Telugu Samadhi - anilvaranasi/indianlanguages GitHub Wiki
వత్తాల్లగ 0. న జూ క ప శ ఢా! | సె స. తా | ం తాన ల ను న. య టీ ను. అమి (“ఈ స. ( ( ఖ్ మ రం! [ చకోర శా 1 స, 1 శ జట్లు పం
శీలా వీర్రాజు కథా సాహిత్యం - 1 (1957-59) సమాధి శీలా వీర్రాజు
ఉంధాబయ గ వ్ " 5గిసీనష011 00160101 0 3[0 310గ69 0) ళ్శి 5౬౬.4 ౪౬౯౬౯౧౧4౮౮ స్ట ల గ ప్రథమ ముద్రణ : మే, 1959 ఖల / "0 ద్వితీయ ముద్రణ : ఆగన్ము, 2001 పో / ముఖచిత్రం : శీలావి (య శి డిటిసి : మను గ్రాఫిక్స్ థ్ 1-8-185/2 (1031), చిక్కడవల్లి, కం హైదరాబాద్ - 500 020. ముద్రణ : శ్రీ బాలాజీ ఆర్ట్ ప్రింటర్స్ చిక్కడపల్లి, హైదరాబాదు - 500 020 య వెల:రూ. 40 లం వ్రశులకు : శీలా సుభద్రాదేవి 2/0, బ్రహ్మానందనగర్ (గ మలక్‌పేట, హైదరాబాదు - 500 036 గ వ ( దిశ పృస్తక కేంద్రం - చిక్కడపల్లి, హైదరాబాదు-20. నవోదయ బుక్‌హౌస్ - కాచిగుడా చౌరస్తా, హైదరాబాదు. ప్రజాశక్తి బుక్‌హౌస్ - చిక్కడపల్లి, హైదరాబాద్-20.
నా కథల్లో కలల్లో కావ్యాల్లో కనిపించి, కమ్మగా సెలయేటి గలగలలుగా గానాన్ని వినిపించి, కవ్వించి, నవ్వించి చక్కటి కథల్ని చెప్పి, నా రచనలకొక విశిష్టతను చేకూర్చి, ఎప్పుడూ నాకు తోడునీడై నన్నంటిపెట్టుకుని, రానున్న నా ముందరి దినాలు కొన్ని వందల పేజీల బృహద్లంథం కావాలని ఆశిస్తూ నన్ను నమ్ముకున్న నా కవితా సుందరికి ! ఉహుం....కాదు నా చిత్రాల్లో ఊహల్లో హృదయంలో అందంగా సింగారించుకొని, సౌందర్యాన్ని ఒలికిస్తూ చిలికిస్తూ ముగ్ధ్గమోహనంగా ప్రత్యక్షమై నా కుంచెకు సూక్ష్మత్వాన్నీ నా చిత్రాలకు వాస్తవాన్నీ పరిపూర్ణతనీ చేకూర్చి, నా భవిష్యత్ దినాల కృషిమీద తన ఆశయాల అందమైన సౌధానికి పునాదుల్ని నిర్మించుకొంటూ ఎదురుచూస్తున్న నా ఊహా సుందరికి! కాదు కాదు- ఇద్దరికీ ప్రేమతో నా హృదయాన్నీ ఈ పుస్తకాన్నీ అంకితం
శీలా వీర్రాజు రచనలు కథల సంస్ప్నటాలు సమాధి బండిచక్రం (వీర్రాజు కథలు) హ్లాదిని రంగుటద్దాలు పగా మైనస్ ద్వేషం వాళ్ళమధ్య వంతెన మనసులోని కుంచె ఊరు వీడ్కోలు చెప్పింది శీలా వీర్రాజు కథలు (ఎంపికచేసిన కథలసంపుటి) నవలలు వెలుగు రేఖలు కాంతిపూలు మైనా. కరుణించని దేవత కవితా సంపుటాలు కొడిగట్టిన సూర్యుడు హృదయం దొరికింది మళ్ళీ నెలుగు కిటికీ కన్ను ఎ(ర్రడబ్బా రైలు. ₹ుంంనంయపక (తెలుగు కవితల ఆంగ్లానువాదం) వ్యాస నంపుటి కలానికి ఇటూ అటూ ఇతరములు శిల్పరేఖ (లేపాక్షి స్కెచ్ బుక్)
ఇందులో ...... అస్థిపంజరం చంచ చంచదచవంవలలర00000000044644444444464442 ౯ = 2రి విచిత్రత్రయం ..............౮౮౭ 29-49 ఎంగిలి మెతుకులు ............44444004-=- ర3ారి/ పుణ్యానికి పోతే...........................- రిర-97 జీవిత సత్యం... 98-108
ఆ రచయిత పరిచయం రాజమండ్రిలో 1939లో జన్మించారు. విద్యాభ్యాసమంతా ఆ వూళ్ళోనే జరిగింది.. చిన్నప్పటినించీ పుస్తకాలు బాగా చదివే అలవాటువల్ల కాలేజీలో చదువుకునే రోజుల్లోనే 'ప్రజామత, ఆంధ్రప్రభ వారపత్రికల్లో రెండు సీరియల్సు రాశారు. రెండు కథల సంపుటాలు కూడా అప్పుడే వెలువడ్డాయి. 1976 వరకు కథలు, నవలలు రాస్తూ; మరో రెండు నవలలు, ఇంకొక ఏడు కథల సంపుటాలు వెలువరించారు. అధునిక కవిత్వంలో కథ చెప్పి 'వచన కవిత్వకథికు శ్రీకారం చుట్టారు. చిత్రలేఖనంలోనూ చేయిపెట్టి కలం, కుంచెలను సమాంతరంగా నడిపిస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తికాగానే హైదరాబాదు వచ్చి 1961లో కృష్ణా పత్రికలో చేరి రెండేళ్ళపాటు పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వ సమాచార, పొారసంబంధాల శాఖలో 1963 జూన్‌లో అనువాదకుడిగా (ప్రవేశించి 1990 జనవరిలో ఐచ్చికంగా ఉద్యోగ విరమణ చేశారు. 1971లో మేనమామ కుమార్తె సుభద్రాదేవితో వివాహమైంది. ఆమెకూడా కథలూ, కవితలూ రాస్తుంటారు. సాహిత్యంలో ప్రయోగాలంటే యిష్టపడతారు. జీవితంలోనూ, సాహిత్యంలోనూ నిజాయితీని హర్షిస్తారు. నిరాడంబరతను ఆశిస్తారు. ప్రగతిశిల భావాలతో రచనలు చేసేవారిని గౌరవిస్తారు.
అస్షిపంజరం థ్ శర్మ జీపువేనుకుని రేవుదగ్గరకొచ్చాడు. మధ్య దారిలో యింజను చెడిపోయిందోఏమో, అనుకున్న సమయానికి లాంచి వొడ్డుకు రాలేదు. ఒడ్డుకు కొద్ది దూరంలో చెట్టుకింద జీపును అపి, తాపీగా సీటుకు జారబడి సిగరెట్టు కాలుస్తూ కూచున్నాడు. శర్మ గవర్నమెంటు డాక్టరుగా పనిచేస్తూ, స్కాలర్షిప్ మీద విదేశాలకు వెళ్ళి ఒక ఏడాదిపాటు వుండి వచ్చాడు. తిరిగివచ్చిన నాలుగు నెలలకే మన్యం ప్రాంతంలో మలేరియా అరికట్టేందుకై అతన్ని వేశారు. ఇద్దరు అసిస్టెంటులు, ఒక జీపు, కొండమీద చక్కటి బంగళా, డిస్పెన్సరీకి అవసరమైన సామాను, ఇద్దరు నర్భులు, నలుగురు పనివాళ్ళు-హోదాకు తగ్గ వుద్యోగం. ఏకాంతం అనుకోకపోతే అదంతా ఒక అందమైన జీవితం. పట్టణంలోలా రైళ్ళూ,కార్లూ, జనం గుంపులూ, క్షబ్బులూ, సినిమాలూ, రకరకాల వినోదాలూ యిక్కడ లేకపోయినా ఎత్తయిన కొండలూ, కొండలమీద మేత మేయడానికి వాలే నల్లటి మబ్బుల గుంపులూ, లోతుగా యిరుగ్గా కొండలమధ్య అగాధాలూ, నున్నగా సూదిగా ఆకాశంలోకి చొచ్చుకుపోయిన కొండ శిఖరాలూ, వాటిమీద కొండనంళతటినీ ఆకుపచ్చ చీరతో చుట్టేసినట్ట పచ్చగా పసుపుగా ఎత్తయిన చెట్టూ, విరిగి లోయలోకి జారిన బండరాళ్ళూ,
రి నమాధి మెలికలు మెలికలు తిరిగి పరుగెడుతూ ఎక్కడికక్కడే అఖరైపోయి మళ్ళీ ఏ రాళ్ళ సందుల్గోనో పుట్టి అల్లంత దూరంలో మాయమయ్యే పిల్లకాలువలూ, జీపుపోతుంటే అడ్డంగా చెంగు చెంగున దూకుతూ పారిపోయే లేళ్ళూ, జింకలూ, చెవులు నిక్కబొడుచుకుని దొంగచూపులు చూస్తూ దూకుతూపోయే తెల్లని బొద్దు కుందేళ్ళూ, కొమ్మ కొమ్మనా నిలిచి పిలిచి పలకరించే రకరకాల పక్షులూ-యివన్నీ యీనాటి పట్నవాసాన్నీ, వాటి మనుషుల్నీ మరిపించి జీవితాంతం ఇక్కడే పడుండేలా చేస్తాయి. ప్రకృతిని ప్రేమించేవాడికి ఇదంతా ఒక స్వర్గంలా అనిపిస్తుంది.
శర్మను ఆ ప్రకృతీ, అక్కడి అలవాట్లూ విశేషంగా ఆకర్షించాయి. నల్లని కొండచరియలు, తెల్లగా నల్లగా ఎగిరే మేఘాలు, పచ్చగా పసుపుగా దూరానికి నీలంగా కనిపించే చెట్టు, లావుగా సన్నగా కొండలమీదనుండి బండల పక్కనుండి పాముల్లా మెలికలు తిరుగుతూ పరుగెత్తి కదిలి దూకి ఒకొక్కప్పుడు పొంగిపారలి. మరొకప్పుడు నిశ్చలంగా పరుగెత్తే కొండ కాలువలు, ఒకేచోట గుంపుగా పదీ పదిహేను పూరిపాకలు ఆతనికి చాలా సన్నిహితమైపోయాయి. రోజూ శర్మ జీపువేసుకుని ఆ 'ప్రాంతాలన్నీతిరిగి అక్కడి వాళ్ళకు ఇంజక్షన్లనీ, మందుల్సీ సలహాలనీ యిస్తూంటాడు.
శర్మ పూర్తిగా మారిపోయాడంటే ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ ప్రకృతే అలాంటిది. అక్కడి ప్రకృతీ, అతనిచుట్టూ వున్న పరిస్థితులూ అతన్నలా మార్చేశాయి. తనలో వచ్చిన మార్చును తలచుకుంటుంటే ఒక్కొక్కప్పుడు అతనికే ఆశ్చర్యం వేస్తూవుంటుంది. విదేశాలు తిరిగివచ్చినవాడేనా తను అని విస్తుపోతుంటాడు.
ఏ వ్యక్తయినా విదేశాలు తిరిగొచ్చాడని చెప్పుకోడానికి పట్నం మంచి పబ్లిసిటీ యిస్తుంది. కార్లూ నలగని ఊలెన్ సూట్ట్లూ, సన్మానాలూ, పత్రికలూ, పెద్దలతో పరిచయాలూ, పరాయి భాషలో పలకరించి మాట్ట్లాడుకోడానిక్రి మిత్రులూ మనిషి విదేశాలు తిరిగివచ్చాడని చాటడానికి తోడ్పడతాయి. కాని యిక్కడ యీ కొండల మధ్య లోయల్లో ఎక్కడో మైలు దూరంలో పదీ పదిహేనుమంది వృండే యీ నిర్ణన ప్రదేశంలో అతను ఏ ఏ దేశాలు తిరిగాడో, జీతం ఎంతో తెలుసుకోవలసిన అవసరం ఎవరికీ వుండదు. అక్కడివాళ్ళకు కావలసిందల్లా అతను మందు యిస్తున్నాడా? అది గుణం యిస్తున్నదా అని.
నిజానికి ఆ ప్రాంతంలో వాళ్ళివరూ అతని దగ్గర మందు తీసుకోరు. ఇంగ్లీషు మందులూ, సూది మందులూ వారికి యిష్టం లేదు. ఏ జబ్బొచ్చినా నాలుగాకులు
అస్థిపంజరం కి తెచ్చుకుని నాలుగువేళ్ళు తవ్వుకుని నములుతారు. మరోవ్యాధి అయితే ఎవరూ అతన్ని లెక్కచేయరు ఒక్కమలేరియా తప్ప. అదీ అక్కడి కోయజాతి వారినీ , అడవిజాతి వారినీ ఏమీ చెయ్యలేదు . ఇప్పుడిప్పుడు కొత్తగా జనం పట్నంనుండి ఎగబాకి వ్యాపారం సాగిస్తున్నారు. వాళ్ళకు మలేరియా తగులుతోంది. దాన్ని అరికట్టడానికి అతన్నివేశారు.
కొండోళ్ళతో మాట్లాడడమంటే సులభమేంకాదు. ఒక పట్టాన వాళ్ళకు అర్థంకాదు. అతను యిచ్చే మందులు తాగడానికి వాళ్ళు వొప్పుకోరు . వాళ్ళకు నెమ్మదిగా నచ్చజెప్పాలి. వాళ్ళతోపాటు కూర్చుని ఆప్యాయంగా మాట్లాడాలి. వాళ్ళను నవ్వించాలి. వాళ్ళమధ్య కలసి గుడిసెల్లోనూ , నేలమీదా కూచోవాలి. విదేశాలు వెళ్ళొాచ్చానన్న గర్వం పనికిరాదు వాళ్ళతోపాటు తనూ ఒక్కడై నవ్వుతూ నవ్విస్తూ తిరుగుతూ , వాళ్ళు తీసుకెళ్ళిన చోటికి పోతూ,వాళ్ళ మోటు సరసాల్నీ వేళాకోళాల్నీ భరిస్తూ వుండాలి
శర్మకు అవన్నీ అలవాటయిపోయాయి. నిజంగా అతను ఆ ్రకృతితోనూ, అక్కడి వాళ్ళతోనూ కలసిపోయాడు.
అక్కడి ప్రకృతినీ, ప్రజల్నీ వివరిస్తూ శర్మ పట్నంలో వున్న మిత్రులిద్దరికీ వుత్తరాలు రాస్తూండేవాడు రెండేళ్ళకి, ఒక రోజు యిద్దరూ కలిసి వస్తున్నామని ఉత్తరం వచ్చింది.
ఒకడు సత్యం
రెండోవాడు శివం.
ఇద్దరూ ప్రకృతి అందాన్ని సాంతంచేసుకోవాలని, ఆ సౌందర్యంముందు గుడ్డప్పగించి కూచుని గడగడా మంచినీళ్ళుతాగినట్టు అందాన్ని కళ్ళతో తాగే సేవాళ్ళే! ప్రకృతి అందాన్ని ప్రేమించినట్టు ప్రీనికూడా ప్రేమించలేరేమో! స్త్రీలో అందం వుండవచ్చు. అది లేకపోయినా మోహం అందాన్ని సృష్టిస్తుంది. మోహం లేకపోతే స్రీలో ఆకర్షణ ఏదీ?
మరి ప్రకృతి అలాకాదు ,* దాని అందంలో ఆకర్షణ వుంది. రోజులపాటు నిద్రహారాలు మానిపించి కూర్చోబెట్టే శక్తివుంది. మానవుణ్ణి మహా సౌందర్యంముందు అల్పుడ్ని చేసి తనముందు మోకరిల్లజేసుకునే మహత్తు వుంది. ఇవి అందర్నీ కదపలేకపోయినా సత్యం , శివం లాంటి వారినిమాత్రం వూపిపారేస్తాయి. వాళ్ళ ఆలోచనల్ని వునాదుల్తోసహా కదలించేస్తాయి.
గీతల్లో ఆకారాల్నీ పోలికల్నీ తెప్పించి, కళ్ళముందు ప్రకృతిని కృత్రిమంగా
10 నమాధి సృష్టించి, సృష్టికి ప్రతిసృష్టి చెయ్యగల చిత్రకారుడు-సత్యం .
దాని సౌందర్యాన్నీ సోయగాన్నీ వర్ణించి , వినిపించి, మారుమూలలకు కూడా దాని ప్రాముఖ్యతను ఎలుగెత్తిచాటే కవి-శివం
ఇద్దరూ కలిసి వలానానాడు వస్తున్నామని ఉత్తరం రాశారు. మిత్రుల్ని
తీసుకెళ్చామని శర్మ జీపు వేసుకుని వచ్చాడు. లాంచి యింకా రాలేదు. జీప్‌లో కూచుని ఆకాశంలో మేఘాలు పీల్చేసిన పల్చని వెలుగు తడినీ, చెట్ల గుబురుల్లోనూ, కొండల దిగువ లోయల్లోనూ పేరుకుంటున్న చీకటినీ చూస్తున్నాడు,
లాంచి వస్తోన్న శబ్దం సన్నగా వినిపించింది. లేచి గట్టుమీదికొచ్చి నుంచున్నాడు. లాంచి వస్తోంది ,బుడ బుడా నీటిని శబ్దంచేసుకుంటూ లాంచి వొడ్డుకొచ్చి ఆగింది. అలలు గట్బమీద తాపిన రాళ్లనూ , గట్టువదలి నీళ్ళల్లోకి దిగిన చెట్లవేళ్ళనూ కదిపి శబ్దంచేసి మాయమయ్యాయి
సత్యం , శివం లాంచి దిగొచ్చి మిత్రుడి కావలించుకున్నారు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చాలాసేపు అక్కడే నిలుచుని మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత ముగ్గురూ వెళ్ళి జీపు ఎక్కారు . శర్మ డైవ్ చేస్తున్నాడు. వెనకసీట్లో సత్యం , శివం కూచుని పరిసరాల కేసి చూస్తున్నారు. చీకటిలో వాళ్ళకు కనిపించేదేమీ లేదు. అయినా ప్రకృతి చీకటిచీర చుట్టుకుని ఎంత భయంకరంగా, గంభీరంగా వున్నా అదికూడా ఓ సౌందర్యమనే వాళ్ళ వాదం.
చూప్పల్ని తమలో విలీనంచేసుకుని , ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ కలిగించి భావాలనూ బుద్ధినీ స్తంభింప చేసేదే సౌందర్యం. చీకటికూడా ఎంత అందంగా వుంటుందని | మనకళ్ళకు దాని అందం కనిపించదుకాని కనిపిస్తే అందాన్ని భరించలేక, అ చీకట్లో పరుగెత్తి దొర్లి ఏడవాలనిపిస్తుంది. గబ్బిలాలూ , పెద్ద పులులూ , పిల్లులూ ఎంత అదృష్టం గలవి! ఆ అదృష్టం మనకు లేదు. చీకటంటే మనకు అసహ్యం, భయం. దాన్ని చీదరించుకుంటాం. అక్కడ్నించి ఏ వెలుగునో వెతుక్కుంటూ పారిపోతాం. వాటికాబాధలేదు. చీకటిలోనే 'స్వేచ్ళగా, ఆనందంగా, తృప్తిగా తిరుగుతాయి అందాన్ని అనుభవిస్తూ.
జీపు హెడ్లైట్లు చీకట్లను చీల్చుకుని ముందు కొద్దిమేర వెల్తుర్ని సృష్టిస్తున్నాయి. కొండల కిందనుండి, పెద్ద బండరాళ్ళపక్కనుండిలోయల్లోనుండి, ఎత్తయిన గుట్టలమీద నుండి సన్నని కంకరబాట ఒకటి బండివెళ్ళే వెడల్పులో వుంది. కొద్దిదూరం పోయాక
అస్థిపంజరం [1 కంకరబాట ఆఖరైపోయి దాన్ని కలుపుతూ మట్టిబాట వుంది. కుదుపుల్లో ఎగిరిపడుతూ ఆ బాటలోంచి పోతోంది జీపు. మధ్య మధ్య చెట్ల కొమ్మలూ, రాళ్ళూ జీపుని రాసుకుంటున్నాయి. పక్కకు దిగితే మళ్ళీ కనిపించనంతటి అగాధాలు ఒకవైపూ , జీపు టాపు మీదకి వంగి ఏక్షణంలోనన్నా మీద పడబోయేటట్టు కొద్దిపాటి ఆధారంమీద ఆనుకున్న బండరాళ్లు మరోవైపూ వున్నాయి. మెడ తెగగొట్టడానికి తీసుకుపోతున్న మేకపిల్లలా వెళ్ళలేక వెళ్ళలేక లోపలి ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని వెళ్తోంది ప్రాణంలేని ఆ యంత్రం,
నాలుగైదు కుందేలు పిల్లలూ , జింక పిల్లలూ వెలుతుర్ని చూసి ప్రళయం వచ్చిపడ్డట్టు అడ్డంగా విరిగిపడ్డ చెట్ల కొమ్మల్నీ , బండరాళ్లనీ చెంగు చెంగున దూకుతూ దాటుతూ చీకట్లో కలసిపోయాయి. ఒకటి రెండు రాళ్ళు దొర్లుకుంటూ వచ్చి జీపుపక్కనే పడి, కిందవున్న కాలవలోకి జారిపోయాయి. ఎవరూ ఏమీ మాట్లడ్డంలేదు. ఎవరేమన్నా శర్మ నిశ్చలత చెదిరి జీపు ఏమైనాకావచ్చు. సొందర్యంలోకూడా భయం వుందన్న సంగతి ఆలోచిస్తూ ఊపిరి బిగబట్టి కూర్చున్నారు.
దారిలో గూడెం ఒకటి తగిలింది. బాటపక్క పదీ పదిహేను పూరిపాకలు అక్కడక్కడ అంతంత దూరంలో వున్నాయి. ఇళ్ళల్లో దీపాలులేవు. దగ్గర్లోనే చిన్న మంటను వెలిగించి, దానిచుట్టూ కోయవాళ్ళు కొందరు పాడుతూ ఆడుతున్నారు. మోటుగా , బలంగా వున్న ఆడాళ్ళూ, మగళ్ళూ ఒకళ్ళతో ఒకళ్ళు సరసాలు ఆడుతూ తూగుతూ తోసుకుంటూ గెంతుతూ తరుముకుంటున్నారు. ఆడాళ్ళ వొంటిమీద బరువెక్కువే వుంది. మెడలోనూ చేతులకూ దండలకూ పూసలూ , వేర్లూ , ఇత్తడివీ రాగివీ గొట్టాలూ జారిపోతూ వేళ్ళాడుతున్నాయి. చేతుల్లో నడుములు పెనవేసుకుని మంట చుట్టూ గుండ్రాకారంలో నిలుచుని నిశ్శబ్దాన్ని నవ్వుల్తో, ఆరువుల్లో విరున్తూ చలి కాచుకొంటున్నారు. గుంపులోని పిల్లకాయలు జీపుశబ్దం వినడంతోనే పరుగెత్తుకొచ్చి బాటకు అటూ యిటూ నుంచుని చప్పట్లు చరుస్తున్నారు. పెద్దాళ్ళు ఎగొదిగా జీపును చూసి మళ్ళీ యధావిధిగా ఆడుతూ పాడుతూ తమపనిలో తాము మునిగిపోయారు.
“ఎంత బలంగా , మోటుగా ఉన్నారో!” అన్నాడు సత్యం.
“ఎంత ఆనందమైన జీవితం ! విచారంలేని బ్రతుకులు సుమీ 1” అన్నాడు శివం.
రెండింటికీ ఊ కొట్టాడు శర్మ
12 నమాధి వొళ్ళ పాటలూ , వాళ్ళ కేరింతలూ ఆ కొండ లోయల్లో , ఆ రాళ్ళ మధ్య , అక్కడి చెట్ల అడుగున , ఆ కాలవ నీళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయి. జీపు, వాళ్ళకు దూరమై పోయింది. క్రమ క్రమంగా అవీ సన్నగిల్హాయి . నిశ్శబ్దంలో అన్ని శబ్దాలూ కరిగిపోయి ప్రకృతిలో నిశ్చలత తొంగిచూస్తోంది జీపు, లోయలాంటి దాన్ని దాటి చిన్న పచ్చిక బయలు ప్రదేశంలోకి వచ్చింది. కోయవాళ్ళు వ్యవసాయం చేసి సారం తగ్గిపోతే వదిలేసిన ప్రదేశం అది. దానికి వందగజాల దూరంలో ఒకవైపు కొండలాంటి ఎత్తు ప్రదేశం వుంది. దానిమీద ఒక బంగళా వుంది. లోన హరికెను దీపాలు వెలుగుతున్నాయి. నడవాలో మాత్రం 'పెట్రోమాక్సులైటు తెల్లగా వెలుగుతోంది. బార్జా తెరిచిన కిటికీ సందులోనుండి వెలుతురు కొండకింద కాలవ నీళ్ళల్లో పడి వెండిలా తళతళలాడుతున్నాయి నీళ్ళు. ఆ యింట్లో నడవాలో, బయట బంగళాపక్క చెట్టుకింద గుబురుల్లో మనుషుల అలికిడి వినిపిస్తోంది. జీపు , చుట్టూ తిరిగి బంగళా చేరుకుంది. మిత్రులు ముగ్గురూ జీపుదిగి నడవాలోకి నడిచారు. భోజనాలయ్యాక ముగ్గురూ బంగళాని ఆనుకున్న పెద్ద రాతి బండమీద కూచుని సిగరెట్లు కాల్చుకుంటున్నారు. “ఎలావుంది యీ చోటు?” అన్నాడు శర్మ “నన్ను యిలాంటి చోటగాని పడేస్తే నగర నాగరికుడి పాద స్పర్శే తగలని యీ ప్రదేశాల్నీ, చెట్లనూ , యీ కదిలే కాలవల్నీ, పక్తుల్నీ బొమ్మలు గీసీ , స్త్రీ వంటిమీద యితరులకు కనిపించకుండా దాచిన భాగాల్లా సృష్టిలో దాగిన యీ మారుమూల సౌందర్యాన్ని అందరికీ బాహాటంగా బట్టబయలుచేసేవాడిని, ఇక్కడ కూర్చుంటే తయారైన లేండ్స్కేపుల్ని ఏ లండన్ ఆర్ట్ గేలరీలోనో ప్రదర్శిస్తే ఫస్ట్ ఫైజ్ వచ్చితీరుతుంది. ఇదిగో యిక్కడ ఈ కాలవ వడ్డున నీళ్ళల్లో పాదాలలోతున నిలుచుని కడవెత్తుకుంటూ ఓ స్తీ వుంటే యీ ప్రదేశం యింకెంత కళకళలాడుతుందోగదా! రాత్రివేళే యిది యింత అందంగా వుంటే పగలు మరింకెంత అందంగా వుంటుందో! నిజంగా నువ్వు అదృష్టవంతుడవోయ్ శర్మా! ఇలాంటి ప్రకృతి మధ్య నువ్వుంటున్నావంటే నాకెంత అసూయగా వుందో తెలుసా” అన్నాడు సత్యం, చిన్నగా చిరునవ్వు నవ్వాడు శర్మ, “మరి నీకెలా వుంది?” అన్నాడు శివంవైపు తిరిగి.
అస్థిపంజరం సా
“నేను యింతవరకు యిలాంటి సౌందర్యాన్ని ఎవరో చెప్పగా వినడమే గాని ప్రత్యక్షంగా చూడలేదు. ఈ చెట్ట ఆకులు ఎంత అందంగా శబ్దంచేస్తూ కదులుతున్నాయి! అగాధాల్తా నీలంగా నీళ్ళూ, వక్షాలమధ్య చంద్రహారంలా కొండలమధ్య లోయలో పిల్లకాలువా, స్నానంచేసి తలారబోసినట్టు ఆకాశంలో నల్లని చీకట్-వీటిమధ్య కూచుని కలంపట్టుకుంటే ఓ మహాకావ్యాన్ని సృష్టించకపాయ్యేవాడినా ఇక్కడో ప్రణయఘట్టం- ఇద్దరు ప్రియులు కలుసుకోవడమో, విడిపోవడమో, తెగించి నీళ్ళల్లోకి దూకి చావడమో ఏదో ఒకటి జరిగితే ఎంత నిండుదనం, ఎంత కళా యీ ఫ్రదేశానికి వస్తాయి! నువ్వు కేవలం అనుభవించి ఆనందిస్తున్నావేగాని నేనయితే ఇక్కడ కాలంలో కరిగిపోయిన చరిత్రను-ఈ నీళ్ళలో, యీ రాతిమీద, యీ గడ్డిలో, యీ కొండలపైన, యీ లోయల్లోపల వెన్నెల రాత్రిళ్ళు, చీకటి రోజులు రహన్యంగా కలుసుకున్న ప్రియుల్ని లోకానికి చాటి; వాళ్ళ ధైర్యానికి అభినందననూ, వాళ్ళ (పేమకు ఫలితాన్నిబట్టి సానుభూతినో, సంతోషాన్నో యిప్పించేవాడిని. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడి వోయ్ శర్మా! ఒక విధంగాచూస్తే డాక్టర్లు ప్రకృతిని ప్రేమించలేరు. దయాదాక్షిణ్యాలు, పాపం, భయం, సౌందర్యం వాళ్ళను ఎక్కువగా కదిలించలేవు సృష్టిని చంపడం అతనికి కష్టంకాదు. సౌందర్యాన్ని నిరయగా, పాపపుణ్యాల ప్రమేయం లేకుండా నాశనం చేస్తాడు. అందమైన స్త్రీ రూపాన్ని చూస్తే అతనికి కనిపించేది బాహ్యరూపంకాదు, లోపల వికారంగా రక్తం, (ప్రేవులు, జబ్బులు, పురుగులు, సన్నని ఎముకల పోగుల అస్థిపంజరం! కానీ నువ్వు డాక్టరువే అయినా అందుకు విరుద్ధంగా మారిపోయావు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది వాళ్ళలోనూ దయా, (పేమా, అభిమానంవుందని నిరూపించడంగాబోలు.”
శర్మ మళ్ళీ తనలోతాను నవ్వుకున్నాడు. ఆ నవ్వుకు శృతిగా ఎక్కడో ఓ పిట్ట కూసింది. కొండలోయల్లో ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది
శర్మ చెప్పాడు-
“నేనిలా మారిపోవడం నాకుకూడా చాల ఆశ్చర్యంగానే అనిపిస్తూ వుంటుంది. కారుమీద తప్పితే కదిలేవాడిని కాదు పరివారం వుంటేగాని అవతలకు అడుగు పెట్టేవాడిని కాదు. ఈనాడు ఆ పట్టుడలా, ఆ గర్వమూ ఏమయ్యాయో తెలీదు. రెండేసి మైళ్ళు తుప్పల్సీ గుట్టల్నీ నీళ్ళ చారల్నీ దాటుకుని నడిచి వెళ్ళడం అంటే నాకిప్పుడు చాలా యిష్టం, జీపు వున్నా మరీ దూరమైతేగాని దానిమీద వెళ్ళను. ఇక్కడి వాళ్ళతోపాటు
౫4 నమాధి నేలమీద్నో రాతిమీదో, గడ్జిపైనో కూచుని మాట్టాడుతూ, వాళ్ళతో కలిసి తిరుగుతూ వాళ్ళు తెచ్చిన పళ్ళనీ, దుంపల్నీ తీసుకుని; వాళ్ళలా పచ్చివీ, కాల్చినవీ తింటూ ఒక రకంగా వాళ్ళల్లో కలిసిపోయాను. నేను వెళ్ళేటప్పటికి చిన్నపిల్లలు నా చుట్టూ చేరిపోయి నా కోటునీ, నా సంచినీ పట్టుకుని వేళ్ళాడుతూ, భుజాలు రాసుకుంటూ చుట్టూ గెంతుతుంటారు. నిజానికి నన్ను యిక్కడ వెయ్యకపోతే నేనిలా అయ్యేవాడినేకాదు. ఇందాక నువ్వన్నట్ట దయా దక్షిణ్యాలు లేని రసహీనమైన గుండెనాది. కాని అది కరిగిపోయింది. నాచుట్టూ వున్న ప్రకృతే నన్నిలా మార్చేసింది. సొందర్యం అనేది కేవలం సినిమాల్లోను, తారల మొహాల్లోనూ, పట్టాల్లో టిప్‌టాప్‌గా తిరిగే పాశ్చాత్య నాగరికతకు సరికొత్త కార్చను కాపీల్లాంటి స్తీలల్లోనూ కాదు వుండడం పంచభూతాలూ కలిసి తాపీగా విశ్రాంతి తీసుకుంటున్న యిలాంటి నిశ్శబ్ద వాతావరణంలోనే అందంవుంది. పనికిరాని మట్టితునకా, జారిపోయే నీటిచుక్కా, పొద్దున్న ఎదురొచ్చి ముఖం ఎత్తి పలకరించి దాటిపోయిన పిల్లగాలీ, కొండ శిఖరంమీద గుచ్చుకున్న ఎర్రని సూర్యకిరణం విడివిడిగా గుర్తింపు పాందకపోయినా యివన్నీ కలిస్తే ఎంత అందాన్ని సృష్టిస్తాయి!” ముగ్గురూ చాలాసేపు ఆ రాతిమీదనే కూచుండిపోయారు. ఎంతసేపయిందో తెలీదు, కబుర్లతో కాలాన్నే మర్చిపోయారు! దూరంగా ఒక కొండపైన చిన్న వెలుగు లేచి పెద్దమంటై, ఆ ప్రదేశమంతా ఎర్రగా చీకట్లను దూసుకుంటూ మండిపోతోంది. తెల్లటి పాగలు మెలికలు మెలికలుగా ఆకాశంలోకి వ్యాపిస్తున్నాయి. ప్రకృతి ప్రశాంతతని భంగపరుస్తూ పక్తులు అరుస్తూ ఎగురుతున్నాయి. సత్యం, శివంలు ఆశ్చర్యంగా అటు చూస్తున్నారు. “మరేంలేదు, ఏ ఎలుగ్గొడ్డునో భయపెట్టడానికి మంటేస్తున్నట్టున్నారు కోయవాళ్ళు. అలాంటివి యిక్కడ తరచు కనిపిస్తూనే వుంటాయి. మీలాటి కొత్తవాళ్ళకి అది ఏ కార్చిచ్చో అనిపిస్తుంది” అన్నాడు శర్మ ముగ్గురూ ఆఖరిమంట చివరి వెలుగు చిక్కటి చీకటిలో యింకిపోయేవరకు కూచుని నిద్రపోదామని లేచారు. ఉదయం లేచేసరికి ప్రకృతి చక్కగా సింగారించుకుని ఎదుట నిల్చునివుంది. తలలో ఎగ్రగన్నేరులా మద్దిచెట్ల గుబురుల్లోనుండి సూర్యుడు తొంగిచూస్తున్నాడు.
అస్థవంజరం నే కిటికీలోంచి చూస్తే గుట్టలూ, కొండలూ, అగాధాలు, కాలువలూ అందంగా మృదువుగా పచ్చగా కనిపిస్తున్నాయి. కొండ శిఖరాల్లాంటి వక్షాల్ని కప్పుతూ ఆకుపచ్చని రంగు చీర పరచుకుని వుంది. ఎక్కువసేపు నిద్రపోవాలనిపించలేదు వారికి తొందరగానే లేచి స్నానం పానం పూర్తిచేసుకున్నారు కాస్సేపు అలా కొండలమీద తిరిగివద్దామన్నారు. శర్మ చిన్నఅభ్యంతరం చెప్పాడు- రేపు ముగ్గురం కలిసి జీపుమీద అడివంతా తిరిగొద్దామని “పోనీ యివ్వాల్దికి మేం యిద్దరం అలా తిరిగొస్తాంలే” అంటూ కాగితాల కట్టల్లో ఫ్లాస్కుల్ని భుజాన వేలాడేసుకుని బయలుదేరారు సత్యం , శివంలు. వాళ్ళు వెళ్తున్నప్పుడు “జాగ్రత్త సుమా ” అని హెచ్చరించాడు శర్మ “అలాగే' అని చెప్పి బయలుదేరి హుషారుగా కొండల్నీ గుట్టల్నీ ఎక్కుతూ. దిగుతూ, కాలువల్లో మోకాళ్ళ నీటిలో దిగి నడుస్తూ అడవిలో నుండి, లోయల్లో నుండి గింతుతూ, పరుగిడుతూ అనుకోకుండా రెండు మైళ్ళదూరం నడచిపోయారు. చిన్న కోయగూడెం తగిలింది. కొత్త మనుషుల్ని అక్కడివాళ్ళు విచిత్రంగా చూస్తూ దగ్గరకు చేరారు. వాళ్ళను దాటుకొని మళ్ళీ నడక సాగించారు వారిద్దరూ. మధ్యాహ్నమయింది.సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చాడు. ఇక నడవలేక గుంపుగా వున్న టేకుచెట్టమధ్య నీడలో కూచున్నారు. అవ్పటికి ఫ్లాన్కులో నగం కాఫీ అయిపోయింది. మిగతాదికూడా కాళీచేసి సిగరెట్టు వెలిగించారు. దారిలో వస్తూ సత్యం కొండల్సీ చెట్లనీ, అక్కడి కోయవాళ్ళనీ గీచిన స్కెచ్ లన్నిటినీ ఓమారు తీసి చూనుకున్నాడు. ఓ స్రీ బండమీద కూచుని జుత్తు ముడి పెట్టుకుంటోంది ముందుకు పొడుచుకొచ్చిన ఆమె వక్షం, కుడివైపు చంకకింద నుంచి అవుపిస్తోంది. ఆ బొమ్మను అక్కడక్కడ దిద్ది శివంకు చూపించాడు. బావుందన్నాడు శివం. తనుకూడా చూసిన ఆ ఆడమనిషి అందాన్నిగురించి పావుగంటసేపన్నా పొగిడాడు. అక్కడకు కొద్ది దూరంలో చిన్న కాలవవుంది. ఆ కాలవలో ముఖం కాళ్ళూ చేతులూ కడుక్కుని మళ్ళీ కాలవ వడ్డు వెంబడే బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే కాలవలో నీళ్ళు కనిపించలేదు. అర ఫర్గాంగు దూరంలో మళ్ళీ నీళ్ళు తగిలాయి. జల ఎక్కడికక్కడే వూరుతూ ఆఖరవుతూ వెళ్ళేకొలదీ కాలవ యింకా లోయల్తోంచీ, చెట్ల
16 నమాధి వేరుల కిందనించీ, బండరాళ్ళ పక్కనుంచీ లాక్కుపోతోంది ఉత్సాహంతో చాలాదూరం వెళ్ళిపోయారువాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళకి బంగళా జ్ఞాపకానికొచ్చింది
చుట్టూ చూశారు. బంగళా కనిపించడంలేదు. వాళ్ళుమాత్రం లోయలో నుంచున్నారు చుట్టూ కొండలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొండ శిఖరాలు తలమీదకు వంగి చూస్తున్నాయి. పెద్ద వర్షం వస్తే నీళ్ళు ఆ లోయని ముంచి వాళ్ళను మళ్ళీ కనిపించకుండా చెయ్యొచ్చు. అడవిలోంచి పారిపోయొచ్చిన ఏ చిరుతపులన్నా వాళ్ళమీద అమాంతం విరుచుకుపడొచ్చు కొండ ఎక్కబోయి కాలుజారి పడితే ఆకారంకూడా తెలీకుండా ఎముకల పోగులా కావచ్చు. రక్షించేవాళ్ళెవరూ లేరు అరిచినా అది వాళ్ళకుతప్ప మరొకరికి వినిపించదు తమ సంగతి యింటికి చేరేసేవాళ్ళయినా వుండరు. నికృష్టపు చావు చావాల్సి వస్తుంది.
వాళ్ళిద్దరూ భయంవేసింది
వెనక్కు తిరిగి వెళ్ళిపోదామని బయలుదేరారు
లోయలో సన్నని యిరుకుబాట వెంట వెళ్ళి ఓ పెద్ద బండరాయిని దాటుతూ చటుక్కున ఆగిపోయాడు సత్యం శివంకు కూడా ఆశ్చర్యం వేసింది.
ఎదురుగా బండకింద అస్థిపంజరం!
దగ్గరో అక్కడక్కడా ఒకటి రెండు గుడ్డపేలికలూ, చెదిరిపోయిన పూసలూ, గాజుముక్కలూ వున్నాయి ఎంతకాలంనించి అది అక్కడవుందో తెలియదు, వట్టి ఎండిపోయిన ఎముకలు తప్ప మాంసంగాని, రక్తంగాని లేదు. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ ఎప్పటినుండో అలా పడివున్నట్టుందది.
“అసలు యిదిక్కడికెలా వచ్చింది?” అన్న ప్రశ్నకు యిద్దరకూ జవాబు దొరకలేదు. ఇలాంటి ఏకాంత ప్రదేశంలో మనుషుల అలికిడే వుండనిచోట అస్థిపంజరం ఎలావచ్చింది? ఏ పెద్దపులో, మరో జంతువో లాక్కొచ్చినట్టు ఆధారాలు కూడా లేవు. ఎముకలు ఎక్కడివక్కడే వున్నాయి. ఏ నీళ్లలోనో కొట్టుకొచ్చి వుండాలిగాని మరోవిధంగా అది అక్కడకు వచ్చే మార్గం లేదు.
మెల్లగా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ యిద్దరూ దాని పక్కకు చేరారు. సత్యం ఆ అస్థిపంజరాన్ని కాలితో అటూ యిటూ కదిపి దాన్ని స్కెచ్ గీశాడు. శివం ఆ అస్థిపంజరాన్ని చాలాసేపు పరిశీలనగా చూసి “ఆడదై వుండాలి” అన్నాడు.
