Telugu Poorubatalo telangana - anilvaranasi/indianlanguages GitHub Wiki

లల (| /

| 'అజ ఆ

శ ఛ్‌ స. ల

తూ శీ న | / (టి క్‌ ట్ల జ్‌ గో క్ర | కీ

గ ] పోరుబొటలో తెల౦0గాణ ఉం (యం ॥ 2 ( డ్‌ సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ షా - ై వి

పోరుబాటలో తెలంగాణ (ఉద్యమ సమీక్ష 2009 ఆగస్టు నుండి 2010 ఆగస్టు వరకు) ప్రచురణ; మట్‌ ల సిపవఐి (ఎం-ఎల్‌) న్యూడెమోక్రన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ ,

ప్రచురణ ఏ సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ లం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ లు ఖల లె ముద్రణ సెప్టెంబర్‌, 2010 ద్ర భి పా వెల ఏ రూ. 15/- వష ల రల" ప్రతులు ఏ 2000 సై దొరుకు స్ధలం ఏ - ప్రజాపంథా, మార్క్‌భవన్‌, 658, విద్యానగర్‌, 7వ లైన్‌, హైదరాబాద్‌-44. గ = సహచర బుక్‌ హౌస్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌. ర్‌ నా సి దిశ బుక్‌ హౌస్‌, మోర్‌... సూపర్‌ మార్కెట్‌ దగ్గర, వంగల. దేటీడేన్‌.. * చిక్కడపల్లి, హైదరాబాద్‌-20. ల సం - నవోదయ బుక్‌ హౌస్‌, ఆర్యసమాజ్‌ బిల్దింగ్‌ ఎదురుగా, మై ఫ్యా హైదరాబాదే = క్‌ కాచిగూడ, హైదరాబాద్‌. గ కి జ - మైత్రి బుక్‌ స్టాల్‌, ఏలూరు రోడ్డు, విజయవాడ.

  • విశాలాంధ్ర అన్ని బ్రాంచిలలో ముద్రణ: * ఏ2 నవ్య ప్రింటర్స్‌, బాదమ్‌ సోహ్నా అపార్ట్‌మెంట్స్‌, రాజ్‌భవన్‌ రోడ్‌, హైదరాబాద్‌. కవర్‌ డిజైన్‌ : అంకుష్‌ గ్రాఫిక్స్‌, నల్లకుంట, హైదరాబాద్‌. మామాట ఆంధృవదోళలో భాగంగా కొనసాడుతూ వస్తోన్న తెలంగాణ (పొంతాన్ని వత్చేక ర్మాష్హంగా వర్దాటు చేయాలనే దిమాంద్‌ 20229 అఖడు నుండి తీవస్థాయికి చేడకొన్నద. ఈ న్యాయమైన టభజాస్వామిక దద్ధముంలో వస్రుతస్థాయిలో, ట్రజారానులు వొల్గొంటున్హాయి. నరికొళ్తపోరాటి డూపొలతో దద్దుదుం కొత్త వుంతలు లొక్షుతున్నది. తెలంగాణ (పొంతంలోని అన్ని వర్గాల | దజానకం దద్దుముస్తున్నది. అన్ని రకాల క్యిలన్ను డతంతాలను ఎదుర్గొంటూ ఈ జ ద్రమం వురోగమన్తున్సది. అనేక ఎడడుదిగుడుల ముద్దు కొనసాడుతున్ను ఈ ఉద్దుమాన్ని అంతిమ విజయం నధ్రించేదాక కొనసాగించాల్సిన అవసరముంది. ఈ అవగానాన వెలుగులోనో 2009 ఆగన్హు నుంది కొనస్తాపతున్ను జద్దుమాన్ని నీబీఐ (ం-ఎల్‌ న్యూదామో్యకనీ నమ్మక్షీంచింది. ఈ నమ్మీక్షము బ్రజుల ముందుంచుతన్లుద. భద్ధుము క్తర్ణవ్వాలన్ను పోరాట వ్వూవోలను ఖరాడు బోసుకున్నది. తెలంగాణ నీద్రించేదాక వోరాదాలని అన్ని వర్ణాల దదానకానికి విజ్ఞార్తీ చేస్తున్నది.

పోరుబాటలో తెలంగాణ

(ఉద్యమ సమీక్ష 2009 ఆగస్టు నుండి 2010 ఆగస్టు వరకు) తెలంగాణ ఉద్యమం - పార్టీ ప్రవేశం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు యెడల సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నూతనంగా సమర్థించే తీర్మానం చేసింది. రాజకీయంగా సమర్ధించడమేగాకుండా దాని కోసం పోరాడాలన్నది. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర కమిటీ తగిన పథకాన్ని రూపొందించు కొన్నది. ప్రజల్లోకి వెళ్ళే ముందు తన శ్రేణుల్లో తెలంగాణ నినాదాన్ని సంఘటితపరిచే కర్తవ్యాలను రూపొందించుకొని అమలు జరిపింది. జిల్లాల్లో విస్సృత సమావేశాలు జరిపి చైతన్య పరిచింది. తెలంగాణపై పార్టీ వైఖరిని వివరించే 66 పేజీల బుక్‌లెట్‌ని రాష్ట్ర కమిటీ విడుదల చేసింది.

2009 ఆగస్టు 8న తెలంగాణ సమస్యపై పార్టీ రాష్ట్ర సదస్సుని రాష్ట్ర కమిటీ నిర్వహించింది. ఈ సందర్భంగా 25 అంశాలు, 18 డిమాండ్లతో కూడిన ఐదాన ట్రకజటనని విడుదల చేసింది. కేంద్ర కమిటీ తీర్మానాన్ని కూడా ప్రచురించింది. ఈ సదస్సుకి రాష్ట్ర. వ్యాపితంగా మన పార్టీ ప్రతినిధులతోపాటు, తెలంగాణ మేధావులు కూడా హాజరయ్యారు. సభ ఉత్సహపూరితంగా జరిగింది. ఆ తరువాత జిల్లా న్థాయి సదస్సులు జరిగాయి. ఈ కాలంలో తెలంగాణ కోసం ఏ పార్టీలుగానీ, సంస్థలు గానీ ఉ ద్యమించడం లేదు. తెలంగాణ ఉద్యమం స్థబ్బ్దతలో వున్నది. తెలంగాణ అభిలాషపరులను న్యూడెమోక్రసీ పార్టీ నిర్వహించిన సదస్సు, అందులో రూపొందించుకౌన్న కర్తవ్యాలు ఉ త్సాహపర్పాయి. తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడని సమయంలో ఈ కర్తవ్యాలను అమలు జరిపిన ఫలితంగా న్యూడెమోక్రసీ పార్టీ తెలంగాణ ప్రజల్లో సానుకూల దృష్టితో చర్చనీయాంశమయింది.

(్ర్ర

మరోమారు పోరుపథంలో

ఈ సమయంలో అనగా అక్టోబరు 9న పోలీసుల నియామకానికి సంబంధించిన అంశంలో హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. ఈ తీర్పుని తెలంగాణ ప్రజలు నిరసించారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ తీర్చుకి వ్యతిరేకంగా ఆందోళనకి దిగారు. దీనితో నవంబరు చివరిలో టీఆర్‌యస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. ఈ పరిణామాలన్నీ తెలంగాణ ప్రజలను మరొక్కసారి ఉద్యమాల బాట పట్టించాయి. కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించగానే పోలీసులు నిర్బంధించి ఖమ్మం తీసుకొచ్చారు. దీనితో పండ్ల రసం తీసుకొని నిరాహార దీక్ష విరమణకి పూనుకొన్నాడు. కేసీఆర్‌ అపహాస్యపు చర్యకు తెలంగాణ ప్రజలు నెగెటివ్‌గా స్పందించారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు అత్యంత తీవ్ర పూరిత వ్యాఖ్యానాలతో ఉద్యమించారు. కేసీఆర్‌ తన పొరపాటుని సవరించుకొని ఆమరణ దీక్షని కొనసాగించాడు.

అదే సమయంలో కేసీఆర్‌ని అక్రమంగా ఖమ్మం తరలించడానికి వ్యతిరేకంగా సీపీఐ (ఎం-ఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ ఆందోళన చేపట్టింది. ధర్నా చేసింది. కార్యకర్తలు లాఠీ దెబ్బలకి గురయ్యారు. వీరిపై ప్రభుత్వం తప్పుడు కేసులను మోపింది. న్యూడెమోక్రసీ పార్టీ వీటికి దేనికీ వెనుదీయక కొనసాగించిన ఉద్యమం ఫలితంగా కేసీఆర్‌ని ప్రభుత్వం ఖమ్మం నుండి హైదరాబాద్‌ నిమ్స్‌ హాస్పిటల్‌కి తరలించింది. ఈ సంఘటన తెలంగాణ ఉద్యమంలో ఎంతగానో ప్రాధాన్యతని సంతరించుకొన్నది. ప్రత్యేకంగా న్యూడెమోక్రసీ పార్టీ తెలంగాణ ఉద్యమాభిమానుల ఆదరాభిమానాలను పొందింది.

దీని తదనంతరం తెలంగాణకి చెందిన వివిధ అంశాలపై పార్టీ వైఖరిని తెలుపుతూ లక్ష కరపత్రాలను రాష్ట్ర కమిటీ ప్రచురించి రాష్ట్ర వ్యాపితంగా ప్రచారం చేసింది. తప్పటడుగులు +

సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ తెలంగాణ సమస్యపై స్వతంత్ర కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కలిసివచ్చే వారితో ఐక్య కార్యాచరణని సాగిస్తోంది. అప్పటికే ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ నాయకత్వంలో “తెలంగాణ జన పరిషత్‌లో ఆకుల భూమయ్య నాయకత్వంలోని తెలంగాణ మహాసభ, హనుమాండ్లు నాయకత్వంలోని తెలంగాణ ఐక్య వేదిక మరికొన్ని సంస్థలు చేరాయి. ఆ తదనంతరం సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రస్సీ పార్టీని కూడా తెలంగాణ జనవరిషత్‌ ఆహ్వానించింది. దీనికి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. అన్ని వైపుల పరిశీలన లేకుండానే అందులో చేరాము. ఈ సంస్థ వెలుపల అనేక సంస్థలున్నాయి. వాటికి దూరమయ్యే అవకాశం వుందని పార్టీ భావించింది. అందుకే ఇలా చేరడాన్ని తొందరపాటు చర్యగా పార్టీ గుర్తించింది.

(2)

ఈ లోపల 'తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు ప్రా కోదండరామ్‌ నుండి కూడా మన పార్టీకి ఆహ్వానం వచ్చింది. వీరితో కూడా సన్నిపొతంగా వున్నాం. ఈ సంస్థలతోపాటు, యితరులు తీసుకొనే కార్యక్రమాల్లో న్యూడెమోక్రసీ పార్టీ భాగస్వామ్య మయింది. అప్పటికి ఏవీ సరయిన నిర్మాణ రూపం తీసుకోలేదు. వివిధ వేదికల పేరిట పనిచేస్తున్నవన్నీ ఒకే వేదికపైకి రావాలనే వాదనని మనం వినిపించాం. అప్పటికే కొన్ని ప్రిజుడీస్‌తో వున్న వివిధ వేదికల నాయకులు మన భావనతో సానుకూలతని ప్రదర్శించ లేదు. ముఖ్యంగా కేసీఆర్‌ గతంలో అనుసరించిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అవిశ్వాసాన్ని వ్యక్తం చేసారు. కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష రోజులు గడుస్తున్న కొలది పరిస్థితిల్లో ఉద్రిక్తత నెలకొన్నది. ఉద్యమం పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతానికి విస్తరించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ సెక్షన్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించుట అంతకంతకూ వేగంగా పెరిగింది. డిసెంబరు 9, 23 కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు

2009లో తమ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, పీఆర్పీ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని సమర్థించాయి. కానీ యివేవీ తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. మరో మారు తెలంగాణ ఉద్యమం ఉరకలేసింది. ముఖ్యంగా డిసెంబరు 8 విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి పిలుపు ప్రభుత్వాన్ని హడలెత్తించింది. దీనితో తెలంగాణలోని పాలక పార్టీలన్నీ జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోక తప్పలేదు. తెలుగుదేశం ఒక్క అడుగు ముందుకుపోయి శాసనసభలో కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తీర్మానం ప్రవేశ పెట్టకపోతే, తానే ప్రవేశపెడ్తానని బహిరంగంగా ప్రకటించింది. సీపీయం, లోక్‌సత్తా, ఎం.ఐ.ఎం. పార్టీలు మినహా అన్నీ పార్టీలు తెలంగాణని బలపర్చడంలో పోటీ పడ్డాయి.

2009 డిసెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పర్చిన 8 పార్టీల అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెసు, తెలుగుదేశం, తెరాస, పీఆర్సీ, సీపీఐ, బీజేపీ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని బలపర్హాయి. సీపీయం పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించింది. ఎంఐఎం రెండు రోజుల్లో చెబుతానన్నది. శాసనసభలోని రెండు ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని బలపర్బాయి. మరోవైపున ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించకపోతే, తెలంగాణ ప్రజల్లో కాంగ్రెసు పార్టీ బలహీనపడుతుందని భావించి కేంద్ర ప్రభుత్వం తరపున డిసెంబరు 9న హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసాడు.

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎడల రాష్ట్ర స్థాయిలోని కాంగ్రెస్‌, తెలుగుదేశం, పీఆర్బీలు సానుకూలతనే వెలిబుచ్చాయి. డిసెంబర్‌ 9 ప్రకటనానంతరమే పార్టీలు ప్రాంతాల వారీగా అభిప్రాయాలు వెలిబుచ్చాయి. వారి అభిప్రాయాల ప్రకారం

(1 .

వుద్యమించాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకి చెందిన కాంగ్రెసు, తెలుగుదేశం, పీఆర్పీ పార్టీలు తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చేసిన కేంద్రం (ప్రకటనకి వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలియచేసాయి. రెండు ప్రాంతాల పార్లమెంటు, శాసనసభ్యులు రాజీనామాలు ప్రకటించారు. కేంద్రం నుండి తమకి సానుకూలంగా ప్రకటన వచ్చే వరకు అలజడి చేసారు. డిసెంబరు 23న కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 9 ప్రకటనకి విరుద్దమయిన రెండో ప్రకటన చేసింది. ॥ జేపసీ పర్పాటు చిదంబరం చేసిన డిసెంబరు 23 ప్రకటన తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టింది. తెలంగాణ ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. తెలంగాణలోని కాంగ్రెసు, తెలుగుదేశం, పీఆర్పీ పార్టీలు తెలంగాణని బలపర్చాయి. అవి ఉద్యమంలో తమ భాగస్వామ్యతని ప్రకటించాయి. కాంగ్రెసులోని కొంత మంది ప్రజాప్రతినిధులు బహిరంగంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించారు. మాజీ మంత్రి జానారెడ్డితో సమాలోచనల కెళ్ళిన కేసీఆర్‌ 28 రాత్రి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ)ని ఏర్పర్పారు. దీనికి ప్రొఫెసర్‌ కోదండరాంని కన్వీనర్‌గా ప్రకటించారు. దీనిలో మిగతా వారిని కూడా భాగస్వామ్యం చేసేందుకు కళింగ ఫంక్షన్‌ హాల్‌లో డిసెంబరు 24న విసృత సమావేశం జరిగింది. దీనికి టీఆర్‌ఎస్‌, తెలంగాణలోని కాంగ్రెసు, తెలుగుదేశం, బీజేపీ, పీఆర్పీ పార్టీలు మరియు సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీలతోపాటు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు మొదలగునవి హాజరయ్యాయి. ఈ ఉద్యమంలో అన్ని పార్టీలు, సంఘాలు, శక్తులు, వ్యక్తులు భాగస్వామ్యమయినట్లుగా, ఒకే వేదిక నుండి పోరాడుతున్నట్లుగా ప్రజలకి... సందేశం పంపడమే దీని ఉద్దేశ్యం. ఇందులో పాల్గొన్న వారి సందేశాలు ప్రజలకి ఉ త్తేజాన్నిచ్చాయి. సభను నిర్వహించడంలో లోపాలున్నాయి. సభ ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు. ఈ సందర్భంలో ఈ లోపాలను గుర్తింపుచేసే అవకాశం రాలేదు. డిసెంబరు 25న రావినారాయణ రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో విసృత సమావేశం జరిగింది. నిర్మాణయుతంగా, ప్రజాస్వామికంగా జేఏసీని నిర్వహించడంలో తీవ్ర లోపాలు జరిగాయి. ఆ తరువాత కాలంలో వీటిని ఎప్పటికప్పుడు న్యూడెమోక్రసీ పార్టీ గుర్తు చేసింది. అన్ని సంస్థల ప్రతినిధుల సమావేశం జరిపి అందులో విధి విధానాలనూ, నిర్మాణాన్నీ చర్చించాలని డిమాండ్‌ చేసింది. గుంపుల్లో, విసృత సమావేశాల్లో చర్చించడం, నిర్ణయాలు చేయడం అసంభవమని స్పష్టపరిచింది. అనుభవంలో అదే తేలింది. (్ర

ఈ క్రమంలో ఈ ఉద్యమంలో పాల్గొంటున్న సంస్థలను రెండు భాగాలుగా ప్రకటించారు. రాజకీయ పార్టీలు ఒక భాగం. ఇందులో రాజకీయ పార్టీలు విభాగాలు ఆరు వున్నాయి. 1) టీఆర్‌ఎస్‌ 2) టీడీపీ 3) కాంగ్రెసు శ) బీజేపీ 5) పీఆర్సీ 6) సీపీఐ (ఎం-ఎల్‌ న్యూడెమోక్రసీ. మిగతావన్నీ మరొక భాగం. ఇందులో కాంగ్రెసు, టీడీపీ, పీఆర్పీలు పార్టీలుగాకాక, తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రమే పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో శాసనసభలోని పార్టీలనే రాజకీయ పార్టీల విభాగంలో వుంటాయన్నారు. అందువల్ల న్యూడెమోక్రసీ కూడా ఉద్యోగ, ప్రజా సంఘాల వరసలోనే వుంటుందన్నారు. దీనికి “వర్మింగ్‌ గ్రూపు” అని పేరు పెట్టారు.

