Telugu Paryavarana Vaadam Vaamapakshalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
( హ్ ౧. గ. ఇ ॥ క / చీ గ 1 ._శామణక్రూక్యూ, న. య ” చా ల్ న. స్త్ర ్ | టా న ఆలా జ్యా న క్ ను మ జ బయల పష హు క్ మ ఖీ పం క ౫ వ శీ వ పల పోనమననాయమాయా నా న య! అనే. శ! క లా. ర్; పు! య న గా. ల నన్నో త్రి అవ కళ కహ స వ శ లల సో గ్ ఇ సో ు! శే లా క్షే కై. లె / ల కాడ 4 శ్చ షె శ సక్ . లో గీ న త్న ఛా 1 ళా శ్ న్. / గ టే, న. * క్ | ” తే ళ్ స్వ ] ట్ టే /| | |. లై క మి ఇ ల
పర్యావరణవాదం ఆలి వామపక్షాలు తి ను యు అర్జనా ప్రసౌద్ ప్రజాశక్తి బుక్హౌన్ ₹-1-187/7/2 చిక్కదనసల్లి హైదరాబాద్-260 ఫోన్ 27660013
0230 06 ంంంయుంలటలుు 2206 116 ఓ61 నీల0? తీ[01॥1202 9౯25261 క్యాంటం10 41 1074 ౧6౪ 06101 0004) ద్ర 6 27 న న స ము? ళు ౨౬౦ (ర జ ప్రచురణ సంఖ్య 924 ప్రచురణకాలం జనవరి, 2005 వెలరు 35/- త్రతులకు ప్రజాశక్తి బుక్‌హౌస్ 1-1-187/1/2, చిక్కడపల్లి హైదరాబాద్-20 ఫోన్ 27660613 బ్రాంచీలు హైదరాబాద్, విజయవాడ విశాఖపట్నం, తిరుపతి ఖమ్మం, హన్మకొంద, నల్గొండ గుంటూరు ముద్రణ ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్
విషయసూఛిక 1 ఉవోద్దాతం - ఉలటవవలంంవలలం కే 2 గిరిజనులు - భూమి సమస్య ల కేతి 8 గిరిజన జీవనోపాధి - వ్యవసాయరంగ సంక్షోభం. .......... 25 4 గిరిజనులు, అడవులు, ప్రపంచీకరణ లం త్తీషే 5 అభివృద్ధి - నిర్వాసిత రాజకీయాలు లర్? 6 _ భారత ప్రజుస్వామ్యంలో గిరిజనులు క... 7 చివరి మాట - ఐక్య సంఘటన నిర్మాణం ఆ రిర్
క ఉపోద్దాతం
అల్లో
ంలర్టార్ సరోవర్ భారీనీటిపారుదల పథకం కింద మహారాష్ట్రలో నర్మదా నదీకీరంపై వెలసిన కుగ్రామం మనిబేలి ముంపునకు గురయ్యే ప్రాంతంగా గుర్తించబడింది. 19921 వర్షాకాలంలో ఆ గ్రామానికి నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్తలు చేరుకొని ముంపు ప్రక్రియను అడ్డుకునేందుకు గాంధేయ పద్ధతుల్లో సత్యాగ్రహం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 'మేము మునిగిపోతాము కాని (గ్రామం విడిచి వెళ్లం” అన్న నినాదంతో ఈ పోరాటం [ప్రారంభమయ్యింది దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ముంపు ప్రక్రియను వేగిరపరచి ప్రజలు గ్రామం వదలి వెళ్లేలా చర్యలు చేపట్టింది అయితే ఈ (ప్రయత్నాల్లో (ప్రభుత్వం విఫలమైంది సత్యాగ్రహం కొన్ని నెలలపాటు సాగినా చివరికి ప్రభుత్వం పోలీసు బలగాల సహాయంతో ఆ '్రాంఠాన్ని ఖాళీ చేయించింది మనిబేలి సత్యాగ్రహం నర్మదా బచావో అందోళన్ ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకురావడమే కాకుండా విశాలమైన రాజకీయ ముఖచిత్రంపైకి భారతీయ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ఒక ప్రబల శక్తిగా అవతరింపచేసింది
జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణ కోసం స్థానికంగా సాగే అన్ని ఆందోళనలను, పోరాటాలను విశాలమైన ప్రాతిపదికన నిర్వచించడానికి 'పర్యావరణ పరిరక్షణ ఉద్యమం అన్న పదాలను ఉపయోగించసాగారు అభివృద్ధిపై కొనసాగుతున్న వాదప్రతివాదనల్లో పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యం అంశాలు కూడా అంతర్భాగాలయ్యాయి భారతదేశంలో తొలిసారిగా, అంటే 1978లో, ఉత్తరప్రదేశ్‌లోని గద్వాల్ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా చిప్కో ఉద్యమం మొదలైంది 1970 నుండి 1980 తొలి సంవత్సరాలు వరకు అడవులు నీటి హక్కులపై అనేక పోరాటాలు జరగడంతో పర్యావరణానికి సంబంధించిన మరిన్ని పెద్ద అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిలో స్థానికులకు అడవులపై సాముదాయ హక్షుల కల్పన, భారీ పధకాల ద్వారా పునరావాసం, తరలింపు, భారీ పధకాలు, హరిత విప్లవం, భారీ ప్రాజెక్టుల నిరర్ధకత (ప్రధానమైనవి
క్ష
ఆధునిక అభివృద్ధి మంత్రం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఆది నుండి ప్రభుత్వాలు (ప్రభుత్వాధికారులు అనెసరిస్తున్న వైఖరిని పైన పేర్మొన్న పోరాటాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి వలస పాలన నుండి విముక్తి అయినా భారత పాలకులు కూడా వలసవాద అభివృద్ధి విధానాలను కొనసాగిస్తూ ఆధునిక పెట్టుబడిదారీ అజెండాను ముందుకు నెట్టారు ఫలితంగా సాధారణ ప్రజలు, అణగారిన వర్గాలు మరింత పేదరికాన్ని అనుభవించాల్సి వస్తోంది ఈ విషయాన్ని భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే ఉంది భారీ పరిశ్రమల న్థాపన వాటికి అవసరమైన ముడి సరుకుల కోసం అన్వేషణ దేశంలో పర్యావరణ సమతుల్యం దెబ్బతినడానికి ప్రధానకారణాలని ఉద్యమకారులు వాదిస్తూనే ఉన్నారు
నవీన అభివృద్ధి విధానాలకు ప్రత్యామ్నాయంగా “పేదల పర్యావరణ వాదం” అనే సిద్ధాంతాన్నీ పర్యావరణ పరిరక్షణ ఉద్యమం సూచించింది ఆధునిక ప్రగతి మార్గాలను విశ్లేషణాత్మకంగా విమర్శించడమే కాకుండా సాంప్రదాయబద్ధమైన స్వయం సమృద్ధిగల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే ఈ సిద్ధాంతం ప్రధాన లక్ష్యం ఈ విధమైన పర్యావరణవాదం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న సాంప్రదాయ పర్యావరణ విధానాల కంటే విభిన్నమైంది ప్రభుత్వం మానవుల ఉనికి లేని సహజసిద్ధమైన అటవీ ప్రాంతాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే అనేక జాతీయవనాలు, జంతుపరిరక్షణ ప్రదేశాలు ఏర్పాటయ్యాయి. వలస పాలనానంతరం వన్యప్రాణుల సంరక్షణకు, ప్రకృతి వైవిధ్యాన్ని కాపాడటానికి ఇవి ఎంతో దోహదపడగలవని మన పాలకులు తలపోశారు అయితే ఈ తరహా విధానాలను ఉద్యమకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు, ఇతర వర్గాలకు అవి ప్రమాదకరమైనవని వాదించారు సహజ వనరుల పరిరక్షణ లక్ష్యాలు నెరవేరాలంటే స్థానికులకు జీవనోపాధి కల్పించడమే మార్గమని వారు విశ్వసించారు. స్థానిక సముదాయాలే పర్యావరణ పరిరక్షణకు సరైన సాధనాలని, అటవీ ఉత్పత్తులను అవసరమైన మేరకు ఉపయోగించుకునేందుకు వారికి న్యాయపరమైన హక్కులను కల్పించాలని కూడా వారు కోరారు కనుక ప్రాంతీయ పర్యావరణ సంరక్షణ, పరిరక్షణలకు సాంప్రదాయ హక్కులను, సంస్థలను పునరుద్ధరించడమే వక్రైక మార్గమని తీర్మానించారు
అయితే ఈ వాదనకు విరుద్ధంగా భారత వామపక్షాలు ఆధునిక శాస్త్ర సాంకేతిక వరిజ్ఞానంతో కూడిన పారిశ్రామిక ప్రగతిని, వ్యవసాయాఖభివృద్ధిని సాధారణంగా బలపరుస్తున్నాయి. అయితే ఆధునిక అభివృద్ధి విధానాలకు వానుపక్షాలు గుడ్డిగా మద్దతు పలకవు భారత సమాజంలోని నిరుపేదలైన వర్ణాలకు అభివృద్ధి పలాలు అందేలా అభివృద్ధి పధకాలను రూపొందించాలన్నదే వారి అభిమతం ఆర్థికవ్యవస్థలో భాగమైన ఉత్పాదక వనరులు ఆస్తులను సమానంగా పంపిణీ చేసి భూస్యామ్య, పెట్టుబడి దారీ వ్యవస్థల కింద నలిగిపోతున్న పీడిత వర్గాలను ఆదుకొని సమసమాజ స్థాపనకు ద్వారాలు తెరవాలన్నది వారి ఆశయం ముఖ్యంగా షెడ్యూల్డు కులాలు తెగలకు చెందిన ప్రజల సంక్షేమానికి వారు ప్రాధానృతనిస్తారు అందుకే ఆధునిక ప్రగతి సూత్రాలకు వామపక్షాల సమర్ధన, సాంప్రదాయ వ్యవస్థపై వారి విమర్శనాత్మక వైఖరిని తెలియ జేస్తుంది భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమం భావిస్తున్నట్లుగా
లి
సాంప్రదాయ వ్యవస్థలు ఉదారమైనవని మనుగడ సాధించగలవని వారికి ఎలాంటి నమ్మకం లేదు అందుకు విరుద్ధంగా వారు పురాతన సంబంధాలు, సాంప్రదాయ వ్యవస్థలను భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడి చిహ్నాలుగా గుర్తిస్తారు మరోవైపు ఆధునిక అభివృద్ధి మంత్రం సామాజికంగా ఆర్ధికంగా, రాజకీయంగా మనగలదని వారి నమ్మకం అయితే ఈ ప్రక్రియ అంత సునాయాసంగా సాధ్యమయ్యేది కాదని అందుకు రాజ్య స్వభావంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుందని, ప్రస్తుతం అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల్లో గణనీయమైన మార్పులు చేయాల్సి ఉందని వారి భావన
స్వాతంత్రానంతరం దేశం అవలంబించిన నెహ్రూ అభివృద్ధి పంధా నవీన పెట్టుబడిదారీ వ్యవస్థకు పునాదులు వేసిందని వామపక్షాలు నమ్ముతున్నాయి ఫలితంగా అర్ధ భూస్యామ్య సంబంధాలు బలపడి, పేదలు- ధనికుల మధ్య అంతరాలు మరింత పెరిగాయి అలాగే సహజ వనరులను అశాస్త్రీయంగా వాణిజ్య వినియోగం కోసం వెలికి తీయడానికి పెట్టుబడిదారీ విధానాలే కారణం పర్యావరణం ప్రాతిపదికన సాధ్యతను చూడకుండా, సామాజికంగా, ఆర్థికంగా సమానత్వంతో కూడిన పెట్టబడిదారియేతర వ్యవస్థనే వామపక్షాలు గుర్తిస్తాయి ఇలా చేయడం ద్వారా ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని, పారిశ్రామికీకరణను వ్యతిరెకించని ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాలను ప్రతిపొదిస్తున్నట్లుగా వామపక్షాయ కనిపిస్తాయి ఆధునికత అంటే సమసమాజ వ్యవస్థకు ఉపయోగకరమైన రీతిలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమాజంలోని అణగారిన వర్గాలకు ఉత్పాదక వనరులను అందుబాటులోకి తేవడమేనని వారి వాదన
ఆధునికతకు వ్యతిరేక వైఖరిని అవలంబించకుండా ఉత్పత్తి సంబంధాలను మార్పు చేయడానికి వామపక్షాలు ఏ విధంగా ఉద్యమించాయో ఈ పుస్తకంలో మనం ముందు ముందు తెలుసుకుందాం. పర్యావరణ సిద్ధాంతకర్తలు అందుకే వామపక్షాలను రాజ్యపెట్టుబడిదారీ సమర్ధకులని చిత్రీకరించారు వారిది అతినిర్టారిత ఆర్థిక వైఖరని విమర్శించారు సామ్యవాదం, పెట్టుబడిదారీ వీధానం మధ్య మౌలికమైన తేడాలు లేవని, రెండూ పర్యావరణాన్ని ధ్వంసం చేయడమే గాక స్థానిక ఆచారాలను, హక్కులను, సాంప్రదాయ విజ్ఞానాన్ని మరుగుపరుస్తాయని వాదిస్తారు ఈ కారణంగానే సహజ వనరులపై స్థానికులకు హక్కుకల్పించాలని వామపక్షాలు సాగించిన ఉద్యమాలను భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఎన్నడూ గుర్తించలేదు
వామపక్షాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మధ్య మరో చర్చనీయాంశం స్టానిక పరిపాలన, సహజవనరులపై ప్రజల ప్రజాస్వామిక హక్కు సాంప్రదాయ అధికార కేంద్రాల పునరుద్ధరణ కంటే రాజ్యమే గుణాత్మకమైన, ఆచారణాత్మకమైన పాత్ర పోషించి స్థానిక వనరులను సమగ్రంగా అభివృద్ధి పరచడమే మేలని వామపక్షాలు వాదిస్తాయి. ఇది పేదల పక్షాన పోరాడే పర్యావరణ ఉద్యమకారుల వైఖరికి భిన్నమైంది స్థానిక, కేంద్ర ప్రభుత్వాల స్వరూపంలో మార్పులు తెచ్చి అవి ప్రజల న్యాయబద్ధమైన హక్కులను గుర్తించేలా చేయగలిగితే సమగ్రమైన అభివృద్ధి సాధ్యమని వామపక్షాలు నమ్ముతాయి. అందుకే ఉద్యమకారులు కోరుకుంటున్న విధంగా
౩
సహజవనరుల యాజమాన్యం నుండి ప్రభుత్వం వైదాలగరాదని (ప్రస్తుత ఆర్థిక సంస్కరణల యుగంలో అది వాంఛనీయం కూడా కాదని అవి పేర్కొంటున్నాయి ముఖ్యంగా ఈ కారణాల వల్లే వామపక్షాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి సమస్యల ప్రాతిపదికన ఇరుపక్షాలు ఉమ్మడిగా పోరాటాలు నిర్వహించినప్పటికీ వాటి మధ్య పూర్తి సమన్వయం కుదరలేదు
భారత గిరిజన సమాజాల అభివృద్ధి నేపధ్యంలో వామపక్షాలు పర్యావరణ ఉద్యమాల మధ్య నెలకొన్న వాదప్రతివాదనలను స్టూలంగా వివరించడానికి ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది ఈ చర్చ కనీసం మూడు కారణాల వల్ల ప్రాముఖ్యతను సంతరించుకుంది మొదటిది, వామపక్షాలకు, పర్యావరణం ఉద్యమానికి గిరిజన ప్రజలమధ్య, వారు అధికంగా నివసించే ప్రాంతాలలో పని చేసిన అపారమైన అనుభవముంది ఈ ప్రాంతాలలో ఇతర గిరిజన హక్కుల ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి గాంధేయవాద స్ఫూర్తితోనే ఈ పోరాటాలు జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల లక్ష్యాలతో ఇవి ఏకీభవిస్తాయి రెండవది, గిరిజనాభివృద్ధిపై చర్చను ఆధునిక అభివృద్ధి, బలహీనమైన పర్యావరణ వ్యవస్థలు, స్థానిక ప్రజలపై దాని ప్రభావంపై కూడా చర్చగా భావించాల్సి ఉంటుంది పర్యావరణ ఉద్యమకర్తల వాదనలు ఈ అంశాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి గిరిజన చరిత్ర పునర్నిర్మాణాన్ని సాంప్రదాయ జీవనశైలి, పద్ధతుల పునరుద్ధరణతో ముడిపెట్టి ఆధునిక ప్రగతి కంటే సాంప్రదాబద్ధమైన విధానాలే స్థానికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఉద్యమకారులు వాదిస్తున్నారు నర్మదా, ఇతర చిన్నచిన్న ఉద్యమాలు కలిసి వేదికగా ఏర్పడ్డ ప్రజా ఉద్యమాల జాతీయ కూటమి ౮210021 41112006 0! 600165 240౪76౧6౧6) విషయంలో ఈ వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది చివరిది, వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన (ప్రాంతాల్లో తమకున్న అనుభవం వల్ల పర్యావరణ నిపుణులు, సీడ్ధాంతకర్తల విశ్లేషణ నుండి వామపక్షాలు చాలా నేర్చుకోవచ్చు ముఖ్యంగా, తమ స్టూల విశ్లేషణలో పర్యావరణ అంశాన్ని అంతర్భాగం చేయడంలో ఉద్యమకారుల సూచనలు వామపక్షాలకు ఉపయోగపడతాయి
మరోవైపు, పర్యావరణ ఉద్యమకర్తలు సాంప్రదాయం, సముదాయ పద్ధతులనే అంశాల మీద జరిపిన పరిశోధనలు, ఆధునిక ప్రగతిపై వారి విమర్శతో రాజకీయ ఆర్ధిక అంశాలను మిళితం చేస్తే అవి ఎంతో వాస్తవమైనవిగా కనిపిస్తాయి దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం ఈ విషయమై చర్చించడానికి ఎంతో అనుకూలంగా ఉందని ఇక్కడ గుర్తు చేయడం అనివార్యం ఆర్థిక సంస్కరణల నూతన దశ, గిరీజన ప్రాంతాలపై మతతత్వ శక్తుల దండయాత్ర, వ్యవసాయ రంగంలో ప్రబలుతున్న సంక్షోభం దృష్టా భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమం, వామపక్షాల మధ్య మైత్రి ఎంతైనా అవసరం నర్మదా కేసులో సుప్రీం కోర్టు తీర్పు, అటవీ ప్రాంతాల నుండి ప్రజల తరలింపునకు వెలువడ్డ ఆదేశాలు కూడా నయా ఉదారవాద, (ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటానికి అవకాశం, వేదికలను కల్నిస్తాయి ఈ నేపధ్యంలోనే ఈ పుస్తకం వామపక్ష పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల మధ్య
త్తే
ఉన్న సారూప్యాలను తేడాలను పరిశీలిస్తుంది గిరిజనుల భవిష్యత్తుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశాలను పరిష్కరించాలంటే ఈ చర్చ ఏ దిశగా పయనించాలో కూదా ఈ పుస్తకం సూచిస్తుంది ఆధునికతను వలసవాదంతోసమానం చేయడం
సాంప్రదాయ ఆర్ధునిక పద్ధతుల మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఆధునిక పద్ధతుల పట్ల వ్యతిరేకత పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుల కార్యకలాపాలను సూచిస్తాయి ఈ పరిణామ క్రమం ప్రాముఖ్యత ముఖ్యంగా వలసపాలన, సామ్రాజ్యవాదం విశ్లేషణ సందర్భంగా వెలుగు చూస్తుంది ఈ అంశంపై వచ్చిన చాలా వ్యాసాలు 'వలస పొలన' దేశంలో పర్యావరణ పరిరక్షణకు గీటురాయిగా పేర్కొన్నాయి ముఖ్యంగా సాంప్రదాయబద్ధమైన ఆచారాలు, ఆటవీ ఉత్పత్తుల వినియోగ పద్ధతులు స్థిరత్వం, పర్యావరణ అనుకూల జీవన విధానాలను పారిశ్రామిక శక్తులు, పెట్టుబడిదారీ వ్యవస్థలు విచ్చిన్నం చేశాయి. దేశ వనరులపై ప్రభుత్వ పెట్టుబడిదారీ గుత్తాధిపత్యం పెరిగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది వలస పాలకులు దేశంలోని భూమి, అడవులు, సహజవనరులపై సంపూర్ణ హక్కులు సాధించారు 19వ శతాబ్దం ఆరంభం నుండి బ్రిటీష్ పాలన కూడా ఇదే విధానాన్ని అవలంబించింది స్వాతంత్రానంతరం కూడా సహజ వనరులను విచక్షణారహితంగా కాల్లగొట్టే సౌొంప్రదాయాన్నే భారత పాలకులు కొనసాగించారు పరిశ్రమలకు అవసరమయ్యే వనరులను వెలికి తీయడం సహజ వనరుల యాజమాన్యంగా ఈ రెండు శకాల్లో కొనసాగిందని, కొనసాగుతూనే ఉందని గిరిజన హక్కుల కోసం పోరాతున్న కార్యకర్తలు చెబుతున్నారు ఈ తరహా వనరుల వినియోగానికి మూడు ప్రధానమైన లక్షణాలున్నాయి మొదటిది ఆహార సేకరణ తరుగుదల, జీవనాధారం కోసం వాణిజ్య ఆర్ధిక వ్యవస్థవైపు గిరిజనులు మళ్లడం గిరిజనుల జీవితం దిగజారడానికిగల ప్రధాన కారణాల్లో ఇది ప్రముఖమైనది ఆర్ధిక, మార్కెట్ వ్యవస్థ నుండి గిరిజనులు దూరంగా ఉండేవారని అంతకుముందు భావించేవారు పరిశ్రమల కోసం వనరులను భారీస్థాయిలో వినియోగించడం ప్రారంభించగానే స్థానిక గిరిజన సముదాయాలు బలహీనపడ్డాయి. వలసపాలనకు ముందు ఉన్న సర్దుబొటు ధోరణి కూడా కనుమరుగయ్యింది సాంప్రదాయ సాంస్కృతిక ఆచారాలు, వనరుల వినియోగాన్ని నిర్దేశించే స్థానిక పాలనాపద్ధతులు ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కారణంగా మూలన పడ్డాయి చివరగా, విశాలమైన మార్కెట్ వ్యవస్థను శాసించే వ్యాపార, వాణిజ్య సంస్థలు సముదాయ, వ్యక్తిగత స్థాయిని నిర్ధారించసాగాయి. ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా సముదాయ ప్రయోజనాలను నీరుగార్చింది స్తానిక సముదాయాల ప్రయోజనాలకు పూర్వం (వలసపాలనకు ముందు) ఎలాంటి ముష్పు ఉండేది కాదు సమకాలీన విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఎందరో పూర్వపు సుస్టిర వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేసి, దయగల వలసవాద పాలనా సిద్దాంతాన్ని బలపరచినా చివరికి వారి విశ్లేషణ ఆధునిక పారిశ్రామిక దేశాలు, వెనుకబడిన సమాజాల మధ్య అలాంటి అగాధాన్నే సృష్టించింది
పారిశ్రామిక ఉత్పత్తి దోపిడిదారీ వ్యవస్థకు దారి తీసి, వెనుకబడిన సమాజాల బలహీనతను ఆసరాగా తీసుకొని విస్తరిస్తుందన్న అవగాహన పైనే పర్యావరణ ఉద్యమ విశ్లేషణ
ర్
ప్రధానంగా ఆధారపడి ఉంది పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న సోషలిస్టు క్యాపిటలిస్టు దేశాలు పర్యావరణంపై, గిరిజనులకు దానితో ఉన్న బాంధవ్యంపై వినాశకరమైన ప్రభావం చూపాయని వారి వాదన అలాగే వలసవాద, వలసవాదానంతర (ప్రభుత్వాలు అనుసరించిన పారిథామిక విధానాల మధ్య ఎలాంటి తేడాలు లేవని రెండూ పారిశ్రామిక ప్రయోజనాలకు పెద్ద పీట వేశాయని ఉద్యమకారులు సేర్మాంటున్నారు ఈ విధంగా పేదల పర్యావరణ పరిరక్షణ ఉద్యమం పారిశ్రామికీకరణను వలసవాద పాలనతో, క్యాపిటలిజం విస్తరణతో పోల్చి, సా(మ్రాజ్యవాదానికి ఇవ్వాల్సిన గుర్తింపును ఇవ్వడం లేదు ఈ కారణంగానే వారి విశ్లేషణ వలసవాద పాలన మిగిల్చిన కొన్ని సాంప్రదాయ పద్ధతులను, అటవీ శివారు ప్రాంతాల వెనుకబాటును గుర్తించడంలో విఫలమైంది వలసవాద ప్రక్రియలు ఆయా వలసల ఆధునిక ప్రగతిని అడ్డుకుంటాయి. ఎందుకంటే వలసపాలకులు వలసల ప్రయోజనాల కోసం కాకుండా తమ మాతృదేశ ప్రయోజనాల కోసమే పాటుపడతారు ఫలితంగా, భూస్వామ్య, అర్ధ భూస్యామ్య వ్యవస్థలున్న అటవీ ప్రాంతాలు మనుగడ సాగించడానికి వారు అనుమతించరు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రయోజనాలను కాపాడి అది కోరుకునే అసమాన ఆర్ధిక వ్యవస్థను పరిరక్షిస్తాయి
ఆదునిక ప్రభుత్వం-సమసమాజం
వలసవాద, వలసవాదానంతర్న ప్రభుత్వాల విశ్లేషణ తరహాలోనే (ప్రభుత్వానికి సహజ వనరుల యాజమాన్యంలో పరిమిత పాత్ర లేదా ఎలాంటి పాత్ర ఉండదన్న వాదన కూడా ఉంది భోరత పర్యావరణ ఉద్యమ. పేర్కాంటున్నట్లు ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం పారిశ్రామిక పెట్టుబడి ప్రయోజనాలనే కాపాడుతుంది దీని అర్ధం ఆధునిక ప్రభుత్వం భారీపరిశ్రమల విస్తరణకు ఒక సాధనంగా మాత్రమే ఉందని పేదల పర్యావరణవాదం అభిప్రాయపడుతోంది పారిశ్రామికీకరణ (ప్రజలను వారి స్వంత సహజ వనరులనుండి దూరం చేసిందని సృష్టం చేసింది భారతదేశంలో సహజ వనరులపై కొనసాగుతున్న ప్రభుత్వ గుత్తాధిపత్య వ్యవస్థ క్యాపిటలిస్టు, సోషలిస్టు పోకడలకు ఒక సజీవమైన ఉదాహరణ అని పర్యావరణ కార్యకర్తలు భావిస్తున్నారు ఇలాంటి వ్యవస్థలు అసమానతలను పెంచి పోషించి, సామాజిక అస్థిరత, అరాచకానికి దారి తీస్తున్నాయని వారు చెబుతున్నారు వనరులపై ప్రభుత్వనియంత్రణను అనుకూలంగా మలచుకొని ధనిక వర్ణాలు సమాజంలోని మిగతా ప్రజలను దండుకుంటున్నారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు పర్యావరణ ఉద్యమం అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ సంస్థలు భారతదేశంలో విశాల జనహిత ప్రయోజనాల కోసం పాటు పడుతున్నట్లు కనిపిస్తాయి ఈ కోవలోనే, గిరిజన, పర్యావరణ ఉద్యమకారులు క్యాపిటలిస్టు సోషలిస్టు ప్రభుత్వాలను అ(ప్రజాస్వామికమైనవిగా భావిస్తారు రష్యా, చైనాలలో సోషలిజం జయకేతనం ఎగురవేసిన తర్వాత రెండు దేశాల్లోనూ నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, తమ సమాజాలపై ఆధునిక పారిశ్రామిక ప్రగతి వ్యవస్థలను రుడ్డాయని, ఫలితంగా ప్రజలకు వనరుల వినియోగంపై ఎలాంటి హక్కు లేకుండా పోయిందని వారి వాదన క్యాపిటలిజం తరహాలోనే సొషలిస్టు వ్యవస్థ కింద కూదా నిజమైన ప్రజాస్వామ్యం ఉద్భవించలేదని, సహజ వనరుల నుండి ప్రజలను 6
దూరం చేశారని ఉద్యమకారులు చెబుతున్నారు మరో వికేషమేమిటంటే ప్రజాస్వామ్యం ముసుగులో సముదాయ ఆచారాలను, విజ్ఞానాన్ని రెండు వ్యవస్థలు దెబ్బతీశాయి దీనికారణంగానే భారత పర్యావరణ ఉద్యమకారులు క్యాపిటలిస్టు, సోషలిస్టు ప్రభుత్వాలు ఒక్కటేనని అవి భారీ పరిశ్రమల విస్తరణకు, ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానికి ఎనలేని తోడ్పాటు అందించాయన్న నిర్ధారణకు వచ్చారు
ఈ విధంగా, రెండు ప్రభుత్వ వ్యవస్థలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా సాంస్కృతిక విభిన్నతను (వనరుల పరిరక్షణ విషయంలో) దెబ్బతీశాయన్న వాదన బలపడింది ఇందుకు భిన్నంగా సముదోయ సంస్థలు సమాన, ప్రజాస్వామిక సంస్థలుగా, సుస్థిర జీవన విధానాలు అందించే సాధనాలుగా కనిపించాయి మార్కెట్ వ్యవస్థకు దూరంగా, స్వావలంబన సాధించిన గ్రామాలుగా ఈ సముదాయ సంస్థలు గుర్తింపు పొందాయి అలాంటి (గ్రామాల్లో ప్రజలను సమాన స్థాయిలో ఆదరిస్తారు సముదాయ సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని సామాజిక, సాంస్కృతిక నిబంధనలను కూడా వెలువరించాయి గిరిజన జీవితంలో “పవిత్రమైన తోటలు ప్రధానంగా ఉండడం అటవీ సంరక్షణకు ఒక చక్కటి సాంప్రదాయ ఉదాహరణ *ద ఫిష్టర్డ్ ల్వాందో (౧|౯ 1530766 12064) గ్రంధంలో రచయితలు మిజోరాం, మణిపూర్లలో ఇంకా కొనసొగుతున్న వేట - సేకరణ పద్ధతులను, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను చక్కగా విశ్లేషించారు పవిత్రమైన తోటలు, అటవీ ప్రాంతాల జెన్నత్యాన్ని వనరుల సక్రమ వినియోగాన్ని సాంప్రదాయ పద్ధతులు పరిరక్షణకు ఎలా దోహదపడుతున్నాయో వివరించారు అందుకే పేదల పర్యావరణ వాదం ప్రభుత్వం వనరుల యాజమాన్యం నుండి పూర్తిగా తప్పుకోవాలని వాదిస్తాంది వనరుల యాజమాన్య బాధ్యతలను సముదాయ సంస్థలకు అప్పగించాలని చాలా కాలంగా కోరుతోంది గిరిజనుల తరతరాల సంస్కృతిలో భాగమైన పరిరక్షణ ఆచారాలు వారి ప్రత్యేకతను సూచిస్తాయన్న వాదన గిరిజన హక్కుల ఉద్యమాలను ప్రభావితం చేస్తోంది గిరిజనుల సాంప్రదాయ జీవన విధానాన్ని కాపాడాలని, వనరుల వినియోగంలో వారు అనుసరిస్తున్న పాలనా పద్దతులను అనుమతించాలని ఆయా ఉద్యమాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి
సాంప్రదాయ పద్ధతులు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తాయని, అవి నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిగలవని వాదిస్తూ ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది జార్ధండ్కు చెందిన ఆదివాసిసభ 1930లలో ఈ సభ జార్థండ్ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని స్టానికేతరులను గిరిజన ప్రాంతాల నుండి బహిష్కరించాలని కోరుతూ ఉద్యమించింది బ్రిటీషు పాలనలో గిరిజనులు తమ తమ ప్రాంతాలలో ఇదేతరహా డిమాండ్లతో ఉద్యమించారు అటవీ ఉత్పత్తులు, ఇతర సహజ వనరులపై తమకు పూర్తిహక్కు కల్పించాలని వారు అనేక పోరాటాలు చేశారు గిరిజన పోరాటాల్లో అత్యంత ముఖ్యమైనవి 19వ శతాబ్దంలో చెలరేగిన ముండా, సంధాల్ తిరుగుబాట్లు, 1910లో సంభవించిన బస్తర్ తిరుగుబాటు, సెంట్రల్ ప్రావిన్సెన్లోని అటవీ సత్యాగ్రహం మొదలైనవి ప్రధాన స్రవంతి జాతీయోద్యమంతో గిరిజన ఉద్యమాల సంబంధం అంతంత మాత్రంగానే ఉండేది కాంగ్రెస్ జాతీయవాదులు తరచూ గిరిజనుల
గ
ఉద్యమాలను సాంప్రదాయబద్దమైనవిగా, జాతీయవాద రహిత పోరాటాలుగా అభివర్జించేవారు అయితే 1980లలో ఉద్భవించిన దిగువథ్రేణి, అధ్యయనాల (సబాల్టిర్న) పధకం కారణంగా చరిత్రకారులు దేశంలోని ఆయా ప్రాంతాల ప్రజల స్థానిక ఆకాంక్షలను గుర్తించారు అలాగే గిరిజన గిరిజనేతర సముదాయాల మధ్య ఉన్న అసమానమైన సంబంధాలను ఉల్లేఖించగలిగారు ఈ సమయంలోనే పర్యావరణ ఉద్యమకారులు చిప్కో నర్మదా బవావ్ ఆందోళన తదితర ఉద్యమాల గురించి విసృతంగా వ్యాసాలు,పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు గిరిజనుల మౌలికమైన హక్కుల పరిరక్షణకు పై ఉద్యమాలు తప్పనిసరి అని వాదించారు అలాంటి రచనల్లో రామచంద్ర గుహ రచించిన “అన్క్రైట్ వుడ్స్, (౮౧4416 ₹/0069) ముఖ్యమైనది అందులో గడ్వాల్ ప్రాంతంలో పెల్లుబికిన చిప్కో ఉద్యమం గురించి చర్చించారు అలాగే ఆ రచన ఒక విధంగా దేశంలో పర్యావరణ చరిత్రలేఖనానికి పునాదులు వేసిందని చెప్పాలి దీని తర్వాత అటవీ హక్కుల ఉద్యమాలపై డేవిడ్ హార్దిమన్, మాధవ్ గాడ్జిల్ తదితర విద్యావేత్తలు రచనలు చేశారు స్థానిక సంస్కృతులు, ఆధునిక జగత్తుల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక ఘర్షణను, ప్రస్తుత “గుర్తింపు రాజకీయాలను వారు సమూలంగా విశ్లేషించారు. ఇలాంటి ఉద్యమాలు చాలా వరకు నేటి భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి ప్రగతికి పునర్నిర్వ్యచనం
అధునిక ప్రగతిపై సైద్ధాంతిక విమర్శలో భాగంగానే వామపక్షాలను ఆధునికీకరణ శక్తులుగా పర్యావరణ ఉద్యమకారులు గుర్తించారు గిరిజనుల సాంస్కృతిక పర్యావరణ హక్కులపట్ల వామపక్షాలకు ఎలాంటి సంఘీభావం లేదని, సహజ వనరులపై న్థానికులకుపూర్తి హక్కు కల్పించాలన్న విషయంలో వాటికి ఎలాంటి సానుభూతి లేదని కార్యకర్తల ఆవేదన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలపరిచే వామపక్షాలు, వ్యవసాయ ఉత్పత్తిలో ఆధిక్యతను సాధించి భూస్వామ్య వ్యవస్థను రూపుమాపాలని, క్రమంగా సోషలిస్టు విప్లవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ విధానాలు, ఆశయాలు స్థానిక సుస్థిర ప్రగతికి, గిరిజనుల హక్కులకు భంగకరంగా ఉన్నాయని పర్యావరణ కార్యకర్తలు వాదిస్తున్నారు. ఇరువురి మధ్య సైద్ధాంతిక అభిప్రాయభేదాలున్నా, రెండు ఉద్యమాలు ఒక్క విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి ప్రస్తుత వ్యవస్థ దేశానికి అనుకూలమైనది కాదని వాంఛనీయం కూడా కాదని రెండు పక్షాలు గుర్తించాయి గిరిజన హక్కులు జీవనభృతి విషయానికి వస్తే పర్యావరణ ఉద్యమానికి, వామపక్షాలకు మధ్య కొంత సారూప్యం కనిపించకమానదు రెండింటికీ కొన్ని సాధారణ విలువలపట్ల విశ్వాసం ఉంది భూమి యాజమాన్యమే సహజ వనరుల నియంత్రణకు ఒక ప్రధాన సాధనమని ఇరుపక్షాలు గుర్తిస్తాయి అయితే ఆధునిక పద్ధతుల్లో ప్రగతి బాటలు వేసే విషయంలోనే ఇరువురికి స్పష్టమైన విభేదాలు ఉన్నాయి. క్యాపిటలిస్టు మార్గంలో అభివృద్ధి జరగరాదని ఇద్దరూ కోరుకుంటున్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్థాలను ఇప్పటికీ వారు అన్వేషించే దశలోనే వున్నారు. స్థానిక గిరిజన సముదాయం ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన (ప్రత్యామ్నాయ పధకాలను, ప్రణాళికలను
క్
రూపొందించడానికి అవి నేటికీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి
అయితే ఈ లక్ష్యం నెరవేరాలంటే పర్యావరణ ఉద్యమకారులు, వామపక్షవాడులు ఒకరి నుండి మరొకరు నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు వామపక్షాలు స్థానిక సాంప్రదాయ పద్ధతులను విజ్ఞానాన్ని విశ్లేషించి వాటిపట్ల సానుకూలంగా స్పందించాల్సి ఉంది వాటిని మరింత అభివృద్ధి పరచడానికి కృషి చేయాల్సి ఉంటుంది ఆ విధంగా గిరిజన సముదాయాలను బలోపేతం చెసినట్లవుతుంది (ప్రధాన (స్రవంతిలో ఉన్న వామపక్షాలు కొన్ని ఈ విషయాన్ని ఇప్పటికే ఈ అంశాన్ని గుర్తించినట్లు ఈ పుస్తకం తెలియచేస్తుంది మరోవైపు పర్యావరణ ఉద్యమకారులు ప్రభుత్వ జోక్యాన్ని ఆధునిక ప్రగతి మార్గాలపట్ల తమ తీవ్రమైన వ్యతిరేకతను వదులుకోవలసి ఉంది శాస్త్రసాంకేతిక విజ్ఞానంపట్ల వారి వైఖరి మారాల్సి ఉంది ఈ విషయాల్లో వారు ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఈ పుస్తకం చర్చిస్తుంది వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆధునిక అభివృద్ధి సధకాలపట్ల వారు సముచిత వైఖరిని ప్రదర్శించాల్సి ఉంటుంది వామపక్షాలు - పర్యావరణ ఉద్యమ సంస్థలు ఉమ్మడి ఉద్యమాన్ని నిర్మించాలంటే పై విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలను స్ఫూలంగా విశ్లేషించడానికి ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది
గిరిజన (ప్రాంతాల్లో వామపక్షాలకు పెద్ద అనుభవమే ఉంది గిరిజన ఉనికి సంస్కృతి, భాష తదితర విషయాలపట్ల వాటికి ఉన్న దృక్చధానికి ఈ అనుభవమే కారణం గిరిజన హక్కులపై వామపక్షాలు పోరాడిన మూడు ప్రధాన కేంద్రాలను మనం గుర్తించవచ్చు మొదటిది, 1940లో త్రిపురలో ఉద్భవించిన గణముక్తి పరిషత్ త్రిపుర పాలకులు భూమిలేని పేదలపట్ల అనుసరిస్తున్న దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా గణముక్తి పరిషత్ ఉద్యమించింది వారిలో గిరిజనులే అధిక సంఖ్యలో ఉండేవారు ఈ ఉద్యమంలో భూమీ సమస్య, అటవీ ఉత్పత్తులపై హక్కు గురించి పరిషత్ ప్రధానంగా ప్రస్తావించింది పరిషత్ చేపట్టిన కొన్ని పోరాటాలను పాలకులు నిర్జాక్షిణ్యంగా, హింసాత్మకంగా అణచివేశారు వామపక్షాలు చేపట్టిన మరో రెండు ప్రధానమైన ఉద్యమాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణా ప్రాంతంలో కొనసాగింది మూడవది మహారాష్ట్రలోని దహానులో చేపట్టిన వర్లీ పోరాటం (త్రిపురలోలాగే మిగతా రెండు ఉద్యమాలు కూడా రాజ్యహింస, దోపిడీకి వ్యతిరేకంగా కొనసాగాయి వర్గ సంబంధాల్లో మార్పులు తేవడం ద్వారా అందరికీ హక్కులు కల్పించాలన్నది మరో ప్రధాన కోర్కె గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే భూయాజమాన్యం ఉండాలని భూమిలేని వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలని, అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని, వెట్టిచాకిరి వ్యవస్థను నిర్మూలించాలన్న ఇతర డిమాండ్లు కూడా ఈ పోరాటంలో (ప్రధానంగా ముందుకు వచ్చాయి సాంప్రదాయ వ్యవస్థను వామపక్షాలు గౌరవించలేదన్న భావనకు ప్రధాన కారణం వారు భూస్వామ్య వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించడమే పి సుందరయ్య జఉల్లేఖించినట్లు 1940లో కిసాన్ సభల ముఖ్య ఉద్దేశం రైతులను రైతు కూలీలను, యువతను సమీకరించడం, తద్వారా సాయుధ పోరాటంతో నిజాం, దేశ్‌ముఖ్‌ల నిరంకుశ పాలనకు చరమగీతంపాడటం రాజకీయ సాంస్కృతిక కార్యాచరణతో ఈ లక్ష్యాన్ని సాధించడానికి వామపక్షాలు ప్రయత్నించాయి ఈ
౦