సత్యం తల వూపాడు. “అవును. ఆడదే కావచ్చు. అధారాలేవీ తేవుగాని కటి
అస్థవంజరం 17 ప్రదేశం కాస్త విశాలంగా వుంది. ఈ చెదిరిపోయిన పూసల్ని మగాళ్ళుకూడా వేసుకుంటారు. అయితే గాజులుమాత్రం ళొడగరు. అందుకే మూడొంతులు యిది ఆడదై వుండాలి” అన్నాడు. “మరి యిక్కడెందుకుంది?” “మో” చాలాసేపు అక్కడే వుండి దాన్నిగురించే చర్చించుకుంటూ బయలుదేరారు. కొద్దిదూరం వెళ్ళాక అలసిపోయి నడవలేక ఒకచోట కూర్చుండిపోయాడు సత్యం అలసట తీర్చుకుందామని. శివం కాలవలో ముఖం కడుక్కొస్తానని వెళ్ళాడు. సత్యం ఓ మారు పుస్తకం తిరగేశాడు. అస్థిపంజరం స్కెచతీశాడు. దాని చుట్టూ మాంసం, శరీరం, జుట్టు, కళ్ళు, ఒక్కొక్క భాగం గీశాడు. ఇరవై యేళ్ళ కోయపిల్ల నగ్నంగా పడుకుంది. బట్టలేదు. ఇంత అందంలోనూ ఎంత భయం దాక్కుంది! అందాన్ని ఒలిచేస్తే అడుగున కనిఫించేదేమిటి? వికృతంగా, భయంకరంగా అస్థిపంజరం! దామెర్ల రామారావు చిత్రాల్లోని “అమాయిక' లా వుంది. పాపం! అంత అందమూ ఎలా పనికిరానిదిగా నాశనం అయిపోయిందో! సృష్టే దాన్ని నాశనం చేసింది. ఎండా, వానా, గొలీ కలిసి సౌందర్యాన్ని పీల్చి పిప్పిచేసి వదిలి పెట్టినట్టుగా ఎముకల్నీ, వికృతమైన రూపాన్నీ విడిచిపోయాయి. సృష్టిలోనూ పరస్పరం ఒకదానిమీద మరోదానికి ఎంత కసి! ఎంత కోపం! అందాన్ని మరో అందం అంతం చెయ్యాలనే తుదివరకూ ప్రయత్నం! బలంగా పిక్కలు తేలిన శరీరం, ఎత్తుగా ఉబికిన వక్షాలు, లైట్ అండ్ షేడ్‌లో చిత్రానికి పరిపూర్ణతనిచ్చే వంపులు తిరిగిన ఆకారం-నిజంగా ఆమెను మోడలుగా పెట్టుకుంటే చిత్రాల్లో ఎంత నిండుదనం వుంటుంది! అలాటి స్త్రీని బొంబాయి జే.జే న్కూల్లో నిలబెడితే వందలాది ఆర్టిస్టుల చేతులు ఎంత వాస్తవాన్ని అలవరుచు కుంటాయో! శివం వచ్చాడు. బొమ్మను చూసి అశ్యర్యపోయాడు,"ఎంత అందంగా వుంది! నిజంగా యిదే మనిషయితే, చలం దీన్ని చూసివుంటే, అమాంతం ఎంతమందిలో వున్నా లాక్కుపోడూ. మళ్ళీ దీనిమీద రెండొందల "పేజీల పుస్తకం రాయడూ. ఇలాటి నిర్జన ప్రదేశంలో కావ్యాన్ని సృష్టించడానికి యీమె కధానాయిక అయివుండేది. ఈ ప్రదేశానికంతటికీ ఒక ప్రత్యేకతనీ, ఎవరూ మర్చిషోలేనంతటి విశిష్టతనీ చేకూర్చివుండేది. ఈ చుట్టూరా వున్న జింకపిల్ణలకు, వక్తులకు, కాలవనీళ్ళకు, కొండరాళ్ళకు,
18 నమాధి గడ్డిదుబ్బులకు పని కలిగించేది. వాటిని కదిలించి గిలిగింతలు పెట్టేది. కాని చిత్రం! ఇప్పుడు ఆమె అందాన్నీ, శక్తినీ నాశనంచేసిపారేశాయి కొన్ని శక్తులు. దానిమీద కసికొద్దీ ఎందుకూ పనికిరానిదానిలాగ, చూస్తే భయపడి పారిపోయేట్టుగా వికృతపరచి, దాన్ని జయించామన్న గర్వంతో అనందంగా దానిచుట్టూ విలయనృత్యం చేస్తున్నాయి గాలీ, ఎండా ఇంకొద్దిసేపట్లో నేనూ వస్తున్నానన్నట్టు దొంగ చూపులు చూస్తోంది కారుమేఘం ఒకటి కొండ శిఖరం మీదనుండి. ఆ మూడింటివల్తా ప్రకృతి ఎలా సృష్టించబడుతుందో అలాగే నాశనమూ అవుతుంది ఒకే వస్తువు మంచికీ, చెడుక్లీ ఉపయోగించబడినట్లే ఆ మూడు శక్తులూ ప్రకృతి పుట్టకకూ, నాశనానికీ ఉపయోగపడతాయి. అంత అందమైన శరీరాన్నీ రక్తమాంసాల్నీ అవి మూడూ సప్పరుగులు ఏరుకు తిన్నట్టుగా తినేశాయి, ఎముకల పోగు మిగిలింది దానివల్ల ఉపయోగం ఏమిటి? కొన్నాళ్ళకది మట్టిలో కలిసిపోతే అందులోనుంచి చిన్నమొక్కలేచి నుంచుంటుంది అందులో ఎరువు వుంది గనుక, అంతే”
“అసలు, ఆమె ఎందుకు చనిపోయింది?”
“ఏమో... ఏమో”
ఇద్దరికీ జవాబు తెలీదు. ఆలోచించుకుంటూ యిల్లు చేరుకున్నారు
రాత్రి భోంచేశాక అంతా కలిసి కూచున్నప్పుడు శర్మతో తాము చూసిన అస్థిపంజరం గురించి చెప్పారు “సరే, రేపు జీపులో వెళ్ళినప్పుడు అదీ చూద్దాంలే.” అన్నాడు శర్మ,
అనుకున్నట్టుగానే ఆ మర్నాడు జీప్‌లో బయలుదేరారు. మళ్ళీరావడం సాయంకాలమే. అవనరమైన పెట్రోలు, తినటానికి ఫలహారాలు వెంటేనుకుని బయలుదేరాడు. ఈసారి కారుని డైవరే నడుపుకొన్తున్నాడు. సత్యం, శివంలు వెనకసీటులోనూ, శర్మ ముందు సీట్లో డ్రైవరు పక్కనా కూచున్నారు.
మధ్యాహ్నం వరకు జీపుమీద తిరగగలిగినంత దూరం తిరిగి భోజనం చేసే సమయానికి సరుగుడు చెట్లకింద జీపును అపి, తెచ్చుకున్న ఫలహారాల్ని ఖాళీచేశారు అక్కడికి దగ్గర్జోనే చిన్న వాగు వుంది. నీళ్ళు తేవడానికని డైవరు వెళ్ళి చల్లగా వున్నాయంటూ స్నానం చేసి వచ్చాడు. రెండింటివరకూ చెటకింద నీడల్లో కబుర్లు చెప్పుకుంటూ కూచున్నారు. కాస్సేపు పేకాట ఆడుకున్నారు.
ఎండ కొద్దిగా తగ్గినతర్వాత అస్థిపంజరం చూసొద్దామని బయలుదేరారు కాలవ
అస్థిపంజరం 19 వడ్డు వెంబడే వెళ్తే రెండుమైళ్ళన్నా ప్రయాణం చేయాలి. అడ్డదారిన పుంతలు, మెట్టలు దాటుకుంటూపోతే మైలు దూరంలోనే తగులుతుంది. ఫరవాలేదులెండని అడ్డదారినే పోనిచ్చాడు డడైవరు. అరమైలు వెళ్ళేసరికి యింజను ఆగిపోయింది. ముగ్గురూ దిగి తొయ్యడం (ప్రారంభించారు. అయినా ఇంజన్ స్టార్ట్ కాలేదు. డ్రైవరు దిగి బాగుచేయడం ప్రారంభించాడు మిత్రులు ముగ్గురూ జీపువొదిలి అవతల కనిపిస్తోన్న చింతచెట్టు దగ్గరికొచ్చారు.
దానిమొదల్ని చూసి ఆశ్యర్యపోయాడు శివం. దానిచుట్టకొలత పదిబారలైనా వుంటుంది. సత్యం అంతవరకూ పెన్సిలుకు పనిచెప్పలేదేమో గబగబా నాలుగు లాండ్ స్కేప్ స్కెచ్‌లు గీనుకున్నాడు. ఈలోగా శివం, దగ్గరలోని మెట్టయెక్కి ఫర్ధాంగుదూరంలో నిటారుగా నుంచున్న కొండ శిఖరాన్నీ మీద మేత మేస్తున్న మేఘాల గుంపుల్నీ , అడుగున చుట్టూరా దట్టంగా పెరిగిన పచ్చని మద్దిచెట్లనీ ఫోటో తీసివచ్చాడు. చింతచెట్టు కిందికొచ్చి కూర్చున్నాడు
శర్మ సిగరెట్టు వెలిగించి మిగిలిన యిద్దరకూ చెరోటి యిచ్చి వాళ్ళపక్కనే కూచున్నాడు. సిగరెట్టు పాగ మెలికలు తిరుగుతూ వాళ్ళ చుట్టూరా అల్లుకుని గాలిలో కరిగిపోతోంది. పిల్లగాలులకు కొమ్మలూ,రెమ్మలూ ఊగులాడుతున్నాయి. చెట్టు మొదట్లో అరడుగు ఎత్తున పెరిగిన పచ్చగడ్డి వెల్వెట్ గుడ్డలా గాలికి కదిలి మెరుస్తోంది.
శివం కొద్దిగా దగ్గాడు. నిశ్శబ్దం చెదిరింది. గొంతు సవరించుకుని అడిగాడు. “శర్మా! ఇక్కడ నీకు ఎలాటి చిత్రమైన అనుభవమూ జరగలేదూ?”
సత్యంకూడా తన మనసులో అదే ప్రశ్న వున్నట్టు శర్మవైపు చూశాడు.
శర్మ తలపంకించాడు. పంకించాడే కాని ఏమీ మాట్లాడలేదు.
మిత్రులిద్దరూ ప్రశ్నలు తగిలించుకున్న ముఖాలతో అతన్నే చూస్తున్నారు. శర్మ సిగరెట్టు ఆఖరిదమ్ము గట్టిగా పీల్చి దాన్ని అవతలకు విసిరేశాడు.
“జరిగింది. జీవితంలో మర్చిపోలేని చిత్రమైన అనుభవం జరిగింది. కాని మీకు చాలా హాస్యాస్పదంగా వుంటుందేమో. నవ్వుకుంటారు కూడాను.” సాలోచనగా యిద్దరి ముఖాల్లోకి చూశాడు శర్మ,
“ఫర్వాలేదు చెప్పు” అన్నట్బగా యిద్దరూ అతనివైపే తిరిగి కూర్చున్నారు.
ఆయన మెల్లగా చెప్పడం ప్రారంభించాడు.
20 నమాధి
ఒకరోజు-అంటే ఈ ప్రాంతానికి వచ్చిన నెల్గాళ్ళకు - ఒక రోజు ఒక్కడ్నీ కాలినడకన బయలుదేరాను పరిసర ప్రాంతాల్ని చూద్దామని. చెట్లని, గట్లని, పక్షుల్ని చూస్తూ వెళ్తున్నాను. ఒక కొండ ఎక్కి దిగుతుండగా కాలు జారింది. నాలుగడుగులు కిందకు జారి ఓ తుప్పను పట్టుకుని లేచాను కొండకింద ఎవరో పకపకా నవ్వుతున్నారు. చాలా గట్టిగా ఆ చుట్టూ ప్రతిధ్వనించింది
కిందకు చూశాను.
ఎండిన చితుకుల్ని ఏరుకొంటోన్న కోయపిల్ల పకపకా నవ్వుతోంది నన్నుచూసి. మరొకామె చితుకుల మోపు బిగించి కడ్తోంది మారుమాట్లాడకుండా కొండదిగి వాళ్ళవైపన్నా చూడకుండా ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయాను ఫర్లాంగు దూరమన్నా వెళ్ళకముందే వర్షం ప్రారంభించింది. కుండపోతగా వాకటే వర్షం! కొండల మీదనుండి పాముల్లా పరిగెత్తుకొస్తున్నాయి. నీళ్ళు ఆగాధాలూ, కొండదిగుడులూ సెలయేర్ల ప్రవాహంతో నిండిపోయాయి
చెట్టుకింద నుంచున్నాను నేను. వర్షం బొట్లు బొట్టుగా ఆకులమీద నుండి జారిపడుతోంది. బట్టలు తడిసిపోయాయి. చలివేస్తోంది. శీతగాలికి వేళ్ళు వంకర్లు తిరిగిపోతున్నాయి. సిగరెట్టు వెలిగిద్దామనుకున్నాను అగ్గిపెట్టె తడిసిపోయింది. వెలగడంలేదు చలికి వణికిపోతూ నుంచున్నాను.
ఇందాకటి కోయవాళ్ళు మోపులు ఎత్తుకుని వచ్చారు. వర్షంలో పూర్తిగా తడిసిపోయారు, వచ్చి, ఆ చెట్టుకిందే మోపుల్ని దించి నుంచున్నారు.
తిన్నగా వాళ్ళను చూడభేకపోయాను పల్చటిగుడ్డముక్క వక్షాల్ని కప్పుతోంది వర్షానికి తడిసి శరీరానికి అంటుకుపోయింది. గుండ్రని ఉబికిన వక్షాలు పల్చటిగుడ్డ పారను చీలున్తున్నాయి. మనం ఏది సంస్కారమనుకుంటున్నామో ఆ సంస్కారం అక్కడలేదు. స్వేచ్చగా గాలికీ వానకీ వదిలిపెట్టారు వాళ్ళు. ఈ కాలపు నాగరికత అనే నీతిలో అనాగరిక జీవితాలు ఎలా ప్రతిఫలిస్తున్నాయో ఆలోచిస్తే మానవుడి పురోగతి నిజంగా పురోగతి కాదు. అది మళ్ళీ పాతదాన్ని చేరుకోవడమే
అడవిజాతివాళ్ళు అనాగరికులు, వాళ్ళకు సిగ్గు అనేదిలేదు, గోవ్యంగా శరీరభాగాల్ని దాచుకోవడం తెలీదు అంటుంది నాగరిక ప్రపంచం. అదే నిజమయిత్తే, వాస్తవాన్ని ఆలోచిస్తే, యీనాటి నాగరీకుల్ని నిజంగా నాగరీకులనలేం. శరీరం సాధ్యమైనంత ఎక్కువగా కనపడేలా వస్రైల్ని ధరించడం యీనాటి నాగరికత. ఒకనాడు
అస్థిపంజరం ల ఏది అనాగరికమూ, సంస్కారం కానిదీ అయిందో అదే యీనాడు సంస్కారమనిపించు కుంటోంది.
పడవ బయలుదేరిన చోటికే మళ్ళీ వచ్చి చేరుతుంది అనాగరికతనుండి బయలుదేరిన నాగరికత చుట్టూ తిరిగి చివరకు అనాగరికతలోకే వెళ్తోంది ఈనాటి సంస్కారిత నాగరికతను థైర్యంగా, ఆనందంగా కళ్ళను యింతింత చేసుకుని చూస్తుంటాం. అదో ఆకర్షణ! అదే ఆకర్షణ అనాగరిక జాతుల్గోనూ, సంస్కారం సభ్యత తెలీని కొండజాతివారిలోనూ ఎందుకుండదు?
అలానే నుంచుని సంస్కారంకాని చూపుల్తో తడిసిన వాళ్ళభాగాల్ని చూస్తున్నాను. తీక్షణంగా చూసే శక్తిలేదు. మనసు వికలమై దగ్గరగా కుంచించుకుపోయి ఒకమూల ముద్దగా పడిపోయింది. దృష్టి మార్చుకుని పక్కకు తిరిగి ఎటో చూస్తున్నాను. వాళ్ళు నవ్వుకుంటున్నారు. గుసగుసలాడుకుంటున్నారు. మాటలు వినిపిస్తున్నాయి గాని స్పష్టంగా లేవు.
వర్షం తగ్గిపోయింది. మబ్బులుమాత్రం యింకా వేలాడుతూనే వున్నాయి. పిల్లకాలువల్లో నీటిప్రవాహపు వొరవడి తగ్గింది. మెల్లగా పాకుతూ వెళ్తున్నాయి నీళ్ళు.
వర్షం తగ్గడంతోనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వెనుకనే నేనూ బయలుదేరాను. కొండ ఎక్కాను దాటి వెళ్ళిపోదామని. వాళ్ళు మెల్లగా కొండకింద సన్నని బాటలోంచి వెళ్తున్నారు. ఒకామె పాడుతోంది. ఆ పాటకు ఒక వరసేం వున్నట్టలేదు. ఆ మాటలు గాని, భావంగాని తెలీడంలేదు. కాని ఆ పాటలో బరువుంది. కంరంలో శ్రావ్యత వుంది. అది హృదయాన్ని పగ్గాల్తో పట్టివేసింది. గాలిలో కలసి ఎగురుతోంది. రాళ్ళల్లో మారు మోగుతోంది.
వాళ్ళు చూపునుండి దొటిపోయేవరకూ అలానే నుంచున్నాను. వాళ్ళు వెళ్ళి వెళ్ళి చెట్లకొమ్మల్లో, ఆకుల గుబురుల్లో కలిసిపోయారు. వాళ్ళు దృష్టినుండి తప్పుకున్న అయిదునిమిషాలవరకు యింకా పాట వినిపిస్తూనే వుంది. సాయంకాలం ఆఖరి వెలుతురు చారలు క్రమక్రమంగా చీకటిలో కలిసిపోయినట్టుగా నిశ్శబ్దంలో కరిగిపోయింది పాట.
మెల్లగా కొండదిగి వెళ్ళిపోయాను. అప్పటినుండి రోజూ సాయంకాలం పూట షికారుగా ఆ కొండ మీదకువచ్చి కూర్చోవడం అలవాటైంది. కొండకింద బాటలోంచి చితుకుల మోపుల్ని ఎత్తుకొని అఆ యిద్దరూ రోజూ అటే వెళ్ళేవారు. అందులో ఒకామె
22 నమాధి తరచూ పాడుతూనే వుండేది. గట్టిగా, ఆ రాళ్ళల్లో ప్రతిధ్వనించి, అలలు అలలుగా తెరలు తెరలుగొ ఆ పాట వినిపిస్తూనే వుండేది. అక్కడి వాళ్ళతో పరిచయం అయ్యేకొద్దీ, వాళ్ళమాటలు, వాళ్ళ ఉచ్చారణ క్రమంగా అర్థమవుతూ వచ్చాయి. ఆమె పాడే పాటలకు కొద్దికొద్దిగా అర్ధం తెలుస్తోంది. మామూలుగా ఆ వయసులోని స్త్రీల హృదయాలలో నాటుకునే భావాలూ, కోర్కెలే ఆమె పాటలకు యితివృత్తాలు. అవి వాళ్ళ జానపద పాటలు. రోజూ నా దినచర్యలో ఒక భాగం సాయంకాలం పూట ఆ కొండ దగ్గరకు వెళ్ళి కూచోడం. అలా అర్ధ సంవత్సరం గడిచిపోయింది. వరుసగా ఒక వారం రోజులపాటు వాళ్ళు కనిపించలేదు అశ్చర్యం వేసింది. ఆ ప్రకృతీ, చెట్టూ, కొండలూ, రాళ్ళూ, నీళ్ళూ, పిల్లగాలులూ, సన్ననిబాటా, నేనూ చిన్నబోయినట్టయ్యాయి. ఎనిమిదోరోజు కొండదిగి గూడెంలోకి బయలుదేరాను. గూడెంలో చాలా హడావిడిగా వుంది గూడెం వెనక మైదానంలాంటి చోట జనం గుమిగూడి వున్నారు. పిల్లలూ పెద్దలూ, ఆడాళ్ళూ మగాళ్ళూ చేరి డప్పులు కొడుతూ, దొప్పలతో కల్గుతాగుతూ, అరుస్తూ, పాడుతూ, గెంతుతూ హుషారుగా, సందడిగొ కనిపించారు. చీకటిలో స్పష్టంగా ఆకారాలు తెలీడంలేదు. ఒకచోటమాత్రం చిన్న మంట వెలుగుతోంది,
ఆ మంటకు కాస్త దూరంగా చిన్న గుంపు వుంది. వాళ్ళ మధ్య ఒక జంట వుంది. కొత్తగా పెళ్ళయినట్టు వాళ్ళ ఆకారాలు చెప్తున్నాయి. మెళ్ళో పూసలు, వాంటిమీద రంగురంగుల గుడ్డ పీలికలు, మొఖంమీద గీతలూ బొట్టూ కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరికి కలిపి పెళ్ళిచేసిన పెద్దలు వాళ్ళను వదిలి మస్తుగా తాగి తూలుతున్నారు
ఆ ముంటముందు నుంచునివున్న పెళ్ళికూతురు నాకూ, నా సాయంకాలపు ప్రకృతికీ అందాన్నీ ఆనందాన్నీ యిచ్చి రాగంతో ఆకాశాన్నీ భూమినీ కలిపి అక్కడి రాళ్ళనీ, లోయనీ కదిలించే ఆడది-మోపెత్తుకుని వెళ్ళే కోయపిల్ల.
వాళ్ళ ఆచారాల్ని చూసి నవ్వుకుని వెళ్ళిపోయాను.
ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ సాయంకాలంపూట ఆకొండల్లో ఆమెషాట వినలేదు. అమెతో వచ్చే మరో కోయపిల్లకుడా అలా వెళ్ళేది కాదు . చిన్నబోయినట్టువుండేది ఆ ప్రదేశం. ఒకరకమైన పద్ధతికి అలవాటుపడిపోయాక, ఆపద్ధతి మారిపోతే మనసు కొంతకొలంవరకూ అదోలా వుంటుంది. నేనూ అలాంటి స్థితిలోనే కొంతకాలం
అస్థీవంజురం ౭3 వున్నాను.మళ్ళీ మెల్లమెల్లగా, నాగొడవల్లో మునిగిపోయి క్రమక్రమంగా మర్చిపోయాను. నాలుగైదు నెలలు గడిచాయో లేదో ఒకరోజు సాయంకాలం డిస్పెన్సరీలో కూచుని వుత్తరం రాసుకుంటున్నాను బండిదిగి యిద్దరు మనుషులు ఒక కోయవాడిని లొపలికి తీసుకొచ్చారు. ఒంటినిండా, బట్టలనిండా రక్తంతో చేతులకు, తలకు అప్పటికప్పుడు గుడ్డ పీలికలు చించికట్టిన కట్లున్నాయి. ఆ కట్టను తప్పించుకుని రక్తం చిమ్ముతోంది. ఆనందం వచ్చాడు. అడవిలో చెట్లను పొడి, కలపను కోయించి దిగువకు పంపిస్తుంటాడు ఆనందం. అతను వస్తూనే చెప్పాడు -- కలప కొట్టిస్తుంటే ఓ పెద్దకొమ్మ విరిగి మీదపడిందని. ప్రమాదం ఎలా జరిగిందీ ఆనందం వివరంగా చెప్పి “కాస్త ప్రాణం పోకుండా చూడండి డౌక్టరుగారూ, ఏ మాత్రం వీడిప్రాణం గుటుక్కుమన్నా యీ వెధవలు నన్ను ఒకపట్టాన వదలరు"అన్నాడు. నిజానికి అతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుంది. తలమీద తగిలిన గాయం పెద్దదే. కుడిచెయ్యి పూర్తిగా పిప్పిపిప్పి అయిపోయింది. ఆ పరిస్థితుల్లో “ప్రయత్నిస్తాను అని అనడంకన్న మరే ధైర్యమూ చెప్పలేకపోయాను. అనందం కాస్సేపు వుండి, మళ్ళీపొద్దున్న వొచ్చి కలుస్తాననిచెప్పి వెళ్ళిపోయాడు. చీకటిపడే వేళకు పాతికమలది కోయవాళ్ళు పరుగెత్తుకొచ్చారు. ఒకావిడ ఏడుస్తోంది. గట్టిగా గుండెలు బాదుకుంటూ ఒకటే ఏడుపు. వచ్చినవాళ్ళంతా అరుగుచివర చీకట్లో నుంచున్నారు. ఆకారాలు కనిపించడంలేదు. బహుశా ఆ ఏడుస్తున్నామె అతని భార్య అయివుంటుంది. వచ్చినవాళ్ళు ఓమారు అతన్ని చూసి, చాలాసేపు బయట వరండాలోనే కూచుని వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయాక భోజనం చేసి నిద్రపోయాను. మధ్యలో తెలివి వచ్చింది. బయటినుండి ఎవరో స్త్రీ సన్నగా ఏడుస్తోన్న శబ్దం వినిపిస్తోంది. ఆ నిశ్శబ్దంలో మందంగా కదులుతోన్న గాలిలో అలలు అలలుగా ఎగురుతోంది. ఆ ప్రదేశంలోని ప్రతి అణువునూ కదిలించి వేసేట్టుగా వుంది ఆ శబ్దం. పాపం! తెల్లవార్లూ ఆమె అలా ఏడుస్తూనే వుందిగాబోలు, నేనుమాత్రం కొద్దిసేపట్లోనే తిరిగి నిద్రపోయాను ఆ కొద్దిసేపూ ఆమె ఆవేదన నాలోనూ జాలినీ, సానుభూతినీ లేపివెళ్ళింది. అది మామూలే, కాకుంటే డాక్టర్లు కావడం అనవసరం. మళ్ళీ అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోయాను. ఉదయం లేచి అరుగుమీదకు వచ్చాను. ఆ ఆడమనిషి యింకా అక్కడే కూచుని
బశ నమాధి వుంది. మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తోంది. నన్ను చూడగానే లేచి బిత్తరచూపులు చూస్తూ నుంచుంది. దుఖం ఆపుకోలేక ఒక్కసారిగా గొల్లున ఏడ్చేసింది
ఆశ్చర్యపోయాన్నేను ఆమెను చూస్తూ కొద్దిసేపు అలానే నిలబడిపోయాను. తన కదలికతో, రాగంతో కొంతకాలంక్రితం ప్రకృతికీ, నాకూ, నా చుట్టూ తిరిగీ ఊహలకూ, నా ఆనందానికీ కారణమైన కోయపిల్ల! ఎంతో అందంగా, నిండుగావుండే ముఖంలో నిరాశారేఖలు తూరుపుచారల్లా నలువైపులకూ పరుగెత్తుతున్నాయి ఆమె ఏమిటో అడుగుతోంది. సరిగా వినిపించడంలేదు ఆ కంరంలో పూర్వపు మాధుర్యం లేదు. ఆమె కళ్ళల్లో వెనకటి జ్యోతుల్లేవు. చాలా దీనంగా చూస్తోంది ఆ చూపుల్లోని ఆవేదన ములుకుల్లా గుచ్చుకుంటున్నాయి నన్ను. ఆమెకు థైర్యం చెప్పి యింటికి పంపించేశాను ఆమె వెళ్ళిపోయిన చాలాసేపటి వరకూ మనసు అటే ఆలోచిస్తూ వుండిపోయింది ఏమయినా అతను జీవించాలి.
అలానే జీవించాడు. చాలా రోజులు కష్టపడి అతి జాగ్రత్తగా వైద్యం చేయగా మళ్ళీ మామూలు మనిషై లేవగలిగాడు. అయితే కుడిచేతినిమాత్రం మోచేతి కీలువరకూ తీసెయ్యాల్సి వచ్చింది. అతన్ని యింటికి పంపించేరోజున ఆమె వచ్చింది, కూడా ఓ అయిదారుగుర్ని వెంటబెట్టుకుని. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆమె ముఖంలో ఎప్పుడూ చూడనంత ఆనందం గట్టుతెగి పార్లిపొంగింది. సర్హాగా కబుర్లు చెప్పుకుంటూ కాలవగట్టు వెంబడే వాళ్ళు వెళ్ళిపోయారు.
వారంరోజుల తర్వాత ఒక్కడ్నే జీపుమీద వస్తున్నాను. ఆ చుట్టపట్ల నాలుగైదు గూడెంలు తిరిగి, అప్పటికే చాలా ఆలస్యమైపోయిందని కాలవపక్క బాటమీదనుండి జోరుగా పోనిన్తున్నాను. బాటకు దగ్గర్లో గుట్టమీదనుండి ఎవరో అరుస్తున్నారు వెనక్కుతిరిగి చూశాను. ఆవిడే, అదే కోయపిల్ల! జీపు ఆపాను. పననపండొకటి మోసుకొచ్చి జీపులో పెట్టింది. ఆ తర్వాత నా ఎదురుగా రెండు నిమిషాలు మౌనంగా నుంచుని చెంగుచెంగున దూకుతూ రాళ్ళనీ రప్పల్సీ తుష్పల్నీ దుబ్బుల్నీ తప్పించు “కుంటూ గుబురుల్లో మాయమయ్యింది.
అ తర్వాత రోజున అలా వెళ్ళాలనిపించింది. జీపుమీద కాకుండా కాలినడకనే ఆ రెండు మైళ్ళూ నడుస్తూ వెళ్ళాను. కాలవమీదుగా వెళ్ళితే కాలక్షేపంగా వుంటుందని బయలుదేరాను, గతరోజు ఆమె కలుసుకున్నచోటు వరకూ వచ్చాను, గుట్టమీద నుంచుని చూస్తే ఆవల చెట్ల గుబురుల్లో గూడెం కనిపిస్తోంది. చాలాసేపు గుట్టమీదనే
అస్థివంజరం ఖల్ కూచున్నాను. ఎవరూ రాలేదు సాయంసంధ్యలో కాంతులన్నీ కరిగిపోతున్నాయి. ఇంకొద్ది సేపట్లో అక్కడ చీకటి బాహువుల్ని చాస్తుంది.
ఏదోపాట సన్నగా వినిపించింది. ఒట్టి కూనిరాగమే అది. ఒక్కటో రెండో చరణాలు మాత్రమే. రాగం ఆగిపోయింది. కింద కాలవలో నీళ్ళు కదిలాయి. కడవను నీళ్ళతో నింపుకుని ఎవరో వెళ్ళిపోతున్నారు.
ఆ కంరం ఎవరిదో నాకు తెలును. అంత చక్కదనం ఎవరి కంఠంలో 'రంగరించిపోశారో, ఎవరి కంఠం చివర్లో రాగం చిగురాకులా వణికిపోతూవుంటుందో, ఎవరి కంరంలో సన్నని నాక్కులుంటాయో నాకు తెలుసు
గబగబా గట్టుదిగి వెళ్ళాను
నన్ను చూసి ఆశ్చర్యపోయింది. ఓసారి చిత్రంగా నా నఖశిఖ పర్యంతమూ చూసి కదలబోయిలరది.
“ఇదిగో మాట” అన్నాను.
ఆగింది. నా వైపే ఆశ్చర్యంగా చూస్తూ నుంచుంది.
“ఆ పాట మరికాస్తా గట్టిగా పాడవ్?” అన్నాను.
తలవూపి కదిలింది, కాలి అందెలను టిక్కుటిక్కు మనిపించుకుంటూ.
“చూడూ...” పిలిచాను.
చూసింది, అక్కడినించే వెనక్కు తిరిగి,
తల ఊపాను రమ్మన్నట్టుగా.
సగం వరకూ వచ్చి ఆగింది.
ఎందుకు పిలిచాను? ఏమో, ఏమీ చెప్పలేను. కాళ్ళూ చేతులూ వణుకు తున్నాయి. గుండె గబగబా కొట్టుకుంటోంది. ఏమిటి యిలా అయిపోయాను! వాకే ఆశ్చర్యంగా వుంది.
ఆమె వెళ్ళిపోతోంది.
గబగబా దగ్గరకు వెళ్ళాను. పర్సులోంచి ఓనోటు తీసి ఆమెచేతికివ్వ బోయాను, చిత్రంగా చూసింది.
“చీర కొనుక్కో. ఈసారి సంతకెళ్ళినప్పుడు మంచి చీర కొనుక్కో. నువ్వు
తిం నమాధి కట్టుకున్నదేం బావుండలేదు. ఎర్రగా రక్తంలా వుండే రంగుచీరయితే నీకు బాగుంటుంది” అన్నాను.
చెయ్యి వెనక్కు తీసేసుకుంది. గబగబా అక్కడ్పుంచి వెళ్ళిపోయింది.
నాకక్కడ నిలుచోడానికి భయంవేసింది నామీద నాకే అసహ్యం వేసింది. అక్కడ్నించి వొచ్చేశాను.
మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. సాయంకాలంపూట బంగాళా వదిలి బయటికి వెళ్ళడంకూడా మానుకున్నాను. నామీద నాకే తక్కువభావం. మాటిమాటికీ చికాకూ, అసహనం కలుగుతున్నాయి.
ఒకరోజు సాయంకాలం ఒక్కడ్నే గదిలో కిటికీముందు కూచుని వర్షాన్ని చూస్తున్నాను. నాలుగురోజులుగా కుండపోతగా ఒకటే వర్శం మంచుపొరలు అకాశాన్నీ భూమినీ కప్పేసినట్టుగా వుంది. కనుచూపు మేరంతా నిర్జీవంగా వుంది. ఒక్క పక్షి కూడా ఎక్కడా ఎగరడంలేదు.
అకస్మాత్తుగా అన్ని శబ్దాల్నీ తప్పించుకుని సన్నగా ఓపాట ఎగిరి వచ్చింది చాలా కాలానికి మళ్ళీ ఆ పాట విన్నాను. అచేతనంగా ఆ పాటనే వింటూ కూచుండిపోయాను. ఆరగంటయింది. ఇంకాపాట పూర్తికాలేదు. ఏమో... ఎన్నిసార్లు ఆ పాటను ఆమె మళ్ళీ మళ్ళీ పాడుతూ వుందో తెలీదు, గంటయినా ఆ పాట వినిపిస్తూనే వుంది!
కిటికీలోంచి చూశాను. ఎవరూ కనిపించలేదు. మరో అర్ధగంట గడిచింది. అయినా పాట ఆగిపోలేదు. పాడిందే మళ్ళీ మళ్ళీ పాడుతోంది. వర్షంలో గొడుగేసుకుని పాట వినిపిస్తున్న వైపుగా బయలుదేరాను.
రెండు ఫర్గాంగుల దూరంలో ఓ బండమీద ఎవరిదో ఆకారం కదిలింది. దగ్గరకు వెళ్ళాను. ఆవిడే, కోయపిల్ల! వర్షంలో తడుస్తూ నుంచుంది. దూరంనించే నన్ను చూడగానే పాట అపి చప్పట్లు కొడుతూ, పైమీద వల్లెవాటుగా వేసుకున్న గుడ్డపీలికను తీసి గాలిలో ఆడిస్తూ తన వునికిని తెలియజేసింది.
దగ్గరకువెళ్ళాను. ఏమిటో చెప్పాలని అనుకుంటున్నట్టంది, కాని మాటలు పెగలడంలేదు. రెండు చేతుల్నీ దగ్గరగా గుండెల్లోకి ముడుచుకుని పాదాల్ని చూసుకుంటూ నుంచుంది, ఆమె వళ్ళంతా వణికిపోతోంది. ఆ పెదాలు మరీనీ, బహుశా వర్షంలో తడుస్తూ వుండడం చేతనేమో.
అస్థిపంజరం భి తలమీద నుండి వర్షపునీరు కారి వక్షాలమీద పడుతోంది. తడిసిన వస్త్రాల్లోంచి శరీరం అక్కడక్కడ బైటపడుతోంది.
ఆ స్థితిలో ఆమెను చూస్తోంటే నా మనసు స్వాధీనం తప్పిపోతోంది. అచేతనంగా పడివున్న కోర్కెలు అనుభవాల కోసం ఎదురుచూస్తూ ఉవ్వెత్తున పైకి లేచాయి. చుట్టు చెట్లూ రాళ్ళూ, రాళ్ళపక్కన పాకుతున్న నీళ్ళు, చెట్ల పలవల్లో జ్ఞానంలేని పక్షులు, పైన చిక్కగా ముసుగు కప్పిన వర్షం, చలితో గజగజా వణికిపోతున్న శరీరాలు!
“ఏమిటి విశేషం?” అన్నాను మరికాస్త దగ్గరకువెళ్ళి. నా ముఖంలోకి దీనంగా చూస్తూ “డబ్బులు కావాలి” అంది.
“లేవు, ఎలా?” అన్నాను. నిజానికి నా దగ్గర లేవు.
నిరాశగా చూసింది. ఎంత బరువుగా కదిలాయని ఆ రెప్పలు!
“ఆడు తెమ్మన్నాడు” అంది మెల్లగా. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీరు కదిలింది.
ఎంచెయ్యను, ఎలా వున్నవాడిని అలా వచ్చేశాను. జేబులో కాణీకూడా లేదు. చిటికిన వేలుకు వుంగరం వుంది. ఎప్పుడో చాలా కాలంక్రితం చేయించినది. దాన్ని తీసిచ్చాను. ఆశగా అందుకుంది. ఒకసారి తన వేలికి తగిలించుకుని గుండెలకు అదుముకుని, చెంగుచెంగున లేడిలా దుముకుతూ పరుగెత్తుకుని పారిపోయింది. స్థబ్బుడ్నయిపోయాన్నేను. కొంతదూరం వెళ్ళి ఆగి వెనక్కి తిరిగింది.
“రావూ?” అడిగాను.
“రేపు” అంది. మళ్ళీ లేడిలా దుముకుతూ మాయమైంది.
అంతే. ఆమె మళ్ళీ రాలేదు. ఆమె పాట మళ్ళీ నేను వినలేదు. ఆమె మోసం చేసిందా? ఏమో చెప్పలేను. కాని, యిక్కడివాళ్ళకు మోసం, కృత్రిమం, ఈర్మ్య అనేవి తెలీవు. ఆమెను గురించి గట్టిగా వాకబుచేసే ధైర్యంలేక ఆషామాషీగా తెలుసుకోవాలని చూశానుగాని అంతగా పట్టించుకున్నవాళ్ళే లేకపోయారు. యధాలాపంగా ఒకరిద్దర్ని అడిగితే ఆమె ఏమయిందీ తెలీదన్నారు. అంతకన్న ఎక్కువగా అడగలేక మాట్లాడక వూరుకుండిపోయాను.
ఇప్పటికీ ఆమె ఏమయిందో తెలీదు”
28 నమాధి శర్మ చెప్పడం ముగించి సిగరెట్టు తీశాడు. సత్యం, శివంలు చిన్నగా నవ్వుతూ మిత్రుడ్ని చూశారు మరో పదినిమిషాలకి డ్రైవరు వచ్చి జీపు బాగయింది రమ్మన్నాడు పదండంటూ బయలుదేరారు ముగ్గురూ. జీపులో చాలా చోట్లకి వెళ్ళారు ఫొటోలు తీసుకున్నారు. సత్యం స్కెచ్‌లు గీసుకున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు అస్థిపంజరం వున్న లోయ దగ్గర ఆగారు. జీపు తిన్నగా లోయ ముఖం వద్ద ఆగింది. ముగ్గురూ దిగి లోయలోకి నడిచారు. అస్థి పంజరాన్ని చూశారు. శర్మ దాన్ని అటూయిటూ తిప్పి పరీక్షగా చూసి “ఇది ఆడదే”అన్నాడు. “హాస్పిటల్లో పెట్టకోడానికి బావుంటుంది.” అని చెప్పి డైవరు సాయంతో దాన్ని జీపులో పెట్టించాడు. ముగ్గురూ అక్కడ రాళ్ళమీద చాలాసేపు కూచున్నారు. అడవి వింతలు చాలా చెప్పుకొచ్చాడు శర్మ, విదేశంలో వున్నప్పటి భయంకరమైన వేట అనుభవం చెప్పి భయపెట్టాడు. చీకటి పడకుండానే బంగళా చేరుకుందామని లేచారు. శివం కాలికేదో గట్టిగా తగిలింది. మట్టిని తొలగించాడు. బంగారపు ఉంగరం! శర్మా సత్యం మాట్టాడుకుంటూ ముందు నడుస్తున్నారు. బహుశా ఆ అస్థిపంజరం ఏ నీళ్ళలోనో అక్కడికి కొట్టకొచ్చి వుండాలి అనే నిర్ణయానికి బలాన్ని వెతుక్కుంటూ. శివం మెల్లగా ఆ వుంగరాన్ని జేబులో దాచుకున్నాడు. 9
విచిత్రత్రయం
పోళ్ళ శబ్దాలన్నీ యింకిపోయి నిశ్శబ్దం వ్యాపించింది. కార్గూబళ్ళూ, రిక్షాల హడావిడీ, ఫ్యాక్టరీలకూతలూ, మనుషుల అలికిడీ, వాళ్ళ పాటలూ , మాటలూ, ఏడువులూ నెమ్మది నెమ్మదిగా దూరమైపోయాయి. అవ్పటికిమాత్రం అవి నల్గటిమునుగు దువ్పటిలో దాక్కున్నాయి. మళ్ళీ ఉదయం యధావిధిగా రణగొణధ్య్వనీ,చెవులు చిల్లులు పడే శబ్దాలు చీకటిముసుగును తొలగించి నిశ్శబ్దంలో సంచలనాన్ని సృష్టిస్తాయి.
