Telugu Nruthnaratnavali Rochi - anilvaranasi/indianlanguages GitHub Wiki
- శృళైకత్యాడక రౌచి , ప [ క్ట . ఇ _ ” సంపాదకుడు న ళ్ డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు ప అ) “ట్రం పున గుక్కువతోన్ల ఫ్ లీ. సో పస్తకాన్ల సాహ్హా “నరించ్యి (| శ | స గ ఆది స్ష తా | . ౦ధరయ్య్య విజ్ఞాన క్ష *ళూనుల క్యా . పతీ “ందంతో బ్య డానికి . య సొకరిన్తున్నా ం ॥ 1 | షక మం! ర్ల] ల
- +. కుటుం్వు ష్ టి క . ఢి 4 (కే అడ అన మ వ. సంస్కృతభాషా ప్రచార సమితి " థ్స్ళ ల్: .. క్ష క శ
రజతోత్సవ[గ్రంథమాల - దశమకుసుమం నృత్తరత్నావళి రోచి సంపాదకులు పుల్లెల శ్రీరామచంద్రుడు దాః బి. వాణి [౦౮610 54091611 సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ, 'హైదరాబాదు. సంస్కృతభాషా ప్రచార సమితి హైదరాబాదు ఇగ్రిగిడ
నృత్త రత్నావళి రోచి శల ర్ట ఖరో “ఈ నో 'ప్రథమముద్రణ : 2004 వెల ; రూ. 25/-_ ప్రకాశకులు : సంస్కృతభాషా ప్రచార సమితి శి 5-4-743,సి, / ,/ నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, 1 హైదరాబాద్ - 5600 001. త్ క్షరాలకూర్చు : సందర గంరాలడా క అక్షరాలకూర్చు : "గూ. ఠంరేర జ ఫు! షీ టి కా నో హైదరాబాద్-500 016. ముద్రణ : శ్రీకళాంజలి గ్రాఫిక్స్ విఠల్వాడి, హైదరాబాదు - 500 029.
3 శ్రీః తొలిపలుకు
వివిధవిద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహిస్తూన్న జి. పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్టుకు అనుబంధసంస్థగా సంస్కృతభాషాప్రచారసమితి హైదరాబాదు నగరంలో, 1978లో స్థాపించబడింది. నాటి నుండి ఈ సమితి ఆంధ్రప్రదేశంలో సంస్కృత భాషాప్రచారకార్యం అవిచ్చిన్నంగా సాగిస్తూన్నది. సమితి చేపట్టిన ప్రధాన కార్యక్రమం క్రమబద్ధరీతిలో రూపొందించిన ఏడు సంస్కృతపరీక్షలు నిర్వహించి తద్ద్వారా పాఠశాలా-కళాశాలా విద్యార్థులకు, ఇతర సంస్కృతప్రియులకు సంస్కృతభాషను అభ్యసించదానికి తగిన అవకాశాన్ని కల్పించడం. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశం లోని వివిధవిద్యాస్థానాల్లో ఉన్న దాదాపు 250 కేంద్రాల ద్వారా నిర్వహింప బడుచున్నది.
సమితి పరీక్షానిర్వహణకార్యక్రమానికి అనుబంధంగా గ్రంథప్రచురణ కార్యక్రమం కూడా చేపట్టి నిర్వహిస్తూన్నది. సంస్కృతభాషాసాహిత్యాలకు సంబంధించిన గ్రంథాలను తెలుగుభాషద్వారా తెలుగువారికి అందించడం దీని (ప్రధానలక్ష్యం. ఈ కార్యక్రమానికి సంస్కృతభాషాశద్ద్ధాలువులనుండి ప్రోత్సాహం లభించడం సమితికి ఆనందజనకం.
ఈ సంవత్సరంలో (2003-2004) రజతోత్సవం జరుపుకొంటూన్న సమితి సుప్రసిద్ధులైన సంస్కృతవిద్వద్విదుషీమణులచేత సంస్కృతసాహిత్యానికి సంబంధించిన, ఆ యా కవులను, వారి కావ్యాలను పరిచయం చేసే ఇరవైయైదు లఘు గ్రంథాలను వ్రాయించి ప్రచురిస్తున్నది. ఈ సాహిత్యయజ్ఞంలో ఆర్వ్విజ్యం వహించినవారందరికీ మా కృతజ్ఞతలు.
