Telugu Saamya vaadaanni sahinchani hinuduism - anilvaranasi/indianlanguages GitHub Wiki

1 నా అ. గదు న హతం ల లి న... లో యాం). వననరయాయాడాానున చరా న న్‌ న క్‌ న జీ. స ంం!! స |

  1. ॥ శ్లో | న 2 స న్‌ (ల క + | గ్‌ ॥ . స్‌ న రం పే న గ్‌ (1. నో - జ మ యు శామ్‌ ॥ గ | శ ఎ జు | / వ. న్‌ు. (న షు! |: ను! ్టై (. ౨. ఇయు గ ణ్‌ న్న సహ్గాష్మా | ," ః" ॥ | + న (1, ఫ్‌ న పనా చా య న! | 1 యాం టా)! నాల క య. గ , ట్‌ క వ (క్‌ . క స్త / గ" ఎ న న క. స స

సామ్యవాదాన్ని సహించని హిందూయిజం విజయనగర ప్రసంగం కుసుమ ధర్మన్న ప్‌ (ప్రజాశక్తి బుక్‌వౌస్‌ 27-80-4 ఆకులనారి వీధి, గవర్నర్‌పేట, రాఘవయ్యపార్భు వద్ద, నిజయవాడ - 5620 002 ఫోన్‌ 9490099202

య న్‌ నవక. శల ఏ220002 2264220011 2010001201 0460118201 ఉంళుం! కంటం 20020012 ప్రచురణ సంఖ్య 1419 థ్‌ ప్రజాశక్తి ముద్రణ సెప్టెంబర్‌, 2016 ఉత వెల ₹ 25/- యా గండాతళకు ప్రతులకు శం జ్‌ ట్ట భయం 2? గీ యాగ య లో వ్‌

[౧9811 7 చ ప్రజాశక్తి బుక్‌వహొస్‌

27-1-64, కారల్‌మార్చ్‌ రోడ్‌,

విజయవాడ -520 009, ఫోన్‌ 0866 - 25775638

బ్రాంచీలు

విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు,

ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు

ముద్రణ

ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ైస్‌, విజయవాడ

ఇం09106 ఇగాగాా 090% 1

90020(28008411 ౧౦౧1

||111111111111

121692

ప్రచురణ కర్తల మాట

ల్మెటుగునాట తొలి అంబేద్కరిస్టు కుసుమ ధర్మన్న కులవ్యవస్థ దాష్టీకాన్ని తన రచనల "ద్వారా, క్రియాశీల ఉద్యమాల ద్వారా ఎలుగెత్తి చాటాడు ఆయన రాసిన *మా కొద్దీ నల్లదొరతనం'ి గేయరో ఆనాడు ఒక సంచలనం ఆయన వాగ్గేయకారుడు కూడా ఈ గేయం పారకుడ్ని ఉర్రూతలూగించడమే కాదు ఆలోచనలు రేపి ప్రతిఘటనోత్తేజం కలిగిస్తుంది క్తసుమ ధర్మన్న గారి రచనలు “మా కొద్దీ నల్లదొరతనం”, “సొమ్యవాదాన్ని సహించని హిందూయిజం), హరిజన శతకం, మధ్యపొన నిషేధం ఈ నాలుగు పుస్తకాలతో పాటు డా॥ మద్దుకూరి సత్యనారాయణ ఎం ఫిల్‌ వ్యాసం- 'కుసుమ ధర్మన్న కవి రచనలు - దళిత దృక్పథం, ధర్మన్న జీవిత, సాహిత్యాలపై ప్రముఖులు రాసిన “తొలి దళిత స్ఫూర్తి కుసుమ ధర్మన్న! వ్యాస సంకలనంతో కలిపి మొత్తం ఏడు పుస్తకాలను వెలువరిస్తున్నాం వందకుపైగా సాపొత్య, సామాజిక, కళా, సాంస్కృతిక, దళిత, వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో 2018 సెప్టెంబర్‌ 18న జరుగుతున్న కుసుమ ధర్మన్న సాహితీ సమాలోచన సందర్భంగా ఈ ప్రచురణలు తెస్తున్నాం

నేడు దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను పరిశీలిస్తే కుసుమ ధర్మన్న రచనలు ఈనాటికీ ఎంత ప్రాసంగికతను కలిగి ఉన్నాయో అర్ధమవుతుంది

కుసుమ ధర్మన్న రచనల అధ్యయనం ఈనాటి అవసరంగా భావించి ప్రజాశక్తి బుకవౌస్‌ ఈ ప్రచురణలను మీ ముందుకు తీసుకువస్తున్నది గళంలో సివి రాసిన 'తొలి దళిత వైతాళికుడు కుసుమ ధర్మన్న కవీంద్రుడు' పుస్తకాన్ని కూడా ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ప్రచురించింది హెచ్‌బిటి, నలుపు పత్రిక కుసుమ ధర్మన్న రచనలు ప్రచురించాయి కుసుమ ధర్మన్న గారి ఈ పుస్తకాలు తేవడంలో అవి ఉపయోగపడ్డాయి. వారందరికీ మా కృతజ్ఞతలు ఈ పుస్తకాలను పారకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం = ప్రజాశక్తి బుకవహౌస్‌ విజయవాడ

భూస్వామ్యం దుమ్ముదులిపిన కుసుమ ధర్మన్న = దా॥ రాచపాళిం చంద్రశేఖరరెడ్డి తెలుగులో ప్రతి ద్వంద్వ రచనల సంప్రదాయం ఒకటుంది ఒక రచయిత ఒక వస్తువు మీద ఒక దృక్చథంతో ఒక రచన చేస్తే, మరో రచయిత ఆ రచయితతో విఖేదిస్తూ మరో రచన చేస్తే అది ప్రతిద్వంద్వ రచన అవుతుంది భఖిన్నభావజాలాలు, భిన్నజీవన విధానాలు, వాటి మధ్య సంఘర్షణలలోంచి ప్రతిద్వంద్వ రచనలు పుడతాయి భారతీయ సమాజం ఆర్థిక సాంఘిక వైరుధ్యాల పుట్ట ఈ వైరుధ్యాలను అర్ధం చేసుకోవడంలో అనేక భావజాలాలు అనేక మార్ధాలనుసరిస్తాయి. ఒక్కోసారి ఈ అనేకత్వం మిభ్రస్వభావం కలిగిందిగానూ, మరోసారి శత్రుస్వభావం కలిగిందిగానూ ఉంటుంది సమాజంలో వైరుధ్యం నిర్మూలించినపుడే ఆలోచనలలో వైరుధ్యం నశిస్తుంది ఈ వైరుధ్యాలను కళాత్మకంగా ఆవిష్కరించే క్రమంలో ్రతిద్వంద్వ రచనవుతుంది విశ్వనాధసత్యనారాయణ సంప్రదాయ దృష్టితో “దేవరాజు నాటకం రాస్తే త్రిపురనేని రామస్వామి చౌదరి ఆధునిక దృక్పధంతో ఖూనీ నాటకం రాశారు విశ్వనాధ హైందవ సంస్కృతి బెన్నత్యాన్ని తన దృష్టికోణం నుంచి “వేయిపడగలు నవలగా రాస్తే గుర్రం జాషువా తన జీవిత నేపథ్యం నుండి తన జీవితానుభవం నుండి 'నాల్గొపడగల హైందవ నాగరాజు అనే భావనను తన కవిత్వమంతా చిత్రించారు విశ్వనాధ శ్రీమద్రామాయణ కల్పవృక్షం రాస్తే, దాని మీద విమర్శగ్రంథంగా రంగనాయకమ్మ రామాయణ విషన్ఫక్షం రాశారు కుటుంబ వ్యవస్థ మీద విశ్వనాధ సత్యనారాయణ, చలం రాసిన నవలల్లో ఈ ప్రతిద్వంద్వ లక్షణాలున్నాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు దేవులపల్లి కృష్ణశాస్త్రి 'కృష్ణపక్షము' రాస్తే అనంతపంతుల రామలింగస్వామి “శుక్ల పక్షము" రాశారు ప్రీపురుష సంబంధాలలో విప్లవాత్మక సంబంధాలు ప్రతిపాదిస్తూ కుటుంబ హింస భరించలేనప్పుడు స్త్రీలను ఇంటిని బహిష్కరించమని (ప్రబోధించిన చలంకు ప్రతిద్వంద్వగా త్రిపురనేని గోపిచంద్‌ త్‌ నా నా... కుసుమ ధర్మన్న

“వెంకటాచలం పాత్రలు పేరుతో ఠెండు కధలు రాశారు. స్రీవాద కవిత్వం మొదలైన రోజులలో జయప్రభ “సోమి దేవమ్మలు సాహిత్యంలో మరి కన్పించరు” అనే కవిత రాస్తే జ్వాలాముఖి దాని మీద స్పందిస్తూ “డాలర్‌ ప్రభా అనే కవిత రాసారు.

హిందూముస్లిం సమైక్యతను ప్రతిపాదిస్తూ కేతు విశ్వనాధరెడ్డి అమ్మవారి నవ్వు కథరాస్తే, దానిమీద స్పందిస్తూ మహమ్మద్‌ ఖదీర్‌బాబు 'మక్కా చంద్రుడూ కథ రాశారు. ఇదొక పెద్ద పరిశోధనాంశం చూడబోతే ఇందులో పెద్దపరిశోధనాంశంగా ఉంది. ఈ ్రతిద్వంద్వ రచనకు ఆద్యుడు కుసుమధర్మన్న అని చెప్పడానికే ఈ ఉటంకింపులన్నీ ఒక రచయిత భావనను, ఆలోచనను తిప్పి కొడుతూ తన దైన భావనను, ఆలోచనను (ప్రతిపాదిస్తూ రచన చేసే సంప్రదాయాన్ని తెలుగులో కుసుమధర్మ్శన్నే ప్రతిపాదించారు. వలస పాలనకు వ్యతిరేకంగా, గాంధీజీ ప్రభావంతో, గరిమెళ్ళ నత్యనారాయణ “మాకొద్దీ తెల్లదొారతనము” అనే పాట రాని రాజమహేంద్రవరం వీధులలో పాడి రాయవేలూరు జైలుకు వెళ్ళారు. వలసపాలన వల్ల కొంత సామాజిక వరివర్తన జరిగిన వాన్తవాన్ని దృష్టిలో పెట్టకొని డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆలోచనా మార్గంలో కుసుమధర్మన్న “మాకొద్దినల్లదారతనము” అనేపాట రాశారు. అదే రాజమహేంద్రవరం నుంచి ఇద్దరూ కలిసి దొరలపాలనను వ్యతిరేకించారు.

నేను 80.10.1888న “మాకొద్దీతెల్లదొరతనం' పాట మీద ఒక వ్యాసం ప్రచురిస్తే దానిని చదివి తోగిర జై సీతారాం, అనంతపురంలో మాయింటికి వచ్చి ఆ వ్యాసం చదివానని చెబుతూ, గరిమెళ్ళ “తెల్లదొరతనం' అని అన్నచోట మనం 'నల్లుధొారతనం' అని ఒక్క అక్షరాన్ని మార్చి రాసుకుంటే, నేటి మనపాలకులకు బాగా సరిపోతుంది అన్నారు. అంటే స్వతందత్రభారతదేశంలో కొనసాగుతున్నది నల్లదొరలపాలన అని ఆయన అభిప్రాయం. కునుమధర్శన్న చెప్పింది నిజమైందన్నమాట. అయితే అప్పటికి నాకు కుసుమధర్మన్నను గురించి తెలియదు. బహుశా జైసీకారాంకు కూడా తెలియలేదేమో!

ఇరవయ్యవ దశాబ్దం తొలినాళ్ళలోనే వర్దవ్యవస్థమీద దళిత దృక్పథంతో యుద్ధం ప్రకటించిన కవి. కుసుమధర్శన్న “హరిజన శతకం' రాసేనాటికి జాషువా 'అనాధ'అనే దళిత మహిళాకావ్యం రాసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈయన అప్పటికే 'బాప్పసందేశము' తెలుగు తల్లి" వంటి కవితలు రాశారు.