సాయంకాలానికి ప్రకృతి అలసిపోతుంది. సూర్యుడు రొప్పుతూ రోజుతూ ఆచివరినుండి యీ చివరివరకూవచ్చి యిక నడవలేక నీళ్ళల్లోదాక్కుని చూస్తుంటాడు. సృష్టి ఏమయిందీ అని. జనత విశ్రాంతి తీసుకుంటుంది. జంతువులు, పక్షులు, చెట్టు, అన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. కొత్త వాతావరణంలా ప్రకృతి తారు పూనుకుని మూల కూర్చుని కునుకుతుంటుంది.నల్లటి మునుగు దుప్పటికి సన్నని చిరుగులున్నాయి. అందులోనుండి వెలుగు కిరణాలు రాలేక రాలేక అతికష్టంమీద దూరివన్తున్నాయి. అయినా లోన అంతా చీకటేవుంది.
చైతన్యం లేని ప్రకృతి చచ్చిన జెర్రిగొడ్డులా పడుంది. అన్నింటితోపాటు ఊరూ నిద్రపోతోంది. వీధుల్లోనూ, యిళ్ళబయటా మనుషుల అలికిడి లేదు. చలి గజగజ
౩0 సమాఖణి వణికిస్తోంది. జనం యిళ్ళల్గో తలుపులు బిడాయించుకొని నిద్రపోతున్నారు. వీధుల్లో దీపాలు అంతంత దూరానికి ఒక్కొక్కటి చాప్పున ఒంటరిగా పహరా జవానుల్లా నిలుచున్నాయి ఒకవీధిలో దీపంకూడా వెలగలేక ఆరిపోయింది రెండు కుక్కలు కసిగా పోట్టాడుకుని ఎదురెదురుగా నిలబడి చూసుకుంటున్నాయి మళ్ళీ ఏక్షణంలోనన్నా కలబడదామని. ఇద్దరు ముగ్గురు ఆ వీధిలోనుండి నడిచిపోయారు. చీకట్లలో కరిగి ఒకరికి కనిపించకుండా మరొకరు నడుస్తూ, అందుకు సాధ్యమైనంత దూరంగా, జో- శబ్దం చేయకుండా జాగ్రత్తగా అడుగులు తేల్చివేస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన పావుగంట వరకు అత్తర్జూ, సెంట్లూ , పూలగుత్తుల పరిమళాలూ, పౌడరూ, స్నోల సువాసనలతో వీధంతా నిండిపోయింది. ఊరంతా నిద్రపోతున్నా సినిమాహాలు దగ్గరా, స్టేషన్లోనూ జనంవున్నట్టే ఆ వీధిలోనూ జనం తిరుగుతుంటారు. అందరికీ కావలసిన విశ్రాంతి కాదప్పుడు వాళ్ళు కోరేది. ఆనందం యొక్క చీకట్ రూపాన్నీ ముసుగు కప్పేసిన నికృష్ణపు బతుకు అందా అక్కడ కొనుక్కొందుకని జనం వస్తుంటారు. రాత్రి సమయంలోనే ఆ వ్యాపారం సాగుతుంటుంది. బతుక్కి బంగారం పూసి, అద్దాల బీరువాలోంచి చూపించి మనుషుల్ని మోసగించేందుకు రాత్రి తప్ప మరొకటి లేదు ఉదయం చూస్తే అక్కడ ఏమీ వుండదు. ఎంతో బోసిగా, వాడిపోయిన తర్వాత రంగూ, వాసనాలేక ఒరిగిపోయి కళావిహీనమై పోయిన పువ్వులాగా ముడతలు పడిపోయినట్టు సౌందర్య రహితంగా వుంటుందక్కడ ఆ వీధిలో అక్కడా అక్కడా అంతంతదూరంలో ఒక్కొక్కటి చొప్పున అయిదారిళ్ళు వున్నాయి. మిగతావన్నీ మామూలువే అన్నీ అందంగా వెలిగిపోతున్నాయి. రేడియోల సంగీతం, గాలికి ఎగిరే కర్టెన్ల రెప౦పలు, పాటలు, నవ్వులు, మూలుగులు, ఆప్యాయంగా మెల్లగా రహస్యంగా వాగ్దానాలు అక్కడ మెలికలు తిరుగుతూ గాలిలో కరిగి పలచబడి క్రమక్రమంగా మాయమవుతున్నాయి అన్ని యిళ్ళల్లోనూ గుమ్మాల దగ్గరా, స్తంభాలకు జారబడీ, ఇళ్ళకిటికీ కలుగుల్లోంచీ కులుకుతూ, నవ్వుతూ, కళ్ళు తిప్పి అభినయిస్తూ అర్థనగ్నంగా ఎదుటివాళ్ళను ఆకర్షిస్తూ అందాన్ని అమ్ముకొని వ్యభిచారం వ్యాపారం చేసి, కొనుక్కొన్నవాళ్ళను అమాయకుల్ని చేసి, వాళ్ళను అవమానించి నవ్వించి పంపేస్తున్నారు. అదో నర్జా! ఏడిపించబడేవాడు ఏడవడు. అలా కావడం ఒక అదృష్టంగానూ, అది అందరికీ లభించనిదానిగానూ, వాళ్ళ నవ్వులూ, సరసాలూ తనలాంటి ఏ అదృష్టవంతుడికోతప్ప అందరికీ కాదనుకొంటూ నవ్వేసి చక్కాపోతున్నారు
ఎిబిత్యత్రయం య! అక్కడ విశేషంగా వ్యాప్తిలో వున్నది ఒక కళ. అదే అభినయం! అది లేనినాడు వాళ్ళ బతుకులేదు. సంతోషం లేకపోయినా నవ్వుతూ వాళ్ళను అకర్షించేట్టు మనసును నిర్ణయగా అణగదొక్కి; శరీరంలో బలంలేకపోయినా, రోగంతో మూల్గుతూ మూల కూర్చున్నా కప్పిపుచ్చి, లేని ఉత్సాహంతో చలాకీగా ఒళ్ళనీ కళ్ళనీ కదిపి ఎదుటివారిని కుదిపివేయాలి. ముసలితనాన్నీ ముడతల శరీరాన్నీ భయంకర రూపాన్నీ దాచి; అది కనబడనీయకుండా నవ్విస్తూ, హావభావాల్ని చూపిస్తూ; రోజూ రోతతో విసిగిపోయినా, యిష్టంలేకపోయినా ఆ పనికి పూనుకోవాలి. అందుకు కావలసినదంతా నటన. కృత్రిమం. లేనిదాన్ని తెచ్చి చూపించి, మోసగించడం. అందుకు ఎంత నేర్చు వుండాలి! వాళ్ళకు అది చెయ్యగూడనిదనీ, అది వట్టి మోసమనీ, నికృష్టజీవితమనీ ముదనష్టపు బతుకనీ, ఆ బతుకులో తృప్త్పిలేదనీ తెలుసు. దొంగకు దొంగతనం చెయ్యడం యిష్టం వుండొచ్చు. కాని అది మంచిపని అనలేడు. అది ఎలాటిదో అతనికి తెలుసు. వ్యక్తిత్వాన్నీ, గౌరవాన్నీ వదులుకొని ప్రాణంతో చెలగాటం ఆడుతూ చయాదాక్షిణ్యాల్ని వదిలిపారేసి గుండెను రాయిచేసుకోవాలి. కడుపులో బిడ్డ బైటపడేవరకూ ప్రసవవేదన పడే తల్లి తన జీవితాన్ని అసహ్యించుకుంటుంది. కాని అది ఆ క్షణంవరకే. ఆ తర్వాత జ్ఞాపకం వచ్చి “ఎంత వెర్రిగా ఆలోచించాను" అనుకుంటుంది! ఇదీ అంతే. +" చెడ్డపని చేన్తున్నప్పుడు మననులో ఒకమూల బాధా, ఆ చేస్తున్న వని నిజస్వరూపం, భవిష్యత్తులో దాని ఫలితాలు కనిపిస్తాయి. అయినా అవి మనసును మార్చలేవు. చెడు, మంచికన్న అనేకరెట్లు బలంకలది. ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు ఏకాంతంగా కూర్చున్నప్పుడూ, గత జీవితాన్ని తలచుకొంటున్నప్పుడూ, శుద్ధ అమాయకుడినీ, మంచివాడినీ మోసగిస్తున్నప్పుడ్తూ కలిగి కేవలం నీలితెరల మాదిరిగా, గాలిపారల్లా, మబ్బుతునకల్లా ఎక్కడికో దూరానికి మళ్ళీ కళ్ళకు కనిపించనంత దూరానికి జారుకుపోతాయి. అలాంటి జనం వున్న వీధుల్లోంచి వెళ్తున్నాడు వాసుదేవరావు. అ వూరికీ,ఆ వీధికీ అతను పూర్తిగా కొత్త, ఆ వూరికి పనిమీద వచ్చి, మిత్రుడి అడ్రనున్న కాగితం పట్టుకొని వెతుక్కొంటూ వెళ్తున్నాడు. అట్టే విశాలమైన వీధి కూడా కాదు. చిన్న సందులా వుంది. అటూ యిటూ యిళ్ళు రోడ్డుపైకి పొడుచుకొని నుంచున్నాయి. ఒక కుక్క అతన్ని చూసి మొరుగుతూ స్తంభానికి కట్టిన గొలుసు తెంపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ వెంటనే రంగుల సీతాకోకచిలుకలు, వన్నెల విననకర్రలు కలుగుల్గోంచి చిట్టైలుకలు తొంగిచూస్తున్నట్టు
32 నమాధి కిటికీల్లోంచీ, సగం తెరిచిన తలుపు సందుల్గోంచీ చూస్తున్నాయి ఒకరు ఏదో అన్నారు అతన్ని చూసి. ఇద్దరు కిలాకిలా నవ్వారు పక్షుల్హా. ఒక యింటిముందు ఆగి యింటినంబరు కనిపిస్తోందేమోనని తలుపుకేసి చూశాడు అతను ఆగడం చూసి ఇద్దరమ్మాయిలు వీధిలోకి పరుగెత్తుకొచ్చారు తెల్లని మడతలు పోని చీర, అదేరంగు జాకెట్టు, మెళ్ళో మెరుస్తోన్న రాళ్ళ నెళ్లెసు, చేతులకు బంగారం రంగు గాజులు, తలకు పాపిడిపిందె-- నియోన్ లైటు వెలుతుర్లో జిగేల్మన్నాయి. ఒకామె సన్నగా, బక్కపలచగా, ఎర్రగా వుంది. పెదాలకు లిప్‌స్టిక్ ముఖానికి పొడరూ రాసినట్టు తెలుస్తోంది. రెండో అమ్మాయి ఓ మాదిరిలావు, ఛామనఛాయ. పెదాలకూ, గోళ్ళకూ రంగు పులుముకుంది. మొదటి అమ్మాయి ఏదో గొణిగింది. రెండో అమ్మాయి “రాండీ” అంది అతను నవ్వుకొని వెళ్ళిపోయాడు. ఆ వీధితత్వం అతనికి అర్థమయ్యింది. అలాంటి వీధిలో తన మిత్రుడున్నందుకు ఆశ్చర్యపోయాడు. ఆలోచిస్తూ రెండడుగులు వేసేన్రికి “బాబూ ఒక్క అగ్గిపుల్లవుంటే యిప్పిస్తారా, చుట్టకాల్చుకోవాలి” అంటూ యాటై ఏళ్ళు దాటిన సాధువు గెడ్డం దువ్వుకొంటూ వచ్చాడు. మనిషిని ఎగాదిగా చూసి “ఎక్కడికెళ్తున్నారు బాబూ?” అన్నాడు. వాసుదేవరావుకు చెప్పాలనిపించలేదు. కాని, మిత్రుడు వుండే వీధి యిదేనా అన్న అనుమానం వచ్చింది. “ఒకవేళ అడ్రసు పొరపాటున తప్పు యిచ్చాడేమో, ముందే తెలుసుకొంటే మంచిదిగా' అనుకున్నాడు. అరడజను పుల్లలు తీసిచ్చి “ఈ వీధిలో తాలూకా ఆఫీసు గుమాస్తా ఎవరన్నా వున్నారా?” అన్నాడు. “అదే. ఇక్కడినుండి మూడోఇల్లే. ఎల్లండి” అని తనే అక్కడనుండి ముఖం ముడుచుకొని ముందే కదిలిపోయాడు. వాసుదేవరావు అయింటి గుమ్మంవరకూ వచ్చి మిత్రుడు నరసింహాన్ని కేకేసి తలుపుకొట్టాడు. “ఎవరూ?” అంటూ ఓ మగకంఠం లోపల్నుంచి వినిపించింది. “నేనూ, వాసుదేవరావును” అన్నాడు తాపీగా, అది తన మిత్రుడి కంఠమే అని నిర్ధారణ చేసుకుని. నరసింహం తలుపు తీసుకునివచ్చి “ఆరి నువ్వటోయ్! రా” అంటూ లోపలికి తీసుకుపోయాడు. ఏమిట్తియిలా అంటున్నాడనిపించింది వాసుదేవరావుకు. తెచ్చుకున్న సంచి యింకా కింద పెట్టకుండానే “ఏమిటిది! ఇలాంటి వీధిలో
ఎిచ్యిత్రత్రయం 33 వుంటున్నావేమిటోయ్? ఊళ్ళో యిళ్ళే దొరకలేదా? ఇంటికి వచ్చేటప్పటికి చచ్చా ననుకో” అన్నాడు రావడంతోనే అదే అతను మొట్టమొదట అడిగిన ప్రశ్న,
“ఏం చెయ్యమంటావ్? రెండేళ్ళ కిందట యీ వీధిలో అన్నీ సంసారుల కొంపలే = ఒకటీ అరా తప్పించి. ఈ మధ్య బొత్తిగా మరీ అధ్వాన్నంగా తయారయిందనుకో. సంవత్సరంలోనూ అయిదారిళ్ళు లేచాయి ఇక్కడేకాదు, ఊళ్ళో అన్నిచోట్లా ఇలానే వున్నారు. ఊరు పెరిగేకొలదీ నాగరికత అభివృద్ధి అవుతూవుంటే యీ వ్యాపారంకూడా ప్రపోర్షనేట్గానే పెరుగుతోంది. పూర్తిగా సంసారుల కొంపలున్న వీధులు కావాలన్నా కనిపించవు” అన్నాడు నరసింహం
ఆ తర్వాత అతనే చెప్పాడు -
“చస్తున్నాననుకో ఈ వీధిలో వుండలేక. రోజూ రాత్రిళ్ళు వెధవ అల్లరి ఒక్కొక్కప్పుడు మా యింటి తలుపుల్నే బాదుతుంటారు తెలుసా- అన్నీ అలాటివే అనుకుని ! ఉండలేకపోతున్నా త్వరలో ఎక్కడికయినా మార్చెయ్యాలి.”
ఇద్దరూ సావకాశంగా కూచున్నారు.
“అలా చిక్కిపోయావేం?” అన్నాడు వాసుదేవరావు-నీరసించిపోయిన వాడిలా ఎముకలు బైటపడి చొప్పదవడలు, లోపలకు పోయిన కళ్ళు, సన్నగా చేతులూ కాళ్ళూ, ఆర్బుకుపోయి ఎముకల్ని అంటి పెట్టుకున్న గుండెతో- మనిషి అదోలా జీవంలేనట్టుగా ఆయాసపడుతూ రొప్పుతూ రోజుతూన్న నరసింాన్ని చూసి.
“ఏంలేదూ... వెధవది నర్వస్ వీల్నెస్తో ఏజ్జర్థం బట్టి బాధపడుతున్నాను. నరాలు లాక్కుపోతుంటాయి.నీరసం, ఆయాసం - ఏపనీ చెయ్యలేను... అలసట, ఉత్సాహం వుండదు. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కోలేను. దానికితోడు నేనే కేంపు క్లర్కుని, అస్తమానం ఏ పల్లెటూరికో కేంపులు తగులుతూనే వుంటాయి... నిద్ర నరిగా వుండదు. మానుకుందామా అంటే మూడు రూపాయలు ఒకసారికి చేతిలో కొస్తుంటే ఎలా మానాలనిపిస్తుంది.”
ఆ తర్వాత నరసింహం భార్యని పిలిచి వాసుదేవరావుకు పరిచయం చేశాడు. ఆమె కాస్సేపు నుంచొని వెళ్ళిపోయింది స్నానానికి నీళ్ళు తోఢడుదామని.
ముఖంలో ఉత్సాహం లేదు. అదోలా దిగులుగా వుంది. అతను చెప్తున్న దానికి ఊళకొట్టనైనా ఊకొట్టలేదు. భర్తతో మాట్లాడినంత సేపూ చాలా ముభావంగా చెయ్యమన్నవిచేసి అక్కర్లేదన్నవి వదిలేస్తోంది. అదోరకమైన నిర్లక్ష్యం. అతనంటే కోపం.
తశ నమాథి వాటిని దాచుకోడానికి ముందు గుండె రాయిచేసుకున్నట్టు "పేలవంగా, బాధగా, మెల్లగా, భారంగా నవ్వుతుంది అ నవ్వు ఎవరినీ సంతోషపెట్టలేదు. అధి సహజమైనది కాదని, అంతా కృత్రిమం అని సులభంగానే తెలిసిపోతుంది.
అలా వుండక మరింకెలా వుంటుంది! అతనివల్ల ఆమె సుఖించిందేదీ? ఏడాదిన్నరగా యీ రోగం. ఇప్పటికే యీనెపుల్లమాదిరి తయారయ్యాడు దానికితోడు రాత్రిళ్ళు ఊర్గో వుండడు అలాంటి భర్తని కట్టకున్నందుకు లోలోపల తిట్టుకుంటుంది కూడా.
వాసుదేవరావు భోజనం చెయ్యలేదు. వస్తున్నప్పుడే టిఫిను, కాఫీ తీసుకుని వచ్చాడు ఈ అర్ధరాత్రి వాళ్ళను బాధపెట్టడం దేనికని. మంచినీళ్ళు తాగి నిద్రపోయాడు.
ఉదయం లేచి, త్వరగా తెమిలి ఏడింటికే పనిమీద వెళ్ళిపోయాడు మధ్యాహ్నం రెండింటికిగాని రాలేదు. ఇంటికి వెళ్ళేసరికి నరసింహం ఆఫీసుకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వరకు ఎదురుచూసి.
నరసింహం భార్య వరలక్ష్మి “భోజనం వడ్డించాను రండి” అంది. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు యిచ్చింది
వాసుదేవరావు భోజనం చేస్తుండగా “వచ్చినపని అయిపోయిందాండీ” అంది
“అ... అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి కలుసుకుంటేసరి. సాయంకాలం వూరెళ్ళిపోతూ అలా కలుసుకుందామనుకుంటున్నాను.” అన్నాడు.
“అదేమిటి! ఒక్కరోజన్నా సరిగ్గా వుండందే. మా ఆయనగారు మిమ్మల్ని నాలుగురోజులు వృంచేద్దాం అన్నారు. మీకు వేరే పనేమీ లేదటగా, ఉండండి, రెండురోజులు వుండి వెళ్ళుదురుగాని ”
“ఖాళీయే అనుకోండి, కాని యిక్కడమాత్రం చేసేదేముంది”
“చేసేది వుందని నేనూ అనడంలేదు. రేపు ఆదివారమే కదా. మీరిద్దరూ అలా వూరల్లా తిరిగిరావచ్చు. మీకుకూడా యీవూరు కొత్తటగా. కాస్సేపు సావకాశంగా మాట్టాడుకోడానికి, మంచిచెడ్డలు చెప్పుకోడానికి వీలుంటుంది.”
“నిజమే...కాని , ఏమిటో వెళ్ళాలనుకున్నాను. వెళ్ళకపోతే అదోలా వుంటుంది. మళ్ళీ వస్తాలెండి నెలరోజులు పోయాక, అప్పుడు వారంరోజులపొటు వుండి మరీ వెల్తాను.”
విచిత్రతయం ౩ల్
వరలక్ష్మి మరేమీ మాట్లాడలేదు. గిర్రున వెనక్కితిరిగి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి “సరే, రేపు పొద్దున్న మీవూరు వస్తే మేమూ అలానే చేస్తాం బంధుత్వం, స్నేహం వున్నచోట్ల యిలాటివి పనికిరావండీ” అంది
ఆ మాటలో చిరుకోపం, 'ఇదీ' అని చెప్పుకోలేని బాధా యిమిడి వున్నాయి ఒక నిశ్వాసం భారంగా, దీర్ధంగా ఆమె తీయడం అతను చూడలేదు.
భోజనం అయిపోయాక గదిలో కూర్చున్నాడు.
వరలక్ష్మి తమలపాకులు తెచ్చి యిచ్చింది వాసుదేవరావు వేసుకుని నములుతూ 'పేపరుచూస్తూ కూర్చున్నాడు.
పావుగంటయ్యాక అతను పేపరు వత్తిగించిచూస్తే ఆ ఎదురుగా కాస్త దూరంలో అమె కూచుని యిటే చూస్తోంది. ఒకపక్కకు తలతిప్పి, మెల్లగా మూలిగి లేచి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళల్లో దేన్నో వెతికి అలసిపోయిన అలసటనీ, వేదననీ అతను చూశాడు.
వాసుదేవరావు 'ఏమిటీ' అనుకున్నాడు.
అనేకమంది స్రీలతో అతనికి పరిచయం వుంది. వాళ్ళను పొగిడి, మాటలు చెప్పి లోబరచుకునే శక్తి వుంది. తెల్లటి గుండ్రని అందమైన ముఖం అతనిది. నల్లగా వెనక్కు తిరిగిన జుత్తు, ముఖంలో పెదాలమీద చిరునవ్వు. దానికింద రెండుగా చీలినట్టు సన్నగా గాడి కలిగిన గెడ్డం అతని వయసుని మభ్యపెట్టి చూపిస్తుంటాయి. అయినా యిరవై ఎనిమిదేళ్ళుకూడా దాటినవాడు కాదు. అతనికి చాలామంది స్త్రీల తత్వం తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా అతనిముందు అభినయిస్తుంటారు. వాటన్నిటికీ అతను అలవాటు వడ్డాడు అదంతా కృత్రిమమని అతనికి తెలును. తనని మభ్య పెట్టడానికి చేస్తున్నదని అతను ఎరుగును. అదే వాస్తవం అయినప్పుడు మాత్రం విచిత్రంగా అతని ఆలోచనలు గడ్డకట్టుకుపోతాయి. అదీ కొద్దిసేపే. ఎందుకు? ఏమిటి? అని ప్రశ్ళించుకున్నప్పుడు జవాబు రాకపోతే 'తీసిపారేయ్' అన్నట్టు ఆ విషయం పక్కకు తోసేస్తుంటాడు.
వరలక్ష్మి గురించి వాసుదేవరావు ఏమీ అనుకోలేకపోయాడు. సంసారంలోని విషయాలు, ఏమిటిలే-- అనుకుని, అలా వెళ్ళొస్తానని బయల్దేరాడు.
సాయంకాలం వరకు ఎక్కడెక్కడో తిరిగి యింటికి చేరుకున్నాడు యిక వెళ్ళిపోదామని నిర్ణయించుకుని.
36 నమాధి
కాని లాభంలేకపోయింది.
నరసింహం వీధిలోనే కూర్చుని వాసుదేవరావు రావడంతోటే “అదేమిటోయ్! అప్పుడే వెళ్ళిపోతానంటున్నావట లాభంలేదు. నాలుగురోజులైనా వుండాలి అధమం ఇవాళా, రేపైనా వుండకతప్పదు. సోమవారం ఉదయం వెళ్ళువుగానిలే అన్నాడు.
వాసుదేవరావు “అబ్బే, రేపొక్కరోజు .” అంటూ ఏదో గొణిగాడు
“చూద్దాంలే” అన్నాడు నరసింహం
ఆరాత్రి పదకొండింటికి హెడ్క్షర్క్ రెండో కూతురి పెళ్ళి అనీ, తను వచ్చేటప్పటికి పన్నెండవుతుందని చెప్పి, వాసుదేవరావుకు నిన్నటిలాగే నడవాలో పక్కవేయమని చెప్పి వెళ్ళిపోయాడు నరసింహం.
వాసుదేవరావు భోజనం చేసి పక్కమీదకు చేరుకున్నాడు అంత వేగంగా నిద్రపోవడం అలవాటులేదు. మాట్లాడుకుంటూ కూచుందామంటే నరసింహం పనుందని వెళ్ళిపోయాడు ఒక్కడూ యింట్లో దేనికని బయటికి వెళ్ళివద్దామన్నా బయట చలి కొరుక్కుతింటోంది. కూడా ఉలెన్ స్వెట్టర్ పట్టుకురావడం మర్చిపోయాడు విధిలేక గదిలోనే నాలుగు గోడలమధ్యా కిటికీలు బిగించి, పేరుకు లోపలితలుపులు కొద్దిగా తీసి సిగరెట్టు మీద సిగరెట్టు ఊదుతూ కూర్చున్నాడు.
వరలక్ష్మి వంటింట్లో పని పూర్తిచేసుకొచ్చి కాస్సేపు అతనితో ఏదో అప్రస్తుతంగా మాట్టాడుతూ కూర్చుంది.
అక్కడ కూర్చున్నంతసేపూ ఆమె చేష్టలు చిలిపిగా, అసహ్యంగా, భరించడం కష్టంగా అనిపించాయి అతనికి.
అతను చలించలేదు కాని చూసి వూరుకున్నాడు
ఆమె నవ్వేది.
కొంటెగా చూసేది.
“అబ్బా పోండీ' అనేది.
కొద్దిగా కోపం, నవ్వు, సిగ్గు, సన్నిహితత్వం ... ఇంకా ఆ మాటల్లో మృదుత్వం, (పేమ, రహస్యంగా ఏదో చెప్తున్న భావం స్ఫురించేవి.
ఆ కొద్దిపాటి సన్నిహితత్వంలోనూ మోటుగా, గట్టిగావేళాకోళం, సన్నగా తెల్లతెల్లగా
విబిత్రత్రయం ౩7 నవ్వులు, మెల్లగా మృదువుగా హృదయాన్ని గిలిగింతలు పెట్టే మాటలు, ఆవలిస్తూ బద్ధకంగా లేచి కూర్చొని ఒళ్ళు విరుచుకొని అతని ముందు పాములా మెలికలు తిప్పి చూపిస్తున్న శరీరం - వాసుదేవరావుకు రోత, అసహ్యం, కోపం పుట్టించాయి.
మరొకరే గనుక అలా చేస్తూవుంటే అనందంగా తనే స్పందించేవిధంగా ప్రవర్తించేవాడు. గత అనుభవాన్నంతా ఆమె ముందు పోసి, తృప్తిగా సంతోషంగా ఆ కళ్ళను నవ్వించేవాడు.
కాని ఆమె - అతడిని నమ్మి నిశ్చింతగా తనపని చూసుకునేందుకు వెళ్ళిన మిత్రుడి భార్య!
ఆమె దాహంతో ఎదురుచూస్తున్నమాట నిజం. కాని ఆమె దాహంతీర్చేపాటి వాడు కాడు తను
దాహంతో గొంతు ఎండిపోయినవాడికి కొద్దిగా నీళ్ళతడి తగిలితేనే ప్రాణం లేచివచ్చినట్ట వుంటుంది. అవి ఎలాంటివో, ఎవరిస్తున్నారోనన్న ఆలోచన వుండదు. కేవలం దప్పికతీర్చుకోవడమే వాళ్ళ ఉద్దేశం.
వాసుదేవరావు పెద్దగా చలించలేకపోయాడు. స్రీ అందం, వాళ్ళ చూపులూ, నవ్వులూ, మాటలూ, చేతలకు లొంగిపోవడానికి అతడికవేమీ కొత్తకావు. లోగడ అనేకమంది స్త్రీలతో అనుభవం వుంది. అయితే యిప్పటికీ అతను వాటిని కావాలని కోరుకుంటాడు. అందుకు కారణం అతను వాళ్ళ ప్రలోభాలకు, మోసానికి, కృత్రిమానికి లొంగిపోయికాదు. అదోరకమైన ఆనందం, దర్జాగా సగర్వంగా చెప్పుకునే విషయం!
వాసుదేవరావు మూడు సిగరెట్టు వరుసగా కాల్చి బద్ధకంగా ఆవలించాడు-ఇక నిద్రపోదామని.
వరలక్ష్మి గట్టిగా నిట్టూర్చి లేచి వెళ్ళిపోయింది.
వాసుదేవరావు వెళ్ళిపోతున్న ఆవిడను చూసి, ముసుగుని మీదకు లాక్కున్నాడు. ఆపాదమస్తకం వెచ్చా వుండేలా. ఆ తర్వాత ఆమె అవతలిగదిలో విసురుగా మంచం వేసుకోవడం, దుప్పటి దుల 1డం, నిద్రపోతున్నప్పుడు గాజులు శబ్దం చేయడం, మంచం కిర్రుమనడం అన్నీ వినిపించి గ్రష ౦గా నిద్రమత్తులోకి వెళ్ళిపోయాయి.
మధ్యలో తెలివి వచ్చింది.
38 నమాధి మంచినీళ్ళు తాగుదామని ఆ చీకట్లో నిద్రమత్తుతో వెతుకుతూంటే చెయ్యి తగిలి టేబిలుమీది గ్లాసు కిందపడి శబ్దం అయ్యింది.
వరలక్ష్మి తలుపు తీసుకుని కళ్ళు నులుపుకొంటూ వచ్చి “మంచినీళ్ళు వెతుకుతున్నారా, అవిగో టేబిలుమీద పెట్టాను” అంటూ తనే మంచినీళ్ళు వంపి యిచ్చింది.
లైటు వేసి కుర్చీలో కూర్చుంటూ “ఏమండీ, నిద్రపట్టలేదా?” అంది
“పట్టింది” అన్నాడు ముభావంగా.
ఆమె అక్కడనుండి కదులుతుందేమోనని చాలాసేపు ఎదురుచూశాడు.
ఆమె అక్కడనుండి లేవలేదు.
వాసుదేవరావుకు విసుగుపుట్టింది
ఆమెమీద అసహ్యం కలిగింది.
అక్కడ తను వుండడం భావ్యం కాదనుకున్నాడు. దండెంమీది చొక్కా తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు.
ఎక్కడక్సు వెళ్ళాలో ఆలోచించుకోకుండానే నడుస్తున్నాడు.
బయట చలి ఎముకల్నీ మొత్తం శరీరాన్నీ కొరికేస్తోంది. అసలే తొడుక్కున్నవి సన్నని గ్లాస్కో బట్టలేమో గజగజ వణికిపోతున్నాడు.
సిగరిట్టు కాలుద్దామని జేబు తడుముకుంటే సిగరెట్టు దొరికాయిగాని అగ్గిపెట్టె కనిపించలేదు. ఇంట్లో ఎక్కడో వదిలేసి వుంటాడు. ఎవరైనా ఎదురైతే వాళ్ళను అడుగుదామన్నా ఒకరికొకరు కనిపించకుండా వుండాలని దొంగ చాటుగా మూలల్నుంచి తువ్వాల్ని ముసుగులుగా ముఖాన ఆనవాలు దొరక్కుండా కప్పేసుకుని, ఎవరైనా పలకరిస్తున్నా వినిపించుకోకుండా వెళ్తున్నారు. వాళ్ళను ఆపి అడిగినా, నిజంగా వాళ్ళదగ్గిర వున్నా, లేదని తప్పించుకుపోతారు!
అ వీధిలో ఒక చిన్న గుడివుంది. అది ఏ దేవుడి గుడ్లో అతను పగలు పరిశీలించి చూడలేదుగాని ఎవరో ఒక దేవుడు అక్కడ కాపురం వుంటున్నాడని అతనికి తెలుసు. దేవుడు నర్వాంతర్యామి అనడానికిదో నిదర్శనం! అక్కడా యిక్కడా అనిలేదు, ఎక్కడబడితే అక్కడే వుంటాడు ప్రహ్లాదుడు చెప్పినట్టు. ఎక్కడయినా ఒకేరకం ఆనందం.
విబిత్రత్రయం ౨9 ఆనాడు శ్రీనాధుడు వెండి శివలింగాన్ని మెళ్ళో వేసుకున్న అడామెను చూసి “జంగం స్త్రీ వక్షాల మధ్య లోయలో చల్లని నీడలో హాయిగా నిద్రపోతున్నావయ్యా శివయ్యా” అని అన్నాడంటే కేవలం దేవుడు అంత సుఖంగా నిద్రపోతున్నాడన్న ఈర్య్యవల్తా, కోపంవల్తానూ అతనికి మాత్రం తెలీదూ, దేవుడు అక్కడేమిటి ఎక్కడయినా వుంటాడు! ఏదో అప్పటికి అలా అన్నాడు అతనిమీద అసూయకొద్దీ,
వాసుదేవరావు ఆ గుడిదగ్గరకు చేరుకున్నాడు.
నిన్నటి సాధువు ఆ గుడి అరుగుమీద ఒక మూల చీకట్లో కూర్చుని గంజాయిపట్టు పట్టిస్తున్నాడు. గట్టిగా దమ్ములాగి వదిలిపెడుతున్నాడు. గొట్టంలోని గంజాయి వెలిగి ఆరిపోయి, రెండు నిమిషాల తర్వాత దమ్ము పీల్చడంతోనే మళ్ళీరాజుకుంటోంది. అది వెలిగినప్పుడల్లా ఎర్రగా కందిపోయిన మొఖంలో యింకా ఎర్రగా వెలుతురు పడుతూ, అది పీల్చడానికి అతను పడుతున్న శ్రమంతా తెలుపుతోంది. ఒకొక్కసారి అయిదు నిమిషాల వరకు దగ్గిదగ్గి నీరసంగా మూలిగి, ఇంకో అయిదు నిమిషాలు గొట్టాన్ని ప్రక్కన పెట్టి, మళ్ళీ యధావిధిగా చేస్తున్నాడు. మధ్యమధ్య రెండేసి నిమిషాలకు ఒకసారి రామనామాన్ని గట్టిగా జపిస్తున్నాడు.
“ఎవరు బాబూ” అన్నాడు సాధువు వెనక్కు తిరిగి వాసుదేవరావును చూసి.
తర్వాత అతనే కూర్చున్న చోటినుండి లేచివచ్చి పరిశీలనగా వాసుదేవరావు ముఖంలోకి చూసి “మీరా! రండి కూర్చోండి” అన్నాడు తను పడుకునే తాటాకుచాప దులిపి.
“ఏదీ, కాన్త సిగరెట్టు వెలిగించుకోనీ, చలేస్తోంది” అంటూ చావమీద చతికిలపడ్డాడు.
చాలా వికృతంగా, విచిత్రంగా, గట్టిగా నవ్వాడు సాధువు.
అసలు అతని నవ్వే అంతేమో!
ఆ శబ్దానికి ఎదురుగా ఒక కలుగులోంచి రెండు చిలుకలు కిచకిచలాడాయి.
వాసుదేవరావు ఆశ్చర్యంగా చూశాడు అతనివైపు.
“అదేవిటండీ, పాతికేళ్ళన్నాలేవు...ముసలాళ్ళలా చలంటారేవిటీ” అన్నాడు నవ్వాపుకొని.
40 నమాధి
మళ్ళీ ఎదుటి కన్నంలో చిలుకలు కిచకిచమన్నాయి. రెండు కాదు మూడు! కొత్తగా వచ్చిన చిలక కలుగుదాటి బయటికే వచ్చి నుంచుంది ఎగాదిగా వాసుదేవరావును చూస్తూ
“ఏమిటి బాబూ చూస్తున్నావు?” అన్నాడు తాత
“అబ్బే ఏంలేదు, ఎవరా అని"
“ఎవరేవిటి...రంభండి! తప్పపుట్టి యో యింట్లో ఫుట్టిందిగాని లేకపోతే ఏ చక్రవర్తి కూతురో కదుటండీ” తాత గెడ్డాన్నీ మీసాన్నీ కదిపి మెల్లగా నవ్వాడు.
వాసుదేవరావుకు అర్థమయ్యింది.
“ఎంతేమిటి?” అన్నాడు కొంటెగా.
“ఏముంది రెండు హస్తాలే. మీకు కావలిస్తే చెప్పండి ఒక హస్తానికే మాట్లాడి పెడతా”
వాసుదేనరావు మాట్లాడలేదు. మౌనంగా ఆలోచిస్తున్నాడు.
తాత మళ్ళీ అందుకున్నాడు. “రామరామ. నేను అబద్దం ఆడతాననుకొన్నారా, నిజం ! ఆ రాముడి సాక్షిగా చెప్తున్నా ఊరిలో యిలాంటి పిల్ల లేదనుకోండి. మేళం ఎవరు కడతారయ్యా అంటే ముందు అదిగో ఆ రాజ్యం పేరు చెప్పి అ తర్వాతే మిగతావాళ్ళనిచిప్తారు. చూడండి నుంచొందిగా భలేపిల్లలెండి! అయితే పాదుషా, లేకపోతే ఫకీర్! పడితే ఆ పిల్లనే పట్టాలి. లేదూ యింక భోగందాని'పేరు ఎత్తకండి మీ జన్మలో. గువ్వలాంటి పిల్ల బాబూ. ఇంకా చూస్తారేం”
తాత, ఓ మారుమూల పడేసిన గంజాయి గొట్టంతీసి మళ్ళీ ఒక్క దమ్ములాగొడు గట్టిగా.
వాసుదేవరావు జేబులో చెయ్యి పెట్టాడు. అయిదు రూపాయల నోటు బయటికొచ్చింది.
“సరే కానియ్” అన్నాడు, సిగరెట్టును ఆఖరిసారి గట్టిగా పీల్చి పారేస్తూ,
“మరి...మరి నసిగాడు సాధువు.
“ఏంఖొ
విచ్యిత్రత్రయం త్తే
“గంజాయి కొనుక్కుంటాను. ఒక్క అర్ధరూపాయివుంటే యిప్పిస్తారేమోనని”
“అర్ధరూపాయలేదు, పావలాయే వుంది. ఇంద” వాసుదేవరావు పావలా తాత చేతిలో పెట్టాడు.
“ఉండండి, ఇప్పుడే వస్తా” అంటూ ఎదుటింటిలోకి వెళ్ళాడు సాధువు. అయిదు నిమిషాల్లో మళ్ళీ వెనక్కు తిరిగివచ్చి “వెళ్ళండి, అదే యిల్లు, అన్నట్టు ఒక చుట్టపీకవుంటే యిప్పిద్దురూ పొద్దుటికి మళ్ళీ ఏంలేదు”
“లేవు తాతా. .సిగరెట్లే కాలుస్తాను”
“పోనీ ఏదో ఒకటి. ఇలా పారెయ్యండి”
వాసుదేవరావు సిగరెట్టుని సాధువు దగ్గరికి విసిరి హుషారుగా గబగబా ఎదుటి మెట్లెక్కాడు.
వీధిలో నుంచున్న అమ్మాయి “రాండీ” అంది. ఒయ్యారంగా ఊగుతూ వచ్చి భుజం పట్టుకుని లోపలకు తీసుకెళ్ళింది ఖాళీగావున్న పెద్దహాల్లోకి.
ఇద్దరు పిల్లలు అదే వయసువాళ్ళు సోఫాల్లో కూర్చుని డిటెక్టివ్ నవలలు చదువుతున్నారు.
ఒక ముసలావిడవచ్చి “చూసుకోబాబూ” అంది.
“రాజ్యం అట ఎవరూ?” అన్నాడు ముగ్గుర్నీ చూసి.
“నీనే రాండీ” అంది యిందాక వీధిలో నుంచున్న అమ్మాయి మెడచుట్టు ఒయ్యారంగా చేతులు చుట్టి.
హాలుకి కుడివైపు ఓ గదివుంది. అట్టే చిన్నదీ కాదు, మరీ పెద్దదీకాదు. లోన ఒక పందిరిమంచం గదిలో సగంవరకూ అవరించివుంది. మంచంమీద తెల్లని పరుపు, దుప్పటి, మీద కొన్ని మల్లెపూలు, గదిలో అగరువత్తులు- సగంకాలి పాగ మెలికలు మెలికలుగా గదినిండా మబ్బు తెరల్లా దట్టంగా నువాసనలు; నీలంరంగు బెడ్రూం లైటు, చిన్న దేవుడి ఫొటో రెండు రోజులకిందట వేలాడవేసిన మల్లెపూదండ, గాలికి ఎగిరే నీలితెరలు-అన్నీ అందానికి అమర్చినవేగాని ఒకదానివల్లా ఉపయోగం వున్నట్టులేదు.
వాసుదేవరావు సెకండ్‌షో సినిమా విడిచిపెట్టే వేళకు యింటికి వెళ్ళిపోయాడు.
తై నమాధి
“సినిమా ఎలావుందీ?” అన్నాడు నరసింహం.
“మీ మిత్రుడు సినిమాకు వెళ్ళాడని అతనిళ్లో వరలక్ష్మి చెప్పింది
వాసుదేవరావు “బాగానే వుంది” అన్నాడు జవాబుగా
ఆ రాత్రికి నరసింహం పక్కనే వేరే మంచంమీద పడుకున్నాడు. వరలక్ష్మి లోన మరో గదిలో నిద్రపోయింది.
ఉదయం “ఇక తప్పదోయ్! నేను వెళ్ళిపోవాలి యీ బండికే” అంటూ పట్టుపట్టాడు వాసుదేవరావు.
నరసింహం అఖరుకు ఆరోజు సాయంకాలం వరకన్నా ఉండమన్నాడుగాని వుండలేదు. ఏదో వంకపెట్టి ప్రయాణం స్థిరపరచుకున్నాడు.
స్నానం పానం పూర్తవగానే వెళ్ళొస్తానని వరలక్ష్మితో చెప్పి బయలుదేరాడు. నరసింహం కూడా మిత్రుడివెంటట బయలుదేరాడు బండెక్కించి వద్దామని.