రాజకీయ పార్టీలు, వర్కింగ్‌ గ్రూపు కలిసి జరిపే సమావేశాలను స్టీరింగ్‌ కమిటీ సమావేశాలన్నారు.

పై రూపంలోనే నిర్మాణం సాగింది. సీపీఐ (ఎం-ఎల్‌ న్యూడెమోక్రసీ కళింగ ఫంక్షన్‌ హాలులో డిసెంబర్‌ 25న జరిగిన సమావేశం వద్ద నుండి జేఏసీలో పూర్తి భాగస్వామ్యమయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి బలమైన ప్రభావితం చేయగలిగేది టీజేఏసీనేనని భావించింది. కొన్ని తప్పులను కంట్రోల్‌ చేయలేక పోయినా ఇందులో వుండటమే ప్రయోజనకరంగా వుంటుందని పార్టీ భావించింది. ఇందులో చేరేటప్పుడు వివిధ అంశాలను చర్చించింది. సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ తప్ప, ఇందులో వున్న పార్టీలన్నీ పాలకవర్గ పార్టీలే.

ఐక్య కార్యాచరణలోని భాగస్వామ్య పక్షాలు తమ తమ కోణాల్లో వివిధ అంశాలపై చర్చిస్తుంటాయి. అంతిమంగా అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలనే జేఏసీ నిర్ణయిం చాలి. కానీ ఈ సూత్రానికి విరుద్దంగా నిర్ణయాలుంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో విప్లవ పార్టీలు, ప్రజాస్వామిక సంస్థలు వీటిల్లో మెదలడం కష్టంగానే వుంటుంది. అయినా వీలున్నప్పుడల్లా తప్పుడు పద్దతులకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటాన్ని న్యూడెమోక్రసీ పార్టీ సాగించింది. ప్రారంభంలో జేఏసీలో న్యూడెమోక్రసీ పార్టీని గానీ, దాని ప్రతినిధులను గానీ గుర్తించడం కష్టంగానే వుండేది. తదుపరి కాలంలో పార్టీ స్వతంత్రంగా కొనసాగించిన ఉద్యమాల ఫలితంగా కానీ, జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల్లో మన పార్టీ నిర్వహించిన పాత్ర కానీ, దాని ప్రతినిధులు చేసిన చొరవ ఫలితంగా కానీ జేఏసీలో పార్టీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం మొదలయింది. తప్పుడు పద్దతులకు ఒక మేరకు బ్రేకులు వేయగలిగింది. దీనికి (జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల్లో) మన పార్టీ నిర్వహించిన పాత్ర మరియు యితర మిత్రులు చేసిన పోరాటం కూడా దోహదపడింది. ఆ తదుపరి మెరుగైన నిర్మాణయుత ఉద్యమాన్ని సాగించింది. .

($్ర

జనవరి 5 ఢిల్లీ చర్చలు

జనవరి 5న ఢిల్లీకి 8 పార్టీలని తమ వైఖరులను మరోమారు వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం తరపున చిదంబరం ఆహ్వానించాడు. ఢిల్లీ వెళ్ళిన పార్టీలు తమ వైఖరులను వెలిబుచ్చడం గాకుండా, ప్రాంతాల వారీగా అభిప్రాయాలను వెలిబుచ్చాయి. రాష్ట్ర కాంగ్రెసు, టీడీపీ పార్టీల అధ్యక్షులు ఈ సమావేశానికి ఉద్దేశ్యపూర్వకంగానే గైర్దాజరయ్యారు. విచిత్రమేమంటే, ఇందులో కేంద్రం చేసిన రెండు నిర్ణయాలనూ, ప్రాంతాల వాదీగా విడిపోయి పరస్పరం విరుద్దంగా ప్రకటించిన రెండు ప్రాంతాల పార్టీల ప్రతినిధులు బలపర్పారు.

ఏమిటీ ఆ రెండు నిర్ణయాలు? 1) ఉద్యమంలో అశాంతి కొనసాగుతున్నది కాబట్టి ఉద్యమాన్ని నిలిపివేయాలి. 2) తెలంగాణ సమస్య పరిష్కారానికి కమిటీని వర్పర్చడం. వీటిని తెలంగాణ ప్రాంత ప్రతినిధులు బలపర్చడం, ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ బలపర్చడం అనుచితం.

అప్పటికీ కొనసాగిన ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగానే సాగింది. దీన్ని కూడా సహించలేకనే ఈ ఉద్యమంలో నక్సలైట్లు పాల్గొని అధికారాన్నీ తమ చేతుల్లోకి తీసుకొంటున్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. అంటే నక్సలైట్లకి ఉద్యమంలో పాల్గొనే హక్కు లేదా? ఏ రాజ్యాంగ సూత్రంలో వుందో తెలుపుతారా? ఇదేనా తాము చెప్పే ప్రజాస్వామ్యం? నక్సలైట్ల పేరిట ఉద్యమానికి అశాంతి నెపం మోపి నీరుకార్చేందుకు పన్నుతున్న కుతంత్రాలే ఇవన్నీ.

2, కమిటీ ఏర్పాటు. ఇది దేని కోసం? ఉద్యమంపై నీళ్ళు చల్లడానికే. ఆ తదుపరి తెలంగాణ వాదాన్నే లేకుండా చేయాలనే ఉద్దేశ్యమే ఇందులో దాగి వున్నది. తెలంగాణ డిమాండ్‌ ప్రారంభమైనప్పటి నుండీ ఐదున్నర దశాబ్దాలుగా ప్రధానంగా కాంగ్రెసు, తెలుగుదేశం ప్రభుత్వాలు ఎన్నో కమిటీలనూ, కమీషన్లనూ ఏర్పరచాయి. అవన్నీ ఏమయ్యాయి? తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్బాయి. ఇది కూడా వాటిల్లో భాగమే. ఇలా అని తెలిసి కూదా తెలంగాణ అని చెప్పుకొంటున్న పార్టీలు చర్చలనంతరం ఉద్యమ మాటే మరచిపోయాయి.

ఢిల్లీ చర్చల్లో టీఆర్‌ఎస్‌తో సహా తెలంగాణ ప్రాంతంలోని పార్టీలు అనుసరించిన రాజీ వైఖరినీ, కేంద్రంపై భ్రమలు కొల్పే వైఖరినీ న్యూడెమోగ్రసీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ సందర్భంలో పార్టీ స్వతంత్రంగా కార్యక్రమాలను నిర్వహించింది. అలాగే జేఏసీ వర్కింగ్‌ గ్రూపు మాత్రం ఉద్యమ బాటను వదిలిన పార్టీలను విమర్శిండంలో మెతక వైఖరిని

(8

ప్రదర్శించింది. తత్పలితంగా రాజకీయ పార్టీల వైఖరినే జేఏసీ కలిగివుందనే భావనని ప్రజలు వ్యక్తం చేసారు. రాజీనామాల డిమాండ్‌

వారం రోజుల సంపూర్ణ నిస్తబ్బ్దత నుండి అనగా జనవరి 12న రావి నారాయణరెడ్డి హాల్‌లో రెండవ విడత విసృత సమావేశం జరిగింది. దీనిలో రాజీనామాలపై జరిగిన చర్చ ఉద్రిక్తతకి దారితీసింది. డిసెంబరు 23న చిదంబరం '్రకటనకి వ్యతిరేకంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజా ప్రతినిధుల మాదిరిగానే తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామాలివ్వాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. ఆ తదుపరి రాజీనామాల నినాదం మరింత తీవ్రమయింది. అప్పటికే ఆత్మహత్యలు మొదలయ్యాయి. యివి జరిగినప్పుడల్లా “మాకు చావులా! మీకు పదవులా!” అని విద్యార్థులు, యువకులు ప్రజా ప్రతినిధులను నిలదీసారు. ప్రజా ప్రతినిధులు రాజీనామాలను ప్రకటించి, వాటి ఆమోదానికి పూనుకోకపోయేసరికి తెలంగాణ ప్రజల్లో అనుమానాలు, అవిశ్వాసాలు ఏర్పడి ప్రజా ప్రతినిధులపై మరింత వత్తిడి చేసారు. ఈ పరిస్థితి గమనించిన టీఆర్‌ఎస్‌ వారం రోజులలో అనగా 18వ తేదీన తన రాజీనామా యిస్తున్నట్లు పొలిట్‌ బ్యూరో జనవరి 12వ తేదీ ఉదయం ప్రకటన చేసి, ఈ సమావేశానికి దాని ప్రతినిధులు హాజరయ్యారు. ఆ వాయిదానే అక్కడి ప్రతినిధులు నిలవేసారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ పార్టీ ప్రతినిధులు కూడా రాజీనామాలని డిమాండ్‌ చేసారు. మిగతా పార్టీలు కూడా ఇలానే డిమాండ్‌ చేసాయి. ఈ సందర్భంగా శాసనసభలోని ఐదు రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించడానికి ఇదే రోజున ఇదే హాలులోనే ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఇవి శాసనసభలో ప్రాతినిత్యం కలిగిన పార్టీలనే రాజకీయ పార్టీలనే వైఖరిని అనుసరించాయి. అప్పట్నుంచి న్యూడెమోక్రసీ వర్కింగ్‌ గ్రూపులో భాగంగా వుంటుందని భావించాయి.

ప్రత్యేక సమావేశమైన ఐదు (తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, టీడీపీ, తెరాస, బీజేపీ, తెలంగాణ పీఆర్సీ) రాజకీయ పార్టీలు మరో 10 రోజులు వాయిదా వేస్తూ అనగా 28న రాజీనామాలిస్తామని ప్రకటించాయి. ఈ వాయిదాని టీడీపీ, కాంగైసు ప్రతినిధులు కోరిన మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై హాల్‌లో ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ సమావేశంలోనే ఎంఆర్‌పీయస్‌ అధినాయకుడు మందకృష్ణ మాదిగ రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినప్పుడు రాష్ట్ర కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల అధ్యక్షులైన డి. శ్రీనివాస్‌, చంద్రబాబు నాయుడు ఎందుకు హాజరు కాలేదు? వారిద్దరు నిర్దిష్టంగా అభిప్రాయాలెందుకు వెల్లడించడం లేదు? ప్రాంతాల వారీగా అభిప్రాయాలు చెప్పడం ఏమిటి? ఒకే పార్టీ రెండు అభిప్రాయాలు చెప్పడం ఏమిటి? అని సూటిగా

(7

నిలవేసాడు. ఇవే విషయాలను న్యూడెమోక్రసీ పార్టీ వెల్లడించింది. కృష్ణ మాదిగ లేవనెత్తిన విషయాలకు సరైన సమాధానమివ్వకుండా దొర పోకడతో కాం[గ్రెసు ఎం.ఎల్‌.ఎ. రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి వ్యవహరించాడు. దీన్ని న్యూడెమోక్రసీ పార్టీ ప్రతినిధులు ఖండించారు. కానీ అధ్యక్షత స్థానంలో ఉన్న కోదండరాంగానీ, యితర పార్టీల నాయకులు గానీ ఖండించక పోవడం గర్హనీయం.

హేతుబద్దంగా లేవనెత్తిన (ప్రశ్నలకి రాజకీయ పార్టీలు సరైన సమాధానాలివ్వకుండా దాట వేసాయి. తాము చేసిన నిర్ణయాల్లో యితర సంస్థలను భాగస్వామ్యం చేయకుండా ఒంటెద్దు పోకడలతో తాము భావించిన నిర్ణయాలను ్రెస్‌వారిని పిలిచి బహిరంగంగా ప్రకటించారు. వీటితో తమకు సంబంధం లేదనీ, ఇవి ఈ ఐదు రాజకీయ పార్టీల వైఖరులు మాత్రమేననీ మంద కృష్ణ, న్యూడెమోక్రసీ ప్రతినిధులు బహిరంగంగా ప్రకటించారు. దీనితో జేఏసీ చీలిపోయినట్లు మీడియా వ్యాఖ్యానించింది. ఇది కొంత గందరగోళాన్ని సృష్టించింది. ,

ఆ మరుసటి రోజే (జనవరి 18) మార్చ్‌ భవన్‌లో (ఎన్‌డి ఆఫీసు) ఎమ్మార్పీఎస్‌, న్యూడెమోక్రసీ నాయకత్వంలో విసృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేఏసీలోగల అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాలు హాజరయ్యాయి. మేధావులు, ఇతరులు పాల్గొన్నారు. ఇది మరో జేఏసీ ఏర్పడుతుందనే తప్పుడు సందేశాన్నిచ్చింది. జేఏసీలో కొనసాగుతూ బహిరంగంగా పోటీ సమావేశం నిర్వహించడం చీలిక మెసేజ్‌నే ఇస్తుంది. ఇలా నిర్వహించడం సరయింది కాదు. జేఏసీ చీలిపోవడం లేదని ఈ సమావేశం స్పష్టం చేసింది. జేఏసీ నిర్ణయాలను చురుకుగా అమలు జరుపుతుందని కూడా నొక్కి చెప్పింది. శ్రీకృష్ణ కమిటీ

ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో శాసనసభలోని రాజకీయ పక్షాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది. ఈ సందర్భంగా పరిస్థితిని పరిశీలించడానికి కమిటీని నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని తెలంగాణ అనుకూలురు, వ్యతిరేకులు కూడా అంగీకరించారు. తరువాత కమిటీ, దాని విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు ప్రాంతాల్లో పర్యటించి అభిప్రాయాలను సేకరిస్తుందని స్పష్టం చేసింది. ఈ వైఖరి తెలంగాణకి వ్యతిరేకమైనది. విడిపోతామని ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల వైఖరిని తెలుకోవడానికి పరిమితం గాకుండా, దీనికి పోటీగా మిగతా ప్రాంతాల్లో కూడా పర్యటిస్తుందని ప్రకటించడంలోనే కేంద్ర ప్రభుత్వ కుతంత్రం దాగి వున్నదని ఉద్యమ సంస్థలు విమర్శించాయి. ఈ కమిటీ ఉద్యమాన్ని నిర్విర్యం చేసేందుకేనని కూడా తెలిపాయి. ఇలాంటి కమిటీకి రిపోర్టు చేయాల్సిన పనిలేదనీ, దీన్ని తిరస్మరించాలనీ

జేఏసీ అభిప్రాయ పడింది. శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించాలని బీజేపీ పిలుపునిచ్చింది. జేఏనీ, బీజేపీ వైఖర్లతో సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు అంగీకరించలేదు. శ్రీకృష్ణ కమిటీ యెడల ఎవరు భావించింది వారు అమలు చేసుకోవచ్చని జేఏసీ వ్యక్తం చేసింది. శ్రీకృష్ణ కమిటీకి సీపీఐ (ఎం-ఎల్‌ న్యూడెమోక్రసీ తన వైఖరిని వివరించేందుకు 64 పేజీల బుక్‌లెట్‌ని తయారు చేసి అందచేసింది. దీన్ని పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది.

శ్రీకృష్ణ కమిటీ డిసెంబరు 31 లోపున తన నివేదికను సమర్పిస్తానని ప్రకటించింది. అప్పటి వరకు ఉద్యమాన్ని కొనసాగించకుండా వుండాలనే వైఖరి కొన్ని పార్టీల నుండీ, కొన్ని సెక్షన్ల నుండీ వ్యక్తమయింది. దాన్ని జేఏసీ, న్యూడెమోక్రసీ ఖండించాయి. ఇదే చేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క కమిటీ ఏర్పాటు ఉద్దేశాన్ని పరోక్షంగా సమర్ధించడమేనని వ్యక్తం చేసాయి. తెలంగాణా ఆవిర్భవించే వరకు నిరంతరం తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించాలని తెలంగాణ జేఏసీ ప్రకటించింది. ఈ సందర్భంగా కూడా ఉద్యమమే తెలంగాణ ఆవిష్మరణకి ముఖ్య భూమిక పోషిస్తున్నదని మరోమారు ప్రకటించింది. దాన్నే అమలు జరుపుతున్నది. రాజకీయ సంక్షోభం

అన్ని పార్టీలకి చెందిన ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలిస్తే రాజకీయ సంక్షోభం ఉత్పన్నమర్య్యోేది. ఇది మాత్రమే కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చేది. కానీ, కాంగ్రెసు పార్టీ తమ అధిష్టానం అభిప్రాయం మేరకు రాజీనామా లివ్వకుండా దాట వేసింది. కాంగ్రెసు పార్టీ ప్రతినిధులు రాజీనామాలివ్వక పోతే తామిచ్చి ఏమి ప్రయోజనమని తెలుగుదేశం తన వైఖరిని వెల్లడించింది. ఈ రెండు పార్టీలు రాజీనామాలివ్వకుండా రాజకీయ సంక్షోభం రాదు.

