Telugu Saamidheni - anilvaranasi/indianlanguages GitHub Wiki

'. సామిధేని . అ.

అభయ లాల చయలు -

సామిధేని అబ్బూరి వరద రాజేశ్వరరావు

సామిధేని అబ్బూరి వరద రాజేశ్వరరావు సంపాదకుడు డా. గోపాలకృష్ణ అబ్బూరి అబ్బూరి ట్రపఫ్ట్‌ హైదరాబాదు

3గి!గ190 1౬111 [56160166 ౧౦౪౯)౧] శీం06గ ౪42262 [౧|6542[2 గ౧౬6| ౬6. 09/ 0॥/ 00212419౧౧ 4౦౦.1 “ఇ మో యగ ణో య్కి ౮ 10 ళ్‌ కవర్‌ డిజైన్‌ : శ్రీ శిలా పీర్రాదు లా గంధాలయ శః ఆ వి 'ప్రథమముద్రణ: మే 1995 భల కంలాలాం న్‌ " శే ఇ వా (థి అబ్బూరి ట్రస్ట్‌ గం ంర్టుత తో శ వం యో వెల వి రూ.35 హైద రాడ్‌ యి ప్రతులకు ; విశాలాంఢధ్ర బుక్‌ హౌస్‌ "హైదరాబాద్‌ నవోదయ బుక్‌ హౌస్‌ ఖో. హైదరాబాదు | నవోదయ పబ్లిషర్స్‌ గ విజయవాడ కంపోబింగ్‌ : ఫాంట్‌లైన్‌ (గ్రాఫిక్స్‌ హైదరాబాదు ఫోన్‌ : 660000 ముద్రణ ః. చరిత గ్రాఫిక్స్‌ హైదరాబాదు

విషయ సూచిక సంపాదకీయం ల్లా నిరంతర అన్వేషి నిత్య ప్రయోగశిలి వరద 12 చేకూరి రామారావు సొమిథేని 25 ప్రస్తానం 27 (ప్రస్తానం 30 సందేహం 34 స్వగతం. 37 చెరసాల గీతాలు శ0 మేలుకో న్‌! భూతకాలస్మనిషి త్తై2 ఆర్బుదీపం 43 ఈనెల నడిచెను క! అమ్మాయీ పదపద త్న్‌ నేనేం కావాల్నని త్త ఈరాజ్యరమ దేనికి త్త కన్నీటి కోనేటిలో తగి ఉత్తరం - 1 త్తం ఉత్తరం - 2 50 ఉత్తరం - 3 ర్‌1 శేషగీతాలు 53 నిర్వాణ గ్‌తి ర్‌డ్తీ మీరెవరో మాకు తెలుసు 56 నువ్వు ర్‌7 నువెవరవు 58 సంజల మధ్య 60 ప్రేయసీ! 62

నన్నయ నుంచినా దాకా 63 ఎవరు? రక్‌ ఉదక నిమిత్తం బహుకృత వేషం రర వెళిపోయింది 67 అక్కడ 69 శ్రీశ్రీ వరదారుద్రలు 70 పక్కింటి కు(ర్రాడు ల్యే ఓయి మోరివాడ! గ్గ బోలపాటలు ళ్‌ కవితా శకలాలు లాలా అంత్యశ్రియలు ౯8 వైళన కవిత 81 లాసికా! 83 భగ్న 'ప్రణయము రిక్త వేకువల చాయ 88 విప్లవము 89 కసేదలు 90 చేస్తం 9] నా హృదయమున 92 నేటి వేకువ 93 ఆనువాదాలు వక్త అఆరంభశూన్యం 9 సాయంకాలం 97 స్వభావాలు 99 వెధవ గీతం 100 ఓ మనసా! 104 ఛందో వరదపస్మృతి 111 డా. కోవెల సంపత్కుమారాచార్య

సంపాదకీయం

ఈ సంపుటిలో చేరిన రచనలు విడి కాగితాలలో, అయిదారు నోటు పుస్తకాలలో చెదురుమదురుగా వున్నాయి. ఈ రచనలన్నిటినీ వాళచోట చేర్చి వర్గీకరించి మో ముందుంచుతున్నాం. ఆయా రచనల కాలనిర్ణయం ఉజ్జాయింపుగా చేసినదే. వాక కవితా ఖండికకు వొక సంవత్సరాన్ని రచనాకాలంగా ఇవ్వడంలోనే సంపాదకుడి ఇబ్బందిని పాఠకులు అర్ధం చేసుకోగలరు. పురావస్తు శాన్తవేత్త తాను సేకరించిన వస్తుజాలాన్ని వర్గీకరించి తుది తీర్పుకు విజ్ఞుల ముందుంచడం శాస్త విహితమైన కార్యం. ప్రస్తుత సంకలనంలో ఆ మార్గాన్నే అనుసరించడం జరిగింది.

కవి జీవించి వుండగా తన రచనలను వొకటికి పది సార్దు పరిశిలించుకుని తన బుద్ధికి నిర్దుష్టంగా, తన అభిరుచికి దర్పణంగా నిలిచే రచనలను ప్రచురణకు ఎంపిక చేసుకోవడం సాధారణంగా జరిగే విషయం. అలా ప్రచురితమైన సంపుటులలో శైలీ పరమయిన యేక వాఠ్యత మాత్రమే కాక వొక ప్రణాలిక సైతం ద్యోతకనువుతూ వుంటుంది. దివంగతుడైన కవి రచనలను అముద్రితాలైన వాటిని ప్రచురించేటప్పుడు ఈ కాలమానాలకు ఆస్కారం వుండదు. ఈ కవితా సంపుటి ప్రచురణ వెనుక నున్న ఆశయం వొక్కటే. అముద్రితాలైన రచనలను వెలుగులోకి లేవడమే గాక, కవి తన పరిణత శైలిని రూపాందించుకొన్న విధానాన్ని సూచన ప్రాయంగానైనా ప్రతి ఫలించే విధంగా సంపుటిని తీర్చడం. సహ్నదయులే తీర్చరులు. .

సామిధేని : సామిధేని ఆంటే యజ్ఞకుండంలో సమిధలను వేస్తున్నప్పుడు పఠించే బుక్కు. నృష్టి రహస్యాన్ని భేదించాలనే తపనతో తన జీవన క్షణాలను సమిధలుగా సమర్చిస్తూ నిర్వహించిన కవితాయాగం ఇది. సృష్టి రహస్యం అభేద్యం. సమాధానం అసంభవం. వరద రచన కూడా బహుళా అందు వల్లనే అనంపూర్ణం..

చెరకాలం తరవాత “మరోటి రాయాలనుకున్నాను. 'సామిధేని' ప్రారంభించి - కొంత తెలుగు స్వతంత్రలో వచ్చింది - స్థాన చలనం వలన - నేను "హైదరాబాదు వదిలేసి ఢిల్లీ వెల్లి పోయాను - అదీ అసంపూర్ణంగానే మిగిలిపోయింది” అన్నాడు వరద. ఫకవితాసంచిక - పుట 165). (ప్రస్తుతం మాకు వరద నోటు పుస్తకాలలో లభించిన

8 'సొమిధేని' ఖండికలను అదే వరసలో వుంచి మీకందిస్తున్నాం. కవితా సంచికలో ముద్రిత మైన భాగాలను కూడా యిందులో చేర్చడం జరిగింది. ఉన్నంతలో సమగ్రత్వాన్ని సాధించే ప్రయత్నంలో ఇలా చేయడం జరిగింది. 'సామిధేని'లోని కొన్ని ఖండికల ప్రచురణ కాలాన్ని 1954గా వరద కవితానంపుటిలో పేర్కొన్నాడు. రచన అంతకు ముందురెండు మూడు సంవత్సరాలుగా సాగుతూవుండి వుండవచ్చునని రాతప్రతులను పరిశీలిస్తే అనిపించింది. 1948లో “చిరకాలం” రచన తర్వాత “సామిధేని” రచన ప్రారంభమైందని వరదే చెప్పి వున్నాడు. “కవితా సంచిక” ముద్రణ సమయంలో వరద ఆర్లోగ్యం దెబ్బతినడం వలన, “సామిధేని” ని సమగ్రంగా ప్రచురించే అవకాశం వరదకు లభించలేదనుకోవలసి వస్తున్నది. చెరసాల గీతాలు : ఇక్కడ కొంత నేపథ్యాన్ని చెప్పుకోవలసివుంది. హైదరాబాదు నంస్థానపు పౌరసంబంధాల శాఖలో వరద ఉద్యోగిగా వున్నప్పుడు తరచు విజయవాడ వచ్చి వెళుతూండేవాడు. ఆ సందర్భంగా యేర్పాటు చేసిన సభలకూ, విందులకూ శవులకీ పత్రికా రచయితలకీ ఆహ్వానాలు వెళ్లేవి. ఈ వ్యవహారం చూసి అసూయ పడిన స్థానిక రాజకీయ నాయకుడొకరు వరద మోద కకళ్షపెంచుకుని తన రాజకీయ పరపతిని వినియోగించి, ఆనాడు ఆమలులోవున్న ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం కింద డిటెయిన్‌ చేయించాడు. మూడు నెలల తరువాత ఆరోపణలలో నిజంలేదని గ్రహించి అధికారులు విడుదల చేశారు. అయితే ఆ రాజకీయ నాయకుడు మళ్లీ పెద్ద యెత్తున ప్రయత్నించి మల్లీ డిటెయిన్‌ చేయించాడు. ఆరు నెలల పాటు నిర్భంధాన్ని ఆనుభవించిన వరదను యేవిధమైన షరతులూ లేకుండా ప్రభుత్వం విడుదల చేసింది. “చెరకాలం' కార్యంలో కనిసించే “కాళి దేవర మౌళీ", 'అభిల భారత చరఖానందస్వామో' అన్న సంబోధనలు ఈ రాజకీయ నాయకుడిని ఉద్దేశించినవే (కవితా సంచిక పుటలు 64 - 65), రాజ మహేంద్ర వరకారాగారంలో వున్న వరద చెరకాలాన్నే కాక మరి కొన్ని రచనలనూ చేశాడు. అవి అముద్రితాలుగానే వుండి పోవడం వలన ఇక్కడ చేర్చడం జరిగింది. ఆ నోటు పుస్తకం మోద అధికారులు (ధ్రువీకరించిన తేదీ 1948. ఇందులో కృష్ణశాస్రీగారిక్ర ఉత్తర రూపంలోవున్న పద్యాలలో చివరిపద్యం ఆఖరిపాదం మారిపోయి “కవన కుతూహలం” (పుట 230) లో కనిపిస్తోంది. నోట్‌ బుక్‌లో వున్న పద్యపాదం కూడా బాగొవుందని భావించడం వల్ల ఆపాదాన్ని యథాతథంగా ఇవ్వడం జరిగించి.

9 శేషగీతాలు : ఇందులో 'ఉదక నిమిత్తం బహుకృతవేషం' అన్న శీర్షిక వరద పెట్టిందే. మిగిలినవి సంపాదకుడు పెట్టినవి. రెండు మూడు నోటు పుస్తకాలలోనూ విడి కాగితాల మోదా వున్న రచనలివి. వీటిలోకొన్ని ఆసంపూర్ణ రచనలు. కవి వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తూన్నందువల్ల వీటిని చేర్చడం జరిగింది. అంత్యక్రియలు : పాదాంతాన క్రియాపదం వుండడం వలన ఈ ఖండికలను వరద 'అంత్యశక్రియ' లన్నాడు. “కవితా సంచిక లో ప్రచురితమైన రచన కన్నా ఇవి భిన్నమైనవి. ఆంధ్రజ్యోతిలో ప్రచురణ కోసం పంపినప్పుడు “అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి అంత్యక్రియలు' అని శీర్సికను వరద పెట్టగా ఆశీర్షికను తాను అలా అచ్చు వెయ్య లేనని శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు తిరస్కరించినట్ట వరద చెప్పిన విషయం, " శైశవ కవిత : వరద ఆతి చిన్న వయసులోనే కవితారంగంలో అడుగు పెట్టాడు. కవితా నంచికలో ప్రచురితమైన “తలపులు” అన్న రచనలు చేసే నాటికి వరద వయస్సు పది సంవత్సరాలు. పదకొండు సంవత్సరాల వయసులో 'తపోభంగం' అన్న నాటికను రాశాడు. దీనిని గురించిన వివరాలు కొన్ని 'కవనకుతూహలం'లో గిడుగు రామమూర్తి గురించి రాసిన వ్యానంలో ఉన్నాయి. మొదట 'తపోభంగం' ఉషస్సు అనే పత్రికలోనూ శరువాత కృష్ణా పత్రికలోనూ అచ్చయింది. దానిని విని జయవూరు రాజా విశ్రమదేవ వర్మవరడకు 'బాలకవి' అనే బీరుదును ప్రదానం చేస్తూ “శబ్ద రత్నాకరం' బహూకరించారు. మాకు దొరకని వరదరచనలు “తపోభంగం' (1934) “కుమారసంభవం” (1935) “వ్రతీకారం' (1935) 'వార్షికోత్సవం” (1936)' అంతిమయుద్ధం' (1939). ఈ నేపథ్యంలో ఈ సంపుటిలో సేకరించిన రచనలను పరిశీలించ వలసివుంది. 1939 తేదీ వేసివున్న నోట్‌ పుస్తళథం నుంచి ఇందులోని రచనలను సేకరించడం జరిగింది. ఈ విభాగంలోని రచనలకు శీర్షికలు మేం సెట్టినవే. 1939 లో వరద ఇంటర్మీడియట్‌. రెండో సంవత్సరంలో వున్నాడు. నయస్సు 16 సంవత్సరాలు. ఆ నోట్‌ బుక్‌లో వున్న గమనార్హమైన రచన “పేదలు' అన్నది. శ్రీశ్రీ వరదకు 1932లో సరిచయమైనాడు. 'మహా(్రస్థానం'లోని “పేదలు' అన్న కవితా ఖండిక ౬౧016 ౪6గ౧46/6౧ రాసిన [169 ౧౭౮౪౧89 అన్న గీతానికి ఆనువాదమని శ్రీశ్రీయే చెప్పాడు. 'మహాప్రస్థానం'లో “పేదలు' రచనా కాలం “1939(2)గా సూచించారు. బహుశా వరద శ్రీశ్రీ రచన వల్ల ప్రభావితుడై ఇందులోని

10 “పేదలు' రాసి వుంటాడు. అయితే వొక్క సంవిధానంలో తప్పరెండింటికీ పోలిక లేదు. వరద పద్యం స్వతంత్ర రచన. మూపు(లు) మోపు(లు) అన్న పదాలు మాత్రమే రెండింట్లోనూ వున్నాయి. 'ఈనాడు' పత్రికలోని వార్తలో (వరదస్కృతి - పుట 332) “శ్రీశ్రీ పద్యమే తనదిగా భ్రమించిన వరద దాన్నితిరిగి రాసి పురిపండాకు చూపి ఆశ్చర్యపరచటం'” ' అన్నది పారబాటు. వరద స్వతంత్ర రచనను శ్రీశ్రీ రచనగా పారబడింది పురపండావారే. ఆ పద్యమే ఇది. ఈ శైశవ కవితలలోనే మరొక రచన “భగ్నప్రణయము' విడికాగితాలలో దొరికింది. అసంపూర్ణ గేయ పద్యాత్మక రూపకం ఇది. పూర్తిగా లభించినట్లయితే తెలుగు భాషకు అందమైన “ఆపెరా' లభించివుండేది. వరద కౌమార దశలో పొందిన “'ప్రణయాను భూతికి అక్షర రూపం ఇది. రావిశాస్రిగారి జ్ఞాపకాలలో రేఖామాత్రంగా (వరద నృతి - పుటలు 500-501) ప్రస్తావించారు. ఇందులో ఆనాటికే వరదరాసిన మూడు పద్యాలను తరువాత '“చెరకాలం' కావ్యంలో వాడుకున్నాడు. రవీంద్రనాథ ఠాగూర్‌తన “రాజా' లోని గేయాలను 'బసంత్‌' అన్న నృత్యరూపకంలో వినియోగించినట్టే, శ్రీక్రీ తన 'సుస్తాస్థికలు' 'మరో ప్రపంచం" ఆన్న కవితలను రేడియోనాటికలలో వాడుకున్నట్లే, 'సంధ్యాకామిని' ముత్యాల సరాలను అబ్బూరి రామకృష్ణ రావుగారు “నదీ సుందరి'లో వాడుకున్న విధానంలోనే వరద ఈ పద్యాలను తరువాత చెరకాలంలో వినియోగించుకున్నాడు. ఈ పద్యాలను వరద శొమ్మిదోయేటనే రాసినట్లు రామమోహన రాయ్‌ గారు పేర్కొన్నారు. (సాహిత్యవేదిక, ఆంధ్రజ్యోతి. మ 17.1993), 1939 ప్రాంతాలలో కమ్యూనిస్ప పార్టీనుంచి వైదొలగిన అబ్బూరి రామకృష్ణరావు గారు “లీగ్‌ ఆఫ్‌ రాడికల్‌ కాంగ్రెస్‌ మెన్‌ొలో సభ్యులుగా చేరారు. అలా చేరిన రాయిస్టలందరూ నిజానికి మార్కిస్టులే. అందుకనుగుణంగానే ఆనాటి వరద రచనా శకలాలలో భావకవితా ధోరణితో బాటు మార్క్సిన్చు ప్రభావం కూడా కనిపిస్తోంది.

అనువాదాలు : ప్రధానంగా యీ అనువాదాలను 'కవిత' సంచికల కోసం జేశాడు వరద. 'కవిత' మూడో సంపుటి వెలు వడివుంటే అందులో చేరివుండేవి.

ఓ మనసా : ఈ రచన 1989 డైరీలో రాసివున్నాయి. వొకటీ అరా చరణాలు విడికాగితాల మోద వున్నాయి. ఆ డైరీలో మరే రాతా లేదు. 1993 ఫిబ్రవరి నెల నుంచీ వరద ఆరోగ్యం క్షీణించి శ్వాన కోళ వ్యాధి లక్షణాలు కనిపించాయి. 1992 జులై అంతానికి వరద విశాఖలో ఆరోగ్యంగా రావిశాస్త్రి జన్మదినోత్సవాలలో పాల్గొన్నాడు.