కుసుమ ధర్మన్న కన్నాముందు 'మాలవాండ్రపాటు (1909), గురజాడ లవణ రాజు కల” (1910). తల్లాప్రగడ సూర్యనారాయణ 'హేమవతి” నవల (1918) సామ్యవాదాన్ని సహించని పొందూయిజం 6

వేంకటపార్వతీశ్వర కవుల “మాత్చమందిరముూ' (1919) 'నిరుద్ధభారతము” (1913) కావ్యం మొదలైన రచనలు దళిత జీవితంపట్ల సానుభూతితో వచ్చాయి ఈ రచనలమీద నంధు నంన్మరణ, స్వాతంత్రోద్యమాల (ప్రభావం ఉంది కునుమధర్మన్న “'మాకొద్దీనల్లదొరతనము' రాసేవాటికి ఉన్నవ లక్ష్మి నారాయణ “మాలపల్లి నవల రాస్తున్నారు

కుసుమ ధర్మన్న సాంఘిక విప్లవ కవి ఆయన 1986లో విజయనగరంలో ప్రథమ స్వాతంత్ర్య మహాసభలో ఆది ఆంధ్ర మహాసభను ప్రారంభిస్తూ చేసిన ప్రసంగం “సామ్యవాదాన్ని సహించని హిందూయిజం” అనే ప్రసంగం ఈ ప్రసంగంచేసి 80 ఏళ్ళయింది అయినా ఈ ప్రసంగంలో ధర్మన చేసిన వ్యాఖ్యలు నేటికీ వర్రిస్తున్నాయి తమ అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వారిని అనాగరికంగా మాట్లాడుతూ, హత్య చేస్తూ భౌతికదాడులకు పాల్పడుతూ ఆధిపత్యవాదులు ఆగడాలు చేస్తున్న సందర్భంలో ఈ ప్రసంగాన్ని మరోసారి వింటే ధర్మన్న ముందుచూపు అర్ధమౌతుంది 1936 నాటికి భారతదేశంలో గాంధీయిజం, అంబేద్మరిజం బలంగా (ప్రభావం చూపిస్తున్నాయి మార్చిజం ప్రపంచమంతా ఆవరిస్తున్నది అభ్యుదయ సాహిత్యం మొలకదశలో ఉంది 'మాలపల్లొ 'రైతుభజనావళి మొదలైన రచనలు మార్చిస్టు భావజాలాలను వెదజల్లుతున్నాయి. “దేశచరిత్రలు' కవితా ఇంకా రాయలేదుగాని, జయథం, మహాప్రస్థానం, బుక్కులు, బాటసారి, భిక్షువర్షీయసి వంటి కవితలు రాశారు పరాఖి 'ఫిదేలు రాగాల డజన్‌' వెలుగులోని వచ్చింది ముద్దుకృష్ణ స్థాపించిన 'జ్వాలి పత్రిక మార్చిస్టు సాహిత్య ప్రచారానికి పనిచేస్తున్నది పురిపండా అప్పలస్వామి భావకవిత్వంలోకి, అభ్యుదయ సాహిత్యంలోకి (ప్రవేశిస్తూ ఉన్నారు ఉ న్నవ మాలపల్లి 1922లో అచ్చయింది

విశ్వనాధ “వేయిపడగలు” అడివి బాపిరాజు 'నారాయణరావు' ఈ సమయంలోనే రాశారు చలం 1928-80 మధ్యనే తన నవలల్లో ఎక్కువ రాశారు మొక్కపాటి '“బారిస్టర్‌ పార్వతీశం” నవల ఈ కాలంలోనే వచ్చింది అయితే ఇవేవీ మాలపల్లి సరసన నిలవవు 'వేయిపడగలు ఆలోచనా విధానము సనాతనమైనది శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్ర, పుల్లంరాజు, ఇలాంటి తవ్వాయి వస్తే లాంటి కథలు రాసి ఉన్నారు లీలాసరోజిని మాదిగవాడు, అరవ వెంకటస్వామి, యీరమ్మ, గొట్టుముక్కల మంగాయన్మా, అయ్యోపాపం వంటి కధలు అప్పటికే వెలువడి ఉన్నాయి 1986 నాటికి దళిత సమాజము ప్రధాన వస్తువుగా తీసుకొని వచ్చిన తెలుగునాటక మేదీ లేనట్టుంది పౌరాణిక, చారిత్రక, రాజకీయ నాటకాల ఉరవడి కొనసాగుతున్నది ఇదీ కుసుమ ధర్మన్న ప్రసంగాల నాటి తెలుగు సాహిత్య వాతావరణం భె... కుసుమ ధర్మన్న

1986 నాటి కుసుమధర్మన్న ప్రసంగం చదివినవాళ్ళకు ఒక ప్రశ్న పుట్టడం సహజం అప్పటికి భారతదేశం నియమోల్లంఘన ఉద్యమంతో భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్‌ పాలనను ఎదుర్కొంటూ ఉంటే ఈయనేమిటి? దళితుల సమస్యను గురించి మాట్లాడతారా? అన్నదే ఆ ప్రశ్న గురజాడ 'కన్యాశుల్కం' నాటకంలో గిరిశం “పల్లెటూరి పీపల్‌ లెక్చర్లకి అన్‌ ఫిట్‌ మొన్న మనం వొచ్చిన బఐండీవాడికి నేషనల్‌ కాంగైస్‌ విషయమై రెండు గంటలు లెక్చర్‌ యిచ్చేసరికి ఆ గాడిద కొడుకు వాళ్ళ వూరు హెడ్‌ కానిస్టేబుల్ని కాంగైెసువారు యెప్పుడు బదిలీచేస్తారని అడిగాడు విలేజస్‌లో లెక్బర్లు యంత మాత్రం కార్యం లేదు,”అంటాడు తన శిష్యుడు వెంకటేశంతో యేమిసిద్ధా లోకం ఎలా ఉంది” అని వీర బ్రహ్మం అడిగితే, సిద్ధయ్య ఎవరి లోకం వారిదిగా ఉంది స్వామి ” అన్నారని చెప్పకుంటూ ఉంటారు జనం గిరీశం డయిలాగ్‌ దీనిని గుర్తు చేస్తున్నది గిరీశం బ్రాహ్మణుడు అరోకారో చదువుకున్నాడు ఆయనకు నేషనల్‌ కాం(గైస్‌ ముఖ్యం బండి వానికి కాంగ్రెస్‌ను గురించి ఏమీ తెలియదు అతనికి తక్షణ శత్రువు హెడ్‌కానిస్టేబుల్‌ గాంధీ స్వాతంత్రోద్యమాన్ని తుంటే, అంబేదృర్‌ దళితోద్యమం నడపటంలోని రహస్యం ఇదే బ్రిటిష్‌ వాళ్ళనుంచి స్వాతంత్ర్యం కోరే ముందు, భారతీయులు తమలో తాము స్వాతంత్ర్యం ఇచ్చుకోవాలి ఒక కులం మీద మరో కులం పెత్తనం చూస్తూంటే బ్రిటిష్‌వాళ్ళ పెత్తనాన్ని ప్రశ్నించే హక్కు ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు అంబేద్మర్‌ కుసుమధర్శన్న (ప్రశ్న కూడా ఇదే

స్వంత పరిపాలనా జేసేదమంటారు

చెంతకు మము జేర నీరు

స్వరాజ్య మనుచు సర్మారుతో పోరాడి

స్వాతంత్ర్యము మడుగుతారు

మాకు స్వాంత్రమీయమంటారు

మాకు హక్కు లేదంటె స్వారాజ్య మెక్కడ దక్కు

మాకు హిందూసంఘము నందు

స్వాతంత్ర్య మాగు వరకు

మాకొద్దీ నల్లదొరతనము

ఇదీ ధర్మన్న వాదం భారతదేశ అంతర్గత స్వాతంత్ర్యం కోసం బి ఆర్‌ అంబేద్మర్‌

పోరాడిన మార్గంలో కుసుమధర్శన్న పయనించారు ఆ ప్రయాణంలో భాగమే ఈ ప్రసంగం ఆర్థిక రాజకీయ విప్లవాల కన్నా ముందు భారతదేశంలో సాంఘికవిప్లవం రావాలన్న అంబేద్మర్‌ ఆంశయానికి అనుగుణంగానే ధర్మన్న ప్రసంగించారు సామ్యవాదాన్ని సహించని హిందూయిజం 8

కుసుమ ధర్మన్న తన ప్రసంగంలో సామ్యవాదాన్ని ఆమోదించారు. దానిని

భారతదేశానికి ఆహ్వానించారు అయితే భారతదేశ నిర్ధిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి దళితుల స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని చర్చించారు మార్చిజం అంతర్జాతీయ దృష్టితో వర్గ సిద్ధాంతాన్ని భారతదేశ దృష్టితో వర్ద సిద్ధాంతాన్ని సమన్వయం చేసుకోవాలని ఆయన కోరుకున్నట్లు అర్ధమౌతుంది భారతదేశంలో ఆధిపత్యంలో ఉన్న హిందూయిజం సామ్యవాదానికి అడ్డుపడుతున్నదని ఆయన విమర్శించారు

“సామ్యవాద మహావేదంలో జాతి, మత దేశ భేదాలకు కాని, ధనికులు, పేదవాళ్ళనే హెచ్చుతగ్గుల పైత్యానికి కాని, అంతఃకలహానిక్తీ, అంతరాలకు కాని తావులేదు ఇట్టి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని సౌభాగ్యాన్నే కాదు ప్రపంచమంతా కావాలని కోరేది ఏదో ఒక నాటికి ఫలించి ప్రాప్తించవలసిందే ప్రాప్తించి తీరుతుందనే నా విశ్వాసం (పుట-07) సామ్యవాదం మీద ఇంతటి గట్టి నమ్మకం ఏర్పడింది కుసుమ ధర్మన్నకు కానీ భారతీయ సమాజంలో అమలులో ఉన్న వర్జవ్యవస్థ అగ్రకుల ఆధిపత్యంలో ఉండటం వల్ల, హిందూయిజం సామ్యవాదాన్ని స్వీకరించదని, అందువల్ల హిందూమతంలో ఉంటూ బాధలు పడటం కన్నా ఆ మతాన్ని వదులుకోవడమే వారికి ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డాడు

“సామ్యవాదం సిద్ధిస్తే దేశానికి, మతాంతరం వంటబడితే హరిజనులకు తప్పకుండా మేలు “(పుట - 07) అన్న ధర్మన్న అభిప్రాయాన్ని నేటి మార్చిస్టులు గుర్తించాల్సి ఉంది మతం మారితే దళితులకు అన్నం, బట్ట, అత్మగౌరవం దక్కుతాయి అన్నారాయన మతం మారడాన్ని ఆయన ఆధ్యాత్మిక విషయంగా చూడలేదు భౌతిక విషయంగానే చూశారు ఈరోజులాగా అసహనరాజ్యం ఆరోజు ఉండాలంటే పరిస్థితి ఎలా ఉండేది

ఇతర మతాలను న్వీకరించడం కన్నా దళితులు సామ్యవాదాన్ని ఆహ్వానించరాదా? అన్ని ప్రశ్చను కూడా ఆయనే లేవనెత్తి ఆయనే సమాధానం చెప్పారు 1 అన్యమత స్వీకారానికంటే హరిజనులు సామ్యవాదులెందుకు కాకూడదని అడుగుతారు. నిజమే కాని పుట్టింది మొదలు గిట్టేవరకు హరిజనులు సహజంగా సామ్యవాదులే కాని మన సామ్యవాదం హిందువులకి, కాపుకమ్మాది భూస్వాములకి సపొంచదు, రుచించదు సంపన్నులకు నలుపు, స్వార్ధవరులకు పులుపు దయారహితులైన రైతులకు బల్లెము, ఆత్మశుద్ధిలేని అసహాయవాదులకు కళ్ళిము” భారతదేశంలో దళితులకు ఆస్తులు లేవు గనక వాళ్ళు సహజంగానే సామ్య వాదులని, ఆధిపత్యాన్ని ఆస్తులను గుప్పిట్లో పెట్టకున్న అగ్రకులాలు కులాలు సృష్టించి దళితులను 9 కుసుమ ధర్మన్న

హింసిస్తున్నానుని, కుల మత వ్యవస్థలు ఉన్నంతకాలం దళితులు సామ్యవాదులైనా హింసను అనుభవించవలసివస్తున్నదని, అందువల్లనే ఇంకొకమతం వైపు చూడవలసి వస్తున్నదని ధర్మన్న అభిప్రాయపడ్డారు కులం సామ్యవాదానికి శత్రువు అని ధర్మన్న గుర్తించినట్లు అర్ధమౌతుంది దళితులు సామ్యవాదులై ఉండి, వాళ్ళు ఆధునికి సామ్యవాదం వైపు మొగ్గకుందా ఉండడానికి పాలకులు ఎలా ఆకర్షించి సామ్యవాదాన్ని ఎలా నీరు గారుస్తారో కూడా ధర్మన్న స్పష్టం చేశారు ఇవాళ బూర్జువాపార్టీలలో వివిధ హోదాలలో ఉంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడే వాళ్ళంతా కుసుమధర్మన్న మాటల్ని అర్ధం చేసుకోవాలి కరిచే కుక్కకు కండ అడ్డమేయాలి మత్తు మందు చల్లాలి కలవకుండా కలతలు పెట్టాలి కూడకుండా కుయుక్తులు పన్నాలి తిరగబడితే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు త్రాగించాలి తల్లినీ పిల్లనీ అతక్కుండా చేయాలి అంటే సామదాన భేద దండోపాయాలతో కదలకుండా బంధించాలి బాధించాలి మట్టం చేసి విడిచి పెట్టాలి ఇదీ! హరిజనుల సామ్యవాదానికి వచ్చే ప్రతిఫలం, అంగబలం అర్ధబలం లేని నిస్సహాయులం ఏం చేయగలం? ఈ సౌమ్యవేదం అఖిలభారత సమస్యగా మారితే తప్ప మనకు సులభ సాధ్యం కాదు (పుట 07) దళితేతర మార్చిస్టులు కుసుమధర్మన్న అభిప్రాయం గురించి సానుకూలంగానే ఆలోచిస్తారనుకుంటాను కేవలం ఆర్థిక సమానత్వాన్నే కాకుండా తరతరాలుగా భారతీయ సమాజాన్ని శాసిస్తున్న కులమతాలను, వాటి దుపష్పలితాలను అవి నిర్వహిస్తున్న విధ్వంసక పొత్రను చారిత్రిక దృక్పథంతో ఆలోచించమని ధర్మన్న కోరుతున్నారు బి ఆర్‌ అంబేద్మర్‌ ఆలోచనా మార్గంలోనే కుసుమధర్శ్మన్న ఆలోచనలూ సాగాయి

“ఉర్విజనులకెల్ల నొక్కకంచము” బెట్టమన్న కాలంలో 'నన్ను ముట్టుకోకు అనే గుంపులో పుట్టడం ఎంత దౌర్భాగ్యం ఈ దౌర్జన్యం మీద ఆగ్రహము ధర్మన్న వ్యాసం “వర్జ ధర్మమధర్మ ధర్మంబు” అని కుసుమ ధర్మన్న కన్నముందే గురజాడ ఇచ్చిన తీర్చు ఎంత న్యాయమైనదో ధర్మన్న వ్యాసం రుజువు చేస్తున్నది తల్లాప్రగడ సూర్యనారాయణ, వేంకటపార్వతీశ్వర కవులు దళితులు కారు, నాస్తికులూ కారు శుద్దబ్రాహ్మణులు, వాళ్ళు మేలావతి, మాతృమందిరం నవలల్లో దళితులు ఎందరో మతం మారుతున్నారో చెప్పారు సమస్య మూలాలను తెలుసుకొనకుండా ప్రశ్నించిన వాళ్లను ప్రత్యమ్నాయం చూసుకున్న వాళ్ళను చంపడానికి మొదలుపెడితే ఎక్క మొదలు బెట్టాలి, వేమన నుంచి మొదలు బెట్టాలి కుసుమధర్మన్న విమర్శను హేతుబద్ధమైన బుద్ధితో ఆలోచించాలి ఆవేశమౌడ్యంతో ఆలోచిస్తే వ్రయోజనం శూన్యం సామ్యవాదాన్ని సహించని పొందుయిజం ౨౦

