Telugu Padhukasahasra pradhyotham - anilvaranasi/indianlanguages GitHub Wiki

స్ట్‌ మ వయ మదిన్‌ కం న . సంపాదకుడు పై వ . .... డా, పల్లెల శ్రీరామచంద్రుడు. |... | ల్‌ - సహజ కవి మలెమోల్య సెకరించిన న. స జం . ఈపుస్తూనిసాళ ( వష గే అ (|... ఆనందంతో బహూకరిన్త” ఇ వ. | సంస్కృతభాపషా ప్రచార సమితి ల శ "న హైదఠాబాదు వ. నస వ

రజతోత్సవగ్రంథమాల జ అవ్టాదశకుసుమం పాదుకాసహస్ర ప్రద్యోతం సంపాదకుడు డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు దా॥ ఎస్‌.వి. రంగరామానుజాచార్యులు రీడర్‌ 3.౪౮౫. సంస్కృతకళాశాల, కొవ్వూరు శ్రా సంస్కృతభాషా ప్రచార సమితి హైదరాబాదు 2004

వాదుకాసవస్ర ప్రద్యోతం వంగ" లు ర ఈటి రంగం"

ప్రథమముద్రణ : 2004

వెల ; రూ. 25/-

(ప్రకాశకులు :

సంస్కృతభాషా ప్రచార సమితి

ర్‌-4-743సి

నాంపల్లి స్టేషన్‌ రోడ్‌, అబిడ్స్‌, | హైదరాబాద్‌ - 500 001. 1.

([ ల

అక్షరాల కూర్చు : సమంత గ్రాఫిక్స్‌ లో (గ్రంధాలయ మా

గంపెట, ల్‌

య్‌! రి) * హైదరాబాద్‌-500 016 శ [లీ 6స0ంల (11 అన 'భౌల్రి పైదరాబొ

ముద్రణ ; శ్రీకళాంజలి గ్రాఫిక్స్‌ విఠల్‌వాడి, హైదరాబాదు - 500 029,

3 శ్రీః తొలిపలుకు

వివిధవిద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహిస్తూన్న జి. పుల్లారెడ్డి చారిటీస్‌

ట్రస్టుకు అనుబంధసంస్థగా సంస్కృతభాషాప్రచారసమితి హైదరాబాదు నగరంలో, 1978లో స్థాపించబడింది. నాటి నుండి ఈ సమితి ఆంధ్రప్రదేశంలో సంస్కృత భాషాప్రచారకార్యం ' అవిచ్చిన్నంగా సాగిస్తూన్నది. సమితి చేపట్టిన ప్రధాన కార్యక్రమం క్రమబద్ధరీతిలో రూపొందించిన ఏడు సంస్కృతపరీక్షలు నిర్వహించి తద్ద్వారా పాఠశాలా-కళాశాలా విద్యార్ధులకు, ఇతర సంస్కృతప్రియులకు సంస్కృతభాషను అభ్యసించడానికి తగిన అవకాశాన్ని కల్పించడం. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశం లోని వివిధవిద్యాస్థానాల్లో ఉన్న దాదాపు 250 కేంద్రాల ద్వారా నిర్వహింప బడుచున్నది.

సమితి పరీక్షానిర్వహణకార్యక్రమానికి అనుబంధంగా గ్రంథప్రచురణ కార్యక్రమం కూడా చేపట్టి నిర్వహిస్తూన్నది. సంస్కృతభాషాసాహిత్యాలకు సంబంధించిన గ్రంథాలను తెలుగుభాషద్వారా తెలుగువారికి అందించడం దీని ప్రధానలక్ష్యం. ఈ కార్యక్రమానికి సంస్కృతభాషాశ్రద్ధాలువులనుండి ప్రోత్సాహం లభించడం సమితికి ఆనందజనకం.

ఈ సంవత్సరంలో (2003-2004) రజతోత్సవం జరుపుకొంటూన్న సమితి సుప్రసిద్ధులైన సంస్కృతవిద్వద్విదుషమణులచేత సంస్కృతసాహిత్యానికి సంబంధించిన, ఆ యా కవులను, వారి కావ్యాలను పరిచయం చేసే ఇరవైయైదు లఘు గ్రంథాలను వ్రాయించి ప్రచురిస్తూన్నది. ఈ సాహిశ్యయజ్ఞంలో ఆర్విజ్యం వహించినవా రందరికీ మా కృతజ్ఞతలు.

ఈ రజతోత్సవ[గ్రంథమాలా అష్టాదశకుసుమంగా డా. ఎస్‌.వి. రంగరామానుజాచార్యులు గారు రచించిన పాదుకాసహస్ర ప్రద్యోతంను ప్రచురిస్తు న్నాము. దీనిని సంస్కృతాభి మానులందరు ఆదరించగల రని విశ్వసిస్తున్నాము. సంస్కృతభాషాప్రచారసమితి, పుల్లెల శ్రీరామచంద్రుడు హైదరాబాద్‌. కులపతి

తీ సంస్కృతభాషా ప్రచారసమితి "హైదరాబాదు కార్యనిర్వాహకసంఘసభ్యులు క్షే శ్రీ జి. పుల్లారెడ్డిగారు, అధ్యక్షుడు 2 మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు, కులపతి త డా. కే. రాజన్నశాస్రిగారు, ఉపకులపతి త్తే శ్రీ చలమచర్ల వేంకటశేషాచార్యులుగారు, కార్యదర్శి ర్‌... శ్రీ పి. రామకృష్ణగారు, సభ్యుడు 6. శ్రీ ఆర్‌.రామానుజాచారిగారు, సభ్యుడు గా శ్రీ పి.వేంకటేశ్వర్లుగారు, సభ్యుడు & శ్రీ బియన్‌.రెడ్డిగారు, సభ్యుడు రి శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తిగారు. సభ్యుడు 10. శ్రీ ఆర్‌.వి. శేషాచార్యులుగారు, సభ్యుడు 11 శ్రీ వై. నాగభూషణరెడ్డిగారు, సభ్యుడు 12. శ్రీ పి. సుబ్బారెడ్డిగారు, సభ్యుడు

శ్రీః పాదుకాసహస్ర ప్రద్యోతం

సంస్కృత సారస్వతంలో ఇంచుమింగా అన్ని రకాల ప్రక్రియల్నీ తలస్పర్భంగా స్పృశించిన వైదుష్యం గల శ్రీమన్నిగమాంతదేశికులు శ్రీవైష్‌ణవలోకానికే కాక - సంస్కృత సారస్వతాఖినివిష్టులైన విద్వాంసులకు కూడా ఉపాదేయతములు. న్యాయ- వ్యాకరణ -వేదాన్తాది వివిధదర్శనాల్లో అగాధమైన పాండిత్యంగల శ్రీదేశికుల లేఖిని అవితశ్రాన్తంగా అనర్హగ్రంథరాశిని లోకానికి అందించింది. వీటిలో తాము ఆదరించి ఆశ్రయించిన వేదాన్త దర్శన మర్మాలను - సాంప్రదాయికమర్యాదలను - వెల్లడిచేసిన విచారధారాసంభరితగ్రంథరాజములతో పాటు, కావ్యనాటకాది వివిధ ప్రక్రియా సమాథ్రితాలైన [గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. శతాధిక గ్రంథకర్శృతచేత సంస్కృత వాబ్బయంలోనే విశేషఖ్యాపనీయమైన స్థానానాన్ని పదిలపరచుకొన్నారు శ్రీమద్దేశికులు.

శాస్త్రవార్నిధి మధన సముత్సమహార్ధమణులైన ఎన్నో గ్రంథాలను విరచించి పరమదార్భనిక ధురంధరులుగా యశస్సు గన్న శ్రీమదప్పయ్యదీక్షితేంద్రులచే స్వయంగా వ్యాఖ్యాతాలైన కావ్యనాటకాలను శ్రీమద్దేశికులు రచించీనారని ఎరిగినవారు శ్రీదేశికుల విద్యావైభవగరిమను బాగా ఎరుగుదురు. శ్రీదేశికుల యాదవాభ్యుదయ కావ్యం రఘువంశానికి, హంససందేశకావ్యం మేఘసందేశానికి, సంకల్ప సూర్యోదయ నాటకం -కృష్ణమిశుల ప్రబోధచంద్రోదయానికి . దీటుగా వ్రాసినట్లు గ్రంథావలోకనంచేత అవగతం అవుతుంది.

శ్రీమద్దేశికులు ఉదాత్తమైన స్తోత్రకావ్య రత్నాలను రచించారు. ప్రాకృతభాషలో వ్రాసిన 'అచ్యుతశతకం' శ్రీదేశికులకు గల ప్రాకృతభాషావైదుష్యాన్ని లెస్సగా ఆవిష్క రిస్తున్నది.

న్యాయ-వేదాన్త దర్శన గ్రంథనిర్మాణం

శాస్తసంప్రదాయంలో పరినిష్టితులైన శ్రీదేశికులు న్యాయవేదాన్త మిమాంసా శాస్త్రాల్లో ఎన్నో గ్రంథాలను వెలయించారు. అధికరణ సారావళి, శతదూషణి, శ్రీభాష్య టుప్‌టీక, న్యాయసిద్ధాంజనం, న్యాయపరిశుద్ధి, తత్త్వముక్తాకలాపం, మిమాంసాపాదుక మొదలైన (గ్రంథాలు దేశికులకు గల స్వసంప్రదాయాఖినివేశాన్ని సువిదితం చేస్తున్నాయి.

6 పాదుకాసహప్ర ప్రద్యోతం

శ్రీదేశికుల గ్రంథాలన్నింటికి సాంప్రదాయికవిషయసంబంధం ఆధారభూమిగా ఉంటుంది. విశేషించి వీరిస్తోత్రవాజయం సంప్రదాయరహస్య సంభరితమే. సంస్కృతంలో ఎంతటి విస్తృత వాజ్మయాన్ని వీరు సృజించారో ద్రావిడంలో కూడా అంతటి అభినివేశంతోను మహానర్హకోశరాశిని శ్రీదేశికులు సృజించినారు.

వీరి కవితా వైజీయన్ని సంస్కృతద్రావిడ సారస్వతభూముల్లో రెండింటా సమస్మ్కంధంగా తన ప్రభలను వెదజల్లింది.

రచనలో ప్రాఢత, కల్పనలో స్వతంత్రత వీరికి నిసర్గసిద్ధమైన లక్షణం.

శ్రీదేశికజన్మ వైశిష్ట్రం

“(ఘంటా హరేః సమజనిష్ట యదాత్ననేతి అని శ్రీదిశికులే స్వయంగా ఈ గ్రంథంలో నిర్దేశించడాన్ని బట్టి ఆయన ఆవిర్భవించి యున్నకాలంలోనే ఆయన శ్రీవేంకటపతి సన్నిధిలోని ఘంటయొక్క అవతారంగా లోకంలో వి(్రుతి ఏర్పడడం దాన్ని వారు ఉట్టంకించడం గుర్తింపవలసి ఉంది. శ్రీవేంకటపతి కృపాకటాక్షంచేత లభించిన శ్రీదేశికుల పూర్వనామం “వేంకటనాథుడు”.

శ్రీమద్వేంకటనాథార్యకవితార్మికేసరీ,

వేదాన్తాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది.

అనే సాంప్రదాయిక శ్లోకాన్ని బట్టి వీరా వేంకటనాథులు కాగా, వీరికిగల కావ్యనిర్మాణచాతురి, దార్భనిక తత్త్వజ్ఞత, శాసవాదప్రొఢిమలను బట్టి ఏర్పడ్డ బిరుదం “కవితార్మికేసరి కాగా, ఆచార్యతా నిరూపకమైన వ్యవహారం - 'వేదాన్తాచార్య', 'వేదాన్తదేశిక ఇత్యాది అని గమనింప వచ్చు.

వీరి జీవనవృత్తాన్ని సంగ్రహంగా పరిశీలించుదాం. ఈ విషయంలో పెద్దలు చేసిన వివేచనమే మనకు మార్గదర్శకం తప్ప ఇక్కడ స్వతంత్రంగా చేయవలసిన నిర్ణయాలు ఏమో ఉండవు. 12, 13 శతాబ్దాలు వైష్ణవ - మాధ్వ దర్శన వికాసాలకు నెలవై భారతీయ తాత్త్విక విచార స్రవంతికి అనిదంపూర్వవైన వైభవాన్ని సంతరించి పెట్టాయి.

శ్రీమచ్చంకర భగవత్సాదుల అద్వైతాన్ని విశిష్టంగా పూరించి జగన్మిథ్యాత్వవాద నిరసనపురఃస్సరంగా జగత్సత్యత్వాన్ని పరమాత్ముని కల్యాణగుణ వైశిష్ట్యాన్ని శ్రీమూర్తి

పాదుకాసహప్ర ప్రద్యోతం 7 సమారాధనాన్ని ఆగమ ప్రాముఖ్యాన్ని సముద్ధరించిన శ్రీమద్భగవద్రామానుజుల సిద్ధాన్తాన్ని అప్రధృష్యంగాచేసిన ఘనత శ్రీమద్వేదాన్త దేశికులకే దక్కిందని నిర్మత్సరులైన విద్వాంసులు అంగీకరింపక తప్పదు.

భగవద్రామానుజులు తమ తరువాత తాము స్థాపించిన సాంప్రదాయిక దార్భనిక సిద్ధాన్తాలను లోకంలో ప్రచారం చేయడానికి 74 మంది సింహాసనాధిపతులను నియమించారు. వీరిలో అవన్త సోమయాజి ఒకరు. ఈయన మనుమడు అనన్త సూరి. ఈయన తోతరాంబను పరిణయమాడాడు. వీరిమామగారు వాదిహరి సాబువాహులనే నామాంతరంగల రామానుజ అప్పుల్లార్‌. డెబ్బది నల్వురు సింహసనాధి పతుల్లో ఒకరైన కిడాంబి అబ్బాన్‌ వంశానికి చెందినదే తోతరాంబ. అనంతసూరి - తోతరాంబ దంపతుల నివాసస్థానం కాంచీపురం. వీరిరువరి సంతానమే మన 'దేశికులు” తూప్పిల్‌ గ్రామంలో వీరు జన్మించారు. 1268 ఎ.డి.గా వీరి జననవత్సరాన్ని చారిత్రకులు పేర్కొంటారు. వీరికి శైశవసంస్కారాలన్నీ పూర్తిచేసిన తరువాత వీరి మేనమామగారైన రామానుజఅప్పుల్లార్‌ వద్ద శ్రీదేశికులను అధ్యయనానికై వీరి తల్లిదండ్రులు ఉంచారు. 20 సంవత్సరాలు నిండడానికి ముందే మనదేశికులు సకలశాస్త్ర పాంఠరగతులైనారు. సంకల్ప సూర్యోదయనాటకంలో శ్రీదేశికులే ఇలా అన్నారు

  • “వింశత్యట్టే విక్రతనానావిధవిద్యఃి అని. వైదికసంపత్తిగల కుటుంబానికి చెందిన వధువును వివాహమాడి గృహస్థ జీవనంలో ప్రవేశించారు. ఆజీవనగ్భహస్థులుగానే వేంచేసి ఉన్నారు. ఎందరో సచ్చాత్రులకు విద్యను గరపారు. కడలూర్‌ జిల్లాలోని తిరువహీంద్రపురంలో కొంత కాలం ఉన్నారు. అక్కడ వేంచేసి ఉన్నప్పుడే శ్రీదేశికులు గరుడపంచాశత్‌, అచ్యుతశతకం, రఘువీరగద్యం మొదలైన స్తోత్రాలను వ్రాశారు. ఈయనకు గల 'సర్వతంత్ర స్వతంత్ర బిరుదాన్ని పురస్కరించుకొని, ఒక తాపీపని మేస్త్రి, మీరు బావిని నిర్మించగలరా? అని ప్రశ్నించగా వీరు స్వయంగా బావిని నిర్మించారట. దాని చిహ్నాలు ఇప్పటికీ తిరువహీంద్రపురంలో ఉన్నాయ్‌ని అభిజ్ఞు లంటారు.

శ్రీమద్వేంకటనాథులు తిరుక్కోవిలూర్‌ను దర్శించి, కంచికి చేరారు. ఆ తరువాత వీరు ఉత్తరదేశయాత్రకై బయల్వెడలి తిరుపతి క్షేత్రాన్ని దర్శించారు. అక్కడనే వీరు “దయాశతకం'” అని స్తోత్రరాజాన్ని అనుగ్రహించారు. ఈ శ్లోకాన్ని పరికించండి -

8 పాదుకాసహప్ర ప్రద్యోతం వృషగిరిపతేర్చృద్యా విశ్వావతారసహాయినీ

క్షపితనిఖిలావద్యా దేవి క్షమాదినిషేవితా

భువనజననీ పుంసాం భోగాపవర్గవిధాయినీ

వితమసి పదే వ్యక్తిం నిత్యాం బిభర్ని దయే స్వయమ్‌ ॥

వారాణసీ ప్రముఖక్షేత్రాలను దర్శించి తిరిగి కంచికి చేరారు. ఒక వేదాన్త వాద నిమిత్తంగా శ్రీరంగానికి విచ్చేసిన దేశికులు ఆ. ప్రదేశానికి ఆకృష్టులై శేషజీవనాన్ని శ్రీ రంగంలోనే గడుప నిశ్చయించారు.

1810 ప్రాంతంలో మాలిక్‌ కాఫర్‌ అనే మ్లేచ్చ సేనాని చేసిన దండయాటత్రకు మధురతోపాటు శ్రీరంగంకూడా గురి అయినప్పుడు జరిగిన మారణకాండలో భగవద్రామానుజులు రచించిన శ్రీభాష్యానికి అప్రధృష్యమైన వ్యాఖ్యానాన్ని 'శుత ప్రకాశిక అనేపేరున అనుగ్రహించిన శ్రీసుదర్శన భట్టులు కూడా మరణించినప్పుడు, ఇంతకుముందే శ్రీసుదర్శనసూరి తన కప్పగించిన విధంగా, వారు వ్రాసిన వ్యాఖ్యాన (గ్రంథాలను, వారి పుక్రుల నిరువురిని రక్షించే బాధ్యతను శ్రీదేశికులు నిరాఘాతంగా నిర్వహింపగల్లారు. ఇందుకొరకు శ్రీదేశికులు ఎంతో శ్రమపడవలసి వచ్చింది. అప్పుడు ఆయన 'సత్యకలమ్‌” అనే మైసూరు రాష్ట్ర ప్రాంతానికి (ఇప్పటి కర్ణాటక ప్రాంతానికి) వెళ్లవలసి వచ్చింది. అక్కడ కొంతకాలం ఉండి, శ్రీభట్టరుల బిడ్డలకు ఉపనయనాది సంస్కారాలు చేశారు. అక్కడ ఉన్నప్పుడే వారు “అభీతిస్తవ” మనే స్తోత్ర గ్రంథాన్ని రచించారు. మ్లేచ్చులదాడి కుంఠితం కావలెననే సంకల్పంతో ఈ రచనను చేశారు.