పోరాటం వామపక్షాల వర్గ కోరికలను ప్రతిబింబించింది మహారాష్ట్ర దహానులోని వర్లీలు గోదావరి పరులేకర్ నేతృత్వంలో కొనసాగించిన ఉద్యమం కూడా ప్రధానమైనదే ఇక్కడ కూడా కిసాన్ సభ రైతులు, రైతు కూలీల కొసం, గిరిజనుల న్యాయపరమైన హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించింది త్రిపురలోనైతే గణమ్ముక్తి పరిషత్ రాజుల జాగీరును పేదలకు పంచిపెట్టింది వామపక్షవ్రాదుల తొలి రచనలు ఈ ఉద్యమాలను గురించి వివరిస్తూ భూస్వామ్య వ్యవస్థ, గిరిజనుల అణచివేతల గురించి ప్రముఖంగా ప్రస్తావించాయి రైతులు రైతు కూలీలు గిరిజనులను భూస్వాముల కబంధ హస్తాల నుండి విముక్తి కల్దించడమే ఉద్యమాల (ప్రధాన లక్ష్యమని సృష్టం చేశాయి భూస్వాములకు వర్తకులకు అప్పట్లో ప్రభుత్వ సాధనాలు, సంస్థల మద్దతు సంపూర్ణంగా ఉండేది ఫలితంగా వారు ప్రజలను అణచివేయడంతొ పొటు వారికి దక్కాల్సిన సహజ వనరులను సైతం కొల్లగొట్టడంలో సఫలీకృతులయ్యారు వలసవాద పాలనా వ్యవస్థ లో వారి గుత్తాధిపత్యం సంపూర్ణంగా ఉండేది దీనికి తోడు భూస్వామ్య వర్గాలు, పాశ్చాత్య (ప్రపంచానికి చెందిన పెట్టుబడిదారుల మధ్య పొత్తు కుదరడం వల్ల వారు వలసవాద పాలనలో పాలకనర్గాలుగా అవతరించగలిగారు వలసవాద పాలన చివరి రోజుల్లో వామపక్షాలు గిరిజనులు, రైతులు, కార్మికులు, మధ్యతరగతి యువకులతో కూడిన ఒక ఉమ్మడి సంఘటనను నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి 1946లో దహానులో జరిగిన ఉద్యమం ప్రధాన లక్ష్యం భూస్వాముల,వ్యాపారుల అధికారాన్ని ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే పశుగ్రాసం కోసే వారికి, చెట్లు నరికే వారికి అధిక వేతనాలు ఇప్పించడం మరో ప్రధాన లక్ష్యం ఈ క్రియాశీల పోరాటంలో వామపక్షాలు కేవలం గిరిజన హక్కుల కోసమే పాటుపడలేదు వారి పోరాటాలు మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా, దోపిడికి గురవుతున్న అన్ని వర్గాలకు మద్దతుగా కొనసాగాయి ఒక్కమాటలో చెప్పాలంటే వామపక్షాల విస్తృత పోరాటంలో గిరిజన హక్కుల ఉద్యమం ఒక విడదీయరాని భాగంగా కనిపిస్తుంది మొత్తం ఆర్థిక వ్యవస్థను సమాజాన్ని రాజకీయాలను ప్రజాస్వామీకరించడం వామపక్షాల విస్తృత లక్ష్యం ఈ నేపధ్యంలో, పర్యావరణ పరిరక్షణ, ఇతర గిరిజన ఉద్యమాలను అధ్యయనం చేసిన విద్యావేత్తలు, కిసాన్‌సభ చేపట్టిన ఉద్యమాలను, పోరాట్లాలను పర్యావరణ ఉద్యమంలో అంతర్భాగంగా ఎన్నడూ ప్రస్తావించలేదు ఎందుకంటే వామపక్ష పోరాటాలు గిరిజన ఉనికిని సంస్కృతిని బలోపేతం చేయలేదని వారి నమ్మకం అందుకు విరుద్ధంగా భావజాల ఆధారిత ఉనికి కోసం వామపక్షాలు (ప్రయత్నిస్తూ గిరిజనులు కూదా కలిసి ఉందే రైతులు కార్మికవర్గాలకు అనుకూలమైన ్రభతి వ్యవస్థను రూపొందించాయని ఒక వర్గం విద్యావేత్తల అభియోగం ఈ క్రమంలో వామపక్షాలు సాంప్రదాయవ్యవస్థను, క్యాపిటలిస్టు పంధాను ఒకే రీతిలో విమర్శించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన వర్గాలకు ఆర్థిక వ్యవస్థ నుండి అన్ని ప్రయోజనాలు సమకూరేలా పోరాటాలు జరిపాయి వామపక్షాల విశ్వాసం ప్రకారం వర్గ పోరాటం ద్వారానే పీడిత ప్రజలను విముక్తి కల్గించడం సాధ్యమవుతుంది గిరిజనులు కూడా తమ సముదాయ ఉనికిని త్యజించి వర్గ స్వరూపం అలవర్చుకోవాలని, అలా జరిగితేనే వారు విముక్తి మార్గంలో 10
పయనించగలరని వామపక్షాలు భావించాయి. వామపక్షాలు గిరిజనుల పక్షాన సల్పిన పోరాటాలు ఈ ఆశయాల సాధనకే జరిగాయి ప్రజలను కేంద్రంగా చేసుకునే అభివృద్ధి వ్యవస్థను వర్పాటు చేయడంతో పాటు గిరిజనులను రాజకీయంగా చైతన్య పరచడానికి అవి ఎంతో శ్రమించాయి భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమ విమర్శకులు తమ కృషికి తోడుగా వామపక్ష వ్యాసంగంలో పర్యావరణ సమతుల్యం అనే అంశాన్ని కూడా జోడించవచ్చు ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గాలు, సమకాలీన భారత రాజకీయాలలో హిందూత్వ, ప్రపంచీకరణ శక్తులకు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి పోరాటాన్ని నిర్మించడానికి గల అవకాశాలను పర్యావరణవేత్తలు, వామపక్షాలు అన్వేషించాల్సి ఉంది పుస్తక స్వరూపం
సమకాలీన భారత దేశంల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలను, గిరిజన స్వయం ్రతిపత్తికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను పాలనా వ్యవస్థలను భూమి యాజమాన్యం, అటవీ హక్కులు, నిర్వాసితం తదితర విషయాలను చర్చించడానికి ఈ పుస్తకం ప్రయత్నించింది ఆర్ధికపరమైన సామ్రాజ్యవాదం, సాంస్కృతిక ఫాసిజం దేశ సమైక్యతకు కల్గిస్తున్న ముప్పు నేపద్యంలో పై అంశాలను విశ్లేషించడానికి కృషి చేయడం జరిగింది గిరిజన హక్కుల ఉద్యమాలకు సామ్రాజ్యవాదం, హిందూత్వ శక్తుల నుండి ఎదురయ్యే ఆటంకాలను పర్యావరణ ఉద్యమకారులు వామపక్షాలు ఏ విధంగా ఎదుర్యోగలరో, చారిత్రక నేపధ్యాన్ని అనుసరించి ప్రస్తుత సమస్యలను ఏ విధంగా వారు అన్యయించుకోగలరో అన్న అంశాలను ఈ పుస్తకం పరిశోధించింది ఈ క్రమంలోనే ఉమ్మడి సమస్యలు, ఇరుపక్షాల మధ్య ఉన్న కనీస భావజాల సాన్నిపాత్యాన్ని ఎత్తి చూపి, వారి ఉద్యమాలను దగ్గర చేయడానికి జరుగుతున్న అన్ని ప్రయత్నాలను ఈ పుస్తకం బలపరుస్తుంది
ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయం గిరిజన జీవితంలో భూమి సమస్య విషయాన్ని చర్చించి, సముదాయ ఆధారిత, వర్గఆధారిత కార్యాచరణలు మధ్య ఉన్న భేదాలను ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తుంది భూసంస్కరణలు, హక్కులు స్వభావం గిరిజన ఉద్యమాల దృష్టి కోణంలోని స్థానిక వ్యవసాయ పాలన, స్టూల వ్యవసాయ సమాజం మధ్య ఉన్న సంబంధాలలో అంతర్భాగమేనని ఈ అధ్యాయం వాదిస్తుంది అలాగే, గిరిజన జీవనాధార వ్యవస్థలు, భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యాయం చర్చిస్తుంది మరీ ముఖ్యంగా, గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతున్న పోడు వ్యవసాయం, అందులో వస్తున్న కొత్త మార్పులు పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ రంగం అభివృద్ధిపై వాటి ప్రభావాన్ని ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం ప్రపంచీకరణ యుగంలో గిరిజనులు-అడవులు అన్న అంశాన్ని నాల్గవ అధ్యాయంలో చర్చించాము గిరిజనుల జీవనభృతి, అటవీ ఉత్పత్తులపైవారి హక్కులకు మధ్య ఉన్న సంబంధాన్ని అందులో చర్చించడం జరిగింది
ఉమ్మడి అటవీ యాజమాన్యం, కలప మినహా మిగతా అటవీ ఉత్పత్తులు గిరిజన జీవితాలపై చూపే ప్రభావం గురించి కూడా అందులో ప్రస్తావించబడింది ఈ అంశంలో
క్ష
పశ్చిమ బెంగాల్ అనుభవాన్ని అటవీ సంపదను కొల్లగొట్టడానికి భారీ పర్యికమలకు అనుమతి విదేశీ పెట్టుబడి తదితర విషయాలను విశ్లేషించడం జరిగింది తదుపరి అధ్యాయంలొ ఆధునిక అభివృద్ధి నిర్వాసిత రాజకీయాలు తదితర అంశాలను చర్చించడం జరిగింది నిర్వాసితం పునరావాసం, అభివృద్ధి అంశాలను నర్మదా బచావ్ ఆందోళనను నేపధ్యంగా తీసుకొని విశ్లేషించడం జరిగింది నర్మదా బచావ్ ఆందోళన్ వామపక్షాల వాదనలు, ప్రత్యామ్బ్నాయ మార్గాలపై వారి దృష్టికోణం గురించి అందులో చర్చించడం జరిగింది ఇరుపక్షాల ఉద్యమాల రాజకీయ ప్రభావాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది చివరి అధ్యాయంలో గిరిజన స్వయం ప్రతిపత్తి నేపధ్యంలో గిరిజన సంక్షేమ పధకాల అనుభవాన్ని విశ్లేషించడం జరిగింది ఈ క్రమంలోనే భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమం, వామపక్షాల మధ్య ఉన్న ఉమ్మడి భావజాల క్షేత్రాన్ని వివరించడంతోపాటు వారి బాంధవ్యాన్ని మరింత బలపరచడానికి చివరి అధ్యాయం ప్రయత్నించింది 12
2 గిరిజనులు - భూమి సమస్య
దళిత సంఘాల జాతీయ సదస్సులో సమర్పించిన ఒక పరిశోధనా పత్రంలో ఓ (ప్రముఖ కార్యకర్త భారతదేశంలో గిరిజనులకు భూమి సమస్య ఎంత 'ప్రధానమైనదో కారణాలతో సహా వివరించారు భూమిపై సర్వహక్కులుంటేనే శాశ్వత ఉపాధి లభించగలదని స్థిర నివాసం ఏర్పడగలదని, ఆ ప్రాంతంతో అనుబంధం ఏర్పడగలదని, బలహీన వర్గాల ప్రజలకు సామాజిక, మానసిక రక్షణ కల్పించినట్లవుతుందని చెప్పారు ఈ వ్యాఖ్యల నేపధ్యంలో గిరిజన జీవనాధార వ్యవస్థల్లో భూమి సమస్య కేంద్ర స్థానాన్ని ఆక్రమించుకుందన్న విషయం, దేశంలో సగానికి సగం గిరిజనులు నేటికీ భూములులేని పేదవారన్న వాస్తవం మనకు అవగతమవుతుంది అందుకే అన్ని ప్రజా ఉద్యమాల్లో గిరిజనులకు భూమి హక్కు అంశం ప్రధానంగా చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ కలిగించదు అయితే గిరిజనులకు భూములు పంపిజీ చేసే విషయం అంత తేలికైనదికాదు ఈ విషయం అనేక చిక్క్నుముడులతో కూడుకున్నది
భూమి సంబంధిత విషయాలను, వాటిపై గాంధేయవాద పర్యావరణ ఉద్యమకారులు వామపక్షాలు అవలంబిస్తున్న వైఖరులను ఈ అధ్యాయం చర్చిస్తుంది ఈ అధ్యాయంలోని మొదటి భాగం వ్యవసాయ భూమి సమస్యను విశ్లేషిస్తుంది వ్యవసాయ రంగంలో న్యక్తిగత ఆస్తులు కొనసాగుతూనే ఉన్నాయి అందుకు ప్రభుత్వం కూడా అనుమతిస్తుంది రెండవ భాగం గిరిజన ఉద్యమాలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధీనంలోని అటవీ భూములను స్థానికులకు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తుంది గిరిజన ప్రాంతాల్లో స్థానికులను భూమి నుండి దూరం చేయకూడదన్న వాదనను ఎవరూ వ్యతిరేకించకపోయినా, వారిక్ ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించాలన్న విషయంలోనే సమస్యలు వచ్చిపడ్డాయి. భూమి పంపిణీ సముదాయ ఆధారితంగా జరగాలా లేక వర్గ ఆధారితంగా జరగాలా అన్న అంశాన్ని ఇంకా తేల్చాల్సి ఉంది బూమిపై సముదాయ హక్కుల పునరుద్ధరణ
వామపక్షాలకు తోడు గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న పర్యావరణ పరిరక్షణ
18
ఉద్యమాలు కూడా గిరిజనులకు భూమి హక్షులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి వ్యవసాయ రంగం వాణిజ్య స్వరూపం దాల్చడం, ఆధునిక (ప్రగతి పదకాల దుష్ప్రభావం గిరిజనులపై తీవ్రమైన ఒత్తిడినిపెంచుతోందని, ఈ నేపధ్యంలో వారిని భూముల నుండి చేరుచేయడం ఎంత మాత్రం సమంజసం కాదని వామపక్షాలు, పర్యావరణ ఉద్యమకారులు ఇద్దరూ అంగీకరిస్తారు బ్రిటీష్ పాలనా కాలంలో ఇబ్బడిముబ్బడిగా భూములన. ధనవంతులకు భూస్వాములకు ధారాదత్తం చేయడంతో గిరిజనులు తమ భూములపై హక్కులను కొల్పోయారు నవీన గాంధేయవాద పర్యావరణ ఉద్యమకారుల వాదన ప్రకారం బ్రిటీషు వారి రాకకుపూర్వం స్థానిక గిరిజన సముదాయాలు, గిరిజన సంస్థలు తమ ప్రాంత సహజ వనరులపై పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేవారు గిరిజన సంస్థలు వ్యక్తిగత ఆస్తులను నియంత్రించడంతోపాటు పాలకులు గ్రామాలకు అందించే కౌలు భూములను కూడా స్థానికులకు సమంగా పంచేవి ఈ వ్యవహారంలో సముదాయ నాయకులు, గిరిజన పురోహితులు ప్రధాన పాత్రను పొషించేవారు ఈ విధంగా వలస పాలనకు పూర్వం గిరిజన సంస్థలు తమ ప్రాంత భూములపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉండేవి అయితే 129వ శతాబ్దం నుండి క్రమంగా వలసదారులకు భూములు అప్పగించడం సర్వ సాధారణం కావడంతో గిరిజన సంస్థలు కూడా నిర్వీర్యం అయ్యాయి వలసదారులు తిష్టవేయడంతో రైతులు పరిమిత భూమికే అర్హులయ్యారు అలాగే వారి నుండి భూమి శిస్తును నగదు రూపంలో అధికంగా వసూలు చేసేవారు ఫలితంగా పెద్ద విస్తీర్ణంలో భూములు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఏర్చడి భూస్వాములు, పాలక వర్గాలు భూమిపై గుత్తాధిపత్యం సాధించారు ఈ పరిణామాలను 'ద ఫిష్టర్డ్ ల్యాండ్‌లో సూక్ష్మంగా విశ్లేషించారు , రచయితలు వారి విశ్లేషణ ప్రకారం ప్రభుత్వం పేదలకు భూమి పంపిణీ చేసిన తర్వాత వారి వ్యవహారాల్లో తలదూర్చలేదు అయితే ఈ పరిస్థితి వలసవాద పాలనకు పూర్వం కూడా ఉండేది సముదాయ పెద్దల లేదా గ్రామ సర్పంచ్‌లు, సముదాయ సంస్థలు పాలకులకు కొంత మేరకు శిస్తు చెల్లించే వారు అయితే సముదాయానికి అవసరమయ్యే వ్యవసాయ ఉత్పత్తుల నుండి మాత్రం ఈ శిస్తు చెల్లించేవారు కాదు మరో మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి కేవలం మిగులు ఉత్పత్తులపైనే హక్కులుండేవి అయితే సముదాయం మొత్తం పండించే ఉత్పత్తులలో మిగులు శాతం చాలా పరిమితంగా ఉండేది ఒక ప్రముఖ గాంధేయవాది అప్పటి పరిస్థితులను విశ్లేషిస్తూ సాంప్రదాయబద్ధమైన స్థానిక పరిపాలనా వ్యవస్థల్లో జమిందారీ పెత్తందారీ పోకడలకు అవకాశమే ఉండేది కాదని వ్యాఖ్యానించారు కాని ఆధునిక వలసవాద ప్రభుత్వం ఏర్పడగానే పాక్షిక భూస్వామ్య వ్యవస్థ పునాదులు వేసుకుందని చెప్పారు ఈ ఆలోచనే సాంప్రదాయపరమైన పాలనా వ్యవస్థలు తిరిగి ఏర్పరచనిదే భూమిపై సముదాయ హక్కులను పునరుద్ధరించలేమన్న వాదనకు సిద్ధాంతపరమైన ఆధారమయ్యింది పైన విళ్లేషించిన వాదన ఒక విధంగా వలసవాద పాలనకు పూర్వం ఉన్న భూస్వామ్య వ్యవస్థను సమర్థిస్తున్నట్లు కనిపించే ప్రమాదం ఉంది అవి న్యాయమైనవి, విశాల హృదయం గలవని సూచించే అవకాశం కూడా ఉంది ఏక్తా పరిషత్, భారత్ జన్ ఆందోళన్ లాంటి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు భూమిపై సముదాయ హక్కులను సమర్ధించడమే కాక క్షేత్తీ
పూర్వపు సాంప్రదాయ వ్యవస్థలను, సంబంధాలను తిరిగి కొనసాగించాలని డిమాండ్స్ చేస్తున్నాయి మానవ శాస్త్రవేత్త, విధాన విశ్లేషకుడు బి కె రాయ్‌బర్మన్ పేర్కొన్నట్లు సముదాయ వ్యవస్థలు గిరిజన సమాజంలో అధిపత్య కుటుంబాలకు లాఖభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే పప్రజాస్వామ్యయుతమైన గిరిజన సంస్థల హక్కులు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది గిరిజనుల్లో బాగా వెనుకబడిన కుటుంబాలకు భూమి పంపిణీలో ప్రాధాన్యతనిచ్చి వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో చారిత్రక నేపధ్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించాలని కూడా బర్మన్ పేర్కొన్నారు మధ్యయుగంలో జమిందారీ వ్యవస్థతో గిరిజన సంస్థలకు ఉన్న సంబంధాలను కూడా బర్మన్ విశ్లేషణ పరిగణనలోకి తీసుకుంది ఈ తరహాలోనే వామపక్షాల విశ్లేషణ కొనసాగిందని మనకు స్పష్టమవుతుంది ఎందుకంటే సాంప్రదాయ వ్యవస్థల కంటే వర్గ ఆలోచనతోనే గిరిజనులకు భూములు దక్కాలని వామపక్షాలు పోరాడుతున్నాయి. ఫలితంగా అవి సముదాయపరమైన హక్కులపై అంత సానుకూలంగా స్పందించడం లేదు భూమిలేని పేదలకు భూమి
గిరిజనులకు భూమి పట్టాలు అందజేయాలన్న డిమాండ్‌ను వామపక్షాలు, గిరిజన హక్కుల సంఘాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు మొదటి నుండి సమర్థిస్తూనే ఉన్నాయి మరో ముఖ్య విశేషమేమిటంటే భూ సంస్కరణల అమలులో వామపక్ష ప్రభుత్వాలకు అపారమైన అనుభవం ఉంది పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళవిషయంలో ఇదీ అందరికి బోధపడుతుంది ఇక్కడ భూములకోసం పోరాడింది వర్గ ఆధారిత ఆశయాలతోనే కావడం విశేషం 1940లో త్రిపుర జనశిక్షా సమితి, ఆంధ్ర మహాసభ కొనసాగించిన ఉద్యమాలు ఇందుకు ఉదాహరణ సామఘ్రాజ్యవాదులతో మమేకమైన స్థానిక పాలకులకు వ్యతిరేకంగా ఈ రెండు సంఘాలు పోరాటం కొనసాగించడం ఇక్కడ గమనార్హం ఈ పాలకులు మధ్యయుగం నాటి జమిందారీ, పెత్తందారీ వ్యవస్థలను కొనసాగించారు భూస్వామ్య వ్యవస్థలోని అన్యాయమైన సంబంధాలను వామపక్షాలు ప్రజలకు ఎత్తిచూపాయి. ముఖ్యంగా వెట్టి చాకిరి భూఆ(క్రమణ, వడ్డీ వ్యాపారం పెచ్చరిల్లుతున్నాయని అవి ఉద్యమించాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక రాజకీయ పరిస్థితులను కమ్యూనిస్టు నాయకుడు పి సుందరయ్య పూసగుచ్చినట్లు వివరించారు భూములు, గ్రామాలన్ని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతున్నాయని, బ్రిటీషు వారి రాకకు పూర్వం కూడా ఇవే పరిస్థితులుండేవని ఆయన రాశారు ఆయన విశ్లేషణ భూములపై సముదాయపరమైన హక్కులుండేవన్న సిద్దాంతాన్ని ఖండించడమే కాకుండా సాంప్రదాయపరమైన వ్యవస్థలు ప్రజాస్వామికమైనవని, సమసమాజ భావనతో మెలిగేవన్న భావనను కూడా తోసిపుచ్చుతుంది ఈ నేపధ్యంలో వామపక్షాలు తమ ప్రధాన కర్తవ్యంగా దున్నేవానికే భూమి కల్పించాలని భావించాయి. గిరిజనులతో సహా నిర్వాసితులైన అన్నివర్గాల ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించాయి. గిరిజనుల హక్కుల కోసం వామపక్షాలు ఉద్యమించినా ఆ పోరాటాన్ని అన్ని వర్గాల ప్రజల భూమి హక్ళుకోసం వారు సాగించిన ఉమ్మడి పోరాటంగా చాలా మంది భావిస్తారు
15
ఈ స్టూల పోరాటంలో భాగంగానే 1940 నుండి తిపురలోని గణ ముక్తిపరిషత్ రుమియా తెగ ప్రజల భూమి హక్కుకోసం ఉద్యమించింది ఈ డిమాండ్‌ను తర్వాత రుమియా పునరావాస కార్యక్రమంలో చేర్చారు 1969లో పశ్చిమ బెంగాల్లో జరిగిన అఖిల భారత కిసాన్ సభ సదస్సులో ఒక తీర్మానం ఆమోదించారు గిరిజనుల, ఇతర వర్జ్ణాలకుచెందిన రైతుల భూములను స్వాధీనం చేసుకున్న భూస్వాములు, వ్యాపారులు వాటిని తిరిగి అసలు యజమానులకే అప్పగించాలని ఆ తీర్మానం డిమాండ్ చేసింది 1990 నాటికి కిసాన్‌సభ ఒక డిమాండ్ల పత్రాన్ని రూపొందించింది అందులో భూమిలేని పేదల తరపున స్పష్టమైన డిమాండ్లను చేర్చారు “పేద వర్ణాల అనుకూల వ్యవసాయ విధానం దిశగా' అన్న కరప(డత్రంలో వ్యవసాయ కూలీల సమస్యల శీర్షిక కింద గిరిజనుల తరఫున భూమి హక్కు కోసం ఉద్యమించాలని కిసాన్ సభ ప్రజలకు పిలుపునిచ్చింది కిసాన్ సభ సదస్సు డిమాండ్లు ఇలా ఉన్నాయి 1 గిరిజనేతరులకు గిరిజన భూముల బదిలీని నిలిపివేయాలి గిరిజన ప్రాంతాల్లో భూమి రికార్డులను పూర్తి చేసి స్థానికులు హక్కులను, సముదాయ హక్షులను గుర్తించాలి
2 _ అటవీ ఉత్పత్తులు, అటవీ భూములపై గిరిజనుల హక్కును కాపాడాలి
8 _ రిజర్వు ఫారెస్టు నెపంతో గిరిజనులను అడవుల నుండి బలవంతంగా తరలించడం మానివేయాలి వారు సాగుచేస్తున్న అటవీ భూములను వారి పేరు మీద నమోదు చేయాలి పట్టాలు పంపిణీ చేయాలి అటవీ - వ్యవసాయ పరిజ్ఞానాన్ని వారికి అందుబాటులో తెచ్చి పర్యావరణానికి అనుకూలమైన పంటలు సాగుచేయదంలో వారికి తగిన ప్రోత్సాహం అందించాలి
4 _ పునరావాసం కల్పించేంత వరకు రుమియా ప్రజలకు అటవీ భూములపై ఉన్న హక్షును పరిరక్షించాలి
5 _ అటవీ ప్రాంతాల్లో వెలసిన గ్రామాలను సాధారణ గ్రామాలుగా గుర్తించి పాలనా వ్యవస్థను ఏర్పాటుచేయాలి అలాంటి (గ్రామాల ప్రజలకు అన్ని రాజకీయ హక్కులు కల్పించి పంచాయతిరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
అటవీ, గిరిజన ప్రాంతాలలో తమకున్న అనుభవంతోనే వామపక్షాలు పై డిమాండ్లు ముందుకు తెచ్చాయి పశ్చిమ బెంగాల్, త్రిపురలలో భూసంస్కరణల అమలు నేపధ్యంలో గిరిజన వర్గాలు సమస్యలపై అవి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. 1977లో తొలిసారిగా ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం భూసంస్కరణలు అమలు చేయడంలో రెండు ప్రధానమైన లక్ష్యాలను నిర్దేశించింది మొదటిది కౌలు భూములను సాగుచేస్తున్న వారి పేరు మీద నమోదు చేయడం, రెండవది భూపరిమితి చట్టాన్ని కరినంగా అమలు చేయడం, వ్యవసాయ కూలీలకు భూములు పంపిణీ చేయడం భూమి పంపిణీవల్ల నిరుద్యోగ సమస్య తగ్గడమే కాక వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగగలదని వామపక్ష ప్రభుత్వం బలంగా నమ్మింది అలాగే పేదరికం కూడా తగ్గుముఖం పట్టగలదని భావించింది భూసంస్కరణలు పశ్చిమ బెంగాల్ వ్యవసాయ రంగంలో నెలకొన్న స్తబ్ధతను తొలగించడమే కాకుండా ఆదివాసీలు, దళితులు, మహిళలను మరింత
16
బలోపేతం చేయగలవని వామపక్షాలు ఈ మేరకు ఆశాభావం వ్యక్తం చేశాయి 2001 నాటికల్లా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 14 లక్షల హెక్టార్ల భూమిని భూస్వాముల నుండి స్వాధీనం చేసుకుంది అందులో సుమారు 56 శాతం భూమిని దళితులకు గిరిజనులకు పంపిణీ చేసింది భూ సంస్కరణల వల్ల ప్రయోజనం పొందిన 25 లక్షల కుటుంబాలలో సుమారు 186 శాతం గిరిజనులు 8? శాతం దళితులు కావడం విశేషం ఐదు లక్షల గిరిజన కుటుంబాలకు సుమారు 45 లక్షల హెక్టార్ల భూమిని దళితులకు 95 లక్షల హెళ్టార్ల భూమిని పంపిణీ చేశారు మహిళ ఉద్యమాల డిమాండ్ మేరకు మరో 44 8 లక్షల హెక్టార్ల భూమిని మహిళలకు ఉమ్మడి పట్టాల కింద పంపిణీ చేశారు మహిళా పట్టాదారుల్లో సగానికి సగం మంది బలహీన వర్గాలకు చెందినవారే భూమితోపాటు సేద్యపునీటిని వ్యవసాయ ముడి సరుకులను కూడా అందజేశారు భూసంస్కరణల కార్యక్రమాన్ని సమీక్షిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1981 నుండి 1991 నాటికి వ్యవసాయ కూలీల సంఖ్య సుమారు 1 75 శాతం తగ్గిందని గుర్తించింది ఇన్ని విజయాలు సాధించినప్పటికీ భూసంస్మరణల వల్ల లబ్టి పొందిన షెడ్యూలు తెగలవారి శాతం వారి జనాభా మొత్తంలో కేవలం పది శాతమే కావడం నిరుత్సాహ పరిచింది భూమి పంపిణీ పరిమితులతో గిరిజనుల జీవనాధారం కాపాడడం అంత సులభమైన పని కాదని పై గణాంకాలు స్పష్టం చేశాయి అయితే విధాన రూపకర్తలు ఈ విషయాన్ని (గ్రహించి భూమిలేని గిరిజనుల సంక్షేమం కోసం అనేక పధకాలను దూపొందించారు అందులో భాగంగానే 1998లో బెంగాల్ ప్రభుత్వం వ్యవసాయ కూలీల కోసం భవిష్యనిధి పధాకాన్ని అమలు చేసింది లబ్టిదారుల ఎంపికలో గిరిజనులకు తొలి ప్రాధాన్యతనిచ్చింది
భూసంస్కరణల అమలు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే రాష్ట్రంలో వ్యవసాయోత్స్పత్తి గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతుంది భూమి, వ్యవసాయరంగ సంస్కరణలు పట్టుదలగా అమలు చేయడంవల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అందరికి బోధపడుతుంది
భూసంస్కరణల ఫలితంగా ఎన్నో లక్ష్యాలు నెరవేరినప్పటికీ అనుభవం మాత్రం ఎమి చెబుతుందంటే గిరిజనుల సర్వతోముఖాఖివృద్ధికి వ్యవసాయేతర ప్రత్యామ్నాయాలు కూడా అన్వేషించడం తప్పని సరి అని భూమికి తోడు చెట్లు, మొక్కలు, జంతువులు, ఇతర సంబంధిత వస్తువులు కూడా లబ్టీదారులకు అందజేయాల్సి ఉంది అలాగే మౌలిక సదుపాయాలైన సేద్యపునీటి వసతి రుణం విత్తనాలు, మార్కెట్ సౌలభ్యం, పేదరైతులకు తగినంత సహాయం, ఇతర సౌకర్యాలు కల్పించడంతోపాటు వ్యవసాయం కూలీల సంక్షేమం కోసం పని హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది అంతకు మించి రైతులు తమ భూములను సారవంతంగా ఉండేలా చూడగలిగితే దశాబ్దాలపాటు మంచి దిగుబడి సాధించడానికి వీలు పడుతుంది అటవీ శివారు, ఆయకట్టు చివరి భూముల్లో ఇలాంటి సౌకర్యం సొధ్యంకాకపోయినా వ్యవసాయానికి అదనంగా సహాయక వృత్తులను అభివృద్ధి పరచి గిరిజనుల జీవనాధారం బహుళ (ప్రయోజనకరంగా ఉండేటట్లు చూడాలి ఈ నేపధ్యంలో ఒక్కవిషయం స్పష్టం కావాలి వ్యవసాయ సమాజాలపట్ల వ్యవసాయ వ్యవస్థ కూర్చుపట్ల వామపక్షాలు తమ దృష్టికోణాన్ని మార్చుకున్నప్పుడే భూసంస్కరణల ప్రక్రియ
17
గిరిజనుల కోసం ఒక స్పిరమైన, పురోగామి వ్యవసాయ సమాజాన్ని నిర్మించడంలొ సఫలీకృతమవుతుంది “కబ్జాదారులు గా గిరిజనులు అటవీ భూములను క్రమబద్ధీకరించాలని గత కొన్ని దశాబ్దాలుగా గిరిజనుల పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు గాంధేయవాద వామపక్షవాద ఉద్యమాలు అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేరు మీద భూములను శాశ్వత ప్రాతిపదికన నమోదు చేసి పట్టాలు జారీ చేయాలన్న వాదనను బలపరుస్తున్నాయి అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న వారు అటవీ భూములను సాగు చేస్తున్న కబ్జాదారుల (గిరిజనులు)ను ఆరు నెలలలోగా ఖాళీ చేయించాలని 2002 మేలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత గిరిజన ఉద్యమాలు, అటవీ శాఖ మధ్య సంఘర్షణ తీవ్రరూపం దాల్చింది కబ్జాదారుడు ఎవరు అన్న ప్రశ్నను, అటవీ భూముల యాజమాన్నానికి సంబంధిత అంశాలను సుప్రీంకోర్టు తీర్చు నేపధ్యంలో పరిశీలించాల్సి ఉంది అటవీ భూములపై ప్రభుత్వ గుత్తాధిపత్యం వలసవాద పాలన మిగిల్చిన వారసత్వం ఈ విషయమే క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఉద్యమాలకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణకు కారణంగా నిలిచిపోయింది 1865లో అటవీ శాఖను అధికారికంగా ఏర్పాటు చేశారు మొదటి అటవీ చట్టం ప్రకారం ఇకపై అటవీ భూములన్నింటిపై ప్రభుత్వమే సంపూర్ణ హక్కులు కలిగి ఉంటుంది ఇకపై అటవీ శాఖ ఈ భూములపై ఏకపక్ష సంపూర్ణ నియంత్రణ కలిగి ఉంటుంది అందుకుగాను ప్రత్యేక పోలీసులు, కోర్టులు, చట్టాలు కూడా ఏర్పాటు చేస్తుంది అటవీ యాజమాన్యం కోసం 1877లో సమగ్రమైన, స్పష్టమైన చట్టాలను రూపొందించారు. అయితే తర్వాతి ముఖ్యమైన మైలురాయి మాత్రం 1927లో వెలువరించిన భారత అటవీ చట్టం ఇది ఇప్పటికీ అమల్లోనే ఉంది అటవీ భూములపై ప్రభుత్వ సంపూర్ణ యాజమాన్యాన్ని, నియంత్రణను ఈ చట్టం నిర్ధారించడమే కాకుండా అడవులను రిజర్వు, రక్షిత, గ్రామ అడవులుగా వర్గీకరించింది అయితే ఈ వర్గీకరణ అడవుల పర్యావరణ విలువ ఆధారంగా కాకుండా ప్రజల హక్కులను అనుసరించి జరగడం 1927 చట్టం ప్రత్యేకత అటవీ (1927) చట్టంలో పొందుపరచిన అంశాలను విశ్లేషిస్తే ప్రభుత్వానికి అటవీ భూములు, వనరులపై సంపూర్ణ హక్కులు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుంది ఈ చట్టాన్ని అమలు చేసే ఫారెస్టు సెటిల్మెంట్ అధికారికి అపరిమితమైన అధికారాలుంటాయి రిజర్వు, రక్షిత, గ్రామ అడవుల్లో హక్కులను నిర్ధారించడంలో అతడు కీలక పాత్ర వహిస్తాడు 1927 అటవీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అటవీ ప్రాంతాలలో నివసించే గికిజ్రనులు ఇతర వర్ణాల ప్రజల హక్కులను ప్రభుత్వం చాలా వరకు పరిమితం చేసింది అలాగే అటవీ ఉత్పత్తులు ఇతర సమాజ వనరులపై వారు తమ హక్కును కోల్పోయారు 1927 చట్టాన్ని కేంద్ర,రాప్ర ప్రభుత్వాలు తరచూ సవరిస్తూ ఆడవులపై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకున్నాయి ఈ చట్టం ప్రకారం రిజర్వు అడవులలో (ప్రజలకు భూమిపై ఎలాంటి హక్కులుందజాలవు అలాగే వారిని అక్కడి నుండి తరలించేందుకు అటవీ శాఖ అధికారులకు పూర్తి అధికారాలున్నాయి ఈ చట్టం ప్రకారం రిజర్వు, రక్షిత అటవీ ప్రాంతాలలో వ్యవసాయం చేయడానికి భూమిని 18
సిద్ధం చేయడం నిషిద్దం ఒకవేళ వ్యవసాయం చేయదలచుకున్నా అందుకు సెటిల్మెంట్ అధికారి అనుమతినివ్వాల్సిఉంటుంది అదికూడా వ్యవసాయానికి ఉపయోగిస్తున్న భూములు వర్గీకరణ చట్టం పరిధిలోలేవని స్థానికులకు వ్యవసాయం చేసుకునే హక్కు ఉందని ఆ అధికారి నిర్ధారించినప్పుడే ఈ నిబంధనను ధిక్కరించేవారు భారీ జరీమానా చెల్లించాల్సి వస్తుంది అలాగే వారిని కబ్జాదారులుగా గుర్తిస్తారు
వలసవాద పాలనానంతరం 1952లో వెలువడిన తొలి అటవీ విధానం జాతీయ ప్రయోజనాలు, అంటే పారిత్రామికీకరణకు పెద్ద పీట వేసింది పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పంటలు, అడవులు సాగుచేయడం, తిటవీ ఉత్పత్తుల కోసం అ శాఖకు సంబంధించిన పద్దుల్లో 75 శాతం ఖర్చు చేయడం జాతీయ అవసరాలుగా మారిపోయాయి మూడవ పంచవర్న ప్రణాళికలో అడవులను నేలమట్టం చేసి ఏక పంట తోటలను సాగుచేసే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేశారు ఈ తోటల్లో ప్రధానంగా వాణిజ్యానికి అనుకూలమైన పండ్ల చెట్ల రకాలనే సాగు చేశారు అలాగే అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలకు ఉపయోగపడే వంగడాలను పెద్ద ఎత్తున సాగు చేశారు ఈ క్రమంలో కొందరు రైతులకు పట్టాలను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది యాజమాన్య వికెంద్రీకరణ, వనరులపై రైతుల నియంత్రణ పర్యావరణ పరిరక్షణకు దోహదపడగలదన్న వాదన ఈ కాలంలో బలంగా నిలవలేకపోయింది గిరిజనుల అటవీ వినియోగం అటవీ ఉత్పత్తి యాజమాన్యాల మధ్య సమన్వయం కుదిర్చే విషయాన్ని ఆరవ వంచవర్న (ప్రణాళిక కాని జాతీయ వ్యవసాయ కమీషన్గాని ప్రస్తావించలేకపోయాయి. ఉదాహరణకు ఆరవ పంచవర్ష ప్రణాళిక సమయంలో మధ్యప్రదేశ్‌లోని గిరిజనుల ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఎలాంటి ప్రత్యేక పధకాలు అమలు చేయలేదు అందుకు విరుద్ధంగా కేవలం వేతనాల్లో హెచ్చింపు వల్ల గిరిజనుల ఆర్థిక అవసరాలు తీరగలవన్న భావనతో ప్రభుత్వం ఉండిపోయింది ఎందుకంటే గిరిజన కూలిలు చాలా మటుకు అటవీ శాఖ కోసమే పని చేసేవారు తోటల విస్తరణ కార్యక్రమం గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనభృతి కల్పించగలదని అప్పట్లో విధాన నిర్లేతలు ఆశించారు ఆ పధకం వల్ల గిరిజనులు తమ ఆర్ధిక అవసరాలను తీర్చుకోగలరని వారు విశ్వసించారు అయితే ఈ పరిణామాల ప్రాముఖ్యత ఏమిటంటే గిరిజనులు తమ ఆస్తులను కోల్పోయి రోజువారీ కూలీలుగా అవతారమెత్తారు మరో వైపు ప్రభుత్వం అడవులను వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం పెద్ద ఎత్తున వినియోగించడం మొదలెట్టింది
ఈ నేపధ్యంలో, అటవీ భూములను వ్యవసాయం, ఇతర అవసరాల కోసం బదిలీ చేసే అంశంలో 1980లో రూపొందించబడిన అటవీ సంరక్షణ చట్టం మరో ముఖ్యమైన న్యాయపరమైన మైలురాయిగా మిగిలిపోయింది. 1980కు పూర్వం ఆక్రమణలో ఉన్న అటవీ భూములను సంబంధిత చట్టాలకు లోబడి క్రమబద్ధీకరించడానికి ఈ చట్టం అనుమతినిచ్చింది అయితే 1980 తర్వాత జరిగిన ఆక్రమణలను గుర్తించడానికి సంరక్షణ చట్టం ఎలాంటి ఆస్కారం కల్పించలేదు అటవీ సంరక్షణ చట్టం (1980) ఆధారంగా రూపొందించబడిన జాతీయ అటవీ విధానం (1988) పూర్వం ఆక్రమణలను క్రమబద్ధీకరించడం సాధ్యంకాదని తేల్చి చెప్పింది 1980కు పూర్వం ఆక్రమణకు గురైన అటవీ భూముల క్రమబద్దీకరణ విషయంలో
19
అటవీ శాఖ మరో తిరకాసు పెట్టింది అదేమిటంటే భూములు క్రమబద్ధికరించాలని 1980చట్టం అమలులోకి రాకమునుపే రాష్త్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఉంటేనే ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి వీలు కల్పిస్తూ అటవి శాఖ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది ఇలాంటి చర్యలకు సాంప్రదాయవాద పర్యావరణ ఉద్యమకారుల లాబీ కూడా వత్తాసు పలికింది అనేక రాష్ట్రాలలో అటవీ భూముల ఆక్రమణ పెద్ద ఎత్తున కొనసాగుతోందని, దీనివల్ల పర్వావరణ సమతుల్యానికి ముప్పువాటిల్లగలదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లాబీ సుప్రిం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్లో ప్రధానంగా ఒరిస్సా, పశ్చిమబెంగాల్ కర్టాటక తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, కేరళ అండమాన్ నికొబార్ ద్వీపాలలో కొనసాగుతున్న అటవీభూముల ఆక్రమణ గురించి ప్రస్తావించారు పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు నవంబరు 2001 నుండి ఆక్రమణల క్రమబద్ధీకరణను నిషేధించింది తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిషేధం సడలింపు సాధ్యంకాదని స్పష్టం చేసింది ఈ తీర్చు ఆధారంగా మే 2002లో అటవీ శాఖ ఒక నోటిపికేషన్ విడుదల చేసింది దాని ప్రకారం 1990 నుండి క్రమబద్ధీకరణకు అనర్హమైన ఆక్రమణల నుండి కబ్బాదారులను రాప్ర ప్రభుత్వాలు తక్షణం తొలగించాలి ఖచ్చితంగా చెప్పాలంటే ఈ శాసనం వల్ల సుమారు కోటి మంది గిరిజనులు నిర్వాసితులు కావడమే కాకుండా మనుగడ కొనసాగించడానికి కావాల్సిన అన్ని జీవనాధారాలను కూడా కోల్పోతారు ఆక్రమణల కారణంగా అటవీ శాఖ సంరక్షణ లక్ష్యాలను సాధించలేకపోతోందని తరచుగా నివేదికలు వెలువడ్డాయి కొన్ని స్వచ్భంద సంస్థలకు సమర్పించిన పరిశోధనా పత్రంలో అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆక్రమణల పర్యవసనాలను ఎత్తిచూపింది ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తూపోతే ఆక్రమణల విస్తీర్ణం మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది మరో విధంగా ఈ వాదన అటవీ భూములలో ఎలాంటి కార్యకలాపాలు 2002లో ఆక్రనుణకు గురైన అటవీ భూములు
ఆం(ధ్రప్రదేళ్ 3 418
అస్సాం 2 గడ?
