Telugu Pilalu chepina khathalu khiru khiru lodapa - anilvaranasi/indianlanguages GitHub Wiki
పిల్లలు బెప్పిన కథలు కిర్రు...కిర్రు... లొడ్డవ్వ్పా! క వ షె [స న. ( వక్ జ న . ్ష న ఎఫ్ న
పిల్లలు బెప్పిన కథలు కిర్రు...కిర్రు...లొడ్డప్పా! దా. యం. హరికిషన్ భో కర్నూలు బుక్ ట్రస్ట్ జన విజ్ఞాన వేదిక
/ కే 4 శ" / న్ / గ - న రో ్ట / న్న గ్ర న విల్లలు చెప్పిన కథలు [౧ కిర్రు... కిర్రు... లొడ్డప్పా! యస జ్ లో రచయిత వ దాః యం, హరికీమాాల”ా షష ల్త చిత్రకారుడు. : లక్ష్మణ్ (కర్నూలు) నే లా ప్రతులు వ 2000 ఘం శ వెల ఏ రూ. 20 మొదటి ముద్రణ: డిసెంబరు, 2003 టా మూడవ ముద్రణ : ఫిబ్రవరి, 2007 / ళట్ప ప్రచురణ, ప్రతులకు: (ల
- జీ, మాల్యాద్రి రచయిత ఇతర రచనలు: జన విజ్ఞాన వేదిక ప్రచురణల నిభాగం కథా నంపుటాలు: 162, విజయలక్ష్మి నగర్, 1 మాయమ్మ రాచ్చసి నెల్లూరు - 524 004. ఫోన్: 0861-2305303 జ న... 9 అఆ
- కర్నూలు బుక్ ట్రప్ట్ ల డొః యం. హరికిషన్ నంపాదకత్త్వం: ఇం.నెం. 45/205-1, కర్నూలు కథ లేబర్ కాలనీ చర్చి ఎదురుగా, చెవీన కథలు; టీచర్స్ కాలనీ, కర్నూలు. వీల్లలు పున | ఫోన్: 08518 - 254810 + అల్లముక్క్క ఒకటి తిందునా... ము(ద్రణ: 2 రెండు నా చరిత ఇం(్రెషన్స్, తిందునా... ఆజామాబాద్, హైదరాబాద్ - 500 020. 3. కోటకొండ మొనగాడు ఫోన్: 2767 8411 ఉ చిలక ముక్కు వూడిపాయ...
కృతజ్ఞతలు అడగ్గానే అనేక కథలను సేకరించుకొనివచ్చి నాకు చెప్పిన పూడిచెర్ల, పారుమంచాల గ్రామాల్లోని చిన్నారులకు - ముఖ్యంగా కాశమ్మ, లక్ష్మిదేవి, సుజాత, తిరుమల, విజయకుమారి, స్నేహలత, శ్రీదేవి, శివపార్వతులకు... ప్రతిక్షణం నాకండగా నిలుస్తూ సహాయ సహకారాలందిస్తున్న మా కర్నూలు “కథాసమయం మిత్రులకు... జన విజ్ఞాన వేదికను పరిచయం చేసిన చరిత గ్రాఫిక్స్ సుబ్బయ్యకు... కర్నూలు బుక్ ట్రస్ట్‌తో కలిసి సంయుక్తంగా పుస్తకాన్ని ప్రచురించ దానికి ముందుకొచ్చిన జన విజ్ఞాన వేదిక, నెల్లూరు ప్రచురణల విభాగానికి... = రచయిత ్రై స్మైక్లీ 7 టే డ్ స (యం |
విషయసూచిక
పేజీ 2. బుడంకాయంత బుడ్గోని కథ .................20042 కి 3. సల సల కాలే సూరీడు, సల్లా సల్లని సందమామ .......... 15 4. కిర్రు...కిర్రు...లొద్డప్పా! ..........4444ంంంటలలు. 17 5. దోసకాయల దొంగ నక్క కథ ..................౨౨౨౨౨ 22 6. చిలకమ్మ ఇల్లు ...............220000002000040000020200044 లర 7. మా మల్లన్న సచ్చిపాయ ............020000000000000002 త్రికే 8. ఉల్లిగడ్డ కథ... 40000000000000000000000044 తర్ 9. నక్క - సింహం .......౨౨౨౨౨౦౦౦౦ 2000200000. తెరి 10. గుడ్డోడు - గూనోడు ........00000000000006000000ం00టంంల2 కేన
అతా కోడళ్ళ కథ అధి
ఒకూర్లో ఒక అత్త వుండేది. ఆమెకు కోడలంటే అస్సలు పడేది కాదు. చీటికి మాటికి ఆమెను తిడుతూ కొడుతూ ఏడిపించేది. ఒకరోజు అత్త తన ఇంటి పెరట్లో ఒక బీర గింజ నాటింది. కొద్ది రోజులకే అది బాగా పెరిగి పెద్దదై కుప్పలు తెప్పలుగా కాయలు కాయసాగింది.
కోడలికి ఆ బీరకాయలు తెంపుకోని మంచిగా కూర చేసుకోని తినాలని ఎంతో ఆశ. కానీ అత్తేమో ఆ కాయలన్నీ తెంపి తానొక్కతే వండుకోని బాగా తినేది. మిగిలితే ఎదురింటోళ్ళకు, పక్కింటోళ్లకు ఇచ్చేదేగాని కోడలికి మాత్రం ఒక్క ముక్క కూడా పెట్టేది కాదు.
ఓ రోజు వాళ్ళింటికి అత్త చిన్న తమ్ముడు వచ్చి “అకా... అకా... రేపునా కూతురి పెళ్ళి. నువ్వు తప్పకుండా మా వూరికి రావాలి” అని పట్టుపట్టాడు. సరేనని అత్త తమ్మునితోబాటు పెళ్ళికి పోయింది. అంతే... అత్త అలా బైటికి పోవడం ఆలస్యం, కోడలు సంతోషంతో వురుక్కుంటా పెరట్లోకి పోయి బీరకాయలన్నీ తెంపి కూర వండుకోని బాగా తిని, తీగ మొత్తం పీకి దిబ్బలో పడేసింది.
నాలుగు రోజుల తర్వాత అత్త వచ్చి చూస్తే ఇంగేముంది తీగ లేదు, కాయలూ లేవు. ఇదంతా కోడలు పనేనని గ్రహించిన అత్తకు ఆమె మీద పీకల
అత్తా కోడళ్ళు ళల 5
దాకా కోపమొచ్చింది. రాత్రి కోడలు అన్నంతిని నిద్రపోగానే ఓ పెద్ద కర్ర తీసుకొచ్చి ఆమె నెత్తిన ఒక్కటేసింది. అంతే ఆ దెబ్బకు కోడలు కళ్ళు తిరిగి సృహ తప్పి అచ్చం శవం మాదిరి పడిపోయింది. ఎంత దిపినా-లెయ్యలా. అది చూసి కోడలు చచ్చిపోయిందని అనుకొనింద్వి అత్త గ్. మల గళ 4
అంతలో ఆమె కొడుకు పొలం నుండి ఇంటి కొచ్చినాడు. వెంటనే అత్త దొంగ ఏడుపు ఏడుస్తా 'రేయ్! నీ పెళ్ళానికి ఏమయిందో ఏమో.... ఎంత పిల్చినా పలకడమ్లా. పో! పోయి చూడుపో' అనింది. దాంతో వాడు పోయి పెళ్ళాన్ని అటూ యిటూ కుదిపినాడు. గట్టిగా పిలిచినాడు.
ఆమె స్పృహలో లేదు కదా. అందుకే ఏమీ మాట్లాల్లేదు. దాంతో వాడు కూడా పెళ్ళాం చచ్చిపోయిందని అనుకున్నాడు.
ఇద్దరూ శవాన్ని తీసుకోని చీకట్లోనే శశృశానానికి పోయినారు. దాన్ని “భవం వప్పన కద
కట్టెల మీద పన్నబెట్టి అంటిద్దామని చూస్తే అగ్గిపెట్టె లేదు. దాంతో అత్త 'రేయ్! నువ్ ఇంటికాడికి పోయి అగ్గిపెట్టె తాపో' అని కొడుక్కి చెప్పింది. దానికి వాడు “నాకొకృనికే చీకట్లో పోవాలంటే భయం. నువ్వు కూడా తోడురా' అన్నాడు. సరేనని ఆమె కొడుకుతో పాటు వూళ్లోకి పోయింది. వాళ్ళట్లా వూళ్ళొకి పోయిన కాసేపటికే కోడలికి సృహ వచ్చింది. లేచి చూస్తే ఇంకేముంది, శ్మశానంలో కట్టెల మీదుంది. ఆమెకు జరిగనదంతా అర్ధమై నెమ్మదిగా లేచి పక్కనే పడున్న తుమ్మ మొద్దుకు తన తెల్లచీర సగం చించి కట్టి, దానిని కట్టెల మీద పెట్టింది. తానేమో పక్కనే వున్న చింతచెట్టు ఎక్కి ఏం జరుగుతుందా అని చూడసాగింది. కాసేపటికి అగ్గిపెట్టె తీసుకొని కొడుకుతో అక్కడకొచ్చింది అత్త. చీకటి కదా సరిగా కనబడక తుమ్మ మొద్బనే కోడలనుకోని నిప్పు పెట్టింది. బాగా మంట అంటుకోని, కాలి బూడిదై పోగానే వాళ్ళు తిరిగి కోడలు చింతచెట్టు దిగుదామనుకుంటుండగానే నలుగురు దొంగలు అక్కడికొచ్చారు. వాళ్ళు చింతచెట్టు కిందనే కూర్చుని చుట్టుపక్కల వూళ్ళలో రీ ళో శ టు ఖీ. గ హై .5100:6
కో ఈ” ర
అందా
ఎత్తుకొచ్చిన బంగారం, రత్నాలు, వజ్రాలు, నగలు కుప్పలు కుప్పలుగా పోసి ఎవరి భాగం వాళ్ళు పంచుకోసాగారు. ఇదంతా పైనుండి చూస్తున్న కోడలు ఎలాగైనా ఆ బంగారం కొట్టేయాలనుకోని ఓ అని దయ్యం మాదిరి అరుస్తా దబీమని వాళ్ళ మీదకు దూకింది. అంతే నలుగురు దొంగలు అదిరిపన్నారు. చూస్తే యింకేముంది తెల్లచీరతో, జుట్టంతా విరబోసుకుని 'ఓ' అని వూగుతూ వుంది. వాళ్ళు వచ్చింది దయ్యమేననుకోని భయంతో గజగజా వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి తలో దిక్కు పారిపోయారు.
కోడలు బంగారమంతా మూటగట్టుకోని ఆనందంగా ఇంటికి పోయింది. తలుపులేమో మూసి వున్నాయి. దాంతో 'అత్తొ! అత్తా!” అని పిలుస్తూ తలుపు కొట్టసాగింది. ఎవరబ్బా అని లేచి తలుపు తెరిచిన అత్తకు ఎదురుగా కోడలు కనబడేసరికి ఇది దయ్యమై నన్ను పీక్కుతినడానికే వచ్చిందనుకొని భయపడి అక్కడికక్కడే గుండె పగిలి దభీమని కిందపడి చచ్చిపోయింది.