“కలి ప్రణిధిలక్షణై: కలితశాక్యలోకాయతై:

తురుష్కయవనాదిభిర్ణగతి జృంభమాణం భయమ్‌ |

ప్రకృష్ణనిజశక్తిభి: ప్రసభమాయుధైః పంచఖి: క్షితిత్రిదశరక్షకై: క్షపయ రంగనాథ క్షణాత్‌ ॥ మనుప్రభృతిమానితే మహతి రంగధామాదికే దనుప్రభవదారుతైర్దరముదీర్యమాణే పరై: ప్రకృష్ణగుణక: (శ్రియా వసుధయా చ సంధుక్షిత: ప్రయుక్తకరుణోదధే ప్రశమయ స్వశక్త్యా స్వయమ్‌ 11”

పాదుకాసహప్ర ప్రద్యోతం 9 'ఓరంగనాథా! కలికి సంబంధించిన గూడచారులా అన్నట్లున్న బౌద్ధ - లోకాయతికుల చేత తురుష్క యవనాదులచేత ఈలోకంలో విజృంభిస్తున్న భయాన్ని సర్వోత్తమ శక్తిగల నీ పంచాయుధాలతో ఒక్కక్షణంలో పోగొట్టవయ్యా! వైవస్వతమన్వాదులచే సంమానిత మైన-శ్రీరంగధామాదులు, దానవులవలె దారుణ స్వభావులైన మ్లేచ్చులచేత విచ్చిన్నం కావింప బడుతూ 'ఉండగా, ఉదారగుణ సంపన్నుడవైన ఓ స్వామో! శ్రీ-భూదేవుల (ప్రేరణచేత అపారకరుణా సముద్రడవైన నీవు నీశక్తిచేతనే ఈ ఉపప్షతి ప్రశమింపచేయి” అంటున్నారు శ్రీదేశికులు. ఇలామ్లేచ్చోపఫ్లతిని ప్రత్యక్షంగా దర్శించిన మన స్వామి, ఎక్కడెక్కడనో రక్షింపబడుతూ చివరికి శ్రీరంగంచేరిన శ్రీరంగనాథ శ్రీమూర్తులను అక్కడ పునఃప్రతిష్టించడం కూడా శ్రీదేశికుల సమక్షంలోనే జరిగింది. ఈ సన్నివేశాలను శ్రీదేశికులు శ్లోకబద్ధం చేయగా అవి ఈ నాటికీ శ్రీరంగప్రాకారకుద్యాలపై శిలా శాసనరూపంగా గోచరిస్తున్నవి. శ్రీదేశికుల మధ్యవర్తిత్వం - ద్వైతాద్వైతవివాదం ఒకప్పుడు ద్వైతాద్వైతదర్శనావలంబకుల మధ్య శాస్త్రవివాదం జరిగినప్పుడు (విద్యారణ్యాక్షోభ్యమునులమధ్య అని సంప్రదాయం) శ్రీదేశికులను మధ్యవర్తిత్వం వహించమని వాదులు కోరినప్పుడు వీరు మధ్యవర్తిత్వం వహించినారట. దీని పర్యవసానాన్ని ఇరుపక్షాలవారు వేరువేరుగా చెప్పుకోవడం కద్దు. ద్వైతులు - అసినా తత్త్వమసినా పరజీవప్రఖేదినా విద్యారణ్యమహారణ్యమక్షోభ్యమునిరచ్చినత్‌ ॥ అని అంటారు. అంటే, జీవ - పరమాత్మలకు భేదాన్ని నిరూపించే “తత్త్వమసి అనే మహావాక్య రూపమైన ఖద్గంచేత విద్యారణ్యమహారణ్యాన్ని అక్షోభ్యముని ఛేదించినాడని దాని భావన. అయితే అద్వైతులు - ఇలా అంటారు - “అక్షోభ్యం క్షోభయామాస విద్యారణ్యో మహామునిః విద్యారణ్య మహాముని, ద్వైతి అయిన అక్షోభ్యుని కూడా క్షోభపరచినాడు అని దాని భావన. వాదపర్యవసానం ఎలా ఉన్నా, శ్రీదేశికుల హృదయవైశాల్యాన్ని శాస్త్రవైదుష్యాన్ని అనాడు ఎల్లరూ సమ్మానపురస్సరంగా స్వీకరించా రనేది వాస్తవం.

10 పాదుకాసహప్ర ప్రద్యోతం ఆం(ధ్రరాజులు - శ్రీదేశికులు శ్రీవైష్ణవం ఆంధ్రదేశంలో విస్తరించడానికి శ్రీదేశికులు, వారి పుత్రులు కూడా కొంతవరకు కారణం అని చరిత్రచెబుతున్నది. విజయనగర పాలకుల సామంతులు పలువురు శ్రీదేశికులను శ్రీవైష్ణ్టదర్శన రాహస్యాలను సులభశైలిలో అందించమని ప్రార్ధించారు. వీరిలో వేంగిదేశాన్ని పాలించిన సర్వజ్ఞసింగభూపాలుడు కూడా ఒకడు. శ్రీదేశికులు కొన్ని ప్రాంతీయ భాషలో వ్రాసిన రచనలు ఆతనికి పంపారని కొందరంటారు. అయితే ఏ (ప్రాంతీయ భాషలో అవి వ్రాయబడ్డాయో తెలియదు. కాని వీరు వ్రాసి పంపిన రచనల్లో “సుభాషితనీవి” అనేది ఒకటని తెలుస్తున్నది. శ్రీదేశికులు తమ పరిణత వయస్సులో తమ తాత్త్విక ప్రవచనాలన్నీ ద్రావిడ భాషలో సంగ్రహించారు. అదే “రహస్యత్రయసారం”. తెంగలైసంప్రదాయంలో శ్రీమల్లోకాచార్యస్వామి రహస్య(గ్రంథాలను అనుగ్రపించినట్లే శ్రీదేశికులు సాంప్రదాయిక విషయాలను ఈ (గ్రంథంలో పొందుపరచారు. తిరుమంత్ర- ద్వయమంత్ర-చరమళశ్లోక వ్యాఖ్యాన పరాలైన అధికరణాలతోపాటు అనేక విషయాలను సప్రమాణంగా విచారించి ఈ గ్రంథంలో కూర్చారు శ్రీదేశికులు. శ్రీదేశికుల జీవనం పరిపూర్ణంగా సాగింది. 1869 ఎ.డి.లో తమ 102వ సంవత్సరంలో శ్రీదేశికులు తిరునాడు (పరమపదం) అలంకరించారు. భగవద్రామానుజుల లాగా నూరు సంవత్సరాలపైన జీవించగలిగిన వీరి జీవితంలోని ప్రతిక్షణం శ్రీవైష్ణు సంప్రదాయ వికాసానికి, సంస్కృత (ద్రావిడసొరస్వత వికాసానికి వినియోగించగల్లడం విశేష ఖ్యాపనీయం. శ్రీదేశికుల నిరాడంబరజీవితం శ్రీదేశికులు తమ దీర్జజీవితంలో ఎలాంటి ఐశ్వర్యాన్ని ఆర్జింపక పోయినా వారార్జించిన ఒక మహార్ధధనం ఉంది. అది పిత్రార్దితం కంటే, స్వార్దితధనం కంటే అనన్తగుణితమైంది. తమ తాతగారు సంపాదించిన ముల్లె ఒకటున్న దన్నారు. కంచిలోని వరదరాజస్వామి. కనుకనే వీరు ఇలా అంటూఉండే వారట - నాస్తి పిత్రార్జితం కించిన్న మయా కించిదార్జితమ్‌ । అస్తి మే హాస్తిశైలాగ్రే వస్తు పైతామహం ధనమ్‌ ॥ అని.

పాదుకాసహటప్ర ప్రద్యోతం 11 వీరి జీవనం ఉంఛవృత్తితోనే సాగింది. కళ్లాలలో పరిగలు ఏరుకొనివచ్చిన ధాన్యంతో జీవించడమే ఉంఛవృత్తి. కంచిలోను శ్రీరంగంలోను చాలా సాధారణ జీవనాన్ని వీరు సాగించారు.

వీరికి సహాధ్యాయులైన శ్రీవిద్యారణ్యస్వామి, వీరిని తమ ఆస్థానంలో విద్వాంసునిగా పదవి నలంకరింపవలసిందిగా కోరినప్పుడు వీరు వ్రాసిపంపిన ఐదు శ్లోకాలు వీరి వైరాగ్యసంపదను నిర్ద్వంద్వంగా ఆవిష్కరిస్తాయి.

ఈ రెండు శ్లోకాలు గమనించండి -

క్షోణీకోణశతాంశపాలనకళాదుర్వారగర్వానల

క్షుభ్యత్‌క్షుద్రనరేంద్రచాటురచనాధన్యాన్న మన్యామహే ।

దేవం సేవితుమేవ నిశ్చినుమహే యో౭_సౌ దయాలుః పురా

ధానాముష్టిముచే కుచేలమునయే దత్తే౭_ స్మ విత్తేశతామ్‌ 1 “క్క స్తువిశాల మహాష్ఫథివీమండలంలో ఏదో ఒక మారుమూలగల ఒక చిన్న ప్రదేశాన్ని పాలించడం అనే నైపుణిచేత దుర్నివారగర్వ మహాగ్ని జ్వాలా కవలితులైన క్షుద్రరాజన్య స్తుతిపాఠ విరచనంచేత ఆత్మధన్యతను మేం భావింపజాలం. ఆ దేవదేవునినే సేవింప నిశ్చయించాం. ఎందువల్లనంటే, పరమకృపాళువైన ఆ స్వామి ఒక్కపిడికెడు అటుకులిచ్చిన కుచేలునికి సాక్షాత్కుబేరత్వాన్నే అనుగ్రహించాడు కదా!

తాము “సిలొ వృత్తినే జీవనంగా తీసికొని బ్రతుకుతున్నామని ఈ క్రింది శ్లోకంలో ఉట్టంకించి తమ నిరాడంబరతను లోకానికి చాటారు. వ్యర్థులైన పాలకులను ఆశ్రయింప వద్దని సూచించారు.

సిలం కిమనలం భవేదనలమౌదరం బాధితుమ్‌

పయః ప్రసృతిపూరకం కిము న ధారకం సారసమ్‌ ।

అయత్నమలమల్లకం పథి పటచ్చరం కచ్చరం

భజన్సి విబుధా ముధా హ్యహహ కుక్షితః కుక్షితః 1

వినయప్రవృత్తి

ఎన్ని శాస్త్రాలు చదివినా, చదివిన శాస్త్రం బరువైనా కొంత మనస్సు శరీరం

వంగడం అవసరం. విద్యపెరిగిన కొద్దీ అవినయం, ధూర్తతాలక్షణాలు, దురహంకారం,

12 పాదుకాసహప్ర ప్రద్యోతం లోకంలో చాలామందిలో కనబడుతూ ఉంటుంది. కాని శ్రీదేశికులకు “ప్రహ్వభావం” నిసర్జస్వభావం అయింది. వైష్ణవమాట్రుని కుండవలసిన విశేషలక్షణాల్లో 'వినయం” చాలా ముఖ్యమైంది.

తృణాదపి సునీచేన తరోరపి సహిష్టునా |

అమానినా, మానదేన కీర్తనీయః సదా హరిః 1 అంటారు గౌడీయవైష్ణవాచార్యులైన శ్రీకృష్ణవైతన్యమహాప్రభువులు. గడ్డిపోచకంటే తాను తక్కువతనం కలవాని ననే భావన వైష్ణవులలోనే కాదు విద్యావివేకాలు అబ్బిన ఏ విద్వాంసునకైనా అనివార్యలక్షణమే. అంతే కాదు వృక్షంకంటే ఓర్చు అవసరం. తాను ఏ గౌరవాన్నీ ఆశించక అది ఇవ్వదగిన పరుల కివ్వగల విజ్ఞత కావాలంటారు. ఈ లక్షణం దేశికుల్లో విస్పష్టంగా గోచరిస్తుంది.

ఒకప్పుడు వీరి వినయసంపదను పరీక్షింపకోరిన ఒక వైష్ణవస్వామి తమ గృహానికి, మనస్వామిని ఆహ్వానించి, వారు వచ్చే త్రోవలో గుమ్మానికి చెప్పులు వ్రేలాడకట్టాడట. శ్రీదేశికులు అ చెప్పులను చేతులతో వినయంగా పట్టుకొని శిరస్సుపై ధరించి ఇలా అన్నారట -

కర్మావలంబకాః కేచిత్‌, కేచిద్‌ జ్ఞానావలంబకాః |

వయం తు హరిదాసొనాం పాదరక్షావలంబకాః ॥ కొందరు కర్మమారాన్ని ఆశ్రయిస్తారు. మరికొందరు జ్ఞానమార్థాన్ని ఆశ్రయిస్తారు తరించడానికి. మేమైతే విష్ణుపదా(ితులైన భాగవతోత్తముల పాదరక్షలనే ఆశ్రయించు తాం అన్నారుట. దీన్నే ఆకించన్యం” అంటారు వైష్ణవపరిభాషలో. ఆకించన్యం అంటే “ఏమీ లేమితనం”. ధనంలేకపోవడమే కాదు, విద్యాభిజనాదులు కూడా ఎంతమాత్రం లేనివారనే భావన హృదయదఘ్నమై ఉండాలంటారు.

ప్రస్తుత వివేచనీయ గ్రంథమైన పాదుకాసహస్రనిర్మాణ విషయంలోనూ ఇలాంటి ప్రహ్వభావాన్నే శ్రీదేశికులు ప్రదర్శించినారని అంటారు. ఒకప్పుడు శ్రీవైష్ణవానికే చెందిన మరొక సాంప్రదాయికాచార్యునితో వీరికి పోటీ వచ్చినప్పుడు ఒక్క రాత్రిలో వేయి శ్లోకాలు వ్రాయగల్లిన వారికే 'సర్వవిద్వన్మాన్యతి అని పెద్దలు నిర్ణయించగా ఒక్క రాత్రిలో కేవలం కొన్ని గంటలలోనే శ్రీరంగనాథపాదుకా వైభవనిరూపకంగా

పాదుకాసహప్ర ప్రద్యోతం 13 “పాదుకాసహస్రాన్ని” ఆశువుగా ఆవిష్కరించి ప్రతిస్పర్ధి సిగ్గుపదెలా చేసికూడా, వారు నొచ్చుకోరాద్రనే భావనతో ఇలా అన్నారట -

సూతే సూకరయువతీ సుతశతమత్యన్తదుర్భగం రుటితి |

కరిణీ చిరాయ సూతే సకలమహీపా లలాలితం కలభమ్‌ 11 ఒక ఆడపంది నూర్గురు సంతానాన్ని సకలగర్హణీయంగా వెంటనే కంటుంది. కాని, గజవశ (ఆడఏనుగు) బహుకాలానికి ఒక కలభాన్ని కంటుంది. అది ఎలాంటిది? సకల రాజన్య హస్తలాలితం కాగల యోగ్యత కలది. అంటే మేము వేగంగా వేయి శ్లోకాలు రచించినా, ఇది అంత ప్రశంసనీయం కాదు. కాని తాము రచించిన కొలది శ్లోకాలే సకలవిద్వందనీయాలు అని ప్రశంసించినారట ప్రతిస్పర్ధిని. ఇదీ, వీరి వినయ సంపద.

వేదాన్తాధ్యాపనం - గ్రంథరచనం

ఇంచుమించుగా వీరి జీవితమంతా భగవద్రామానుజదర్శన సాంప్రదాయిక సిద్ధాన్త గ్రంథరచనానికి, అధ్యాపన-ప్రచారాలకు గడచిపోయింది.

“త్రింశద్వారం శ్రావితశారీరకభాష్యః అని స్వాఖిరుచితమైన భగవద్రామానుజ ప్రణీత శారీరక మొమాంసాభాష్య్యాన్ని (శ్రీభాష్యాన్ని ముప్పదిసార్లు అధ్యాపనం చేశారని చెప్పబడటంవల్ల వారికిగల అభినివేశం ఎలాంటిదో విస్పష్ట మవుతున్నది. భగవ ద్రామానుజప్రణీతాలైన గ్రంథాలను అధ్యయనాధ్యాపనాలతో బహువారం ఆవృత్తి చేయడంలోనే వీరి యావనవయోజీవితం గడచిపోయిందని స్వయంగా ఇలా చెప్పుకున్నారు.

నిర్విష్టం యతిసార్వభౌమవచసామావృత్తిిర్యావనం

నిర్ణూతేతరపారతంత్ర్యనిరయా నీతాః సుఖం వాసరాః |

అంగీకృత్య సతాం ప్రసత్తి మసతాం గర్వో౭_పి నిర్వాపితః

శేషాయుష్యపి శేషిదంపతిదయాదీక్షాముదీక్షామహే ॥ యౌవనమంతా యతిసార్వభౌముని భాష్యాదిగ్రంథావృత్తులచేతనే సాగిపోయింది. స్వామికి మాత్రమే పరతంత్రులమై, ఇతరులకు పరతంత్రు లవమనే మహాపాపాన్ని దూరీకరించడంద్వారా మిగిలిన జీవితమంతా సుఖంగా సాగింది. సజ్జనులపట్ల

14 పాదుకాసహపప్ర ప్రద్యోతం, 'ప్రహ్వభావాన్ని స్వీకరిస్తూ, దుర్చుద్ధులైన ప్రతిపక్షుల దర్చం పారద్రోలబడింది. ఇక మిగిలిన జీవితంలో సకలజగచ్చేషి (స్వామి) అయిన భగవానుని దయాదీక్షనే మేం నిరీక్షిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాం అని అన్నారు శ్రీదేశికులు. "

పాదుకాసహస్రం చాలా త్వరగా వ్రాసినప్పటికీ ఎంతోగంభీరమైన సాంప్రదాయి కార్థభరితమైన అందమైన కావ్యంగా పేర్కొనదగి ఉన్నదని ముందు ముందు విశకలితంగా ప్రతిపాదించడం జరుగుతుంది.