ఈ రజతోత్సవగ్రంథమాలాదశమకుసుమంగా శ్రీమతి డా. బి.వాణి రచించిన నృత్తరత్నావళిరోచి అనుగ్రంథమును ప్రచురిస్తున్నాము. దీనిని సంస్కృతాభి మానులందరు ఆదరించగల రని విశ్వసిస్తున్నాము. సంస్కృతభాషాప్రచారసమితి, పుల్లెల శ్రీరామచంద్రుడు హైదరాబాద్. కులపతి
టే సంస్కృతభాషా ప్రచారసమితి హైదరాబాదు కార్యనిర్వాహకసంఘసభ్యులు 1 శ్రీ జి. పుల్లారెడ్డిగారు, అధ్యక్షుడు 2. మహామహోపాధ్యాయ డా. పుల్లెల ' శ్రీరామచంద్రుడుగారు, కులపతి 8. _ డా. కే. రాజన్నశాస్రిగారు, ఉపకులపతి & శ్రీ చలమచర్ల వేంకటశేషాచార్యులుగారు, కార్యదర్శి 5... శ్రీ పి. రామకృష్ణగారు, సభ్యుడు 6. శ్రీ ఆర్.రామానుజాచారిగారు, సభ్యుడు 7 శ్రీ పి.వేంకటేశ్వర్లుగారు, సభ్యుడు & శ్రీ బి.యన్.రెడ్డిగారు, సభ్యుడు 9. శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తిగారు, సభ్యుడు 10. శ్రీ ఆర్.వి. శేషాచార్యులుగారు, సభ్యుడు 11 శ్రీ వై. నాగభూషణరెడ్డిగారు, సభ్యుడు 12 శ్రీ పి. సుబ్బారెడ్డిగారు, సభ్యుడు
నృత్తరత్నావళిరోచి
అనంత విశ్వంలోని చరాచర జీవులన్నీ నిత్యచైతన్య స్వరూపములే. జలజల పారే నదులు, కలకల రవళించే పక్షులు, నిర్భరగాంభీర్యాన్ని నిశ్వసించే పర్వత శ్రేణులు, ఆకులు అలములు అన్నీ కూడా చైతన్యవంతములే. తొలి మానవుడు ఈ నిత్యచైతన్య స్రవంతిని చూచి, పరవశించి ఆడి, పాడి ప్రకృతిలో సమైక్యమైపోయి ఉండి ఉంటాడు. ఆతని ఆటలే నృత్తమై ఉండవచ్చు. పాటలే గీతములై ఉండవచ్చు. మనోవికారహావభావ ప్రకటనలే నాట్యమైఉండవచ్చు. అయితే ఈ సృష్టిలో వాక్కు ముందా? వాగనుగుణమైన అభినయం ముందా? అని (ప్రశ్నించుకుంటే సమాధానం దొరకడం కొంత కష్టం. సామాన్యదృష్టికి అభినయమే ముందు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో భావవ్యక్తీకరణకు అభినయం ప్రధానంగా తోడ్పడుతుంది. వాక్కు లేకుండా కేవలం అభినయం ద్వారా భావవ్యక్తీకరణ సాధ్యమవుతుంది గానీ అభినయం లేకుండా వాక్కు సామాన్యంగా ఉండదు. ఏదో ఒక విధమైన భావప్రకటన తప్పనిసరిగా ఉంటుంది. అభినయం ద్వారా భావప్రకటనను శాస్త్రనిబద్ధం చేసారు పూర్వ బుషులు. ఇలా జీవకోటి చలన సంచలనాలే నృత్త నృత్య నాట్యములై ప్రవర్తిల్లినవి.
