాశ్రితక- ల్పారామునకున్‌ యశస్సుధాంభోనిధికిన్‌. హెన్నయ్య [గ్రంథంలో కనబడే ఈ పద్యమే యథాతథంగా రేగులవలస విజయరామరాజు అనువాదం చేసిన పారాశరీయహోరలో కూడా కనబడుతుంది. ఒకే పద్యం రెండు గ్రంథాలలో ఎందుకుందో భావిపరిశోధనవల్ల తేలాలి. పోన్నయ్య విజయనగరం వచ్చాడో లేక ఎవరైనా లేఖకులు ఆ పుస్తకం ప్రతిలో ఈపద్యం ఎక్కించారో తెలియదు.

హెన్నయ్య గంథం ఆదిలో సంవత్సరఫలాలు ఉన్నాయి. ప్రభవలో వానలు పొడగట్టుతాయి, ధేనువులు అధికంగా పితుకుతాయి. మన్మథలో మధ్యవృష్టి క్షయలో అతిభయం, దుర్చిక్షం అని ఇలాంటి ఫలితాలను ఇది చెప్తుంది. అయిదోశ్వాసంలో వాస్తుజాతక ప్రకరణాలు కూడా ఉన్నాయి. వ్రాస్తున్నది జ్యోతిష గగ్రంథమైైనా ఇది కావ్యమని గ్రంథకర్త చెప్పుకొన్నాడు. 'సుధారసంబునుబోలి యొప్పుచున్న జ్యోతిషరక్నా కరంబను కావ్యంబు' అని చాటుకొన్నాడు (౧.908. అయితే ఇందులోని సుధారసం గురించి ఎవరూ యోగ్యతాపత్రం ఇవ్వరీమో. చరిగొండ హెన్నయ్య ఏవైనా కథాకావ్యాలు బ్రాశాడో లేదో తెలియదు. ఈ కవికాలం క్రీ.శ 1700 అని గోలుకొండ కవులు సంచికలో ఉంది (పుట 406).

ఈ యుగంలో యింకెందరు కవులకు కళింగసీమతో, విజయనగర సంస్థానంతో సంబంధం ఉందో ఇంకా పరిళోధించాలి. బొబ్బిలియుద్ధం పెదవిజయరామరాజుకు ఎవరో కవి 'విజయరామ యశోభూషణం' అనే సంస్కృత కావ్యం కృతి ఇచ్చాడు. శృంగవరపుకోట సంస్థానాధీశ్చ్వరులు ముఖీ కాశీపతి రాజుగారి ఉద్యోగులలో ఒకడైన కృష్ణయ్యకు అండలూరి శరభయ్య “ముక్తి చింతామణి" అనే పద్యకావ్యం అంకితం ఇచ్చాడని తెలుస్తోంది. పరిశోధిస్తే ఇంకా చాలామంది కవులు తేలుతారు. అయితే కళింగసీమలోని సుప్రసిద్ధుల పేర్లు లెక్కించేటప్పుడు గోగులపాటి తూర్మనాథం తొలినాల్లు వేళ్లమీదకు వస్తాడు.

గోగులపాటి. కూర్మనవాథం: విజయనగర సంస్థానాధిపతులకు ఇష్టదైవం రామతీర్థంలో వెలసిన సీతారాముడు. ఈ క్షేత్రంలోని దైవానికే పూసపాటిరాజులూ, వారి ఆశ్రితులు కొందరు తమ కావ్యాలు అంకితం ఇచ్చారు. రామతీర్థంలో తిరుమల పెద్దింటి సంపత్కుమారాచార్యులవారనే వైష్ణవగురువు అ కాలంలో ఉండేవాడు. ఈ అయ్యవార్ల్గం గారు రాజగురువులు. సార్వభామ సీతారామరాజుగారి కాలంనుండి మూడు తరాల రాజుల కీయన మంత్రోపదేశం చేశారు. మడిమాన్యాలు పొందారు. వెంకటాచార్యులుగారు చణ 12కు నలా 21. గ 166) ఆ గ్రంథంలో అ4వ పద్యం.

కింగ కవులు 1003 రాజగురువేకాక సామాన్య సంసారులకు, కవులకూ కూడా గురువే. గోగులపాటి కూర్మనాథం అనే మధురకవి ఈయన దగ్గిర మంత్రోపదేశమే పొందాడో, సాహిత్యమే నేర్చుకొన్నాడోగాని తన గ్రంథాలలో ఈ గురువుగారి పేరు చెప్పుకొన్నాడు. గోగులపాటివారు విజయనగరానికి చేరువలో ఉన్న దేవులపల్లిలో ఉండేవారు. గోగులపాటి బుచ్చన్నగారికి ముగ్గురు కొడుకులు. వాళ్లలో కూర్మనాథం మాత్రం విజయనగర సంస్థానంలోనే ఉండిపోయాడుగాని వెంకన్న, కామన్న అనే సోదరులు ఇద్దరూ కాశీరామేశ్చర మజిలీలు చేశారు. చాలా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సందర్శించుతూ

తోడబుట్టినవాళ్లు అలా తీర్థయాత్రలు చేసి దేశమంతా తిరుగుతూ ఉంటే తూర్మనాథం స్వగ్రామానికి దగ్గరలో ఉండే పుణ్యక్షేత్రాలలో సంకీర్తనాచార్యుడుగా ఉండేవాడు. క్రీ.శ 1700-1717 దాకా పాలించి. విజయనగరం కోట కట్టించిన మొదటి ఆనందరాజుగారి కాలంలోనే కూర్మనాథం ఉద్యోగంలో చేరాడని ప్రతీతి. సంస్కృత కావ్యాలూ, ఆంధ్రప్రబంధాలూ చదువుకొన్నా తూర్మనాథానికి మధురకవిత అంటే ఇష్టం. నిత్యం దేవాలయంలో ఉండేవాడు కనుక ఉత్సవాలలో పాడే పాటలు, వేసే నాటకాలు అంటే అతనికి ఆదరం కలిగింది కాబోలు. చిన్నప్పుడే మృత్యుంజరువిలాసం అనే రచన ఒకటీ చేశాడు.

అది ప్రబంధం, యక్షగానం, నాటకం అన్నీ కలిపిన కొత్తఫక్కీ రచన. అందులో పద్యాలు, పాటలు, దరువులు, ద్వాపదలు, చూర్ణికలు, శోకాలు-దండకాలు, ఒకటేమిటి? అన్నీ ఉన్నాయి. దీనికి కూర్మనాథం 'శృంగార నాటకగేయప్రబంధం' అని కొత్త పేరు పెట్టాడు. “నాకుదోచిన యటునవ్య కావ్యంబు' ప్రచరించానని, ప్రమర పాండిత్య సంభావితులకు, గురుతర సత్కావ్యకోవిదులకు మనవి చేసుకొన్నాడు. చిన్నప్పుడు చెప్పుకొన్న కాళిదాసు సంస్కృత కావ్యాన్నీ, పెరిగాక చదువుకొన్న నన్నెచోడుని ఆంధ్రప్రబంధాన్నీ పదేపదే తలచుకొని కుమారసంభవగాథను “మృత్యుంజయవిలాసం' అనే నవ్యకావ్యరూపంలో తూర్మనాథం మొదలుపెట్టాడు. తెలుగు యక్షగానాలలో యిది ఒక కొత్తతరహాది. ఈ శృంగారనాటక గేయప్రబంధం ఆంధ్రదేశమంతటా ప్రచారం పొందింది. దీనిని ప్రదర్శించేవారో లేదోగాని గాయకులు పాడేవారట.! ఇది కిందటి దశాబ్దంలోనే గుజిలీ పుస్తకంగా అచ్చుపడిందిి

మృత్యుంజయవిలాసం ముందే అచ్చుపడినా గోగులపాటి తూర్మనాథం శృంగారంలో దాటగల అంచులు అందులో కనబడవు. అతడు వ్రాసిన సుందరీమణీ శతకంలో అతడు విచ్చలవిడిగా విహరించాడు. సుందరి అతడు ఉంచుకొన్న వేశ్య కాబోలు. ప్రతిరాత్రీ కొంతసేపు ఆమె ఇంట్లో ఉండి స్వగృహానికి హ్లేవాడు కాబోలు. ఒక వానవచ్చిన రాత్రిని ఇలా వర్ణించాడు. తకపన నన ననన జ. ల 1, జ సవల దర ప టయుయ్య (బందరు) గారి కాపీలైటితో అచ్చుపడింది.

1004 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ బోటిరొ వానచేవెడలి పోవగలేకొక నా డటుండి యే ర్వాటుగ నిద్రవోవ నెణపయ్యెద దీపముత్రైంచివచ్చి స య్యాటలుమాటలుక్‌ బెనగులాటలు సీత్కృతులేమిలేక నక గూటమినేలుటల్‌ దలచుకొందువొ లేదొకొ సుందరీమణీ, (సుందరి. 77) పెనగులాటలు లేని కూటమి ఈ ఒక్కపద్యంలోనే ఉందిగాని మిగతా వాటిలో మదన కదనాలు ఎక్కువే. ఈ శతకంలో విప్రలంభవృంగారం ఉంది. ఏదో కారణంవల్ల సుందరిని ఎడబాసీ వెళ్లాడు. ఆ వియోగంలో ఇది వ్రాశాడు. అమెను కలలోనూ, బొమ్మగానూ, ఊహలోనూ చూడలేకపోతున్నానని ఇలా చెప్పాడుఃో నిను కలనైన చూచుటకు నిద్దురకంటికిరాదు చిత్రరం జనఫలకంబునం గనగ సాంద్రతరాశ్రువులడ్డమౌను భా వనయొనరింతునన్న జెలువా మదిచంచలమాౌ నికేమి సే తు నిముసమొక్క యేడగుచుదోచె దలంపగ సుందరీమణీ, (సుం. 19) అన్నలను, తమ్ములను వదలి సుందరి కోసం వెళ్లాడు. ఆమె కోపగించి పొమ్మంది అతడు ఇలా చెప్పాడు. అలికులవేణి నీకొరకు అన్నలదమ్ముల బాసివస్తి నీ కులుకుమిటారి గబ్బిచనుగుబ్బలకొత్తుచు కౌగలించవే కలికిరొ నీకు గుండె బలు కట్టడిదైవము రాయి చేసెనే చెలియరొ నీకు నాయుసురు చెందకమానునె సుందరీమణీ, (సుంద. ౪) అతని ఉసురు ఆమెకు తగిలిందో లేదోగాని అతని ఊసు అందరికీ తెలిసింది తూర్మనాథం మంచి కవిత్వం చెప్తాడని పెదవిజయరామరాజు చెవిని ఏడింది. కవిని పిలిపించి సత్కరించినట్లుంది. రాజుగారి పేరూ, రామతీరాలులోని దేవుని పేరూ కలిసీ వచ్చేటట్టు “విజయరామా రామతీర్ధాశయా' అనే మకుటంతో ఒక శతకం చెప్పాడు. ఇందులోని మూడు పద్యాలే ఇప్పటికి దొరుకుతున్నాయి.*్‌ ఘనకోపం బతిలోఖికే, పరుషవాక్యప్రోద్ధతుల్‌ పందకే ధనకార్చణ్యము పాపశీలునకె, కాంతా బద్ధమోహంబు జూ రునకే, నిర్జలసాధువంచనవిధుల్‌ మూర్గాళికే, యిమ్మహిక్‌ మనుజస్వామికి ధర్మమా? శ్రీ విజయరామా! రామతీర్థాశ్రయా. ఈ శతకంలో అనుప్రాస విధిగా ఉంటుందని ఊహించవచ్చు. రెండో పద్యం చూడండీ. సములడ్జెనది బారు, మీభజనచే జాగైనదే నోరు, గ్రీ ష్కములో బారినదేరు, సజ్జననివాసంబున్న దే యూరు, రో గము బాగైనదివేరు, మీపదపరాగం బున్న దే నీరు, ధ ర్మము చేగన్నది పేరు, శ్రీవిజయరామా రామతీర్తాశ్రయా! 24. ఈ భావం అచ్చంగా ఇలాగే సముఖం వెంకటకృష్ణప్పనాయకుని అహల్యాసంత్రందనంలో ఉంది. (3-11). బహుశా ఇద్దరికీ ఒక సంస్కృతకవే మూలం కాబోలు. 25. రామతీర్థచరిత్ర - గంటి సూర్యనారాయణశాస్త్రీగారు, (సింహాచలం) పుట ఉ.

తింగ కవులు 10056 మూడో పద్యంలో కూడా ఇదే సంవిధానం.

స్వామిన్సన్నదిపూట, పుణ్యనది క్రీవంనున్నదేబాట, మూ

ధామంబున్నదె పేట, ధర్మసభ సత్యంబన్న దేమాట, యే

సీమ న్వస్తు సమృద్ధిచే భటులచే జెన్వైనదే కోట, పె

న్మామిళ్లున్న దె తోట, శ్రీవిజయరామా! రామతీర్థాశ్రయా.

ఈ శతకం పూర్తిగా దొరక్కపోవడం దురదృష్టం. సమగ్రంగా లఖిస్తే కొన్ని చారిత్రక విషయాలు తెలిసేవేమో. విజయరామరాజు ఖార్య పేరు చంద్రయ్యమ్మగారు. బహుశ ఈమె పేరనే చంద్రమ్మపేట అనే గ్రామం ఉంది. దానినే చంద్రనగరం అని పిలిచేవారు కాబోలు. అ ఊళోని దేవునిపై తూర్మనాథం ఒక అష్టకం వ్రాశాడు. 'చంద్రనగరపురీశ్వరా చెలియనిను పిలిచిందిరా' అనే మకుటం దానిలో ఉంటుంది. చెలియ అనే చోట యతికి సరిపోయేకాంత, రమణి మొదలైన పర్యాయపదాలు ఉంటాయి. ఈ అష్టకం విడిగా ఇప్పుడు కనబడదు. తూర్మనాథం వ్రాసిన లక్ష్మీనారాయణ సంవాదం అనే సేవా ప్రబంధంలో ఉంది.

ఇది మూడాశ్వాసాల కావ్యం. మొదటి అశ్వాసంలో లక్ష్మీనారాయణ సంవాదం ఉంది. స్వామివారు వేటకువెళ్లి తిరిగివచ్చాక లక్ష్మీ తలుపు తీయదు. ఏవో చెడు తిరుగుళ్లు తిరిగి వచ్చావని నిందిస్తుంది. కాదు, రాచకార్యంమీద వెళ్లాను అని ఆయన సాక్షులని చూపిస్తానంటాడు. అమె నమ్మదు. ఈ సంవాదం అచ్చంగా భట్లపెనుమర్తి కోదండ రామయ్య వ్రాసిన వల్లభాభ్యుదయంలోని సంవాదాన్ని పోలి ఉంటుంది*ో అనాటి వైష్ణవ దేవాలయాలలో ఈ తలుపు దగ్గిర సంవాదాలు పరిపాటి.

లక్ష్మీనారాయణ సంవాదంలోని రెండో ఆశ్వాసంలో తిరుమంగయాళ్వారు. కథ ఉంది. స్వామివారు వేటనెపాన ఈ అళ్వారును చూడడానికి వెడుతూ ఉంటారు. “నువ్వూరా' అని లక్ష్మీదేవిని తీసుకువెళ్లారు. తిరుమంగయాళ్వారంటే దారిదోపిడీలు చేసి వైష్ణవులకు విందులుపెట్టిన భక్తుడు.*” ఈ కావ్యంలోని రెండో ఆశ్వాసాన్ని చోరసంవాదం అంటారు. మూడో అశ్వాసానికీ, మొదటి రెండింటికీ సంబంధం లేదు. చివరిదానిలో ఆలయ సేవలు ఉన్నాయి. నైవేద్యాలు, శోభనం, లాలి, ఏకాంతసేవ మొదలైనవి ఉన్నాయి. కొన్ని హాయిగా ఉన్నాయి.

అలయానికే జీవితం అంకితం చేసిన కవి గుడికి ఏ విపత్తు వచ్చినా భరించలేడు. తూర్మనాథుని కాలంలో మరాఠీలు, పిండాలీలు, రోహిలాలు మొదలైనవాళ్లు గ్రామాలమీద పడి దోచుకునేవారు. ఏ సంవత్సరమో సరిగ్గా చెప్పలేంగాని ఒకసారి తురకలు పెచ్చురేగారు.. ప్రజలను హింసించి దేవాలయాలు నాశనం చేయడం ప్రారంభించారు. అప్పుడు కూర్మనాథం సింహాచల దేవాలయంలో ఉద్యోగి. ఆ పురాతన 2౫. నోయకరాజుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి.

  1. నాయకరాజుల యుగం, సమగ్ర అంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి.

1006 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఇతర గ్రామలలో ఎన్నో దారుణాలు జరిగాయి. తురక దాడికి బెదిరి ఇల్లూ వాకిళ్లు వదిలి సంసారాలు పారిపోయాయి. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అడవులు పట్టారు నడవలేనివాళ్లూ పరిగెత్తక తప్పలేదు. పైమీద దుప్పటి బరువనుకొనేవాళ్లు మూటల మోయవలసి వచ్చింది. పంచభక్ష్య పరమాన్నాలు తినేవాళ్లు బలుసాకు తినవలసీ వచ్చింది. గడపదాటని ఇల్లాళ్లు అలంగం తిరగవలసి వచ్చింది. పఠానీలఫౌజు గ్రామాలు చుట్టబెట్టారు. సోమయాజుల పెద్ద జారీలను గుడిగుండీలు చేసుకొన్నారు. యజ్ఞవాటికలో ధూమపానం చేశారు. యాగపాత్రలను లుడకీ చిప్పలు చేసుకొన్నారు. ఇవన్నీ ఇతర గ్రామాలలో చూసి సింహాచలంలో తూడా ఇవి జరుగుతాయేమో అని తూర్మనాథం అలమటించిపోయాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. మొత్తుకొన్నాడు. ఎత్తిపొడిచాడు. తిట్టాడు. రోషం కలిగించాడు.

ఇందుగల డందులేడను సందియంబు - జెందవల దను వేదవాగ్చృందమెల్ల

నెందువెదికిన గాన౮ావేమి ఇపుడు - వైరిహరరంహసింహాద్రి నారసింహ. (50) అని గాలించాడు. దేవునికి కూడా తురక మతంపై అభిమానం పుట్టిందా అని కవికి అనుమానం వేసింది. 'వీవినాంచారిని విలిపింపు వేగమే తుద కభ్యసింపుమా తురకభాష

పాశ్చాత్యులనమాజుపై బుద్ధిపుట్టెనో, మౌనులజపముపై మనసురోసి?

యవనులకందూరి యందిచ్చ చెందెనో, విప్రయజ్ఞములపై విసువుబుట్టి?

ఖానజాతిసలాముపై నింపుబుట్టినో, దేవతాప్రణతిపై భావ మెడలి

తురకల యీదునందు ముదంబుగల్లెనో, భక్తనిత్యోత్సవ పరతమాని

వాండ్రు దుర్మార్గులయ్యయో వ్రతము చెడ్డ

సుఖము దక్కదు, వడి ఢిల్లి చొరగ దోలు

పారసీకాధిపుల పటాపంచలుగను

వైరి హరరంహ సింహాద్రి నారసింహ. (నెం8) కవి తన వ్రతం చెడగొట్టుకొని దేవుణ్ణి తిడుతున్నాడు. అయితే తన సొంతానికి కాదు. ప్రజల క్షేమం కోసమే ఈ దూషణ. అ సంగతి ఇలా చెప్పాడు:

మా మొఖాసాతు గ్రామంబు లిమ్మనలేదు. కొంపలుగాల్పింప కూడదంటి

కరిహయాదుల మేము గాంక్షింపగాలేదు, గోవధమాన్చింప బ్రోవుమంటి

మాకు మిమ్ములను సామ్రూజ్యమిమ్మనలేదు, క్షితిలోనబ్రజల రక్షింపుమంటి

స్వామి మాకొరకేమి కామింపగాలేదు క్షితిలోన ప్రజల రక్షింపుమంటి

జెలగి నీపదసేవలు బేయుమాకు

వేర కోరికలిటికి వెన్నగలుగ

, నహహ నేటికి నేతికి నంగలార్చ వైరిహరరంహ సింహాద్రి నారసింహ. (నెం ౪)

కళింగ కవులు 1007 అంగలార్చడం అంతా ప్రజలకోసమే. అందుకే దేవుణ్ణి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. “చాటకపో జుమీ చాలబోవకయున్న నాటివ్రేపల్లెలో రోటిమాట' అని బెదిరించాడు. 'పాలీయవచ్చిన భామినిప్రాణంబు లపహరించి చెలంగినట్లు గాదు, వరబలంబిది నీ ప్రజ్ఞ పనికిరాదు" అని తూలనాడాడు.

శౌరనిజమాడనిష్ణురం బేనటండ్రు

కాకరోషంబూగలిగిన గరినయవన

సేన నిర్ణించి యీయాంధ్ర సృష్టినిల్చు

వైరిహరరంహ సింహాద్రి నారసింహ. _ (నెం24)

అంధ్ర సృష్టిని నిలుపుకోవాలనే ఆశయం, అది నాశనమవుతుందేమో అనే ఆరాటం; అవకూడదనే సంకల్పం తొలిసారిగా తెలుగు కవితలో ఇక్కడ సాక్షాత్కరిస్తుంది.

సాటి ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పడు సంఘచైతన్యంకల ఏ కవికంఠం ఎలుగెత్తక మానదు? అన్యాయం జరుగుతూ ఉంటే ఆపడానికి దేవుజ్జయినా అది లక్ష్యపెట్టదు.

కారుచిచ్చులా దహించే కన్నీళ్లతో గోగులపాటి తూర్మనాథం సింహాద్రి నారసింహ శతకం చెప్పాడు. ఒకపక్కనుంచి తురక సేనలు త్వరత్వరగా వస్తూంటే వడివడిగా పద్యాలు అతడు చెప్పాడు.

68 పద్యాలు చెప్పగానే ఆ పద్యాల వేడికో, ప్రజల వుసురుకో సింహాచలం కొండమీద ఉన్న తేనెపట్లు ఒక్కసారి అంటుకున్నాయి. వెల్లువలాగ తుమ్మెదలు చెలరేగి తురకసీనలను విశాఖపట్నంలోని శృశానం మెట్టదాకా తరిమాయి. నాటినుండి ఆ మెట్టకు తుమ్మెదలమెట్ట అని పేరు వచ్చింది.

గోగులపాటి కూర్మనాథానికి పేరుతెచ్చిన శతకం కూడా ఇదే. ఇటువంటి శతకాలు తెలుగు సాహిత్యంలో మరికొన్ని లేకపోలేదు. అయితే ఆంధ్రసృష్టిని నిలుపమని సందేశం ఇచ్చిన కవులలో ఇతడు ప్రముఖుడు.

తెలుగు సాహిత్యంలో ఇతని ఈ సృష్టి నిలుస్తుంది.

ఇద్దరు ఆలంకారికులు

పూటకో ప్రబంధం, రోజుకో కావ్యం, గంటకో కావ్యం చెప్పగలమని మన కవులలో

కొందరు చాటుకొంటారు. అభ్యాసమైడే ఇదేమంత కష్టమైన పనికాదు. దీని కాట్టే ప్రతిభ

అక్కరలేదు. రసవత్తరంగా కృతి చెప్పడంలోనే కవి ప్రతిభ కనబడుతుంది. రసమంటే ఏమిటి? దేనివల్ల కావ్యంలో రసం ఉద్భవిస్తుంది? అనే ప్రన్షలకు లాక్షణికులు జవాబు చెప్పారు. భరతముని “రసం నాట్యస్వరూప'మన్నాడు. భామహుడు, దండి, ఉద్బటుడు

“అలంకారాలలో రసం ఉం'దన్నారు. “కావ్యానికి ఆత్మ'ధ్వనే అని అనందవర్ధనుడు

అన్నాడు. ధ్వనిలోనే రసం ఉందన్నాడు. వక్రోక్తిలోనే రసం ఉందని తుంతలుడన్నాడు.

“కౌచిత్యం వల్లనే రసోత్పత్తి జరుగుతుం'దని క్షేమేంద్రుడన్నాడు. వీళ్ళందరూ సంస్కృత

ఆలంకారికులు. వీళ్ల మతాలనే కలగాపులగం చేసి మన తెలుగు లాక్షణికులు వ్రాశారు. అలంకార శాస్త్రంపైన బహు గ్రంథాలను పరిశోధన చేసిన బులుసు వెంకట

రమణయ్యగారు తెలుగులోని అలంకార గగ్రంథాలన్నిటిని పరిశీలించి ఆరు పాయింట్లు బ్రాశారు.!

1... తెలుగువాళ్లు సంస్కృతంలోని అలంకార గ్రంథాలను తర్జుమా చేసేటప్పుడు తిలుగుకు సంబంధించని కావ్యభేదాలు, దోషాలు మొదలైన వాటిని యథాతథంగా తినిగించేవారు.

  1. _ మూలగ్రంథాల పేర్గుగాని, వాటిని వ్రాసినవాళ్ళ పేర్లుగాని స్మరించడం లేనేలేదు.

౩ సంస్కృతంలోనుండి అరువు తెచ్చుకొని తెలుగులో లక్షణ గ్రంథాలు వ్రాస్తున్నప్పుడే ఒకే గ్రంథాన్నిగాని, దానితో విరోధించని గ్రంథాలలో నుంచిగాని విషయాలు తీసుకోవటం మనవాళ్ళకి అలవాటు లేదు. విఖిన్న కారకాలూ, పరస్పర విషయవిరోధాలూ ఉన్న గ్రంథాలలో నుంచి పొందిక లేని సంగతులు తీసుకొని వ్రాయడం సర్వసాధారణంగా కనబడుతోంది.

4 అక్కరలేని సంస్కృత లక్షణాలను తెలుగు గ్రంథాలలో వివరించే లాక్షణికులు తెలుగు భాషకు కావలసిన లక్షణాలను వివరించడం మానివేశారు.

  1. మూలంలో కఠినమైన విషయాలుంటే అనువదించక దాటేస్తారు.

బులుసువారు చెప్పిన ఆ ఆరు పాయింట్లూ అక్షరాలా నిజం. తెలుగులో లక్షణ గ్రంథాలను

కేటాయించి పుస్తకాలు వ్రాయలేదు. క్రీ.శ. 1407 నాటి విన్నకోట పెద్దన్న బ్రాసిన

కావ్యాలంకారచూడామణీ మన భాషలో ఇప్పటికి ప్రాచీనతరమైన అలంకార గ్రంథం దీనిలో తొమ్మిది ఉల్లాసాలు ఉన్నాయి. 7. 8 ఉల్లాసాలలో ఛందోవిషయాలు, కడపటి దాంట్లో వ్యాకరణం ఉన్నాయి. అయితే కొంతమంది ప్రత్యేకంగా నాయికా నాయక

  1. పరిశోధన - ఏప్రిల్‌. 1854.