అప్పటికి నెమ్మది నెమ్మదిగా వెలుగు కిరణాలు ముసుగు దుప్పటిలోకి, చీకటి కోణాల్లోకిి కలుగుల్లోకి వ్యాపించాయి. ఆగిపోయిన యంత్రం మీట నొక్కితే తిరిగినట్టుగా ప్రకృతి మళ్ళీ బద్దకాన్ని దులుపుకొని ఆవలించి లేచి పరుగులెత్తాలని బయలుదేరింది. జనం ఊరి వీధుల్లో అన్ని వైపులకు, మూలల్లో! నీళ్ళు జారినట్టు జారుతున్నారు. మళ్ళీ ఫ్యాక్టరీలు, కార్డు బళ్ళు జనం యధావిధిగా సంచలనాన్ని లేపి గోల చేస్తున్నాయి, అప్పుడే లేచినవాళ్ళు అప్పటికే కాలం అయిదుబారల దూరం పరుగెత్తే సరికి ఆదరా బాదరాగా ఊడిపోతున్న పంచెకట్టుల్ని వెనక్కి దోపుకుంటూ బొజ్జల్ని ఊపుకుంటూ పరుగెడుతున్నట్టు కదుల్తున్నారు. కాఫీ హోటళ్ళు, బజారు ప్రాంతాలు జనంతో నిండిపోతున్నాయి. రాత్రంతా హాయిగా నిద్రపోయిన మీదట ప్రకృతి ముఖం కొంచెం కళకళలాడుతోంది.
సాధువు కాషాయ బట్టలు తొడిగి, వీబూధి ఒళ్ళంతటికీ పులుముకుని రామనామాన్నీ, భక్తికీర్తనల్నీ, నీతి ప్రబోధాల్నీ శ్రావ్యంగా భక్తితో తన్మయత్వం పొందినవాడిలా పాడుతూ, పాడుతున్నప్పుడు సగం కళ్ళుమూసి, దానంచేసిస్ వాళ్ళను దేవుడు దయదలచి ప్రనన్నమయినట్ట చిరునవ్వు నవ్వి దీవిన్తూ ఊరిలోకి బయలుదేరాడు.
విబిత్రతయం 4౩
వరలక్ష్మి పవిత్రవతిలా పతివ్రత మాదిరి చీకటితోనే స్నానంచేసి, పూజచేసిన పువ్వుల్నీ అక్షతల్నీ తలసిగలో దోపి, ముఖంలో గుండ్రంగా కుంకుమబొట్టు తీర్చిదిద్ది, మిత్రుడ్నీ దిగబెట్టడానికి బయలుదేరిన భర్తకు కండువా గొడుగు యిచ్చి, “వెళ్ళి రండీ” అన్నట్టు చిరునవ్వు నవ్వింది ఆప్యాయంగా (్రేమగా కొంచెం సిగ్గుగా భర్త ముఖంలోకి చూస్తూ.
వాడిపోయిన పూవును అందరూ అది సరికొత్తదనీ, అప్పుడే మొగ్గవిడిచినదనీ తెలిపేందుకై అత్తర్లూ 'సెంట్లూ రాసి అలంకరించి కృత్రిమంగా అందాన్ని సృష్టించి, దాన్ని నలుగురూ నమ్మేందుకని, అందాన్ని అందరికీ కనిపించేలా చేసి వ్యాపారాన్ని లాభసాటి చేసుకోవాలని ఊళ్ళోకి బయలుదేరింది రాజ్యం.
వాళ్ళను చూస్తూ బండెక్కాడు వాసుదేవరావు.
9
సమాధి
రౌజారావు ఉదయమే ఆ యింట్లో దిగాడు.
ఆ సాయంకాలం వీధి గదిలో కూర్చుని కథ రాసుకుంటున్నాడు.
రాజారావు రచయిత. పాఠకులలో అతని రచనలకొక విశిష్టతవుంది. బహుకొద్ది కాలంలోనే మంచి రచయితగా పేరుపొందాడు. చాలామంది రచయితల్లా అతని రచనల్లోనూ ఆవేశంపాలు అధికం. వాస్తవానికి ఎక్కువ (ప్రాధాన్యత యిస్తుంటాడు.
ఇంట్లో దిగినరోజు బావృందికదాఅని ఆరోజే కథ రాయడానికి కూడా (ప్రారంభోత్సవం చేశాడు.
కథ పదిపేజీల వరకు నడిచింది. సాలోచనగా సిగరెట్టు కాలుస్తూ కిటికీలోంచి అవతలకి చూస్తున్నవాడల్లా కక్కున ఆగిపోయి కలం పక్కన పెట్టి చూస్తూ కూర్చున్నాడు.
సన్నగా ఎగర్రగావున్న ఒకామె అవతలి మేడమీది కిటికీముందు కూర్చుని దూరంగా దేన్నో చూస్తోంది.
కొద్దిసేపు చూసి మళ్ళీ కథ రాయడంలో నిమగ్బుడయ్యాడు.
చీకటిపడింది. అక్షరాలు కనిపించడంలేదు.
లేచివెళ్ళి లైటు వెలిగించి మళ్ళీ వచ్చి కిటికీముందు కూర్చున్నాడు వట్టినే అలా బైటికి చూస్తూ,
నమాధి శక్ అవతలి కిటికీలో మసకగా అమె ఆకారం యింకా కనిపిస్తూనే వుంది. రాజారావుకు ఆశ్చర్యం వేసింది. “ఏమిటి చెప్మా ఆమె అలా చూస్తోంది?" అనుకున్నాడు చిత్రంగా ఆమెనే చూస్తూ పనిమనిషి కాబోలు ఆ యింట్లో దీపం వెలిగించింది. గ్లాసులో ఏదో వంపి ఆమెకిచ్చి వెళ్ళిపోయింది. దానివంక క్షణంసేపు నిదానించి చూసి, గడగడా తాగేసింది అమె. రాజారావు డాబామీదకు వచ్చి ఆమె చూస్తున్నవైపుగా చూశాడు. బైట ఊరినిండా అంధకారం నల్లని ముసుగు దుప్పటిలా కప్పివుంది. చెట్టు చేమలు, యిళ్ళు గుళ్ళు అన్నీ నల్లటినీడల్లా నిలుచున్నాయి సగం సగం చీకట్లలో కరిగి. అక్కడక్కడ వీధుల్లో యిళ్ళల్లో దీపాలు వెలుగుతున్నాయి. అవి కొద్దిమేర వెలుతురి సృష్టించి క్రమంగా చీకట్లలో కరుగుతున్నాయి. బజారులోను, వీధుల్లోనూ సందుల్లోను కార్టూ బళ్ళూ, రిక్షాలూ, సైకిళ్ళూ వరుగెడుతూంటే విచిత్రంగా దీపాలు చీకటిలో మెరుస్తూ కదులుతున్నాయి. అంతే! అంతకు తప్పించి యింకేమీ కనిపించలేదు. అటు ఏముందో ఊహించుకోవడానికైనా అతనికి ఆ వూరుతో పరిచయం లేదు. చాలాసేపు అలానే నుంచున్నాడు. ఆకలి జ్ఞాపకానికొచ్చింది. డాబాదిగ్సి బట్టలు మార్చుకుని హోటలుకు బయలుదేరాడు, ఇంటికి పదిగజాల దూరంలో కిళ్ళీకొట్టొాకటుంది. వయనుమీరిన తాత కొట్టుమీద కూర్చుని బేరం చూసుకొంటూ వుంటాడు. రాజారావు భోజనంచేసి వస్తున్నప్పుడే కొట్లో సిగరెట్లు కొనుక్కొని వచ్చాడు. ఆ రాత్రల్లా అతను కథను ముట్టలేదు. ఆమె ఎదుటి కిటికీముందు రాత్రి చాలా పొద్దుపోయేవరకు అలానే కూర్చుని ఊరల్లా నిద్రపోయాక మెల్లగా కదిలిపోయింది. రాజారావు ఆలోచనలతో నిద్రపోయాడు. విచిత్రమయిన కలలమధ్య ఉదయం మెలకువ వచ్చింది. అప్పటికే సూర్యకిరణాలు కిటికీలోంచి మీదకు వాలుతున్నాయి.
శం నమాధి బద్దకాన్ని దులుపుకుని, మంచంమీద లేచి కూర్చుని కిటికీలోంచి చూశాడు. ఆమె కిటికీముందు వుంది. స్పష్టంగా అవుపిస్తోంది తలమీదకు ముసుగు తీసుకుని దూరంగా యిళ్ళ కప్పుల్ని దాటుకుని చూస్తోంది. ఉదయ కిరణాలు, చల్లని గాలి ఆమె శిరోజాల్సి చెంపల్ని తాకుతూ పోతున్నాయి. గాలికి దిగజారిపోతున్న ముసుగుని సరిచేసుకుని కూర్చుంది.
గబగబా డౌబామీదకు వెళ్ళి ఆమె చూస్తున్న వైపు చూశాడు.
రాత్రి చీకటిలో దాగిన ఊరంతా రొమ్ము విరుచుకుని వెలుతుర్లోకొచ్చి నుంచుంది. మీద కప్పుకున్న నల్లటి దుప్పటిని దూరంగా విసిరిపారేసి నవ్వుతూ ఎదుట వుంది. కొద్దిమేరతో ఆఖరయిన ఊరు, అవతల మెల్లగా కదులుతున్న గోదావరి, గట్టున స్మశానాలు, అక్కడక్కడ చెట్లు ఉన్నాయి.
అమె చూస్తున్నవైవు చెప్పుకోదగ్గ మేడలేదు. పెద్ద వీధి లేదు మానవ అహంకారాన్ని నాశనం చేసేద, సర్వమానవ సమానత్వాన్ని నిరూపించేదీ ఆఖరి మంజిల్- స్మశానస్థలి ఉందక్కడ,
రాజారావు గట్టిగా ఊపిరితీసి విడిచి కిందకు వెళ్ళిపోయాడు. అతని మనసల్లా అనేక ఆలోచనలతో నిండిపోయింది.
సాయంకాలం ఆఫీసునించి వస్తూ కిళ్ళీకొట్టు దగ్గర ఆగి సిగరెట్లు కొనుక్కున్నాడు. ఒకటి కాలుస్తూ అలాగే నుంచున్నాడు చాలాసేపు.
ఇంతకూ ఆవె ఎవరు? ఎందుకలా చూన్తంటుంది?-వివరాలు తెలుసుకొందామని అతని కోరిక. తాతతో యీ రెండు రోజుల్లోనూ కొద్దిపాటి పరిచయం ఏర్పడింది. తాతకుకూడా చేరాలులేవు. ఖాళీగా కూర్చోలేక రాజారావును కదిపి పెరిగి పోతున్న ధరలగురించి మాట్లాడుతున్నాడు!
“చూడుతాతా, ఆవిడెవరు?” అన్నాడు రాజారావు సమయం కనిపెట్టి.
తొత రాజారావువంక అదోలా చూశాడు.
ఆ తర్వాత 'పాకిస్థానీవాళ్ళ పిల్ల బాబూ! పాపం భర్తపోయాడు. ఆమె భర్త శేట్! కపూర్ చంద్ అని పెద్ద వడ్డీ వ్యాపారి. ఆకస్మాత్తుగా ఒకరోజు గుండె అగి చని పోయాడు” అన్నాడు తాత,
“పాపం!” అన్నాడు సానుభూతిగా రాజారావు.
నమాధి శ?
అది అతనికే ఆశ్చర్యం వేసింది. ఆమె ఎవరో ఎలాటిదో ముక్కూ మొహం ఎరక్కషోయినా ఆమె మీధ సానుభూతి చూపించడానికి కారణమైనదేమిటో అతనికే అర్థంకాలేదు.
ఇంటికి వెళ్ళి 'ఆమెమీద కథ రాయలేనూ' అని ప్రశ్నించుకున్నాడు.
కాని ఆమెను గురించి ఏమని వ్రాయడం?
ఆమె జీవితం గురించి తనకేం తెలుసు!
అయినా ఊహించి కధావస్తువును సగంవరకు రూపొందించుకున్నాడు.
అమె చాలా పేద కుటుంబంలో పుట్టింది. దరిద్రంలోనే ఆమె యవ్వనాన్ని తొడుక్కుంది. పుట్టిన దగ్గరనుండి నిరాశా నిస్పృహలతోను, దారిద్ర్యంతోనూ, గొప్పవాళ్ళ కనుసన్నల్లోనూ పెరగడంవల్ల జీవితానికి స్వేచ్చ, ఆనందం అనేవి లేకుండా పోయినయ్. అందాన్ని కృత్రిమంగా అధికంచేసి నలుగురికీ చూపే స్తోమత లేకపోయింది. మూలుగుతూ మూలకూర్చుని జీవితాన్ని అసహ్యించుకునేది. నిజంగా ఆమెకు జీవితంమీద ఆసక్తిలేదు. బతకాలనే కోరికాలేదు. ఆమెవల్ల అందరికీ బాధగా వుండేది. పెళ్ళి చేయలేక కన్నతండ్రి దిగాలుపడిచూస్తూ కూతురు కళ్ళముందు కనిపించినప్పుడల్లా గుండె బాదుకుంటున్నాడు. చుట్టువుండే కాకిమూక కొరకొరాచూస్తోంది.
వాళ్ళ చూపులు, మాటలు శూలాల్తావచ్చి గుచ్చుకునేవి. ఏమి చెయ్యడానికీ ఆమె ఆశక్తురాలు, జీవితంతో పోరాడి పోరాడి అలసి ఆశలన్నీ నాళనం చేనుకుని, కోరికల్ని చంపుకుని, మమతల్ని కాదని ఒక అర్థరాత్రి ఎవరికీ తెలియకుండా ప్రాణత్యాగం చేసుకుందామని బయలుదేరింది
కాని ఆమె ప్రయత్నం ఒకతను చూశాడు. రక్షించి యిల్లు చేర్చాడు. ఆమె కధంతా విన్నాడు. జాలిపడ్డాడు. ఓ రోజున బ్రహ్మాండంగా వివాహం చేసుకున్నాడు.
అమె తన అదృష్టాన్ని తలంచుకుని మురిసిపోయింది. అతన్ని దేవుడిలా ఆరాధించింది. చిలకాగోరింకల్లా కాపురం చేస్తున్నారు వాళ్ళిద్దరు.
అంతలోనే మతోన్మాదంతో విద్వేషాలు చెలరేగి హత్యలు, లూటీలు, గృహదహనాలు దేశమంతటా విస్తరించాయి. అక్కడ వుండడం ప్రమాదమని భావించి ఇంటిని డబ్బుని నర్వాన్నీ విడిచి అందరితోపాటు వాళ్ళూ యీదేశంలోకి పారిపోయి వచ్చారు. జీవనోపాధికై దేశమంతా తిరిగి చివరికి యీ ఊళ్ళో నివాసమేర్చరచుకున్నారు. నాలుగురాళ్ళు సంపాదించి గడచినగాధలు మరచి జీవిస్తుంటే అకస్మాత్తుగా ఆమె ఆశల్ని
తీర నమాథి అడియాళలు చేసి, ఆమె ఆనందాన్ని కన్నీరుగార్చి, ఆమె భవిష్యత్తును అగాధంచేసి, శేష జీవితాన్ని ఒక్కర్తినీ గడపమని ఒకరోజు అకస్మాత్తుగా గుండెజబ్బుతో అతను కళ్ళు మూశాడు. నిర్జీవంగా ఆమె మిగిలింది.
-రాజారావు కధాంశాన్ని సగంవరకు ఊహించాడు. అటు తర్వాత అతని ఆలోచనలు యిక సాగలేదు. అన్నీ అంతవరకు వచ్చి ఆగిపోయాయి. ఇదంతా అమె గత జీవితంగా భావించి శేషజీవితాన్ని దీనికి జతచేర్చుదామనుకున్నాడు.
కాని చిన్నసందేహం కలిగింది. మిగిలిన ఆమె జీవిత చరిత్రలో ఎన్ని పుటలు వెలువడుతాయోకదా. వాటన్నిటినీ సేకరించడం వీలవుతుందా అని.
కాని అతని మనసు అలా జరగదని చెప్తోంది.
ఆమె జీవితంలో యిక మార్పు వుండదు. ఈరోజు దినచర్యీ రేవటి దినచర్యకూడా! మరో ఏడాదిపోయినా అదే! ప్రొద్దున్న లేవడం కిటికీముందు కూర్చోవడం, వేళకు భోజనం చేయడం, నిద్రపోవడం-అంతే! ఒకవేళ ఆమె దినచర్యలో ఏమయినా మార్చువచ్చి ఆమె జీవిత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తే, అదే ఆ చరిత్రలో అంతిమ అధ్యాయం.
సెకెండ్ షో సినిమాకు వెళ్ళివచ్చాడు రాజారావు. వెంటనే నిద్రపట్టలేదు. అరగంటసేపు మంచంమీద అటూ యిటూ దొర్జాడు. మెల్లగా నిద్రపడుతోంది.
బయట ఎవరో భయంకరంగా దగ్గుతున్నారు. ఆ శబ్దం నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది. గాలిలో ఎగిరి వీధల్లా చుట్టివేసింది.
రాజారావు నిద్ర తేలిపోయింది.
ఖంగుఖంగున దగ్గుతూన్న ఆ శబ్దం అంతటితో ఆగిపోలేదు. వరసగా వినిపిస్తూనే వుంది మధ్యమధ్య సన్నగా మూలుగు.
లేవడానికి బద్దకంవేసి, ఆ శబ్దాన్ని వింటూ ఎప్పుడో నిద్రపోయాడు.
ఉదయం ఆఫీసుకు వెళ్ళేముందు ఎదుటింటి పనిమనిషి మందుసీసా పట్టుకొని వస్తూవుండడం చూసినప్పుడు అంతా అర్థమైంది. రోజూ ఆమెచేత పనిమనిషి తాగించేదేమిటో తెలిసింది.
ఆమెమీద జాలి పుట్టుకొచ్చింది రాజారావుకు. ఏమయినా ఆమెకు సాయంచేస్తే బాగుండునుకదా-అనిపించింది అతనికి.
నమాధి 4కి కాని తను చేయగలిగేదేమిటి?
ఇతరులు తనను చూసి జాలిపడి సానుభూతి చూపించి సాయం చేయవలసిన అవసరం ఆమెకేముంది?
ఆర్థికంగా అమె చాలా గొప్పది. ఆయన చనిపోతూ వదలిపోయిన డబ్బే చాలావుంది.
ఏ పనయినా అమె చెప్తే చేసేవాళ్ళు ఆ వీధినిండా వున్నారు. ఇక తనవల్ల ఆమెకు జరిగే పనేమిటి? ఆమెమీద జాలివల్ల అలా అనిపిస్తోంది. అయినా ఆమెను చూడడం అది ప్రారంభంగనుక, ఆమె ప్రవర్తనలన్నీ వింతగా వున్నాయి. ఆమె గురించి తరచు ఆలోచించాల్సివస్తోంది. ఆమె అంటే ఒక విధమయిన అభిప్రాయం, గౌరవం. ఆ జీవితంమీద జాలి, సానుభూతి.
కాని నెలగడిచేటప్పటికి ఆమె అలవాట్లతో అతనికి సంబంధం లేకపోయింది. యంత్రంలాటిది ఆమె జీవితం గనుక కొత్తగా జ్ఞాపకం వుంచుకోవాల్సిన విషయాలు ఏమీలేవు. అలవాటు అయిపోయిందిగనుక మునుపటిలా బాధకూడా కలగడంలేదు. ఆమెను చూస్తూనే వెళ్ళిపోతున్నాడు ఆమె అలోచనే లేకుండా. రాశ్రల్ధా అమె భయంకరంగా దగ్గిదగ్గి సొమ్మసిల్లి పడిపోతే చూసి పెద్దగా చలించేవాడుకాదు. డాక్టరు అదుర్దా, పనిమనిషి ఆవేదన) ఆమెబాధ ఒక్కక్షణంపాటు మాత్రంకదిళ్ని కరిగిపోయేవి. ఒక్కొక్కప్పుడు అనుకునే వాడు-అదేమిటి! నాకు పిచ్చెక్కుతోందా ఏం, ఆవిడ గురించి నేనెందుకు బాధపడుతున్నాను-అని,
ఒకరోజు ఒక్కడూ సాయంకాలం షికారుకు బయలుదేరి వీధిమలువు తిరుగుతుండగా శర్మ కనిపించాడు.
ఇద్దరూ మాట్టాడుకొంటూ గోదావరి గట్టెక్కి నడుస్తున్నారు.
గట్టున గాలి చల్లగా వీస్తోంది. నదిలో నీళ్ళు రాళ్ళసందుల్లోపడి కిందకు జారుతున్నాయి. కుర్రాళ్ళు నీళ్ళల్లో దిగి " ఆడుకుంటున్నారు. పడవలు వాలుగా జారుతున్నాయి. వాటిని చూసుకుంటూ లోగడ అచ్చయిన రాజారావు నవలలోని “సుశీల' పాత్రను గురించి చర్చిస్తూ గట్టువెంబడే చాలాదూరం వెళ్ళిపోయారు.
మీద సన్నగా చినుకులు పడేవరకు వెనక్కు మళ్ళాలని జ్ఞాపకమేలేదు.
తీరా వెనక్కుతిరిగి ఆదుర్దాగా నడుస్తూ వస్తోంటే వర్షం ముదిరి బట్టల్ని తడుప్టుతోంది. ఎక్కడా ఆగడానికికూడా వీలులేకపోయింది. గట్ట్బమీద చెట్టు గొని,
కలి నమాధి గట్టుకింద పాకలుగాని లేవు. అదంతా స్మశాన ప్రదేశం! ఇంకాస్త దూరం వెళ్ళితే గట్టుపక్కనే సత్రమొకటుంది. ఇద్దరూ పరుగెత్తుకొని అక్కడకు చేరారు వర్షంలో సగంసగం తడిసి. అరగంటసేపు కుండపోతగా వర్షం కురిసి తగ్గిపోయింది. అంతవరకు ఇళ్ళల్లో వొదిగిన మనుషులు బైటికొచ్చి ఆకాశంవంక చూసి నడక (ప్రారంభించారు. ఆగిపోయిన యంత్రం మళ్ళీ కదిలినట్టుగా ఊరంతటా ఓమారు చైతన్యం కనిపించింది.
బళ్ళు, కార్డు, రిక్షాలు మళ్ళీ ఊరివీధుల్లో పరుగెత్తాయి.
రాజారావు వెళ్ళిపోదామని గట్టు దిగబోతున్నవాడల్లా చటుక్కున ఆగిపోయాడు.
ఏమిటి? అన్నట్టుగా చూశాడు శర్మ! రాజారావు ముఖంలోకి.
“అబ్బే. ఆ పేరు చూస్తున్నాను, ఎక్కడో విన్నట్టనిపిస్తేను” అన్నాడు రాజారావు అక్కడి పాలరాయి పలకను చూపిస్తూ.
“ఏమిటి! శేట్ కపూర్‌చంద్ పేరా. బహుశా చాలాసార్లు వినేవుంటావు. "పేరుమోసిన వడ్డీవ్యాపారి. చనిపోయిన తర్వాత ఆయన పేరుమీద కట్టించారుగాబోలు. అదిగో ఎదురుగావున్న ఎత్తయిన ఆ సమాధి ఆయనదే.... పేరు కనిపిస్తోందిగా చూడు” అన్నాడు శర్మ
“ఓహో ఆవిడభర్తా” అశ్చర్యపోయాడు రాజారావు.
శర్మకు అర్థంకాలేదు. విచిత్రంగా మిత్రుడ్ని చూశాడు.
రాజారావు ఆయిదు నిమిషాలు అలా ఆ అక్షరాల్నే చూస్తూ మౌనంగా కదిలిపోయాడు,
ఊర్లోకి వచ్చాక పనుందని వెళ్ళిపోయాడు శర్మ, రాజారావు ఒక్కడూ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ తాత కిళ్ళీ కొట్టువరకూ వచ్చి ఆగిపోయాడు.
“రాబాబూ' అన్నాడు తాత. అలవాటు ప్రకారం అరపెట్టె సిగరెట్లు యిచ్చాడు. రాజారావు అందుకొంటూ అడిగాడు “చూడుతాతా! స్మశానాల దగ్గర సమాధుల
ధరతో లలు
నమాధి వ (రాం 7 కెదురుగా సత్రవ ఒకటుందికదా, అదిఈ శేటు త్త్సుం--. యా,
తాత మెల్లగా తలవూపాడు ఓమారు బరువుగా నిట్టూర్చాడు. “అవును బాబూ, ఆయనదే. ఎంత మంచివారనుకున్నావ్. నిజంగా ధర్మదాత. నాకొట్టు యీ రోజుయిలా నిలబడడానికి కారణం ఆయనేబాబూ. మా ఆవిడ ఆయింట్లో పనిచేస్తుంటాది. ఒకరోజు వందరూపాయలు అప్పు అడగమని పంపించాను. అడగ్గానే తెచ్చి చేతుల్లో పెట్టారు. అప్పటికి నాకు ఏ పనీలేక తింటూ కూర్చునేవాడిని. ఆ డబ్బుతెచ్చి యిలా యీ కొట్టు పెట్టాను. దీనితోనే యింతవరకు నెట్టుకొన్తున్నాను. ఏదో-యిప్పటికి తిండికి ఏలోటూ లేకుండా గడిచిపోతోంది.
ఇంతకాలం అయిపోయినా ఎప్పుడూ ఆ డబ్బు విషయం వాళ్ళు ఎత్తలేదు. ఆయన చనిపోయాక దబ్బు తీసుకెళ్ళి ఆయమ్మ చేతుల్లో పెట్టాం. “ఎందుకు సత్తులూ, ఈ డబ్బు నేనేం చేసుకోను? మీదగ్గరుంటే వ్యాపారంలో తిప్పుకోడానికయినా ఉపయోగిస్తుంది. వారు యిచ్చినందుకు, మీరు పుచ్చుకున్నందుకు తగిన ఫలితం కలిగింది. మీ యిల్లు నిలబెట్టుకోగలిగారు. అంతకన్నా కావలసినదేముంది. మీకు యిచ్చినడబ్బు వారు మళ్ళీ తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. వారికి యిష్టంలేని పనిని నేనుమాత్రం ఎలా చెయ్య ను' అంది. చూశావా బాబూ, వారికి మేమంటే ఎంత ప్రేమో! అంతమంచి మనుషులు చాలా అరుదుగా వుంటారు” అన్నాడు తాత.
ఒక అయిదు నిమిషాలు ఊరుకుని చుట్టతీసి వెలిగించి మళ్ళీ ప్రారంభించాడు.
“మత కల్లోలం సమయంలో భూముల్ని, పుట్టల్సి, ఆస్థిని యింటిని-అన్నిటినీ వదిలి పారిపోయి వచ్చేశారు. దారిలో శేటుగారి తల్లి, ఆఖరి తమ్ముడు ఆకలిదప్పులకు తాళలేక నీరసించి రోగంవచ్చి చనిపోయారట. వీరిద్దరుమాత్రం ఎల్లాగో ప్రాణాల్ని దక్కించుకుని తిన్నగా యీ వూరువచ్చి, ప్రభుత్వం వారివద్దనుండి డబ్బు సాయంపొంది కొద్దికొద్దిగా కోలుకున్నారు. ఆయనకు బంధువులెవరూ లేరు. చెట్టుకొకరు, పుట్టకొకరు చొప్పున తలా ఒకదారి అయిపోయారు. ఆమెకుమాత్రం ఒక అన్న వున్నాడు. బొంబాయిలో యిప్పుడు లక్షాధికారి. అతనూ మతకల్లోలంలో పారిపోయివచ్చేసి బొంబాయిలో బట్టల వ్యాపారం చేస్తూ, చెల్లెలిగురించి అన్నిచోట్లా వాకబుచేసి కనుక్కుని ఓ మారుచూడ్డానికి వచ్చాడు. ఆమె భర్త చనిపోయాక ఆయన తన చెల్లెల్ని తీసుకుపోదామని చూశాడు కాని ఆమె వెళ్ళనంది,. తన భర్త చనిపోయిన స్థలంలో పవిత్రమయిన గోదావరి వడ్డున ఆయన సమాధి పక్కనే తన సమాధి లేవాలని ఆమె సంకల్పం. మిగిలిపోయిన తన జీవితకాలాన్నిఇక్కడే గడిపేయాలని ఆమె కోరిక ఆయన
52 నమాధి పేరుమీద చక్కటి సత్రం ఒకటి కట్టించింది. అనేక సంస్థలకు తన ఆస్థిని దానం చేసింది ఆమెకు జీవితంలో ఇక కోరికలేవీ లేవు, తన భర్తను తలచుకొంటూ హాయిగా కళ్ళుమూయడంతప్ప అయినా ఆమెకూడా యిక ఎంతోకాలం బతికేటట్టులేదు చూస్తుండగానే ఎప్పుడో ఒకప్పుడు దగ్గర్లోనే గుటుక్కుమంటుంది. భర్తపోయాక ఎప్పుడూ అతనినే తలంచుకుని కుమిలిపోతూ ఆరోగ్యాన్నీ, ఆహారాన్నీ నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం ఆమెకు క్షయ జబ్బు. ఆ భయంకరరోగం అమెను వదలడంలేదు ఏమయినా అమెను కొద్దికాలం మాత్రమే మనం కళ్ళముందుచూసేది”
తాత కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. గొంతు బొంగురుపోయింది. రాజారావుకి తన ముఖం కనబడకుండా పక్కకు తిప్పుకున్నాడు.
రాజారావు తాత పరిస్థితి (గ్రహించాడు. వస్తానుతాతా అనిచెప్పి మెల్లగా అక్కడనుండి బయలుదేరాడు.
గదిలోకొచ్చి కూర్చున్నా అతని ఆలోచనలు ఆమెను విడిచిపెట్టడం లేదు భర్తమీద ప్రేమకు, ఆ ప్రదేశంమీది అభిమానానికి అతనికి ఆశ్చర్యం వేసింది.
ఎంత ఆదర్శవంతమైన జీవితం! తన భర్త ఆత్మశాంతికి, తన మనస్సుకు సంతృప్తికి తను యిక్కడేవుంటూ ఆయన్ని తలంచుకుంటూ కళ్ళు మూయాలనే కోరికలో ఎంత (ప్రేమ, త్యాగం యిమిడి ఉన్నాయి! తన భర్త తనకు ఎక్కడ ఆనందాన్నీ, అనురాగాన్నీ యిచ్చాడో అక్కడే నైరాశ్యాన్నీ ఒంటరితనాన్నీ వదిలి తనను నిర్జీవాన్ని చేసి వెళ్ళిపోతే ఆ ప్రదేశంమీద అమెకు ఎందుకంత మనుత? ఎక్కడో సింధలోని “షికార్ పురుష్'లో పుట్టి, ఆ హిమానీ నది సింధూ శీతల జలాల్ని తాగి పెరిగి, యిక్కడ యీ గోదావరి పవిత్ర గంగలో కలవాలనే ఆమె కోరిక ఎంత మహోదాత్తమైనది!
వర్షాకాలం నిండుగా, ఉధృతంగా గోదావరి ప్రవహిస్తున్నప్పుడు, దాని హద్దుల్ని దౌటి స్మశానాల్లోకి చొచ్చుకువచ్చినప్పుడు, దానివడ్డున సమాధుల్లోని తమ శరీరాలు సరిగంగస్నానాలు చెయ్యాలని కాబోలు ఆమె కోరుతూంట!
రాజారావుకు ఆమెమీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది.
ఆమెను గురించి ఆలోచించి తనెందుకు బాధపడాలి అని ఒకనాడు నిర్ణయించుకుని తన ఆలోచనల్లో, చూపుల్లో ఆమెను తప్పుకు తిరిగినవాడు మళ్ళీ క్రమత్రమంగా ఆమెకు సన్నిహితమౌతున్నాడు'
అతని ఆలోచనలు ఆమె జీవితంవైపు, చూపులు ఆమెవైపు పరుగెత్తుతున్నాయి.
నమాధి ళ్ అతనిలో సానుభూతి, బాధ, భయం కలిగి కొద్ది సేవు అతన్ని వశపరచుకుని వెళ్ళిపోతున్నాయి.
ఉదయంలేస్తే ఆమె ఆలోచన!
ఆఫీసుకు వెళ్ళినా, భోజనంచేస్తున్నా ఏకాంతంగా కూర్చున్నా, నిద్రపోతున్నా అవే ఆలోచనలు-అన్నీ ఆమెను గురించే!
మనసు మరో విషయాన్ని ఆలోచించడంలేదు. ఎంతసేపూ ఆమె, ఆమె జీవితం!
దీనంతటికీ కారణం తన ఏకాంతతే అనిపించింది. ఒంటరిగా వుండడంవల్ల వేరే ధ్యాసలేకుండా తన ఆలోచనలన్నీ ఆమె వెనుకనే పరుగెడుతున్నాయి అనుకున్నాడు.
ఆ ఆలోచన కలగగానే తన మామగారిమీద, భార్యమీద ఎక్కడలేని కోసమూ వచ్చింది. రెండు ఉత్తరాలు రాసినా రమని యింకా పంపనందుకు మొత్తంమీద అక్కడీవాళ్ళందరిమీదా కోపం వచ్చింది.
ఆ కోపం తగ్గిపోకుండానే ఆ వెంటనే కూర్చుని మామగారిపేర, భార్య పేర ఉత్తరాలు వ్రాసి అప్పటికప్పుడే పోస్టుచేసి వచ్చాడు. దీనితో తిక్కకుదురుతుంది, రాకేంజేస్తుంది- అనుకుని హాయిగా రాత్రికి నిద్రపోయి ఉదయం లేచి కోపాన్ని మర్చిపోయి యధాలాపంగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
సాయంకాలం ఆఫీసునుంచి తిరిగివస్తోంటే తాతపిలిచి “చూశావా బాబూ! ఆమె తన దగ్గర మిగిలిన అస్థినంతా, తను చనిపోయాక, శాశ్వతంగా చెందేలా అదేదో శరణాలయానికి రాసేసిందట!” అన్నాడు.
మర్చిపోతున్న ఆ విషయాన్ని జ్ఞాపకంచేసి తనకు బాధ కలిగించినందుకు తాత మీద కోపం రాలేదుకాని ఏడుపు వచ్చింది.
ఇంకొద్దికాలంపోతే ఆమెను గురించి యిక నువ్వు ఆలోచించనక్కరలేదు. ఉన్న యీ కొద్దిపాటి కాలంలోనైనా సానుభూతయినా చూపించడానికి బాధపడతావేమిటి?- అని మనసుని కసురుకున్నాడు రాజారావు.
“ఏమయినా ఆమె చనిపోవడవే. మంచిది నాయనా. వుండిమాత్రం సుఖిస్తుందాయేం. దినదినగండం నూరేళ్ళాయుష్నులా ఎందుకూ బతకడం! ఎంతసేపూ ఆ రోగంతో బాధపడడంతప్ప ఆమె ఏం సుఖపడుతోంది. ఒక వైపు భర్త ఆలోచనలతో కృశించిపోతూ, మరోవైపు రోగంతో మూలుగుతూ బాధవడుతూ ఎంతకాలం
ర్ళ నమాభధి జీవించివుంటుంది!”
“అవునవును. నాకూ అలాగే అనిపిస్తోంది తాతా....అదే మంచిది” అంటూ వెళ్ళిపోయాడు రాజారావు.
“ఏమిటి! తను చనిపోవాలనుకుంటున్నాడా అమెను?" ఆశ్చర్యపోయాడు రాజారావు తన ఆలోచనలకి.
మరి...చనిపోకుండా బతికివుండిమాత్రం ఆమె చేసేదేమిటి? తాత మాటల్లో ఎంతో నిజం వుంది. అవును. ఆమె చనిపోతేనే ఈ బాధలు, బరువులు అప్పుడొమెకు వుండవు. ఇప్పుడామె కళ్ళు మూసినా గుండెలు బాదుకుని ఏడ్చేబంధువులు లేరు. ఏకాకిజీవితం వుంటేనే పోతేనేయేఖనుకున్నాడు రాజారావు.
అలానే ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రపోయాడు.
ఆ రాత్రంతా విచిత్రమైన కలలతో నిండిపోయింది.
గడ్డకట్టిన అతని ఆలోచనల ఐసు ముక్కలు కలల నీళ్ళల్లో తేలుతూ దూర్గదూరతీరాలకు ప్రయాణం చేశాయి. వెండిలా తళతళలాడే తెల్లని ఇసుక రేణువుల ఒకానొక తీరం అవలివైపున గుబురుగా పెరిగిన రెల్టుగడ్డి మధ్య శోకిస్తోన్న ఒక స్త్రీ ఏకాంతంగా కనిపించింది. అతను స్వచ్భమైన నీళ్ళల్లో వెన్నెల రాత్రి వాక్కడూ విహరిస్తూ ఆమెను చూసి ఆశ్చర్యపోయి పలకరించాడు. ఆమె వలవలా ఏర్చీ, తనను అక్కడనుండి దూరంగా ఎక్కడికో తీసుకుపోయి వదిలిపెట్టమంది. అతను అలానే చేసి వెళ్ళిపోతూ నాలుగడుగులు' వేసి ఓమారు వెనక్కి తిరిగిచూస్తే ఆమె అక్కడలేదు. అదృశ్యమై పోయింది!
అంతలోనే కొద్దికొద్దిగా తెలివి...మళ్ళీ అర్థంపర్థంలేని ఓ కల.
ఆ కలల్గోని ప్రీ ఆకారాలు ఆ ఎదురింటి ఆమె రూపాలు!
'రెండు మూడు రోజులుగా ఆమె పరిస్థితి మరీ ప్రమాదకరంగా వుంటోంది. రాత్రింబవళ్ళు ఎడతెరిపిలేకుండా దగ్గుతెరల్తో సతమతమవుతోంది. బాధతోతీసే భారమైన మూలుగులు అస్తమానం వినిపిస్తున్నాయి.
అయినా అమె కిటికీముందు కూర్చోవడం మానలేదు.
కిటికీమురదు మంచంమీద కూర్చుని దగ్గుతెర వచ్చినప్పుడు మంచంమీద వాలి, లేనస్పుడు కూర్చుని యిళ్ళ కప్పుల కావల స్మశానాల కీవల ఎత్తయిన ఆ సమాధి
నమాధి కక్ శిఖరాన్ని చూస్తూ అలాగే వుంటోంది.
డొక్టరుకూడా రోజుకు మూడుసార్లయినా వస్తున్నాడు ఏవో ఇంజక్షన్లనీ, మందుల్నీ యిచ్చి వెళ్ళిపోతున్నాడు అతని ముఖంలో సంతోషం లేదు.
ఒకరోజున జట్కాబండివచ్చి అ యింటిముందు ఆగింది. లోపలి నుండీ నలబై ఏళ్ళపైబడ్డతనూ, అతని భార్యా పిల్లలూ దిగి సామానుల్ని తరలించుకుని ఎదుటి మేడలోకి వెళ్ళిపోయారు.
రాత్రి భోజనంచేసి వస్తున్నప్పుడు తాత పిలిచి చెప్పాడు, “వాళ్ళన్నయ్య వచ్చాడుబాబూ” అని
“ఆమెను బొంబాయి తీసుకుపోయి అక్కడ పెద్ద డాక్టర్లకు చూపిద్దామని అతను వచ్చాడు. ఆమె మాత్రం యిక్కడనుండి కదలనని ఒకటే పట్టుపడుతోంది. వెళ్ళితే ఏమన్నా బాగుపడవచ్చేమోమరి” అన్నాడు తాత తిరిగి
రాజారావు ఏమీ మాట్లాడలేదు. కాస్సేపు అక్కడే నుంచొని సిగరెట్టు కాల్చుకుని యింటికి వెళ్ళిపోయాడు
ఆ రాత్రికే అతను ప్రయాణమై భార్యను తీసుకుని రావడానికి బయలుదేరాడు. వారం రోజులపాటు ఆఫీసుకు శెలవు పెట్టిరమ్మని ఉదయమే మామగారి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది.
పెళ్లయిన కొత్తలో మూడు నాలుగుసార్లు ఏంవెళ్ళాడో అంతే! మళ్ళీ ఆ వూరు వెళ్ళలేదు.
మామగారు ఆ విషయాలన్నీ ధ్రాస్తూ 'ఒక వారం రోజులపాటు సెలవు పెట్టివస్తే యిక్కడ మా అందరికీ సంతృప్తిగా వుంటుంది. అలా వెళ్ళేటప్పుడు అమ్మాయినికూడా వెంటబెట్టుకుని వెళ్ళొచ్చు” అన్నారు.
వారం రోజులు ఎందుకులే అనుకుని నాలుగు రోజులు శెలవు పెట్టి బయలుదేరాడు.
తీరా వెళ్ళిన తర్వాత వారం రోజులు వుండక తప్పలేదు.
అక్కడున్న ఆ వారం రోజులూ పిండివంటలు కబుర్లు కాలక్షేపాలతో సంతోషంగా గడిచిపోయింది. పూర్తిగా ఆ సింధీ అమెను మర్చిపోయాడు. ఆ తర్వాత ఆ విషయాలన్నీ ఆలోచించినప్పుడు ఆమెను అంత తేలిగ్గా మర్చిపోయినందుకు అతనికే ఆశ్చర్యం
కర నమాధి కలిగింది. ఏడోరోజున భార్యను వెంటబెట్టుకుని ప్రయాణం కట్టాడు. కొత్త యిల్లు, ఒంటరి సంసారం దిగులు ఆమెను ఆవరించింది. అయినా భర్తతో వుంటూవుండడం అటో ఆనందం, బండిలో పుట్టెడు పుట్టింటి విషయాలు భర్తముందు వెళ్ళగక్కింది. రాజారావు వింటూ కూర్చున్నాడు. అతనికి నిద్రవస్తోంది. ఆమె నోరు కట్టివేస్తే కాస్సేపు కళ్ళు మూద్దామనుకున్నాడు. ఆమె అదేమీ గమనించడంలేదు. రెండు నిమిషాలు ఊరుకున్నట్టే ఊరుకుని ఆ తర్వాత-
“ఇంట్లో ఒక్కరూ ఎలావుండేవారండీ! కన్నవారింట్లో అంతమంది అక్క చెల్లెళ్ళు; ఒదినా మరదళ్ళూ వున్నా ఎప్పుడూ నాకు వెలితిగా బద్దకంగా అదోలా వుండేది" అంది.