11 అంచేత ఈ రచనలో “ఊపిరన్నదె భయం” “నాకాల మయిపోయె"” “ఈశ్వాస పోవగా ఏ్‌ ఆశ లేదనీ” అన్న గేయ చరణాలలో వరద వ్యాధి లక్షణాలు స్ఫురిస్తూ వుండడం వలన ఈ రచన 1993 జనవరిలో జరిగి వుండవచ్చునని భావించాము.

వరద రాత సాధారణంగా కొట్టి వేలూ దిద్దుబాటులు లేకుండా సాఫీగా సాగుతుంది. పద్యం మనస్సులో పూర్తయిన తర్వాతనే కాగితం మోద పెట్టడం వరద అలవాటుగా కనిపిస్తుంది. ఓ మనసా రచన డైరీలో అలాగే కనిపిస్తోంది. ఇల్లీ గోపాలకృష్ణ అబ్బూరి కృతజ్ఞతలు ఇ కీర్తిశేషులు పురిపండా అప్పల స్వామిగారి గ్రంథసంచయం ఛాయా చిత్ర | సంచయ సంరక్షకులు ప్రొఫెసర్‌ ఇక్చాల్‌ గారికి, ఇందులో ప్రకటించిన ఛాయాచిత్రాన్ని ముద్రించుకోవడానికి అనుమతించినందుకు మాకృతజ్ఞతలు. ఛాయా చిత్రానికి ప్రతి కృతి తయారు చేసిన శ్రీ రామూ జెగారికీ, ఛాయా చిత్రంలోని వ్యక్తులను గుర్తించడంలో సహాయపడిన శ్రీ మనూనా, కళాప్రపూర్ణ గణపతిరాజు అచ్యుత రామరాజు, శ్రీమతి స్థానాపతి రుక్కిణమ్మ, శ్రీ మట్టా వరహాలు చెట్టి, శ్రీ చలసాని ప్రసాద్‌ గార్లకు కృతజ్ఞతలు. ముఖ్యంగా వరదరాజేశ్వరరావుగారి 1941 నాటి కవితలు అతి కష్టం మీద సంపాదించి ఆఖరి క్షణంలో ఆందించిన శ్రీ చలసాని ప్రసాద్‌గారికి ఈ సంపుటికి పీఠిక రాయడమే కాకుండా, ప్రచురణ విషయంలో ఎన్నోనలహాలిచ్చిన శ్రీ చేకూరి రామారావుగారికీ, 'ఛందో వరద స్మృతి' అనే తను వ్యాసాన్ని ఇందులో చేర్చడానికి అనుమతించిన శ్రీ కోవెల సంపత్కుమారాచార్య గారికీ, ఈ పుస్తకానికి ముఖ చిత్రాన్ని వేయడమే కాకుండా ప్రచురణకు అడుగడుగునా సహకరించిన శ్రీ శీలా వీర్రాజు గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇ అబ్బూరి ట్రస్ట్‌

12 నిరంతరాన్వేషి నిత్య ప్రయోగశీలి వరద చేకూరి రామారావు సాహత్య చరిత్రలో కాలం కొందరికన్యాయం చేస్తుంది. కారణాలిని అని కూడా చెప్పలేము. నా ఉద్దేశంలో వరదకు ఇట్టాంటి అన్యాయమే జరిగింది. నిజానికి మరీ కాలాన్నే ఆడిపోసుకోనక్కర్లేదనుకుంటాను. సాహితీ మిత్రులకు వరదగా పరిచయమైన అబ్బూరి వరద రాజేశ్వరరావు గారికి (1923-1993) ప్రతిభ పుష్కలంగా ఉంది. ప్రాచీనాధునికాంధ్ర సాహిత్యాల వారసత్వం ఉంది. ఆధునిక పాశ్చాత్య కవితారీతులతోనూ, కవులతోనూ (ప్రత్యక్ష పరిచయం ఉంది. సంస్కృతాంధ్ర శబ్బనంస్కారం ఉంది. ఆంగ్ల భాషా పొండిత్యం ఉంది. మేధావి, మనస్వి, చమత్కారి, హాన్యశిలి - ఇన్నీ ఆయిన వరదకు సాహిత్య చరిత్రలో అన్యాయం ఎందుకు జరిగిందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆధునిక యుగం ప్రచారయుగం. తన శక్తిని తానే ప్రచారం చేసుకోకపోతే గుర్తించని యుగం ఇది. వరదే ఒకచోట చెప్పినట్లు వ్రన్తుతాంధ్ర సారన్వత రంగమందు, వందిమాగభులే పేరు పాందగలరు. విశ్వనాథ సత్యనారాయణగారు తాను నిక్షేపించిన కావ్యకళా రహస్యా లను తానే విప్పి చెప్పుకోవాల్సి వచ్చింది. 1930 నుంచీ తెలుగు కవిత్వాన్ని నేనే నడిసించా నని శ్రీ శ్రీ గారు న్వయంగా బెప్పుకున్నారు. రాసుకున్నారు, ఇట్లా చెప్పుకున్న కవులింకా లేకపోలేదు. వారిలో కొందరు ప్రతిభా వంతులున్నారు. (ఎక్కువ మంది కొదనుకోండి) కాని అందరూ (ప్రచారం మహినును గుర్తించిన వారే. ఆ తండ్రి నారసత్వమేమో తెలియదు గాని, వరద తన కవిత్వాన్ని గురించి రాసుకునే వాడు శాదు. మాట్లాడే వాడు అసలే కాదు. అబ్బూరి రామకృష్ణారావు గారిని విశాఖలోనూ, ఆ తరువాత హైదరాబాద్‌లోనూ ఎన్నిసార్లో కలిశాను. ఎప్పుడూ తన కవిత్యాన్ని గురించి ప్రస్తావించే వారు కాదు. అట్టాగే వరదను చాలాసార్లు హైదరాబాద్‌లోనూ, మరీ తరచుగా ఒక ఆర్నెల్లు అమెరికాలోనూ (మేడిసన్‌, విస్కాన్సిన్‌) కలున్తుండే వాడిని (1963). ఎన్నో మూట్లాడేవాళ్లం. ఏవేవో జోకులు పేలుతుండేవి. అందరి గురించీ విచక్షణ లేకుండానే పేలుతుండేని, తన కవిత్వాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు. అది ఉత్తమ సంస్కారం ఆనుకోవాలో, సినికల్‌ అనుకోవాలో నాకర్థ మయ్యేది కాదు. బహుశా

13 ఈ రెండూ కావచ్చు. కుహనా వినయం (12156 గ౦౮651/) మాత్రం కాదని నాకు బాగా అర్థమయింది. వరద నాకు అమెరికాలో ఎక్కువ సన్నిహితుడయ్యాడు. నేను నిజాం కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే వరదతో మామూలు పరిచయమైతే అయింది కాని ఆంత సాన్నిహిత్యం లేదు. మా క్లాస్‌మేట్‌ జె.లక్ష్మీనారాయణకు ఎక్కువ చనువు. వాడి ద్వారా వరద గుణగణాలను (అరాచకత్వాన్ని, నియమ రాహిత్యాన్నీ (ప్రేమించే వయనూ, కాలం కూడా) వింటుండే వాణ్డి. ఒకసారి హిమాయత్‌నగర్‌లో లిబర్టీ టాకీస్‌ (ఇప్పుడది లేదు)కు వెళ్లే దారిలో ఉన్న వాళ్ళింటికెళ్ళి పచ్చట్ట బైండింగుతో ఉన్న 'అందాక' కావ్యం (రెండో ప్రచురణ 1954) సిగ్గెగ్గులు లేకుండా అడిగి తెచ్చుకున్నాను. ఆ తరువాత తాను అమెరికా వచ్చినప్పుడు (1963 సెప్టెంబర్‌) మొదటి ప్రచురణ (1952) కాపీ, అందులో అచ్చు వెయ్యని శ్రీ శ్రీ పద్యాలతో కలిపి తానే నాకు ఇచ్చాడు. ఆ పద్యాలు 1970లో కె.వి.ఆర్‌. కి పంపాను. శ్రీ శ్రీ వాల్యూములో అచ్చయినట్లు గుర్తు. చెరకాలం మవోకావ్యం - అందాకా అందులోంచి కొన్ని భాగాలు అని అచ్చయింది. ఆ నుహాకావ్యం ఏమయింది? ఆ వుస్తకం జైల్లోనే పూర్తి చేశారు. 1949లో స్వతంత్రలో కొన్ని పద్యాలు అచ్చయ్యాయి. ఆ పుస్తకం అచ్చు కోసం చేసిన ప్రయత్నాలు, గిడుతూరి సూర్యం గారి బొమ్మలూ వరదస్మృతి సంచికలో (పే. 126 - 130) కనిపిస్తాయి. అది 80 "పేజీల సమగ్ర కావ్యమని వరదే పేర్కొన్నాడు. ఏమయితేనేం ఆ పుస్తకం శాశ్వతంగా వెలుగు చూడకుండా పోయింది. అందులో కొన్ని భాగాలు అందాక అనే పేరుతో రెండుసార్లు అచ్చయి, పరకాల ప్రభాకర్‌ నంపాదకుడుగా ప్రచురించిన వరద కవితా నంచిక (1993)లో పునర్దర్శనమిస్తాయి. వరద జైలు జీవితం (1948-1949) ఆయన జీవిత దృక్చథాన్నే చాలావరకు ప్రభావితం చేసినట్టుంది. జైలులో ఒంటరితనం కవి అయిన వాడిని అంతర్ముఖుణ్ణి చేస్తుందనుకుంటాను. ఇటీవలి కాలంలో చెరబండ రాజు, కె.వి.రమణారెడ్డి, నిఖిలేశ్వర్‌, వరవరరావులు జైలు జీవితం ఆనుభవించి రాసిన రాతలు మనకు దొరుకుతున్నాయి. నాజీమ్‌ హిక్మత్‌ ఆనేటర్కిష్‌ కవి 14 ఏళ్ళు జైలు జీవితం గడిపి రాసిన కవిత్వం నా కాలేజీ చదువుల రోజుల్లో ఇంగ్లీషులో చదివాను (కొన్ని ఆనువాదం కూడా చేశాను). వరద జైలు జీవితం గురించి కొన్ని వివరాలు వరదన్మృతి లో దొరుకుతాయి. వరదను ఆర్థం చేసుకోవటానికి ఆ వివరాలు తెలుసుకోవటం అవసరం, జైలు జీవితంలో అంతర్ముఖత్వం

14 ఒక పార్వ్వం మాత్రమే. తోటి ఖైదీల జీవిత విశేషాలు కూడా కవిని ప్రభావితం చేస్తాయి. చాలా చిన్నమాట. కవి దృక్పథాన్నే తీర్చి దిద్దుతాయనటం నిజానికి ఇంకొంచెం దగ్గరైన మాట. వరద విషయంలో అదే జరిగిందని నా ఊహ.

వరద చెరకొాలంలో భాగాలుగా అచ్చేసిన అందాకలో కాని, ఇప్పుడు ఆఅచ్చవుతున్న సామిధేని మరికొన్ని కావ్యఖండికలను కాని ఒకే దృష్టి నుంచి చూడాల్సిన అవసరం ఉందనుకుంటాను. ఈ సందర్భంలో గుంటూరు శేషేంద్రశర్మ గారు తన కావ్యాలను ఆధునిక మసోభారతము గా సంకలితం చేస్తూ అవతారికలో అన్నమాటలు ఈ సందర్భానికి అనుసంధించు కోవటం అవసరం. ఆయన ఇట్లా అంటారు:

ఇది నా కావ్య నంకలనం కాదు. ఇది నా కావ్యం. నా నంవూర్హ కావ్యం. కవి ఆనేక కావ్యాలు రాయడం. కవి ఒళీ మనిషి. వ్రవహిన్తున్సు ఒకే జీవితం జీవిస్తాడు. అలాగే ఒకే తొవ్యం రాస్తాడు” (ఆధునిక మవోభారతము. పే.9)

ఈ అభిప్రాయాన్నే తరువాత ఇంకా కొంచెం విస్తరించారు కూడా. ఈ విషయంపై ఆసక్తి ఉన్న వారు ఆ విస్తరణ కూడా చూడవలసిందిగా కోరుతున్నాను. విస్తరణ విషయం ఎట్లా ఉన్నా, విశేషాంశాల వివరణలు ఏమైనా, ఒక కవికి ఒక కాలంలో ఏర్పడిన దృక్పథ ప్రభావం అతని ఆనంతర కావ్య నిర్మాణమంతా విస్తరిస్తుందని, దాని సారాంశంగా, లేక ఒక ప్రధానాంశంగా అంగీకరించడానికి అభ్యంతరం లేదనుకుంటాను. నేను చిరకాలంగా వరదను కొంచెంగా, ఆయన కవిత్వాన్ని విసృతంగా పరిశిలిస్తున్న వాణ్ణి కనుక ఆయన కవితా దృక్పథ నిర్మాఐంపై నాకేర్చడిన అభిప్రాయమిది. ఈ అభి(ప్రాయాన్ని విస్తరిస్తూ, లక్ష్యాల్ని సమకూరుస్తూ రాయవలసిన అవసరాన్ని గుర్తిస్తూనే ఆ పని ఇక్కడ చేయటం లేదని మనవి చేస్తున్నాను. వరదకు జూనియర్‌ సమకాలికుడిగా, "స్నేహితుడిగా, కవితాభిమానిగా ఆయన కవితా పఠనానికి ఒకటి రెండు మార్గాలు సూచించటమే నా పని. సంపూర్ణ విశ్లేషణ వీలు కుదిరితే మరో చోట చేసుకోవచ్చు. మరొకరైనా చేయవచ్చు.

స్థూల దృష్టితో పరిశీలిస్తే వరద కవిత్వంలో నిరాశా నిస్పృహలు ప్రధాన వస్తువులుగా కనిపిస్తాయి. కాని ఆ నిరాశా నిస్సృహల వెనుక కవికి ప్రస్తుత వ్యవస్థపై ఉన్న ఆగ్రహం కనిపిన్తుంది. ఆ ఆగ్రహమే తాత్విక స్థాయిలో నిర్వేదంగా పరిణమించి ఆయన కవిత్వాన్ని ఆవరించింది. జైలులో చెయ్యని నేరానికి ఉరి శిక్ష పడిన ఒకరి పరిచయం

15 వరద మనస్సును కలిచివేసింది. మొత్తం వ్యవస్థను గురించి ఆలోచింవచేసింది. వ్యవస్థ అంటే ఒక్క రాజకీయ వ్యవస్థే కాదు. ఎటుచూసినా మాయలు, అబద్ధాలు. నయవంచన అన్నింటా కనిపించాయి. తాను బాగా ఎరిగిన సాహిత్య వ్రపంచం ఇందుకు విరుద్ధం కాదు. పని చేసిన పత్రికా రంగం, ఇంకా అనేక జీవితానుభవాలు అబద్ధపు జీవితంపై అనహ్యం కలిగించాయి. ఆ ప్రభావమే చెరకాలం లో కనిపిస్తాయి. సామిధేని లో కనిపిస్తాయి. ఇంకా ఇతర ఖండ కావ్యాల్లోనూ కనిపిస్తాయి. చబెరకాలం లో

నాకయి నేను దుఃఖవడనా? జనపాలనమే నియంతృ బాధాకులమైనదంచును వ్యధాబిత చిత్తముతో కృళింవనా? లేక మవోనరాధినని లేని న్వయం కృత దబోషమింత నేనే కొని తెచ్చుకోన? శరుణ్‌ంచెడు నేత్రములేని రాత్రులన్‌ అని వ్యధ చెందుతాడు. జైలు నుంచి బయటికి దృష్టి సారిస్తే జగత్తంత పెద్ధ జైలు గానూ, కరిగిపోని తారు మొయిలు గానూ కనిపించింది. ఆ దృష్టితో ప్రపంచాన్ని, సృష్టిక్రమాన్ని పరిణామాన్ని దర్శించాడు. మొత్తం నృష్టి, నమాజం, పరిణామం, అభ్యుదయం, రాజకీయం, వగైరా అంతా వృధాగానే కనిపించాయి. ఆందుకే చెరకాలంలో- నమాజం జనించి, నమిష్టి జనభారం నమూవాం, జాతి, తులం, మతం, ఎవివోరం పెనుగాలి వలెరేగ నాగరికత రెచ్చి విధి విరామం లేని నంఘగమనంలో వ్యక్తి చచ్చి మనం వురాతన దైవాల ప్రాబల్యం జీర్థించి నునుమలారాధిన్తున్హారు నమాజాన్షి నమూవాన్చి తెగవర్థించి అని సంఘం పేరిట కొత్తదైవం వెలసి వ్యక్తి ప్రాధోన్యాన్ని తగ్గించే పరిణామాన్ని నిరసిస్తాడు. ఆశ్రయించిన దబ్రతిధర్మం, వరమానధి చేరలేశ పోవటం కనివిన్తుంది.

16 జైలులో అనతి దూరంలో అమలు జరిగిన ఉరిశిక్ష వరద కవిత్వంలో మృత్యు స్పర్శగా మారింది. సామిధేనిలో మృత్యువు కోట, మృత్యువు పేట, మృత్యువు మాట, మృత్యువు పొట వంటి పద సంయోజనలు కనిపిస్తాయి.

చెరకాలం లో అనాది నుంచి ఒకే వ్రత నేటి వరకు అని, ప్రళ్ళ ప్రళ్తలాగే ఉంటుంది, ఎక్కడ్‌దీ జగత్తు? అని అడుగుతాడు. సొమిధేని లో ఇట్టాంటి ప్రశ్నలు వేసుకుంటాడు.

ఈ తమన్వీని వయసెంత? అతగాడెనరు చెప్పరేం?

అని మూలభూతమైన (ప్రశ్శలడుగుతాడు. అయితే ఇదంతా వెర్రితనపుటన్వేషణ గానే అర్ధమైపోతుంది.

వరద ఒట్టి ఆధునిక కవి కాడు. ప్రపంచ గతిని గురించి, సామాజిక ప్రగతిని గురించి, విలువలు నశించిపోయిన వ్యవస్థను గురించి చింతన చేసిన తాత్త్విక కవి. మూలభూతమైన ప్రశ్నలు వేసిన మౌలిక కవి. బహుశా ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవని తెలుసుకున్న జ్ఞాని కూడానేమో! అబ్బూరి గోపాలకృష్ణ మాటల్లో నృష్టి రవూన్యం అభేద్యం, నమాధానం ఆనంభవం. వరద రచన బవాంళా అనంపూర్ణం.

