Telugu Panivaadi thanamu - anilvaranasi/indianlanguages GitHub Wiki
పనివాడీతనం
ల ర్న |
౯ ఇ” ॥
వ కాట...
ఎ లి... “2 ఈ ౯ .
= అనేన ఫ్ర
రా ఈం టంట సి క్
60 .-...
గా న నైన స్స
_ _డంఢడాయములా ంలలమ్హాగ్యుచి
ప్రనివాడీతన౦ ఇతర కథలు అక్కినేని కుటుంబరావు స్వేచ్ళ ప్రచురణలు హైదరాబాద్
అనీ గ ఆగి ఖ్) న్ ప ఠా ర ళ్ ఫస! ౪/401 [60401404 వ భి 570౦ | ౯౩ ల ఉంటు స00 గ20 పనివాడితనం ఇతర కథలు అక్కినేని కుటుంబరావు ఏప్రియల్, 2004 ప్రతులు : 1000 కవర్ ఫోటో | అక్కినేని కుటుంబరావు డిజైనింగ్ * పార్థసారధి ప్రింటర్స్, హైదరాబాద్ బుక్ మేకింగ్ ః జుగాష్ విలి టైప్ సెట్టింగ్ : అక్షర క్రియేటర్స్ హైదరాబాద్ ముద్రణ : కర్టక్ ఆర్ట్ ప్రింటర్బ్, హైదరాబాద్ దవ్రళులకు నవోదయ బుకిహొస్స్ కాచిగూడ, హైదరాబాద్ దిశ పుస్తక కేంద్రం, హైదరాబాద్ రిక బో పస్తకేదం, పై ౬ [09 విశాలాంధ్ర బు[కహౌస్ అన్ని బ్రాంచీలు వ్రేజాశ। గో భాళాష్వా క్తి బుక్ హౌస్ అన్ని బ్రాంచీలు ళం న లు. క] హంగ ౯ వా ఛ్ ల:రూ, 50/- గం [€' 6 10. ఓ!ద!%,..) ల ఎ మె స అపాం వొడస్ట్యు 0ీం న ననన
అంకీతం . ముక్కుకో కాడ చెవికో పోగూ అమాయకపు మొహంతో దిక్కుతోచక పల్లెటూళ్ళో తిరుగుతున్న ఓ పదహారేళ్ళ కుగ్రాజ్జి - నన్ను ఈ భాగ్యనగరానికి తీనుకువచ్చి ప్రతి సందర్భంలోనూ నా అభివృద్ధిని కాంక్షించి నా ఈ స్థితికి కారకులైన మాబావ అట్లూరి మధుసూదనరావు గొరికీ అక్క సూర్యప్రకాశమ్మ గౌరికీ
గౌరవంతో
(ప్రేమతో
- అక్కినేని కుటుంబరావు
కృతజ్ఞతలు
ఈ కధలను వ్రచురించిన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక స్వాతి మాసపత్రిక ప్రజాసాహితి జ్యోతి మాసపత్రిక వివుల ఇండియా టుడే సంపాదకులకు
కథాక్రమం 7 రాధారాజీ చచ్చిపోయింది | రి 2 నత్టలైట్లాన్తున్హారు జాగ్రత్త / ఉం 27 ౨ విలువలు-1 + ద! త్త వాయిదా ఆ తిర క్. కీర్తిశేముడు ః భతి ర్ మనిషాొచ్చాడు ల్? ౧ తవ్పు లు 6౮7 8 ఈరడింట్లో పెళ్ళి అం 65 89 బస్సెళ్ళిపోయింది లం 72 12. నేరం న 79 - 7 విలువలు - 2 ం తగ 12 పిచ్చీ విచ్చీ వీల్లంగోర్ లు ర్ 3 మనుషులు ఉం 105 14 బొరకదంజీ బాబూ! ం 770 5 బండీ ఎం 717 16 లాడికోడు గట్టుకాడ ం 26 17 వనివాణీతనం ఎం 2
రాధారాణీ చచ్చిపోయింది
రౌొధ నా కెప్పుడన్నా గుర్తుకు వస్తే. ఎప్పుడన్నా ఏమిటి? అసలు రాధని నేనెప్పుడు మర్చిపోయాను? మా స్నేహం మా ఆటలు - మా కబుర్లు - నిజంగా ఇప్పటికీ నా జీవితంలో అందమైన కాలమంతా రాధతో గడిపిన చిన్నతనమే. నిజంగా నాకో అదృష్టం పట్టిందన్నా - అపురూపమైంది జరిగిందన్నా మా పిన్నిగారి రాధతో 'స్నేహమే.
అసలు నేనా వూరు చదువుకోడానికి వెళ్ళకపోతే రాధని చూడకపోతే ఈ క్షణాలలో నాకీ వేదన వుండేదా? ఇది - ఈ క్షణాలదేనా? జీవితమంతా.. ఆ అందమైన రాధ... ఆ అద్భుతమైన రాధ నన్ను వెన్నాడేదా?
నిజంగా రాధ ఎంత అందంగా వుండేది పేరుకే అందం తెచ్చినట్టు రాధారాణి ఎంత మనోహరంగా వుండేది? అప్పుడు రాధలాగ వున్నవాళ్ళంటే నాకెంతో యిష్టం. నాకెంతో ఇష్టం కలిగేలాగ వుండేది రాధ.
ఆడవాళ్ళ గురించీ అందం గురించీ నాకప్పుడు చాలా యిష్టాలు, ఇభిప్రాయాలు అంత చిన్నతనం నుంచే వున్నట్టు బాగా గుర్తు. అందమైన ఆడవాళ్ళలో నాకే లోపాలు కనిపించేవి కావు. వాళ్ళు చక్కగా నవ్వుతూ మాట్టాడుతోంటే నోరు విప్పకుండా నిశ్శబ్దంగా చూస్తూ వుండాలనిపించేది
“ఎందుకలా చూస్తావు?” అనేది రాధ ఎన్నోసార్లు
ఏం చెప్పాలో తోచక నవ్వేవాణ్ణి రాధ ప్రశ్న నా నవ్వు ఎప్పుడూ కొత్తగా వుండేవి.
నేను చదవడానికి పనిగట్టుకొని ఆ వూరు వెళ్ళానేగానీ. అసలు అక్కడేం చదివానో గుర్తులేదు. ఎప్పుడూ ఆటలు, పాటలు, కబుర్దు.
మగ స్పేహితులొచ్చి నన్ను ఆటకి పిలిస్తే రాధనీ - ఇంకా ఆడ స్నేహితుల్ని సిల్చుకుని బయల్లేరేవాణ్సి అందరూ కలిసి ఆడబోయేప్పటికి కొంతమంది ఆడపిల్లలకి సిగ్గూ - కొంత
- రాధారాణీ చచ్చిపోయింది + ౦
మంది మొగపిలలకి పాగరూ వచ్చేవి. ఎలాగో సముదాయించి నచ్చజెప్పి ఆటకి దిగితే మధ్యలో నాకర్థంకాని దెబ్బలాటలొచ్చేవి. ఆట వంక పెట్టి ఆడపిల్లల్ని మోటుగా కొట్టడం. . నేల మీద బరబరా ఈడ్చటం . జుట్టు పీకటం చేసేవారు నా మగ స్నవాతులు ఒకరిద్దరు ఆడపిల్లల రాగాలతో - మోచేతుల రక్తాలళో ఆట ముగిసేది ఇళ్ళ దగ్గర తిట్లు ఆడపిల్లలకీ మగపిల్లలకీ మధ్య రాతిగోడలు ఆడపిల్లల్ని అలా ఏడిపించటం నాకు నచ్చక నేను కూడా రాధ వెనక ఆడపిల్లల జట్టులో కలిసేవాణ్ణి అక్కడ అమ్మానాన్న ఆటలు, పెళ్ళిపందిళ్ళు, వియ్యాలవారి అలకలు - కట్నాల పేచీలు, పేరంటం పిలుపులు - మొహానికి బొట్టు. అదంతా నాకూ రాధకి ఎందుకో అయిష్టంగానే వుండేది. కొన్నాళ్ళు అదంతా భరించి అందులో బొత్తిగా ఆనందం లేక - తొందరగానే యిద్దరం ఇవతల పడ్డాం
మాకిష్టం లేనివన్నీ వొదిలేశాం. ఏది ఇష్టమో చాలా హైరానపడి తెలుసుకున్నాం.
ఇద్దరం కూచుని చిన్నచిన్న నాటకాలు చదివేవాళ్ళం. అన్నీ వీరోచితమైన పాత్రలు, స్త్రీలు కూడా యుద్ధం చేసే కధలుచదవటంతో వుత్సాహం తీరక ఆ పాత్రలు మేము అనుకుని ఆ కధలు మావే అనుకుని నటించేవాళ్ళం. నేను నటిస్తోన్నప్పుడు రాధ చూసి మెచ్చుకొనేది. రాధ నటిస్తోన్నప్పుడు నేను చూసి ఆనందించేవాణ్లే మాతో మహా కలిస్తే రాధ తమ్ముడూ, వాడి కుక్కపిల్లా! కొన్ని నాటకాల్లో వాళ్ళిద్దరూ, కూడా నటించారు మధ్య హరాత్తుగా పారి పోయినా మా నాటకాన్ని మించిన అనందం ఏం గుర్తొచ్చేదో వాళ్ళకి, ॥
మా నాటకాలతో కధలతో ఆటలతో మా చిన్న ప్రపంచం ఎంత విశాలం అయి పోయిందీ!
చేతుల నిండా బట్టల నిండా మట్టి చేసుకుని ఎంతెంత అందమైన బొమ్మలు చేసేవాళ్ళం. రంగు కాయితాలు .. సిల్కుదారాలు .. దర్జీ దగ్గర దొరికిన కొత్తగుడ్డలు - పూసల దండలు... ఎన్నెన్ని సంపాదించేవాళ్ళం మేం చేసిన పిట్టల్నీ జంతువుల్నీ, నీళ్ళకావడి మనుషుల్చీ, నాట్యాలు చేసే ఆడపిల్లల్ని, అందంగా పారాడే చంటిబిడ్డల్ని చూసుకుని ఎలా మురిసెవాళ్ళం ఎవరికేనా చూపిస్తే నవ్వి “మీ మొహం ఏం బావున్నాయి” అనేవారు.
“మ్సీ మొహం మీకేం తెలుసు?” అన్నట్టు చూశాం. మా మహోత్సాహం రవ్వంతకూడా తగ్గలేదు. రోజూ ఎన్ని కొత్త ఊహలు, ఎన్ని కొత్త బొమ్మలు, ఎంత కొత్త ఆనందం, ఎన్ని వందల బొమ్మలు చేసినా మళ్ళీ ఏదో పిట్ట, మళ్ళీ ఏదో పువ్వు, మళ్ళీ ఏదో కొత్త ప్రయత్నం
మా పిన్ని ఎంత మంచిది? మా బొమ్మలన్నీ దాచుకోవటానికి తాటాకు బుట్టలు అల్లించి యిచ్చేది.
“చదువుకోరేం?” అని దండించేది కాదు “బట్టలు మాపు చేసుకుంటారేం?” అని పోట్టాడేది కాదు. “చిన్నపిల్లలు అడుకోక ఏం చేస్తారూ” అనేది పైగా అబ్బ ఎంత మంచిది
ఓసారి రాధా నేనూ వారంరోజులు కష్టపడి పొలంగట్ల వెంటా నీళ్ళ రేవుల వెంటా తిరిగి వెన్నపూస వంటి మట్టి సంపాదించి విచిత్రమైన యిల్లు కట్టాం ఆ యింట్లో గోడలు
పనివాడితనం 4 అక్కినేని కుటుంబరావు 10
ఆకశ్రమించినచోటు చాలా తక్కువ. ఎంతో విశాలమైన గుమ్మాలు, కిటికీలు తలుపులనేవి లేవు ఇంటిచుట్టూ చిన్నచిన్న మొక్కలునాటి బంతినారూ, చేమంతినారూ పోసి మేం చేసిన మట్టి వృక్షాలు పాతి పూలతోటలు తయారుచేశాం వృక్షాల కొమ్మల్లో పిచ్చుకల కోసం, పావురాల కోసం గోరింకల కోసం గూళ్ళు అమర్చాం. గూళ్ళల్లో బొమ్మ పిట్టల్ని పెట్టాం చెట్ల కింద పిట్టలు నీళ్ళు తాగేందుకు సహజ సరోవరాల వంటి గుంటలు. అంతేకాదు, ఎప్పుడూ చిక్కిపోని మాయంకాని చందమామని, తళుకు బిళ్ళల నక్షత్రాల్ని ఇంటిమీద వేలాడదీశాం. ఆ ఇంట్లో మనుషులెప్పుడూ డాబా ఎక్కి ఆకాశమే చూస్తూ వుంటారు. పిల్లలెప్పుడూ పక్తులకి గింజలు తినిపిస్తూనే వుంటారు. ఆ ఇల్లు వాక వెన్నెల మడుగులా కనిపించేది మాకు.
మేమనుకున్న అలంకరణంతా ముగిసిం తర్వాత మా స్పేహితులందర్ని ఆహ్వానించాం. ఇల్లు చూసి వాళ్ళంతా ఒకటే నవ్వు వొకటే ప్రశ్నలు “తలుపుల్లేవేం? తలుపులేవీ? తలుపు లుండొడ్డూ! పూలతోటనీ, పక్తుల్నీ చందమామనీ వొకళ్ళూ చూడలేదు తలుపులు కావాలిట, తలువులు.
“మేం పెట్టం, తలుపులెందుకూ? ఇల్డంతా చీకటితో గాలి రాక ఎంత ఇరుగ్గా వుంటాయి మన ఇళ్ళు? అయినా తలుపులన్నీ వేసుకుంటే పూలవాసనలెలా వాస్తాయి ఇంట్లోకి? రాత్రిళ్ళు వెన్నెలెలా వస్తుంది ఇంట్లోకి? వాన కురిసినప్పుడు తోటలో పిట్టలన్నీ చొచ్చి ఎలా దాక్కుంటాయి యింట్లో?” అని తలుపులెందుకుండకూడదో నచ్చ చెప్పబోయాం.
వాళ్ళంతా మా ప్రశ్న్శలన్నిట్నీ ఎగరగొట్టి,
“దొంగలు రారూ?” అన్నారు
“ఎందుకొస్తారూ? దొంగలొచ్చిన వాళ్ళ యిళ్ళకు తలుపులు లేకనే వొచ్చారా?” అన్నాం మా మాట వొక్కటన్నా వినక, మా చంద్రుణ్ణి గానీ, మా నక్షత్రాల్ని గాని చూడక మేం పెట్టిన అటుకులూ, బెల్లం బాగా బొక్కి -
“తలుప్తులు పెట్టండి. బలే ఇల్లే” అని వెక్కిరించి పోయారు.
నేను కొంచెం దిగులుపడి -
“పోనీ తలుపులు పెడదామా?” అన్నాను.
రాధ మండిపడి - “నువ్వు పెట్టుకో. నేను వేరే యిల్లు కట్టుకుంటాను” అంది.
నా బిక్కమొహం చూసి కొంచెం నవ్వి “వాళ్ళందరి మాటలూ ఎందుకు వింటావు” అంది "
“ఇంక విననుగా” అన్నాను
మా బొమ్మరిల్లు తలుపులు లేకుండానే వుండిపోయింది.
నేనింత పెద్దవాణ్ణయ్యాను గానీ నేను చూసిన ఏ ఊళ్ళోనూ అలాంటి యిల్లు కనపళ్ళేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళే ముందు రూమ్‌కి తాళం వేస్తూంటే ఎన్నోసార్లు మా చిన్ననాటి బొమ్మరిల్లు జ్ఞాపకం వస్తుంది తలుపులు బిగించి తాళం పెట్టాల్సి వొచ్చినందుకు చాలా దిగులు కలుగుతుంది.
- రాధారాజీ చచ్చిపోయింది +
అవి అజ్ఞానం రోజులు అనుకోను, ఇదే అజ్ఞానం. ఇదే దౌర్భాగ్యం. ఏనాట్‌కైనా మానవులు... తలుపులూ, తాళాలు అక్కర్లేని మైదానాల్సో. . నిశ్చింతగా జీవితాలు గడపగలరా? ట్టు పక్షులకీ, జంతువులకీ సృష్టిలోని ఇతర ప్రాణికీ లేని చదువులు మనుషుల కెందుకో? రాధని బడి మానిపించారు ఇక చదువక్కరలేదని నన్నింకో ఊళ్ళో పొరేశారు నాకింకా చదువు కావాలని. ఎంత నిస్సహాయమైన స్థితి మాది? ఏం చెయ్యగలిగాం? పెద్దవాళ్ళ చేతుల్లో ఉత్త కీలుబొమ్మలం అయ్యాం. నేను రాధని మర్చిపోలేదు కాని మర్చిపోయినట్టే కాలం గడిపాను ఎన్నో నెలలు, సంవత్సరాలు. మధ్యమధ్య ఏడాదికో వుత్తరం. అందులో ఏం రాయాలో తెలీదు కాగితాలన్నీ ఖాళీ. మా శూన్య హృదయాల్లాగ. మనిషిని తీర్చదిద్దగల మంచి పుస్తకాలేవో తెలుసుకోగలిగినప్పుడూ అవి చదివి మనసు విశాలం చేనుకోగలిగినప్పుడూ నాకు నిజంగా చదువు మీద గౌరవం కలిగింది. ఈ పుస్తకాలన్నీ రాధ చదివితే ఎంత బావుండును? అదే ఆశ. వు పరికిణీ మీద ఓణీ వేసుకుని తిరుగుతున్న రాధని చూసినప్పుడే తెలిసింది. నేను కూడా పెద్దవాబ్బయ్యానని. రాధ నన్ను చూడగానే నవ్వింది. మనోహరంగా, కళ్ళతో, మనసుతో, ఇంకా ఎక్కడో దాచుకున్న అంతరంగంతో నిర్మలంగా, మృదువుగా నవ్వింది. అలాంటి చిరునవ్వు అంత సౌందర్యపూరితమైన మందహాసం నేనే వ్యక్తి మొహంలోనూ చూడలేదు. “అబ్బో పెద్దదానివైపోయావే?” అన్నా. రాధ అంత అందంగానూ నవ్వుతూ “నువ్వు మాత్రం? నాకన్నా పాడుగయ్యావు” అంది. అక్కడ నేనున్న నెలరోజులూ వొక్కరోజు లాగా, ఆ ఉదయాలూ, ఆ సాయంళత్రాలూ క్షణాల్డాగ మా స్నేహమాధుర్యంలో దొర్లిపోయాయి రాధ చక్కగా పాడడం నేర్చుకుంది. మొదట నేను చాలా జంకాను రాధ పాడబోతుంటే ఎక్కడ అషశ్రుతులొస్తాయో, ఎక్కడ నా ఆరాధన గాయపడుతుందోనని. కానీ కవులెవరైనా ఆమె పాట వింటే యౌవనశోభతో విరాజిల్లే ఆ కంఠ మాధుర్యాన్ని ఎలా వర్ణించేవారో. ఇద్దరం చెట్లకిందికి పోయి కూర్చుని పుస్తకాలు చదువుకునేవాళ్ళం. మధ్య మధ్యలో కూనిరాగం ప్రారంభించి, చిన్నప్పుడు నాటకాల్లో నటించినంత సహజంగా పాడేది. గోపికల విరహబాధ అయినా, భక్తిగీతం అయినా, జోలపాట అయినా, అన్ని అందాలూ చిందిస్తూ. అన్ని రాగాలకూ మెత్తగా సన్నగా వొదిగేదా కంరం పనివాడితనం + అక్కినేని కుటుంబరాను కై
పాటలో వున్న సాహిత్యభావాన్ని కంరంలో పలికిస్తూ కొండగాలుల ఆవేశం, జలపాతాల ఉధృతం, సముద్ర కెరటాల తొందరా నదీ ప్రవాహాల నెమ్మదీ ప్రదర్శించి నాకు విస్మయం కలిగించేది.
“నీ కంరంలో ఏం వున్నాయ్ రాధా? వీణలా కోయిళ్ళా?” అంటే
“నీ మొహంలే” అనేది.
పాటల మధ్యమధ్య మళ్ళీ పుస్తకాలు,
నాకెంతో నచ్చిన చలం కథలూ, టాగోర్ కవిత్వమూ రాధకి కూడా నచ్చాయి. ముఖ్యంగా చలం పాత్రల మీద, కధా విధానం మీద ఎన్ని ప్రశ్నలు? ఎన్ని సందేహాలు? ఎన్ని వాదోపవాదాలు? చివరికి ఏకీభవించే వాళ్ళం, మధ్యమధ్య పాటలు
మా పిన్ని రాధని హరాత్తుగా పిల్చి “సూరీడు పెద్దపిల్లయిందట బొట్టు పెట్టి వెళ్ళారు. "పేరంటానికి వెళ్ళిరా” అనేది
“నేను వెళ్ళను. అన్నయ్యా, నేనూ కొత్త పుస్తకాలు చదువుకుంటున్నాం” అనేది రాధ.
“మళ్ళీ చదువుకోరాదూ? నువ్వసలు ఏ పేరంటానికి రావటంలేదని వాళ్ళంతా నన్న డుగుతున్నారు”
“అడగనీ నేనేం చెయ్యను? నాకా గోలంతా ఇష్టం వుండదు” అని విసుక్కునేది రాధ.
ఓరోజు పెద్దమనిషి, ఓ రోజు వరలక్ష్మివ్రతం, ఓనాడు అత్తారింటికి పంపటం, ఓనాడు ఇంకేదో, రాధ నాతో పుస్తకాలు చదువుతూ ఎన్ని పేరంటాలు తిరస్కరించింది.
రాధ మూర్థమైన సరదాల్గ్లో ఇమడనందుకు ఎంత అభినందించానో!
ఆ సెలవలన్నీ వెన్నెల విహారాల్లాగా గడిపి నేను మళ్ళీ రాధని వొదిలి వచ్చేశాను.
నాకు హరాత్తుగా తెలిసింది రాధకి పెళ్ళి నిశ్చయించారని. నిర్భాంత పోయాను,
రాధకి కూడా పెళ్ళేనా? రాధవంటి స్త్రీలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారా? వాకు పట్టరాని కోపం వచ్చింది వెంటనే రాధకి ఉత్తరం రాశాను.
“రాధా
నువ్వు కూడా ఉత్త సామాన్యమైన పెళ్ళి చేసుకుంటావా? అసలీ పెళ్ళికి అర్ధం ఏమిటి? స్ర్తీని అనాధ అనుకుని వాక మగవాడు సనాధని చెయ్యటం ఆ అనాధ రాధై వుండటమా?
ఈ పెళ్ళిళ్ళన్నీ వూరికే కూలిపోయే చవుడు గోడలు రాధా, వీటికేం పునాది బలముంది? ఆచారాల కుళ్ళేగాని?
(ప్రేమానుభవమూ, ఆత్మాన్నత్యమూ ఎదగని మానసిక వికలాంగులంతా చేరి రెండు చిన్న జీవితాల్ని చేర్చి బంధించి, బిగించి, రాక్షసవు ముళ్ళు వేస్తారు అవి బిగిసి, బిగిసి స్వేచ్చ అంతా హరించి రెక్కలన్నీ విరగదీసి ప్రాణాపాయం కలిగించినా అశక్తులై, అసమర్భులై ఆ నిర్బంధాన్నే జన్మజన్మల అనుబంధం అనుకుంటూ, ఆ తాళ్ళనే పూలమాలలనుకుంటూ
శీ రాధారాటవట్తనోయింది ౨ 13
అత్మవంచనతో మూలుగుతూ, కుళ్ళుతూ ఏడుస్తూ మళ్ళీ జన్మ మీద విరక్తి పుట్టి జీవితాలు చాలిస్తారు నిజం రాధా ఈ సపెళ్ళిళ్ళల్లో ఏముంది? అచారాల, సంప్రదాయాల సరిహద్దులు. ఉన్నతమైన భార్యలో, భర్తలో, నీచ భాగస్వాముల్ని భరించడాలు - నీచులా మంచిని భరించలేక కసిపూనడాలు - స్త్రీల సౌందర్య త్యాగాలు. పురుషుల వికృత ఆర్భాటాలు, అహంకారాలు అయిష్టాలతో అసంతృప్పులతో చీకటి మాటు గుడ్డి కాపరాలు క్రూర మృగాలకైనా లేని రాక్షసత్వంతో పిల్లల వీపులు బాదడాలు, జీవితమంతా అపార్భాలతో, అసూయలతో, అపోహలతో కీచులాటలతో, దుర్భరాలు, ఇవేగా పెళ్ళిళ్ళ వల్ల పొందే వరాలు? సౌకర్యాలు? ఉత్సాహంగా ఏపుగా పెరిగీ పూలచెట్లకి హరాత్తుగా పెద్ద గంటు పెట్టే రాక్షసి ఈ సంఘం. రాధా! నీకు పెళ్ళా? నిన్ను బలి వేస్తే నేనింత విచారించనే! నిన్నెవరికో శాశ్వతంగా సర్వహక్కులతో ధారాదత్తం చేసి, అప్పగింతలు పెట్టి భోరున ఏడుస్తారు సిగ్గులేక. నీ మెడలో చెత్తాచెదారాలన్నీ కట్టి వాటికేవో దాంగపేర్లు పెట్టి, నీ మెడ అందమంతా పాడుచేసి నిన్ను భరించమంటారు. బాజాల - బ్యాండు మేళాల హోరుతో నీ కలల సంగీతం నీకు వినపడనివ్వక, గ్యాన్‌లైటు, ట్యూబ్‌లైట్ల మిరుమిట్లతో నీ స్వప్న లోకాలు నీకు కనబడనివ్వక, నీ ఆదర్శ ప్రపంచాన్ని నీ నుంచి గారడీవాళ్ళలాగ మాయంచేసి, అన్నీ మరుపుకి తెచ్చి పెళ్ళాలతో మొగుళ్ళతో లుకలుకలాడే మురికి కూపంలోకి నిర్ణయగా నిన్ను కూడా గెంటేస్తారు. రాధా! అప్పుడు నిన్నెవరు రక్షించగలరు? నిన్ను వున్నతంగా (ప్రేమించే, నీ సౌందర్యాన్ని భక్తితో ఆరాధించే, నీ పాదాల ముందు మోకరిల్ల గల శృంగార హృదయుడూ, ఎన్నడూ నీ ఆత్మకి కోత పెట్టక నీ వూహల్చి, నీ అభిరుచుల్ని నీ కలల్ని పంచుకొని తనవిగా అనుభవించగల స్నేహ హృదయుడూ మాత్రమే నీతో సహజీవనం చెయ్యవచ్చును. అప్పుడు కూడా అతను భర్త కాడు. నీకో వుత్తమ మిత్రుడు. ఓ గొప్ప (ప్రేమికుడు. నీ శరీరం మీదా, నీ హృదయం మీదా, నీ జీవిత విధానం మీదా వొక అధికారిని, హక్కుదారుని నేను యోచించలేను. రాధా నువ్వీ క్షుద్ర వివాహాన్ని లక్ష్యపెట్టకు. ప్రేమతో, నీ అన్న నా వుత్తరం ఏ గంగలో కలిసిందో వారంరోజుల్లో రాధ పెళ్ళి శుభలేఖ వచ్చింది. ఎంత మండిపడ్డాను? తుఫానులాగ వెళ్ళాను “రాధకి పెళ్ళిందుకు?” అన్నాను పిన్నితో. పనివాడితనం + అక్కినేని కుటుంబరావు క్షత
“బావుంది ఈడొచ్చిన పిల్లకి పెళ్ళి చేయొద్దంటావా? మనమేం కట్నాలు కానుకలూ ఇవ్వగలమా? వాళ్ళకై వాళ్ళడిగారు - రాధని చేసుకుంటామని" అంటూ సొద ప్రారంభించింది. నేను పూర్తిగా వినకుండానే రాధ కోసం వెళ్ళాను మిద్దింట్లోకి
రాధ నా బేగ్ లోంచి కొత్త పుస్తకాలు తీసుకొని చూస్తోంది
నా వుత్తరం అందిందా? " అన్నాను “అందింది” అంది మామూలు చిరునవ్వుతో
“మరి ఈ పెళ్ళేమిటి? ఎందుకొప్పుకున్నావు?”
“ఏం చెయ్యమంటావు సెళ్ళి మానేసి”
“పెళ్ళి మానేస్తే ఏదో చేసి తీరాలా? ముందు మానెయ్యి, అంతే”
కొంచెం నవ్వింది ప్రతి చిన్న విషయంతోనూ నాతో ఏక్షీభవించే రాధ ఇంత పెద్ద విషయంలో నన్నో పిచ్చివాడిలా చూసినట్టు కనపడింది
“అసలు నా వుత్తరంలో సంగతులేవీ నీకు నచ్చలేదా?”
“ఎందుకు నచ్చలేదు? కానీ నీకు తెలుసుగా మనం కట్నాలివ్వలేం ఇంతకన్నా మంచి. ”
“కట్నాలు కట్నాలు, కట్నాలివ్వలేకపోవడం అపరాధమా? ఏదో నేరం చేసి శిక్షకి తలదించి నట్లు మాట్టాడతావేం? అసలు కట్నాలెందుకిన్వాలి? నీ మెడకి వురి పాయ్యటానికా? నీ సౌందర్యానికి, నీ కంర మాధుర్యానికి వాడెన్ని లక్షలివ్వగలడు? కట్నాలూ, బహుమతులూ ప్రార్ధనలూ ఎవరు ఎవరికివ్వాలో నీకేమైనా తెలుసా రాధా మనిషికింత హీనత్వం పనికిరాదు, మనమెంత వున్నతమైన కథలు చదివాం! ఎంత అద్భుతమైన పాత్రలు చూశాం? నువ్వీ తుక్కు పెళ్ళి చేసుకునేంత సామాన్యురాలివని ఎప్పుడూ అనుకోలేదు” అన్నాను.
నా మాటలన్నీ విని అలాగే నవ్వుతూ “నువ్వు మాత్రం పెళ్ళి చేసుకోవా?” అంది.
అదిరిపడ్డాను. 'నేనా? ఈ నీచులందరిమళ్లే, కట్నాల కోసం లాంఛనాల కోసం అమ్ముడుపోయే క్షుద్రుణ్లనుకుంటున్నవా? నా జీవితమంతా మహోన్నతమైన (ప్రేమ చేతా, శృంగారంచేతా పాలించబడుతుంది లేకపోతే వొంటరితనంతో అశాంతితో ముగిసిపోతుంది నా జీవితం ఒక యాక్సిడెంట్ అనుకో నేనెప్పుడూ జీవితంతో రాజీపడను ”
“అవును నువ్వు మొగాడివి”
“ఆమాట అనకు నేను సహించలేను”
ఇద్దరి మధ్యా చాలా మౌనం, నేను రాధని వొప్పించలేకపోయాను రాధ బ్రతిమాలు తున్నా వినకుండా ఆ వూరు నుంచి వొచ్చేశాను.
రాధ పెళ్ళి అయిపోయింది. మెడలో వేళ్ళాడే బిళ్ళలతో ఆమె అందం కొంత పాడై వుంటుంది.
ళు
- రాధారాణీ చచ్చిపోయింది + శ్
నేను యూనివర్శిటీ చదువు ముగించుకుని బయటపడ్డాను. లంచాలూ, సిఫార్సులూ సమర్పించక రిక్షాలాగి బ్రతకటానికి సిద్ధపడ్డ పరిస్థితిలో జీవితమే నాతో రాజీపడినా విద్యని సద్వినియోగం చెయ్యగల ఉద్యోగం ఇప్పించింది. తాత్కాలికంగా స్థిరపడ్డాను ఆలోపుగా రాధ గురించి ఎన్నో సంగతులు విన్నాను ముగ్గురో, నలుగురో పిల్లలు.
భర్త ఇంకా కొంత పొలం కొన్నాడు ప్రతి ఏటా వాళ్ళ పొలాలు విరగ పండుతున్నాయి. కొత్త యిల్లు కట్టే ప్రయత్నంలో వున్నారు ప్రారంభించారేమో కూడా రాధ సిరిసంపదలతో తులతూగుతోంది.
'మూర్చుడా! నీ చెల్లెల్ని గురించి ఎంతకాలం విచారిస్తావు? ఆమె ఎంత సుఖపడు తోందో వొక్కసారి చూడరాదూ? నీ భ్రమ తొలుగుతుంది అని సతాయించింది మనసు
ళు
రాధని చూశాను. కొన్ని సంవత్సరాల తర్వాత. నా కళ్ళకు ఆమె చుట్టూ ఆ సౌందర్య కాంతులే చిక్కిన చెంపల్లో, పాలిన పెదవుల్లో, జారిన వక్తంలో, ఏమీ తరగని మునపటి అందాలే.
“పిల్లల తల్లి సహజమే" అని నా మనసు ఆ మార్చుని స్వీకరించింది
కాని రాధ నన్ను చూసి నవ్వలేదు. ఆమె మొహం మీద దివ్యంగా వెన్నెలమల్లే వెలిగే మందహాసం నాకు కనబడలేదు. అప్పుడే కాదు, నేనున్న రోజంతా ఆ కాంతి నేను చూడలేదు. ఆ మందహాసమే లేని ఆ సౌందర్యాన్ని నేనెలా భరించగలను?
రాధ పిల్లలు నా దగ్గర నుంచి బిస్కట్టూ, మిరాయిలూ, కొత్త బట్టలూ, గబగబా లాక్కున్నారు. వాళ్ళు రాధ పిల్లలంటే నాకెందుకో అపనమ్మకం కలిగింది. గుండీలూడి వేళ్ళాడు తున్న బట్టలూ, గజ్జి కురుపుల్తూ, చీమిడి ముక్కులూ.
“విళ్ళనిలా వుంచావేమిటి రాధా” అన్నాను
“పిల్లలింకెలా వుంటారులెద్దూ”
“పెద్దాళ్ళయితే వాళ్ళే షోకు చేసుకుంటారు” అంది.
“ఈ రకంగానే వీళ్ళు పెద్దాళ్ళయితే షోకు కూడా చేసుకుంటారా” అనబోయి వూరు కున్నాను “నీకు బోలెడు కొత్త పుస్తకాలు తెచ్చాను చూస్తావా” అని పుస్తకాల కట్ట ఇవ్వబోయాను
అందుకోకుండా - “పుస్తకాలా? ఎందుకూ? మా అత్తగారు తిడుతుంది పుస్తకాలు చదివితే ” అంది
“పుస్తకాలు చదివితే మీ అత్తగారు తిడుతుందా? ఏదీ? ఆ జంతువునో సారి నాకు చూపించు.”
“చాల్లే ఆవిడ వింటే”
“లేకపోతే ఏమిటి? అన్నం తింటే కూడా తిడుతుందా?”
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 10
“ఎందుకు తిట్టదూ? నెయ్యీ, పెరుగూ వేసుకోనివ్వరు. నా మాట కేంటలే. పిల్లల్ని కూడా తిననివ్వదు నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తావుగా? ఒక గేదెనో, ఆవునో తోలించమన్నానని చెప్పు. ఏం కట్నాలు తెచ్చుకున్నామనీ వాళ్ళ మీద పోట్లాడి తినటానికీ?”
రాధకా ఈ స్థితి? దుర్భరంగా వుంది నాకు. “మీ ఆయనకేం సుస్తీ? పడుకున్నా డేం”
“పోకిరీ మనిషి, పోకిరీ వేషాలు. తిన్నగా వుండకపోతే ఏ జబ్బాచ్చినా వొస్తుంది ”
తృళ్ళిపడ్డాను నేను మైగాడ్ ఒక సౌందర్యదేవత భర్తకి ఇతర స్రీలతో సంబంధాలు? సుఖరోగాలు
1 రాధ ఎంత సునాయాసంగా చెప్పగలిగింది అసలీ వ్యక్తి రాధేనా?
నాతో మాట్లాడుతూ కూర్చున్నంతసేపూ రాధని అత్తగారు - భర్తగారు జబర్దస్తీగా కేకఠలేసి ఏవో పనులు పురమాయిస్తూనే వున్నారు
రాధ పెరట్లో కెళ్ళింది. కొంతసేపటికి ఎవరితోనో పోట్లాట రాధ గట్టిగా కేకలు అంతా స్పష్టంగా తెలుస్తూంది. రాధ పేడంతా కూడబెట్టుకుని పిడకలు చేసి ఎండబెట్టి అమ్మింది వంద ముప్పావలాకి. అవతలి మనిషి నాలుగు వందల పిడకలు తీసుకుని పావలా తగ్గించింది వీల్లేదని రాధ పోట్లాట పిడకలన్నీ తెచ్చి గుమ్మరించమని అరుపులు. మధ్యమధ్య రాధ అడబిడ్డ కీచుగొంతు
నేను కిటికీలోంచి మందారపువ్వులు చూస్తూ కూర్చున్నాను
రాధ కోపంగా వొచ్చింది “నేను పేరంటానికి వెళ్ళాలి. నువ్వు మీ బావతో మాట్లాడుతూ కూర్చో” అంది.
“ఈసారికి మానెయ్యరాదూ?”
“బావుండదు ఈ వూళ్ళో అందరూ తప్పు పడతారు మూ అత్తగారు తిడుతుంది” అని వెళ్ళిపోయింది.
బావతో మాట్లాడుతూ కూర్చోవాలిట నేను ఏమనీ? “రాధని మీ అమ్మ అస్తమానూ తిడుతోందట. ముసలిముండని చంపేస్తాను” అని చెప్పనా?
గదిలో వాక్కణ్ణీ కూర్చున్నాను బాగా చీకటి పడింది
రాధ పేరంటానికెళ్ళిన పట్టుచీరతో దీపం పట్టుకుని నా గదిలోకి వొచ్చింది. అందంగానే వుంది చంటిపిల్లాడొచ్చి తల్లిని చుట్టుకోబోయాడు “చీర పాడవుతుంది” అని విదిలించింది. పెద్దపిల్లలిద్దరూ తండ్రి మంచం దగ్గిర చేరి అల్లరి చేశారని - వాళ్ళ రెక్కలు పట్టి ఇవతలికి లాక్కొచ్చింది అత్తగారు చావిట్లో ఖంగు ఖంగున దగ్గి గోడవారకి వుబ్బసం వుమ్ములు వూస్తోంటే తనకేమీ పట్టనట్టు తిరుగుతోంది. జబ్బు మొగుడు లేవగానే పొయ్యిలో మండే కట్టెపుల్ల తెచ్చి చుట్టకి నిప్పు అంటించింది దాన్ని మళ్ళీ పొయ్యిలో పారయ్యమని పెద్దపిల్ల చేతికిచ్చింది ఆ పిల్ల వెనక్కి రాగానే,
శీరాధారాణీ చచ్చిపోయింది 4 గ
“తలుపులేశావా?” అని నిలదీసింది
“లేదమ్మా! గొళ్ళెం నాకందదుగా?” అంది ఆ పిల్ల
“ఛి, పెంకిముండా! తలుపులు బార్లా తీసి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆ మజ్జిగ నీళ్ళు కాసిన్ని ఏ కుక్కో గుమ్మరిస్తే ఏం మింగుతారూ?” అని కూతురు వీపు మీద వో చరుపు వేసింది తను వెళ్ళి భద్రంగా తలుపులు వేసి వొచ్చింది.
ఈ జుగుప్సాకరమైన దృశ్యాలన్నీ చూడటం నా వొంతు అయింది.
ఎప్పటికో భోజనాలయ్యాక . ఇల్లంతా సర్దుకుని వాకు పక్క వేస్తానని వచ్చింది
“మనం కాసేపు పెరట్లో వేపచెట్టు కింద కూర్చుని మాట్టాడుకుందామా?” అన్నాను.
“అమ్మో! మా అత్తగారు తిడుతుంది”
“మీ అత్తగారెప్పుడు చచ్చిపోతుంది?"
“చాల్లే నువ్వెళ్ళే లోపల నా నెత్తి మీదకేదో తెచ్చేలా వున్నావు ఊరుకుందూ!”
“ఎలా వూరుకోను? ఈ పశువులందర్నీ భరిస్తున్నావే. ఆఅ పసిబిడ్డల్నెందుకలా హింసిస్తున్నావు? వీళ్ళందరికీ చేసే సేవలో లక్షోవంతు నీ కన్నబిడ్డలకు చేస్తే నీ జన్మ ఎంత ధన్యమవుతుందో ఆలోచించావా?”
రాధకి కొంచెం కోపం వచ్చింది. “పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా ఎవరు పెంచ గలరూ? నువ్వెలా పెంచుతావో చూస్తాంలే” అని ప్రసక్తి మార్చి “ఇంకా ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావూ? మా ఆడబిడ్డని చేసుకుంటావా?” అంది.
అదిరిపడి “నేనా? పెళ్ళా ? మీ అడబిడ్డనా?” అన్నాను.
“ఏం? అవిడకేం? బోలెడు కట్నం యిస్తారు. తల్లి నగలు బోలెడున్నాయి. ఇంతకన్నా ఎవరివ్వగలరూ?”
“రాధా! నువ్వు పెళ్ళి చేసుకుని, ఇతర్లకి కూడా పెళ్ళిళ్ళు కుదుర్చుతున్నావన్న మాట”
“అయితే మానెయ్యి. నాకేం మధ్య ? కాస్త లోకజ్ఞానం తెలుసుకున్నావేమో అను కున్నాను” అంది. నేను నిశ్శబ్దంగా కూర్చున్నాను
“పక్క వేశాను పడుకో” అంది.
'పడుకుంటాలే. నువ్వప్పుడే వెళ్ళకు. కూర్చో కొంచెం మన బొమ్మరిల్లు నీకెప్పుడన్నా గుర్తొచ్చిందా రాధా?”
“బొమ్మరిల్లా... అదా.. చిన్నప్పటి సంగతా? ఏమో ఏం జ్ఞాపకం వుంటాయి. ఒకటా రెండా? ఎన్ని చేసేవాళ్ళమో గుడ్డలన్నీ మాపుకుని ”
మళ్ళీ మాటల్లేకుండా కూర్చున్నాం.
“నీ పాటవిని ఎన్నాళ్ళయ్యిందో?
“అవును నేను పొడి కూడా శాన్నాళ్ళయ్యింది. పాటలే మానేశాను” అంది దిగులుగా, కంఠం బరువుగా అయింది.
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు | 18
వెన్నెల్లో చెట్ల క్రింద పాడి మొక్కల్నీ పక్షుల్నీ, నిద్రబుచ్చిన క్షణాలు రాధకి కూడా గుర్తు వచ్చాయేమో అప్రయత్నంగా కంరం విప్పింది పాడబోయింది జీర వచ్చింది. సవరించుకుంది తీగలా సాగే స్వరం ముక్కముక్కలుగా తెగింది మళ్ళీ ప్రయత్నం చేసింది చావిట్లో భర్తకీ, అత్తగారికీ వినపడకుండా నెమ్మదిగా పాడాలని కంఠానికి ఆంక్ష పెట్టింది స్వరం భయంతో వణికింది. ఎవరో గొంతు నొక్కుతున్నారు. కర్కశంగా నలుపుతున్నారు పట్టు సడలనివ్వక బిగించారు రాధను మృదువుగా వారించాను “నీ ఆరోగ్యం బాగాలేదు. మంచిది కాదు. పాడకు” “బాగా అలవాటు తప్పిపోయింది ” “అవును నేను వెళ్తే అమ్మకేమైనా చెప్పమంటావా?” “ఏం చెప్తావు? సుఖంగా వున్నానని చెప్పు. ఆయన సుస్తీ తగ్గింతర్వాత కొత్త ఇంటికి పునాదులు తీస్తారు. ఈ యేడాది కూడా రెండెకరాలు కొన్నాడని చెప్పు” “సరే నేనిక వెళ్తాను” “ఇప్పుడేనా? ఇంత రాత్రి?” “ఫర్వాలేదు నాకిక్కడ నిద్రపట్టేలా లేదు ” “పుస్తకాల ప్యాకెట్టు కూడా నీ పెట్లో సర్దేశాను " నేను మాట్లాడలేదు ఆమె చుట్టూ హీన పరిస్థితులు నాకెప్పుడో అర్ధమయ్యాయి. కానీ రాధ కూడా వాటిలో ఇమిడిపోవటమా? వ్యక్తి బలం పరిస్థితుల హీనత్వాన్ని ధిక్కరంచవొద్దా? నెమ్మదిగా లేచి పెట్టె పట్టుకున్నాను. “మరి నీ పెళ్ళి మాట అంతేనా? మా ఆడబిడ్డని .” నేను రాధ మొహం చూశాను. మహా వికృతంగా ఉంది అనాకారులైన ప్రీలంతా ఆ మొహంలో తిష్టవేశారు. యుగయుగాల సనాతనత్వం ఆ మొహంలో గూడుకట్టింది నరనరాల బానిసత్వం మొహం మీదే తాండవించింది ఎన్ని ముడతలు? ఎన్ని గుంటలు? ఎంత అంద విహీనం? గబగబా బయటికి నడిచాను. నేనిక రాధ కోసం వెళ్ళక్కర్లేదు. నా రాధ ఇంకెక్కడుంది, నా మనసులో వుండి రూడా.. ఆంధ్రబ్యోతి నచిత్ర వారపత్రిక 28-7-1972 ఈ రాధారాణీ చచ్చిపోయింది శి 19
నక్సలైట్లొస్తున్నారు జాగ్రత్త |
చలిలో వొణ్‌కే.. అ శీతాకాలపు అర్ధరాత్రి... ఆ గ్రామంలో... శవాకారపు మనుషులు ఉంటున్న ఇంటి తలుపులు మోగాయ్.
ఆ తలుపుల వెనక... లోపల .. పగలల్తా గొడ్డుచాకిరీ చేసిన ఆ బక్క శవాల మీది అలసట దుప్పట్లు శొలగినయ్. ఒక దుప్పట్లో నుంచి తూలుకుంటూ వొచ్చి తలువులు తీసిందో శవాకారం.
తెరుచుకున్న .. చీకిపోయిన .. చెక్క తలుపులోంచి కన్పించాయి మ
నొలుగు తలలు.
తలలోని తలపులు తెలీదు.
ఎనిమిది కాళ్ళు,
ఎక్కబ్చించి వచ్చాయో తెలీదు.
ఎనిమిది చేతులు.
ఏం చేశాయో, ఏం చేస్తాయో తెలీదు
నాలుగు మూతులు,
ఏమున్నాయో, ఏం తిన్నాయో, ఏముంటాయో, ఏం తింటాయో తెలీదు. ఎనిమిది కళ్ళు ఏం చూశాయో ఏం చూస్తాయో తెలీదు గంజి మరకలతో మొద్దు టార్బాలిన్ మళ్టే వూగే కాకీలాగూలు - లాగూల్లోకి జారిన చొక్కాలు - అ బట్టల వెనక ఏవేవున్నాయో తెలీదు. గుండెలున్నాయో, బండల్లా మారాయో తెలీదు. మనసుందో మసిబారిందో తెలీదు పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 20
చొక్కానీ, లాగూనీ బిగిస్తూ బెల్టు. తలల మీద వాంకర తిరిగిన కాకీ టోపీలు తలల వెనక వాటిని తాకే బయొనెట్టతో తుపాకులు చేతుల్లో సామాను చుట్టిన... ఆ రాత్రిలాంటి. రగ్గులు. వెరసి నల్గురు మనుషుల్లాంటి సి ఆర్‌పీలు తలుపు తీసిన మనిషిలాంటి శవం "పేరు సిమ్మాద్రి గుంటల్లో కళ్ళు గోళ్ళల్లో వేళ్ళు ముక్కు పైకి పెదాలు లోనికి పళ్ళు బయటికి గడ్డం కిందికి మీసాలు పైకి పేను కొరుకుడు తల ఉతుకులుబడి చిరిగి... మసిగుడ్డల మళ్లే... వేళ్ళాడే బట్టల్లోంచీ ఆ అస్తిపంజరం లోంచీ. భూమ్మీదకి వేళ్ళాిడుతో ములక్కాడ చేతులు .. చేతికర్ర కాళ్ళూ - ఈ శవాన్ని చూడగానే సీ.ఆర్.పీలు నల్గురూ వొకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. చాలా నిశ్చయంగా! “నకలైటొస్తున్నయ్ జాగర్త” తురక పోలీసు నోట్టోంచి చాలా గాయాల్తో బయటపడింది తెలుగు. “నక్చలైట్టాస్తున్నారు జాగ్రత్త" అని సరిదిద్ది అరిచాడు హిందూ కాఫిర్. ఆ అరుపుకి కునుకుపాట్లు వడుతూ నిల్చున్న జైస్తవ పోలీసు ఉలిక్కిపడి క్రాస్‌ని ముద్దెట్టుకుని ప్రభువుని తల్పుకున్నాడు. “నచ్చలైటాచ్చినా ఆల్లకేం నాబమండీ? నా దగ్గిరేం వుంది గనకనండీ పోతానికి? అయినా అళ్ళు బీదాబిక్కీకి బూవులూ అయ్యి పంచుతారంటండీ మొన్నాక నచ్చలైటాయ నొచ్చెల్లాడులెండి మా దొరగారు మమ్ముల్ని దోత్తన్నారని ఆయినికి యెదురు తిరగాలనీ ఇంకా ఏటేటో సెప్పెల్లినారండీ... అయినా మా దొరగారెట్టా దోత్తారండే మేవంటే ఆయనికి ఎంత దయోనండే, ఆ బాబుగారి సలవ్వల్లే ఇంతమందివి కట్టం సేసుకుని బతుకుతున్నావండే మా అయ్య నీ . అ అయ్య అయ్యనీ నవకర్ణగా పెట్టుకొని కట్టం సేయించుకుని, నాలుగ్గింజ లెట్టే ఆయన మమ్ముల్నెందుకు దోత్తారండే...' ఇట్లా సిమ్మాద్రి ఏదో చెప్పుకుంటో పోతో వుంటే సిక్కు పోలీసు కుడిచేత్తో సిమ్మాద్రి శవం మెడని పట్టుకుని, తనకీ, ఎవ్వరికీ అర్ధంకాని పంజాబీ యాసున్న ఉఊర్జు-తెలుగులో అరిచాడు దర దని ఆట్‌ంధ్యా ఫి వ. ఛ+ సక్షలైట్లాస్తున్నారు వాగ్రత్త + ౮ ఇ న ై ఖై 0 ౧.218] 9 సు టైమే
“అర్థరాత్రి పన్నెండు గంటల వేళ ఇదేం సాద? మీ యింటిక్కాపలా కాయడానికి యీ చలిచీకట్లో కష్టపడాస్తే ఏమిటి విన్చిస్తున్నావ్ చెత్త? నోయి మూసుకుని చేతులు కట్టుకుని వొంటలు చేయించు ఈ రాత్రికిక్కడుండి మిమ్మల్ని నక్సలైట్ల నించీ కాపాడతాం. నక్సలైట్లా స్తున్నారు జాగ్రత్త, నడు” | అప్పటికే సిమ్మాద్రి వెనక ఇరవై ఏళ్ళ క్రిందట చచ్చిపోయిందనుకున్న అతని తల్లి ఇంకా నేను చావలేదని గుర్తు చెయ్యడానికి ఏదో అంది ఏమందో ఎవరికీ తెలీదు
“రండి బాబూ రండి. వాడట్లానే అంటాడు. బంగారంలాంటి కోళ్ళు నాలుగున్నాయి. వాట్స్ తీసికెళ్ళినా చాలు ఆ నక్సలైట్లు మా ప్రాణానికి రండి కూచోండి నే చేయించుతా వొంటలు” అంటోందనుకున్నారు రక్షకభటులు ముసలి శవం మాట్టాడిన అయిదు నిమిషాల... వళ్ళూడిన .. మాటల్ని బట్టీ.
రెండునెల్ల కిందట పుట్టిన బక్కళవంతో పొటు మరో ఏడు శవాలున్నాయి, ఆఅ శవాలయంలో
అన్నీ లేచాయి ఆ పూరిగుడిసెలో రక్షకభటులు, వాళ్ళలో వాళ్ళు ఏదో పోలీసు భాషలో మాట్టాడుకున్నారు
“అరె భాయ్ యెహ. కుచభీ నజర్ నహీ ఆ రహా హె కహీ6 బెర్ జాయేంగే చలో! ముయొ డర్ లగ్‌రహా హై యే లోగోంకో దేభ్‌కరో' అని శ్రాసూ -
“క్యా దిమాక్ ఖరాబ్ హోగయా క్యా? బాకీ సబ్ సీఆర్‌పీ వాలే గాంవ్‌కే పూరే మకానోంకో బాంటిలియే యే మకాన్‌హీ బచగయా హమారే లియే” అని సర్జార్టీ -
ఇట్లా చర్చలలో అయిదు నిమిషాలు గడిచాయి
మనుషులకి భయం పుట్టే విధంగా ఆ ఏడు శవాలూ బిగుసుకుపోయి అలానే నిలబడిపోయాయ్. రెండు చిన్న శవాల్ని నడుం అనుకున్నచోట పడేసుకుని
రక్షకభటులకి వాళ్ళ నడిగి లాభం బేదని తెల్సి ఆ ఇరవై ఏళ్ళ కిందట చచ్చిన సిమ్మాద్రి మునలితల్లి శవాన్ని అడిగారు “కోళ్ళెక్కడ?” అని.
ఆ రక్షక్షభటుల సాయంతో తమ కోళ్ళని రక్షించుకోవొచ్చుననుకున్న ఆ ముసలితల్లి కంతా అయోమయంగా తోచింది.
ఆ గుడిసెకూ వున్నాయి దిక్కులూ, మూలలూ
ఓ మూల ఆ కోళ్ళని కప్పిన బుట్ట
ఇరవై ఏళ్ళనాడు చచ్చిన ముసళిశవం చేతులు అలాఅలా లేచి ఆ మూలని చూప గల్గాయి
సిమ్మాద్రి పెళ్ళాం నర్భమ్మ ముష్ఫయ్ ఏళ్ళ నించీ శవంగా వుంటోంది
పదమూడేళ్ళ ఆడశవాన్నీ పదేళ్ళ ముసలిళవాన్నీ . తొమ్మిదేళ్ళ గుడ్డి శవాన్నీ.. ఏడేళ్ళ పీల శవాన్నీ.. అయిదేళ్ళ సగం శవాన్నీ కని జబ్బుపడిన ఆ తల్లి శవమే ఏడాది కిందట కాస్త ఓపిగ్గల శవం అయి మరో రెబ్సాల్ల శవాన్ని కంది.
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 22
ఇన్ని శవాల్ని ఈ లోకంలోకి రప్పించగల్లిన నర్సమ్మ అందుకు సాయపడ్డ సిమ్మాద్రి వంక చూసింది. సిమ్మాద్రి పోలీసుల వంక పోలీసులు కోళ్ళ వంక కోళ్ళు గిన్నెల వంక లీ గిన్నెలు పోలీనుల నోళ్ళ వంక నోళ్ళు పొట్టల వంక. పొట్టల్లోంచీ కోళ్ళ తేపులు. అంతా నిళ్ళబ్దం. శబ్దం చేసే శక్తి సహజంగానే లేదు అ యింట్లో వాళ్ళకి కోళ్ళ మత్తులో సీఆర్‌పీలూ శబ్దం చెయ్యలా? ఫు సిమ్మాది జడుడు వానపాములాంటివాడు, | భూమి అడుక్కుపోతాడు. మట్టి తింటాడు పెకి వస్తాడు. తిన్న మట్టిని ఎరువుగా భూమికి వాదులుతాడు అతని తండ్రీ అ తండ్రీ... తండ్రీ. ఇంకా వెనకవాళ్ళూ. అంతా అట్లానే చేస్తో వొచ్చారు. అదే చేస్తున్నాడు సిమ్మాది. ఇట్టా చేస్తున్నందుకు దొరికేవి గుప్పెడంటే గుప్పెడు గింజలు. అవీ తృప్తిగా తింటే పొట్టలో వొక మూలకన్నా రావనేది వేరే విషయం అతనికి తెల్చిన్హల్లా పగలంతా అట్లా తన ఆసామి వ్యవసాయప్పనుల్ని చేస్తో కష్టపడ్డమే. ఆ జ్ఞానమే, ఆ గుణమే అతనికి తన పూర్వుల నించీ సంక్రమించింది. అతని పూర్వులంతా కూడ తమ బాల్యాన్నీీ యవ్వనాన్నీ, మిగతా జీవనాన్సీ అంతా ఆ దొరల జీవితాల ముందు కుమ్మరించినవాళ్ళే ఉధృతమైన యౌవనంలో కూడా సిమ్మాద్ర పూర్వులు, అతని తండ్రీ... తాతా - ముత్తాతా... అంతా తమ భార్యల్నీ, వాళ్ళ అందాల్నీ తమ దొరలకీ, దొరతనానికీ వొదిలి ఎన్ని చలికాలపు, వెన్నెల రాత్రుళ్ళు దొరల పొలాలకీ, ధాన్యా గారాలకీ కుక్కల్లా కాపలా కొశారో ఎవరికీ. ఆఖరికి . తామంత చేశామని వాళ్ళకీ తెలీదు సిమ్మాద్రి పూర్వుల రక్తమాంసాల్నే శ్రమగా మార్చి పాలాలకీ, పసులకీ ఎరువుగా వాడి పండించి కోసి అమ్ముకోగా వొచ్చిందాంతోనే ఈ దొరలు తమ ఖజానాల్ని నింపుకున్నారు
- నక్షలైట్లాస్తున్నారు జాగ్రత్త + 2
లోకాన్ని వెలుగుతో నింపే సూర్యుణ్ణించీ, చెట్లనీ, పుట్టనీ దయగా తాకి సంతోషపెట్టే గాలి నించీ దూరంగా ఘోషాల్గో వుంచి . నగల్లో నింపి. పెద్ద కట్నాలిచ్చి చదువుకున్న అల్డుళ్ళని కొనుక్కున్నారు తాము నిర్మించుకున్న సమాజపు సంతలో, కాని . పూర్వం నించీ . ఆ పాత గుడిసెలోనే... ఆ చింకి గుడ్డల్లోనే.. అఆ ఆకల్లోనే.. దారిద్య్యంలోనే గడిచిపోయింది సిమ్మాద్రి పూర్వులకి, కూలీలకిచ్చే కూలీ డబ్బుల దగ్గర బేరాలాడి మిగుల్చుకున్న పైసలతో పాలేళ్ళకి కొలిచే ఒడ్డ గింజల్లో మిగుల్చుకున్న గింజలతో ఈ దొరలు పై అధికారులకీ, బంధువులకీ విందులు చేసి తమ దొరతనాన్నీ మర్యాదల్నీ, వంశ గౌరవాల్నీ తరతరాల్నించీ "పేరుకున్న కీర్తినీ నిలుపు కున్నారు. పాత గ్రంధాల్ని తిరగరాసిన నవీన ఛాందస కవులకి వెయ్యి నూటపదహార్లూ కాశ్మీర శాలువలూ ఇచ్చి సత్కరించి “ధర్మదాత, కళాపిపాసి, కవిపోషకుడు"” ఇట్లాంటి బిరుదుల్ని పొందారు సిమ్మాద్రి పూర్వుల దొరలు, ఆ కవులు... ఈ దొరల గొప్ప సత్కారాల్సీ గౌరవాల్నీ స్వీకరించి, ఈ దారల సేవకుల 'సేవల్సి అనుభవించి ఈ దొరల మీద కష్టమైన “కంద పద్యాలు' రాసి రైలుస్టేషన్లు చేరుకునే వారు కొని... నీళ్ళు... సిమ్మాద్రి పూర్వులు... అట్లా వాళ్ళకి సేవ చేయడమే తమ ధర్మంగా అందుకోసమే తాము పుట్టినట్లుగా, జీవితకాలమంతా ఊడిగం చెయ్యడమేగాక తమ భార్యల్నీ పిల్లల్నీ దొరల సేవలకే అంకితం చేశారు ఉత్సాహంతో వురకలేస్తూ అడే పాడే వాయసులో సిమ్మాద్రి పూర్వుల ఏల్లలు దొరల ఏ్‌ల్లల సేవల్లో గంటల తరబడి గడుపుతూండేవాళ్ళు. దొరల పిల్లలు తినే పదార్థాల్లోంచి ఏ ఒక్క పలుకన్నా కింద పడుతుందేమో ఏరుకుని తిందామని ఆత్రంగా ఎదురుచూసి ఆశ నిరాశకాగా మనసు వికలం చేసుకుని లోపల లోపలే కుళ్ళి ఏడుస్తూ గడిచాయి ఆ బాల్యపు దినాలు. తనకి పూర్వం ఇన్ని జరిగినా - సిమ్మాద్రికి తెల్స్ఫిందొక్కటే - కష్టపడాలి! సిమ్మాద్రి పెళ్ళాం నర్సమ్మ కూడా భర్త సూత్రాన్నే పాటిస్తోంది. దొరసాని సేవల్లో పొద్దస్తమానం చాకిరీ, నర్స్శమ్మకి తోడుగా పిల్లలు. ళా ఆకలిగా వున్నాయి. అలిసి వున్నాయి. సిమ్మాద్రి ఇంట్లో శవాలు, కడుపులో ఆకలి ఒంటో నీరసం కంటిమీద కునుకు. పనివాడితనం + అక్కినేని కుటుంబరావు బైల
ప్రజల్ని నక్సలైట్ల నించీ కాపొడ్డానికి దయగల ప్రభుత్వం పంపగా పాపం ఇళ్ళ నించీ ఎప్పుడు బయళ్లేరారో ఇప్పుడు గుర్తొచ్చారు భార్యలు ఆ రక్షకభటులకు.