కళ్ళు మూసుకుని నిద్రపోదామనుకుంటున్నవాడల్లా రాజారావు ఓమారు బద్దకాన్ని దులుప్పుకొని నిటాగ్లా కూర్చుని-
“ఎంత చక్కటి కాలక్షేపం అనుకున్నావు! ఇంట్లో దిగిన దగ్గరనుండీ ఏకాంతమే అనిపించలేదు. రోజులన్నీ నాకు తెలీకుండానే విచిత్రంగా దొర్లిపోయాయి! నిజంగా ఆ ఎదుటింటి ఆమె ఒక చక్కటి కాలక్షేపం” అన్నాడు.
“అమె ఎవరు?” ఆశ్చర్యంగా, అసూయగా అడిగింది రాజారావు భార్య
రాజారావు ఆమెను గురించి భార్యకు చెప్పాడు.
ఆమెను గురించి విని ఆశ్చర్యపోయింది.
“అయితే అమెను తప్పకుండా చూడాలి” అంది.
“అలానే” అన్నాడు రాజారావు.
ఆమె సౌశీల్యాన్నీ గౌఢాభిమానాన్సీ పవిత్ర శ్రమను ఊరు చేరుకునేవరకు తలంచుకొంటూనే “అమెను ఎప్పుడు చూస్తానోకదా' అనుకొంది.
రాత్రి ఒంటిగంటకు రైలు ఊరు చేరింది.
రిక్షా కట్టించుకుని యింటికి వెళ్ళిపోయారు.
ఆ అపరిచితమైన ఆ ఊరును తొలిసారి చూడాలనుకునే ఆతృతలో అమె తలను ముందుకు చాచి రిక్షాలోంచి చుట్టూ చూస్తాంది కాని ఊరునిండా నల్లటి కాటుకలాంటి చీకటి! ఆమెకు ఏమీ కనిపించడంలేదు-ఎక్కడో అక్కడా అక్కడా చిన్న
నమాధి త్7 చిన్న వెలుతురు తప్ప.
ప్రయాణంలో అలసిపోవడంవల్లా, సగం రాత్రి పైబడేవరకూ నిద్రలేకపోవడం వల్లా ఇంటికి వెళ్ళి మంచంమీద చేరబడడంతోనే నిద్ర ఆవరించింది.
ఉదయం లేచేసరికి ఏడున్నర అయ్యింది.
సూర్యకిరణాలు వెచ్చగా కిటికీలోంచి మీద వాలుతున్నాయి.
లేనడంతోనే యిద్దరూ ఓమారు ఒళ్ళు విరుచుకుని ఆవలించి బద్దకాన్ని పక్కమీదే వదిలేసి, దాన్ని మడతపెట్టి ఒక మూలకు చేర్చి నుంచున్నారు.
“ఏమండీ. ఆమెను చూపిస్తానన్నారు చూపించరూ?” అంది రాజారావు భార్య.
“ఇదిగో చూడు” అంటూ అతను గబగబావెళ్ళి కిటికీ రెక్కలు బార్లా తెరిచాడు.
కాని, ఎదుటి మేడమీద కిటికీ తలుపులు దగ్గరగా మూసుకునివున్నాయి!
రాజారావుకు ఆతృత ఎక్కువయ్యింది. ఆశ్చర్యం వేసింది. అలాంటి సమయంలో ఎప్పుడూ అవి మూసివుండగా అతను చూడలేదు.
అతని మనసు కీడును శంకిస్తోంది.
గబగబా రాజారావు మేడ వెనక భాగంలోకి వెళ్ళి దూరంగా స్మశానాలవైపు చూశాడు.
అతని భార్యకూడా ఆ వెనకనేవచ్చి అతను చూస్తుండేవైపే ఏమీ తెలియక చూస్తూ నుంచుంది.
స్మశానాలలో పవిత్రమైన గోదావరి నీళ్ళకు దగ్గర్లో దానివడ్డున ఎత్తయిన ఒక తెల్లటి పాలరాతి సమాధి పక్కనే మరో చిన్న సమాధి కొత్తగా నుంచొని వుంది!
“ఏదండీ?” అంది ఆమె మళ్ళీ.
“అదిగో” అంటూ ఆ సమాధివైపు చూపుడువేలు సాచి చూపించాడు రాజారావు,
9
ఉగాది
అచ్చాఫీసు ఆవరణదాటి తేలిగ్గా గాలిపీల్చి యింటి ముఖం పట్టాడు ఆలోచిస్తూ సత్యం,
సందులూ గొందులు, బాటలూ, రోడ్లూ వంకరటింకరగా, సన్నగా, ఇరుకుగొ, నిటారుగా నుంచుని ఊరు చివరవరకూ లాక్కుపోయాయి. రెండు మైళ్ళ దూరం ఆలోచిస్తూనే నడిచాడు-మెల్లగా భారంగా నీరసంగా అడుగుల్లో అడుగులువేస్తూ,
అలవాటుపడ్డకాళ్ళు అరుగువరకూ వచ్చి ఆగిపోయాయి.
ఒకమారు తలెత్తి యిల్లు చేరినట్టు గ్రహించి గబగబా మెట్లెక్కాడు.
బయట, ఇంటావిడ గుమ్మానికి చేరబడి అవతలికి తిరిగి బియ్యం ఏరుకుంటోంది. ఆమె.సత్యం వచ్చినట్టుగా గుర్తించలేదు.
సత్యం ఆమెకు అలికిడి వినిపించనంత నెమ్మదిగా అరుగెక్కి తలుపు గొళ్ళెం తీస్తుండగా యింటావిడ వెనక్కి తిరిగిచూసింది.
నత్యం కూడౌ అదే నమయంలో ఆవిడని చూసి తప్పుచేసినవాడల్లే కుంచించుకుపోయి లోపలకు వెళ్ళి తలుపులు దగ్గరకి వేసుకుని కుర్చీలో కూలబడ్డాడు. అయిదు నిమిషాలపాటు కళ్ళు మూసుకున్నాడు.
ఉగాది క్
కళ్ళు తెరిస్తే గదంతా బోసిగా వెక్కిరిస్తోంది.
ఎదురుగా కుంపటి, గిన్నెలూ ఖాళీగా పడున్నాయి రెండు రోజులబట్టీ యిల్లు తుడవక ధూళీ చెత్తా చేరి అసహ్యంగా కనిపిస్తోంది.
వెళ్ళి ఊడవాలనిపించలేదు. ఒంట్లో నీరసం...ఆయాసం. రెండు మైళ్ళూ నడిచి నడిచి కాళ్ళు తిమెర్లైక్కాయి. గది ఊడవడానికికూడా ఓపిక లేదు. కుర్చీలో జారబడి చూస్తుండిపోయాడు.
నిన్న ఉదయం కాఫీకాచి అలానే వుంచిన బొగ్గుల కుంపటిలోని బూడిద కిందకురాలి మీదకు ఎగిరివస్తోంది.
బూడిద మీదపడకుండా చేతిని అల్లల్హాడిస్తూ అలాగే కూర్చుని కుర్చీలోనే నిద్రపోయాడు.
అంత కలతనిద్రలోనూ ఒక కల!
అంతలోనే తెలివి.
మళ్ళీ అంతలోనే ఖాళీ గిన్నె! బోసి కుంపటి!
పళ్ళాల్నీ పాయ్యినూ చూస్తోంటే ఆకలి జ్ఞాపకానికొచ్చింది.
గట్టిగా నిట్టూర్చాడు సత్యం. భారంగా గోతిలోంచి, పొతాళంలోంచి బైట పడ్డట్టుగా ఊడిపడిందది.
అతనికి తెలుసు-తను చేయగలిగిందల్లా అంతకు తప్పించి మరేమీ లేదని.
ఏదోఉద్ధరిద్దానుని తల్లినీ తమ్ముడినీ ఊళ్ళోవదిలి పట్నం బయలుదేరి వచ్చాక యిటువంటి వాటికన్నిటికీ రోజూ అతను అలవాటు పడిపోయాడు.
ప్రయత్నించగా-కాళ్ళరిగిపోయినట్ట రోజల్లా తిరగ్గా తిరగ్గా-వచ్చిన నెల్టాళ్ళకు ఓ (డ్రెస్‌లో ప్రూఫ్ రీడరుగా నెలకు నలభై రూపాయల జీతంమీద పని దొరికింది. చిన్నగది అద్దెకు తీసుకుని-అదీ వూరుచివర ఎవరూ వుండడానికి యిష్టపడనిచోట తనకు కావాలని ఒకరోజల్లా పట్టుపట్టి తక్కువ అద్దెకు బేరమాడి, యింట్లో స్వయంపాకం పెట్ట, ఒకరోజుతిని మరొకరోజు మాడి, మిగిలింది యింటికి పంపించేవాడు.
ఆఅనాటినుంచీ పస్తుండడం అంటే అట్టే కష్టమనిపించేదికాదు. మొదట్లొ మోకాళ్ళలో తలదూర్చి భోరున ఏడ్చేవాడు..కాని అది పిరికితనం అనీ, అటువంటివి భవిష్యత్తులో రోజూ ఎదుర్కోవలసి వస్తుందనీ గుర్తించాక అలా ఏడవడం కేవలం
60 నమాధి చేతగానితనమేగాక పిరికితనం అని అనిపించి నిట్టూర్చులోనే అంతటి బాధనూదాచి, మళ్ళీ ఆ విషయం ఆలోచించడం మానుకునేవాడు.
సత్యం కొంచెం సేపటివరకూ చలనంలేనివాడిలా కూర్చుని, దాడ్గో బావిదగ్గర మొఖం కొళ్ళూ చేతులూ కడుక్కొనివచ్చి, కుండలో ఉదయం పాసి వుంచిన చల్లనినీరు కడుపు పట్టినంతా గబగబా మూడు గ్లాసులుతాగి, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు అలా శూన్యంలోకి చూస్తూ.
కిటికీలోనుండి నల్లపిల్లి గదిలోకొచ్చి కుంపటిమీది ఖాళీ గిన్నెను తడిమి నిరాశగా అతని ముందునుండి కిటిక్స్ ఎక్కి వెళ్ళిపోయింది.
సత్యానికి అప్రయత్నంగా నవ్వువచ్చింది. ఆ తర్వాత దానిమీద జాలివేసింది.
చిల్లుకాణీ చేతిలో లేనివాడు అనుగ్రహించినా, ఆగ్రహించినా ఫలితంలేదు. అందువల్లే సానుభూతిగా చూసి “పాపం! అనుకుని వూరుకున్నాడు.
“తనలాగే తనమీదా మరొకరు జాలిచూపిస్తారా?' అని ప్రన్నించుకొన్నప్పుడు “చూపించరని' జవాబు చెవ్చకోగలిగితే అనవసరంగా మరొకరిమీద సానుభూతి చూపించేవాడు కాదు.
క్రమశ్రమంగా నల్లగా, దట్టంగా చీకటి వ్యాపించింది. భారంగా వేడిగా గట్టిగా విడిచిపెట్టిన గాలి అతనిచుట్టూ తిరుగుతోంది.
గదినిండా నిశ్శబ్దం,
ఆ నిళ్ళబ్దాన్ని చీలుస్తూ గదిబయట ఎంగిలి మెతుకులకు కాసుక్కూచున్న ఊరకుక్క అరుపు, వీధిలో ఓ ఇంటిముందు అడుక్కొంటున్న ఒక ముష్టివాడి ఆలాపన, దీనంగా జాలిగా వాడిమాటలు, గొప్పగా దేవుడిలా ఎదుటివారిని పొగుడ్డొన్న పొగడ్తలు, అయినా ఆఖరున మిగిలిన నిరాశ ఆరవగా అరవగా బొంగురుపోయిన కంరం, వెనక్కు తిరిగిపోతూ గొబుక్కొంటున్నట్ట మెల్లగా తన దురదృష్టాన్ని తిట్టకొంటోన్న మాటలు!
ప్రపంచంనిండా ఆకలి!
పనిచేస్తున్నా రెక్కలుముక్కలు చేసుకుని ఆకారం వికారం అయ్యేవరకు ఎముకల్లొ మూలుగుంరక్తం కరిగి చెమబై అవిరై అంతరించిపోయే వరకు, చచ్చేవరకు పనిచేస్తున్నా తీరని ఆకలి! నలుగురూ తినిపారేసిన పులిస్తరాకుల్లో ఎంగిలి మెతుకులకోసం ఎగబడి నీచంగా కక్కుర్తిగా తింటోన్నా తరగని ఆకలి!
ఉగాది ల్
లక్షాధికారి యింట్లో పెంపుడు కుక్కగా, జంతు ప్రదర్శనశాలలో కోతిగా, పక్తితీర్థం కొండమీద పక్షిగా, మినిష్టరుగారి పెళ్ళానికి అన్నగా భోగంపిల్ల తమ్ముడిగా పుడితే ఆకలి తీరుతుందేమో!
విచిత్రమైన ఆలోచనలు అతన్ని చుట్టుముట్టేసినయ్ సీరియస్‌గా సమస్యను సాధించే మార్గాన్ని ఆలోచించి సారాంశం చెప్పాడు-ఫలానా రీతిగా పుడితే ఆకలి వుండదోయ్-అని. కాని అతనికి ఆ అదృష్టంలేదు. అతను కనిపెట్టినదానికి విరుద్ధంగా పుట్టాడు. అంతే! మళ్ళీ నిరాశ. ఆకలితీరని ఆలోచన. చేతగానితనాన్ని నిరూపిస్తోన్న అసహాయత!
ఇంటావిడ వచ్చింది. గదిలో దీపంలేదు. మనిషి లోపలవున్న అలికిడి లేదు. “ఇంట్టోకొచ్చినవాడు ఏమయ్యాడు? ఎక్కడకు వెళ్ళాడు?”
ఆమె పిలిచింది.
అదిరిపడి ఆలోచనల్లోంచి లేచి స్విచ్చి వేశాడు.
-.... “ఏం చేస్తున్నావు బాబూ?” అంది ఆమె.
“ఏమీ చెయ్యడంలేదు, రండి. లైటుచుట్టూ రెక్కల పురుగులు చేరితే లైటార్చి యిలా కూర్చున్నాను” అన్నాడు.
ఆమె చాలా జాలిగా నవ్వింది. ఆ నవ్వు “అసలు సంగతి నాకు తెలుసులే నాయనా” అన్నట్టు వుంది.
ఆమె గుమ్మందగ్గరే నుంచుని “భోజనం అయిందా బాబూ” అంది.
“ఊ” అన్నాడు మెల్లగా. ఆ తర్వాత వెంటనే అందుకుని “ఉదయం (ప్రెస్‌కు వెళ్ళేముందే రెండు పూటలకూ అన్నం, కూర వండుకున్నాను. మొన్న యింటి దగ్గరనుండి తెచ్చిన పచ్చడీ వుండనేవుంది. రెండు పూటలూ వండుకు తినడం కష్టం అనిపిస్తుంటే మొన్నటినుండి ఒక్కసారే కలిపి వండుకుంటున్నాను” అన్నాడు. అని, అమెకు కుంపటీ గిన్నెలూ కనబడకుండా అడ్డుగా వెళ్ళి నుంచున్నాడు,
“అయ్యో నాయనా! ఇంకా భోజనం కాలేదేమోనని ఆలన్యంగా కూరతెచ్చాను. తెలిస్తే ముందే తెచ్చేదాన్ని” అంటూ కూరగిన్నె టేబిలుమీద వుంచింది.
“ఎందుకూ భోజనం అయిపోయింది గదండీ” అంటూ గిన్నె వట్టకెళ్ళి ఆమెకందించాడు.
62 నమాధి
ఆమె గదిచుట్టూ ఓమారు చూసి నవ్వింది. “పిచ్చినాయనా! నా దగ్గర మొగమాటపడొద్దన్నాను కదూ. వస్తానుండు” అంటూ వెళ్ళిపోయి మరో రెండు నిమిషాల్లో గిన్నెతో అన్నం పట్టుకొచ్చి బేబిలుమీద వుంచింది.
“అబ్బే,తిన్నానని చెప్తున్నాను కదండీ” అన్నాడు సత్యం.
“చెప్పడానికేం, ఎన్నయినా చెప్పొచ్చు. ముందు కానియ్” అంది.
సత్యం ఎన్నో చెప్పి చూశాడు. లాభం లేకపోయింది. ఆమె మరీ బలవంతం చేస్తోంది. “నువ్వుమాత్రం మా "పెద్దబ్బాయి లాంటివాడివి కావా నాయనా” అంది, అతను కొంచెం మెత్తబడడంచూసి,
“పోనీ, యిప్పటికి కడుపు నిండుగా వుంది. ఇక తినలేను, రేపిద్దురుగాని లెండి. ఇవ్వాల్టికి నన్ను క్షమించాలి” అన్నాడు ఎంతో ప్రయత్నంతో నిలబెట్టుకున్న అభిమానాన్ని ఎగదోసుకుంటూ.
“అయ్యో నాయనా, రేవు ఉగాది. కొత్త సంవత్సరంతోటి యిలాంటివి పుచ్చుకోకూడదు బాబూ. సంవత్సరం పొడుగునా అలానే వుంటారంటారు” అంటూ అమె బలవంతంగా అతని రెక్కపట్టుకుని గదిలో ఒకమూల పీటవేసి కూర్చోబెట్టి “ఊ...తిను నాయనా. నేమ బయటవుంటాలే” అంది.
తప్పించుకునే మాగ్గంలేక తప్పనిసరిగా భోజనం ముంధు కూర్చుని గబగబా అయిదు నిమిషాల్లో పూర్తిచేసి, గిన్నెల్ని తనే దొడ్లో బావిదగ్గర కడిగి ఆమె, చేతికిచ్చాడు.
ఆమె అందుకుని నిండుగా చిరునవ్వు నవ్వి “నా నాయనే” అంది వెళ్ళిపోతూ.
వెళ్ళిపోతున్న ఆమెను అపి, కొంచెం పాదధూళి తీసుకోవాలనిపించింది కాని యిది పురాణకాలం కాదు. అధవా కథల్టోనన్నా అలా చెయ్యడం తొలగించేశారు. తనిప్పుడు అలాచేస్తే పిచ్చివాడనే అంటారంతా. ఆమెకు మనసులోనే నమస్కారాలు చేసి, కాస్సేపు గదిలోనే అటూ యిటూ పచార్లుచేసి మంచం వాల్చుకుని పడుకున్నాడు. అంత 'వేగంగా నిద్రపోదామని కాకపోయినా ఏమీ తోచక, ఎక్కడకూ వెళ్ళాలనిపించక అక్కడే గదిలో మంచం వాల్చుకుని ఆమె అన్న మాటల్నే ఆలోచిస్తున్నాడు. ఊగాది ఆదివారంనాడు పడడంతో ఆ విషయమే గుర్తుకురాలేదు తనకు.
రేపు ఉగాది!
అిగాది 6 ఎదురుగా కేలండరు మీద నల్లక్షరాలమధ్య ఎర్రగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది రేపటిరోజు
ఈ సంవత్సరానికిది అంతిమం. రేపు మళ్ళీ కొత్త సంవత్సరానికి, నూతన సృష్టికి
నాంది చెట్టు చేమలతోపాటు మానవ జీవితాలకు కొత్త-పాత సంవత్సరాలమధ్య ఒక రోజును నిర్ణయించి, అటూ ఇటూ రెండు విభిన్నాల్ని కల్పించి అంత్య ఆరంభాల్ని సృష్టించారు-ఆనాడు ఏది చేస్తే అది ఆ సంవత్సరం పొడుగునా జరగవలసిందేనని! రాబోయే పన్నెండు నెలలకు ఆరోజు సూత్రప్రాయం. ఆరోజు ఏడిస్తే పన్నెండు నెలలూ ఏడ్చేనని, నవ్వితే అంతకాలమూ నవ్వేనని అన్నారు. అదే ఆరోజు ప్రత్యేకత! కనుకనే ఆరోజు అంతా ఆనందంగా ఉంటారు అధవా అలా ఉండాలని ప్రయత్నిస్తారు. చక్కగా, నచ్చిన బట్టల్ని తాడుక్కుంటారు. అగాధాల జీవితాలవాళ్ళు, ఆనందాల్లో మునిగి తేలేవాళ్ళు, కూటికి లేక పస్తులుండేవాళ్ళు, కాటికి కాళ్ళుచాచినవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలు, పెద్దలు అంతా ఆనందంగా వుండడానికై ప్రయత్నిస్తుంటారు.
సత్యం చటుక్కున లేచి కూర్చున్నాడు.
“వీల్లేదు. ఏమయినా రేపు పస్తు వుండకూడదు. రేపు ఉగాది! కొత్త సంవత్సరం 'ప్రారంభంతోనే పస్తుల్హో యీ చినిగిన బట్టల్లో ఎక్కడకూ వెళ్లకుండా యింట్లోనే కూర్చుంటే యీ రాబోయే సంవత్సరమంతా అలానే గడపాల్సివస్తుంది. గేపాక్కరోజయినా ఆనందంగా, నిండుగా నవ్వుతూవుండి సంవత్సరమంతా సుఖమయం చేసుకోవాలి. గతించినదానిలా యీ ఏడాది కాకూడదు. లోగడవన్నీ కలల్లా చెరి పేస్తే చెరిగిపోవాలి. అందుకని ఈరోజే రేపటివన్నీ తయారుగా వుంచుకోవాలి. రేపు ఎవరినీ అవు అడగగూడదు, పస్తుండగూడదు'
సత్యం తలుపుతీసి అరుగుమీదకు వచ్చాడు. ఇంటావిడ మనుమరాల్ని ఆడిస్తూ వీధి అరుగుమీద కూర్చునివుంది.
సత్యానికి ఆమెను చూడగానే మనసులో ఆశ చిగురించింది.
“ఒకసారి యిలా వస్తారా” అన్నాడు.
ఆడిస్తున్న మనవరాల్ని చంకన వేసుకొనివచ్చి “ఏంబాబూ?” అంది ప్రశ్నార్థకంగా సత్యం ముఖంలోకి చూస్తూ,
“ఏంలేదు..అదే...అదే” నసిగాడు సత్యం.
“ఫరవాలేదు చెప్పు” అందామె ఆప్యాయంగా
గ! నమాధి
“ఏంలేదు, ఒక్క అయిదు రూపాయలు వుంటే అప్పిస్తారేమోనని. మీకు మళ్ళీ
వారం రోజుల్లో జీతం రాగానే యిచ్చేస్తాను.”
ఆమె చాలా బాధపడింది. అయ్యోనాయనా! నువ్వు అడిగినప్పుడే నాదగ్గర లేకుండా పోయాయి. పొద్దున్న పదిరూపాయలనోటు -- అలా అదొక్కటి అడుగున పెట్టెలో వుంటే తీసి, రేపటి సామానులకని ఖర్చుచేస్తే ఒక్క కాణీ మిగలలేదు! పాపం ఎప్పుడూ నోరువిడిచి అడగనివాడివి. అడక్క అడక్క అడిగినందుకు, చూడూ - సమయానికి నాదగ్గర లేకుండా పోయాయి. ఉదయం అడిగినా బాగుండును-- ఏదో నగం యిచ్చి సగం ఖర్చుచేసేదాన్ని. ఏమనుకుంటావో ఏమో” అంది చాలా బాధపడుతూ.
“పాపం! వుంటే యిచ్చేదే. అది నా దురదృష్టంలే' అనుకుంటూ వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. కాస్సేపు కూర్చుని ఆలోచిస్తూ చటుక్కున లేచి తలుపు గొణ్జెం పెట్టి వీధిలోకి బయలుదేరాడు.
అప్పటికే జనసంచారం పల్చబడి వీధులు నిర్మానుష్యంగా వున్నాయి. అక్కడక్కడ ఒక్కొక్క కొట్టూ, కాపలాకాస్తోన్న పోలీసు జవానుల్లా రహదారి పొడుగునా నిల్చున్నాయి. కొట్టలో నిద్రమత్తుకు ఆగలేక కునుకుతున్నాయి హరికెను దీపాలు. వీధుల్లో మునిసిపాలిటీ దీపాలు విధిలేక వెలుగుతున్నట్ట ఉన్నాయి.
అలానే ఒక్కడూ ఊరిమధ్య యిల్లు తెలియని మిత్రుడ్ని కలుసుకునేందుకు బయలుదేరాడు,
అతికష్టంమీద యిల్లు కనుక్కొని అక్కడ కు వెళ్ళేనరికి వోయిగా నిద్రపోతున్నాడతను. అతన్ని లేపి, వచ్చిన కారణం చెప్పాడు “ఒక్క ఐదురూపాయలు -చివరకు మూడన్నాసరే వుంటే చేబదులిద్దూ” అన్నాడు.
“అయ్యోపాపం! నువ్వు అడిగినందుకన్నా యివ్వాలే. ఏదో కొద్దిగా వుంటే సాయంకాలమే రడీమేడ్ షాపులో బట్టలు తీసుకున్నాను. ప్రమాణంచేసి చెప్తున్నా ఆమాత్రం సాయం చెయ్యలేనూ” అన్నాడు ఆ మిత్రుడు.
అభిమానం దెబ్బతింది. ఎందుకడిగానా అనుకున్నాడు. చూపుల్లో, ముఖంలో, మాటల్లో నటన అంతా అర్ధమవుతూనేవుంది. “వెధవ అయిదురూపాయల గురించి "స్నేహాన్ని కూడా పాడుచేసుకున్నాడు.'
ఉగాది ర్
అక్కడకు దగ్గర్జోనే మరొక స్నేహితుడి యిల్లు వుంది. కాళ్ళీడ్చుకుంటూ అక్కడకు వెళ్ళాడు అప్పుడే ఆ స్నేహితుడు సినిమా ఫస్టుషో నుంచి వచ్చి భోజనం చేసి ఏదో పత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు.
సత్యాన్ని చూసి “రావోయ్” అని ఆహ్వానించి “ఏం, యిలా యింత రాత్రప్పుడు వచ్చావ్?” అన్నాడు.
సత్యం కారణ౦ చెప్పాక, అంతకు పదింతలు దుఃఖిస్తున్నవాడిలా కిందకు దిగజారిపోయి, తను అసహాయుడయినందుకు సానుభూతి చూపించి ఆరుగువరకూ వచ్చి సాగనంపాడు.
తననుతాను తిట్టుకుంటూ, నోట్లో గొణుక్కుంటూ వచ్చినదారి వెంబడే వెనక్కు మళ్ళాడు సత్యం.
సినిమాహాలు సందుమలుపు తిరుగుతుండగా హాలుదగ్గర శర్మ కనిపించాడు. సినిమాకు వెళ్ళామని గాబోలు భార్యతో కలిసివచ్చాడు. సత్యాన్ని చూసి పలకరించి “ఏమిటీ ఎక్కడనుండి వస్తున్నావ్?” అన్నాడు.
సత్యానికి నిజం చెప్పాలనిపించలేదు. అప్పటికే అభిమానం చంపుకొని ముగ్గుర్ని అడిగి లేదనిపించుకున్నాడు. శర్మను కూడా అడిగి లేదనిపించుకోవడం యిష్టంలేదు. కాని శర్మను ఎరుగున్నంతమట్టుకు ఆతను అలాటివాడు కాడని అతనికి తెలుసు. లోగడ సత్యం అడగ్గానే చేతిలో పెట్టాడు. ఉంటే తప్పకుండా యిచ్చేమనిషి. “పోనీ అంతమందిని అడగ్గా లేనిది యాయన జఒక్కడ్నీ అడిగితే ఏంపోతుందిలే' అనుకుని పక్కకు పిలిచి చెప్పాడు.
“అర్జంటుగా అయిదురూపాయలు కావలసివుండి తెలిసిన యిద్దరు ముగ్గుర్ని అడిగి లేదంటే వచ్చేస్తున్నాను. నీదగ్గర ఏమన్నా వుంటే కాస్త నర్దవోయ్. జీతాలు రాగానే ఇచ్చేస్తా. నాకు అంత యిబ్బందిగా వుండకపోను. ఈనెలలో యింటిపన్ను, తమ్ముడి జీతం కట్టాలంటే వచ్చిన జీతం అంతా యింటికే పంపించేశాను.”
“సమయానికి నాధగ్గరాలేవు సత్యం. ఎంత అవసరంవుండి అడుగుతున్నానో పాపం! నెలాఖరిరోజులుకదూ, అందులోనూ కొత్తసంసారం. కాణీ మిగలడంలేదు. ఈ నెలలో అప్పుడే యిరవైరూపాయలు అప్పుచేశాను. ఇదిగో... ఎప్పటినుండో సినిమాకు వెళ్దాం అని అనుకుంటుంటే యివ్వాళ్ళికిగాని కాలేదు. అదీ, ఈ సాయంకాలం మన
66 నమాధి గుమస్తాగార్నడిగి అయిదురూపాయలు పుచ్చుకున్నాను తర్వాత యిచ్చేస్తానని, పోనీ అంతగా అవరమయితే యీ అయిదూ తీసుకెళ్ళు మేం తర్వాత సినిమాకు వెళ్తాంలే, ఇంకా నెలరోజులన్నా ఆడుతుందికదా” అంటూ అయిదురూపాయల నోటు తీసి యివ్వబోయాడు. “అబ్బే అట్టే ఆవసరంలేదులే” అంటూ అతను బలవంతం చేస్తున్నా వినిపించుకోకుండా తప్పించుకుని వెళ్ళిపోయాడు. చుట్టూ చీకట్లోని నిరాళని తోలుకుంటూ వచ్చిన దారివెంటే వెళ్ళి యిల్లు చేరుకున్నాడు.
ఆ రాత్రి సరిగా అతనికి నిద్రపట్టలేదు. కళ్ళు చెమ్మగిల్లాయి. రాత్రి చాలా సేపటివరకూ జీవితాన్ని నెమరువేసుకున్నాడు. తెల్లవారుతుండగా ఎప్పుడో అతనికి తెలీకుండానే నిద్రపట్టింది.
ఉదయం లేచేసరికి బారెడు పాద్దెక్కింది. ఇంటావిడ పూజచేస్తూ వాయిస్తోన్న గంట గణగణ మోగుతోంది. కిటికీలోంచి గదిలో సగంవరకు సూర్యకిరణాలు వాలుతున్నాయి.
బద్దకంగా ఆవులించి వళ్ళువిరుచుకుని లేచి కాలకృత్యాలు ముగించుకుని బావిదగ్గర మొఖం కడిగి స్నానంచేసివచ్చాడు. రాత్రి విప్పిన బట్టల్నే తొడుక్కొని, కిటికీముందుకు కుర్చీలాక్కుని కూచుని బయటకు చూస్తున్నాడు.
వీధిలో నాలుగిళ్ళావల ఒక వేపచెట్టు తెల్లగా పూలను తలలో తురుముకుని నుంచుంది. కుర్రాళ్ళు కొత్తబట్టల్లో వీధిలో పరుగెడుతున్నారు. ఎదురింటి వాళ్ళమ్మాయి ముస్తాబయి వేపపచ్చడి పంచేందుకు వీధిలోకి బయలుదేరింది.
బయలుదేరేముందు గుమ్మం అరుగుమీద కాలువుంచి సత్యం కిటికీలోకి చూసింది. అలా చూసినకళ్ళు నవ్వలేదు. ముడుచుకుపోయాయి. అసహ్యించు కున్నట్టుగా గబగబా అడుగులు వేనుకుంటూ వెళ్ళిపోయింది.
సత్యం లోలోపలే నవ్వుకొన్నాడు.
ఇంటావిడ వేపపూపచ్చడి తెచ్చి ఇచ్చింది."
తీసుకొని తిన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం వరకూ కదల్లేదు.
మనస్సు బావుండక ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయాడు.
ఎప్పుడో పన్నెండు గంటలవేళ కొంచెం అకలనిపిస్తే వెళ్ళి మంచినిళ్ళు తాగివచ్చి మంచంవాల్చి పడుకున్నాడు. రాత్రి సరిగా నిద్రలేక చూస్తుండగానే కళ్ళు మూతలుపడి
ఉగాది 67 నిద్రపోయాడు.
నిద్రలో ఓ చక్కటి కల!
ఆ కలలో సత్యం ఓ పెద్ద ఫెస్ ప్రాప్రయిటరు.
ఆ ఎదురింటి పిల్ల అతన్ని ప్రేమించింది. ఆనాడు ఉగాది. అతను లేవగానే స్నానంచేసి సరికొత్త ఉలెన్సూటు తొడుక్కుని వీధిలో నుంచున్నాడు.
ఆ పిల్ల వేపపూపచ్చడి పట్టుకొని వచ్చింది. వాలుగా చూస్తూ చిరునవ్వుతో అందించింది. అందంగా ముస్తాబయి కారులో అతనితో పాటు ఊరల్డా తిరిగింది. ఆ సొయంకాలం యిద్దరూ సముద్రం ఒడ్డుకు షికారుకు జఇయలుదేరారు. ఇసుక తిన్నెలమీద చెట్టాపట్టాలు పట్టుకుని నడిచిపోయారు. ఏకాంతమయినచోట యిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.
సాయంకాలపు వెలుతురు చారలు నల్లబడిపోయాయి. నముద్రకెరటాలు ఎగిరిపడుతూ నీటి తుంపర్లు గౌలిలో ఎగిరాస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మబ్బుల్ని దాటుకుంటూ పోయి తెల్లగా నవ్వుతున్నాయి.
ఆ యిద్దరూ అక్కడ కూచుని రహస్యాలు మాట్లాడుకున్నారు.
ఆ ఎదురింటి అమ్మాయి కిలకిలా పక్షిలా మాటలు చెప్పూ నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పింది. ఏమయినా మనం పెళ్ళి చేసుకుతీరాలంది. ఈ ఉగాది మన ప్రేమకు చిహ్నంగా ఉండాలంది. ఇంకా కళ్ళ సంజ్ఞలతో నోటితో చాలా చాలా చెప్పింది.
ఆతను ఆ సాయంకాలం అమెకు ఓహోటల్లో పెద్ద విందు చేశాడు. సినిమాలోలా కలసి డేన్సు చేశాడు.
కల కరిగిపోయింది.
ఎవరో ; అతన్ని నిద్రలేపుతున్నారు.
కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగుండా కిటికీ అవతల నుంచుని శర్మ నిద్రలేపు తున్నాడు.
కళ్ళు నులుముకుంటూ అంతసేపూ తను చూసిందీ, అనుభవించిందీ కలతప్ప వాస్తవం కాదని అర్థమై దీర్ధంగా నిట్టూర్చి లేచి కూర్చున్నాడు సత్యం. లేచిన కొన్ని సెకన్లవరకూ ఏమీ మాట్లాడలేదు. కరిగిపోయిన కలను మళ్ళీ గుర్తుచేసుకుంటూ వుండిపోయాడు.
68 నమాధి
ఆ తర్వాత తేరుకుని లేచి వెళ్ళి తలుపుతీసి “ఏం పనిమీద వచ్చావా?” అన్నాడు శర్మను ఉద్దేశించి.
“ఉన్నపనంతా నీతోనేగాని ఏమిటలా నిద్రలోనే నవ్వేస్తూ చేతులు తిప్పుతూ ఒక్కొక్కప్పుడు ఏదో అస్పష్టంగా మాట్టాడేసుకుంటున్నావ్! కలేమైనా వచ్చిందా?” అడిగాడు శర్మ
“ఊ. కలే వచ్చింది. చక్కటి కల! ఆ కలలో నేను ఉగాది చేసుకున్నాను. అందమైన అమ్మాయితో ఊరల్లా కారుమీద షికార్లు తిరిగాను అందులో నేను లక్షాధికార్ని ఆ అమ్మాయి నన్నూ, నేను ఆ అమ్మాయినీ (ప్రేమించుకున్నాం, ఆమెతో కలిసి విందారగించాను. డేను చేశాను. ఉగాది శోభంతా మామధ్యే వుంది. బంగారంలా జిగేల్ మన్న భవంతిలో డేన్సు చేస్తోంటే నువ్వొచ్చి లేపావ్. కల చెదిరిపోయింది...”
“నావల్ల నీ ఉగాది కార్యక్రమం పొడయిందనుకుంటాను. ఏమంటావ్?” నవ్వాడు శర్మ తర్వాత జేబులోనుండి అయిదు రూపాయలనోటు తీసి “ఇదిగో పాపం, నిన్న అడిగావ్, సమయానికి లేకపోయింది. డబ్బు విషయం మా ఆవిడ అడిగితే చెప్పాను. ఆమె అయిదురూపాయలు పేట్లో దాచుకున్నవి ఉంటే తీసిచ్చింది. పొద్దున్నే రాలేకపోయాను, ఇంద” అంటూ ఇవ్వబోయాడు శర్మ,
సత్యం మందహాసం చేశాడు.
“అక్కర్లేదు, వుండనియ్యి, పెద్దగా అవసరం వుండి అడగలేదు. ఎందుకడిగానో ఆ అవసరం తీరిపోయింది. ఈ రోజు ఉగాదని, రోజూలా కాకుండా కాస్త సర్దాగా వుందామని అడిగాను. కాని ఎందుకులే. ఉగాదంతా యిప్పుడే కలలో చేసుకున్నాగా! ఇంతకు పదింతలు సంతోషంగా చేసుకున్నాను. మళ్ళీ ఉగాది చేసుకోవడమేమిటి... ఇంక వద్దులే” అన్నాడు,
శర్మ ఆశ్చర్యంగా మిత్రుద్నే చూస్తూ వుండిపోయాడు.
9
మబ్బుతెరలు మౌథవి చంటాడికి కళ్ళనిండా కాటుకపెట్టి ముద్దులు కురిపించి మురిసిపోతోంది. ఆ చిన్నారి బాబుమీద వందేళ్ళ భవిష్యత్తు ఊహిస్తోండ్లి. పాకే బాబుని నడిపించి బడికిపంపి, ఆటలకై ఓ చెల్లాయిని తోడిచ్చి... యింకా యిగ్గా ఆ కుర్రాడినే పపెద్దచేసి పెళ్ళిచేసి ఆ చంటాడి భవిష్యత్తుపై ఎన్నెన్నో ఊహల్ని పేర్చి ఆలోచిస్తూ లోలోనే నవ్వేస్తూ, మాటిమాటికీ చంటాడిని ముద్దెడ్తూ, పాలబుగ్గ ఎర్రబడితే “అమ్మో అని హృదయానికి హత్తుకుంది. మధ్యాహ్నం నిద్రమత్తు పూర్తిగా వదిలేలా దొడ్లో బావి దగ్గగ్గ ముఖం కడిగి తుడుచుకుంటూ యింట్లో ప్రవేశించిన కాంతారావు మాధవిని చూసి గుమ్మందగ్గరే ఆగిపోయి చప్పుడు చేయకుండా వెళ్ళి ఆమె ప్రక్కనే కూర్చున్నాడు. ళ్ ఆమె గతుక్కుమంది. జారిపోయిన పవిటను సరిచేనుకుని, షాలుపడదామను కొంటున్న ఒడిలో చంటాడిని భుజాలమీదరకు తీసుకుంది. “కుర్రాడిని చూసి అలా నీలో నువ్వే నవ్వుకోకపోతే కాస్తా నాక్కూడా చెప్పకూడదా?” అన్నాడు కాంతారావు. మాధవికి సిగ్గేసి తలదించుకుంది. చూపుడువేలితో చుబుకాన్ని పైకెత్తి “మన
79 నమాధి చిన్నాడిని కలెక్టరు చేస్తున్నావా, డాక్టరు చేస్తున్నావా?” అన్నాడు, ఆమె ముఖంలో ముఖంపెట్టి మెల్లగా నవ్వుతూ. నవ్వి ఊరుకుంది మాధవి. “మీలా లాయరు మాత్రం కాడులే” అని అందామనుకుంది, ఆ మాట నాలిక చివరి వరకూ వచ్చిందిగాని బైటపడలేదు. వారిని చూస్తుంటే తనకేదో భయం. వారి ఎదురుగా ఒక్కమాటకూడా చెప్పలేదు తను. పెళ్ళయి సంవత్సరం పైబడినా అంత చనువుతో వారి ముందెప్పుడూ (ప్రవర్తించలేదు. ఏమిటో! వారుమాత్రం ఎప్పుడూ (ప్రేమతో ఆప్యాయంగా తనను దగ్గరకు తీసుకుని కవ్వించి నవ్విస్తారు. అయినా వారంటే భయమూ; బిడియమూ తనను వొదిలిపెట్టడంలేదు. “అదిగో అప్పుడే మళ్ళీ ఏదో లోకంలోకి వెళ్ళిపోయావ్. ఇలా అయితే నీతో వేగడం కష్టం సుమా”
“బావగారు వేగలేకపోతే మరికొంచెం నూనె పోసుకోండి” తూనీగలాగ వచ్చి
తుర్రుమంది మరదలుపిల్ల మాలతి.
“గట్టిగా మాట్లాడకండి, బాబు నిద్రపోతున్నాడు” అంది మాధవి.
“ఇంతకీ ఏ౦ పేరు పెట్టాలనుకుంటున్నాన్ మీ బాబుకి?” కాంతారావు మాధవి కళ్ళల్లోకి కళ్ళుపెట్టి అడిగాడు.