ప్రపంచ దేశాల సామాజిక వ్యవస్థలను అధ్యయనం చేసి ధర్మన్న ఈ ప్రసంగం చేశారు క్రివిధ బహిష్కారాలను ప్రస్తావించారు కుసుమధర్మన్న దళితులను అంటకపోవడం, వాళ్ళను చూడకపోవడం, గుడులలోకి వాళ్ళను రానివ్వకపోవడం వీటికి సంబంధించి ఇవాళ మార్పులు వచ్చి ఉండవచ్చు కాని అంతరాంతరాలలో వాటి స్పృహ తుడిచిపెట్టబడిందని ధైర్యంగా చెప్పగలమా? దీనికి విరుగుడుగానే అంబేద్కర్‌ కులనిర్మూలనను (ప్రతిపాదించింది రక్తం సమ్మిభ్రితం కావాలని కోరుకుంది ధర్మన్న దళితుల దృష్టి స్పర్భలను అగ్రకులాలు నిషేధించడానికి చెప్పిన కారణాలు విచిత్రంగా అనిపించవచ్చు అతిగా కూడా అనిపించవచ్చు కనీసం 1986 నాటి ఆ మాటలలో అహంగానే దానిని గుర్తించాలి అగ్రకులాలు రాసిన శాసనాలను సదలించమన్నా, వాటీని ప్రశ్నించినా అవతలివైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో ధర్మన్న చెప్పింది నిజం

ఈ ప్రసంగంలో కవితా గ్రామం నుండి తిరుపతి కొండ దాక జరిగిన దారుణాలను ఆయన ప్రస్తావించారు ఆ ఉదాహరణలలో చెప్పినంత భయంకరంగా ఉన్న సమాజాన్ని మార్చటంలో గాంధీకి అంబేద్కర్‌కు ఉన్న తేడాను ధర్మన్న గుర్తించారు గుర్తించి కొం(గ్రైెస్‌ను ఇసుక తక్కెడ అని గాంధీని పేడతక్కెడ అని అన్నారు 124 00820603 296 6౫601 1476 4016 108 0206 అన్న అంబేద్కర్‌ చరిత్ర చదివితే ధర్మన్న ప్రతిపాదన అర్ధమౌతుంది దళితులను ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు విషయంలో గాంధీజీ ప్రవర్తనను తప్పు బట్టడంలో ధర్మన్న అంబేద్మర్‌ బాటలో నడిచారు

ధర్మన్న కాంగ్రెస్‌, గాంధీలను ఇసుక తక్కెడ పేడతక్కెడలతో పోల్చారు కాంగ్రెస్‌ ధనికుల చేతిలో కీలుబొమ్మకావడం, గాంధీ దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలను వ్యతిరేకిస్తూ నిరశనకు దిగడం పట్ల ధర్మన్న ఆగ్రహించారు. ప్రశ్నించే దళితులను సంక్షేమం అనే అల్ప కార్యక్రమాల ద్వారా ఆకర్షించి, వాళ్ళ సమగ్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేసే ధోరణి మీద ఆగ్రహపడ్డారు ధర్మన్న 1

మనకు కావలసింది మతం కాదు కబళం, అత్మగౌరవం' అంటూనే ధర్మన్న దళితులను ఇతరమతాలలోనికి వెళ్ళమని చేసిన ప్రబోధంలోని భౌతికాంశాన్ని గుర్తించాలి ఈ సందర్భంగా ఆయన విఖిన్న మతవిధానాలను, వాటి వేషభాషలను ఆహారపుటలవాట్లను చర్చించారు “మతాల తెరచాటున పేదవాళ్ళకు జరిగే అన్యాం' 9 అంతా ఇంతా కాదు” (పుట 21) అంటూనే ఆయన మతాలగురించి చర్చించారు పురాణాలలోని అసంబద్ధతను ఎత్తిచూపడంలో ఆవేశంగా మాట్లాడిన ఆయన భావ విప్లవం తీసుకురావడానికి ప్రయత్నించారు

హిందూమతంలో ఉంటూ బాధలు పడడంకన్నా ఇతర మతాలలోకి దళితులు కష్టా... కుసుమ ధర్మన్న

వెళ్ళడం మంచిదని చెప్పినా, ధర్మన్న అలా లేదు హిందూమతంలోనే కొనసాగాలి అనుకుంటే ఏం జరగాలో తన ప్రసంగం చివర్లో చెప్పారు దళితులకు కొన్ని సామాన్య హక్కులు ఇస్తే అప్పుడు చూద్దాం అన్నారు చాకలి మంగలి వంటి (గ్రామసేవకులు దళితులకు కూడా పనులు చేయాలి దళితులను హిందూ దేవాలయాలోకి రానివ్వాలి ఆర్థిక దోపిడి, వెట్టిచాకిరి నిర్మూలించాలి నీటి హక్కు కల్పించాలి, వివక్ష పోవాలి వంటివి ఈ మార్పులు రాకపోవా ఈ హక్కులు రాకపోతే వేరే మతాలలో కన్నా పోవాలి వేరు కొత్తమతమన్నా సృష్టించుకోవాలి అన్నారు ఇతర మతాలలో కూడా ధర్మన్న ఇస్లాం మతానికి అనుకూలంగా ఆలోచించినట్లు అనిపిస్తుంది

1986 నాటికి మనసమాజంలో నెలకొన్న ఆర్థిక సాంఘిక రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ధర్మన్న దళితుల భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించి ఈ ప్రసంగం చేశారు మనకు కావలసింది దేవుడు, మతంకాదు అంటూనే ఇతర మతాలలోకి దళితుడు వెళ్ళడం గురించి చర్చించారు అది హిందూమతంలోని నిరంకుశత్వం మీద విమర్శ. సామ్యవాదాన్ని సమర్ధిస్తూ, దానిని నమ్ముతూ, సామ్యవాదం వస్తుంది రావాలి అని నమ్ముతూ, అది దేశమంతా వ్యాపించినపుడు మేలు జరుగుతుంది అన్నారు ధర్మన్న చివర్లో ఆయన సామ్యవాదం విషయం తేల్చకుండా దళితులు ఏ మతంలో ఉండాలన్న దానికే పరిమితమయ్యారు దీనికి కూడా భారతదేశంలోని కులవ్యవస్థ కారణం కావచ్చు తొలినుంచీ సామ్యవాదులైన దళితులు కొత్తగా సామ్యవాదులు కావలసిన దేమున్నది అన్నది ధర్మన్న అభిప్రాయం కావచ్చు. ఇవాళ మనం మతం దృష్టినుంచి బయటపడి

“మత్రములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అని ఆలోచించవలసిన అవసరం ఉన్నది

సామాజిక విష్లవకారుడు ఆయిన ధర్మన్న సాహిత్యం కాన్ని దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో లేదు ఇదొక పెద్ద వెలితిని సృష్టించింది ప్రజాశక్తి బుక్‌హోస్‌ సి వి సమగ్ర సాహిత్యాన్ని అందించినట్లే కుసుమ ధర్మన్న సాహిత్యాన్ని కూడ ఇప్పుడు అందించి మంచి మేలు చేసింది ప్రత్యామ్నాయ ఆలోచనల సాహిత్య (ప్రచురణ నేటి అవసరం ఆ అవసరాన్ని తీరుస్తున్న ప్రజాశక్తి బుక్‌హౌస్‌కు అభినందనలు సామ్యవాదాన్ని సపొంచని పొందూయిజం 2

సౌంనృతిక సాంఘిక విప్షవమూర్తి కుసుమ దర్శన్న కని ఉద్ధాటన 1 లబ గద్ధలో ఎందరో దలిత కవులు ఉద్భవించాడు. అందులో మెజారిటీ. | | కవులు యథాతథ నమాజాన్నే కోరిన వాళ్ళు. చాలా కొద్ధి నుంది మాత్రమే | , నమాజం యొక్డు మాడ్చును కోరిన వాళ్ళు కుల వ్యవస్థ యోక్క దుర్భార్థాన్ని... | దౌప్పాన్ని బహిర్గతం చేసిన నిర్విరామమైన పోరాటం చేసిన మవోన్నత సాంఘీక. , వివ్లవకారుడు సొంన్యతిక కలం యోధుడు, వైద్య విద్వానా వైద్వు భివక్సి , అయఖేరీ” సంపాదకుడు, కనుము ధర్భన్న కవి రాజమంట్రి నుంది వైద్యం, | ; _ప్రాపొతీ వ్యవసాయం చేసిన మవామవాదు. శతితితలో విజయనగరంలో ఆయన / 'టోగిన ఈ క్రింది ఉవవ్యానం ఎంతో విలువైనది నం. సామ్యవాదాన్ని సహించని హిందూయిజం ఆంధ్ర రాష్ట్రీయ ప్రథమ ఆదిజన సంపూర్ణ స్వాఠంత్ర్య మహాసభ గజపతుల కాటపట్టయిన ఈ విజయనగరంలో 256-12-82వ తేదీన జరిగిన విశాఖపట్టణం జిల్లా దశమ హరిజన.మహాసభకు, నేటి ప్రధమ స్వాతంత్ర్య మహాసభకు నన్ను ప్రారంభకునిగా వుంచి మీ సేవ జేసే భాగ్యం లభింపజేశారు కృతజ్ఞుడను కథ ప్రారంభిస్తా అది విజయవాడ ఇది విజయనగరం అది 1917 ఇది 19386 నేటికి 19 సంవత్సరాలు అప్పుడు అడ్డాల్లో బిద్దలం ఇప్పుడు గెడ్డాలొచ్చిన రడ్డీలం మన వుద్యమం రాష్ట్ర నామంతో ప్రాకి దేకి పడి లేచి- అడి పాడి- తిట్లాడి కొట్లాడి- పార్టీలు, పక్షాలు, సంఘాలు, సంస్థలు, సమాజాలు ఆడించిన ఆటలకీ పాడించిన పాటలకీ తప్పట్లు తాళాలు కొట్టీ కొట్టి, తందనాలాడి తమాషాల్లోపడి మట్టి నలిపిన రోజులు- మన పసితనం, బాలప్రాయం దాటిపోయింది నేడు నవ యువకులమై దిట్టపడి నూనూగు మీసాలు దిద్దుకొంటూ సంపూర్ణ స్వాతంత్ర్య వాంఛతో పల్లె నుండి ఢిల్లీ చేరినట్లు విజయవాడ నుండి- విజయనగరం శత... కుసుమ ధర్మన్న

చేరుకున్నాం కాలచక్రం వాయువేగ మనోవేగంగా గిర్రుమని తిరుగుతూ ఘీంకార గీతాలు పాడుతుంది నేటి వేషభాషలు, భావాలు, (బ్రతుకులు, భవబంధనాలు సహా పరిణామాన్ని (మార్పు) కోరి సంపూర్ణ స్వాతంత్ర్యమనేది తియ్యని వూటలు పూరించి ఉత్సాహ సముద్ర తరంగాల్లో ఆటలాడిస్తుంది

చైనా, జపాను దేశాల్లో ఒకే కుటుంబములో పంచమత సోదరులు యెంచరాని ప్రేమతో బ్రతుకుతున్నారు (వీరికి ఏకోదర భావమెంతో- మతైక్యతా అంతే) టర్కీలో ముసల్మానులు తమ టోపీకి, గెడ్డానికి, పరదాకి సలాం చెప్పేశారు (వీరికి పూర్వాచారాలకంటే- నవీనాచారాల మీదనే ప్రీతి) అమెరికా, ఇంగ్లాండు దేశాల్లో శరీర (దాహం, కామరోగం, దృష్టి దోషం తొలగించే దిగంబరత్వాన్ని అవలంబించారు. (ఇది మన ప్రాచీనుల ప్రధమావస్థ్ర రష్యా దేశంలో స్వర్గ తుల్యమైన రాజ్యాన్ని స్థాపించారు (ఇది మన మహనాటి పంచాయితీ పద్ధతి వంటిది) ఈజిప్టు, చైనా, ఐర్లాండు దేశాలలో చేసే విశ్వ ప్రయత్నాలూ, పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ గారి సామ్యవాదమూ, అంబేద్మర్‌ గారి అన్యమత స్వీకారాందోళనమూ, ఇండిపెండెంటు లేబరు పార్టీ స్థాపనమూ మొదలయినవన్నీ యేమిటో తెలుసునా? సంపూర్ణ స్వాతంత్ర్యేచ్చకు పూర్వ రూపాలు పుట్టకీట్లు

ఇప్పుడు మనం అటు అసెంబ్లీ మెంబరుషిప్పుల హడావిడి మధ్యనూ, ఇటు మతాంతర ఆందోళన నడుమనూ, నల్లేరు కొడలాగ నలిగిపోతున్నాం ఈ సందర్భాలలో సంపూర్ణ స్వాతంత్ర్య రధం ఎలా నడుస్తుందో చెప్పలేం ఎడ్జెమంటె తెడ్దెమనకుండా, తోకపీకుడు బేరాలు లేకుండా ఆదర్భాన్ని అందరూ గౌరవించాలి అందరూ చేతులు కలిపి ఒక్క పట్టుపట్టి ఉం! అని వూగించి లాగితే రధం గిదం కదలి చక్కగా సాగిపోతుంది మన బలమూ బయట పడుతుంది (గ్రహించాలి మరి

నాడు విజయవాడలో నారుపోనిన “శివశ్రేష్టి- సంభుమాన్యుడే” నేడు విజయనగరంలో నీరు పోయక మానడు సంఘ మాన్యుడు సంఘమాన్యుడే సందేహమెందుకు?