ఛత్తీస్‌ఘడ్ 1504
కర్ణాటక 1090
మవోరార్హ 0 936
మధ్యప్రదెళ్ 0 728
ఒరిస్సా 0 756
కేరళ 0 459
జార్ధండ్ 0 389
ఉత్తరప్రదేశ్ 0 252
ఉత్తరాంచల్ 0 104 ఆధారం వికెబహుగుణ ఐజి నవంబరు 15 2002న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సమర్పించిన
అటవీ భూముల ఆక్రమణ సమస్యలపై నివేదని పత్రం 20
జరిగినా దేశ పర్యావరణ భద్రతకు తీవ్రమైన ముప్పు వాటిల్లగలదన్న భావన స్సురించేలా ఉంది 2002 నాటికి నమోదైన ఆక్రమణల వివరాలను పట్టికలో ఇస్తున్నాము
అటవీ శాఖ అంచనాల ప్రకారం 1980లో ఆక్రమణకు గురైన అటవీ భూములు ఏడు లక్షల హెక్టార్లు కాగా నేడు అది 125 లక్షల హెక్టార్లకు చేరుకుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేమిటంటే 1950 నుండి 1980 వరకు బదిలీ అయిన అటవీ భూముల్లో (సుమారు 43 లక్షల హెక్టార్లు) సగానికి సగం మాత్రమే వ్యవసాయ అవసరాల కోసం వినియోగించబడింది 2001 నాటికల్లా 25 లక్షల హెక్టార్లలో ఆక్రమణలను (క్రమబద్దీకరించారు ఈ భూముల్లో 50 శాతం గిరిజన ప్రాంతాల్లోనే ఉండడం విశేషం వాణిజ్య లాభాలు, జీవనాధారం కోసం జరిగిన ఆక్రమణల మధ్య తేడాను గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరించిందనడానికి పై గణాంకాలే తార్మాణం మరోవైపు భారీ పరిశ్రమలు పెద్ద ప్రాజెక్టుల కోసం జరిగిన ఆక్రమణలు గిరిజనుల జీవితాలపై (ప్రతికూల ప్రభావం చూపాయని నొక్కి చెప్పడం ఇక్కడ ఎంతైనా అవసరం
నిర్వాస ప్రక్రియ ప్రధానంగా రాజకీయ పలుకుబడి లేని పేద రైతులు, రైతు కూలీలపైనే దృష్టి కేంద్రీకరిస్తుందన్న వివిధ సంపూల ఆందోళన ఇక్కడ ఆశ్చర్యంగా తోచదు ఇందుకు పూర్తి భిన్నంగా, భారీ తోటలను, పరిశ్రమలను తరలించిన సంఘటనలు కొన్ని మాత్రమే ఉన్నాయి. 1980కు పూర్వం 1980 తర్వాత సంభవించిన ఆక్రమణలను అధికారులు వర్గీకరించినా తరలింపు ప్రక్రియకు వచ్చినప్పుడు క్షేత్ర స్థాయిలో ఈ తేడాలు నామమాత్రంగానే మిగిలిపోయాయి రెండు రకాల ఆక్రమణలకు దారి తీసిన పరిస్థితులు, కారణాలు ఒకటే అయినా 1980 అటవీ సంరక్షణ చట్టం కేవలం 1980కు ముందు అటవీ భూములు ఆక్రమించిన వారికే చట్టపరమైన మినహాయింపును వర్తింపచేస్తుంది ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియకు కూడా ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది అయితే 1980కు పూర్వం ఆక్రమణకు గురైన భూముల్లో వేలాది హెక్టార్లు 21 ఏళ్ళు గడచినా ఇంకా క్రమబద్ధీకరణకు నోచుకోకపోవడం విశేషం క్రమబద్దీకరణ అయిన భూముల విషయంలో వ్యవహరించిన తీరు కూడా పారదర్శకంగా లేదు వాటిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆక్రమణ సమస్యకు అడవుల నుండి ప్రజలను తరలించడమే ఏకైక పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది అయితే 1980 తర్వాత నిర్వాసితులై వారి విషయంలో తదుపరి చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి మార్గదర్శక సూత్రాలు కాని, విధానం కాని వెలువడలేదు మరోవైపు, అటవీ భూములను పారిశ్రామిక అవసరాల కోసం పునపంపిణీ చేయడానికి ప్రభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది పరిశ్రమలను అనుమతించే విషయంలో పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనలను తుంగలో తొక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి ప్రాజెక్టుల పర్యావరణ అనుకూలతను లోపభూయిష్టంగా అంచనా వేస్తున్నారు అటవీ సంరక్షణ చట్టాన్ని వాణిజ్య ఆర్ధిక సంస్థలు గణనీయంగా ప్రభావితం చేయగలవని దీనిని బట్టి మనం నిర్ధారణకు రావచ్చు ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడం
అటవీ భూముల ఆశ్రమణపై ప్రభుత్వ విధానం గిరిజనుల జీవనభృతి, అటవీ
2
సంరక్షణ అంశాల మధ్య సంఘర్షణకు దారి తీస్తుంది ఈ వాదనను తిప్పికొట్టడానికి ప్రజా ఉద్యమాలు అనేక ప్రయత్నాలు చేశాయి శతాబ్దాల తరబడి గిరిజనులు తమ పరిసర ప్రాంతాలతో సామరస్యంగా జీవనం సాగిస్తున్నారని ఈ కారణంగానే అటవీ ఉత్పత్తులపై తొలి హక్కు వారిదేనని పర్యావరణ పరిరక్షణ ఉద్యమం వాదిస్తోంది ఈ వాదన ప్రకారం గిరిజనేతరులు (వ్రభుత్వమే ఆక్రమణదారులుగా నిలబడతారు గిరిజనులను ఆక్రమణదారులుగా ముద్రవేయడాన్ని వామపక్షాలు కూదా తీవ్రంగా వ్యతిరేకిస్తాయి ఎందుకంటే అడవులు లేనిదే వారు మసుగడ సొగించడం దుర్భరమవుతుందని వారు ఒప్పుకుంటారు
వాణిజ్య, పారిశ్రామిక ప్రయోజనాల కోసం భూములు ఆక్రమించే వారు, జీవనోపాధి కోసం అటవీ భూములను సాగు చేసే వారి మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తించాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి. ఈ కారణంగానే, చాలా ప్రజా సంఘాలు స్థానికులను ఆక్రమణదారులుగా గుర్తించరాదని అటవీ భూములను ఈ కోణం నుండి తిరిగి వర్గీకరించాలని డిమాండ్ చేస్తున్నాయి. సెటిల్మెంట్ ప్రక్రియను సౌధ్యమైనంత వరకు పారదర్శకంగా పూర్తి చేయాలని, గిరిజనుల హక్కులను ఎక్కువ సంఖ్యలో పరిగణనలోకి తీసుకోవాలని కూడా కోరుతున్నాయి. ఉదాహరణకు హిమాలయ జాతీయ పార్కు పరిధిలో కేవలం 1860లో ఆండర్సన్ నిర్దేశించిన సెటిల్మెంట్ ఆధారంగా అతికొద్ది కుటుంబాల వాదనలనే ప్రభుత్వం మన్నించాల్సి ఉంది ఫలితంగా నాలుగింట ఒకటో వంతు ప్రజలు మాత్రమే ప్రభుత్వ స్థలసేకరణ వల్ల నిర్వాసితులయ్యే అవకాశం ఉంది వారికి వన్యప్రాణుల శాఖ పునరావాసం కల్పించాల్సి ఉంది ప్రతి ప్రాంతంలోనూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండడంతో వామపక్షాలు, పర్యావరణ ఉద్యమకారులు భూమి కోసం ఆందోళనలు చేపట్టి ప్రజలకు అటవీ భూములపై నియంత్రణ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు
నవంబరు 2002లో రాంచీలో జరిగిన తొలి జాతీయ గిరిజన మహాసభలో సిపిఐ(ఎం) ఒక తీర్మానాన్ని ఆమోదించింది అటవీ శాఖ జారీ చేసిన మే 2002 నోటిఫికేషన్ ఉపసంహరించాలని, వాణిజ్య అవసరాలకు, సాగు ప్రయోజనాలకు ఉద్దేశించబడిన భూ ఆక్రమణల మధ్య తేడాను ప్రభుత్వం గుర్తించాలని ఆ తీర్మానం డిమాండ్ చేసింది గాంధేయవాద ఉద్యమాల తరహాలోనే, సిపిఎం సభ కూడా అటవీ ఉత్పత్తులు, అటవీ భూములపై గిరిజనుల సంపూర్ణ హక్కును బలపరిచింది 1989లో కిసాన్ సభ ఆమోదించిన తీర్మానంలో కూడా
" అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనుల వ్యవహారంలో అటవీ శాఖాధికారులు జోక్యం
చేసుకోవడం మానుకోవాలని సాగు భూముల్లో గుంతలు తవ్వడం నిలిపివేయాలని డిమాండ్ చేసింది అటవీ హక్కులపై వామపక్షాలకున్న నిబద్ధతను పై తీర్మానాలు స్పష్టంచేస్తాయి అటవీ ప్రాంతాలలో గిరిజన రైతులకు మద్దతుగా తాము జరిపిన పోరాటాలకు అనూహ్య స్పందన లభించిందని కిసాన్‌సభ తన తీర్మానంలో పేర్కొంది
మహారాష్ట్రలో అటవీ భూములు సాగు చేస్తున్న వందలాది మంది గిరిజనులు, దళితులు పేద రైతులపై పోలీసు దాష్టీకం పెరిగిపోయినపుడు కిసాన్‌సభ పెద్దఎత్తన ఆందోళనకు దిగడం ఇందుకు చక్కటి ఉదాహరణ 1978-79లో భూములను క్రమబద్దీకరించాలని
22
మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసినా వాటిని అమలు చేయడంలో అటవీ శాఖ అధికారులు తాత్సారం చేశారు ఈలోగా అటవీ భూముల్లో గుంతలు తవ్వి అటవీ సంరక్షణ, విస్తరణ చర్యలు చేపట్టారు అందుకు 1988 జాతీయ అటవీ విధాన తీర్మానాన్ని బూచిగా చూపారు 2002 నివేదిక ప్రకారం భూమి సమస్య మరింత జటిలమై గిరిజనులు రైతులు - అటవీ శాఖ అధికారుల మధ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది అటవీ శాఖ జారీ చెసిన తొలగింపు ఉత్తర్వులను ఆంధ్ర, కేరళ, మహారాష్త్రలలో నిర్బంధంగా అమలు చేస్తున్నారని ఆదివాసి మహాసభ ఆరోపించింది గిరిజనులను పోలీసులు, అటవీ శాఖాధికారులు తరచుగా హింసకు గురి చేస్తున్నారని, తొలగింపును నిరసిస్తే నిర్బంధిస్తున్నారని పేర్కొంది వామపక్ష ఉద్యమాల్లో కనిపించే మరో ముఖ్య లక్షణం గిరిజన ఇతర వర్గాల పేద రైతులను ఒకే తాటిపై నదపడమే
గాంధేయవాద ఉద్యమ సంఘాలైన ఏక్తా పరిషత్ దాని సహచర సంస్థలైన సమర్ధన్, ప్రయోగ్, నాది ఘాటి సంఘర్ష్ సమితి ప్రజలను సమీకరిస్తూ అటవీ శాఖకు వ్యతిరేకంగా క్రమం తప్పకుండా ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఛత్తీస్‌ఘడ్‌లోని అచానక్ మార్గ జంతుపరిరక్షణ కేంద్రంలోని సుమారు 42 గ్రామాల్లో సమర్ధన్ తన కార్యకలాపాలను చురుకుగా నిర్వహిస్తోంది ఒక నిర్దిష్ట సమస్యపై అటవీ పంచాయతీలు ఉమ్మడిగా పోరాడుతున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఉదాహరణకు అచానక్ మార్గ్ జంతుపరిరక్షణ కేంద్రం పరిధిలోని బిజ్రా గ్రామ సమీపాన ఉన్న ఐదు కుగ్రామాలు డిసెంబరు 2001లో అటవీ పంచాయితీ నిర్వహించి అటవీ శాఖ ప్రారంభించిన విస్తరణ కార్యక్రమాలను సమీక్షించింది తమ (గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములలో అధికారులు నాటిన మొక్కలను పీకివేయాలని, తరతరాలుగా తాము నివసిస్తున్న ప్రాంతాల నుండి వైదొలగరాదని పంచాయితీ తీర్మానించింది ఈ చర్య ఉమ్మడి పోరాటంలో భాగంగానే చేపట్టారు అధికారులు నేడు ఈ జంతు పరిరక్షణ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా అభివృద్ధి పరచి దాని పరిధిలోని ప్రజలందరినీ ఇతర ప్రాంతాలకు తరలించాలని తలపోస్తోంది ఈ పధకాన్ని సమీప గ్రామ ప్రజలందరూ ముక్త కంరంతో వ్యతిరేకిస్తున్నారు. సమర్ధన్ నిర్వహిస్తున్న బైగా పునరావాస కార్యక్రమం గాంధేయవాద సిద్దాంతాలను ప్రతిబింబిస్తోంది ఇప్పటి వరకు సర్ఫోహ ఏక్తాకీ పూర్తి అనే రెండు గ్రామాల వాసులకు పునరావాసం కల్పించింది కొన్ని నియమనిబంధనలను ప్రవేశపెట్టి భూసంస్కరణలు, అటవీ సంరక్షణ కార్యక్రమాన్ని సమర్ధన్ చేపట్టింది సాంప్రదాయ గ్రామ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ఇక్కడ కృషి జరుగుతోంది అయితే ఈ వైఖరితో వామపక్షాలు స్పష్టంగా విభేదిస్తున్నాయి ప్రజాస్వామ్య రీతిలో వర్గ ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటాలు నిర్వహించాలని అవి సూచిస్తున్నాయి
మధ్యప్రదేశ్‌లో జన్సంఘర్న్ మోర్చా నేతృత్వంలో అనేక సంఘాలు గిరిజనులకు భూమి హక్కులు కల్పించాలని పోరాడుతున్నాయి. 1995లో రాష్ట్ర ప్రభుత్వం 183 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఆక్రమణలను 'క్రమబద్ధీకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 0 85 లక్షల హెక్టార్లలో భూమిపట్టాలివ్వడానికి రాష్ట్ర
23
ప్రభుత్వానికి అనుమతినిచ్చింది అది కూడా ప్రాదమికంగానే మరోవైపు ౦ 12 లక్షల హెక్టార్ల భూమిని క్రమబద్దీకరించడానికి నిరాకరించింది మిగతా భూముల విషయంలో సవరించిన ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రాన్ని ఆదేశించింది 1980 తర్వాత మధ్యప్రదేశ్‌లో సుమారు 1 5 లక్షల హెక్టార్ల మేర అటవీ భూమి స్వాధీనానికి గురైందని అనధికారికంగా అంచనా వేశారు అందుకు సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలు మాత్రం ప్రభుత్వం వద్ద లేవు భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ మరి ఆలస్యంగా జరుగుతుండడంతొ అణలు భూఆక్రమణ అన్నది సామాన్య ప్రజల ఆకాంక్షలకు పాలకవర్గాల స్వార్ధ ప్రయోజనాలకు మధృ కొనసాగుతూ వస్తున్న వైరుధ్యాలకు దర్పణం పడుతోందని జన్ సంఘర్ష్ మోర్చా వాదిస్తోంది ఈ వాస్తవాన్ని (గ్రహించాక అనేక అటవీ ప్రాంతాల్లో భూములపై సముదాయ హక్కులను గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు పోరాటాలు పుట్టుకొచ్చాయి. స్థానికంగా వామపక్షాలు ఈ పోరాటాలకు మద్దతు తెలిపినా పార్టీ సిద్ధాంతాల (ప్రకాంం అవి సాంప్రదాయ హక్కులను గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి అయితే భూమిలేని పేద రైతులందరికీ ప్రభుత్వం పట్టాలు పంచాలని అవి మొదటి నుండి కోరుతూనే ఉన్నాయి ఈ వైఖరివల్లే వామపక్షాల భూపోరాటాలను పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా గుర్తించడంలేదు అయితే వామపక్షాల పోరాటాలు, వారి డిమాండ్లు దాదాపు పర్యావరణ ఉద్యమకారుల తరహాలో కనిపిస్తాయి ఏది ఏమైనా, రెండు పక్షాలు ఒక్కవాదనతో అంగీకరిస్తారు అటవీ చట్టాల్లో మౌలికమైన మార్పులు రానిదే, భూములను పున వర్గీకరించందే ఆక్రమణ సమస్యను పరిష్కరించడం ఎంత మాత్రం సాధ్యం కాదని
చివరగా, ఆక్రమణల సమస్యను గిరిజన ప్రాంతాల్లో అటవీ, వ్యవసాయ భూముల దుర్వినియోగం నేపధ్యంలో పరిగణనలోకి తీసుకోవలసి ఉంది భారత భూభాగంలో సుమారు మూడో వంతు భూమిని బంజరుగా గుర్తించాలి మెజారిటీ గిరిజన రైతులకు బంజరు భూములకు దరిదాపుల్లోనే పొలాలున్నాయి. అలాగే సారహీనమైన అటవీ భూముల్లో దున్నే వ్యవసాయం కొనసాగించడం వ్యర్థం దీర్ణకాలంలో ఇలాంటి వ్యవసాయం నష్టాలకు దారి తీయవచ్చు తక్కువ దిగుబడినిచ్చే భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తే ఎలాంటి ఫలితం ఉండదు వారి సమస్యలూ తీరవు భూమి హక్కులను వ్యవసాయోత్పత్తి, వ్యవసాయేతర ఉపాధితో ముడిపెట్టడానికి వామపక్షాలు ప్రయత్నించినా నిలకడయైన వ్యవసాయం అన్న ఆలోచనను అవి ఇంకా చర్చకు తీసుకురాలేదు మరోవైపు భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు వ్యవసాయ సుస్థిరతను సాంప్రచాయబద్ధమైన సముదాయ హక్కుల పునరుద్ధరణతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ప్రస్తుతమున్న ఆర్థిక వ్యవస్థను ఉత్పత్తి సంబంధాలను పరిగణనలోకి తీసుకోకుండా సముదాయం హక్కుల గురించి వారు మాట్లాడుతున్నారు ఫలితంగా, సాంప్రదాయబద్ధమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచి వనరుల వినియోగానికి పరస్పర సహకార వ్యవస్థను నిర్మించే అంశం మూలన పడింది
బశ
పహ గిరిజన జీవనోపాధి - వ్యవసాయరంగ సంక్షోభం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్స్ ఇతర హరిత విప్లవ కేంద్రాల్లో పెరిగిపోతున్న రైళుల ఆత్మహత్యలు స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి వృవసాయ సబ్సిడీలపై కోతతో పెరిగిపోయిన ఖర్చులు, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్బుటిఒ) నిబంధనలను అనుసరించి తొలగించిన వ్యవసాయోత్పత్తుల దిగుమతి ఆంక్షలు భారత వ్యవసాయ సమాజంపై నయా ఉదారవాద ప్రపంచీకరణ మోగించిన మరణ మృదంగాన్ని ప్రతిబింబిస్తాయి వేతన కార్మికుల రేటు తగ్గుదల, పడిపోతున్న వ్యవసాయ వేతనాలు, నానాటికీ క్షీణిస్తున్న వ్యవసాయ దిగుబడి (మరీ ముఖ్యంగా గిరిజన రైతుల విషయంలో) అన్నీ ప్రపంచీకరణ దుష్ఫలితాలను చాటుతున్నాయి. వ్యవసాయ దిగుబడి క్షీణించడానికి సరళీకృత ఆర్ధిక విధానాలే కాకుండా హరిత విప్లవ సాంకేతిక పరిజ్ఞాన దీర్హకాలిక ప్రభావం కూడా కారణమని పర్యావరణ ఉద్యమకారులు మరీమరీ పేర్కొన్నారు అధిక దిగుబడినిచ్చే పంటలవైపు రైతులు మళ్ళడం రెండు విడతల్లో జరిగింది మొదటిది, 1860 తర్వాత వలసవాద పాలనలో పత్తి దిగుబడిలో చవిచూసిన భారీ పెరుగుదల రెండవది, వలసవాదానంతర పాలనలో హరిత విప్లవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టినప్పుడు పేదల పక్షం వహించే పర్యావరణ ఉద్యమకారుల వాదన ప్రకారం ఈ రెండు మార్పులు సాంప్రదాయక విజ్ఞాన వ్యవస్థలను పూర్తిగా పక్కకు తప్పించి వేశాయి గ్రామీణ వ్యవసాయక ఆర్థిక వ్యవస్థలోని సంస్థాగత ఏర్పాట్లను విచ్చిన్నం చేశాయి ఫలితంగా సాంప్రదాయక వ్యవసాయ పద్ధతులు క్షీణించి, అంతవరకూ ఉన్న అఆర్టిక వ్యవస్థలోని పేద, పెద్ద రైతుల మధ్య అసమాన సంబంధాలు మరింత పెరిగాయి అయితే గిరిజనుల అభిప్రాయం మేరకు తొలిదశలో వ్యవసాయం వాణిజ్య స్వరూపం దాల్చినా 25
'కమేణా భూముల పున "సేకరణ వేగం పుంజుకోవడంతో వారు పక్కకు నెట్టివేయబడ్డారు ఆ భూముల్లో వారు పోడు వ్యవసాయం కొనసాగించారు వ్యవసాయ రంగం వాణిజ్య స్వరూపం దాల్చిన తొలి దశలో గిరిజనుల వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ అధిక భాగం సాధారణమైన నాగలి వ్యవసాయ వ్యవస్థకు బయటే ఉంది ఈ విధంగా చూస్తే, జివనోపాధి కోసం వ్యవసాయోత్పత్తిపైనే ఆధారపడ్డ గిరిజనులు ఎవరూ కనిపించరు, ముఖ్యంగా మధ్య భారత ప్రాంతంలో ఈ నేపధ్యంలో, సుస్టిర భూ వినియోగ పద్ధతుల అంశం వ్యవసాయరంగ చర్చలో ఎనలేని (ప్రాధాన్యతను సంతరించు కుంటుంది పర్యావరణ ఉద్యమం మొదటి నుండి గిరిజన వ్యవసాయ పద్దతులను, ముఖ్యంగా పోడు వ్యవసాయాన్ని, సమర్థిస్తూనే ఉంది గిరిజనుల భూ వినియోగ పద్ధతులు నిలకడయైనవని, పర్యావరణ అనుకూలమైనవి ఉద్యమకారులు తరచుగా వాదిస్తూనే ఉన్నారు మరో పక్క వామపక్షాలు పోడు వ్యవసాయం లాంటి పురాతన వ్యవసాయ పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాలం చెల్లిన వ్యవసాయ పద్ధతులను వీడేలా గిరిజనులను ఒప్పించాల్సిన అవసరం ఉందని వాటి అభిప్రాయం ఆదర్శవంతమైన వ్యవసాయ సమాజం, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలన్న అంశంపై వ్యక్తమైన భిన్నమైన భావనల్లో ఈ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఇమిడి ఉన్నాయి. గిరిజన వ్యవసాయ సమస్యను ఉద్యమాలు నూతన పంథాల్లో పరిష్కరించగలిగినపుడే ఒక ఆదర్శవంతమైన వ్యవసాయ సమాజాన్ని నిర్మించడం సాధ్యం కాగలదని త్రిపురలోని వామపక్ష ప్రభుత్వ అనుభవం చెబుతోంది అలాగే గిరిజన జీవనోపాధి సమస్యను భారత వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ నుండి వేరు చేసి చూడడం సాధ్యం కాదని కూడా త్రిపుర అనుభవం నేర్పుతుంది చిన్న స్టీరమైన, వైవిధ్యమైన వ్యవసాయం సక్రమ భూ వినియోగం పద్ధతులను అనుసరించే స్వయం సమృద్ధి గ్రామ స్వరాజ్యాల ఆధారంగానే ఆదర్శవంతమైన వ్యవసాయ సమాజాన్ని నిర్మించగలమని గాంధేయవాద గిరిజన, పర్యావరణ ఉద్యమకారులు భావిస్తారు వ్యవసాయం జీవనోపాధికే కాని మిగులు కోసం కాదు కరినమైన పరిశ్రమ, స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చిన్నతరహా ఉత్పత్తిపై వ్యవసాయం ఆధారపడి ఉంది వ్యవసాయ ఉత్పత్తిలో “మిగులు” అంశంలేని ఈ ఆలోచన స్థిరమైన వ్యవసాయ పద్ధతులంటే సాంప్రదాయ బద్ధమైనవి, స్థానికమైనవని చెబుతుంది స్థానిక సంస్థలు విజ్ఞాన వ్యవస్థలు చిన్నవి, స్వయం సమృద్ధి గలవి, పహ్యూవరణానికి అనుకూలమైనవి కూడా గాంధేయవాద ఉద్యమకారులు నమ్ముతారు క్యాపిటలిస్టు మార్కెట్ల ప్రవేశం ఆధునిక శాస్రసాంకేతిక పరిజ్ఞానం (హరిత విప్లవ పరిజ్ఞానం) ఈ వ్యవస్థలను సర్వనాశనం చేశాయని వారంటారు ఈ వాదనను బలపరుస్తున్న వారిలో వందనా శివా ప్రముఖులు ఈ వాదనపైనే ఆమె ఎందరో గాంధేయవాదులను, సోషలిస్టులను సమీకరించి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. స్థిరత్వం - పర్యావరణం అన్న సూత్రాన్ని ఇలాంటి ఉద్యమకారులు నమ్ముతారు క్యాపిటలిస్టేతర ఆదర్శ 26
వ్యవసాయ సమాజాన్ని ఈ సూత్రం ఆధారంగా నిర్మించగలమని వారి విశ్వాసం వ్యవసాయంలో ఉన్న భిన్నత్వాన్ని సన్నకారు రైతుల జీవితాలను తొలుత హరిత విష్ణవం, తర్వాత ప్రపంచీకరణ నమూనా వ్యవసాయం నాశనం చేశాయని వందనా వాదిస్తారు వాటి వల్ల రసాయనాలు పెట్టుబడుల వినియోగం ఎక్కువైందని, కేంద్రీకరణ సుదూరమైన రవాణాలాంటి దుష్ఫరిణామాలు చవి చూడాల్సి వచ్చిందని కూడా ఆమె చెబుతారు. ఇందుకు విరుగుడుగా వ్యవసాయంలో వైవిధ్యాన్ని పెద్ద ఎత్వన ప్రోత్సహించాలని అందుకు తక్కువ విస్తీర్ణంగల భూములను ఎన్నుకోవాలని, శారీరక (శ్రమ అమితంగా ఉండే వ్యవసాయ పద్ధతులను పాటించాలని వందనాశివ సూచిస్తారు గాంధేయవాద విద్యావేత్త ధరంపాల్ సూచించిన విధానం మాదిరిగానే ఇంచుమించుగా వందనా ప్రతిపాదనలు కనిపిస్తాయి స్థానిక పరిజ్ఞానం, సాంకేతిక పద్దతులను పునరుద్ధరించాలని చాలా కాలం కిందటే ధరంపాల్ సూచించి ఉన్నారు అయితే వందనా ప్రతిపాదనలు కొంత వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి ముఖ్యంగా ఆమె సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వ్యవసాయ రంగ సరళీకరణపై బలమైన విమర్శ కూడా ఉండడం ఈ వైవిధ్యానికి కారణం
బలహీన వర్గాలపై క్యాపిటలిస్టు వ్యవసాయం చూపే దుష్ప్రభావాన్ని దాదాపు అన్ని ప్రగతిశీల ఉద్యమాలు ఒప్పుకున్నా ప్రత్యామ్నాయం చూపడంలో ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. పర్యావరణ ఉద్యమం సూచించిన ప్రత్యామ్నాయం పెద్ద - చిన్న, వ్యక్తిగత
- సముదాయ ఆస్తులు, స్థానిక - ఆధునిక పరిజ్ఞానం మధ్య అంతరాలను మరింత పెంచేదిగా ఉంది ఇలాంటి వైరుధ్యాల సృష్టించడం ద్వారా స్థానిక వంగడాలు హైబ్రిడ్ వంగడాల కంటే తక్కువ దిగుబడినిస్తాయని చిన్న పొలాలు పెద్ద పొలాల కంటే తక్కువ ఉత్పత్తిని, ఆదాయాన్ని అందిస్తాయన్న అపోహలను తొలగించాలన్నదే ఈ ఉద్యమ నేతల (ప్రయత్నం చిన్న తరహా వ్యవసాయ పాలన పునరుత్పత్తి సహజ ఎరువులు, స్వయంకృషిపై ఆధారపడి ఉన్న ఆదర్శవంతమైన వ్యవస్థ అని వారు వాదిస్తున్నారు సాంప్రదాయ విజ్ఞానం పద్ధతులు గ్రామ అవసరాలను ఎలాంటి బయటి సహాయం లేకుండానే తీర్చగలవని వారు చెబుతారు అందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమంతా సహజ వనరుల వ్యవస్థ పట్ల హింసాత్మకంగా ఉన్నట్లు తోస్తుంది మరోవైపు అది లక్షలాది రైతులకు హానికరంగా ఉన్నట్లు కనిపిస్తుంది
పోడు వ్యవసాయాన్ని వందనా స్వయంగా సమర్ధించడం గాని, విశ్లేషించడం గాని చేయనప్పటికీ ఆమె సూచించిన స్థూల వ్యవసాయ వ్యవస్థ ప్రత్యామ్నాయం దేశంలో కొనసాగుతున్న సాంప్రదాయబద్ధమైన వ్యవసాయ పద్ధతులను సమర్ధించేదిగా ఉంది గిరిజన, పర్యావరణ చరిత్రను అధ్యయనం చేసిన విద్యావేత్తలు వలసవాద పాలన స్థిరపడక ముందు గిరిజన సమాజాలన్నీ స్వయం సమృద్ధిగా ఉండేవని సూచించారు గిరిజనుల వ్యవసాయ పద్ధతులు, ముఖ్యంగా పోడు వ్యవసాయం, పర్యావరణ అనుకూలంగాను, వ్యక్తిగత అవసరాలు (ఉపాధి, ఆహారం) తీర్చేవిగాను ఉండేవని వారు విశ్లేషించారు పోడు వ్యవసాయం అడవులను
27
పునర్దీవింపచేయడమే కాకుండా సహజ వనాలను పెంసాందించే విధంగా ఉండేదని మరీ చెప్పారు పోడు వ్యవసాయాన్ని ఒక జీవన విధానంగా చూడాలని, శతాబ్దాల తరబడి పర్యావరణంతో సాగించిన సహజీవనం నుండి అది ఉద్భవించిందని ఒక (ప్రముఖ మానవ శాస్తకారుదు (ఆంత్రోపాలజిస్టు) వాదిస్తారు పోడు వ్యవసాయం పుట్టువూర్వోత్తరాలు ప్రాచినమైనవన్న వాదన, భౌతిక, సహజ వాతావరణంతో దాని అనుగుణ్యతను ఐదు దశాబ్దాల క్రితం రూపొందించబడిన జాతిచరిత్రల ఉల్లేఖనం ఆధారంగా సమర్ధిస్తారు ఉదాహరణకు బైగాల పోడు వ్యవసాయ విధానం వారి సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమని ఎల్విన్ సమర్థించారు అయితే బైగా సమాజం ఏ విధంగా రూపాంతరం చెందిందనే ప్రక్రియను ఎల్విన్ విశ్లేషించలేదు పోడు వ్యవసాయం, ఇతర ఉపాధి మార్చాలు (వేతన కూలి అటవీ ఉత్పత్తుల సేకరణ-అమ్మకం) మధ్య ఉన్న సంబంధానికి కూడా ఆయన ప్రాదాన్యతను ఇవ్వలేదు
ఇన్ని పరిమితులున్నాా ఎల్విన్ వాదన సైద్ధాంతిక ప్రభావం అనేక చరిత్రకారులు, మానవశాస్త నిపుణులపై బలంగా వని చేసింది పోదు వ్యవసాయం వపర్యావరణానిక్ అనుకూలమైనదని, మన్నికగల వ్యవసాయ వ్యవస్థ అని వీరంతా వాదిస్తారు ఉదాహరణకు ఆంటత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుడొకరు పోడు వ్యవసాయం అందించె జొన్నలు లాంటి దిగువడ్రేణి తృణధాన్యాలను ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా దానికున్న కరుఎును తట్టుకునే స్థిర స్వభావాన్ని విశదీకరించారు పొడు వ్యవసాయం ఇంకా జీవించి ఉందంటే అది ఎంత స్థిరమైన వ్యవసాయ వ్యవస్థో బోధపడుతుందని ఆయన వాదించారు ఎందరో ప్రముఖ పర్యావరణ చరిత్రకారులు ఇలాంటి పరిశోధనా పత్రాలను ఆధారం చేసుకొని ఆధునికతకు భిన్నమైన గిరిజన వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి, ఆధునికత లేని వ్యవసాయ ప్రగతి సూత్రాన్ని ప్రతిపాదించడానికి ప్రయత్నించారు స్వాతంత్ర్యానికి పూర్చం, అనంతరం పోడు వ్యవసాయంపై విధించిన నిషేధాన్ని అటవీ శాఖ పాలనాయంత్రాంగం, ఆధునిక భారత దేశానికి చెందిన పారిశ్రామికులు సహజ వనరులు అన్యాయంగా, అక్రమంగా దోచుకోవడానికి రూపొందించిన ఉమ్మడి కుట్రగా చిత్రీకరిస్తున్నారు. అడవులపై ప్రభుత్వ గుత్తాధిపత్యం, వాణిజ్యపరమైన అడవుల పెంపక్తం, కలప వ్యాపారం ఆధునిక శాప్రీయ అటవీ విస్తరణా పధకాన్ని సూచిస్తాయి ఈ పధకం వలసవాద పాలన సాధించిన పర్యావరణ పరిరక్షణలో ప్రధానమైనదిగా గుర్తించారు పరిణామక్రమంగా, స్థానిక హక్కుల-విరాకరణ స్టానిక జీవనోపాధి వ్యవస్థల సమూల వినాశనం లాంటి దుష్పరిణామాలు సంభవించాయని ఈ మేధావులు వాదిస్తున్నారు
వ్యవసాయంలో వైవిధ్యం స్థిర స్వభావం అంశాలను అందరూ ఆకళింపు చేసుకున్నా ముందుగానే నిర్దేశించబడిన పోడు వ్యవసాయ సైద్ధాంతిక సమర్ధనను విశ్లేషించడమే అసలు సమస్యగా మారుతుంది చారిత్రక పరిణామ క్రమం ఆధారంగా ఈ గిరిజన వ్యవసాయ విధానాన్ని అర్ధం చేసుకోవడం కంటే విశ్లేషణ ఎంతో ముఖ్యం పోడు వ్యవసాయంపై ఇలాంటి
28
ఒక అధ్యయనంలో అజయ్‌ప్రతాప్ పై విశ్లేషణను సమర్ధించారు పరిమితమైన పర్యావరణ పరిస్థితుల్లోనే పోడు వ్యవసాయం మనగలదని ఆయన నిరూపించారు సమకాలీన పోడు వ్యవసాయ పద్ధతులు మొక్కలనాట్ల తీవ్రతపై ఆధారపడి ఉన్నాయని బతుకుతెరువు కొనసాగింపు భూములు కోల్పోకూడదన్న లక్ష్యాలతో కూడుకున్నవని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ విశ్లేషణను బట్టి చూస్తే ప్రస్తుత పోడు వ్యవసాయ పద్ధతులు పర్యావరణ అనుకూలమైనవిగా అటవీ సంరక్షణకు అనుగుణంగా ఉన్నాయని వాదించడం కష్టమవుతుంది ఈశాన్య రాష్రాలలో విసృతంగా అధ్యయనం చేసిన పి ఎస్ రామకృష్ణన్ విశ్లేషణ కూడా అజయ్ ప్రతాప్ వాదనలను సమర్థిస్తుంది అడవుల కోత పోడు వ్యవసాయ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కనక ఈ పద్ధతులను శాస్త్రీయంగా మెరుగుపరచి, ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని రామకృష్ణన్ నూచించారు ఈ నేపధ్యంలో, ఏ పరిస్థితుల కింద పోడు వ్యవసాయం మనగలుగుతుందో, గిరిజనుల అవసరాలు తీర్చడం ఎలాగో పరిశీలించడం ముఖ్యం (ప్రజాకర్షక గాంధేయవాద వైఖరులు ఇలాంటి సమస్యలను ఎన్నడూ పరిష్మరించలేదు పోడు వ్యవసాయ వ్యవస్థలో మార్పులు, దాని సామర్ద్వాన్ని వారు ఎరుగరు ఇందుకు ముఖ్య కారణం పోడు సవసాయం, స్థూల రాజకీయ అర్థిక వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాన్ని వారు గుర్తించకపోవడం గోడు వ్యవసాయ వ్యవస్థ ముఖ్య లక్షణాల్లో కాలాల వార్ ప్రణాళికలు ఒకటి ఉత్పత్తిలో ఈ ఎణాళికలకు నేరుగా సంబంధముందేది దీని పర్యవసానం రైతు చేతివృత్తిదారులు, పశువుల పర్లు గిరిజన సముదాయాల మధ్య ఉన్న సహకార సంఘర్షణ సంబంధాలపై కూడా డేది పై సూత్రీకరణ నేపథ్యంలో పరిశీలిస్తే జీవనోపాధి వ్యవస్థల దీర్జకాలిక స్వభావం స్థానిక, ప్రాంతీయ, జాతీయ రాజకీయ ఆర్ధిక వ్యవస్థలో సంభవించే కొద్దిపాటి అలజడులు ఎడా. పోడు వ్యవసాయం వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపేలా చేసిందని చెప్పడం శావ్యంగా ఉంటుంది. 19వ శతాబ్ద చివరి దశకం కెల్లా ఈ అస్థిరమైన వ్యవస్థలన్నీ తమ ఎనుగడకు స్థానిక ఆర్ధిక వ్యవస్థ విస్తరణ పైనే ఆధారపడి ఉండేవి రామకృష్ణన్, అజయ్'ప్రతాప్‌ల ఏళ్లేషణలు ఈ కీలకమైన అంశంపై ఎంతో కొంత సానుకూలంగా ఉందేవి ఫలితంగా, వాది విశ్లేషణలు పోడు వ్యవసాయాన్ని ఆర్ధికంగా, పర్యావరణ పరంగా తీర్చిదిద్దాల్సిన అవసరాల్ని కూడా సమర్ధిస్తాయి అయితే ఇందుకు విరుద్ధంగా గాంధేయవాద, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు ఈ విశ్లేషణలను దాదాపుగా విస్మరించాయనే చెప్పవచ్చు స్థిరమైన అభివృద్ధి అనేది ఒక సైద్ధాంతిక ఆయుధం మాత్రమే ఆచరణలో దాని విలువ పరిమితమే
పోడు వ్యవసాయ పద్ధతుల అభివృద్ధి
పై విశ్లేషణను అనుసరించి, పర్యావరణ ఉద్యమకారులు వామపక్షాలను హరిత విప్లవ సమర్ధకులుగా హైట్రిడ్ విత్తనాల వినియోగం, ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని (ప్రోత్సహించేవారిగా అదే సమయంలో పరిచయం చేశారు గిరిజన ప్రాంతాల్లో నాగలి సేద్యాన్ని వాణిజ్య పంటల సాగును కూడా వామపక్షాలు ప్రోత్సహిస్తున్నాయని, వాటి దృష్టిలో పోడు 29
వ్యవసాయం 'ప్రాచీనమైనదని ఉద్యమకారులు పేర్కొంటున్నారు వ్యవసాయ మిగులు ఆధారంగా వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ విస్తరించాలని వామపక్షాలు కోరుకుంటాయి గిరిజన వ్యవసాయం మిగులు ఉత్పత్తిని సాధించలేదు కనక వెనుకబడినదని అవి భావిస్తాయి భూస్వామ్య వ్యవస్థను రూపుమాపాలంటే వ్యవసాయ ఉత్పత్తిలో మిగులు సాధించడమే పప్రధానమన్న విశ్వాసంతో ఏకీభవించే వామపక్షాలు, ఈ లక్ష్యాల సాధనకు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అధిక మోతాదులో రసాయనాల వాడకాన్ని ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాల సాగును ఎలాంటి సంకోచం లేకుండా సమర్థిస్తున్నాయి అయితే పర్యావరణ ఉద్యమకారులు చిత్రీకరిస్తున్నట్లుగా వామపక్షాలు ఆధునిక వ్యవసాయ పద్ధతులను బేషరతుగా, గుడ్డిగా సమర్థించడం లేదు వామపక్షాల దృష్టికోణంలో ఆదర్శవంతమైన వ్యవసాయ సమాజం భూస్వామ్య, పెట్టుబడిదారీయేతర స్వభావం కలిగి ఉండాలి పరిభ్రమించే వారే (రైతులు) యజమానులుగా ఉండాలని, ఉత్పత్తిపై వారికే పూర్తి నియంత్రణ ఉండాలని వారి ఆశయం ఇలాంటి ఆదర్శ వ్యవస్థను నిర్మించాలంటే స్వాతంత్ర్య భారతంలో వ్యవసాయక ఆర్ధిక వ్యవస్థను శాసించే సామాజిక సంబంధాల్లో గణనీయమైన మార్పు రావాలని, అదే సమయంలో ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని ముఖ్యంగా నీటి పారుదల, సేద్యం రంగాల్లో రైతులందరికీ అందుబాటులో తేవడానికి విధానాలను రూపొందించాలని వామపక్షాలు కోరుతున్నాయి నీటిపారుదల రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (భారీ నీటి ప్రాజెక్టులు, కాల్వలు) వామపక్షాలు మొదటి నుండి సమర్థిస్తూనే ఉన్నాయి ఎందుకంటే అధిక వ్యవసాయ దిగుబడి ఒక్కటే దేశ ప్రజలందరికి ఆహార భద్రత కల్పించగలదని అవి నమ్ముతున్నాయి వ్యవసాయ రంగ అభివృద్ధి ఫలాలను కార్మికులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, సన్నకారురైతులందరికీ దక్కాలని ఈ వర్గాల కోసం 1930 నుండి ఉద్యమాలు నిర్వహిస్తున్న వామపక్షాలు కోరుతున్నాయి. ఈ సైద్దాంతిక నిబద్ధతలో భాగంగానే వామపక్షాలు హరిత విప్లవం సందర్భంగా అధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని వ్యతిరేకించలేదు పర్యావరణ అనుకూలత కోణం నుండి కూడా తమ వైఖరి సరైనదేనని వారు విశ్వసిస్తారు అయితే వ్యవసాయ పెట్టుబడిని ద్విగుణీకృతం చేసే హైబ్రిడ్ వంగదాలను ఎంపిక చేసే విషయంలోనే వారు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి పెరిగితే ఎక్కువ దిగుబడి సాధించే క్యాపిటలిస్టు రైతులే మరింత ప్రయోజనం పొంది మిగిలిన వ్యవసాయ వరాలు చాలా వెనుకబడిపోతాయని వామపక్షాలు విళ్లేషించాయి స్థూల రాజకీయ ఆర్థిక విశ్లేషణలో అంతర్భాగంగానే వామపక్షాలు ఈ విమర్శను ముందుకు తెచ్చాయి 19560 తొలి రోజుల నుండి అమెరికన్ హైబ్రిడ్ విత్తనాలను భారత వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడాన్ని అవి వ్యతిరేకిస్తున్నాయి అధిక దిగుబడినిచ్చే ఈ వంగడాల సాగుకు ధనికరైతులే మొగ్గు చూపుతారని, అదే జరిగితే మధ్యతరహా, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతారని అవి వాదిస్తూనే ఉన్నాయి 80