ఇద్దరు అలంకారికులు - 1009 లక్షణాలు, స్థాయీభావాలు, విభావాలు మొదలైనవి చెప్తూ రసవివరణ చేసి “ఫక్తు అలంకార గ్రంథాలను వబ్రాయకపోలేదు. వాళ్లలో అనంతుడు ప్రథముడు. ఈయన ఛందో గ్రంథాన్న్సీ అలంకార శాస్త్రాన్నీ నెపరేటుగా వ్రాశాడు. ఛందోదర్పణం, రసాభరణం అని రెండు గ్రంథాలు విడివిడిగా ఉన్నాయి. ఇందులో రసాభరణం చాలామటుకు విశ్వనాథుని ప్రతాపరుద్రీయాన్ని అనుకరిస్తుంది. సంస్కృతంలోని ప్రకాపరుద్రీయం తెలుగులో దాలా గ్రంథాలకు ఖిక్ష పెట్టింది. నాయికానాయక లక్షణాలను శృంగారరస వివరణకు కావలసిన ఇతర భోగట్టాలను చెప్పే ప్రత్యేక గ్రంథాలు సంస్కృతంలో లేకపోలేదు. క్రీశ 1320 నాటికి భానుదత్తుడు రసమంజరి అనే గ్రంథం వ్రాశాడు. అందులో ఇవన్నీ ఉన్నాయి. ఈయన విదేహ దేశంవాడు; మిథిలానగర నివాసి. భానుదత్తుడే కాక మన కృష్ణదేవరాయలవారు కూడా నంస్కృతంలో ఒక రసమంజరి బ్రాసినట్టు కనబడుతుంది. ఆముక్టమూల్యదలో వారి పుస్తకాల లిస్టుని తెలుగు వల్లభుడు టేరీజు వేశాడు. “రసమంజరీ మధురకావ్య రచన మెప్పించికొంటి గీర్వాణభాష (1-13) అని దేవుడే రాయలవారితో చెప్పాడు. ఈ రసమంజరి అలంకార గ్రంథమో కాదో తెలియదు.! భానుదత్తుని రసమంజరిని తెలుగులోకి చాలామంది అనువాదం చేశారు. వాళ్లలో మొదటివాడు గణపవరపు వెంకటకవి. ఈ తెనిగింపు ఇంపుగా ఉందో లేదో చెప్పడానికి అ పుస్తకం దక్కలేదు. అలాగే నెల్లూరి వీగరాఘవయ్య అనువాదం కూడా నష్టమైంది. ఇవాళ లఖించే ఆంధ్రీకృతరసమంజరులలో ప్రాచీనమైనది కోదండపతి వ్రాసినదే. ఇది క్రీశ. 1875లోనే అచ్చుపడింది. గుడిపాటి కోదండపతి: అచ్చుప్రతిలో ప్రకాశకులు ఇతణ్జీి సురతాణి తోదండపతి అని పేర్కొన్నారు. దానికి కారణం గద్యలో ఇతడు- తన పేరుముందు ఆ మాట వాడుకొన్నాడు. శృంగారరసమంజరి చివర గద్య ఇలా ఉందిః “ఇది శ్రీమత్కోదండ రామ వరప్రసాదలబ్ధ చతుర్విధ కవితాధురీణ భరద్వాజగోత్ర పవిత్ర వేంగళమంత్రిపొత్ర రంగయామాత్యపుత్ర సత్కవి జనమిత్ర కుకవిలతాలవిత్ర గుడిపాటి పయః పారావార రాకాసుధాకర సురతాణి కోదండపతి ప్రణీతం.” ఈ గద్యలోని “సురతాణి' అనే మాటకు అర్థం చెప్పుకోడానికి చివరనున్న సీసపద్యం తోడ్పడుతుంది. దానిలో 'గుడిపాటివంశ సంభవుడు విరుదుగా నవఖండ సురాతాని పేరంది మహితుడౌ... కోదండపతిఘనుడు” అని కనబడుతుంది. ఇతనికి నవఖండ సురతాణీ అని బిరుదు ఎవరు ఇచ్చారో తెలియదు. ఇతని కీదొక్కటే కాదు; మరో బిరుదు కూడా ఉంది. ఎత్తుగీతి చూడండీ. సరసకవితాచమతక్కార సార్వభౌము-డవని శ్రీరంగధామ దయాశ్రయుండు నెలమి రసమంజరిని రచించెనందు-సరవిరాగ తృతీయ గుచ్చంయబు తనరు. . 2. గజపతుల తొలి రాయల యుగాలు, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి ౩ కృష్ణదేవరాయలవారు. ఖానుదత్తుని సత్కరించినట్టు ఈయుణ్ణీ వెంకట వీరరాఘవదార్యులవారు బ్రాశారు (విక్రమసింహపురిమండల సర్వస్వం, తృతీయఖండం, పుట 12). అయితే మల్తాది సూర్యనారాయణకాస్త్రిగారి లెక్క ప్రకారం చూస్తి భానుదత్తుడు రాయలవారికి రెండువందల సంవత్సరాల ప్రాచీనుడు. (సంస్కృతవాజఖ్యయచరిత్ర, ద్వితీయ ఖాగం, పుట 2586),

1010 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈ పద్యంవల్ల నవఖండ సురతాణికి సరసకవితా చమత్కార సార్వభౌముడనే ప్రసి్ధి ఉన్నట్టుంది. ఇది స్వాతిశయమే కావచ్చు. గుడిపాటి కోదండపతి గురించి ఇంతకంటే పేే భోగట్టాలు తెలియవు. ఇతడు ఏ వూరువాడో, ఏనాటివాడో చెప్పలేం. కందుకూరి వీరేశలింగంగారు ఇతని గురించి వ్రాస్తూ 'ఇన్నూరు సంవత్సరముల క్రిందట నుండి యుండునేమో' అని అనుమానించారు. అంటే క్రీ.శ 1700 ప్రాంతాలలో నన్నమాట. భావిపరిశోధనవల్ల తప్పు తెలుగులో దొర్‌కే ఈ మొదటి రసమంజరి కర్త ఎప్పటివాడో నికరంగా చెప్పలేం.

మంజరి అంటే పూచిన కొమ్మ. పూలగుత్తి అని అర్థాలు ఉన్నాయి. ఈ మాటను సార్థకం చేయడం కోసం కోదండపతి తన గ్రంథభాగాలను గుచ్చాల కింద పేర్కొన్నాడు. ఒక్కొక్క గుచ్చంలో ఎన్ని పువ్వులున్నాయో ఆ పువ్వులకు ఎన్ని దళాలున్నాయో, ఎన్ని

. . తేసరాలున్నాయో చెప్పాడు. లక్షణం వ్రాస్తున్నప్పుడు వచనాలు చెప్పినచోట వాటిని

కేసరాలని పేర్కొనిన్నడు. వాటి వివరాలు చూడండీ.

ప్రథమగుచ్చం - ౩ పువ్వులు 50 పద్యదళాలు 23 వచనకేసరాలు

ద్వితీయగుచ్చం - 11 పువ్వులు 59 పద్యదళాలు 14 వచనకేసరాలు

తృతీయగుచ్చం - 5 పువ్వులు 24 పద్యదళాలు 14 వచనకేసరాలు మొత్తంమీద ఈ శృంగారరసమంజరిలో 133 పద్యాలు, 51 వచనాలు ఉన్నాయన్నమాట. రసాలలోకెల్లా శృంగారరసం గొప్పదైతీ, శృంగార విభేదాలలో సంభోగ శృంగారాన్ని వర్ణించడం కత్తిమీద సాములాంటిది. జుగుప్స కలిగించకుండా దీనిని చెప్పగలగలడంలో కవిప్రజ్ఞ వుంటుంది. గుడిపాటి కోదండపతి ఇచ్చిన ఉదాహరణ చూడండీ:

గగనము సంచలించె ధర కంపము చెందెను జారె మేఘముల్‌

మిగుల కులాద్రుం బొదలె మీరగనాడెను రాపగోల్మికిన్‌

నెగడీ కపోతముల్‌ పలికె నీటుగనల్లలనాడె జంద్రుడా

సౌగసి వరుం బెనంగు నెడ జుక్కలురాలెను దిక్కు లెల్లెడన్‌. (రస 3-4-11) ఆ సౌగసులాడీ ఎవరోగాని ఆమె వరునితో పెనగేటప్పుడు ఆకాశం కదిలి భూమి అదిరిందంటే అబ్బురంగా ధ్వనిస్తుంది. అయితే ఈ పద్యంలోని శ్లేషటలో సౌగసుంది. ఆడదాన్ని నడుము ఆకాశమని, జఘనం భూమి అని, కురులు మేఘాలని చెప్పడం తవిసమయం. ఈ దృష్టితో సాంతం చూసినప్పుడు ఆ సాగసులాడి రూపం కనబడుతుంది. ఇలాగే మిగతా పద్యాలకు తూడా 6ధారాలు చెప్పుకొంటే సరసంగా ఉంటుంది.

తోదండపతి రచించిన ఈ రసమంజరిని మళ్లీ ఎవైనా అచ్చువేయడం అవసరం: ఇతని తరువాత చాలామంది దీనిని అనువదించారు. వాళ్లగురించి ముందు సంపుటాలలో చెప్పుకొందాం. కనడ 4. ఆంధ్రకవులచరిత్ర, ౩వ భాగం, పుట 191. 5. కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తులో గుడిపాటి కోదండపతి రసమంజరికీి ఒక అముద్రిత ప్రతి ఉంది.

లంథసంఖ్య 10౫. పరిషత్పత్రిక భాండాగారం, 2వ ఖాగం, పుట 7౫.

ఇద్దరు ఆలంకారికులు 1011

అలంకార శాస్త్రంలో ప్రత్యేకంగా అర్భాలంకారాల గురించి వివరించే గ్రంథాలు సంస్కృతంలో చాలా ఉన్నాయి. అసలు అర్జాలంకారాలే 124 ఉన్నాయి. నిజానికి ఆదిలో మూడేమూడు అర్భాలంకారాలు ఉండేవి. భరతుడు నాట్యశాస్త్రంలో ఉపమ, గీపక, రూపకాలను మూడింటినే చెప్పాడు. కాలక్రమేణా ఇవి పెరుగుతూ వచ్చాయి. వెంకటపతిరాయలకాలంలో నున్న అప్పయదీక్షితులవారు “కువలయానందము' అనే గ్రంథంలో నూరు అర్జాలంకారాలను వివరించి చర్చించారు. ఈ గ్రంథాన్ని ఒక తెలుగుకవి అనువదించాడు. అతని గురించి చెప్పుకొందాం.

శటికసేని రామయ్య: వెంకటగిరి ప్రాంతాలలోని పద్మనాయకులలో కటికనేని వారొకరు. ఈ వంశంలో సూరయ్యగారి రామయ్య సాహితీీపరుడు. 'అతివిచిత్ర గుణాలంకార బంధురాతి ప్రబంధనిర్మాణ చాతురీధురీణుడ'నని అతడు చెప్పుకొన్నాడు. ఈయన శ్రీ ప్రతివాది భయంకర వేదాంతాచార్యులవారి శిష్యుడు. పానుగంటి వెంకయ్య, కాళీ వెకటనరసయ్య అనే వాళ్లు రామయ్యకు మిత్రులు. రంగాచార్యులవారనే సంస్కృత పండితుడు రామయ్యకు చేదోడువాదోడుగా ఉండేవాడు. వీళ్లంతా ఏ ప్రాంతాలవాళ్ళి చెప్పవచ్చునుగాని ఎప్పటివాళో తెలియదు. కటికనేని రామయ్య 'నూరు నూట యేబదియేండ్ల క్రిందటినుండి యుండవచ్చును' అని కందుతూరి వీరేశలింగంగారు క్రీశ 1390లో వ్రాశారు అంటే క్రీ.శ 1740 ప్రాంతాలని చెప్పుకోవాలి.

కటికనేని రామయ్య లీలావిలాసం అనే గ్రంథం వ్రాశాడు. ఇది నష్టమైంది. ఈ ప్రబంధాన్ని బ్రాశాక అప్పయదీక్షితులవారి కువలయానందన్ని రంగాచార్యులవారి సహాయంతో 'కువలయానంద ప్రకాశిక అనే పేరిట మూడు ఘట్టాలుగా అనువదించాడు. ఈ పుస్తకాన్ని వెంకటగిరిరాజావారు క్రీశ 1293లోనే ప్రకటించారు. ఇది

" యథామూలమైన తెలుగుసేత అనీ, కొన్నిచోట్ల మాత్రమే మూలంలో లేని ఉదాహరణ లిద్బాడనీ పరిశోధకుల అభిప్రాయం.” అమూలకమైన ఉదాహరణలలో కొని రామయ్య _ కృష్ణలీలావిలాసంలోనించి ఇచ్చాడు. ఉద్ర్పేక్షాలంకారం, రూపకాది అలంకారాలతో సంకీర్ణమైన కొన్ని చోట్ల కనబడుతుంది. రూపకసంకీర్జానికీ “మత్ర్రణీతంబైన శ్రీకృష్ణవిలాసంబునందలి యుదాహరణంబు' అని ఇలా చెప్పాడు: *' సమయవరుండు పశ్చిమదిశాసతి కంఠతలంబునందు గుం

కుమకలితాంశుసూత్రమున గూరిచి కట్టిన తాళి సంజియుక

ప్రమద మొనర్చబోవ గుచపాళిని దా నరమాటుజెందెనా

నమరగ గాననయ్యె నపరాద్రిమరుంగున భానుడర్ధమై (తువలయా. 1-98) ఈ సూర్యాస్తమయ వర్ణన ఒకటేకాక మరో పద్యం తూడా తన శ్రీకృష్ణవిలాసంలోంచి కటికనేని రామయ్య ఉదాహరించాడు. రూపకసందేహాలంకార సంకీర్ణమైన అద్భుతో జ్రేక్షా లంకారానికి ఉదాహరణగా ఈ పద్యం చూపాడు. వహమమపనననననమనయననన 6. ఆంధ్రకవుల చరిత్ర, ౩వ భాగం, పుట 236. 7. అంధ్రాలంకారచరిత్ర - బులుసు వేంకటరమణయ్యగారు. పరిశోధన డిసెంబరు జనవరి, 1965 పుకు 78.

1012 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఆరామామణివేణి రాహువు లలాటార్థేందునిం బట్టు దీ క్షారంభంబున రాదలంచి యసమత్వాశంకచే బుత్రులక బ్రారూఢింబనుపక్‌ శ్రవఃకుహర నిర్మాతాత్ముడై దృబ్మనో భూరాజద్వితిఖార్తి నిల్చెనన నొప్పు! దీర్లసుభూలతల్‌:. (కువలయా. 1-9) ఇలాంటి కొన్ని ఉదాహరణలు తప్పించి మిగతాదంతా కువలాయనందానికి తు.చ.తప్పని అనువాదమే. ఈ పుస్తకంపై బులుసువారు సమగ్రమైన పరిశోధన చేసి విమర్శించారు. '“మూలమందలి వాక్యముల కారీతిగానే తత్సమీకరించిన యనుకరణ మగుటచేతను నిందలి విషయము కొంత దుగ్రాహ్యముగనే యున్నది” అని బులుసువారి తీర్చు. ఈ పుస్తకానికే కాదు తెలుగులోని అలంకార గ్రంథాలకు మొత్తంమీద ఇది వర్తిస్తుంది. ముగ్గురు శేషధర్మ కవులు మన ధర్మశాస్తాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఎవరెవరు ఏఏ ధర్మాలు పాటించాలో, వాటివల్ల పొందే ఫలితాలు ఏమిటో బోధించే గంథాలు కూడా కథల్లాగ మన పూర్వులు చెప్పారు. ఇవన్నీ ఇతిహాస పురాణాలలో ఉన్నాయి. భారతం కొన్ని ధర్మాలను ప్రబోధించింది. దాని శేషమైన హరివంశం ఇంకొన్ని చెప్పింది హరివంశంలో అశ్చర్యపర్వం అని ఒకటి ఉంది. దానినిండా ధర్మకథలే ఉన్నాయి. వీటిని తెనిగించాడు.! అఆ తరువాత వెణుతురుపల్లి విశ్చనాథం తూడా రచించాడు! కడపటిరాజులయుగంలో ఇంకో ముగ్గురు ఈ గగ్రంథాన్నే వ్రాళారు. వాళ్ళలో తురిమళ్ళ రామన్నగురించి ముందు తెలుసుకుందాం. తురిమళ్ల రామరన్న : తూనపులి చిన్నమనాయకుడనే ఒక మోతుబరి పూర్వం ఒక గ్రామం పాలించేవాడు. ఆయనదగ్గిర కార్యనిర్వాహక కర్తగా తురిమళ్ళ రామన్న అనే విద్వాంసుడు ఉండేవాడు. తెనాలి తాలూకాలో ఉన్న తురిమళ్ల ఇతని స్వగ్రామం కావచ్చు. ఈయన తెలివితేటల్లో ఆదిశేషుని ఓడించినంత గొప్పవాడినని చెప్పుకొన్నాడు. శేషధర్మాలు తెనిగించడంలో మొదటివాడినని ఇలా చెప్పుకొన్నాడు. ఖారతముఖ్యసంహితలు భాగవతాది పురాణముల్‌వచ 'శ్రీరహిమీరగా తెనుగుజేసిన పూర్వకవీశ్చరుల్‌ దయో లావ న సప పు పకన. 8. పరిశోధన, డీసెంబరు - జనవరి. 1955 పుట ౫.

  1. _ఆరవీటీరాజులయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి.
  2. మలిరాయలయుగం, సమగ్ర అంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి.

ముగ్గురు శేషధర్మ కవులు 1013 దారకటాక్ష వీక్ష నను ధన్యుని గానొనరింపజూచియో దారు రచింపరైరి వసుధాస్థలి తెన్గున శేషధర్మముల్‌ ఈ పద్యంలోని ప్రకటన ప్రకారం శేషధర్మాలను తొలిసారిగా ఆంధ్రీకరించిన ధన్యత ఇతనికే చెందాలిగాని అకీర్తలో కొంత అతని స్నేహితుడు కూడా పంచుకోక తప్పదు. అతని పేరు భద్రిరాజు తిమ్మన. ఈయన రామన్నకు రచనలో తోడ్చడ్డాడు. ఈ సంగతి రామన్న ఇలా చెప్పాడు : చిత్తమునన్‌ దలంచి నుతిచేసెద మత్కృతికిన్‌ సహాయ ము ద్యత్తరమైత్రి జేసిన మహామహు సత్కవులెంచ విష్ణుధ ర్మోత్తర ముఖ్యసత్కృతుల మూన చమత్కృతి మీరజేయన త్యుత్తము భద్రరాజకులధుర్యుని దమ్మున సూరివర్యునిన్‌. (2. 620) ఈ పద్యంవల్ల భద్రిరాజు తిమ్మన ఇతని మిత్రుడే కాక విష్ణధర్మోత్తరం మొదలైన కృతుల చమత్కృతికి కారణభూతుడని తెలుస్తూంది. ఈయన తనకు సహాయం చేసినట్టు రామన్న కృతజ్ఞతతో చెప్పుకోవడంవల్ల విష్ణుధర్మోత్తరం పేరు తూడా తెలియవచ్చింది. తురిమెళ్ళ రామన్న ఈ మిత్రుణ్లే కాక ప్రాచీన కవులని కూడా నుతించాడు. తిక్కనగారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పూర్వకవులను స్మరిస్తున్నారు. కాని తురిమళ్ల రామన్న విలక్షణంగా స్తుతించాడు. ఈయన లక్ష్యలక్షణ కవులను విడివిడిగా ప్రార్థించాడు. లాక్షణీకులను ఇలా స్తుతించాడు. శ్రీ వలయంగ నేషునులు చేసిరి లక్షణకావ్యముల్‌ కవి స్తోమములెంచనట్టి గుణరుజ్జ్వ లలక్షణ చక్రవర్తులన్‌ వేమరు నాత్మలో దలతు వెల్లకితాతమనీషి ఖైరవున్‌ భీము ననంతు జీత్రకవి పెద్దసుధీంద్రు జగత్ర్పసిద్ధులన్‌. (2620) ఈ పద్యంలో పేర్కొన్న లాక్షణికులందరూ క్రీ.శ 1560కి పూర్వులే. వాళ్లని నుతించిన తురిమెళ్ళ రామన్న కనీసం మరో వందసంవత్సరాల తువాతి వాడనుకుంటే ఇతనికాలం 180 అవుతుంది బహుశ మరొకరకం అర్వాచీనుడు కావచ్చు. ఇతడు వ్రాసిన శేషధర్మాలు సమగ్రమే. ఇది ఎనిమిదాశ్వాసాల కావ్యం. దాన్ని అతడు మహా ప్రబంధమన్నాడు. ఇది అముద్రితం. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. (2.620 వనపర్తి సంస్థానంలో కూడా తురిమళ్ళ రామన్న వ్రాసిన శేషధర్మాల ప్రతి ఒకటే మిత్రులు డాక్టరు వీరుదురాజు రామరాజుగారు ఒక వ్యాసం వ్రాశారు. అందులో తురిమెళ్ళ రామన్న కడప బిల్లా పులివెందుల తాలూకాలోని వేముల గ్రామం వాడని “అయన బాశారు. కూనపులి వంశంలోని వ్యక్యలా గ్రామంలో ఉండేవారని, తురిమెళ్ళ ౩. మరుగుపడి మాణిక్యాలు, పుటలు 25-30.

1014 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి రామన్న పేర్కొన్న కుమాళ్ళ కాల్వ, వేల్పుల, మామిడిపల్లె మొదలైనవన్నీ కడప జిల్లాలోనే ఉన్నాయి. కూనపులి వారిది కడప జీల్లా అయినా రామన్నగారి పూర్వీకులు తెనాలినుండి వెళ్లి వుండవచ్చు. కొడిచెర్త శ్రీనివాసుడు; తురిమెళ్ళ రామన్న తరువాత ఈ యుగంలో శేషధర్మాలను రచించినవాడు కొడిచెర్ల శ్రీనివాసులు. తాను నవరసానుబంధంగా ప్రబంధాన్ని నిబంధించగల చాతుర్య ధురీక్షణుణ్ఞని ఇతడు చెప్పుకొన్నాడు. మన కవులందరూ గద్యలో ఇలా ప్రకటించుకొంటారు. అయిడే కొడిచెర్ల శ్రీనివాసులు తనకు కులక్రమానుగతంగా వచ్చే కొన్ని వీరుదులను కూడా చెప్పుకొన్నాడు. తొడిచెర్లవారు ఏ రాజులవద్ధ ఉద్యోగులోగాని ఐవరగండ బిరుద ప్రచండ మంత్ర మార్తాండ అనే ప్రశస్తి పొందారు. సమస్త సద్గుణవాసుడైన కొడిచెర్ల శ్రీనివాసుడు ఎప్పటివాడో తెలియదు. ఇతడు ఆరాశ్వాసాల పద్యకావ్యంగా శేషధర్మాలు రచించాడు. ఇతని కవిత్వం ఫ్రొడంగా రసికజన హృదయంగమంగా ఉంటుందని పీరేశలింగంగారు అభిప్రాయపడ్డారు. మానవుడు కామక్రోధాలవల్ల అంచెలంచెలుగా ఎలా చెడిపోతాడో కొడిచెర్ల శ్రీనివాసుడు ఇలా చెప్పాడు: నెలకొని సంగమంబున జనించును గామము కామవృద్ధి చే దలకొను క్రోధ మట్టి బెడిదంబగు కోధమునం దనర్చు మో హలతిక మోహవృత్తినుదయంబగు విస్కృతి విస్కృతిన్‌ జనున్‌ దలపగ బుద్ధి బుద్ధి చనినక్‌ మరితాజెడు మానవుండీలన్‌. ఇలాంటి సాఫీ కవిత్వమున్న కావ్యానికి కొడిచెర్ల శ్రీనివాసుడు “శేషధర్మ రత్నాకరం” అని పేరు పెట్టాడు: కానాల నరసింహం: శ్రీనివాసుని తరువాత చెప్పుకోవలసినవాడు కానాల నరసింహం. ఇతడు అవే శేషధర్మాలను ఎనిమిది ఆశ్వాసాల గ్రంథంగా రచించాడు. ఇతడు తరిగొండ గ్రామంలో ఉండేవాడు. ఆ ఊళ్లో ఎప్పటివాడో యిదమిత్ధంగా తెలియదుగాని క్రీశ 1750 ప్రాంతాలవాడని వీరేశలింగంగారు భావించారు. శేషధర్మాలవంటి నీతి ప్రబోధక కావ్యాలు బ్రాస్తున్నా మన కవులు తము కల్పనలు, అనుసరణలు మానరు. '"నానాసూన వితాన వాసనల) అనే చక్కని పద్యం చాలా ప్రసిద్ధమైంది (వసు 2-47), ఈ ముక్కుపద్యం, అనంతర కవులను ముక్కుపట్టుకొని అనుసరణారణ్యంలోనికి నడీపించింది. కానాల నరసింహం ఇలాగ ఇనుముడించి నాసీకా వర్ణనం చేశాడు. పొలుపగుకాంచనంబు దిలపుష్పము నచ్చెలి నాసికోపమం బలవరవచ్చి దానిసమమౌటకు జాలకయూర్థ్వదృష్టి గొ అానానానానాలననననన్ననినననననొ నునన ననుట ననున నననులకునను న నకుల తనన ననన నకనానన నానన ననా. 4, ఆంధ్రకవుల చరిత్ర - మూడవభాగం, పుటలు జ-70 6. ఆంధ్రకవుల చరిత్ర - మూడవభాగం, పుట 284.

కొందరు మహత్వాల రచయితలు 1015

మ్మల దలక్రిందుగా దవముమానుగ జేసి ఫలించువేళ మే

నులు విడిచెక్‌ నలంగ డె ఘనుండయినన్‌ బలవధ్విరోధిర్నై

భట్టుమూర్తి పద్యంతో తులతూగే పద్యం వ్రాయడానికి ఎందరెందరో తలకిందులుగా తపస్సు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆ గుంపులో గోవిందా అనేవాళ్లే ఈ ముగ్గురు శేషధర్మాల కవులు!

కొందరు మహత్వాల రచయితలు

మన దేశంలో పుణ్యక్షేత్రాలకూ, పురాణపురుషులకూ. కొదవలేదు. గురజాడ అప్పారావుగారు చెప్పినట్టు ఈ దేశంలో పాండవులు ఉండని గుహలూ, సీతమ్మవారు స్నానమాడని గుంటలూ అంటూ లేవు. ప్రతి ఊళోనూ ఒక దేవాలయం ఉంది. ప్రతిదేవుడూ సత్యమున్న దైవమే. అతని మహిమలు భక్తులకు చిరస్మరణీయాలు. స్థానిక గాథలకన్నా సుప్రసిద్ధ క్షేత్రమహిమలు దేశం మొత్తంమీద అందరూ చెప్పుకొంటారు. కొన్ని మహాత్మ్యాలు జనులు అనుశ్రుతంగా చెప్పుకొనేవి. కొన్ని గ్రంథస్తమై చాలామంది మరచిపోయినవి. కొన్ని కొత్తగా కల్పించి ఏ స్కాందపురాణానికో అంటగట్టినవి. ఈ యుగంలో కవులు చాలామంది మాహాత్మ్యాలను వ్రాసి వాటిని ప్రబంధాలన్నారు. ఈ తరహా గ్రంథాలను ప్రసిద్ధ కవులు వ్రాసినా అవి మూలబడ్డాయి. ఇక మిగతావాళ్ళ రచనల సంగతి చెప్పనే అక్కరలేదు. దారిలో ఒయాసిస్సులలాగ ఈ గ్రంథాలలో అక్కడో చక్కని పద్యం. ఇక్కడో రసభరితమైన ఘట్టం ఉంటే కొండంత తృప్తి కలుగుతుంది.

ఈ యుగంలోని కొందరు సుప్రసిద్దులూ. తదితరులూ రచించిన మహత్వాల అకారాదిక్రమం చూడండీ.