రాజీనొమాలకి ప్రధానంగా ద్రోహం చేసింది కాంగ్రెసు పార్టీ. దీన్ని సాకుగా చూపించి, తెలుగుదేశం తప్పుకోజూసింది. కనీసం టీడీపీ రాజీనామాలిచ్చినా, కాంగ్రెసు ప్రజా ప్రతినిధులపై వత్తిడి తీవ్రంగా వుండేది. రాజీనామాల యెడల ప్రజల డిమాండ్‌ కూడా వుంది. కాబట్టి రాజీనామాలను అన్ని పార్టీలు ప్రకటించాయి. కొద్ది మందయినా రాజీనామాలిస్తే, రాజీనామాలివ్వని వారిపై ప్రజా ప్రతిఘటన తీవ్రమవుతుందని జేఏసీ భావించింది. అప్పుడయినా రాజీనామాలివ్వక తప్పదనుకొన్నది. కానీ, రాజీనామాలివ్వని ప్రతినిధులను ప్రజలు కొద్ది కాలం మాత్రమే అది కూడా కొన్ని చోట్ల మిలిటెంటుగా ప్రతిఘటించారు. స్థిరంగా ఈ ప్రతిఘటన కొనసాగలేదు. ఫలితంగా లక్ష్యాన్ని సాధించలేక పోయాము.

($)

ఈ అంశాన్ని సీపీఐ (ఎం-ఎల్‌ న్యూడెమోక్రసీ కూడా గుర్తించలేక పోయింది. 12 మంది శాసనసభ్యుల రాజీనామాలతో సంక్షోభం రాకపోగా, ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కాంగ్రెసు, టీడీపీ పార్టీలదే. ఈ రెండు పార్టీలు రాజీనామాలిస్తామని ప్రకటించి యివ్వకపోగా, రాజీనామాలిచ్చిన పార్టీల అభ్యర్థుల స్థానంలో పోటీకి పూనుకొన్నాయి. ఇది అనైతికం; విద్రోహం మాత్రమే. జేఏసీ నుండి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దూరమయినవైనం

జేఏసీ నుండి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రతినిధులు బయటికి రావాలని, రాజీనామాల ప్రస్తావనే తీసుకు రావద్దని కాంగ్రెసు అధిష్టానం హెచ్చరించింది. కానీ ప్రజల నుండి రాజీనామాలపై వత్తిడి పెరిగింది. దీనితో జేఏసీలో భాగమైన కాంగైసు పార్టీ ప్రతినిధులు ఏదో ఒకటి తేల్చుకోవాల్సి వచ్చింది. అంతిమంగా కాంగ్రెసు ప్రతినిధులు జేఏసీ నుండి చెప్పా పెట్టకుండా ఉడాయించారు. అయినా జేఏసీ కానీ, టీఆర్‌ఎస్‌ కానీ కాంగ్రెస్‌ పార్టీపై సరయిన విమర్శ చేయలేదు.

కాంగ్రెసు ప్రతినిధులు జేఏసీ నుండి తప్పుకున్నాక కూడా టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు జేఏసీలో కొంతకాలంగా కొనసాగారు. ఇది ఇష్టంలేని టీఆర్‌ఎస్‌ చంద్రబాబు నాయుడు చేసే తెలంగాణ వ్యతిరేక అంశాలను చూయించి జేఏసీ నుండి టీడీపీని బహిష్మరించాలన్నది. టీడీపీని జేఏసీలో చేర్చుకొనేటప్పుడు వుండే వైఖర్లనే రాష్ట్ర టీడీపీ నాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కలిగి వున్నాడు. ఎలాంటి ప్రత్యేకత లేకుండానే టీడీపీనీ అర్ధరాత్రి జేఏసీ బహిష్కరించింది. కనీసం జేఏసీ సమావేశం పెట్టలేదు. ఎజండా లేదు. భాగస్వామ్య పక్షాలందరికీ ఆమోదయోగ్యం లేదని తెలిసినా టీఢీపీని బహిష్కరించడం టీఆర్‌ఎస్‌ ఒంటెద్దు పోకడను స్పష్టం చేస్తోంది. జేఏసీకి వున్న ప్రతిష్ట ఈ సందర్భంగా మంటకల్సింది. జేఏసీ స్వతంత్ర వేదిక అనే వైఖరిపై దుమ్ము పోసింది. జేఏసీ ప్రధాన నాయకత్వం కేసీఆర్‌ తొత్తులనిపించుకొనే విమర్శకి తావిచ్చింది.

ఈ సందర్భంగానే టీడీపీని బహిష్కరించిన విధానాన్ని నిర్మాణపరంగానూ, రాజకీయ పరంగానూ సరైంది కాదని సీపీఐ (ఎం-ఎల్‌ న్యూడెమోక్రసీ బహిరంగంగా విమర్శించాల్సి వచ్చింది. జేఏసీ నుండి పోయిన కాంగ్రెసుని వదిలి టీడీపీని బహిష్కరించడం పూర్తిగా అవివేకమైనది. టీడీపీ రాష్ట్ర నాయకత్వం, దాని అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలని నిరసించే విధంగా తెలంగాణ తెలుగుదేశం నాయకత్వాన్ని మరల్చే ప్రయత్నం చేయాల్సి వుంది. టీఆర్‌ఎస్‌ అధినాయకుడి ఆదేశం మేరకు జేఏసీ నాయకత్వం తీసుకొన్న ఈ వైఖరి తీవ్రంగా ఖండించదగింది. తెలంగాణ పీఆర్బీ పార్టీ శాసనసభ సభ్యులు యిద్దరూ స్వార్ధపూరిత విధానాలకి ఒడిగట్టి, తెలంగాణ

ఉద్యమంలో పూర్తిగా తెరమరుగయ్యారు. యిక జేఏసీలో నికరంగా మిగిలిన రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్‌, బీజేపీ, న్యూడెమోక్రసీలు మాత్రమే. జేఏసీ కొన్ని నిర్మాణ మార్పులు

ఈ పరిణామాలనంతరం జేఏసీ నిర్మాణంలో మరోసారి కొన్ని మార్పులు వచ్చాయి. యిక వర్క్మింగ్‌ (గ్రూపు, స్టీరింగ్‌ కమిటీలు, రాజకీయ పార్టీలు అనేది కాకుండా అన్నీ కలిసి “స్టీరింగ్‌ కమిటీ”గా ఏర్పడ్డాయి. ఇందులో పైన పేర్కొన్న ౩ రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, కుల, వృత్తి, ప్రజా సంఘాలు మొదలగునవి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒక కన్వీనర్‌, మిగతా వారంతా సభ్యులుగా వున్న జేఏసీ స్టీరింగ్‌ కమిటీ యిక నుండి ఛైర్మన్‌, కో-ఛైర్మన్‌, కన్వీనర్‌, కో-కన్వీనర్‌, కో-ఆర్టినేటర్‌, అధికార ప్రతినిధులు, మెంబర్లు అనే తీరులో నిర్మాణాన్ని రూపొందించారు. ఇది కూడా క్షుణ్ణంగా చర్చించి జరిపింది కాదు. దీనిలో రాజకీయ పార్టీలకి ప్రాధాన్యత తగినంతగా లేదు. ఆ తరువాత జరిగిన స్టీరింగ్‌ కమిటీ ఉద్యమ నిర్వహణ కోసం ఐదు కమిటీలను ఏర్చర్చింది. వీటిల్లో పార్టీల ప్రతినిధులను కూడా తీసుకొన్నది. ప్రధానంగా మే నెలంతా జేఏసీ ఉద్యమాన్ని సంఘటిత పరిచే నెలగా ప్రకటించింది. ఒక మేరకు జిల్లాల్లో జేఏసీ సంఘటిత పడింది. క్షేత్ర స్థాయిలో నిర్మాణం ఏర్చర్చడానికి పూనుకున్నది. ఉప ఎన్నికలు ॥

ప్రారంభం నుండి ఎన్నికలకి సంబంధించి జేఏసీ స్పష్టమైయిన వైఖరిని తీసుకొన్నది. రాజీనామాలిచ్చిన అభ్యర్థులను సమర్దించాలనీ, రాజీనామాలివ్వకుండా పోటీలో ఎవరిని నిలబెట్టినా వారందరినీ ఓడించాలనీ ప్రకటించింది. ఈ సందర్భంలో స్టీరింగ్‌ కమిటీలో పార్టీ వైఖరిని న్యూడెమోక్రసీ ప్రతినిధులు వెల్లడించారు. ఎన్నికలకి సంబంధించిన కార్యక్రమాల్లో జేఏసీతోగానీ, యితరత్రా గానీ పాల్గొనలేమని తెలిపారు. రాజీనామా " లివ్వకుండా పోటీకి దిగుతున్న ఏ పార్టీగానీ, వ్యక్తులుగానీ ద్రోహానికి తలపెట్టడమే అని చెప్పారు. వీరికి పోటీ చేసే నైతిక అర్హత లేదనీ కూడా స్పష్టం చేసారు.

అలాగే ఎన్నికల్లో జేఏసీ పేరిట పోటీ చేయాలనే బీజేపీ 'ప్రతిపాదనని స్టీరింగ్‌ కమిటీలో న్యూడెమోక్రసీ పార్టీ తిరస్కరించింది. ఎన్నికల్లో పాల్గొనరాదని స్పష్టం చేసింది. జేఏసీ ఉద్యమ సంస్థ. ఇది ఉద్యమాల ద్వారానే గొప్ప ప్రతిష్టని సంపాదించింది. యిక ముందు కూడా పోరాటాలకి ప్రాతిపదికగా దీన్ని నిలబెట్టుకోవాలన్నది. ఉద్యమ కృషిలో పార్టీ పాత్ర

సీపీఐ (ఎం-ఎల్‌ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం

(గ్ర .

ఉద్యమించాలని పిలుపిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ సంవత్సరం కాలంగా అప్రతిహతంగా కృషి సల్పుతున్నది. తెలంగాణలోని 10 జిల్లాల్లో న్యూడెమోక్రసీ పార్టీ వివిధ మోతాదుల్లో నిర్మాణం కలిగి వున్నది. మెదక్‌లో విద్యార్థి రంగానికే పరిమితమయింది. తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ సమస్యపై అహర్షిశలు కృషి సల్పుతున్నది. విస్సృతంగా కరపత్రాలు, మీటింగ్‌ల ద్వారా ప్రచారాన్ని చేసింది. ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. క్యాడర్‌ ఎనలేని విధంగా కృషి చేసింది. గత సం॥ ఆగస్టు నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే ఉద్యమంలోనే న్యూడెమోక్రసీ పార్టీ ప్రధానంగా పాటు బడింది. స్వతంత్రంగానూ, ఐక్యకార్యాచరణ ద్వారానూ న్యూడెమోక్రసీ పార్టీ ఉద్యమాలను కొనసాగించింది. నిజాయితీగా పార్టీ కృషి చేసింది. ఈ ఉద్యమంలో పార్టీ ప్రతిష్టను పెంచుకొన్నది. “చెప్పింది చేసేది, చేసింది చెప్పేదిగా” తెలంగాణ ఉద్యమంలో పార్టీ తన ప్రత్యేకతని నిలబెట్టుకొన్నది. పార్టీ నిర్మాణయుతంగా జరిపిన కృషికి జేఏసీలోని సంస్థలు వివిధ సందర్భాల్లో ప్రశంసలు తెల్పాయి. ఆర్థికంగా అన్ని జిల్లా కమిటీలు ఎన్నో యిబ్బందులను ఎదుర్కొన్నాయి. ఉద్యమ పెలుపుల సందర్భంలో కొన్ని చోట్ల పార్టీ ఆఫీసులపై పోలీసులు దాడులు చేసారు. వందలాది మంది కార్యకర్తలపై కేసులు బనాయించారు. పోలీసుల దాడులను ఖాతరు చేయకుండా, కామ్రేడ్స్‌ ఉద్యమించారు. తెలంగాణ వ్యాపితంగా పార్టీకి మంచి గుర్తింపు, గౌరవం, ప్రచారం దక్కాయి. తెలంగాణ జేఏసీగానీ, న్యూడెమోక్రసీ పార్టీ కానీ ఇచ్చిన పిలుపులను గానీ పార్టీ నిర్మాణం వున్న జిల్లాలన్నీ గట్టిగా అమలు చేయుటకు కృషి చేసాయి. జేఏసీ వివిధ సందర్భాల్లో నిరాహార దీక్షలకి పిలుపిచ్చింది. ఈ శిబిరాలే కేంద్రాలుగా ఉద్యమాన్ని కొనసాగించాయి. నిరాహార దీక్షలపై సీపీఐ (ఎం-ఎల్‌్‌ న్యూడెమోక్రసీ పార్టీకి సానుకూల వైఖరి లేక పోయినా, వీటిల్లో భాగస్వామ్యమైంది. ఇది పార్టీకి యిబ్బందిని కల్గించింది. కౌన్ని సందర్భాల్లో యిచ్చిన బంద్‌ పిలుపుల్లో పార్టీ చురుకుగా పాల్గొన్నది. వినూత్న కార్యక్రమాలన్నింటిలో పార్టీ తన శక్తి కొలది పాల్గొన్నది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఈ ఉద్యమంలో అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు యిచ్చింది. నల్గొండ జిల్లా కృష్ణ బృందమే సుమారు 60కి పైగా ప్రదర్శనలిచ్చింది. అలాగే ఇలెందు ట్రూపు కూడా రాజకీయ పరిణామాలకి అనుకూలంగా “శ్రీకృష్ణ కమిటీ” ఆగమనంపై “రాజకీయ బాగోతం”ని రూపొందించి ప్రదర్శించింది. ఈ (ప్రదర్శన బాగా ఆకట్టుకొన్నది. (్ర్రి

తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక కార్యకర్తలకి బాగా డిమాండ్‌ పెరిగింది. తెలంగాణ సాంస్కృతిక బృందాల్లో కొంత మందికి ఉద్యమ చైతన్యాన్ని పెంచేందుకు తమ ప్రదర్శనలివ్వాలనే తపన పోయింది. డబ్బు దండుకోవడంగా వారి పద్దతులు మారాయి. ఉద్యమం, విధానాల కంటే వారి వ్యక్తిగత ఫోకస్‌లకి పాటుపడ్డారు. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మాత్రం నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది.

వీడీఎన్‌యూ విద్యార్థి సంథుం పీడీఎస్‌ యూ పేరుతోనూ, విద్యార్థి ఐక్య

*... కార్యాచరణలోనూ భాగస్వామ్య మయింది. పీడీఎస్‌యూ 'పొలికేక' పేరిట పెద్ద ప్రచారం చేసింది. సెక్రటేరియట్‌ వద్ద పీడీఎస్‌యూ తెలంగాణ సమస్యపై ధర్నా చేసింది. 18 మంది అరెస్టు అయ్యారు. పీఓడబ్య్యూ కూడా ఉద్యమంలో పాల్గొన్నది. మండల ఆఫీసులకి

తాళం వేసే కార్యక్రమాన్ని చేవట్టింది. పీవైఎల్‌, యితర (ప్రజా నంవథూలు కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నాయి. పీవైఎల్‌ ప్రత్యేకంగా ఈ ఉద్యమంలో లేక పోవడం లోపం. ఇష్టా, ముఖ్యంగా సింగరేణిలో తెలంగాణ సమస్యపై విసృతంగా కార్యక్రమాలు నిర్వహించింది. పార్టీ రాష్ట్రస్థాయి జనరల్‌ బాడీ సమావేశాలు

పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోనే గాకుండా రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌, ఖమ్మంలో తెలంగాణ సమస్యపై రెండు విసృత సమావేశాలు నిర్వహించుకొన్నది. మొదట తెలంగాణ జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుల సమావేశాన్ని జరుపుకొన్నది. రెండవ దఫా ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ డివిజన్‌ కమిటీ సభ్యుల సంయుక్త సమావేశాన్ని జయప్రదం చేసుకున్నది. అప్పటికే వుద్యమాల్లో వస్తున్న ధోరణులపై స్పష్టత కలిగించే పద్దతిలో చర్చలు జరిగాయి. ఈ రెండు సమావేశాలు నిర్వహించుకోవడం ఎంతో ఉపయోగపడింది.

వివిధ జిల్లాల్లో పాల్టీ నిర్వహించిన స్వతంత్ర కార్యక్రమాల సంక్షిప్త రిపోర్టులు

హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో హైదరాబాద్‌ నగర కమిటీ స్వతంత్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే, ఐక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నది. ఉస్మానియా విద్యార్థి ఉద్యమంపై విచక్షణా రహితంగా లాఠీఛార్జీ చేయడం, రబ్బర్‌ బుల్లెట్లు, బాప్టవాయువు ప్రయోగించిన ప్రతి సందర్భంలోనూ వారికి అండగా వుండి క్రియాశీల పాత్రను నగర

[్‌

కమిటీ పోషించింది. ప్రజా సంఘాలన్నీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాయి. స్వతంత్ర కార్యక్రమాలు

  • తెలంగాణ సమస్యపై 20.12.09న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నగర కమిటీ సభ నిర్వహించింది. 24.12.09న తెలంగాణ బంద్‌ సందర్భంగా 100 మందితో విద్యానగర్‌, బర్మత్‌పుర, నారాయణగూడ మీదుగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వరకు నగర కమిటీ ర్యాలీ నిర్వహించింది. బంద్‌ను జయప్రదం చేసింది.

  • రంగారెడ్డి జిల్లా ప్రగతినగర్‌లో 24.1.10న 8 బస్తీలలో కొవ్వొత్తులతో ప్రచారం నిర్వహించింది. అనంతరం 600 మందితోనూ, 10.1.10న మహాత్మాగాంధీ నగర్‌ బస్తీలో 80 మందితోనూ పార్టీ బహిరంగ సభలు నిర్వహించింది. 26.1.10న కవాడిగూడలో 300 మందితోనూ, 27.1.10న నల్లగుట్ట, గైదీనీ బాగ్‌ బస్తీలో 250 మందితోనూ, ఉస్మానియా యూనివర్సిటీ బస్తీలో రెండు సార్లు, క్యాంప్‌ 5 బస్తీలలోనూ గ్రూపు మీటింగులను పార్టీ నిర్వహించింది. ఫిబ్రవరి 15న లాఠీచార్జీకి నిరసనగా ఓయూ లేడీస్‌ హాస్టల్‌ ముందు 500 మంది విద్యార్థినిలతో సభ జరిగింది.

  • శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ 12.2. 10న నగర కమిటీ ఆధ్వర్యంలో

మార్చ్‌ భవన్‌ నుండి ర్యాలీ బయలుదేరి విద్యానగర్‌ చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. పార్లమెంటులో తక్షణమే బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో 200 మందితో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముందు పీఓడబ్య్యూ ధర్నా నిర్వహించింది. 8.1.10న “కార్మికుల ధూంధాం” కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 450 మందితో ఇష్టా నిర్వహించింది. మలక్‌పేట కాలేజీలో, న్యూమలక్‌పేట కాలేజీ, మోహన్‌ నగర్‌ వాస్టల్స్‌లలో సదస్సులనూ మరియు జంట నగరాల జనరల్‌ బాడీ సమావేశాన్నీ పీడీఎస్‌యూ నిర్వహించింది. 25.1.10న “పొలికేకా పోస్టర్‌ను పీడీఎస్‌యూ ఆవిష్కరించింది. సిద్ధార్ధ కాలేజీ, నోబుల్‌ కాలేజీ, సిద్ధార్ధ ఉమెన్స్‌ కాలేజీల్లో ప్రచారాన్ని నిర్వహించింది. 12.2. 10న ముసురాంబాగ్‌లో పీడీఎస్‌ యూ అధ్వర్యంలో శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

  • తెలంగాణ ప్రభంజనం సందర్భంగా పార్శిగుట్ట, రాంనగర్‌, విద్యానగర్‌లలోనూ, మెహిదీపట్నం నుండి నాలానగర్‌ వరకు, కవాడీ గూడా, అడ్డగుట్ట, మెడికల్‌ కాలేజీ, షేక్‌పేట నాలా, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌.బి. నగర్‌, చంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఓయూ 8,4,5 బస్తీల్లో విస్సతంగా మూడు బ్యాచీలుగా డప్పు డాన్స్‌, గ్రూఫ్‌ మీటింగ్‌లతో ప్రచారం నిర్వహించారు. అరుణోదయ బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాయి.

  • ఎప్రిల్‌ 18న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 500 మందితో తెలంగాణ ప్రభంజనం మీటింగ్‌ జరిగింది.

  • ఉస్మానియా యూనివర్సిటీని ఈ ఉద్యమ కాలంలో ప్రభుత్వం జైలుగా మార్చింది. విద్యార్థినులపై మూకుమ్మడిగా చేసిన దాడిలో 10 మంది విద్యార్థినులు తీవ్రమైన గాయాలకి గురయ్యారు. వీరి పరామర్శ పేరుతో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి హాస్పటల్‌కి ఠాగా పీఓడబ్య్యూ, ఇష్టా సంఘాలు ఘెరావ్‌ చేసాయి.

  • జనవరి 16 నుండి 28 వరకు జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్‌ వద్ద జరిగిన రాష్ట్ర రిలే నిరాహార దీక్షలో ప్రతి రోజూ పార్టీ పాల్గొన్నది. ఇందిరా పార్క్‌ దగ్గర జరిగిన ధర్నాలోనూ, ఫిబ్రవరి 1న రంగారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడీ, ఫిబ్రవరి 4న ట్యాంక్‌ బండ్‌పై మానవహారం కార్యక్రమాల్లోనూ, అమరవీరుల స్థూపం దగ్గర జరిగిన ధర్నాల్లో పార్టీ, ప్రజా సంఘాలు చురుకుగా పాల్గొన్నాయి.

  • హోళీ పండగ కాముడి దగ్ధం సందర్భంగా ఇందిరా పార్క్‌ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. జనవరి 1న చిలుకానగర్‌లో రెండు వేల మందితోనూ, పార్సిగుట్ట, రాంనగర్‌ చౌరస్తాలలో జేఏసీల ఆధ్వర్యంలో జరిపిన బహిరంగ సభల్లో పార్టీ ప్రధాన పాత్ర పోషించింది.

  • ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్‌ కాలేజీ వద్ద జరిపిన రిలే నిరాహార దీక్షలో రెగ్యులర్‌గా పీడీఎస్‌యూ పాల్గొన్నది. మహిళా జేఏసీలో పీఓడబ్య్యూ భాగస్వామిగా వుంటూ గన్‌పార్క్‌ చార్మినార్‌, ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీల దగ్గర నిర్వహించిన మానవహారంలో _ భాగస్వామ్యమయింది. జనవరి 81న ఆర్టీసీ కల్యాణ మండపంలో మహిళా ప్రభంజనం మీటింగ్‌ను నిర్వహించగా పీఓడబ్య్యూ పాల్గొన్నది.

  • జీడిమెట్ల, షామీర్‌పేట జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలలో ఇష్టూ కార్మికులు 380 మంది పాల్గొన్నారు.

  • పార్టీ టీజేఏసీలోనూ, పీడీఎస్‌యూ విద్యార్థి జేఏసీలోనూ, పీఓడబ్యూ మహిళా జేఏసీలోనూ, ఇష్టా కార్మిక రంగ జేఏసీలలో వుంటూ చురుకుగా పాల్గొన్నాయి. నిర్బంధం

  • 20.1.10న వేణుగోపాల్‌ రెడ్డి శవయాత్ర సందర్భంగా ఓయూలో జరిగిన ర్యాలీపై విచక్షణా రహితంగా పోలీసులు రబ్బర్‌ బుల్లెట్‌లను, బాప్పవాయువు, వాటర్‌ క్యాన్స్‌ని ప్రయోగించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న పార్టీ నాయకులు సూర్యం, పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి గౌతం ప్రసాద్‌, ఇప్టా నగర నాయకుడు కిరణ్‌, పీడీఎస్‌యూ నాయకులు ఎ.డి. రాము మొదలగువారు గాయపడ్డారు.

గి

  • తెలంగాణ ఉద్యమంలొ చురుగ్గా పాల్గొన్నందుకు పీడీఎస్‌యూ గోపీకృష్ణ ఇంటిపై రాత్రి పోలీసులు దాడి చేసి నిర్బంధించారు. ఓయూ పీడీఎస్‌యూ నాయకుడు రాజేష్‌ను అరెస్టు చేసి, చంచల్‌గూడ జైల్లో 9 రోజులు నిర్బంధించారు. 80. 12.09న సుందరయ్య పార్క్‌ దగ్గర ర్యాలీని అద్దుకుని పార్టీ, ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టు చేశారు. 14.2.10న రాత్రి ఓయూలో లాఠీఛార్జికి నిరసనగా ఇఫ్లూ దగ్గర ధర్నా చేస్తుండగా ఇఫ్లూ నగర నాయకురాలు ఎస్‌.ఎల్‌. పద్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి గౌతం ప్రసాద్‌లను అరెస్టు చేసి తెల్లవారి 8 గం![లకు వదిలారు. మరో సందర్భంలో పద్మ, అనురాధలను నిర్బంధించారు. వీడీఎన్‌యూ ఓయూ నాయకులు రాజేష్‌ ఉపేందర్‌లపై 307 సెక్షన్లతోపాటు అనేక కేసులు మోపారు.

జిల్లా ఉద్యమాల సంక్షిప్తి పరిచయం ఖమ్మం జిల్లా: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఖమ్మంజిల్లాలో సి.పి.ఐ (ఎం. ఎల్‌) న్యూడెమోక్రసీతోపాటు పీడీఎస్‌యూ, ఐ.యఫ్‌.టి.యు, పీఓడబ్యూూ, .పీవైయల్‌ ప్రజాసంఘాలు చురుకైన పాత్ర నిర్వహించాయి. ఇవి చొరవతో కార్యక్రమాలు నిర్వహిం చాయి. జిల్లా వ్యాపితంగా పార్టీ శ్రేణులన్నీ కదిలి కార్యకమాలు నిర్వహించాయి. జిల్లాలో జేఏసీ కార్యక్రమాలలోనూ, స్వతంత్ర కార్యక్రమాలలోనూ పార్టీ ముందు వరసలో నిలబడి పనిచేసింది. జిల్లా అంతటా కార్యక్రమాలు సాగటానికి కృషి చేసింది. అరెస్టులు, కేసులు, లాఠీదెబ్బలు ఎదుర్శొని తెలంగాణా ఉద్యమంలో గురుతరమైన బాధ్యతను నిర్వహించింది. . 2009 ఆగస్టు 8న హైదారాబాద్‌లో జరిగిన సదస్సు అనంతరం జిల్లాలో సదస్సులు, . డివిజన్‌ల వారిగా జనరల్‌ బాడీలను పార్టీ నిర్వహించింది. ఖమ్మంజిల్లా నీటి వనరుల డిమాండ్లపై కలెక్టరేట్‌ ఎదుట పికెటింగ్‌ నిర్వహించింది. తెలంగాణ సమస్యపై సదస్సులు నిర్వహించింది. నవంబర్‌ 29న కెసిఆర్‌ను కరీంనగర్‌లో అక్రమంగా నిర్బంధించి ఖమ్మం తీసుకొచ్చినపుడు ప్రభుత్వ చర్యను నిరసిస్తూ పోలీస్‌ కాన్వాయ్‌ను పార్టీ అడ్డుకున్నది. పోలీసుల దాడిని కార్యకర్తలు దృఢంగా ఎదుర్కొన్నారు. నవంబర్‌ 80న జరిగిన బంద్‌ విజయవంతానికి కృషి చేశారు. అదేరోజు జైలు ముందు బైఠాయించి ధర్నా చేశారు. డిశంబర్‌ 2న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. యిది చాలా మిలెటెంట్‌గా సాగింది. పోలీసులకూ, పార్టీ కార్యకర్తలకూ మధ్య 30 ని! లకు పైగా తీవ్ర తోపులాట జరిగింది.

వందలమంది అరెస్టుయ్యారు. అదేరోజు పిడిఎస్‌యు కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ఆరోజు నుంచి వరుసగా 4 నెలలపాటు ప్రధానంగా పార్టీ, పీడీఎస్‌యు తరువాత పీఓడబ్యూ, పీవైఎల్‌, ఐఎఫ్‌టీయూ, అరుణోదయలు కార్యక్రమాలు నిర్వహించాయి. ఉపాధ్యాయ సంఘం జేఏసీ గా ఏర్పడి కార్యక్రమాలు చేసింది. రచయితల సంఘం కలం కలిపింది.

పొయ్యివెలిగించం-ముద్దముట్టం అనే నినాదంతో 2 దఫాలుగా జిల్లాలో 110 (గ్రామాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గం॥ లదాకా పొయ్యివెలిగించకుండా, వినూత్నంగా కార్యక్రమాన్ని పార్టీ నిర్వహించింది. 26-12-2009న 10 (గ్రామాల్తో, 4-31-2010న 100 గ్రామాల్లో యీ కార్యక్రమం నిర్వహించింది. పిల్లలు, స్త్రీలు, (గ్రామప్రజలంతా చావిడి దగ్గరకు వచ్చి యీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని (ప్రదర్శించారు.

సరిహద్దుల్లో నూతన సంర స్వాగతం :- నూతన సంవత్సరం సందర్భంగా 1-1-2010న ఖమ్మంజిల్లాలో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు సరిహద్దులుగా ఉన్న 9 ప్రాంతాలలో పార్టీ ఆధ్వర్యంలో బస్‌లను ఆపివేసారు. తదనంతరం 2ని॥లు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు యివ్వాలనీ, అన్నదమ్ముల్లా విడిపోదాం, స్నేహితులుగా కలసివుందాం అనీ కరపత్రాలు పంచుతూ, ఉపన్యాసాలిస్తూ కార్యక్రమం నిర్వహించింది. మంచి స్పందన వచ్చింది.

పీవైఎల్‌ జిల్లాలో అనేక గ్రామాల్లో కాగాడాల ప్రదర్శనలు నిర్వహించింది. పీఓడబ్యూ మహిళా ర్యాలీలు నిర్వహించింది. ఐఎఫ్‌టియు సింగరేణిలో, వివిధ సెక్టార్‌లో ప్రదర్శనలు, సభలు నిర్వహించింది.

జిల్లాలో దాదాపు 30 మండలాల్లో పెద్ద సభలను పార్టీ నిర్వహించింది. వివిధ గ్రామాల్లో జనరల్‌ బాడీలు, సభలు, ర్యాలీలు, నిర్వహించి పార్టీ వైఖరిని వివరించింది.

పీడీవస్‌యూ జిల్లా వ్యాపితంగా విద్యాసంస్థల్లో వివిధ ఆందోళనా కార్యక్రమాలు తీసుకున్నది. ముఖ్యంగా తెలంగాణా కోసం “పోలికేక” పేరుతో జిల్లాలో కళాకారులు, విద్యార్థి నాయకులతో రెండు బృందాలుగా విడిపోయి జిల్లా అంతటా యాత్ర జరిపారు. అన్ని కాలేజీల్లో సభలు, ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణా కోసం పోరాడతామని దీక్షలు చేయించారు.

జేఏసీ బస్సు యాత్ర, ఓ.యు. విద్యార్థి పాదయాత్రలకు పార్టీ, ప్రజా సంఘాలు తోడ్పడ్డాయి.

జిల్లా మొత్తంగా పార్టీ యావత్తు నవంబర్‌ 29 నుంచి నేటి వరకు తెలంగాణా కార్యక్రమాలపై దృష్టిపెట్టి కృషిచేసింది. ఖమ్మంజిల్లాలో సి.పి.ఐ(ఎం. ఎల్‌) న్యూడెమోక్రసీ తెలంగాణా ఉద్యమంపై శక్తివంచన లేకుండా కృషి చేసింది. ఈ జిల్లాలో న్యూడెమోక్రసీ పార్టీయే తెలంగాణ ఉద్యమంలో పార్టీ అగ్ర భాగాన వుంది.

గ్ర

ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలు:- - 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ అరెస్టు తర్వాత తెలంగాణా రాష్ట్ర సాధనకై జరిగిన వుద్యమంలో జిల్లాలో పార్టీ, ప్రజా సంఘాలు స్వతంత్రంగానూ, జేఏసీ కార్యక్రమాలలోనూ ముఖ్యమైన పాత్రను పోషించాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకై డిసెంబరు 2, 8, 4 తేదీలలో రిలే నిరాహార దీక్షలపై “తెలంగాణ ప్రజా సంఘాల ఐక్య వేదిక” యిచ్చిన పిలుపులో భాగంగా ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఖానాపూర్‌, ఉట్నూరు, నిర్మల్‌, గోదావరిఖనిలలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. వాస్తవంగా యివి పార్టీ ఆధ్వర్యంలో “ఐక్య వేదిక” పేరిట జరిగాయి. కేవలం రెండు కేంద్రాలలో మాత్రమే ఒకరిద్దరు యితర ప్రజా సంఘాల నుండి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9 చేసిన తెలంగాణ (ప్రక్రియ ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల కుట్రలకు వ్యతిరేకంగా పార్టీ ఉద్యమించింది. అందులో భాగంగా జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించింది. డిసెంబర్‌ 16న మంచిర్యాలలో 2000ల మందితోనూ, 18న ఆదిలాబాద్‌లో 1500 మందితోనూ, 20న గోదావరిఖనిలో 2 వేల మందితోనూ బహిరంగ సభలు జరిగాయి. ఈ సభలలో తెలంగాణ విద్యావంతుల వేదిక నుండి మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీధర్‌, కోదండరాంలు వక్తలుగా పాల్గొన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ, డిసెంబరు 10న ఖానాపూర్‌లో 1000 మందితో ప్రదర్శన జరిగింది.

ఆదిలాబాద్‌లో ఊరేగింపు, సభలకు అనుమతివ్వక పోవటాన్ని నిరసిస్తూ, మూతికి నల్లబట్టలు కట్టుకుని 1500 మందితో నిరసన ర్యాలీ జరిగింది. ఈ నిరసన ర్యాలీ జిల్లాలో చర్చనీయాంశమైంది; ప్రభావాన్ని కలుగ చేసింది.

  • డిసెంబర్‌ 9 ప్రకటన తరువాత కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల వత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 28న విసృత (3 ప్రాంతాల) చర్చల ద్వారానే తెలంగాణా సమస్యను పరిష్కరిస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికి అనుకూలంగానే శ్రీకృష్ణ కమిటీని వేసింది. ఈ చర్యలన్నీ తెలంగాణా ఏర్పాటును వాయిదావేసి, ఉద్యమాన్ని నీరుగార్చుట కౌరకే. ఈ స్థితిలో తెలంగాణాలో టీజేఏసీ ఆధ్వర్యంలో వుద్యమాలు నడిచాయి.

మార్చి 13, 2010న ఛలో హైదరాబాద్‌ తెలంగాణా ప్రభంజనంకై పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చింది. ఈ పిలుపు విజయవంతానికై (గ్రామాలలో ప్రచారం, జనరల్‌ బాడీలు, బహిరంగ సభలు నిర్వహించింది. మార్చి 13న ప్రభంజనం అనుమతి నిరాకరించినందుకు నిరసనగా గోదావరిఖని, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఉట్నూరు, కడెం, ఖానాపూర్‌లలో ధర్నాలు, సభలు నిర్వహించారు. ఈ సభ సందర్భంగా కరీంనగర్‌ డివిజన్‌ సగ భాగం విసృతంగా క్యాంపెయిన్‌, సభలు నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో జిల్లా

వ్యాపితంగా (గ్రూపు మీటింగులు, బహిరంగ సభలు పదుల సంఖ్యలో నిర్వహించారు. వేలాది మందికి తెలంగాణపై పార్టీ వైఖరిని వివరించారు.