ఇతరశాస్త్రగంథనిర్మాణం

శ్రీమద్దేశికులు నిర్మించిన దర్శనప్రౌఢ గ్రంథాలు చాలా ఉన్నా ఈ క్రింది గ్రంథాలు అవశ్యఖ్యాపనీయాలు

  1. అధికరణసారావళి - బ్రహ్మసూత్రాధికరణక్రమంలో ఆయా అధికరణాలలో భగవద్రామామానుజుల శ్రీభాష్యంలో ఉట్టంకింపబడిన వేదాన్త రహస్యాలనే ప్రగ్ధరా వృత్తాలలో చాలా మనోహరంగా శ్రీదేశికులు ఆవిష్కరించారు. ప్రగ్ధరాదుర్ధరాశః” అనితమకు ్రగ్ధరావృత్తంపట్ల గలప్రీత్యతిశయాన్ని లెస్సగా ఆవిష్కరించారు శ్రీదేశికులు. వేదాన్తశాస్త్రంలో నిస్తుషమైన వైదుష్యంకల వారవడం చేతనే వీరికి “వేదాన్తాచార్య" బిరుదం సాక్షాత్‌ శ్రీరంగనాథుడే అనుగ్రహించాడని, స్వయంగా అధికరణసారావళిలో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు -

స్వస్తి శ్రీరంగభర్తుః కిమపి దదదహం శాసనం తత్ర్రసత్తై

సత్యైకాలంబభాప్యం యతిపతికథితం శశ్యదధ్యాప్య యుక్తాన్‌ |

విశ్వస్మిన్నామరూపాణ్యనువిహితవతా తేన దేవేన దత్తాం

వేదాన్తాచార్యసంజ్ఞామవహితబహువిత్‌ సార్ధమన్వర్థయామి ॥| ఈ [ప్రపంచములో ఆయావస్తుజాతానికి, నామరూప కల్పనం చేసిన, దేవదేవుడైన ఆశ్రీరంగనాథుని శాసనాన్నే శిరసావహించి, ఆయన ప్రీతికొరకు యథార్థమైన యతిసార్వభౌమ ప్రణీతశ్రీ భాష్యాన్ని యోగ్యులైన వారికి పలుమారులు అధ్యాపనంచేసి, ఆస్వామియే (శ్రీరంగనాథుడే) స్వయంగా అనుగ్రహించిన 'వేదాన్తాచార్య' సంజ్ఞను అన్వర్థం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు దేశికులు.

భగవద్రామానుజ సమ్మతమైన (బ్రహ్మసూత్ర తాత్పర్యాన్ని ప్రత్యధ్యాయ-

పాదుకాసహప్ర ప్రద్యోతం 15 తద్గతాధికరణ -తద్గతసూత్రవిషయసం[గ్రహణరూపంగా ఈ అధికరణసారావలిని శ్రీదేశికులు తామురచించినా ఇది, తమ గురువులైన వాదిహంసొంబువాములు, వారి యంతర్యామి అయిన హయవదనుడే ఆవిష్కరించారని ఇలా పేర్కొన్నారు చివరి శ్లోకంలో.

పారాశర్యః ప్రభూతాదుపనిషదమృతోదన్వతః సారభూతం

నిర్మథ్యాదత్త సూథతైరవితథనిగమాచార్యనామా మునీంద్రః |

యత్తన్నిష్కృష్టమిత్ణం యతిపతిహృదయారూధమారూధతార్‌క్ష్యః

తద్వక్తా వాజివక్షః సహ మమ గురుభిర్వాదిహంసాంబువాహైః॥। అని. 562 శ్లోకాలో శాస్త్రప్రమేయాన్ని మనోజ్ఞంగా సంగ్రహించారు శ్రీదేశికులు.

శ్రీగీతాభాష్యచంద్రిక

భగవవద్రామానుజుల భగవద్దీతాభాష్యానికి విశదమైన వ్యాఖ్యానమే భాష్యార్ధ చంద్రిక. దీనిలో శ్రీదేశికులు గీతాభాష్యంలోని అనేక విశేషాలను విస్తారంగా వివరించారు.

యతిపరివృధో యద్గీతానామదర్శ్భయదంజసా

నిగమపరిషన్నేదీయాంసం నిరామయమాశయమ్‌ |

జననపదవీయాత్తాయాతశ్రమాపహరాం ధియం

జనయతు స మే దేవశ్షీమాన్‌ ధనంజయసారథిః 1 అంటూ భగవద్రామానుజ సిద్దాన్తం శ్రీమద్గీతావచనాలకు పరమవైదికము నిస్తుషము అయిన ఆశయాన్ని ఆవిష్కరిస్తూన్నదన్నారు. సారాన్ని ఆస్వాదించే భావం కల సజ్జనులు చిత్తతమోపహారకమైన తమ గీతాభాష్య తాత్పర్యచంద్రికను సేవించందని (ప్రేరించారు. “అపర్యాప్తం యదస్మాకం” ఇత్యాది శ్లోకాల్లో సమన్వయపరంగా ఉన్న క్షిష్టతను చాలా విధంగా విచారించి నిర్దుష్టమైన సమస్వయాన్ని దర్శింపజేశారు దేశికులు. వీరి వ్యాఖ్యాన శైలికి నిదర్శనాలైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి.

గీతార్ధసంగ్రహవివరణం :- భగవద్యామునులు అనుగ్రహించిన షట్మతయ సారభూతాలైన గీతార్ధ సంగ్రహ శ్లోకాలకు శ్రీదేశికులు విశదమైన వివరణాన్ని అనుగ్రహించారు. భగవద్గీతలోని సారాన్ని ఎరుగ గోరిన వారు ఈ గీతార్థ శ్లోకాలను

16 పాదుకాసహపప్ర ప్రద్యోతం అనుసంధానం చేసి శ్రీదేశికుల వివరణాన్ని అధ్యయనం చేస్తే చాలు గీతాతాత్పర్యం అవగతమౌతుంది.

శ్రీభాష్యటీక - భగవద్రామానుజులు బ్రహ్మసూత్రాలపై రచించిన విస్తృతమైన భాష్యాన్ని శీభాష్యం? అని అంటారు. దీనికి సుదర్శన సూరి అనుగ్రహించిన “శుతప్రకాళశిక' అనే విస్తృతవ్యాఖ్య ఉన్నప్పటికీ పలువురు ఆచార్యులు .సాక్షాత్తుగా భాష్యానికి, భాష్యవివరణలకు వ్యాఖ్యానాలు వెలియించారు. శ్రీదేశికులు “తత్త్వటీక' అనే పేరుతో లఘుటీకను వెలయించారు. మూలవిశేషాలను ప్రతిపక్ష నిరసన పురస్సరంగా వివరిస్తూ, ఒక్కొక్క ప్రఘట్టక తాత్పర్యాన్ని సంగ్రహ శ్లోకాలలో ఆవిష్కరించడం అనే ప్రక్రియను శ్రీదేశికులు ఆశ్రయించారు. శాస్త్రం భ్రాంతిమూలమే అయినా తత్త్వజ్ఞానాన్ని ఇస్తుందన్న ్రతిపక్షుల భావాన్ని ఖండించిన భాష్యకారుల ఆశయాన్ని ఇలా ఆవిష్కరించారు.

భాంతిమూలేన వాక్యేన ధీసత్యత్వం యదీష్యతే |

తన్మిథ్యాత్వాదికం తద్వదిష్యతామితి చాశయః।। అని ఇలానే రామానుజుల ఆశయాలను విశదపరచే ఈ టీక అపరిపూర్ణంగానే లభించడం శోకావహం.

  1. న్యాయసిద్ధాంజనం : ఇది భగవద్రామానుజుల సిద్ధాన్త సిద్దాలైన ప్రమేయాలను సలక్షణంగా విచారించి నిరూపించిన గ్రంథం. 1. జడద్రవ్యపరిచ్చేదం 2 జీవ పరిచ్చేదం 8. ఈశ్వరపరిచ్చేదం 4. నిత్యవిభూతి పరిచ్ళేదం 5. బుద్ధి పరిచ్చేదం
  2. అద్రవ్యపరిచ్చేదం - అనే ఆరు పరిచ్చేదాలలో అనేక సిద్దాన్త విషయాలను నిరూపించారు.

ప్రమేయ సంగ్రహః

“చేతనులు - అచేతనులు అనే విశేషణాలతో కూడిన 'పరబ్రహ్మ' ఒక్కటే తత్త్వం. సామాన్యరూపంగా తత్త్వం దద్రవ్యం-అద్రవ్యం అని రెండు రకాలు. ద్రవ్యం మళ్లీ ఆరు రకాలు - త్రిగుణం (ప్రకృతి), కాలం, జీవుడు, ఈశ్వరుడు, నిత్యవిభూతి ధర్మభూతజ్ఞానము అని. మొదటి ప్రకరణంలో (పరిచ్చేదంలో) ప్రకృతి కాలాల గురించి చాలా విస్తారంగా నిరూపణం జరిగింది. సందర్భోచితంగా ఇక్కడ బౌద్ద్ధాది విమత

పాదుకాసహప్ర ప్రద్యోతం 17 వాదాలు విచారింపబడ్డాయి. (త్రిగుణాల్మిక ప్రకృతియే, మాయ, అవిద్య అనే పేర్లచే గూడా చెప్పబడుచున్నది. ఇక ప్రకృతి అవస్థాభేదంచేత 24 తత్త్వాలుగా పరిమిత మౌతున్నది. మహదహంకార ఇంద్రియాదులను నిరూపించే సందర్భంలో [గగ్రంథకారుడు “ సాంఖ్య-వైవాగమాది పర్యాలోచనం విస్తృతంగా చేసినాడు. షట్‌త్రింశత్తత్త వాదఖండ నాదులు - పంచీకరణప్రక్రియ, బ్రహ్మాండనిరూపణ, నైయాయికారోపితదోష నిరసన పపుర్సరంగా నైయాయిక సమ్మతాణు వాదఖండనం ఇత్యాదులు ఇక్కడ ఉన్నాయి. జీవపరిచ్చేదంలో దేహేంద్రియమనః ప్రాణజ్ఞానాతిరిక్తమైన ఆత్మతత్త్వం నిరూపించి జ్ఞానాత్మవాదనిరాకరణ పురస్సరంగా శ్రీమద్యామునమునిలోచనోద్ధరణ ముఖంగా ఆత్మనిత్యత్వం, స్థిరత్వం, జ్ఞాతృత్వం, కర్తృత్వం, స్వయం్రకాశత్వం, నానాత్వం అణుత్వం మొదలైన లక్షణాలను నిరూపిస్తూ, సందర్భసముచితంగా, యామునముని _ బాదరాయణ - విష్ణుచిత్త, వరదవిష్ణు, ప్రభృతుల గగ్రంథాల్లోని విశేషాలను ఉట్టకించాడు గ్రంథకర్త. ఈశ్వర పరిచ్చేదం విశిష్టాద్వైత సిద్దాన్తసిద్ధమైన పరమాత్మతత్త్వాన్ని లెస్సగా ఆవిష్కరిస్తున్నది. నిత్యవిభూతిపరిచ్చేదం పరమపద-ముక్తజీవాదుల స్వరూప స్వభావాదులను, బుద్ధి పరిచ్చేదం జ్ఞానస్వరూపాదులను నిరూపిస్తున్నది. ఆరవదైన అద్రవ్య పరిచ్చేదం పదిరకాల అద్రవ్యతత్త్వాలను నిరూపిస్తున్నది. సత్తాదిగుణత్రయం, శబ్దస్పర్భాదివిషయ పంచకం, సంయోగ-శక్తులు ఈ పది తత్త్వాలు, నైయాయికాదు లంగీకరించిన గుణాలను స్వాభిమతగుణాల్లో అంతర్భవింప చేయడం ఇలా చాలా విషయాలను [గ్రంథకర్త నిరూపించాడు. విశిష్టాద్వైత దర్శనాభివినిష్టులు, ధర్మనాలోకనాఖినివిష్టులై ఈదర్శన రహస్యాలను సంగ్రహంగా ప్రామాణికంగా ఎరుగగోరిన వారీ గ్రంథాన్ని తప్పక అధ్యయనం చేయవలసి ఉంది. 8. న్యాయపరిశుద్ధి - న్యాయశాస్రీయమైన హేత్వాభాసాది లక్షణాలను (వ్యాప్తి లక్షణముతో సహా) తమదైన శైలిలో పరిష్కరించి శాస్త్రీయ తత్త్వ విచారణం చేసిన

18 పాదుకాసహప్ర ప్రద్యోతం గ్రంథమిది. ఇది గౌతమసూత్ర బహిష్కార పక్షనిరసన పురస్సరంగా స్వీకారపక్షాన్ని ఉపస్థాపనంచేసి “యద్వా అని ఆరంభించి

-_ న్లాత్రీవ చ బహిష్మారః నాతీవ చ పరిగ్రహః 1

సాంఖ్యాదివదిహాపి స్యాత్‌ సమాధిస్తాషతండులః 1 అంటూ,

ఉపజీవ్యబహుత్వేన విద్యాస్థాననివేశనీమ్‌ ।

విరుద్ధాంతైకవిషయా సూత్రాదిషు బహిష్‌క్రియా 1 అని

ఉపజీవ్యవిషయాలు అధికంగా ఉండటంచేత స్వీకారము, విరుద్ద విషయాలలో నిరాకరణము తమ నిరూపణ'్రక్రియ అని శ్రీదేశికు లుట్టంకించారు.

  1. సేశ్వరమిమాంస, మామాంసాపాదుకః ఇది గద్యరూపంగా వ్రాయబడిన మోిమాంసాశాస్త్ర ప్రమయనిరూపణ పరమైన గ్రంథం. భగవానునికి విగ్రహం ఉన్నదని, ఫలప్రదత్త్వం ఉన్నదని నిరూపించే గ్రంథం ఇది. ఈశ్వర సత్తను నిరూపించే స్వభావం కలగడంవల్ల ఇది జైమినీయ మొమాంసొశాస్త్రం కంటే విలక్షణమైందని గ్రహింవలసి ఉంది. ఇక మోమాంసాపాదుక అనే గ్రంథానికీ ప్రమేయం ఇదే అయినా ఇది పద్యరూపంగా వ్రాయబడిన గ్రంథం. ఏకశాస్త్రవాదం అంటే జైమినీయ మిమాంసా బాదరాయణ మిమాంసలు రెండూ కలిసి, 20 అధ్యాయాల ఏకగ్రంథమే నన్నవాదం-

“మీమాం సేత్యేకమేతత్‌ శ్రుతివిషయనయస్తోమసం గ్రాహి శాస్త్రం” ఇత్యాదిగా దేశికులు నిరూపించారు.

మిమాంసాపాదుకాగ్రంథం ప్రథమాధ్యాయ ప్రథమపాదాన్తమే లభిస్తున్నది. పూర్వోత్తరమిమాంసలు ఒక్కటే శాస్త్రమన్న స్వసిద్ధిన్తానికి ప్రతిబంధకాలుగా ఉన్న ఆక్షేపాలు ముఖ్యంగా (1) కర్షృభేదం (2) పరస్పర విరుద్దార్థ ప్రతిపాదకాలవటం (8) జైమిని దేవతా నిరాకరణవాది కావడం ఇలా ఉన్న ఐక్యశాస్త్ర ప్రతిబంధకాలను యుక్తి పురస్సరంగా నిరాకరించి ఐక్యశాస్తాన్ని నిరూపించడం ఈ (గ్రంథప్రధాన లక్ష్యం. ,

తత్త్వముక్తాకలాపం - ఇది కూడా న్యాయసిద్ధాంజనలాగానే విశిష్టాద్వైతసమ్మత పదార్ధ తత్త్వనిరూపణ ప్రధానమైన గ్రంథం. జడద్రవ్యసరం, జీవసరం, నాయకసరం, బుద్ధిసరం - అద్రవ్యసరం అని ఐదు విభాగాల్లో రచింపబడింది. మొదటిదానిలో

పాదుకాసహపప్ర ప్రద్యోతం 19 ప్రకృతి కాలస్వరూప నిరూపణ క్షణ భంగవాదాది నిరసన పురస్సరంగా చేయబడింది. అనేక విశేషాలను శ్లోకముఖంగా ఉపస్టాపనం చేశారు శ్రీదేశికులు. ఈ శ్లోకాన్ని చూడండి -

“ప్రజ్ఞాసూచ్యా౭_ నువిద్ధః క్షతిమనధిగతః కర్మశాత్‌ తర్క్మశాణా

చ్భుడ్డో నానాపరీక్షాస్వశిథిలవిహితే మానసూత్రే నిబద్దః |

ఆతన్వానః ప్రకాశం బహుముఖమఖిలత్రాస వైధుర్యధుర్యో

ధార్యో హేతుర్ణయాదేః స్వహృది సహృదయైః తత్త్వముక్తాకలాపః॥।”

శతదూషణి - ఇది అనేక వాదాలను సప్రమాణంగా నిరూపించిన గ్రంథం. ఇది భగవద్రామానుజదర్శ్మన సిద్ద్ధాన్తాలకు విరుద్ధాలైన ప్రతిషక్షవాదాలను ఖండించడానికే ఉద్దేశింపబడింది. ఇది శ్రీభాష్యశుతప్రకాశాది గ్రంథాల్లోని విషయాలను ఆధారంగా చేసికొని వాటిపై ప్రతిపక్షివాదులను వాటిని ఆధారంగా చేసికొనే ప్రతిసమాధా నించడం. ఇది రామానుజదర్శన సిద్ధాన్హాన్ని అవికవలంగా అందివ్వగల [గ్రంథంగా భావింపవచ్చు. మొదటి నుంచి 8వ వాదం వరకు (బ్రహ్మశబ్దవృత్యనుపపత్తివాదం నుండి సాధన చతుష్టయపూర్వవృత్తత్వ భంగవాదంవరకు) శ్రీభాష్యజిజ్ఞాసాధికరణలోని లఘు సిద్దాన్త స్థాపితాలైన విషయాలను వివరించడం జరిగింది. ఆపైన 66వ వాదం వరకు శ్రీభాప్య మహాసిద్ధాన్త విషయాలను శ్రీ దేశికులు విశద పరచారు ఈ (గ్రంథంలో.

శ్రీదేశికుల సారస్వతవరివస్య

శ్రీదేశికులు కావ్యప్రకాశకారుడు పేర్కొన్నట్లు 'కావ్యజ్ఞునిగా కీర్తింపదగిన వారు. “క్రావ్యం కర్తుం విచారయితుం చ యే జానత్తి తే కావ్యజ్ఞాశో అన్న నిర్వచనాన్నిబట్టి స్వయంగా కావ్యనిర్మాణదక్షులై, కావ్యవివేచనా పాటవం కలవారినే కావ్యజ్ఞులంటారు. సంస్కృతా లంకారశాస్త్రంలో ఆనందవర్ధనుని తరవాత అలాంటి 'కావ్యజ్ఞతను స్వగ్రంథ రచనం ద్వారా నిరూపించుకున్నవాడు జగన్నాథపండితుదే. ఇక వైష్ణవాచార్యులలో ఆ స్థాయిని మించిన వైదుష్యం, కావ్యజ్ఞతా లక్షణం పుష్కలంగా కలవారు శ్రీదేశికులే నని చెప్పవలసి ఉంది. వీరు కావ్యప్రకాశానికి ఒకలఘుటీక వ్రాసినట్లు, ఆ టీక అసమగ్రంగా ఉన్నట్లు అడయార్‌ లైబ్రరీ మాన్యుస్కిప్ట్‌ - కాటలాగ్‌ చూచినప్పుడు లభించిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వీరు రసవాదాల గురించి పర్యాలోచన

20 పాదుకాసహప్ర ప్రద్యోతం చేసినట్లు, సంచారిభావాలలో కొన్నింటిని మాత్రమే అంగీకరించి మిగిలిన వాటిని తామంగీకరించిన చిత్తవృత్తుల్లో చేర్చుతు చేసిన 'న్యాయసిద్ధాంజని గతమైన విచారణ వలన అవగతమవుతున్నది.