  1. కార్తీకమాహాత్మ్యం తుందుర్త్హి వెంకటాచలం
  2. కాశీమహిమార్థ్ధదర్చణం కళులె నంజరాజు 3౩. గజారణ్యమాహాత్మ్యం (పద్యాలు) కవిధాటి బలభద్రయ్య
  3. గజారణ్యమాహాత్మ్యం (వచనం) కర్తపేరు తెలియదు
  4. గౌతమీమాహాత్మ్యం అల్లమరాజు బాపయ్య
  5. జగన్నాథమాహాత్మ్యం (ముక్తీచింతామణి) యతిరాజ వెంకటాచార్యులు
  6. జగన్నాథమాహాత్మ్యం రామయ్యగారి సూరయ్య
  7. జాహ్నవీమాహాత్మ్యం ఏనుగు చినలక్ష్మణకవి
  8. నింబజామాహాత్మ్యం బడగలపాటి నరసయ్య
  9. మాఘమాహాత్మ్యం విజయరంగ చొక్కనాథుడు
  10. రామేశ్వరమాహాత్మ్యం ఏనుగు చినలక్ష్మణకవి
  11. వృద్ధాచలమాహాత్మ్యం రేవూరి అనంతయ్య

1016 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 13. శ్రీ ముష్టమాహాత్మ్యం కేవూరి చినఅనంతయ్య 14. శ్రీరంగమూహాత్మ్యం చేతూరి సిద్ధయ్య 15. శ్రీరంగమాహాత్మ్య్యం విజయరంగ చొక్కనాథుడు 16. సర్పపురీమాహాత్మ్యం తూచిమందచి తిమ్మకవి 17. సాగరసంగమాహాత్మ్యం తూచిమంచి తిమ్మకవి 18. సింహాచలమాహాత్మ్యం తూచియంచి తిమ్మకవి 19. సేతువూహాత్మ్యం భాస్కర వెంకటాచలం 20. హాలాస్యమాహాత్మ్యం కళులె నంజరాజు 21. హాలాస్యమాహాత్మ్యం శ్రీపతి రామభద్రయ్య ఈ మహత్వాల రచయితలలో కొందరి గురించి ప్రత్యేక వ్యాసాలలో వివరించడం జరిగింది. కుందుర్తి, రేవూరి కవుల గురించి విడిగా చెప్పుకొన్నాం. ఏనుగువారు, తూచిమంచివారు ప్రసిద్ధులు. విజయనగరం చొక్కనాథుడు వచనభోజుడు. మధురనాయక రాజు కళులె నంజరాజు తత్తుల్యుడే; మైసూరువాడు ఈ ప్రముఖులను మినహాయిస్తే ఎనమండుగురు మాసాత్మ్య రచయితలు మిగులుతున్నారు. వాళ్ళగురించి తెలిసినన్ని విషయాలు చెప్పుకొందాం. శవిధాటి బలభద్రయ్య : దక్షిణాదిన వున్న పుణ్యక్షేత్రాలలో జంబుకేశ్వరం ఒకటీ. దీనిని గజూరణ్యం అంటారు. ఈ క్షేత్రం గురించిన వివరాలన్నీ పద్మపురాణంలో ఉన్నాయి. వాటిని గజారణ్య సంహిత అనే పేరిట కవిధాటి బలభద్రయ్య అనువదించాడు. ఇతనికాలంగాని ఇతర వివరాలుగాని తెలియవు. పోనీ ఇతని కృతి అయినా సమగ్రమా అంటే అంతా లఖించలేదు: దాని అముద్రిత ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (14-1-17). జంబుకేశ్వర మహిమను పద్యకావ్యంగా బలభద్రయ్య వ్రాస్తే ఎవరో పేరు తెలియని కర్త దానినే వచనరూపంగా అనువదించాడు. ఈ పుస్తకం కూడా అసమగ్రం. దాని ప్రతి కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు వారి కార్యాలయంలో ఉంది (గ్రంథ సంఖ్య 167). అల్లమరాజా. బాపయ్య తంజావూరులో. తెలుగు నాయక రాజుల యుగం అంతరించాక పండిత కుటుంబాలు దక్షిణాదినుండి ఎగువకు వలస వచ్చాయి. వాళ్లే ద్రావిళ్లుగా జిల్లాలలో ప్రసిద్ధులయ్యారు. అల్లమరాజుగారు ఆరామద్రావి్లు. పిఠాపురం ప్రాంతాలలో క్రీ.శ 17356 నాటికి స్థిరపడ్డారు. అల్లమరాజు బాసయ్య గౌతమీమాహాత్మ్యం అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇదేమంత మంచి కవిత్వం కాదని పరిశోధకుల అభిప్రాయం] యతిరాజు వెంకటాచార్యులు: అదినుంచి కులాల పట్టింపు తేని దేవాలయం పూరీ జగన్నాథమే. అందుకే “సర్వం శ్రీజగన్నాథం' అన్న సామెత పుట్టింది. జగన్నాథుని ప్రసాదాన్ని ఎంత హీనుడిచ్చినా పుచ్చుకోవాలి. పరిగ్రహించని బ్రాహ్మణునికి ఏగతి పడుతుందో దేవుడిలా చెప్పాడట:

  1. అంధ్రకవులచరిత్ర, వంగూరు సుబ్బారావుగారు : పుట 584

శొందరు మహత్వాల రచయితలు 1017 హీనుడు ముట్టినా డనుచు నెంచి మదీయ మహా ప్రసాదమున్‌ చానుపభుక్సియోగ్యమని తత్సరబుద్ధి పరిగ్రహింపకే మానిన సద్వాజుండు వృతమంగళుడై భవరోగబారియ్డై న్యూనత చెంది పంచముని యోగమునందు వసించు నెప్పుడున్‌. (0.347)

ఈ పద్యం జగన్నాథ మహాత్మ్యాన్ని చెప్పే ముక్తిచితామణి అనే ప్రబంధంలోని మూడో

అఆశ్బాసంలోనిది. ఈ కావ్యాన్ని యతిరాజు వెంకటాచార్యుడనే కవి వ్రాశాడు. ఆయన

రాజమహేంద్రవరంవాడు. హయగ్రీవ భక్తుడు. కందాడ వరదాచార్యులవారి శిష్కుడు. గాన తిమ్మరాజు అనే పద్మనాయకుడు ఒకప్పుడు రాజమండ్రికి అధికారిగా ఉండేవాడు. ఆయన ప్రేరేపిస్తే ఈ కావ్యాన్ని వ్రాసి జగన్నాథునికే వెంకటాచార్యులు అంకీతం ఇచ్చాడు. ఇది నాలుగాశ్వాసాల కావ్యం. ఈ కవి క్రీ.శ. 1700 ప్రాంతాలలో ఉండి ఉంటాడని వీరేశలింగంగారి అంచనా.* ఇది అముద్రితం.

రామయ్యగారి సూరన్న యతిరాజ వెంకటాచార్యుల జగన్నాథ మాహాత్మ్యం అముద్రితం. అయితే రామయ్యగారి సూరయ్య వ్రాసినది అసమగ్రం. ఇది ఎన్ని ఆశ్వాసాల గ్రంథమో తెలియదు. కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో రెండో ఆశ్వాసంలో కొంతదాకా ఉన్న గ్రంథం ఉంది (350). ఈ కావ్యాన్ని సూరయ్య భద్రాచల రామునికీ అంకితం ఇచ్చాడు. కవి గురించి మరే వివరాలు దొరకవు. కవిత్వం ధారాళంగా, చక్కగా ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.5

బడగలనాటి నరసయ్య: ఏక్షేత మాహాత్మ్యాన్దైనా, గోత్రచరిత్రకైనా మన పురాణాలే పరమ ప్రమాణాలు. బ్రహ్మాండ పురాణంలో మౌద్గలగోత్రం ఏర్పడిన విధం ఉందట. అందులో దేవమల్లుని కథ, దేవీ మాహాత్మ్యం, మల్లుల శాఖ లేర్చడిన పద్ధతి మొదలైన వివరాలన్నీ ఉన్నాయి. వీటిని నింబజూమాహాత్మ్యం అనే పేరిట బడగలనాటి నరసయ్య అనే కవి వ్రాశాడు. ఇతడు చంద్రగరి ప్రాంతాలవాడని అనుమానించవచ్చు. తన తండ్రి విధవైల కన్నడ నరసమంత్రి అని చెప్పుకొన్నాడు. విధైలమంటే చంద్రగిరి

కావచ్చును. . బడగలనాటి నరసయ్య ఈ నింబజామాహాత్కాాన్ని తొక్కడం మన్నరుజెట్టి

ప్రేరణవల్ల బ్రాశాడు. “జనుల తొక్కడములు సడలించు కతన, “ఘనులు వాళ్ళ నాన్నను

తొక్కడం వెంకటబెట్టి అన్నారట. అది ఇంటిపేరైంది. కృతి ప్రేరేపకులు మల్గులు కనుక

దేవమల్లుని కథను చెప్పే నింబజామాహాత్మ్యం ద్వాపదగా నరసయ్యచేత చెప్పించాడు. ఈ

గ్రంథానీకి ఏకవీరా మాహాత్మ్యం అనే నామాంతరం కూడా కవేపెట్టాడు. ఈ ద్విపద

కావ్యం అముద్రితం. తంజావూరులో ఒక ప్రతి వుంది (తం.డీ.303). ఈ కవి ప్రేరేపకుడు క్రీశ 1740 ప్రాంతాలవాడని, దక్షిణాన మహారాష్ట్ర నాయకుల సీమలోని వాడని పరిశోధకుల భావనే "

పలల వనన తతలోనోతనానుకోతలూ కాకాను నననకాతనానానాకానానాముతనావననావనవనాదా వాడాడు

  1. ఆఅంధ్రకవులచరిత్ర, ౩3వ ఖాగం, పుట 199

  2. ఆంధ్రసాహిత్యపరిషత్సత్రిక, సంపుటి 4.పుట 3౫.

  3. దక్షిణదేశీయాంధ్ర వాబ్బయం - పుట ణా.

1018 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

చేకూరు సిద్ధయ్యః ఎక్కడివాడో ఎప్పటివాడో చెప్పలేంగాని చేకూరు సిద్ధయ్య అనే కవి శ్రీరంగమాహాత్మ్యాన్ని అయిదాశ్వాసాల పద్యకావ్యంగా రచించాడు. నల్లగొండ లక్ష్మీనరసయ్య ఇతని గురువు. ఈయనవల్ల తనకు వినూతన సాహితీ లక్షణాదిక జ్ఞానం కలిగిందని కవి చెప్పుకొన్నాడు. ఛశ్రీరంగమాహాత్మ్యం వ్రాయడానికి ముందు హరిభక్తామృతసారమనే ప్రబంధం నిర్మించాడట. ఆ సంగతి 'శ్రీరంగమాహాత్మ్యం గద్యలో చెప్పుకొన్నాడు. అయితే అది అలభ్యం. దొరుకుతున్నది మాత్రం సంస్కృత పద జటిలమైన రచన అని పరిశోధకుల అంచనా.5 దాని ప్రతి కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది. గ్రంథ సంఖ్య 672.

భాస్కర వెంకటాచలం; ఈ యుగంలోనే రామేశ్వర మాహాత్మ్యం ఏనుగు చినలక్ష్మణకవి రచించాడు. అతనిలాగే భాస్కర వెంకటాచలం కూడా దక్షిణాదిన సితుమాహాత్మ్యం అనే నాలుగు ఆశ్వాసాల పద్యకావ్యాన్ని వ్రాశాడు. ఇతడు క్రీ.శ. 1731-1767 ప్రాంతాలలో ఉన్నవాడని పరిశోధకులు భావిస్తున్నారు* భాస్కర వెంకటాచలమేకాక అతని సోదరుడు శేషాచలం కూడా రచయితే. ఆయన నాంచారు పరిణయం అనే యక్షగానం వ్రాశాడు. ఇది ఈ మధ్యనే వెలుగు చూసింది. రాజపాళయం లోనే తెలుగు విద్యాలయంవారు 1987లో ప్రచురించారు. వెంకటాచలం రచన దొరుకుతుంది. దీనిప్రతి ఒకటి కాకినాడ ఆంధ్ర సాహిత్యపరిషత్తువారి గ్రంథాలయంలో ఉంది. ఈ కవిత్వం ప్రొఢమూ కాదు; నిర్దష్టమూ కాదని పరిశోధకుల తీర్చు.”

శ్రీపతి రామభద్రయ్య: క్షేత్రమహిమలను కొందరు పద్యకావ్యాలుగా వ్రాస్తే కొందరు వచనరూపంలో రచించారు. మధురానగర మాహాత్మాాన్ని పచ్చకర్చ్పూరపు తిరువెంగళయ్య చొక్కనాథచరిత్ర అనే పేరిట ద్విపదలో వ్రాశాడు. అయితే కళులె నంజరాజు ఈ యుగంలో హాలాస్యమాహాత్మ్యం అనే పేరుతో వచనంలో మధుర మాహాత్మ్యం చెప్పాడు. ఈయనేకాక శ్రీపతిరాజు భద్రయ్య తూడా వచనకావ్యంగా హాలాస్య మాహాత్మ్యం రచించాడు. ఇతడు మధుర నివాసి. అయితీ ఎవరికాలంలో ఉన్నవాడో తెలియదు. ఈ గగ్రంథప్రతి ఒకటి ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది (170) వ్రాసేది వచనమే. అయినా యమకమంటే రచయితకు ఇష్టం. సంస్కృత జటిలంగా రచన సాగిందని గ్రంథ పరిశీలకులు చెప్తున్నారు.

ఈ యుగంనుంచీ కవి తన పాండిత్యగరిమ ప్రకటించుకోడానికి వచనంలో తూడా సాముగరడీలు చేయడం మొదలుపెట్టాడు. ఏ క్షేత్రమాహాత్మ్యం వ్రాసినా అందుకే. ప్రజోపయోగం కొంచెం తక్కువే. కాబట్టే ఇన్ని పుస్తకాలు వెలుగు చూడలేదు.

క పరిషత్చుస్తకభాండాగారం - ద్వాతీయ భాగం పుటణు |; 8 వోథాండ్య దాంధ్ర ప్రాబల్యం - శ్రీహరి సేతురూామయ్యగారు, ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక, సం. 7. ఆంధ్రసాహిత్యపరిషత్ప త్రిక, సంపుటి 3, పుట 3%.

  1. పరిషత్చుస్తక ఖాండాగారం, ద్విడీయభాగం, పుట 73.

పదిమంది శతకకవులు

మన కవులలో చాలామంది నంచదాయాలకు బంధితులు. లక్షణ గ్రంథాలకు బానినలు. ననాతన సత్కథలనేగాని నమకాలిక ఇతివ్చత్తాలను స్వీకరించరు భాషాడంబరాన్నేగాని భావ సౌకుమార్యాన్ని మెచ్చరు. న్వవిషయాలు చెప్పురు. నటీవ పాత్రలు సృష్టించరు. పెద్దలు పెట్టిన ఒరవళ్లే దిద్దుతారు. ప్రాచీనులు గీసిన గీటు దాటకుండా గానుగెద్దులలాగా తిరుగుతారు. అయితే మన ప్రాచీనులలో కొందరు ప్రతిభాచంతులు ప్రబంధ నిర్మాణంలో స్పతంత్రించారు. అలా చేయనివాళ్లు స్వవిషయాన్నీ, నమకాలిక జీవితాన్నీ జోడించి శతకాలు వ్రాశారు. అదే ఆనవాయితీని ఈ యుగంలో కొందరు కవులు పాటించారు.

మొగలాయి సేనలు ఈ యుగంలో చేసిన దారుణాలకు లెక్కలేదు. పజాజీవితం అల్లకలోలమైపోయింది. కవుల సాంఘిక చైతన్యం మేలుకొంది. పరమతాలవాళ్లు చేసే వీభత్సాలు ఆపమంటూ దేవుణ్ణి ప్రార్థించారు. ఎత్తి పొడిచారు. నిందించారు. వివిధ ప్రాంతాలలో కవులు ఒకే మోస్తరు పద్యాలలో అవేదనా, ఆరాటం వ్యక్తపరిచారు. ఈ కోవలోని శతకాల వివరాలు చూడండీ:

  1. పింహాద్రివారపింహశతకం : గోగులపాటి కూర్మనాథం వ్రాశాడు. ఇతని గురించి చెప్పుకొన్నాం.

  2. శత్రుసంహారశతకం : తిరుపతిలో ఎవరో వ్రాశారు. ఇతని గురించి చెప్పుకొందాం.

  3. వీశామ్రలింగశతకం : కంచిలో జరిగిన కలోలాన్ని చూసిన నిమ్మల లక్ష్మన్న మొరపెట్టుకున్నాడు.

శీ. పశ్చిమరంగశతకం : మైసూరు ప్రజలను ఎవరో ఇక్కేరిరాజు బ్రాహ్మణ కంటకుడై బాధిస్తున్నప్పుడు ఒక కవి చెప్పాడు. దాని ప్రతి

  • ప్రాచ్చులిఖిత గ్రంథాలయంలో ఉంది. .1611)
  1. కస్తూరిరంగశతతం : “రాత్రిచరవైరి కస్తూరి రంగళౌరి' అనే మకుటుంతో ఎవరో చెప్పిన శతకం. వివరాలు తెలియవు.

  2. రాక్షసవిరామశతకం : తురకనైన్యాలు కొల్లకొడుతూ ఉంటే ఆపమని ఎవరో బ్రాశారు. 'రాక్షసవిరామకస్తూరి రంగధామ' అనే మకుటం ఉంది. దాని ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథా లయంలో ఉంది. (14-17-12)

ఈ అరడజను శతకాలేకాక ఇటువంటివి మరికొన్ని ఈ యుగంలో పుట్టి ఏ పుట్టలోనో మూలుగుతూ ఉండవచ్చు. ఈ కవులలో వ్రతిఒక్కరిలోనూ చిత్తశుద్ధీ, దేశభక్తీ ఎంత ఎక్కువో పరస్పరానుకరణ కూడా అంత ఎక్కువే. ఒకరి అవేదన ఇంకొకరిలో ప్రతిధ్వనిస్తుంది. వీళ్ల గురించి కొంచెం చెప్పుకొందాం.

  1. శతకకవులచరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, పుట ౫1.

1020 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి

తిరుపతి వెంకటాచలం: జౌరంగజేబు సైన్యాలు దక్షిణాన పూనమల్లిదాకా వచ్చాయి. అ దండయాత్రలో దిగువ తిరుపతిని కూడా కొల్లగొట్టారు. అప్పుడు ఎవరో కవి *శత్రుసంహార వెంకటాచలవిహార' అనే మకుటంతో శతకం వ్రాశాడు. ఇతని పేరు తెలియదు. అయినా తిరుపతివాడు, వెంకటాచల శతకం బ్రాశాడు కాబట్టి తిరుపతి వెంకటాచలం అనే నామకరణం చేశాను. అసలు పేరు తెలిసీేదాకా ఇదే వాడుకుందాం గోగులపాటి తూర్మనాథం వ్రాసిన సింహాద్రినరసింహ శతకానికీ, దీనికీ దాలా పోలికలు ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు గగ్రంథచౌర్యం చేశారని వంగూరి సుబ్బరావుగారు ఆరోపిస్తున్నారు. “సమాన పద్యములు భావములు వాక్యములు కూడా గనబడుచున్నవి అని అభియోగం దాఖలు చేశారు.

ఈ కవి పుదుక్కోట సంస్థానానికి చెందినవాడు కావచ్చు. ఆ సంస్థానాధిపతులకు “తొండమానో అనే బవీరుదు ఉంది. ఈ శతకంలో తొండమాను భూపాలుణ్జి ఇలా పెర్కొన్నాడు:

మామిడక్రింది సోమరిపోతు శ్రీభాష్య-కారులకేల సంగరము గొదువ

అలిమేలుమంగ సొమ్ముల పెట్టియలుకాచు- కొనియుండుటేదాలు హనుమనికిని

ఠీవిని బంకమంటి విరుల్‌ సమర్పించి-తెరు గాటుకరిగెను గురువనంబి చెంచమిఠారితో బంచబాణ'క్రీడ- లోలుడయ్యెను కప్పుడాలనృహరి నీకుమదికోపమంతయు లేకపోయె

బోయెగాకేమి తొండమాన్చూమిపాలు

డున్ననింతకు దురకల మన్నిగొనడె

శత్రుసంహార వెంకటాచలవిహార: (౨.1710 పద్యసంఖ్య 49)

తొండమానులు పాలించే పుదుక్కోట సంస్థానం ఈ యుగంలోనే పుట్టింది కాని కుంపిణీ యుగంలోనే విరివిగా సాహిత్యపోషణ జరిగింది. కడపటి రాజుల యుగంలో ఒక్క నుదురుపాటి సీతారామయ్య ఆ సంస్థానంలో కనబడుతున్నాడు. అయితే ఈయన కుంపిణీ యుగంలో కూడా ఉన్నాడు. పుదుక్కోట గురించి వచ్చే యుగంలో ముచ్చటించుకుందాం. ప్రస్వతానికి వెంకటాచల శతకం బ్రాసిన కవి తొండమానులను పేర్కొన్నాడని గుర్తించడం తప్ప ఇంకేమీ చేయలేం.

బహుశా ఈ కవే “గుండువారి వెంకటాచలశతకం' తూడా చెప్పాడు కాబోలు. గుండు శోభనాద్రి అనే వైళ్ళుని పోషణలో కవి ఉన్నాడు. “గుండువారి గృహంబున నిండువేడ్క వెలయుచుండెడు వెంకటాచల విహార అనే మకుటంతో ఒక శతకం చెప్పాడు (౨.1711). పోషకుని పేరు చెప్పినా తన పేరు చెప్పుకోలేదు. ఇతని గురువుమాత్రం చంద్రాభట్ల వెంకటాచార్యుడని తెలుస్తోంది. భావిపరిశోధనవల్ల మిగతా వివరాలు దొరకవచ్చు.

  1. శతకకవుల చరిత్ర, పుట 30

పదిమంది శతకకవులు 1021 నిమ్మల లక్ష్మన్న: ఇతడు తూడా ఆర్కాటు సుబావాడే. కంబంలో ఉండేవాడు. తురక సేనల దుర్మార్గాలు చూసి ఏకామ్రలింగానికి మొరపెట్టుకొన్నాడు. ఎత్తుగీతిలోని మూడు పాదాలు మకుటమే. మామూలుగా ఇటువంటి పరివేదన శతకాలు పరాకుతో మొదట మొదలు అవుతాయి గాని ఇది ఇలాగ కాక సర్వసాధారణంగానే మొదలు అవుతుంది. పైగా ఇందులో మొదట ఆదిమ కవులస్తుతి కూడా ఉంది. ఇతర శతకాల పోలికలు ఉన్నాయి చూడండీ. మొగలాయి దెబ్బకే ముగినె నీపను లెల్ల దగ బార్డు దెబ్బకు తాళి తెట్లు జడియక త్రిపురుల సంహరించిన నీవు పగ్గి తురకల జూచి పారొతెట్లు . నేడు విప్రుల బాధ నిర్ణయించిన నీవు గరిమితో భక్తుల గాచికెట్లు భువనంబు నశియింప బ్రోవలే నైతివి కొంచక జగము సృష్టించి తెట్లు పుడమి నానాట నీసత్య ముడిగె నేమొ విషమ శరభంగ శరభాంగ వృషతురంగ యోగిహృత్సంగ బాలచంద్రోత్తమాంగ మంబి కార్గాంగ కంచి యేకాద్ర లింగ (90.1431) ఈ శతకం చెప్పాక కంచి ఏకాయ్ర లింగడీపై లక్ష్మన్న మరో శతకం తూడా చెప్పాడు కాబోలు. దాని ఎత్తుగితి చివరి రెండుపాదాలు మాత్రమే మకుటం. 'మదన మదభంగ మహితక్షేమాసతాంగ శరధృతకురంగ కంచి కంచి యేకాధ్రలింగ' అని ప్రతిపద్యంలోనూ సంబోధించాడు. సోమేశ్వరాచార్యులు: కంచిలోని ఏకామ్రలింగడి పేరు చాలామంది భత్తులు పెట్టుకొన్నారు. పాల్కురికి సోమనాథుని రచనలను చదువుకొన్న ఒక భక్తుడు “ఏకామ గురు చిత్తనలిన భృంగ సోమనాథ లింగ' అనే మకుటంతో ఒక శతకం వ్రాశాడు. దీనికే అన్యవాద కోలాహలం అనే పేరు ఉంది. అచ్చుపడింది. అయితే యేకామ లింగనాథుడు థీని గ్రంథకర్త అని వావిళ్ళవారు పారపడ్డారు.3 మరికొన్ని ప్రతులలో శివయోగీంద్రుడు రచించినట్టు కనబడుతున్నదట. బ్రాతప్రతులలో సోమేశ్వర విరచితమని ఉంది. “వివభత్తులకు శరణు శరణు అనడంతోనే శతకం నిండిపోయిందని చరిత్రకారులు సైతం విసుక్కున్నారునే చెన్నాప్రగడ నాగరాజు: పద్యానికో శివభత్తుని చరిత్రను కీర్తిస్తూ నూరు పద్యాలు బ్రాసినవాళ్లు కూడా ఈ యుగంలో ఉన్నారు. “గణసౌజన్యాఖ్యాన శతకం' అనే పేరుతో చెన్నాప్రగడ నాగరాజు ఒక కృతి వ్రాశాడు. దీనికి గణస్తవం అనే పొట్టిపేరు కూడా ఉంది. శతకాలతు ఉండే మకుటనియమం ఇందులో కనబడదు. ఇది అచ్చుపడలేదు.. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో మూడు ప్రతులు ఉన్నాయి. (0153815640 , తుమ్మలపల్లి శివరామయ్య: వీర్చైవ మతాన్ని ప్రబోధించే ఇంకొక శతకం కూడా ఈ యుగంలో ఉందే. దాని పేరు సోమేశ్వరశతకం. నారాయణ పట్టణంలో ఉండే 3. వావిళ్ళ ప్రచురణ, 144 పుట4 4, శతక కవుల చరిత్ర, పుట 425.

1022 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి తుమ్మలపల్లి కివరామయ్య దీనిని రచించాడు. ఇతడు క్రీ.శ. 1707లో దీనిని పూర్తి చేశాడు. బహు వేదాగమశాస్తసారమైన వ్యాఖ్యానాన్ని శతకకర్తి ప్రతిపద్యానికి వ్రాశాడు. ఈ శతకం అముద్రితం. దీని ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. (1.794)

బృహత్తటాకం నాగశాస్త్రి ఒక్కొక్క మతానికో దేవుడు ప్రముఖుడైనట్టే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవతకు ఎక్కువగా ఆరాధనలు జరుగుతాయి. బెంగాలీవాళ్లు కాళిని, మహారాష్టులు వినాయకుణ్ణి పూజించినట్టు తమిళులకు కుమారస్వామి జాతీయదైవం. దక్షిణాదిన ఉన్న తెలుగువాళ్లు కూడా సుబహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. తిరుచినాపల్లి దగ్గర పెరియకుళం అనే ఊరుంది. దానినే బృహత్తటాకం అని సంస్కృతీకరించారు. ఆ వూరికి యజమానులైన నాగశాస్తుర్లు బాలసుబ్రహ్మణ్యుని మీద ఒక శతకం చెప్పాడు. ఇతడు తూడా 'కొట్టి గోడించి మ్లేచ్చుల గుట్ట గూల్చి మట్టు చేయక యుండిన మహిమ యేల' అని దేవుణ్ణి పురికొల్పాడు. అయితే శతకంలో కవి ఎక్కువగా తన వ్యక్తిగత దుర్దశనే చెప్పుకొన్నాడు. నిందిస్తూ పాగిడాడు. దేవుణ్ణి ఇలా హెచ్చరించాడు.