“మహా మీ బాబు కానట్బ” అంది మాధవి ఆ వెంటనే. కాని అతనన్న మాటలు జ్ఞాపకం రాగానే కొద్దిగా కంపించిపోయినట్టు అయిపోయింది. అది కనబడకుండా సన్నగా నవ్వి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
మరదలు పిల్ల మళ్ళీవచ్చి “ఏం బావా, బాబుకి ఏం పేరు పెడ్తున్నావ్?” అంది.
“చెప్పనా... చెప్పనా” అంటూ ముందుకొచ్చాడు. “చెప్పకపోతే దాచుకో, ఎవరిక్కావాలో అంది బుంగమూతిపెట్టి.
“ఓ యబ్బో! అందుకే కాబోలు అంత ఆతృత తెలుసుకోవాలని”
“చెప్పుబావా ఏంపేరు పెడ్తానో” స్థాయి తగ్గించి ఒక మెట్టు దిగి అంది.
ఇకబెట్టు చేస్తే లాభంలేదనుకున్నాడు.
“చెప్పనా”
ఊఊ
మబ్బు తెరలు 77
“కృష్ణమోహన్”
“కృష్ణమోహన్... కృష్ణమోహన్” అనుకుంటూ దొడ్లోకి పరుగెత్తింది మాలతి.
గదిలో తువ్వాలు ఆరేస్తున్న మాధవి ఆమాటలు వినడంతోనే భర్తవేపు ఓమారు
_చూసి అతను నవ్వుతూ (ప్రేమతో చిలిపిగా దగ్గరకు రమ్మని సైగచేస్తున్నా వెళ్ళకుండా పరధ్యాన్నంగా వరండాలోకి వెళ్ళిపోయింది.
ఆరాత్రి భోజనం చేశాక మాధవి అతని పక్కనే కూర్చుని తాంబూలం చుట్టియిస్తూ “ఆ పేరే పెడ్డారా బాబుకి?” అంది.
“ఊ” అన్నట్బగా తలూపాడు
“నిజంగానా?” సూటిగా అతని ముఖంలోకే చూస్తూ అడీగింది.
“ఏం .. అ పేరే పెడదామనుకుంటున్నాను, బావుంది కదూ. మన రామం, నేనూ కలిసి నువ్వు వుత్తరం రాసినరోజు సాయంకాలం నాన్నగారితో ఆలోచించి యీపేరు నిర్ణయించాం” అన్నాడు. అని, ముందుకు వంగి నోరు తెరిచాడు ఆమె సున్నం రొసిన ఆకుని నోటికందిస్తుందని.
ఆమె గబుక్కున లేచిపోయి కిటికీ ముందుకు వెళ్ళి నుంచుంది కిటికీలోంచి బైటకిచూస్తూ.
అలా లేచిపోయినందుకు ఆశ్చర్యపోయినా పరిహానం చేన్తున్నదేమోనని రెండుసార్లు “ఇలా రా మాధవీ” అంటూ మృదువుగా పిలిచాడు.
ఎప్పుడయినా మాధవి యింట్లో ఎక్కడున్నా ఏం చేన్తున్నా కాంతారావు అలా స్వరం తగ్గించి లాలనగా పిలిస్తే చప్పున అతనిముందుకొచ్చి ఏం పనన్నట్టు అతని ముఖంలోకి చూసేది. అదే మృదుత్వం అతని మాటల్లో ధ్వనించినా ఆమె దగ్గరకు రాకపోవడానికి కారణమేమిటో తెలీక తనే వచ్చి ఆమె పక్కనే నుంచొని రెండు చేతుల్తోనూ ఆమె భుజాల్ని పట్టి తనవైపుకు తిప్పుకున్నాడు. _
అప్పుడే జారిపోయిన రెండు కన్నీటిబొట్లకు సూచనగా తడిచారలు ఆమె బుగ్గలమీద కనిపించాయి. “ఏమిటిది మాధవీ!” అని అతను యింకా పూర్తిగా అనకుండానే కంగారుగా పైట కొంగుతో కన్నీటి చారల్ని తుడుచుకొని'ఏం లేదండీ అంది. ॥
కాంతారావు కేమిటో అర్ధంకాక తిరిగివచ్చి మంచంమీద కూర్చున్నాడు.
72 నమాథి
"పెళ్ళయిన మొదటి రోజుల్లో అలాగే ఆమె చాటుగా అతనికి తెలీకుండా కళ్ళనీళ్ళు పెట్టుకుని, పారపాటున అతని కళ్ళముందు పడినప్పుడు తప్పించుకుందామని సన్నగా నవ్వేది. ఆ నవ్వులో, ఆమె చీర సింగారించి, జడలో జాజిమొగ్గలు తురిమి రంగరించిన బంగారు బొమ్మలా ఎదురుగా నిలబడి, అతనన్న ఏ మాటకో సిగ్గుదొంతర్ల తెరల మధ్య సన్నగా నవ్విన ఛాయలు కనిపించేవికావు.
“ఏం అలా వున్నావని అతను ఆడగనూ లేదు, ఆమె చెప్పనూలేదు. తల్లిదండ్రుల్ని వదిలి వుండలేని కొత్త పెళ్ళికూతురి తొలిరోజులు కదా అనుకున్నాడు. తర్వాత తర్వాత అతను ఎప్పుడూ ఆమె కళ్ళవెంట కన్నీరు కారుతుండగా చూడలేదు. ఈనాడు మళ్ళీ అలాగే ఆరోజుల్లో వలె ఏమీ కారణంలేకుండానే అమె కన్నీరు కారుస్తుండడంలో విశేషమేమిటో అతనికి అర్థం కాలేదు.
మంచంమీద కూర్చున్నవాడు మళ్ళీ ఆమె పక్కకువచ్చి*ఏం.. పేరు బాగోలేదా?” అన్నాడు.
మాధవి మాట్టాడలేదు. కిందకు చూస్తూ కాలిగోటితో గచ్చుమీద గీస్తూ తల అడ్డంగా తిప్పింది.
“మరేం, ఆ మాట చెప్పడంతోనే అదోలా అయిపోయావ్?”
“ఏం లేదు, ఊరికే, ఏదో జ్ఞాపకం వచ్చింది... అయ్యో మర్చిపోయాను, ఆకుల్లో సున్నం లేదండీ” అంటూ చేతిలో నున్నంరాసిన ఆకు అతనికి యివ్వబోయింది.
“ఒద్దులే, నేను రాసుకున్నాను” అన్నాడు నవ్వుతూ.
ఉయ్యాల్లో చంటాడు కదులుతూవుంటే వెళ్ళితీసుకొచ్చి అతనికి చాటుగా పాలుపెడ్తూ“మీరు చాలా మంచివారండీ” అంది. నిష్కల్మంషంగా అన్న ఆ మాటలు ఎందుకందో తెలీకపోయినా నిండుగా చిరునవ్వు నవ్వాడు అతను.
పొద్దున్న లేచేటవ్పటికి వెచ్చగా నూర్యకిరణాలు కిటికీలోంచి మీద వాలుతున్నాయి. అంతకుముందే మాధవి ఓమారు వచ్చి లేపి వెళ్ళిపోయింది. ఇక అప్పట్టైనా లేవకపోతే బాగోదని బలవంతంగా లేచి ముఖం కడుక్కుందామని బావివైపు వెళ్ళాడు.
“ఏం బావా! కుంభకర్ణుడి నిద్రచేశావు. నీ కంటే బాబే నయంసుమా. నాలుగింటికే లేచి అక్కకు పనిచెప్పాడు” అంది.
మబ్బుతెరలు 7
“మా బాబు నాలుగొకులు ఎక్కువే చదువుకుంటాడు లేవే. ఇవాళ నాచేత పనిచేయించుకున్నవాడు మరో రెండు రోజులుపోతే నీకూ పనిచెస్తాడు” అంది మాధవి టూత్‌పేస్టు, బ్రష్తూబావిదగ్గర పెట్టి చెల్లెలన్న మాటకు జవాబుగా.
“ఎలా అయినా పేరు సార్ధకం చేసుకుంటాడులే. కృష్ణమోహన్లో ఆ బాలకృష్ణుడి చిన్నెలన్నీ యిప్పటినుంచే వున్నాయి సుమా” అంది మాలతి మూతి మూడు వంకర్లు తిప్పి-
మాధవి ముఖం ముడుచుకుంది. ఇంకా చెల్లెలితో ఏదో అందామని, దాన్ని ఏడిపిద్దామని అనుకున్న మాధవి ఆమాట వినడంతోనే మరేమీ అనకుండానే యింట్లోకి వెళ్ళిపోయింది.
మాధవి అలా వెళ్ళిపోవడం కాంతారావుకు, మాలతికి అర్ధంకాలేదు. ఆశ్చర్యంతో ఆమె వెళ్తున్నవైపే చూస్తూ వుండిపోయారు. ఆమె వంటగదిలో పొయ్యిముందు కూర్చుని కాఫీకాస్తున్నప్పుడు పైటచెంగుతో కళ్ళు వత్తుకోవడం ఒక్క కాంతారావే ముఖం కడుక్కుంటూ బావి పక్కనే వున్న వంటగది కిటికీలోంచి చూశాడు.
స్నానం చేశాక గదిలో కూర్చొని పేపరు చదువుతూ వుండగా మాధవి కాఫీ తెచ్చియిచ్చింది. కప్పు అందుకుంటూ “కళ్ళు అలా వున్నాయేం?” అన్నాడు.
“ఎలా వున్నాయ్?” అంది అదోలా నవ్వుతూ. ఆ తర్వాత అద్దంముందు కెళ్ళి నుంచొని కళ్ళు ఎర్రగా వుండడం చూసి “ఏం లేదు. పాయ్యిదగ్గర కంట్లో ఉదో నలుసు పడిందంతే” అంది.
ఆ మాటలు అతను ఆలకించినట్టులేదు. అతనికోసం మావగారు వస్తే గబగబా కొఫీ పూర్తిచేసి ఆయనతో కలిసి బైటికి వెళ్ళిపోయాడు.
మధ్యాహ్నం యింటికి వచ్చాక భోజనం దగ్గర “ఎక్కడకు వెళ్ళారండీ నాన్నగారూ మీరూ” అంటూ అడిగింది మాధవి.
“అబ్బాయిని తీసుకుని అలా అవధానులుగారింటికి వెళ్ళానమ్మా మన చంటాడి పేరు గురించి అబ్బాయి చెప్పాడు. అది బాగానే వుందట.... నక్షత్రం అదీ సరిపోయిందన్నారు” అన్నాడు తండ్రి అల్లుడికి బదులు తనే జవాబు చెప్పేస్తూ.
“అలాగా” అంది మాధవి. ఆ సమయంలో పప్పులో నెయ్యి వేస్తున్న ఆమె చేతులు వణికాయి.
గ నమాధి
“అదేమిటి! అంత నెయ్యి వేస్తున్నావ్?” అన్నాడు కాంతారావు అమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ,
“అయ్యో చూసుకోలేదు. పోనీ పక్కకు తీసెయ్యండి” అంది మాధవి కంగారుతో కూడుకున్న భయం ఆమెకు తెలీకుండానే పదాల్లో కనిపించింది
అంతా భోజనాలు చేసేశాక ఏకాంతంగా అక్కని చూసి అడిగింది మాలతి.“ఏమే బావని చూసి లోకాన్నే మర్చిపోతున్నావేమిటి!” అని.
“చాల్లేవే నువ్వు మరీనూ” చెల్లెలి వేళాకోళానికి నవ్వాస్తున్నా కావాలని కోపం అభినయినన్త అంది.
“ఏమిటే-ఘాలతీ! నువ్వు మర్ చిన్నపిల్లవైపోతున్నావ్” అంటూ కోప్పడింది వంటింట్లోంచి తల్లి మాణిక్యమ్మ
“ఏం లేదమ్మా అక్క ఈ రెండు రోజులబట్టీ మరీ మతిమరపు మనిషి అయిపోయిందంటున్నానంకే” అంది మాలతి.
“నీకు ఎలాగూ కొమ్ములు తిరిగాయి. ఆగు, మరో సంవత్సరం పోతే చెవులు మెలిపెట్టే మొగుడే దారుకుతాడులే”
“మహా బావ నీ చెవులు మెలిపెడ్డ్తున్నట్లు! నెత్తి కెక్కించుకుని పూజించకపోగే సరి... ఇదిగో, బాబు తయారయ్యాడుగా, ఇక నీ నెత్తికెక్కే కూర్చుంటాడు.”
“మా రత్నబాబు అలాటి వాడెప్పటికీ కాడు”
మాధవి మాటలు మాలతికి వింతగా అనిపించాయి.
“అదేమిటి, రత్నబాబేమిటి!” అంది ఆశ్చర్యంగా.
“ఓ! అదా... బాబు పేరులే” అనేసి వెళ్ళిపోయింది మాధవి.
కాంతారావు అంతా మంచంమీద పడుకుని విన్నాడు. మాధవి లోపలికి రావడంతోనే “ ఆ 'పేరు ఎప్పుడు పెట్టావు మాధవీ?” అన్నాడు.
మాధవి మాట్టాడలేదు,.ఉయ్యాల్లో బాబు కదులుతూ వుంటే ఏదో జోలపాట పొడి ఊపుతూ, మధ్యలో పాట అసి “ఏవండీ ఆపేరు బాగోలేదా?” అంది.
కాంతారావు తలూపాడు “బాగానే వుంది"
“మరి మన బాబుకి ఆపేరే పెడ్తే?
మబ్బుతెరలు గ్
“బాగానే వుంటుంది కాని ఎందుకూ, కృష్ణమోహన్ అని ఆలోచించాంగదూ” అన్నాడు.అలా అతను అంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరగడం కనిపించింది. కాంతారావుకు. దగ్గరగా వెళ్ళి “అదేమిటి మాధవీ పేరుగురించి యిలా పట్టింపుకు పోవాలా” అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకుని “చూడు, తాతగారి పేరు కృష్ణశాస్త్రి గారని నీకు తెలుసుకదా. వచ్చేప్పుడు నాన్నగారు మరీమరీ చెప్పారు ఆపేరు పెట్టమని, ఆయన్ను కాదంటే ఎలా.” తల నిమురుతూ అన్నాడు.
ఆమె అతని కౌగిట్లోంచి జారుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ చీకటి పడేవరకూ ఆమె ఆతనికి కనిపించలేదు. దీపం వెలిగించడానికని గదిలోకి వచ్చి వెళ్ళిపోయింది. అప్పుడామె వాచిన కళ్ళూ, దువ్వుకోనట్టున్న చింపిరి జుట్టూ అతను చూశాడు. అనుకోకుండానే ఆమెను పిలిచాడు. మాధవి అతనివైపు చూడకుండానే వెళ్ళిపోయింది.
అలా మాధవి వెనక్కు తిరగకుండా, అతను చెప్పేదేమిటో వినకుండా వెళ్ళిపోతుంటే కాంతారావు ఎంతటి సరళహృదయుడైనా, బాహ్యంగా కాకపోయినా మననులోనే కొంచెం బాధపడ్డాడు. కాస్సేపు ఆలోచించి అ రాత్రికి భోజనం చెయ్యకూడదనుకున్నాడు.
మాలతి పిలవడానికొచ్చి కాంతారావు రానంటే వెళ్ళిపోయింది.
మాధవి వచ్చి “భోజనం చెయ్యరా?” అంది ముభావంగా.
కాంతారావు మాట్లాడలేదు.
ఆమెకూ కాస్సేపు ఏమి మాట్లాడాలో తోచలేదు. మళ్ళీ “భోజనానికి రండీ” అంది. ఈసారి ఆమె మాటల్లో కోపం, నిర్లిప్తత లేదు. కాంతారావు ఓమారు అమె ముఖంలోకి చూసి మళ్ళీ పుస్తకంలోకి దృష్టి మరల్చుకున్నాడు.
వర్షాకాలపు తొలిరోజుల్లో గాలితాకిడీకై ఎదురుచూసే నీలాకాశపు తెల్లని మేఘాలు అమె కళ్ళల్లో నల్లగుడ్డు చుట్టూరా ఆవరించాయి. చల్లగాలివీస్తే అవి మరి కొద్దిసేపట్లో కరిగి నీరై బొట్టుబొట్టుగా కారిపోయే స్థితిలో వున్నాయి.
'పిచ్చిపిల్ల! మాట్లాడితే కళ్ళల్లో కన్నీరు నిలుస్తుంది! మరీ విడ్డూరంగా గోరంతల్ని కొండంతలు చేసి ఊరికే బాధపడుతోంది, అనుకుంటూ పుస్తకం మడిచి ఆమె వెనకనే వెళ్ళాడు.
భోజనం చేస్తూ ఆమెను నవ్విద్దామని “ఈసారి వుట్టిన వాళ్ళందరకూ నువ్వే
76 నమాధి పేర్లుపెట్టకో. పేరుగురించి తర్జనభర్ణనలు పడి ఆలోచించడం, తీరా ఆలోచించాక ఒకరు మూతిముడుచుకోవడ౦-- యీ లేనిపోని గొడవంతా నా కెందుకూ. కనేదానివి నువ్వే గనక ఎంతమందికి ఎన్నిపేరు పెట్టాలనుకుంటావో యిటుపై నువ్వే నిర్ణయించుకో” అన్నాడు. బలవంతాన నవ్వాపుకొని “చాల్లెద్దురూ, ఎవరైనా వింటే నవ్విపోగలరు” అందామె, బారసాల కాగానే మరునటిరోజు ఉదయం కాంతారావు వెళ్ళిపోయాడు. బౌరసాలవాడల్లా మాధవి అదోలా ఉండడం చూసి కాంతారావు అంతవరకూ చెప్పకుండా దాచిన బంగారపుకొత్తగొలును -బాబుకని చేయించినది-= చిన్న పలకల ఎగ్రపాడి వుంగరం, మరికొన్ని జుబ్బాలు ఆ మధ్యాహ్నం పెట్టోంచి తీసి మాధవి చేతుల్లో పెట్టాడు. ఆమె మామూలుగా వాటిని అందుకుని భర్తకు అప్పటికి నవ్వు ముఖం చూపి వెళ్ళిపోయింది. ఆమె నిజంగా సంతోషించలేదని ఆ తర్వాత అతనికి అర్ధమైంది. బాబుపేరు గురించి ఆమెను కాదని తను మొండిపట్టు పడుతున్నట్టే అనిపించింది. అయినా పెద్దవాళ్ళ మాటని కొట్టివేయడం బావుండదు. మాధవి కూడా మొండిపట్టే పడుతోంది. మొత్తంమీద బాబుకు కృష్ణమోహన్ అన్నపేరు పెట్టడం విని అతను యింకేమీ మాట్లాడలేదు. మరుసటిరోజు ఉదయం వెళ్ళిపోతూ “అమ్మకు మనవడి చూసుకోవాలని వుంది. సాధ్యమైనంత తొందరగా వచ్చెయ్” అన్నాడు. ఊరెళ్ళాక నెలరోజుల్లోనూ నాలుగైదు వుత్తరాలు రాశాడు. అన్నింటిలోనూ “కృష్ణమోహనుడు ఏం చేస్తున్నాడు?వాడికి నొ ముద్దులు" అంటూ చాలావరకు బాబుని గురించిన విషయాలే వృండేవి. ఆమె రాసిన జవాబుల్లోనూ వాడి సంగతులే. బాబు అల్లర్హి పగలు నిద్రపోయి రాత్రిళ్ళు మేలుకొని సరిగా నిద్రపోనివ్వకపోవడం, పాలుపట్టడానికి ఓ క్షణం అలస్యమైతే యిల్లెగరగొట్టేయడం చాలా చాలా కబుర్లు రాస్తుండేది. ఒక ఉత్తరంలో “నేను ఆదివారం మెయిలుకు వస్తున్నాను, స్టేషనుకు రండి” అని రాసింది. కాంతారావు గంట ముందుగానే స్టేషనుకు వెళ్ళాడు. బండి వచ్చేవరకూ ఎదురుచూస్తూ ప్లాట్ఫారంమీదే పచార్లు చేస్తూవున్నాడు.
మబ్బుతెరలు 77
బండి వచ్చి ఆగింది. మాధవి కనిపించగానే వెళ్ళి పెట్టె అందుకుని, బాబుని తీసుకున్నాడు. ఆమె కిందకి దిగిరాగానే “మన కృష్ణుడు బండిలో గొడవ చెయ్యలేదు కదా?” అన్నాడు
“ఉండే కొలదీ వట్టి పెంకివాడయిపోతున్నాడు. బండి ఎక్కింది లగాయితు ఒకటే ఏడుపు” అంది విసుగ్గా
సామాను తీసుకుని స్టేషను బయటికి వచ్చి రిక్షాలో యింటికి వెళ్ళిపోయారు
మనవడి చూసి మురిసిపోయింది సుబ్బలక్ష్మమ్మ. “అచ్చంగా నీ పోలికేనే అమ్మా” అంది కోడలితో.
ఆ రాత్రి “ ఏం పిల్లా! పేరుగురించి పట్టబట్టావట” అని కోడలిని అడిగింది అత్త.
“వట్టినేనండీ పలకడానికి ఆ పేరు బాగోలేదని మరో పేరైదైనా పెట్టమన్నాను. వారు ఆ పేరే పెట్టాలంటే కాదంటానా” అంటూ కాంతారావు గదిలోంచి పిలుస్తే లోపలికి వెళ్ళింది
“చూడు, నీ కృష్ణుడు ఏం చేశాడో, ఏడుస్తున్నాడు కదాని ఎత్తుకొంటే ఫేంటు, చొక్కా రెండింటిని తడిపి ముద్దచేశాడు” అన్నాడు కాంతారావు.
మాధవి ఫకాలున నవ్వి బాబుని తీసుకుంటూ అంది “పేరు పెట్టినవారు ఆ ఆమాత్రం అల్లరిచేస్తే భరించలేరా” అని.
బావుంది కృష్ణుడిపేరు పెట్టినంత మాత్రాన కొంటెవాడౌతాడనా, + ఉద్దేశం? అయితే రత్నబాబని పేరెడ్తే రత్నాలు కురిపిస్తాడంటావ్.” అంటూ దగ్గరకొచ్చి బుగ్గమీద మెల్లగా చిటికవేసి భోజనానికి వెళ్ళిపోయాడు.
భోజనం చేసి వచ్చి కూర్చున్న కాంతారావు అలికిడి విని కుర్రాడిని ఉయ్యాల్లో వేసి ఊపుతున్న మాధవి “మీరు చాలా మంచివారండీ” అంది.
ఆమె అంతవరకూ అలా ఏమిటాలోచిన్తూవుందో అతనికి అర్ధంకాలేదు. అవే మాటలు అంతకుముందు ఒకసారి ఆమె నోటిమీదుగా వినిపించినట్టనిపించింది. అవి ఎప్పుడు ఎక్కడ ఎందుకందో జ్ఞాపకం లేకపోయినా వట్టినే ఏ కారణం లేకుండా అనలేదని, ఆ మాటల వెనుక భావగర్భితమైన విషయమేదో ఉండివుంటుందని అతను
78 నమాధి అనుకున్నాడు.
అది తెలుసుకోవాలని అతను ప్రయత్నించలేదు ఆమె మనసు అతనికి తెలుసు. అమె ఏ విషయమూ చెప్పకుండా దాచదని అతని నమ్మకం
ఒకసారి ఆమె కుర్రాడిని గురించి పనిపిల్లని అడుగుతూ “రత్నబాబు లేచాడేమో చూసిరావే” అంది మాధవి.
అది కొంతరావు విన్నాడు. మళ్ళీ అతనిలో భావ సంచలనం చెలరేగింది.
అప్పుడప్పుడు వాడిన పువ్వులా మార్దవంలేని ఆమె నవ్వూ, పుంతదాపున షికారీని చూసి బెదిరిన లేడిలా చెదిరిన ఆమె చూపులూ, మనసులో విషయాన్ని దాచలేక వేరే రూపంలో బైటపెట్టే ఆమె దుర్చలత్వం అతని కళ్ళముందు నిలిచాయి.
ఆరాత్రి ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు “నాకు చెప్పవా?” అన్నాడు, ఆమెను దగ్గరకు తీసుకుని చుబుకాన్ని అధరాన్ని ముద్దెట్టుకుంటూ
ఏమిటన్నట్టుగా అతని ముఖంలోకి ముఖం పెట్టి జ్యోతుల్లాటి కళ్ళని ఆర్బకుండా
చూసింది ఆమె.
“నువ్వు బాబుని ఒక్కమారూ పేరెట్టి పిలవ్వేం? అప్పుడప్పుడు కొత్తపేర్లు చేర్చుతూ వుంటావెందుకు?” అన్నాడు.
అతని వెచ్చని కౌగిట్టో వున్నా శిశిర రుతువులో శీతగాలిలో గజగజలాడినట్టుగా వణికిపోయింది.
అతను నుతారంగా ఆమె ముంగురుల్ని సవరిస్తూ “ఏదో విషయం నా నుండి దాయాలనుకుంటున్నావు కదూ. నాకు చెప్పవా?” అన్నాడు మళ్ళీ.
ఆ సమయంలో ఆమె కళ్ళల్లో కన్నీరు నిలిచి జారిపోవడం అతనికి కనిపించకపోయినా వేడినిట్టూర్పులు "చుట్టూరా ఆవరించి ఆమె ఏఢుస్తున్నదనే విషయాన్ని తెలియజేసాయి.
కాంొరావు ఆమెను మురిపించాలని మరింత దగ్గరగా లాక్కుని వక్షానికి వక్షాన్ని అధరానికి అధరాన్ని అదుముకున్నాడు.
రెండు కన్నీటి చుక్కలు ఆతని చెంపలమీద పడ్డాయి. అతను తుడుచుకుని “ఇంకా ఏడుపేనా... ఒద్దులే... నాకేమీ చెప్పాద్దు. ఊరుకోమరి” అన్నాడు లాలనగా. ఆమె చెంపలమీద తడిని తుడిచాడు. ఆమె చాలాసేపు ఏమీ మాట్లాడకుండా అలాగే
మబ్బుతెరలు 79 వుండిపోయింది. ఆ తర్వాత లేచి కూర్చుని “మీరు నన్ను క్షమిస్తారా” అంది.
“నా మనసు నీకు తెలీదా మాధవీ” అన్నాడు కాంతారావు ఆమె ముఖంలో ముఖంపెట్టి
మాధవి అతని వక్తంమీదకు వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆతనికి ఏం చెయ్యాలో తోచక ఆమె శిరోజాల్ని వేళ్ళతో వెనక్కు దువ్వుతూ “పోనీ ఆ విషయం నాతో చెప్పాద్దులే” అన్నాడు.
ఆమె ఏడ్చి ఏడ్చి అతని గుండెలమీద నిద్రపోయింది. ఆమెను పక్కకు వత్తిగించి మరో మంచంమీదకు వెళ్ళిపోయాడు.
అతనికి ఎంతసేపటికీ నిద్రపట్టలేదు. లేచివెళ్ళి బెడ్‌లైట్ వేశాడు.
నుదుటిమీద చెదిరిపోయిన సింధూర తిలకం ముందుకు వాలిన తల వెంట్రుకలతో కలిసి గుండ్రని ముఖంలో వింతగా శోభించింది. ముఖంమీద అక్కడక్కడ పల్పగా పరుచుకున్న చెమటతడి, దీపం వెల్తురులో చెమ్మీ రేణువుల్లా మెరుస్తోంది. ఆమె మంచం వరకూ వచ్చి చూస్తూ చాలాసేపు అలాగే నుంచున్నాడు.
నిద్రలో ఆమె ఏమిటో కలవరిస్తోంది.
'పిచ్చిపిల్ల. నిద్రలో కూడా యీ కలవరింపేనా' అనుకుంటూ నవ్వుకుని వెళ్ళి పడుకున్నాడు.
ఉదయం లేచేటప్పటికి మాధవి అతని ఎదురుగా నుంచాని “ఇంకా నిద్రేమిటండీ, అత్తయ్య ఊరికే కంగారు పడుతోంది, బన్సుకి టైం అయిపోళతోందని, లేవండి” అంటోంది. అప్పుడతనికి జ్ఞాపకం వచ్చింది అమ్మ చెల్లెలు దగ్గరకు వెళ్తున్నట్టు.
లేచి గబగబా తెమిలి తల్లిని పదిగంటల బస్సుకి పంపించి, ఆరోజు గవర్నమెంటు సెలవు కావడంతో పన్నెండింటివరకూ మిత్రుల యిళ్ళకు వెళ్ళి గడిపి, భోజనం టయిముకు యింటిని చేరుకున్నాడు.
భోంచేసి యింటిపట్టునే వుండిపోయాడు ఏదో పుస్తకం చదువుకుంటూ. అతను చదువుకుంటుంటే మాటిమాటికీ నూధవి అతను చదువుకుంటున్న గదిలోకి ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోతుండేది. అతని దగ్గరకంటూ వచ్చి పక్కనే కూర్చుని, అంతలోనే ఏదో జ్ఞాపకం రాగానే లేచి వెళ్ళిపోయేది. భూగర్భంలో శిలలు కరిగి లావాలా వైటపడడానికై సుస్థిరమైన కొండల్ని కదిపి పైకి ఎగజిమ్మినట్ట ఆమె
౭0 నమాధి మనసు లోలోపల బిగపెట్టిన విషయమేదో హృదయంలోంచి ఉబికిరావడానికై పెద్ద సంచలనాన్నే కలిగిస్తోంది. ఆ తాకిడికి ఆమె తట్టుకోలేక అతని ముందు ఒక్కసారిగా వెళ్ళగక్కుదామనుకొనేది. తీరా అది బైటపడితే సంభవించే పరిణామాన్ని తలంచుకుని గజగజలాడిపోతోంది. చివరకు ఎలాగైతే ధైర్యంచేసి అతనిముందుకొచ్చి “మీకో విషయం చెప్పాలి" అంది. అతను చదువుతున్న పుస్తకంలోంచే చెప్పమన్నట్టుగా ఆమెవైపు చూశాడు. ఆమె కూడగట్టుకున్న అంత ధైర్యమూ అతని చూపుతో నీరుగారిపోయింది. చీకటిలోంచి వెళ్తున్నవాడు పామునుచూసి తొడనుకొని పక్కనుంచి పోయినా అది ఏమీ చేయదని మనసులో అనుకున్సితీరా తాడునిచూసి పామనుకుని పరుగెత్తి పారిపోదామన్నట్టందామె స్థితి. “అబ్బే ఏంలేదు” అని వెళ్ళిపోయింది పుస్తకం మడిచి ఆమె వెనకే వెళ్ళాడు కాంతారావు “ఏదో చెప్పాలని యిలా వచ్చేశావేం?” అన్నాడు. ఆమె దీనంగా అతని కళ్ళల్లోకి చూసింది. “ఒక విషయం చెప్తాను, మీరు కోపగించుకోరుకదూ” అంది. “పిచ్చిదానా ఎప్పుడయినా కోప్పడ్డానా?” లేదన్నట్ట తలతిప్పింది. “మరి క్షమిస్తారు కదూ” అంది మళ్ళీ అతి దీనంగా ముఖంపెట్టి. జవాబుగా అతను ఆమెను మంచంమీద కూర్చోబెట్టి ఆమె పక్కనే తనూ కూర్చుని ఆమెచేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమెకు ఎలా (ప్రారంభించాలో తోచక రెండు నిమిషాలు మౌనంగా వుండిపోయి “నాకు కృష్ణమోహన్ 'పేరువింబే చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తాయి. అందుకని బాబుకి ఆ పేరు పెట్టడం ఎంతమాత్రం యిష్టంలేదు” అంది అకస్మాత్తుగా. “ఆ చిన్నప్పటి విషయాలు ఏమిటి? అని అతను అడగలేదు, ఆవిడే చెప్తందిలే అన్నట్టుగా ఊరుకుండిపోయాడు. “చిన్నప్పుడు చదువునే రోజుల్లో కృష్ణమోహన్ అనీ ఓ అబ్బాయి వుండేవాడు. అతను కూడా మా వీధిలోనే వుండడంవల్ల బాగా తెలుసు. అతను కాలేజీలో ఇంటర్
మబ్బుతెరలు 8 చదువుతుండేవాడు. బాగాపాటలుపాడేవాడు. మా వీధి చాలా సన్నని సందు కావడంవల్ల స్కూలుకి వెళ్తున్నప్పుడు ఆ యింటిముందునించి వెళ్తుంటే చాలాసార్లు అతను పాటలు పాడడం వినిపించేది. అందుకే గాబోలు అతనంటే యిష్టం ఏర్పడింది. నేనప్పుడు ఫిఫ్తఫారం చదువుతున్నాను అతనుంటున్న యింటికి ఎదురింట్లోనే నా క్లాసేచదివే సీతారత్నం వుండేది ఆ అమ్మాయి యింటికి వెళ్ళినప్పుడల్లా అతను కిటికీలోంచి నన్ను చూస్తుండడం చాలాసార్లు గమనించాను
ఒకసారి స్కూలునించి ఒక్కర్తినీ వస్తున్నాను. ఆరోజు సీతారత్నం స్కూలుకి రాలేదు ఇంటికి మరీదూరం కాదుగనక నడిచే వస్తున్నాను. దారిలో అతను ఎదురై నన్ను డ్రుమిస్తున్నట్టూ, ఆవిషయం చెప్పాలని ఎంతో కాలంనించి ఎదురుచూస్తున్నట్టూ చెప్పాడు. అతని మాటలకు నాకు సంతోషం కలిగినా ఎందుకో భయంవేసి గబగబా వచ్చేశాను. అ తర్వాత మూడు నాలుగుసార్లు రోడ్డుమీద కలిసి పలకరించి మాట్లాడినపుడు భయపడి వచ్చేయలేదు. అతని పాటల గురించి మెచ్చుకుంటూ మాట్టాడేదాన్ని. నాతోపాటు కొంతదూరం నడుస్తూవచ్చి ఆగిపోతుండేవాడు. అలా నాలుగైదు నేలలు గడిచాయి.
మేమిద్దరం అలాకలిసి కబుర్లు చెప్పుకుంటూ రావడం ఎవరు చెప్పారో నాన్నగారికి తెలిసింది. ఓ సాయంకాలం వాళ్ళింటివాళ్ళతో పెద్ద కొట్లాట పెట్టుకుని వచ్చారు నాన్నగారు. నన్ను కొట్టలేదుగాని మళ్ళీ అతనితో మాట్లాడితే స్కూలు మానిపించి యింట్లో కూర్చోబెడ్తానని గట్టిగా కోప్పడ్డారు. అప్పట్నించీ అతను ఎప్పుడైనా ఎదురుపడినా, మాట్లాడ్డానికి యత్నించినా తప్పించుకుని వచ్చేసేదాన్ని. దార్లో కాపుకాస్తున్నట్టు నాన్నగారికి తెలిసిందో ఏమో నాకూ, సీతారత్నానికీ స్కూలుకి తీసుకెళ్ళి తీసుకురావడానికి ఓ రిక్షాని కూడా ఏర్పాటుచేశారు అయినా అతను నా కోసం ఎదురుచూడ్డం మానలేదు.
ఒకరోజు అకస్మాత్తుగా కృష్ణమోహన్ వచ్చి నేను యింట్లో వున్నానేమోనని అడిగాడట. నాన్నగారు ముఖం వాచేట్లు చీవాట్లు పెట్టి పొమ్మని గెంటేశారట. మా పెదనాన్న కొడుకు తన (ఫెండ్స్‌తో వెళ్ళి అతన్ని ఓరోజు సాయంత్రం కాలేజీ గ్రౌండ్స్‌లో చిదగతన్నినట్టు కూడా తెలిసింది. ఆ ఏడాది అతను పరిక్ష తప్పాడని విన్నాను. ఒక ఏడాదిలో అతనిలో చాలా మార్చు వచ్చింది చాలా డల్‌గా అయిపోయాడు. వీధిలో యిల్లుకూడా ఖాళీ చేసి వూళ్ళో మరెక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత అయిదారు నెలలకు గాబోలు బజార్లో కనిపించాడు. మాసిపోయిన గెడ్డం, దుమ్మూ ధూళితో చిరిగిపోయిన బట్టలు, పీడముఖ౦- అతని రూపం మారిపోయింది. ఆ తర్వాత ఏడాదికే
82 నమాధి పిచ్చి మరీ ముదిరి వాళ్ళు ఆ వూరుకూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారని తెలిసింది. ఎప్పుడు గుర్తొచ్చినా నా వల్ల ఓ మనిషి పిచ్చివాడైిపోయాడని మనసంతా వికలమైపోతుంటుంది. అందుకే నాకు ఆ పేరు తలచుకోడానికి కూడా భయంవేస్తుంది” మాధవి రెండు చేతుల్తోనూ ముఖం కప్పుకొని అతని ఒడిలోకి వాలిపోయింది. కాంతారావు చాలాసేపటివరకు ఆమెను కదల్బలేదు. నిశ్చలంగా కూర్చుని కిటికీలోంచి బైటికి చూస్తున్నాడు. మబ్బు విడిచిన సూర్యుడి ఎండ వాలుగా కిటికీలోంచి గదిలోకి పడుతోంది. మాధవి అతని వడిలోంచి లేచి భయంభయంగా అతని ముఖంలోకి చూసింది. కాంతారావు చిరునవ్వు నవ్వాడు. “ఇందుకేనా యింతకాలంనించీ బాధ పడుతున్నావ్! భలేదానివే! చిన్నతనంలో తెలీని యీడులో జరిగిన్నఅతి సాధారణమైన విషయాన్ని గోరంతల్ని కొండంతలుగా చేసుకొని యింతగా బాధపడతా వేమిటి? ఒకనాడు తెలీక చేసిన పని జీవితాంతం విచారించడానికి కారణం కాకూడదు. నడిచిపోతున్నప్పుడు కాలికింద చీమలు నలిగి చస్తున్నాయని బాధపడవు. అంతే! నీకు తెలీకుండా జరిగినదానికి నువ్వు బాధ్యురాలువుకావు. ఇంత చిన్న విషయానికే నువ్వు లోలోపల కుమిలిపోవడం నాకు ఆశ్చర్యంగావుంది. ఏమీలేనిదొన్ని ఏదోగా ఊహించుకుని నీలో నువ్వే కుమిలి పోతుంటే అర్ధంకాక్కమనిద్దరిమధ్యా మనస్పర్థల కార్చిచ్చు ఎలా రగుల్కొందో చూశావా. కార్చిచ్చు అంటుకుంటే చెట్టాక్కటే కాదు ఆచుట్టపట్ల వున్నవన్నీ నాశనమవుతాయి... ముందే దానిని ఆర్బీయాలి. పేరుచూసి భయపడిపోవడానికి కారణం నీలో తప్పుచేసానన్న భావం బలంగా నాటుకుపోయింది. ఆ భావాన్ని తొలగించుకుంటే తప్ప నీ మనసుకు ప్రశాంతత వుండదు. నువ్వు చేసిన పనిలో ఏ తప్పూ నాకు కనిపించలేదు. నీకెందుకంత ఆందోళన! ఇంకా ఆ భయం దేనికి! ఇలా దగ్గరకు వచ్చి కిటికీలోంచి అవతలికి చూడు” అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ఆకులమధ్య ముక్కుల్ని పాడుచుకుంటున్నరెండు పిట్టల్ని చూపించి, పరధ్యాన్నంగా ఆమె చూస్తుంటే చటుక్కున ఆమె బుగ్గమీద ముద్దెట్టుకున్నాడు. ఏం
౨ఎ౦గిలి మెతుకులు
సత్రవంతా బిక్కుబిక్కుమంటోంది. మసిబారిన మొండిగోడలు అర్థరాత్రి శ్మశానంలో గోరీల్గా నిలుచున్నాయి. మధ్యమధ్య మసిబొగ్గుతో గీసిన అడ్డమైన నానారాతలూ చిందరవందరగా కనిపిస్తున్నాయి. ఏళ్ళ తరబడి ఆలనాపాలనాలేని ఆ సత్రం దూలాలనుండి సాలీడులు వేలాడుతూ గాలికి ఉయ్యాలలూగుతున్నాయి. కుండపెంకులు, కాగితం ముక్కలు ఆ సత్రం నలుమూలలా ఆగుపిస్తున్నాయి.
అంతవరకు కథచెప్పన్న గడ్డం సాధువు, కునికిపొట్లతో ఆవలిస్తున్న చుట్టూవుండే జనాన్ని చూసి కధని మరుచటిదినానికి వాయిదావేసీ అక్కడే నడుం చేరేశాడు. నత్రం పెద్ద చావడిలో అప్పుడే నిద్రాదేవి ఒడిలో గట్టిగా గుర్రు పెడుతోన్న వెంకాలు కాల్చిపారేసిన చుట్టపీకనుండి యింకా పొగవస్తూనే వుంది. నిద్రలో కాస్పేవు కలవరించిన నాగులు తిరిగి చప్పబడిపోయాడు.
చిమ్నీలేని కిరసనాయిలు దీపం గాలికి అటూయిటూ ఊగి ఆరిపోయింది. నలువైపులా దట్టంగా ఆవరించిన అంధకారం మధ్య నిశ్శబ్దంగా వున్న సత్రవలో కొద్దిగా సంచలనం కలిగింది.
అందంగా ముస్తాబైన 'రామి" నలిగిపోయి వాడిపోతున్న కనకాంబరం దండ జెడలోంచి జారుతుంటే సత్రం చేరుకుని ఓమూల చతికిలబడింది.