వీరి కవితాభర రచనల్లో స్తోత్రకావ్యాలను విడచి ప్రధానంగా చెప్పదగినవి.

  1. యాదవాభ్యుదయం 2. హంససందేశం 3. సంకల్పసూర్యోదయనాటకం. వీటిలో “యాదవాభ్యుదయంి రఘువంశశైలిలో వ్రాయబడిన యదువంశతిలకుడైన కృష్ణుని చరితాన్ని వర్ణించే మహాకావ్యం. దానిలో మహాకావ్యలక్షణాలన్నీ సమగ్రంగా అన్వయిస్తాయి. హంససందేశం మేఘసందేశానికి దీటుగా మందాక్రాన్తా వృత్తాలతో వ్రాయబడిన కావ్యం. ఇక, సంకల్పసూర్యోదయం అనే నాటకం, కృష్ణమిశ్రుని (ప్రబోధ చంద్రోదయ నాటకానికి ప్రతిద్వంద్విగా వ్రాయబడ్డ వేదాన్త ప్రక్రియా ప్రధానమైన నాటకం. పరపక్షనిరసన పురస్సరంగా స్వపక్ష న్ధాపనానికై ఆయా స్వభావాలకు, వేదాన్త సిద్ధాంతత్త్వాలకు వ్యక్తిత్వ కల్పనం చేసి వ్రాసిన నాటకం. ఈ కోవకు చెందిన నాటకాలు సంస్కృత సారస్వతలోకంలో అత్యంతాల్పసంఖ్యాకాలుగా ఉన్నాయి.

దేశికుల స్తోత్రసాహిత్యం

శ్రీదేశికులు రచించిన స్తోత్ర సారస్వతం చాలా విపులమైంది. శ్రీమత్ర్రతివాది భయంకర అణ్జంగరాచార్య స్వామివారు ప్రకాశింపజేసిన స్తోత్రావళీ విభాగంలో పాదుకాసహస్రంతో పాటు 32 స్తోత్ర కృతులు ముద్రింపబడ్డాయి 1. హయగ్రీవ స్తోత్రమ్‌ - దానికి తెలుగు లఘు వివరణ ప్రస్తుత వ్యాసకర్త వ్రాసినది “ముముక్షువు” పత్రికలో అనుస్యూతంగా ముద్రింపబడింది. 2. దశావతారస్తోత్రం. 3. భగవద్దాన

సోపానం - ఇదిక్రమంగా మూర్తి వర్ణన పరమైన లఘు స్తోత్రం; 12 శ్లోకాలలో నిబద్ధమై ఉంది.

రంగాస్ట్థానే రసికమహితే రంజితాశేషదచిత్తే

విద్వత్సేవావిమలమనసా వేంకటేశేన క్లుప్తమ్‌ 1

అక్షేశేన ప్రణిహితధియామారురుక్షోరవస్థాం

భక్తిం గాఢాం దిశతు భవద్య్వానసోపానమేతత్‌ ॥ అని ఈ స్తోత్ర విశేషాన్ని శ్రీదేశికుల విస్పష్టపరచారు. 20 శ్లోకాలు గల 'గోపాలవింశతి”

పాదుకాసహప్ర ప్రద్యోతం 21 శ్రీకృష్ణవైభవప్రకాశకం. లలితరచనాశైలి కలది. శ్రీవైభవప్రకాశమైన లక్ష్మీస్తుతి 'సకల కుశల సీమాసార్వభౌమత'ను అనుగ్రహించే కృతి. న్యాసదశకం భరన్యాసదర్శకం. “అఖీతిస్తవం” 29 శ్లోకాలుకల స్తుతి, శ్రీరంగేశ అఖీతి ప్రార్థ్ధనారూపం. ఇక 'దయాశతకం' శ్రీవేంకటపతి దయానిరూపకం. 'వరదరాజపంచశాత్‌' 50 శ్లోకాలుకల కంచిలోగల వరదరాజస్వామిని స్తుతించే లఘుకృతి. వేగాసేతు స్తోత్రాన్నే యథోక్తాకారి స్తోత్రమంటారు. కేవలం పది శ్లోకాలు కలస్తుతి. దీపప్రకాశస్తోత్రమే “శరణాగతదీపిక” అని వ్యవహరింపబడే న్యాసవిద్యాతత్త్వ నిదర్శకమైన 60 శ్లోకాలుగల స్తుతి. దేవనాయక పంచాశత్‌ అనే స్తుతి ఏఖైశ్లోకాలు గల దేవనాథునిస్తుతి. శ్రీదేశికుల ప్రాకృత భాషా వైదుష్యాన్ని దర్శింపజేసేస్తుతి. కృష్ణగుణ వైభవనిదర్శకమైన అచ్యుతశతకం, దేహలీశస్తుతి, న్యాసతిలకం, రఘువీరగద్యం, భూస్తుతి, గోదాస్తుతి, షోడశాయధస్తోత్రం, సుదర్శనాష్టకం, గరుదడందకం, గరుడ పంచాశత్‌, యతిరాజ సప్తతి, న్యాసవింశతి, వైరాగ్యపంచకం, ద్రమిదోపనిషత్‌ తాత్పర్య రత్నావళి, ద్రమిడోపనిషత్‌సారం అనేవి ఇతర లఘుకృతులు. శ్రీదేశికుల పాదుకాసహ(స్రమ్‌ దీని ఆవిర్భావం వెనుక ఉన్న కథలలోని తత్త్వం ఎలాంటిదైనా ఇలాంటి అద్భుత స్తోత్రరాజావిర్భావానికి త్రోవదీసిన పరిస్థితులు మనకు మహోపకారమే చేశాయని చెప్పక తప్పదు. మహాకవికాళిదాసు ఇలా అంటాడు. జ్వలతి చలితేంధనోగ్నిః విప్రకృతః పన్నగః ఫణాం కురుతే ప్రాయేణ స్వం మహిమానం క్రోధాత్ర్రతిపద్యతే జంతుః ॥ మధ్యమధ్య కట్టెలను ఇటు అటు కదిల్చినప్పుడే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. నెత్తిపై కొట్టినప్పుడే పాము స్తబ్ధతను వీడి పడగవిప్పితన ప్రభావాన్ని చూపినట్లు సాధారణంగా తన వ్యక్తిత్వానికి సామర్థ్యానికి ఏదైనా ఒక “స్పర్ధా లాంటిది వచ్చినప్పుడే ఏ వ్యక్తి అయినా తన ప్రభావాన్ని దర్శింప జేయగల్లుతాడని అన్నట్లు, దేశికులకు ఇతర విద్వాంసుల వలన ఏర్పడిన స్పర్ధ్థయే ఇలాంటి సర్వోత్తమకవితావిర్భావానికి ప్రేరకమైన దని పాఠకులు ఆనందపడవచ్చు. పొదుకాసహస్రం హఠాత్తుగా స్పర్దతో వ్రాసిన స్తోత్రమా అనిపించదు. చాలా

౭2 పాదుకాసహప్ర ప్రద్యోతం ప్రణాళికాబద్ధంగా కుదురుగా ఏకాగ్రచిత్తంతో వ్రాసిన స్తోత్ర రాజంగా పాఠకులు దాని పరిశీలించినప్పుడు గుర్తింపగలరు. సాంప్రదాయిక ద్వేసాసూయాపరులైన కొందరు వ్యక్తులు ఏవేవో హేతువులను కల్పించినా, వీటిలో సత్యం కంటే అతిశయమే ఎక్కువగా ఉంటుందని ఈ వ్యాసకర్త భావిస్తున్నాడు. ఏదైనా ఒక కవితారచన ఆవిర్భవించడానికి, జన్మాంతరీయమో, ఏతజ్ఞన్మీయమో అయిన దైవాద్యనుగ్రహజన్య సంస్మ్కారమో లేదా స్వాభావిక శక్తివిశేషనైపుణ్యా భ్యాసజన్య సంస్కారమో కారణంగా ఉంటేతప్ప ఇలాంటి కవితా వైభవం కలరచనలు ఆవిర్భవింపవు. “కావ్యం తు జాయతే జాతు కస్య చిత్‌ ప్రతిభావతహొ అన్న ఆలంకారిక వచనాన్ని బట్టి విలక్షణ ప్రతిభావైభవంచేతనే కాక, విలక్షణవ్యుత్పత్తి కూడా ఎంతో ఇలాంటి రచన ఆవిర్భావానికి మార్గదర్శకాలు అవుతాయని గుర్తించవలసి ఉంది. అసలు ఈ స్తోత్రం ఆవిర్భవించడానికి గల నిదానాన్ని వ్యాఖ్యాతలు సంప్రదాయాను సారంగా ఇలా పేర్శొన్నారు. “పురా శ్రీరంగనాథః, అర్చకముఖేన ఆచార్యస్య శిరసి శఠకోపం నిక్షిప్య, పాదుకాసహ'స్రం ప్రణయేతి సబహుమానమభ్యనుజ్ఞాతవాన్‌” “పూర్వం శ్రీరంగనాథుడే అర్భకునిద్వారా శ్రీదేశికుల శిరస్సుపై శ్రీవెష్టవకూటస్టుడైన నమ్మాళ్వారులకు ప్రతీకమైన “శఠకోపాన్ది ఉంచి, పాదుకాసహప్రాన్ని రచింపుమని బహుమాన పురస్సరంగా అభ్యనుజ్ఞ చేశాడట. ఈ విధంగా సాక్షాత్తుగా శ్రీరంగేశుని ఆదేశాన్ని అనుసరించియే తాను ఈ రచన చేసినట్లు శ్రీదేశికులు 'ఫలపద్ధతిలోని 36వ శ్లోకంలో పేర్కొన్నారు. పృథుకవదనశంఖస్పర్భనీత్యా కదాచిత్‌ శిరసి వినిహితాయాః స్వేన భూమ్నా తవైవ । స్తుతిరియముపజాతా మన్ముఖేనేత్యధీయుః పరిచరణపరాస్తే పాదుకే£_పాస్తదోషాః ॥ 'స్వామిపాదుకా! ఎట్టి రాగద్వేషాలు లేని నీకు పరిచరణం చేయడంలో ఆసక్తులైన సజ్జనులు. “కస్తుతియొక్క ఆవిర్భావం” నీ ప్రభావంవల్లనే అని అంటారు. ఎందువల్ల నంటే పిల్లవాడైన ధ్రువుడు స్వామిసాక్షాత్మరించినప్పుడు “స్తోతుం త్వామహమిచ్చామి తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చ మే” అని ప్రార్ధించినప్పుడు, స్వామి - తన శంఖంప్రాంతం చేత స్పృశించి, తనను స్తుతింపగలవాగ్రైభవాన్ని (ధ్రువనికి అనుగ్రహించాడని -

పాదుకాసహప్ర ప్రద్యోతం 23

“శంఖప్రాంతేన గోవిందస్తం పస్పర్శ కృతాంజలిమ్‌ |

ఉత్తానపాదతనయం ద్విజవర్యం జగత్పతిః ॥ అని శ్రీవిష్ణుపురాణం చెబుతున్నది. అలాగే స్తోత్రానుజ్ఞాసమయంలో ఎప్పుడో ఒకప్పుడు నీవు (స్వామి పాదుక) నా శిరస్సుపై ఉంచ బడినందువల్ల, తత్‌స్పర్శ ప్రభావంచేతనే ఈ వొదుకాసహస్ర నిర్మాణ సామర్ధ్యం నాకు అలవడిందని శ్రీదేశికు లుట్టంకించారు. ఇలా అనడంచేత భగవత్సన్నిధిలోని శ్రీ శఠకోప పాదుకాస్పర్భవల్ల తమకులాగనే, ఈపాదుకా సహస్ర స్తుతి సంబంధంచేత వివేకావిర్భావం పాఠకులకు తప్పక కలుగుతుందని సూచిస్తున్నారు శ్రీదేశికులు.

ఈపాదుకా సహస్రస్తోత్రం 'పద్ధతి అని విభజింపబడింది. పద్ధతి అంటే “త్రోవ” లేక “నడక”. త్రోవలో పాదాలతో నడిచేవారే పాదుకులను ధరిస్తాడు కనుక పాదుకలకు “పద్ధతికి సంబంధం అనివార్యం. 32 పద్ధతులుగా దీన్ని విభజించారు శ్రీదేశికులు. ఈ 32 సంఖ్య చాలా విలక్షణమైన దని వ్యాఖ్యాతలు వివరించారు.

శ్రీదేశికులు సాంప్రదాయిక విషయ నిరూపణకి సంస్కృత ద్రావిడ భాషామయ మైన “మణిప్రవాళం”లో వ్రాసిన “రహస్యత్రయసార” (గ్రంథంలో 32 అధికారా లున్నారు. చాలా (గ్రంథాల్లో ఈ సంఖ్య కనిపిస్తుంది. మోక్షవిద్యలు -బ్రహ్మవిద్యలు 32 అని ప్రసిద్ధి. వైష్ణవాచారాలు పురాణ నిరూపితాలు 32. శ్రీగీత 18 అధ్యాయాలు - శారీరకభాప్యం నాల్గు అధ్యాయాలు, నమ్మాళ్వారులు తిరువాయి మొళి ప్రబంధంలోని శతకాలు పది కలసి 32 వైష్ణవోపాదేయాలు. ఇక్కడ ఈ స్తుతిలో ఈ మూడు గ్రంథాల తత్త్వరహస్యాలు ఉపక్షిప్తాలు. ఇంతే కాదు శ్రీ వైష్ణవ సిద్ధాన్త తత్వాలు 32. “మూల ప్రకృతిని అవ్యక్తం - అక్షరం - తమస్సు అని మూడుగా నిష్మర్షిస్తే పృథివినుండి తమస్సు వరకు మొత్తం 26 తత్వాలు. కులం (27) నిత్యవిభూతి (28) ధర్మభూతజ్ఞానం (29) జీవుడు (30) శ్రీదేవి (31) నారాయణుడు (32) ఇలా తత్త్వసంఖ్య కూడా 32 అవుతున్నది. ఈ విధంగా 32 దోషాలను దూరంచేసికొని, 32 ప్రమాణ ప్రమేయ తత్త్వాలను ఎరిగి, సేవింపదగిన పాదుక నుద్దేశించి చేసిన ప్రస్తావ - సమాఖ్యా - ప్రభావ పద్ధతులు మూడు కలిసి ఒక భాగం. పాదుకా ప్రభావాన్ని సొక్షాత్మారించిన స్థానం శ్రీరామచరణం కనుక తత్రధానమైన సమర్పణ - ప్రతిష్థాన - అధికార పరిగ్రహ - అభిషేక - నిర్యాతనా పద్ధతులు ఆరు - రెండవ భాగం. సర్వావతార

2జీ పాదుకాసహప్ర ప్రద్యోతం సాధారణమైన వందిస్తుతితో ఆరంభించి వైతాళిక - శృంగారసంచార - పుష్ప - పరాగ - నాదపద్ధతుల వరకు ఆరు - మూడవ విభాగం. పాదుకాకృతివర్షనారూపమైన రత్నసామాన్య పద్ధతితో ఆరంభించి రత్నసామాన్య - బహురత్న - పద్మరాగ - ముక్తా - మరతక - ఇంద్రనీల - బింబప్రతిబింబ - కాంచన - శేష - ద్వంద్వ - సన్నివేశ - యన్రికా - రేఖాపద్దతులు పదమూడు నాల్గవ విభాగం. సుభాషిత - ప్రకీర్ణ - చిత్రపద్ధతులు మూడు ఐదవ విభాగం - ఇక మిగిలిన నిర్వేద - ఫలపద్ధతులు రెండూ ఆరవ విభాగం అని ఈ పాదుకాసహస్రాన్ని ఆరువిధాలుగా వర్ణింపబడిన విషయాలను బట్టి విభజించడం జరిగింది.

ఇలా - 3+5+6+13+3+2 = 39 పద్ధతుల సంఖ్యాగణనం గుర్తింప వలసి

ఉంది. పాదుకాసహస్ర ప్రతిపాద్యమైన అభిధేయతత్త్వం

శారీరక మొమాంసలోని నాల్గు అధ్యాయాలలోలాగా నాల్గు విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నారు.

(1) పాదుకలయందు గల శేషిత్వం చెప్పబడుతున్నది. శేషిత్వం అన్నదానిక్షి శాస్త్రీయంగా నిర్వచనం ఉన్నా స్వామిత్వం అని (గ్రహించితే చాలు. ఏదైనా ఒక వస్తువును ధరిస్తూ, నియమిస్తూ, తన కొరకు స్వేచ్చగా వినియోగపడేలా చేసికానే వాడు శేషి. అలా వినియోగపడే వస్తువు “శేషొమని అంటారు. ఈ సమస్త జగత్తు భగవానునికి శేషమని, దీన్ని యథేష్టంగా వినియోగించుకొనగల భగవానుడు శేష్ని అని, ఈ రెండు తత్త్వాలకు మధ్య గల సంబంధం శేషశేషిభావం అని అంటారు. ఇక్కడ భగవత్సాదుక శేషి అని చెప్పబడింది.

(2) ఇలాంటి '“శేషి (స్వామి) అయిన భగవత్సాదుకలకు గల ప్రభావాతిశయాన్ని భరతుడు ప్రత్యక్షంగా అడవిలో దర్శించడం, దాని యొక్క సంచారాన్ని వర్ణించడం ద్వారా తత్ర్రభావం బాధితం కాదని చెప్పడం రెండవ అంశం.

(8) ఆ పాదుకులను ఉపాసించడానికి అనుగుణంగా దాని ఆకృతి వైలక్షణ్యాన్ని నిరూపించడం మూడవ అంశం.

(4 భగవత్సాదులకలే “ప్రాష్యతత్త్వం” ఉన్నదని నిరూపించడం నాల్లవ అంశం.

పాదుకాసహప్ర ప్రద్యోతం 25

ఈ నాల్గు అంశాలను నిరూపించడం విషయంలో ఈ 82 “పద్ధతులు” ఎలా సంగతము లౌతున్నాయో (ఎలా అన్వయిస్తున్నాయో) అనుశీలింపవలసి ఉంది.

పద్ధతినిర్మాణశైలి

ప్రతి పద్ధతిలోను మొదటి శ్లోకం 'అనుష్టుభోొ వృత్తంలోను చివరి శ్లోకం “ఆర్యావృత్తం” లోను, మధ్యలో అనేక వృత్తాల నిరూపణం ఉంది. ఆరంభంలో సంబోధనా పురస్సరంగాను, తరువాత సాధారణంగాను నిరూపణం సాగింది.

'ప్రథమపద్ధతి - “ఫప్రస్తావ పద్ధతి”

శ్రీదేశికుల రచన విశిష్ట కవితా ధోరణిలో సాగినదని ప్రతిశ్లోకం నిరూపిస్తుంది. ప్రథమ శ్లోకంలోనే పరికర - ఉదాత్త - (ప్రేయోలంకార పరస్పర సంకీర్ణంగా సాలంకృతమై కవిస్తుతిరూప “భక్తి” భావ ప్రధానంగా భాసిస్తున్నది. గమనించండి.