పెళ్ళాన్ని చూసి మొగుడు గజగజా వణుకుతూ వుంటే ఆమె జరిగినదంతా చెప్పింది. వాడు “అలాగా” అని సంతోషపన్నాడు. ఆమె తెచ్చిన బంగారంతో పదంతస్థుల మిద్దె కట్టుకోని హాయిగా బతకసాగారు. "శ + వీల్లలు చెవ్పీన కథలు
బుడంకాయంత బుద్గోని కథ ఒకూర్లో ఒకామె వుండేది. ఆమెకు పెళ్ళయి ఎన్నినాళ్ళయినా పిల్లలు పుట్టలేదు. దాంతో ఓ రోజు సుంకులమ్మ గుడికి పోయి 'తల్లీ నాకు పిల్లలు పుట్టేలా వరమియ్యి”' అంటూ ఏడురోజులు ఉపవాసం చేసింది. అది చూసి జాలిపడిన సుంకులమ్మ ప్రత్యక్షమై ఆమెకో బుడంకాయ ఇచ్చి “ఇది తిను. నీకు పుల్లలు పుడతారు” అని చెప్పింది. దాంతో ఆమె సంతోషంగా ఇంటికిపోయి దాన్ని తినింది. కొద్దిరోజుల తర్వాత ఆమెకు సుంకులమ్మ చెప్పినట్టుగానే ఓ పిల్లోడు పుట్టాడు. ఎలాగున్నాడబ్బా అని చూస్తే అచ్చం బుడంకాయలాగానే, దానంతనే వున్నాడు. సరే ఎవడో ఒకడు పుట్టినాడు చాల్లే అనుకోని ఆమె ఆ బుడంకాయంత బుద్దోన్నే ప్రేమగా పెంచుకోసాగింది. “(5 మనని,
- అవ్య. ళా (. [ భ్ర జం! యణ ్ట వ్ = త ఉఊో డముదాా స బుదంకాయంత బుద్గోని కథ ఈ9
ఓ రోజు వాళ్ళ నాయన చేనుకి పోతావుంటే వాడు అడ్డుపడి “నాన్నా! నాన్నా! ఈ రోజు చేనుకి నేను పోయి దున్నాస్తా. నువ్వు ఇంటికాన్నే హాయిగా విశ్రాంతి తీసుకో' అన్నాడు. దానికి వాళ్ళ నాయన “ఒరేయ్! నువ్వు వేలెడంత కూడా లేవు. నువ్వేం దున్నుతావు? పో... పోయి ఆడుకోపో' అన్నాడు. కానీ వాడు దానికి ఒప్పుకోక 'లేదు. నేను పోతా. ఒక్కసారైనా పంపు” అని ఏద్పడం మొదలుపెట్నాడు. వాని ఏడుపు సూల్లేక వాళ్ళ నాయన 'సరేపో' అన్నాడు. దాంతో వాడు ఎగిరి గంతేసి 'ఛల్‌ఛల్ అనుకుంటూ ఎద్దులను తోలకపోయి చేలో దున్నడం మొదలుపెట్నాడు. అలా దున్నుతా, దున్నుతా వుంటే మధ్యలో పెద్ద వానొచ్చింది. దాంతో వాడు గునగునగున దొర్లుకుంటా పోయి ఓ పెద్ద బండరాయి చాటున తదవకుండా కూర్చున్నాడు.
అదే సమయంలో ఓ దొంగ, దొంగోని పెళ్ళాం అటువేపు పోతూ చేనులోని ఎద్దులను చూసి సప్పుడుకాకుండా తోలుకోనిపోయినారు. వాన తగ్గినాక బుద్దోడొచ్చి చూస్తే ఇంగేముంది, ఎద్బుల్లేవు. చుట్టుపక్కలంతా వెదికీ, వెదికీ అలిసిపోయి విచారంగా ఇంటికొచ్చినాడు.
ఉత్తచేతులు వూపుకుంటా ఇంటికొచ్చిన బుడ్దోన్ని చూసి వాళ్ళమ్మ “ఏరా! ఎద్దులెక్కడ?” అనడిగింది. వాడు జరిగినదంతా చెప్పినాడు. అదివిని వాళ్ళమ్మ “ఒరే! మీ నాయన ఒద్దు, ఒద్దన్నా వినకుండా ఎద్దులను తోలకపోయి పోగొడ్డివి. ఇప్పుడు మీ నాయన ఒచ్చినాడనుకో నిన్ను బాగా తంతాడు. ఎలాగరా' అనింది. దానికి వాడు 'ఏం ఫరవాలేదు. నాన్న ఒచ్చేలోగా నేను ఎలాగైనా ఎద్దులను వెదికి పట్టుకొస్తా. ముందు నాకు తొందరగా ఆరుపళ్ళ అన్నం వండిపెట్టు' అన్నాడు. సరేనని వాళ్ళమ్మ ఆరుపళ్ళ అన్నం వండి, వానికిచ్చింది.
బుడ్డోడు ఆరుపళ్ళ అన్నం మూటగట్టుకోని ఎద్దులను వెదకడానికి అడవిలో 70 ఈ. వీల్లలు చెప్పన కథలు
పోసాగాడు. అలా పోతా పోతా వుంటే దారిలో ఓ తేలు ఎదురై 'బుడంకాయ బావా! బుడంకొాయ బావా! యాడికి పోతున్నావు అనడిగింది. దానికి వాడు 'మా ఎద్దులను ఎవడో దొంగ ఎత్తుకుపోయినాడు. వాటిని వెదకదానికి పోతున్నాను” అన్నాడు. అది విని తేలు 'నాకో పడి అన్నం పెడితే నేనూ నీతో వచ్చి చాతనైనంత సాయం చేస్తా అనింది. వాడు సరేనని దానికో పడి అన్నం పెట్టాడు. బుడంకాయ, తేలు అడవిలో పోతా పోతా వుంటే దారిలో ఓ పాము ఎదురై 'బుడంకాయ బావా! బుడంకాయ బావా! యాడికి పోతున్నావు' అనడిగింది. దానికి వాడు 'మా ఎద్దులను ఎవదో దొంగ ఎత్తుకుపోయినాడు. వాటిని వెదకడానికి పోతున్నాం అన్నాడు. అది విని పాము 'నాకోపడి అన్నం పెడితే నేనూ మీతో వచ్చి నా చేతనైనంత సాయం చేస్తా అనింది. వాడు సరేనని దానికి కూడా ఓ పడి అన్నం పెట్టాడు. ॥ షప. 1 (ె క్ల సీ హన్ (క ళీ ఇ లు బుదంకాయ, తేలు, పాము అడవిలో పోతా పోతా వుంటే దారిలో ఓ ఎలుక ఎదురై 'బుడం కాయ బావా! బుడం కాయ బావా! యాడికి పోతు న్నావు' అనడిగింది. దానికి వాడు 'మా ఎద్దులను ఎవదో దొంగ ఎత్తుకు పోయినాడు. వాటిని వెదకడానికి పోతున్నాం అన్నాడు. అది విని ఎలుక *'నాకో పడి అన్నం విన వై ణల
పెడితే నేనూ మీతో వచ్చి నా చేతనైన సాయం చేస్తా అనింది. వాడు సరేనని దానికి కూడా ఓ పడి అన్నం పెట్టాడు. బుదడంకాయ, తేలు, పాము, ఎలక అడవిలో పోతా పోతా వుంటే దారిలో ఓ చిలక ఎదురై 'బుడంకాయ బావా! బుడంకాయ బావా! తేలు, పాము, ఎలకతో కలిసి యాడికి పోతున్నావు అనడిగింది. దానికి వాడు 'మా ఎద్దులను ఎవడో దొంగ ఎత్తుకు పోయినాడు. వాటిని వెదకడానికి పోతున్నాం” అన్నాడు. అది విని చిలక 'నాకో పడి అన్నం పెడితే నేనూ మీతో వచ్చి నా చేతనైన సాయం చేస్తా అనింది. సరేనని చిలకకు కూడా ఓ పడి అన్నం పెట్టాడు. బుడంకాయ, తేలు, పాము, ఎలక, చిలక అడవిలో వెదుకుతా, వెదుకుతా పోతా వుంటే ఓ పెద్ద మర్రి చెట్టు పక్కన ఓ ఇల్లు కనబడింది. ఆ ఇంట్లోకి పోయి చూస్తే ఎవరూ లేరు. పక్కనే వున్న పశువుల కొట్టంలోకి పోయి చూస్తే వాళ్ళ ఎద్దులు కట్టేసి కనబడ్డాయి. 'ఓహో! ఐతే ఇదేనన్నమాట దొంగోని ఇల్లు, వీనికి ఎలాగైనా బుద్ధి చెప్పా'లని అన్నీ అనుకొన్నాయి. లా మ్ నాట = 6 ల ౮" అక్కు స్ ల ₹2 + వీల్లలు చెవ్పీన కథలు గ్
బుడ్డోడు పోయి ఇంటి పైకెక్కి కప్పు మీద కూర్చున్నాడు. చిలక పోయి దీపం పక్కన కూర్చుంది. తేలు పోయి గూట్లో అగ్గిపెట్టె దగ్గర కూర్చుంది. పాము పోయి మూలన చుట్ట చుట్టుకోని కూర్చుంది. ఎలక పోయి పశువుల కొట్టంలోనున్న ఎద్మలను విడిపించడానికి వాటి తాళ్ళను కొరకడం మొదలు పెట్టింది.
చీకటి పడిన కాసేపటికి దొంగోడు, దొంగోని పెళ్ళాం వస్తా కనబన్నారు. కప్పుపైనున్న బుడ్డోడు వెంటనే వాళ్ళొస్తున్నట్టు గట్టిగా ఒక్క ఈలేశాడు. ఆ ఈల విన్న వెంటనే లోపలున్న తేలు, పాము, చిలక మేం సిద్ధం అంటూ తిరిగి ఈలేశాయి. దొంగ, దొంగోని పెళ్ళాం తలుపు తెరుచుకోని లోపలికి అడుగుపెట్నారు.
వాళ్ళు అడుగుపెట్టగానే దీపం పక్కన కూర్చున్న చిలక వుఫ్ అంటూ దీపమార్చేసింది. అంతే ఇల్లంతా చీకట్లో నిండిపోయింది. దీపం వెలిగిద్దామని దొంగోనిపెళ్ళాం చీకట్లోనే తదుముకుంటా, తడుముకుంటా పోయి అగ్గిపెట్టె కోసం గూట్లో చేయి పెట్టింది. వెంటనే అక్కడున్న తేలు ఆమె చేతి మీద లటుక్కున ఒక్కటేసింది. ఆ నొప్పికి ఆమె గిలగిలా కొట్టుకుంటూ "తేలు! తేలు! అని గట్టిగా అరవసాగింది.
ఆ అరుపులు విన్న దొంగోడు తేలును చంపడానికని పరుగెత్తికొనెళ్ళి మూలనున్న కట్టెకోసం చేయి పెట్టాడు. అంతే అందుకోసమే ఎదురుచూస్తున్న పాము చటుక్కున వాని చేతి మీద కాటేసింది. వెంటనే వాని ఒళ్ళంతా విషమెక్కి లబోదిబోమని ఎగిరెగిరి పడతా, గిలగిలా కొట్టుకోని చచ్చిపోయినాడు. అంతలో ఎద్దులకు కట్టిన తాళ్ళన్నీ ఎలక కొరికేసి వాటిని తోలుకోని వచ్చింది.