  • ఏప్రిల్‌ 18న ప్రభంజనం సందర్భంగా రెండు జిల్లాల్లో పార్టీ నిర్మాణం వున్న ప్రదేశాల్లోని మండలాల జనరల్‌ బాడీలు, సభలు జరిగాయి.

మార్చి 8న మంచిర్యాలలో 1000 మందితోనూ, ఏప్రిల్‌ 2న ఖానాపూర్‌లో 5600ల మందితోనూ, మార్చి ౩న మందమర్రిలో 700ల మందితోనూ, ఏప్రిల్‌ 7న ఉట్నూర్‌లో 500ల మందితోనూ, తెలంగాణా ప్రభంజనం ప్రచారానికై బహిరంగ సభలు జరిగాయి.

ప్రభంజనం సభకు అనుమతించక పోవుటకు నిరసనగా కలెక్టరేట్‌ల ముందు ప్రదర్శన, ధర్నా సభలు జరిగాయి. ఏప్రిల్‌ 18న ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ల ముందు 2500ల మందితో ప్రదర్శన, ధర్నా బహిరంగ సభ జరిగాయి. ఏప్రిల్‌ 16న మంచిర్యాలలో 1500 మందితో ఊరేగింపు, ధర్నా 2000ల మందితో బహిరంగ సభ నిర్వహించింది. ఏప్రిల్‌ 17న కఠరింనగర్‌ కలెక్టరేట్‌ల ముందు 1500ల మందితో ప్రదర్శన, ధర్నా సభ జరిగాయి. |

  • ఇష్టా ఆధ్వర్యంలో మిలిటెంట్‌ కార్యక్రమాలు చేపట్టాయి. డిసెంబరు 5న సింగరేణి కంట్రాక్టు కార్మికులు 500 మందితో శ్రీరాంపూర్‌లో 150 మందితో ప్రదర్శన జరిగింది. 8.12.“09న నిర్మల్‌లో 600 మందితో ప్రదర్శన, రాస్తారోకో జరిగాయి. 6.1.2010న నిర్మల్‌లో 6 వేల మందితో బీడీ యూనియన్‌ ఆధ్వర్యంలో బీడీ మహాగర్జనను నిర్వహించింది. ఆదిలాబాద్‌లో 'ఇఫ్టూ' ఆధ్వర్యాన 6.1.“10న 500 మంది కార్మికులతో అర్థనగ్న ప్రదర్శన,
  1. 1.10న జరిగిన బహిరంగ సభలో 700 మంది కార్మికులు పాల్గొన్నారు. 27.1.“10న 50 మంది మహిళా బీడీ కార్మికులు జామ నుండి సారంగపూర్‌ వరకు జరిగిన పాదయాత్ర (4 కి.మీ.)లో పాల్గొన్నారు. నవంబర్‌ 30, డిసెంబర్‌ 7, 24, మార్చి 8న తెలంగాణా సాధనకై సింగరేణిలో జరిగిన సమ్మెలలో ఇఫ్పూ క్రియాశీలకంగా పాల్గొన్నది. సింగరేణి కార్మికుల సమ్మెలకు మద్ధతుగా, “ఇప్టూ' ఆధ్వర్యాన సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేశారు. పీఓడబ్య్యూ ఆధ్వర్యంలో మంచిర్యాలలో జేఏసీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనుటయేకాక స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర సాధనకై జరుగుతున్న ఉద్యమంలో భాగంగా, 8.12.“09న ఐ.బి. చౌరస్తాలో 100 మందితో బతుకమ్మ ఆట, 3.1.“10న ఓవర్‌ బ్రిడ్జిపై 50 మందితో రాస్తారోకో, మిట్టపల్లి దగ్గర హైవే రోడ్డుపై 200 మందితో ధర్నా పడ్తన్‌పల్లిలో 100 మందితో ర్యాలీ, రాస్తారోకో, 20.2.“10న రాంనగర్‌లో మహిళలతో కొవ్వొత్తుల ప్రదర్శన మున్నగు కార్యక్రమాలు జరిగాయి.

అరుణోదయ మూడు టీంలుగా ఏర్పడి, విసృతంగా ప్రదర్శనలు యిచ్చింది. ప్రజా పాఠశాల పిల్లల దళం మంచి కృషి చేసింది.

  • జిల్లాలో అన్ని ముఖ్యమైన సెంటర్‌లలో జేఏసీలు ఏర్పడ్డాయి. వీటిలో పార్టీ ముఖ్యమైన పాత్ర వహించింది. కొన్ని కేంద్రాల్లో ప్రధాన బాధ్యతను చేపట్టింది. డిసెంబర్‌ 23 తరవాత శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో ధూంధాం కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించింది. వీటన్నింటిలో పార్టీ, ప్రజా సంఘాలు భాగస్వామ్యమయ్యాయి. ఖానాపూర్‌, ఊట్నూర్‌, గోదావరిఖని ప్రాంతాలలో జరిగిన ధూంధాం సభలలో విసృతంగా ప్రచారం నిర్వహించాము. జేఏసీ ఆధ్వర్యాన జరిగిన బస్సు యాత్రలో జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2010లో ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల సందర్భంగా అనేక గ్రామాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

  • జిల్లా స్థాయి పార్టీ జనరల్‌ బాడీ సమావేశాలు 6 సార్లు జరిగాయి. జేఏసీలోనూ, స్వతంత్రంగానూ నిర్వహించాల్సిన కార్యక్రమాలు రూపొందించింది. అన్నింటినీ కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అమలు జరిపారు.

నిర్బంధం: డిసెంబరు 28 ప్రకటనకి వ్యతిరేకంగా రాస్తారోకోలు, ధర్నాలు, సభలు నిర్వహించారు. బంద్‌ సందర్భంగా 7 గురు పార్టీ కార్యకర్తలను రెండు రోజులు పోలీసులు నిర్బంధించారు. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో 5 గురిపై 4 కేసులు మోపారు. నిర్మల్‌, లక్సెట్టిపేట, ఉట్నూరు, మంచిర్యాల కేంద్రాల్లో కార్యకర్తలను నిర్బంధించారు. వీరిపై 3 నుండి 5 వరకు తప్పుడు కేసులను మోపారు.

  • ఈ సంవత్సర కాలంలో 10 సార్లు లక్షకు పైగా కరపత్రాలు ప్రచురించి, ప్రచారం సాగించింది. విద్యార్థి జేఏసీలో జిల్లాలో పీడీఎస్‌యూనే ప్రధాన పాత్ర పోషించింది. పీడీఎస్‌యూ గోదావరిఖని ప్రాంతంలో, ఆదిలాబాద్‌లో తెలంగాణ రాష్టం కోసం విద్యార్థులను ప్రతి సందర్భంలో కదిలించడంలో ముందు స్థానంలో వున్నది.

నల్లగొండ జిల్లా: - డిసెంబర్‌ 26, 2009న తెలంగాణ రాష్ట్ర సాధన కోరుతూ సూర్యాపేటలో రెండు వేల మందితో బహిరంగ సభ - వెయ్యి మందితో ప్రదర్శన జరిగింది.

  • ఫిబ్రవరి 16న సూర్యాపేట టౌన్‌లో 250 మంది మహిళలతో పార్లమంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ, ప్రదర్శన నిర్వహించి ఆర్జీఓ ఆఫీసు ముందు ధర్నా చేసారు.

  • తెలంగాణ రాష్ట్ర సాధన కోరుతూ సీపీఐ (ఎం-ఎల్స్‌ న్యూదెమోక్రసీకి చెందిన ఆలు-మగల దీక్షలను నిర్వహించారు. ఈ పద్దతుల్లో దీక్షలు హుజూర్‌నగర్‌, సూర్యాపేట, నల్లగొండ కేంద్రాల్లో జరిగాయి.

  • మార్చి 13న ప్రభంజనం సభకు అనుమతి నిరాకరించినందుకు నిరసనగా, సూర్యాపేటలో ముఖ్యమంత్రి శవయాత్రను, దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.

  • ఏప్రిల్‌ 13 తెలంగాణ ప్రభంజనం సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనందుకు నిరసనగా నల్లగొండ పట్టణంలో 800 మందితో ప్రదర్భన, ధర్నా నిర్వహించారు.

  • తెలంగాణలో శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను నిరసిస్తూ సూర్యాపేటలో బహిరంగ సభ, ప్రదర్శన నిర్వహించారు.

  • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ సందర్భాలలో జరిగిన రాష్ట్ర బంద్‌లలో క్రియాశీలకంగా పాల్గొనడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేసారు.

  • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలలో ఎఐకెఎంఎస్‌, ఇషప్పూ, పీడీఎస్‌ యూ, పీవైఎల్స్‌ అరుణోదయ, పీఓడబ్యూ సంస్థలు వేర్వేరుగా పాల్గొన్నాయి. ఇవి తమ బ్యానరు క్రింద ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రోజు పాల్గొన్నాయి. ఈ విధంగా కోదాడ, హుజుర్‌నగర్‌, సూర్యాపేట, నల్గొండ, ఆలేరు, నకిరేకల్‌లో రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. -

_ నకిరేకల్‌ కేంద్రంలో ఉద్యమకారులపై పోలీసు నిర్బంధం తీవ్రం చేసి అనేక మందిపై అక్రమ కేసులు బనాయించారు. కళాకారులపై 807 కేసు పెట్టి జైలుకు పంపారు. మహిళలపై కూడా 807 కేసులు పెట్టి నిర్బంధించారు. పీఓడబ్య్యూ జిల్లా అధ్యక్షురాలు కామ్రేడ్‌ వసంతను కూడా ఈ కేసులో యిరికించారు. బందు కార్యక్రమాల్లో పార్టీ జిల్లాలో 30 కేంద్రాలకు పైగానే చొరవతో పాల్గొన్నది. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసులపై పోలీసులు దాడి చేసి, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు.

_ నక్తిరేకల్‌లో కళాకారులపై, ఉద్యమ కారులపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులకూ, లాఠీఛార్జి చేసినందుకూ, ఇండ్లపై దాడులు జరిపినందుకూ నిరసనగా 5 వేల మందితో ప్రదర్శన, ధర్నా జరిగింది. ప్రత్యేకించి మరొక రోజు పీఓడబ్య్యూ 200 మంది మహిళలతో నల్గొండ ఎస్‌.పి. కార్యాలయం ముందు ధర్నా చేసింది.

  • సూర్యాపేట డివిజన్‌ పార్టీ కార్యదర్శిపై ౩ అక్రమ కేసులు బనాయించనైనది.

_ పీడీఎస్‌ యూ ఆధ్వర్యంలో 16 మందితో 10 రోజులపాటు జిల్లాలో 20 మండల కేంద్రాలలో “విద్యార్థి పొలికేక” పేరుతో వేలాది మంది విద్యార్థులను కదిలించింది. ప్రదర్శనలు నిర్వహించింది.

(జ్ర

  • పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్‌ వద్ద వందలాది మంది విద్యార్థులతో ధర్చాా పికెటింగ్‌ నిర్వహించటం జరిగింది.

  • కోదాడలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కాలేజీల్లో స్కూల్స్‌లో ప్రచారం చేసి, బహిష్కరించి, ప్రదర్శన చేసారు. హుజుర్‌నగర్‌, కోదాడ ప్రాంతాల్లో జేఏసీ కార్యక్రమాల్లో పార్టీ పాత్రనే కీలకమయింది. వెలిదండలో 8 వేల మందితో జరిగిన బహిరంగ సభలో పార్టీ కీలక పాత్ర వహించింది.

  • ఆలేరులో ఇప్టూ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యాలయం ముందు ధర్నా చేసారు. రాజుపేట మండలంలో తెలంగాణపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఇప్టూ మౌన ప్రదర్శన నిర్వహించింది. “మేడే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుదాం” అనే పేరిట యాదగిరిగుట్ట మండలం కాసారంలో (ప్రదర్శన, బహిరంగ సభ జరిగాయి. ఆలేరు ప్రాంతంలో అరుణోదయ కళాకారులు 7 (గ్రామాల్లో తెలంగాణపై సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. టంగుటూరులో బహిరంగ సభ జరిగింది.

  • తెలంగాణపై అవగాహసే పెంపొందించుకొనుటకై కార్యక్రమాలను రూపొందించు కొనుటకై & జనరల్‌ బాడీ సమావేశాలను జిల్లా కమిటీ నిర్వహించింది.

వరంగల్‌ జిల్లా:-_- 2010 జూన్‌లో జగన్‌ ఓదార్చు యాత్ర నేపధ్యంలో జరిగిన *మ్రానుకోట సంఘటన - నిజా నిజాలూ అనే అంశంపై పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూన్‌ 18న వరంగల్‌లో 1100 మందితో జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాజకీయ జేఏసీలో భాగస్వామ్యం గల పార్టీల ప్రతినిధులు, జిల్లా జేఏసీ కన్వీనర్‌, మేధావులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ 5 వేల కరపత్రాలను ప్రచురించింది.

  • 2009 ఆగస్టులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనీ, అందుకు సంబంధించిన బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ్రవేశపెట్టాలనీ డిమాండ్‌ చేస్తూ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుమారు మూడున్నర వేల మందితో తెలంగాణ ధూంధాం జరిగింది. ఈ సభలో పార్టీ కేంద కమిటీ, రాష్ట్ర కమిటీల నాయకులు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే కళారూపాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా 10 వేల కరపత్రాలు ౩ వేల పోస్టర్స్‌ను ముద్రించి పంపిణీ చేశారు.

  • తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ, 2010 జనవరిలో జిల్లా పార్టీ వరంగల్‌లోని పబ్లిక్‌ గార్డెన్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. సుమారు 2 వేల మంది హాజరైన ఈ సభలో పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ఇతర మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్‌ వేల కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు.

(జ్ర

  • తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనీ, ఉద్యమకారులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలనీ, విద్యార్థి, యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దనీ కోరుతూ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2010 మార్చి రెండో వారంలో 2 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి, ముగింపులో సభ జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 వేల కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు. వరంగల్‌ సబ్‌ డివిజన్‌

  • తెలంగాణ ధూంధాం బహిరంగ సభ పార్టీ ఆధ్వర్యంలో 2010 జనవరిలో వరంగల్‌లోని కాశీబుగ్గలో 2 వేల మందితో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు, పార్టీ జిల్లా నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 8 వేల కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు. సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు.

  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో తక్షణమే బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ, సబ్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో 150 మందితో వరంగల్‌లో సదస్సు జరిగింది. ఈ సభలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొని ప్రసంగించారు.

  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ భూపాలపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 250 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో తొలి నుండి పార్టీ, ఇష్టాలు పాల్గొంటూ వస్తున్నాయి.

  • సబ్‌ డివిజన్‌ పరిధిలో ఖిల్లా వరంగల్‌, భూపాలపల్లిలలో జరిగిన తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో న్యూడెమోక్రసీ పార్టీ, ప్రజా సంఘాలు ముఖ్యమైన పాత్రను పోషించాయి.

  • పీవైఎల్‌ ఆధ్వర్యంలో 2010 ఫిబ్రవరిలో వారం రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై “జనచైతన్య మహా పాదయాత్ర జరిగింది. ఈ యాత్ర 7 మండలాల పరిధిలోని 200 గ్రామాలలో విసృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 800 పైచిలుకు గ్రూప్‌ మీటింగులు జరిగాయి. వీటిల్లో 100 నుండి 500 మంది వరకు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 వేల కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు.

  • వరంగల్‌లో 610 జీవోపై పీవైఎల్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు 100 మందితో జరిగింది. +

  • 2009 నవంబర్‌ 6న "హైదరాబాద్‌ ట్రీజోనా - ఆరవ జోన్‌లో భాగమా అనే అంశంపై మహబూబాబాద్‌లో “చర్చాగోస్టి” పీవైఎల్‌ డివిజన్‌ కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగింది. వివిధ రాజకీయ పార్టీల - ప్రజా సంఘాల నేతలు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

(జ్ర

  • 2009 నవంబర్‌ 10న వరంగల్‌లో ఫ్రీజోన్‌ అంశంపై పీవైఎల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “చర్చాగోష్టి జరిగింది. మహబూబాబాద్‌ డివిజన్‌

  • 2010 ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు పార్టీ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో 7 మండలాల పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర 150 గ్రామాలలో 350 గ్రూప్‌ మీటింగ్‌లను నిర్వహించి, విస్ప్రతంగా ప్రచారం సాగించారు. ఈ మీటింగులలో సగటున 100 నుంచి 500 వరకు ప్రజలు పాల్గొన్నారు. కొరివి మండలం బంజరాయి తండాలో పాదయాత్ర ముగింపు బహిరంగ సభ 500 మందితో జరిగింది. ఈ బహిరంగ సభలో కేంద్ర నాయకులు ఎస్‌.వి., జిల్లా కార్యదర్శి చంద్రన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10,000 కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు.

  • మహబూబాబాద్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో 2010 ఏప్రిల్‌ 150 మందితో డివిజన్‌ స్థాయి సదస్సు జరిగింది.

  • పార్టీ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిరహార దీక్షలు చేపట్టింది. మానుకోట, కొరివి, డోర్నకల్‌, కేసముద్రం, నెల్లికుదురు, తొర్రూర్‌ తదితర మండల కేంద్రాలలో దీక్షలు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరాల్లో 50 నుంచి 100 మంది వరకు పాల్గొన్నారు.

  • 2009 డిసెంబరు 28న డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహబూబాబాద్‌లో 38000 మందితో బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 5 వేల కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు.

