Telugu Parinatavani volume 3 - anilvaranasi/indianlanguages GitHub Wiki
టపలిణతవాణి (మూడవ సంపుటి (65 ఇళ్ళుకు సైబడీన తెలుగు భాషా సాహిత్యరంగ ప్రముఖుల ంళ్మకథా ప్రసంగ వ్యాసాలు) (10 / 4,౨. సహజకవి మల్లెమాల ంం , ( వ ౪ ౪ మనసుపడి మక్కునతో సేకరించిన . క ల + 5 ఈ పుస్తూన్నిసాహిత్యాభిమానుల కోసం “ఫి | సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి . ఫో | ఆనందంతో బహూకరిస్తున్నాం. | 1 స. లస. - మల్లెమాల కుటుంబం థి ఆంధ్ర సారస్వత పరిషత్తు | ౫ ్ట | క్ష తిలక్‌రోడ్, హైదరాబాదు-500 001. 1 సన ౮
జ్ పలణతవాణి (మూడవ సంపుటి (65 పళ్ళకు పైబడిన తెలుగు బాషా సాహిత్యరంగ ప్రముఖుల ఆతృకధా ప్రసంగ వ్యాసాలు రు స (ప్రధాన సంపాదకులు జ్ఞానపీర పురస్కార గ్రహీత, పద్మభూషణ్ ఆచార్య సి. నారాయణ రెడ్ది అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు సంపాదకులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రధాన కార్యదర్శి, ఆంద్ర సారస్వత పరిషత్తు ఆంధ్ర సారస్వత పరిషత్తు తిలక్‌రోడ్, హైదరాబాదు-500 001.
ఉష కతి న శ్కోడ (/౦౬౮౪౫౬- 11) (4ఉ ౦01606110౧ 0 &4(00100/20౧1081 9660069 08గ౧౧1౧6౧1161464 ఓ1612౧/ ౧6౧౩౦౧9) (ప్రధమ ము(ద్రణ : సెప్టెంబర్, 2006 ప్రతులు : 1000 థీ మూల్యం : రూ. 60/- గో ల ఈలా (ప్రతులకు ; శరీర షో ఆంధ్ర సారస్వత పరిషత్తు సుల్లా వైవో క్ట తిలక్‌రోడ్: హైదరాబాదు-500 001 ఫోన్: +91-40-24753724 ముద్రణ :; విష్ణ కంప్యూటర్ సర్వీసెస్ (డిజైనర్స్ & మర్టీకలర్ అవ్సెట్ ప్రింటర్స్) నల్లకుంట, హైదరాబాద్ 500 044, ఫోన్, శ9 1-40-27 676910. 65348445
న్ ప్రవేశిక జ్ఞానపీర పురస్కార గ్రహీత, పద్మభూషణ్ ఆచార్య సి. నారాయణ డ్డి అధ్యక్షులు ఆం(ధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్ర సొరస్వత పరిషత్తు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో పరిణతవాణి' ప్రసంగ పరంపర ఎందరో సహృదయుల (ప్రశంసలు అందుకున్నది. ఆంధ్రదేశంలోని (ప్రముఖులను ఆహ్వానించి వారి జీవిత విశేషాలు, సాహిత్యవేత్తలతో వారికి ఉన్న పరిచయం, ఉద్యమాలత్తో వారికి గల సంబంధం, సాహిత్య సాంస్కృతిక భాషా రంగాల్టో వారు చేసిన కృషిని గురించి ప్రసంగించమని కోరాం. మొదట డెబ్బై యేళ్లకు పై బడ్డ (ప్రముఖులచేత ప్రసంగాలు ఇప్పించాం. తరువాత అరవై అయిదేళ్లు పైబడ్డ వారిని ఆహ్వానించాం. ఈ ప్రసంగాలను ఆడియో టేపుల్లో రికార్డు చేయించాం, ఆడియో .టేపుల్లోని విషయాన్ని ఎత్తి రాయించి ఈ (ప్రసంగ వ్యాసాలుగా రూపొందించాం. కొందరు వక్తలు వ్యాసాలు సమర్పించారు. సుదీర్హంగా ఉన్న వ్యాసాలను క్టుప్తీకరించాం. విషయ ప్రధాన దృష్టితో ఈ ప్రసంగ వ్యాసాలను సంపుటీకరిస్తున్నాం. అందుచేత ఈ ప్రసంగ వ్యాసాలు విస్శృతిలో కొన్ని చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా రూపొందాయి. పరిషత్తు కార్యవర్గంవారు, కార్యకర్తలు, ఈ (ప్రసంగ పరంపరకు విచ్చేసిన సదస్యులు, సాహిత్యవేత్తలు వీటిని పుస్తక రూపంలో తీసుకురావలసిందని సూచించారు. వారి సూచన ప్రకారం అయిదు ప్రసంగాలతో మొదటి సంపుటిని, ఏడు వ్యాసాలతో రెండవ సంపుటిని వెలువరించాం. మరో ఏడు వ్యాసాలతో (ప్రస్తుతం మూడవ సంపుటిని వెలువరిస్తున్నాం. ఈ పరిణత (ప్రముఖుల ఆశయాలు ఆదర్శ కరదీపికలుగా నేటి తరాన్ని ఉద్దీసింప చేస్తాయని ఆశిస్తున్నాను. "హైదరాబాదు 10.10.2006 డా! సి, నారాయణ రెడ్డి
ముందుమాట
'పరిణతవాణి' అన్నది ఒక విశిష్టమైన (ప్రసంగ పరంపర. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య సి. నారాయణ రెడ్డి గొరు ఈ ప్రసంగ పరంపర స్వరూప శిల్పి. పరిణతవాణి కార్యక్రమంలో పరిషత్తు వేదిక నుంచి సాహిత్య సాంస్కృతిక రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు వారి అనుభవాలను, ప్రముఖులతో వారికి గల పరిచయాలను, వారు చేసిన కృషిని గురించి ఆత్మ కధాకధన రూపంలో ఎన్నో విశేషాలు వివరించారు. అందులో కొన్ని మనకు తెలిసిన విషయాలు కాకపోవచ్చు. ఈ తరం వారికి వారి అనుభవాలు, జ్ఞాపకాలు, ఎంతైనా అవసరం. భారత స్యాతంధత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంలో ఈ తెలుగు ప్రముఖుల అనుభవాలను, జ్ఞాపకాలను మొదటి సంపుటిగా పుస్తక రూపంలో తీసుకురావడానికి కారణం మా అధ్యక్షుల వారి సంకల్ప బలం. ఇప్పటికి ఇరవై ఏడు ప్రసంగాలు జరిగాయి. అందులో రెండు సంపుటాలుగా 'ప్రచురించాం. మరో ఏడు వ్యాసాలతో ఈ మూడవ సంపుటిని వెలువరిస్తున్నాం.
ఈ (ప్రముఖులు ప్రసంగిస్తున్నప్పుడు రికార్డు చేయించిన ప్రసంగాలను, వ్యాసరూపంగా ఇచ్చిన ప్రసంగాలను సంగ్రహించి ఇందులో (ప్రచురించాం. సాధ్యమైనంత వరకు విషయ (ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. చాలావరకు వారి స్వచ్చందమైన అభిప్రాయాలను గౌరవిస్తూ వాటిని ప్రచురించాం. అభిప్రాయ భేదాలు ఉన్నచోట ఆ అభిప్రాయాలు ఆ ప్రముఖులు వెలువరించినవనీ, ఆంధ్రసారస్వత పరిషత్తు కేవలం వాటిని ప్రచురించిందనీ గమనించవలసిందిగా మా విజ్ఞప్తి,
ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యక్రమాల్ని తీర్చి దిద్దుతూ, ఎన్నో సదస్సులను నిర్వహింపజేస్తూ మా అధ్యక్షులు ఆచార్య సి, నారాయణ రెడ్డి గారు కార్యక్రమాల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ సంపుటులను (ప్రచురించడంలో వారి ప్రోత్సాహం ఎంతైనా ఉంది. వారికి కృతజ్ఞతలు. నాతో సహకరిస్తున్న కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు. ఈ సంపుటిని తీర్చిదిద్దడంలో శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు గారు, డా॥ డి. చంద్రశేఖర రెడ్డి గారు ఎంతగానో సహకరించారు. వారికి నా కృతజ్ఞతలు.
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
హైదరాబాదు (ప్రధాన కార్యదర్శి 10.10.2006 ఆంధ్ర సారస్వత పరిషత్తు
ప్రసంగ వ్యాససూచిక
పుట 1 డా గడియారం రామకృష్ణశర్మ...... ౨౨౨౨౨] 2. శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి .. ......... ౨ 21 3. డా. సి. ఆనందారామం ౨౨౨4ల ల ఆలం ఆలు బీలై జే డా. ఎం.ఎస్. రెడ్డి... టు ఆలం. ఆల జి ర్0 5. _ డా. నాగభైరవ కోటేశ్వరరావు... 69 6. శ్రీమతి మల్లాది సుబ్బమ్మ... ౨౨౨౨౨ రి? 7... డా. జె. బాపురెడ్డి, లుల 127 8. డా. పోతుకూచి సాంబశివరావు... 158
డౌ. గడియారం రామకృష్ణ శర్మ
70 శరత్తులు దాటిన ఎందరో మహాకవులు, పండితులు, విజ్ఞానవేత్తలు ఇంతవరకు ఈ వేదిక నుండి తమ జీవిత సాహిత్య విశేషాలను తెలిపినారు. సుప్రసిద్ద వ్యక్తులు మరణించిన తరువాత వారి జీవితాలను గురించి సిగపట్టుపట్టడంకంటే, ఊహపోహలు చేయడం కంటే వాళ్ళే తమను గురించిన విశేషాలు తెలపడం, అవి వెంటనే పుస్తకరూపంలో (ప్రకటన కావడం చాలమంచిది. ఈ 'పరిణతవాణి” కార్యక్రమంలో అసాధారణ మేధావులు, రచయితలు, కళావేత్తలు తమతమ అనుభవాలను తెలపడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కేవలం 70 సంవత్సరాలు దాటడమే ప్రధానార్హత కలిగిఉన్న నావంటి వాణ్ణి పిలిచి ఈ శీర్షికలో మాట్లాడమనడం సముచితంగా లేదని అనుకుంటున్నాను. అయితే మధుర పదార్థాలు తిన్న తరువాత నాలుకకు చింతకాయ పచ్చడి రాచుకున్నట్టుగా నా మాటలు ఉపయోగపడవచ్చు.
నేను అనంతపురం జిల్లాలో కదిరి తాలుకా బాబా సాహెబ్ పల్లెలో పుట్టినాను. నా తల్లిదండ్రులు గడియారం జ్వాలాపతిశా(స్తిగారు, తల్లి వెంకట సుబ్బమ్మ. నా జన్మతిథి కాళయుక్తి సంవత్సర ఫాల్గుణ శుద్ద చవితి. అది 1919 మార్చి రవ తేది అవుతుంది. మా తండ్రిగారు ఉభయ శాఖలలో దిట్టమైన యాజ్జికులు. షోడశకర్మలు చేయించగలవారు. జ్యోతిషములోను మంచి ప్రజ్ఞ కలవారు. లౌక్యులు-కోర్టు వ్యవహారాలు వారికి కొట్టిన పిండి. ఆనాటి మా ఆర్థికస్థితి బాగుండేది. అయితే చుట్టు పక్కల (గ్రామాల (ప్రముఖులతో పార్టీలు కట్టి వ్యవహారాలు చేసి ఆస్తినంతా పోగొట్టుకున్నారు. నాకొక పినతండ్రి - రామశర్మ ఆయనకు యాజ్జిక - జ్యోతిషాలతో పాటు సాహిత్య జ్ఞానం కూడా ఉంది. దా. గడియారం రామకృష్ణ శర్మ [1
చిన్నతనంలో కుటుంబ పరిస్టితులు బాగులేక నా చదువు సరిగా సాగలేదు. మా ఊళ్ళోని రామాలయంలో కోమటి చలమయ్య సారు దగ్గర ఇసుక ఓనమాలు దిద్దినాను. 8 ఏండ్ల వయసు వచ్చేవరకూ ఆ పల్లెలోనే ఉండిన తరువాత కదిరి పట్టణానికి మా కాపురం మారింది. అక్కడి హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో చేరి 5వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ స్కూల్లో మా తెలుగుసారు శ్రీ, వి. ఖండేరావుగారు, మంచి రూపము - శ్రావ్యకంఠము, సంగీత జ్ఞానము కలిగి ఉండేవారు. మాకు తెలుగు పద్యాలు (శ్రావ్యంగా చదివి పారం చెప్పుతూంటే ప్రక్క తరగతుల విద్యార్దులు కూడా తమ పారాలు వదలి పద్యాలు వినేవాళ్ళు. వారి బోధన వల్ల నాకు తెలుగు మీద ఆసక్తి కలిగింది. అయితే కదిరిలో కూడా మేం చాలా కాలం ఉండేలేదు. మళ్ళీ మా కాపురం తాడిపత్రి తాలుకా శింగవరం (గ్రామానికి మారింది. ఆ ఊళ్ళో ఎలిమెంటరీ స్కూలులో కవ తరగతి వరకే ఉంది. ఒకే టీచరు ఉండేవాడు. చదువు సంధ్యలు లేకుండా కొందరు పిల్లవాండ్లను వెంటేసుకొని తోటలు దొడ్లూ తిరుగుతూ ఉండేవాడిని, మా చిన్నాయనగారు బలవంతంగా కూర్చోబెట్టి ఆం్రనామసం([గ్రహం, అమరకోశం రెండు కాండలు చెప్పినారు. నన్ను పురోహితుణ్మి చేయవలెనని మానాన్నగారు నాకు 7వ యేటనే తిరుపతి కొండ మీద ఉపనయనం చేసి యాజ్జిక మంత్రాలు (ప్రారంభించి నారు. కొంత భాగం నేర్చుకున్నాను. అప్పటి నైజాం ఇలాఖా అలంపూరులో మా అక్కయ్యను ఇచ్చినారు. మా బావ ఒకసారి శింగవరం వచ్చినప్పుడు నా స్థితి చూసి నన్ను అలంపూరికి తెచ్చినారు. అక్కడ ఉర్జూమీడియంతో ఒక మిడిల్ స్కూలుంది. దాన్ని 'మదరసే వస్తానియా' అనే వాళ్ళు. అలంపూరులో నాకు అన్న వరుస అయిన టి. కృష్ణశర్మగారు నాకు ఉర్జూ అక్షరాలు, ఖాయిదా (1వ తరగతి వాచకం) నేర్చి, 4వ వాచకం వరకు చెప్పి 6వ తరగతిలో చేర్చినారు. మా తరగతిని 'జమాతె షషమ్' అనేవారు. అన్ని సబ్బక్టులూ ఊర్జూ లోనే చెప్పేవాళ్ళు. 6వ తరగతి ఉరూ వాచకం మా అన్నగారి సాయంతో చదువుకున్నాను, ఇంగ్లీషు రీడరు కూడా అర్హమయ్యేది. లెక్కలే అర్ధమయ్యేవి కావు. అప్పుడు మాకు తెలుగు రెండవ భాష కవ తరగతి సరస్వతీ వాచకం ఉండేది. సంవత్సరం పరీక్షల్లో నాకు తెలుగు - ఇంగ్రీషు -చరిత్రలలో మంచిమార్కులు వచ్చినా లెక్కల్లో 7 మార్కులు వచ్చి "ఫీల్ అయినాను. అంతటితో నా బడి చదువు ముగిసి పోయింది. అప్పుడు నా వయస్సు 12 సంవత్సరాలు. అలంపూరులో చదువుకుంటున్న కాలములో నాకు తెలుగు మీద విశేషాభిమానం కలిగింది. ఆ రోజుల్లో మా అన్నగారు ఆంధ్ర (ప్రచారిణీ (గ్రంథమాల, సరస్వతీ 2 పరిణతవాణి ప్రసంగాలు
(గ్రంధముండలి, వేగుచుక్క[గ్రంధమాల వాళ్ళు (ప్రకటించే నవలలను తెప్పించేవారు. చాలా పరిశోధక నవలలు, సాంఘిక నవలలు, చారిత్రక నవలలు వచ్చినాయి. చాలా ఇష్టంతో వాటిని చదివే వాణ్ణి. మధిర సుబ్బన్న దీక్షితుల వారి కాశీమజిలీ కధలూ వచ్చినాయి. అన్నీ రసవంతంగా ఉండేవి. వెంకట పార్వతీశ్చర కవుల ఏకాంతసేవ, కావ్యకుసుమావళి, ఖండ కావ్యాలు కూడా అప్పుడే వచ్చినాయి అన్నిటిని చదవడం వల్ల తెలుగు సాహిత్యం మీద అభిరుచీ, ఆసక్తీ బాగా కలిగినాయి
ఉర్దూ చదువు చాలించుకొని శింగవరానికి తిరిగి వచ్చినాను. ఆ ఊరు పల్లెటూరు. చిత్రావతీ నదీ తీరంలో ఉంది. ఊటకాలవల ద్వారా వచ్చిన నీటితో వరి, ఆకుతోటలు, చీనా పండ్ల తోటలు సాగు చేసేవాళ్ళు. రైతులలో హిందువులూ ముస్లింలూ ఉన్నా అన్నదమ్ములవలె కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మాది పురోహీత కుటుంబం. రాత్రి భోజనాలు చేసి రైతులు హిందూ ముస్లిం భేదం లేకుండా మా ఇంటికి వచ్చి లోకాభిరామాయణం సాగించేవాళ్ళు. మా చిన్నాయనగారిని ఏదైనా పురాణం చెప్పడంని వేధించే వాళ్ళు. విధిలేక ఆయన ఒప్పుకున్నారు. నేను చదవడం, ఆయన అర్హం చెప్పడం (ప్రారంభమైంది. ఈ విధంగా ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం, రంగనాధ రామాయణం మూడూ రెండు సంవత్సరాలలో పూర్తి చేసినాము. ఈ పురాణపఠనం వల్లనా సాహిత్యజ్ఞానంతోపాటు ఆసక్తీ ఎక్కువైనాయి. నాకంఠం కూడా ఇంపుగా ఉండేది. నేను పద్యాలు చదివితే (శ్రద్ధగా వినేవాళ్ళు.
పగటిపూట పౌరోహిత్యం మంధ్రాలు మా చిన్నాయనే చెప్పేవారు. మాది సమష్టి కుటుంబం. మా నాయనగారికి కోర్టు వ్యవహారాలతో తీరిక ఉండేది కాదు. గుత్తి- అనంతపురం-మదరాసు హైకోర్టు వరకు తిరుగుతూ ఉండేవారు. మా పెద్దలుకోరినట్టు నేను పురోహితుడిని కాలేకపోయినాను. మా పొరుగు [గ్రామం “లక్షుంపల్లె'లో భూపాళం రంగశాయిగారు అనే వైశ్యులు ఉండేవారు. ఆయన వీధి బడిపంతులు. చక్కని సాహిత్య జ్ఞానం కలవారు. మా నాన్నగారికి మిత్రులు, ఆయన దగ్గర మంచి నవలలు ఉండేవి. వాటి కోసం అప్పుడప్పుడు నేను ఆయన దగ్గరకు పోతూ ఉండేవాడిని. ఆయన తన దగ్గర ఉన్న వావిళ్ళ కంపెనీ ప్రకటించిన మనుచరిత్ర, వసుచరిత్ర, టీ కలతో ఉండేవాటిని నాకిచ్చి వాటిని చదవండని గట్టిగా చెప్పినారు. (శ్రద్దతో వాటిని చదువుతూ ఎక్కడైనా భావం అర్ధంగాకపోతే ఆయనతో తెలుసుకునేవాణ్ణి ఆ మహాప్రబంధాలు చదవడం వల్ల ఆంధ్ర సాహిత్యంలో ఒకపాటి జ్ఞానం కలిగింది. ఆయన బలవంతం వల్లనే సులక్షణసారం' అనే ఛందో[గ్రంధాన్ని చదివినాను. కవిత్వం మొదలు పెట్టినాను. ఆ పద్యాలు విని మా చిన్నాన్నగారు, రంగశాయిగారు నన్ను చాలా ప్రొత్సహించినారు. డా. గడియారం రామకృష్ణ శర్మ వ
అప్పుడు నాకు 16 ఏండ్ల వయస్సు, నా మొదటిపద్యం ఇట్టా ఉంది: జతి పార్వతి వరపుత్రా నీ పాదములంటి కొలుతు నిపుణత తోడన్ నా పాపము పోకార్పుము ఓపికతో నన్ను కావు ఓ కరివదనా”
ఈ విధంగా పద్యాలు రాయడం మొదలుపెట్టి ఎన్నో వ్రాసినాను. (క్రమంగా వృత్తాలు, జాతులు, ఉపజాతులు అభ్యాసం చేసినాను నేను కవిత్వం వ్రాయడం. మా చిన్నాయనగారు మెచ్చుకున్నా మా నాయనమ్మకు ఇష్టముండేది కాదు. కవిత్వంలో విషబీజాలు, విషగణాలు ఉంటాయనీ, పొరపాటున అవి పద్యాలలో పడితే రాసిన వాళ్ళ కొంపలు కూలుతాయనీ ఆమె పెద్దవాళ్ళు చెప్పినారట. ఆ నమ్మకంతో రాయవద్దని నన్నూ, మెచ్చుకుంటున్నందుకు మా చిన్నాయననూ చెడతిట్టేది. ఆయన వినేవాడు కాదు. ఆయన (ప్రోత్సాహమే నా వ్యాసంగాన్ని ముందుకు పోనిచ్చింది.
నాకు సంస్కృతం చదవాలని కోరిక ఉండేది. మా చిన్నాయనగారి దగ్గర కావ్య పాఠం కుదరలేదు. మా ఊరికి రెండు మైళ్ళ దూరంలో తిమ్మంపల్లి ఉంది. ఆ ఊరివాళ్ళు కొందరు తమ పిల్లలకు సంస్కృతం నేర్పించవలెనని ఒక సంస్కృత పండితుణ్ణై పిలిపించుకున్నట్టు తెలిసింది. నేను పోయి వారిని దర్శించినాను. నా కోరిక విని నన్నూ వచ్చి చదువుకో అన్నారు. రఘువంశం (ప్రారంభించినారు. వారు వైష్ణవులు. రఘువంశ కావ్యంలో (ప్రథమ సర్గ పార్వతీపరమేశ్వరుల స్తుతితో ప్రారంభమైంది. “జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్చరౌ” అని ఉండడంతో వారు నాకు (ప్రథమసర్ల్గ విడిచి దశమ సర్గతో పారం మొదలుపెట్టినారు. అక్కడి నుంచి దశరధుని పాలన మొదలవుతుంది. నా దురదృష్టం వల్ల ఈసర్ల్గ కూడా పూర్తి కాలేదు. వారికి స్వగ్రామంలో ఏదో అవాంతరం వచ్చి వెళ్ళిపోవడంతో నా నంస్కృతాభ్యాసం అంతటితో ఆగిపోయింది. భూపాళం రంగశాయిగారూ, మా చిన్నాన్నగారూ నన్ను ఏదైనా కధను తీసుకొని చిన్న కావ్యం రాస్తే బాగుంటుందని నా వెంటపడినారు. నాకూ ఆ విషయం నచ్చింది. నేను 5వ తరగతి చదివినప్పుడు నావాచకంలో ఉండిన చం(ద్రహాసుని కథ తీసుకున్నాను. కావ్యారంభం చేసినాను. కృత్యాద్యవస్థ అంటే ఏమో అప్పుడు నాకు అర్థమైంది. నాకు చిన్నతనం నుంచీ ఇష్టదైవమైన హనుమంతునకు అంకితమిచ్చినాను. నా పద్యరచనలో కొంత మార్పు వచ్చింది. అప్పటి పద్యాలు కావ్యావతారికలో ఇట్టున్నాయి:
తే పరిణతవాణి ప్రసంగాలు
“అష్టాదశ హాయనములు , కష్టంబులలోన గడచెగదయింతేనిన్,
తుష్టి నెరుంగను బహువిధ, చేష్టలలో నేటి రాముసేవ నెరుంగన్
తేనె సోనలు గురిసెడు తెలుగుకైత , వాసిగాంచదు గీర్వాణవాణి లేక
ఎంత సౌందర్యవతియైననేమి? ఇంతి ఆశ్రయము లేక రాణింపనగునె భువిని”
ఈ విధంగా కవిత సాగి రెండు ఆశ్వాసాలతో కావ్యం ముగిసింది వర్షనలను పూర్వ కావ్యాల నుండి [గ్రహించి అనుకరించినాను. మా చిన్నాన్న, రంగశాయిగారు విని చాలా మెచ్చుకున్నారు. ఇందులో ఎన్నో దోషాలుంటాయనీ, పండితులతో తప్పులు దిద్దించుకోవాలనీ అనుకున్నాను. మా (ప్రాంతాలలో గొప్ప విద్వత్కవులు కడపలో ఉండే 'కావ్య సృతి తీర్ట' జనమంచి శేషాద్రిశర్మ గారు. కడపకు పోయి వారిని 'ప్రార్టించినాను. వారు నన్ను యక్షప్రశ్నలతో ముంచినారు. ఏమి చదివినావు? ఎవరి దగ్గర చదివినావు. పంచకావ్యాలైనా ముగించినావా? తెలుగులో ఏ (గ్రంధాలు చదివినావు? ఎక్కడ? బాలవ్యాకరణం చదివినావా? ఈ ప్రశ్షలకు ఉక్కిరిబిక్కిరైనాను. ఎవరి దగ్గరా ఏమీ చదవలేదని, ఛందస్సు నేర్చుకొని పద్యాలు అల్లినాననీ దయచేసి తప్పులు సవరిస్తే తమకు కృతజ్ఞుడనై ఉంటాననీ [ప్రాధేయపడినాను. ఆయన హేళనగా నవ్వుతూ “నాయనా నీవు బమ్మెరపోతనవలే సహజపండితుడవు. నీయంత వాడే నీగ్రంధాన్ని పరిశీలించడానికి అర్హుడు. అట్టాంటి వారు చాలా మంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళకు చూపించు” అన్నారు. నాకు దుఃఖం కలిగింది. ఆ సమయంలో అక్కడ రాజమండ్రి వారు మల్దాది లక్ష్మీనరసింహశా'స్త్రి గారు ఉండిరి. వారి పని ముగిసినందున లేచి బైటికి వచ్చిరి. నేనూ వారి వెంటే వచ్చినాను. అప్పుడు కడపలో అప్పఅయ్యరు హోటలు ప్రసిద్దికలది. శాస్త్రి గారు అక్కడున్నారు. నన్ను తమ బసకు తీసుకొని పోయినారు. నా సంగతులు విచారించి నా పద్యాలు కొన్ని విన్నారు. “నీ పద్యాలు బాగున్నాయి, సంస్కృతం చదివితే రాణిస్తావు' అన్నారు. ఈ కవిత్వం చాలించు, నాకు తెలిసిన పండితులున్నారు. వారు చాలా గొప్పవారు. నీకు తప్పక విద్య చెప్తారు. వెళ్ళు' అని వెంటనే సుప్రసిద్ధ శతావధానులు శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారి అడ్రసు రాసి ఇచ్చిరి. “మొదట ఉత్తరం రాసి కనుక్కో' అన్నారు. నేను హతాశుబ్ఞయి మా ఊరికి చేరుకున్నాను. ఇల్లు చేరగానే శ్రీ శాస్తిపాదులకు నా స్థితిని నివేదించుకున్నాను. వెంటనే వారు
అను(గ్రహించి రమ్మని (వ్రాసినారు. అక్కడికి వెళ్ళడానికి అప్పుడు 1937లో 10-12 రూపాయలు సరిపోతాయి. కాని ఆ డబ్బు ఎవరిస్తారు? ఇంట్లో చెప్పితే పోనీరు. ఎట్లో అవస్థలు పడి మిత్రుల సాయంతో శ్రీ గురుపాదుల సన్నిధి చేరుకున్నాను. దా. గడియారం రామకృష్ణ శర్మ క్
(బ్రహ్మశ్రీ, వేలూరి శివరామశా'స్తిగారి జన్మస్టానము కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా “చిరివాడ' అగ్రహారం. వారి ధర్మపళ్ని నూతృశ్రీ కామమ్మ గారికి ఆరోగ్యం బొత్తిగా బాగులేక వాతావరణం మార్చుకై చిరివాడ వదలి, తేలప్రోలు ఎస్టేటుకు చెందిన 'కౌత్త సూరవరం'” బైట ఒక తోటను కొని పాకలు వేసుకొని కాపురముంటున్నారు. నేను వెళ్ళిన సమయంలో వారి దగ్గర ఇద్దరు విద్యార్దులు కావ్యాలు చదువుతున్నారు. వాళ్ళు రోజూ ప్రక్క ఊళ్ళో నుంచి వచ్చి పారాలు చెప్పించుకొని సాయంకాలం పోయేవాళ్ళు. అప్పుడే 'మేఘసందేశం' ప్రారంభించినారు. శాస్త్రులు గారు నా చదువును విచారించి నారు. నా కవిత్వం విన్నారు. నన్ను వాళ్ళతో కలిసి మేఘసందేశం" చదువు అన్నారు. నాకు రఘువంశం, కుమారసంభవం చదవక ఒక్కసారి ఈ కావ్యం మొదలుపెట్టడం వల్ల కష్టంగా ఉండేది. ఆ పాఠం (ప్రాచీనపద్ధతిలోసాగేది. శోకంతోపాటు పదచ్చేదం, అన్వ్నయ(క్రమంలో అర్ధం, శ్ఞోకభావం, ఆకాంక్ష, ధాతు శబ్దరూప సమాసాలు, చెప్పేవారు. మొదట్లో అన్నయ(క్రమం జ్ఞాపకం పెట్టుకోవడానికి పదాల మీద అంకెలు వేసుకొనేవాణ్ణో. పూర్వమేఘం ముగించేప్పటికి ఆ బాధ తప్పింది. రాత్రుల పూటశబ్దాలు - ధాతువులు వల్లించడం వల్ల “ఆకాంక్ష సులభమైంది. మేఘసందేశం ముగించడంతో '“భారవి" మొదలుపెట్లినారు. నాకు వ్యాఖ్యానం చదివిశ్ళోకాన్ని అర్ధం చేసుకొనే పరిజ్ఞానం కలిగింది. 1-2 పదాలు తెలియకపోయేవి. రోజుకు 2-3 శ్లోకాలు చదివి చెప్పేవాణ్ణి నా సహాధ్యాయులకు అది కష్టమైంది. ఒక వ్లోకం చాలని గురువుగారితో చెప్పించుకొనేవాళ్ళు. వాళ్ళకు వ్యాఖ్యానం అన్సయించుకునే జ్ఞానం కలగలేదు. శాస్త్రులు గారికి నా ఆసక్తి ఆర్జ్హమైనా వాళ్ళను మించిపోకుండా ఉండడానికి చిన్న ఆటంకం కలిగించినారు. ఏ రోజు క్లోకాన్ని ఆరోజు తెలుగు పద్యంలో అనువదించి చూపునట్టు ఆజ్ఞాపించినారు. భారవి మొదటి శ్లోకం “శ్రియఃకురూణాం అధిపస్య పాలనీం (ప్రజాసువృత్తిం యమయుక్ర వేదితుం | సవర్షలింగీ విదిత సృమాయయౌ, యుధిష్టిరం ద్వైతవనే చరః” దీన్ని నేను అదే వృత్తంలో అనువదించి వినిపించినాను. నా అనువాదమిట్టుంది: “సుయోధన, శ్రీలను ఏలునట్టిదౌ, జన'్రవృత్తిన్ గననేని పంచెనో ఎరింగి ఆ భిల్లుడు బ్రహ్మచారినా యుధిష్టిరున్ ద్వైత వనిం గనెన్ జనెన్ ” ఈ అనువాదాన్ని గురువుగారు ఆమోదించలేదు. “తెలుగులో ప్రసిద్దమైన వృత్తాలతోనే అనువదించవలెగాని, ఇట్లా సంస్కృతవృత్తాలలో అనువదించరాదు. గణనియమంతోపాటు యతిప్రాసలు అవసరం" అన్నారు. రెండు నెలలు అట్టే సాగించినాను. నా ఆవేదనను అర్జం చేసుకున్న గురువుగారు నాకు వారితోపాటు 6 పరిణతవాణి ప్రసంగాలు
శావ్యపారాన్ని, నాకు మాత్రమే చంద్రాలోకాన్నీ ప్రారంభించినారు మాఘం మొదలు పెట్టగానే, కువలయానందం అనే అలంకార (గ్రంధాన్నీ, లఘుకాముది అనే వ్యాకరణాన్నీ మొదలు పెట్టినారు. రాత్రిపూట కావ్య - అలంకారాలనూ, తెల్లవారు జామున వ్యాకరణ సూత్రాలనూ వల్లించేవాణ్ణి, నీలున్నప్పుడు చదువుతూ రఘువంశ కుమార సంభవాలు ముగించినాను. నాకు పారాలు భారంగా ఉన్నా సమయం కలిసి వస్తున్నందుకు ఉత్సాహంగా ఉండేది.
శా(స్తులు గారు అప్పుడు ఆంధ్ర పత్రిక వారి కొరకై గాంధిగారి “ఆత్మ కధ'
రెండవ భాగాన్ని అనువదిస్తున్నారు. శరత్ నవలలు, 'బాపనపిల్ల' "కట్టు తప్పిన పిల్ల" అనువదించినారు. అప్పుడప్పుడు మీర్జాపురం జమీందారు గారి కారు వచ్చి గురువుగారిని తీసుకొనిపోతూ ఉండేది. రాజా గారితో వారి కున్న అనుబంధం వల్ల ఆయన తీయదలుచుకున్న 'కృష్ణ జరాసంధ' సినీమాకు కధ - మాటలు (వ్రాయవలసి వచ్చింది. అందుకై అప్పుడప్పుడు గురువుగారు మదరాసుకు పోయి వస్తూ ఉండేవారు. ఆ సమయాలలో నేను నా సహాధ్యాయులకు కావ్యపారం చెప్పుతూ ఉండేవాడిని. వారి (గ్రంధాలయంలోని విలువైన (గ్రంధాలను చదువుతూ నోట్సు (వ్రాసుకుంటూ ఉండే వాడిని. పాలేరు సాయంతో పంటలు పెట్టించడం, కోతలు కోయించడం చేసేవాడిని. పంటలకు నీళ్ళు పెట్టడానికి బావికి వేసిన ఇంజిను ఆడించి పంపుసెట్టుతో నీళ్ళు పారించేవాడిని. కేవలం విద్యార్థి వలె కాక కొడుకు వలె ఇంటి పనులన్నీ చేసేవాణ్ణి. గురుదేవులకు నాపట్ల అపేక్షానురాగాలుండేవి. ఈ విధంగా తోటలో నా విద్యాభ్యాసం ౩ సంవత్సరాలు అపూర్వంగా సాగింది.
'కృష్ణజరాసంధి సినిమా షూటింగు (ప్రారంభమైంది. అప్పుడు నేనూ వారి వెంట మదరాసుకు పోయినాను. రాజాగారు మాకు మైలాపూరులోని 'లజ్చర్చ్రోడ్డు'లో ఒక బంగళాను వసతిగా ఏర్పరచి వంట (బ్రాహ్మణి నియమించినారు. అక్కడ ఉన్నప్పుడు “త్రిలింగ విద్యాపీఠం'లో పండితుల ఉపన్యాసాలు జరుగుతుండేవి. గురువుగారు నన్ను తమ వెంట తీసుకొనిపోయేవారు. ఎందరో దిగ్గజాల వంటి పండితులు బ్రహ్మశ్రీ దెందుకూరు నరసింహశా(స్రిగారు వంటి వారల దర్శనభాగ్యం కలిగింది.
నా దురదృష్టం నన్ను వదలలేదు. నన్ను వెంటాడుతూనే ఉంది. సరిగ్గా అప్పుడే అలంపూరులో మా బావగారు అకాలమరణం చెందినారు. వెంటనే రమ్మని మా నాన్నగారు రాసిన ఉత్తరం సూరవరం తోటకు పోయి ఆలస్యంగా మదరాసు చేరింది.
గురువుగారు చింతిస్తూ 'నీవు రేపు ఉదయం వెళ్ళు. అక్కడి పరిస్థితులు చక్కబడగానే తోటకు వచ్చేయ్' అని వెంటనే కర్నూలుకు టికెట్ ఇప్పించి మరునాడు డొ. గడియారం రామకృష్ణ శర్మ 7
కారులో నన్ను మదరాసు సెంట్రల్ స్టేషనుకు తీసుకొని వచ్చి రైలెక్కించి, కొంత డబ్బు ఇచ్చినారు. వారి అవ్యాజనురాగం చిరస్మరణీయమైంది. దురదృష్టవంతుణ్ణై మళ్ళీ వారి సన్నిధికి వచ్చే అవకాశం లభించలేదు. నా చదువుకు ముక్తాయింపు జరిగింది.
1940లో అలంపూరు చేరిన తరువాత కోర్టు వ్యవహారం రెండేండ్లు సాగించి ఆస్తిని మా అక్కగారిపేర చేయించినాను. భూములు, ఇల్టు స్వాధీనం చేసుకున్నాము. నగదుడబ్బు, నగలు మా అక్కయ్య అత్తగారు తీసుకొని బిడ్డ ఇల్టు చెరుకున్నారు. ఈ వ్యవహారం ముగిసింది.
ఈ కాలంలో నాకు ఉండవెల్లి గ్రామవాసులు సరసులు, సాహిత్వాభిమానులు అయిన దుంపలి రామిరెడ్డి గారి పరిచయ భాగ్యం కలిగింది. అదొక అదృష్టం. వారు తమ (గ్రామంలో తాము స్థాపించిన సరస్వతీ విలాసపుస్తకభాండాగారాన్ని నాకు అప్పగించినారు. తరచుగా సేను వారితో ఉండవెల్లికి వెళ్ళుతూ అక్కడి సాహిత్య, చారిత్రక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక (గ్రంథాలను తెచ్చుకొని చదివినాను. అక్కడ లేనివి, నాకు కావలసినవి అయిన పుస్తకాలను వావిళ్ళ కంపెనీ వంటి (ప్రచురణసంస్థల నుండి వి-పి లు తెప్పించి ఇచ్చేవారు. ఈ విధంగా నా సాహిత్యవ్యాసంగం నిరంతరాయంగా సాగింది. ఆయన నా చేత అలంపూరు క్షేత్రాన్ని గురించి 5 పుస్తకాలు రాయించి 'ప్రచురించినారు. సాధారణంగా రచయితలు తమ రచన ఎట్టా అచ్చవుతుందా అనే చింతతో నానా బాధలు పడతారు. కాని నాకు వారి సహకారం వల్ల ఆ దుర్గతి పట్టలేదు. నన్ను ఏదైనా వ్రాయండని ప్రేరేపించి త్వరగా ముగించేట్లు తొందరపెట్టి వెంటనే ముద్రణ చేయించి ఇచ్చేవారు. ఇది అపూర్వసహకారము, వారొకసారి “ఆలంపుర క్షేత్ర మాహాత్మ్యము” అనే ఒక సంస్కృతం (వ్రాతప్రతిని తెచ్చియిచ్చి దీన్ని పరిష్కరించండని కోరినారు. నేను పరిష్కరించి విపుల పీఠికతో ప్రచురించినాను.
వారికి అంకితమిస్తూ ఇట్టా స్తుతించినాను: “అవ్యాజప్రణయంబుతో వలయు (గ్రంధాళిన్ ప్రసాదించుచున్ నావ్యాసంగము పెంచి సాయములు నానారీతులన్ సల్పుమీ భవ్యస్నేహ సుధాస్రవంతికి నమో వాకంబు లర్పించి ఈ దివ్యోపాయనమిచ్చుచుంటి బహుట్రీతిన్ మిత్ర చూడామణీ” “జరయున్పైకొనె, రోగముల్ ప్రబలె, క్షేశంబుల్ కడున్ హెచ్చె, ఈ తరుణంబందును స్టైర్యమున్ విడక విద్యాపోషణాసక్తిచే పరామేశార్చన చేయబూను మిము సంభావించి మీ యట్టులే చరితార్హం బొనరించికొందు భవమున్ సారస్వతోపాసనన్”
8 పరిణతవాణి ప్రసంగాలు
ఈ విధంగా శ్రీదుంపలిరామిరెడ్డిగారు నాకు చిరస్మరణీయులు. వారి బుణము తీర్చుకోలేనిది.
నేను రాజకీయరంగంలో ప్రవేశించడం చిత్రంగా జరిగింది. ఆనాటి నైజాం నిరంకుశపాలన ప్రజలకు కంటక ప్రాయంగా ఉండేది. 1941లో ఒకసారి ఒక నాటక కంపెనీ వాళ్ళు అలంపూరికి వచ్చి డేరా వేసుకున్నారు. అది బాగా (బ్రతికి చితికిపోయిన సురభి కంపనీలో ఒక భాగం. అంతా కుటుంబ సభ్యులే నటులు. అప్పుడు నాటక ప్రదర్శనానికి తహసీల్దారు, పోలీసు అమీన్సాబు (ఎస్ఐ) అనుమతి ఇస్తేనే అది జరుగుతుంది. అందుకు ఆ రెండు ఆఫీసుల వాళ్ళకూ ముడుపులు చెల్లించుకొని అనుమతి సంపాదించుకున్నారు. ఒకనాడు హరిశ్చంద్ర నాటకం ఆడుతున్నారు. మేం కొందరు యువకుల టికెట్టు కొని నాటకానికి పోయినాము. అనుభవజ్ఞులైన నటీనటులు చక్కగా నటిస్తున్నారు. కాటిసీను జరుగుతున్నది మరణించిన కొడుకు శవం మీద పడి చంద్రమతి విలపిస్తున్నది. ఇంతలో బాగా తాగివచ్చిన పోలీస్ మొహరిర్ సాబ్ (అంటే రైటరు) డేరాలోకి 1-2 కానిస్టేబుళ్ళతో వచ్చినాడు. ఉర్దూలో నాటకం వాళ్ళను తిడుతూ ఈ ఏడుపు పాటలు చాలించి మంచి గజళ్ళు పాడు అని చంద్రమతిని గద్దించినాడు. ఆమెకు దిక్కుతోచక భయపడి చూస్తున్నది. నేను చెప్పితే పాడవా అని స్టేజిమీదికి పోయి ఆమెను కొట్టబోయినాడు. ప్రేక్షకులు ఒక్కరూ ఇదేమని అడగలేదు. నటులు కాళ్ళావేళ్ళాబడితే తంతున్నాడు. మాకు రక్తం వేడెక్కింది. పది మందిమీ స్టేజిమీదికి ఉరికినాం. 'ఇది నాటకళాల. ఇక్కడ నీ దౌర్జన్యం సాగనీము. ఆమె నీవు చెప్పినట్లు పాడదు. మర్యాదగా ఇక్కడినుంచి వెళ్ళిపో అన్నాము. అతను రెచ్చిపోయి దుర్భాషలాడుతున్నాడు. కొందరు (ప్రేక్షకులు మాతో కలిసినారు. పరిస్టితి విషమిస్తూ ఉండడంతో వెంట ఉన్న పోలీసులు అతణ్ణి లాగుకొనిపోయినారు. నాటకం యధాప్రకారం సాగింది. ఈ సంఘటన మాకు ఉత్తేజం కలిగించింది. మరునాడే (గ్రామంలోని యువకుల సమావేశం జరిపినాము. అప్పుడే “ఆం[ద్ర యువజన నాట్యమండలి” స్టాపించినాము. ఈ మండలి 10 సంవత్సరాలకాలం నాటక ప్రదర్శనలు ఇచ్చింది. నా పర్యవేక్షణలో మామండలి పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలను ఆడి ప్రజల మన్నన పొందింది. మా నాట్యమండలికి నేనే డైరెక్టరును - నాయకపొత్ర ధారిని.
పై సంఘటన తరువాత శ్రీ దుంపలి రామిరెడ్డిగారు. మాకు 'ఆం(ధ్ర మహాసభిను గూర్చి తెలిపినారు. వారు అప్పటికే అందులో సభ్యులుగా ఉన్నారు. 1941లోనే శ్రీ చిక్కేపల్లి రామచం[ద్రరావుగారు వచ్చి అలంపూరులో ఆంధ్రమహాసభ తాలూకా కమిటీని డా. గడియారం రామకృష్ణ శర్మ క్ర
ఏర్పరచిపోయినారు. ఆ కమిటీకి వకీలు సురవరం రాఘవరెడ్డి గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా నియమింపబడినాము. అప్పటినుండీ మేము తాలూకాలో ప్రచారము చేస్తూ పల్లెలలో (గ్రంధాలయాలు స్థాపించడం, రాత్రి పాఠశాలలు (ప్రారంభించడం, సభలు సమావేశాలు జరపడం చేస్తూ (ప్రజలలో చైతన్యం కలిగిస్తూ ఉండేవాళ్ళం జిల్హా సభలకూ, రాష్ట్ర సభలకూ వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. తాలూకాలోని మరికొందరు కార్యకర్తలు నాతో కలిసినారు. 1942 మే నెలలో వరంగల్టు దగ్గరి ధర్మవరంలో తొమ్మిదవ ఆంధ్ర మహాసభ, 1943 మే నెలలో హైదరాబాదు రెడ్డి హాస్టలులో దశమాంధ్ర మహాసభ జరిగినాయి. నేను మిత్రులతో కలిసి ఆ మహాసభలలో పాల్గొన్నాను. ఆ మహాసభలలో పద్యాలు రాసి ప్రబోధించేవాడిని. అవి ప్రజలను బాగా ఆకర్షించేవి. సభాంగణములో నేను కనబడగానే నాతో పద్యాలు చదివించండని గోల చేసే వాళ్ళు. రాష్ట్ర నాయకులైన శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులు గారికి, శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారికి, శ్రీ కొండా వెంకటరంగారెడ్డిగారికి నా పద్యాలు సరిపడేవి కావు. (ప్రజల అల్లరి భరించలేక నాతో 1-2 పద్యాలు చదివించే వారు. నేను అప్పటి పరిస్టితులకు అనుగుణంగా అప్పటికప్పుడు రాసి చదివే వాబ్దే. మచ్కుకు ఒక సందర్భం వినిపిస్తాను. మహాసభలప్పుడు మరునాడు ఉదయం సభలో ్రవేశపెట్టవలసిన తీర్మానాలను తయారు చేయడానికి ముందు రోజు రాత్రి స్టాండింగ్ కమిటీ సమావేశమై తర్జన భర్జనలు చేసి తెల్లవారే వేళకు మూడు తీర్మానాలు రూపొందించేవాళ్ళు, ఇందుకై వాదోపవాదాలు కొనసాగేవి. ఆంధ్ర పితామహులు తమ సహజ సమన్వయధోరణిలో నచ్చచెప్పిన తరువాత తీర్మానాలు ఆమోదించబడేవి. నేను నా పద్యాలలో రాత్రి గొడవలను ఉదయం సభలో వెల్లడించేవాణ్ణి. నా ధోరణి ఇట్లా ఉండేది: "అలవడ్డ రాజకీయ జ్ఞానమంతయు, వర్షింగుకై వ్యర్థపరచువారు మితవాదులై కొందరతివాదులై కొంద, రేటికి కాటికి ఈడ్భువారు ఉరుదులో ఒకరైన ఒక్కరింగ్లీషులో, తమ విద్హత చాటదలచువారు త్యాగంబు చూపించు తరిదాపురించిన, చల్లగా మెల్లగా జారువారు సాలుకొక సారి జరుగు జల్పాలలోన, వివిధ వేషాల తోడ దీపించువారు ఈ ప్రజాపతులందరు ఇంకనైన, త్యాగదీక్షను వహియించి తరలరాదె ॥ అప్పటి నా అనుభవాలను ఈ విధంగా అక్షర బద్దం చేసేవాణ్ణి. అందుకే నాయకులకు నా మీద కోపం. 10 పరిణతవాణి ప్రసంగాలు
1946లో 'అంజమనె ఇత్తెహాదుల్ ముసల్మెన్ ' అనే ముస్లిం సంస్ప అత్యాచారాలు నిజాం (ప్రభుత్వానికే దుర్భరమైనాయి. అప్పటి (ప్రధాని సర్ మోర్జా ఇస్మాయిల్ స్ట్రేట్ కాం[గైస్ మీద నిషేధం తాలగించినాడు. విడిగా పనిచేస్తూన్న ఆంధ్ర - కర్ణాటక - మహారాష్ట్ర మహాసభలు స్టేట్ కాంగ్రెస్‌లో విలీనమైనాయి. అదే హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్రోద్యమాన్ని కొనసాగించింది. నేనూ అందులో పాల్తొన్నాను. స్టేట్ కాం(గైస్ కార్యాచరణ సమితి (కౌన్సిల్ ఆఫ్ యాక్షన్) ఆదేశాల (ప్రకారం సరిహద్దులోని కర్నూలు క్యాంపులో ఉండి నిజాం (ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వార్తా బులెటిన్సు విడుదలచేస్తూ 'భాగ్యనగర్ రేడియో” ప్రారంభించి తీవ్ర ప్రచారం చేస్తూ ఇతర కార్యక్రమాలు సాగించినాను. శ్రీ పాగా పుల్హారెడ్డి గారితో కలిసి పనిచేసినాను. అప్పుడు నిజాం (ప్రభుత్వం 'దక్కన్ రేడియో' నిర్వహించేది. శ్రీ కురుగంటి సీతారామయ్యగారు అందులో (ప్రజలకు వ్యతిరేకముగా మాట్టాడుతుండేవారు. నేను ఆయన వాదాలను ఖండిస్తూ ఆయనను 'సతార్మియ్యా" అని ముద్దుగా పిలిచేవాడిని. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సిద్దించగా నైజాం నవాబు మొండిగా స్వాతంత్ర్యం ప్రకటించినాడు. ఆనాడే స్టేట్ కాంగ్రెస్ సత్యా(గ్రహాలు ప్రారంభించి ఉద్యమాలు తీవ్రతరం చేసింది. శ్రీ సర్దారు వల్లభభాయి పటేల్గారి రాజనీతి చతురత వల్ల హైదరాబాదు సంస్టానం మీద 'పోలీసు చర్య' జరిగి 1948 సెప్టెంబరు 17 తేదీన స్వాతంత్ర్యం సిద్ధించింది.
1942లోనే నేను సాంఘికోద్యమాన్ని చేపట్టవలసి వచ్చింది. అప్పుడు గద్వాల సంస్టానికి సంబంధించిన రామాపురం (గ్రామంలో ఒక పెద్ద రైతు కుమార్తె 12 సంవత్సరాల అమ్మాయికి భర్త మరణించినాడు. ఆ పసిబిడ్డకు 11వ దినమున కుంకుమ, గాజులు తీయించవలెనని నిర్ణయించినారు. ఈ సంగతి తెలిసిన అమ్మాయి నేను తీయనని పట్టుపట్టింది. అందువల్ల వంశగౌరవం - కుల గౌరవం నాశనమౌతా యని మూర్ధంగా తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు, వాళ్ళ ఇంటి పురోహితుడు తమ నిర్ణయం జరిగితీరవలెనని మొండికెత్తినారు. అమ్మాయి అన్న, అతని మిత్రులు ఆం(ధ్రమహాసభ కార్యకర్తలు నాకు సుపరిచితులు. నా దగ్గరకు వచ్చినా అభిప్రాయం అడిగినారు. నేను మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్కృతి, పరాశరస్మృతి పరిశీలించి ధర్మశా(స్తాలలో భర్త మరణిస్తే ఫలానా వస్తువులు తీసివేయవలెనని చెప్పలేదు, ఇవి ఇటీవల వచ్చిన ఆచారాలని చెప్పేనాను. నన్ను వాళ్ళ ఊరికి 10వ రోజున పిలుచుకొని పోయి సభ ఏర్పాటు చేసినారు. నేను సహేతుకంగా శా(స్తాధారాలు చూపించి భర్తపోతే గాజులు, కుంకుమ తీయనక్కరలేదని నిరూపించినాను. గ్రామ (ప్రముఖులు నా వాదాన్ని అంగీకరించినారు. మరునాడు ఆమెకు పాతగాజులు తీయించి కొత్తగాజులు డా. గడియారం రామకృష్ణ శర్మ 11
వేయించినారు. ఇది చాలా ్రచారమైంది. దీని తరువాత కర్నూలు జిల్లా నిడుజూరు నుండి ఒక మర్యాదగల అర్భక కుటుంబీకుడు వచ్చి తన కుమార్తె 10 సంవత్సరాల వయసులో వితంతువైంది, ఆమెకు వివాహము చేయడానికి శాస్తాలు అంగీకరిస్తాయా? చెప్పండి అన్నారు. నేను కందుకూరి వీరేశలింగంగారి పుస్తకాలు, ఈశ్చర చంద్ర విద్యాసాగర్ (గ్రంధాలు చదివిన వాణ్ణి. మళ్ళీ ఇందుకోసం ధర్మశా(స్తాలు పరిశోధించి నాను. బాల విధవా వివాహము శాస్త్ర సమ్మతమని, మీ అమ్మాయికి తప్పక పెండ్డి చేయండని చెప్పినాను. ఆ పెండ్డికి నేనూ వెళ్ళినాను. ఇది శాస్త్ర విరుద్దమని వాదించదలచిన వాళ్ళు వచ్చి వాదించవచ్చు అని పత్రిక ద్యారా ప్రకటించినారు. ఎవరూ రాలేదు. పెండ్లి నిర్విఘ్నంగా జరిగింది. ఈ విధంగా 5-6 బాల వితంతు పునర్వివాహాలు జరిపించినాను. నా సహకార్యకర్తల బలవంతం వల్ల 1943లో నేనూ స్త్రీ పునర్వివాహం చేసుకున్నాను. అలంపూరు బ్రాహ్మణ సంఘం వాళ్ళు నన్నూ, నా అనుయాయులనూ వెలివేసినారు. ఒక సంవత్సరకాలం బహిష్కారంలో ఉన్నా మాకేమీ ఇబ్బందులు కలుగలేదు. కాని ఈ సనాతనమ్మన్యులను ఆటపట్టించవలెనని 1944లో (బ్రాహ్మణుల మీద మాననష్టం దావా అలంపూరు మున్సిఫ్ కోర్టులో వేసినాను. మున్సిఫ్గారు సాహిత్యాభిమాని, నా మీద అభిమానం గలవాడు. (ప్రతిపక్షాలను పిలిచి మీరు రాజీ చేసుకోకపోతే చట్టం ప్రకారం శిక్షిస్తానని గట్టిగా చెప్పడంతో మా వెలి తీరిపోయింది. రాజీపడి కేసును ఉపసంహరించుకున్నాను. అప్పుడు నిజాం సంస్థానంలో 8 జిల్దాలు తెలంగాణంగా ఉండేవి. ఒక కోటి తెలుగు వాళ్లున్నారు. అందుకే ప్రసిద్ధ కవి దాశరధి 'నా తెలంగాణ కోటిరత్నాల వీణ” అన్నారు. (ప్రజలకు మాతృభాషలో విద్యాబోధన లేదు. ఉర్జూలో చదువుకోవలసి వచ్చేది. నేను ఆరవతరగతి వరక్రు ఉర్జూలోనే చదువుకున్నాను. ఈ విధంగా భాషా విషయికంగా (ప్రతికూల పరిస్టితులున్నప్పటికీ తెలంగాణాలో గద్వాల, ఆత్మకూరు, వనపర్తి, గోపాలపేట, జటప్రోలు, దోమకొండ మొదలైన సంస్టానాలుండి, అవి కవి పండితులను, కళాకారులను సన్మానిస్తూ, పోషిస్తూ ఉండడం వల్ల సాహిత్యం గణనీయంగా ఉండేది. ఆం(ధ్ర మహాసభా వేదికల మీద నుండి ప్రజల మాతృభాషలో విద్యాబోధన జరగవలెనని, విరివిగా తెలుగు పాఠశాలలను స్థాపించవలెనని తీవ్రంగా ఆందోళన జరుగుతుండేది. (ప్రభుత్వము అతి తెలివిగా మీ కోరికను మన్నిస్తాం, కాని తెలుగులో చదువు చెప్పగల పంతుళ్ళు లేరుగదా! ముల్కీ పంతుళ్ళు దొరికితే తెలుగు పాఠశాలలు ప్రారంభిస్తామని చెప్పేది. నిజాంలో (ప్రభుత్వ ఉద్యోగానికి ముల్కీనిబంధన ఉంది. ముల్కీ అంటే నిజాం ప్రాంతంలో పుట్టడం, నివసముండడం. ఆ విధంగా కలెక్టరేట్ నుండి ముల్కీ సర్టిఫికెట్టు సంపాదించవలె. అప్పుడు కూడా నిజమైన ముల్కీలకు ముల్కీ సర్టిఫికెట్టు 12 పరిణతవాణి ప్రసంగాలు
దొరికేది కాదు. బయటినుండి వచ్చిన వాళ్ళు వెయ్యి రూపాయల వరకు లంచం ఇచ్చి సులభంగా సాధించేవాళ్ళు. స్టానికులు బీదవాళ్ళు కావడం వల్ల ఏరిక్సి అందుబాటులో ఉండేదికాదు. ప్రభుత్వం వారి సమాధానం మన పెద్దలను అలోచింపచేసింది. 1943లో హైదరాబాదు రెడ్డి హాస్టలులో దశమాం[ద్ర మహాసభ జరుగుతున్నప్పుడు కొందరు ప్రముఖులు సమావశమై ఆం(ధ్రభాషా పప్రచారానికై 'నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు'ను స్ట్రాపించినారు. దాని స్టాపకులలో ఇప్పుడు నేను, శ్రీ బూర్గుల రంగనాధరావు గారు, శ్రీ కోదాటి నారాయణరావు గారు ముగ్గురము మాత్రము మిగిలిఉన్నాము. పరిషత్తు తెలుగు ప్రచారానికి అనేక ప్రణాళికలు చేపట్టింది. తెలుగు పరీక్షలను ప్రారంభించింది. (ప్రాథమిక - మాధ్యమిక - (ప్రవేశ పరీక్షలను చక్కని ప్రణాళికతో నిర్వహించింది. ప్రవేశపరీక్షను మెట్రిక్ పరీక్షతో సమానంగా (ప్రభుత్వం గుర్తించింది. వేల సంఖ్యలో అభ్యర్థులు పాల్లొని ఉత్తీర్ణులైనారు. తెలుగు బోధకులు లభించినారు. ప్రభుత్వం గత్యంతరం లేక తెలుగు పాఠశాలలను స్థాపించింది. ఉన్నత పారశాలల్లో తెలుగును బోధించడానికి విశారద పరీక్షను ప్రారంభించినాము. తెలుగు పండితుల కొరత తీరింది. పరిషత్తు యావదాం(ధ్రలోనే కాక, బెంగుళూరు, మదరాసు, బొంబాయి ప్రాంతాలలో కూడా పరీక్షా కేంద్రాలను స్టాపించి అక్కడి తెలుగు వారికి మాతృభాషాభిమానం కలిగించింది. ఆం(్ర సారస్వత పరిషత్తులో శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు, శ్రీ పులిజాల హనుమంతరావుగారు, శ్రీ నూకల నరోత్తమరెడ్డిగారు, నేను ముఖ్యకార్యకర్తలుగా ఉండి కలిసికట్టుగా పనిచేసినాము. నేను స్టాపక సభ్యుడుగా, ప్రచారకార్యదర్శిగా, పరీక్షా కార్యదర్శిగా, (ప్రధానకార్యదర్శిగా సేవ చేసినాను. ప్రస్తుతం ఉపాధ్యక్షుడుగా ఉన్నాను. పరిషదధ్యక్షులు ఆచార్య సి. నారాయణరెడ్డిగారు అభిమానంతో నాకు పరిషత్సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. కీ.శే. సురవరం (ప్రతాపరెడ్డ్గారి సహకారంతో శ్రీ, పి.ఎన్. శర్మగారు “సుజాత” అనే మాసపత్రికను ప్రారంభించి చక్కగా మూడేండ్లు నడిపినారు. తరువాత ఆగిపోయింది. ఆ పత్రికను నేను 1953లో పునరుద్దరించి, మూడేండ్డు నిర్వహించినాను. ఆ కాలములో నేను ప్రకటించిన “తెలంగాణా సంచిక”, "పరిషత్తు సప్రమవార్డిక సంచిక”లు ప్రజల మెప్పుపొందినాయి. నాకు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు మొదటిసారిగా 1940లో హైదరాబాదులో పరిచయమైనారు. ఆ తరువాత వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. 'గోలకొండ పత్రిక' ద్వారా, ఆం(ధ్రసారస్వత పరిషత్తు ద్వారా కలిసి పనిచేసే అదృష్టం కలిగింది. క్యాతూరులో 26వ ఆంధ్ర ఎశగ్రంథాలయ మహాసభలను కలిసి నిర్వహించినాము. డా. గడియారం రామకృష్ణ శర్మ 13
నా నివాసమైన అలంపూరు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము దక్షిణ వారణాసిగా పేరు పాొందింధి. అంతేకాదు (ప్రఖ్యాతి చెందిన చారిత్రక స్తలం కూడా. అక్కడ 7 శతాబ్ది నుండి 17 శతాబ్టి దాకా దక్షిణాపధాన్ని పరిపాలించిన రాజవంశాల వారు వేయించిన శాసనాలు 70కి పైగా ఉన్నాయి. బాదమీ చాళుక్య, రాష్ట్ర కూట, కల్యాణి చాళుక్య, కాలచుర్య, వైదుంబ, తెలుగుచోళ, కాకతీయ, విజయనగర వాస్తురీతులకు చెందిన అనేక దేవాలయాలున్నాయి. వైదిక షణ్మతాలకు చెందిన దేవమూర్తులున్నాయి. రసవిద్యకు సంబంధించిన ఓషధులు, పాషాణాలు ఉన్నాయి. తాంత్రిక విద్యలకు సంబంధించిన సాంకేతిక చిహ్నాలున్నాయి. పట్టణ పరిసరాలలో చరిత్ర కందని కాలపు సమాధులున్నాయి. వీటివల్ల అదొక పురాతత్త్యశాస్త్ర పరిశోధకులకు, చరిత్రకారులకు, వాస్తు శాస్త్రజ్ఞులకు, శాసన పరిశోధకులకు, దైవభక్తులకు, రసవాదులకు యాళత్రాస్టలంగా ఉంది. దేశ విదేశ యాత్రికులు వస్తూ ఉంటారు. అక్కడ పడిఉన్న శిలాశాసనాలు నాలో జిజ్ఞాసను కలిగించినాయి. వాటిల్లో ఏమి రాసే ఉందో తెలుసుకోవాలనే కోరిక బలమైంది. అందుకై “ఇండియన్ 'పేలియా(గఫీ
- ఇండియన్ ఎపిగ్రఫీ”ని గూర్చిన (గ్రంధాలు తెప్పించినాను. అన్నీ ఇంగ్లీషులో ఉన్నాయి. నేను చదువలేను. నా బడి చదువు 6వ తరగతి వరకే. ఆ మహాగ్రంధాలు నా వంటి వానికి ఏమర్దమౌతాయి! 'రెన్ అండ్ మార్టిన్ అనే ఇంగ్రీషు వ్యాకరణాన్ని ఒక ఉపాధ్యాయునితో చెప్పించుకున్నాను. నాకు కలిగిన అల్పజ్ఞానంతో ఆ “లిపిశాస్త్ర - శాసన శాస్తా"లను చదువుకున్నాను. శాసన పరిశోధన మొదలుపెట్టినాను. దాదాపు శాసనాలలోని (బ్రాహ్మీ వేంగీలిపి, తెళుగన్నడలిపి, కన్నడలిపి, తెలుగులిపి, నాగరలిపులను అక్షరాలు -గుణింతాలతో తెలుసుకున్నాను. అలంపూరులోని ఇంచుమించు అన్ని శాసనాలకు పాఠాలు తయారుచేసినాను. వీటిలో దాదాపు యాభై వరకు హళెగన్నడ భాషా శాసనాలున్నాయి. 'హళెగన్నడ' మంటే పాత కన్నడం అని అర్ధం. ఇప్పుడు కర్నాటకులు మాట్టాడేది 'హొసగన్నడ' - (క్రొత్త కన్నడం. నాకు ఏదీ రాదు. బెంగుళూరులో ఉండే “కన్నడ సాహిత్య పరిషత్తు” వారు (ప్రకటించిన “కన్నడ కైపిడి” 2 భాగాలు తెప్పించుకున్నాను. దాని ద్వారా కన్నడ వ్యాకరణం, భాషా విశేషాలు, ఛందస్సు అవగాహన చేసుకున్నాను. 'హళెగన్నడ శాసనాలు” అర్ధమైనాయి. ఈ పరిచయంతో కన్నడ సాహిత్యాన్ని ఆసక్తితో అభ్యసించడం జరిగింది. దాని ఫలితంగా కన్నడ (గ్రంథాలను అనువదించగలిగినాను. శాసనాలు చదవగలిగినందువల్ల మా తాలూకాలో 'పల్లెపాడు' (గ్రామంలో దొరకిన బాదమి చాళుక్యుల కాలపు తొమ్ర శాసనాలను చదివి, వినయాదిత్యుని పల్లెపాడు [4 పరిణతవాణి ప్రసంగాలు
తామ్రశాసనాన్ని, ఆమిదేలపాడువిక్రమాదిత్యుని తామ్రశాసనాన్ని 'భారతి' పత్రికలో 'ప్రకటించినాను. హైదరాబాదులోని 'లక్ష్మణరాయ' పరిశోధకమండలి పక్షాన వారి దగ్గర ఉన్న శాసన ప్రతిబింబాలను చదివి “తెలంగాణా శాసనాలు-2వ భాగా”నికి సంపాదకబాధ్యత నిర్వహించినాను. శాసనాల ఆధారంతో “అలంపూరు శిధిలాలు, అలంపూరు చరిత్ర, దక్షిణ వారాణాసి, ది మాన్యుమెంట్స్ ఆఫ్ అలంపూరు"”' అనే (గ్రంధాలు వ్రాయడం జరిగింది. ఇట్లే ఉమామహేశ్వర క్షేత్ర చరిత్ర, బీచుపల్లి క్షేత్ర చరిత్ర, అనిమెల సంగమేశ్వర క్షేత్ర చరిత్రలు (వ్రాయడం జరిగింది. లక్ష్మణరాయ పరిశోధక మండలికి శ్రీనాయని రంగారావుగారు - మునగాల రాజాగారు అధ్యక్షులు ఆదిరాజు వీరభద్రరావు కార్యదర్శులు. వారు సేకరించిన తెలంగాణా జిల్లాల శాసన 'ప్రతిబింబాలను ప్రకటించదలచినారు. ఆ పని నాకు అప్పగించినారు. రాజాగారు మరణించినారు. ప్రభుత్వ సహాయంతో “తెలంగాణా శాసనాలు - 2వ భాగం” నేను పరిష్కరించగా (ప్రకటించినారు.
కీశే. దేవులపల్లి రామానుజరావుగారి సూచనతో పరిషత్తు ప్రవేశపరీక్షకై భారత దేశ చరిత్ర'ను రచించడం జరిగింది. అది నూత్న దృక్పధంతో వ్రాయబడింది. సాధారణంగా భారతదేశ చరిత్రను హిందూమహాయుగం, బౌద్దమహాయుగం, మహమ్మదీయ మహాయుగం, (బ్రిటీష్ మహాయుగం అని విభజించి (వ్రాస్తున్నారు. ఈ విభాగాలు మన చరిత్రకు సరిమైన న్యాయం చేయడం లేదు. ఉదాహరణగా చూడండి. మొత్తం చరిత్ర 400 పేజీలుంటే హిందు మహాయుగానికి 25 పేజీలు, బౌద్ధయుగానికి 75 పేజీలు, మహమ్మదీయ యుగానికి 125 పేజీలు, బ్రెటీష్ యుగానికి 175 పేజీలు కేటాయించి వ్రాసీనారు. ఇది సరికాదు. (ప్రాచీన భారతీయ చరిత్ర - సంస్కృతులను తెలిపే హిందూ - బౌద్ధ యుగాలకు ఎక్కువ పుటలు కేటాయించవలెను. మహమ్మదీయ -బిటీషు యుగాలకు తక్కువ పుటలు కేటాయించి 'బ్రాయడం సరితైన పద్దతి. నేను ఆ దృష్టితోనే “భారతదేశ చరిత్ర' ను (వ్రాసినాను. దీనికి అప్పటి ఆర్కిలాజికల్ డైరక్టరు. డా॥ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులుగారు పీరిక (వ్రాస్తూ నా విధానాన్ని అంగీకరించినారు.
అలంపూరులో విభిన్న వాస్తు రీతులలో దేవాలయాలున్నాయి. ఈ నిర్మాణాలు విభిన్నంగా ఎందుకున్నాయో తెలుసుకోవలెననే కుతూహలం కలిగింది. శ్రద్దతో భారతీయ వాస్తు శాస్త్రాలు, మానసొరము, మయవాస్తువు, ఈశాన గురుదేవపద్దతి, ఆగమ(గ్రంధాలు, కాశ్యపసంహిత, కపింజలసంహితము చదివినాను. చారిత్రక వాస్తు పరిణామ విశేషాలకై ఫెర్య్యూసన్, హెన్రీకజిన్స్, అలెగ్జాండరు రే, ఫెర్సీబ్రౌన్ మొదలైన డా, గడియారం రామకృష్ణ శర్మ 15
వారి ఆంగ్ష (గ్రంధాలు చదవడం జరిగింది. అన్నిటిలో 'మానసార' వాస్తు శాస్త్రం (ప్రామాణికమైన (గ్రంధం. అది? సంపుటాలలో ప్రకటించబడింది. ఇక్కడి దేవమూర్తుల నిర్మాణంలో కూడా విభిన్న రీతులు కానవస్తున్నాయి. అందుకై “ఇండియన్ ఐకోనో(గ్రఫీ'- దేవప్రతిమాలక్షణ[గ్రంధాలను చదవవలసి వచ్చింది. ఈ పరిజ్ఞానంతో అలంపూరు దేవాలయ నిర్మాణ రీతులను గ్రహించడమే కాక్క "భారతీయ వాస్తు విజ్ఞానము, మన వాస్తు సంపద", 'ఆంధ్రుల వాస్తువైభవం' అనే (గ్రంథాలు నవ్రాసినాను. ప్రకటించబడి నాయి. ఇంకా “భారతీయ వాస్తు సర్వస్వం” (ప్రకటించవలెననే ఉద్దేశంతో మన (ప్రాచీనుల ఇంజనీరింగ్ విధానాలన్నిటినీ గూర్చి పరిశోధించి నోట్సు తయారు చేసినాను. ఎన్నో ఫోటో బ్బాకులతో, చాలా పేజీలతో (గ్రంధము బృహద్రూపమున ఉండగలదు. దాన్ని ముద్రించేదెవరు? చదివే వాళ్ళేవరు? - అనే నిస్పృహ కలిగి ఆ (ప్రయత్నము విరమించడం జరిగింది. ఇప్పుడు దాన్ని పూర్తి చేయలేను.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవతరించినప్పటి నుంచీ అది అంతమయ్యే వరకు నేను కార్యవర్గసభ్యునిగా, విశిష్ట సభ్యునిగా ఉన్నాను. ఆప్తమి(త్రులు శ్రీ, దేవులపల్లి రామానుజరావుగారి సహచర్యంతో యథాశక్తి సాహిత్యసేవ చేసినాను. అకాడెమీ (ప్రకటించిన 'దక్షిణ భారత సాహిత్యాలు” అనే సంపుటంలో “కన్నడ సాహిత్య చరిత్ర'నూ “ఉత్తర భారత సాహిత్యాలు సంపుటంలో పంజాబీ సాహిత్య చరి(త్ర'నూ వ్రాసినాను. ప్రభుత్వ సహాయంతో అకాడెమీ ప్రకటించిన ప్రాచీనగ్రంధములలో మంచన రచించిన “కేయూరబాహు చరిత్ర”ను, కొరవి గోపరాజు వ్రాసిన “సింహాసనద్వాత్రింశిక” ను పరిష్కరించి విపుల పీరికలు వ్రాసినాను.
దేశంలో అన్ని ర్యాష్ట్రాలలో అకాడెమీలు స్టాపించబడిపనిచేస్తున్నాయి. 'ఆం(ధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ” చేసినంత పని ఏ అకాడెమీ చేయలేదు. ఎట్టి ఒడిదుడుకులు లేకుండా మన అకాడెమీపని చేయగలిగిందంటే అదంతా నిస్వార్ధపరులు, సర్వసమర్భులు, సరసులు అయిన శ్రీ దేవులపల్లి రామానుజరావు గారి చలవే అని గట్టిగా చెప్పగలను.
కేంద్ర సాహిత్య అకాడెమీకి కొన్ని సలహా సంఘాలుంటాయి. నేను కొంతకాలం “తెలుగు సలహా సంఘ సభ్యుడుగా ఉన్నాను. అప్పుడు కేంద్ర అకాడెమీ నిర్ణయం ప్రకారం కన్నడ ప్రాచీన సాహిత్యంలోని 'కవిగదాయుద్ధ' కావ్యాన్నీ, నవీన సాహిత్యంలోని 'కన్నడ సజ్మక తెగళు' అనే కథాసంకలనాన్నీ తెలుగులోకి అనువదించి ఇచ్చినాను. వీటిలో 'గదాయుద్ద' ను గూర్చి కొంత చెప్పవలసి ఉంది.