ఇప్పుడు సంపూర్ణ స్వాతంత్ర్యమనే పదం వుపయోగించదానికి, ప్రయోగించడానికి రాజకీయంగా కాంగైసు వారికే కాకుండా, సాంఘికంగా మనకి కూడా తేలిగ్గానే కనిపిస్తుంది సంపూర్ణ స్వాతంత్ర్యమనేది గుట్టత్రవ్వి గొయ్యి పూడ్చడం లాంటి పెద్దపని కాని, కట్టివిరచి పొయ్యిలో పెట్టడం లాంటి చిన్నపని కాదు మరెలాగ?

సంపూర్ణ స్వాతంత్ర్య సాధనం ద్వారా దేశం, సంఘం, ఆత్మ అన్నీ తరించి- శాంతి సౌఖ్యాలు అనుభవించి ఆనందించి తీరుతాయి సంపూర్ణ స్వాతంత్ర్య దివ్యసౌధం సామ్యవాదాన్ని సహించని హిందూయిజం మెడ

చేరడానికి నొటి ముసలి నాయకులు తీసిన దారి, దొంగల భయం లేకుండా ధారాళంగా ఆదర్శప్రాయంగా, విజయ సూచికంగా వుందని చెప్పక తప్పదు కాంగ్రెసు నాయకుల ఆదర్శం సామ్యవాదమంటారు మన యువకుల ఆదర్భం అన్యమత స్వీకారమంటారు ఆ స్వీకారంలో అన్నం, బట్ట, ఆత్మ గౌరవం ఈ మూడు ముఖ్య సాధనాలు సామ్యవాదం సిద్ధిస్తే దేశానికి, మతాంతరం వంటబడితే హరిజనులకీ తప్పకుండా మేలు

అన్యమత స్వీకారానికంటే హరిజనులు సామ్యవాదులేం కాకూడదని అడుగుతారు నిజమేకాని- పుట్టింది మొదలు గిట్టేవరకు హరిజనులు సహజంగా సామ్యవాదులే కాని మన సామ్యవాదం హిందువులకి, కాపు కమ్మాది భూస్వాములకి సహించదు రుచించదు సంపన్నులకు నలుపు, స్వార్ధపరులకు పులుపు, దయారహితులైన రైతులకు బల్లెము, ఆత్మశుద్ధిలేని అసహాయ వాదులకు కళ్ళెము కనుకనే కరచే కుక్కకు కండ అడ్గమేయాలి, మత్తు మందు చల్లాలి కలవకుండా కలతలు పెట్టాలి కూడకుందా కుయుక్తులు పన్నాలి తిరగబడితే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు క్రాగించాలి తల్లికీ పిల్లకీ అతక్కుందా చేయాలి అంటే సామదానభేద దండో పాయాలతో కదలకుండా బంధించాలి బాధించాలి మట్టం చేసి విడిచిపెట్టాలి ఇదీ! హరిజనుల సామ్యవాదానికి వచ్చే ప్రతిఫలం అంగబలం, అర్ధబలం లేని నిస్సహాయులం ఏం చేయగలం? ఈ సామ్యవాదం అఖిలభారత సమస్యగా మారితే తప్ప మనకు సులభ సాధ్యం కానేకాదు

సామ్యవాదాన్ని కోరే నేటి ప్రపంచం

సామ్యవాద మహావేదంలో జాతి, మత, దేశ భేదాలకు కాని, ధనికులకు- పేదనాళ్ళనే హెచ్చుతగ్గుల పైత్యానికిగాని, అంతఃకలహాలకీ ఆంతరాలకీ కాని తావులేదు ఇట్టి విశ్వమానవ సౌభ్రాతృత్వ సౌభాగ్యాన్నే నేడు ప్రపంచమంతా కావాలని కోరేది ఏదో ఒక నాటికిది ఫలించి ్రాప్తించవలసిందే ప్రాప్తించి తీరుతుందనే నా విశ్వాసం నేటి ప్రపంచ పరిస్థితులలో నా దేశం, నా జాతి, నా మతం, నా వారు, నీ వారు, నేను, నీవు- “ఎవరికి వారే యమునా తీరే” అనే తుచ్చభావాలు విడిచిపెట్టి, “సర్వం జగన్నాధం” అనే సామ్యశంఖం పూరించి స్వపరభేదాలు సవరించుకోక తప్పదు గత్యంతరం లేదు సర్వసమత్వాన్ని సమాన ప్రతిపత్తిని పెంపొందించుకోవడమే గమ్యస్థానం

మాకైశ్వర్యం, మాకారోగ్యం, మాకు ధనం- మీకు రుణం అంటే- మేము పవిత్రులం, మీరు అపవిత్రులు మాది ఆత్మబలం, మీది దేహబలం అనే న్యూనాధిక భావాలు బలిసిపోయి- మతాన్ని సంఘాన్ని అంతరాల భేదాలతో గట్టిగా బిగించేసి నిరంకుశత్వం చెలాయించే హిందూ సంఘాన్ని దిద్ది తీర్పీవాడు లేడు తనకు తోచదు చెప్పితే వినడు దొరికితే జారిపోవడం- జారిపోతే దొరక్కపోవడం దీని తత్వం ఇదంతా బాతాఖానీ కర కుసుమ ధర్మన్న

బొర్ర మనది గులాంఖాన పర్ర కడుపునిండా కూడూ గౌరవం కోరకూడదు ఎన్నాళ్ళీ మిడిమేళం? ఎందుకీ ప్రక్క తాళం?

బ్రాహ్మణ రాజకీయవేత్త తాను సంస్కర్షనని నటించి బ్రాహ్మణులకు మాత్రం అది బోధించడు

1 అర్చకుడు- గుడిలోనికి రానివ్వడేమయ్యా బాబూ! అని అడిగితే నీకు గుదడెందుకు? బడెందుకు, నీ దేహమే పెద్దగుడి, నీయాళ్ళే దేవుడు ఈ రాతి గుళ్ళలో దేవుడు లేడంటాడు అజ్ఞానం మీద మాత్రం వర్తకం సాగించాలట! బ్రాహ్మణులకు బత్యాలు గిట్టాలట! అర్బ్భకత్వానికి (బ్రాహ్మడేకాని బ్రావ్మాణేతరుడు తగడట! పొలం, పుట్రా, మడీ, మాన్యం దేవుని పేరుతో బ్రాహ్మణుడు అనుభవించాలట! ఎండోమెంటు బోర్టు నుండి పోవాలట!

౨, చూస్తే దృష్టి దోషమంటాడేమిటి పంతులూ! అని అడిగితే- ఛాందసులతో మీకు వాదమెందుకంటాడు అంటే పులికడుగు చారుతో ప్రొద్దు పుచ్చేవాళ్ళు, ఆ కమ్మని కందిపప్పు, అపోటమైన ఆవునెయ్యి- కెరడు గట్టిన గేదె పెరుగు, మేలైన మినపగారెలు, పొందైన బొబ్బట్లలో వుండే కమ్మతనం, కండబలం (గ్రహిస్తే, వీడికి నోరూరి వాటిని తనదాకా రానివ్వడనే భయం కాబోలు? చూసే కూడెందుకరగదూ”? నొప్పా! రోగమా! అయితే సంతర్పణాలు, సష్తాహాలు మానుకోరెందుకో?

8 అంటుకుంటే అదిరిపడి బూతులాడ్దాడేమి కర్మమయ్యా! అని అడిగితే- అది న్వల్ప విషయమని నర్దుకుంటాడు అయితే ఎ అంటరానివాడు, బి చూడరానివాడు, సి చెప్పరానివాడు అనే కరినమైన త్రివిధ బహిష్కారం యెందుకు విధించారో దాని అసలు కిటుకు తెలిసినా చెప్పడు

మూడు రకాల బహిష్మారాలు

ఇది పైకి జాతిద్వేషం లాగ కన్సించినప్పటికీ అతి రహస్యం ఏమంటే- పూర్వం జాతి ద్వేషాలతో పాటు పరస్పర రక్త మిశ్రమం జాతికి కళంకమనిన్ని అగౌరవమని భావించారు ఆ కళంకం రాకుండా స్తీ జాతిని పాతివ్రత్య పంజరాలలో బంధించారు పురుష జాతికి కూడా ఏకపత్నీ వ్రతాలు నేర్పారు కాని నిర్భంధించలేదు ఆచారం రెండో ప్రకృతి అని నమ్మినప్పటికీ సంఘకట్టుబాట్లు (ప్రకృతి ముందు నిలపలేవని కూడా తెలుసును “తలలు బోడులయిజే- తలపులు బోడులా?”” ఈ బాపతుకే మాతంగుడు పుట్టాడట అయినప్పటికి పర సంపర్మం, పట్టరాని కోపం, చెప్పలేని సామ్యవాదాన్ని సపించని పొందూయిజం 6

ద్వేషం అ రోజుల్లో ఆర్యులకు - అనార్యులు జాతివైరులు దాన్నే ఈ రోజుల్లో జాతి వైరమనకుండా, ఆచార వైరమని పేరు పెట్టారు అనార్యులనే హరిజనులు- కష్టజీవులు బలాధ్యులు కండబలం, అండబలం, పిక్కబలం, మన్మధబలం ఇవన్నీ ఇప్పటికినీ హరిజనుల సొంతసొమ్ము ఇట్టీ మన్మధ వీర్యులు కంటబడితే, తమ స్త్రీలలో యెవరైనా (భమింతురేమో! అనే వుద్దేశంతో చూడరాదని, అంటితే- ఆకర్షణ శక్తి లాక్కుంటుందేమో అనే తలంపుతో అంటరాదని, చెప్పితే చవులు (ఊటలు) వూరునేమో! అనే శంకతో చెప్పరాని వాడని, ఆర్యులు ఈ త్రివిధ బహిష్కార శాసనం శాసించారని నిష్పక్షపాత బుద్ధితో శ్రీదండి స్వాములవారు ఖండితంగా చెప్పారు అయితే మా స్రీలకు నీతి లేదా? అని అడుగుతారు అందరికి వుంటుందనే గ్యారంటీ యెక్కడ? మోహం (గ్రుడ్డిది ఆకలి రుచెరుగదు నిద్ర సుఖమెరుగదు వలపు రూపెరుగదు అన్నారు పెద్దలు అంతేకాదు, బొజ్జాబాబుల్ని, భోజన ప్రియుల్ని ఉచపిరగ్రలు, కట్టెబొమ్మలు, దొప్ప చెవులు, దోనె కడుపు, మిట్టనొసలు, మిడుగుడ్దు, తలసన్నం, తాబేలు వర్ణం- ఇలాంటి సరసమైన సరుకుని ప్రీ జనం యేమాత్రం కన్నెత్తి కమ్మగా కౌగలించుకుంటారో ఆ సంగతి రంభా ఊర్వశి మేనకలే చెప్పాలి వీరి దేహాత్మలు వికృతాకారాలు యెందుకు పొందుతున్నాయో తెలిసికొందామని జోస్యం చూపిస్తే కేవలం ఖాన, పీన, సోన అంటే సత్తుగా తిని, చిత్తుగా బొబ్బోవడం వల్ల శీతలించి, చమడా మందమై వికృత రూపాలు యేర్చడుతున్నట్లు జోస్యం తేల్చిందట నల్లని తుమ్మమొద్దుల్లాంటి హరిజనుల్ని మా స్రీలు మోహించబోయారా? అని ప్రశ్నించబోతారు సరే! గోపాలకృష్ణుడు ఎర్రగా దొండపండులాగ వున్నాడనేనా- గోపికలు కోరింది? వృత్తిలోను, రంగులోను గోపాల కృష్ణునికి- హరిజనుడికి భేదమెక్కడో తెలియదు ఈ వాదం అపవాదమంటే ఏర్చి కూర్చి, ప్రత్యేకించి ఒక్క హరిజన జాతి మీదనే, యీ త్రివిధ బహిష్కారం విధించడానికి మూలకారణం యేమైవుంటుందో మరి? 4& ఇంటిలో తనకి, వీధిలో నాకు వడ్డించడం తప్పని తెలిసీ చెప్పలేక, ఆచారం ఒక్కసారిగా పోతుందా? అని కులాధిక్క్యత మరుగుపుచ్చి సాకు చెప్పి చల్లగా జారిపోతాడు 6. వేదోక్తంగా శూద్రుడు బ్రావ్మణ కన్యను పెండ్లాడవచ్చునని శాసనం మార్చమంటే

  • అబ్బే! ఎందుకయ్యా! అవసరం! రిజిష్టరు పెండ్రిండ్లు చేసుకోవచ్చునని సంస్కర్తలాగ సతాచారి కబుర్లు చెప్పి బ్రాహ్మణత్వం కాపాడుకోవాలని చూస్తాడు తాను మాత్రం నాలుగు వర్ణాల పిల్లల్ని నిరాటంకంగా వివాహం చేసుకోవచ్చునని సమయమెరిగి శాస్త్రం చూపిస్తాడు నిర్భయంగా వాదిస్తాడు ాాాాాాాాాాాాాాాాాకుసము ధర్మన్న