హైబ్రీడ్ విత్తనాల వినియోగంతో వ్యవసాయ పెట్టుబడి పెరిగిపోయి క్యాపిటలిస్టు ధోరణులు పెరిగిపోతాయని, క్యాపిటలిస్టు సంబంధాలు ఉత్పత్తిని నిర్దేశిస్తాయని వారి ఆందోళన హరిత విప్లవంపై సిపిఎం వెలువరించిన విమర్శనా పత్రం కూడా ఇదే స్వరంలో ఉంది సిపిఎం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అఖిల భారత కిసాన్ సభ పూర్వ ప్రధాన కార్యదర్శి అయిన హరికిషన్ సింగ్ సూర్దిత్ రైతు ఉద్యమ దృష్టికోణం నుండి ఇలా రాశారు
“ఆధునిక పరిజ్ఞానం (హరిత విప్లవం) ప్రవేశపెట్టడంతో రెండు రకాల ప్రయోజనాల మధ్య సారూప్యం ఏర్పడింది అవి భారత క్యాపిటలిస్టుల, వ్యవసాయ క్యాపిటలిస్టుల ప్రయోజనాలు, వ్యవసాయ వ్యాపారంలో చురుగ్గా ఉన్న బహుళబాతి సంస్థలు (రసాయనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపు నివారణ మందులు ఉత్పత్తి చేసే కంపెనీలు), వ్యవసాయ అవసరాలకు యంత్ర పరికరాలను తయారు చేసే భారీ పరిశ్రమల ప్రయోజనాలు రెండూ ఈ ప్రక్రియ వల్ల లాభపడ్డాయి ”
హరిత విప్లవం అమలు కాలంలో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగినా తలసరి ఆహార లభ్యత శాతం తగ్గి, 1960ల్లో నమోదైన శాతం కంటే తక్కువగా ఉండిపోయిందని సూర్దిత్ చెప్పారు దీనికి ముఖ్య కారణం దేశ (ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలే వ్యవసాయ రంగంలో సన్నకారు, పెద్ద రైతుల మధ్య ఉన్న అంతరాలను పూద్చనిదే వ్యవసాయ విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా సన్నకారు రైతులు, రైతు కూలీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని సూర్జిత్ వ్యాఖ్యానించారు వ్యవసాయంలో ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానాల జోక్యం అంశాన్ని ఎప్పుడూ సామాజిక సంబంధాల పునివ్యవస్టీకరణతో ముడిపెడుతూ వచ్చిన వామపక్షాలు, (త్రిపురలో గిరిజనుల వ్యవసాయ సమస్యలను పరిష్కరించడానికి ఇదే వైఖరిని అవలంబించేందుకు ప్రయత్నించాయి. వామపక్షాల తాలి ముసాయిదా సత్రాలలో ట్రిపురకు చెందిన ప్రస్తావన ఉంది అదీ కేవలం సాంస్కృతిక, భూమిహక్కుల నేపధ్యంలోనే 1990 తొలి సంవత్సరాల్లోనే కిసాన్‌సభ పోడు వ్యవసాయదారుల గురించి విపులంగా ప్రస్తావించింది పోడు వ్యవసాయంలో కొనసాగుతున్న వారికి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని తీర్మానించింది అదికూడా త్రీపురలోని వామపక్ష ప్రభుత్వం ప్రాధమిక చర్యలు తీసుకున్న తర్వాతనే రుమియాలకు వేరే వృత్తుల్లో పునరావాసం కల్పించాలన్న ప్రతిపాదనే వ్యవసాయ రంగంపట్ల వామపక్షాలకున్న ఆధునిక దృష్టికోణాన్ని చెబ్బకనే చెబుతుంది ఇది ప్రజాకర్షక పంధాకు పూర్తిగా భిన్నమైనది క్యాపిటలిజానికి పూర్వమున్న భూమి వినియోగ పద్ధతులు ప్రాచీనమైనవిగా కాలం చెల్లినవిగా గుర్తించడం జరిగింది స్థిర వ్యవసాయం భూ వినియోగానికి మేలైన మార్గమని, ఉపాధి - ఆదాయంలో స్థిరత్వాన్ని కల్పిస్తుందన్న వాదన ఒకటుంది
ఈ వాదన ఎలా ఉన్నా పోడు వ్యవసాయదారులకు ఇతర వృత్తుల్లో పునరావాసం కల్పించే విశిష్ట పధకం ఒక్క త్రిపురలోనే అమలు కావడం విశేషం అది కూడా వ్యవసొయేతర రంగంలో ప్రభుత్వ జోక్యంతో రైతులకు పునరావాసం కల్పించడం ఎక్కడా జరగలేదు
రే
స్వాతంత్ర్యానికి పూర్వం త్రిపుర ఒక సంస్థాన రాజ్యం 1941లో ఆ రాష్ట్ర జనాభాలో సుమారు 52-85 శాతం ప్రజలు గిరిజనులు. అయితే దేశ విభజన, కాందిశీకుల రాక (బెంగాలీలు) వల్ల గిరిజనులు మైనారిటీ వర్గంగా మారిపోయారు. 1971-81 దశకంలో గిరిజనుల శాతం 28.44కు పడిపోయింది. అయితే 1991 జనాభా లెక్కల మేరకు త్రిపురలో వారి శాతం 80. 95కు చేరుకుంది. రుమియా అన్న పదం ముందు నుండి వస్తున్నది కాదు. గిరిజనులను వృత్తిపరంగా ప్రత్యేకంగా గుర్తించడానికే పాలకులు ఆ విధంగా నామకరణం చేసి ఉంటారు. సిపిఎం తన 1983 ఎన్నికల మ్యానిఫెస్టోలో 18 వేల రుమియా కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు ఒక పునరావాస సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని స్పష్టంగా పేర్కొంది. పునరావాసం కల్పించాల్సిన అవసరం కొన్ని ప్రత్యేక పరిస్థితుల నుండి ఉద్భవించింది. రుమియాలు నిరుపేదలు. రుణభారంతో కుంగిపోతూ బంజరు భూముల్లో సాగు చేస్తూ బతుకు బండిని నడిపిస్తున్నవారు. పోడు వ్యవసాయం అశాస్త్రీయమైనది, జీవనోపాధికి అంతంత మాత్రంగానే ఆధారమైన ఇలాంటి వ్యవస్థ ఆర్థికంగా మనగలిగేది కాదు. 'ఎకరాకు 226.50 రూపాయల పెట్టుబడి 65.5 పని దినాలు అవసరమయ్యే ఈ సాగువల్ల సంక్రమించే వార్షిక ఆదాయం కేవలం 218 రూపాయలుమాత్రమే. ఫలితంగా సంవత్సర కాలంపాటు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం, వారికి కనీస వేతనాలు చెల్లించడం అసాధ్యమైన కార్యంగా మిగిలిపోయింది. అయితే 1985లో వామపక్ష ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం మొదటిది మాత్రంకాదు. బ్రిటీష్ పాలకుల సూచన మేరకు.్రిపుర రాజు 1981లో కళ్యాణ్పూర్ రిజర్వును ఏర్పాటుచేసి గిరిజనులు నాగలి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించాడు. కళ్యాణ్పూర్ ప్రాంత భూములు సారవంతమైనవి కూదా. గిరిజనుల భూమి హక్ములను పరిరక్షించేందుకు కౌలుదారుల
- చట్టాన్ని కూడా సవరించారు. స్వాతంత్ర్యానంతరం గిరిజనులను ప్రధాన స్రవంతి అయిన వ్యవసాయ వ్యవస్థలోనే పునరావాసం కల్పించాలని అనేక ప్రయత్నాలు జరిగాయి. గిరిజనుల కోసం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయడానికి, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసుకోవడానికి పోడు వ్యవసాయ నియంత్రణ పథకాన్ని అనులు చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజక కార్యక్రమమైన ఈ పథకం కింద లబ్దిదారులకు సాగుభూమిని, 5600 రూపాయల ప్రాథమిక పెట్టుబడిని అందజేశారు. మౌలిక వసతులతో కూడిన కాలనీలను గిరిజనుల కోసం నిర్మించారు. 1969లో 59 కాలనీలు ఏర్పాటయ్యాయి.. అయితే ఈ పథకం సాధించిన విజయం పరిమితంగానే ఉంది. ఎందుకంటే ఎంపికైన 26,388 కుటుంబాల్లో కేవలం 37 శాతం కుటుంబాలే లబ్బిపొందాయి. లబ్జిదారుల్లో కూడా అనేక మంది నాగలి వ్యవసాయం చేపట్టడంలో విఫలమయ్యారు. నేటికీ క్రిపురలోని రక్షిత అటవీ ప్రాంతాల్లో సుమారు 18 వేల కుటుంబాలు జీవనభృతిని పొందుతున్నాయి. 1980లో వీరికి ఉపాధి కల్పించాల్సిన తక్షణావసరం ఉందని 82
అప్పటి ప్రభుత్వం గుర్తించింది అనంతరం, 1983లో వామపక్షాలు తమ ఎన్నికల మెనిఫెస్ట్రోలో రుమియాలకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చాయి పునరావాసం కల్పించేంత వరకు పోడు సాగుపై ఎలాంటి నిషేధం విధించబోమని, అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందజేస్తామని వామపక్షాలు హామీ ఇచ్చాయి. 1984లో వామపక్ష ప్రభుత్వం గిరిజనుల పునరావాసానికి సంబంధించిన ఒక పధకాన్ని ప్రతిపొదించింది ఆ పదకం ముఖ్య లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి 1 సంచార, భూమిలేని గిరిజనులకు ఆర్ధిక పునరావాసం 2 పోడు వ్యవసాయం నుండి రుమియాలను దూరంగా ఉంచడం ౩ _ అడవుల కోతను, తదనంతర దుష్ఫరిణామాలను అడ్డుకోవడం 4 నిస్సారమైన, బంజరుగా ఉన్న భూములను శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధి పరచి వాణిజ్యపరమైన తోటలు సాగు చేయడం 5 _ సంచార గిరిజన తెగలకు ఉపాధి అవకాశాలు కల్పించడం 6 _ స్థానిక పరిశ్రమలకు అవసరమయ్యే ప్రాధమిక వనరుల ఉత్పత్తి 7 _ మౌలిక సదుపాయాలైన రవాణా, సంచార, నీటి వసతులను అభివృద్ధి పరచడం 8 కాలనీల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం 9 _ గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచడం 10 సామాజిక ప్రయోజనాలైన విద్య, వైద్యం, నీటి సరఫరా తదితరాలను గిరిజనులకు అందించడం ఈ (ప్రధాన లక్ష్యాల్లో అంతర్భాగంగానే రబ్బరు తోటల పెంపకంతో గిరిజనులకు ఉపాధి కల్పించడంతోపాటు వ్యవసాయేతర వృత్తులైన పశుపోషణ, చేపల చెరువుల పెంపకాన్ని వాణిజ్య సరళిలో ప్రోత్సహించడం ఈ పదకం ఉద్దేశం ఈ తోటలను త్రిపుర తోటల పునరావాస సంస్థ, లబ్దిపొందిన భూమిలేని గిరిజనులు ఉమ్మడిగా నిర్వహిస్తారు ఏడవ పంచవర్న ప్రణాళికా కాలంలో సుమారు 16,150 గిరిజన కుటుంబాలకు వ్యవసాయేతర రంగాల్లో పునరావాసం కల్పించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఇందులో 9,842 కుటుంబాలకు రబ్బరు తోటల సాగులో పునరావాసం కల్పించారు మరో 4,297 కుటుంబాలను పాడి పరిశ్రమ, వ్యవసాయం, ఉద్యానవనం, చేపల సాగు తదితర రంగాల్లో ఉపాధి కల్పించారు పొడు వ్యవసాయం ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను పెంపొందించడం ప్రభుత్వ పునరావాస పధకం ప్రధాన వ్యూహం త్రిపురకు ఇంతకు ముందు తెలియకున్నా ఆ రాష్ట్రంలో రబ్బరు బాగా పండుతుంది తక్కువ ఖర్చుతో కూడుకున్న రబ్బరు తోటలు పెంపకం, ఇతర పంటలతో కలిపి ఉమ్మడిగా సాగు చేయవచ్చు ముఖ్యంగా అనాస, కాఫీ తేయాకు, మిరియాల పంటలతో రబ్బరు తోటలను ఉమ్మడిగా సాగు చేయవచ్చు. ఇలా సాగు చేసిన మిశ్రమ పంటల నుండి తేనె సేకరించవచ్చు గిరిజన పునరావాస పధకాలన్నీ 388
దాదాపు ఇదే విధానాన్ని అవలంబిస్తాయి. వికేంద్రీకరణ వ్యవస్థ ద్వారా తోటల నిర్వహణ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలను జిల్లా అభివృద్ధి మండళ్ళ ద్వారా అమలు చేస్తుంది లబ్బిదారులను (గ్రామ సభల్లో ఎన్నుకుంటారు అయితే లబ్టిదారులకు రబ్బరు తోటల భూమిపై, ఉత్పత్తిపై హక్కు కల్పించడం ఇంకా సుదూర స్వప్నంగానే కనిపిస్తోంది తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికా సమయానికి రబ్బరు తోటల సాగును ప్రాొత్సహిస్తున్న సంస్థగా ఇండియా రబ్బరు ప్రాజెక్టు ఉద్భవించింది త్రిపుర విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం, రబ్బరు బోర్డు, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా సహాయ సహకారాలు అందించి ఆ రాష్ట్రాన్ని భారత రబ్బరు పరిశ్రమకు రెండవ రాజధానిగా తీర్చిదిద్దారు త్రిపుర పధకాన్ని కేరళ రబ్బరు పరిశ్రమను ఆదర్శంగా తీసుకొని రూపొందించారు అందులో పేదల కోసం రబ్బరు పధకం ప్రధానమైనది గిరిజనులు, పేద రైతులకు తగినంత ఆదాయం అందించేందుకు ఈ పధకం కృషి చేస్తోంది అయితే ఈ ప్రక్రియలో పేద రైతులు ప్రపంచ రబ్బరు మార్కెట్లో అంతర్భాగమయ్యారు శారీరక శ్రమ, మౌలిక వనరులు అందించే వ్యవస్థగా మారిపోయారు ధాయ్‌ల్యాండ్, ఇండోనేషియాల తర్వాత అధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే దేశం భారత్ ఇందులో కేరళ భాగమే 90 శాతం 1980 తర్వాత సాంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా రబ్బరు తోటలను పెంచసాగారు వాటిలో త్రిపుర ప్రముఖమైనది రబ్బరు తోటల పెంపకం లాభదాయకంగా కనిపించింది ఎందుకంటే ఈ ప్రయోగం రుమియాలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు తగిన ఆదాయం తెచ్చిపెడుతుంది మిశ్రమ పంటలైన అనాస మిరియాలు కూడా భారీగానే ఆదాయం తెచ్చిపెడతాయి. వాణిజ్య పంటల సాగుకు బంజరు భూములు వినియోగించడంవల్ల త్రిపుర ప్రభుత్వం తన రాబడిని పెంచుకోవడంతోపాటు పరిశ్రమలు, ఎగుమతుల రంగంలో కూడా అభివృద్ధి సాధించడానికి వీలు పడుతుంది అయితే 1990 దశకం చివరికల్లా రబ్బరు ఆర్ధిక వ్యవస్థ దీర్జకాలిక ప్రభావాలు కేరళ ఆర్ధిక వ్యవస్థపై పడసాగాయి. ప్రపంచ మార్కెట్లో విలీనం కావడంవల్ల అంతర్జాతీయ స్థాయిలొ సంభవించే పరిణామాలు స్థానిక రైతులను సైతం ప్రభావితం చేయసాగాయి 1997-98 కాలంలో రబ్బరు ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గుముఖం పట్టడంతో రబ్బరుపరిశమ కేరళ సహజ రబ్బరు స్థానంలో చవకగా లభించే దిగుమతి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించింది ఈ పరిణామం కేరళ వ్యవసాయ రంగం మొత్తాన్ని కబళించి వేసింది సన్నకారు రైతులపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపింది సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్‌తో కలిసి కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు స్పష్టంగా తెలిసాయి వారి నివేదిక ప్రకారం పత్ఫనంతిత కొల్లం, తిరువనంతపురంలో గిరిజనులకు చెందిన సుమారు 70 శాతం భూముల్లో రబ్బరు తోటలు పెంచారు అయితే ఆర్థిక విశ్లేషణలో మాత్రం సన్నకారు రైతులే తీవ్రంగా నష్టపోయినట్లు తేలింది ఇదే విషయాన్ని అభివృద్ధి అంశాల అధ్యయన కేంద్రం కూడా దృవీకరించింది ఈ సంస్థ మలనాడ్ అభివృద్ధి సంస్థలో భాగస్వాములైన ౩ెశీ
రబ్బరు రైతుల ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేసింది ఆహార పంటలకు ఎప్పుడో స్వస్తి చెప్పడంవల్ల ఈ రైతులు తమ ఆదాయంలో అధిక భాగం ఆహార ధాన్యాల కొనుగోలు కోసమే కేటాయించాల్సి వచ్చిందని సంస్థ నివేదిక పేర్కొంది రబ్బరు సాగు ఒక్కటే ఆదాయ మార్గం కాదని గిరిజనులు తమ మనుగడ కోసం ఇతర ప్రత్యామ్నాయ వృత్తులపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని నివేదిక స్పష్టం చేసింది గిరిజనుల ఆదాయంలో అధిక భాగం వేతనాల రూపంలో అందుతోంది రబ్బరు సాగు పర్యావరణంపై చూసే దుష్ప్రభావంవల్ల నీటి లభ్యత భూసారం, ఆహార భద్రత విషయాలపై అనేక ప్రశ్నలు తలెత్తాయని అధ్యయనంలో తెలుసుకున్నారు
ఈ అనుభవం నేపద్యంలో త్రిపుర రబ్బరు పధకం ప్రగతిపై సమీక్ష జరపాల్సిన అవసరం ఏర్పడింది రబ్బరు పరిశ్రమ అభివృద్ధి, ఎగుమతుల పెంపు లక్ష్యంతో ్రిపుర (ప్రభుత్వం లాటెక్స్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నెలకొల్పింది ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది అయితే కేరళ అనుభవం నేపధ్యంలో త్రిపుర ప్రభుత్వ విధానాల బెచిత్యాన్ని ప్రశ్నించాల్సి ఉంది కాని త్రిపుర ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా అంధకారంలో ఉన్నట్లుంది తన విధానాలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపగలవన్న విషయాన్ని తెలుసుకోవడానికి అక్కడి ప్రభుత్వం (శ్రద్ధ చూపడంలేదు. దిగుమతి పరిమాణ ఆంక్షలను సడలించిన తర్వాత రబ్బరు ధరలు 50 శాతానికి పైగా పడిపోయాయని త్రిపుర (గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జితేంద్ర చౌదరి ఒప్పుకున్నారు ఈ కారణంగానే ప్రభుత్వం ఉద్యానవన పంటలైన పనస, అనాసలపై దృష్టి సారించాల్సి వచ్చింది గిరిజనుల ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచకపోవడం, ఉత్పత్తి సాధనాలపై వారికి నియంత్రణ లేకపోవడం వల్లే వారి ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది ఈ అంశాలకు త్రిపుర రబ్బరు పధకం తగిన ప్రాధాన్యతనివ్వలేదు గిరిజనుల 'ప్రయోజనార్థం రబ్బరు ఉత్పత్తిదార్ల సంఘాలను ఏర్పాటు చేసి వారి జీవనోపాధి కోసం ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాలని త్రిపుర ప్రభుత్వం యోచిస్తున్నా గిరిజన, గిరిజనేతర సమాజం మధ్య ఉన్న అసమాన సంబంధాల్లో ఎలాంటి మార్చురాలేదు కేరళ విషయంలో అభివృద్ధి అంశాల అధ్యయన కేంద్రం చేసిన సూచనలను బహుశా త్రిపుర ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకోవాలి సాగులో ఉన్న బంజరు నేలల్లో సుమారు 50 శాతాన్ని బహుళపంట విధానానికి వినియోగించాలని ఆ కేంద్రం కేరళ ప్రభుత్వానికి సూచించింది ముఖ్యంగా ఆహార పంటలు, స్థానికంగా అమ్మకానికి అనువైన వాణిజ్య పంటలను ఈ విధానంలో భాగం చేయాలని కోరింది అయితే, పోడు వ్యవసాయాన్ని శాష్రీయంగా అభివృద్ధి పరచినపుడే ఆశించిన లక్ష్యాలు నెరవేరగలవు ఈశాన్య రాష్ట్రాలలో పరిశోధన జరిపిన పి ఎస్ రామకృష్ణన్ ఇదే విషయాన్ని తన నివేదికలో నొక్కి చెప్పారు ఈ విషయంలో ఎలాంటి కదలిక రావాలన్నా తొలుత వామపక్షాలు పోడు వ్యవసాయాన్ని ప్రాచీనమైనదిగా, సమస్యాత్మకమైనదిగా పరిగణించడం మానాలి దానిని సమూలంగా వ్యవస్టీకరించి లాభ,
385
'ప్రగతిదాయక విధానంగా మార్చడానికి కృషి చేయాలి గిరిజనులకు ఉపాధి కల్పించే సాధనంగా పోడు వ్యవసాయాన్ని గుర్తించి బహుళ ప్రయోజనాలు నెరవేర్చగల పంటలను తోటలను ఈ విధానంలో అంతర్భాగం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు ఈ విధంగా పోడు వ్యవసాయంతో వ్యవసాయేతర వృత్తులను అనుసంధానం చేయవచ్చు గిరిజనుల వ్యవసాయ పద్ధతులను వెనుకబడినవిగా కాకుండా నూతన వనరుల యాజమాన్య వ్యవస్థల్లో భాగంగా గుర్తించి ఇతర వ్యవసాయ విధానాలతో సహజీవనం సాగించేలా చూడాలి పోడు వ్యవసాయాన్ని పర్యావరణ అనుకూలంగా మలచడంపై దృష్టి సారించడమే కాకుండా గిరిజనుల ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్రవంతి ఆర్థిక వ్యవస్థతో ఉన్న అసమాన మార్చిడిని సవరించాలి అసమాన క్రయవిక్రయం 2001 వేసవిలో ఒరిస్సాలోని గిరిజన ప్రాంతాల్లో అనేక ఆకలి చావులు సంభవించినట్లు వార్తలొచ్చాయి. కాశిపూర్ జిల్లాలో గిరిజనులు తిండి దొరక్క విషపూరితమైన మామిడి విత్తనాలను తింటున్నారని స్పష్టమైంది (భారత అహార సంస్థ (ఎఫ్‌సిఐ) గోదాముల్లో 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు మూలుగుతున్న సమయంలో ఈ ఆకలి చావులు సంభవించాయి. ఇదే కధ మధ్యప్రదేశ్ రాజస్టాన్లలో పునరావృతమైంది మధ్యప్రదేశ్‌లో సహరియ గిరిజనులు, రాజస్థాన్‌లో కరువువల్ల రైతులు ఆకలి చావులకు గురయ్యారు దురదృష్టవశాత్తు గిరిజన భారతంలో ఆకలి చావులు కొత్తవి కావు గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థలు కుష్పకూలాయనడానికి ఈ సంఘటనలు నిదర్శనం ప్రభుత్వాలు ఈ విషయంలో అనుసరించిన విధానాలు లోపభూయిష్టంగా ఉండడంతో గిరిజన ప్రాంతాల్లో పేదరికం, ఆకలి అనారోగ్యం పెరిగిపోయాయి ప్రపంచీకరణ ప్రభావంలో ప్రభుత్వాలు సంక్షేమ రంగాలనుండి తప్పుకుంటున్న తరుణంలో ప్రజాపంపిణీ వ్యవస్థలు, కొనుగోలు సంస్థలు గిరిజన ప్రాంతాల్లో ఏ మెరకు సమర్థవంతంగా పని చేస్తున్నాయో పై పరిస్థితులు స్పష్టం చేస్తాయి ఆకలి చావులపై పత్రికలు, ప్రసార మాధ్యమాలు తీవ్రంగా స్పందించడంవల్ల పీడిత ప్రజలకు స్వల్పకాలిక ఉపశమనం కలిగించవచ్చు కాని ఆసమతుల్యంగా, లోపభూయిష్టంగా ఉన్న ఆహార పంపిణీ, కొనుగోలు వ్యవస్థ స్థూల సమస్యకు ఒక దర్పణం మాత్రమే సమస్యకు కేంద్ర బెందువైన గిరిజన సమాజం, ఆర్థిక వ్యవస్థలో సంభవించిన వ్యవస్థాగత మార్పులను మీడియా ప్రతిబింబించడం లేదు గతయాభై సంవత్సరాలుగా ఈ మార్పులు గిరిజన ప్రాంతాల్లో ఆహార, ఉపాధి భద్రతలను నాశనం చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకృత ఆర్ధిక విధానాల వైపు మొగ్గు చూపుతుండడంతో గిరిజనుల మనుగడ సంక్షోభం మరింత వికటించింది సరళీకృత ఆర్థిక విధానాలకు అన్ని రాజకీయ పక్షాలు, పారిశ్రామిక వర్గాలు వంత పాడుతున్నాయి ఫలితంగా గిరిజన రైతులుతీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు నూతన ఆర్టిక విధానాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్న కొద్దిపాటి ఆహార ధాన్యాల ఉత్పత్తిని కూడా నాశనం చేస్తున్నాయి ఈ ప్రమాదకరమైన పరిణామానికి వికృతమైన ఉదాహరణ 2003లో ఛత్తీస్‌ఘడ్ 86
ప్రభుత్వం సమర్ధిస్తున్న క్రిషి చత్రాలె (2 ంభూలు) ఈ సంఘాల ద్వారా ప్రభుత్వం వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తోంది తహార పంటలను పక్కన పెట్టి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చే వాణిజ్య పంట్త్లలకు ప్రాధాన్యతనిస్తుండడం అనేక సమస్యలకు దారి తీస్తోంది. విదేశీ మార్కెట్లో వాణిజ్య ఉంటలను తమ పారిశ్రామిక అవసరాల కోసం ప్రోత్సహించే బహుళజాతి సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది తమ ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుకోవడం కోసం ఈ సంస్థలు ప్రజా (రైతు) సంక్షేమం ముసుగులో స్వయం సహాయక సంఘాల ద్వారా వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్నాయి ఆయా ప్రాంతాల ఆర్థిక వ్యవస్థపై పర్యావరణంపై ఈ వ్యవసాయ విధానం చూపే దుష్ప్రభావం గురించి వాటికి ఏ మాథ్రం పట్టదు వారి ప్రయోజనార్థమే అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలు కూడా ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలనే సాగు చేసేలా రైతులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అందుకు ఎగుమతుల మార్కెట్ నుండి వస్తున్న డిమాంద్షను పాలకులు సాకుగా చూపుతున్నారు ఈ నేపధ్యంలోనే స్థానిక, సహజమైన వంగడాలను ప్రోత్సహిస్తూ పర్యావరణ, గిరిజన ఉద్యమాలు చేస్తున్న కృషి సమకాలీన గిరిజన వాస్తవ పరిస్థితికి ఎంతైనా అవసరం గిరిజన ప్రాంతాల్లో ఆహార భద్రత కాపాడాలంటే సాంప్రదాయబద్ధమైన గిరిజన వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడమే ఏకైక మార్గమని అనేక పర్యావరణ, గిరిజన ఉద్యమాలు నమ్ముతాయి. పెరుగుతున్న ఆకలి చావుల సంఘటనలు, గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్ రంగం విస్తరిస్తున్న నేపధ్యంలో సాంప్రదాయ వ్యవసాయం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని చర్చించినప్పుడు ఆహార భద్రత అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఈ ఉద్యమాల అభిప్రాయం
పర్యావరణ ఉద్యమానికి భిన్నంగా వామపక్షాల అభిప్రాయాలున్నాయి ఆకలి చావులకు సరళీకృత ఆర్థిక విధానాలు, గిరిజన వ్యవసాయ అర్ధిక వ్యవస్థపై వాటి దుష్ప్రభావమే కారణమని వామపక్షాలు వాదిస్తున్నాయి. వాణిజ్య పంటల వైపు మొగ్గు మరో అర్ధానికి కూడా దారి తీస్తుంది గిరజనేతర ప్రాంతాల నుండి వచ్చిన భూస్వాములు గిరిజనుల భూములను పెద్దఎత్తున కొనుగోలు చేసి వాటిలోనే స్థానికులను తక్కువ వేతనాలతో పని చేయిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతాలు భూములను, కూలీలను చవకగా అందిస్తాయి పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని శివపురి అటవీ ప్రాంతంలో పంజాబీ భూస్వాములు పెద్దఎత్తున స్థిరపడడం ఇందుకు నిదర్శనం 1960 ప్రాంతంలో కొందరు ప్రముఖ ప్రభుత్వాధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు ఈ ప్రాంత గిరిజనుల నుండి తక్కువ ధరలకు భూములుకొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాలను నిర్మించుకున్నారు. వాటిలో నిరుపేద వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించి వారి శ్రమను దోచుకున్నారు కూలీలలో భూములు అమ్ముకున్న వారే పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం ఇదే పరిస్థితి ఒరిస్సాలోని కలహండి, బొలంగీర్, కొరాపుట్ ప్రాంతాల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ ప్రాంతాల్లో భూముల్లేని వ్యవసాయ కూలీలు, పేద, సన్నకారు రైతుల సంఖ్య
౩7
గణనీయంగా పెరిగిపోయింది. 1971 నుండి 1991 వరకు ఒక ఎకరానికి కంటే తక్కువ భూమి ఉన్న రైతుల సంఖ్య 17 నుండి 39 శాతానికి చేరుకుంది అదే సమయంలో పదెకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల సంఖ్య 47 నుండి 09 శాతానికి పడిపోయింది మధ్యతరహా రైతుల విషయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నాలుగు నుండి పదెకరాల భూమి ఉన్న రైతుల సంఖ్య 20 వళ్ళలో 30 4 నుండి 9 9 శాతానికి పడిపోయింది సన్నకారు రైతుల సంఖ్యలో వృద్ధి మధ్యతరహా, పెద్ద రైతుల సంఖ్యలో వచ్చిన తగ్గుదల సరిసమానంగా లేవు అనేకమంది మధ్యతరహా రైతులు సన్నకారు రైతులుగానో వ్యవసాయ కూలీలుగానో మారిపోయారని పై గణాంకాలను పరిశీలిస్తే బోధపడుతుంది జనాభాలో 47 శాతమున్న దళితులు, ఆదివాసిలు సారవంతమైన మంచి భూములు కోల్పోయి 1996 నాటికి వ్యవసాయ కూలీలుగానో, సన్నక్రారురైతులగానో మిగిలిపోయారని గుర్తించడం ఎంతో ముఖ్యం అధిక దిగుబడినిచ్చే సారవంతమైన భూములు కేవలం 5-10 శాతం మంది భూస్వాముల నియంత్రణలోనే ఉన్నాయి వీరంతా గిరిజనేతర, పట్టణ ప్రాంతాల్లో నివాసముందేవారే అస్థిరమైన జీవనోపాధులు - పేదరికం గిరిజన రైతులు దివాళా తీయడంవల్ల వారు నివసించే ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది అటవీ ఉత్పత్తుల సేకరణ, వ్యవసాయ పనులపై ఆధారపడి అనేక మంది గిరిజనులు నిత్యజీవితాన్ని గడుపుతారు గని కార్మికుల్లో గిరిజనులదే పైచేయి అయితే ఈ ఉపాధులన్నీ సీజనల్ కావడంవల్ల వలసలు సర్వసాధారణమయ్యాయి కరువు, కొరత సమయాల్లో వలసల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది ఒరిస్సాలోని ౩0 జిల్లాల్లో 21 జిల్లాలు ఈ సీజన్లో కరువు బారిన పడడంతో సుమారు లక్ష మంది వలస వెళ్ళారు గత 50 ఏళ్ళలో ఎన్నడూ ఎరుగని కరువును ఈసారి ఛత్తీస్‌ఘడ్ అనుభవించింది గిరిజన ప్రాంతాలలో పని చేసే స్వచ్భంద కార్యకర్తల అంచనా ప్రకారం సుమారు 30 శాతం జనాభా వలసవెళ్ళింది అయితే కరువును ఎదుర్కొంది ఈ ఒక్క ప్రాంతాలే కాదు గిరిజనులు, దళితులు అధిక సంఖ్యలో నివసించే (ప్రాంతాలు ఆకలికి, వలసలకు గురి కావడానికి దారి తీసిన పరిస్థితులేమిటి? దీనికి జవాబు అస్థిరమైన జీవనోపాధే ఉపాధులు ఆయా సీజన్లలో లభించే తాత్మాలికమైన పనులపై ఆధారపడి ఉండడంతో దళితులు, గిరిజనులజీవితం దుర్భరంగా మారింది ఉదారహరణకు చాలా మంది గిరిజనులు సంవత్సరంలో 40 నుండి 60 రోజుల వరకు బీడీ ఆకుల సేకరణలో నిమగ్నమవుతారు మిగతా సంవత్సరమంతా గనుల్లోనో, ఇతర ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగానో వెళతారు లేదంటే కుటుంబంలోని ఒక సభ్యుడిని ఉపాధి నిమిత్తం పట్టణానికి పంపుతారు మాంద్లాకు చెందిన ప్రజలు 350 కిలొమీటర్ల దూరంలో ఉన్న బస్తర్ గనులకు మూడు నెలల ఉపాధి కోసం నడుచుకుంటూ వెళతారు ఈ కాలంలో వారికి 2 000 నుండి 5,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది కలహాండి నుండి 88
అనేక మంది యువకులు రాయ్‌పూర్‌కు వలస వెళ్ళి సైకిల్ రిక్షాలు లాగుతారు అలాగే ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన మహిళలు, పురుషులు పెద్ద నగరాలకు తరలి వెళ్ళి దినకూలీలుగా పని చేస్తారు స్థానికంగా లభించే ఉపాధి వారికి అంతంత మాత్రంగానే ఆదాయం తెచ్చిపెడుతుంది కనీస అవసరాలు తీర్చుకోవడానికి నానా యాతనలు పడాల్సి వస్తుంది పొదుపు అన్న ప్రశ్నే తలెత్తదు కలహాండిలో సాధారణంగా కలుపుతీసే మహిళకు ఐదు రూపాయల వేతనం ఇస్తారు మగవారికైతే ఐదు నుండి ఆరు కిలోల బియ్యం ఇస్తారు నాట్లు, కోత సమయాల్లో రోజుకు 80 నుండి 40 రూపాయలు ఆర్డిస్తారు తమ కనీస అవసరాలైన నూనె, ఉప్పు, పప్పు ధాన్యాలు, వస్త్రాలు కొనుగోలు చేయడానికి పేద, సన్నకారురైతులు కిలో వద్లను ఒకటి నుండి రెండు రూపాయల ధరకే విక్రయిస్తారు దీనిని సంక్షోభ విక్రయమంటారు వీడీ ఆకుల విషయంలో కూడా ఇదే కధ పునరావృతమవుతుంది రోజంతా కష్టపడి 100 ఆకు కట్టలను సేకరించినా సేకరణదారునికి 80 రూపాయలకంటే ఎక్కువ ఆదాయం లభించే అవకాశమే లేదని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన పి సాయినాధ్ ఉల్లేఖించారు. అసలు దేశంలో కనీస వేతనాలు, కనీస మద్దతు ధరలను అమలు చేసే మార్గాలే లేవా అని పై వాస్తవాలను పరిశీలిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు
ఆహారం, ఆశ్రయం కల్పించే అటవీ భూములపై గిరిజనులకు ఎలాంటి హక్కు లేకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది కరువు సమయాల్లో అడవిలో లభించే పండ్లు ఫలాలు, గిరిజనుల ఆకలిని తీర్చేవని ఈశాన్య మధ్యభారతంలో తరతరాలుగా మౌఖికంగా ప్రచారమవుతున్న కధలు స్పష్టం చేస్తాయి కలప, ఇతర అటవీ ఉత్పత్తులు సమకూర్చే ఆదాయం పెరుగుతుండడంలో వలస పాలకులు, స్వాతంత్రానంతరం భారత పాలకులు అటవీ భూములపై తమ గుత్తాధిపత్యాన్ని మరింత పెంచుకున్నాయి. ప్రభుత్వం, వ్యాపారులు కలిసి మహువ, జీడిపప్పులపై పూర్తి అధిపత్యం సాధించారు ఈ కారణాలవల్ల గిరిజనుల ఉపాధి, ఆహార భద్రత నమన్యలు మరింత తీవ్రమవుతూ వచ్చాయి ఆకలి, పౌష్టీకావోరలేమీ సాధారణమయ్యాయి. మౌలిక వసతులు, సేవల కొరత కూడా ఉండడంతో వారి జీవన ప్రమాణాలు క్షీణించాయి. ఇదే సమయంలో అటవీ భూములు, ఉత్పత్తుల నుండి భూస్వాములు, వ్యాపారులు పెద్దఎత్తున లబ్టిపొందారు ఈ నేపథ్యంలో పనికి ఆహారం, ప్రజా పంపిణీ పధకాలు గిరిజన సమాజాల తాత్కాలిక అవసరాలను మాత్రమే తీర్చగలవు అయితే వారి సమస్యలకు దీర్థకాలిక పరిష్కారం అన్వేషించాలంటే జనాభాలో 90 శాతం ఉన్న పేద ప్రజలు, ముఖ్యంగా దళితులు, ఆదివాసిలు, ఆర్థికంగా లబ్టిపొందే పధకాలను, విధానాలను ప్రభుత్వాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం ఆర్థిక విధానాల్లో వ్యవస్థాగత సర్దుబాట్లు చేయాల్సిన అవసరం కూడా ఉంది (ప్రస్తుత ఆర్థిక విధానాలపై పర్యావరణ ఉద్యమకారులు, వామపక్షవాదులు తమ వాదనలకు పదును పెట్టినప్పటికీ ప్రజానుకూలమైన ప్రత్యామ్నాయ వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాన్ని సూచించడంలో ఇంకా అనేక సవాళ్ళను
89
ఎదుర్కొంటున్నారు ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమం ఆర్థికంగా లాభదాయకమైనది పర్యావరణ అనుకూలమైనదే కాకుండా సంస్థాగతంగా, వ్యవస్థాగతంగా పెట్టుబదిదారీయేతర సమసమాజ నిర్మాణ లక్షణాలు కలిగి ఉండాలి వ్యవసాయ రంగాన్ని పట్టి. పీడిస్తున్న నయా ఉదారవాద, ప్రపంచికరణ విధానాలకు వ్యతిరేకంగా ఒక (క్రియాశీల ఉమ్మడి ఉద్యమాన్ని చేపట్టాలంటే ఇలాంటి ప్రత్యామ్నాయ కార్యక్రమానికి ఒక పునాది నిర్మించడం ఎంతకైనా అవసరం
జ్య!