ఆ పోలీసు బట్టలు తీసేస్తే రక్షక్షభటులూ మామూలు మనుషులేగనక వీళ్ళకీ వున్నాయి స్త్రీ అంటే దుకాణాల్లో దొరికే ఒక వస్తువనీ, రోజూ ఇంటి దగ్గర పడుండే కుక్కనే' అభిప్రాయాలు అందరిమళ్లేనే స్త్రీని కడుపునొప్పి పోగొట్టే మందుగానే తప్ప వేరే విధంగా యోచించుకోలేరు వాళ్ళు.
కోడి పన్లేస్తోంది లోన
దాంతో సహకరిస్తో పక్క వూరు విడిచి వొస్తో పుచ్చుకున్న నాటుసారా.
రాత్రి పన్టేస్తోంది మనిషిలో
కోరికలు పన్దేస్తున్నాయి శరీరం మీద పైగా అంతరాంతరాల్లో ఎవరిమీదో కసి పన్టేస్తోంది.
నలుగురికి విడవిడిగా ఎవరిపైనోనా?
పిల్లల్ని కని, కనీ నీరసించి శవం మళ్లే వేళ్ళాడే తన భార్య మీదనా ఆ తురుష్కుడికి కసి?
తన తన్నులకి భయపడి పుట్టింటికెళ్ళి తిరిగిరాని భార్య మీదనా ఆ హిందూ కాఫిర్‌కి కసి
పక్కింటి సర్జార్జీతో రహస్య సంబంధం పెట్టుకున్న భార్యను చంపడం కుదర్లేదనా అ సిక్కు వీరుడికి కసి?
తన నిర్జీవత్వాన్ని భరించలేక “చర్చ్ ప్రీస్ట్ తో లేచిపోయిందనా ఆ క్రాస్‌కి కసి?
అంతేనా? లేక వాళ్ళందరికీ తమ్ము నిరంతరం హింస పెట్టే నిరంకుశాధికారులపైనా కసి?
తమ చేతికందని నక్సలైట్ట మీదనా? కాని అందరిలోనూ ఒక్కసారిగా భగ్గుమంది
కసి.
కసి,
కసీ.
కసి,
శరీరాన్నీ మనసుని, దేన్నీ అదుపులో పెట్టుకోనీకుండా లోపల సారా... కోడి కసి... బయట చలి, చీకటి
నలుగురూ లేచారు
సిమ్మాద్రి శవపు భార్యవంక ఆ గుడ్డి వెల్తుర్లో ఆకలిగా చూశారు.
కాని ఆమె చేతిలో అస్తిపంజరం కంటే హీనమైన పసికూన.
పిల్ల'నోట్లో నాన్తో నర్ఫమ్మ శవపు రొమ్ము తాలూకు తోలుతిత్తులు.
వ నస్తలైట్హాన్తున్నారు దార్తత్త* లర్
పాతిన ఎండు కట్టెల్లా కాళ్ళు. కాళ్ళ మీద పాత గుడ్డ కప్పినట్టు చర్మం "పైన చిల్లులు పడ్డ దిష్టికుండ తల. తల మీద వేలుముడికి అందని జుట్టు. ఆ రక్షకభటుల కోరిక... ఇంకక్కడి కోరిక. ఎగిరిపోయింది. అంత మత్తులోనూ... మంటల్లోనూ వాళ్ళ బుర్రలూ, శరీరాలు చప్పున పన్దేశాయ్. అందరి దృష్టికోణాలూ సిమ్మాద్రి కూతురు తాలూకూ పదమూడేళ్ళ ఆడ శవం మీద కల్సుకున్నాయ్. వెట్టిచాకిరీ చేయించుకున్నందుకు చాలాకాలం తర్వాత దొరసాని ఇచ్చిన రంగుల చీర ముక్కలు - వాటిని అందంగా చేర్చి కుట్టిన ముసలామె కుట్టుపనీ - సిఆర్‌పీల్లో మండే సారా... కోడీ.. కసీ... కోరికలూ - అన్నీ ఆ చిన్న శవాన్ని ఆత్రంగా కప్పి అందులో ఏదో అసాధారణమైంది వుంది అనే భ్రమని కలిగించాయ్, కోడి తిన్న ఆ రాత్రిలో.. చలిని కాల్చిన సారాలో... చీకటిని మింగిన కసిలో. కలల్లో కన్పించే యిష్టమైన ఆడతారల వాంటి నిగనిగని... పూర్వం చదివిన సెక్స్ పుస్తకాల్లో కథల్సీ .. భార్యలతో గడిపిన క్షణాల అనుభవాన్నీ.. ఇంకా తమకి అసాధారణమనిపించిన, తమ సంస్కారానికి అందిన మాయభోగాల్నీ వూహించుకున్నారు. ఆ పిల్ల శవానికి నోరు పెగల్డా. ఆ నోరు వొక గుప్పిట్లో వుంది. ఆ అడ శవానికి చేతులాడలా. ఆ చేతులు ఇంకో చేతుల్లో. అ పదమూడేళ్ళ శవానికి కాళ్ళు కదలడం మానేశాయి. అ కాళ్ళు ఇంకో కాళ్ళ కింద. ఆ పిల్ల.. ఆ ఆడపిల్ల. పదమూడేళ్ళ పిల్ల వొంటిమీది బట్టలు, ఆ బట్టలూ ఆమె వాళ్ళూ. .. ... ఆపోలీసుల శరీరాల్టోంచి వీచిన మంటల్లో మండి మాడి మసైపోయాయ్. ఆ నల్లురూ కలిసి పంచుకున్నారు ఆ శవాన్ని. మర్నాడు పొద్దున పదమూడేళ్ళ సిమ్మాద్రి ఆడకూతురు మాయమైనట్టు తెల్సింది. అన్నట్లు వాళ్ళని ఆ పూటకి నక్సలైట్ల నించి రక్షించడానికొచ్చిన రక్షక భటులూ లేరు! సిమ్మాద్రై కొడుకు పది సంవత్సరాల ముసలివాడు తండ్రి నడిగాడు - “నాత్తిరి నచ్చలైటు లాత్తారన్నారుగా. వొచ్చారా” అని. ఆంధ్రజ్యోతి వారపత్రిక 17-8-1973 పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 26
విలువలు - |
అీయిర్ కండిషన్డ్ బార్ గదీ తలుపు తోసుకుని తూలుకుంటూ, బజార్లో కడుగుపెట్టిన కృష్ణమూర్తికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంతపనయ్యింది. కటిక చీకట్లోంచీ ఒక్కసారి ప్రకాశవంత మైన కాంతిలోకి అడుగుపెట్టగానే తిరిగినట్టు కాదు.
కళ్ళు తిరిగాయి అన్నాను కాబట్టి అతనికి కళ్ళు తిరిగి ఇంక అంతటితో ఆగిపోయిందని కాదు. దాంతో మొదలైంది కణతల్లో చెమ్మగా రక్తం కదలిక. మెదడులో ఎక్కడో నమాచార తంత్రులు దూరంగా ముక్కుగోళ్ళకు పైగా రక్తం జరుగుతున్న చప్పుడు. తల దిమ్ము కడుపులో తిప్పుడు.
ఇప్పుడు కృష్ణమూర్తిలో వున్న వికారాలన్నింటికీ ఆఖరి ఆటవిడుపు. అతనికి మును 'పెన్నడూ కానంతగా భయంకరమైన వాంతయింది ఒకటి కాదు, ఒకదానివెంట ఒకటి.
ఇప్పుడతనికి మెదడులో ఆలోచనలు వొక కొలిక్కి వస్తున్నాయ్.
అతన్ని పట్టుకోడానికి అతని వెనకే మరో నలుగురు మిత్రులు.
కృష్ణమూర్తి వాంతులు చేసుకుంటూండగా ఆ చప్పుడికే మూడు గజ్జికుక్కలు - అందులో వొకదానికి తోక సగానికి తెగి వుంది - వెంటనే హాజరై ఎంతో శ్రద్ధగా వినయంగా శుభ్రం చెయ్యడం సాగించాయ్.
అంతకుముందే బార్‌లో తాగిన పానీయాలు, తిన్న మాంసాహారాలూ అంత అత్రాన్ని 'పెంచాయ్ - డొక్క లెండుకుపోయిన ఆ మూడు గజ్జికుక్కలకి - ఆ మూడింట్లో వొకటి నల్లదీ, మిగతావి ఎర్రమచ్చలున్న తెల్లవి.
ఆ మూడు గజ్జికుక్కల్ని ముందు అసూయగానూ, తర్వాత ఏహ్యంగానూ చూసి తల తిప్పుకున్న ఆరుగురు కుష్టురోగపు బిచ్చగాళ్ళ కధా నేనిప్పుడు చెప్పబోవడంలేదు అయితే ఆ ఆరుగురిలో ఇద్దరు కేవలం చెవులే కళ్ళుగా గలవారు ఒకరు చేతులే కాళ్ళుగా గలవారు. ఒకరు చిరిగిన చొక్కా, మరొకరు లాగూలాంటి చిరుగు శరీరం కలవారు ఒకామె మాత్రం
4 విలువలు - 14 2/
జాకెట్టూ, చీరా ధరించి తన రెండు రొమ్ముల్ని దాచుకోలేనామె పెదాలు కప్పలేని పళ్ళతో తన కాళ్ళే తన మాట విననంత నిర్లక్ష్యం వున్నామె.
అయితే నేను మీకు చెప్పేది క్రిష్టమూర్తీ, అతని నలుగురు మిత్రుల కధేగాని, మూడు గజ్జికుక్కలూ - దానిలో ఒకదానికి అంగుళం మేర మాత్రమే బొచ్చుంది ఆరుగురి బిచ్చగాళ్ళ కధా కాదుకదా? పైగా కుక్కల్లో, అందునా గజ్జికుక్కల్లో. బిచ్చగాళ్ళలో. . కవిత్వం చూడగలిగే వాళ్ళని ప్రస్తుత పత్రికా ప్రపంచం గుర్తించదు. తేలిగ్గా నాలుగు తెలుగు సినిమాలు జ్ఞాపకం తెచ్చుకుని, వెన్నెముకలేని హీరోనీ, అంత నీచుడి కోసమూ ఆరాటపడే దౌర్భాగ్యపు హీరోయిన్నీ సృష్టించి కుళ్ళిన సెంటిమెంటలిజాన్ని గుప్పించి మార్కెట్టోకి వదుల్తున్న సోదర సోదరీమణులు సాహిత్యరంగాన్ని ఏలుతున్న సమయంలో అంత సాహసమా?
ఆ విధంగా, ఆ హీనమైన మూడు కుక్కల్నీ హేయమైన ఆర్గురు బిచ్చగాళ్ళనీ అతి ప్రయాసతో అర్ధణా కూడా ఖర్చు కాకుండ క్రిష్టమూర్తీ, అతని నలుగురు మిత్రులూ - అందులో ఒకతని పేరు రంగారావు - దాటగలిగారు.
అవును. దాటడం అలాంటివారికి చాలా తేలిక. వాళ్ళు అలా, ఆ పాడు గజ్జికుక్కల్చి, ఆర్గురు బిచ్చగాళ్ళనీ దాటకుండా వాటికేసి ఆసక్తిగా చూస్తే నాగరికతకు భంగం. లోన చూడాలనే వుంటుంది చాలామందికి. ముఖ్యం, కుష్టురోగులు వాయించే వాయిద్యాలనీ, వాళ్ళు పట్టుకునే బ్యానర్లనీ వాళ్ళ మూతుల్నీ, చేతుల్ని. కాని పరీక్షగా చూస్తే నామోషీ.
వాళ్ళు పట్టకున్న బ్యానర్ మీద 'కుష్టురోగుల నంఘం' అని వుంది. బాపట్ల అనో, చచిలీపట్నం అనో, కింద పెయింట్ రాలిపోయిన అక్షరాల్లో వుంది. దానికింద ఏదో బొమ్మ ప్రక్కనా, కిందా తెలుగులో ఇంగ్లీషులో 'బీదలను కటాక్షించువారు ధన్యులు”, 'దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును' అని వుంది.
ఆ గజ్జికుక్కల్ని ఏ 'చలమో' చూస్తే తీసికెళ్ళి పెంచేవాడు. ఏ 'షోలహోవో' అయితే వాటి మీద దయనీయమైన కధా రాసేవాడు, తన 'గుగ్రప్పిల్లి కథమతళ్లే.
ఆ బ్యానర్ మీది సూక్తుల్ని ఏ 'మార్క్సో' చూసుండి వుంటే ఆ బిచ్చగాళ్ళతో
“సోదరులారా! మిమ్మల్ని పేదలుగా, బిచ్చగొళ్ళగా, కుష్టురోగులుగా, దిక్కులేని దీనులుగా తయారుచేసిన పరిస్థితులకు కారకులూ, మీకీ సూక్తులు రాసిచ్చిన దాతలూ అంతా వొకటే వర్గం. వాళ్ళందరి ప్రయోజనాలూ ఒక్కటే. మీరుగానీ, మీ పూర్వులుగానీ బిచ్చగాళ్ళు గాక పూర్వం ఏ పాలాల్గ్లో పంటలు పండించేవారో, ఏ కార్థానాల్లో కొలిమి ముందు
నిలబడి పనిచేసేవారో నాకు అర్థం అవుతుందిలే! ఆ కార్మికులూ, కర్షకులూ ప్రపంచం అంతటా దోపిడీ లేని సమాజం కోసం పోరాడుతున్నారు. వాళ్ళ పోరాటాలే మిమ్మల్ని ఈ రోగాల నుంచీ, దారిద్ర్యం నుంచీ విముక్తి చేస్తాయి” అని వుండేవాడేమో,
ఎవరేమనుకుంటేనేం - ఆ అయిదుగురు మిత్రులూ మాత్రం ఆ గజ్జికుక్కల్సి కుష్టు చిచ్చగాళ్ళనీ దాటగల్లారు
వ
పనివాడితనం శి అక్కినేని కుటుంబరావు 28
ఒక గంట క్రితం వాళ్ళు ఎయిర్ కండిషన్స్ గది తలుపు తోసుకుని జాగ్రత్తగానూ, తెచ్చిపెట్టుకున్న దర్జాతోనూ - (తాము ఇవ్వబోయే బిల్లులో యీ రకంగా ఆ హాల్గో నడవడాని క్కూడా బిల్లు చెయ్యబడ్డుందని వారి దృఢమైన నమ్మకం) - పంజాబ్ హోటల్ కేఫ్‌ను దాటుకుంటూ “పంజాబ్ హోటల్ కేఫ్ అండ్ బార్‌లో బార్‌లోకి ప్రవేశించగానే లైట్లు డిమ్‌గా వుండటం గమనించి క్రిష్ణమూర్తీ అతని నలుగురు మిత్రులూ - ఒకతని పేరు ప్రసాద్ - ఒకర్ని చూసి ఒకరు కన్ను గీటుకున్నారు అయితే, అక్కడా అయిదుగురికీ సరిపడా ఖాళీ లేదు. ఒక బారుగా వున్న బల్ల ముందు ఒక చివరగా రెండు కుర్చీలు. అందులో ఓ మీసాలు కూర్చుని, మీసాల మధ్యలోకి సువర్ణసుందరి సినిమాలో మహంకాళి వెంకయ్యలాగా కోళ్ళని పంపేస్తున్నాడు.
కేశవరావు డాంబికంగా - “పోదాం పదండి గురూ, మరో బార్‌కి” అన్నాడు.
వెనక్కి తిరిగేసరికి పెద్ద గడ్డం.
గడ్డం కన్నా కొంచెం చిన్నగా వున్న మీసం గల సర్దార్జీ - పైన మేడమీద బ్రహ్మాండమైన హాలు వీళ్ళకోసమే చూస్తోందని హిందీలో బహు (త్) మర్యాద చేసాడు.
ళు
సరిగ్గా అప్పుడు ఆ మేడమెట్లెక్కుతున్న సమయాన ్రసాద్‌కి తన చిన్నతనంలో తన తండ్రి తనని ఎత్తుకుని మేడమెట్లు దిగడం, అమ్మ ఏడుస్తూ వెనక వెనక రావడం గుర్తొచ్చి, కళ్ళు తిరిగినట్టె కాళ్ళు తడబడ్డాయ్
మేడ మెట్లకీ ప్రసాదుకీ చాలా సెంటిమెంటల్ సంబంధం వుంది
ఆ వూరి మున్సిపల్ ఛైర్మన్ దగ్గర కుర్రాడుగా వున్నప్పట్సించీ నడిమి వయసు వరకూ ఆ పనీ ఈ పనీ కావలి కుక్కమళల్లే చేయగా చేయగా ఆయన ప్రసాదు వాళ్ళ నాన్న మొహాన వొక పనికిరాని సిటీబన్సు పారేశాడు. ప్రసాదు వాళ్ళ నాన్నకి బిర్లా అయినంత సంతోషం కల్గింది. ఛోటా, మోటా రిపేర్లేవో చేయించి, ముప్పుతిప్పలు పడి మొత్తానికి ఆ డొక్కుబస్సునే తిప్పాడు ఆ టవున్లో రెండుమూడేళ్ళు ఆ బస్సులో సాధ్యమైనంత ఎక్కువ ప్రయాణీకుల్ని కుక్కి కుక్కి కొంత సంపాయించాక పడబోతూ ఆగిన మేడ కొన్నాడు
కొన్నాళ్ళకి ఆ బస్సుకి రిపేర్లూ బజార్లో వేరే బస్సులవాళ్ళతో పోటీ. వీటికి తట్టుకోలేక అప్పులు చెయ్యాల్భొచ్చి, అప్పులకి బదులు బస్సునీ, ఆ మేడనీ యిచ్చి, ఆ మేడమెట్లు దిగి టవునవతల పూరిపాకకి చేరుకున్నాడు అదీ కధ.
- వెనక నడుస్తున్న సుందర్రావన్నాడు ' ఏం గురూ! వాసనన్నా చూడకుండానే నిషాలో పడ్డావ్ చాల్లే నడవవయ్యా, నడు యాక్షన్ తర్వాత చేద్దువుగానిలే ”
ప్రసాదు కింకా తన తల్లీ, తండ్రీ దూరాన... తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో... పడుతున్న ఇబ్బందులు గుర్తుకొస్తూనే వున్నాయ్ బస్సు అమ్మేశాక వేరే బస్సులో (డైవర్‌గా చేరిన తండ్రి త్వరలో ముసలితనం వల్ల వుద్యోగంలోంచి బైటకు రాబోతున్న విషయం -
శవిలువలు-14 " 29
ఎవరి లారీలోనో క్షీనర్‌గా పనిచేస్తున్న తమ్ముడూ - ఇంకా ఎప్పుడు చేస్తావురా నీ చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు?...” అనే వూరివాళ్ళ మాటలూ - చాలా గడ్డుగా జరుగుతున్న రోజులూ -
ఇవన్నీ ఒకవైపూ, 'బారోలో పానీయాలు ఇంకోవైపూ ప్రసాద్‌ని పట్టుకునే వున్నాయ్.
"పైగా వారం క్రితం డబ్బుకోసం తమ్ముణ్ణి పంపాడు తండ్రి. ఆ వొచ్చిన తమ్ముడి వాంటిమీద చిరుగుల్లేని బట్టల్లేవు. ఎదిగే వయసులో వున్న తమ్ముడు నరైన తిండిలేక ఎండుకట్టెలా వున్నాడు. అతనేకాదు, ఇంట్లో అంతా తరచూ పస్తులుంటున్నట్ట చెప్పాడు తమ్ముడు. అంతవసరంలో ఇంటికి పైసా కూడా సర్దలేనివాడు, ఈ బారుకు యాభై ఖర్చు పెట్టబోతున్నాడు. ఆ స్పృహతో ప్రసాదులో గందరగోళం (ప్రారంభమైంది. అతని మెదడులో గోల.
పైట మిత్రుల గోల.
అంతా అరుస్తున్నారు.
ఒకటే కేకలు.
వాళ్ళతో తనూ కలిశాడు.
తన బుర్రలో తాను వింటున్న కేకల్నించీ తప్పించుకోవడానికి.
అంతా అరుస్తున్నారు.
కానీ, అందరిలోను ఓ సందేహం. అలా కేకలేస్తే ఇదే మొదటిసారి అనుకుంటారేమో నని, ,
ఆ అయిదుగురూ కేకలు. కేకలాపమనే కేకలు,
వెయిటర్ రాగానే “ఏవేం వున్నాయ్” అనడిగాడో మిత్రుడు.
“పీటర్ స్కాట్ విస్కీ, హెర్క్యులస్ రమ్, సావరిన్ బ్రాందీ, సావరిన్ విస్కీ, రెడ్‌నైట్ మార్ట్ విస్కీ, సావరిన్ గోట్టెన్ బీరొ - అని వెయిటర్ చదివితే ఏ'ఒక్కడికి ఏమీ తోచక “అంతా ఇండియన్ స్టఫ్‌లాగుందే” అన్నారు.
“ఇంకేం వున్నాయోయ్?”
“విష్‌ఫుల్ నిస్కీ, నోబుల్‌మాన్స్ బ్రాందీ, హవుస్ ఆఫ్ లార్డ్స్ విస్కీ లండన్ పాట్ 'డైజిన్...”
“నాకు...”
“మా ఇద్దరికీ...”
“మా ఇద్దరికీ.”
ఈ వొచ్చిన మిత్రుల్లో కొందరికి స్వదేశీ కంపెనీల మీదా, కొందరికి విదేశీ కంపెనీల మీదా, కొందరికి విదేశీ సహకారంతో నడిచే స్వదేశీ కంపెనీల మీదా చాలా గ్రేమ కలిగి... ఆ ప్రకారంగా కంపెనీల పేర్లూ, పానీయాల పేర్లూ అడిగి ఆర్జరిచ్చుకున్నారు.
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 30
ఆ వెయిటర్ వాటిని తెచ్చేలోగా వాళ్ళ మధ్య పెద్ద చర్చ జరిగింది కూడాను.
“విదేశీ కంపెనీల్ని ప్రోత్సహిస్తే మన దేశం నుంచి కోట్లకి కోట్లు రూపాయిలు వాళ్ళు ఊడ్చికిడతారోయ్. కనక, మనం మనదేశంలోని కంపెనీల్నే ప్రోత్సహించాలి.”
“అస్సలు మన దగ్గరున్న ఏ కంపెనీ అన్నా స్వతంత్రం అంటావా? ఈ డ్రింకుల్లోకి కావాల్సిన పదార్థాల్లో ఒకటి లండన్ నుంచి, ఇంకోటి ప్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోకుండా వుంటారా మనవాళ్ళు? పైగా మనవాళ్ళు లాభంలేదోయ్. క్వాలిటీ బాగుండదు. శ్రద్ధ చూపరు. అయినా... ఎవడికిపోతే ఏమిటోయ్. మన దగ్గరైతే వుండదు గదా ఈ డబ్బు?”
“ఓ పని చేద్దాం విదేశీ సంస్థల సహకారంతో నడిచేవాళ్ళవి తాగుదాం. వాటిలో కొంచెం క్వాలిటీ వుంటుంది. పైగా మనం ఇచ్చే సొమ్ము కనీసం సగమన్నా మన దేశంలోనే వుంటుంది ..”
ఏదేమైతేనేం? ఈ మిత్ర బృందానికి మొత్తం మీద కంపెనీల మీదనే జాలి. వాళ్ళ లాభాలమీదనే వీళ్ళ శ్రద్ధ. ఆ కంపెనీల్లో పన్టేసే కార్మికులూ, వాళ్ళ బ్రతుకులూ వీళ్ళెవరి దృష్టిలోకి, ఆలోచనల్లోకి రాలేదు.
ఖీ
గ్లాసులు తాకించారు. పళ్ళాలు లాగించారు. జేబులు పోగేసారు. అంతా కలిసి రెండు వందల నలభై తొమ్మిది రూపాయల పదిహేను పైసలు అయింది. సప్టయర్ నవ్వాడు. అతనికి ఎనఖై అయిదు పైసలు.
“భఖర్చయితే అయింది గురూ భలే బావుందీ వాతావరణం” రంగారావు.
“ఆం వెధవ డబ్బులు. నేను చెబుతున్నాను విను. నేనీ వుద్యోగంలో చేరి పదేళ్ళవు తోందా? గుర్తుందిగా? యెస్సల్సీ అవ్వగానే అదే నిక్కరుతో వొచ్చి ఈ కంపెనీలో జేరి లోడింగ్ చేశా. ఇప్పుడు అదే కంపెనీలో లోడింగ్ చేయించుతున్నా ఎంత లేదన్నా పాతికవేలు జీతంగా తీసుకున్నా. అప్పుడప్పుడూ 'ఓటీలు తీసుకున్నా. చీటీలు కట్టా. నానా యాతనలూ పడ్డా ఎప్పుడు చూసినా వాక్క పైసా వుండదు. దేనికోసం పడాలి జాగ్రత్త? జాగ్రత్త! జాగ్రత్త! జాగ్రత్త ఎంత జాగ్రత్తవడూ, అంతే. ఫస్టాస్తోందంటే భయం. ఎవణ్జి ఆపాలీ అని. ఇష్టం వచ్చినప్పుడు ఖర్చు పెడతా. నెలాఖరులో పంచడం మానేస్తా . అవునోయ్ ఇది పంచడం కాదా? పోయిన్నెల కూరలకి ముప్ఫై రూపాయలు పంచాను పాలతనికి యాభై అయిదు రూపాయలు. అద్దెకి యాభై బియ్యానికి తొంభై. నూనెలు ముప్ఫై అయిదు మిగతావన్నీ ఖర్చులు. ఈ నెల మొదట తేదీనే దీనికి యాఖై అయినయ్ మిగతా వాటిల్లో సర్దేద్దాం. ఎలానూ, ఈ యాభై మిగలవు కదా? ఈ సంబరమూ లేదు వాటిల్లో...” డోసు కొంచెం ఎక్కువైంది కేశవరావుకి,
ఫి
- విలువలు - 14 వ్ర్షే
క్రేశవరావూ వాళ్ళు తాము చేసే అప్పుల గురించీ, కడుతున్న వడ్డీల గురించీ మాట్లాడు తోంటే అంత నిషాలో వున్నా క్రిష్ణమూర్తికి విసుగు వొచ్చింది. అప్పులూ, అవీ అనగానే క్రిష్ణమూర్తికి తన డెబ్భై ఏళ్ళ తండ్రి గుర్తొచ్చాడు. ఎవరి దగ్గరో ఒక ఎకరం కవులికి తీసుకుని కూరగాయలు పండిస్తున్నాడు ఆయన వాళ్ళ వూళ్ళో! ఆయనకు తోడుగా క్రిష్ణమూర్తి తల్టి. ఆ ముసలి దంపత్తులు ఆ ఎకరం కూరగాయలతోటనే నమ్ముకుని బతుకుతున్నారు. ఏది పండించినా, ఎంత పండించినా వీళ్ళిద్దరి కాయకష్టం మీదనే. అయినా ఆ పండించిందాన్ని తామే స్వయంగా మార్కెట్లో అమ్మడానికి వీల్లేదని అతనికి కట్టుబడికిచ్చినాయన ఆంక్ష. ఆ పాలం ఆయన బావమరిది మొత్తం కూరగాయల్ని టవునికి తీసికెళ్ళి అమ్ముతాడట అదీ సంగతి. పైగా విత్తనాలూ, ఎరువులూ అవీ మార్కెట్టులో దొరకవు. ఆ కవులికిచ్చినాయన దుకాణంలోనే వాటిని కొనాలి బ్లాకులో. కట్టుబడి కిచ్చినందుకు యివ్వాల్సింది పండించిందాన్లో సగం - మిగతా సగం ఈ ముసలివాళ్ళు తాము అంతకుముందు కొడుకు చదువుకి చేసిన అప్పులూ, తోట మీద పెట్టే ఖర్చూ, వాళ్ళ తిండీ. వీటికి సరిపోదు. పదిపైసలు పోతే ప్రాణం పోయినట్టే. అందువల్లే రెండు పూటలా సుమారుగా భోజనం, ఆ ముసలివాళ్ళకి. కృష్ణమూర్తికి ఆరొందల దాకా వస్తయ్. కాని పాపం అతనికీ వున్నాయ్ కష్టాలు. మర్యాదస్తుడిలా బతకాలనుకున్నవాడు వాళ్ళనీ, వీళ్ళనీ తనింటికి పిలవాలి, పిలిపించుకోవాలి. వాళ్ళ పిల్లలకి వీళ్ళూ, వీళ్ళ పిల్లలకి వాళ్ళూ ఏవో బహుమతులిచ్చుకోవాలి తనతో పనిచేసే అళనింటికి బీరువా వస్తే తనింటికీ వాకటి రాకపోతే బావుండదు. పక్కింటికి గ్యాస్ స్టవ్ వస్తే తనింట్లో (ప్రెషర్ కుక్కర్ కూడా రావాలి. (దానివల్ల వొచ్చే సౌకర్యం కోసం కాదు - సాంఘికంగా వొచ్చే గుర్తింపు కోసం) వీటన్నిటికి వచ్చేది ఎట్లా సరిపోతుంది? పైగా ఇట్లా నెలనెలా మొదటి వారంలో బార్‌కి రాకపోతే తనున్న “సొసైటి ముందు బాగుండదు కదా? వు రంగారావంటారా? అతనికొచ్చేది తక్కువే అయినా అతని భార్యకి బాగానే వొస్తుంది. ఆమెకేదో బ్యాంకులో వుద్యోగం. ఇతనికి ఇల్లు అంత బాధ కాదు. ఇతని డబ్బు ఇతనే ఏమైనా చేసుకోవచ్చు. రంగారావుకి పెళ్ళి కాకముందు కూడా తన జీతం ఖర్చు పెట్టాల్సి నవసరం కలగలేదు. ఇతని అన్ని అవసరాలూ నాగరత్నం తీర్చేది. నాగరత్నంకి పద్ధెనిమిదేళ్ళకే పెళ్ళయింది. ఓ ఆడపిల్ల పుట్టగానే ఆ భర్త చచ్చిపోయాడు. అప్పట్నుంచీ ఆమె అన్నా, తండ్రీ, ఆమెకు పెళ్ళి చెయ్యలేదు. సంప్రదాయం కోసం తండ్రీ, ఆమె భర్త తరపు అస్తిన్సీ ఆమె అస్తినీ కాజెయ్యాలని అన్నా .. మొత్తం మీద ఆమెకు పెళ్ళి చెయ్యలేదు. ఆ తర్వాత అయిదేళ్ళకి ఆమె జీవితంలోకి రంగారావు వొచ్చాడు. రంగారావులో వున్న విశేషం ఏమిటంటే ఎవరికి ఏది ఇష్టంగా వుంటుందో అదే మాట్లాడ్డాడు. పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 27
“ఇతను మనలాంటివాడే ఇతన్హో స్నేహం చేసుకుంటే బాగుంటుంది” అనేట్టు అవతలివాళ్ళని చేస్తాడు. సరిగ్గా ఇదే జరిగింది నాగరత్నం విషయంలో. నాగరత్నం తరపు బంధువులూ, అన్నా, తండ్రీ చాలా అభ్యంతరాలు తెలిపారు. అయినా లక్ష్యపెట్టలేదు నాగరత్నం ఏ అటంకమూ, అభ్యంతరమూ లేకుండా తనని తాను రంగారావుకి ఇచ్చేసుకుంది. రంగారావు కూడా “మధ్యలో మీరెవరు? మేం ఇద్దరం డ్రేమించుకున్నాం పెళ్ళి చేసుకోలేదన్నమాటేగాని ఈమె నా భార్యే” అన్నాడు అట్లా అన్న మరుసటి సంవత్సరమే బ్యాంకులో ఉద్యోగం చేసే అమ్మాయికి 'మంచి'" కట్నంతో ఉరితాడు కట్టాడు. ప్రస్తుతం ఆ భార్యారత్నం సంపాదన మీదనే ఇల్లు నడుస్తోంది. తన సంపాదనంతా 'చాయ్'లకి, సిగరెట్లకీ, తాగుడుకీ. భు సుందర్రావుకి అసలిటువంటివిష్టంలేదు కాని నిన్న చివరి నిమిషంలో రంగారావు దగ్గరకొచ్చి “గురూ! చివరికిట్లా అయింది నా బతుకు" అని కళ్ళ నీళ్ళెట్టుకున్నాడు. సంగతేవిటని నలుగురూ నాలుగురకాలుగా అడిగితే తేలిందేమిటంటే తన కసలు ఇష్టంలేని పెళ్ళి, పైగా ఇస్తామన్న కట్పం తన చేతికివ్వరు, నాలుగేళ్ళయింది. వడ్డీ సంగతెత్తరు ఇదిగో... అదిగో. అని ఆళపడ్డం మిగిలింది. ఈలోగా ఇద్దరు పిల్లలు నిన్న సుందర్రావు మామ వొచ్చాడు పిల్లని మూడో కాన్చుకి ఇంటికి తీసుకెళ్ళడానికి సుందర్రావు ఖచ్చితంగా తేల్చేయమంటే - “మనమంతా ఒకటే అనుకున్నాను. మీకూ, వాకూ భేదం కన్పించలా మీరొకటీ నేనాకటీ కాదు” అని సినిమాల్గోలాగా కబుర్లు మొదలెట్టాడు. సంగతి తేల్చమంటే సుందర్రావు కొంప నిలువునా కూలేట్టు ఒకటే ఒక్కమాట “నేనసలు లెక్కలు కట్టడంలేదు” అని ఆ మామ చుట్ట ఆర్చి అవతల పారేశాడు. “నేనసలు ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? చివరికి నా బతుకిలా అయింది” అని నుందర్రావు బావురుమన్నాడు. 'సరే' అని అతన్నీ తీసుకొచ్చాడు రంగారావు. సుందర్రావుకి తాగ్గా తాగ్గా ఒక్కటే లోకాన్నంతా నింపేసిన సత్యం కన్పడ్డది ఈ లోకంలో అందరు మామలకన్నా సప్లయ్‌ర్ చాలా సెద్ద మనుషులు వాళ్ళు చూడండి తాగింది తాగినట్టూ, తిన్నది తిన్నట్టు ఎంత అద్భుతమైన లెక్క వేశారు. లెక్క వేస్తున్నారు. లెక్క వేస్తారు. ఖీ క్రిష్ణమూర్తీ అతని నలుగురు మిత్రులూ తింటూ, తాగుతూ, తింటూంటే జ్యోతిలక్ష్మి క్లబ్ డాన్స్ సీనులో వినిపించే సంగీతంలా బ్యాగ్రౌండ్‌లో మ్యూజిక్ వాస్తోంటే హోటల్ యజమాని పంజాబీ అయితే మాక్రమేమిటి? మంచి సరసమున్న వ్యక్తిలాగున్నాడు అని అనుకున్నారు
- విలువలు - 14 తత
ఎయిర్ కండిషన్స్ కాకపోయినాగాని డాబా పైకి రూఫ్‌గార్జెన్‌లోకి తమని పంపి కన్నకొడుకుల్లాగా సకలమైైనట్టీ సపర్యలు చేయించుతూ, అధికమైనట్టీ, అత్యద్భుతమైనట్టి మర్యాద, వినయం వుట్టిపడుతున్న స్వరంలో హిందీలోనే అయితేనేం “బెర్ క్యా హోనా?” అనడిగాడు.
ఆ “చక్కటి చేదు పొనీయాలూ, ఆ వగరు ఫ్లస్ కారం పదార్థాలూ తాగీ, తినీ తాగీ, వెనకనించీ జ్యోతిలక్ష్మి బ్రాండ్ సంగీతం వినీ, రకరకాల మోటు హాస్యాలాడుకుని ఆడుకుని, ఒకరి మీద ఒకరు పడిపోతున్నట్టు నటిస్తూ... అని పడకుండా జాగ్రత్త తీసుకుంటూ, నగం మందు మత్తులో, సగం డబ్బు వదిలిన మత్తులో - అంత డబ్బు పోతే - యింత మత్తన్నా లేకుంటే ఎలా అనీ... అలా అలా దిగి హాల్లో తెల్స్ఫినవాళ్ళెనరన్నా వున్నారేమో చూసుకుంటూ, తూల్తుకుంటూ, నెమ్మదిగా ఎయిర్‌కండిషన్ట్ కేఫ్ అండ్ బార్ గది తలుపు తోసుకుని బైటికి రాగానే -
"పేదరికంలోంచి వొచ్చిన శ్రిష్ణమూర్తికి - పేదరికంలో మునిగి వున్న తల్లిదండ్రులు గల క్రిష్ణమూర్తికి “పేదరికంలోంచి తేలి ఘనాపారిగా, హైలెవెల్ వ్యక్తిగా, మర్యాదస్తుడిలా, చలామణి కాదల్బిన క్రిష్టమూర్తికి -
ఇందాక, తాగుతోండగా... తల్లి మజ్జిగ ఇచ్చే దృశ్యం -
తండ్రి, మిట్టమధ్యాహ్నపు ఎండలో భుజాన కావిడేసుకుని డెబ్బయ్ ఏళ్ళ చెమటతో తడిసిన.. చెమటలో తడిసిన... చర్మంపైన సరైన బట్టయినా లేకుండా - తాను స్నానం చేయడానికని నీళ్ళు తీసుకొచ్చి తాటిచెట్టు కింద నీడలో పెట్టి - “అయ్యా, స్నానం చెయ్యరా! ఎండలో బడొచ్చావ్ రాయ్యా!” అంటోన్న దృశ్యాలు. . అనుకోకుండా గుర్తొస్తోంటే - ఏ జ్యోతిలక్ష్మి బ్రాండ్ సంగీతంలో అయితే వాటినన్నింటినీ చెరిపేసుకుని, తుడిచేసుకుని, మలిపేసుకుని తాగాడో, తిన్నాడో, తాగాడో, ఆ సంగీతం జ్యోతిలక్ష్మీ బ్రాండ్ సంగీతం కాదనీ .. అది కేవలం వేళ్ళూ కాళ్ళూ లేని కుష్టురోగులు వాయించుతున్న సహాయార్ధ భజన అనీ తెలుసుకోగానే ఆ సంగతి అతను గ్రహించగొనే, కనీసం గ్రహించడానికి వొప్పుకోగానే క్రిష్టమూర్తికి కళ్ళు తిరిగాయ్. అతని కణతలు పగిలి రక్తాశ్రువులు జారి ఎక్కడోపడ్డాయి. కడుపులో కలయ దిరిగింది. తల దిమ్మెక్కింది.
క్రిష్ణమూర్తికి వరసగా అయిదు వాంతులయ్యాయి రెండుసార్లు వాంతులయ్యేసరికి ఎక్కణ్ణించో మూడు గజ్జికుక్కలు, ఒకదానితో ఒకటి పందాలు వేసుకున్నట్టుగా - వాటిల్లో ఒకదానికి అంగుళం మేర మాత్రమే జుట్టు వుంది. మరొకదానికి తోక సగానికి తెగి వుంది. వేరొకదానికి...!
ఆరుగురు కుష్టురోగపు బిచ్చగాళ్ళూ ముందు ఆశగా, ఆత్రంగా, అసూయగా తర్వాత ఏహ్యంగా ఆ కుక్కలకేసి చూశారు.
స్వాతి మానవత్రిక ఆగమ్టు 1976 పనివాడితనం 4 అక్కినేని కుటుంబరావు వ్రత
వొయిదా
లక్
సొర్ సెంద్రయ్య సేతి మీద సిలిండర్ పడి సెయ్యి సితికింది సార్” అంటూ
ఫిల్లింగ్ సెక్షన్ నించి పోచయ్య పరిగెత్తుకొచ్చాడు - ఆఫీసులోకి పొద్దుటే.
నేనూ పురుషోత్తం కంగారుపడుతూ చూశాం - “బాగా తగిలిందా దెబ్బ”
పని వదిలేసి పరిగెత్తాం.
మేం వెళ్ళేసరికి రాందాసూ, ముత్యాలూ చంద్రయ్య ని నేల మీద పడుకోబెట్టి అదిమి పెడుతున్నారు. చంద్రయ్య ఏడుపుతో, పెడబొబ్బలతో ఎగిరెగిరి పడుతున్నాడు. చెయ్యంతా రక్తం! అక్కడ నేలంతా రక్తం! మజ్టూర్గంతా ఆ చేతికి ఏవో మురికిగుడ్డ పేలికలు చుట్టవెడు తున్నారు.
చంద్రయ్యని చూస్తే ఆ యాథ్సిడెంటు జరగడం చాలా సహజం అనిపించింది నాకు.
అతను రాత్రి షిష్టంతా పనిచేశాడు. మళ్ళీ పొద్దున్న షిఫ్టులో పనిచేస్తున్నాడు. అతనికి బదులు రావలసిన బాలయ్య రాలేదు. రానని నిన్నే చెప్పాడు మా సెక్రైట్రీకి, సెలవు కావాలని అడిగాడు. ఇయ్యను పొమ్మన్నాడు సెకైట్రీ.
“ఎందుకియ్యవ్ సార్. నా భార్య దవఖానల వున్నది. ఆమెన్దూడాలె. ఒక్క దినం చుట్టి ఇయ్యి” అన్నాడు బాలయ్య మళ్ళీ.
అదేం కుదరదులే. రేపు డ్యూటీకి రా తెలిసిందా” రాకపోయావో మెమో ఇస్తా నీ ఇష్టం” అని తేల్చేశాడు సెక్రైట్రీ,
మెమో కంటే భార్య జబ్బుకే జంకినట్టున్నాడు బాలయ్య ఈరోజు పనికి రాలేదు.
చంద్రయ్య పొద్దుట డ్యూటీ దిగే టైమ్‌కి బాలయ్య లేడు
షిఫ్ట్ ఇన్‌ఛార్జి సెక్రైట్రీ ఇంటికి ఫోన్ చేశాడు ఏం చెయ్యాలో చెప్పమని.
అంతా విని మండిపడి సెక్రైట్రీ 'చంద్రయ్యనే ఈ షిఫ్ట్ కూడా చెయ్యమ'ని ఉత్తర్వు జారీ చేశాడు.
+ఉ వాయిదా ళీ తర్
“నేనెట్ట జేస్త సార్? ఇరవై మైళ్ళు సైకిల్ మీద పోవాలె. రెండు షిఫ్టులు జేసి ఎట్టబోత సార్గొ” అన్నాడు చంద్రయ్య ఇన్‌ఛార్జితో.
అన్నాడుగానీ, చంద్రయ్యకి మళ్ళీ డ్యూటీ ఎక్కక తప్పలేదు
పది గంటలకి సెక్రైట్రీ ఆఫీసుకి వచ్చిం తర్వాత చంద్రయ్య ఆఫీసులోకి వచ్చి రొండ్రూపాయ లియ్యమని అడిగాడు.
ఎవరికైనా సందేహం రావచ్చు - ఒక వర్కరు రూపాయో, అర్జో కావాలంటే సెక్రటరీ దగ్గరికిపోయి అడుగుతాడా అని మా దగ్గిర అంతే. మా కంపెనీలో అంతా సెక్రట్రీదే పెత్తనం
అ మహానుభావుడి ఆజ్ఞ లేకపోతే పదిపైసలైనా బైటికి పోవడానికి వీల్లేదు. అన్నిట్లోనూ సెకైట్రీ కలగజేసుకోవలసిందే.
ఎనిమిది గంటలకు నిద్రలేచి పదిగంటల లోపల ఒకసారి అల్పాహారం, ఒకసారి సంపూర్ణాహారం స్వీకరించి స్టీలు కేరేజి నిండా రెండోపూట తాలూకు సంపూర్ణాహారం స్టోరుచేసుకుని కారులో వచ్చి ఫాన్ కింద మెత్తల కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్న సెక్రట్రీ చంద్రయ్య తలుపు దగ్గిర నిలబడి చేతులు కట్టుకొని రొండ్రూపాయలడగ్గానే వులిక్కిపడ్డాడు. అలా పడతాడని మీకందరికీ తెలుసు.
“ఇప్పుడేం డబ్బులోయ్? రెండు గంటలకి ఎలాగా తీసుకుపోతారుగా ఇవాళ? (ఎలాగా దోచుకుపోతారుగా అన్నట్టే) ఏకంగా అప్పుడే తీసుకుఫో” అని కసిరాడు
చంద్రయ్య అలాగే నించున్నాడు.
“పొద్దుగాల నుండి ఏం తిన్లేదు సార్ ఒక్క రూపాయన్న ఇప్పియ్. ఏమన్న తినొస్తా”
ఈరోజెలాగా శనివారమే. రెండు గంటల్లో వర్కర్సందరికి ఓవర్‌బైమ్ డబ్బు లెక్కచూసి ఇచ్చెయ్యాలి. వర్కర్భు అప్పుడప్పుడూ కావలసింది అడిగి తీసుకుంటూనే వుంటారు.
కానీ సెక్రెట్రీ ఈ పూట బాలయ్య మీద చాలా కోపంగా వున్నాడు. బాలయ్య మెమోకి కూడా జంకనందుకు.
“పోవయ్య పో, తిందుగానిలే తరువాత నా పని పాడుచెయ్యకు” అని చంద్రయ్యని కసిరేశాడు.
“అస్తమానూ డబ్బులే. మీరందరూ శనివారం శనివారం డ్యూటీ దిగిం తర్వాత తీసుకుపోండి. మధ్యమధ్యలో అడగొద్దు. అంతే” అని కొత్త ఉత్తర్వు జారీచేశాడు
చంద్రయ్యకి కోపం వచ్చి మాలాంటి వాళ్ళ దగ్గర ఒక రూపాయి అప్పన్నా అడక్కుండా వెళ్ళిపోయాడు.
ఒక గంట ముందు జరిగింది అది.
గంట తర్వాత జరిగింది ఇది. చంద్రయ్యకి ప్రమాదం జరక్కపోతే అసహజం గానీ ..
పనివాడితనం * అక్కినేని కుటుంబరావు తెర
చంద్రయ్య బాధ భరించలేక మనిషి వణికిపోతున్నాడు. ఎనభై కిలోల బరువున్న ఇనప సిలెండరులో గ్యాస్ నింపి పక్కన పెట్టబోతోంటే చేతి మీద పడింది. ఎన్ని వేళ్ళు చితికాయో వివరం తెలీడంలేదు. అంతా రక్తం.
“ఫస్టెయిడ్ బాక్సు తీసుకురా” అన్నాను ఆఫీస్ బాయ్‌తో.
అతనికేం బోధపళ్ళేదు ఏం తెమ్మన్నానో - దాని పేరే ఎన్నడూ విన్నట్టు లేడు.
అప్పుడే వచ్చిన ఫిట్టర్ రంగారావు “వుత్త పెట్టెతో ఏం చేస్తారండీ?ఇంకో రెండు వేళ్ళు చితగ్గాడతారా? అందులో దూదన్నా లేందే” అన్నాడు.
అప్పుడు గుర్తొచ్చింది ప్రధమచికిత్స పెట్టెలో ఏం వున్నాయో ఏం లేవో తనిఖీ చెయ్యాల్సిన ఇన్‌స్పెక్టరు అప్పుడప్పుడూ నవ్వుతూ మా సెకైట్రీ దగ్గరికి వచ్చి నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటాడు.
ఈమధ్య కొత్త ఇన్‌స్పెక్టర్ వచ్చాడు. అతను మా ఆఫీసు కొచ్చే శ్రమ కూడా తీసుకోవడం లేదు. మా సెక్రట్రీయే దక్షిణ పంపిస్తున్నాడు.
మిషన్ల మడ్డి తుడిచి పడేసిన గుడ్డ ముక్కలు తీసి చంద్రయ్య చేతికి చుట్టబెట్టారు. రక్తం కనపడడంలేదు.
“సస్తున్నా సార్! అయిపోయింది సార్ నన్ను బచాయించు సార్!” అని చంద్రయ్య ఆఫీసు వాళ్ళం ఎవరు కనపడితే వాళ్ళకి నమస్కారాలు పెడ్తున్నాడు.
సంగతంతా సెకైటీ8 తెలిసింది
“బాగా దెబ్బ తగిలిందా?” అన్నాడు కంగారుపడుతూ.
సానుభూతితో అన్నాడనుకునేరు. వర్కర్స్‌కి ఏమైనా ప్రమాదాలు జరిగితే ఆ నష్టాన్ని బట్టి వాళ్ళకు కొంత డబ్బు ఇవ్వాల్సి వుంటుంది మేనేజ్‌మెంటు. చంద్రయ్య ఎంత డబ్బు దోచుకుపోతాడోనని సెక్రైెట్రీ కంగారు.
డాక్టర్స్‌తో లాలూచీపడొచ్చు అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడనుకోండి.
“ఎవరన్నా ఇద్దరు చంద్రయ్యని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి” అన్నాను.
“యిద్దరా?” అని వులిక్కిపడ్డాడు సెకైట్రీ.
“స్పృహ లేదా అతనికి? యిద్గరెళ్ళాలా?” అన్నాడు తను స్పృహ తప్పబోతూ.
“స్పృహ తప్పలేదుగానీ, చాలా బాధ పడుతున్నాడు. ఇద్దరు లేకపోతే అతన్ని పట్టుకోడం కష్టం ”
సెక్రైట్రీ మొహం చిట్టించాడు.
“మీరొక్కరూ వెళ్ళండి యిద్దరు అనవసరం. అంత సీరియస్సేం కాదు. వర్క్ సఫరవు తుంది ఇక్కడ” అన్నాడు గబగబా ఇక ఆ మాటకి తిరుగులేదని తెలుసు నాకు. వర్క్ సఫర్ కాకూడదు. నిముషం నిముషం వర్కు జరుగుతూ వుండాలి వుత్పత్తి పెరుగుతూ వుండాలి.
వానలో ఆడుకుంటూ పిల్లలు పాడుకుంటూ వుంటారే - “వానల్లు కురవాలి, వరిచేలు పండాలి, మా ఇల్లు నిండాలి' అనీ, సరిగ్గా అలాగే, అంత సహజంగా మా సెకైట్రీ 'వర్కుల్లు జరగాలి, వుత్పత్తి పెరగాలి, మా జేబుల్లు నిండాలి' అని పాడుతూ వుంటాడు పూటపూటా.
న్తీవాయిదాని తె
నేనాక్కళ్ణ్ళే చంద్రయ్యని తీసుకుని ఆటోలో బయల్దేరాను మాకు దగ్గిర్లో వున్న ఇ.యస్.ఐ. ఆస్పత్రికి. ఇఆయస్ ఐ ఆస్పత్రులు ఫ్యాక్టరీ కార్మికుల సేవ కోసం ఫ్యాక్టరీ ఉద్యోగుల జీతాల్టోంచి కొంత డబ్బు బిగబట్టి, దానికి తమ జేబులోది కూడా కొంత కలిపి నెలనెలా ఆ మొత్తం ఇ.ఎస్‌ఐ వారికీ అప్పగిస్తారు - మా కార్మికుల ఆరోగ్యాలు మేం పాడు చేస్తాం, మీరు బాగు చెయ్యండని.
చంద్రయ్య నా కొడ మీద తల అన్ని కాస్సేపు పడుకున్నాడుగానీ వుండలేకపోతున్నాడు. నిలకడగా పడుకోలేకపోతున్నాడు, బాధ ఓర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు చాలా అన్యాయంగా, అసహజంగా.
చంద్రయ్యని ఎలాగో ఆటో దింపి అతి కష్టం మీద నడిపించుకుంటూ ఎమర్జన్సీ వార్డుకి తీసుకెళ్ళా
అక్కడ ఇద్దరు నర్భులు గుమ్మాని కటొకరూ ఇటొకరూ నించుని కబుర్లు చెప్పుకుంటు న్నారు. మమ్మల్ని చూశారుగానీ కదల్లేదు, మాటలాపలేదు
గాయపడ్డ మనిషి చొక్కా నిండా రక్తంతో, చేతి నిండా రక్తంతో, వివపరీతంగా బాధ పడుతూ, ఏడుస్తూ, వాణికిపోతూ ఎదురుగా నించుంటే వాళ్ళిద్దరూ మావేపు రెండో చూపు తిప్పలేదు.
నైంటింగేల్ జీవితచరిత్ర చదివి మదర్ తెరిస్సా బైస్కోపు చూసి వున్న నేను నిజంగా వాళ్ళిద్దర్నీ చూసి చాలా ఆశ్చర్యపడిపోయాను వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి చంద్రయ్య ని పట్టేసుకుంటారనుకోలేదు గానీ... ఇంత చలించకుండా నిలబడగలరని మాత్రం అనుకోలేదు. మావేపు రెండో చూపు చూస్తే ఏమాటన్నా తప్పుతుందేమో అన్నట్టు ఒకర్షి ఒకరు భుజాలు తట్టి తోసుకుంటూ నవ్వుకుంటూ హాస్యాలు చేసుకుంటున్నారు.
“పోవే నీ దివానీ ఫేషన్”
“పోవే నీ మాటలకేంటీ?”
ఎడంపక్కామె సుతారంగా నవ్వింది. కుడిపక్కామె కొంచెం ఎక్కువ సుతారంగా నవ్వింది. నవ్వనీకుండా పెదాల్ని బిగపట్టడంలో మాత్రం ఇద్దరూ సమానంగా శ్రమపడ్డారు.
వాళ్ళిక మమ్మల్ని పట్టించుకోరనే నిర్ణయానికి వచ్చాక “సిస్టర్ ఇతనికి బాగా దెబ్బ తగిలింది. ఎక్కడ చూస్తారు?” అన్నాను.
ఒకొమె కొంచెం ఇబ్బందిగా కదిలి - “ఇక్కడే” అంది.
ఇంకో ఆమె ఇందాకటికన్నా తీరిగ్గా సుఖంగా వుండేందుకేమో కాలు వెనక్కి మడిచి గోడకి తన్నిపట్టింది.
“ఏమేసుకున్నాడూ చేతిమీదా?”
నాకు మతిపోయింది
“అతనేసుకోలేదు, అదే పడింది ”
పనివాడితనం 4 అక్కినేని కుటుందిరాను చెరి
“ఏ ఫ్యాక్టర?” చెప్పాను. “ఎప్పుడు తగిలించుకున్నాడూ?” “అక్కడే పనిచేస్తాడా?” చెప్పాను. “పర్మనెంటుగానా?” చెప్పాను. “జీతం ఎంతా?” చెప్పాను. చంద్రయ్య నిలబడలేకపోతున్నాడు, నేలకి దిగజారుతున్నాడు. “ఎందుకయ్యా అల్లా ఏడుస్తా ప్రాణం పోయినట్టూ.” నా సహనం నశించింది అసలు ఇప్పటిదాకా అంత సహనంగా వున్నందుకే నా మీద నాకు కోపంగా వుంది. సహనం గాడిదల లక్షణం అన్నాడు గోర్కీ. కానీ ఇక్కడ గాడిద లక్షణాలే చెల్లు బాటయ్యే లాగున్నాయి. వాళ్ళిద్దరూ అలా సావధానంగా, కులాసాగా, "పెళ్ళిచూపుల్లో పిల్లని అడిగినట్టు ప్రశ్న లేస్తోంటే నా భుజం మీదికి పూర్తిగా వారిగిపోతున్న చంద్రయ్యని కాస్త దూరంలో వున్న ఓ బల్లమీద పడకోబెట్టి ఆ చెల్లెళ్ళ నడిగాను “డాక్టరుగారున్నారా లోపల?” “ఎందుకూ?” ఎందుకూ అట “ఎందుకా?.. ఇతను...” “వున్నారు .. ఎవరో పెద్దమనిషితో మాట్లాడుతున్నారు ” మీరు పెద్దమనుషులు కారుగా అన్నట్టు. నేను రెక్కల తలపు తోసుకొని లోపలికెళ్ళాను. నిజంగానే అక్కడ ఓ పెద్దమనిషి, పెద్ద పాట్టమనిషి కూచుని వున్నాడు. కెల్ల ఖద్దరు లాల్చీ, రంపం అంచు డిజైనున్న పల్చని పంచీ... గొలుసూ. వుంగరాలూ.. పేషంటులా మాత్రం లేడు. డాక్టర్ నన్ను చూశాడు. ఎదటాయన్లో మాటలు మాత్రం ఆపలేదు “_ అందువల్లా ఏం చెప్పన్నానూ? ఆం... లక్ష కాదండీ లక్షన్నరైనా ఇస్తా కుర్రాడు డొక్టరైతే చాలు. మా అమ్మాయి కూడా “ఎవర్ని చేసుకుంటావు బేబీ?" అంటే “డాక్టర్ని చూడండి డాడి అంటోంది. మా అబ్బాయి కూడా డాక్టరే. మీకు తెలుసుగా? మొన్న సుల్తాన్‌బజార్‌లో “ఏడుకొండలా క్లినిక్ అని క్లినిక్ తెరిచాడు మరీ ఎక్కువ తీసుకోవడంలేదులెండి. ప్రస్తుతానికి శీదాయిదా తి వం
ముష్ఫయేసి మాత్రం పుచ్చుకుంటున్నాడు. రోజుకి పదిమంది వచ్చినా చాలనుకున్నాం! పాతికమంది దాకా వస్తున్నారు.”