బుడ్డోడు సంతోషంగా తన ఎద్దులను తీసుకొని తన దగ్గర మిగిలిన రెండు పళ్ళ అన్నం వాటికి ఇచ్చేసి, తనకు సహాయం చేసిన స్నేహితులకంతా కృతజ్ఞతలు చెప్పి, వాళ్ళ నాన్న తిరిగి రాకముందే ఎద్దులతో ఇంటికి చేరుకున్నాడు.
బుదంకాయంత బుద్దోని కథ ఈ73
సల సల కాగే సూరీడు సల్లా సల్లని సందమామ ఒకూర్లో ఒకామె వుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దోని పేరేమో సూర్యుడు. చిన్నోని పేరేమో చంద్రుడు. వాళ్ళు చాలా బీదోళ్ళు. ఆమె ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పనులు చేసి వచ్చిన డబ్బుతో పిల్లలకు మంచి తిండి పెట్టేది. ఒక రోజు ఆమెకు పేద్ద జ్వరమొచ్చి మంచంలో పడిపోయింది. నెలైనా జ్వరం కొంచెం కూడా తగ్గలా. ఇంట్లో వున్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఆమె పిల్లలిద్దరికీ ఏదో ఒకటి పెట్టి తాను మాత్రం ఏమీ తినకుండా వుత్త మంచినీళ్ళు తాగి పండుకొనేది. పిల్లల కోసం జ్వరంలోనూ ఆకలితో పస్తులుండేది. అంతలో ఒక రోజు ఆ వూరిలో ఓ పెద్ద పెళ్ళి జరుగుతావుంటే వీళ్ళను భోజనానికి పిల్చినారు. పెళ్ళి భోజనమంటే వుత్త అన్నం పప్పు పెట్టరుకదా. మంచి మంచి రుచికరమైన వంటకాలు వడ్డిస్తారు. ఆమె చాలా రోజులనుండీ పస్తులుంది కదా. నోరూరింది. పిల్లల్లో సహాపోయి బాగా తిని రావాలనుకునింది. కానీ చాలా రోజులనుండీ తిండి లేదుకదా. ఆదీకాక జ్వరం ఇంకా తగ్గలా. అందుకే నీరసమొచ్చి మంచం మీద నుండి లేవలేకపోయింది. దాంతో సూర్యున్ని, చంద్రున్ని పిలిచి 'రేయ్! మీరిద్దరూ పెళ్ళికిపోయి బాగా తినిరండి. అలాగే వచ్చేటప్పుడూ నాక్కూడా ఏమైనా పట్టుకొని రండి. చాలా ఆకలిగా వుంది అని చెప్పింది. సరేనని ఇద్దరూ పెళ్ళికి పోయినారు. 4 ఈ. విల్లలు చెవిన కథలు
సూర్యుడు భోజనానికి కూర్చోగానే అమ్మకిచ్చిన మాట మరిచిపోయినాడు. భక్ష్యాలు, లడ్డు, కజ్జికాయలు, పాయసం అన్నీ బాగా మెక్కి వుత్త చేతులు వూపుకుంటా ఇంటికొచ్చినాడు. వాళ్ళమ్మ సూర్యుని చూడగానే తనకోసం అన్నీ షి గ ఉం ర్ూ. యవ =. ౮ ( స్స్) ల్ *౧ సత్రతళా అన. తెచ్చింటాడు అనుకోని ఆశతో “ఏరా! నాకోసం ఏమి తెచ్చినావు' అనడిగింది. దానికి సూర్యుడు “అరెరే! నీ సంగతే మర్చిపోయా. నా కసలు గుర్తే లేదు అన్నాడు. తాను రోజూ ఏమీ తినకుండా కడుపు కాల్చుకొని అన్నీ వీళ్ళకే పెడుతున్నా కనీసం ఒక్క పూట కూడా తనకు తేలేదు కదా అని ఆమె చాలా బాధపడింది. చంద్రుడు మాత్రం భోజనానికి కూర్చోగానే పెట్టినవి పెట్టినట్టు సూర్యుని మాదిరి గబగబా తినకుండా 'పాపం అమ్మ రోజూ తానేమీ తినకుండా అన్నీ మాకే పెడుతుంది. కనీసం ఈ ఒక్క రోజైనా ఇవన్నీ తీస్మపోయి అమ్మకు పెట్టాలి అనుకోని ఎవరూ చూడకుండా విస్తరాకులో పెట్టినవి పెట్టినట్టు అంగీలో దాచిపెట్టుకోని ఇంటికి తీసుకొచ్చినాడు. నల సల కాగే సూరీడు నల్హానల్లని నందమామ ఛి 15
అమ్మ చంద్రుని చూస్తానే 'ఏరా! నువ్వన్నా ఏమన్నా తెచ్చినావా. లేక మీ అన్నమాదిరే బాగా మెక్కి వుత్త చేతులు వూపుకుంటూ వచ్చినావా అనడిగింది. ఆ మాటకు చంద్రుడు నవ్వుతా “ముందు నువ్వు కాళ్ళూ చేతులు కడుక్కొని రాపో! తిందువుగానీ” అంటూ విస్తరి వేసి తెచ్చినవన్నీ (ప్రేమగా అమ్మకు పెట్టాడు. అవన్నీ తిని ఆమె చాలా సంతోషించింది.
అ తరువాత సూర్యున్ని పిలిచి 'చూడ్రా! వీడు నీకన్నా చిన్నోడే అయినా అమ్మ కోసం ఏమీ తినకుండా అన్నీ తెచ్చినాడు. నువ్వు పెద్దోనివైనా మాత్రం ఏం లాభం” అంటూ "నేను ఎట్లాగైతే ఆకలితో మల మల మాడిపోయానో, అట్లాగే నువ్వు కూడా ఇప్పన్నించీ సల సల సల మండిపోవాలా' అని శపించింది.
చంద్రున్ని పిల్చి 'మలమలలాడిపోతున్న నా కడుపు నిండా అన్నంపెట్టి దాన్ని చల్లగా చేశావు. అందుకని ఇప్పన్నించీ నువ్వు చల్లగా బతకాల' అని దీవించింది.
ఆ రోజు నుండీ సూర్యుడు సలసలా కాగిపోతా సెగలు కక్కుతా వుంటే, చంద్రుడేమో వెన్నెల కురిపిస్తా హాయిగా వున్నాడు.
సస లీ మో | గ ఆశ్రతమి ్ఞ "కొకనాలు-. | (స గడం నా ఇన / సూర ల శ తీ ర్ట ఇ స వ ష్ ఇ యూ ₹6 ఈ వీల్లలు చెప్పిన కథలు
శి కిర్రు. |! కిర్రు. ల! లొడ్డప్పా! ఒకూర్లో ఒకడుండేటోడు. వానికి చిన్నప్పన్నించీ అన్ని పనులు లొడ్డ చేత్తో చేయడం అలవాటు. దాంతో అందరూ వాన్ని లొడ్డప్పా! లొడ్డప్పా! అని అడ్డపేరు పెట్టి ఎగతాళి చేసేటోళ్ళు. కానీ ఎవరన్నా తననలా ఎగతాళి చేస్తే చాలు వాడు కోపంతో కుతకుతలాడిపోయేటోడు. పొట్లాటకు దిగేటోడు. ఓరోజు వాడు చేనుకి పోతా పోతా పెళ్ళాన్ని పిల్చి “ఒసేవ్! మధ్యాన్నం చద్దికట్టుకోని చేనుకాడికిరా' అని చెప్పిపోయాడు. సరేనని ఆమె మాంచి మసాలా వేసి ఘమఘుమలాడేలా కోడికూర వండి మొగుని కోసం పొలానికి తీసుకొని వెళ్ళింది. మొగుడు పొలంలో దూరంగా దున్నుతా కనబన్నాడు. పెళ్ళాం వచ్చింది గీ శ్ జ | [ల (|! సాం (1) ల పా వ (లీ తీర్ర...కిరు... లొర్డప్పా' ఈ 77
చూల్లేదు. ఆమె “ఏమండీ!” అని పిలిచింది. దూరంగా వున్నాడు కదా వానికి వినబల్లేదు. అలాగే దున్నసాగాడు. ఆమె మళ్ళా గట్టిగా “ఏమండీ!” అని పిలిచింది. వూహు... వాడు వులకలేదు. పలకలేదు.
ఎన్నిసార్లు పిలిచినా పలకక పోయేసరికి ఆమె కోపంగా “ఏయ్! లొడ్డప్పా' అని గట్టిగా ఒక్కరుపు అరిచింది. లొడ్డప్పా అనే మాట వినబడగానే వాడదిరిపడి ఎవరబ్బా తననలా పిలిచింది అని కోపంగా తిరిగిచూశాడు. చూస్తే ఇంగేముంది గట్టుమీద పెళ్ళాం కనబడింది. వాడు కోపంతో కుతకుతలాడిపోతూ '“నా పెళ్లానివి, నన్నే లొడ్డప్పా అని పిలుస్తావా' అంటూ కట్టె తీసుకోనొచ్చి ఆమె నెత్తిన ఒక్కటేశాడు. అంతే! ఆ దెబ్బకు పాపం ఆమె తల పగిలి అక్కడికక్కడే చచ్చిపోయింది. భార్య చనిపోవడంతో వాడు భయపడి చుట్టూ చూశాడు. ఎవరూ చూల్లేదులే అనుకుంటా గబగబా గుంతతీసి శవాన్ని బూద్చేసి ఏమీ ఎరుగని అమాయకునిలా ఇంటి కొచ్చేసినాడు.
నాలుగైదు రోజులు గడిచిపోయినాయి. వాని పెళ్ళాం కనబడకపోవడంతో ఎదురింటోళ్లు, పక్కింటోళ్లు 'ఏరా! నీ పెళ్ళాం కనబడ్డం లేదు. యాడికి పోయింది” అనడగసాగారు. దానికి వాడు 'వాళ్ళ వూరిలో తిర్నాలంట. అది చూడ్డానికి వాళ్ళ పుట్టింటికి పోయింది. ఓ నెలదాకా తిరిగిరాదు” అని చెప్పసాగాడు.
నెమ్మదిగా నెల అయిపోయింది. రెండు నెలలు అయిపోయినాయి. అయినా ఆమె తిరిగిరాలా. దాంతో జనాలకు అనుమానమొచ్చింది. కనబడినోడల్లా “ఏరా! నెలకు వస్తాదంటివి. రెండు నెలలు దాటిపోయినా ఇంకా నీ పెళ్ళాం రాలేదేమి” అనడగసాగారు. దానికి వాడు *'ఏం చెయ్యమంటారన్నా! అది ఈ వూరికి రానేరాదుట. నన్నే ఇళ్ళూ, పొలాలు అన్నీ అమ్ముకోని వాళ్ళ వూరికి 78 + పిల్లలు చెప్పిన కథలు
వచ్చేయమంటోంది. దానికేమి పోయేకాలమొచ్చిందో ఏమో” అని చెప్పసాగాడు.