సంతః శ్రీరంగపృథ్వీశచరణత్రాణశేఖరా: ॥

జయన్తి భువనత్రాణపదపంకజరేణవః ॥ ఇక్కడ 'సన్తః* సత్పురుషులు అంటే, పరమాత్మయాథార్చాన్ని ఎరిగిన భాగవతోత్తములు. “అస్తి బ్రహ్మేతి చేద్వేద సన్తమేనం తతో విదుః అనే (శ్రుతివచనం ఇక్కడ ప్రమాణం. మరి ఈ భాగవతోత్తము లెలాంటి వారు? శ్రీరంగభూమి నాయకుడైన సర్వేశ్వరుని పాదాలను నిరంతరం రక్షించే పాదుకలను శిరస్సుపై ధరించేవారు. అంతేకాదు ముల్లోకాలనూ రక్షించే పాదపద్మరేణువులు కలవారు. ఇలా, ఇక్కడ భగవంతుని కంటే, స్వామియొక్క పాదుకలకు, వాటికంటే, వాటిని శిరస్సున ధరించే భాగవతోత్తములకు, వారికంటె వారి పాదాల కంటిన రేణువులకు మాహాత్యమున్నదని 'జయస్తొ అనే పదంచేత కవి సూచిస్తున్నాడు.

“ఆరాధనానాం సర్వేషాం విష్టోరారాధనం పరమ్‌ ।

తస్మాత్పరతరం ప్రోక్తం తదీయారాధనం నృప 11 అన్న ఇతిహాస వచనాన్నిబట్టి వైష్ణవసంప్రదాయ సిద్ధమైన భాగవత నిష్టను ఇక్కడ శ్రీదేశికులు ఆవిష్కరిస్తున్నారు. భగవద్భక్తుల పాదరేణుస్పర్శ సకలభువన పావకమని నారదీయవచనం స్పష్టపరుస్తున్నది -

26 :పాదుకాసహప్ర ప్రద్యోతం

“మద్భక్తజనసంమర్ద పదపాంసువిమర్దనాత్‌

చతుస్సాగరపర్యన్లా పావనా స్యాద్వసుంధరా 1౯” “నా భక్తజనుల పాదపాంసువుల సమ్మర్దంచేత ఈ సమస్త వసుంధర పరమపవిత్ర మైయన్నదని స్వామి స్వయంగా అంటున్నారు ఈ శ్లోకంలో. ఇలా ప్రారంభమైన ఈ ప్రస్తావ పద్ధతిలో ఇరవై శ్లోకాలున్నాయి. రెండవ శ్లోకంలో శ్రీరామపాదుకలను శిరస్సుపై ధరించిన పరమభాగవతోత్తముడైన భరతుని ఉపశ్లోకించారు శ్రీదేశికులు. భక్తి మంతులకు ప్రథమోదాహరణమైనవాడు భరతుదడన్నారు శ్రీదేశికులు. శ్రీరామపాదుకా ప్రభావం లోకంలో భరతుని వల్లనే ప్రథితమైందన్నారు.

భరతాయ పరం నమో£_స్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజామ్‌ ।

యదుపజ్ఞమశేషతః పృథివ్యాం ప్రథితో రాఘవపాదుకాప్రభావః ॥

మూడవ శ్లోకంలో నమ్మాళ్వారులను నాల్గవశ్లోకంలో వాల్మీకిమహర్షిని ఉపళ్లోకించి ఐదవ శ్లోకంలో శ్రీరంగపతి పాదుకలకు నీచోచ్చభావభేదదర్శనం లేదని, నీచమైన తమ శిరస్సుపైన, సర్వోత్తమమైన వేదశీర్షంపైన నిర్విశేషంగా (సమానంగా) భగవత్చాదుకాద్వయం ఉన్నదని, కనుకనే వాల్ళీకిప్రభృతులచే క్రీర్తితమైన మహాత్మ్యంగల శ్రీరంగనాథుని పాదుకాద్వయాన్ని స్తుతిస్తున్నానన్నారు దేశికులు.

శ్రీదేశికులు తమ రచనకు వాల్మీకరచనకు సామ్యం ఏర్పడిందని గడుసుగా చమత్కరించారు. ఎలా? శ్రీవాల్మీకి వాక్కు ఏ పాదుకాహృదయాన్ని వర్ణించడం ద్వారా శిరస్సుపై ధరించిందో దాన్నే తమ వాక్కూ ధరించింది కనుక మావాక్కు వాల్మీకి వాక్కుతో 'సమతను' పొందింది. ఎలా అంటే - గంగాజలంలో పడిన మార్గస్థితమైన జలం యమునతో చేరి తత్సామ్యాన్ని పొందగలగుతున్నది కదా! అన్నారు.

ధత్తే ముకుందమణిపాదుకయోర్నివేశాత్‌

వల్మీకసంభవగిరాం సమతాం మమోక్తిః ॥

గంగాప్రవాహపతితస్య కియానివ స్యాత్‌

రథ్యోదకస్య యమునాసలిలాద్విశేషః || ఈ శ్లోకంలోని చమత్కారం బెచిత్యం ఏమిటంటే - వినయపూర్వకంగా శ్రీదేశికులు తమ రచనకు “రథ్యోదకి సామ్యాన్ని భావనచేసి, రథ్యోదకమైనా గంగాప్రవాహ

పాదుకాసహఫ్ర ప్రద్యోతం 27 పతితమైనప్పుడు తద్దతమైన పావిత్ర్యంతో పాటు యనముతో సమానంగా ప్రవహించే యోగ్యత కూడా కలగడంతో ఆశ్చర్యం ఏముంది? ఇలాగే శ్రీదేశికులు తమ రచన రథ్యాజలం లాగా దోషదూషితము నిరూపయోగమూ అయినా, గంగాజలంలో కలసి ప్రవహించినప్పుడు వర్ణనీయ విషయమహాత్య ప్రయుక్తమైన వైభవం, పావిత్రం తమవాక్కుకూ ఏర్పడడమేకాక యమునతో సామ్యాన్ని పొందిన రథ్యాజలంలా వాల్మీకి వాక్‌సొమ్యాన్ని పొందగలగడంలో విశేషం ఏమీలేదని, ఇది కేవలం “పాదుకా ప్రభావమేనని వ్యంగ్యంగా సూచిస్తూన్నారు శ్లోకంలో. అయోగ్య మైనదిగా భావింపదగిన తమ కవితకు కూడా 'యోగ్యత' కలింగింపగలిగిన శ్రీరంగనాథపాదుకల మహత్త్వం విశేషఖ్యాపనీయమని కూడా వ్యంగ్యం.

ఈ సమస్త విశ్వమూ ఎవనిపై ఆదారపడిఉన్నదో, ఈ సమస్త విశ్వానికీ పరమగతి ఎవ్వరో అటువంటి శ్రీరంగనాథునే “ఒంటరిగా” ధరిస్తూ ఆయనకు కూడా అందమైన “గతి” నిరూపిస్తున్న నీవు, సాక్షాత్తు బ్రహ్మరుద్రాదులకే దుర్విబోధమైన మహిమ కలిగి ఉండగా క్షుద్రులమైన మాబోటి కవులకు స్తుతిపద మెలా కాగలవు? అంటున్నారు దేశికులు. ఇక్కడ *'ద్రుహిణ” 'హరి అనే విశేష్యాలు సాభిప్రాయంగా వేయబడ్డాయి కనుక పరికరాంకురాలంకారం. వారికే దుర్చోధమైన నీమహిమ సామాన్యులకు సుతరాం దురవగాహమేకదా అని శిఖరిణీ” వృత్తంలో విశదీ కరుస్తు న్నారు దేశికులు - 'యదాధారం విశ్వం” అనే 9వ శ్లోకంలో.

కేవలం వాల్ళీకిప్రభృతికవి సంరంభగోచరమైన నీ విషయంలో మాబోటి పరిమిత ప్రతిభాసమున్న్మేషం కలవాని వాక్కు మిక్కిలి హాస్యజనకమేతప్ప వేరు కాదు, అంటూ రుంరూవాతం ముందు ముఖపవన విజ్బంభణుం లాగా ఉంటుంది మా ప్రయత్నం అని రమ్యంగా పోల్చారు దేశికులు - “మిత(ప్రేక్షా' అనే శ్లోకంలో.

పాదుకాప్రత్యుప్తాలైన మణుల మంజునాదంతో సమానంగా పాదసౌష్టవం గలిగేలా నా కవిత్వాన్ని అనుగ్రహించి, స్వామి రంగనాథుడు లక్ష్మీసనాథుడై తన పరిషత్తులో నిద్రావిదూరుడై సావధాన చిత్తంతో వినేలా నామనస్సులోను వాక్కులోనూ సావధానవై ఉండు ఓ మణిపాదుకా! అంటూ మణిపాదుకను సావధానపరచడం ప్రధానంగా ఈ ప్రస్తావన పద్ధతిని సాగించారు దేశికులు.

28 పాదుకాసహప్ర ప్రద్యోతం ఇక రెండవది - సమాఖ్యాపద్ధతి ఈ పద్ధతిలో ఆళ్వారులలో పరతావిశిష్టస్థానాన్ని పొంది కూటస్టులుగా ప్రసిద్ధి చెందిన ద్రావిడవేద నిర్మాత అయిన నమ్మాళ్వారులు శ్రీరంగపాదుకామూర్తియే నని శీరంగనాథ పాదుకలను “శఠకోపొ సమాఖ్య (శేరు) యుక్తమేనని ఎందువల్లనంటే వేయిపాశురాల ననుగ్రహించిన (సహఫ్రగీతి అనిపేరుగల తిరువాయిమొళిని అను గ్రహించిన) శరారులు శ్రీరంగనాథ పాదుకారూపంలో తమకు (పేరుకులై తమముఖం నుండి వేయి శ్లోకాలు ఆవిర్భవించేలా చేస్తున్నారు కనుక ఇది యుక్తమే అంటున్నారు. శఠకోప ఇతి సమాఖ్యా తవ రంగథురీణపాదుకే! యుక్తా ॥ సూతే సహస్రమేవం సూక్తీః స్వయమేవ యన్మయా భవతీ ॥ అని ఈ పద్ధతిలోని పదిశ్లోకాలలో శఠకోపాభిన్నంగా శ్రీరంగపాదుకలను ఉపశ్లోకించి సహజంగానే శేషత్వాన్ని పొందిన శ్రీరంగపాదుక సాక్షాత్తు ఆదిశేషుడే అయినదని శ్రీమద్యామునశ్రీసూక్తి “నివాసశయ్యాసన పాదుకాంశుకోపధానవర్నాతపవారణా దిఖిగో అన్న శ్లోకంలో స్వామియొక్క శయ్యాదులేకాక 'పాదుక' కూడా శేషుడే అని పాదుకగా శేషుని శేషత్వాన్ని ఉద్దోషించి పాదుకకు శేషత్వం స్వాభావికమేనని నిరూపిం చారు. ఇప్పుడు స్వతః శేషమైన పాదుక, స్వామిపాదాలను తాను ధరించి ద్విగుణీకృత శేషత్వాన్ని పొందింది. అది చాల దన్నట్లుగా తానే “శఠకోపొత్వాన్ని పొంది భాగవత శేషత్వాన్ని కూడా పొందినట్లు తన 'నామ' (సమాఖ్య) ద్వారా వ్యక్తపరుస్తున్న దంటారు దేశికులు. చూడండి - శయ్యాత్మనా మధురిపోరసి శేషభూతా పాదాశ్రయేణ చ పునః ద్విగుణీకృతం తత్‌ | భూయో2.పి భాగవతశేషతయా తదేవ వ్యంక్తుం పదావని శఠారిపదం బిభర్షి | శ్రీవైెష్ణవ్రసంప్రదాయంలో భగవత్‌శేషత్వంకంటే భాగవతశేషత్వం తచ్చేషత్వం (దాసత్వం) ఇలా ఏడు వ్యవధానాలతో కూడిన శేషత్వపారాకాష్టను పొందినవారిగా నమ్మాళ్వారులకు ప్రసిద్ధి ఉంది. దీన్నే “త్వద్భృత్య - భృత్య - పరిచారక - భృత్య - భృత్య - భృత్యస్య - భృత్య ఇతి మాం స్మర లోకనాథ” అను ఆచార్య శ్రీసూక్తి వ్యక్తపరుస్తున్నది.

పాదుకాసహప్ర ప్రద్యోతం న

ఇక్కడ ఆరు వ్యవరుధానాలు చెప్పబడగా శ్రీమచ్చఠకోపసూరులు ఏడు వ్యవ ధానాలలో శేషత్వాన్ని ఆవిష్కరించారు శ్రీసూక్తులలో. అలాంటి శఠకోపులపేరు తాము పెట్టుకోవడంవల్ల శ్రీరంగనాథపాదుక వీరిని కూడా అతిశయించిన శేషత్వ పరాకాష్టను పొందినదంటారు దేశికులు - న

యః సప్తపర్వవ్యవధానతుంగాం

శేషత్వకాష్థామభజన్మురారేః ॥

తస్యాపి నామోద్వహనాత్‌ త్వయా£_సౌ

లఘూకృతో౭_భూచ్చఠకోపసూరి: ॥

ఇలా సమాఖ్యాపద్ధతిని ముగించి మూడవదైన ప్రభాపద్ధతిని ఆరంభించారు దేశికులు.

తవ దైన ప్రభాపద్ధతి

ఈ పద్ధతిలో దేశికుల కల్పన, మనోజ్ఞంగా ఆలంకారికమర్యాదానిదర్శకంగా సాగింది -

నిఃశేషమంబరతలం యది పత్రికా స్యాత్‌

సప్తార్షవీ యది సమేత్య మహీ భవిత్రీ |

వక్తా సహస్రవదనః పురుషః స్వయం చేత్‌

లిఖ్యేత రంగపతిపాదుకయోః ప్రభావః ॥

సమస్తమైన మహాకాశం ఒక పత్రిక అయితే, ఏడు సముద్రాలు 'సిరా అయితే చెప్పేవాడు సహహ్రవదనుడైన శేషుడైతే అప్పుడు రంగపతి పాదుకా ప్రభావాన్ని వర్ణించవచ్చు. ఇది సంభావనాలంకారం అంటారు.

వేదాన్ని ఉపబ్బృంహణంచేయాలనే కుతూహలం కల వాల్మీకి వ్యాసులిరువురూ అనుగ్రహించిన రామాయణమహాభారతాలు రెండూ శ్రీరంగపాదుకామాహాత్య వీక్షణానికి ఉపకరించే రెండు కన్నులు అంటారు దేశికులు. అంటే పైరెంటిలోనే భగవత్సాదుకావైభవం ప్రత్యక్షంగా వీక్షింపబడుతుందన్నమాట. రామాయణంలోనే కాక, రామాయణార్ధ సంగ్రహంకల భారతంలో కూడా 'పాదుకా' పరిగ్రహ ఘట్టం

30 పాదుకాసహపప్ర ప్రద్యోతం వర్ణింపబడటంచేత ఈ రెండూ నేత్రాలు. అయితే ఇవి వేదోపబ్బంహకాలు కనుక - భగవత్సాదుకా వైభవం సాక్షాత్తుగా వేదవేద్యమే నని వ్యక్త పరుస్తున్నారు. ఇలా సాగిన ఈ పద్ధతిలోని కొన్ని శ్లోకాలు మంచి ధారాశుద్ధితో సాగాయి. గమనించండి - “భక్తిప్రహ్వపుర ప్రభంజనజటావాటీ సనీడస్ఫుర చ్చూదారగ్వధవాసనాపరిమలస్త్యానే స్తుమః పాదుకే । రంగక్షోణిభృదం(ఘి పద్మయుగళీపూర్ణప్రవత్తేః ఫలం నిశ్చిన్వంతి విపశ్చితః శమధనా నిత్యం యదుత్తంసనామ్‌ ॥ భక్తితో ప్రహ్వంగా నమస్కరిస్తున్న పరమశివుని శిరస్సులోని పూలపరిమళాన్ని గాఢంగా అందిపుచ్చుకున్న పాదుకలను సంబోధిస్తూ శ్రీరంగనాథుని పాదపద్మ ద్వంద్వాన్ని పరిపూర్ణంగా శరణు పొందినందుకు ఫలం ఈ పాదుకలను శిరస్సున దాల్బగల్గడమేనని శమధనులు నిర్ణయిస్తున్నారట. దేవతలంతా అహం ప్రథమికాసంమర్దసంజనితమైన కోలాహలం చేస్తూఉంటే ఆకోలాహలాన్ని విష్వక్సేనుని చేతిలోని బెత్తమే దూరం చేస్తున్నదట. ఈ కోలాహలం దేనికొరకు అంటే శ్రీరంగసేవోత్సవంలో పాదుకలను తమ శిరస్సులపై ముకుటాగ్రాలపై ఉంచుకోవాలనే ప్రయత్నమే దేవతలకీ స్థితిని కలిగించిందంటారు దేశికులు. ఇలాంటి పాదుకల గుణగణాలను ఎవ్వరు వివరించగలరు, అని అంటూ (శ్రుతుల చివర్లలో (ఉపనిషత్తుల్లో) చెప్పబడిన రహస్యం సర్వకర్మలూ పరమాత్మ పాదుకల కర్పించడం ద్వారా పాదుకా పర్యంతాలే తప్ప కేవలం ఇంద్రాదిదేవతాపరాలు కావని గుర్తింపలేని మూర్భుల యజ్ఞాలు కేవలం పశువధమాత్రావశిష్టాలేతప్ప, అన్వర్థాలు కావని నామ మాత్రయజ్ఞాలేనని వేదకర్శ్మమర్శజ్ఞులైన అభిజ్ఞులు పరిహసిస్తారని అంటారు ఈ క్రింది శ్లోకంలో - (డ్రుతిశిరసి,నిగూఢధం కర్మణాం చోదితానాం త్వదవధివినివేశం నాధిగంతుం క్షమాణాం పరిహసతి మురారేః పాదుకే బాలిశానాం పశువధపరిశేషాన్‌ పండితో నామయజ్ఞాన్‌ ॥| వైదిక కర్మలన్నీ శ్రీరంగనాథ పాదుకలకే అర్చించబడడమే విజ్ఞానమని, అలా