ఆయన అన్వేషణ అసంపూర్ణమే కావచ్చు. అసలు ఏ, అన్వేషటైనా అనంపూర్ణమే. "అయితేనేం అన్వేషణలే మన విజ్ఞాన శాస్త్రాల వికాసానికి, తత్వశాస్త్ర వికననానిక్షి, సాహిత్యాది కళల అభివృద్ధికి మూల హేతువులు. అందుకే అన్వేషకులను మనం గౌరవిస్తాం. వాళ్ల అన్వేషణే మన మనుగడకు ఆధారం. సాహిత్యంలో అట్లాంటి ప్రథమశ్రేణి అన్వేషకుడు వరద. సాహిత్య చరిత్ర మరిచిపోదగని అన్వేషకుడు.

వరద సాహిత్య మార్గాన్వేషకుడు కూడా. కవిత్వంలో కొత్త వ్యక్తీకరణల కోసం తపన పడ్డ ప్రయోగశీలి. పద్యం, గేయం, వచన కవిత్వం - అనే మూడు రీతుల్లోనూ (రూపకాలు, నాటకాలు కూడా కలుపుకోవాలి) ప్రయోగాలు చేశాడు. పద్యాల్లో విశేష వృత్తాల్సి సామాన్యీకరించటం, సామాన్య పద్యాల్లో విశేషగతులను కల్పించటం, తన కాలం వరకూ అంతగా పద్య రచనల్లో అలవాటు కాని సామాన్య భాషని వాడటం ఆయన పద్యాల్లో చేసిన ప్రయోగాలు. ఉత్సాహ, భుజంగ ప్రయాతం, స్రగ్ధర, గ్రగ్విణి వంటి విశేష వృత్తాలను చంపకోత్పల మాలలు, ఆట వెలది తేటగీతులతో సమానంగా వాడారు. చెరకాలం లో కాలం మారింది నేస్తం! (కవితా, సంచిక, పే.6) అనే స్రగ్ధర

(7 మామూలు మాటల్లో సాగుతుంది. పద్యాల్లో ఆధునిక పద రూపాలు వాడటం ఆధునిక పద్య కవులకో. నరదా. శ్రీ శ్రీ, ఆరుద్ర, వరదలు ఈ పని విశేషంగా చేశారు. వ్రసిద్ధ పద్యాల్లో గతి భేదాలు కూడా వరద కవిత్వంలో విశేషంగా కనిపిస్తాయి. వరద కవితా సంచిక నిండా ఇవి విస్తరించి ఉన్నాయి. అందులో ఒకటి చూడండి.

విది కడసారి గౌనం - మరెందుకింక మంచిది, ధరించుమౌనం - భరించమనకు చెయ్యి కన్టీళ్ళ స్పానం - రుబించదివుడు చివిరికొకసారి ధ్యానం - రబింతునివుడు / ఇది గీత పద్యం. యతి స్థానం కంటె ఒక అక్షరం ముందు విరగటం ఇక్కడ పొటించిన వైచిత్రి. ఆ విరువు వల్ల యతిస్థానంలో వాడిన గురువు వల్ల జగణస్స్ఫూర్తి కలుగుతుంది. ఇది కావాలని చేసిన ప్రయోగమే. ఆలవోకగా రాసి కంద పద్యాలతో ఆడుకున్న కవులలో వరద ఒక ప్రముఖుడు. (నా దృష్టికి వచ్చిన ఇతర కవులూ కృతులూ ఇవి; శ్రీ థీ - సిరిసిరి మువ్వ శతకం, దేవిప్రియ - గరీబు గీతాలు, న.చ. రామానుజాచార్య - మూర్థశతకం) సామిధేని లో ఈ కంద పద్యాన్ని చూడండి. పో ఒంటరివై వ్రల్చిం చే ఓటమితో వలక్క, నీకోనంని న్హే ఓదార్చే చూవుల లో ఓవికతో చెదరనితోవల బడీపో, పూర్వం వివిధాచ్చులను (ప్రానస్థానంలో వాడిన కంద పద్యాలున్నాయి. యడాగమం వల్ల ప్రాన సరిపోతుందని ఆక్కడ సరి పెట్టుకోవాలి. ఇక్కడ అట్లాంటి అవసరం లేకుండా ఒకే అచ్చుతో ప్రాస నడిపాడు. యడాగమం లేకుండా (ప్రాసతో మొదలయ్యే వేరుమాట వాడటం వల్ల గతివైచిత్రి కూడా వచ్చింది. మాత్రాఛభందస్సులో వరద చేసినన్ని ప్రయోగాలు మరో తెలుగుకవి చేసినట్బ కనవడదు. ముత్యాల సరాన్ని 7, 7, 14 మాత్రల వరనతో మూడు పాదాల గేయంగా నడపటం

18 వరద ప్రయోగాల్లో ఒకటి. ముత్యాల సరంలో ఉండేది మిశ్రగతి. చాలా మంది ఆధునికులు దీన్ని ౩-4 అనే మిశ్రగతిగా వాడారు. వరద దీన్ని అక్కడక్కడ 4-3గా వ్యత్యస్తం చేశాడు. నువ్వు పోయిన సాయం తనం నవ్వలేదొక తార కూడా జలదరించిన ఆశాళమే ఒక్క పెట్టున నవ్వుకొన్నటి ఇక్కడ రెండో పాదంలో మాత్రాగణాలు 4-3 వరసలో ఉన్నాయి. మవ్వైరుగుదువు నేస్తం నిజం నంధ్యాగమన రవహాన్యగాథ పె గేయశకలంలో రెండో పాదంతోపాటు, మూడో పాదంలో మొదటి సగాన్ని 4-3గా విభజించాలి. అన్ని పాదాల్ని 4-3 మాత్రా గణాల ేర్చుగానే విభజించవచ్చు. ముత్యాల సరాన్నే బేసి పాదాల్లో 3౩ -4 మాత్రా గణాల వరసలో 14 మాత్రలను వాడి సరి పొదాల్ని 3-4-4 వరసలో 11 మాత్రలు వాడిన రీతులున్నాయి. నిరుడు విరిసిన నీలగగనం నేడు కనవడదమ్మా! నిరుడు వినరిన ళీత వాయువు నేడు మనలదు తల్లీ? ఇట్లాంటి ముత్యాల సరాలు ఈ ఖండికలో (కవితానంచిక, పే. 18-19) ఆరున్నాయి. నరిపాదాంతొల్లో అమ్మా, తల్లీ అనే సంబోధనలు పర్యాయంగా వస్తాయి. పాదానికి 14 మాత్రలనే వాడుతూ ముత్యాల సరం కన్నా భిన్నంగా నడిపిన ప్రయోగం ఒకటి ఉంది. ఇందులో మాత్రా విభజన 3-3-2-3-3 క్రమంగా కాని, 3-3-

19 5-3 క్రమంగా కాని విభజించవచ్చు. జనం చచ్చి భోజనం లేక దినం ఒకే రాక్షనం కేక మనం మీద దయమాలి వెదుకు ధనం వడుకు సొధనం కొరకు వీటిల్లో కొన్నిటికి రెండు రెండు పాదాలకి ప్రాస పాటించబడింది. కొన్నింటికి మొదట పదం పాదం మధ్యలో మరో పదంలో భాగంగా వస్తుంది, ముళ్తసద (గ్రస్తానికి ప్రతిబింబ రూపం (11/0? 1౧౫498) వ్యత్యస్త ముక్త పదగ్రస్తం అనుకోవచ్చు. దీన్ని నియమంగా వాడినట్టు లేదు. పైన వాడిన వ్యత్యస్తముక్త పదగ్రస్తాన్ని పాదాంతానికి మార్చి పాదంలో గరిష్ట మాత్రా సంఖ్య 13 మాత్రలకు తగ్గించి 2-4-3-4గా మాత్రా విభజన చేసిన ప్రయోగం ఒకటి ఉంది. వదముందును వెనక ఆవద ముది కనులకు లేదు కౌముది గదిలోపలి నలువు మూగది వదనేన్తం వెనక ఆవద ప్రతిపాదంలోను సరిగణాలుగా నాలుగు మాత్రలతో ఉంటాయి. బేసిగణాలలో మాత్రం వ్యత్యాసం ఉంది. ఇదొక మిశ్రగతి ప్రయోగం. ఇట్ట్లాంటివి ఆరు శకలాలున్నాయి. అన్నిట్లోనూ వ్యత్యస్త ఆద్యంత ముక్త పదగ్రస్తం ఉంది. (కవితా నంచిక, పే, 38-39) గరిష్ట నంఖ్య 13 మాత్రలుండి గణవిభజన 4-3-3-3 ఉన్న మరో ప్రయోగం ఉంది. మరణం లేని మనిషి వృాదికీ తరుణం వాదు తుది ఎిడీదికీ | చితికిన కలల గాజుమేడ చీకటి నెనుక వెలుగుజాడ ప్రతి రెండు పాదాలకు ఆంత్యప్రాన పాటించిన ప్రయోగం ఇది. ఇట్టాంటి నాలుగు చరణాలలో ఖండిక సామిధేని లో ఉంది. ఇట్టాంటి ప్రయోగాల్లో అక్కడక్కడా

20 మాత్రాగణాలు ఒకదానిలో ఒకటి కలిసిపోయి గరిష్ట మాత్రా సంఖ్యకు సరిపోయేవి కూడా ఉన్నాయి. పై ఖండికలోదే ఒకటి ఇది క్లేశాల సంవేశం ఇటీ లేదొక తటిల్లేశం జెరచే దెవరు వెలుగు తలువు వరచే దెవరు వలవు పిలువు తిశగతిలో పాదానికి 12 మాత్రల చొప్పున నాలు” మూడు మాత్రలుగా గాని, రెండారు మాత్రల గణాలుగా గాని విరిగే వాడుక ఒకటి ఉంగి. గేయాలు రాసిన తెలుగు కవులంతా దీన్ని వాడుకున్నారు. వరద దీన్ని 9 మాత్రల గరిష్ట పరిమితిలో త్రిశ్రగతిలో రచించాడు. వెలుగు నోచుకోని వెలితి దాచుకోని . కన్నులార! ఎందు కంత మృత్యుభయం. పె త్రిశగతినే పాదానికో మాత్ర పెంచి 3-3-4 మాత్రాలుగా విభక్తమయ్యే ప్రయోగం ఒకటి ఉంది. ఇది ఒకరకం మిశ్రగతి అవుతుంది. దిక్కులేని జనులకు తెలువు కనని కనులకు పురాతనం మంచిది వురోగమనమెందుకు. ఈ రకం చరణాలు మూడున్నాయి. అన్నీ లఘ్వంతాలే. పాదాంత లఘ్సువృ గురువుగా దీర్ధం తీసి ఉచ్చరిస్తే ఇది మాత్రాలుప్త త్రిశ్రగతిలో ఒదుగుతుంది. తిశ్రగతిలో బేసి పాదాల్లో చాలా ప్రయోగాల్లో లాగా పన్నెండు మాత్రలే ఉంచి సరిపాదాల్లో మాత్రం ఒక గురువును ఎక్కించి ఒక ప్రయోగం, తగ్గించి మరో ప్రయోగం చేశాడు. ఎక్కించిన ప్రయోగం

21 వెళ్ళిపోకు గుండెబితికి (పేతభూతలం వెతుక్కునే కళ్ళు ఎవ్చుకోకు, కలల గాలిమేడ నీడలందు, ళ న్ఫీళ్ళు కార్బబోకు, బ్రతుక నే కళేబరాన్సి బాబు కొ వాళ్ల దాక్క నిన్నృవా వడీ నా యిదే కటోయి జీవితం తగ్గించిన ప్రయోగం: మా యారాద్యా బ్రమో జే లల. భన) కానలేక బాధవడకు (ఈ ఇక ఉ్న కొటి కావలా జనం గా గ 6 గం. 5. అలారం ల ణా లేనిబోట్ల ఒంటరిగ ర గ్‌ టే లించి చచ్చిపోకు, నీ హైదనోత సం 3 లోని లేమి లోతులకు తి లోదఠాలు చల్లుకో ఇట్టాంటి చరణాలు ఒక ఖండికలో ఐదున్నాయి. నిర్మాణాన్ని బట్టి అఆష్టపాదులుగా ఉద్దేశించినట్ట కనిపిస్తున్నాయి. నరిపాదాలన్నీ గుర్వంతాలే అయినా తరవాత పాదాలతో అన్వయిస్తున్నాయి. (కవితానంచిక, పే. 51-53) త్రిశ్రగతిలో మరో భేదం: గు - 3-3-3 మాత్రాగణాల విభజనతో 11 మాత్రల పాదంతో మరో ప్రయోగం ఉంది. మీ భయం నయం కాళ మీ కలలు వలలు వినరి మీ నోట మాట లేళ మీ జూడ నీడ మునరి ఈ రకం చరణాలు నాలుగు ఒక ఖండికగా ఏర్పడ్డాయి. పూర్వం ఉదాహరించిన వెలుగు నోచుకోని అనే 9 మాత్రల ఛందస్సుకు-ముందు ఒక గురువు చేర్చటం వల్ల

22 ఏర్పడినట్లు భావించవచ్చు. ఇందులో నరి, బేసి పాదాలకు విడివిడిగా అంత్యప్రాస, కాక అదనంగా మధ్యలో వచ్చే పదాలకు (భయం - నయం, కలలు వలలు) అఆధికప్రాస గమనించదగింది. అన్ని చరణూలకు ఇవే నియమాలున్నాయి. (కవితా నంచిక పే. 55) మిశ్రగతిలో మరో విచిత్ర ప్రయోగం ఒకటి సామిధేని లో కనిపిస్తుంది. ఇందులో పాదసమత లేదు. భిన్న పాదాల్లో మాత్రాక్రమం ఇట్లా ఉంది. పాడ న ౩-4 4-3 డీ-శ-4-3 ఉీ-త-4-ప ఇదొక-రకం షట్పదీ ప్రయోగం లాగుంది. గతం గతించి బీతించి వ్రతం దినం శ్రమించి శమించి మనం దీవం చిందని వాఠిట్లోకి పానం వండిన చీకట్లోకి మొదటి నాలుగు పాదాల్లో వ్యత్యయ గణ ప్రయోగంతో పాటు వ్యత్యయ పాన ద్రయోగం కూడా ఉంది. గతం - వ్రతం, గతించి - జితించి, దినం - మనం, శ్రమించి

  • ఛమింబి అనే రకంగా పదాంత్య ప్రాస ఉంది. వ్యత్యయమైన గణాలకే ప్రాస సరిపోయింది. దీన్ని ఇంగ్లీషులో ఛాయాదేవి గారు అన్నట్లు 0055 గ/౧౧9 5006౧19 అనవచ్చు. పైన మొదటి. నాలుగు పాదాల్లో మాత్రాగణాలుగా విభజన చూపినప్పటిక్రి అక్షర గణాల నియమం కనిపిస్తున్నది. విధిగా లగం - జగణం వాడినట్టు కనిపిస్తున్నది, మాత్రాగణాలను వివిధ పద్ధతులలో కలుపుతూ కొత్త ఛందస్సులను సృజించటం వరదకు ఆలవాటు. ఈ కలపటం వల్ల సాంప్రదాయికమైన మిశ్రగతులు కాక, కొత్త మిశ్రగతులు సాధ్యమవుతాయి. ఈ కలపటం ఒక్కోసారి ఒక క్రమంలో జరుగుతుంది. మరోసారి ఆ శ్రమం వ్యత్యస్తమవుతుంది. సొమిధేని లో నందేహం అనే ఖండిక చూడండీ.

23 ఇలనలువు నింపేదెవరు ఎదవెలుగు బింపేదెవరు మనవూర్వ వురుషులు రుమలు ళనలేని దానికి వెనక తలదనిరి నత్చదార్హము కల గాంచనిది యదార్థము ఈ పైనుదాహరించిన గేయ శకలంలో ప్రతిపాదానికి 12 మాత్రలున్నాయి. మొదటి నాలుగు పాదాల్లో అవి 5-4-3 అనే అవరోహణ క్రమంలో ఉన్నాయి. ఆయితే చివరి రెండు పాదాల్లో అది వ్యత్యస్తమయింది. ం గణ(శ్రమం 5-3-4 వరసలో ఉంది. ఈ షట్పదిలో మొదటి రెండు పాదాలకూ, చివరి రెండు పాదాలకూ ఆంత్యప్రాస ఉంది. నడిమి రెండు పాదాలకు అంత్య్రాస పాటించలేదు. ద్వితీయాక్షర ప్రాస పాటించబడింది. ఇదంతా యాదృచ్చికనునుకోటానికి వీల్లేదు. తరవాత చరణమూ ఆ పద్ధతిలోనే ఉంది. నలువులో వెలుగున్నదని వెలుగులో నలువున్సదని రకరకంగా ళళ శకం వెకిలిగా వెతుకుతున్నాము మరో లోకవు వాలఠం మననుకెళ్కని కీలకం 'పై చరణంలో చివరి రెండు పాదాల్లో గబవ్యత్యయం ఆరోహణ్రమంలో 3-4-5 గొ ఊంది. చివరి 5 మాత్రల గణాన్ని 3-2 గా విడదీయొచ్చు. అందువల్ల ఈ చివరి రెండు పాదాలు ముత్యాలసరం మిశ్రగతితో సమన్వయమవుతాయి. అయితే ఈ ఖండికలో కొన్ని చరణాలు ఈ విశ్లేషణకు లొంగవు,. ఒకేరకపు నమపాదాలను పేర్చుకుంటూపోవటం వరదకు ఇష్టం ఉండదు. పాదాల్లో గణ వ్యత్యయమో, పద వ్యత్యయమో, రైము వ్యత్యయమో చేన్తూ రచనలో చమత్కారం నిర్వహించటం మాత్రా ఛందస్ప్సుల్లో వరద నరదాలాగా కనిపిస్తుంది. . వచన కవిత్వంలో సరిణత రూపంలో ఈనాడు కనిపిస్తున్న ప్రయోగరీతులు

24 వరదలోనూ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పాదాలతో కొన్ని, పెద్ద పాదాలతో కొన్ని, అసలు పొద విభజన లేనివి కొన్ని వరద వచన కవిత్వంలో కనిపిస్తాయి. వచన కవిత్వం అనే మాట వరదకు పడదు. ఆ మాటవాడిన చోట ఫ్రీవర్సు అని అనువదించుకోవాలి.