మనకు 'కవిత్రయం” ఉన్నట్టే కర్నాటకులకు 'రత్న(త్రయ' ఉన్నారు. పంప-సొన్న- రన్న అనే ముగ్గురు కన్నడ కవులను 'రత్నత్రయ' అంటారు. రన్న కవి 10వ శతాబ్ది 16 పరిణతవాణి ప్రసంగాలు
వాడు. హళెగన్నడ' భాషలో 'గదాయుద్ద' అనే చంపూ కావ్యాన్ని రచించినాడు. 20వ శతాబ్ది (ప్రారంభకాలంలో మైసూరు విశ్శవిద్యాలయములోని ఆచార్యుడు బి.ఎం. శ్రీకంరయ్య గారు ఆ కావ్యంలో కొన్ని గద్యపద్యాలు (గ్రహించి దృశ్యకావ్యంగా మార్చినారు. అది అన్ని భాషలలో అనువదించబడింది. హళెగన్నడము తెలుగుకు దగ్గరగా ఉంటుంది. కొన్ని పద్యాలు వినండి. 1 మూలం: శ్రీరమణి గెనెలె తన్మయ పేరు రమం మాళ్ళనెంబ బగె మిగె సమర 'ప్రారంభకె పూణ్షీర్వం కౌరవకుల విలయకేతు సాహసభీమం” తెలుగు: శ్రీరమణికి నెలవుగ తన "పేరురమును సలుపనెంచు విధమున సమర (ప్రారంభమునకు భీముడు కౌరవకుల సర్వనాశకరుడు కడంగెన్” 2. మూలం: కురుభూభృత్ బల తూలకౌాలపవనం, కౌరవ్య గందేభకే సరి, దుళ్ళాసన రక్త రక్తవదనం, దుర్యోధ నోరుక్షమా ధరావజ్రం, కురురాజ రత్న మకుటోత్కుటాం(ఘ్రి సంఘట్టసం గరనెందెం దభివర్షిపెం రణయళ శ్రీరామనం భీమనం ॥ తెలుగు: కురుభూభృత్బల తూలకాల పవనున్, క్షోణీంద్రగందేభకే సరి, దుశ్చాసన రక్తరక్తవదనున్, సమాణ్మహోరుక్షమా ధరవ(జ్రాన్, హరురాజ రత్నమకుటోత్పాటాం(ఘిసంఘట్టసం గరునిన్ నేను నుతించెదన్ రణయశః కామున్ ఘనున్ భీమునిన్॥ 38. మూలం: గళియిసుతిరె కబరి భరం గళియిసుతిరనయనవారి నిన్నాననదిం నళినాననెన్ నిరె కురు కులాంతకం, గళిత కోపనే ఈ భీమం ॥ తెలుగు: జారిన కురుభారముతో ఊరెడు కన్నీటితోడ నుసురసురనుచున్ నారీ! నీవిటులుండగ కౌరవ నాశకుడు లేడు గళితా[గ్రహుడే ॥ దా. గడియారం రామకృష్ణ శర్మ 17
హళెగన్నడము ఇప్పటి సామాన్య కర్ష్నాటకులకు అవగతము కాదు. ప్రత్యేకముగ చదువుకున్న పండితులకే అర్దమవుతుంది కాని తెలుగువారికి కొంచెం కష్టపడితే సాధ్యమవుతుంది. నేను చదువకున్నది సాహిత్యం. కాని నాకు అభిమాన విషయాలు - శాసన పరిశోధన, చరిత్ర, వాస్తుశిల్పాలు, పురాతత్త్యశాస్త్రము, భారతీయ సంస్కృతి, ధర్మశాస్త్రాలు నేను 100కు పైగా శాసనాలు ప్రకటించినాను. క్షేత్ర చరిత్రలు (వ్రాసినాను. జీవితచరిత్రలు - శ్రీనిత్యానందస్వామి, శ్రీ మాధవ విద్యారణ్యస్వామి చరిత్రలు 'బ్రాసినాను. సాహిత్య (గ్రంథాలు - 'పాంచజన్యం' (ఇండ కావ్యసంపుటి, పిల్లల కధలు (బాలసాహిత్యం), తెలుగు సిరి (వ్యాసాలు) ప్రకటించబడినాయి. అనేక నగరాలలో కవులను గూర్చి కావ్యాలను గూర్చి ఉపన్యసించినాను. వివిధ పత్రికలలో, సం(గ్రహాం(ధ్ర విజ్ఞాన కోశము, తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపుటాలలో వివిధ విషయాల మీద (వ్రాసిన వ్యాసాలు ప్రకటించబడినాయి. హైదరాబాదు - కర్నూలు రేడియో స్టేషనుల ద్వారా ఎన్నో నా ప్రసంగాలు ప్రసారం అయినాయి. అనేక సంస్తలలో పని చేసినాను. ఉస్మానియా యూనివర్సిటీ - అకాడెమిక్ కౌన్సిల్, రీజినల్ హిస్టారికల్ రికార్డు సర్వే కమిటీలలో సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. నేను స్వాతంత్ర్యం రాగానే రాజకీయాల నుండి తప్పుకుందామనుకున్నాను. కాని కాంైసులో ముఠా తాజకీయాఆా ఖేశాయి కాలిగ్రేట్ -గోసాయి కాంగ్రేస్ 'ప్రబలినందున నేను కొనసాగవలసివచ్చింది. 1953లో మదరాసు రాష్ట్రం నుండి తెలుగు జిల్లాలు విడిపోయి కర్నూలు రాజధానిగా ఆం(ధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు రాజధాని రభసలు చాలా చెలరేగినాయి. సర్కారాంధ్రులు రాజధానిని విజయవాడకు తీసుకొని పోవాలని చాలా అల్లరి చేసినారు. రాయలసీమవారు పట్టుబట్టి కర్నూలులో రాజధానిని సాధించినారు. ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డిగార్హ భగీరధ ప్రయత్నం ఫలించింది. వాళ్ళ ఉద్దేశం విశాలాంధ్ర ఏర్పడవలెననీ, హైదరాబాదు రాజధాని కావలెననీ. అయితే విశాలాంధ్ర కొరకు ఎవరు ఉద్యమించవలె! సర్కారాంధ్రులకు అది ఇష్టము లేదు. రాయలసీమ వారు (ప్రయత్నిస్తే తెలంగాణా వారు కలిసిరారు. తెలంగాణా నుండే ఈ ఉద్యమం రావలెనని ఆ నాయకులు నిర్ష్ణయించినారు. అయ్యదేవర కాళేశ్చరరావుగారు, నీలంసంజీవరెడ్డిగారు 'హైదరబాదుకు వచ్చినారు. నెహ్రూగారికి హైదరాబాదును విభజించడం ఇష్టం లేదు. అది గమనించిన ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుగారు. సుముఖత చూపలేదు. కొండా 18 పరిణతవాణి ప్రసంగాలు
వెంకటరంగారెడ్డిగారు, చెన్నారెడ్డిగారు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావలెనని ప్రచారం చేస్తున్నారు. పరిషదధ్యక్షులు శ్రీ, నూకల నరోత్తమరెడ్డిగారు తెలంగాణాను సమర్షిస్తూ పత్రికా ప్రకటన చేసినారు. కాని రామానుజరావుగారు, పులిజాల హనుమంతరావుగారు, నేనూ విశాలాంద్ర వాదాన్ని సమర్థిస్తూ - నరోత్తమరెడ్డి గారి అభిప్రాయాన్ని ఖండించి మాది పరిషత్తు అభిప్రాయమని పత్రికలలో (ప్రకటించినాము. అప్పుడు ఆచార్య సి. నారాయణరెడ్డిగారు కూడా “మేము కోరేది వేరు తెలంగాణా కాదు - వీర తెలంగాణా” అని (వ్రాసినారు సంజీవరెడ్డిగారు కాళేశ్చరరావుగార్ల (ప్రోద్చలంతో మాడపాటి హనుమంతరావు పంతులుగారు చాకచక్యంగా రామానుజరావుగారిని ముగ్గులోకి దింపినారు. విశాలాంధ్ర మహాసభ ఏర్పడింది. శ్రీ పాగపుల్దారెడ్డిగారు ప్రధాన కార్యదర్శిగా, శ్రీ రామానుజరావు గారు ముఖ్యసలహాదారుగా విశాలాంధ్ర మహాసభ మరొక ఉద్యమాన్ని నిర్వహించింది. రామానుజరావుగారి వెంట మేము ఉండవలసి వచ్చింది. విశాలాంధ్ర మహాసభ హైదరాబాదులో 1954లో జరిగింది. అప్పుడు నేను 'నాందీ వాచకము' పద్యాలతో పలికినాను. “హస్తినాపురి పెద్దలా[గ్రహించెదరంచు ముఖ్యులే తమ మూతి ముడువవచ్చు, కీలుకుర్చీ రాజకీయాల పెద్దలు, భీతిచే వెనుకంజ వేయవచ్చు, తమ కబ్బియున్న, హోదాలకై నాయకా, గ్రేసరుల్ బాగా వక్రించవచ్చు, చివరి కాత్మీయులె పరిహసించవచ్చు, నాల్లుకోట్ల తెలుంగులందరను కలుప ఎవ్వరేమన్న జంకుకొంకీంత లేక ఈ విశాలాంధ్ర భిరి మ్రైూయింపు డయ్య, “సిరికిందావలమైన తీరములు మంజీరాది జీవాపగల్ సురులాసించెడు రాజధాని, ధనరాసుల్ పండు నేలల్ మనో హర శిల్పాలయముల్ చెలంగిన విశాలాంధ్రంబు సిద్దించి సు స్రిరమై యుండగ ఈ మహాసభయె నాందీవాచకంబయ్యెడిన్ ॥ ఎవరేమంటేనేం నెవ్రూగాడు హైదరాబాదును ముక్కలు చేయడానికి అంగీక రించినారు. ఆ వార్త చెవుల పడగానే అప్పుడు ఢిల్లీలో ఉన్న బూర్లుల వారు విశాలాంధ్ర కావలసిందే అని ధైర్యంగా ప్రకటించినారు. 1956 నవంబరు 1 తేదీన ఆం(ధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ జరుగవలెనని ప్రకటించబడింది. నీలంసంజీవరెడ్డిగారు ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ఏర్పడింది. అందులో తెలంగాణావాదులైన కొండా వెంకటరంగారెడ్డి గారిని, మజ్జి చెన్నారెడ్డిగారినీ తీసుకున్నారు. విశాలాంధ్రోద్యమాన్ని నిర్వహించిన వారిలో కనీసం పాగపుల్హారెడ్డిగారు, రామానుజరావుగారి వంటి వారిని గూడా వదలిపెట్టినారు. డా, గడియారం రామకృష్ణ శర్మ 19
ఒక మీర్ అహమదలీ ఖాన్ గారిని మాత్రం తీసుకున్నారు. సంజీవరెడ్డిగారి రాజకీయం ఏరుదాటి తెప్పతగలేసినట్టయింది అందుకు నిరసనగా నేను కాం(గైసు (ప్రాధమిక సభ్యత్వానికి గూడా రాజీనామా చేసి రాజకీయాల నుండి బైటపడినాను. అలంపూరులో 1935 సం॥ పరిషత్తు సప్తమవార్షికోత్సవాలను ఘనంగా జరిపించినాము. డా॥ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు వచ్చినారు, ప్రారంభోపన్యాసం చేసినారు. రామానుజరావుగారు అధ్యక్షత వహించినారు. ఆం(ధ్రదేశంలోని ప్రసిద్ధకవి పండితులు, విదుషీమణులు అందరూ పాల్గొన్న ఆ సభలు చిరస్మరణీయాలు.
ఆ సభల అనంతరం 1954 నుండి 1984 వరకు 30 సంవత్సరాలు అలంపూరు దేవస్థాన ధర్మకర్తల సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నాను. 1977 నుండి 85 వరకు తాలూకా వ్యవసాయదారుల సంఘానికి అధ్యక్షుడుగా పనిచేసినాను.
ఇప్పుడు 80 సంవత్సరాలు నిండినాయి. నా కాలం చాలా వ్యర్థమై పోయింది. నేను చేయవలసిందీ, వ్రాయవలసింది తెలుసుకొనేప్పటికి అశక్తుడనైనాను. దైవమను (గ్రహిస్తే వ్రాస్తున్న నా స్వీయచరిత్రను పూర్తి చేస్తాను.
ట్ 20 పరిణతవాణి ప్రసంగాలు
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి (25-9-1999)
ప్రస్తావన
సాహితీ సానువులు మీదుగా కీర్తి శిఖరం వైపు ప్రయాణం పెట్టుకున్న అక్షరతపస్వి ఎప్పటికీ పధికుడుగానే మిగిలిపోతాడు: ఏమంటే యశోవిలసితమైన ఆకాంచనళశిఖరం అతని ఊహల్లో అల్లంత ఎత్తున కనిపించేదే కాని ఫలానా చోట ఫలానా ఎత్తులో అంటూ నిర్దిష్టంగా ఎక్కడా ఉండ్గద్దు. అలాగని అతని ప్రయాణం మానుకోనక్కర్లేదు
- కానైతే ప్రయాసని కాస్సేపు మరిచిపోవడం కోసం, అంతకంటే మును ముందుకు సాగాలనే ఉత్సాహాన్ని తెచ్చుకోవడం కోసం తను బయలుదేరిన స్థితి నుంచి ఈ పరిస్థితికి చేరుకొన్న ప్రయాణ సరళిని ఓ మారు సమీక్షించుకోవడం అవసరం. అప్పుడు తను సాధించిన ప్రగతి అర్హం అవుతుంది.
ఎంతో కొంత పరిణతి వచ్చిందని తెలుస్తుంది.
దాంతో కొంత తృప్తే కలుగుతుంది.
ఆనందమూ లభిస్తుంది. అభిరుచి "
అసలు రచన చెయ్యాలనే కోరిక నాకు రక్తనిష్టంగా ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే మా నాన్నగారు జ్ఞాపకం వస్తారు. ప్రొఢ నిర్భరమైన వయస్సులో, అనగా, ఆయనకి ముపష్పయిఆరు ముప్పయి ఏడు ఏళ్లు ఉండగా, మా అమ్మగారు స్వర్గస్థులయ్యారు. అప్పటికి కడగొట్టు బిడ్డడనైన నాకు రెండేళ్ళు - నా పైన ముగ్గురు అన్నగార్జూ ఒక అక్క గారూను. అయిదుగురు పిల్లలతో ఆ వయస్సులో ఆయనకి వచ్చిన కష్టం దుర్భరమైంది. ఆయనింక పెళ్ళి చేసుకోలేదు. కఠోరనియమంతో, డెబ్బయి రెండేళ్ళ శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి 21
వరకూ జీవికసాగించారు. వేదనామయంగా ఉన్న ఆ ముప్పయి అయిదేళ్ళ జీవితాన్ని ఆయన భక్తి వైపుకు మళ్ళించారు. పరమ భాగవతోత్తముడాయన. తనకి వచ్చిన కష్టాన్ని ఆ దేవదేవునికి విన్నవించుకుంటూ “అకటా - నేనే మందును? అన్యాయం బయ్యె నాకు అయ్య నాదుమనవి వినుము ఆలమూరు జనార్హనా” అంటూ కొన్ని కీర్తనలు రచించారు. ఆయనకి గల ఆ సృజనాత్మకతే, బహుశా నాకు లభించి ఉంటుంది వాతావరణం మాది ఆలమూరు. నాటి సగటు తెలుగు పల్లెటూరులాగే మా ఊరు కూడా సహజమైన ప్రకృతి సౌందర్యంతో అందంగా ఉండేది. తూర్పు గోదావరి జిల్లాలో, రాజమహేండద్రవరానికి ఇరవైమైళ్ళ తూర్పున, వృద్దగాతమీ తీరాన. మరీచిన్నపల్లే పట్టణమూ కాకుండా, తాలూకా కేంద్రంగా ఉన్న (గ్రామం అది. చుట్టూ పచ్చని వరి చేలూ, ఆరటి తోటలూ - ప్రక్కనే రహదారీ పడవలు వెళ్ళే పంట కాలవా - కాలువని ఆనుకొని ఏటి గట్టూ - గట్టు దిగితే వృద్ద గౌతమీ నదీ. ఊరికి నాలుగువైపులా, కలువలతో, తామరలతో కలకల్లాడే నాలుగు చెరువులూ. ఊరు మధ్యలో జనార్దన స్వామి దేవాలయం, సన్నని చిరుగాలి వీచినప్పుడల్హా, గలగల్హాడే ధ్వజ స్తంభం చిరుగంటలూ, గంటల ధ్వని వినిపించినప్పుడల్దా రెక్కలు టపటపకొట్టుకుంటూ ఎగిరిపోయే పావురాలూ. ఊళ్ళో, మమతలు పంచుకుంటూ “మావా” 'బావా' అని పిలుచుకుంటూ మధురజీవనం సాగించే అన్ని కులాల మనుష్యులూ - మళ్ళీ అందులో, అమృత హృదయులైన డాక్టర్ చలపతిగారూ, పసిడిమనస్సు గల కాంపొండరుగారూ, అందరికీ ఆప్తుడైన కాపు వెంకన్నా, అభిమానధనుడైన మంగలి తాతబ్బాయి, అందరి గౌరవాల్నీ నమస్కారాల్నీ అందుకునే గంభీరమూర్తి మా నాన్షగారు లక్ష్మీనారాయణమూర్తిగారు. పురాణవాజ్మయాన్ని పుక్కిటబట్టిన పురాణపండ రామమూర్తిగారు, (ప్రజాసేవలో జీవితాన్ని పండించుకొన్న నరసింహ దేవర సత్యనారాయణగారు వంటి విశిష్టమైన వ్యక్తిత్వం గల మనీషులు కొందరు. సంప్రదాయజీవనానికి (ప్రతీకగా నాగులచెరువు గట్టున వేదపాఠశాల, ప్రగతి శీలకమైన జీవికకి సంకేతాల్హా ఊరికి ఓ పక్కగా వెలసిన హార్డింజ్ మిడిల్ స్కూల్, రూరల్ బేంక్, మేజ్యిస్టేట్ కోర్టు, పోలీసుస్టేషన్ వగైరా వగైరా, ఊళ్ళో భజనలూ, అప్పుడప్పుడూ నవరాత్రి సప్తాహ ఉత్సవాలూ, స్వాతంత్రోద్యమంలో భాగంగా సాగే సత్యా[గ్రహాలూ, మీటింగులూ. 22 పరిణతవాణి ప్రసంగాలు
ఇలా (ప్రాచీన నవీన జీవన సమ్యక్ సమ్మేళనంగా సాగే ఆలమూరులో నేను జన్మించింది 1929 డిసెంబరులో, ఆ ఊరు, ఆ మనుష్యులూ ఆ వాతావరణం చిన్నతనంలో నా మీద గాఢమైన ముద్ర వేశాయి నా రచనల మీద వాటీ ప్రభావం కూడా కొంత చూపించాయి. తర్వాత తర్వాత రచనా వ్యాసంగం సాగించి, తెలుగు సాహితీ చరిత్రలో ఓ గుర్తింపుకి వచ్చిన పోతుకూచి సాంబశివరావు, ఉషశ్రీ, నేను, చామర్తి కనకయ్య, నా భార్య రాజ్యలక్ష్మి, పోరంకి దక్షిణామూర్తి- మేమంతా ఆ చిన్న (గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళమే. నాలాగే వాళ్ళ మీద కూడా ప్రశాంతమైన ఆ వాతావరణం, ప్రత్యేక వ్యక్తిత్వం గల అక్కడి కొందరు మనుష్యులూ ఎంతో కొంత (ప్రభావాన్ని చూపించి ఉండాలి. సన్నిధి మా అమ్మగారు పోయిన కారణంగా, రెండవ ఏటనుంచి పదోఏడు దాకా నేను మా బావగారి దగ్గర రాజమండ్రిలో పెరిగాను. ఆయనకి ఆ ఊళ్ళో పెద్దవాళ్ళయిన న్యాపతి సుబ్బారావు, జయంతి గంగన్న గార్ల వంటి వారితో సన్నిహితమైన మైత్రి ఉండేది. అందువల్ల నాకు ఆ చిన్న వయస్సులోనే బిపిన్ చంద్రపాల్, మహాత్మాగాంధీ, రవీంద్రనాధ్ రాగూర్ వంటి మహామహుల్ని సన్నిహితంగా చూసే అవకాశం, అర్హం అయినా కాకపోయినా వాళ్ళ ఉపన్యాసాల్ని వినే అదృష్టం లభించాయి. ఆ సంఘటనలు కూడా నా ఆలోచనా సరళిపై కొంత ప్రభావాన్ని చూపాయి. ఇంక - నాలో ఉన్న విజ్ఞాన తృష్ట అనే చిరుదివ్వెని మరింత (ప్రకాశవంతం చేసిన గురువర్యులు ఎందరో ఉన్నారు. నిజంగా నా అదృష్టం ఏమిటంటే, వరుసగా సమర్థులైన గురువర్యులు లభించడం, ఆ తర్వాత, గొప్పగొప్ప సాహితీమూర్తులతో స్నేహం ఏర్పడడం. ఫస్ట్ఫారమ్ సెకండ్ ఫారమ్ చదువుతూన్న రోజుల్లోనే, లలితస్కంధము కృష్ణమూలమువంటి పద్యాలకి, భాగవతార్దంలోనూ కల్పతరువు అర్ధంలోనూ విడమర్చి పాఠం చెప్పి, అప్పటినుంచీ సాహిత్యంపట్ట అభిరుచి ఏర్పరచిన కూచిభొట్ల కృమ్ణావధానులుగారు- హైస్కూల్లో తెలుగుతీపిని పెంపరాల సూర్యనారాయణ శాస్తిగారూ, సంస్కృత కావ్యపరిమళాన్ని ఇంద్రగంటి హనుమచ్చా(స్త్రిగారూ రుచి చూపించారు. అప్పుడు వారు మునిచరిత్ర, వీరు దక్షారామం రాస్తున్నారు. వాటిల్లో పద్యాల్ని సిరా తడి ఆరకుండా చదివిన అదృష్టం నాదీ, ఉషశ్రీదీను - శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి 23
కాలేజీ చదువుకని నేను మళ్ళీ రాజమండ్రి వచ్చాను. రెండేళ్ళు సైన్స్ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్: రెండేళ్ళు స్పెషల్ తెలుగు (గ్రూప్‌తో బి.యే. మధ్యలో ఒక ఏడు స్థానికంగా ఉన్న దేశసేవ, అఖండ భారత్ వంటి కొన్ని పత్రికల్లో సంపాదకత్వ ఉపసంపాదకత్వ బాధ్యతలూ - 1947 నుండి 1952 వరకూ రాజమండ్రిలో గడిపిన ఆ అయిదేళ్ళలోనూ, ఊళ్ళో ఉన్న సాహితీ దిగ్టంతులు శ్రీపాదకృష్ణమూర్తిశా(స్త్రి మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు, శ్రీ పాదసుబ్రహ్మణ్య శాస్తి గార్లతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. నాది ఇరవై ఏళ్ళు నిండీ నిండని వయస్సు. వారు ఎనభయినుంచి నలభై అయిదు వరకూ వివిధ వయస్సుల్లో ఉన్నవారు, అయినా వారికి నేను సన్నిహితం కావడానికి కారణం, అప్పటికీ నేను, చిత్రగుప్త ఢంకా, వినోదిని, రూపవాణి, కృష్ణాపత్రిక, త్రిలిజ్ఞ వంటి పత్రికల్లో పద్యాలూ, గేయాలూ, వ్యాసాలూ, కధలూ, ఒకటి రెండు చిన్న నవలికలూ ప్రసన్న అనే కలం పేరుతో రాస్తూ సాహిత్యాభిరుచిని కనబరచడం. అంతకంటే ముఖ్యకారణం ఆలమూరులో నేనూ, ఉషశ్రీ కనక్ ప్రవాసి కలసి 1948 విజయదశమి నాడు 'తరుణ సాహితీ సమితి' అని ఒక సాహిత్య సంస్థని ప్రారంభించి, ఎన్నో సంచలనాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించడం. ఊళ్ళో ఆ నలుగురితోను సాన్నిహిత్యం, కాలేజీలో సాహితీ సుసంపన్నులైన శ్రీ భూపతి లక్ష్మినారాయణరావు (తర్వాత త్రీ వేంకటేశ్సర యూనివర్సిటీలో తెలుగు శాఖ ప్రధమాధ్యక్షులుగా పనిచేశారు), శ్రీ చెజుకుపల్లి జమదస్లి శర్మ, శ్రీ పియస్.ఆర్. అప్పారావు (తర్వాత తెలుగు అకాడమీ మొదటి డైరెక్టరుగా వ్యవహరించారు) వంటి మహామహుల దగ్గర శిష్యరికం - ఈ రెండూ తెలుగు భాషా సాహిత్యాల్ని లోతుగా అధ్యయనం చెయ్యడానికి ఉపకరించాయి. చదివింది బి.యే. స్థాయే అయినా ఆ మహామహుల అందరి చలవవల్ల తెలుగులో ఎమ్.ఏ., స్థాయికి మించిన వివేక విజ్ఞానాలందాయి. తొలి ప్రయత్నాలు అప్పటికి నాకు పద్యాల మీద మోజు ఎక్కువగా ఉండేది. కాలేజీ స్థాయి పద్యరచనల పోటీల్లో మానాప్రగడ శేషశాయితో తలపడ్డం, అంతర్ కళాశాలల పోటీల్లో బూదరాజు రాధాకృష్ణతో ఢీ కోవడం - ప్రక్రియలో ఆటు పద్యప్రభావం, ఉద్యమంలో ఇటు అమలిన శృంగార (ప్రాధాన్యం గల భావ కవిత్వ (ప్రభావం. అమలిన శృంగార ఇతి వృత్తాలతో 1951 నాటికే చిత్రగుప్తలో నిట్టూర్చు అనే నవలికనీ, అఖండ భారత్‌లో సాంధ్యరేఖలనే నవలికనీ రాశాను. తెలుగు 24 పరిణతవాణి ప్రసంగాలు
స్వతంత్రలో చలం మ్యూజింగ్స్, ఆరుద్ర'త్వమేవాహం' వచ్చే నాటికే, నేనా పత్రికలో కొన్ని కధలూ స్కెచ్‌లూ రాస్తూ ఉండే వాడిని ఏం రాసినా, ఎన్ని రాసినా, ఒక నిర్రిష్టమైన లక్ష్యంగాని, ఈ మార్గంలోనే రాయాలి అని ఒక పధనిక్దేశంగాని గట్టిగా ఏర్పడలేదు. అప్పటికి ఉత్సాహంతో ఏదో రాసెయ్యడమే!
యుగసంధి
నేనూ, ఉషశ్రీ, కనక్ ప్రవాసి కలసి ఆలమూరులో తరుణ సాహితీ సమితిని (ప్రారంభించే నాటికి భావకవిత్వం వెలుగులు వెనకబడుతున్నాయి. ఆవంత్స సోమసుందర్, శిష్ట్టా, శ్రీరంగం నారాయణబాబు, శ్రీత్రీ.ల కొత్త కంఠాలు వినిపిస్తున్నాయి. మమ్మల్ని ఓ ప్రక్క సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కధలూ, మరో (ప్రక్క జాషువా, కరుణశ్రీల పద్యాలూ ఆకర్షిస్తున్నాయి.
మేం ముగ్గురం సంప్రదాయ కవితామార్గంలో నడిచివచ్చిన వాళ్ళం. మాతో అప్పుడే మైత్రి నెజపిన సోమసుందర్ అభ్యుదయ కవితా రీతికి ఆహ్వానం పలకాలి అనే వాడు.
ఏ మార్గాన్ని అనుసరించాలి? అనేది ఒక మీమాంస.
దానికి తోడు, "పద్యానికి రోజులు చెల్పాయి -ఆ మాటకొస్తే కవితకి కూడా (ప్రాచుర్యం తక్కువ. ఇది కధలకీ నవలలకీ గుర్తింపు వస్తూన్న కాలం. అందువల్ల అవే రాయండి” అని కలుసుకున్నప్పుడల్లా శ్రీ పాదసుబ్రహ్మణ్యశాస్త్రిగారు చెవిని ఇల్టు కట్టుకొని పోరడం. తరుణ సాహితి
నాలుగు వెన్నెల రాత్రులు నాగుల చెరువు గట్టు మీదున్న అరుగుల మీద కూర్చుని చర్చించి “సంప్రదాయ- అభ్యుదయ వారధిగా, కావ్యకధా సమన్వయ రథసారధిగా ఉండేలా తరుణసాహితీని నడపాలి” అని నిర్ణయించుకొన్నాం.
ఆ తర్వాత కొన్నాళ్ళకి వ్యక్తిగతంగా నేనూ ఓ నిర్ణయానికొచ్చాను. ఇంక పద్యాలూ, కవితలూ తగ్గించి, వ్యావహారిక భాషలో కధలూ నవలలూ రాయాలి. అవి కూడా ఏవో కొన్ని ఇజాలకీ, నిబద్దతలకీ కట్టుబడకుండా, సర్వ (ప్రజాహితంగా, నిజాయితీగా, మానవతా విలువలతో, సహజత్వానికి దగ్గరగా, కళాత్మక విలువలు తగ్గకుండా రాయాలి అని నిశ్చయించుకొన్నాను. శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి 25
ఇంతవరకూ నేను రాసిన 13 నవలలూ, నూరు నూటపాతిక కధలూ, ఇతర వ్యాసాలూ, రేడియో నాటికలూ హాస్య'ప్రసంగాలూ అన్నీ ఆ నిర్ణయానికి అనుగుణంగా రాసినవే.
వాటి వివరాలు - తర్వాత -
తరుణ సాహితి ఎన్నో ఘనకార్యాలు సాధించింది:
1954లో విశ్వనాధ సాహిత్య సంచిక అనే ఒక (ప్రతిష్టాత్మకమైన సంచికని (ప్రచురించింది.
ఆ సంవత్సరమే, మొదటి భువన విజయ సభని నిర్వహించి, ఆ క్రొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టింది.
అటు పుట్టపర్తి నుంచి ఇటు శ్రీరంగం నారాయణబాబు, ఆరుద్రల వరకూ వర్గీకరణలకి అతీతంగా, ఉదాత్త సాహితీ్రష్టల్ని ఎందర్నో సన్మానించింది.
30 (గ్రంధాలవరకూ (ప్రచురించింది.
“రసప్రభ' అనే పుస్తక పంపిణీ సంస్థని అనుబంధ సంస్థగా ఏర్పరచి, దాని ద్వారా ఎందరో సాహితీమిత్రుల (గ్రంథాల్ని విక్రయించి సాయం చేసింది. విభిన్న దృక్పథాలు గల సాహితీమూర్తుల్ని ఆహ్వానించి ప్రసంగాలు చేయించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి తన 'ప్రతినిధుల్ని పంపి, అకాడమీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంది. 29-9-98న హైదరాబాదులో స్వర్ణోత్సవ సభలు నిర్వహించింది. స్వర్ణోత్సవ సంచికని వెలువరించింది.
1951లో రాజ్యలక్ష్మితో నా వివాహం అయింది. పురోగతి
1952లో నేను బి.యే. పాస్ కావడమేమిటి ఇరవై రోజుల్టో ఉద్యోగం రావడమేమిటి. నెల్లూరు కాలేజీలో చేరిన నెల్దాళ్ళకే ఆ ఉద్యోగం మానేసి, భీమవరం కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా చేరాను. తెలుగు శాఖాధ్యక్షులు నండూరి రామకృష్ణమాచార్యులు. విద్యార్థిగా ఉండగానే కట్టమంచి వారి అభినందనలు అందుకొన్న దిగుమర్తి సీతరామస్వామిగారూ, సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యక్రమంలో పనిచేసిన దర్చా సర్వేశ్చర శాస్త్రి, చిలుకూరి వీరభద్ర శాస్తి గారలు ఇతర తెలుగు ఉపన్యాసకులు. భీమవరం కాలేజీలో 1958 వరకూ పనిచేశాను.
26 పరిణతవాణి ప్రసంగాలు
కాలేజీలోనూ ఊళ్ళోనూ మొత్తం అంతా సాహితీసంరంభమే! ఊళ్ళో అడవి బాపిరాజు గారు, కాలేజీలో గణితశాఖలో అర్కసోమయాజులుగారూ, కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్లో పాలగుమ్మి పద్మరాజు గారూను. విద్యార్దులు కూడా సామాన్యులు కారు. ఇప్పుడు ప్రసిద్దులైన కొందరు, అప్పుడు స్పెషల్ తెలుగు బి.యే చదువుతూ ఉండేవారు. స్కూల్ సైనలు వరకూ నాకు క్రాస్మేట్స్ అయిన కొర్లపాటి శ్రీరామమూర్తి ఉషశ్రీ, వంటి ఇద్దరు ముగ్గురు మిత్రులు కారణాలతరాల వల్ల విద్యాభ్యాసం ఆలస్యం అయి, నేను ట్యూటర్‌గా పనిచేస్తూన్న రోజుల్లో అక్కడ బి.యే. చదివారు. తంగిరాల సుబ్బారావు, సన్నిధిరాజు సు(బ్రహ్మణ్యం, శనగన నరసింహస్వామి, నందుల గోపాలకృష్ణమూర్తి - వాళ్ళంతా ఆకాలేజీలో తెలుగు బి.యే. చదివిన వాళ్ళే.
తరచు దేవులపల్లి, అడవి, పింగళి, విశ్చనాధ, శ్రీపాద, వేదుల, కరుణశ్రీ మొదలైన సాహితీమూర్తులు వస్తూవెళుతూ ఉండేవారు. సాహిత్యచర్చలూ కబుర్లూ - తిరునాళ్ళులా ఉండేది భిమవరం వాతావారణం.
1955లో నేను విజయవాడ రేడియో స్టేషన్‌కి పంపిన కధని అప్పటి ప్రొడ్యూసర్ పింగళి లక్ష్మీకాంతం గారు 'రసమయి' కార్యక్రమంలోకి తీసుకున్నారు. రసమయి, ధ్వని కార్యక్రమాలంటే ఆరోజుల్లో విశ్వనాధ, తుమ్మల వంటి కవులకి, పాలగుమ్మి, శ్రీపాద వంటి కధకులకి, రాళ్ళపల్లి, జమ్ములమడక వంటి పండితులకూ పరిమితమై ఉండేవి. అలాంటిది, 23 ఏళ్ళకు(ర్రాడికి రసమయి కార్యక్రమం ఏమిటి అని పింగళి వారికి అసిస్టెంటుగా పని చేస్తూన్న బుచ్చిబాబుగారు తటపటాయించారు. కాని, పింగళి వారు నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేదు - ఇలా (ప్రసంగిస్తూంటే, అలా గాలిలోకి వెళ్ళిపోయేది. సాహితీమిత్రులు
పింగళి లక్ష్మీకాంతంగారికి నా మీద ఓ ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. 1961లో రాష్ట్రంలోని అన్ని విశ్శవిద్యాలయాలూ పాల్గొన్న రేడియో నాటికల పోటీలో నేను రాసిన 'ఆత్మావై పాత్రనామాసి' ని ఎన్నిక చేసి ఢిల్లీ పంపారు. అఖిల భారత రేడియో నాటికల పోటిలో దానికి ద్వితియ బహుమతి వస్తే ప్రథమ బహుమతి ఎందుకు రాలేదా అని కాస్సేపు మధనపడ్డారు. ఓ మారు అఖిల భారత తెలుగు రచయితల మహాసభల్లో ఆయన అధ్యక్షతలోనే, ఆయన రాసిన తొలకరి కావ్యాన్ని విమర్శించవలసి వచ్చింది. మంచిది - విమర్శ అలా ఉండాలి అని ప్రోత్సహించారే కాని మందలించలేదు. ఆయన ఆశీస్సులతో 1953లో ప్రారంభమైన నా రేడియో రచనా కార్యక్రమం నేటి వరకూ అవిచ్చిన్నంగా సాగుతూనే ఉంది. శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి 27
నేను 1958లో బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీషులో ఎమ్.ఏ. పట్టా తీసుకుని, ఆనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీషు లెక్సరర్గా జేరాను. అక్కడున్న నాలుగేళ్ళలోనూ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి మా తెలుగుతల్లి గీత రచయిత శంకరంబాడి సుందరాచార్యులు, తర్వాత వైస్ ఛాన్సలర్ అయిన జి.యన్.రెడ్డి, సుబ్బన్న శతావధాని, బెళ్ళూరి శ్రీనివాసమూర్తి పుట్టపర్తి నారాయణచార్యులు వంటి ఎందరో సాహితీమూర్తులతో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారింది. సి.నా.రె. దాశరధి ద్వయం సాహితీ జైత్రయాత్రనుండీ నాకు మిత్రులు. ఉద్యోగరీత్యా వేను 1962లో ఏలూరు వచ్చి సెయింట్ ధెరిసా కాలేజీలో ఇంగ్లీషు లెక్సరర్గా చేరాను. అక్కడా నాలుగేళ్ళే ఉన్నాను. అయితే అక్కడ ఉన్నప్పుడు కొన్ని మరిచిపోలేని సంఘటనలు జరిగాయి. మొక్కజొన్న తోటలో వంటి కవితలు రాసిన కొనకళ్ళ వెంకటరత్నం, ప్రసిద్ద రచయితలు కొండముది శ్రీరామచంద్రమూర్తి వెల్ళేరు నారాయణరావులతో స్నేహం; ప్రసిద్ద కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌తో విడదియ్యరాని మైత్రి ఏర్పడ్డాయి. తెల్లవారితే ్రింటింగ్కి ఇస్తాం అనగా, రాత్రంతా “అమృతం కురిసిన రాత్రి" లో ఏ ఖండికలు ఉంచాలి, ఏవి తీసెయ్యాలి అని మీమాంస, చర్చ కబుర్లూ - అన్నింటికంటే ముఖ్యమైనది. నవలలు నాకు సాహిత్యప్రపంచంలో మంచి గుర్తింపు తీసుకువచ్చిన 'కాసల్య' నవల రాయడం; దానికి ఆంధ్రప్రభ 1964 ఉగాది నవలలు పోటీలో బహుమతి లభించడం. కౌసల్య స్వాతంత్ర్యం రావడానికి పూర్వం, రాజకీయాల్లో పాల్గోన్న ఒక నిజాయితీ అయిన దేశభక్తుని కధ అది. అతని రాజకీయ జీవితం, సాంసారిక జీవితాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేసిందో, నాకు తెలిసిన పల్లెటూరు వాతావరణాన్ని నేపథ్యంగా తీసుకుని నేను ఎజిగిన ఒకరిద్దరు వ్యక్తులనైజాన్ని రేఖామాత్రంగా (గ్రహించి, అమూలా(గ్రం తెలుగుతనంతో శ్రద్ధగా మలచిన కథ అది. సుమారు వందపేజీలు రాశాక, మిత్రులు విని సాదాసీదాగా ఉంది అన్నారు. దాంతో నేను (వ్రాతపనిని బీరువాలో పడేశాను. నా భార్య రాజ్యలక్ష్మి చదివి “చాలా బాగుంది పూర్తి చెయ్యండి” అంటూ ఒక నెల్లాళ్లయినా నాతో వాదించి మళ్ళీ వ్రాతప్రతి తీయించింది. ఆమె కూడా రచనలు చేస్తోందని నాకు అంత వరకూ తెలియదు. అప్పుడూ తెలియనేలేదు. ఆ తర్యాత ఏడాదికి, అంటే మా పెళ్ళయిన 14 సంవత్సరాలికి ఒక రోజు బాపు బొమ్మలతో ప్రతి పేజీ అలంకరించబడిన ఆమె 28 పరిణతవాణి ప్రసంగాలు
కథ నాటి జ్యోతి మాసపత్రికలో అచ్చయి వచ్చింది అప్పటి నుంచీ ఆమె వరసగా 13- 14 నవలలూ, ఓ వందకి పైగా కధలూ, కొన్ని వ్యాసాలూ ఇప్పటి వరకూ రాస్తూ ఉంది. రచనల గురించి నేటికీ చర్చించుకుంటాం. కాని ఎవరి మార్గం వాళ్ళదే. ఆ వ్యక్తిత్వం ఆమెకీ ఉంది నాకూ ఉంది. ఏమైతేనే తర్వాత వారం పదిరోజులు దీక్షగా కూర్చుని ఏకబిగిని రెండు వందల పేజీలు రాసి, గడువు తేదీ రెండు రోజులుందనగా పంపాను.
నవలకి బహుమతి లభించింది. అది 1970లో “తల్లిదండ్రులు” సినిమాగా వచ్చింది. ఉత్తమ సినీకథరచయితగా నాకు నంది అవార్డు కూడా అందించింది. 1975లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా దేశీయ భాషలన్నింటి లోకీ తర్జుమా అయింది. రేడియో జాతీయ నాటకంగా ప్రసారమైంది. క్విట్ ఇండియా స్వర్గోత్సవాల సందర్భంలో 1992లో నేషనల్ నెట్‌వర్క్‌లో డి.డి. ద్యారా 13 వారాలు “అప్నా అప్నా ఆస్మాన్' పేరుతో టెలీ సీరియల్ గా (ప్రసారమైంది. ఢిల్లీ దూరదర్శన్ ద్వారా (ప్రసారమైన మొదటి తెలుగు నవల ఇదే కావడం విశేషం ముఖ్యంగా చెప్పవలసింది ఈ ముప్పయి అయిదేళ్ళలోనూ 5 సార్టు పునర్ముద్రితమై 15 వేల కాపీల వరకూ అమ్ముడు కావడం. భోగిమంటలు
మరుసటి సంవత్సరం నేను రాసిన నవల “భోగిమంటలు”. ఒక చిత్రకారుని చుట్టూ అల్లిన కథ అది. మనిషిలో బలహీనతలు ఉండడం సహజం. కాని ఆ బలహీనతల్నే ముడి వస్తువుగా తీసుకుని, ఒక కళాకారుడు తన కళాతపస్సు అనే అగ్నిలో పురం పెట్టి, బలమైన కళాఖండాలుగా మారుస్తాడు. నేను చిత్రకళకి సంబంధించిన ఎన్నో (గ్రంధాల్ని చదివి సాంకేతిక విషయాల్ని అవగాహన చేసుకొని మరీ రాసిన నవల అది. సంజీవ్‌దేవ్ గారు చదివి మెచ్చుకొన్నారు. అంతే కాదు. విశ్చ్శవిఖ్యాత చిత్రకారుడు రోరిచ్కి కథా సంగ్రహం ఇంగ్లీషులో చెప్పారట. రచయితకి అభినందనలు అందించమన్నారట ఆయన. ఆ సంగతికూడా రాశాడు సంజీవ్‌దేవ్‌గారు తన ఉత్తరంలో - దీపశిఖ
నేను 1966లో బాపట్ల కాలేజీలో లెక్చరర్‌గా చేరి, రిట్రైరయ్యే దాకా అంటే 1989 దాకా అక్కడేఉన్నాను. 1967లో నేను మూడో నవల రాశాను. దాని పేరు 'దీపశిఖ'. మా స్వ([గ్రామం ఆలమూరులో ప్రజాసేవలో తన జీవితాన్ని హారతి కర్పూరంలా శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి 29
అర్పించిన డాక్టర్ చలపతి గారిని దృష్టిలో పెట్టుకుని రాసిన నవల అది. డాక్టర్లు పల్లెటూళ్లకి వెళ్ళాలంటరు. కాని (గ్రామీణ రాజకీయాలు అలాంటి వ్యక్తుల జీవితాల్ని బలిగొంటాయి - అని హెచ్చరిస్తూ రాసిన నవల అది.
అంతకు కొన్ని నెలల క్రితమే (ప్రారంభించిన “ఆంధ్రజ్యోతి' వీక్తీకి అది పంపాను. నార్హ వెంకటేశ్వరరావు గారు. “స్త్రీలు రాసిన నవలలే పాఠకులు చదువుతున్నారు - మగవాళ్ళ నవలలు సీరియల్‌గా వెయ్యం అండీ” అంటూనే చదివి, బాగుందని తల ఊచి, “ఇలా ఉంటే వేస్తాం” అని చెప్పి సీరియల్‌గా (ప్రచురించారు. 1975లో 'దీపశిఖ' నవలని 'రామరాజ్యం' సినీమాగా తీశారు - రామా విజేత సంస్థ వారు. ఇవాళ ప్రసిద్ద నటుడైన శరత్‌బాబు మొదటిసారి నటించినది రామరాజ్యం లోనే. బాపట్లలో ఉన్న 25 ఏళ్ళలోనూ, మా దంపతులకి సాహితీ సమితితో ఆతీ శ్రయత ఏర్పడింది. సాహితీ సమితి సభ్యులంతా మా ఇంటికి తరుచు వచ్చి నాలుగేసిరోజులుండి వెళ్తు ఉండేవారు. సంఘం చేసిన మనిషి
1969లో దాశరథి కృష్ణమాచార్యులు గౌరికిచ్చిన మాటవల్దా, అప్పటి ఎమెస్కో అధిపతి ఎమ్.ఎన్.రావుగారితో వచ్చిన మాట పట్టుదల వల్లా పదిరోజుల్లో రాసి ఎమెస్కో 'ప్రచురణక్షై పంపిన నవల “సంఘం చేసిన మనిషి” “మేము (ప్రచురించిన రెండు వందల నవలల్లోనూ, అందరి అభిమానాన్నీ చూరగొన్న నవలలు రెండే రెండు - ఒకటి వీరేశలింగంగారి 'రాజశేఖర చరిత్ర" - రెండు-పోలాప్రగడ వారి “సంఘం చేసిన మనిషి” - అంటూ ఎమ్.ఎన్. రావుగారు తమ పుస్తక ప్రపంచంలో ప్రకటించారు. ఆ నవలకి (ఫెంచిభాషలో తర్జుమా అయి (ప్రకటన పొందే అవకాశం లభించికూడా రావుగారి అకాల మరణం వల్ల తప్పిపోవడం దురదృష్టకరం. భారత రాజకీయాల మీదా రాజకీయ నాయకుల మీదా సంధించిన విమర్శనా(స్తం అది. ఆద్యంతమూ వాస్యవ్యంగ్య ధోరణిలో, ఒకే శ్రుతిలో సాగిన వచన కావ్యం అది. అల్పజీవి - అసమర్దుని జీవయాత్ర సరసన నిలువదగిన నవల అది. 'ప్రచారలోపం, విమర్శకుల దృష్టిలో పడకపోవడం దురదృష్టకరం. నవోదయం
1970 (ప్రాంతంలోకంచికచర్లలో ఒక విషాద సంఘటన జరిగింది. ఒక హరిజన యువకుణ్ణి పందిరరాటకి కట్టి కాల్ళి చంపేశారు. ఆ సంఘటన ఆధారంగా తీసుకుని, దరి[ద్రనారాయణుల పక్షాన నిలబడి, కరుణ రసాత్మకంగా 'నవోదయం' అనే నవల రాశాను. నార్లవారూ, మహీధరవారూ మెచ్చుకొన్న నవల అది. ఎమెస్కో వారు 30 పరిణతవాణి ప్రసంగాలు
(ప్రచురించారు. ఎమెస్కోకి నేను రాసిన ఈ రెండు ననలల్నీ “ది మెయిల్” అనే ఇంగ్లీషు పత్రిక సమీక్షిస్తూ రచయితని హార్డీ, డికెన్స్లతో పోల్చడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అంతరాయం
ఆ తర్వాత తెలుగు నవలా ప్రపంచంలోకి భూత(ప్రేత పిశాచాలు ప్రవేశించాయి. శృంగారం పేర అశ్లీల వర్షనలూ సస్పెన్స్ పేర అసంబద్ధ సంఘటనలూ వికటాట్టహాసం చేయసాగాయి. పారకులు ఆదరిస్తున్నారని పత్రికా సంపాదకులు ఆ రకం నవలలే రాయమని అడగడం (ప్రారంభించారు. బాధ్యతారహితంగారాసి సమాజాన్ని (భ్రష్టు పట్టించడం నాకు ఇష్టం లేదు. పైగా ఇంగ్లీషు లెక్సరర్గా ముప్పయిఏళ్ళు పనిచేసిన నేను ప్రపంచ ప్రసిద్దమైన నవలలెన్నో చదివాను. క్లాసులో పారం చెప్పాను - వాటిలో ఆ జాతి జీవన (ప్రతిబింబం, ఆ ప్రజలు ఆశలూ ఆశయాలూ, సంప్రదాయ నవీన జీవితవిధానాలూ, విలక్షణమైన పాత్రలూ కనిపిస్తూ, అద్భుతమైన నిర్మాణకౌశలంతో అలరారిన వచన కావ్యాలవి. నేను అప్పటివరకూ రాసిన ఏడెనిమిది నవలలూ ఆ స్థాయిలో ఉండాలనే దృష్టితో రాసినవే.
మరి ఇప్పుడు పారకుల అభిరుచి వ(క్రమార్గానికి మళ్ళిందని - నేనూ ఆ వక్రమార్గంలో రాయడమా? -
నాకది ఇష్టం లేదు. అయితే ఇంక నవలలు రాయడం మానెయ్యాలి - అదీ ఇష్టం లేదు. హాస్య నవలలు
అందువల్ల, అంతవరకూ అప్పుడప్పుడు కధల వరకూ, రేడియో ప్రసంగాల వరకూ మాత్రమే పరిమితం చేస్తూ వచ్చిన హాస్యరసాన్ని ఊతగా తీసుకుని కొన్ని హాస్యనవలలు రాశాను. అవి సమాజానికి ఉపయోగకరం కావచ్చు కాకపోవచ్చు. కాని ఆరోగ్యకరమైనవి.
అలా రాసిన నవలలు.
మనసిచ్చిచూడు - ప్రేమాయణం - (ప్రేమాకలాపం. ఈ మూడింటిలో, 'పేమాయణం' అదే పేరుతో 1977లో సినీమాగా వచ్చింది. శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్రి 31
1989 నాటికి ప్రజాభిరుచుల్లో మార్పు వచ్చిందేమో అనే ఆశ కల్గింది. సదువుకొన్న మా రాజులు జాతి జీవనానికి వెన్నెముకగా ఉండే విద్యావ్యవస్ట కొన్నేళ్ళ (క్రితం ఎలా ఉండేదో, ఇప్పుడెలా తయారయిందో చెప్తూ తరాల అంతరాల పరిస్టితిని చిత్రిస్తూ భవిష్యత్తులో బాగుపడుతుందనే ఆశారేఖతో ముగిస్తూ 'సదువుకొన్న మారాజులు” అనే ఓ నవల రాశాను. విద్యావ్యవస్థతో నాకు 35 ఏళ్ళు ఉన్న పరిచయాన్నీ ఆరంగంలో ఉన్న అనుభవాన్నీ రంగరించి, నాటకీయంగా, కళాత్మకంగా రాసిన నవల అది. మేధావుల మెప్పు పొందింది. కాని ఆ నవలకి పారకులనుంచి ఆశించిన స్పందన రాలేదు. దాంతో ఏడెనిమిదేళ్ళు నవలా రచనకి దూరంగా ఉండిపోయాను. పొత్తులబావి కాని, రెండేళ్ళ (క్రితం ఒక ప్రసిద్ద వారపత్రిక (ఆంధ్రభూమి) సంపాదకవర్గ సభ్యుడు త్రీ ఆకెళ్ళ రామచంద్రరావు అదే పనిగా అడగడంతో రాయలసీమ హత్యా రాజకయాలూ, నీటి సమస్యా రెండూ జోడిస్తూ చివరకి వాటికొక సమంజసమైన పరిష్కారమార్గం సూచిస్తూ 'పొత్తుల బావి" అని ఒక నవల రాశాను. దానికి అనూహ్యంగా పారకుల దగ్గర్నుంచి మంచి స్పందన లభించింది. తెలుగు నవలకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయోమో మరి! నేను ఇంతవరకు ఇలా 13 నవలలూ రాశాను. శ్రీనాథకని సార్వభౌను అన్నట్లు మరో ముఖ్యమైన నవల విషయం చెప్పడం మరిచిపోయాను. అది చారిత్రక నవల, 'శ్రీనాథకవి సార్వభౌమ” (లేదా విజయాంబిక) అని దాని పేరు. సరళ(గ్రాంధికంలో రాశాను. మైసూర్, గుల్పర్గా ఆంధ్ర వంటి మూడు నాలుగు విశ్చవిద్యాలయాల్లో డీ క్లాసు ఉపవాచకంగా స్వీకరించారు. కొండవీటి రెడ్డూ రాజమండ్రీ రెడ్డూ ఆంధ్ర జాతిని రెండుగా చీల్చబోయారు. అమ్హుడా ప్రమాదాన్ని చాకచక్యంగా వారించింది శ్రీనాధ కవి సార్వభౌముడు. అందువల్ల అవనీనాథులు అవధులేర్పరచాలని చూసినా, సాంస్కృతిక సనాథులైన కవితానాధులు దాన్ని వారించాలి అనే సందేశాన్ని చెప్పీ చెప్పకుండా రాసిన నవలే కవి సార్వభౌమ. 32 పరిణతవాణి ప్రసంగాలు
రచనా విధానం సమకాలీన సమాజంలో ఎప్పటికప్పుడు ప్రస్ఫుటంగా కనిపించే ఒక సమస్యని తీసుకుని, తెలుగుతనం చెడకుండా, నవలా నిర్మాణం, కథాకథనం, సంఘటనా సామర్థ్యం, సన్నివేశ సహజత్వం, విశిష్టపాత్ర చిత్రణావైవిధ్యం ఇవన్నీ చూసుకుంటూ, వీటి నన్నింటినీ జాచిత్య పరిధిలో మేళవించి ప్రతి నవలనీ ఒక కళారూపంగా మలచడానికి ప్రయత్నించాను. . ఎక్కడా ఏ సమస్యనీ విశేషించి చర్చించలేదు. ఏవోకొన్ని సిద్దాంతాలు ప్రతిపాదించడానికి ప్రయత్షించనూ లేదు. విశ్లేషణ, నా మార్గం కాదు - సమ్మేళనే నా పద్దతి. సమస్యలు పరిష్కారానికి ల! గ. ళా సంఘర్షణకంటే సామరస్యమే సరి అయిన మార్గం అని నేను అనుకుంటాను. కుల, వర్మ, ప్రాంతీయ భేదాలు లేకుండా, అందరికీ సామాజిక న్యాయం జరగాలి. ఇది సర్వులకూ సమ్మతమే - అందరూ కచ్చితంగా అంగీకరించి తీరవలసిందే. అయితే, ఆ నినాదంతో ఘర్షణలు లేవదియ్యడం, అసూయద్వేషాలు రగిలించడం, అలజడులు రేపడం సమంజసంకాదు. అది జాతి దీర్హ (ప్రయోజనాల్ని దెబ్బతీస్తుంది అని నా నమ్మకం. దేన్ని అయినా అంటించినంత సులభం కాదు ఆర్నడం. కొన్ని వందల ఏళ్ళ నుండి పరిపాలన సాగించిన పరదేశీయులెవ్వరూ మన జాతి జీవనవాహినినీ, సాంస్కృతిక సంపదనీ, శాంతియుతమైన మధుర సామాజిక సహజీవనాన్నీ విధ్వంసం చెయ్యలేదు. అటువంటి రకరకాల నినాదాలతో మనమి(త్రులే యాభయిఏళ్ళలో రూపురేఖలు లేకుండా చేసేశారు. వాళ్ళు ఆరాధించే మేధావులే ఆయా దేశాల్లో ఆ పని చెయ్యలేదు. ఇటుక మీద ఇటుకగా కాన్ని వేల ఏళ్ళనుంచి నిర్మించుకుంటూ వచ్చిన సాంస్కృతిక సౌధాన్ని ఏవో కొన్ని మార్పుల్ని ఆశించి ఇవాళ నేల మట్టం చేస్తే, మరో క్రొత్త సంస్కృతిని పునర్నిర్మించుకోడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది? ఈలోగా ఉన్నది నశించి, (క్రొత్తది ఆవిర్భవించక, రాబోయే వందలాది తరాల్ని చీకట్లో తారట్టాడేలా చేసే హక్కు మనకి ఎక్కడుంది? లా ప్! ఇవీ నా ఆలోచనలు - శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్రి 33
నా నవలల్లో ఈ ఆలోచనలు అక్కడక్కడ, ధ్వని ప్రధానంగా కనిపిస్తాయి. రచయితగా నేనెక్కడా పీట వేసుక్కూర్చుని (ప్రవచించలేదు. సూచించాను. స్పృశించాను -అంతే! అసలు రచయిత అలాగే చెయ్యాలని నా ఉద్దేశం. కబుర్జ్హు మొదలుపెడితే కళ దెబ్బతింటుంది. కథలు మొదటి పదేళ్ళలోనూ రాసిన కథల మాట చెప్పలేను కాని, గత పాతిక ముప్ఫయి ఏళ్ళ నుంచీ రాస్తూన్న కథల్ని మాత్రం నా భావాలకి దర్చణాల్దాగే రాశాను. 1944-47 నుంచే కథలు రాశాను. “తమ సోమా జ్యోతిర్లమయ', “సందులో మందారంి అనే శీర్షికలతో కథా సంపుటాలు ప్రకటించాను. అయితే వాటిలో వచ్చినవన్నీ తొలికథలే - ప్రతి కథలోనూ ఒక చమత్కారం - ఒక మలుపు ఒక సంఘటన - ఒక పాత్ర చిత్రణ - ఒక కొత్త దృశ్యం. అంతే - నా ఆలోచనలకీ, ఆదర్శాలకీ అవి వాహికలు కొవు.
అయితే కథా నిర్మాణం దృష్ట్యా చూస్తే అవి మంచి కథలే. ఏమంటే నాక్సు మొదటినుంచీ కథా కథనం మీద దృష్టి ఎక్కువ.
మంచి కథకి జీవధాతువులైన - కథా (ప్రారంభం, నిర్వహణ, ముగింపు, కథ ఆద్యంతమూ ఒకే శ్రుతిలో, ఒకే ధోరణిలో సాగడం, సంక్షిప్తత, సమ(గ్రత, వస్తైక్యత- వీటిన్నింటి మీదా నాకు (శ్రద్ద ఎక్కువ.
అందుకే, నేను ఎక్కువగా ఏ నవలనీ సరిచూసుకుని, తిరిగి రాయడం జరగలేదు కాని, (ప్రతి కథనీ ఒకటి రెండుసార్జు తిరిగి రాశాను.
మొదటి దశపూర్తి అయాక రాసిన = నెగళ్ళు, ఆకశేరుకము, చేతులు చిగిరించాయి, ఒకే ఒక్క రూపాయి, చిరునవ్వు సింహనాదం, ఆకలి, నీళ్ళు ల కన్నీళ్ళు, జ్వాలా తోరణం, బల్లకట్టూ బడిపంతులూ, (శ్రావణి వంటి చాలా కథల్ని మూడేసి నాలుగేసి " సార్టు కూడా సాపురాశాను.
ఈ సంగతినే ఓమారు మాటల ప్రస్తావనలో - చా, సో, గా ప్రసిద్ధులైన చాగంటి సోమయాజులు గారితో అంటే “అంతేనా? - నేను నా 'ఎందుకు పారేస్తాను నాన్నా" అనే కథని ఏడు సార్హు తిరగరాశాను. ఆ ఒక్క కథా పూర్తి చెయ్యడానికి 5 ఏళ్ళు ప్రశ పరిణతవాణి ప్రసంగాలు
పట్టింది.” అన్నారు.
అవును మరి -
కథానిక అతి సుకుమారి -
పరమ లావణ్యమైన సాహితీకుసుమం -
ఎంతో సున్నితంగా చూడాలి -
“నెగళ్ళు' కథలో నేను చెప్పింది ఏమిటంటే - సాంఘిక అసమానతల్ని చూసి కళ్ళేకాదు హృదయాలు కూడా నెగళ్ళులా మండాలి. అయితే ఆనెగళ్ళు కాంతిని 'ప్రసరించడానికే కాని, కాల్చడానికి కాదు,
అలాగే - 'అకశేరుకం'లో అన్యాయాల్ని చూస్తూ నిర్వీర్యంగా ఉండిపోకండి, చెన్నెముక లేని వ్యక్తులు కాకండి - మనకెందుకు పోనిద్దూ అనే మాటకన్నా మహామ్మారి మేలు అని చెప్పాను.
'చేతులు చిగురించాయి. కథలో నిరుద్యోగులారా నిస్పృహ చెందకండి - మనిషిచ్చిన డిగ్రీల్ని నమ్ముకోకండి - దేవుడిచ్చిన చేతుల్ని నమ్ముకోండి, ఇంక జీవికకు భయం ఉండదు - అని 'హెచ్చరించాను.
గాంధీ శతజయంతి సందర్భంలో రాసిన కథ 'జ్యాలాతోరణం*. ఆయన చెప్పిన మాటల్ని తుంగలో తొక్కాం. ఆయన వి(గ్రహాల్ని మాత్రం చెక్కి నిలబెట్టాం - అన్నది ఆ కథలో ప్రధానాంశం,
ఇలా (ప్రతీ కథా ఏదో ఒక ఉదాత్తమైన లక్ష్యంతో రాసినదే - వీటిలో ఓ ఇరవై కథలు ఏరి 'పోలాప్రగడ కథలు” అనే శీర్షికతో ఒక కథాసంపుటి (ప్రచురించాలని సంకల్పం.
నేను నవలలూ, కథలే కాకుండా కొన్ని సాహిత్యవ్యాసాలూ, “ షేట్టియర్ సాహిత్య ఇభవం'” అనే (గ్రంథాన్నీ రాశాను.
లాలాలజపతిరాయ్, చిత్తరంజన్దాన్, రాజగోపాలచారి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే జీవిత చరిత్రలు రాశాను. వీటిలో చివరది కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఆదేశం మేరకు రాసింది.
బి.యే.. ఎమ్.ఏ., తెలుగు సాహిత్య విద్యార్థుల కోసం, పాఠ్యగ్రంథంగా ఉండేలాగ, శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి తెక్
“తెలుగు కథానిక అనే (గ్రంథాన్ని తెలుగు అకాడమీ వారి కోసం రాశాను. ఆం(ధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణలైన 'వ్యాసతోరణం', వాస్య తోరణం” అనే రెండు (గ్రంథాల్ని సంకలనం చేశాను. వీటిలో మొదటిది ఆంధ్ర విశ్చవిద్యాలయం తెలుగు ఎమ్.ఏ., విద్యార్థులకి పాఠ్య(గ్రంథంగా కొన్నాళ్ళు ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ 'భారతీయ సాహితీ సర్వస్వం' (200)610016412 01 104120 14424180) అనే ఆంగ్ల (గ్రంథ పరంపరకి కొన్ని ఆంగ వ్యాసాలు రాశాను. ఆంధ్రప్రభలో 'యథాలాపంి, ఆం(ధ్రజ్యోతిలో “గాథాలహరి", అనే ఫీచర్జు ఒక్కొక్కటి రెండేసి ఏళ్ళు చొప్పున రాస్తూ వచ్చాను. ప్రస్తుతం ఆంధ్రభూమి వారపత్రికలో 120 వారాల నుంచి 'ఆరోజుల్లో' అనే శీర్చిక నిర్వహిస్తున్నాను. హాస్యం భార్యతో బజారుకి, భార్యా భర్తలిద్దరూ రచయతలైతే, వంటొచ్చిన మగాడు, మజాకా గాదు మేష్టరీ ఉద్యోగం వంటి పాతిక ముప్పయి హాస్య ప్రసంగాలు, విజయవాడ, హైదరాబాదు రేడియో స్టేషన్ల ద్వారా (ప్రసారం అయ్యాయి. పదిహేను ఇరవై రేడియో నాటికలు రాశాను. ఏడాదిక్రితమే నేను రాసిన కొన్ని హాస్యకథల్ని చేర్చి 'నవ్వాలను'కొంటె కథలు” అనే కథాసంపుటంగా వెలువరించాను. నేను భమిడిపాటి కామేశ్చరరావుగారి దగ్గర చదువుకొన్నాను. 'బారిష్టర్ పార్వతీశం" రాసిన మొక్కపాటి నరసింహశాస్త్రి గారితో ఇరవై ఏళ్ళపాటు సన్నిహితమైన మైత్రి ఉంది. మునిమాణిక్యంగారి కథలంటే నాకు ఇష్టం - అంతకంటే, నా మాటలో, మనస్సులో, ఆరోగ్యకరమైన హాస్యానికి పెద్దపీట- వ్యక్తిజీవితంలో ఏమిటి, జాతి జీవనంలో ఏమిటి తరచు తలఎత్తే తలనొప్పు అన్నింటికీ సర్వరోగనివారిణి హాస్యం అని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే నారచనల్లోనూ, సంభాషణల్లోనూ, గాంభీర్యం వెనకాల హాస్యరేఖ తాంగిచూస్తూ ఉంటుంది. నాకు నంది అవార్డుతోబాటు.. నెల్లూరు వారి ఠాగూర్ అవార్డు, తెలుగు యూనివర్సిటీ ప్రతిభాపురస్కారం లభించాయి. యాభయి ఏళ్ళుగా సాగుతూన్న సాహిత్య యాత్రలో అవి సరే - అంతకంటే నాకు లభించిన అదృష్టాలు రెండు. ఒకటి, సమర్దులైన గురువులు దొరకడం - 36 పరిణతవాణి ప్రసంగాలు
రెండు, ప్రసిద్దులైన ఎందరో సాహితీమూర్తులు నాకు సన్నిహితమైన మి(త్రులు కావడం
మొదటి అదృష్టం గురించి ముచ్చటించాను. పరిణతి
ఇంక రెండో అదృష్టం వివరాలు: కధా-నవలా ఈ ప్రక్రిల్లోనే ప్రాయికంగా రచనా వ్యాసంగం సాగించడం - కధలో తెలుగు వాతావరణాన్ని. భాషలో నుడికారాన్ని గమనిస్తూ రచన చెయ్యడం - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి సహచర్యం వల్ల నాకు
ఆరోగ్యకరమైన హాస్యం ఎలా ఉంటుందో తెలిసింది భమిడిపాటి కామేశ్వరరావు గారి వల్ల -
భాషాగతమైన అందాలు అర్ధం అయింది మధునా పంతుల వారి కారణంగా.
పింగళి వారి వ్యక్తిత్వాన్ని వచన రచనలో కనిపించే వారి శ్రైలినీ పరిశీలించాక, రచనా గొంభీర్యం యొక్క అవసరం ఎంతటిదో అర్ధం అయింది.
విశ్వనాధ, తల్హావర్జుల, దేవులపల్లి, పుట్టపర్తి వంటి దిగజాలతో ఎంతో సన్నిహితంగా పాతిక ముప్పయి ఏళ్ళు స్నేహం చెయ్యడం వల్ల, నా రచనా మార్గం లో ఎన్నో వెలుగులు నింపుకోగలిగాను. న
వ్యక్తిగా బొన్నత్యం సాధిస్తేనే రచనలో జౌన్నత్యం వచ్చేది - అనే వారు విశ్చనాథ. ర వనలో అందాలు ఎన్ని చొప్పీంచినా, అంతర్లీనంగా ఒక జీవిత సూక్తం కూడా ఉండాలి-
సమకాలీనమైనదాన్ని దేన్ని వస్తువుగా తీసుకున్నా, దాన్ని సార్వకాలీనం చెయ్యాలి. అప్పుడే, అది పదికాలాలపాటు నిలుస్తుంది - ఇది తల్గావర్జులవారు నేర్పిన పారం.
పాఠకుడు స్పందించాలంటే మొదట రచయితలో ఆస్పందన ఉండాలి. రాయాలి రాయాలి అనే తహ తహ బయల్లేరకపోతే రచన చెయ్యెద్దు. కవితలు కాని కధలు కాని ఎన్ని రాశాం అని కాదు. ఎలా రాశాం - అన్నది ముఖ్యం అని నిత్యమూ చెప్పేవారు కృష్ణశాస్రే
రాసేటప్పుడు వళ్ళు తెలియకుండా రాయి.
తిరిగి చదువుకొనేటప్పుడు వళ్ళు దగ్గర పెట్టుకుని మరీ సరిచూసుకో. శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి ర
రాసేటప్పుడు నువ్వు నిరంకుశుడివి. కాని అది మళ్ళీ చదువుకున్నప్పుడు నీకు నువ్వే శత్రువువి- పుట్టపర్తి వారి హెచ్చరిక ఇద్. కధకాని నవల కాని సహజంగా ఉంటేనే పాఠకుని మనస్సుని ఆకట్టుకొనేది. కాని సహజంగా మాత్రమే అంటే, అది సాహిత్యం కాదు - ప్రెస్ రిపోర్టు అవుతుంది. అప్పుడు పారకుడ్కి మనస్సుకి హత్తుకోదు. ఇది అద్ "శిండు కత్తివాదరల్హాంటివి వీటి మధ్య చాకచక్యంగా పరిగెట్టించాలి కలాన్ని - పాలగుమ్మివారు నేర్పిన పారం ఇది. వీరంతా చెప్పినవన్నీ నాకు రక్తంలో జీర్ణించిపోయాయి. రాసేటప్పుడు నాకు తెలియకుండానే వాటి లబ్లిని నేను పొందుతున్నాను. నాకు గల సాహితీ బంధువుల సంఖ్య చాలా ఎక్కువ. వారిలో కవులూ, కథకులూ, నవలా రచయితలూ, నాటకకర్తలూ, విమర్శకులూ అందరూ ఉన్నారు. నాడు-నేడు గత పది పదిహేను ఏళ్ళ నుంచీ స్నేహాలు మరీ యాంత్రికంగా తయారయ్యాయి కాని, అంత(కితం సమవయస్కులం అయితే అన్నదమ్ములుగా ఉండేవాళ్ళం. పెద్దవాళ్ళయితే బాబయ్యో, మామయ్యో - ఇంటికి వస్తే వారం పదిరోజులు అరమరికలు లేకుండా ఆత్మీయంగా ఉండిపోవడమే. సాహితీ బంధువులు అనే మాటకి సార్టకమైన అర్హం ఉన్న రోజులవి, ఆ యుగం వెళ్ళిపోతోంది. ఏం రాశాం. ఎలా రాశాం అని కాదు. ఏయే అవారు ర్ లున్నాయి, వాటిలో మనకి ఎన్ని వచ్చాయి? ఇంక ఎన్ని రావాలి? - అని లెక్కించుకొనే రోజులు వచ్చాయి. ఆంతేకాదు - మన ఆలోచనా మార్గానికి భిన్నంగా ఉన్న ఆలోచనల్ని అర్ధం చేసుకోవడం పోయి అవహేళన చేసే రోజులు వచ్చాయి. ఇలా ఎన్నో మార్పులూ పరిణమాలూను - జగత్తే పరిణామశిలం - సరే - అవన్నీ ఆలా ఉంచండి. నా సాహిత్య జీవితానికి సంబంధించిన అన్ని కోణాల్నీ - దాదాపు స్థూలంగా ప్రస్తావించాను. 38 సరిణతవాణి ప్రసంగాలు
మరొక్కటి మిగిలిపోయింది ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆం(ధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా నేను కొనసాగిన ఒక దళాబ్ది కాలం గురించి - అకాడమీ సభ్యునిగా నా పాత్రని దాదాపు సంతృప్తిగానే, నిర్వర్తించాను. అంత వరకూ నాటక (ప్రక్రియకి అకాడమీ అవార్డు ఇచ్చేది కాదు. అవార్డుల కింద ఇచ్చే సొమ్ము కూడా వెయ్యి రూపాయిలే ఉండేది అకాడమీ నిర్వహించే సభలు, జయంత్యుత్సవాలతో సహా, హైదరాబాద్‌లోనే జరిగేవి. గురజొడ జయంతి విజయనగరంలోనూ, కందుకూరిది రాజమండ్రిలోనూ- అలా ఏ సాహితీమూర్తిది ఆయా చోట జరిపించే పద్దతి లేదు. ప్రసిద్ద కధకుల గురించి సాధికారికమైన వ్యాసపరంపరగాని, ప్రసిద్దమైన కధల సంకలనంగాని పారకులకి అందుబాటులో లేవు గా ఏటా ఒక విషయం ప్రకటించి ఆ విషయంపై వచ్చిన విమర్శ (గ్రంథాల్లో ఉత్తమమైన దానికి మూడు వేలిచ్చే ప్రణాళికలో ప్రాచీన సాహిత్య విషయాలే కాన్ ఆధునిక విషయాలు లేవు. సాహిత్య స్టాయికి ఎదిగిన సాహిత్యేతరవ్యాసాల (ప్రాసంగిక వ్యాసాలు) ఉనికిని ఎవరూ గమనించలేరు. కవుల్నీ. కధకుల్నీ, నవలా రచయితల్నీ, దేశంలోని ఇతర (ప్రాంతాలకి పంపి, ఆయా ప్రాంతాల జీవన సరళినీ, అక్కడి సాంస్కృతిక సామాజిక పరిస్థితుల్నీ అవగాహన చేసుకుని, ఆంధ్రులకి ఆం(ధ్రేతర ప్రాంతాల గురించి తెలియజెప్పే రచనలు చెయ్యండని (ప్రోత్సహించే పద్దతి లేదు. ఇలా అనేకానేకమైన ఉపయుక్త కార్యక్రమతీర్మానాల్ని (ప్రవేశపెట్టి (ప్రస్తావించడం లోనూ, అకాడమీని ఒప్పించి వాటిపై తీర్మానాలు చేయించడంలోనూ, మిగిలిన ఎన్నో విషయాల గురించి చర్చించడంలోనూ నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. నా నవలలపైనా కధలసైనా,ఎమ్.ఫిల్., పి.హైచ్.డి,లు కొన్ని వచ్చాయి. ఒకటి శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి తి
సం([గ్రహంగా ఇదీ నా సాహితీ (ప్రస్థానానికి సంబంధించిన చరిత్ర ప్రస్థానం ఇంకా సాగుతూనే ఉంది. సనూలోచన అయితే సాధించిన ప్రగతి ఎంత? వచ్చిన పరిణతి ఏమిటి? అని ఇవాళ నన్ను నేను ప్రశ్నించుకుంటే, క్రాత్తలో ఉత్సాహమే కాని ఒక లక్ష్యం, ఒక గమ్యం, అంటూ ఉండేది కాదు - తర్వాత తర్వాత లోకానుభవం పెరిగింది. సాహితీ ధురంధరులతో సాగించిన సన్నిహితమైన మైత్రికి తోడు, అధ్యయనం వల్ల ఆలోచనలపై కొన్ని వెలుగురేఖలు ప్రసరించాయి. ఆంధ్ర సాహిత్యంతోబాటు, ఆంగ్రమాధ్యమం ద్వారా (ప్రసిద్దమైన కొంత విశ్ససాహిత్య పరిచయం కూడా లభించింది. దాంతో సాహిత్యం పట్ట ఒక అవగాహన ఏర్పడింది. దాన్ని మార్పు అనవచ్చు - సహృదయులుదాన్నే పరిణతి అనవచ్చు. ఆ పరిణతి కూడా పరిమితమైందనే నా ఉద్దేశం - పరిమితమైన పరిణతితో నేననేదేవిటంటే - ముగింపు మాటలు ఏ రచయితా అభ్యుదయం పేరుతో జాతి సంస్కృతిని విచ్చిన్నం చెయ్యడం మంచిది కాదు. రచనల ద్వారా (ప్రజల మధ్య సంఘర్షణల్ని సృష్టించడంకంటే, సామరస్యాన్ని పెంపొందించడం (శ్రేయస్కరం. (ప్రతి రచయితా, తాను తీసుకున్న ఇతివృత్తంతోబాటు ఆ ఇతివృత్తాన్ని అందించే విధానం మీద కూడా సమానమైన దృష్టి ప్రసరించాలి. ప్రతి రచయితకీ, తనదైన ఒక శైలి అవసరం - అలాగే ఒక్కొక్క రచనకి ఒక్కొక్క ధోరణీ ఒక్కొక్క (శ్రుతీ ముఖ్యం. కథ, నవల, కవిత, నాటకం, ఏది రాసినా, రాయాలనే తహతహ ఏర్పడ్డాకే రాయాలి. ఆవేశంతో రాసినా ఆలోచనతో సరిచూసుకోవాలి త పరిణతవాణి ప్రసంగాలు
ఎన్ని రాశాం అనికాదు - ఎలా రాశాం అన్నది ముఖ్యం.
ప్రతి రచనకీ ఒక ప్రయోజనం ఉండాలి. - ఆ ప్రయోజనం, ఆ రచయిత ముఖ్యజీవిత సూక్తానికి (01110+001%) 0౯ 1[ఎ అనుబంధంగా ఉండాలి -
సమకాలీన సమస్యని తీసుకున్న దాన్ని సార్వకాలీనంగా మలచాలి
విరూపమూ వికృతమూ అయిన సంగతిని చెప్తూన్నా, దానికి వీలైనంత కళాత]క రూసం తీసుకురావాలి. న్ శ్ర
జాతి దీర్హకాలిక ప్రయోజనాన్ని లక్ష్యంగా పెట్టుకొని, మనుష్యుల్లో కసిని కాకుండా కారుణ్యాన్ని పెంచడానికి ప్రయత్నించాలి.
అన్నింటి కంటే ముఖ్యం -
ఏళ్ళు గడిచిన కొద్దీ రచయిత గిడసబారకూడదు. పసితనాన్నీ పచ్చదనాన్నీ గుండెల్లో జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. ఏమంటే, రచయిత ఉన్నతంగా ఉంటే తప్ప రచనకీ జాన్నత్యం రాదు.
మానవజాతికి 'ఆశ' చెట్టుకి నీరు లాంటిది. అందువల్ల ఆశావాదాన్నే కాని రచన ద్వారా నిరాశావాదాన్ని ప్రచారం చెయ్యడం మంచిది కాదు -
పరిణామ దశ అనండి పరిణతమైన దశ అనండి - ఏమైనా నాకు తోచిన భావాలు ఇవి.
విజ్ఞులైన రసజ్ఞులకి ఇవన్నీ తెలియవని కావు - నేను కూడా తెలుసుకున్నానని చెప్పడం వరకే -
అందువల్ల ఇంతటితో సెలవు.
ట్
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి తే
డౌ. సి, ఆనందారామం (8-2-2005)
తెల్లవారితే వరలక్ష్మీవ్రతం అనగా ఆ తెల్లవారుజామున పుట్టానట. అందుకే నా పేరుకు లక్ష్మిని చేర్చారు. మా నాన్నగారివైపు వాళ్ళందరివీ ఆచారాలు, సంప్రదాయాలూ నిష్టగా పాటించే కుటుంబాలు. మా ఆమ్మతరఫు బంధువులందరూ ఆధునిక నాగరికతను అంగీకరించినవాళ్ళు - 1930కి పూర్వమే విదేశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళు - ప్రేమ వివాహాలు, వర్ణాంతర వివాహాలూ చేసుకున్నవాళ్ళు. ఈ రెండు పరస్పర విభిన్న సంస్కారాల మధ్య పెరిగాను.
ఏ మార్పు అయినా [క్రమానుసారంగా వస్తుంది. ఆకాశంలోంచి ఊడిపడదు మా అమ్మమ్మగారు భక్తి పేరుతో వ్యవస్తను ధిక్కరించారు. మౌ అమ్మ స్రీకి విద్య కావాలి అంటూ, మాకు పెళ్ళిళ్ళయ్యాక పట్టుదలగా చదువుకొంది. మా తరంలో మేము స్త్రీ కూడా ఉద్యోగం చెయ్యాలనీ, ఆర్టిక స్వాతంత్ర్యం ఉండాలనీ పోరాడాము. మా తరంలో చదువుకొని ఉద్యోగం చేసిన (స్త్రీల సంఖ్య 15 శాతం కూడా ఉండదేమో!
నాకు జ్ఞానం వచ్చినప్పటినుండీ నా చుట్టూ కధలే వినిపించాయి. ఇంట్లో అమ్మమ్మగారు చెప్పే రామాయణ, భారతకధలు - వీధుల్లో స్వాతంత్రోద్యమ వీరుల బు(ర్రకధలు- గుడిలో హరిదాసు గారు చెప్పే హరికథలు!