పాదుకాసహప్ర ప్రద్యోతం 31 తెలియక పోవడమే అజ్ఞానం అని దేశికులు సూచిస్తున్నారు. 70 శ్లోకాలు కల ఈ పద్ధతి రంగనాథ పాదుకాప్రభావాన్ని బహుముఖంగా వర్ణిస్తున్నది. నాల్గవదైన సమర్పణ పద్ధతి పాదుకకే సర్వస్వాన్ని సమర్పించడం ఇందులోని విషయం. శ్రీరంగపాదుకలు స్వయంగా స్వామి శ్రీచరణాలను ఆశ్రయించి కరుణంగా విలపిస్తున్న అయోధ్యా పౌరులను పురస్కరించుకొని, శ్రీరామవనగమన సమయంలో బహుశః ప్రార్థిస్తున్నా యేమో నన్నట్లు మనోహరంగా రాముని వెనుకకు మరల్చడానికి ధ్వనిచేస్తున్నాయట. మణి పాదుకలు ధ్వనించడం స్వాభావికలక్షణం. అయితే మణిపాదుకల ఈమంజు ధ్వనికి శ్రీరామవనగమన ్రవృత్తినివారణమే నిమిత్తమని కవి ఊహిస్తున్నారు. కనుక ఇది హేతూత్రేక్ష “వినివర్తనార్ధం రామం పదగ్రహణపూర్వమయాచతేవ” అని ఇవ శబ్దాన్ని ఉద్రేక్షావాచకంగా ఇక్కడ వాడటం జరిగింది. క్రియాపదంతో అన్వయించిన ఇవశబ్దం ఉపమను కాక ఉత్రేక్షనే బోధిస్తుందని శాస్తమర్యాద. ఇక భరతుడు రామడు లేని అయోధ్యను తృణప్రాయంగా భావించి, మణిమయ పాదుకలకే ఉజ్జయినీ, అవన్తీ, మధురా, అయోధ్యలుగా భావిస్తున్నాడట. చూడండి - ప్రాప్తే ప్రయాణసమయే మణిపాదరక్షే పౌరానవేక్ష్య భవతీ కరుణాప్రలాపాన్‌! మంజుప్రణాదముఖరా వినివర్తనార్థం రామం పదగ్రహణపూర్వమయాచతేవ ॥ మత్వా తృణాయ భరతో మణిపాదరక్షే రామేణ తాం విరహితాం రఘురాజధానీమ్‌! త్వామేవ సప్రణయముజ్జయినీమవన్తీం మేనే మహోదయమయీం మధురామయోధ్యామ్‌ ॥ శ్రీరామచంద్రునికంటే రామపాదుకలే గొప్పవంటారు దేశికులు. ఎందువల్ల? శ్రీరాముని వెనుకకు తీసికొని వెళ్లాలని వచ్చిన భరతుడు రామునికి బదులుగా

32 పాదుకాసహప్ర ప్రద్యోతం పాదుకలను తీసికొని వెళ్లడంచేత శ్రీరామ ప్రత్యాయన పరిపణంగా (విశ్వాసజనక మూలధనంగా) పాదుకలే ఉపకరించినాయి కనుక ఇవే గొప్పవి అంటారు. “షాద్రావని! ప్రభవతో జగతాం త్రయాణాం రామాదపి త్వమధికా నియతం ప్రభావాత్‌ । నో చేత్మథం ను భరతస్య తమేవ లిప్పోః ప్రత్యాయనం పరిపణం భవతీ భవిత్రీ॥ శ్రీదేశికులు ఉపమానిర్వహణంలో చాలా వైశిష్ట్యాన్ని దర్శింప జేశారు. ఈ క్రింది శ్లోకాన్ని చూడండి - “పాదాంబుజాద్విగలితాం పరమస్య పుంసః త్వామాదరేణ వినివేశ్య జటాకలాపే అంగీచకార భరతో మణిపాదరక్షే గంగాధిరూధశిరసో గిరిశస్య కాంతిమ్‌ ॥ శ్రీరామచంద్రుని పాదపద్మంనుండి జారిన పాదుకను శిరస్సున ధరించిన భరతుడు గంగను శిరస్సున దాల్చిన పరమశివుని కాంతిని స్వీకరించాడట. ఇక్కడ “పాదాం బుజాద్విగలితా” అనే విశేషణాన్ని సాక్షాత్తుగా పాదుకలతోను అర్ధసిద్ధంగా గంగతోను అన్వయాన్ని దర్శింపజేసి ఉభయత్ర పవిత్రత సమానమని, రెండూ పరమపురుష పాదస్పర్శ కలవవడమే దీనికి మూలకారణమని రెంటికీ సామ్యాన్ని ధర్శముఖంగా నిరూపిస్తూ, 'జటాకలాప వినివేశనం' కూడా భరత-పరమశివులకు పాదుకా-గంగల విషయంలో సమాన ధర్మమని అవగతపరుస్తున్నారు దేశికులు. ఈ సమర్పన పద్ధతిలో 20 శ్లోకాలున్నాయి. ఐదవది - ప్రతిప్రస్థాన పద్ధతి ఈ పద్ధతిలో శ్రీభరతుడు స్వీకరించిన రామపాదుకలు చిత్రకూటం నుండి అయోధ్యకు ప్రయాణమై వెళ్లిన సమయంలో అగుపించిన గుణాలను కవి వర్ణించారు. శ్రీరామచంద్రుడు వనవాసాన్నే కాంక్షించి అయోధ్యకు రానిరాకరించడం బహుశ; పాదుకకు కూడా ఇష్టమై ఉండదు; ఎందువల్లనంటే శ్రీరామపాదం ఇప్పుడు చాలా నిష్ణురంగా ఉన్నది. కారణం 'అవనం” (అయోధ్యాదివనభిన్న ప్రదేశం) (రక్షణం)

పాదుకాసహప్ర ప్రద్యోతం 3 విడచి వనాన్ని ఆశ్రయించి అక్కడనే సంచరింపనుద్యమించింది కదా. అవనమే (రక్షణమే) స్వభావంగాగల పాదం స్వధర్మాన్ని విడచినప్పుడు, ఇంక ఆ పాదంతో తన కేం పని? అని అనుకున్నదేమో రామపాదుక, రామపాదాన్ని విడచి అయోధ్యాఖి ముఖంగా పయనమైనది అంటారు దేశికులు. అంతేకాదు; పాదుకకు తనకాతయమైన పాదంపట్ల వైముఖ్యం కలగడానికి మరొక కారణం కూడా ఉంది. ఏమిటంటే! ఎంతో ఆతురుదైన సాక్షాత్తు సోదరుడు భరతుని 'ప్రణయాన్ని? కూడా నిర్దాక్షిణ్యంగా త్రుంచిపారవేసి స్వభావవిరుద్ధంగా వనాన్ని ఆశ్రయించడమే నంటారు.

భృశాతురస హోదరప్రణయఖండనసై వ్రరిణా

పదేన కిమనేన మే వనమిహావనాదిచ్చతా ।

ఇతీవ పరిహాయ తన్నివవృతే స్వయం యత్స్పురా

పదత్రమిదమాద్రియే ధృతజగత్రయం రంగిణః 1 ఇక్కడ మరొక చమత్కారం కూడా ఉంది. "స్వైరిణా' అని ప్రయోగించారు దేశికులు. వ్యాకరణ వ్యుత్పత్తిని "స్వేన స్వచ్చందేన సంచరితుం శీలం యస్య' 'స్వేచ్చగా సంచరించే స్వభావం కలవారిని స్వైరి అంటారు. ఇక్కడ రామపాదం స్వైరి. అలాంటి స్వచ్చంద స్వభావం కలవారిని అంటిపెట్టుకొని తిరిగితే తనకు కూడా న్వరూవహాని కలుగుతుందని బహుశః బయపడిందేమో నన్నట్లుగా వైముఖ్యాన్ని చూపి, రామపాదాల నుండి జారి ఆర్హుడైన భరతునితోపాటు అయోధ్యాముఖం పట్టి ఉంటుంది 'పాదుకి అన్న భావాన్ని “స్వైరిణా” అన్న పదం వ్యక్త పరుస్తున్నది.

శ్రీపాదుక అయోధ్యకు బయలుదేరివెళ్లడం సముచితమే నంటారు దేశికులు. ఎందువల్ల? పాదుకాప్రస్థానంపట్ల రామునికి ఎలాంటి సత్యసంధతా భంగం కలుగ కుండా, రాముడు తనతండ్రి మాటను నెరవేర్చే ఉత్తమస్థితి ఏర్పడింది. పాదుకా ప్రస్థానమే ప్రసక్తం కాకపోతే భరతుని దైన్యాన్ని చూచి భరించలేక రాముడు అయోధ్యకు తిరిగివస్తే దశరథుని మాట ఏమి కావాలి? దీనివల్ల రెండు అనర్ధాలు. ఒకటి పితృవాక్యం మొక్కవోవడం, రావణాది రాక్షసవధకు మార్గం మూసికొనిపోవడం. కనుక ఈ రెండు ఉపద్రవాలు కలగకుండా పొదుకాప్రతిప్రస్థానం మార్గం సుమగం చేసింది అంటారు దేశికులు.

34 పాదుకాసహటప్ర ప్రద్యోతం దశవదనవినాశం వాంఛతో యస్య చక్రే దశరథమనఘోక్తిం దండకారణ్యయాత్రా । స చ భరతవిమర్డే సత్యసంధస్త్వయాసీత్‌ రఘుపతిపదరక్షే రాజధానీం 'ప్రయాన్నా ! అనే శ్లోకం ఈ అభిప్రాయాన్నే వ్యక్తపరుస్తుంది. ఇలా పాదుకా ్రతిప్రస్థానంలోని ఎన్నో విశేషాలను శ్రీదేశికులు ఈ ప్రతి ప్రస్థానపద్ధతిలో ఆవిష్కరించారు. ఇక్కడ ఒక శ్లోకంలో “పాదుక” “సీతమ్మ” ఇద్దరూ శ్రీరామచంద్రుని పాదకమలాన్ని తగిన సమయంలో విడచి పెట్టారట. ఇలా పాదుకకు సీతమ్మకు లోకరక్షణ నిమిత్తంగా అలాంటి దుష్కరకర్మ చేయడంలో ఎలాంటి దైన్యం లేదట. కనుకనే, రామపాదుకను విడచి లోకరక్షణార్థమై అయోధ్యకు వెళ్లింది పాదుక, ఇక సీతమ్మ రావణవధ సుగమం అవడానికి తాను దైన్యావస్టను, అంటే శ్రీరామచంద్రునికి దూరంగా లంకలో భర్తృవిరహవేదన ననుభవిస్తూ రావణుని దురుక్తులు వింటూ రాముని కొరకు ఎదురుచూడవలసిన దుస్థితిని, తెచ్చుకొని లోక కళ్యాణకృత్యాన్ని నెరవేర్చింది. చూడండి - స్త పాదరక్షే రక్షార్థమస్య జగతో మణి క్ష రామస్య పాదకమలం సమయే త్యజంత్యోః। కిం దుష్కరం తవ విభూతిపరిగ్రహో వా కిం వా విదేహదుహితుః కృపణా దశా సా॥ ఇలా విలక్షణంగా పాదుకాగుణఖ్యాపన పరంగా సాగిన ఈ పద్ధతిలో ౨౦ శ్లోకాలున్నాయి. ఆరవది అధికారపద్ధతి ఈ పద్ధతిలో పాదుకావైభవాన్ని విలక్షణరీతిలో శ్రీదేశికులు వర్ణించారు. శ్ర పాదుకలు ఎక్కడ ఉంటే అక్కడ వైభవం ఉన్నదంటారు దేశికులు. ఇక్కడ చమత్కారంగా “షాదుకాసత్తే వైభవసత్త్వం పాదుకాభావే వైభవాభావఃి అన్న అన్వ్నయవ్యతిరేకాలు శాస్త్రసిద్ధంగా ఇయోధ్యావాసులకు కూడా అవగతమైందంటారు దేశికులు -

పాదుకాసహప్ర ప్రద్యోతం 85 అధీష్టే పాదుకా సా మే యస్యాః సాకేతవాసిభి: ॥ అన్వయవ్యతిరేక్రాభ్యామన్వమియత వైభవమ్‌ శేషత్వ పారతంత్రాలు రెండూ జీవుని అసాొధారణలక్షణాలని శ్రీవైష్ణవ

సంప్రదాయం ఉద్దోషిస్తూన్నది. శేషత్వం అంటే ఏమిటో వెనుక శ్లోకాల్లో చెప్పడం

జరిగింది. ఇక్కడ పారతంత్ర్యం అంటే ఏమిటో అవగతపరుస్తున్నారు శ్రీదేశికులు పాదుకా స్వభావ వర్దన ముఖంగా. స్వామియొక్క ఆజ్ఞ ఎలాంటి దైనా స్వరూప సాధకమా? నాశకమా? అనేవి చికిత్స లేకుండానే ఆదరించడం పారతంత్ర్యమే. స్వామి వనవాసం అయిన తరువాత తిరిగి వచ్చి రాజ్యాన్నితనతో పాటు స్వీకరింపుమని కోరినా లక్ష్మణుడు అంగీకరిరిచలేదు. భరతుడు అలాకాక, మారుమాటాడక రామాజ్ఞను శిరసా వహించాడు. ఇదే లక్షణాన్ని 'మణిపాదుక కూడా అనుసరించదగిన విధంగా ఆచరించి చూపింది, బహుశః 'మణిపాదుకు ఇచ్చిన సందేశాన్ని గ్రహించియే భరతుడు వనవాసానంతరం రామ వచనాన్ని పాటించేలా ఇదే ప్రేరేపించినదన్నమాట. ఎలా? తాను రామాజ్ఞను పాటించి అయోధ్యాసింహాసనంపై అధిష్టించింది కదా శ్రీపాదుక.

రామాజ్జయా పరవతీ పరిగృహ్య రాజ్యం

రత్నానసం రఘుకులోచితమాశ్రయన్తీ ॥

శుద్ధాం పదావని పునర్భవతీ వితేనే

స్వాతంత్ర్యలేశకలుషాం భరతస్య కీర్తిమ్‌ ॥1

పాదుక ఒక ఉత్తమమైన ఆదర్శాన్ని లోకానికి చూపిందంటున్నారు శ్రీదేశికులు. ఎలా? రఘుకులంలో పుట్టి కూడా, భరతుడు, తాను సోదరుదైనంత మాత్రం చేత రాజ్యాన్ని ఎందుకు పరిగ్రహించాలి అని తల్లి కోర్కెను, తం[డి ఆదేశాన్ని రాజ్యాన్ని విడచి అడవికి రామసన్నిధికి వెళ్లాడు. ఇది ఒక విధంగా శాసనోల్లంఘనం ద్వారా స్వాతంత్ర్యం ప్రదర్శించి భరతుడు, స్వరూపవిరుద్ధమైన తన ప్రవృత్తిద్వారా నింద్యతను పొందాదు. కాని 'మణిపాదుకి అలా స్వాతంత్ర్యాన్ని స్వీకరింపక అటు భరతుని కీర్తికి వర్పడిన కళంకాన్ని తొలగించడమే కాక, తాను అజరామరమైన కీర్తిని పొంద గలిగింది. ఎందువల్లనంటే రావణాసురుని వధను కాంక్షించిన దేవర్షులు భరతుని వారించారు. దశగ్రీవవధరూపదైవకార్యమే లేకపోతే భరతుడు చేసిన రామనివర్తన

తెర :పాదుకాసహప్ర ప్రద్యోతం ప్రయత్నాన్ని ఆతని ప్రార్ధనను రాముడు అంగీకరించేలా చేసేవారే. అయితే విహ్వలుడైన భరతుడు మళ్లీ ప్రార్ధించాడు -

“ఇదం రాజ్యం మహాప్రజ్ఞ స్థాపయ ్రతిపద్య హిః అని. ఇతని అభిప్రాయం ఇది. “నేను అశక్తుడను. కనుక నీవు వనంలో ఉంటూనే రాజ్యాన్ని స్వీకరించి పాలించు” అని. అయితే రాముడు తండ్రి ఇచ్చినది, తాను ఇచ్చినది అయిన రాజ్యాన్ని మళ్లీ స్వయంగా తానే స్వీకరించడం ఇష్టంలేక నిషేధించాడు. అందువల్లనే “నీ పాదుకలన్నా ఇమ్మని” ప్రార్ధించాడు భరతుడు. ఈ విధంగా స్వాతంత్ర్య నివృత్తి కొరకే కొంత స్వాతంత్ర్యాన్ని స్వీకరించాడు భరతుడు. ఇది దోషావహం కాదు. సురాపానం చేయమని ఆదేశిస్తే, తాను స్వీకరించనని శాస్త్రపారతంత్ర్యాన్ని ప్రదర్శించడం కూడ దాసునికి

ఒక విధంగా పారతంత్ర్యమే. అలాంటిదే ఇదీను. ఈ పద్ధతిలో త్తం శ్లోకాలున్నాయి. వఏదవది అభిషేకపద్ధతి

ఈ పద్ధతిలో రామపాదుకలుగా భావింపబడే శ్రీరంగనాథపాదుకలకు జరిగిన

అభిషేకాన్ని కవి లెస్సగా బహుముఖంగా భావిస్తున్నారు. శ్రీరామపాదుకలను ఆసనంపై ఉంచి, ఇక్ష్వాకుపురోహితుడైన వసిష్టుధు అభిషేకించినాడు. ఈ పద్ధతిలో శ్లేషన్సు ఆశ్రయించి దేశికులు శబ్బ్చచమత్మారాన్ని కూడా దర్శింప చేశారు.

రక్షోవధార్థం మణిపాదరక్షే! రామాత్మనో రంగపతేః ప్రవాసే

రక్షోఐ_ పకారాత్‌ భవతీ వితేనే రాజన్వతీం కోసలరాజధానీమ్‌ ॥

ఓ మణిపాదుకా! రాక్షసవధకొరకు శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్లగా రక్షోపకారం ద్వారా రాజధానిని, పాదుక రాజన్వతిని చేసిందట. ఇక్కడ 'రక్షోపక్రార శబ్దం శ్లిష్టం. “రక్షసామపకారః, రక్షారూపోపకారఃొ అని రెండర్భ్థాలు. రాముడు

లేనందువల్ల అయోధ్యలో ఏర్పడిన అరాజకతా మూలమైన దోషాన్ని పోగొట్టి రక్షణరూపమైన ఉపకారం చేసింది శ్రీపాదుక. ఎలా? తానే సింహాసనాధిస్టితర్రై అయోధ్యను 'రాజన్వతి' చేసి. రాజన్వతి అనేచోట 'మతుప్‌ ప్రత్యయం ప్రొశస్య బోధకం, ప్రశస్తరాజుకలది అని అర్ధం. ఈ విషయం శ్రీరామాయణంలో శ్రీరామ'్రతివర్తన సమయానికి కోశాగారం ధన సమృద్ధం కావడం రాజ్యవ్యవస్థ సుస్థిరం కావడం మొదలైన ప్రశస్తలక్షణాలను వాల్ళీకి లెస్సగా వర్ణించాడు. ఇలాంటి స్థితికి మణిపాదుకయే

పాదుకాసహట్ర ప్రద్యోతం ౩7 కారణం. ఇక, ఇదే సమయంలో రాముడు వనంలో ఉండి రాక్షసవధ చేశాడు కనుక “రక్షో. పకారం' రాక్షసులను అపకారం కూడా చేసింది శ్రీపాదుక. ఈ విషయాన్ని శ్లేషముఖంగా కవి పై శ్లోకంలో లెస్సగా వర్ణించారు.