వరద కవిత్వాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఇంకెన్ని ప్రయోగాలు గ్రహించవచ్చునో!

ఇప్పటికే సుదీర్వమైన పీఠికను మరిన్ని ఛందో విశేషాలతో పెంచటం భావ్యం కాదనుకుంటాను. ఆ పని ఈ పుస్తక ప్రచురణ పరిధిలో నే జరగాల్సిన అవసరం లేదు. వరద తాను బుద్ధి పూర్వకంగా చేసిన ప్రయోగాలను పాఠకులకు, పరిశోధకులకు రేఖా మాత్రంగానైనా సూచించాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగాలను సూచించాను. మరిన్ని విశేషాలు సంపత్కుమార రచించిన భందోవరద న్మృతి వ్యాసంలో ఉన్నాయి.

జీవితంలోనూ, కవిత్వంలోనూ నిరంతరాన్వేషి వరద. నిత్య ప్రయోగశీలి వరద. కవితాభిమానులను కల కాలం అలరించే. ఛంద: పరిశోధకులకు చిరకాలం పని కల్పించే కవిత్వం కూర్చాడు వరద.

సామిధేని ప్రచురణ సందర్భంగా వరద కవితా పరిశీలనకు నాకవకాశం కల్పించిన వరద జీవిత సహచరి అబ్బూరి ఛాయాదేవి గారికి, సోదరులూ, ఈ సంపుటి సంపాదకులూ అయిన అబ్బూరి గోపాలకృష్ణకూ కృతజ్ఞతలు. _

యువ సంవత్సరాది, 1995.

సామిధేని

26 యన్మహా మైథున ప్రాప్తి కాదిజన్మ నోచుకొన్న మానవుడిపుడే చిదాత్మ! అతని చూచిన యంత, ఆ బ్రతుకుకన్న యంత, నాశనుంగవ కెంత భ్రాంతి యౌను!

27 జ ప్రస్తానం శకం విడిచి శకం గడిచి జీవిన్తున్నది మశకం రకరకంగా శతసహస్ర నిశల పిలుస్తున్నది నరకం అర్ధరాత్రి పుట వధుల నిదురించే నగరం వార్థక్యపు టసుర సంజలో పరితపించే వానరం! పలకరిస్తే ప్రతి నక్షత్రం వెలవెలబోయింది చిలకరించవు విద్యుత్కిరణాలు కనికారమెరుగని గాలికి కలల బరువు లేదు మనలేని మమతకు బతుకు రుచి చెడింది! నగరం హృదయంలో నగ్నవ్యాకులత నదించే జీవన్మరణ విహంగరుతం నిశ్శబ్దపు టొడిలో న్నహ వీడిన మనిషి నిఖిలం పరిత్యజించిన మహామనీషి! ఆ నిళ్ళ్శబ్ద సాగరంలో ఒంటరిగా ఆవరించిన తిమింగలంలా తిమిరం; ఏ జీవన నౌకల విచ్చేదనానికి ఈక్షణం పర్యవేక్షణ, యీ క్షణం ్రతీక్షణ? వేధిస్తూ నేటాడుతున్నది మనిషిని విపద్వీధుల విహరిన్తున్నది మనను... చైతన్య స్రవంతిలో కాళరాత్ర గాత్రం సాయుజ్య చింతనలో కాలమృత్యు నేత్రం!

26

చుక్కలు కడిగిన గగనం విడిచి రెక్కలు తొడిగిన కాలం, వెళిపోతున్నది విధుర వేగంతో వెళిపోతున్నది సృథుల శోకంతో వెళిపోతున్నది! రోదిస్తున్నది గుండెలారబోసుకుని రోదిస్తున్నది పాపం రోదసి! శూన్య పర్యంకంలో తలవాల్చి శోకిస్తున్నది పాపం రోదసి! న్పందనరహిత జీవన గతిలో పాపం పుణ్యం భయం సన్నిధిలో మనిషిని వేటాడుతున్నది మనస్సు మనిషిని వెన్నంటుతున్నది తమస్సు,

ళ్‌ శడలి పొంగింది, పుడమి వణికింది, ఉప్పెన లెగసినై కదలి వచ్చిందేమొ మహా విలయ వేళ! కడుపు మండింది, గుండె చెదరింది, కన్నులు చెదరినై కడల విచ్చిందేమొ విపద్గళక్షేళ!

న! మరణం లేని మనిషి హృదికి తరుణం రాదు తుది విడిదికి చితికిన కలల గాజుమేడ చీకటి వెనుక వెలుగుజాడ! చిక్కని సంభ్రమాల మధ్య చేరని సంశయాల రధ్య

29 మదిలోపల నదిస్తున్న్స భయం మెదలే గదుల కునుకు నయం! ఇది క్లేశాల సంవేశం ఇట లేదొక తటిల్లేశం తెరచేదెవరు వెలుగుతలుప్త పరచేదెవరు వలపు పిలుపు! నటించి యథాశక్తి బ్రతుకు వటించి క్షుధావేధ చితుకు వెన్నెల మిన్ను విప్పలేము వెలితి కన్ను కప్పలేము!

ప్రసానం రి గతమసంగతం ప్రస్తుతం కనక బయలు దేరడం మానుకోకు, నువ్వేరుకున్న దారిలో గజదొంగలున్నారు నాన్న! భయపడి వెనక్కి తిరిగి రావలదు తండ్రి! తొక్కిన మార్గం వదలకు చిక్కిన స్వర్గం విడువకు, చింతించకు నీ దక్కని గత కాలానికి చిక్కు విడక పోదు మదికి చివరికి తండ్రీ! రాద్ధాంతమింత దేనికి సిద్ధించవు స్వప్ప దృష్టిచే చెరిగిన నీ రుద్ధాంతరంగ పంజర బద్ధాందోళిత పర'ప్రపంచ ద్యోతుల్‌! కొండల లోయల్లోనికి మండే కారడవుల తెలిమసిలోనికి పో నిండని చీకటిలోనికి పండే పాపాల నీలి వాగుల బడిపో! పో ఒంటరివై ప్రల్నిం చే ఓటమితో పలక్క, నీకోసంని న్నే ఓదార్చే చూపుల తో, ఓపికతో చెదరని త్రోవల బడిపో!

31 చుక్కేసుకున్న చుక్కల దిక్కయినా చూడక, విరుతించే గగనం మొక్కుబడిని గమనించక చిక్కని పరమార్థమేదో చింతిస్తూ పో! అడిగేవు'సుమూ నీవెం బడిపడి తిరిగే మరుద్రవాన్ని రుడుస్తూ తడబాటుళో, “నువెవరివి కడలికి యేమయ్యద"”వని కారడవుల్లో! వడివడి నడవకు, యెదన వ్వడిలో, కడలేని సాగుబడితో పెనుసం దడిలో కంపించే నీ ఆడుగుల్ని తడబడనీకు ఆలోచనలో! నేనెవర్నని నువ్వు నిన్నే ఆడక్క ఈ జగత్తు పుట్టక నుంచి యింత వరకు ప్రశ్న ప్రశ్ళనే ప్రశ్నించవలసి వచ్చె రాత్రి నేత్రాల ప్రత్యుత్తరాన్ని వెదుకు వెనక ముందు మధ్య వేగుతూ ప్రస్తుతం దాని బతుకు బుద్భుదం విధాన ప్రస్తుతం గతించి భావి ప్రస్తుతమయి ప్రస్తుతం గతమయి పరిఢవిల్లు. నువ్వు ముందు నేను నొరెత్తక వెనక ప్రస్తుతం మనిద్దరం బతక్క | ముందు బతికి వెనక మూగ జీవాలమై కడకు ముక్తి కలల కడలి లోన.

32 అందుకని నువ్వు సాగిపోవయ్య తండ్రి! కళ్ల చీకట్లు చిమ్ము వాకిళ్ల దాటి కెంపు రంగుల మేలిలోగిళ్లు గడచి అవధి పరిధి యెరగని బయళ్లు నడిచి. న్‌ ప్రమోదం త్యజిస్తూ ప్రభాతం భజిస్తూ ప్రమాదం పరిస్తూ ప్రపాతం నటిస్తూ శమించే విరక్తిన్‌ నిశల్‌ నిండగా ఆ గమించే విముక్తిన్‌ మఖబజ్యోతి పండన్‌ చలించే విరక్తిన్‌ దిశల్‌ నిండగా (ప్ర జ్వలించే విముక్తిన్‌ ...................... శ గతం గతించి జితించి వతం దినం క్రమించి శమించి మనం దీపం చిందని వాకిట్లోకి పావం పండిన చీకట్లోకి వ్యధల్‌ భరించి ధరించి కథల్‌ దివం ధ్వనించి జనించి భవం భేదం చిందిన వాకిట్లోకి స్వేదం పిండిన చీకట్లోకి

33 కృతుల్‌ ద్రవించి వ్రవించి స్తుతుల్‌ లయం రహించి వహించి భయం శాపం విరచించిన మాపటిక్‌ పావం విరజిమ్మిన రేపటికి జగతి త్యజించి సృజించి ప్రగతి విరక్తి పిలిపించిన మూపటికి విముక్తి వెదకించని రేపటికి

సందేహం ఇల నలుపు నింపేదెవరు ఎద వెలుగు చింపేదెవరు మనపూర్వ పురుషులు రుషులు కనలేని దానికి వెనక కలదనిరి సత్పదార్ధము కలగాంచనిది యదార్థము- నలుపులో వెలుగున్నదని వెలుగులో నలుపున్నదని రకరకంగా శకశకం వెకిలిగా వెదుకుతున్నాము మరోలోకపు వాలకం మనసుకెక్కని కీలకం- “ఈ తమస్విని వయసెంత?” పేత భూతలం లోన చెలరేగుతున్నది ప్రశ్న ఈ ప్రయాణానికి గమ్యం ఎంత వెదికినా శూన్యం బయలుదేరిన చో ట్రితే దయమాలి మర్షాటికే తిరిగి చేరుకుంటాము దీర్ధనిద్రకై బ్రతుకు వెలితీలో వేయి కనుల

35 వెర్రితనపు టన్వేషణ మాసిపోయిన బుగ్వీధి వేసి తీయని ప్రతి తలువు శట్టి పరబే నూకేక తెట్టి జవాబూ లేక అతని ఆచూకీ దొరక్క అదే దారిబడి వెనక్కి గుండెలీడ్చుకొస్తాము కోటి బరువులు మోస్తాము ప్రతి పతన దుస్థితిలోన వ్రతికారడవి, ప్రతి కడలి ప్రతి మంట, ప్రతి గుడిగంట ప్రతి పీడ, ప్రతి చితినీడ అతని చిరునామాలకై అర్థం లేని పొలికేక అతని కోసం స్వోగతం ఆద్యంత రహితం మనకు అందుకోసమే స్వగతం ఆఅహర్చిశలతని గురించి; “అతగాడెవరు చెప్పరేం?” ఆలా అడగటం కూడదు. ఈన్ను తానెరగటంలో దైవ సన్నిధి పాందటం; ఎవడిది వాడే చూసుకుని

36

ఇహంలోన స్వయంసిద్ధి! వెల్లిన దార్ని మళ్లటం వెళ్లిన దార్ని కుళ్లటం తాను తానెరక్కపోవటం తనకు తానై పోవటం తీరు తప్పని తమస్సు నోరు విప్పని తపస్సు!

స్వగతం వర్షించు నదించే ప్రమాదాన్ని! హర్షించు! నృజించకు ప్రమోదాన్ని బహిరంతరాల్లోన! క్రమిస్తున్న ముహూర్తం గమనించి భ్రమిస్తున్న గత స్వష్నాకృతికి పలికించకు కడసారి వీడ్కొలుపు; రుళిపించకు అవధి చేరని ఆశయాల్ని పట్టి ఆవరించని నిన్నహలో నెట్టి!- ఓ నీల గగనమా! ఊశావా ఉరుముల్ని; వెలుతుర్ని మేశావా నీలోన జీవితం చూస్తామే కాలాల జాతకం రాస్తామే కననానికి పాదులు తీరుస్తాం కష్టాలకి చితుల్ని పేరుస్తాం నీ తలంపున తన్మయతకు కరిగి మా తరుణ రక్తవాహినుల మరిగి తొలి మృత్యుదర్శనం చేస్తామే తుల లేని మూర్భల్ని మోస్తామే! ఉప్పాంగు మహోధధి మరణిస్తే ఉప్పెనలు నిస్తబ్ధత కరుణిస్తే చలిగాలి పసికందులేడున్తయి తెలిమంచు కన్నీళ్లు కారుస్తయి

8రి కారణం చెప్పవా మరి మరణం। మారుణం తీర్చేందుకిది తరుణం మహోదధి సాగించిన యీ రణం మహీశ్వరి మాంగల్యపు తోరణం తెంచేందుకు మాత్రం కాదయ్యా! తెరచాప జీవితం చేదయ్యా మాకు మాత్రం! మాకీ సాగరం శేతెత్తిన కోరికల జాగిలం! ఎడతెరిపి లేని యీ యొడారి ఎడద కరిచి గాయపరచవేం? అరుస్తుందప్ప్తుడయినా యిది తెరుస్తుందోక్కసారి తన హృది ఓ శీతకాలవు చలిగాడ్చు! మా శిథిల వసంతాశ్రోశం ఈ ఆశయాల యెొడారిలో ఏ గమ్యమెరుగని దారిలో గతించిన భవిష్యత్తు నుంచి కలకాలవుటవధుల్ని తెంచి చరమనిదద్రని కలవరిస్తూ జనన గాథని వెలువరిస్తూ తిరుగాడుతున్న వాస్తవాన్ని తెలియదని అబద్ధం చెప్పకు మహోదధి మరణించే దినం మరోసారి చేయక మననం జీవితం! చించకు కొగితం జీవనం। తుంచకు కవనం

39 ధనం! చాలించు నీ కథనం జనం! యేదీ ప్రభంజనం? పరం! ఇహంతోటి కాపరం చెరపడ్డ సనుఖంపు చెచ్చెర! చట్టం! పడిగాపుల చుట్టం! దేశం! కారా ప్రవేశం! సమిష్టి! తలలేని పరమేష్టి హుకుమళత్‌! కళ్లు లేని ముహబత్‌ మరణం! మాది స్వయం వరణం .. మూడు ముళ్లు వెయ్యనీ నేడు!

చెరసాల గీతాలు (రాజనుహేంద్రవర కేంద్ర కారాగారము - 1948)

మేలుకో వ్రమాదం ప్రనవించింది జనించింది పరమాణువు శతసహస్ర శకలాలై నరభవిష్యం చెదిరింది తరతరం దగాపడ్డ తగాదా పెంచుకున్న పుడమిబిడ్డా! మలుకో! కాలి(క్రింది రసాతలం కరిగి కరిగి కరిగి కరిగి జిగదస్థికలు చెమ్మగిలి బజ్వలిన్తుందిక నమన్తం చరిత్ర కక్కిన నెత్తుట ధరిత్రి గుండె నిండింది కాలవిహగ నఖక్ష్తతం గాయపరచింది నిద్రని వెర్రి తండ్రీ! మేలుకో!

42

భూతకాలప్మనిషి భూతద్దాల భూతకాలస్మనిషి మూతులు బిగించని సీసాలు ఖాళీ చేస్తాడు ఆత్మకూ పరమాత్మకూ బేదం అన్నానికీ పరమాన్నానికీ యెంతో అంకేనంటాడు. అంతర్వాణికి బొషధం పోసి జంతుజాలం అనుపానంగా గొంతుచించుకుంటాడు. అప్లికేషన్లకి ఉద్యోగాలూ ఆశీర్వాదానికి సంతానం అవశ్యం వైకల్పికమంటాడు. వెనకటి శాసనాలూ శాస్త్రాలూ కనిపించని భూగర్భం గుడిలో వినిపిస్తానంటాడు. వినమ్రంగా విశదం చెయ్యమంటే వే-వే-వేద ప్రమాణంగా వినకూడదంటాడు.

తం

ఆర్ప్బుదీపం

ఆర్పు దీపం

ఆర్ప్బు దీపం

వెలుగు నోచుకోని

వెలితి దాచుకోని

వల్లకాటిలోని

నల్లకనులు మావి!

ఆర్బు దీపం

ఆర్పు దీపం!

పుడమితల్లి నుదుట

పొడిచె రక్తరేఖ!

బతికి చెడిన మాకు

గతులు చెదరి మారు

ఆర్బు దీపం

ఆర్పు దీపం!

ఇనప గవాక్ష్రాల

యెదురు చూచు కనులు

జీవరాగమొలుకు

తోవలల్లు కొనగ

ఆర్బు దీపం

ఆర్పు దీపం

వెలుగు మోయలేని

వెలితి కనులు మాని।

దీపావళి 1948

తత ఈ నెల నడిచెను ఈ నెల నడిచెను వానల శ్రావణ మేఘచ్చాయల మేలిమి బంగరు పూవుల తావుల గౌతమి రేవున కావలి చిక్కిన బ్రతుకుల (ప్రోవున! ఈ నెల గడిచెను జానెడు జాగా జీవికి కాలం చెల్లించిన తొలి బాకీవలె, నా బానిస గుండెను భావియుగమ్ముల చీకటి నిండెను! ఏ నెల కానెల ఏ తెలి వెన్నెల వెలుగుల కొరకో వేకువ లెరుగని చీకటి కోణ ద్వారం ముగుదల ఆకలి థన్నుల కోరుదు విడుదల!

శక్‌

అమ్మాయీ పదపద

ఏయ్‌ అమ్మాయీ పదపద ముందుకి

మీ యిల్లెంతో దూరం సందుకి

నువ్వు దగాపడి తప్పకు మార్గం

యవ్వనమంటే యెందుకు స్వర్గం?

ఏయ్‌ రిక్షా, ఏయ్‌ రిక్షావాలా,

ఇటురా, నీ కారణాలు చాలా

ఎంతో దూరం లేదీ చోటుకి

ఎగిరే శవాల స్మశాన వాటికి-

ఓసీపిల్లా దేనికే భయం

నీ సినిమా ఉద్యోగం ఖాయం!