భరతముని నాట్యశాస్తాన్ననుసరించి నృత్తమనాది. పరమేశ్వరుని సృష్టి నాట్యము బ్రహ్మసృష్టి భరతముని నాట్యోత్పత్తిని గురించి ఇలా వివరించాడు. దేవతలు కోరిన విధంగా బ్రహ్మ నాట్య వేదాన్ని సృష్టించాడు. అది దృశ్యమై, (శవ్యమై వినోద యోగ్యమైన పంచమవేద మైంది. ఈ నాట్యవేద సృష్టికి బ్రహ్మ పాఠ్యాన్ని బుగ్వేదం నుండి, గీతాన్ని సామవేదంనుండి, అభినయాన్ని యజుర్వేదం నుండి, రసాన్ని అథర్వణ వేదం నుండి గ్రహించాడు. ఇలా నాల్గు వేదాల సారాన్ని ఇందులో పొందుపరచాడు. ధర్మమును ్రతిపాదించేది, యశస్సునిచ్చేది, భవిష్యల్లోకానికి సర్వకర్మానుదర్శిని అయినది, సర్వశాస్త్ర సంపన్నమైనదీ, సర్వశిల్ప ప్రవర్తకమైనదీ, ఇతిహాసమైనదీ ఈ నాట్యవేదం. అందుకే భరతముని *న తత్ శాస్త్రం న సా విద్యా అంటూ నాట్యానికి అంగం కానిది ఏదీ లేదు అని కీర్తించాడు. వేదములందలి జ్ఞానమును అనుశాసనబద్ధము చేసి శిష్యపరంపరకు బోధించడానికి భరతమహర్షి 'నాట్యశాస్త్ర నిర్మాణం సలిపాడు. వేద రహస్యముల నెరిగినవారు,
6 నృత్తరత్నావళిరోచి సంభ్రిత వ్రతులు, అయిన భరతపుత్రులు, గ్రహణ, ధారణ ప్రయోగములలో సమర్థులు కూడా అవడం చేత, లోకహితము కొరకు ఈ నాట్యాన్ని ప్రదర్శించి, ప్రవర్ధిల్ల చేసే గురుతర బాధ్యత (కార్యము) వారిపై ఉంచబడింది. ఆ విధంగా నాట్యవేదాన్ని అభ్యసించిన భరతపుత్రులు దేవేంద్రసభలో నృత్తగీత అభినయాది సమ్మేళనముతో, తాము అభినయము, అప్సరలు నృత్తము, స్వాతి వాద్యము, నారదాదులు గానము చేయుచుండగా నాట్య ప్రయోగం సలిపారు. ఈ నాట్యము కేవలము దేవతలకొరకే కాక ముల్లోకముల వారి సర్వస్వభావములను ప్రదర్శించుచు ధర్మాధర్మములను బోధించునది, దుఃఖార్తులకు, (శ్రమార్తులకు, శోకార్తులకు విశ్రాంతి కలిగించునది అయినది. నానాభావోప సంపన్నము, నానావస్థాంతరాత్మకము, లోకవృత్తాను కరణము అయిన నాట్యమున దేవతలు, రాక్షసులు, రాజులు, కుటుంబీకులు (బ్రహ్మర్నుల చరిటతలు, వివిధవేద శాస్త్రధర్మార్ధములు కూడా వినోద జనకముగా ప్రదర్శింప బడతాయి. ఈ విధంగా సుఖదుఃఖ సమన్వితమైన లోకస్వభావమును ఆంగిక అభినయముల ద్వారా ప్రదర్శించుట నాట్యమనబడదును.
యో౬యం స్వభావో లోకస్య సుఖదుఃఖసమన్వితః |
సో౭_ంగాద్యాభినయోపేతో నాట్యమిత్య ధీయతే ॥ (నా.శా..