6 శోత్రియ బ్రాహ్మణుని కంటే, రాజకీయ వేత్తయిన బ్రాహ్మదే పక్కా మోసగాడు శోత్రియుడు వున్నది వున్నట్లుగా మొకం ముందు ఖచ్చితంగా చెప్పేస్తాడు రాజకీయ వేత్త సామాన్యుడు కాడు ఎత్తులమారి గిత్త జిత్తులమారి నక్క పేచీలకోరు పెదబాబు “నీవు హరిజనుడవు తగిన వాడవు నిన్ను బోర్టు ఫ్రెసిడెంటుగా చేయిస్తాను అది నా చేతిలో పని ఎవరికీ చెప్పబోకు” అని వుబ్సించి, వూరించి, వెర్రెత్తించి మతి చెరిపేశాడు రాజకీయవేత్త ఈ హరిజన మెంబర్ని మినహాయించి అర్ధరాత్రి వేళ పార్టీ మీటింగు జరిపించేసి, “కడుపులో లేకపోయినా- కౌగలించుకున్నా”డన్నట్లు- 10 సంవత్సరాలు (ప్రెసిడెంటుగా యేలిన రాజకీయవేత్తను తిరిగి బోర్డు (్రెసిడెంటుగా చేయడానికి వొప్పించాడు గుట్టు మాత్రం బయట పడకూడదన్నాడు ఏమయితేనేం! హరిజనుడికి ఆముదం రాశారు పైగా బ్రతకనివ్వరు చావానివ్వరు గుండెలదిరిపోయే ఘోరాలు “వ్పేమ్సు స్వాతంత్ర్య ప్రియులం కాంగ్రెస్‌ తెరచాటున బురకావేసికొని యెన్ని చేసినా తప్పులేదు సంఘ సంస్కరణ వూసు మాకక్క్మరలేదు స్వరాజ్యం మాత్రం లడ్డూ వుండలాగ చేతులో పడాలి” అనే పోరంబోకు రకాల వల్ల యేమీ తెగదనుకోండి కవితాగ్రామంలో జరిగిన భయంకర దృశ్యం చెట్టినాడులో జరిగిన ఘోరం తూర్పుగోదావరి పొన్నమండలో జరిగిన అఘాయిత్యం ఆ జిల్లా రామచంద్రాపురం తాలూకా చెల్లూరులో జరిగిన అన్యాయం విశాఖపట్టణం జిల్లా గాజులరేగలో జరిగిన అక్రమం చిత్తూరు జిల్లా మంగలగుంటలో జరిగిన దౌర్జన్యం, ఏలూరులో జరిగిన క్రూరం, జయపూర్‌ స్టేట్‌లోను, రామనాథ్‌ జిల్లాలోను జరుగుతున్న దురంతాలు వింటుంటే గుండెలదిరి పోతున్నాయి వీటిని జరిపించేదెవరు? హిందువులు, హిందూ మతస్తులే కదా? ఈ నాయకులు, వినాయకులు ఏమీ మాట్లాడరెందుకో!

అన్ని వర్ణాల పిల్లలూ చదువుకొనే బోర్డు పాఠశాలకి తమ పిల్లల్ని కూడా పంపించడమే కవితాలో హరిజనులు చేసిన మహానేరం ఇందుకు నూళుల్లో కిరసనాయిలు పోసి, హింసించి, కొంపలు తగలబెట్టడమే హరిజనులకు వేసిన శిక్ష

రవికెలు తొడుగుకొని ఐజారు వీధుల్లో నడవడమే చెట్టినాడులో హరిజన స్త్రీలు చేసిన తప్పిదం పొన్నమండలో హరిజన యువకులు సైకిళ్ళపై వీధిలోకి వెళ్ళడమే వారు చేసిన సాహసం చెల్లూరులో హరిజనులు కుంతీదేవి వుత్సవం చేసి పెద్ద వూరేగింపుతో వెళ్ళడమే వారు చేసిన ఘోర పాపం గాజులరేగలో హరిజన వధూవరులను సామ్యవాదాన్ని సపొంచని హిందూయిజం 116

గుర్రంపై వూరేగించడమే వారు చేసిన విరుద్ధ కార్యం మంగలగుంట రాజవీధిలో హరిజనులు చెప్పుల కాళ్ళతో నడచిపోవడమే వారు చేసిన మవాీద్రోహం అందుకు వారికి తన్నులు, గుద్దులే తగిన బహుమానం, ప్రాయశ్చిత్తం

ఏలూరులో ముక్కోటి యేకాదశినాడు దేవుళ్ళను వూరేగించే సమయంలో, సనాతనుల దేవుడికి- మాల దేవుడు బజారు వీధిలో తారసిల్లడమే తగనిపని ఇందుకు పోలీసువారి సహాయంతో సందులమ్మట, గొందులమ్మట మాల దేవున్ని పాఠరదోలడమే హరిజనులకు చెప్పిన కబడ్డార్‌

అంచులు, కండువాలు వుండే గుడ్డలు, పట్టుబట్టలు, బంగారు-వెండి నగలు ధరింపరాదని, నేతి వంటలు చేసుకోరాదని, ఇండ్లకు తలుపు లుండరాదని ఘోరమైన సాంఘిక నిర్బంధ నిరంకుశ శాసనం చేసి, జయపూర్‌ స్టేట్‌లో రామనాధ్‌ జిల్లా హిందువులు హరిజనుల్ని యేలి పాలిస్తున్నారు పూర్వం మూతికి ముంకా, ముడ్డికి చేటా, కాళ్ళకు చీపురు కట్టుకోవాలనే శాసనమట ఈ 20వ శతాబ్దంలో కట్టకూడదు, కుడువకూడదు, ధరింపకూడదు, తలుపులుండ కూడదనే ఘోరమైన ఆర్డినెన్సులట!' ఇది మన దురదృష్టమా! లేక హిందువుల దురహంకారమా?

తిరుపతి వెంకటేశ్వరుని కొండమీదకు గవర్నరు దొరగారిని చెప్పుల కాళ్ళతో డోలీలో మోసి తీసుకొని వెళ్ళవచ్చునట ఆ జిల్లా మంగలగుంట నడివీధిలో మాలవాడు చెప్పుల కాళ్ళతో నడవకూడదట భక్తి తత్పరుడై ఎత్తురాజులు దాసు (హరిజనుడు) తిరుపతి దేవస్థానంలో అలివేజిమంగాదేవిని పూజించాడనే నెపముతో నేరం ఆరోపించి, కోర్టుకు లాగించిన సంగతి మరచిపోగలమా? మాలవ్యా పండితుడు మనకు మంత్రోపదేశం చేసి దేవాలయ ప్రవేశాలు చేయిస్తాడట! అయితే యిప్పుడు దేవాలయాలకు ఫోయేవారందరూ మంత్రాలు నేర్చుకున్నవారే కాబోలు?

పైన చెప్పిన దారుణ క్రూరకృత్యాలు ప్రమాదం చేత అచ్చటచ్చట అప్పుడప్పుడు సంభవించేవి కావు మనకి నిత్యానుభవములే మన ప్రాణాలు కారు చౌక మన మంటే అంత నిరసన భావం! మనం మనుష్యులం కాము! పశువులము' ఇదే సనాతన హిందూమతం! సవర్డుల (ప్రేమతత్వం! వారి అహింసా ధర్మం!

1 కవితాగ్రామ హరిజనుల పడే బాధలు చూడలేక ఆ గ్రామం విడచిపోమన్నాడు

(గాంధి 2 ఆత్మ గౌరవం కాపాడుకోవాలనుకుంటే, హరిజనులు హిందూమతాన్ని విడనాడుటే లాభమన్నాడు (అంబేద్మర్‌)

టాటాల. కుసుమ ధర్మన్న

  1. కవితాగ్రామ హరిజనులు తమ పాదధూళిని ఆ గ్రామమందే విడచి రమ్మన్నాడు (గాంధి) 2 దేశంలో వున్న హిందూ మత కల్మషాన్ని తమ పాదాల నుంచి విసిరి, దానిలోనే పారవేసి బయటకు రమ్మన్నాడు (అంబేద్మర్‌) అంబేద్మర్‌ పొరబడ్డాడని గాంధి తలంపు తన వుద్దేశం సరికాదని రుజువు చేసే ప్రతీ మనిషి పారబడ్డాడని అనుకోవడం సహజ లక్షణమే కదా? ఊరు విడవడానికి వీళ్లేదంటే, ప్రాజాలే విడచుకొండని చెప్పునేమో గాంధీగారు 1 అన్యాయమే మా యిలవేల్పు 2 అమాయకుల్ని పీడించుకు తినడమే మా కులవృత్తి 8 దేవుడని- కర్శని- దబాయించే బందిపోటే- మా మతం ఇసుక తక్కెడ కాంగ్రెస్‌ నిర్మాణ కార్యక్రమంలో అస్పృశ్యతా నివారణమనేది ఒక ఆంగం కేవలం తీర్మానాలే అస్పృశ్యత తీసివేయగలిగితే, స్వరాజ్యాన్ని మాత్రం యెందుకు తీసుకురాలేవు? స్వరాజ్య సైనికులు జైళ్ళకి-లారీలకి గురికావలసిన అవసరమెందుకో కాంగ్రెస్‌ వారు గవర్షమెంటుతో చేయడానికి జంకనటువంటి సత్యాగ్రహం, అస్పుశ్యతా నివారణ పట్ల తలపెట్టరెందుకో? అది బెల్లపు ముక్క ఇది అల్లపు ముక్క కాబోలు? ఎవరికీ యే విధమైన బాధ కలుగకుండా, ఐకమత్యం చెక్కుచెదరకుండా, మరొక శతాబ్దం వరకూ అస్పృశ్యత పోకుండా, స్వరాజ్యం వచ్చాక దీని కోసం నెమ్మదిగా మరొక పోరాటం సాగించవచ్చునని కాంగ్రెస్‌ వారి వుద్దేశం కాబోలు? ధనికుల చేతిలో కీలు బొమ్మయిన కాంగ్రెస్‌, పేదల రక్తస్తకమయిన ఇసుక సౌధం నిర్మించుకుంది దాని అడుగున కుములుతుండేది ఒక అగ్ని పర్వతమని తెలిసికోదు మలయమారుతం, శరత్మాల చంద్రికలు, ఎల్లప్పుడూ తొనే అనుభవించగలవని కలలో సమా కేరింతలు కొడుతుంది ఎంత త్వరలో తాను మేల్కొని అదుగునున్న హరిజనుల్ని కూడా తనతో పాటు సమానంగా చూస్తే, తనకీ హరిజనులకీ అంతమేలని తలంచదు ఇందుకు సేవా సంఘాల్ని ముందు బెట్టింది హరిజన సంఘములో రగిలి రగిలి, హ్రష్టరబ్లదోయే కాలాగ్నిని చల్లార్చడానికి యేర్చడ్డ వాటికే హరిజన సేవా సంఘాలని రు పేడ తక్కెడ హరిజనులకు సిరిజనులు రుణస్తులని గాంధిగారి వ్యాఖ్యానం ఉడికెత్తి ఉద్రేకింపబడే హరిజన యువకులు వేడి వేడి రక్తాన్నుంచి వెలువడబోయే దావాగ్నిని చల్లార్చదానికి సామ్యవాదాన్ని సహించని పొందూయిజం 20

పుస్తకాలు, పలకలు, విద్యార్థి వేతనాలు ఎరేసి, అంటగట్టి- బానిసత్వంతో బంధించాలని కుట్రపన్నారు తియ్యని మాటలతో మోసగించి వశపరచుకుంటున్నారు తమ్ము పీడించువారినే, పోషించువారని ట్రమింపజేస్తున్నారు

చిరకాలాన్నుంచి మనల్ని ఒక ఇరుకు బోనులో ఇరికించారు అది యెలాగో తప్పించుకున్నాం ఇప్పుడు ముక్కా ముదుసూ, రొట్టె ముక్కలూ అడ్జమేసి సేవా సంఘమనే క్రొత్త బోనులోకి లాగుతున్నారు ఈ బందీఖానా 144గో సెక్షన్‌ బాపతేరా బాబూ తెలిసికోండి' మేల్కోండి! అని నాబోటి వాళ్ళెవరైనా నోరెత్తితే చూచారా! పెంచిన కుక్క కాలు కరవొస్తుందని గొంతు బీక్కొని, తెగ్గింజుకొని గుడ్తెర్రజేసి, గుటకలు (మింగుతారు వీరి గెడ్డాల క్రింద కారేనీళ్ళు త్రాగాలని హరిజన విద్యాధికుల్లో కొందరు, మాయతెర మీద నాటకాలాడి కులాన్ని మరిపించబోతారు “ఎక్కువ చదువుకుంటే, ఎక్కువ మోసాలు నేర్చుకోవచ్చు”నట

లోకోత్తర పురుషుడైన గాంధీ మహాళ్ళుడు ప్రాయోపదేశం (ఉపవాసం) యెందుకు చేశాదో తెలుసునా? హరిజనులని పిలువబడే మన సంఘానికి (00202 £16640240) ప్రత్యేక ఎన్నికలు పనికిరావని, వాటి వల్ల హరిజనులు హిందూ సంఘాన్నుంచి మరింత దూరమైపోతారని గాంధీ వారి విశ్వాసం అయితే ప్రాయోపవేశ ఫలితంగా బయలుదేరిన సేవా సంఘాలు చేస్తున్న పనులేమిటి? ఏ ప్రత్యేకతైతే హరిజనులకు పనికిరాదని మహాత్ముడు ప్రాయోపవేశం పూనితే బ్రహ్మరథం పట్టారో అటువంటి ప్రత్యేకతతో కూడుకున్న ప్రత్యేక బావులు, ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేక దేవాలయాలు, ప్రత్యేక దేవుళ్ళు, ప్రత్యేక పేర్లు, ప్రత్యేక పల్లెలు కల్పించి, హిందూ సంఘాన్నుంచి మరింత ప్రత్యేకించి -విడదీసి- పెడమొగం పెట్టిస్తున్నారు ఇదేనా గాంధీగారి వుద్దేశం? అయితే అస్పృశ్యత పోయేదెలాగ? ఆర్థిక మార్గాలు కలిగేదెట్టు? హక్కులు కాపాడదేదెప్పుడు?