పదపద నీ కల నిజమయి వేవై

పగల్ని రాత్రిని చేదాం

నేనేం కావాల్నని నేనేం కావాల్నని నీ కోరిక వేను చస్తున్నాని అనుమానం రక్షించు అహో విశాఖపట్నం - వెలంపేట కాస్త ఎగిరేందుకు శాస్త ఏడ్చేందుకు చా బతుకు నిజంగా అనుకో తగ్గదేనా ఆ మాత్రం ప్రతి మనిషీ అంటే అఆ మనిషికి కాలక్షేపం మరెలా మరో నైసర్గిక రేఖ జ్ఞాపకం చేసుకుని మరచిన నేస్తం ముఖం వెల్లడించుకుని అజ్ఞాత ప్రదేశం మాసిన ఆకాశం ప్రతి ప్రభాతం కనిపించే జన్మభూమి సుదూరమ్మా ప్రయాణం

ఈరాజ్యరమ దేనికి ఈరాజ్య రమ దేనికి ఎగరటం నరకానికి రణ మందు మరణించిన మనుషులను కరుణించిన నేరస్థులార! రండి! ఈరోజు బతుకు పిండి మువ్వన్నె బావుటాలు ముంచెత్తి నిలుపమేలు ఇది పొడు జీవితం ఎదుకొచ్చిన వ్రతం ఓసి బోగం దాన |! మాసిపోయెను లోన |

తీరి కన్నీటి కోనేటిలో కన్నీటి కోనేటిలో కలవరించే పలవరించే కలన పూవుల్లార! కాలచక్ర పరిభ్రమణంలో దారితప్పి నిలచిన కాందిశీకుల్లార! నంఘవత్ర పరిశ్రమణంలో క్లితిచే పరిరక్షితులు సాధు వుంగవులార 1 విధివృశ్చికపు చీకటి కాటుకు శివతాండవం చేసే వెర్రితండ్రుల్లార! యోగప్రయోక్త జీవితపు పాలిమేరల వెలితి కురికె రాగ పీడితులార! హితులార! సుతులార।! జితించిన గతుల, గతించిన కృతుల సృృతి చరణ తాడితులు . నాకు వారసులు మీరేనయ్యా నామరణ శాననం వినరయ్యా! (ఆనంవూర్హం)

శక్తి ఉత్తరం - | ఎవ్వరే చెరసాల బంధించినారు పాపమెరుగని వుణ్యసంపదయులేని బెదరు హృదయాలు వేలాది వేలునేడు? పరచు నాకేక కింత యుత్తరము లేదు. శ్రీ కృష్ణశాస్తికి: ఆశలే చివురించని 3శవాన మీ కవిత్వాన్ని నేనంత మెచ్చుకొంటి ఊర్వశీ ప్రవాసమ్మున పూర్వగతిని కంఠపాఠమ్మొనర్చిన గాథగలదు. పరమపాశ్చాత్య కవితావ్రభాన విధిని కడకు శ్రీశ్రీ యవతరణ కారణమున తమ కవిత్వమ్ము మీద ఆదరము కొంత నడలిపోయిన మాట వాస్తవముకూడ ఏ సిరా నుపయోగించి వ్రాసినారు, ఏ దుకూలమ్ము ధరియించి యేడ్చినారు ఏ చరమ లక్ష్య సిద్ధి నూహించినారు. పరమ పూజ్యులు శోకాబ్టి పతులుమీరు! మీ శిరోజాలు రోజాల రాసి వోలె నూరిపోయిన పప్రాయాన మంచి మంచి పాటలెన్నేని వ్రాసిరి నేటి దనుక మరల నా యభిమానమ్ము తిరిగి వచ్చె

50 నేడు చెరసాల మృత్యు సాన్నిధ్యమందు నాకొరకు నా పవిత్ర దైన్యమ్ము జూచి చెమ్మగిలు నయనమ్మేని చెంత లేదు; ఇంత కన్నీటి భిక్ష యాచింతునిపుడు ఉత్తరం - 2 ఆరు(ద్రకు

విశాఖ పట్నం వినువీధిలోనా

విశేష మేదో వినిపించి పోవా నశించు మాప్రాణము లీక్షణమ్మే నిశీధమందే నెలవున్న దబ్చీ! ప్రవంచగాథా వరణమ్ము నంతా విపత్తు నేడే వెదికింది కాదా

నృపాల పీడాన్విత రామరాజ్యం అపేక్ష్యమే కాదని చెప్పలేవా?

బలే ప్రపంచం బతికేది కష్టం

కలం సిరా జాగ్రత చేసుకోవోయ్‌ చలించకే రాజ్య విధానమైనా చలించి పోవున్‌ జనశక్తి

51 ఉత్తరం 3 చిరంజీవి ఆరుద్రకు : అనేక ఆశీర్వచనములు చేసి రాయదలచుకొన్న లేఖ. ఇనప కటకటాలు సాక్షులుగా చెబుతున్నాను. ఉత్తరం రాయటానికి వీలు లేదు. శబ్దం అమరం కనక చావు బతుకులు లేని వాతావరణంలో సహృదయుల కర్ణ దాతృత్వాన్ని ఆపేక్తిస్తూ తిరుగాడుతుంది. విశాఖపట్నం నముద్ర తీరాన సైకతాద్రుల ద్యానముద్రలో నువ్వెప్పుడో ఒకప్పుడు ఉండక పోవు. జలాశ్రయాన్ని దాటిపో. లోయ తోటలో ప్రవేశించు. లవంగలతలూ తమాల వృక్ష చ్భాయలూ లేవు. వాటిని తలచుకోకు, బాటసారుల చెట్టు దగ్గరికి వెళ్లు దాని మొదలంటకూర్చో, దాని విశాల పత్ర మధ్యం నుంచి వాయు రోదనంవ్వ్యిడస్థ్రడ ఈ$ టంఛాలలు వై ఆరోదనంలోనే నాకొన ఊపిరి ఉన్నది, భం టాం జాగ్రత్తగా విను. | (69 ౫ంట్ర్‌ 'ద్రైజితం ప లా ఇంతలో చీకటి వచ్చి చీరవిప్పుతుంది. భయసడకున్నా పార శస పడుకో, తెల్ల మచ్చలు చూసి రుడునుకోకు, నా ఆవేద? వాటి వెలుతురే తాగేసినయి. పరీక్షించు. ఆ పక్కనే సన్నగా సెలయేరు పారుతూంటుంది. ఆవ్రవాహంలో నిశాకంఠం వినిపిస్తుంది. గొద్గదికం ఆది. భయానకం, నువ్వడుగు: ఎవరిదీ పాట?

52 నీకు ప్రత్యుత్తరం రాదు, హఠాత్తుగా ప్రవాహం ఆగిపోతుంది. కంఠధ్వని సన్నగిలి సన్పగిలి నిశ్శబ్దత ఆవరిస్తుంది. మళ్లీ ఆడుగు, చీరవిప్పిన చీకటిలో నీప్రాణాన్ని విప్పుకుని. ప్రవాహం తిరిగీ సాగుతుంది. ప్రశాంతంగా పలుకుతుంది. “విగత జీవుల స్వరమేళ” మళ్లీ పాడమను. పాడుతుంది. ఆపాట విను, విను అంతే, మననం చేసుకోకు, రాసుకోకు. విన్నతిలో అపశృతి కలయిక, అదే జీవితం, నీదీ నాదీ, అదే సత్యం; దాని శవం సుందరం సత్యం ఆజన్మతః నిర్జీవం, అందువల్లనే అది ఆరాధ్యం ఈ లోకం దానికభి ముఖంగా ప్రయాణిస్తున్నది. అందులో పురోగామిని నేను. నువ్వుమాత్రం తొందరపడకు, ఆలోచించు. ఆలోచించు. సర్వం ఆవలోకించు. కళ్లు మూసుకుని ఆలోచించు, చీకటితో కాపురం చింతారహితం. చింతలేని బతుకు అవశ్యం వర్ణ్యం.

శేష గీతాలు

వ్‌ష నిర్వాణ గీతి విచలించండి విచలించండి! డేగ రెక్కల్లార! మూగ నక్కల్లార! బ్రతుకు కారాగృహం పగిలించి రగిలించి విచలించండి విచలించండ్‌! పతిత రక్తం హరించుకునే నరాధముల నాశం కొరకు విచలించండి విచలించండి! ఎండుకట్టెల్లార! మండుటెండల్త్లార! పొలకొరకు కేక పాస చచ్చేదాక! రాకాసి దరిద్రం మో కోసరమే రాక! విచలించండి విచలించండి! విస్టృత బుక్కుల్లార! వికృత భిక్కుల్లార! విచలించండి విచలించండి!

ర్‌ర్‌ నేల కొరకు స్వేచ్చ కొరకు కాయ కష్టం కబళం కొరకు విచలించండి విచలించండి! రక్తనేత్రుల్లార! రిక్తరాత్రుల్లార! ఆనాటి ఖర్మం పోదని ఈనాటి ఖర్మం చేదని బతుకు వెతలు నురీ ఖరీదని మోలో కృశించక మోలో నళించక విచలించండి విచలించండి! వక్ర రేఖల్లార! వృక్ష శాఖల్లార! క్రొత్త వెలుగు కలిమికి జ్రొత్త ఎలుగు చెలిమికి విచలించండి విచలించండి! డేగరెక్కల్లోర! మూగ నక్కల్గార! (నాళం కష్ణా రావు గారి నన్టి వూర్తి నంచిక “శ్రీ కృష్ణాల్యుదబయ” నంచిక 2947 మండి)

56 మీరెవరో మాకు తెలుసు మీరెవరో మాకు తెలుసు మిన్నంటిన వెన్నెల వన్నెలు మీరెవరో మాకు తెలుసు మృత్యువు తీర్చిన చలువరాతి తిన్నెలు మాకు తెలుసు మీరెవరో మాసిపోయిన కలల కన్నులు మాకు తెలుసు మీరెవరో మనిషి మనసు తెంచిన తెన్నులు! మాకు తెలును మీరెవరో వేకువ లెరగని రాత్రులు మాకు తెలుసు మీరెవరో 1954

5్‌7 నువ్వు

నా ఆదర్శాల శల్య సారధ్యానివి నా ఆక్రోశాల వైరుధ్యానివి నాహృదయంలోని అర్థం లేని కేరింతవి నాయింద్రియ నిగ్రహాన్ని కన్న బాలెంతవి నువ్వెవరవో నాకు తెలయక కాదు యీలోకమ్మీద నాకున్న చేదు నువ్వు కాలానివి ముముక్తువుల మనళ్ళ్శీలానివి నాడ్రేయసివి అందని అందాల రోదసివి!

1954

కరి నువెవరవు? నువెవరవు? నువెవరవు? . చిగిరించని కోర్కెల చెరవు దిగజారిన చీకటి తెరవు నువెవరవు? నువెవరవు? వేస్తున్నదొకటే ప్రశ్న వేయికనుల విప్పి జ్యోత్స్న! నువెవరవు? నువెవరవు? పిండుతున్న గుండెల మరవు మండుతున్న బాధల ధరవు. నువెవరవు? నువెవరవు? నోరుతెరచి చూస్తూ మిన్ను కారునలుపు మోస్తూ మన్ను! సడిలేని నడిరేయి కరుగుతున్న తుహిన హృదయం కడలెరుగని కాల విలయం నువెవరవు నువెవరవు? నిశలు చించి రేగుతున్నది దిశలు నిండి మైోగుతున్నది.

చం నువెవరవు నువెవరవు హపిమనగ శిఖరాన కాలిడి హేమంతం నుదుట వేలిడి వెలితి కో వెలమోల నువెవరవు నువెవరవు? 1950 ?

60

సంజల మధ్య సందుల మధ్య సంజల మధ్య నడుస్తూ రానున్న రాకాసి చీకటి నోటికి రుడుస్తూ తలపోశాను ఈ భువనం మంటి పాలయిన మదురాతి మధుర 'ప్రసవమ్మని భూగర్భ కోశంలో కెలికాను వేళ్లు చాచి ఒక్క దళం కోసం పరిమళం కోసం వచ్చేది వసంతం తెచ్చేది సౌందర్యం ఈ నగరంలో గొలివీచినా వానవెలిసినా తారతమ్యం జెలీని శ్వాన నిశ్వాసల విశ్వమిత్రులు విధి కచేరీలో గుమాస్తాలు కన్నీటి కెరటాల కోస్తాలు.... అందులో అందరికన్నా ఆరాధ్య దైవం శివం- దురదృష్ట దేవత శంఖారావం

61

అతని నుదుటి గీత గీర్వాణం నుంచి బ్రహ్మాండ పురాణం తెలుగుకై సేత తన గుండెను రోడ్డు మీద విప్పరాదని తన జీవితం విలువ కొలవరాదని ఊరవతల సొరాదుకాణం వక్క వెలిసిన పోలేరమ్మ సాక్షిగా ప్రమాణం చేసిన శివయ్య ప్రమాణం పరిణామం తెలీక ప్రపంచంమీద ఫిర్యాదు చేసి విశ్వ్యేమలో విపరీత విశ్వానం పెంచుకుని రచ్చపై గోరు వెచ్చని

( అనంవూర్ణం. రభవాకాలం-?)

62 జొ త్త ట్రయం! పేయసీ! రోచి ర్వేల్లిత రోదసీ! ఎన్ని నేరాలెన్ని ఘఫోరా లీ క్షణంలో నీ క్రుధాశ్లధ వీక్షణంలో, నీలవర్ష ప్రాంగణంలో- ఎన్ని దోపిళ్లెన్ని హత్యలు ఈ శరత్తున, నీసితాశ్రు రు రీ సరిత్తున, భయం కర రుం రూ మరుత్తున- 1954

63 నన్నయ నుంచి నాదాకా

నన్నయనుంచి నాదాకా

నవ్వని వారెవరు లోకాన్ని చూసి?

జనన మరణ గతుల్ని ఆరబోసి

జ్వలిస్తున్న హృదయం చిచ్చారక

ప్రతి కవీ బాధ పడిన మాట ధ్రువం

పరమావధి తెలియక లవం! నన్నయాదుల్ని కనికరించ నేరక నానావిధాల యేళ్ల తరబడి

భూత భవితవ్యాల భావన కొరబడి. పుణ్యం, పాపం, నీతులవినీతులు మారళ (వాశారెందరెందరో కవిత్వం

వారికి సిద్ధించింది మరి స్థిరత్వం!

నువ్వూ నేనూ, ఆలాంటిది కోరక నవ్వుకున్నాం మనంకూడా మరోరకంగా మనం మరో విధంగా రచిస్తున్నా శకశకంగా ధ్వనిన్తుంది కాలగర్భం చీకటి చేరక మనం నవ్యమార్గం, ప్రవక్తలం! ఆధునికత రర్థం తెలియ జాలక ఆ గణం ఆప్రాస, ఆ ఛందం ఆ విభాగం, ప్రయోగం, ఆ బంధం వాటిల్లో నించి పైకి తేలక సహించక హృదిలో పరివర్తనం సాగిన్తున్నారు వెనకటి నంకీర్తనం! ఆధునికతలో గుత్త వ్యాపారం

64 అరడజను చేతుల్లో నడుస్తోంది మన జన్మ వాళ్ల ప్రాణం తీస్తోంది దచినదినం గండం వాళ్ల వ్యవహారం గ్రహించరు కాలక్రమాన్ని నహించరీ కార్యక్రమాన్ని! 1954

లర్‌ ఎవరు?

కాలానికి సంకెళ్లు తొడిగి

కష్టాలకు కాళ్లు కడిగి

అంతరాంతర శక్తులుడిగి

అవతరించా రెవరినడిగి?

జీమూతానికి జీతం పెంచి

ం జీవచ్చవాలకు వేషం వేయించి

కర పత్రాల పాత్ర ధరించి

కవితకు గాంధర్వం పట్టించి

ఆనందం మకరందం వడబోసి

అక్షరాలనురిదీసి

కీర్తి ప్రతిభల విడదీసి నర్తిస్తున్నారెవరీ నిశి?

1952?

66

ఉదక నిమిత్తం బహుకృత వేషం చరుస్తున్నప్పుడు తొడలు గాయపడకూడదు. విరుస్తున్నప్పుడు జబ్బ వెన్ను మీద కన్నువెయ్యండి ఏడుస్తున్నప్పుడు రుమాళ్లు పెద్దవి కొనండి ఎందుకేనా మంచిది, ఛాందనం వదిలివెయ్యండి ఛందస్సెప్పుడో చచ్చింది: యీ ఛాన్సు మళ్లీరాదు మిల్లు ఖద్దరులా వచన కవిత్వం వచ్చేసింది మూడు పువ్వులారు కాయల్లా మూలమూలా తెలుగు కవిత వెల్లి విరుస్తోంది. ఇహ నుంచి అహరహం ఇహం మానేసి సామాన్య జనులు శ్రామికులు కర్షకులు కవిత్వం కోసమే బతుకు తారు మీ ఆరిభీకరకేకలకు వాళ్ల శత్రువులు దగ్ధమౌతారు.

1980?

67 వెళిపోయింది వెళిపోయింది నిన్న యివాళ వెళిపోయింది వెళిపోతుంది నేడు రేవటికి వెళిపోతుంది నువ్వూ నేనూ అలాగే పోవాలసి ఉంటుంది నోరు తెరుచుకుని సిద్ధంగా ఉంటంలో తత్వముంది. అన్నా! ఇన్నాళ్లక్‌ నాహృదయాన్ని విప్పి అందాకా తొక్కిన మాయ దారి తప్పి తుది ఘడియల్ని నీలోనాలో మోగించి వెళి పోతాను ప్రయాణాన్ని సాగించి. తెలునునాకు నీ కళ్లల్లో కొలనుంది తెలుసునాకు పూలబాకు నీ మొలనుంది. చంపేస్తుంది నీ వలవునన్ను; చంపి మాయమవుతుంది నీ చెంపల్ని వేణ్జీళ్లతో నింపి. మరీ చిన్నతనంలో మనం కవిత్వం రాసి మధ్యాహ్నాల్ని సముద్రంలో పారేసి ఈతి బాధల్ని ఉప్పుటేర్లో గిరవాటేసి నవ్వుకున్నాం లోకానికొక కన్ను గీటేసి పురిపండా గుండె మంచిది, గొంతు మంచిది; ఉన్న విశాఖపురినిండా కవిత్వాన్ని పండించి చిత్తశుద్ధితో సౌహిత్యాన్ని జీవిత ధ్యేయం చేసి పరిశ్రమించాడా రోజుల్లో కలలు గాసి.