సముచితమైన అభిషేకాన్ని శ్రీపాదుక పొందినప్పుడు అభిషేకార్ధమై ఉంచబడిన తీర్చోదకాలవలన ఏర్పడిన ధ్వని మంత్రధ్వనితో కలసి కోసలవాసులు సంకులార్త నాదాలను ప్రశమింపజేయగలిగిందట. చూడండి -

సముచితమభిషేకం పాదుకే ప్రాప్నవత్యాం

త్వయి వినిపతితొనాం దేవి తీర్గోదకానామ్‌ ॥

ధ్వనిరనుగతమంత్రః సీదతాం కోసలానాం

శమయితుమ లమాసీత్‌ సంకులాన్‌ ఆర్తనాదాన్‌ | ఈ అభిషేకపద్ధతిలో 30 శ్లోకాలున్నాయి.

ఎనిమిదవది నిర్యాతనాపద్ధతి

“నిర్యాతనోత్సవ' విషయమైన పాదుకను ఈపద్ధతిలో స్తుతించారు దేశికులు. నిర్యాతనోత్సవం అంటే న్యాసప్రత్యర్పణోత్సవ మన్న మాట. “నిర్యాతనం వైరశుద్దా న్యాసప్రత్యర్పణే£_.పి చి అన్నకోశాన్ని బట్టి రక్షించడానికై తన వద్ద ఉంచుకున్న వస్తువులు తిరిగి యజమానికి తిరిగి సమర్చించడమే 'నిర్వాతనశబ్దార్ధం'. ఇక్కడ రెండు వస్తువులకు నిర్యాతనం జరిగింది. 14 సంవత్సరాలు వనవాసం తరువాత భరతునివద్ద న్యాసంగా ఉన్న “రాజ్యం” తిరిగి రామునికి చేరింది. ఇదొక 'నిర్యాతనం”. 14 సంవత్సరాలు రామునివీడి అయోధ్యాపాలనంలో అధికృతమై భరతుని సేవలందు కొంటూ ఉన్న 'మణిపాదుక తిరిగి శ్రీరామపాదాన్ని పొందించబడింది. ఇది కూడా నిర్యాతనమే.

పదునాల్గు సంవత్సరాలు కోసలస్టలైన ప్రజలచే అనన్యభావనతో సేవింపబడింది మణిపాదుక. ఇలా మణిపాదుకను సేవించడం వల్ల తాను పరమ పురుషార్ధ సిద్ధికి ఉపాయమై సాంతానికాదిలోకాలను ఫలంగా అనుగ్రహించింది. ఈ లోకాలు వాస్తవానికి పరమయోగులైన సనకసనందనాదులకు కూడా దుర్లభమే. అయినా స్వసేవాఫలంగా వాటిని అనుగ్రహించిం దంటున్నారు శ్రీదేశికులు. చూడండి -

38 పాదుకాసహఫప్ర ప్రద్యోతం ఉపాస్య వర్షాణి చతుర్దశ త్వామ్‌ ఉత్తారికాముత్తరకోసలసాః 1 సనందనాద్ద్వైరపి దుర్విగాహ్యం సాన్తానికం లోకమవాపురగ్ర్యమ్‌ 1 అంతేకాదు. మణిపాదుక, శ్రీరామచంద్రుని యథాపూర్వంగా తదుచితమైన రత్నపీఠం మోద కూర్చుండబెట్టి, తాను శ్రీరామపాదపీఠాన్ని అధిరోహించిందట. రఘుపతిమధిరోప్య స్వోచితే రత్నపీరే ప్రగుణమభజథాస్త్వం పాదుకేః పాదపీఠమ్‌ 1 తదపి బహుమతిస్తే తాదృశీ నిత్యమాసీత్‌ క్వ ను ఖలు మహితానాం కల్ప్యతే తారతమ్యమ్‌ ॥1 ఇక్కడ శ్రీరాముడు అధిరోహించిన రత్నపీఠానికి, పాదుక అధిరోహించిన పాదపీఠానికి తారతమ్యం లేదంటారు. పాదపీఠాధిరోహణం పాదుకకు నిరంతరం ఏర్పడిన ఈ బహుమానం విశిష్టమైనదన్నారు. ఇక్కడ రెండు పీలాలు శేషత్వోపయుక్తాలే, వాస్తవానికి భగవత్‌స్థాన పీఠం, షం” (భగవచ్చేషం) కాగా, పాదుకాస్పడమైన పాదపీఠం “ప్రగుణం” అన్నారు. దానికి కారణం, భగవత్‌శేషత్వమే. రామునిక్తి, రామపాదుక శేషం కాగా, పాదుకకు పాదపీఠం శేషం. భగవచ్చ్భేషత్వం కంట్రే భాగవతశేషత్వం గొప్పది కూడా! ఇలా 30 శ్లోకాల్లో సాగింది 'నిర్యాతని పద్ధతి 9వ దైన వైతాళిక పద్ధతి ఇందులో 10 శ్లోకాలున్నాయి. ఇక్కడ 'సుప్తప్రబోధనం' మాత్రమే కాక వేళ్ళ కార్యము రెండూ జ్ఞాపనం చేయడమే వందివైతాళిక కృత్యంగా నిరూపిం బడుతున్నర్రి “వంది” అంటే స్తుతి పాఠకుడు. వైతాళికుడంటే ప్రతిబోధు కరుడని సిద్ధార్ధమైనా, ఇక్కడ సాక్షాత్తూ వేదాన్తాలే, ఉపనిషత్తులే, వందివైతాళికత్వాన్ని పొందాయని శ్రీదేశికులు క్తీర్తిస్తున్నారు. నమస్తే పొదుకే పుంసాం సంసారార్దవసేతవే ॥ యదారోహాస్య వేదాన్తాః వందివైతాళికాః స్వయమ్‌ ॥ అని వెనుకటి పద్ధతిలో రామాయణవృత్తాంత జ్ఞాపకముఖంగా పాదుకాప్రభావం

పాదుకాసహట్ర ప్రద్యోతం 39 అప్రధృష్యమని చెప్పారు. ఇక కాలభేదం చేతకూడా పాదుకయందు కార్యభేదం ఉన్నదని తెలియజేయడానికి పాదుకా ధారణకాలబోధకరుడైన పురుషవృత్తాన్ని తెలియజేస్తున్నారు. వారు వందివైతాళికులు. పొదుకా విషయంలో స్వాపప్రతిబోధనలు సాక్షాత్తుగా చెప్పనలవికావు కనుక, పాదుకనే సంబోధించినా, రంగనాథ సన్నిధిలో పాదుకా సంబోధనం చేయడం స్తుతిపాఠాదులు చేయడం ఇలాంటివేవీ అనుభవసిద్ధాలు కావు కనుక, రంగనాథుని సంబోధిస్తున్నారని, పాదుకను కాదని సాంప్రదాయికులు అంటారు. అయితే ప్రతిశ్లోకమూ పాదుకాపరంగానే ఉన్నది. ఈ పద్ధతిని వైతాళిక పద్ధతి అని వ్యవహరించారు. ఆదియును చివరను “వంది” పదం ఉండటంచేత “వంది వైతాళిక పద్ధతి” అనికూడా అంటారు. ఈ పద్ధతిలోని ఏడవ శ్లోకంలో పాదుక “వరపురంధ్రీ' వృత్తిని వహించి దివ్యాప్సరలు చూపుతూ ఉండగా ప్రదోషారంభ సమయంలో ఒక్కపురంధ్రి తన పతిని పరిచరిస్తున్నట్లు, పాదుక, నీపాదాలను రక్షిస్తూ 'సవిలాస ప్రవృత్తి కలదై నిన్ను నీ రాజనాసనంపైకి తీసుకొని వెళ్లుగాక, అని ఆశంసిస్తూ, పరిజనవనితలచే అంతఃపురహృదయాఖిజ్ఞతచే శుద్ధాన్తచరదాసుడైన మదనుడు అంజలి బంధంతో నీకు పప్రణమిల్లుతూ ఉండగా, నిన్ను నీపాదుకయే సన్నిహిత సఖిలా శేష శయ్యపై పరుండచేయడానికి సిద్ధపడగా నీపాదం పాదుకను పాసించుగాక అని అంటూ ఇలా తగిన సమయంలో వందిత్వాన్ని పొందిన వేదాల వచనాదులను విని అడుగడుగునా రంగనాథుడు పాదుకనే అభిసరిస్తున్నాడు అంటారు శ్రీదేశికులు. ఈ పద్ధతి ముందు పద్ధతికి ఉపోద్దాతంగా కూర్చబడింది. ముందుపద్ధతి “శృంగారపద్ధతిగా కూర్చ్పబడింది. దర్శించండి. శృంగారపద్ధతి - 10

ఈ పద్ధతిలో పాదుక శ్రీరంగనాథుల హృద్యచేష్టలను కృత్యాలను ఆలంబనంగా చేసికొని 'సమాసోక్తి విధానాన్ని అనుసరించి ఆ కృత్యాలన్నీ దివ్యదంపతీకృత్యాలే నని స్తుతిస్తున్నారు శ్రీదేశికులు. శ్రీమన్నారాయణుని శృంగారంచేష్టలను అవిర్భవింప చేసేది శ్రీపాదుకే. ఎందువల్లనంటే శుద్ధాన్తంలో (అంతఃపురంలో) ఉన్న వారి భోగానికి “ముందు! 'తరువాత' కూడా పాదుకాభోగం అనివార్యమౌతున్నది కదా శ్రీరంగపతికి!

'శారేః శృంగారచేష్టానాం ప్రసూతిం పాదుకాం భజే |

యామేష భుంక్తే శుద్దాన్తాత్‌ పూర్వంపశ్చాదుపి ప్రభుః 11

40 పాదుకాసహప్ర ప్రద్యోతం స్వామి, నిరంతరం, తనను శిరస్సుతో ప్రణమిల్లే ఇంద్రాదుల మౌళిమాలా మకరందం చేత పంకిలమైన తనపాదంతో పాదుకనే శ్రీరంగపతి ప్రేమతో అలదుతాడట. అంతః పురాల్లో ఇతర సహాయనిరీపేక్షంగా శ్రీరంగనాథుని తానే ధరిస్తున్న మణిపాదుకను దూరం నుండీ తమ తెల్లని కుసుమపరిమళితాలైన దృక్కులతో అంతః పురాంగనలు సస్పృహంగా వీక్షిస్తారట. ఆహా! మాకు దుర్లభమైన నిరంతర స్పర్శభాగ్యం పాదుకకు లభ్యమైంది కదా అని కావచ్చు. స్వామి, నిత్యయౌవనుడు, శృంగారరసికుడు. ఇలాంటి దివ్యమంగళ వి[గ్రహంతో నిత్యనూతనంగా అననుభూత సర్వభోగ్యత గల స్వామిని భోగించే పాదుక రసిక శిఖామణి కాక ఏమౌతుంది! స్వామి, సుఖంగా శయనించి నిదురిస్తున్నాడు. స్వామికి దగ్గరగా శయ్యాసమోపంలో ప్రహ్వభావంతో వేచి ఉండి స్వామియొక్క శ్వాసానిలంవల్ల ఎగిరివచ్చిపడుతున్న నాభీసరోజపరాగంచేత అందంగా అంగరాగాన్ని నిరంతరం పొందుతూ ఒక 'వాసకసజ్జికా' నాయికలాగ పాదుక భాసిస్తున్నది. స్వామి నిదురించినప్పుడు కూడా సన్నిహితంగా ప్రక్కనే వేచి ఉండ్రి స్వామియొక్క ప్రథమకటాక్షం ప్రభాతసమయాన తనపైననే పడాలనే ఆశతో ప్రతీక్షిసూ ఉంటుందట మణిపాదుక. ఇలా 10 శ్లోకాల్లో స్వామి వాల్లభ్యాన్ని పాదుకపొందిన వైనాన్ని సుందరంగా ఈ పద్ధతిలో శ్రీదేశికులు వర్ణించారు. ఇక భగవల్లీలా సంచారవైభవాన్ని వర్ణించడానికి, అందంగా సంచారపద్ధత్తిన్సి ఉపస్థాపనం చేస్తున్నారు దేశికులు. సంచారపద్ధతి - 11 సీతమ్మ రామవనవాసనిశ్చయ సందర్భంలో తానూ రామునితో అడ్లవిక్షి వస్తాన్సన్సి అన్నది. రాముడు వనవాసంలో ఉండే దోషాలను ఉట్టంకించి రావద్దని నివారించ యత్నించాడు. ఈ సందర్భానికి ఆరంభంలో సీతమ్మ తన నిశ్చయాన్ని ప్రకటిం్చి నప్పుడు- “అ(గ్రతస్తే గమిష్యామి మృద్నతీ కుశకంటకాన్‌” అని అన్నది. “రామా! నీ ప్రయాణమార్గంలో ఉన్న ముళ్లను తొలగిస్తూ నీకంటే ముందు నేను నడచి నీమ్రారాన్ని సుగమం చేస్తోనన్నది. ఈ ప్రవృత్తి పాదుకకు స్వాభావికం కదా! మార్గంలో ఉన్న కంటకాలను మర్దిస్తూ మార్గాన్ని సుగమంచేయడమే కదా పాదుకాకృత్యం. సీతమ్మ తానూ ఆ కృత్యాన్నే నిర్వహిస్తానని అంటూ పాదుకనే ఆదర్శప్రాయంగా తీసికున్నదన్న మాట. దీన్నే ఇలాఅంటున్నారు దేశికులు.

పాదుకాసహప్ర ప్రద్యోతం శ]

అ(గ్రతస్తే గమిష్యామి మృద్నతీ కుశకంటకాన్‌ ।

ఇతి సీతాపి యద్‌వృత్తమియేష ప్రణమామి తామ్‌ ॥

మణిమండపాల్లో ఉత్సవసమయాల్లో ఆహూతుడైన చతుర్ముఖబ్రహ్మ స్తుతించే భగవానుని గుణగణాలను చూస్తూ వాటికి కారణమైన మణిపాదుకల వైభవాన్ని కీర్తిస్తూ శతవత్సరాలు జీవిస్తూ ఉంటానంటారు శ్రీదేశికులు.

పుష్ప పద్ధతి - 12

స్వామి సంచరిస్తున్నప్పుడు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసిందట. ఆ కురిసిన పుష్పవృష్టి పాదుకపైనే పడింది. కనుక పుష్పారాధితయైన పాదుకను శరణు వేడుతున్నాని ఆరంభించి, దేవాంగనాదులు పుష్పాలతో పాదుక నర్చించడాన్ని, శ్రీవైకుంఠ, సత్యలోక

  • సాకేత-శ్రీరంగ స్థానాల్లో నాల్గింట అర్బనం భగవచ్చాస్త సిద్ధమైనట్లే, మణిపాదుకకు కూదా శ్రీవైకుంఠలోను, సత్యలోకంలోను అయోధ్యలోను, కావేరీమధ్యంలోను అర్చనం జరిగిందని శ్రీదేశికులు వర్ణించారు. ఎవ్వరు భగవత్పాదాలను పుష్పాలతో నిరంతరం అర్చిస్తారో వారిని, దేవతలు మందారసుభగాలైన తమముకుటాలను వంచి నమస్కరించడం ద్వారా పాదార్చనం ద్వారా సభాజిస్తారంటారు దేశికులు.

అర్బన్తి యే మధుభిదో మణిపాదరక్షే

భావాత్మాకైరపి పరం భవతీం ప్రసూనై:

మందారదామసుభగైః మకుటైరజ(స్రం

బృందారకాస్సురభయన్తి పదం తదీయమ్‌ ||

ఎవ్వరు రంగపతి పాదుకలను పద్మాలతో అర్చిస్తారో, అధికారేచ్చగల వారి అర్చనాన్ని పురస్కరించుకొని, వారికి కల్గిన అదృష్టమే వారిని ఆయా కల్పాల్లో ఎవ్వరెవ్వరు “బ్రహ్మ” కావాలని నిర్ణయించే పత్రికల్లో క్రమంగా స్థాపిస్తుంది. ఇలా ఈ పద్ధతి 80 శ్లోకాల్లో సాగింది.

పరాగపద్ధతి = 13 పాంతు వః పద్మనాభస్య పాదుకాకేలిపాంసవః 1 అహల్యాదేహనిర్హాణపర్యాయపరమాణవః 1

42 పాదుకాసహప్ర ప్రద్యోతం ఈ పద్ధతిలో పాదుక కంటిన పరాగాలను బహుధా కీర్తిస్తున్నారు శ్రీదేశికులు. ఇవి ఎలాంటివి? అహల్యాదేహ నిర్మాణంలో ఉపయోగించిన పరమాణువు లంటు న్నారు. ఈ పరాగం మహాప్రభావం కలది. కతకరజస్సు జలాన్ని స్వచ్చపరిచనట్ట్లు, ఈ పాదుకాపరాగం మనస్సుల కలత దేర్చడానికి సమర్ధమైనదంటారు. మధువైరిపదార విందసంలగ్న పాదుకాపరాగం అపరాగులను చేస్తుదంటారు. ఇది విరోదాభాసం. పాదుకాపరాగం - విషయవాంఛలను పారద్రోలి “అప-రాగుల” వైరాగ్య సంపన్నులను చేస్తుందని వారించారు దేశికులు.

“మధువైరిపదారవిందబంధోరపరాగాః తవ పాదుకే పరాగైఃి శ్రీరంగనాథపాదుకా పరాగాన్ని ఒక్కసారి శిరస్సున దాళ్చినవారు రజస్తమో విదూరమైన 'విశుద్ధసత్వాన్ని. అంటే శుద్ధసత్త్వమయమైన స్వామియొక్క దివ్యమంగలవి [గ్రహాన్ని దర్శిస్తారని ఉద్గోషించారు. ఈ శ్లోకాల్లో విరోధాభాస లక్షణాన్వితాలైన శ్లోకాలను దేశికులు విశేషంగా కూర్చారు. “అభిజాతైస్తవ దేవి నాభిజాతఃొ

ఓ మణిపాదుకా! నీవు శుద్ధ సత్తమయదేహం కలదానివి. ఇలాంటి నీవల్లనే శ్రీహరిపాదాలు విరజస్సులైనాయి. అయితే. నీరజస్సుచేతనే మానవులకు శ్రద్ద సత్త్రమయత ఏర్పడుతున్నది. ఇలా ఈ పద్ధతిలో 80 శ్లోకాలున్నాయి. ళ్‌

నాదపద్ధతి జ!