ఒక రోజు వాడు పనుండి చేనుకాడికి పోయినాడు. పెళ్ళాం శవం ఎక్కడైతే బూడద్చిపెట్టాడో, సరిగ్గా అక్కడే తోటకూర చెట్లు బాగా ఏపుగా పెరిగినాయి. అవి వీన్ని చూడగానే గాలి వీచినప్పుడల్లా అటూ యిటూ వూగుతా
“సుయ్... సుయ్... లొడ్డప్పా
సుయ్... సుయ్... లొడ్డప్పా” అనసాగాయి.
ఆ మాటింటూనే వాడు కోపంతో వూగిపోతా వాటిని ఫటఫటమని తెంచి, ఇంటికి తీసకపోయి కూరగిన్నెైలో పదేసి హమ్మయ్య అనుకున్నాడు.
పొయ్యి అంటించిన కాసేపటికి గిన్నెలో కూర కుతకుతకుత ఉడకసాగింది. అందులోంచి బుడగలు
“కప్... ఠప్... లొడప్పా
ఠప్... ఠప్... లౌడప్పా” అంటూ పగిలిపోసాగాయి.
దాంతో వాడు కోపంతో వూగిపోతూ ఆ కూరంతో తీస్కపోయి గాట్లో బరగొద్దు దగ్గర విసిరి పాడేసి హమ్మయ్య అనుకున్నాడు.
బరగొద్డ్దు ఆ కూరంతా నున్నగా తినేసింది. అప్పన్నించీ అది వాడు కనపడ్డం ఆలస్యం
“అంబా... అంబా... లొడ్డప్పా
అంబా... అంబా... లొడ్డప్పా” అనరవసాగింది.
దాంతో వాడు కోపంతో వూగిపోతా ఇంట్లోంచి కత్తి తీసుకొచ్చి దాన్ని ఒక్కటేశాడు. అంతే అది చచ్చూరుకుంది.
క్షిడు...కడు... లొద్దవ్వే! ఈ 19
వాదు దాని చర్మం వలిచి చెప్పులు కుట్టేటోనికి ఇచ్చినాడు. వాడు ఆ బరగొడ్డు చర్మంతో మాంచి అందమైన చెప్పులు కుట్టి ఇచ్చాడు. అవేసుకోని వాడు రోడ్డు మీద నడవడం ఆలస్యం అవి వెంటనే
“కిరు... కిర్రు... లొడ్డప్పా
కిరు... కిర్రు... లొడ్డప్పా” అనడం మొదలు పెట్టినాయి.
దాంతోవాడు కోపంతో వూగిపోతా ఆ చెప్పులను ఇంటి దగ్గరున్న కుక్క ముందుకు విసిరిపాదేసినాడు.
కుక్క ఆ చెప్పులను బాగా పీక్కోని, పీక్కోని తినేసింది. అంతే అప్పట్నించీ వాడు కనబడ్డం ఆలస్యం అది
“భౌ... భౌ... లొడ్డప్పా
భౌ... భౌ... లొడ్డప్పా” అని మొరగసాగింది. 2ళి శ వీల్లలు చెప్పన కథలు
ఆని (1 టమ
దాంతో వాడు కోపంతో వూగిపోతా కట్టె తీస్మోని దాని నెత్తిన ఒక్కటేశాడు. అంతే దెబ్బకు తలపగిలి అది అక్కడికక్కడే చచ్చురుకుంది. వాడు దాన్ని తీసకపోయి విసిరి చెరువులో పడేసి హమ్మయ్య పీడ విరగడైంది అనుకున్నాడు.
కానీ అప్పన్నించీ ఆ చెరువులో ఎవరన్నా నీళ్ళకోసం బిందె ముంచుతే చాలు
దుడ... బుడ... లొడ్డప్పా” అని శబ్దం రాసాగింది.
వానికి ఆ చెరువును ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దాన్ని కొట్టలేడు. చంపలేడు. ఏమీ చేయలేడు. అందుకే అది “లొడ్డప్పా... లొడ్డప్పా” అని అరుస్తున్నా ఏమీ చేయలేక నోరు మూసుకోని మట్టసంగా వుండిపోయినాడు.
క హా!
దోసకాయల దొంగ నక్క కథ
ఒకూర్లో ఒకరైతున్నాడు. ఆయన పొలంలో దోసకాయల విత్తనాలు వేసినాడు. వానలు బాగా పడడంతో కొన్ని రోజుల్లోనే తోటలో దోసకాయలు బాగా కాశాయి. అది చూసి రైతు ఎంతో సంబరపన్నాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబల్లేదు.
ఆ వూరికి ఆనుకునే ఒక పేద్ద అడవి వుంది. ఆ అడవిలో ఒక నక్కుంది. దానికి దోసకాయలంటే చాలా ఇష్టం. రోజూ రాత్రి చీకటి పడగానే దొంగచాటుగా తోటలోకి పోయి మంచి మంచి దోసకాయల్ని కడుపునిండా తిని, తన పెళ్ళాం, పిల్లలకోసం మిగతావన్నీ కోసుకోని వ్యాయా నే
నువులు. . ఓ సంచి నిండా వేసుకోని వెళ్ళిపోయేది. వీ శిస్. భ్టోస్తూం స గ్ర షి కత ్తాగర చ నే వనక నధ వ తవ కాం
పొద్దున్న రైతొచ్చి చూస్తే ఇంకేముంది, తోటలో ఒక్క దోసకాయ కూడా కనబడేది కాదు. ప్రతిరోజూ అంతే. కాసినకాయలు కాసినట్టు నక్క ఎత్తుకుపోయేది. దాంతో రైతు కట్టె తీసుకోని రాత్రిపూట చేనుకి కాపలా కాయడం మొదలు పెట్టినాడు. కానీ పాపం ఎంతసేపని మేలుకోగలడు. ఏదో ఓ సమయంలో నిద్రొచ్చి కళ్ళు మూసుకుపోతాయిగదా. అంతే... అందుకోసమే ఎదురుచూసే ఆ దొంగ నక్క ఠక్కున లోపలికి దూకి రైతు మళ్ళా కళ్ళు తెరిచేసరికి కాయలన్నీ మాయం చేసేసేది.
ఇక ఇట్లాగైతే లాభం లేదనుకున్న రైతు బాగా ఆలోచించి చివరకు చిన్న చిన్న కత్తులు తీసుకోనొచ్చి దోసకాయల చుట్టూ పెట్టి అవి కనబడకుండా ఎండుగడ్డి కప్పినాడు. మామూలుగానే ఆ రోజు రాత్రి కూడా నక్క హుషారుగా ఈల వేసుకుంటూ తోట కాడికి వచ్చింది. చూస్తే రైతు ఎక్కడా కనబళ్ళేదు. ఈ రోజు రైతు ఇంకా రాలేదేమో, వచ్చేలోగా అన్నీ తినేయాలనుకొని ఎగిరి తోటలోకి దుంకింది. అంతే... కత్తులు సర్రున లోపలికి దిగబన్నాయి. పాపమా నక్క బాధతో విలవిలలాడిపోతా “కుయ్యో! మొర్రో! అని అరుస్తా గబగబా తోట దాటి అడవిలోకి వురికింది. దానికి కత్తులు గుచ్చుకున్నాయి గదా, ఒళ్ళంతా ఒకటే రక్తం కారిపోసాగింది. నడవలేక, నడవలేక నడవసాగింది. అలా కొంత దూరం పోగానే దానికి బాగా నీరసమొచ్చి ఓ బండమీద కూలబడి అలాగే నిద్రపోయింది.
రక్తం ఎట్లుంటాది. ఎరగా, బంక బంకగా వుంటాది కదా. నక్క బండమీద పడుకున్న కాసేపటికి రక్తం బాగా ఎండిపోయి దాని కడుపు బండకు అట్లనే అతుక్కుపోయింది. పొద్దున్నే నక్కకు మెలకువ వచ్చి లేద్దామంటే అతుక్కు పోయింది కదా, లేవలేకపోయింది. ఎంత గింజుకులాడినా లాభం లేకపోయింది.
దాంతో ఇక లాభం లేదనుకుని ఆ నక్క కళ్ళనీళ్ళు పెట్టుకోని వానదేవున్ని
దోసకాయల దొంగ నక్ళ కథ ఈ 23
తలచుకుంటా 'భగవంతుడా! బుద్ధి గడ్డి తిని మంది సొమ్ముకు ఆశపద్డా. ఇంగెప్పుడూ దొంగతనం చేయను. ఈ ఒక్కసారికీ నన్ను కాపాడినావంటే ఏడు రాత్రులు మేలుకోని నీకు భజన చేస్తా అని మొక్కు కునింది. అది విన్న వానదేవుడు సరేనని పెద్దవాన కురిపించాడు. నీళ్ళు బాగా తగిలీ తగిలీ రక్తమంతా కరిగిపోయింది. దాంతో ఆ నక్క బైటపడి బతుకు జీవుడా అనుకుంటా పరుగెత్తుకోని ఇంటికి చేరుకునింది.
పెళ్ళాం పిల్లలకు జరిగినందంతా చెప్పి 'మొక్కు తీర్చుకోకుంటే దేవునికి కోపమొస్తాది. ఎలాగైనా మొక్కు తీర్చుకోవాల' అనింది. పెళ్లాం పిల్లలు కూడా సరే అన్నారు. కానీ భజన చేయాలంటే తాళాలు కావాలి గదా. తాళాలంటే ఇంటికి వేసేవి కావు. దేవుని దగ్గర ఒకడు పాట పాడుతుంటే పక్కనే కూర్చొని ఇంకొకడు ఆ పాటకు తగ్గట్టు రెండుచేతుల్లోనూ పట్టుకోని ఠప్... ఠప్... అని కొడుతుంటాడు చూడు అవి. ఆ తాళాలు దాన్ల దగ్గర లేవు. చుట్టు పక్కల ఎవరినడిగినా మా దగ్గర లేవంటే మాదగ్గర లేవన్నారు. మరి ఎట్లాగబ్బా అని ఆలోచించీ, ఆలోచించీ చివరకు ఓ ఉపాయం వేసినాయి.
అడవిలో నక్క నక్క పెళ్ళాం దారి పక్కన ఓ పొదలమాటున కూచోని వచ్చిపోయే జనాలను బాగా గమనించసాగాయి. కాసేపటికి ఒకడు పక్క వూరిలో భజన చేసి తాళాలు పట్టుకొని వస్తా కనబడ్డాడు. వెంటనే ఓ నక్క దారిలో వానికి కనబడేటట్లుగా ఓ చోట చచ్చిందాని మాదిరి పడిపోయింది. వాడు ఆ నక్కను చూసి 'ఇదేదో ఇప్పుడే చచ్చిపోయినట్లుంది. వెంటనే తీస్కపోతే నేను నా పెళ్ళాం పిల్లలు బాగా కూర వండుకోని తినొచ్చు” అనుకొని లొట్టలేసుకుంటా తాళాలు కిందపెట్టి దాని దగ్గరకు పోయినాడు.