నీతల్లి చట్రాతికూతురై దయలేక, మగని దేహంబును సగము చేసె

నీతండ్రి ఏపాటి నీతిజుడందును, పట్టణంబులు గాల్చి ప్రబలినాడు

నీయన్న యెంతటి నిర్మలుండందును, ఘన కాంక్ష దోవలు కాచినాడు

నీ మేనమామ యే నిజమువాడందును, కొంచెమైై కపుల యాచించినాడు

వారివలెగాక నీవైన వసుధలోన

నాశ్రయించిన భక్తుల నాదరించి

మంచివాడని పేరు కల్పించుకొమ్ము

సుకవి జినగేయ శ్రీబాలసుబ్బరాయ (సుబ్బరాయ 12)

తిరుములయ్యగారి సీనయ్య: బృహత్తటాకం నాగశాస్త్రి ఒక్క నూరు పద్యాలు సుబ్బరాయని మీద చెప్తే, తిరుమలయ్యగారి సీనయ్య అనే కవి వెయ్యినూర్ల ఎనిమిది పద్యాలు వ్రాశాడు. దీనికి షణ్ముఖసహస్రం అని పేరు. ఈ కవి తిరునల్వేలిలోని తిరుచ్చెందూరు గ్రామవాసి. ఆ వూరు సుప్రసిద్ధమైన సుబ్రహ్మణ్యక్షేత్రం. ఈ షణ్ముఖ సహస్రంలో పది శతకాలు ఉన్నాయి. లోకనీతులు, పురాణగాథలు, సంస్కృత శోకానువాదాలు చాలా ఉన్నాయి. కవిత్వం అంత నిర్దష్టం కాదని పరిశోధకుల అఖిప్రాయం.5 ఇది అముద్రితం. దీని ప్రతి కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయంలో ఉంది

శర్దాట తేరప్పు ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు చాలా అపురూపమైన గ్రంథాలు సేకరించారు. కొన్ని ప్రకటించారు. దిగితేగాని లోతు తెలియదని గ్రంథం. అచ్చుపడితేగాని పరిశీలించలేం. పరిషత్తువారు ముద్రించిన శతకాలలో తేరపావనశతకం ఒకటి. దీనిని కర్ణాటక తేరప్పు వ్రాశాడు. ఇందులో దశావతార వర్ణనం, రామాయణ 5. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, సంపుటి ౩, పుట 365. 8. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, సంపుటి ౩, పుట 3౪.

పదిమంది శతకకవులు 1023 కథనం, రామనామ మహిమ మొదలైన విభాగాలుగా పద్యాలు ఉన్నాయి. తేరప్పు ఏ ప్రాంతంవాడో. ఏ కాలంవాడో కచ్చితంగా చెప్పలేం. “కరడ య క్రీ.శ1750 ప్రాంతాలవాడని నిడుదవోలు వారి నిర్ణయం.” కవిత్వం ఏమంత ఓహో అన్నట్టు లేదని ఎవరైనా నిర్ణయించగలరు. తొక్కడం రామాబెట్టి: ప్రథమ శ్రేణి రచయితలు స్వతంత్ర రచనలు చేశాక వాటికి కోకొల్లలుగా ఇమిటేషను కావ్యాలు పుడతాయి. వేమన పద్యాలు ప్రచారం ఫొందాక పుట్టిన శతకాలకు లెక్కలేదు. పరశురామపంతులవారి ఇంట్లోనే ఆటవెలదులు ఆ బాణీలో నడిచాయంటే ఇక ఇతరుల మాట ఏమిటి. 7 విశ్చదాఖిరామ వినురవేమ అనే మకుటంతోనే నేటి ప్రతిభావంతులు సహితం పద్యాలు వ్రాస్తున్నారు (ఉదా: దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు). ఇక వేమనగారి కాలంలోను, ఆయన గతించిన కొన్ని సంవత్సరాలలోనూ పుట్టిన శతకాల సంగతి చెప్పాలా. “బాలచక్ర వేమ భవ్యానామ' అనే నకిలీ శతకం ఒకటి పుట్టింది. ఈ మకుటానికి అర్థంగాని, ఇది చెప్పినవాడి పేరుగాని మనకు తెలియదు. తొక్కడం జెట్టి అనే పెద్దమనిషి ఈ పద్యాల విలేఖరి కావచ్చును. ఈ శతకం ప్రతి ఒకటి అడయారు దివ్యజ్ఞానసమాజం వారి గ్రంథాలయంలో ఉంది (37-౭5). కవి ఎప్పటివాడో ఏమిటో ఇంకా చరిత్రకారులు నిర్ణయించలేదు. వడపోస్తే కొన్ని మంచి పద్యాలు దొరుకుతాయేమో. ధర్మపురి శేషయ్య: ఈ యుగంలోని శతకాలలో పది పన్నెండు చక్కని పద్యాలు కనబడితే ప్రాణం లేచివస్తుంది. అంతకన్న ఎక్కువ పద్యాలే బాగున్న శతకం దొరికితే కడుపు నిండుతుంది. వరంగల్లు సుబాలోని ధర్మపురిలో శేషయ్య అనే కవి నరసింహ శతకం వ్రాశాడు. ' భూషణవికాస శ్రీధర్మపురనివాస, దుష్టసంహార నరసింహదురితదూర అనే మకుటంలోలాగే ఈ శతకంలో కూడా వికాసముంది. భావాలూ వాటితోపాటు భాషా హాయిగా ఉంటాయి. పద్యం ఎక్కడా కుంటదు. కవికి దేవునిదగ్గిర ఉన్న చనువు ఇంతా అంతా కాదు. కంచర్ల గోపన్న తరువాత ఇతడే దేవుణ్ణి నిలబెట్టి బాకీ వసూలు చేయగల మొనగాడు. “కువలయశ్యాము. నీ కొలువు చేసిన నాకు జీత మెందుకు ముట్టజెప్పవైతి అని ధైర్యంగా అడిగాడు. 'తెగబడితి జూడు నీతోడ జగడమునకూ అన్నాడు. డబ్బు లేకపోతే కుండలాలూ, పసిడి గొలుసులూ అమ్మమన్నాడు. "కొనకు నీ శంఖచక్రముల్‌ కుదువబెట్టి గ్రాసమిచ్చి పోషించు కపట ముడిగి' అని నిష్కర్ణగా చెప్పాడు. ఇంత చక్కని శతకం కనుకనే ఇది చాలా ప్రదారంలోనికి వచ్చింది (గురజాడ అప్పారావుగారు తమ కన్యాశుల్కంలో ఒక పాత్రచేత 'నరసింహ నీదివ్యృనామమం త్రము చేత అనే పాదాన్ని పదేపదే అనిపించారు). ఈ శతకకవి తాను పంచకావ్యాలూ, త్రికాంతసహితంగా - అమరం చదవలేదనీ, శాస్త్రీయ గ్రంథాలు చూడలేదనీ చెప్పాడు. అయితే శతకం చివర శేషయ్య అను కవి చెప్పిన పద్యముల్‌ చెవుల కానందమై చెలగు చుండు అని కవే చెప్పుచున్నాడు. నిజమే. ____కవణానందం కానిదికావ్యంకాదు లా 7. శతకకవుల చరిత్ర అనుబంధం, పుట 70౫. 8. శతకకవుల చరిత్ర, పుకు 715.

రామాయణ రచయితలు

ఆకాశంలో చుక్కల్నీ, ఆంధ్ర సాహిత్యంలో రామాయణాలను వ్రాసినవాళ్లనీ లెక్కించడం ఠష్ట్రం. పద్యకావ్యాలుగా రామకథను దబ్రాసినవాళ్లు పెద్ద తారలలాగ టక్కున కనబడతారుగాని వచన కావ్యాలుగా రచించినవాళ్లు ఓపట్టాన కళ్లకు అనరు. ఈ యుగంలో మధుర, మైసూరు రాజ్యాలలో వచన రచన ఉద్ధృతమైంది. భారత భాగవత రామాయణా లను సులభ్దాలిలో యథామాతృకంగా వ్రాయాలనే సంకల్పం చాలామందికి కలిగింది. అయితే వీళ్లలో ఎవరు మొట్టమొదట వచనరామాయణం రచించారో తెలిస్తే అతనికి మొదటి దండవేసి మనం సత్కరించవచ్చు. ఇంకెవ్వరూ చేయనిపని తానే చేశానని అసహాయశ్యామారాయుడు భావించాడు. ఇతడు మధురలో ఉండేవాడు.

విజయనగరం చొక్కనాథునికాలంలో క్రీ.శ 1706-32 మధ్య మధురా నగరంలో తుమ్మలపాటి సుబ్బరాయచెట్టి అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. ఇతనికి ఓ వ్యాపారం తూడా వుండేది. విజయనగరం చొక్కనాథుణ్ణి ఈ సెట్టీగారు ఏవిధంగా సివించుకున్నారోగాని రాజుగారి కరుణాకటాక్షవీక్షణాలకు పాత్రులయ్యారు. ఈయనకు శ్రీమద్రామాయణాన్ని వచనకావ్యంగా వ్రాయించాలనే సంకల్పం కలిగింది. ఊళో

శ్యామారాయుడు విద్వత్కవి. కృష్ణయ్యగారి కుమారుడు. లక్ష్మీపతిగారి

తమ్ముడు. చతుశ్శాస్త్ర పండితుడు. షడ్డర్భనీపారంగతుడు. సంస్కృతాంధ్ర భాషాకవితా నిర్వాహకుడు. సుబ్బరాయనసెట్టి తన కోరిక చెప్పగానే శ్యామారాయుడు పొంగిపోయాడు. సెట్టిగారేకాక శ్రీరామచంద్రుడు కూడా శ్యామారాయుల్ని కనికరించి 'నాదుచరిత్రము నీవును నాదరమున దెనుగుజేయుమని కలలో చెప్పాడట. శ్యామారాయుడు సెట్టిగారితో ఇలా అన్నాడు. “శ్రీమద్రామాయణంబు వచనకావ్యంబుగా జేయుమని పలికితివి. నీవు కృతార్థుండవైతివి. తొల్లి వాల్మీకీయ రామాయణ మహాకావ్యంబు భాస్కరకవి పద్యుకావ్యంబుగా రచన చేయించె, రంగనాథకవి ద్విపద కావ్యంబు చేసె, నితరులెవ్వరును వచన కావ్యంబుగా రచనీ చేయనిది నీవు నేను జేసిన పుణ్యంబుగా నీపేర నంకితంబుగా రచన చేసెద.” ఈ మాటలవల్ల శ్యామారాయునిదే తెలుగులోని మొట్టమొదటి వచన రామాయణమని తెలుస్తూంది. ఇతడు నవరసాలంకారంబుగా చాతుర్వర్జాశ్రమజనసంఘాలు పఠించడానికీ యోగ్యంగా వ్రాసిన రామాయణం ఇప్పుడు తొలి మూడు కాండలే లఖిస్తున్నాయి. వీటి ఆముద్రిత ప్రతులు కాకినాడ్‌ ఆంధ్ర సాహిత్య పరిషత్తు కార్యాలయంలో ఉన్నాయి (గ్రంథ సంఖ్య 168). ఇది వచన కావ్యమైనా ప్రతిసర్గ ప్రారంభంలోనూ శ్యామయ్య పద్యాలు బ్రాశాడు. రాముణ్ణి నుతించాడు. గద్యపద్యాలు రెండూ సాఫీగా వుంటాయి.

అసహాయ శ్యామారాయులేకాక ఈ యుగంలో ఇతరులు చాలామంది రామాయణ వచనాలు వ్రాశారు. కుందుర్తి వెంకటాచలం వచనరామాయణం వ్రాసినట్టు

రామాయణ రచయితలు 1025 అతని మిత్రవించాపరిణయం వల్ల తెలుస్తోంది. ఆ కావ్యం వ్రాసే ముందు అతని బంధుమిత్రులు వెంకటాచలాన్ని చూసి 'వచన కావ్యములుగా రచించినారు భారతభాగవతములు, రామకథయు' అన్నారు (1-39). కుందుర్తి వెంకటాచలం బ్రాసిన వచనరామాయణం నష్టమైంది.

కుందుర్తి వెంకటాచలంలాగా భాగవతాన్ని తూడా వచనంగా బ్రాశాడో లేదోగాని భారతరామాయణాలను తుపాకుల అనంతయ్య వచనరూపంలో వ్రాశాడు. అయితే ఇతని సుందరకాండ ఒక్కటే నేడు లభిస్తోంది. దీనినితడు మధురలో బ్రాళాడో, మైసూరులో వ్రాశాడో తెలియదు.

శ్యామారాయుడు, వెంకటాచలం, అనంతయ్యల్లాగే మధురతో సంబంధం వున్న దేవకి వెంకటసుబ్బయ్య అనే మరో రచయిత తూడా వచన రామాయణాన్ని వ్రాశాడు. ఇతడు అళగరయ్యగారి కుచూరుడన్న సంగతి తప్పు ఇతర వివరాలేం తెలియవు. ఇతని రామాయణంలో తొలిరెండు కాండలూ తప్ప మిగతా నాలుగూ దొరుకుతున్నాయి. శ్యామారాయుడిలాగే వెంకటసుబ్బయ్య కూడా సర్గాదిని పద్యాలు వ్రాశాడు.

దక్షిణాదిని కొందరు రచయితలిలా వచనంలో రామాయణం రచించడం మొదలుపెడితే ఉత్తరాన జయపురంలో కూడా ఇటువంటి కృషే జరిగింది. ఓడ్రభాషలో సిద్ధేంద్రయోగి ఒక రామాయణాన్ని వ్రాశాడు. దాన్ని అనుసరించి డొంకా గోపీనాథుడనే కవి తెలుగులో వచనవిచిత్ర రామాయణం వ్రాశాడు. ఇతణ్జీ జయపుర సంస్థానాధిపతి విశ్చంభరదేవుగారు సన్మానించారు. ఆయన శ్రీ.శ 1670 ప్రాంకాలవాడు. గోపీనాథం తూడా అప్పటివాడే. ఈ వచనవిచిత్ర రామాయణం గుంచి రచయితే ఇలా చెప్పాడు.

వాల్మీకి రామాయణానుమతంబైన ఓడ్రరామాయణంబు జూచి. తత్కథా విశేషంబుల సారంబంగకరంచి సంక్షిప్తంబుగా నెడనెడ సంస్కృతపదంబులు సంఘటించి తెనుంగున వచనప్రకారంబున... నీ మహాకావ్యంబు రచియించితి'' (2.218). ఈ గద్యరచన కేవలం నిర్జుష్టం కాదని పరిశోధకుల అభిప్రాయం. అయితే ఈ సంగతి గోపీనాథానికి బాగా తెలుసు. అందుకే ఇలా ప్రార్థించాడు. “ఇది చదివినవారు వినినవారును బ్రాసినవారును. నెడనెడ (గుణదోషం)బులు. గ్రహించి గేలిసియక సుశబ్దంబులు రచియించినవారును జగత్పూజ్యులై యంతంబున వైతుంఠంబున జెందేరు. శృంగారా లంకార చమత్కారవచన పటుత్వంబు గల్లి”.

ఈ వచనవిచిత్ర రామాయణం అసమగ్రం. దీనిలో ప్రకరణ విభాగం లేదు. దీని ప్రతి ప్రాచ్చలిఖిత గ్రంథాలయంలో ఉంది" గోపీనాథుడు వచనంలో రాసిన ఈ ఉత్కళ రామాయణాన్ని అతని తూతురి కొడుకు ఫక్కీ లక్ష్మీనరసింహం చదివి ఆనందించాడు. తుమురాడ పాపకవి అనే ఆయనను పిలిపించి ఈ వచనరామాయణాన్ని పద్యరూపంలో

చ టీ 4, పుట 258. ఏ పహరరమననమమానవట లు (ల

1026 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి దీని ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో వుంది (1.474). తుమురాడపాపయ్య ఈ ఒక్క రామాయణాన్నేకాక వేరీ రచనలు చేశాడు. ఇతడు ఉభయభాషాకవితావైచిత్రి కలవాడు. కాళిందీకల్యాణమనే మూడాశ్వాసాల శృంగారప్రబంధాన్ని రచించి. ఎవరో సన్యాసిరాజుగారికి అంకితం ఇచ్చాడు. దీని అముద్రితప్రతి కూడా ప్రాచ్యలిఖిత గంథాలయంలో ఉంది. (౧. 443) తుమురాడ పాపయ్యలాగ రామాయణాన్నే పద్యకావ్యంగా రచించిన కవులు తూడా ఈ యుగంలో ఉన్నారు. హుళక్కి భాస్కరుడు, కోన బుద్ధరాజు మొదలైన ప్రాచీనులు వాల్మీకిని యథాతథంగా అనువాదం చేయలేదని ఆ లోటు పూరించడానికి చాలామంది ప్రయత్నించారు. వాళ్లలో ఘనగిరి రామయ్య ఒకడు. ఈ యుగంలోని ఇతర కవులు రామాయణాన్ని వచనరూపంలో వ్రాస్తే ఇతడు నిర్వచనంగానే చెప్పినట్టుంది. గద్యలో తన ఇంటిపేరు 'ఘనగిరి' వారని వ్రాసినా అది పెనుగొండ అనే తెలుగు మాటకు సంస్కృతీ కరణం. పెనుగొండ ఎల్లయ్య అనే గొప్ప పండితుని వంశంలో రామయ్య పుట్టాడు. ఆ ఎల్లయ్యగారు ఇతని తాతగారికి తాతగారు. ఆయన గురించి ఇలా శ్షషించాడు. లసదజ ప్రఖ్యవాణీవిలాసియయ్యు- లసదజ ప్రఖ్యవాణీవిలాసియగుచు నెన్నికనునెక్కు పెనొాండయెల్లయార్యు- డుర్చ్వియందలిసత్కళాయుక్తిదనరి. (2.131) అతిసత్కళాయుక్తిదనరిన ఈ ఎల్లయ్యగారు ఏమైనా కావ్యాలు వ్రాశాడో లేదో తెలియదు. మునిమనుమని కొడుకు రామయ్యే గ్రంథకర్తగా కనబడుతున్నాడు. రామయ్యకు ఎవరో లక్ష్మీనరసింహశా స్తులవారు గురువు. ఆయన శిష్యరికం చేయడం వల్లనే తానింతవాడినయ్యానని రామయ్య చెప్పుకొన్నాడు.

  • ఈ యథావాల్మీకి రామాయణం కీష్కింధకాండదాకా దొరుకుతూంది. ఈ నాలుగు కాండల ప్రతులు కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు కార్యాలయంలో వున్నాయి! ప్రాచ్చలిఖిత గ్రంథాలయంలో బాలకాండ కొంతవరతూ వుంది.

ఘనగిరి రామయ్య ఏకాలంవాడో తెలియదుగాని బహుశా కడపటిరాజుల యుగంలోని మరికొందరు శుద్ధాంధ్రలో రామకథను చెప్పారు. వారిలో మొదటివాడు అడిదం బాలభాస్కరుడు. రెండవవాడు కూచిమంచి తిమ్మయ్య.

దొరికితే అడిదం బాలభాస్కరునిదే మన భాషలోని మొదటి శుద్దాంధ్ర రామాయణం అయ్యేది. కూచిమంచి తిమ్మకవి రామాయణం గురించి అతని జీవితచరిత్రలో చెప్పుకున్నాం. అడిదం బాలభాస్కరుడు అచ్చ తెనుగు

బాలభాస్కరుడు తన లక్షణ గ్రంథంలో ఏ ప్రయోగపాఠాలు ఇచ్చాడోగాని ఒక రామాయణకర్త తన కావ్యంలో ప్రయోగపాఠాల గురించి ఒక చక్కని పద్యం చెప్పాడు.

లామాయణ రచయితలు 1027

శ్రుతులకు భూషణంబులగుచున్‌ బరమానుభవంబు గల్లు నీ

శ్రుతులకు నెల్ల లోకముల జూసీన సామ్యము లేదు మాధుకీ

గతుల సుధారసంబు చిలుకన్‌ ఘనమోహన నుస్తారైక సం

గతుల మహాద్చుతంబు గులుకక్‌ విలసిల్లె బ్రయోగ పాఠముల్‌

ఈ పద్యాన్ని అనంతరాజు జన్నయ్య అనే కవి రామకథాఖిరామం అనే కావ్యం ప్రథమాశ్వాసంలో వ్రాశాడు. ఇతడేకాలంవాడో తెలియదు. ఇతని తండ్రి పేరు అమ్మయ్య గారు. తాత జన్నప్పు. ఈ కావ్యంలో పది ఆశ్వాసాలున్నాయి. ఇతని కవిత్వం నాతి కఠినమయి మృదుపద గుంఖితమై కర్ణరసాయనముగా ఉందని చెప్పిన వీరేశలింగంగారు ఈ కవి క్రీ.శ17560 ప్రాంతాలవాడని ఊహీంచారు* ఈ కావ్యం సవిస్తర రామాయణం కాదు. నంగ్రహమే అని పరిశోధకుల అభిప్రాయం

రామాయణాన్ని వచన రూపంలోనూ, పద్యరూపంలోనూ యీ యుగంలో ఇంతమంది కవులు చెప్తే ద్వొపదగా రామాయణ సారాన్ని ఒక కవి రచించాడు. అతడు భోసల ఏకోజీ, క్రీశ167లో తంజావూరు పాలించిన మహారాష్ట్ర నాయకరాజు, ఈ ద్విపద రామాయణం ప్రతి ఒకటి తంజావూరు గ్రంథాలయంలో ఉంది. ఆరుకాండలూ సమగ్రంగా ఉన్నాయి. (తంజావూరు ౨.352)

పాడుకొనడానికి ఏకోజీ ద్విపదరూపంలో రామాయణాన్ని వ్రాస్తే హోసూరి సాకమ్మ అనే మహిళ రామకథను యక్షగానంగా రచించింది. హోసూరు గ్రామం సేలం జిల్లాలో ఒక తాలూకా ముఖ్యపట్టణం. సాకమ్మగారి స్వగ్రామం హోసూరికీ దగ్గరలో కావేరి ఒడ్డున ఉన్ను 'తోగిరొ అనే పల్లెటూరు. దీనికి వీరరాజాంబుధి అగ్రహారం అని నామాంతరం వుంది. క్రీ.శ 1711 ప్రాంతాలలో తళులె వీరరూజు ఈ గ్రామాన్ని దానం చేయడంవల్ల ఆ పేరు వచ్చింది. వీరరాజు మైసూరు దళవాయి. భారకాన్ని నచనకావ్యంగా రచించిన ప్రసిద్దుడు. విఖిన్నక్షేత్రాలలో అగ్రహారాలూ, ఆరామాలూ దానం చేసి కవులను సంతోషపెట్టాననీ తన భారత గద్యలో_ బ్రాసుకొన్నాడు. అతడిచ్చిన అనేకమైన అగ్రహారాలలో తోగిరి. ఒకటి. తోగిరిలో పూర్వం సర్వేపల్లివారు వుండేవారు. ఆ కుటుంబంలో వెంకట రామావధాని అనే శ్రోత్రియునికి సాకమ్మ జన్మించింది. ఈమెకు చిన్నప్పుడే పెళ్లి అయింది. పెళ్లయిన కొద్దికాలానికే పసుపు కుంకునులు నిండుకున్నాయి. వైధవ్యం ప్రాప్తించాక సాతమ్మ తన జీవితాన్ని గ్రంధపతనంలోనూ. రచనలోనూ గడిపింది. రామాయణం, రంగవిలాసం అనే యక్షగానాలు బ్రాసింది. ముక్తీికొంతాకళ్యాణం, గురుశిష్యసంవాదం అనే గ్రంథాలు రచించింది. వీటిలో రామాయణమే ప్రసిద్ధమైంది.

యక్షగాన రూపంలో బ్రాసినా సాకమ్మగారి రామాయణం గేయంగా పదారు పొందింది. బాలకాండ ముద్రితమైంది._ అన్నదానం రామలక్ష్మమ్మగారు 1912 నన... ననన వవ ననన 4 అంధ్రకవుల చరిత్ర, మూడవభాగం, పుట 141. - ఏ కమారవక్త లద నారోహోడలు. పాకమ్యగారకే అన్నదానం వెంటాంబ అనే మరో

పేరుంది.

1028 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ప్రచురించారు.” ఈ రామాయణంలో తెలుగుదనం వుట్టిపడుతూందని పరిశోధకుల అఖిప్రాయం.! సంపూర్ణ రామాయణాన్ని అనంతర కవులు చాలామంది యక్షగానాలుగా వ్రాశారు. హోసూరి సాకమ్మ వారిలో ప్రథమురాలు,

ఇంతవరకూ ఈ యుగంలో వాల్మీకి రామాయణాన్ని అనుసరించిన కవుల గురించే చెప్పుకొన్నాం. అయితే సంస్కృతంలో రామకథను వ్రాసిన కవులు అనేకులు వున్నారు. వాళ్లలో భోజుడు చాలా ముఖ్యుడు ఇతడు రామాయణ చంపువును వ్రాశాడు. దీనిని ఈ యుగంలో కడప సుబాలోని నడిమింటి వెంకటపతి, కార్వేటినగరంలోని బుగ్వేదకవి వెంకటాచలం అనువదించిన సంగతి గుర్తించాం.

మన దేశంలో మరికొన్ని విలక్షణ రామాయణగాథలు వున్నాయి. అవి రామునికికాక ఇతర పాత్రలకు ప్రాముఖ్యం ఇస్తాయి. వాటిలో శతకంఠ రామాయణం, సహస్రకంఠ రామాయణం వంటి చాలా ప్రచారం పొందాయి. '“లింగకవి- గంగకవి' అనే జంటకవులు క్రీ.శ. 1700 ప్రాంతాలలో శతముఖ రామాయణం రచించారు. దీనికి సీతావిజయం అనే నామాంతరం వుంది. ఈ కవులు వేదాద్రిపురవాసులు. తొలి మూడాశ్వాసాలు లింగన్న వ్రాశాడు. పేరుకు జంట కవులేగాని ఎవరు వ్రాసిన ఆశ్వాసాలను వాళ్లు తమ కిష్టమైన వాళ్లకు అంకితం ఇచ్చారు (౫.551). ప్రాచీన కవులను బాగా అనుకరించారు. భాస్కర రామాయణంలో అయోధ్యకాండలో తమ తుమారుణ్జీ దశరథుడు పొట్టన పెట్టుకున్నప్పుడు అంధముని ఇలా విలపిస్తాడు.

హాయను నోకుమవారయను నక్కట పల్కవదేమి పుత్ర పు

త్రాయను దల్లి జూడుమను దమ్ముడ దూరగ నాటెనే యమో

ఘాయత సాకంబను నృపాధము డేటికినేనె బట్టి ప

ట్టీయను నీకు నీగతి ఘటించె గదేయను దైవమా యనున్‌ (భాస్కర. 2-34) దానిని అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయంలో ఇంకో ఘట్టంలో ఇలా అనుకరించాడు.

హాః యను గాథినందన మఖారి నిశాట మదాపహారి బా

హా! యను గ్రావజీవన పదాంబురుహాయను రాజలోక సిం

హా! యను బోషితార్యనివహాయను గానలకేగి లేనిరీ

హా! యను నిర్వహింపగలనా నినుబాసి రఘూద్వహా యనున్‌.

(రామాభ్యుదయం, 6-10)

ఈ రెండు పద్యాలను ఈ జంటకవులు ఇలా అనుకరించారు.

రా! యను బోకు మంటి గదరాయను నిన్నిక బాసి యోర్వ లే

రా! యను హాశతద్వయకరాయను మమ్మిక బాధ పెట్ట వే

రా! యను నీతనూజు గనరా యను నెక్కడ గందురా కుమా

రా; యను నల్ల నేల వినురాయను హా! శతకంధరాయనున్‌. (సీతావిజయం 4-171) 8. ఆంధ్ర యక్షగాన వాబజ్బయచరిత్ర,పుట 320. 8. గజపతులయుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి 2002

1 ... ర

కం! 1.

1030 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి

విలాపానుకరణలు మ్లీకాదు ఈ యుగంలో చాలామంది చేశారు. ఆదిలో ఇలాంటి వాటికి తిక్కనగారు చూచాయగా ఒరవడీ పెట్టారు. అభిమన్యుడు పోయాక “హాయను ధర్మరాజ తనయా యను......” అంటూ కొద్దిగానే చెప్పాడు (ద్రోణ 2-242). ఈ శబ్దాలంకారాన్ని తర్వాత వాళ్ళు సాగగొట్టారు.

కూచిమంచి తిమ్మయ్య తన రామాయణంలో తూడా ఇలాగే రెండు మూడు ఘట్టాలలో వాశాడు (2-99, %; 3-97). ఇతర కవులు ప్రబంధాలలో ఇలాగే పాత్రలు విలపించారు. పదేపదే ఒకే సంవిధానం కనబడితే ఇలాంటి విలాపాలు “ఏడిసినట్టే' ఉన్నాయి అనిపిస్తాయి.