ప్రపంచం అంతా రోగులైపోతే ఆ రోగులందరూ ఏడుకొండలా క్లినిక్కే వస్తే ఆ డాక్టర్‌కి ఎంత అనందం కలుగుతుందో, నన్ను చూసి అంత చికాకు కలిగిందాయనకు,
నేను చాలా చొరవగా సీరియస్‌గా చెప్పాను “బైట పేషంట్ చాలా బాధపడుతున్నాడు డాక్టర్? యాక్సిడెంట్‌లో వేళ్ళు చిట్టిపోయాయి. చాలా రక్తం పోతోంది. ఫ్యాక్టరీ నుంచి తీసు
కొచ్చాను”
నా మాటలు విని డాక్టర్ - 'ఐసీ' (అల్లాగా?) అని మొహం ఎగరేసి విస్మయపడ్డాడు.
ఆ సమయంలో అతను డాక్టర్ కానట్టూ, నేను ఎవరో డాక్టర్ కోసం చూస్తోన్నట్టూ
“అవును మనకో డాక్టరు దొరికితే బాగుణ్డు' అని అతను కూడా ఆలోచిస్తున్నట్టూ చూశాడు. మళ్ళీ ఎదటాయన్తో మాటలు మొదలెట్టబోయాడు అటు వంగి,
“డాస్టరుగారూ! అతన్ని లోపలికి తీసుకురమ్మంటారా?” అన్నాను.
డాక్టర్ ఛీత్కారంగా చూసి విసుగ్గా చెయ్యి రూడించి “వెళ్ళండి అక్కడ సిస్టర్స్
వుంటారు చూడండి” అనేసి మళ్ళీ పెద్దమనిషి వేపు తిరిగాడు.
నేను బయటికి వచ్చేటప్పటికి అక్కచెల్లెళ్ళు మకాం మార్చి ఇంకోచోట నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకో ఇద్దరు సిస్టర్స్ నాకందకుండా చకచకా వెళ్ళిపోయారు
నేను మొదట మాట్లాడిన చెల్లెళ్ళ దగ్గరికే వెళ్ళి “డాక్టరుగారు మీకు చెప్పమన్నా రండి” అన్నాను వినయంగా. నా వినయం వల్ల లాభం కలక్కపోతుందా అనే ఆశతో.
“అతని కార్డు వుందా?” అంది ఒక చెల్లెలు ఎట్టకేలకు మొహం తిప్పి
“లేదు” అన్నాను.
“లేకపోతే తీసుకురండి” అని మరబొమ్మలాగా మళ్ళీ మొహం తిప్పేసింది
“అతనెక్కడో షాలిబండాలో వుంటాడు సిస్టర్, అతనిల్లు నాకు తెలీదు . ఫ్యాక్టరీలో యాక్సీడెంట్ అయితే తీసుకొచ్చాం. కార్డులు జేబుల్లో పెట్టుకు తిరుగుతారా?” అన్నాను వుండబట్టలేక.
“తిరక్కపోతే మానండి. మందు కావాలంటే కార్డు కావాలి. అందరూ మీలాగా మాట్టాడికే కార్డులిచ్చి లాభమేంటి?” అంది విసుక్కుంటూ.
“అందరూ నాలాగా ఎందుకు మాట్లాడతారు సిస్టర్? ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది కాబట్టి కార్డు జేబులో లేదు కాబట్టి, ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొచ్చాం కాబట్టి, అతను చాలా బాధపడుతున్నాడు కాబట్టి, మీరు కార్డు లేకపోయినా వైద్యం చెయ్యాలి. దారేపోయే వ్యక్తి కెవరికైనా మీ అస్పత్రి ముందు ప్రమాదం జరిగితే కార్డు కోసం చూస్తారా? వైద్యం చేయ్యరా?” అని లాజిక్కు మాట్లాడాను.
“మాకేం అవసరం? మేమెందుకు చేస్తాం?” ఆశ్చర్యపడిందా చెల్లెలు
పనివాడితనం 4 అక్కినేని కుటుంబరావు తం
అంతలో రెండో చెల్లెలు కలగజేసుకుని ' ఎమర్జెన్సీ కేసైతే కార్డు లేకపోయినా ఫర్వాలేదు లెండి పోనీ అవుట్ పేషెంట్ వార్డుకెళ్ళి చీటీ రాయించుకు రండి” అంది
'బతికిచ్చావు తల్లీ' అనుకుని “అతనికి కొంచెం ఆ రక్తం ఆగేట్టు చూస్తారా?" అన్నాను వైద్యం మొదలెట్టెయ్యరాదూ? అన్న అర్థంతో.
“రక్తం ఎక్కడండీ? ఇంతసేపు రక్తం కారితే ఇంక మనిషి బతికినట్టే. మీకెందుకు మీరెళ్ళండి ' అని విసుక్కుంది
చంద్రయ్య నెమ్మదిగా ఏడుస్తున్నాడు నేను అటూ ఇటూ తిరుగుతోంటే నా వంకా, ఆ ఇద్దరి వంకా, తన చేతివంకా చూసుకుంటూ బాధ వోర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా అసహజంగా, చాలా అన్యాయంగా.
నాకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది చంద్రయ్య పొద్దుట్నుంచీ ఏమీ తినలేదని,
ఒక కప్పు చాయ్ ఇస్తారా అతనికి?” అన్నా సిస్టర్స్‌తో
వాళ్ళు నన్ను పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి - “ఇప్పుడు కాదు. అడ్మిట్ అయితే లిస్టులో పడితే అప్పుడు” అన్నారు.
ముందు చంద్రయ్యకి ఏమన్నా తెచ్చి తినిపించనా? లేకపోతే ఆ చీటీ రాయించుకొచ్చి వీళ్ళకిస్తే అతని చేతికి కట్టుకట్టే లోగా తీసుకురానా? ఆలోచిస్తూనే అవుట్ పేషెంట్ వార్ళుకి పరిగిత్తాను.
అక్కడ కనీసం యాభై మీటర్ల పొడుగు క్యూ. నేను ముందుకు పోతోంటే క్యూలో వున్న వాళ్ళంతా అరుస్తున్నారు
వాళ్ళవంక చూస్తే రకరకాల రోగాల శాంపిల్సులాగా కనిపిస్తున్నారు. ఇంతమంది రోగులా? ఫ్యాక్టరీల్లో శ్రమించి సంపదలు సృష్టించే కార్మికులు ఇంతింత రోగాలతో గంటల తరబడీ ఇలా వరసల్లో నిలబడి వుండాలా?
ఆలోచిస్తూ నించునే టైమ్ లేదు. చాలా అన్యాయగా క్యూ ముందుకి పోయాను. సరిగ్గా అప్పుడే ఆ చీటీలిచ్చే ఆయన నోటినిండా పాన్ నములుతూ సీట్లోంచి లేచి బయటికి పోయాడు. క్యూలో వాళ్ళంతా నిట్టూర్పులు విడిచారు. చీటీలాయన సీట్లోంచి లేస్తే ఒక యుగం దాకా తిరిగి రాడన్నారు. రోగులందర్నీ ఎగాదిగా చూస్తూ నించున్నాను. ఒకతనయితే. . ముళ్ళకంప మీద పాతబట్ట పరిచినట్టు. ఆ పుల్లల్లాంటి చేతులూ కాళ్ళూ... తను మనిషే అయితే మరి నేనెవర్నో! ఏనుగునై వుండాలి.
ఫ్యాక్టరీ మేనేజర్లకీ, ఓనర్గకీ అయితే ముక్కుకో డాక్టరు, మూతికో డాక్టరు, కంటికో డాక్టరు, పంటికో డాక్టరు - ఎటుచూసినా డాక్టర్లు. కార్ల మీదా, రైళ్ళ మీదా, అవసరమయితే విమానాల మీదా కూడా వచ్చి వాల్తారు నిమిషాల్లో.
ఫ్యాక్టరీల ఓనర్లూ, మేనేజర్లూ, వారి విమానాల డాక్టర్లూ ఎవరి శ్రమ మీద కులుకు తున్నారో అ నిర్భాగ్యులు అవుట్ "పేషంట్ వార్డుల్లో గంటలు... గంటలు .. గంటలు. గంటలు
ఛ+ఉ వాయిదా € చాడా
చాలాసేపు నిలబడి ఇక ఆ పూట ఆ చీటీముక్క దొరకడం సాధ్యంకాదని మళ్ళీ చంద్రయ్య దగ్గరికి పరిగెత్తుకొచ్చాను.
అక్కడ చంద్రయ్య ఎప్పట్లాగే వున్నాడు. అతని కాళ్ళవేపు బెంచీ మీద ఇంకో చంద్రయ్య పడున్నాడు. గావు కేకలు పెడుతూ ఏడుస్తున్నాడు కొత్త చంద్రయ్య. “నేను బతకను. నేను బతకను దేవుడా!” అని అరుస్తున్నాడు. మనిషి అంత గట్టిగా ఏడవగలడంటే నేను స్వయంగ వినకపోతే నమ్మను.
చంద్రయ్య స్పృహ తప్పిపోయినట్టు పడున్నాడు. అతని మొఖంలో ఏదో మార్చు కనిపిస్తోంది నాకు. “ధనుర్వాతం కమ్మి చచ్చిపోయారు' అన్న మాటలు చాలాసార్లు విన్నాను ఇదివరకు. ఇంత త్వరగా అది జరుగుతుందో లేదో నాకు తెలియదుగానీ చాలా భయమేసి మళ్ళీ డాక్టర్ గదిలోకి పరిగెత్తాను. వెనకాల సిస్టర్స్ ఏదో అంటున్నారు. వినిపించుకోలేదు.
డాక్టర్ ఇంకా ఆ 'పెద్ద' మనిషితో మాట్లాడుతూనే వున్నాడు. నోరంతా తెరిచి నవ్వుతూ ఆ నోటితో నావేపు చూసి “ఆం.” అన్నాడు 'ఏం?' అన్నట్టు.
“మా ఫ్యాక్టరీ వర్కర్‌కి యాక్సిడెంటైతే అర్జంటుగా తీసుకొచ్చాం సార్. కార్డు లేదు, అవుట్ పేషెంట్ వార్డుకెళ్ళి చీటీ రాయించుకురమ్మన్నారు సిస్టర్స్ అక్కడ...”
డాక్టరు నవ్వే గుజాన్న వున్నాడేమో మహా తేలిగ్గా “సరే, తీసుకురండి” అన్నాడు.
నేను బైటికి పరిగెత్తి చంద్రయ్య ని లేవగొట్టి డాక్టర్ దగ్గరికి తీసుకురాబోయాను.
డాక్టరు కంగారుపడిపోయి “ఇక్కడిక్కాదు, ఇక్కడిక్కాదు... సిస్టర్...” అని ఓ గావు కేక పెట్టి చెల్లెల్ని పిలిచాడు.
చెల్లెళ్ళు పరిగెత్తుకొచ్చి నన్ను మింగేసేలా చూసి చంద్రయ్యని లాక్కుపోయి ఒక బెడ్ మీద పడేశారు.
మళ్ళీ ఎక్కడ వాళ్ళక్కడ నిలబడ్డారు.
“సిస్టర్! అతనికి.”
వాళ్ళిద్దరూ మొహాలు చిట్లించి - కొత్తగా చిట్లించారో, అసలు ఎప్పుడూ ఆ మొహాలు చిట్టించినట్టే వుంటాయో “ఇంకేంటీ? అని విసుక్కున్నారు ఇద్దరూ వుమ్మడిగా.
ఇంకేంటీ అట! అసలు జరిగిందేంటి? బల్లమీద వాణ్ణి బెడ్ మీద పడేస్తే చాలా? వైద్యం అంతా అదేనా?
డాక్టర్ ఆ పెద్దమనిషిని సాగనంపుతూ బైటికి వచ్చాడు. నేను మళ్ళీ వెనకాల పడ్డాను. వెంటనే నన్ను వొదిలించుకోవడానికి బైట ఎక్కడో అప్లికేషన్ ఫాం దొరుకుతుందనీ, అద్దీసుకుని మరెక్కడో ఒకతను దొరుకుతాడనీ, అతన్ని కలుసుకుని పేషంట్ వివరాలన్నీ రాయించుకు రమ్మన్నాడు.
నేను పరిగెత్తాను. ఆ కాయితం తొందరగానే దొరికింది. అందులో చూస్తే చంద్రయ్య తండ్రి పేరూ, వూరు, ఎక్కడ పనీ, ఏం పనీ, ఇంటెడ్రస్సూ, వీధెడ్రస్సూ సవాలక్ష సంగతులు
ప్రనివాడితనం 4 అక్కినేని కుటుంబరావు లై
రాయమని వుంది ఈ సంగతులన్నీ ఆ కొత్తమనిషి ఎలా రాయగలడో నాకర్థం కాలేదు అయినా వెతికాను అతనికోసం. దొరికితేనా? మళ్ళీ డాక్టర్ దగ్గరకి పరిగెత్తుకొచ్చి “సార్ ఈ ఫామ్ నేను ఫిలప్ చెయ్యొచ్చునా? ఈ వివరాలన్నీ నాకు తెలుసండీ” అన్నాను “
డాక్టర్ నావేవు చెప్పలేనంత ఆశ్చర్యంగా చూశాడు
“మీ సీట్లో నేను కూచోవచ్చా?' అని అడిగినట్టు చూశాడు.
“న్లన్లు చెప్పినట్టు చెయ్యండి. వెళ్ళండి” వెళ్ళాను సిస్టర్స్ దగ్గరకి. చంద్రయ్య వివరాలు మీకు తెలీకపోయినా ఆ ఫామ్ నింపగల ఆ మహానుభావుడెక్కడుంటాడని అడిగాను.
వాళ్ళిద్దరూ చెరోదారీ చూపించి మళ్ళీ ఏకదారి చూపించారు. సరే, అటు పరిగెత్తాను ఒక గేటు అడ్డం వచ్చింది. ఆ గేటు దగ్గర ఒక మనిషి అడ్డం వచ్చాడు.
“చెం అయిపోయింది” అని చెయ్యి వూపాడు.
“నేను ఫలానా మనిషి కోసం వెళుతున్నాను” అన్నాను.
“ఆ ఫలానా మనిషి ఇక్కడ వుండడు. ఇంకో ఫలానా చోట వుంటాడు” అని చెయ్యి జాపాడు
నేను ఇక ఆ చేతివేపు చూడకుండా పరిగెత్తాను. ఈ కొత్త ఫలానాచోటు ఇందాక చెల్లెళ్ళు చెప్పిన ఫలానాచోటికి సరిగ్గా వ్యతిరేక దిక్కు. ఆ దిక్కులో ప్రకృతి పుట్టినప్పట్నించీ నర సంచారం అనేది జరిగినట్టు లేదు. ఇంకా పోగా పోగా ఏవో స్టోరు గదులు అన్నీ తలుపులు బిగించి తాళాలు వేళ్ళాడుతూ లోపల అద్దాల కిటికీలలోంచి ట్యూబ్‌లైట్లూ, ఫాన్లూ మహా జోరుగా వెలిగిపోతూ, తిరిగిపోతూ కనిపించాయి. అటూ ఇటూ పాొతికేసి గదులు దాటుకుంటూ పోయాక ఒకాయన కనిపించాడు. కనిపించి నన్ను చూసి గతుక్కుమన్నాడు. అతన్ని చూసి నేనూ గతుక్కుమన్నాను.
“ఇటెందుకొచ్చా?”
“ఫలానా అతని కోసం”
“ఇప్పుడు టైమెంతా?”
“ఫలానా అంత”
“మరింకేం? అతని డ్యూటీ అయిపోయి అరగంటైంది”
“వైళ్ళిపోయాడా సారొ”
“వెళ్ళలేదులే. నేనే?”
“నమస్కారం సార్. . మిమ్మల్ని చూడగలిగాను ఇది కొంచెం కంప్లీట్ చెయ్యండి సార్ అవతల పేషంటు...”
“డ్యూటీ అయిపోయి అరగంటైంది”
నేను జేబులోకి చెయ్యి పోనిచ్చాను.
బాగా ఆశపడ్డాడు “రిజిష్టర్ లేదు డాక్టర్ దగ్గిరకి పంపేశాను. పైసలిచ్చెయ్. రేపెప్పు డన్నా ఇంకో కేసుకి రాస్తాలే ”
నేవాయిదా* ట్రై
పరిగెత్తాను వెనక్కి తిరిగి డాక్టర్ ఇంకో పెద్దమనిషితో మాట్లాడుతున్నాడు కుర్రాడు డాక్టరైతే చాలండీ లక్షన్నరిస్తా మా అమ్మాయి డాక్టర్ కావాలని ముచ్చటపడుతోంది అతని బిజినెస్ వ్యవహారం అంతా నేను చూనుకుంటాగా? అంటున్నాడు అతని ప్రాక్టీస్ అంతా నేను చూసుకుంటాగా అన్నా బాగుండును అతని బిజినెస్ అంతా తను చూసుకుంటాట్ట చుట్టూ రోగుల మూలుగుల్తో కేకల్తో దేవుణ్ణి పిలిచే ఆర్తనాదాల్తో ఆస్పత్రి పునాదులు కంపిస్తోంటే ఈ డాక్టరు తనకు డాక్టరల్లుడు దొరుకుతాడా లేదా అని దిగాలు పడిపోతున్నాడు ఎప్పటికప్పుడు తన జీవిత సర్వస్వాన్నీ సర్వశక్తుల్నీ ప్రజల కోసం ప్రజాసైన్యాల కోసం ధారపోసిన డాక్టర్ బెతూన్ గుర్తు రాబోయాడు లాభం లేదని ఆలోచనల్ని తోలేసి డాక్టర్ ముందు నిలబడి ఎవండీ అన్నాను ఎరా అనవలసినవాబ్దీ ఎమిటి? అన్నాడు ఆ రిజిష్టర్ ఇక్కడికే పంపించేశారట ఆయన డ్యూటీ అయిపోయిందట అయితే నన్నేం చెయ్యమంటారు? ఆ ఫామ్ నన్ను పూర్తి చెయ్యమంటారా? 'నేను లేస్తా వచ్చి ఇక్కడ కూర్చుని వైద్యం కూడా చెయ్యండి రండి అని లేవ బోయాడు కుర్చీలోంచి డాక్టర్‌ననే ఆ గర్వ ధన మదాంధుడు నిజంగానే ఆ కుర్చీలో కూర్చోడానికి నేనే అర్హుణ్జి పదేళ్ళ కిందట నేనుకున్నాను డాక్టర్ బెతూన్‌లా డాక్టర్ కోట్సీస్‌లా ఇంకెందరో ప్రజాసేవకులైన డాక్టర్లలా డాక్టర్ చదువు చదివి పేద ప్రజలకేదో చేద్దామని నాలాంటివాళ్ళకు రావలసిన సీట్లు నీలాంటి నీచులు కొట్టేశార్రా అందామను కున్నాను డొక్టర్‌తో ఆగాను నోరు మెదపకుండా నించున్నాను చంద్రయ్య కోసం వస్తానండీ మీ పనికి ఆటంకంగా వున్నట్నన్నాను అని లేవబోయాడు డాక్టర్ ఎదటి పెద్దమనిషి అబ్బబ్బే ఎం ఆటంకం కూర్చోండి రోజూ ఉండేదే ఈ గోల ఇవ్వాళేం కొత్తా? ఈ వర్కర్స్ బలే ఎత్తు లేస్తారులెండి కంపెనీ నుంచి ఒక వందో వెయ్యో వస్తాయంటే చాలు కాళ్ళయినా చేతులైనా విరగ్గొట్టేసుకుంటారు అంతా దొంగవేషం అనుకోండి ఎక్కడన్నా కాస్త దెబ్బ తగిలినా అంత గావుకేకలు పెట్టేంత బాధ వుండదు వూరికే గాభరాతో అరుస్తారు రోజూ వుండే భాగోతము మాకు తెలునుగా? ఎదో లెండి పదిమంది రోగులు వృద్ధి అయితేనే మీ డాక్టర్లకి నాలుగు డబ్బులు రాల్తాయి అని పెద్దమనిషి వేళాకోళం చేశాడు పనివాడితనం శ అక్కినేని కుటుంబరాను చా
నాకు డాక్టర్‌తో పోట్టాటేసుకోవాలనిపించింది ఇ ఎస్ ఐ వాళ్ళు వర్కర్స్ నించీ కంపెనీల నించీ వసూలు చేసిన దాంట్లో కాళ్ళూచేతులూ విరగ్గొట్టుకున్న వర్కర్స్‌కి ఎంతిస్తున్నా రేమిటి? అందామనిపించింది డాక్టర్ ఎ గుణాన్న వున్నాడో చెల్లెల్ని పిలిచాడు రిజిష్టర్ చూడు అన్నాడు ఆయన ఎక్కడ పడేశాడో అని విసుక్కుందావిడ ఎదరగా ఇంకో బల్ల మీద పెద్ద బైండ్ ఎదో వుంది సిస్టర్ అదేనేమో చూడండి అన్నాను ధైర్యంగా కాకపోవడమేమిటి అదే అన్నాడు డాక్టర్ చెల్లెల్ని ఎమీ అనకుండా ఈ ఫామ్ నింపు దాంట్లో ఎక్కించు అన్నాడు చివరికి చెల్లెలు అలాగే చేసింది ఈ తంతు అంతా జరగటానికి దాదాపు గంటన్నర పట్టింది తర్వాత ఇంకో అరగంటలో జరిగిందేమిటంటే - చంద్రయ్యని ఇన్ పేషంట్‌గా ఎడ్మిట్ చెయ్యాలంటే ఇంకోచోటికి తీసికళ్ళాలన్నారు శ్రైెచర్ లేదు నేనూ ఇంకో ఆయమ్మా చంద్రయ్యని నడిపించుకుంటూ బయల్టేరాం దారిలో ఆయమ్మ మీరు నడుస్తూ వుండండి అని ఎవరితోటో పలకరింపుల్లొ మునిగింది మేం నడిచాం అమె రాలేదు చంద్రయ్యని అక్కడ నేల మీద పడుకోబెట్టి వెనక్కి వెళ్తే అయమ్మ లేదు చంద్రయ్యకి టీ అయినా తెద్దామని కేంటీన్ కెళ్ళా గ్లాసుకోసం రెండ్రూపాయలక్కడ పెట్టమన్నాడు సరే అలాగే పెట్టి టీ పట్టుకొస్తోంటే గేటతను వెళ్ళడానికి వీల్లేదన్నాడు నేనిప్పుడే కదయ్యా వెళ్ళాను వెళ్ళినవేమో వెళ్ళినవ్ అయిషపాయె అని చెయ్యి చాపాడు అతని చేతిలో చారనా పెట్టి లోపలికెళ్ళి చంద్రయ్యకు టీ తాగించాను ఆవురావురు మంటూ తాగాడు అతని బాధ ఎమీ తగ్గలేదు అతనికి కొంచెం ధైర్యం చెప్పి గ్లాసు ఇచ్చెయ్య డానికి వెళ్తోంటే ఆయమ్మ ఎదురుపడి యాడికి బోతున్నవ్? అని గదమాయించింది ఇప్పుడే వస్తా అని కాంటీన్‌కి పరిగెత్తి గ్లాఎచ్చేసి వచ్చాను చంద్రయ్యని ఎడ్మిట్ చేసుకోడానికి అక్కడ డాక్టర్ లేడట తర్వాత ఇంకో అరగంటకి ఒక చెల్లెలు ఒక బెడ్ చూపించింది చంద్రయ్యని దాని మీద పడుకోబెట్టాం అతను మూడు గంటలనుంచీ విరామం లేకుండా మూలుగుతూనే వున్నాడు మన కళ్ళ ముందు ఇంకో జీవి సాటి మనిష అంత బాధపడుళతోంటే ఆ బాధని నివారించగలిగే విద్యలన్నీ మన చేతిలో వుంటే వెంటనే ఆ బాధని పోగొట్టాలనే ఆరాటం కలగదా? ఆ జీవిని మగా ఓదార్పాలని హృదయం కొట్టుకోదా?
- నాయిదా + బ్శే్
శేషెంట్ పేరు రిజిష్టర్‌లో ఎక్కించేముందు కప్పు టీ నీళ్ళు ఇవ్వనివ్వని రూల్స్‌ని చూస్తేదు ఖం రాదా? రూల్చ్‌ని ధిక్కరించే శక్తి మనకు లేకపోతే బాధతో కొట్టుకునే మనిషితో ఒక చల్లని మాట ఒక మెత్తని నవ్వు ఒక (ప్రేమార్థమైన చూపు అంతమాత్రం ఇవ్వలేమా? ఎంత ఆలోచించినా అర్థంకాదు నాకు
పది నిమిషాలకి రెండు ఇంజెక్షన్లు చేశారు చంద్రయ్యకి ఎవో మాత్తర్జు ఇచ్చారు నోట్లోకి చేతికి వున్న మురికి గుడ్డలన్నీ వూడబీకి ఎదో మందు పూసి కొంచెం బాండేజ్ గుడ్డ చుట్టారు
ఆ చేయి ఎంత చితికిందో ఎన్ని కుట్టు కుట్టాలో ఎం చెయ్యాలో ఆ పనేదో సోమవారం నాడు చూస్తారట
ఇవ్వాళ శనివారం
వజాసావొతి సెప్టెంబరు 977 పనివాడితనం + అక్కినేని కుటుంబరావు జ్
శి కీర్తిశేషుడు ఎ౦డ ఒకటే ఎండ అబ్బ ఎంత ఎండో ఫ్యాక్టరీ ఆఫీసుగది కిటికీలోంచి చూస్తే దూరంగా కనిపించే రోడ్డ మీద జనసంచారం లేదు అక్కడక్కడా మహా హడావుడిగా తిరిగే ఒకటీ అరా లారీలు తప్ప - మా ఫ్యాక్టరీ చుట్టూ వున్న కాబ్బరిచెట్ల మీద ఎట్టలు బిక్క మొహాల్లో గుటకలేస్తున్నాయి వంతువేసుకుని నీళ్ళ వంపుని ముక్కుల్లో. నీళ్ళాదలమనో ఎమో పాడుస్తున్నాయి యాడాదికిందట మా ఫ్యాక్టరీలోనే స్థిరనివాసం ఎర్వరచుకున్న రెండు కుక్కలు ఒక నీడ నుంచీ యింకో నీడకి పరిగెడుతున్నాయి. నాలికలు వేళ్ళాడేసుకుని ఎండ ఒకటే ఎండ అబ్బ ఎంత ఎండో అట్లాంటి ఎండలో ఆ వేసవికాలపు మిట్టమధ్యాహ్నం ఎండలో పడున్న ఐరన్ మెటీరియలోని ఇనపసామాను లారీలోకి లోడు చేయించమని తన ఎయిర్ కండిషన్ రూమ్‌లోంచి వుత్తర్వు జారీ చేశాడు మా ప్రాప్రయిటర్ రాజా సుబ్రమణ్యేశ్వర్రావు అదే సంగతి - నేను లోడింగ్ చేయించే గుమాస్తాని గనక మజ్జూర్లకి చెప్పాను ఉదయం పదింటికల్లా లోడయ్యి వెళ్ళిపోవాల్సిన లారీ ఆ యం యస్ స్లేట్సు కోసం ఇప్పుడు రెండుగంటల వేళ వొచ్చింది ఒచ్చి వగరుస్తూ నిలబడింది లారీలోంచి డ్రైవరూ క్లీనరూ తడిసిన ముద్దల్లా బయటకురికి అబ్బబ్బ ఎమెండ ఎమెండ అంటూ లోన షెడ్డులో నీడలోకిపోయి నుంచున్నారు ఎమయ్యోయ్ మైసయ్యా నర్సింహా యాదమ్మా రాములూ రండయ్యా రండి జల్లీ గానివ్వాలి మూడయ్యేసరికి బండి బైటుండాలి లేకపోతే మన దుంప తెంచుతాడు ఈ కీర్తిశేషుడు ఈ డగ
మన సేరు రండి రండి జల్టీ అని అన్నానేగాని నాకు తెలుస్తోనే వుంది ఎండ ఎంతగా మండిపోతోందో అంత మండుటెండలో ఆ ఇనపప్లేట్లని ఎలా లోడ్ చెయ్యగటబ్రు అనినా మనసు ఎకుతోంది ఎం సార్ ఎట్టజెయ్యాలె సార్ గింత ఎండ్ల? పిల్లేటు పట్టుకుందికె శాతనైతలేదు యింక ఎట్ల లే వట్టాలే? ఎట్ట లోడ్ చెయ్యాలె? జరసేపయినంక జేస్తం సారొ మాటలు మహానెమ్మదిగా వస్తున్నాయి రాములు కంరంలోంచీ నీకాల్మొన్హా బాంచెన్ గా పిల్లేట్లన్నీ ఎండల ఎట్ల గాల్తున్నాయో సూడున్రి పొద్దుగాల్న యిన మంచిగుండె యింక పొద్దుమీకిజేస్తం దొరా జర సేటుకి జెప్పు ఓవలొో టేమ్ యివ్వక్ మని జెప్పు పాద్మీకి జేస్తం గిప్పుడు వేరిపన్దెప్పుర్రి చేస్తం గాపిల్లేట్లాద్దు సస్తం గరిబోల్లం నీటిపారలు కమ్మిన కళ్ళతో రెండు చేతులూ జోడించి బతిమాలాడు మైసయ్య మైసయ్య అరవై ఎళ్ళవాడు అస్తిపంజరంలా తోటకూరకాడలా ఎక్కుపోయిన కళ్ళతో అతి బలహీనంగా శనిపిస్తాడు అతన్ని చూసినప్పుడు కొల్లేట్లో అష్టకవ్చలు పడుతూ గయ్యాళి- పాలం పనులు చేసుకునే మా బాబాయి గుర్తొస్తాడు మైసయ్య వెనక ఇంకో మజ్‌దూర్ నర్సింహ అవ్ సార్ నిజం సార్ పాద్మీకి జేస్తాం సారో అంటున్నాడు పదినెల్ల కొడుక్కి పాలిచ్చుకుంటున్న యాదమ్మ కూడా అవ్ దొరా అంటోంది దూరం నుంచీ నాకూ నిజమే నన్పిస్తోంది కాని అంతలో మా మేనేజరు మొదటి హెచ్చరిక చెయ్య డౌనికొచ్చేసాడు ఎంతవరకూ వొచ్చిందీ? అంటూ అరే ఇంకా మొదలు పెట్టలేదేం? అవతల ప్రాపైటరుగారు తొందరగా కావాలని చెప్పి పంపిస్తే ఇంకా మొదలెట్టలేదేం? పనిచెయ్యడానికొచ్చారా అడుకోడానికొచ్చారా? చెయ్యండి చెయ్యండి అని గదమాయించాడు నా ముందు ఎంతో చనువుగా జాలిగా చెప్పుకున్న మజ్‌దూర్‌లు మేనేజర్ ముందు ఎమీ మాట్టాడలేకపోయారు వాళ్ళంతా రోజువారీ కూలీలు అంతా కలిపి వారానికోసారి ఇస్తారు వాళ్ళ కూలిడబ్బులు ఆదివారాల్లో సెలవల్లో ఎమీ ఇవ్వరనే సంగతి వేరే చెప్పనవసరం లేదు తనకి ఎమాటంటే ఎవంటాడో? పనిలోంచి గేటవతలకి గెంటేసినా గెంటేస్తాడు పైగా ఎన్నాళ్ళబట్టా వాళ్ళందరికీ ఆశ ఈ నెల్లో అయినా పర్మనెంటో చేస్తారేమోనని కాని ఇలా ఆశలతో ఇప్పటికి అయిదేళ్ళు గడిచాయి రూల్ ప్రకారం రెండువందల ముష్ఫృయ్ అయిదురోజులు మాత్రం పన్దేయించుకుని వారంరోజులు పనిలోకి రానివ్వకుండా సర్వీసు ముగిసిందంటారు మళ్ళీ మొదలు రోజు కూలీ మీద చాకిరీ నర్సింహ - పాతికేళ్ళీవాడు - కొంచెం సాహసించి కంఠం తగ్గించి అన్నాడు బడె కాల్తున్నది సార్ ఇన్ము పొద్దు మీకి చెయ్యాల్నా సార్ ఇప్పుడు వేరే ఎమన్న వుంటె చేస్తాం పనివాడితనం € అక్కినేని కుటుంబరావు త్రి
అట్లాగే అయితే ఇప్పుడు చెయ్యాల్సిందొక్కటే గేటవతలకి వెళ్ళి రేపట్నించీ పనిలోకి రావటం మానేయ్ ఎం వొళ్ళు కొవ్వెక్కిందా? కూలి కోసం వొచ్చారా రాజాల్లాగా కూచుందాం అని వొచ్చారా? ఇష్టమైతే చెయ్యండి కష్టమైతే పాండి అని కసిరాడు మేనేజర్ తప్పనిసరై పనికి సిద్ధమయ్యారు ఆ నలుగురూ యాదమ్మ వాళ్ళో వున్న పసికందుని గేటవతల కూచున్న పదేళ్ళ తన కూతురుకిచ్చి పనిలోకొచ్చింది ఈతరానివాడు సముద్రంలోకి దిగుతున్నట్టు నలుగురూ వొకరి వెనకాల వాకరు ఎండలోకి ఆ ఇనుప సామాను వైపు నడిచారు గోనె సంచుల ముక్కలూ చొక్కాలూ మెషిన్స్ తుడిచే వేస్టు కాటనూ చేతుల్లో "పెట్టుకుని ఆ ఇనవస్లేట్టని ఒక్కటాక్కటిగా లారీ లోకి చేర్చుతున్నారు లారీలో ఆ యం యస్ ప్లేట్లు పడ్డ చప్పుడు ఎండని మరింత మండిస్తోంది ఆ ప్లేట్లు పట్టుకున్న వీళ్ళ చేతులకి బొబ్బలు బుసబుస పొంగుతున్నాయి. ధారగా చెమటలు వాళ్ళంతా ఎండ వేడికి వుడికిపోతోంది చర్మం వూడుతోంది కణకణ మండుతున్నాయి ప్లేట్లు ఈ మంట భరించ లేకపోతే కడుపుమంట అసలు భరించలేరు ఇటువంటి భద్రతలేని పని పరిస్థితుల్లో ఇలాంటి పనులు చెయ్యం చెయ్యలేం అని అనగానే ఉద్యోగాలు పోనవసరం లేదు ఫ్యాక్టరీకి యూనియన్ వుంది కాని ఆ యూనియన్ నాయకత్వం ఫ్యాక్టరీ గేటు బయట సమ్మె అంటుంది పదిహేను రోజులు సమ్మె జరిగాక రాజీ అంటుంది రాజీల్లో 5 రోజుల జీతం నష్టం తేల్తుంది పని చెయ్యనన్న వాడి పేర అతన్ని ఉద్యోగంలోంచి తీసేసినట్టు టెర్మినేషన్ ఆర్థరొస్తుంది కార్మిక న్యాయస్థానానికి వెళ్తే ఒకటి రెండు సంవత్సరాల్లో విషయం తేల్తుంది గాని అప్పటికతగాడి జీవితం ముగుస్తుంది ఫ్యాక్టరీకయితే లేబర్ ఆఫీసరో ఉంటాడు వర్కర్ల కెవరుంటారు? చట్టాలన్నీ కాగితాల మీద కార్మికులకున్నట్టే కనిపిస్తాయి న్యాయం మాత్రం కంపెనీవాళ్ళకే అనుకూలం అందుకే ఈ మైసయ్యలూ నర్సిమ్మలూ తమ గానుగల్ని తాము భుజాన వేసుకుంటున్నారు ఇప్పుడా ఇనపస్లేట్లని పుళ్ళ మీద వేసుకుంటున్నట్ట నర్సింహా రాములూ కుర్రాళ్ళే గదా - అని ఎలాగోలా సరిపెట్టుకున్నా ఆ మైసయ్య 9? అరవైఎళ్ళ అస్తిపంజరం ? ళ్థు మైసయ్యా ఇంత వయసులో ఈ బరువుపని ఎందుకు చేస్తావయ్యా? వేరే ఎదన్నా కొంచెం తేలిక పని చేసుకు బతకరాదా? అని అడిగినప్పుడు - ఎం జేత్తు దొరా? అసల్ పని దొరుకుడే కష్టమంటే ఇగ అల్క గుండె వనులేడి కెల్గొస్తయ్? దస్తర్ల గిట్ట దార్కుతే అల్క గుంటది నాకేడ దొర్కుతది ఆ కొల్వు అయిదేండ్ల నుండి గీలోడింగ్ పని చేస్కుంట బతుకు తున్ననా ఇంకిదే పర్మనెంట్‌గాలే ఇగ వేరె కాల్వు ఎడికెల్లి తెద్దు? అనేవాడు నక్తముడుం తం
లోడింగ్‌లోకి రాకముందు ఎం పని చేసేవాడివి? రిక్షా నడిపిస్తుంటి దీనికంటే అదే సుఖం గదా ఎం సుకం దొరా? గదీ గిబ్నే వుంటది ఎల్‌కానకెల్లి లష్‌కర్‌క. మాల్ దీస్కపోవల్పంటే ఎంత కష్టం దొరా? అంత కష్టంతోడి చడావులు దాట్‌కుంట తీస్కపోయినాగాని అయిదార్ రూపాల్ కంటే ఎక్కువిచ్చెటోల్లు గాదు పైనుంచి తీస్కపోయే తందుకూ మూడుగంటటై తది రిక్షల పెబ్టెతందుకూ అదో అద్దగంట - ఈడో అద్ధగంట అదైనంక గాదొర్కిన పైసలతోటి రిక్ల కిరాయి గట్టాలె నూకలు దెచ్చుకోవాలె నడుమ పోలీసోన్కి ఎమన్న యియ్యాలె లేకుంటే రాంగొస్రైడ్ వొచ్చినవంటడు గంత మాల్ యేపిచ్చి నవ్ అంటడు అతనికి నేనేం చెయ్యగల్ను హృదయంలోంచి సానుభూతి తప్ప కాని ఒక్కోసారి అదీలేదు నా ఉద్యోగధర్మం ప్రకారం అతన్ని లోడింగ్ తొందరగా చెయ్యడం లేదేమని కేకలెయ్యాలి అలా వేసేవాల్లి కూడా పని చేస్తూ చేస్తూ మంచినీళ్ళడిగితే ఇంతసేపు అక్కడ ఎం చేస్తున్నావ్ అని గట్టిగా అడిగేవాణ్ణి అది నా వుద్యోగంలో ఓ భాగమే ఓరోజు అతను డ్యూటీ అయిపోయాక సాయంత్రం అయిదింటికి నా దగ్గరకొచ్చి చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు ఎం మైసయ్యా ఎమిటి కబుర్లు అన్నాను ఎమున్నయ్ దొరా ఎం లేవు అని కొంచెం ఆగి దొరా మా పోరగాస్కి ఎదన్న కొలువిప్పియ్యరాదు దొరా పెద్ద దొరతోటి చెప్పి అన్నాడు నేనే రికమెండేషన్ మీద ఆ గుమాస్తా ఉద్యోగానికి వచ్చాను ఆ కంపెనీలో సూపర్ వైజర్‌గా వున్న మా మేనత్త కొడుకు నన్ను రికమెండ్ చేయించి ఈ ఉద్యోగం ఇప్పించాడు నువ్వే మేనేజర్‌గార్ని అడగరాదూ? ఎవన్నా చూస్తాడేమో? లేదు దొరా మేనేజర్ సాబ్ నీకీ యింటడు దొరా మాకినడు మేం అమాలోల్డం గదా నువ్వు జర చెప్పరాదు దొరా? ఇంతకీ ఎం ఉద్యోగం? ఎమన్నాగాని ఆఖస్‌బాయ్ గనన్నా ఎల్‌పరోగ నన్నా లోడింగ్‌లో నన్నా బుక్కెడన్నం బెట్టే ఎ కొల్వన్నా యిప్పియ్ దొరా చానా తక్‌లీపయితున్నది దొరా నీకు ఇంకో కొడుకున్నాడనుకొంటా గదా? అతనేదో పనిచేస్తూన్నాడన్నాన్? వుప్పర్ పని జేస్తుండె దారా గాడ మవులాలిల కార్థాన కడుతున్రుగద గండ్ల వుప్పరు పని చేసెటప్పుడు గోడలు కూలి మద బడి చనిపోయిండు. వాని పెంద్గం బిడ్డల్ని గూడ నేనే సాకాలె కోడలికెప్పుడూ రోగమే గింత బువ్వొండి పెడతది గంతె
- మొత్తం మీద సాహసించి మా మేనేజర్‌ని అడిగి మైసయ్య కొడుక్కి రాములుకి లోడింగ్ పని ఇప్పించా అతనికాపని డెయిలీవేజెస్ మీదే ఇచ్చినా కలెక్టరుద్యోగం ఇచ్చినంత గొప్పగా ఫోజు పెట్టాడు మా మేనేజర్ ళు పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 50
కొంతసేపటికి 'జెరసేపు కూకుంటం దొరా శేతులు కాల్తున్నయ్ దారా నెత్తి గూడ నొస్తున్నది అని మైసయ్య యాదమ్మా కూలబడ్డారు దూపయితున్నది సార్ జరనీల్లు తాగొస్తం సారో అని రాములూ నర్సింహా మంచినీళ్ళ పంపు దగ్గరకెళ్ళారు ఇంతలో లోపల్నించీ నాకు పిలుపు ఎంతవరకూ వొచ్చిందయ్యా మీ లోడింగూ అవతల టైమ్ అయిపోతోంది ఇంక దాంతోనే కూర్చుంటారా ఇవ్వాళంతా ఎయిర్‌కూల్డ్ గదిలో సోఫా కమ్ బెడ్ మీద యూఫోమ్ కుషన్ మీద జారగిలపడి కూచుని పైప్ తీసిన నోట్లోంచీ వస్తున్న పొగతో కలిపి అంటున్నాడు మా ప్రాప్రయిటర్ అవుతోందండీ చేస్తున్నారు ఎండలో కాలికాలి వుంటం మూలాన ఆ ఇనపపసేట్లు లోడ్ చెయ్యడం కష్టమవుతోంది కొంచెం అహా కష్టమవుతోందా? అని వెటకారం చేసి అసలేవన్నా అయ్యిందా నడువ్ నడువ్ అని ఎలుగుబంటిలా వురుకుతూ చల్లటి గదిలోంచీ వడివడిగా నడిచి వేడిలార్ దగ్గరకొచ్చాడు తీరా మేం లోడింగ్ జరుగుతున్న స్థలానికి రాగానే మైసయ్య అరవైఎళ్ళ అస్తిపంజరం నేల మీద వడున్నాడు అతని కొడుకు రాములు నాయినే నాయినే అని ఎడుస్తున్నాడు యాదమ్మ కంగారుగా మైసయ్య వంక చూస్తొంది నర్సింహా నీళ్ళు తెచ్చి మొహాన కొడుతున్నాడు ఫ్యాక్టరీలో ఇతరచోట్ల పనిచేసే మిగతా వర్కర్లు ఇది తెలిసి మైసయ్యవైవు రావడం మొదలు పెట్టారు మా ప్రాఫైటర్ ధామ్ ధూమ్‌లాడుతూ అందర్నీ కసురుకుంటూ ఇష్టం వొచ్చినట్టు కేకలేస్తూ పనుల్లోకి వెళతారా తన్ని తగలెయ్యమంటారా? అని రాముల్నీ నర్సింహనీ తలలు పట్టుకుని వూపి వాళ్ళేమీ పట్టించుకోకపోయేసరికి 'రేపట్పుంచీ ఈ మైసయ్యని పనిలోకి రానివ్వకండి ఈ ముసలీ ముతక జనానికి కూలిడబ్బులు పాయ్యడమే గాని పనీ చెయ్యరు పాడు చెయ్యరు అని మా మేనేజర్‌కి ఆర్డర్ పాస్ చేశాడు మైనయ్యవైపు రాబోతున్న వర్కర్లని కసురుతూ కేకలేస్తూ అరుస్తూ అరుస్తూ మా ప్రొాప్రయిటర్ గుండెల మీద చెయ్యి పెట్టుకుని డైవర్ డ్రైవర్ అని పిలిచాడు అప్పుడు గుర్తొచ్చింది నాకు మా ్రాప్రయిటర్‌కున్న గుండెజబ్బు సంగతి పైగా చాలా ఎక్సైటై పెద్దగా అరుస్తూ మండుటెండలో గబగబా నడిచేటప్పటికి నొప్పి వచ్చిందను కుంటా వెంటనే మా ప్రాప్రయిటర్‌ని తీసుకుని మా మేనేజర్ గాంధీ వాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు ఇక్కడ మైసయ్య మాత్రం కళ్ళు తెరవనేలేదు వడదెబ్బకి తట్టుకోలేక ఆ ఆరవైఎళ్ళ అస్తిపంజరం మని స్పృహ తప్పి పడిపోయాడు అతన్ని యెవర్తూ ఎ.ఆసుపత్రికీ తీసుకెళ్ళే
- కీర్తిశేషుడు జ్తందరర రా య్యా లా పాం క్ 1 "శ్ ఇల ఉం ఠఈ18([2) ల్ షో మాం లో
ప్రయత్నం చెయ్యలేదు కొంతమంది వర్కర్లే చొరవ తీసుకుని అరమైలు దూరానున్న ఆటో స్టాండ్ వరకూ మైసయ్య ని ఎత్తుకు తీసి౩ళ్ళినా లాభం లేకపోయింది హాస్పిటల్‌కి చేర కుండానే అంతా ఆయిపోయింది లై మా ప్రాప్రయిటర్‌ని స్పెషల్ వార్డులో చేర్పించి అటెండెర్‌గా వుండేందుకు నాకు కబురంపాడు మా మేనేజర్ వారంరోజులపాటు నేను ఆసుపత్రిలోనే మా ప్రాప్రయిటర్‌కి "సేవలు చేస్తూ వుండాలని నాకు మా మేనేజరిచ్చిన తాఖీదు నాతోపాటు రాజా సుబ్రమణ్యేశ్వ రావుకి సేవలు చేసేందుకు అతని రెండో భార్య సామ్రాజ్యం కూడా వుంది ఆమె చాలా నెమ్మదన్తురాలుగా శన్సించింది మొహంలో దిగులో భయమో ఆమెని ఆవరించి వుండేది ఇంతకీ ఆ ఫీలింగు ఆమెకి ఈ రాజాగారి సమక్షంలోనేనా వేరే సమయాల్లో కూడానా అనేది నేను తేల్చుకోలేకపోయా మా ప్రాప్రయిటర్ కంటే ఆమె ఇరవై ఎళ్ళు చిన్న అతనికి యాఖై పైనే వుంటాయి ఈమె అతని ముందు గజగజ వణికిపోతూ వుండేది మందిచ్చేప్పుడైనా కాఫీ అవీ ఇచ్చేప్పుడైనా ఎవ్చుడూ ఆమె చెయ్యి వణకకుండా వుండేదికాదు నాకు త్వరలోనే అర్థమైపోయింది మా 'ప్రాప్రయిటర్ అంత అసహనం వున్నవాడు ఈ దేశంలో వుండడు రాజస్థాన్ భూస్వాముల్లో కూడా ఇంత కర్కశంగా వుండేవాళ్ళని చూడం విపరీతంగా అరుస్తో వుంటాడు ప్రతి చిన్న విషయానికీ అవతలి నునిషి చాలా ఘోరం చేసినట్లు తిడతాడు ముఖ్యంగా అ రెండో భార్య సామ్రాజ్యాన్ని ఆసుపత్రిలో చేర్చిన ఆ మొదటి రాత్రి బాగానే వున్నాడు మా ప్రాప్రయిటర్ ఆ రాత్రి అతను ఎదో మాట్లాడుతున్నాడు నిద్రలో అతని మంచం సక్కనే సామ్రాజ్యం కదలకుండా కూర్చొనుంది ఆమె కూడా నిద్రబోతోందేమో అఆ ముసలాయనకి ఎమన్నా అవుసరమో ఎమో అని నేను ఆతని బెడ్ వున్న రూము బయటినించీ లోనికెళ్ళా ఒరేయ్ ఎక్కడ చచ్చార్రా ఆ సొంబంగాడి పాలం నెర్రలేసిపోయిందంట వీరేశం గాడి పాలానికి నీళ్లు లేక పది పుట్టివాల్సింది పచ్చగడ్డి క్కుడా పనికి రాకుండా అయిపోతాం దంట ఇంక వీళ్ళకి ఎప్పుడు అ పంటలన్నీ పండేను ఎప్పుడు వాళ్ళ బతుకులు బాగువడేను అంటున్నాడనుకున్నాను మన బాకీల కింద ఎప్పుడు పంటని మనం తెచ్చుకునేమూ అని పూర్తి చేశాడు ఎమండీ ఆయనలా కలవరిస్తున్నాడేం? డాక్టర్‌ని పిలవమంటారా? అనడిగాను సామ్రాజ్యాన్ని లేదండీ అవసరం లేదు ఈయనగారికి ఊళ్ళో బాకీలివ్వాల్సిన వాళ్ళు చాలామందు న్నారు వాళ్ళా బాకీలు తీర్చక చాల్నాళ్ళయ్యింది తరచుగా నిద్రలో అట్లా బాకీల గురించి కలవరిస్తూ వుంటారు మామూలే అంది పనివాడితనం + అక్కినేని కుటుంబరావు క్‌లై
రాజా సుబ్రమణ్యేశ్వత్రావుకి అతని వూళ్ళో రెండువందల ఎకరాలుండేవి అయిదేళ్ళ క్రితం వంద ఎకరాలు అమ్మేసి నేను పన్దేసే ఫ్యాక్టరీ పెట్టాడు ఇంక వేరీ ఫ్యాక్టరీల్లో భాగాలు కూడా వున్నాయి ఆ వూళ్ళో వీళ్ళది జమీందారీ కుటుంబం మిగతా వంద ఎకరాలూ ఒక్కోటీ కనీసం పదిహేనువేలు చేస్తుంది పైగా ట్రాక్టర్లు అవీ చాలా వున్నాయి వాటిని కిరాయి కి తిప్పుతూ వుంటాడు కూడాను
ఇతను అస్పత్రిలో చేరటానికి నిన్న లోడింగ్ వాళ్ళ మీద అంత మండుటెండలో కేకలెయ్యటం వల్లా ఎక్సైట్ అవ్వటం వల్ల మాత్రమే కాదట తన వూరు విండా పక్క వూళ్ళ వాళ్ళకీ అప్పులిచ్చాట్ట అప్పులిచ్చి చాల్నాళ్ళయినా వడ్డీలు పెరుగుతున్నా ఎవరూ ఇంతవరకూ పైసా ఇవ్వలేదట చాలామందికి నాగు కిందా కొంతమందికి వడ్డీ కిందా ఇచ్చాట్ట మొత్తానికి కొన్ని లక్షల పైకి తేల్చి కింద తొక్కేద్దాం అనుకున్నాడు పంట మాట సరే తాగటానికి కూడా నీళ్లు లేక జనం అల్లల్లాడుతున్నారు అల్లల్దాడితే ఫర్వాలా బతికితే బట్ట కట్టినా కట్టకపోయినా ఒచ్చే సంవత్సరం చూసుకునేవాడు ఈయన నాగుకీ వడ్జ్డీకీ అసలుకీ అన్నింటికీ ముప్పు తెచ్చేట్టు ఆరుగురు ఈ లోకం నించీ ఈయనకి అందకుండా పరారయ్యారు బతికి వున్నవాళ్ళని పట్టుకోడానికి వాళ్ళు దున్నే భూములున్నాయి కోర్డులున్నాయి జైల్భున్నాయి పోలీసులున్నారు
కనక పరారి అయినవాళ్ళని పట్టుకోడానికా అన్నట్టు ఈయనకి గుండెపోటు వచ్చి అర్జెంటుగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు
మొదటిరాత్రి కొంచెం మెరుగ్గానే వుంది రెండోరోజు పోటు కొంచెం ఎక్కువగా ఒచ్చింది ఈయనకి యాబఖైవేలు ఇవ్వాల్సిన రోశయ్యని రాత్రి పేర్లు తలియనివాళ్ళాచ్చి చంపి అతను దాచుకున్న ధాన్యం మూడుఎపాల నీళ్ళూ మోసుకుపోయారట అదీ కారణం
రోశయ్యా రోశయ్యా నువ్వు కూడౌ నన్నింత అన్యాయం చేస్తావా? అ కూలీవెధవలూ సన్నకారు రైతులు తీర్చరంటే నమ్మగల్సు నువ్వింత అన్యాయం చేస్తావా రోశయ్యా అని ఒకటే ఎడుపు
సామ్రాజ్యం నన్ను పిలిచి ఆయన వూరెళ్ళి ఆయనకి సంబంధించిన వాళ్ళందర్నీ తీసుకురమ్మనీ తనకు భయమేస్తోందనీ అంది వాళ్ళ వూరెళ్ళి ముఖ్యులందర్నీ పిలుచుకొచ్చా తీరా వచ్చి చూద్దుగదా గొప్ప నిరాశ ఎదురైంది లేచి చక్కగా మంచం మధ్యలో కూచుని సామ్రాజ్యాన్ని పచ్చి బూతులు తిడుతున్నాడు డాక్టరొచ్చినప్పుడు ఆమె పక్కకి తప్పుకోలేదనీ పైగా ఎలాగుందండీ డొక్టరుగారూ అని అడిగిందనీ అతనికా కోపం అట
వచ్చినవాళ్ళని చూడగానే ఎరా కిట్టిగా వూళ్ళో ఎమన్నా ఒచ్చేట్టన్నాయా? మాట్తాడవేంరా భూషిగా? అ నారిగాడేమంటున్నాడు? వాడీ పెళ్ళాన్నమ్మయినా నా నాలు గొందలూ కళ్కిస్తా ఎదీ ఇది నయంగానీ అమ్మో నొప్పి డాక్టర్ని ఇటు పిలవండి ఎందుకు ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతాడీ డాక్టరు? ప్రజలకి బోల్డు జబ్బులున్నాయి వాళ్ళకి తగ్గేట్టు చూడమని ప్రజలంతా ప్రభుత్వం డబ్బులిప్పిస్తోంటే ఇక్కడికొచ్చి ఈ స్టూలు
న్రైరీర్తిశేముడు 4 53
మీద కూర్చుని నన్ను కనిపెట్టుకు నుండక ఎందుకా డాక్టరుకా తిరుగుడు? ఎప్పుడు చూసినా ఆ జండ్రల్‌వార్డులో రేపో మాపో చచ్చే ఆ అలగా జనాన్ని చూడ్డానికా వాణ్ణి పెట్టింది ఈ రకంగా వాగుతూ వాగుతూ మగతలోకిషోయి కాసేపాగి మళ్ళీ లేచాడు అప్పుడు దాదాపు అర్థరాత్రి ఒంటిగంటయ్యింది ఒచ్చిన వాళ్ళంతా సెకండ్‌షో సినిమాకెళ్ళారు ఎవ్వరూ లేరు నేనూ సామ్రాజ్యం తప్ప ఎవన్నా అవసరమేమో అని లోనకెళ్ళాను సామ్రాజ్యాన్ని మంచి సీళ్ళడిగాడు ఆమె ఇచ్చాక తాగేసి ఆ గ్లాసుని నేలకేసి కొట్టి దాన్ని అందుకోబోతున్న ఆమె చెయ్యిని ఒక్క లాగు లాగి ఒంచి నాలుగ్గుద్దులు గుద్ది ఆయాసంతో మంచం మీద పడి అప్పుడు చచ్చిపోయాడు
తర్వాత తెల్సింది సామ్రాజ్యాన్ని రోజుకు అయిదారుసార్లన్నా కొట్టకపోజే అతనికి ఆరోజు ఎదో పిచ్చెక్కినట్టుగా వుండేదట అలవాటు అలవాటైపోయింది ఆమెని కొట్టటం వయసులో వున్న భార్యకి భయం భక్తి వుండాలనేవాడట
అతన్ని చూడ్చానికొచ్చిన వాళ్ళంతా అతని శవం చుట్టూ నిలబడ్డారు ఒక్కరు ఒక్కరైనా మర్యాదకైనా యేడవలా కట్టెల గురించీ టాక్సీల గురించీ పెరుగుతున్న ధరల గురించీ నాగేశ్వర్రావూ రామారావుల్ని డౌన్ చెయ్యడానికి కృష్ణా శోభన్‌బాబులు చూస్తున్నారనీ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎవరో బాగా పాడలేకపోయారనీ ఇలా చాలా మామూలుగా ఎమీ జరగనట్టూ ఎవరూ చచ్చిపోనట్టూ మాట్లాడుకుంటున్నారు. శవాన్ని తీసుకెళ్ళడానికి ఎవో ఫార్మాలిటీస్ చూస్తున్నాం మా మేనేజరూ నేనూ