టే గిరిజనులు, అడవులు, ప్రపంచీకరణ
ఆధునిక రాజ్య వ్యవస్థ (ప్రభుత్వం)కు ప్రజలకు మధ్య సంఘర్షణా క్షేత్రంగా నేడు అడపులు అవతారమెత్తాయి. ఇందుకు కారణం అటవి భూములు అటవీ ఉత్పత్తులపై పెద్ద సంఖ్యలో బలహీనవర్గాల ప్రజలు ఆధారపడి మనుగడ సాగిస్తుండడమే సంఘర్షణకు ప్రధాన కారణమైన భూ ఆక్రమణ సమస్యను గడిచిన అధ్యాయంలో చర్చించాము ప్రభుత్వ అటవీ సంరక్షణా కార్యక్రమం వల్ల ఉత్చన్నమవుతున్న సమస్యలకు ప్రధాన కారణం అటవీ భూములు, ఉత్పత్తులపై ప్రభుత్వ గుత్తాధిపత్యమే (19వ శతాబ్దం నుండి) వలస పాలన, స్వాతంత్ర్యానంతరం ఉనికిలోకి వచ్చిన అధికారగణం అడవుల సంరక్షణకు శాప్రీయమైన వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది కాని ఈ రెండు కాలాల్లోనూ దేశంలోని అడవులు, అటవీ ప్రాంతాలు వినాశనానికి, తరుగుదలకు గురయ్యాయి
అడవులను సొంస్కృతిక, సామాజిక స్వరూపాలుగా కాకుండా వనరులను సమకూర్చే ఆస్తులుగానే అటవీ శాఖాధికారులు, పాలకులు పరిగణిస్తున్నారని పర్యానరణ, గిరిజన హక్కుల ఉద్యమాలు వాదిస్తున్నాయి గిరిజనుల జీవనవిధానం, ఉపాధిలో కీలకపాత్ర వహించే అడవులను వారికి దూరంగా ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే సహజ వనరులపై న్థానికులైన గిరిజనులకు సంపూర్ణ హక్కులు, నియంత్రణ కల్పించాలని ఈ ఉద్యమాలు డిమాండ్ చేస్తున్నాయి హక్కుల పోరాటాలు ఆధునిక నాగరికతకు, గిరిజన సముదాయాల సాంప్రదాయ బద్ధమైన జీవితానికి మధ్య జరుగుతున్న సంఘర్షణగా అవి పేర్మాంటున్నాయి అటవీ భూములు ఇతర ఉత్పత్తులపై గిరిజన సముదాయాలకు సాంప్రదాయ నియమాలను అనుసరించి సంపూర్ణహక్షులు కల్పించాలని, వనరుల యాజమాన్యాన్ని సముదాయ సంస్థలకు అప్పగించాలని ఆయా ఉద్యమాలు కోరుతున్నాయి. సోషలిస్టు సమాజ నిర్మాణాన్ని ఆర్థికవ్యవస్థను సమర్ధించే సంస్థలుగా వామపక్షాలు వ్యవహరిస్తున్నాయని, ఈ విధానాల వల్ల పర్యావరణ సమతుల్యానికి
త్తే
తీరని నష్టం, పేద గిరిజనుల బతుకులు ఛిద్రం కావడం తధ్యమని పర్యావరణ పరిరక్షణ సంఘాలు వాదిస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తే అడవులపై ప్రభుత్వ నియం(శ్రణను వామపక్షాలు సమర్థిస్తున్నా కేంద్రీకృత, గుత్తాధిపత్య ప్రభుత్వ సంస్థలను మాత్రం గుడ్డిగా సమర్ధించడం లేదు సమాజంలోని అణగారిన వర్థాల న్యాయపరమైన హక్కులను అటవీ సంపదపై స్థానికుల నియంత్రణను ముడిపెట్టి సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పాలనా స్వరూపంలో మార్పులు రావాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి ఈ మేరకు హక్కుల అంశాన్ని పాలనా సంస్థల సంస్కరణతో దానికున్న సంబంధంపై వామపక్షాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు రెండూ తమ దృష్టిని సారించాయి గిరిజనుల సామర్థ్యాన్ని తక్కున చేసి చూపడం? అడవులపై నియంత్రణకు జరుగుతున్న పోరాటాన్ని పాశ్చాత్య - ఆధునిక ప్రపంచ దృష్టికోణం, సాంప్రదాయబద్ధమైన గిరిజన ఆలోచనా విధానాల మధ్య సంఘర్షణంగా గిరిజన పర్యావరణ ఉద్యమాలు తరుచుగా వర్ణిస్తున్నాయి అడవుల సంపదను కొల్లగొట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ శక్తులపై ఆధునిక పాశ్చాత్య వ్యవస్థ ఆధారపడుతుంది, ఫలితంగా శాప్రీయమైన అటవీ సంరక్షణా పధాకాలను భారీ పరిశ్రమల ప్రాదమిక వనరుల అవసరాలను తీర్చే సాధనాలుగా గుర్తిస్తున్నారు ముఖ్యంగా కలప, అత్యధిక వాణిజ్య విలువ ఉన్న చెట్లను, తోటలను సంరక్షించే చర్యలుగా అటవీ సంరక్షణా పధకాలు దర్శనమిస్తాయి వలసవాద పాలనా సమయంలో కూడా ఇదే దృష్టి కోణంతో పాలక, అధికార వర్ణాలు వ్యవహరించేవి ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం సమకూరగలదు, భారీ పరిశ్రమలు పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాలు ఎంత వరకు నెరవేరగలవన్న అంశాలకే పాలకవర్థాలు ప్రాదాన్యతనిచ్చేవి తొలిదశలో శాప్రీయ అటవీ సంరక్షణ లక్ష్యం రైల్వేలను నిర్మించడం అందుకు అవసరమైన కలపను సేకరించడమే నవీన గాంధేయవాద పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు అధికారిక సంరక్షణా పధకాలను వ్యతిరేకించాయి. గిరిజన సముదాయాలు తరతరాలుగా అడవులను కాపాడుతున్నాయని, వాటితో సామరస్య పూర్వకంగా సహజీవనం సాగిస్తూనే ఉన్నాయని అవి వాదిస్తున్నాయి వాటి ప్రవర్తనా నియమావళి, సాంస్కృతిక వ్యవస్థలు, సమంజసమైన వినియోగ పద్ధతులు అడవుల కోతకు వ్యతిరేకంగా, సహజ వనరుల సంరక్షణకు సహాయకారిగా ఉండేవని ఉద్యమకారులు పేర్కొంటున్నారు ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ఎందరో పండితులు, అనేక హక్కుల సంస్థలు గిరిజనుల సహజ పరిజ్ఞాన వ్యవస్థలను అధ్యయనం చేస్తున్నారు ఈ అధ్యయనాన్ని అడవులపై గిరిజనుల న్యాయబద్ధమైన హక్కులను సమర్దించడానికి సైద్ధాంతికపరమైన వాదనగా మలచడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఆలోచనా విధానంలో భాగంగా అడవులను కలప, పెద్దపెద్ద చెట్లకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలుగా కాకుందా స్థానికులు తమ నిత్యజీవిత అవసరాలు తీర్చుకునేందుకు ఇతర అటవీ ఉత్పత్తులను (పండ్లు ఫలాలు, ఆహారపంటలు) వినియోగించే కేంద్రంగా అఖభివర్డిందానికి ప్రయత్నాలు తా
జరుగుతున్నాయి. ఈ నివాసిత ప్రాంతాన్ని క్రమపద్ధతిలో శాశ్వతంగా వినియోగించాలంటే సాంప్రదాయబద్ధమైన గిరిజన వరిజ్ఞాన వ్యవస్థలే మన్నికైనవని, వలసవాద పాలన, వలసవాదానంతర పాలనలో స్థానికులు నిర్వాసితులయ్యారని హక్కుల ఉద్యమాలు వాదిస్తున్నాయి ఈ నేపధ్యాన్ని పరిగణనలోకి తీసుకొని అటవీ వినియోగ, సంరక్షణ బాధ్యతలను గిరిజన సముదాయాలకు, సహకార సంస్థలకు అప్పగించాలని, అటవీ సంరక్షణ బాధ్యతల నుండి ప్రభుత్వాలు, పాలనావ్యవస్థలు వైదొలగాలని తరచుగా డిమాండ్ చేస్తున్నాయి అటవీ పాలనా వ్యవస్థ నుండి ప్రభుత్వం పూర్తిగా ఎందుకు తప్పుకోవాలి, సహజ వనరులపై స్వయం ప్రతిపత్తిగల గిరిజన సముదాయాలకు పూర్తి నియంత్రణ ఎందుకు కల్పించాలి, అందుకు తగిన కారణాలేమిటి అన్న అంశాలను చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వలసవాద పాలన ఆరంభమైనప్పటి నుండి నేటి వరకు అడవులపై ప్రభుత్వానికే సంపూర్ణ హక్కులుండేవని, అటవీ భూముల వర్గీకరణ, యాజమాన్య బాధ్యతలను పాలకులే నిర్వర్తించేవారని చరిత్ర చెబుతోంది అటవీ ఉత్పత్తులను భారీ, చిన్న తరహా ఉత్పత్తులుగా 19వ శతాబ్దం మధ్య కాలంలో అటవీ శాఖను ప్రత్యేకంగా ఏర్పరచిన తర్వాత వర్గీకరించారు అటవీ ఉత్పత్తి సేకరణా పద్ధతులు, దాని విలువ ఆధారంగా అప్పట్లో వర్గీకరణ చేపట్టారు ప్రపంచ మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఉత్పత్తులకు వాణిజ్య విలువను నిర్ధారించారు ఈ విధగా వంట చెరకు, కలపల విలువను భారత అటవీ చట్టం నిర్ధారించి భారీ ఉత్పత్తులుగా వర్గీకరించింది
అన్నిరకాల గడ్డిని, కలప మినప ఇతర ఉత్పత్తులను చిన్నతరహా ఉత్పత్తులుగా నమోదు చేసింది అయితే 20వ శతాబ్దం తొలి సంవత్సరాలకల్లా ప్రభుత్వం చిన్న తరహా ఉత్పత్తులపై కూడా తన హక్కును పదిలపరచుకునే చర్యలు తీసుకొని అటవీ శాఖ ఆదాయాన్ని గణనీయంగా పెంచే చట్టాలను రూపొందించింది స్వాతంత్రానంతరం తొలి దినాల్లో ప్రభుత్వం అడవులపై సంపూర్ణంగా గుత్తాధిపత్యం సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేసింది ఫలితంగా చిన్నా చితక ఉత్పత్తులపై కూడా నియంత్రణ సాధించింది 1960 దశకంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చిన్నతరహా ఉత్పత్తుల వ్యాపారంపై నియంత్రణ సాధించడానికి (ప్రత్యేక చట్టాలను రూపొందించింది 1964లో రూపొందించిన మధ్యప్రదేశ్ బీడీ ఆకు వ్యాపార నియంత్రణ చట్టం బీడీ ఆకుల సేకరణ, విక్రయంపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ కల్పించింది. బీడీ ఆకులు విక్రయించే సంస్థలను ప్రభుత్వమే నిర్ణయించడం మొదలుపెట్టింది అమ్మకపు ఏజెంట్లు ప్రభుత్వానికి తమ రాబడిలో కొంత భాగాన్ని రాయల్టీగా చెల్లించేవారు సేకరణదారులకు వేతనాలు చెల్లించేవారు అయితే ఈ వేతనాలు చాలా తక్కువగా ఉండేవి 1969లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అటవీ ఉత్పత్తులన్నింటిపై తన గుత్తాధిపత్యాన్ని చాటుకోవడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది మధ్యప్రదేశ్ వనుపజ్ అధినియం ప్రకారం అటవీ ఉత్పత్తుల సేకరణ, అమ్మకాలపై ప్రభుత్వానికే సంపూర్ణ హక్కు ఉంటుంది అందులో దళారుల వ్యవస్థను ఏర్పాటు చేసి క్రయవిక్రయాలను నిర్వహించేవారు ఉత్పత్తులను (ప్రధానంగా పారిశ్రామిక అవసరాలను
త్తీప్రై
ప్రీర్చేందుకు విక్రయించేవారు 1978, 1984లో బీహార్ ప్రభుత్వం కూడా ఇవే తరహా చట్టాలను రూపొందించింది గిరిజనులు సేకరించిన ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నామమాత్రపు శిస్తును చెల్లించేవారు. సేకరణదారులకు కనీస వేతనాలు కూడా ఇచ్చేవారు కాదు ఈ రెండు రాష్ట్రాలకు తోడుగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ప్రభుత్వాలు కూడా ఇలాంటి వ్యవస్థలనే ఏర్పాటు చేశాయి రాయల్టీ విధానం ద్వారా వాణిజ్యపరమైన అన్ని అటవీ ఉత్పత్తులను కొల్లగొట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయన్నది దీంతో స్పష్టమవుతుంది ఈ వ్యవస్థ 1952లో రూపొందించబడిన భారత అటవీ చట్టం నిబంధనలకు అనుగుణంగా ఉందన్న విషయం తేటతెల్లమవుతుంది జాతీయ ప్రయోజనాలైన పారిశ్రామికీకరణకు చేదొడువాదోడుగా ప్రభుత్వ అటవీ సంరక్షణ; నియంత్రణ చట్టాలు వెలువడ్డాయి ఈ చర్యలు అడవుల్లో భారీ తోటల -పెంహూనికి, గిరిజనులను-దినసరికూరీలుగా వినియోగించుకోవడానికి ఎంతో ఉపకరించాయి ఈ గుణాత్మక మార్పులో ప్రధాన సమస్య గిరిజనుల పరిజ్ఞానాన్ని సామర్ధ్యాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం అలాగే గిరిజన రైతులు భూమిలేని వ్యవసాయ కూలీల ప్రయోజనార్ధం స్థానిక ఆర్థిక “వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు సంవత్సరం పొడవున ఉపాధి లేకపోవడంతో గిరిజన, దళిత కుటుంబాలు భూస్వాముల, వ్యాపారుల, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు వారికి ఉపాధి భద్రత కరువై ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి కూలీ పని చేయసాగారు ఈ పరిణామాల వల్ల ఉత్పన్నమైన మనుగడ సమస్యలు స్థానికులను తిరుగుబాటుదారులుగా మార్చివేశాయి. వారు అటవీ శాఖాధికారులతో సహకరించడం మానేశారు ఇదే విషయాన్ని అనేక సంస్థలు, అధ్యయనాలు విశ్లేషణాత్మకంగా నిరూపించాయి. ఈ సమస్యను కొంతవరకైనా పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం 1980లో సామాజిక అటవీ యాజమాన్య పదకాన్ని ప్రవేశపెట్టింది ఈ పధకంలో భాగంగా స్థానిక సముదాయాలకు అటవీ భూములు, ఉత్పత్తులపై ఉమ్మడి యాజమాన్య హక్కులను కల్పించి కనీస వేతనాలు చెల్లించేవారు వాస్తవంగా ఈ పదకం ఉద్దేశం గిరిజనులను రైతుకూలీలుగా వినియోగించుకొని అటవీ శాభాధికారుల ప్రణాళికలను అమలు పరచడమే అటవీ యాజమాన్య బాధ్యతలు నిర్వహించే పరిజ్ఞానం, వ్యవస్థాగతకూర్పులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు అటవీ భూముల్లో సాగు చేయాల్సిన పంటల రకాలను కూడా అధికారులే నిర్ణయించేవారు ముఖ్యంగా వారు వాణిజ్య విలువ ఉన్న యూకలిప్టస్ పాప్లర్ చెట్ల పెంపకానికే (ప్రాధాన్యతనిచ్చేవారు తర్వాత అమల్లోకి వచ్చిన అటవీ తోటల పదకం కూడా వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికే ఉద్దేశించబడినది ఈ క్రమంలో స్టానిక రైతులు కూడా మార్కెట్ డిమాండ్లను అనుసరించి వాణిజ్య పంటలనే సాగు చేయడం ప్రారంభించారు స్థూలంగా విశ్లేషిస్తే, సామాజిక అటవీ సంరక్షణ పధకం స్థానికులకు ఉపాధి కల్పించడానికే తప్ప భూమిలేని పేదలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న నంబంధ న్వరూపంలో మార్పులు తేవదానికి ఉద్దేశించబడిందికాదు తత్వ
గిరిజనుల జీవనోపాధి కోణం నుండి ఆలోచిస్తే, స్వాతంత్రానంతరం తొలి దశకాల్లో సంభవించిన ప్రధానమైన పరిణామం వాణిజ్యపరమైన అటవీ ఉత్పత్తుల (వీడీ ఆకు, బంక, సాల్ విత్తనాలు ) జాతీయకరణ ఈ ఉత్పత్తుల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసింది ఈ సంస్థలు ప్రాధమిక సేకరణదారుడి నుండి ఉత్పత్తులను కొనుగోలు చేసి పరిశ్రమలకు వ్యాపారులకు వేలం పాట ద్వారా విక్రయించేవి ఈ ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని వ్యాపారులు ఎగుమతి కూడా చేసేవారు అయితే ఈ వ్యాపార సంస్థల ప్రాముఖ్యత ఏమిటంటే కలప కాని అటవీ ఉత్పత్తులనే కాకుందా ఆహార ధాన్యాలు, ఇతర ప్రాదమిక ఉత్పత్తులను కూడా అవి కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయించేవి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ పరిణామం స్పష్టంగా బోధపడుతుంది అక్కడి గిరిజన సహకార సంస్థ (జిసిసి) తన పరిధిలోని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ కేంద్రాలను కూడా నిర్వహించేది ఈ కేంద్రాలు ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పని చేసేవి ఇలా చేయడానికి సాధ్యం కాని రాష్ట్రాలలో (ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్) వ్యాపారుల వ్యవస్థను బలోపేతం చేశారు అదే సమయంలో బ్లాకు, జిల్లా స్థాయిలలో ప్రభుత్వ గుత్తాధిపత్యం కొనసాగేది మౌలిక వసతుల (రోడ్లు, సమాచార వ్యవస్థ) లేని ప్రాంతాల్లో వ్యాపారుల వ్యవస్థకు అనుబంధంగా (ప్రభుత్వ క్యాపిటలిజం ఈ విధంగా విలసిల్లింది అటవీ భూములు, ఉత్పత్తులపై ప్రభుత్వానికే సర్వహక్కులు ఉన్నాయన్న మాటే కాని అన్ని రకాల ఉత్పత్తుల సంక్షోభ పరిస్థితుల్లోనే విక్రయించబడేవి 19880 దశకం తొలి సంవత్సరాల నుండి సాంప్రదాయబద్ధమైన క్షేత్రస్థాయి ఉద్యమాలు అటవీ హక్కుల లక్ష్యసాధనకు నడుం బిగించాయి అడవుల సహజ రక్షకులైన గిరిజన సముదాయాలకే అటవీ యాజమాన్య బాధ్యతలు అప్పగించాలని అవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయసాగాయి. ఆదే సమయంలో వామపక్షాలు కూడా అటవీ పాలనావ్యవస్థను సంస్కరించి ప్రజాస్వామ్యబద్ధంగా వికేంద్రీకరించాలని ఉద్యమాలు చేపట్టాయి అటవీ ఉత్పత్తులపై ఉమ్మడి యాజమాన్యం ఉండాలని వాదించారు కాని సముదాయ హక్కుల జోలికి మాత్రం అవి వెళ్లలేదు వికేంద్రీకరణ ప్రక్రియ ద్వారా స్థానికుల (దళితులు, గిరిజనులు) జీవన ప్రమాణాలు పెంచే దీర్హకాలిక లక్ష్యాన్ని సాధించడానికి, అందుకు ప్రజలను సిద్ధం చేయడానికి వామపక్షాలు కృషి చేశాయి. వాస్తవంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్‌లోని ఆరాబరి (ప్రయోగం వామపక్షాల ఈ ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది వ్యవస్థలో మార్పు రావాలన్నది వామపక్షాలు, పర్యావరణ ఉద్యకారుల వాంఛ దేశంలోని అడవులపై ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఇరుపక్షాలు ఉద్యమాలు నిర్వహించాయి వ్యాపారులు బలోపేతం
ప్రభుత్వ అటవీ సంరక్షణ, వినియోగ కార్యక్రమంలో మార్పులు సూచించిన అనేక హక్కుల సంఘాలు ప్రధానంగా కలప కాని అటవీ ఉత్పత్తుల విషయంలో స్థానికుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశాయి అటవీ యాజమాన్యంలో భాగమైన ఈ అంశం
కేర్
గిరిజన సమాజ సంక్షేమంతో ముడిపడి ఉందనీ, అందులో వచ్చే మార్పులు గిరిజనులపై తీవ ప్రభావం చూపే అవకాశముందని వాదించారు కలప మినహా ఇతర అటవీ ఉత్పత్తులను అభివృద్ధి పరిస్తే గిరిజనులకు శాశ్వతమైన ఉపాధి అవకాశాన్ని కల్పించవచ్చని అనేక మంది విద్యావంతులు, స్వచ్చంద సంస్థలు వాదించాయి ఈ అంశంపై చేపట్టిన అధ్యయనాలు ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చాయి. కలప కాని అటవీ ఉత్పత్తులు గిరిజనుల మనుగిడలో ప్రధాన పొత్ర పోషిస్తాయన్న వాదనను అవి తిరస్మరించాయి పశ్చిమ బెంగాల్‌ను ప్రామాణికంగా తీసుకొని పరిశోధన జరిపిన కె సి మల్హోత్ర ఈ అంశంపై మరిన్ని వివరణలు ఇచ్చారు కలప కాని ఉత్పత్తులు గిరిజన కుటుంబాల వార్షిక ఆదాయంలో 17 12 శాతం మాత్రమే అర్జించిపెట్టాయని, వాటికి కాలపరిమితి కూడా ఉందన్న విషయాన్ని ఆయన ఎత్తి చూపారు ఏ పరిస్థితుల్లో గిరిజన జీవితాలను ఈ ఉత్పత్తులు ఆదుకోగలవో కూడా ఆయన వివరించారు జార్ధండ్, ఛత్తీస్‌ఘడ్‌లలో జరిపిన క్షేత్రస్థాయి అధ్యయనం కూడా అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నతరహా అటవి ఉత్పత్తులు కేవలం అదనపు ఆదాయాన్ని మాత్రమే సమకూర్చగలవని, గిరిజనులు వాటిపైనే ఆధారపడి జీవనం కొనసాగించలేరని ఆ పరిశోధన సృష్టం చేసింది ఇలాంటి ఉత్పత్తుల వల్ల గిరిజనులు సంవత్సరంలొ మూడు నుండి పది వేల రూపాయలు మాత్రమే సంపాదించగలరని, ఈ మొత్తం కనీస వేతనాల స్థాయిలో కూడా లేదని ఆ నివేదిక విశ్లేషించింది చిన్నతరహా ఉత్పత్తుల విషయంలో రుణదాతలు విదేశీ వాణిజ్య సంస్థలైన ప్రపంచ బ్యాంకు తదితర సంఘాలు చేస్తన్న వాదనలకు ఎలాంటి ఆధారం లేదని, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వ్యవస్థలొ విప్లవాత్మక మార్పులు రానంత వరకు ఈ పరిస్థితి అలాగే కొనసాగుతుందని పై పరిశోధనలు సృష్టం చేస్తున్నాయి హక్కుల ఉద్యమాలు పెంచిన ఒత్తిడి, అటవీ యాజమాన్య అంశాల్లో పెరిగిన విదేశీ ఆర్ధిక సంస్థల జోక్యం వల్ల (ప్రభుత్వ అటవీ విధానాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అంతిమంగా అడవులపై ప్రభుత్వం తన గుత్తాధిపత్యాన్ని కోల్పోయింది. 1988లో సవరించబడిన జాతీయ అటవీ పధకం ఉమ్మడి యాజమాన్యం, పర్యావరణ సమతుల్యం, స్థానికుల సంక్షేమం అంశాలను ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది, ఈ విధానానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేశారు ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో చిన్నతరహా అటవీ ఉత్పత్తుల సహకోర సమాఖ్యను ఏర్పాటు చేసి అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయాన్ని చేపట్టారు సమాఖ్యకు మూడంచెల వ్యవస్థను నెలకొల్పారు ప్రాధమిక దశలో సేకరణదారులు, తర్వాతి దశలో జిల్లా సంఘాలు, చివరగా రాష్ట్రస్థాయి సమాఖ్యలు తమ కార్యకలాపాల ద్వారా గిరిజనుల సంక్షేమానికి పాటు పడతాయి ఈ సమాఖ్య ప్రధానంగా బీడీ ఆకులను విక్రయిస్తుంది వచ్చిన లాభాలను ఆయాస్థాయిల్లోని సంఘాలకు కమీషన్ రూపంలో చెల్లిస్తారు వీడీ అకుల విషయంలో జరిపిన అధ్యయనం ప్రభుత్వ, వ్యాపార వర్ధాల దోపిడీ విధానాన్ని ఎండగట్టింది ఇదే తరహాలో ఇతర ఉత్పత్తుల సేకరణ, విక్రయానికి గిరిజన సహకార, మార్కెటింగ్ సమాఖ్యను ఏర్పాటు చేశారు తం
ఇది రాష్ట్రస్థాయి సమాఖ్య కాదు కేంద్రప్రభుత్వమే దీనిని నిర్వహిస్తోంది ఈ సమాఖ్యకు అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలున్నాయి గిరిజన సేకరణదారులకు మార్కెట్ వెదికిపెట్టడమే దీని ప్రధాన కర్తవ్యం 1990 నాటికల్లా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబడిన ఉమ్మడి యాజమాన్య కమిటీలు కలప కాని అటవీ ఉత్పత్తులపై పరిమిత నియంత్రణను సాధించగలిగాయి మధ్యప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ ధన్ పధకం వల్ల దళారుల వ్యవస్థ నిర్వీర్యమైంది గ్రామ కమిటీలే ఆహార ధాన్యాలు, అటవీ ఉత్పత్తులు (చింతపండు)ను కొనుగోలు చేసి విక్రయిస్తున్నాయి
అయితే ఈ చర్యలన్నీ సంతృప్తికరమైన రీతిలో ఫలితాలనివ్వలేదు మధ్యప్రదేశ్‌లోని ఆయా సహకార సంఘాల వార్షిక నివేదికలు అటవీ ఉత్పత్తుల సేకరణలో క్రమంగా సంభవిస్తున్న ప్రతికూల మార్పులను ఎలుగెత్తి చాటాయి వన్ ధన్ సమితిల విషయం కూడా ఇలాగే ఉంది వ్యాపారుల కంటే ఎక్కువ ధర చెల్లించాల్సిన ప్రభుత్వం తన వామీకి తిలోదకాలిచ్చిందని ఆయా ప్రాంతాల రైతులు ఆరోపించడంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అనుమానపు మేఘాలు అలుముకున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమితులు ఏడు రోజుల కాలపరిమితితో కూడిన రుణ ఒప్పుదంపై ధాన్యాలను, ఉత్పత్తులను కొనుగోలు చేస్తుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో గిరిజనులు తమ ఉత్పత్తులను స్టానికవ్యాపారులకే అతి తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే స్థానికులు ఈ అటవీ సహకార సంఘాల ఏర్పాటును, పని తీరును తప్పుపడుతున్నారు మార్కెట్ అందుబాటులో లేకపోవడం, ప్రాసెసింగ్ పరిజ్ఞానం కొరతతో ఒరిస్సా గిరిజన రైతులు కూడా తమ ఉత్పత్తులను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తున్నారు ఫలితంగా ఎలాంటి లాభాలకు అర్జించలేకపోతున్నారు
రుణసంస్థలు, ఎన్ సి సక్సేనా లాంటి విద్యావేత్తలు అటవీ రంగ సంస్కరణల అవసరాన్ని నొక్కి చెబుతున్నారు అడవులపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా సడలి నప్పుడే రైతులు తమ ఉత్పత్తులకు, పడిన శ్రమకు తగిన ఫలితం పొందగ్గలరని వీరు వాదిస్తున్నారు ఇలాంటి వ్యవస్థలో గిరిజనులు, వ్యాపారులు, (పైవేటు కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వానికి సమాన పాత్ర ఉండాలని, అప్పుదే గిరిజన ఉత్పత్తులకు తగిన ధర లభించగలదని వారు విశ్వసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సముదాయ అటవీ పధకంపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన విధాన పత్రాల్లో ఇలాంటి వ్యవస్థనే ప్రతిపాదించారు గిరిజన సహకార సంఘాలకు ఉత్పత్తుల కొనుగోలుపై ఉన్న గుత్తాధిపత్యాన్ని పూర్తిగా తొలగించాలని, గిరిజనులే తమ దిగుబడిని నేరుగా మార్కెట్లో విక్రయించుకునే అవకాశం కల్పించాలని అందులో సూచించారు. మార్కెట్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే ప్రధాన సమస్య అని, గిరిజన- గిరిజనేతర (ప్రాంతాల మధ్య ఉన్న అసమతుల్య క్రయ విక్రయ వ్యవస్థ పెద్ద ఆటంకమేమీ కాదని ఆ పత్రంలో నిర్ధారించారు మార్కెట్ వ్యవస్థలో సంస్మరణలు లేకపోవడమే మరో కారణమని కూడా స్పష్టం చేశారు అయితే ఛత్తీస్‌ఘడ్, జార్ధండ్లో నిర్వహించిన క్షేత్ర స్థాయి పరిశోధనలు ఈ వాదనలను లోపభూయిష్టమైనవిగా తోసిపుచ్చాయి. అటవీ ఉత్పత్తుల విషయంలోనే
జ?
వ్యాపారులు గిరిజనులను మోసపుచ్చుతున్నారని, ఈ వ్యాపార విధానం అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని తేల్చాయి జాతీయకరణ జాబితా నుండి తొలగించిన వస్తువుల ధరల పట్టికను చూస్తే ఈ విషయం బోధపడుతుంది 2001-02 సంవత్సరంలో ఛతీస్ఘడ్ మార్కెట్లో ఆయా ఉత్పత్తులకు నిర్ణయించిన ధరలను, మధ్యవర్తులు అమ్ముకునే ధరలను, చివరగా నగరాల్లో వ్యాపారులు కొనుగోలుదారుల (వినియోగదారులు) నుండి వసూలు చేసే ధరలను కింది పట్టికలో చూడొచ్చు ఉత్పత్తులు బకరణదారుల ధంతారి ముంబాయి/థిలి కామా! (రూ/కేజ్) (రూశీజీ) (రూ/ీజీ) ఆమ్ల (ఉసిరి) 85 15 00 22 00-32 00 చింతపండు త౦ 12 00-15 00 382 00-84 00 ఎండుద్రాక్ష 150 00 20000-25000 | 350 00-400 00 మస్తీ 100 00 - “250 00౦0-1200 00 గిరిజన రైతులు మొదటి నుండి వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతూనే ఉన్నారు ఇహ అటవీ ఉత్పత్తులపై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోతే వారి దోపిడీ తగ్గడం కంటే మరింత ఎక్కువయ్యే ప్రమాదముందంటే ఆశ్చర్యం వేయదు వ్యాపార, మార్కెటింగ్ సరళిని పరిశీలిస్తే గిరిజనులు స్థానికంగా సాధ్యమైన మేరకు తమ ఉత్పత్తులను శు(భపరచి వ్యాపారులకు అమ్ముతారు ఉసిరిని ఎండబెట్టడం, చింతపండులోవిత్తనాలు ఏరడం, ద్రాక్షను శుభ్రపరచి ఎండగట్టడం సర్వసాధారణమే పచ్చి వస్తువుల కంటే ఈ ఎండు పదార్ధాలకు ధర కూడా ఎక్కువగానే చెల్లిస్తారు అయితే ఈ ధరలు సేకరణ శుద్ధి ఖర్చులను ఏ మాత్రం పూద్చలేవు వీటితోపాటు గిరిజనులు తమ స్వంత వినియోగం కోసం మహువను నిల్వ చేసుకుంటారు వాటి పూలతో కల్లును, విత్తనాల నుండి వంట నూనెను తయారు చేస్తారు మూడు కేజీల విత్తనాలకుగాను కేజీ నూనెను తయారు చేస్తారు ఈ నూనెను విక్రయించకపోయినప్పటికీ, వాటి పూలను స్థానిక వ్యాపారులకు అమ్ముకుంటారు కొంత భాగాన్ని తమ ఇంటి అవసరాల కోసం నిల్వ చేసుకుంటారు ఈ విక్రయాలన్నీ తక్షణావసరాల కోసమే ముఖ్యంగా నగదు రాబట్టుకోవడానికే వ్యాపారులు చాలా సందర్భాల్లో గిరిజనులు తీసుకొచ్చే ఉత్పత్తులను శుద్ధి చేయని పదార్థాలుగా ధృవీకరించి వాటికి దక్కాల్సిన న్యాయమైన ధరలను నిరాకరిస్తున్నారు అన్ని హక్కుల ఉద్యమాలు కనీస ధరల వ్యవస్థను సంస్కరించాలని డిమాండ్ చేస్తూనే ఉన్న వామపక్షాలు ఒక్కటై అన్ని రకాల చిన్న తరహా ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి అయితే అటవీ సంరక్షణ, యాజమాన్య బాధ్యతల నుండి ప్రభుత్వం వైదొలగితే ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించే అవకాశమే ఉండదు మార్కెట్ పరిస్టితులను బట్టీ శతి
వ్యాపారులు, కంపెనీలు, సముదాయాలు ధరలు నిర్ణయిస్తాయి అసమతుల్యమైన అభివృద్ధి, క్రయవిక్రయాల స్టూల ప్రక్రియల్లో గిరిజనులెప్పుడూ బలిపశువులుగా మిగిలిపోతున్నారు వారు సేకరించే ఉత్పత్తి చేసే వస్తువులకు వందలకిలోమీటర్ల దూరంలో ఎక్కడో అదనపు విలువను జోడిస్తారు. శుద్ధి చేయడానికి ఈ నగరాల్లో తగిన మౌలిక సౌకర్యాలు ఉంటాయి ఫలితంగా అక్కడి వ్యాపారులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి స్వచ్చంద రంగంలో గిరిజనులకు తగిన ప్రయోజనాలు అందించాలని జరుగుతున్న ప్రయత్నాలు కొద్ది మేరకే ఫలితాలు ఇస్తున్నాయి స్వచ్చంద సంస్థలు కూడా రుణాలు, పెట్టుబడుల లేమితో సతమతమవుతున్నాయి రెండో దశ ఆద్దిక సంస్కరణల పేరుతో ప్రభుత్వం గనుక మరిన్ని కీలక రంగాల నుండి తప్పుకుంటే ఈ సమసృలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది ఒక్క వామపక్షాలు మినహా గిరిజన హక్షుల సమర్ధకులందరూ గిరిజన ప్రాంతాల నుండి ప్రభుత్వం పూర్తిగా తప్పుకోవాలని వాదిస్తున్నాయి అయితే ఇది సరైన పరిష్కారం కాదని మన చర్చ తేల్చుతోంది వికేంద్రీకరణ ప్రక్రియ నుండి గిరిజనులు, దళితులు గరిష్టంగా లబ్లిపొందే విధంగా ప్రభుత్వమే తగిన విధానాలు రూపొందించేలా, వ్యవస్థాగత స్వరూపాలు నెలకొల్పే విధంగా అన్ని ఉద్యమాలు రాజకీయ పక్షాలు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది
సాదికారతా? హక్కుల హరింపా?
1980 దశకం తొలి సంవత్సరాల్లో చిప్కో తదితర పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను ఎన్నో అధ్యయనాలు ఉల్లేఖించాయి. అడవులను, పర్యావరణాన్ని కాపాదే సహజ రక్షకులుగా సాంప్రదాయబద్ధమైన సంస్థలు వ్యవహరిస్తున్నాయని సమర్ధించాయి. ఇలాంటి అధ్యయనపూరిత నివేదికలన్నీ భారత పర్యావరణ పరిరక్షణ ఉద్యమ భావజాలాన్ని చారిత్రక నేపధ్యం, న్యాయబద్ధత ఆధారంగా బలోపేతం చేశాయి. సాంప్రదాయ వ్యవస్థల్లో వారసత్యంగా వస్తున్న అంతర్గత వైరుధ్యాలను కప్పిపుచ్చడమో, మరో రంగు అద్ధడమో జరిగింది చివరగా అడవులను ఎవరు నియంత్రించాలనే అంశంపై వాదనకు పునాదుల ఏర్పడ్డాయి ప్రభుత్వం, స్థానిక సముదాయాల మధ్య పోరుకు బీజం పడింది ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని వామపక్ష ప్రభుత్వం ప్రయోగాత్మక రీతిలో అటవీ యాజమాన్యాన్ని వికేంద్రీకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది అటవీ భూములు, ఉత్పత్తుల నియంత్రణలో ప్రజలకు చురుకైన భాగస్వామ్యం కల్పించింది ఈ ప్రక్రియ తర్వాతి కాలంలో ఉమ్మడి అటవీ యాజమాన్య కార్యక్రమంగా రూపాంతరం చెందింది అటవీ ప్రాంతాల్లో స్థానికుల సహకారం లేనిదే ఎలాంటి వ్యవసాయ - సాంస్కృతిక కార్యక్రమాలు విజయం సాధించలేవన్న అనుభవం ఆధారంగానే పశ్చిమ బెంగాల్‌లోని అరాబరీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విశేష ఖ్యాతి గడించిన అటవీ యాజమాన్య పధకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది ఆ ప్రాంత అటవీ శాఖాధికారి (డిఎఫ్ఒజ) ఎకె బెనర్జీ చొరవతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు అరాబరీ రేంజిలో సాల్ చెట్ల పరిరక్షణకు ప్రజలను సమీకరించడంలో ఆయన విశేష కృషి చేశారు సుమారు 1,272 హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీ
డ్రి
భూముల్లో ఆయన పునరావాస కార్యక్రమాన్ని చేపట్టి స్థానికులకు సంరక్షణ పధకాల్లో భాగంగా ఉపాధి కల్పించారు ఆ ప్రాంతలో వంట్ట చెరకును కూడా పెంచి స్థానికులకు సరసమైన ధరలకు విక్రయించారు వంతుల వారీగా పశువులను మేపడానికి సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేశారు అన్నిటికంటే ఎక్కువగా, అటవీ భూముల్లో వరిని సాగు చేయడానికి స్థానికులకు అవకాశం కల్పించారు పంటను సుమారు 700 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయించి ధాన్యాన్ని అతి తక్కువ ధరలకు అటవీ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి విక్రయించారు ఈ పధకం విజయవంతమైతే స్థానికులకు పంట దిగుబడిలో 25 శాతం వాటాను చెల్లిస్తామని కూదా హామీ ఇచ్చారు ఉమ్మడి యాజమాన్య పధకం ప్రవేశపెట్టిన అనంతరం 15 ఏళ్ళ వరకు స్టానికుల దృక్పధాన్ని మార్చేందుకు, పరస్పర విశ్వాసాన్ని పెంచేందుకు కృషి చేశారు 1987 నాటికల్లా ఈ వ్యవస్థ అటవీ సంరక్షణకు మంచి ప్రత్యామ్నాయమని వామపక్ష ప్రభుత్వం గుర్తించింది తర్వాత అటవీ శాఖ, స్థానిక సముదాయాల మధ్య భాగస్వామ్య వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తొలి సంవత్సరాల్లో ఈ ప్రయోగం మంచి ఫలితాలనిచ్చింది ఆ ప్రాంత పర్యావరణ సమతుల్యత పునర్జీవమయ్యిందని, అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయంవల్ల సమకూరుతున్న ఆర్థిక వనరులు క్రమంగా పెరిగాయని తర్వాతి కాలంలో నిర్వహించిన అధ్యయనాలు ఉల్లేఖించాయి ఈ చర్యలన్నింటినీ సామాజిక సంస్మరణ స్టూల ప్రక్రియలో భాగంగా, భూసంస్కరణల అమల్లో అంతర్భాగంగా చేపట్టారన్న విషయాన్ని తెలుసుకోవడం ఇక్కడ ఎంతైనా ముఖ్యం భూసంస్కరణలు అప్పటికే గ్రామీణ పేదలను ఆర్ధికంగా బలోపేతం చేసి ఉన్నాయి దీంతోపాటు స్థానిక సంస్థల పాలనను వికేంద్రీకరించి 1980లో భాగస్వామ్యు అటవీ వ్యవస్థలను ఏర్పరిచారు అటవీ సంరక్షణా కమిటీలన్నీ గ్రామ స్థాయి కమిటీలే అయినా వీటికి నిధులను జిల్లా పరిషత్, పంచాయతీల ద్వారా సమకూర్చారు ఈ విధంగా పధకంలో స్థానిక సంస్థలను కూడా భాగస్వాములను చేశారు ఫోర్డ్ ఫౌండేషన్ తన సమీక్షా నివేదికతో ప్రత్యక్షం కాకమునుపు 15 ఏళ్ళ వరకు అరాబరీలో ఆటవీ శాఖాధికారులు, స్థానిక ప్రజల మధ్య అనధికార ఒప్పందాలు ఉండేవి అరాబరీలోనే ఈ వ్యవస్థ సంపూర్ణంగా విజయవంతమైంది తర్వాత ఇతర డివిజన్లలో ఇలాంటి వ్యవస్థనే అమలు చేయడానికి అటవీ శాఖాధికారులు ప్రయత్నించారు ఒక విధంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఉమ్మడి అటవీ యాజమాన్య ప్రయోగం ప్రత్యేకమైనది ప్రగతిశీల సామాజిక, రాజకీయ ఉద్యమాల ప్రభావంలో అప్పటికీ అరాబరీ ప్రాంతం ఉంది ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య ఉమ్మడి యాజమాన్య పధకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ అటవీ యాజమాన్య పధకాన్ని ప్రవేశపెట్టిన ఇతర రాష్ట్రాలలో ఇలాంటి సామాజిక ప్రక్షాళన జరగని నేపధ్యం ఉండడం గమనార్దం 1990లో భారత ప్రభుత్వం ఉమ్మడి అటవీ యాజమాన్య పధకం అమలుకు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది 1995 కల్లా 15రాస్ర్రాలు ర్ం
తమ పరిధిలో పదకం అమలుకు మార్గదర్శక సూత్రాలు జారీ చేశాయి మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఏర్పాటు చేసిన అటవీ సంరక్షణ కమిటీలు తమ కార్యదర్శిగా ఒక ఫారెస్టు గార్డును కలిగి వుండేవి అటవీ శాఖ గతంలో నిర్వహించిన గస్తీ బాధ్యతలను సంరక్షణ కమిటీలు తమ భుజాన వేసుకున్నాయి వికేంద్రీకరణకు ప్రతీక అయిన ఉమ్మడి అటవీ యాజమాన్య పదకాన్ని అటవీ శాఖ అత్యుత్సాహంతో బలోపేతం చేయడం వెనుక ఒక వాస్తవం దాగుంది స్వాతంత్ర్యానంతరం 40 సంవత్సరాల వరకు అమల్లో ఉన్న కేంద్రీకృత యాజమాన్య వ్యవస్థ అంత సమర్ధవంతంగా పని చేయలేదన్న సత్యాన్ని అటవీ శాఖ ఒక విధంగా ఒప్పుకున్నట్లే అయితే, పధకం అమల్లోకి వచ్చినకొద్ది సంవత్సరాలకే అటవీ శాఖాధికారులు, లబ్బిదారుల్లో ఉత్సాహం కొరవడింది పధకం అమలుకు పరిస్థితులు అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఆ కార్యక్రమస్వరూపమే చానివైఫల్యానికి దారి తీసింది అటవీ శాఖ కూర్చు, చట్టాల్లో ఎలాంటి మార్పులు రాలేదు కేవలం అధికారుల వైఖరిలోనే కొంత మార్చు వచ్చింది అయితే వామపక్ష ప్రభుత్వ ప్రభావం బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్లో మాత్రం విప్లవాత్మకమైన మార్చు కనిపించింది అప్పటికే అక్కడి (ప్రభుత్వం యాజమాన్య పధకాన్ని సంరక్షణ చర్యల్లో భాగంగా అనధికారికంగా అమలు చేస్తోంది అన్ని అధ్యయనాల్లో గుర్తించిన మార్పుకు (ప్రధాన కారణం ఆ రాష్త్రంలో నెలకొని ఉన్న సామాజిక - ఆర్థిక వాతావరణం పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత జవాబుదారీగా చేయాలన్న పాలకుల రాజకీయ నిబద్ధతవల్ల బీట్ అధికారులు, న్థానిక అధికారులు స్వయంగా వెళ్ళి గిరిజనులతో, స్థానిక సంస్థలతో చర్చలు జరిపి వారిని యాజమాన్య పధకంలో భాగస్వాములను చేశారు. వేరే రాష్ట్రాలలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి అటవీ శాఖాధికారులు స్థానిక సముదాయాలపై తాము ముందుగా నిర్దేశించుకున్న షరతులను విధించారు సాంప్రదాయబద్ధంగా వస్తున్న వ్యవస్థకు అధికార స్వరూపం ఇవ్వకపోయి తమ అధికార దర్చాన్ని వారు ప్రదర్శించడంతో పధకం అమలులో ఆదిలోనే పరస్పర సహకార భావన లోషించి క్రమంగా అది నిర్వీర్యమైంది పథకం ప్రధాన లక్ష్యాలు గస్తీ వికేంద్రీకరణ, నిధుల వినియోగం వంగడాలను ఎన్నుకునే విషయాల్లో నిర్ణయాన్ని కేంద్రీకృతం చేయడం, లాభాలను సమానంగా పంచుకోవడంగా మధ్యవర్తి సంఘాలు భావించాయి పశ్చిమ బెంగాల్‌తో సహా అన్ని రాష్ర్టాలు పధకం లాభాల్లో అధిక భాగాన్ని హస్తగతం చేసుకున్నాయి ఈ ప్రక్రియలో అటవీసంరక్షణ కమిటీలు నమ్మక (ద్రోహానికి గురయ్యాయి. సామాజిక ఉద్యమాలు బలంగా లేని ప్రాంతాల్లో ఈ వ్యవస్థ సామాజికంగా, రాజకీయంగా మనుగడ సాగించడం కష్టమయ్యింది కమిటీలకు రాజకీయ అందనిస్తూ వాటికి న్యాయబద్ధమైన వాటాను ఇప్పించే సామాజిక, (ప్రజా ఉద్యమాలు లేనిచోట్ల ఎలాంటి ప్రయోజనాలు సిద్ధించలేదు కేవలం తమ సంస్థాగత ఖర్చులను కేంద్ర ప్రభుత్వ, విదేశీ ఆర్థిక సహాయంతో తీర్చుకోవాలనే ఉద్దేశంలో ఈ పధకాన్ని అటవీ శాఖాధికారులుచేపట్టిన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది కేంద్రం ఊా నిర్వహించిన అనేక అధ్యయనాల్లో తేలిందేమిటంటే పధకానికి కేటాయించిన నిధుల్లో సింహభాగం 51
మౌలిక సౌకర్యాల కల్పనకు నిర్మాణాలకు వ్యయం చేశారు ఇదే విషయాన్ని విశాఖపట్టణం కేంద్రంగా పని చేసే సమతా అనే స్వచ్చంద సంస్థ ఆధారాలతో సహా నిరూపించింది అటవీ సంరక్షణ పనులకు కేటాయించిన నిధులు మిగతా వ్యయం కంటే చాలా తక్కువగా ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది ఉమ్మడి అటవీ యాజమాన్య పధకం అమలులో (శ్రద్ధ కొరవడిందని పై విషయాలు స్పష్టం చేస్తున్నాయి ఆర్టిక సంస్కరణలతో పాటే ఈ పధకం అమల్లోకి రావడంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాఖలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులపై దృష్టి కేంద్రీకరించాయి కేంద్ర, విదేశీ ఆర్ధిక సహకారంతో నడిచే పధకాలపై దృష్టి పెట్టి వాటి నిధులను పెద్దఎత్తున మళ్ళించాయి. ప్రపంచ రుణ సంస్థల షరతులతో భాగంగా అడవులను భూస్వాములు, వ్యాపారులకు బార్లా తెరిచాయి మధ్యప్రదేశ్ విషయంలో ఈ విశ్లేషణ సరిగ్గా సరిపోతుంది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అటవీ యాజమాన్య పధకం కింద అత్యధికంగా నిధులు దక్కాయి ఇలాంటి పరిస్థితుల్లో అటవీ యాజమాన్య, సంరక్షణ పధకాలు స్టానిక సముదాయాల హక్కులను భంగపరిచాయి. ఏక్తా పరిషత్, కిసాన్ ఆదివాసీ సంఘటన్, ఆదివాసీ ముక్తి మోర్చా లాంటి సంఘాలు ఇదే విషయాన్ని మధ్య భారతమంతా చాటాయి మధ్యప్రదేశ్ అటవీ పధకంపై జాయింట్ మిషన్ ఇచ్చిన నివేదికలో ప్రపంచీకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యమాల కార్యకర్తలు అటవీ యాజమాన్య పదకాన్ని సమీక్షించి పునర్వ్యవస్థీకరించాలని వాదించారని పేర్కొన్నారు అటవీ సంరక్షణ స్వచ్చంద చర్యలను ప్రభుత్వ పధకాలు ఆక్రమించాయనదానికి 1931 చట్టంకింద ఉత్తరాంచల్‌లో ఏర్పాటు చేసిన వన పంచాయతీలే నిదర్శనం ఈ చట్టం 'ప్రకారం గ్రామ సముదాయాలకు అడవుల వినియోగంపై నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పించారు సాంప్రదాయ పద్ధతుల్లో అడవులను నియంత్రిస్తూ అటవీ వనరులపై కొద్దిపొటి స్వయం ప్రతిపత్తిని వన పంచాయతీలు సాధించాయి. (గ్రామసభ, అటవీ శాఖల మధ్య ఉన్న అవగాహనతోనే (అనధికార)వ్యవస్థ నడిచేది ఇటీవలి గణాంకాల ప్రకారం ఉత్తరాంచల్‌లో 6,069 వన పంచాయత్‌లు ఉన్నాయి అవి దాదాపు 4,05,426 హెక్టార్లలో విస్తరించి ఉన్న అడవులను సంరక్షిస్తున్నాయి స్వాతంత్రానంతరం వచ్చిన మార్పులవల్ల అవి తమ అధికారాలను చాలా వరకు కోల్పోయాయి. సామాజిక అటవీ పధకం అమలైన తర్వాత 1976లో వన్ పంచాయత్ చట్టాలను సవరించారు. వాటి పరిధిని తగ్గించారు అయినా స్టూల అటవీ యాజమాన్య వ్యవస్థలో పంచాయత్‌లు తమ ప్రభావాన్ని కాపాడుకోగలిగాయి వన్ పంచాయత్‌ల వ్యవస్థ ఆదర్శ్భవంతమైనదని ఇక్కడ వాదించడం లేదు మహిళలు, పేదలహక్కులపై ప్రతికూల 'ప్రభావం చూపలేదని చెప్పడం లేదు ఎన్ని లోపాలున్నా ఈ వ్యవస్థవల్ల మెజారిటీ ప్రజలు ఆర్ధికంగా ప్రయోజనం పొందారు అడవులనుసంరక్షించబడటమే కాకుండా బీడు భూముల్లో వాటిని విస్తరింపచేశారు కాని 1994లో అమల్లోకి వచ్చిన (గ్రామ అటవీ ఉమ్మడి యాజమాన్య కార్యక్రమం ఈ వ్యవస్థకు గట్టి సవాలును విసిరింది ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సాయంతో 52
నడిచే ఆ పధకంలో వన పంచాయతీలను విలీనం చేయాలని అటవీ శాఖకు ఆదేశాలందాయి ఈ విధంగా పంచాయత్‌ల వ్యవస్థకు తిలోదకాలిచ్చిన అటవీ శాఖ అడవులపై తనదే గుత్తాధిపత్యమని మరోమారు నిరూపించుకుంది
వన పంచాయత్‌లను రద్దు చేస్తారని ముందుగానే పసిగట్టిన స్థానిక ఉద్యమకారులు ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలో మార్చులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే వామపక్ష ప్రజాసంఘాలు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. అయితే అటవీ శాఖ దమన నీతికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించడానికి స్వంతంగా (ప్రయత్నించాయి. సముదాయ స్వభావం, దాని నియంత్రణ పద్ధతులపై విభేదాల కారణంగా వామపక్షాలు వన పంచాయత్‌ల ఉమ్మడి పోరాటం నుండి దూరం జరిగాయి అంశాల ప్రాతిపదికనే తమ మద్దతును ప్రకటించాయి. ఈ రెండు ఉద్యమాలు కొద్ది కాలమే కలిసి పని చేసినా ఒక్క విషయంలో మాత్రం అవి ఏకీభవించాయి. అడవుల (ఫైవేటీకరణ ప్రపంచ క్యాపిటలిస్టు వ్యవస్థలో గిరిజనులను అంతర్భాగం చేయడాన్ని రెండు ఉద్యమాలు వ్యతిరేకించాయి అపరిష్కృత సమస్యలు - భవిష్యత్ సవాళ్ళు
ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాప్ర లాంటి చాలా రాష్ట్రాలు, నేడు ఒరిస్సా ఛత్తీస్‌ఘడ్, జార్ధండ్లలో అటవీ శాఖలు ఒక విధంగా సంస్మరణ పదంలొ దూసుకెళ్తున్నాయి అడవులను పెద్ద ఎత్తున ైవేటీకరించడానికి శాఖాపరంగా పున వృవస్థీకరణ చెందుతున్నాయి ఇందుకు ఆంధ్రప్రదేశ్ వికృతమైన ఉదాహరణ అక్కడి ప్రభుత్వం ఉమ్మడి యాజమాన్య కార్యక్రమంలో పరిశ్రమలను మూడో భాగస్వామిగా గుర్తిస్తూ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది అదే విధంగా, అటవీ విస్తరణ రంగాన్ని పునవ్యవస్థీకరించేందుకు ప్రపంచ బ్యాంకు మధ్యప్రదేశ్ అటవీ విస్తరణ పధకాన్ని సాధనంగా ఎంచుకుంది ఈ పధకంలో ప్రైవేటురంగాన్ని కూడా భాగం చేయాలన్న షరతును బ్యాంకు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విధించింది వనరుల వినియోగం, యాజమాన్యం, రుణ సదుపాయం, గ్యారంటీలు, సాంకేతిక పరిజ్ఞానం పరికరాలను అందించడంలో అటవీ - ఆధారిత పరిశ్రమలు క్రియాశీలపాత్ర పోషిస్తాయని తెలుస్తోంది వన వ్యవసాయ పథకాలకు సహాయకారిగా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవి సిద్ధంగా ఉన్నాయని, విత్తనాలు, మొక్కలు కూడా అందించగలవన్న వార్తలొచ్చాయి ఈ విధంగా [ైవేటు పరిశ్రమ నర్సరీలు, విత్తన బ్యాంకులు, తోటలను ఏర్పాటు చేయడంలో ముఖ్యభూమికను పోషించగలదని స్పష్టమవుతోంది అయితే పేద సన్నకారురైతులు, భూమిలేని రైళులు, గిరిజనులు శుద్ది సౌకర్యాలను పారిశ్రామికావసరాలకు ప్రాధమిక వనరులను తమకు తాముగా కల్చించుకోలేరు కాబట్టి ఈ వీధానం కేవలం ధనిక రైతులు వ్యాపారులు పరిశ్రమలకే అన్ని లాభాలు తెచ్చిపెట్టగలదు ఇలా (ప్రైవేటురంగానికి ప్రయోజనాలు కల్పించే ఈ పధకంలో 'ప్రభుత్ప్స పాత్ర కేవలం నియంత్రణ సహాయకారిగానే పరిమితమవుతుంది ఉత్పత్తి, ఉత్పాదకత
53
అంశాలలో దానికెలాంటి భాగస్వామ్యం ఉండదు ఈ పధకం ప్రధాన షరతులలో ఒకటి
('పైవేటు భూముల్లో చెట్ల నరికివేతపై ఉన్న నిషేధాన్ని తొలగించడం పర్యావరణ పరిరక్షణ,
పరిసరాల భద్రత కంటే పారిశ్రామికావసరాలకు ముడి సరుకులను నిరంతరంగా పంపిణీ
చేయడానికే ఈ పధకం ఉద్దేశింపబడినట్లుగా దర్శనమిస్తుంది 1988 జాతీయ అటవీ పధకాన్ని
రాష్ట్రాలు అమలు చేయడమే తమ లక్ష్యంగా ప్రపంచ బ్యాంకు మరోవైపు వాదిస్తోంది
పైన వర్ణించిన పునర్ వ్యవస్థీకరణ ఒక్క ప్రపంచ అటవీ విస్తరణా పధకాల
లక్షణమేకాదు ఇతర పదకాలూ ఇదే బాటను అనుసరిస్తున్నాయి కేంద్ర పర్యావరణ అడవుల
శాఖ రూపొందించిన దీర్హకాలిక కార్యాచరణ ప్రణాళికల్లో కూడా ఇది పప్రస్ఫుటమవుతుంది
ఇందులో భాగంగానే ఇటీవల కేంద్రం జాతీయ అటవీ విస్తరణ కార్యాచరణ కార్యక్రమానికి
శ్రీకారం చుట్టింది అడవుల ఉత్పాదకతను పెంచడం, అటవీ యాజమాన్య సామర్దాన్ని పెంచడం
ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి ఈ లక్ష్య సాధనకు అడవులపై హక్కులున్న వారందరికీ
ప్రత్యేక రాయితీలను కల్పిస్తారు రాయితీల స్వరూపాన్ని కింది పట్టికలో అందిస్తున్నాం
జాతీయ అటవీ విస్తరణ కార్యాచరణ కార్యక్రను ప్రోత్సాహకాలు
భాగస్వాములు ప్రోత్సహకాలు
రైతులు మద్దతుధర విలువల తొలగింపు, నియంత్రణపై ఉన్న నిబంధనల తొలగింపు విస్తృత సేవలు సాంకేతిక పరిజ్ఞానం (హైబ్రిడ్ విత్తనాలు, ఇతర సాధనాలు) అందించడం
స్ధానిక సముదాయం పాలనా వికేంద్రీకరణ, భాగస్వామ్యానికి అనువైన పరిస్టితులుకల్పించడం, సురక్షిత పాలనా కాలపరిమితి, ఉపాధి అవకాశాల కల్పన, అటవీ ఉత్పత్తుల్లో సమాన వాటా, హక్షులు, హోదాల గుర్తింపు
(ప్రైవేటు అటవీ యజమానులు ఆచరణయోగ్యమైన స్తూల విధానాలు, సుస్ధిర పాలన, విస్తృత సౌకర్యాలు, వాణిజ్య సరళీకరణ, సంస్థాగత రుణం, ఆర్ధిక రాయితీలు(నష్టాల
విషయంలో)
శుద్ధిచేసే పరిశ్రమ ముడి సరుకుల నిరంతర సరఫరా సరసమైన ధరలకు ఉత్పత్తి సాధనాలు మార్కెట్ వ్యవస్థను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పరచడం, మౌలిక సౌకర్యాల కల్పన, ఉత్పత్తి అభివృద్ధి, మార్కెట్ సమాచారం, వివిధ రంగాల మధ్య సమన్వయం సాధించడం
ర్డీ
బహుళజాతి సంస్థలు ప్రోత్సాహకరమైన విధాన నంన్మరణలు సరళీకృత విధానాలు, ఆకర్షణీయమైన కిరాయి, రాజకీయ సున్టిరత, లాభాల తరలింపు ఎగుమతి - దిగుమతి ఆంక్షల సడలింపు, మౌలిక సొకర్వాలు అధ్యయనం (పరిశోధన) అభివృద్ధి సంస్థలు | ప్రోత్సాహకరమైన విధాన సంస్కరణలు, నరళీకృత విధానాలు, న్వయం (ప్రతిపత్తి పరిశోధనా వసతులు, పెట్టుబడులు, సామర్భాల పెంపు పాలనా సిబ్బంది ఆకర్షణీయమైన జీతం వేతనాలు సామర్భ్వానికి గుర్తింపు, స్పష్టమైన విధులు, బాధ్యతలు, అధికారుల ప్రక్షాళన, జవాబుదారీతనం - పారదర్శకత - బాధ్యత అటవీ ఉత్పత్తులు, పేవలవినియోగదారుడు స్థిరమైన, సమంజసమైన ధరలు అవసరానికి తగిన నాజ్యత, నిరంతర అందుబాటు, మన్నికపై పూర్తి సమాచారం అటవీ వాసులు సాంప్రదాయ సంస్కృతికి మద్దకు, సాంప్రదాయ పద్ధతుల అభివృద్ధి, అడవులకు సంబంధించిన నిర్ణయాల్లో భాగస్వామ్యం, తగిన హక్కులు, ప్రయోజనాలు విధాన రూవకర్తలు అపరిమిత ఆర్థిక, ఉపాధి ప్రయోజనాలు, ఎక్కువ ఆదాయం, ఆదాయ న్ఫృష్టి, స్థూల జాతీయ ఉత్పత్తి గణనీయమైన తోడ్పాటు ఆధారం జాతీయ అటవీ విస్తరణ కార్యాచరణ కార్యక్రమం 1వ సంపుటి కేంద్ర పర్యావరణ, అడవుల శాఖ దీర్ధకాలిక పధకం అటదీ ధంగాన్ని సరళీకరించి పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానించడమేనని పై పట్టిక సూచిస్తోంది పెట్టుబడులను ముఖ్యంగా బహుళజాతి సంస్థల నుండి ఆశిస్తున్నారు (పైవేటు రంగమంటే గిరిజనులు, రైతులు, వ్యాపారులు స్వచ్చంద సంస్థలు పైవేటురంగ కంపెనీలు, బహుళజాతి సంస్థలన్న ప్రపంచ బ్యాంకు నిర్వచనాన్నే అటవీ మంత్రిత్వ శాఖ ఉద్దాటిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వము, రుణ సంస్థలు అడవుల పాలనలో ఎలాంటి భాగస్వామ్యాన్ని ఆశించడంలేదని స్పష్టమవుతుంది ఈ రంగం నుండి ప్రభుత్వం తప్పుకుంటే పెద్ద కంపెనీలదే రాజ్యమవుతుంది ఎందుకంటే సరళీకరణ ఫలాలను అందుకునే పరిస్థితిలో సాధారణ ప్రజలు లేరు కనీస స్థాయిలో కూడా ర్5్
లేని మౌలిక సదుపాయాలు మార్పులు తీసుకువచ్చే పరిమిత లాభాలు దినసరి వేతనాలను స్వల్పస్థాయిలో మాత్రమే పెంచగలవు మొత్తంగా, ఈ మార్పులు ఆయా ప్రాంతాల మధ్య అసమతుల్యాన్ని అసమానమైన (క్రయవిక్రయాలను మరింత విస్తరించే అవకాశాలున్నాయి
ఈ సంస్కరణల ప్రక్రియ విసురుతున్న పెనుసవాళ్ళను ఎదుర్కోవడానికి వామపక్ష పర్యావరణ ఉద్యమ సంఘాలు ఆర్థిక విధానాల స్టూల విమర్శలో భాగంగా వాదనలు సిద్ధం చేసుకుంటున్నాయి వామపక్షాల విశ్లేషణ అడవుల విస్తరణ రంగంపైన, పీడిత వర్గాలపై అది చూపే ప్రభావంపై దృష్టి కేంద్రీకరించకపోగా పర్యావరణ ఉద్యమం ఆయా అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా సమస్య విశాలమైనది కాబట్టి ప్రతిస్పందించలేకపోతోంది ఇందుకు కారణం అటవీ రంగం నుండి ప్రభుత్వం పూర్తిగా తప్పుకోవాలన్న తమసైద్ధాంతిక వాదనే సంస్కరణల యుగంలో సరళీకృత, ప్రపంచీకరణ ఆర్ధిక వ్యవస్థలో స్థానిక సముదాయాల సంరక్షకులుగా ఎవరు ఉండగలరన్న ప్రధానమైన ప్రశ్నకు పర్యావరణ ఉద్యమం జవాబు చెప్పలేకపోతోంది ఈ అంశం అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే అటవీ పాలన నుండి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటే గిరిజనుల బతుకులు మరింత ఛిద్రమవుతాయి ప్రభుత్వం తన పాత్రను పునర్ వ్యవస్థీకరించుకొవాలి సహజ వనరులపై దాని గుత్తాధిపత్యం తొలగిపోగానే ప్రజలే నియంత్రణ, యాజమాన్య, అభివృద్ధి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా సహాయ సహకారాలు అందించాలి అడవుల పాలనా, అభివృద్ధి ఉమ్మడి అటవీ యాజమాన్య పధకం లాంటి కార్యక్రమాల అమలుకు ఇప్పటి వరకు వామపక్షాలు (ప్రభుత్వంపైనే నమ్మకం ఉంచాయి పెట్టుబడిదారీయేతర నూతన రాజ్య వ్యవస్థల ఏర్పాటుకు ఇప్పుడవి తగిన చొరవ చూపాలి ప్రజలు, పర్యావరణానికి అనుకూలమైన వికేంద్రీకృత పాలనా యంత్రాంగాన్ని అన్వేషించాలి నేడు వామపక్షాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకు ఇదే తక్షణ, ఉమ్మడి బాధ్యత
56
క్ అభివృద్ధి - నిర్వాసిత రాజకీయాలు
సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పునరుద్ధరిస్తూ అక్టోబరు 18, 2000న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో నర్మదా బచావ్ ఆందోళన రాజకీయంగా తిరిగి వెలుగులోకి వచ్చింది నర్మదా నది ముంపునకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమానికి రెండు దకాబ్బాల చరిత్ర ఉంది మేధాపట్కర్ నాయకత్వంలోని ఈ ఉద్యమం పేదల పక్షపాతి అయిన పర్యావరణ ఉద్యమానికి సైద్ధాంతిక మార్గదర్శిగా మారింది ఆధునిక అభివృద్ధి పంధాకు వ్యతిరేకంగా సాగుతున్న పోరుకు మేధా ఫట్మర్ ఆదర్శప్రాయంగా నిలిచారు ప్రాజెక్టు నిర్మాణ అవసరాన్ని, బెచిత్యాన్నే ప్రశ్నించడం ద్వారా ఆధునికత, ఆధునిక అభివృద్ధి అనే భావనను ఎన్బీఏ సవాలు చేస్తోంది. ఆధునిక అభివృద్ధి పంధాలో నిర్వాసం - పునరావాసం ఒక భాగమయ్యాయని అవగాహనతో ఎన్బీఏ డ్యాం - వ్యతిరేక వైఖరిని సమర్థిస్తోంది ఆధునిక అభివృద్ధి బాట పర్యావరణపరంగా, సామాజికంగా, ఆర్థికంగా లాభదాయకమైనదికాదని అది వాదిస్తోంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం, సాంకేతిక వరిజ్ఞానం (ప్రజా ప్రయోజనాలను పరిరక్షించలేవని, వారిసమస్యలకు పరిష్కార మార్గాలు చూపలేవని నర్మదా ఉద్యమకారుల భావన అర్ధవంతమైన జీవితం నైతిక ఆలోచనల పెంపొందించే అభివృద్ధి పంధా ఎంతైనా అవసరమని, చిన్నతరహా అభివృద్దే ముద్దు అని, భారీ ప్రాజెక్టులు వ్యర్థమైనవి, ఉన్నత వర్గాల అభివృద్ధి కాంక్షను సూచించేవిగా ఉన్నాయని వారు విశ్వసిస్తున్నారు ఈ ప్రయత్నంలో నర్మదా బచావ్ ఆందోళన ఒంటరిగా లేదు దేశవ్యాప్తంగా ఎన్నో క్షేత్రస్థాయి ఉద్యమాలు గిరిజన ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సాగుతూ ఉన్నాయి జార్థండ్లోని కోయెల్కారోలో ప్రభుత్వ దమనకాండ, బస్తర్‌లో నగర్ నార్ స్టీలు పరిక్రమ, బిలాస్పూర్ సమీపంలోని సీపత్ ధర్మల్ విద్యుత్ కేంద్రం, హిమాచల్‌లోని హిమాలయ జాతీయ పార్కు మహారాష్రలో మహేశ్వర్ డ్వాంలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలు నిర్వాసానికి, ఉపాధికి దూరమైన గిరిజనుల జీవితానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ ప్రాజెక్టువల్ల స్థానికుల
ర్?