ఒకే కథ, ఒకే రకం మూస పరిశోధకులకు పని కల్పిస్తూ పాఠకులకు విసుగెత్తిస్తాయి.

అన్నట్టు వీళ్లూ ఉన్నారు ఈ యుగంలోని చాలామంది రచయితల గురించి సుబాలవారీగా తెలుసుకున్నాం. 2కే సాహిత్యశాఖకు చెందినవాళ్ల గురించి కేటాయించి తెలుసుకున్నాం. అయితే మరికొందరు మిగిలిపోయారు. వీళ్లలో అంతా ప్రతిభావంతులు కారు. కొత్త ఇతివృత్తాలు తీసుకొని సరికొత్త భావకల్పనలు చేసినవాళ్ళు అరుదు. సాహిత్య చరిత్ర వ్రాస్తున్నప్పుడు “అన్నట్టు వీళ్లూ ఉన్నా'రని లెక్కించవలసినవాళ్లే ఎక్కువ. అసలీ యుగంలోని ప్రతిభావంతుల కావ్యాలు వరుసగా చదువుతూంటేనే ఒక సర్కసుకంపెనీ తరువాత ఇంకొకటివచ్చి ఆటకట్టిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇక ప్రతిభ లేనివాళ్ల కృతులూ, వ్యుత్పత్తి చాలనివాళ్ల రచనలూ చదువుతూంటే ఇంక చెప్పాలా! అందుకే కొందరిని కేవలం జమకట్టుకోవాలి.

ఏ సుబాకు చెందినవాళ్లో ఇదమిత్ధంగా చెప్పలేని వాళ్లను కూడా ఇందులో చేర్చాలి.

సిరిప్రిగడ ధర్మన్న : ఒకరు వ్రాసిన కావ్యాన్ని ఇంకొకరు బ్రాయడం మన సాహిత్యంలో కొత్త కాదు. శ్రీనాథుడు శృంగారనైషధాన్ని వ్రాశాక ఆంధ్ర సాహిత్యంలో నలచరిత్రను వ్రాసినవారు చాలామంది ఉన్నారు. చక్రపురి రాఘవాచార్యులు బట్టేపాటి తిమ్మయ్య రఘునాథనాయకుడూ నలచరిత్రను ద్విపదగా మాత్రమే వ్రాశారు. శ్రీనాథుని తరువాత మళ్లీ ఈ కథను పద్యకావ్యంగా వ్రాసినవాడు సిరిపైగడ ధర్మన్న.

ఇతడు ఇందుర్తి సీమవాడు. పేరూరిలో వుండే తుమురుగోటి ధర్మయ్యగారి మేనల్సడు. కృష్ణా, గోదావరి జిల్లాలో మూడు పేరూరు గ్రామాలు వున్నాయి. గోదావరి జీల్లా అమలాపురం తాలూకాలో ఒకటి, నూగూరు తాలూకాలో ఒక జమీందారీ గ్రామం వున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలో తూడా ఒక పేరూరు వుంది. ఈ మూడింటిలో ఏది తుమురుగోటివారి పేరూరో తెలియదు. అయితే ఆ గ్రామంలో ఒక

అన్నట్టు వీళ్లూ ఉన్నారు 1031 శ్రశవస్వామి దేవాలయం వుంది. “సంతత పేరూరి కేశవస్వామియధీన మానసస్పితిలో! సిరిపైగడ ధర్మన్నగారి మేనమామ ధర్మన్న వుండేవాడు. ఆయన తన మేనల్లుజ్లీ పిలిచి ఇలా అన్నాడు: గణ విను మనఘాత్మ ధర్మసుకవీ భవదీయ వచోవిలాసముల్‌ ఘనకవి హృద్విలాసములు గావె చమత్కృతి మీఠ గీవు నే ర్చినగతి నిప్పుడానలచరిత్రము వేంకట్టాలరాణ్డీవా సునకు సమర్పణంబుగను శోభనలీల రచింపు పెంపునన్‌. ఘనకవి హృద్వాలాసముగా చమత్కృతితో వ్రాయదలచిన ఈ కావ్యాన్ని ధర్మన్న ఆరు ఆశ్వాసాలలో ముగించాడు. ఇతని కవిత్వం నిర్దుష్టమని వీరేశలింగంగారు మెచ్చుకొన్నారు.! నిర్వచనంగా, నిరోష్ట్య్రంగా అచ్చ తెనుగులో నలచరిత్రను వీరేశలింగంగారు కూడా వ్రాశారు. ఆయన యింపుగా వుందని చెప్పడం ధర్మన్న కావ్యానికి పెద్ద యోగ్యతాపత్రం. ఒకే కథా కావ్యాన్ని వ్రాసీన ఇద్దరు కవులు, రమారమి జ్ఞాతులు. వాళ్లలో విరోధమేగాని ఆప్యాయత వుండదు. ధర్మన్న తన నలచరిత్రలో జ్ఞాతుల గురించి ప్రచారంలో వున్న లోకోక్తి ఇలా పద్యంలో చెప్పాడు. నీతిన్‌జూడు నరేంద్ర మీనతతులక్‌ మీనంబులే మింగుటల్‌ ఘాతక్రీడ గులారకాష్టముల వృక్ష బ్రాతముక్‌ ద్రుంచుటల్‌ జ్ఞాతిత్సంబునగాదె జ్ఞాతు లెచటక సామాన్యులే చెల్లటో జ్ఞాతిశ్చేద నలేన కిమ్మనెడు శాస్త్రంబుం బరీక్షింపవే? 2. 3౩6) ఈ లోకోక్తిని ఇంతకుముందు బాగా వాడుకొన్నవాడు భట్టుమూర్తి. వసుచరిత్రలో గిరిక విహారాన్ని వర్ణిస్తూ చక్కగా చమత్కరించాడు. గిరిక శుక్తిమతి కూతురు. శుక్తిమతి నది. నీటపుట్టిన తామరలు మొదలైనవన్నీ గిరికాదేవి తమ్ములే. జ్ఞాతులే. మన్మథబాణాలు ఓర్చుకోలేక గిరిక తమ్ములని పద్మాలను పట్టుకొంటే అవీ బాధించసాగాయి. ఈ సంగతి భట్టుమూర్తి బాగా చెప్పాడు (వసు 3-10. భట్టుమూర్తిలాగా శేషించలేకపోయినా సిరిపైగడ ధర్మన్న ఈ సామెతను వాడాడు. వీలైన చోటెల్లా లోకోక్తులు వాడడం మన కవులకు అలవాటే. ధర్మన్న కూడా అదే చేశాడు. రామామజాచార్వులుః నలచరిత్రను పద్యకావ్యంగా బ్రాసిన ధర్మన్న గురువు పేరు యి నామామరా లాలు ఈ అచ్చివారికి ఎయివంటి బంధువులోగాని అచ్చి రామానుజాచార్యులనే ఒకాయన. కొన్ని వేదాంత గ్రంథాలు బాశాడు.. ఇతడు నివాసి. |కీశ 1700 పాంతాలలో వుండేవాడు. తత్వార్థదర్పణం స మాసే దీని కస్ట హనుమకొండ పరిళోధకమండలిలో వుందకు. ఇదీ దీనితోపాటు మోక్షసారం అనే మరొక రచనా అచ్చుపడలేదుగాని అచ్చి రామానుజాచారి బాసిన చుమర్తుబనకల్పం మాత్రం ముద్రితం అయింది. వేదాంత గ్రాలు కన

  1. ఆంధ్రకవుల చరిత్ర మూడవభాగం, పుకు 28.

1032 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ఈయన ఏమైనా కావ్యాలు వ్రాశాడో లేదో తెలియదు. తెలంగాణాలో వెతికితే దొరకవచ్చు.

అత్తాను రామానుజాచార్యులు: దడెలంగాణాలోని మహబూబ్‌నగరు జిల్లాలోని మునిపల్లె గ్రామంలో అత్తాను రామానుజాచార్యులనే ఒక కవి ఉండేవాడు. అతడు పాండ్రాజువారి వంశంలోనివాడు మదనగోపాల భక్తుడు. ఈయన రుక్మిణీ కళ్యాణాన్ని కురవంజి రూపంలో రచించాడు. ఇందులో చక్కగా ధవళాలు, సువ్వాలలు మంగళ హారతులు మొదలైన దేశిరచనలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. కొట్నాలు దంచేటప్పుడు బిలుగువన్నై చంద్రకావి చీరలిచ్చారట. మునగపూవు ఛాయరంగు తుందనంపు పూత మెరయ పసుపుపట్టు రవికెలెల్ల పంచియిచ్చారట ఆ ముత్తయిదువులకు,

చక్కని దేశిరచన అముద్రితంగానే ఉండిపోయింది. ఈ రుక్మిణీ కురవంజి ప్రతి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారి కార్యాలయంలో ఉంది.

ముడుంబి వెంకటాచార్యులు ; బహుశా తెలంగాణాలోని ముడుంబి వెంకటా చార్యులనే వైద్యుడు గణబద్ధంగా వైద్యశాస్తాన్ని తెలుగులో వ్రాశాడు. దానిపేరు “రసప్రదీపిక'. ఇతడు రాజమండ్రి సర్కారువాడని వీరేశలింగంగారి అభిప్రాయం. మెదకు సుబావాడని శేషాద్రి కవుల నమ్మకం. నిజానికి ఎక్కడివాడో చెప్పలేం.

రసప్రదీపికలో మూడాశ్వాసాలు వున్నాయి. దీని బ్రాతప్రతులు చాలా ప్రచారంలో వుండేవి. ప్రాచ్యలిఖిత గంథాలయంలోనే దీనికి నాలుగు ప్రతులు వున్నాయి (0.2453-55). ఈ వైద్య గ్రంథం అచ్చుపడింది. మన తెలుగు కవులలో కొందరు ప్రథమశ్రేణి రచయితలు పూర్వం వైద్య గ్రంథాలు అనువదించారు. ఎలకూచి బాలసరస్వతీ ' బాహాటం' రచించాడు. ఈ ముడుంవి వెంకటాచార్యులు సంస్కృత బాహాటాన్ని చూశాడు. తెలుగు గ్రంథాన్ని చదివాడో లేదో తెలియదు. తాను చదివిన గ్రంథాలను గురించి ఇలా చెప్పాడు.

శారీరంబు నిఘంటు ద్రవ్యగుణముక సంఖ్యా నిధానయినౌ

దారంబైన రసప్రదీపికయు సూత్రస్థానమున్‌ ధాత్రిలో

సారంబైన చికిత్స సంగ్రహము ఖైషజ్యంబు బాహాట మిం

పారంజూచితి వేద్దూలపతి పాదాబ్దంబు నే ప్రాపుగన్‌. (90.2453 ఈ పద్యంలో వేద్దాలపతిని పేర్కొనడంవల్ల కవి గ్రామం వేదాద్రి ప్రాంతాలేమో అనే అనుమానం కలుగుతోంది. ఇతడు వైద్యగ్రంథాలేకాక ఇతరాలు తూడా వ్రాశాడు. “దేవహూతి విలాసం” అనే కావ్యం లఖిస్తోందిగాని అది అముద్రితం. ఆంధ్ర విశ్చవిద్యాలయంలో దీని ప్రతి ఒకటి ఉంది. ఈ కవి గురించి ఇంకా పరిశోధన జరగాలి.

పట్టమెట్ట సరస్వతీ సోమయాజి, మొదట తెలంగాణాలో వుండి తరువాత రాజమండ్రీ సర్కారుకు వలస వచ్చిన కవితా కుటుంబాలు లేకపోలేదు. పట్టమట్టవారిలో 2. మరుగుపడిన మాణిక్యాలు - డాక్టరు బి. రామరాజు, పుట అ నుండి ఆ 3. అఆంధ్రకవుల చరిత్ర, ౩వ భాగం, పుకు 22. 4. గోలుకొండ కవుల సంచిక

అన్నట్టు వీళ్లూ ఉన్నారు 1033 కొందరు ఆదిలో మెదకు సీమలోని కామినేనివారి ఆశ్రితులు. ఆ తరువాత గోదావరీ మండలానికి వచ్చారు. సరస్వతీ సోమయాజి తణుకులో చిన్సప్త డు. ఆ నన్నయ్యగారు ఆదిలో యజ్ఞం చేశారట. అక్కడొక వద్ద వ ౯ ళన నీడలో ద్రాక్షరామ ఖీమేశ్చరుడు ఇతనికి ప్రత్యక్షమై కృతార్థుణ్ని చేశాడట. ఫీమేశ్వరునికి అంకితంగా ఈ కవి 'షృథుచరిత్ర' అనే అయిదాశ్వాసాల ప్రొడ ప్రబంధాన్ని రచించాడు. దీనికి భాగవతం చతుర్ధ స్కంధంలో కథ ఆధారం. ఈ కావ్యంలో శబ్దాలంకారాలు జాస్తి అయినా మృదుత్వం లేకపోలేదు. అంతా సలక్షణమే. చెవికేకాక హృదయానికి కూడా ఇది రంజకంగా వుంటుందని పరిశోధకుల అఖిప్రాయం.5 ఈ కావ్యం అముద్రితం. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో వుంది (0. 569. ఈ కావ్యంలో పూర్వకవిస్తుతి విలక్షణంగా సాగింది. సాధారణంగా ఏదో &క సీసపద్యంలోనో, వృత్తంలోనో పూర్వకవులందరికీ మూకవుమ్మడిగా దండం పెట్టడం మన కవులకు రివాజు. అయితే సరస్వతి సోమయాజీ 7 పద్యాలలో ప్రథమశ్రేణి పేరుతో ఇతడిలా పేర్కొనడం గమనించతగ్గది. శృంగారరసాలింగగ్భథ రంగ-త్కవితానదీ తరంగము హృదయ త్వంగద్భుజంగ మాంగద-లింగంబు తెనాలిరామలింగము దలతున్‌ బి.569 నిజానికి మన సాహిత్యంలో తెనాలి రామలింగాలు ఇద్దరున్నారు. తెనాలి రామలింగం: మొదటి నిజాము కాలంనుంచీ ష్టాదరాబాదే మన రాజధాని. అయితే ఈ కేంద్ర నగరంలో జీవించిన తెలుగు కవులు ఎందరో మనకి తెలియదు. ఒక్క తినాలి రామలింగం పేరే బయటపడింది గాని అతని కావ్యం వెలుగు చూడలేదు. ఈ కవి అక్కన్న మాదన్నల కాలంలోనివాడు. ఇతడు 'ధీరజన మనోవిరాజితం' అనే గ్రంథం లాళాడు. ఇందులో విశ్చబ్రాహ్మణుల గొప్పతనాన్ని చాటుకొన్నాడు. ఆ కులాన్ని నిందిస్తే వచ్చే కష్టాల గురించి తూడా కథలు చెప్పాడు. ఇంతకన్న ఇతని గురించిగాని ఇతని కావ్యం గురించిగాని తెలియదు* విశ్వకర్మ ప్రశస్తిని కొనియాడే మరొక గ్రంథం ఈ యుగ్గలోనే బహుశా తలంగాణాలోనే వెలువడింది. దీనిని ఒకరు కాదు ఇద్దరు కవులు కలిస్‌ రచించారు. వారి పేర్లు తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతి. తురగా రాజుకవీ, అయ్యంకి బాలపసరప్వతి, ఈ జంట కవుల బంధుత్వమేమిటో తెలియదు. ఇంటిపేరులు వేరుగా ఉన్నాయి. అయినా వీరి గోత్రం మాత్రం ఒకటే (శౌనక గోత్రం). వీరిలో మొదటి కవి పేరు “తుర్కారాజకవి అని వీరి కావ్యం ట్రాతప్రతులలోనూ తొలి ముద్రిత ప్రతిలో కనబడుతుంది. వీరేశలింగంగారు “తుర్కా'ను ఊహించుకొన్నారు.” అయితే అనంతరం పరిశోధకులు ఈ జింటకవుల పేర్లు తురగా 6. గోలకొండకవుల సంచిక పుట. 407 7. అంధ్ర కవుల చరిత్ర, ద్వితీయభాగం, పుట 204.

1034 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి రాజకవి, అయ్యంకి బాలసరస్వతి అని నిర్ణయించారు.కి ఈ కవులు తమ గురించి వివరాలేమీ గ్రంథంలో చెప్పుకోలేదు. కృతిపతి గురించి చాలా చెప్పారు.

ఈ జంటలలో నాలుగో జంట వ్రాసిన నాగరఖండం అయిదాశ్వాసాల గ్రంథం. ఆ కవులు అఖినవవిశ్రుత కవితా విభవులు. అఖిలాగమాంతవిదులు. రాజకవి రసికుడు; బాల సరస్వతి అసమప్రతిభావిరాజి. తమను గురించి ఈ కవులు ఇంతకన్నా ఎక్కువగా చెప్పుకోలేదు. వీళ్ళను ధవశిశ్చరపురపు మార్కండేయుడనే శ్రీమంతుడు పిలిపించాడు. ఒక కావ్యం అంకితమిమ్మని అడిగినట్లు కవులు ఇలా చెప్పారు

మము బిలిపించి చాల బహుమాన మొనర్చి 'కవీంద్రులారః స్కాం

దమున మహాప్రసిద్ధమగు నాగరఖండ మఖండవిశ్వ[క్ర

రృమహితవైభవాకరము మాకు దెనుంగున నంకితంబుగా

రమణ ఘటింపగాదగు పురాణవిదుల్‌ మది రాణ మెచ్చగక (౧.294) మార్కండేయుడు ఇలా అడగ్గానే 'కృతికంఠమాలకు గొబ్బున నాయకరత్నం' అబ్బిందని కవులు ఈ కథను చెప్పసాగారు. స్కాందపురాణంలోని సనత్కుమారసంహిత అనే నాగరఖండం ఉంది. ఇందులో విశ్వకర్మ గొప్పదనం విశదమవుతుంది.

ఒకనాడు పార్వతీదేవి 'జగత్కారణదేవుడు ఎవ్వ'డని శివుణ్ణి ప్రశ్నించింది. ఆయన విశ్వకర్మమహానుభావాన్ని చెప్పాడు. విశ్వకర్మ అనే వృక్షంలోనే సదాశివా పంచశక్తుల ఉత్పత్తి జరిగింది. విశ్వకర్మ ముఖాది అవయవాలవల్ల అష్టాదశపురాణాలు ఏర్పడ్డాయి. ఈ నాగరఖండంలో శివుని పంచవింశతి లీలానామాలు, జంతునిర్మాణ క్రియ అష్టాదశజాతి భేదాలు, అరవై నాలుగు కళల ఉత్పత్తి, ఆరు దర్శనాలు మొదలైనవాటి వివరాలున్నాయి. నాలుగో ఆశ్వాసంలో ఆంజనేయుని జన్మకథ ఉంది. మర్కటమిథున ప్రసంగాన్ని చూసి మానసవికారం పొందిన తివుని వీర్యమే అంజనాదేవి శరీరంలో ప్రవేశించింది. గర్బ్పస్థ థిశువును ఆమె భరించలేకపోయింది. ఆ వేదన బాపమని వివిధ దేవతలకు మొక్కుకుంది. వాళ్లు వచ్చారు. "నీ కేమిస్తే గర్భం బయటకు వస్తావు?” అని కడుపులో శిశువును అడిగారు. బంగారు కౌపీన కుండలాలూ, యజ్ఞసూత్రం ఇస్తే బయటికి వస్తా'' నన్నాడు విడ్డ. దేవతలకు అది చేయడం సాధ్యపడలేదు. విశ్వకర్మను పిలిచారు. ఆయన వచ్చి, “సరే నువ్వు అడిగినవి చేసి ఇస్తాను కాని, నువ్వు నాకేమిస్తా”వని అడిగాడు. “నీ ధ్వజంపైన ఎప్పుడూ నిలబడి ఉంటాను” అని విడ్డ బాస చేశాడు. అతడే హనుమంతుడు, నాటినుండి విశ్వకర్మ కపికేతనుడు.

విశ్చకర్మ కులంలో పుట్టినందువల్లనే నాగరఖండాన్ని అభిమానించి, అనువాదం చేయించి, అంకితం పుచ్చుకొన్న మార్కండేయుని జండాపైన తూడా కపిరాజు ఉన్నాడు. ఇతనికి 'పెషణీహనుమంత' మొదలైన బీరుదులున్నాయి. ఈ మార్కండేయుని ఇంటిపేరు ధవశిశ్వరపురంవారైనా ఇతడు పెందోటపురానికి అధిపతి.

8, అఆంధ్రకవి తరంగిణి, 11వ సంపుట, పుట 58.

  1. ఈ కవుల నాగరఖండం అచ్చుపడిందిగాని నాకు దొరకలేదు. అందుచేత ప్రాచ్చలిీత లగంథాలయంలోని ప్రతులూ ముఖ్యంగా టై. క్యాటలాగు 3వ సంపుటి ౩ భాగాన్ని ఉపయోగించుచున్నాను.

అన్నట్టు వీళ్లూ ఉన్నారు 1035

కృతిపతి “మహమ్మదు కుతుబశాహీ చంద్రునికి కుడిభుజు” మని కవులు పొగిడారు (నాగర ఖండం 1-18). క్రీశు 1580 నుండి 1611 దాకా గోల్కొండను పాలించిన కుతుబ్‌షానే కవులు పేర్కొన్నారని చాగంటి శేయ్యగారు ఖావించారు.!9 ఇతని ప్రాభవ వేళలో కావ్యం పుట్టినట్టుంది. ఈ కుతుబ్‌షా రాజ్యానికి వచ్చినప్పుడు 15 సంవత్సరాల ప్రాయంవాడు. 1617 నుండి 1626 దాకా నుల్తాన్‌ మహమ్మదు తుతుబ్‌షై. అనే ఇంకొక పాలకుడు కూడా ఉన్నాడు. ఇందులో ఎవరికి మార్కండేయుడు కుడిభుజం? ఎవరికీ కాదేమో! ఈ పద్యంనత్యుక్తి విశేషంగా నున్నట్టు తోచుచున్నది'' అని చాగంటి శేషయ్యగారు. రాశారు.!* కుతుబ్‌షా కుడిభుజంగా ఉండేవాడు పెందోట వురానికి కరణంగా ఎందుకుంటాడన్న ప్రశ్న సహజంగానే వస్తుంది సమాధానానికి చాలా పరిశోధన కావాలి. ఆకరాలు దొరకవు. గ్రంథాంతాన గద్య తర్వాత ఒక పద్యంలో గ్రంథ రచనా కాలాన్ని చెప్తున్న పద్యం ఒకటి చాగంటి శషయ్యగారు ఉదాహరించారు. దాని ప్రకారం గ్రంథరచనాకాలం శాలివాహన శకం 1506లో, అంటే క్రీశ. 1586లో అని డేలుతుంది. "ఈ పద్యము గ్రంథకర్హ్చృ నామాదికములు తెలుపు గద్యకు, విమ్మట నుండుటచే కవులు రచించినది కాదేమోయని సంశయము తోచుచున్నది” అని చాగంటివారు అన్నారు. ఈ పద్యం నేను చూసిన ప్రతిలో లేదు (2.312. ఈ పద్యంలో “కుతుబ్‌ షా కీ నిజాంకు తలనాధు ప్రాభవ వేళ అనే మాటలున్నాయి. ఇది కవులు రాసిన పద్యమే అయితే వాళ్ళు పదహారో శతాబ్ధం వాళ్ళు కారు. 18వ శతాబ్దం వారు అని చెప్పాలి. కుతుబ్‌షాకు నిజాం అనే బిరుదు ఉన్నట్లు కనబడదు. అసఫ్‌ జా వంశంలోని వాళ్ళకే నిజాం అన్న వీరుదు నికరంగా ఉంది. ఈ వంశంవాళ్ళు క్రీశ 1713 తర్వాతనే రాజ్యానికి వచ్చారు. కవులు అందుచేత కడపటిరాజుల యుగంలోనే రచన చేశారు అనుకోవాలి.

కుతుబ్‌షాహి ప్రాభవ వేళలో కాకపోయినా వేమనగారి ప్రాభవవేళలో ఈ గ్రంథ రచన పూర్తికావచ్చినట్టు కనబడుతుంది. చతుర్గాశ్వాసంలోని ఒక ఆటవెలదిని చూడండీ.

“దివిజ విశ్చకర్మ దేవుండు స్థావర జంగములకు..... జనకు డయ్యె

తాతయయ్యె సకల దైవత కోటికి వెలయ పది భుజముల విశ్వకర్మ”

(నాగరఖండం 312 పుట)

ఈ గ్రంథంలోని ఇతర ఆటవెలదులు ఇలా వేమనగారి బాజీలో లేవు. వేమనగారిని నుతించారు.

ఈ జంటకవులు నాగరఖండంలో చేసిన పూర్వకవి స్తుతి మన సాహిత్యానికి ఎంతో ఉపకారం చేస్తున్నది. దీని సహాయంవల్ల కొంతమంది కవుల కాలాన్ని నిర్ణయించడానికీ అస్కారం కలిగింది. ఈ కవులు నాగరఖండాన్ని క్రీశ 158లో బ్రాశారని గ్రంథాంతాన ఉన్న ఒక పద్యం వల్ల తెలుస్తున్నది. వీళ్లు స్తుతించిన కవులందరూ సహజంగా ఈ 10. అంధ్రకవి తరంగిణి - 11వ సంపుటం, పుట ణి.

  1. పై గ్రంథంలోనే, పుట 61.

1036 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ప్రాచేతసు బరాశరకుమార గాళిదాసు మయూర భవభూతి జోరుదండి బాజు ధనంజయ భారవి జయదేవు భాసుని శ్రీహర్హ బ్రవర సేను మల్లణు బిల్లణు మాఘు మురారిని క్షేమేంద్రు వటమూల సోమనాథు శివతత్సు శివదేవు జిన్న్మయు భవదూరు శరభాంకు రాజశేఖరుని వేము నన్నపను దిక్క మఖి బ్రబంధ పరమేళు సాధు నాధర్వణాచార్యు జంద్రమౌళి భాస్కరు ననంతు శ్రీనాథభట్టు ఖీము సోము నమరేంద్రు దలతు నుత్సుకత నాత్మ, (294) ఈ పద్యంలో నలఖైమంది సంస్కృతాంధ్ర కవుల పేర్లున్నాయి. శివతత్వుడంటే శివతత్త్వసారం వ్రాసిన మల్లికార్జునపండితారాధ్యుడు కావచ్చు. చిన్మయుడు, సాధుకవి ఎవరో తెలియదు. నాగరఖండంవల్ల తెలియవచ్చే కవుల అకారాది పట్టిక ఇది.