  • పీఓడబ్యూ మహబూబాబాద్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించింది. 15 మందితో ప్రచార టీం ఏర్పడింది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు మూడు మండలాల పరిధిలో 50 గ్రామాల్లో ఈ టీం ప్రచారం చేసింది. 100 వరకు గ్రూపు మీటింగ్‌లు నిర్వహించింది. (గ్రూపు మీటింగ్‌లకు సగటున 100 నుంచి 500 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు వేల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశారు.

  • జగన్‌ ఓదార్పు యాత్రను నిరసిస్తూ జూన్‌ 28న జరిగిన కార్యక్రమానికి పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 1000 మందిని కదిలించారు.

నర్సంపేట డివిజన్‌

  • 2010 ఏప్రిల్‌ 21న నర్సంపేట డివిజన్‌ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట, ములుగు డివిజన్‌ల పరిధిలోని 8 మండలాల్లో రెండు వారాలపాటు పాదయాత్రను నిర్వహించింది. 170 గ్రామాలలో కొనసాగిన పాదయాత్రలో 280 [గ్రూవు మీటింగ్‌లను పార్టీ నిర్వహించింది. ఈ మీటింగ్‌లకు సగటున 50 నుంచి 300 మంది వరకు హాజరయ్యారు. పాదయాత్ర ముగింపు సందర్భంలో నర్సంపేటలో బహిరంగ సభ 2 వేల మందితో జరిగింది. ఈ సభలో జిల్లా, రాష్ట్ర నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా క వేల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశారు.

  • నర్సంపేట డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ, ఫిబ్రవరిలో డివిజన్‌ స్థాయి సదస్సు 2 వేల మందితో జరిగింది. సదస్సుకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ సభలో కేంద్ర, జిల్లా నాయకులు, మేధావులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 5 వేల కరపత్రాలను ముద్రించి విసృతంగా ప్రచారం చేశారు.

  • పార్టీ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌లో తక్షణమే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ, రెండు దఫాలుగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సగటున 800 మంది వరకు పాల్గొన్నారు.

  • ఇఫ్పూ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ 100 మంది నర్సంపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

  • రాష్ట్ర రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రకు సంఘీభావంగా బొద్దుగొండ, గూడూరు, ఖానాపూర్‌, నర్సంపేట మండల కేంద్రాల్లో పార్టీ సభలను నిర్వహించింది. ఈ సభలలో 500 నుంచి 800 మంది వరకు ప్రజలు పాల్గొన్నారు. ఈ సభలలో కేంద్ర నాయకులు ఎస్‌. వెంకటేశ్వర్లు, జేఏసీ కోదాండరాం పాల్గొని ప్రసంగించారు. పాదయాత్రలో పార్టీ, ప్రజా సంఘాలకు చెందిన కార్యకర్తలు 100 మంది పాల్గొన్నారు.

  • పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ దుగ్గాండి పార్టీ సబ్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో 200 మందితో సదస్సు నిర్వహించారు.

  • నర్సంపేట డివిజన్‌ పరిధిలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో 2010 జనవరి 23న నర్సంపేటలో భారీ బహిరంగ సభ 75 వేల మందితో జరిగింది. ఈ బహిరంగ సభకు పార్టీ నుండి 15 వేల మందిని సమీకరించారు. పీవోడబ్య్యూ అధ్యక్షురాలు కా॥ సంధ్య, నాయకులు కా॥ కోడి సోమన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచార క్యాంపెయిన్‌లో పార్టీ, ప్రజా సంఘాలు చురుకైన పాత్ర నిర్వహించాయి.

(29

నిజామాబాద్‌ జిల్లా:- ప్రత్యేక తెలంగాణాను కోరుతూ సెప్టెంబర్‌ 23న అంబేడ్మర్‌ భవన్‌లో 200 మందితో సదస్సుని జిల్లా కమిటీ నిర్వహించింది. నవంబర్‌ 18న కలెక్టర్‌ కార్యాలయం ముందు 300 మందితో ధర్నా జరిగింది. నవంబర్‌ 29న జిల్లా బంద్‌ సందర్భంగా 100 మందితో ర్యాలీ నిర్వహించింది. బస్టాండ్‌ ముందు రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంలో అరెస్టులు జరిగాయి. డిసెంబర్‌ 28న పార్టీ ఆధ్వర్యాన, జనవరి 4న కార్మిక సంఘాల తరపున, 5న పీఓడబ్య్యూ తరపున కలెక్టరేట్‌ ముందు రిలే నిరాహార దీక్షలు జరిగాయి. 2న గాంధీ చౌక్‌లో నిరాహార దీక్షలు చేపట్టగా అరెస్టులు జరిగాయి. 2009 డిసెంబర్‌ 9న కేంద్రం చేసిన ప్రకటన సందర్భంలో 150 మందితో నిజామాబాద్‌లో ర్యాలీ జరిగింది. 13.4.2010న జిల్లా కమిటీ ఆధ్వర్యాన 1500 మందితో కోటగల్లి, ఎన్‌.ఆర్‌. భవన్‌ నుండి వూరేగింపు శివాజీనగర్‌ వరకు తీసారు. అనంతరం మున్నూరు కాపు కళ్యాణ మండపంలో బహిరంగ సభ జరిగింది. హైదరాబాద్‌లో ప్రభంజనానికి పర్మిషన్‌ యివ్వక పోవడంతో నిరసనగా నిజామాబాద్‌, డిచ్‌పల్లి, ఆర్మూర్‌, సిరికొండ, నందిపేట, బోధన్‌లలో నిరసన (ప్రదర్శనలు జరిగాయి. | ఆర్మూర్‌ డివిజన్‌లో 8.12.09న ఆర్మూర్‌లో 100 మంది మహిళలచే కొవ్వొత్తుల ప్రదర్శన, 9.12.09 150 చిన్న పిల్లలచే ప్రదర్శన, 12న 100 డప్పులతో అరుణోదయ వారిచే ప్రదర్శనలు జరిగాయి. 15.12.2009న జక్రాన్‌పల్లిలో 2000 మందిచే బహిరంగ సభ జరిగింది. 16న బాల్కొండలో 150, వేల్చూర్‌లో 120 మందితో ధర్నాలు, 18న బస్‌ రోకో చోడో కార్యక్రమాలు జరిగాయి. పార్టీ చొరవతో ఈ క్రింది మండలాలలో జేఏసీ ఏర్చడింది. దీని ఆధ్వర్యంలో క్రింది బహిరంగ సభలు జరిగాయి. వీటిల్లో పార్టీ ముఖ్య పాత్ర వహించింది. ఆర్భూర్‌లో 10 వేలతోనూ, సిరికొండలో 8 వేలతోనూ, భీంగల్‌లో 8 వేలతోనూ, జక్రాన్‌పల్లిలో 5 వేలతోనూ, మోర్తాడ్‌లో 10 వేలతోనూ, మరోసారి 5 వేలతోనూ, వేల్పూర్‌లో, కమ్మర్‌పల్లిలో, ధర్‌పల్లిలో 7 వేల మందితో జరిగిన సభలన్నీ జయప్రదంగా జరిగాయి. పార్టీ ఆధ్వర్యాన ఆర్భ్మూర్‌లో 7.2.2010న 8000 మందిచే తెలంగాణ జాతర కార్యక్రమం జరిగింది.

ఆర్మూర్‌ అరుణోదయ తరపున 72 సభలలో వివిధ కళారూపాలు, నృత్యాలు, పాటలు జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించడం జరిగింది. కోరుట్ల, మెట్‌పల్లి, నిర్మల్‌ పట్టణాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. నిజామాబాద్‌ డివిజన్‌

9.1.2010 డివిజన్‌ పార్టీ ఆధ్వర్యాన కోటగల్లిలో 1500 మందితో తెలంగాణ ధూం ధాం కార్యక్రమం జరిగింది.

30.11.2010 డిచ్‌పల్లి 50 మంది బంద్‌లో పాల్గొన్నారు. డిచ్‌పల్లిలో డిసెంబర్‌ 6, 7 తేదీలలో జరిగిన బంద్‌లో 70 మంది పాల్గొన్నారు. 10న డిచ్‌పల్లి ర్యాలీలలో 250 మంది పాల్గొన్నారు. మోపాల్‌ గ్రామంలో 800 మందితో ర్యాలీ జరిగింది.

బోర్గాంలో 30 మందితో రిలే నిరాహార దీక్షలు, 6న వూరేగింపు, 7న మానిక్‌ బండార్‌ చౌరస్తాలో 50 మందితో రాస్తారోకో, 8న పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులతో ర్యాలీ జరిగాయి.

మోపాల్‌ గ్రామంలో ౩ నుండి 9 వరకు నిరాహార దీక్షలు జరిగాయి. కోటగల్లిలో మన పార్టీ చారవచే జేఏసీ ఏర్పడి 100 రోజులు నిరాహార దీక్షలు, 2 సార్లు తెలంగాణ ధూంధాంలు జరిగాయి. బోధన్‌ డివిజన్‌

7.12.09న బోధన్‌లో 200 మంది, 9.12.09 బీడీ కార్మికులతోనూ, రాకాసిపేట 12న 3800 మందితోనూ, 28.12, 11.1 రుద్రూర్‌లో 200 మందితోనూ ప్రదర్శనలు జరిగాయి.

21.1.10న పార్టీ నాయకుడు కా॥ మల్లేష్‌ అరెస్టు కాగా 800 మంది బీడీ కార్మికులు పోలీస్‌ స్టేషన్‌ ముందు ప్రదర్శన చేసి, విడిపించుకున్నారు. నందిపేట సబ్‌ డివిజన్‌

పార్టీ చారవతో నందిపేటలో జేఏసీ ఏర్పడి 4 నెలలపాటు నిరాహార దీక్షా శిబిరం కొనసాగింది. ఇందులో వేలాది ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. కుల సంఘాలు, వృత్తి సంఘాలు, మైనార్టీలు, సెటిలర్స్‌, డ్వాక్రా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ, బోనాలు, మానవ హారాలు, పాదయాత్రలు, కొవ్వాత్తుల ప్రదర్శనలు జరిగాయి. బంద్‌లు, రాస్తారోకోలు, మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు జరిగాయి. 18 రోజుల పాటు రోడ్లపై వంటా వార్పు కార్యక్రమాలు జరిగాయి. నందిపేట నుండి నిజామాబాద్‌ వరకు మహాపాద యాత్ర జరిగింది. ఇందులో మన పార్టీ చురుకైన భాగస్వామ్యమయింది.

(ై

మహబూబ్‌నగర్‌ జిల్లా:- పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 10న జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా 2000 పోస్టర్లు, 4& వేల కరపత్రాలు ప్రింట్‌ చేసి ప్రచారం చేసింది. 15 మండలాల్లోని 60, 70 గ్రామాల్లో ప్రచారం జరిగింది.

సెప్టెంబర్‌ 10 నాడు జిల్లా కేంద్రంలోని టౌన్‌హాలులో 500 మందితో జిల్లా సదస్సు జరిగింది. రాష్ట్ర సెంటర్‌ నుండి కామ్రేడ్స్‌ ప్రదీప్‌, గోవర్థన్‌ల్లు హాజరయ్యారు. జిల్లాలో స్వతంత్రంగా ఆందోళనలు చేయాలని నిర్ణయం జరిగింది.

29 నవంబర్‌, 2009న టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ ఆమరణ దీక్ష కూర్చోవడానికి బయలుదేరగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడానికి నిరసనగా పోస్టర్స్‌ వేశారు. నవంబర్‌ 80న బంద్‌కు టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. ఈ పిలుపును న్యూడెమోక్రసీ పార్టీ బ్యానర్‌ మీదనే బంద్‌కు మద్దతు ప్రకటించింది. జిల్లాలోని నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, ఆత్మకూరు ఏరియాల్లో బంద్‌లో పార్టీ పాల్గొంది. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని 50 రైస్‌మిల్స్‌ బంద్‌ చేయించి 300 మంది కార్మికులతో ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక టౌన్‌ సి.ఐ. నాయకత్వంలో పోలీసులు పార్టీ జిల్లా కార్యదర్శి, టౌన్‌ కార్యదర్శిలతో సహా నాయకులను, కార్యకర్తలను 20 మంది వరకు అరెస్టు చేశారు.

దీని తర్వాత ప్రజా సంఘాల జేఏసీలో భాగంగా పార్టీ డిసెంబర్‌ 2,3,4 తేదీల్లో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నది. ఇప్పటి నుంచి మన కార్యకలాపాలు జేఏసీలో భాగంగా జరిగాయి.

2010 ఫిబ్రవరి 12న శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ, పార్టీ నాయకత్వాన మహబూబ్‌నగర్‌ పట్టణంలో దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం నిర్వహించింది. తర్వాత శ్రీకృష్ణ కమిటీ మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆ కమిటీకి పార్టీ తరపున తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ, వెంటనే తెలంగాణా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కమిటీ తరపున మెమోరాండం ఇవ్వడం జరిగింది.

హైదరాబాద్‌లో తెలంగాణా ప్రభంజనం సభకు పోలీసులు అనుమతిని నిరాకరించి నందుకు జిల్లా కేంద్రంలోనూ, నారాయణపేట, మక్తల్‌, ఆత్మకూరు పట్టణాలలో దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతోపాటు, ధర్నాలు నిర్వహించడం జరిగింది.

తెలంగాణ ప్రభంజనం; హైదరాబాద్‌లో మార్చి 18న పార్టీ ఆధ్వర్యంలో “తెలంగాణ ప్రభంజనం” పేరిట నిజాం కాలేజీలో ఒక లక్ష మందితో భారీ బహిరంగ సభని నిర్వహించాలనుకొన్నది. ఈ సభ పేరిట న్యూడెమోక్రసీ పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని భావించింది. ఈ కాలంలో ఒక మేరకు తెలంగాణకి సంబంధించిన ఉద్యమం స్థబ్దతలో వున్నది. పార్టీ నిర్వహించబోయే సభలో పాల్గొనాలని పార్టీ యేతర

తెలంగాణ అభిమానులు కూడా ఎదురుచూసారు. 2 లక్షల కరపత్రాలు, 50 వేల వాల్‌ పోస్టర్లు, 8 వేల 5 వందల బ్యానర్లు మరియు ఉర్దు కర్రపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ప్రింటు చేసింది. గోడ రాతలు రాసారు. ప్రచార కార్యకర్తలు విసృతంగా ప్రచారం చేసారు. హైదరాబాద్‌ సభని విజయవంతం చేసే సందర్భంగా జిల్లాల్లో సభలు విసృతంగా జరిగాయి. హైదరాబాద్‌లో పార్టీ, ప్రజా సంఘాలు రోజుకి ౩ నుండి 5 బ్యాచీలుగా వెళ్ళి ప్రచారం చేసాయి. బస్తీల్లో ప్రజలను సమీకరించి సభలు పెట్టాయి. జంట నగరాల్లో రాత్రనక, పగలనక చేసిన ప్రచారం మూలంగా విసృతంగా పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. ప్రభంజనం గురించి జిల్లాల్లోగానీ, హైదరాబాద్‌లోగానీ దినపత్రికలు, టీవీలల్లో ప్రచారం జరిగింది. జిల్లాల్లో ప్రత్యేకంగా కరపత్రాలు, పోస్టర్స్‌ ప్రచురించి కార్యకర్తలు విసృత ప్రచారం చేసారు. ఎండలు మండిపోతున్నా నెలరోజులు (గ్రామాల్లో (ప్రచారం చేసారు. ప్రజల్లో ఊహించిన దాని కంటే స్పందన బాగా వచ్చింది.

సభకి ఎంతో ముందే పోలీసు పర్మిషన్‌కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సభ జరిగే రోజు సమీపిస్తున్నా అనుమతిపై పోలీసు కమీషనరేట్‌ స్పష్టం చేయలేదు. రెండు రోజుల ముందు మాత్రమే అనుమతి యివ్వలేమని పోలీసు కమీషనర్‌ వెల్లడించాడు. శానససభ జరిగే కాలంలో సభలకి అనుమతి సాధ్యం కాదన్నారు. సభ జరిగే రోజు శాసనసభకి 3 రోజులు శెలవు. శాసన సభ జరిగే పేరిట సభకు అనుమతిని పోలీసు యంత్రాంగం నిరాకరించింది. తెలంగాణ ఉద్యమాలు సాగే సమయాల్లో జరుపుకొనే సభలకి ఎవరినైనా కూడా పర్శిషను నిరాకరించడం ప్రభుత్వ విధానంగా కొనసాగింది. అదే తీరుని “ప్రభంజనం” యెడల పోలీసులు వర్తింప చేసారు. శాంతి భద్రతల సాకుతో ప్రజాస్వామ్యయుతంగా జరిగే సభకు అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చిగా తృణీకరించింది. దీనిపై హైకోర్టు కెళ్ళగా, అది కూడా అనుమతిని నిరాకరించింది. దీనితో అనుమతి నిరాకరణకి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాపితంగా ప్రజలు తీవ్ర నిరసనని తెలియజేసారు. రాస్తారోకోలు, ధర్నాలు, (ప్రదర్శనలు నిర్వహించారు.