జీవితాలు దుర్భరమవుతున్నాయని ఈ ఉద్యమాలు వాపోతున్నాయి
మరోవైపు వామపక్షాలు ప్రజానుకూలమైన అభివృద్ధి పందాను సమర్ధిస్తున్నాయి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదపడితే ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నాయి. స్టూలంగా, భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వామపక్షాలు వ్యతిరేకించకపోయినా పర్యావరణవాదులు డిమాండ్ చేస్తున్నట్లు నిర్వాసం పునరావాసం సమస్యలను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే ఎలాంటి పధకాలైనా ప్రభుత్వం చేపట్టవచ్చని అవి కోరుతున్నాయి పర్యావరణ పరిరక్షణ ఉద్యమంతో ఏకీభవిస్తూ వామపక్షవాదులు ప్రస్తుత ఆధినిక అభివృద్ధి వ్యవస్థ దొపిడీదారి లక్షణం కలిగి ఉందని, దానివల్ల కేవలం కొద్ది మంది నూత్రమే లబ్టి పొందుతున్నారని, మరోవైపు స్థానికులు తమ స్వదేశంలోనె శరణార్జులుగా మారాల్సినపరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే వారి పోరాటాల దృష్టి అంతా ప్రాజెక్టుల సక్రమ రూపకల్పన, ప్రణాళికపైనే కేంద్రీక్కృతమవుతోంది. భారీ ప్రాజెక్టుల వల్ల స్థానికులు, పేద వర్గాలు అత్యధిక సంఖ్యలో లాభపడాలని అభివృద్ధి అనేది సమాజంలోని ధనిక వర్గానికే పరిమితం కారాదని వామపక్షాలు అభిషిస్తున్నాయి. అయితే అనుభవం ఏమి నేర్పుతోందంటే సమాజంలోని మెజారిటీ వర్గాలకు ఉపయోగపడని ఆధునిక దేవాలయాల(ప్రాజెక్టులు)కు మద్దతుగా వామపక్ష ప్రజా ఉద్యమాలు ఎల్లకాలం నిలవలేవు సైలెంట్ వ్యాలీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా వామపక్ష అనుబంధ సంస్థ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ చేపట్టిన ఉద్యమం ఆధునిక అభివృద్ధి పంధాపై వామపక్షాల్లొ అంతర్గత చర్చికు దారి తీసింది ఇటీవలి కాలంలో వామపక్ష ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, కిసాన్ సభల నేతృత్వంలో మహా హిమాలయ జాతీయ పార్కు నథ్చారుక్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం, పార్వతీసాగర్ (హిమాచల్‌ప్రదేశ్)లకు వ్యతిరేకంగా ఉద్యమాలు బయళ్టేరాయి. అలాగే, సుప్రీంకోర్టు తీర్పు తద్వాత నర్మదా బచావ్ ఆందోళనకు వామపక్షాల సమర్ధన ఇవ్వడం చూస్తే స్థూలంగా ఉద్యమం నిర్వాసితుల సమస్యకు సానుకూలంగానే స్పందిస్తోందని అర్ధమవుతుంది
వామపక్ష్మ పర్యావరణ ఉద్యమాల మధ్య వాదనలో ఇంతకంటే క్లిష్టమైన, వివాదాస్పదమైన అంశం బహుశా మరొకటి ఉండకపోవచ్చు ఈ అధ్యాయంలో వర్లించినట్లుగా రెందు ఉద్యమాల మధ్య ఉన్న అభిప్రాయబీధాల స్పరూపం కారణంగానే వారి ఐక్యత అశాశ్వతమైనదిగా, విచ్చిన్నమైనదిగా కనిపిస్తుంది స్థూల సైద్ధాంతిక ఏకాభిప్రాయం కంటే స్టోనిక పరిస్థితులు, ప్రత్యేక అంశాల ఆధారంగానే రెండు ఉద్యమాలు ఉమ్మడి పోరాటాన్ని నిర్వహించాయి. ఎందుకంటే అభివృద్ధిపై వాదనలో వామపక్షాలు ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా ఎన్నడూ తమ వైఖరిని ప్రదర్శించలేదు ఈ కారణంగానే నిర్వాసిత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అవి చేపట్టే ఉద్యమాలు అంతగా వెలుగు చూడవు అలాగే ఇతర ఉద్యమాలకు వాటి సంఘీభావం మద్దతును ఎవరూ గుర్తించరు సంజయ్ సంగ్వాయ్ తాను ఇటీవల రాసిన పుస్తకం ద రివర్ అండ్ ద లైఫ్ (నది-జీవితం)లో సిపిఎం వైఖరిని
58
నిశితంగా విమర్శించారు పర్యావరణ ఉద్యమాలు, ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానం, (ప్రజా హక్కులపై సిపిఎం తదితర వామపక్ష సంఘాలు ఎలాంటి వైఖరిని అవలంబించడం లేదని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్య చర్చనీయాంశమే అయినా దానిని వామపక్షాలు, ప్రజా పర్యావరణ ఉద్యమాల మధ్య ఈ అంశంపై ఉన్న ప్రధాన సమస్యకు ప్రతిబింబంగా గుర్తించడం ముఖ్యం నర్మదా కథ
సర్దార్ సరోవర్ ప్రాజెక్టుపై ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్కియాలజీ, కల్చర్ అండ్ హిస్టరీ రూపొందించిన చిత్రం ఏమంటుందంటే లోయ [ప్రాంత ప్రజలకు నర్మదా కేవలం ఒక నది మాత్రమే కాదు, వారి జీవితం, సంస్కృతి, దివ్యమైన సాంప్రదాయానికి చిహ్నం ఈ భావన ఆధారంగా ముందుకు వెళుతూ మరో రచయిత ఏమన్నాడంటే “నది కింద ముంపు అంటే దేవతాకన్యపై అత్యాచారమే స్థానికులు ఆ విధంగా నదులను భక్తి ప్రపత్తులతో కొలుస్తారు ” ఈ కారణాలు (ప్రజల సాంస్కృతిక శక్తిని బలోపేతం చేసి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించేలా చేశాయి. డ్యాంలు కేవలం నీటి నిల్వ క్షేత్రాలు, విద్యుత్ ఉత్పాదక పధకాలే కాదు నర్మదా నదీ క్షేత్రాన్నంతటిని స్థూలంగా అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించిన భారీ పధకంలో అంతర్భాగమే ఈ భారీ ప్రణాళికలో భాగంగా 30 భారీ, 135 మధ్య తరహా 3,000 చిన్న తరహా డ్యాంలను నాలుగు రాష్ట్రాల్లో (గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర విస్తరించి ఉన్న నర్మదా నదీ పరివాహక ప్రాంతాలలో నిర్మించాలని సంకల్పించారు అందులో 455 అడుగుల ఎత్తు కలిగిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ముఖ్యమైనది ఈ ప్రాజెక్టు కింద పూర్తిగా ముంపు సంభవించినపుడు సుమారు ఒకటిన్నర లక్ష మంది (ప్రజలు నిర్వాసితులవుతారు సాగునీటి సరఫరా విషయంలో మధ్యప్రదేశ్‌కు ఎలాంటి ప్రయోజనం లభించకపోయినప్పటికీ ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే వారి సంఖ్య ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది మధ్యప్రదేశ్‌లో సుమారు 193 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా వేశారు అయితే గుజరాత్లో ముంపు గ్రామాల సంఖ్య 19, మహారాష్ట్రలో 88 మాత్రమే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎలాంటి సాగు నీరు లభించనప్పటికీ మధ్యప్రదేశ్ వాసులే అధికంగా నష్టపోవాల్సి ఉంటుంది ఇంకా చెప్పాలంటే, ముంపునకు గురయ్యే వారిలో 62 శాతం మంది దళితులు గిరిజనులే కావడం విషాదకరం ట్రిబ్యునల్ అవార్డు తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభమైన వెంటనే ముంపునకు గురయ్యే కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉద్యమాలు (ప్రారంభమయ్యాయి. 1987-88 నుండి ఈ ఉద్యమాలన్నీ ఏకతాటిపైకి వచ్చి నర్మదా బచావ్ ఆందోళనగా రూపాంతరం చెందాయి
ప్రభుత్వానికి సమర్పించిన తొలి విజ్ఞాపనలో, ద్యాం నిర్మాణాన్ని నర్మదా బచావ్ ఆందోళన పూర్తిగా వ్యతిరేకించింది ముంపునకు గురయ్యే కుటుంబాల్లో ఒక్కటి కూడా తమ ఇళ్ళను వదలి వెళ్ళదని అందులో స్పష్టం చేసింది భూసేకరణ చట్టం కింద ప్రాజెక్టు నిర్మాణం
ర్ం
కోసం భూమిని సేకరించడాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని కూడా ఎన్బీఏ డిమాండ్ చేసింది ఉద్యమం తొలి దశలో ఎన్పీఏ దృష్టంతా ప్రాజెక్టు నిర్మాణాన్ని అపడంపైనే ఉందేది నిర్వాసం పునరావాసం అంశాలను పూర్తిగా వెనక్కి నెట్టేశారు ఏందుకంటే ఉద్వమం [పాజెక్టు ఉనికినే ప్రశ్చిస్తోంది ఈ కారణంగానే ముంపువాసుల సంక్షేమం, పునరావాసంపై ఆందోళన వ్యక్తం చేసిన రాజకీయ శక్తులను ఉద్యమ వ్యతిరేకులుగా పరిగణించడం జరిగింది సంగ్వాయ్ తాజా పుస్తకమే ఇందుకు ఉదాహరణ
“కేంద్ర,రాస్త్ర స్థాయిల్లో ఉన్న మితవాద, వామపక్షనాద శక్తులన్నీ తొలి నుండి “అభివృద్ధి పధకం" పునంసమీక్షను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఉదాత్తమైన రీతిలో ముంపువాసులకు సమగ్రంగా పునరావాసం కల్పించాలన్న డిమాండ్‌ను అనుమతించాయి”
ఈ వాదనలో ఎంత వరకు నిజం ఉందన్న సంగతి పక్కన పెడితే పట్టుసడలని ద్యాం వ్యతిరేక వైఖరి కారణంగా ఉద్యమం మొత్తానికి ఎదురైన పరిణామాలు ఏమిటని ప్రశ్నించడం ముఖ్యం ఈ ప్రక్రియలో ఎన్బీఏ కొంత మేరకు విజయం సాధించిందని చెబ్బ్పడం నిస్సందేహం డ్యాం నిర్మాణాన్ని స్వతంత్రంగా సమీక్షించెలా ప్రభుత్వానికి ఎన్నివ ఒత్తిడి తేగలిగింది 1991లో ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన మోర్స్ కమిటీ డ్యాం మానృతను సామాజిక, ఆర్థిక, పర్యావరణ కోణాల నుండి సమీక్షించింది దీని తర్చాత డ్యాం ఖర్చు - ప్రయోజనాలపై విశ్లేషణాత్మకంగా అధ్యయనాలు జరిగాయి. పర్యావరణ పరిస్టితుల అనుకూలతను నిర్ధారించిన తర్వాతే డ్యాం నిర్మాణానికి అనుమతినివ్వాలని, ఇది పనులు ప్రారంభించడానికి ముందే జరగాలని అయా అధ్యయనాలు సూచించాయి ప్రాజెక్టు నిర్మాణం అన్ని పర్యావరణ ప్రమాణాలను ధిక్కరిస్తోందని, ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు పెద్దగా ఉండవని మోర్స్ కమిటీ నివేదించిన వెంటనే 1998లో ప్రపంచ బ్యాంకు ఆ కమిటీని వెనక్కి తీసుకొంది ముంపునకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణం చాలా ఉండడంతో నిర్వాసితులందరికీ దేశంలోని చట్టాలు, నిబంధనలను అనుసరించి పునరావాసం కల్పించడం అసాధ్యమని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది ఈ పరిణామంతో ఉప్పొంగిపోయిన నర్మదా బచావ్ ఆందోళన సర్దార్ సరోవర్ ద్యాం పనులన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని కోరుతూ సుట్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసింది ద్యాం ఎత్తును తగ్గించాలనికోరుతూ నర్మదా కంట్రోల్ అదారిటీ ముందు ప్రతిపాదనలు పెట్టాలని దిగ్విజయ్‌సింగ్ నేతృత్వంలోని అప్పటి మధ్యప్రదేశ్ ప్రభుత్వం పై ఎన్బీఏ తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది ఫలితంగా కోర్టులో డ్యాం ఎత్తు తగ్గించాలని కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనేక అఫిడవిట్లను ప్రవేశపెట్టింది దీనిని అవకాశంగా తీసుకొని డ్యాం ఎత్తును తగ్గించాల్సిందేనంటూ ఎనీఏ బహిరంగంగా డిమాండ్ చేయడం మొదలుపెట్టింది నర్మదా కంట్రోల్ అధారిటీ ఎదుట ఇలాంటి వాదనే ఉంచాలని మహారాష్ట్ర (ప్రభుత్వాన్ని కూదాకోరింది 1996 నాటికల్లా సహజ వనరులపై ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న క్షేత్ర స్థాయి ఉద్యమాలన్నింటిని ఒకె వేదికపై తెచ్చి ప్రజా ఉద్యమాల జాతీయ కూటమి (నేషనల్
60
అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్స్-ఎన్ఎపిఎం)ని నర్మదా బచావ్ ఆందోళన ఏర్పాటు చేసింది తన పరిధిని విస్తరించుకోవడమే కాకుండా భారీ ప్రాజెక్టుల వ్యతిరేక సిద్ధాంతాన్ని ప్రచారం చేసెందుకు ఒక విశాలమైన వేదికను పర్పాటు చేయడమే ఎన్బీఏ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది వామపక్షాలు - నర్మదా ద్యాం
ఈ కద నుండి పక్కకు తప్పుకొని ఇక్కడి నుండి నర్మదా సమస్యపై వామపక్షాల వైఖరేమిటో చర్చించడం భావ్యంగా ఉంటుంది 1990 తొలి దినాల్లో ఎన్బీఏ నిర్విరామంగా వ్యవహరించింది దానితోపాటు సామాజిక ఉద్యమాలు, సంస్థాగత వామపక్షాలతో ముడిపడి ఉన్న శక్తులు కూడా ఆందోళనాపధంలో ఉన్నాయి. నిర్వాసితులకు సంతృప్తికరమైన రీతిలో పునరావాసం కల్పించేంత వరకూ ప్రాజెక్టు పనులు చేపట్టరాదని సిపిఎం ఒక దృధమైన వైఖరిని తీసుకొంది పునరావాసం పూర్తిగా కల్పించకుండానే డ్యాం ఎత్తును పెంచే ప్రతిపాదనను అది తీవ్రంగా వ్యతిరేకించింది వామపక్షవాద రాజకీయ పార్టీలు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేయకపోయినా పనుల పునరుద్ధరణకు కొన్ని షరతులు విధించాయి ప్రాజెక్టుబాధిత ప్రజలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పున సమీక్షించాలన్న వాదనను వారి డిమాండ్లు ప్రతిబింబించాయి 1992లో సిపిఎం కింది విధంగా తీర్మానించింది
“సామాజిక, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకొని అన్ని భారీ పధకాలను, నీటి ప్రాజెక్టులను నిలిపివేయాలన్న వాదనతో సిపిఎం ఏకీభవించడం లేదు ప్రతి ప్రాజెక్టును జాగ్రత్తగా అధ్యయనం చేసి, స్థూల అర్హతలు, ప్రయోజనాల సమతుల్యం ఆధారంగా వాటిని చేపట్టాలి ఇందుకు అభివృద్ధి పర్యావరణ (ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి సర్దార్ సరోవర్, నర్మదా వ్యాలీ ప్రాజెక్టుల విషయానికి వస్తే, క్రమంగా పెరిగే అంచనాల వ్యయం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, సమర్ధవంతమైన అధికారిక కమిటీతో ప్రాజెక్టులను సక్రమంగా పునిసమీక్షంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రాజెక్టు పనులతో ముందుకు వెళ్ళి సమయంలో పై అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి పునరావాసం, ఉపాధి పధకాలన్ని పూర్తి చేసిన తర్వాతే ముంపు వాసులను తరలించాలని మధ్యప్రదేశ్ సిపిఎం శాఖ డిమాండ్ చేసింది ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురయ్యే ముందే సకల చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది ”
ఇదే వైఖరిని సిపిఎం తరచుగా వ్యక్తం చేసింది 2002 అగస్టులో ప్రాజెక్టు బాధిత ప్రజల సమస్యలను ప్రాదమికంగా తెలుసుకునేందుకు పార్టీ ఎంపీల బృందాన్ని గుజరాత్‌కు పంపింది ముంపు వాసుల అవస్థను కళ్ళారా చూసి చలించిపోయిన ఎంపీల బృందం ఢీ చేరుకోగానే పునరావాసం, ఉపాధి అంశాలపై నర్మదా జల వివాదాల ట్రిబ్యునల్ అనార్థు ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసింది సిపిఎం చేసిన డీఘాంద్లు కింది విధంగా ఉన్నాయి
ప!
- భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ భూములు (నగదు పరిహారం స్థానంలో) కేటాయించి వారి జీవనోపాధిని పునరుద్ధరించాలి 2 బాధిత ప్రజలను సాగుభూములు (పూర్తి హక్కులతో) కేటాయించి పునరావాసం కల్పించాలి సాగు భూములను వారి స్వంత రాష్ట్రాల్లోనే కేటాయించాలి ప్రభుత్వ ఖర్చుతో సేద్యపు నీటి సౌకర్యం కల్పించాలి 38 _ పునరావాసం విషయంలో గుజరాత్ లేదా రాష్ట్రాలనే ఎన్నుకునే హక్షును ప్రాజెక్టు బాధితులకు కల్పించాలి శ (గ్రామాలను ఒక సముదాయంగా తరలించిగ్రామానికి అవసరమయ్యే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి 5 _ పునరావాసానికి ఒక సంవత్సరం ముందుగానే సాగు భూములను పంపిణీ చేయాలి 6 ముంపు వాసులకు పునరావాసం కల్పించి, వారికి ముందుగా తెలియజేసిన తర్వాతనె మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రాంతాలను ముంపునకు గురి చేయాలి 7 ప్రాజెక్టు నిర్మాణానికి చాలా ముందుగానే పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేయాలి లేని యెడల ఈ కార్యక్రమం ముగిసేంత వరకు నిర్మాణ పనులు, నీటి నిల్వ (ప్రక్రియను నిలిపివేయాలి 8 మాన్ డ్యామ్ ప్రదేశం నుండి గిరిజనులను తరలించేందుకు అనుసరిస్తున్న దమనకాందను తక్షణం నిలిపివేయాలి ప్రజాసమస్యల పరిష్కార బోర్డు సూచనల మేరకు వారికి పునరావాసం కల్పించాలి 9 _ పునరావాస కార్యక్రమాన్ని సమీక్షించేందుకు ప్రత్యేక అధారిటీని పర్పాటు చేయాలి అప్పటి వరకు బాధితుల భూములు ముంపునకు గురికాకుండా చూడాలి 10 మహేశ్వర్ జలవిద్యుత్ పధకాన్ని పున సమీక్షించి పూర్తిగా రద్దు చేయాలి 1990 నుండి ప్రాజెక్టు బాధిత ప్రజల పట్ల సిపిఎం దృఢమైన వైఖరే అవలంబిస్తోందని చెప్పడానికి పై డిమాండ్లే నిదర్శనం వాస్తవంగా, నేడు వామపక్షాలు మహేశ్వర్ జల విద్యుత్ పధకం లాంటి భారీ ప్రాజెక్టులను నిలిపివేయాలని సైతం డిమాండ్ చేస్తున్నాయి ఫలితంగా వారి వైఖరి ఎన్సీఏ వాదనకు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది అయితే ఆధునికత సాంకేతిక పరిజ్ఞానం అంశాలపై మాత్రం ఇరువురి మధ్య పూద్చలేనంత విభేదాలున్నాయి రాజకీయవసరాల కోసం ఈ మార్పు చోటు చేసుకోలేదు వామపక్షాల అనుభవాలతోనే వారి వైఖరిలో సడలింపు వచ్చింది ఈ మధ్యకాలంలో, చాలా ప్రాజెక్టులను పున దర్శించి వాటి ఆర్థిక, పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేశారు గత నాలుగేళ్ళుగా నద్చా జాక్రి (హిమాచల్) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. ఆ ప్రాజెక్టు స్థానిక రైతులు కార్మికుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అవి వాదిస్తున్నాయి భూగర్భసారంగాలలో ఉష్టోగ్రతలు 602
అధికంగా ఉండడంతో 1993 నుండి నేటి వరకు సుమారు 200 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు 1999లో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనను హింసాత్మకంగా అణచివేయడానికి ప్రయత్నించింది అదే సమయంలో ఆ ప్రాంత రైతులు, స్థానికుల సమస్యలపై కిసాన్ సభ ఉద్యమాన్ని ప్రారంభించింది నిర్వాస సమస్య తలెత్తనందున నాధ్బాజాక్రి ప్రాజెక్టు ప్రజానుకూలమైనదిగా పాలకులు అభివర్ణించారు కాంటినెంటల్ ఫౌండేషన్ జాయింట్ వెంచర్లో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రాజెక్టులో కార్మికులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు, యాజమాన్యం అవలంబిస్తున్న అణచివేత చర్యలకు వ్యతిరేకంగా 1990 నుండి సిఐటియు ఉద్యమాన్ని లేవదీసింది (ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికుల్లో అత్యధిక శాతం మంది టివీ, అస్తమా (ఉబ్బసం) లాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నారని తొలుత సిఐటియు వాదించింది కార్మికులకు చెల్లిస్తున్న పరిహారం నామమాథభ్రంగా ఉందని ఆరోపించింది రాష్ట్ర మానవ హక్కుల సంఘం జోక్యం తర్వాతనే యాజమాన్యం పరిహార నిధిని ఏర్పాటు చేసింది ఈ అంశాలే కాక ఆ ప్రాంత పర్యావరణంపై ప్రాజెక్టు చూపుతున్న దుష్ప్రభావాన్ని కూడా సిఐటియు, కిసాన్సభలు ఎత్తి చూపాయి నిర్మాణ ప్రదేశాల్లో చేపడుతున్న బ్లాస్టింగ్వల్ల ఆ ప్రాంత ప్రజల నివాసాలకు పెద్దపెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి మంచినీటి సదుపాయాలు ఎండిపోయాయి పశుగ్రాసం అదృశ్యం కావడమేకాక ఆ ప్రాంత వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది నదుల్లో ఇసుక తరలింపు, కొండ ప్రాంతాల్లో తవ్వకాల వల్ల ప్రాంతీయ పర్యావరణ సమతుల్యం బాగా దెబ్బతింది భూగర్భ నీటి మట్టాలు అడుగంటి పోయాయి ఇక్కడ కూడా, వామపక్షాలు భారీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వాదించకపోయినా, నాద్బాజాక్రి ప్రాజెక్టు డిజైన్‌ను పునిసమీక్షించాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాయి ప్రాజెక్టు పర్యావరణ (ప్రభావ అంచనాను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శాస్త్రవేత్తల, నిపుణుల బృందానికి అప్పగించాలని, పరిష్కార మార్గాలు కనుగొని వాటి ఆధారంగా ప్రత్యామ్నాయ డిజైన్‌ను రూపొందించాలని కోరుతున్నారు
ఈ నేపధ్యంలో నర్మదా బచావ్ ఆందోళన తరచుగా లేవదీసిన ప్రత్యామ్నాయ మార్గాల అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం సముచితంగా ఉంటుంది 1980వ దశకం చివరికల్లా వామపక్ష అనుబంధ సంస్థ పీపుల్స్ సైన్స్ మూవ్మెంట్ (పిఎస్ఎం) దేశంలో జరుగుతున్న పారిశ్రామికీకరణ అభివృద్ధి స్వభావంపై చర్చను ప్రారంభించింది. ఏకలవ్య, కేరళ శాస్త్ర సాహిత్యపరిషత్లకు ఎన్బీఏ అజెండాతో ఉన్న సారూప్యతను పిఎస్ఎం చర్చ ప్రతిబింబిస్తుంది ఈ క్రమంలో వామపక్ష సహచర సంస్థ ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ 1994లో సర్టార్ సరోవర్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం గురించి చర్చించడానికి శాస్త్రవేత్తల, ఉద్యమకారుల సంయుక్త సమావేశాన్ని నిర్వహించింది సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి శాస్త్రవేత్తలు నిపుణులు హాజరై సాంకేతికపరంగా సర్దార్ సరోవర్కు ప్రత్యామ్నాయ పధకాన్ని అన్వేషించేందుకు ప్రయత్నించారు కేంద్ర ప్రణాళికా సంఘం, కేంద్ర జల సంఘం, కేంద్ర విద్యుచ్చక్తి బోర్డు
63
నుండి ప్రతినిధులు వచ్చి తమ వాదనలు వినిపించారు ఆ సమయంలో ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ పనులు కొనసాగ్గుతున్నాయి. సమావేశానికి హాజరై తమ వాదనలు వినిపించాలని నర్మదా బచావ్ ఆందోళన ప్రధమ ్రేణి ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపినా వారు కేవలం పరిశీలకులను మాత్రమే పంపారు సమావేశానికి ప్రతినిధులను పంపితే తమ ద్యాం వ్యతిరేక వైఖరికి మచ్చరాగలదని వారు భావించారు సర్దార్ సరోవర్ నిగమ్ (ప్రతినిధులెవ్వరూ హాజరు కాలేదు సమావేశం నిర్ధారించిందేమిటంటే ప్రాధమికంగా సర్దార్ సరోవర్కు సాంకేతికపరమైన ఉన్నత (క్రేజి ప్రత్యాన్నూయాలు ఉన్నాయి నర్మదా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జరిగిన జలపంపిణీ వ్యవస్థను కొనసాగించినా, ప్రస్తుతం నిర్మితమైన గోడను వినియోగించుకున్నా ఈ ప్రత్యామ్నాయాలను అమలు చేయవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతికపరమైన, సామాజిక, మానవ అంశాలను సంపూర్ణంగా సమీక్షించాలని, అందుకు తాజా గణాంకాలను ఆధారంగా తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది
సమావేశం ప్రాముఖ్యత మార్కిస్టు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అయిన సుహాస్ పరాంబ్బే, కెజె జాయ్ (పీపుల్స్ సైన్స్ మూవ్మెంట్)లు శాస్త్రీయమైన ప్రదర్శన ఇవ్వడమే. నర్మదా వ్యాలీని సందర్శించి గణాంకాలు సేకరించిన వీరు ఆ ప్రాంతంలో నీటి వాడకానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రతిపాదించారు ఈ ప్రణాళికలో ఆసక్తికరమైన అంశం భారీ, చిన్నతరహా పధకాల నిర్మాణంపై ఉన్న వ్యతిరేకతను రూపుమాపడానికి కృషి చేయడం ఈ ్రర్యామ్నాయంలో ముఖ్య అంశం చిన్న వ్యవస్థలు సమర్ధవంతంగా పని చేయాలంటే సహజ వనరులను పెద్దఎత్తున వినియోగించడం ఎంతైనా అవసరమన్న వాదనను ముందుకు తేవడం చిన్నాపెద్ద ప్రొజెక్టుల మధ్య ఘర్షణ కన్నా వాటి మధ్య సంబంధం అన్న అంశాన్ని ఈ ప్రత్యామ్నాయం చర్చకు తెచ్చింది ప్రస్తుతమున్న డ్యాం స్వరూపాన్ని స్థానిక నిల్వ సౌకర్యాలతో అనుసంధానం చేసి కరువు పీడిత ప్రాంతాల అవసరాలను తీర్చగలమని ఈ ప్రత్యామ్నాయం సూచించింది ప్రణాళికాబద్ధంగా, కట్టుదిట్టంగా వినియోగిస్తే భారీ వనరులు చిన్నతరహా, స్థానిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండగలవని అది వాదించింది భారీ కట్టడం (ప్రధాన నిల్వ కేంద్రంగా కాకుండా స్టానిక నిల్వ వ్యవస్థలకు క్రమంగా నీటినందించే రిజర్వుకేంద్రంగా ఉండగలదని ఎక్స్(పెస్ కెనాల్ ద్వారా కరువు పీడిత ప్రాంతాలకు సత్వరం నీటిని అందించవచ్చని, దీనివల్ల హరిత ప్రాంతాలకు నీటిని మళ్ళించే అవకాశం దక్కదని ప్రత్యామ్నాయ ప్రణాళిక పేర్కొంది ఫలితంగా, నీటి నిల్వ తగ్గి ముంపునకు గురయ్యే ప్రాంతాలు కూడా తగ్గుతాయని, ప్రస్తుతం ప్రతిపాదించిన నిర్వాసితుల సంఖ్య 80 శాతం మేరకు పడిపోగలదని శాస్త్రవేత్తలు సూచించారు నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గడమే కాక నర్మదా జలాలను సంపూర్ణంగా వినియోగించే వ్యవస్థ ఏర్చడగలదని వారు వాదించారు ఈ ప్రతిపాదనకు ఎన్‌సిఎ తొలుత ఏ మాత్రం స్పందించలేదు ఎన్నో ఏళ్ళుగా ఉద్యమం కొనసాగడం, దానికి ద్యాం వ్యతిరేక స్వభావం ఉండడంవల్ల ఈ ప్రతిపాదనకు తలూపే ప్రశ్నే ఏర్పడలేదు ఈ ప్రణాళికను ప్రతిపాదించిన
64
ఐదేళ్ళ తర్పాత వాటి రూపకర్తలు ఇరుపక్షాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరికి వారు మడిగట్టుకొని కూర్చోని ప్రచృన్న యుద్దం కొనసాగిస్తున్నారని, మధ్యేమార్గ ప్రత్యామ్నాయాలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వడంలేదని విమర్శించారు ఈ రీతిలో ఆలోచిస్తే విపక్షాన్ని పూర్తిగా క్షీణింపచేన్తి లొంగదీనుకునే వరకు పోరాటం కొనసాగించాలని ప్రభుత్వం ఎన్నీఏ నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది అయితే నూతన శతాబ్దం ఆరంభం నాటికి నర్మదా బచావ్ ఆందోళన ఆలోచనా స్రవంతిలో ప్రత్యామ్నాయ (ప్రణాళిక, వామపక్షాల పాత్ర అంశాలుచోటు చేసుకున్నాయి. నర్మదా ఉద్యమానికి సంబంధించిన వెబొసైట్లు ఇతర (ప్రముఖ రచయితలు సుహస్ పరాంచ్చే, కె జె జాయ్లు సూచించిన ప్రత్యామ్నాయాలను ప్రచురించ సాగారు ఇప్పుడు చర్చ వ్యయం - లాభాలు పునరావాసం అంశాలపై మళ్ళింది డ్యాం - వ్యతిరేక వైఖరిలో మార్పు కనిపించింది ముఖ్యంగా 2000 అక్టోబరు 18 సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో ఈ వైఖరిలో కొంత మెతకదనం వచ్చింది ఇంతకు ముందుగా పేర్కొన్నట్లు, నర్మదా బచావ్ ఆందోళన సర్దార్ సరోవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసింది పిటీషన్లను కోర్టు విచారిస్తుండగా ఒక్క విషయం స్పష్టమైంది, తీర్పు ప్రతికూలంగా రాబోతోందని 1997 కల్లా ఎన్బీవ కొత్త వాదనలను సిద్ధం చేసింది గుజరాత్ ప్రభుత్వం తప్పుడు రికార్డులతో పునరావాస కార్యక్రమాలు పూర్తి చేసినట్లు అఫిడవిట్లు దాఖలు చేస్తోందని ఎన్బీఏ వాదించింది ద్యాం వ్యయం - ప్రయోజనాల విశ్లేషణను చూపుతూ ప్రాజెక్టు బాధిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కోర్టుకు తెలియజేసేందుకు ప్రయత్నించింది ఈ మేరకు ఎన్నో యాత్రలు, ('ప్రజావాదనలు, శాంతియుత ప్రదర్శనలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా మలచడానికి ప్రయత్నించింది కాని ఇవన్నీ ఎలాంటి ఫలితానివ్వలేదు
తీర్చు రోజు (18 అక్టోబరు, 2000)న కోర్మ నర్ద్జార్ నరోవర్ వనులు కొనసాగించవచ్చని, దాని ఎత్తు 90 మీటర్ల కంటే ఎక్కువగా పెంచుకోవచ్చని, ప్రాజెక్టు నిర్మాణానికి పునరావాస కార్యక్రమంతో సంబంధం లేదని ఆశ్చర్యగొలిపే రీతిలో ఆదేశాలు జారీ చేసింది అయితే మైనారిటీ జడ్జిమెంటులో జస్టిస్ బరుచా ప్రాజక్టు నిర్మాణానికి పర్యావరణ అంచనాలు, అనుమతులు తప్పని సరి అని పేర్కొన్నారు ఈ తీర్పు ఎన్బీఏ, ఇతర ప్రగతిశీల ఉద్యమాలకు శరాఘాతంగా మారింది *తీర్పుపై వ్యాఖ్యానిస్తూ ఎన్బీఏ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించింది సుప్రీంకోర్టు తీర్చును 'ఆలోచనా రహితమైనదిగా, ప్రజా వ్యతిరేకమైనదిగా, రాజ్యాంగ విరుద్ధమైనదిగా,” ఆందోళన వ్యాఖ్యానించింది ఇలాంటి ఖండనలు, ఆందోళనను వామపక్షాలతో సహా ఇతర ప్రగతిశీల శక్తులు వ్యక్తం చేశాయి. భారత రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నేపధ్యంలో సుప్రీంకోర్టు తీర్చు నర్మదా అంశంపై ప్రగతిశీల శక్తులన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చింది దురదృష్టవశాత్తు ఈ పరిణామం సర్దార్ సరోవర్ (ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి గల దారులన్నీ మూతపడినప్పుడు సంభవించింది
65
ప్రత్యామ్నాయ ప్రణాళిక - ప్రస్తుత ప్రణాళికల మధ్యపోలిక సంఖ ప్రణాళిక ప్రణాళిక నిల్వల స్థాయి (90 మీటర్ల కనీస మట్టం) 8 | నిర్వాసితం నిర్వాసిత శాతంలో 15 లక్షల మంది న భారీ తరుగుదల స్థానికులు నిర్వాసితుల య్యారు 4 | పునరావాసం అదే ప్రాంతంలో తరలింపు, ఇతర నర్మదా జలాల హామీతో | ప్రాంతాల్లో పునరావాసం వీనియోగ భూములు 6 | గుజరాత్లో సాగులోకి శ1 లక్షల హెక్టార్లు 18 లక్షల హెక్టార్లు వచ్చే భూములు ళో సౌరాష్ట్ర ప్రాంతంలో 13 1 లక్షల హెళ్లార్లు | 9 లక్షల హెక్టార్లు (32 శాతం) (22 శాతం) కచ్ ప్రాంతంలో 4 లక్షల హెక్టార్లు 0 4 లక్షల హెక్టార్లు (10 శాతం) (2 శాతం) ఉత్తర గుజరాత్ 14 7 లక్షల హెక్టార్లు (౩ 1 లక్షల హెక్టార్లు (86 శాతం) (17 శాతం) గుజరాత్‌లోని మిగతా ప్రాంతాలు | 8 9 లక్షల హెక్టార్లు 10 6 లక్షల హెక్టార్లు (22 శాతం) (59 శాతం, 7 | విద్యుత్ ఉత్పత్తి 850 మెగావాట్లు 1400 మెగావాట్లు 2600 మెగా యూనిట్లు | 3600 మెగాయూనిట్లు ప్రాజెక్టు పరిధిలో 1646 మెగా యూనిట్లు | 1138 మెగా యూనిట్లు విద్యుత్ వినియోగం ం పీకిలోడ్ సామర్ధ్యం 1200 మెగావాట్లు 1400 మెగాయూనిట్లు గ్యాస్ -సౌరశక్తి 200 మెగావాట్లు ఎలాంటి ప్రతిపాదన లేదు ఉమ్మడి ఉత్పతి (పొదుపు) 1750 మిలియన్ యూనిట్లు 66
యూనిట్లు (26 3 ఎంటి) (బయోమాస్ రూపంలో) సుస్టిర ప్రగతి
10 | మొత్తం వ్యయం రు 12 920 కోట్లు రు 13000 కోట్లు
వ్యయం కేటాయింపు పరమైన సేవల ఆధారంగా గుజరాత్ వాటా (ఎం ఎ ఎఫ్) (ఎం ఎ ఎఫ్)
18 |అటవీ ప్రాంతాల క్షీణత ముంపు ద్వారా 13,700 హెక్టార్లు 3,000 హెక్టార్లు (అత్యధికం ఉత్తమ శ్రేణి పునరావాసానికి అటవీ ప్రాంతం) దిగువశ్రేణి 10,000 హెక్టార్ల అటవీ భూమి వినియోగం
14 | ఆయకట్టు కింద శాశ్వత 11,000 హెళ్టార్లు ఎలాంటి ఏర్పాటు లేదు
హరిత ప్రదేశం (అటవీ ప్రాంతాలకు విస్తరించి ఉన్న ఉపరితలం ఆయకట్టులో 23,000 హెక్తార్లు) ఆధారం సుహాస్ పరంజపె కెజె రాయ్ -రీవిజిటింగ్ ది ఆల్టర్నేటివ్ రీస్టక్చరింగ్ ఆఫ్ సర్దార్ సరోవర్ పునరావాస బాధ్యతల విస్మరణ సుట్రీం కోర్టు తీర్పు ప్రాజెక్టు బాధిత ప్రజల బాధ్యతల నుండి కేంద్ర రాష్త్ర ప్రభుత్వాలను పూర్తిగా తప్పించివేసింది ఇప్పటి వరకు ఎన్నడూ ఎరుగని రీతిలో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు (ప్రజలను పెద్ద సంఖ్యలో నిర్వాసితులను చేస్తుంది అధికారిక గణాంకాలు ప్రాజెక్టు బాధిత 67
కుటుంబాల వాస్తవ సంఖ్యను చాలా తక్కువ చేసి చూపుతున్నాయి ట్రిబ్యునల్ అవార్డు వెలువడే సమయంలో కేవలం 6 147 కుటుంబాలు లేదా 40,000 మంది ప్రజలే ముంపు వల్ల ప్రభావితులవుతారని తేల్చగా, ప్రణాళికా సంఘం ఆ సంఖ్యను 6 700 కుటుంబాలుగా పెంచింది 1997లో ప్రపంచ బ్యాంకు ఆ సంఖ్యకు రెట్టింపుగా 12 000 కుటుంబాలు నష్టపాతాయని అంచనా వేసింది తర్వాతి అంచనాలో ఆ సంఖ్యను 27 000 కుటుంబాలుగా మార్పు చేశారు 1994 నాటికి ఈ సంఖ్య 41 500 కుటుంబాలకు చేరుకుంది 245 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా వేశారు 2001 నాటికి 43,000 బాధిత కుటుంబాలను గుర్తించారు ఇందులో సగానికిపైగా కుటుంబాలు సమాజంలో అణగారిన వర్ణాలకు చెందినవి కావడం విశేషం ప్రాజెక్టు బాధిత కుటుంబాల నిర్ధారణకు పాటించిన ప్రమాణాలపై నర్మదా బచావ్ అందోళన సందేహాలు వ్యక్తం చేసింది ముంపునకు గురయ్యే కమాండ్ ఏరియాలో నివసిస్తున్నప్పటికీ ప్రాజెక్టు వల్ల నష్టపోయే వారిని పరిగణనలోకి తీసుకోలేదని ఉద్యమకారులు ఆరోపించారు ఉపాధి కోల్పోయే ఇలాంటి ప్రజలను బాధితులుగా గుర్తించి వారికి పునరావాసం కల్పించాలని వాదించారు ఈ వాదనలో బలమున్నా దానిని ప్రస్తుతానికి పక్కన పెట్టి పునరావాసం జరిగిన విధానాన్ని ఒక్మోసారి విశ్లేషించడం ఎంకైనా అవసరం 1999లో జాతీయ షెడ్యూలు కులాలు తెగల కమీషన్ పునరావాస కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ నుండి గుజరాత్‌కు తరలించబడిన మూడు వేల గిరిజన కుటుంబాల సర్వేను నిర్వహించింది విశ్లేషణ అనంతరం సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి 1 భూములు దక్కాల్సిన 40 శాతం మంది ప్రజలకు భూములు దక్కలేదు 2 _ 16 శాతం మందికి శాశ్వతమైన పట్టాలు ఇవ్వలేదు 8 840 కుటుంబాలకు సాగుకు యోగ్యం కాని భూములు కేటాయించారు వారికి కేటాయించిన భూముల్లో బంజరు, ఉప్పు మట్టం, నీట మునిగిన భూములు ఎక్కువగా ఉన్నాయి 4 పంపిణీ చేసిన భూముల్లో 87 శాతం వ్యవసాయానికి నోచుకోనివి 11 శాతం సేద్యపు నీటి సౌకర్యం లేనివి 5 _ ఈ కారణాలవల్ల 11 శాతం మంది ప్రజలు తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చారు 6 _ స్వంత గ్రామాలకు తిరిగి వచ్చినా స్థానికులు తమను వ్యతిరేకిస్తున్నారని, తరిమి వేస్తున్నారని చాలా మంది ఫిర్యాదు చేశారు పై నిర్ధారణల కంటే దిగ్ర్భాంతి గొలిపే మరో వాస్తవం ఉంది (ప్రభుత్వం తన పునరావాస లక్ష్యాలను పూర్తి చేయడం కోసం చాలా కుటుంబాలను వారి ఇష్టానికి విరుద్ధంగా తరలించి దిక్కులేని వారిగా మార్చివేసింది భూముల్లేని గిరిజనులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు సహజంగా వారికి ఆదాయం చేకూర్చే అడవులు, బావులు మేత ప్రాంతాల 68
నుండి వారిని దూరం చేశారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపలేదు. ఇలాంటి వారికి మౌలిక అవసరాలు (తాగునీరు, విద్య, వైద్యం) కల్పించే విషయాన్నే పూర్తిగా మరిచారు. ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా పునరావాస ప్రక్రియ జరుగుతోందని ఎన్పీఏ కోర్టులో ఎన్నో వాజ్యాలు, నివేదికలను దాఖలు చేసింది. ॥ మహేశ్వర్ డ్యాంకు సంబంధించి దౌద్ కమిటీ ఇదే విధమైన అభిప్రాయానికి వచ్చింది.