  1. అధర్వణాచార్భుడు 11. తిక్కన 21. భాసుడు 31. వేముడు
  2. అనంతుడు 12. దండి 22. భాస్కరుడు ౩2. వ్యాసుడు
  3. అమరేంద్రుడు 13. ధనంజయుడు 2. భీమన 3. శరభాంకుడు
  4. ఎరాప్రైెగడ 14. నన్నయ 24. మయూరుడు 34. వివతత్వుడు
  5. కాళిదాసు 15. ప్రవరసినుడు 25. మల్లణుడు 35. శివదేవుడు
  6. గ్షేమేంద్రుడు 16. బాణుడు 28. మాఘుడు 36 శ్రీనాథుడు
  7. చంద్రమౌళి 17. విల్లణుడు 27. మురారి ౩7... శ్రీహర్జుడు
  8. చిన్మయుడు 18. భవదూరుడు 28. రాజేఖరుడు ౫. సాధుడు
  9. చోరుడు 19. భవభూతి 29. వటమూలుడు 39. సోమన
  10. జయదేవుడు 20. ఖారవి 3౫0. వాల్మీకి 40. సోమనాథుడు వటమూలుడు, వేమన మొదలైన కొంతమందిని ఈ జంటకవులు స్తుతించారు. సాహిత్యచరిత్ర రచనలో వీరి కాలనిర్ణయానికి చాలా తోడ్పడే ఈ స్తుతిని చేసిన జంటకవులు ఏ ప్రాంతాలవారో తెలియదు, తొందరు మన సాహిత్యంలో వున్నారు. వారిలో పావులూరి మల్లన్న ఒకడు. మొదటీ మల్లన్న చాళుక్కయుగంనాటివాడు, రెండోవాడు అర్వాచీనుడు. భద్రాద్రి రామశతకం బ్రాశాడు. కొండవీటి సర్కారులో ఒక పావులూరు వుంది. కవి అక్కడివాడే. తండ్రీ రామన్న పావులూరి కరణం. తన ఊళో వున్న రాముజ్జే భద్రాద్రి రామునిగా భావించి శతకాన్ని చెప్పాడు. ఇందులో నామస్మరణ తప్పు భావవైచిత్రి లేదు. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో వుంది (0.1627). చివరి పద్యంలో మల్లన్న దేవునికిలాగ రికమండు చేశాడు. ఈ మహిలో నీశతకము-నేమనుజుడు వ్రాయు జదువ నీప్సితఫలమున్‌ ఈ శతకాన్ని కాపీ చేయడంకన్నా రామకోటి వ్రాసుకొంటే, నమ్మినవాళ్లకు పుణ్యం పదింతలు పెరగవచ్చు. ఇది ఈ యుగంలోని చాలా కావ్యాలకు వర్తిస్తుంది.

1037 ముఖ్యపదానుక్రమణిక

అంకన్ను, సింహాద్రి 778 | అప్పమంత్రి, నాదెండ్ల 30 అంకరాజు, దామెర్ల 656 | అప్పయ్య, వైదర్సు 996 అంవికావాదం 766 | అప్పలాచారి, శేషభట్టరు 799 అక్కన్న, 800 , అబ్బయ్య, కనుపర్తి 9843 అక్కన్న కవి 924 | అఖీనయ దర్పణం 916 అక్కమహాదేవి చరిత్ర 705 | అభినవ వాగనుశాసనుడు 959 అక్కయ్యకవి 923 | అఖిషిక్రరాఘవం 860 అక్కల కొలుపు 469 | అమరుకకావ్యం 183 అక్కలు 468 | అమరుక శతకం 150 అఖిలకావ్య లక్షణలక్ష్యసాగరం 22 | అయ్యన్న కంచెర్ల శీత] అచలాత్మజా పరిణయం 829 | అయ్యప్పదీక్షితులు - 989 అచ్చ తెనుగు రామాయణం 958 | ఆయ్యలరాజకవి 366 అచ్యుతదేవరాయలు 7 |, అరుణాచలపురాణం 226 అచ్చుతప్పనాయకుడు 501, 604 | అర్చిరాది ప్రబంధం 824 అచ్యుతప్పరాయాభ్యుదయం 8 | అశ్వలక్షణసారం 24 అచ్యుతా భ్యుదయం 526 | అశ్చరాయచరిత్ర 811 అజ్జయ్య దీక్షితులు 829 | అష్టదిగ్గజాలు రిల అనంతయ్య, ఏనుగు 978 | అష్టమహిషీ కల్యాణం 148, 22 అనంతయ్య, చిత్రకవి 452 | అష్టమహిషులు 691 అనంతయ్య, తుపాకుల 866 | అష్టవిధనాయికలు రం! అనంతయ్య, రేవూరి 872 | అష్టావధానకవి 924 అనంతరాజు, మట 246, 415 | ఆహల్యా సంక్రందనం 879 అనంత వ్రతకల్పము 766 | అహోబలపండితీయం 94 అనరరాఘవం 822 | అహేబలయ్య, కుందుర్తి 891

ఖు త 407. 944 ఆళగరి, వెలిదండ్ల 892 అన్నప్పు 277 | ఆళియరామరాయలు 244 అన్నమరాజు య. ౫

= వెన్నెలకంటి 167 | అంధ్రకవికాపి క్‌ ఇం 1621 | ఆంధ్ర కామందకం వనీ అప్పకవి, కాకునూరి 765 అంధక ముది ?ది1 అప్పకవీయం 765 | ఈ భాగవతులు అప్పకవీయం 785 942 ఆంధ్రనామ సంగ్రహం

అప్పన్న, నెప్పల్లె గిర్‌ భ్రభాషారత్నాకరం 42 అప్పప్పకవి 942 | ఈ

1036 ఆంధ్ర శబ్దానుశాసనం 910 | ఏకప్రాస శతకం 778 ఆనందకనక మాహాత్మ్యం 279 | ఏకావమ్రనాథుడు 376 ఆనందరంగరాట్బ్పందం 92, 932 | ఏకామ్రయ్య 873 ఆనందరాయమఫఖి 921 | ఏకాయలింగశతకం 1021 ఆముక్తమాల్యద 3౩7 | ఏకోజీ 897 ఆరవీటి బుక్కరాజువంశం 306 | ఏకోజీ, భోసల 1027 ఆరవీటి రాజుల యుగం 242 | ఏగంటి భాష్యము 153 ఆరవీటి వంశం 243 | ఏలూరు సర్కారు 949 ఆర్కాటు సుబాకవులు 931 | ఒడయనంవి విలాసం కర్‌ అస్తిక దర్శనాలు 842 | ఒడ్డెయ్య, వెణుతుర్ల 492 ఆస్తిక దార్శనిక మతాలు 842 , ఓబయ్య, దర్చా 915 ఇందుమతీ పరిణయం 278, 603 | ఓబళకవి, పొన్నతోట 475 ఇబ్రహీం (ఇభరాముడు) 235 | ఓబళనాయకుడు 78 ఇమ్మడి ఏకోజీ 907 | ఓబళయ్య, గాలి 947 ఇమ్మడి కాళహస్తికవి, రేవూరి 871 | కంచికావ్యం కర్ర] ఇమ్మడి రామకృష్ణుడు 278 | కందర్పకేతు విలాసం 198 ఇళాదేవీయం 926 | కంపరాయలు, ఓబల 28 ఈదెమ్మకథ . 467 | కతుత్‌స్థ విజయం 420, 628 ఈశ్వర ఫణీభట్టు ॥ 345 | కడపటిరాజులయుగం 800 ఉత్తమ గండచ్చందం 26 | కడప సుబా కవులు ఈ0 ఉత్తర రామాయణం 583 | కదరీపతి, తాడిగోళ్ళ 781 ఉదయనోదయం 481 | కనకరంజిత తిఖామణీ పరిణయం 478 ఉదృటయ్య 197 | కన్నప్ప చరిత్ర 413 ఉద్పటారాధ్య చరిత్రము 189 | కియుద్దీఖాన్‌ 801 ఉద్యోగపర్వం 933 | కర్నూలు సుబా 832 ఉపమాక వేంకటేశ్వర శతకం 997 | తవిజనరంజనం 988 'ఉప్పుగుండూరి కవులు 482 | కరుణభాసుర యక్షగాన ప్రబంధం 222 ఉషాపరిణయం 656, 697 కవికర్ణరసాయనం 117 ఉషాపరిణయకర్తలు 698 | కవికాల్పకం 766 ఎర్రన్న, ఎడపాటి 393, 936 | కవితులసార్వభౌముడు 616 ఎనర్రయ్య, బద్దెపూడీ 989 | కవిచింతామణి 2 ఎల్లన్న్య చింతలపూడీ 123, ఈక | తవిజన సంజీవని ఉఫ్‌! ఎల్లమరాజూ, మట్ల 859 తవి భానుడు 564 ఎల్లయ్య. కావూరి 476 | కవిరాజ మనోరంజనం 944 ఎల్లయ్య, చింతలపల్లి 757 | కవిరాజ విరాజితం రికీ ఎల్లారెడ్డి, కామినేని (ఇమ్మడీ) 455 | కవిశిరోభూషణం 948

109 కవిసంశయవిచ్చేదం 989 | కుమార వెంకటరాయలు 797 కవిసర్పగారుడం 232 | తుమూరార్దునీయం 631 కసవరాజు, కొరవి 14 | కుముదవల్లీ విలాసం 793 కసవరాబా, తేళ్ళపూడి 402 | కుముద్వతీ కళ్యాణం 626 కసుబా 756 | కుముద్వత్తీ పరిణయం 859 కస్తూరి రంగయ్య, వెచ్చా 932 | కులపురాణాలు న! కళాపూర్లోదయం 246, 307 | కులీకుతుబ్‌ షా 234 కళావతీ శతకం 402 | కువలయానంద ప్రకాశిక 1011 కళింగ కవులు 983 | కువలయాశ్చ చరిత్ర 712 కళింగ దండయాత్ర 51 | కుశలవోపాఖ్యానం 4ధిక కాంచీమాహాత్మ్యం 230 | తూర్మనాథం, గోగులపాటి 1002 కాంటర్‌బరీ కథలు 782 | తూర్మపురాణం 475 కామకళానిధి 911, 914 | కృష్ణకవి, వెలగపూడి 257 కామినేని కవులు 454 | కృష్ణదండకం 956 కామిరెడ్డి, కామినేని 454 | కృష్ణదేవరాయలు ర్‌, 37 కామేశ్వరీ చరిత్రము 470 | కృష్ణమంత్రి. నేబది శ్రి? కార్తీక మాహాత్మ్యం 892 | కృష్ణమరాజు, నంద్యాల 245 కావ్యసార వర్ణనం 385 | కృష్ణమాచార్యులు, కర్బ్చూరం 825 కావ్యాలంకార సంగ్రహం 326 | కృష్ణయ్య, పూడూరి 85 కాళయ్య, చెంగల్వ 636, 66 | కృష్ణయ్య, వెలగపూడి 808 కాళయ్య, బొమ్మలాట 227 | కృష్ణరాజ దండకం 585్‌ కాళహస్తికవి, రేవూరి 871 | కృష్ణరాయ విజయం 602 కాళహస్తి మాహాత్మ్యం 606 | కృష్ణలీలా తరంగిణీ 745 కాళహస్తిలింగ శతకం 776 | కృష్ణవిలాసం 629, 7, ఆం కాళిందీ కన్యాపరిణయం 947 | కృష్మాజీ 634 కాళిందీ కల్యాణం 1026 | కృష్ణాధ్వరి 0068 కాళలీయమర్దనం 648 | కృష్ణార్ణున సంవాదం ఇ. బా కీరాతార్తునీయం 227 | కేశవన్న 624 కుందురి కవులు 891 | కేశవ విలాసం 819 కుందుర్తి పండితులు 483 | కొండన్న, వేగినొటి యొ 'టిశుర శతకం 904, 962 | కొండపల్లి సర్కారు _ కా న 837 | కొండయ్య, బొడ్డపాటి 403 తుతుబ్‌షాహి వంశం 234 | కొండలరాయుడు. రావు 860 కుమార అనంతరాజు, మట 62, జ9 | కొండవీడు సర్కారు 943 కుమార ధూరటి స్ట 602 | కొందరు రామాయణ రచయితలు 1029 కుమార భారతి 188 | కొందరు నాటకకర్తలు 14

1040 కోదండపతి, గుడిపాటి 1009 | గోపన్న, కంచెర్ల 790 కోదండరామయ్య, అనఘం 631 | గోపన్న; పలకలూరి హూ కోదండరామయ్య, చింతకుంట 948 | గోపన్న, పొట్టూరి 4కి కోదండరామయ్య, భట్ల పెనుమర్తి 520 | గోపమంత్రి, నాదెండ్ల 8, 85 కోనేరునాథుడు, దోనూరి 353 | గోపరాజు, కొరవి 9 కౌసలేయ చరిత్రం 763 | గోపాలయ్య, బుచ్చాలి 869 క్షీతయ్య 666 | గోపాలయ్య, వికటకవి 875 క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలు 684 | గోపాలరాజు, రత్నాకరం 940 గంగకవి 1028 | గోపాలరావు, అష్టభాషల 822 గంగరాజు, చిరుమూరి 404 | గోపాలు, కనకబండీ 467 గంగాగౌరీ విలాసం 477 (| గోపీనాథకవి, డొంకా 1025 గంగాధరుడు, అద్దంకి 281 | -గోవిందయ్య 483 గంగాధరుడు, కాకమాని 228 | గోవిందయ్య, కుందుర్తి 891 గంగాపుర మాహాత్మ్యం 473 | గోవిందయ్య, పాలూరి 913 గంగావతరణం 69 | గౌడపురాణం 816 గజిపతిరాజులు 983 | గౌతమీ మాహాత్మ్యం 1016 గణపయ్య, రాయసం 229 | గౌరన 403, 953 గణసొ జన్యాఖ్యాన శతకం 1021 | గౌరరాజు 491 గణీత దీపిక 485 | గౌరీ వివాహం 614 గద్వాల సంస్థానం 832 | గౌళికాశాస్త్రం 888 గరుడాచలకవి, లయగ్రాహి 763 | ఘటికాచలమాహాత్మ్యం 211, 916 గాధేయోపాఖ్యానం 872 | ఘట్టు ప్రభువు 836 గారడీ పద్యం 730 | జ్ఞానచింతామణిీ శక్‌ గిరిజా కల్యాణం 299 | జ్ఞాన సూర్యోదయం 346 గరియమ్మ 763 | చంద్రభానుచరిత్ర 249, 429, 7986 గిరిరాజు, దర్చా 915 | చంద్రలేఖా విలాపం 966 గురవమంత్రి, ఏనుగు 614 | చంద్రశేఖర విలాసం 925 గురవయ్య, చల్తా 630 | చంద్రహాస విలాసం 226 గురవరాజు, వణుతూరి 490 | చంద్రాంగద చరిత్ర 624 గురుదీక్షాబోధ 144 | చంద్రాంగదోపాఖ్యానం 758, 823 గురుపరంపరా ప్రభావం 60 | చంద్రాలోకం 9639 గురురాజయ్య 614 | చంద్రికాపరిణయం 516, 818 గురుశిష్యసంవాదం 3౩47 | చంద్రికా విహారం 704 గువ్వలచెన్న శతకం 462 | చంపూ రామాయణం 539 గొల్ల కలాపం 748 | చమత్కారమంజరి 619 గోదావరీ శతకం 780 | చింతలపల్లి పండితులు 757

1041 చిక్కదేవరాయ విలాసం 861 | జగన్నాథ మాహాత్మ్యం 1017 చిక్కయ్య, చెందలూరి 179 | జగన్నాథరాయలు, పొనుగోటి _ 793 చిక్కరాజవిన్నపం 862 | జగన్నాయక శతకం 778 చిత్త శతకం 459 | జగ్గన్న కూచిమంచి 964 చిత్రకవితా దర్పణం 860 | జగ్గన్న, పెదపాటి 261, 35 చిత్రకవి పండితులు 447 | జనార్దనాష్టకం 223 చిత్రకవి పెద్దన 341 | జన్నమంత్రి, వెన్నెలకంటి 1ఈ చిత్రకూట మాహాత్మ్యం 893 | జన్నయ్య, అనంతరాజు 1027 చిత్రగర్చ కవిత్వం 599 | జయవిజయాభ్యుదయం 627 చిత్రభారతం 85 | జయసింహుడు 907 చిన అనంతయ్య, రేవూరి 894 | జలపాలి మహాత్మ్యం 410 చిన చెవ్వప్పు నాయకుడు 498 | జాంబపురాణం 465 చిన తి్మురాజు, పొట్లపాటి 245 | జాంబవతీ పరిణయం 69 చిన నారాయణ, సవరం 710 | జానకీ పరిణయం 585, 951. 94 చిన రాఘవయ్య, చింతలపల్లి 758 | జాహ్నవీ మాహాత్మ్యం 973 చిన రామన, ముద్దరాజు 447 | జీయోవాని బొకాడియో 781 చిన లక్ష్మణకవి, ఏనుగు 616 | ఫైమినీ భారతం 878 చిన లచ్చన్న ఏనుగు 973 | జ్యోతిష రత్నాకరం 1002 చిన వీర రాఘవయ్య, చింతలపల్లి 762 | డిండిమభట్టు, రాజనాథ తి చిన్నన్న, తాళ్ళపాక 148 | డీకామెరాన్‌ 781 చిన్నాదేవి 43 | తంజావూరు తెలుగు కవులు 910 చూడీకుడుత్తమ్మ 54 | తంజావూరు మహారాష్ట్ర రాజులు 896 చెన్నకృష్ణయ్య 823 | తత్వ చంద్రోదయం 345 చెన్నమరాజు, చెన్నమరాజు 623 | తత్వ దీపిక బోధ 347 చెవ్వప్పునాయకుడు 500 | తత్వ ప్రకాశిని 827 చాక్కనాథచరిత్ర 351 | తత్వ మార్తాండ 829 చాక్కనాథ నాయకుడు 874 | తత్వార్థ దర్చణం 1031 చొక్కనాథుడు 503 | తపతి సంవరణోపాఖ్యానం 291 చొక్కనాథుడు, విజయరంగ 877 | తమ్మయ్య, సారంగు 289 చొక్కవజీరు శతకం 877 | తాతంభట్టు, వెల్లంకి 233 చౌడప్ప 425 | తాతాచార్యులు 2056 చౌడప్ప శతకం 425 | తాత్పర్యబోధిని 62 చౌతయ్య, గంగరాజు 404 | తానీషా అబులహసన్‌ 678 ఛందోదర్పణం 233 | తాయికొండ నాటకం 69 ఛాయాపతి, చింతలపల్లి 758 | తారకబ్రహ్మ రాజీయం 128 ఛాసర్‌ న 782 | తారా శళాంకం ౫

1042 తాళదేశ ప్రాణదీపిక 919 | తులసిమూర్తి 680 తాళ్ళపాక కవులు 147 | తుళువ వంశం 242 తిట్టుకవులు 560 | తెనాలికవులు 276 తిప్పురాజు, కుడీచెర్ల 230 | తెలగన్న, పాన్నికంటి 285 తిమ్మకవి, లింగమగుంట 280 | తెలుగు భాస్కరులు 564 తిమ్మన, నంది (ముక్కు) 72 | తీరపావన శతకం 1022 తిమ్మన, పుష్పగిరి 567 | తీరప్ప, కర్ణాట 1022 తిమ్మన, బొడ్డుచర్ల 438 | తోపూరు యుద్ధం 535 తిమ్మమంత్రి. నైషధం 341 త్యాగరాజస్వామి 917 తిమ్మయ్య, కుంటుముక్కల 230 | త్రయంబకరాయమఖి 298, 921 తిమ్మయ్య, కూచిమంచి 804, 852, 956, 1026 | త్రిపురవిజయం 232 తిమ్మయ్య, తామరపల్లి 479 | త్రిలోకభఖేది 233 తిమ్మయ్య (తిరుమలభట్టు), బట్టేపాటి 506 | త్రిలోక సంజీవని 452 తిమ్మరాజు, చతుర్చుజ 613, 617 | దత్తప్ప, బద్దెవీటి 485 తిమ్మరాజు, పూసపాటి 621 , దత్తయోగీంద్ర కావ్యం 493 తిమ్మరాజు, పొట్లపాటి 245 | దర్చా సోదరులు 915 తిమ్మరాజు, బిజ్జల 438, 822 | దశరధరాజనందనచరిత్ర 337 తిమ్మరాజు, సార్చభౌమ 617 | దశావతార కథాసంగ్రహం 785 తిమ్మరాజు, సిద్ధిరాజు 245, 358 ' దశావతార శతకం 792 తిమ్మరుసు 2 | దాక్షాయణీ పరిణయం తక్‌ తిరుకామయ్య, లింగనవఖి 503, 736, 874 | దామెరల కవులు 648 తిరుకాళహస్తిలింగ శతకం 403 | దాశరథీ శతకం | 790 తిరుమల దేవరాయలు 245 | దిట్టకవి 614 తిరుమలదేవి 44 | దివ్యదేశ మాహాత్మ్యదీపిక 764 తిరుమల నాయకుడు 503 | దీక్షితచంద్రుడు, కోనేటి 709 తిరుమలన్న 624 | దుగ్గన్ను దగ్గుపల్లి 179 తిరుమలభట్టు (తిమ్మయ్య) 506 , దేచయ్య 189 తిరుమలయ్య, నెల్లూరి 563 | దేచిరాజు, రాపరిది 231 తిరుమలయ్య, వెంకట సోమయాజిగారి 893 | దేవకీనందన శతకం 166 తిరుమలాంబ 8 | దేవరాజు, చిక్క 861 తిరువడాంబ శతకం 577 | దేవహూతి విలాసం 1032 తిరువెంగళప్పు, తాళ్ళపాక 150 | దేవాంగ పురాణం తా] తిరువెంగళరాజు, పచ్చకప్పురంపు 351 | దేవేంద్ర విజయం 16 తుక్కోజి 905 | దేశాయి, మల్తారెడ్డి 473 తుపాకుల రాయడు 674 | దొర, బోయినపల్లి 795 తుర్కారాజకవి 1033 | ద్రౌపదీ కల్యాణం 797

1043 ద్రౌపదీ పరిణయం 615 | నరసింహం, ఆలూరి 68 ద్చాపద కాశీఖండం ఏ480 | నరసింహం, కానాల 1014 ద్విపద ప్రభులింగ లీలలు 154 | నరసింహం, బోరవెల్లి 796 ద్విపద భగవద్గీత 825 | నరసింహకవి, ఎల్లకర త71 ద్విపద భాగవతం 585, 940 , నరసింహశకవి, చరిగొండ 494 ద్విపద భారతం 506, 941 ' నరసింహనాయకుడు 504 ద్వాపద భారత కవిత్రయం 506 |, నరసింహ పురాణం 141, 744, ౪21 ద్విపద మార్కండేయ పురాణం _ 471 | నరసింహభట్టు, ఆమడూరి 405 ద్విపద రామాయణం 596, 1027 | నరసింహరాజు, కంకంటి 587 ద్విపద విష్ణు మాయానాటకం 588 | నరసింహరాజు, వానపాల 618 ద్వీపద సారంగధర చరిత్ర 952 | నరసింహరాయమణి 898, 921 ద్వ్యర్థి కావ్యాలు 300 | నరసింహరాయలు, సాళువ 1 ధర్మఖండం 981 |, నరసింహ శతకం. 1023 ధర్మన్న చరిగొండ 85 | నరీంద్రలింగ శతకం 780 ధర్మన్న సిరిటైగడ 1030 | నలచరిత్ర ౩73, 527, 1030 ధర్మయ్య, బారిగడుపుల 820 | నలయాదవ రాఘవ పాండవీయం 612 ధీరజిన మనోవిరాజితం 1033 | నలరాఘవ యాదవ పాండవీయం 868 ధూర్జటి 108 | నల్లతిమ్మరాజు, పొట్లపాటి 245 ధూర్జటి కవులు 598 | నవగ్రహస్తవం 403 ధేను మాహాత్మ్యం 503, 974 | నవచోళచరిత్ర 152, 160, 1 ధ్రువ చరిత్ర 616 | నవనాథచరిత్ర 953 నంజరాజవాణీవిలాసం 867 | నవాబులయుగం 234 నందనందన శతకం 777 | నవీన కాళిదాసు 868 నందన చరిత్ర ॥ 404 | నాంచారు పరిణయం 1018 నక్షత్ర ఖీలనం 819 | నాగదత్తోపాఖ్యానం 728 నగరేశ శతకం 779 | నాగభూషణం, తుమ్మలపల్లి 95కీ నన్నయ్య, మోచర్ల 480 | నాగరఖండం 1034 నరసప్పయ్య, దళవాయి 876 | నాగరాజు, చెన్నాప్రగడ 1021 నరసభూపాలీయం 322 | నాగశాస్త్రీ బృహత్తటాకం 1022 నరసభోజనుతి 876 | నామయోగి 344 నరసయ్య, పోచిరాజు 245 | నాయకరాజులయుగం 496 నరసయ్య, బడగలనాటి 1017 | నారప్ప, కంభంపాటి 348 నరసరాజు, కంఠీరవ 863 | నారాయణ, అయ్యలరాజు 781 నరసరాజు, గొబ్బూరి 245 | నారాయణ, కోన 795 నరసింగన్న 148 | నారాయణతీర్ణులు 743 నరసింహం, అంగర 798 | నాసిేతోపాఖ్యానం 179

1044 నాస్తిక దర్శనాలు 842 | పారిజాతం 746 నింబజా మాహాత్మ్యం 1017 | పారిజాతాపహరణం గ! నిమ్మయ్య, పిడపర్తి 144 | పార్షతీ పరిణయం 921 నిరంకుశోపాఖ్యానం 217 | పిడపర్తి కవులు 144 నీలాసుందరీ పరిణయం 958 | పిల్ల వసుచరిత్ర 956 నృసింహకవి, సంకుసాల 117 | పురుషోత్తమ దీక్షితులు 70%6 నెల్లూరి కవులు 911 | పురూరవచరిత్ర 348 నేబతి 488 | పుష్పగిరి తిమ్మన్నవంశవృక్షం _ 52 వైషధపారిజాతం 608 | ఫపూతనాహరణం ూం పంచకన్యాపరిణయం 923 పషృథుచరిత్ర 103 పంచతంత్రం 185 | పెదకెంపరాయడు 477 పంచతంత్ర ప్రబంధం 264 | పైదతిరుమలయ్య 14 పంచరత్నాలు 224 | పైెదనరసింహరాయలు, మరింగంటీ 824 పతితపావన చరిత్ర 908 | పెద పర్చతన్న మక 1 పద్మనాయక చరిత్ర ఠం పెద బాపయ్యశకాస్త్రి, అయ్యగారి 962 పద్మనాయక భూపాలుడు, సర్వజ్ఞ. 492 | ప్వైల్వన్స ద్దూవు న పద్మపురాణం 456 పెదదాసు 76 పద్మావతీకల్యాణం 411 | పెదదాసుచరి త 79 పరతత్వరసాయనం జర వక ఎలుగంటి 4కు పరమభాగవతచరిత్ర 5% | పెట్టేయి, ఒడ్డెపూడి 470 పరమభాగవత చరిత్ర కర్తలు 594 పెద్దాపురం ప్రభువులు 613 పరమయోగి విలాసం 150, 294, ౩58, 828 | అదొ ్నొ పొన్నాడ 406 పరమానందతీరులు 348 | వగుచుత్సకవులు 260 పరమానంద శతేకం 360 | వెమ్రున. భావన 407 పర్వతనారదోపాఖ్యానం 919 | వెరియన్స్య ఉప్పుగుండూరి 505 పర్వతన్న ఎడవల్లి 489 | పేరయలింగం 44 పర్వతపురాణం 409, 112 | పేరయ్య, బొడ్డపాటి 408 పాంచాలీ పరిణయం 659 | పోతయ్య, ప్రెగ్గడపల్లి 780 పాండురంగ మాహాత్మ్యం 204 | పోతరాజు 231 పాటిగణీతం 227 | పోలమరాజు 409 పాపన్న, మాచవరపు 938 | ప్రకాపచరిత్ర 377 పాపయ్య, తుమురాడ 1025 | ప్రతాపరుద్ర యళోభూషణం 228 పాపరాజు, కంకంటి 583 | ప్రతాపసింహుడు 909 పామనాయకుడు 828 | ప్రద్యుమ్నచరిత్ర 406