శాసనసభా కాలం ముగిసాక సరిగ్గా నెల రోజులకు అంటే ఏప్రిల్‌ 13న తిరిగి ప్రభంజనాన్ని జరపడానికి పార్టీ నిర్ణయించింది. మళ్ళీ కర్రపత్రాలు, పోస్టర్లు ప్రచురించి హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాపితంగా ప్రచారం చేసింది. మతకలహాల పేరుతో రెండవసారి కూడా సభకు అనుమతిని ప్రభుత్వం తిరస్కరించింది. అప్పటికే మతకలహాలు వెనక పట్టు పట్టాయి. ఉద్దేశ్య్వపూర్వకంగానే పోలీసు యంత్రాంగం సభకి అనుమతిని నిరాకరించింది. దీనితో అదే రోజు ఏప్రిల్‌ 18న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభంజనం సభలు జరపాలనే పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునందుకొని జిల్లా కమిటీలు

సభలు, ప్రదర్శనలు, ధర్నాలు దిగ్విజయంగా జరుపుకొన్నాయి. ప్రకటించుకొన్నట్లుగా హైదరాబాద్‌లో సభ జరుపుకోకుండా ప్రభుత్వం అడ్డుపడొచ్చుగాక, కానీ దాని ప్రభంజనం హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాల్లోనే గాకుండా జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో తెలంగాణ ప్రభంజనపు ఘంటారావాన్ని మోగించింది. ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక వైఖరిని, దాని అప్రజాస్వామిక, నిరంకుశ పద్దతులను తీవ్రంగా దుయ్యబట్టింది. ఈ సభలు ప్రజలను ఒక మేరకు రాజకీయంగా సంఘటిత పర్పాయి. ప్రశాంతంగా జరుపుకోవడానికి అవకాశం వున్న తెలంగాణ (ప్రభంజనానికి అనుమతి నిరాకరించిన ప్రభుత్వం, ఉ(ద్రిక్తత వాతావరణంలో వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి సభలకి అనుమతివ్వడం ప్రభుత్వ పక్షపాత వైఖరిని వెల్లడి చేస్తున్నది. వైయస్‌, జగన్‌ మహబూబాబాద్‌ పర్యటన వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి మహబూబాబాద్‌ పర్యటించే సందర్భంలో ప్రజలు నిరసించారు. అడ్డుకొన్నారు. ఈ సమయంలో యాత్ర సరైంది కాదని కూడా సీపీఐ (ఎం-ఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ ప్రకటించింది. కాంగైసు పార్టీలో వుండే వైరుధ్యాలను తమకి అనుకూలంగా మార్చుకొనేందుకు రోశయ్య, జగన్‌లకు వారి వారి కోణాల్లో ఈ పర్యటనలో స్పష్టమయిన దురుద్దేశ్యాలున్నాయి. ఏదేమయినా జగన్‌ సమైక్యవాదానికి నాయకత్వం వహిస్తున్నాడు. పార్లమెంటులో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులతో కలిసి సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకొని తెలంగాణకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తెలంగాణలో ఉద్యమం సాగుతున్న సమయంలో తన తండ్రి మరణించి 8 నెలలు గడిచాక ఓదార్పు యాత్ర పేరిట సెంటిమెంట్‌ రెచ్చగొట్టి, పర్యటనని సజావుగా సాగించాలనుకొన్నాడు వై.ఎస్‌. జగన్‌. తన పర్యటన విజయవంతంతో తెలంగాణ వాదం నీరుకారి పోయిందని చాటించదలుచు కొన్నాడు. ఇతనికి తొత్తులుగా వున్న కాంగ్రెసు పార్టీలోని ఒక సెక్షన్‌కి చెందిన కొండా మురళి, సురేఖ, కవితలు జగన్‌కి స్వాగతం పలకడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. నిరసన తెలియచేసారు. అద్దుకొన్నారు. ప్రతిఘటించారు. ప్రజలపై ప్రజా ప్రతినిధులైన మురళి, కవిత, సురేఖల గన్‌మెన్లు కాల్పులు చేసి 14 మందిని క్షత్రగాత్రులను చేసారు. అనేక మంది ఉద్యమకారులు గాయాలకి గురయ్యారు. బుల్లెట్లు దూసుకపోతున్నా వెనుదీయకుండా ఉద్యమకారులు మునుముందుకే ఉరికారు. ప్రభుత్వం పోలీసు బలగాలను పెద్ద యెత్తున దించింది. ఉద్యమ నాయకులపై అక్రమ కేసులను మోపింది. కేసులను ఎత్తివేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. నిరసన తెలుపుతున్న ప్రజలపై కొండా మురళి, సురేఖ గన్‌మెన్లు జరిపిన కాల్పులను ప్రజలు ప్రతిఘటించారు. దీనితో జరగబోయే తీవ్ర పరిణామాలను గమనించిన ప్రభుత్వం

జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటనని వరంగల్‌ జిల్లాలోకి అడుగు పెట్టకుండా మధ్యలోనే నిలిపి వేసింది. ఇది తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా సాధించిన విజయం. కొన్ని తప్పడు సూత్రీకరణలు

స్టీరింగ్‌ కమిటీలో మరోసారి ప్రజా ప్రతినిధుల రాజీనామాలు చర్చకొచ్చాయి. “అదుర్స్‌” సినిమాపై కేసీఆర్‌ కూతురు కవిత, మరికొంత మంది అనాలోచితంగా 'ప్రకటనలిచ్చారు. ఈ ప్రకటన కొన్ని దురుద్దేశాలతో కూడినదనే చర్చ జరిగింది. అదుర్స్‌ సినిమాపై కవిత, మరికొంత మంది తెలంగాణవాదం పేరిట తీసుకున్న వైఖరిని న్యూడెమోక్రసీ పార్టీ ఖండించింది. స్టీరింగ్‌ కమిటీలో కూడా చర్చించింది. ఇలా ప్రకటనలివ్వడం సరైంది కాదన్నది. తెలంగాణని బలపర్చని వారు తెలంగాణలో వ్యాపారం చేసుకోవడానికి వీళ్లేదనే వైఖరి కూడా సరయింది కాదు. తెలంగాణకి వ్యతిరేకంగా అడ్డుగా వస్తే అలాంటి వాటిని ఆలోచించాలి గానీ, తద్భిన్నంగా వ్యవహరించరాదన్నది. ఈ సందర్భంగా జేఏసీ ఈ క్రింది విధంగా ప్రకటన చేసింది.

“తెలంగాణలో జరిగిన కొన్ని సంఘటనలు చూసి తెలంగాణేతర ప్రాంతాల వారు తెలంగాణలోవ్యాపారాలు చేసుకోకుండా అడ్డుపడుతున్నారనే అపోహ కలిగివున్నారు. అలా వుండాల్సిన అవసరం లేదు. ఎవరయినా, ఏ ప్రాంతం వారయినా తమ వ్యాపారాలు సజావుగా కొనసాగించుకోవచ్చు. వారికి పూర్తి భద్రత కల్పిస్తాం. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే యితర ప్రాంతాల బడా వ్యాపారస్తులకి ఇది వర్తించదు”.

  • ఈ సందర్భంలోనే తెలంగాణేతరుల ఉత్పత్తులపై జేఏసీలో చర్చ జరిగింది. తెలంగాణకి అడ్డు పడుతున్న ఆంధ్రా, రాయలసీమ నేతల వ్యాపారాలను, వారి ఉత్పత్తులను అడ్డుకుంటామని జేఏసీ ప్రకటన చేసింది. దీన్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయి. జిల్లాల్లో కొంత మంది తెలంగాణ నాయకులు అర్థం చేసుకోకుండా వ్యాఖ్యానించారు. వ్యవహరించారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన చిన్న పెద్ద వ్యాపారులకి వ్యతిరేకంగా కౌన్ని విధ్వంసకర సంఘటనలు జరిగాయి. జేఏసీ నిర్ధిష్టంగా తెలంగాణకి అద్డువచ్చే బడా వ్యాపారస్తుల పేర్లు ప్రకటించి, వారి ఉత్పత్తులను ప్రకటిస్తే ఈ స్థితి వచ్చేది కాదు.

తెలంగాణ ఉద్యమంలో వెల్లడయిన మరికొన్ని తప్పుడు ధోరణులకు వ్యతిరేకంగా రాజీ లేకుండా పోరాడాలి. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టరాదు. తెలంగాణ సంస్కృతిని విమర్శిస్తున్నారనే పేరిట ఇతరుల సంస్కృతిపై దాడి చేయరాదు. పాలకులు, ఉన్నత వర్గాలు, సమైక్యవాద నాయకత్వం ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించే

" విద్వేషాలకి తెలంగాణ ప్రజలు రెచ్చిపోరాదు. (జ్ర

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పార్టీలుగా తెలంగాణకి వ్యతిరేకంగా వ్యవహరించిన చరిత్రనే యింతవరకు చూసాం. అయినా తెలంగాణలో ఈ రెండు పార్టీల తెలంగాణ ప్రాంత నాయకులను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి ఎంతో కృషి జరిగింది. ఈ పద్ధతికి తోడుగానే ఆంధ్రా, రాయలసీమ ప్రాంత ప్రజల మద్దతును సంపాదించే దిశగా మన కర్తవ్యాలుండాలి. వీటికి నష్టం జరిగే అన్ని చర్యల నివారణకి పూనుకోవాలి. “ఇడ్లీ వాడా! సాంబారోడా” అనే నినాదాలు ఆ ప్రాంత ప్రజలతో ఐక్యం చేయనీయవు. “అడ్డంగావస్తే అడ్డంగా నరుకుతాం'” ఇది ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే నినాదం. నరకడంతో తెలంగాణని సాధించుకోలేము. తెలంగాణ ప్రజలను సంఘటిత పర్చడం ద్వారా ఆంధ్రా, రాయలసీమ ప్రజల మద్దతు పొందడం ద్వారా తెలంగాణ సాధన సులభ సాధ్యమవుతుంది. “ఆంధ్రావాడా” అనే నినాదం ఆ ప్రజలను సమైక్యవాదులతో సంఘటిత పరుస్తుంది. ఆంధ్రా ఉత్పత్తులన్నింటినీ నిషేధించాలనే వైఖరి నష్టకరమయింది. అది అసాధ్యం. ఇది విచక్షణ కోల్పోయి చేసే వాదన. తెలంగాణకి పచ్చి వ్యతిరేకులుగా, దూకుడుగా వస్తున్న కొద్ది మంది ఆంధ్రా సంపన్న వర్గాలకి వ్యతిరేకంగానే ఈ పోరాటం వుండాలి. వీరి నుండీ, సమైక్యవాదానికి నాయకత్వం వహిస్తున్న పాలకుల నుండీ ఆంధ్రా, రాయలసీమ ప్రాంత ప్రజలు వేరుబడేట్లుగా పార్టీ విధానం వుండాలి. ఏ ప్రాంత ప్రజలనయినా గాయపర్చే చర్యలను పార్టీ ఖండిస్తోంది. ఒయూ. జేఏసీ

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల పోరాటాలు రాష్ట వ్యాపిత విద్యార్థులపైనా, ప్రజలపైనా ప్రభావం కలుగచేసాయి. ఉస్మానియా విద్యార్థి ఉద్యమంలో పీడీఎస్‌యు కూడా భాగస్వామి అయింది. ఓయూ క్యాంపస్‌లో నిలకడగానూ, వినూత్న రూపాల్లోనూ వేల మంది విద్యార్థుల భాగస్వామ్యంతో ఉద్యమం కొనసాగింది. ముఖ్యంగా కేసీఆర్‌ ఖమ్మంలో ఆమరణ దీక్ష ప్రారంభించిన వెంటనే నిమ్మరసం తీసుకొన్న సంఘటనకి ప్రతిస్పందించిన తీరు మరోసారి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది. విద్యార్థి గర్జన పేరిట జరిపిన సభ విద్యార్థులనే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలందరికీ ఎంతో ఉత్సాహాన్నందించింది. .

ఓయూ విద్యార్థి ఉద్యమం ఎంత ప్రభావం చేస్తుందో, అంత నిర్మాణ బలహీనతలను కూడా కలిగివున్నది. వీరిలో కొందరిని తప్పుడు రాజకీయ ధోరణులు వెంటాడుతున్నాయి. ఓయూనే మొత్తం తెలంగాణ విద్యార్థుల తరపున పిలుపులివ్వడం, దాని ఒంటెత్తు పోకడలని తెలియ చేస్తున్నది. తెలంగాణ విద్యార్థుల బందుకీ, ప్రాంతం బంద్‌కీ, ఓయూనే పిలుపినిచ్చేది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల సంఘాలను భాగస్వామ్యం చేసి, సంఘటిత

ర్‌

శక్తిగా కొనసాగడానికి ఓయూ విద్యార్థి నాయకత్వం సుముఖంగా కన్చించక పోయేది. ఒక్కొక్కసారి ఓయూ విద్యార్థి సంఘాలకి కూడా సంబంధం లేకుండా వ్యక్తులే నిర్ణయించి, పిలుపులిచ్చిన సదర్భాలున్నాయి. టీఆర్‌ఎస్‌ నాయకత్వం కూడా ఈ నాయకత్వాన్ని పోత్సహించిన ఉదంతాలు లేక పోలేదు. ఓయూ జేఏసీలోని నాయకత్వం తమ అజమాయిషీ తప్పుడు పద్ధతులను ప్రశ్నిస్తారనుకొంటే, ఉద్యమాన్ని చీల్చడానికి కూడా వెనుకాడదని రుజువు పరుచుకొన్నది. పీడీఎస్‌యుతోపాటు, యితర ఉద్యమ సంస్థలను ఓయూ జేఏసీ నుండి అకారణంగా తొలగించింది. ఇలా ప్రకటించడం దురుద్దేశ్యంతో కూడుకున్నదే.

ఓయూ పీడీఎస్‌యు నాయకత్వం ఈ ఉద్యమంలో చెప్పుకోదగిన కృషి చేసింది. విద్యార్థి సంఘ నాయకులపై రకరకాల ప్రచారం జరుగుతున్న సమయంలో పీడీఎస్‌యు నాయకత్వమే నిజాయితీగా కృషి సల్ప్చుతుందనే పేరు తెచ్చుకొన్నది. అలాగే రాష్ట్ర పీడీఎస్‌యూ నాయకత్వానికీ ఓయూ పీడీఎస్‌యూ నాయకత్వానికీ మధ్య సమన్వయం లోపించింది. ఓయూ పీడీఎస్‌యూ నాయకత్వం నిర్మాణాన్ని మైమరచి సమస్యల వెంట కౌట్టుకపోతుంటే, రాష్ట్ర పీడీఎస్‌యూ నాయకత్వం చౌరవని ప్రదర్శించలేక పోయిందనే విమర్శలను ఎదుర్కొంటున్నది. అన్ని లోపాలను సరిచేసుకొని తెలంగాణ ఉద్యమానికి పీడీఎస్‌యూ చాంపియన్‌గా కృషి సల్పాలి. విద్యార్థి నాయకత్వం తెలంగాణకి సంబంధించిన రాజకీయ ఉద్యమ కర్తవ్యాలను అభివృద్ది పర్చుకోవాలి. వివిధ పార్టీల తీరుతెన్నులు

కాంగైసు మొదటి నుండీ తెలంగాణకి మోసం చేస్తూ వస్తోంది. ప్రజా ఉద్యమాల ధాటికి తట్టుకోలేనప్పుడూ, తనకి రాష్ట్ర విభజన రాజకీయంగా ప్రయోజనంగా భావించినప్పుడూ, తెలంగాణ గురించి సానుకూలంగా చెప్పుతూ వుంటుంది. నేడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో వుండి, గతంలో కూడా అత్యధిక కాలం పాలించిన కాంగైసు పార్టీయే తెలంగాణ రాక పోవడానికి ప్రధాన కారణం. వాస్తవంగా ఇది రాష్ట్ర విభజన ఆవశ్యకతకి ప్రాధాన్యత నివ్వడం లేదు. ఉద్యమాల ద్వారానే ప్రజల్లో తెలంగాణ వ్యతిరేకులని వేరు పడడం ద్వారానే ప్రభుత్వాలచే రాష్ట్రాన్ని విభజించకోగల్లుతాం. ఒక వేళ విభజన జరిగితే, కాంగ్రెసు మెడలు వంచి ప్రజలు సాధించుకున్న విజయంగానే వుంటుంది.

తెలంగాణ రాక పోవడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని తెలంగాణ కాంగ్రెసు ప్రకటించడం హాస్యాస్పదం. తమ రాష్ట అధ్యక్షులు తెలంగాణకి అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీ ముందు చెప్పక పోవడం తెలంగాణ వ్యతిరేకం కాదా? తమ పార్టీ తమ ప్రభుత్వాలు

(్ర్రి

తెలంగాణ రాక పోవడానికి కారణంగా వెల్లడించ కుండా, తెలుగుదేశంపై నెట్టి తెలంగాణ కాంగ్రెసు తప్పించుకోవడం సబబుకాదు. టీడీపీ అగ్ర నాయకత్వం తెలంగాణ యెడల వ్యతిరేక వైఖరినే మనస్సు నిండా కలిగి వున్నది. తెలంగాణని బలపర్చుతూ చేసిన తీర్మానాలన్నీ అవకాశ వాదంతో చేసినవే. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వచ్చేసరికి ఎంత భయంకరంగా తన నిజ స్వరూపం బయట పెట్టుకొన్నదో చూస్తున్నాం. తెలంగాణ ప్రజల మనోభావాలను గమనించి, ఆ మేరకు తెలంగాణలోని తెలుగుదేశం సానుకూలంగా స్పందించాల్సి వచ్చింది. తెలంగాణకి వ్యతిరేకంగా వ్యక్తం చేస్తున్న తమ నాయకుడి వైఖరిని గానీ, తమ పార్టీ ఆంధ్రా, రాయలసీమ నేతల వైఖరిని గానీ తెలంగాణలోని తెలుగుదేశం ఎందుకు ఖండించరు? కాంగ్రెసు తెలంగాణ రాక పోవడానికి కారణమని చెప్పుతూ, తమ పార్టీ అడ్డు పడిన తీరుని దాట * వేస్తారు. ఉప ఎన్నికల్లో పోటీకి తమ నాయకత్వం పూనుకొంటుంటే వీరు నోరు మెదపరు. పైగా పోటీకి దిగడం ధారుణం. బీజేపీ కున్న యిద్దరు శాసనసభ్యుల్లో ఒక్కరే రాజీనామా యిచ్చాడు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి రాజీనామా యివ్వకపోవడాన్ని, టెక్నికల్‌ కారణంగా స్టీరింగ్‌ కమిటీలో పదేపదే బీజేపీ నాయకత్వం చెప్పుత్తూ వస్తున్నది. అంతిమంగా ఉద్దేశ్య పూర్వకంగానే రాజీనామా యివ్వలేదని తేలిపోయింది. ఈ పార్టీకి ఇతరులను రాజీనామాలివ్వలేదని విమర్శ చేసే నైతిక హక్కు ఎక్కడిదని కాంగ్రెసు, టీడీపీ పార్టీలతో సహా ప్రశ్నిస్తున్నాయి. దీనికి బీజేపీ వద్ద సమాధానం లేదు. తెరాస పార్లమెంటు సభ్యులు రాజీనామాలివ్వక పోవడం చర్చనీయాంశమయింది. కాంగ్రెసు పార్టీ నుండి సోనియా గాంధీని విడదీసి చూసే వీరి వైఖరి నష్టకరమయింది. అలాగే వివిధ పార్టీల నాయకులతో పోల్చుకొన్నప్పుడు కేసీఆర్‌, తెరాసలపైనే తెలంగాణ (ప్రజలు అధిక విశ్వాసం కలిగి వున్నారు. సీపీఐ తెలంగాణకి అనుకూలంగా తీర్మానించినా, దాని కోసం ఉద్యమించేది లేదన్నది. కానీ తెలంగాణలో వారి పార్టీ క్యాడర్‌ను ఉద్యమంలో భాగస్వామ్యం చేయలేక పోతున్నది. సీపీఐ అవకాశవాద వైఖరి ఫలితమే ఇది. సీపీఎం మొదటి నుండి ప్రకటించిన సమైక్యవాదానికే కట్టుబడి వున్నది. నేటికీ దాన్నే అనుసరిస్తోంది. పీఆర్పీ తెలంగాణలో తమ పార్టీని రద్దు పర్చుకొన్నది. నేడు విచ్చలవిడిగా తెలంగాణకి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నది.