వాడు తాళాలు కిందపెట్టి అలా వెళ్ళడం ఆలస్యం నక్క పెళ్ళాం వెనుకనుండి ఎగిరి దుంకి దాన్లను నోట కరుచుకొని “వూ” అంటూ వూల వేస్తూ పారిపోయింది. 24 ఈ విల్లలు చెవ్పీన కథలు
అ అరుపు వినబడగానే అంతవరకూ చచ్చిందాని లక్క గమ్మున పడుకొన్న నక్క ఛటుక్కున పైకిలేచి పారిపోయింది. వాడు ఆశ్చర్యపోయి తిరిగిచూస్తే తాళాలు కూడా లేవు. దొంతో వాడు లబోదిబోమని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయినాడు. జా గల
దడా / డ్ర్ ళ్య జే నక్క నక్క పెళ్ళాం దేవునికి మొక్కుకున్నట్లుగా గుడికి పోయి వరసగా
ఏడు రాత్రులు భజన చేసి, తమ మొక్కు చెల్లించుకున్నాయి. దోసకాయల దొంగ నక్క కథ ఈ 25
చిలకమ్మ ఇల్లు అనగనగా ఒకవూరు. ఆ వూర్లో ఒక రైతు వుండేటోడు. ఆయనకు ఇద్దరు
ఆడపిల్లలు. వాళ్ళు చిన్నగున్నప్పుడే వాళ్ళమ్మ చచ్చిపోయింది. తల్లిలేని పిల్లలు కదా అందుకని ఆ రైతు వాళ్ళను ఎంతో (ప్రేమగా చూసుకునేటోడు. తిట్టేటోడు కాదు. కొట్టేటోడు కాదు. అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చేటోడు. అంతలో అనుకోకుండా ఓ రోజు పాము కరచి ఆ రైతు కూడా చచ్చిపోయినాడు. ౨. ప్రాపం! ఆ ఇద్దరు ఆడపిల్లలు కిందా న మీదా వడి ఏడ్చినారు. చిన్నప్పుడే తల్లి 17:11 చచ్చిపోయింది, ఇప్పుడు తండ్రికూడా లేడు. సగ! మరి వాళ్ళు బతికేదెట్లా. అప్పుడు ఒకాయన (టన సస
-.. “మీరేమీ బాధపడొద్దండి. చిలకమ్మని మీ (స తగ్! బంధువు ఒకామె వుంది. ఆమె చాలా క... మంచిది. ఆమె దగ్గర, చాలా దబ్బుంది. మీరు శక్త గ నా వెళితే తప్పకుండా సాయం చేస్తాది అని | క్త వ న నలవో ఇచ్చినాడు. కానీ చిలకమ్మ న (41 న్ గీ .
గ నే హ్ =
ఎక్కడుంటాదో ఆ వూర్లో ఎవరికీ తెలీదు. | శ రీ న్న (క ప
పెదపాప చిలకమ్మ కోసం వూరొదిలి వెదుకుతా వెదుకుతా పోసాగింది. అలా పోతా పోతా వుంటే దారిలో ఓ పెద్ద గుడి కనబడింది. ఆమె గుళ్ళోకిపోయి 'పూజారీ! పూజారీ! మా చిలకమ్మ ఇల్లు ఎక్కడో నీకేమైనా తెలుసా” అనడిగింది. దానికా పూజారి 'ఈ గుడంతా శుభంగా ఊడ్చి బండలు తుడ్చు. అప్పుడు చెప్తా అన్నాడు. ఆమె సరేనని గుడంతా కన్నెగ వూడ్చి, బండలు అద్దం లెక్క తుద్చింది. అది చూసిపూజారి సంతోషంగా “ఇలాగే సక్కగ ఓ మూడు మైళ్ళు పో. అక్కడ ఓ మల్లె చెట్టుంటాది. దాన్నడుగు చెప్తాది' అన్నాడు.
పెదపాప అలాగేనంటూ అడవిలో నడుస్తా నడుస్తా సక్కగ మూడుమైళ్ళు థ్ (00 పోగానే మల్లె చెట్టు కనబడింది. ఆమె దాని [| | క/( గ్ దగ్గరకు పోయి 'మల్లెచెట్టూ! మల్లెచెట్టూ! ఖ్ నో ల (గ మా చిలకమ్మ ఇల్లు ఎక్కడో నీకేమైనా నీ గ్త/ఢ గ్య తెలుసా! అనడిగింది. దానికా మల్లెచెట్టు [స్తా క! గ్రోటో / “నీళ్ళు లేక నేను ఎండిపోతున్నా. నాకోళ్న సి న్ న చెంబు నీళ్ళు పోయి అప్పుడు చెప్తా' భా యయెగ అనింది. వెంటనే పెదపాప 'చెంబేంది ॥ బ్ర గ్గ హా ఏకంగా బిందె నీళ్ళు పోస్తా అంటూ పక్కనే | 19) వున్న బావిలోంచి ఓ పెద్ద బిందెతో నీళ్ళు గ్ర ' | తీసుకొచ్చి పోసింది. అప్పుడా మల్లెచె గ 1! కవ అష్ట యా. మైకా మా మాముంటాడు. ఆయన్నడుగు పో చెప్తాడు అనింది.
చిలకన్ను ఇల్లు + 27
పెదపాప అలాగేనంటూ అడవిలో నడుస్తా నడుస్తా సక్కగ మూడు మైళ్ళు పోగానే మామ ఇల్లు కనబడింది. ఆమె మామ దగ్గరకు పోయి 'మామా! మామా! చిలకమ్మ ఇల్లు ఎక్కడో నీకేమైనా తెలుసా” అనడిగింది. దానికా మామ 'నా ఇల్లంతా తెల్లగా సున్నంపూసి, ఇంటిముందు ముగ్గులు పెట్టు. అప్పుడు చెప్తా అన్నాడు. ఆమె సరేనని ఇల్లంతా చక్కగ సున్నం కొట్టీ, ఇంటి ముందు పేడతో అలికి రంగురంగుల ముగ్గులు పెట్టింది. అప్పుడు మామ సంతోషించి “ఇలాగే సక్కగ ఓ మూడు మైళ్ళు పో. అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టుంటాది. దానిపైనే చిలకమ్మ ఇల్లుందేది” అని చెప్పినాడు.
పెదపాప అలాగేనంటూ అడవిలో నడుస్తా నడుస్తా మూడు మైళ్ళు పోగానే ఓ పేద్ద మర్రిచెట్టు, దాని మీద చిలకమ్మ ఇల్లు కనబన్నాయి. పెదపాప సంతోషంగా చెట్టు పైకెక్కి తలుపు కొట్టగానే చిలకమ్మ బైటకొచ్చి ఆమెను చూసి “ఏమిట్లా వచ్చినావు' అనడిగింది. దానికాపాప ఏడుస్తూ 'మా నాయన పాము కరిచి చచ్చిపోయినాడు. మాకు నీవు తప్ప బంధువులు ఇంకెవరూ లేరు. అందుకే వచ్చినా” అనింది.
చిలకమ్మ పెదపాపను ఓదార్చి, కుర్చీలో కూచోబెట్టి 'ఏమి తింటావు" అనడిగింది. దానికి పెదపాప 'నువ్వు ఏమి పెడ్తే అవి తింటా” అనింది. చిలకమ్మ లోపలికి పోయి మంచి మంచి దోర దోర జాంపండ్లు తెచ్చి పెట్టింది. అవి తినగానే రత్నాలు, వారాలు, బంగారం ఓ సంచి నిండా పోసిచ్చి 'ఇవి తీస్మపోయి వోయిగా ఐతుకు' అనింది.
'పెదపాప బంగారంతో వస్తా వుంటే దారిలో మామ కనబడి ఇంటికి పిలుచుకుపోయి పట్టులంగా, పట్టుపైటా కొత్తవి ఇచ్చినాడు. అవి ఏసుకోని సంబరంగా తిరిగి వస్తావుంటే దారిలో మల్లెచెట్టు కనబడి తలలో పెట్టుకో అంటూ మంచి మల్లెపూలిచ్చింది. మల్లెపూలు తలనిండా పెట్టుకొని వస్తావుంటే పూజారి 28 ఈ విల్లలు చెప్పిన కథలు
కనబడి తియ్యని ప్రసాదం పెట్టాడు. అది తిని ఇంటికి చేరి చెల్లిని పిలిచి చిలకమ్మ మనకు చాలా బంగారమిచ్చింది. ఇద్దరం సగం సగం పంచుకోని హాయిగా ఐతుకుదాం'” అనింది.
కానీ చిన్నదానికి పొగరెక్కువ. అందుకని “నువ్వేంది నాకిచ్చేది. నేనేపోయి దీనికి రెండింతలు తెచ్చుకుంటా' అంటూ చిలకమ్మ కోసం బైలుదేరింది.
చినపాప పోతా పోతా వుంటే దారిలో ఓ పేద్ద గుడి కనబడింది. ఆమె గుళ్ళోకి పోయి “పూజారీ! పూజారీ! మా చిలకమ్మ ఇల్లు ఎక్కడో చెప్పు" అనడిగింది. దానికా పూజారి 'ఈ గుడంతా శుభ్రంగా వూడ్చి బండలు తుడ్డు. అప్పుడు చెబ్లా అన్నాడు. దానికి ఆమె “భీ! ఛీ! నేనేంది. బండలు తుద్చడమేంది. నీకళ్ళకు నేనేమైనా పనిమనిషి లెక్క కనబడ్డున్నానా' అంటూ విసురుగా అఆన్నించి బైటకొచ్చేసింది.
చినపాప దారి తెలీక నడుస్తా నడుస్తా ఆరుమైళ్ళ దూరం పోగానే ఆమెకు మల్లె చెట్టు కనబడింది. ఆమె దాని దగ్గరకు పోయి 'మల్లెచెట్టూ! మల్లెచెట్టూ! మా చిలకమ్మ ఇల్లు ఎక్కడో చెప్పు” అనడిగింది. దానికా మల్లెచెట్టు “నేను నీళ్ళు లేక ఎండిపోతున్నా. నాకు ఓ చెంబు నీళ్ళు పోస్తే అప్పుడు చెబ్లా అనింది. దాని కామె కోపంగా “ఛీ! ఛీ! నేనేంది నీకు నీళ్ళు పోయడమేంది. నేనేమైనా నీదాసీ ననుకుంటున్నావా' అంటూ దాని కొమ్మలు అందినవి అందినట్టు ఫటఫటమని విరిచి పారేసింది.
మళ్ళా ఆమె నడుస్తా నడుస్తా దారి తెలీక ఓ ఆరుమైళ్ల దూరం పోగానే మామ ఇల్లు కనబడింది. మామ దగ్గరకుపోయి 'మామా! మామా! మా చిలకమ్మ ఇల్లు ఎక్కడో చెప్పు అనడిగింది. దానికి మామ “మా ఇల్లంతా తెల్లగా సున్నం పూసి, ఇంటిముందు ముగ్గులు పెట్టు. అప్పుడు చెప్తా అన్నాడు. దానికి చినపాప ఛ! ఛ! నేనేంది నీ ఇంటికి సున్నం కొట్టడమేంది. నువ్వు చెప్తే ఎంత చెప్పకుంటే ఎంత” అంటూ విసురుగా ఆన్నించి వెళ్ళిపోయింది.
లాగా
మళ్ళా నడుస్తా నడుస్తా దారి తెలీక అట్లా ఇట్లా ఓ ఆరుమైళ్ళు పోగానే ఓ పేద్ద మర్రిచెట్టు, దానిమీద చిలకమ్మ ఇల్లు కనబన్నాయి. చినపాప సంబరంగా చెట్టుపైకెక్కి తలుపు కొట్టింది. చిలకమ్మ బైటికొచ్చి చినపాపను చూసి “ఏమి ఇట్లా వచ్చినావు' అనడిగింది. దానికి చినపాప పొగరుగా “ఏం రాగూడదా... మా అక్కకు ఇచ్చినట్లే నాక్కూడా దానికి రెండింతలు బంగారమియ్యి. తీస్కోనిపోతా' అనింది.