68 దండాలపై ధండాలపై దండాలు పెట్టి అవి అందుకొని దీవించమన్న సీత్రారామాంజనేయుల జాతక మేమాయె అతన్ని తలుచుకున్న తెలుగువాడు లేడు. -1984

659 అక్కడ మనం రాయటం పొరపాటని నమ్మేసి మనం కాసిన కలల్ని గిరవాటేసి కనిపించని వినిపించని తీరాలకు పోదాం శాస్రీగారూ! మనం ఆందరం వెళదాం అక్కడ భావ దారిద్య్రం ఉండదు అక్కడ మనం పడనివాడికి కడుపునిండదు అక్కడ నిత్యం దేనికో వెతకటం వెదికి వెదికి వేసారి చితకటం 1978

70

శ్రీశ్రీ వరదారుద్రలు శ్రీశ్రీ వరదారుద్రలు ఏ్మ శ్రేయస్సును భజించిరీ లోకంలో ఆళ్ళతు లా రుతు లాగతు లీ శ్రీ ముఖమందున ఫలియించు కవనమై! వరదారుద్రలు శ్రీశ్రీ పరదాగా చేయలేని సంచారంలో పరదాల వెనుక బ్రతికే చీరునామాల పరిణామ చింతన ఒకటే! ఆరుద్ర వరద శ్రీశ్రీ లారంభించని జగన్మహా కావ్యంలో హీరోషిమా విషాదం నీరో మీటిన ఫిడేళ్లనే వరియించున్‌! తొక్కిన మార్గాలన్నీ చిక్కని న్వరాలనుకుని చింతిస్తామూ? ఎక్కని రిక్షాలన్నీ దక్కని మోక్షాలనుకుని తడబడతామా;

1956

న పక్కింటి కుర్రాడు పక్కింటి కుర్రాడు వెళ్లేది న్కూలికి అంత లేడా లేదు వాడికీ వాలికి వాడికన్న నయం సుగ్రీవుడు లేడనటానికి వీల్లేదు దేవుడు. ఎదురింటాయనతో లేచిపోయింది వాళ్ల అమ్మ ఏమనటానికి వీల్లేక నోరు నాక్కుకుంది వాళ్ల బామ్మ పొద్దస్తమానం గుళ్లో కూచుంటాడు వాళ్లనాన్న ఏం చెయ్యగలడు పాపం అంతకన్న పక్కింటి కుర్రాడి కళ్లు జీతాలు చాలని గుమాస్తాల మామూళ్లు పక్కింటి కుర్రాడి గొంతు సారస్యం లేని నన్నాయి తంతు. వాడి జుట్టాక కీకారణ్యం అందులో కాపురమున్నది కారుణ్యం " వాడు తొడుక్కునే అంగీ వాడి తాసత్రయాల బంగీ. స్వాతంత్ర్యం గురించి వాడికేం తెలీదు పాసం సాయత్రం అంటే వాడికి బహుకోపం వాడికి నచ్చిన మాట సామ్యవాదం ఆందుకే ఆహరహం వాడి సింహనాదం

72 వాడి చెవులు సూది మొనలు చెంపలు పంపరపనస తొనలు నుదురు చూసి వల్లకాడు బెదురుతుంది గుర్గగూబ గుండెల్లో చెత్తురు చెదురుతుంది వొడునిలబడితే ఆశ్చర్యార్థకం పడుకుంటే ప్రశ్చార్థకం నడిస్తే రోడ్డుమీది జనాని కనర్థకం నిత్యం కూచోవటం బలవర్ధకం. వ్రతిరోజూ స్కూలికి ఒక క్షణంలేటు అందుకని దొరకదు పాపం సీటు వీడి పరీక్షకి వాళ్లనాన్న పూజ శప్పని సరిగా తప్పుతాడు వాజ

73 ఓయి వెర్రివాడ |!

ఓయి వెగ్రివాడ! కనుల ఊగులాడు ఘోషక్రై మాయబోని (ప్రాత బ్రతుకు మాటలాడుభాషకై కాయరాని వెర్రికలల కావిరంగు నీడ శై తీయబోకు గుప్తహృదిని తీరులేని జాడకై నమ్మరాని దీ జగతి మనమ్ము) తేటి పాటలో చెమ్మగిల్లు పూవుటెడద; చింత లేర్చుతోటలో సొన్ముసిల్లు మానవహృది; శూన్య...

1950

74

జోల పాటలు నిదురపో నా తండ్రి! నిదురపో నా తండ్రి! ఏ జన్మకే జన్మ ఏ కర్మే కర్మ నిదురపో నా తండ్రి! ఏడువకు నా తండ్రి! ఏడువకు నా తండ్రి! ఏడిస్తై నీకళ్లు ఏడు దీవుల ప్రాకి నిప్పచ్చరమె యౌను! ఏడువకు నా తండ్రి! ఏడువకు నా తండ్రి! నీతండ్రి నాకెవరు? నీవేను నొ ళండ్రి! ఏడువకు నాతండ్రి! ఏడువకు నా తండ్రి! నిదురపో నా తండ్రి! నిదురపో నా తండ్రి! నాయొడల చిట్టడవి నీవిడుదలకు దారి ఆదారి చూపించి

75 ఏతీరు పోయెనో నీ తండ్రి నాకేమౌను? నీవేనునా తండ్రి! ఏడిస్తై నీకళ్లు నీలాలు కారగా నీ తండ్రి మారునా? నాతీరు మారునా? నీకోస మిందాక నిదురించనే లేదు వలపంటి కలగంటి పరమార్థ మనుకొంటి నిదురపో నాతండ్రి! నిదురపో నాతండ్రి! నీ భాదయయ్నెవ్వరిది నీ తీరమెందాక నీ తండ్రి యెరుగునా నా తండ్రి నిదురపో! నిదురపో నాతండ్రి! నా శయనమ్మందు నీ తల్లి నీ జీవ రక్షానయనమ్ముగ నీ కోసమె బతికి నా కోర్కెలనె వలచి నాయీ శరీరమ్ము నగ్న వాంఛాకృతిగ

76 నీ తల్లి నిర్మలగ నే పన్నిన వలగా భావించి నిన్నిపుడు దీవించి సేవించి నేనెవరో తానెవరో తెలియనేరని కలగా నా పయనమ్మందు నీ తల్లి నీ జీవ రక్షానయనమ్ముగ!

భా కవితా శకలాలు వైతరణి కేదినం నిర్ణయించారో ప్రాజెక్టు నిర్మాణ కార్యగ్రమానికి నక్తత్ర విద్యుత్పసార వ్రసాదం నాటికైనా లభించునా మాగ్రామానికి? లే దారితప్పించి లాభం లేదు నదొన్ని చివరికి చేరుతుంది గమ్యాన్ని మానం చెరిపి తుంచకు పదాన్ని మౌనం పెంచుతుంది....... శ్‌ దీన బంధువు లెవరో దాన సింధువు లెవరో వాడవాడల గాలించిరండీ తోడునీడలు............. శనికరిస్తారు. లే చందా లిచ్చేందుకే జిందగి కునుమించింది నా శీర్తిశషావతరణకు నామృత్యు దివ్య సంన్మరణకు! చారెడు కళ్లు నాన్న తికి ఇదొక నిషా; యిదొళ మిధ్య ఈ పదాల దాడి మధ్య తునకలైంది గుండె లోడులేని నీడలేని

అంత్యక్రియలు

79 అంత్యక్రియలు

ఎక్కడిదీ చీకటి? చూడకుండా చెప్పకు ఎప్పటిదా వేకున? తెలీదని నాకళ్లు కప్పకు; పోయేనాడు యవరూ వెంటరారు. అబద్దాలాడితే రోజులు మారు.

ళా కాలానికి మెదడుబేదు; గమనం ఉంది శీలానికి హృదయంలేదు; మెదడుంది. దారిద్ర్యం నైసర్గిక స్వరూపం చూడు దైవం భూతల స్వర్గాన్నిస్తుందేమో చూడు

శ్‌ పంచవర్ష ప్రణాలిక కంఠస్థం చెయ్‌ పంచదార దొంగతనంగా కొని దొచెయ్‌ పిగ్గులేని మాజీమంత్రికి దాసోహంపట్టు ఆకాడమీలో డబ్బులు ముట్టు

నే సినీపొాటలో మనీమాట కలదు ధ్వనిప్రధానమైజేకాని కవిత చెల్లదు మని ప్రధానంగా కుకవుల గొంతు వెలిసె అంచాత శ్రీశ్రీ కా కిటుకు తెలిసె

శ తెలుగు కవితకు నెలతప్పింది తీరాంతరాల చీకటి పురివిప్పింది మీత్యువు పుడుతుంది అకాడమీ బారసాలకు వెడుతుంది

శ్‌

80 జ్ఞాన నేత్రానికి చత్వారం రాదు మౌన హృదయానికి పబ్లిసిటీ అవసరం లేదు కుండమోత నేటి కవిత; కుందుర్తి నడక్కు పెద్దబాలశిక్ష నేటి సాహిత్యం; అజంతా నడుగు జ్‌ ఇక్కడ ఆడదానికి మోకాళ్లుంటాయి ఇక్కడ మేడలకి మెడ నోప్పిఉంటుంది ఇక్కడ రోడ్డు నిద్రపోవు ఇక్కడ కార్లకు చెవుల్లేవు. శ్‌ ఒకానొక రాత్రి ధరిత్రి దద్దరిల్లుతోంది ఒక్కట్లే -నిద్ర కోసం ప్రాణం ఛస్తోంది ఎవరూ లేని యీవాకిట నేనాకటికి చచ్చి ఎత్తిన చేయి క్రైవారమ్ముగా మెచ్చి శః లాభం లవం లేదు కవిత్వం రాసి లక్షణంగా పక్కింటి పెరట్లో గడ్డిమేసి బతకటం మేలు; నలుగురి నోటాపడి బలే గమ్మత్తుగా ఉంటాం చచ్చీచెడి శ అధికారం వూడిన మంత్రికి అంతస్తు హెచ్చింది ఆయన్నాశ్రయించుకున్న జనహప్రాణం చచ్చింది కళాకమీసూ చవగ్గా వుంది శవిగా తిరిగితే షోగ్గా వుంటుంది. 1978

నైశవ కవిత

క్‌! (గే జా లి | కక్‌ పెం ింము న 1 శ్‌ తా రం. వ్‌ సు ఆళి తానో శ అటిక ష్‌ లీ శ్‌ శాప ఈం గం కయ - ఓ కి న కణ చి స్‌ సట్‌ ౧ (యా రథో న ఇ. లోట య. | న్‌ నే గ్‌జ చే న నా స కట! _ ఆశాట్య్య వా, ల్ల శ్‌ జే న స నం ం ఎం యో ఖీ భే లే జ ళ్ల న్‌, - సలా ల యా 1 గ! శింస్తె నే కస ప్త డన శశి చెసా ష్‌ న్‌ సళ్ల

లాసికా! ఠస్సూ రి వరదళాసే స్త్ర డొంన్ర) ల౭ంసి శ్రా! "ర వలచు శ లళఖ తరఫు జాడ పావును ౫ న. నని ౮గ్త్ర సాగ ఇాలసం న్యాంగతాం పాదం షేంండఎా గార్‌ నొళ్లాాాణ పల వాారం,/ (7, 0.29 లాసికా! రేసు వలదు కలాలి కొరకు నేడె పొమ్ము, బహంక్షుధానిధిని నేను; ఆగర్ట స్వప్న గళాల సంధ్యాంగణాల పాడుకొందము గాక నిర్వాణ పదము 1939

రికీ అలి భగ్నప్రణయము ఓమనోజ్జ్ఞ ప్రభాత మహోజ్వల సిత రోచిరుదయినీ! పీడిత రుధిరసిక్త మో ధరిత్రీ తలమ్ము నిర్హేతుకమ్ము జీర్ణ నీరవ ప్రాంగణ జీవితమ్ము ఓ ప్రమాద ముద్రిత జగతీ ప్రబుద్ధ దుఃఖ భాగినీ! లేచి రావె, కామేశ్వరీ లేచిరమ్ము దగ్ధ గాధా ప్రబంధ బంధమ్ము తెంచి, మఘవ మధుర స్వప్నాంచల మార్గ మెగసి లేచి రావె, కామేశ్వరీ! లేచిరమ్ము దక్షిణా పథ రసిక హృదంతరమ్ము నీ విషాదాంత...................... స్‌ మా పూర్వ పుణ్యనతు లే నోము నోచిరో నూ పూర్వ సాహసికు లే ధనువు సొచిరో ఆర్జించి కొన్నాము అమృత భాండము దీని పూజంచు కొన్నాము పుణ్య కామేశ్వరిని

తిక

తమస్సు విరిగెనే ఉషస్సు విరిసెనే ఊరికావల నీలి తోనల ఉన్నదమ్మా పసిడి బొమ్మా కన్నతల్లికి కంట నీరే విన్నవారికి వింత కాదే! ఎవరొహో ఎవరొహో

ఇల నలుపు నింపెదరు?

కల వెలుగు చంపెదరు?

జ్‌ అలముకొన్నాను మేన, రక్తాభ్ర కాంతి, అదిమికొన్నాను కౌగిట విదియ జ్యోత్స; పడుచు చెలుల కాంక్రాఫల ట్రాప్తి కొరకు చల్లి పోవుదు కుంకుమాక్షతలు నేడు. ళ్లు శావణాంబర మేఘావరణములోన రంగురంగుల మేలి తోరణము లేల? దిగ్య్వ్యధూ చరణారుణ దీప్తిలోన ఏ లలిత మౌనహృద యేచ్చ మేలు కొనును? కామేశ్వరి :

విరియునా నేడయిన

వియత్రాంగణమ్మున

ఇంద్రధనున్సు? కురియునా నేడయిన

క్తుధా దృక్కోణమున

దయా పయన్సు

తి బంద గీత : ఆశాశ లాల కించినవిలే ఆశాశ లావరించినవిలే కాటి కాపరివరచు తొలికేక కోటి గుండెల మోగు పెనుకాక మహారాజు; ఎవ్వరిది కాతర స్వర మోసుప్ర భాతమంగళవేళ - విపన్నులెవరు? కామేశ్వరి : వలపింతురా, శూన్య గవాక్షాంతరమ్ముల మాలిన్యరేఖ విలపింతురా, దైన్య శవాభ్యంతరమ్ముల శో నన్నపహసించు మూఢ మానవుల కింత శ్వాసశక్తి నే దైవ మొసంగినాడొ? లోక మోనాడు విశ్వాస లోభగతిని ఆభ్యుదయ్య మెరుంగదు, విలయమ్ము దప్ప ఏనెరుంగను ప్రేమించి యింత దనుక లలిత లావణ్యరేఖ లీలాకుమారి నొక్కవతిత భ్రష్ట జనమ్ముదక్క లేరు బాంధవులు నాకు నేటి ప్రపంచ మందు.

ఈ చెరసాలలోనె నశి యించెద నీ వలె నేలరాలి, బా ధాచిత మోయగమ్య జన తాభ్యుదయోద్యరుచింత, నీవునా శై చరమాంధ్యవేళల వి (| యత్పధమెల్ల చరింపబోకు, నా యీ చలితార్దనేత్రములి దేవిధినీ కయి విహ్వలించెడన్‌. (ఆనంవూర్హం, 1939

88

వేకువల చాయ ఎవరు రగిలించారో ఈ రేయి సుడిగాలి ఎవరు పగిలించారో ఈ జీర్ణ హృదయమ్ము? సడిలేని గుడి యెడద జడివానలే కురిసె! వెలుగెరుగనీ గుడిసె విపుల జ్వాలలె విరిసె! ఈ ప్రొద్దు గతియేమొ ఎరుగదే లోకమ్ము! మృత్తిక యని కలను మృదుల హస్తాలతో లొలగించిన దెవరీ తొలి వేకువల చాయ!

89 విస్త్షవము విప్లవము రావాలి! విప్లవము కావాలి! విప్లవ జ్వాలతో విశ్వమేనిండాలి! ప్రాత సంకెళ్లన్ని పగుల గొట్టించాలి 1939

90 పేదలు "పేదవాని మూపు రోదనముల మోపు కండరాల కనుల గుండుసూది గనుల ముంచియెత్తినంత భూతలమ్మునంత వెలిగె క్రొత్త కలిమి విరిగె ప్రాత చెలిమి! "పేదవాని గుండె రోదనములనిండె తాను కష్టపడిన తాను నష్టపడిన బహు శ్రమార్ధ ఫలము స్వర్ణ జగత్తలము! "పేదవాని శవము క్షుధావ్యధారవము పుడమి లోతు కొసల గాలి పాము బుసల క్షణము క్షణము గడిచి ఫణము ఫణము నడిచి మృత్యుశృంఖలాల తకైంచుకొనెడు వేళ ఈ మధాంధ జగతి కౌగలించు ప్రగతి 1939

91 జి నేస్తం పవలు రేలని భేద భావమ్ము గనక కడుపు నింపుకో జూచు వర్గస్తుడతడు; ఆతని జీవితగాథ క్షణాంకురమ్ము అతని సర్వమ్ము తన కేశ వితతి కాదు రాత్రి వలె నల్లగా ఆర్ద నయనాలు నీలముల మాయ కా నీరవములు 1939

92

నా హృదయమున నా హృదయమున విశ్వవీణా వ్రబమ్ము! రక్త రంజిత తారకారాశి లోన వెదకి కొన్నాను నా ప్రియం వద పదమ్ము ఆర్ట నయనాల ఈ గహనాంతరాల] ఈ తమస్సు మనస్సు సహించునెట్లు? జన్మ జన్మాంతరములు విషాద జీవి తమ్ము గడపిన వృద్ద బాంధవ్య హృదయ వేదనా మహతీ శ్రుతీ రోదనమ్ము?