అది కూడా 2000 సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన కొద్ది కాలానికే ప్రస్తుతమున్న డ్యాం ఎత్తు 80 మీటర్లకు అనుగుణంగా పునరావాసం కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జస్టిస్ దౌద్ అభిశంసించారు. ప్రజలకు పునరావాసం కల్పించేందుకు తగిన భూములు
" సేకరించకుండానే మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాం ఎత్తును పెంచిందని కమిటీ తప్పు పట్టింది. ఇటీవలే మాన్ డ్యాం విషయంలో ప్రజా ట్రిబ్యునళ్ళు నిర్వహించిన విచారణలో జూన్ 2002 నాటికి ముంపునకు గురయ్యే గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రభుత్వం వెంటనే పునరావాస చర్యలు తీసుకోవాలని ప్రజలు ఫిర్యాదు చేశారు. 17 గ్రామాలకు చెందిన గిరిజన కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదముందని, వారిని వెంటనే ఆదుకోవాలని ట్రిబ్యునల్ సూచించింది. నర్మదా ప్రాజెక్టు పునరావాస విధానం కింద మధ్యప్రదేశ్ (ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలకు విరుద్ధంగా ఈ పరిస్థితి ఉంది. డ్యాం నిర్మాణంలో నిర్వాసితుల పునరావాసం అంతర్భాగం కాదన్న విషయాన్ని తెలుసుకొని ట్రిబ్యునల్ ఆశ్చర్యాన్ని ఆందోళనను వ్యక్తం చేసింది. బాధితులకు ఉపాధి, పునరావాసం కల్పించే వరకు ముంపు ప్రక్రియను నిలిపివేయాలని అది సిఫార్సు చేసింది.
ఈ విధంగా నిర్వాసితులైన ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముప్పై ఏళ్ళుగా పోరాడినా ఇంత వరకు వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఒక నర్మదా ప్రాజెక్టు విషయంలోనే ఇలాంటి పరిస్థితి దాపురించలేదు: మాన్ డ్యాం నిర్వాసితుల కథ మరో ఉదాహరణ. నగర్నార్ స్టీలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై పోలీసు కాల్పులు ఇంకొకటి. మనకు తెలియని వెలుగులోకి రాని ఇలాంటి సంఘటనలు లక్షల సంఖ్యలో ఉండొచ్చు. ఎందుకంటే పునరావాసం, ఉపాధి ప్రక్రియ కేంద్రీకృతమైనది, వలసవాద స్వభావం గలది. భూసేకరణ చట్టం 1894 సంవత్సరంనాటిది. దానిని మరింత కేంద్రీకృతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. అలాగే పునరావాస ముసాయిదా విధానం కూడా
. రూపొందించబడింది, అయితే దానిపై బహిరంగ చర్చ పరిమితంగానే జరిగింది. ఈ విధానం ఇంకా కాగితాలపైనే మూలుగుతోంది. జాతీయ సహజ వనరుల పరిరక్షణ ఉద్యమం గొడుగు కింద ఎన్నో సంఘాలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. సంక్షేమ రంగం నుండి (ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతుండడం, ఉమ్మడి, సహజ వనరుల ప్రైవేటీకరణకు నడుం బిగించడం లాంటిచర్యలు నిర్వాసిత ప్రజల భవిష్యత్తును మరింత అంధకారమయం చేశాయి. ప్రజా ప్రయోజనాల పట్ల ప్రభుత్వాలు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనదానికి ఒక ఉదాహరణ
69
అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మహేశ్వర్ డ్యాం ఆనకట్టపై ఎస్ కుమార్ కార్పొరేషన్‌కు భూమిని విక్రయించడానికి చేసిన ప్రయత్నాలపై చెలరేగిన వివాదం మరోవైపు
ప్రజలు తమ అభిప్రాయాలను ప్రకటించుకావదానికి ఉన్న అన్ని మార్గాలను 'ప్రభుత్చం మూసివేస్తోంది నర్మదా నదీ పరివాహక ప్రాంత ప్రజల పోరాటాలు ఎలాంటి ఫలితాలనివ్వలేదు
(ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నిర్వాసిత ప్రజల పట్ల మానవీయ భావంతో వ్యవహరించాలన్న కనీస విజ్ఞతను చాటుకోలేకపోయాయి ఫలితంగా ఒక విశాలమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేసి తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగించడంలో నర్మదా బచావ్ ఆందోళన విఫలమైంది భారి పధకాలకు (ప్రత్యామ్నాయాలు అన్వేషించే అంశం కూడా మరుగునపడింది
సుప్రీంకోర్టు తీర్పు ప్రగతిశీల శక్తుల పునరేకీకరణకు మంచి అవకాశానిచ్చింది. దానిని సద్వినియోగం చేసుకొని ఉపాధి, పునరావాసం తదితర అంశాలపై ఉమ్మడి పోరాటాన్ని నిర్వహించాల్సి ఉంది పరస్పర చర్చలవల్ల వామపక్షాలు, పర్యావరణ ఉద్యమాల మధ్య దూరం తగ్గుతోంది అయితే 'ప్రజాస్వామ్యయుత నిరసన, ప్రత్యామ్నాయ విధానాల అమలుకు గల అవకాశాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి నర్మదా కదలోని విషాదం, గుణపారం ఇందులోనే ఉన్నాయి
70
6 భారత ప్రజాస్వామ్యంలో గిరిజనులు థీ వ్
గిరిజన ప్రజా సంఘాల సుదీర్హ పోరాటం అనంతరం 2000లో పార్లమెంటు వర్షాకాల సమావేశం సందర్భంగా గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రంగా జార్థండ్ను ఏర్పాటు చేస్తూ బిల్లును ఆమోదించారు దీనిపై వెంటనే స్పందించిన గిరిజన నాయకుడు రాందయాళ్ ముండా ఈ విధంగా అన్నారు
“ఈ స్వప్నం సాకారం చేసుకునేందుకు నిర్విరామంగా పోరాడిన ఈ ప్రాంత ప్రజలు ఆలోచనాపూరితమైన స్పందనా పూరితమైన అభివృద్ధినే అనుమతిస్తారు”
గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఈ నాటిది కాదు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుదైన జైపాల్ సింగ్ ఈ డిమాండ్‌తో తిరుగుబాటు బావుటాను ఎగురువేశారు ప్రత్యేక సంధాల్ రాష్త్రం కావాలని ఆయన 1980లో ఉద్యమం ప్రారంభించారు. అలాగే, భారత్ జన్ ఆందోళన్‌కు చెందిన గాంధేయ వాద కార్యకర్తలు ఇతర గిరిజన ఉద్యమాలు 2000 సంవత్సరంలోనే గిరిజన రాష్ట్రంగా ఛత్తీస్‌ఘడ్ ఏర్పాటు కావడంతో ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. పర్యావరణ వేత్తల ఆలోచనా సరళిలోనే గిరిజన కార్యకర్తలు కూడా రాజ్యాధికారంతో గిరిజన ప్రాంత సమస్యలను పరిష్మరించుకోగలమని విశ్వసించారు స్వయం పాలనే అంతిమ లక్ష్యంగా కాకుండా సాంప్రదాయ గిరిజన సంస్థలకు గుర్తింపు, గ్రామ స్వరాజ్యం తదితర ఆశయాల సాధనకు తొలిమెట్టుగా వారు భావించారు
మరోవైపు స్వపరిపాలనపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంవల్ల సమకాలీన గిరిజన రాజకీయ వ్యవస్థ ఎదుర్మోంటున్న ప్రధాన సమస్యలు మరుగున పడిపోతున్నాయని వామపక్షాలు వాదిస్తూనే ఉన్నాయి. అసమాన క్రయవిక్రయాల సమస్యకు పరిష్కారం అధికార బదలాయింపు కాదని, గిరిజన ప్రాంతాల ఆరవ షెడ్యూలులో పొందుపరిచిన ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని వామపక్షాలు కోరుతున్నాయి త్రిపురలో గిరిజనులతో ఉన్న అనుభవం దృష్టా వామపక్షాలుపై అభిప్రాయంతో ఉన్నాయి సాంప్రదాయ సంబంధాలను పునరుద్దరించడం కంటే గిరిజనుల్లో సామాజిక, రాజకీయ ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించేందుకు
7
ప్రజాస్వామ్య సంస్థలను (స్థానిక సంస్థలు) బలోపేతం చేయడమె ఉత్తమమని అవి బావిస్తున్నాయి అంతమాత్రాన, ఆరవ షెడ్యూలే అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని వామపక్షాలు అంగీకరించడం లేదు స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన కౌన్సిళ్ళను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ మేరకు ఆరవ షెడ్యూల్‌ను రాజ్యాంగపరంగా సవరించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి కౌన్సిళ్ళకు మరిన్ని కాసనాధికారాలు ఆర్ధికపరమైన అధికారాలు కల్పిస్తేగాని అవి వాస్తవికమైన ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని అనుభవించలేవని వామపక్షాలు అంటున్నాయి వీరి వాదనలకు విరుద్ధంగా ఐదవ పషెడ్యూలే ప్రయోజనకరమైన స్వపరిపాలన వ్యవస్థకు మేలైనదని గిరిజన హక్కుల ఉద్యమాలు పేర్కొంటున్నాయి ఎందుకంటే ఈ చట్టం కింద సాంప్రదాయ అధికార వ్యవస్థలు కొనసాగేందుకు అవకాశం ఉందని అవి చెబుతున్నాయి గిరిజన రాజకీయ వ్యవస్థకు ఏ షెడ్యూలు మంచిదనే చర్చ సాంప్రదాయానికి ఆధునిక ప్రజాస్వామ్య ఉనికికి మధ్య వైరుధ్యాన్ని ఒక వైపు, సాంప్రదాయ సంస్థలకు అధికారం, సమసమాజ, ప్రజాస్వామిక సంస్థల బలోపేతానికి మధ్య వ్యతిరేకతను మరోవైపు అద్దం పడుతోంది నెహ్రూూవాద దృక్పధం
గిరిజన అభివృద్ధిపై 1930లో సరికొత్త వాదనలు తలెత్తాయి గిరిజనుల దారిద్యమే వారిని గిరిజనేతరుల నుండి సంరక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి (ప్రేరేపించిందని వలస పాలనాధికారులు వాదించి ఉన్నారు భారత ప్రభుత్వ చట్టం (1935) 52 92 సెక్షన్ల ప్రకారం గిరిజనులు అత్యధిక సంఖృలో నివసించే ప్రాంతాలను సురక్షిత, షాక్షిక సురక్షిత ప్రాంతాలుగా వర్గీకరించాల్సి ఉంది దీని అర్ధం ఈ ప్రాంతాలను రాజ్యాంగ పరిధికి అవతల గవర్నర్ పాలించాల్సి ఉంటుంది ఐదవ, ఆరవ షెడ్యూళ్ళలోని నియమాలు నిబంధనలు దెశంలోని మిగతా ప్రాంతాలకు ఖిన్నంగా ఉంటాయి వలసవాద పాలన చివరాంకంలో షెడ్యూళ్ళ రూపకల్పనపై చర్చ జరిగింది దీని ఆధారంగానే గిరిజన సంక్షేమానికి నెహూవాద విధానం రూపొందించబడింది వలసపాలనలో గిరిజనులు నానా కష్టాలు అనుభవించారని, వారి సాంస్కృతిక, ఆర్థిక హక్కులు కాపాడాల్సిన తరుణం ఆసన్నమైందని ఈ విధానం సూత్రీకరించింది ఉదాహరణకు 1952లో నెహ్రూ ఇలా రాశారు
“కోట్లాది మంది భారతీయుల అనుభవాన్ని గిరిజనులు పంచుకోలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి వారిని అప్యాయతతో చనువుతో సంప్రదించాలి విమోచనా శక్తిగా మనం వారి వద్దకు వెళ్ళాలి వారికి ఏదో ఇద్దామని వచ్చామని, గుంజుకోవడానికి రాలేదన్న నమ్మకాన్ని కలిగించాలి ఇలాంటి భావాత్మక ఎకీకరణే ప్రస్తుతం దేశానికి చాలా అవసరం ”
నెహ్రూ దృష్టికొణంలో గిరిజనుల ఆర్థికపరమైన జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆధునీకరించాల్సి ఉంది అలాగే వారి సంస్కృతిని పరిరక్షించాల్సి ఉంది బ్రిటీష్ మానవ శాస్త్రజ్ఞుడు వెర్రియర్ ఎల్విన్ ఆలోచనల ఆధారంగానే నెహ్రూ తన దృక్పధాన్ని ఏర్పరచుకున్నారు వలసవాద పాలనానంతరం గిరిజన విధానం రూపొందించడంలో ఎల్విన్ కీలక పాత్ర పోషించారు ఈ విధానానికి ఉన్న వలస వాద పుట్టుపూర్వోత్తరాలు దానిపై భారత జాతీయ కాంగ్రెస్ ఊగిసలాటలు 1935 నుండి 1960 వరకు సాగిన చర్చలో స్పష్టమవుతాయి. 1935లో
72
షెద్యూళ్ళ సమర్దకులు గిరిజనులు - రైతుల మధ్య ఉన్న సంబంధాన్ని దోపిడీ లక్షణం కలిగి ఉన్నదిగా భావించారు ఈ వర్గాలను విడదీయడమే వారి ఆధునీకరణకు సరైనమార్గమని వారు వాదించారు అయితే జాతీయవాద మానవ శాస్తజ్జులు, కాంగ్రైస్వాదులు ఈ వాదనలను తోసిపుచ్చారు ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేయడానికిగల ఆధారం పూర్తిగా నిరర్ధకమైనదని జాతీయవాదులు వాదించారు తన సామ్రాజ్యవాద వ్యతిరేక అజెండాను, విశాల భారతీయ ఉనికిని పెంపొందించే లక్ష్యాన్ని నొక్కి చెబుతూ, వేర్పాటు వాదుఎ వాదనలను సాంస్కృతిక పిడివాదంగా కాంగ్రెస్ ఖండించింది
ప్రత్యేక (రక్షిత) ప్రాంతాలు డిమాండ్ చేస్తున్న వారు వలసవాదుల ఆశయాలను (విభజించి పాలించు సిద్ధాంతాలు) పెంపొందిస్తున్నారని జాతి నిర్మాణ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పరుస్తున్నారని కాంగైస్ వాదులు ఆరోపించారు గిరిజనులు మిగతా (ప్రజలతో చాలా సంప్రదాయాలు పంచుకుంటారన్న విషయాన్ని నిరూపించేందుకు, గిరిజన మతం విశాల హిందూ నమ్మకాల వ్యవస్థలో భాగమేనని వారు వాదించారు ఈ ప్రక్రియలో భాగంగానే సామాజిక కార్యకర్తలైని ఎ వి రక్కర్ లాంటి వారు హిందూ మతాన్ని సంస్కరించి దళితులు, గిరిజనుల పట్ల అంటరానితనం, వివక్ష భావాలను తొలగించాలని ఉద్బోధించారు
అయితే, స్వాతంత్రానంతరం ఈ చర్చలో అసాధారణ మలుపు వచ్చింది అంతకుముందు గిరిజన, గిరిజనేతరులను వెరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఏకీకరణను సమర్ధించిన కాంగ్రెస్ ఇప్పుడు షెడ్యూళ్ళ ఏర్పాటును సమర్థిస్తూ వాదించడం మొదలు పెట్టింది సాంస్కృతిక బహుళత్చవాదాన్ని గౌరవించే నూతన జాతి నిర్మాణ లక్ష్యమే ఇందుకు కారణంగా చూపబడింది ఏకీకరణ కంటే జాతి సమైక్యత అనే అంశానికే కొత్త కాంగైస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో గిరిజనుల ఆశయాలను, ఆకాంక్షలను ప్రతిబింబింవ లేకపోయామన్న వాస్తవాన్ని కాంగ్రెస్ గ్రహించగబ్గింది జాతీయ ప్రధాన ప్రవంతిలో గిరిజనులు మమేకం కావడానికి చాలా కాలం పడుతుందని, ఈ కాలంలో వారిపట్ల సహనంతో, సానుభూతితో వ్యవహరించాల్సి ఉంటుందని కొత్త ప్రభుత్వం నిశ్చయించింది ఈ శ్రమంలో గిరిజన ఆర్థిక వ్యవస్థలను మార్కెట్ వ్యవస్థ నుండి పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాలు అవసరమని నెహ్రా వ్యాఖ్యానించారు గిరిజనుల సంక్షేమం, అభివృ కోసం ఉద్దేశించిన అనేక ప్రణాళికల గురించి ఆయన విశదీకరించారు అయితే నెహ్రూ ఆలోచన చారిత్రకంగా నిర్దిష్టమైనది కాదు ఎందుకంటే మార్కెట్ వ్యవస్థ ప్రభావానికి దూరంగా గిరిజనులు జీవిస్తున్నారని ఆయన ఊపహించుకున్నారు తన సమకాలీకులులాగా, ప్రత్యేకంగా ఎల్విన్ నెహ్రూ కూడా గిరిజన ఆర్ధిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు మూల కారణం వారి సాంప్రదాయ హక్కులను -రాకరించడమేనని భావించారు ఈ హక్కులను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆయన "క్ష్మి చెప్పారు గిరిజన ఆర్ధిక వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించే దిశగా అభివృది చెందాలంటే దొపిడి నుండి వారిని రక్షించడమే ప్రధానమన్న భావనను స్ఫురింపచేశారు ఈ ఆలోచనమేరకు నెహ్రూ అభిప్రాయాలన్ని ఆయన సమకాలీన వర్యావరణ భావుకుల ఆదర్శాలతో ప్రభావితమయ్యాయని చెప్పవచ్చు ముఖ్యంగా, తన హయాంలో ఈశాన్య రాష్ట్రాలలో అనేక బాధ్యతలు నిర్వహించిన వెర్రియర్ ఎల్విన్ ఆలోచనలు (ప్రణాళికలు నెహ్రూను బాగా ప్రభావితం
73
చేశాయి వలస వాదానంతర విద్యావంతుల కార్యకర్తల ఆలోచనా విధానాన్ని కూడా ఎల్విన్ ఆలోచనలు (ప్రభావితం చేశాయి ౩రవ ఐదవ షెడ్యూళ్ళ కింద గిరిజన సంస్కృతిని సంస్థలను పరిరక్షించాల్సిందేనని ఎల్విన్ వాదించారు ఈ నేపధ్యంలో, తొలి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఈ చర్యలకు రాజ్యాంగబద్దమైన స్వరూపం కల్పించారు అవి భారత (ప్రభుత్వ చట్టం (1935) నిబంధనలను పోలి వున్నాయి వాటిలో ముఖ్యమైనవి ఐదవ, ఆరవ షెడ్యూళ్ళు ఐదవ, ఆరవ పషెద్యూళ్ళ మధ్య (ప్రధాన వ్యత్యాసం ఆరవ పెద్యూలు కింద స్వయం ప్రతిపత్తిగల గిరిజన మండళ్ళను(ఎన్నికల ఆధారంగా) ఏర్పాటు చేయడమే ఐదవ షెడ్యూలులో ఇలాంటి నిబంధన లేదు వాటి పరిధిలోని ప్రాంతాలను నేరుగా గవర్నరే పాలించేవాడు ఆయనకు సహాయంగా ఒక గిరిజన సలహా మండలి ఉందెది ఈ పరిస్థితిని ఒక ప్రముఖ జర్నలిస్టు సరైన రీతిలో విశ్లెషంచారు. “ఆరవ షెడ్యూల్ కింది ప్రాంతాల ప్రజలు తమ భవిష్యత్తుకు తామే విధాతలుగా ఉన్నారు అయితే ఐదవ షెడ్యూలు ప్రాంతాల ప్రజలు పరాధీనంగానే ఉన్నారు ” షెడ్యూలు ప్రాంతాల్లో భూమి క్రయవిక్రయాలపై పూర్తిగా నిషేధం ఉందేది స్థూలంగా చెప్పాలంటే, గిరిజనుల అభివృద్ధి, మార్కెట్ శక్తుల నుండి వారికి రక్షణ
తదితర నెహ్రూ దృక్పధంతో వామపక్షాలు సాధారణంగా ఏకీభవించాయి. 1940 నుండి (త్రిపురకు చెందిన వామపక్ష ప్రజాసంఘం గణముక్తి పరిషత్ గిరిజనులు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలన్నింటికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది గిరిజన ప్రాంతాల్లో పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను అభివృద్ధి పరచాలని నొక్కిచెప్పింది గణముక్తి పరిషత్ వాదనకు ఆరవ షెడ్యూలు ఏర్పాటుతో బలం చేకూరింది అలాగే గిరిజన సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఉద్యమిస్తున్న వామపక్ష సంఘాలను మరింత బలోపేతం చేసింది ఈ ముఖచిత్రం మరో అంచున, నవీన గాంధేయవాద పర్యావరణ గిరిజన హక్కుల పరిరక్షణ ఉద్యమాలు కూడా నెహ్రూవాద సంరక్షణవాదాన్ని బలపరిచాయి అయితే సాంప్రదాయ గిరిజన సంస్థల పునరుద్ధరణ వరకే దాన్ని పరిమితం చేశారు ఈ మద్ధతు పరిమితమైనది వారి ఆదర్శం నెహ్రూ స్వష్నానికి భిన్నమైనది గిరిజనులను నెమ్మదిగా ప్రధాన '్రవంతి బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రప్పించడమే నెహ్రూ ఆశయంగా ఉండేది మరోవైపు వామపక్షాలు గిరిజన సమాజాన్ని ప్రజాస్వామ్కరించాల్సిన ప్రాముఖ్యతను గుర్తించారు అయితే భారతదేశంలో ఒక విభిన్నమైన (ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాన్నదే వారి లక్ష్యం కనుక భారత ప్రజాస్వామ్యంలో గిరిజనుల భవిష్యత్తు రాజకీయ స్వేచ్చ, స్వపరిపాలనా సంస్టలపైనే కాకుందొ గిరిజన ప్రాంతాలు, ప్రధాన స్రవంతి రాజకీయార్ధిక వ్యవస్థ మధృ ఉన్న అసమానతలను తొలగించడంపై కూడా ఆధారపడి ఉంది
సంక్షేమ ప్రభుత్వంపై ఆధారపడటాన్ని సృష్టించడం
నెహ్రూ ఆలోచనల మేరకే స్వాతంత్ర్య భారతంలో గిరిజన విధానాలు రూపొందించబడ్డాయి. విద్య ఉపాధి కల్పించడం ద్వారా గిరిజనుల నిత్యజీవితంలో సముదాయ సంస్థలో ఆధునిక ఆలోచనలను చొప్పించాలని ఆయన వాదించారు ఈ ఆశయాలు సాధనకు 74
గిరిజన సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు గిరిజన ప్రాంతాలన్నింటిని ప్రత్యేక గిరిజన బహుళార్ధక (ప్రాంతాలుగా విభజించి విద్య, సార్వజనీన వైద్యం ఉపాధి తదితర సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టారు దురదృష్టవశాత్తు, విధాన రూపకర్తలు ఈ ప్రాంతాల్లోని సహజ వనరులపై గిరిజన హక్కుల అంశాన్ని విస్మరించారు సహజ వనరులపై ఎలాంటి హక్కులు లేకుండా గిరిజనులు మిగిలిపోగా అడవులు, అటవీ భూములు, అటవీ సంపద, సహజ వనరులపై ప్రభుత్వ గుత్తాధిపత్యం నిరంతరంగా కొనసాగింది ఈ పరిస్థితులు గిరిజన ప్రాంతాల ప్రయోజనాలకు భంగకరంగా పరిణమించాయి. 1960లో వెర్రియర్ ఎల్విన్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఈ పరిస్టితి ప్రతిబింబించింది స్వాతంత్రానంతరం కొన్ని దశాబ్దాలు గడచిన తర్వాత కేంద్రీకృత అభివృద్ధి ప్రక్రియ మొదలైంది ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో తలమునకలైన ప్రభుత్వం, పాలకులు ఐదవ పంచవర్ష ప్రణాళిక వరకు గిరిజనాభివృద్ధిపై దృష్టి సారించలేకపోయారు. ఐదు పంచవర్న ప్రణాళికల్లో గిరిజనాభివృద్ధి, సంక్షేమానికి కేటాయించిన నిధుల గణాంకాలు ఒక నిరుత్సాహపూరితమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి ఈ కింది పట్టికలో నిధుల కేటాయింపు గణాంకాలను చూడవచ్చు షెడ్యూలు తెగల సంక్షేమానికి ప్రణాళికా వ్యయం 1950-79 ప్రణాళిక మొత్తం | ఎస్టీలపై తలసరి వ్యయం | వ్యయం వ్యయం (కోట్లలో) | (కోట్లలో) (రూ లలో) మొదటి 1951-56 | 1960 | 1747 083 776 రెండవ 1956-61 | 4672 | 4886| 087 1865 మూడవ 1961-66 | 8577 | 5255 | 061 1757 వార్షిక (ప్రణాళికలు 1966-69 | 6756 | 3464 051 10381 నాల్గవ 1969-74 | 15902 | 7600| 047 1974 ఐదవ 1974-79 | 54411 | 10500| 022 252? అదనపు కేటాయింపులు | 1974-79 50000, 092), 2165 రావాల నుండి ఆధారం ఎం ఎం వర్మ, భారతదేశంలో గిరిజనాభివృద్ధి, మిట్టల్ పబ్లికేషన్స్, న్యూఢిల్లీ, 1996, పి54 గిరిజనుల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో (రాజ్యాంగంలోని 8వ షెడ్యూలు ప్రకారం) అధిక శాతం విద్య, సామాజిక సేవలందించేందుకు (గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు అందించారు ప్రత్యేక బహుళార్ధక గిరిజన ప్రాంతాల పనితీరును సమీక్షించిన ఎల్విన్ కమిటీ ఉత్పాదక కార్యకలాపాలకు కేటాయింపులు తక్కువగా ఉండడమే కాదని, గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయంపై వ్యయం కూడా నామమాత్రంగా ఉందని వివరించింది ఒక్కో ప్రత్యేక గిరిజన ప్రాంతానికి ఐదేళ్ళకుగాను కేవలం 27 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించారు ఈ నిధుల్లో 20 శాతం అంటే 5 50 లక్షలను నీటిపారుదల, భూమి అభివృద్ధి, భూసార పరిరక్షణకు, వ్యవసాయానికి వినియోగిస్తారు ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ప్రాజెక్టు 75
ప్రధాన కార్యాలయానికి పరిపాలనా ఖర్చుల నిమిత్తం ఏడు లక్షల రూపాయలు కేటాయించడం ఒక పద్దు కింద కేటాయించిన నిదుల్లో ఇదే పెద్ద మొత్తం రవాణా, వార్తా సౌకర్యాలు వైద్యరంగాలకు సగటున 3 5 లక్షలు రెండు లక్షలు కేటాయించారు విద్య, హస్తకళల అభివృద్ధికి కేటాయింపులు లక్ష రూపాయలలోపే ఉన్నాయి సహకార సంఘాల అభివృద్ధికి భారీగానే నిధులు వ్యయం చేశాయి ఈ కార్యక్రమం ఆధారంగా గిరిజన (ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యం అయితే 43 బ్లాకుల్లో (కేంద్రాలు) నిర్వహించిన సర్వే ప్రకారం ఉత్పాదక పధకాలపై చేసిన వ్యయం ఇతర సేవల కంటే చాలా తక్కువగా ఉంది ప్రాజెక్టు అమలు ప్రాంతాల్లో 1957-59 మధ్య చేసిన సగటు వ్యయాన్ని కింది పట్టికలో చూడవచ్చు బహుళార్ధక గిరిజన ప్రాంతంలో చేసిన సగటు వ్యయం పధకం మొత్తం కేటాయింపు నిధుల వినియోగ (ఠూ లక్షల్లో) శాతం ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం 700 శశీ 3ర్ వ్యవసాయం, పాడి పరిశ్రమ 150 835 42 నీటిపారుదల, భూసార సంరక్షణ త్త00 88 05 వైద్యం, (గ్రామీణ పారిశుధ్యం 200 57 60 విద్య 075 త8 71 రవాణా వార్తా వ్యవస్థ త్షీ00 తరి కీర్ (గ్రామీణ హస్తకళలు 200 20 20 సహకారం 200 20 ౩4 (గ్రామీణ గృహన్ర్మాణం 2860 నిధుల పూర్తి గ వినియోగం ఇతరఖర్చులు 050 పలా పధకాల రూపకల్పనలో లోపించిన దూరదృష్టిని విమర్శించడమే కాకుండా ఉత్పాదక వనరులపై వ్యయం చాలా తక్కువగా ఉండదాన్ని ఎల్విన్ ఎత్తిచూపారు ఈ పదకాలను అమలు చేస్తున్న అధికారులకు గిరిజన ప్రాంతాల సమస్యలపట్ల ఏ మాత్రం అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు పట్టికలో పొందుపరచిన గణాంకాలను పరిశీలిస్తే ప్రాజెక్టు పరిపాలన లేదా సామాజిక విద్య (బూర్జువా భావాల బోధన, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగవర్గాల చొరబాటుకు ఉద్దేశించబడిన)కు అత్యధిక శాతంలో నిధులు వ్యయం చేశారని స్పష్టమవుతుంది అఖభివృద్ధికిసంబంధించిన ఆధునిక ఆలోచనలను గిరిజనులకు పరిచయం చేయడమే వారి ప్రాంతాల అభివృద్ధి అని పాలకులు ఆలోచిస్తున్నట్లు పై పరిస్థితి తెలియజేస్తోంది ఫలితంగా, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల పైన వెచ్చించిన కొద్దిపాటి నిధులు స్థిరమైన సాగుకు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు విత్తడానికే వినియోగించినట్లు బోధపడుతుంది ఈ పంట రకాలు చివరి ప్రాంతాలకు ఏ మాత్రం అనుకూలించవు దీనిని గమనించిన ఎల్విన్, ఈ ధోరణికి అద్దుకట్ట వేయకపోతే బోధించడానికి కొందరు ఆశ్రయం కల్పించడానికి ఎవ్వరూ ఉండని రోజు వస్తుందని అభిప్రాయపడ్డారు రెండవ పంచ వర్ష ప్రణాళికా కాలంలో గిరిజన 76
'పాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో కేవలం 13 2 శాతం మాత్రమే వినియోగమయ్వాయని, నోటిఫైడ్ గిరిజన ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన పదకాల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఎల్పిన్ నివేదిక పేర్కొంది బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో మాత్రమే ఈ పధకాలను కొంత వరకు సమర్ధవంతంగా అమలు చేయగలిగారు అది కూడా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ద్వారా గిరిజన సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో నెలకొన్న విషమ పరిస్థితులను చక్కదిద్దడానికి ఎల్విన్ కమిటీ ప్రయత్నించింది భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లో కేటాయింపులు ఈ విధంగా జరగాలని సిఫార్సు చేసింది ఆర్థిక ప్రగతి 60 శాతం వార్తా వ్యవస్థ రవాణా సౌకర్యాలు 25 కాతం సామాజిక సేవలు 15 శాతం, బ్లాక్ స్థాయి నుండి గిరిజన ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలను నిధులు పంపిణీ కావాలని సూచించింది రాష్త్ర (ప్రభుత్వాలు గిరిజనాఖివృద్ధిపై మరింత దృష్టి సారించాలని, స్థానిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని మెరుగుపరచి అందుకు అనుగుణంగా పధకాలు ప్రవేశపెట్టాలని కమిటీ కోరింది ఈ మార్పులతోపాటు మూడవ పంచవర్న ప్రణాళిక నాటికి ప్రస్తుతమున్న కేంద్రాలను విస్తృతపరచి గిరిజనాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది మూడవ పంచవర్ష ప్రణాళికా కాలం ముగిసిన వెంటనే ఈ పధకాన్ని మరోసారి సమీక్షించారు 15 రాష్ట్రాల్లోని 504 గిరిజన అభివృద్ధి కేంద్రాల్లో అమలు చేన్తున్న సమగ్ర అభివృద్ది పధకం సరైన ఫలిఖాలు ఇవ్వడంలేదని, గిరిజనులు గిరిజనేతరుల మధ్య అసమానతలు మరింత పెరిగిపోతున్నాయని కమిటీ నివేదించింది పై కేంద్రాలతోపాటు పశ్చిమ బెంగాల్లో మరికొన్ని సబ్ డివిజన్లు ఉత్తరప్రదేశ్‌లో నాలుగు ప్రాంతీయ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు నాగాలాండ్‌లో కూడా కొత్త ప్రాంతీయాఖివృద్ధి పధకాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు గిరిజనుల ఆర్టిక ప్రమాణాలు పెంచడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యంగా మారింది ఇతర కార్యక్రమాల్లో గిరిజనులను సంఘటితం చేసి ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా చర్యలు తీసుకోవడం, పాడి పరిత్రమాభివృద్ధికి రుణాలు కల్పించడం, సూక్ష్మ, చెరువుల నీటి పారుదల పధకాలు చేపట్టడం, చేతివత్తుల వారికి మార్కెట్, రుణ సౌకర్యం కల్పించడం ప్రధానమైనవి పదహారేళ్ళ పాటు ఈ కార్యక్రమాల నిర్విరామంగా కొనసాగినా గిరిజన సమాజంపై అవి చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపలేకపోయాయి. బ్లాకు స్థాయి కార్యక్రమాలపై పరిశోధన జరిపిన ఎస్సీ, ఎస్టీ కమీషనరు 1978లో ఈ కింది సమస్యలను ప్రభుత్వానికి నివేదించారు 1 బ్లాకు అభివృద్ది కార్యక్రమాలకు పలు ప్రామాణిక పధకాలున్నా నేటికీ ప్రత్యేక పధక్షాలను రూపొందించలేదు 2 అభివృద్ధి ఉపాధి అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు 8 _ విస్తరణ పూర్వదశలో భూవివాదాల పరిష్కారాన్ని చేపట్టలేదు 4 _ 60-70 శాతం పథకాలన్నీ భవన నిర్మాణానికి సంబంధించినవే 5 _ చాలా సందర్భాల్లో ప్రజలకు తెలపకుండానే సహకార సంఘాలను ఏర్పాటు చేశారు బ్లాకు స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల్లో సింహభాగాన్ని గిరిజనుల్లోని 77
నృత వర్షాలే కైవసం చేసుకుంటున్నాయని ఇదో ప్రధాన సమస్యగా అవతరించిందని కమీషనర్ అన నివేదికలో పేర్కొన్నారు. బ్లాకు అధికారులు కేవలం తమకు సమీపంగా ఉన్న గిరిజన 'వాంతాల్లోనే కార్యక్రమాలు చేపడుతున్నారని, మారుమూల (గ్రామాలు తాండాలను విన్యరిస్తున్నారని నిర్ధారించారు కమీషనర్ నిర్ధారణలను ఎనిమిది రాష్ట్రాల్లో నిర్వహించబడ్డ ఏవిధ బర్వేలు కూడా సమర్దించాయి. ఆంధ్రప్రదేశ్‌లాంటి కొన్ని రాష్ర్రాల్లో గిరిజనులు తమ మనుగడ కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై నేటికీ అధారపడుతున్నారని గిరిజన ప్రాంతాలలో ఎర్యటించిన వారు నివేదించడంతో మరిన్ని కరోర సత్యాలు వెలుగులోకి వచ్చాయి భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉన్న గుజరాత్‌లోని గిరిజనులు తమ భూములను గిరిజనేతరులకు బదిలి చేసినట్లు కూడా వార్తలొచ్చాయి అలాగే, మధ్యప్రదేశ్, మహారాస్త్రలలో ఈ కార్యక్రమం వ్యవసాయం, భూ అన్యాక్రాంతం, భూసార పరిరక్షణ, రుణ విముక్తి, కుటీర పరిశ్రమల రంగాల్లో ముందడుగు వేయడంలో విఫలమైంది ఆర్ధిక కార్యకలాపాలు, ఉత్పాదన రంగాల్లో సమగ్ర గిరిజనాభివృద్ధి పధకాలు ఘోరంగా విఫలమయ్యాయి. సంక్షేమ పధకాల ద్వారా గిరిజన ప్రాంతాల సమస్యలను పరిష్కరించవచ్చన్న ప్రతిపాదన నిరద్ధకమైనదని రుజువయ్యింది పరాదీన సమాజాలు
ఐదవ, ఆరవ షెడ్యూళ్ళ సమర్ధకుల మధ్య కొనసాగుతున్న వాదనను సంక్షేమ రాజ్యం వైఫల్యం నేపధ్యంలో పరిశీలించాల్సి ఉంటుంది ఆరవ షెడ్యూల్ కంటే ఐదవ పషెద్యూల్ భిన్నమైనది ఎందుకంటే అందులో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయ్యే గిరిజన మండళ్ళ (ప్రస్తావనే ఉండదు రాష్ట్ర గవర్నర్ నియంత్రణలో ఆ షెద్యూల్ ప్రాంతాలు ఉంటాయి ఈ అప్రజాస్వామిక లక్షణం ఉన్నప్పటికీ బి డి శర్మ లాంటి గిరిజన హక్కుల ఉద్యమకారులు, భారత్ జన్ ఆందోళన లాంటి సంఘాలు ఈ పెడద్యూల్ను సమర్థ్ధించాయి. “భారతదేశంలో గిరిజన వ్యవహారాలు (ట్రైబల్ అఫైర్స్ ఇన్ ఇండియా) అనే తన పుస్తకంలో శర్మ ఐదవ షెడ్యూల్ ప్రాంతాల వి8ిష్టతను వివరించారు ఈ ప్రాంతాలు వలసవాద పాలనకు పూర్వమే విలసిల్లాయంటే సామ్రాజ్యవాదానికి ఆమడదూరంలో ఉన్నాయని స్పష్టమవుతుందని ఆయన వాదించారు వలసపాలకులు గిరిజన సంస్థలకు అవకాశం, గుర్తింపు కల్పించి వాటిని చట్టబద్ధమైన పాలనా వ్యవస్థలుగా పరిగణించారని తెలుస్తోందని చెప్పారు అందుకే ఈ షెడ్యూల్ కింద సంరక్షణ చర్యలు అవసరమే కాకుండా గిరిజన స్వయం పాలనను ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉన్నాయని వాదించారు ఈ క్రమంలో ఆయన గిరిజన అస్థిత్వాన్ని పెంపొందించడంలో, స్వయం పాలన డిమాండ్‌ను పైకి తేవడంలో సామ్రాజ్యవాదం నిర్వహించిన పాత్రను పూర్తిగా ఉపేక్షించారు ఇందుకు విరుద్ధంగా, ఆరవ షెడ్యూల్‌ను బలవంతపు శాసనంగా చిత్రీకరిస్తున్నారు