ర నమాథి అలికిడి విని లేచిన మంగి ఓ పక్కకు వత్తిగిల్లి “ఏందే, ఓరూ దారకనేదా?” అంది నిద్రకళ్ళతోనే. “ఊర్కోవే పోలీసాత్తుండాడు ఏదీ, కాత్త అలా జరుగు, నీ పక్క నిద్దరోతాను” అంటూ మంగి పక్కకు చేరి ముసుగు కప్పింది రామి. “ఓ యబ్బో! భయంగల సిల్లే. ఇట్టా అయితే యేపారం ఏం సాగుద్దంటే." మంగి ముసుగులోంచి గుసగుసమన్నట్టుగా అంది “నీ క్కాదటే సెప్పేది. పోలీసొత్తుండాడు. కాస్పేపు మాటాడక తాంగో.” మంగి మరింకేమీ మాట్లాడలేదు. పక్కనుండి భారంగా వినిపిస్తోన్న ఉచ్చ్వాస నిశ్వాసాల్ని వింటూ వుండిపోయింది. సత్రం బయట బూట్ల శబ్దం గుమ్మంవరకూ వచ్చి ఆగిపోయింది. ముసుగులోని రామి గజగజా వణికిపోయింది. కన్నంలోంచి చూస్తే బయట ఒక తెల్లటి ఆకారం పక్కనున్న పోలీసుతో ఏదో చెప్పి సత్రంలోకి చూపించి వెళ్ళిపోవడం కనిపించింది. రామి ఊపిరిబిగపట్టి అలికిడి వినడానికి ప్రయత్నించింది. కాస్సేపటివరకూ ఎలాటి శబ్దమూ వినిపించలేదు. ఆ తర్వాత బూట్లళబ్దం క్రమంగా తగ్గిపోయి అంతరించిపోయింది. రామి గట్టిగా ఊపిరి విడిచి ముసుగునెట్టి లేచి కూర్చుంది. “ఈయాల ఆడి 'ఫేతుల్లో పడేదాన్నే. నాయాల సూసినట్టుండాడు" అంటూ, సత్రం గుమ్మం వరకూ వచ్చి అటూయిటూ తొంగిచూసి మళ్ళీ మంగి పక్కగా వచ్చి పడుకుంది. “అసలేం జరిగిందేంటే”” అంది విసుగా మంగి, రామి భయానికి కారణం ఏమిటో అర్ధంకాక. గై “నానోట్లో దుమ్ముపోత్తే అడుమాత్రం బాగుపడతాడంటే. ఈయాల రూపాయి డబ్బులు సేతులో కొత్తదనుకున్నాను. ఆ బాబుగారు రూపాయి యిత్తానన్నారు. ఆఖరిని ఎల్లిపోయేప్పుడు అడిగితే యింకో రూపాయి యిచ్చేవోరు. అలా గోదారాడ్డు ఇస్కూల్లోకి తీసుకెళ్ళాను. అయిదు నిమిషాలయినా కాలేదు ఆ ముసలిముండాకొడుకు- ఇస్కూలు సూత్తుంటాడు ఆతు 'ఓరక్కడ' అని గట్టిగా అరుత్తుండాడు. ఆడి కళ్ళల్లో కారం జల్లా. అడీకి అప్పుడప్పుడ్కు కాఫీకి డబ్బులు యిచ్చినా ఎదవఅల్లరి సేసిపారేసాడు. ఆడిగోలయిని రేత్రి గస్తీ తిరుగుతుండే పోలీసోడు ఇస్కూలులోకి వత్తుండాడు. ఇంకప్టుడు నా పాణం పైకెగిరిపోయిందంటేనమ్ము ఆ బాబుగారు చేతిలో డబ్బులు పెట్టకుండా
ఎంగిలి మెతుకులు త్ గోడదూకిపోయాడు. ఆడముండని నేనాక్కర్తినీ ఏంసేసేది? రేత్రి గెంజికాసినాక మిగిలిన బేడ మొల్లో దాసింది తీసి ముసలోడి 'సేతుల్లో పెడ్తే “ఓసి నువ్వటే! ఓరో అనుకున్నాను” అన్నాడు. ఆడీదంతా ఎదవనాటకం డబ్బులు గుంజుదామని ఆ ఎత్తేసాడు. “మరిప్పుడు నేనెలా బయటికి పోయేది ముసిలోడా' అని అడిగితే 'గోడదూకలేవటే. ఆ మాత్రందానికి యీపనెందుకు సేత్తుండావే? ఊ పరుగెత్తుకుపోవే. పోలీసోడు సూత్తే నా పీకట్టుకుంటాది' అన్నాడు. అప్పుడిక నేనింకేంసేసేదిఅడనించి యెనకాల గోడదూకి లగెత్తుకొచ్చాను. ఆడు సూసే వుంటాడు ఎదవ ఆ ముసలోడు యీసారి కనబడనీ, చడమడా నాలుగు తిట్టేత్తాను. ఏదైనా అంటే ఆడి నంగతి నాకు తెలీదేంటి. ఆడి కూతురు ఆ సొయిబాబుగాడితో తిరగండంనేదూ”
“ఓలె! ఇంతసేసినా ఓ కానీకూడా దొారకనేదంటే” అంది మంగి సానుభూతిగా.
“ఏందే. ఇంకా నా దగ్గరవి బేడ్డబ్బులు వాదిలేయి. ఈయాల ఏపనిసేసినా యిలా తగలడతున్నాది పొద్దున్న బజార్లోంచి గంపెత్తుకొత్తుంటే ఓ బాబుగారు అలాటోళ్ళేమోనని ఉండలేక ఏదో అన్నాను. ఆరు బజార్లో జోడెత్తి కొట్టడానికికూడా వచ్చారు. మొన్నరేత్రి సిన్న సెట్టి యీడకి వొచ్చాడని ఆరిబాబుకి ఎలా తెలిసిందో మద్దేనం కూలెత్తుకొత్తుంటే చెళ్ళున లెంపకాయ కొట్టి “ఈయాల గనక ఊరుకున్నాను. ఇంకెప్పుడన్నా యిలా సేసేవంటే కొట్లో పెట్టిత్తా' నన్నారు. అసలు, ఆరిని యిక్కడకు రమ్మన్నానా? ఆరే వొచ్చారు దానికి నేనేం తప్పు సేసేను? ఓరూ బుద్దిసెప్పేవోళ్ళు లేకపోతే సరి”
సత్రవ మూల ఏదోఅలికిడి అయ్యింది.ముసుగులోంచి ఓతల బైటకు వచ్చి “ఆడముండలు యింకా నిద్దరోలేదంటే” అంది.
“నువ్వు నిద్దరోయే మంగి, నే వత్తాను ” అంటూ ఆ ముసుగు మనిషి దగ్గరకు వెళ్ళింది రామి. మునుగు తొలగిస్తూ “ఏం బావా! పక్కన సేరబడమంటావా?” ఆంది,
“నీకు ఎప్పుడూ యిదేనేంటే, నిద్దరపోనియ్యవేందే?” అని ఓ పక్కకు జరిగాడు.
రామి ఓమారు ఒళ్ళు విరుచుకుని ముసుగులోకి దూరి మంచుగడ్డలాంటి చలికాలపు నాపరాతిమీద వెచ్చగా వుండేలా ఆపాదమస్తకం ముసుగు కప్పుకుని “ఇంకొంచెం యిటు జరుగుబావా” అంది.
అంతటా నిశ్శబ్దం.
మళ్ళీ ఉక్కుబూట్లు శబ్దం చేసుకుంటూ వచ్చి సత్రవముందు ఆగాయి.
తి నమాధి ముసుగులోని మనిషిని యింకా గట్టిగా అంటిపెట్టుకుంది రామి శీతాకాలపు చలి కొరుకుతూ వుంటే, మనసుచుట్టూ ఆవరించిన భయానికి మరింతగా వణికిపోతూవుంది. పోలీసు గుమ్మందాటుకుంటూ వచ్చి “ఎవరక్కడ?” అన్నాడు కంచుగంటలా ఆ శబ్దం శిథిలమైన ఆ సత్రవ గోడలమధ్య భయంకరంగా ప్రతిధ్వనించింది. రామి లేచి కూర్చుంది. పోలీసు అగ్గిపుల్ల గీసి చూశాడు. గడ్డిపోచలాగ గజగజలాడుతోంది రామి. “ఓసీ నువ్వటే! ఏవిటి రావీ; యిందాక నువ్వేనా యిటు పరుగెత్తుకొచ్చావు?” అన్నాడు పోలీసు వెంకటస్వామి. రామి ఆశ్చర్యపోతూ “నువ్వా మావా! ఓరో అనుకున్నాను” అంది “నీకు ఎన్నిసార్లు చెప్పానే, యిలా బైట తిరగొద్దని. ఇంకో పోలీసోడెవడైనా చూస్తే బొక్కలో యెట్టి మక్కలిరగదంతాడు తెలుసా. నేం గనక ఊరుకుంటున్నాను”. వెంకటస్వామి మీసాల్ని మెలిపెడుతూ ఆ మెలిపెడుతున్న మీసం కిందుగా చిరునవ్వును చూపిస్తూ అన్నాడు. రామి మాటాడక ఊరుకుంది - 'ఇటువంటివి చాలా చూశాంలే' అన్నట్బగా. ఆ తర్వాత ఏదో జ్ఞాపకంవచ్చి “ఇందాకోసారి యిట్టావచ్చావు కదుమావా?” అంది. “అదేనే ఓమారు నాలుగు వీధులూ తిరిగి డ్యూటీ కాగానే వెళ్ళిపోయేష్పుడు యిలా వద్దామని వచ్చాను” అన్నాడు. “అయితే నీకూడా ఆరెవరినో చూసాను. ఎవరేంటి?” వయ్యారంగా చేతుల్ని వెంకటస్వామి భుజంమీద వేసి అడిగింది. “ఎవరయితే నీకెందుకులే. ఇందాక గోడదూకి పోయాడుకదా, ఆయన” చెప్పకూడదనుకునే చెప్పేశాడు. “ఆరి దగ్గర ఎంత డబ్బు నాగావేంటి?” ఆతృతగా అడిగింది. “ఏదోలేవే, ఓ పదిరూపాయలు, పర్సులో వున్నవే అంత. రేపు డొక్టరుకి ఫీజు కట్టాడానికి సరిపోతుంది.” రామి వాటాకూడుతుందేమోనని ముందే సరిపెట్టి చెప్పాడు. రామి ఆశగా కళ్ళను యింతింత చేసుకుని చూసింది. ఆ కళ్ళల్లో తొణీకిసలాడిన ఆవేదన బైటికి కనిపించకుండా చీకట్లోనే కరిగిపోయింది. “నువ్వే నయం మావా, ఏం కష్టపడకుండా పదిరూపాయలు సంపాదించావు. నేనింత సేసినా సిల్లుకానీకూడా
ఎంగిలి మెతుకులు 87 "సేతిలోకి రాలలేదు కదా?”
“వనీలేవే, ఒకో రోజే అంత. అయినా యీ ఎదవపని నువ్వు మానేరాదుటే”
“మానేసి ఏం 'సెయ్యమంటావు? ఇప్పుడు కూలిసెయ్యడంనేదా. కూడుకే గతిలేనప్పుడు ఏంసేత్తే ఏం వొచ్చిందేం?” ఆవేశంతో అంది రామి. అ మాటలు అగ్నిపర్వతం పేలినప్పుడు ఎగిరిపడే లావాల్డాంట్వి. ఆమె గుండెల్లో ఎప్పటినుంచో గూడుకట్టుకొన్న అవేదన హృదయాన్ని చీల్చుకుని మాటలుగా బైటపడ్డాయి.
వెంకటస్వామి ఓ నిమిషం ఏమీ మాట్లాడలేదు. జేబులోంచి చుట్టతీసి వెలిగించుకుని గట్టిగా దమ్ములాగి పొగని వదుల్తూ “షోనీలేవే. నేను చెప్తే మాత్రం వింటావా. ఆ మూల కెళ్టాం పద” అన్నాడు హుషారుగా ఆమె భుజంమీద చెయ్యివేస్తూ.
“ఇప్పుడొద్దు మావా. రేపు రా సూద్దాం” అంది రామి, అలసిపోయిన శరీరానికి కాస్తంత విశ్రాంతినిచ్చే ఉద్దేశంతో.
వెంకటస్వామి గంభీరంగా ఆమెవైపు చూశాడు. నోట్లో చుట్టను బైటకి తీసి పొగను ఆమె కళ్ళల్లోకి వదుల్తూ “ఏవిటే, నేనడిగితేనే అలా అంటావు, ఇంకోరివరైనా అయితే ఎగిరిపోతుంటావ్? ఫరవాలేదులే యిటురా” అంటూ అమె చెయ్యిపట్టుకుని చీకటి మూలవైపుగా లాగాడు.
నిర్జీవంగా ఆమె అతనివెంట వెళ్ళింది.
అర్ధగంట తర్వాత వెంకటస్వామి బూట్లు టకటక లాడించుకుంటూ నసత్రవ మెట్లు దిగాడు.
శేపు కూడొండుకోడానికి గింజలులేవు మావా” అని గొణుక్కున్నట్టుగొ అంటున్న రామి మాటలు వినిపించుకోకుండా పెద్దపెద్ద అంగలేనుకుంటూ వెళ్ళిపోయాడు వెంకటస్వామి.
రిక్తహస్తాలతో కొయ్యబొామ్మలా నిలబడిపోయింది రామి. నీరసం, నిస్సత్తువ, ఆకలి ఆమెను అవరించాయి.
తన చుట్టూ ఏముందో ఆమెకు కనిపించలేదు, ఒక్క ముదనష్టపు బతుకులోని ఎంగిలిమెతుకుల ఆంతర్యంమాత్రం శూన్యంగా గోచరించింది,
ఛం
పుణ్యానికి పోతే
శరభయ్య బొటనవేలంత లావు లంకపుగాకు చుట్టను గుండ్రంగా చుట్టూ పెదాలమధ్య తిప్పుతూ వేరే ధ్యాసేమీ లేకుండా కాలుస్తూ కూర్చున్నాడు. అదే చెట్టునీడలో అయిదడుగుల దూరంలో చిన్నరాతిబండమీద చతికిలబడ్డ నడికారు కుర్రాడు శరభయ్య లంక పుగాకు చుట్టతో సమానంగా వెలిగించిన సిగరెట్టు చూస్తుండగానే _చిన్నదై వేళ్ళను చుర్రుమనిపిస్తే దాన్ని అవతలకు విసిరి, మళ్ళీ కాల్చుకోడానికి సిగరెట్టు లేక దిగాలుపడ్డట్టుగా ముఖం తేలేశాడు. బస్సు పక్కనే దాని నీడలో చతికిలబడ్డ ఆడాళ్ళ మధ్య ఒక ఒడిలో నాలుగేళ్ళ కుర్రాడు శరభయ్యనూ, ఆ వెనక రోడ్డుపక్క పాగవస్తున్న సున్నపుబట్టీ గొట్టాన్నీ విస్తుపోయి చూస్తున్నాడు.
చిన్న ప్రమూణంలో గున్నేనుగులాంటి స్టూలశరీరాన్ని స్థిరనిశ్చలతలో వుంచి చుట్ట కాల్చుకొంటున్న శరభయ్య ఓమారు గట్టిగా దమ్ముపీల్చి వదిలిపెట్టి 'ఏం బావా బన్సు యియ్యాల్చికి బయలుదేరేట్టలేదే” అన్నాడు వెనక కూర్చున్న బావమర్జి లక్షయ్యను సంబోధిస్తూ,
లక్ష్మయ్య 'ఊ' అనీ ఊరుకున్నాడే గాని అంతకుతప్పించి జవాబు యివ్వలేదు.
“ఏం చేస్తున్నావయ్యా?” అంటూ వెనక్కి తిరిగాడు శరభయ్య.
లక్ష్మయ్య ఆతని పక్కనున్న యిరవైఏళ్ళ కుర్రాడితో మాట్లాడుతున్నాడు. బానమర్ది శరభయ్య “ఏం చేస్తున్నావయ్యా' అని అంటే లక్ష్మయ్య చిన్న చిరునవ్వు నవ్వి పక్కనున్న
వుణ్యానికిపోత 89 కుర్రాడిని చూపిస్తూ “మన రాఘవయ్య లేడూ... అదే మన ఊర్జో నుందర్రామయ్యతో వియ్యం కట్టాడే రామాపురం రాఘవయ్య, అతన్ని కొడుకట! పట్పంలో బి.ఏ పరీక్ష యిచ్చి వస్తున్నాడట” అన్నాడు.
“మన రాఘవయ్య” అని అనడంలో లక్ష్మయ్య లౌక్యాన్ని అర్థం చేసుకున్న శరభయ్య, రాఘవయ్యను ఎరక్కపోయినా నిండుగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు, ఆ తర్వాతి విషయం బావమర్జికే వదిలిపెడుతూ.
బావమర్ది లక్ష్మయ్య యిలాటి విషయాల్లో మంచి ఘటికుడు.నిమిషాల మీద యిట్టే సంబంధం స్థిరపరిచే వ్యవహారవేత్త. ఒకవిధంగా పెళ్ళిళ్ళ పేరయ్య అని అనిపించుకున్నాడు. ఎలాలేదన్నా పదీపది హేను పెళ్ళిళ్ళు తనచేతిమీదుగా చేయించాడు. అన్నీ యిప్పుడు హాయిగా సంసారాలు సాగుతున్నాయి. ఒక్క శరభయ్య పెద్దకూతురు సీతాలక్ష్మిది తప్ప దానిరాత అలావుండి ముండమోసి బతుకు బండలైందికాని లేకపోతే దానికేం, రాజాలాంటి బతుకు.
“బస్సు బాగుపడింది రండ"”౦టూ కండక్టరు కేకవేసాడు. అంళవరకు ఆ చెట్టుకింద జట్టుజట్టుగా కూర్చుని లోకాభిరామాయణాల్నీ, వ్యాపారలాభాల్నీ తిరగేస్తున్న మగాళ్ళూ, పేర్ల దగ్గరనుండి మెళ్ళో కాసుల పేర్ణవరకు పరామర్శించుకొంటున్న ఆడాళ్ళూ పిల్లాపీచుల్సీ వెంటబెట్టుకుని బస్సెక్కి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. శరభయ్య తను కూర్చోవడానికి కాస్తా అనువుగా వుండేలా ముందే వెళ్ళి యింకా బావమర్గి రాడేమిటీ చెప్మాఅంటూ ఎదురుచూస్తున్నాడు. అతని చేతిలో చుట్ట ఎంతకీ కాలనంటోంది. ఇక కాల్పడానికి ఓపికలేకో, లేక ఆ వెనక ఆడాళ్ళకు పాగబాధ కలిగించడం యిష్టంలేకో చేతిలో చుట్టను బయటికి గిరాటేసి కాండ్రించి ఓమారు ఉమ్మేసి, స్థలం దొరికింది కదాని సీటుకు జారపడి టాపును చూస్తూ కూర్చున్నాడు.
బస్సు బయలుదేరేముందు హారను వేయగా లక్ష్మయ్యా, ఆ కుగ్రాడూ ఆదరాబాదరాగా వచ్చి బస్సెక్కారు. ఆ కుర్రాడు డ్రైవరు పక్కసీట్లో కూర్చున్నాడు. లక్ష్మయ్య వెళ్ళి బావమర్షి పక్కనే చతికిలబడ్డాడు.
లక్ష్మయ్యలో ఉత్సాహం కనిపించలేదు. కూర్చున్నవాడు కూర్చున్నట్టగా మౌనంగా వుండిపోయాడు.
శరభయ్యకు సంగతేమిటో అర్ధంకాలేదు. ప్రశ్నార్థకంగా బావమర్దివైపు చూశాడు.
తిం నమాధి లక్ష్మయ్య కొద్దిసేపు మౌనంగా కూర్చుని పెదాలు చప్పరించి “అబ్బే లాభంలేదు బావా” అన్నాడు. “అంటే?” అన్నట్టుగా లక్ష్యయ్యను చూసి “ఏం?” అన్నాడు శరభయ్య. “ఏదో ... బాగానే డబ్బుందనుకున్నాను కాని అంతా రెండేళ్ళకిందటే హరించిపోయిందట! వెనక సుందర్రామయ్యతో వియ్యం కట్టేప్పుడు కాస్తా కొద్దోగొప్పో చేతిలో వున్నవాడే. పదెకరాల మాగాణీ, మూడెకరాల కొండ్ర, చేతిలో పదీపదిహేనువేల నగదు వుండేవి. ఈ మధ్య మరో యిద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశాడట. కొత్తగా పొగాకువేసి ఓ సంవత్సరం దెబ్బతిన్నాడట. ఇక పట్నంలో అబ్బాయి చదువుకు ఏటా రెండువేలన్నా అవుతుంది కదా. మొత్తం చదువు పూర్తయ్యేసరికి ఎనిమిదివేలదాకా ఖర్చవుతుంది. అటు పెళ్ళిళ్ళకూ, యిటు చదువులకూ చేతిలో నగదుపోగా వున్న అ పాలంకాస్తా అమ్మేశాడట. ఏదో ఉన్నవాడూ, ఊడబొడిచినవాడూ అనుకున్నాను. ఇంతాచేస్తే యిదీ! ఇలాంటివాడికి పిల్లనిస్తే అడుక్కుతినేందుకు చిప్పచేతికిచ్చినచ్చే. పిల్లాడు బుద్ధిమంతుడే. అయితే యేం, ఈరోజుల్లో చేతిలో తడిలేకపోతే బతికేదెట్టయ్యా?” అన్నాడు లక్ష్మయ్య, సాధ్యమైనంత నెమ్మదిగా, ఎదుటివాళ్ళకు వినిపించనంతగా నోట్లో గొణుక్కుని, ఆరిపోయిన చుట్టను వెలిగించుకునేందుకు ఒకటి రెండు నిమిషాలు తంటాలుపడి మళ్ళీ ప్రారంభించాడు “చూడు శరభయ్య బావా! మన బుల్లికి మొగుడే దొరక్క పోతాడంటావ్? రేపు వచ్చే ఆదివారం మొన్నటి సంబంధం సంగతేమిటో తేల్చుకొచ్చేస్తాను. అంతా సవ్యంగానే వ్యవహారం వృందిగాని ఎటొచ్చీ ఆ వచ్చిన చిక్కంతా కట్నం దగ్గరే. ఎంత బి.ఏ చదివితే మాత్రం యిరవైవేలా కట్నం! ఇల్గుగుల్లచేసి యిమ్మంటాడో, ఎక్కడ్నించన్నా ఎత్తుకొచ్చి యిమ్మంటాడో అర్థంకాకుండా వృంది. ఈసారి ఎళ్ళినప్పుడు అటోయిటో తేల్చుకొచ్చేస్తాను. ఇదికాకపోతే మరొకటి. ఈ చేతులమీదుగా పదిహేను పెళ్ళిళ్ళు జరిపించిన లక్ష్మయ్య మేనకోడలికి పెళ్ళే చేయలేడా?” లక్ష్మయ్య ఓమారు మీసాల్ని దువ్వి నాలుగు దమ్ములు గబగబా పీల్చి బావమర్షి ముఖంలోకి చూశాడు, అంతసేపూ తను వాగినదానికి బావమర్దినుండి జవాబు ఏమొస్తుందో అని, శరభయ్య అయిదునిమిషాలు తాపీగా కూర్చుని “చూడుబావా” అన్నాడు. “ఆ, చూస్తూనే వున్నాను. ఏమిటో చెప్పు మన్నట్టుగా లక్ష్యయ్య మౌనంగా చూశాడు. “ఇరవైవేలుపోసి ఆ కుర్రాడిని కొనుక్కోకపోతే ఏం పోయె? ఆ డబ్బుపెట్టి
వుణ్యానికిపోతే త్రి లక్షణంగా ఏ లేనివాడికో కట్టబెడితే ఏమాయె! ఇంతకూ మనకు కావలసినదేమిటి? ఏదో దాని బతుకు అది బతుక్కొంటూ మనల్ని ఆశించకుండా వుండాలనే కదా. లక్షాధికారికిచ్చినా భిక్షాధికారికిచ్చినా అదే ఆశతో పెళ్ళి చేస్తాం. కాకపోతే అంతస్ఫులకు తగ్గట్టు ఖర్చులవుతాయి. లక్షరూపాయల అస్థివున్నవాడి చేతిలో సెడ్తేమాత్రం పిల్ల సుఖిస్తుందని, వాడు దాన్ని పువ్వుల్లో పెట్టి పూజిస్తాడని మనం కలగన్నామా? అలా అని మనం రాసిపుచ్చుకోలేం గదా. దాని అదృష్టం బావుండి మొగుడు మంచివాడయితే, అంత డబ్బున్నండుకు నాలుగు కాసులపేర్లు మెళ్ళో తగిలించుకుంటుంది. ఇందుకేనా మనం అన్నివేలూ పోసి ఆడబ్బున్నవాడికిచ్చుకోవడం? చిలకల్లా నవ్వుతూ వాళ్ళు కనిపించాలేగాని మెళ్ళో ఎంత బరువుంటేమాత్రం ఏముంది? ఏదో, మనం తెలీక డబ్బు పట్టుకుని వేలాడతాంగాని. ఒక విషయం చెప్తా ఆలోచించు. డబ్బుందని ఆశకొద్దీ చేసిన కాపురాలుచూడు. మన రాములు మనవరాలది, రాఘవులు కూతుర్ది, అలయం వీధి మిరాయికొట్టు సూరి సెట్టి చిన్నకూళుర్జి- అన్నీ ఏమయ్యాయి? అందుకే లేనివాడినే చదువుకున్న ఓ మంచివాడిని చూసి చేద్దామని వుంది. నోట్లో ఆ మాత్రం అక్షరంముక్క పెట్టకుని సెళ్ళాన్నే పోషించుకోలేకపోతా డంటావ్. అటుపుణ్యం, యిటుపురుషార్థం రెండూ కలిసాస్తాయి. లేనివాడిని ఉద్ధరించాడన్న "పేరూ దక్కుతుంది, మన బాధ్యతా నెరవేరుతుంది. ఏమంటావ్?” అంటూ లక్ష్మయ్య ముఖంలోకి చూశాడు శరభయ్య,
లక్ష్మయ్య సందేహంగా నసిగాడు “కాని మన అంతస్థుకు తగ్గ సంబంధం కాకపోతే అంతా ఏమనుకుంటారు?”
“ఏమనుకుంటారయ్యా, మనపిల్ల భవిష్యత్తు మనం నిర్ణయించాలిగాని వీళ్ళు అనుకోవడం అనుకోకపోవడంతో పనేమిటి? రేపు పొద్దున్న దాని బతుకు ఏమైనా అయితే వీళ్ళు వెళ్ళి ఉద్ధరిస్తారాయేం?”
లక్ష్మయ్య తలాడించాడు.
“బావచెప్పింది బాగానేవుంది. పోనీ లేనివాడినే తెచ్చి చేస్తే కొస్త విశ్వాసమైనా వుంటుంది. మనం చెప్పినట్బకూడా నడుస్తాడు. కష్టపడి సంపాదించుకొంటాడు గనక డబ్బు విలువ తెలుస్తుంది'- అనుకుంటూ ఆలోచించి, మళ్ళీ ఆరిపోయిన చుట్టను అవతలకు విసిరి, ముందుసీటులో కూర్చున్న కుర్రాడితో ఆరగంటసేపు కలిసికూర్చుని మాట్టాడిన్నాయిప్టుడు మళ్ళీ పరిశీలనగా అయిదునిమిషాలు అతడినే చూసి, బావమర్దికి దగ్గరగా జరిగి “ఇందాకటి అబ్బాయి ఎలా వున్నాడంటావ్బావా?” అని అడిగాడు.
9 నమాధి శరభయ్య మెలిపెట్టిన మీసాల సందుల్లోంచి చిన్నగా నవ్వి అన్నాడు. “అబ్బాయికేం,రాజులా వున్నాడు, కాకపోతే పెద్ద డాంబికంగా లేడంతే” “అలాగే వుండాలి లెద్దూ. డాంబికంగా వున్నవాడిలో అసలు సరుకే కనిపించదు. వట్టి పైనపటారం, లోనలొటారం వాళ్ళంతా. ఏమయినా సాదాగా పోయేవాడే మంచాడనుకో. నువ్వు సరిగ్గా చూడు, అబ్బాయి బి.ఏ చదివినవాడిలా కనిపిస్తున్నాడా! ఇందాక నాతో మాట్లాడినప్పుడు ఎంత వందనంగా మాట్లాడాడనుకున్నావ్! మన వాళ్ళల్లో ఎవరూ అలా మాట్లాడ్డం వినలేదనుకో. నీకూ నచ్చింది గనుక రెండురోజుల్లో అన్ని విషయాలూ సంప్రదించుకుని సంబంధం స్థిరపరచుకోవచ్చు. నచ్చి మనం యిస్తామనాలే గొని రెక్కలు కట్టుకొని వాళ్ళంతా యిక్కడవాలరూ. అందులోనూ శరభయ్యతో సంబంధం కలుపుకొందామని బోలెడుమంది ఎదురుచూస్తుంటే కావాలని వీరికిస్తామంటే కాదంటారాయేం? నువ్వు ఊ” అంటే రేపొచ్చే ఆదివారమే అటు పట్నంపోయే బదులు యిటు పల్లెకు వెళ్ళి ఏదో ఒకటి రైటనిపించేస్తాను. పోనీ పక్కవూరేగా! యిద్దరం కలిసే వెళ్ళాం. ఇటు వెళ్ళేబస్సుకు బయలుదేరితే అటు వచ్చేబస్సుకు రావొచ్చు.ఏమంటావ్?” శరభయ్య “సరే” అన్నాడు. మళ్ళీ బస్సు దిగేంతవరకూ యిరువురూ మాట్లాడుకోలేదు. బస్సు ఆగాక అవతలి కుర్రాడు దిగివెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న వాడిని సిలిచి “ఏం పేరన్నావు బాబూ” ఆంటూ అడిగాడు లక్ష్మయ్య. “జనార్థనరావండీ” అనిచెప్పి వెళ్ళిపోయాడు అతను. ఇంటిక్ వెళ్ళాక సంబంధం సంగతి భార్య చెవిలో వేశాడు శరభయ్య. “అదేమిటండీ?” అంది ఆమె విస్తుపోయి. ఆ వెంటనే మళ్ళీ “ఏడిచినట్టేవుంది మీ తెలివి. చూడగా చూడగా గుర్రం గాడిదయ్యిందట! ఉన్నకొద్దీ మీ తెలివి యిలా మండిపోతోందేం. నిక్షేపంలాంటి పిల్లను తీసుకెళ్ళి ఆ అడుక్కుతినేవాడికా యిచ్చేదీ? నలుగురూ వింటే నవ్వులాట తప్ప మరేమైనా వుందా! బంగారంలాంటి ఏ లక్షాధికారినో పెళ్ళాడవలసిన దానికిదేం ఖర్మమండీ. అసలు మీకు యీ బుద్ధెలాపుట్టిందంట? పోనీ డబ్బు లేదుగనకనా? యాఖైవేల నగదు అలా మూలపడి మూలుగుతోంది కదొ. ఇదంతా ఏం చేసుకుందామని మిమ్మల్నీ నన్నూ కప్పెట్టకోడానికి తప్ప” అంది చిరుబురలాడుతూ. “ఏడిశావ్ ఎర్రిదానా, నీ మాత్రం తెలివి నాకు లేదంటావా? ఏదో, పిల్లను
వుణ్యానికిపోతే 93 నువ్వే కన్నట్టూ, దాని భారమంతా నీకే చుట్టుకున్నట్టూ మాట్లాడుతావేం. అసలు సంగతి ఆలకించుమరి ఇరవైవేలు కట్నంపోసి, మరో అయిదువేలు ఖర్చుచేసి దానికి 'పెళ్ళిెచేయకపోతే ఏంపోయె? లేని కుటుంబంలోనుండి మంచివాడిని చూసి చేస్తే మాత్రం లోటేమిటొచ్చిందంట? అయిదారువేలతో అంతా తేలిపోతుంది. ఇంకా కావాలంటే పట్నంలో చిన్న పెంకుటిల్లొకటి కొనిచ్చేస్తే మళ్ళీ మనల్ని ఆశించకుండా ఆ వచ్చినజీతం రాళ్ళతో ఆలుమగలు గడుపుకోలేరూ? పోనీ మీ అన్ననడుగు ఏం చెప్తాడో. ఇందాక బస్సులో వస్తూ యిద్దరం కలసి ఆలోచించిందే యిది.”
“ఏమో నాకేమీ అర్థంకావడంలేదు” అంటూ గొణిగింది ఆమె. శరభయ్య చిరునవ్వు నవ్వాడు “చూస్తావుగా” అంటూ.
ఆదివారం రాగానే బావామరుదులు యిద్దరూ చద్దన్నంతిని ఫస్టుబస్సుకు ప్రయాణం కట్టారు. బస్సు ఎక్కడమేమిటి రామాపురం చేరడమేమిటి అన్నీ అర్ధగంటలో జరిగిపోయాయి. “ఇవ్వాళ ఏఊరు పండిందోగాని బస్సు మాబాగా వెళ్ళిందిబావా” అన్నాడు లక్ష్మయ్య.
“ఏవూరో పండాలేమిటి, ఛూడు-మనం పెళ్ళిచూపులకు బయలుదేరేమంటే దేనికవే అన్నీ సమకూడిపోతున్నాయి. ప్రారంభంలోనే శుభసూచకం. అందులోనూ ఎరకమ్మ ఎదురురాక సామాన్యమా. వ్యవహారం యిట్టే ఫైసలా అయిపోతుంది.”
ఇద్దరూ బస్సుదిగారు. కండువాల్ని సరిచేసుకుని ఊరిలోకి నడిచారు. ఇక్కడక్కడ వాకబుచేసి అయిదు నిమిషాలకు రాఘవయ్య యిల్లు కనుక్కున్నారు. ఇద్దరూ అక్కడకు చేరేనరికి కాబోయే పెళ్ళికొడుకు వీధిలోనే వున్నాడు. వీళ్ళను చూసి ఆశ్చర్యపోయి చాపవేసి కూర్చోబెట్టాడు.
“మీ నాన్న యింట్లో వున్నాడా బాబూ?” అన్నాడు లక్ష్మయ్య వ్యవహారానికి నాంది పలికి కూర్చుంటూ.
“ఇప్పుడే పొలానికి వెళ్ళారు. మీరు కూర్చోండి, పిలిపిస్తాను” అంటూ వీధిలో ఆడుకుంటున్న ఓ కుర్రాడ్ని పంపించాడు.
వాడు పరుగెత్తికెళ్ళి పొలంలో పనిచేస్తున్న రాఘవయ్యను వెంటబెట్ట్బకొచ్చాడు.
రాఘవయ్య వాకిట్లో కాలు పెడ్తూనే అరుగుమీద కూర్చున్న ఆ యిద్దర్నీచూసి ఆశ్చర్యపోయి “ఏమిటేమిటీ లక్ష్మయ్యగారా!” అంటూ వచ్చి వాళ్ళముందు ఛతికిల పడ్డాడు. ఆ తర్వాత తాపీగా “ఏదో దారితప్పి వచ్చినట్టున్నారే” అన్నాడు.
తశ నమాధి
“అబ్బే అలాటి పొరపాట్లు జరగవండోయ్. మీతో పనుండబట్టే వచ్చాం” అన్నాడు లక్ష్మయ్య. అని, కొంచెం సేపు మాట్లాడకుండా ఊరుకున్నాడు ఈ మధ్య సమయంలో అవతలివాడు ఆ పనేమిటో తనని అడగాలని.
అలానే అడిగాడు రాఘవయ్య -- “నాతోనా!” అని ఆశ్చర్యపోతూ
“ఆ. మీతోనే, వీరిని మీరు ఎరుగుదురనుకొంటాను_మా బావమర్జి శరభయ్య గారు” అన్నాడు లక్ష్మయ్య శరభయ్య ను చూపిస్తూ , శరభయ్య చిన్న చిరునవ్వు నవ్వాడు ఆయన్ని చూస్తూ,
రాఘవయ్య తలూపాడు. “వీరిని ఎరక్కపోవటమేమిటి. ప్రత్యక్షంగా ఎప్పుడూ కలుసుకుని మాట్లాడకపోయినా చాలాసార్లు యిద్దరం ఒకేబస్సులో బస్తీకి వెళ్తుండేవాళ్ళం. స్వయంగా మీ అంతటివారు పనిగట్టుకుని వచ్చారంటే ఏదో పెద్ద విశేషమే వుండాలి”
లక్ష్మయ్య రంగంలోకి దిగేముందు చిన్నగా చిరునవ్వు నవ్వి “ఏంలేదూ, మా మేనకోడలు పెళ్ళీడుకొచ్చి నాలుగేళ్ళయ్యింది. ఇంతవరకూ పెద్దగా పెళ్ళి ప్రయత్నాలేవీ చేయలేదు. అయినా అప్పుడప్పుడు ఏవో సంబంధాలు వస్తూనేవున్నాయి. ఇప్పుడప్పుడే పెళ్ళి ఎందుకులెద్దూ అంటూ వచ్చినవన్నీ తిప్పిపంపించేశాం. అదీగాక మా బావగారి అభిప్రాయం వేరు. మొదటినుంచీ వీరిది చాలా మెత్తని హృదయం. ఎవరన్నా బాధపడుతుంటే చూస్తూ వూరుకోలేరు. జాలిగుండె. అది అలా వుంచండి. అమ్మాయి పెళ్ళీ విషయంలో వారొక నిర్ణయానికి వచ్చారు. డబ్బులేకపోయినా కాస్తా చదువుకున్న వాడిని చూసి, మంచివాడైతే ఏదో తోచినంత కట్నంయిచ్చి పెళ్ళి చేద్దామని వారి ఆశయం, అందుకే యీ నాలుగేళ్ళూ తగినవాడు దొరికినప్పుడే చెయ్యొచ్చులే అని ఊరుకున్నారు. కాని...”
కాస్సేపు ఆగి రాఘవయ్య ముఖంలోకి చూశాడు లక్షయ్య. చాలా ఆతృతగా చూపుల్ని తనమీదే వుంచి చూస్తున్నాడు రాఘవయ్య. ఇక అట్టేసేపు అతన్ని బాధించడం యిష్టంలేక మళ్ళీ ప్రారంభించాడు. "
“... కాని , ఏమైనా ఏదో ఒక మంచి సంబంధం వెతికి యీ ఏడే పెళ్ళి చేసేద్దామనుకుంటుండగా మొన్న బస్తీకి వెళ్ళి బస్సులో వస్తోంటే మీవాడుకనిపించాడు. మీవాడని నాకేం తెలుసూ, వచ్చి పక్కన కూర్చుంటే వివరాలవీ అడిగాను. అప్పుడు తెలిసింది ఫలానా అని. అబ్బాయి బస్సు దిగి వెళ్ళిపోయాక బావగారు నాతో అన్నారు “కుర్రాడు మన బుల్లికి తగ్గ జోడు కదుబావా' అని. మీ సంప్రదాయం, గౌరవమర్యాదలు
వుణ్యానికిపోతే త్ ఎరిగిన వాడిని గనుక బావగారితో అన్ని సంగతులు చెప్పి పెద్ద ఆర్భాటం లేకుండానే యిద్దరం కలిసి సంబంధం తేల్చుకుపోదామని వచ్చాం” అన్నాడు లక్ష్మయ్య.
రావంవయ్య ఉబ్బితబ్బిబ్బయిపోయాడు ఓమారు యింట్లోకి వెళ్ళి ఆడవాళ్ళందరికీ యీ సంగతిచెప్పి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు-పిచ్చాపాటీ మాట్టాడ్డ౦ంతో పాటు కట్నకానుకల విషయాలు వివరంగా తెలుసుకుందామని.
ఇలా యిక్కడ రావువయ్య మాట్టాడుతుండగానే అతని బావమర్గికి కబురెప్పుడెళ్ళిందో పరుగెత్తుకొచ్చాడు వీరయ్య.
వీరయ్యను చూడగానే రాఘవయ్య గుండెల్లో రాయిపడింది. “నమయానికి వీడెందుకొచ్చాడూ. తన కూతుర్ని కాదని డబ్బాళశతో పై సంబంధానికి వప్పుకుంటున్నానని యిక్కడ ఏ మాత్రం అవాకులుచెవాకులు మాట్టాడినా వ్యవహారం యిట్టే మంట గలసిపోతుంది. ఈ వచ్చే అదృష్టం కూడా అంటకుండా పోతుంది" అనుకుంటూ అలోచించి ఏమయినా బావమర్ణిని యిందులో తలదూర్చిస్తేగాని లాభంలేదనుకుని వీరయ్య ఆ యిద్దరికీ తన బావమర్దిని పరిచయం చేసి 'ఏదో,వ్యవహారం నువ్వే వొడ్డెక్కించెయ్యాలి బావా” అన్నాడు- అంతసేపూ జరిగిన సంభాషణను బావమర్దికి టూకీగా చెప్పి
వీరయ్య కూడా వ్యవహారాల్లో మునిగితేలుతున్నవాడు. కోర్టుల దగ్గరనుండి కట్నాలవరకు రకరకాల వ్యవహారాల్ని నడిపి సిద్ధహస్తుడనిపించుకున్నవాడు.
బావమర్ది చేస్తున్న పనికి లోలోపల అగ్గిబుగ్గయిపోతున్నా పైకిమాత్రం నవ్వుతూనే “ఓహో' 'ఆహా' అంటూ సంబంధం “సరే ఖాయం” అనిపించాడు.
“మరి మీలా మేం గొప్పలకు పోలేమండోయ్. అంతన్ముకు తగ్గ మర్యాద జరిపించగలమో లేమోనని భయవడుతున్నాం. పెళ్ళికి రెండుమూడువేలు ఖర్చుంటాయనుకుంటాను. ఇల్లొకటి- దూలాలు పుచ్చిపోయి పడిపోయేట్టు వున్నాయి. పెళ్ళేపెళ్ళి! అదికూడా బాగుచేయించాలి. అదీగాక యింటిమీద అప్పాకటి. అంళటికీ _' నసిగాడు వీరయ్య.