1939

త నేటి వేకువ

నేటి వేకువ నా గుండె నిదుర లొణకె వెలుగు చాయలలో క్రొత్త కలిమితోచె, స్వస్తి చెప్పితి ప్రాచీన పద్ధతులకు ఆధునిక మనోజన్మ సంప్రాప్తముుయ్యె తోటి కవుల కలాలకే మేటి తనము కలదనుకొనెడు పఠితృజనుల ఉదార హృదయములు! నమస్కారమిదియ కొనుడు మీరు వందింపబడిరి నుమీ నిజముగ! |

1939

అనువాదాలు

రక

ఆరంభ శూన్యం

ఆదిలో సత్యంలేదు అంతకన్న

అసత్యం లేదు

ఆకాశం లేదు ఆకాళం వెనక

అగాధం లేదు

నిరవధికమైన నిరాకారమైన

జలగర్భం ఒకటే

అప్పుడు మరణం, అమరం లేదు

రాత్రీ పగలూ లేదు

చీకటిని కప్పుకుని చీకటి

అలాంటి ఆరంభ శూన్యం నుంచి

అదిగో అది న్వయంకృత శక్తితో

ఆవిర్భవమయింది = ఊపిరితో శ్వాన నిశ్వానలు లేకుండా

ఆవిర్భవమయిన తరవాత - అదిగో అది

కాంక్షని అనుభవించింది. కాల్పనిక

మనస్సుకు (ప్రారంభశక్తి -

స్వయంభువులయిన కవులు సతకీ ఆసత్‌ కీ

మధ్యకల బంధాన్ని గ్రహించారు. "

అయినా, ఎవరికి తెలుసు ఈ సృష్టికి

ఆది క్షణమేదో

దైవాలూ తరవాతనే వచ్చారు.

బహుశా తనంతట తనే సృష్టించుకుని ఉంటుంది.

అలా కాకపోవచ్చు.

ఈ విశ్వాన్ని అత్యున్నత స్థావరం నుంచి

అఆవలోకిస్తున్న అతనే -

96 అతనికే తెలుస్తుంది. బహుశా అతనికీ తెలియకపోవచ్చును. ఆవేదన ప్రవర్గమానమవుతుంది. సవ్యమైన సత్యం తెలియదు కనక. బుగ్వేదంలోని నానదీయ నూవ్రినికీ ఆనువాదం

| 97

సాయం కాలం

మెరుస్తున్న చల్లని కనుచీకటి

నగరం నుదుటిపై హిమకణంవలె కురుస్తున్నది

దినం క్రమంగా క్షీణిస్తున్నది విసిగెత్తి

నదం ప్రవహిస్తున్నది మంద మందమ్ముగా

మనుష్యులు గమిస్తున్నారతి వేగమ్ముగా

నిఖిల నిశ్శబ్దం వెనుక .

చివరి కాశనాకటి కనుగొనినటు;

ఇటు నిరీక్షిస్తున్న మాకనిపిస్తున్నది

కేవలమ్మీ సాయంతనమ్మునకె

కాలగిరి నవరోహించి నారమ్మని

నిరీక్షిస్తున్నాము మేము నిరీక్షిస్తున్నాము

చీకటి కౌగిట విధి రహన్యం

చిక్కిన రెక్కల్ని ఈ క్షణం ఆవిష్కరిస్తుంది.

అనంతశ్తి సంపన్నమయిన హన్తం

ఆనుమానంపై ఆఖరి దెబ్బతీస్తుంది

విడిపోతున్నయి సంజమబ్బులు

దీపం ఊదుతున్న పెదవుల్లా

ఈ క్షణం తీవ్ర నిశ్వాసాన్ని దిగమింగింది

ముక్కుల్ని బిగించి

ఆఖరి కేకకు ఆసరాయిస్తుంది

నవ్వుతున్నాం మాకు తెలును కనక

ఉదయానికి ముందుగానే దుమారంలో

నిశ్శబ్దం రాలుతుందని

రేపటి సాయం కాలానికి యీగతం

98 గడిచిపోయిన పాత కలలా తోస్తుంది. ఇపుడు కాలం నరాలు చల్లబడుతున్నయి నిశ్శబ్ద కాసారంలో కట్టెదుట కాళరాత్రి ఈ చరమక్షణంలో వెలుగుతున్న వీధి నుంచి ఇంటికి వెళిపోవటం ఎంత కమ్మదనం. మూలం హెరాల్డ్‌ మనో. అనువాద కాలం 1954

99 స్వభావాలు

తామ్మిది రంకులు, 12 సంబంధాలు 64 చీకటి తప్పులు, మరిగొచ్చి ఒక రమారమి మానభంగం మన నున్నితమైన స్పేహితుడు ప్లోరియాలిస్‌ గుండెల మీద ప్రతిరాత్రి విశ్రమిస్తాయి అయినా అతగాడు ప్రవర్తనలో ఎంత నెమ్మదిగా ఎంత నిండుకుండగా ఉంటాడని! అతణ్ణి చూసి రక్తహీనుడని నిర్వీర్యుడని అంతా అనుకుంటారు మైథునం గురించి తప్ప మరిదేని గురించి వాగని వ్రాయని ముండాకొడుకు, ఆ మాటకొస్తే కవల పిల్లల తండ్రయ్యాడు. అయితే యీ ఘనకార్యం సాధించడానికి పాపం నాలుగింతలు పెళ్ళానికి దానుడయ్యాడు!

మూలం: ఎజ్రా బౌండ్‌ (కనువాద వాలం: 1954)

100

వెధవ గీతం నిన్ను తలచుకొని తలచుకొని నిద్దర పట్టక రెండు రూముల రాత్రప్పుడు నా గదిలో యీజీ చైరు మీద కూచుని ఉండగా

  • యదుట బల్లమీద మెరుపు దీపం, గోడని నిలువుటద్దం వున్నాయి - అద్దంలో నా ముఖం చూసుకుని యేమంటానూ? “యీ సాగసైన ముఖం యీ తామర రేకుల వంటి నేత్రాలు యీ సోగ మీసాలు యివన్నీ వృధా గదా? ఎవరు చూసి ఆనందించనూ? నా బుచ్చమ్మ నన్ను పెళ్లాడకపోయిన తరవాత నా బతుకుయెందుకు? ఆని నిస్పహకలిగి ఛగర్రున టేబిల్‌ సారుగు తీసి అందులో వున్న జోడుగుళ్ల పిస్తోలు ఎక్కుపెట్టి గుండెదూసి పోయేటట్లు కొట్టేసుకుంటాను తక్షణం దేనతలు విమానం పంపించి నన్ను స్వర్గానికి తీసుకు వెళతారు

101 స్వర్గానికి వెళ్లానని నాకు అక్కడ మాత్రం సుఖం వుంటుందనుకున్నావా వొదినా? నవాభరణ భూషితురాలయి రంభ తక్కుతూ తారుతూ వొచ్చి “హా ప్రియా! గిరీశ! నీలాంటి సుందరుణ్ణి యన్నడూ నేను చూడలేదు రమ్ము నన్నుచే కొమ్ము” అని రెక్క బట్టుకు లాగుతుంది. యానా నేనేవంటానూ? యర తా గ్‌ లి “ఛి ఆవతలికి పో ఉష ఇంతటితో నే - నేను యాంటీనాచ్చి! త్త షు ల సు టాటా క్‌ సొనిది తాకితే పరమ ఆ న ఫైదా అ పవిత్రంగా తలుస్తాను క పియర్సు సబ్బు రాసి కడిగితేనే కాని యీ చేతికి కశ్మలం పోదు నువ్వా రంభవి? మా బుచ్చెమ్మ సాగసుకి నువ్వు వొడ్డీకి పనికిరావు గోయెవే!

102 డామ్‌ డర్జీ గూస్‌! + అని అంటాను అలాగే మేనకా ఊర్వళీ తిలోత్తమా మొదలైన యావన్మంది అప్సరస స్రీలని తన్ని తగిలేస్తాను. తగిలేసి కాషాయ వస్త్రాలు ధరించి కల్పవృక్త్షచ్భాయని “వో బుచ్చెమ్మా! బుచ్చెమ్మా!” అని నీ పేరు జపం చేన్తూ అనేక సంవత్సరాలు పద్మాసనం మీద వుండిపోతాను. ఆంతట కొన్నాళ్లకి - నా తపస్సు ఫలించి, నువ్వు నందన వనంలోకి చంద్రోదయంలాగ బయలుదేరి వస్తావు నేను ప్రియురాలా! యెన్నాళ్లకి వొచ్చావు!” అని అమాంతంగా వెళ్లి నిన్ను!

103 నిన్ను కౌగలించుకుంటాను అప్పుడు నీ మొదటి మొగుడు ముసిలి వెధవ గావంచాగుడ్డ కట్బకుని పొడుం ముక్కుతో “బుచ్చెమ్మ! నా పెళ్లాం!” అని అడ్చు రాబోతాడు. “వెధవాయా! నువ్వు బుచ్చెమ్మకి తగవు! నీ రూపాయలు నువ్వు పట్బకుపో” అని ఒక్క తాపు తన్ని తగిలేస్తాను. మనం ఇద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా వుండిపోతాం, యన్‌.గెరీళంగారి మధుర న్వప్పాల నుండి యీ కవిత్వం నంగ్రపొంచబడినది. గ్రసాంచవలెను ప్రచురితం: ఆం(్రవ్రభ నబిత్ర వారనత్రిక 5-10 ఆక్టోఐల్‌ 1994

ఓ మనసా!

105 ఉఓమనసా]

బగవంతు డున్నాడొ భగవంతుడే లేగొ భగవంతుడే యెరుగు నగుబాటు కాదటే

ఓ మనసా! ఉఊపిరన్నదె భయం ఒంటరి తనమె భయం ఒక్క మంచం భయం ఒక్క పక్కే భయం

ఓ మనసా]! ఎవరైన చెప్పెదర ' ఏది మూలమో జన్మ కేది మూలమొ కర్మ కేది కాలమొ మృతికి

ఓ మనసా। నన్ను చూసేదెనరు నన్ను మోసేదెవరు నాకాలమయి పోయె నా కలలు కడతేరె

ఓ మనసా! నీ వల్ల నా బ్రతుకు

106 నేనల్లుకాంటినే నీవు లేకుంటేను నేను లేనేలేను ఓ మనసా! వెనకెంత చీకటే మునిమాపు నామనికి ముందు వెనకా నీవె ముక్తి ధామము నీవె ఓ మనసా! ఈ బతుకు తరవాత ఏ వెలుగు లేదనీ ఈశ్వాన పోవగా ఏ ఆశ లేదనీ ఓ మనసా! నీవు నేనూ ఒకటి + నేను నీవూ ఒకటి మనమధ్య యెవరోనె మాటి మాటికి చొచ్చి ఓ మనసా! నీ కోనమై వెతికి నీ కోనమై చితికి ఇన్నాళ్లు నే బ్రతికి ఎన్నాళ్లకే ముక్తి ఓ మనసా!

107

దారిద్యమంటేను తనకింత లేదనా దౌర్భాగ్యమంబేను తనకింత రాదనా

ఓ మనసా ఆదర్శదాంపత్య మంబేను మనదేనె ఆ జీవ సౌభాగ్య మంబేను మనదేనె

ఓ మనసా! చీకటీ వాటికా చింతదివ్వే వెలుగు చింత దివ్వెవు నువ్వె చిన్నారి ప్రమిదవే

ఓ మనసా! ఊరికీ దూరాన ఉన్నదే ఒక యేరు ఆయేరు దాటంగ మాయా మయమ్మబే

ఓ మనసా! దారిద్య్ర మంటేను దౌర్భాగ్యమంటేను నువ్వన్న మాబేను నువ్వన్న బాటేను

108 ఓ మనసా! ఆశా నిరాశలతొ అలమటించే బ్రతుకు ఏమూల చూచినా ఏమున్నదె మనకు " ఓ మనసా! ఒకమాట చెప్పవా ఒకవేళ బ్రతుకంటె నాకింక భారమన వాతోనె వత్తువా? ఓ మనసా! నాకు తెలియనిదేదొ నాకు తెలిసినదేదా నాకు తెలియని వేళ నాకెవ్వరే దిక్కు? ఓ మనసా! ఎవరె నాకాళ్వాసి ఇహలోక సన్యాసి తలపులే కలబోసి _ వలపు చూపే మనిషి ఓ మనసా! మారిపోవడు మనిషి మరచిపోయెను తన్ను

109 మారునేమో యెలుగు మారబోనిది వెలుగు ఓ మనసా! నోటపలికే దంత పాటగా మారునా కవితగా మననాట కలకాలముండునా ఓ మనసా! స్పందించనీ మేధ సాహచర్యము తోడు తెలుగు నుడి పని లేక తెలుగు కవు లీనాడు ం ఓ మనసా! కవితలో నవ్యతకు కనగ భావ శబలత కనుపించ దిసుమంత 'పెనుబూతు నుడి తప్ప ఓ మనసా! తలకాయ పనిలేక మొలకాయ పట్టుకుని కవితలల్లే వెధవ కక్కురితి కంటివా ఓ మనసా! గూటిలోనీ గువ్వ కోటి రెక్కలు విచ్చి

110 ఏ వెలుగునో కోరు ఎచ్చటికి పోవునే ఓ మనసా! తాలి యేడ్చు నీవేనె తొలి నవ్వు నీదేనె తుది పలుకు నీడేనె తుది శ్వాస నీదేనె ఓ మనసా! ఒంటరివి ఒంటరివి ఇంటనూ బయటనూ జంటలో మందిలో ఒంటరివి ఒంటరివి ఓ మనసా! నాదారి వేరనీ నీదారి నాదనీ నమ్మినేనిన్నాళ్లు ఓ మనసా! నీవైన నేనైన నిన్న చూచితి మన్న మాటయే మిగిలి రేపున్న తెలియదే ఓ మనసా! 1993

111 ఛందో వరదస్కృతి డా. కోవెల సంపత్కుమారాచార్య నీ చిరు వెదనుల నడుమను పూచిన వూవుల పోలిక దరహాసం బిమమంతయు దలగిపోదురా సెలయేరుల కలకలముల చిరుగాలుల నృుదుగీతల మంజులమగు నీ వలుకులెే మదికి దచోచురా “కవితా నంచికి పు. 78) అబ్బూరి వరద రాబేశ్చరరావు గారి ఈ పద్యాలకు నాకున్నంత వయస్సుంది. మేం ఒకే సంవత్సరం, ఒకే నెల - 1933 జూన్‌లో జన్మించాం. ఇది ఈ పద్యాలతో నాకున్న ఆత్మీయతకు ఒక కారణం. అయితే ఈ పద్యాలను నేను చదివింది నూత్రం నా అరవయ్యో ఏట 1993 లో కవితా నంచికో లో వెలువడ్డాక మాత్రమే. ఇది వరద రాజేశ్చరరావు గారి సమగ్ర (9) కవితా సంకలనం. సరిగ్గా తన పదో ఏట ఆయన ఎవరినో గూర్చి రాసిన పద్యాలా ఇవి? లేదా, ఆయనను గురించి - ఇవి చదివే నాటికి ఏడెనిమిదేళ్ల (ప్రత్యక్షపరిచయం గలనేనో, లేదా నా వంటి మరెవరో ఆయనను గురించి రాసిన పద్యాలా ఇవి? అనిపించింది నాకు వీటిని చదువగానే, మొదటి పద్యం మొదటి పాదంలోని “చిరు' పదాన్నట్లా ఉంచితే, ఆయన స్నేహ (ప్రవాహంలో తలారా స్నానం చేసిన ప్రతి వారి మనస్సులో చెలరేగే మధురానుభవమే ఈ పద్యాల్లో వెల్లివిరిసిందనిపిస్తుంది. వరద రాజేశ్చరరావు గారి కవిత లతో నాకు తొలి సరిచయం 1954లో, 'సుసంస్కృత' వాతానరణంలో (వ్రవీణ సంపాదించుకొని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా నేను జీవితం ఆరంభించిన తాలి సంవత్సర మది. ఆ రోజుల్లో నా వంటి వారిని విశేషంగా ఆకట్టుకొన్న పత్రిక తెలుగు నృతం్యత అందులో వెలువడిన సామిభేని శీర్షికతో రెండు

112 కవితలు నన్నాకర్షించుకొన్నాయి. అందుకు రెండు కారణాలు. ఒకటి: ఆ యాజ్జికముయిన ఆ శీర్షిక. రెండు: వ్యావహారిక భాషలో కంద, గీత పద్యాల రచన. ఆ కంద పద్యాల్లోనూ ఒక దానిలో (ప్రాసొక్షరం హల్టుకు బదులు అచ్చు ప్రయోగించటం. ఎక్కడో ఛందో(గ్రంథంలో ఇట్టాంటి ప్రయోగం చదివాను. మళ్లీ మా గురువు గారు కీ.శే. మల్లంపల్లి వీరేశ్చర శర్మగారు తమ ఉత్తరనైషదం లో ఇట్లాంటి పద్యం రాసారు. తెలుగులో అచ్‌ ప్రాసను సాధించటానికి వీలులేదు. యడాగనూదులేవేవో తప్పని సరిగా వచ్చి పదాదిలోని అచ్చును అచ్చుగా ఉండనియ్యవు. (పద మధ్యంలో ఎట్టాగూ అచ్చు ఉండనే ఉండదు) కాగా, మా గురువు గారు సంస్కృతంలోని సంధి విధానం కలిగించిన ఒకానాక సౌకర్యాన్ని ఉపయోగించుకుని సంస్కృత భాషను ప్రయోగిస్తూ - “ఉ ఉమాపతి ర రమాపతి /రి ఆత్ముభూరేష నైషధేళ్చర ఇతి భూ ౮ య ఉదాహరంతా వికకయః / ఖ ఆత్మ చరితం నృపాలకో(వణు.యనుచున్‌ "అని అచ్‌'ప్రాస సాధించారు. మరి వరద (- రాజేశ్చరరావు) వ్యావహారిక భాషా ప్రయోగంతో సాధించారు. ఈ భాషా ప్రయోగంలో యడాగమాదుల (ప్రసక్తి పూర్తిగా ఐచ్చికం. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని - పో ఒంటరినై పట్టిం చే ఓటమితో వలక్క, నీ కోనం ని న్దే ఓదార్చే చూవుల లో ఓవీకలో చెదరని తోవల బడిపో అని వరద అబ్‌ ప్రాసను సాధించారు. ప్రాసలో అచ్చు మారవచ్చు. కాని ఇక్కడ ప్రాసొచ్చు మారక పోవటం మరో విశేషం. నిజానికి లాక్షణికంగా నయితే, మొదటి మూడు పాదాల్లో యడాగమం వచ్చి యొ” అవుతుంది. చివరి పాదంలో తో)” (దుతాంతం కాబట్టి తోనోసీక' అవుతుంది. కాని, భాష వ్యావహారికం కావటాన వీటిని కాదనటానికి వీలయింది. కాగా కవితా విషయం అల్లా ఉంచి ఆ పద్యాల్లో వరద చేసిన భాషా ప్రయోగం, ఛందః ప్రయోగం, ఛందః పరిశీలనలో ఆసక్తి గల నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ ఆస్తే 'నీ చిరుపెదవుల' పద్యాలలో ఛంద: ప్రయోగాన్ని గుర్తింపజేసింది. ఈ నీ చిరుపెదవుల పద్యాల రచనకు సరిగ్గా ఇరవై మూడేళ్ల [క్రితం గురజాడ అప్పారావు గారు ముత్యాల నరం పేరుతో ఒక అర్హ షట్పదిని ప్రయోగంలోకి తెచ్చారు. మూడు పాదాల ఆర్రషట్పది ఈ ప్రయోగంలో నాలుగు పాదాల పద్యంగా మారింది.