ఇలాంటి కధా (ప్రపంచం మధ్యనా ఊహలనిండా కధలే! ఊహలలో గంధర్వలోకాలకు వెళ్ళేదానిని - తపస్సు చేసి దేవుడి దగ్గర “నేను ఏది కోరుకుంటే అది జరిగిపోయే” వరంపాందేదానిన్సి - ఇది ప్రపంచ ప్రజలందరి ఆశ అనీ, దీనిని (ప్రతీకాత్మక (ప్రతిరూపాలే 'పాతాళభైరవి”, 'అల్హాడద్దీన్ అద్భుతదీపం' లాంటి కధలనీ పెద్దయ్యాక తెలుసుకున్నాను. (ప్రైమరీస్కూల్లోనే నీతికథలు సాంతంగా కల్పించి చెప్పే దానిని - అందరూ నవ్వేవారు.
42 పరిణతవాణి ప్రసంగాలు
నేను ఏడో క్లాసులో ఉన్న రోజుల్లో అంటే, నాకు పదేళ్ళ వయసులో, అమ్మ అమ్మమ్మని ఒక (ప్రశ్చ అడిగింది:
“మొగవాళ్ళు పుణ్యం చేసుకుంటే, వాళ్లకి రంభ, మేనక, ఊర్వశి మొదలయిన వాళ్ళున్న స్వర్గం వొస్తుంది కదా! నురి ఆడవాళ్ళు పుణ్యం చేసుకుంటే, వాళ్ళు పొందే స్వర్ణం ఎలాంటిది?”
ఈ ప్రశ్న ఈనాటికీ నేను మరిచిపోలేదు. స్వర్గనరకాల ఉనికినే ప్రత్నించే ప్రశ్న. పుణ్యపాపాలకు గీటురాయి ఏదని నిలదీసే ప్రశ్న. ఈ ప్రశ్న నాకు తరువాతి జీవితంలో 'ప్రతిదానినీ ప్రశ్నించటం నేర్పింది.
నా చదువు దినదినగండంగా సాగింది. ఎస్.ఎస్.ఎల్.సి. అయ్యాక మాన్పించారు. ఎలాగో ఇంటర్లో చేరాను. ఇంటర్ పాసయ్యాక మళ్ళీ మాన్పించారు. పెళ్ళి సంబంధాలు చూశారు. పెళ్ళి కుదరలేదు. కధ కుదిరింది. చదవకుండా ఉండలేని ఆరోజుల్లో కేవలం నేను చదువుకోవటం కోసం చూసినవీ, విన్నవీ అన్నీ కధలుగా రాసే దానిని, నేనే చదువుకుని బీరువాలో దాచేసే దానిని. నా స్నేహితురాలు, అంబ నా కధ చదివి “ఇది పత్రికలలో వచ్చే కధలాగానే ఉంది-” అని, తనే ఫెయిర్ చేసి, తనే పోస్టల్ ఛార్జీలు భరించి, 'ఆంధ్రప్రభికు పంపింది. ఆ కధ “ఆంధ్రప్రభ డెయిలీలో అచ్చయింది. పెద్దవాళ్ళకి తెలిస్తే తిడతారని “మిస్ బీనా" అనే పేరుతో పంపాము. కధ పేరు “ఆటు-పోటు”. ఆ కథకి నాకు 15రూ. రెమ్యూనరేషన్ వచ్చింది. నా మొదటి సంపాదన. నాన్నాగారికి ఇచ్చాను. అప్పుడు - "కధలు రాయటం మంచిదేనే!” అన్నారు నాన్నగారు. అమ్మ చాలా సంతోషించింది. ప్రైవేట్‌గా బి.ఏ.కి కట్టాను. టైం లేదు. టెక్స్స్బుక్స్ లేవు. అలాగే పరీక్ష రాసి పాసయ్యాను.
“మా ఆనంద గ్రాడ్యుయేట్!” అని మా నాన్నగారు తలుచుకుని తలుచుకుని ఆనందించారు. ఆ రోజుల్లో మా కుటుంబాల్లో బి.ఏ. పాసయిన వాళ్లు చాలా తక్కువ.
తర్వాత కుమారి ఆనందలక్ష్మి పేరుతో “అందమయిన ట్రాజెడీ” కధ రాశాను. అది 'ఆం(ధ్రపత్రిక'లో అచ్చయింది.
1954-55ల మధ్య సి.ఆర్.ఆర్. కాలేజికి వచ్చిన డా| సి. నారాయణరెడ్డిగారిని చూశాను. పాల్కురికి సోమనాథుడు కోడికూతను “కాక్కొరోకుజ్” అని ఎంతో సహజంగా వర్షించాడు. - అని వారు చెప్పటం నాకింకా గుర్తుంది.
తర్వాత రెండేళ్ళు సి.ఆర్-ఆర్. కాలేజీలో ట్యూటర్‌గా పని చేశాను. కాలేజి మేగబిన్లో ఒక కధ ్రాశాను. 1957లో రామాచార్యులు గారితో పెళ్ళి జరిగింది. దా, సి. ఆనందారామం తై
హైదరాబాద్‌కి వచ్చాను. మా మావగారి దయవల్ల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజిలో యం.ఏ ,లో చేరాను. ప్రీవియస్‌లో పెద్దబ్బాయి. సైనల్లో చిన్నబ్బాయి. బస్‌స్టాపులో బండరాతి మీద చదువు - ఎలాగో డిగ్రీ తెచ్చుకున్నాను. ఆ సమయంలో నాకు సహకరించిన కుటుంబసభ్యులకి, ముఖ్యంగా మా పెద్దతోటికోడలు లక్ష్మిగారికి కృతజ్ఞురాలిని, ఇంటిపని, పిల్లలు, అనారోగ్యం - వీటితో కొన్నాళ్ళు కధల సంగతి మరిచిపోయాను. చదివే అలవాటు మానలేదు. విశ్వనాధ, బుచ్చిబాబు, గోపీచంద్, మాలతీచందూర్. ఇంగ్లీష్ నవలల అనువాదాలూ, శరత్ టాగూర్ రచనల అనువాదాలు - అవన్నీ అప్పటికే చదివేశాను. సోమరొసెట్ మామ్, డోస్తవిస్కీ మొదలయిన వాళ్ళ రచనలు చదివేదానిని. నా స్నేహితురాలు సరస్వతి, డా॥ జయంతి కామేశ్చరరావుగారి అమ్మాయి, నన్ను మళ్ళీ కధలు (వ్రాయమని ప్రోత్సహించింది. 1962లో నా మొదటి నవల “సంపెంగ పాదలు” వచ్చింది. నా చుట్టూ ఉన్న (స్త్రీల జీవిత కధలే నా రచనలకు ప్రేరణ. నాక్షు 'స్నేహితురాలూ, బంధువూ - ఒకామె భర్త అహంకారాన్ని భరించలేక, పుట్టింటికి వచ్చేసింది. తండ్రి చదివిస్తానన్నాడు. 'మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళొద్దు" అన్నాడు. అంతలో భర్త “నువ్వు తిరిగివచ్చెయ్యి” అని ఒక కార్డు రాశాడు. “మా అయన్ని వొదిలి నేనుండలేనే” అంటూ అత్తవారింటికి బయలుదేరింది. ఇదే, 'సంపెంగ పొదలు” నవలలకు (ప్రేరణ. పారకులు ఈ నవలను బాగా ఆదరించారు. “ఆంధ్ర పత్రిక సంపాదకులు నాకు రూ.450/- పారితోషికం పంపారు. అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం. పబ్దిషర్స్ మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చి, నాకు మరో 450రూ॥ ఇచ్చి నవల పబ్లిషింగ్ హక్కులు తీసుకున్నారు. తర్వాత 'స్వాతిజల్టు' ఆంధ్రపత్రికలో సీరియల్‌గా వచ్చింది. 1965లో ప్రధమ అఖిల భారత రచయిదత్రుల మహాసభ జరిగింది. విజయలక్ష్మీ పండిట్ ముఖ్య అతిధిగా వచ్చారు. కాసుబ్రహ్మానందరెడ్డిగారు ఆనాటి ముఖ్యమంత్రి. ఆ సభలో సాహిత్య అకాడమి తరపున ప్రముఖ సినీనటి భానుమతి నన్ను ఉత్తమ రచయి(త్రులలో ఒకరుగా సన్మానించారు. నేను ఎదురుచూడని గౌరవం అది. సన్మానితుల లిస్ట్‌లో నా పేరు ఉన్నట్టు కూడా నాకు తెలియదు. నా పేరు పిలవటం విని సంభ్రమంగా స్టేజి మీదకు వెళ్ళాను. శ్రీమతులు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు, నాయని కృష్ణకుమారిగారు, యశోదారెడ్డిగారు, రామలక్ష్మీ ఆరుద్ర మొదలయిన వారు, ఆ సభలో పాల్గొన్నారు. ఈనాటికీ మరిచిపోలేని గౌరవం అది. భానుమతి గారు నన్ను సన్మానించినప్పటి ఫోట్రో నాదగ్గిర అతి జాగ్రత్తగా ఉంది. “ఏది సత్యం? గడ సరిణతవాణి ప్రసంగాలు
ఏదసత్యం?” నవలలో భార్యకు ఉద్యోగం ఉండి, భర్రకు లేకపోతే, అతడి ఇన్ఫీరియారిటీ కాంపైైక్స్ ఎలా ఉంటుందో రాశాను తనకంటే భార్య అధికంగా ఉండటం ఏ భర్తా సహించలేడు సాధారణంగా.
1967లో ఆచార్య సి. నారాయణరెడ్డిగారి పర్యవేక్షణలో పిహెచ్.డి.లో చేరాను. ఇది నా జీవితంలోనూ, సాహిత్యంలోనూ కూడా గొప్ప పరివర్తనదశ. అప్పటికి నేను నవజీవన విమెన్స్ కాలేజిలో పనిచేస్తున్నాను. డా॥ నారాయణరెడ్డి గారికి నా 'ఆత్మ బలి" నవలను ఇచ్చాను. ఆ నవలకు వీరమాచనేని మధుసూదనరావు గారు రూ.1,000/
- బహుమానంగా ఇచ్చారు. ఎమెస్కోవారు దానిని బెస్ట్‌సెల్లర్స్‌లో ఒకటిగా ప్రకటించారు. కానీ నారాయణ రెడ్డిగారు దానిని “ఇదేం నవల?” అని నిశితంగా విమర్శించారు. నేను చాలా క్రుంగిపోయాను. అభిమానుల ప్రశంసలకంటె ఈ విమర్శ విలువయినదిగా నేను భావించాను. ఎలా అయినా, నారాయణరెడ్డిగారు మెచ్చుకునే లాంటి నవల (బ్రాయాలనే పట్టుదల, తపన (ప్రారంభమయ్యాయి. అదే నా “నా నృషికురుతే కావ్యమ్” రచనకు దారి తీసింది. దానికి 'ఆంధ్రప్రభి నవలలో పోటీలో మూడవ బహుమతి వచ్చింది. కానీ, మంచి ప్రచారం వచ్చింది. కన్నడంలోకి భిమారావుగారు అనువాదం చేశారు. అయిదు ముద్రణలు పొందింది. ఇప్పటికీ ఆ పుస్తకం కావాలని అడుగుతుంటారు. నారాయణరెడ్డిగారు ఈ నవలను 'ఫరవాలేదు' అన్నారు. డా॥ సి. మృణాళిని ఈ నవలను కూడా తన పిహెచ్.డి. ధీసిస్లో చర్చించింది. “ప్రతి వ్యక్తిలోనూ ఐడియల్ సెల్ఫ్ ఉంటుంది. కానీ, నిజ జీవితంలో దానిని అందుకోలేము. వ్యక్తి ఐడియల్ సెల్ఫ్ ని అందుకోవటానికి అనుభవించే సంఘర్షణే జీవితం” - ఇది 'నా నృషికురుతే కావ్యమ్' నవలలోని ప్రధానాంశం.
తండ్రి బాధ్యతా రాహిత్యం కారణంగా నాశనమయిన స్రీ జీవిత గాథ “చీకటి కడుపున కాంతి”. మహిళా సంవత్సరం సందర్భంగా దక్షిణ భారత హిందీ (ప్రచార సభ వారు దీనిని హిందీలోకి అనువదించారు. “మానవ జీవితమే ఒక తపస్సు” అనే అర్ధంతో “తపస్వి” రాశాను. దీనిని 1970లో నారాయణరెడ్డిగారికి అంకితం ఇచ్చాను. సభ ఏమీ జరగలేదు. దీనిని ఎమెస్కోవారు వేశారు. వెంటవెంటనే రెండు ముద్రణలు వచ్చాయి. మళ్ళీ మరో ముద్రణ వచ్చింది. అవకాశం వస్తే దీనిని మరోమారు ముద్రించి, ఆపాత ఫోటోతోనే డా॥ నారాయణరెడ్డిగారికి సభాముఖంగా ఇయ్యాలని ఉంది.
1972లో నాకు గృహలక్ష్మి స్వర్ణకంకణం వచ్చింది. ఇది నాకు లభించిన మొదటి పెద్ద బహుమతి. ఈ బహుమతికి నా పేరును ఎవరు సూచించారో కూడా నాకు తెలియదు. ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు వచ్చింది. డా. సి, ఆనందారానుం తం
నిలం సంజీవరెడ్డిగారు భారతదేశానికి రాష్ట్రపతిగా వున్న రోజుల్లో కొందరు రచయి(త్రులను ఢిల్లీ ఆంధ్ర మహిళాసభ వారు ఆహ్వానించారు. వాళ్ళలో నేనూ ఉన్నాను. కానీ, కొన్ని కారణాల వల్ల ఢిల్లీ వెళ్ళలేకపోయాను.
ప్రతి దీపావళికీ 'యువి, 'జ్యోతి', 'ఆంధ్రజ్యోతి' పత్రిక సంపాదకులు నా కధలు అడిగి తీసుకుని ప్రచురించేవారు. పత్రికా సంపాదకులు నా నవలలు, కధలు కావాలని ఉత్తరాలు రాసే వారు. నవల పూర్తిగా ఇయ్యకపోయినా, నా మిద నమ్మకంతో వారానికొకసారి రాసి పంపినా, అంగీకరించేవారు. పబ్లిషర్స్ ఇంటికి వచ్చి, నవలలకు ప్రచురణ హక్కులు తీసుకునేవారు. కధా సంకలనాలు రావటం కాస్త కష్టంగానే ఉండేది. కథా సంకలనం వేస్తేనే, నవలకు ప్రచురణ హక్కులు ఇస్తామంటే ప్రచురించే వారు. నాకు బయటి ప్రపంచంతో సంబంధం చాలా తక్కువ. ఇల్టూ, కాలేజి - ఇదే నా (ప్రపంచం. నా ఆనందాలు, ఆలోచనలు, భయాలు, సంఘర్షణలు, ఊహలు, పరిశీలనలు - అన్నీ అక్షరాలతోనే! కాగితం మోదనే! ఏది చూసినా, ఎలా స్పందించినా కథగా ఆకారం దాల్బేది. అందుకే, నేను కొంచెం ఎక్కువగా రాశానేమో!
కులాల సమస్యలు (వెలుగుబాట), పెళ్ళి కాకుండానే గర్భవతి అయి ఆదుకొనేవారు లేక ఆత్మహత్య చేసుకున్న స్త్రీల సమస్యలు (గుళ్ళో వెలసిన దేవతలు), సంప్రదాయాలతో పోరాడిన ప్రీ కధలు (భాష్యం, రక్ష రేకు) - ఇలా ఎన్నో కోణాలలోంచి (స్త్రీల సమస్యలు రాశాను. కానీ నేను ఫెమినిస్ట్‌ను కాను. నా స్తీపాత్రలు పాత సంప్రదాయాలను ప్రశ్నించాయి. (ప్రతిఘటించాయి. కానీ, పురుషులలో పశ్చాత్తాపం కనబడినప్పుడు రాజీ పడ్డాయి. పాత పగలు నిలుపుకోలేదు. “కొందరు మంచివాళ్ళు, మరికొందరు చెడ్డవాళ్ళు అంటూ ఉండరు. ప్రతివ్యక్తిలోనూ, మంచీ - చెడూ రెండూ ఉంటాయి. ఎప్పుడు మంచి తనం మేల్కొంటుందో, ఏ దశలో పాశవికత పడగ విప్పుతుందో ఎవరూ చెప్పలేరు.” - జీవితంలోనూ, సాహిత్యంలోనూ కూడా ఇదే నా దృక్పథం. సంఘర్షణాత్మక పాత్రల్లో మాత్రమే నేను జీవించగలను.
వివాహవ్యవస్థ విచ్చిన్నం కావటం వల్ల స్త్రీకి లాభమా? నష్టమా? - ఆలోచించ వలసిన ప్రశ్న.
డౌక్టర్ సి. నారాయణరెడ్డిగారి తీవ్రమయిన మందలింపుల ఫలితంగా వారి దయవల్ల నాకు 1977లో పిహెచ్.డి. డిగ్రీ వచ్చింది. 1979లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చేరాను. అక్కడి హిందీ, హిస్టరీ, పోలిటికల్ సైన్స్, ఆం్రోపాలిజీ డిపార్ట్మెంట్ అధ్యాపకులతో పరిచయాలు చేసుకున్నాను. వారి పరిశోధనాంశాలు తెలుసుకున్నాను. ఈనాటి శకుంతల), 'మరో ముందడుగు”, “'జాగృతి' నవలలు ఆ షట్ పరిణతవాణి ప్రసంగాలు
కాలంలో రాసినవే. “మరో ముందడుగు” నవలను నా ఆత్మీయస్నేహితురాలు డా॥ ఎ. నిద్యారాణికి అంకితమిచ్చాను.
హిందీ ప్రొఫెసర్ డాః వై.వి రమణరావుగారు నా కధలు హిందీలోకి అనువాదం చేశారు. ఆ కధా సంకలనాన్ని డా॥ సి. నారాయణరెడ్డిగారికి అంకితమిచ్చారు. నీరు తెలుగులో కూడా యం.ఏ డిగ్రీ తీసుకున్నారు.
డి.డి. కొశాంబి, ఇంద్ర మొదలయిన వాళ్ళ రచనలు చదవటం నల్ల పురాణేతి హాసాలను హేతువాద దృష్టితో పరిశీలించటం నేర్చుకున్నాను దాని ఫలితమే, “ఇంద్ర సింహాసనం'. 'ఇదా భారతం?” నవలలు - నా తర్వాత కె. రామలక్ష్మీ ఆరుద్ర, యాయతి పేరు తోనూ, డా॥ ముక్తేవిభారతి 'చతురస్రం' పేరుతోనూ యయాతి కథను రాశారు
'జాగృతి' నవలను రాఘవేంద్రరావుగారు 'త్రిశూలం' సినిమాగా తీశారు. నా “ప్రేమ సూత్రం” ఆధారంగా కె.ఎస్. ప్రకాశరావుగారు “జీవితం” సినిమా తీశారు. ఆ సినిమాకు పాటలు డా॥ సి. నారాయణరెడ్డిగారు రాశారు. అవి బాగా హిట్ అయ్యాయి. అదొక అందమయిన అనుభవం. “జ్యోతి” సినిమాను కూడా రాఘవేంద్రరావు గారే తీశారు దీనికి నా “మమతల కోకిల” అనే నవల ఆధారం. నా 'ఆత్మబలి' ఆధారంగా “సంసార బంధం' సినిమా వచ్చింది.
చుట్టు పక్కల వారి జీవితాల నుండి (ప్రేరణ పొంది రాసే అలవాటు ఉండడం వల్ల, నేను అనుకున్న విధంగా రాయలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నేను నవలను మధ్యలో ఆపేసే దానిని లేదా పుస్తకరూపం ఇచ్చేదానిని కాదు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు.
ఆ కాలంలోని అంటరాని వారి జీవితాలు నేపధ్యంగా “భాష్యం”. “రక్షరేకు” రాశాను. అయితే, నేను నా అనుభవాలు (ప్రేరణగా రాశాను. వర్షపోరాట దృష్టి లేదు. నేను జీవితంలో పరిస్థితులకు ఎదురీది, హరిజన బాలికను చేరదీసినట్టే, నవలల్లోనూ ఉభయ వర్గాల సామరస్యమే సమస్యకు పరిష్కారమయింది. “రక్షరేకు”ను యువకళా వాహినివారు “ఆత్మబలం” అనే టి.వి. సీరియల్‌గా తీశారు (30డు వారాలు మాత్రమే).
1987 నుండి 1992 వరకు నేను కాటరాక్ట్ గ్లూకోమాలతో బాధపడ్డాను. ఆ దుర్దశలో డాక్టర్ సి. నారాయణరెడ్డిగారు ఎంతో దయతో నాకు అండగా ఉన్నారు. నా సహాధ్యాపకులందరూ నా మోద సానుభూతి చూపారు. డాః వైవి. రమణరావుగారి భార్య శ్రీమతి రాజేశ్చరిగారు, డొ॥ పి. రామనరసింహంగారి భార్య శ్రీమతి లీలగారూ ఎంతో మంచివారు. ఈ రెండు కుటుంబాల వారూ నన్నెంతో ఆత్మీయంగా ఆదరించారు. దా. సి. ఆనందారామం 47
ఈ దశలోనే చదివించుకుని విని, చెప్తూ రాయించి “సమాజసాహిత్యాలు” 'నవలా విమర్శ" 'తులన్మాతక సాహిత్యం-నవలా ప్రక్రియ” ప్రచురించాను. ఇవి పరిశోధన (గ్రంధాలు.
చెప్పదలుచుకొన్న అంశానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని కొన్ని నవలలు రాశాను. ఆడవాళ్ళ బైళ్ళకువెళ్ళి, ఆడఖైదీలను ఇంటర్వ్యూ చేసి “అర్దరాత్రి సూర్యోదయం”, మెంటల్ హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ లక్ష్మి అనే మానసిక రోగితో మాట్టాడి, డాక్టర్ నడిగి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుని “మళ్ళీ వచ్చిన వసంతం”, ఆర్కియాలజీ గురించి తెలుసుకుని “సూర్యనేత్రం” ఓషియెనో[గ్రఫీ గురించి తెలుసుకుని “నిటిసెగలు” నవలలు రాశాను.
యూనివర్సిటీ పోలిటిక్స్ మోద కొన్ని కధలు రాశాను. యూనివర్సిటీ జోక్స్ వారం వారం ఆం(ధ్రజ్యోతి వారపత్రికలో వచ్చేవి. వీటిలో కొన్నింటికి కామేశ్వరిగారు
(అళ్విని) ప్రేరణ ఇచ్చారు. నా నవలలు కన్నడంలోకి చాలానే వచ్చాయి. “మంటలు” “పెళ్ళందుకు?” “ఎవరు నువ్వు?” కధలు ఇంగ్లీష్ లోకి వచ్చాయి.
నాకు చెప్పుకోదగిన అవార్డులు కొన్ని వచ్చాయి. 1979లో స్టేట్ సాహిత్య అకడమో అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్‌కు నా పేరు సూచించింది - ఆం(ధ్రా పెరల్ బక్ డా॥ వాసిరెడ్డి సీతాదేవి గారు, అక్షర వాచస్పతి డాక్టర్ దాశరధిరంగాచార్యులు గారు అని తర్వాత తెలిసింది. డా॥ వాసిరెడ్డి సీతాదేవి నా అభిమాన రచయిత్రి. నా స్నేహితురాలు. నాకెన్నో విధాల సహకరించారు. ఆమెకు కృతజ్ఞురాలిని. అగ్రశ్రేణి రచయి(త్రులందరూ అందుకున్న సుశీలా నారాయణరెడ్డి అవార్డ్ అందుకోగలగటం నాకు గర్వకారణం. తెలుగు విశ్చవిద్యాలయం వారు ఉత్తమ విమర్శకూ, ఉత్తమ రచయిత్రిగానూ అవార్డులిచ్చారు. గోపీచంద్ అవార్డ్ 2000లో వచ్చింది. న్యాయ నిళ్లీతలలో డా॥ వాసిరెడ్డి సీతాదేవి కూడా ఉన్నారు.
పెద్ద గేప్ తర్వాత 'వార్త సంపాదకులు కోరగా “ఎంతెంత దూరం?” రాశాను. దీనికి మంచి ఆదరణ లభించింది. దీనిలో కపట సన్యాసులను విమర్శించాను. నిజమయిన ఆధ్మాత్మిక సాధనను గౌరవించాను.
తర్వాత 'వార్త' సంపాదకులు కోరినా రాయలేకపోయాను. “తిరుప్పావై ఆధారంగా నవల రాయాలని సంకల్పించుకొన్నాను. నేను మిధ్యావాదాన్ని ఒప్పుకోను. అందుకే, “ప్రకృతి మిధ్య కాదు. ప్రకృతి ఆధారంగానే పరతత్త్యాన్ని అందుకోగలం” అని చెప్పే తిరుప్పావై నన్ను ఆకర్షించింది. "భౌతికావరణను చైతన్య ప్రదీప్తం చేసేది భగవానునిపై ఉరి పరిణతవాణి ప్రసంగాలు
గల ప్రేమ” అంటుంది అండాళ్, నేను ప్రేమను నమ్ముతాను. అది కాల్పనికం కాదు మనసును అంతర్యామి వైపు నడిపించే వెలుగు.
నా జీవితానుభవం సాహిత్యసృష్టిగా ఎలా రూపొందుతుందో చెప్పటానికి ఒక ఉదాహరణ “బుణ(గస్తులు”. దీనిని డాః ముక్తేవిభారతి ఇటీవల డిసెంబర్ 'విపుల'లో “రచయిత్రికి నచ్చిన కధ' శిర్షికలో ప్రచురించారు. నాచేతికి ఏక్సిడెంట్ అయితే, మా పని మనిషి నరస నాకెంతో సేవచేసింది. ఆమెకు బహుమతిగా నేను బంగారు దుద్దులు ఇచ్చాను. అయినా, ఇంకా నేనే బుణపడి ఉన్నాననే భావం కలిగింది. ఇది 'అనుభవం'” కధగా రూపొందింది.
ముగిస్తూ ఒక మాట.
భగవంతుడిని నేను ఎన్నెన్నో కోరాను.
అవేమి, ఆయన నాకు ఇవ్వలేదు.
కానీ,
నాకు ఎప్పుడెప్పుడు ఏది అవసరమో,
అవన్నీ నాకు ప్రసాదించాడు.
నా గురువర్యులు, ఆంధ్రసారస్వతపరిషత్ అధ్యక్షులు డా॥ సి. నారాయణరెడ్డి గారిక్షి కృతజ్ఞత.
ఇ శీ షె
దడా. సి. ఆనందారామం త్రి
డా. ఎం.ఎస్. రెడ్డి (3-8-2005)
నేను రెండు విధాలుగా అదృష్టవంతుణ్ణి! ఒకటి పిత్రార్జితమైన ఆస్పిపాస్తులకు వారసుణ్ణి కాకపోవటం, రెండు - బహుముఖాలుగా వికసించిన మానవమేధకు వారసుణ్ఞి కావడం.
ఇవి నా గురించి నేను రాసుకున్న మాటలు. ఈ దినం ఆ రెండు మాటలకూ మరో మాటను జతపరుస్తున్నాను. మూడో అదృష్టంగా - సాహితీ ప్రపంచంలో సుదీర్హచరిత్ర గల ఆంధ్ర సారస్వత పరిషత్తు వేదిక మీద 'పరిణతవాణి" ప్రసంగ పరంపరలో నేనూ ఒకణ్ణిగా పాల్గొనడం.
ఇక నా గురించి చెప్పాలంటే, చెప్పుకోదగ్గ సాహిత్యనేపధ్యమేం లేదు. చెప్పుకోదగిన ఏమిటి! అసల్లేదు. కారణం మాది ఒక మారుమూల (గ్రామం నెల్లూరు జిల్లాలో. పేరు అలిమిలి. నెల్లూరు అంటే మీ అందరికి తెలుసు. కవి తిక్కననూ, ఖడ్గ తిక్కననూ కనిపెంచిన పట్టణం. ఆ జిల్లాలో నేనూ పుట్టినానన్న దొక్కటే నా ప్రత్యేకత. అంతకు మించి మరేం లేదు.
ఏ మూల(గ్రామమైనా మా వూరు కష్టజీవులకు నిలయం, మొత్తం (గ్రామజనాభా సుమారు ఐదువందలు అప్పట్లో ఊరంతా కలిపినా ఎనఖై గడపలకుమించిలేవు. ఇక ఆయకట్టంటారా, మొత్తం ఎనభై ఎకరాలు మాగాణిభూమి. అందులో పదిహేను ఎకరాలు మా కుటుంబానిది. 'గోవులేని వూళ్ళో గొడ్డు గేదే శివాలక్ష్మి' అన్నట్టుగా ఆ వూళ్ళో మాదే మోతుబరి కుటుంబం. మా నాన్నగారి పేరు రామస్వామిరెడ్డి, అమ్మ రంగమ్మ. క్0 పరిణతవాణి ప్రసంగాలు
ఇద్దరూ (శ్రమజీవులే. మా నాన్నకు వ్యవసాయం అంటే ప్రాణం. పేదా సాదా అంటే వల్లమాలిన అభిమానం. ఊళ్ళో ఏ ఒక్కరూ పస్తుండగూడదనేది ఆయన సిద్దాంతం. అంతేకాదు. పారుగూరు నుంచి ఎవరొచ్చినా మా ఇంట్లోనే ఆతిధ్యం. అందుకోసం ఆదాయానికి మించి అప్పులైనాయి. ఆ అప్పులు చివరకు ఆస్తిమొత్తాన్ని హరించాయి. అప్పటికి నాకు పదహారేళ్ళు ఆప్తులు కూడా అపరిచితుల్టాగా (ప్రవర్తించసాగారు. ఆ కారణంగా సింహసదృశుడైన మా నాన్షగారి ధైర్యం పూర్తిగా సన్నగిల్లింది అయినా ఆయనలో నిజాయితీ మాత్రం చెక్కు చెదరలేదు ఆ నిజాయితీయే నన్నాక మనిషిగా తీర్చిదిద్దింది. నా చదువు గురించి ఏదో చెప్పాలనుకుని ఎక్కడికో వెళ్ళిపోయాను. మన్నించండి.
ఇక మళ్ళీ మొదటికొస్తాను. మా తల్లిదం[డ్రులకు నేను మొదటి సంతానం. నా తర్వాత అయిదేళ్ళ వరకు పిల్లల్లేరు. అది ఒకరకంగా నాకు అదృష్టమే - అమ్మపాలు అప్పటిదాకా (త్రాగడానికి. అందుకే ఈ మధ్య ఒక మిదత్రుడు మీరు ఎనభై ఏళ్ళ వయసులో గూడా ఆరోగ్యంగా వుండటానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందులో నా ఘనతేం లేదు.
“అయిదేళ్ళ వరకు మా అమ్మ తాపించిన చనుబాలె తరగని శక్తి నాకు”
అన్నాను. నేను రెండేళ్ళ వయసులో ఉండగా ఎవడో ఒక మాల దాసరి నా చెయ్యి చూచి, ఈ అబ్బాయి మూలంగా మీ కుటుంబం పేరు దేశంలో నిల్ళిపోతుందమ్మా, బాగా చదివించండి అన్నాట్ట. ఆ జోస్యాన్ని గుడ్డిగా నమ్మిందా పిచ్చితల్లి. అప్పటినుంచీ నాకు అయిదో ఏడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసింది.
ఆ మంచిరోజు రానే వచ్చింది. అక్షరాభ్యాసం చేయాంచాలంటే మా వూళ్ళో నాలుగు గోడలైనా వుండే బడుంటేగా! మా వూళ్ళోనే కాదు, ఆ రోజుల్లో మా చుట్టుపక్కల పది పన్నెండు ఊళ్ళలో కూడా బడి వుండేది కాదు. బడి మాట దేవుడెరుగు. కాస్త అక్షరజ్ఞానం వున్న అయ్యవారైనా లేడు. ఒక ఆలయపూజారి మాత్రం నాలుగక్షరమ్ముక్కలు తెలిసినవాడు. ఆయన (బ్రహ్మచారి. అప్పటికే వయసు అరవై దాటింది. మా అమ్మకు ఆయన గుర్తొచ్చాడు. నా అక్షరాభ్యాసం ఆయన చేత చేయించింది. ఆయన నన్ను బిడ్డలా చూసేవాడు. ఆరు నెలల్లో గుణింతం వరకూ నేర్పాడు, అంతలో నా దురదృష్టం వల్ల ఆయన ఆర్జాంతరంగా చనిపోయాడు. కానీ
యయతచ్చు గ్ర్సా దా, ఎం.ఎస్, రెడ్డి నా క 5్1 ల్ ఖీ కా మాడ యో గీ
నా చదువుపట్ట మా అమ్మచూసే (శ్రద్దవల్ల అయితేనేం, నా చేత అక్షరాలు దిద్దించిన పంతులుగారు “ఒరే సుందరం! నాది వానకాలపు చదువురా! నాకు తెలిసింది ఇప్పటికీ చాలమటుకు నీకు చెప్పాను. ఒక్కసారి చెస్తే (గ్రహించే బుద్ది నీకు పుట్టుకతోనే అబ్బింది. నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు' అని నన్ను ఉత్పాహపరచడం వల్లనయితేనేం నాకు చదువుపట్ల ఆసక్తి మరింత పెరిగింది. కానీ ఆయన కన్ను మూయడంతో నా చదువు గుణింతాల దగ్గరే ఆగిపోయింది. అప్పట్నుంచీ మా అమ్మ నా చదువు విషయం రోజూ మా నాన్నతో పోరుపెట్టేది. కానీ ఆయన “మనం భూమిని నమ్ముకున్న వాళ్ళం. అదే యింత అన్నం పెడుతుంది. పోనీ నీ పోరు పడలేక చదివిద్దామంటే ఊళ్ళో బడివుంటేగా” అని ఎప్పటికప్పుడు దాటేసేవారు. ఆ దాటవేత నా ఏడో ఏడు వరకు సాగింది. మధ్యమధ్యలో నేనూ చదువుకోవాలి, చదువుకోవాలి అని ఏడ్చేవాద్ని. ఏమయితేనేం నా అదృష్టం కొద్దీ మా నాన్న ఒక భట్రాజుని వెతికి పట్టుకున్నాడు. ఆయన భారత భాగవతాలు న్షుజ్జంగా చదువుకున్న వాడు. భోజనం పెట్ట, నెలకు 12రూ.లు జీతం ఇచ్చే ఒప్పందం మీద నేను గాక, మరో పది పన్నెండు మంది పిల్లల్ని పోగు చేసి రచ్చబండే బడిగా ఒక వీధి బడి ఏర్పాటు చేశారు. భోజనం, విడిదీ మా యింట్లోనే. నావంతు జీతం నెలకొక్కరూపాయి. అలా పదమూడు నెలలు గడిచాయి. అప్పటికే సుమతి శతకం, కృష్ణశతకం, బాల రామాయణం నా చేత కంరస్టం చేయించాడు. పద్యం ఎలా చదవాలో నేర్పడంతో పాటు మధ్య మధ్య అర్ధ తాత్పర్యాలు కూడా చెప్పేవారు. ఆ కారణంగా పద్యం పట్ట నాకు ఆసక్తి పెరిగింది. ఒకరోజు ఆటవిడుపు పద్యాలు మా అందరికీ చెబుతూ పలకల్గో రాసుకోమన్నారు నేను రాసుకోకుండానే వెంటనే అప్పజెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. “ఒరేయ్... నువ్వు ఏకసంతగ్రాహివి అని నేనిప్పుడు తెలుసుకున్నాను. నావద్ద నువ్వు యిప్పటి వరకు చదివిన చదువు చాలు. పద! నేను మీ నాన్నగారితో మాట్టాడి పై చదువులకు పంపించే ఏర్పాటు చేస్తాను” అన్నారు. “అంత శక్తి మాకెక్కడిది. కాస్త లెక్క పద్దు రాసుకునే జ్ఞానముంటే చాలు. మీరు చెబితే యింకా కొన్నాళ్ళు చెప్పండి లేకపోతే యిక్కడితో ఆపేయండి” అన్నారు మా నాన్న. అప్పుడు మా అమ్మ కలగజేసుకుని “నాయనా! మీ నాన్న అన్నదాంట్లో తప్పులేదు. మన కుటుంబపరిస్థితి అదే! కానీ గూడూరులో, నెల్లూరులో పెద్ద పెద్ద రెడ్డున్నారంట. నువ్వు వెళ్ళి ఏ పెద్ద రెడ్డికో నీ పద్యాలు వినిపిస్తే తప్పకుండా నీకు సహాయం చేస్తారు” అని నాకు ధైర్యం చెప్పి, చార్జీకి కొంత డబ్బులు ఇవ్వడానికి శక్తిలేక ఇంటి వాడుకకని కుట్టిన విస్తర్త కట్టలు మోపుకట్టి, నా నెత్తిన పెట్టి కన్నీటితో బొట్టుపెట్టి సాగనంపింది. 52 పరిణతవాణి ప్రసంగాలు
కానీ గూడూరులో ఒక్క రెడ్డి కూడా నాకు ఆశ్రయమిన్యలేదు. పైగా “ఓరేయ్! నువ్వు చదునుకుని, ఉద్యోగం చేస్తావా... ఊళ్ళేలతావా .. నీ మొహం ఎస్తుడైనా అద్దంలో చూసుకున్నావా? పో. పో..." అన్న చీవాట్లే ఎదురయ్యాయి. నా పసిహృదయం గాయపడింది. అప్పటికే విస్తరాకుల కట్టలు అమ్మిన డబ్బులు “హరీ" అన్నాయి. ఒకరోజంతా గూడూరులోనే అనాధలా తిరుగుతూ నెల్లూరి రెడ్డ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను. నా మనసు ఒకటే చెప్పింది. ధనికుల మనస్తత్వాలు ఎక్కడైనా ఒక్కటేరా... అని, అప్పుడు నాకు ఏకలవ్యుడు గుర్తొచ్చాడు. అతను నాలాగే సమాజం చేత తిరస్కరింపబడినవాడు. ఆయనకు ఎవరు నేర్పారు విలువిద్య? లక్ష్యమే ఆయనకు గురువు. పట్టుదలే పరంజ్యోతి. నేను దాన్నే నమ్ముకుని ఇంటిముఖం పట్టాను. జరిగింది మా అమ్మకు చెప్పాను. అమ్మ బోరున ఏడ్చి, “పొరపాటు చేశావు నాయనా! నెల్టూరికి పోయ్యుంటే అక్కడ నీకు తప్పకుండా ఆశ్రయం దొరికేది నాయుడుపేట దగ్గర పుదూరులో... అల్హాడి కృష్ణస్వామిగారు అని ఒకాయన వున్నారు అయన చిన్నప్పుడు నాయుడుపేటలో వారాలు ఎత్తుకొని వీధిదీపాల వెలుతురులో చదువుకున్నారట. నీకూ మీ నాయనలాగేరోషం ఎక్కువ. మన రోజులు బాగాలేనప్పుడు రోషం మంచిది కాదు. నెల్టూరికి పాయ్యుంటే బాగుండేది!” అన్నది. కోతి అనకాపల్లెలో పుట్టినా, అమలాపురంలో పుట్టినా, అలిమిలిలో పుట్టినా కోతులన్నిటికీ మూతులొకటే... నాకు ఏకలవ్యుడు ఆదర్శం, హైస్కూల్లో చదివిందే చదువుగాదు. నేను చదువుతాను. లోకమే నా పాఠశాల. ఇప్పటి వరకు నాకు ఎదురైన అనుభవాలే బోధగురువులు. పెద్దపెద్ద చదువులు నోచుకోని వాళ్లందరికీ కనిపించని గురువెవరో ఉన్నారు. నేను ఆయన్ను పట్టుకుంటాను. మాలదాసరి నాకు చెప్పిన జ్యోస్యాన్ని నిజం చేస్తాను అని మా అమ్మను సమాధానపరిచాను. ఎంతవరకు నిజం చేశానో నాకు తెలియదు గాని, ఈ రోజు ఈ వేదిక మీద నిల్చునే అర్హత సంపాదించాను. నా చిన్ననాటి జ్ఞాపకాలను క్లుప్తంగా మీముందు వుంచాలనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. పసి జ్ఞాపకాల ప్రభావమది. ఈ రోజేగాదు- “ప్రతినిత్యమొకసారి పసిజ్ఞాపకాలలో -ఈదులాడక నిద్రరాదు నాకు” మా అమ్మ చిన్నతనంలోనే ఒక పద్యం నేర్చింది. అది... ఆమె ఎక్కడో విని నేర్చుకున్నది. బాగా చదువుకొని పైకి రావాలంటే సరస్వతిని ధ్యానించాలట. ఈ పద్యం రోజూ చదువుకో... ఎప్పుడో ఒకనాడు ఆ తల్లి కరుణిస్తుంది అని "ఏణీలోచన పల్లవపాణి” అనే పద్యం నేర్పింది. ఆ పద్యాన్ని ప్రతినిత్యం పరించేవాణ్ణి. క న్నాళ్ళకు డా, ఎం.ఎస్, రెడ్డి 53
నిజంగా ఆ తల్లి కరుణించింది. నాకు మొదట్నుంచి వేమన పద్యాలంటె చాలా యిష్టం. అందులో ఛందస్సుందని నాకు తెలీదు.
“తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు,
పుట్టనేమి వాడు గిట్టనేమి ..”
ఈ మాత్రం నేను రాయలేనా అనిపించింది. అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. “రాయలేకేం ప్రయత్నించు” అన్నది మనసు. అదే ధోరణిలో అప్పుడప్పుడు కొన్ని ఆటవెలదులు నా నోటినుండి దొర్జాయి. ఇందులో కూడా ఛందస్సుందో లేదో నాకు తెలియదు గాని, పద్యం నడక మాత్రం అలాగే వుండింది. అలా కొద్ది రోజులు గడిచాయి. నేను రాసిన పద్యాలు ఎవరికైనా వినిపించాలంటే భయపడేవాళ్డో.. తప్పులు పడతారని. అందుకని మా అమ్మకు వినిపించేవాణ్ణీ. ఆమె విని మెచ్చుకునేది. వేమన ఆటవెలదులలో నాలుగవ పాదం “విశ్శధాబిరామ వినురవేమ”. నా కెందుకో ఆ మకుటం కూడా భలే నచ్చింది.
నేను ఆయన బాణీలో, కొన్ని పద్యాలు రాశాను అన్నానుగా! ప్రతి పద్యంలోను మూడవ పాదం పూర్తికాగానే నాల్లవపాదం “విశ్వదాభిరామ వినురవేమ” అనే వచ్చేది. నా పద్యాలకు కూడా ఒక మకుటం కావాలనిపించేది. కానీ అంత అందమైన మకుటం నాకు చాలా సంవత్సరాల దాకా దొరకలేదు. అందుకని మూడు పాదాలు మాత్రమే రాసుకుంటూ వెళ్ళాను. తరువాత నా ఇంటి పేరే నా పద్యాలకు మకుటమయ్యింది- “మహిత వినయశీల మల్లెమాల”. మాల్లెమాల మా ఇంటిపేరు. ఆ మకుటం బాగా నచ్చడంతో కవిగా నా కలంపేరు “మల్లెమాల” అని పెట్టుకున్నాను. తర్వాత నా దృష్టి తేటగీతల మీద పడింది. పూర్వ కవులు రాసిన తేటగీతుల్ని అధ్యయనం చేసేవాణ్ణి, ఆ నడక కూడా నాకు సులభంగానే పట్టుబడింది. తేటగీతయినా, ఆటవెలదయినా అది ముందు ప్రజల నాల్కల మీదికెక్కాలనేది నా అభిప్రాయం. వేమన పద్యాలు అంతేగొ! అందుకని ఒక పద్యంలో ఇలా అన్నాను:
“పరువ ముడుగకుండ (ప్రజల నాల్కలపైన నవరసమ్ములొలుక నాట్యమాడి గణుతికెక్కనట్టి కావ్యమ్ము కావ్యమా”
అక్కడాగింది. మరేమిటి అని (ప్రశ్నించుకున్నాను. “ఒట్టి కాగితాల కట్టగాక” అన్న వాక్యం స్ఫురించింది. అదే నాల్గవ పాదమయ్యింది.
నెల్లూరు వి.ఆర్. కాలేజిలో చదువుతూన్న మా బంధువుల అబ్బాయి ఒకడు
54 పరిణతవాణి ప్రసంగాలు
ప్రతినెలా నాకు ఉత్తరాలు రాసేవాడు అతను ఇంటరు చదువుతున్నాడు. అందులో భాష పేలవంగా అనిపించేది నాకు. వెంటనే నాదైన శైలిలో నేను బదులు రాసేవాణ్ణై. నా జాబు చేరిన వెంటనే అతను తోటి విద్యార్దులకందరికీ చదివి వినిపించేవాడుట. అలా కొంతమంది విద్యార్దులు పరోక్షంగా నాకు అభిమానులయ్యారు. ఒకసారి అతను పద్యాలతో నాకు ఉత్తరం రాశాడు. ఆ పద్యాలు చదివి నేను నవ్వుకున్నాను. నా పద్యాలతో పోల్చి చూసుకున్నాను.నేను పద్యాలలోనే జవాబు రాశాను ధైర్యంగా. ఎప్పుడెప్పుడు జవాబు వస్తుందా అని ఎదురు చూశాను అభినందనల కోసం. అభినందనలకు బదులు చీవాట్టతో వచ్చింది ఉత్తరం. ఉత్తరం సారాంశం ఏమిటంటే... “నీ పద్యాల్లో ఏ ఒక్కదానికి ఛందస్సు లేదు పద్యానికి ఛందస్సు ప్రాణవాయువు. ముందుగా నేను చదునబట్టి సరిపోయింది. ఇంకెప్పుడూ పద్యాలజోలికి వెళ్ళొద్దు” అని. నాకు తల తీసినంత పనయ్యింది. ఈ విషయం మా అమ్మకు కూడా చెప్పలేదు. కానీ నాలో పట్టుదల పెరిగింది.. నా పద్యాల్లో లోపమేమి...? అసలు ఛందస్సు అంటే ఏమిటి? అని తర్కించుకున్నాను. వెంటనే పోతన భాగవతం రుక్మిణీ కల్యాణం' లోని కొన్ని పద్యాలను ఏరుకుని వరుసగా అక్షరాలను కొలుచుకుని సరిచూసుకున్నాను. అంతా బాగున్నట్టే అన్పించింది. మరి ఎక్కడ జరిగింది సారపాటు... అని సునిశితంగా వెతకగా, వెతకగా యతులంటే ఏమిటో ప్రాసలంటే ఏమిటో... మొత్తం మీద ఛందస్సు అంటే ఏమిటో నాకు అర్హమయ్యింది. కానీ ఇప్పటికి నాకు గణవిభజన తెలీదు. నా దృష్టిలో ఛందస్సు అంటే పద్యంనడకకు కొలబద్ద. అలాగని కొలిచి రాస్తే ఆ పద్యం కృతకంగా వుంటుంది. నేను పద్యం మొదలెట్టగానే శారదా కటాక్షం వల్ల పదాలు నేను నేను అంటూ వచ్చి వాటి స్టానంలో అవి కూర్చుంటాయి. ఆ నమ్మకం కుదిరాక నేను నా మి(్రనికి పద్యాలలోనే రాశాను జవాబు. ఆ ఉత్తరం నాక్షు అనేకమంది అభిమానులను సంపాదించి పెట్టింది. అలా (ప్రారంభమైంది నా పద్యరచన నిర్హుష్టంగా. ఆ తరువాత నేను సభలో మాట్లాడినా, స్నేహితులకు జాబు రాసినా తప్పకుండా పద్యాలు చోటుచేసుకునేవి. అవి జమీన్ రైతు ఉద్యమం ఉద్హృతంగా సాగుతున్న రోజులు. నెల్లూరు నుండి వెంకట్రామానాయుడు గారి సంపాదకత్వంలో వెలువడే 'జమీన్ రైతు" పత్రిక ఆ ఉద్యమానికి వెన్నుదన్నుగా వుండేది. మా [గ్రామం కూడా జమీందారి (గ్రామం. వెంకటగిరి సంస్థానం కింద వుండేది. జమీన్ రైతు ఉద్యమంలో భాగంగా మా నాన్న మా ఊళ్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో ఆచార్య రంగా, వారి సతీమణి భారతీదేవి, డా. ఎం.ఎస్. రెడ్డి 55
“జమీన్ రైతు" సంపాదకులు వెంకట్రామానాయుడు మొదలగువారు పాల్గొన్నారు ఆ దినం వారి ఉపన్యాసాలు నా హృదయం మీద చెరగని ముద్రవేశాయి రంగాగారి సందేశంలోని జాతీయభావాలు, వెంకట్రామనాయుడుగారిైైలి నాకు బాగా నచ్చాయి. అదే ధోరణిలో చిన్నచిన్న మాటలతో సామాన్యుడికి అర్హమయ్యేలా పద్యాలు రాసి, పల్లెపల్లెకూ తిరిగి కొంతమంది యువకుల్ని ఉద్యమంవైపు మళ్ళించాను. ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. పర్యవసానంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో జమీందారి రద్దు బిల్లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది. ఐతే, ఆ బిల్లు పాస్ కాకుండా చేసేందుకు ఆంధ్ర దేశంలోని జమీందారులు అంతా ఎం.ఎల్.ఏ.లను కొనడానికి డబ్బు సంచులతో మద్రాసు రైలెక్కుతున్నారని తెలిసింది. వెంటనే నేను జమీన్ రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, రద్దు బిల్టు యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని గేయాలు రాశాను. చుట్టుపక్కల పల్లెల్లో నుండి దాదాపు వందమంది రైతు యువకులను పోగు చేసుకని ఆ గేయాలు పాడుకుంటూ కాలినడకన మద్రాసుకు బయళల్లేరాము. సరిగ్గా బిల్లు అసెంబ్లీలో (ప్రవేశపెట్టేనాటికి మేం అక్కడకు చేరుకున్నాం. ఏ మహానాయకుడినైతే స్ఫూర్తిగా తీసుకున్నానో ఆ టంగుటూరి ప్రకాశంపంతులు గారు అప్పటికి “మాజీ” ముఖ్యమంత్రి అయ్యారు. కళా వెంకట్రావు గారు రెవిన్యూ మంత్రి. వారే అసెంబ్లీలో బిల్లు (ప్రవేశపెడుతున్నారు. ఆ సందర్భంగా మా బృందం రాజాజీ హాలు మెట్ల మీద ఇరువైపులా నిల్చుని కరపత్రాలను ప్రతి శాసనసభ్యుడికి అందిస్తూ గేయాలు ఆలపిస్తున్నాం. అప్పుడు ప్రకాశం పంతులుగారు, జమీన్ రైతు నాయుడుగారు అదే మెట్టమీదుగా అసెంబ్లీకి వెళ్తున్నారు. మా పాట విని ఆగారు. ఇద్దరికీ నేను కరప(త్రాలందించాను. అందులో నా గేయాలతో పాటు రెండు మూడు పద్యాలు కూడా వున్నాయి. ప్రకాశం పంతులుగారు ఓపిగ్గా చదివి “బాబూ, ఎవ(ర్రాశారివి” అని నన్నే అడిగారు. “నేనే రాశాను మాస్టారు, వెంకట్రామనాయుడుగారి స్ఫూర్తితో” అన్నాను తడబడుతూ. “స్ఫూర్తి ఎవరిదైతేనేం, నీ రచనలో జాతీయ భావాలు నిండుగా వున్నాయి” మెచ్చుకున్నారు. “ఏదో పల్లెటూరి భాష” అన్నాను. “కావచ్చు నువ్వు పుట్టుకతో కవివి (బోర్న్ పోయెట్, (ప్రతి పద్యంలోనూ సహజత్వం వుంది. నీ వాక్కు చాలా బలిష్టమైంది. నువ్వు నాకొక మాటివ్వాలి. నీ కవిత్వాన్ని జాతి శ్రేయస్సు కోసమే ఉపయోగిస్తానని” అంటూ చెయ్యి చాచాడు. నేను వణికిపోయాను. అది ఆనందమో, భయమో తెలియదు. ఒక్క క్షణం నిశ్శబ్దం చోటు చేసుకుంది. వెంటనే వెంకట్రామానాయుడు గారు నా భుజం తట్టి “పంతులుగారి (ప్రతి మాటతో నేనూ ఏకీభవిస్తున్నాను. నువ్వు నిజంగా సహజకవివి. ధైర్యంగా మాటివ్వు” అన్నాడు. అప్పుడు ధైర్యం చేసి అశువుగా ఈ 5్6్ పరిణతవాశి ప్రసంగాలు
పద్యం చెప్పాను. “రాజశ్రీ గురుబంధు తుల్య మనసారన్ నీవు చూపించు న వ్యాజ(ప్రేమకు నే కృతజ్ఞుడను, నీవాశించుచున్నట్టు నా సాజంబైన కవిత్వమున్ సతతమున్ జాతీయ(శ్రేయస్సుకై పూజా పుష్పమొనర్చు వాడను ప్రజామోదానుసారమ్ముగన్”
ఆ ఇద్దరూ మహదానందపడ్డారు.
ఆ మరుసటి వారమే వెంకట్రామానాయుడుగారు జమీన్ రైతులో నన్ను “సహజకవి”గా పరిచయం చేశాడు. అప్పటినుండి మా జిల్లాలో అందరూ నన్ను సహజకవి అని పిలవడం మొదలుపెట్టారు. అది ఒకరకంగా నాకు చిరునామా అయ్యింది. ఆ తరువాత నాలో ఆవేశం పెల్టుబికినప్పుడు, ఆనందం ఉప్పాంగినప్పుడు అలవోకగా పద్యాలు చెప్పడం మొదలుపెట్టాను. అలా చెప్పిన పద్యాలైతేనేం, సందర్భానుసారంగా రాసిన ఖండికలైతేనేం చాలానే వున్నాయి. కానీ, ఇంత వరకు నేనుగా పుస్తకరూపంలో (ప్రచురించినవి ఏవీ లేవు. ఎందువల్ల? ఇప్పటికీ నా కవిత్వంలో (ప్రతినిత్యం నేను తప్పులు వెతుక్కుంటూనే వుంటాను.
ఒక వ్యక్తి మంచికవిగా రూపొందాలంటే ముందుగా మంచి పారకుడవ్వాలి. నాకా, తెలుగు తప్ప మరో భాష తెలీదు. అందువల్ల విశ్శసాహిత్యాన్ని చదివే అవకాశం నాకు కలగలేదు. తెలుగులో చేతికందిన ప్రతిపుస్తకాన్నీ చదవడం మొదలుపెట్టాను. జీవితం అంటే చదువొక్కటే కాదుగా... నా కుటుంబ పరిస్థితులు... చదువుకన్నా, కవిత్వం కన్నా ముందు నువ్వు ఒక మనిషిగా బ్రతకడం ముఖ్యం అని చెవినిల్లు కట్టుకుని చెప్పాయి. అందువల్ల దుర్భరమైన ఆర్టిక పరిస్థితుల్ని ఎదుర్కొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సాహిత్యరంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయాను. నా ధ్యాసనంతా చితికిపోయిన మా కుటుంబ భవిష్యత్తు మీదే పెట్టాను. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా శ్రమించి పైసా పైసా కూడబెట్టి మా నాన్నగారి హయాంలో పోగొట్టుకున్న ఆస్తిపాస్తులన్నీ తిరిగి సంపాదించుకున్నాను. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను.
దాంతో మా నాన్న నాకు పెళ్ళి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. 1951 అక్టోబరు పదో తేదీ నా వివాహం జరిగింది. నా శ్రీమతి నాకంటే ఎక్కువ చదువు కున్నది. “మొదటి రాత్రి” అనే కావ్యఖండికను రాసి ఆమెకు పెళ్ళికానుకగా ఇచ్చాను. అది మా ఇద్దరిమధ్య చక్కని అవగాహనకు, ఆత్మీయతకు పునాది వేసింది. ఆ తర్వాత డౌ. ఎం.ఎస్, రెడ్డి 57
కొంతకాలానికి వ్యాపారరీత్యా నా మకాం గూడూరుకు మూరింది.
అక్కడ నాకు కొందరు సాహతీవేత్తలతో పరిచయం ఏర్పడింది. అందులో నిద్యాన్ ముదిపర్తి కొండమాచార్యుల వారు ముఖ్యులు. ఆయన అటు సంస్కృతంల్ నూ, ఇటు తెలుగులోనూ కవిగా, పండితుడుగా లబ్దప్రతిష్పుడు. అప్పటివరకూ నేను రాసిన అముద్రిత రచనలన్నీ ఆయనకు చూపించాను పరిశీలించి మీ అభిప్రాయం చెప్పమని ఆయన ఓ వారం రోజులపాటు నా రచనలన్నీ పరిశీలించి నన్ను మరింతగా (ప్రోత్సహించారు.
అంతకు ముందే నేను ఉండేల మాలకొండారెడ్డి తన పద్నాలుగో ఏట రాసిన 'నేతాజి' అనే పద్యకావ్యాన్ని చదివాను. అందులోని చాలా పద్యాలు నాకు బాగా నచ్చాయి. ఆయన వయసులో నాకంటే ఏడెనిమిది సంవత్సరాలు చిన్న అయినా అ(డ్రసు తెలుసుకుని మరీ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పద్యాల్లోనే రాశాననుకుంటా జాబు. ఆ ఉత్తరం ఒకరినొకరు చూసుకోకుండానే ఇద్దరి స్నేహానికి బాటవేసింది.
ఆ తర్వాత గుంటూరు శేషేంద్రశర్మ గూడూరు మున్సిపాలిటీకి కమీషనరుగా రావడం జరిగింది. అయనా నెల్లూరు జిల్దా వాడే. చిన్నతనంలోనే ప్రాచీన సాహిత్యాన్ని జొపోసన పట్టిన వాడు. అప్పుడు నేను గూడూరులో ఒక సినిమాహాలు కట్టాలనే ప్రయత్నంలో వున్నాను. అనుమతి కోసం ఆయన వద్దకు వెళ్ళాను. ఆయన అంతకు ముందే నా గురించి తెలుసుకున్నట్టుంది. ఆప్యాయంగా లేచి కౌగిలించుకుని, 'మీ పద్యాలు పత్రికల్లో చదువుతున్నాను. నేను 'బుతుఘోష అనే కావ్యం రాశాను. విశ్చనాధ వారు పీరిక రాశారు. దాన్ని మీకు అంకితం ఇవ్యాలనుకుంటున్నాను' అన్నాడు. “అంకితం తీసుకునే స్థాయి నాకు లేదు. మనం మంచి సాహితీ మిత్రులుగా వుందాం' అన్నాను. ఆ రోజు నుంచి ప్రతి రోజూ సాయంత్రం ఆరు నుండి ఎనిమిది వరకూ కలుసుకునే వాళ్ళం మా యింట్లో పద్యం ఎలా చదవాలి అన్నది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను.
అప్పటికే నేను డాక్టర్ సి. నారాయణరెడ్డిగారి “కర్పూర వసంతరాయలు' చదివాను. అందులోని (ప్రతి వాక్యం నన్ను ముగ్దుణ్లి చేసింది. ఆయన్ని ప్రత్యక్షంగా కలిసి నా ఆనందాన్ని వ్యక్తం చేయాలనుకున్నాను. ఆయనుండేది హైదరాబాదులో. చాలా రోజుల దాకా కలవడం కుదరలేదు. ఒక రోజు పనిగట్టుకుని మరీ హైదరాబాదుకు వచ్చాను. ఎలాగో ఆయన అడ్రస్ తెలుసుకుని ఇంటికెళ్ళాను. రైల్వే స్టేషన్ కెళ్ళాడు, మద్రాసు పోవడానికి అని చెప్పారు. వెంటనే స్టేషనుకి వెళ్ళాను. కారు దిగి పరుగెత్తుకుని ప్లాట్‌పాం మీది కెళ్ళాను. నా దురదృష్టం - బండి కదిలి వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాను 5్8 పరిణతవాజి ప్రసంగాలు
- 'జీవితం ఒక రైలు బండి - పరుగు దానికి కొట్టిన పిండి. అది ఎవ్వరి కోసం ఆగదని. తర్వాత నారాయణరెడ్డిగారితో (ప్రత్యక్ష పరిచయం సినిమా రంగంలోనే. అప్పటికే ఆయన సుప్రసిద్ద కవిగానే కాక, సినీ గేయ రచయితగా కూడా తనకంటూ ఒక ్రత్యేకతను సముపార్టించుకుని వున్నారు. 'గులేబకావళి కథ" చిత్రం కోసం ఆయన రాసిన అన్ని పాటలూ నాకు ఎంతగానో నచ్చాయి. ముఖ్యంగా 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ" పాట నిజంగానే నా హృదయాన్ని దోచుకుంది. ఫలితంగా మా 'శ్రీకృష్ణ విజయం'లో కొన్ని పాటలు ఆయన చేత రాయించాను. మీ అందరికీ తెలుసు. అందులోని “జోహారు శిఖిపించమౌళి...” అన్న నృత్యగీతం ఆ చిత్రానికే మకుటాయమానం. అలాగే “పిల్లనగ్రోవి పిలుపు...” అనే పాట సంగీత ప్రియులందర్ని విశేషంగా అలరించింది. అప్పటీ నుంచి ఆయనతో నాకు ఆత్మీయమైన మైత్రీ బంధం ఏర్పడింది.
ఫలితంగా హైదరాబాద్‌లో మా ఇద్దరి ఇళ్ళూ పక్కపక్కనే కొలువుతీరాయి. నా కవిత్వం అంటే ఆయనకెంత ఇష్టమో, ఆయన కావ్యాంటే నాకూ అంతకన్నా ఇష్టం. నారాయణరెడ్డి గారిలో వున్న గొప్పతనం - ఎవరి కవిత్వంలోనైనా ఒక మెరుపు కనిపిస్తే చాలు వెంటనే స్పందిస్తాడు. ఫోన్ చేసి మరీ అభినందిస్తాడు. అలా ఆయన అభినందనలు అందుకున్న వాళ్ళలో నేనూ ఒకణ్ణి,
నా బాల్య స్నేహితులు చాలా మంది అంటారు అప్పుడప్పుడు - మీరు సినిమా పరిశ్రమకు పోకుండా వుంటే ఇంకా ఎంతో సాహిత్య సృష్టి చేసుండేవాళ్ళని. నేను వాళ్ళతో ఏకీభవించను. నిజానికి సినిమా పరిశ్రమ నాసాహితీ వ్యాసంగానికి మరింత తోడ్పడింది. మహాకవి శ్రీశ్రీ దేవులపల్లి, దాశరధి, ఆరుద్ర, ఆత్రేయ, సముద్రాల, పింగళి వంటి దిగ్దంతులతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిచింది.
అంతకు ముందే నేను శ్రీశ్రీ గారి రచనలన్నీ చదివాను. కవిగా ఆయనంటే నాకు అపారమైన గౌరవం. పరిశ్రమలో వారితో నా పరిచయం చాలా నాటకీయంగా జరిగింది. అవి, కె.యస్.ప్రకాశరావు దర్శకత్వంలో నేను 'భార్య' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులు. అంతకు ముందు మూడు నాలుగు అనువాద చిత్రాలు నిర్మించినా, తెలుగులో అదే నా మొదటి చిత్రం. అందులో సన్నివేశపరంగా ఆరు పాటలున్నాయి. అన్నీ రికార్డు చేయడం కూడా జరిగింది. అప్పట్లో మా ఆఫీసు మద్రాసు సెయింట్ మేరీస్ రోడ్డో వుండేది. బయట 'కౌముది' కార్యాలయం అని పెద్ద బోర్జుండేది. ఒకరోజు శ్రీశ్రీ గారు మా ఆఫీసుకొచ్చి మీరు తీస్తున్న పికృర్ణో ఒక్క పాట నా చేత రాయిస్తారా అని అడిగారు. అప్పుడే తెలిసింది ఆయన శ్రీశ్రీ అని. నేను ఆశ్చర్యపోయాను. అప్పటి దా. ఎం.ఎస్, రెడ్డి క్
నుంచి మా సినిమాలకు ఆయన పాటలు రాసినా రాయకపోయినా ఊర్లో వున్న ప్రతి రోజూ మా ఆఫీసుకు వచ్చేవారు. వారితో మాట్లాడడమే గొప్ప సాహితీ అనుభవం. శ్రీశ్రీ కవిగా ఎంత విష్ణవవాదో, వ్యక్తిగా అంత సున్నితమైన వాడు. పసిపిల్లవాడి మనస్తత్వం, ఒక విధంగా అల్ప సంతోషి కూడా. అందుచేతనే అనిర్వచనీయమైన సాహితీ సంపదను సమాజానికిచ్చి కూడా కుటుంబానికి ఏమీ ఇవ్వలేకపోయడు మద్రాసు ఆకాశవాణిలో (ప్రసారమైన నా “ఫలవిలాపం” పద్యాలను విని, మరుసటి రోజు స్వయంగా వచ్చి, “మీ ఆకాశవాణి పద్యాలు నా కవిత్వమంత గొప్పగా వున్నాయి” అన్నారు. ఆ మహాకవి నోటివెంట ఆ మాట వినడం నాకు ఇప్పటికి మరపురాని మధురానుభూతి. అలాగే, నా ఉగాది కవితలో కొన్ని పంక్తుల్ని ఆయన అప్పుడప్పుడూ ఉదహరించేవాడు. మచ్చుకు-
పంచాంగంలో వుండే వర్షం
పంటలకుపయోగిస్తుందా?
పున్నమి ఘనతను వల్లెవేసితే
అమవస చీకటి పోతుందా?
ఇలా ఎన్నో మార్టు నా వెన్ను తట్టాడు. అలాగే కృష్ణ శాస్త్రిగారు చాలా కాలం మా పక్క వీధిలో వుండేవారు. ఆయన
కూడా నా చిత్రాలకు చాలా పాటలు రాశారు. నేను సినిమా పరిశ్రమకు పోక ముందు నుంచే కృష్ణశాస్త్రి గారి కవిత్వంతో పరిచయం వుంది. 'మల్లీశ్షరి' చిత్రంలో వారు రాసిన పాటలు చిరస్మరణీయాలు,. వారు నాకు పరిచయం అయ్యే నాటికి ఆయన గొంతు మూగబోయింది. శాస్త్రిగారు ప్రతి అక్షరాన్ని కన్న బిడ్డలా చూస్తాడు. అందుకే పాటలో ప్రతి అక్షరాన్ని ఆచితూచి పాదుగుతాడు. నేను కేరళ అందచందాల గురించి రాసిన పద్యాలు 'ఆంధ్రప్రభ' లో వచ్చాయి. అవి చదివాడట ఆయన. సంతోషం పట్టలేక నడిచి మా ఇంటికొచ్చి ఆయన ఆనందాన్ని అక్షరరూపంలో వెలిబుచ్చాడు. “రెడ్డిగారూ ఉదయాన్నే చదివాను. మీ పద్యాలు పత్రికలో -” అని రాసి, అందులో కొన్ని పంక్తులు ఉదాహరిస్తూ “ఇలాంటి మాటల్ని మరో వెధవాయి రాయలేడు” అని అభినందించాడు. ఆ మాట నాకొక (ప్రశంసాపత్రం. ఆయనకు కృష్ణుడన్నా, రాధ అన్నా వల్లమాలిన అభిమానం. “గోపీకృష్ణు' పేరుతో “రాధాకృష్ణుల ప్రణయాన్ని నేపథ్యంగా తీసుకుని మీరు చిత్రం తీయండి. పాటలు, మాటలు అన్నీ నేనే రాస్తాను. ఆ చిత్రం మన ఇద్దరికీ తిరుగులేని ఖ్యాతిని సంపాదించి పెడుతుంది. డబ్బు కూడా వస్తుంది" అన్నాడు. అనడమే కాదు ఆరు నెలల్లో పాటలు, మాటలతో సహా మొత్తం 60 పరిణతవాణి ప్రసంగాలు
(స్కిస్ప సిద్ధమైంది. ఆ పైలు మీద ఆయన స్వదస్తూరితో మాటలు, పాటలు 'గోపీకృష్ణ శా(స్త్రి' అని రాశాడు. 'ఇదేమిటి' అనడిగితే, * ఈ చిత్రం విడుదలయ్యాక నా పేరు 'గోపికృష్ణశాస్రి' అన్నాడు. కారణాంతరాలవల్ల ఆ చిత్రం తెరకెక్కకపోయినా సుదీర్హమైన ఆయన సాన్నిహిత్యం వల్ల ప్రతి పదాన్ని ఆచితూచి వాడటం నేర్చుకున్నాను నేను. అలాగే ఆత్రేయ, ఆరుద్ర, దాశరధి... వీళ్ళందరి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, కవిత్వానికి మూలధనం సాహిత్యం. అందులో నేను చాలా పేదవాణ్ణి కవిత్వానికి కావలసినంత వాజ్మయ్రసంపద నా వద్ద లేదు. అందువల్ల నేను బాల్యం నుండి కూడా విశ్చమానవ కల్యాణ వీధుల్లో విహరిస్తూ, కవుల గళాల నుండి జాలువారే ఆణిముత్యాల నేరుకుని భద్రపరుచుకోవడం నాకు అలవాటు. సినిమా పరిశ్రమకెళ్ళాక మరిన్ని ఆణిముత్యాలను పొగుచేసుకున్నాను. ఆ రకంగా పద్యమైనా, పాటైనా నాకు తారు రోడ్డు మీద కారు నడిపినట్లే అయింది. తర్వాత నా మకాం హైదరాబాదుకు మారింది. ఇక్కడ కూడా నా చుట్టూ సాహితీ వాతావరణాన్ని ఏర్పరుచుకున్నాను. సజ్జన సాంగత్యం సర్వ(శ్రేయోమూలం కదా. నా బాల్యమంతా పల్లెటూరిలో గడవడం వల్ల పల్లెతల్లి నాకు ఎన్నో విషయాలు నేర్పింది. అందులో ముఖ్యంగా సమయపాలన. నాకు పల్లెకోడి గురువు. ప్రతినిత్యం వేకువ ఒకే సమయానికి నిద్రలేన్తుంది. దాని కమ్మని గొంతుతో పల్లెను మేలుకొలుపుతుంది. ముత్యాల పల్లకిలో “తెల్లవారకముందే పల్లె లేచింది” అనే పాటకు ప్రేరణ ఆ కోడే. అలాగే నా పాటల్లో కూడా పల్లె వాతావరణం గోచరిస్తుంది. ఉదా:“రామయ్యతండ్రి”లో ఒక పాట- “కందిచేను నిన్నూ నన్నూ విందుకు రమ్మంటుంది సందె వాలితే చోటు దొరకదని ముందే చెప్పింది” అంటుంది కథానాయిక, తన బావతో... అలాగే దీపావళి పాట, “వెన్నెలరోజు ఇది వెన్నెలరోజు అమావాస్య నాడు వచ్చే పున్నమిరోజు...” అన్నాను దీపావళిరోజును. మచ్చుకు మరో ఉదాహరణ “నాయుడుబావ”లో- “నెల్లూరి చేలలో పిల్లగాలి కూగేటి వరి వెన్నులాంటిది మల్లి సొగసు ళా న! దా. ఎం.ఎస్. రెద్ది 6]
అది వద్దన్నా దోస్తుంది నా మనసు” పొరపాటున కూడా నా పాటల్లో అశ్రీలత చోటు చేసుకోదు. యుగళగీతానికి కూడా సాధ్యమైనంత ప్రకృతి రామణీయకతనే నేపధ్యంగా తీసుకుంటాను. అందుకు ఉదా. “సన్నజాజికి, గున్నమామికి పెళ్ళికుదిరింది మాటామంతీలేని కోయిల పాటపాడింది...” అలాగే “కోడెనాగు”లో “సంగమం సంగమం అనురాగసంగమం”. పాట ఏదైనా సందర్భానికి తగిన సాహిత్యాన్ని వాడాలన్నదే నా అభిప్రాయం. అందుకు ఉదా: “ఇదే చంద్రగిరి - శౌర్యానికి గీచిన గిరి”. అలాగే తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, ఏకలవ్య... యిలా ఏ సినిమాలో కూడా నా పాటలు బౌచిత్యానికి దూరంగా లేవు. ఇది గర్వంతో అంటున్న మాట కాదు. వినమ్రంగా నిజం చెప్పడమే. అలవోకగా అప్పుడప్పుడు నేను చెప్పిన పద్యాలు “నిత్యసత్యాలు” పేరుతో గత ఒకటిన్నర సంవత్సర కాలంగా ప్రతి ఆదివారం ఆం(ధ్రజ్యోతి దినపత్రిక లో సంపాదకీయం సరసన వస్తున్నాయి. ఎన్నో ఏళ్ళుగా మూలబడి వున్న నా పద్యాలు ఈ రోజు లక్షలాది మంది మన్ననలకు నోచుకున్నాయి. పుస్తకరూపంలో ఎప్పుడు వెలువడతాయి “నిత్యసత్యాలు” అని చాలా మంది పారకులు అడుగుతున్నారు. దాంతో నా రచనలకు పుస్తకరూపం ఇవ్వాలన్న ఆలోచన నాకు కలుగుతోంది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. బాల్యం నుండి నా ఆరాధ్యదైవం శ్రీరాముడు. నేను అక్షరాలు దిద్దుకున్నది కూడా ఆయన సన్నిధిలోనే. శ్రీరాముడి వ్యక్తిత్వం నా హృదయం మీద చెదరని ముద్ర వేసింది. అలాగే నాలో అతి చిన్న వయసులోనే జాతీయభావాలు చోటు చేసుకోవడానికి కారణం మహాత్మాగాంధీ. పన్నెండేళ్ల వయసులోనే గాంధీగారి ప్రభావం నా మీద పడింది. ఆయన సందేశాలను నేను పత్రికల్లో చదివి స్పందించి, పూజ్యభావాన్ని ఏర్పరుచుకున్నాను. “ధరను నల్వది కోట్ల భరత ప్రజల నెల్ల నవ్వుచు ఒక (త్రోవ నడిపినావు” అని ఎవరో రాసిన పద్యం చదివి జీవితంలో ఒక్కసారైనా ఆయన దర్శనం చేసుకోవాలన్న అభిలాష ఆ వయసులోనే నాకు ఏర్పడింది. ఆం(ధ్రదేశ పర్యటన సందర్భంగా మహాత్ముడు వెంకటగిరికి వస్తున్నాడని తెలిసింది. అంతే, ఇంట్లో 62 పరిణతవాణి ప్రసంగాలు
చెప్పకుండా కాలినడకన వెంకటగిరి వెళ్లాను మీటింగ్ ఎక్కడో తెలుసుకున్నాను. రెండు గంటల ముందే వేదిక దగ్గరగా ఒక పక్క కూర్చున్నాను. బాపూజీ అక్కడకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాలు కళ్ళకద్దుకున్నాను. ఆ క్షణంలో నాకు మహాత్ముని దర్శనం దైవదర్శనం అన్పించింది. దూరంగా నిలబడి ఆయన ఉపన్యాసాన్ని శ్రద్దగా విన్నాను. తెలుగు అనువాదం వుండటం వల్ల (ప్రతిమాట నాకు అర్ధమైంది.
ఆ రోజు నుంచి మహాత్ముడు నాకు మార్గదర్శకుడయ్యాడు. (క్రమంగా వయసు పెరిగేకొద్దీ నా ఆలోచనలు కాంగ్రెస్ వైపు మళ్ళాయి. యధాశక్తి ప్రజలకు సేవచేయడానికి కాంగ్రెస్‌నే వేదికగా ఎన్నుకున్నాను. నీలం సంజీవరెడ్డిగారి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో సభ్యునిగా చేరాను. ఖద్దరు కట్టడం (ప్రారంభించాను. ఆ రోజుల్లో మాల, మాదిగలకు హరిజనులు అని పేరు పెట్టారు గాంధీజీ. హరిజనుడు అన్న పదం నన్ను ముగ్దుణ్ణి చేసింది. దానికితోడు “మాలలు మాత్రం మనుషులు కారా” అన్న పాట నన్ను ప్రభావితుణ్ణే చేసింది. ఫలితంగా అంటరానితనం మా ఊర్గో లేకుండా చేయడానికి కృషి చేశాను.