ఎంఐఎం తెలంగాణ రాకుండా మడత పేచీలు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని మొదట నుండీ వ్యతిరేకిస్తూ వచ్చింది.

ఎమ్మార్పీయస్‌ ల్లాంటి సంస్థలు జేఏసీ నుండి తప్పుకొన్నాయి. దీనిలో తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి అనేక బలహీనతలు వ్యక్తమయినాయి. ఎమ్మార్పీయస్‌ నేత మంద కృష్ణ కాకతీయ యూనివర్సిటీ ఘటన సందర్భంగా అనుసరించిన వైఖరి అనుమానాలకి తావిచ్చే విధంగా వుంది. ఐక్య ఉద్యమంలో వుంటూ, నిర్మాణయుతంగా విమర్శలు కాకుండా, విచ్చిన్నమయ్యే విధంగా ఆయన చర్యలు కొనసాగాయి. మానుకోట ఘటనల సందర్భంగా ఆయన చేసిన ప్రకటనలు ఉద్యమాన్ని ముందుకి తీసుకుపోవడానికి తోద్పడక పోగా ఉద్యమానికి హని కలిగించాయి. ఆత్మహత్యలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలత రానప్పుడు కొంత మంది విద్యార్థులు, యువకులు నిరాశ, నిస్పృహలకులోనై ఆత్మహత్యలకి పూనుకొంటున్నారు. అదే విధంగా వేగవంతంగా కొనసాగుతున్న ఉద్యమం వివిధ కారణాల మూలంగా స్థబ్దతకు గురయినప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఇది ఎక్కడ వెనక్కి పోతదో, ఆగిపోతదోనని భావించినప్పుడు ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ ఆత్మహత్యలను అన్ని పక్షాలు ఆపాలని కోరుతున్నాయి. ఆత్మహత్య జరిగినప్పుడు ఇదే చివరి ఆత్మహత్య కావాలనీ, యిక వాటికి స్థానం వుండరాదనీ మాట్లాడుతూనే వున్నారు. కానీ, ఆ ఆత్మహత్య చివరిది కాకుండా పోతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సుమారు 400 మంది ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమైనది.

ఆత్మహత్యలపై కూడా తెలంగాణ ఉద్యమంలో తప్పుడు భావనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఉద్యమానికి పెట్రోలనీ, ఆక్సిజననీ చెప్పడం వాటిని ప్రోత్సహించడానికే దోహద పడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, వాటి ఆవశ్యకతని కాదనలేమని చెప్పడం సహించరానిది. కొన్ని సందర్భాల్లో ఉద్యమ నాయకులు కూడా ఆత్మహత్య చేసుకొంటామని ప్రకటించడం కూడా వీటికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతున్నది.

ఆత్మహత్యల వలన ఉద్యమానికి ప్రయోజనం లేదు. వీటికి ఉద్యమంలో స్థానం లేకుండా చేయాలి. పోరాటంలో మరణం నేర్చుకోవాలి గానీ, ఆత్మహత్యలతో పోరాటాన్ని సృష్టించలేము. కొనసాగించలేము. ఆత్మహత్యలు - వాటికి లభిస్తున్న కారణాలను నిరుత్సాహ పర్పాలి. వీటిపై సరయిన రాజకీయ పోరాటం జరగాలి. ఆత్మహత్యలను నివారించే కార్యక్రమాలను నిర్వహించాలి. ఆత్మహత్యలను నివారించే పోరాట చైతన్యాన్ని అందించాలి.

(్రి

తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న అత్యధిక ఆత్మహత్యలు నిస్వార్థంగా జరుగుతున్నవే. తమ ప్రాణం కంటే, తెలంగాణ ఏర్పాటే ప్రాముఖ్యత కల్గివుందని భావించి ప్రాణాన్ని తీసుకొన్నవే. ఆత్మహత్యలు సరైనవి కావనే చైతన్యం తెలంగాణ ఉద్యమం నుండి సరిగ్గా లభించని కారణంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే వున్నది. కానీ, వారి తెలంగాణ ఆశయం వారి ఆత్మహత్యల మార్గం ద్వారా లభించదు. ఆ మార్గం ప్రయోజనకరం కాదని తేటతెల్లం చేయాలి. ఆత్మహత్యల నివారణా ఉద్యమాన్ని కొనసాగించాలి. పార్టీలో తప్పడు ధోరణులను అధిగమించాలి పాలకవర్గ పార్టీలతో “పోరాటం - ఐక్యత - పోరాటం”గా విప్లవకారుల విధానంగా వుంటుంది. ఐక్య కార్యాచరణ కొనసాగుతున్నప్పుడు, పార్టీ స్వతందత్రతని గాలికి వదిలేసి, పూర్తిగా ఐక్య కార్యాచరణనే కీలకంగా భావించడం మూలంగా వర్గ రాజకీయాలు దెబ్బతింటాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక ప్రజాస్వామికమైన అంశం మాత్రమే. దానికంటే ఎన్నో రెట్లు గొప్పది నూతన ప్రజాస్వామిక విప్లవం. ఒక రకంగా ఈ రెండింటికి మధ్య పోలిక లేనిది. నూతన (ప్రజాస్వామిక విప్లవం సాధింపు లక్ష్యంగా పనిచేసే న్యూడెమోక్రసీ పార్టీలో ఎవరయినా “వకైక తెలంగాణ”గా పోరాడాలనుకోవడం పాలకవర్థాల ప్రభావ ఫలితమే. వర్గ రాజకీయాలకు అతీతం కావడమే. ఉద్యమంలో వచ్చే వ్యక్తిగత గుర్తింపు విప్లవ రాజకీయాలకతీతంగా మారే ప్రమాదమున్నది. విప్లవకారులు పాల్గొనే ఉద్యమానికి వివ్లవ రాజకీయాలే చెక్‌. పార్టీ పద్ధతులకి మినహాయింపుగా ఎవరు ఆలోచించినా వర్గ దృక్పథం నుండి దూరమవుతున్నట్లే. బూర్జువా విధానాల ఆకర్షణకి లోనవుతున్నట్లే, . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కలసివచ్చే శక్తులతో కలిసి, పనిచేస్తున్నప్పుడు, వారి జబ్బులు విష్ల్రవకారులయినంత మాత్రాన అంటకుండా పోవు. అందుకే పాలకవర్థాల యొడలా, వారి విధానాల యెడలా విమర్శనాత్మకంగా వుండాలి. వారి ముఖస్తుతికి కొట్టుక పోరాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, దాని కోసం కొనసాగుతున్న ఉద్యమం సందర్భంలో అందులో పాల్గొంటున్న వారికెవ్వరికయినా కొన్ని అభిప్రాయాలు ఏర్పడటం సహజం. ఎవరికయినా వచ్చిన అభిప్రాయాలకి భిన్నంగా పార్టీ నిర్ణయం వుంటే పార్టీలో చర్చించవచ్చు. అందరి అభిప్రాయాలు అమలు జరపడం అసాధ్యం. ఎవరికి ఏ అభిప్రాయాలున్నా అందరూ ఒకే విధానాన్ని అమలు జరపాలి. అప్పుడే నిజమైన ఐక్యతను సాధించ గల్టుతారు.

స్థిరంగా నిర్మాణంలో వుండగల్లుతారు. భిన్నాఖిప్రాయాలన్నింటినీ పార్టీలో చర్చకు పెటొచ్చు. ఇలా చర్చలకి తావివ్వడమంటే బజారులోబడి తాను భావించిన దాన్నే చర్చిస్తా మనడం, అమలు జరుపుతాననడం కాదు. అది అరాచకమయింది. తమకి అవకాశం వున్న వేదికల్లోనే . చర్చించాలి. ఇదే పార్టీలో అనుసరించాల్సిన సరయిన వైఖరి, పద్దతీనూ.

ఉప ఎన్నికల ఫలితాలపై

జులై 27న రాజీనామా చేసిన 12 నియోజక వర్షాల్లో ఎన్నికలు జరిగాయి. 30న ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెసు సగం వరకు, టీడీపీ పూర్తిగా డిపాజిట్లు కోల్పోయాయి. రాజీనామా చేసిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఈ ఎన్నికలను పార్టీల మధ్య జరిగిన ఎన్నికలుగా ప్రజలు చూడలేదు. తెలంగాణకి అనుకూలం, అననుకూలంగా విభజించి చూసారు. తెలంగాణకి వ్యతిరేకంగా భావించిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించారు. రాజీనామా చేసిన అభ్యర్థులను తెలంగాణకి అనుకూల ప్రతినిధులుగా భావించి పెద్ద మెజార్టీతో గెలిపించారు.

రాజీనామాలు అనేక మలుపులు తిరిగాయి. రాజీనామాలు చేయాలని పోరాటం సాగింది. ఈ పోరాటంలో ప్రజలు భాగస్వామ్యమయ్యారు. రాజీనామాల నుండి తప్పుకాన్న వారిని ప్రజలు తెలంగాణ ద్రోహులుగా చూసారు. ఈ ఉద్యమంలో జేఏసీ ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో భాగమైన న్యూడెమోక్రసీ పార్టీ కూడా రాజీనామాలని డిమాండ్‌ చేసింది. తదనంతరం -ముందుకు వచ్చిన ఎన్నికల్లో పార్టీ పాల్గొన లేదు. తన ఎన్నికల విధానాల్లో పాలకవర్గ పార్టీలని సమర్ధించే వైఖరి లేదు. ఎన్నికల ద్వారా కాదు, ఉద్యమం ద్వారానే తెలంగాణా సాధిస్తామని ఈ ఎన్నికల సందర్భంగా పార్టీ వైఖరి వెల్లడించింది.

దాదాపు ఒక సం॥ కాలంగా కొనసాగుతున్న ఉద్యమం ఫలితంగానూ, రాజీనామాలు ఉద్యమంలో భాగం చేయడం మూలంగానూ ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రతినిధులు విజయం సాధించారు. ఉద్యమం ద్వారానే ప్రజా ప్రతినిధులపై వత్తిడి తీసుక రాగల్గుతామనీ, పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టించుకోగల్లుతామనీ ఈ ఉప ఎన్నికల తీరు, ఫలితాలు మరోమారు వెల్లడించాయి. ముగింపు ,

తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భాగమయినప్పటి నుండీ ఆర్థికంగానూ, రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ వివక్షతకూ, దోపిడీకీ గురిచేయబడింది. అందుకే తన హక్కుల రక్షణ కోసం పోరాడుతున్నది. ప్రత్యేక తెలంగాణా కోసం జరుగుతున్న పోరాటం ప్రజాస్వామికమయినది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించడం న్యాయమయింది.

(

ఈ సందర్భంలో ఉన్నత స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు రాజకీయంగా ఉ ద్యమాన్ని సంఘటిత పర్ప్చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీరు - తదనంతర పరిస్థితిపై స్పష్టతని కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదుపరి పాలించేది బూర్జువా, భూస్వామ్య వర్గమే. ప్రాంతాల మధ్య కొనసాగుతున్న వివక్షతనూ, మరికొన్ని పాక్షిక సమస్యలను మాత్రమే పరిష్కరించుకోగల్లుతాం. అలాగే తెలంగాణ ప్రజలు విద్యా, వైద్యం, నీరు, ఉ పాధి, భూమి తదితర డిమాండ్లను భవిష్యత్‌ తెలంగాణ రాష్ట్రంలో పొందేట్లుగా ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. ఈ డిమాండ్లను అమలు జరపాలి. అమలు జరపకపోతే, ప్రజలు పోరాడి సాధించుకోవాలి.

ఈ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం కోసం సీపీఐ (ఎం-ఎల్స్‌ న్యూడెమోక్రసీ సూత్రబద్ద వైఖరితో పోరాడుతున్నది. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అకుంఠిత దీక్షతో ఉద్యమిస్తుంది.

తెలంగాణ రావడంతోనే తెలంగాణ ప్రజల మౌలిక సమస్యలు కూడా పరిష్కారమవు తాయని తెలంగాణవాద పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలను భ్రమలకి గురి చేస్తున్నాయి. ఇది సరయిన వైఖరి కాదు. కొన్ని పాక్షిక సమస్యలు మాత్రమే పరిష్కరించ బడతాయి. ఈ దోపిడీ వ్యవస్థలో సకల సమస్యల పరిష్కారానికి తావే లేదు.

విదేశీ పెట్టుబడిదారుల, దేశంలో పెద్ద పెట్టుబడిదారుల, భూస్వామ్య వర్షాల, వివిధ రకాల దోపీడీ, పాలన సాగినంత కాలం, వీరి జోక్యం చేసుకొనే తీరు కొనసాగినంత కాలం, మన దేశ (ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా జీవించడం అసాధ్యం. విదేశీ, పెట్టుబడిదారుల అండదండలతో దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, కోటీశ్వరుల దోపిడీ కూల్చబడకుందడా ప్రజలు స్వేచ్చగా జీవించడానికి అవకాశమే లేదు. ప్రజల నెత్తిన కూర్చున్న ఈ మూడు పీడనలు తొలిగిపోకుండా అసమానతలు రద్దు కావడం అసాధ్యం. దోపిడీ రాజ్యం అండదండలతోనే ఈ అసమానతలు పెంచి పోషించబడుతున్నాయి. వీటికి రక్షణ కవచంగానే ఈ పాలన, పాలక వర్గాల పని తీరూ వుంది. వీటిని తదకంటూ నిర్మూలించి

నూతన ప్రజాస్వామిక వివ్లవాన్ని సాధించినప్పుడే ప్రజల నకల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ లక్ష్యం కోసం పోరాడుతూనే, పాక్షిక సమస్యల పరిష్కారం కోసం కూడా ఉద్యమించాలి. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం. అది సాధించే వరకు అలుపెరగక ఉద్యమిద్దాం. నోటు? అవసరమయిన రిపోర్టులను మ్యతమే ఇందులో పొందు వర్దాం. (ధానంగా నమీక్ష భాగాలనోే వేర్చొన్నాం,

1 న్‌ 4. | ప గ స గ0/౪0221310 7613086202 | . తోరదాంలో న. / ౯ కంల కం ఇ తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భాగమయినప్పటి నుండి ఆర్ధికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా వివక్షకి, దోపిడికి గురిేచేయబడుతూ వస్తోంది. అందుకే తన హక్కుల రక్షణ కోసం తెగించి పోరాడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరుగుతున్న ఈ పోరాటం అత్యంత ప్రజాస్వామికమయినది. న్యాయమైనది.

ఈ ఉద్యమాన్ని ఎగువస్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు రాజకీయంగా సంఘటితపరచు కోవాలి. నిర్మాణాన్ని అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటుచేసుకోవాలి. మెరుగుపరుచుకోవాలి. పటిష్టపరుచు కోవాలి. తెలంగాణ ఏర్పడే దాకా విశ్రమించకుండా పోరాడాలి. ఉద్యమించాలి. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన

తర్వాత ఏం చేయాలనే స్పష్టత ఇప్పటి నుండే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు విద్యా, వైద్యం, నీరు, ఉపాధి, భూమి తదితర డిమాండ్లను సాధించుకొనేటట్లుగా ముందస్తు ప్రణాళికను ఇప్పటి నుండే రూపొందించుకోవాలి. వాటి అమలు కోసం రాబోవు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలి. ఎన్‌కౌంటర్లు లేని, ఆత్మహత్యలు లేని, ఆకలి చావులు లేని తెలంగాణ కోసం గొంతెత్తి నిలబడాలి. అన్నింటికి మంచి ప్రజాస్వామిక వాతావరణం ఏర్పాటు కోసం అహర్షిషలు కృషిచేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్త్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది బడాబూర్జువా, భూస్వామ్య వర్గమే గనుక. .

అనవా 0౧| (1) 1౯4 ౦౯4౦౦౧10?