అతని మొదటి భార్యట వచ్చింది మరీ పాతకాలపు మనిషి మొగుడుపోతే శోకాలు పెట్టాలి అనేది ఆమె చిన్నతనంలోనే నేర్చుకుంది పెళ్ళి గాకముందు గొబ్బెమ్మ సంగతి అయ్యాక వర్షక్ష్మీ వ్రతం సంగతీ చేటలు చెల్లించుకునే సంగతీ మొగుడు చచ్చాక శోకాల సంగతి రెండు అయిపోయాయి. ఇప్పుడు మూడో అవకాశం ఆమె కాస్సేపు శ్రమపడి తర్వాత మహా సహజంగా లేచి ముందే సిద్ధపర్చుకున్న సంచి లోంచి ఎనిమిది ఇడ్జీలు తీసుకుని ఓ పాట్టంలోంచి కారప్పాడి తీసుకుని నిదానంగానే అయినా మహా శుభ్రంగా తృప్తిగా భోజనం ముగించి భయంకర నాదాలతో త్రేన్చునూ వెళ్ళిపోయింది వరండాలోకి
మర్చాడు పేపర్ల నిండా ఈయన యువకుడిగా వున్నప్పటి ఫోటో తర్వాత వివిధ రంగాల్లో ఆయన చేసిన బహుముఖ సేవలు ఒకటి రెండు పత్రికలు ఈయన చావు మీద ప్రత్యేక అనుబంధాలు వేశాయి కూడాను రెండో కేజీ నిండా వివిధ శాఖలకి చెందిన మంత్రుల సానుభూతి ప్రకటనలు
శ్రీ గారు గొప్ప దేశాభిమాని ఆయనగారు స్వర్గస్తులయ్యారని తెలిసి నేను షాక్ తిన్నాను స్వర్గనస్తులయ్యారనట
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు వ్‌తే
కీర్తిశేషులు శ్రీ గారు మన రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఎనలేని సేవ చేసారు కార్మిక సంఘాలకీ యజమానులకీ మధ్య లంచాల సదవగాహన పెంపొందించడానికి ఆయన చేసిన కృష శ్రీ గారు దేశానికి చేసిన సేవని చెప్పడానికి వెయ్యినాల్కలు కలిగిన చూసొచ్చా డీయన నాగేంద్రునిక్కూడా కాదు ముఖ్యంగా నాకాయన శ్రీవారు పోవడం తల్చుకుంటే నిజంగా దేశం గుర్తించాల్సిన వ్యక్తి ఇంత తక్కువ వ్యవధితో ఆయన పోతారని (తీసుకు తీసుకు చావలేదని నాల్గోపేజీలో ఫొటోలు కంచు విగ్రహం చేయించాలని కొందరి తీర్మానాలు అంతేగాని అయిదేళ్ళ నుంచి లోడింగ్‌వాళ్ళనీ ఇతర వర్కర్లనీ కాల్చుకు తింటున్నా డనీ అతను వడ్డీల పేరుతో నాగుల పేరుతో తన వూరు జనాన్ని పీడించాడనీ వాళ్ళ నుంచి తిరిగి సొమ్ము రాదనే దిగులుతో చచ్చిపోయాడనీ చచ్చే ముందు సామ్రాజ్యాన్ని చచ్చే గుద్దులు గుద్ది తనతో తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశాడనీ మొదటి భార్య వచ్చి యధావిధిగా ఎడ్చిన వైనం లెక్కలు తేలక ముసలాజణ్జి తిట్టిన కొడుకుల ప్రతాపం చచ్చిపోయాడని తెలీగానే పీడ విరగడైందని జనం సంతోషించడం ఇవేవీ వీటిల్లో వేటినీ ఎ పత్రికా ఎక్కడా ఒక్క ముక్క కూడా రాయలేదు స్వాతి మానవత్రిక ఎన్రీల్ 977
- కీర్తిశేషుడు + క్‌ర్
మనిషొచ్చాడు తెల్గగన్నెలో పండు మిరపకాయ పచ్చడన్నం పెట్టుకుని పాతబట్టలో మూట కట్టుకుని గుడిసెలోంచి బైటకొచ్చింది లక్ష్మి అంతవరకూ ఎమీ ఎగరని మేకల్దా వ్పన్న మేకలు లక్ష్మిని చూడగానే మేము అని అరుస్తూ కట్టిన తాళ్ళని గుంజుకోడం మొదలెట్టాయి లక్ష్మి అన్నం మూట పక్కనపెట్టి వరసగా ఆరు మేకల్ని విప్పింది తాళ్ళు విప్పదియ్యగానే మేకలన్నీ వీధినపడ్డాయి లక్ష్మి కూడా అన్నం మూటా ఆకులు కోసే కొంకి కర్రా పుచ్చుకుని మేకల వెనకే బయల్దేరింది మేకల్ని తవ్వుకుంటూ ముత్యాలూ నర్సీ ఎదురొచ్చారు లక్ష్మికి వాళ్ళిద్దరూ బళ్ళో కెళ్తున్నారు వాళ్ళ చేతుల్లో చిరిగిన సంచుల్లో చిరిగిన పుస్తకాలు యావే లచ్చీ? సాయింతరం తొందరగా వత్తావేవే ? ఎన్నెల నీడాడుకుందాం అంది ముత్యాలు ఆం వత్తానే అని లక్ష్మి గబగబా నడిచింది ముందు వెళ్ళిపాతున్న మేకల్సి కలవ డానికి లక్ష్మీ ముత్యాలూ నర్సీ అంతా ఒక శఈడుపిల్లలే అంతా తొమ్మిదేళ్ళ వాళ్ళు లక్ష్మి కూడా బళ్ళో౭ళ్ళి వాఠటో క్థాసు చదివింది లక్ష్మి తండ్రి వీరడు అంతలో ఈ మేకల్ని కొన్నాడు చదువు కూడెడతందంటే? మేకల్ని మేవు అన్నాడు లక్ష్మిని లక్ష్మీకి కూడా చదువు కూడెట్టదనే నమ్మకం కుదిరినట్టుంది మెదలకుండా మేకల్ని మేపడం మొదలెట్టింది ఊరు దాటగానే అన్నీ కొండలూ తుప్పలూ చెట్లూ చేమాతో ఆ ప్రదేశమంతా పచ్చగా అడవిలా వుంటుంది పనివాడితనం + అక్కినేని కుటుంబరావు వ్
మేకలు ఆకలితో వున్నాయేమో మే మే అని కూడా అరవకుండా గబగబా అందిన ఆకునల్లా తినేస్తూ అటూ ఇటూ పోతున్నాయి
అన్నిటినీ ఒక దగ్గరే వుండేట్లు చూసుకుంటూ ఎత్తునున్న చెట్టుకొమ్మల్ని కొంకి కర్రతో కోస్తూ మేకలకి అందిస్తూ లక్ష్మి తన పని తను చేసుకుంటూ పోతోంది
ఆ మేకల్లో ఒకటి ఎల్లమేక దానికి లేతలేత కొమ్మల్ని అందిస్తోంది లక్ష్మి - ప్రత్యేకంగా
లక్ష్మికి లాగే ఆ పిల్లమేకకి కూడా పుట్టగానే తల్లి చచ్చిపోయింది జబ్బుచేసి
తల్లి లేని ఆ ఎల్లమేక అంటే తల్లిలేని ఈ పిల్లకి ఎంతో అభిమానం ఆ పిల్ల మేకకీ అంతే ఎప్పుడూ లక్ష్మి చట్టు తిరుగుతూంటుంది అది
అదే కొండ మీద దూరంగా వున్న పల్లె నుంచి మేకల్నీ గొరైల్నీ తోలుకొని ఈ కొండకే వస్తారు
వాళ్ళల్లో ఒక పాటగాడు కూడా వున్నాడు వాడి పేరు రాములు వాడికొచ్చిన పాటలన్నీ బూతుపాటలే అన్నీ సినిమా పాటలే వాడికి ఇరవై ఎళ్ళుంటాయి. అయినా వాడి శ్రోతలంతా పదేళ్ళలోపు వాళ్ళే. అడగనివాడిది పాపం అందరికీ వినిపిస్తూంటాడు ఆడపిల్ల కనిపిస్తే చాలు వాడు సినిమా గీతాలు ఆలాపిస్తాడు
ఈ కొండకవతల చిట్టడవి దాన్లో నెమళ్ళూ కుందేళ్ళూ లాంటివేగాక నక్కలూ తోడేళ్ళూ కూడా వున్నాయి పాముల సంగతి వేరే చెప్పనక్కరలేదు
లక్ష్మికి పాములకంటే కూడా తోడేళ్ళ గురించి చాలా భయంగా వుంటుంది ఎప్పుడొచ్చి మేకల మీద పడతాయో అని
గొటైల్ని కాసే మగపిల్లలు కొందరు అప్పుడప్పుడూ వాళ్ళ మందలన్నింటినీ కలిపి ఇద్దరు ముగ్గురికి ఒప్పజెప్పి చిట్టడవికి పోయి కుందేళ్ళను వేటాడి తెచ్చుకుని మాంసం పంచుకుంటుంటారు
మందలన్నింటినీ కలిపి మేపడం వల్ల మందంతా ఒక్కటిగా జేరి మేత మానేసి మే మే అంటూ 'వేటగాళ్ళొస్తున్నారు జాగ్రత్తోచ్' అని కుందేళ్ళకి సంకేతాలిస్తున్నాయా- అన్నంత అల్లరి చేస్తూ వుంటాయి
విశాలంగా వున్న ప్రదేశాల్లో ఎత్తుపల్లాల్తో ఆ కొండ ఒక్కోసారి మంచి సందడిగానూ ఒక్కోసారి నిర్ణనారణ్యంగానూ వుంటుంది
పొద్దు నెత్తిమీదికెక్కింది
మేకలు తిండి ఆపి చెట్లనీడలో విశ్రాంతి తీసుకుంటున్నాయి
లక్ష్మి అన్నం మూట తీసుకుని ఓ చెట్ట నీడలో కూచుంది
ఎండ విపరీతంగా వుంది ఎండలోకి చూస్తే కళ్ళు మసకలు కమ్ముతున్నాయి ఎక్కడా ఒక్క పిట్ట కూడా అరవడంలేదు మేకలూ అంతే ఎక్కడా చడీ చప్పుడూ లేదు
నిశ్శబ్దం కొండల్నేల్తోంది
- మనిషాచ్చాడు * క్/
అన్నం తింటూ వుండగానే లక్ష్మికి నిదర ముంచుకొచ్చేస్తోంది సగం నిద్రోతూ సగం తింటూ వుంది లక్ష్మి
వున్నట్టుండి నాలుగు చెట్లవతల ఓ చెట్టు మీద నుంచి పక్తులరిచాయి
ఉలిక్కిపడింది లక్ష్మి
ఉలిక్కిపడ్డాయి లక్ష్మి మేకలు
ఓ పాదచాటు నుంచి వురికి పడిందో తోడేలు
పిల్ల మేకని పట్టుకుని చూస్తుండగానే మాయమైపోయింది
మేకలు గోలగోలగా అరుస్తూ అటూ ఇటూ పరుగులు తీశాయి
లక్ష్మి నోట్లో పెట్టుకున్న ముద్దని వూసేసి ఓరయ్యో తోడేల్రోయ్ తోడేలోయ్ నారిగో మల్లిగో తోడేలోయ్ రండిరో రండిరో అంటూ కేకలేస్తూ కర్ర పుచ్చుకుని తోడేలు వెళ్ళినవేపుకి పరుగుతీసి మళ్ళీ వెనక్కి తిరిగి కేకలేస్తొంది
పక్ష్తులరుపులూ మేకలరుపులూ లక్ష్మి అరపులూ విని ఎంటేంటేంటి అని పరిగెత్తు కొచ్చారు ఇద్దరు అన్నారం వాళ్ళు రాములూ ఎంకటేసి
లక్ష్మి ఎడుస్తు తోడేలొచ్చింది తోడేలాొచ్చింది మా మేకపిల్ల నెత్తుకుపోయింది అని పెద్ద కంరంతో ఎడవడం మొదలెట్టింది
తోడేలొచ్చిందా? అని కంగారూ తన గొర్రైలేమైనాయోనని పరిగెత్తాడు ఎంకటేసి
రాములు ఎడుస్తున్న లక్ష్మిని చూశాడు
లక్ష్మి కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూస్తూ పద అని ఎటెల్లిందీ? అనడిగాడు
తోడేలు పోయిన దిక్కు చూపిస్తూ లక్ష్మి పరుగుదీసింది లక్ష్మి వెనకే పరుగు తీశాడు రాములు
కొంతదూరం వరకూ మేక రక్తం బొట్టుబొట్టుగా కనబడి తర్వాత జాడ లేకుండా పోయింది
అప్పటికి వాళ్ళిద్దరూ చాలా దూరం పరిగెత్తారు
లక్ష్మి అలిసిపోయింది ఎడ్చి ఎడ్చి మొహమంతా వుబ్బిపోయింది
చిన్నమేక మీద తల్లిలేని పిల్ల మేక మీద పెంచుకున్న అభిమానమంతా పాంగుకొచ్చి లక్ష్మికి యెక్కడలేని దుఖ్బమంతా వచ్చింది
పరిగెత్తి పరిగెత్తి ఆ పిల్లకి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి
రాములికి మేక పోయిందన్న దిగులు లేదు బలమైనవాడూ ఇరవైయేళ్ళవాడూ కావడం మూలాన కాళ్ళకి అలుపూ లేదు పైగా వాడు నిజంగా తోడేలు కోసమూ రాలేదు
ఒక ఆడపిల్ల అలా ఒంటరిగా దొరకడం చాలా సంతోషంగా వుంది వాడికి
తోడేలు మేకల్ని తింటుంది ఎత్తుకుపోయో చాటుగా మాటువేసో రకరకాలుగా తోడేలు ఆహారం సంపాయించుకుంటుంది
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 5్‌రి
కాని ఈ వొచ్చిన మని రాములు నిజంగా మనిష కాదు మనిష ఆకారంలో వున్న మృగం నిజానికీ మృగమూ కాదు ఎ మృగమూ ప్రకృతి ధర్మాన్ని వదిలి అసహజంగా ప్రవత్తించదు కాని ఈ మనిష మాత్రం మృగం నుంచీ పరిణామం చెందిన మనిషిలా కాకుండా మృగం కన్నా హీనంగా వున్నాడు అందుకే వాడికి లక్ష్మి పిల్ల మేక కోసం అలమటించే పిల్లలాగానీ తన మేక నెత్తుకు పోయిన తోడేలు మీద కోపంతో ద్వేషంతో వుడికిపోయే పిల్లలాగానీ కనబడలేదు మేక పిల్ల పోయిన ఆ దుజ్జంలో లక్ష్మికి ఎమీ తోచలేదు ఆమె కళ్ళు తెరిచి అలా చూస్తోందేగానీ ఆమె దృష్టి నిండా మేకపిల్లే నిండిపోయింది ఆమెకి ఎదుట వున్న రాములు గానీ చుట్టూ వున్న పొదలుగానీ ఎమీ కనబడ్డంలేదు రాములు నెమ్మది నెమ్మదిగా లక్ష్మివైపు అడుగులు వేస్తున్నాడు అకస్మాత్తుగా రాములు చూపులు తోడేలు చూపుల్లా వుండడం గమనించింది లక్ష్మి తోడేలొచ్చిందన్న అదురు ఇంకా తగ్గనే లేదు తోడేలుకన్నా భయంకరంగా కనిపించాడా మని అంతలో రాములు అచ్చు మేక మీదికి వురికే తోడేలులానే అ పిల్ల మీదకి తొమ్మిదేళ్ళ లక్ష్మి మీదకి వురికాడు ఎక్కడో దూరాన మంద దగ్గరున్న ఎంకటేసుకి కొండల్లోంచి చిన్నపిల్ల కేకలూ ఎడుపూ వినిపించాయి ఎడువు వచ్చినవైపు వెతుక్కుంటూ పరిగెత్తాడు వెళ్ళి చూసేసరికి ఒక పాదపక్కన వాంటిమీద బట్టల్లేకుండా లక్ష్మి పడిపోయి వుంది ఎంకటేసిని చూసి పరగెత్తబోయాడు రాములు కోపంతోనూ అసహ్యంతోనూ ఎంకటేసి రాయి తీసుకుని రాములు తలకేసి విసిరి కొట్టాడు ఆం ధజ్యోతి నచిత్ర వారవత్రిక 7 ౩ 980
- మనిషాచ్చాడు + క్0
తప్ప
అకను చేసిన ఆ ఒక్క తప్పే అతని కొంప ముంచింది పాపం ఎతాపతి సర్వ నాశనం అయిపోయాడు ఆ ఒక్క తప్పుతోనే
అతను మొదట్లో ఇలా వుండేవాడు కాదు అందగాడి కిందే లెక్క కండలు దిరిగిన శరీరం ఆరోగ్యానికారోగ్యం ఉత్సాహంగా సంతోషంగా ఎక్కడ చూసినా సీతాపతే అన్నట్టుండే వాడు అబ్బో అప్పుడతను ఆడని ఆటలు లేవు వెయ్యని వేషాలు లేవు కాయని పందాలు లేవు భూమి మీద నడిచాడా? ఉహూ
ఎ మాటకామాటే చెప్పుకోవాలి సీతాపతి తండ్రి లక్ష్మీంపతి చచ్చిపోతూ కొడుక్కి లక్షణంగా డబ్బు పాలం ఇతర ఆస్తుల రూపేణా బాగానే ఇచ్చిపోయాడు కొన్నాళ్ళు ఆ లంకంత కొంపకీ తల్లీ కొడుకూ ఇద్దరే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు
లంకంత కొంపలో తల్లీ కొంప బైట కొడుకూ
సీతాపతి ఆరోజుల్లో బైటి 'పెత్తనాల్లోనే ఎక్కువ కాలం గడిపేవాడు భోజనానికీ పడుకోడానికీ మాత్రమే ఇల్లు గుర్తొచ్చేదతనికి
తల్లి వెంకమ్మ ఒక్కతే ఆ ఇల్లంతా ఊడ్చుకోవడం తుడుచుకోవడం కళ్ళాపులు జల్లడం ముగ్గులెయ్యడం వంటలూ అంటులూ అన్నీనూ ఇల్లు అన్నాక నూటయాభై మూడు పన్గుంటాయ్ గద అవన్నీ చేసుకుంటూ క్రిష్టారామా అనుకుంటూ చచ్చిపోయిన మొగుబ్నీ చావక ముందు మొగుడికీ తనకీ వచ్చిన కీచులాటల్నీ గొడవల్నీ తలుచుకుంటూ నడుపుతోంది బతుకు
ఆరోజుల్లో అ వూర్ణో తాగడం ఇంకా ఫేషన్ కాలేదు
సీతాపతికి ఆ రెండలవాట్లూ లేవు అవి లేవూ అంటే కుర్రాడు బుద్ధిమంతుడైనట్టే
అందువల్ల సీతాపతికి -
మా సీత నిస్తామని ఒకరూ
మా లక్ష్మినిస్తామని మరొకరూ
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 60
మా నర్పమ్మనిస్తామని ఇంకొకరూ
మా కరుణనిస్తామనీ మా అరుణని ఇస్తామనీ ఇలా అమ్మాయిల్ని కన్న తండ్రులు ఎతాపతి తల్లి దగ్గరికి తెగ తిరుగుతున్నారు
పెళ్ళి చేసుకోవాల్సిందిగా ఎతాపతికి చెప్పింది వెంకమ్మ
ఆసరికి ఆ ఊళ్ళోకి అసలు ప్రేమ జబ్బు అనేది ప్రవేశించనేలేదు ఎప్పుడో ఎవరో అలా ఎదో చేశారంటారు గాని దాన్ని ప్రేమగా ఎవరూ గుర్తించలేదు అందువల్ల దాని వాత ఎవరూ పడనూ లేదు తల్లిదండ్రులు ఎవర్ని పెళ్ళి చేసుకొమ్మంటే వాళ్ళని తలవంచుకుని పెళ్ళి చేసుకోవడం నోరు మూసుకుని గుట్టు చప్పుడు గాకుండా అందరిలానే సంసారం చేసెయ్యడం పిల్లల్ని కనడం
కనుక ఎతాపతి సార్థక నామధేయుడై సంసారాన్ని లాగిస్తున్నాడు
అలా కొన్నేళ్ళు గడిచాయి
అప్పుడు
ఎతాపతి తప్పు చేసిన మాట నిజమే
కాని
కొన్ని తప్పులెలాంటివంటే -
ఆ తప్పు చేసినప్పుడు అదో తప్పులానే కన్పించదు చెప్పాలంటే - ఆ తప్పు జరిగి నప్పుడు ఎదో తప్పు చేశామే అని గాక తామేదో గొప్ప చేశామనే అన్పించుతుంది
కనుక
అ తప్పు జరగ్గానే సీతాపతిని ఎవరూ నువ్వీ తప్పు చేశావని అనలా
అందరూ చేసే చేస్తున్న తప్పేగా అనుకున్నారో ఎమో పైగా ముసిముసిగా నవ్వారు కొందరు అతనా తప్పు చేసినందుకు సంతోషపడ్డారు కూడానూ
చిత్రం భార్య కూడా సంతోషపడ్డట్టే వుంది మరి
ఆ తర్వాత సీతాపతి ఇద్దరు కూతుళ్ళకూ ఓ కొడుక్కూ తండ్రయ్యాడు
భార్య సీత పిల్లల సంబరంలో పడింది
అయ్యా
ఆ తప్పు చేసేన పదిహేనేళ్ళ తర్వాత మొదలైనాయండీ పాపం సీతాపతి కష్టాలు
అవ్పట్లుంచి అవి పెరిగాయేగాని తరగలా
నెమ్మది నెమ్మదిగా తననెంతో ఇష్టపడేవాళ్ళు సైతం దూరంగా జరగటం తప్పుకు తిరగటం లోక్కూడా దిగాయి
సీతాపతి ఆటలు ఆడటం పాటలు పాడటం పెళ్ళయ్యాక కొన్నేళ్ళకి మానేశాడు నేల మీదే నడవడం ఎప్పుడో మొదలెట్టేశాడు అతని పాలమేమో ఇల్లేమో అతనేమో అంతే
భార్యని అందర్థానే కసురుకునేవాడు అయితే కొందర్గా కొట్టేవాడు కాదు
కాని ఇప్పుడు సీత తన పతిని అతని మానాన అతన్ని బతకనిచ్చింది కాదు చెవిలో నివాసం పెట్టింది అతని చెవిలోనే
శతస్వశ 61
ఎ మాటొచ్చినా తిప్పి తిప్పి ఆ తప్పు అతని మీదికి లాక్కెళుతుంది ఇరవయి నాలు గ్గంటలూ రింగు రింగున ఒకటే దెప్పుళ్ళు అతను తప్పు చెయ్యలేదని కాదు - తప్పు చేశాడనే కాని ఆ తప్పులో తనకూ వాటా ఉందంటే మాత్రం ఒప్పుకోదు
మొదట్లో అసలది తప్పేగాదని వాదించిన ఎతాపతి పదుగురాడుమాట పాటియై ధర చెల్లు అన్నట్టు లోకరీతి అలా వున్నందువల్లేగానీ లేక తనకే తెలిన వచ్చిందోగానీ అది తప్పు అంటే తప్పేనని ఒప్పుకోక తప్పలా
లోకంలో తప్పులు రెండు రకాలున్నాయి
కొన్ని తప్పులు చేసంతర్వాత దిద్దుకోగలిగినవి
మరికొన్ని వున్నాయి తప్పు చెయ్యాలే గాని ఇకవాడికి పుటం పెట్టినా దాన్ని దిద్దు కోలేడు అది కుదరదు
సీతాపతి చేసిన తప్పు దిద్దుకోలేనిది మాత్రమేగాక అప్పుడెప్పుడో ఎన్నేళ్ళ క్రితమో చేసిన తప్పు గోరంతలు కొండంతలయి ప్రతి నిముషం అతని జవసత్వాల్ని లాగేసేది అతను రానురాను చూసెవాళ్ళకి జాలిపుట్టే విధంగా తయారయ్యాడు కష్టాల్లో కాకుల్లా పొడిచే లోకులు అతన్నాస్థితిలో చూసి జాలిపడకపోగా ఎగతాళి చేసేవారు ఎవగించుకునేవారు ఎమిటేమిటో అనేవారు అతను నొచ్చుకుంటాడేమో అని కూడా చూసేవారు కాదు నిజానికి అతను నొచ్చుకోవాలనే చూసేవారు కూడానేమో
అలానే పాపం అతనూ విపరీతంగా బాధపడ్డ్తుండేవాడు తన వల్ల తప్పూ జరిగింది అనుకోగానే క్షణం నిలబడలేకపోయేవాడు
ఎప్పుడో ఎ వెన్నెల రాత్రో వాకిట్లో పురి పక్కగా మంచం వేసుకుని ఆకాశం వంక చూస్తూ రేపు చెయ్యబోయే పాలం పనుల గురించి ఆలోచిస్తుండగా అతనికి ఎవరూ గుర్తు చెయ్యకుండానే అతని తప్పు ఎదురుగా వచ్చి నిలబడేది పక్కనొచ్చి కూర్చునేది అమాయ కంగా కళ్ళలోకి చూసేది
అంత తప్పు చేసి ఇంత బేఫికర్‌గా ఎలా వుంటున్నాడు? అన్నట్టు చూసేది
అతడు అంతర్ముఖుడయ్యేవాడు మొదట్లో అతనా తప్పు జరిగినందుకు విచారించని మాట నిజమే కాని రానురానూ అసలింత తప్పూ తనే చేశాడా అనే పశ్చాత్తాపం మొదలయ్యేది చుట్టూ ఉన్నవారి వాలకం చూస్తే
కానీ ఎంత పశ్చాత్తాప్పడీ లాభం ఎముందీ? జరిగిన పాపభారం పెరుగుతోందే తప్ప తరగడంలేదు
తప్పు నిప్పులాంటిది పైగా లోకులు ఆ నిప్పులో ఉప్పు జల్డుతున్నారు ఫలితంగా అళని బతుకులో చిటపటలు పెరిగిపోయాయి
దు ఖం వేదన అభిమానం ఒకటా? ఎంత బాధలో పడ్డాడో పాపం ఎతాపతి
రానురానూ అతన్ని మరింత అన్యాయంగా చూస్తున్నారు ఇంటా బయటా కూడా వాళ్ళు నిజంగా అలా చూస్తున్నారో లేదోగాని అతనలా అభిప్రాయపడుతున్నాడు
తండ్రి ఇచ్చిన పొలాన్ని మరికాస్త పెంచాడే గానీ తగ్గించలేదు
పాత పెద్ద ఇంటిని పడగొట్టి కొత్త మంచి ఇల్లు చిన్నది కట్టించాడు
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 62
ఇంటిల్లిపాదికీ పండగలకీ పబ్బాలకీ కొత్త బట్టలు చింపించేవాడు పశువులున్నాయి. పాడీ వుంది క మామూలుగా చూస్తే అతను బేఫికర్‌గా బతకాల్సిన మనిషే కాని చేసిన తప్పు దిద్దు కోలేనిది భార్య సీత ముఖం మీదే పతిని ఎంత మాట పడితే అంత మాట అనేస్తోందిప్పుడు ఎత తన పతితో ఎకళశయ్యావతి అయి వున్న నమయంలో కూడా ఆ తప్పు గురించి ప్రస్తావించి కన్నీళ్ళు పెట్టుకుంటోంది ఎప్పుడెవరు ఎమన్నా సహించగలడుగాని మగాడన్న తర్వాత తన గుండెలమీద కలకల నవ్వాల్సిన మగువ కన్నీళ్ళు పెట్టకుంటే భరించగలడా? కట్టె గుండెల వాళ్ళ మూట మనకెందుకు? సీతాపతి మాత్రం భరించలేడు జరిగిన తప్పేమో జరిగింది కనీసం దాన్ని దిద్దుకోవాలనుకున్నాడు ఇక లాభంలేదు ఎది ఎమైనాగాని యిక యిలా భరించేది లేదు సహించేది లేదు దాన్ని దిద్దుకోడానికి నిశ్చయించుకున్నాడు ఆ తీవ్రంగా నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకోవడమే కాదు - ఆ తప్పు దిద్దుకుంటున్నాననుకుంటూ తెగ సంబరంతో అందర్నీ పిలిచి విందు కూడా యిచ్చాడు కాని ఆ పనే అతను చేసిన రెండో తప్పయి కూర్చుంది అది చాలక మళ్ళీ మళ్ళీ విందులు చేశాడు మొదటి తప్పుకి మానసికమ్మెన అశాంతులో బాధలో వేదనలో అయితే ఇప్పుడు చేసిన తప్పు నెమ్మది నెమ్మదిగా పాలాన్ని పశువుల్ని ఆస్తుల్ని తినెయ్యడం మొదలెట్టింది ఇప్పుడు సీతాపతిని చూస్తోంటే జాలిపడని పురజనులుండరు మొదటి తప్పు దిద్దుకుందామని ఇతను చేసిన రెండో తప్పు అతని పుటం ఆర్పింది రెండో తప్పు చెయ్యడానికి సహయపడినవాడొకడున్నాడు వాడూ మొదట్లో బాగానే వుండేవాడు కాని నెమ్మది నెమ్మదిగా ఇతన్ని ఎక్కు తినసాగాడు అదేమంటానికి లేదు చేసిన తప్పుని గుర్తుకి తెచ్చేవాడు బ్లాక్‌మెయిల్ అంటామే - అచ్చంగా అదే మామా - మావా అంటూ వదలకుండా వెంటబడేవాడు ఇప్పుడు సీతాపతికి అతన్ని తల్చుకోగానే నహ తప్పిపోతుంది అతను కనపడగానే బేషరతుగా లొంగిపోతాడు అతనేదంటే అదిచ్చేస్తాడు మరి సీతాపతి సర్వనాశనం అయ్యాడు అంటే అవడా మరి? చేసిన తప్పులు మాత్రం సామాన్యమైనవా? ఇంతకీ అతను చేసిన తప్పులు చెప్పనేలేదు గదూ నా మతిమండా ఈ మతిమరు పాకటే ప్రాణాలు తీస్తోంది ఆ చెప్తున్నా మొదటి తప్పు - ఆడపిల్లని కనడం రెండో తప్పు - ఆ పిల్లకి ఘనంగా పెళ్ళి చెయ్యడం ఇవేమన్నా ఈ కాలంలో చిన్న తప్పులా? తప్పించుకోగల తప్పులా మీకు మాత్రం తెలవదూ?
- వివుల 982 శతప్పళి 63
ఈరడింటో పెళ్ళి కూతుర్ను తీసుకుని జగన్నాధంగారింటి కొచ్చాడు బండీరడు బండీరడు - బండవీరడుగాని బండి వీరడు కాదు దొరసానమ్మగోరూ దారుండాడ? అని యింట్లోకి ఓ కేకేశాడు దొరసానమ్మగారు లోపల ఎక్కడో ఉంది దొర బైటికొచ్చాడు ఎరా బండీర ఎంటి సంగతి? అని బండీరడ్ని అడిగి పక్కనున్న లచ్చిని చూసి ఇదెవర్రా?” అన్నాడు జగన్నాధం ఇది నా కూతురుండే లచ్చి అన్నాడు బండీరడు బండీరడి కూతురూ బండీరడి కూతురూ అంటే యేంటో అనుకున్నా నీ కూతురు గుర్రంలా బాగుందిరా అన్నాడు లచ్చివంక తినేసేట్టు చూస్తూ ఎంటోలెగండి దొరా అంతా పిచ్చాల్లు అన్నాడు బండీరడు అంతకన్నా యింకే మనాలో తోచక పిచ్చాల్దేంటిలే మంచోల్లే సినిమాలో అమ్మాయిల్హాగా వుంది ఆ రంగురంగుల బట్టలూ అదీ ఊ బాగుంది చాలా బాగుందిరా అన్నాడు దొర జగన్నాధానికి అరవైయేళ్లు ఇంత బాగానూ వున్న మనుమరాళ్లున్నారు పట్నంలో చదువుకుంటున్నారు కాబట్టి యింకా షోగ్గా కూడా వుంటారు అయితే తన మనుమరాళ్ళ గూర్చీ వారి అందాల గూర్చీ భార్యతోనూ కూతుళ్ళతోనూ మాట్లాడేటప్పుడు అమ్మళ్ళకేమే బంగారబ్బామ్మలు చిదిమి దీపం పెట్టొచ్చు నా మనుమరాళ్ళు గాదూ అంటాడు బైటి వాళ్ళమ్మాయిల్నయితే అదీ తమకింద పనిచేసే మనుషుల పిల్లలయితే సినిమా అమ్మాయిల్లాగానూ బాగా బలిం సవారికి సిద్ధంగా వున్న గుర్రాల్హాగానూ కనపడ్డారు అవతలి వాళ్ళు అదేం అనే అవకాశం లేదు కాబట్టే యింకా ఎలానైనా కన్పడతారు పనివాడితనం € అక్కినేని కుటుంబరావు 64
బండీరడు నసిగి నసిగి... “దీనికి పెళ్ళి సేద్దారి అనుకుంటన్నా దొరా. నిన్నే గుడివాడ నుంచో సంబంధమొచ్చింది. కుర్రాడు రిక్షా లాక్కుంటన్నాడు. రోజుకు నాలుగురాళ్ళు కళ్ళ సూత్తన్నాడు. మరి తమరితో సెప్పి ఎట్టాగోట్టా దీనికా మూడుముళ్ళూ...” అని ఊరుకున్నాడు బండీరడు,
“అప్పుడే దీనికి పెళ్ళిందుకురా. నాల్లేళ్ళు నీ దగ్గరుంచుకుంటే కూలీనాలీ చేసి నాలుగు డబ్బులు కూడబెట్టుకుంటుందిగా.”
“అదేంటుండే. ఇంతకు మునుపే గదుండే నువ్వు గుర్రంలాగుందన్నావు”
“అన్నాన్లే. మరి అది గుర్రంలా కనపడింది నా కళ్ళకి, సరే, దీనికి కళ్ళెమెయ్యాల్సిందే. అదిసరేగాన్సీ ఈరా? ఇంతందమైందాన్ని పైయ్యూరుకి పంపడమేంట్రా. మనూళ్ళో దీన్ని పెళ్ళాడతామన్న మగాళ్ళ దొరకలేదంట్రా” అన్నాడు.
జగన్నాధానికి ఆ నిమిషాన సంఘాన్ని ఎదిరించి విప్లవాత్మకమైన పనాకటి చేస్తే బాగుం టుందనిపించింది. అదేమిటంటే లచ్చిని తను “ఉంచుకుంటే” బాగుంటుందని. కాని మళ్ళీ ఎన్నో తలనెప్పులు. ఒకటి - 'మాల్గంజై'పోయింది. రెండు - అంతా ఈ వయసులో నీకిదేం బుద్ధీ అంటారు. మూడు - పెళ్ళాం, పీల్లలూ, అల్డుళ్ళూ, కోడళ్ళూ, చివరికి మనుమలు, మనుమరాళ్ళు అందరిముందు తలొంచుకు తిరగాల్సి రావొచ్చు.
“ధీభఛీ అయినా దీంతో మనకేంటి” అనుకుని తన విప్లవాత్మకమైన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
దొర మౌనాన్ని చూసి ఏమనాలో తోచక బండీరడు “ఎయ్యి రూపాయలు” అన్నాడు.
“ఎయ్యా? ఎయ్యెక్కడ్చుంచి తేనురా! అయినా నేనియ్యకపోతే నీకు దొరకవా?” అని లచ్చెంక చూసి “ఏమే” అన్నాడు జగన్నాధం, |
దొరకంది లచ్చికా, బండీరడికా అనే అనుమానం యిద్దరికీ వచ్చేట్టు.
కాసేపు లచ్చెంక చూసిచూసి, “ఏరా” అన్నాడు, అ ప్రళ్ళకి సమాధానం ఈరడే ఇవ్వా లన్నట్బ్టు.
“ఎక్కడ దొరుకుతుయ్యుండే. నీ దగ్గరే లేవంటున్నావ్. ఇక ఊళ్ళో నీకన్నా మొవాసు లున్నారా?” అని దొరని ఉబ్బేశాననుకొని మహా సంబరపడ్డాడు బండీరడు.
“సరేరా... నీకు చెల్లంకుల్లో కాత్తేదో ఏడిసినట్టందిగా పాలం.”
“ఆ ఉంది లెగండి. చిటికెడు చిట్టు కూడా అవదు. మీ సేను సరసనేగా”
“ఏం తగలడిందోలే. నా కయన్నీ ఎక్కడ గుర్తుండి చస్తయ్‌గాని... ఎయ్యేం చాల్తయ్‌రా, పదిస్తర్లన్నా లేపవ్?”
“లేపప్పోతే కులపోళ్లూరుకుంటారేంటుండే”
“మరెయ్యేం సాల్తయ్‌రా!”
“ఏదో...”
న్నేరురడింటో పెళ్ళై+ 65
“ఏంటేదో... నా మాటిను. నీకిదొక్కటేగా పిల్ల. ఒక్కగానొక్క పిల్ల పెళ్ళి చేత్తన్నావ్. నువ్వు మళ్ళీ పెళ్ళిళ్ళు చెయ్యబోయావా? నలుగురికి పెట్టబటోయావా? కాదూ కూడదంటే మళ్ళీ నువ్వే పెళ్ళి చేసుకోవాలి...” అని బెకబెకలాడాడు జగన్నాధం.
ఈరడు కూడా పగలబడి నవ్వి “ఆ! ఇక నాకదొక్కటే తక్కువ. ఈమాట మీ మాల దిందంటే నాకీ నాలుగు మెతుకులు కూడా పెట్టదూరుకోండే” అన్నాడు ఖుషీ అయిపోయి.
లచ్చి కిలకిల నవ్వింది.
ఆ నవ్వు చూసి జగన్నాధం “ఓసి నీ అందమార! ఏం నవ్వు నవ్వావే” అన్నాడు. అదే సమయంలో లచ్చి జబ్బ మీదొక దెబ్బ వేస్తే బాగుబ్నని అతని మనసు లబలబలాడింది గాని ఆ పిల్ల దూరంగా ఉండడం వల్ల కుదరలా, లేచి వెళల్ళామన్నా, ఆమెను దగ్గరకు రమ్మందా మన్నా బాగుండదనుకుని ఊరుకున్నాడు.
“..మరందువల్ల... మీ మాలపల్లి మాలపల్లీ ముక్కుమీద వేలు వేసుకునేట్టు చెయ్యరా.
_ నువ్వు మళ్ళీ చెయ్యబోయి చేత్తావా? ఆ పెళ్ళి వైభోగం చూసి నీ అల్లుడు అదిరిపోవాలి, ఆ దెబ్బతో నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి.”
“ఆం నాకెందుకు లెగండే అంత బరువు నే మొయ్యలేను. ఎత్తలేని ఎత్తులు నాకెందుకుండే. ఏదో ఓ ఎయ్యిప్పిత్తే మా తిప్పలు మేం పడతం”
“ఓర్నీ అందుకేరా అందరూ నిన్ను బండీరడనేది. ఏటని గోసినా ఎండగట్టి తిందామనే
గొని పరులకింత పెడదామని ఉండదేరా? ఒక్కగానొక్క కూతురి పెళ్ళి చేత్తా కానీ ఖర్చు లేకుండా, పదిమందినీ పిలవకుండా చేద్దానునే చూత్తన్నావ్. కట్టుకుపోతావేరా ముసల్నాకొడక? బండనాకొడక” అని దొంగనవ్వులు నవ్వుతూ జగన్నాధం అనేసరికి -
'పైగా 'ఏటనికోసినా ఎండగట్టి తింటావుగాని...' అనేసరికి, తన్ను ఘోరంగా అవమా నించినట్టూ, తద్వారా మాలపల్లినే అవమానించినట్టూ, ఆ మాటకొస్తే అసలు మానవజాతినే అవమానించినట్టుగా భావించి బండీరడు పౌరుషం తెచ్చేసుకున్నాడు.
“ఏంటుండే. మీరు కూడా అట్లా మాట్టాడతన్నారూ? ఎక్కడతేముండే డబ్బూ? ఎయ్యి రూపాయలియ్యమంటే నువ్వే ఎనకాముందూ ఆడతన్నావు గంద. ఇంకెవడు నా మొఖం చూసి డబ్బిత్తాడుండే?” అన్నాడు బండీరడు,
“ఉరేయ్. ఏదో మాటవరసకన్నాలేరా! ఎయ్యికాదు నాలుగువేలిత్తే మాత్తరం 'నువ్వెక్కడి కెల్తావుగానీ. నీకు నిజంగా డబ్బు దొరకదనే తేలిగ్గా పోనిద్దామనుకుంటున్నవా?” అని అన్నాడు జగన్నాధం.
“అంతేగదుండే మరీ”
“సరే అయితే. నీకెంత కావాలంటే అంత. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసికెళ్ళరా. సరేనాగో
“సరేనుండే.”
పనివాడితనం ళ€ అక్కినేని కుటుంబరావు 66
మరింకే మైకూగియ్‌కూ తెబ్బంచి మాంఛి అంగూ ఆర్బాటాల్లో చెయ్యి కూతురి పెళ్ళి నీకేంటి? అందర్గా కాదు సెంటో కుంటో పొలముంది వంటో భగమంతుడిచ్చిన శెక్తుంది నీకేం తక్కువ ఇటు చూత్తే ఒక్కగానొక్క కూతురు నువ్వు మళ్ళీ పెట్టటోయావా? నీవాళ్ళు తినబోయారా? పెళ్ళంటే ఈరడింటో పెళ్ళే పెళ్ళి, అని మాలపల్లిలోనేగాక కమ్మటూర్లో కూడా చెప్పుకునేట్టు చెయ్యి, నిన్నాక్తేసించేవాడు లేడు మొన్న చూశావుగా రామయ్య గారింటో పెళ్ళి ఒక్కడ్ని పిలిచాడా ఒక్కడొచ్చాడా? కమ్మాడన్నమాటేగాని కమ్మపెళ్ళిలాగా వుందా? ఆయన్ననీ లాభం లేదనుకో తింటే చూడు తిప్పుళ్ళాట తినకపోతే చూడు దేవుళ్ళాట నీ ఎటు చూసినా అప్పూలూ వాళ్ళూనూ నీకే? మాలాడివన్నమాటేగానీ మాలపల్లిలో తల్లో నాలుకలాగా ఉన్నోడివేగా నామాటిని శుభ్రంగా బర్చు కెరవకుండా చేసెయ్ పిల్ల పెళ్ళి నే చెబ్తున్నాగా అని నోట్లో చుట్టని పీల్చి అది ఆరిపోయిందని గమనించి చుట్టని తీఎ నేలకేసి రాసి చేతులబన్నీ జేబులోంచి అగ్గిపెట్టె తీసి రెండుసార్లు గీశాడు వెలగలా మూడోసారి - వెలిగి వెంటనే ఆరిపోయింది ఉసే నీ పేరేంటో లచ్చుండే అదేలే ఇటురా కాస్త గాలికడ్డంగా నుంచో లచ్చొచ్చి గాలికడ్డంగా నుంచుంది జగన్నాధం అగ్గిపుల్ల గీశాడు అది వెలగలా మళ్ళీ గీశాడు మళ్ళీ వెలగలా కాని విరిగింది తుఫ్ దొంగలంజా కొడుకులు డబ్బులు దొబ్బటమేగాని సరైన సరుకొక్కటీ యివ్వరు అని వ్యాపారన్తులందర్నీ పేరుపేరునా తిట్టి మరోపుల్ల గీశాడు తిట్టుకి జడిసినట్టు పుల్ల వెలిగింది చుట్ట అంటించుకుని మండే అగ్గిపుల్లని లచ్చి లంగాకి అంటించబోయినట్టు నటనచేఎ - లచ్చి భయపడుతోంటే నవ్వి - నీ దుంపతెగా అనే మాట సాయంతో ఆ పిల్ల జబ్బమీదో దెబ్బేసి ఆమె శరీరపు గట్టితనానికి ముచ్చటపడి మరో దెబ్బ వేసేంతలో లచ్చి దూరంగా వెళ్ళి నుంచుంది సరేరా ఈర నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత యిస్తా దీన్ని పంపు మళ్ళీ అక్కడ్నుంచిక్కడదాకా నువ్వెందుకు అన్నాడు జగన్నాధం సరేనుండే అని వీరడు బైల్లేరాడు తండ్రి వెంట కూతురూ వెళ్ళబోతూ ఒక్కసారి జగన్నాధాన్ని చూసింది మామూలుగానే కానీ ఆ చూపుతో జగన్నాధం కుడితిలో పడ్డ ఎలకలా గైపోయాడు సంఘాన్నెదిరిద్దాం అనుకున్నాడు వెంటనే ఇదిగో ఉసే నీ పేరేంటో అన్నాడు నే రురడెంటో పెళ్ళి 4 67
లచ్చుండే అంది వెళ్ళబోయేదల్లా ఆగి వెనక్కి తిరిగి అదేలే సరేలే వెళ్ళు అన్నాడు ఇంట్లో ఉన్న ముసలి భార్య - ఇంట్లో ఉన్న జబ్బు భార్య - పునిస్తీ చావు కోసం నోము నోస్తున్న భార్య - గుర్తొచ్చింది దేవుడున్నాడో లేడో అనే మీమాంసలో పడ్డాడు జగన్నాధం ఒకవేళ ఉంటే భక్తుల కోర్కెల్ని తీర్చడంలో జాప్యమెందుకు చేస్తాడో తన భార్య ఎంత భక్తురాలు ప్చ్ అనుకుంటూ భగవంతుడి తన భార్యకి పునిస్తీ చావు ప్రసాదించడంలో తాత్సారం చేస్తున్నందుకు విసుక్కుని లోనకెళ్లి పైపంచె తెచ్చుకుని దులుపుకుంటూ బజార్న పడ్డాడు జగన్నాధం ళా ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరీ అంటూ ఎవరో ఆడకూకురు పారేసుకున్నందుకు తెగ సంతోషపడిపోతోంది ఈరిగాడింటికాడ్నుంచి మైకులో మాలపల్లంతా ఒకటే సందడి ఎవళ్ళకాళ్ళు తెల్లారతందా పాొదుకుతందా అని ఒకటే భయపడ్డున్న రోజుల్లో ఒకరోజున ఈరిగాడు మాలపల్లంతట్సీ భోజనాలకీ పెళ్ళికీ పిలిచాడు పిలిచిందే తడవుగా మాలపల్లంతా వచ్చి ఈరిగాడింటి మీద పడ్డారు పిల్గాపాపా చేరి ఇల్లంతా పీకి పందిరేసి ఆ పందిట్లో లచ్చి పెళ్ళి చేసేసి అంతా అన్నాలు తినేసి మైకులో తమక్కావల్సిన పాటలు ఉన్నవాటిల్లోంచి యెంచుకుని వేయించుకుని విని మైకతనితో తిట్లు తిని పెద్దాళ్ళంతా ఒకచోట చేరారు ఈరిగాడే ఈరిగాడు లచ్చి పెళ్లే పెళ్లి అని ఎకగ్రీవంగా తీర్మానించారు ఇటువంటి పెళ్ళి మాలపల్లిలో ఇంతకుముందు సూడలేదు ఎనభై ఎళ్ళ ఎంకయ్య అన్నాడు మాలపల్లిలో ఎటి? కమ్మటూర్గో మాత్రం ఎంతమంది యింత ఖర్చు సెడ్తన్నారు మరీ బలిసిన రైతుల్నాదిలేస్తే అంతా తూతూ మంత్రం చేసెయ్యటల్లా అన్నాడు చింతడు అళ్ళు మాత్తరం ఎం సేత్తార్డేరా డబ్బు అంతా డబ్బులో వుంది కమ్మదొరయినంత మాత్రాన డబ్బెక్కడ్పుంచొత్తంది డబ్బుల్లేకుండా మైకు దగ్గరకెళ్లి నేను కమ్మదొరని పాట పాడమంటే పాడతందా? ఇయిగో రూపాయలు పాడు అంటే చల్ మోహనరంగా అని పాడతం మొదలెడ్తంది గాని అన్నాడు ఈరేశం అంతా గొల్ట్లున్నవ్వారు అంతే అంతే అని ఎకగ్రీవంగా డబ్బు మహత్యాన్ని వేనోళ్ళ కొనియాడారు పనివాడితనం శ అక్కినేని కుటుంబరావు 68
"ఈరడంటే ఏదో బండాడు కాబట్టి ఎనకా ముందూ చూడకుండా చేశాడుగాని యిట్టా యిక ముందు కూడా మన మాలపల్లిలో ఎవడూ పెళ్ళి చేయలేడు” అని జోస్యం చెప్పారు.
“ఓరి సర్లే ఊరుకోండిరా ఆడు బండాడు కాబట్టి కింద మీద తెలవక ఖర్చు చేత్తన్నాడు. ఏలకి ఏలు అప్పెట్టా తీరుత్తామనే బయంలేదు. మనకింత ధైర్యం ఎక్కడ్నుంచి. వత్తంది” అన్నాడు యాకోబు. ఇతను ఈమధ్యే కూతురి పెళ్ళి చేశాడు. అయినవాళ్ళని కూడా పిలకుండా, పిలుద్దామని ఉన్నా చేతిలో పైసా లేదు. ఏం చేస్తాడు?
యాకోబు అన్న మాటకి బండీరడి మేనత్త కొడుకూ, భార్య తమ్ముడూ అయిన నల్లెంకడికి కోపమొచ్చింది. “ఓరి యాకోబూ, నువ్వు నీ కూతురి పెళ్ళి ౩వరినీ పిలవలేదని మేమేమీ అనంలేరా! ఎందుకా ఉలికిపాటు? మా బావకీ అక్కకీ సెంటో కుంటో పొలముంది. ఒంటో కాత్తో కూత్తో ఛెక్తుంది. పాలంలో నాలుగ్గింజలు పండిచ్చుకుని తిండికి జరుపుకున్నా కూలో నాలో చేసుకుని నాలుగు డబ్బులు ఎనకేసుకోగలమనే ధైర్యంతోనే ఒక్కగానొక్క కూతురి పెళ్ళి గనంగా చేసుకుంటన్నారు. అప్పిచ్చిన మారాజు జగన్నాధం గోరికిలేని భయం నీకెందు కురా. అప్పెట్టా తీరుత్తారని” గడగడ అన్నాడు నల్లెంకడు.
అతని కోపం చూసి అందరూ తగ్గారు. ఎంకయ్య మాత్రం “అంతేలేరా! అడి వంటో ఛెక్తుంది. నాలుక్కాలాల పాటు కస్టపడి అప్పు తీర్చుకుంటాడు” అన్నాడు.
అందరూ “అంతే. అంతగాకేంటిలే” అన్నారు.
ళు
పెళ్ళయిన నెలరోజులకి జగన్నాధం బండీరడ్ని పిలిపించాడు.
“ఏంటుండే” అనుకుంటూ వచ్చాడు ఈరడు.
“ఏంలేదు లేరా ఈరా! పెళ్ళి మా గనంగా చేశావంటగా. అంతా మా గొప్పగా చెప్పు కున్నారనుకో” అన్నాడు జగన్నాధం.
“అంతా మీ దయుండే” అన్నాడు ఈరడు.
పులి మంచితనాన్ని పొగిడే మేకలాగా.
తోడేలు మంచిదనుకుంటున్న కోడిలాగా.
“నా దయేముందిలేరా. భభమంతుడి దయుండాలి. నీ పిల్ల పెళ్ళి నువ్వు చేసుకున్నావ్. అందరికీ సంతోషమే” అన్నాడు.
సీతారాముల పెళ్ళి లోకానికే పెళ్ళి!
“మీ అండదండలుండయ్యి గాబట్టే నేను చెయ్యగలిగాను గదుండే” అన్నాడు ఈరడు.
“దాన్టేముందిలేరా. నీకు వంట్లో భగమంతుడిచ్చిన శక్తుంది. నువ్వూ నీ పెళ్ళామూ. కూతురంటావా సుఖం గుంటంది. నీ అల్లుడు కూడ మంచాడేనంటలే. గుడివాడలో కనుక్కున్నా మరి లెక్కలు చూశానురా. చెల్లంకుల్లో కుంటన్నరా నా కమ్మినట్టు కాగితాలు
- ఈరడింటో పెళ్టైశీ 609
రాయించా ఊళ్ళో వున్న ధరకి ఒక వంద ఎక్కువే ఎశా మరి అది పోగా నువ్వింకా ఆరున్నాక్క వందలు బాకీ వుంటావు దీని మీద యేలళిముద్రలెయ్యి యిటొచ్చి అంటున్నాడు జగన్నాధం బండీరడు తాతల్నాటి చెల్లంకుల్లో పొలం తాతల్ని వెతుక్కుంటూ వెళ్లిపోతున్నట్టుగా భయపడిపోయాడు అదేంటి దొరా అట్టా అంటావు పాలం అమ్ముకునేటట్టయితే ముందే అమ్ముకోలేక పోయానా? మీ దగ్గిర కొచ్చి అప్పెందుకడుగుతాను కూలో నాలో చేసుకుని మీ అప్పు వడ్డీతో సహా అజాపైసల్లో సహా తీరుత్తాగాని పాలం అమ్మేది లేదుండే అన్నాడు అన్నాడే గానీ జగన్నాధం తన పాలం లాగేసుకుంటాడనే భయంతో వీరడి మనసు అల్లకల్లోలం అయిపోతోంది జగన్నాధం తాపీగా అన్నాడు - నువ్వు కూలీనాలీ చేసి ఎంత సంపాదిస్తావు? నువ్వెంత తింటావు నాకెంతిస్తావు? నువ్వు ఎన్ని జన్మలు సంపాదిత్తే నా అప్పు తీర్చగలవురా ఎర్రాడా? వడ్డీ పెరిగిపోతా వుంటంది అందుకే ఇప్పుడు పాలం నాకమ్మెయ్యి తర్వాత సంపాదిచ్చినప్పుడు రా నీ పాలం నీకే యిత్తా దీనివల్ల నీకు వడ్డీ తప్పుతుంది అది కాద్దొరా అరేయ్ నాక్కోపం తెప్పించమాక అని జగన్నాధం లేస్తున్నాడు బండీరడు నా పాలం నా పాలం అంటూ పిచ్చికేకల్లో ఊర్ణోకి పరిగెత్తాడు స్వాతి మానవత్రిక మే 982 పనివాడితనం ళ€ అక్కినేని కుటుంబరావు 70
2, బస్ఫెళ్ళిపోయింది బజస్సాస్తోంది ఈ బస్పన్నా ఆగుతుందో ఆగదో అంది నెమ్మదిగా తనలో తను అనుకుంటు న్నట్టుగా బుజ్జిగాడితో వాళ్ళమ్మ బస్బాస్తోంది ఎప్పుడు అమ్మమ్మాళ్ళూరెళ్ళి ఎప్పుడు బుజ్ఞాయిగాడితో ఆడుకోవాలా అని అత్రపడ్డు న్నాడు బుజ్జిగాడు బస్సాచ్చింది ఆగింది లోనంత కిటకిటలాడ్డున్నారు జనం - బైటలాగే దిగేవాళ్ళు యిద్దరున్నారు అసలందుకే ఆ బస్సాగింది ఆ ఇద్దర్నీ దిగనివ్వకుండా శిందివాళ్ళు బస్సుని నెట్టుకుంటూ జనాన్ని తోసుకుంటూ ఒకర్నొకరు తిట్టుకుంటూ కండక్ట రేసిన కేకకి ఆగారు దిగాల్సిన యిద్దరు దిగారు వెంటనే కండక్టర్ పోనియ్ బాబాయ్ అని పెద్ద కేకేశాడు కింద జనంలో హడావుడి పెరిగింది అందుకు నిదర్శనంగా కేకలు ఒకర్నొకరు తిట్టు కోడాలు నెట్టుకోడాలు పెరిగాయి బాబాయ్ కి (డైవర్ బాబాయ్‌కి దాహమైంది షోడా కుర్రాడ్ని పిలిచాడు అందువల్ల కండక్టర్ పోనిమ్మన్నా పోనివ్వకుండా నెమ్మదిగా ఒక షోడాతో మొఖం కడిగి మరో షోడాతో దాహం తీర్చుకుని నెమ్మదిగా వెనక్కి చూశాడు అప్పటికి బుజ్జిగాడు కూడా వాళ్ళమ్మతో సహా బస్సెక్కొడు బస్సు సహజంగానే నానాజాతి సమితిలా వుంది అలాగే - అందరి మొఖాల్లోనూ అసహనం తాండవిస్తోంది శ బస్టెక్టిపోయింది శ క!