రాజకీయంగా నీలం సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి గార్లను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్‌పార్టీ ద్వారా మా (గ్రామ పంచాయతీ (ప్రెసిడెంటుగా, నెల్లూరి జిల్బా నిమ్మరైతుల సంఘ అధ్యక్షుడిగా, జిల్బా కొంగైసు కార్యనిర్వాహక సభ్యుడిగా దాదాపు పది సంవత్సరాలు యథాశక్తి మా ఊరే కాకుండా జిల్లా అంతా పర్యటించి ప్రజలకు దగ్గరయ్యాను. 1956 నవంబర్ 1జేదీ నీలం సంజీవరెడ్డిగారు ఆం(్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ మరుసటిరోజు దైవదర్శనానికి తిరుపతిపోతూ దారో వెంకటగిరిలో మేము ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఆ సభలో నా ఉపన్యాసమంతా మొత్తం పద్యాలలోనే సాగింది. మా తాలుకా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ పద్యరూపంలో ఆయన దృష్టికి తెచ్చాను. వెంకటగిరి నుండి కార్డో తిరుపతికి పోతూ, వాటికీ పరిష్కారాలు కూడా సూచించాను. అందులో కొన్ని చురకలున్నాయి. ముఖ్యమంత్రిగారు ఒక వైపు నన్ను అభినందిస్తూనే అందులో అంతర్లీనంగా వున్న విమర్శను కొంత తప్పుపట్టారు. నేను అది తప్పు కాదని పద్యరూపంలో జవాబిచ్చి ఆయన చేతనే భేష్ అనిపించుకున్నాను. ముఖ్యంగా సంజీవరెడ్డి, ఆం(ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రాయ్యాక నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో వారి పర్యటన ఎప్పుడున్నా ప్రతి సభలోనూ నా ప్రసంగం ఉండేది. ఆ (ప్రసంగం పద్యగద్యాత్మకంగా వుండేది. ప్రతి పద్యం ప్రజా సమస్యలమీద చెబుతూ ఆనాడు ప్రకాశంగారికిచ్చిన మాట నిలబెట్టుకునేవాడిని. డా. ఎం.ఎస్, రెడ్డి 63
అలా 1960 వరకు ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోనే కొనసాగాను. ఆ తరువాత తెలిసింది రాజకీయాలు నాలాంటి ఆవేశపరులకి అచ్చిరావని. అందుకు సవాలక్ష కారణాలు! అప్పట్టి నుండి సంజీవరెడ్డి అనుచరుడిగా గాక ఆయన అభిమానిగా మిగిలిపోయాను. అప్పటికే కాం(గ్రెసు వాదిగా కాక, గాంధేయవాదిగా (బ్రతుకుతున్నాను ఏ రంగంలోనైనా నాకంటూ గుర్తింపు తెచ్చిపెట్టింది పద్యం.
శ్రీరాముడు నా ఆరాధ్య దైవమని ముందే చెప్పాను. నా ఎదుగుదలకు కారణం ఆయన ఆశీస్సులేనని నా నమ్మకం. రామాయణ సందేశాన్ని నాదైన శైలిలో మరో మారు సినిమా ద్యారా చెప్పాలనుకున్నాను. అయితే సంపూర్ణ రామాయణమే గాకుండా రామాయణంలోని (ప్రతి ఘట్టం తెరకెక్కడం జరిగింది. అవన్నీ తెలుగు జాతి గర్వించదగిన కళాకారులు నటించినవే. మరి అంతకు మించి మరేం తీయగలం మనం అనుకున్నాను. అలాగని నా సంకల్పాన్ని వదులుకోవటానికి మనసంగీకరించ లేదు. పర్యవసానంగా భారమంతా రాముని మీద వేసి చిన్నారుల శిల్పారామం బాల బాలికలతో 'రామాయణం' చిత్ర నిర్మాణానికి సాహసించాను. ఆ చిత్రం నాకు ఆర్డికంగా పరిమిత లాభాన్ని యిచ్చినా జాతీయస్థాయిలో ఉత్తమ బాలలచిత్రంగా రాష్ట్రపతి అవార్డు సాధించిపెట్టింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నంది అవార్డుతో మా చిత్రాన్ని సత్కరించింది. చిత్ర నిర్మాతగా నాకు అపరిమితమైన తృప్తి నచ్చింది. అలాగే 'ఏకలవ్య' చిత్రం కూడా. ఆ చిత్రానికి పాటలు, పద్యాలు అన్ని నేనే రాశాను, మాటలు కొండవీటి వెంకటకవి రాశారు. చిత్రం పెద్దగా విజయం సాధించకపోయినా సాహిత్యపరంగా నాక్రు అనిర్వచనీయమైన ఆనంధాన్ని అందించింది. ఈ చిత్రం విడుదలకు ముందు నెల్లూరులో బెజవాడ గోపాలరెడ్డి గారికి చూపించటం కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశాను. ప్రదర్శన అయ్యాక గోపాలరెడ్డి గారు “తెలుగు చిత్రంలో ఇంతగా సాహిత్య వీలువలుండటం మొదటిసారిగా “ఎకలవ్య”లోనే చూశాను” అని అభినందించారు.
ఇలా చిత్ర నిర్మాణంలో కూడా నేను నా సాహిత్యాభిరుచిని, నైతిక విలువలను కాపాడుకుంటూనే వచ్చాను. ఇక ప్రస్తుతానికొస్తే నా 'నిత్య సత్యాల'కు లభించిన జనాదరణ నా రచనలకు (గ్రంథ రూపాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు వేసింది. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను.
వాకు ఒక దురలవాటు ఉంది. (గ్రంథస్థం మీదున్న (శ్రద్ధ కంటే కంఠస్థం మీదే ఎక్కువ మక్కువ. ఆందువల్ల అలవోకగాను, ఆశువుగాను చెప్పేన పద్యాలు నా బు(ర్రలోనే భద్రపరుచుకున్నాను. ఇతివృత్తం ప్రాతిపదికగా నేను రాసీన ఖండ కావ్యాలు 64 పరిణతవాణి ప్రసంగాలు
మాత్రమే ఇప్పుడు గ్రాత ప్రతులుగా నా వద్ద ఉన్నాయి. అవి ఫల విలాపం, తేనెటీగలు, ఆణిముత్యాలు, అక్షరశిల్పాలు, పల్లె పరాయిదయ్యింది మొదలైనవి. నా తొలి పుస్తకంగా దేన్ని ము్రించాలి అని ఆలోచిస్తే తిరిగి తిరిగి నా కలం రామయణాన్నే సూచించింది. ఇక్కడ మల్లీ అదే ప్రశ్న. నాకన్నా ముందే రామాయణాన్ని చాలా మంది సుప్రసిద్ద కవులు పద్య కావ్యాలుగా రూపొందించారు. నాకు తెలిసి తెలుగులో చిన్నా పెద్దా రామాయణాలు దాదాపు యాభై, అరవై ఉన్నాయి అంతకుమించి నేనేమి రాయగలను అనుకున్నాను. 'మించి అనేది పక్కన పెట్టి నీ శైలిలో నువ్వు రాయి” అని రాముడే నన్ను ప్రోత్సహించాడేమో కలము అందుకున్నాను. అయితే నా రామాయణ రచనకు నేటి భారతమాత విలాపమే నేపధ్యంగా తీసుకున్నాను. దేశ స్వాతంత్ర్యానికి షష్టిపూర్తి దగ్గరపడుతున్నా గాంధీ కలలు గన్న రామరాజ్య నిర్మాణానికి కనీసం పునాది రాయికూడా పడని దృశ్యం నా కళ్ళముందు సాక్షాత్కరించింది ఆ సంఘటనను గుర్తు చేస్తూ నా స్మృతి పధంలో భారతమాత మెదిలింది. ప్రస్తుతం దేశ రాజకీయాలు గుర్తు చేస్తూ బోరున విలపించింది. ఆ విలాపం నుండే రామాయణం పురుడు పోసుకుంది గత సంవత్సరం ఆగస్టు 15వ తేది.
అప్పటినుంచి నా ధ్యాస, నా శ్వాస రెండూ రామాయణమే. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే పరిషత్తు నాకిచ్చిన సమయం చాలదు.
అయినా నాకు మరచిపోలేని మధురానిభూతులందించిన రెండు, మూడు సంఘటనలు మాత్రమే చెబుతాను. అందులో ఒకటి అన్నామలై యూనివర్సిటీ నుంచి నేను కవిగా 'డాక్టరేట్ అందుకోవటం. ఆ రోజు నాతోపాటు జాతీయస్ట్రాయిలో గుర్తింపు పొందిన వైజయంతి మాల కూడా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. మిగతా నలుగురు కూడా ప్రపంచఖ్యాతి పొందిన వ్యక్తులు. సామాన్యంగా డాక్టరేట్ బిరుదు యూనివర్సిటీ ఛాన్స్లర్ అయిన గవర్నర్ చేతుల మీదుగా జరుగుతుంది. ఆ ఆనవాయితీ ప్రకారం అప్పటి తమిళనాడు గవర్నర్ డా. మగర్రిచెన్నారెడ్డి గారు నేనందుకున్న డాక్టరేట్ బిరుదు మీద స్పందనగా పద్యం చెప్పమన్నారు. ఎదురుగా వున్న వాళ్ళల్లో తాంభై శాతం తమిళులే. ఈ సభలో నేను తెలుగులో పద్యం చెబితే స్పందన ఏముంటుంది అన్నాను. “అవన్నీ తరువాత ముందు మీరు పద్యం చదవండి” అన్నారు చెన్నారెడ్డి. అప్పటికే డాక్టరేట్ పట్టా నా చేతిలో వుంది. ఒకసారి దాన్ని చూసి పద్యం అందుకొన్నాను, ఏమని... దా. ఎం.ఎస్, రెడ్ది 65
“ఎక్కడో మారుమూల జనియించిన నిత్యకృషీవలుండ నా 'ప్రక్కన జేర మోజుపడి వచ్చినదీ బిరుదమ్ము గాన నే నక్కున జేర్చుకొంటి యిక అక్షర శిల్పములొక్క టొక్కటే చెక్కెద నెల్లవారరసీ చెక్కిలి ముద్దిడి మెచ్చునట్లుగా” అన్నాను రాగయుక్తంగా, సదస్సులకు పద్యం ఎంతవరకు అర్జమైందో నాకు తెలీదు గానీ సభంతా చప్పట్లతో మారు(మోగింది. ఆ చప్పట్టే “అక్షర శిల్పాలు” కావ్యానికి పునాదులయ్యాయి. మరో మధురానుభూతి మద్రాస్‌లో విశ్శనాథ సత్యవారాయణగారి అధ్యక్షతన జరిగిన కవి సమే శళనంలో ఆయన నా పద్యాలు విని “బాబూ, నువ్వెవరో వాకు తెలీదు, కానీ చాలాకాలం తర్వాత కవిసమ్మేళనంలో ఒక కవికూడా పాల్గొన్నాడనే తృప్తి నాకు మిగిల్చావు” అన్నారు. అలాంటిదే మరో సంఘటన. ఒక సంవత్సరం డిసెంబరు 14వ తేదీ పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి బాబా వారి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో పన్నెండు మంది కవులం పాల్గొన్నాము. అందులో నేను ఒక్కణ్ణై తప్ప మిగతా అందరు పుట్టపర్తికి పాతకాపులే. (గ్రంథకర్తలుగా అందరూ లబ్బ ప్రతిష్టలే. నేనొక్కల్లే అచ్చులో పుస్తకం లేనివాణ్ణి, ఆయినా జి.వి.సుబ్రహ్మణ్యంగారు పట్టుపట్టి నన్ను తీసుకెళ్ళారు. కవి సమ్మేళనంలో చదివే ప్రతి కవితా స్వామి వారి గురించే వుండాలనేది నిబంధన. మిగతా అందరూ ముందుగానే బాబాగారి గురించి కవితలు రాసి, అచ్చువేయించి మరీ తెచ్చారు. నేనొక్కడినే ఒట్టి చేతులతో వెళ్ళాను. కారణంనేనెప్పుడూ పుట్టపర్తిలో అడుగుపెట్టలేదు. అక్కడేం జరుగుతుందో చూశాక ఆలోచిద్దామనుకున్నాను. ఉదయం బాబా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆసుపత్రిని మాత్రం చూశాను. అంతే! అక్కడ మొదలైంది నా పద్యం, అలా వరుసగా ఏడు పద్యాలు ఏకధాటిగా నొ మనసులో మెదిలాయి. విడిదికొచ్చాక అన్నిటిని కాగితం మీద కేక్కించాను. సభ ప్రశాంతి నిలయంలో. అధ్యక్షులు స్వామివారే. మధ్యలో ఆయన ఆసనం, అటువైపు ఆరు కుర్చీలు, ఇటువైపు ఆరు కుర్చీలు వేశారు కవుల కోసం. స్వామి వారు వచ్చే వరకు కవులంతా పద్మాసనం వేసుకుని (క్రిందనే కూర్చున్నారు. మోకాళ్ళనొప్పుల మూలంగా నేను క్రింద కూర్చోలేనంటే ఆ ప్రక్కనే నాకు ఓ చిన్న కుర్చీవేశారు. నా కుర్చీ స్వామి వారు వచ్చే మార్గంలో మొదటనే వుంది. వారు వస్తూనే 56 పరిణతవాణి ప్రసంగాలు
అందరం ఒక్కసారి చివాలున పైకి లేచాం. బాబావారు మెల్లగా నా దగ్గరకు వచ్చి “అవును, నీ కోసం నలఖై ఏళ్ళుగా ఎదురుచూస్తున్నాను, ఒక్కసారైనా వస్తావేమోనని, ఇప్పటికొచ్చావు” అన్నారు మెల్లగా. నాకు ఏడుపాగలేదు.
“ఎందుకేడుస్తున్నావ్, రామాయణం రాస్తున్నావుగా!” అన్నారు బాబా
“రాస్తున్నాను, పూర్తి కావాలిగా” అన్నాను నేను.
“ఇంకా పూర్తికాకపోవడమేమిటి, సుందరకాండ దాకా వచ్చి.. తప్పకుండా పూర్తవుతుంది. అక్కడ రాముడున్నాడు. ఇక్కడ నేనున్నాను” అని చేత్తో ఆశీర్వదించి వెళ్ళిపోయారు
అదృష్టవశాత్తూ ఆయన ప్రక్కనే పడింది నా కుర్చీ వేదిక మీద. వరుసలో నేను ఏడవవాణ్ళి. నా ముందు చదివిన ఆరుగురూ చదివిన కవితల్ని స్వామి వారికి అందజేశారు. ఆయన ప్రతి ఒక్కరికీ స్వయంగా శాలువా కప్పి ఒక్కొక్క లడ్డూ ఇచ్చారు. నావంతు రాగానే నేను మైకు దగ్గరకు వెళ్ళి కాగితం చూడకుండానే నా పద్యాలు చదివాను. సభలో స్పందన అపూర్వం. అప్పుడు తీశాను జేబులోంచి కాగితం. స్వామి వారికి ఇచ్చి, నమస్కరించాను. శాలువా కోసం తలవంచాను. కాని శాలువా కన్నా ముందే ఆయన నా కళ్ళ ఎదుటే ఉంగరాన్ని సృష్టించి నా వేలికి తొడిగారు. ఊహించని ఈ పరిణామానికి నా కళ్లలో ఆనందా/శ్రువులు నిండాయి. ఇదొక మధురానుభూతి.
ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే ఈ అనుభూతులన్నింటికి నా పద్యమే కారణం. నా పద్యంలో నలుసంత గుణమున్నా అది తెలుగుభాషకే చెందుతుంది. ఎలాగంటారా శిల్సి ఎంత గొప్పవాడైనా శిల్పం అందంగా రూపుదిద్దుకోవడానికి శిలయే ప్రధానకారణం. నేను మొదటినుంచీ “అక్షరం అణుబాంబుకంటే శక్తిమంతమైంది” అని నమ్మినవాడిని. అందుకే ఒకచోట రాసుకున్నా “అక్షరాలు నాకు అండగా వున్నంతకాలం ఆయుధాలు నన్నేమీ చేయలేవు” అని, అంతేకాదు
“అలసినట్టి వేళ అక్షర వృక్షాల నడుమ తీరుబడిగా నడుము వాళ్ళి అద్భుతాలు గనుట ఆనవాయితి నాకు... మహిత వినయశీల మల్లెమాల” దా. ఎం.ఎస్, రెద్ది 67
అన్నాను. అలాగే చివరిగా నా గురించి నేను చెప్పుకున్న రెండు పద్యాలతో ముగిస్తాను; “గణనాధు కరముతో ఫణిరాజు పడగతో కరచాలనము సల్పు కలము నాది మిన్నేటి అలలతో మేఘ గర్జనలతో కలసి గానము జేయు గళము నాది అ(క్రమార్దనలన వ(క్రమార్గములను నిలదీసి వెలివేయు నియతి నాది మూఢవిశ్వాసాలు మూర్థ సిద్దాంతాలు మదిలోన జొరనీని మతము నాది వర్షమేదైన, ఏ దేశ వాసుడైన సకల మానువులొక్కటే జాతియన్న పరమ ధర్మమె గమ్యమౌ బాటలోన నడక సాగించు విశ్చ్శమానవుడ నేను”. చాలా మంది నన్ను మట్టి మనిషి అంటారు. అవును నేను నిజంగా మట్టి మనిషినే. మట్టి పిసకడం అంటే నాకు మహాసరదా, అందుకే అన్నాను- “మట్టి పిసుకుకొనుట మరియాద కాదని ఎంచువాడు నీచుడెందుకనిన మనిషి అల్పజీవి మట్టి చిరంజీవి మహిత వినయశీల మల్లెమాల” ఇలా చెప్పుకుపోవాలంటే చాలా వున్నాయి. చివరగా ఒక పద్యం: “అతిగా ఆర్జన చేసి సంతతికి అష్టైశ్సర్యముల్ గూర్చినన్ (బ్రతుకించేనియు ధన్యతన్ గానస్ నాకు లోకమ్మునన్ అతి విఖ్యాతి నొసంగినట్టి కవితన్ ధ్యానించి సేవించి నే శతజన్మమ్ములకైన మంచి కవిగా జన్మింప వాంఛించెదన్.” ట్రీ 68 పరిణతవాణి ప్రసంగాలు
డా. నాగభైరవ కోటేశ్వరరావు (9-1-2003)
కాలిబాట వెంటా, డొంకలవెంటా, దొరువుల వెంట నడిచీ నడిచీ చేనుగట్టుకు చేరాక - మంచెఎక్కి - నడచి వచ్చిన దారిని వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకొనే అవకాశం కల్పించిన ఆం(ధ్రసారస్వతపరిషత్కూ - వర్తమానంలో దాని రూపురేఖలకు వన్నైలు దిద్దుతున్న దార్శనికుడు సినారెకూ - దక్షుడైన కార్యదర్శి శివారెడ్డికీ ధన్యవాదాలు.
మాది ప్రకాశంజిల్లా పల్లెటూరు రావినూతల. కవిత్వం కట్టడం నాతోనే మొదలైనా
- మావూరు పెంకుటిళ్ళు కప్పడంలో మాత్రం సాగరాంధ్రంలో తలమానికం.
దారి డొంకలు లేని ఊళ్ళన్నా మనపల్లెటూళ్ళూ దమ్మిడీకి పనికి రావన్నా -
- అని జమీన్ రైతు రామానాయుడు ఎప్పుడో ' రైతుబిడ్డ ' చిత్రంలో రాశాడే - ఆ పాటకు ఆకృతిగా అనిపించేది నా బాల్యంలోని మాఊరు. అంతా దిగువ మధ్య తరగతి రైతులే. అలాటి రైతు కుటుంబంలో పుట్టిన ఎవరికైనా సాహిత్య నేపధ్యం ఏముంటుందీ?
మా అమ్మ ఉయ్యాల దగ్గర ఏం పాటలు పాడిందో నాకు గుర్తు లేదు.
మా తాతలు పంట కళ్ళాల దగ్గర పాడిన “ఒలియో ఒలీ - పొలియో పాలీ - రావేలు గల వాడ - రార పొలిగాడ” - పాట మాత్రం గుర్తుంది.
బాల్యంలో నేను విన్న పొటలూ, పద్యాలు రాత్రి పదిగంటలకు (ప్రారంభమై, దా. నాగభైరవ కోటేశ్వరరావు 69
తూర్పు రేఖలు తెల్లవారేవరకూ సాగే వీధి భాగవతాల్లోవి. బుర్రకధల్లోవి. హరికథల్లోవి. చెక్క భజనల్లోవి. కోలాటాల కోలాహలంలోవి. మా ఊళ్లో మిషన్ కుట్టే శివరాజు శేషయ్య పంతులు అప్పుడప్పుడూ ఇంటి చుట్టూ మురిసే జనంగుంపులకు వినిపించే హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామఫోను రికార్డుల్లోవి ఆ (గ్రామ ఫోన్ పెట్టెలోంచి టంగుటూరి సూర్యకుమారి పాడిన 'మా తెలుగుతల్లికి మల్పెపూదండ - పాడవే చెల్లెలా 'ప్రణవభారతగీతి'- పాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటూ వుంటాయి. మా ఊరు ఎలిమెంటరీ పారశాల దాటి - ఒంగోలు ఎ.బి.యం. హైస్కూలు చేరిన నాకు అప్పటికే రామాయణం రాస్తున్న పూజ్యులు జోస్యుల సూర్యనారాయణమూర్తి పద్యం చదివే విధానం, పండిత కవీ, 'క్రొక్కారు' కావ్యరచయత జలదంకి కృష్ణస్వామి శర్మ చెప్పిన ఛందస్సూ, చివుకుల సత్యనారాయణ శాస్త్రి బోధనా సాహిత్యాభిలాషను కలిగించాయి. ఆదివారాల్లో జలదంకి వారింటికి వెళ్ళి 'మనుచరిత్ర' చెప్పించుకున్నాను. చివుకులవారి దగ్గర ఒకటి రెండు (ప్రబంధాలు నేర్చుకున్నాను. అప్పట్లో ఒకసారి మా 'హైస్కూలుకు గుర్రం జాషువాగారు వచ్చారు వారే నేను చూసిన మొదటి ప్రముఖ కవి. ఆ వేళ సభలో ఆయన ఆరోజే రాశానని వినిపించిన సీసపద్యం- “సీమలో ఆచార్య సింహపీరిక మోద నిలిచి వచ్చినది నా తెలుగువాడు...” ఉపన్యాసం తర్వాత - వారు మా స్కూల్లోనే పనిచేస్తున్న తన సోదరుడు ఇజ్రాయేల్‌తో కలసి నిర్శహించిన నేత్రావధానం నా మనసులో నిత్యహరితం. తొమ్మిదో తరగతిలో నేర్చుకున్న ఛందస్సు - పద్యాలు రాయడం ప్రాక్టీసు చేయించింది. కొన్ని పద్యాలు పాఠశాల మాగజైనులో పడి ఉత్సాహానికి వాకిళ్ళు తెరిచాయి. ఒంగోలు నుంచి అప్పట్లో వచ్చే 'జైహింద్ పత్రికలో అచ్చయి స్నేహితుల దృష్టిలో కవిని చేశాయి. గుంటూరు హిందూ కాలేజీలో పళ్ళి పూర్మప్రజ్ఞావార్యులు, పిల్లలమర్రి హనుమంతరావు, వావిలాల సోమయాజులు గళాలు నా సాహిత్యాభిలాషను అభిరుచిగా మార్చాయి. 49లోనో 50లోనో ఒంగోల్లో నాయని వారింట్లో ఒక పెళ్ళి సందర్భంలో జరిగిన కవి సమ్మేళనం ఒంగోలు యువకవుల మోద చెరగని ముద్రవేసింది. దేవులపల్లి వారు 70 పరిణతవాణి ప్రసంగాలు
ఆధ్యక్షం వహించారు కొడవటిగంటి కుటుంబరావు ప్రారంభోపన్యాసం చేశారు. శ్రీశ్రీ, పుట్టపర్తి కె.వి.రమణారెడ్డి, అనిసెట్టి, సోమసుందర్ వగైరాలు పాల్గొన్నారు. రూ గ
1952 నుండి నా కవితలు అడపాదడపా పత్రికల్లో వచ్చేవి
అప్పటికి అభ్యుదయ కవిత్యోద్యమం సాహితీలోకంలో రాజ్యం చేస్తోంది
'మహాప్రస్ట్రానంి అప్పటికి అచ్చయింది. అది యువకవులకు సిలబస్‌గా, అభ్యుదయ భావాలకు మేనిఫెస్టాగా మహత్తరమైన (ప్రభావం సాధించింది.
అట్టనుంచి అట్టవరకు మహాప్రస్టాన్ని నాలాగా కంరతాపట్టిన వాళ్ళని కొందరిని నేనెరుగుదును.
పద్యరచనకు నమస్కారం పెట్టి నాకలం గేయరచనకు పురుడు పోసింది.
నన్ను ప్రభావితం చేసిన మరో కావ్యం 'కర్పూరవసంతరాయలు'. కొత్తకొత్త పదబంధాలు, నెత్తావుల వంటి భావాలు యావదా(్రధాన్ని ఉర్రూతలూపాయి.
'నాగార్హునసాగరం' 'కర్పూరవసంతరాయలు' వంటి నారాయణరెడ్డి గేయకావ్యాలు
- ఆనాటి ఒక చారిత్రిక అవసరాన్ని తీర్చినాయ్. అది ఎలాగంటే:
అభ్యుదయ రచయితల సంఘం ఊపు తగ్గాక - తెలుగు కవిత్వ వస్తువులో ఒక స్తబ్దత ఏర్పడింది. ఎంతసేపూ తాడితులూ, పీడితులూ, దగాపడ్డ తమ్ములూ హ్యవ్స్ అండ్ హ్యన్నాట్స్ వర్గ సంఘర్షణ - ఇవే భావాలను అభ్యుదయ కవిత్వం వందగొంతులతో ఒకే రాగాన్ని పాడింది. ఈ రిపిటీషన్ తెలుగు కవితా (ప్రియులకు విసుగు పుట్టించింది. కవిత్వానికి రాజకీయ పార్టీల మద్దతు కొందరికి నచ్చలేదు. పారకలోకం కొత్తదనాన్ని కోరుకుంది.
అదిగో ఆ శూన్యాన్ని పూడ్చాయి నారాయణరెడ్డి కధాకావ్యాలు. మొనాటనీ నుంచి చైతన్యాన్ని, విసుగుదల నుంచి వైవిధ్యాన్ని, నినాదంనుంచి నిజమైన కవితా విధానాన్ని అవి సమకూర్చిపెట్టాయి.
నా మొదటి కావ్యం “రంగాజమ్మ”. 1963లో అచ్చయింది. కధచారిత్రకం. కవితారూపం మాత్రాచ్చందం.
17వ శతాబ్దంలో తంజావూరును పాలించిన నాయకరాజు విజయరాఘవునికీ, అతని ఆస్థాన కవయిత్రి రంగాజమ ఖీ మధ్య ప్రణయం ఇతివృత్తం. కధ విషాదాంతం:
రంగ ఆతని మనో
డా. నాగబైరవ కోటేశ్వరరావు 71
రంగమ్ముపై నర్తకి
ఆయమాతని మాన
సాంతరాంతర సరో
వరములో విహరించు
సురలోక రాజహంస
అతని మనసున కామె
ఆమని ప్రవాహమ్ము
అతని కన్నుల కామె
ఆనంద దీపమ్ము
-రంగాజ(ప్రేమలో చిక్కుకొని కొలువునూ అంతఃపురాన్ని మరచిన రాజు, మంత్రీ
పురోహితుడూ పన్నిన పన్నాగంలో చిక్కుకొని రంగాజమ్మ తన సోదరి అని నమ్ముతాడు. నైతిక పతనం చెందానని కుమిలిపోతున్న అతనికి ఆమె సోదరి కాదనే వార్త, ప్రసవవార్త ఒకేసారి తెలిశాయి. పరుగు పరుగున వెళ్ళిన ప్రియుని చేతుల్లో పసికందునుంచి రంగాజమ్మ కన్ను మూస్తుంది. పన్నాగమే కధకి ఆయువుపట్టు. (ప్రేమకు గొడ్డలిపెట్టు.
- కావ్యం ఈ పంక్తులతో ముగుస్తుంది:
తల్లడిల్లెడి రేని గాంచుచు
తల్లి కరవౌ బిడ్డ గాంచుచు
నేల ఏడ్చెను నింగి ఏడ్చెను
గాలి ఏడ్చెను పూలు ఏడ్చెను
గాలి తరగల నీది చూచుచు
జాలిపడి జాబిల్లి ఏడ్చెను
తేలిపోయెడు మేఘమేడ్చెను
గంట మేడ్చెను కాలి అందెల
గజ్జెలేడ్చెను - తోటలో సుర
పొన్న యేడ్చెను - సన్నసన్నగ
కన్నె కోయిల ఏడ్పుముగిసెను.
కడకు ఈ కథాకావ్యమల్లిన
కలము సైతము కరిగిపోయెను
కన్నులందున నీరు వెట్టెను.
కధలు గాధలు మాసిపోనీ 72 పరిణతవాణి ప్రసంగాలు
కాలచ(క్రము తిరిగిసోనీ రంగజీవిత మమర కావ్యము వ్రాయగల్లుట నాదు భాగ్యము
- కధ చెప్పడంలో ఉన్న తొందర కవిత్వం పండించడంలో లేదు. కధాసామ్యం వల్ల 'కర్పూరవసంతరాయలు” కు అనుకరణంగా కనిపిస్తుంది అన్నారు కొందరు. కధాకధనం గ్ప్పుగా వుంది అన్నారు కొందరు నా సింహావలోకనంలో నేను స్పష్టంగా రాశాను “కర్పూరవసంతరాయల ప్రభావం” రంగాజమ్మ మోద ఎంతైనా ఉంది. రంగాజమ్మలకుమకు చెల్లెలు నారాయణరెడ్డి నాగభైరవకు అన్న” అని. ఆయన ప్రతిభాగరిష్టుడు, అనుసరణీయుడు. “రంగాజమ్మ” కావ్యం పొగడ్తలకు తెగడ్తలకు గురైనా నేను పొంగిపోలేదు. క్రుంగిపోలేదు. రంగాజమ్మ ఉదాత్త కధానాయిక. నర్తకి, కవయిత్రి, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కనకాభిషేక గౌరవం పొందిన ఏకైక మహిళ. రంగాజమ్మ కావ్యం (ప్రచురించాక నా దృక్పధంలో మార్పు వచ్చింది. సాహిత్య ప్రయోజనంలో ఆనంద సంధాయకత్వం ప్రధానం కారాదు. సామాజిక హితం (ప్రధానభూమిక వహించాలి. 1968లో నా 'ఒయాసిన్' కవితాసంకలనం వచ్చింది. వైవిధ్యంలేని నినాద ప్రాయమైన కవిత్వాన్ని గర్హిస్తూ- మంచువలె నా చుట్టునూ వ్యా పించు వంచన చించుటకు, ఉద యించు సూర్యుని లేతకరముల మించు రచనలు నాకు కావలె స్పర్థ ఈర్చ్యాద్వేషముల కా స్పదము నా హృద్వనములో ఆ కలుపు మొక్కల ఛేదనకు నీ కలము కావలె కురారా[గ్రము మంచితనమను పంటలను పం డించుటకు నీ కలము హలమై దున్నవలె నా మనోక్షేత్రపు డా. నాగభైరవ కోటేశ్వరరావు 73
దుక్కులను నవదృకృధమ్ముల పాత గాథలు పాడు బాధలు పలికినన్నిటు వేచెదెందుకు? కొత్త ప్రమిదను కోర్కెమై నా కొరకుగా వెలిగింప వెందుకు? కాళరాతిరి నిశీధములో కాంతిరేఖలు నాకు కావలె శాంతి కడుపున దాగియున్న ఉ షస్సు లెన్నో నాకు కావలె నా మనసు దుర్చలము జేసెడు నాపరచనలు వేలు దేనికి చక్కగా నను నడుపగల రచ నొక్కటే ఒక్షటైన చాలును. అని వినతి చేశాను సాహితీలోకానికి - 1969లో సాగరాంధ్ర తీరాన్ని అతలాకుతలం చేసిన తుఫాను నేపధ్యంగా వచ్చిన విషాదాంత రైతుకుటుంబగాధ 'కన్నీటిగాధ'. తుఫాను విజృంభణానికి మా ఊరికి సమిపంలో 80 కుటుంబాలు గల పల్లె నీలాయపాలెం నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కడు తప్ప మిగిలిన జీవులన్ని ఆహుతైపోయిన నేపధ్యంలో ఆ మిగిలిన ఒక్కడు చెప్పిన సంఘటన ఆధారంగా అల్లిన కావ్యం “'కన్నీటిగాధ'. మాత్రచ్చందం. దాన్ని “ఇండియన్ లిటరేచర్ పత్రికలో పూజ్యగురుదేవులు అమరేందద్రగారు రెవ్యూ చేశారు మంచిగా, మూడు జిల్దాల ముక్కలు ఏకమై 1970లో ప్రకాశంజిల్లా ప్రభవించింది. ఆ యేడే పప్రధమజిల్హా రచయితల మహాసభలు జరుపుకున్నాం వైభవంగా - దానికి నాదే ఆధ్వర్యం. జిల్హా రచయితలందరినీ ఒకే వేదికమోదకు తెచ్చిన అపూర్వ సన్నివేశమది. కేంద్రమంత్రి, రచయిత్రి నందినీ సత్పథి సభలకు ముఖ్యఅతిధిగా రావడం ఒక అలంకారమైతే - దాశరధి, నారాయణరెడ్డి కవులను నాటి మా జిల్లా మంత్రి 7డీ పరిణతవాణి ప్రసంగాలు
రొండా నారపరెడ్డి గండపెండేరాలతో అలంకరించడం మరో వైభవం. ప్యూడలిస్టిక్ విధాన పునరుద్దరణ మని విమర్శకులు వేలెట్టి చూపినా జిల్లా కవుల్లో చకచ్చకితమైన చైతన్యం కలిగించిన సంఘటన అది ప్రకాశం జిల్బా సమగ్ర సాహిత్య చరిత్రను గొల్లపూడి (ప్రకాశరావు రాసింది ఈ సందర్భంలోనే. 1972లో నా 'మూనవతా సంగీతం', తర్వాత 'తూర్పువాకిళ్ళు' వెలుతురుస్నానం' 'సంతకం'” వగైరా కవితా సంపుటాలు వచ్చాయి. మనుషులు మారాలి. మనుషుల మనసులు మారాయి. భావవిష్టవమే వ్యవస్థ సృష్టించిన అవస్థలకు పరిష్కారమార్గం. ఆ భావవిప్టవం కోసమే నేను కవిత్వం రాళశాను- ఈ దేశంలో నునుషులు రెండే రెండు రకాలు చెమట ఓడ్చి బతికేవాళ్ళు చెమట ఊడ్చి గతికే వాళ్ళు. ఇవాళ బతికేవాళ్ళ కంటే గతికే వాళ్ళే అధికమయ్యారు సమాజంలో - పల్లెటూళ్ళలో పవిత్రత చెడిపోయింది. బస్తీల నాగరికతా (ప్రభావంలో పతనమై పోయాయి. మనుషుల మధ్య సంబంధాలు తెగాయి. దూరాలు అధికమైనాయి- మా ఊరు చెడ్డది మనుషులున్నారుగా = మా ఊరు దొడ్డది పశువులున్నాయిగా ఆ స విభిన్నమైన ఆ కాలపు కవులందరూ నడిచిన బాటనే నేనూ నడిచాను తప్ప విభిన్నమై కవితలు రాయలేదు. సు పిలిచారు. వెళ్ళాక 1973 అంతంలో అనిసెట్టి, దాశరధి, ఆరుద్ర నన్నో మ్రాను త్ల న అభ్యుదయ రచయితల సంఘాన్ని పునరుద్ధరించాలల, ఆ భా నిర్వహించమనీ అడిగారు. అ రవ మహాసభలు ఒంగోలో 1974 జనవరిలో అభ్యుదయ రచయితల సంఘం ఆ ణ జరిగాయి. దు నేది 0 కాకూడదు - ఆ రచయితల సంఘాలు ఏ రాజకీయ పార్టీకి అనుబంధ పధాన తీర్మానం. 6 ట్ర 75 డా, నాగఖైరవ కోటేశ్వరరావు
చాగంటి సోమయాజులు - చాసో - గారి అధ్యక్షతన మూడు రోజులు వైభవంగా జరిగాయి ఆ మహాసభిలు. ఆంధ్రదేశపు నాలుగు చెరగుల నుండి ప్రతినిధులు వచ్చారు. నుద్రాసు నుంచి ఆరుద్ర 'అనిసెట్టి' పిలకా, రామలక్ష్మి - చిత్తూరు నుంచి నూతలపాటి గంగాధరం, మధురాంతకం, మునిసుందరం, కెయస్వీ - వరంగల్టు నుంచి పేర్వారం జగన్నాధం - విశాఖ నుంచి రోణంకి లప్పలస్వామి, హైదరాబాదు నుంచి దొాశరధి- ఖమ్మం నుండి రావెళ్ళ వెంకట రామారావు వగైరాలు వచ్చిన వాళ్ళలో నేను జ్ఞాపకం చేసుకొన్నవాళ్లు 200 మంది (ప్రతినిధులతో ఒంగోల్లో సంక్రాంతి ఆయేడు సాహిత్యం అయింది. విద్యానగర రాజ వీధుల కవితకు పెళ్ళిపందిళ్ళు కప్పించునాడు ఆ రాయప్రోలు వారి పాదం కోట్ చేసి పెళ్ళిభోజనాలు పెట్టించావయ్యా - అనే వాడు పిలకా గళాపతెశాసస్త్రి కనిపించినప్పుడల్హా. ఉద్యోగరీత్యా నెల్లూరులో ఏడు ఏళ్ళు ఉండడం సాహితీకారుల పరిచయాలను పెంచింది. సాహిత్యం పట్ట నా అవగాహనను విశాలతరం చేసింది నెల్లూరు తిక్కన ఊరనే కాదు. అభ్యుదయ కవిత్వసుందరి ఎక్కిన పల్లకీని మోసిన తొలి నలుగురు బోయీల్లో ఒకరైన పరాభి ప్రభవించిన గడ్డ అనేకాదు. నెల్లూరు వేంకట్రామానాయుడు 'జమిన్ రైతు" స్టాపించిన సీమ అనే కాదు. ఓసి నెల్టుర్ నగరమా! న వ్యాం(ధ్రి సిగలో పూలసరమా! నినుదలంచిన నా మనస్సున నిలుచు ఊహలు చెప్పతరమా! అని ప్రారంభిస్తూ సాగే ేయంలో నెల్లూరు మిద నా మమకారాన్ని ఆరవోసుకొన్నాను. డా. బెజవాడ గోపాలరెడ్డి వాత్సల్యంలో తడిసిపోయాను 73వ ఏట ఆయన 'ప్రారంభించిన సృజనాత్మక కవితలకు మొదటి శ్రోతను నేనే. తనది వచనమూ కాదు
- వచన కవిత్వమూకాదు కవిత్వ వచనం అనే వారాయన. నెల్లూరు వారైన శేషేంద్రశర్మ ఉద్యోగరీత్యా ఊళ్లేలుతున్నాడు. ఆటవెలదిని వ్. అద్భుతంగా రాసిన మల్లెమాల సినీలోకంలో ఇరుక్కుపోయాడు. 76 పరిణతవాణి ప్రసంగాలు
కాగా పోగా నెల్లూరులో మిగిలిన సాహెలీకారులు నురుపూరు కోదండరామరెడ్డి, మోచర్ల రానుకృష్ణయ్య, దుగ్గిశెట్టి రమణయ్య, బంగోరె, జమిన్ రైతు గోపీ, శినారెడ్డి నుదివర్తి ఆధునిక వ్యక్తీకరణలతో వచన కవిత్వంలో పరిణలి చెందిన కని ఆసాన్ అవార్డు నిజేత 'మోనా'". నెల్లూరు సాహితీకారుల్లాగే - నెల్లూరు సాహితీసభాసదులక్కూడా ప్రాచీన కవిత్వం పట్ల మక్కువ ఎక్కువ. కవిత్రయ జయంతులు, మొల్లజయంతులలో పాల్గొనడానికి బయటనుంచి సిలిపించే దిగ్రంతుల వంటి సాహితీకారులతో నెల్లూరులోనే నాకు పరిచయం జరిగింది. అది కొనసాగుతూనే వుంది. ఏడేళ్ళ నివాసంలో అడపాదడపా కవిత్వం రాయడం అటుంచి - నేను ముఖ్యంగా మూడు పనులు చేశాను నెల్లూరులో - చేతన" సంస్థ స్టాపించిన యువతరానికి ఆధునిక సాహిత్యం పట్ట అవగాహన పంచాను. చేతన పాదులోంచి మొలిచినవారే సినీరచయిత వెన్నెలకంటి, రాజేంద్రకుమార్, ఎ.జి. ఆఫీసు 'రంజని' అధ్యక్షుడు చీకోలు సుందరయ్య, ఏదో పత్రికలో సబ్ఎడిటర్గా పని చేస్తున్న హెబ్బార్ నాగేశ్వరరావు, 500 కధల్ని రాసిన కోలపల్లి ఈశ్వరరావు వగైరాలు. రెండోపని రుబాయీలు వందరాశాను. రుబాయి పారశీకపద్యం. నారాయణరెడ్డి లాగే దాశరధి కూడా రుబాయిలకు ఓ మాత్రాచ్చందం ఏర్పాటుచేశాడు. దాన్ని అనుసరించి డా. తిరుమల శ్రీనివాసాచార్యులు రాశారు. అదే మిటర్లో హాస్యం పండించేవి నా రుబాయి 'జమోన్ రైతు' లో వారం వారం వచ్చేవి. మచ్చుకు ఒకటి - భార్య మోద బోరుకొట్టి సినమా కెళితే పక్కసీటు భామా మణి చనువే యిస్తే ఇంటర్వెల్ లైటు వెలిగి యికిలించింది ఆ సీట్లో తన భార్యే సకిలించింది. ఇక మూడోపని ముఖ్యమైనది - నాకు కీర్తిని తెచ్చింది. 1979లో పరాభి పష్టిపూర్తి ఉత్సవాలను నెల్లూరు టౌన్ హాల్లో జరపడానికి నిర్ణయించారు డా. బెజవాడ గోపాలరెడ్డిగారు. బెంగుళూరు నుంచి పరాభి మద్రాసు నుంచి ఆరుద్ర వస్తారు. 'సభకు ముందో వెనుకో భరతనాట్యం ప్రోగ్రామ్ పెట్టిద్దాం' అన్నారు గోపాలరెడ్డి, డా. నొగభైరవ కోటేశ్వరరావు 77
'వద్దండీ' అన్నాను మృదువుగా.
“మరి కవిసమ్మేళనం పెట్టిస్తావా' అన్నారు కోపంగా.
'కాదండి!' అన్నాను.
“అదేదో మోరే తేల్చుకోండి" అన్నారు బెజవాడ గోపాలరెడ్డి,
ఆరాత్రంతా ఆలోచించాను. భువన విజయాలు ఆంధ్రదేశంలో అక్కడక్కడా అప్పుడు జరుగుతున్నయ్. కవులు అష్టదిగ్గజాల వేషాల్లో, అధ్యక్షుడు కృష్ణాయల వేషంలో స్టేజెక్కి సమస్యల పూరణలతో, ఆశువుల వీరణాలతో అవధాన తోరణాలతో దుమ్ము దులిపేవారు.
దీనివల్ల ప్రయోజనం పండితులకే! అదీ ఆనందం కలిగించడమే.
సామాజిక ప్రయోజనం ఉండే సాహిత్యరూపకం రాయాలి.
మెరపు మెరిసింది.
కృష్ణరాయల స్టానంలో ఆరుద్ర పాత్ర క్లార్క్ సూర్యారావు ఉంటాడు. (ప్రబంధ, భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ, సినీకవులు నవలా రచయిత్రి పాత్రలు (ఇప్పుడు పాత్రలు పెరిగాయి- దళితకవీ, (స్త్రీ వాద కవయిత్రీ, ప్రజాకవీ కలిశారు).
ఇరవయ్యో శతాబ్ది సాహిత్య ఉద్యమాల స్వరూపస్వభావాలు తెలుపుతూ, (డ్రైమాటిక్ ఎండింగ్ యిచ్చిన ఈ రూపకం ఆంధ్రాలోనూ ఆం(ధ్రేతర (ప్రాంతాల్లోనూ 300లకు పైగా ప్రదర్శనలు జరిగాయి. పండిత పామరుల్ని అలరించాయి.
పత్రికలూ ప్రముఖులూ కొనియాడారు. ఆరు(ద్రగారు “దీని ఒక్క (ప్రదర్శన 100 సాహిత్య వ్యాసాల పెట్టు” - అన్నారు తన వ్యాసంలో
బదిలీ మిద నెల్లూరు నుండి గవర్నమెంటు కాలేజ్ ఫర్ వుమెన్ - చీరాలకు వచ్చాను.
1985 నాటికి నా అభిప్రాయాల్లో మళ్ళీ మార్పు వచ్చింది. కవిత్వరూసం ఏదైనా ఒకటే అని నమ్మాను. కవిత్వ గుణం (ప్రధానం అనే నిర్ణయానికి వచ్చాను. పద్యం, గేయం, వచన కవిత నిర్మాణ రూపం ఏదైనా దాన్లో కవిచాదీపం వెలిగితేచాలు.
గుండెను తట్టి లేపి ఎది గూర్చు శుభమ్మును? అద్ది గేయమా! పండిన పద్యమా? వచన భావము పొంగెడికైతరూపమా? 78 పరిణతవాణి ప్రసంగాలు
మొండి నివాదమేల ఎచముంగిట చేతన కేత నమ్ములన్ దండిగనిల్బజాలినగదా నిజమైన కవిత్సమయ్యెడిన్. అందుకనే మా ప్రాంతంలో అనుస్యూతంగా వినిపిస్తున్న ఓ లోకల్ లెజెండ్ ఆధారంగా కధ కల్పించి “గుళ్ళకమ శై చెప్పిన కధ” - పద్యకావ్యం రాశాను. గుళ్ళకమ్మ (ప్రకాశం జిల్లా నది. చరిత్ర కన్ను తెరవకముందు నదికి ఇద్దరి చెంచులు, అద్దరి ఎరుకలు ఉండేవారు. వాళ్ళ వైరానికి కాకి అటుపోయి యిటువచ్చి కాలిపడును. చెంచుల పడతి అంకి. ఎరుకల చిన్నవాడు అద్దడు. (ప్రేమించుకున్నారు. విషాదాంతకధ. అద్దడు, అంకి అసువులు బాసిన చోటు అద్దంకి అయింది. ఈ కావ్యాన్ని చదువుతూనే దాశరధి గారు ఆనందాతిరేకంలో సుదీర్హ లేఖ రాశారు. సంజీవదేవ్ దీర తమ లేఖ రాశారు. దానికి గడియారం వెంకటశేష శాస్త్రి "పేర ఉన్న కడపవారి అవార్డు లభించింది. కొండ కొండ పక్క నది చుట్టూ అరణ్యం - అదీ (ప్రాంతం. తిరముగా నిల్ఫియుండుట గిరికి సొగసు నిలువకయ పారుచుండుట నీటి సొగసు ఆకుపచ్చందమ్ములాయడవి సొగసు రీటినొక చోట జేర్చుట వీధ్రికి సొగసు. ఇంకో పద్యం అంకి అఆధరంబు చుంబించి అద్దడనెను సుంకు వట్టిన లేజొన్న కంకి వీవు చెలిమి వనముల విహరించుజింక వీవు వంకలేనట్టి నా నెలవంకవీవు. 85లోనే చీరాలలో జిల్లా రచయితల సంఘం సభలు వైభవంగా జరిగాయి ఆరుద్రకు ఆంధ్ర దేశంలో తొలిగా షష్టిపూర్తి జరిపింది ప్ర.ర.సం, డా, నాగభైరవ కోటేశ్వరరావు 79
ఆ సభల్టోనే తుమ్మల సీతారామమూర్తి గారికి సహస్ర చంద్ర దర్శనోత్సఎం కూడా జరిపింది ('ప్రర.సం,
'ప్రరసం. నా మానసపుత్రిక నయస్సు మళ్ళీ వార్డక్యం వచ్చాక - బాధ్యత యువకుల మీద ఉంచాను.
ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర" చిత్రానికి సంభాషణలు రాయడానికి 1987లో పిలిపించడం వల్ల నేను సాహితీలోకంలో మాత్రమే కాక బయటి లోకంలో కూడా పరిచితుఖ్ఞయాను. అంతకు ముందు నెల్టురులో ఉన్న సమయంలో 18 సినిమా సాటలు దాశాను.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను 1987లో కేంద్ర సాహిత్య అకాడమిోకీ సభ్యుడుగా నామినేట్ చేసింది. పింగళి-కాటూరి, తుమ్మల, శ్రీశ్రీల మొనో(గ్రాపులు రావడానికి నా ప్రతిపాదనలే కారణం.
2 సం॥ల కాలం ప్రాంతీయఫిలిమ్ సెన్సార్‌బోర్డు సభ్యుడుగా పనిచేసి కొన్ని నివారించలేని పరిస్టితులలో ఇమడలేక - రాజీనామా చేసి బయటకు వచ్చాను.
2 నం॥లసాటు తెలుగు విశ్శవిద్యాలయ పాలకమండలి సభ్యుడుగా వ్యవహరించాను. ట్యాంక్‌బండ్ మోద విగ్రహాలకు సంబంధించిన మొనో(గ్రాపులకు సంపాదకత్వం వహించాను.
కొన్ని పాఠశాల, కళాశాల పార్య్యగ్రంధాల్లో నా కవితలు పార్యాంశాలుగొ నిర్ణయించబడ్డాయి.
అధికార భాషా సంఘ సభ్యుడుగా రెండేళ్ళు పనిచేశాను. తెలుగువాడికి తన మాతృభాషపై మమకారం లేదనే విషయం (ధ్రువపరచుకొన్నాను.
సాహిత్యానికి నా కొంట్రిబ్యూషన్కి మించిన గౌరవాలతో ఆంధ్రదేశం నన్ను సత్కరించింది. నా జన్మను సార్ధకం చేసిన ఆ వురస్కార (ప్రదాతలకు కృతజ్ఞతాభివందనాలు.
రాజ్యలక్ష్మీ ఆ చెంకన్న చౌదరి అవార్డు
రాజాలక్ష్మి ఫౌండేషన్ సాహితీ పురస్కారం
గడియారం వెంకటశేషశాసస్త్రే అవార్డు
సి. నారాయణరెడ్డి కళాపీఠం అవార్డు 80 పరిణతవాణి ప్రసంగాలు
ఉండేల మాలకొండారెడ్డి కళాసీరం అవార్డు
రామినేని అయ్యన్న ఫౌండేషన్ అవార్డు
తెలుగు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
- నేనందుకున్న గౌరవాల్లో కొన్ని
నాగభైరవ కళాపీరం ద్యారా నేనూ నా' శక్తి మేరకు మహానుభావుల్ని
పురస్కారాలతో పూజించుకొన్నాను. వారిలో మహాకవి సి, నారాయణరెడ్డి, తిరుమల రామచంద్ర, రాయసం వెంకటరామయ్య, ఆర్, అనంతపద్మనాభరావు, పాపినేని శివశంకర్ ఉన్నారు.
రిటైర్మెంట్ తర్వాత సాహిత్యం నా పూర్తి కాలవ్యాపకం ఆయింది
200 వారాలు వరుసగా యువకవుల్ని పరిచయం చేస్తూ - 'వార్త' ఆదివారం ప(త్రికలో యువసంతకాలు శీర్షిక నిర్వహించాను.
ఈనాటి యువకవుల్లో కవితాసక్తి ఉన్నంతగా కవిత్వశక్తి లేదు. పరనం పూర్తిగా తగ్గిపోయింది. గుప్పెడుమంది యువకులు అద్భుతమైన అభివ్యక్తీకరణలతో అంగలు వేస్తూ సాగుతున్నా, బోలెడు మంది కీర్తిని కాంక్షిస్తున్నారే తప్ప. ఆర్తిని అవగాహన చేసుకోవడం లేదు.
నా అబ్బర్వేషన్లో గమనించిన మరో అంశం - తెలంగాణా రచయితలు కవిత్వానికి 'ప్రొాధాన్యమిస్తున్నారు. రాయలసీమ రచయితలు కధలు అత్యుత్తమ కథలు - రాసి పోస్తున్నారు. ఉత్తర ఆం(ధ్రలో పద్యం పట్టువీరెలు కట్టుకొంటుంది. ఒక్క ప్రకాశం జిల్లాలో తప్ప - దక్షిణ సాగరతీరంలో కవిత్వం గణనీయంగా కనిపించడం లేదు, ఈ పరిస్థితికి భావిపరిశోధకులు కారణాలు గవేషింతురుగాక!
1992 జనవరిలో గుండెకు బై-పాస్ సర్జరీ జరిగింది. విశ్రాంతిగా కోలుకొనే సమయంలో పిల్లలకోసం ఒక కావ్యం రాస్తే బాగుండుననిపించింది. ఏం రాయాలి! మన స్వతంత్ర సమరం ముఖ్య ఘట్టాలు మన పిల్లలకు తెలపాలి. కధ ఉండాలి. పలనాడులో పుల్లరికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. కన్నెగంటి హనుమంతును ఆంగ్రేయులు కాల్చివేశారు. స్వాతంత్ర్య పోరాటం నేపధ్యం ఆ వీరగాధ పిల్లల కోసం
ళం మా(త్రాచ్చందస్సులో రాశాను. దానికి రావలసినంత పేరు రాలేదు.
పలనాటి పల్లెలను బాలల కోసం వర్షిస్తూ: చొ. నాగభైరవ కోటేశ్వరరావు 81
పల్లెలా అవి? పారిజాత సు మాల జల్టుల కొల్లలే అవి పల్లెలా అవి - సొగసులను తూ ర్పారబోసిన కళ్ళములు అవి అందములు సృజియించునప్పుడు అవిధాత్పడు పరాకందుచు జారవిడిచిన పువ్వులే అవి ఆరబోసిన నవ్వులే అవి అడవులకు అడవులకు మధ్యన అందమైనా పల్లెలున్నవి పల్లియకు పల్షియకు మధ్యన య! ళా బహువిశాలపు అడవులున్లువి అడవి మధ్యన ఊరు ఉంటే ఊరి చెంగట ఏరు ఉంటే ఏరు దాటీ అడవి చేరే దారులున్షవి తెన్నులున్నవి. ఇదే మోటర్లో ఎనభై పేజీల కావ్యం సాగుతుంది. ఆచార్య రంగాగారు దీనికి అందమైన పీరిక రాశారు. తర్వాత రాసిందీ పద్యకావ్యమే. 'నది చెప్పని కథ' లోకల్ లెజెండ్ అది యిది ఎద్దియో తెలియ నట్టి విధమ్మున ఊసులాడి, నా ఎద నటియించి, పాదముల నీడ్చుచు మానసమందు సాగి, తు మ్మెదవలె బంభరించి సుతి మెత్తని గానము లాలపించి, ఏ సదమల వాయువీచికయొ సాగెను కావ్య మనోజ్ఞ గీతిగా - మా ప్రాంతపు స్టానిక గాధ. కాలగర్భంలో కలసిపోకుండా అక్షరబద్ధం చేద్దామనే 82 పరిణతవాణి ప్రసంగాలు
(ప్రయత్నం చాలకాలం ఊగిసలాటగానే సాగింది. "సైన్సు దీన్ని అంగీకరించదు" - అన్నాడు డా. జయప్రకాష్ ఈ కధ విని. 'మన (స్త్రీలను మనం అవమానపరచినట్టవుతుందేమో' - ఓ సీనియర్ ఐ.ఏ.యస్ చంద్రయ్య. మోది కావ్యం, శాస్త్రం కాదు రాయండని (ప్రోత్సహించాడు మహానటుడు గుమ్మడి. ఇంతకీ ఆ సైన్సు అంగీకరించని విషయం - రతి సమయంబున సతిమతి కుతుకముతో నెట్టి రూపుగోరునొా అదియే సుతసుతుల రూపురేఖలు (ప్రతిబింబమ్మగునటంచు పలికెదరార్యుల్. (గ్రామంలో ఆలయ నిర్మాణానికి గాంధర శిల్పి పిలిపించబడ్డాడు. ఆ వూరి (స్త్రీలంతా ఆసిక్తితో ఆ అందగాణ్ణీ చూస్తుంటారు. తర్వాత కొన్నాళ్ళ ఆవూళ్లో గర్భం దాల్చిన ప్రతి యిల్లాలూ గాంధార శిల్పిరూపంతో సంతానాన్నికంటుంది. కొందరు యువకులు శిల్పిశీలాన్ని శంకించారు. అతన్ని వధించారు. శవాన్ని నదిలో వదిలేశారు. శిల్పి చెక్కిన నంది విగ్రహం. మోకాల్తండయొనర్చి మోరపయికామోదంబునన్ ఎత్తిగో ళాకారంబున మూపురంబుపయి హేలన్ ఓ పురంబొప్ప, చ (క్రాకారంబున గంగడోల్ మెడకు సంక్రాంతింప నందీశుడున్ ఆకాళంబుకు [క్రింద భూమిపయినన్ మోహాకృతిన్ నిల్చెడున్ విగ్రహాన్ని తమకంతో చూసిన ఆవులు నందిపోలికలతోనే సంతానాన్ని ఈనినయ్. తమ తప్పు తెలుసుకున్నారు (గ్రామోణులు, ఈ కావ్యంలో శిల్చిని గూర్చి రాసిన పద్యాలు వినిపించి ముగిస్తాను. పురుష స్పర్శ చేత పులకించి పూబోణి డా. నాగబైరవ కోటేశ్వరరావు 83
తన్మయత్వమంది తనిసినట్టు
జడత వీడిపోయి జానువై స్పిగ్రమై
శిలలు ఒదిగిపోవు శిల్సియులికి -
ఉలుల స్పర్శ వలన శిలకింత గిలిగింత కనులు మూసి తాను కలల జారి మమతలందు ఊగి మైకమై, మైనమై
శిల్సి చేత రాయి సిగ్గులొలుకు -
సిగ్గులొలుకు చుండు శిలలోని అందాలు
బట్టీ, వెలికిదీసి, పలుకరించి దివ్యరూపములను దిద్దెడు శిల్పియు (ప్రాణమోయలేని (బ్రహ్మకాడె!
తలయూచు నొక్కసారియు
తలయూపక యొక్కసారి తలపుల మునుగున్ శిలలో దాగిన యందము
లులికిన్ కనిపించినప్పుడుత్సాహపడున్. శిలచెక్కుటయనగా నొక కలచెక్కుటయగును గాదె! కలలోనే రూ పులు కనుగొనునో వానిని
నిలుపుటయే యగును గాదె! నిశ్చల శిలలో -
ఆ తర్వాత ప్రచురింపబడ్డవి రెండూ ఆధునిక వచన కవిత్వ సంపుటులు. మారుతున్న కవిత్వముఖ చిత్రం అనుదినమూ నారాయణరెడ్డి లాగే నేనూ గమనిస్తాను. ఆయనలాగే ప్రతిభకు నేనూ వెన్నుతడతాను. ఆ రెండు సంపుటాల్లో 'పతాక శీర్డిక' ఒకటి - 'దగ్టగీతం' రెండోది. అందులో ఒక కవిత వినిపిస్తాను. కవిత గొప్పదని కాదు - తరువాతి తరం వాళ్ళతో ఈ వయసులో కూడా పోటీ పడుతున్నాం అనే సంతృప్తి కోసం; నిత్య సంక్రాంతి
కంటిరెప్పల కింద - నిప్పు కణికలను దాచుకో వద్దు 84 పరిణతవాణి ప్రసంగాలు
రగులుతున్న చైతన్యం మోద
రణభేరి మోగించవద్దు
వెలుగును మూటగట్టాలనడం
నెర్రివాడు చేసే ప్రకటన
నిజాన్ని పాతర నేయాలనడం
నియంత (ప్రైలాపన
పగలొక రెక్కా - రేయొక రెక్కా
కాలం పక్షి గమనం అనివార్యం
ఆత్మ స్రైర్యాన్ని అమ్ముకొని
పక్షిని శాసించాలనుకోవడం మూర్ధత్వం
సువాసన కోసం, వసంతం కోసం
శోధన జరగడం తప్పు కాదు
దుర్యాసననీ, శిశిరాన్ని, శిధిలాన్ని
దూషించడం నేరమూ కాదు -
మూసిన రెప్ప విప్పే సరికి
ముంగిట్లో సుగంధాలు హసించాలి
తెరిచిన కన్ను పద్మమయేసరికి
తెచ్చిన స్వప్నం నిజం కావాలి.
సాహసిమా(త్రమే స్వష్నాలను
స్వభాషలోకి తర్జుమా చేసుకొంటాడు
గర్భం కోశంలోంచి ఊకొడుతూనే
పద్మవ్యూహాల దారులు కనుక్కుంటాడు.
భీరువుకు స్వర్గం ఎప్పుడూ (భ్రాంతి
వీరుడి ఆశయం = నిత్య సంక్రాంతి. ముగింపుగా ఒక మాట చెబుతాను. కవిగా నేనేం సాధించాను. నా కాలపు ఆం(ధ్రదేశపు మహావ్యక్తుల పరిచయం సాధించాను. మంచి కవిని కాకపోయినా మంచి వ్యక్తిత్వమున్న మనిషిగా రూపుదిద్దుకొన్నాను.
దా. నాగభైరవ కోటేశ్వరరావు 85
నన్ను గురువుగా పేర్కొనే ప్రతిభావంతులైన పదుగురు శిష్యులను సాధించాను.
శతాధిక సంఖ్యలో కవులను ్రోత్సహించాను
ఆ తృప్తి చాలు.
మళ్ళీ జన్మంటూ ఉంటే కవిగా పుట్టాలని కోరుకుంటాను.
ఆం[ధ్ర సారస్వత పరిషత్తుకూ, కవిత్వంలోనే కాకుండా - వ్యక్తిగతంగా నా జీవితంలో ఎదురైన ఎగుడుదిగుడుల్లో సహకారాన్నందించే మానవతామూర్తి మహాకని నారాయణరెడ్డిగారికీ నా కృతజ్ఞతలు.
వ 86 పరిణతవాణి ప్రసంగాలు
న శ్రీమతి మల్లాది సుబ్బమ్మ (16-12-2005)
ఆమె ఆడది. ఈ దేశంలో పుట్టిన ఆడది. విద్యలేక, విజ్ఞానం అసలే లేక మత కబంధహస్తాలలో, పురుషుల ఇనుప సంకెళ్లలో బంధింపబడ్డ ఆడది. వాళ్ల కాళ్ల (క్రిందపడి నల్లిలా నలిగి అణగారిపోతున్న ఆడది. సంరక్షకత్వం వల్ల ఆర్టిక స్వేచ్చ పొగొట్టుకున్న అబల ద్వంద్వనీతి వల్ల సామాజిక దోపిడీకి గురి అయిన నిర్భాగ్యురాలు కాదంటారా? జౌనంటే మరేం చెయ్యాలి? అందుకే సాంఘిక జొన్నత్యం కోసం, సమసమాజ నిర్మాణం కోసం, భారతనారి స్వేచ్చా, సమానత్వాల కోసం రచనయే మార్గదర్శకమనే ధ్యేయంతో నేనీ (స్త్రీవాద సాహిత్యాన్ని ముద్రిస్తున్నాను. ఇలాంటి సాహిత్య సమిధలతో సాంఘిక దురాచారాలను, మహిళలపై జరిగే అత్యాచారాలను కాల్చివేసి మహిళా లోకానికి సేవచేయాలనే తీవ్రమైన ఆకాంక్షే నాలో ఉత్తేజాన్ని కలిగించింది, నా కలాన్ని కదిపింది. ఈనాటి వ్యవస్టలోని లోపాలను (స్త్రీల కారకు ఏర్పరచిన దురాచారాలను, ఆరాజకాలను ఎత్తిచూపాలన్నదే నా ఆరాటం. స్త్రీ స్పేచ్చకోసం, సమానత్వం కోసం సమాజంలోని కుళ్ళును, అవినీతిని బట్టబయలు చేయాలనేదే నా ధ్యేయం.
ఆసలు స్రీ జీవితమే సమస్యల విషవలయం. ప్రతి సమస్యను ఒక వ్యాసంగా (వ్రాయవచ్చు, ఒక కధగా, నవలగా వ్రాయవచ్చు. సమస్యలకు పరిష్కారం చూపేవారు కొందరైతే, అవి పారకులకే వదలివేయాలనే వారు మరికొందరు. వ్యాధి లక్షణాన్ని వివరిస్తే చాలదు; వ్యాధికి మూల కారణమేదో కనిపెట్టి దానికి తగిన చికిత్స చేయగలవాడే నిజమైన వైద్యుడు. అలా సృజనాత్మకళక్తి వాస్తవిక అవగాహన, సామాజిక స్పృహ, విమర్శనా పటిమగల రచయిత జీవిత సత్యాలను శోధించగలడు. నేటి (స్త్రీల ఆర్టిక, సాంఘిక, నైతికపరమైన వర్తమాన స్థితిగతులను వెలికితెచ్చి సమ్యక్ దృష్టితో వాటిని పరిశీలించి పరిష్కారమార్గాలను సూచిస్తూ, పారకులకు అందివ్వాలనే తపనే శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 87
నన్నీ సాహిత్య'ప్రక్రియకు ప్రోత్సహించింది ఇవే నా సాహితీ యాత్రకు నిజమైన ప్రాతిపదికలు. తరం మూరినప్తుడల్టా సంప్రదాయాలు, ఆచారాలు, సిద్దాంతాలు మారుతూ వుంటాయి. అలా మూర్పు చెందనిచో వాటి ఉనికే లేనట్టు భావవిస్టవంతోపాటు సాహితీ విప్లవం రాకతప్పదు మానన జీవిత సంస్కృతికి అద్దం వంటిది సాహిత్యం. ఆ సాహిత్యం ద్వారా నలిగిన స్రీ జీవితాన్ని వెలికితెచ్చి ఆమెలో ఆశాజ్యోతులు వెలిగించాలనేదే నా తపన. పురుష సంస్కృతి అనే కాలసర్పం నేటి ప్రీని కాటేసింది సంప్రదాయం, ఆచారం, పాతివ్రత్యం అనే విషసర్పాలు అమెపై ఆజన్మాంతం బుసకొడుతూనే వుంటాయి. వివాహ వ్యవస్త, దాంపత్యజీవితం ఆమె స్వేచ్చను, సుఖాన్ని అరికడుతున్నాయి. తన కోసం సృష్టించుకొన్న సంఘానికి, చట్టానికి తానే బందీ అయినట్టున్న ప్రీ పై దౌష్ట్యాన్ని, సామాజిక కుళ్ళును, రాజకీయ నిరసనను, ఆర్థిక అసమానత్వాన్ని బహిర్గత పర్ఫటానికే నేనీ సాహిత్య యాత్నాన్ని చేపట్టటం జరిగింది. నాకు పురుషద్వేషి స్త్రీ పక్షపాతి, కుటుంబ శాంతి విధ్వంసకరాలు' అనే బిరుదులిస్తూ ఎగతాళి చేస్తుంటారు. ఆ గుసగుసలు వింటూంటే నాకు బాధ అనిపించకపోగా నవ్వు వస్తుంది కాని ఆడవాళ్లను “అయ్యో పాపం! అంటూ కనికరించడం, 'దిక్కుమాలినది' అంటూ జాలితో చూడటం, నీచంగా మాట్లాడటం * ఈ పనికి ఆడదే తగినది" అని వేలెత్తి చూపడం, సానుభూతితో ఏదో ఒక పదవి మొహాన పారేయడం, ప్రతి కమిటీలో ఒక స్టానం కేటాయించడం లాంటివిచేసే వ్యక్తులను, వారి వ్యవస్థను చూస్తుంటే ఒళ్లు భగ్గున మండుతుంది. పని విభజనతో టీచరు, నర్సు, టైపిస్టులాంటి విసుగుపుట్టే పనులకు “ఆడవాళ్లే తగుదురన్నట్టు ఇవ్వడం చూస్తుంటే “అది వారి దృష్టిదోషమా! బధిరత్వమా!” అన్నంత ఆవేదన కలుగుతుంది. మహిళలు నోరు మూసుకుని పడివున్నన్నాళ్ళు ఈ భాగోతం ఇంతే! పురుషద్వేషంతో స్త్రీల సమస్యలు చక్కబడతాయని నమ్మని వారిలో నేను మొదటిదాన్ని. (స్త్రీలంతా మహాగుణవంతులని, పురుషులందరూ నియంతలని నిర్వచించటం అమానుషమే కాదు, మహాపరాధం కూడా అవుతుంది. 'సుబ్బమ్మగారూ! మో గురించి వైవిధ్యంతో కూడిన భావాలున్నాయి. ముఖ్యంగా మోకు పురుషద్వేషం, (స్త్రీ పక్షపాతం, కులమతాల తేడా - లేవు. దేవుభ్లే నమ్మరు. పార్టీలు నచ్చవు. అధికారాన్ని ఆశించరు. మరీ సమాజంలో మార్పు ఎలా తెస్తారు. అసలు మో ఫిలాసఫీ ఏమిటి? మో అంతిమ కోర్కె ఏమిటి?” అన్నప్పుడు... అసలు నా ఫిలాసఫీ ఏమిటి? నేను స్త్రీలకు, సొసైటీకి చేసిందేమిటి; ఎందుకింత సాహిత్యాన్ని సృష్టించాను? గత 50 ఏళ్ళుగా స్త్రీ జనాభ్యుదయానికి ఎందుకు పాటుపడుతున్నాను 88 పరిణతవాణి ప్రసంగాలు
నాకిలాంటి జిజ్ఞాస ఎందుకు కలిగింది? నేను సాధించిందేమిటి? నేను సమాజానికిచ్చే సందేశమేమిటి? - అని ్రశ్నించున్నప్పుడు 'మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటే నా జీవితాన్ని పరిశీలించండి. నేనిప్తుడొక ఫెమినిస్టుని, రేషనలిస్టుని, హ్యూమనిస్టుని, జర్నలిస్టుని, సెక్యులరిస్పుని, పౌరహక్కులే కాక హ్యూమన్రైట్సుని నమ్మి ఆయా రంగాలలో పరిభ్రమిస్తున్న కార్యకర్తను. నమ్మిన సత్యాన్ని త్రికరణశుద్ధిగా - మనసా, వాచా, కర్మణా ఆచరించి ప్రచారం చేస్తున్న నాకు అర్హ్ణబలం, అంగబలం, అధికార బలము లేవు. అయినా ఇన్ని ఘనకార్యాలెలా చేస్తున్నానంటే నాకు నైతికబలం వుంది. నే చెప్పింది చేస్తా, చేసింది రాస్తా అదే (ప్రచారం చేస్తా అందువల్ల ప్రజల్లో నా మోద విశ్వాసం వుందంటే అది నా ప్రత్యేక విశిష్టతండీ! నా ప్రచార బలిమివల్ల ఎన్నో వందలమంది మహిళల్లో స్పందన కలిగిందంటే అతిశయోక్తి కాదు. నేటి స్త్రీలు మేమెందుకు వెనుకబడి వుండాలి? (స్త్రీగా పుట్టడవే నేరమా? మేమెందుకు హింసింపబడాలి? - అని ఆలోచించి ముందడుగు వేస్తున్నారు. మా చిన్నపడు భర్త కొట్టాడని, వెళ్లగొట్టాడనే బాధతో (స్త్రీలు ఆత్మాహుతి చేసుకునేవారు. తెల్దారేటప్పటికి బావుల్లో, చెరువుల్లో ఆడవారి శవాలు తేలేవి. మాబోంట్ల కృషి వల్ల నేడు ఆ పరిస్టితి మారి (స్త్రీల మనస్రత్వంలో మార్పు వచ్చి విద్యలో, ఉద్యోగంలో, సంగీత, సాహిత్య, చిత్రలేఖనంలాంటి కళల్లో ముందడుగు వేస్తున్నారు. పురుషులతో సమానం కాకపోయినా కొంతమటుకు అభ్యుదయం సాధించారు. విద్య ఉద్యోగాల్లో పురోగమిస్తున్నారు. చాలా మంది స్త్రీ పురుషులు సుబ్బమ్మగారూ! మిరు ఇలా కావడానికి కారణమేమిటి? పురుషాధిపత్యం నశించాలని, (స్త్ర స్వేచ్చ సమానత్వాలు కావాలని పోరాటాలు ఎందుకు చేస్తున్నారు? మో భర్త మిమ్మల్ని నానా హింస పెట్టాడా? అసలు మోరు కూడా పురుష బాధితులా? గత 50 ఏళ్ళుగా పురుషాధిపత్యం మోద మీరెందుకు , పోరాడుతున్నారు? మోరు పురుషద్వేషులా? మిరు ఇంతటి (ప్రముఖ విదుషీమణి ఎలా కాగలిగారు? - అని ప్రశ్నిస్తూ వుంటారు. కనుక నా గురించి చెప్పాలంటే... తాజ్‌మహల్ కట్టారంటే ఒక్క షాజాహాన్ వల్ల మాత్రమే కాదు. అనేక మంది శిల్పులు, చిత్రకారులు, సాంకేతికనిపుణులు, మట్టి, రాళ్ళు మోసే కార్మికులు ఎన్నో వేలమంది మార్చలంతో కోట్ల ధనం వెచ్చించి కడితే ఆ మహోన్నత కళాఖండం రూపుదిద్దుకుంది. అలాగే అనేకమంది ప్రతిభావంతుల వల్ల నా (శ్రేయోభిలాషుల వల్ల, కందుకూరి, గురజాడ, దుర్గాబాయ్ లాంటి సంఘసేవకులు, మహిళోద్దారకుల వల్ల, పత్రికల వారి వల్ల, మహిళా సంఘాలు, ముఖ్యంగా నా భర్త ఎం.వి. రామమూర్తిగారు తన ప్రతిభా పాటవాలను నాలో ్రోదిచేసి నా వెన్ను తట్టి ముందుకు నడిపించిన మార్గదర్శకత్వం వల్ల నేనొక మహిళాభ్యుదయవాదిని కాగలిగాను. నాలో నిక్షిప్తమైన అగ్నికి ఆజ్యం శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 89
పోసి నన్ను ప్రజ్వలింపచేసిన మహోన్నత మహిమాన్వితుడు సహజంగా ఆయన స్త్రీ జనోద్దారకుడు ఒక్క నూటలో చెప్పాలంటే ఆయన వేల్ పెనినిన్కు' సమసమాజాభ్యున్నతుడు కావటాన సగభాగమైన 'ప్రీలను జాగృతి పరచాలనే ధ్యేయంతో నేను చేస్తున్న మహిళాభ్యున్నతికి ఆయన తన సహాయసహకారాలు అందించారు. నాకు విద్యా విజ్ఞానాలు నేర్పి ఒక విదుషేమణిగా తయారుచేసింది రామ్మూర్తిగారే. నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అది ఆయన కృషే ఆయన రుణం ఏమిచ్చినా తీరేది కాదు. ఆయన సహజంగా హేతువాది, హ్యమనిస్టు, సివిల్ లిబర్టీస్ నాయకులు, గొప్ప స్కాలరు, నిస్వార్ధ 'సేవాపరుడు. అలాంటి భర్తలు 10శాతమైనా లభిస్తే ఈ దేశ స్వరూపమే మారి అభ్యుదయ పధాన పయనిస్తుంది. అలా నా భర్త నాకు మార్గనిర్దేశికుడైనాడు.
(స్రీ వాదమంటే - స్వేచ్చ సమానత్వం ్రాతిపదికలుగాగల మానవ విలువలతో ఉద్భవించిన, ఫ్రెంచి విష్ణన చైతన్యంతో ఆవిర్భవించిన ఆలోచనా ధోరణికి రూపకల్పనే ఫెమినిజం. మహిళా దశాబ్దానంతరం ఇంటిపనిలోను, పిల్లల పెంపకంలోను స్త్రీ పురుషులిద్దరూ భాగస్వామ్యం వహించాలనే పోరాటం ప్రబలంగా సాగిపోతోంది లింగభేదం వల్ల మా వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సహించేది లేదని ఎలుగెత్తి చాటుతోంది ఈనాటి ఫెమినిజం. అంతేకాదు వ్యక్తిత్వం, వ్యక్తి స్వేచ్చ, ఆత్మాభిమానాన్ని ఆకాంక్షి స్తుంది ఫెమినిజం. తెలుగు సాహిత్యంలోనేకాదు, అన్ని సాహిత్యాలలోను ఈ సంప్రదాయం అనగా విప్లవ సంప్రదాయం అనూచానంగా వస్తున్న అక్షయకోశం. ఆ విధమైన విష్ణవాత్మక సాహిత్యం నేటి యువతరాన్ని సరియైన మార్గంలో పయనింప చేయగలదు. కాబట్టి రచయితలకు కాల్పనికత, కట్టుకధలపై మోజు తగ్గిపోవాలి. హేతువాదం, స్త్రీ వాదం, వాస్తవికత కవిత్వంలో, కధలలో చోటు చేసుకోవాలి. నిర్దిష్ట లక్ష్యం, అదీ సమాజాన్ని ముందుకు నడిపించగల సమూలమైన మార్పులు తీసుకురాగలధోరణి, భావం, నియమనిబద్ధత వుండాలి. నేనొక మహిళాభ్యుద వాదిగానే కాక ప్రజాస్వ్యామికవాది, హేతువాది, లౌకికవాది, నవ్యమానవవాదిగా పలురకాలుగొ నా భావ వ్యస్తకరణ చేస్తుంటాను.