సేవా సంఘ నిధి నుండి వేతనాలు పొందే సవర సేవకులు హరిజన యువకులను ఎలా ్రేమిస్తున్నారో గ్రహించారా? గాంధీగారు మేకపాలు పిండుకుని తాగుతూ, మేకపిల్లని ఒడిలో వుంచుకొని దాని తలా- తోక- చెవులు సవరించి, బుజ్జగించి, "౦ "క్యూ 462౯ 104” ఓ నా ప్రియమైన మేకపిల్లో అని ముద్దాడి (ప్రేమించడం ఎంతో హరిజన సేవకుల (ప్రేమ కూడా అంతే! దీన్ని సవతి తల్లి ప్రేమంటారు ధీరులు

మన పౌరుషం చంపారు చంపుతున్నారు మనం చండాలురమని- సంకరజాతి వాళ్ళమని- రండ కొడుకులనని- ముండ బిద్దలమని సనాతనుల వాదం బ్రాహ్మణ- శూద్రునితో రంకుపోతే పుట్టామట

“జాతు లెంచనేల జన్మముల్‌ తెలియరా,” వలే... కుసుమ ధర్మన్న

తపసు చేత ద్విజుడు, “తర్మింపు కులమేది?” తాతగన్న తల్లి ! తండ్రినిగను తల్లి తన్నుగ్రన్నతల్లి ! తల్లి తల్లి తల్లి శూద్రురాలు ! తానెట్లు బాపడు? విశ్వదాభిరామ వినురవేమ మాతంగుడు సంకరుడు అతని మునిమనుమలు (బ్రాహ్మణులు అంబ అంబాలిక ముండలు వీళ్ళు నియోగించుకున్న వ్యాసుడు రండకొడుకు ముండలకి రండ కొడుకు- మిండడు గోత్రీకులు బోల్డంతమంది ఇతని కొడుకు పాండురాజు పాండురాజు కొడుకుల మనుకొనే పాండవులు ఐదుగురూ, అయిదుగురికి పుట్టారు ఆరోవాడు కర్ణుడు “ఎక్కడ పొర్షితేనేం !' మాదొడ్లో యీన్సే చాలు"ననుకున్నారు పాండవులయిదుగురికి ద్రౌపది ఒక్కతే భార్య (ద్రౌపదికి కుంతీదేవి అత్తగారు అత్తకు నలుగురు కోడలుకి అయిదుగురు కర్టుణ్జి కూడా కలుపుకుంటే, అత్తకి తీసిపోయేది కాదు కోడలు ఆపై సంగతులు మనకు తెలియవు తత్వం “తల్లి ఒక్కతే, తండ్రులెందరో- తధ్యము నాకది తెలియదయా” అన్నాడు (బ్రహ్మంగారు ఎవరికి యెంతమంది బాబులో, ఎవడికి తెలుసును? ఆ సంగతి అమ్మయే చెప్పాలి కనుక తీగెలాగితే డొంకంతా కదులుతుందన్నారు నిజమే మరి- అయితే, గొంగళ్ళోతిని వెంట్రుకలు లెక్క పెడతారెందుకో! ఈ వేళ హిందూ సంఘ మహావృక్షాన్ని దులిపి చూడండి- ఎన్ని సంకరకాయలు రాల్హాయో! ఏమిటో తెలుస్తుంది మూల పురుషుల జాతకాలు విప్పితే అంతా సంకరమే అందరూ సంకరులే తమ తాతముత్తాతలు చేసిన అపరాధాలకి తమరు బాధ్యులు కాకపోతే, మన పూర్వీకుల అపరాధాలకి మనం మాత్రం యెలా బాధ్యులం? మనలో నందవారు, చోకామేళుని వంటి మవాభక్తులు పుట్టారు అగ్రజాతుల్లో జార, చోర, గోఘ్న ఇత్యాది దుర్వత్తులు అవలంబించువారు వున్నారు అందుచేత జాతిని బట్టి గౌరవాలు నిర్ణయించడానికి వీల్లేదు జాతి చండాలునికంటే - కర్మ చండాలుడే హీనుడన్నారు ఘోరమైన భారత యుద్దానికి పాండవ సంకర సంతానమే హేతువు ఆ భాగవత కృష్ణుడే- భారత కృష్ణుడని ఒప్పుకుంటే, నాడు పాండవుల కోసం శ్రీకృష్ణమూరి నేడు హరిజనుల కోసం మహాత్మాగాంధీ అవతరించారనుకోవాలి కృష్ణాయబారములో కౌరవులది అన్యాయమని, అజ్ఞానమని నచ్చజెప్పి పాండవులకి తోద్పడ్డాడు గౌంధీ సందేశములో హిందువులది అధర్మమని, పాపమని బోధించి హరిజనుల్ని లేవగొట్టాడు అది గొల్లటేరం ఇది కోమటి బేరం, అది తెగతెంపు ఇది ముసుగులో గుసగుసలు ఆ బోధ కామయోగం- ఈ బోధ నిష్కామయోగం కృష్ణభగవానులకి- గాంధీ దేవునికి సామ్యవాదాన్ని సహించని పొందూయిజం 22

బేధం కన్పించదన్నారు. కాని శ్రీకృష్ణుని విశ్వరూపంలో, అర్జునుడికి విశ్వమంతా దర్శింపజేశాడు గాంధీ మహాత్ముని విశ్వ విజ్ఞాన మూర్తిలో, అన్యమత సహనం అంతగా కన్ప్సించలేదంటారు ఆ లోపాన్ని పూర్తి చేయడానికేమో అన్నట్లు తన రక్తజనిత జ్యేష్ట పుత్రుడు హీరాలాల్‌ గాంధీ మహమ్మదీయ మతం అవలంబించి అబ్బుల్లా గాంధీగా మారాడు కర్మ- పరిపూర్తి చెందిందేమో ఇప్పుడు?

ఇదంతా సనాతనుల బుర్రకెక్కదు ఏమీ నచ్చదు తలపోటు పాపం గాంధీగారి మీద బాంబు విసరి చంపాలని ప్రయత్నించారు కాని భగవంతుడు తప్పించాడు

ధర్మశా(స్తాలు మారకూడదని ననాతనుల సిద్ధాంతం మీ ఆచరణ ధర్మశాస్తానుకూలంగా వుందా? అని ప్రశ్నిస్తే దెబ్బతిని, ఆపద్ధర్మమని- లోకాచారమని దాటిపోతాడు కానీ ధర్మశాస్త్రాలు ఆచరణ యోగ్యాలు కావు ప్రపంచంలో ఒక్కడైనా ధర్మశాస్తానుసారంగా వర్తించువాడుండడని ఖండితంగా చెప్పొచ్చు. ఏమంటే వాటి నియమాలే అటువంటివి (హరిశ్చంద్రుడు అబద్ధమాడడు- మనం నిజమాడం) ఇంతే! శాస్తాలకీ మనుష్యులకీ మధ్య వుందే తేడా! సనాతనుడు తన కొడుకుని అటు ఆంగ్ల పారశాలలో చదివిస్తాడు ఇటు వేదశాస్తాలు మంటగలిపి పోతున్నాయని వుపన్యాసాలు కౌడతాడు వేదశాస్తాలు విడచిపెట్టి ధనార్జన సాధనమని ఇంగ్లీషు చదువుతారు తమ వృత్తి కానటువంటి సేద్యం, వాణిజ్యం, ఉద్యోగాలు చేస్తారు వీరి స్వేచ్చా వృత్తిని శాస్త్రాలు అరికట్టలేవు వీరికి అనాచారముండదు ఆచారం వెనక, తమ ధర్మాన్ని తమరు ఆచరింపరు ఇతర్లకు బోధిస్తారు ఏది చెప్పినా గురివెందగింజ రకమే

దేవాలయం అపవిత్రులను పవిత్రులుగా చేసేచోటు (బ్రాహ్మణాదుల పూజలే కాని- అస్పృశ్యుల పూజలు దేవుడు అంగీకరించడా? జ్ఞానయోగ, కర్మయోగాలతో బ్రాహ్మలు తరిస్తారు భక్తియోగమే అస్పృశ్యులకు సాధనం దేవాలయానికి పోతే దేవుడికి వల్లమాలిన కోపం! అంటినంత మాత్రాన, చూచినంత మాత్రాన మయిలపడిపోయే మతం, మంటగలిపినా విచారపడదే వారుండరు మనకు కావలసింది దేవుడు కాని, మతం కాదు మతం లేకపోతే దేవుడు ఎలా దొరుకుతాడనే సంశయం వుందనక్కరలేదు "3962006 216 60 8004" అంటే, మంచిగా ప్రవర్తించి- మంచి పనులు చేయగలిగితే, లోకంలో అంతకంటే మించిన మతమే లేదన్నారు అయికే మంచి నేర్పేది ఎవరిని అడుగుతారు మంచి చెడ్డలు నేర్పేది మన మనసే

“₹/0016 13 16 క౦0418203లో' లోకానుభనమే పెద్ద గురువన్నారు ఈ మఠాలు- మనుష్యులూ శ్రమపడి మనకు నేర్పే విశేషమేమి కన్పించదు తన గోచి తాను సర్జుకోగలిగితే చాలు అదే పదివేలు మతం అవసరం లేకుండగనే మంచిగా ప్రవర్తించే జ్ర. కుసుమ ధర్మన్న

మానవ సంఘాలు కొన్ని లోకంలో వున్నాయి “నీతిలేనివాడు- కోతికన్న పొడన్నారు ”

ఈ గోముఖ వ్యాఘాల వల్ల భారతమాత కుళ్ళి కృశించి, ఐకమత్యమైకమత్యమని ఫఘోషిల్లుతున్నది వర్ధాలు వల్లకాటిలో పెట్టమంటుంది “ఘనమైన కులమేది? కాని కులమేది? కులమెంచగానేల? గుణమె కారణము” అని వీరబ్రహ్మం గారితో పలికించింది

ఉర్విజనుల కెల్ల నొక్క కంచముబెట్టి

పొత్తుగుడిపి కులము పొలయజేసి

తలను చెయ్యి బెట్టి తగనమ్మ చెప్పరా

విశ్వదాభిరామ వినురవేమ

వేద వేదాంగ వేద్యులు ఏరీ? కనిపించరే! పలుకరు, ఉలకరు, కులమతాల పేరుతో కులుకులాడాలనుకునేవారు- పలుకుతారా, వులుకుతారా? ఎక్కడి మాట! ఏమి లాభం! నలిపించుకుంటే గాని ధనియాలు పండవు

విశ్వవిఖ్యాత పురుషుడు, డాక్టరు అంబేద్మన్‌ హిందూ ధర్మ నిరంకుశ క్రూరకృత్యాలు విన్నాడు, కన్నాడు, అనుభవించాడు, ఆలోచించాడు, నిరీక్షించాడు, తుదకు నిరాశజెందాడు ఈ దొంగ దరిద్రగొట్టు హిందూమతంలో హిందువుగా చావనన్నాడు హిందూ ధర్మాన్ని (చోడ్‌దేవ్‌) విడవండి, విడచి పొండన్నాడు హితమైన అన్యమతంలో కలవండి, కలసి పొండన్నాడు మాలకంపు పూర్తిగా మాపుకోమన్నాడు

ఏ పంచలో చేరాలో?

మనం పుట్టి పెరిగింది హిందూ మతములో పుట్టింది మొదలు చచ్చే వరకు చేతికి, నోటికి దూరం చేసింది కూడా హిందూ మతమే మనం కుక్కల కంటె తక్కువట చండాలులారా! ఛీ పొండని వూరికి దూరంగా పారదోలింది అంటకూడదు, ముట్టకూడదు, ప్రాణం విసిగిపోయి బ్రతుకు జీవుడా! అని కైస్తవుల్లో తురకల్లో కలిసిపోతుంటే కంటగింపు, కడుపుమంట, అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదు. పెడతాదనే ఆశలేదు ప్రేమతో పిలుస్తాదనే నమ్మకం లేదు *రామిగాడు- సీతది- బసవడు-గవరిదొ అని ముద్దు పిలుపులట ఎద్దు- వెంకటేశుడు, గద్ద-గరుత్మంకుడు, కుక్క- ఖైరవస్వామి, పంది- వరహావతారం, పాము-సుబ్బారాయుడట ఈశ్వర ప్రతిరూపమైన మానవుడేమో- హీనుడట ఈ క్షుద్ర నీచ, క్రూర జంతువులేమో, దైవ సమానులట ఆవాీ! ఇదే కాబోలు? విశాలమైన హిందూమత వేదాంతం? వారి వేదాంతాన్ని మనం చూచుకోక తప్పదు జాలం చూయకూడదు అభిమానానికీ- సామ్యవాదాన్ని సహించని హిందూయిజం ల్‌!

అవమానానికీ- మధ్య వూగులాడితే లాభం లేదు మతం మీద అభిమానం, మాటలు పడలేక అవమానం తన్ని తోలేస్తుంటే చూరుపట్టుకొని వ్రేలాడేరకం మనది మరెలాగ? ఈ ద్వంద్వ తత్వాన్ని మార్చేయాలి చొరాయించి ముందుకు నడిచేవాడు వెనకకు చూడకూడదు సింహానికి ముందు చూపే కాని వెనకచూపు లేదు రెండు పడవల మీద- రెండు కాళ్ళూ వేస్తే యేమవుతుందో మనకు తెలుసు కాలాన్ని బట్టీ కారణాలు మార్చుకోవాలి మార్చే ప్రకృతి ధర్మమన్నారు మనలో మార్పు కలగాలి మార్సే జీవితానికి అందం

హిందువులు, హిందూ మతాచారాలు, యుగ యుగాల నుండి మనల్ని యెంత అజ్ఞాన స్థితిలో పెట్టి గట్టిగా అదిమి పట్టాయో చూచారా?