కూర్చున్నవాళ్ళు తక్కువ నించున్నవాళ్ళు ఎక్కువ వాళ్ళల్లోనూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నించున్నవాళ్ళు తక్కువ బస్సు ఒక అంటించిన కావులా వుంది చిన్నాపెద్దా ఆడామగా తేడాల్లేకుండా అంతా అతుక్కుని వున్నారు అందరికీ చెమటలు కారుతున్నాయ్ అందరికీ శరీరాలు చీదర చీదరగా వున్నాయి మనసుల్తానే పసిపిల్లలందరూ ఎడుస్తున్నారు తల్గులందరూ తిడుతున్నారు తమ పిల్లల్నీ తామెక్కినా కదలని బస్సునీ తామెక్క కుండా వెళ్ళిపోయిన బన్సుల్నీ ఈ వెధవ ప్రయాణాన్నీ అందుక్కారణమైన దరిద్రపు బతుకుల్నీ మగవాళ్ళంతా వినేవాడు లేకపోయినా తమతమ అజ్ఞానాల్నే జ్ఞానాలుగా తలచి- అది సర్వ సహజమనుకోండి - ఎదుటివారిని పూర్తి అజ్ఞానులుగా కూడా తలచి ఎవరికి తోచింది వారు వాగుతున్నారు పోనీ బాబాయ్ అనే కేక విని బస్సు రకరకాలుగా మోగి మొరాయించి చివరికి బాబాయి బలవంతం మీద కదిలింది అది కదుల్తున్న సర్వకుల సమ్మేళనంలా వుంది అందుకే అది అంత గందర గోళంగానూ అంత సందడిగానూ అన్ని తగాదాల్లోనూ వుంది నడుస్తోంది బుజ్జిగాడు బిత్తరచూపుల్లో అటూఇటూ చూస్తూ తనవంకే చూస్తున్న ఒకాయన వంక చూశాడు ఆ ఒకాయన పేరు రాంబాబు రాంబాబు బుజ్ఞిని దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేశాడు బుజ్జి బిడియంగా తల్లివంక చూశాడు తల్లి వెళ్ళమని తలూపింది తెలియని మని దగ్గర కెళ్ళడానికి బుజ్జికి సిగ్గుగా వుంది రాంబాబు తన దగ్గర కూర్చోవడానికి రమ్మని మళ్ళీ పిలిచాడు బుజ్జికి వెళ్ళాలనీ వెళ్ళి కూర్చోవాలనీ వుంది తెలియని మని దగ్గరకెళ్ళడానికి కాస్త బెరుగ్గానూ వుంది అసలంత వరకూ - రెండు సీట్ల దూరం - తను వెళ్ళగలడా? అందర్నీ తప్పుకుంటూ అని భయంగానూ వుంది ఎందుకో ఒకతను నవ్వాడు బుజ్జిగాడు అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు వెనక వుండడం మూలంగా అతన్నవ్వడం చూడని కండక్టరు ఎవరయ్యా కోళ్ళని తెస్తోందీ? అని బిగ్గరగా కసురుకున్నాడు జనమంతా పగలబడి నవ్వారు జనం ఎందుకు నవ్వుతున్నారో తెలియని కండక్టరూ - పనివాడితవం శ అక్కినేని కుటుంబరావు 72
జనం ఎందుకు నవ్వుతున్నారో తెలిసిన నవ్వినతనూ తప్ప జనమంతా పగలబడి నవ్వారు బుజ్జిగాడు కూడా కాస్త నవ్వుతూ తల్లి వంక చూశాడు అమ్మ వెళ్ళు నాన్నా వెళ్ళి అక్కడ కూర్చో నేను దిగేప్పుడు నిన్ను పిలుస్తాగా అంది బుజ్జి అటూ ఇటూ ఊగిసలాటలో ఉండగా ఉగ్రేయ్ బుజ్జిగా ఇట్రా ఇక్కడ కూర్చుందూగాని అనే అరుపు చాలా క్రూరంగా వినబడింది బస్సులోని జనారణ్యం నుంచి బుజ్జిగాడికి తండ్రి కనపడ్డంలా జనంలో ఎక్కడో వున్నాడు కాని తండ్రి అప్పుడెలా వుండి వుంటాడో బాగా తెలుసు బుజ్జిగాడి తండ్రైెప్పుడూ ఓడిపోయిన కుక్కని కరుస్తున్న కుక్కలా వుంటాడు ఇటురా ఇక్కడ కూర్చో అనే మాటలకి కూడా అతను మొఖం అంతా గాట్లు పెట్టుకుని మూతి వికృతంగా పెట్టి కూర్చో మనడానికీ అవతలకి పో అనడానికీ ఆయన మొఖంలో పెద్ద తేడా వుండదు తండ్రెందుకు ఎప్పుడూ అంత అసహనంగా కసిగా అశాంతిగా వుంటాడో అర్థం కాదు బుజ్జిగాడికి తండ్రి కన్పడ్డం లేదన్న మాటేగాని బుజ్జిగాడికి ఆయన అరుపులు గర్జనలు విన్నడ్డూనే వున్నాయ్ పులి గర్జన వింటూనే గజగజలాడే లేడిపిల్లలా - తండ్రి పిలుపు వినగానే తల్లి - బుజ్జిగాడిని నాన్స పిలుస్తున్నారు వెళ్ళు అంది వాడికి వాడి తండ్రి రూపం ప్రత్యక్షమయింది ఇక్కడ కూర్చోటానికి నీకో చోటుంది రమ్మనే గర్జన విన్సడ్డూనే వుంది బుజ్జిగాడు గబగబా అడ్డంగా వున్న వారి కాళ్ళల్లో పడి తోసుకుంటూ తిట్లు తింటూ రెండు ఎట్లు దాటి రాంబాబు పక్కకెళ్ళి నిలబడ్డాడు అంతే బుజ్జిగాడికి తెల్సింది తల్లిని కొట్టే తండ్రిగాని తనని ప్రతిదానికీ కసురుకునే తండ్రిగానీ ఎప్పుడూ అందరి తోనూ పోట్లాడే తండ్రిగాని యిక బుజ్జిగాడికి గుర్తురాలా రాంబాబు బుజ్జిగాడ్ని నెమ్మదిగా లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు వాడి తల ముందు బటు కడ్డీకి తగలకుండా తన చెయ్యి ఆ కడ్డీ మీద పెట్టాడు బుజ్జిగాడినో చేత్తో సున్నితంగా నిమురుతూ - నీ పేరేంటి? ఎక్కడి కెళ్తున్నావూ? అక్కడ ఎమేం వుంటాయ? నువ్వెవర్తో ఆడుకుంటావు? బుజ్జిగాడికి తను తన అమ్మమ్మగారి వూరెళ్ళి పరుగు పరుగున చావిట్లోకి వెళ్ళడం అక్కడ బుజ్జ్ఞాయిగాడు అంబా అని తనని గుర్తుపట్టడం తను బుజ్ఞాయిగాడి తాడు ఊడ టీ బస్టెక్టపోయింది ఖీ 73
దియ్యడం బుజ్ఞాయిగాడు తనని యిన్నాళ్ళు ఎలా వున్నావురా నన్ను చూడ్డానికి రాకుండా? అని అడుగుతున్నట్టు తన వళ్ళంతా వాడి గరుకుగా బారూ వుండే నాలికతో ప్రశ్నించడం తర్వాత తామిద్దరూ పరుగాటలాడడం బుజ్ఞాయిగాడు తను కొత్తగా నేర్చుకున్న గంతులు వేసి తనకి చూపడం
ఇవన్నీ బుజ్జిగాడు రాంబాబుకి చెప్తున్నాడు
అవుదూడతో తన చిన్నప్పుడు తను ఆడుకున్న ఆటలు గుర్తొచ్చి మనసు నిండి పోయింది రాంబాబుకి
బస్సాగింది
రైలుగేటు వేసి వుంది కాసేపటికి రైలు కూతేసుకుంటూ దడదడపుంటూ వచ్చింది బుజ్జిగాడు రాంబాబుని పట్టుకున్నాడు రాంబాబు బుజ్జిగాడ్ని రెండు చేతుల్తోను నిమురుతూ
అదిగో రైలు కన్పడ్తోందా? అడిగాడు
బుజ్జగాడు దొంగచూపుల్లో భయంభయంగా బైటికి చూశాడు
ప్రచండవేగంతో పరుగెత్తుతోంది రైలు చూస్తుండగానే మాయమయింది
అశ్చర్యం నిండిన చూవుల్లో రాంబాబు వంక చూశాడు బుజ్జిగాడు
ఈ రైలు బెజవాడ నుంచి మద్రాసు వెళ్తోంది అని చెప్పాడు రాంబాబు
బెజవాడ
మద్రాసు
అనుకున్నాడు బుజ్జిగాడు ఆ రెండూ రెండు మబ్బులు అవెక్కడుంటాయో మబ్బు ల్లోనే వుంటాయి
బిస్సెల్లోంటే తాటిచెట్ట గుంపు మొదటి వరసలో వున్న తాటిచెట్టు ఒకవేపుకి పరుగులు తీస్తోంబే వాటి వెనక వున్న చెట్టు మరోవేపు పరుగులు తీస్తున్నాయ్
బుజ్జిగాడూ బుజ్ఞాయిగాడే కాదు చెట్లు కూడా పక్తుల్లానే పరుగులు తీస్తాయి ఆటలాడుకుంటాయి
రెండు పక్షులు సంతోషంగా పాడుకుంటూ ఆకాశంలో పల్టీలు కొడ్తున్నయ్ రైతులు నాగళ్ళు పుచ్చుకుని ఎడ్డను తోలుళూ చేలను దున్నుతున్నారు ఎవరెవరో ఎక్కడెక్కడికో వెళుతున్నారు నెత్తిమీద గంపలతో మూటల్లో చిన్నచిన్న బిందెల్లో కుండల్లో
పాలాలకెళ్ళే కూలి మనుషుల వెంట బడ్డున్నారు తామూ వస్తామని వాళ్ళ పిల్లలు
ఇవన్నీ ఒక్కొక్కటీ రాంబాబు చెప్పన్నాడు బుజ్జిగాడు వింటున్నాడు
తర్వాత
బుజ్జిగాడు కూడా అదీ ఇదీ చెప్తున్నాడు రాంబాబు పరవశత్వంతో వింటున్నాడు
వాడి కళ్ళకి - నీళ్ళతో నిండి వున్న చెరువులో వాటి నిండా వున్న కలువ వూలూ తామరపూలూ చెరువు కవతల గట్టున పరుగులు తీస్తున్న ఆవులూ వాటి వెనక ఖెంగున గంతులేస్తున్న దూడలూ వాటి వెనక పరుగులు తీస్తున్న చిన్నపిల్లలూ
పనివాడితనం + అక్కినేని కుటుందిరావు 74
చెట్లూ పక్షులూ బస్సాగింది ఇచ్చట ప్రశస్తమయిన మంచి పాగాకు కేలండర్లు బిళ్ళలు అమ్మబడును అని రాసి వున్న కొట్ట మూసి వుంది ఉరేయ్ రమణా అని అరిచాడు కండక్టర్ ఆ దగ్గరో ఆడుకుంటున్న పిల్లలంతా ఆట ఆపారు ఇటు చూశారు వాళ్ళల్లోంచి ఓ పిల్లాడు పరుగెత్తుకొచ్చాడు ఇదిగో ఇది నీవు తీసుకో జిలేబి తిను ఇవి అమ్మకివ్వు అని రెండు పుస్తకాలిచ్చాడు రమణ ఆటలు మానేసి జిలేబి తినడం అప్పటికప్పుడే మొదలెట్టి ఆ ఊళ్ళోంచి వున్న ఓ అడ్డరోడ్డు పట్టి నడుస్తున్నాడు ఎక్కడా అక్కుండా వెళ్ళిపో అని కేకేశాడు కండక్టర్ నాన్‌స్టాప్ అని జోకేశాడొకాయన విననివాళ్ళల్లో కొందరు నవ్వారు కాబట్టి కొందరు నవ్వకుండా గంభీరంగా అయ్యారు విననివాళ్ళల్లో చాలామంది నవ్వలేదు కాని దేనికైనా నవ్వే కొందరు నవ్వేవాళ్ళని చూసి నవ్వారు బుజ్జిగాడి తండ్రీ అన్నీ విన్నాడు నవ్వలేదు నవ్వేవాళ్ళని చూశాడు అయినా నవ్వలేదు కాని బుజ్జిగాడి తల్లి మీద కారాలూ మిరియాలూ నూరుతున్నాడు చూపుల్లోనే నరికి పోగులు పెడ్తున్నాడు బుజ్జిగాడనుకుంటున్నాడు నాన్న యివ్వాళ అమ్మని బాగా కొడతాడు అని అమ్మ వంక చూశాడు అమ్మకూడా అప్పుడే బుజ్జిగాడ్నీ చూసింది అమె కన్నులు మెత్తగా అమాయకంగా జాలివారుతూ వుండడాన్ని రాంబాబు చూశాడు రాంబాబు చూశాడు బుజ్జిగాడు దీనంగా అవ్వడాన్ని కూడా తన భార్యకి పరాయి పురుషుడి స్పర్శ తగుల్తోందని అనుమానం ఈ తండ్రికి అందుకే భార్య మీద మండిపడుతున్నాడు పరాయి మగాడు కనపడగానే గుమ్మం అవతలకెళ్ళి తలుపు చాటున దాక్కోవాలి ఆడదన్నాక సరే మరి - బస్సులో అడుగడుక్కీ తలువులు గుమ్మాలు ఎక్కడివీ? బస్సెక్కేప్పుడే తేల్చుకోవాలి తన భార్య శరీరం మీద బస్సు దిగేవరకూ తనకేమీ అధికారం లేదని ఆ అధికారం ఎవరిదనేది ఆమె పక్కన్నిలబడేవాడి సంస్కారాన్ని బట్టి వుంటుందని
- బస్టెక్టిపోయింది + 75
బస్సు బైబ్టేరింది రాంబాబు దృబ్బ మరల్చాడు బుజ్జిగాడు తన చిన్న బుర్రతో చాలా పెద్దగా ఆలోచిస్తున్నట్టున్నాడు నీకందరికన్నా ఎవరంటే యిష్టం? అన్నాడు రాంబాబు వెంటనే అమ్మ అన్నాడు బుజ్జిగాడు రాంబాబు బుజ్జిగాడి తల మీద ముద్దు పెట్టుకున్నాడు రాంబాబుకీ అంతే అమ్మ తర్వాత? తర్వాత తర్వాత లిస్టులోకి యిష్టాల లిస్టులోకి అమ్మమ్మ బుజ్ఞాయిగాడు తాత మళ్ళీ అమ్మ గోళీలు వస్తున్నాయిగాని నాన్న రావటంలా మీ నాన్నంటే? అన్నాడు యిక ఆగలేక రాంబాబు సంతోషంగా వున్న బుజ్జిగాడి మోముపై చీకటిలా విషాదం మెదిలింది అందరికన్నా యిష్టంలేదు అన్నాడు బుజ్జిగాడు అంటే లోకంలో అందరికన్నా ఎక్కువగా తండ్రిని ద్వేషిస్తున్నాడన్నమాట బుజ్జిగాడు రాంబాబు మనసు జలదరించింది ఇంత చిన్న మనిషలో అంత పెద్ద ద్వేషాన్ని ఎలా ఎంతెంత కష్టపడి సంపొదించుకున్నాడో ఆ తండ్రి? అనుకున్నాడు పిల్లలు తమ తల్లిదండ్రుల్ని ఎక్కువ (ప్రేమిస్తారు మామూలుగా బుజ్జిగాడి తండ్రి మీది ద్వేషం చాలా అసహజం అయితే ఆ తండ్రి అంత అసహజాన్నీ సహజం చేశాడు మరి తండ్రంటే అంత ద్వేషం ఎందుకు అని బుజ్జిగాడ్నీ అడగలేదు రాంబాబు అతనికి తెలుసు ఆ ప్రశ్నలన్నీ వాడ్ని బాధపెడ్తాయి రాంబాబు దృష్టి తనకి రెండుసీట్ల ముందున్న వాక చిన్నాడి మీద పడింది వాడికి నాలుగేళ్ళుంటాయి. అ సీట్టోనే ఓ చిన్నది దానికి ఆరేళ్ళుంటాయి వాళ్ళిద్దరి మధ్యా వాళ్ళమ్మ అవిడకి పాతికేళ్ళుంటాయి చిన్నాడు చేతులు తిప్పేస్తూ కళ్ళని తిప్పేస్తూ తలని ఊపేస్తూ మాటల బాంబులు పేల్చేస్తున్నాడు తమ్ముడికి తోడుగా అక్క వాళ్ళమ్మ దిగ్భ్రమ కొల్పించేలా ఆశ్చర్యపడ్డూ - తన పిల్లలిద్దర్నీ చూసుకుని వాళ్ళు మాట్లాడే మాటల్ని వింటూ ఎంత ఆనంద పడ్తోందంటే లోకంలో కన్నతల్లులకి మాత్రమే తెలుస్తుంది ఆ సంతోషం తన శరీరంలోంచి వచ్చిన చిన్నిచిన్న మాంసపు ముద్దలు అలా అన్ని మాటలు అంత తెలివిగా మాట్టాడ్డం ప్రనివాడితనం ౨ అక్కినేని కుటుంబరావు 76
ఇంతమంది పిల్లల్ని చూసిందిగాని ఆ తల్లి తన పిల్లల్లాంటి సిసింద్రీల్ని ఎప్పుడూ ఎక్కడా పుట్టి బుద్దెరిగినాక చూడలేదనుకుంటోంది పిల్లల ముద్దుమాటలకి తననితను మర్చి పోయి ఆనంద సముద్రంలో మునకలేస్తోంది ఊపిరందనంత సంతోష పడిపోతోంది ఆహా పిల్లల్ని కన్న తల్గుల్లారా మీ జన్మే ధన్యం అనుకున్నాడు రాంబాబు బుజ్జిగాడు ఎవో వింతవింత రంగురంగుల కలల్లో తేలిపోతున్నాడు ఉగ్రేయ్ బుజ్జిగా మనూరొత్తంది దిగు దిగు అనే ఉరుము బస్సంతా మార్మోగింది రాంబాబు వళ్ళోంచి గబగబా దిగి అతని వంక ఎంతో స్పేహంతో చూస్తూ - ఈ నాన్న ఎందుకెప్పుడూ యిట్లా వుంటాడు? ఈ రాంబాబులాగా ఎందుకుండడూ? అనుకుంటూ - రాంబాబు నొదిలి వెనక్కి వెనక్కి చూసుకుంటూ బస్సు దిగాడు బుజ్జిగాడు బస్సెళ్ళిపోయింది స్వాతి మానవత్రిక
- బస్టెళ్టిపోయింది 4 77
నేరం
రౌజి ఫాషనబుల్‌గా కట్టుకొచ్చిన చీర గురించీ ఆవిడ గ్రే చేసుకున్న సెంటు గురించీ తన వ్యాఖ్యలన్నీ పూర్తిచేశాడు వెంకటేశం ఓపిగ్గా విన్నాడు సహోద్యోగి విరాస్వామి
ఆఅఖసు కొస్తుంటే బస్సు దొరక్కా దొరికిన బస్సులో ఎటు దొరక్కా తాను పడిన ఇబ్బందుల్ని వర్ణించి వర్షించి చెప్పి ఈ జగతిలోని సకల ఇబ్బందులకీ కారణమైన ఆ భగవంతుణ్ణి యిన్ని ఇబ్బందుల్ని కాకుండా వాటిలో కొన్నిట్నే ప్రసాదించమని వేడుకొని తన ఖర్మని తనలోతనే తిట్టుకుని శాంతించాడు హనుమంతు
రోజూలానే హలోలూ గుడ్ మాణింగ్‌లూ యధావిధిగా ఆఫీసుగదిలా పచార్లు చేశాయి
క్రమంగా ఆ హడావుడీ కోలాహలం అణిగి ఓ అరగంటవుతుండగా -
ఇద్దరు ఆఖసర్ల లాంటివాళ్ళు వేంచేసేరు ఆఖసులో కడుగెట్టి రొసెష్టనిస్టుతో 'మేనేజర్ గార్ని కలవాలి అన్నాడు కల్తీలేని ఇంగ్లీషులో
రాణి రిసెస్టనిస్ట్ హోదాలో తన మామూలు హొయలు ఒలకబోసి మేనేజర్‌గారితో ఇంటర్‌కం లో భాషించబోతూ మీరెక్కణ్ణించి వచ్చారో తెలుసుకోవచ్చా అంది అంత కల్తీలేని ఇంగ్లీషులోనూ
ఇద్దరు పెద్దమనుషులు ఆయన్ని కలవాలనుకుంటున్నారని చెప్పు అన్నారు ఆ యిద్దరిలో ఒకరు ఆ వివరాలు ఆయన్తోనే చెప్తాం అన్నారు రెండోవారు
రాణి తెలుగావిడే అయినప్పటికీ ఇంగ్లీషు మేనరిజంలు నేర్చుకుని ఉంది గాబట్టి ఎమిటో? అన్నట్టుగా రెండు భుజాలు ఎగరేసి కళ్ళు పెద్దవి చేసీ చిన్నవి చేఎ మేనేజర్‌తో మాట్లాడింది
మేనేజర్ ఎమని 'సెలవిచ్చాడో గానీ వెంటనే ఆస్ బోయ్‌ని పిలిచి అతని వెంట వెళ్ళమని వీళ్ళకు వీళ్ళని మేనేజర్ దగ్గరకు తీసుకెళ్ళమని అతనికి చెప్పింది
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 78
బాయ్ కొత్తగా ఉద్యోగంలో చేరాడు కాబట్టి ఎక్కడా మజిలీలు లేకుండా వీళ్ళని సరాసరి మేనేజర్ రూంకి చేర్చాడు ఎక్కణ్జీంచి వచ్చారు వీళ్ళు? అసలెవరీ పెద్దమనుషులు అని వాకబు చేసింది రాణి బాయ్ తిరిగి రాగానే కాని వాడు తెల్లమొహం వేశాడు అంతవరకూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగున్నారు ఆఖసులో తుఫాను వచ్చిన మవో సముద్రంలా అల్లకల్లోలమయిందిప్పుడు కారణం మరో పదినిమిషాల్లో ఆ వచ్చిన ఇద్దరు పెద్దమనుషులు సిఐడిలు అనే విషయం చల్లగా బయటపడడమే వాళ్ళు పోలీసులని నీకు ఎలా తెల్సిందీ అనడిగాడు ఒకడు రెండో సహోద్యోగిని వాళ్ళే చెప్పారు నేను పైలు తీసుకెళ్ళేసరికే మేనేజరుగారేమో వాళ్ళనేదో అడిగారు వాళ్ళు జేబులోంచి ఎవో కార్డులు తీసి చూపించారు మేనేజరుగారు వెంటనే నాతో కూల్‌డ్రింక్స్ తెప్పించమని ఆఫీస్ బాయ్‌తో చెప్పమని పంపేశారు అన్నాడు అతను అయితే వచ్చినాళ్ళు పోలీసులేనంటా అన్నాడు హనుమంతు వాడనేదేంటండీ వాళ్ళు పోలీసులే పోలీసులు కూడా కాదు పోలీసులకి పోలీసులు వీళ్ళు సిఐ డిలు అన్నాడు వెంకటేశం అందుకుని అన్నవాడు అపకుండా వాళ్ళ మొకాలు చూడగానే అనుకున్నా అసలా మొకాల్లో పోలీసుకళ కన్ఫడ్డూనే వుంది అని కూడా అన్నాడు హనుమంతు సహజంగా భయస్తుడు పైగా అమాయకుడు అ అమాయకత్వమూ భయమూ తెల్సిన వాడవటం వల్ల వెంకటేశం అతన్ని తరచూ హడలగొడ్డూ వుంటాడు అది అతనికి సరదా ఇప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని పోనివ్వదల్పుకోలా అందుకే పోలీసులు ఆఫీసులో కొచ్చారూ అంటే ఎవడి కొంపో నిలువునా మునిగిందన్నమాట ఎవడి పెళ్ళాం తాడో తెగటానికి సిద్ధమవుతోందన్నమాట _ అని కూడా సెలవిచ్చాడు హనుమంతు బాగా గాబరా పడిపోయాడు అయ్యయ్యో అపండి సోమీ ఆపండి నాకసలే భయమేసి ఛస్తున్నా ఇంకా హడలగొట్టకండి అయినా అసలీ పోలీసోళ్ళు మన ఆఖసు కెందుకొచ్చినట్టంటారూ? చెప్పాను గదయ్యా ఎవణ్లో తీసుకుపోటానికొచ్చారు దీన్లో సందేహం లేదు మన ఆఖసులో దొంగలెవరున్నారండీ అంటే పోలీసులు దొంగల్ని తప్ప ఎవర్నీ పట్టకోరంటావా? అన్నాడు అంతా వింటున్న వీరాస్వామి అది కాదండి దొంగలు కాకపోతే అలాంటివాళ్ళు ఎదో ఒక తప్పు చేసినవాళ్ళు అనుకోండి ఎడిసినట్టుంది నువ్వు చెప్పేది ఎదో ఒక తప్పు చేసినవాణ్లో దొంగతనాలు దోపిడీలూ చేసినవాళ్లో పట్టుకెళ్తే ఇక పోలీసుల గొప్పేం వుంది? ఎ తప్పు చేయని నీబోటోళ్ళని పట్టుకెళ్తేనే వాళ్ళకి కీర్తీ పత్రికల్లో పతాక శీర్షికలూనూ అని నవ్వాడు వెంకటేశం అంతే +ఈనేరంళ 70
జరగవలసిన ఘోరం జరిగిపోయింది హనుమంతు తనని పట్టుకెళ్ళటానికే పోలీసులొచ్చారని నిశ్చయం చేసేసుకున్నాడు ఊహ తెల్సినప్పట్నుంచీ అడుగో పోలీసు అంటే అడుగో బూచి అన్నట్టు పనిచేసిందళనికి బజార్న పనిమీద వెళ్తూ పోలీసు కన్పడ్తే ఎందుకైనా మంచిదని రూట్ మార్చేవాడు పోలీసు అనేమాట అతని మనసుకి పడేది కాదు మనుషుల్లోంచే పోలీసులొస్తారంటే అతని జ్ఞానం ఒప్పుకోదు పురాణాల్లో రాక్షసుల్లాగా ఇప్పుడు మనుషులూ పోలిసులూ విడివిడిగా గుర్తొస్తారతనికి హనుమంతు లేచి గబగబా లెట్రిన్ కెళ్ళొచ్చాడు అతనికి తన భార్య గుర్తొచ్చింది పిచ్చిది తనే పిచ్చాడనుకుంచే తనకన్నా పిచ్చిదది ఎట్లా బతుకుతుందో ఎమో తను లేకపోతే నలుగురు పిల్లల్ని పెట్టుకుని ఎట్లా బతుకుతుంది పుట్టిల్లు కూడా లేదు ఆమెకు ఎం చేయాలో తోచక మళ్ళీ వెంకటేశం దగ్గరకళ్ళి 'వెంకటేశంగారూ ఇందాక మీరన్న మాట నిజమేనా? అన్నాడు హనుమంతు అక్షరాలా నిజమే ఇంతకీ ఎ మాటా? అదేనండీ నన్ను పోలీసులు పట్టుకెళ్తారనేది ఊరుకోండి మిమ్మల్నెందుకు పట్టుకెళ్తారు అన్నాడు వీరాస్వామి ఎందుకు పట్టుకెళ్ళకూడదూ? అన్నాడు వెంకటేశం రెట్టిస్తూ ఆయనేమన్నా దొంగతనం చేశాడా? ఎమో ఎ దొంగతనాలూ చేయలేదనే పట్టుకెళ్తారేమో అదేమిటండీ అన్నాడు హనుమంతు మరింత వణికిపోతూ అదంతే లేవయ్యా ఉరుమురిమి మంగలం మీద పడ్తుందనే సామెత విన్నా ఈ పోలీసుల తంతూ అంతే ఎన్నో నేరాలు చేసినవాళ్ళు ఈ లోకంలో ప్రశాంతంగా బొజ్జలు సవరించుకుంటూ జీవిస్తుంటారు మనలాంటి అమాయకులే దొరుకుతారు వాళ్ళకి తీసుకు షోయి వాళ్ళకిష్టమైన నేరం ఒకటి మనం చేశామని చెప్పి మనతో ఒప్పించి బొక్కలో తోస్తారు అదీ సంగతి అంటూ వెంకటేశం చెప్పటం ముగించాడు కాని ఆ మాటలు వినే స్థితిలో లేడు హనుమంతు పోలీసులు పెట్టే టార్చర్స్ ఒక పక్కా దిక్కూ మొక్కు లేకుండా అయిపోయే పెళ్ళాం ఏల్లలు ఒకపక్కా అతని మనసుని గందరగోళం చేసేస్తున్నాయి అదే ఆఖసులో మూడేళ్ళ నుంచీ పనిచేస్తున్న విష్ణు పవార్ ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు అతని మనసు పరిపరి విధాల పోతోంది అతను వీళ్ళెవరితోనూ మాట్లాడకుండా మనసులోనే మధనపడుతున్నాడు బహుళా ఇవ్వాల్టితో నా పని సరి అనుకున్నాడు విష్ణు సనినాడితనం + అక్కినేని కుటుంబరావు 80
అతనలా అనుకోడానికి తగినంత విషయం వుంది మరి విష్ణు బొంబాయిలో పదకొండేళ్ళున్నాడు సామాన్యంగా బతుకుతుండేవాడు కానీ వ్యసనాలు ముదిరి ఆదాయం చాలక దొడ్డిదోవల్గ్లో పరుగులు తీసి అవీ చాలక భార్యను పట్టుకు ఎడించేవాడు ఇతనికి తెలిఎన యిద్దరు స్నేహితులు వారి భార్యల ద్వారా డబ్బులు సంపాదించటం యితనికి తెలుసు తెలవడమేమిటి ఇతనూ వెళ్ళి వచ్చేముందు కొంత డబ్బిచ్చి వచ్చేవాడు కూడాను ఆలోచించగా ఆలోచించగా ఇతనికి "స్నేహితులు చేసే పనిలో నీచత్వం కన్పడ్డం మానేసింది ఆరోజు - ముఖ్యంగా తాగి ఉన్నప్పుడు మరీనూ భార్యని డబ్బు తెమ్మని ఎడించేవాడు “నేనెక్కడ్నించి తేను ఎదన్నా ఉద్యోగం చూడండి చేస్తాను అంది ఆమె ఉద్యోగాలు తేరగా లేవు మరి నేనెక్కడ్నించి సంపొదించాలీ? మనసుంటే మార్గముండదా? ఆ ప్రభాకర్ వడేకర్‌ల భార్యల్ని చూడు ఛీఛీ వాళ్ళ జన్మ తగలడ మీకిలాంటి బుద్భలెప్పట్నించి వుడ్తున్నాయ్ ఎదో తాగి తందనాలాడుతున్నారనుకున్నానేగాని పెళ్ళాన్సి పదిమంది దగ్గరిక పంపి డబ్బు సంపాదిద్దామను కుంటున్నారని కల్లో కూడా అనుకోలేదు అంటూ నానా తిట్లూ మొగుడి తిట్టి అటువంటి మొగుడికి పెళ్ళాంగా ఉంటున్నందుకుగాను తనని తాను తిట్టకుందామె ఎ నుయ్యో గొయ్యో చూసుకుంటానుగాని పరపురుషుడి వేలు నా వంటి మీద పడనిస్తానా అని ఉగ్రరూపమెత్తింది ఆ వెంటనే అసలే చిరాకెత్తిపోయున్న విష్ణు ఆ మాటల్లో భార్య మీదపడి తన్నరాని చోట్ల తన్ని కొట్టరాని చోట్ల కొట్టి వదిలాడు ఫలితంగా ఆవిడ ఆ నిముషంలోనే చచ్చిపోయింది చచ్చిపోతూ చచ్చిపోతూ విష్ణువంక చూసిన చూవు మాత్రం విష్ణుని ఇప్పటివరతూ వదల్లేదు ఆ చూప్పు జీవితమంతా వదల్టు అతన్ని విష్ణు వెంటనే బొంబాయి వదిలేశాడు ఎక్కడెక్కడో తిరిగాడు మూడేళ్ళుగా ఇక్కడ పచ్దేస్తున్నాడు (ప్రైవేటు కంపెనీ కాబట్టి పెద్దగా క్వాలిఫికేషన్ల గురించీ సర్టిఫికెట్ల గురించీ పట్టించుకోలేదు వీళ్ళు పోలీసులెందుకొచ్చారో అర్థమయిందతనికి ఎలా వచ్చారో మాత్రం అర్థ్ధంకావటంలా ఇక్కడ నరమానవుడన్న వాడికి తన గురించి తెలవదు తను చేసినపని తెలవదు కాని ఈ పోలీసులు అసాధ్యులే అనుకున్నాడు విష్ణు పవార్ మౌనంగా ఆలోచిస్తున్నాడు మూటాముళ్లే సర్దేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాడు హనుమంతుగారి మనసు మనసులో లేదు అసలీ పట్నాలు తనకు పడవు అను కున్నాడు అందుకే బళ్ళారెళ్ళి బగ్రెల్ని మేపుకు బతుకుదామని అంతా సీద్ధం చేసుకున్నాడు +శనేరంళ రే
హాయిగా కాలవగట్టంటే బర్రెల్ని మేపుకుంటూ ఉంటే ఎ గొడవా లేక ఎంత హాయిగా ఉండే పని? ఈ కేశవరావాకడు తన ప్రాణానికి బళ్ళారంటయ్యా హైద్రాబాదు నొదిలి ఎక్కడైనాగాని బకికేం? బ్రతక్కేం అంటాడు కోరీ అబిడ్స్ పబ్లిగ్గార్హన్సూ రవీంద్రభారతీ రామకృష్ణా సపష్పా షహీన్ గోల్కొండ గండిపేట టాంక్‌బండూ ఇందిరాపార్కు యిలా చెప్తూ పోతాడు అయితే ఎమిటి? అంటాడు హనుమంతు ఎమిటేమిటి? అసలు జీవితమంటే ఎమిటి? జీవితమంటే బతకడం మరి బతుకంటే? బతకటమే కాదు బతుకంటే జీవించడం జీవించడమంటే అనుభవించటం అన్నీ చూడాలి అన్నీ అనుభవించాలి బళ్ళారిలో ఎముంది బళ్ళూ బరైలూనూ అయ్ ఊయ్ అంటూ ఢథమథఢమలాడించేసరికి హనుమంతు ఖామోష్ అయిపోయాడు బళ్ళారి ప్రయాణం వాయిదా వేసుకున్నాడు తను ఇవ్చుడేమయిందీ? బళ్ళారీ పోయింది బరెలూ పోయాయ్ భార్యాభర్తలు విడిపోయి పిల్లలు తలోదిక్కు అయిపోయి సిఐ డీలు *నేవచ్చారు ఇంకేముందిలే హనుమంతులో దు ఖమూ భయమూ పోటీపడి పెరిగిపోతున్నాయి అప్పుడే విష్ణు వవార్ లేచి చల్లగా బయటికెళ్ళాడు అతను వెళ్ళడం చూసి కాఫీ తాగొద్దాం వస్తారా? తల పగిలిపోతోంది అంటూ లేచాడు ఆనందరావు ఎవర్ని వస్తారా అన్నాడో ఎవరికీ తెలియకముందే తను వెళ్ళిపోయాడు వెళ్ళినవాడు కాస్త దూరం నెమ్మదిగా నడిచాడు అతని మనసులో ఆలోచనల ముందు ఎ సూపర్‌ఫాస్ట్ రైళ్ళూ పోటీ పడలేవు కొను మరి చేసేది దొంగపని ఈ జీతం ఎ మూలకి? తను గట్టిగా తాగితే సిగరెట్లకి సరిపోదు తనకున్న అలవాట్లు చాలా ఖరీదైనవి అందుకిక రాబర్ట్ చెప్పిన పని చెయ్యక తప్పలేదు పైగా పనీ పెద్ద కష్టమనిపించలా రాబర్ట్ ఎదో అడ్రసిస్తాడు తను కొన్ని దొంగనోట్లు తీసికెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా ఆ అడ్రస్‌కి చేర్చాలి అంతే అయిపోతుంది తన పని ఎంత ఈజీనో ఈ పనిచేస్తే ఆఫీసులో పగలంతా కష్టపడితే ఎంతొస్తోందో కనీసం దానికి రెట్టింపు ప్రతిఫలం దొరుకుతుంది సిఐ డీలు అనగానే ఆనందరావు పని బెటయిపోయింది కానీ గుండె నిబ్బరంళో కాసేవు కూర్చున్నాడలానే లేస్తే అంతా తన మీద అనుమానపడతారేమో ట్రాజడీ ఎమిటంటే ఇప్పుడు అతని జేబులో దొంగనోట్టున్నాయి సి ఐ డీలు వస్తే రెడ్ హాండెడ్‌గా పట్టుబడిపోతా ఉన్నమాట లేవడానికి కాళ్ళూ చేతులూ పని చెయ్యలా బుర్ర తికమక అయిపోయింది పనదాడితనం 4 అక్కినేని కుటుంబరావు 82
విష్ణు దేవుడల్లే లేచాడుగానీ లేకపోతే ఈనాటితో తన పని పూర్తయిపోయేదే అనందరావు ఆభఖసు నుంచి కాస్త దూరం వచ్చాక అటూ యిటూ చూసి యూరినల్స్ కన్నట్ట ఓ మూల కూర్చొని ఎవరూ తనని గమనించకుండా జేబులో నోట్లు తీసి గబుక్కున కిందపెట్టి దాని మీద కాస్త మట్టిపోసి ఎదో తుక్కూ ధూళీ చల్లి ఓ రాయి పడేసి లేచి కాస్త దూరం నడిచి చేతులు శుభ్రంగా దులుపుకున్నాడు
ఇక ఇప్పుడు ఆనందరావు ఎంత రీవీగా నడిచాడంటే అతను వచ్చేప్పుడూ వెళ్ళేప్పుడూ చూసినవాళ్ళెవరైనా సరే అతనూ యితనూ ఒకడేనని అనుకోలేరన్నమాట ఆనందంగా ఆఖసులోకి అడుగుపెట్టాడు ఆనందరావు
ఫోన్లో మాట్లాడే నారాయణరావు మన స్థితి ఉండవలసినంత హుందాగా దర్జాగా లేదు
అతనికి అసలు విషయం అంతు పట్టడంలా నిన్న రాత్రి తను చేసిన పని ఇంత త్వరగా బైటపడి పోయిందంటే అతనికి నమ్మకం కలగడంలా కానీ ఎదురుగుండా పోలీసు లొచ్చి కూర్చుంటే తన నమ్మకం ఎవడిక్కావాలి? అంటే మేనేజరు ముండాకొడుకు తన మీద ఓ కన్నేసి సమయం కోసం ఎదురు చూస్తున్నాడిన్నమాట స్టోర్సులోంచి తనెంత సకడ్చందీగా ఆ మెబన్ని దాటించాడు కానీ ఎం లాభం? బైటపడిపోయింది ఎలా బైటపడిందనేది అర్థం కావటంలా తనకి అర్థమైనా కాకపోయినా ఒకటే స్టోర్చులోంచి పదివేల రూపాయల విలువైన ఒక మెషిన్ పోయిందనెది బైటపడింది ఆ విషయం తనతో కనీసం ప్రస్తావించకుండా పోలీసుల్లో ప్రస్తావించాడన్నమాట ఈ మేనేజరు
పోలీసులొచ్చారు ఇవాళ్టితో తన పని సరి అంతే ఇంత పొజీషనూ పదనీ జీతమూ కారూ ఫోనూ క్వార్టరూ - అన్నీ చివరకు సంఘంలో తన పరువూ ప్రతిష్టా నారాయణరావుకి కంటనీరు తిరిగినంత పనయింది వెధవది పదివేలకి కక్కూర్తి పడ్డానే అనుకున్నాడు
అతనంతకు ముందు ఇంకా చాలా వాటికి కక్కుర్తి పడ్డాడు అయితే యిప్పుడు పట్టుబడ్డ్తున్నాడు కాబట్టి దీనికి కక్కుర్తి పడకుండా వుంటే సరిపోయేదనుకుంటున్నాడు
నారాయణరావు మెదడెంత దడదడతో నడుస్తోంది అతనికొచ్చే ఫోన్లూ ధణధణలాడ్డు న్నాయి దూరంగా అద్దంలోంచి వీరాస్వామి టైపు టకటకలూ హనుమంతు పిరికిచూపులూ వెంకటేశం వికటాట్టహాసాలూ ఆనందరావు దర్జా విష్ణు పవార్ ఖాళీ కుర్చీ రాణి వయ్యారాలు
మేనేజర్ ఆ సిఐడి లిద్దర్నీ వెంటబెట్టకుని వచ్చేడు
ఈమే లలితకుమారి అని పరిచయం చేశాడు ఒకామెను వారిద్దరికి లలిత నుంచుంది ఆఫీసుకొచ్చిన దగ్గర్నుంచి నీరసంగా వుంది రాత్రంతా నిద్రలేదు రైల్లో టిట్ బుక్ చేసుకోడానికి ఎప్పుడూ కుదరనట్టే రాత్రి కుదరలేదు పన్నెండుగంటలు ఒంటికాలి మీద నుంచుని ప్రయాణం ఈ రెండు రోజులూ సరైన తిండీ నిద్రా లేదు అయినా ఆమెకవి అలవాటే లలితకుమారి పాటలంటే ప్రజలకి ఎంత ఇష్టమో ఆ ఇష్టం చూసి ఈవిడ అలసట ఎగిరిపోతుంటుంది +అనేరంళ 83
లలిత పాడుతోంటే లలిత బృందం అందుకనుగుణంగా నటిస్తోంటే ప్రజలు ఉత్తేజితు లవుతుండేవాళ్ళు
లలిత తన సహచరుల్తో కలిసి పాడుతూ నటిస్తుంటే ప్రజలంతా తమ బాధల్నీ కష్టాల్నీ అంత చక్కగా చూపించే లలితన్నా ఆమె సహచరులన్నా విపరీతమైన స్పేహాన్నీ యిష్ట్రాన్నీ చూపెడతారు
వారు తమ కష్టాలకీ కన్నీళ్ళకీ కారణాలు లలితా వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నామను కునేవారు
అరకపట్టి పాలం దున్ని
కంచెకాడ మంచెకాడ
పాడికాడ పసులకాడ
మట్టికాడ ఎట్టికాడ
నాటుకాడ మోటకాడ
కోతకాడ మోతకాడ
ఎంత చేసినా ఎంత చేసినా ఎంత చేసినా
గట్టు మీద దొరోడు చెట్టు లెక్క నిలుసుండి -
ఆలి నుండి తల్లి దాక వావివరస లేకుండా
తిట్టుడేందిరా దొర కొట్టుడేందిరా
అని వారు అలోచిస్తున్నారు
కూలినాలి పేదోళ్ళం కలిసిమెలిసి ఉండాలె అనుకుంటూ అందుగ్గావల్సిన జ్ఞానాన్ని పొందుతున్నారు అందుకే లలితన్నా లలిత స్నేహితులన్నా వారికి యిష్టం
లలిత నీరసంగా అఫీసులో ఈ రెండురోజులుగా పేరుకుపోయిన పని పూర్తి చేస్తూ ఆలోచిస్తోంది ఈ ఆఖసూ ఉత్తరాలూ ఎవొచ్చినాయి ఎ ఉత్తరాలు పోయినాయి ఎ తారీఖు ఎ దస్తావేజూ ఎమిటీ అర్ధం లేని పని దేశం కోసం ప్రజల కోసం అంత పనుండగా ఎమిటి ఈ కాలక్షేపం అని ఆలోచిస్తుండగా -
మేనేజర్ ఇద్దరు “పెద్ద మనుషుల్నీ తీసుకొచ్చి పరిచయం చేశాడు ఆ యిద్దరు పెద్ద మనుషులూ తామడగబోయే కొన్ని ప్రప్టలకు సమాధానాలు చెప్పడానికిగాను లలితను తమతో రావల్సిందిగా కోరి ఆ ప్రకారమే లలితను బహు మర్యాదగా తీసుకుని వెళ్ళారు
సిఐ డీలు వచ్చి లలితకుమారిని అలా తీసికెళ్ళేసరికి హనుమంతుకి భయం తగ్గింది కానీ అతన్నిప్పుడో పెద్ద అనుమానం పట్టుకుంది
దొంగల్నో నేరస్తుల్హో పట్టుకోవాల్సిన పోలీసులు లలితకుమారిని పట్టకెళ్ళడమేమిటి? ఎందుకూ?
పనివాడితనం ౨ అక్కినేని కుటుంబరావు 84
లలిత అప్పుడప్పుడూ లంచ్‌టైంలో పాడే పాటలు అతనిగ్గుర్తొచ్చాయి అవిడ ఆ పాటలు పాడ్తోంటే పాడేదంతా నిజమేగదా అనుకునేవాళ్ళుగాదూ తామంతా
'పేదల్ని భూస్వాములూ కార్మికుల్ని పెట్టుబడిదారులూ దోచుకుంటున్నారనీ ఈ దోపిడీ ఎదురించేందుకు జనం కదలాలనీ చెప్పన్నందుకేనా లలితకుమారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు?
ఈ అలోచన రాగానే హనుమంతు ఒణికిపోయాడు తానూ లలితకుమారిలాగానే ఆలోచిస్తున్నాడు ఇలా ఆలోచించినందుకేగాదూ లలితకుమారిని పోలీసులు అరెస్టు చేసింది అనుకున్నాడు హనుమంతు
సరే చెయ్యనీ
కానీ పాపం లలిత ఎంతమంచి అమ్మాయి వీళ్ళు ఆ పిల్లని ఎన్ని చిత్రహింసల పాల్టేస్తారో? దుర్మార్గులు
లలితలాంటి చిన్నపిల్లలు తమ జీవితాల్ని యిలాంటి పన్లకి ఉపయోగిస్తుంటే నాలాం టాళ్ళు క్షణంక్షణం భయంతో ఛస్తున్నామన్నమాట - అనుకుని సిగ్గువడ్డాడు హనుమంతు
జీవితంలో చేయాల్సిందేదో తెల్సినట్టయింది హనుమంతుకి
మేనేజర్ స్టాఫ్‌తో అంటున్నాడు
ఎన్నిసార్లు చెప్పానో ఆ నాటకాలూ ఆ ప్రజాసేవా మానెయ్యమ్మా అని వింటేనా ఇప్పుడు చూడండి ఎమయిందో సిఐ డిలొచ్చి తీసుకుపాయ్యారా వాళ్ళ వరస చూస్తే ఈ అమ్మాయ్ చేసిన పన్లకి యిష్పుడిప్పుడే వదిలేట్టు లేరు ఇట్లాగే మనుషులు ఎందుకూ పనికిరాకుండా పోయేది అని బాధపడ్తున్నాడు
పనికి రాకుండా పోవడం అంటే ఇదేనా? అనిపించింది హనుమంతుకు
కానీ
యస్సార్ అని ఎకగ్రీవంగా వినిపించింది విష్ణు ఆనందరావు వగైరాల్నుండి అదే క్షణంలో ఎవుల 983 ఛఅనేరంశ 85్
ఆమధ్యోసారి కేశవరావు ఎనో నాటకాలూ అవీ వెయ్యటానికని టూర్ వెళ్ళి నెలకి తిరిగొచ్చాడు నాగరాజూ అని కొడుకుని పిలవగానే చిన్నసైజు తలమాసినవాడిలాగా కొడుకు 'ప్రత్యక్రమయ్యాడు ఈయన ప్రయాణబడలికంతా ఎగిరిపోయింది
నాగరాజు వంక జాగ్రత్తగా చూశాడు
మీసాలు కూడా కిందికి జారటం మొదలుపెట్టాయి ప్రమాద పరిస్థితిని పసిగట్టాడు 'క్రేశవరావు
వెంటనే నాగరాజు నో కుర్చీ తెచ్చుకుని కూర్చోమని - జుట్టు తల హృదయం బుద్ధీ మీసాలూ గుణాలూ హుందాతనం జులాయితనం వెకిలి వ్యవహారం నీట్‌నెస్ యిలా చాలా చాలా చెప్పి అర్ధమైందా అని అడిగాడు
అరగంటలో నువ్వే చూద్దూగాని యిక ఆపు నాన్నా అని నాగరాజు బైటికెళ్ళాడు నీట్‌గా శ్రాఫ్ చేయించుకున్నాడు రాజ్‌కపూర్‌లా మీసాలు
సంతృప్తిగా తల పంకించాడు కేశవరావు అతని కన్నుల్లో ఆనందం హృదయంలో గర్వం
క్యూలో ముందూ వెనకా ఒకటే గోలగా వుంది టైం చూశాడు కేశవరావు పదకొండయ్యి రెండు నిమిషాలయ్యింది మరో పదిహేను నిమిషాల్లో మల్లీశ్వరి చూస్తాననుకోగానే కేశవరావుకి హృదయంలోంచి ఆనందం సంతోషం కెరటాల్దాగా లేచాయి
అతనికి మల్లీశ్వరి సినిమాకెళ్ళిన ప్రతి ధియేటరూ ప్రతి సందర్భమూ గుర్తున్నాయి మొట్టమొదటిసారి రూన్సక్కతో వెళ్ళాడు ఆ సినిమా చూస్తూ అక్క పొందిన సంతోషం తనకిప్పటికి బాగా జ్ఞాపకం కేశవరావు హృదయం బాధగా మూల్గింది రూన్సక్క గుర్తుకు రాగానే ఇప్పుడు తనకన్నా రూన్సక్కే చిన్నది ఆ సినిమా చూసాొచ్చిన రెండు మూడు సంవత్స రాలకే అక్కకేదో జబ్బు చేసి చచ్చిపోయింది తనెంత ఎడ్చాడు? తన అక్క తన స్నేహితురాలు తనని అమితంగా ప్రేమించిన మనిషి చచ్చిపోయింది గదూ ఎన్ని పాటలు ఎంత చక్కగా పాడేది ఎంత అందంగా వుండేది కేశవరావు నెమ్మదిగా ఆ మూడ్‌లోంచి ప్రయత్న పూర్వకంగా బయటపడ్డాడు తర్వాత తర్వాతెప్పుడు చూశాడు మల్లీశ్వరి?
ఆ - కైకలూరు కుమారీలో ఎవరో పారేసుకున్న పది రూపాయలు తనకి దొరికి ఆ పారేసుకున్నతనికిస్తే అతను పావలా ఇచ్చాడు ఆ పావలా పెట్టి మల్లీశ్వరి చూశాడు అప్పుడు మొదటిసారి కన్నా బాగా అర్ధమైంది తను కూడా మల్లితో నాగరాజుతో కలిసి వాళ్ళు నవ్వితే నవ్వి వాళ్ళు ఎడిస్తే ఎడ్చాడు
తర్వాత గుడివాడలో అది ఎవరితో కల్సి చూశాడో గుర్తొచ్చి కేశవరావు మళ్ళీ బాధలో కెళ్ళాడు మూడోసారి అతనూ చౌదరీ కల్పి చూశారు అప్పుడు వీళ్ళిద్దరూ గొప్ప స్నేహితులు ఇద్దరిదీ ఒకే ప్రాణమన్నట్లు వుండేవాళ్ళు ఇద్దరూ లోకాన్ని కొత్త అర్థాల్లో కొత్త జ్ఞానాల్లో చూస్తున్నారు స్నేహం (్రేమా యౌవనం ఎమిటో తెలుస్తున్నాయి నరే ఎన్నో ఎళ్ళు అలా
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 88
గడిచి గడిచి చివరికి ఆమధ్య యిద్దరూ ఘోరమైన పరిస్థితిలో విడిపోయారు. అప్పుడు ఒక్క నిమిషమూ అతన్ని మర్చిపోని కేశవరావు ఇప్పుడు ఒక్క నిమిషం కూడా అతన్ని తల్చుకో కూడదు అనుకుంటాడు చాలా ఎళ్ళ తర్వాత మళ్ళీ అక్క తర్వాత స్నేహితురాలితో కల్సి మల్లీశ్వరి చూశాడు కేశవరావు కేశవరావూ సుగుణా మల్లీశ్వరి చూస్తూ చూశాక మల్టీశ్వరిలోని కృష్ణశాస్రిగారి పాటలూ రాజేశ్వర్రావుగారి సంగీతమూ భానుమతిగారి అభినయమూ యన్ టి ఆర్ అందమూ బిఎన్ రెడ్డిగారి దర్శకత్వమూ వీటన్నిటి గురించీ చెలికత్తె కమలాబాయి దగ్గర్నుంచీ ఎ ఒక్క వివరమూ పోకుండా ఎన్నిసార్లు ఎంత సంతోషంగానో మాట్లాడుకున్నారు ఇక వాళ్ళా స్నేహంతో బిరబిర చరచర పరుగున పరుగున వాగులు దాటీ వంకలు దాటీ పచ్చని తోటల విచ్చిన పూవుల్లా కొమ్మల మోగే కోయిల జంటలా మారిపోయారు ఇప్పుడసలు సుగుణతోనే కల్సి రావాల్సింది కానీ ఆవిడ అనుకోకుండా విజయవాడ వెళ్ళింది ఆ దిగుల్ని మర్చిపోవచ్చు ఈ సినిమాలోనని కేశవరావు ఒక్కడే వచ్చాడు వీళ్ళిద్దరికీ నాగరాజొక్కడు వాడు పొద్దున్నే ఫ్రెండు దగ్గరకని వెళ్ళాడు ఇద్దరూ కల్పొస్తే ఎంత బాగుండేది అనుకున్నాడు కేశవరావు టిక్కెట్లిచ్చే అతనొచ్చాడు టికెట్ దొరికింది కేశవరావుకి ఇంకా చాలా ఉన్నాయి అందరికీ దొరుకుతాయ్ అనుకొని సంతోషంగా గబగబా వెళ్ళి హాల్లో కూచున్నాడు హాలంతా గోలగోలగా వుంది ఎంత గోలగా వుందంటే అసలీ గోల మల్లీశ్వరి మొదలయ్యాక కూడా ఇలానే ఉంటుందా అన్నంత భయంగా వుంది అదే ఆలోచనల్లో పడిపోవటం - ఎవరితో మళ్ళీ మల్లీశ్వరి ఎప్పుడు చూశానూ? అని ఆలోచనలో పడిపోయాడు కేశవరావు ఆ నీరసుడితో నీరసుడు గుర్తుకు రాగానే కేశవరావుకి నవ్వు వచ్చింది నీరసుడి అసలు పేరు వేరే వుంది నీరసుడు ఎప్పుడూ నీరసంగా ఉండేవాడు అన్నీ నీరసంగా చెబుతుండేవాడు అన్నిటినీ అనుమానిస్తుండేవాడు వయసులో తన స్ప్నేహితులందరిలో చిన్నవాడు మంచివాడు నీరసుడూ తనూ కల్సి మల్డీశ్వరి చూసి బైటికి వొచ్చిన ఐదు నిముషాలకి మల్లీశ్వరి చూడాలి చూడాలి అంటూ మొదటిసారి చూసిన నీరసుడ్ని అడిగాడు కేశవరావు ఎలావుందీ? అని బాగుంది కానీ నేనో లోవం కనిపెట్టాను అన్నాడు నీఠరసుడు చాలా సంతోషంగా ఆ లోపంతో ఆ సినిమా తీసిన బి యన్ రెడ్డిగారి మీద ఆరాధనతో అతని కళ్ళు మెరిశాయి కేశవరావు చిత్రంగా చూశాడు నీరసుడి వంక మల్లీశ్వరి గురించేనా నువ్వు మాట్లాడేది అన్నాడు అవును బియన్ రెడ్డి తీసిన మల్లీశ్వరిలో అన్నాడు కేశవరావు +ఉవిలనలు 24 89
అవును భానుమతిగారున్న మల్లీశ్వరిలో అని సంతోషాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు నీరసుడు
ఎమిటా లోపం అన్నాడు కేశవరావు అతి ప్రయత్నం మీద సహనం తెచ్చుకుని
నువ్వు సరిగ్గా చూశావో లేదోగాని మళ్లీ నాగరాజు అడుకుంటారే ఆ బావి దగ్గర అక్కడ పచ్చగడ్డి వాళ్ళ చిన్నప్పుడెంత ఎలా వుందో వాళ్ళు పెద్దయ్యాక కూడా అంతే అలాగే వుంది అంతేకాదు అక్కడే ఒక గడ్డివామి ఉంటుంది అది కూడా వాళ్ళ చిన్నప్పుడూ సపెద్దప్పుడూ కూడా ఒక్కలాగే వుంటుంది అని ఒక విజయవంతమైన నవ్వు నవ్వాడు కానీ అది ఒక వెర్రి నవ్వులా కనబడింది కేశవరావుకి
ఓహో నువ్వు నిజంగా జీనియస్సువోయ్ నీరసుడా నీకివ్వాళ్ళి నుంచీ నీరసుడనే పేరు ముందు జీనియస్ అనే బిరుదు కూడా తగిలిస్తాములే నువ్వివ్వాల్సి నుంచీ జీనియస్ నీరసుడివి
అయితే మల్లీ నాగరాజూ రావీచెట్టూ తిన్నెచుట్టూ పాడుతూ ఆడుకుంటుంటే నువ్వు అక్కడ గడ్డి ఎంత ఎత్తున వుంది? అదింకా ఎన్నాళ్ళకు కోతకొస్తుంది? ఆ వామి ఎన్ని 'గేదెలకి వొస్తుంది? ఇదన్నమాట చూస్తున్నావు వాళ్ళు పెద్దవాళ్ళయ్యి భానుమతీ రామారావూ కృష్ణశాస్త్రిగారు ఎంతో మధురంగా రాసిన గీతాలకి అభినయం చేస్తున్నా ఘంటసాల అమృతాన్ని కురిపించినా రాజేశ్వర్రావుగారు ఎంతో అద్భుతంగా సంగీతం సమకూర్చి ఛాయాగ్రాహకులూ ఆర్ట్ డైరెక్టర్ఫూ టెర్సీషియన్లూ ఎంతమంది తమ శర్తులన్నీ పెట్టి కమునీయంగా చిత్రించినా మనకి మాత్రం పెరగని గడ్డీ తరగని వామి ఇదేనన్నమాట కనపడింది కేశవరావుకి అంటు కోవాలేగాని అతన్నిక ఎనరూ చివరికి తనను తను కూడా ఆపలేరు ఇతని మూడ్ చూసయినా ఆగవల్సింది నీరసుడు కానీ అతను జీనియస్ నీరసుడయ్యె ఎలా ఆగుతాడు?
అంటే తప్పుల గురించి మాట్లాడకూడదా?
నోర్మూయవోయ్ వచ్చాడు మాలావు మొనగాడు మల్లీశ్వరిలో తప్పులు పట్టుకోటా నికి మల్లీశ్వరిలోని మంచి అంశాల్ని గురించి మాట్లాడ్డానికి నీ జన్మ చాలదు ఇంక నువ్వు తప్పులు పట్టుకుంటావా? అసలు నేనెప్పుడూ ఆ గడ్డినే చూడలేదే పంది బురదకోసం వెతికినట్టు నీ కళ్ళు అడ్డమైన గడ్డి కోసమూ ఎందుకు వెతుకుతాయో?