నా సాహిత్యపిపాసకు కారణం - భారతదేశ జనాభాలో సగం శాతం మహిళలు వున్నప్పటికి వారి సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకలేదు. ఆ పరిస్థితులలో స్రీ “వచవాదిగా, మహిళోద్యమవాదిగా ప్రకటించుకొన్న నేను నా సాహిత్యం ద్వారా మహిళోద్యమవాదిగా' రూపొందడం జరిగింది. జీవితంలో (ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో రంగాలుండగా నేను మాత్రం అతిక్షిష్టమైన, కష్టమైన మహిళా మార్గం ఎంచుకున్నాను. 90
సరిణతవాణి ప్రసంగాలు
జనాభాలో సగభాగంగా వున్న తోటి (స్త్రీలలో చైతన్యం, స్పూర్తి, స్పందన లేకుండా ఆ అభాగ్యులు అంధకారంలో వంటింట్లానో, సదకటింట్లోనో గడపడం కళ్లార చూచి నా జీవితాన్ని (స్తీ జనాభ్యుదయానికి వినియోగించాలని నిర్ణయించుకున్నాను. అటు సాహిత్యంలోనూ, ఇటు సంఘసంస్కరణలోను నవ్యసాచిత్వాన్ని నెరపి రెంటికి ఏక సూత్రత ఘటించి, రెండు ఫలాలను ఏకముఖంగా సాధించి సమన్వయకర్తగా నా ఆత్మకధ 'పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా” 1992 లో చెప్పుకున్నాను. అంతేకాదు నా జీవితానికొక ధ్యేయం వుంది. నా చేతిలో అమోఘమైన రచనాశక్తి వుంది. నా సాహిత్యానికి కేంద్రం స్త్రీ. మనస్సులో పుట్టేది ఆవేదన, మండే గుండెల్లోంచి వచ్చేది తపన. అసమానత్వంపై కలిగేది భావోద్రేకం. వీటిని కలపోసి రచించిన సాహిత్యం కావ్యరూపం దాలుస్తుంది. ఉద్వేగం కలిగితే కవిత్వం ఉప్పొంగి పెల్టుబికి కట్టలు తెగి (ప్రవహిస్తుంది. నా సాహిత్యానికి కళారీతులు లేకపోవచ్చు. కాని నా సొహిత్వానికి అమరత్వం వుంది. అది సమాజంలో ఘనీభవించి వున్న కుళ్లును బహిర్గతం చేస్తుంది. వారి ఆర్తనాదాలకు భాష్యం చెబుతుంది. అంతో ఇంతో ఉపశమనం ఇస్తుంది. సామాజిక దృక్పధం లేని సాహిత్యం పదికాలాలపాటు మనజాలదు. పాత్రల్ని సన్నివేశాలను ఊహించినా, కల్పించినా వాటిని జీవితమంతా సహజంగా చిత్రించగలగాలి. పారకులకి సహజత్వం అందులో గోచరించాలి. అదే సిసలయిన సాహిత్యం అని నా దృఢవిశ్వాసం. “ఆడది చదివి ఉద్యోగం చేస్తుందా! వూర్లేలుతుందా! ఉద్యోగం పురుష లక్షణం" అనే ఆచారం అమల్లో వున్న రోజుల్టో 10 ఏళ్లకే నా చదువు మాన్పించి పెళ్లి జరిపించారు నన్ను కన్నవారు. మాదొక సనాతన సం'ప్రదాయకుటుంబం. నోములు, (వ్రతాలు, పూజలతోనే నా బాల్యం గడిచిపోయింది. ఇక మెట్టినిల్లొక యజ్ఞయాగాదులు, కృతువులతో విలసిల్లే అగ్రహారికులది. ఈ మధ్యలో నా జీవితమొక మహాపతి(వ్రతగా, సన్యాసులకు భిక్షలు, వఎనాపాఠీలకు ఆతిధ్యాలు, హోమాలు, (క్రతువులు, పురాణశ్రవణాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేదాన్ని. మా అత్తగారు ఒక స్వామాజీ చేత నాక ఉపదేశం చేయించింది. మంత్రజపం రోజుకొక కోటి చేసి ఆ 'దుష్ట' గురువుకు ధారపోయాలిట. నాకప్పటికి 22 ఏళ్ళు. నలుగురు బిడ్డలకు తల్లినయ్యా కుడితిలోపడ్డ ఎలుకలా అయింది నా పరిస్టితి. చదువుకుంటానంటే మగవాళ్ల (ప్రక్కన కూర్చుని చదువా? సిగ్గుచేటన్నది మా అత్తగారు. మరో పదేళ్లకు నా పిల్లలిద్దరు ఇంజనీర్లయ్యారు. మరో ఇద్దరు మెడిసిన్ చదువుతున్నారు. ఇక నన్నెవరూ ఆపలేక పోయారు. నా భర్త మొదటి నుండి పక్కా ('ప్రజాస్వామికవాది, స్కాలరు, హ్యామనిస్టు, రేషనలిస్టు, మహిళాభ్యుదయవాది. నన్నెంతో ఆదరించి ఇంతదాన్ని చేసింది ఆ మహానుభావుడే. ఇది కాదనలేని నస్టసత్యం. శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 9]
నాకప్పటికి 36 ఏళ్లు వున్నాయి. అయినా జంకలేదు, సిగ్గుపడలేదు. ధైర్యం, పట్టుదల, అభ్యుదయం, ముందుచూపు వుండబట్టే నాటికి, నేటికి నేను నిలబడి (స్త్రీల స్వేచ్చా సమానత్యాల కోసం పోరాటాలు జరుపుతున్నా. నేనస్పుడు సట్టుబట్టి మెట్రిక్ పాసయి, పియుసి, బి.ఏ చదివి ఆ వెంటనే ఫ్యామిలీ ష్టానింగు డిస్షమా చేశాను అందువల్ల ఎంతో విద్వత్తు గడించాను. లోకజ్ఞానం పొందాను. కులమతాల తేడాలు పోయాయి. హాస్టల్లో క్రిష్టియన్లు, ముస్లింలు, హిందువులం కలిసి తినే రాళ్లం. మానవులంతా ఒకటే అనే భానం నాకప్పుడే కలిగింది. అలా ఆ (ట్రయినింగువల్ల ఎంతో విజ్ఞానాన్ని పాందగలిగానంటే నమ్మండి. ఆ తరువాత జిల్ద్హా ఆర్గనైజరుగా వర్కు చేశా. ఆ ట్రయినింగు నా జీవితాన్నే మలుపు తిప్పింది. 1964లో జనాభా పెరుగుదల, కుటుంబ నియం(త్రణావశ్యకత మోద చిన్న చిన్న కదలు, వ్యాసాలు వ్రాయటం, ఉపన్యాసాలు ఇవ్వడం, ఓరియంటేషన్ ట్రయినింగు క్యాంపులు పెట్టి పారాలు చెప్పడం హెచ్చుస్టాయిలో జరిపాను. ఆ రోజుల్లో ఇద్దరు బిడ్డలు చాలు! ఆపరేషన్ చేయించుకోమంటే తల్లి సరేననేది కాని భర్త అత్తమామలు వ్యతిరేకించేవారు. అది చూసి స్త్రీకి స్వేచ్చ లేదని (గ్రహించిన నేను ముందుగా (స్తీ స్వేచ్చా సమానత్వాల మోద పోరాడాలి, ఆమెకు వ్యక్తిత్వం కావాలి- అని నిర్ణయించుకొని 1964 నుండి (స్త్రీల హక్కులపై (ప్రచారాన్ని హెచ్చుస్టాయిలో జరుపుతూ రాష్ట్రమంతా పర్యటించాను. రాష్ట్ర సభలు, సెమినార్లు, వర్కుషాపులు నిర్వహిస్తూ, మహిళాసంఘాలలో, (గ్రామాలలో ఎవరు పిలిచినా వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చివస్తూ వుండేదాన్ని. అదికాక ప్రీల మిద చిన్న చిన్న కథలు, వ్యాసాలు, వరకట్న హింసలు, అత్యాచారాలు లాంటివాటిపై వ్రాసి పేపర్తకు పంపుతూ వుండేదాన్ని. ఆ రోజుల్లో 30 పైసలు స్టాంపు పెట్టి కవరు పంపితే తిరిగివస్తూ వుండేవి. మొదట్లో నేను పంపా, వాళ్లు త్రిప్పి పంపడం జరిగేది. ఆ అవధులన్నీ దాటి ఈనాడు అడిగి (వాయించుకోవడం, రిమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారు. ఆ సమయంలోనే “వికాసం” మానసత్రిక రామ్మూర్తిగారు, నేను స్టాపించి అందులో విరివిగా రచనలు చేస్తూ వుండేదాన్ని.
అది 1962లో రాబర్జు కెనడీ అమెరికా (ప్రెసిడెంటు నీ(గ్రోలను హింసించరాదని, వారూ మానవులే వారికి రక్షణ కావాలని ప్రచారం చేశాడని తెల్లవాడే కాల్చి చంపాడు. (గాంధీని గాడ్పే కాల్ఫి చంపినట్టు) ఆ ఉద్రేకంలో 'మంటకలిసిన మానవత్వం” అనే కధ రాశాను. అదే నా మొదటి కధ. అది పూర్తిగా (గ్రాంధికభాషలో నడిచింది. నీత్త మంచిదైనా భాషకాని, రచనా విధానంకాని బాగా లేవు. ముడిసరుకులా వుంది. సాహితీరీతులు, రీడబిలిటీ అందులో లేవు. ఇంక 64 నుండి 'కుటుంబ మిత్ర'లో 92 పరిణతవాణి ప్రసంగాలు
ప్రతినెలా చిన్న కథో, వ్యాసమో రాసేదాన్ని. 1962 నుండి 'ఆంధ్ర జ్యోతి" మహిళా శీర్షికలో నా వ్యాసం ప్రతివారం (ప్రచురించేవారు ఎడిటరు రామ్మోహనరావుగారు. వారి 'వనితా జ్యోతి' వారపత్రిక స్టాపన నుండి 15 సం॥లు “వ్యక్తిగత సమస్యలు - సమాధానాలు” వ్రాశాను 'అంధ్రపత్రిక' వారి 'కలువబాల' వారపత్రికలో 19 ఏళ్లు కాలమిస్టుగా స్త్రీల సమస్యల మోద వ్రాశాను. స్రీ స్వేచ్చ' మాససత్రిక 1989లో స్టాపించి ఎడిటరుగా స్త్రీల సమస్యల మోద నడుపుతున్నాను. 1964 నుండి అంటే ఈ 40 ఏళ్ల నుండి ఈనాటి వరకు '్రీల సమస్యల మీద వైవిధ్యంతో కూడిన వ్యాసాలు 800 దాకా వుంటాయి. 1999 జూన్‌లో జరిగిన తానా సభల్లో ఉపన్యసించాను. వారు 'సాహిత్యంలో స్త్రీ పాత్ర చిత్రణ' వ్యాసం వ్రాయించి శాలువా కప్పి, అవార్డు యిచ్చి సత్కరించారు. తెలుగు యూనివర్సిటివారు నాకు 10 (ప్రశ్నలు పంపి, వచ్చి ఫిల్ము తీసి వారి లైబ్రరీలో భద్రపరిచారు. అనేకానేక సెమినార్లలో పరిశోధనపత్రాలు (వ్రాసి 'ప్రసంగించాను. ఉస్మానియా, ఆంధ్రా, తిరుపతి ఉమెన్సు స్తడీస్ వారి సెమినార్లలో వర్కు పేపర్టు వ్రాసి పాల్గొన్నాను. 'తెలుగు విద్యార్థి మాసపత్రికలో 25 ఏళ్లు వ్యాసాలు ్రాశాను.
ముఖ్యంగా రచనలను గురించి రాసేటప్పుడు రచయిత తన జీవితాన్ని అర్ధంచేసుకోవాలి. తాను పరిపూర్ణమైన అంటే సార్హకమైన జీవితాన్ని అనుభవించాలి. “మాకొద్దీ తెల్లదొరతనం” అనే ఒక్క కలంపోటుతో స్వరాజ్యం పొందగలిగాము. అంటే కత్తికంటే కలం గొప్పదనేది పచ్చి నిజం. ఆ శక్తి స్పందన, సామాజిక స్పృహకలవారి రచనలే దిక్సూచిలా నిలుస్తాయి. మిరేదో అజ్ఞానులని, నేనేదో (ప్రవక్తనని చెప్పటం లేదు. మన రచనల ద్వారా అవిద్య, అజ్ఞానం, అసమానతలనే గాఢంధకారంలో కొట్టుమిట్టాడుతున్న స్రీ జాతికి చిరుదివ్వెలా తొడ్పడాలనే తపనతోనే ఈ సాహితీ ప్రక్రియను చేపట్టాను. నేను ఎవరెస్టు నధిరోహించలేకపోయినా మొదటి మెట్టు ఎక్కగలిగినందుకు నా జీవితం సార్ధకమైందని విశ్చసిస్తున్నాను. నా సాహిత్యానికి కేంద్రం “స్త్రీ, నా ఉపన్యాసానికి మకుటం 'మహిళి, నా కార్యరంగానికి మూలం, నా ధ్యేయం “స్తీ విమోచన" నా ఆదర్శం, లక్ష్యం “స్తీ జనాభ్యుదయమే'.ముఖ్యంగా చెప్పాలంటే నా సాహిత్యం నా సంఘసేవకు వన్నెతెచ్చింది. సంఘసేవాధురీణ అయిన సాహితీమూర్తి' అని నా గురించి వ్యాఖ్యానించారు శ్రీ తిరుమల రామచంద్ర.
నా మనసులో పొంగిపొరలే భావాలే నా రచనలు 60 పుస్తకాలుగా (ప్రచురించాను. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని పేర్కొనడం అవసరం. 1983లో 'ఆధునిక (స్త్రీ 300 పేజీలది (వ్రాశాను. దానికి నార్లవారు (వ్రాసిన ముందుమాటలో “సుబ్బమ్మగారులాంటి శ్రీనుతి మల్లాది సుబ్బమ్మ 93
విదుషీమణులు ఈ దేశంలో ఒక లక్షమంది వుంటే ఈ దేశ స్వరూపవేం మారిపోతుంది”అన్నారు. తరువాత "హైందవం: స్త్రీలు 'ఇసాం: స్రీలు, “క్రైస్తవం. ప్రీలు అనే ఈ మూడు పుస్తకాలు వేదాలు, ఇతిహాసాలు, ఖురాన్, బైబిలు చదివి (స్త్రీల దృష్టితో విమర్శించి (వ్రాశాను. అనేక రివ్యూలు, ప్రశంసలు వచ్చాయి. ఇస్లాం: (స్రీలు' పుస్తకం ఇంటర్నెట్లోకి చేరిందని తెలిసి సంతోషించాను. మరో పుస్తకం 'ఉమెన్ అండ్ సోషల్ రిఫాం' లా కాలేజికి రిఫరెన్సు బుక్‌గా పెట్టారు నా [గ్రంధాలలో ముఖ్యమైనది 330 పేజీలనా ఆత్మకధ (199 “పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా”. డా॥ సి.నారాయణరెడ్డి, ఆవుల సాంబళివరావు, తార్కుండే, ప్రా। బిహెచ్. కృష్ణమూర్తి. జి.వి. సుబ్రహ్మణ్యం, డా॥ రావూరి భరద్వాజ, కేతు విశ్శనాధరెడ్డి గార్లే కాక అనేకానేక మంది ప్రశంసించడం జరిగింది. ఇంకా ముఖ్యమైనవి సాహిత్యం: సంస్కరణ, మానవ హక్కులు, మహిళల హక్కులు, లైంగిక విష్ణవం, భవిష్యత్ మహిళ, వివాహం - నేడు, రేపు, మనం : మన సంస్కృతి లాంటివి. 2003లో ఇంగ్రీషులో "లైఫ్ ఎభీవ్మెంట్ అవార్డీ- హ్యూమనిస్టు హిరోయిన్” అనే (గ్రంథాన్ని ఇటీవలే ప్రచురించాను. రివ్యూలు బాగా వచ్చాయి. నావి 20 పుస్తకాలు అమెరికా నేషనల్ లై(బ్రరీలో భద్రపరిచామని లేఖ పంపారు. ఈ సందర్భంగా కొన్ని నవలలను విశ్హేషంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను, వివిధ రకాల కళా ప్రక్రియలలో సాహిత్యానికి జనసామాన్యంలో చెరగని ముద్ర వేసే లక్షణం నవలకు వుంది. కాబట్టి నేను నా నవలల ద్యారా స్త్రీల సమస్యలు వెలికితెచ్చి మహిళా ప్రగతికి మార్గం చూపించటానికి పూనుకున్నాను. నవలా ప్రక్రియ అనిర్వచనీయమైనది. స్త్రీల సమస్యలకు దర్పణాలే నా నవలలు. ఒక పొత్ర అయినా సమస్యా పరిష్కారాన్ని సూచించాలన్న నియమబద్ధత నా నవలల్లో (ప్రతిబింబిస్తుంది. వెలిగిన జ్యోతి (1992) వెలిగినజ్యోతి (1992) వ్రాస్తే అనేక పత్రికల్లో రివ్యూలొచ్చాయి. భూదేవి అంతటి సహనమూర్తి అయిన కాంచన భర్త డబ్బు కోసం తనని దగాచేసి పడుపు గృహానికి తరలిస్తుంటే ఒక్కసారి అపరకాళియై కత్తిపీటతో ఆతని నెత్తి అడుస్తుంది. బానిస మనస్తత్వాన్ని పారద్రోలి తిరుగుబాటుతో స్వేచ్చా వాయువులు పీల్చుకోవాలనీ స్తే జాతికి నేను ఇచ్చిన సందేశం... భర్తను చంపింది. ఇది జొచిత్యమా! అనేది పరిస్టితులను బట్టి వుంటుంది. (స్త్రీలంతా మంచివారని కాదు. వేదకాలం అంటే 4 వేల ఏళ్ళనుండి వారు పడుతున్న అణచివేతను పారద్రోలడమే ఈ నవల ఉద్దేశం. 94 పరిణతవాణి ప్రసంగాలు
(ప్రేమ+సెక్సు=నీతి (1984)
ఇది పూర్తిగా సెక్సు నవల అనిపించినా ఇందులో అడవారు, వారి సమస్యలు, ఉ(ద్రెకాలు, తపన, కామం, మనస్తత్వాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. మనం సెక్సును గురించి వ్రాసినా, మాట్లాడినా వారిపై వింత భాష్యాలు చెప్తారు కాని ఆహార ని(ద్ర మైధునాలు మానవ జీవిత ముఖ్యభాగాలు. వీటి మంచి చెడ్డలు విమర్శించక తప్పదు. అందుకే వయస్సు మళ్లినదాన్ని కనుక నేను వ్రాయడం సమంజస మని 200 పేజీల ఈ పుస్తకం (వ్రాశాను. ఈ నవలపై శార్వరిగారి వ్యాఖ్య - “ఆడవారి సమస్యలు, ఉ(ద్రేకాలు,తపన, కామం, మనస్తత్వాల నిర్శచనం బాగుంది. ఇది ఎంత సెక్సు నవల అయినా మహిళాభ్యుదయ దృష్టితో చూస్తే మంచి ప్రయోజనం వున్న నవల”. వంశాంకురం (1988)
ఈ నవల “ఆంధ్రభూమి” వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది. పిల్లలను కనడం, కనక పోవడం స్త్రీ జన్మహక్కు. ఆమెను శాసించే హక్కు భర్తకు కూడా లేదు. అంతేకాదు గర్భ(స్రావపు హక్కు కూడా ఆమెకే వుంటుంది. నిమిత్తమా(త్రుడైన భర్తకు ఆమెను వారించటం తగదని నా వాదన. ఏది ఏమైనా ఏటికి ఎదురీదగల జీవితశైలి నేటి కాలపు స్త్రీలు అలవర్చుకోవాలన్నదే నా అభిమతం. చీకటి వెలుగులు (1984)
ఈ నవల 'విశ్చ్శసాహితి' మాసపత్రికలో సీరియల్‌గా వచ్చింది. సరోజ భర్త ఆమెను వీణ వాయించనీయడు. అదే భర్త మరో స్త్రీ వీశావాదనను మెచ్చుకుంటే, తనని హింసిస్తుంటే తన (ప్రతిభా వ్యుత్పత్తుల వికాసం కొరకే భర్తకు విడాకులిచ్చింది. ప్రతి చిన్నదానికి విడాకులకు నేను (ప్రోత్సహిస్తాననే అపవాదు నామోద వుంది. కాని భార్యాభర్తల మధ్య (ప్రేమానురాగాలు, సదవగాహన, పరస్పర విశ్వాసం కొరవడితే ఆ కాపురం అర్ధరహితం. అదొక నరకప్రాయం, అందుకే నేను ఆ నవలలో విడాకులు ఇప్పించాను.
ఈ దేశం నాదేనా? (1986)
కూడు, గుడ్డ, గూడు ఇవ్వలేని మన దేశం చెత్తకుండీల దగ్గర చెత్తను ఏరుకుని (బ్రతికే అభాగినులను చూచి హృదయం భగ్గుమనగా ఆ మంటలోంచి వచ్చిన ఆవేశాన్నే ఈ నవల. శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 95
కాంతికిరణాలు (1984)
వివాహ వ్యవష్టలో ఎన్ని విధాలైన దాంపత్యజీవితం గడపవచ్చో, కలిసి ఎలా జీవించవచ్చో వివాహ వ్యవస్టపై వైవిధ్యాన్ని చిత్రీకరించడమేకాక ఇంకా గ్రేమ వివాహం, ఆధునిక వివాహం, సంస్కరణ వివాహాలే కాక 'విష్టవ వివాహం' అనే కొత్త రూపాన్నికూడా సామాజిక దృష్టితో ఈ నవలలో తేవడం జరిగింది బాలల నవల “సామ్రాజ్ఞి రుద్రమ దేవి"
ఈ నవలను బాలభవన్ వారు 1991లో ముద్రణచేసి 10 వేల రూపాయల పారితోషికం ఇచ్చారు. ఒక స్త్రీ ధైర్య స్టైర్యాలను, పరిపాలనా దక్షతను గూర్చి చెప్పటం, సామ్రాజ్ఞి మహిళ అయినప్పటికి ఆమెపట్ట ప్రజలు (ప్రదర్శించిన గౌరవభావం చూపటం, ఆమె జీవితం ద్వారా మంచి స్పూర్తి కలుగజేయడం కోసం ఈ నవల (వ్రాశాను.
ఇంకా చెప్పాలంటే నేను కథారచయితను కూడా. సాహిత్యంలో ముఖ్యభూమిక కథ. నేను 30 కథలు (వ్రాశాను. లోపం వల్ల బిడ్డలు పుట్టకపోతే ఆమె లోపమనుకొని ఆమె గొంతు పిసికి చంపిన కధ “మాతృత్వానికి మరో ముడి” అనే పేరుతో (గ్రంధం ముద్రించాను. అందులో 'పడగవిప్పిన పదో రోజు”. (స్త్రీ వైధవ్యం మోద, మానభంగం మీద (చెలియలికట్ట), వైకుంఠపాళి, పనికిమలిన ముత్యం, కంటి వెలుగు (కన్యకు గర్భం వస్తే, కనువిప్పు, మంట కలిపిన మానవత్వం, మనసెప్పుడూ గుప్పెడే, జీవిత వలయం (వృద్దాప్యం మోద), ఆత్మాభిమానం, పూసలపల్లికి (బిడ్డను పెంపుడు ఇస్తే), 'ప్రతీకారవాంఛ, నిష్కళంక చరిత్రుడు లాంటి కధలు 250 పేజీలు వ్రాసి 1983లో ప్రింటు చేశాను.
అలాగే “విషాదగాధలు” అనే మరో కధల సంపుటిలో తరతరాల (స్త్రీల బాధలు, పురుష దౌష్ట్యం, సామాజిక నిరసన, రాజకీయ నిరాదరణకు గురిఅవుతున్న కడలి కన్నీరు గాధ, విద్యా-వివాహమా!, తరతరాల (స్త్రీల పరాజయగాధ, ఇది కధకాని నిజం, కీలెరిగి వాతపెట్టాలి, సమానత నువ్వెక్కడ? ఆమె అజ్ఞానమే ఆ విషాద గాధ, మతం మహిళను హతమారుస్తుందా?, ఎలా పరిష్కరించాలి?, ఆమె శీలం అంటే అంత చులకనా?, మోసగించేది మగవారు, అనుభవించేది ఆడవారు, ఓ కళ్యాణి కథ, ఆమె ఆదర్శమే ఆమెకు అంధకారమైంది, ఈ సంఘమే నన్నిలా చేసింది, దాచేస్తే దాగని సత్యం, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, గొడ్రాలయితే చంపాలా?- లాంటివి 60 కధలు 'గ్రాసి ప్రచురించాను 1991 మార్చిలో. ఈ కధలన్నీ పురుషుల దౌష్ట్రం మిద, స్త్రీల నిస్సహాయతమీద వ్రాశాను. నా సాహిత్యం మీద ముగ్గురు రిసెర్చి చేస్తున్నారు. అయినా 96 పరిణతవాణి ప్రసంగాలు
నాకు సంఘసేవకురాలిగానే గుర్తింపు, పేరు వచ్చాయి కాని సాహితివేత్తగా అంతగా రాలేదు. కారణం ఒక వ్యక్తి రెండు విభాగాల్లో సమాన స్థాయిలో వర్కు చేస్తే ఒక్క దానికే ప్రముఖంగానూ, రెండోదానికి అనుగుణంగానూ వస్తాయేమోనని నా విశ్వాసం. నేనొక సభలో ఈ భావాన్నే వెల్లడిస్తే “సుబ్బమ్మగారూ మీ సంఘసేవకు మో సాహిత్యం తోడ్పడి మో సేవా స్థాయిని పెంచింది. అందువల్లే “ప్రముఖ సంఘసేవకురాలు” అనే బిరుదు మోకు వచ్చిందని” నన్ను అభినందించారు.
నా పుస్తకాలు 12 ఇంగ్రీషులోకి అనువాదం చెయ్యబడ్డాయి మళయాళంలోకి 6 పుస్తకాల తర్జుమా జరిగింది. నియోలీటరేట్సుకు [గ్రామాల్లో మూఢనమ్మకాలపై, మహిళలపై దౌర్జన్యం, సమానత నువ్వెక్కడ? అతివలపై అఘాయిత్యం - వ్రాసి (గ్రామ (స్రీలకు పంచిపెట్టాను ఇంకా చెప్పాలంటే నా సాహిత్యంలో ముఖ్యమైన నా ఇంగ్లీషు అనువాదాలు (1) ఫియర్లెస్ ఫెమినిస్టు (2) ఇస్లాం : (స్త్రీలు (3)హైందవం: : స్త్రీలు (4)ఉమెన్ ఇన్ ఛేజింగ్ సొసైటి (5) స్టేటస్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (6) ఉమెన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ (7) ఉమెన్సు అసోసియేషన్ (8) సాగా ఆఫ్ ఉమెన్స్ (స్ట్రగుల్ (9) ఉమెన్ ఇన్ సోషల్ రీఫాం (10) స్త్రీలపై అత్యాచారాలు.
1962 నుండి వైవిధ్యంతోకూడిన సాహిత్యాన్ని ప్రచురించాను. లండన్ సభల్లో, అమెరికా తెలుగు సభల్లో నా భావాలు అభివ్యక్తీకరణ చేశాను. గత 40 ఏళ్లుగా వందల సభల్లో ఉపన్యాసొలు జరిగాయి. సావనీర్లలో వ్యాసాల (ప్రచురణ జరిగింది. హైదారాబాదు దూరదర్శన్‌లో, ఇంకా ప్రయివేటు ఛానల్సు టి.వి.లలో 1978 నుండి నావి స్త్రీలపై లెక్కకు మిక్కుటంగా ప్రసంగాలు, చర్చలు వచ్చాయి. ముఖ్యంగా దూరదర్శన్‌లో 7 ఏళ్లు ్కీనింగు కమిటీ మెంబరుగా వుండి నాలుగు వందల సినిమాలు, ప్రీవ్యూలు చూసి నా అభిప్రాయం, భావాలు (వ్రాసేదాన్ని. 1952 నుండి రేడియోలో వందల కార్యక్రమాల్లో పాల్తొన్నాను. రేడియో ఎడ్వయిజరీ కమిటీలో వుండి సలహాలు ఇచ్చేదాన్ని. టి.వి. సీరియల్సు 500 పైగా దిద్ది ఎబి.సి క్యాటగిరీల్లో టెలికాన్ట్ అర్హత వుందా? లేదా? (వ్రాసీ యిచ్చేదాన్ని. టి.వి. ఎ.ఐ.ఆర్. వారు నాకు గత 40 ఏళ్ళుగా ౩ లక్షల రూపాయలు దాకా పారిలోషికం ఇచ్చారు.
సాహిత్య సాంస్కృతిక పరమైన నా అవార్డుల గురించి చెప్పుకొంటే అతిశయెక్తిగా గోచరించవచ్చు. కాని సమాజం గుర్తింపు నెరిగించటంలో అనౌచిత్యం లేదని నా దృఢవిశ్వాసం. ముందుగా 1988 ఉగాది నాడు తెలుగు విశ్శవిద్యాలయం వారునా పుస్తకం “ఆం.ప్ర.లో మహిళోద్యమం: మహిళాసంఘాలు 1860-1993” (అది 150 ఏళ్ల చరిత్ర). ఆ (గ్రంథానికి అవార్డు యిచ్చారు. అప్పటి సి.ఎం. ఎన్.టి.రామారావు శ్రీనుతి మల్లాది సుబ్బమ్మ 97
నన్ను గౌరనించారు. అవార్డు, రూ. పదివేలు ఇచ్చి సన్మానించారు. అలాగే నా ఉపన్యాసాల ద్వారా, 60 (గ్రంధాల రచనల ద్వారా మహిళల హాక్కులు మానవహక్కులేఅనే సాంఘిక చైతన్యాన్ని, సామాజిక జాగృతిని కలిగించిన నాకు ప్రత్యేకంగా మహిళల మానవ హక్కుల కొరకు చేసిన నా కృషికి గణనీయమైన సేవకు గుర్తింపుగా విజిలిండియా మూవ్మెంటువారు “ఎం.ఎ. ధామస్ నేషనల్ హ్యామన్రైట్సు' అవార్డు లక్షరూపాయలతోపాటు మెమొంటో యిచ్చి సత్కరించారు. అలాగే 57పుస్తకాల ఆధారంతో వేదకాలం నుండి నేటి వరకు సాంఘిక, ఆర్దిక, రాజకీయాల్లో (స్త్రీలలో వచ్చిన మార్పులు విశ్లేషించి 1996 వ్రాసిన (గ్రంధం (వివాహం చాని పుట్టుపూర్యోత్తరాలు) 'సహజీవనం: సన్నిహితత్వం' ఈ పుస్తకానికి కూడా తెలుగు యూనివర్సిటివారు 'ఉత్తమ (గ్రంధం' గా గుర్తించా రూ. 10వేల పారితోషికంతోపాటు మెమోంటో యిచ్చి సత్కరించారు. 36వ ఏట మెట్రిక్ పాసయ్యానని బాపట్లలో పౌరసన్మానం జరిగింది. అది నా మొదటి సన్మానం. గౌరవ కుటుంబ నియంత్రణ ప్రచారకురాలిగా ప్రెసెడెంటుచేత నామినేట్ చేయబడ్డప్పుడు సత్కారం జరిగింది. 'ఓఓల్హర్ ఉమెన్సు లీగ్ అమెరికా సంస్టవారు 1982లో వారి గౌరవ చిహ్నం యిచ్చి గౌరవించారు. సంఘసేవకు గుర్తింపుగా 1986లో దుర్గాబాయ్ అవార్డు, ఆలిండియా ఉమెన్సు కాన్ఫరెన్సు డైమండ్జూబ్లివారి సన్మానం, రోటర్క్షబ్, కోఠి ఉమెన్సు కాలేజీ సిల్వర్ జూబ్లీ అవార్డు, తెలుగు ఉగాది ఏకాదశ రచయిత్రులలో, గీటురాయి రజతోత్సవాల్లో ఇందిరగాంధీ యూత్ వెలేఫేర్వారు, స్టేటుబ్యాంక్ స్త్రీ శక్తి స్కీము క్రింద త్రిపురనేని రేషనలిస్టు అవార్డు, ప్రధానమంత్రి జన్మదిన వేడుకల్లో విశిష్ట అతిధిగా, కళాపీరం, వాసవీ ఆర్హు థియేటర్: మద్రాసు (ప్రపంచ తెలుగు సమాఖ్య, ఇంటర్నేషనల్ ఉమెన్సు క్లబ్బు వారు 'ఆంధ్రా రూన్సీరాణి' టెటిలిచ్చి గౌరవించారు. సుజీ సంస్థ 'కృషిరత్న' గోల్డుమెడల్, చైతన్య ఆర్బు థియేటరు వారు 'గార్జియన్ ఆఫ్ గుడ్‌విల్ అవార్డు, ఢిల్లీ తెలుగు అకాడమి, వివేకానంద అవార్డు, జాషువా అవార్డు, అంబేడ్కరు అవార్డు, పొట్టి శ్రీరాములు, మదర్ ధెరిస్సా అవార్డులే కొక అనేకానేక మహిళా మండళ్ల సన్మానాలు చిన్నవి పొన్నవి ఒక 60 దాకా వున్నాయి. 2003లో 'లైఫ్ ఎచీవ్మెంటు" అవార్డు శ్రీ లేవీ ప్రాజిల్, ప్రపంచ హ్యూమనిస్టు సంఘాధ్యక్షులు మెమెంటో, వారి సింబల్సు యిచ్చి సత్కరించారు. ఇంకా ముఖ్యమైనది. గౌరవప్రదమయిన 'ఆత్మగౌరవ పురస్కారం" అవార్డు 50 వేల రూపాయలు, మెమెంటో, శాలువా కప్పీ ఆం.ప్ర. అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన సన్మానం చేశారు. నా సాహిత్యానికి, సంఘసేవకు నాకు జరిగిన 98 పరిణతవాణి ప్రసంగాలు
ఘనసన్మానాలకు ఇవి మైలురాళ్ళు. ఏ వ్యక్తికయినా సన్మానం అంటే అదొక గుర్తింపుగా చేసిన దానికి ఆత్మసంతృప్తిగా ఆనందిస్తారు అది సహజం. మాకు వద్దు, మేము తీసికోము! - అంటే అది కృత్రిమం అనవచ్చు.
మహిళోద్యమం నా వూపిరి. మహిళా పురోగతి నా ప్రాణం. స్త్రీ స్వేచ్చ అంటే విశ్చంఖలత్వం కానేకాదు. పురుషద్వేషం, పగ, వారి అణచివేత అంతకన్నా కాదు భార్యాభర్తల మధ్య సదవగాహన, సమానత వెల్లివిరియాలి. భారత రాజ్యాంగంలో జండరు డిఫరెన్సు లేదని (వ్రాసుకున్నాం అయినా పాటించడం లేదు. స్త్రీకి తనకో వ్యక్తిత్వం వుండాలి; తన మోద తనకు పూర్తి హక్కులుండాలి. ముందుగా జీవించే హక్కు, చదువుకునే హక్కు, తనను (ప్రేమించినవాణ్ణి పెళ్చాడే హక్కు వుండాలి. వీటినే నేను ఫెమినిజం లేక మహిళాభ్యుదయం అంటాను. ఫెమినిజంలో పలురకాలు వున్నాయి. అంటే లిబరల్ ఫెమినిజం, మార్కిస్టు ఫెమినిజం, సోషలిస్టు ఫెమినిజం, రాడికల్ ఫెమినిజం, కల్చరల్ ఫెమినిజాలు వున్నాయి. మార్గాలు వేరయినా ఈ సిద్దాంతాలన్ని స్త్రీ స్వేచ్చా, సమానత్వాల కొరకే అవి ఆవిర్భవించాయి. వీటిని సమకూర్చి సమన్సయపరచి నేను హ్యామనిస్టు స్రీ విమోచనను 'ప్రతిపాదిస్తున్నాను. నన్ను నేను హ్యామనిస్టు ఆ 'ఫెమినిస్టుగా అభివర్షించుకుంటున్నాను. అసలు నేను రచయిత్రిగా నా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టలేదు. సామాజిక కార్యకర్తగా, మహిళా విముక్తి దాయినిగా 1958 నుండి సంఘసంస్కరణ, సంఘసేవా కార్యక్రమాలలో స్త్రీ సమస్యలు చూచి, వారి ఆర్తనాదాలు విని మండే గుండెలతో హృదయం (ద్రవించగా కొన్ని సంఘటనలకు ఉద్వేగంతో తట్టుకోలేక నా స్పందనను లిఖితపూర్వకంగా (వ్రాయడం జరిగేది. అదే క్రమంగా సాహిత్యంగా మారి నేనొక మహిళా సాహితీవేత్తగా పరిఢవిల్లాను. నాకిప్పుడు 82 ఏళ్లు. కీళ్ల నొప్పులొచ్చాయి. అయినా రోజుకు 16 గంటలు ఏటో ఒకటి చేస్తూ స్త్రీల సంక్షేమానికే పాటుపడుతున్నాను.
మహిళాభ్యుదయాన్ని సంస్థల ద్వారా నిర్మాణ కార్యక్రమాలు సాగించటానికి 8 సంస్థలు, 2 ట్రస్టులు స్టాపించి రిజిష్టరు చేశాను. 1973 నుండి స్థాపించిన సంస్థలు - మహిళాభ్యుదయ సంస్త మహిళాభ్యుదయ (గ్రంథాలయం, వరకట్న హింసల దర్యాప్తు సంఘం, (స్త్రీ విమోచన, (స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రమే కాక 1980లో మహిళాభ్యుదయ ట్రస్టు, మల్దాది సుబ్బమ్మ ట్రస్టు స్థాపించి నా ఆస్తి అంతా నా ట్రస్టుకు విరాళంగా యిచ్చి తదాది 40 మంది సంఘసేవకులకు అవార్జ్డులిచ్చి, శాలువా కప్పి సత్కరించాను. ఎంతోమందికి విరాళాలు, అవార్డులు, స్కాలర్షిప్లు ఇచ్చాను. ప్రస్తుతం 8 ఏళ్లుగా ఒకేషనల్ జూనియర్ కాలేజి స్థాపించి పైసా ఫీజు లేకుండా శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 99
అమ్మాయిలకు నా ఖర్చుతో విద్య నేర్పిస్తున్నాను. ఇలా సాహిత్యం ద్వారా, సంస్టల ద్వారా, ఉపన్యాసాల ద్యారా యధోచిత సేవలు చేస్తున్నానంటే అది అతిశయోక్తి కాదు. నన్ను నేను పాగుడుకుంటున్నానని అపోహపడవద్దు. నిజం చెప్పాలంటే నేను చేసినదాంట్లో సగం కూడా (వ్రాయడం లేదు. మరో ముఖ్యవిషయం చెప్పక తప్పదు. నేను గత 30 ఏళ్లుగా ప్రముఖ రేషనలిస్టుగా, హ్యామనిస్కుగా, జర్నలిస్టుగా, ('ప్రజాస్వామికవాది (పార్టీలస్ డమోక్రసి గానా జీవితరధాన్ని సాగిస్తున్నాను. నాకు కులమతాల తేడా, స్త్రీ పురుష తేడా అసలే లేవు. ఏ అధికార పదవులూ కోరుకోను. (ప్రజలు విమర్శించినా, పురుష ద్వేషినన్నా, కాపురాలు కూలుస్తున్నానన్నా బాధపడను. 'లోకో భిన్న రుచిః' అని నవ్వుకుంటాను. కులమతాలు లేని నేను 1981లో అభ్యుదయ వివాహ వేదిక స్థాపించాను. ఆ వేదిక తరపున ఇప్పటికి 380కి పైగా వివాహాలు - వర్ణాంతర వివాహాలు, సంస్కరణ వివాహాలు, ఆదర్భ వివాహాలు జరిపాను. అలాగే 1980లో కుటుంబ సలహా కేంద్రం నా భర్త నేను స్టాపించి ఆయన లీగల్‌గా, నేను సోషల్‌గా సలహాలిచ్చి కేసును బట్టి కాపురాలను నిలబెట్టడమో, విడదీయడమో, డైవర్సు ఇప్పించడమో చేస్తున్నాను. ఇప్పటికి 3000 కేసులకు పైగా నా ఆధ్వర్యంలో జరిగాయి. ఇలా వైవిధ్యంగల కార్యక్రమాలలో ఎప్పుడూ మునిగితేలుతూ వుంటానంటే నమ్మండి! ముఖ్యంగా చెప్పాలటే మద్యనిషేధోద్యమంలో 1992 నుండి 1996 వరకు ఎనలేని కృషి చేశాను. పోలీసులు చచ్చేట్టు కొట్టారు. ఆరుసార్జ్హు అరెస్టు, కొన్నిసార్హు హౌస్ అరెస్టులు కూడా జరిగాయి. చివరికి 50శాతం స్త్రీల కృషితో విజయాన్ని సాధించాం. 'ప్రచారకమిటిలో సభ్యురాలిగా వుండి రాష్ట్రమంతటా పర్యటించి ప్రజల్లో నైతిక విలువలు తెచ్చాం. తర్వాత సి.ఎం. ఎత్తివేయటం అదొక వింత చర్య. అలాగే 1972లో ప[్రేకాంధ్రోద్యమం కోసం కృషి చేసి 8 సార్టు జైలుకెళ్ళా. 4 రోజులు ఒంగోలు సబ్ జైల్లో వున్నా. 2 ఏళ్లు ఆశేష ఆంధ్రులు కృషి చేసినా ఆ ఉద్యమం వీగిపోయింది. నా రాజకీయ జీవితం అనన్యసామాన్యం. 1960లో బాపట్ల మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీచేసి 15 ఓట్ట తేడాతో ఓడిపొయాం. ఓట్టు కొనలేదు కదా! అలాగే 1980లో పార్లమెంటు అభ్యర్థిగా హైదరాబాదు నియోజకవర్గంలో పోటీ చేశా. అరువేల రూపాయల ఖర్చుతో 8వేల ఓట్టు పొందగలిగా. కాం(గైస్ - ఎస్ కంటే నాకే ఎక్కువగా వచ్చాయి. సుబ్బమ్మ గారికి మేధావుల సపోర్టు వుంటుందికాని ఓడిపోతుందని ముందుగానే పత్రికలవారు రాశారు. ఇలా వివిధ రంగాలలో రోజుకు 16 గంటలు (శ్రమించడం నాకు గత 45 ఏళ్ళుగా అలవాటు. అలాగే ఈనాడు 82 ఏళ్లు నిండినా ఏదో ఒక 100 పరిణతవాణి ప్రసంగాలు
పనిచేస్తూనే వుంటా. నేను స్టాపించిన సంస్టలే కాక నాకు ఇష్టమైన ఇతర సంస్టలలో మెంబరుగా నుంటూ యధోచిత సేన చేస్తూనే వుంటా. తెలుగు భాషా సమితికి ఉపాధ్యక్షురాలిగా ఆ సంఘస్టాపన నుండి పనిచేస్తున్నా. రాష్ట్ర కులనిర్మూలన సంఘ ఉపాధ్యక్షురాలిగా మహిళ సభలు వగైరా జరిపా ముఖ్యమైనది సినిల్ లిబర్టీస్ (పియుసిఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంటుగా 3 ఏళ్లు పనిచేశా. 1992 నుండి రాష్ట్ర సిటిజన్సు ఫర్ డెమో(క్రసి వైస్'ప్రసిడెంటుగా, గుంటూరు జిల్లా (ప్రొబేషన్ ఎడ్వయిజరీ కమిటీ మెంబరుగా, ప్రజాస్వామ్య (ప్రచురణలు మేనేజింగు డైరక్టరుగా, ఆం.ప్ర. హ్యూమనిస్టు సంఘ ప్రసిడెంటుగా, కార్యదర్శిగా, భారత రాడికల్ హ్యూమనిస్టు జాతీయ సమితి సమాఖ్య ్రసిడెంటుగా, బాపట్ల హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు మేనేజరుగానే కాక (క్రాసు, మార్పు, ఆంధ్ర మహిళాసభ, ఆంధ్ర యువతీ మండలి, రెడ్‌క్రాన్, మియాపూర్ వృద్ధాశ్రమం లాంటి సంస్పల్లో లైఫ్మెంబరుగా యధోచిత సేవ చేస్తున్నాను. ఇక్కడొక ముఖ్య విషయం చెప్పకతప్పదు. హైదరాబాదు రేడియోవారు 2005లో మల్లాది సుబ్బమ్మ జీవితాన్ని (పర్సనల్ లైఫ్ & యాక్టివిటీస్) రికార్డు చేసి ఆర్ఖైవ్లో భద్రపరిచారు. ఇది నా జీవిత దర్శణం. ఇది చాలా విశిష్టతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా నా పుట్టుక, పెళ్ళి కొంత వివరిస్తున్నాను. చిన్న చిన్న అవరోధాలను ఎలా అధిగనించానో ముందుగా చెప్పక తప్పదు.
నా తండ్రి కొండూరి సత్యనారాయణ అతి బీదకుటుంబంలో పుట్టాడు. మహా మేధావి, నిజాయితీపరుడు, గొప్పు పరోపకారి, ప్రముఖ లాయరు. కేసులను - బీదవారికి ఉచితంగా చేసేవారు. చాలా భాగం రాజీ కుదిర్చేవారు. మా తాతకి ఆరుగురు సంతానం. చీట్లపేక ఆడి రోజుకు రూపాయి పావలా , 2 రూపాయలు గెలిచి కుటుంబాన్ని పోషించేవాడు. పెంచలేక ఇద్దరు పిల్లల్ని పెంపుడిచ్చాడు. మా నాన్నను వారు నివసించే ఇటికం౦పాడు (గ్రామం నుండి రెండు మైళ్ళ దూరంలో వున్న అప్పికట్టకు పంపి 5 కాసుల వరకు చదివించారు. ఇక పొలం పనులల్లో పెట్టబొయ్యే సమయంలో మా నాయనమ్మ అడ్డుపడి బాపట్ట పోతున్న ఎడ్డబండిలో మా నాన్నని ఎక్కించి, తను ఎక్కి కూర్చున్నప్పుడు మా తాతకూడా ఎక్కి బాపట్ల చేరిందాక “మనం పట్టణంలో ఎలా బ్రతకాలి? ఎలా చదివిస్తాం” అని భార్యను తిడుతూ, కొడుతూనే వున్నాడట. బాపట్ల చేరాక పోరంబోకులో ఒక గుడిసెవేసి కాపురం పెట్టి మళ్ళా చీట్టపేక ఆఫీసు తెరిచాడు. అలాగే రోజుకు రూపాయి పావలా, రెండు రూపాయలు సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. మా నాయనమ్మ వడ్డు దంపి, కూరలు పండించి తన వంతు భారాన్ని మోసేది. మా నాన్నకు ధనవంతుల ఇళ్లల్లో వారాలు కుదర్చి చదివిస్తుండగా 30 ఎకరాల భూస్వామి అయిన మా అమ్మ తండ్రి ముష్టి రామయ్య శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 101
కోర్టు పనిమోద బాపట్ల ప్లీడరు ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న వారాల ఇంట్లో భోంచేస్తుండగా చూసి ముగ్గ్దుడైై ఆ ప్లీడరుని అడిగి వివరాలు సేకరించి తెలివిగలవాడు, బుద్దిమంతుడు, అందమైైనవాడనే అభిప్రాయంతో మా నాన్న చదువుతున్న స్కూలు హెడ్ మాస్టరుతో మాట్లాడి సరాసరి మా తాత ఇంటికెళ్లి మా అమ్మని ఇచ్చి సెళ్ళి చేస్తానని నంబందం కుదుర్చుకున్నాడు. మా తాత, నాయనమ్మ పరమానందభరితులయ్యారు. అలా మా అమ్మ అన్నపూర్ణమ్మతో వాళ్లపెళ్లి జరిగాక మా నాన్న చదువు అతి కష్టం మీద అప్పులతో పూర్తి అయింది. ఆ తర్వాత మంచి పేరు ప్రఖ్యాతులతోపాటు బాగా సంపాదించాడు. మా అమ్మకు 13 మంది పిల్లల్లో నేను మొదటిదాన్ని. శ్రావణ శుద్ద విదియ అంటే ఆగష్టు 2న 1924 కృష్ణ ఒడ్డున పోతార్లంక అనే [గ్రామంలో పుట్టానట. మా అమ్మ కలలో వెంకటేశ్వర్దు కనపడి తన పేరు పెట్టమన్నాడట. అందుకనే నాకు వెంకట సుబ్బమ్మ అని పేరు పెట్టారు. నాకప్పటికి ఆరేళ్లు. 1929లో “శారదా యాక్టు పెట్టింది (బ్రిటీష్ ప్రభుత్వం. రాజస్థాన్‌లో రుక్మాబాయ్ అనే పదేళ్ల పిల్లకు 30 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేయగా ఆమె రజన్వల కాకుండానే భర్త కాపురానికి తీసుకెళ్లి చెరిస్తే అధిక రక్తస్రావమై చనిపోయినప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం కలతచెంది 1929 అక్టోబరు 29న శారదా యాకును అమల్లోకి తెచ్చింది. రేపు యాక్టు అమల్లోకి వస్తుందనగా ఆరోజు రాత్రి లోపల కొన్ని లక్షల పెళ్ళిళ్లు దేశమంతా పురిటిలో పిల్లలకు, రోజుల పిల్లలకు, గర్భస్థ పిండాలకు కూడా పెళ్లిళ్ళు జరిపారు. 'అష్ట వర్షాత్ భవేత్ కన్య' అనే ఆచారాన్ని అమలు పర్పారు. ఆ రోజుల్లో మా అమ్మమ్మ చెల్లెలికి ఏడు ఏళ్లకే పెళ్ళయింది. 8వ ఏట భర్త పోయ్యాడు. 10 వ రోజు గారెలు వండుతుంటే నాకూ గారెలు పెట్టమని ఒకటే ఏడ్చానని చెప్పింది. తరువాత రజస్వల అయన 11వ రోజున ఆమెను అందంగా అలంకరించారట. అద్దంలో చూచుకొని సంబరపడి రోజూ ఇలాగేచేస్తారా! అని మురిసిపోతూ అడిగిందట. ఇంతలో నది ఒడ్డుకు తీసుకెళ్ళి జుట్టు, బొట్టు, గాజులు తీసేసి తెల్లబట్ట కట్టి రవికె లేకుండా ఇంటికి తెచ్చారట. అలా ఆమె 90 ఏళ్ళు బ్రతికింది. “అన్నేళ్ళూ ఏం చేశావు అమ్మమ్మా!” అని అడిగితే... “ఈ ఇంట్లో పెళ్ళి, ఆ ఇంట్లో తద్దినం, మరో ఇంట్లో బారసాల, ఇంకో ఇంట్లో వ్యాధి లాంటి వాటికి పిలిచి నా చేత చాకిరీ చేయించుకునే వారు. అలా ఎన్ని బస్తాలు వండానో! చెప్పలేనమ్మాయి” అనేది నాతో. ఇలాంటి ఆచారాలు దరిదాపు ఇప్పటికి జరుగుతూనే వున్నాయ. 1887లో విధవా వివాహ చట్టం వచ్చింది. 1888లో సతీసహగమన నిషేధం, బహుభార్యాత్వ నిషేధం లాంటి చట్టాలు (బ్రిటీష్ వారు పెట్టినా 1989లో రాజస్థాన్‌లో రూప్కన్వార్ని సతీసహగమనం చేయించారు. బహుభార్యాత్వం ఇంకా జరుగుతూనే వుంది. బాల వితంతువులు సైతం వివాహమాడితే 102 పరిణతవాకి ప్రసంగాలు
ఇప్పటికీ అక్షేపణీయమే! అంతేకాదు. అమ్మాయి పుడితే అరిష్టమనే భావం ఇంకా వుంది. ఇంకా ఈనాడు కూడాపుట్టబోయే శిశువు 'ఆడ' అని తెలిస్తే అబార్జన్ జరుగుతోంది. పుడితే ఆమెకు విద్యావిజ్ఞానాలు లేకుండా అంతో ఇంతో యిచ్చి పెళ్ళిచేసి పంపేస్తారు.
ఈ సందర్భంగా నా పెళ్లినాటి 1935 సంవత్సరపు సమాజం ఎలా వుందో, స్త్రీల పరిస్టితి గురించి వివరించి చెప్తా వినండి.! ఆనాడు బాల్యవివాహాలు, నిర్బంధ వైధవ్యం అమల్లో వుండేవి. ఆడది చదివి సంపాదిస్తుందా, ఉద్యోగం పురుష లక్షణమంటూ అమ్మాయిలను విద్యకు దూరంచేసేవారు. అబ్బాయి 10సార్హు తప్పినా ఇల్లూ, పాలమూ, ఆఖరికి సూత్రం అమ్మి అయినా చదివించడం నాడే కాదు నేడూ అమల్లో వుందని మోకు తెలుసుగదా! ఆడది అంటే కేవలం వంట ఇంటికి, పడకటింటికి అంకితమై పోవాలి. పూజలూ, (వ్రతాలతో, మడి ఆచారాలతో, వంటా వార్పులతో రోజంతా (శ్రమించటం ఆమె విధి. ముఖ్యంగా పున్నామ నరకవిముక్తి కోసం పుత్రుణ్ణి కనాలి. “ఓ దేవా! నాకు కుమారుణ్ణి 'ప్రసాదింపుము” రుగ్వేదంలో ఒక పనస వుంది. మనుధర్మశాస్త్రంలో కూడా తనకు సంతతి లేకుండా భర్త చనిపోతే అతని అన్నతో (క్రీడించి కొడుకును కంటే భర్తకు ఉత్తమ గతులుంటాయని మనువు చెప్పాడు. అంతేకాదు 10 ఏళ్ల అమ్మాయిని 30ఏళ్ల అబ్బాయితో పెళ్ళి చేసేవారు. 1956లో హిందూ మ్యారేజి యాక్టు వచ్చేదాకా పురుషుడెంతమంది (ప్రీలనైనా పెళ్ళాడవచ్చు. అది చాలక ఉంపుడుకత్తెని వుంచుకొని ఆమె సంతానాన్ని కూడా పోషించేవారు. భార్యను కొట్టినా, తిట్టినా, ఆఖరికి చంపినా తప్పులేదు. కోర్టులకెళ్ళేవారు కాదు. పుట్టింటివారు చచ్చినా, బ్రతికినా, నీవు మా ఇంటికి రాకు అని వెళ్లగొట్టేవారు. సమాజం -ఈ రీతులను గౌరవించేది. చిన్నప్పటినుండి ఈ విధానాలు చూచి నేను బాధపడి మా నాన్నతో స్త్రీలపై హింస తప్పుకాదా అని ప్రశ్నించేదాన్ని. ఆ బీజాలు నా మస్తిష్కంలో నాటుకుపోయి మహా వృక్షాలై గత 50 ఏళ్ళుగా మహిళోద్ధరణకు మార్గదర్శకు రాలినయ్యానంటే నమ్మండి! ఆ రోజుల్లో మాకు లైట్టు , ఫ్యాన్టు, కుర్చీలు, పంపులు లేవు. గుంటూరు బావుల్లో నీళ్లు తోడిపోసేదాన్ని. నిజం చెప్పాలంటే పిడకలతో వండాను. కట్టెలతో, బొగ్గులతో వంటచేశా. కిరసనాయలు, తర్వాత గ్యాసు, ఆ తర్వాత కరెంటుతో వండిన దాన్నంటే నమ్మండి. ఇది ఎలకక్ష్రానిక్ యుగం. బియ్యం కరంటు పొయ్యిలో పడేసివస్తే అన్నం ఉడికి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మా రోజులూ, మా కష్టాలు ఈనాడు లేవు. కుక్కర్ణు, (గైండర్లు, వాషింగ్ మెషిన్లు వచ్చి సేద తీరుస్తున్నాయి. అలాంటి వాతావరణంలో ఢక్కా ముక్కీలకు నిలబడ్డదాన్ని కనుకనే 82 ఏళ్లు నిండినా ఈనాడు రోజుకు 16 గంటలు ఇంటా బైటా పనిచెయ్యగలుగుతున్నా. ఇంకా చెప్పాలంటే శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 103
నా టైము, ఎనర్జీ సంపద సమాజసేవకు నినియోగిస్తున్నానంటే అతిశయోక్తి కాదు. ఇక నా పెళ్ళి కధ వింటారా? మోరు ఆశ్చర్యపడిపోతారు.
“శారదా యాక్టు' పెళ్లిళ్లను చూసి మురిసిపోయిన నేను 'నాన్నా! నా పెళ్లెప్పుడు చేస్తావని' అడిగా! పెళ్లంటే లడ్డు, జిలేబీలు తింటూ, నగలు పెట్టుకొని, పూసల పల్లకిలో వూరేగడం, బంతులాడుకోవడం, పట్టు పరికిణీలు కట్టుకోవడం అనుకున్నా నేను. మా నాన్న నవ్వుతూ తొందరపడకమ్మా! నీ పెళ్ళి ఘనంగా చేస్తానన్నాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు మొదలయ్యాయి. 1935లో కోర్టు సెలవల్లో 10 రూపాయల సీజన్ టిక్కెట్టు కొంటె నెల రోజులు రైలు ప్రయాణం ఇండియా మొత్తం తిరగొచ్చు. అలా మా నాన్న నా పెళ్ళి కోసం రెండేళ్ళు తిరిగాడు. అనేక మంది అబ్బాయిల తల్లిదండ్రులుచూడడానికి
వస్తే ఒక హార్మణి పెట్టె నా ముందు పెట్టి “లంబోదర లకుమికరా అంబాసుత అమర వినుత” అనే పాట పాడించేవారు. అసాధ్యమైన ఒక కేసును మా నాన్న గెలిస్తే ఆ క్రయింటు 16 రూ.ల పట్టుపరికిణి, ఒక హార్మణి పెట్టి నాకు బహూకరించాడు. ఆ పరికిణి, ఆ హార్మణి, ఈ పాటతోకాక ఒక చిన్న ఇంగ్లీషు పుస్తకం యిచ్చి చదివించేవారు. “వన్స్ అపాన్ ఎ టైం, దేర్ ఇజ్ ఎ కింగ్ నేమ్హ్ దశరధ. హి హేడ్ ఫోర్ సన్స్" అని చదివి కూర్చునేదాన్ని అన్ని పెళ్ళిచూపులకు. చివరికి 16 ఏళ్ల రామ్మూర్తిగారితో 10 ఏళ్ల వయస్సు, క్ కాసులు చదివిన నాకు పెళ్లి కుదిరింది. ఈ పెళ్లికి నాదొక స్టస్ పాయింట్ వుంది. మా అమ్మవైపు వారికి ఒక్కొక్కరికి 13, 15 మంది సంతానం. నాన్నవైపు 10, 12 మంది పిల్లలు. మా అత్తగారికి ఒక్కడే కొడుకు కావటాన “ఈ పిల్లను చేసుకుంటే మా ఇల్లంతా పళ్ల గంపలా పిల్లలు పుడతారు” అని నన్ను చేసుకున్నారు. వారికి ఒక్కడే కొడుకు కావాన 80 మంది బంధుమిత్రులు, నేను మొదటి సంతానాన్ని కావటాన మా వైపు 70 మంది పెల్లికి వెర్రుపాలెం హాజరై 6 రోజులు పిండివంటలతో విందారగించారు. మా తండ్రి గొప్ప స్లీడరు, మామగారు తాలూకా తహశీల్దారు. నాది బాల్య వివాహం నైజాంలోని వెర్రుపాలెం (గ్రామంలో 'బాల్య వివాహం నిరోధచట్టం' లేదు. అదొక స్వదేశ సంస్థానం కావటాన మాఇద్దరిని ఎత్తుకొచ్చి ఇక్కడ వివాహం జరిపారంటే మా తండ్రి చట్టాన్ని అతిక్రమించాడు. మా మామగారు గవర్నమెంటు యాక్టును బ్రేక్ చేసి పెళ్లి జరిపారు. అంటే చట్టాలకంటే సాంఘికాచారాలకే నాటినుండి నేటికీ విలువ ఎక్కువ. ఆ రోజుల్లో ఏ ఇంట్లో అయినా పెళ్ళికాని కన్య రజస్వల అయితే ఇటు ఏడుతరాలు, అటు ఏడుతరాలు సప్త జన్మల వరకు నరకంలో పడిపోతారనే నమ్మకం వుండేది. ఆ కుటుంబాలవారినే వెలివేసేవారు. వెలి అంటే 'సోషల్ బాయ్‌కాట్. వారి ఇంటికి ఎవరూ రారు. పెళ్లిళ్లకు పిలవరు. వైద్యుడు రాడు. చస్తే మోసేవారు కూడా వుండరు. అందువల్ల బాల్య వివాహాలు 104 పరిణతవాణి ప్రసంగాలు
హెచ్చుగా జరిగేవి. బాల వితంతువుల ఘోష మిన్నుముట్టేది. ఇది ఆనాటి చరిత్ర. 1890లో వీరేశలింగం గారు విధవా వివాహాలు చేసినప్పుడా దంపతులను వెలివేస్తే ఆ మహాతల్లి గోదావరి కెళ్లి నీళ్లు తెచ్చి విడోలకు పెళ్ళిళ్లు చేసేవారు. వారింటికి స్నేహితులు, బంధువులు, వైద్యుడు, ఆఖరికి ప్రాణాలు పోతే శవదహనానికి కూడా ఎవరూ రారని వారికి తెలుసు. ఆనాడు అమ్మాయిలకు ఇంటిచాకిరి, అణుకువ, తలవంచుకొని నడవటం, మెల్లిగా మాట్లాడటం నేర్పించేవారు. 30 ఏళ్ల అమ్మాయి బైటికెడితే 13 ఏళ్ల అబ్బాయిని రక్షణగా పంపేవారు. ఆడపిల్ల పుడితే ఏ వేడుకలు లేవు. వైద్యం కూడా అంతంత మాత్రమే. అమ్మాయి అంటే నాశిరకం జాతి. ఎంతో అంత మూట ఆమె నెత్తిన పెట్టి పంపేవారు. ఆమె కేవలం పెళ్లికోసం, జాతినుద్దరించే పిల్లల్ని కనే యంత్రంగా చూడబడేది. ఆడపిల్ల అంటే “ఆడ పుష్పించేది' అని అర్హమంటూ హేళన చేసేవారు తెలిసిందా! నాటి అమ్మాయిల జీవన (స్రవంతి. నేను కాపురానికి వెళ్తేప్తుడు 360 నోముల పుస్తకం నాకిచ్చి ఆ నోములన్ని నోయాలని, అత్త వారింట్లో మెళకువగా వుండి వారి మన్ననలను పొందడమే నీ ధ్యేయం కావాలని, ఇక్కడికి రావాలని కోరుకోవద్దని, పుత్రపౌత్రులతో నీ కుటుంబం వర్చిల్హాలని మా అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మలు బుద్దులు చెప్పి పంపారు. ముఖ్య విషయం ఏమంటే నేను పుట్టింది సనాతన సంప్రదాయ (బ్రాహ్మాణ కుటుంబం. మెట్టినిల్లు కూడా అ(గ్రహారికులుగా యజ్ఞయాగాది (క్రతువులు, వైశ్వదేవం లాంటి (క్రతువులు చేసేవారు. పెళ్లికాక ముందు పుట్టింట్లో చేశాను. తరువాత అత్తవారింట్లో కొనసాగుతూనే వున్నాయి. అలా మడి, ఆచారాలతో సంప్రదాయ బలిమితో 24 ఏళ్లు గడిచాయి. నా 14వ ఏట పుట్టిన పిల్లాడు పూర్ణానందం డిస్తిరియాతో ఆరోజుల్లో వైద్యం లేక పోయాడు. నేను కామేశ్వరరావు, గోపాలకృష్ణమూర్తి విజయలక్ష్మి, వెంకటేశ్వర్డు అను పేరు గల నలుగురి పిల్లల తల్లినయ్యాను. పిల్లల పెంపకం, అత్తమామల "'సీవలు, బంధుమిత్రుల రాకపోకలతో 24 గంటలు సరిపొయ్యేవి కావు. ఇదికాక మా అత్తగారి బోధ గురువులు, స్వాముల వార్ల భిక్షలు, మడి ఆచారాలతో అత్తాకోడళ్ళ సతమతమయ్యే వాళ్లం. మా అత్తగారు మహా పండితురాలు. “అహం బ్రహ్మాస్మి” అనే బ్రహ్మవేత్త అని చెప్పుకోవచ్చు. తత్వవేత్త లెవెల్లో కూర్చుని శిష్యులకు వేదవేదాంతాలు, భాష్యాలు, ధర్మశాస్తాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తుల సారాంశం చక్కగా బోధించేది. ఆ వినికిడి వల్ల భారత, భాగవతాలేకాక ఎన్నో ఉన్నత ఆశయాలు, 'ప్రపంచజ్ఞానం నాకు కలిగాయి. మా అత్త ఆదిశంకరుల స్థాయిలో కూర్చుని బోధిస్తుంటే నాకు ఆశ్చర్యంగా వుండేది. ఆమె చదివింది 5 క్లాసులు మాత్రమే. చక్కని దస్తూరి. పరోపకార పారీణత. ఆమెకు ఒక్క కొడుకు కావడాన పంచప్రాణాలు కొడుకు మోద పెట్టుకుని నన్ను పిల్లల్ని కూడా శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 105
బాగా చూచేది. ఆమెకు స్వాములవార్లన్నా, వారి సేవలన్నా, ఉపదేశాలన్నా చాలా యిష్టం ఆ ఒరవడిలో జన్మసార్టకత కోసం నాకూ ఉపదేశం చేయించింది చింతలపూడి ఆ(శ్రమాధిపతి బోధానందపురి స్వామి వారిచేత నేను కూడా ముక్తిపొండాలనే ధ్యేయంతో. “ఓం శ్రీం రాం శ్రీరామాయ నమః” అనే మంత్రం పలికించారు. ఆయన మహాభోగ పురుషుడు. వయస్సులో వున్న ఆడవారు, భర్త విహీనులు, ధనవంతులు ఆయన శిష్యురాండ్రు. ఆయన చేసిన ఉపదేశ మంత్రాన్ని రోజుకు లక్ష జపించి తనక్రు ధారపోయాలని ఆదేశించారు. నలుగురి పిల్లల తల్లిని, ఇంట్లో చాకిరి, వారి పోషణభారంతో సతమతమయ్యే నేను 'రోజుకు లక్ష జపం చెయ్యలేనని' స్వామాజీన అభ్యర్థిస్తే “చెయ్యకపోతే గురుద్రోహ మహాపాతకాన పడిపోతా”వంటూ గద్దించాడు. 'నీకు ఇక్కడ టైము వుండదు నీవు నా ఆశ్రమానికి వస్తే నీకు భవబంధ విముక్తి పొందే మార్గాన్ని చూపిస్తా అసలు గురువుకు తను, ధన, మనః; ప్రాణాలు సమర్పించి ధన్యత గడించాలి'అంటూ అధిక్షేపించాడు నన్ను ఆ జడదారిస్వామిజీ. వెంటనే ఈ విషయం మా అత్తగారితో ప్రస్తావించగా ఆమె “నువ్వెంతో అదృష్టవంతురాలివి. కనుకనే నీకు భవబంధ విముక్తిని కలిగించే మోక్షప్రాప్తి సూచించాడు. అందరికీ అలాంటి అదృష్టం పట్టదు. నీ పిల్లల్ని నేను చూస్తా నీవు పో, ముక్తి పొందు” అన్నది పరమానందంతో కల్గాకపట౦ ఎరుగని మా అత్త, అతనొక జిత్తులమారి, స్వార్హపరుడైన వ్యభిచారి అని నేను గ్రహించా. నాకప్పుడు వంటెడు నగలు, ఆస్తిపాస్తులు అన్నీ వున్నాయి. ఇంటి కోడలిని. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా నా అదృష్టం పండి ఆ రాత్రి రాజకీయ వుద్యమాలు, సభల్లో విరామమెరుగని నా భర్త రాజకీయ సభల నుండి ఇంటికొచ్చారు. లేకపోతే నా జీవితం అధోగతి పాలయ్యేది. రాగానే ఈ విషయం చెప్పి... “స్వామిజీ రమ్మంటున్నాడు. మి అమ్మ పొమ్మంటున్నది. వయస్సులో వున్నదాన్ని నలుగురి పిల్లల తల్లిని ఎలా వెళ్ళాలి” అంటూ ఏడుపు మొహంతో చెప్పాను. వెంటనే గబగబా నా భర్త తల్లి దగ్గరికి వెళ్లి 'అభం శుభం తెలియని ఆమెను స్వామోజీ వద్దకు వెళ్తమంటావేమిటి” అని గద్దించినప్పుడు కపటం లేని మా అత్త “అదేమిటిరా నాయనా! మోక్షప్రాప్తికి భర్త ఆజ్ఞతో పనిలేదు. అది వ్యక్తిగత విషయం. అలాంటి అదృష్టం ఎవరికి దక్కుతుంది?” అంటూ వాదించింది. ఆ రాత్రంతా ఆలోచించి 'దీనికంతకూ నా తెలివితక్కువ తనము, (ప్రపంచ జ్ఞానలేమి, విద్యా విజ్ఞానాలు తెలియని నా లోపమే" అని తర్కించుకుని ఉదయమే లేచి జపాన్ని నీళ్లలో కలిపి దేముడు లేడని, మానవుడే అన్నింటికి మూలమని, స్వతం(త్రాలోచన కావాలని, నా భవిష్యత్తుకు నేనే కర్తనని జపాన్ని గంగలో ముంచేశా. నిజంగా చెప్పాలంటే ' ఆ బాధ గురువే నాకు బోధగురువయ్యాడంటే' నమ్మండి. కాకపోతే అత్త అదుపాజ్ఞలతో, పూజలు, వ్రతాలతో 106 పరిణతవాణి ప్రసంగాలు
నా జీవిత నౌక మునిగిపాయ్యేది. నిజం చెప్పాలంటే ఆ కపట సన్యాసివల్లే నేనాక ఫెమినిస్టును, రేషనలిస్టునయ్యాననేది నా జీవితంలో విస్మరించరానిది. ఆనాటి నుండి రామ్మూర్తిగారి పంధాలో గొప్ప రేషనలిస్టుగా, హ్యూమనిస్టుగా పరిఢవిల్హాను. ఇది నా జీవితంలో పెద్ద మలుపు. ఈ మార్పు వల్ల నేనాక గొప్ప మహిళాభ్యుదయవాదిని, సంస్కర్తను, సామాజికాభ్యున్నతి కోరీ విదుషీమణిగా ఎదగాలనే జ్ఞానోదయం నాలో కలిగింది. నా భర్త మార్గంలో పయనించాలనే వాంఛ ప్రబలింది. ఆయన సపోర్టు లభించింది. ఆనాటి నుండి మేమిద్దరం 50 ఏళ్ల సహజీవనం సాగిస్తూ సాంఘిక, ఆర్ధిక, రాజకీయ సంస్టలు స్టాపించి కార్యక్రమాలు నిర్వహించాము. నా భర్త ముందుగా నాలో ప్రేరణ కలిగించలేదు. కాని తర్వాత పశ్చాత్తాపం పడి నాకు తోడ్పడ్డాడు. నా వెనక నుండి నన్ను (ప్రాజెక్టు చేసి నన్ను ఇంతటి రచయితగా, సంఘసేవాపరురాలిగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి సంస్కరణవాది.