అప్పుచేసి గొప్పగా పెండ్లి చేసుకోవాలి అవి తీర్చడానికే రంగూనో మోల్మేనో, సిలోనో, సింగపూరో పోవాలి వయసొచ్చిన పెళ్ళాం పెడదారి పట్టాలి వీడు- యే కుంజాం గళ్ళీనో మరిగి కరిగిపోవాలి ఇక్కడ అప్పు పెరిగిపోవడం, పంపిన డబ్బు వడ్డీ క్రింద జమకట్టుకోవడం, అప్పు క్రింద కొంప వేలం వేయడం, ముసలి తల్లిదండ్రులు కూటికి చేతులు, కాటికి కాళ్ళు చాచుకొని విలపించడం, చస్తే యెక్తే దిక్కు లేకపోవడం, ఇదంతా కళ్ళారా చూస్తున్నాం పెండ్లి చేసిన కులపెద్దలు, విందులారగించిన కులస్తులు, అప్పిచ్చిన కావుకమ్మ దొరలే కదా దీనికంతకు కారణం ఈ నరకబాధలు, వంశనాశనాలు- నిన్నటివా? మొన్నటివా? చూస్తూ మనం యేం చేయగలుగుతున్నాం? దరిద్రులం యేం చేయగలం? చెప్పితే ఏమైనా ఖాతరు చేస్తుందా సంఘం పెద్దలనాటి ఆచారమని, నిర్బంధమని సాకు చెప్పి- తెలిసీ గోతిలో పడుతుంది తమాషా చూద్దం తప్ప- హిందూ సంస్కర్తలు యేం చేయగలుగుతున్నారు? కుండలో కూడు కుండలోనే ఉండాలి- బిడ్డ మాత్రం దుద్దులాగుండాలట! దీన్ని భరించలేకనే కదూ కైస్తవుల్లో కలిసిపోవడం హిందువుగా వుంటే పురిటిలో కల్లు, పెళ్ళిలో కల్లు, చావులో కల్పు దినంలో కల్లు ఇంతేనా” ప్రదానంలో కల్లు సమర్హలో కల్లు, శోభనాల్లో కల్గు అంతా కల్లే! పెళ్లుమంటా, గొళ్లుమంటా వుంటేనే గాని కులం వాళ్ళు, పెద్దలు, వీరుడు, పేరంటాలు తరించరట! ముక్తి దొరకదట! “ఇల్లు కాలి ఒకడేడుస్తే ఒళ్ళు కాలి ఒకడేడిశాడన్నట్లు, మనిషి పోయి గొళ్ళుమని యేడుస్తుంటే- కల్లు కడవమాటేమి చెప్పుతావని అడుగుతాడు పెద్దమాల ఈ కల్గుకడవలు- పంది మాంసాల ఖర్చులు, కులం వాళ్ళతో పదే బాధలు కైస్తవుల్లో కలిసేవారికుండవు తాతల నాటి అప్పులని తప్పుడు పత్రాలు చూపించి వంశపారంపర్యంగా దాస్యాంబుధిలో, దరిద్రకూపంలో దిగముంచి, హరిశ్చంద్రుల్ని చేసి విడిచిపెడుతున్నారు. అంటే- పెళ్ళాన్ని బిడ్డల్ని జ్తక్రానాూాాౌ కుసుమ ధర్మన్న

అమ్ముకున్నా అప్పు తీరదు ఇంకా బకాయే' ఇంతకంటే హిందూ సంఘం చేసే వుపకారం కనిపించదు మనకు కావలసింది మతం కాదు- ఆత్మ గౌరవం

ఇది పరివర్తన యుగం, పల్లెలు పట్నాలుగా, బళ్లు ఓడలుగా మారుతున్నాయి రాజులు, రాజ్యాలు తలక్రిందులవుతున్నాయి మొన్నటివరకు గంజిలేని వారు ఈ రోజున కలిమితో బ్రతుకుతున్నారు మనకీ అవకాశాల్లేవు దొరకనివ్వరు ఎంత కొలిచినా గొర్రెకు బెత్తెడు తోకే అన్నట్టు మన పని ఆ గుడిసెల్లోనే గుసగుసలు మడత కుడుములే కూడు ఎక్కడ వేశావురా గొంగళంటే- వేసినకాడనే వుందన్నాడట! ఎన్నాళ్ళీ లొకలొకలూ? ఏమి సార్ధకం? బాగుపడడం మన జన్మహక్కుకాదా మనకు కావలసింది మతం కాదు, కబళం- ఆత్మ గౌరవం

ఈ విషమ పరిస్థితుల్లో మనం ఏ పంచ జేరాలో చెప్పమని అడుగుతారు తురకల్లో చేరితే మంచిదని ఒకరు, శిక్కుల్లో చేరితే బాగని ఒకరు, జైస్తవుల్లో చేరికే గౌరవమని ఒకరు, ఇలాగే వుండిపోదామనే వారొకరు స్వతంత్ర మతం స్థాపించాలని మరొకరు “ఇది మేకల మందకాదు అమ్ముకోవడానికని యం సి రాజాగారి వాదం” ఇది “దున్నల మంద కాదు- దున్నించుకొని దొరలుగా (బ్రతకదానికని” డాక్టర్‌ అంబేద్కర్‌ గారి (ప్రతివాదం

తురకల్లో కలిస్తే పందిమాంసం మాని, గెద్దం పెంచుకొని పరదా కట్టుకోవాలి శిక్కుల్లో కలిస్తే గొద్దుమాంసం, పొగచుట్టా మాని కత్తో, కర్రో చేత పుచ్చుకొని, తలా, గెడ్డం పెంచుకోవాలి (ఈ మతం మన ప్రాంకానికి పారలేదు) బొట్టూ, బొమ్మా తప్పితే కైస్త్రవులకి మనకీ అట్టే భేదం లేదు

తురకల గొడ్డు మాంసం, శిక్కుల పందిమాంసం మనం తింటాం పొగ చుట్ట కాలుస్తాం మనకు భేదమే లేదు సర్వభక్షకులం బొట్టూ-బొమ్మా పూజా అట్టే లెక్కలో మాట కాదు కాని కైస్త్వ మతంలో దమ్ము చాలదు తురకల సంఘకట్టు, శిక్కుల ధైర్యసాహసాలూ తెలిసినవే ఇంకా సమాజాలున్నాయి కదా అని అడుగుతారు ఇవి మహాసముద్రంలో చిన్న దీవుల వంటివి మంచివే కాని, మైనార్టీ పార్టీలు ఇందులో యేది విడచి యెందులో కలవడానికీ చిక్కుగానే వుందని పరిశోధకులు పలుకుతున్నారు ఇంతకూ తర్మ వితర్మాల్లో పడ్డది మనబేరం అయితే అధైర్యపడవలసిన పనిలేదు

గెడ్డాలు, తలలు- 'పించుకుంటే చీకాకు పుట్టి- పేలు పుడఠాయని శంకించే వారిని, పెంచుకుంటేనే గాని వల్లకాదని నిర్బంధించకూడదు టర్కీ సాహేబులకి గెడ్డాలు, టోపీలు, పరదాలు లేవు వారు ముసల్మానులే ఇప్పుడు కొత్తగా తురకల్లో కలిసే వారికి సున్నతీ సామ్యవాదాన్ని సహించని హిందూయిజం 2

పట్టుదల లేదు మిగతా వాటికి మాత్రం యెందుకు పట్టుపట్టాలి? జుట్టు, బొట్టు, కట్టు మొదలైనవి స్వరాన్ని ఇవ్వలేవు అడ్డురావు మనం తిని కుడిచే వాటికి, కట్టి విడిచే వాటికి యెక్కడా నిర్వంధముందడకూడదు అది సంపూర్ణ స్వాతంత్ర్యమే అదట్లుండగా! మనం సహజంగా దరిద్రులం అందుచేత మన పెద్దలు యేం చెప్పారో జ్ఞాపకముందా? కోడిని పెంచుకుంటే కొత్తప్పు, పందిని పెంచుకుంటే పాతఠప్పు తీర్చుకోవచ్చునన్నారు ఆర్థికంగా మనకు తోద్చడతాయి తురకలలో కలిస్తే పందిని పెంచకూదదు దానికి బదులుగా వచ్చే ఆదాయం కన్పించదు ఇతర్లు దొరకనివ్వరు ఎందులో కలిసినా కష్టపడక తప్పదు ఎవరు కూడ కూర్చోబెట్టి పెట్టరు అది ఆశించకూడదు కూడాను ఎన్నాళ్ళు? ఏమి లాభం? కాబట్టి ఎందులో చేరాలో! ఏ విధంగా వుండాలో? ఆ సంగతి ఆఖరు మాటలో తేల్చుకుందాం ఆగండి!

మాంసాహారం మంచిది కాదట హిందూ దేశంలో బ్రాహ్మలు, వైశ్యులు తప్ప మిగతా వారందరూ మాంసాొహారులే బ్రాహ్మణ వైశ్యులు జనాభా సంఖ్యలో చాలా తక్కున బెంగాలు, కాళ్ళీరు, పంజాబు, మళయాళ దేశాలలో బ్రాహ్మలు కూడా మాంసాహారులే ఇప్పుడు అన్ని రాష్ట్రాల బ్రాహ్మలు చాలా భాగం మాంసాదులు తినడానికి జంకడం లేదు కాని తింటున్నామని చెప్పుకోరు గొప్ప చెప్పుకోవడాలలో ఇది గొప్ప. మహా రుషులలో చాలామంది మాంసాహారులే యజ్ఞాలు, యాగాలు మాట సరేసరి తరిపి దూడల్ని నల్ల మేకల్ని తంపటేసుకొని తినేవారు కండ- కండకు బలమన్నారు దీర్చాయువులతో జీవించారు పెద్ద పెద్ద శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు వ్రాయగల్లారు వారి సంతతి వారిప్పుడు శాకాహారులై ఆ శాస్త్రానికి సరియైన భాష్యాలు వ్రాయలేరు యుగాల తరబడి శ్రమపడి, హిందూ మహాక్షేత్రంలో ఒక బావిని త్రవ్వి పాతాళానికంటా క్రవ్వినా జలం వూరలేదు నిట్టూర్పు విడిచి, “ఓ హరిజనులారా! ఇక లాభం లేదు! ఆశించకండి! వృథాప్రయాస! కాలయాపనం! నాలుక పీక్కపోయి చావకండి! ఏ కిరస్తాని నీళ్ళో, ఏ తురకనీళ్ళో త్రాగి దాహం చల్లార్చుకోండి' ప్రాజాలు నిలుపుకొండి అది అవినీతి కాదు అధర్మం కాదు పొండి లేచిపొండి నిరీక్షించకండి” అని అదిగో దివ్యవాణి- దేదీష్యమానమై పలుకుతుంది ఆలకించారా? అచ్చా- చెలో మంచినీళ్ళు ఎక్కడ లభిస్తాయో చూచి దాహశాంతి చేసుకుందాం రండి రండి, పోదాం రండి

  1. అసలైనది మన కులము- ఐకమత్యమే మన బలము, సహన సత్యములే మన

గుణము- శౌర్య ధైర్యములే మన ధనము 2. ఆలోచనలు మానండి- ఆలస్యమెందుకండి బయలుదేరి వేగరండి- వెనుకంజ వేయకండి

జలా కుసుమ ధర్మన్న

ఓ హిందూ సంఘమా నీకు అడియేణ్ణి దాసోహం శెలవు, శెలవు శాంతి, శాంతి, శాంతించాలి ఓర్చుకోవాలి కష్టమో సుఖమో కట్టుకున్న వాడితోనే పడి చావమని- పట్టలేనన్ని బోధలు- వినలేకపోతున్నాం చెవులు హోరెత్తి పోతున్నాయి అయితే కాంగ్రెసు కన్య - గాంధీగారి చెట్టపట్టి, పట్టుమని పదిహేనేళ్ళయినా అయిందో లేదో ముసలికంవు కొట్టింది పొత్తు కుదరదట! వెంటనే ఆ మహామహాననికి విడాకులిచ్చింది తరతరాల నుంచి హిందూ మగడితో హరిజన కన్య- బూతులు పడి, కవుకులు తిని, కష్టాలు, నష్టాలు అనుభవించలేక విసిగిపోయి *పోరులేని గంజి- బొక్కెడే చాలు- రెక్కలాంటి మగడు ఎక్కడా లేడు” అని విడాకులిస్తానంటే, వల్లకాదని, లేనిపోని పంచాయితీలు, పీకులాట పంచాంగాలు పెట్టి, తగుదుమని తగువాడుతున్నారు చూచారా! వీరి కుండే శాంతం- ఓర్పు మనకు లేదట వీరు కోరే స్వేచ్చ లాంటిది కాదు కాబోలు! మన స్వేచ్చ” మనకెందుకీ పంచాయితీలు? ఒప్పులు చెప్పేవారేకాని- వొద్ద పదుకునేవారు లేరట” ఇనుము విరిగితే అతుకుతారు గాని మనసు నెవడు అతికేది? అనిత్యాని శరీరాణి విభవో నైవశాశ్వత! నిత్యం సన్నిహితో మృత్యః కర్తవ్యో ధర్మ సంగ్రహః శరీరం అనిత్యం, సంపద అశాశ్వతం, చావు సన్నిపాతం, కాబట్టి “ధర్మార్ధ కామమోక్షాలు” గుర్తించి ప్రవర్తించమని నీతి పారం ఈ నాలుగింటిలో ఆది తుది ధర్మాలు విడిచిపెట్టి మధ్య రెండింటిని గట్టిగా పట్టుకొంది మానవ లోకం ఇది గురూప దేశానికి ఫలితం గురువు బ్రాహ్మడు రాజ్యాధికారం, కనకమయ సింహాసనం, అంతఃపురాలు, భోగభాగ్యాలు క్షతియులకీ-వాణిజ్యమంతా వైశ్యులకీ- సేద్యమంతా శూద్రులకీ అంటగట్టాడు ఇవన్నీ యెప్పుడో ఒకప్పుడు కుస్తీలు పట్టి తలకిందులై గిర్మీలు తిని, వుల్చాపుల్దాలై దివాలా తీసి, కళ్లు తేలేసి, కాళ్ళు జేరేసే డిపార్టుమెంటులని బాగా తెలుసును గురువగారికి అనిత్యాని శరీరాణీ అందరి సొమ్మూ నాకే రానీ తనకు మాత్రం పిలకజుట్టు, విభూతి బొట్టు, కుళ్ళాయి గుడ్డ, బుడ్డి చెంబు, పంచాంగపు కట్టా మిగుల్చుకున్నాడు చూపుకు భిక్షగాడే కాని (00౧%00039510367 0% క200006 ౫0) రాబడి పన్ను మీద రాజు, కడుపులో నీళ్ళు కదలకుండా చూచుకున్నాడు మహారాజు అగ్రపీరం, ప్రధమ తాంబూలం, పాద పూజా తనకే భూసురుడు, భూదేవుడు సామ్యవాదాన్ని సపొంచని హిందూయిజం 28