1045 ప్రద్భుమ్ను విజయం 406 | బుధ మనస్తోషణి 62 ప్రబంధరాజ వెంకటేశ్వర విజయవిలాసం 723 | బుస్సీదొర 803 ప్రభావతీ ప్రద్యుమ్నం 250 | బృహన్నారదీయం 177 ప్రభుదేవర వాక్యం 347 | బేతాళపంచవింశతి 231 ప్రభులింగ లీలలు 145 |, బొమ్మ పెట్టడం క32 ప్రయోగసారం 232 |, బొమ్మల కథలు 10 ప్రసన్న రాఘవం 439 | బొమ్మలాట కవులు 227 ప్రహ్హాదచరిత్ర 647 | బోడిపర్వతన్న 6524 పోలునాటికవులు 955 | బోరవెల్లికవులు 795 బందరు సర్కారు 943 | బోరవెల్లి సంస్థానం 767 బడబానలభట్టు 561 |, బ్రహ్మయలింగం, ముదిగొండ 827 బమ్మెరకవులు 434 బ్రహ్మాండ పురాణం 478 బలభద్రయ్య, కవిధాటి 1016 | బ్రహ్మోత్తర ఖండం కీ్‌5్‌ బలభద్రరాజు 617 భక్టమందార శతకం 364 బలభద్ర విజయం 618 , భగవంతం, సత్యవోలు 969 బసవన్న, కాచిరాజు 232 | భగవంతరాయమణీి 898 బసవయ్య, అంగద 260 | భగవద్గీత 348 బసవయ్య, చెన్న 494 | భగవద్గీతార్థ దర్పణం 835 బసవ విజయం 954 | భట్టుమూర్తి 321 బశిర కరివేల్పు శతకం 997 | భద్రగిరి మాహాత్మ్యం 867 బహుళాశ్వచరిత్ర 247, 68 | భద్రాద్రి శతకం 1036 బాపయ్య, అల్లమరాజు 1016 |, భద్రాయురాభ్యుదయం 811 బాలకవి సుబ్బన్న 922 | భరతశాస్త్రం త13 బాలకృష్ణలీలా విలాసం 924 | భర్గ శతకం 959 బాలక్రీడా విహరం 799 | భల్లాణచరిత్ర 485 బాలగోపాల విలాపం 492 | భవానీశం, ఈదురుపల్లి 980 బాలగోపాల శతకం 777 | భవ్యనొమశతకం 1023 బాలభాగవతం 353 | భానుకవి 185 బాలభారతం 228 | భానుమతీ పరిణయం 483 బాల భాస్కరుడు, అడిదం 9386, 1026 భానుమద్విజయం 257, ఈ9 బాలరామాయణం 723 | భామాకలాపం - రచనా ప్రణాళిక 751 బాలసరస్వతి 508 | భారత సావిత్రి క్ష72 బాలసరస్వతి, అయ్యంకి 1033 | భారతీ పరిణయం 483, 991 బాలసరస్వతి, ఎలకూచి 512 | భావన, రేటూరి 468 బాలసరస్వతీయం 613 భావనారాయణ, కలిదిండి తాత బుచ్చి వెంకటాచార్యులు, కిరీటి. 831 | భాస్కరకవి, శ్రీపతి 459

1046 భాస్కర శతకం 458 | మల్గుభట్టు, ఘటసాని 410 భాస్కరాచార్యులు 472 |, మల్లణచరిత్ర 393, 9386 ఖీమకవి, వేములవాడ 301 | మహమ్మద్‌చరిత్ర 240 థీమఖండం 123 | మాంధాతృచరిత్ర 117 థీమన్న 231 | మాఘమాహాతవమ్యం 476, 877 ఖీమసేనవిజయం 616 | మాచన్న, ఖైరవయ్యగారి 817 భువనవిజయం 67 | చమూడయ్యకవి 16 భోసల కోసలీయం 910 | మాతపురాణం 466 మంగమ్మ దండకం 875 | మాదన్న 800 చయంగమ్మ దక్షత 875 | మాధవరాయలు, సురఖి 512 చముంగా దుష్పాంసులా విలాసం 870 |, మాధవుడు, ఫణిదపు 406 మంచన 781 | మారీచీ పరిణయం 8 మత్స్యపురాణం 140, 147 | మార్గరెట్‌ రాణీ 781 మదాలసచరిత్ర 45 | మాలినీ మాధవీయం 888 మధురనాయకరాజులు 874 మాహాత్మ్య కావ్యాలు 1015 మధురమంగా పుంశ్చలీ విలాసం 875 | మిత్రవిందా పరిణయం 478, 892, 1025 మధురవాణి 693 | మీనకేతాభ్యుదయం 505 మధురవాణీ విలాసం 758, 762 | ముకుందయోగి 494 మనుచరిత్ర 97 | ముక్కుతిమ్మన్న 40 మనుమంచిభట్టు 24 | ముక్తికాంతా పరిణయం 925 మనోహరశతకం 815 | ముత్తరాజు, నెల్లూరి 411 మన్నారు కృష్ణశతకం 792 ముద్దమరాజూు, రెడ్డిపల్లె 232 మన్నారుదాసవిలాసం 634, 696 | ముద్దరాజు సోదరులు కత? మన్నారుదేవుడు 708 | ముద్దు అళగిరి 503 చున్నారురంగపదాలు 886 ముద్దుపళని 925 చలయకూటం 67 ముద్దుమంగ 908 మలిరాయలయుగం 1 | ముముక్షుజనకల్చం 1031 మల్లన, చదలవాడ 293 | ముమ్మడి తిమ్మప్ప, సుగ్గుటూరి 631 మల్లన, తరిగొప్పుల _ 249, 429, 795 | ముమ్మడి మల్లన 3|ీర్‌ మల్లన, పావులూరి 1036 | ముమ్మడి ముద్దు వీరప్ప 874 మల్లన, ప్రొఢకవి 162, 562 | ముమ్మయ్య, బైతరాజు 410 మల్లన, మాదయగారి 40౦9 | మూకరసు 863 మల్లయ్య, నండూరి 409 | మూరువర్పకులు 25్‌ మల్లయ్య, మద్దికాయల 410 | మూర్తికవి, చింతపల్లి 757 మల్లారెడ్డి, కామినేని 456 | మృత్యుంజయ విలాసం 1003 మల్లికార్జున సిద్ధయోగి -816 | మెదకు సుబా కవులు 817

1047

మెదకు సుబా సంస్థానాలు 817 రసికజన కంఠాభరణ శ్రీకృష్ణ

మేధావిభట్టు 561 | దశావతారచరిత్ర 589 మైరావణ చరిత్ర 16 | రసికజన మనోఖిరామం 956, 960 మొదటి బసవకవి, పిడపర్తి 144 | రాగతాళ చింతామణీ 919 మొల్ల 267 | రాఘవాపాండవీయం 301 మొల్ల రామాయణం 267 రాఘవయ్య 142 మోహనకవి 227 | రాఘవాచారి, చక్రపురి ౩73 మోహనాంగి 8 | రాఘవాభ్యుదయం 758 యధావాల్మీకి రామాయణం 1026 | రాజకవి, తురగా 1033 యమశతకం 723 | రాజగోపాలవిలాసం 636, 687 యయాతిచరిత్ర 285, 796 | రాజనీతి రత్నాకరం 488 యాగంటివారి వచనాలు 151 |, రాజయ్య, పులిపర్రు 780 యాగయ్య, చింతలపల్లి 758 | రాజరంజన విద్యావిలాసం 906 యాజ్ఞ్యవల్క్యచరిత్ర 60, ౪8 | రాజరాజాఖిషేకం 798 యాదవ భారతీయం 823 | రాజలింగకవి శ7ర్‌ యాదవామాత్సుడు 226 | రాజవాహన విజయం 659 యామునాచార్భులవారి చరిత్ర 58 | రాజశేఖర చరిత్ర 964 యోగానంద అవధూత 347 | రాధామాధవం 123, 49, 6765 రంగకవి, కస్తూరి 92 | రాధామాధవకవి 123 రంగప్పరాజు, రామరాజు 245, 251, 362 | రాధామాధవ సంవాదం 927, 93 రంగరాజుగారి జగ్గరాజూ, కస్తూరి. 617 రాధికా సాంత్వనం -. 89, 926 రంగవిలాసం 1027 | రాబర్ట్‌ లే 804 రంగశాయి, గురజాల 680 | రామకథాఖిరామం 1027 రంగశాయి, బాగూరు 928 | రామకవి, కొండా కరి1 రంగాజమ్మ 634, 693, 705 | రామకవి, తురగా 967 రఘునాథనాయకాభ్యుదయం _ 633, 646 | రామకవి, పట్టాఖి శీరి2 రఘునాథనాయకుడు 503, 524 | రామకృష్ణవిలాసం 799 రఘునాథ రామాయణం 628 | రామకృష్ణుడు, తెనాలి 198 రఘునాథాభ్యుదయం 646 | రామచంద్రయ్య, కోదండరామయ్యగారి 228 రతి రహస్యం 134 | రామచంద్ర శతకం 792 రతీమన్మథవిలాసం 813 | రామచంద్రుడు, బడబాగ్ని 466 రత్నావళీ పరిణయం - 407 | రామచంద్రోదయం 822 రమణయ్య, దివి 627 | రామన్న, తురిమళ్ళ 1012 రసప్రదీపిక 1032 | రామన్న, ముద్దరాజు 450 రసమంజరి 45 | రామభద్రమ్మ 693 రసవాదం 858 | రామభద్రయ్య, పుత్తేటి 104

1046

రామభద్రయ్య, శ్రీపతి 1018 | రుద్రకవి శతకం 224

రామభద్రుడు, అయ్యలరాజు 272, 278 రెండవ బసవన్న, పిడపర్తి 146

రామయమంత్రి, ధరణిదేవుల 588 | రేటూరి కవులు 483

రామయ్య, ఎలకుర్తి 411 | రేవతీ పరిణయం 410

రామయ్య, కటికనేని 1011 | రేవూరి కవులు 871

రామయ్య, ఘనగిరి 1026 , లక్షణమంజరి 341

రామయ్య, ధరణీదేవుల 785 | లక్షణ విలాసం 485

రామయ్య, లింగముగుంటు 279 | లక్షణసారం 986. 1028

రామయ్య, వాసిరాజు 177 | లక్షణసార సంగ్రహం 342

రామరాజభూషణుడు 321 | లక్షణా పరిణయం 619 రామరాజీయం 598 | లక్షణా పరిణయకర్తలు 620 రామరాజు, పింగళి 563 | లక్ష్మణకవి, ఏనుగు 615 రామరాజు, పెద్దిరాజుగారి 488 | లక్ష్మన్న, నిమ్మల ॥ 1021 రామలింగం, తెనాలి 1033 | లక్ష్మయ్య, గార్లపాటి 152, 18 రామలింగయ్య, గద్దె 779 | లక్ష్మయ్య, భండారు 8 రామలింగయ్యగారి అబ్బాయి 779 | లక్ష్మయ్య, యాగంటి 151 రామలింగశతకం 411, 990 | లక్ష్మీనారాయణ సంవాదం 1005 రామవిలాసం 977 | లక్ష్మీ నృసింహ విలాసం 793 రామశతకం 815 | లక్ష్మీపతి, రాపాక 811 రామాజెట్టీ, తొక్కడం 1023 | లక్ష్మీవిలాసం 482 రామానుజాచార్యులు, అచ్చి 1031 | లచ్చన్న, పైడిపాటి 942 రామానుజాచార్యులు, అత్తాను 826,1032 | లయగ్రాహికవులు 757 రామానుజాచార్యులు, కొండ్రవీటి 825 | లింగకవి 1028 రామాభ్యుదయం 272 | లింగకవి, భద్రకవి శ71 రామాయణ రచయితలు 1024 | లింగమూర్తి, పరశురామపంతులు 812 రామేశ్చర మాహాత్మ్యం 977 | లింగయ్య, పోశెట్టి 152, 159 రాయప్పరాజు 617 లింగయ్య, రంగరాజు 562 రాయల జీవితంలో ముఖ్యఘట్టాలు 70 | లింగరాజు 606 రాయవాచకం 382 | లీలావతీ కళ్యాణం 904, 916 రుక్మాంగద చరిత్ర 162, 916 | లీలావతీ శాహరాజీయం 922 రుక్మావతీ పరిణయం 632 | లీలావిలాసం 1011 రుక్కిణీ కల్యాణం 1032 | వచన భారతం 865 రుక్మిణీ కురవంజి 827 | వచన రామాయణం 866 రుక్మిణీ పరిణయం?738, 816, 956, 970, 994 | వచన విచిత్ర రామాయణం 1025 “రుచి వ్యాఖ్య 62 | వజాభ్యదయం 795 రుద్రకవి, కందుకూరి వటమూలమందిరా శతకం ౩43

1049 వటమూలుడు 343 | విరోధి వరూధినీ ప్రమాదినీ 829 “వనమాలి లక్షణం 585 | వివిధ నాట్య సంప్రదాయాలు 749 వరంగల్లు సుబాకవులు 810 | వివిధ వేషకథలు 754 వరంగల్లు సుబా సంస్థానాలు 810 | వివేక సింధువు 4939 వరదరాజు, కట్టా 593 ( విశ్చనాధం, వెణుకుదురుపల్లి 614 వరదాంవీకా పరిణయం 8 | విశ్చ్వనాథనాయకుడు 4939 వరరుచి 757 | విశ్వామిత్ర చరిత్ర 977 వరాహపురాణం 136 | మ్స్పోశ్చరకవి 341 వల్లభయ్య, కోడూరి 227 | విశ్వేశ్చరచ్చందం 341 వల్లభాభ్యుదయం 520 | విశ్వేశ్చ్వర పండితుడు ౭90 వసుంధరా పరిణయం 912 | విష్ణుకథా నిధానం 410 వసుచరిత్ర 329 | విష్ణుపురాణం 169, 474 వసుచరిత్ర వ్యాఖ్యానం 794 | విష్ణుభక్తి సుధాకరం 999 వసుదేవనందన శతకం 816 | విష్ణ్రభజనానందం తక్‌ వాజణీవిలాసం 84 | విష్ణమాయానాటకం 130 వాజణీవిలాస వనమాలిక 585 | విష్ణుమాయావిలాసం 936 వామనపురాణం 475 | విష్ణుమిత్రోపాఖ్యానం 487 వాల్మీకిచరిత్ర 638 | వీరగాథలు 907 వాశిష్టలైంగధర్మం 455 | వీరనరసింహరాయలు 2, 45 వాసంతికాపరిణయం 91 | వీరనారాయణ శతకం 815 వాసప్పనాయకుడు 37 | వీరభద్రయ్య. వక్కలంక 978 వాసవదత్తా పరిణయం 979 | వీరభూపాలీయం 865 వాసవీ మాహాత్మ్యం 472 | వీరయ్య, పోతురాజు 232 వాసుదేవ దీక్షితులు 920 | వీరరాఘవకవి, చింతలపల్లి 757 విక్రమార్క చరిత్ర 167 | వీరరాఘవయ్య, కొటికలపూడి. 833 విఘ్నేశ్వర పరిణయం 908 | వీరరాఘవయ్య, నెల్లూరి 912 విజయరాఘవ కల్యాణం 709 | వీరరాఘవుడు 278 విజయరాఘవ నాయకుడు 50, 632 | వీరరాజు 86కీ విజయరాఘవుని రచనలు శ41 | వీరరాజు, కళువె 1027 విజయరామరాజు, పూసపాటి 998 | వీఠశరభయ్య, కంచి క్ర] విజయవిలాసం 547 | వీరశైవం 844 విద్యావతీదండకం 727 | వీరేశ్చరుడు 48ిర్‌ విద్వజ్ఞన రంజని 794 | వెంకటకవి, గణపవరపు 723 విప్రనారాయణ చరిత్ర జ, 64 | వెంకటకవి, చేమకూర 646 వీమలాంగీ పరిణయం 993 | వెంకటకవి, జక్కరాజూ 368 విరూపాక్షయ్య. శ్రీగిరి 776 | వెంకటకవి, ఢీల్లి 346

1050 వెంకటకవి, బాలశయన 298 | వెంకటాచల శతకం 1020 వెంకటకవి, యడవల్లి 868 | వెంకటాచార్యులు, కిరీటి 829 వెంకటకృష్ణకవి, గునుగుటూరు 612 | వెంకటాచార్యులు, ముడుంబి 1032 వెంకటకృష్ణప్పు, సముఖం 878 | వెంకటాచార్యులు, యతిరాజు 1016 వెంకటగిరి, దర్చా 916 | వెంకటాచార్యులు, రేవణూరి .- 150 వెంకటనరసయ్య, పైడిపాటి 792 | వెంకటాద్రి. కొండ్రాజు 2465 వెంకటనాథుడు, బైచరాజు 264 | వెంకటాద్రి. పెనుమత్స 260 వెంకటపతి, ధూర్జటి 407 | వెంకటాచార్యులు, తిరునగరి 778 వెంకటపతి, నడిమింటి 860 | వెంకటార్యులు, పెనుమర్తి 485 వెంకటపతి, పైడిమర్రి 624 | వెంకటేశ శతకం 780 వెంకటపతి, మహంకాళి 588 | వెంకటేశాంధ్రం 724 వెంకటపతి, రాయసం 4892 | వెంకటేశ్వర శతకం 344 వెంకటపతి, రోసనూరి 935 | వెంకటేశ్వరులు, కొట్రూ 991 వెంకటపతి, వెలిదండ్ల 927, 93 | వెంకన్న, వెలగపూడీ 256 వెంకటపతి, శేషం 882 | వెంకయ్య, అందుగుల 5998 వెంకటపతి సోమయాజి కామరసు 703 | వెంకయ్య, చల్లపల్లి 918 వెంకటప్ప 624 | వెంకయ్య, మారస “458 వెంకటయోగి, మారేపల్లి 347 | వెంకయ్య, వెణుకుదురుపల్లి 617 వెంకటయ్య. దిట్టకవి 614 | వెంగళరాజు, దామెర్ల 247, 648 వెంకటయ్య, పొత్తపి 869 | వేదాంతసార సంగ్రహం 889 వెంకటయ్య, రాచపూడీ 490 | వేమన 840 వెంకటయ్య, సింహాద్రి 618 | వేమన పద్య రచనాశిల్చ్బ ప్రభావం 856 వెంకటరమణ 452 | వేమన శతకం - సంస్కృత అనువాదం 858 వెంకటరమణకవి, గూళికల్లు 478 | వేమన స్థలనామాలు 848 వెంకటరమణకవి, ముడియం 493 | వైజయంతీ విలాసం 289, 294 టెంకటరాజుగారి జగ్గరాజు, వత్సవాయి 617 | శంకరకవి . 252 వెంకటరామయ్య, శ్రీనాథుని 811 | శంకర విజయం 408 వెంకటశాస్త్రి, ఆణీవెళ్ళ 950 | శంభుదాసు, బాణాల 952 వెంకటసుబ్బయ్య, దేవకి 1025 | శతుంతలా పరిణయం 150 వెంకటాచలం, బుగ్వేదకవి 296, 939 | శతకకవులు 776, 1019 వెంకటాచలం, కుందుర్తి 891, 1024 | శతముఖ రామాయణం 1028 వెంకటాచలం, కోడూరి - 868 | శతానందయోగి 461 వెంకటాచలం, తిరుపతి 1020 | శమంతకమణి చరిత్ర 490 వెంకటాచలం, భాస్కర 1018 | శరభోజి 904 వెంకటాచలం, వెన్నెలకంటి 628 | శశాంక విజయం 883 వెంకటాచలపతి శతకం 776 | శవిలిందు చరిత్రం 494

1061 శరేఖా పరిణయం 942 శేషాచలం, భాస్కర 1018 శాలిహోత్రం 24 | శైవాగమ శిఖామణి 495 శాహమహారాజ కల్యాణం 923 | శ్రవాచార సంగ్రహం 230 ఇాహరాబ విలాసం 910 శోభనాద్రి, కౌొడూరి 799 ఇంహాజీ 898 | శ్యామారాయడు, అసహాయ 1024 తిరా సుబాకవులు 861 శ్రీకాళహస్తీశ్వర! మాహాత్మ్యం 111 శివకామసుందరీ పరిణయం 906 | శ్రీకాళహస్తీశ్వర శతకం 108 వివధర్మోత్తరం 456 | శ్రీకృష్ణకర్ణామృతం 258 వివభక్తి విలాసం 867 , శ్రీకృష్ణవిజయం 621 శివరాత్రి మాహాత్మ్యం 618 | శ్రీకృష్ణలీలావిలాసం 923 శివరామకవి, కోట 486 | శ్రీకృష్ణ విలాసం 920 శివరామయ్య, నెల్లూరి 911 | శ్రీగవిరంగనాధ శతకం 461 శివలీలా విలాసం 956 | ఛ్రీగిరికవి 277 శుకచరిత్ర 815 | శ్రీనాథుడు 123 శుకద్రింశతి 784 | శ్రీనివాస తాతాచార్యులు 829 శుకసప్తతి 782 | శ్రీనివాసదీక్షితులు, రత్నఖిట 496 శుద్దాంధ్ర నిరోష్ట్య సీతాకల్యాణం 337 | శ్రీనివాసాదార్భులు, కవికార్కికువ. 819 శుద్దాంధ్ర రామాయణం 966, 1026 | శ్రీనివాసుడు, కొడీచెర్ల 1014 శూద్ర ధర్మోత్సల ద్యోతినీ స్కృతి కౌముది819 | శ్రీనివాసుడు, తాళ్ళపాక 779 శూద్ర స్కృతి 819 | శ్రీపాదరోణు మాహాత్మ్యం 150 శృంగార దామం 627 | శ్రీ ముష్ట మాహాత్మ్యం 894 శృంగార దీపిక 134 | శ్రీరుగమూహాత్మ్యం 434, 596, 877, 1018 శృంగార మంజరి 679, 723, 822, 990 | శ్రీరంగ మాహాతమ్య కర్తలు 695 శృంగార రసమంజరి 1009 | శ్రీరామదండకం 990 శృంగార రసాలవాలం 492 | శ్రీరామ విజయం 614 శృంగారలహరి 680 | శ్రీశ్రల మాహాత్మ్యం 277 శృంగారసావిత్రి 542 | శ్లేషకవిపితామహుడు 808, 612 శేషధర్మకవులు 1012 | శ్లేషకవులు - 608 “ శేషధర్మరత్నాకరం 1014 | శ్రేషళావ్యకర్తలు 612 శేషధర్మాలు 1012 | శ్లేషకావ్యాలు 304. 612 శేషనాథుడు, నాగలూటి 412 | షట్టక్రవర్తి చరిత్ర 228, 466 శేషయ్య. ఏలూరి 662 | షడ్చాషా వివరణం 513 శేషయ్య, ఘట్టు (ప్రభువు) 836 | షణ్ముఖ సహస్రం 1022 శేషయ్య, ధర్మపురి 1023 | షోడశ కుమార చరిత్ర 1% శేష్టాల విహార శతకం 580 | షోడశ రాజచరిత్ర శేషాచలం, నివర్తి 910 | సంక్షేప భాగవతం 233

1052 సంగమ వంశం 242 | సారసంగ్రహ గణితం న! సంగమవంశరాజులు 01 | సావిత్రీ కల్యాణం 542 సంగరాజు 203 | సాళువ వంశం 242 సంగీతకళా రహస్యునిధి 328 | సింగరాచార్యులు, మరింగంటి 824 సంజరాజు, కళువె 867 | సింగరాచార్యులు, శేషభట్టరు 819 సంజీవకవి, చింతలపల్లి 758, 823 | సింహాద్రి నారసింహశతకం 1007 సంజీవనీ వ్యాఖ్య 62 | సింహాసన ద్వాత్రింశిక ్రి సంజీవయ్య, రావూరు 815 | సిద్ధన పైగడ 232 సంస్కృతాంధ్ర కవితా పీకామహుడు618 | సిద్ధయ్య, చేకూరు 1018 సకలకథాసార సంగ్రహం 104 | సిద్ధయ్య, బొమ్మలాట 227 సకల జీవన సంజీవనం 452 | సిద్దరామకవి 347 సకల ధర్మసారం 233 | సిద్ధేంద్రయోగి 743 సకల లక్షణసార సంగ్రహం . 941, 959 | సిద్ధేంద్రుడు 754 సచ్చిదానంద అవధూత, అఖండ _ 348 | సిద్ధెశ్చర చరిత్ర 382 సత్యభామా విజయం 837 | సీతపాట 814 సత్యభామా సాంత్వనం 736 | సీతారామాంజనేయ సంవాదం 813 సక్యావధూ ట్రీణనం 45 | సీతారాముడు, అణీవెళ్ల 951 సత్రమరులు 706 | సీతావిజయం 1028 సదానందయోగి 344 | సీనయ్య, తిరుమలయ్యగారి 1022 సదానందయోగి శతకం 344 | సీనయ్య, వంగల 686 సష్తాంబిక 168 | సీమంతినీ పరిణయం 984 సమీర కుమూర విజయం 568 | సుందర నాయనారు 436 సరస్వతీ సోమయాజి పట్టమెట్ట 1032 | సుందరీమణి శతకం 1003 సర్వకవి, లింగమగుంట 278 | సుగ్రీవ విజయం 221 సర్వప్ప, కాసె 382 | సుదంతా కల్యాణం 892 సలాబత్‌జంగ్‌ (నిజాం) 803 | సుదక్షిణా పరిణయం 277 సాంఖ్యావిచారం 494 | సునందా పరిణయం 949 సాంబనిఘంటువు 932, 942 | సుబ్బరాయ శతకం 969, 1022 సాంబయ్య, బొమ్మలాట 227 | సుబ్బారాయుడు, రాజవోలు 627 సాంబవిలాసం 453 | సుభద్రా కల్యాణం 557 సాంబోపాఖ్యానం 251, ౫2. 490 | సుభద్రా పరిణయం 965. 972 సాగర సంగ మాహాత్మ్యం 959 | సుభాషిత రత్నావళి 975 సాధ్వీజన ధర్మం 766 | సుభాషిత శతకానువాదం 975 సానందోపాఖ్యానం 486 | సురపురం రాజవంశావళి 827 సాముదికశాస్త్రం 404 | నురపురం సంస్థానం - 827 సారంగధర చరిత్ర 550, 879, 959 | సురాభాండేశ్వరం 839

1053 సుల్తాన్‌ కులీ 234 | సోమయ్య, పెనుమళ్ల ర84 సూతులు 464 | సోమరాజు, పుసులూరి 777 సూరన, అడీదం 942. 987 | సోమవార వ్రత మాహాత్మ్యం 954 సూరన్న నారన్నగారి త్ర్ర1 సోమేశ్వర శతకం 1021 సూరన్న పింగళి 246, 298 | సోమేశ్చరాచార్యులు 1021 సూరన్న రామయ్యగారి 1017 | సౌగంధికాపహరణం 229 సూరన్చ్య, వెన్నెలకంటి 166 | సాౌపర్జ్ణాఖ్యానం 796 సూరపరాజు, ఉడుమూరి 776 | సొరపాదపం 785 సూరప్పనాయకుడు 496 | స్థలపురాణాలు తీర4 సూరయ్య, కంచిరాజు 413 | స్థానాపతి 382 సూరయ్య, చల్తా 925 | స్వరమేళ కళానిధి 499 సూర్య శతకం 408 | హంసవింశతి 782 సేతుమాహాత్మ్యం 1018 | హయలక్షణ విలాసం 25 సోమన, లోకేకావు 618 | హరికథాసారం 92 సోమనాథం, రేకపల్లి 994 | హరిదత్తోపాఖ్యానం 409 సోమనాథుడు, కొటికలపూడి 487 | హరిభట్టు 13, 147, 744 సోమనాథుడు, పట్టమట్ట 455 | హరిలీలా విలాసం 199 సోమనాథుడు, పాల్కురికి 191 , హరిశ్చంద్ర నలోపాఖ్యానం 335, 452 సోమనాథుడు, పిడపర్తి 141, 154 | హరిశ్చంద్ర మహారాజు 907 నమనాథుడు, వేములవాడ 794 | హరిశ్చంద్రోపాఖ్యానం 253 సోమన్న ఆత్మకూరు 508 | హాలాస్య మాహాత్మ్యం 1018 సోమయ్య శ్య/ 918 | హెప్పామెరన్‌ 781 సోమయ్య, దావ్యరాజు 413 | హేమాబ్దనాయికా స్వయంవరం 701. 70% సోమయ్య, పులిజాల 245 | హొన్నయ్య, చరిగొండ 1001 సోమయ్య, పెదపాటి 226, 390 | హోసూరి సాకమ్మ 1027

1054 సంప్రదించిన గ్రంథాలు - వ్యాసాలు

అచ్యుతరావు, టీకుమళ్ళ - “విజయనగరసామ్రాజ్బమందలి ఆంధ్ర వాజ్మయ చరిత్రము

అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి - “వేమని, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్సు, వాల్తేరు, 1929, 1971

అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి - 'సారస్వతావలోకము'. త్రివేణి పల్లిషర్స్‌, మచిలీ పట్టణము, 1954

అప్పారావు, గురజాడ = “కన్యాశుల్కం', 1911

అప్పారావు, విస్సా = "క్షేతయ్యపదములు', అంధ్ర గానకళాపరిషత్తు, రాజమండ్రీ, 1963

ఆదినారాయణ శాస్త్రీ, పంచాగ్నుల - 'నవచోళచరిత్ర' మద్రాసు, 1923

ఆదినారాయణ శాస్త్రి పంచాగ్నుల - “వాత్సా్యాయనకామసూత్రములు' అర్భభారతీ పైస్సు, మద్రాసు 1930

ఆరుద్ర - “మన వేమన శ్రీ వేంకటేశ్వర విశ్చవిద్యాలయం, తిరుపతి, 1985.