అది 1950 సంవత్సరం. ఇంతవరకూ గుంటూరులో వున్నాము. ఆ సమయంలో తన 52వ ఏట నా తండ్రి మరణించినప్పుడు ఆయన ప్లీడర్ (ప్రాక్టీసును నా భర్తను చెయ్యమని కోరింది మా అమ్మ అప్పటివరకు ఎం.ఎన్.రాయ్ సిద్దాంతాన్ని నమ్మి ప్రచారం చేస్తున్న నా భర్త రామ్మూర్తిగారు సంపాదనపై మక్కువ చూపలేదు. మామగారే మా కుటుంబాన్ని, నా పిల్లలను పోషించేవారు. పిల్లలు ఎదిగారు. హైస్కూళ్ల చదువులు, ఖర్చులు పెరిగాయి. అత్తమామలు, తదితరులు కూడా నా భర్తను మామగారి ప్రాక్టీసు చెయ్యమని కోరారు. వెంటనే బాపట్ల వచ్చి రామ్మూర్తిగారు ప్లీడర్ ప్రాక్టీసు మొదలుపెట్టారు. (ప్రాక్టీసులో ఉచిత సలహాలు, రాజీలు కుదిర్చేవారు. అంతేకాదు ఆయన గొప్ప మేధావి. బాపట్టలోని అన్ని సంస్థలలో... రోటరీక్షబ్బు, అర్జు కాలేజీ స్టాపన, హైస్కూలు మేనేజరు, కోపరేటివ్ బ్యాంకు మేనేజరు, బార్ అసోసియేషన్ (ప్రెసిడెంటు, సూర్యలంక పోర్టు డైరెక్టరు లాంటి పదవులన్నీ చేస్తుండేవారు. అయినా రామ్మూర్తిగారి తెలివితేటలకు, నిజాయితీకి మెచ్చిన జడ్జి, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వారిని నియమించారు. ఆ సమయంలో ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ మెంబరుగా (గ్రాడ్యుయేట్స్ తరపున రామ్మూర్తిగారిని ఎన్నుకున్నారు. ఈ మధ్యకాలంలో నా పిల్లలు ఇద్దరు ఇంజనీర్లు. ఇద్దరు మెడిసిన్‌లో చేరారు. అందరూ స్కూలులో ఫస్టు వచ్చేవారు. మెరిట్ మెడల్సు, ఫస్టు (ప్రయిజులు పొందారు. నా కూతురు విజయలక్ష్మి సెవెంత్ ఫాంలో స్టేటు ఫస్టు వచ్చి డాక్టరు చదువుకు స్కాలర్పేప్ కూడా సంపాదించుకుంది. తరువాత గైనకాలజిస్టుగా, పేరు 'ప్రఖ్యాతులుగల పెద్ద డాక్టరుగా ప్రాక్టీసు చేస్తోంది. అబ్బాయిలు విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సమయంలో నాకు కొంత విశ్రాంతి దొరికి నేను కూడా చదువుకుంటానని' నా భర్తను, మామగారిని కోరాను. శ్రీనుతి మల్లాది సుబ్బమ్మ 107
ఆనాడు 'పరపురుషుల వద్ద చదువుకోటానికి నీకెంత ధైర్యమే! అన్న అత్తగారు ఈనాడు సంతోషంగా అంగీకరించింది అప్పటికి నాకు 36 ఏళ్ళు వచ్చాయి పిల్లల నోట్సులతో, ఎ.బి.సి.డిలతో మొదలుపెట్టి రోజుకు 13 గం.లు చదివి ఫస్టు ఎటెంప్లలోనే మెట్రిక్ పానయ్యి, పి.యు.సి. బి.ఏ., చేశాను. బావట్టలో మా ఇద్దరికీ మంచిపేరు 'ప్రఖ్యాతులుండబట్టి తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు పెద్దపెద్ద పండితులయిన మాస్టర్దు ఇంటికి వచ్చి చెప్పేవారు నేను తప్పితే అప్రతిష్ట అనే భయంతో, అందరూ నవ్వుతారని కరెంటు లేని ఆ రోజుల్లో కూడా చాలా శ్రమించి ఉత్తీర్ణురాలినయ్యానంటే నమ్మండి! ఆ లోపలే బాపట్టలో అనేక సాంఘిక్త సంక్షేమ, సారస్వత పదవులు చేపట్టాను (స్త్రీల కుటీర పరిశ్రమలకు సెక్రటరీగా వందమందికి పిండివంటలు, పళ్లరసాలు, కుట్టు, అల్లికలు నేర్పించాను. కనుపర్తి వరలక్ష్మమ్మ గారిచే స్థాపించబడిన "స్త్రీ హితైషెణి మండలి' సెక్రటరీగా వుండి 100మంది వయోజన స్రీలకు సోషల్ వెల్ఫేర్ బోర్డు వారి నాలుగు కండెన్సుడు కోర్సులను నిర్వహించా. బాపట్లలో 1909లో అన్నవరపు వారు స్థాపించిన బాలికా పారశాలకు మేనేజరుగా పదవీ బాధ్యతలు స్వీకరించాను. ఆ స్కూలులో మా అత్తగారు, నేను, నా కొడుకు మూడ్తు తరాల వారిమి విద్య నభ్యసించాము. అంతేకాక 'శారదా మహిళా విజ్ఞాన సమితి'కి (ప్రెసిడెంటుగా వ్యవ హరించాను. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు ప్రసిడెంటుగాను. నేను సెక్రటరీగా సోషల్ వెల్ఫేర్వారి ఆర్దిక సహాయంతో సంస్కృత పారశాల కోర్సులను యువతుల కోసం నడిపాము. ఇల్టు పిల్లలు, విద్య, సామాజిక సేవ ఇన్నీ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ మున్సిపల్ ఎన్నికలకు పోటీచేసి ఓట్టు కొనకుండా, పైసా ఖర్చు పెట్టకుండా 15 ఓట్ట తేడాతో (1968)లో ఓడిపోయాను. ఈ తరుణంలో రామ్మూర్తిగారు పార్లమెంటుకు పార్టీరహిత (ప్రజాస్వామ్య అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు అలా వీరామంలేని షెడ్యూలుతో అహరహం (శ్రమించాను. 82 ఏళ్లు నిండినా ఈనాడు కూడా నా సంస్థల కార్యక్రమాలే కాకుండా బైట ఉపన్యాసాలు, టి.వి. రేడియో కార్యక్రమాలు, వెతేర సంఘాల వారి సభలు, వర్కుషాపులు, సెమినార్లలో యధ్రోచిత్ర సేవ చేస్తున్నానంటే నమ్మండి. నా జీవితం నా నడవడ్రి తెలుసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. 1062లో కుటుంబ నియంత్రణ కార్యకర్తల ట్రయినింగుకు మెట్రిక్ పాసయిన త్రము అర్హులని పేపర్ణో వెయ్యి రూ.ల ష్టయిపేండుతో ఒక సం॥ కోర్సు అని నోటిఫికేషన్ (ఎమలతా గుప్త స్టేటు ఫ్యామిలి ప్లానింగు హైదరాబాదు (బ్రాంచి వారి ప్రకటన చూచి నా భర్త “నువ్వు (ట్రయినింగుకు వెళతావా! ఒక సంవత్సరం మాత్రమే. (ప్రపంచజ్ఞానం, సమాజం, దేశం, సాహిత్య, సంఘసేవ పూర్తిగా తెలియని నీ భవిష్యత్తు సర్వతోముఖంగొ 108 పరిణతవాణి ప్రసంగాలు
నికసించి లోకజ్ఞానం కలుగుతుంది' అన్నారు. మామగారు కూడా అభ్యంత౦౦ చెప్పలేదు వెంటనే హైదరాబాదుకు ప్రయాణమై కోర్సులో చేరితే నా వయస్సు చూచి నా తోటి స్టూడెంట్సంత నేనే వార్డన్ అనుకున్నారు. నాకప్పటికి 46 ఏళ్లు, ఇంటర్వ్యూలో కమిటివారు 'నీ భర్త వెళ్లగొట్టాడా?” అని ప్రశ్నించారు నా వయస్సు చూచి అది విన్న నా భర్త లేచివచ్చి 'నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, సీనియర్ లాయర్ని, రాజకీయ ఉద్యమాలలో ప్రముఖ కార్యకర్తను. నా భార్యకు లోకజ్ఞానం కొరకు ఈ కోర్సులో చేర్చిస్తున్నా'నని చెపితే వారంతా నా భుజం తడుతూ పకపకా నవ్వారు. ఆ కోర్సులో ఎనిమిది సబ్జక్టు వుండేవి. ఎనాటమా, ఫిజియాలజి, సైకాలజి, సోషియాలజి, ఫ్యామిలీ ప్లానింగు, ఫస్టు ఎయిడ్, న్యూట్రిషన్, ఇంగ్లీషు లాంటి సబ్దక్టు చెప్పడానికి పెద్ద పెద్ద ప్రాసెసర్లు వచ్చేవారు. ఎంతో విపులంగా మనస్సుకు హత్తుకునేలా ఇంగ్రీషులో పాఠాలు చెప్పేవారు. నేనప్పుడు మరో లోకంలో విహరిస్తూ వుండేదాన్ని. ఈ కోర్సు వల్ల ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నా. కులమతాల భేదాలు పోయాయి. కేరళ క్రిష్టియన్లు, హైదరాబాదు ముస్లింలు, హిందువులం కలిసి మెలిసి ఉరూ. ఇంగ్లీషు, తెలుగు భాషలు నేర్చుకుంటూ సిలబసు, పార్యాంశాలు చెప్పుకుంటే ఆ సంవత్సరం అన్యోన్యంగా గడిపాము మూఢవిశ్వాసాలు, నమ్మకాలు అంతరించాయి. నేను 50 మందిలో 7వ దానిగా ఉత్తీర్ణురాలినయ్యా. (ప్రొఫెసరు ప్రశ్నలు అచగగానే నేను లేచి నుంచుని వచ్చీ రాని ఇంగ్రీషులో సమాధానాలు చెపుతుంటే తోటి ఎద్యార్థినులంతా 'సుబ్బమ్మగారు లేచింది! అటూ పకపకా నవ్వేవారు. నాకు దైర్యం వుండేది. తెలిసింది చెప్పాలని, తెలియంది తెలుసుకోవాలనే తపన వుండేది. నొ జీవితంలో అదొక అద్భుత సన్నివేశం ఆ సర్టిఫికెటుతో నేను ఉద్యోగానికి వెళ్లలేదు. నా శక్తి సామర్య్యాలు నా భర్త సపోర్భ (గ్రహించిన ట్రేమలతా గుప్త నాకు జిల్లా కుటుంబ నియంత్రణ ఆర్గనైజరుగా ఆనరరీ పోస్టును ప్రెసిడెంటు ఆఫ్ ఇండియా ద్వారా పంపారు. గుంటూరు జిల్లాలో డి్టిక్ట ఆర్గనైజరుగా 5 సం॥లు పనిచేసి 'కుటుంబమి(త్ర' పత్రికకు, ఆంధ్రజ్యోతి డైలీకి “జనాభా పెరుగుదల, అపరేపన్ల” పై అనేక వ్యాసాలు (లాగాను. ఫ్యామిలీ ప్టానింగు 'ఓరియేంటేషన్ ట్రయినింగు' క్యాంపులు 30కి పైగా 30 మంది హై తె రోజులు నిర్వహించి అన్ని సబ్బక్టులు నిష్ణాతులైన పండితులతో చెప్పించవారం. క్యాంపుకు రూ.400 ఖర్చులకు పంపేవారు. నేను 'కుటుంబ నియంత్రణ , అవోహలు - అనుమానాలు" మోద కాసులు తీసుకుని ఎంతో మంది స్త్రీలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పంపేదానిని. రామ్మూర్తిగారు తాలోకొ అసోసియేషను స్టాపించి రోటరీ క స్స్ క చేసేవారు. ఆ సబక్తు 'జనాభౌ 'పెరుగుదల' నాటికీ నేటికీ క్షబ్బు ద్వారా ప్రచారం చనవా 1౧ ఏళలో వందల సంఖ్యలో అడవారిని నాక్రు తరిమానికమయింది. అంటే ఈ 46 ఎిళ్లోల ౯9 థ్
109 శ్రీమతి మల్లాది సుబ్బమ్మ
ఆపరేషన్లకు పంపూతూనే వున్నాను. ఒక్క పిల్లకన్నా కనవద్దని చెప్తూనే వున్నాను ఇలా (ట్రయినింగు కోర్సు నన్నాక ప్రతిభావంతురాలిగా మలిచి నాకు మంచి పేరు (ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందనేది పచ్చి నిజం.
'వికాసం' మాసపత్రికను స్టాపించి రామ్మూర్తిగారు ఎడిటరుగా, నేను పబ్లిషర్‌గా, మేనేజరుగా పనిచేసి 15 సం॥లు పత్రికను నడిపాం. ఆ సమయంలో మా దంపతులం జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో చేరి ప్రముఖ పాత్ర వహించాం. రామ్మూర్తిగారిని 1975లో ఇందిరమ్మ ఎమర్జన్సీ ప్రకటన వల్ల డెటిన్యూగా ఆరెస్టుచేసి రాజమండ్రి జైలులో ఒక సంవత్సరం వుంచారు. ఆ సమయంలో నేను '“వికాసం' బాధ్యత వహించాను. ఎమర్జన్సీలో పత్రికలలో వ్రాసే ఎడిటోరియల్స్ కలెక్టరుకు చూపించి (వ్రాయాలనే నిషేధాన్ని పెట్టారు విజయవాడలో కూడా, అయినా నేను ధైర్యంతో వికాసం పత్రిక నిర్వహిస్తూనే వున్నాను. కొందరు ప్రముఖులే కాక మృణాళ్‌సేన్ లాంటి వారితో
కలిసి విజయవాడలో ఫిల్ము సొసైటీ స్టాపించి దానికి (ప్రెసిడెంటుగా వ్యవహరించేదాన్ని. బెజవాడలో నేను బహుముఖ ప్రజ్ఞాశాలిగా గౌరవింపబడ్డాను. కారణం రామ్మూర్తిగారు జైలులో వున్నప్పటికి పత్రికా నిర్వహణ, సభలు, సమావేశాలు, రేడియో ప్రసంగాలు, ఫిల్ము సొసైటీలో పనిచెయ్యడం వల్ల 2,3 ఏళ్లలోనే పేరు ప్రతిష్టలొచ్చి గుర్తింపబడ్డాను. 1976లో రామ్మూర్తిగారు కోర్టు ద్వారా రిలీజ్ అయినప్పుడు... తిరిగి అందరి డెటిన్యూలను మరలా అరెస్టు చెయ్యమని ఇందిరమ్మ ఆర్డరు వేస్తే హైదరాబాదులో రెండు జైళ్ళు వుండటాన నేను, పిల్లలు వెళ్లి చూడటం తేలికనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే 1976లో హైదరాబాదు చేరాం. ఆనాటినుండి హైదరాబాదులో నా కార్యక్రమాలు విజృంభించి చెయ్యడం మొదలయ్యింది. నాటి నుండి నా ప్రచారం, ఎడ్యుకేషన్, ఎజిటేషన్, ఆర్గనైజేషన్ల ద్వారా అంటే ప్రబోధం, ప్రచారం, చైతన్యపరచడం. సంస్థల స్టాపనల ద్వారా స్త్రీలలో చైతన్యం తేవాలనే ధ్యేయంతో ఉపన్యాసాల ద్యారా, రచనల ద్వారా, పోరాటాల ద్వారా సంస్థలు స్థాపించి వాటిద్వారా ప్రచారం చెయ్యడమనే మూడు మార్గాలను ఎంచుకున్నాను. వీటి ద్వారానే నేను (స్త్రీలలో చైతన్యం తేవడానికి (ప్రయత్నిస్తున్నాను. హైదరాబాదు రాగానే వెంట వెంట మహిళాభ్యుదయానికై వేర్వేరు పేర్లతో ఎనిమిది సంస్థలు, రెండు ట్రస్టులు స్థాపించి కార్యక్రమాలపై విజృంభించాను. అవినా కవలపిల్లలని గర్విస్తూ వుంటా. నా భావాల అభివ్యక్తీకరణ రూపమే నా సంస్థల న్థాపన. సంస్థల ద్వారా సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్కుషాపులు, రాష్ట్ర సభలు గత 5 ఏళ్లుగా అవిరళ కృషితో సాగిస్తున్నానంటే నమ్మండి! నేను స్థాపించి రిజిష్టరు చేసిన నా సంస్థలలో ముఖ్యమైనది పేరంటల్ ఆర్షనైజేషను 'మహిళాభ్యుదయ సంస. (ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్యాన్స్మెంటు ఆఫ్ ఉమెన్). ముందుగా 110 పరిణతవాణి ప్రసంగాలు
మహిళాభ్యుదయ సంస్త గురించి వివరిస్తా ఆ సంస్త మరో ఎనిమిది సంస్టలను సృష్టించి నాటి నుండి ఈనాటి వరకు ఎడతెరిపిలేని కార్యక్రమాలు నిర్వహించటం ముదావహం. మహిళాభ్యుదయ సంస్ద
1980లో స్టాపించి రిజిష్టరు చెయ్యటం జరిగింది. ఈ సంస్ట గత 25 ఏళ్లుగా ఎన్నో సభలు సమావేశాలు, చర్చలు, వర్కుషాపులు, సెమినార్డు నిర్వహించింది. ఇందులో 100 మంది లైప్ మెంబర్జు వున్నారు. దానికి అనుబంధ సంస్థలు (సిస్టర్ ఆర్గనైజేషన్సు) ఎనిమిది. ఇంకా 2 ట్రస్టులు “మల్లాది సుబ్బమ్మ (ట్రస్టు, 'మహిళాభ్యుదయ ట్రస్టు'- ఈ సంస్టలన్ని రిజిష్టరై నాటి నుండి నేటి వరకూ నేనే కాక సభ్యులు, హితులు, స్నేహితుల తోడ్పాటుతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయంటే అది అనన్య సామాన్యం. ముందుగా అనుబంధ సంస్థలను పేర్కొని, వాటి కార్య(క్రమాలను వివరించడం సముచితం. క్ష మహిళాభ్యుదయ గ్రంథాలయం
మహిళాభ్యుదయ (గ్రంధాలయ స్థాపన 1981లో జరిగింది. దీనికి ఈనాడు” లైబ్రరి, సారస్వతపరిషత్తు వారు, సాహిత్య అకాడమో వారు అనేక మంది జె.బి, రావ్, ఎం.వి. రామమూర్తి లాంటి మిత్రులు, స్నేహితులు, హితులు ఈ (గ్రంథాలయానికి అనేక పుస్తకాలు డొనేట్ చేశారు. మొత్తం 3000 పుస్తకాలలో తెలుగువి 1800, ఇంగ్రీసువి 1200. దీనికి 15 సంలు స్టేట్ గ్రంథాలయ సంస్థ వారు గ్రాంట్ యిచ్చారు.
- 'కాస్మాపాలిటన్ మ్యారేజ్ బ్యూరో”
'కాస్మాపాలిటన్ మ్యారేజ్ బ్యూరో' అంటే అభ్యుదయ వివాహ వేదిక. ఇది 1981లో స్టాపించి రిజిష్టరు చేశానండీ! ఆనాటినుండి ముఖ్యంగా (పేమ వివాహాలు, కులాంతర, మతాంతర, భాషాంతర, దేశాంతర, వరకట్న రహిత, విధవా వివాహాలు జరుగుతూనే వున్నాయంటే నమ్మండి. ఈనాటికి 380కి పైగా పెళ్లిళ్లు చేశాను. వీరి వివరాలు, ఫొటోలు వున్నాయి. తల్లిదండ్రులు యిష్టపడని ప్రేమికులు మా వేదికద్వ్యారా వివాహాలు జరిపించుకుంటున్నారు. జరిపిస్తున్నాను. స్త్రీలే అంటే నేనే సారధ్యం వహించడమనేది దీని (ప్రత్యేక విశిష్టత, కేవలం ఇద్దరిచేత దండల మార్పిడి చేయించి, పెళ్లి ప్రమాణం చేయించి సర్టిఫికెట్టు యిచ్చి పంపిస్తుంటాను. 'లా' ప్రకారం అమ్మాయి 18, అబ్బాయి 21 సం॥లు వయస్సు నిండిన వారికి మాత్రమే చేస్తున్నాను. హిందూ మ్యారేజి యాక్టు (ప్రకారం ఈ పెళ్ళిళ్లు నిర్వహిస్తున్నాను. ఇంతవరకూ ఏ తల్లిదండ్రులు నన్ను నిర్చంధించలేదు. ఇదొక గొప్ప ముందడుగుగా భావిస్తున్నాను. ఈ వేదికకు నార్లవారు శ్రీమతి మల్లాది సుబ్బష్ము 111
గౌరవాధ్యక్షులు, మమతా లక్ష్మన్న (ప్రెసిడెంటుగా, రామ్మూర్తిగారు ట్రెజరరుగా, నేను సెక్రటరి/డైరక్టరుగా 30 మంది సభ్యులతో పని చేస్తోంది 3. “కుటుంబ సలహా కేంద్రం"
“కుటుంబ సలహా కేంద్రం' ఫ్యామిలి కౌన్సిలింగు సెంటరు - 1980లో స్థాపించి రిజిష్టరు చేశాను. నా భర్త నేను ఈ సంఘానికి సారథులం. రామ్మూర్తిగారు లీగల్ ఎడ్వయిజరుగా, నేను సోషల్ వర్కరుగా ఎనలేని సేవ చేశాం. 1980 నుండి ఈ నాటికి 3800 లకు పైగా కేసులను పరిష్కరించడం, భార్యాభర్తలను కలపడం, అలవికాని పరిస్థితులలో విడదీసి డైవర్సు యిప్పించడం, మెయింటనెన్సు ఏర్పాటు చెయ్యడం. అనేక మంది (స్త్రీలు భర్త కొట్టాడని, వెళ్లగొట్టాడని, అధిక కట్నం తేలేదని హింసలు పెడుతుంటే అలాంటి అభాగినులు మా కేంద్రానికి వచ్చి తమకు న్యాయం చెయ్యమని మొరపెట్టుకునేవారు. కొన్ని కేసులు ఆరు నెలలు, సంవత్సరం కూడా పట్టవచ్చు. నేను కలిపిన జంటలు మరలా పేచీలుపడి తిరిగిరావడం జరగలేదంటే నమ్మండి. భార్యాభర్తల తగాదాలు చాలా సున్నితంగా వున్నా నాతో చెప్పుకుంటారు. అవి చిక్కుపడిన దారపువుండలా వుంటాయి ఆ సమస్యలు. ఈ కేంద్రాన్ని గుర్తించిన కేంద్ర సోషల్వెలొఫిర్ బోర్డు వారు ఒక స్కీమును 1980లో శాంక్షన్ చేశారు. దాని ద్వారా ఇద్దరు కౌన్సిలర్లను, స్టాఫ్‌ను నియమిస్తూ (గ్రాంటూ మంజూరు చేశారు. ఇది ఆం.ప్రలో మొదటి సంస్థ, మా సెంటరుకు జంటనగరాల నుండే కాక ఇతర జిల్లాల నుండి అర్దరాత్రి అపరరాత్రి భర్త కొట్టాడని, చంపబోతూన్నడని, త్రాగిన మైకంలో కూతురునే లాగుతున్నాడని, వస్తువులెత్తుకెళ్లి అమ్ముతున్నాడని, అఖరికి ఆడపిల్లల్ని కంటే కూడా వెళ్లగొట్టాడనే కేసులెన్నో వచ్చాయి. ఎంతో సహనంతో, ఓర్పుతో గత 24 ఏళ్ళగా ఈ సంస్థను నిర్వహిస్తున్నానంటే అది అసాధారణమనవచ్చు. ఈ సలహా కేంద్రం ఎందరో మహిళలకు తోడ్పడింది. నిజంగా చెప్పాలంటే ఇదొక అసిధారావ్రతం లాంటిది. ఇక్కడ కాని కేసులు ప్రొటెక్షన్ సెల్‌కు, ఇంకా కోర్టు ద్వారా పరిష్కరించే కేసులు చాలా వున్నాయి. ఈ సంస్థకొక లీగల్ అడ్వయిజరు వున్నారు, సోషల్ కమిటి కూడా వుంది.
- “శ్రామిక మహిళా సేవని
“'శామిక మహిళా సేవ అనే సంస్థను నెలకొల్పి రిజిష్టరు చేశాను. వదాన్యులు శ్రీ బాదం రామస్వామిగారు 20 వేల రూ. విరాళంగా యిచ్చి (ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించమనగా నేను 20 మంది స్త్రీలకు తలకొక వెయ్యి రూ. చొప్పున వడ్డీ లేకుండా కూరగాయలు, పాలు, కట్టెలు, కుట్టు మిషన్ల లాంటి వాటి 112 పరిణతవాణి ప్రసంగాలు
ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి నెలకు 50 రూ.ల చొప్పున తిరిగి చెల్లించే విధంగా లోన్లు యివ్వగా అందరూ తిరిగి చెల్లించారు. ఆ విధంగా ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది. ఎందరో పేద స్త్రీలు ఈ స్కీము క్రింద లాభించారనేది నగ్నసత్యం.
- “స్త్రీ విమోచన శిక్షణా కేంద్రం
“స్రీ విమోచన శిక్షణా కేంద్రం' అనే సంస్టను 1987లో స్టాపించి నేను డైరెక్టరుగా వుంటూ [గ్రామ (స్త్రీలను 30 మందిని (ప్రతినెలా ఆహ్వానించి ట్రయినింగు క్యాంపులు నిర్వహిస్తూ వారికి భోజన వసతితోపాటు 30 సబ్జ్బక్టుల మోద 'కుటుంబ నియంత్రణ, మానవహక్కులు - మహిళల హక్కులు, పర్సనల్ లా, హిందూ, ముస్లిం, (క్రైస్తవ మతాల గురించి, ఓటుహక్కు గురించి, నేను రోజు స్త్రీల సమస్యల మీద, ఎన్.3ె. ఆచార్య లీగలు మీద, రామ్మూర్తి గారు జనరల్ నాలెడ్జ్ పైనా నిష్పాతులైన అధ్యాపకుల చేత క్లాసులు నిర్వహించేదాన్ని. ఈ సంస్త ద్వారా (గ్రామాలలో 50దాకా 'ఎవేర్నెస్ క్యాంపులు' నడిపించగలిగానంటే అదొక గర్వకారణమనవచ్చు. ఇలా 1980-95 వరకు 15 సం॥లు ఈ కార్యక్రమాలు (గ్రామ, పట్టణ స్త్రీల కొరకు చేశాను. ఈ సంస్థకు 'బెడ్ ఫర్ది వాళ్లో అనే జర్మనీ సంస ఆర్జిక సహాయం చేసింది. ఈ సంస్థ ద్వారా చాలా మంది మహిళలు వేలసంఖ్యలో విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పధాన్ని పొందగలిగారంటె నాకే విస్మయం కలుగుతుందండి! అంతేకాదు. (గ్రామ స్త్రీల కొరకు లీగల్ లిట్రసీ క్యాంపులు 60కి పైగా జరిపి వారిలో వివాహం, ఆస్తిహక్కు, విడాకులు, దత్తత లాంటి విషయాలపై అవగాహన కలిగించాను. (గ్రామ (స్రీలకు అసలే న్యాయశాస్త్ర అవగాహన లేనందువల్ల ఈ క్యాంపులు వారికి ఎన్నో విధాలుగా రక్షణ, అవగాహన కలిగించాయనక తప్పదు.
- "సెంటర్ ఫర్ ఉమెన్సు రైట్స్”
"సెంటర్ ఫర్ ఉమెన్సు రైట్స్" అనే సంస్థ 1989లో స్థాపిస్తే దానికి నార్వే వారు ఆర్థిక సహాయం అందించారు. దీని తరపున (గ్రామాలలోను, సిటీలోను, కాలేజీ విద్యార్థినులను, (స్త్రీలను అహ్వానించి స్త్రీల హక్కులే కాక లీగల్: సోషల్, పొలిటికల్ క్లాసులు నిర్వహించి వారిలో చైతన్యం కలుగజేసేదాన్ని. ఇది ఎనిమిదేళ్ళు పని చేసింది. 7. “సుబ్బమ్మ షెల్టర్
'సుబ్బమ్మ షెల్టర్ 1990లో స్థాపించాను. అర్ధరాత్రి, అపరరాత్రి వచ్చే బాధిత స్త్రీలకు ఆశ్రయం కల్పించి తదుపరి 3 సం॥లు వుంచుకునే స్టేటు హోం లాంటి శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 113
వాటికి పంపేదాన్ని. అలా వచ్చిపోయేవారి సంఖ్య మిక్కుటంగానే వుండేది. వారి పిల్లలను అనాధ శరణాలయాలకు పంపేదాన్ని. స్కూళ్లల్లో చేర్పించి చదివించేదాన్ని 8. “వృద్ద మహిళాశ్రమం'
ఈ ఆ(శ్రమాన్ని నార్సింగి గ్రామంలో నెలకొల్పి బాదం సరోజదేవి, నేను బాధ్యత వహించాము. వారికి రక్షణ, పోషణ, వైద్యం సమకూర్చడం దీని ముఖ్యోద్దేశం. ఎంతోమంది దిక్కులేని వృద్దులకు 30 మంది దాకా ఆశ్రయం కల్పించాము. చందాల ద్వారా, నా ట్రస్టుల ద్యారా వారి పోషణ జరిగేది. ఉన్నవారు కొంత ఆర్టిక సహాయం చేసేవారు. దీని స్థాపన 1992లో జరిగింది 9. మినీ ఫ్యామిలీ స్లానింగు సంస్థ
రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖవారి ఆర్జిక సహాయంతో 'మినీ ఫ్యామిలీ ప్టానింగు' (ప్రాజెక్టు ద్యారా నా ఆధ్వర్యంలో నలుగురు సహేలీలను నియమించి వారి ద్వారా గ్రామాలలో కుటుంబసంక్షేమం, ఆపరేషను, జనాభా పెరుగుదల లాంటి విషయాలను వారి దృష్టికి తెచ్చి, వారిని చైతన్యపరిచి హెచ్చు స్థాయిలో వారిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పంపేవారం. ఈ (ప్రాజెక్టు 6 సం॥లు నిర్వహించాను.
- “డౌరీ అఫెన్సెస్ ఇన్వెష్టిగేషన్”
“డౌరీ అఫెన్సెన్ ఇన్వెష్టీగేషన్' అనే సంస్థను కొన్నేళ్లు నిర్వహించాను. 'మహిళాభ్యుదయ సంస్థ ను వెల్ళేర్ ఆర్గనైజేషన్‌గా గుర్తించి సెంట్రల్ గవర్షమెంటువారు ఈ సంస్థను శాంక్షన్ చేశారు. కట్నం తీసుకోవడం నేరమని పోలీసులు చేప్తారు గదా! ఆ ప్రకారంగా మాకు ఫిర్యాదు చేస్తే మేము మా సంస్ట ద్వారా ఫలానివారు కట్నం తీసుకున్నారని, అమ్మాయిని వేధిస్తున్నారనీ రిపోర్టు యిస్తే కేసు నడుపుతారు. పోలీసులకున్నంత విలువ మా సంస్థకు వుందని జి,ఓ.ను పాస్ చేశారు.
11 వికాస కుట్టు సెంటరు
మహిళభ్యుదయ సంస్థ తరపున కుట్టు సెంటరు 5 ఏళ్ళు నడిపాను. ఈ సెంటరు ద్వారా సుమారు 2000 మంది పైగా కుట్టు నేర్చుకుని జీవనోపాధి సాగిస్తున్నారు. అలాగే విజ్ఞాన మహిళ్ళాటైపు ఇనిస్టిట్యూట్‌ను కూడా నిర్వహించాను. ఎంతో మంది యువతులు, విద్యార్థినులు వృత్తి విద్యగా టైపు వల్ల సార్దకత సాధించారు.
114 పరిణతవాణి ప్రసంగాలు
- నయోజన విద్యా కేంద్రం
దత్తాత్రేయ కాలనీలో వయోజన విద్యా కేంద్రాన్ని స్థాపించి క్లాసులు నిర్వహిస్తున్నాను. ఇటీవల అక్షరజో ;తి అనే పేరుతో దేశమంతటా అక్షరాస్యతను వృద్ది చేస్తున్నాను. ఆ సందర్భంగా ఇద్దరు వాలంటీర్లకు శిక్షణ యిచ్చి జనవాడలో, జియాబాగ్లో క్లాసులు నిర్వహించాను అక్కడ 1999లో యూనిసెఫ్, ఇంకా చందాల ద్వారా పెద్ద హాలు కట్టించాను. అందులో చిన్న న్కూలు, కుట్టు సెంటరు నడుస్తున్నాయి. ముఖ్యమైనది “మల్దాది సుబ్బమ్మ ట్రస్టు
ఈ ట్రస్టు 1980లో పెట్టి రిజిష్టరు చేశాను. అలాగే 'మహిళాభ్యుదయ ట్రస్టును స్థాపించి దాని ద్వారా (స్త్రీలకు టెక్నికల్ విద్య అంటే ప్పంబింగు, వైరింగు, కన్స్ట్రక్షన్ వర్కు, రేడియో, టి.వి. రిపేరింగులాంటి వర్కు నేర్పించాలనే ధ్యేయంతో జనవాడ (గ్రామంలో 10 ఎకరాల భూమిని కొనడం జరిగింది. అలాగే “మల్లాది సుబ్బమ్మ స్సు ద్వారా విద్యార్దులకు, పాలిటెక్టిక్ విద్యార్హినులకు విరాళాలు యివ్వడం, ఎన్నో సంస్టలకు ఆర్థిక సహాయం చెయ్యడం గత 20 ఏళ్ళుగా జరుగుతోంది. (ప్రస్తుతం గత ఆరేళ్లుగా ఈ ట్రస్టు ద్యారా “మల్లాది సుబ్బమ్మ మహిళా ఒకేషనల్ జూనియర్ కాలేజో ని స్టాపించి పేద విద్యార్థినులకు ఫీజులు లేకుండా 10వ తరగతి పాసయినవారిని ఇంటర్లో చేర్చుకుని 'ఎకౌంటింగ్ అండ్ టాక్సేషన్ 'ఆఫీసు అసిస్టెంటుపిప్పు కోర్సును ఇంటర్ మోడియట్ బోర్డు వారి గుర్తింపుతో నిర్వహిస్తున్నాము. మా కాలేజి విద్యార్షిని వై. అరుణ కుమారికి స్టేట్ ఫస్టు వచ్చి ప్రతిభా అవార్డు' గోల్టుమెడల్ రావడం విశేషం. ఈ (ట్రస్బులను ఇన్‌కంటాక్సు ఎగ్జమ్షన్ వుంది. దీని ద్వారా విరాళాలు లభించడం ప్రత్యేక విశిష్టత. ఇంకా ఈ ట్రస్టు ద్వారా సంస్టలకు, విద్యార్థినులకు విరాళాలు, స్కాలర్షిప్లు, మహనీయుల జయంతి సభలు, మెమోరియల్ లెక్కర్ణు జరుపుతున్నా మంటే అది అతిశయోక్తి కాదంటే నమ్మండి. ఇంకా చెప్పాలంటే సంఘ సేవకులకు, విదుషీమణులకు నా బర్హుడే రోజున సన్మానాలు, సత్కారాలు సలుపు తున్నాను. నా ఆస్తిపాస్తులన్నీ యిచ్చి ఈ ట్రస్టు పరిధిని పెంచాలనే ధ్యేయంతో వున్నాను.
'మల్చాది సుబ్బమ్మ మహిళాభ్యుదయ పురస్కారం" కోసం తెలుగు యూనివర్సిటి వారికి 1980లో రూ.15 వేలు నేను ఇచ్చాను యూనివర్సిటివారు 'మల్లాది సుబ్బమ్మ మహిళా పురస్కారం” పేరుతో ప్రతి ఏటా 1116 యిచ్చి శాలువా కప్పి మెమోంటో యిచ్చి ఇప్పటికి 24 మంది విదుషమణులను సత్కరించారు. ఇలా ప్రతి సంవత్సరం శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 115
ఆగస్టులో సంఘసేవ, సాహిత్యం సృష్టించిన విదుషమణులకు అవార్డులు యిచ్చి సత్కరించాము. మెమోంటో, శాలూవా, సైటేషన్ ఇస్తున్నాను. 2005 మార్చిలో 'లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్ట' ను స్పాపించటం జరిగింది. నేను ఆ సంఘానికి ఛీఫ్ ఎడ్వయిజరుగా వుండి డా॥ నాయని కృష్ణకుమారికి 5 వేల రూపాయల అవార్డు ఇచ్చి, శాలువ కప్పి సత్కరించాను.
1952 నుంచి బెజవాడ రేడియోలో, 1976 నుండి హైదరాబాదు రేడియోలో అనేకానేక (ప్రోగ్రాములు 'అధిక ధరల'పై, “బడ్జెట్ మోద, 'కులతత్వం"పై పిల్లల్లో వైజ్ఞానిక దృక్పధం, 'విద్య, ఉద్యోగం, వివాహం స్త్రీకి ఏది ముఖ్యం”. 'సాహిత్యం- సంఘసేవ' లాంటి అనేకానేక విషయాలపై నా ఉపన్యాసాలే కాక, మోడరేటర్‌గా వుండి చర్చల్లో పాల్గొన్నాను. ఏడేళ్ళు రేడియో ఎడ్వయిజర్ కమిటీ మెంబరుగా 'ఫ్యామిలీ షానింగు' మోద సలహాదారుగా వున్నాను. మా మహిళాభ్యుదయ సంస్టకు రేడియోవారు అనేకానేక (ప్రోగ్రాములు యిస్తున్నారు. గత 50 ఏళ్ళుగా బహుముఖ (ప్రజ్ఞాశాలిగా వందల సంఖ్యలో రేడియో ప్రోగ్రాములు నిర్వహించాను. 82 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా రేడియో డిస్కషన్సు, స్త్రీల సమస్యలపై ్రోగ్రామ్సు ఇస్తూనే వున్నాను.
నా సంఘసేవను, సాహిత్యాన్ని గుర్తించి సినిమా డైరెక్టర్లు నన్ను ఆహ్వానించి సినిమాల్లో అభ్యుదయపధాన పయనించే పాలకు, ఇంకా సాహసవంతమైన మహిళలకు నా చేత సన్మానాలు, అభినందనలు, గౌరవించడం లాంటి చిన్న చిన్న పాత్రలను నేను నటించే అవకాశం యిచ్చారు. వాటిలో కొన్ని సినిమాలు - ఓ భార్యకధ, భద్రం కొడుకో, నల్లపూసలు, సహనం, కంటే కూతురినే కను, తాళి కట్టిన శుభవేళ లాంటి ఒక 10 పినిమాల్లో నటించాను. దరిదాపు అనేకానేక సినిమాలకు “ప్రివ్యూ'లకు ఆహ్వానించి అభిప్రాయాలను సేకరించి తరువాత మీటింగుపెట్టి మాట్టాడించేవారు. వారి వారి సినిమాల గురించిన సందేశాలు నాచేత సభల్లో చెప్పించి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. సానూజికభ్యున్నతికి నేను చేపట్టిన పదవులు:
ఆం.ప్ర. రాడికల్ హ్యూమనిస్టు సంఘ అధ్యక్షులుగా 5 సంలు వున్నాను. ఆ సమయంలో అనేక స్టడీ క్యాంపులు, రాష్ట్ర సదస్సులు, సభలు, వర్కుషాపులు నిర్వహించాను. అఖిల భారత రాడికల్ హ్యూమనిస్టు సంఘ కార్యనిర్యాహక సభ్యురాలిగా 1976 నుండి వున్నాను. ఇంగ్లీషు పత్రిక “రాడికల్ హ్యుమనిస్టు' పత్రికకు వ్యాసాలు (వ్రాస్తుండేదాన్ని. ఆలిండియా సభలకు కాన్ఫరెన్సులకు స్పీకరుగా లేక కార్యకర్తగా
116 పరిణతవాణి ప్రసంగాలు
వెళ్లేదాన్ని. జయపూర్, పాట్నా, ఢిల్లీ, కలకత్తా, బాంబే, నైనిటాట్ లాంటి ప్రదేశాలలో సభలకు హాజరయ్యేదానిని. నా భర్త రామ్మూర్తిగారు ఆలిండియా ్రెసిడెంటుగా, సెక్రటరీగా చాలాకాలం పదవీ బాధ్యతలు నిర్వర్తించి 'రినైజున్సు' సమితి సభ్యులుగా కడదాకా వుండేవారు. 1992 నుండి ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్ ఆంధ్రప్రదేశ్ సంస్థకు ఉపాధ్యక్షులుగాను, 1996 నుండి అధ్యక్షులుగాను కొనసాగాను. జనతం[త్ర సమాజ్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యన్షులుగా 1992 నుండి పనిచేశాను. ఆం(ధధ్ర(ప్రదేశ్ కులనిర్మూలన సంఫఎ ఉపాధ్యక్షులుగా 1990 నుండి పదవి నిర్వహిస్తున్నాను. 1996లో కులనిర్మూలన సంఫఎ రాష్ట్ర మహిళా సదస్సు నిర్వహించాము. అఖిల భారత హేతువాద సంఘ అధ్యక్షులుగాను, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులుగాను, జాతీయ సంఘ సభ్యులుగాను 1980 నుండి పనిచేశాను, చేస్తున్నాను. సతీ సహగమన వ్యతిరేక ఉద్యమం పెట్టి కార్యకర్తగా పనిచేశాను. సోషల్ వెల్ఫేర్ బోర్టువారి వాలంటరీ యాక్షన్ బ్యూరో మెంబరుగా, రాష్ట్ర కుటుంబ సంక్షేమం వారి 'స్కోవా' కమిటీ మెంబరుగా, హైదరాబాదు అక్షర జ్యోతి సమితి ఎగ్జిక్యూటివ్ మెంబరుగా, వానోడ్, (క్రాస్ సంస్థలు, ఆంధ్ర యువతీ మండలి, ఆంధ్ర మహిళా సభ, రెడ్ క్రాస్, స్రీ మేళా, మియాపూర్ వృద్ధాశ్రమం లాంటి వాలంటరీ సంఘాలలో లైఫ్ మెంబరుగా వుండి యధోచిత సేవ చేశాను, చేస్తున్నాను.
ఆందోళన కర్తగా తోటీ ఉద్యమ కార్యకర్తలతో కలిసి సాధించిన విజయాలెన్నో వున్నాయి. 1973 నుండి ఇందిరాగాంధీ ఎమర్దన్సీని విధించింది. దేశమంతా అల్లకల్లోలమయింది. జయప్రకాష్ నారాయణ ఎమర్జన్సీని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని లేవనెత్తాడు. అప్పుడు స్త్రీలంతా ఆయన సపోర్టుగా పోరాటాలు సలిపినప్పుడు బెజవాడలో నా నాయకత్వాన ప్రదర్శన జరుగుతుండగా లాఠీ చార్జీ చేశారు. నవంబరు 2005లో ముఠా వ్యతిరేక సంఘం స్థాపించి దానికి నేను ఆనరరీ 'ప్రెసిడెంటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతిగ్రామంలో రెండు ముఠాలై కొట్లాటలు, హత్యలు దొపిడీలు జరిగి రాయలసీమ పరమ దారుణంగా తయారుయింది గదా! ఎక్కడ ఘోరం జరుగుతున్నా నివారించేందును మన పాత్ర వుండాలి గదా!
1996లో ఒక బాబు తండ్రి కులం వల్ల ఉద్యోగార్హత కోల్పోయాడు. అప్పుడు తల్లి కులం బిడ్డకు వర్తిస్తుందని మా సంస్థ తరపున హైకోర్టులో రిట్వేసి విజయం సాధించాము. 1992లో స్త్రీలకు రాజకీయాధి కారం (ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్) కావాలనే ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్ర సదస్సు జరిపి పార్లమెంటులోకి జొరబడి కరపత్రాలను విరజిమ్మడం జరిగింది. స్త్రీలకు 33 శాతం సీట్లు అసెంబ్లీలో, శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 117
పార్లమెంటులో రిజర్వు చెయ్యమని పోరాటాన్ని గత పదిహేనేళ్ళుగా సాగిస్తూనే వున్నాం. ఈ నాటికి అమలు కాలేదు. రాజస్టాన్‌లో భర్త చనిపోయిన రూప్ కన్వార్‌ను బంధువులు భర్త చితిపై సహగమనం చేయించారు. హైదరాబాదులో మేము పెద్ద ఎత్తున స్నేహలత భూపాల్, స్త్రీ శక్తి సంఘటనవారు, మహిళాభ్యుదయ పంస్త్ర వారం కలిసి సహగమనం చేయించినవారిని శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనచేసి అలజడి రేపొం. నల్గొండ జిల్లా చిలకుర్తి గ్రామంలో యజమాని కూతురు (ప్రేమించినవాడితో లేచిపోవడానికి సహాయపడిన ముత్తమ్మ అనే దళిత (స్త్రీని వివస్త్రనుచేసి వూరంతా వూరేగించి చెట్టుకు కట్టేసి కొట్టినప్పుడు మా సంస్ట పెద్ద ఎత్తున ప్రదర్శన జరిపి, ముత్తమ్మను పరామర్శించి ఆమె కొడుకు చదువుకు, ఆమె ఉద్యోగానికి అర్హత కల్పించాము కలెక్టరుతో మాట్టాడి. ఆ దుర్మార్గులకు కరిన శిక్ష విధించారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇంకా చెప్పాలంటే ఏలూరులో (క్రష్టియన్ మతాధిపతులు 'మోనాస్టరీస్' కట్టించి 8 మంది స్త్రీలను ఇష్టపూర్వకంగా అంగీకరించేటట్టు చేసి లోకంలోని పాపాలను పోగొట్టటానికి వారు ధ్యానంచేస్తూ అక్కడే. సమాధి అయ్యేటట్టు గుంటలు తవ్వివుంచారు. ఈ వార్త విని నా ఆధ్వర్యంలో మా సంఘాలవారం ఏలూరు పొయ్యాము కోర్టులో కేసు పెట్టాము అలాగే హైదరాబాదులో మెహిందీ వేశ్య వాడకి వెళ్లి వృత్తి మానుకోమని, మోకు 'బ్రతుకుతెరపు చూపిస్తామని ఫారిన్ ఫండ్సు తెస్తామని మాతో రమ్మని నేను, నా తోటి మిత్రులతో ఎన్నో సార్టు తిరిగినా ఫలితం దక్కలేదు.
అలాగే (స్త్రీలల్లో ఆ విద్య, అజ్ఞానం, శాస్త్రీయ దృక్సధం లేమివల్ల స్త్రీలల్టో మూఢాచారాలు మిక్కుటంగా వున్నాయి. పోలెరమ్మ జాతర్జు. చేతబడి, గణాచారి, బాణామతి, పూనకాలు, సోది చెప్పించుకోవడం లాంటి దురాచారాలపై 'ప్రీలకి నమ్మకం ఎక్కువ. దీనితో వారిలో వ్యక్తిత్వం నళించి నిర్వీర్యులైపోతున్నారు. వాస్తుమాద, జాతకాలమోద, ([గ్రహణాలమిద, ముడుపులు వీటిపై (గ్రామాల్లో మా సంస్థ తరపున సభలు, సమావేశాలు, శిక్షణా తరగతులు జరుపుతూనే వున్నాము. ఒక సభలో 'నాకు ఎవరైనా చేతబడి చెయ్యండి! లక్ష రూపాయలు యిస్తానని" కూడా ప్రతిజ్ఞ చేశాను. ఇది తరతరాల భావదాస్యం. స్త్రీలలో మూఢాచార నిర్మూలన కోసం గత 30 ఏళ్ళుగా ప్రచారం చేస్తూనేవున్నాను.
రాజస్థాన్‌లో హైకోర్టు ముందు ఆరు అడుగుల మనువు వి(గ్రహాన్ని తయారుచేయింది. హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఆవిష్కరించాడు. ఈ న్యూసు విని మేమంతా పత్రికలలో వ్రాసి హైకోర్టు జడ్జిని పదవీచ్యుతుని చెయ్యమని డిమాండు చేశాం. “నస్తీ స్వాతంత్య మర్హతి" అని శాసించిన మనుపు (స్రీలకు విరోగికదా! 118 పరిణతవాణి ప్రసంగాలు
బి.సి. 500 నాటి మనుధర్మశాస్త్రం ఆరోజుల్లో శ్లాఘనీయం కావచ్చు. ఈనాడది అనుసరణీయం కాదుకదా! అలాంటి మనువును మళ్ళా (ప్రతిష్టించడం (ప్రీజనోద్దారకులమైన మాకు అభ్యంతరం కదా!
ఎనిమిది మంది పిల్లల తల్లి 60 ఏళ్ల షాబానో భర్త నెలకి 50 వేలు సంపాదించే ఒక ప్లీడరు. ఆమెకు తలాక్ యిస్తే ఆమె కోర్టుకు వెళ్లి భర్తను భరణం కోరగా 500 రూ.లు శాంక్షన్ చేసింది క్రింది కోర్టు. భరణం యివ్వడం యిష్టంలేని భర్త పై కోర్టుకు పోతే చంద్రచూడుడనే జడ్జి అసలు ముస్లిం (స్త్రీలకు భరణమే యివ్వక్కర్లేదని తీర్పు చెప్పాడు. ముస్తిం (స్త్రీలంతా మిన్నకున్నారు. కాని మా సంఘాలవారం అలజడిచేసి చంద్రచూడుడుని విమర్శిస్తూ సభలు పెట్టాము. ఇలా ఎక్కడ ఏ అన్యాయం జరిగా స్పందించడం నిరసన తెలపటం నా వైఖరిగా మార్చుకున్నాను.
నాకు రాజకీయ అవగాహన లేకపోలేదు. అది 1932. మా వాకింట్లో పెద్ద గాంధీ విగ్రహం వుండేది. ప్రతి రోజు సాయం(త్రం అక్కడకు రాజకీయనాయకులంతా వచ్చి బ్రిటిష్‌వారి దమననీతిపై నిరసన, స్వరాజ్యం ఎలా సాధించాలి, ఎన్ని కష్టనష్టాలనయినా (ప్రాణాలువొడ్డి పోరాడాలి - అంటూ నిరసన తెలిపేవారు. నెహ్రూ, వల్లభాయ్‌పటేల్, బోసు, రాజేంద్రప్రసాద్ లాంటి నాయకులు వచ్చి ఉపన్యాసాలిచ్చే వారు. వెంటనే బ్రిటిష్ సిపాయిలొచ్చి కార్యకర్తలపై పొట్టమిద లారీ ఛార్జీచేసి, బూటుకాలితో తొక్కి వ్యాన్ ఎక్కించేవారు. మరల మరలా కార్యకర్తలు రావడం, దెబ్బలు తినడం అరెస్టు అయిదెబ్బలు తినడం చూచి నేను చలించిపాయ్యే దానిని. అలా రాజకీయ చరిత్రనంతా తెలుసుకున్న నాలో రాజకీయాలపై అవగాహన కలింది. 1935లో గాంధీ ఆంధ్ర పర్యటనలో బాపట్ల వచ్చినప్పుడాయన తన కొల్హాయి పరిచి 'డబ్బు' అని ఆడగగానే వేల రూపాయలు పడ్డాయి. నేను కూడా నా వేలి ఉంగరాన్ని తీసి వేశా మా అమ్మ నన్ను చావగొట్టింది. అలా నాటి నుండి నేటి వరకు ఎలక్షన్లలో పని చెయ్యటం, ఓటు విలువ చెప్పటం, ఓటర్ల కౌన్సిల్సు ెట్టించటం, అవినీతి రాజకీయాలపై ప్రచారం చెయ్యటం, లంచగొండులను, మత విద్వేషులను నిరసించటం, స్త్రీల పై అత్యా చారలను నిరసించటం, స్వార్ధ రాజకీయాలను, శాడిజాన్ని, గూండాయిజాలను దునుమాదడం పై యధోచిత 'సేవచేస్తూనేవున్నాను.
అత్యాచార నిరోధంమిద, వరకట్న నిషేధంమోద, స్త్రీల హింసలమోద నేను చెయ్యని పోరాటం లేదు. (స్త్రీలమోద ఏ అలజడి జరిగినా, ఏ అన్యాయం జరిగినా శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 119
స్పందించడం, పోరాడడం నా జీవిత విధానంలో ముఖ్య భాగమైంది ఆ నేపధ్యంలో 1992లో దూబగుంటలో రోశమ్మ, తోటి మహిళలు కలిసి సారాని నిషేధించాలని ఉద్యమాన్ని చేపట్టి సారా వ్యానుని వూరిలోకి రాకుండా నిరోధించగలిగారు. ఈ వార్త దావానలంలా ఆంధ్ర దేశమంతా పొక్కింది హైదరాబాదులో పోరాటతత్యం వున్న నేను, నాతోటి మహిళలం ఉద్యమాన్ని చేపట్టి ముందుగా ఫిరోజ్గాంధి పార్కు నుండి టాంక్బండ్ వరకు 1000 మంది మహిళలం వూరేగాం. 'సంపూర్ణ మద్య నిషేధ సమితి” పేరుపెట్టి 1992లో సంపూర్షమద్య నిషేధవుద్యమానికి నేను అధ్యక్షురాలిగా సంధ్యావందనం లక్ష్మీదేవి తదితరులం కలిసి సభలు, సమావేశాలు, 'సెమినార్జు, రాష్ట్ర సదస్సులు జరిపాం. అలాగే కమ్యూనిస్టు మహిళలు, బి.జె.పి.కార్యకర్తలు, సర్యోదయ మండలి వారందరూ కలిసి ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. గాంధీ విగ్రహానికి పూలదండ వేసే అర్హత ముఖ్యమంత్రికి లేదని అడ్డుకోవటానికి బైరాయించిన మమ్మల్ని 50 మంది పోలీసులు లారీ ఛార్జీ చేస్తే నా మోకాలు బెణికి వాచింది. రక్తం కళ్లజూచారు. మమ్మల్ని అరెస్టు చేసి బొల్ద్జారం పోలీసు స్టేషనుకు పంపారు. ఎన్.టి.ఆర్. తో 1992లో చిత్తూరు నుండి శ్రీకాకుళం దాకా నిషేధం కావాలని పర్యటించాను. ఆయన నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. నన్ను దరిదాపు రెండు రోజుల కొకసారి హౌస్ అరెస్టు చేసేవారు. అయినా భయపడకుండా ధర్నాలు, రాస్తారోకోలు, పబ్లిక్ మోటింగులు నిర్వహించేవారం. ప్రతిరోజు ఒక కార్యక్రమం చొప్పున జాతీయ పోరాటం స్థాయిలో ఆంధ్రలో మద్యనిషేధోద్యమం నడిచింది. 'ఈనాడు' ఎడిటరు రామోజీరావు రెండు పేజీలు కేటాయించి రాష్ట్రంలోని న్యూసు నంతటిని (ప్రచురించేవారు. అన్ని పత్రికలవారు మాకు సపోర్టు యిచ్చారు. అలాగే టి.వి. ఛానల్సువారూ. రాష్ట్రం ఒక రణరంగంగా తయారయింది. చివరికి ఎన్.టి.ఆర్. 1993లో ముఖ్యమంత్రిగానే నిషేధం పేపరు మోద సంతకం చేశాడు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా వండి మధ్య నిషేధ ప్రచారనికి వావిలాలను, నన్ను 10 మందితో ఒక కమిటీని పెట్టి మమ్మల్ని రాష్ట్రమంతటా త్రిప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు నిషేధాన్ని సడలించాడు. తిరిగి మరలా రాజశేఖరరెడ్డి 2004 మేలో 25 వేల మంది జనాభావున్న చోట మద్యం షాపుల పెంచితే ప్రస్తుతం మళ్లీ ఉద్యమాన్ని 'జన విజ్ఞాన వేదిక "తో కలిసి పోరాటాన్ని నిర్వహిస్తున్నాను. మళ్లీ మద్య నిషేధ ఉద్యమం విశ్వరూపం దాలుస్తోంది. నిషేధం అమలుసేర్చేదాకా మా 'ప్రాణాలున్నంతవరకూ పోరాడతానని 27, ఫిబ్రవరి 2005న రాష్ట్ర సభలో ప్రతిజ్ఞ చేశాను. నిజం చెప్పాలంటే ఇదొక దీర్జకాలిక పోరాటమయింది.
120 పరిణతవనాణి ప్రసంగాలు
కలెక్టరు చంద్రయ్య గారు నన్ను 1964 నుండి ఒంగోలు సబ్ జైలుకు 'ప్రోబేషన్ ఎడ్వయిజరీ కమిటీలో లైఫ్ మెంబరుగా నియమించారు. అప్పుడప్పుడు జైళ్లకు వెళ్లి ఖైదీలకు నీతిని గురించి, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చెయ్యవద్దని, మోరల్ వ్యాల్యూస్మోద పారాలు చెప్పేదాన్ని. 1983 ప్రాంతంలో హైదరాబాదు ఓల్లు సిటీలో హిందూ ముస్లిం పోరాటంలో కత్తిపొట్టు జరిగి దరిదాపు 200 వందలమంది దాకా చనిపోయారు. ఆ సమయంలో మా మహిళాభ్యుదయ సంస్థ సభ్యులం వెళ్లి సర్వే చేసి 16 పేజల రిపోర్టు వ్రాశాము. ఆ భయంకర రోజుల్లో కూడా వెళ్లి ఆ రిపోర్టును గవర్నర్‌కు ఛీఫ్మినిస్టరుకు తదితర మంత్రులకు సమర్పించాము. చుండూరులో ఒక వర్గ ప్రజలను అంటరానివారిగా నిక్టేశించి చంపితే మా సంస్థల వారం వెళ్లి పోరాడి ప్రదర్శనచేసి వచ్చాం. నాకు కులమతాల తేడా లేదు. ఆస్తి అంతస్తుల భేద భావాలు, స్రీ పురుష తేడాలు అసలే లేవు. పదవులపై వ్యామోహం అంతకన్నా లేదు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నా నిరసన తెలియజేయ్యడం, న్యాయంకోసం పోరాడడం గత 50 ఏళ్లుగా చేస్తూనే వున్నాను. ఇంత చేసినా ఇంకా చెయ్యాల్సింది అనంతంగా వున్నది. దీనికి సమష్టి కృషీ కావాలి. దానికి మనం మన టైము, ఎనర్జి ధనము ఎంతో అంత వినియోగించి తోటివారికి సాయపడాలి. మిన్నకుండటం ఆత్మద్రోహం అవుతుంది. నేనేదో తత్వవేత్త లెవెల్లో వుండి చెప్పడంలేదు. సామాజిక అభ్యున్నతికొరకు ఎంతో అంత చేశాను కనుక ఈ మాత్రమైన ఇతరులను చెయ్యమని (ప్రోద్చలపరుస్తున్నాను. మనం మనుష్యులం కనుక మనుష్యులంగా (బ్రతకాలి. మానవత్వ మంటే తోటి మానవులలో ఆత్మస్టైర్యం. నీతి, నిజాయితి, న్యాయం, ధర్మం కలిగించి, తద్వారా తోటి వ్యక్తులకు సాయడటమే మన ప్రథమ కర్తవ్యంగా భావించాలి.
ఆలక్ష్యంతోనే రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వుండి సంక్షేమ రాజ్యానికి సేవ చేద్దామనే లక్ష్యంతో 1988లో పార్లమెంటుకు ఓటర్ల సమితి తరపున సైకిలు గుర్తుతో పోటీ చేసి 6 వేలు చందా వసూలు చేసి సైకిలు రిక్షామిద పెట్టుకొని (ప్రచారం చేశాను. నాకు 8000 వేల ఓట్టు వచ్చాయి. గెలుపు ఓటముల కన్నా భావ (ప్రచారం ముఖ్యమని ఆ పని చేశాను.
ఇక్కడ నా స్వవిషయం కొంత వివరించక తప్పుదు. నా కుటుంబ సభ్యులంతా ఉన్నతాశయాలు, ఉదారబుద్ధి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మాలకోసం పోరాడే వదాన్యులు. అలాంటి కుటుంబానికి కోడలిగా రావడం నా అదృష్టం. నా భర్త మహా ఉన్నతోన్నత వ్యక్తి మంచి స్కాలరు, పరోపకార పారీణతగల వ్యక్తి పదవులు శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 121
ఆశించని నిస్వార్ద జీవి, పేరు (ప్రఖ్యాతులు కోరని సేవాతత్పరుడు, అభ్యుదయవాది జీవితాంతం హ్యుమనిస్టుగానే కాక పక్కా హేతువాది, ప్రజాస్వామికవాది, మచ్చలేని మహోన్నతవ్యక్తి. నా అత్తమామల గురించి (వ్రాస్తే అదొక ఉద్గంధమవుతుంది. వారు నన్ను అమ్మాయి అని పిలిచేవారు. మా అత్తగారు 250 నవర్సుల బంగారం ఒక పళ్లెంలో పెట్టి బొట్టుపెట్టి 'సువర్షదానం' అంటూ ఇచ్చేసింది మామగారు అమ్మాయి! ఇవిగో ఇనప్పెట్టై తాళాలు తీసుకో! ఇక ఈ ఇంటి బాధ్యత నీదే! నా ఒక్కగానొక్క బిడ్డ దేశానికి, సమాజానికి సేవకోసమే పుట్టాడు. వాడొక రేషనలిస్టు మా కర్మకాండలు చేసినా చెయ్యకపోయినా మా ఒక్కగానొక్క బిడ్డను తిట్టము, విమర్శించము అన్నారు. వాళ్లు కర్మిష్టులు, నా భర్త నిరీశ్చరవాది. అయినా వాం౬ అభిమానాలు, ఆప్యాయతలు, (ప్రేమలు తగ్గలేదు. అలాంటి మామగారు, అత్తగారు నా దగ్గర 40 ఏళ్లు వున్నారు. నా చేతులమోదుగానే పొయ్యారు. నేనేమి చేసినా "ల రుణం తీరేది కాదు.
1966లో మామగారు, 1975లో మా అత్తగారు మరణించారు. నా భర్త రామ్మూర్తిగారు 1998 సెసప్టెంబరులో మరణించినా నేను [క్రుంగిపోలేదు. 1935లో మా పెళ్లి అయితే 63 ఏళ్లు కాపురం చేశాం. 1995 మే 15న మా 'సహజీవన షష్టిపూర్తి సభ' చాలా గొప్పగా జరుపుకున్నాం. ఆ సభకు ఆవుల, నారాయణరెడ్డి భద్రిరాజు లాంటి ప్రముఖులు పాల్లొని ఉపన్యసించారు. సాంఘిక, రాజకీయ, సారస్వత ఉద్యమాల్లో కలిసిమెలిసి వందల కార్యక్రమాలు నిర్వహించాం. యూరప్ పర్యటన జరిపాం. అప్పటికి తనకు 80 ఏళ్లు నిండాయి. డయాబిటీస్ వ్యాధివల్ల మరణించారు. [క్రికెట్ ఆటలో ఒక వికెట్ పడిపోతే రెండోవారు బ్యాటుపట్టుకొని ముందు కురకాలిగదా! అలాగే యిద్దరం సంస్పలు స్టాపించాం. ఉద్యమాలు నిర్వహించాం. వయస్సు నిండాక ఎవరో ఒకరం పోక తప్పదుకదా! మనం నిజాయితీగా నమ్మిన ఉద్యమాలకు సేవ చెయ్యాలిగదా! - అనే నిర్వేదంతో 9వ రోజునే గాంధీ జయంతినాడు మద్యనిషేధ సమితి సభ్యులం గాంధి వి([గ్రహానికి పూలదండ వేశాం. అదే ప్రకారం దండవేసి మళ్తీ మద్యనిషేధోద్యమంలో కి దూసుకెళ్ళా అప్పటి నుండి ఎడతెరిపి లేకుండా కాలేజీ నిర్వహణ, కౌన్సిలింగు, పెళ్లిళ్లు జరుపుతూనే వున్నాను. సభల్లో పాల్గొంటూ, పత్రికలకు వ్యాసాలు (బ్రాస్తూనేవున్నాను. ఇవి చాలక ఫ్రీగా ఆడపిల్లలకు ఒకేషనల్ జూనియర్ కాలేజీ స్టాపించి గత ఏడేళ్లుగా నిర్వహిస్తున్నానంటే నమ్మండి! నా ఆస్తి అమి శ ఆ డబ్బుతో ట్రస్టు పెట్టి ఆ వడ్డీతో ఈ కాలేజీ నిర్వహిస్తున్నాను.
ఇక నా పిల్లల విషయంలో నేనేలోపమూ చెయ్యలేదు. కోడళ్లకు మా అత్తగారిచ్చిన బంగారం తలా 40 నవర్సులూ ఇచ్చాను. కానీ కట్నం పుచ్చుకోలేదు. 122 పరిణతవాజి ప్రసంగాలు
పిల్లల్ని ఉన్నతోన్నతులుగా పెంచాను. ఇద్దరు ఇంజనీర్జు, ఇద్దరు డాక్టర్లు అయ్యారు. . ముగ్గురు. విదేశాలు వెళ్లివచ్చారు. కూతురు గైనకాలజిస్టు. ఆమె. 'భర్త పర్ఫా . పట్టాభికూడా డాక్టరే. కోడళ్లు ముగ్గురూ - ఉష, కళ్యాణి, మంజు నన్ను గౌరవిస్తారు. ఆదరిస్తారు. ఏనాడూ నేను వారిని, వారు నన్ను పల్తెత్తు మాట అనుకోలేదు. వైరి . పిల్లలు కూడా ఇంజనీర్జు, డాక్టర్లు. అమెరికా వెళ్లి అక్కడ ఉన్నత పదవుల్లో వు న్నారు. నాకు 8 నుంది మనవలు, అయిదుగురు ముని మనవలు వున్నారు. నేను వారిక్రి ఆప్రిపాస్తులు పెద్దగా ఇవ్వకపోయినా “మా అమ్మ నాన్ను మంచిపనులు చేస్తున్నారని' | సంతోషించేవారేకాని బాధపడి ఎరుగరు అలాంటి భర్త ఇలాంటి పిల్లలు కలిగా రు. | అంటే అదొక అదృష్టంగా చెప్పకోవచ్చు. స్మత్పవర్తనగల పిల్లలు విద్యలో ఉద్యోగాల్లో కుటుంబ బాధ్యతలలో నీతి నిజాయితీతో నిర్వర్తిస్తారు. ఎవరి కైనా సాయ్రం నో సాజ్తి . కాని అవినీతిగా మసలు కోరు. సమాజంలో వారికి మంచి గౌరవమర్యాదలున్నాయి
- ఏతప్పుడు పని, అవినీతి, స్వార్షం లేకుండా మనగల్లుతున్నారంటే అదో చ్రాల్రా గొప్పు . విషయం. చేతనైతే మంచి చేస్తారు లేక పోతే మిన్నకుంటారు. అలాంటి పిలలి ఇలాంటి భర్త అత్త మామలు, కుటుంబ సభ్యులున్నందువ వల్ల నాక్తు సంపు! | 'సీవ చెయ్య గల అవకాశం మెండుగా లభించింది. ప్రతి వ్యక్తీ విలక్షణమైన వ క . అయినా ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరి ప్రతిభ, ప్రజ్ఞ వారిదే. చేన్స హ్యూమనిస్తున్నీ . శ్రిషనలిస్టునని, ఫెమినిస్టునని, రుజువు చేసుకున్నా. ఎంత చెప్పినా చెప్పాలి. ంది . మరేదో వుందనిపిస్తుంది. నా జీవిత చరిత్ర పూర్తిగా చదివినవారికి నా ఆ వన / ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆదర్శాలు, ప్రజ్ఞా విశేషాలు, అసమర్థతలు క్రూడ్దా చ వగతమవుతాయి. కాకపోతే నేనే చెపుతా. నేను మరెవ్వరోకాదు - నేన్స, న్య న పత్మస్తుతి అంటారా! కాదు, పరనిందా కాదు. గత 50 ఏళ్లుగా అంతో ఇం వల మేలు పొందవచ్చు. (శ్ర స్వచ్చలాంటి నా భావాలు నచ్చివారు మారవచ్చు నాణ జ్య? - 2 వని. నిజం, శ్చ న... నౌ భవిష్యత్తు గురించి ఒక విధంగా ఆలోచిస్తే - నొ సీ వా స్రీ విధానమేమోవనసిపెస్తుంది పట్టుదల, ధైర్యం, సాహసం ఈ మూడు లక్షణాలూ నాలో మూర్తిభవించి వున్నాయి, ఎవరన్నా విమర్శిస్తైతని భయ లేదు శి ( చేసిందని గుసగుసలాడతారని” సంకోచంలేదు, వున్నదేదో వుంది, లేనిదేదొ అబు. / నమ్మిన సిద్దాంతాన్ని ప్రచారం చెయ్యటానికి వెరపు లేదు. ఎగతాళి చేస్తారనే | పిరికితనం అసలే లేదు, అనేకానేక భావాల సంపుటి నా జీవితం. ఇక్కడొక శపథం + సరమెతే చేస్తున్నాను. ఇకముందు నాశ్తక్తి యుక్తులను, వనరులను, చివరికి అవసరమైతే నా ర్తి శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 123
ఆశించని నిస్వార్ధ జీవి, పేరు ప్రఖ్యాతులు కోరని సేవాతత్పరుడు, అభ్యుదయవాది. జీవితాంతం హ్యుమనిస్టుగానే కాక పక్కా హేతువాది, ప్రజాస్వామికవాది, మచ్చలేని మహోన్నతవ్యక్తి నా అత్తమామల గురించి (వ్రాస్తే అదొక ఉద్గంధమవుతుంది. వారు నన్ను అమ్మాయి అని పిలిచేవారు. మా అత్తగారు 250 నవర్సుల బంగారం ఒక పళ్లెంలో పెట్టి బొట్టుపెట్టి 'సువర్షదానం' అంటూ ఇచ్చేసింది. మామగారు అమ్మాయి! ఇవిగో ఇనప్పెట్టై తాళాలు తీసుకో! ఇక ఈ ఇంటి బాధ్యత నీదే! నా ఒక్కగానొక్క బిడ్డ దేశానికి సమాజానికి సేవకోసమే. పుట్టాడు. వాడొక రేషనలిస్టు. మా కర్మకాండలు చేసినా చెయ్యకపోయినా మా ఒక్కగానొక్క బిడ్డను తిట్టము, విమర్శించము అన్నారు. వాళ్లు కర్మిష్టులు, నా భర్త నిరీశ్వరవాది. అయినా వాం౬ అభిమానాలు, ఆప్యాయతలు, (ప్రేమలు తగ్గలేదు. అలాంటి మామగారు, అత్తగారు నా దగ్గర 40 ఏళ్లు వున్నారు. నా చేతులమోదుగానే పొయ్యారు నేనేమి చేసినా ఇతి రుణం తీరేది కాదు. 1966లో మామగారు, 1975లో మా అత్తగారు మరణించారు. నా భర్త రామ్మూర్తిగారు 1998 సెప్టెంబరులో మరణించినా నేను (క్రుంగిపోలేదు. 1935లో మా పెల్లి అయితే 63 ఏళ్లు కాపురం చేశాం. 1995 మే 15న మా 'సహజీవన షష్టిపూర్తి సభ' చాలా గొప్పగా జరుపుకున్నాం. ఆ సభకు ఆవుల, నారాయణరెడ్డి, భ(ద్రిరాజు లాంటి ప్రముఖులు పాల్గొని ఉపన్యసించారు. సాంఘిక, రాజకీయ, సారస్వత ఉద్యమాల్లో కలిసిమెలిసి వందల కార్యక్రమాలు నిర్వహించాం. యూరప్ పర్యటన జరిపాం. అప్పటికి తనకు 80 ఏళ్లు నిండాయి. డయాబిటీస్ వ్యాధివల్ల మరణించారు. క్రికెట్ ఆటలో ఒక వికెట్ పడిపోతే రెండోవారు బ్యాటుపట్టుకొని ముందు కురకాలిగదా! అలాగే యిద్దరం సంస్థలు స్టాపించాం. ఉద్యమాలు నిర్వహించాం. వయస్సు నిండాక ఎవరో ఒకరం పోక తప్పదుకదా! మనం నిజాయితీగా నమ్మిన ఉద్యమాలకు సేవ చెయ్యాలిగదా! - అనే నిర్వేదంతో 9వ రోజునే గాంధీ జయంతినాడు మద్యనిషేధ సమితి సభ్యులం గాంధి వి(గ్రహానికి పూలదండ వేశాం. అదే ప్రకారం దండవేసి మళ్లీ మద్యనిషేధోద్యమంలోకి దూసుకెళ్లా. అప్పటి నుండి ఎడతెరిపి లేకుండా కాలేజీ నిర్వహణ, కౌన్సిలింగు, పెళ్లిళ్ళు జరుపుతూనే వున్నాను. సభల్లో పాల్గొంటూ, పత్రికలకు వ్యాసాలు (వ్రాస్తూనేవున్నాను. ఇవి చాలక ట్రీగా ఆడపిల్లలకు ఒకేషనల్ జూనియర్ కాలేజీ స్థాపించి గత ఏడేళ్లుగా నిర్వహిస్తున్నానంటే నమ్మండి! నా ఆస్తి అమ్మి ఆ డబ్బుతో ట్రస్టు పెట్టి ఆ వడ్డీతో ఈ కాలేజీ నిర్వహిస్తున్నాను. ఇక నా పిల్లల విషయంలో నేనేలోసమూ చెయ్యలేదు. కోడళ్లకు మా అత్తగారిచ్చిన బంగారం తలా 40 నవర్సులూ ఇచ్చాను. కానీ కట్నం పుచ్చుకోలేదు. 122 పరిణతవాణి ప్రసంగాలు
పిల్లల్ని ఉన్నతోన్నతులుగా పెంచాను. ఇద్దరు ఇంజనీర్హు, ఇద్దరు డాక్టర్లు అయ్యారు. ముగ్గురు. విదేశాలు వెళ్లివచ్చారు. కూతురు గైనకాలజిస్టు. ఆమె భర్త పర్పా పట్టాభికూడా డాక్టరే. కోడళ్లు ముగ్గురూ - ఉష, కళ్యాణి, మంజు నన్ను గౌరవిస్తారు, ఆదరిస్తారు. ఏనాడూ నేను వారిని, వారు నన్ను పల్తెత్తు మాట అనుకోలేదు. వారి పిల్లలు కూడా ఇంజనీర్డు, డాక్టర్లు. అమెరికా వెళ్లి అక్కడ ఉన్నత పదవుల్లో వున్నారు నాకు 8 మంది మనవలు, అయిదుగురు ముని మనవలు వున్నారు. నేను వారికి ఆస్తిపాస్తులు పెద్దగా ఇవ్వకపోయినా 'మా అమ్మ నాన్న మంచిపనులు చేస్తున్నారని" సంతోషించేవారేకాని బాధపడి ఎరుగరు. అలాంటి భర్త ఇలాంటి పిల్లలు కలిగారు. అంటే అదొక అదృష్టంగా చెప్పకోవచ్చు. స్యత్రవర్తనగల పిల్లలు విద్యలో ఉద్యోగాల్లో కుటుంబ బాధ్యతలలో నీతి నిజాయితీతో నిర్వర్తిస్తారు. ఎవరి కైనా సాయం చేస్తారే కాని అవినీతిగా మసలు కోరు. సమాజంలో వారికి మంచి గౌరవమర్యాదలున్నాయి. ఏతప్పుడు పని, అవినీతి, స్వార్దం లేకుండా మనగల్లుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. చేతనైతే మంచి చేస్తారు లేక పోతే మిన్నకుంటారు. అలాంటి పిల్లలు, ఇలాంటి భర్త అత్త మామలు, కుటుంబ సభ్యులున్నందువ వల్ల నాకు సంఘానికి సేవ చెయ్య గల అవకాశం మెండుగా లభించింది. ప్రతి వ్యక్తీ విలక్షణమైన వ్యక్తి అయినా ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరి ప్రతిభ, ప్రజ్ఞ వారిదే. నేను హ్యూమనిస్టునని, రేషనలిస్ట్రునని, ఫెమినిస్టునని, రుజువు చేసుకున్నా. ఎంత చెప్పినా చెప్పాల్సింది మరేదో వుందనిపిస్తుంది. నా జీవిత చరిత్ర పూర్తిగా చదివినవారికి నా ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆదర్శాలు, ప్రజ్ఞా విశేషాలు, అసమర్థ్హతలు కూడా అన్నీ అవగతమవుతాయి. కాకపోతే నేనే చెప్తుతా. నేను మరెవ్వరోకాదు _ నేను, నేనే. ఇది ఆత్మస్తుతి అంటారా! కాదు, పరనిందా కాదు. గత 50 ఏళ్లుగా అంతో ఇంతో (శ్రమపడి పనిచేస్తున్నా, విమర్శలూ సహిస్తున్నా, కష్టాలు భరిస్తున్నా. ఏ కొద్ది మంటో నావల్ల మేలు పొందవచ్చు. స్త్రీ స్వేచ్చలాంటి నా భావాలు నచ్చివారు మారవచ్చు ఆలా ఎందరో మార్పు చెందారనేది పచ్చి నిజం.
నా భవిష్యత్తు గురించి ఒక విధంగా ఆలోచిస్తే - నా సాహసమే నా జీవిత విధానమేమోననిపిస్తుంది. పట్టుదల, ధైర్యం, సాహసం ఈ మూడు లక్షణాలు నాలో మూర్తీభవించి వున్నాయి. ఎవరన్నా విమర్శిస్తారని భయంలేదు. “ఎమి చేసిందని గుసగుసలాడతారని” సంకోచంలేదు. వున్నదేదో వుంది. లేనిదేదో లేదు. నమ్మిన సిద్దాంతాన్ని (ప్రచారం చెయ్యటానికి వెరపు లేదు. ఎగతాళి చేస్తారనే పిరికితనం అసలే లేదు. అనేకానేక భావాల సంపుటి నా జీవితం. ఇక్కడొక శపధం చేస్తున్నాను. ఇకముందు నాశక్తి యుక్తులను, వనరులను, చివరికి అవసరమైతే నా శ్రీమతి మల్లాది సుబ్బు 123
ప్రాణాన్ని సైతం స్త్రీ సంక్షేమానికి వినియోగించాలనే కృతనిశ్చయానికి వచ్చాను. చేసిందానికన్నా చెయ్యబోతున్న కార్యరంగం మరింత పటిష్టంగాను, శాశ్ళతంగానూ నిలబడగల కార్యదీక్షను చేబూనాలనే ఆకాంక్ష నాలో పెనవేసుకుపోయింది ఇది ఆత్మస్తుతి కాదు. పరనిందా కాదు. ఆ మాట కొస్తే ఆడవారి 'ఆత్మకధిలు అరుదయిన తరుణంలో నేను “పాతిప్రత్యం నుండి ఫెమినిజందాకా” 400 పేజీల ఆత్మకధ 1992లో (వ్రాశాను. తిరిగి “నా జీవిత తరంగాలు” అనే 200 పేజీల (గ్రంధాన్ని వ్రాశాను. తిరిగి మరలా ఈనాటి వరకు జరిగిన నా జీవిత చరిత్రను 'క్రోడికరించి “నాలో నేను-నా జీవిత సింహావలోకనం” 2001లో 80 పేజీల పుస్తకం (వ్రాశాను. ఇంత (వ్రాసినా, ఇన్ని చేసినా నాలో లోపాలు లేకపోలేదు. ప్రతి మనిషిలోనూ కొంత మంచి, కొంత చెడు వుంటుంది. ఏ వ్యక్తి పరిపూర్ణ మానవుడు కాలేదు. అలాగే నేను కూడా కొన్ని పొరపాట్లు, తప్పులు చేశాను. దేశ సేవ, సమాజ సేవ చేసే నాభర్త ఒక్క బిడ్డనుకని సమాజ సేవ చేద్దామని హితపు చెపితే అర్హంచేసుకోలేని నేను నలుగురు పిల్లలను కనడంతో ఆయన సేవాకార్యక్రమాలకు కొంత అడ్డుతగిలాననే చెప్పాలి. మా అత్త మామలు నన్ను, నా పిల్లల కోసం సర్వవిధాల తోడ్పడ్డారు. కాని నేను వారరికి చెయ్యాల్సినంత చెయ్యలేదనే అసంతృప్తి నాకుంది. ప్రతి వ్యక్తిలోనూ మంచినే చూద్దామనకుంటా డైరీలో ప్రతి సంవత్సరం ఈ మాటే 'వ్రాస్తా. కాని ఆచరణలో దాన్ని వమ్ము చేస్తున్నాం. చేసిన గొప్పను చెప్పుకోకూడదనే విశ్వాసం నాకు వుంది. కాని చెప్పకుండా వుండలేను. ఇలాంటివే కొన్ని చిరులోపాలు వుండవచ్చు. మానవ స్వభావాన్ని ఆధిగమించలేకపోతున్నానని పశ్చత్తాపపడుతున్నా. నేను నా 'మరణ శాసన విజ్ఞప్ర' వ్రాసి మిత్రులకు, స్నేహితులకు, హితులక్షు అందరికి యిచ్చాను. అందులో నాకళ్టు, లివరు, కిడ్ని, గుండె లాంటివి నా ప్రాణం పాయ్యేముందు పేస్‌మేకర్‌తో ప్రాణాన్ని నిలిపి డాక్టరుచేత ఆర్ల్గను తీయించి తోటి మానవులకు యివ్వాలని, ఎలక్ట్రికల్ ్రిమేషన్ చెయ్యాలని (వ్రాశాను. ఇది నా తుదికోరికగా చెప్పాను. అలాగే రామ్మూర్తిగారు పోగానే నేత్రదానం చేయించాం. అంటే మనం చచ్చినా బ్రతికినా తోటివారికి సాయపడాలనేదే నా సందేశం. అంతేకాదు. 50 శాతం (స్త్రీలు వున్నారు. వారు తమ ఇల్టు, భర్త పిల్లలతోనేకాక సమాజానికి, దేశాభ్యున్నతికి పాటుపడి తమ జీవితానికి ధన్యత గడించాలని తోటి మహిళలను అభ్యర్హిస్తున్నాను. మనం లోపాలను సరిదిద్దుకుంటూ మూఢాచారాల ముసుగులో కొట్టుమిట్టాడుతున్న తోటి మహిళల విముక్తికై వారిలో అధునికత, శాస్త్రీయ దృక్పథం, సేవాతత్వం 'ప్రోదిచెయ్యడం కూడా మన కర్తవ్యమే అనేది నా తత్వం, 124 పరిణతవాణి ప్రసంగాలు
చివరగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. సంఘసేవ చెయ్యాలనేది ఒక ఆర్తి. ఒక బలవతరమైన వాంఛ. అది ఆ మనిషి యొక్క వ్యక్తిత్వంలో ఒక భాగం. నిరంతరం ఆ భావం వెన్నాడుతూనే వుంటుంది. అది పొగడ్తలకు తెగడ్తలకు చలించని ఒక అనుభూతి. కృతనిశ్చయంతో మంచిది అనుకున్నదానిని చేసుకుంటూ పోవడమే నా కర్తవ్యంగా భావించాను. ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా తాను ఒక ఘనకార్యం తలపెడితే అది తప్పక నెరవేరుతుంది. అది జయించలేకపోయామంటే అది మన ప్రయత్న లోపమే కాని దానికి మరొక కారణం వుండదు. ఇది నా జీవితానుభవంనుండి నేర్చుకున్న మొదటి సత్యం. చదువుకోవాలని పట్టుబట్టడం, 'హేతువాదిగా బ్రతకాలను కోవడం, వ్యక్తిత్వం, స్వేచ్చ. సమానత్వాలు ముందుగా నిలబెట్టకోవాలనుకోవడం, మపాళాభ్యూదయానికి మార్గదర్శకత్వం వహించాలనుకోవడం, సంస్థలను నిర్మించి తద్వారా సస్రీహిత కార్యక్రమాలు నిర్వహించాలనుకోవడం, సాహిత్యం ద్వారా (ప్రబోధించడం లాంటివి నా పట్టుదలకు పడికట్టు రాళ్లు, నిదర్శనాలు.