వేదాలు పరపదాన్ని “ఇలాంటిది అని స్పష్టంగా చెప్పలేవట. కేవలం “నేదం యదిదముపాసతే” అన్నట్లు ఇది కాదు అని, 'నేతి నేతి అని, 'క ఇత్ధా వేద యత్ర సఃజి అని చెబుతున్నాయి. పరమపదశబ్బానికి పరమాత్మస్వరూపమని, నిత్యవిభ్రూత్రి అని, ముక్త జీవస్వరూపం అని మూడర్జాలు. ఈ మూడూ అ్రత్యక్షాలే కనుక '్ష్వః అని చెప్పనలవి కానివి. అపరిచ్చిన్న మహిమత్వం “న చక్షుషా గృహ్యతే' అని అనిదం భావం కూడా చెప్పబడింది. ఇలాగే ప్రతిమాంతర్గతమైన దివ్యమంగళవి[గ్రహం క్రూడ్రా అప్రత్యక్షమే. అయితే 'మణిపాదుకి మాత్రం తన మంజునాదంచేత, “ఇదమిళ్థం' అని స్పష్టంగా చెబుతున్నదంటారు దేశికులు. పాదుకా 'నాదవైభవం' అలాంటిదన్న మాట.

పాదుకాసహప్ర ప్రద్యోతం క (ఢుతిభిః పరమం పదం మురారేరనిదంకారమనేవమిత్యుపాత్తమ్‌ | ఇదమిత్ధమితి బ్రవీషి నూనం మణిపాదావని మంజుఖిః ప్రణాదైః ॥ ఇక, మునులు, ప్రణిధానసంనిరుద్ధమైన తమ హృదయంలో రంగేశపాదుకనే

ధ్యేయవస్తువుగా ఉంచుకొని, ఆ మణిపాదుకయొక్క మంజుల ప్రణాదాన్నే ప్రణవ

ప్రణిధిగా అనన్యభావనతో భావిస్తున్నారట. ప్రత్యక్షంగానేకాక, ధ్యానంలో కూడా

“ఇదమిత్ధం” అని (ప్రదర్శించగలిగినది మంజుపాదుకా ప్రణాదం అన్నమాట.

మణిపాదుకాధ్వని అమృతాత్మక చంద్రకలను అనుసరిస్తున్నదట. కనుకనే, అమృతకలా

రూపమైన తన్నాదాన్ని చెవులతోను ముఖంతోను ఆస్వాదించి ఒక్కక్షణంలో సాధువులు అజరామరత్వాన్ని పొందుతున్నారుట. చూడండి -

అనుయాతి నిత్యమమృతాత్మికాం కలామ్‌

తవ రంగచంద్రమణిపాదు రుంకృతిమ్‌ ।

శ్రవసా ముఖేన పరిభుజ్య యత్‌ క్షణాత్‌

అజరామరత్వముపయాన్తి సాధవః 1

శ్రీరంగపతిమణిపాదుకామంజుశింజితం చివరి సమయంలో శిథిలమైన ఇంద్రియాలు కలిగి విహ్వలులైనవారికి అద్భుతమైన “కర్ణరసనారసాయనం' అంటారు. చెవి అనే నాల్మతో ఆస్వాదింప దగిన బెషధ మన్నమాట.

“విహ్వలస్య భవదీయశింజితం స్వాదు కర్ణరసనారసాయనమ్‌”

అన్నారు. ఈ నాదపద్ధతిలో కొన్ని శ్లోకాల్లో మంత్రశాస్త్రహస్యాలను కూడా శ్రీదేశికు

లుట్టంకించారు. అంతర్చ్య స్తెర్మణిఖిరుదితం పాదుకే రంగబంధా మందం మదం నిహితచరణే మంజులం తే నినాదం | పశ్యన్వాదిక్రమపరిణతేః ప్రాక్తనీం తాం పరాయా మన్యే మిత్రావరుణవిషయాదుచ్చరన్తీమవస్థామ్‌ ॥॥ శ్రీరంగనాథుడు మెల్లమెల్లగా పాదాన్ని ఉంచుతూ ఉంటే మణిపాదుకలో

ప్రత్యుష్తాలైన మణులవల్ల మంజులమైన నాదం ఆవిర్భవిస్తున్నది. ఈ నాదావిర్భావం

“పశ్యన్తి మొదలైన క్రమ విపరిణామానికి మూలమైన 'పరా' అని చెప్పబడే స్పంద

డగ పాదుకాసహప్ర ప్రద్యోతం శూన్యము బిందురూపము అయిన నాదం మిత్రావరుణస్థానమైన నాభిదేశంనుండి ఆవిర్భవించే టప్పుడు ఏర్పడిన హృదయారూఢ శబ్బావస్థగా మేం భావన చేస్తున్నాం అంటున్నారు దేశికులు. శ్రీభాగవతశ్రీధరీయ వ్యాఖ్యలో సాంబపంచాశికాగతాలైన ఈ వచనాలను మనం ్రస్తుతంలో ప్రమాణంగా చెప్పుకోవచ్చు. యా సా మిత్రావరుణసదనాదుచ్చరస్తీ త్రిషష్టిం వర్ణానత్ర ప్రకటకరణైః ప్రాణసంగాత్‌ ప్రసూతే | తాం పశ్యస్తీం ప్రథమముదితాం మధ్యమాం బుద్ధిసంస్థాం వాచం చక్రే కరణవిశదాం వైఖరీం చ ప్రపద్యే ॥1 అని. మిత్రావరుణస్థానం అంటే నాభిప్రదేశం. అక్కడ సూక్ష్మంగా ఆవిర్భవించిన ఏ పరానాదం, క్రమంగా హృదయంలో పశ్యన్తిని, కంఠంలో మధ్యమనాదాన్ని ముఖంలో ఆ యా అవయవాల ద్వారా వైఖరీనాదాన్ని ఆవిర్భవింపజేసి అక్షరోత్పత్తికి మూలమవు తున్నదో ఆ మూలనాదాన్ని అంటే పరవాక్కును శరణవేడుతున్నానన్న ఈ భావననే శ్రీదేశికులు మణిపాదుకా మంజుద్వనికి అన్వయించి మనోజ్ఞంగా వర్ణించారు. సర్వవైదికశబ్దాలూ శ్రీరంగనాథ పాదకమలాన్నే వృత్తిభేదంచేత ప్రతి పాదిస్తాయి. ఈ పదసరసిజ బోధకత్వంలో వాటికి ఐకకంఠ్యమే ఉంది. ఈ తత్త్వాన్ని ఎరుగలేన్స మందబుద్ద్ధులకు, స్వామిపాదాలనే స్పృశించి ప్రమాణంచేసి మరీ నీవు చెబుతున్నావు ఓ మణిపాదుకా! అని కీర్తిస్తున్నారు దేశికులు '“విష్టోరస్మిన్‌' అనే శ్లోకంలో. 'తవాంబ కిల ఖేలతాం” అనే (99వ) శ్లోకం గంభీరమైన వైదికసయూథ్యకలహాన్ని మనోహరంగా సూచించింది. శ్రీరంగనాథమణిపాదుకలోని మణులు మనోజ్ఞంగా ధ్వనిస్తుంటే ఆధ్వనులలో భగవత్‌స్తావకులకు మణిపాదుకా ప్రభావసిద్దాన్తులతో పాటు సయూథ్యకలపహ్రం ఏర్పడిందట. ఎందవల్ల : మణినాదాలలో కొన్ని స్వామియొక్క చరణాలను స్తుత్రిస్తుంబ్రే మరి కొన్ని మణిపాదుకా ప్రభావాన్ని స్తుతిస్తున్నాయట. భగవత్‌ స్తుతి ప్రతిపాదక్షాల్సుగా వైదికవాక్కులను మణిపాదుకామణులనాదం ఆవిర్భవింపచేస్తుంటే, ఆశ్రుతివచనాలనే పాదుకా ప్రభావపరాలని మరికొందరు వ్యాఖ్యానింపగా కలహం ప్రారంభమైంది. దీన్నిబట్టి శ్రుతివచనాలకు భగవత్‌ స్తుతి పరత్వమూ, మణిపాదుకా ప్రభావ పరత్వమూ రెండూ ఉన్నదని స్పష్టపడుతున్నది. ఈ శ్లోకాన్ని గమనించండి.

పాదుకాసహప్ర ప్రద్యోతం ఉర్‌ తవాంబ కిల ఖేలతాం గతివశేన గర్భాశ్మనాం

రమారామణపాదుకే! కిమపి మంజుభిః శింజితైః ॥

పదస్తుతివిధాయిఖిః త్వదనుభావసిద్దాన్తిఖిః

సయూథ్యకలహాయితం (శ్రుతిశతం సమాపద్వతే

ఈ శ్లోకం గంభీరమైన భావాన్ని వ్యక్తపరుస్తున్నది. అసలు సయూథ్య కలహం ఏమిటో సాంప్రదాయికాచార్యులు వివరించారు -

“కవిస్పర్ధ' అని ఇతరులు భావించేలా 'ఒకానొక పదకమల సహస్రనిర్మాణఘోషు ఏర్పడిందట. శ్రీరంగనాథుని పారిషదులు మహామహిమాన్వితులు భగవద్దుణాను భవంలో ప్రవర్తించారట. కొందరు భగవద్గుణాలలో జ్ఞానశక్తి శౌర్యసంపద పరత్వ సౌలభ్యాదులు ఎన్నో ఉండగా, వీటిలోను రామవీర్యం, కృష్ణపరాక్రమం ఇలా ఎన్నో అవాంతరగుణ భేదాలుండగా, ఇంకా భగవన్మూర్తి భేదాలు, భగవచ్చేష్టాభేదాలు ఇలా ఎన్నో విశేషాలలోని రసాస్వాదంలో అఖభినిష్టులై శ్రీరంగనాథ పారిషదులు ప్రవర్తించారట. అయితే ఇదే మిషగా తీసికొని మరికొందరు శ్రీరంగనాథ ప్రభావ ప్రకాశమే కావాలని కోరుతూ శ్రీదేశికులను నిర్బంధించి పాదుకా సహ(్ర నిర్మాణప్రతిజ్ఞను చేయించారట. సదస్సులో - పదసహ'్రం - పాదుకాసహస్రం ఈ రెంటినీ వినే కుతూహలం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఇతరులను కూడా తమకు అభీష్ట్రాలైన విషయాలలో శ్లోకరచనానికి పురికొల్సి తాము ఆయా పక్షాలను ఆశ్రయించి స్పర్ధను పెంచారట. వాస్తవానికి భగవద్దుణాలలో తేడా లేకపోయినా, వాటిని ప్రతిపాదించే కవితాశైలిలో రుచిభేదం ఉండవచ్చు కనుక, దాన్ని బట్టి ఈ స్పర్ధ పెరిగి హెచ్చుతగ్గులు భావించే స్థితి ఏర్పడింది. శ్రీరామ శ్రీకృష్ణ తారతమ్య స్పర్ధను శ్రీవిష్ణు చిత్తులు వర్ణించారు. (3-9) కనుక, పాదుకాసహస్ర నిర్మాణం విషయంలో “ఆచార్య పరస్పర కలహాన్ని” గురించిన వార్తలు (శ్రద్ధేయాలు కావని, కేవలం భగవద్దుణానుభవ వైభవాఖినివేశాన్ని మాత్రమే ఈరచన ఆవిష్కరిస్తున్న దని పెద్దల సంవాదం. అయితే జరిపిన స్పర్ధలో సిద్ధాన్త నిర్ణయ చర్చలో భగవద్దుణకీర్తనం కంటే భాగవత గుణకీర్తనం సర్వాతిశాయి అని పర్యవస్తిస్తున్నది. ఈనాదపద్ధతిలో దేశికులరచనా వైభవం నిరతిశయ కాష్టను పొందింది. ఇందులో 100 శ్లోకాలు నిబంధింపబడ్డాయి.

46 పాదుకాసహపప్ర ప్రద్యోతం ఇదే పద్ధతిలో -

  1. రత్నసామాన్య పద్ధతి - ఇందులో పాదుకాప్రత్యుప్తమణిప్రభావవర్ణనం-

దిదృక్షణమాస్య పరం నిధానం స్నేహాన్వితే యోగదశావిశేషే ।

సంపత్రదీపం మణిపాదరక్షే సంధుక్షయన్తీవ మరీచయస్తే ॥

ఇత్యాదిగా స్పృహణీయంగా సాగింది. 50 శ్లోకాలు.

  1. బహురత్నపద్ధతిలో కూడా 50 శ్లోకా లుపనిబద్ధాలు.

  2. పద్మరాగపద్ధతి 18) ముక్తా పద్ధతి 19) మరకతపద్ధతి .20) ఇంద్రనీలపద్ధత్త _ ఇంతవరకు వివిధ రత్న(ప్రత్యుప్త మణిపాదుకారత్నప్రభావం వర్ణింపబడింది. వివిధ కల్పనాశిల్ప చాతుర్యం ఈ పద్ధతుల్లో విశేషంగా కనిపిస్తుంది.

  3. ప్రతిబింబపద్ధతిలో వివిధ ప్రతిబింబవైచిత్రి విలక్షణంగా వర్ణింపబడింది.

స్వామి గరుడస్థడు కాగా ఇంద్రాది దేవతలు వాహనస్థులైనారట. స్వామి తన పాదరక్షలు ధరింపగా, వారంతా వాహనాలు దిగి భూమిపైనుండి సేవిస్తున్నారట. అయితే వారి బింబాలు రత్నపాదుకలలో ్రతిఫలించి వారు పాదుకారూధులైనట్లు గోచరిస్తున్నారట.

భగవతి గరుడస్టే వాహానస్టాః సురేంద్రాః

త్వయి వినిహితపాదే భూమిమేవాశ్రయన్తి ॥

తదపి చరణరక్షే రత్నజాలే త్వదీయే

ప్రతిఫలితనిజాంగాః తుల్యవాహా భవన్తి ॥ (21-15)

  1. కాంచన పద్ధతి - పాదుక కాంచనమయంగా విచిత్రకల్పనాపురస్సరంగా వర్ణింపబడింది. 20 శ్లోకా లున్నాయి.

  2. శేషపద్ధతిలో - ఇంతవరకు పాదుకామూర్తిని వర్షించి, ఆమూర్తి యందున్న దెవ్వరను సందేహం నివృత్తంచేస్తూ సాక్షాత్‌ శేషుడే పాదుకాంతరస్థుడైన జీవుడని వర్ణిస్తున్నారు దేశికులు. ఆచార్యాగ్ర్యులైన శ్రీమద్యామునులు ఆదిశేషుని వివిధ మూర్తులలో 'పాదుకి కూడా ఒక మూర్తియేనని వర్ణించారు - “నివాసశయ్యాసన పాదుకాంశుకి ఇత్యాది శ్లోకంలో.

పాదుకాసహప్ర ప్రద్యోతం తా సాక్షాత్‌ శేషుడే పాదుకావతారాన్ని ధరిస్తే, ఆ పాదుకలను శిరస్సుపై దాల్చిన వారిలో శేషత్వం పరాకాష్ట చెందినట్లే గదా అంటారు. (28.8) మణిపాదుక శేషత్వ సీమనియత మంటారు. సాక్షాత్తూ పాదుక శేషమూర్తి అయినప్పటికీ, భరతుని శిరస్సుపై ఉన్న పాదుకకు శేషమూర్తి అయిన లక్ష్మణుడే నమస్మరించినాడట. ఇందులో విచిత్రత లేదంటారు. ఎందువల్లనంటే స్వయంగా శ్రీరంగనాథుదే, రామావతారంలో తాను రాముడై, ఇక్ష్వాకు కులధనంగా తననే ప్రణమిల్లాడు కదా! 2) ద్వంద్వపద్ధతిలో పాదుకాగతమైన యుగలభావనను *“ఓమ్‌' అనే ('ప్రణవంలోని రెండు కళలుగా వర్ణించారు దేశికులు. ప్రపద్యే పాదుకారూపం ప్రణవస్య కలాద్వయమ్‌ । ఓతం మితమిదం యస్మిన్‌ అనన్తస్యాపి తత్పదమ్‌ ॥ 25) ఇలాగే పాదుకాసన్నివేశ పద్ధతి 26) యాంత్రికపద్ధతి 27) రేఖాపద్ధతి 28) సుభాషిత పద్ధతి 29) ప్రకీర్ణ పద్ధతి 30) చిత్రపద్ధతి 31) నిర్వేదఫద్ధతి 82) ఫలపద్ధతి. ఇలా 82 పద్ధతుల్లో పాదుకాసహస్రం సంస్కృతవాజ్మయంలో చాలా విలక్షణ స్థానాన్ని పొంది ఉంది. దీన్ని పారాయణ చేసే విధానం ఒకటి ఉంది. ఒక్కొక్క ఫలాన్ని ఆశించి ఒక్కొక్క పద్ధతిని పారాయణం చేయవచ్చు. ఎలా? ఈ క్రింది శ్లోకాలను గమనించండి-

  1. కవిత్వప్రౌఢికాంక్షాయాం పాఠ్యా ప్రస్తావపద్ధతిః | సూరిసూక్తరసాస్వాదం సమాఖ్యాపద్ధతిర్దిశేత్‌ ॥
  2. _ ప్రభావపద్ధతిః స్పేవ్యా ప్రభుత్వోన్నతివాంఛనే | అపవాదపరీహారః స్యాత్‌ సమర్పణ సేవయా ॥
  3. _ ప్రేస్స్పితం లభయేత్‌ పుంసః ప్రతిప్రస్థానపద్ధతిః | అపేక్షితే౭_ ధికారీ స్యాత్‌ అధికారపరిగ్రహాత్‌ ॥ 4 సుభిక్షమభిషేకాత్‌ స్యాత్‌ దానం నిర్యాతనీఫలమ్‌ । వందిశృంగారతో భోగే సంచారాద్‌ యాత్రికే సుఖమ్‌ ॥

గరి పాదుకాసహప్ర ప్రద్యోతం 5, పుష్పాత్‌ పుష్పార్చనం శక్యం పరాగాదపరాగతా | వాదవ్యాఖ్యానసంగీతదాక్ష్యదా నాదపద్ధతిః ॥ 6 రత్నస్వర్థాదిలిప్సూనాం రత్నపద్ధతయః శుభాః । పుత్రాదిలాభో బింబాత్‌ స్యాత్‌, శేషాత్‌ శ్రీకాంతశేషతా 1 7. వివాహో ద్వంద్వ పద్ధత్యా సంనివేశాత్‌ సురూపతా । యంత్రికా భూషణం దద్యాత్‌ రేఖా లేఖనకౌశలమ్‌ ॥ 8& ఫలం సర్వం ప్రకీర్దాత్‌ స్యాత్‌ చిడ్రాత్‌ స్యాత్తు విలక్షణః | వైరాగ్యభాక్‌ స్యాన్నిర్వేదాత్‌ ముక్తిభాక్‌ ఫలపడద్ధతేః ॥ 9, _ శ్రీపాదుకాసహస్రస్య నిత్యం పారాయణే రతాః | సర్వసంపత్సమృద్దాః, స్యుః గురుశ్రీశప్రసాదతః ॥ 10. శ్రీరంగనాథశ్రీదివ్యపాదుకాభాం నమో నమః । వేదాన్తదేశికశ్రీమత్‌పాదుకాభ్యాం నమో నమః ॥ ॥ శుభమ్‌ ॥ హంద్యూ € సాను గ. కన స | న... స్‌? టో

గ్‌ 6 [౫ స్ట