“పోనీ మీరు అంతగా అడుగుతున్నారు గనక కట్నం అయిదువేలూకాక 'పెళ్ళిఖర్చులుకూడా భరిస్తాంలెండి. మునుపటిరోజులు కాదుకదా అయిదువేలూ చేతితో పట్టకుని అయిదురోజులు పెళ్ళిచేయడానికి”
వీరయ్య తెల్లముఖం వేశాడు. 'ఇంటిగుట్ట బట్టబయలు చేస్తే వచ్చినవాళ్ళు
8 నమాథి వెనక్కు తిరుగుతారనుకు౦టే యిదేమిటి?!”
శరభయ్య, లక్ష్మయ్య లేచి నుంచున్నారు. “వచ్చే సోమవారం మంచిదను కుంటాను, తాంబూలాలు పుచ్చుకోవచ్చు” అన్నాడు శరభయ్య.
సరే అని బావమర్జ్చులిద్దరూ తలూపి, కూడా బస్సువరకూవెళ్ళి వాళ్ళను బస్సె క్కించి వెనక్కు బయలుదేరారు. వస్తున్నప్పుడు దారిలో “నీ రుణం ఎలా తీర్చుకోగలను బావా. నువ్వు పూనుకోకపోతే యిది సాంతం అయ్యేదికాదు. మన అమ్మాయిని కాదని పై సంబంధం చేస్తున్నందుకు ఏమనుకుంటున్నావో ఏమో” అన్నాడు రాఘవయ్య వీరయ్య చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ.
“అబ్బే, నేనేమనుకుంటాను, సిరి కలిసివస్తోంటే కాలదన్నడమెందుకు” అన్నాడు వీరయ్య బలవంతంగా నవ్వి.
ఇద్దరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.
నాలుగోనాడు పనిగట్టుకుని బావమర్ది యింటికివెళ్ళాడు వీరయ్య. వీరయ్య నట్టింట్లో కాలుపెట్టేసరికి చెల్లెలూ, బావమర్దీ 'పెళ్ళిగురించే మాట్లాడుకుంటూ
“రా అన్నాయ్యా” అంది చెల్లెలు. వీరయ్య వెళ్ళికూర్చున్నాక “ఏమిటో. యీ సంబంధం నాకు యిష్టంలేదు. ఎంచక్కా నిక్షేపంలాంటి మేనరికం. అది వదులుకుని పైవాటికి పోవడమేమిటి? మీ బావకు డబ్బాళశ తప్పితే మరేంలేదు. మంచో చెడో ఏమీ తెలుసుకోకుండానే 'ఊ' అనేస్తారు” అంది.
వీరయ్య కొంచెంసేపు ఆలోచిస్తున్నవాడిలా మౌనంగా కూర్చుని తలగోక్కుంటూ “కాని - బావా! అసలు సంగతి ఆలోచించావ్?” అన్నాడు. ఎదుటిముఖంలో ప్రశ్నార్థకాన్ని చూసి మళ్ళీ అతనే ప్రారంభించాడు- “పిల్లను మనం అడక్కుండానే కావాలని వచ్చి కోరి యిన్తున్నారంటే ఏమయివృంటుందంటావ్? పెళ్ళిఖర్చు కాణీకూడా మనం పెట్టకోకుండా అంతా వాళ్ళే భరిస్తామనడంలో ఉద్దేశం ఏమిటో మరి! దానికితోడు అయిదువేలు కట్నం. ఏదీ మనం అడక్కుండానే అన్నీ వాళ్ళే చెప్పేస్తున్నారు. ఆఖరుకు యింటి మరమ్మత్తుకుకూడా ఏదో యిచ్చేట్టేవున్నారు. ఇదంతా దేనికంటావ్? ఈ సంగతి నువ్వసలు అలోచించివా? పిల్ల పెళ్ళీడు కొచ్చినా, అస్థిపాస్థులు బాగావుండికూడా, నాలుగేళ్ళు పెళ్ళికాకుండా వుండిపోయిందంటే... నిజం ఎలావున్నా అనుమానం మాత్రం పీడిస్తూవుంటుంది కదా. అదీకాక మరో విషయం. పెద్దపిల్లకు పెళ్ళి చేసిన అర్నెల్లకే
వుణ్యానికిపోతే 97 ముండమోసి యింట్లో కూర్చుందట. అసలు అంత డబ్బున్నందుకు ఏ లక్షాధికారితోనో వియ్యం కలపడం పోయి వెతుక్కుంటూ మన కాళ్ళదగ్గరికి రావడం ఏమిటి!? మనిషి ఎంత మంచివాడయితే మాత్రం ఉద్ధరింపన్న పేరుతో కన్నకూతుర్ని కాణీ ఆస్థిలేనివాడి చేతుల్లో పెడ్డాడంటావ్? ఏమో బావా! నాకేమీ పాలుపోకుండా వుంది. ఏం కంగారు "పడ్డా ఏమొచ్చి పడుతుందోనన్న భయం” వీరయ్య చెప్పడం ఆపి యిద్దరి ముఖాల్లోకీ చూశాడు.
ఇద్దరిముఖాల్లోనూ కత్తినాటు పెట్టినా నెత్తురుచుక్క కనిపించేట్టు లేదు.
“అవునన్నయ్యా! ఆమాటా నిజమే. నాకూ అదే సందేహం వచ్చింది. డబ్బు ఎరచూపి కళ్ళుముయ్యాలనుకున్నారు. ఇంకానయం, ముందే తెలుసుకున్నాం” అంది రాఘవయ్య భార్య రవణమ్మ
రాఘవయ్య కూడా ఓమారు బుగ్రగోక్కున్నాడు. “అవును బావా యిదేదో గోత్మాల్గానే వుంది”
ఆ మరుసటిరోజే అక్కడ శరభయ్య, లక్ష్యయ్యలు తాపీగా జానెడంత పొడుగు, బొటనవేలంత లావు లంకషాగాకు చుట్టల్ని కాల్చుకుంటూ పెళ్ళిచర్చ చేస్తుండగా ఊరూ 'పేరూలేని వాడెవడోవచ్చి “రాఘవయ్య మీ సంబంధాన్ని చేసుకోనంటున్నాడయ్యా” అంటూ చెప్పిపోయాడు.
ఆ తర్వాత పదీపదిహేను రోజులకు కాబోలు బావమర్జులిద్దరూ కూర్చుని వుండగా గాలికబురాకటి ఎవరో తీసుకొచ్చారు 'వీరయ్య కూతుర్ని రాఘవయ్య కొడుక్కి యిచ్చాడటయ్యా' అని.
టి
జీవిత సత్యం
“ఇలారా అమ్మా సరోజా” అన్నాడు ధర్మయ్య. ఆ గదిలో అవతలిపక్కనకూర్చుని చీకటి నీడల్ని చూస్తున్న సరోజ, తండ్రి తనను ఎందుకు పిలుస్తున్నాడో అర్థంకాకపోయినా వట్టీనే పిలవడం లేదని, ఏదో ముఖ్యమైన విషయమే మాట్లాడ్డంకోసమేనని అనుకుంటూ వచ్చి నుంచుంది 'ఏం నాన్నా' అంటూ.
“మరేం లేదమ్మా నీ విషయమే కొంచెం మాట్ట్లాడుదామనుకుంటున్నాను, రా కూర్చో” అన్నాడు ధర్మయ్య తను చెప్పదలచిన విషయం ఎలా చెప్పాలో అలోచించుకొంటూ.
తన విషయమేమై ఉంటుందా అన్న ఆలోచనతో తండ్రి ముఖంలోకి సూటిగా చూసింది సరోజ.
“మరేంలేదు. మంచిరోజు చూసుకుని నిన్ను తీసుకెళ్ళమని రాద్దామనుకొంటు న్నాను” అన్నాడు ధర్మయ్య. అని, ఆమె ఏమంటుందోనని ఆమె ముఖంలోకి చూశాడు.
సరోజ ఏమీ అనలేదు, చాలాసేపటివరకూ పక్కకి ముఖంతిప్పి మౌనంగా కూర్చొని లేచిపోతూ “అప్పుడే తొందరేమొచ్చింది నాన్నా” అంది.
“అది కాదమ్మా, నామాట విను. ఇంతకాలం నువ్వు చిన్న పిల్లవుగనక ఎవరూ
జీవిత నత్యం 99 ఏమీ అనలేదు. ఇప్పుడు నీకు పద్దెనిదేళ్ళు వచ్చాయి కదా. పెళ్ళయిన పిల్లవి. ఇంకా పుట్టింట్లోనే వుంచేస్తే అంతా ఏమనుకుంటారు? కిందటేడే పంపించేద్దామనుకుని చేతిలో డబ్బులేక ఆగిపోయాను. ఈ ఏడైనా పంపించకపోతే బావుండదు రేపువచ్చేనెలలోనే మంచిరోజు చూసి అదీ అయిందనిపించేస్తాను మళ్ళీ నీ గురించి ఆలోచించక్కర్లేదు” అన్నాడు తండ్రి. |
“ఏమో నాన్నా. నాకు అక్కడకు వెళ్ళడం యిష్టంలేదు నువ్వేమీ ఆ ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు” అంటూ తండ్రి జవాబుకు ఎదురుచూడకుండా అవతలి గదిలోకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోతున్న కూతురువంకే చూస్తూవుండిపోయాడు ధర్మయ్య. కూతురు అలా అంటుందని అతనికి తెలుసు అందుకే యీ విషయం భార్య బదులు తనే చెప్పి ససేమిరా అంటే ఎలాగోలాగ ఒప్పిద్దాం అనుకున్నాడు కాని సరోజ అదేమీ వినకుండానే వెళ్ళిపోయింది.
"ధర్మయ్య గట్టిగా ఓ నిట్టూర్చు విడిచాడు. '“అల్డుడి గురించి అంతా అనుకుంటుండగా అది మాత్రం ఆలకించకుండా వుంటుందాయేం! చిన్నపిల్ల 1! అవన్నీ ఆలకించి ఎంతగా భయపడిపోతోందో ఏమో. అందుకే లోలోపలే కుమిలిపోతున్న దానిలా ఎప్పుడు చూసినా అదోలా దిగాలుపడి వుంటుంది. ఇంతకూ దీన్ని అని ఏం లాభం, దాన్ని అనాలిగాని”
ఆలోచిస్తూ ఆ పక్క గదిలోనుండి అంతా ఆలకిస్తూ అప్పుడే లోనికొస్తున్న వరహాలమ్మ వంక చూశాడు ధర్మయ్య. ఆచూపులోని భావం “విన్నావా? అన్నది గ్రహాంచి “ఊ” అన్నట్టుగా గట్టిగా మూలుగుతీసింది వరహాలమ్మ ఆ మూలుగు ముళ్ళుగుచ్చు కున్నట్టు అనిపించింది ధర్మయ్యకు. కూతురి విషయంలో భార్య కల్పించుకోవడం ధర్మయ్యకు సుతారామూ యిష్టంలేదు. అది కల్పించుకోబట్టే యింతవరకు వచ్చిందని అతని అభిప్రాయం.
వరహాలమ్మ నెత్తిపట్టుకుని కూర్చుంటూ “ఏంజేస్తాం. ఖర్మ” అంది
“అలా నెత్తిబాదుకోకపోతే ఆనాడేమైందీ ఆలోచన” చురచురా చూశాడు ధర్మయ్య. ఇలాటివన్నీ అలవాటయిన మనిషి గనుక మాట్టాడకుండా వూరుకుంది వరహాలమ్మ,
100 నమాధి “నేనప్పుడు చెప్తే విన్నావూ. తమ్ముడని బావుకొని తిరిగావు లక్షణంగా చదువుకొంటున్నాడుు రేవు రెండ్రోజులుపోతే ఉద్యోగంచేన్ నాలుగురాళ్ళు సంపాదించుకుంటాడు, మేనరికం చేద్దాం అంటే వప్పుకున్నావూ? కాదు కూడదని, శమ్ముడు ఊడబాడుస్తాడని అయిదురోజులు అన్నంతినడం మాన్సికోరి యీ సంబంధం చేసినందుకు దాని గొంతు నిలువునా కొయ్యడంతప్ప నువ్వు చేసిన ఘనకార్యమేమిటి? కూతురన్న అభిమానం నీకేగాని నాకుమాత్రం వుండదా?” ధర్మయ్య కోపాన్నంతా వెళ్ళగక్కి వీధి అరుగుమీద కెళ్ళి కూర్చున్నాడు. " వరహాలమ్మ ఎలా కూర్చున్లుది అలానే అరగంట వరకూ కూర్చుండిపోయింది. “తనకు మాత్రం వుండదూ కూతురు సుఖపడాలనీ, దాని భారం పూర్తిగా వదిలిపోవాలనీ. ఆనాడు పెళ్ళిచేసేటప్పుడు తనేమైనా కలగందా? తమ్ముడన్న అభిమానం కొద్దీ కూతుర్నిచ్చి కట్టబెట్టింది. అవ్వుడు తనకేం తెలును పెద్ద య్యాక యిలా తయారవుతాడని!. ఆ మాటకొస్తే చచ్చి స్వర్గాన్నున్న అత్తగార్ననాలి. ముసల్దాన్నని, , మనవరాలి పెళ్ళి తను బతికుండగానే చేసెయ్యమని బలవంతంచేస్తే ఆయనగారు కూడా తల్లిమాటకు తాళం వేసి మేనరికం చేద్దామనుకుంటుంటే, తను కల్పించుకుని ఆ సంబంధం యిటు తిప్పింది. అసలు ఆ వయసులో దానికి పెళ్ళేమిటి? ఆనాడు వాళ్ళుయీ ప్రయత్నం చెయ్యకపోతే దీనిగతి యిలా తయారవుతుందా? ఈ వయసులో పోయిగా కాపరం చెయాల్సిన సమయంలో గుండె చెరువై యింట్లో కళ్ళముందు దిగాలుపడి తిరుగుతుంటే కన్నందుకు అంతకు రెండింతలు దుఃఖంతో తను మాత్రం కుమిలిపోవడంలేదూ?' అసలు దీనికంతటికీ తను కారకురాలు కాదని ఆలోచించి 'పైటకొంగుతో కళ్ళు వత్తుకుని లేచి కూతురున్న గదిలోకి వెళ్ళింది వరహాలమ్మ, గదిలో సరోజ నంజదీవం వెలిగింంచకుండానే మంచంమీద వడుకుని కిటికీగుండా బైట చెట్టగుబురుల కింద పరచుకుంటున్న మసకచీకట్టనుచూస్తూ, మధ్యమధ్య కారే కన్పీటిని తడుచుకుంటూ వుంది. వరహాలమ్మ గదిలో లైటు వెలిగించి కూతురు నిద్రపోవడంలేదని తెలుసుకుని, ఆ మంచంమీడే ఓ పక్కన కూర్చుని “చూడమ్మా” అంటూ అవతలికి చూస్తున్న కూతుర్ని తనవైపుకు తిప్పుకొంది. తల్లికి కనిపించకుండా దాద్దొమనుకున్న కన్నీళ్ళు ఆమె చూస్తుండగానే కారి కిందపడ్డాయి. “ఛా... ఏడుస్తున్నావా, ఊరుకో” అంటూ ఒక చేత్తో తలనిమురుతూ
జీవిత నత్యం 707 మరో చేత్తో తడిచారల్ని తుడిచింది. కూతుర్ని దగ్గరకు తీసుకుని “నువ్వు చిన్నపిల్లవు. నీకింకా తెలీదమ్మా, రేపు మామయ్యకు ఉత్తరం రాయిస్తాను. జవాబు వచ్చాక మంచిరోజు చూసి కార్యం అయిందనిపిస్తే నీ భారం యిక వదిలిఫోతుంది తల్లీ” అంది.
“బరువు తీరిపోతుందని గొంతు పిసికి చంపెయ్యలేకపోయావ్? పోనీ అంతకన్నా సులభం, ఏ మందో మాకో సెట్టెయ్యలేకపోయావ్” అంది సరోజ, అంతవరకు ఆలోచిస్తున్న తన స్థితికి తల్లే కారణం అని నిర్ణయంచుకొంటూ.
“నువ్వూ నన్నే అంటున్నావా సరోజా...” అన్సి మధ్యలోనే గొంతు గాద్గిదికమై ఆగిపోయి కళ్ళు తుడుచుకుని “పోనీ నన్ననక యింకెవరి నంటావులే. కన్నందుకు ఏమన్నా పడాలి” అని తల నిమురుతూ “ఉత్తరం రాయమంటావు కదమ్మా” అంది.
సరోజ ఆట్టే ప్రసంగం చెయ్యకుండానే “ఊవు” అని అవతలి పక్కకు వత్తిగిల్లింది.
“అలా అనకూడదమ్మా ఏదో నువ్వు విన్నవి ఊహించుకొని యిలా కుమిలిపోతున్నావు గాని నిజంగా మామయ్య అంత చెడ్డవాడుకాడు. వాడేదో నిన్ను తన్ని తిట్టి కష్టపెడుతుంటే నాకు యిష్టం అనుకున్నావా తల్లీ? ఆ మాత్రం నాకు తెలీదూ? పోనీ నువ్వనుకున్నట్టు చెడ్డాడే అనుకో. నువ్వు వెళ్తే వాడే బాగుపడతాడు. పెళ్ళాం రాకముందు అల్లరిచిల్లరిగా తిరిగిన వాళ్ళెంతమంది పెళ్ళాం వచ్చాక మిగిలినవాళ్ళకన్నా బాగా బతుకుతున్న వాళ్ళని చూళ్ళేదూ!” అంది వరహాలమ్మ
“ఇప్పానుగదూ, నేను అక్కడకు వెళ్ళనంటే వెళ్ళను” మెండిత్తినట్టుగా అంది సరోజ.
వరహాలమ్మ యింకా ఏదో చెప్పబోయింది కాని సరోజ పక్క దుష్పటి తీసి తలనుండి పాదాలవరకు ముసుగుతన్ని యింకేమీ వినక్కరలేధన్నట్బగా పడుకొంది ఇక ఏం చెప్పినా లాభంలేదనుకుని నిట్టూర్చి లేచి వెళ్ళిపోయింది వరహాలమ్మ
తల్లి వెళ్ళిపోవడంతోనే లేచివెళ్ళి తలుపుగెడపెట్టి మంచంమీద కొచ్చి కూర్చుంది సరోజ, బయటంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వుంది. ఒక్క సరోజ హృదయంలో మాత్రం తుఫానూ, సుడిగాలీ రెండూ కలిసివచ్చినప్పుడు ఎటూ వెళ్ళలేక ఆ సుడిగాలి పరిధిలోనే
702 నమాధి పరిభ్రమిస్తున్నట్టుగా మనసు ఆలోచనల పరిధిలోనే గిరగిరా తిరుగుతూవుంది. వాటినుండి మరల్చుకుందామన్నా వీలుకావడంలేదు. అలసిపోయి అక్కడే మంచంమీదకు ఒరిగింది. అయినా నిద్రపట్టలేదు. ఆలోచన్లు నీడల్లా అంటిపెట్టుకునే వున్నాయి. చిన్నప్పుడు పెళ్ళినాటి జ్ఞాపకాల్లో తారట్లాడే ఆయన, ఆ తర్వాత పక్కింటి వరలక్ష్మి అంతా చెప్పగా ఊహించుకున్న ఊహల్లో ఆయన - ఆ రెండూ రెండువైపులా ఆమెను ఎదుర్కొంటున్నాయి. “ఉహూ, చచ్చినా అక్కడకు వెళ్ళకూడదు' అనుకుంది.
రాత్రి భోజనంచేసి వచ్చి పడుకున్నాక కూడా ఆమె ఆలోచనలకు ముగింపు లేకపోయింది. నిద్రపట్టలేదు. మనసు నిండా అవే ఆలోచనలు-
“ఆయన గురించి వరలక్ష్మి తల్లితో చెప్తుండగా తను వింది ఆవిడేమిటి, స్వయానా తండ్రి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఒకనాటిరాత్రి తను నిద్రపోయానని భావించి గట్టిగానే తల్లితో చెప్తున్నాడు. “చూసిచూసి పిల్లను ఆ దౌర్భాగ్యుడి చేతుల్లో పెట్టామే ఇంతకన్నా ఆ దొడ్డో బావిలోకి దించినా కొంచెంమెరుగే. బండిదిగి ఊర్లో అడుగు పెట్టింది లగాయతు ఆ వూర్ణో వున్నంతసేపూ ఎదురయిన ప్రతి ఎరుగున్న ముఖమూ అదేమాట- మీవాడు యీ మధ్య మరీ బలాదూర్‌గా తిరుగుతున్నాడండీ. పచ్చి రౌడీగా తయారయ్యాడు అని.
ఆ మాటలు తండ్రి అంటున్నప్పుడు ఆ కంఠంలో సన్నని జీర తొణికిసలాడి ఆ తర్వాత బొంగురుపోయి అంతటితో ఆగిపోవడం తను చాటుగా వింది. వరలక్ష్మి చిన్ననాటినుండీ ఎంతో చనువుగా వుండేదల్లా పెళ్ళయి వెళ్ళిపోయి పుట్టింటికి మొదటిసారి వచ్చినప్పుడు ముందటి పరిహాసాలూ, చనువూచూపించకపోతే ఏమిటో అనుకుంది తను. ఆమె అత్తగారి వూరూ, తన తాతగారి వూరూ ఒక్కటే. ఆమె ఆ వూర్జో వున్నప్పుడు విన్నవీ కన్నవీ అన్నీ చెప్పింది. ఆమె చెప్పిన ప్రతి సంగతీ తను చాటుగా వింది. విన్నా తను చేసేదేమిటి, తన దురదృష్టాన్ని తలంచుకుంటూ తల బాదుకుని ఏడవడం తప్ప. ఆలా బయటికికూడా ఏడవలేక లోలోపలే కుమిలిపోవడమే తను చేయగలిగినదల్గా, తనని జీవితాంతం యీ కష్టాలు పడమని బొమ్మలాటగా ఆనాడు యీ పెళ్ళిచేశారు. పోనీ ఆ చేసేదిగూడా ఆలోచించి చెయ్యగూడదూ? అక్కడా స్వార్ధమేనా? తమ్ముడికే యివ్వాలని అమ్మ పట్టుబట్టడమేమిటి, ఇవతల కన్నకూతురు ఏమయినా అంతేనేమో..."
జీవిత నత్యం 103 ఎప్పుడో ఆమెకు తెలీకుండానే ఆవహించిన నిద్రలో ఆలోచనలు ఎగిరిపోయి ఆ స్థానంలో ఏదో పీడకల వచ్చి కరిగిపోయింది. సరోజ ఉదయం లేచి మామూలు మనిషిలా తిరిగలేకపోయింది. ఇంట్లో ఎవరూ ఆమెను మళ్ళీ ఆ విషయమై కదపలేదుగాని రెండురోజులవరకూ ఆమెను ఆ ఆలోచనలు వదిలిపెట్టలేదు. ఆ తర్వాత మెలమెల్లగా అవి తొలగిపోయాయి. పూర్తిగా ఆ విషయాలు మర్చిపోయి యింటిపనుల్లో మునిగిపోయివున్న సమయంలో వరలక్ష్మి పురిటికని పుట్టింటికి వచ్చింది. వరహాలమ్మ ఆరోజే ఆమెను పిలిపించి “తమ్ముడి విషయాలేమైనా తెచ్చావా?” అంది. అంతా తెలిసిన కూతురుకు చాటుచెయ్యడం దేనికని,కూతురువచ్చి కూర్చున్నా ప్రసంగం మార్చకుండానే అడిగింది. “ఏం చెప్పనుపిన్నీ. అంతకుముందు ఎలా వున్నాడో యిష్పుడూ అంతే. ఆస్థంతా తగలబెడుతున్నాడని తాతయ్యకూడా వాడికి కార్యం కానిచ్చేసి వేరీ కాపరం పెట్టిద్దాం అనుకుంటున్నాడు. దగ్గర్జోనే మంచిరోజు చూసి అదీ అయిందనిపించేద్దామనే వాళ్ళు చూస్తున్నారు. ఇదిగో నేను చెప్తున్నా విను పిన్నీ! భార్యవున్న దారివేరు. లేనిదారివేరు. ఏంచేస్తున్నా నాలుగుసార్లు అడ్జి అపేవాళ్ళుండాలి. లేకపోతే ఆ ఒదినలకేం కొవాలి వీడేమైతే. ఇక తండ్రంటావా? ఆపే స్థితిలో లేడు. ఏమయినా మనపిల్ల జీవితం గనక మనమే త్వరపడి ఏదో - ఆ పనికూడా అయిందనిపించేసి పంసేస్తేనే మంచిది. ఎన్నాళ్లని యింట్లో వుంచుకొని దాని జీవితాన్ని నాశనంచేస్తాం?” అంది వరలక్ష్మి పెళ్ళయి రెండేళ్ళే అయినా వందేళ్ళ అనుభవాన్నంతా జీర్ణించుకున్నదానిలా మాట్లాడింది. “చూశావా అమ్మా!” అంది వరహాలమ్మ కూతుర్ని ఉద్దేశిస్తూ, చూసేదేమీ లేదన్నట్టుగా లేచి వెళ్ళిపోయింది సరోజ. వెళ్ళిపోతున్న సరోజనుచూసి వరలక్ష్మి వరహాలమ్మ దగ్గిరకంటా వంగి “నీకు తెలీదు పిన్నీ వాడలా తయారయ్యాడో ఈ మధ్య దేన్నో తెచ్చి వుంచాడట?” అంది చాలా రహస్యంగా వినిపించీ వినిపించనంత నెమ్మదిగా. వరహాలమ్మ ముక్కుమీద వేలేసుకుంది “వీడికి యిది కూడొనా!' అని. సరోజ అవతలి గదిలోకి వెళ్తూ తల్లినిచూసి ఏమనుకుందో ఏమో దభీలున తలుపులు వేనుకుంది. “సరోజతో మాట్టాడివస్తాను పిన్నీ” అని వరలక్ష్మి లేచొచ్చి
104 నమాధి తలుపులు తోసుకుంటూ గదిలోకి వచ్చింది.
“రా కూర్చో” అంది సరోజ.
“మీ అయన దగ్గర కెళ్ళనన్నావటేమే” అంది ఆశ్చర్యంగా
“ఏం లేదు, ఆ విషయం యిష్పుడెందుకులే” అంది సరోజ. అని, ఆ సంభాషణని మార్చే ఉద్దేశంతో ఏదో చెప్పబోయింది గాని వరలక్ష్మి అడ్డుపడి “అది సరేగాని, ముందీ విషయం చెప్పు, మీ ఆయన దగ్గరికి ఎందుకెళ్ళవ్?” అని అడిగింది.
సరోజ ఏమీ జవాబు చెప్పలేదు. అయినా అసలు కారణం వరలక్ష్మికి తెలియనిదేమీకాదు. అందుకే ఆమె “భర్త ఎలాటివాడైనా కట్టుకున్న తర్వాత తప్పుతుందా నరోజా! ఇప్పుడెళ్ళనంటావ్. రేపెళ్ళనంటావ్. ఒకటిరెండు సంవత్సరాలు యిలా గడిపేసినా ఆ తర్వాతనన్నా వెళ్ళక తప్పదుకదా?...” అంది. పావుగంటసేపు ఆమెకు హితబోధ చేసింది.
సరోజ అదేమీ తలకెక్కించుకున్నట్టులేదు.ఆమె చెప్తోంటే బల్లమీది పుస్తకం పేజీలు తిరగేస్తూ బొమ్మలు చూస్తూ కూర్చుంది.
వరలక్ష్మి వెళ్ళాస్తానంటూ లేచింది. సరోజ గుమ్మంవరరూ వచ్చి, :వెళ్ళిపోతున్న వరలక్ష్మిని చూస్తూ తనలో తనే నవ్వుకుంది. “తన ఈడుపిల్ల యీ వరలక్షి ముసలమ్మలా తనకి నీతులు చెప్తోందేమిటి? ఎలా అయినా పెళ్ళయ్యాక గడుసుదనంఆదీ నేర్చేసింది. దీనికి పెద్దల తరహా వచ్చేసిందిసుమా' అనుకుంది.
ఆ రాత్రి ఒకమారు వరలక్ష్మి అన్న విషయాలు జ్ఞాపకం చేసుకుని అలోచించి ఏమయినా అక్కడకు వెళ్ళకూడదు. వెళ్ళినందువల్ల తనకి కష్టాలేకాని సుఖం లేదు, ఆ వుండేదేదో యిక్కడే వుంటేసరి' అని నిర్ణయించుకుంది.
ఆ తర్వాతకూడా చాలాసార్లు తల్లీ, తండ్రీ, వరలక్ష్మీ చెప్పి చూశారు. అప్పటికీ సరోజ మెత్తబడలేదు. ఇంకా గట్టిగా చెప్తే ఏ అఘాయిత్యం చేస్తుందోనని భయపడి ఊరుకుని, సమయం చిక్కినప్పుడల్లా మంచిగా చెప్పండేవారు. ఊకొట్టి ఊరుకునేది సరోజ. చెప్పిచెప్పి వాళ్ళుకూడా విసుగెత్తి వూరుకున్నారు, ఎప్పుడో దానికే బుద్ధి శిరుగుతుందని.
ఒకరోజు ప్రభాకరం వచ్చాడు, ఆ దగ్గరి వూళ్ళో స్నేహితుడి పెళ్ళికనివచ్చి,
జీవిత నత్యం 105 మేనమామ వాళ్ళనికూడా చూసి వెళ్చ్ళామని వచ్చాడు. సరోజను ప్రభాకరానికి యివ్వలేదన్న కోపంకొద్దీ ఆ రెండిళ్ళకూ రాకపోకలు తెగతెంపులు చేసుకున్నారు. ధర్మయ్య తల్లి చనిపోయినప్పుడు మళ్ళీ మాటలు కలిసాయి.
చెల్లెలి కొడుకు ప్రభాకరం అంటే ధర్మయ్యకు మొదటినుంచీ యిష్టమే. వరహాలమ్మకు కూడా తమ్ముడిమీద (నీళిమానంకొద్దీ కూతుర్ని వ్రభాకరానికి యివ్వలేదుకాని, వ్రభాకరం అంటే “బుద్ధిమంతుడ్డని, వోయిగా ఉద్యోగం చేసుకుంటున్నాడని మంచి అభిప్రాయమే వుంది. ' ఆ యిచ్చేది వీడికైనా యివ్వక పోయానే” అని అప్పుడప్పుడు బాధపడుతూ వుంటుందికూడా.
ప్రభాకరం దగ్గరకూర్చుని అతను చెప్పినవన్నీ విని “అయితే పెళ్ళిప్పుడు చేసుకుంటావబ్బాయ్?” అంది.
ప్రభాకరం చిరునవ్వు నవ్వుతూ రేపొచ్చే నెలలోనే. మొన్ననే నాన్న సంబంధం చూస్ మాట్ట్లాడీ వచ్చాడు. కట్నం ఐదువేలు యిస్తారట” అన్నాడు.
“అవునులే! రాజాలాంటి పిల్లాడు. ఇవ్వకేం జేస్పిరు' అనుకుంది మననులో వరహాలమ్మ
భోజనం చేసి కాస్సేపు నిద్రపోయిలేచాడు ప్రభాకరం. నరోజ టీ పట్టుకొచ్చి యిస్తే తాగుతూ “ ఇంకా మీ ఆయన దగ్గరకు పంపించలేదా?”అని అడిగాడు.
సన్నగా వినీవినపడనంత నెమ్మదిగా “ఊహు” అని ఖాళీకప్పు అందుకుని వెళ్ళిపోయింది.
ధర్మయ్య ఎప్పుడో నాలుగు గంటలవేళ వచ్చి ప్రభాకరాన్ని పలకరించి కాస్సేపు అక్కడి విషయాలవీ మాట్లాడి ఆరింటికి పనుందని, రాత్రి రావడం ఆలన్యమౌతుందని చెప్పి వెళ్ళిపోయాడు.
ప్రభాకరం సాయంకాలంపూట యింట్లో కూర్చోలేక అలా అవతలకు షికారుకు వెళ్ళి వస్తానని బయలుదేరాడు. ప్రభాకరం బయలుదేరడం చూసి వరహాలమ్మ ఆ వీధిలో ఎవరింట్లోనో త్రినాథస్వామి పూజకని వెళ్తూ బావవస్తే సిలవ్వే అని చెప్పి వెళ్ళిపోయింది. |
సరోజ ఒక్కర్తికీ యింట్లో ఏంచేయడానికీ తోచక వీధి గదిలోకొచ్చి కిటికీముందు
106 నమాధి కూర్చుంది. వీధిలో కుర్రాళ్ళు వేపచెట్టుకింద గాలికి రాలిన వేపపళ్ళను ఏరుకుంటున్నారు. అదిచూస్తుంటే ఆమెకు తన బాల్యం గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి
చిన్నప్పుడు ప్రభాకరం, సరోజ అలానే సాయంకాలంవేళల్లో గట్టిగా గాలులు వీచినప్పుడు వేపపళ్ళు ఏరుకు తినేవారు. తన ఒడినిండా యిన్ని పళ్ళు ఏరుకొచ్చి ఓచోట తిందామని కూర్చుంట్లే ప్రభాకరం వెనకనించి వచ్చి గుప్పెడు పళ్ళు లాక్కుపోయేవాడు. తను వ్లీడిస్తే అత్తయ్య వచ్చి వాడిని నాలుగుతన్ని ఆమెకవి యిప్పిస్తుండేది. ఎంత చక్కటిరోజులవి! చీకూచింతా లేనిరోజులు. ఆ రోజులిక తిరిగిరావు.
ఆలోచిస్తూ కూర్చున్న సరోజ ముఖంమీద వర్షపుజల్లు కొట్టింది. బైట చినుకులు మొదలై, చూస్తుండగానే చింతపిక్కలంత పరిమాణంలో వర్షం కురుస్తోంది. కుర్రాళ్ళంతా ఎవరికి దగ్గర్జో వున్న అరుగులు వాళ్ళెక్కి నుంచున్నారు. వీధివీధంతా నిర్మానుష్యమై పోయింది. నీళ్ళు రోడ్డుమీద కాలవలుకట్టి పారుతున్నాయి.
సరోజ అలా వీధిలోకి చూస్తుండగానే ప్రభాకరం ఆ చివరనుడి పెద్దపెద్ద అంగల్లో ' వర్షంలో తడుస్తూ వస్తుండడం కనిపించి గబగబా వీధి అరుగుమీదకువచ్చి నుంచుంది. బావని చూస్తోంటే నవ్వాగింది కాదు సరోజకు. పకాపకా నవ్వుతూ “ తడుస్తూ వచ్చావేం బావా! ఎక్కడన్నా వర్షం తగ్గేవరకూ ఆగలేకపోయావ్?” అంది.
“ఏదీ, ఆ వంతెన దాటకుండానే వర్షం పట్టుకొంది. ఎక్కడని ఆగేది, అంతా కొత్త” వణికిపోతున్న కంరంతో సగం అక్షరాల్ని మింగి అన్నాడు.
సరోజ లోపలికి పోయి తువ్వాలు పట్టుకొచ్చి “రా బావా లోపలికి వచ్చి తుడుచుకో” అంది.
అతను చొక్కా, బనీను తీసేసి తల తుడుచుకుంటుంటే ఓ పక్కగానుంచాని గజగజా వణికిపోతున్న ప్రభాకరాన్ని చూసి “చలేస్తున్నట్టుంది. వుండు, వేడివేడి టీ పట్టుకొస్తాను” అని వంటగదిలో! వెళ్ళింది.
అయిదునిమిషాల్లో పొగలుకక్కుతున్న టీ పట్టుకొచ్చి యిచ్చింది సరోజ. అప్పటికి ప్రభాకరం తలతుడుచుకుని తడిసిపోయిన 'ఫేంటుకూడా తీసేసి లుంగీ కట్టుకుని కూర్చున్నాడు.
జీవిత నత్యం ౫77
సరోజ యిచ్చిన కప్పాను అందుకొని తాగుతూ మధ్యమధ్య తనవైపే చూస్తూ తను చూస్తుంటే చటుక్కున దృష్టి మార్చుకుంట్టున్న సరోజను చూస్తూ కప్పు ఖాళీచేసి ఆమెకు అందించాడు. సరోజ అందుకుని చెయిజారి కిందపడబోయిన కప్పును చటుక్కున ముందుకువంగి పడకుండా పట్టుకుని పక్కన స్ట్రూలుమీదపెట్టి, ఏం మాట్లాడ్డానికీ తోచక చూస్తూ వుండిపోయింది. ఓ నిమిషం తర్వాత కిటికీలోంచి వాలుగా వర్షం తుంపర్లు లోపలికి రావడం గమనించి కిటికీ రెక్కలు రెండూ మూసి వచ్చింది.
“ఎప్పుడెళ్తున్నావ్ మీ ఆయన దగ్గరికి?” ప్రభాకరానికి అలా నిళ్శబ్దంగా కూర్చోవడం యిబ్బందిగా అనిపించి సంభాషణలోకి దించుదామని అడిగాడు.
“అన్నట్టు యీ మధ్యనే ఉద్యోగంలో చేరేవట, నాన్న చెప్పాడు, జీతం ఎంత?”
(ప్రభాకరం సమాధానం చెప్పాడు. ఆమె అంతటితో ఆగిపోలేదు. ప్రశ్చలమీద ప్రశ్నలు వేస్తోంది. అతనుచెప్తన్నాడు. చెప్పన్నాడేగాని అతని దృష్టి ఆ ఎదుటిగోడమీద వుంది. ఆ గోడమీద నాలుగైదు ఫోటోలు వేలాడుతున్నాయి. సరిగ్గా ఆమె కూర్చున్నచోటే తలమీద రాధాకృష్ణుల ప్రణయసన్నివేశం చిత్రకారుని రంగుల్లో కళ్ళను ఆకట్టు కుంటోంది. అతను దానినే చూస్తున్నాడు. అస్తమిస్తోన్న నూర్యుడు, అలముకొంటున్న చీకటి, ఆమధ్య ప్రకృతిలో కరిగిపోయిన నీలవర్జంలో మురళివాయిన్లూ శ్రీకృష్ణుడు, అతని వడిలో రాధ- సోలిపోయిన కళ్ళూ, చెదిరిపోయిన పవిటా, వీడిపోయిన కేశబంధం! వారిచుట్టూ పూల గ్భుబురులళలో నిశ్చలమైన ప్రకృతి!
ప్రభారం దృష్టి సరోజమీదకు మళ్ళింది. కుర్చీకోడిమీద చేతినుంచి, ముఖాన్ని అరచేతిమీద ఆని కిందకుచూస్తూ కాలిగోటితో నేలమీద రాస్తూవుంది. ప్రభాకరం తన దృష్టిని ఎంత మార్చుకుందామన్నా సరోజనుండి మార్చుకోలేకపోతున్నాడు.
ఆమె తలలో వాడని మల్లెలు, గదిలో మంచం, చుట్టూ చలిగాలి, ఎదురుగా మనసును ఉత్తేజపరిచే ప్రఇయసన్నివేశం, ఇంట్లో మరెవరూలేని అవకాశం!
అతని కళ్ళల్లో దాహాన్నీ ముఖంలో ఉద్విగ్నతనీ గుర్తించి వెళ్ళిపోదామని లేచినుంచొని ఏదో చెప్పబోయి “బావా అంది
(ప్రభాకరం తలుపు గెడపెట్టివచ్చి భుజంపట్టి కూర్చోపెట్టి ఆమె కళ్ళల్లోకి చూశాడు
సరోజ బిత్తరపోయింది.
108 నమాభి ప్రభాకరం ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆమె ఏదో గొణిగింది. అతను వినిపించుకోలేదు. మరింతగా ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. నరోజకూడా మరేమీ అడ్డుచెప్పలేదు.?అతని కంఠం చుట్టూ గట్టిగా చేతులు "పెనవేసుకుంది. ఆ మర్నాడే ప్రభాకరం వెళ్ళిపోయాడు. మరోరోజు వుండమని అత్తయ్య: మామయ్య చెప్పిచూశారుగాని అర్జంటుపని వుందని వెళ్ళిపోయాడు నాలుగురోజుల తర్వాత ఓ సాయంకాలం తీరిగ్గా తల్లీ తండ్రీ వీధివరండాలో కష్టసుఖాలు మాట్లాడుకుంటుంటే దీపం వెలిగించడానికని అటొచ్చిన సరోజను చూసి యధాలాపంగా అడిగింది తల్లి. “మామయ్యకి నిన్ను తీసుకెళ్ళడానికి రమ్మని ఉత్తరం రాస్తానంటున్నారే నాన్న రాయమంటావా?” అని. “సరే, రాస్తేరాయండి” అన్నట్టుగా తలాడించింది సరోజ. కూతురు అంగీకరించడం వాళ్ళకు ఆశ్చర్యంగానేవుంది. కారణం ఏమిటో తెలీకపోయిన్నా కూతురు కాపరానికి వెళ్ళడానికి అంగీకరించినందుకు సంతోషంతో యిద్దరూ సరోజవైపు చూశారు. సరోజ వెనక్కుతిరిగి వాళ్ళకు కనబడకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మెల్లగా గదిలోకి వెళ్ళిపోయింది. 9 భనరోం రరాలర్సు న 1 హిజన హం అ
సమ నాదుట్టు వున పకృతి నన్నిలా మార్చసింది సౌందర్యం అన దవ లర సన్ మాతతానూ. తారల ఎ మొవాలనూ ఎట్పాళ టపటపా తంగ పళత నాగరకతకు నశ ఇర్వను ఇపీలరట ప్రటలోనూ లెద ఫందడం. వంచక్రూతాలూ కలన తాపీగా వశత తమపుంటున్న పటట... చ విష చాతావరణంలోన అందంనంద్. పనికిరాని మట్టతున. జారపోయ నీటచు కా ప్నున. స సూర్యకరం విడవిదిగాంంరరపు వాంచక పొయినా యవనీ అస్త ఎంత అందాన్ని సృష్టిసాయి న న న క అ