గత 50 ఏళ్లుగా రోజుకు 16 గంటలు పనిచేసి సాధించింది తక్కువేమి కాదు. సమాజంలో నేను చేసిన సేవకు గుర్తింపు వచ్చింది. నేను చేసింది చాలా తక్కువయినా నాకు వచ్చిన పేరుప్రఖ్యాతులు ఎక్కువ. దేశ విదేశస్టులెందరో పాగడుతుంటే నేను చేసినదానికన్నా ఎక్కువ గౌరవం వచ్చిందనే భావంతో సమాజానికి నేనే రుణపడి వున్నానని ఇంకెంతో సేవ చెయ్యాలనే స్పూర్తి నాకు కలిగింది. ఈ పరిస్థితులలో సమాజానికి నా సందేశమేమిటంటే = ప్రతి వ్యక్తి మేము ఏమి చెయ్యలేము? అసమర్జులం, అజ్ఞానులం అని బాధపడకూడదండి. ఏదో ఒక రంగంలో - కుంటి, (గ్రుడ్డి మూగ, చెముడు లాంటి అనేకులున్నారు వీటిలో ఏదో ఒక రంగంలో పనిచెయ్యడం అంత కష్టమేమో కాదు. మన ఆస్తి మన పిల్లలు, మనది అనుకోకుండా బయటివారికి తోడ్పడితే అదే మనకు శాశ్ళతానందాన్ని కలిగిస్తుంది. ఎంతటి చీకటినయినా ఛేదించే ఏ చిరుదీపమైనా వెలిగిస్తే అది వదిమందికి వెలుగునిన్హుంది. కనుక మనం (కుంగిపోకుండా, అసహాయులమనుకోకుండా, మన శక్తి సామర్థాలకు తగినట్టుగా సమాజసేవ చెయ్యడం మన ముఖ్య కర్తవ్యం. 'దానము భోగము నాశము పూనికతో మూడు గతులుభువి ధనమునకున్” అన్నాడు భర్చహరి. అంటే మన ధనం పరహితార్హం కారకు వెచ్చించాలనేదే దీని భావం.
ఇక్కడ నా శ్రేయోభిలాషులు, గౌరవనీయులు నాపై చల్లిన అమృతపు జల్గులు, అభినందనలు మోకు వినిపించాలనే కోరిక నాకు వుంది. ప్రముఖ శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 125
హ్యామనిస్టు శ్రీ వి.ఎం.తార్కుండే “భారత మహిళద్యమంలో ఉజ్వల తార మల్లాది సుబ్బమ్మ. ఆమె స్వయం కృషిలో అభ్యున్నతి సాధించిన విదుషిమణి. మహత్తర ఆటంకాలను అధిగమించి విద్యను నేర్చి కుల నిర్మూలన, కుటుంబ నియంత్రణ, హేతువాదం, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢ విశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్దరణ లాంటి అనేక అభ్యుదయ ఉద్యమాలలో ఆమె చేసిన కృషి గణనీయం” అన్నారు. డా॥ సి.నారాయణరెడ్డి ప్రస్తుతిస్తూ “ఎదురిదే చేతులుంటె ఏరు దారి యివ్వక ఏం చేస్తుంది. పయనించే అడుగులుంటె బాట చేతులెత్తక ఏం చేస్తుంది- అక్షరాలా శ్రీమతి మల్చాది సుబ్బమ్మ గారికి అనువర్తించే పంక్తులివి. వాలును బట్టి గాలిని బట్టి సాగిపోయిన వ్యక్తీగాదు ఆవిడ. పరమ సాంప్రదాయిక పరిధిలో పుట్టి పెరిగి. ప్రయోగాత్మక వాతావరణంలో సరి॥క్రొత్త జీవన (ప్రమాణాలను స్వీకరించి నమ్మిన ఆదర్శాలకు ప్రతీకగా నిలిచిన వ్యక్తిత్యం ఆమెది!” అన్నారు. ఆవుల సాంబశివరావుగారు “ఒక మామూలు మనిషి ఒక ఉద్యమ నేతగా పరిణమించిన రీతికి దర్పణం ఆమె జీవితం. సుఖ్బమ్మగారి ఆత్మకధ ఒక సఎబుర శంఖారావం. ఇది ఒక స్వయంసిద్ద జీవిత గాధ” అని (ప్రస్తుత్తించారు. ఇంకా ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం ప్రస్తుతిస్తూ “షష్టిపూర్తినాడు యావదాస్తిని ధర్మ సంస్థలకు దానం చేసి, తనిప్పుడు ట్రస్టు ఇంట్లో వుంటున్న అనుభవం పొందుతోంది సుబ్బమ్మగారు. ఆమె నడిగే ప్రశ్నలకు ఆమె జీవితమే సమాధానం,” అన్నారు. శ్రీ టి. రాధాకృష్ణ ఇలా అన్నారు: “దిస్ ఈజ్ ఎ మాస్టర్ పిస్ రిటెన్ విత్ ఫార్ మోర్ ఎల్యూసీడేషన్ దేన్ మోష్టుడాక్టరల్ డిసర్టేషన్సు ఇన్ తెలుగు దీజ్ డేస్”. కృష్ణ ఒడ్డున పోతార్లంకలో పరమఛాందస కుటుంబంలో పుట్టిన నేను 1995లో (ప్రపంచ హ్యూమనిష్ట్ర మహా సభలు లండన్‌లో జరిగినప్పుడు ప్రపంచ హ్యూమనిష్టు తార్కుండే ఇంటర్ నేషనల్ హ్యూమనిష్టు అవార్డు ఇచ్చారు. ఆ సభకు రామ్ముర్తిగారు స్పీకరు, నేను డెలిగేటుగా వెళ్ళాం. ఎక్కడ ప్రపంచ హ్యూమనిష్టు మహాసభ! పోతార్లంకలో పుట్టి ఈ స్టితికి రావటమంటే అదెంతట వారికి సాధ్యం! నా పుట్టుక, నా విద్య, ఆచారాల పరిస్టితి ఎక్కడ? లండన్ హ్యూమనిష్టు సభల పరిణామం గొప్పవింత. మిత్రులు, హ్యూమనిష్టులు నన్ను అభినందిస్తూ వుంటారు. టే 126 పరిణతవాణి ప్రసంగాలు
డా, జె. బావురెడ్డి (3-2-2006)
అనంతమైన కాలం వెంట సాగే అన్ని యాత్రలకు ఒక ఆరంభం, ఒక పరిసమాప్లి ఉంటాయి. అన్నిటికీ మాతృక జీవితయాత్ర. ఏడు దశాబ్దాలుగా కొనసొగుతున్ను నా జీవిత యాత్రలో - స్వదేశయాత్రలు, విదేశయాత్రలు, విజ్ఞానయాత్రలు, వినోద యాత్రలు, తీర్థయాత్రలు వంటి ఎన్నెన్నో యాత్రలు అంతర్భాగాలౌతున్నాయి. అయితే ఈ అన్నింటికి అనుసంధానమైన అతిముఖ్యమైన యాత్ర నా “సాహితీయా(త్ర”. 1950 దశకంలో యాదృచ్చికంగా రూపొందిన ఆయాతత్ర, ఎన్నెన్నో మజిలీలు దాటి, ఎన్నెన్నో అక్షరానుభూతుల్ని, అనుభవాలను, జ్ఞాపకాలను మూటగట్టుకొని ముందుకు సాగిపోతున్నది. అప్రమేయ. దేశకాల విలసితమైన సృష్టిలో క్రాంగొత్త సత్యాలను అన్వేషిస్తూ గమ్యానికి చేరునవుతున్నది. తనకు తాను ఒకసారి తిరిగి గత కాల సృృతుల అద్దంలో చూచుకొంటున్నది. నాకు జన్మనిచ్చిన యువనామ సంవచ్చరం
నేను కరీంనగరంజిల్దా, సిరిసిల్లా తాలుకాలోని సిరికొండ (గ్రామంలో యుననామ సంవత్సరంలో పుట్టినట్లు నా తండ్రి జంకె కృష్ణారెడ్డిగారు నేను సుమారు పదిహేను సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఏదో సందర్భంలో చెప్పాడు. ఆ విషయం ఆయనకున్న పరిమితమైన “పంచాగ” పరిజ్ఞానంతో ప్రస్తావించాడు. అయితే నన్ను 1948లో సిరిసిల్టా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చేర్చించినప్పుడు ఆనాటి ఉర్జూ భాషా సంప్రదాయం ప్రకారం ్రవేశషత్రంలో ఉర్దూ క్యాలెండర్ (జంత్రీ) ప్రకారం వేసిన అంకెల ననుసరించి ఉత్తరోత్తర నా జన్మదినం జూలై 21, 1986గా స్టీరపడింది. ఏదిఏమైనా నేను 1936కు సరిపోయే యువనామ సంవత్సరంలోనే పుట్టినానని నా తండ్రి చెప్పిన సత్యం పై నాకు దృఢవిశ్వాసం కలిగింది. అందుకే నేనునా డా. జ బావురెద్ది 127
షష్టిపూర్తి సందర్భంలో నిరాడంబరంగా (వ్రాసుకున్న పద్యాలలో నా స్పందన ఇలా వెలువడింది. “యువ నామ సంవత్సరము నను భువిపై పడవేసి వెడలి పోయెనెటకొ, మా నవజీవిత విపణిని నా వ్యవహారము చూచిపోవ వచ్చెను మగుడన్! ఏ నా కమ్ముకు తీసిపోనటులుగా ఈ లోకమున్ తీర్చు, కా వ్యానేకమ్ములు కూర్చి, సంతతచిదద్వైతాత్ముడౌా నన్ను, చై (త్రానందమ్మున చూచి మెచ్చి, యువనా మాబ్దమ్ము దీవించే; వత్సా! నీ సత్కృతులెల్ల లోకముల సత్సంయోగమున్ కూర్చెడిన్” నన్ను యువనామ శక్తియే కన్న కతన చిరయువత్వము నా భావ చేతనమున వెలుగుచున్నది, అమృతత్వమలది; ముదిమి (త్రాసమే లేదు నా కవితాసవితకు” నాకు - నా వయసుకు మధ్య 'యువత్వము' నిలిచియుందో ఏమో! అందరూ నన్ను ఎప్పుడూ యువకుడుగానే కనిపిస్తున్నావంటుంటే “వాస్తవముకన్న బ్రతుకులో భ్రాంతి మిన్న” అని తెలిసికొన్న నా కవితాత్మ కూడా ఆనందిస్తూ ఉంటుంది. అందుకే నా పరిణత వాణి వినిపించడానికి నన్ను ఆలస్యంగా పిలవడానికి కారణం నా 'యువనామి జాతక 'ప్రభావమేనన్నట్టు పెద్దలు, అధ్యక్షులు నారాయణరెడ్డిగారు వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఇప్పుడు నా వయస్సు 'సప్తతి' వేడుకలకూ, సాహిత్యజీవిత స్వర్ణోత్సవాలకూ ముస్తాబవుతున్న శుభసందర్భంలో నా అనుభవాలు చెప్పడానికి నా గత స్మృతుల మూట విప్పటానికి అవకాశం కలిగినందుకు ఎంతో మురిసిపోతున్నాను. అందుకు మొట్టమొదటే 'ఆంధ్ర సారస్వత పరిషత్తు" వారికి ముఖ్యంగా ఆ సంస్థను కల్పవృక్షంలా పోసిస్తున్న జ్ఞానపీఠ పురస్కార శోభితులు, మహాకవి డా. సి. నారాయణరెడ్డి గారికి, ఆయనకు కొండంత అండగా నిలిచి కృషి చేస్తున్న, ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారికి, డా. జె. చెన్సయ్య వంటి మిత్రులకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. ఇక ఇవాళ ఫిబ్రవరి మూడవ తేది. ఈ రోజుకున్న విశిష్టత ఏమిటంటే నా జన్మదినం 21 జూలై లేక 38 ఆగష్టు, ఈనాడు ఫిబ్రవరి 3. నా ఉపన్యాసం 36వది, వేదిక మీద పెద్దలు ముగ్గురు కూర్పోవటం, ఇది 21వ శతాబ్దం, 3వ సహస్రొబ్టికావటం, 1208 పరిణతనాణి ప్రసంగాలు
నా సాహిత్యం మూడు ప్రక్రియలో, మూడు ధారలుగా సాగటం అన్నిటికీ మూలసంఖ్య మూడు కావటం ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. ఆంధ్ర సారస్వత సరిషత్తుతో అనుబంధం మరొక విశేషం ఏమిటంటే ఇంచుమించుగా నా సాహిత్య జీవితంలోని తాలి ముఖ్యఘట్టం ఇదే ఆం(ధ్రసారస్వత పరిషత్తు వేదిక మీద 1960లో ఆరంభం కావటం. ఇక్కడే పూజ్యులు శ్రీ దేవులపల్లి రామానుజరావు గారి అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలో నా తాలి కవితా సంపుటి, “చైతన్య రేఖలు” అప్పటికే మహాకవిగా వెలుగుతున్న డా. సి.నారాయణరెడ్డి గారికి అంకితం ఈయటం. ఆ సభలో ఆచార్య దివాకర్ల వెంకటావధాని, డా.బోయిభీమన్న, దాశరథి వంటి ఉద్దండులు నన్ను ఆశీర్వంచడం మరుపురాని మధురస్మృతులు. “నారాయణరెడ్డి కవీ! నవ్య గేయ మహాకవీ! ఆంధ్రుల హృన్నిరేజములందు వెలుగు కళారవీ!” అంటూ అంకితగేయంలో కృతి స్వీకర్తను కీర్తించాను. ఆ వాక్కు , నాలో బుషిత్వాన్ని మేల్కాలిపిన బుక్కు అయినందుకు గర్విస్తున్నాను. 50 వ దశకంలో చిగురించిన. కవితలన్నీ పరిమళించిన ఆ చిరుకావ్యసంపుటి ప్రచురణకు కారకులైన శ్రీ రాజగోపాలరెడ్డి గారిని గూర్చి పలికిన పద్యం ఏనాటికీ వాడిపోని సత్యసుందర పద్మంగా భాసిస్తూంది- “కవులనాదరించి కావ్య ముద్రణలకు - వలయుసాయపడెడి వారులేని, నేటి కాలమందు, నీ వంటి వారు - ఒయాసిసులు లెడారు లందు, బావ! నేటి యువకులందరి రచనలను ఈలాంటి వదాన్యులైన 'ఆత్మబంధువులు” వెలుగులోకి తీసుకురావాలని ఆశిద్దాం. నా సాహితీయాత్రలో మొలిచిన ఆ “చైతన్య రేఖలు” సముజ్బలమైన కొవ్వ వృక్షాలుగా పెంపొందడానికి జీవధారలందించాయి. ఆం[్ర సారస్వత పరిషత్తు ఆవరణలో వెలిగిన ఆ కళ్యాణ జ్యోతి, జన్మజన్మలకు మరువలేని మహానుభూతి. ఆ తర్వాత పరిషత్తు వేదిక మీద నా "గేయనాటికలు” ఆవిష్కరింపబడి, ' సినీతార" శ్రీ గుమ్మడి వెంకటేశ్చరరావు గారికి అంకితం చేయడం, ఉత్తరోత్తర, “బాపురెడ్డి గేయాలు” కవితాత్ముడు బోయిభీమన్న గారికి అంకితం చేయడం వంటి నా సాహిత్య కార్య[క్రమాలెన్నో ఇక్కడే జరగడం నేను ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ, పరిషత్తుతో నాకు ఏర్పడిన అనుబంధం పవిత్రమైన అనురాగగంధం అయినందుకు పులకిస్తున్నాను. డా, జె బాపురెడ్డి 129
సాహిత్యరంగ ప్రవేశం - ప్రస్థానం
బాల్యంలో, నా తండ్రి జంకె కృష్ణారెడ్డిగారు భక్తి పారపశ్యంతో, భావయుక్తంగా పాడిన కీర్తనలు, పద్యాలు నా నాలుక చిలుకకు పలుకులు నేర్చేవి. నా అమాయిక జిజ్ఞాసకు గిలిగింతలు పెట్టేవి. జానపదకళారూపాలైన హరికధలు, బుర్రకథలు, భజనలు, వీధి భాగవతాలు నాలో మేల్కొంటున్న 'బాలకవి' వెన్నుతట్టేవి. ఈ సందర్భంలో “నీలగిరి పంతులు” చిందులువేస్తూ చిరుతలు (మోగిస్తూ చెప్పిన హరికధలు ఇప్పటికీ నా చెవుల్లో రింగుమంటున్నాయి. మా ఊరి "హనుమాండ్లగుడి”లో పెద్దలు చేసిన భజనలతో (శ్రుతి కలిపిన నా 'అవ్యక్షానందం' ఇప్పటికీ నాలోని బాల్యాన్ని బ్రతికిస్తూనే ఉంది. “సంతసకరమైనదీ వసంత కాలము” అంటూ విశ్చనాథం అనే జొత్సాహికుడు ప్రీ పాత్రలో పాడిన నాటకపు సన్నివేశాలు మననం చేసుకొంటున్నాను. ఆనాడు అర్థం తెలికపోయినా, భావవసంతాలు శబ్ద విన్యాసాలు నన్ను అలరించేవి.
బీజరూపంలో ఉన్న నాలోని భాషాసాహిత్యాలపైని ఆసక్తి అభిమానం కరీంనగర్లో నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు విచిత్రంగా మొలకెత్తింది. మా, ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ముద్దురామకృష్ణయ్య గారికి స్థానచలనం (తబాదిలా అని అప్పుడు, (ట్రాన్స్ఫర్ అని ఇప్పుడు అంటున్నది) జరిగినప్పుడు ఆయన పట్ల విద్యార్దులకుండే అపారమైన గౌరవం అందరితో పాటు నన్నూ కన్నీరుపెట్టించింది. ఆయన అప్పుడప్పుడే లండన్‌లో ఉన్నత విద్యార్దన చేసి వచ్చాడు. వినూతనమైన విద్యా బోధనా పద్దతులు [క్రమ శిక్షణ, వ్యక్తిత్వవికాసంవంటి అం లు (ప్రవేశపెట్టి సంచలనాత్మకమైన చైతన్యం, అవగాహన కలిగించాడు. ఆయన తొలిసారి నిర్వహించిన పార్యేతర కార్యక్రమాలలో జరిపించిన పోటీలలో వకృృత్వం, వ్యాసరచన, తోట పెంపకం వంటి అంశాలతో పాటు “కవితలు” అల్లడంలో కూడా విద్యార్దుల్లో ఎంతో ప్రేరణ కలిగించింది. అన్నిటితో పాటు నేను కవిత్వం పట్ట చూపిన ఆసక్తి అభిరుచి గుర్తించి నాకు ఆయన ఇచ్చిన సర్టిఫికెట్టు, ఇప్పటికీ నా 'ప్రయివేటు (గ్రంధాలయం'లో భద్రంగా ఉండడం చూచి పులకించాను. “ప్యారేబచ్చో!” - (ప్రియమైన పిల్లలారా) అంటూ సంబోధిస్తూ ఆయన అడపాదడపా నిర్వహించిన బహిరంగ తరగతుల్లో ఆయన విజ్ఞానం, వివేకం, (ప్రేమతత్వం జఇట్టిపడేవి. మరి ఆయన వెళ్లిపోతున్నాడంటే, సురమౌళి వంటి సీనియర్జు చిన్నచిన్న ఉపన్యాసాలతో, కవితలతో శ్లాఘిస్తూ తమ ఆవేదనను వ్యక్తంచేశారు. అప్పుడే నాలో పెల్లుబికిన ఆవేదన, ఆవేశం నా కవితకు (శ్రీకారం చుట్టింది.-
“అయ్యయ్యొ నేడెంత ఘోరవార్తవింటి-అ(శ్రువులు రాలంగ ఆవేదనలు పొంగ
మాదు హెడ్మాష్టరు, మమ్ములనువిడనాడి-వేరె చోటునకు వెళ్తుతున్నాడనగ.....” 130 పరిణతవాణి ప్రసంగాలు
“భక శోకత్వమాగత'” అనట్టు ఆవేదనలో నుంచే, రసార్టమైన హృదయం నుంచే నాకవిత ఆవిర్భవించింది. అందుకే అది ఇంతకాలం నవరసభరితంగా సాగిపోతున్న దేమో!
తెలుగు మాస్టార్డు శ్రీ మేడిచర్ల ఆంజనేయమూర్తి గారు, శ్రీ ఎం. నారాయణ గారు నాలో పొడ చూపిన సాహిత్య పిపాసను గుర్తించి నన్ను ప్రోత్సహించడం, ఛందస్సు నేర్చుకొమ శని 'సులక్షణసారం' వంటి (గ్రంధ్రాలు నాకు ఇప్పించడం, రచనలు చేస్తూ సాధన చేయమని నన్ను ప్రోత్సహించడం, తరచు పారశాల (గ్రంధాలయంలో ఉన్న సాహిత్య (గ్రంధాలు తిరగవేస్తుండడం నా జిజ్ఞాసను మరింత ఉద్దీపింప జేశాయి.
1952-53 కాలంలో, నారాయణరెడ్డిగారితో నాకు తొలి పరిచయం కలిగింది. అప్పుడప్పుడు ఆయన గురించి, నా శ్రేయోభిలాషి మా ప్రక్క ఊరియజమాని శ్రీ యస్ నారాయణరావు గారు, నారాయణరెడ్డి “నవ్వనిపువ్వు” గురించి ఆయన కవితా (ప్రతిభను గురించి ముచ్చటిస్తుంటే ఆయన్ని చూడాలనిపించేది. కాకతాళీయంగా ఆయన కరీంనగరం రావటం, జిల్టా విద్యార్థి సంఘం నాయకుడుగా ఉన్న నన్ను “తెలంగాణ రచయితల సంఘం కఠింనగరం శాఖ” నిర్వాహకునిగా నియమించడం జరిగింది. నారాయణరెడ్డి గారు నా గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు సభల్గో సమావేశాల్లో ఆప్యాయంగా, ఒక మధుర స్మృతిగా ఈ విషయం పేర్కొంటూ ఉంటారు. ఆనాడు స్కూలులో ఏర్పాటు చేసిన ఆయన కావ్యగానం ఎన్నెన్నో సంఘటనలను గుర్తుకు తెస్తుంది. కాలేజి జీవితం - కవితా తత్వం
1953లో మెట్రిక్ లేషన్‌లో ప్రథమశ్రేణిలో ఉతీర్ణున్నై (అరుదైన గౌరవం ఆ రోజుల్లో, 'ప్రతివ్రాత్మకమైన నిజాం కళాశాలలో చేరిన తర్వాత నా సాహితీ యాత్రలో తాలి ముఖ్యఘట్టం ప్రారంభమైంది. చేకూరిరామారావు, నలమాద యాదగిరిరెడ్డి, జగడం లక్ష్మినారాయణ, పాడిబండ్ల రాజేంద్రప్రసాద్ వంటి సాహితీ ప్రియులతో “సాహతీ వాహిని”గా పేరు పెట్టుకున్న ఒక ఆంతరంగిక బృందంలో నేను సభ్యుడుగా చేరాను. వారందరూ కమ్యూనిజాన్ని అభిమానించే అభ్యుదయ వాదులుగా, నేను సంప్రదాయాన్ని వీడలేని గాంధేయ మార్గగామిగా భావించేవారు. నా సాహిత్య రచనను కూడా వారు అదే దృకృధంతో చూసేవాళ్లు-అయినా కళాశాల తెలుగు విద్యార్ధి సంఘం అధ్యక్షుడుగా, ఆంధధ్రాభ్యుదయోత్సవాల కార్యదర్శుల్లో ఒకరుగా, (ప్రతిభావంతుడైన 'యువకవిగా” నాకు గుర్తింపు ఉండేది-కాలేజీలో జి.వి.సుబ్రహ్మణ్యం గారితో కలిసి అనేక వకృృత్వ వ్యాసరచన పోటీలలో పాల్లొని బహుమతులు గెలుచుకొనేవాణ్ని. ఎండాకాలపు సెలవుల్లో డా, ఇ. బాపురెడ్డి 131
నా స్వగ్రామంలో పొద్దుపుచ్చుతున్నప్పుడు పంటచేలలోని 'మంచెలమీద' కూర్చుని కావ్యాలు, నవలలు, చదివేవాబ్ని. గొపీచంద్ “అసమర్జుని జీవయాత్ర”, అడవి బాపిరాజు “నారాయణ రావు”, రవీంద్రుని “పడవమునక”, బుచ్చిబాబు “చివరకు మిగిలేది” వంటి నవలలు, చదివి పొందిన ఆనందానుభూతులు ఈనాటికీ స్పృతి పధంలో కదలాడుతూనే ఉంటాయి. మామిడి తోపులో ఆడుకుంటూ, కోకిల పాటకు-మామిడి పండుకు ఏదో అనుబంధం ఉందన్న భావం స్ఫురించగానే, విరబూచిన ఊహలు తీయని గీత పద్యాలైపోయాయి- “ఈ రసాలవృక్షాల కోయిల గళాలు పోసిన సుగాన సుధ (త్రాగి వేసెనేమొ! మండుటెండల గ్రీష్ముండు బెండు బోవ, మధువుతో పొంగులెత్తై ఆమ్రఫలజాతి! ఇది, జరా మరణాలు లేని నా తొలి ఛందోబద్ద (ప్రామాణిక పద్య కవిత అయింది. నిద్ర పోతున్న నాకు మా కుగ్రామంలో అర్దరాత్రి నిద్రమాని వినిపించిన ఊరకుక్కల “గొంతులు” శ్రీశ్రీ గారి “అగ్గిపుల్ల”, “కుక్క పిల్లను” తలపించాయి. ఆ రాత్రికి రాత్రే “కుక్క- కావ్య వస్తువు” అనే శీర్షికతో వ్రాసిన కవిత, నాటికీ, నేటికీ, కరుణ రసభరితమైన, అభ్యుదయభావ కావ్య ఖండికగా గుర్తించబడటం నా అదృష్టం. అది నా తాలి వచన కవితగా రాణించి నేటికీ కవి పండితుల, విమర్శకుల (ప్రశంసలకు పాత్రం అయింది: “లోకమంతా నిద్రిస్తూంది చీకటి భీకరంగా చూస్తూంది నిర్భయంగా నీ గొంతు మాత్రం నిశల చీల్చుక వినిపిస్తూంది నిద్రమాని నా మనస్సు నిన్ను గూర్తి ఆలోచిస్తూంది కుక్కా! నీ బ్రతుకు మిద ఒక్క కావ్యం రాయాలనిపిస్తూంది మత్తుగా జీతం తిన్న పోలీసువాళ్లు రాత్రి కాపలాకాస్తూ ఏమూలో గురక పెడుతుంటే జీతం బత్తెంలేక నీవు జీవితాంతం సేవచేయడం చూస్తే మనషులన బడే వాళ్లకంటే నీకే ఓ నమస్కారం చేయాలనిపిస్తూంది” “వెైతన్య రేఖలు” నా తొలి కవితా సంపుటి 1960 వరకు ఇలా సాగిన కవితలెన్నో 1960లో నేను తొలుత ప్రస్తావించిన “వైతన్య రేఖలు” గా రూపు దిద్దుకున్నవి. నేను ఎందుకిలా ఈ “చైతన్య రేఖలు” గురించి పదే పదే (ప్రస్తావిస్తున్నానంటే &-5 సంవత్సరాల కాలంలో (వ్రాసిన అందులోని కవితలు నిజానికి నా సాహిత్య దృకృధానికి, కవితా తత్వానికి అన్ని ప్రక్రియలపట్ట అభిరుచికి మూలబీజాలుగా నిలిచినవి, 1955 నుంచి - 2005 వరకు నా కలం 132 పరిణతవాణి ప్రసంగాలు
నుండి జాలువారిన రచనలన్నీ 1960లో ప్రచురితమైన “చైతన్య రేఖ”లలో నుంచి వెలువడిన కాంతి పుంజాలే, కిమ్మీర వర్గాలే, భావచిత్రాలే. అందుకే నాకనిపిస్తుంటుంది మనిషి ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు, జయాపజయాలు, ఆశలు, ఆశయాలు ఏవైనా అవన్నీ ఆయన ఒకే ఒక జీవిత (గ్రంథంలోని పుటలే- ఆధ్యాయాలే. అందుకే ఒక మహాకవి అన్నట్టు, కవి నిజానికి వ్రాసేదంతా రూపాలు, నామకరణాలు, ప్రక్రియలు భాషలు వేరు వేరుగా ఉన్నట్టు అనిపించినా చివరుకు అవన్నీ ఆ కవి వ్రాసిన ఒకే
(గ్రంధంగా పరిగణింపవచ్చు. నా విషయంలో ఇది పూర్తిగా వర్తిస్తుందనే విశ్వాసం నేను
“వైతన్యరేఖ”ల్టోకి మళ్లీ తొంగిచూస్తే కలుగుతున్నది. అరశతాబ్దీగా సాగుతున్న నా సాహిత్య రచనల మీద వచ్చిన సమీక్షలు, విశ్తేషణలు,
విమర్శలు, వ్యాసాలు, 14.0111, 01.0. వంటి పరిశోధనలన్నిటిలో నాలుగు అయిదు
అంశాలు గుర్తింపబడ్డాయి:
1 పద్యం, గేయం, వచిన కవిత, గేయ రూపకాలు, వ్యాసాలు అన్ని ప్రక్రియల్లో ఇంతో అంతో నేను రచనలు చేశాను. ప్రక్రియా పక్షపాతంలేని ప్రతిభా పక్షపాతం నాది.
- ప్రణయం, సామాజిక ప్రగతి, ప్రణవం - వీటి చుట్టే నా సాహిత్య సృష్టి అంతా జరిగింది. మనిషి జీవితంతో ముడిపడ్డ ఈ మూడు సంబంధాలు పరస్పర అనుబంధాలే కాని విరుద్దాలు కావన్నది, కాకూడదన్నది నా అభిప్రాయం ఆశయం-ఆచరణ.
3 సం(ప్రదాయం-ప్రయోగం ఇవి విడదీయరాని అద్వెత ద్వైతాలు-ప్రాచీనమా, అర్వాచీనమా అని కాక సమీచీనమైనదే ఉత్తమ రచనగా గుర్తించడం సాహిత్య విమర్శకు మార్గదర్శకం కావాలి.
- కవిత్వానికి వస్తువు కన్నా తద్వస్తుగతమైన భావం ముఖ్యం. సృజనాత్మకత, సత్యదర్శనం, సందేశాత్మకత, రసాత్మకత కవితా సృష్టికి ప్రమాణాలు కావాలి. ఈ నాలుగు అంశాలు నాకు తెలియకుండానే “వైతన్యరేఖ "ల్లో ఎలా నిక్షిప్తమైనాయో
కాస్త వివరిస్తాను. నవ్యసాహితీ సమితి (ప్రచురించిన చైతన్య రేఖల్లో ఆ సమితి అధ్యక్ష-కార్యదర్ములైన
బోయిభీమన్న-పోతుకూచి సాంబశివరావు వారి 'మనవి మాట” గా నా గురించిన
(వ్రాసిన మాటలు --
- శ్రీ బాపురెడ్డి గారు వయస్సుకు చాలా చిన్న వాడైనా కవితలో పెద్ద, ఇప్పటికే సాహిత్యరంగంలో ఈయన ఒక చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. అనువాదాలు,
డా. జె బాపురెడ్డి 133
అనుసరణలు వంటి శ్రైధిల్యాల వైపుపోక, స్వచ్చమైన స్వతంత్రమైన భావోద్వేగంతో ఆశాపధంలో ముందుకు దూసుకపోవడానికి ఉద్యుక్తుడైన సాహితీ పధికుడీయన.
'నా ఓటమి ఈ జగద్వినాశమునకు సంకేతం నా వికాసమున లోకం నాకమ్మాతుంది నిజం' అనగలిగిన అజేయుడీయన- పద్యాన్ని, గేయాన్ని వచనకవితనూ కూడా సమాన ప్రతిభతో నడిపించగల నైపుణ్యం ఈయనది-కావ్య వస్తువుగా పనికిరాని వస్తువేలేదు ఈయనకు. కవి బహుముఖ ప్రజ్ఞా నంతుడైన శిల్పి. అతని చేతికి ఏ వస్తువు దొరికితే ఆ శిల్బంగా రూపొందుతుంది. ఈయన అట్టివాడనడానికి ఈ సంపుటిలోని ప్రతిఖండ కావ్యము ఒక నిదర్శనమే”
ఆ మహానీయుల వాక్కులు, బుక్కులై వారు ఆశించిన “ఆశాపధంలో” నన్ను నేటిదాక సుమారు అర్హశతాబ్దం కాలం నడిపించాయి. వారు నాలో ఆనాడు కనగొన్న లక్షణాలే ఈనాటీ వరకు చెక్కు చెదరకుండా ఉన్నట్టు విమర్శకులు, సహృదయులు చేస్తున్న నా సాహితీ విశ్లేషణలు, విమర్శలు, సమీక్షల వలన తెలుసుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
1959లో 'ఆర్థిక శాస్త్రంలో నేను ఎమ్.ఎ పట్టం పుచ్చుకున్న నాటికే నిజాం కళాశాల, ఉస్మానియా విశ్శ విద్యాలయం కళాశాల విద్యార్హిగా నాకు జి.వి. సుబ్రహ్మణ్యం, శ్యాం బెనెగల్, చేకూరి రామారావు వంటి ప్రతిభావంతుల సాహచర్యం లభించింది. కళాశాల తెలుగు విద్యార్షి సంఘం అధ్యక్షుడుగా, ఒక ఉత్తమ విద్యార్థి నాయకుడుగా, వర్హమాన కవిగా, పండితులు మహాకవులు కృష్ణశాస్త్రి, దాశరధి, బోయిభీమన్న, బుచ్చిబాబు, గోపీచంద్, రావూరి భరద్వాజ వంటి సాహితీ మూర్తులతో కూడా సాన్నిహిత్యం ఏర్పడింది. వారి వాత్సల్యం నా సాహితీయాత్ర విజయోన్ముఖంగా సాగడానికి దోహదం చేసింది. తన తాలి రచన “నవ్వని పువ్వు” నే యువకోటి హృదయాల్లో ఆరని దివ్వెలా వెలిగించిన సి.నారాయణరెడ్డి గారి నిరంతర దేదీష్యమాన సృజన శీలత ప్రభావం ఆగణిత యువరచయితల వలెనే నా మీద కూడా పడింది. అలాగే ఇతర (ప్రభావాలు కూడా నా మీద ఉన్నా అన్నిటినీ జిజ్ఞాసతో జీర్షించుకొని విజ్ఞతతో నాదైన స్వతంత్ర దృక్పథం ఏర్పరుచుకున్నాను. 'ఎకానిమిక్స్ సుందరి" వంటి (ప్రయోగాత్మక రచన నా సృజన చేతనకు నిదర్శనంగా పేర్వారం జగన్నాధం వంటి సహాధ్యాయులు 'పేర్కొన్నప్పుడు నాకెంతో ప్రేరణ కలిగేది. “దీప సభ” తో తన బహుముఖీన ప్రతిభా 'ప్రభతో నన్ను ఆకర్షించిన బోయిభీమన్న నన్నాదరించిన తీరు మాటలకందని మమతలమిన్నేరు.
134 పరిణతవాణి ప్రసంగాలు
రెండవ మజిలీ 1961-70
1960 తర్వాత ఒక దశాబ్దం పాటు నా సాహితీయా(త్రలో రెండవ మజిలీ కొన సాగింది. 1959లో (వ్రాసిన ఆం(ధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ పోటీ పరీక్షలో అనూహ్యంగా అత్యుత్తమ స్థాయిలో నెగ్గి డిప్యూటీ కలక్షర్గా ఎంపిక కావడం, 1961 జనవరి 9 నాడు విశాఖపట్నంలో ఉద్యోగంలో చేరడం నా వృత్తిపరపైన జీవితంలోనే గాక ప్రవృత్తి పరమైన సాహిత్య యాత్రలో కూడ గణనీయమైన పరివర్తనం కలిగించింది. అధికార దర్బం, ఉద్యోగధర్మం, సృజనాత్మక సాహిత్య రచనకు భంగం కలిగిస్తుందన్నది వాస్తవమే అయినా అదృష్టవశాత్తు నా ఆత్మ దఘ్నమైన కవితా చేతన, సౌందర్యారాధన, సత్యశోధన, విజ్ఞాన పరమైన వృత్తి నిర్వహణకు సమాంతరంగా ముందుకు సాగాయి. వృత్తికి - (ప్రవృత్తికి మధ్య వైరుధ్యం లేని వైవిధ్యాన్ని పోషించే దృక్పధం నాకు ప్రాప్తించింది. అందుకే నేను కవిగా ఎంత ఎదిగినా, పరిపాలనా దక్షుడుగా కూడా అంతగానే, ఇంకా మిన్హుగానే ఎదిగిన వ్యక్తిత్వం ఒక అపురూప వరంగా నాకు సం(క్రమించింది. సమర్జ్హుడైన “పరిపాలకుడు-పదపాలకుడు” అనే నానుడి నాకు కూడా పెద్దలు వర్తింప చేసినప్పుడు నేను వినమ్రతా భారంతో శిరస్సు వంచే వాణ్ని. డిప్యూటీ కలెక్టరగా 1961లో నేను విశాఖపట్నంలో ఉద్యోగంలో చేరడం నా సాహితీయాత్రలో ఒక అనూహ్యమూ సృజనాత్మకమూ అయిన మలుపు. అక్కడ ఉన్న అయిదేళ్లలో తెన్నేటి విశ్వనాథం, రావిశాస్త్రి, వసంతరావు వెంకటరావు, అచ్యుత రామరాజు వంటి ప్రజ్ఞానిధులతో ప్రగాఢ పరిచయం ఏర్పడంది.
“విశాఖలేఖ”, 'అరుకులో అభ్యుదయం, 'బుతురాగం' వంటి (ప్రాచుర్యం పొందిన కవితలెన్నో నేను విశాఖలో (వ్రాసినవే. వృత్తిరీత్యా గడించిన అనుభవాలకు నా కవితా(ప్రవృత్తి కూర్చిన రమ్యాక్షరరూపాలే అవి. డా! డి.కృష్ణమూర్తి (డిక్కీ) ప్రోత్సాహంతో “బుతురాగం” వంటి గేయనాటికలు వ్రాసి నేను గేయనాటక కర్తగా గుర్తింపు పొందాను. ప్రముఖ సాహిత్య విమర్శకుడు తంగిరాల వెంకటసుబ్బారావు “భారతి”లో వ్రాసిన వ్యాసంలో తెలుగు సాహిత్యంలో బుతువుల గురించి మౌలికమైన రచనలు చేసిన విశ్చనాధ సత్యనారాయణ, నారాయణరెడ్డి, శేషం ద్రశర్మతోపాటు “బుతురాగం” నాటిక రచించిన నన్ను కూడా పేర్కొన్నాడు.
1960 - తర్వాత వ్రాసిన కవితలన్నీ “రాకెట్టు రాయబారం” పేరుతో సంపుటీకరించి ఆవిష్కరించింది విశాఖలోనే 1964లో. రసచిత్తుడు శ్రీ కె ఎస్.దత్తుగారికి ఆ గ్రంధ అంకితం చేసిన సన్నివేశం ఈనాటికీ నా గుండెలో గుబాళిస్తూనే ఊంది. 'రాకెట్ల రాయబారానికి' ఇతి వృత్తమైన అంతరిక్షయాత్రలు నాలో విహాయస దృష్టిని కల్పించినవి. దా. జె బాపురెద్ది 135
విఖ్యాతులైన పరిశోధకులు పూజ్యులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారు నా “రాకెట్టు రాయబారం” చూచి నన్ను పితృవాత్సల్యంతో, ఆశ్చర్యచకితుడై ఇచ్చిన అభినందన పూర్వక ఆశీస్సులు నా భావుకతను మేల్కొల్పిన మధురోషస్సులు. 1960లో నా తొలి కవితా సంపుటి తర్వాత ప్రచురితమైన “రాకెట్టు రాయబారం” ఆనాటికే సాహిత్య సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ది కెక్కిన విశాఖపట్నంలో ఆవిషృతం కావడం నాకొక విలక్షణమైన అనుభవంగా మిగిలిపోయింది. అందుకు కొంచెం ముందు 1962-63లో అనుకుంటాను గుంటూరు జిల్లాలో నారాయణరెడ్డి గారికి జరిగిన తొలి “సాహితీ సన్మాన మహోత్సవం” నాకు ఒక ఆనందోత్సవంగా స్ఫురించింది. కార్య నిర్యాహకులైన అన్నపురెడ్డి విజయభాస్కరరెడ్డి, (బ్రహ్మానందరెడ్డి యువ రచయితులు కోరినట్లుగా నేను ఆ మహాయజ్ఞానికి ఆర్థిక సహయం సేకరించి పెట్టిన ఘట్టం నాలోని కార్యదక్షతకు కట్టిన మొట్టమొదటి పట్టం. అప్పుడప్పుడే సినారె సినీకవిగా, “గులేబకావళి” వంటి చారిత్రాత్మక చిత్రంలో కథానాయకుడైన ఎన్‌టి.ఆర్ వంటి కొమ్ములు తిరిగిన కళాకారుల (ప్రశంసలందుకుంటున్న శుభతరుణం. అది ఘంటసాలతో పాటు నారాయణరెడ్డి గారికి జరిగిన గుంటూరు సన్మానం, తెలంగాణ సాహితీ ప్రతిభకు ఆంధ్రావని కట్టిన సంభక్తి తోరణం. వ్యక్తిగతంగా ఆనాడు నాకది ఒక గర్వకారణం.
విశాఖలో ఉద్యోగం చేసిన ఐదు ఆరు సంవత్సరాలలో నేను తెలంగాణ వాసి నని చెప్పినా నమ్మలేదు. అయినా “తెలంగాణీయుల” వేషభాషల గూర్చి, ఆచార వ్యవహారాల గురించి, ఆర్థికస్టితిగతుల గురించి, కళాసంస్కృతుల గురించి కోస్తా ఆంధ్ర మిత్రులకు ఉన్న కొన్ని అభిప్రాయాలు, అపోహలు, అనుమానాలు, తొలగించడంలో నేను చాల వరకు కృతకృత్యుడినైనాను. పైగా కట్టు, బొట్టు, యాసలు, మాండలికాలలో కనిపించే తేడాల వెనుక, తెలుగు వారందరిని నడిపించే “ఉమ శి సంస్కృతి” ఉన్నదన్న విశాసం కలిగించేవాణ్ని. అయితే రాజకీయాలు, స్వార్ధచింతనలు ఎప్పటికప్పుడు “సమైక్యతకు” భంగం కలింగించే ప్రమాదాలు తెచ్చిపెడుతు ఉన్నట్టు పసిగట్టేవాణ్ని. తొలి విదేశయాత్ర
ఆ తర్వాత 1967-68లో ఉన్నత విద్యావిషయకంగా నేను హాలండుకు వెళ్లి అక్కడ తొమ్మిదినెలల పాటుకు ఉండి రావటం నా జీవిత యాత్రలో సంభవించిన విప్లవాత్మక పరిణామం. నిజాం క్షబ్బులో నాకు ఇచ్చిన వీడ్కోలు విందులో అనేక మంది అధికారులతోపాటు, పెద్దలు నారాయణరెడ్డి గారు పాల్గొని నన్ను ఆశీర్వదించిన సన్నివేశం “బాపుంటే తీపు” అక్కరలేదని ఆయన నోట ఛలోక్తులు కురిపించింది. అనేక ఐరోపా దేశ యాత్రలు చేయడం, విభిన్న సాహిత్యాలతో సంస్కృతులతో 136 పరిణతవాణి ప్రసంగాలు
ప్రత్యక్ష పరిచయం కలగడం నా కవితా చేతనానికి అంతర్జాతీయ స్ఫూర్తి అంతరిక్ష విజ్ఞాన స్ఫూర్తి. కలిగించాయి “విదేశయాత్ర” సేరుతో వ్రాసిన ఒక కవితతో పాటు, నా నూతనానుభూతులు ప్రతిబింబించిన అనేక కవితలను, ఇంగ్లీషులోకి తర్హుమా చేసే అవకాశం, అవసరం అక్కడే ఏర్పడింది. ఉత్తరోత్తర నేను ఆంగంలో ర్ కవ్తా సంపుటాలు (ప్రచురించడానికి, అనేకానేక అంతర్జాతీయ సాహిత్య సదస్సుల్లో పాల్గొనడానికి కూడా అవి దారి తీసినవి. తదనంతరం (ప్రపంచ కవుల మహాసభల్లో నాకు గౌరవడాక్టరేటును కూడా ప్రసాదించడానికి దోహదపడ్డాయి. స
1968లో నేను విదేశాల నుండి తిరిగి రాగానే “బాప్పురెడ్డి గేయాలు” పేరుతో గేయ సంపుటిని ప్రచురించి మహాకవి బోయి భీమన్న గారికి అంకితం చేయడంతో నా సాహితీయాత్రలో ఒక మహోజ్వల ఘట్టం ఆరంభమైంది. 1969లో నా పద్యకవితా సంకలనం, 1970లో నా వచనకవితా సంకలనం, వెను వెంటనే నా గేయనాటికల సంపుటి" వెలువడడం - దానితో అంతవరకు ఇరువైసంవత్సరాలుగా నేను చేసిన సాహిత్య సృష్టికి చతుర్ముఖత్వం ఏర్పడింది. పద్యం-గేయం-వచనకవిత - గేయనాటిక ఈ నాలుగు ప్రక్రియలతో నా కవితా రచనకు విస్పష్టమైన రూపురేఖలు ఏర్పడ్డాయి. నా సాహిత్య చేతన 'ఒప్పాంగిపోయిని గోదావరిని తలపించింది. కవితా దృ కథం
(ప్రక్రియాపరంగానే కాకుండా, కవితా తత్వపరంగా కూడా నాకొక మార్గం ఏర్పడింది. వాద వివాదాలకు దూరంగా, రాజకీయ రంగులకు లొంగకుండా సృజనాత్మక సత్య సాహిత్య రచన చేయాలనే సంకల్చం నాలో బలపడింది. మరీ క్రొత్త సిద్దాంతం కాకపోయినా “భావభౌతిక” సత్య స్పృహతో నా రచనలను మూడు భావధారలుగా రూపొందించాను. (ప్రణయం- ప్రణవం- సామాజిక ప్రగతి - త్రిపుటిగా విశాలమైన జీవితానికి ప్రతిబింబంగా సాహిత్యాన్ని దర్శించాను. సృష్టిలోని చరాచర, చిరాచిర దృశ్యమాన ప్రకృతిని మానవ జీవిత సంబంధాలతో ముడివడ్డ ఈ మూడు భావధారల మధ్య సమన్వయమే పరిపూర్ణ జీవితానుభూతిగా ఆవిష్కరించాను. (స్త్రీ-పురుష అనుబంధాల పట్ల కలిగే ప్రణయ చేతన, మనిషికీ-దైవానికి మధ్య ఏర్పడే ప్రణవచేతన మనిషికీ-మనిషికీ మధ్య దైనందిన ఆర్థిక, రాజకీయ పరమైన సామాజిక ్రగతిచేతన
- దేనికది మనిషిలో ఉత్తమ విశ్వాసాలను, విలువలను పెంపొందించేరీతిలో భావసత్యా విష్కరణ జరగాలన్నదే నా “భావ భౌతిక” తత్వసారం. ఈ దృష్టితో నా కృతులన్నీ ఎన్నో సంపుటాలుగా అన్ని (ప్రక్రియల్లోనూ వెలువడ్డాయి ఈ విషయాలు నేను “నా మనసులోనిమాట” వ్యాస సంపుటిలో కూడా వివరించి నా ఆలోచనా పారదర్శకతను నిరూపించాను. డా. జె. బాపురెడ్ది 137
నా కవితాయాత్రలో నా సాహిత్యతత్వాన్ని ప్రక్రియాగత వివక్షలేకుండా చేసిన రచనల్ని ప్రతి బింబించే ముఖ్యమైన కృతులు ఇలా ఉన్నాయి: వచన కవితా రూసమెత్తినవి
అనంత సత్యాలు, ప్రణవప్రణయం, పంచబాణసంచా, మనచేతుల్లోనే ఉంది, రంగురంగుల చీకట్టు, కాలం మాయాజాలం, సౌదామినీ కవితలు, అక్షరానుభూతులు, లోకాలోకనం - నా తాలి గద్య కవితలు వీటిలో సమ్మిళితమైనాయి. గేయకవితా కృతుల సమాహారం
శ్రీకారశిఖరం, (ప్రేమారామం, నా దేశం నవ్వుతూంది, బాపురెడ్డి భావగీతాలు, ఆటపాట, నవగీతనాట్యం, బాపురెడ్డి గేయనాటికలు, బాపురెడ్డి గేయాలు, నాదవేదాలు కూడ పై ఎనిమిది సంపుటులలో విలీనమైనాయి. పద్యకవితానతారమెత్తినవి
బాపురెడ్డి పద్యకావ్యాలు, హృదయ పద్యం- జీవనశుతులు, ఆత్మీయరాగాలు, వాడిపోని వసంతాలు అన్ని ప్రక్రియలతో కూడిన (ప్రత్యేక కవితా సంపుటాలు. ఇవి ఒక విలక్షణమైన ఇతి వృత్తానికి చెందిన కవితలన్నీ సంపుటీకరించిన కృతులు. విభిన్న రంగాలకు చెందిన మాన్యమి(త్రులు, మహానీయులు, సాహితీమూర్తులు, దేశ నాయకులను గూర్చి ఆయా సందర్భాలలో (వ్రాసిన కవితలన్నీ ఒకచోట చేర్చిన “ఆత్మీయ రాగాలు”గా తీర్చినాను. అలాగే 1957లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత “దుర్ముఖి” నామ సంవత్సరం తెచ్చిన వసంతం ఉగాది పర్వదినోత్సవం మొదలు ఉత్తరోత్తర అనేక మధు మాసాలు, చైత్రోదయాలు కలిగించిన అనుభూతులు ప్రతి ఫలించిన కవితలు “వాడిపోని వసంతాలు” గా రూపొంది, ఆనాటి ప్రధాని డా॥ పి.వి.నరసింహ రావుకు అంకితమైనాయి. ఉగాది సందర్భాన్ని వస్తువుగా స్వీకరించి అనేక జీవనసత్యాలను, కవిత్వీకరించిన ఈ సంపుటి ప్రజాదరణ పొందింది.
“శిశిరంలా ఈ సూరాలి పోతూంది వాసంతంలా (పేమ విరిసింది” వంటి
(ప్రేమతత్నాన్ని,
“భూతకాలం పెరిగినట్టా భావికాలం తరిగినట్టా
కొత్త సంవత్సరం రావటం అంటే ఏమిటి జరిగినట్టు”
వంటి తాత్వికత్వాన్ని; “కోకిల పాటలు వినే కోరిక లేదు తారల ఆటకనే తీరిక
లేదు” అంటూ ఎలుగెత్తాను. మానవాభ్యుదయభావావేశం ప్రకృతి పరంగా, మానవ
ప్రకృతి పరంగా వెలువడ్డ చైత్ర-జైత్రయాత్రా కావ్యం అది. కోకిలత్వాన్ని కూడా 136 పరిణతవాణి ప్రసంగాలు
మించిన మానవత్వం విరబూచిన (క్రేమారామం-ఇహ పరసుఖానంద ధామం
అది.
నా సాహిత్యయాతత్ర చరిత్రను, రేభా మాత్రంగా ఆవిష్కరించిన (గ్రంధం, నా షష్టిపూర్తి ప్రత్యేక సంచిక “బాపురెడ్డి సాహితీ భారతి” అందులో నా దేశవిదేశ మిత్రులు, సాహితీమూర్తులు, విమర్శకులు, నా సాహిత్యం గూర్చి వెలిబుచ్చిన అభిప్రాయాలు చేసిన విశ్తేషణలు నన్ను ఉక్కిరి బక్కిరి చేసినవి. నాకు నూతనోత్సాహాన్ని ఇచ్చినవి. ప్రపంచంలోని ఎన్నో "7/00 19 ౪1౦" సంపుటాలు కూడా నా సాహిత్య కృషిని గుర్తించాయి, అనుభవాలు - జ్ఞాపకాలు (స్వదేశంలో)
నా సుదీర్ధ సాహితీ యాత్రలోని, మజిలీలు కొన్ని ఘట్టాలు రేఖా మాత్రంగా చిత్రించాను. అయితే, నా జీవితయా(త్రకు జీవం పోసిన కొన్ని సంఘటనలు, సన్నివేశాలు, అనుభవాలు జ్ఞాపకాలకు ఈ సందర్భంలో నా స్మృతిపధంలో నేనంటే నేనని తోసుకొని వస్తున్నాయి. అందులో ఒగరు, చేదు, తీపి, పులుపు వంటి రుచులన్నీ దైనందిన జీవిత పాత్రలో ఉగాది పచ్చడిగానే సరస సమ్మేళనం చెందినవి. వాటిలో కొన్నిటిని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను.
నిజాం కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతున్నప్పుడు నేను తెలుగు మీడియం నుంచి వచ్చిన వాణి కాబట్టి, ఇతరత్రా అర్హతలెన్ని ఉన్నా, క్లాసు ప్రతినిధి స్టానానికి జరిపిన ఎన్నికల్లో స్వల్పమైన ఓట్ట తేడాతో ఓడిపోయాను. కారణం క్రాసులో ఉన్న విద్యార్దినులు (ఇంగ్లీషు మీడియం నేపథ్యం గలవాళ్లు) నా ప్రత్యర్థి ఇంగ్లీషు మీడియం నుంచి రావటం వలన అతని డాబు చూసి నాకు వేస్తామని మాటిచ్చిన ఓట్టు మతి తప్పి అతనికి వేయటం. అయితే ఆ ఓటమిని ఒక అనుభవంగా తీసుకున్నాను తప్ప, ఆగ్రహావేశాలకు, నిరాశానిస్పృహలకు లోను కాలేదు. పైగా ఆ విద్యార్థినుల పేర్లన్నీ స్ఫురించేటట్టుగా, నా ఇష్టసఖికి వారు సాటి రాలేరనే భావంతో ఓ చక్కటి గేయం (వ్రాసి సంతృప్తి చెందాను-
“ఏమంచు పేరిడుదునే నీకు చెలియా
ఓ మంజు గీతాల నినుకూర్తు నే (ప్రియా!
నీ ముందు తన మందహాసాల రుచిమాయ
ఆ సరోజిని ముఖము ముకుళించుకొనెనే
నీ నుదుటి ప్రణయ కుంకుమ కాంతులను జాచి
సిగ్గెల్లి తారమ్మ కారు మబ్బుల దూరె! డా. జ బాపురెడ్ది 139
నీ కుంతల వినీల కాంతితరగల జూచి
ఆ సునంద మిళిందబాలముసుగు బిగించె
ఏ వీణ, నీ గానమున (మోగలేక
సాగి తీగలు తెగెగ మూగవడిపోయె.
పతి లేని మతిలేని రతిరాణి నినుజూచి
'బ్రకికేల నాకు” అని చితి పేర్చుకొనజూచె
లక్ష్మీ, సరస్వతీ, శైలజా సత్కళలు
కలిపి చేసేనో నిన్ను నలువానా కోసమే!”
ఆ పొట నా “ప్రేమారామం” గేయ సంపుటిలో నేటికీ పరిమళిస్తూనే ఉంది నా చిన్ననాటి చిలిపి కవితలకు ఒక తీపి గుర్తుగా నిలిచింది.
ఆ రోజుల్లో కళాశాల విద్యార్థినులు నాట్య ప్రదర్శన లిచ్చే ఆనవాయితీ చాల అరుదు. అయితే, అయా విద్యార్థి ఉత్సవాలలో ప్రదర్శించిన కొందరి యువ నర్తకుల కళా (ప్రతిభను ప్రశంసిస్తూ అభినందన కవితలు వ్రాసే ఉత్సుకత, సంస్కారం నాకు అబ్బినందకు నేను ఈనాటికీ గర్విస్తున్నాను. ఆడ పిల్లలను అల్లరిపెట్టే ఆకతాయి చేష్టలు పరిపాటి అయిపోయిన ఆ రోజుల్లో, వాళ్ల (ప్రతిభా పాటవాలను, కళాకౌశలాలను, సౌందర్యాలను, సంస్కారాలను సగర్వంగా సాహితీకరించే వాణ్ని. ఉదాహరణకు (ప్రస్తుతం వైద్య విద్యా శిఖామణిగా పేరు గడించిన శ్రీమతి సుధాకిశోర్ (అప్పుడు కుమారి సుధ పంజె) కోఠిలోని మహిళా కళాశాలలో ఒక విద్యార్థినిగా ఇచ్చిన నాట్య (ప్రదర్శన చూచి నాకలం నుండి జాలు వారిన గేయ కవిత ఆనాడే ఆమె మాతృభాష మైన మరాఠీలోకి అనువదించపబడి, కళాశాల (ప్రత్యేక సంచికలో ప్రచురింప బడింది. అది వచన కవితగా కూడా రూపుదిద్దు కొని నా కావ్య సంపుటాలలో రాణిస్తున్నది.
“ఎన్నా ఊహలను ఎన్నిన్నా అనుభూతులను
జీవ నిర్శర భావ చిత్రాల నిల్చునా
కలము న రూప సత్కళ చూచి తలవాల్చి కంపించు.....” “మిన్నేరు నీ కాళ్ల మీదె ప్రవహించునా
చంచలలు నిన్నే స్పృశించి నటియించినా...
పాపాలు నీ కంటి దీపాల వెల్లులో
తానమాడిన పుణ్యధామమ్ములైపోవు” అంటూ సాగింది.
అలాగే మరొక యువ కళాకారిణి సుషమాకృతిలో దర్శించిన ఉదాత్తమైన రూపు రేఖలను ఎన్నో పద్యాలలో చిత్రించాను. మచ్చుకు ఒకటి చిత్తగించండి.
140 పరిణతవాణి ప్రసంగాలు
కంబుగళంబు చ(క్రముఖకంజ కళా విభవంబు వీణరూ
పంబువహించు నీ జఘనభాండము, నీతల బంతి నీ జడల్
బింబము తాట శ్రీ పతికి, విద్యల రాణికి, నామనంబు, దే
హంబును పల్విధంబుల ప్రియా నిను గొల్భ్బుట సాజమేగదా!
ఇలా నేను ఎన్నెన్నో వ్యక్తిగతమైన అనుభవాలను అనుభూతులను ఆధారం చేసుకొని సృజన శీల రచనలు చేశాను. అలా వైయక్తిక అనుభూతికి విశ్శజనీనత చేకూర్చాను. ఇతరులకు చూపించ గూడని, చెప్పగూడవి భావజాలం నా కెప్తుడూ స్ఫూర్తిదాయకం కాలేదు. మచ్చ అంట నీయని, మానవీయ విలువలను రమ్యాక్షర బద్దంచేయాలనే సాహిత్య తత్వమే నన్ను నడిపిస్తున్నది. కూలివాడు-కోటీశ్వరుడు ఒకరి నొకరు “త్వమేవాహంగా” భావించి జీవించే మానవత్వమే, ప్రగతి తత్వమే నా సాహిత్య రసాద్వైతంగా నిలిచింది.
లేదురా లేదురా లేదురా కులానికి అర్ధం లేదురా
లేదురా లేదురా లేదురా మనిషికి మనిషికి తేడా లేదురా!
పుట్టిన వారందరి తీరొకటేరా గిట్టిన వారందరి దారొకటేరా
చాతుర్వర్దాలు, కులాలు స్వార్ధపరులు కలిపించినవేరా
ఈ గీతం సాంఘిక సంక్షేమ శాఖవారు క్యాసెట్టుగా వేసి ప్రచారం చేసినప్పుడు నాకు కటల్షిన సంతృప్తి చెప్పరానిది.
మందిర్ కూల్చి మసీదు కడితే మసీదు కూల్చి మందిర్ కడితే
కూల్చేవారు, కట్టేవారు కొల్చే దేవుడు ఒకటేరా
వంటి భావచేతన, సత్యదర్భ్శనం నేను అనుభూతించాను.
విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఆంధ్రా మెడికల్ కాలేజీ వార్షికోత్సవాల సందర్భంలో వారి కాలేజీకి ఒక కాలేజీ అంథమ్ ఉండాలని నిర్ణయించారు. అప్పటికప్పుడు ముఖ్యమైన గీతం ద్రాసేయగలిగే వారెవరని చర్చించి, ఎందుకో నా మీద విశ్వాసంతో నన్ను 'వ్రాయమన్నారు. నేను కొంచెం వెనుకాడినా అది ఒక ఛాలెంజిగా తీసుకొని (వ్రాసిన గీతం ఇప్పటికీ వారు అన్ని ఉత్సవాల సందర్భంలో పాడుకుంటున్నారని విన్నాను.
“అదుగో ఆంధ్రా మెడికల్ కాలేజీ జీవనచిహ్నం” అన్ను పల్లవితో వాసిన గీతం ఆరోగ్య ప్రదాయిగా, ఆనందకేతనంగా ఆదరింపబడుతుండడం నా అదృష్టం.
బో య్యిభీమన్నగారు నన్ను విశాఖపట్నం గూర్చి ఓ కవిత వ్రాయమని ఆదేశించారు. డా. జె, బాపురెద్ది 141
ఆయన వాక్కు శక్తి ఎంతటిదో నాకు అర్జమైంది 'విశాఖ లేఖి అనే కవిత వ్రాశాను. అది ఆయనకు వ్రాసిన లేఖయే. అయినా విశాఖ సాహిత్యచరిత్రలోనే కాక విశ్వనాధ సత్యనారాయణ, బాలాంత్రపు రజనీకాంతరావు సంకలనం చేసిన నేషనల్ బుక్‌ట్రస్ట్ వారి ప్రచురణలో చోటు చేసుకొన్నది. శ్రీశ్రీ కొంపెల్ల జనార్హనరావు వంటి మహనీ యులు ప్రశంసించిన విశాఖ నా కలానికి కొత్తవెలుగులందించడం నా అదృష్టం. “పచ్చనోట్లు ఉంటేనేగాని పచ్చిమంచి నీళ్లైన పుట్టవు” వంటి పంక్తులు ఎందరో విమర్శకుల ప్రశంసలందుకున్నాయి.
అరకులో, పాడేరులో నేను చూచిన గిరిజన జీవితాల గూర్చి వ్రాసిన గేయాల వెనుక కూడా మరువలేని మధురానుభూతులున్నాయి.
ఉనాడు భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఉన్న విశ్చవిఖ్యాత తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణ విశాఖ దర్శించినప్పుడు మా కార్యదక్షతను మెచ్చి శ్రీ కె. జయభారతిరెడ్డి ఐఏఎస్ గారిక్షీ నాకూ తన అమృత హస్తాలతో ప్రదానం చేసిన బహుమానాలు చెరిగిపోని జ్ఞాపికలుగానే నిలిచిపోయాయి
ఆ రోజుల్లో తొలి అంతరిక్ష యాత్రికులైన గైగేరియన్: మ్యాడమ్ తెరిష్కోవా వంటి రష్యన్లు మన దేశ యాత్రలో విశాఖ విమానాశయంలో దిగినప్పుడు, నేను వారితో ఏర్పాటు చేసిన సమావేశం, జరిపిన ఇష్టాగోప్టి దానికదే ఒక అంతరిక్ష విహారానుభూతి. “నా రాకెట్టు రాయబారం” రచనకు స్ఫూర్తినిచ్చిన రష్యన్ రాకెట్టే తర్వాత వారిని తొలి వ్యోమగాములు చేసినవి. ఉత్తరోత్తర నేను రష్యా దర్శించినప్పుడు ఈ సంఘటనను గుర్తు చేసికొని, వాళ్లతో కలిసి తీసుకున్న ఫోటోలను అక్కడి మిత్రులకు చూపించి వారితో ఆనందం పంచుకున్నాను.
తొలిసారి హిమాలయ పర్పత(ప్రాంతమైన సిమ్లా సందర్శించినప్పుడు అక్కడి చల్లని వాతావరణం. సహజ సుందరమైన (ప్రకృతి శోభ, నిరాడంబరంగా అమాయికంగా వీధుల్లో సంచరించే గిరిజనుల జీవితగతులు నా కవితాత ను ఉద్దీపింపచేశాయి -
“సిమ్హాలో చూచితినొక చిన్నదానిని
కలల అలలురేపు మత్తు కనుల దానిని
మాల్ రోడ్డు మీద అదో మాదిరిగా నవ్వింది
చలచల్లని లోయల వెచ్చని గాడుపు రువ్వింది”
అంటూ స్పందించిన అనుభూతి చిరస్మరణీయగీతి.
“అమ్థానసిమ్హా” అంటూ అశువుగా అక్కడ ఆలపించిన ఒక అభ్యుదయావేశం కూడా నేను తరచు తలచుకునే సన్నివేశం. 142 పరిణతవాజి ప్రసంగాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అభివృద్ది కార్యకలాపాలపట్ట, దర్శనీయ స్థలాల పట్ట నేను చూపిన (శ్రద్దను ప్రశంసిస్తుండేవారు. అయితే నన్ను వారు ఆ జిల్లాను కీర్తిస్తూ సందేశాత్మక కవితలు (వ్రాయమని పట్టపట్టడం, నాకు కొన్ని స్ఫూర్తిదాయకమైన కవితలు వ్రాయటానికి అవకాశం కల్పించింది. “రండి రండి నుహబూబ్నగరం” అనే పల్లవితో వ్రాసిన స్వాగత గీతం ఇప్పటికి (ప్రచారంలో ఉందని విన్నాను. అలాగే “పనివాళ్లం పనివాళ్లం పాలమూరు పనివాళ్లం ప్రాజెక్టులు నిర్మించే సాటి లేని పని వాళ్లం. . . .” వంటి పారిశ్రామిక గీతాలు నాకెంతో సంతృప్తిని కలిగించాయి. “చీరెలు చీరెలు గద్వాల చీరెలు కట్టుకున్న వాళ్లంతా కదలాడే తారలు సీతమ్మపెళ్లినాటి పీతాంబరమిక్కడిదే కన్యలు కట్టారంటే కళ్యాణం తప్పదట” వంటి సాంస్కృతిక గీతాలు అక్కడే 'బ్రాశాను. శ్రీమతి రోడామి'స్త్రీ పర్యాటకశాఖమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి సమక్షంలో, రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వాటిని సంగీత నృత్యరూపకాలుగా ప్రదర్శించారు. అప్పుడు పెద్దలు, ప్రేక్షకులు నామీద కురిపించిన ప్రశంసల జల్టులో నేటికీ నా ఒళ్లు పులకిస్తూనే ఉంటుంది. అక్కడి “పిల్లలమగ్రితో ఇంటర్వ్యూ” వచన కవితా రూపకం కూడా ఒక ప్రయోగాత్మక రచనగా ప్రసిద్దికెక్కింది. నేను మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్నప్పుడే హైదరాబాదులో నా కావ్యసంపుటి ఒకటి ముద్రణలో ఉంది. హరాత్తుగా ప్రింటర్ నుండి టెలిఫోన్ కాల్ వచ్చింది. “అయ్యా! మీ పుస్తక ముద్రణ పూర్తి అవుతుంది. కాని పారపాటున ఒక పుట మధ్యలో ఖాళీగా ఉండిపోయింది. వెంటనే “ఒక పుటకు సరిపోయే కవిత పంపండి” అన్నాడు. సరే నేను కాసేపట్లో ఫోను చేస్తాను అన్నాను. ఇంకేం, "ఒక పుట” మీదే కవిత చెప్పాలనుకొని, అప్పటి కప్పుడు ఆశువుగా కవిత (వ్రాసి ఫోనులోనే డిక్టేట్ చేశాను - “జననం ఒక పుట, మరణం ఒక పుట - మానవ జీవిత పత్రానికి దినం ఒక పుట, రాత్రి ఒక పుట - రాలిపోయే కాలవటపత్రాలకు దేశం ఒక పుట, కాలం ఒక పుట - అనంత సృష్టి తాళపత్రానికి డా. జె బాపురెడ్డి 143
ఊహ ఒక పుట, వాస్తవం ఒక పుట - చూడగల్లిన మానవ నేత్రానికి
ఒకే ఒక పుట గల పత్రం లేదు - ఒకే తీరం గల నది లేదు
సకలం ఆ్రేడితం ; దేవుడు కూడా ఒంటరి కాదు - దేనీ సమేతుడు'
ఈ కవిత ఆ పుస్తకానికే తిలకం దిద్దింది. అనేక భాషల్లోకి అనువుదింపబడింది. కావ్యాంకితాలు - ఆత్మీయరాగాలు
“చైతన్య రేఖలు” 1960లో నారాయణరెడ్డిగారికి ఇచ్చిన అంకితంతో మొదలైన సాహితీ బాంధవ్యాలు ఏటేటా ఎదుగుతూ ఎన్నెన్నో వీడిపోని అనుబంధాలు, వాడిపోని ఆత్మీయతాగంధాలు నా జీవితాన్ని రసప్టావితం చేశాయి. నేను ఇచ్చిన అంకితాల కంటే నేను పుచ్చుకున్న అంకితాలు చాలా తక్కువే అయినా ఇచ్చిపుచ్చుకోవటాలు వెనుక వెలుగొందిన అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు, సన్నివేశాల గూర్చి ఎంత కష్తంగా పేర్కొన్నా బోలెడెంత (గ్రంథం అవుతుంది. అయితే ఆ మహనీయులను ఈ శుభసందర్భంలో నేను తలచుకోకుండా ఉండలేను.
మహాకవి, పద్మశ్రీ బోయిభీమన్నకు నేను నా “బాపురెడ్డి గేయాలు" అంకితం చేశాను. స్వీకరిస్తూ ఆయన నా గురించి వ్రాసిన --
“సిరికొండ గుండెలో చిరుదీపమై వెల్లి
గోల్కొండ గుండెలో మెల్కవితగా” వెలిగాడంటూ ఆయన దీవించడం, ఆయనకు ఎంతో ప్రియమైన “బొమ్మ” కావ్యాన్ని నాకు అంకితం చేసిన సంస్కారం నా సాహిత్య చైతన్యాన్ని ఆయన ఉద్దీపింపచేసిన మమకారం మరుప్తుకు చిక్కని ఆనంద పారావారం.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా డా. బెజవాడ గోపాలరెడ్డి గారు నా “గద్యకావ్యాలు” అంకితం తీసుకొన్నప్పుడు కూడా నేను పొందిన అనుభూతి చెప్పరానిది. అది ఒక “రసరాజ్య పట్టాభిషేకం”.
పోలీసుశాఖలో అత్యున్నత పదవి అలంకరించిన వాడు, 'చేతిలో మధుపాత్ర శ్రీచక్రమునకన్న చిద్విలాసబిందు శ్రీధరుండు" గా భాసించినవాడు శ్రీ రొడ్డం (ప్రభాకరారవు, ఐపిఎన్ వంటి సంస్కృతీ సంపన్నునికి ఆప్పుడ్డైన వాడు శ్రీ కృష్ణమాచార్యులుకు నా “పద్య కావ్యాలు" విశాఖపట్నంలో అంకితం చేశాను. దేవుడు అతణ్ని తీసుకువెళ్లి నా ఆయన క్షీర్తి మాత్రం తరుగలేదు.
నా శేయనాటికలిను, ఆనాటికే (ప్రఖ్యాతుడైన సినీ నటుడు ఇప్పుడు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు పొందిన శ్రీ గుమ్మడి వెంకటేశ్చరరావు గారికి అంకితం చేశాను. ఇంతకు ముందే ఆ విషయం ప్రస్తావించినా మళ్లీ మళ్లీ మననం చేసుకోదగిన శేత4 పరిణతవాకి ప్రసంగాలు
సన్నివేశం అది. హేమాహేమీలు పాల్లొన్న “సారస్వతపరిషత్తు” వెలిగించిన ఆ సభావైభవం ఇప్పటికీ నా కళ్లల్లో మెరుస్తూనే ఉంది
ఖౌారతరత్న శ్రీమతి ఇందిరాగాంధి గారికి నా “ఇన్ క్వెస్ట్ ఆఫ్ హార్మనీ” ఆంగ్ల కవితా సంపుటి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వెంగళరావుగారి సమక్షంలో అంకితం చేసిన ఘట్టం కూడా నా అనుభూతుల పేటికలో అమూల్య రత్నమే. ఆమె పుస్తకం మీద సంతకం చేసిన సన్నివేశం ఆమె విజ్ఞతకు, రసజ్జతకు అద్దం పట్టింది. ఉత్తరోత్తర నేను మెదక్ జిల్దా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ మహనీయమూర్తితో కలిగిన పరిచయం కూడా చిరస్మరణీయమే.
ఆచార్య జివి. సుబ్రహ్మణ్యం గారికి నేను నా “రంగురంగుల చీకట్టు కృతి అంకితం చేశాను. ఆయన తన “జీవియస్ వ్యాసాలు” నాకు స్నేహోపాయనంగా అంకితం బేసి కొన్నత్యాన్ని చాటుకున్నాడు. నిజానికి ప్రతి (గ్రంధాంకితం' కృతిభర్త, స్వీక్తర్తల పరస్పర గౌరవాభిమానాలకు సంకేతంగా నేను భావిస్తాను.
పూజనీయుడు, కారణజన్ముడు, భారత ప్రధాని డా. పి.వి. నరసింహారావు గారు సంక్షోభంలో పడ్డ భారతదేశాన్ని సంరక్షించినపుడు నా “వాడిపోని వసంతాలు" కావ్య సంపుటి అంకితం చేసినప్పుడు కలిగిన సంతృప్తి వీడిపోని దేశభక్తి సందీప్తి. ఆయన భారత ప్రధానిగా ఎంతటి కీర్తి సాధించాడో, అంతటి సాఫల్యాలు, సాహిత్యకారుడుగా, మేధావిగా పొందాడు.
అంతర్జాతీయ కీర్తిగడించిన ఆర్థికశాస్త్రవేత్త సిహెచ్. హనుమంత రావు గారికి నా “మన చేతుల్లోనే ఉంది' వచన కవితా సంపుటి - అంకితం చేసి నాకు ప్రతిభపట్ట, విద్యావిజ్ఞాన సంపన్నుల పట్ట ఉన్న గౌరవాన్ని 'ప్రదర్శించాను. అది మా చిరకాల మెైత్రిలో ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగు విశ్చవిద్యాలయ పురస్కారం పొందింది.
హాళిండులో తెలుగు తేజంగా వెలిగిన విశ్చవిఖ్యాత జన్యు శాస్త్రజ్ఞుడు డా. పి. మీరాఖాన్ గారిని నా “ప్రేమారామం"లో ప్రతిష్టించి ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆరాధించాను. “మీరాఖాన్ మేరిజాన్” అంటూ పరవళించాను. కాకెన్హాఫ్ పూలకడలి అంతటి అదృష్టం దక్కించుకోగలిగాను.
ఆప్తమి(త్రులు, నిత్యసంఘసేవా చైత్రులు శ్రీమతి సుచరిత - డా. జయచంద్రారెడ్డి ఆదర్శ దంపతులకు నా 'భావగీతాలు" సమర్పించి నా కృతజ్ఞత చాటుకున్నాను. ఇంగ్లాండులో ఎంతో కాలం కాపురం ఉన్నా, స్వదేశాన్ని మరచిపోని, కడపకోటిరెడ్డి వంటి దేశభక్తుని కుటుంబీకులు వారు. మా నాలుగు దశాబ్దాల మైత్రికి అది వీడిపోని ఒక ఆత్మీయబంధం మాత్రమే. దా, జె. బాపురెద్ది 145
ఇంగ్లాండులో స్టిరపడ్డా తన “నత్తా రామేశ్యరాన్ని” సేవించి, తనకు జన్మనిచ్చిన నేలతల్లిని త్రికరణ శుద్దితో కొలిచిన, విద్యా విజ్ఞాన వ్యాపకుడు, మచ్చలేని మహామనీషి త్యాగధనుడు శ్రీ ద్వారపుడి సుబ్బిరెడ్డి గారికి నా “పంచబాణసంచా” కృతితో లండన్‌లో అలంకరించిన సన్నివేశం మరువరానిది. ఆ సభలో విశ్శనాధరాయలు వంటి అక్కడి ఎందరో మహనీయులు, మేడసాని మోహన్వంటి సహయాత్రికుడు పాల్గొని నన్ను అభినందించిన ఘట్టం పూర్వజన్మ పుణ్యఫలం.
అమెరికాలో “తెలుగుజెండా” గా రెపరెపలాడే అణుశాస్త్ర పరిశోధనా తపస్వి, భౌతిక శాస్త్ర (ప్రబోధనా యశస్వి, గిరిజా కళ్యాణాది నృత్యనాటికా ప్రయోక్త 'కాస్మిక్ కవితా' సంపుటి సంకలన కర్త ఆచార్య పెమ శరాజు వేణుగోపాలరావుకు ఎనిమిదవ ఉత్తర అమెరికా తెలుగు మహాసభల్లో (1991) నా “మనసులోని మాట” వ్యాస సంపుటిని అంకితం చేసిన ధన్యత నాకు కలిగింది. మా స్నేహబంధం చెక్కుచెదరని మహానుభూతిగా మిగిలింది. “కుందుర్తి” గురించి నేను వ్రాసిన వ్యాసం పట్ట ఆయన స్పందించిన తీరు ఆయన సాహిత్య తత్వవివేచనకు హారతి పట్టింది.
పెద్దవాళ్లకే కాదు ప్రతిభా జ్యోతులు, భావిపౌరులు అయిన చిన్నారులు రోహిణ్కు నా “ఆటపాటలు? నృత్యకళాజ్యోతి అయిన బేబీ దీక్షితకు నా 'నవగీత నాట్యం ఆశీస్సులతో అంకితం చేసి నాలోని బాల్యత్వాన్ని (బ్రతికించుకున్నాను. “బాలకుల దీవెనలు (బ్రహ్మదీవెనలు” అందుకున్నాను. అట్టాంటా ఆటా సభల్లో రోహిణ్ను పూజ్యులు పి.వి. నరసింహారావుగారు దీవిస్తే ఓరుగల్టులో దీక్షితను ఆచార్యులు సుప్రసన్నాచార్యులు, పేర్వారం జగన్నాథం, అనుమాండ్ల భూమయ్య వంటి సాహితీమూర్తులు అభినందించారు అవిష్కరణ సభల్లో,
మహాకవి, పద్యవిద్యాధురంధరుడు “నేతాజీ” వంటి కావ్య నిర్మాత, సృజనశీలి మైన ఇంజనీయరు, 'వైతన్యభారతి' వంటి సాంకేతిక విద్యావితరణ సంస్థ స్థాపకులు, మానవగీతాచార్యుడు డా. ఉండేలా మాలకొండారెడ్డిగారిని నా 'పద్యాలపల్లకి'లో ఊరేగించి సాహిత్య కళ్యాణోత్సవం జరిపించిన అనుభూతిలో
“నీ వలనె నేను సైతము
భావుకతను నమ్ముకున్న ప్రతిభా కవినే
నీ వలెనె నేను శుభకర
జీవన సత్యాలు వెదకు బిజ్ఞాసువునే”
అన్న సత్యాన్ని నా చేత పలికిస్తే ఆయన
“అతడు పొందనట్లి అధికార మెయ్యది 146 పరిణతవాణి ప్రసంగాలు
తిరిగి చూడనట్టి దేశమేది!
విశ్వమంత కవిత వినిపించి, రసికుల
మెప్పుగాంచినట్టి మేటి అతడు”
అంటూ నన్ను వినమ్రుణ్నీ చేశాడు. ఇద్దరం శుభాకాంక్ష లతో ముడివేసుకొన్న స్నేహబంధం అది.
నొ అభిమాన పద్యకావ్య సంపుటి 'హృదయపద్యం' తెలంగాణా గడ్డమీద రైతుబిడ్డలుగా పుట్టిన తేజోమూర్తులు సేవాతత్సరులు “అశోకా బిల్డర్స్" వంటి గృహ నిర్మాణ సంస భాగస్వాములు, లయన్స్ క్షబ్బుకు (ప్రాణప్రదులైన శ్రీమతి లీలారెడ్డి - కోరుపోలు లక్ష్మారెడ్డి దంపతులకు - ఆ (గ్రంధాన్ని అంకితం చేసి వారి ధార్మిక సాంస్కృతిక సేవలకు అక్షరాంజలి ఘటించిన శుభతరుణం నా జీవితంలో ఒక మధురానుభూతి తోరణం.
సనాతన వైదిక ధర్మనిష్టులు, నిరాడంబర సంఘసేవా తత్పరులు, భారతీయ సాహిత్య లలితకళా సంస్కృతి పోషకులు, ప్రగతివీలురైన శ్రీ, సి. రామకృష్ణ - శ్రీమతి కళ పుణ్యదంపతులకు నా 'జీవన శ్రుతులు” పద్యకావ్య సంపుటి అంకితం చేశాను. శ్రీ సి. రామకృష్ణతో స్నేహం “త్వమేవాహం” గా స్ఫూర్తి కలిగించింది.
నొకు అత్యంత గుర్తింపు తెచ్చిన గేయసంపుటి 'శ్రీకార శిఖరం మూడు ముద్రణలకు నోచుకుంది. 2002లో అది సప్తగిరీశునికి వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో అవధాన విద్యాధరుడు మేడసాని మోహన్ అధ్యక్షతలో జరిగిన సభలో అంకితం చేశాను.
“ఏడు కొండల మీద ఏమున్నదోగాని
నా గుండె ఆచటనే నాటుకొని పోయింది.
గొడవేది జరిగినా గోవిందా! అంటుంది
తెరువేది లేనపుడు తిరుపతీ అంటుంది”
“సిగ్గవుతున్నది నాకు శ్రీనివాసా
నెరసిన తలనీలాలను నీకీయాలంటే” అంటూ భక్తి ఆధ్యాత్మిక శక్తియుక్తమైన అనుభూతి పంచిన ఆ కావ్యపు తొలిప్రతిని పద్మావతీ - వేంకటేశ్వరుల ఆశీస్సులతో దైవభక్తి సమాజసేవాపరులైన ఆత్మీయులు డా.లంక జానకీరామయ్య - శ్రీమతి లంక అఆమరవల్లి ఆదర్శ దంపతులకు సమర్పించి పొందాను పరమానందం.
నా కావ్యరచనా యాత్రలో ఒక మైలురాయిగా నిలిచిన నా 'అక్షరానుభూతులు'” వచన కవితా సంపుటి విశ్వవిఖ్యాత పారిశ్రామిక వేత్త సత్యం కంప్యూటర్స్ అధినేత దా. జె. బాపురెడ్డి 147
శ్రీ బైరాజు రామలింగరాజు గారికి అంకితం చేసి భావసత్యాలకు - భౌతిక సత్యాలకు మూలసూ(త్రమైన “సత్యం” ఒకటేనన్న వాస్తవాన్ని ఆవిష్కరించాను. శ్రీరామలింగరాజు తన అపారభౌతిక సంపదను, విద్యా విజ్ఞాన సంపత్తిని తాను జన్మించిన గరగప(ర్రు (గ్రామం నుండి, భౌగోళిక (గ్రామం (గ్లోబల్ విలేజ్ వరకు విస్తరింపజేసిన భారతీయ సనాతన ధర్మ ప్రతినిధి. ఆయన్ని సత్కరించగలిగిన అనుభవం, దానికదే ఒక అక్షర 'ప్రాభవం.
“అనంత సత్యాలు" నా శ్రీకారశిఖరం వలెనే నా ఆధ్యాత్మిక, తాత్విక చింతనకు అద్దం పట్టిన వచన కావ్య సంపుటి. ప్రతిభా పాండిత్యాలు తన అక్షరచన్షునులైన ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారు ఆ (గ్రంథానికి వ్రాసిన సుదీర్హమైన పీరిక చాలు, నా జన్మ తరించినట్టుగా నేను సంతృప్తి చెందడానికి. అవ్యాజమైన (ప్రేమతో, అప్రతిహతమైన సత్యదర్శనంతో ఆయన నా సాహిత్యతత్వాన్ని విశ్లేషించిన తిరు, నాకు వేయి అవార్డులు, అత్యున్నతమైన రివార్డులు లభించిన అనుభూతి కలిగించాయి. వీరభద్రరావు, బోయి భీమన్న, నారాయణరెడ్డి, జి.వి.సుబ్రహ్మణ్యం, శేషేంద్ర శర్మ, దివాకర్ల వెంకటావధాని, మల్లంపల్లి సోమశేఖరశర్మ, నాగభైరవ కోటేశ్వరరావు, కృష్ణ శ్రీనివాస్, సయ్యద్ అమీరాద్దీన్, అమరేంద్ర, ఎస్.ఎస్. ప్రభాకరరావు, ప్రకాశం వంటి మహనీయు లెందరో నా స్పజనశీలతను గుర్తించి, నన్ను అభినందించి ఆశీర్వదించిన తీరు వేయిజన్మలకు చాలినంత సంతృప్తి, సంతోషం, అనుభూతిని మిగిల్చినవి.
“అనంతసత్యాలు" మూడవ విసృత ముద్రణ, సత్యసాయిబాబాకు ప్రేమపా(త్రుడ్డె ఆయన గూర్చి సహజపాండిత్య, సాహిత్య రచనలు రాళిపోసిన లిమ్కా పురస్కార (గ్రహీత, అడ్డులేని వ్యాపారవేత్త నాకు చిరకాలమిత్రులు శ్రీ ఎ.వి.ఎస్.రాజు గారికి అంకితం చేశాను. నా 'అక్షరానుభూతులు'లో అమృతానుభూతి పొందాను. నాకు అంకితమిచ్చిన వారిలో ముఖ్యంగా పేర్కొనదగినవారు విజ్ఞాన (ప్రజ్ఞాన సంపన్నులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారు, ప్రముఖ కవయిత్రి శారదా అశోకవర్హన్గారు, (ప్రతిభామయుడు జి, వెంకటేశ్చర్హు కూడా ఉన్నారు. వారు నాపట్ల చూపిన ఆదరాభి మానాలు కూడా జీవితాంతం జ్ఞాపకం ఉంచుకోదగినవే. సాహితీ బాంధవ్యానికి
అక్షర సాక్ష్యాలే.
ఇటీవల ప్రచురించిన నా 'లోకాలోకనం' నా అనంత సత్యాల వలనే నా లోకానుభవాలు, అనుభూతులు సుదీర్హ కావ్యంగా రూపొందిన (గ్రంధం. నేను అనేక సందర్భాలలో పర్యటించిన, దర్శించిన సుమారు 36 దేశాలలో పొందిన అనుభవాలు, అనుభూతులు, స్పందనలు, స్పూర్తులు సమాహారంగా వెలువడ్డ ఈ (గ్రంథంనా జీవిత 148 పరిణతవాణి ప్రసంగాలు
యాత్రలో మూలకందమైన సాహితీయా(త్రకు అక్షరరూపం. నన్ను 'విశ్వకవి?, 'విశ్చపర్యాటకకవి' '(ప్రపంచకవి' వంటి అభిమానోక్తులకు పాదత్రుణ్ని చేసిన (గ్రంధం ఇది. అయిదు ఖండాలను చుట్టి వచ్చిన అనుభవంతోపాటు, అనేక సంస్కృతులతో, సమాజాలతో, సాహిత్యాలతో, మత విశ్యాసాలతో, చరిత్రలతో, విష్ణవాలతో, పరిణామాలతో. భౌగోళిక విశేషాలతో, దర్శనీయస్థలాలతో, ఆచార వ్యవహారాలతో విదేశాలలో వెలుగొందిన స్వదేశదీప్తులు, గుబాళించే సాంస్కృతిక పరిమళాలు ఇందులో (ప్రతిబింబించ గలిగినందుకు నాకెంతో సంతృప్తి కలిగింది. భావసత్యాలు, భౌతిక సత్యాలు అల్టుకున్న జీవిత చిత్రాలుగా అందించిన ఈ (గ్రంథం అమెరికాలో భారతీయ సంస్కృతిని, మానవీయ దృక్పధాన్ని, పెంపాందిస్తున్న శ్రీ టి.ఆర్. రెడ్డి ఆయన సతీమణి, విద్వన్మణి శ్రీమతి నిరంజని గారికి అంకితం చేశాను. ఇదినా సాహిత్య జీవిత స్వర్ణోత్సవానికి కట్టిన స్వాగత తోరణంగా నేను అనుభూతిస్తున్నాను. 2004లో వెలువరించిన ఈ (గ్రంధంలో “యాత్రల సూత్రం” ప్రతిపాదించాను. నా విదేశ యాత్రాను భవాలను కొన్ని మచ్చుకు ఇక్కడ స్మరిస్తున్నాను. విదేశానుభూతులు నాతాలి విదేశయాత్రలో నేలమీద దిగగానే “హిమపాతం” చూడగానే గుండె పులకించింది, అయిపోయింది ఒక రసగీతం- హీమపాతం - హిమపాతం-హేమంత సంగీతం నల్లని మబ్బుల క్లబ్బులు అల్లే తెల్లని గీతం - చెట్ల చెలులు, లతాంగనలు సస్టిష్టీ బొనరించె మేడలు, వాడలు, రోడ్డులు గోడలు పల్లికిలించె పచ్చని పంట పోలాల పారెను క్షీరములు నీటి కాలువల నిండా నిండెను మీగడలు - జంట జంటలుగా వీధుల వెంట తిరుగు (ప్రేమికుల, ఒడళ్ల నిండ కురిసె, బొడ్డు మల్లెల, మొల్లల, జల్టులు - కిటకిటలాడె జనాళి, క్రిస్మస్ పండుగ దినాలు ఆనందం, అనురాగం ఆరబోసె ముత్యాలు - ఏమి హిమము 1! ఏ మహిమయొ - ఎల్ల జగము తెల్లబోయె వెలుపలి చలి, ఎదలోచెలి - వెచ్చదనం నిండిపోయె! చేయి చేయి గీలించి, హాయి హాయిగా వీధులవెంట సాగిపోయే వలపు జంటలపై కురిసిన మల్లెపూలజల్టులా భాసించింది. నా కవితాత్మ గుబాళించింది. ఏదైనా ఒక సన్నివేశం తొలిసారి చూచినప్పుడు కవులు, కళాకారుల్లో ఒక సృజనాత్మక స్పందన డా, జె. బాపురెడ్డి 149
కలుగుతుందని పించింది. నా దేశ విదేశయా(త్రలో తారసిల్లిన కొన్ని దృశ్యాలు, సంఘటనలు ప్రేరేపించిన సద్యఃస్పూర్తి అనుభూతి అనేక కవితలకు మూలబీజాలైనవి.
“ఆలమందలు, పూలతోటలు - అచ్చరల తలదన్ను బోటులు
'స్నేహశీలము వెలుగుచుండు - నేలతీయని నెదరులాండు
దృఢతరంగ తురంగములతో - తీరదేశము నా(క్రమించిన
ఉత్తరాబ్దిని త్రిప్పికొట్టిన యోద్దభూమి”
నన్ను మైమరిపించింది. నా నోట ఎన్నైన్నో కవితలు పలికించింది.
స్కాండినేవియాలోని డెన్మార్కులో 'కోపెనొహెగన్ ప్రక్కన కూర్చున్న “మర్మేడ్” మూగ శిలాకృతిలోని ఆత్మ సౌందర్యం నన్ను అలరించింది. స్కాండినేవియాలో కవిత్వం రాయలేనివాడు ఎక్కడా కవి కాలేడు అని అనిపించింది.
ఇంగ్లాండులో 'కొండల్దాంటి రాకాసి గుండెల్లాంటి బకాసరుని కండల్హాంటి, భవనాలతో నిండిన లండన్ మహానగరం*లో పరతంత్ర భారత్ స్పృతులు నన్ను కలతపెట్టాయి. భావకవితా సరోవరం. బకింగ్‌హామ్ భవనం, ధేమ్స్ నది తలపించిన జీవిత గతులు మరపురానివి. బర్మింగ్‌హామ్‌లో, మాంచెస్టర్‌లో జరిగిన ఈటా (యూరోపియన్ తెలుగు అసోసీయేషన్ ) సభల్లో అతిధిగా పాల్గొన్న అనుభూతి కూడా మరచిపోలేనిది.
అంబరచుంబి యాపిల్ టవర్ నుంచి ఆశ్చర్యంతో అవలోకిస్తే పురాగాథ కలాపాలు విప్పి ఆడే మయూరి'లా పొడచూపింది ప్యారిస్ నగరశోభ 'లిడోలో వినోదప్రభ, వెదజల్లిన కళాత్మక సౌరభం నేను జన్మజన్మలకు మరవలేని రసానుభూతి. ఫ్రెంచి సాహిత్య సంస్కృతుల విశిష్టత నన్నెంతో ఆకట్టుకుంది.
బెల్జియంలో 1815లో జరిగిన వాటర్లూ యుద్ధరంగంలో సృష్టించిన కుడ్యచిత్ర (ప్రదర్శనం నా కలాన్ని కదను తొక్కించింది. అదొక అవర్షనీయ అనుభవం.
ధర్మాన్ని ఒకప్పుడు ఉరితీసిన జర్మనీ దేశంలో పర్యటించినప్పుడు మానవజాతిని హింసించిన హిట్లర్ నాజీ నియంతృత్వపు రాక్షసకృత్యాల స్మృతులు రైను నోట విన్నాను.
“అలా అలా గలా గలా ఆడే నదీ - ఐరోపా హృదయంలో పారే నదీ
కలవంటి కథవంటి రైను నదీ - కదిలించింది నా మదిలో కవితానది”
వినిపించింది దాని ఆత్మస్పందనలు.
ఇటలీలో కాలలీలాకేళిలో 'ఇరవై నాలుగు శతాబ్దాలు దాని అస్తిత్వాన్ని నిలబెట్టిన ఘట్టాలు” గుర్తు చేసుకొంటూ చేసిన “రోం నగర వీధుల్గో, విహారం రోమాంచం 150 పరిణతవాణి ప్రసంగాలు
కలిగించింది. తెలుగు భాష “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్న సంగతి ఇటాలియన్లకు తెలియకపోవటం బాధ కలిగించింది. ప్రపంచంలోని సప్తాద్భుతాలలో ఒకటైన పిసా'లోని వాలుగ్ పురం “భూమాత ముందు మోకరిల్లైన వాస్తుకళా సైర్య స్తంభాన్ని ఆ మాత నేల కూలనీయదేమో” అన్నట్టు అనుభూతి కలిగించింది. మన తాజమహల్‌ను తలపించింది.
“మానవ చరిత్రను మలుపు తిప్పిన రష్యా” చరిత్ర ఆరవ శతాబ్దంలో వెలుగు చూపి, ఇరవయ్యో శతాబ్దారంభంలో కమ్యూనిస్టు విప్లవాన్ని సృష్టించిన సన్నివేశం, లెనిన్ మసోలియంలో నా కళ్లలో మెరిసింది
మేలుకొ లెనిన్ మేలుకో
నీ సుదీర్చ యోగనిద్ర నుంచి మేలుకో... అంటూ
పుస్తకాలలో వ్రాసిన సిద్దాంతాలు
వాస్తవంలోకి రాలేదని... (గ్రహించాను.
“తప్పిపోయిన నా చేతిపెట్టె” - పోతే పోయిందిగాని
అక్కడ రక్షక భటులు చూపిన సానుభూతి ఆదరణ, సహకారం,
మమకారం నాకు అమితానంద పేటిక అయింది.
మనసిచ్చిన మలేషియాను ఎన్నిసార్డు చూచినా తనవి తీరని ఆనందాన్ని పంచింది
- ఆత్మీయులు శ్రీ, ఆదిల్నాయుడు, బాలకృష్ణనాయుడు వెదజల్లిన స్నేహ గంధాలతో
మలయమారుతం - మలయమారుతం
మలేషియా దేశమైత్రి మధుర మారుతం'
అంటూనా దేహాత్మలు పొందిన పారవశ్యం మరువరానిది. రెండవ ప్రపంచతెలుగు మహాసభలకు ఆతిథ్య మిచ్చిన ఆ దేశ రాజధాని కవులు మెచ్చిన “"కవులాలంపూర్”గా నన్ను కూడా అలరించింది. ఉత్తరోత్తర అనేకసార్లు అక్కడికి వెళ్ళాను. మిత్రులు పాల్నాయుడు ఆంధ్రసంఘం సభ్యులు ఇచ్చిన ఆత్మీయ సత్కారం మైత్రికి మారుపేరు. ఇక సింగపూర్ పండించిన బంగారు స్మృతులు చెప్పనక్కర లేదు. ఆజాద్ హింద్ సేన నడిపిన ఆసమాన దేశ భక్తుడు, వీరుడు సుభాష్ చంద్రబోస్ అమరవాణి విన్నాను.
“చచ్చితివా లేదా నేనే
కచ్చితముగ చెప్పలేను, కడలి కడుపులో
చొచ్చిన సూర్యుడు చచ్చునే
చచ్చునె తమసాబ్దీ మునుగు చంద్రుడు చెపుమూ” డా, ఇ బాపురెడ్డి 151
అని నా మౌన (ప్రశ్నకు సమాధానం చెప్పింది.
వినోద విజ్ఞానాల చెండు ధాయిలాండ్. తొలిసారి (ప్రపంచ కవుల సమ్మేళనం' లో పాల్గొన్నప్పుడు దర్శించి పొందిన అనుభూతి నాతో పాటు భారతీయ సోదరకవులు మల్లెమాల, ఉండేల మాలకొండారెడ్డి ఆచార్య తిరుమల, వి. కొండలరావు, హెచ్. రాజేంద్రప్రసాద్, అమీరొద్దీన్. వి.వి.వి. సుబ్రహ్మణ్యం, కృష్ణ శ్రీనివాస్, పద్మనాభం (ప్రభృతులు పంచుకొన్నారు.
“కటి కౌపీనము దాల్చి జీవనల సద్గంగాతరంగాలపై
నటనమ్మాడితి, సర్వశాస్త్రవర వీణా వైణిక స్వామినై
స్ఫుటశ్ళంగార విలాసరాగ రచనా పూర్వాభిరాముండనై
వటయాబీచి కవోష్ణ కౌముదుల గోపాలుండనైపోయితిన్”
అంటూ ఆశువుగా పొందిన స్పందన నా “లోకాలోకన' యాత్రలో మరపురాని ఒక మధురసృతి.
చైనా ప్రజా రిపబ్లిక్ గణతంత్ర చైనా దేశం - (తైవాన్) ఒకే. చెట్టుకు వేసిన రెండు శాఖలు - తళతళలాడిన తైవాన్ ముఖ్యపట్టణం తైపీలో జరిగిన కళకళలాడిన (ప్రపంచ కవి సమ్మేళనంలో పాల్లొన్న సంఘటన, చైనా ప్రజా రిపబ్లిక్ రాజధాని బీజింగ్‌లో జరిగిన పారిశ్రామిక ప్రదర్శనలో పాల్లొన్న అనుభవం రెండూ, ప్రాచీన - అధునాతన చైనా సంస్కృతుల శోభలో నన్ను ముంచెత్తాయి.
అటు (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వంటి మానవ కల్పితాద్భుతం, ఇటు సూర్యచంద్ర సరోవరం వంటి ప్రకృతి సౌందర్య వైభవం ముందు మోకరిల్లింది నా కవిత్వం, చేరిపోయింది మధురమధురానుభూతుల మంజూషలో తన తన్మయత్వం.
టిక్కితో “నా సాహిత్య సంపర్కం” నిలుస్తుంది ఆ చంద్రతారార్కం. ఇస్తాంబుల్‌లో జరిగిన (ప్రపంచకవుల సమ్మేళనంలో నా 'లవింగ్ ఈజ్ లివింగ్'(ప్రేమించడమే జీవించడం-ఆంగ్ల కవితా సంపుటి) ఆవిష్కరణ, సబీహో నెవిన్ ఇస్టాం వంటి సాహితీమూర్తులతో పరిచయం - ఆ పుస్తకాన్ని ఆమె నాటకీయంగా టర్కిష్ భాషలో తర్జుమా చేసి, నన్నక్కడికి పిలిచి సన్మానించడం, ఆ దేశంలో పర్యటనలు, బాస్పరస్ జలసంధిలో నౌకా విహారం, అంటాలియా సందర్శనం, అక్కడి సాహితీ గోష్టులు అన్నీ ఒక వాస్తవమైన స్వాప్నికానందం. ఒక భావభౌతిక సత్యానుభూతి.
మార్గమధ్యంలో సప్తవర్ష ఇంద్రధనువు వంటి ఏడు ర్యాష్ట్రాల సంయుక్త అరబ్ ఎమిరేట్సులో రసజ్ఞ మిత్రులు రాజారావుతో దుబాయి పర్యటనం, ఎడారి సఫారి నవనవానుభూతులు పండించాయి. బంగారం ఆరబోసిన బజారు మెరుపుల్లో 152 పరిణతవాణి ప్రసంగాలు
అరమోడ్భిన నా కళ్లు ఇంకా తెరుచుకోలేదేమో అనిపిస్తుంది. చూసినా నమ్మని వాస్తవానుభూతి అది. కష్టాల కడలిలో చిక్కిన ఫిలిప్పిన్స్ నన్ను మనీలాలో అదోలా చేసేసింది. 7100 దీవులు బారులు తీరిన ఈ దేశాన్ని కొండలదండులు అగ్నిపర్వతాలు, భూకంపాలు నిర్వచిస్తున్నాయి. రెండవ ప్రపంచయుద్ధంలో చరిత్ర సృష్టించిన 'కొర్రిగడోర్ రణస్టలం', వేలాది మృతవీరుల 'అమృతవాటికి నన్ను తాత్వికానుభూతితో ఓలలాడించింది. సమాధి వాటికలో నా చేత స్మృతిగీతి ఆలపింపజేసిన అనుభూతి అది - “ఏవీ ఈ పూవులన్ని ఏమైపోతున్నాయి” తో సాగిన జానపద ప్రస్థానం హతులైన సైనికులు సమాధులైై అసమాధులు మళ్లీ పూవులైన భావధార అది. జపాన్ “ఆత్మ స్టైర్యాన్ని” హిరోషిమాపై అణుబాంబుల కరాళ నృత్యం, హీనాతిహీన అకృత్యం సృష్టించిన విధ్వంసపు గుర్తులు చూస్తేనే కళ్ళు చెమ్మగిల్లాయి. గుండె గుభేలుమంది. శ్రీమతి మియోపుజియ, యుకియోపుజి దంపతులు ఇచ్చిన ఆతిధ్యం, డా॥ ఉపేందర్ రెడ్డి సహకారం, సొకాగొక్కాయి సంస్త ప్రతినిధులు హీరోపూమీ కోసెకి, యామికో తోమ్యోకా, మూషిహీరో ఒజాకితో చర్చలు, సంస్థ అధ్యక్షులు విశ్చవిఖ్యాత బౌద్ధ ధర్మశాంతి ప్రబోధకుడు డా. దైసాకు ఇకెడా నాపై కురిపించిన ప్రశంసలు బుల్లెట్ టైయిన్ (షింకాన్సెన్) లో ప్రయాణం, సదాకీశాంతిబకం, పల్లెసీమల ప్రాభవం, జపానీ బాత్ జలకాలు ఒక అపురూప జగత్తులో సంచరించిన అనుభూతి మిగిల్ఫింది. -ఈ+జిప్టలో, -- “నైలునది రోడ్డు మీద నాగరికత కట్టుకున్న గుడులు చూచితి, పిరమిడులు చూచితి నిస్సహాయతా జీవిత సహారా ఎడారిలోన కాలం పాఠాలు నేర్పు - బడులు చూచితి = పిరమిడులు చూచితి” అంటు పాడుకున్న పాట, సూయజ్ కొలువ గురించిన భౌగోళిక విశేషాలు, నైలునదిలో తేలాడిన నా హృది, అల్లరిపెట్టిన అశ్వారోహణం కైరోనగరంలో కలల కడలి చేరుకున్నాయి -అనిర్వచనీయమైన నా అనుభవానికి అస్తిత్వాన్ని అందించాయి. ఆఫ్రికాలోని జింబాబ్వేలో చేసిన అధికార పర్యటనలో పొగాకు పరిశ్రమతోపాటు శిథిలమైన కట్టడాల వెనుక చెదరిపోని చరిత్ర నన్ను పలకరించింది. చీకటి ఖండంలో ఒక వెలుగు జండా ఎగరవేసినట్టనిపించింది. మొరాకో ఒక సభ్యదేశంగా అధికారబ్బందంలో ఒకడైన నన్ను స్వాగతించిన దా. జె బాపురెడ్డి 153
తీరు, రాచరికం నెలకొన్న ఆ రాజ్యంలో మొరాకేశ్లో కింగ్ హుస్సేన్ చేతుల మీదుగా నాకు ప్రపంచ కళా సంస్కృతుల అకాడమో పక్షాన అంతకుముందు నా పరోక్షంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సంఘటన గుర్తులు నాకెంతో పులకింత కలిగించాయి. “కాసాబ్బాంకా”ను చూచిన సంతృప్తి కూడా ఒక ఆరిపోని స ట్రతిగా మిగిలిపోయింది.
ఆిఫ్టైలియాలో 'తెలుగు పలుకు' సంస్త దశాబ్ది విజయోత్సవంలో అతిధిగా పాల్గొని నా 'హృదయపద్యం' కావ్యసంపుటి అక్కడ ఆవిష్కరించిన సన్నివేశం, మిత్రులు శ్రీ టి. నారాయణరెడ్డి ఆతిథ్యం, సిద్నీలోని ఒపెరా హౌజ్ సోయగాలు, మెల్బోర్న్లో సాహిత్య సౌరభాలు, క్యాంబెర్రాలో రాజ్యాధికార పీరం దర్శించాను. అతివిశాలమైన ఈ దేశంలో విహరిస్తుంటే *ఒక భూఖండం నా పాదాల క్రింద ఉందన్న (బ్రహ్మానందం'లో తేలియాడను. “మనుషుల్ని వెదుకుతున్న మైదానాలను చూచి బావురుమన్నాను”.
అమెరికా ఒక అపురూపప్రపంచం. ఎన్నోసార్లు ఆదేశంలో ఆధికారిక, సాంస్కృతిక, సాహిత్య, సుహృద్భావ పర్యటనలు చేశాను. పికాగోలోని వివేకానంద ధ్యానమందిరంలో కూర్చున్నప్పుడు - న్యూయార్కు లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్జీని, గణేష్ మందిరం దర్శించినపుడు, వాషింగ్టన్‌లోని వైట్‌హౌజ్ వైభవం ఆస్వాదించినప్పుడు, ప్లారిడాలోని డిబ్నిలాండ్లో విహరించినప్పుడు, లాసాంజెలెస్ లాంగ్ బీచ్‌లో తాత్విక చింతనలో పడ్డప్పుడు, సింధూరి నడుపుతున్న సావిత్రి ఆర్ట్స్ అకాడమి నృత్య కళాశాల ఆతిధ్యం అందుకున్నప్పుడు, అస్టిన్లోని హిప్పీపార్కు లోని (ప్రకృతి సహజమైన నగ్న సౌందర్యాలు చూచినప్పుడు, అట్లాంటాలో డెట్రాయిట్లో, ఫిలడెల్ఫియాలో, అగస్టాలో మెక్సికోలో పుస్తకావిష్కరణలు, అంకితోత్సవాలు జరుపుకున్నప్తుడు అస్టిన్ టెలివిజన్‌లో సుదీర్హమైన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, శ్రీమతి నిరంజని ప్రోత్సాహంతో అమెరికాలో బతుకమ పాట కూర్చినప్పుడు నేను మీటిన సాహిత్య స్వరాలు, శారదాంబ ప్రసాదించిన మహానుభూతి వరాలు.
కెనెడీ సెంటర్లో అంతరిక్ష పరిశోధనలను సందర్శించినపుడు, 1969 జూలై 21 నాడు తొలి మానవుడు ఆమ్[స్టాంగ్ చంద్ర మండలం మీద కాలుమోపిన చారిత్రాత్మక ఘట్టం గుర్తుకు తెచ్చుకున్నాను. ఆనాడు నాలోఉప్పాంగిన భావావేశం మానవజీవితానికి అంతరిక్షం అందించిన సందేశం. తర్వాత శ్రీహరికోట సందర్శించినపుడు అంతరిక్షమంతా నాకళ్ళల్లోనే కదలాడినట్టు అనుభూతించాను. నా 'కళాతృష్ణు 'అంతరిక్ష విజయం' వంటి కావ్యఖండికలు అందుకు అక్షరసాక్ష్యాలు. 1154 పరిణతవాణి ప్రసంగాలు
2001 సెప్టెంబర్ పదకొండు నాడు న్యూయార్కు కళలపార్కులోని ప్రగతి గోపురాల జంటను ఉన్మత్త రాక్షసత్వం అమానుషంగా కూల్చినప్పుడు విశ్చ్శవ్యాప్తంగా మానవత్వం సంఘటిత శక్తిగా స్పందించినప్పుడు కలిగిన నా ఆ(గ్రహావేశం, భావోద్వేగం గుర్తుకు తెచ్చుకుంటున్నాను.
కొనడాలోని విండ్సర్ విశ్వవిద్యాలయంలో ఆచార్య టి. వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అతిధిగా ఉపన్యాసం చేసినప్పుడు, ప్రపంచ ప్రఖ్యాత నయాగర జలపాతంలో మమేకమై మైమరచినప్పుడు పొందిన స్పందనలు అనుభవైక వేద్యాలు, ఆనంద బృందావనాలు. అనువాదాలు
నా ఆంగ్ల కవితా సంపుటి 'లవింగ్ ఇజ్ లివింగ్ టర్కీలోకి 'ఆశ్చయషూర్ 'గా , నా “శ్రీకార శిఖరం' హిందీలోకి, డా. శ్రీరామరెడ్డి 'శ్రీకార శిఖరోగా, ఆచార్య సోనియా గుప్త నా ఆంగ్ల కవితల్ని స్పానిష్ కవితాసంపుటి 'మాస్ అలాదెల్ ఒరిసాంత్యే'గా, శ్రీ మార్కండపురం శ్రీనివాస నా "కాలం మాయాజాలం” కవితా సంపుటిని “కాలం మాయాజాల”గా కన్నడలోకి అనువదించారు. జర్మనీ, కొరియన్, చైనీజ్, రొమేనియన్ వంటి భాషల్లోకి కొన్ని కవితలు కూడా తర్జుమా చేయబడి ఆయా అంతర్జాతీయ కవితా సంకలనాలలోకి చేరినవి.
నేను కూడా ఇతర భాషల్టోనుంచి తెలుగులోకి అనువదించిన (గ్రంధాలు నాకు అనువాద (ప్రక్రియలో కొంత అభినివేశం, అనుభవం కలిగించాయి. కీర్తిశేషులు అమరేంద్ర వంటి విమర్శకాగ్రేసుడు నా సృజనాత్మక విశ్ససనీయత అనువాద శైలిని ఎంతగానో (ప్రశంసించాడు. ఎన్.బి.టి. వంటి జాతీయ సంస్థలు నిర్వహించిన అనువాదానికి చెందిన అంతర్జాతీయ సదస్సులలో పత్రం సమర్పించే అవకాశం కల్పించారు. నేను నా తెలుగు కృతులను 11 (౪౫౬౦1 [జయుంం, గట & ₹151015', '&0800%03% 0 గౌరంలి, "|| 01 0౪6, వంటి సంపుటాలుగా అనువదించడమే గాక అమెరికన్, ఆర్మేనియన్, డేనిష్ కవయిత్రుల (గ్రంథాలను తెలుగులోకి అనువదించాను. వాటి మీద తులనాత్మక విమర్శనవ్యాసాలు (ప్రచురింపబడ్డప్పుడు పొందిన ఆనందం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను.
నేను ఆ మధ్య ఒక జపానీ కవి కావ్య సంపుటాన్ని (ఇంగ్లీషు మాధ్యమం ద్వారా) 'అజ్ఞాత శక్తి సందేశం'గా అనువదించడం, కొరియాలో జరిగిన ప్రపంచ కవుల సమ్మేళనంలో ఆవిష్కరింపబడడం నాకెంతో సంతృప్తి కలిగించింది. దడా, జె బాపురెడ్డి 155
విశ్శసాహిత్య సృష్టికి మన జాతీయ సమైక్యతా భావపుష్టికి భాషాంతరీకరణాలు, “ఆదాన్ ప్రదాన” వంటి కృషి ఎంతో దోహదం చేస్తాయి. మన సాహిత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాకపోవటానికి ఒక ముఖ్యకారణం కూడా ప్రపంచ భాషల్లోకి అనువాదానికి మన సాహిత్య సృజనాత్మకత నోచుకోకపోవటమే. ఈ మధ్య నేను ఇంగ్లాండులో నిర్వహించిన “జాతీయ సమైక్యతలో భాషల పాత్ర” పై సదస్సులో సమర్పించిన పత్రంలో (ప్రస్తావించినప్పుడు సదస్యులు (ప్రశంసాపూర్వకంగా స్పందించారు. నన్ను అభినందించారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బాలమురళీకృష్ణ సుశీల, వాణీజయరాం, ఆనంద్, ఎైలజ వంటి ప్రఖ్యాత గాయనీ గాయకులు పాడిన 'శ్రీకార శిఖరం' ఆడియో క్యాసెట్టు 'రసమయి' రాము వెలువరించాడు. బహుళ ప్రచారం పొందిన ఆ క్యాసెట్‌ను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలతో తెలుగు ప్రజలకు అంకితం చేయడం నా జీవితంలో శిఖరాయమానమైన సాఫల్యంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. నా “బాపురెడ్డి గేయాలు”, 'మన చేతుల్లోనే ఉంది” 'భావగీతాలు*, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డులకు, తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులకు నోచుకున్నాయి. నా “'బుతురాగం” నృత్యరూపకం 1994 సం॥నికి టెలిఫిలిం [క్రింద 'నంది' అవార్డు అందుకుంది. నా రచనలు పార్యపుస్తకాలలో ఆంధ్రప్రదేశ్‌లో, కర్నాటకలో, రాజస్టాన్‌లో చేర్చబడడం నాకెంతో సంతృప్తి కలిగించింది. దేశవిదేశాలలో నాకు జరిగిన సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు తక్కువేమీ కాదు. నాకు రాని అవార్డుల గురించి, గుర్తింపుల గురించి బాధపడకుండా, వచ్చినవే నాకు పదివేలుగా గుర్తిస్తాను. అయినా నా మిత్రులు (శ్రేయోభిలాషులు మీకు ఫలానా అవార్డు, పురస్కారం, గుర్తింపు ఎందుకు రాలేదని అడిగినప్పుడు నేను వినమ్రుడనై పోతాను. భగవద్గీతలో నేను నేర్చుకున్న నిష్కామకర్మయోగత్వం 'స్థితప్రజ్ఞత్వం' పట్ట విశ్వాసంతో భారత కధకు జీవనాడి వంటి పద్యాన్ని ఉల్లేఖిస్తుంటాను. సారపు ధర్మమున్ విమల సత్యము, పాపము చేత బొంకు చే పాఠము పొందలేక చెడ బారినదైన అవస్త, దక్షులె వ్వారు ఉపేక్షచేసిరది వారల చేటగుగాక్క, ధర శని న్థారకమయ్యు సత్యశుభ దాయకమయ్యు దైవముండెడన్ అంటూ చిరునవ్వు చిందించి నిట్టూర్చి దండం పెడుతుంటాను. నా శేషజీవితంలో నా చేతనైనంత సాహిత్య సేవ చేయాలని అంకితభావంతో సృజనావేశంతో యాత్ర 156 పరిణతవాణి ప్రసంగాలు
సాగించాలని ఆశిస్తున్నాను. అందుకు పెద్దలందరి ఆశీస్సులు నాకుంటాయని ఇన్ని విశేషాలు, జీవితానుభవాలు, అనుభూతులు ఆవిష్కరించడానికి నాకు అవకాశం కల్పించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు వారికి ముఖ్యంగా పెద్దలు డా॥ సి, నారాయణరెడ్డి మిత్రులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా॥ జె. చెన్నయ్య గారలకు నా లు యు కృతజ్ఞతాభివందనాలు. ట్ డా, జె బాపురెడ్డి 157
డా. వోతుకూచి నాంబశవరావు (25-1-1997)
జీవిత ఉషోదయంలో ఎన్నో ఆశలతో, ఆశయాలతో ముందుకు సాగిపోతాం. కొన్ని నెరవేరుతాయి, కొన్ని సాధించుకుంటాం. మరికొన్ని లభించక భేదిస్తాం. అందుకే (ప్రతి వ్యక్తి జీవితం ఒక సమరం. అలాగే నా జీవితమూ సాగుతోంది.
'పరిణతవాణి'లో ప్రసంగించడానికి అవకాశమిచ్చిన డా. సి. నారాయణరెడ్డి గారికి నా కృతజ్ఞతలు. జీవిత సమరంలో ఒడుదుడుకుల అనుభవాల రసాశయమే యీ పరిణతవాణిి,
తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు (గ్రామంలో జన్మించి, బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకుని, మేనమామ పోషణలో ఎదిగి, చదువుకుని పట్టభద్రుడినైనాను. విద్యార్థి దశలోనే కళలపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది నాలో. కాకినాడ పి. ఆర్. కాలేజీలో ఇంటర్, బి.ఏ, చదువుతున్న రోజుల్లో నా కలంలో సాహితీ చైతన్యం జనించింది. ఆనాటి ఆం(ధ్రాభ్యుదయోత్సవాలలో ప్రధమంగా పద్య కవిత (వ్రాసి 'జనుషాంధుడు' అనే కవితా ఖండికకు ప్రథమ బహుమతి పొందాను. భమిడిపాటి కామేశ్వర్రావుగారి (ప్రభావంతో ముందుకు సాగి 'ఇదీతంతు' అనే నాటిక వ్యంగ్య హాస్యంగా రచించి, నటించి, ప్రదర్శించి, రచనకు, నా ప్రాత * వైకుంఠంబాబు' కు పోటీలలో ప్రధమ బహుమతి పొందాను. విద్యార్థి కాంగ్రెసు పట్టణ నాయకుడిగా ఒక ప్రక్క రాజకీయాలలో ప్రవేశించి, ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నాను. నేను వ్రాసిన మొదటి కథ “చితికిన హృదయంలో చీలికలు" అనాటి 'ఆనందవాణి' పత్రికలో ప్రచురించి కాళిదాసు గారు నాకు ఎంతో (ప్రోత్సాహం యిచ్చారు. అప్పటికి నాకు ఆయనతో ఏ విధమైన పరిచయము కూడా లేదు. తరువాత హైదరాబాదులో కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నాను. 158 పరిణతవాణి ప్రసంగాలు
1948లో హైద్రాబాదు తరలి వచ్చాను ఉద్యోగాన్వేషణలో. నటరాజు అయ్యర్ చార్జర్హు అక్కౌంట్సు కంపెనీలో స్టైనోగా ఉద్యోగంలో చేరి సాహితీ పిపాస 'పెంపొందించుకున్నాను. సాయంత్రాలు [గ్రంధాలయాల్లో గడిపి సాహిత్యం ఎంతోచదివి ఆనందించే వాడిని. ఉద్యోగ నిర్వహణలో, క్రొత్తగా ఉద్యోగాల వేటలో చివరకు సెక్రటేరియట్లో స్టైనోగా, విరల్రావు, హెచ్.సి.ఎస్, నాగేంద్ర బహదూరు, హెచ్.సి.ఎస్., యన్. యస్. వర్మ కస్టోడియన్, ఎవాక్యూ్రాపర్టీ, రాష్ట్ర కార్మికమంత్రి వి.బి,.రాజు మున్నగు వారి వద్ద తీరిక లేని ఉద్యోగాలు చేస్తూ సాహిత్యాన్ని మరోవైపు పెంపొందింప చేసుకున్నాను. నేను వ్రాసిన కధలు కవితలు, వ్యాసాలు విరివిగా 'ఆంధ్రపత్రిక' వారపత్రిక 'గోల్కొండపత్రికల్లో ప్రచురితమౌతుండేవి. నవ్యసాహితీ సమితి స్థాపకులలో ఒకడినై ఎన్నో సాహితీ కార్యక్రమాలు అధ్యక్షుడిగా, ప్రధానకార్యదర్శిగా నిర్వహించి, తెలంగాణా రచయితలతో కలిసి మెలిసి తిరిగాను. సాధనసమితి కార్యక్రమాలు నెల్లూరి కేశవస్వామి ఆధ్వర్యంలో జరగగా, ఎన్నో సమావేశాలకు హాజరయి, పి.వి. నరసింహారావు, హయగగ్రీవాచారి, పల్దా దుర్గయ్య, దాశరధి, రామరాజు వంటి పెద్దల స్నేహ మాధుర్యం రుచిచూశాను. 'నవ్య సాహితీ సమితి” కార్యకర్తగా ఆంధ్ర రచయితలకు హైద్రాబాదులో వేదిక ఏర్పాటు చేసి, సాహిత్య ప్రచారానికి దోహదపడ్డాను. ఆ కాలంలోనే కురుగంటి సీతారామయ్య, బోయిభీమన్నల ఆశీర్వచనం, అండదండలతో ఎన్నో సాహితీ కొర్య(క్రమాలు వేమరాజు నరసింహారావు సహాయంతో నిర్వహించి తెలుగు సాహితీరంగ (ప్రముఖుల సన్నిహిత పరిచయాలు సాధించుకున్నాను. దివాకర్మ్మ ఖండవల్లి లక్ష్మీనిరంజనం, బొడ్డపాటి కుటుంబరావు, మునిమాణిక్యం నరసింహారావు, వేలూరి సహజానంద, బుచ్చిబాబు, గోపీచంద్, స్థానం, కృష్ణశాస్త్రి కాటూరి, అబ్బూరి రామకృష్ణారావు, దేవులపల్లి రామానుజరావు, బెజవాడ గోపాలరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి వెలిదండ ప్రభాకరరావు, గోపాలచక్రవర్తి కపిలకాశీపతి, సూర్యదేవర రాజ్యలక్ష్మి, ఇల్లిందల సరస్వతీ దేవి యల్లాప్రగడ సీతాకుమారి, బూర్గుల రామకృష్ణారావు -- ఇలా అనేక మంది సొహితీ ప్రముఖుల మన్ననలు పొంది క్రొత్త ఉత్సాహంతో ముందుకు సాగిపోయాను. తెలంగాణా రచయితల సంఘం కార్యకర్తలైన దాశరథి, సి. నారాయణరెడ్డి కాళోజి, వానమామలై మున్నగువారి సాహిత్య (ప్రతిభ గుర్తించి, వారి నుంచి ఎంతో నేర్చుకొని (క్రొత్త సాహితీ జీవిత నిర్మాణానికి కృషి చేశాను.
1952 ప్రాంతంలో 'ఆంధ్ర పత్రిక వారపత్రికలో నేను వ్రాసిన ప్రథమ నవల “ఉదయ కిరణాలు” కు ప్రధమ బహుమతి వచ్చింది. తర్వాత ఆ నవల ఆ పత్రికలో సీరియల్‌గా ప్రచురించారు. ఆ నవల నాకు అనంతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టింది. నా ఉద్యోగ వాతావరణంలో నాకు మంచి గౌరవం లభించింది. డా. పోతుకూచి సాంబశివరావు 159
ఆ కాంలోనే (1956లో) భీమన్న సహాయంతో, నాటి కార్మిక మంత్రి దామోదరం సంజీవయ్య గారితో పరిచయం ఏర్పడింది. సంజీవయ్య రాజకీయవేత్తేగాక రచయిత, నటుడు, నాటకకర్త, గాయకుడు, మహావక్త. నన్ను సన్షిహితునిగా ఆదరించారు.
అప్పటి సాహితీ వాతావరణంలో కవులు,రచయితలు వర్గాలుగా ఏర్పడి, అభ్యుదయ రచయితల సంఘం, సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్తు, విష రచయితల సంఘం, ఇలా సంస్థలు ఏర్పడి ఎవరి దారి వారిదే అన్నట్టు సభలు నిర్వహించేవారు. రచయితలు అందరూ ఒక (త్రాటిపై, ఒకే వేదికపై కలవాలని కలలు కనేవాడిని. ఆ దృష్ట్యా నవ్య సాహితి సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర రచయితల సమావేశాలు ఏర్పాటు చేద్దామని నేను సంకల్పిస్తే ఆపరిధిపెంచిఅఖిల భారత తెలుగు రచయితల సభలు నిర్వహించమని భీమన్న సలహా యిచ్చారు. కార్యకర్తగా ఆ సభలు నిర్వహణ నా జీవితంలో ఒక ప్రధాన సంఘటన. మంత్రి సంజీవయ్య అధ్యక్షతలో ఆహ్యాన సంఘం ఏర్పరిచాం. తరువాత ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో భీమన్న, నేను, వేమరాజు, కల్లూరి సుబ్బారావు ప్రధానంగా పూనుకొని (ప్రధమ అఖిల భారత తెలుగు రచయితల మహాసభలు 1960లో రెడ్డి హాస్టల్లో ఘనంగా నిర్వహించాం. ఆనాటి ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ సభలు
(ప్రారంభించడం, దేశం నలుమూలల నుంచి వెయ్యి మంది పైగా ప్రముఖ రచయితలు హాజరు కావడం, మూడు రోజులు అపూర్వమైన తెలుగు రచయితల ఐక్యతా వేదికగా ఆ సభలు రూపొందడం నా జీవితంలో మహాదానందం కలిగించింది. అందరి దృష్టిని నేను ఆకర్షించాను. అనంతమైన కీర్తికూడా ఒక కార్యాకర్తగా గడించ కలిగాను. ఈ సభలు నిర్వహించాలనే కోరిక నాకు మిత్రుడు వెల్దండ (ప్రభాకరరావు ద్వారానే కలిగింది. ఆయనతో కలిసి ఆలిండియా ఓరియంటల్ సభలు, అఖిల భారత (పెన్) సభలు వాజరయ్యాను. నా దృక్పధంలో సాహితీసంకుచిత్వం దూరం చేసి, అందరినీ కలపాలనే ఉద్వేగం నాలో కలిగింది. తర్వాత ఈ సభలు రాజమండ్రి, హైద్రాబాదు, విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు నగరాలలో కూడా దిగ్విజయంగా నిర్వహించాను. ఇతర నగరాలకి వెళ్లి సభలు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని నాకు తెలిసింది. కాని దైవకృప వలన నా ప్రయత్నాలు సఫలీకృతమయి, నాకు కీర్తిప్రతిష్టలు ఇనుమడింప చేశాయి. ఎందరో ప్రముఖులను నేను సన్మానించే అవకాశం లభించింది. తిరుపతి సభలకు 'చలం' రాలేకపోతే స్వయంగా రమణాశ్రమం వెళ్ళి, చలాన్ని దర్శించి, ఆయన ఆతిథ్యం స్వీకరించి ఒక అర్దదినం ఆయనతో గడపడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. వారి కాంపౌండులో నృత్యం చేస్తున్న నెమిలిలా నేను సంతోషంతో నిండిన హృదయంతో నాట్యం చేశాను.
160 పరిణతవాణి ప్రసంగాలు
కార్యకర్శత్త్వంతో పాటు నా సాహితీ కృషి కొనసాగించాను. 1960లో నా 'అన్వేషణ' నవల ఆం(ధ్రవారసత్రికలో ప్రచురింపబడింది సీరియల్‌గా. ఆ నవల ఎందరినో ఆకర్షించింది. మూడు సంవత్సరాలు జంట నగరాలలో ఎన్నో పాత్రలు, వాతావరణాలు దర్శించి, పరిశోధించి, ప్రయోగాల ద్వారా క్రొత్త పాత్రలు అర్హం చేసుకుని, హైద్రాబాదు జంట నగరాల చరిత్ర, భూగోళ సౌందర్యాలు నవలలో పొందుపరిచి క్రొత్త రీతిలో ఆ నవల (వ్రాశాను. ఆ రోజుల్లో పాదకుల స్పందన నాకు ఎంతో గర్వం, ఆనందం కలిగించాయి. ఆ నవల రచనా (ప్రయోగాలలో, హైద్రాబాదు నగరంలోని పార్కుల్లో పడుకున్నాను. దెయ్యాలు చూడాలని (ప్రయత్నించాను. మెహిందీలోని వ్యభిచార జీవితాలు పరిశీలించాను. నాటకరంగంలోని తీరుతెన్నులు, మానవ మనోసంత్లిష్టతలు అర్దం చేసుకుని (వ్రాశాను. హైద్రాబాదు సంస్కృతి విళిష్టం. సర్వభాషా సమ్మేళనం యీ నగరం - జాతీయ సమైక్యతకు (ప్రతిబింబంగా వుండేది. ఆ చరిత్ర, వాతావరణం, రకరకాల పా(త్రలు ఆ నవలలో చిత్రించబడ్డాయి. ఇది ఒక అపూర్వమైన నవలగా సాహితీ చరిత్రలో నిలవగలదని నా అభిప్రాయం.
ఒకవైపు సాహిత్యకృషితోపాటు, 1966లో నా ఉద్యోగంకు రాజీనామా చేసి సంజీవయ్య గురువుగా రాజకీయాలలోకి ప్రవేశించి కాం(గైస్‌లో పనిచేశాను. దొదాపు 30 సంవత్సరాలు గాంధీభవన్‌లో మిత్రుడు ఎ.చక్రపాణితో కలిసి, అనేక పార్టీపదవులు అధిరోహించాను. రాష్ట్ర నిర్వాహక కార్యదర్శిగా, 1972లో కర్నూలుజిల్లా జనరల్. ఎన్నికల పరిశీలకుడిగా, గాంధీభవన్ ఎకనామిక్ కల్చరల్ సెల్ఫ్ కన్వీనర్‌గా - ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. యం.యల్:ఏ. యం.యల్.సి. పదవులకు పోటీ చేసి విజయం సాధీంచలేకపోయాను. కాని నాకు స్నేహపరిధి పెరిగింది. రాజకీయనాయకులు అందరూ నన్ను రచయితగా గౌరవించే వారు. 1972లో దామోదరం సంజీవయ్య మరణం నా రాజకీయ జీవితాన్ని కుంటుపరిచింది.
ఈ రాజకీయ కార్యక్రమాలవల్ల నా సాహితీ కృషి కొంతవరకు వెనుకబడింది. ఈ లోగా క్రొత్త రచయితలు ఉద్భవించారు. ఉన్న రచయితలు శిఖరా(గ్రాలు అధిరోహించే ప్రయత్నం చేశారు. నా రచనలు ప(త్రికలలో పడుతున్నా నా (గ్రంథాలు వెలువడుతున్నా, సాహితీ సమరాంగణంలో నేను వెనుకబడ్డానని తర్వాత తెలుసు కున్నాను. అయినా. శేఖరం కథలు (ప్రేమ కథలు) కధాసంపుటాలు(2), పోతుకూచీయం - పద్యశతకం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి యిచ్చిన హంతకులు నాటకం, 'దాంగనాటిక, రేడియో నాటికలు, రేడియోలో రంగస్థలం మీద నాటకాలు, నా నవలల్లోని వైవిధ్యం నన్ను ప్రజలలో మంచి రచయితగా నిలబెట్టాయి. డా, పోతుకూచి సాంబశవరావు 161
నాటకరంగంలో ఎ.ఆర్. కృష్ణ సారధ్యంలో అనేక పాత్రలు నటించినా (ప్రతాప రుద్రీయంలో ఢిల్లీ సుల్తాన్‌గా నా పాత్ర నాకే ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. నాటకరంగంలో నాకు సన్నిహితుడిగా డా. పన్నూరి రామారావు నాతో వుండేవారు. ఆ రోజుల్లోనే దొర, మూడునాటికలు, పల్లె కదిలింది నాటకం కూడా వ్రాశాను హంతకులు నాటకం పొందిన అదరణ “పల్లె కదిలింది” - సంపాదించుకోలేక పోయింది. .
పద్య (గ్రంథాలలో సాంబశివానందలహరి, గేయాలలో 'అనురాగం - అను-రాగం'" నాకు కీర్తి సంపాదించి పెట్టాయి. దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర 'సంజీవయ్య సందర్శనం” మూడేళ్ళు కష్టపడి, కర్నూలులో సంజీవయ్య జీవిత వాతావరణం పరిశోధించి, రాజకీయ (ప్రముఖులు, మోరార్టీ, శరద్ పవార్, పి.వి. నరసింహారావు, కేంద్రమంత్రి, కె.హెచ్. రంగనాధ్ (బెంగుళూరు) - ఇలా జాతీయ నాయకులను ఎందరినో కలిసి సంజీవయ్య చరిత్రకు సంపూర్ణత్వం కలిగించాను. 400 పేజీలు పైగా ఉన్న ఆ (గ్రంథంలో సంజీవయ్య వ్రాసిన పాటలు కూడా ఉటంకించాను. ఈ (గ్రంథ రచన నేను చేసిన ఒక మహత్తరకృషిగా, ప్రయోగంగా భావిస్తాను. ఈ కృషిలో చక్రపాణి, కెయస్.ఆర్. మూర్తి సి. బి. నామదేవ్ నాకు ఎంతో సహకరించారు.
అఖిల భారత తెలుగు రచయితల సభలు నిర్వహించే కాలంలో ప్రపంచ తెలుగు మహాసభల పథకం రూపొందించాను. తమిళనాడులో జరిగిన ప్రపంచ తమిళ సభలు దృష్టిలో వుంచుకొని, తెలుగువారు యీ సభలు ఎందుకు చేయలేరు? అనే భావనతో కృషి చేశాను. - 1968 ప్రాంతంలో జరిగిన తెలుగు రచయితల సభలకు (ప్రధమంగా మారిషన్ నుంచి రామయ్య, రంగడు, గున్నయ్య వట్టు తెలుగు ప్రముఖులను రప్పించాను. వారి రాక ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించింది. విదేశాలలో తెలుగువారు అనేక మంది నివసిస్తున్న విషయం సర్వవిదితమయింది. వీరిని ఆనాటి ముఖ్యమంత్రులకు, మంత్రులకు పరిచయం చేసి, సభల ద్యారా విదేశాలలోని తెలుగు వారి పరిచయాలు పత్రికా ముఖంగా ప్రకటించాను. ఆ పిదప దక్షిణాఫ్రికా నుంచి పి.యం నాయుడు. ఐ.జె. నాయుడు మున్నగు వారు సతీ సమేతంగా విచ్చేసి తెలుగు వారిని సంభ్రమ పరిచారు. మలేషియా నుంచి తదువరి మరి కొందరు తెలుగు వారు ఆంధ్ర ప్రదేశ్‌కు విచ్చేశారు. ఇలా విదేశాలలోని తెలుగు వారి చిరునామాలు నేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి అందుజేసి 1975లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, మండలి వెంకట కృష్ణారావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫతేమైదాన్‌లో మొదటి ప్రపంచ సభలు చాలా ఘనంగా జరిగాయి. ఈ సభలకు నేను ష్టానింగ్ కమిటీ కన్వీనరుగా తరువాత సెమినార్సు, ఇండియన్ డెలిగేషన్సు కన్వీనరుగా వ్యవహరించాను. ఆ పిదప మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు సభలకు కార్యదర్శిగా కూడాకృషి చేశాను. 162 పరిణతవాణి ప్రసంగాలు
నా రచనలు చాలా వరకు ఇతర భాషల్లోకి - హిందీ, ఇంగ్లీషు, జర్మన్, రష్యన్ భాషల్లోకి అనువాదాలయినాయి. ముఖ్యంగా ఉదయకిరణాలు నవల రష్యన్ భాషలోకి అనువాదమయింది. అలాగే నా కధలు మరి కొన్ని కవితలు భారతీయ భాషల్లోకీ అనువాదం చేయబడినాయి.
ఈ (ప్రపంచ సభలు సందర్భంగా అనేక విదేశాలు, ఇతరరత్రా కూడా పర్యటించే అవకాశం లభించింది.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 20 సంవత్సరాలు సభ్యుడిగా వున్నాను. ఒక టర్ము కార్యవర్గంలో కూడా పని చేశాను. ఆధునిక సాహిత్య ప్రచారానికి అకాడమీ ద్వారా నముచిత పథకాలు అమలులోకి వచ్చేలా ప్రయత్నించాను. అకాడమీ ప్రతినిధిగా లలిత కళా అకాడమీలోనూ, సంగీత నాటక అకాడమీలో 'నాట్యకళి అసోసియేట్ సంపాదకునిగానూ పని చేశాను. ఆ రోజుల్లో చాలా విలువైన వ్యాసాలు కళల గురించి సేకరించి ఆ పత్రికకు |క్రొత్తరూవులు దిద్దాను. ఆనాటి సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీ పసల సూర్య చంద్ర రావు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ యం.ఆర్. అప్పారావు కూడా నాకు ఎంత ప్రోత్సాహం అందించేవారు. వారి సహాయంతో ఒకసారి ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలు రవీంద్ర భారతిలో కార్యదర్శిగా నేను నిర్వహించాను.
1960లో 'విశ్శసాహితి' సంస్థ స్థాపించాను. ప్రస్తుతం ఈ సంస్థకు అఖిల భారతంలో 1500 మంది సభ్యులున్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి విదేశాలకు అందించి (ప్రచారంచేయాలని '౮|||౬17' పత్రిక ప్రారంభించి, దాన్ని నేడు ౪16/4 గా మార్చి నెల నెలా ప్రచురిస్తున్నాను విశ్చరచన, విశ్చసాహితి పత్రికల ద్వారా అనేక మంది యువ రచయితలకు ప్రోత్సాహిం కలిగించాను. దాదాపు 22 సార్హు ఆంధ్రప్రదేశ్ యువనవరచయితల సభలు నిర్వహించి, ఎందరో యువతీ యువకులను తీర్చి దిద్ది ఉత్తమరచయితలుగా రూపొందించాను,
రచయిత్రుల సభలు, ఆలిండియా తెలుగు కవుల సభలు, అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన సభలు "హైద్రాబాదులో నిర్వహించి తెలుగు, ఇతర భాషా రచయితలలో ఐక్యత, సంచలనం కలిగించాను. ఈ సంస్థ భోపాల్‌లో ప్రధాన కార్యాలయం స్థాపించి కృషి చేస్తోంది. ఈ సంస్థకు ఉపాధ్యక్షుడిగా అనేక బహు భాషా కవిసమ్మేళనాలు హైద్రాబాదులో నిర్వహించాను.
1997 ప్రాంతంలో నేను కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా జనరల్ కౌన్సిల్లోకి తీసుకోబడ్డాను నాటి తెలుగు సలహా సంఘ కన్వీనరు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి దడా. పోతుకూచి సొంబశివరావు 163
ఆదరణతో యువతకు కేంద్రసాహిత్య అకాడమీ ప్రత్యేక పధకాలు రూపొంచాలని (ప్రచారంచేసి గట్టి ప్రయత్నం చేయగా అధ్యక్షులు రమాకాంత రధ్ నా ప్రయత్నాలను బలపరిచారు.
అయిదునవలలు, దాదాపు 300 కధలు, ఎనిమిది కవితానంపుటాలు, వ్యాసాలు, బాలలకు (గ్రంధాలు, అనువాదాలు, జీవిత చరిత్రలు, న్యాయం, జ్యోతిషం, ప్రకృతి వైద్యం - పై కూడా (ప్రచురణలు చేసి దాదాపు 80 (గ్రంధాలు వెలువరించాను. చవక ధరలకు సాహిత్యం అందించి జన సామాన్యానికి అందు బాటులో వుంచి, వారిలో సాహితీ చైతన్యం కలిగించాలని ప్రయత్నం చేశాను. అలాగే యువకవుల, రచయితల, రచయిత్రుల రచనా సంకలనాలు కూడా వెలువరించాను. సాహితీ రంగంలో కవిత, కధ, నవల, నాటకం, విమర్శ -ఇలా అన్ని ప్రక్రియలలో విశిష్టమైన (గ్రంధాలు (వ్రాసి (ప్రచురించాను.
నటుడుగా, నాటక కర్తగా 30 ఏండ్లు ఆ రంగంలో కృషి చేశాను. మిత్రుడు ఏ.ఆర్.కృష్ణ సహకారంతో ఎన్నో ఉత్తమ పాత్రలు రంగస్టలం మీద నటించడమే కాక, నా నాటకాలు, నాటికలు స్వయంగా ్రదర్శించాను. వాటిలో పాత్రలు నిర్వహించి నటించాను. ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం నిర్యాహక కార్యదర్శిగా నేను చాలా విశిష్టమైన కృషి చేశాను. అనేక రేడియో నాటకాలలో స్థానం, సహజానంద, భాస్కరభట్ల, నండూరి విరల్, శారదా శ్రీనివాసన్‌ల దర్శకత్వంలో అనేక పాత్రలు రేడియో నాటికాలలో నిర్వహించాను. అనేక జాతీయ కవి నమ్మేళనాలాలో ఇతర భాషల్లోని కవితలు అనువదించి, రేడియో ప్రసారాలలో పాల్గొన్నాను.
1093లో ఆంధ్ర విశ్వ విద్యాలయం 'కళాప్రపూర్ణ' పురస్కారంతో నన్ను సత్కరించింది. అభిల భారతీయ భాషా సాహిత్యనమ్మేళన్ వారు 'భారత భాషా భూషణ్ ప్రదానం చేసి గౌరవించారు. ఇండియన్ రైటర్స్ యూనియన్ (కేరళ) వారు నన్ను తామఘ్రపత్రంతో సత్కరించారు - సాహితీ చైతన్య, సాహితీ భీష్మ, విశ్వాంధ్ర సంధాత బిరుదులు కూడా ప్రజా సంస్థలు నాకు బహూకరించాయి. 2007లో నేను నా సాహితీ షష్టిపూర్తి చేసుకొనే అదృష్టం పొందబోతున్నాను.
జీవితంలో ఒంటరి వాడినై, నా సర్వశక్తులు సాహిత్యకళాభివృద్దికి ఉపయోగించి, వీఖైనంతాగా సేవా కార్యక్రమాలు నిర్వహించాను.
కవితారంగంలో ఇటు పద్యం, అటు వచనం కూడా క్షుభ్మంగా అవగాహన చేసుకుని పద్యాలు, వచన కవితలు వ్రాశాను. దాదాపు 12 సంపుటాలు వెలువడ్డాయి. పద్య రచన చేయలేని కవి, కవిగాడని నా అభిప్రాయం. నేడు వచన కవితారీతులు అందరూ 164 పరిణతవాణి ప్రసంగాలు
పాటిస్తున్నారు. వచన కవిత్వం (వ్రాయడం కష్టమే. అందులోభావం, కవితా తత్వం లేకపోతే, వచన కవిత రాణించదు. తెలుగులో (ప్రముఖుల వచన కవితలు ఆంగ్లంలోకి అనువాదం చేయించి ప్రత్యేక '౮౫|౬| సంచికలు (ప్రచురించాను. గురజాడ అప్పారావు శత జయంతి ఉత్సవాలలో వెలువరించిన (ప్రత్యేక సంచిక దేశ దేశాలలో ప్రఖ్యాతి గాంచింది. అలాగే పానుగంటి ప్రత్యేక సంచిక ఆసియా కవుల ప్రత్యేక సంచికలు ప్రపంచంలోని ఆంగ్ల పారకులను ఆకర్షించాయి. యువ నవ రచయితల గ్రంథా లెన్నింటికో నేను పీరికులు (వ్రాసే అవకాశం కలిగింది కూడా,
నేను (వ్రాసిన 'ఏడు రోజుల మజిలీ" నవల విశిష్టమైంది ఒక 'ప్రేమకధ వారం నడుస్తుంది. ఆ వారం రోజుల్లో నడిచే (గ్రహాల ప్రభావం ఆధారంగా పాత్రలు నడిపించి, జ్యోతిష శాస్త్ర విజ్ఞానం ప్రదర్శించిన ఒకే ఒక నవల ఇది తెలుగు సాహిత్యంలో. నా నవలలన్నీ నాలుగైదు ఎడిషన్సుగా వెలువడ్డాయి. పారకులు (ప్రత్యేక ఆసక్తితో నా నవలలు కోరుతున్నారు. రచనలు, సాహిత్యం ప్రచురించుకుని మార్కెట్ చేసే కృషిలో 'ప్రధములలో నేను ఒకణ్ని. విశ్చసాహితి సభ్యుల (గ్రంధాలు కూడా అమ్మి, వారికి చాలా కాలం సహాయం చేశాను.
ఇదీ తంతు, ఏడు సున్నలు, మూడు నాటికలు హాస్య రసభరితమైన నాటికలు. చలమయ్య షష్టిపూర్తి హాస్యవంతమైన నవల, పోతుకూచీయం హాస్యరస పూరితమైన పద్యాలు. ఎన్నో సరదా కధలు (వ్రాశాను హాస్యం చిలుకుతూ. 'తిరుగుడు తలపులు” శీర్షిక ద్వారా సామాజిక, కళా విశేషాలు విశ్లేషణ చేసి హాస్యం సృష్టించాను. ఆ విధంగా నేను చాలా హాస్య ప్రియుణ్ని.
కధా రంగంలో నేను కొన్ని ప్రయోగాలు చేశాను. 'స్వగతాలు” అనే కధా రచనా విధానంలో పాత్రలు సంభాషణలు లేక మనోగత అభిప్రాయాల ద్వారా కధలు అల్లడం. అలాగే వచన కవితా కధా రూపాలు సృష్టించాను. కధారంగంలో రకరకాల 'ఇజం' లు పొందుపరిచాను. రియలిజం, సర్రియ లిజం, సింబాలిజం, ఇంప్రెషనిజం - మున్నగు సిద్దాంతాలు రకరకాల కధల్లో (ప్రతి బింబించాయి. గల్పిక, కార్డుకధ, మినీ కథల వంటివీ వ్రాశాను. 'స్వగతాలు-గల్సికలు' ఒక కధా సంపుటిలా వెలువడింది. ముని మాణిక్యం వారి కాంతం కథలు నన్ను ప్రభావితుణ్ని చేశాయి. ఆ పద్దతి ఆధారంగా నేను శేఖరంకధలు' రెండు సంపుటాలు వెలువరించాను. ఒక లేడీ డాక్టరును (ప్రేమించిన హీరో ఆమె చుట్టూ అల్టు కున్న కథల సముదాయం ఇది. వాతావరణం హైద్రాబాదు ఉసా శ్రైనియా ఆస్పత్రి నుంచి కాచిగూడ (ప్రాంతం దాకా. దా. పోతుకూచి సాంబశివరావు 165
ఇతివృత్త వైవిధ్యం కలిగిన నవలలు -- అన్వేషణ, ఏడు రోజుల మజిలీ. హైద్రాబాదు వాతావరణ మంతా సహజత్వ సిద్దాంతం ఆధారంగా వర్షించి అక్కడ కల్పిత పాత్రల ద్వారా కధలో సంచలనం కలిగించాను - జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఏడు రోజులు (గ్రహచారం గురించి (ప్రేమికులు ఎదుర్కొనే సంఘటనలు ఆసక్తి కరంగా నవలలో, రూపొందించాను. జ్యోతిష శాస్త్రం ఆధారంగా (వ్రాసిన తెలుగునవల ఇదొక్కటే అంటే ఆతిశయోక్తి కాదు.
ఇంట్లో కూర్చుని ఊహించి వ్రాయడం పాత పద్దతి - అది దూరం చేసి, వివిధ వాతావరణాలు, (ప్రాంతాలు పాత్రలు పరిశీలించి రియలిజం సిద్దాంత పరంగా కధలు, నవలలు (వ్రాయడం నా ప్రత్యేకత = ఈ విషయంలో నాకు సోమర్సెట్ మాం ఆదర్శంగా నిలిచాడు. ఆయన నవలలు నన్ను బాగా ఆకర్షించాయి- ముఖ్యంగా ఆయన వ్రాసిన రేజర్సు ఎడ్జీ' నవల.
కాల (క్రమంలో నాకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. 'దైవ (ప్రవక్త సాయి బాబా అనే పుస్తకం వ్రాసి షిర్టీవెళ్ళి, బాబాకు ఆ పుస్తకం అర్పించి, తరువాత (ప్రచురించాను. ఇప్పటికి బాబా నా ప్రార్థనలో ఒక దైవమే.
ఇరవై అయిదు సంవత్సరాల క్రితం నాకు “కృష్ణా కాన్షన్సు” వారి యోగి ఒకరు కృష్ణ మంత్రోదేశం చేశారు - ఆనాటి నుంచి నాకు కృష్ణ భక్తి అలవడింది. ఆ విత్తనం వేడు ఒక మహా వృక్షంలా నాఎదలో ఎదుగుతోంది. “కృష్ణుడితో నేను' అనే (గ్రంధం (వ్రాశాను. శ్రీ కృష్ణ పరమాత్మతో నా అనుభవాలు, నా కోరికల సాఫల్యం, అందులో వివరించాను. కృష్ణ పరమాత్మను నేను ఒక మి(త్రుడిలా ఆరాధిస్తాను కుచేలుడీలా - జీవితంలో కృష్ణుడు నాకు చూపిస్తున్న కృప అడుగడుగునా కనిపిస్తూనే వుంది. అనేక పద్యాలు, గేయాలు కృష్ణుడిపై రచించాను. అవిత్వరలో 'కృష్ణస్తుతి' (గ్రంధంగా వెలువడతాయి. =
సాహిత్యమే కాక, ఇతర (గ్రంధాలూ (వ్రాశాను. ప్రకృతి వైద్యం నేర్చుకుని 'అస్పత్రికి వెళ్ళకుండా ఆరోగ్యం కాపాడుకోండి" అనే గ్రంధం వ్రాశాను. నిత్యజీవనంలో మనం రోజూ వాడుకునే వంటింటి వస్తువులు, ధనియాలు, మిరియం, వాము, జీలకర్ర, ఉల్లి, నిమ్మ - ఇవన్నీ చాలా మంచి మందులు. ప్రతీ ఆకూ ఒక మందే. ఈ దృష్ట్యా ఈ (గ్రంధం చాలా జన రంజకమైైంది. 166 పరిణతవాణి ప్రసంగాలు
న్యాయశాస్త్రం ద్వారా నేను లాయరుగా ప్రాక్టిసు చేసి 40 సంవత్సరాలు పూర్తి చేశాను. 'లాయరుసలహాలు' 'అందరికే న్యాయం' అనే (గ్రంథాలు ప్రచురించాను. ఇవి కూడా (ప్రజానీకంలో చవక (గ్రంధాలుగా బాగా చలామణీ అయి పారకులను ఆకర్షించాయి.
అమె
నా జీవిత మంతా సాహిత్యరంగంలోనే ఎక్కువ గడిచి పోయింది. సంపూర్ణ సాహితీవేత్త కావాలంటే సాహిత్య కృషి సాహిత్యసేవ, సాహితీ చైతన్యం - మూడూ ఉండాలని నాభావం - 1గంథ రచన ద్వారా సాహితీ కృషి యువనవ రచయితలకు సహాయం చేయడం, పోత్సహించడం ద్వారా సాహిత్యసేవ, రచనల ద్వారా ప్రజలలో ఉత్తేజం, కలిగించడం ద్వారా సాహితీ చైతన్యం సిద్ధించగలదనినా విశ్వాసం - ఈ దిశగా నా జీవితం సాహిత్య రంగంలో గడచిపోతోంది. భవిష్యత్కాలంలో కూడా కలం కదుపుతూ ఆధునిక వాతావరణం అర్హం చేసుకుంటూ, సమన్వయ భావాలతో, అభ్యుదయ దృక్పధంతోనే ముందుకు సాగిపోవాలని నా ఆకాంక్ష
శ (న్ భొల్రి వాకర్ డా. పోతుకూచి సాంబశివరావు 167
- న | ఖః 12
| 1|| + (| స | ॥|ీ ॥ | ల. న. (కస. | వ్ శ | జ్ . గళ్ల 1 4 . శ | | | ॥ | | , |. | ; 4 చాల కా