నువ్వు చూడలేదంటే అది నీ తప్పు అటువంటప్పుడు అసలా గడ్జెందుకు పెట్టాలి సినిమాలో అన్నాడు నీరసుడు
సంగీతమూ సాహిత్యమూ మింగుడుపడని జంతువుల విరసం కోసం ఆ గడ్డి పెట్టంటాడు దర్శకుడు నిజంగా బి యన్ రెడ్డి గొప్పదనం నాకిప్పుడు మరీ స్పష్టమయింది ఇక మళ్ళీ ఎప్పుడూ జీనియస్ నీరసుడితో కల్సి కేశవరావు ఎ సినిమాకి వెళ్ళలేదు కేశవరావు మంచి మంచి సినిమాలు చూస్తాడు స్నేహితులకు చూడమని చెబుతాడు ఇతను చెప్పినా చూడని స్నేహితుల మీద అలుగుతాడు కోప్పడతాడు
ప్రనివాడితనం ౨ అక్కినేని కుటుంబరావు 90
లైట్లు ఆరిపోయాయి తలుపు లేసేశారు మల్లీశ్వరి మొదలయింది శేశవరావుకి పదోసారి మల్లీశ్వరి మీద నుంచి దృష్టి వెనక్కి మళ్ళింది ఇతని వెనక ఎవరో జులాయి వెధవలు చేరారు వాళ్ళకి మళ్లి నవ్వుతోంటే వెటకారం మల్లీ నాగరాజు మాట్లాడుకుంటుంటే వెటకారం పాటలు ఎపాటలు? ఘంటసాలా భానుమతీ రాజేశ్వర రావుగార్లు అమృతమయం చేసేసిన పాటలు వస్తుంటే కూడా వెటకారాలు చెయ్యటమే ఒకడు ఎదో కామెంట్ చెయ్యటం మిగతా ఇద్దరూ నవ్వటం సినిమాని ఆనందంగా చూస్తున్నవాళ్ళేమనుకుంటారోనన్న ఆలోచన లేదు పైగా వాళ్ళ తెలివినీ హాస్య ప్రియత్వాన్నీ మిగతా జనం మెచ్చుకుంటారని అనుకుంటున్నారులా వుంది ఒకటే నవ్వులు కేశవరావుకి తల పగలగొడ్డున్నట్ట్లుంది వాళ్ళ న్యూసెన్సుకి లేచి సీరియస్‌గా వార్నింగ్ యిద్దామునుకుంటే ఇంకా రెచ్చిపోతారేమోనని భయం పిలచిన బిగువటరా బెరా చెలువలు తామే వలచి వచ్చిన వెనక నుంచి కామెంట్ రానే వచ్చింది చీరలు వలిచి వచ్చిన బిగువుండదు అని మిగతా యిద్దరూ అతనో కల్సి పగలబడి కోడి కేర్తున్నట్టుగా నవ్వులు వాళ్ళ నవ్వులూ గోలల్లో మల్లీశ్వరి చివరి చరణంలోకి వొచ్చేసింది అందగాడ యిటు తొందర చేయగ తొందరటరోయ్ మళ్ళీ కేరింతలూ నవ్వులూ కేశవరావుకి లేచి బైటికెళ్చ్ళామా అనిపిం చింది వీళ్ళని లెక్కచెయ్యకుండా సినిమాలో లీనమవ్వాలని ప్రయత్నించాడు పధ్నాలుగోసారి వాళ్ళని చూడాలన్న కోర్కెని బలవంతాన అణుచుకుని సినిమాలో లీనమయ్యాడు మల్లిని రాణివాసం పంపుతూ అమ్మలక్కలు పోయిరావే తల్లి పాడుతున్నారు వెనకవాళ్ళని యిక ఎవరూ ఆపలేరన్నంత గోల చేస్తున్నారు సౌభాగ్యరాశివే మా భాగ్యలక్ష్మి అనగానే సగం మంది బిత్తరపోయేట్టు కేకలేశారు వీళ్ళు భాగ్యలక్ష్మీ లాటరీ టిక్కెట్ వెల ఒక్క రూపాయి అని ఒకడు బంగరు బంగరు లాటరీ భాగ్యలక్ష్మీ లాటరీ అని ఒకడూ గోలగోల చేశారు ఎవరే పిలిచే రల్లన మెల్లన? పిల్లన గ్రోవిని ప్రియా ప్రియా పాట వస్తోంటే వాళ్ళు ముగ్గురూ లేచి బైటికి వెళ్ళారు ఇక రాకుండా వుంటే బాగుండుననుకున్నాడు కేశవరావు అతనికి ఘోరమైన పశ్చాత్తాపంగా వుంది ఆ పూట ఆ సినిమాకొచ్చి అంత దరిద్రపు వెధవల దగ్గర కూర్చోవాల్పొచ్చినందుకు ఎవరే పరిచే రిసుక బయళుల మల్లెల శయ్యల ప్రియా ప్రియా కృష్ణశాస్రిగారి ఊహాలోకాల్లోకి మళ్ళీ వెళ్ళాడు ఇంటర్వెల్ యిచ్చారు జనం గోల మళ్ళీ మొదలు మల్లీశ్వరి చూస్తూ అంతంత గోలలు ఎలా చేస్తారు జనం అని ఆశ్చర్యపోతాడు కేశవరావు ప్రతిసారీ +అవిలువలు 24 సట్ నాపపపసపన పీ రే
మల్లీశ్వరి తర్వాత వేయబోయే సినిమా గురించి చూపించారు నలుగురు ఆడ కూతుర్లు ఒకావిడ చాలా సిగ్గుపడిపోతోంది ఇంతమంది జనానికి గోచి పెట్టుకుని కనబడటా నికి మరొకామె సంతోషిస్తోంది అంతే గోచి పెట్టుకున్నందుకు మరోకావిడైతే ఎమిటీ అచ్చాదనలు అన్నట్టు ముఖం చీదరగా పెట్టింది నాలుగో అవిడ తనకు అంతకన్నా పెద్దముక్క దొరకలేదని చూసేవాళ్ళని నమ్మమంటోన్నట్టు చూస్తోంది ఒక అడవిదున్నలాంటి ముసలి ఖడ్గమృగం ఆ నలుగుర్నీ కాళ్ళతోనూ చేతుల్తోనూ పట్టుకున్నాడు ఆ సినిమా పేరు చదవటానిక్కూడా మనస్కరించక కేశవరావు కళ్ళు మూసుకుని తల చేతుల్లో పెట్టుకుని సర్వం కోల్పోయినవాడిలా దిగాలుపడి కూర్చున్నాడు అతని మనసు నిండా దేశం జనం నంస్కృతి విలువలు గందరగోళంగా తిరుగుతుండగా మళ్ళీ మొదలయింది మల్లీశ్వరి ఊరి గుడిలో రావికావల నాటి వలపుల మాటలన్నీ నేలపాలైపోయెనే గాలి మేడలు కూలెనే అంటూ మల్లీశ్వరి బాధపడుతుంటే హాల్లో వున్న (్రేక్షకుల్లో బహుశా సగంమంది కన్నా ఎక్కువమందే బాధపడుతున్నారు వెనక మిత్రత్రయం ఎప్పుడొచ్చి కూర్చున్నారోగాని - ఛేయ్ చంవుతావేమే అని ఒకడు పెద్దగా కేకేశాడు ముగ్గుర్దోంచి ఆ కేకకి తననవ మానించినట్లు ఫీల్ అయిందా భానుమతి అన్నట్టు వెంటనే ఆమె మాయమయింది కరెంటు పోయింది జనం ఈలలేసి కేకలేసి కుర్చీలు టపటపా కొడుతున్నారు కేశవరావుకి దు ఖం కట్టలు తెంచుకు వస్తోంది లోపల్నించి ఎందుకు ఈ ప్రజలిలా వున్నారు? వాళ్ళ మీద కోపం రాబోతుండగా కేశవరావు తననితాను మందలించుకున్నాడు తనకి తెలుసు ఎ సంస్కృతి ఎ విషవు వాతావరణం ఈ దేశాన్నీ ఈ దేశ ప్రజల్నీ మంచి కళను ఆనందించలేని స్థితికి తీసు కొచ్చిందో ఎ వ్యవస్థ ఈ ప్రజల్ని తన విషపు కౌగిలిలోకి తీసుకుని ఎది మంచీ ఎది చెడ్డా అనే విచక్షణా జ్ఞానొన్ని సైతం తెలియని స్థితికి తెస్తుందో ఆ వ్యవస్థపై కోపం రావాలి జనం మీద కాదు వెనక ముగ్గురు వాళ్ళ ముఖాలు చూస్తే బాగుండుననే కోరికని పదిహేనోసారి అణఖుచుకున్నాడు కేశవరావు గోలగోలగా నవ్వుతున్నారు మనుషులకి నవ్వు ఒక వరం కదూ కానీ వీళ్ళ నవ్వులో ఎంత వెకిలితనం? ఎంత కసి? ఎవరి మీద అదంతా? శ్రీశ్రీ గేయం గుర్షొచ్చింది నీవు చూసే వెకిలిచూపూ నీవు తీసే కూనిరాగం మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు ఈ దుర్మార్గపు వ్యవస్థకు బలై దానినే వెక్కిరిస్తున్నారా వీళ్ళు పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 02
మూడు పశువులు... చాలా వికృతంగా కేశవరావు మనసులో నర్తిస్తున్నాయి.
ఇక లాభం లేదనుకుని పదిహేడోసారి తన కోర్కె నణచుకోలేక, లేచి ఆ మూడు పశువుల వంకా చూశాడు కేశవరావు.
అంతే - లేచినవాడు నిలబడలేకపోయాడు. ఎటూ నడవలేకపోయాడు.
అందుకే తన సీట్టోనే కూలబడిపోయాడు.
మల్లీశ్వరి పారవశ్యం అతని బుర్రలోంచి దిగిపోయింది.
మల్లీశ్వరి చూస్తూ వెకిలి కామెంట్స్ చేసిన -
మల్లీశ్వరి చూస్తూ పశువుల్లా ప్రవర్తించిన-
మల్లీశ్వరిని చూసి ఆనందిస్తున్నవారికి అపరిమితమైన అసహ్యాన్ని కలిగించిన ఆ ముగ్గుర్జోనూ...
ఇద్దరికి కేశవరావు కిష్టంలేనట్టే చెవుల్ని కప్పేసేలా జుట్టూ, మూతి మీద నుంచి వాలి పోయిన మీసాలూ ఉన్నా - మూడో అతను మాత్రం నీట్‌గా వున్నాడు. కేశవరావుకి నచ్చేట్టే వుంది జుట్టు.
కానీ - అతన్ని అ ముగ్గురు పశువుల్లో ఒక పశువుని తన పుత్రరత్నంగా, పైగా నాగరాజనే "పేరు గలవాడిగా గుర్తించేసరికి కేశవరావుకి ఎక్కడలేని నిన్సత్తువా కమ్మేసింది. తనక్సీ సుగుణకీ పుట్టినవాడు నాగరాజు. వాడు యిలా ఉన్నాడన్నమాట!
కేశవరావు కలలు -
అతని కళాత్మక హృదయం -
అతని విలువలు, అతని సంస్కారం అన్నీ కళ్ళముందే ధ్వంసం అవుతుంటే చూడ లేనట్టుగా తల పట్టుకుని అలానే కూలబడిపోయాడు కేశవరావు.
ఆంధ్రజ్యోతి నచిత్ర వారవత్రిక 2-3-1904
- వలువలు - 2 + రి
పిచ్చీ పిచ్చీ సిల్లంగోర్
ఉలిక్కిపడి లేచాడు రాంబాబు
వంటింట్లోంచి అమ్మ కవ్వంతో చల్ల చేస్తున్న చప్పుడు వినబడుతోంది
రాంబాబుకి తనెందుకు లేచాడో గుర్తొచ్చింది చేతులవంక చూసుకున్నాడు ఎండి పోయిన గోరింటాకు చేతులకీ తను అప్పటివరకూ పడుకుని వున్న పక్క మీదా
గబగబా వంటింట్లోకి నడిచాడు అమ్మ చల్ల చెయ్యడం అపకుండానే అప్పుడే లేచావేం ఇంకాసేపు పడుకో నాన్నా అంది
పడుకోను అన్నట్టు తల అడ్గంగా ఊపాడు రాంబాబు
తల ఊపుతూనే అమ్మ దగ్గర౭ళ్ళి అమ్మని వెనక నుంచి కావలించుకున్నాడు
శకుంతలమ్మ చల్ల చెయ్యడం ఆపి కొడుకుని ముందుకు తీసుకుని తల నిమిరి జుట్టు సవరించి చేతులు చూసి తొందరగా చేతులు కడుక్కుని రా ఎట్టా పండాయో చూద్దాం అంది
రాంబాబు కాసేపు తల్లి దగ్గర మారాం చేసి గబగబా వాకిట్లోకొచ్చాడు తెల్లగా తెల్లారినట్టుగా వెన్నెల వాకిలంతా దొడ్డంతానే గాక సత్తెంగాడిల్లూ సూరీడిల్లూ అనసూయిల్లూ రమా సుజాతల యిళ్ళదాకా అన్ని యిళ్ళూ శుభ్రంగా కన్పడుతున్నాయి
దొడ్లో తొట్టె దగ్గరున్న బీరచెట్టు పువ్వులు పూసింది ఆ వెన్నెల్లో బీరవువ్వులు ఎంతం దంగానో వున్నాయి కాస్త దూరంగా సారచెట్టు నేల మీద చాలాసేపు పాకి గొడ్డపాక మీది కెక్కింది పాఠక మీద నుంచి సార పువ్వులు తెల్లగా వెన్నెల్లో
పుట్టి బుద్ధెరిగినాక ఈ బాబు ఎప్పుడన్నా యింత పొద్దున్నే లేచాడా? అన్నట్టు మరీ తెల్లబోయి ఆశ్చర్యంగా చూస్తున్నాయి సారపువ్వులు
పనివాడితనం 4 అక్కినేని కుటుంబరావు గ?
రాంబాబు అన్నీ ఓసారి చూసి గబగబా దొడ్డో వున్న తొట్టె దగ్గరకళ్ళి తొట్లో వున్న చెంబుతో నీళ్ళు తీసుకుని రెండు చేతులూ శుభ్రంగా కడుక్కున్నాడు వెంటనే చేతులు చొక్కాకీ లాగూకీ తుడుచుకుని ఆ వెన్నెల్లోనే అరచేతుల్ని చూసుకున్నాడు
గోరింటాకుతో ఎర్రగా పండి వున్నాయి ఆ చిన్నారి చేతులు
బీరపూలు తలలాడించాయి
గబగబా పరిగెత్తిళ్ళి అమ్ము మొఖానికి దగ్గరగా చేతులుంచాడు
శకుంతలమ్మ కొడుకు చేతులు చూసి అబ్బ ఎంత బాగా పండాయో ఈసారి అందరికన్నానీ చేతులే బాగా పండి వుంటాయిలే అని కొడుకు అరచేతుల్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది కొడుకు కళ్ళలోకి చూస్తూ 'వెళ్ళి మొహం కడిగేసుకుని రా పులిహోర తిందువుగాని అంది
ఊ అన్నాడు గారాంగా రాంబాబు ఊ ఎంటీ? నీకిష్టమని గోంగూర పచ్చడి కూడా చేశా పెరుగేసుకుని పులిహార
తిందువుగాని మళ్ళీ మీ జతగాళ్ళంతా వచ్చేస్తారు అంది తల్లి
రాంబాబుకి వెంటనే జ్ఞానోదయమయింది
రాత్రి తను తన జతగాళ్ళతో అన్న మాటలు జ్ఞాపకమొచ్చాయి. అందరికన్నా ముందు నేనే లేచి పులిహార కూడ తినేసి పిచ్చీ పిచ్చీ పిల్లంగోరో అంటూ మన వీధిలో పిల్లలందర్నీ నేనే లేపుతాను అన్నాడు రాంబాబు
ఇవ్వాళ తెల్లారగట్ట తద్ది పిల్లలంతా దీన్ని పిచ్చీ పిచ్చీ పిల్లంగోర్ పండుగ అంటారు తెల్హారగట్టే లేచి పులిహార తిని వెన్నెల్లో పడి వీధివీధి తిరుగుతూ పిచ్చీ పిచ్చీ పిల్లంగోర్- తెల్లారింది లేవండోయ్ అని అరుస్తూ పిల్లలందర్నీ పోగేసుకుని వెన్నెల పోకుండానే రకరకాల ఆటలాడతారు రావిచెట్లకి గంగరావిచెట్లకి వేసిన పెద్దపెద్ద ఉయ్యాల లూగుతూ చాలా సందడిగా సంతోషంగా గడుపుతారు పిల్లలు ఒకరి మీద ఒకరు పోటీలు పడి పెద్దలు కూడా ఉయ్యాలలూగుతారు ్రతి వీధిలోనూ రెండు మూడు పెద్ద ఉయ్యాలలుంటాయి ఆ రోజంతా ఆడపిల్లలు ఆ ఉయ్యాలలూగుతూనే గడిపేస్తారు
రాంబాబుకి గుర్తొచ్చింది తన వీధిలో అందరికన్నా ముందు లేచి తనే అందర్ని లేపుతానన్న సంగతి
పరుగుపరుగున మళ్ళీ దొడ్లోకెళ్ళాడు గబగబా కచ్చిక తీసుకుని వళ్ళు తోముకోడం మొదలెట్టాడు
దూరంగా ఎదో కేక వినపడ్డట్టయి చెవులు రిక్కించి విన్నాడు అతని గుండెల్లో గుబులయ్యింది తన కన్నా ముందే ఎ కిట్టిగాడో లేచి పిచ్చీ పిచ్చీ పిల్లంగోర్ అంటున్నాడా అని కాని మళ్ళీ ఎ కేకా వినబడలేదు
మొఖం కడిగేసుకున్నాడు చొక్కాకే తుడిచేసుకున్నాడు వాళ్ళమ్మ ఎన్నిసార్లు తుండుతో తుడుచుకోమన్నా రాంబాబుకి చొక్కాతో తుడుచుకోవడంలోని ఆనందం తుండుతో తుడుచు
నీ వచీపిచ్సీ పిల్తంగోర + ర్తి
కుంటే కనబడడంలా తుండుతో శుడుచుకోవాలీ అంటే ముందు తుండెక్కడుందో చూడాలి దాన్ని దులపాలి దానితో తుడుచుకుని దాన్ని మళ్ళీ ఎక్కడో పడెయ్యాలి ఇదంతా ఎందు కొచ్చిన గోల చొక్కాని కాస్త లేపితే అన్ని పనులు చకచకా అయిపోతాయ్ అందుకే చేతుల్ని లాగూకీ మొఖాన్ని చొక్కాకీ తుడుచుకుని రాంబాబు వంటింట్టా౭ళ్ళాడు అమ్మా తొందరగా పెట్టవే కొంచెమంటే కొంచెం అన్నాడు గబగబా కొడుకంత తొందరెందుకు పడ్డ్తున్నాడో తెల్ఫు నవ్వుకుంటూ పులిహార గోంగూర పచ్చడితో కొంచెం ఒక పళ్ళెంలో వేసి కలిపి ముద్దలు రాంబాబు నోట్లో పెట్టింది రాంబాబు ముద్దముద్దకీ నీళ్ళు తాగుతూ ఇలా నీళ్ళు తాగకూడదని తల్లి చెప్పినా తొందర పనులు న్నప్పుడు రాంబాబు యిలానే చేస్తాడు ముద్ద నోట్లో పడగానే నీళ్ళు తాగితే అన్నమంతా నమలక్కర్లే మింగేయొచ్చు త్వరత్వరగా తిండి కార్యశక్రమం ముగించబోయాడు అరి పెరుగుతో కూడా రెండు ముద్దలు తిను నాన్నా అని శకుంతలమ్మ కొడుకుని పట్టుకుని కూర్చోబెట్టి వేరే తీసిపెట్టిన మీగడ పెరుగు తీసి కలిపి కొడుక్కి పెట్టింది రాంబాబు యింకో ముద్ద వుందనగానే లేచి పరుగుతీసేవాడి వరసలోకొచ్చేశాడు శకుంతలమ్మ కూడా లేచి వాడితో పాటే వాడి చొక్కా పుచ్చుకుని ఆపి ఆ చివరి ముద్ద వాడి నోట్లో పెట్టి గ్లాను నీళ్ళిచ్చి వాడి మూతి తుడిచింది మొకమూ చేతులూ కడుక్కున్నప్పుడు లాగూకీ చొక్కాకీ తుడవకూడదని కొడుక్కి చాలాసర్లే చెప్తుంది శకుంతలమ్మ కాని తన చేతుల్ని చీరకే తుడుచుకోవడం ఎవ్వుడూ మర్చిపోలేదు రాంబాబు దూసుకుని వీధిలోకి పోయాడు పోతూనే ఎచ్చీ పిచ్చీ పిల్లంగోర్ తెల్లారింది లేవండోయ్ అని రెండు కేకలేసేసరికే రెండిళ్ళవతల్పుంచి చిట్టిగాడొచ్చాడు ఇద్దరూ కలిసి రెండు కేకలేసేసరి! మూడిళ్ళవతల్పుంచి కిట్టిగాడు చంటిగాడు అలా అలా ఆ వీధి పిల్లలంతా మొత్తం పోగయ్యారు అందరూ కలిసి వీధిలో రెండు మూడుసార్లు అటూ ఇటూ తిరిగారు తర్వాత ప్రక్క వీధికెళ్ళి అక్కడివార్ని కలుపుకున్నారు అంతా కల్సి పాతికమంది దాకా పోగయ్యారు ఎవరి చేతులు బాగా పండినయ్యో ఎవరెవరు ఎమేమి తిన్నారో రాత్రి ఏమేమి ఆటలాడ్డూ వాళ్ళమ్మ పిలుపులకో నాన్న తిట్లకో జడిసి మధ్య వెళ్ళిపోయారో మాట్లాడుకుంటూ. వెన్నెల్లో తడుస్తూ ఇప్పుడు ఎం అడాలనే చర్చలోకొచ్చారు కుందుకుట్టాట అన్నాడు చిట్టిగాడు వాడు బాగా కుందుకుట్టాట ఆడతాడు చంటిగాడు ఆకాట అన్నాడు ఎ ఆకు తెమ్మన్నా చిటికెలో తేగల ప్రావీణ్యం వాడు సంపాదించాడు కాసేపు అదీ ఇదీ తర్జ్ణనభర్ణనలయ్యాక ముందు వెన్నెల పోకుండా 'వెన్నెల నీడ ఆడడానికి ఎక్కువ మంది మొగ్గారు వెన్నెలనీడ ఆడుతూ ఆడుతూ దొంగాట మొదలెట్టారు పనినాడితనం 4 అర్మినేని కుటుంబరావు 06
కిట్టిగాడు దొంగయ్యాడు
రాంబాబు చిట్టిగాడూ చంటిగాడూ సత్తెంగాడూ సూరీడూ అందరూ కోదండ రామయ్యగారి గొడ్డచావిట్లో దూరారు చావడి బైట పట్టపగల్లా వెన్నెల కాస్తోంది మూడువైపులా తాటాకుల్లో దడికట్టి వుండడంవల్ల లోపల గాడాంధకారంగా వుంది
వీళ్ళు చావిట్టోకెళ్తూనే గొడ్డమేత కోసమున్న గాడి లో కెళ్ళారు కాని ఎవరికి వారికి ఎందుకో ఎన్నడూ లేనిది భయమేసింది లేచి చావిట్టో పరుగులు తీసి ఎలిసి పక్కిబోయి మరీ భయమన్సించి బైట వున్న పెద్దపురి చాటున నిలబడ్డారు పెద్దపెద్ద రాళ్ళ మీద బండిచక్రం వేసి దాని మీద కట్టారు పురిని ఎలుకల బారి నుంచి కాపాడ్డానికి
కిట్టిగాడొస్తున్నట్టు కేక లిన్సడ్తున్నాయ్ వాడెటొచ్చి పట్టేసుకుంటాడోనని వీళ్ళు వురి చుట్టూ తిరుగుతుంటే వీళ్ళ ముందో వెనకో ఎవరో తిరుగుతున్నట్టుగా అన్పించి బాగా బెదిరి పోయారు పిల్లలంతా
రాంబాబు చిట్టిగాడూ కళ్ళు చిన్నవి చేసి తలలెగరేసి ఎమిటన్నట్టుగా వకర్షొకరు ప్రళ్నించుకున్నారు
అప్పుడు రాంబాబు చెప్పాడు అయిడియా అంతా కళ్ళతోనూ చేతుల్తోనే చిట్టిగాడు మరో ముగ్గురు వెనక్కి తిరిగి పురిచుట్టూ తిరుగుతారు. రాంబాబు మరో నల్గురూ ముందు నుంచీ పురిచుట్టూ తిరుగుతారు
తిరిగారు
ఆశ్చర్యంగానూ భయంగానూ వుంది
కంగారుగా వకతను పురి కిందికి దూరిపోయాడు
పిల్లలంతా వక్కసారిగా దొంగ దొంగ అని అరవడం మొదలెట్టారు
ఎల్లల్లో దొంగ కాదనీ ఆటదొంగ అసలే కాదనీ నిజమైన దొంగని పిల్లలు పట్టుకు న్నారనీ పెద్దలకు తెలిసేసరికి తెల్లగా తెల్దారిపోయింది
శా
కోదండయ్యగారిది చాలా పెద్ద దొడ్డి ఊరు సగం అక్కడే వుంది
దొంగని బండి చక్రానికి కట్టేశారు
గోవిందయ్యగారొచ్చారు
పట్టాభిరామయ్య రానేవచ్చాడు
నల్లాడు మొదట్నించీ అక్కడే వున్నాడు
తాటాకు దడి అడ్డంగా ఆడవాళ్ళు కూడా చాలామంది వచ్చేసి వున్నారు
ఇప్పుడు సూర్యనారాయణగారు కూడా వచ్చేశారు వస్తూనే అక్కడున్న అందర్నీ వాతావరణాన్నీ దడవతలగా వున్న ఆడవాళ్ళనీ వారి గుసగుసల్ని పట్టి వాళ్ళంతా అక్కడు న్నారని కోదండయ్యగారి దొడ్డినీ గొడ్డ చావడినీ కట్టుగొయ్యలకి కట్టేసి వున్న గొడ్డనీ చూశాడు
- పిళ్చీపిళ్చీ పిల్లంగోర్ + 9/7
ఎం బావా కొత్త గిత్తలు కన్పడ్తున్నాయ్ అన్నాడు నిన్న సందేళ మా బామ్మర్ది శికినాల నుంచి తోలుకొచ్చాడు బావా నీక్కబురంపితే నువ్వు లేవు పాలమెళ్ళావన్నారు ఇదిగో ఇవాళ యిదీ వరస అన్నారు కోదండయ్యగారు సూర్యనారాయణ మంచి హుందా అయిన మనిషి అందుకే అక్కడున్న యావన్మం దినీ బండిక్కట్టి వున్న మనిఎనీ దడవతలున్న ఆడంగుల్నీ అందర్నీ విస్మరించి గిత్తల దగ్గరకెళ్ళాడు ఒక గిత్త పిర్ర మీద ఒక దెబ్బ వేశాడు ఆ దెబ్బ మోతకి అక్కడున్నవాళ్ళంతా అదిరి పడ్డారు గిత్త సరేసరి అది గిరుక్కున వెనక్కి తిరిగి సూర్యనారాయణ్ని కూడా పరామర్శించ బోయింది అప్పటికే దానికందనంత ఇవతలకొచ్చి భేష్ మంచి ఛలాకీజోడులే బాగుంది అన్నాడు అప్పుడు మళ్ళీ అందరివంకా చూశాడు ఆయనకి వెండితీగల మీసకట్టు పెద్దదే వుంది అది అంత పెద్దగా వుంది కాబట్టే మీసాన్ని ఓసారి సవరించుకుని - ఊ అన్నాడు రెండు గంటలపాటు అవతలవాళ్ళు చెప్పగా చెప్పగా వినివినీ అలిసీపోయినట్టున్న ఊ అది ఊ అంటూనే అందర్నీ వదిలి బండి దగ్గరగా వెళ్తూ నీ పేరేంట్రా అబ్బాయ్ అన్నాడు ఆ అబ్బాయ్ పేరు చెప్పే టైం కూడా ఇవ్వకుండానే - ఎ ఊరు? అన్నాడు దేనికీ జవాబిచ్చే వ్యవధినివ్వకుండానే పిల్లల్నుద్దేశించి మీరంతా ఎందుకురా యిక్కడ? పిల్లంగోర్ పండుగాయే పోయాడుకోండి ఎందుకిక్కడ? అని కసురుకుని - అడిగిందానికి జవాబు చెప్పవేరా? అన్నాడు అంటూనే ఎందుకో వంగుతున్నట్టు వంగుని చెప్పు తీసుకుని అతని మీద పడి చెడామడా ఛెళ్‌ఛెళ్‌న నాలుగుసార్లు ఆ దవడా ఈ దవడా పగిలిపోయేట్టు కొట్టాడు దడవతల ఆడవాళ్ళు తలలన్నీ దడి మీదగా పెట్టి బిక్కచచ్చిపోయి చూస్తున్నారు పిల్లలంతా ఊపిరందనంతగా భయపడిపోయారు దొడ్డోనే ఉన్న వేపచెట్టు మీదున్న పక్షులు ఒక్కసారిగా రెక్కలు కొట్టుకుంటూ రకరకాల కూతలతో ఎగిరిపోయాయ్ చావిట్లో పపవులన్నీ వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూస్తున్నాయ్ చెప్పు అని ఓ భయంకరమైన రంకె వేశాడు సూర్యనారాయణ అప్పటివరకూ అక్కడక్కడ నుంచుని వున్న పెద్ద మనుషులంతా సూర్యనారాయణ దగ్గరకొచ్చి చుట్టూ నుంచున్నారు సూర్యనారాయణ అతనివైపు కోపంగా చూడడం చాలించి నెమ్మదిగా చూస్తూ చెప్పు నీ పేరేంటి? అన్నాడు పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 098
నా పేరు సత్యం మాది అని అనుమానంగా ఆగిపోయాడు సత్యం మా ఊరే అంటూ అంతమంది మధ్యలోకీ వచ్చేసింది సత్యవతమ్మ అప్పుడు ఆ ఊరి వారందరి మీద ఆకాశమే విరిగిపడింది అ ఊరి చరిత్రలో దడో కతలుపో గోడో అడ్డం లేకుండా ఒక ఆడది మగాడి ముందు పడడం అనేది లేదు ఇక్కడ ఒక మగాడు గాదు ఊరి 'మొవాసు లంతా వున్నారు పైగా ఒక దొంగని వెనకేసుకుని అందరికీ అర్ధమైంది అతను మామూలు దొంగ కాదు అతనొచ్చింది మామూలు దొంగతనం కోసం కాదు ఆ ఊరి పరువు ప్రతిష్టల్ని దోచెయ్యడానికి అ ఊరి మానాభిమానాలు మంటగలపడానికి ఆ ఊరి ఆడవాళ్ళందరికీ మాయని మచ్చ తేడానికి ముందు తేరుకున్న సూర్యనారాయణ మంగలి కోటప్పని వెంటనే తీసుకురండి ఇక్కడున్నట్టు రావాలి అన్నాడు నల్లాడు వెంటనే బైబ్దేరాడు వాడు చేతులూపుకుంటూ వస్తాడేమో వాడి పెట్టి తెచ్చుకోమను సూర్యనారాయణ సత్యంవంక తిరిగాడు సత్యం ఎదో చెప్పబోతున్నాడు ఎం చెప్తాడో విందామని ఊరంతా సద్దుమణిగింది సూర్యనారాయణ తల కాస్త పైకి లేపాడు చెయ్యి సత్యం మొఖంవేపుకి లేపి చూపుడువేలుతో బెదిరిస్తూ మాట్టాడమాక అన్నాడు అతను మళ్ళీ ఎదో అనబోతే బతికుండాలనుకుంటే చచ్చినట్టు పడుండు అన్నాడు అతనికి బతికుండాలని లేదేమో అవును చచ్చినట్టు పడి బతికుండాలని లేదు ఇది ఊరా? వల్లకాడా? అన్నాడు నేను చెప్పేది వినండి అని కూడా అన్నాడు సరే సరే చెప్పనివ్వండి బావగారూ ఎం చెప్పాడో అదీ విందాం అన్నాడు పట్టాభి రామయ్య సత్యం చెప్పడం మొదలెట్టాడు సత్యమూ సత్యవతీ చిన్నతనమంతా కలిసి ఆటపాటల్లో గడిపారు కాస్త ఎదిగాక కల్సి బడికి వెళ్ళారు వస్తూనే కల్సి కూర్చుని చదువుకున్నారు క్లాసు పుస్తకాలూ తర్వాత తర్వాత చందమామలూ బాలమిత్రలూ కల్సే లెక్కల్లో కుస్తీలు పట్టారు కరివేపాకు తేవడం నుంచి కారానిక్కాపలా వరకూ కల్సే చేసేవాళ్ళు ఇంకాస్త పెరిగాక కల్సి కలలు కన్నారు కాని - కలలన్నీ కల్టలయ్యాయి ఈ ఊరతన్తో బలవంతంగా పెళ్ళి జరిపించాడు సత్యవతి తండ్రి సత్యానికి మనసు దేని మీదా నిలవక ఎ పనీ చెయ్యలేక ఊళ్ళుబట్టి పోయాడు న ఎస్తపిల విల్తంగోర నే
ఎక్కడో ఎవరో కనబడి చెప్పారు. నీకు తెలుసా? మీ సత్యవతి భర్త పోయాడు అవి ఆమెని ఓదార్బాలని అప్పటికప్పుడు బైబ్టేరి వచ్చాడు సత్యం వచ్చాక చూసి మాట్లాడాక సత్యాని కన్పించింది ఇంతకుముందు సత్యవతికి తన అవసరం వున్నా లేకపోయినా యిష్టుడు తప్పక తన అండకావాలి తామిద్దరూ కల్సి బతకాలి ఇంతవరకూ చెప్పి సత్యం అన్నాడు మీకెవరికీ కష్టం కలక్కుండా నేనీమెని మీ ముందే పెళ్ళి చేసుకుని తీసికెళ్తాను ఆ బండికి కట్టివెయ్యబడి వున్న వాడు మామూలు దొంగ కాదని అంతకుముందే తెలిసినా యిప్పుడు అతను తమలాంటి మామూలు మనిషి కూడా కాదని ఈ ఊరికేగాక మొత్తం మానవ సమాజానికే చీడపురుగనీ అభిప్రాయపడ్డారు అక్కడున్న పెద్దలు గోవిందయ్య తల్లో మెరుపు మెరిసింది అయితే నీ పేరేంటో అన్నాడు ఎవరో సత్యం అని అందిచ్చారు అదేలే అయితే సత్యమూ నువ్వు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానంటున్నావు మరి గేదెల దొడ్గోనూ పురి కిందా ఎందుకు తారట్లాడతన్నావూ? అన్నాడు ఊరందరూ ఎంత అద్భుతమైన పాయింట్లు మర్చిపోయామో గదా అని చాలా విచార పడ్డారు సత్యం అన్నాడు అది నిజంగా పొరపాటే కాని ఎం చెయ్యను సత్యవతి ఎవరన్నా చూస్తారని బాగా భయపడింది భయపడక్కర్లేదన్నా వినలా తెల్లారేవరకూ వుండి వాళ్ళ అత్తమామల్ల్తో మాట్లాడతానన్నా విన్లా అంతలో పిల్లల కేకలు విని నన్ను వారిపొమ్మనీ లేపోతే తాను అల్లరి అయిపోతాననీ ఎడవడం మొదలెట్టింది గత్యంతరం లేక పిల్లల్ని తప్పించుకో డొనికి నేను ఆ చావిట్లో కెళ్తే వాళ్ళు అటే వచ్చారు నేను కంగారుపడి కింద దూరాను అదంతా చాలా అనాలోచితంగా చేశాను మంగలి కోటప్ప వచ్చి వున్నాడు సూర్యనారాయణన్నాడు - చెప్పినంతవరకూ అరికత బాగానే వుందిగానీ యిక సరిపెట్టు ఉరే కోటప్పా యిదిగో ఈడి తల గొరుగు అన్నాడు ఎమిటీ అన్యాయం ఇది ఊరేనా? అన్నాడు సత్యం ఆవేశంగా ఊరు కాబట్టే అన్నాడు సూర్యనారాయణ శాంతంగా అని చూత్తావేంటిరా అని కోటప్ప వంక ఉరిమి చూశాడు కోటప్ప గబగబా సత్యం దగ్గరకెళ్లి కదలమాక బాబో కదిల్తే గాయమవుతుంది అని సత్యం తలపట్టుకుని వెంట్రుకలన్నీ పూర్తిగా తీసేశాడు దీనిక్కూడా గుండు గొరుగు అన్నాడు సూర్యనారాయణ ఆడవాళ్ళంతా మళ్ళీ రకకాల గుసగుసల్లో పడ్డారు స్రనివాడితనం 4 అక్కినేని కుటుంబరాను 100
సత్యవతమ్మ చప్పున తల వంచుకుని సత్యం పాదాల దగ్గర కూర్చుండిపోయింది దీనికసలు ఆ కావుడు పోయినప్పుడే గుండు కొట్టించాల్సింది అన్నాడు నల్తాడు నల్గాడి కసీ యిప్పటికి తీరుతోంది నల్గాడు సత్యవతమ్మని భర్తపోయిన పదిహేనో రోజు నుంచీ కారాడ్డ్తున్నాడు సత్యవతమ్మ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తప్పించుకుంటూ వుంది ఊళ్ళో ఎవరన్నా అనాధలున్నారంటే వాళ్ళకి నల్గాడు నాధుడవ్వాల్సిందే వెనకబడిన కులా మతాల ఆడవాళ్ళనీ ఆర్థికంగా చితికిన సంసారాల్లో వున్న ఆడవాళ్ళనీ భర్తలు పోయిన ఆడవాళ్ళనీ చెండుకు తినడంలో గణుతికెక్కినవాడు నల్లాడు ఈ నల్హాడు సత్యవతమ్మని ఎంత వేధిస్తున్నాడంటే సత్యవతమ్మ వీడి పోరు పడలేక రెండుసార్లు చచ్చిపోదామని కూడా ప్రయత్నించింది బాగా చెప్పావ్ అన్నాడు గోవిందయ్య గోవిందయ్య ఆ ఊళ్ళో ఎంతమంది మొగుళ్ళ చేతుల్లో చావు దెబ్బ తిన్నాడో లెక్కే లేదు సత్యవతమ్మకి గుండు చెయ్యడానికి కోటప్ప మనసంగీకరించలేదు చూత్తావేరా అన్నాడు పట్టాభిరామయ్య పట్టాభిరామయ్యకి కోడల్లో అక్రమ సంబంధం వున్న విషయం కొడుకుతో సహా అందరికీ తెల్పు ఇప్పుడు పట్టాభిరామయ్య భుజం మీదవున్న మనమడు మనమడు కాదనీ చిన్నకొడుకనే విషయం కూడా చాలామందికి తెలుసు ఆ చాలామందిలో కొడుకు కూడా వున్నాడు కోటప్ప కత్తి సత్యవతమ్మ నెత్తి మీద పెట్టాడు అతని చెయ్యి వణికింది సత్యవతమ్మ తల మీద చిన్న గాటుపడింది ఆవిడ మంచితనం ఆవిడ పాతివ్రత్యం ఆవిడ సౌశీల్యం అన్నీ కోటప్పకి తెలుసు ఈ ఊరిలో వేళ్ళమీద లెక్కించవలసిన ఆడవారిలో సత్యవతమ్మ మొదటిశ్రేణీలోకొస్తుంది అంత మంచావిడకీ గతా? అనుకుంటున్నాడు కోటప్ప తప్పు చేసినందుకు అలా గుళ్ళు గియ్యవల్సి వస్తే ఇక్కడున్నవారిలో వక్కరికి కూడా నెత్తిమీద జుట్టు వుండదు అనుకున్నాడు కోటప్ప ఊరివారి రహస్యాలన్నీ బహిరంగరహస్యాలే బహుశా సూర్యనారాయణ ఒక్కడే రెండో ఆడమణిసి నెరగడు అనుకున్నాడు కోటప్ప కాని కోటప్పకి తెలవని సంగతొకటుంది భార్య కాంతమ్మకి నూటయిదు డిగ్రీల జ్వరమొచ్చినా సూర్యనారాయణ పక్క మీంచి అవిడకీ విముక్తి లభించదు కటిక లంఖణాల్లో వున్నా కాంతమ్మ శయనేషు రంభలా వుండాల్సిందే మంత్రి పదవీ తల్లి పదవీ ఎమీ లేవు రంభ దాన ఈ రెండు పదవులూ ఎ నిమిషమూ ఎన్ని ఇబ్బందుల్లోనూ ఎమరకుండా నిర్వహించాల్సిందే అదీగాక అసలు సూర్యనారాయణకి వేరే అడవాళ్ళతో సంబంధాలు "పెట్టుకోవాలంటే రెండురకాల భయాలున్నాయి. ఒకటి డబ్బు - డబ్బు పోతుందేమోనని ౩ బ్బు- జబ్బులొస్తాయేమోనని యర్ ద్దాల ప్రై
- ఎచ్చీపిళ్చీ పిల్లంగోర్ + న్.
- (అ(ం 818/9 సళ. రో
ఈ కారణాల వల్ల ఈ ఊరి జనాల్లో సూర్యనారాయణ పెద్ద పవిత్రుడిగా పేరు పాందాడు
కోటప్ప రెండు మూడుచోట్ల చిన్నచిన్న గంట్లు పెట్టి ఇక సాల్లే దొరా అన్నాడు
దొరలెవరూ మాట్లాడక ముందే దడవతల నుంచి పట్టాభిరామయ్య బహిరంగ కోడలు బహిరంగ రహస్య ప్రియురాలు అయిన సావిత్రి మాత్రం తనకు చాలా అన్యాయం జరుగు తున్నట్టుగా లబలబలాడి ఊరు పరువు తీసేసింది. ఫలానా ఊళ్ళో. అంటారు గామాల్ను అని తీగలు తీసింది
అవున్తల్లీ ఇంత తెలివితక్కువగా ఉంటారా ఎవరన్నా నువ్వు సూడు మామకి పిల్లాడ్ని కని కూడో ఒక్క మాట అన్పించుకోకుండా ఎలా వున్నావో అనుకున్నాడు కోటప్ప
ఓసి నీయమ్మ నీ సంగత్తెలవందెవడికే అనుకున్నాడు అక్కడున్న ప్రతి మగవాడు
మామ ధూర్తత్వమూ భర్త అలసత్వమూ సావిత్రినలా తయారుచేసినప్పటికీ వాళ్ళిద్దరి కన్నా సావిత్రినే జనం అవహేళనగా అనుకుంటున్నారు
అసల్సంగతేమిటంటే సత్యవతమ్మగ్గానీ ఆమె మామగారిగ్గానీ పైసా ఆస్తిలేదు కూలీ మీద అధారపడి బతుకుతున్న గొప్పకులం వాళ్ళు వీళ్ళు డబ్బుంటే ఆ సంగతి వేరు అవినీతుల్ని కూడా అవే నీతుల్లా చెలామణి చెయ్యగల సత్తా డబ్బుకుంది మరి పట్టాభిరామయ్య సావిత్రిల విషయం అక్కడున్న అందరికీ తెల్సినా పట్టాభిరామయ్యకిష్టం లేకుండా కోటప్ప ఆయన తల మీద ఒక్క వెంట్రుక కూడా తియ్యలేడుగా
సత్యవతమ్మ మామ ముసలాయన - పక్కవాళ్ళతో అంటున్నాడు ఇక చాల్లే ఊరుకోండి వదిలెయ్యండి అళ్ళ తిప్పలు ఆళ్ళు పడతారులే అని
అ మాట పదిమంది చెవుల్గోనూ పడకుండానే సత్యవతమ్మ బావగారు తండ్రిని కాల్చేసేట్టు చూసి నోర్మూసుకో ముసలాడా మతి చెడిందనుకుంటారు. అన్నాడు
చూత్తావేర జానిగ్గాడ్ని పిల్చి నీగ్గుండు కొట్టించమంటావేంటి? అన్నాడు పట్టాభి
రామయ్య
సగంమంది నవ్వారు మిగిల్న సగం కోప్పడ్డారు
వణుకుతున్న చేతుల్లో కోటప్ప సత్యవతమ్మ జుట్టంతా తీసేశాడు
నలాడు సున్నం తెచ్చి యిద్దరి తలల మీదా సున్నంబొట్లు పెట్టాడు
పిల్లలంతా ఎం జరుగుతుందో చూడ్డమే తప్ప ఎందుకు జరుగుతోందో తెలియని అయోమయంలో వున్నారు
గోవిందయ్య న్నాడు పిల్లల్లో - అరేయ్ ఈళ్ళిద్దర్నీ రాళ్ళతో గెడ్డల్తో కొట్టుకుంటూ ఊరవతలకి తరిమి రండీరా
ఒకళ్ళిద్దరు పిల్లలు నెమ్మదిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయారు కొందరు మనుషుల్లాగే
పెద్దా చిన్నాగాని కోతిగాడు మాత్రం వాళ్ళమీద ఒక రాయి వేశాడు పెద్దలంతా సభ చాలించి లేచారు
సనివాడితనం + అక్కినేని కుటుంబరావు 102
వాళ్ళిద్దరూ తలలొంచుకుని బజారులో నడుస్తున్నారు కోతిగాడూ పరివారమూ వుండుండి ఒకటీ రెండు రాళ్ళు గడ్డలూ వేస్తూ వెంబడించారు నెమ్మదిగా పిల్లలకి ఉత్సాహం వచ్చింది వాళ్ళు ఎమీ అనకుండా తలలొంచుకు నడుస్తూంటే - ఇద్దరూ వంచిన తలలెత్తలా ఊరు మూర్కత్వానికి సిగ్గుపడా? ప్రజల పశుత్వానికి విస్తుపడా? దుర్మార్గానికి మౌనం పాటిస్తూ - వాళ్ళిద్దరూ శ్మశానాల్లోంచీ అలాగే తలలాంచుకుని నడుస్తూ వూరు వదిలి వెళ్ళిపోయారు షి ఇప్పుడు ముప్ఫై సంవత్సరాల తర్వాత కూడా రాంబాబుకదంతా గుర్తొచ్చింది సిగ్గుతో దు ఖంతో అవమానంతో అతనికదంతా మళ్ళీమళ్ళీ గుర్తొస్తోంది ఇతనూ అప్పుడు ఆ రాళ్ళతో కొట్టిన పిల్లల్లో నడిచాడు తనెందుకుండాలి వాళ్ళతో? తనకప్పుడు ఎడెనిమిదేళ్ళుంటాయేమో తనంతవాడే కదూ చిట్టిగాడు వాడు తమతో రాకుండా యింటికెళ్ళిపోయాడు ఆ మాత్రం సంస్కారం తనకెందుకు లేకపోవాలి? తను చేసిన పాపానికి పరిహారంగా (ప్రాయశ్చిత్తంగా తను ఎం చెయ్యాలి? వాళ్ళలాంటి (ప్రేమికుల్ని ఎటువంటి కష్టాల్లో వున్నా ఆదుకోవాలి ఆదరించాలి అభిమానించాలి ఆలోచి స్తున్నాడు రాంబాబు సరే అసలిప్పుడు వాళ్ళెక్కడున్నారు? వాళ్ళు ఆ తర్వాత చాలా అన్యోన్యంగా (ప్రేమతో జీవితం గడిపి వుంటారని కాసేపు కలలు కన్నాడు లేదా ఢేమ మామూలైపోయి మామూలు భార్యాభర్తల్లా చికాకుల్లో చీదరల్ల్తో ఒకర్నొకరు హీంసించుకుంటూ బతుకుతుంటారా అని దిగులుపడ్డాడు లేదా అంతకన్నా హీనంగా ఘోరంగా ఆమెని అతను మోసం చేసో లేదా ఆమే అతన్ని మోసం చేసో ఎలాగన్నా వుండనీ వాళ్ళకి (ప్రేమ తెలుసు వలపెరుంగక బ్రతుకుట కన్నా వలచి విఫలమ్మొంది విలపింప మేలురా ఎ ప్రేమా లేకుండా యాంత్రికంగా బ్రతికే మామూలు భార్యాభర్తల్లా కాక ఖచ్చితంగా కొంత భిన్నంగా బ్రతుకుతుంటారు అని నిశ్చయంగా అనుకున్నాడు ఆంధ్రజ్యోతి వారవత్రిక 4 ౩ 3986
- పెచ్చీపిళ్చీ పిల్లంగోర్ + 103
మనుషులు మౌ రమణ లేడూ వాడంత తలతిక్క మనిషిని నేనెక్కడా చూడలా అందుక్కారణం వాడంత తలతిక్కగా వుండడానికి కాదు నేనెక్కడా చూడకపోవడానికి - బహుశా వాడంత తల తిక్కమనిషి మరొకడు వుండి వుండడని నా వుద్దేశ్యం అసలు ఈ తలతిక్క అవే మాట వాడి విషయంలో సరిపోతుందా లేకపోతే వాడంత పనికిమాలినవాడు మరొకడు లేడు అంటే సరిపోతుందా అనే విషయం నాకు చాలా యేళ్ళుగా అపరిష్కృతంగా వుంది అందువల్ల వాడి గురించి మీకు చెప్పాలంటే వాడొక పనికిమాలిన వాడూ అదే విధంగా తలతిక్కవాడూ కూడా అని చెప్పాలి అసలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే వాడంత తల తిక్కవాడు కాబట్టే పనికిమాలిన వాడయ్యాడనీ లేదా అంత పనికిమాలినతనం వల్లే వాడంత తలతిక్కగా తయారయ్యాడనీ అర్థం చేసుకోవచ్చు లేకపోతే ఎంత పనికిమాలినవాడు గాకపోతే అందానికందం గుణానికి గుణం అన్నిటి కన్నా మిన్నగా బోల్డంత అస్తి ఉన్న స్నేహలత నిన్ను గ్రేమిస్తున్నా రమణా అంటే నాలో ఎం చూసి ప్రేమిస్తున్నావ ని అడుగుతాడా? సరే అడిగాడు ఆ పీల్ల కోసం తెచ్చుకోకుండా ఎలాగో తమాయించుకొని ఎదో చెప్పింది నాకన్నీ గుర్తుండవు అసలా విషయం తల్చుకుంటేనే నా కడుపు మండుతుంది నన్నంటే నా అందాన్ని చూశా? అన్నాడట వీడి అందమూ వీడూ పాడుగానూ నా ఆస్తిని చూశా అన్నాడట అ అమ్మాయి ఆస్తితో పోలిస్తే వీడికి అస్తి వున్నట్టే గాదు ఇరవై అయిదువేల ఆస్తీ పాతికవేల అప్పులూను నా భావాల్ని ఇష్టపడుతున్నావా? అని అడిగాడట నేనంటున్నానని కాదు మీకు మాత్రం వళ్ళు మండటంలా పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 104
బంగారంలాంటి పల్ల ఎందుకులెండి చెప్పుకుంటే సిగ్గు ఆ పిల్ల నీ తలతిక్కని చూసి అని చెప్పుండవలసింది అని నేనన్నప్పుడు వాడు ఎగిరి గంతేసి ఆ మాటే అనుంటే వెంటనే మా పెళ్ళి అయుండేద న్నాడు వాడు సరదాకి అ మాటా ఈ మాటా మాట్లాడే రకం కాదు వాడేదన్నా అది వాడు సీరియస్‌గా అంటున్నాడనే అనుకోవాలి అలా వాడు ఆ పిల్లని బెదరగొట్టి మరో పిల్లను పెళ్ళి చేసుకున్నాడు ఈ పిల్ల అన్ని రకాలుగా ఆ పిల్ల ముందు దిగదుడుపే ఎమిటిరా? ఆ పిల్లనొద్దన్నావంటే సరే అంతకన్నా మంచి పిల్లని పెళ్ళాడ్తావేమో అనుకున్నాం మేమంతా ఈ పిల్లనా పెళ్ళాడతావూ? అని నిష్కర్షగా మొఖం మీదే అడిగేశాను మరొకడ్నీ మరొకద్నీ అయితె అలా అడగలేంగా కాని వీడి ముందు మనం మొగ మాటంగా వుండక్కర్లేదు లెండి చెట్టంత మని నిలేసి అంత మాటడిగితే వాడి మొఖం మీద చిన్నమెత్తు బాధన్నా లేదు పైగా కిలకిలా నవ్వు అసలు వాడి నవ్వు ఎలా వుంటుందో మీకు తెలియదు మీ మొఖం మీద వాడు నవ్వితే తప్ప తెలుసుకోలేరు మనం వాడిని తెలివితక్కువ వాడంటామా? వాడా నచ్వు నవ్వుతాడు మనకి సందేహం వస్తుంది తెలివితక్కువవాడు వాడా? మనమా? అని అలా నవ్వుతాడన్నమాట సరీ పెళ్ళి విషయం చెప్తున్నా గదూ చివరికి ఆ పిల్లనే ఐె పిల్లని నాసిరకంగా వుంటుందన్నానో ఆ పిల్లని పెళ్ళి చేసుకున్నాడు నీకు జీవితంలో సుఖపడాలనుండదేమిటిరా అన్నానోసారి అందుకేగా మీ సలహాలేమీ లేకుండా పెళ్ళాడింది అని నవ్వుతాడు ఇప్పుడు సుఖంగా వున్నావా అన్నాను నిస్సందేహంగా అన్నాడు సుఖం ఎక్కడ్నుంచొస్తుంది పెళ్ళాం విషయమే తీసుకుందాం పెళ్ళాం అందంగా వుండి చెప్పినమాట విని వేళకింత పెట్టీ కష్టమూ సుఖమూ తెలుసుకునేదయితే సుఖమేగదా వాడికి చాలదు ఎం కావాలి యింకా? అని నేను నరాలు తెంపుకుని అడుగుతాను వాడు ఎకబిగిని లక్ష చెపుతాడు ఆ లక్షలో ఒక్కటీ పనికొచ్చేదుండదు ముఖ్యంగా వాడు భార్యతో సుఖపడ్డున్నానంటున్నాడు కాబట్టి దానిలో సందేహంలేదు వాడు సుఖపడు తున్నదీ వాడికి నచ్చిందీ ఎమిటా అని నేను ఆర్నెల్లు వాడింట్లో తిష్టవేసి మఠీ కనిపెట్టిందేమి టంటే వాడన్న ప్రతిదానికీ ఆవిడా - ఆవిడన్న దానికి వాడూ వాదన లేసుకుంటారు
- మనుషులు + 105
ఉదాహరణకి వాడు “తెలుగులో చలాన్ని మించిన రచయిత లేడు అంటాడనుకోండి అదీ వాడు ఎవరితోనో అంటూ వుంటాడు ఈవిడ వెంటనే కొడవటిగంటిని మరిచిపోతున్నావు అంటుంది
ఇక మన పని సరి
వాళ్ళిద్దరూ మనల్ని మరిచిపోతారు మనకిక మూడు కర్తవ్యాలుంటాయి
ఒకటి - వాళ్ళతో పాటు అ చర్చా ప్రవంతిలో మునగడం
రెండు - నిర్లిప్తంగా వాళ్ళని చూస్తూ కూర్చోవడం
మూడు - వెంటనే లేచి వెళ్ళిపోయి రెండురోజుల తర్వాత రావడం
ఎమాటకామాటే చెప్పుకోవాలంటే ఆవిడలో ఈ చర్చించే గుణాన్ని మినహాయిస్తే మంచిదే నీవాళ్ళు నావాళ్ళు అనే తేడా లేకుండా అందర్నీ ఆప్తులుగా చూస్తుంది పూర్తిగా మన పనికిమాలినవాడి వరసే
నాకు వాళ్ళని తలుచుకుంటే కంపరం కల్గేదెక్కడంటే యిద్దరికీ సంపాదన సయించదు ఎప్పుడూ ఎదో ఓ ఇబ్బంది పడుతూనే ఉంటారు యిద్దరూ ఉద్యోగస్తులే అయినా ఇబ్బందే ఓ బరువు బాధ్యకలేం లేవు నన్నడిగితే వాళ్ళీపాటికి మూడిళ్ళు ఆరు స్థలాలు కొనవచ్చు వుహూ ఒక్కచోట కూడా ఒక్క స్థమూ కొ్‌నలా వాడిల్లో సత్రవ ఎ రోజూ ఆ యింట్లో యిద్దరికి తగ్గకుండా కొత్తవాళ్ళుంటారు వాళ్ళు పోనీ ఆయన్తమ్ముడో ఆవిడ్తమ్ముడో కాక పోయినా బంధువులు కూడా అయుండకపోవచ్చు అంత లెక్కలేకుండా వున్నవాళ్ళకి జీతాలేం చొల్తయ్ అదేమంటే స్నేహం అంటారు ఎంతయినా బంధువులకయితే ఒక లిమిటుంటుంది స్నేహాలకేముంది నువ్వు తెలివితక్కువ్వాడివైతే ప్రతివాడూ స్నేహం పేరు చెప్పి నిన్ను వాడు కొనేవాడే
అదే అయింది వీళ్ళ విషయంలో
ఆమధ్య ఓ అర్ధరాత్రి వచ్చి నిద్ర లేపాడు
వాడి దగ్గర డబ్బుల్లేవు
అర్జంటుగా రెండువేలు కావాలి ఎందుకు అన్నాను మత్తుగా
నా మత్తంతా దిగేలా చెప్పాడు
చిన్ననాటి స్నేహితుడొకడు యిల్లు కట్టుకుంటున్నాడు చాలా కష్టాల్లో వున్నాడట వీడికి వుత్తరం రాశాడట ఎలాగైనా ఓ రెండు వేలు సర్టితే ఓ ఆర్పెల్లో పంటలు రాగానే పంపిస్తాడట
నేనన్నాను యిక ఇంట్లో ఖర్చుగాక వూళ్లంట కూడా డబ్బులు పంపి కష్టాలు తీరుస్తా వన్నమాట అని
తన దగ్గర సమయానికి లేకగాని లేకపోతే ఈసరికే పంపేవాడట యింతకుముందు అప్పుడప్పుడు ఎవరన్నా అడిగితే పంపేవాడట
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 106
సరి అప్పందింది యిక వూళ్ళ నించి ఉత్తరాలాస్తయ్ డబ్బు పంపమని పోస్టాఫీసుకి దగ్గరగా వుండు ఆ వుత్తరాలు అందుకోడం డబ్బు మనియార్ణరు చెయ్యడం యిదే సరి పోతుంది అని నోటికి వచ్చిందంతా వాగాను ఎంత వాగినా ప్రయోజనం లేదు రాత్రికి రాత్రి డబ్బిస్తావా చస్తావా అని ఎకల మీద కూచున్నాడు యివ్వడానికి నాకేం యిబ్బంది నా దగ్గర డబ్బూ వుంది ఫస్టుకెలాగూ వాడివ్వనే యిస్తాడు అయినా అదిగాదురా అన్నాను వంద మాటలనవసరం నువ్వు డబ్బిస్తావు నేను వెళ్తాను అన్నాడు ఆ మాట నిజమే నేనసలు మొత్తుకునేదదేగా వాడికేది తోస్తే అది చేస్తాడు ఒకడు చెప్పేది వినడు సరే వాడు డబ్బు తిరిగిస్తాడనే మాట నమ్మొచ్చా అన్నాను డబ్బిస్తూ వాడు తిరిగిస్తాడని నేను పంపడంలా చిన్ననాటి 'స్పేహితుడు ఇద్దరం కలిసి ఎన్ని ఆటలు అడుకున్నాం స్కూలుకెళ్తూ వస్తూ ఎన్ని కబుర్లు చెప్పుకొనేవాళ్ళం ఎన్ని కలలు కనేవాళ్ళం వాడు యిబ్బందిలో ఉన్నానని వ్రాశాడు నేను పంపుతాను అన్నాడు సరే మరి నువ్వు యిబ్బందిలో వున్నావుగా అన్నాను “నేనేం యిబ్బందిలో వున్నాను? అంటాడు వాడు యిబ్బందిలో వున్నాడని మనం తెలుసుకోవాల్సిందేగొాని వాడనుకోడు అదేమంటే మీరంతా వున్నారుగా నాకేం యిబ్బంది అంటాడు నాకు బుర్రలో మెరుపు మెరిసింది వాడు ఇల్లు కట్టుకుంటూ ఇబ్బందిలో వున్నానంటున్నాడు నీకిల్లు కాదుకదా స్థలం కూడా లేదు అయినా అప్పు చేసి పంపుతానంటావేమిటి? అన్నాను మనం పంపే వెధవ రెండువేల రూపాయల కోసం వాడి జీవితాన్ని లెక్కలడుగు తామా యివ్వు వెళ్తాను అన్నాడు నాకు ముందే తెలుసు ఎన్ని మాట్లాడినా వాడితో వాదనలో నెగ్గలేం మహానుభావులు అననే అన్నారు గదా మొండివాడు రాజుకన్నా బలవంతుడని నేను రెండు వేలిస్తూ పంటలు రాగానే పంపమని గట్టిగా రాసి పంవు అన్నాను వాడు నవ్వాడు అదే నవ్వు నాకు చిరాకేసి వాడెళ్ళాక కూడా అరగంట నిద్రపట్టలా యిది జరిగి సంవత్సరం దాటింది ఎరా నీ చిన్ననాటి స్నేహితుడు డబ్బు వాపసు చేశాడా? అనడిగా మొన్నోరోజు నవ్వాడు అంటే వాడు పంపలేదన్నమాట వాడి అడ్రసిటివ్వు? అన్నాను
- మనుషులు ళి పటి ప నన మయ పటే 107
ఎందుకు ?* అన్నాడు ఒక ఉత్తరం రాసి పడేస్తా నన్నాను ఎమని నాకు చిరాకుగా ఉంది అయినా ఓపిగ్గు డబ్బు పంపమని అన్నాను వద్దు అన్నాడు ఎందుకనీ? అంతెక్కువగా ఉన్నాయా డబ్బులు అన్నాను నాకు తెలుసు ఈమధ్య వాడుచాలా ఇబ్బందులకు దగ్గరవుతున్నాడు అవిడ నర్ధి మనిషి కూడా కాదు అసలందుకేగా ఈ (ధైవేటు కంపెనీవాళ్ళు ఆవిడ వుద్యోగం తీసేసింది తర్వాత వాడికీ నాకూ జరిగిన ముష్పావుగంట చల్చా మీకనవసరం విషయం ఎమిటంటే ఆ చిన్ననాటి మిత్రుడు డబ్బు అడిగేప్పుడే నోటు కూడా రాసి పంపాడట వాడెవ్వడో ఘనుడే మనవాడి సంగతి బాగా ఎరిగినవాడే వీడూ వీడికి తగినట్టే ఆ నోటు వాపసు పంపుతూ నీ దగ్గరున్నప్పుడు పంపు యిబ్బంది పడకు అని రాశాడట ఇక వాడు పంపడు వీడు అడగడు మధ్యలో మీరూ నేనూ బుర్ర పగలగొట్టుకోవడం ఎందుకూ దండగమారి వ్యవహారం అయినా నాకు బుద్ధిలేక ఒరే వాడు నీకు డబ్బు పంపమని రాయడమనా అంతకుముందు వుత్తరాలేమన్నా రాసేవాడా? అన్నాను 'నెలకీ రెండ్నెల్లకీ రాస్తూనే వుండేవాడు అన్నాడు మరిప్పుడేమని రాస్తున్నాడు ఫలానాప్పుడు పంపుతాననేమన్నా రాస్తున్నాడా? అన్నాను వాడు నవ్వి అన్నాడు గదా - 'నేను డబ్బు పంపిన దగ్గర్నుంచి యిక ఉత్తరాలు రాయడం మానేశాడు ఆంధ్రనబిత్ర వారవతిక 7మే 987 పనివాడితనం € అక్కినేని కుటుందిరాను 108
దొరకదండీ బాబూ అయిందానికీ కాందానికీ సానుభూతి చూపించడం కొందరికి జబ్బయితే మరి కొందరికి ప్రతి విషయంలోనూ తమకి సానుభూతి చూపించమని దేబిరించడం వ్యసనం సుబ్బారావుకి ఈ రెండూ గిట్టవు గిట్టకపోతే మానే అసహ్యం కూడాను సరిగ్గా కోదాడలో బస్సు బైల్దేరిన అయిదు నిమిషాలకి ఎందుకో తన సూట్‌కేస్ పెట్టిన వైపు చూసి - అరే నా సూట్‌కేస్ ఎదీ అన్నాడు సుబ్బారావు అక్కడ పెట్టావుగా అరే ఎదీ అన్నాడు రాంబాబు సుబ్బారావు లేచి నిలబడి బస్సులో కిందామీదా అంతా వెతికాడు తన నూటికేస్ కోసం అది లేదు రాంబాబు కూడా చూశాడు అన్నీ వివరంగా అడిగిన మరికొందరు కూడా బస్సంతా కలయచూశారు చిత్రం ఆయినా అది లేదు అప్పుడు వెనక సీటులో నుంచి లేచి వీళ్ళ దగ్గరకు వచ్చిన తను - మీరెంతమందయినా చూడండి ఎక్కడయినా చూడండి దొరకదండీ బాబూ అదిక దొరకదు అన్నాడు అతనా మాటలు ఎంత గట్టిగా అన్నాడంటే తప్పిజారి ఆ సూట్‌కేస్ ఒకవేళ దొరికితే దొరకదనుకోండి మాటవరసకి దొరికితే అతను ఆత్మహత్య చేసుకోవచ్చు తాము నమ్మిన విషయాల కోసం ప్రాణాలు తృణప్రాయంగా ఇస్తున్నవారిని మనం చూస్తూనే వున్నాంగా మరింక సందేహం ఎందుకు అ సూట్‌కేస్ దొరికితే అతను ఆత్మహత్య చేసుకుంటాడు అదిక అంతే పోయిన సూట్‌కేస్ దొరుకుతుందని చెప్తారు ఎవైనా మీరెవరండీ పాపం సూట్‌కేసు పోయి ఆయన కంగారుపడ్డోంటే దొరకదని అంత ఖచ్చితంగా చెప్తున్నారూ. అన్నాడు సుబ్బారావూ రాంబాబూ కూర్చున్న ఎటుకు ముందు ఎట్లో నుంచి మరొకాయన
- దొరకదండీ బాబూ + 109
కొందరు నవ్వారు.
మరికొందరు 'పాపం' అన్నారు. “పాపం' దేనికో, ఎవరికో, ఎందుకో విడమర్చి
చెప్పకుండానే.
సుబ్బారావు రాంబాబు వంక చూశాడు.
“పోయినోళ్ళందరూ మంచోళ్ళు” అన్నారు ఆత్రేయ. పోయిన సూట్‌కేస్‌లు కూడా మంచివేనేమో...” అన్నాడు రాంబాబు.
“నీకు హాస్యంగా వుందా నాయనా? దానిలో వున్న బట్టలు తప్ప నాకు మరిలేవు” అన్నాడు సుబ్బారావు.
“నువ్వు మరీను. వంటిమీద వున్నాయ్‌గా” అన్నాడు రాంబాబు ఎత్తిపొడుపుగా.
“ఉన్నాయనుకో” అన్నాడు తప్పు వప్పుకుంటున్న ధోరణిలో సుబ్బారావు.
“అన్నట్టు సూట్‌కేస్ నాదికాదు. ప్రభాశరరావుది” ఏదో “క్లూ అందించాడు సుబ్బారావు.
“షాపం! ఆయన అడగడు. మనం కొనిస్తామంటే కొట్టేస్తాడు. సో, అది కూడా క్లియర్ అయింది... ఇక మనకి లాసల్లా...” అంటున్న రాంబాబు సుబ్బారావు కుడిచెయ్యిని నుదురు మీద గట్టిగా కొట్టుకోడం చూసి ఆగి “ఏమిటి?” అన్నాడు.
“మూడు సంవత్సరాల రీసెర్చి పేపర్లన్నీ దాన్గోనే వున్నాయ్” అన్నాడు సుబ్బారావు.
“అవి ఎవడికి పనికొస్తాయిలే?” తేలిగ్గా అన్నాడు రాంబాబు.
“నీ తెలివి ఏడ్చినట్టే వుంది. ఎవడికో పనికీరావడం రాకపోవడం కాదు. మనకి... మనకెట్లా?” నెత్తీనోరూ కొట్టుకున్నాడు సుబ్బారావు.
“అవృన్నిజమే ఎలా” పరేషాన్‌లో పడ్డాడు రాంబాబు కూడా.
పెట్టె పోయిందని తెలీగానే లబోదిబోమంటారేమో, కావలించుకొని జేబులోది కూడా కొట్టేద్దామని చూసి వాళ్ళు ఏడవకపోయేసరికి ఏంచెయ్యాలో తెలియనివాళ్ళులాగౌ నిలబడి పోయి వున్న కొందరికి ఇప్పుడు కాస్త వూరట కల్గింది.
“ఏమున్నాయ్? ఏమేమున్నాయ్?” అనే ప్రశ్నలూ వాటిలో పాటు “ఎక్కడ ఎక్కారు?” “ఎక్కడికెళ్తున్నారు?” “మరి హైద్రాబాదులో వుండేవాళ్ళయితే విజయవాడ డైరెక్టుగా వెళ్ళిపోవచ్చుగదా! కోదాడలో ఎందుకు ఆగారు?” “ఏం చేస్తారు?” “మ్సిర్రసలు ఏం చేస్తు న్నారు?” “పెళ్ళయిందా?”
“ఆగండి” అసహనంగా అన్నాడు సుబ్బారావు.
అందరూ అతని మాటకి చాలా విలువ వున్నట్టు ఆగారు.
“వాకు పెళ్ళవడానికీ, నా సూట్‌కేస్ పోవడానికీ ఏమిటి సంబంధం? సంబంధంలేని ప్రళ్షలెందుకేస్తున్నారు? అసలు మీరెవరు నన్ను ప్రశ్నించడానికి? నా పెట్టె ఎవడో దొంగవెధవ' దొంగిలించుకుపోయినంత మాత్రాన నామీద మీ అందరికీ ఇంత చనువు, అధికారం ఎలా వచ్చాయి?”
పనివాడితనం శ అక్కినేని కుటుంబరావు 110
నాకు పెళ్ళయిందో లేదో అయితే పిల్లలున్నారో లేరో ఉంటే ఎందరున్నారో లేకపోతే ఎందుకులేరో ఇవన్నీ తెలుసుకొని మీరేం చేస్తారు? మీకు మరో పనేంలేదా? ఇష్టంవచ్చినట్లు కడిగేస్తున్న సుబ్బారావుని ఆపి బస్సులో వేరే ఎం పనుంటుంద్ అన్నాడు బెజవాడలో దిగి గుంటూరు బస్సు అందుకోవాల ని ఇందాక చెప్పినాయన ఖంగుతిన్నాడు సుబ్బారావు అతనికి ఎం సమాధానం చెప్పాలో వెంటనే తోచలేదు ఇంతలో రాంబాబు అందుకున్నాడు - మీకు పనిలేకపోతే కామ్‌గా కూర్చోండి మా బుగ్రలు తినొద్దు అందరూ మూతులు ముడుచుకొని వాళ్ళపక్కవాళ్ళతోనూ పెళ్ళాలతోనూ కూడా మాట్లాడకుండా కూర్చున్నారు అయిదు నిముషాలన్నా గడవలేదు వెనక సీటతను మళ్ళీ లేచి ముందుకొచ్చి అది దొరకదండీ బాబూ దొరకదు ఒకసారి నేనూనూ అంటూ ఆయనా ఆయన చిన్న తోడల్గుడూ చవగ్గా అమ్ముతున్నారని తెలిసి రాయచూరు దగ్గర పొలాలు బేరం చేద్దామని వెళ్ళిన వైనం చెప్పడం మొదలెట్టాడు బేరం చేయడానికి అంతదూరం ఎందుకు? కొనాలనుకుంటే వెళ్ళాలిగానీ అన్నాడు గుంటూరాయన కొనాలనుకుంటే మాత్రం బేరం చెయ్యకుండా ఎట్లా కుదురుతుందీ? అని లా పాయింటు లాగాడు మరొకాయన ఇంతకీ మీదేం పోయిందో చెప్పనేలేదు? అన్నాడు ఆత్రంగా మరొకతను నాదా నాదేం పోలా ఆముందు సీట్లో ఇట్లాగే ఇద్దరు భార్యాభర్తలు భార్యాభర్తలే ననుకుంటాలే - ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకొంటున్నారు ఇంకా నయం భార్యాభర్తలయితే నవ్వులు కూడానా అళ్ళు ఎవరో ఇంటికాడ చెప్పకుండా ఎగిరెళ్ళే బాపతు అన్నాడు ఒకాయన నవ్వుతూ బాగా చెప్పారు అన్న్మయ్యగారూ పెళ్ళాం పక్కనుంటే ఎ మొగుడి మొకొనయినా నవ్వు మొలున్తుందా - ఎడుపుగొట్టు మొకాలూ ఎడుపుగొట్టు మొగుళ్ళూనూ _ బస్సెక్కిన కాబ్నీంచి చిరచిరలాడుతున్న మొగుడివంక ఓరగా చూస్తూ అందొకావిడ అంగీకారంగా అందరూ నవ్వారు భార్యాభర్తలు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారంటే నమ్మలేనంత ఎత్తుకి ఎదిగిపోయిన బన్సులో జనాన్ని సుబ్బారావు అశ్చర్యంగా చూస్తోంటే - ఇంటి దగ్గర చెప్పకుండా ఎగిరివెళ్ళేవాళ్ళు మాత్రమే నవ్వుకుంటూ మాట్లాడుకుంటారనే సత్యం కొత్తగా బోధపడిన రాంబాబు ఎవో ఊహల్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు భార్యభర్తలయినా కాకపోయినా ఒకమ్మాయి అబ్బాయి అంటావేమిటీ వీళ్ళిద్దరూ అబ్బాయిలేనాయె అన్నాడు మరొకాయన
- దొరకదండీ బాబూ + శ
మళ్ళీ అందరూ నవ్వారు ల ల మల అంతవరకే మౌనం ఎందుకు రాజ్యమేలిందో పల వ అందరిలోను ఇంతంత చమత్కారాలు ఎలా వస్తున్నాయో తెలును: క సతమతమనవ తున్నాడు సుబ్బారావు బస్సు నందిగామ చేరింది సుబ్బారావూ రాంబాబూ బస్సు దిగి కంట్రోలర్ దగ్గరకు వెళ్ళారు వెళ్తుంటే వెనక సీటతను కలిసి - అది దొరకదండీ బాబూ దొరకదు అనే మాటని స్టోగన్‌లాగా చెప్తున్నాడు మ రిసెర్చి "పేపర్ల సంగతి తరువాత అతని సంగతి తేల్చడానికైనా సరే ఆ సూట్‌కేస్ దొరికితే బాగుండనుకొన్నాడు సుబ్బారావు గబగబా బస్సెక్కి మరోసారి అన్ని సూట్‌కేస్‌ల వంకా చూశాడు అతనలా చూస్తోంటే
- ఆ ఇంకెక్కడ సూట్‌కేసు అదప్పుడే పోయింది దొరకదండీ బాబూ అంటున్నాడతను దగ్గరగా వచ్చి సుబ్బారావు కళ్ళు దూరాన డ్రైవఠ్‌కి దగ్గరగా సెట్టి వున్న సూట్‌కేస్ మీద పడ్డాయి బస్సు బయలుదేరింది సుబ్బారావు లేచి వెళ్ళి ఆ సూటికేస్‌ని లేపి - ఇదెవరిది? అన్నాడు అందరూ గుడ్డప్పగించి చూస్తున్నారు దొరికిందా? అ మరి పోయిందన్నారుగా? పోలా ఇందాక అంటిరే దొరికింది దొరకదన్నాడుగా ఆయన ఆయన దేముడా? వెనక సీటాయన సుబ్బారావు చెప్పబోయే మాటలకోసం అతని మొహంలోకి చూస్తున్నాడు ఆయనెవరో కోదాడలో హడావుడిగా దిగాడు గదా ఆయనదనుకొని నా సూట్‌కేసు తీసుకొని దిగిపోయాడు - ఇది ఆయనది అని చెప్పి ఆ సూట్‌కేస్‌ని తన దగ్గర పెట్టుక్కూర్చు న్నాడు సుబ్బారావు కాసేపాగి - ఇప్పుడేం చేస్తారు? అన్నాడు వెనక సీటాయన ఎముందీ? ఆయన సూటికేస్ కాదని తెలుసుకోగానే విజయవాడ వస్తాడుగా - ఆయన్హాయనకిచ్చి నాది నేను తీసుకుంటాను ప్రనివాడితనం ఈ అక్కినేని కుటుంబరావు 112
అయన రాకపోతే ఎందుకు రాడూ? ఆయన పెట్టెలో కన్నా మీ పెట్టెలో వస్తువులు విలువైనవైతే అయితే మాత్రం? అవి ఆయనవి కావుగా అందరూ ఆ పాయింట్‌ని కొట్టేసినట్టు నవ్వేశారు బస్సులో యావన్మంది ధ్యాసా ఈ పజిల్ ఎలా పూర్తవుతుందా అనే మార్గాయాసం లేకపోగా వాళ్ళందరి మొహాలు ఆనందంతో ఆశ్చర్యంతో వెలిగిపోవడం చూస్తే అఆంటీసీ వాళ్ళు ప్రజాసేవే కర్తవ్యంగా వున్నవాళ్ళు కాబట్టీ ప్రతి బస్సులోను ఇటువంటి వినోద కాలక్షేపం ప్రవేశపెడ్తే బాగుంటుందేమో అన్సిస్తూంది ఎవరికైనా నీ చేతిలోకి వచ్చింది నీదీ - నువ్వు బొక్కింది నీది - అనే సూత్రాన్ని అందరూ వప్పేసుకుంటున్నారు. రెండో ఆలోచన లేకుండా రాంబాబుకి మరో ఆలోచన వచ్చింది సూట్‌కేస్‌కి లాక్ చేసి వుందేమో చూడు? అన్నాడు లేదు అన్నాడు చూసి సుబ్బారావు తెరువు ఎమున్నాయో చూద్దాం కనీసం అడ్రసున్నా అన్నాడు రాంబాబు బస్సంతా సుబ్బారావు మీదికి వచ్చి చేరింది అందరి కళ్ళూ తెరుచుకోబోతున్న ఆ సూట్‌కేస్ మీదే జాగ్రత్తండోయ్ ఎ బాంబన్నా కనపడకపోయినా ముందేం జరుగుతుందో వెనక సీట్టోంచి తన జ్ఞానచక్తువుతో ఓ ఆసామి చెప్పిన మాట విని జనం కాస్త తగ్గినట్టు కనబడ్డారు బాంబే వుందో? డబ్బే వుందో? మరొకడన్నమాట వినగానే మళ్ళీ ముందుకి వచ్చారు ఆ సూట్‌కేసులో డబ్బుంటే చూడ్డానికి బాంబున్నా భయపడరన్నమాట తెరిచాడు దానిలో సింపుల్‌గా రెండు జతల బట్టలు ఒక డైరీ వున్నాయి డైరీ తెరవగానే అతని అడ్రసుంది అమ్మయ్య బతికాం అడ్రసుంది వెళ్ళి ఇచ్చి మస్టిమనం తెచ్చుకోవచ్చు అన్నాడు సుబ్బారావు అందరూ నీరసంగా ఎవరి సీట్లలో వాళ్ళు చేరారు వేదాంత ధోరణిలో వున్న వెనక ఎటాయాన మొఖంలో వెలుగు వెంటనే వురుములాగా అరిచాడు అ పిచ్చిపని మాత్రం చెయ్యకండి ఎం ఎందుకని త్వరగా చెప్పండి
- దొరకదండీబాబూ ళీ 113
ఇలా పది ప్రశ్నలూ అభ్యర్థనలు అతనికి వినిఉంచాయి అయితే వాటిల్లో ఎ ఒక్కటీ సుబ్బారావువిగానీ రాంబాబువిగానీ కాదు సెమినార్లలో కొత్త ధియరీ చెప్పబోతున్న పాత జ్ఞానిలా ఓసారి ముఖం అరిచేత్తో రుద్దుకుని - ఇప్పుడు ఈ సూట్‌కేస్ ఆయనే మీ సూట్‌కేస్ తీసుకెళ్ళాడని నమ్మకమేమిటి? అన్నాడు జనానికి సరిగా అర్థంగాలా వివరించాడు జ్ఞాని ఆయన లెక్క ప్రకారం ఈమధ్య దొంగలు తెలివి మీరారు ఇది ఆయన అనడం పూర్తి కాకుండానే ఒకాయన మధ్యలో అడ్డంపడ్డాడు - దొంగలసలు ఎప్పుడూ తెలివిగలవాళ్ళే అని ఆ మాట కొస్తే తెలివిగలవాళ్ళంతా దొంగలే అన్నాడు మరొకాయన ఓరి వీళ్ళ దుంపతెగ ఎమిటీ జనం ఇంత బ్రహ్మాండమైన సూత్రీకరణలు ఇంత అవలీలగా చేసి పడేస్తున్నారు అన్నాడు రాంబాబు నిజంగా ఈ సూత్రీకరణకి మనం రావాలంటే కనీసం పదిహేను ఎహెచ్‌డీలు చెయ్యాల్చ్ఫుంటుంది అన్నాడు సుబ్బారావు అవునుగదా మరి అలాటి తెలివైన దొంగలు ఇప్పుడేం చేస్తున్నారంటే ఎక్కడో ఒక సూట్‌కేస్ తెస్తారు అదిక్కడ పెడతారు అలాటిదే మరొకటి ఇవతలో అవతలో వుంటుంది అద్దీసుకెళ్తారు? ఇదేమన్నా ఆటా వాళ్ళకి? అ అటలాగే చేస్తున్నారు ఇప్పుడు దొంగలు అది సరే ఈ సూటికేస్ మంచిదేగా పైగా రెండు జతల బట్టలున్నాయి వాడు దాన్ని బస్సులో వదల్గం ఎందుకు? ఎందుకా వాడు నీ సూట్‌కేసు దొంగిలించేప్పుడు నువ్వు చూసి ఎమిటంటా వనుకో ఆ అంటే? అరే మీదా నాదనుకొన్నా జస్ట్ కన్‌ఫ్యూజన్ అని అంటాడు వాడి సూట్‌కేస్ తీసుకొని దిగుతాడు వాడు మాత్రం నువ్వు దాన్ని మోసుకుంటూ ఎక్కేటప్పుడే చూస్తాడు బరువు ఎంతుందా అని అంతే చెక్కేస్తాడు అని సుబ్బారావు వంక తిరిగి మీ సూట్‌కేసు బాగా బరువుగా వుంది గదూ? అన్నాడు తలూపాడు సుబ్బారావు అది ఇప్పుడు మీ చేతిలో సూట్‌కేస్ తీసుకొని హైదరాబాద్‌లో శ్రీనగర్ కాలనీలో ఆ మూల వున్న ఇంటినంబర్లు వెతుక్కుంటూ వెళ్ళి డైరీలో పేరున్నాయన్ని పట్టుకుంటారు ఇదుగో బాబూ నీ సూట్‌కేసు నాది నాకిమ్మంటారు ఆయనేమంటాడో తెలుసా? అని మళ్ళీ జనాభిప్రాయం కోసం సాభివ్ర యంగా చూశాడు పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 14
అందరూ ఇంతింత కళ్ళేసుకుని చూస్తున్నారు అందరి మొహాల్లోనూ ధ్రిల్ ధాంక్సృండీ అనే వక్కమాట అంతే ఆ మాటకోసం మీరు మీ చేతిలో వున్న నూట్‌కేస్‌ను కూడా వదులుకోవాలి మీ సూట్‌కేసు మీకు దొరకదండీ బాబూ దొరకదు జనం అందరూ ఎకగ్రీవంగా హర్షధ్వానాల్లో తీర్మానించేశారు రాంబాబు సుబ్బారావు చెవిలో నాకెందుకో వీడికీ ఆ దొంగకీ సంబంధం ఉందన్ని స్తోంది కిందకి పిల్చి నాల్గు ఉతుకుదామా? అన్నాడు ఎందుకనిఎస్తోందో తెలియదుగానీ నాకూ అలాగే అన్సిస్తోందే? అన్నాడు సుబ్బారావు సుబ్బారావు తన చేతిలో వున్న సూట్‌కేనుని తీసుకొని తేలు కుట్టిన దొంగలా ఎమీ తెలియనట్టూ ఎమీ జరగనట్టూ తనదేమీ పోనట్టు తనకేదీ దొరకనట్టూ బస్సు దిగి తలొంచు కొని గబగబా తాను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోవాలి అలా చెయ్యకపోయాడా ఈ సూట్‌కేస్ కూడా పోతుంది ఇంకా నయం అంతే అయితే ఫర్వాలా ఆ శ్రీనగర్‌కాలనీ ఆయన ఈ సూట్‌కేస్‌లో పదివేల రూపాయల క్యాషుండాలి ఎదీ అంటాడనుకోండి అప్పుడేం చేస్తాడీయన అన్నాడు వెనకసీటు ఇప్పుడు మాత్రం నిజంగా సుబ్బారావుక్రీ రాంబాబుకీ తమ సూట్‌కేస్ దానిలో మూడు సంవత్సరాల కష్టఫలితం రీసెర్చి పేపర్లు అన్నీ వదిలేసుకోవాలేమో అని భయం వేసింది నిజమే ఆయన విలువైన అభరణాలో ఆస్తులో దీనిలో వుంటే వీడు చెప్పినట్టే దొంగాడు అవి కాజేసి ఈ సూట్‌కేస్ ఇక్కడ పెడితే ఆయన మనల్సి ఎలా నమ్ముతాడు? అన్నాడు రాంబాబు ఎందుకు నమ్మడు? మనమే అవన్నీ తీస్తే పనిగట్టుకుని ఆయన దగ్గర కెందుకు వెళ్తాం- వెర్రా? అన్నాడు సుబ్బారావు ఎమో నాకైతే భయం వేస్తోంది ఎందుకైనా మంచిది వెనుకవాణ్లీ నాలుగు వుతికి నిజం చెప్పమందాం మనక్కూడా కాస్త భయం తగ్గుతుంది అన్నాడు రాంబాబు బస్సు బెజవాడ బస్టాండులో ఆగింది అంతవరకూ చాలా సంతోషంగా ఒక వినోదయాత్ర ముగించుకొని వస్తున్న స్కూలు పిల్లల్లాగా సర్వం మరిచిపోయి ఆనందడోలికల్లో ఊగిన జనం గబగబ దిగి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ ఆ సూట్‌కేసు తీసుకొని బస్సు దిగగానే - సారీ సార్ హోటల్‌కెళ్ళి చూసుకొని వెంటనే టాక్సీ మాట్లాడుకొని వచ్చేశాను ఇదిగో మీ సూట్‌కేసు అంటున్న వ్యక్తిని ఆరాధనతో చూశారు మిత్రులిద్దరూ కాసేపాగి? ఎడీ ఈ వెనక సీటాడు అన్న రాంబాబు రంకె విని బెజవాడ బస్టాండులో పిల్లలు జడుసుకొని ఎడుపు మొదలెట్టారు = వివుల 988
- దొరకదండీబాబూ + కేల్
బండి ఇ౦క ఈ ఊళ్ళో ఎం ఉంటారు? నా దగ్గరకు రమ్మని అమ్మనీ నాన్ననీ రాము ఎన్నిసార్లు పిలిచినా - ఇద్దరమూ ఉన్నంతకాలం ఇక్కడే ఒకరు పోయాక రెండోవారిని తీసుకెళ్ళు అనేవారు వాళ్ళు నాన్న పోయాడు అమ్మ మిగిలింది ఇల్లూ అ కాస్త పొలం పట్నంలో పట్టవనుకున్న సామాన్తూ - తాతలనాటి భోషాణం
- అన్నీ - అన్నీ అమ్మేశాడు రాము నాన్న ప్రాణానికి ప్రాణమైన బండి మిగిలింది ఈ బండిని కూడా అమ్మేసి రేపే వెళ్ళిపోవాలి ఈ బండితో ఎమిటి మీకంత అనుబంధం ఇవ్వాళా రేపూ రక్తమాంసాలున్న మనుషులకే అభిమానాలు అనుబంధాలు కరువవుతున్నాయ్ చెక్కబండితో ఎమిటి అయిన కాడికి అమ్మెయ్యక అంది శాంత నీకేం తెల్సు ఇది చెక్కబండా నాతో ఎన్ని ఆటలాడింది నన్నెంతంత దూరాలు మోసింది తిప్పింది నాకెంత ఆనందాన్నిచ్చిందీ బండి ఈ పిచ్చిముండ ఎడ్లు మాత్రం అవి నాతో మాట్టాడేయి గదూ నిజంగా ఎలా చూసేవీ? అవి శ్రీగంట చూపులు చూసేవి వాటి కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనబడేది అవి నాతో ఎంత స్నేహం చేసేవీ అవి సైగలు చేసేవి ఎన్ను నెమ్మదిగా కుమ్ముతూ నాతో అటలాడేవి గతిలేక ఎడ్డని అమ్మేసినప్పుడు నేను పదిరోజులు మూసిన కన్ను తెరవలేదు మామూలు అవ్వడానికి ఆర్సెల్లు పట్టింది ఆ ఎడ్లు తమ స్వంత ఇల్లు స్వంత బండి స్వంత నాగలి స్వంత మనుషులను పనివాడితనం + అక్కినేని కుటుంబరాకు 116
కున్న మా అందర్నీ వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు - ఎంత దిగులు పడ్డాయో అవి మాకోసం ఎంత ఆరాటపడ్డాయో ఆనాడు అవి పోయినా నాన్న ఈ బండిని చూస్తూ ఈ బండిమీదే తన వార్ధక్యం అంతా గడిపాడు ఇవ్వాళ ఈ బండి నాతో మాట్లాడుతోంది శాంతా నాతో మాట్లాడుతోంది నిజం నువ్వు నమ్మవు కాని అది నా చిన్నతనాన్ని నా అల్లరిని నా స్నేహితుల్ని వాళ్ళ మాటల్ని నాకు వర్ణించి వర్ణించి చెప్తోంది నేను ప్రతి సంక్రాంతి పండక్కీ దీనిని కడిగి పసుపుతో రుద్ది కుంకునుతో బొట్లు "పెట్టేవాడిని నాకు ఇందాకటివరకూ గుర్తులేదు అది ఇంతకు ముందే నాకు గుర్తు చేసింది ఓసారి నేను బండి చివరికెక్కి పడిపోబోతే ఈ బండే నన్ను పడకుండా అడ్డుకుంది అప్పుడు నా చిన్న మిత్రులంతా చేరి ఈ బండిలాంటి బండి ఈ ఊళ్ళోనే కాదు ఓల్ మొత్తం ప్రపంచంలోనే లేదని ఖరారు చేశారు ఆనాడు మేమంతా దీన్ని ఎంత పాగిడాం అదంతా ఈ బండి నాకింతకు ముందే చెప్తోంది అంటే సర్లెండి పిచ్చి ముదిరింది రోకలి తలకి చుట్టండన్నట్టు పెద్దాయన ఎదో పిచ్చిలే అనుకునేవాళ్ళం మీరు తయారయ్యారన్న మాట అంది శాంత నవ్వుతూ రామూకి ఆ బండి అంటే వల్లమాలిన ఇష్టం అతని చిన్నతనంలో సగభాగం ఆ బండి మీదో బండి కిందో ఆటల్లో గడిచిపోయింది వేరే వాళ్ళయితే వాళ్ళ బళ్ళ దగ్గరికి పిల్లల్ని చేరనిచ్చే వాళ్ళు కాదు పిల్లలు బండి మీదెక్కి దాని తొట్టిని తొక్కి తొక్కి పాడుచేస్తారనీ బండి మీదున్న జల్లనో గుడిసెనో నాశనం చేస్తారనీ వాళ్ళభిప్రాయం రాము వాళ్ళ నాన్నకి మాత్రం తన కొడుకు ఆటకి బాగుంటే ఆడుకోనియ్యి పాడైతే బాగుచేద్దాంలే అనుకునే తత్వం అందువల్లే మయ్య రామూని మా అయ్య అని తప్ప మరో పేరుతో పిలిచి ఎరుగడా తండ్రి ఆడుకుంటే అదే శాన అనేవాడు తోటి పిల్లల్లో ఎప్పుడూ ఎదో ఓ ఆట ఆడుతూనే ఉండేవాడు బండి మీదెక్కి పరుగులూ దూకడాలూ బండి కింద దాక్కుని వేరే వాళ్ళని జడిపించడాలు నవ్వులు కేరింతల్లో ఆ బండి ఎప్పుడూ పకపకలాడ్డ్తున్నట్టుండేది రామూ కాస్త ఊహొచ్చిన తర్వాత అచ్చయ్య బాబాయి పెళ్ళికి అదే బండి మీద "పెదపారుపూడి కెళ్ళడం గుర్తొచ్చింది ఆ సెళ్ళికళ్ళేటప్పుడు ఎన్ని సరదాలు ఎంత సంబరం అన్ని బళ్ళకంటే మా బండే ముందుండాలని రామూ పట్టుబట్టాడు రామూలాగే మిగిలిన పిల్లలూ వాళ్ళెక్కిన బండే ముందుండాలని మారాం చేశారు ఉరే అక్కినాడా ఎంట్రా నీ గొప్ప ముందుండాలంట ముందు అరేయ్ ఈ అక్కినాడి బండిని అందరి బళ్ళకంటే ఎనకమాలుంచండిరా అన్నాడు చలపతి మామయ్య రామూకి ఎడువు ముంచుకొచ్చేసింది కోపంతో కళ్ళు మందారపూలకన్నా ఎరు పెక్కాయి ఉక్రోషంతో ఊగిపోయాడు శ+శబండి + స
“అసలీ చలపతి మామెవడు? నన్ను అక్కినాడ అంటాడెందుకు? అక్కిని బొక్కిని బొళబొళ అని ఎప్పుడూ నన్ను నెత్తిమీద ఎందుక్కొడతాడు. ఈయన్నీ...” అని చరచరా బండి మీద నుంచి జారుతున్న రామూని “పడతావ్... పడతావ్...” అని నవ్వుతూ హెచ్చరించింది అమ్మ
“నీకసలు సిగ్గులేదా? నీ కొడుకుని ఎవరో ఏడిపిస్తుంటే నవ్వుతావెందుకు?” అని 'జి అని ఏడవడం మొదలెట్టాడు రామూ.
. ఇక అ ఏడుపుని ఆపించడాన్కి, వాడిని సముదాయించడానికీ, ఎంతమంది ఎన్ని యాతనలు పడ్డారో, కన్నీళ్ళొచ్చేలాగ ఎంత పడీపడీ నవ్వారో.
ఆ బండి మాత్రం అన్ని బళ్ళ కన్నా ముందు ఆగమేఘాల మీద పెద పారుపూడి కేసి ఉరికింది. అ బండి లేపిన మట్టిమబ్బుల్లో వెనకవున్న బళ్ళన్నీ మాయమైపోయినాయ్.
ఆ బండి అలా పరుగు పరుగున వెడుతోంటే ఆ చిట్టి రామూగాడు తాము వెళ్ళేది పెళ్ళికనీ, ఆ పెళ్ళి పెద పారుపూడిలో అనీ మర్చిపోయాడు. అలా ఆ బండి అనంతంగా లోకాలన్నిటినీ తెంచుకుని ఆకాశంలో కెళ్ళిపోతుందని గట్టిగా నమ్మాడు.
పెళ్ళివాళ్ళు చెరువుగట్టు దగ్గర విడిది ఏర్పాటుచేసి, పానకాల కావిళ్ళతో ఎదురొచ్చి, బళ్ళన్నీ వచ్చి చెరువు గట్టు మీద ఆగేసరికి రామూ నిద్రమత్తులో వాళ్ళమ్మ ఒళ్ళో ఊగుతున్నాడు.
రామూ వాళ్ళమ్మకి నీనిమా చూద్దామన్చించినప్పుడల్లా “అబ్బాయి సినిమా కెళల్ళిమంటూ ఒకటే గొడవ పెడ్తున్నాడు” అనేది.
ఆ మాట వింటూనే “గొడవ దేనికీ వెళ్తేపోలా!” అనేవాడు నాన్న.
ఇక రామూ పనేమిటంటే చిన్నమ్మనీ, ెద్దమ్మనీ, అత్తనీ, అమ్మమ్మనీ, రాముడ క్కాయినీ,. రాగమ్మొదిన్నీ, “ఇవ్వాళ మా బండి మీద సీనిమా కెళ్తున్నాం. మా అమ్మ నిన్ను కూడా తొందరగా తెమిలి రమ్మంది" అని పేరు పేరునా అందర్నీ పోగియ్యటం. ఎవరెవరికి రావటానికి కుదురు తుందో ఎవరెవరికి కుదరదో, ఎన్నింటికి రావాలో ఎవరి కోసమూ చూడకుండా బండి ఆగ మేఘాల్లో ఎలా వెళ్ళిపోతుందో చెప్తూ, పొద్దున్నించీ మధ్యాహ్నం దాకా ఊపిరాడకుండా తిరిగేవాడు రామూ, మధ్యమధ్యలో బండిని కాస్త శుభ్రం చేసి బండి మీద కాస్త గడ్జేసి, గడ్డి మీద చాపలు పరిచి అవి జారకుండా తాళ్ళతో కట్టి బండికి గుడిసె ఎక్కించి తయారు చేస్తున్నారా లేదా పర్యవేక్షించడం, కనబడిన స్నేహితులందరికీ మేం మా బండి మీద గుడివాడ సినిమా కెళ్తన్నాం' అని గొప్పలు చెప్పుకోవడం 'నేను తొట్లో కూచ్చుంటా! నేనే ఎడ్జని తోలతా' అనేవాడు.
“నీకు తోల్డం వచ్చేంటీ” అనేవాడు క్రిష్ణ
“అరే కిట్టిగా నీకు రాదురా. నాకొచ్చు. ఎట్టాగో చూపించనా?” అని గబగబా తొట్టోకెక్కి కూర్చునేవాడు. తొట్లో మునిగినట్టుండి క్రిష్ణ ముఖం కనపడేదికాదు. లేచి నిలబడి “ఇదుగో ఇట్టా” అని చేతిలో చెర్షకోల ఉన్నట్బగా అటూ ఇటూ ఊపుతూ “చల్ చలో అనేవాడు.
సనివాడితనం + అక్కినేని కుటుంబరావు . 118
క్రిస్టేమో పోరా నీకేం వాచ్చు చల్‌చల్లంట చల్ చల్ అని గుర్రాల్ని తోల్తారు ఎడ్డని జా ఎహెహె నిన్ను మాదిగ రాముడింటికి తోలా అని చెర్నకోల పెట్టి కొట్టుడు కొట్టాలి అని మూతి బిగపట్టి ఎడ్డని కొట్టడానికి సర్వశక్తుల్ని వినియోగించేవాడిలా అయిపోయాడు ఎం కాదులే మా ఎడ్లు గుర్రాలకన్నా బాగా పరుగు పెడతాయి అసలు మా బండి ఎంత తేలికో తెలుసా? ఎడు మళల్లెపూవులంత బరువు మా నాన్న చెప్పాడు మా ఎడ్జకి అసలు బరువే తెలవదు అందుకే వాటిని మేమెప్పుడూ ఒక్క దెబ్బ కూడా వెయ్యం ఎడ్డని కొట్టగూడదు అవి నోరులేని జీవులు వాటిని కొడితే పాపం ఆహా పాపమని ఊరుకుంటే అవి మన్నే పాడుత్తయ్ నూ ఎడ్లు పొడవ్వు క్రిష్ణకి తెలుసు రామూ వాళ్ళ ఎడ్లు పొడవ్వు వాడు రామూతోపాటు తనూ ఆడుకున్నా డాయె కొడితే పాపమగాని తిట్టొచ్చు అని రాజీకొచ్చాడు క్రిష్ణ తిట్టగూడదు కూడా మా నాన్న చెప్పాడు తిడితే మన నోరు పాడైపోతుందంట మరి నీకు చెర్షకోల ఎందుకురా అన్నాడు క్రిష్ణ వాడికి మంచి పాయింటు దొరికింది బండి తోలుకెళ్ళేటప్పుడు అడ్డం రాకుండా బజార్లో వాళ్ళని జడిపించడాన్కి అన్నాడు రాము క్రిష్ణ మరింకేమీ మాట్లాడకుండా కాసేపుండి “నేను కూడా తొట్టో కూర్చుంటారా అన్నాడు రామూ రమ్మని బండి తొట్టో స్నేహితుడ్ని కూడా కూర్చోపెట్టుకుని ఉత్తుత్తిగా ఎడ్లు లేని బండిని చేతిలో లేని చెర్పకోలతో తోలడం మొదలెట్టాడు కాసేపు కూర్చున్నాక క్రిష్ణ మీ బండి మంచిదిరా అన్నాడు అవును మా బండి భలే మంచిది మా చలపతి మామయ్య వాళ్ళ బండుందే అదే దొంగ మొహంది ఎవరూ ఎక్కకపోతే మాట్లాడకుండా నుంచుంటుంది ఎవరన్నా ఎక్కారనుకో ఇక అది ముళ్ళల్లోకి తుప్పల్లోకి తీసుకెళ్తుంది మొన్నాకసారి మా చలపతి మామయ్య తూరుప్పాలం వెళ్తోంటే నేను కూడా ఎక్కా అప్పుడిక అది బోదిలో కంటే బోదిలోకి వెళ్లిపోయి ఇక కొంచెం ఉంటే బోల్తా కొట్టేదనన్న మాట నేను దిగిపోతాను అని ఎడిస్తే కూడా అది ఆగలా మరి మీ చలపతి మామయ్య ఎట్ట ఎగుతున్నాడ్రా దాంతో అదే నాకు తెలవదు నేనడిగితే మా మామయ్యన్నాడు అక్కినాళ్ళు ఎక్కితే వాళ్ళ బండి పడేస్తందంట అన్నీ వట్టి మాటలే అసలా బండే దొంగమొహంది ఎదో గుర్తొచ్చిన +శబండి + 110
కృష్ణ అవున్రా మీ చలపతి మామయ్యగారి బండి మొన్న మిల్లు దగ్గర్నుంచి వచ్చేప్పుడు బోల్తా కొట్టిందిరా అప్పుడు నువ్వు లేవుగదా బండి మీద అవును నేను లేను నూ నాన్న కూడా లేడు మేమిద్దరమేగా అక్కినాళ్ళం మా అమ్మ అక్కినాళ్ళు కాదంట తెలుసా? అంతలో వాళ్ళమ్మ చిన్నా అని ఇంట్లో నుంచి కేకేసింది మర్చిపోయాన్రా మా అమ్మ నన్నెళ్ళి మా అత్తని తొందరగా రమ్మని చెప్పమంది నేను పోతన్నా అని అట్నించి అటే పరిగెత్తాడు రామూ రామూకి సినిమా అంటే బండిలో అమ్మ కూర్చుంటే అమ్మ వళ్ళో కాసేపు బండి తొట్లో నాన్న వళ్ళో కాసేపు కూర్చుని హడావుడి చెయ్యడం బండి నిండా ఆడవాళ్ళు అన్నయ్యా ఎందుకంత తొందర నెమ్మదిగా తోలు బోల్దంత టయముంది అని కేశలేస్తోంటే ఆ ఈ బావయ్య బండి కూడా బావయ్యలాగానే మహా నిదానం అని ఎగతాళులు వినపడ్డుంటే తొందరగా తోలాలో నెమ్మదిగా తోలాలో తికమకపడకుండా నవ్వుల్లో నిండి వుండే నాన్న మొఖం చూస్తూ ఈ ఆడాళ్ళదంతా ఒక గోల తొందరగా పోతే తొందరంటారు నెమ్మదిగా పోతే నెమ్మదంటారు అనుకునేవాడు రామూ అందుకే కావాలనుకున్నప్పుడు నాన్న వళ్ళో చేరి తొందర తొందరగా అని కేక లేసే వాడు అలసటన్పిస్తే వచ్చి అమ్మ వళ్ళో కూర్చునేవాడు ఎప్పుడు సినిమాకి బైల్దేరినా రామూతో వాళ్ళమ్మ అనేది మీ అత్తని ముందు కూర్చో మనరా చిన్నా అని వెంటనే తెరలు తెరలుగా ఆ నవ్వు ముంచుకొచ్చేది రామూకి అప్పుడే అత్త బండిలో చాప మీద నుంచి జర్రున జారి రోడ్డు మీద పడుతున్నట్టు కనిపించేది ఎదవా ఆడి నవ్వు చూడు ఎప్పుడో ఓసారి జారానని ఇక ఎప్పుడూ జారతానా? బండిలో కూర్చోడం నాకేమొచ్చులే మీ అమ్మా కొడుకులంత నేర్చు నాకెక్కడిదీ ఆపుతావా నోట్లో పాడవనా? నవ్వులో అత్త మొఖం భలే గమ్మత్తుగా ఉండేది రామూ నవ్వాపకపోతే చూడన్నయ్యా వీడూ? వేలెడంతున్నాడో లేడో ఇప్పుడే ఈడికి నేనంటే ఎంతలుసో? అని నాన్నతో మొరపెట్టుకునేది మయ్య మాటలకేంలే అమ్మా, నువ్వొచ్చి నా దగ్గర కూర్చో అనేవాడు నాన్న ఇప్పుడు నవ్వడం అమ్మ వంతయేది ఎంటన్నయ్యా నువ్వు కూడా అని అత్త ఉడుక్కునేది ఎప్పుడు సినిమా కెళ్ళినా సినిమాహాలు దగ్గర బడ్డీ కొట్టాయన్లో కాస్త బండిని చూత్తా ఉండండి సాయిబ్బుగారూ అని చెప్పేవాడు నాన్న అందరూ దిగాక ఎడ్డ మెడ మీద నుంచి బండికాడిని దించి ఎడ పలుపుతాళ్ళని బండికే కట్టి తొట్టో దాచి తెచ్చిన జనపకట్ట వరిగడ్డి మీద పడేఎ ఎడ్జని నిమిరేవాడు ఆ ఎడ్లు పనివాడితనం ఈ అక్కినేని కుటుంబరావు 120
రెండూ నాన్న వంక థపేమగా చూసి “ఫర్వాలేదులే. మీరు వెళ్ళిరండి” అన్నట్టు తలలూపేవి. సినిమా చూసి వచ్చేవరకూ జనపకాడలు నవ్వుల్లూ నెమరేస్తూ విశ్రాంతి తీసుకునేవి. ఓసారి బండి మీద చాపలు కాజేద్దామని ఎవడో తుంటరివాడు ప్రయత్నం చేస్తే ఈ ఎడ్డు వాడిని పాడవబోయి గొడవ చేస్తే సాయిబ్బుగారు చూసి వాడిని తరిమేశాడు. సినిమా చూసి వచ్చాక సాయిబ్బుగారు అదంతా చెప్పి “ఏం ఎడ్గండీ! మీ ఎడ్లు రాజాలు” అని నాన్నతో అంటే నాన్న వాటి మెడల్ని కావలించుకుని “కాక?” అన్నాడు.
సినిమా చూసి మళ్ళీ బండి కట్టుకుని బైల్టేరీ ప్రతిసారీ నాన్న “ఎళ్ళాస్తాం సాయిబుగారూ! మీకెప్పుడు అవసరమున్నా కబురంపండి. బండి పంపుతా” అనేవాడు.
“అలాగే తప్పకుండా. మా అమ్మాయి పెళ్ళికే రెండు రోజులు. నేన్చెప్తా లెండి” అనేవాడు.
సినిమా చూసి ఊరికి తిరిగొచ్చేటప్పుడు తాము చూసిన సినిమా గురించి మాట్లాడు కునేవారు అమ్మా వాళ్ళంతా. అమ్మమ్మ ఎన్ని కథలో చెప్పేది. కాని తాను చూసిన సినిమాకథ మాత్రం చెప్పలేకపోయేది. అందరూ నవ్వితే బాధపడేది. అమ్మ అందర్నీ కోప్పడి “శపు నేను చెప్తాలేవే అమ్మా” అనేది.
అందరూ గుడివాడ పొలిమేరలు దాటకుండానే నిద్రకి పడేవాళ్ళు. ఎడ్లు నెమ్మదిగా 'రోడ్డంటే వెళ్ళిపోయేవి. వాటికి ఊరూ ఇల్లూ ఏమీ చెప్పక్కర్ణా. బండి మీద నుండి ఎవరూ జారకుండా నాన్న వెనక నడుస్తూ ఉండేవాడు. బండోడు - మనుషులిట్టా పుడతారా అని పదేళ్ళ రామూని ఆశ్చర్యంలో ముంచేసిన బండోడు - ఈ బండిలోనే పుట్టాడు. వరలక్ష్మి పిన్నికున్న సినిమాల పిచ్చి నిండు నెలల్లో ఉన్న ఆమెని సినిమాకి రప్పించింది. సినిమా చూసి వస్తూ ఎప్పట్లానే అందరూ నిద్రల్లో జోగుతుండగా ఉన్నట్టుండి వరలక్ష్మి పిన్ని గట్టిగా వేసిన కేకకి అందరూ ఉలిక్కిపడి లేచారు. ఊరెళ్ళేదాకా నిద్రపోనని నాన్నతో పందేం కాసిన రామూ కూడా -
రామూకంతా అయోమయం. హడావుడిగా అందరూ బండెందుకు దిగారోో ఎందుకు కంగారు పడుతున్నారో, ఎందుకు నవ్వుకుంటున్నారో, ఎందుకు భయవడుతున్నారో తెలవటం౦లా.
నాన్న గబగబా రైలుగేటు దగ్గర కెందుకెళ్ళాడో, వరిచెత్త లాగి నాలుగు ఎండుపుల్లలేసి మంట ఎందుకు రాజేశారో - అంతా అయోమయం.
పిన్ని కేకలు పెట్టినప్పుడల్లా భయంతో గుండె ముడుచుకుపోతుంటే అమ్మ కోసం వెతికేవాడు. అమ్మ అమ్మమ్మ, అత్తా ముగ్గురూ బండిలో - బండి కడ్డంగా - రాగమ్మొదిన తనని గట్టిగా పట్టుకుని “కాసేపు కదలకుండా తొట్లో కూచో” అని కసిరింది.
రామూ నిద్ర అయోమయం, భయం అన్నీ పోగొడుతూ చిన్నపిల్లాడి ఏడుపు అందరూ సందడి సంతోషం... 'మగపిల్లాడే' అన్న కలకలం. రామూకంతా అద్భుతం. పిన్ని పొట్టలో
నదిండె శి గం
పెరుగుతున్న పిల్లాడు ఈ రాత్రి తన బండిలో ఎట్లా బైటికొచ్చాడు - వాడు ఎగ్రగా, నెత్తుటి ముద్దలా భయం గాలిపేలా ఉన్నా పదేపదే వాడిని చూడకుండా ఉండలేకపోయాడు. - మర్నాడు బళ్ళో స్నేహితులందర్నీ ఆశ్చర్యంతో ముంచెత్తుదామని వెళ్ళిన రాము “పిల్లలెలా పుడతారో తెలుసా" అంటూ కొందరు చెప్పిన విషయాలు విని హడలిపోయాడు. తన బండిలో అంత పని జరిగిందా, ఎంత అద్భుతం అని తనే ఆశ్చర్యపోయాడు. తర్వాత బండోడిని చూచినప్పుడల్లా రామూకి అర్థంకాని ఏదో రహస్యాన్ని చూసిన భావం - దాన్ని అరిగించుకోవాలని ఆరాటం - అర్థం చేసుకోవాలన్న తపన కలిగి తెలియని అశాంతితోనూ, అపూర్వమైన అలజడితోనూ మనసు నిండిపోయేది. ఆ బండోడు ఇవ్వాళ విమానాలు నడుపుతున్నాడు. వాడ్ని తలుచుకోగానే రామూ పెదవుల మీద చిరునవ్వు. ఆ బండిని తలుచుకుంటే చాలు రామూకి ఎక్కడెక్కడి సంగతులూ గుర్తొస్తాయి. ఎప్పటెప్పటి కబుర్గ్లో ఆ బండి అతన్హో చెబుతున్నట్లే ఉంటుంది. బండి మీద వేసుకుని పచ్చగడ్డి మోపులూ, జనవ కట్టలూ, వరిగడ్డీ వకటా... పాలాన్నించి ఎన్ని తీసుకొచ్చేవారూ... అన్నీ పాలాల్నుంచేనా? పాలాలకీ తీసుకెళ్ళేవాళ్ళు. అయితే నాన్న మాత్రం “పెంటపోగు తోలేప్పుడు వద్దులేయ్యా నీకు జబ్బు చేస్తుంది” అనేవాడు. “మరి నీకు చెయ్యదా” అనేవాడు రామూ, “నేను పెద్దాడ్నీ గాయ్యా” అనేవాడు నాన్న. ఈ ఇంటికీ, వాకిట్టోకీ భరంతు కోసం ఎండిపోతున్న కాలవనుంచి ఎంత మట్టి మోసుకొచ్చేది ఈ బండి. " ఈ బండి మీదే నిలబడి నాన్న, వీరడూ తూరుపోత పలికల్తో ధాన్యం అంతా పోతపోసే కళకఠళ్లాడుతూ వద్గన్నీ ఒక బంగారు రాశిగా పోగుపడుతూ ఉంటే - కాస్త దూరంగా తాలూ తప్పా, తుక్కు దూగరా... బండి మీదే తలగుడ్ద కట్టుకుని శూర్చుని రామూ - ఓసారి తూరుప్పాలం నుంచి పండిన వడ్డన్నిటినీ ఇంటికి చేరవేస్తున్నారు. ఈసారితో కళ్ళంలో ఉన్న బస్తాలన్నీ అయిపోతాయి. బండి కెక్కించిన పనివాళ్ళు కాళ్ళూ, చేతులూ కాలవలో కడుక్కుని బండి వెనకే బయల్దేరారు. నాన్న ఎడ్డ తాళ్ళు పట్టుకుని ముందు నడుస్తు న్నాడు. రామూ తొట్ల్టో కూర్చున్నాడు. చివరిసారి అవటం మూలంగా బండికి కాస్త బరువెక్కువే అయింది. అందువల్లే ఎడ్లు కాస్త భారంగా లాగుతున్నాయి. చేలల్లో గుండా వేసిన బాట వెంట నడుస్తోంది బండి. పడమటి అకాశంలో సూర్యుడు దిగిపోతున్నాడు. ఆకాశం అంతా పనివాడికనం 4 అక్కినేని కుటుంబరావు 122
ఎర్రగా కుంకుమతో నిండిపోయింది. పక్తులు గుంపులు గుంపులుగా ఎగురుతూ వెళ్తున్నాయి. ముందు నాన్నా తర్వాత బండి. వెనగ్గా పనివాళ్ళలో ఎవరో తీస్తున్న రాగం...
ఈనాడు బండి వంక చూస్తున్న రామూకి ఎప్పుడో ముష్ఫయ్యేళ్ళనాడు తను గడిపిన అ సాయంత్రం ఇప్పుడు తన కళ్ళముందు దృశ్యంలా గుర్తొస్తోంది. బండి ఇప్పుడు కూడా ఆ పచ్చగడ్డి పరిమళాల్తో సహా గతాన్ని గుర్తుకు తెస్తోంది. ఈ బండితో తనకెంత అనుబంధం. ఈ ఊరుతో, ఈ పాలాల్తో, ఈ కాలవతో, ఈ చెట్లతో, ఈ పక్షుల్తో ఈ వీధుల్తో ఇళ్ళతో, ఈ మనుషుల్లో...
ఇవన్నీ వదిలి మళ్ళీ తన పొగలోకిి తన దుమ్ములోకి, తన గతుకుల రోడ్డలోకి, చితికిన బతుకుల్లోకి వెళ్ళిపోవాలి.
“అదిగో వడ్రంగాయన వస్తున్నాడు. మీరు లోపలికెళ్ళండి. నేనే ఏదో ధరకి సెటిల్ చేసేస్తా” అంది శాంత,
“వద్దు శాంతా. వడ్రంగి బండిని ముక్కలు చేసి పీటలో, కుర్చీలో చేస్తానన్నాడు. నాకది ఇష్టంలేదు. బండిని బండిలాగే ఉండనిద్దాం. ఇందాక వీరడు కనబడి బండిని తాను కొనుక్కుని కిరాయికి తిప్పుకుంటానన్నాడు.”
“వీరడేం ఇవ్వగలడ౦ండీ”
“కిరాయికి తిప్పుకునేట్టయితే తీసుకెళ్ళమన్నాను. పైగా వీరడు కూడా. ఈ బండితో కల్సి బోల్డంత పనిచేశాడు. ఈ బండికి నేను డబ్బులు తీసుకోను” అంటూ ఉండగానే మనసులో నుంచి ఏదో బరువు దిగపోయినట్టయి తేలిగ్గా నిట్టూర్చాడు రామూ.
ఆంధ్రజ్యోతి ఫిబ్రవరి ౩ 1989 వునర్ముదణ : జ్యోతి చూనవత్రిక జూన్ 1989 చలసాని మాట నేను స్థూలంగా కథలలో సాంఘిక ప్రయోజనాన్ని కోరుకొంటాను. అది లేకున్నా కనీసం రచయిత తాను చెప్పదలచిన విషయాన్ని, చూపదలచిన జీవితాన్ని సమర్థవంతంగా, పాఠకుల చేత ఆలోచింపజేసేలా చెప్పగలరా? అందులో విజయవంతం అయ్యారా? అనేదాన్ని గీటురాయిగా తీసుకుంటాను.
ఆ దృష్ట్యా నాకు నచ్చిన ఉత్తమకథ అక్కినేని కుటుంబరావుగారి “బండి.