భరతమునికి పూర్వము కేవలము నృత్తశబ్బము మాత్రమే వాడుకలోనున్నట్లు తెలియుచున్నది. నృత్తము కేవలము అంగవిక్షేపము మాత్రము. అర్ధబోధకము గాదు. నాట్యము అట్లుగాక చతుర్విధాఖినయములతో అర్ధబోధక మగుచున్నది. ఈ రెండింటి కలయిక నృత్యమగుచున్నది. అనగా నృత్యమందు నృత్తమందలి అంగవిన్యాసము, నాట్యమందలి చతుర్విధాభఖి నయములుండును. 'నృత్ ధాతువునుండి నృత్తము, 'నటొ ధాతువునుండి నాట్యము అనుపదము లుత్పన్నము లైనవి. కేవలము లయాశ్రయమై, విలాసముగ వివిధ అంగముల నాడించుట నృత్తము. అభినయాశ్రయమై మహర్షులచే ప్రచారము పొందినది నాట్యము. భావాశ్రయమై పదార్థములనభినయించునది నృత్యము. ఇందులో నాట్యము నాట్యవేదము నుండి జనించినది. మహర్షుల ఆదరణ పొందినది. సజ్జనులచే ప్రదర్శింప బడినది. కనుక 'మార్గము' అని పేర్కొనబడినది. ఈ నాట్యములో అభినయము నందు ఏదేని కొరత ఏర్పడిన, దానిని పూరించుటకు అంగవిక్షేప
నృత్తరత్నావళిరోచి 7 మాత్రమైన నృత్తము ప్రయోగింపబడుచున్నది. అంతేగాక పూర్వరంగ మందు ప్రయోగింపబడి నృత్తము నాట్యమున కుపకరించునది అగుచున్నది. ఈ నృత్తము బహులక్షణములు కలిగి యున్నది.
స్త్రీ - పురుష జనోచితమైన జగత్కల్యాణకారకము లైన ఈ నృత్త-నృత్య- నాట్యములు భారతదేశంలో అందునా ఆంధ్రదేశంలో బహుళ ప్రచారంలో ఉన్నట్లు అనేక ఆధారాలు లభ్యమవుతున్నాయి. రాజులు సంగీత సాహిత్య కళాకోవిదులకు తమ ఆస్థానంలో ఉన్నతస్థానం కల్పించి, సగౌరవంగా పోషించేవారు. అందువల్ల సమస్త విద్యలు సర్వతోముఖాభివృద్ధి పొందడం, తద్ద్వారా ప్రజలు చిత్రకళా నైపుణ్యం, శిల్పకళా చాతుర్యం, నాట్యకౌశలం కలిగి ఉండడం సాధ్యమైంది. అనేక రచనలు, పరిశోధనలు, ప్రదర్శనలు, పోటీలు కోకొల్లలుగా సలుపుతూ ఉండేవారు. ప్రజలు వివేకవంతులై, విజ్ఞాననిధులై ఆదర్శవంతమైన సుఖజీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఆనాదేకాదు, నేడుకూడా రాజులు (ప్రభుత్వం), శ్రీమంతులు, రసికులు వివాహాది శుభసమయములందు, పర్వదినములందు, ఉత్సవ సమయములందు ఈ కళా ప్రదర్శనలు జరిపించి ఆనందించడం, దేశదేశాలకు మన కళాకీర్తిని వ్యాపింప చేయడం చూస్తూనే ఉన్నాం. భరతసారం యిలా పేర్కొంది.
ద్రష్టవ్యే నాటనృత్యే చ సర్వకాలే విశేషతః,
నృత్యం తత్ర నరేంద్రాణామభిషేకమహోత్సవే,
యాత్రాణాం దేవయాత్రాయాం వివాహే ప్రియసంగమే,
నగరాజణామగారాణాం ప్రవేశే పుత్రజన్నని.
శుభార్థిఖిః ప్రయోక్తవ్యం మాంగల్యం సర్వకర్శసు.
నాట్యనృత్యములు సర్వసమయము లందు చూడదగినవి. ప్రభువుల అభిషేక మహోత్సవ సమయంలో, యాత్రలందు, దేవయాత్రలందు, వివాహాది శుభ సమయములందు, నగర, గృహ ప్రవేశసమయములందు, పుత్రజన్మమునందు నృత్యము తప్పనిసరిగా ప్రయోగింపవీలెను.