చిలకమ్మ చినపాపను కుర్చీలో కూచోబెట్టి 'ఏం తింటావు” అనడిగింది. దానికి చినపాప కాలుమీద కాలేసుకోని వూపుతా “మంచిమంచి దోర దోర జాంపండ్లు తీస్కరాపో. తింటా' అనింది. చిలకమ్మ అలాగేనంటూ లోపలికి పోయి బాగా మురిగిపోయిన జాంపందడ్లు తెచ్చి చేతిలో పెట్టి 'ఇంగపో నా ఇంట్లోంచి” అని బైటికి దొబ్బేసి తలుపులు మూసేసుకొనింది. . -
చినపాప వస్తా వస్తా వుంటే దారిలో మామ కనబన్నాడు. 'మామా! మామా! నాకు మంచి పట్టు బట్టలు పెట్టవా" అనడిగింది. “అలాగేరా అంటూ మామ ఇంట్లోకి తీస్మపోయి చినిగిన లంగా, చినిగిన పైటా ఇచ్చి పంపినాడు.
చినపాప చినిగిన లంగా, చినిగిన పైటతో వస్తా వస్తా వుంటే దారిలో మల్లెచెట్టు కనబడింది. చినపాప మల్లెచెట్టు దగ్గరికి పోయి “మల్లె చెట్టూ! మల్లెచెట్టూ! నాకు మంచి మల్లెపూలు ఇయ్యవా” అనడిగింది. దానికి ఆ మల్లెచెట్టు అలాగే తీసుకో అంటూ వాడిపోయిన మల్లెపూలు ఇచ్చింది.
చినపాప చినిగిన లంగా, చినిగిన పైటా, వాడిపోయిన పూలతో వస్తా వస్తా వుంటే దారిలో గుడి కనబడింది. లోపలికి పోయి “పూజారీ! పూజారీ! బాగా ఆకలి వేస్తోంది. నాకు మంచి ప్రసాదం పెట్టవా' అనడిగింది. దానికా పూజారి అలాగే తీసుకో అంటూ పాచిపోయిన ప్రసాదం పెట్టినాడు.
చినపాప చినిగిన లంగా, చినిగిన పైట, వాడిపోయిన పూలతో, మల మల మాడే కడుపుతో ఏడ్చుకుంటా ఇంటికి చేరుకునింది. ౩౮ ఈ విల్లలు చెప్పున కథలు
ఒల్లో మా మల్లన్న సచ్చిపాయ ఒకూర్లో ఒక రాణి వుండేది. ఆమె చాలా మంచిది. ఎవరైనా బాధపడుతుం చూసి తట్టుకునేది కాదు. ఆ రాణి దగ్గర ఒక సాకలామె వుండేది. ఆ సాకలావె ఎప్పటికప్పుడు వూళ్ళో జరిగిన సంగతులన్నీ రాణికి పూసగుచ్చినట్టు వివరించేది బాగా పాటలు పాడేది. ఎప్పుడూ నవ్వుతా అందరినీ నవ్విస్తా వుండేది. అందుక సాకలామంటే రాణికెంతో ఇష్టం. ఆమెకు కావల్సినవన్నీ ఇస్తూ ప్రేమగ చూసుకొనేది. 0) జప? న్న్న
ళో గ యాం భభ ్ము ల;
మూ మల్లన్న సచ్చిపాయ ఈ 31
ఒక రోజు ఎప్పట్లాగే సాకలామె బట్టలన్నీ శుభంగా వుతుక్కోనొచ్చి రాణి ముందు వేసింది. రాణిబట్టలు లెక్కబెట్టుకుంటా వుంటే వెక్కి వెక్కి ఏడ్వసాగింది. అది చూసి రాణి 'అయ్యో పాపం! మా సాకలామెకు ఎంత కష్టమొచ్చిందో ఏమో. ఎప్పుడూ ఏద్బనిది ఈ రోజు ఏడుస్తోంది అనుకొని “ఏమే! ఎందుకలా ఏడుస్తున్నావు” అనడిగింది. దానికి సాకలామె ఏడుస్తానే 'ఏం చెప్పమంటావమ్మా! నిన్ననే మా మల్లన్న సచ్చిపోయినాడు. అది గుర్తొచ్చి ఏడుస్తున్నా అంది. సాకలామె బాధ చూసి రాణికి కూడా బాధేసింది. మల్లన్నంటే ఆమెకు ఎంత కావల్సినోడో ఏమో అనుకోని రాణి కూడా ఏద్చడం మొదలుపెట్టింది.
రాణి ఏడుస్తా వుంటే చూసిన రాజు “అయ్యోపాపం! నా రాణికి ఎంత కష్టమొచ్చిందో ఏమో. ఎప్పుడూ ఏద్బనిది ఈ రోజు ఏడుస్తోంది” అనుకొని రాజు కూడా ఏద్చసాగాడు.
రాజు ఏడుస్తా వుంటే చూసిన మంత్రులు, సేనాధిపతులు 'అయ్యో పాపం! మా రాజుకు ఎంత కష్టమొచ్చిందో ఏమో. ఎప్పుడూ ఏడ్చనిది ఈ రోజు ఏడుస్తున్నాడు” అనుకొని వాళ్ళు కూడా ఏద్బసాగారు.
మంత్రులు, సేనాధిపతులు ఏడుస్తావుంటే చూసిన భటులు, దాసీలు 'అయ్యో పాపం! మా మంత్రులకు, సేనాధిపతులకు ఎంత కష్టమొచ్చిందో ఏమో. ఎప్పుడూ ఏద్బనిది ఈ రోజు ఏడుస్తున్నారు” అనుకొని వాళ్ళు కూడా ఏద్పసాగారు.
భటులు, దాసీలు ఏడుస్తా వుంటే చూసిన ప్రజలు 'అయ్యో పాపం! మా భటులకు, దాసీలకు ఎంత కష్టమొచ్చిందో ఏమో. ఎప్పుడూ ఏద్బనిది ఈ రోజు ఏడుస్తున్నారు” అనుకొని వాళ్ళు కూడా ఏద్బసాగారు.
అలా రాజ్యంలో ఏ వీధి చూసినా, ఏ ఇండ్లు చూసినా ఏడుపులే ఏడుపులు. 32 అ. విల్లలు చెప్పిన కథలు
ఒకరిని చూసి మరొకరు కిందా మీదా పడి ఏద్చసాగారు. ఆ సమయంలో పక్క వూరినుండి ఓ వర్తకుడు సరుకులు అమ్ముదామని ఆ రాజ్యానికొచ్చినాడు. చూస్తే ఇంగేముంది. వూరువూరంతా ఏడుస్తున్నారు. వాడు ఆశ్చర్యపోయి 'ఇదేందబ్బా నన. బ్ ౧ [1 .. | అందరూ ఇట్లా ఏడుస్తున్నారు అనుకొని ఒకని దగ్గరకు పోయి “ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తావున్నావు' అనడిగినాడు. దానికి వాడు 'ఏమోబ్బా, నాకు తెలీదు. మా భటులు, దాసీలు ఏడుస్తా వుంటే నేనూ ఏడుస్తావున్నా' అన్నాడు. వాడు భటులు, దాసీల దగ్గరకు పోయి 'ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తా వున్నారు” అనడిగినాడు. దానికి వాళ్ళు 'ఏమోబ్బా” మాకు తెలీదు. మా మంత్రులూ, సేనాధిపతూ ఏడుస్తా వుంటే మేమూ ఏడుస్తా వున్నాం” అన్నారు. మా మల్లన్న నచ్చిపాయ ఈ 33
వాడు మంత్రులు, సేనాధిపతుల దగ్గరికి పోయి “ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తావున్నారు”' అనడిగినాడు. దానికి వాళ్ళు 'ఏమోబ్బా' మాకూ తెలీదు. మా రాజు ఏడుస్తా వుంటే మేమూ ఏడుస్తా వున్నాం” అన్నారు.
వాడు రాజు దగ్గరికి పోయి “ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తా వున్నావు” అనడిగినాడు. దానికి రాజు 'ఏమోబ్బా, నాకు తెలీదు. మా రాణి ఏడుస్తా వుంటే నేను ఏడుస్తా వున్నా అన్నాడు.
వాడు రాణి దగ్గరకు పోయి “ఏం జరిగింది? ఎందుకట్లాఏడుస్తా వున్నావు" అనడిగినాడు. దానికి రాణి 'ఏమోబ్బా, నాకు తెలీదు. మా సాకలామె ఏడుస్తా వుంటే నేనూ ఏడుస్తా వున్నా! అనింది.
వాడు సాకలామె దగ్గరకు పోయి “ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తా వున్నావు" అనడిగినాడు. దానికి సాకలామె ముక్కు చీదుకుంటూ 'మా మల్లన్న సచ్చిపోయినాడు. అందుకే ఏడుస్తున్నా అనింది. మల్లన్నంటే ఎవరో అర్ధంగాక వాడు సాకలామెను 'మల్లన్నంటే ఎవరు” అనడిగినాడు.
దానికా సాకలామె వెక్కి వెక్కి ఏడుస్తా 'మల్లన్నంటే కూడా తెలీదా. చిన్నప్పన్నుండీ నేనెంతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచుకున్న మా గాడిద' అనింది.
అది విని వాడు 'ఓరినీ! గాడిద చచ్చిపోయినందుకు ఇంత మంది ఏడుస్తున్నారా' అనుకొని కిందా మీదా పడి నవ్వుకుంటా వెళ్ళిపోయినాడు. విషయం తెలిసిన రాణి, రాజు, మంత్రులు, సేనాధిపతులు, భటులు, దాసీలు, ప్రజలు అందరూ నవ్వుకున్నారు. ౩4 అ. విల్లలు చెవ్పిన కథలు
ఉల్లిగడ కథ (సో
అనగనగా ఒకూరు. ఆ వూర్లో ఒక ఐస్క్రీమ్తూ మిరపకాయా, టమోటా, ఉల్లిగడ్డా వుండేవి. ఆ నాలుగూ మంచి స్నేహితులు. ఎక్కడికళ్ళినా కల్పే వెళ్ళేవి. కల్సే తిరిగేవి. హాయిగా ఆదతా, పాడతా, ఎగురుతా, దుంకుతా ఆనందంగా వుండేవి.
. ఖ్ ర్మ (గో ఆట థ్రీ
ఓ రోజు నాలుగూ కల్సి స్నానం చేసొద్దామని మధ్యాన్నం తుంగభద్రా నదికి వెళ్ళినాయి. నాలుగూ నీళ్ళలో దూకి సరదాగా ఈత కొట్టసాగాయి. కానీ పాపం నీళ్ళు తగిలీ తగిలీ ఐస్క్రీము నీళ్ళలోనే కరిగిపోయింది. మిగతా మూడూ బైటకొచ్చీ చూస్తే ఇంకేముంది. ఐస్‌క్రీం లేదు. తమ మిత్రుడు చచ్చిపోయినందుకు బాధతో మిరపకాయా, టమోటా, ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్పినాయి.
ల్లగ ౩7 ౩
ఓరోజు మిగతా మూడు కొండారెడ్డి బురుజు చూసొద్దామని సరదాగా సాయంకాలం చల్లగాలిలో హుషారుగా షికారుకు బైలుదేరినాయి. అలాపోతావుంటే దారిలో బజ్జీలు వేసేటోడు మిరపకాయను చూసి ఠక్కున చేతిలోకి తీసుకోని, శెనగపిండిలో ముంచి సలసలకాగే వేడివేడి నూనెలో వేసేసినాడు. పాపం మిరపకాయ అఆవేడికి తట్టుకోలేక అక్కడికక్కడే చచ్చి పోయింది. తమ మిత్రుడు చచ్చిపోయి నందుకు బాధతో టమోటా, ఉల్లిగడ్డా వెక్కి వెక్కి ఏడ్చినాయి. 1322 8:32 2382
ల లన తలి ---
కికాకాకులనిమక కామము క కు నా
న డా
చ ాావాతించరో్్ భ్)
ణే త ఈ ఓ రోజు టమోటా, ఉల్లిగడ్డా సినిమా చూసొద్దామని ఆనంద్ టాకీస్‌కు
వెళ్ళినాయి. రెండుటికెట్లు కొనుక్కోని సీట్లలో కూర్చోని ఆనందంగా సినిమా చూడసాగాయి. అంతలో ఒకడు చీకట్లో చూసుకోక సరిగ్గా టమోటా మీద కూర్చున్నాడు. అంతే పాపం టమోటా కడుపు పగిలి అక్కడికక్కడే చచ్చిపోయింది. తనకు మిగిలిన ఒక్క మిత్రుడూ చచ్చిపోయినందుకు బాధతో ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్చింది. 36 ఈ వ్ల్లలు చేన్పీన కథలు
అలా ఉల్లిగడ్డ ఏడ్చుకుంటా, ఏడ్చుకుంటా పోతా “ఐస్‌క్రీం చచ్చిపోతే నేనూ, టమోటా చచ్చిపోతే నేనాకృన్నే ఏడ్చా. మరి రేప్పొద్దున నేను చచ్చిపోతే నాకోసం ఎవరు ఏడుస్తారు” అని ఓ చోట కూచోని దిగులుగా బాధపడసాగింది.
ఆకాశంలో పోతున్న పార్వతీ పరమేశ్వరులు అదిచూసి 'ఏమబ్బా! పాపం ఉల్లిగడ్డ అంత బాధపడుతోంది. దానికేం కష్టమొచ్చిందో, ఏమో” అని రివ్వున కిందకు దిగినారు.
“ఉల్లిగడ్డా! ఉల్లిగడ్డా! ఎందుకే అలా ఏడుస్తున్నావ్. ఏం నీ బాధ' అన్నారు. దానికి ఉల్లిగడ్డ కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతుండగా వెక్కి వెక్కి ఏడుస్తా “ఏముంది సామీ! ఐస్‌క్రీం చచ్చిపోతే నేనూ, టమోటా, మిరపకాయ ఏడ్చినాం. మిరపకాయ చచ్చిపోతే నేనూ, టమోటా ఏడ్చినాం. టమోటా చచ్చిపోతే నేనొకృన్నే ఏడ్చా. మరి రేప్పొద్దున నేను చచ్చిపోతే నాకోసం ఎవరు ఏడుస్తారు. నాకెవరూ లేరే అనింది బాధగా.
అది విన్న పరమేశ్వరుడు 'అయ్యో పాపం!' అని జాలిపడి, “నువ్వేమీ బాధపడకు. ఇప్పన్నుంచీ నిన్ను ఎవరైతే చంపుతారో _ వాళ్ళే నీకోసం ఏద్చేలా వరం ఇస్తున్నా పో తీ ఆ కో అన్నాడు. హ్ /
అంతే... ఆ రోజు నుండీ (్ ప్రో ర్ట స్త ఉల్లిగడ్డను ఎవరు కోసినా వాళ్ళ షి స్యా గ కళ్ళ నుండే బాధతో నీళ్ళు శ ఈ లో కారు (యి. ఇ | న్న
క్షే వల్లిగద్ద కథ ఈ 7
నక్క - సింహం
ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక సింహముండేది. అది చాలా ఎత్తుగా, బలంగా వుండేది. దానిగోళ్ళు చాలా వాడిగా వుండేవి. అది ఒకరోజు దారిలో పోతున్న నక్కను పిల్చి 'నువ్వు నా దగ్గర పనిచెయ్. అడవిలో నీకు ఎక్కడైనా సరే ఏనుగు కనబడగానే నాకొచ్చి చెప్పు. నేను పోయి దాని తల పగలగొట్టి మెదడు . మాత్రం తింటాను. మిగతా శరీరం నువ్వు తిందువు గానీ' అనింది. నక్క సరేనని సంతోషంగా ఒప్పుకొనింది.
టా.
38 ఈ విల్లలు చెవ్పీన కథలు
సింహం రెండు పెద్ద పెద్ద గుండ్లను తెచ్చి పక్కపక్కన పెట్టి ఆ గుండు మీద నుండి ఈ గుండు మీదకు, ఈ గుండు మీదనుండి అ గుండు మీదకు దుంకి 'నా కళ్ళు ఎర్రగైనాయా' అనడిగింది. నక్క కాలేదనింది. సింహం మళ్ళా ఆ గుండు మీదనుండి ఈ గుండు మీదకు, ఈ గుండు మీదనుండి ఆ గుండు మీదకు దూకి “ఇప్పుడు ఎర్రగైనాయా' అనడిగింది. నక్క ఎర్రగైనాయనింది.
“ఐతే నువ్వు పోయి ఎక్కడైనా ఏనుగు వుందేమో చూసి రాపో అనింది. నక్క అడవంతా వెతికి ఓ చోట ఏనుగు కనబడగానే పరుగు పరుగున వచ్చి సింహానికి చెప్పింది. వెంటనే సింహం నక్క వెంబడి పోయి ఏనుగు కనబడగానే దాని మీదకు దుంకింది. తన వాడైన పంజాతో ఏనుగు తలమీద ఒక దెబ్బ బలంగా కొట్టేసరికి దాని తలపగిలి మెదడు బైటికొచ్చింది.
సింహం నక్కకు ఇచ్చిన మాట ప్రకారం దాని మెదడు తిని శరీరం నక్కకు ఇచ్చేసింది. ఇలా కొద్దిరోజులు పోగానే నక్క ఏనుగుల శరీరాలు తినీ తినీ బాగా కొవ్వెక్కింది. నెమ్మదిగా దానికి కళ్ళు నెత్తిమీదికి ఎక్కినాయి.
ఒకరోజు నక్క 'నేనేంది! సింహం దగ్గర పని చేయడమేంది. నేనే ఏనుగులను వేటాడి దాని మెదళ్ళు తింటాను” అనుకొని దారిలో ఓ కుక్క పోతా వుంటే పిల్చి “నువ్వు నా దగ్గర పనిచెయ్. అడవిలో ఎక్కడైనా నీకు ఏనుగు కనబడగానే నాకొచ్చి చెప్పు. నేను వెళ్ళి దాని తల పగలగొట్టి మెదడు మాత్రం తింటాను. శరీరం నువ్వు తిందువుగానీ" అనింది. కుక్క సరేనని ఒప్పుకొనింది.
నక్క కూడా సింహం లాగానే రెండు పెద్ద పెద్ద గుంద్లను తెచ్చి పక్కపక్కన పెట్టి ఆ గుండు మీద నుండి ఈ గుండు మీదకు, ఈ గుండు మీద నుండి ఆ గుండు మీదకు దుంకి 'నా కళ్ళు ఎర్రగైనాయా” అనడిగింది. కుక్క కాలేదనింది. నక్క మళ్ళా ఆ గుండు మీద నుండి ఈ గుండు మీదకు, ఈ గుండు మీదనుండి
నక్క = నీంహం ఈ 39
ఆ గుండు మీదకు దుంకి “ఇప్పుడు ఎర్రగైనాయా”' అనడిగింది. కుక్క మళ్ళా కాలేదనింది. అప్పుడు నక్క “అలా కాదు ఐనాయని చెప్పు” అనింది. సరే అని నక్క కళ్ళు ఎర్రగా కాకపోయినా కుక్క ఐనాయి అనింది.
“ఐతే నువ్వు పోయి ఎక్కడైనా ఏనుగు వుందేమో చూసి రాపో) అని పంపిచ్చింది. కుక్క అడవంతా వెతికి ఒక చోట ఏనుగు కనబడగానే పరుగు పరుగున వచ్చి నక్కకు చెప్పింది. వెంటనే నక్క కుక్క వెంబడిపోయి ఏనుగు కనబడగానే ఎగిరి దాని మీదకు దూకి ఏనుగు తల పగలగొట్టాలని కాలితో బలంగా బాదసాగింది.
ఎంకైనా నక్క నక్కే, సింహం సింహమే. సింహంలాగా నక్కకు పదునైన గోళ్ళు వుండవు కదా. అందుకే ఏనుగుకేమీ కాలేదు. దానికి తన తల మీద కూర్చోని కొడుతున్న నక్కను చూడగానే పిచ్చ కోపమొచ్చింది. వెంటనే తొండంతో దాన్ని పట్టుకోని గిరగిరగిర తిప్పి అకృన్నే వున్న ఓ గుండుకేసి దభీమని కొట్టింది.