ఆరుద్ర _. “వేమన వేదం, న్యూస్టూడెంట్స్‌ బుక్‌ సెంటర్‌, విజయవాడ, 1985.

ఆరుద్ర = “సమగ్ర ఆంధ్ర సాహిత్యం' సంపుటాలు, ఎమెస్కో ప్రచురణలు, & ప్రజాశక్తి బుక్‌ హౌస్‌, విజయవాడ, 1999 నుండీ

ఈశ్వరదత్తు, కుందూరు _ “ప్రాచీనాంధ భూగోళం, శివాజీపైస్‌, సికిందరాబాదు, 1963.

కులశేఖరరావు, ఎం. (సం) - “సింహగిరి వచనములు (కృష్ణమాచార్య ష్టాదరాబాదు, 1968 ం

కృష్ణకుమారి, నాయని =. “తెలుగు జానపద గేయ గాథలు ఆంధ్ర సారస్వత పరిషత్తు, ప్టాదరాబాదు, 1977

కృష్ణశాస్త్రి హెచ్‌ = ౪0100198 ౮ 60100010 1౧618 పుణ్యకుమారుని మాలెపాడు శాసనాలు

కృష్ణశ్రీ (సంపా.) _ “స్త్రీల పొరాణికపుపాటలు'. అంధ్ర సారస్వత పరిషత్తు, ష్టాదరాబాదు, 1963

కోదండరామిరెడ్డి, మరుపూరు. - 'వేమన, పాశ్చాత్యులు, వర్థమాన సమాజము,

(అనువాదం) నెల్లూరు, 1971

గోపి, ఎన్‌ - 'ప్రజాకవివేమని చైతన్వ్స ప్రచురణలు, ష్టాదరాబాద్‌, 1980

గోవింద దీక్షితులు (అవతారిక) - 'సంగితసుధ', సంగీత అకాడమి, మద్రాసు 1940

1055 చినతిరువెంగడనాథ, తాళ్ళపాక _ - “అన్నమాఛార్య చరిత్రము తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి, 1949. చిన సీకారామస్వామిశాస్త్రి వజ్ఞల - “వసుచర్తిత్ర-విమర్శనము', వావిళ్ళ రామఫ్వామి కాసులు, మద్రాసు, 1965. చిన్నికృష్ణయ్య, దేవళ్ళ _ “వరాహ పురాణము' హరిభట్టు ప్రణీతము, ప్రదీప ప్రచురణలు, మద్రాసు 1978 జగన్నాథశర్మ, దువ్వూరి _. తెలుగు పారాశరీయహోరి, పూసపాటి విజయ రామగజపతి విరచితము (1670-1756), నటశ్రీ, ప్రచురణాలయం, రామచంద్రపురం, 1955. జానకి రామయ్య, చోడవరపు - “మలహణచరిత్ర, _ (పెదపాటి ఎల్జనార్య విరచితము), శృంగార కావ్య గ్రంథమండలి, మచిలీపట్టణము, 1940. జోగారావు, యస్పీ - “ఆంధ్ర యక్షగానవాబ్మయ చరిత్ర ఆంధ్రవిశ్చకళా పరిషత్తు, వాల్తేరు, 1960 జోగారావు, యస్వీ _ *“ఆంధ్రయక్షగాన వాజ్బయ చరిత్ర సరస్వతీ పవర్‌ వెస్‌, రాజమండ్రీ, 1961. తాళ్ళపాక కృతులు = "శృంగార కీర్సనలు' 8వ సంపుటం దొణప్ప, తూమాటి = “ఆంధ్ర సంస్థానములు- సాహిత్యపోషణ, ఆంధ్ర విశ్చకళాపరిషత్తు, వాల్తేరు 1969. దొణప్ప, తూమాటి _. తెలుగులో బుడతకీచు నుడులు (వ్యాసం), భాషా చారిత్రక వ్యాసావళి అభినందన సంచిక హైదరాబాదు, 197 దొరస్వామిశర్మ, రావూరి _ శెలుగు భాషలో ఛందోరీతులు' వెల్డన్‌ బెస్‌, మద్రాసు, 1%2 ధర్మారావు, కాపీ _ “విజయవిలాసము-హ్యృదయోల్లాస వ్యాఖ్య, ప్టైదరాబాదు, 19698 నరసింహశాస్త్రి, చింతలపాటి - "కూచిపూడి భాగవతులు' నాగేశ్చరరావు, కాశీనాథుని - “ఆంధ్ర వాజ్మయ సూచిక, ఆంధ్ర పత్రిక కార్యాలయం, మద్రాసు, 1929 క = “రా ష రచనా వైఖరి అనన భా గానకాబోదిని మల్రాసు లి, లు “చాటుపద్య కరం, నెల్లూ 1 పెచ్చయ్యశా్ట్రి దీపాల య భాసా “బీతకాశ్‌ టీకాసహితం', పిచ్చయ్యశాస్త్రి. దీపాల స ప్రతాపరెడ్డి, సురవరం = “ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అంధ్ర సారస్వత ౦ పరిషత్తు, హైదరాబాద్‌, 1950

1056

ప్రతాపరెడ్డి, సురవరం - “ఖుతుబ్‌ షాహీ సుల్తానులు, ఆంధ్ర సంస్కృతిలో వ్యాసం

ప్రభాకరశాస్త్రి, వేటూరి - “చాటుపద్య మణీమంజరి' ప్రథమ ఖాగం, మణీమంజరి, ముక్త్యాల, 1952.

ప్రభాకరశాస్త్రి, వేటూరి - “చాటుపద్య మణీమంజరి (401. 1ఓ్ర) మణీమంబజరి ప్రచురణలు, హైదరాబాదు. 1988

ప్రభాకరశాస్త్రి, వేటూరి _ తంజావూరి ఆంధ్రరాజుల చరిత్ర, మణిమంజరి ప్రచురణలు, హ్టైదరాబాదు, 1984

ప్రభాకరశాస్త్రి వేటూరి (సం) _ “ప్రబంధ రత్నావళి కాజా వెంకట శేషయ్య, మద్రాసు, 1918

ప్రభాకరశాస్త్రి. వేటూరి _ “మీగడతరగలు', మణిమంజరి, ముక్త్యాల, 1951

ప్రభాకరామాత్య, వెల్దండ _ “ఆముక్ష్సమాల్యద' (పర్యాలోకనము) సాహిత్య నికీతనము, ప్టైదరాబాదు, 1945

ప్రసాదభూపాలుడు = “ఆంధ విజ్ఞానం' (7 సంపుటాలు - దేవిడీ జమీందారులు) కాకినాడ, రాజమండ్రి, 1938- 1941

మన్నారుదేవుడు - “హీమాబ్దనాయికా స్వయంవరం', సరస్వతీమహల్‌ గ్రంథమాల, తంజావూరు, 1956

మాధవశర్మ, పాటిబండ - “తపతీ సంవరణము', అద్దంకి గంగాధర కవి ప్రణీతము, ౬1454, 1972

యజ్ఞనారాయణ దీక్షితులు - “"సాహిత్యరత్నాకరం' (టి.ఆర్‌. చింతామణి), తంజావూరు, 1932

రంగాచార్యులు, చెలమచర్ల జు “ఆంధ్రప్రతాపరుద్రయశో భూషణం (పీఠిక) నాగార్జున బుక్‌ డిపో, నారాయణగూడ, ష్టాదరాబాదు, 1944

రజనీకాంతరావు, బాలాంత్రపు - 'ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము స్వతంత్ర ఆర్టు ప్రింటర్స్‌, విజయవాడ, 1958, విశాలాంధ్ర, 1975.

రవికుమార్‌, సూర్యదేవర - 'వ్యాససుధ' భట్టిప్రోలు 198

రామకృష్ణు నటరాజ _ “ఆంధ్రుల నాట్టాకళ, నర్తన మురళీ గ్రంథమాల,

రామకృష్ణశాస్త్రి శిష్టా - “వీరైవాంధ్ర వాజ్బ్మయం' తృతీయ ప్రకరణం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ, తిరుపతి, 1952

రామచంద్ర, తిరుమల _- “పరిశోధన (సం), మద్రాసు, 1954-55

రామయ్య, జయంతి = “ఆంధ్రసాహిత్య పరిషత్‌ పత్రిక సంపుటాలు 1914.

రామరాజు, బిరుదురాజు " - “ఖుతుబ్‌ షాహీ సుల్తానులు. ఆంధ్ర సంస్కృతిలో వ్యాసం

1057 రామరాజు, వీరుదురాజు - “చరిత్రతక్కని చరితార్థులు, ష్టాదరాబాదు రామరాజు, విరుదురాజు - "జానపద గేయాలు- సాంఘిక చరిత్ర" రామరాజు, వి =. తెలుగు జానపద గేయ సాహిత్యం, ష్టాదరాబాదు, 1958.” రామరాజు, బిరుదురాజు _ 'మరుగుషడిన మాణిక్యాలు", గోలకొండ పత్రిక

  • ప్రచురణలు, 19861 రామరాజు, వి = సంస్కృత వస్తుచరిత్ర (పరిష్కరణం) రామలింగారెడ్డి, కట్టమంచి - "కవిత్వ తత్త్వ విచారము, వాల్తేరు, 1941, లక్ష్మణస్వామి నాయుడు, ఏ, సరస్వతి పవర్‌ వైస్‌, రాజమండ్రీ, 1947 రామారావు, అడీదం - అడిదం సూరకవి జీవితం, వావిళ్ళ ప్రచురణ, మద్రాసు, 1955. రామారావు, అడిదం = “విస్మృత కళింగాంధ్ర కవులు రామేశంపంతులు, వేపా _. “తెలంగాణా శాసనము' లక్ష్మణరాయ పరిశోధక మండలి, హ్టైదరాబాదు, 1935, 1960 సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ సంపుటాలు. రామ్మూర్తి పంతులు, గిడుగు . - 'నిజమైన సంప్రదాయం' లక్ష్మీకాంతమ్మ ఊటుకూరి = '“అఖిలభారతకవయిత్రులు' లక్ష్మీపతిశాస్త్రి, శ్రీపాద _ “తుమార సంభవ విమర్శము”, ఆనంద ముద్రణా లయం, మద్రాసు, 1937 లక్ష్మీ రంజనం, ఖండవల్లి _ “ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం' లక్ష్మీరంజనం, ఖండవల్లి = “కవిశిరోభూషణం'” (అహోటల పండితీయం), ఆంధ్ర రచయితల సంఘం, ప్టాదరాబాదు, 1965. వసుమతి _ “ఖుతుబ్‌ షాహీ సుల్తానులు, అంధ్ర సంస్కృతిలో వ్యాసం విశ్వనాథరాయని స్థానాపతి - “రాయవాచకం' ఆంధ్ర సాహిత్య పరిషత్‌ పత్రిక నుండి, కాకినాడ, 1933 వీరభద్రరావు, ఆదిరాజు _ “ఖుతుబ్‌ షాహీ సుల్తానులు, ఆంధ్ర సంస్కృతిలో సం వీరేశలింగం, కందుతూరి - -అధ్రకవులవరిత్ర (మూడు. భాగాలు), హితకారిణ్‌ సమాజం, రాజమండ్రీ వెంకటకవి, గణపవరపు - “అంధ్రకౌముది' వెంకటకవి, జక్కరాజు _ అంధ్ర కామందకము, మద్రాసు గవర్నమెంట్‌ ఓరియంటల్‌ సీరీస్‌, మద్రాసు, 1950. వెంకటకృష్ణ వదు... - తకూ్య్యాయ సర్వస్పు శ్రీధరరావు. 15. ల సారస్వత పరిషత్తు, ప్టాదరాబాదు, 1967.

1056

వెంకటరంగయ్య, మామిడిపూడి - సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, 2వ సంపుటం, అర్హ వాస్తు శాస్త్రము, కృష్ణానది, సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ సమితి, ష్టాదరాబాదు, 1960.

వెంకటరమణయ్య, నేలటూరు. - ఆంధ్ర వాబ్బ్మయచరిత్ర సర్వస్పము, దాక్షిణా త్యాంధ్ర సాహిత్యము, మద్రాసు యూనివర్సిటి, మద్రాసు, 1957.

వెంకటరమణయ్య, నేలటూరు - చరిత్ర రచన - !. వేదం వెంకటరాయశాస్త్రి అండ్‌ బ్రదర్స్‌, మద్రాసు, 1948.

వెంకటరమణయ్య, నేలటూరు. - దాక్షిణాత్యాంధ్ర సాహిత్యము, మద్రాసు గవర్నమెంటు ఆర్ట్స్‌ కాలేజీలో ఇచ్చిన

. ఉపన్యాసాల విపులీకరణ, 1953.

వెంకటరమణయ్య, బులుసు - ఆంధ్రకవి సప్తశతి, తిరువళ్లిక్కేణి, మద్రాసు, 1956.

వెంకటరమణయ్య. బులుసు - అంధ్రాలంకార చరిత్ర, పరిశోధన పత్రిక జనవరి, 1955.

వెంకటరమణయ్య ,'బులుసు - కావ్యాలంకార సంగ్రహము, వావిళ్ల ప్రచురణ, మద్రాసు, 132.

వెంకటరమణయ్య, బులుసు _ గజపతిరాజుల తెలుగు సాహిత్య పోషణము, బాలసరస్వతి బుక్‌ డిపో, మద్రాసు, 1%4.

వెంకటరాఘవానందరావు, గొబ్బూరి - ఆంధ్రవచన రచనా పరిణామం, సరస్వతి గ్రంథమండలి, రాజమండ్రీ, 1%1.

వెంకటరామకోటిశాస్త్రి, కేతవరపు - నైమిశము, క్వాలిటీ పబ్లిషర్స్‌, విజయవాడ, 1961. 1911. _

వెంకటరావు, నిడుదవోలు _ అఆంధ్రవచనవాజ్బ్యయము, లక్ష్మీకాంతానిలయము, ష్టాదరాబాదు, 1977.

వెంకటరావు, నిడుదవోలు _- ఉదాహరణ వాజ్బయచరిత్ర. విజయభాస్కర పబ్లిషర్స్‌, ష్టాదరాబాద్‌, 1954, 1968.

వెంకటరావు, నిడుదవోలు - దక్షిణ దేశీయాంధ్ర వాజఖ్బ్యయం, 2వ సంపుటం (1958), తృతీయ ముద్రణ (1980), మద్రాసు యూనివర్సిటి, మద్రాసు

వెంకటరావు, నిడుదవోలు - విజయనగరసంస్థానం - ఆంధ్ర వాబ్బయ పోషణ, ప్టాదరాబాదు, 1965.

వెంకటశాస్త్రి, చెళ్ళపిళ్ళ - “కథలు-గాథలు” చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి సన్స్‌.

  • వెంకటేశ్వర పల్లికేషన్స్‌, కడియం, 1958,

వెంకటసీతాపతి, గిడుగు _ క్షేత్రయ్య పదములు, పిఠాపురం మహారాజా, 1952

వెంకటావధాని, దివాకర్ల = ఆంధ్ర వాబ్బయ చరిత్ర, ఆంధ్ర సారస్వత పరిషత్డు, ప్టాదరాబాదు, 1961.

1059 వ్యాసమూర్షి కాళూరి _ “కవిత్వ తత్స విచార విమర్శనరో ఇివరామశాస్త్రి, వేలూరి _ “సోముడు-ఉత్తర హరివంశ విమర్శ. వావిళ్ల రామస్వామిశాస్తులు అండ్‌ సన్స్‌. మద్రాసు, 1౫1 శివశంకరళాస్త్రి (స్వామి) - శ్రీ వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రిగారి షష్టిపూర్త్యుత్సవ సన్మాన సంపుటం, వావిళ్ళ ప్రచురణ, నుద్రాషు, 1952. ఇివసుందరేశ్వరరావు - “ఖుతుల్‌షాహీ సుల్తానులు. అంధ్ర సంప్కృతిలో వ్యాసం. శేషయ్య, చాగంటి = “అంధ్ర కవి తరంగిణీ (11 ఓ 12వ సంపు.) హిందూ ధర్మశాస్త్ర గ్రంథనిలయం'. కపిలేశ్చరపురం, 1954, రామచంద్రాపురం. 1959. శ్రీనివాసరావు, వేమూరి _ “పూర్వగాథాలహరోొ. వెంకత్రూమ అండ్‌ కో. మద్రాసు, 1952. ష్టైదరాబాదు. 1353 శ్రీరామమూర్తి, గురజాడ _ “శవ జీవితములు”. మ రామస్వామి శామ్తలు అంత్‌ సన్స్‌, మద్రాను. 1855 సత్యనారాయణమూర్తి, కవికొండల- విశాఖమండల చరిత్ర, 19 సత్యనారాయణరావు, యండమూరి - “శారదాధ్వజం' మద్రాసు, 1952 సమితి ప్రచురణ సీతారామయ్య, కురుగంటి _ కొందరు తంజావూరు కవులు, వండిశులు సీతారామయ్య, కురుగంటి _ "తంజావూరు ఆంధ్రనాయకరాజుల చరిత్ర” సుందరేశ్వరరావు. నిడుదవోలు. - “కుతుబ్హాహిలు” - అంధ్ర సంస్కృతి నుండీ సుబ్బారావు పంతులు, వంగూరి. - “శతకకవుల చరిత్ర, కమల కుటీర టైప్‌ నరసాపురం, 1957 సూరకవి, అడిదం _ తవిసంశయ విచ్ళేదం, వావిళ్ల ప్రచురణ, మద్రాను. 1955. . సూర్యనారాయణశాస్త్రి గంటి. - 'రామతీర్ధ చరిత్ర, సింహాచలం సూర్యనారాయణజాస్త్ర. మల్తాది-. - “సంస్కృత వాజ్మయ చరిత్ర - లౌకిక వాజ్మయం, అంధ్ర సారస్వత పరిషత్తు, ప్టాదరాబాదు. 1961 సూర్యనారాయణశాస్త్రి, వెంపరాల - “కవిశిరోభూషణం అహోబల పండితీయం, (పీఠిక)

1060 సేతురామయ్య, శ్రీహరి _ “చోళపాండ్య దేశాంధ్ర ప్రాబల్యం, ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక (7వ సంపుటి) సోమశేఖరశర్మ, మల్లంపల్లి - (పీఠికలు) “ రఘునాధనాయకాభ్యుదయం'”” స్వామినాథ అయ్యర్‌, ఎ.ఏ _ “శ్రీమదప్పారాయాన్వయ చరిత్రము”, 1911 హనుమచ్చాస్త్రి, ఇంద్రగంటి - వ్యాసావళి సంచికలు అముదిత గ్రంథ చింతామణి సంపుటి 1, సంచిక, 12, 1896 అయ్యంకి వెంకట రమణయ్యగారి సన్మాన సంచిక ఆంధ్రకవి తరంగిణి సంపుటాలు ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు ఆంధ్ర పత్రిక సారస్ప్వతానుబంధం ఆంధ్ర సాహిత్య పరిషత్‌ పత్రిక సంపుటాలు, 1914 ఆనందరంగం హ్ల్లై డైరీలు ఓరియంటల్‌ లైబరి క్యాటలాగులు గోలకొండ కవుల సంచిక గోలకొండ పత్రికలు ఉదయిని సంచిక, మద్రాసు, 1936 తంజావూరు యక్షగానాలు తంజావూరు లైబరి క్య్యాటలాగులు తెలంగాణా శాసనము, లక్షణరాయ పరిశోధకమండలి, ప్టైదరాబాదు, 1935 & 1960 దక్షిణ భారత శాసన సంపుటాలు పరిశోధన సంచికలు ప్రాచ్య లిఖిత గ్రంథాలయం కేటలాగులు, మద్రాసు బౌను లోకల్‌ రికార్డులు ఖారతి సంపుటాలు మెకంటీ రికార్డులు విజ్ఞాన సర్వస్వం - ఆంధ్ర పత్రిక ప్రచురణ విజ్ఞాన సర్వస్వం - తెలుగు భాషా సమితి సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం సంపుటాలు సరస్వతి మహల్‌ గ్రంథాలయం క్యాటలాగులు, తంజావూరు

1061 శం త.తి. అా0ల02 అ కట్టూరయయ సయుంలం 51009 జడ ౧లలుంయాజ; 11 664. ౦౧6011 ౧28, 1959 రం4బల ఆయ &ఉ 'ాజంంంంటి - "గి ౦0|60య4ంగ 0 అం హంలడంకంగ 0౧ ౧౦౧౧౯౬ ౧1816 అల జారే 00౧6 సల!0/6 టయ క 00 ౧8 సిశ8రులు, 1905. రడజేజ 85. 6౮౪౬ = "౦4 5006 0 5ం0లిలుం హయ ంయంంటితిం: & ౧0. 1871 రము! సామిజంశి, 0 = గతీ 5660 4 బల గెబుబయగంతిక అంగం (౮౧౧౪౦10అర). ణం 110౧౧000 _ 6 కకంగం తీం్రంలు" కకుడణ 9 గయల ౭జి 90య68/, ఓ2ాబుంం & జగ, ంగిరంగ, 1949, 61016, ౮.లి.గ. ఎ 105 ౮ ఈం అంజు, ౪011 1004, గలి. ఎ గం గకరాలరి జార 10ం%జీ కెణగంజుజు 0! కొర్రంరేడ' య౭గా౦గ666 1435206506, గేలూలులే ౮౧౪ ఆ౩కు 21698, 1920. ]60జ05, ని.5. ఎ ఇలు & గంటి" రింంటలజ 0746508 కెంగరిజు, 1962. $0గుండ ౧80, ౮.౪. = "5టయజ ఓ 1నమతంటుంండజని" 80సలి జారు, ౧88, 1956. శేగంలిండి ౭0 సీయం _ యంగటే ేరేలడ086', ౪01.8 జంమిం! సజారుటం, గం్రజ! _ "ంటుంజ 0 1200జ8క ంరటుంగజంి ౦గ౧౯|| ఇెయింజాంటి హితము ?౮080860౧, ౮౧౫౯౩$/ 0 సీతయజు, 10933. య కక అ “తయయాేంరంరంగ జారే 90యజ కం ఉండేల '/108060ర్ర్రతతి' $శడజ16, 14.5. ఎ. గొలంం జారే ఓంంటారు ౮ 14800బయిగటల' సశం!8 & ౧౦0 ఎ సంంలోజీ ౧జంయా 0 హయ, పేతం ప వ ఒకటా 5ంటూంజ ౦ ఆత్పరగతప్రతణి" లు [ల౧80 యా "య్రయణ ఆ*జక్రంయలా. కం” - కలక కోటు, ౪. (౬.0.) _.శకంలాల ౬౪1038 ఈ 5గఉ0ట “బాయిజకి, 100% +వీబయాన౭ర 14204, లజ 110. 54, 1952 గిటుఖయయటంత రత )తటాజాతత!.. - "ేరజాయంంత" ౯4 044 1983. 5482040223 సజ కె స యలంగు ఆ ఈం యల ౮ యా, తలల, 1924 5[౧జంరంంే / ాిరెకకీకారంరేడ-. 5జలా/” ఉతికే వతి గిగా డు 124 రిల. 1982. వ ఎ జయం గెంటి ౦ జం", క4తరూమి, 1928 కాటు బాలం, గె. అ "6 కటారియా! 08082080 4 గణ గూడిాక అణాజాట, జయ 1957. కా. గార అ! ఎ గజంర్రాంత్రం & ఓకలంరోల ౮ 10667 హయ కాం? గజూబాటిజ ఓలి. = మరిలులో

1062 కష వ = “0జ5జ జర గజ ర 50 10ఉి, 01. 1] కాంం86క రిలజళుడండం =. గం ఆంగం “06 సం ఆంగం ల గగుతండయతగని జురీ ౧౪ 300:” ౪01.1, 1935 మంలో! జ, = '“'ిళంగ 4 జట్‌ ఓటజురాంం6కఈ ఉ పకజంరూం 7104) ంజుణుూ/ 8ంం0% కంటం, కిశీతరటు, 1956. 'ఆబా౭003ర2 గం, యాం = "౧180 1స08జ0 గటి 50టజంం8కు! 280 0 జాంటీ గం పజేంరింంతిరుకుుడి కిటసంంరలిత డి టర కసిరబత0ితిడే, 1961 క = ళంగ” ౪01.81 ఆలగబాకు/ ౮ 184000, 1946. అల౦ఆ౮లిస[4పీ5్‌ తీ రజయటా8 44280906 0 96 6004 స బుచడయ్యట ౪01 1 & 1, 142629, 1915 - 1934 తీగండ 0 0౫౭౧౫ 2ఆంటిలయ, ఆలగగలం%/ 0 సంరుజి, ౪01. ౧1 ౧౭41 1 & 2, 1959 శరర 0)లట ఓం? లుల 0481036 తీ గలి ౧8౪10846 04 శజుంంలోంట, 604. ౦0గ౪2 సంద ఓ0టుగ కేశీతర 3. లేంటాంజీ ౮ కెంగర089 - గటోంగండ! 5ండలంిు, | ౪01. 1941 గంగు. గెలుంగ 0 ఈం 5లింర ౧0౧౫౧6౭ ౦% 6 0098 ౦ ౧ంయూుంంగి ౧ ఈ గకటో ౮ శం ౬8514 1008 ౧౦ంగ౧౧జ) 1812 (3 ౪౦0100. ౦జీంగ8, 1917-18) 'ంటంజి 01 086 రంశిాకుతంటా 109౧60౧6 “7 గ్‌ క్షం |] య్‌ దా ర ఖా ఓ సస స 1 ౮ రి వ లో | వ లు మ నం 0

హననం ననన నని | నన కక ర్న ర్ట మా

. ల క నన స యాడు... ” ణీ . య . 1) (-. (6 వ, /| న 1 | న్న ర్చ శ్వ / సం. యయా ||. పా 3 అోసగటై 1925=షంస్‌ 1098

శ క. ఖ్‌. శీ సీ యు రల మవ చం ఉంది. ఇది ఒక |

క న. జ రర స్వభావం సరించి షధిశోధనా. పూర్వమైన చర్చ ఉ చప్పగా క | |... దనిలో న్నాయహర్వపు న ల ఇ. న పనన న యయ. న న. : నవవధిటదగ్భా 1 వా పనో ఉంది. సరిశోధకకృషి, విమర్శకటృస్టి శ గప్‌ హాప్‌, రసికుడు, అన్నివిధాల ఇ 1 స నసోరతునందయం సహా ఏకి వెన్మతోడ పెస్టంది. పొందర్యవపాసి రసికు అననిగాల | స భై వ్యా హా హతో చదవ అమి ఇక కలల ముట్‌ కసుం స . .. య. ల లశ వన్మరీఫస్ణాని | న్‌ భరస ఆ చోఖ పుల వ్‌ అబల నలావు. ర్వ "| . లు వ మ. జల ఆరు న ఇ శ వ ను న్నవ. ఇ: