Telugu Padhya Kavyathrayi - anilvaranasi/indianlanguages GitHub Wiki

| / శతూతవష్టోభాతతుం నం? . వ. కతన లం ం ను! “అల వోతోజు' ఏ న ఖీ /1 ఉను || "కే ల. ; ' సహజకవి మల్లెమాల వంగా... మనసుపడి మక్కునతో సేకరించిన వే బక్క. ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం వం సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి రా... ఆనందంతో బహూకరిస్తున్నాం, నా | - మలైమాల కుటుంబం గ్‌ ప్రచురణ " యల 2 గీ భే దీపూ ప్రింటర్స్‌ జొ ఆక 4 (1 ర్తి నాంపల్లి, హైదరాబాద్‌ “ళీ తో

క్‌! పూజ్యశ్రీ ఎం. నరసయ్యగారు సింగరేణి కాలరీస్‌ - కొత్తగూడెం నా గురువు గీ॥ విద్య సాధారణ మునయ్యె విబుధులందు ఆది విద్యనేర్వగజూడ ఆదినముల సరస సద్గుణ ధనలక్ష్మి సన్న గిల్లె అట్టి తరుణాన నరసయ్య ఆదరణకు, గీ _ నేను పాత్రుడ నైతిని నిరతము నను అక్కునన్‌ చేర్చుకొని నాదు అవసరముల విద్యకై తాను రుసుమును విధిగకూర్చ ఆర్థికాధికారులద్వార అమలుపజథిచె! గీ॥ _ దైవ సమముగ గురువుగ దయనుజూపె అట్టి విబుధునకైవంద నములు శతము వాంఛ దీర వసుధమెచ్చ వాస వేంద్ర ఎల్ల వేళల నర్చించనిమ్ము నన్ను. ॥

౧ సత స య ళో లలల టం జే . శస ల్‌ న క్రీ॥శే॥ నా పితరులు బ్రహ్మశ్రీ పోలోజు శ్రీమతి పోలోజు కాదో టో సాంబయ్యాచారిగారు కమలాక్షీబాయిగారు కకత ||

అంకితం తల్లి, తండ్రి, గురువు దైవసమానులు తరతరాల మనుజధర్మమిద్ది అట్టివారి దలచి అక్షరకృతి పల్క జన్మధ్య మనుచు జగము తెలిపె. చిన్ననాటి నుంచి కవిత చిజునగవున విన్నను చదివినను వెన్నతిన్నయట్లె తత్త్వ్వబోధన వినుచును తండ్రివలన వత్సరమ్ములు గడచెను, వయసు ముదిరె. విధివిలాసమై నాపెండ్డి వింతగొలిపె మురిపెముగ సతి నన్నొక వరమ్ము కోరె | 'పలుకుడీ కైత” లని నాదుకలము 'కదిపే' అట్టి కవితలే కావ్యమై అమరెనేడు. వాణి కరుణీంప, పలుకులు వసుధ మెచ్చ మలిన మమలినముగ నెంచి మమత మీజ వ్రేలితో వెంటనిడుకొని గ్రేమతోడ పితరులేకద నడక నేర్చినది నాడు! అశ్వముగ వారె ఆటల నాడ నేర్చి ఆటపాటల సుగుణమ్ము లలవరుచుచు దైవచింతనయే నన్ను ధరనునిల్పు ననుచు మంచి మాటలు నేర్చి రా విబుధులు. సాంబశివుడుగా ఊరిలో జనులు పిలుచు నట్టి సాంబశివాచార్యు డనుగు తండ్రి నాకు దైవంబ; అట్టి జనకున కిడు వాడ నంకితంబుగను ఈ పద్యకృతుల. ననా 111

భా శ484- 422) గ ప... శ గీ ౮.459 ౩2. ఈ హా ఫ్‌ న్‌ త్త తి కృతికర్త ఆర్‌.సి. పోలోజు శ్రీమతి చంద్రకళ ఎంత ప్రాభవ మున్నను - ఎదురులేక ప్రహిలు లెన్ని యున్నను నీరు - ప్రజకు లేక ఎంత ధనము యున్న నాసుఖం' - ఎవరి తోడ? ఇంతి లేకయు నింటిలో - ఏమి చేయ? [/

అత్మ స్పందన

నామనోవ్యధకు, అఖిల చరాచరసృష్టిని తన ముందే నిల్పుకొన్న మన భూమాతయే కారణము.

భూదేవికి భారతయుద్దానంతరము కలియుగము మొదలైనది. ఇందు కొలదికాలమునకే భూదేవి బిడ్డలమైన మనము, మనతోబుట్టువులైన వృక్త, జంతు జాలములు, పశుపక్ష్యాదుల వలన మంచి, చెడు వంటి ఎన్నో అవాంఛనీయమైన సంఘటనలు, అనగా మన కుటుంబాలలో అన్నతమ్ములు, అక్కచెల్లెండ్రు, భార్యాభర్తలు, తండ్రికొడుకులు ఒకరితో నొకరు పోరాడి విడిపోవుట, చంపుకొనుట, యొకరినొకరు మోసగించుకొనుట, అవసరము లేకున్న చెట్లను నరుకుట, మృగముల వేటాడుట, జార చోరత్వములు, మత్తు పదార్థములను సేవించడము, ఒళ్లు తెలియని స్సితిలో ఇతరులను దూషించడము, ఇవియే కాక ఏమి తెలియని వాళ్ళు రాజకీయాలలో చేరడము, నరిబైన నడవడి లేకపోవడము, మరియును అందరు పెద్ద పదవు లాసించడము, అవి చేజిక్కించుకొనుటకై ప్రత్యర్థుల బలిదీసికొనుట, దోపిడీలు, దొంగతనాలు మొదలగువాని వలన భూదేవికి ఎంతో పాపభారమై భరించలేక తనభర్తయగు శ్రీ శ్రీమన్నారాయణునితో ఏకాంతసమయమునందు, ఈ పాపభారము మోయుట కష్టమైనదని తాను నిరుత్సాహము చెంది నివేదించుకున్న విధమును ఆ భగవతి కల్పించిన ఊహలవలన స్పందనకల్లి సరళమైన తేటగీతి పద్యముల రూపములో కల్పనకావించితిని.

నాయందు కాని, ఈ రచనయందుకాని ఏవైన తప్పిదములున్న, కావ్యము చదివిన యనంతరము నాకు తెలిపి నిండుమనసుతో నన్ను దీవించగలరు.

ఇట్లు ఆర్‌.సి. పోలోజు ౪

శ్వాంతర్ని గోత్రము, పోలోజు వంశము, విశ్వబ్రాహ్మణ కుటుంబము. తండ్రిపేరు పోలోజు సాంబయ్యాచారి, తల్లి కములాళక్షీబాయి. నా పేరు పోలోజు రాజేశ్వరాచారి, కాని ఆర్‌.సి. పోలోజు గా, వృత్తి వ్యవహారములో వాస్తు శిల్పియని మాత్రము పరిచయములో ఉన్నాను. నా చిన్ననాటి విద్యాభ్యాసము ప్రభుత్వపుప్రయిమరీ పాఠశాల (చెట్లకింద) నుండి పదియవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల సింగరేణి కాలరీసు, కొత్తగూడెం ఖమ్మం జిల్హాలో జరిగినది. అక్షరాభ్యాసము మొదలు ఆరవ తరగతి వరకు గౌరవార్హులైన ఉపాధ్యాయులు శ్రీ యం. నరసయ్యగారు విద్యాబోధన జరిపినారు. వారు నాయందుగల వాత్సల్యము చేత ప్రభుత్వము నుండి పుస్తకములు మరియు పాఠశాలకు చెల్లించవలసిన రుసుమును తొలగింపచేసినారు. వారు చెప్పిన మంచిమాటలు, విద్యాబోధన విధానము నా ఉన్నత విద్యకు దోహదమైనది. అందులకు వారికి నా కృతజ్ఞతాభివందనములు. మా పెద్దలు-అనగా తాతలు, తండ్రులు, సోదరులు జ్యోతిష, గృహవాస్తు, పౌరోహిత్యములు మరియు, వృత్తి విద్య-వెండి బంగారు నగల తయారీలు-ఈ రోజు వరకు కూడా చేయుచునేయున్నారు. నేను సహజముగా గృహవాస్తు శాస్త్రజ్ఞుడను. ఆఫీసులో పనులు తీవ్రముగానున్న రోజులలో మనస్సు పనిమోద లగ్నమగుటకుగాను మా పెద్ద అన్నయ్య ద్వారా రామాయణ, భారత కథలు మరియు సంగీతము, కవితలు వినిపించుకొనుచు పనిలో నిమగ్నుడనయ్యెడి వాడిని.

స!

కొంత కాలమునకు “కరుణామయుడు సినిమా హీరో శ్రీ విజయచందర్‌ గారి ద్వారా డా॥ ఉండేల మాలకొండారెడ్డిగారు తదుపరి డా॥ మాలకొండారెడ్డిగారి ద్వారా డా॥ మల్లెమాల గారు పరిచయము కావడము జరిగినది. డా॥ మాలకొండారెడ్డి ద్వారా పద్మాలయ స్టూడియో “సెకండు ఫేజ్‌”కు నేను వాస్తు శిల్పిగా పనిచేయడము, మళల్లెమాలగారి సలహాల ద్వారా పూర్తి చేయడము, తదనంతరము డా॥ మల్లెమాలగారు వారు కట్టించిన శబ్బ్దాలయముపై నా సూపర్‌విజనునకు రెండు సంవత్సరాలు నన్ను నియమించుకొని స్నేహితుడుగా, సాంతమనిషిగా చూచి వ్యవహరించడము జరిగినవి.

ఈ రెండు సంవత్సరముల వ్యవధిలో ఎందరో మహానుభావులు డా॥ మల్లెమాలగారి వద్దకు వచ్చి సలహాలు తీసికొని, సలహాలు పాటించడము, సలహాలు పాటించనివాళ్ళను వారు మందలించడము గమనిస్తూ ఉండేవాడిని. ఒక రోజు ఒక పెద్దమనిషి డా॥ మల్లెమాలగారి మాటలను పెడచెవిని పెట్టడము లాంటిది జరిగినది. ఆ రోజు డా॥ మళల్లెమాలగారికి ఆవేశము రావడము ఆయావేశములో “ఈ కాలములో మనుష్యులు పశువులుగా మారుచున్నారు. ఏ ప్రయత్నము సరిగాచేయరు. మనదేశంలో ఒకడు పనిచేసి సంపాదిస్తే కుటుంబవులో ఉన్నవాళ్ళు కలిని అనుభవించడవు అలవాటై సోమరులౌతున్నారు. నేను ఎక్కడ కూర్చున్నా ఏమి చేస్తున్నా కొద్దిపాటి ఖాళీ సమయం ఉన్నా కవిత గురించి ఆలోచిస్తూంటాను. ఎన్నో సభలకు వెళ్లడము నిర్వహించడము, మరియు సినిమాలను కూడా నిర్మించడము జరుగుతున్నది. కావున మనిషికి పట్టుదల ఆకాంక్షఉుండాలి” అని మందలించి, అతనిని వెళ్ళమన్నాడు.

డా॥ మల్లెమాలగారే కాకుండా 'సాహిత్యబ్రహ్మ' డా॥ వి.వి.యల్‌. నరసింహరావు గారు కథలు వ్రాయడము, డ్రామాలు వేయడము, సభలలో పాల్లానడము

జ11

గవర్షమెంటు ఉద్యోగములో ఉండి ఉత్తమ రచనలు చేసి “సాహిత్యబ్రహ్మ” బిరుదాంకితుడై గండపెండేర గ్రహీత కూడా అయినారు. “కవికిరీటి” డా॥ మాలకొండారెడ్డిగారు చిన్ననాటి నుండి కవితలు వ్రాస్తూ ఇంజనీరింగులో పట్టభద్రులై ప్రభుత్వఉద్యోగిగాఉండి కూడా కవిత్వములో “కవికిరీటి”గా పేరు నిల్చుకున్నారు. నాతోబుట్టువుఅయిన పెద్దన్నయ్య శ్రీ పోలోజు నాదబ్రహ్మాచారిగారు కూడా విశ్వబ్రాహ్మణ వృత్తి పండైైండవ ఏట నుండి చేశారు. ముగ్గురు తమ్ముళ్ళను, ముగ్గురు చెల్లెండ్రను, విద్యనభ్యసింపచేయవలయునని అహోరాత్రులు శ్రమిస్తూ తాను పండైెండేళ్ల వయసు వరకు మేనమామల వద్ద వేదపాఠాల నభ్యసించిన విద్యతో-క్రమముగా నవయుగ కవిగా పేరొంది ఒక గ్రంథము “నవనీతప్రణీతము” అను పేరున పద్యకవిత వ్రాసినారు. సహజకవి డా॥ మల్లెమాలగారు ఉద్బోధించినవి అన్నిటిని డా॥ వి.వియల్‌ గారిలోను, డా॥ ఉండేల మాలకొండారెడ్డిగారిలోను, డా॥ మలెమాల గారి యందున గవునించడముజరిగినందున నాకు కవితలు వాయు (పేరీపణకల్లినది. కాని కవిత్వము దైవికము, దైవదత్తము. ఆలోచనలు ఎన్నియున్నా దైవానుగ్రహము లేనిది ఏరూప కల్పన చేయలేముకదా! వాస్తు శిల్పి ఆర్‌.సి. పోలోజు కకక డా ౪

అక్షరాభినందన

“సహజకవి” డా! మల్లెమాల శబ్బాలయ, రోడ్‌నెం. 1, బంజారా హిల్స్‌, హైదరాబాద్‌. ఇప్పుడు మీచేతిలో ఉన్న పుస్తకం ఏ చేయిదిరిగిన రచయితో వ్రాసింది కాదు. ఈయన అసలు పేరేదైనా... అమలులో ఉన్న పేరు ఆర్‌.సి.పోలోజు వృత్తిరీత్యా వాస్తు నిపుణుడు. అనేక భవన సముదాయాలకు, చలన చిత్ర ప్రదర్శన శాలలకు రూప కల్పన చేసిన సాంకేతిక శాస్త్రవేత్త. ఇహ వ్యక్తిగా నంటారా? పొరపాటున కూడా పాల్లు మాట నోట పలుకనివాడు. పనిని దైవంగా ఆరాధించేవాడు. ఇన్ని మంచి గుణాలున్న ఈ వినయ భూషణుడికి ఒకే ఒక వ్యసనం ఉంది. అది కవితా వ్యసనం. ఆ వ్యసనం పోలోజుకు వారి అన్నగారి నుండి సంక్రమించింది. ఆయన “నవనీతప్రణీతం” అన్నపేరుతో ఒక పద్యకావ్యం రచించాడు. ఆ కావ్యం పండిత లోకంలో కొంత పేరు సంపాదించి పెట్టింది. అది చూసి ఈయన కూడా ఆయన దారి పట్టాడు. భారం అన్న పైన పెట్టాడో, భారతిపైన పెట్టాడో నాకైతే తలియదుగాని మొత్తానికి ధైర్యం చేసి కలం పట్టాడు. మంచిదే! ఏ వ్యక్తి అయినా తన ఆలోచనలను పది మందికీ పంచడానికి సాధనంగా కవిత్వాన్నే ఎన్నుకుంటాడు. పోలోజు చేసిందీ అదే.

1%

అతని సంకల్పాన్ని నేను స్వాగతిస్తున్నాను. కాని... ఆయన ఎన్నుకున్న ప్రక్రియ పద్యం. పద్య ఛృందస్సు అడుగడుగునా కవిని పరీక్షకు పెడుతుంది. పోలోజు కూడా ఆ పరీక్షను ఎదుర్కొన్నాడు. పట్టు వీడని విక్రమార్కుడిలా కొంత సాధనచేసి తన ఆలోచనలను అక్షర రూపంలో మన కందించారు. తొలి ప్రయత్నం కదా! తప్పటడుగు లున్నాయి. నేను వాటిని ఎత్తిచూపదలుచుకోలేదు. ఎందుకంటారా? లోపం పాపమంత దుర్మార్గమైంది కాదు. చిరంజీవి పోలోజు ఈ సత్యాన్ని గ్రహించి మరింత కృషి చేసి మంచికవిగా తన్ను తాను తీర్చిదిద్దుకుంటాడని అభిలషిస్తూ... అతనికి అక్షరాభినందన నందజేస్తున్నాను. సహజకవి : డొ॥ మల్లెమాల

రతకకతతతతతకతకకకడడకకకకకకకకడకకడతతతత22ఊఊ

౫%

సహజకవితాగృహవాస్తు శిల్పి శ్రీ పోలోజు 'సాహిత్యబ్రహ్మ' డా॥ వి.వియల్‌. నరసింహారావు, ఎం.ఏ.పి. హెచ్‌.డి. రిటైర్డ్‌ డైరెక్టర్‌, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ, హైదరాబాద్‌

గృహవాస్తుశిల్పిగా సుప్రసిద్ధులైన శ్రీ పోలోజు రాజేశ్వరాచారిగారు వ్యావహారిక జగత్తులో ఆర్‌.సి. పోలోజుగా ఇంజనీరుగా సుపరిచితులే. కాని ప్రస్తుత గ్రంథకర్తగా వీరు అభినవ కవితా శిల్పిగా కూడా కీర్తి నార్జించనున్నారు. ఈ కవితాసంపుటిలో మూడు శీర్షికల క్రింద ముచ్చటగా మూడు పద్యకృతు లున్నాయి. ఒకటి బానరసరన్వతి, రెండవది “నూతన కర్ణభారతం' “భూదేవినిర్వేదం', మూడవది . కావ్యశీర్షికలు వురాణేతివోసాలను స్ఫురింపజేస్తున్నా విషయం ఆధునిక మానవజీవితాన్ని అద్దంలో చూపినట్లు చూపి, ఆవశ్యకమైన అనేక సంస్కరణలను గడుసుగా ధ్వనింపజేశారు పోలోజు కవిగారు. ఇది అభ్యుదయభావనాశిల్పం, ఇంతకు చివరిదైన భూదేవి నిర్వేదానికి హేతువేమిటి? ఆత్మస్పందనలో కూడా కవిగారు వివరించారు. భూదేవి బిడ్డలమైన మనం మనతోబుట్టువులైన వృక్షలతాదుల్ని పశుపక్ష్యాదుల్ని ధ్వంసం చేస్తున్నాం. బోరుబావులు త్రవ్వి నేలతల్లి గుండెలో గునపాలు దించుతున్నాం. సామాజిక జీవనం, గార్హస్థ్యజీవనం స్వార్ధంతో చిన్నాభిన్నం చేసుకొంటున్నాం. పదవులకోసం పడుచుపెదవులకోసం చేసే ఘోరాలు చెప్పనక్కరలేదు. తన బిడ్డలు ఇలా సంస్కారహీనులైపోతుంటే జూూవూత తన బాధ ఎవరితో చెవుకోవాలి? తన వతి దేవుడైన శ్రీమన్నారాయణునికే చెప్పుకోవాలి. ఆమె ఆపనే చేసింది. తే॥ “అడుగడుగున నే నవమానపడుచునుంటి

అదివిష్ణువు భార్యనై అవనిలోన

మాన మర్యాదలన్నియు మట్టిగలసె

పద్ధతిగ పన్నగశయన పలుకవయ్య!”

న!

ఈ విధంగా భూదేవి నిర్వేదంలో ఆధునిక మానవజీవితంలోని అరాజకమైన ఎన్నో అకృత్యాలు ప్రస్తావించబడినాయి. వాటి నుంచి ఉద్ధరించబడితేనే మానవజీవిత సార్థక్యం. విఘ్నేశ్వరస్తుతితో ప్రారంభమైన ఈ చివరికృతి తేటగీతుల్లో తీయగా తిన్నగా సాగి ప్రభోధాత్మక సందేశంతో ముగుస్తుంది. ఇక రెండవకృతి “నూతన కర్ణభారతం' లోకంలో సుప్రతీతమైన సామెతకూడా ఉంది, “కర్ణుడులేని భారతమా?” అని భారతకథలోని కర్ణపాత్ర మాత్రమేకాక, భాసకవి విరచిత “కర్ణభార' మనే సంస్కృత రూపకం కూడా పోలోజు కవిగారిని ఆకర్షించింది. భాసకవి అంటే కవికులగురువైన కాళిదాసుకు కూడా మార్గదర్శి అయిన నాటకకర్తకదా! కర్ణుడు యుద్ధభూమిలో తనసారథి అయిన శల్యుడితో తన పూర్వకథ కొంత చెప్పుకోవలసివచ్చింది. పరశురామగురువు శపించటం. తల్లికి చేసిన వాగ్దానం, దేవేంద్రుడికి తనసహజ కవచకుండలాలు ఇవ్వవలసిరావటం - ఇట్లా ఎన్నో విషయాలు చెప్పటం జరిగింది. ఇంతాచేస్తే శల్యుడు కర్దుడికి విశ్వాసపాత్రుడా? కాడు. ఈ పద్ధతిలో ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనాదివిశేషాలను కూడా గడుసుగా విమర్శించటం కనిపిస్తుంది ఈ రెండవ కావ్యంలో. “మిలటరీల కన్న మిన్నయై మనవారు చదువుకొన్న వారు చవటలైరి నేరమునకు నీతి నీరాజనముపల్కె చట్టుబండలయ్యె చట్టమంత” ప్రస్తుత భారత సమాజంలో ప్రజల బ్రతుకు లేవిధంగా ఉన్నవో అనేక దృశ్యాలతో శ్రీ పోలోజుకవి వివరించారు. య.

“పనికి అన్న మనిన పరవళ్ళు త్రొక్కిరి పనిని పూర్తిచేయు పది నెలలుగ పాట్టనిండదాయె పుచ్చినధాన్యాన; నెత్తి బాదుకొనిరి నేరమనుచు” కర్ణభారతంలో ప్రభుత్వోద్యోగులమీద కొన్ని విసుర్లు కనిపించవచ్చు. వారిని కించపరిచే దృష్టి తనకులేదని కవిగారు చెప్పారు. ఇట్లా చెప్పటం కూడా విద్యాదేవి కటాక్షమేనని వీరి విశ్వాసం. ఏమైనా ఆటవెలదుల్లో ఆడుతూపాడుతూ చెప్పిన పద్యాలివి. కోపం వచ్చినా అది ప్రణయ కోపంలా భాసించాలేమో! మజీ ప్రథమ కృతి “బాసరసరస్వతి” ఈ అమ్మవారి నుద్దేశించి చెప్పిన పద్యాలు కూడా అటవెలదులే. భక్తితో పరమానంద తాండవం చేస్తున్నట్లు కనిపిస్తారు కవిగారు ఈ రచనలో. బాసరసరస్వతి అమ్మవారిలో లక్ష్మీసార్వతులను కూడౌ దర్శించారు. శ్రీకరమగు వాణి! శ్రీలక్ష్మి! శర్వాణి! ఈశదాసనుత! గణేశమాత! పాదయుగళిమైొక్కి పాలింపవేడితి బాసరశుభవాణి! బ్రహ్మరాణి! అ తల్లి తనకు కవితామతల్లి కావాలని ఎంతో ఆరాటపడుతూ కవి ఆవేదన చిందాడు. “పరులకెంతొ వింత పద్యకవిత లిచ్చి కరువువచ్చెనేమొ కరుణనీకు! నాకు విద్య యొసగ నాకు తల్లివిగాదె? బాసర శుభవాణి? బ్రహ్మరాణీ! డతడు ౫

పోలోజు కవిప్రార్ధన నాలించి ఆ బ్రహ్మరాణి బాసరశుభవాణిగా పోలోజుగళంలో కమ్మగా నినదించింది; పరతత్త్వభాజనంగా పరమార్ధం నినదింపజేసింది. ఆ విధంగా ప్రభవించిందే ఈ ప్రథమ పద్యకృతి. పోలోజు కవి తపస్సు వలించింది. వారిపెద్దన్నయ్యగారైన మాన్యశ్రీ నాదబ్రహ్మచార్యులవారి వద్ద ఆబాల్యంగా విన్న వేదపురాణేతిహాస సాహిత్య సంగీత విశేషాలు - తమ్ముడైన రాజేశ్వరాచారిగారిలో ఈ విధంగా ఫలించాయి. “విశ్వకర్మయన్న విశ్వమంతయునిండి' ఉండటంమాత్రమేకాదు; విశ్వసృష్టిచేసిన మహాశిల్చి కూడా ఆయనే. ఆ లక్షణాలు ఆనువంశికంగా ఆత్మలో పాదువుకొన్న గృహవాస్తుశిల్పి ఆర్‌.సి. పోలోజు, అంతేకాదు, ప్రస్తుత కృతిరచనలో నవకవితా గృహవాస్తు శిల్పిగా కూడా కనిపిస్తున్నారు శ్రీ ఆర్‌.సి. పోలోజుగారు. ఈ ఉభయ శిల్చనైపుణ్యం ఇట్లే కొనసాగుగాక! ఇదే అభ్యుదయభావనాశిల్పం.

= వాసిలి వేంకటలక్ష్మీనరసింహరావు 06-01-2007 84/21, మిర్‌పేట, ఆర్‌.యన్‌. రెడ్డి కాలనీ వద్ద, వైశాలినగర్‌ పోస్టు, హైదరాబాద్‌ - 500 079. ఫోన్‌ : 040 - 24090646 బుక

4

దీవెనలు

డా॥ ఉండేల మాలకొండారెడ్డి “బాల సరస్వతి”, 'కవికిరీటి, 'విద్యాభూషన్‌” ఎ.వి. కాలేజ్‌ క్యాంపస్‌, గగన్‌ మహల్‌, హైదరాబాద్‌. ఫోన్‌ : 040 - 23399188, శ్రీ ఆర్‌.సి. పోలోజుగారు ప్రసిద్ధ వాస్తుశాస్త్ర నిపుణులు. అందమైన భవనాలకు రూపకల్పన చేయడంలో అందెవేసినచేయి. అంతేకాదు తన భావాలను అందంగా పద్యరూపంలో వ్యక్తీకరించుటకు ప్రయత్నిస్తున్న వర్ధమాన కవి. పెద్దలయందు గౌరవము, పిలలయందు వాత్సల్యము, దైవమునందు భక్తి, సామాజిక స్పృహ ఆయన సహజగుణాలు. ఈ నేపథ్యంలో ఆయన రచించిన కవితలు మూడు (1) బాసర సరస్వతి, (2) నూతన కర్ణభారము, (3) భూదేవినిర్వేదం. “కర్ణుని తలభారతం” అన్నారు పూర్వకవులు. భారతంలో కర్ణునికి జరిగిన అన్యాయంతో పోలుస్తూ, ఈనాడు ప్రభువులు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగట్టడం “నూతన కర్ణభారం” లక్ష్యం. ఉదాహరణ కొక పద్యం ; తే॥ భారతమున పెక్కు భర్త లుండిరిగదా

నేడు మాత్ర మేమినేర మనుచు,

భటులజంట సతిని భంగపరచిపంపె

భర్త కోపగింప, భయముజెప్పె. భూదేవి సంతానమైన మానవులు, తల్లిమేనిపై ఎన్నిరకాల కాలుష్యాలు వెదజల్గుతున్నారో భూమాత, తన భర్త్పట్టైన శ్రీమన్నారాయణునకు

ఎ

మొరపెట్టుకొనుట “భూదేవి” కవితలోని కథాంశం. ఉదాహరణకు రెండు పద్యాలు : తే॥ వెదకి, నీటికై బోరులు వేయుచుండ,

గోతులను త్రవ్వ, నామేను గులయయ్యె

నాగలిని బట్టీ దున్న, నా నరము లుడిగె

ఎట్టులోపుదు నేనింక ఏమిసేతు! తే॥ మరుగుదొడ్డను కట్టగా మలినమైన

మురికి కూసమ్మునందున మునిగియుంటి,

శ్వాస పీల్చ సాధ్యముకాక శ్వానమైతి

ఎపుడు తీరును కష్టాలు? ఎందుబోదు? సర్వవిద్యాధినేతయైన బాసర సరస్వతిని ప్రస్తుతిస్తూ వ్రాసిన కవిత “బాసర సరస్వతి”. ఉదాహరణకు ఒక పద్యం : ఆ॥ పతిత పావనివని పలుమారు నినువేడ,

పరిహసింపవలదు, పలుకునిమ్ము

కవిత చెప్పగ, నను కరుణజూడగరావె

బాసర శుభవాణి! బ్రహ్మరాణి! బ్రవ్మారాణీ శ్రీ పోలోజు గారికీ కవితా ప్రావీణ్యం వ్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను. మరియు పూర్వకవుల, నవీన కవుల రచనలు చదివి క్రొత్త రచనలు ప్రజా శ్రేయస్సునకై చేసి ఉన్నతస్థాయి నందుకోవాలని ఆశిస్తూ నా ఆశీస్సు లందిస్తున్నాను.

  • ఉండేల మాలకొండారెడ్డి ౫/1

స ను. కత మడు స య స స. . న. శ సో టి ఏ న ట్రీ నం ్‌ న. బాసర సరస్వతి

బాసర సరస్వతి శ్రీ పరబ్రహ్మణే నమః ఆ॥ వె॥ శ్రీకరమగు వాణి శ్రీలక్ష్మి శర్వాణి 1 ఈశదాసనుత! గణేశమాత! పాదయుగళి మొక్కి పాలింప వేడితి బాసర శుభవాణి! బ్రహ్మరాణి్‌ ! ఆ॥ వె॥ కలలు గన్ననాకు కలలు నిజము జేయ 2 కలము చేతికియ్య కావ్యమౌనె? నిన్ను నమ్మి నేను నిత్యము సేవింతు బాసర శుభవాణి! బ్రహ్మరాణి | ఆ॥ వే॥ వాక్కునొసగి నాకు వారసత్వము నిచ్చి 3 (భ్రమర రూపమిచ్చి బ్రతుకనేర్చ నెట్టు మరతు నేను ఇందీవరాక్షి! నిన్‌ బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ శతము అష్టపద్యశాస్త్రీయహారమౌ డీ కూర్చి వ్రాసినాడ కోర్కె దీర దయను నేలవమ్మ ధర్మార్ధ కామినీ! బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! తీ॥ గీ॥ గురువులందరి యందున - గురుతు నిలుప ర్‌ గాను మాధుర్యమును నిచ్చి - కాంచరావె గగన మునువీడి, నను బ్రోవ-కదలిరమ్ము ప్రోత్సహించి, మాతల్లిగా - పూజలందు. |

ఆ॥ వె॥ మాయమైన మనిషి మజిలేచి మదిలోన 6 చింతచేయు చుండి చిన్నబోయె _ ఎట్లు కాల మిట్ట్లు ఏమగు ననుచుండె బాసర శుభవాణి! బ్రహ్మరాణీ ! ఆ॥ వె॥ మణుల నిచ్చినావు మాన్యులు కోరంగ 7 మమత తలచి గతము మరవలేము మరణమైన శరణు మరల గోరెద నిన్నె బాసర శుభవాణి! బ్రహ్మరాణి . ఆ॥ వె॥ ఎట్టి విధుల గొల్లు? ఎట్లు నే కీర్తింతు 8 వాసిలి నరసింహు వసుధలోన? అక్షరమున కైదు అర్ధంబుల నొసంగు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆఅ॥ వె॥ విశ్వకర్మయన్న విశ్వమంతయు నిండె ర విత్త మార్దనంబు వెనుకబడదె? విధి విధానములను వివరింపగా లేరు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ పతిత పావని వని పలుమారు నిను వేడ 10 పరిహసింప వలదు, పలుక నిమ్ము కవిత చెప్పగ నను కరుణ జూపగ రావె బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ భంగులు బహుళంబు భావన కల్పింప [11 ఫలితమన్న దెందు పాలుపోక నీదు చరణధూళి నిల్పుము శిరమున బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! 2

ఆః వె॥ ఓం గణపతి యన్న ఓంకారమున నిల్చి 12 ఓర్చు జూపి నాకు ఊహ నిమ్ము జలజనయన! నాదు జన్మ తరించగ; బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ బ్రతుకు తెరువు కేని భజన తప్పక యుండు 13 భార మెంతయైన బాలుడైన సత్యమన్న దింక సంగ్రహింపుము తల్లి బాసర శుభవాణి! బ్రహ్మరాణి |! ఆ॥ వె॥ పక్షి వాహన నిను, పంచాక్షరివటంచు 114 పాదపద్మయుగళ పట్టువిడక పగలు రేయి యనక పఠన జేయుచునుంటి బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ భారమైతి నేమొ భార్గవీ! నీకు నే; 15 నీదు బుణము పొంద నేటి విధిని తెలుపుమమ్మ దయను తేట తెల్లంబుగా బాసర శుభవాణీ! బ్రహ్మరాణి | ఆః వె॥ బదులు పలుకు టెరుగ; బదులు చెప్పుట రాదు 16 బాలుడ కరుణించి భాష నేర్చి ఏమి చేయ నన్ను ఎంచెదవో తల్లి? బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ భావమన్నది గని భయముజెందుచు నుండ 17 పరులకినుక భావపఠన మిడగ నాదు కైత లనగ నగవేల? వలదను బాసర శుభవాణి! బ్రహ్మరాణీ ! తె

ఆ॥ వె॥ పంచతంత్ర మవని పఠన జేయని వారు 18 పలు విధాల విద్య పాటి లేక మేఘపంక్తి చెదరి మెరయునట్లు కనరే? బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ పరుల కెంతొ వింత పద్యకవిత లిచ్చి 19 కరువువచ్చె నేమొ కరుణనీకు నాకు విద్య యొసగ! నాదు తల్లివి గాదె ? బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆః వె॥ భరత ఖండమంత భక్తితో నినుగొల్వ 20 తరతరాల నీతి తలపజేయు గణనమింత యనక ఘనముగా గుర్తింపు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! అ॥ వె॥ తనయు డనెడు మాట తలపగా నీ వుండ 21 పరుల పంచ నెట్లు పలకనేర్తు? హంసవాహనయని హారతు లిడితిని బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ గణము తప్పకుండ గతిసాగిపోవంగ 22 మతిని తప్పనీక యతిని నిలిపి ప్రాసనియమ మందు ప్రతిభ నెంచగ రావె బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ ఎట్టికవిత నిచ్చి ఎట్టు కాపాడెదో 23 భయము వీడి నీదు భక్తి గల్లి ముక్తి నాంది, నిన్ను ముమ్మారు పిలిచెద బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! న

ఆః వె॥ నిన్ను గొల్వ మదిని వెన్నంటు తత్వంబు 24 మాటకైన నాకు మనసువిప్పి తెలియపరచకున్న తెలిసికొనుటయెట్లు ? బాసర శుభవాణి! బ్రహ్మరాణ్‌ ! ఆ॥ వె॥ మనసు నిల్పినాకు మతిని వృద్ధిని జేయు 25 మార్గమెట్టు కల్గు మదిని తెలుపు మానవాళి కిటుల మార్గదర్శకమైన బాసర శుభవాణి! బ్రహ్మరాణి | ఆ॥ వె॥ తండ్రి దూరమాయె తల్లి తల్లిని జేరె 26 భ్రాతృవర్గ మందు భ్రమలు నిండె తలప కాల మిట్లు తా కాటువేసెను బాసర శుభవాణి! బ్రహ్మరాణీ ! ఆ॥ వె॥ మంచిదారి జూపి మాతను మరపించు 27 మనుజులందు పెక్కు మలుపు లుండు మతుల గ్రుచ్చి పూల మాలగా గూర్చవే బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆఅ॥ వె॥ తల్లివై తనయుని తగురీతి గాపాడి 28 విద్య గరప నీకు విధియుగాదె? తల్లిదండ్రికీర్తి తరతరాలును నిల్చు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ తనయు లెందరొ యిల? తలలు వాల్చిరి కదా! 29 బాధ్యతయన నన్ను భారమనుచు మరవజూడ నీదు మరపు నెరయబజేసె బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! క్‌

ఆ॥ వె॥ కథలు కథలుగ కవి కావ్యము జేయగా 30 ఉజ్జ్వల మహిమంబు ఉదరమందు పొదిగి ప్రాభవమున పొంతన జచేయుమా బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ తప్పిదంబగుపని తప్పనిసరి జేయ 31 తలచి మాన్సజూడ తనువు దీరు వింతగా తలతురు విధివశంబు నెజగి బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ ఆపదలను పోరి అతిసులభత నేను 32 ఆఅఆటవెలదు లందు అలసిపోక నీదు చరిత వ్రాయ నిజకాంతు లిడి యేలు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ కలము కవ్వమైన కమ్మని పదములు 33 చిందునట్లు చేయు చెంచు లక్ష్మి వెన్నపూస కవిత వెయ్యేండ్లు జగమేల బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆఅ॥ వె॥ భావమింత యన్న బాలుడ నైతినే 34 సులభమగు పదాల చూచి మార్చి మాలలల్లి నీకు మనసు నింపుదు నేడు బాసర శుభవాణి! బ్రహ్మరాణి |! ఆఅ॥ వె॥ ఈశ్వరతపమందు ఈతిబాధల చేత 35 ముక్తిజెంది మనసు మూగ బోయె పరమ పావని! మృదు పదములై కావుమా, బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! 6

ఆ॥ వె॥ ఆనతియ్య రావె అఖిలాండ నాయిక ! 36 అర్ధరహితమైన అవనియందు తరగ నట్టి విద్య తరతరాలుగ నిల్చ బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆః వె॥ సద్గుణా లవెన్నా సరసములై యుండ 37 సమత జీవనమ్ము సగటుకాగ సత్యకాల వచన సంపాదనము లేక బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ ఆత్మనిగ్రహాన ఆత్మభవుండు నీ 38 కంకితంబు నిచ్చె అడిగినంత శంకలే దొకింత శైలేశపుత్రిరో |! బాసర శుభవాణి! బ్రహ్మరాణి |! మహిమ నాదు కోర్కె మరచిపోక వరము లీయవమ్మ వరశైలపుత్రికా! బాసర శుభవాణి! బ్రహ్మరాణి |! ఆ॥ వె॥ పిలువ నెంత వాడ ట్రీతితో నే నిన్ను 40 జాలమేల తల్లి జగడమేల ? తరలిరావె నీదు తనయుని గాపాడ బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ ఆదరంబు నిచ్చి ఆపదల్పాపగ 41 అడుగడుగున నాకు అండనిల్చి దయను జూపి మాకు ధర్మబుద్ధి నొసంగు బాసర శుభవాణి! బ్రహ్మరాణీ ! 7

ఆ॥ వె॥ తల్లివనియు నిన్ను తరతరాలుగ గొల్చి 42 తలను బాదుకున్న తలపు రాక తలచు చుంటి నెన్ని తడవుల విధిపేర బాసర శుభవాణి! బ్రహ్మరాణి |! ఆ॥ వె॥ ఏల తల్లు లిట్టు లెండమావుల జూపి 43 తనయు డన్నమాట తాము మరచి జగము నందు జనుల జగడాలు పుట్టింత్రు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆఅ॥ వె॥ శోధనంబు జేయశోకంబు మిగిలెను 44 శతము లెన్స్మొ గడువ శరణు మిగిలె అంతిమ క్షణాన ఆశలు బెంచకు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ ఆఖరిక్షణమన్న దసలు లే దీభువి 45 క్షణము క్షయ మొనర్చ క్ష్రామమయ్యె అక్షయముగ వ్రాయు అక్షరములు నీవె బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ రక్షణంబు జేయ రాయి దేవుం డయ్యె 46 మహిని నీదు మహిమ మరులు మిగితె పెద్దజేయ నిన్ను పేదమనసు నాది బాసర శుభవాణి బ్రహ్మణి! ఆఅ॥ వె॥ భాగ్యమన్నది గన భారమైయుండెను 47 భాష యొప్పుజేసి భావమొసగు భక్తవత్సల యన బాలాత్రిపురమూర్తి బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! 8

ఆ॥ వె॥ తగిన రీతి నీదు తాత్పర్యమును వ్రాయ 48 శాస్త్రములను చదువ శతశతమ్ము నీదు కరుణ లేక నేర్వగలడె కోరి! బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ పలువిధముల మెచ్చ పాండిత్యమును లేదు 49 పలుకవమ్మ నోట పరువు నిల్బ పసిడి వన్నెలు గల పంకజాక్షివినీవు బాసర శుభవాణి! బ్రహ్మరాణి |! ఆ॥ వె॥ పరమ దుర్లభమగు పరతత్త్వ పఠనంబు 50 కరుణ చిల్కగోర కళను తీర్చి కావ్యమన్నది కల కాకుండ దీవించు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ వేద విద్యలంది వివిధ రీతుల ర5్‌1 వివరణముగ నాకు విప్పిచెప్పు వాక్కు నిచ్చికెచు వనజభవుని దేవి బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆః వె॥ వెజ్జీ కోరికలని వీడెదో వాగ్దేవి 52 పాలిటిక్సు నందు ఫలితమిచ్చు పామరులకు ఎట్టు పలుక నేర్పెదవమ్మ? బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ పరుల నిందలన్ని పరమేష్టి వీవయ్యు 53 పరిహసింప ధరణి పారదోలి ప్రణయమందు కోర్కె ప్రబలకుండగజేయు బాసర శుభవాణి! బ్రహ్మరాణీ ! లలన ననే ం్ర

ఆ॥ వె॥ అమ్మలగని జగతి అమ్మవైయున్న నీ ర4 పాదములను వదలి పాపినైతి ఎట్లు హృదయమందు ఈతీరు వక్రించె? బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ భరత ఖండమంత భగభగమండగా ర్‌5్‌ బాగు చేయునట్టి భావమొసగు ఖ్యాతిగల్లుగ ఖండఖండాంతరములలో బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె! కాయకష్టమందు కడుపు నింపుకొనుచు 56 కవితలల్లు ప్రతిభ కరుణజూప వేడుకొంటి నిన్ను వేగమ్ముగా రమ్ము బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ! వె॥ మల్లెమాల గారు - మట్టిలో అక్షరాల్‌ ర5్‌7 వ్రాయనేర్చినట్టి - వ్రాత చేత మంచిపేరు నిల్ప్బ - మహిమ నీదే కదా! బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ మల్లెమాల జన్మ మరవని జన్మంబు 58 స్వర్ణయుగమె యయ్యె చాటి చెప్ప సకల జనుల కదియె స్వాతంత్ర్య దినమయ్యె బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ పలుక నిమ్ము నోట పాండిత్య విభవమ్ము 59 ప్రతిభ నిచ్చి నిలుపు ప్రగతిలోన ఫాలనేత్రునింట పర్వతపుత్రివే బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! 10

ఆ॥ వె॥ తగునె, నీకు నిటుల తనయుని వేధింప 60 కల్చ్పనలను జేయ కరుణ జూపి ఉరుమునట్లు మదిని ఊహలన్నియు నింపు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ కమ్మని మదియుండి కలము ఖడ్గము గాగ 61 కవిత లాసగి మనసు కైవసమున నిబ్బరముగ నిల్చు నిశ్చలాత్మ నొసంగు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ భాగ్యమన్నది గన భావభావమునందు 62 మరవలేని నిన్ను మది నిలుపుదు! కరుణ నన్ను నీదు కాసారమున ముంచు బాసర శుభవాణ్‌! బ్రహ్మరాణ్‌ ! ఆ॥ వె॥ పదము పదము నీదు పగలు రేయనకయు 63 పరవశతను నిల్చు పాటవంబు జన్మజన్మలందు జగము మెచ్చగ నిల్చు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ జలజనయన! నాకు జలము త్రాగెడిరీతి 64 కమలనయననీవు కలముకదుపు! మిసమిసయను మనసు మీనాక్షి! వాగ్దేవి! బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ ఓషధు లవియెన్నా ఒడిలోన గల తల్లి! 65 ధాతువు లవియెన్నా దాచినావు ధరణిమాత! భాష ధారాళముగ నిమ్ము బాసర శుభవాణి! బ్రహ్మరాణి |! [11

ఆ॥ వె॥ రత్నగర్భయైన రమణివి నీవైన 66 రత్నమొకటి విడ రగులు చింత తగునె జాగు చేయ తనకొంగు నీడలో బాసర శుభవాణి! బ్రహ్మరాణి !

ఆఅ॥ వె॥ విద్య భాండములను విరివిగా నొప్పిన 67 కొమరులందు పంచ కుదురకున్నె? పంచు టెట్టనంగ పరులమా నిటలాక్షి? బాసర శుభవాణి! బ్రహ్మరాణి |

ఆ॥ వె॥ పోతన కవియందు పొట్టన నిల్నియు 68 రామకృష్ణకవికి రక్తి జేర్చి కాళిదాసు కవిత కాంతవై వెలసిన బాసర శుభవాణి! బ్రహ్మరాణి !

ఆ॥ వె॥ పార్వతీ సుతునకు పాటవమ్మును నేర్ప 69 కరుణజూపి యిమ్ము కావ్య కవిత పద పదమున కెట్లు పవలు రేయి తపింతు? బాసర శుభవాణి! బ్రహ్మరాణి |!

ఆఅ॥ వె॥ కావ్య కవిత వీవె కారుణ్యమూర్తివై 70 కథలు కథలుగ నిను కాంచనిమ్ము అంచ లంచెలుగను నంద మానందంబు బాసర శుభవాణి! బ్రహ్మరాణి |

ఆ॥ వె॥ ఆత్మనిగ్రహంబు అడుగకుండగ నిచ్చి 71 అలసటన్నది ఇక అంటువీడ శాస్త్ర సంపదనిడి శాసింపజేయుము బాసర శుభవాణి! బ్రహ్మరాణి |

[2

ఆ॥ వె॥ ఆదిశక్తి వనుచు ఆత్మకథను వ్రాయ 72 ఆటవెలదులందు ఆశకలిగె శారదాంబ వౌచు శంకలు దీర్చుము బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ శక్తిసంపదలకు శాశ్వతనిలయమై 73 పుట్టిగిట్టటలకు ప్రోది యగును చయ్యన నను బ్రోచి చక్కగా నేలుము బాసర శుభవాణి! బ్రహ్మరాణ్‌ ! ఆ॥ వె॥ ఇంగితమను చింత యింతమాత్రము లేక 74 మందబుద్ధి నగుట మనన జేయ నన్ను బ్రోవరమ్ము నగజాత పుత్రివై బాసర శుభవాణి! బ్రహ్మరాణి |! ఆః వె॥ ఆత్మవంచనన్న ఆశయంబులపేరు 75 దరికి జేరకుండ దారిగాచు శమదమముల ఓర్చు శమనుడు మెచ్చగా బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ అంతరాత్మ నాకు ఆనతియ్యగ కోర 76 అంకమందు నిలువ ఆంక్షలున్న శరణు నీవె తల్లి! శ్రైలేశపుత్రిగా! బాసర శుభవాణి! బ్రహ్మరాణ్‌ ! ఆః వె॥ కావ్య కవిత కీవె కారుణ్యమాతవై 77 కథలు కథలుగాను కాంచనిమ్ము శరణు వేడ నిమ్ము శైలేశపుత్రిగా! బాసర శుభవాణి! బ్రహ్మరాణి ॥ [13

ఆ॥ వె॥ భారతావని నిను భళిభళియని మెచ్చ 78 జన్మజన్మలందు జయము నిమ్ము శారదాంబ నీవు శైలేశపుత్రివై బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె! పలురకాల విద్య పరమ పదమునకై 79 పాటుపడగ లేను పంకజాక్షి! శంకదీర్చి ఏలు శైలేశపుత్రివై బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ కోర్కె లెన్నియున్న కోరకుండగ నుండి 80 అన్ని నావి యన్న ఆశనున్న శైలభావునన్ను శైలజ! కావుమా, బాసర శుభవాణి! బ్రహ్మరాణి 1 ఆ॥ వె॥ బంధురాగరక్తి బాధపడుట మాని 81 భవతి మోక్షమనెడి భాగ్యమబ్బ శాశ్వతముగ నిమ్ముశైలజ! పరితృప్తి బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ దత్తపుత్రివగుచు దాహము తీర్చుము 82 గౌరవమ్ము నిల్పి గతులు మార్చు శశిధరాఢ్య బోవు శ్రైలేశపుత్రివై బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆఅ॥ వె॥ ఆశయమును బెంచి ఆహుతి జేయుమీ 83 మనసుమార్చిమంచి మనసు నిమ్ము శరణు వేడువాడ శైలేశపుత్రిరో! బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! [4

అ॥ వె॥ దత్తతగొని భాగ్యదాత్రిగ జేయుచో 84 భాగ్యమెటుల నీకు భంగమగును? శమదమముల నోర్చు శైలేశపుత్రిగా బాసర శుభవాణ్‌! బ్రహ్మరాణ్‌ !

ఆ॥ వె॥ విరులు విప్పి మనసు విశ్వరూపము జూపు 85 వేద విద్యనాకు విధిగ నొసగు శారదాంబ వరద శైలేశపుత్రిగా బాసర శుభవాణి! బ్రహ్మరాణి !

ఆ॥ వె॥ తలచ కోర్కె దీర్చ తా ననసూయగా 86 శాంభవి నను జేరె శాంతమూర్తి శంకరేచ్చ కల్లి శైలేశపుత్రియై బాసర శుభవాణి! బ్రహ్మరాణ్‌ !

ఆ॥ వె॥ విద్యనడుగ నాకు వింతగా వరమిచ్చె 87 విషయమంత తెలిసి విష్ణుకామి అంబవగుచు నిలిచి ఆలంపురిని ఏలు బాసర శుభవాణి! బ్రహ్మరాణి |!

ఆ॥ వె॥ ఆత్మ నిగ్రహాన ఆత్మభవుడు నిన్ను 88 అంకితంబు చేసె అడిగినట్లు శంకలే దొకింత శైలేశపుత్రిరో! బాసర శుభవాణి! బ్రహ్మరాణి !

ఆ॥ వె॥ శయనమేల నీకు శైలేశపుత్రి? నీ 89 కరుణ గోరువాడ కవితనిమ్ము కడకు దేర్చు కవిగ కాలాంతమున నన్ను బాసర శుభవాణి! బ్రహ్మరాణి !

ననన ననన ననన ననే

[5

ఆ॥ వె॥ శాస్త్ర సంపదలను శ్లాఘింపు కోర్కెను 90 చమరగిరిని ఏలు చంద్రమతివి శాసనమ్ము జేయు శైలేశ పుత్రివై బాసర శుభవాణి! బ్రహ్మరాణి | ఆ॥ వె॥ చరణ ధూళి సోకి శతఘంటకవులైరి 9 సకల శాస్త్ర పూజ్య సత్యవాణి శాస్త్ర విద్య నేలు శైలేశపుత్రివో బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ వాణి నాదియన్న వాదనం బొప్పింప 92 నిల్వ లేదె మధ్య నేనె యనుచు శరణ మనినయంత శైలేశపుత్రిగా బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ విక్రమార్కు నేలి వీరఖడ్గ మొసగ 93 ఎట్టిపూజ చేసె ఎరుగనైతి శత్రుబలము చీల్చ శైలేశపుత్రిగా బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ శరణు వేడ నిన్ను షణ్మాసపుత్రిగా 94 విధికి ఎదురు నిలువ వింతగాదె? శాంతమూర్తి వయిన శైలేశపుత్రిగా బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ నీదుకరుణ పొంది నిలిచియుండ కవిగ 95 మాతవైన నిన్ను మరవలేను శాంతమతిగ నిలుపు శైలేశపుత్రివై బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! 16

ఆ॥ వె॥ విఘ్ననాయకు నిటు వేడకుండగ నేను 96 కవిత వ్రాయ నాదు కలము నిలిచె బొజ్జగణపతి నిక బుజ్జగించుము తల్లి బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ వాయు తనయు నాంజనేయుని బ్రోవంగ 97 రఘుకులేశు డెట్ట్లు రాజ్యమేలె? శత్రువులను నణచ శైలేశపుత్రిగా బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ ఆదిశక్తివగుచు ఆదిశంకరు నేలి 98 అవని బ్రోచినట్టి ఆత్మనిమ్ము అన్ని నీవె యనుచు ఆశించియుంటిని బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ రగులు చున్న కోర్కె రమ్యతన్‌ గొల్పంగ ంం వైరము లభిరామమయ్యె శబరి బ్రోవ నంప శైలేశ పుత్రివై బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ భావమన్నది మది భారమైయుండగా 100 శంభుని శిరమందు శయనమొంద తగునె తనయు డిట్లు తల్లడిల్లగ జూడ బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ శ్రీకరముగ భువిని శ్రీనాథు కరుణింప 101 భార మెంచబోక ప్రబలినావు గుండె రాయిచేసి గురుతుగా నను బోవు బాసర శుభవాణి! బ్రహ్మరాణీ ! (7

ఆ॥ వె॥ సకలమర్మములను సాటి నీ కెవరమ్మ? 102 సాక్షి గణపతి గృహ సద్గుణాంబ సహజ విజయ మొసగు సంచారముగ నేడు బాసర శుభవాణి! బ్రహ్మరాణి |!

ఆ॥ వె॥ చక్కబడని ఇల్లు చక్కగా సరిదిద్దు 103 మహిమ నెట్లు కాంతు మనసు లేక? శంకరాత్మ జనని శైలేశపుత్రిగా బాసర శుభవాణి! బ్రహ్మరాణి !

ఆ॥ వె॥ ద్విగుణముగను చేయు ద్విపదరూపిణివైన 104 ధైర్య లక్ష్మి వగుచు ధైర్య మిమ్ము శాస్త్రమన్న నీవె శ్రైలేశపుత్రిగా! బాసర శుభవాణి! బ్రహ్మరాణి !

ఆ॥ వె॥ దైవమనిన ధరణి ధనలక్ష్మిగా రమ్ము 105 దాతలందు మెలగ ధనము తోడ శాశ్వతాత్మవైన శైలేశపుత్రిగా బాసర శుభవాణి! బ్రహ్మరాణి !

ఆ॥ వె॥ త్రిపుర సుందరివిగ త్రిపురములేలుచు 106 తగిన పూజలందు తరుణివయితి వద్రిజాతనయుని ఆరాధ్యదైవమై బాసర శుభవాణీ! బ్రహ్మరాణి !

ఆ॥ వె॥ అలసి సొలసినావా ఆలంపురీలక్ష్మి! 107 మరవకమ్మ, మాట నిలుపు మమ్మ వేయిపనులె యున్న వేవేగ దీర్చవే బాసర శుభవాణి! బ్రహ్మరాణి !

18

ఆ॥వె। ధాతకైన నీదు ధ్యానంబు తప్పునే? 108 ధ్యాన మందు నుండ ధన్యవగుచు శాసనమ్ము జేయ శ్రైలజ పుత్రివై బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! ఆ॥ వె॥ చిత్తమందు దలచి చింతిల్లకయె నేను 109 సిరుల పొందు భ్రమలు చెదిరిపోవ పద్యపఠనజేయ భావము జనియించె బాసర శుభవాణీ! బ్రహ్మరాణి |! ఆ॥ వె॥ వ్రాస్‌నాడ చరిత వసుధ బ్రోవగ కల్మ 110 షాది రహిత నేడు షాడబమును స్వీకరించు తల్లి స్వీకర్తవై నీవు బాసర శుభవాణి! బ్రహ్మరాణి ! 19

త నం. సం త సన ల. ల త ముం. మం క. నూతన కరభారతం ళం

నూతన కర్ణభారతం ప్రజాభారము మన ఇతిహాసములలో ఒకటైనది “కర్ణభారము”. ఇట్టి కర్ణభారమును పూర్వపు కవియైన “భాసకవిగారు” రచించియుండిరి. వీరు మన కాళిదాస కవి గారి కన్నను ముందువారని తెలియుచున్నది. “కర్ణభారము” అనగా మహారథి కర్ణుడు భారత యుద్ధభూమిలో ప్రవేశించిన తర్వాత తన మనోవ్యధను సారథియైన శల్యునకు - “తన గురువు చేత శపింపబడుట, తల్సి కుంతి తన నుండి వరము పొందుట, దేవేంద్రుడు తన యెఎక్క నవాజ కవచ కుండలములను భిక్షగా నడుగుటయు”” -వినిపించుట-మున పౌరులు తవుకు జరిగిన వోనముల గురించి, అన్యాయముల గురించి కొన్ని కొన్ని సందర్భములయందు అధికారులతో వెొొంరపపటుకొనుటను వురియు అధికారుల నమాధానములును ఇందుకూర్చబడినవి. 'కర్ణభారము*ను చదివి చూచిన అనంతరము ఆ “శల్యుని” వద్దతిలా ల 'అభుత్వ పరిపాలనలో కొన్ని విశేషాలను వివరింప లను సర హైతయెన జరిగినది. నాకు గురుతుల్యులైన “సాహిత్యట్రల్కా ల్‌ టక కవితాపద్య డా వాసిలివేంకటలక్ష్మీ నరసింహారానగొ_. టాయుటకు ప్రోత్సాహము రత్నాలు నన్ను అకర్షించుట చేత ఈ “కర్ణభారము. ( కలిగినద్రి చి వ్రాసినప్పటికీ ఇందులో కొన్ని విషయములు ప్రభు వ పం శేను కలము పట్టలేదు. నా ఉ్రద్ద్య్సు వారిని కించపరచాలని కొలు? "= 21

శ్రీల సిద్దివినాయక! శ్రీమహేశ సన్నుతిం జేతు వివరాల - సడలనిమ్ము కల్పనను జేసితినెటులొ - కరుణజూపు వాంభఛితములను నెరవేర్చు - వామహస్త ! కైతలు పలువ్రాయ - కమలగర్భునిరాణి వాక్కునీయ కున్న - వ్రాయగలమె? కోరి జన్మలెత్త - కొరతలు లేకుండ కమ్మనివర మిచ్చి- కరుణ జూపు. వాస్తు శిల్పి పోలోజు 22

ప్రజలలో వెనుకబడిన జాతులు మరియు పెద్ద తరగతి ప్రజలు, వారి వారి యొక్క స్థితిగతులు అనుభవాలను ప్రభుత్వోద్యోగుల తోడ చెప్పుకొనుచు వాపోయిన విధము.....

బక్క చిక్కియుండ - బడికి పామ్మని చెప్పె 1

బుక్కెడన్న మడుగ - భువిని ద్రోసె

'ప్రాజ్జుడంత నచట - ప్రాణంబు వదిలెను

పల్లెవారి బ్రతుకు - పలుకలేము.

బిడ్డపోయెనంచు - బిక్కుబిక్కున నేడ్వ 2

తబలనువినిపించె - తరిమి తరిమి

తరుణులఒడ లాయె - తాటి బెల్లంబుగా

తప్పుచెప్పుమన్న - తనువు దోచె.

మిలటరీలకన్న - మిన్నయ్యె మనవారు 3

చదువుకొన్న వారు - చవటలైరి

నేరమునకు నీతి - నీరాజనము పల్కె

చట్టుబండలయ్యె - చట్టమంత.

పోలిసునకు తెల్ప - పాగరుబోతనినారు త్న

లాకపునను లాఠి - లయము జేసె

లక్ష్య సాధనమున - లక్షలు కాజేసె

పోలిమేరమింగె - పొలము దాట. రేషనుకార్జులు రెండు రకములురాగా వాటి గోడు మరియు అట్టె మధ్య తరగతివారు తినుబండారముల ధరలు పసపెరిగినవని అధికారులకు తెల్సి... వొపోయిన విధము.

23

ధరలు పెరిగి అన్ని - ధాన్యాలు కొరతయ్యె ర్‌ "పెంచి నోళ్ళ పేర్లు - పేప రెక్కె తెలిపి నోళ్ళ తలల - కిల తిరుక్షౌరమ్ము చట్టమునకు తెల్ప - చావబాదె. బ్రతుకు భారమయ్యె - భాగ్యహీనుల కిట్లు 6 జిలకరపాడి నిచ్చె - జేలు కొట్ట ఎట్లు గడుపుదు రిల? - ఏదారి జీవమ్ము? ఓటు వచ్చెమనకు - ఓర్పు నేర్ప. ఎర్ర కార్డు వారు - ఎండిన బియ్యంబు 7 వండబోరు ఇంట - వండి తినరు రూకలివ్వ రెండు - రోత బియ్యంబయ్యె అలవాటు లేక - అమ్మ వచ్చె! తెల్ల కార్డు వారు - తెల్ల బోయిరియంత 8 ధరలు పెరుగ వారి - దమ్ముపోయె ఆరు రూక లాయె - అమెరికా బియ్యంబు ఇండియావి యన్న - ఇరువదాయె అమెరికావి అశ - అడుగుపట్టగ విని 9 ఇండి యావి యింట - ఎండి పోయె ఎన్ని చెప్పి చూచి - ఏమి చేసినగాని దండుగాయె నిల్వ - ధాన్యమంత! చదువురాని పల్లెటూరి ఆడపడచు మన మాటల్లో వాడకపు పదమును ఒక ఊతపదముగా వాడి ఆమె అనుభవించిన విధము 24

రేపు చేయుబుద్ద్ధి - రీతికాదనియన్న 10 అలుకజేసి పట్టి - అదుముకొనిరి ఇంతి నిడ్చె నిట్టె = ఈ రోజు కానిమ్ము పరులు లేరటంచు - పరువుద్‌సె. అన్నమడిగి నంత - అరకుసీ, సనిచూపె, 11 అడ్డు చెప్పినోళ్ళ - అణచివేసె పాపభితిలేక - ప్రాణాలు తీసిరి మనకు ఏమి యనుచు మరచిరంత ఇళ భూములడుగ - ఇస్తిమిస్తిమనుచు 42 'పెంటకుప్పలిచ్చె - పేరు నిల్బ బాగు కాగ కన్ను - భగ్గుమనగ వాటి నమ్మబేసి అడవి - వమ్ముజేసె. పనికి అన్నమనిన - పరవళ్లు త్రొక్కిరి 13 పనిని పూర్తిచేయ - పదినెలలుగ పొట్టనిండదాయె ఆ పుచ్చిన ధాన్యాన నెత్తిబాదుకొనిరి - నేరమనుచు. ఓటుహక్కు తెల్ప - ఊరికి మనసాము 114 లమ్మలారయనుచు - ఆడువారి చీరలనుచు పంచె - చీకొట్టకుండగ చాల జేలు కొట్టి - జనము మజచె ! పట్టణాన వదిలె - పగలు తిండికి లేదు 15 రాత్రి కూడు లేక - రైలు ఎక్కి 2ై5్‌

రాజ్యము మన దంచు - రాజ్యము దోచిరి, తెల్లదొరల మించె - తెలుగుజాతి పౌరుడు మరియొక పౌరుని ప్రీతో పరిహాసము చేయ పౌరునికి ఆమె, మన ఇతిహాసములగు రామాయణ, మహాభారతముల గురించి వివరించ పౌరుని ప్రవర్తన నిట్ట్లుచూపె. భారతమున పెక్కు - భర్త లుండి రిగదా, 16 నేడుమాత్రమేమి - నేరమనుచు భటుల జంట సతిని - భంగపజఅచిపంపె భర్త కోపగింప - భయము జెప్పె. భారతమును జూడ - బరితెగించియు నుండె 17 ఇట్టి నీతి చెప్ప - ఇంటికి జను రంకు నిండియుండె - రామాయణంబున ఏమి చెప్పెదవని - ఈడ్చివేసె. రే పటన్న దింక - రెండవ రోజాయె 18 రోజు కొక్కసారి - రుచిని చూపు లాఠి జులుపి మగని - లంచ మడిగిరన్న ప్రళయ భయము నీకు - లాఠియనిన దిక్కు లేక భర్త - దీనుడ ననిఏడ్చి 19 దయను జూప్పుమనును - దారిలేక ప్రాణములను వదలె - ప్రగతి సాగుచునుండె మానవత్వమంత - మంటగలిసె. ననన ననన ననన 26

భారతార్ధ మనిన - భటులకు తెలియదా ? 20

రాక్షసాంతకుండు - రాముడనగ

రాము డనని నీదు - రక్తంబు చూచెద

ననుచు అతని జట్టు - అట్టె పట్టె ! ప్రతి ఎలక్షనుల సమయములో ప్రతి అభ్యర్థి తాను, తినుబండారముల ధరలు తగ్గించుతామని వేర్వేరు విధములైన వాగ్దానాలను చేయడము తర్వాత ఆ మాటలు వారికి జ్ఞాపక ముండక పోవడము వెనుకబడిన జాతులకు ప్రోత్సాహము కల్పించకపోవడము వలన ప్రజలు వాపోవుచుండిన విధము.....

దేశమంత ఎగిరె - దేదీప్యమై రంగు 21

ఎరుపు తెలుపు పచ్చ - ఎరుక చెప్ప

కాటువేసె నిపుడు - కాంగ్రెస్‌ రాజ్యంబు

కరవుతీరు నెపుడు - కడుపు నిండు ?

అన్న లందరుండ - ఆడరాజ్యంబయ్యె 22

రాజ్యమందు కరువు - రాజ్యమేల

రమణులందు పరువు - రభసగా నుండెను

ప్రగతి బరువు నాయె - ప్రజల కిటుల.

బడుగు వర్గములను - బంతులాడించిరి 23

బాస రాజ్యమయ్యె - భయము లేక

భాగ్య నగరమయ్యె - బాధల నగరంబు

బాంబు రాజమయ్యె - భయము నింపె. స్వరాజ్యము వచ్చినపుడు స్వతంత్ర సమరమున పోరినప్పుడున్నటువంటి ధ్యేయాలు ప్రస్తుతము కాంగ్రెస్‌లో లోటైనందున ప్రజలు మనస్తాపముతో ఓటు వేయజాలక.... వాపోయిన విధము...

2

కాంగ్రెసునకు వేయ - కాగడయ్యెను చూడ 24 పచ్చజెండ చూడ - పలుచనయ్యె పట్టెడన్న మెవడు - పట్టించుకోడట ఓటువేయుమనుచు - చాటుచుండె. ఎన్నిమార్దు చెప్పి - 'ఏమి యడిగినను 25 మార్పులేదు మనసు - మమతలేక మారునెట్లు బుద్ది - మనవాళ్ళ్యయందున? మంచిమార్గ మనగ - మాయమయ్యె. బీదసాదలన్న - భేదమ్ము లేదాయె 26 లేబరన్నగాని - లెక్క లేదు; మంచి, జేయుదుమని - మరవగా జేసిరి మాట నిల్చుకొనక - మాయమైరి. మన్నన యన వారి - మనసున లేదాయె 2/ పెద్దలందు బుద్ధి - పెరడుజేం పరువటన్న దింక - పలుకవద్దని యనె “పచ్చ కాగితాలె - పరువు'అనిరి గోదావరి కృష్ణా జలాలను హైదరాబాదునకు మళ్ళించకపోవడాన్ని తలచి వాపోయిన విధము పాత్ర తడవదాయె - పాచిపొట్టును నింప 268 పతనమయ్యె మతులు - పదవి కొరకు ఓటు ఫలిత మెపుడు - ఒరగి చూచు మనల ? బరగి ఓటువేసి - బ్రతుకు టెట్లు ? 28

కలతల బ్రతుకాయె - కాంగ్రెసు రాజ్యంబు 29 తెలుగుదేశమన్న - తిండిలేదు భారతీయ జనత - బంధమ్ముతెంపిరి, బాబు పాలనంబు - పరులు మెచ్చ కష్టమయ్యె ప్రజకు - కమ్యూనిటీలందు 30 ఓటు హక్కు తెలుప - ఓపలేదు ఎవరు చెప్పరాయె - ఏమి తెలియదయ్యె ఓట్లనాడు వచ్చె - ఊపుకుంటు. ఇంటిపన్ను కట్ట - ఇన్కము లేదాయె 31 గడ్జిగుడిసె కేమొ - గండముండె గతము మరవజేసె - గారడి గావించె గగనమందు నిల్పె - కంఠమెత్తి మద్యపాన మంచు - మరిమరి మురిపించె 32 మాన్పినట్లు చేసి - మాయ జేసె మద్యమున్న చోట - మనసుండు ననినంత మాట లన్ని వినగ - మతులు పోయె. అందలంబు నెక్కె - అప్పులవారధుల్‌ 33 అడ్డుచెప్పువారు - ఆరుకోట్లు అండ నిలిచినజను - లలసిపోయిరిగాన ఆదరమును జూప - అసలు టేరు. తలలు పండిన వారి విషయము గురించి పౌరులు ఇట్లు పల్కిరి... 29

తెలుగు జాతి కెపుడు - తీరంబు లేదంచు 34 చక్కగా మనసున - చాటి చెప్పె జాతి గౌరవంబు - జగమెల్ల పాగడంగ తాతలందరి నెటొ - తరిమి కొట్టె. బాగుచేయు బలము - భాగ్య మబ్బ్చియునుండి 35 కులమతాలనుచును - కుంటుపడెను భీతి లేదని రిక - బీజేపి నేతలు కంకణమును కట్టి - కాలుదువ్వె. ఎలక్షనులో ఎవరు నెగ్గుతారని యడుగగా... ఎవరినైన రేపు - ఎత్తి యెలక్షనుల్‌ 36 ఎట్టి వారినైన - ఎత్తి నిలుపు ప్రజల హితవు కోర - ప్రవహించి వచ్చును వలయు అండదండ - వారి కుండు. ప్రజల మరచిపోవ - ప్రభుతయె పచ్చడె, 37 పోరు సల్చ ఎవరు - పుట్టబోరు వచ్చెనయ్య బలము - వసుధలో నిండుగా ధైర్యమనగ తెల్పె - దైవమెటులా. తెలుగు దేశమంత - తెల్లవారలునిల్చి 38 దేశముమనదియని - దిట్టజూపి ప్రజ్ఞచేసి యిద్ది - ప్రజలరాజ్యంబుగ పనులు చేయకోరె! పరుల చేత! 30

రామదండునౌచు - రాజ్యమేలుచునుండె 39 రాముడింట లేక - ప్రబలె దండు రాళ్ళ భూములిచ్చె ఆ రత్నాల పంటకై దాతలందరుండ - ధరలు పెరిగె! హరిజనులకనుచును - ఆరగించి రెవరు? 40 గిరిజనులకు గీత - గీసిరెవరు? గట్టుకట్టెలమ్మి - గతము మరవజేసి కలువరమ్మనంగ! - కలువరైరి. న!

| భూదేవి నిర్వేదం

భూదేవి నిర్వేదం విఘ్నేశ్వర స్తుతి శ్రీమనోరమ, అమరేశ, - శ్రీగణేశ ! 11 నాదు, ఊహల, కలలను, - నడుపరావె కమ్మనివడల్‌ కడుపునిండ ! - కదలకుండ నుందు, వేమో యురగభూష - ఓ గణేశ ! సే! నెమలివాహనునన్న ! - నేర మెంచకయుండి 2 వక్రతుండముగల్లి - వాంఛదీర్చు చేట చెవులవాడ - చెరకు గడలు మెక్కి మినపట్లు, బొబ్బట్లు - మిక్కుటమన, ఎలుకవాహనముకై - యింటింట వెలయుచు ఇక్కట్ల నెన్నైన - ఇంపు జేయ పద్యరూపమునందు - పంచభక్ష్యములుగ చిరు వంటలు ప్రజకై చేయుచుంటి పొట్టికాళ్ళను గల్గి - పాందైన సుముఖుండ కైతవంటను చక్కగా నడుపగ వంట యంతయు రుచిపుట్టు - వరము నిమ్ము 3 వాంఛ కలుగగవేడితి - వసుధ నిన్ను వరము లివ్వలేదేని నిన్‌ - వదలలేను ఆరగింప రావయ్య 1! నా - అవధి తెల్ప కలన ననా తత

వాణీస్తుతి పిలచినపలుకుం జెలివౌచు - ప్రేరణనిడి శ్రే నాదుగీర్వాణ్‌వై ధర - నామనమును తెలియజేయ నీ కావ్యంబు - తీర్చిదిద్ది ధాత నీనోట వల్లింప - ధన్యుడౌదు. ప్రార్ధనలుజేసి బహువిధ - ప్రగతి గోరి ర్‌ కోరితి నిను నా మనవిని - కూల్చబోక తీయనగుగుండెలోపల - ఊయలూగ శారదాంబవై రావేల - శైలజాంబ ? , టా 4

[1 కరుణమూర్తిగ స్నేహము - కదుపు చుండు భార్య యగుచును భర్తపై - వలపుజూపు తల్లియై పుత్రులందరి - తనివి తీర పూల పాన్పులపై నుంచి - పొగడుచుండు

  1. భృగు మహర్షిని కోపించి - భువికి చేరి పార్వతీదేవియే నాడు - పాట్లు పడియె ఆడవారుగ నెందరో - అవనిలోన అక్కటికములు పొందలే దాదరమ్ము

  2. సకల సేవల నిలలోన - చక్కగాను నిత్య కృత్యములను జూడ - నిరతరక్తి గుండెలో సూదులను గ్రుచ్చి - కొప్పు పైన తలలలో ముడుచుకొనిన - తరుణులైరి

శ భర్త బాగుకై నేభక్తి - భజన జేసి భర్త డ్రుమానురాగాలు - బలిగొనినను ముక్తి కోరును, కష్టమై - మోకరిల్లి ముద్దు మాటల తోడను - మోసపోతి

  1. తాగుపోతుమగని చేరి - తలచిఏడ్చి పెళ్ళి యైన పోరునుసల్సి - పేరు పొంది పిల్లలుండక జీవించ - పిచ్చియెత్తె, పిల్లలుండగ గుండెలో - పిడుగు పడెను.

  2. ఎట్టి వ్రాతను వ్రాసెనో - ఏమిసేతు ఎవరి మాటలనువినునో - ఎరుగనైతి ఎందు, బోదునో, తెలియదా-యె వివరింప తరుణి నైతిని, గాన నే - తగవులాడ!

తక్‌

  1. తల్లిగా నెంతొ, తనయుల - తగినశైైలి పెంచి, పెద్ద జేయంగ నా - పిలుపు వినక కూటికై నాదు మేనును - గ్రుచ్చిగ్రుచ్చి పంటలకొరకు, ధాన్యపు - పంటవేసె!

  2. పంట పండించవలసియే - పలువిధాల గోతులను త్రవ్వ నామేను - గుల్లలయ్యె! నాగలి నడుపింపగ మేను - నరములుడిగె ఎట్టు లోపుదు నేనింక? - ఏమిసేతు?

9, వెదకి నీటికై బోరులు-వేయగాంచ, మేను రంధ్రాల తారటై - మెరయు చుండె రక్తమును నీరుగా పీల్చి - “రంగ రంగి యనుచు గడుపుచుండిరి ప్రజ - యదుకులేంద్ర!

  1. _ మరుగుదొడ్డను కట్టగా మలినమైతి మురికి కూపమునందున - మునిగియుంటి శ్వాస పీల్చ సాధ్యముకాక - శ్వానమైతి ఎవరితో తీరు కష్టాలు? - ఎందుబోదు!

1, గిరుల తరువుల బరువును - గెలుతుగాని తరుణులై చేయు పనులకు - తాళలేక భయము తోడ నెక్కువగాను - భారమయ్యె కోరుచుంటి భారము దించ - కువలయేశ!

12, మైలపడితిని మానవ - మాయవలన ఎంత మునిగిన నీటను - ఏమి ఫలము మనుజుల మనసు సుంతైన - మారకున్న నెవ్విధాన భారముతీర్చ - నెవరు నాకు!

3ర

ముగ్గులను పెట్టి మురిపించి - మొక్కనేర్చి ముఖము చాటు చేయుదురయ్య - ముద్దుగాను మోసపోవుచుంటినిటుల - మూగనగుచు నివృతిని తెలుపకోరుచు - నెమ్మదింతు వనరులను కూర్చగా నిల - వాదమయే్య్యే; వావి, వరుసలు దప్పిన - వసుధ యయ్యె; మాత నై మార్చజూచుచు - మార్చలేక చింతతో విన్నపంబును - చేయుచుంటి! జెర! నామేను త్రవ్వుచు - అందు నుండి మన్ననెడు మాంసమును త్రవ్వి - మాయజేసి భవన నిర్మాణములు చేసి - బాగుపడిరి గోడు మనిఏడ్వ వినరైరి - కొంచెమైన. ఆభరణములకై మేను - నవసరమని వెండి బంగారములకెంతొ - విలువనివ్వ నాశరీరము గుల్హాయె - నష్ట మయ్యె ఎవరి నాశయింతును? నెందు కేగతలతు? అది దేవుని భార్యనై - అవని యందు అన్ని యనుభవించుచునుంటి - అమరనాధ అవని నెన్నాకష్టముల కాలయమునయ్యె బ్రహ్మరాత మార్చుననెడి - భ్రమలనుంటి | రాళ్ళ రత్నాల విలువలు - రాజు లెజిగి నాదు పొట్టచీల్చగా చూచి - నగవుచుండి జాలియన్నది నాపైన - జలజనయన చూపక జరుగునది చూడ - ఛురికయయ్యె! తెగ

  1. రక్కసుల బరిమార్చగా - రాముడవయి వేదములను కాపాడిన -_ వేదవేద్య నాదు భారముమాన్పగా - నన్ను బ్రోవ శేషళశయన! కావగరావె - శివసురూప!

  2. సొమ్ములకుగాను నిన్ను నే - చూడలేదు పొట్టకై నేను కలగని - పాగడలేదు బట్టకై బర్వు నీపైని - బడగలేదు పాపభారమ్ము నాపైన - పడుట మాన్ను!

  3. కువలయంబున కొమరులు - కలుగనేల కాటి కాపరుల సమమౌ -_ కాలమందు జీవనమును గడుపనేల - జిహ్యయుండి జగము లేలెడ్షి జగద్‌శ -_ జాగువలదు!

  4. మున్ను నను నీట ముంచగా -_ మొగము ద్రిప్ప ర వరహావతారుడవైన - గరుడ గమన రక్షణము జేసితివినీవు - రంగనాథ! పక్షి వాహన। రావేల? - పాపహరణ!

23, అమృతమునకైన సాగరమథనమందు అమృతమును దేవతాళికి - పంచినట్ట్‌ మోహినియవత్రారివియైన - మోహనాంగ। యేయువతివై యెటుల నన్ను - నేలగలవు?

  1. మందరగిరినీట మునుగ - మర్మమేమొ కూర్మరూపము దాల్చిన - కొంటె వాడ! పాపులను రూపు మాప్పుమా - పరమ పురుష! ఈ పడతిమాట్ర వినవయ్య య ఈశ్వరుండ!

ననన

38

  1. యజ్ఞవిధ్వంసకులపాలి - యముడ వగుచు మునుల కాపాడి ముక్తిని - ముదము నిచ్చి యాగముల భవ్యఫలమును - పొందజేసి నట్టి నారాయణుండవే - నన్ను బ్రోవు!

  2. యంత్రముల యింధనములకై - అవని పైన నాదు పొట్టను చీల్చుచు - నరులు పెట్టు బాధలు భరింపచూచుట - భాగ్యమౌనె భర్త వై నాదు భవములు - బాపవయ్య॥!

  3. పసుల ఆకలి తీర్చగా - పచ్చగడ్డి బట్టలకుగాను నేనుగా - పత్తి నిడితి ప్రజల పోషణ కిన్నెన్నా - పంటలిడితి వివిధ వలములు నాఫైన - విరియబూసె!

  4. వజముల కోరి కొమరులు - వరుసన నను గుల్లలుగ గుల్లలుగచేయ - గుండెపగిలె గురుతు తెలియక, జీవిక - కుంటుపడెను ఇట్టి వాత ధాతయె వ్రాసె - ఏమిసేతు?

  5. పార్వతీదేవి, పశుపతి - ప్రక్కనిల్నె వాణీ పద్మజు చెంతన - వాగ్వివాద గోప్టి, గౌనమా ధుర్యము - గ్రోలు చుండె పద్మనాభుని భార్యనై - వగచుచుంటి!

  6. పశుపతి సతికి పుత్రులు - పదుగురేల? యనుచు, పుత్రుల ఇద్దరి - యందెతాను సుముఖముగనుండె గీర్వాణి - సోయగాన బ్రహ్మ మానసపుత్రుని - బడసి యుండి!

ననన ననన ననన ననన

న్‌

సయ నాదు పుత్రసంతతి అంతమగుచు నుండె దుష్టకర్మలను సహించు - దోషమునను దిన దినమునెంతగా నేను - దిగులు చెంది, కరుణ జూప వేడుచునుంటి - కమల నాభ!

  1. _ భక్తప్రహ్హాదు, రక్షింప - భాగ్యమని త లంచియే హిరణ్యకశిపు ద్రుంచి పెక్కు భక్తులనుకాచి, బ్రహ్మగ - బయటపడక అవతరించిన యవతార! - ఆదిదేవ!

  2. _పద్మలోచన! నే నీదు - పాదపూజ చేయ చేరువగాకనే - చిన్నబోతి భార్యగా బహువిధముల - భంగపడితి కోటి మొక్కులు, మొక్కుచు - క్రుంగిపోతి!

  3. పదుగురికి తెలుపకయుండి - పరితపించు చుండి, పిల్లల బాగోగు - చూడలేక నిన్నుకొలుచుభాగ్యమ్మును - నేనడిగితి కావరావేల నన్ను నో - కంధి వాస!

  4. _ కరిమొరనువిని క్రమ్మర - గాచినట్టి కరుణగల్లినట్టి మురళీ - గాన లోల! భక్తవత్సల! ననుబ్రోవు - భానుతేజ! భక్తజనులకాపాడ నీ - బాధ్యతయ్యె.

  5. చిదుమ పాలుగారు - చెక్కిళ్ళు గలనాడె తల్లిరొమ్ము వీడి - తలపలేని పూతననుబలిగొన - పుట్టినట్టి పరమ పురుషుడనిన నీవె - పుణ్యపురుష!

40

  1. _ ఎందరోరాజుల భువిపై - ఎరిగియుంటి రక్తపాతములో ముంచి - రాజ్యమేలు సానుభూతిని నాపైన - చాటలేదు మాతభూదేవి బాధను - మజచిరిలను

  2. తస్కరులవల్ల తరచుగా - తగవులాట దినదినాభివృద్దిని పొంది - దిగులుచెంది తస్కరులభయంబనుచింత - తలచకుంటి నీదు పాదము నాపైని - నిలుచువరకు

  3. అడుగడుగున నే నవమానపడుచునుంటి ఆదివిష్ణువు భార్యనై - అవనిలోన మానమర్యాదలన్నియు - మట్టిగలసె పద్దతిగ పన్న్షగశయన! - పలుకవయ్య!

  4. జీవికోటి సర్వము నొక - జీవియైన మోదు మహిమ నా గుండెలో - మెదలుచుండ విశ్వహిత! నీకయి వినీతి - వేచియుంటి పూర్వపుటవతారములను - పొగడుచుంటి!

శ్రే. చదువు కలిగియు, కొందరు - చవటలైరి విద్యలేకయు కొందరు - విజ్ఞులైరి చెప్పవయ్య శ్రీనాధ! నీ - చిన్నికథలు దారిజాపుమయ్య కథలద్వారనైన!

  1. నన్ను పరమేశ్వరియటంచు - నరు లెపుడును పాగడుచుండంగనుండియు - పొంగిపోవ పలురకాల హింసలచేత - పరువుపోవ కమలగర్భుడ వీవెగా - కాంచితీవు!

4

  1. _ దుష్టజనులు చేయుపనికి - దూరముంచ కోరు చుంటి నీ పాదాలు - కొలువగోరి దుర్లభమగునీ సన్నిధి - దొరకనిమ్ము ధరణిలోనపాపములన్ని - దాటిపోవ.

  2. _ సత్య సంధుడ వనుచు నే - సాగుచుంటి పరిపరివిధములుగనిన్ను - పరిహసించ నీదు మౌనమే నాకగు - నేరమనుచు తలచి తత్వచింతనలోన - తేలియుంటి

  3. ఆట పాటల వయసున - ఆడుచుండి నీవు కాళిందిమడుగున - నృత్యనిరతి మందరగిరిని మోసిన - మన్మధుండ నాట్య మాడుచు, గోవర్ధనగిరి నెత్తి గోవులనుగాచి, నిలిచిన - గోపబాల!

  4. సకల శాస్త్రము లిమిడిన - సద్గుణుండ! వేద వేదాంగములు నీవె - వేదవేద్య! వేరు వేరుదేవతలుగా - వెలసినట్టి సకల ధర్మములును నీవె - సత్యమీవె!

  5. _ అవని నరకాసురుని నీదు - ఆలు చంసపె పేరు తలచిదూషించగ - పిడుగులుపడ నీకె చెల్లు నన్నిట దేవ - నీలివర్ణ! వినతి గొను దీన పోషక - విశ్వమందు

  6. భారతమున భీష్మునిజంప - భారమయిన తగునుపాయంబుచే కూల్చ - తగినవాడ!

ఊహ కందని పన్నాగమున్నవాడ

భక్తవత్సల! రావేల - బరువు తీర్చ! వానిని నానన న

4 తల్లి దండ్రులు నాకున్న - తగవులాడ

వచ్చె దరనియనుకొనగ - వసతి భయము

మోదు మాతయై జగన్మాత - మింట నుండె

పసిడి పసికందుల వదలి - మసలలేను 50. అత్త మామలన్ననసతె - అవనిలేరు

ఆది దేవుడవైయుండ - అక్కటికము

లెవరికి కనిపించినగాని - ఏమి ఫలము?

అందరి యాత్మవు నీవెయై - అలరియుండ! 51. అన్నదమ్ముల గూడియు - అలుక తెలిపి!

వచ్చెదననిన ఆత్మయే - వంచననియె

అందరివలన హేళన - యయి అలసియు

విన్నపముచేయ మోతోడ - వేచియుంటి. 52. తోడ బుట్టిన వారిని - తొలగజూచి

మనుమల మనుమరాండ్రను - మట్టి గరుప

వారి మొజిలను వినలేక - వారిజాక్ష

నిన్ను వేడి మాన్పగకోరి - నిలచియుంటి! 53. _ పతితపావన! నిన్నునే - పట్టు విడక

బిడ్డలని చూడ, బూడిద - బెడద మిగిలె

గొడవ చేయుట నాకేమి -_ గొప్పకాదు

కాన కమలాక్షి ప్రియతమ! - కావుమయ్య! 54. కంటి వెలుగు వయ్య ప్రగతి - కాంతి వెలయ

చేయుమంటివి వినయాన - చివరిమాట

నీ వెరుగనేర వేర్చగా - నిండుముదము

తోడ జీవించి పడతిగ - తోడునైతి! తతత

  1. మతిచెడగ రాజకీయాన - మనకుమారు లెవరి యూహకు తోచిన - ట్లెల్ల వారు నడచు చుండగా పార్టీలు - నలుగు చుండె అందరికి ముఖ్యమంత్రిగా నాశలుండె!

  2. పద్మనాభ! పిల్లలు వారి - బలము వారు చూపు చుండిరి, కొందరు - చోరులైరి దినదినంబును మత్తున తేలు చుండ నా కడుపుకోత ఆకసం - బంటు చుండె!

  3. కూడగట్టుకొనియిలను - గొంతునులుమ స్టాంపులందున దోపిడి - స్టాండువేసె బోఫరునులోఫరనుచును - బోర్జుత్రిప్పె కుంభకోణములన్నచో - కొదువలేదు

  4. _ నీతిశాస్త్రము చదివించ - నీతిపోయె సుమతినీతులు వినిపించ - సుమతిపోయె వేమనార్యు నీతులు - వెగటులయ్యె! నీతులెటువంటివైనను - నెలవుదప్పె!

59, _ మిమ్ము పెసిడెంటుగా నేను - మేలు కొల్ప బ్రహ్మ దేవుడు వేడెను - బహు విధముల నీలకంఠుడు నాతోడు - నిల్చెగాన అప్పుడప్పుడు నాకోప - మదువుదాటె!

  1. _తల్లినైనను పులినౌచు - తాళలేక పిల్లలను నేను పొట్టన - బెట్టుకుంటి దైవ వైపరీత్యమ్మును - దాటు కొంటి అవనిభారము నను వీడ - ఆశలేదు.

న.

  1. నావలన జరిగిన పాడు - పనిని మీరు విశ్వమందున గమనించి - విధిని దాట వశము కాదని తెలిపిన - వనజ నేత్ర! నాదు భవితను, పంచుకో - నాగశయన!

  2. ఎవరి పరిధి వారికినున్న - ఇరుగుపొరుగు వారలైవారి వారి సంపాదనలను అడ్డుకో దలచుచును ఘోరాపదలను చిక్కుకొనుచుందు రెందుకో - చివర కేమి?

  3. క్రూరవర్తనులను పడ - కుమ్మివేయ దలచువాడవని విని నే - తలచు చుంటి మన కుమారులను క్షమించ - మనసు విరుగ మనము పులులము కాదాయె - మజచిపోవ

  4. _ ఎట్టి వార లైనను నెన్ని - ఎగ్గులైన తల్లి దండ్రుల మించిన - తనువులేదు పుత్రశోకంబును భరించ - పుట్టలేదు కాల మే తీర్పు చేయునో - కమలనాభ!

  5. మనది ఏకర్మమో యేమొ - మనకు నిలను పుట్ట గొడుగుల మాదిరి - పుత్రులు గల రవనిభారమ్ము పెంచగా - అండనిలువ నెట్టు, మనసుపుట్టెను మోకు? - ఎందువలన?

  6. చెల్లి ద్రౌపది కోర్కెదీర్చెడు తలపున భారత రణంబు, జరిపింపదలచినావు నాదు కోర్కెను మన్నించు - నాగశయన! వల్లభుండవనుచు చెప్ప - వలసెనిట్లు!

45

  1. _పద్మనాభుండవై యిల - ప్రజలలోన రాజకీయము చేయుచు - రాజ్యమేల మనసు ఎటులబ్బె తెలుసుకో - మన్మదుండ పలువురు నిను ద్రోహిగ చెడ పలుకు చుండ!

  2. వరుల కొను వారసత్వమే - వసుధ నిలచె మనసుతో చేయు పెళ్ళికి - మనిషిలేక వయసు పండెను వధువుల - వసుధలోన మతులు పోయియుండిరి మంచి - మమతలేక!

  3. మమతలు మజిచిరి వయసు - మరుగు పడగ మాయకును లాంగి మాతయే - మట్టి కజచె వయసు చేతిలో బొమ్మలై - వలల చిక్కె వారిజాక్ష! వాంఛయనిన - వసుధ వలదు!

  4. పిల్లల వివాహముల పెద్దలెల్ల నిలువ మనుమలు మనుమరాండ్రకు - మతులు పోయి వివిధ రీతుల విధిచేత - వియ్యమంద జీవితమున వివాహము - జెయిలుగాగ

71... పెద్దల ప్రసక్తి లేకుండ - పెళ్ళియైన వరుస ముచ్చటల్‌ తీరక - పరువుపోయె క్రొత్త వింతల నాసించి - కుమిలిరెట్లు కోరికలుచావ బ్రతుకులు - కుంటు చుండె.

  1. పాప భీతిలేక మెదలి - పరిహసించు ప్రజల భారమై కష్టమై - పద్మనయన చేరినాను నీచెంతకు - చిత్తగించు బ్రహ్మ యేమొ బొమ్మలసృష్టి - బాపడాయె!

ననన ననన న

త్‌

  1. _ పతిత పావన! పద్మనాభ! నరసింహ! వడ్డి కాసుల వాడవై - వరములిచ్చు నీల వర్డుడ! నావల్ల - నేరమేమి? అందరివలన ఘోరమ్ము - లఅగుచునుండె!

  2. _ వేడుకొంటి నెంతగనా నా - పేరు మాసె కండలు తిరిగినధురీణ - కరములయిన పోషణను చేయలేరైరి - పురుషవర్య! పక్షివాహన! నినుగాక - పరుల వేడ!

  3. _ కమలజుని తండ్రివై నట్టి - కమలనాభ! శేషశయనుండవైనట్టి - చెంచువాడ అన్ని కష్టములను మాన్న - అవతరించు ఆదిదేవుడ వన నీవె - అమరనాథ!

  4. కాంచనంబున కాసించు - కలలులేవు రాచరికమునకైన - ప్రార్ధనలు లేవు రత్తములవంటి బిడ్డలు - రాజ్యమేల నిత్తు వనుచును ఆశచే - నెమ్మదింతు

77... రత్నములవంటి మగువలు - రాళ్ళునైరి కమలగర్భుడ! కమలాత్మ! - కాంచుమయ్య గగనమున కిల దూరమా - గరుడగమన వెన్న దొంగకు భారమా - వెంకటేశ!

  1. భువన భాండములను కుక్షి - పొదువుకొనిన భూతనాథుని బావవై - బొమ్మ వగుచు వెలసి యుంటివి నీవు శ్రీ వెంకటేశ ఓ విరూపాక్ష దర్శనం ఆ బొసగుమయ్య!

కతత టట డడఊఊఊచఊఊ

47

  1. _ ధర్శనంబునిచ్చి ననునీ - దరిని చేర్చ ఎన్ని యుగములు పట్టును? - ఎందు బోదు? ఎవరి నాశ్రయింతు నిలను? - ఏమి కర్మ? కరివరదుడవైనట్టియో - కంసహరుడ!

  2. ఏడుకొండలపై నిల్చి - ఎక్కుమనిన నీదు భార్యనైననుగాని - నీర జాక్ష! ముదుసలి ముసుగు నను వీడి - పోకయుండె కాళ్ళలోన బలము తగ్గి - కదలకుంటి

  3. _ శ్రీడివై దివ్య చక్షుల - శ్రీడి కొసగి

విశ్వరూపమును విధిగ - విన్నవించి దర్శనమునిచ్చి నట్టి యో - ధర్మరూప! నన్ను గాంచిన ప్రజ లిల - నగుదురయ్య!

  1. దర్శనమను భాగ్యమునకు - దయను జూపు భూ జనమునకునందని - భోగమేల? భర ధర్మము నోచని - భార్యయేల? భార్యగా నను ఏలిన - ఫలితమేమి?

  2. _ భార్యనై రెండవచెలిగా - బ్రతుకనేల? భారమైనచో నను నీవు - పడయనేల? మొదటి భార్యకు సవతినై - యొదుగనేల? ముందు వినయంబె, నన్నింత- మోసపుచ్చె

  3. _ ఓ మహామాయ! అక్షయ యోగమాయ! ఆది మధ్యాంత రహితుడ! అమరపూజ్య! యోకలిపురుషా, మురళీసముజ్వలాస్య! జలజనయన! జగన్నాథ! - జాష్య మేల!

4్రి

  1. (బవ్యాకి వేదముల దెబ్బి - భ(దవరువ శివుని, భస్మాసురుని నుండి - చేరదీయ, అసురు డగుగజాసురు బరిమార్చి నట్టి యదుకులాన శ్రేష్టుడవగు - యాదవేం(్ర!

  2. సాంతముగ పనులను చేయ - సొంత ఇల్లు ఏబదేండ్లైనగాని నా కేదిలేదు! పంటలన్ని మనవెయైన - పాడుపొట్ట నిండ దాయె పిల్లలగతి - నేమిసేతు!

  3. అత్మహత్య లనేకమై - అవధిదాటె చట్టు బండలయ్యె నిలలో - చదువు లన్ని బూట్లు కొనుటకు పిల్లలు - బోరుమనిరి స్కూటరుకొజకై కూలియే - కుతిలపడియె

  4. _ కొడుకులు వినక మనుమలు - కోడెలైరి చెప్పుకొనినచో పరువుకై - చింతకల్లె నూరుకొన్నచో, నుభయులు - యుద్ధమనిరి ఇట్టి పుత్రుల నిడితివి - ఏమి సేతు?

  5. నెమలి పింఛము వాడవో - నింగిరాజ! క్రీడి బావవై క్రీడికి - కీర్తికల్ల చేసి నట్టి యో రుక్మిణి - చెలిమికాడ! రాజితుడవగు నిను వేడ - రాజసంబు.

  6. తల్లిమాటలు తండ్రిగా - తండ్రి తెలుప తండ్రిమాటలు తల్లిగా - తల్లి తెలుప కొడుకు లెవ్వరి సలహాలు - కూడదనిరి గుండెపై భార మాయెనో - గోపబాల

తం

  1. దెవ చింతామణివయిన - దైత్య హరుడ! పతిత పావన! నగరాజ! - పాండు రంగ! కంధివాస కమలనాభ! - కార్తవీర్య సంకట హరణా! రక్షోనృశంసహరణ!

  2. _ పన్నగశయనా! పాదాలు - పట్ట నిమ్ము పక్షి వాహనా! రావేల - పాపహరణ! గోపికాలోల! గోపాల! గోకులేశ! నీల మేఘ శరీర! రావేల దేవ?

  3. రూపముల పలు విధముల రూపు మార్చి దుష్ట సంహరణార్థము - దోహదముగ విధిగ ప్రజలకై వెలసిన - వేంకటేశ! నాదు కోర్కె తీర్చుటయెట్లు - నగధరేంద్ర?

  4. వెజచినటుల నటించుచు - విశ్వనాథ! మట్టు పెట్టించ, మెప్పు నీ - మనుగడయ్యె చారు లక్ష్మీమనోహర! - చంద్రహాస! చండ భండన రుచులను - చవినిచూపు.

  5. మంద హాసనర శ్రేష్ట - మత్స్యగంధ! వెన్న దొంగవేకాక యో - వివిధ వేద్య! వింత వింతగ నీపైన - విరహ మొంది దైవ చింతన తోడ నీ - దాసులైరి.

  6. _ పల్లవారుణ మృదుపద పద్మయుగళ! పక్షి వాహన! నన్నేలు - భానుతేజ! తులసి మోక్షము నొందగా - దురిత దూర తులసి మాలాభరణుడవు - తోయజాక్ష!

క్‌0

  1. కోరినంతనే కోర్కెల - కొరత తీర్చి యదుకులాంభోజుడవగునో - యదుకులేంద్ర! పాపుల నిల శిక్షించిన - పాంచజన్య! నిరత యోగనిద్రానంద! - నీల వర్ణ!

  2. జగము నేలుతండ్రి కిలలో - జయము, జయము ఆది మధ్యాంత రహితుడా! - జయము, జయము! తండ్రివీవెయె, తల్లివై - తనయుడవయి జగము నిండిన నీకిల - జయము జయము!

  3. మానవావళి కుపయుక్త - మైనదైన కోరికకలిగి నంతనే - గొప్ప యనుచు కావ్య రూపమొందగ జూచె - కమల జాకి జన్మధన్యత గావించె - జలజనయన.,

  4. నిన్న మొన్నటి వరకును - నింగిమెచ్చి పడతియోర్పును మెచ్చుచు - ప్రణతులొసగి చలన చిత్రములకధల - చంచలంబు సృష్టి యయ్యె దాంపత్యము - సుడులు తిరిగె

  5. భర్తయం దనురాగము - భారమయ్యె; భాగ్య దేవతలందున - భక్తి పెరిగి; ముద్దు ముచ్చట్లు మనిషికి - మోటుగాగ తల్లి యగు భాగ్యము పడతి - తలచునెట్లు?

  6. భోగ భాగ్యముల్‌ మఖజిచి - బుద్ది తోడ కామమును క్రోధమును వీడి - కలసి యుండ భర్త కోరి చెంతకు చేర - పడతి కడుపు పండు ననుచును వేదాలు - పలికియుండె.

క్‌ '

  1. న్యూటనను సూత్రవిస్కృతి - నుగ్గగుచును మతులు పోవ సంసారపు - మరలయందు పడతులు నలగి భాధ్యత - పంచలేక వల్లభునిమనసును కించపరుచు వారు.

  2. మనసుతోడ గట్టునుకట్టి - మడులలోన నీరు పెట్టిన పంటలు - నిక్కమనిరి గట్టు లేక నీ రంతయు - గంగనేగు పంట పండ కిలను రైతు - పరితపించు

  3. కుక్క తోడ ముద్దుగనున్న - కూర్మరాజ! కుక్క ప్రాణాలను మనకై - కూల్చుకొనును; మనుజులకునట్టి విశ్వాస - మనున దెచట? కలల నైన కాంచగలమా - కమలజాక్ష!

  4. పడతి ఎంతయందంబున్న - పాపభీతి తొలుత లేక భర్తల తాము - తూలనాడ పడతులకడుపు పండక - పరువుపోయె పద్మనాభుడ! నీవైన - పలుకుమయ్య!

  5. ఉమ్మడి కుటుంబ మందున - నోర్చులేని పడతు లెందరో పతులను - బాధపెట్టి మనసు విరుగగ, మమతలు - పనికిరాక కడుపు పండక బ్రతుకులు - కాల్చుకొనిరి

  6. చదువు లేకుండ పూర్వము - చరిత నిల్నె! చదువు నేర్వగ సంస్కృతి - చంకనెక్కె! నీదు పూర్వపు మాయలు - నేడు లేక వక్రముగ పోవుచుండిరి - వారిజాక్ష!

కనన ననన ననన క్‌2

  1. నాథ! మనకుమార్తెలు తమ - నాథులందు మోహమునువీడి మత్తున - మూఢ లగుచు మోము త్రిప్ప్పువిషయముపై - ముచ్చటించు కారణములేవియో తెల్పు - కాలహరణ!
  2. పన్నగశయనా! పాపుల - పాప ముడుప భక్తవత్సల! నీయందు - భారముంచ ముక్తి కిపుడైన మార్గంబు - రక్తిజూపు మెంతకాలంబు 'ముక్తికై - ఎదురుజూతు?
  3. . దేహ మున్నంత కాలంబు - దివ్వె యౌను దేవుడవగునీ దీవనల్‌ - దిగులు దీర్చ దివ్వెగా వెలిగినప్రాణి - దేహ ముండు దీనజనపోషకా! నీవె - దిక్కుగాగ. 4 న... రకత, | సని మ. తతత డజజడాడడడడ వ్‌తె

| న. న. / స మస, . న " వే . శ ఓ న టో న. నేల లల ప / మ స స! న. సి ల టట 4 న. సీ . ను. మ ల పిన టే ష్‌ ను! గ. త! నన భట ప సు టు నం ర; ఈ. క | ప ర సం టి | న . _ . న ల న నై న. లం? / | నూ