ళ్ ళో
ఆ దెబ్బకు నక్క తల పగిలి అక్కడికక్కడే చచ్చిపోయింది. అది చూసిన కుక్క కుయ్యో మొర్రో అనుకుంటా అడవిలోకి పారిపోయింది. శ9 ఈ వీల్లలు చేవ్పీన కథలు
గుడ్డోడు - గూనోడు ఒకూర్లో ఒక గుడ్డోడుంటాడు. ఒక రోజు వాళ్ళమ్మ వాన్ని పిల్చి 'రేయ్! ఇంటి ముందు కసువు కొట్రా' అనింది. వాడు గుడ్డోడు కదా. కళ్ళేడ కనబడ్డాయ్. చీపురు తీస్కోని వాళ్ళిల్లే అనుకొని పక్కింటి ముందు నున్నగా కసువు నూకి చెత్తంతా ఎత్తుకొచ్చి వాళ్ళింటి ముందు పోసినాడు. కొంచెంసేపున్నాక వాళ్ళమ్మ బయటి కొచ్చి చూస్తే ఇంటి ముందంతా చెత్త కుప్పలే. దాంతో వాళ్ళమ్మకు కోపం ముంచుకొచ్చి “గుడ్డి నాయాలా! ఫో నా ఇంట్లోంచి” అని వాన్ని తన్ని తరిమేసింది. పాపం వాడు ఏడ్చుకుంటా పోసాగాడు. అదే వూర్లో ఒక గూనోడుండేటోడు. వాళ్ళమ్మ వాన్ని పిల్చి “ఒరే! కడవతో నీళ్ళెత్తుకురాపో' అని పంపిచ్చింది. పాపం వాడు గూనోడు కదా. ఐనా ఎట్లాగో కష్టపడి కడవ వీపు మీద పెట్టుకోని వస్తా వస్తా వుంటే దారిలో ఓ పెద్ద బోటురాయి కాలికి తగిలింది. వాడు దభీమని బోర్లా బొక్కల పడిపోయినాడు. కడవ ముక్కలు ముక్కలై పోయింది. అది చూసి వాళ్ళమ్మ “ఓరి గూనినాయాలా! బంగారం లాంటి కడవ పగలగొట్టావు గదరా. ఫో నా ఇంట్లోంచి” అని వాన్ని దొబ్బేసింది. వాడు ఏడుస్తా పోతా వుంటే దారిలో గుడ్డోడు ఎదురైనాడు. ఇద్దరూ జరిగిందంతా ఒకరికొకరు చెప్పుకోని బాధపన్నారు. జద్దోద = గాన ఈ ఈ
గుడ్డోడు, గూనోడు ఊరుదాటి అడవిలో పోతావుంటే దారిలో వాళ్ళకి ఓ సలాకి దొరికింది. అది తీసుకొని పోతా పోతా వుంటే అడవిలో ఓ చోట ఓ గాడిద మేత మేస్తూ కనబడింది. గూనోడు నెమ్మదిగా శబ్దం రాకుండా వెనుక వేపుగా వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. ఇద్దరూ దానిమీదెక్కి పోసాగారు. దారి మధ్యలో ఆకలైంది. అడవి గదా మంచి మంచి పండద్లుంటాయి. వాటిని కోసుకోని కడుపునిండా తిని, కొన్ని పళ్ళు మూటగట్టుకోని గాడిద మీద వేసుకోని పోసాగారు. కొంతదూరం పోయేసరికి చీకటి పడింది. వాళ్ళకు భయమేసింది. అడవంటే మాటలా, రాత్రయితే పులులు, సింహాలు తిరుగుతుంటాయి. కనబన్నామనుకో కసుక్కున చంపి తినేస్తాయి. ఎట్లాగబ్బా అనుకుంటుంటే దూరంగా ఒక గుహ కనబడింది. ఇద్దరూ దాంట్లోకి పోయి పండ్లు తిని, చిన్న చలిమంటేసుకుని గాడిదను ఒక మూల
అర్భరాత్రి ఏవేవో సీ యా లై న్్ శబ్దాలు వినబడుతుంటే ా లీ డ్రి గుడ్డోడు నిద్రలేచాడు. ౪ _ స ్టో" శీయ్! ఏవో మాటలు "హమ 1. 17 దూరంగా వినబడ్డ్తున్నాయ్. గ ళ్ య (7 కా మృ అన్నాడు. సరేనని గూనోడు _-ాహయౌోన ఖ 1... క్ట న్స్ + చప్పుడు చెయ్యకుండా పోయి చాతీ (ల నొ చూస్తే గువా ముందు శ నలుగురు దొంగలు . . రః కూచున్నారు. ఒకొక్కడు నల్లగా మ కండలు తిరిగి, పెద్ద పెద్ద 42 ఈ విల్లలు చెప్పిన కథలు
మీసాలతో చిన్న చిన్న రాక్షసుల్లా వున్నారు. నలుగురూ మధ్యలో దీపం పెట్టుకొని తాము దోచుకొచ్చిన బంగారమంతా ముందేసుకోని పంచు కుంటున్నారు. గూనోడు నెమ్మదిగా వెనక్కొచ్చి గుడ్డోనికి చూసిందంతా చెప్పినాడు. గుడ్డోనికి కళ్ళు కనబడవు గానీ తెలివిమాత్రం చాలా ఎక్కువ. వాడు ఒక ఉపాయం ఆలోచించినాడు. గాడిద అరవకుండా దాని మూతిని గట్టిగా తాడుతో కట్టేశాడు. సలాకి గ | గు తీసి నిప్పుల మీద ఎరగా కాల్చి, 'రేయ్ ను ళా ఫస € నువ్వు పోయి వాళ్ళకు కనబడకుండా గ! వగ యో రాయి తీసుకొని దీపం మీదకు విసురు, (గా 1|| లీ దీపం పడిపోగానే ఓ అని దయ్యం మాదిరి ఉత! ల య క! అరువు” అన్నాడు. వాడు సరేనని పోయి (తస మ. రాయి తీసుకోని దీపాన్ని ఒక్కేటు కొట్నాడు జు "ల జ దీపం ఎగిరి కింద పడి ఆరిపోయింది. ్ళీ గ ఆలి ఈ] దీపం కిందపడడంతో ఒక్క సారిగా ళ్ స ల అంతా చీకటైపోయింది. హాం [మ కలిసున్న) 'ఎవరా దీపాన్ని మయునే' జ నం నా! రాయితో కొట్టింది! అన్నాడు ఓ దొంగ. అంతలో గుహలోపల్నించి సన్నగా అరుపు వినబడింది. ఇంకో దొంగ గజగజా వణుకుతూ "కొంప దీసి లోపల దయ్యాలున్నాయేమో' అన్నాడు. గుడ్గోడు లోపల గాడిద కట్లిప్పి వేడి వేడి సలాకీతో దానికి వాత పెట్నాడు. అంతే అది నొప్పికి గిలగిలలాడతూ బైటకురికింది. గుహకడ్డంగా దొంగలు కూచున్నారు గదా. దాంతో గాడిద అడ్డమొచ్చిన దొంగల్ని ముందుకాళ్ళతో ఇద్దర్నీ, వెనక కాళ్ళతో ఇద్దర్నీ ఫెదేల్ ఫెదేల్మని ఎగిరి తన్నింది. ఆ దెబ్బలకు నలుగురు దొంగలు ఎగిరి దభీమని పన్నారు. వెంటనే గుడ్డోడు లోపల్నించి ఓ అంటూ దద్దోదు - గూనోదు ఈ 43
దయ్యమ్మాదిరి గట్టిగా అరవసాగాడు. అంతే దొంగలు అదిరిపడి దయ్యాలే తమని తన్నినాయనుకోని భయపడి ప్రాణాలరచేతిలో పెట్టుకోని తలో దిక్కూ పారిపోయినారు. దొంగలు పారిపోయిన కాసేపటికి గుడ్డోడు, గూనోడు ఆడికి చేరుకున్నారు. చూస్తే ఇంకేముంది. వజ్రాలు, రత్నాలు, హారాలు, బంగారం కుప్పలు, కుప్పలున్నాయి. ఇద్దరూ చెరిసగం పంచుకోవాలనుకున్నారు. గూనోడు ఓ పడి తీసుకొచ్చి నీకో పడి, నాకో పడి అంటూ పంచసాగాడు. మధ్యలో గూనోనికి ఆశపుట్టింది. గుడ్గోనికెట్లాగు కళ్ళు కనబడవుగదా వాడేం చూస్తాడ్లే అనుకోని తానేమో పడి నిండుగా పోసుకుంటా, గుడ్డోనికి సగం పదే పోయసాగాడు. గుడ్డోనికి కళ్ళు కనబడకపోయినా వినికిడి శక్తి ఎక్కువ. గూనోడు పోసుకుంటున్నప్పుడు గలగలమనే శబ్దం ఎక్కువసేపు, తనకు పోసేటప్పుడు తక్కువ సేపు వస్తోందని గ్రహించాడు. దాంతో అనుమానమొచ్చి వాని కుప్ప, వీని కుప్ప తడిమి చూసినాడు. గూనోసి థిప్రేమో పెద్దగుంది. తన కుప్పేమో చిన్నగుంది. దాంతో వానికి కోపమొచ్చి ల్ర్నీ మోసం చేస్తావురా గూని నాయాలా” అని ఎగిరి వాని నడ్డిమీద ఒక్క తన్ను ళ గోనినోడు అంతే గూనోడు ఎగిరి దభీమని కిందపన్నాడు. గుడ్డోదు కొట్టిన దెబ్బకి ౧ వాని దూనీ పోయి నడుం సక్కగా ఐపోయింది. కోపమ్మీదున్నాడు గదా గూనోడు “అదీ చూసుకోలా. వెంటనే లేచి 'నన్నే తంతావురా గుడ్డి నాయాలా' అని పక్కనే శ్లడివున్న ముళ్ళకంప తీసుకోని గుడ్డోని ముఖంమీద ఒక్కటి పెరికినాడు. అంతే ముళ్ళకంపలోని ముళ్ళు కళ్ళమీద తగిలేసరికి ఒక్కసారిగా వానికి కళ్ళొచ్చేసినాయ్.” వెంటనే గుడ్డోడు 'ఏయ్! నాకు కళ్ళొచ్చేసినాయ్” అంటూ ఆనందంగా ఎగిరి గంతులేయసాగాడు. అంతలో సక్కగా నిలబడి నోరెళ్ళబెట్టుకోని చూస్తున్న గూనోన్ని చూస్తూ 'రేయ్! నీ గూనేదిరా' అన్నాడు. అప్పుడు వాడు వెనక్కు చూసుకున్నాడు. ఇంకెక్కడి గూని, గుడ్డోని దెబ్బకు ఎప్పుడో పోయింది గదా. గూనోడు కూడా గూని పోయినందుకు సంబరంతో ఎగిరి గంతు లేసినాడు. ఇద్దరూ ఆ తర్వాత బంగారం చెరీ సగం పంచుకోని ఆనందంగా ఇంటికి బైలుదేరినారు. ఈ ఈ విల్లలు చెవిన కళబ
. ” పిల్లల కథలది ఒక అద్భుత ప్రపంచం. ఒకప్పుడు కథలన్నీ మౌభ్కంగా .
- చెప్పుకున్నవే. ఒకవిధంగా ఇవి విశ్చజనీనమైనవి. పాత్రలు, ప్రదేశాలు, , ఇతర అంశాలు మారవచ్చుగానీ మూల 'కథ' అన్నీ భాషలలోనూ
- ' ఆశ్చర్యం గొలిపేలా ఒకేలా వుంటుంది. ఒక రకంగా ఇవి కాలాసికి న్ నిలిచిన కథలు. కథలు చెప్పేవాళ్ళు మూలం చెడకుండా తమదైన | అద్భుత మెరుపులు దిద్దారు. చెప్పేవాళ్ళతోపాటు కథలు అంతరించి _ . పోకుండా వాటిని తెలుగులో లిఖితరూపం ఇచ్చే ప్రక్రియ ఇటీవల = మొదలయింది. నామన్, 'బజారా' హరదికిషన్లు ఈ కథలను ఆయా ప్రాంతాల భాషలో అక్షరబద్ధం చేశారు, చేస్తున్నారు. _ పిల్లల కథలంటే నీతి కథలు అనే నమ్మకం విస్తృతంగా ఉంది.
- కాని కథ అంటే పిల్లల్ని ఆశ్చర్యపరచాలి, ఆనందపరచాలి, గిలిగింతలు పెట్టీ నవ్వించాలి. అన్నిటికీ మించి కథలంటే ఆసక్తి, ప్రేమ కలిగించాలి. కథలనుంచి పిల్లలు నేర్చుకునేది ఏమీ ఉండదా? ఉంటుంది. కాస్ .... . ౨ ఒక.కథనుంచి ఏం తెలుసుకుంటారు, ఏం నేర్చుకుంటారు, ఏం స అలవళుచుకుంటారు అన్నది పిల్లలకి వదిలెయ్యాలి. పిల్లలకు అందంగా, జ. . ళా కా . న న గ ని న స కా | ఆ నంత స యు ్ట