పెట్టుబడిదారీ నాగరికత ఫలితంగా మారిన గ్రామీణ సాంఘిక జీవితం, నూతన అర్థిక వ్యవస్థ ప్రభావంతో మారిన మానవసంబంధాలు చిత్రించే కథలు మనకు ముపష్పయ్యేళ్ళ
+శబండి* 123
నాడే అంతకు ముందే చాలానే వచ్చాయి అయితే వాటితో ఈ తరంవారికి అంతగా పరిచయం లేదు అ కధాంళాన్నే తీసుకొని ఈ తరంవారి కోసం రాసిన కధ బండి బూర్డువా వర్గానికి పైచేయి అయినచోటనల్త్లా అది సకల ప్యూడల్ సంబంధాలనూ సకల పితృస్వామిక సంబంధాలనూ సకల నిష్కపట జానపద సంబంధాలనూ నిర్మూలించింది మనిషికి మనిషికి మధ్య నగ్నమైన స్వలాభం తప్ప కిరాతకమైన డబ్బు లావాదేవీ తప్ప ఇక ఎ సంబంధాన్నీ మిగలనివ్వలేదు అది మనిషి విలువను రూపాయిల్లోకి మార్చింది ఈ మాటలు మార్క్స్ - ఎంగెల్స్‌ల కమ్యూనిస్టు మానిఫెస్టో లోనివి అక్కినేని కుటుంబ రావుగారి బండి చెప్పేది ఈ చారిత్రక సత్యాన్నే సమాజ పరిణామశక్రమంలోని ఒక సంధికాలపు సవాలక్ష సంఘటనల్లో ఒక చిన్న అంశాన్నే పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిపోయిన ఒక గ్రామీణ విద్యాధికుడు పల్లెలో మిగిలిపోయిన వారసత్వపు ఆస్తుల్లో ఆఖరి వాటిని కూడా అమ్మేసి డబ్బు గా మార్చుకుని పట్నమెళ్లి పోవాలని గ్రామానికి వస్తాడు అక్కడ అతనికి మిగిలి ఉన్నది ఒక ఎడ్జ్ద బండి నాన్న ప్రాణానికి ప్రాణమైన బండి - ఇది చెక్కబండా? నాతో ఎన్ని ఆటలాడింది?” నన్నెంత దూరాలు మోసింద్ తిప్పింది నాకెంత ఆనందాన్నిచ్చిందీ బండి ఈ పిచ్చిముండ అనుకుంటాడా విద్యాధిక యువకుడు అలా ఎన్నో జ్ఞాపకాలు నెమరేసుకొని బండితో గల అనుబంధాన్ని తెంచుకోలేక అమ్మటానికి వెనుకాడుతాడు కాని పట్పంల్మోఅతని అవసరాలు వేరు బండి ఉపయోగం వేరు మరి అతనేం చేస్తాడు? అటు గతించిన కాలపు సెంటిమెంట్లనూ వదులుకోలేక ఇటు మారిన జీవితవ్యవస్థకు అనుగుణంగా తెగించనూలేక చివరికి వడ్రంగికి అమ్మేస్తే డబ్బొస్తుందిగానీ వాడా ప్రాణప్రదమైన బండిని ముక్కలుగా చేసి పీటలూ కుర్చీలూ చేస్తాడు అది సహించలేడు కనుక కిరాయికి తోలుకుంటానన్న వీరడికి ఉచితంగా ఇచ్చేస్తాడు ఆ విధంగా డబ్బు ఆశను హృదయగతానుబంధం జయించిన తీరును రచయిత ప్రతిభావంతంగా చిక్రించాడు అందుకే ఈ బండి నా దృష్టిలో ఉత్తమ కధ
- చలసాని ప్రసాదరావు జ్యోతి మానవతిక జూన్ 989 పనివాడితనం + అక్కినేని కుమింబరావు $ే2త
లాడికోడు గట్టుకాడ
రౌొం౦బాబు బస్సు దిగాదో లేదో 'రైట్ పోనీ అన్నాడు కండక్టరు ఆయనా మాట అన్నాడో లేదో బస్సు బైల్దేరి వెళ్ళిపోయింది
ఆకాళం నిండుగా చుక్కలు కాలవ కటూ ఇటూ ఉన్న పాలాల్లో నుంచి కీచురాళ్లూ కప్పలూ చేస్తున్న జుగల్‌బందీ ఉండీ ఉండి వారెవ శభాష్ అన్నట్టు తీతువపిట్టల అరుపులు
అక్కడ దిగింది రాంబాబు ఒక్కడే వెన్నెల అతని చుట్టూ వెల్లివిరిసింది
ఇలాటి వెన్నెలని అతను ఎప్పుడో ఈ ఊళ్ళోనే ఎరుగును తర్వాత ఎన్నో పట్టణాల్లో చదివాడు నగరాల్లో ఉన్నాడు కానీ ఈ వెన్నెల ఊ హూ ఎక్కడా అతనికి కనపడలా
ఊళ్ళోకెళ్ళడానికి ఒక రోడ్డుంది గాని అది చుట్టు నడిచెళ్ళేవాళ్ళివరూ దానంట వెళ్ళరు చేలల్లో ఉండే గట్ల మీద నడిచెళ్తారు ఈ తోవలో చిన్నచిన్న ప్రమాదాలున్నాయి
వర్షాకాలంలో గట్టకి గళ్ళు పడతాయి కొంత కొంత దూరం అసలు గట్టే ఉండదు శీతాకాలాల ఉదయాల్లో గట్టు నిండా పెరిగిన పచ్చగడ్డీ జనప మొక్కలూ కలిసి బట్టల్ని తడుపుతాయి
అన్నిటికన్నా పెద్ద ప్రమాదం లాడికోడు
రాంబాబు నెమ్మదిగా నడుస్తున్నాడు ముందుకి అతని ఆలోచనలు వెనక్కి
గోచీ పెట్టుకుని స్నానం చేసే తండ్రి పక్కనే ఎ గోచీ లేకుండా తను స్నానం చేసేవాడు
గేదె తోక పుచ్చుకుని కొల్లేట్లో ఈత నేర్చుకున్నాడు
కొల్లేట్లో పట్టుకున్న చేపల్నీ కొంగల్నీ తెచ్చి నీచు తినని తల్లికిచ్చి వండవే అనేవాడు
రాత్రి పడుకోబోయే ముందు జీవకారుణఖ్యం గురించీ నోరులేని జీవుల యెడల చూపాల్సిన జాలి గురించీ అహింన గురించీ కధలు కథలుగా చెప్పిన తల్లి మొహం చు డకుండా వండవే అనేవాడు
- లాడికోడు గట్టుకాడ + 125
తండ్రికి ఏ పూటా నీచు లేకపోతే ముద్ద దిగదు. తల్లికి నీచు వాసన తగిల్తే ముద్ద దిగదు.
అయినా, అవిడ ప్రతిరోజూ నీచు వండిపెట్టేది.
రాంబాబు “లాడికోడుని చూసి ఆగాడు. ఒకప్పుడు ఈ 'కోడు' దగ్గర లేళ్ళు బాగా తిరిగేవట. అందుకే దీనికి 'లేళ్ళకోడు' అని పేరు. అది “లాడికోడు' అయిందిప్పుడు.
ఈ లాడికోడు సంవత్సరంలో ఓ రెండ్నెల్లు నడివేసవిలో ఎండుతుంది.
మిగిలిన పది మాసాలూ నీళ్ళతో, ఎగిరిపడే చేపల్తో, నిండా ఉండే తూటుకాడలతో, గాలికి ఊగే రకరకాల తీగల్తో, పూలతో, షికార్లు కొట్టే పొముల్లో చూడడానికి కన్నుల పండుగే.
కానీ నడిచివచ్చిన ప్రతివారినీ దిగి కాళ్ళు తడుపుకోమంటుంద్ది.
ఎప్పుడన్నా ఓ తాటిపట్టా ఆ గట్టునీ ఈ గట్టునీ కలుపుతూ ఉండడం కద్దు. త్వరలోనే అది చీకి... చీకి... గట్టు కుంగి కుంగి... పనికిరాకుండా పోతుంది. మళ్ళీ అందరూ దిగి నడవాల్సిందే. పంచెలూ, చీరలూ కాస్త కాస్త పైకెత్తి తొడల్లాకా... అప్పుడప్పుడూ నడుముల్డాకా... తడుస్తూ... అవతల గట్టుకి వెళ్ళాలి. అప్పుడుగాని ఊర్జోకెళ్ళడం కుదరదు.
ఇప్పుడు రాంబాబు పొంటేసుకుని ఉన్నాడు. పైగా, ఎక్కడ దిగాలి? ఎక్కడ కాస్త తక్కువ లోతుంటుంది? ఇదివరకు కూడా కొన్నాళ్ళాచివరా, కొన్నాళ్ళిటు వైపుగా దిగుతూండే వాళ్ళు.
“ఎప్పుడొచ్చావే అన్నయ్యా” అంటూ వచ్చింది చిన్నమ్మ
“ఎవడ్రా అక్కడ కూచ్చుందీ? మనూరితో ఆడికేం పనంటా?” అంటూ మోటసరసం ఆడుతూ, ఆగకుండానే వెళ్ళిపోయాడో బావ.
“ఏంబెల్లిపోతున్నా! మర్యాత్తెలిసేడిసిన మొకాలైతేగా!” అని గునిసింది ఆయన భార్య = పెదనాన్నగారమ్మాయి.
“వత్తన్నానే! కళ్ళు కనపట్టల్లా! పాలువుతాడు తెంచుకుని వడ్డ పరుగెత్తాంది” అనుకుంటూనే ఉరుకులు పరుగులుగా వెళ్ళిపోయాడు సపెద్దనాన్నగారమ్మాయి మొగుడు.
తీరిగ్గా పొగాకు పాయలుగా చీలుస్తూ, తుడుస్తూ, సవరదీస్తూ, వాసన చూస్తూ, కళ్ళు చిట్టించీ, చేతులడ్డం పెట్టుకునీ రాంబాబు చుట్టూ నిదానంగా తిరుగుతూ “ఎవరా మడిసి... రాంబాబా?” అన్నాడు చిన్నతాత,
“అమ్మనీ మునలోడా! కళ్ళు కనపట్టల్లేదని వహటే గొడవ! మరి రాంబాబెట్టా కనపడ్డాడూ?” అంది చిన్నమ్మ
చిరునవ్వులు చిందించాడు... ముసలాయన మహా నెమ్మది. కాసేపాగి “మీ పాడు మొకాల్లో ఏముంటుంది, చీకటి తప్ప!” అన్నాడు.
“అబ్బో! మరి నీ మనవడి మొకంలో...” మూట పూర్తి కాకముందే -
“అడు రాజా కదంటే! ఆడి మొకంలో కళుంటంది”
ప్రనివారితనం ఈ అక్కినేని కుటుంబరావు 126
“నీ ముసలాడు పాడుగాను! అందుకే - అందరికీ నువ్వంటే మంట! రోజూ కళ్ళెదు టుండి నీ బాగోగులూ మంచి చెడ్డలూ చూసే మా మొకాలేమో చీకటిగుయ్యారాలా. ఎంత రంగుంటే మాత్తరం నీ మనవడి మొకంలో కోతులాడతన్నయ్యా?”
మాటలన్నీ వింటూ ఈ గ్రామీణ వాతావరణానికి పూర్తిగా దూరమయిపోతున్నానే అనుకుంటున్నాడు రాంబాబు.
“అయితే అయ్యా! పొద్దుపోయాకొచ్చా?” అన్నాడు చిన్నతాత.
“అవునే. అనుకోకుండా ఆలస్యమయిపోయింది” అన్నాడు రాంబాబు.
“పొలాల్లో నుంచే”
“పొద్దుబోయి పొలాల్లోనుంచెందుకొచ్చా! ఏ పురుగో పుట్రో ఉంటే... మరి ఆ లాడికోడు గట్టుకాడ...?”
“ఏం చేస్తానే. మీరంతా ఏం చేస్తున్నారు? అలాగే... దిగి.”
“మాకంటే పుట్టిందగ్గర్నుంచీ అలవాటయ్యె. పైగా, నీకేమో పొడుగు లాగూలు..”
“లగూల్డేముందిగాని... అరికాళ్ళ నిండా తుమ్మముళ్ళే! తెల్దారిందగ్గర్నుంచీ ఇప్పటి దాకా నీ మనవడి పాదాల్లో దిగ్గిన ముళ్ళు తియ్యడమే నా పని! మూడు పిన్నీసులు వంకర పోయినయ్” అంది సెద్దమ్మ
“నీ పిన్నీసులు పాడుగాను-”
“పాడయినయ్యనే చెప్పేది”
“పోతే పోయినయ్‌లే - పిన్నీసులేగా! ఆడి పాదాలెట్టా ఉన్నయ్”
“ఎట్టా ఉంటాయ్? ఎర్రమందారాల్దాగా ఉన్నయ్.”
“అట్టెట్టా దిగావురాయ్యా”
“ఏం చెయ్యమంటావే! నీటి అడుగున ఎక్కడ ఏముందో నాకెట్టా తెలుస్తుంది? అయిన్నా ఆ లాడికోడు గట్టుకాడ చిన్న వంతెన కట్టుకోలేరంటే!”
రాత్రి వచ్చిన ఊరి మీది కోపం మళ్ళీ తిరగబెడ్తోంది.
అందరూ తలో దిక్కునా మీద పడ్డారు. రాంబాబు మీదా వడ్డారు. ముసలాయన మీదా పడ్డారు.
రాంబాబుకి ఊహ వచ్చింతర్వాతే నాగార్జునసాగర్ డాము కట్టింది. క్రిష్ణ మీదా, గోదావరి మీదా కూడా బ్రిడ్జిలు కట్టారు. ఎన్నెన్నో వంతెనలు వెలిశాయి. ఎందరో సివిలింజనీర్లు తయార య్యారు. ,
దేశం (ముందుకే కాబోలు) తెగ వేగంగా పోతోంది. ఈ ఊరూ, ఊర్గో మనుషులూ, ఆ లాడికోడు గట్టూ మాత్రం ఏమాత్రం మారలా, అదీ రాంబాబు వాదన.
- లాడికోడు గట్టుకాడ + క్రై?
పల్లెటూళ్ళో చర్చ మొదలవ్వాలేగాని ఊరు ఊరంతా పనులు మానేసి అసలిప్పుడు పెద్ద పనులూ లేవు చర్చ చుట్టూ చేరిపోతారు శీతాకాలం తెల్లారగట్ట చలిమంట చుట్టూ చేరిపోయినట్టు ఆ వంతెనలు మాత్రం ఆగుతాయా అన్నాడొకాయన బాగా చెప్పావ్ అన్నాడు చంద్రం బాబాయ్ ఇదుగో చంద్రం బాబాయ్ నువ్వూరుకోవే ఇందాకాడు చెప్పిందానికీ అట్టాగే అన్నావ్ ఇప్పుడీయన చెప్పేదానికీ అట్టాగే అంటన్నావ్ అంది వనమక్కాయ్ బాగా చెప్పావ్ అన్నాడు మళ్ళీ చంద్రం బాబాయ్ అందరూ నవ్వుల్లో పడ్డారు ఇదిగో నేను చెప్పేది సీరియస్సుగా వినండి అన్నాడు రాంబాబు ఎట్టా ఇనాలీ? అన్నాడు తాత కొల్టేట్లో పుట్టి పెరిగిన రాంబాబు తెలుగు కోసం వెతుకుతున్నాడు ఎట్టాగోట్టా ఇనండి ఆడేం చెబుతాడో అని విసుక్కుంది రాముడక్కాయి సరే చెప్పరా నువ్వు చెప్పేదేంటో మీరందరూ రకరకాల కారణాలు చెప్పారు అన్నీ చూస్తే - లాడికోడు గట్టుకాడ వంతెన కట్టడానికి డబ్బు ఎవరేసుకోవాలి? ఎంతేసుకోవాలి? వేసుకున్నా ఆ పని ఎవరు చేస్తారు ఇవీ సమస్యలు వీటన్నిటికీ పరిష్కారం నేను రాత్రే ఆలోచించా అంటే ముళ్ళు అంత బాగా దిగినయ్యన్నమాట బెకబెక నవ్వాడు బావ అందరూ మళ్ళీ ఓ విడత నవ్వుల్లో ఆ సరే సో నిజంగా జరిగిందదే రాత్రి ఆ నొప్పికి సరిగ్గా నిద్రపట్టలా అందుకని విషయానికొద్దాం నేనీ ఊళ్ళో పుట్టి పెరిగాను హైద్రాబాదులో నా పని కాస్త బాగానే ఉంది కాబట్టీ లాడికోడు గట్టుకాడ వంతెన కట్టించాలనుకున్నా ఎంత ఖర్చయితే అంతా నేనే పెట్టుకుంటా ఆ పనంతా బావ చేయిస్తాడు వంటింట్లో టిఫిన్ చేస్తున్న పెద్దక్క ఎమంటున్నాడే అనడిగింది అప్పుడే లోనకొచ్చిన చెల్లెల్ని ఖర్చు తను పెట్టుకున్నా పాతికేలన్నా అవుతయ్ పాతికతో అయితే తేలిగ్గా అయినట్టే త్య ఈసారి రాంబాబు బస్సు దిగేసరికి చీకటి పడలా పైగా సాయంత్రపు నీరెండ చేను గట్టంతా కదుల్తున్న మానవహారంలాగా ఉంది ఎమిటివాళ? అనుకుంటూండగానే తట్టింది మంగళవారం కైకలూరు సంత సరుకుల మూటలూ కూరల మూటలూ నెత్తిన పెట్టుకుని ఊరికేసి నడుస్తున్నారు జనం వారిలో కలిశాడు రాంబాబు పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 128
ఎవురా మడిసి? మన రాంబాబు కదూ ఎరా అయ్యా ఇప్పుడేనా రావటం? ఇప్పుడే బస్సు దిగాడు ప్రశ్నలూ సమాధానాలు అన్నీ వాళ్ళే చెప్పుకుంటున్నారు రాంబాబుక్కూడా చెప్పాలని ఉన్నా అవకాశం ఇవ్వడంలా లాడికోడు గట్టుకాడ మగాళ్ళు పంచలూ ఆడాళ్ళు చీరలూ ఎగ్గడుతోంటే - రాంబాబూ ఇక్కడ నువ్వు వంతెన గట్టిస్తావని అంటున్నారే ఊళ్ళో ఈ అవకాశాన్ని జారవిడుచుకోదల్చుకోలా అవును అందుకే వస్తున్నా త్వరత్వరగా అన్నాడు రాంబాబు వంతెనా? ఆశ్చర్యపోయాడు ఒకాయన ఎంటట్టా తెల్లబోతన్నా ఎప్పుడూ వంతెన "పేరే ఇననట్టూ? అంది ఓ వనిత వంతెన పేరూ ఇన్నా నీ పేరూ ఇన్నాగానీ ఇక్కడ కట్టిత్తారా అని నేను పుట్టి బుద్ధెరిగినాక ఎవ్వరూ అనలా ఆ మాట అందుకూ తెల్లబోడానిక్కారణం వివరించాడాయన కట్టిత్తారు నువ్వు నడుత్తావా నడవ్వా దానిమీద కట్టిత్తే ఎందుకు నడవనూ? ఎమో ఎవరు కట్టిత్తే అల్భే నడుత్తారు నాకేం కర్మ అంటావేమోననుకున్నా ఓసినీ - జనం నవ్వుల్లో ఆయనన్నమాట ఎవరికీ వినపడలా అవతలి గట్టెక్కాక ఛీఛీ ఊళ్ళో ఇన్ని పార్టీలున్నాయ్ ఇందరు పెద్ద మడుసులు న్నారు గాని దీని మీద నాలుగురాళ్ళు ఎయిద్దాం అనుకోరు గందా అంది ఓ అక్క ఎమోనక్కా గట్టు మీద నడిసినట్టే లాడికోడు మీద కూడా నడుత్తాం అనుకుంటే నమ్మబుద్ధెయ్యదు అంది ఓ చెల్లెలు ఎన్ని రోజులు పడతందీ? నెలా ఆన్నాడు గబుక్కున రాంబాబు ళా ఒకసారి సర్పంచుగారింటికెళ్ళాద్దాం పద అన్నాడు బావ పద అన్నాడు రాంబాబు అక్కడ పాత మునసబుగారు కూడా ఉన్నారు వీళ్ళెళ్ళాక వీళ్ళు రావడం చూసి మరికొందరు పోగయ్యారు ఎంకటేసగ్రావ్ చెప్పాడ్రా బాబూ నువ్వు చేద్దామనుకున్న పని మంచిదే. కానీ అని ఆగాడు సర్పంచు సందేహమెందుకు. చెప్పు అన్నాడు పాత మున్సబు
- లాడికోడు గట్టుకాడ + 120
ఎమిటదీ? అన్నాడు రాంబాబు ఎముందీ? నువ్వెరగవా ఈ ఊళ్ళో వాళ్ళ బుద్ధులు ఒకడు ఎటికి లాగితే ఒకడు కోటికి లాగుతాడు వింటున్నాడు రాంబాబు రాంబాబు చిన్నప్పుడు గేదెల్ని కొల్లేట్లోకి తోలుకెళ్ళేవాడు ఒక్కోరొజు ఎందుకో ఒక్కో గేదెకి చిర్రైత్తుకొచ్చేది ఇక అది ఎ మూల నుంచి ఎ మూలకి పోతుందో తెలియక - ఆ కొల్లేటి గట్టంటా ఎట్టోనూ పడిపోతూ ఉండేది దాని వెనక పరుగులెత్తలేక ఈత వెయ్యలేక రాంబాబు (ప్రాణాలు పోయేవి ఇవ్చుడు నర్చంచుగారు మాట్టాడ్డం మొదలెట్టాక ఈయన రకరకాల ఊక ఎందుకుగానూ దంచుతున్నాడో ఎమాశించి తన కళ్ళలోకి ఆ పొట్టు ఊదుతున్నాడో రాంబాబుకి పాలుపోవడంలా పాత మున్సబుగారే రాంబాబుని కరుణించి - అదంతా ఎందుకిప్పుడు? ఉన్నమాటేదో వాడి చెవిలో వేస్తే పోయేదానికి అని - అసలు విషయం ఎంటంటేన్రా అబ్బాయీ రాంబాబూ - ఇరవయ్యేళ్ళన్నా వచ్చీ రాకముందే నువ్వీ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయావా? మేం పెద్దాళ్ళమంతా నువ్వు పుట్టక ముందు నుంచీ ఈ ఊళ్ళోనే పడున్నాంగా ఎనాడూ లాడికోడు మాకడ్డంగాలా అదిపోనీ - వంతెన కట్టుకుంటే తప్పేం ఉందిగానీ - ఊల్లో ఇంతమంది పెద్దముడుసులుండి చెయ్యలేని పనిని
- నువ్వెక్కడ్నుంచో వచ్చి చేస్తే - తెల్లారి పొద్దున్న లేచి ఊళ్ళో మొకాలెత్తుకు తిరగ్గ్లలమా? లోకులు కాకులు పొడిచినట్టు పాడవరా? అంటున్నారు కొందర మొవాసులు మరి అళ్ళన్న దాంటోనూ తబావతు లేదుగదా పోయిన్సారి వుష్కరాలప్పుడు జరిగిన గొడవలు నువ్వినే ఉంటావుగా మళ్ళీ అట్టా పుచ్చెలెగిరిపోయేటట్టుగా ఉంది ఊళ్ళో చూస్తాంటే అందువల్ల వంతెన బాగ్గెం లాడికోడుకి రాసిలేదనుకో దాని సంగతి మరిచిపోయి నీ సంగతి నువ్వేదో చూసుకో అన్నాడు పాత మున్సబు రాంబాబుకి పిచ్చెక్కేలా ఉంది తనో పాతికవేలు ఖర్చుచేం చిన్న వంతెన కట్టిస్తానంటే ఊళ్ళు వాళ్ళందరూ తలలెందుకు పగలగొట్టుకోవాలో అర్థం గావడంలా అదే బావతో అంటే- ఆయనన్నాడు నువ్వు ఎచ్చే ఎన్నికల్లో నిలబడతావనీ అందుకే ముందుగా ఈ వంతెన కట్టించబోతున్నావనీ ప్రచారం జరుగుతోందిలే ఇదంతా నీకెందుగ్గానీ ఈసారొచ్చేటప్పుడు కాస్త ముందుగా ఉత్తరం రాశావంటే రోడ్డుమీదికి గుడిసీ బండి పంపుతాం అన్నాడు బావ అక్క కొడుకు శంకర్ పదేళ్ళవాడు అప్పటి వరకు బావ చెయ్యి పట్టుకుని నిశ్శబ్దంగా అందరి మాటలూ వింటున్నవాడల్లా తల పైకెత్తి అవును బండి మీదొస్తే నీకసలు లాడికోడే కనపడదు మామయ్య నిజం అన్నాడు నచ్చచెప్తున్నట్టుగా రాంబాబు మాత్రం లాడికోడులో పాతికవేలు పోయినవాడిలా దిగాలుపడ్డాడు ఇందడీయా టుడే 2 5 ఫిబ్రవరి 993 పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 130
పనివాడితనం ఇ౦శ6కీ ప్రసాదు అదృష్టం బాగుందిలే లేకపోకే నీకీ బుద్ధి పుట్టేదిగాదు అంది పార్వతి అన్నకేసి తిరిగి వాడదృష్టం నా అదృష్టం ఎత్తుభారపు అదృప్పులు వెంకటాచారి కంఠంలో ఎక్కడలేని విషాదమూ వినిపించింది నీ అదృష్టం సంగతేమోగానీ వాడికి ఫర్వాలేదులే బావా వాడ్ని గురించి నువ్వు దిగులు పడక్కర్దేదులే అన్నాడు తిరుమలాచారి తల దించుకుకూచున్న ప్రసాదుకేసి చూసి ఎమోయ్ అల్లుడూ నువ్వేం చేద్దామనుకుంటున్నావ్ అనడిగాడు వాడికేమొచ్చనీ? ఎం తెలుసనీ? తండ్రి వెంకటాచారి మాటలకు పౌరుషంగా చూశాడు ప్రసాదు శిల్పాలు చెక్కటం తప్ప ఎ పనైనా చేస్తాను మరింకేం ఆ పని ఎలానూ లేదు అది మన తాతలకేం పెట్టిందో తండ్రుల నాటికే అంతంతమాత్రమయింది. నేను చెప్పిన పని శ్రద్ధగా చెయ్యి. మనూళ్ళో సగం కొనెయొ్యొచ్చు నవ్వుతూ అంటున్న మామవైపు చూస్తూ సంతోషంగా తలూపాడు ప్రసాదు మీ మామయ్య కొనగా మిగిలితే సన్నాయి నొక్కు నొక్కింది పార్వతి నవ్వుతూనే భార్యవంక గుడ్డురిమి చూసి బావవైపు తిరుగుతూ ఇప్పటిలాగే మరో సంవత్సరం తిప్పలు పడు తర్వాత నీ కొడుకే నిన్ను చూసుకుంటాడు అన్నాడు వాడు నన్నడక్కపోతే అదే చాలు అన్నాడు వెంకటాచారి వెంకటాచారీ తిరుమలాచారీ మేనత్తా మేనమామ బిడ్డలు పైగా కుండమార్చిడి వెంకటాచారికన్నా ఐదేళ్ళు చిన్నవాడు తిరుమలాచారి ఆ చనువూ చిన్నప్పటి నుంచి ఒక్కచోట
- పనివాడితనం + శ్ర
పెరుగుతూ తిరుగుతూ పెంచుకున్న అనుబంధం. "పెళ్ళవగానే కులవృత్తి కూడు పెట్టదని తిరుమలాచారి కృష్ణాతీరం నుంచి మూసీ తీరానికి చేరాడు. ఒక మోస్తరు ఉద్యోగం చేస్తూ ఆట్టే ఇబ్బందులు పడకుండా బతుకుతున్నాడు. శిల్పాలు చెక్కటంతో సంసారం నడవక పోయినా, రానురానూ శిల్పాల కోసం ఎవరూ అడగకపోయినా వెంకటాచారికి శిల్పాలు చెక్కడం ఓ వ్యసనమైపోయింది. వెంకటాచారి తాత పేరు కూడా వెంకటాచారే. ఆయన ఆంధ్రదేశంలోనే పేరుపొందిన శిల్పాచార్యుడు. ఆయన కాలంలో వాళ్ళిల్లు ఒక గురుకులం. ఎక్కడెక్కడి నుంచో యువకులు వచ్చి శిష్యులై శిల్పాలు చెక్కటం నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. తాత వెంకటాచారి పదిమంది శిష్యులనూ, వందమంది పనివాళ్ళనూ వెంటబెట్టుకుని ఆంధ్ర దేశమంతటా గుళ్ళు కట్టించాడు. విగ్రహాలు ప్రతిష్టాపన చేయించాడు. ఆయన శిష్యులకు పాఠం చెబుతుంటే, ఉలి పుచ్చుకుని చెక్కి చూపుతుంటే మామూలు వాళ్ళకు కూడా శిల్పాలు చెక్కుదామనిపించేది. కొడుకు రామాచారిని కూడా ఆయన శిష్యుడిగానే చూశాడు. మిగిలిన శిష్యులెంతో కొడుకూ అంతే. చిన్న వెంకటాచారి పుట్టిన నాలుగేళ్ళకు పెద్ద వెంకటాచారి చచ్చిపోయాడు. మనవడితో వినాయకుడి విగ్రహం చెక్కించాలనే కోరిక తీరకుండానే చచ్చిపోయాడని రామాచారి కుమిలికుమిలి ఏడ్చాడు. అయితే, తొందరలోనే రామాచారికి పితృవియోగ దుఃఖం మాయమయింది. చిన్న వెంకటాచారిలో తాతను మరిపించే పనివాడి లక్షణాలు కనిపించాయి. తండ్రి తనకు నేర్చిన విద్యంతా కొడుక్కి నూరిపోశాడు రామాచారి. మరి ఇప్పుడు నేర్పమని అడిగే శిష్యులు కూడా లేరు. కొడుకు పనిలో ప్రవేశించి ఉలి పట్టుకుంటే ఎలాంటి శిలైనా వెన్నలా కరిగి, మైనంలా ఒదిగి, మనసులోని మూర్తి కళ్ళ ఎదుట ప్రాణం పోసుకునే తీరు తన్మయంగా చూసేవాడు రామాచారి. ఏకశిలా శిల్పాలు చెక్కడంలో తండ్రిని మించిన తనయుడని అందరూ అంటుంటే ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అయితే, రామాచారి జీవితకాలంలోనే శిల్పవిద్య కడుపు నింపుతుందా అన్న సందేహం మొదలయింది. రామాచారి చివరి రోజుల్లో పేదరికాన్ని రుచి చూసి కొడుకు గురించి దిగులు పడుతూనే చచ్చిపోయాడు. వెంకటాచారికి తాత పోలికలొచ్చాయిగానీ, తాత పుట్టిన కాలంలో పుట్టకపోవడంతో ఆ అదృష్టం మాత్రం రాలేదు. బతుకు దినదిన గండం నూరేళ్ళాయుష్పులా తయారయింది. అయితే, వెంకటాచారి తన ఇంటినిండా సంపద ఉన్నట్లే తిరిగేవాడు. సంపదలేకేం? దొడ్జీ, పెరడూ, ఇల్లూ ఎక్కడ చూసినా శిల్పాలు, శిల్పాలు... దేవుళ్ళవే గాదు, దేవతలవేగాదు - చిలుకలు, పావురాళ్ళు, పూలు, పళ్ళు, మనుషులు, పశువులు... ఒకటా - సృష్టిలో ఉన్న సమస్తమూ అతని దొడ్లో ఎక్కడ చూస్తే అక్కడ కనపడుతుంటే, ఆ ఇల్లు తాకట్టులో ఉందనీ, తాను విడిపించుకోలేదనీ వెంకటాచారికి గుర్తొచ్చేది కాదు. తన చిన్నప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందంటే డజన్లకొద్దీ విగ్రహాలు ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు రెండు, మూడు కూడా ఎందుకు రావడంలేదో వెంకటాచారికి అర్ధమయ్యేది కాదు. పనివాడితనం 4 అక్కినేని కుటుందరాను 132
విగ్రహం చెయ్యమని బయానా ఇచ్చినవాళ్ళు కూడా విగ్రహాలను తీసికెళ్ళడానికి ఎందుకు రారో అర్థమయ్యేది కాదు వీటన్నిటికంటే కొరుకుడు పడని విషయం వెంకటాచారి జీవితంలో ఒకటి జరిగింది ఆ ఊరి సర్పంచ్‌గారబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు సెలవులకు వచ్చి నప్పుడు తనతోపాటు ఒక అమెరికన్ స్పేహితుడిని తీసుకొచ్చాడు ఆ స్నేహితుడిని కాలక్షేపం కోసం వెంకటాచారి శిల్పాలు చూడటానికని తీసుకొచ్చాడు ఆ అమెరికా యువకుడు సరస్వతీ విగ్రహం చూసి ముచ్చటపడి వెంకటాచారి పేదరికం చూసి దిగులుపడి ఆ విగ్రహం కొంటా నన్నాడు కొన్నాడు అమెరికా వెళ్ళగానే పదివేల రూపాయలు విలువ చేసేన్ని డాలర్లు పంపు తానన్నాడు వెంకటాచారికి మహా అదృష్టం పట్టిందన్నారు అందరూ నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం వారు వెంకటాచారికి అయిదొందల రూపాయల చెక్కు పంపుతూ అమెరికా నుంచి వచ్చిన పదివేలకి వృత్తిపన్ను వంటి పన్నులన్నీ వేయగా మిగిలింది పంపుతున్నామని ఉత్తరం రాశారు వెంకటాచారి దరిద్రం తీరేదికాదని అందరూ తీర్మానించారు అప్పుడు కూడా వెంకటాచారి కుంగిపోలేదు వెంకటాచారిని అంతరాంతరాల్లో నిజంగా బాధించే విషయం ఒకటుంది తన తండ్రి తనను చూసి సంతోషపడినట్టే తను తన కొడుకును చూసి సంతోష వడాలనుకుంటే ఆ కోరిక తీరలేదు తమ దరిద్రానికంతటికీ ఈ శిల్పవిద్యే కారణమన్నట్టుగా ప్రవర్తించేవాడు రామప్రసాదు తండ్రి బలవంతాన పని నేర్చుకున్నాడుగానీ అతనేనాడూ మన స్ఫూర్తిగా శిల్పం చెక్కలేదు మొక్కుబడిగా యాంత్రికంగా ఉలి పట్టకున్న ప్రసాదుని చూస్తే మనసు చివుక్కుమనేది వెంకటాచారికి సరే - కులవృత్తి ఎలాగూ లేదు ఇక వాడిని దేన్లో పెడతావో ఎం చేస్తావో నీ యిష్టం అన్నాడు వెంకటాచారి బావమరిదితో ళు మొదటిసారి హైదరాబాదు వచ్చిన వెంకటాచారినీ ప్రసాదునీ తీసుకుని పార్వతీ తిరుమలాచారీ వాళ్ళమ్మాయి పద్మజా బిర్లా మందిరానికి వచ్చారు అక్కడ దైవదర్శనం పూర్తయ్యాక పబ్లిక్ గార్జెన్సు లలిత కళాతోరణం చూపించి నాంపల్లిలో బస్సు కోసం ఎదురు చూస్తూ నుంచున్నారు టాంక్ బండ్ మీద విగ్రహాలు చూపిద్దాం అన్నయ్యకు అంది పార్వతి తిరుమలాచారి దృష్టంతా బస్సుల మీదే ఉంది అన్నట్ట జోగేశ్వరంగారు ఇళ్ళల్లోకెళ్తున్నారుగా మనం రేపు వాళ్ళింటికి ఒట్టి చేతుల్లో ఎలా వెళ్తాం? ఎమ్మన్నా కొని పట్టుకెళ్ళొద్దు అంటూ హడావిడి పడింది పార్వతి
- పనివాడితనం + 133
అరగంట నుంచీ ఎదురుచూస్తున్న బన్సు అదుగో వస్తోంది ఇప్పుడు నీకిది గుర్తొచ్చింది మనకా బస్సెక్కే యె గంలేదు పద మరి ఎమన్నా కొందాం అందరూ అబిడ్స్ వైపు నడక మొదలెట్టారు ఓచోట ఆగారు ఎదురుగా చిత్ర శిల్ప అనే అక్షరాలు నాలుగు భాషల్లో వెలుగుతూ ఆరుతూ రంగురంగుల్లో ఎమిటిది? దీనిలో ఎముంటుంది? అడిగాడు వెంకటాచారి దీనిలో ఎముంటుంది అనిగాదు అడగాల్సింది ఎముండదూ అని అడుగు ఎది కావాలంటే అది ఉంటుంది మన దగ్గర డబ్బుండాలి అంతే అంటూ లోనికి దారి తీశాడు తిరుమలాచారి అట్టహాసంగా ఉన్న ఓ ద్వారం దాని దగ్గర రాజాధిరాజులా ఓ దర్వానూ ఉన్నారు దర్వాను వీళ్ళను చూడగానే వంగి సలాం చేస్తూ తలుపు తెరిచాడు వెంకటాచారి బెదిరి పోయాడు గానీ పైకి కనపడకుండా ఎలాగో లోనపడ్డాడు లోపలంతా చల్లగా హాయిగా ఉంది దేవేంద్రలోకంలో కొచ్చినట్ట్లు సువాసనలు మధురమైన వీణానాదం చెవుల్లో అమృతం కురిపిస్తూ అడుగు వేస్తే మెత్తగా లోపలికి దిగుతున్నట్లు ఎర్రని తివాచీలు మనుషులున్నారుగానీ నిర్మానుష్యంగా ఉంది మాట్లాడుతున్నారుగానీ చప్పుడు లేదు నడుస్తున్నారుగానీ కదలిక లేదు కాదు కాదు కదుల్తున్నారుగానీ నడవటం లేదు కనుచూపు మేర ఎటు చూసినా రంగులు అద్దాలు. కాంతులు విశాలంగా విస్తరించుకుంటున్న ఈ లోకం ఎమిటిది? ఆ బస్టాండులోంచి దీన్లోకెలా వచ్చాం? మామయ్యా ఇది చూడు చూశాడు ఒక వైపంతా రంగురంగుల కాంతులతో మెరుస్తూ రకరకాల ఎల్లల బొమ్మలు అప్పటి వరకూ అరుచుకుంటూ మాట్లాడిన మనుషులేనా వీళ్ళు పార్వతీ చారీ కూడా గుసగుసగా ఎదో అనుకుంటూ చిన్నగా ఎవరూ చూడకుండా నవ్వుకుంటూ ముందుకు నడిచారు పద్మజ వారి వెనకాలే వెంకటాచారీ ప్రసాదూ ఆ పిల్లల బొమ్మల దగ్గర్నించీ కదల్లేకపోతున్నారు నాన్నా నెమ్మదిగా పిలిచి ముందుకెళ్తున్న తలిదండ్రులను ఆపింది పద్మజ మాట్లాడకుండా కళ్ళతోనే ఎమిటని అడిగాడు తిరుమలాచారి ఈ రాధాకృష్ణుల శిల్బం ఎంతో తెలుసా? పద్మజ ప్రశ్న వినిపించినా మనసులో దూరలేదు రాధాకృష్ణుల విగ్రహాన్ని చూస్తూ నిలబడిపోయాడు పార్వతి కూడా ఆ సౌందర్యానికి తన్మయురాలై ఆనందంగా శిల్పాన్ని చూస్తోంది పనివాడితనం + అక్కినేని కుటుంబరావు వం
ఎంత అద్భుతంగా ఉందీ కళ ఉట్టిపడుతోంది కృష్ణుడి పెదవిలో ఆ విరుపు దానిలో ఆ కొంటెదనం తిరుమాచారి చూస్తూనే ఉన్నాడు రాధలో ఆ మోహ పారవశ్యం ఎక్కడ ఎలా తెప్పించారు? అసలా కళ్ళు చూడండి తన్మయత్వమా భక్తా? ఎలా మూతలు పడుతున్నాయో ఆ కళ్ళు పార్వతి పరవశంగా అంటోంది నిజంగా ఎంతయినా ఇవ్వొచ్చు దీనికి ఎంత? అడిగాడు కూతుర్ని ఇరవైనాలుగు వేల రూపాయలు గంభీరంగా చెప్పింది పద్మజ నిజం? పార్వతి గుండెల మీద చేయి వేసుకుంది చూడు పైగా అమ్ముడుపోయింది రేటు సోల్డ్ అవుట్ బోర్డు చూపింది చూడు బావా ఈ విగ్రహం ఖరీదు పాతిక వేలట వెనుకగా వస్తున్న వెంకటాచారికీ ప్రసాదుకీ చూపించాడు ఇద్దరూ శిశ్చేష్టులై ఆ శిల్చం వంకే చూస్తూ నిలబడ్డారు ప్రసాదు కళ్ళు శిల్పాన్నంతా వెదుకుతూ ఓ చోట ఆగి చిత్రంగా మెరిశాయి తండ్రి వంక చూశాడు తండ్రి చూపు కూడా నరిగ్గా అక్కడే ఉంది నెమ్మదిగా ఆ చూపవు గ్రసాదువైవు తిరిగింది ప్రసాదు ఎదో మాట్లాడబోవటం చూసి వద్దు అన్నట్టు తలూపాడు తండ్రి ఇద్దరూ మరోసారి ఆ బొమ్మ వంక చూశారు రాధాకృష్ణుల సల్గాపం ఆ ఇద్దర్నీ చుట్టుకున్న లతలూ వాటికి పూలు వాటి మధ్యలో ఎనిమిదిచోట్ల లేగదూడలు ఎనిమిదో దూడ కన్ను ఆ లేగదూడ కన్ను లేక విషాదంగా చూస్తున్నట్టుంది దాన్నే చూస్తున్న ప్రసాదు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి వెంకటాచారి తదేకంగా అటే చూస్తున్నాడు అతని హృదయం తరుక్కుపోతోంది అనలా సన్మానం వల్ల జరిగిందిదంతా అనుకున్నాడు ప్రసాదు తండ్రిని బాధపెట్టి హైదరాబాద్ వచ్చిన క్రమమంతా ప్రసాదుకీ ప్రసాదు ముఖాన్సీ శిల్పాన్నీ చూస్తున్న వెంకటా చారికీ ఒక్కసారే గుర్తొచ్చింది భి ఎలాంటి సన్మానమది ఎలాంటి రోజది ఇంట్లో గంజి కాయడానికి పట్టెడు నూకలన్నా లేవు విగ్రహం తీసుకెళ్ళటానికి వస్తానన్న మనిఎ వస్తేగాని డబ్బు చేతికి రాదు పాద్దుట్నించీ సన్నగా తుప్పర ఇంట్లో ఉన్న ముగ్గురూ మధ్యాహ్నం దాకా చలికీ ఆకలికీ ముడుచుకు పడుకున్నారు మూడవుతూందనగా వెంకటాచారి లేచి బయల్దేరాడు అయి దింటికల్లా టౌనుహాలు దగ్గరకు రమ్మన్నారు. నెలరోజుల నాడు సుభాష్ చంద్రబోసు విగ్రహం చేయించుకు వెళ్ళి టౌనులో ఆవిష్కరించిన చౌదరిగారు ఇవాళ వెంకటాచారికి సన్మానం ఉంది రమ్మని పిలిచాడు భార్య లేచి డబ్బాలన్ని వెతికి కాసిని అటుకులుంటే పెట్టింది నడిచి వెళ్ళాల్సిందేగా అంటూ
- పనివాడితనం ళీ క్షేతేక్
తుప్పర పడుతూనే ఉంది వెంకటాచారి తలమీద కండువా కప్పుకొని నాలుగు కిలోమీటర్లు నడిచేసరికి దాదాపు తడిసిపోయాడు టౌన్లో తుప్పర ఆగింది గానీ చలిగాలి ఈడ్చి కొడుతోంది టౌనుహాలు దగ్గర ఎవరూ లేరు వెంకటాచారి లోపలికి వెళ్ళి కూచున్నాడు గంటన్నర తర్వాత హడావిడి మొదలైంది దండలొచ్చాయి మైకొచ్చింది మనుషులొస్తున్నారు ఎవరో ఒకతను వెంకటాచారిని చూసి గుర్తుపట్టి చికాగ్గా ముఖం పెట్టాడు ఇంకో కుర్రాడిని పిలిచి ఎదో చెప్పాడు ఆ కుర్రాడు వెంకటాచారిని రండి రండ ని హడావిడి పెడుతూ బయటకు లాక్కళ్ళాడు ఎదన్నా టిఫిను పెట్టించి ఇంత కాఫీ తాగిస్తే బాగుండు అనుకున్నాడు వెంకటాచారి అలా అనుకుంటున్నందుకు సిగ్గుపడుతూనే పెద్దహోటల్సి దాటి పక్కనున్న హెయిర్ డ్రెసింగ్ షావులోకి వెళ్తున్నందుకు తెల్లబోయాడు "పెద్దపెద్ద వాళ్ళాన్తున్నారు గడ్డం మాసింది బాగుండదు కూచోండి టైము అయిపోతోంది అ అబ్బాయి తొందరపెట్టాడు వెంకటాచారి సిగ్గుపడుతూ తన మాసిన గడ్డం కోసం సిగ్గుపడుతూ కూచున్నాడు పది నిమిషాల్లో పదిసార్లు బైము చూసుకున్న కుర్రాడు వెంకటాచారిని సభ దగ్గరకు పరిగెత్తిం చాడు 'వేదిక మీదికి పిలవగానే రండం టూ ముందు వరుసలో కూచోబెట్టి వెళ్ళాడు మీరేనా వెంకటాచారిగారు. వెనుక వరుసలోంచి ఓ కుర్రాడు ముందుకొచ్చి వెంకటాచారి పక్కన కూచున్నాడు మిమ్మల్ని చూద్దామని వచ్చాను మీరు చెక్కిన విగ్రహం చాలా బాగుంది వెంకటా చారికి అనుకోకుండా ఎదురైన ప్రశంస కళ్ళమ్మట నీళ్ళు తెప్పించింది ఆ కుర్రాడి వంక అప్యాయంగా చూశాడు 'నేను అదృష్టవంతుడిని సభకు ముందే మిమ్మల్ని చూసి మాట్లాడాను ఇంక వెళ్తాను వెంకటాచారి ఆశ్చర్యపోతూ అదేం బాబూ సన్మానం చూడవూ అనడిగాడు ఆ కుర్రాడు చిత్రంగా నవ్వాడు సన్మానం ఆ పేరుతో వాళ్ళు మీకు చేసే అవమానం చూడలేనండీ వెంకటాచారి అయోమయంగా భయంగా ఆ కుర్రాడి కేసి చూశాడు మీకు సన్మానం చేసే వీళ్ళకు మీ గురించి ఎమీ తెలియదు మీ విద్య గురించి తెలియదు ఆ ముక్క మీతోనే చెబుతారు ఇక ఆ తర్వాత వాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు పొగుడు కుంటారు అందరూ కలిసి మీకు సన్మానం చేస్తున్న చౌదరిగార్ని పాగుడుతారు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు మరి అసలు నన్నెందుకు పిలిచారు? మీరు కావాలి మీ సన్మానం పేరుతో వాళ్ళ పేర్లు పేపర్లో వస్తాయి నెలకో సభ ఇలాంటిది జరిపితే కళాప్రియుడనీ పోషకుడనీ 'పేరొస్తుంది పూర్వం రాజులు పాలకులు గాబట్టి కళాపోషణ చేసేవారు ఇప్పుడు ఇలాంటి సోకాల్డ్ సూడో కళాపోషణతో పాలకులవ్వా పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 136
లని చూస్తున్నారు డబ్బున్నవాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఈయన పోటీ చేస్తాడు అదంతా ఓ కళ ఓ విద్య మీ పనివాడితనం ఎందుకూ పనికిరాదు కుర్రాడు విసురుగా లేచి వెళ్ళిపోయాడు ఆ కుర్రాడి మాటల్లో వ్యంగ్యం కోపం హేళన ఎందుకో అతనెందుకలా మాట్లాడు తున్నాడో వెంకటాచారికి అర్ధం కాలేదు సభ అచ్చం ఆ కుర్రాడు చెప్పినట్లే ముగిసింది వెంకటాచారి దండ వేయించుకుని శాలువా కప్పించుకుని బిక్కుబిక్కుమంటూ కూచున్నాడు సభ పూర్తయ్యాక ఇంకొకతను ఎవరో వచ్చి రండి రండని హడావిడి చేసి అతని వుణ్యమా అని బస్పెక్కించి టికెట్టు కొని వెంకటాచారి చేతిలో పెట్టి మరీ వెళ్ళాడు అర్థరాత్రి ఆకలితో వడుకున్న భార్యాపిల్లల దగ్గరకి వట్టి చేతుల్లో వెళ్ళటానికి సిగ్గు పడ్డాడు వెంకటాచారి పాపం ఎదన్నా తెస్తానని చూస్తుంటారు అనుకున్నాడు భార్య శాంతమ్మ వెంకటాచారిని చూసి లేచి అతని చేతిలో పూలదండలూ శాలువా అందుకుని పక్కనపెట్టి ఓ క్షణం ఆగాక ఇన్ని పూలివ్వకపోతే పళ్ళన్నా ఇవ్వగూడదా అంది శప్పాద్దున్నే లేచి ఎనిమిదో దూడ కన్ను చెక్కాలి అదొక్కటే మిగిలింది అదయిపోతే రేపాయన వచ్చి డబ్బిస్తాడు పస్తుల బాధ తప్పుతుంది సంజాయిషీ ఇస్తున్నట్టు గొణిగాడు వెంకటాచారి తెల్లారింది చారి లేవలేక అలాగే పడుకున్నాడు తిండి లేకపోవటంతో పాటు సన్మానం కోసం పడ్డ శ్రమ కలిసి నీరసం వచ్చింది ప్రసాదు తండ్రి పరిస్థితి చూసి తనే ఉలి అందుకుని నెమ్మదిగా ఎనిమిదో దూడ కన్ను చెక్కటం మొదలెట్టాడు ఉలి చప్పుడుకు లేచిన చారి గబగబా వచ్చి ప్రసాదూ అని అరిచాడు ప్రసాదు చేతిలో ఉలి తగలరాని చోట తగిలి ఎనిమిదో దూడ కన్నుండవల్సిన చోట చిన్న ముక్క లేచి అవతల పడింది చారి నిస్సత్తువగా కూలబడిపోయాడు నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది అంటున్నాడు ఎమయింది? అంత చక్కని విగ్రంలో అదెవరికీ కనపడదు మనం తప్ప మరెవరూ అది గమనించలేరు ఎవరికీ తెలియదు కనపడదు కనపడనివారి గురించి కాదురా కనవడాలంటే కన్నుండాలి ఆ కన్నున్నవారు ఎవరన్నా ఎవడిది చెక్కిందీ అని అంటే ఆ మాట పడి బతళటం అనవసరం దాన్ని ఓ మూల పారేయ్ నేను మళ్ళీ రాయి కోసం వెళ్తాను విగ్రహం కోసం ఆయన వస్తే మూడ్నెల్ల తర్వాత రమ్మను ఇది మాత్రం ఇవ్వొద్దు అంటూ లేచి - బజారుదాకా వెళ్ళొస్తా ఎక్కడన్నా అప్పు పుట్టించాలి ఎన్నాళ్ళుంటాం పస్తులు? గొణుక్కుంటూ వెళ్తున్న తండ్రిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు ప్రసాదు
- పనివాడితనం + ్ష/
ఈ శిల్పానికి వాడే రాయి ప్రత్యేకమయింది నెమలి కన్ను రంగు రాయి ఎక్కడంటే అక్కడ దొరకదు ఆ రాయి తెచ్చి మళ్ళీ మూడ్చెల్లు కష్టపడితే వచ్చేది ఖర్చులు పోను వెయ్యి రూపాయలు మూడు నెలల కష్టానికి వెయ్యి ఉలితో కాకుండా సుత్తితో రాళ్ళు పగలగొడితే నెలకి వెయ్యి దొరుకుతాయి ఎవరికీ కనపడని చిన్న లోపానికి ఇంత కష్టం బూడిదపాలు చేస్తున్నాడు తండ్రి ప్రసాదు అలోచనలో ఉండగానే విగ్రహం కోసం మనిషాచ్చాడు ప్రసాదు చేతిలో అయిదొందలు పెట్టి విగ్రహం తరలించుకుపోయాడు
కాసేపటికి వెంకటాచారి దిగులు ముఖంతో ఇల్లు చేరాడు ఎక్కడా రూపాయి అప్పు పుట్టలా విగ్రహం లేదు కొడుకు చేతిలో డబ్బు వెర్రికోపం వచ్చింది చారికి ఎదిగిన కొడుకని కూడా చూడకుండా ఎడాపెడా కొట్టాడు చేతులు నొప్పెట్టి ఆయాసమొచ్చి ఆగాడు
అమ్మా, ఈ అయ్య పెట్టడు ఎవడన్నా ఇంత పెడతానన్నా తిననివ్వడు నేనీ విగ్రహాల పనిమాత్రం చెయ్యను నన్ను మామయ్య దగ్గరకు పంపు ఎదో ఓ పనిచేసి నేనింత తిని మీకింత పెడతాను వెక్కివెక్కి ఎడ్బాడు ప్రసాదు
రెండోరోజు రాత్రి తంగ్రీకొడుకులిద్దరూ హైదరాబాద్ బస్సెక్కారు
ళు
వెంకటాచారి ఆ జ్ఞాపకాల బరువుతో కుంగినట్టు వంగి నిలబడ్డాడు
ప్రసాదు బుర్రంతా ఉలితో కొడ్తున్నట్టగా ఉంది
తిరుమలాచారి భార్యతో అంటున్నాడు పనివాడితనమంటే అదీ
నిజం ఎంత చక్కటి శిల్బం ఎంత గొప్ప శిల్చి చెక్కాడో పార్వతి ఆనందంగా అన్నది
ఓసి పిచ్చిమొహమా ఆ శిల్చిని గురించి కాదే శిల్పుట్టేముంది ఓ రాయి వాళ్ళ ముందు పడేసి ఉలి చేతికిస్తే చాలు రొట్టెముక్క ఇవ్వకుండా మాడ్చినా ఆ శిల్పం చెయ్య కుండా ఉండలేరు ఆ శిల్చికి ఎంతిస్తారనుకుంటున్నా? ఎ నాలుగైదు వేలో ఇస్తారు వీళ్ళెంత కమ్ముతున్నారో చూడు
నాలుగైదు కాదు వాళ్ళిచ్చింది రెండు వేలే అది చేసింది నాన్నే నోటి మీద కొచ్చిన మాటలు నోట్లోనే ఉండిపోయాయి ప్రసాదుకి
పనికిరాదనుకున్న శిల్పం ఖరీదు పొతికవేలు ఎడాదికొక్క శిల్బం అమ్ముడయితే చాలు తిండికి వెతుక్కునే పనిలేదు కానీ తనకొచ్చేది రెండువేలు రెండు నెలలు అతి కష్టం మీద దొర్లించటానికి సరిపోయేంత అంతే పనివాళ్ళ తలరాత
వెంకటాచారి మనసంతా దిగులుతో నిండిపోయింది తిరుమలాచారి అంటున్నాడు
నువ్వు బంగారం సృష్టించు అమ్ముకోటం తెలియకపోతే అది మట్టితో సమానం నృష్టించే వాడికి అమ్ముకోటం రాదు అందుకే సృజన ఎంత గొప్పదో అంత పేదది నేను
పనివాడితనం + అక్కినేని కుటుంబరావు 138
చెప్పే పనివాడితనం ఇలా అమ్మగలిగినవాళ్ళది. ఈ కాలంలో పనివాడితనమంటే అదే. అదే అసలైన పనివాడితనం.”
సన్మాన సభలో కుర్రాడి మాటలు గుర్హొచ్చాయి వెంకటాచారికి.
“నువ్వు మాట్లాడేది నిజమేనేమో. కానీ, సృష్టించే చేతులే లేకపోతే ఏం అమ్ముకుని పనివాడితనం చూపిస్తార్రా వీళ్ళంతా” వెంకటాచారి కంఠంలో ఆవేదనతో పాటు ఉక్రోషం కూడా ఉందేమో!
“సంపాదన లేదని నువ్వు శిల్పాన్ని సృష్టించడం మానుకున్నావా? గిట్టుబాటు ధర లేదని ఏ రైతన్నా సాగుచేయడం, పండించడం మానుకున్నాడా ఎప్పుడయినా? కొడుకులు చూడటంలేదని ఏడవటమేగాని, కొడుకుల్ని కనడం మానుకుందా ఏ తల్లయినా? నృజన కోసం పుట్టినవాళ్ళు సృష్టిస్తూ ఉంటే, సంపాదనకోసం పుట్టినవాళ్ళు సంపాదిస్తుంటారు. అందుకే ప్రసాదు చేతులకి అమ్ముకోవటం నేర్చుదామనుకుంటున్నాను. ఈ కాలానికి పనికొచ్చే పని అదొక్కటే” ఆవేశంగా అన్నాడు తిరుమలాచారి.
ఆ మాటల్ని అంగీకరించలేకా, ఏం సమాధానం చెప్పాలో తెలియకా తన చేతుల వంక చూసుకున్నాడు వెంకటాచారి.
“ఈ చేతులు సృష్టించటానికే పుట్టాయి. అమ్ముకోటానికి కాదు' మరోసారి మనసులోనే స్థిరంగా అనుకుని నిట్టూర్చాడు.
ఇండియా టుడ్తే జనవరి 275 ఫీబ్రవరి, 995 యది ల్‌ంరాలయ గా ష్ త " ల ఉల నే ర నైతి షు రీ
- సనివాడితనం + 139
- శువ్యైుబంగారం సృష్టించు, అమ్ముకోటం తెలియకపోతే అది మట్టితో సమానం. ం. 1..." ఇృష్టించే వాడికి అమ్ముకోటం రాదు. అందుకే సృజన ఎంత గొప్పదో అంత ఖు” గ. , పేదది, నేను. చెప్పే పనివాడితనం ఇలా అమ్మగలిగినవాళ్ళది. ఈ కాలంలో .. 'పనివాడితనమంటే అదే. అదే అసలైన పనివాడితనం. , లం" క | సంపాదన లేదని నువ్వు శిల్పాన్ని సృష్టించడం మానుకున్నావా? గిట్టుబాటు = _ భ్రర లేదని ఏ రైతన్నా సాగుచేయడం, పండించడం మూనుకున్నాడా ఎప్పుడయినా? కొడుకులు చూడటంలేదని ఏడవటమేగాని, కొడుకుల్ని కనడం మౌనుకుందా ఏ తల్లయినా? సృజన కోసం పుట్టినవాళ్ళు సృష్టిస్తూ ఉంటే, సంపాదనకోసం పుట్టినవాళ్ళు సంపాదిస్తుంటారు. ం , . పేమానుభవమూ, ఆత్మాన్నత్యమూ ఎదగని మానసిక వికలాంగులంతా చేరి రెండు చిన్న జీవితాల్ని చేర్చి బంధించి, బిగించి, రాక్తసపు ముళ్ళు వేస్తారు. అవి బిగిస్కి బిగిసి స్వేచ్చ అంతా హరించి రెక్కలన్నీ విరగదీసి ప్రాణాపాయం కలిగించినా ఆశక్తులై, అసమర్జ్థులై ఆ నిర్భంధాన్నే జన్మజన్మల అనుబంధం అనుకుంటూ, ఆ తాళ్ళనే పూలవూల లనుకుంటూ ఆత్మవ౦చనతో మూలుగుతూ, కుళ్ళుతూ ఏడుస్తూ మళ్ళీ జన్మ మీద విరక్తి పుట్టి జీవితాలు ,