113 అంటే (ప్రస్తుతానికి ముత్యాలసరం గూర్చిన వివరాల్లోకి పోనక్కరలేదు. పోతే ప్రస్తుత విషయం వరదలో కొట్టుకుపోతుంది. మిశ్రగతి (త్రిస్ర + చతురస్ర)లో నడిచే ఈ ముత్యాలసరం పద్దతిని వరద తన చిన్ననాటి పద్యాల్లో త్రిప్రగతికి ఆనువర్తింపజేసి ఒక 'ప్రయోగం' ప్రదర్శించారు. ఇది ఒక ప్రయోగం కాబట్టి చతురస్ర గతితో ఆరంభమయి తిస్రగతిలోకి పరిణమిస్తుంది. మొదటి పద్యంలో మొదటి రెండు పాదాలు స్పష్టంగా నాలుగు మాత్రల మూడు గణాల (మొత్తం పన్నెండు మాత్రలు)తో కన్పించగా, మూడో పాదం ఆరు మాత్రల గణాలు రెండింటితో సాగి, నాలుగోపాదం, రెండు త్రిమాత్రాగణాలు

  • ఒక గురువుగా రూపొందింది. చివరి పాదం పొట్టిదిగా ఉండటం, 'ముత్యాల సరం” తీరు ఆ తీరే ప్రస్తుత పద్యాన్ని 'మరో' ముత్యాలసరం చేసింది. రెండో పద్యంలో చతురస్రగతి లేదు. మరి, లాక్షణికంగా గుర్తిస్తే ఆ రెండు పద్యాలు అర్జభోగ షట్పదులు. భోగషట్పది తిళ్రగతికి చెందింది. అంటే, హయ(ప్రచార రగడ మీద ఆధారపడిందన్న మాట. శ్రీ శ్రీ మరో(వ్రపంచం చతురస్ర గతి (మధుర గతి రగడం)కి చెందిన శరషట్పది. ముత్వాలనరం, మి(శ్రగతి వారిగతి లేదా వృషభ గతి రగడుకి చెందిన భామినీ షట్పది. మరి నీ చిరు- సెలడోరు! పద్యాలు రాసేనాటికే ఈ షట్పదీ భేదాలను వరద అధ్యయనం చేసే ఉంటారని చెప్పగలమో, లేమో గాని, ఇది ఆయన ముత్యాలనరం మీద చేసిన మరో 'ప్రయోగమని మాత్రం సులభంగానే చెప్పవచ్చు.

ఛందస్సులో ప్రయోగాలు చేయటం తమ తండ్రి గారయిన అబ్బూరి రామకృష్ణారావు గారి నుండి వారసత్వంగా వరదకు లభించి విస్తరించటమే కాదు, పురోగమించిందనిపిస్తుంది. మాత్రా ఛందస్సులో వరద చేసిన రకరకాల ప్రయోగాలు కవితా నంచిక నిండా పరచుకొని కన్పిస్తయి. ఆయన ఛందః ప్రయోగాలను గూర్చివిస్టృతంగానూ, విశేషంగానూ విశ్లేషిస్తే ఎన్నో రకాల విశేషాలు వెలుగులోకి వస్తాయి. ఉదాహరణ (ప్రాయంగా రెండు మూడంశాలు మాత్రమే ప్రస్తుత పరిధిలో (ప్రస్తానించుకోవడానికి వీలవుతుంది. వాటిలో ఒకటి: బా - లెంత కనుల పొంత ॥ భావికా - లాల చింత పావకే - రింతలోన బం - గారు బంధనాలు (కవితా సంచిక పు. 68) ఇది త్రిస్రగతి రచన. పాదానికి నాలుగు త్రిమాశత్రా గణాలుంటాయి. కాని, ఈ పద్యంలో అక్షరాల ప్రకారం మాత్రలు లెక్కగడితే, ఉండవలసిన పన్నెండు మాత్రలకు

114 బదులు పదకొండె కన్పిస్తాయి. అంటే, మూడు (త్రిమాత్రా గణాలూ, ఒక గురువు (లేదా, రెండు లఘువులు) ఉన్నాయన్న మాట. కాగా, ఈ గురువును (లేదా, రెండు లఘువులను) మరాక మాత్రా కాలం పొడిగించినట్టు అయి గతి సరిపోతుంది. ఆయితే, ఈ గురువు (లఘువులు) అన్ని పాదాల్టోనూ ఒకే నిర్దిష్టస్టానంలో ఉండనక్కరలేదు. స్థానం మారవచ్చు. ఆద్యంత పాదాల్గోనేమో (బా, బం), నడిమి రెండు పాదాల్లోనేమో పాదాది త్రిమాత్రాగణం తరువాత (కా.కే) గురువులున్నాయి. కాగా బా - (లెంతు కనుల / చెంత భావి / కా- లాల చింత అని చదువుతామన్న మాట. 'ముత్యాల సరం'లో సరిపాదాల మొదట ఒక గురువును ఆదనంగా చేర్చి పూ/ బాళి - రీషము - లేరు - కొంటిని అంటూ రామకృష్ణారావు గారు - గురజాడ దే / శాభి - మానం - నాకు - కద్దని స్ఫూర్తితో (ప్రచారంలోకి తీసుకురాగా శ్రీ శ్రీ ప్రభృతులు అనుసరించారు. అయితే, ఇక్కడ గురువు ఆదనం కాగా, వరద చేసిన చమత్కారం వాటిని పాదాల్లో అంతర్భాగాలు చేయటం. సంస్కృతంలో ఆర్బ లో ఒక లఘువును ఒక చతుర్మాత్రాగణానికి ప్రయోగించే పద్దతి ఉంది. త్రిమాత్రాగణానికి బదులు ఒక గురువును (లేదా రెండు లఘువులను) వరద 'ప్రయోగించటం ఆర్యాంశాన్ని గుర్తుకు తెస్తుంది. బాలెంత తరువాతి పద్యంలో మొదటి రెండు పొదాల్లో పాదాదిలోనూ, మూడో సాదంలో మొదటి త్రిస్రగణం తరువాత గురువునూ, చివరి పాదంలో మొదటి గణం తరువాత గురువుకు బదులు రెండు లఘువులనూ వరద ప్రయోగించారు. నాల్గవ పాదం - నిఖిల /నుఖ - దీప్తి రేఖ (ఇక్కడ 'సుఖ'” మన్నది మరో మాళత్రాకాలానికి విస్తరిస్తుంది.

అయితే, వరద అదనంగా గురువును ప్రయోగించిన సందర్భమూ ఉంది కాని, ఆది పాదమధ్యంలో కన్పించటం విశేషం. జనం -చచ్చి - భో - జనం - లేక / దినం - ఒకే

  • రొ - క్షనం - కేక (ప. 26) ఇక్కడ సరిగ్గా రెండు రెండు త్రిమాత్రా గణాల మధ్య అదనంగా గురువు (భోర్యా కన్పిస్తుంది. అయితే ఈ గురువుల్ని చదువటంలో అర్జామా(త్రా కాలికమయిన ఎడం అనుకోకుండానే రావటంతో నడకలో భేదం పెద్దగా కన్పించదు. ఈ పాదాలను 8+6గా విరువవచ్చు గాని, స్పష్టంగా (త్రిమాత్రా గణాలు సర్వత్రా కన్చిస్తూండటం వల్ల ఇది త్రిస్రగతిలో వ్రయోగం గానే గుర్తించవలసి ఉంటుంది. ఇట్లాగే ఎ(్రు- పాలెవు / మురికి కాలున/ చీకటి - కష్టు - కొన్లు - శాలువ! వంటి చోట 344 గా సాగే మిశ్రగతిని 4+3గా చివరి పాదం పూర్వార్హంలో తిప్పి కొట్టటం ఒక

1బ్‌ చమత్కారం: ఈ ఖండిక (పు.22)లోని పద్యాల్లో ఈ విధమయిన చమత్కారాలు చాలా చూడవచ్చు. త్రిమాత్రా గణం లగం ఎదురు నడిచే గణం ప్రయోగం కూడా ఈ పద్యాల్లో గుర్తించదగింది. ఆంత్య (ప్రాస ప్రియుల్లో ఒకరయి కూడా వాటి ప్రయోగంలో వరద హుందాగా (ప్రవర్తిస్తారు. ఆంత్యప్రాసల కోసం పదాలను వికృతంగా విరువటం, అసమర్జాంత్య ప్రాసలు 'ప్రయోగించటం ఆయనలో దొరికించుకోవటం కష్టమే. ఎక్కువగా జంట పాదాలకు అంత్యప్రాస కన్పిస్తుంది. బేసి పాదాలకు, సరిపాదాలకు విడివిడిగా ఆంత్య(ప్రాస ప్రయోగించటమూ ఉంది. మొత్తం నాలుగు పొదాలకూ ఒకే ఆంత్య ప్రాస కూడా ఉంది. రుబాయీ ల పద్దతిలో మూడో పాదాన్ని వదిలిపెట్టి 1, 2, 4 పాదాలకు ఆంత్యప్రాస కనిపిస్తుంది. అయితే, ఇక్కడ ఒక విశేషం. నాలుగు పాదాల పద్యంలో రెండో సాదాన్ని, లేదా మొదటి దాన్ని వదిలేసి మిగిలిన మూడు పొదాలకు (1, 3, 4 లేదా 2, 3, 4) అంత్య ప్రాస ప్రయోగించటం రుబాయీ పద్దతికి ఒక విస్తరింపుగా భావించవచ్చు. ఇవన్నీ ఇట్లా ఉంచి ఒక విచిత్రమయిన అంత్య ప్రాసను వరద ఒక విశేషంగా (ప్రయోగించారు. సాధారణంగా ఆంత్య (ప్రాస వేరు వేరు పఫొదాల చివరలకు సంబంధించి కాగా, వరద చేసిన ప్రయోగం లో పాదాది ప్రాసకు అదే పాదం (అంత్య) ప్రాస చెల్లుతుంది. ఉదా: వదముందుకు, వెనుక ఆవద ముది కనులకు లేదు కౌముది గటి లోపలి నలువు మూగటి వద నేస్తం వనుక ఆవద ఇందులో ప్రతి పాదంలోనూ ప్రాస పూర్వాక్షరంతోబాటు ప్రాసాక్షరం యధాతథంగా, (వదు ముది, గటి, వదు పాదాంతంలో ప్రాస చెల్లించబడింది. పాదాంతంలోని వద" మొదలయినవి మరో పదంలోని భాగాలు కావటం ఒక భాషా ప్రయోగ చమత్కారం. ఈ ఖండిక (పు.38)లోని ఆరు పద్యాలూ ఈ విధంగానే సాగినాయి. దాన్ని ఆద్యంత (ప్రాస అనవచ్చు. ఇదిట్లా ఉండగా, కేనలం మాత్రా ఛందస్సుల్లోనే గాక కందం, గీతం, ఆటవెలది, ద్విపద వంటి మాత్రాగణ బద్ధచ్చందస్సులోనూ, కొంత వరకు విశేష వృత్తాల్లోనూ ఆంత్యప్రాసల వీరవిహారం దర్శించవచ్చు.

116

వ్యావహారిక భాషను మాత్రా ఛందస్సుల్జోనే గాక మాత్రా గణబద్ద పద్యాలయిన కందగీతాదుల్లోనూ, అక్షర గణ బద్ద పద్యాలయిన వృత్తాల్లోనూ, విశేషించి విశేష వృత్తాల్గోనూ సమర్హంగా ప్రయోగించటమే కాకుండా అందులో సాఫల్యం గూడా సాధించి,

  • వ్యావహారిక భాష పద్యాలకు ఒదుగదు (కాబట్టి పద్యాలను నిరాకరించాలి) అనే ఒకానొక వాదాన్ని పరాస్తం చేసిన కవి, ఛందః ప్రయోక్త వరద జెరకాలం” అనే తన కావ్యంలో ్రగ్దర, (ప్రగ్విణి, భుజంగ 'ప్రయాతం వంటి విశేష వృత్తాలను ఆయన వ్యావహారిక భాషలో విరివిగా ప్రయోగించారు. కంద గీతాదుల్లోనయితే లెక్కలేదు. అబ్బూరి రామకృష్ణారావు గారు కూడా భుజంగ ప్రయాతం (ప్రయోగించక పోలేదు గాని, దానిలో వ్యావహారిక భాషలేదు. కాగా, వరద ఆస్ట్రితి నుంచి పురోగమించారు.

ఆధునికంగా - అభ్యుదయ కవితా మార్గంలో ఒక సమగ్ర 'కావ్యం' రచించటంలో బహుశః వరదే మొదలు అనుకుంటాను. ఆ కావ్యం రాతప్రతిని క్రీశ్రీ ఎక్కడో పోగొట్టాక, చిత్తు కాగితాల్గోంచి బయట పడ్డ ఆ కావ్య ఇండికలతో ఆ కావ్యం - ఒక విధంగా అఆసమగ(గ్రంగా' వెలువడింది. అయినా, దాని వస్తువూ, ప్రణాళికా దాని కావ్యత్వాన్ని నిరూపిస్తుంది.

అందులో వరద రకరకాల అక్షర - మాత్రా గణ బద్ధ పద్యాలనూ, మాత్రా ఛందస్సులనూ, వచన పద్యాన్ని గూడా ప్రయోగించి ఛందో వైవిధ్యాన్ని ఎంతగానో (ప్రదర్శించారు.

సామిధేని కావ్యం ఆరంభించారు గాని, ఆది ముందుకు సొగకపోవటానికి వరదకు కలిగిన బహు కార్యవ్యావృతి మాత్రమే కారణం.

ఆయన ప్రతిభ సాహిత్య, రాజకీయ, సామాబిక, పత్రికా రచనాది వివిధ రంగాల్లో పంపకం కావటం సాహిత్యానికి ఒక విధంగా నష్టమే జరిగిందనిపిస్తుంది. సాహిత్య రంగంలో ఆయనకున్న అపారమయిన జీవితమూ, అనుభవమూ ఆయన కవన కుతూహలం, వరద కాలం వ్యక్తం చేస్తాయి. ఆధునిక సాహిత్య చరి(త్రను సాధికారంగా రచించగల ఆయన సామర్ధ్యం మనకు ఉపయోగించకుండా పోవడం ఒక దురదృష్టమే.

కొని ఈ రెండు పుస్తకాలు ఒక విధంగా తృప్తి ఆయన నాట్యగోస్టి నాలుగు నాటకాలు" ఆయన రూపక రచన, ప్రదర్శన శక్తులకు ప్రతీక.

హాయిగా నవ్వుతూ, స్వచ్చంగా ఛలోక్తులూ, చమత్కారాలు విసురుతూ మాట్టాడుతూనే

117 వర్తమాన సాహిత్య పరిస్థితి గూర్చిన తన అసంతృప్తిని వ్యక్తీకరిస్తుండే వారాయన. ఏదో చేయాలనే తపన మాట మాటలోనూ కన్పిస్తుండేది.

ఎన్నో ప్రణాళికలు వేస్తుండే వారు. కాని, వాటిని అమలు చేసే అవకాశాన్ని కాలం ఆయనకు కల్పించలేక పోయింది. దానిలో అచ్చమయిన వ్యక్తి అత్యంత స్నేహశీలి ఆయిన వరద మనందరినీ వదిలేసి కాలం వెంట వెళ్లిపోయి అప్పుడే ఓ ఏడాది గడించింది. ఆయన ఛందః ప్రకృతి వల్ల ఆయనతో నాకు కలిగిన సాహిత్య సాన్నిహిత్య స్మృతికి ఈ ఛందః పరిశీలన ఆత్మీయమైన నివాళి. 'ఆం(ద్రవ్రభ' దినవతిక మే ౩, 1994 భం (సం బి 6 ఘః 46 శ్‌ 44 షు ( నో (€ / స మా యం టం అలా స ల ఉ / ననన వనక

అందుబాటులో ఉన్న అబ్బూరి వరద రాజేశ్వరరావు గ్రంథాలు కవన కుతూహలం నరదకాలం బ్యా నాట్యగోష్టి, నాలుగు నాటకాలు కవితా సంచిక సామిధేని ఇతర ప్రచురణల సమాచారం, జీవిత వివరాలూ అంధించే గ్రంథం “వరద పృ్యృతి”

॥ _ ॥ | అబ్బూరి నరదరాజేశ్వరరావు - . “కవిత్వంలో కొత్త వ్యక్తీకరణల కోసం తపన పడ్డ ప్రయోగశీలి. పద్యం, గేయం వచన కవిత్వం - అనే మూడు . రీతుల్లోనూ (రూపకాలు, నాటకాలు కూడా కలుపు కోవాలి.) ప్రయోగాలు చేశాడు. పద్యాల్లో విశేషగతులను కల్పించటం, . తన కాలం వరకూ అంతగా పద్యరచనల్లో అలవాటుకాని సామాన్య భాషని వాడటం ఆయన పద్యాల్లో చేసిన (ప్రయోగాలు... మాత్రా ఛందస్సులో వరద చేసినన్ని ప్రయోగాలు మరో తెలుగుకవి చేసినట్టు కనపడదు... జీవితంలోనూ, కవిత్వంలో నిరంతరాన్వేషి వరద. నిత్య (ప్రయోగ శీలి వరద.” చేకూరి రామారావు “ఛందస్సులో ప్రయోగాలు చేయటం తమ తండ్రి గారయిన అబ్బూరి రామకృష్ణరావు గారి నుండి వారసత్వంగా * వరదకు లభించి విస్తరించటమే కాదు, పురోగమించిందని పిన్హుంది... ఆయన ఛభందః(ప్రయోగాలను గూర్చి విస్ఫృతంగానూ, విశేషంగానూ విశ్తేషిస్తే ఎన్నో రకాల విశేషాలు వెలుగులోకి వస్తాయి. కోవెల సంపత్కుమారాచార్య -