ఈ విధముగా నృత్యం-నృత్తం, నాట్యం అనాదినుండి అవిచ్చిన్నంగా పరంపరగా సాగుతూనే ఉన్నాయి. లలితకళలన్నీ స్వతంత్రరాజుల సమక్షంలో
8 నృత్తరత్నావళిరోచి సంపూర్జాభివృద్ధిని పొందినాయి. తంజావూరు రాజులు తొలి ఆంధ్రరాష్ట్రపాలకులు, కళలను కళాకారులను విశేషంగా పోషించారు. శాతవాహన రాజుల కాలంలో బౌద్ధమతం విసృత ప్రచారం పొందిన సమయంలో, ప్రజలు తామారాధించే బుద్ధ భగవానుని శిల్పాలు, చిత్రాలు చిత్రించారు. సంగీత నృత్యాలతో కీర్తించారు. కావ్యగానాలతో అలరించారు. అమరావతి, నాగార్జున కొండలలోని పాలరాతి శిల్పాలలో, నాట్యభంగిమలు, నాట్య సంప్రదాయాలు మలచబడ్డాయి. అమరావతి లోని బృందనాట్యమండలిలో ఒక్కొక్క నర్తకి ఒక్కొక్క కరణాన్ని భావాన్ని భంగిమనీ సూచిస్తూ న్నట్లు చిత్రాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో నృత్యప్రదర్శనకు ప్రతిశివాలయంలో మూలవిరాట్టుకు ఎదురుగా ఒక వలయాకారపు పీఠము, రాతిది ఏర్పరచి ఆలయాలు నిర్మించారు. ఆ పీఠము నర్తకి నృత్యపూజకు వేదికగా ఉండేది. నర్తకి ఆగమ శాటస్తాలననుసరించి నృత్యవిద్యలో శిక్షణపొంది లింగధారణచేసి (శివాలయంలో నృత్యంకొరకు) లేదా శంఖ-చడక్ర ముద్రలు వేసి (వైష్ణాలయంలో అయినట్టైతే) అర్హత కలిగించిన పిమ్మటనే నాట్యం చేసేది. అసలు, క్రీ.శ. ప్రారంభమునాటికే ఆంధ్రదేశంలో నృత్తగీతవాద్యాలు విశేష ప్రచారంలో ఉన్నాయనడానికి హాలుని గాథాసప్తశతే సాక్ష్యం. హాల శాతవాహనుడు క్రీ.శ. ప్రథమశతాబ్దికి చెందినవాడని చరిత్రకారుల నిర్ణయం. గాథాసప్తశతిలోని “పూచిన జనపచేను హరితాళ (అర్దళు మండిత ముఖముతో మెరిసెడి నటివతె అంద గించుచున్నది” లాంటి వర్ణనలు నృత్తం వారి జీవితంలో భాగమేనని భరతుని నాట్యశాస్త్రములో ప్రవృత్తి. ప్రకరణంలో (18వ అధ్యాయం) ఆంధ్రులు దాక్షిణాత్య ప్రవృత్తికి చెందినవారని, దాక్షిణాత్యులు బహునృత్త గీతవాద్య లలితాఖినయ ప్రియులని పేర్కొనబడింది. జాతిలక్షణ ప్రకరణంలో 28వ మధ్యమ (గ్రామాశ్రయములను పదకొండు జాతులలో 'ఆంధ్ర' ఒక జాతి (నేటి రాగము)గా వర్గికరింపబడింది. ఈ విధంగా నాట్యశాస్త్ర కాలంనాటికి ఆంధ్రదేశంలో నృత్తగీత వాద్యాలు సంపూర్ణవికాసదశలో ఉన్నాయని నిర్వివాదంగా తెలుస్తున్నది. క్రీ.శ. 8వ శతాబ్దంలో రచింపబడిన నందికేశ్వరుని అభినయదర్పణం 'వ్రాతపత్రులన్నీ తెలుగులిపిలోనే లభ్యమైనవట. బెంగాల్లోని విశ్వభారతిలోని వ్రాతప్రతి కూడా తెలుగులిపిలోనే ఉండడంబట్టి, అభినయదర్పణం ఆంధ్రదేశం
నృత్తరత్నావళిరోచి 9 లోనే రచింప బడిందనీ, నందికేశ్వరుడు తెలుగువాడని స్పష్టంగా నిర్ధారించవచ్చు. నాట్యశాస్తానికి అనుబంధం లాంటి అభినయదర్పణం తెలుగువారిచే రచింపబడడం మనకు గర్వకారణం కదా! అన్ని నృత్యసంప్రదాయాలకు మూలము ఈ అభినయదర్చణం. నందికేశ్వరుడు రచించినదే అయిన భరతార్జవంలో కూడా నృత్య సంప్రదాయరీతులు అనేకం వివరింప బడ్డాయి.