“దేశవ్యాప్తంగా గిరిజన ఉద్యమాలను నడుపుతున్న శక్తి తమ వ్యవస్థ, ఆచారాలు, ప్రాంతం, బయటి వారి నుండి ఉన్న ముప్పుపై గిరిజనులకు ఉన్న ఆందోళనే ఇందుకు జిల్లా మండలి మినహాయింపు కాదు గిరిజనుల దృష్టిలో అది కూడా ప్రభుత్వం విజాతి సంస్టే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో మనం చూస్తున్నది ప్రభుత్వం, గిరిజనుల మధ్య ప్రత్యక్ష పోరు తప్ప మరొకటి కాదు” బి డి శర్మ భారత్ జన్ అందోళన ప్రకారం ఈశాన్య రాష్ట్రాలలో ప్రజాస్వామ్య సంస్థలను ప్రభుత్వం అభివృద్ధి పరచడమంటే గిరిజన
78
సాంప్రదాయ వ్యవస్థలపై, జీవన విధానంపై అనుచిత దాడి జరపడమే ఇందుకు భిన్నగా ఐదవ షెద్యూలు సాంప్రదాయబద్ధమైన సంస్థలను పరిరక్షించే నిర్మాణంగా పరిగణిస్తున్నాల ముఖ్యంగా 1996లో పంచాయతీల (షెడ్యూలు ప్రాంతాలకు విస్తరణ) చట్టం ఆమోదించబడిన తర్వాత ఈ భావన మరింత బలపడింది
అయితే, ఐదవ షెడ్యూల్ అనుభవం ఏమంటోందంటే దాని సమర్థకులు ప్రభుత్వ పోషక వ్యవస్థపై అపారమైన, స్థిరమైన నమ్మకాన్ని ఉంచారు ఐదవ షెడ్యూల్ విజయవంతంగా అమలు కావడం ఈ వ్యవస్థపైనే ఆధారపడి ఉందని వారు నమ్ముతున్నారు ఇందుకు మంచి ఉదాహరణ మధ్యప్రదేశ్‌లోని సత్పురాకొండల సమీపంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన బైగా చాక్ ఈ ప్రాంతాన్ని పోడు వ్యవసాయం కోసం ఏర్పాటు చేశారు బైగా ప్రజలను మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్ తెగగా గుర్తించారు నెహ్రూ ఎల్విన్లు తమ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఇలాంటి ప్రాంతాలు చక్కటి అవకాశాలను కల్పిస్తాయి ఎందుకంటే వాటిని ఐదవ షెడ్యూల్ కింద ప్రత్యేక గిరిజన ప్రాంతాలుగో బైగాలను ప్రాచీన తెగగా (ఎనిమిదవ షెడ్యూల్ కింద) గుర్తించారు దీని అర్ధం వారిని మార్కెట్ శక్తుల నుండి కాపాడడమే కాకుండా విశాల భారతీయ సమాజంలో బైగాలను క్రమంగా విలీనం చేసే అవకాశముందేది ఈ లక్ష్యాలు ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం బైగాల సంక్షేమం కోసం వివిధ పధకాలను ప్రవేశపెట్టింది 1950, 60లలో బైగా చాక్‌ను సందర్శించిన డాక్టర్ డి ఎస్ నాగ్ స్వాతంత్రానంతరం చాక్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఉల్లేఖించారు
ఐదవ 'షెడ్యూల కింద బైగాల వర్గీకరణ తర్వాత గమసించబడిన దీర్ధకాలిక ప్రభావంలోని (ప్రధాన లక్షణం పెరుగుతున్న వారి రుణ భారం నిత్యజీవిత అవసరాలు, పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చలేక వారు సతమతమవుతున్నారు సగటున ఒక బైగా కుటుంబంలో 7? 2 మంది సభ్యులుంటారు వాటి ఆధీనంలో ఉన్న భూములు సభ్యుల ఆహార అవసరాలు తీర్చడానికి సరిపోవడం లేదు ఎర్రమట్టి నేలలపై నాగలి సేద్యం ప్రారంభించడం ఇందుకు పాక్షికంగా కారణమైంది భూమి ఉత్పాదక శక్తి క్షీణించడానికి సేద్యపు నీటి కొరత, పరిమిత విస్తీర్ణంలో ఉన్న బంజరు భూములు, భూమిని కోల్పోవడం ప్రధాన కారణాలు దీనికితోడు అటవీ ఆర్థిక వ్యవస్థతో సంబంధాలు లేకపోవడం కూడా వ్యవసాయాన్ని దెబ్బతీసింది భూమిపై యాజమాన్య హక్కులు లేకపోవడం సమస్యలను మరింత తీవ్రతరం చేసింది బైగాల దురవస్థకు యాజమాన్య హక్కుల లేమి ప్రధాన కాంణమని; 1976లో నిర్వహించబడిన ఒక సర్వే తేల్చింది పై కారణాలన్నీ బైగాల ఆహార పంపిణీని తీవ్రంగా ప్రభావితం చేశాయి భూమి, అటవీ వినియోగంలో అనుసరించే పద్ధతుల్లో తరచుగా మార్పులు చోటు చేసుకుంటూ ఉండడం ఆహార కొరతకు దారి తీసింది
సీజన్‌వారీ మనుగడ వ్యవస్థలు విచ్చిన్నంతో ఉత్పన్నమైన సమస్యలు 1970లో టైగా చాక్ విస్తరణ తర్వాత పెరిగి పెద్దవయ్యాయి చాక్ ఇపుడు షాదోల్, బాలాఘాట్, మాండ్లా బిలాస్పూర్, పండారియా, రాజ్‌నందన్‌గావ్ జిల్లాల్లో విస్తరించింది అందులో 312 గ్రామాలు 1,219 కుటుంబాలు నివసిస్తున్నాయి. 1978లో ఈ కుటుంబాలను బైగా అభివృద్ధి సంస్థ పాలన కింద తెచ్చారు సంస్థ ముఖ్య విధుల్లో గిరిజనులకు ఉపాధి అనకాశాలు, ఆదాయ
79
మార్గాలు కల్పించడం, వారి సమస్యలను పరిష్కరించడం ప్రధానమైనవి సంస్థ జిల్లా కలెక్టర్ నియంత్రణలో పనిచేస్తుంది హస్తకళలను ప్రోత్సహించడం, వారి సమన్యలను అర్ధం చేసుకోవడం, మౌలిక వసతులైన విద్యా వైద్యం, రోడ్లు సంచార వ్యవస్థ తదితర వాటిని కల్పించడం సంస్థ బాధ్యతలు
అయితే, 1980వ దశకం చివరి నాటికి ఈ వ్యూహం నామమాత్రపు విజయాన్నే సాధించింది బతుకుతెరువు కోసం బైగాలు దినకూలిపై, తాళ్ళుఫేనడం, బుట్టల అల్లికపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫలితంగా వారి జీవన ప్రమాణాలు ఎలాంటి అభివృద్ధిని చవిచూడలేకపోయాయి. ఈ కారణంగా బైగాలు తమ జీవనాధారం కోసం అటవీ శాఖపై పూర్తిగా ఆధారపడ్డారు భైగాలకు పని కల్పించే అతిపెద్ద సంస్థగా అటవీశాఖ అవతరించింది ఆ శాఖ ద్వారానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేసింది వలసవాద పాలన నుండి గిరిజనులకు చేరువయ్యేందుకు పాలకులు ప్రయత్నించారే తప్ప వారి ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మౌలిక సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు. అందుకు విరుద్దంగా, ప్రభుత్వ పధకాలు వారిని క్యాపిటలిస్టు ఆర్థిక వ్యవస్థకు మరింత సమర్ధవంతంగా 'సేవలందించేలా తయారు చేయడానికి ప్రయత్నించాయి. మరోవైపు గిరిజనులు కొత్త వృత్తులు పెంచుతున్న ఒత్తిడిని తట్టుకోలేక మరింత పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చింది ఈ కార్యక్రమాలను ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు రెండు నిర్వహించాయి వాటి లక్ష్యం ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం
ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రైవేటు సేవలందిస్తున్న వారిపై గిరిజనులు ఆధారపడక తప్పడంలేదు ఎందుకంటే ప్రభుత్వం వారి ప్రాంతాల్లో మౌలక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. విశాల రాజకీయ చిత్రపటంలో ఆయా సంస్థలు, వ్యక్తులు తమ ప్రయోజనాల దృష్ట్యా గిరిజనులకు కల్పించాల్సిన సేవల స్వభావాన్ని నిర్జ్ధారిస్తున్నారు దీనివల్ల గిరిజనుల సంస్కృతిపై, ఉనికిపై ప్రతికూల ప్రభావం పడుతోంది ఎన్టీఓలు, స్వచ్చంద కార్యకర్తలు గిరిజన ప్రాంతాల్లో తమ స్వంత విలువలను, సిద్ధాంతాలను ప్రచారం చేయడం కూడా ఈ వరిస్థితికి ఆజ్యం పోస్తోంది గిరిజన (ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను తాలుత ప్రారంభించింది జ్రైస్తవ మిషనరీలే అయినా, 1980-40 నాటికి హిందూత్వ సంస్థలైన హిందూ మహాసభ, ఆర్యధర్మ సేవక సంఘాలు కూడా తమ పలుకుబడిని బాగా పెంచుకున్నాయి వీరికి తోడుగా గాంధేయవాద సంస్థలు, ఉదారవాద మానవ శాస్త్రజ్ఞులు (ఎల్విన్ లాంటి వారు) కూడా గిరిజన (ప్రాంతాల్లో చురుకుగా పని చేసేవారు వీరి కార్యకలాపాలవల్ల గిరిజనుల సాంస్కృతిక, సామాజిక ఉనికికి ఒక స్వరూపం ఏర్పడింది ఇదే సమయంలో వారు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు ఒంటరిపాటు అభివృద్ధి లేమి, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో స్తబ్ధత - అపరిష్కృతంగా మిగిలిపోయాయి ఈ నేపధ్యమే మతపరమైన రాజకీయాలకు దారి తీసింది క్రైస్తవ మిషనరీలు, హిందూ సంస్థల మధ్య 1940 నుండి ప్రచ్చన్న యుద్ధం మొదలైంది చివరకు నియోగి కమీషన్ నివేదిక సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఐదవ షెడ్యూల్ (ప్రాంతాల్లో మిషనరీల కార్యకలాపాలను నిషేధించింది ఈ చర్యను తమ విజయానికి ప్రతీకగా హిందూత్వ
80
శక్తులు ప్రచారం చేసుకున్నాయి హిందూత్వ శక్తులు గిరిజన ప్రాంతాల్లో చొచ్చుకుపోయాయని చెప్పడం ఇక్కడ మా ఉద్దేశం కాదు ఐదవ షెడ్యూల్ దీర్ధకాలిక ప్రభావం గిరిజనుల సామాజిక-ఆర్థిక-రాజకీయ జీవితానికి ఏ మాత్రం ప్రయోజనకరంగా లేదని నిరూపించడమే మా లక్ష్యం సాంప్రదాయ సంస్థలు సాంస్కృతిక జాతీయవాదాన్ని ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని నిలువరించగలవన్న నమ్మకం ఐదవ షెడ్యూల్ అనుభవంతో సన్నగిల్లింది ప్రజాస్వామ్య నిర్మాణం పై వాదనకు విరుద్ధంగా, వామపక్షాలు ఆరవ "షెడ్యూల్ కింద గిరిజన ప్రాంతాల ఏర్పాటును, గిరిజన మండళ్ళకు మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించాలని డిమాండ్ చేస్తూనే వున్నాయి వారి వాదనలో హేతుబద్ధత, అనుభవం ఉన్నాయి 1937లో ఆల్ అస్సాం ప్లెయిన్స్ ట్రైబల్ లీగ్ ఏర్పాటు తర్వాత ఆరవ షెడ్యూల్‌ను ప్రయోగించసాగారు అలాగే జిల్లా సయం పాలిత మండళ్ళు కూడా ఏర్పడ్డాయి గిరిజనుల సామాజిక - ఆర్థిక ప్రయోజనాలు కాపాడటమే కాకుండా వంశపారంపర్యంగా వస్తున్న వ్యవస్థను పరిరక్షించడానికి లీగ్ ప్రయత్నించింది గిరిజనేతరుల (ప్రవేశాన్ని, జోక్యాన్ని నివారించాలని సంకల్పించింది అయితే ఈ జిల్లా మండళ్ళు కొన్ని సాంప్రదాయ వ్యవస్థలైన సియెమ్, నోక్కా, దొలోయ్లకు, అలాగే గ్రామ మండళ్ళకు ఆశ్రయం కల్పించాయి. స్టాన్లీ నికొలస్ రాయ్ (ప్రకారం ఈశాన్యంలోని కులవర్గాలు, గ్రామ మండళ్ళు ఆరవ షెడ్యూల్ లేకుండా ఉన్నట్లయితే సజీవంగా ఉండేవి కావు మిజోరం, మేఘాలయ అనుభవం ప్రకారం ఆరవ షెడ్యూల్ వాస్తవికమైన అమలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు అయితే ఆర్థిక అధికారాలు లేకపోవడం, తరచుగా రాష్ట్ర (ప్రభుత్వాలతో సంఘర్షణా వైఖరి అవలంబించడం వల్ల జిల్లా మండళ్ళు నిర్వీర్యంగా తయారయ్యాయి. ఈ స్తబ్బతవల్ల అవి ప్రజలను అధిక నంఖ్యలో తమ కార్యకలాపాల్లో భాగస్వాములను చేయలేకపోయాయి. అలాగే ప్రాంత ఉన్నత వర్గాల వ్యతిరేకతను ఎదుర్శొనేవి పరిమిత ప్రయోజనాలు నెరవేరినా, ఈ షెడ్యూల్‌ను సమర్ధించేవారు ఒక్కో విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించగలిగితే గిరిజన ప్రాంతాల సమైక్యతను, అభివృద్ధిని సాధించడానికి ఆరవ షెడ్యూల్ సమర్ధవంతమైన రాజ్యాంగ వ్యవస్థగా ఎదగగలదు త్రిపురలోని వామపక్ష ప్రభుత్వం (ప్రజాస్వామ్య గిరిజన సమాజాన్ని నిర్మించేందుకు ఆరవ షెడ్యూల్‌ను సాధనంగా వినియోగించింది సంస్థాన రాజ్యమైన త్రిపుర రాష్ట్రం 1947 తర్వాత శరణార్థుల వలసను పెద్ద ఎత్తున చవిచూసింది విభజనకు ముందు రాష్ట్ర జనాభాలో గిరిజనుల శాతం 50 9గా ఉందేవి మొత్తం 19 గిరిజన సముదాయాలు (రాయెంగ్లు, చక్కాలు, రుమియాలు) ఉండేవి అయితే 1951 నాటికి ఈ శాతం 36 85కు పడిపోయింది పలితంగా గిరిజనులు బలమైన మైనారిటీగా మిగిలిపోయారు. రాష్త్రంలో స్థానికేతరులు, బెంగాలీలు రాజకీయంగా, ఆర్ధికంగా బలమైన శక్తులుగా ఉండేవారు 1972లో భారతదేశంలో ఒక రాష్ట్రంగా త్రిపుర గుర్తించబడే సమయానికి మొత్తం జనాభాలో గిరిజనులు 28 95 శాతంగా నమోదయ్య్వారు. బలమైన సముదాయంగా ఉండడంతో గిరిజనులకు ఇతర వర్థాల నుండి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి గిరిజనేతరుల రాక, ప్రభుత్వ గుత్తాధిపత్యంవల్ల 81
గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్శొన్నారు వాటిలో ప్రధానమైనది భూముల అన్యాక్రాంతం అటవీ భూముల్లో పోడు వ్యవసాయం కొనసాగిస్తున్న వారికి భూయాజమాన్య హక్షులు కల్పించలేదు ఫలితంగా, వారి రుణ భారం పెరిగి ఆర్ధిక పరిస్థితి విషమంగా మారింది ఈశాన్య మండలి వ్యవస్థాగత పెట్టుబడి (రూ కోట్లలో) రంగాలవారీ పట్టిక 7 వ్యవస్థ శాతం రవాణా, సమాచార వ్యవస్థ 147216 | 102775 | 2499 90 | 45 45 విద్యుచ్చక్తి ॥ 1252 24 | 1012 35 | 226477 | 4118 వ్యవసాయ, సంబంధిత రంగాలు 89 91 8430, 12421 226 సామాజిక, సముదాయ సేవలు 189 26 26212, 45138 | 821 ఇతరులు 4621 11330| 15951, 290 మొత్తం 304977 | 245000 | 5499 77 100 00 ఆధారం తొమ్మిదవ (ప్రణాళిక ముసాయిదా (1997-2000)
ఈ నేపధ్యంలోనే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ 1948లో తన తొలి గిరిజన ప్రజాసంఘం, గణముక్తి పరిషత్‌ను త్రిపురలో స్థాపించింది వడ్డీ వ్యాపారులు, ఆహార ధాన్యాల వర్తకులకు వ్యతిరేకంగా ఈ సంఘం పోరాటాన్ని ప్రారంభించింది తక్కువ వడ్డీకి రుణాలు తక్కువ ధరకు ఆహార ధాన్యాలను స్థానికులకు అందించాలని వారిపై ఒత్తిడి తెచ్చింది 1947లో గణముక్తి పరిషత్ ఒక సహకార రుణ వ్యవస్థను ప్రారంభించి గిరిజనులకు నామమాత్రపు వడ్డీతో రుణాలు పంపిణీ చేసింది అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భూస్పాములు, వ్యాపారుల కొమ్ము కాస్తూ వారి పేరున భూములను బదిలీ చేసింది రుమియాలు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూముల్లో బెంగాలీ శరణార్థులను స్థిరపరచింది ఇదే విషయమై 1955లో రాష్ట్ర ప్రభుత్వానికి గణముక్తి పరిషత్ ఒక విజ్ఞాపనా పత్రాన్ని సమర్పించింది తరతరాలుగా ఆ భూములను రుమియాలు సొగుచేస్తున్నారని, వాటిని గిరిజనుల పునరావాసం కోసం రక్షిత ప్రాంతాలుగా వర్గీకరించాలని పరిషత్ కోరింది అలాగే వారి సంస్కృతిని, సాంప్రదాయ సంస్థలను రక్షించి, తమ అభివృద్ధి మార్గాన్ని స్థానికులే ఎంచుకునే అధికారాన్ని కల్పించాలని నివేదించింది గిరిజన ప్రయోజనాల రక్షణతోపాటు ఆ ప్రాంతాల్లో ఆరవ షెడ్యూల్‌ను అమలు చేయాలని ఈ విధంగా గణముక్తి పరీషత్ ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచింది 1983లో జరిగిన గిరిజన సదస్సులో వామపక్ష ప్రభుత్వం ఆలోచనను ప్రతిబింబిస్తూ నృపేన్ చక్రవర్తి ఈ విధంగా వ్యాఖ్యానించారు
“రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ను విధించాలని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు చేపట్టిన ప్రజా ఉద్యమాన్ని మనమందరమూ బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తాం జిల్లా స్వయంపాలిత మండలి ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సహకరిద్దాం త్రిపురను బలమైన ప్రజాస్వామిక కేంద్రంగా తీర్చిదిద్ది గిరిజనులు గిరిజనేతరులకు సమానస్థాయి సమాన హక్కులు, సమాన హోదా లక్ష్యాలను సాధిద్దాం ”
82
త్రిపురలో వ్యవస్టాగత పెట్టుబడులు (జెల్లా స్వయంపాలిత మండలి) రంగాలవారీ (మొత్తం కేటాయింపు శాతం)
పట్టిక 8 వ్యవస్థలు/సంవత్సరాలు 8వ పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ సంబంధిత రంగాలు 318 216 మౌలిక వసతులు 140 340 పరిశ్రమ ౩0 శ్రి సామాజిక, సముదాయ సేవలు 510 400 ఆధారం త్రిపుర ప్రభుత్వ నివేదికలు
జిల్లా స్వయం పాలిత మండళ్ళను వామపక్షాలు ప్రాతినిధ్య పాలనా వ్యవస్థలుగా గుర్తించాయి వీటి ద్వారా గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య అసమానతలు తొలగించాలని కృషి చేశాయి గిరిజనుల ఆకాంక్షలను ఆలోచనలను గౌరవించడంతోపాటు ఆయా వర్ణాల మధ్య సమైక్యతను పెంపొందించడానికి జిల్లా మండళ్ళు పాటుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశాయి ఈ విధంగా గిరిజన ప్రజలను సమీకరించి ప్రాంతీయ, జాతీయ రాజకీయ అంశాలపై ఉద్యమాలు నిర్వహించడానికి పరిస్థితులు కల్పించాలని వామపక్షాలు ప్రయత్నించాయి సుదీర్హ పోరాటం తర్వాత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కింద స్వయంపాలిత జిల్లా మండలిని 1982లో ఏర్పాటు చేశారు 1985లొ మండలిని ఆరవ షెడ్యూల్ కింద ఉంచారు మండలి 30 శాతం జనాభాను, 68 శాతం భూమిని తన నియంత్రణలోకి తెచ్చుకుంది మండలిని అభివృద్ధి సాధించే వ్యవస్థగా రూపుదిద్దాలన్నదే వామపక్షాల ముందున్న సవాలు ఇది మండలి వార్షిక వ్యయంలో ప్రస్ఫుటమవుతుంది ఇంతకు ముందు ఇచ్చిన పట్టికల్లో ఆయా రంగాలకు కేటాయించిన నిధుల వివరాలు పొందుపరచబడ్డాయి. (పట్టిక 7,8)
పట్టికలను పరిశీలిస్తే ఈశాన్య మండలి ప్రాధాన్యత మౌలిక సదుపాయాల అభివృద్ధి అని స్పష్టమవుతుంది ఇంత చేసినా, ఈశాన్య ప్రాంతం నేటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ఎస్ పి కుక్లా కమిటీ (1998) తన నివేదికలో పేర్కొంది అయితే త్రిపుర ప్రభుత్వం జిల్లా మందళ్ళ ద్వారా గిరిజనుల ఉత్పాదక సామర్థ్యాన్ని వారి ఆర్ధిక పరిస్థితిని బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకొంది ఈ విషయాన్ని గత అధ్యాయాల్లో తెలుసుకున్నాము ఈ విధంగా జిల్లా స్వయం పాలిత మండళ్ళను గిరిజన అభివృద్ధికి సాధనంగా వామపక్షాలు సమర్ధవంతంగా వినియోగించుకున్నాయి
పై అనుభవం కారణంగానే వామపక్షాలు ఆరవళోడ్యూల్ను బస్తర్ లాంటి ప్రాంతాలకు విస్తరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం బస్తర్ ఐదవ షెడ్యూల్ కింద ఉంది సిపిఎం ఇటీవల నిర్వహిందిన అఖిల భారత గిరిజన సదస్సులో ఆరవ షెడ్యూలు విధించడానికి అవకాశమున్న ప్రాంతాలను గుర్తించాలని తీర్మానించింది స్వయం ప్రతిపత్తిగల గిరిజన మండళ్ళ ఏర్పాటుకు కృషి చేయాలని నిర్ణయించింది గిరిజన మండళ్ళకు మరిన్ని అదికారాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది ఈ నేపధ్యంలోనే మనం ఐదవ షెడ్యూల్ స్థితిపై జరుగుతున్న
883
వాదనను పరిశీలించాలి ఈ షెడ్యూల్‌ను పూర్తిగా రద్దు చేస్తారన్న వదంతులు కూడా ఉన్నాయి మరోవైపు భారత్ జన్ ఆందోళన ఇతర సంస్థలతో కలిసి ఐదవ షెడ్యూల్‌ను కొనసాగించాలని కోరుతూ పోరాటాలు నిర్వహిస్తోంది ఈ షెడ్యూల్ కింద గిరిజనుల సాంప్రదాయ సంస్థలను జీవన విధానాన్ని సంరక్షించగలమని వారి వాదన ప్రభుత్వ వ్యవస్థ కంటే అవే నిజమైన ప్రజాస్వామ్య స్పూర్తిని సమసమాజ లక్షణాన్ని కలిగి ఉన్నాయని వారి విశ్వాసం అయితే స్వాతంత్ర్యం తర్వాత ఐదవ షెడ్యూల్ ప్రాంతాల ప్రగతిని సమీక్షిస్తే ఈ వాదనలు వాస్తవం కాదని బోధపడుతుంది గిరిజన పంచాయత్‌ల కన్నా ప్రభుత్వ అధికార గణమే ఈ ప్రాంతాలపై ఆధిపత్యం 'కలిగిఉందని స్పష్టమవుతుంది ఏది ఏమైనా, ఐదవ షెడ్యూల్ కొనసాగింపును వామపక్షాలు, ఇతర ప్రగతిశీల సంఘాలు వ్యతిరేకించకపోయినప్పటికీ గిరిజనుల సంక్షేమానికి ఆరవ షెడ్యూల్ వ్యవస్టే ఉత్తమమైనదని నమ్ముతున్నాయి. గిరిజన రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామీకరించడానికి, అలాగే వారి భాష సంస్కృతులను కాపాడటానికి అరవ "షెడ్యూల్‌కు మించిన వ్యవస్థలేదని వారి విశ్వాసం ఈ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేయాలంటే స్వయం పాలిత కౌన్సిళ్ళ రూపంలో ప్రజాస్వామ్య ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని కూడా వామపక్షాలు వాదిస్తున్నాయి అలా జరిగినప్పుడే ప్రాంతీయ జాతి విద్వేషాలకు జిల్లా స్వయం పాలిత మండళ్ళు అడ్డుకట్ట వేయగలవని అవి చెబుతున్నాయి
అయితే, వామపక్షాల దృష్టికోణం కూడా గిరిజనులు గిరిజనేతర ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న సంన్థాగత అసమానతలను పరిగణనలోకి తీసుకోవటం లేదు అసమానతలు తొలగాలంటే గిరిజన ఆర్ధిక వ్యవస్థ ఉత్పాదక సామర్ద్యాన్ని జిల్లా మండళ్ళ ద్వారా (ఐదవ, ఆరవ షెడ్యూళ్ళ కింద) పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆరవ షెడ్యూల్ కింది జిల్లా మండళ్ళు మేలైనవి ఎందుకంటే గిరిజన ప్రతినిధులు తమ ప్రాంత ప్రజలకు పూర్తి జవాబుదారీగా ఉంటారు అన్ని పధకాలకు వీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఐదవ షెడ్యూల్ కింద ఇది సాధ్యపడదు అలాగే జిల్లా మండళ్ళకు విధుల నిర్వహణలో పూర్తి స్వేచ్చను, అధికారాలను ప్రభుత్వం కల్పించాల్సి ఉంది
త్రిపుర జిల్లా మందళ్ళ పనితీరు విషయంలో ఆదర్శంగా నిలిచింది రాజకీయ నిబద్ధత ఉంటే సాధించలేనిదేది ఉండదని నిరూపించింది మండళ్ళ ద్వారా చేపట్టే సంక్షైమ, అభివృద్ధి పధకాలు ఆయా ప్రాంతాల ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేదిగా వుండేటట్లు చర్యలు తీసుకోవాలి కేవలం సంక్షేమ పధకాలపైనే గిరిజనులు ఆధారపడేటట్లు చూడరాదు ఈ అంశంలో నెహ్రూవాద దృష్టికోణం (సంక్షేమ రాజ్యం) ప్రయోజనం లేనిది
బహుశా, సమసమాజ ఇ్ఞశయం, సామాజిక దృష్టికోణం, ఆత్మ పరిశీలన కలిగిన వామపక్ష దృక్పధమే పరిపూర్ణమైనేతిగిరిజన సమాజ నిర్మాణానికి బాటలు వేయగలదు గిరిజనాభివృద్ధికి ఆదర్భంతమైన (ప్రత్యామ్నాయాన్ని సూచించడంలో వామపక్షాలు, నయా సాంప్రదాయవాదులు చారవ తీసుకోవాల్సి ఉంది
రశ
గక చివరి మాట ఐక్య సంఘటన నిర్మాణం
సమకాలీన భారతదేశం సంక్షోభంలో ఉంది దేశంలోని శ్రామిక వర్షాల నిత్యజీవితాన్ని ప్రభావితం చేసే మూడు ప్రధాన సవాళ్ళను ఎదుర్కొంటోంది మొదటి సవాలు 1990 దశకంలో ప్రారంభమైన నయా ఉదారవాద ప్రపంచీకరణ విధానాలు వీటిపై వామపక్ష వాదుల వైఖరి స్పష్టంగా ఉంది సరళీకరణ వల్ల దేశ ప్రజలకు కలిగే నష్టాలపై వామపక్షాలు సమర్ధవంతమైన విశ్లేషణతో ముందుకొచ్చాయి. నూతన ఆర్థిక విధానాలవల్ల అసమానత, పేదరికం, ఆకలి అనారోగ్యం సర్వత్రా వ్యాపించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రగతిశీల ఉద్యమం సాగిస్తున్న శక్తులన్నీ విశ్వసిస్తున్నాయి. రెండవది, హిందూత్వ వాదం విసురుతున్న సవాలు ఈ తిరోగమన వాదాన్ని వామపక్షాలు, ఇతర (ప్రజా సంఘాలు ముక్తకంరంతో, పూర్తి శక్తియుక్తులతో వ్వతిరేకిస్తున్నాయి నుత ఛాందసవాద శక్తులకు వ్యతిరేకంగా అనేక పర్యావరణ పరిరక్షణ ఉద్యమ సంమాలు ఇతరులతో కలిని పోరాడుతున్నప్పటికీ సుందర్‌లాల్ బహుగుణ లాంటి ఉద్యమకారులు తమ లక్ష్యాలను, సిద్ధాంతాలను పటిష్టపరచుకొనేందుకు ఛాందసవాద శక్తులతో జట్టు కట్టడానికి సిద్ధపడుతున్నారు అయితే తెహ్రీ డ్యాం అనుభవాన్ని పరిశీలిస్తే ఇలాంటి సంకీర్ణం మున్నాళ్ళ ముచ్బటేనని బోధపడుతుంది దాని అవకాశవాద స్వరూపాన్ని బహిర్గతం చేస్తుంది ఇలాంటి వైరుధ్యాలున్నా మొత్తానికి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నాయి మూడవ సవాలు, క్రమంగా క్షీణిస్తున్న పర్యావరణ సమతుల్యం, అడుగంటుతున్న భూగర్భజలాలు అంతరిస్తున్న అటవీ ప్రాంతాలు, సారహీనమవుతున్న సాగు భూములు ఈ సమస్యలపై వామపక్షాల్లో కొన్ని ఆందోళన ' వ్యక్తం చేస్తున్నప్పటికీ, వీటికి సంబంధించిన మూల కారణాలను విశ్లేషించినప్పటికీ ఈ సంక్షోభం చూపే ప్రతికూల ప్రభావంపై
85
వారు మొత్తంగా ఒక అవగాహనకు వచ్చినట్లు కనిపించడంలేదు. స్థూల రాజకీయ ఆర్ధిక వ్యవస్థ విశ్లేషణలో పర్యావరణ సూత్రాలను వారు పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం లేదని దీని అర్ధం స్థిరమైన ప్రగతి అంటే కేవలం వాతావరణ మార్పు, రియో ప్రకటన అమలుపై సాగుతున్న అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కటే కాదు భారత ప్రజల నిత్యజీవిత సమస్యలను పరిష్కరించడానికి స్థిరమైన, నిరంతరమైన ప్రభుత్వ జోక్యం కూడా అవసరం ఈ అంశంలోనే జీవనోపాధి సమస్యను పాలనా సంస్థలతో ముడిపెడుతున్నాయి కొన్ని పర్యావరణ ఉద్యమ సంస్థలు ఇలా చేయడం ద్వారా భారతదేశ అభివృద్ధి రాజకీయాల్లో పర్యావరణ సమతుల్యాన్ని ఒక (ప్రధాన అంశంగా మార్చుతున్నాయి ప్రజా హక్కులు, ఉపాధి అంశాలు వామపక్షాలకు కొత్తేమి కాదు 1940 దశకం నుండే' ఈ అంశాలపై అవి పోరాడుతున్నాయి ఈ ఉద్యమాలను పర్యావరణ పరిరక్షణ పోరాటాలుగా ఎందుకు గుర్తించలేదంటే వామపక్షాలు ఆధునిక ప్రగతి సిద్ధాంతాలను వ్యతిరేకించవు పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి, వామపక్షాలకు మధ్య ఈ విషయంలోనే తీవ్ర విభేదాలున్నాయి గిరిజనులు, ఆధునిక ప్రగతి బాట మధ్య ఉన్న సంబందంపైనే (ప్రధానంగా ఇరుపక్షాలు పరస్పర విరుద్ధమైన వైఖరిని (ప్రదర్శిస్తున్నాయి ఈ చర్చపై ఉన్న గరిష్ట పరిమితులను ఎత్తి చూపుతూనే ఇరుపక్షాలు సాంప్రదాయం, ఆధునికత అంశాలపై తమ వైఖరులను సడలించాల్సిన అవసరముందని ఈ వ్యాస సంకలనం ప్రస్తావించింది గిరిజనాభివృద్దికి ఒక ఆచరణయోగ్యమైన ప్రత్యామ్నాయ ప్రగతి ప్రణాళికను ఏకాభిప్రాయంతో రూపొందించాలని నూచించింది. పైన (వ్రస్తావించిన నవాళ్ళను వరిగణనలోకి తీసుకొనే ఎలాంటి ప్రత్యామ్నాయాన్నైనా సూచించాలి రాజకీయ ఆర్థిక వ్యవస్థ కోణం నుండి గిరిజన చరిత్రను అన్వయించుకొని ముందుకు సాగితే పెరుగుతున్న అసమానతలు, గిరిజనులపై సరళీకృత ఆర్థిక విధానాలు ఆయా స్థాయిల్లో చూపుతున్న ప్రతికూల ప్రభావం ఏమిటో స్పష్టంగా బోధపడుతుంది గిరిజన చరిత్రపై సమిష్టి ఆలోచన ఉంటేనే సమసమాజ స్థాపనకు ఉమ్మడి ఆశయం ఉద్భవిస్తుంది ఇలాంటి సమాజంలో ఇతర (శ్రామిక వర్గాల సరసన గిరిజనులకు సమానమైన, గౌరవప్రదమైన స్థానం దక్కుతుంది | గిరిజనులు గిరిజనేతరుల ఉమ్మడి చరిత్ర రచన ఆశయం శ్రామిక వర్గాల ఐక్యవేదికను ఎర్బరచి వారి ముందున్న సవాళ్ళకు వ్యతిరేకంగా విశాల స్థాయి ఉద్యమాన్ని చేపట్టేదిగా ఉందాలి సమాజంలో గిరిజనులే అత్యంత వెనుకబడిన వర్గాలైనందువల్ల వారి ప్రయోజనాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి భూమి, అడవులు, జలవనరులపై గిరిజనులకు సంపూర్ణ హక్కు నియంత్రణ దక్కేలా సమాజంలో వారి ఏకీకరణ ప్రక్రియను చేపట్టాలి అడవులు, నదీ జలాలపై గిరిజనుల హక్కును, ఇతర వర్షాల హక్కుతో ఎలా సమన్వయ పరచాలన్నదే ఇక్కడ ప్రధానమైన సమస్య ఎందుకంటే ఉమ్మడి వనరులు చాలా వరకు స్థానిక, గ్రామ సరిహద్దులు కలిగి ఉండవు అన్సి ఎర్ధిక్క, పరిసర ప్రాంత హద్దులు దాటి ఉంటాయి అందుకే పర్యావరణ ఆర్టిక రంగాల" ప్రణాళికను ఉమ్మడిగా రూఫ్రొందించి సహజ వనరులు అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం అరదేత్యాకూడాల్సిన అవసరం ఉందా 86
నూతన అంతర్జాతీయ వ్యవస్థలో ప్రభుత్వ పాలనారంగ పాత్రను, స్వభావాన్ని పునర్నిర్వచించడం ప్రగతిశీల ఉద్యమాల ముందున్న ముఖ్యమైన సవాళ్ళలో రెండవది గిరిజనుల సఎిగ్రాభిప్ప్ఫద్ధిలో ప్రభుత్వ పాత్ర తప్పనిసరి అయితే పాలనాపరమైన విధానాలు మారాల్సిన లపసం౦ ఉంది ప్రపంచీకరణ (ప్రభావం వల్ల గిరిజన ప్రాంతాల్లో దూసుకొస్తున్న ప్రైవేటు పెట్టుబడులు, ఆర్థిక సంస్థల కారణంగా సహజ వనరులపై (ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యం మంగా సడలుతోంది జలవనరులు, అటవీ ప్రాంతాల ప్రైవేటీకరణలో ఈ విషయం స్పష్టంగా అర్జబువుతుంది ఇప్పటికే అనేక రాష్త్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ బాటలో పడ్డాయి అయితే ప్రైవెటీకరణ చర్యలను వామపక్షాలు, పర్యావరణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు వాటివల్ల నిరుద్యోగం అసమానతలు, పేదరికం ఆకలి సమస్యలు మరింత తీవ్రతరమవుతాయని అవి ఇరుపక్షాల ఆలోచన ప్రకారం చూస్తే గిరిజనాభివృద్ధి ఎదుర్కొంటున్న దీర్హకాలిక సఎిస్పకు పరిష్కారం ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని పునరుద్ధరించడంలో లేదు అయితే ప్రభుత్వం, ప్రజల మధ్య సానుకూలమైన సహకారం ఏర్పరచి అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి పాలనాపరమైన సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ - ప్రైవేటు రంగ భాగస్వామ్యం కంటే ఇదే మేలైన (ప్రత్యామ్నాయం ఇందుకోసం కొత్త వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాలను అన్వేషించాలి వివిధ ఉద్యమాలు, స్టానిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి నయా ఉదారవాద ప్రపంచీకరణ విసురుతున్న పెనుసవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వ - ప్రజల భాగస్వోమ్యాన్ని సానుకూల రీతిలో తీర్చిదిద్దడం ఎంతో ముఖ్యం
చివరగా, గిరిజన ఆర్థిక వ్యవస్థను దోపిడీదారీ మార్కెట్ శక్తుల నుండి పరిరక్షించి అభివృద్ధి పధంలో పయనింపచేయాలంటే గిరిజనుల సామర్థాన్ని, పరిజ్ఞానాన్ని మెరుగుపరిచే శిక్షణా కార్యక్రమాలను పటిష్టవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది గిరిజన, గిరిజనేతరుల మధ్య సహకారాన్ని మరింత పటిష్టపరిచే రీతిలో గిరిజన ప్రాంతాలు, ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది జరిగితే పైన పేర్కొన్న లక్ష్యం నెరవేరగలదు ఇలాంటి సహకారంవల్ల స్థానిక స్థాయిలో గిరిజనుల ఉత్పత్తులను అదనపు విలువ కలగాలి స్థానిక వనరులను సాధ్యమైనంత వరకు పేదాతిపేద వర్షాలకు ప్రయోజనం కలిగించేలా వినియోగించాలి క్యాపిటలిస్టు సంబంధాలు వేని నూతన వ్యవస్థలను ఏర్పాటు చేయాలంటే ఆలోచనలో, ఆశయంలో స్పష్టత ఉండాలి వివిధ ఉద్యమాలు ప్రగతిశీల శక్తులు ఉమ్మడిగా కృషి చేసి ప్రజా సంస్థలను నిర్మించాలి అప్పుడే దోపిడీదారి ఆర్థిక విధానాలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను వ్యూహాత్మకంగా రూపొందించగలం వామపక్షవాదులు, పర్యావరణ ఉద్యమకారులు ఇద్దరూ ఇందుకు కృషి చేయాలి అప్పుడే
భారతదేశ గిరిజనుల భవితవ్యాన్ని రూపొందించడంలో వారు కీలక పాత్ర పోషించగలరు
శ్తళయు గంధాలు.
గే ఇం స
87( శ (ఉ0- త్తు
పా స్తో
గ క
గలు శ క. మల. సే శ న య | 4. క న ననరన 1 , క్త న గాడీ సీ న పర్యావరణ పరిరక్షణ: ఉద్యమాలన్ను . వాదనలను. విమర్శనాత్మకంగా పరిశీలించి, ఇదే . 1 అంశంపై వామవక్షాల కృషిని కూడా | / విశ్లేషించింది ఈ పుస్తకం: ఈ రెండు పాయల మధ్య ఉమ్మడి అంశాలను వివరించడంతో పాటు అవి వరనర నంబంధాన్ని అభివృద్ధి చేసుకోవలసిన ఆవశ్యకతను ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది. ల ప్రజాశక్తి బుక్‌హౌస్ "