బిరుదులూ తనకే ఎందుచేత? బ్రహ్మ ముఖాన్ని పుట్టాడట అందం, చందం, అర్థం, ఆనందం, అందూ పొందూ అంతా తనకే “మా ఇంటి కొస్తావు నాకేమి తెస్తావు? మీ ఇంటికొస్తాను నాకేమి పెడతావు?” అనే తత్వం కూడా తనకేనట “అనిత్యాని శరీరాణి- అందరి సొమ్మూ నాకే రాస” అనే వేదార్ధం పరిస్తాడట శవాలు మోసే దగ్గర నుంచి శెషన్సు జడ్జీ వరకూ యెగబ్రాక వచ్చునట మంత్రాంగం, తంత్రాంగాల మాట చెప్పనక్కరలేదు రాజ్యాలు మారిపోయినా, భూకంపాలు సంభవించినా, మతకర్తలు- సంస్కర్తలు- ప్రవక్తలు- మహాత్ములు యెంతమంది పుట్టి ప్రబోధించినా, నా కాలి క్రింద నుంచి బలాదూర్‌, నా మను నిర్మిత వర్ధ్ణాశ్రమ మతరాజ్యాన్ని యెవడూ కదపలేడు, మెదపలేడు, చోడ్‌దేవ్‌ అంటాడు ఇటలీ ముస్సోలినీ కంటే, జర్మను హిట్లరు కంటే యెంతో దిట్టమైనవాడు యీ డిక్టేటర్‌ ఆ డిక్టేటర్లు యీ డిక్టేటరు చంకనాకడానికి కూడా పనికిరారేమో! అని సంశయం హిమాలయ పర్వతాలనైనా కదపొచ్చు గాని, ఈ వర్ణాశ్రమ పునాదిని కదపడం బహు కష్టమన్నాడు రవీంద్రనాథ్‌ టాగూరు దీన్ని మట్టంతో యెత్తేసి- మచ్చ మాపేస్తాను చూచుకో నా దెబ్బ! అంటున్నాడు జగబ్జెట్టి జవహర్‌లాల్‌ దానితో మిర్రుపడి చూచి, ఇలాంటి వాళ్లు ఎంత మంది నా చేతిలో మునిగిపోయారు కాదూ? ఇతను ఒక లెక్కా? జమా? రానీ, రానీ పీకపిసికేస్తానని గోచి బిగించి, జందెం సవరించి, పిలక ముడేస్తున్నాడు బాపన్న భాగ్యవంతులతో మద్దతు వారు పచ్చగా వుంటే తాను నున్నగా వుంటాడు మరి ఏది యెలాగున్నాా కాలగర్భంలో యేముందో తెలియదు జయాపజయాలు సత్యాధీనం కర్తవ్యం 'ప్రజాధీనం సౌఖ్యం దేశాధీనం మతమంటే ఏంటి?

మతమంటే దేవున్ని తెలిపేది అన్ని మతాలూ దేవున్నే తెలుపుకాయి కానీ, దెయ్యాన్ని, సైతాన్ని చూపించవు “నదీనాం సాగరో గతిక పేరూ, వూరూ, వేర్వేరైనా నదులన్నీ సముద్రాన్ని చేరవలసిందే అలాగే అందరూ దేవున్ని చేరుకుంటాం అందుచేత అన్ని మతాలూ సమానమే

మతం తేనె పూసిన కత్తిలాగ, నీటిలో మూటలాగ, గడుపువాళ్ళ గప్పాలాగ, (0౧||101664 30082) బుద్ధిమంతుల బూటకం లాగ, 1122 1360612౪" మనుకల్చిత మతలబులాగ తయారు కాకూడదు కాని మఠాల తెరచాటున పేదవాళ్లకు జరిగే అన్యాయం అంతా ఇంతా కాదు పేదవాళ్ళు యేమైపోతే మీకేం, కడుపునిండా తిని కంటినిండా నిద్రపోమని చెప్పే మతం- మతమేనా? వారు దేహాభిమానులా, దేశాభిమానులా? దేవుడు వారిని యెందుకు పుట్టించాడో? రోగాలతో కుళ్ళిపోయే ఇతి డ్డ... కుసుమ ధర్మన్న

భోగాలెందుకో? మతాలు ఉత్తుత్తి పరలోకాన్ని చూపి భ్రమపెట్టి నిజమైన యిహలోక సౌఖ్యాన్ని యే విధంగా భంగపరుస్తున్నాయో విన్నారా! ఎండలో వానలో- ఏనాటి కానాడు బండ చాకిరి చేసి- బ్రతుకుతావే గాని దినము నీ కూలితో - మాలోడ తిండైన దొరుకునా - కూలోద కర్మ మంటా వొకరి - ధర్మమంటావు నీ కడుపు మాడ్చుక దొరల కడుపు నింపూతావు కష్టమంతా నీది- మాలోడ కలిగినోళ్ళది సుఖము- కూలోడ పాడిపంటలు గల్ల - ప్రభువులుంటానికని మేడ మిద్దెలు గట్టి - మిగుల శ్రమపడు నీకు ఉందనిల్లూ లేదు- మాలోడ పండ మంచము లేదు - కూలోడ దొరలు నీ చాకిరిని దోచుకొని తింటూంటే తిరగబడి నీవెపుడు తిప్పలెడకావాయని కర్మమని చెపుతారు - మాలోడ కంగారు పెడతారు- కూలోడ గొప్పోళ్ళు నలుగురూ కూడి నిన్నలయించి ఎప్పుడూ సుఖపడుట- ఏమిటంటావనే తప్పుడూ శాస్రాలు- మాలోడ దాపరంజేశారు = కూలోడ రాయిలాగున్నపడు- హాయిగా చేయించి నీ గడ్డ రక్హాన్ని- నిలువునా పీల్చేసి డీలు పడిపోగానే- మాలోడ దగ్గరికి రానీరు - కూలోడ నీకష్టమేలేంది - నిల్వ లేనీ దొరలు ఏనాడు కష్టపడ- కెదురు తిరుగుదువాయని దైవ శాసనమంచు- మాలోడ తలపైకి నెట్టారు- కూలోడ సామ్యవాదాన్ని సపొంచని పొందూయిజం ౦

కుడువ కూడూ లేక- కట్ట గుద్దా లేక

కడుపు మండీనపుడు- కరుకెక్కుతావని

దడిపించుతారు నిను - మాలోడ

దేవుడని, దైవమని - కూలోడ

కష్టపడ్డాగాని - కడుపుమాడీ నీవు

చస్తుంటె చూచేటి- చచ్చువాళ్ళని జూచి

భయమేల భక్తేల - మాలోడ

భుక్తికీ చూచుకో - కూలోడ

ధనవంతులని యేటి - పేదవాళ్ళనియేటి

సంఘాలు రెండేను - స్థిరముగా నున్నవి

ఒకదాని కొక్కటి - మాలోడ

ఎప్పుడూ యెడపెడయె- కూలోడ

మాయ జేసేవాడు - మతమేల గితమేల

నీకేల నియతేల - నిజము నాకివియన్ని

నినుదోచు కొనుటకే - మాలోడ

నిజముగా పుట్టినయి - కూలోడ

నిజమును (గ్రహించి - నిలువు దోపిడి నాపి

శక్తి గలిగిన నీదు సంఘ - జ్రేయము గోరి

కళ్ళు తెరచీ నీవు - మాలోడ

కాళ్ళు ముందూకేయి - కూలోడ

ఇదే మన సంపూర్ణ స్వాతంత్ర్యానికి సూత్రం ప్రథమ సోపానం అసలు కీలకం, ఆయువుపట్టు

ఆఖరు మాట

మతం మార్చుకోవడమా? మానుకోవడమా? ఇదే మనకిప్పుడు ముఖ్య సమస్య మతం మార్చుకోకపోతే మన చచ్చు వాదలదు బానిసత్వం పోదు, హిందువులతో పొందూ కుదరదు మనలను ఆదరించరు, గౌరవించరు వారికి దయాదాక్షిణ్యాలు లేవు మనకి ధైర్య సాహసాలు లేవు, మనం పిరికివాళ్ళం వారు పిరికిబంట్లు వారు దాసులు మనం దాసానుదాసులం ౩1 కుసుమ ధర్మన్న

కాబట్టీ మతం మార్చుకోక తప్పదు సంఘమంతా ఏక్‌దమ్‌ మారిపోవాలి అదే అందం, ఆనందం అయితే అందరూ కలవడం సాధ్యమా? అసాధ్యమా అనేది ఒక ప్రశ్న తినీ కుడిచే వాటివల్లా, కట్టీ విడిచే వాటివల్లా అంటే ఇప్పటి అభ్యాసాలు, అలవాట్లు మానుకోలేక హెచ్చు మంది మతం మార్చుకోవడానికి చొరాయించరు

గద్దాలు, తలలూ పెంచలేం- టోపీలు పరదాలు పెట్టలేం- పంది మాంసం, గోమాంసం, పొగచుట్టా మానలేం” అని అంటూ మహమ్మదీయులు కాని, శిక్కులు కాని అంగీకరిస్తే మంచిదే! అయినా మాంసాదుల వల్ల ప్రత్యేకంగా వాలికే స్వర్ణమేదో కన్పించదు కాని అవి వారి వారి అలవాట్లు ఆచారం అలవాట్లు మార్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు. కష్టం లేదు, నష్టం రాదు అనేకం మారాయి, మారుతున్నాయి కాలాన్ని బట్టి అన్నీ మార్చుకోవచ్చు. ఎవరూ కాదనలేరు

పోనీ! హిందూ మతంలోనే వుందామంటారా? అయితే వినండి! హిందువులందరి కోసం ఏర్పడ్డ గ్రామసేవకులు- చాకలిని, మంగలిని మనం ఇళ్ళకు కూడా రానిచ్చి, దేవాలయ ప్రవేశమిప్పించి, పిచ్చ కుంచాలు, పెచ్చు వడ్డీలు, నిర్బంధ సేవా తగ్గించి, శూద్రుని వద్దకొనే వస్తు సామగ్రి, తినుబడి సరకులు- మన వద్ద కూడా కొనిపించి, పబ్లిక్‌ నూతులు, వీధులు, సంతర్చణాలు, సప్తాహాలు, వింతలు, వినోదాలు మొదలయిన వాటికన్నిటికి రానిచ్చి- కష్టసుఖాల్లో మనకు తోద్పడగలమని చెప్పి- ఈ హిందువులు, హిందూ మహాసభవారూ అమలు జరిపించమనండి చూద్దాం!! (సవాల్‌) ఈ సామాన్యపు హక్కులైనా ఇవ్వకపోతే ఈ తుక్కు మతంలో మనమెందుకుందాలో? పక్కలు విరగదన్నించుకోడానికా? ఏమి సార్ధకం? తురకల్లోనా? శిక్కులలోనో, కలిస్తే- ఆ మరునాడే ఇలాంటి హక్కులన్నీ పొంది ఆనందించగలం అప్పుడు హిందువులకీ ఆనందమే

ఎవరితోనూ రాజీ కుదరకపోతే ఏం చేయమంటారని అడుగుతారా? వినండి! హిందువులతో విడిపోయి క్రొత్త పేరుతో కజైస్తవ మహమ్మదీయుల వలె- ప్రత్యేక మతస్తులుగా పిలువబడి- రాజకీయ హక్కులు పొందుతూ, అన్యోన్య సాంఘిక సహాయం కోసం మహమ్మదీయులతోనే సంధి కుదుర్చుకొని పౌరుషంతో, గౌరవంతో జీవించడమే మనకిప్పుడు కర్తవ్య సాధనమని నా విశ్వాసం ఇక నేను విరమిస్తాను (శ్రమకు మన్నింతురు గాక! = భవదీయుడు కునుము ధర్భన్న కన్సి కునుము కుటీరం, రాజమంధీ 22-20-2936

(నలువు వ్యత్రిక 2992 నవంబరు నుంది 1898 జనవరి వరకు) సామ్యవాదాన్ని సహించని హిందూయిజం దా టై ఖా 82 ఈ 1227 సూ ల కాం

క ] ఖే " " . టి ప. లా. అటు ఇట వ. ం మ (ఫై ల ఎ ఆాట్రజాకవి ధర్శన్న 1 వ 1/1 ట్‌ న్‌ య. ఆ! ణటత్టటంత తన్ను లఆతతన్తున (1 న. మ... తొత్యస్త అంతు నతాంతంతసయత్యాలు... నీ ననన. ఆాయ్రుయ్హాతయందతుంంి ఇస్టతబ్యాకొాలిటుల మ. తపా తప్రష్రయ్య్తరంయాతతత్చాతు | [11 . ' అ వత్తు కతు శ్రత్యత్షో బ్రంతయయత్తాతు తళ్లల.. . ము... తాత౭తోత్రణంవుత్రత్తయాతుతవాడచుమ్తయంతాళు.. “1 సం పజయతన్మాతత్య్య్తాయయంలతతృటామనాతు. స. త్య పుయా తయారు తచమ్యతతళు న! స శ లం ఏన అం నా ల మ న న! లో క ౬. స న. ర! షై న న్య స్‌ స! ల! 11 పే, | హర మ! ర! గ్ల టే! 1 స్‌ ! (/ క్రై? |. 1114 క. [1 11016 దత? ర. ట్ల / ర పటేీయి టె శర 1,1 టు " 'తజాశకి:బుకహోన్‌ ౮... “| స న్నే! 1. /. . న ము | నే ల కస / . (టి స) . న షల త్‌,.! (ష 11. ట్‌