నందికేశ్వరుని తరువాత ఏడు, ఎనిమిది శతాబ్బ్దాలవరకు శాస్త్రప్రామాణిక (గ్రంథాలు లభ్యమవక పోయినా, ఆంధ్రదేశంలో నృత్త, గీతవాద్యాల అభివృద్ధి కే మాత్రము ఆటంకం కలగలేదన్న నిజాన్ని అమరావతి, నాగార్జునకొండ మొదలైన ప్రదేశాల్లో వెలువడిన శిల్పాలు, నన్నె చోడుని కుమారసంభవం (8 వ అధ్యాయం, 180వ పద్యం) పాల్కురికి సోమనాథుని పండితారాధ్యచరితము (పుటలు 4385-65) నిరూపిస్తూనే ఉన్నాయి.
చాళుక్యరాజైన గుణగణాదిత్యుడు క్రీ.శ. 948-92 గాంధర్వ విద్యా ప్రవీణుడు. అట్లే కవిగాయక కల్చతరు బిరుదాంకితుడు. రెండవ అమ్మరాజు (క్రీ.శ. 945-70) రాజరాజ కులోత్తుంగుని శాసనమువలన నానావిధనాట్యశాలలు కూడా నిర్మింపబడ్డాయని, వాని పోషణాదులకు తగిన ధనవసతులేర్చడినవని తెలుస్తున్నది.
నన్నెచోడుని కుమారసంభవములో నృత్తగీత నాట్యాదులు బహుధా ప్రశంసింపబడ్డాయి. 9వ ఆశ్వాసంలో (37-88) రంభ నాట్యాఖినయము, 8వ ఆశ్వాసంలో రతిలీలా వ్యాజమున లాస్యనృత్యము వర్ణింపబడంవలన కవులు, నృత్త ప్రావీణ్యం గలవారని ఊహించవచ్చు.
పాల్కురికి సోమనాథుని (క్రీ.శ. 12వ శతాబ్ది) బసవపురాణ - పండితారాధ్య చరితములలో సంగీత -నృత్య-నాట్యకారుల ప్రశంసలనేకం గోచరిస్తాయి. బసవ పురాణంలోని సంగయ్య కథలో (53-54) నృత్తవిధానము, కంచి ఏకామ్రనాథుని కథలో (59-60) శివుని తాండవస్వరూపము, సకలేశ్వరుని మాదిరాజయ్య కథలో (78-79) సంగీతశాస్త్ర ప్రశంస ఉన్నాయి. పండితారాధ్యచరితములో శివరాత్రి నాటి ఆటపాటలు, భరతశాస్త్ర ప్రశంన, నాటక ప్రదర్శనలు, మార్గ సంప్రదాయములు విస్తృతంగా చర్చించడం కనపడుతుంది.
10 నృత్తరత్నావళిరోచి
ఆంధ్రమహాభారత కర్తలలో ఒకరైన తిక్కన సోమయాజి అనువదించిన మహాభారత విరోటపర్వభాగంలో మూలంలో లేని కొన్ని నృత్య సంప్రదాయాలు, దండలాసకాది దేశీ నృత్యరీతులు సమయోచితంగా పేర్కొనబడ్డాయి. ఈ నృత్యరీతులు సంగీత సమయకర్త పార్య్వదేవుడు వివరించాడు. బృహస్పతి తనను తాను పరిచయం చేసుకొన్న సందర్భంలో (2389-41) దండ లాసక, కుండలి, పేరణి, ప్రేంఖణాది నృత్తరీతులు పేర్కానడాన్ని బట్టి, ప్రయోగ వైవిధ్యము గల నృత్యములు బహుళ ప్రచారములో నున్నట్లు, క్రొత్తరీతుల నెరింగినవారు చతురులై రాజాన్థానమున రాజును నిపుణతతో సేవించెడివారని తెలిస్తున్నది.
దేశినృత్యరీతులను నాచనసోమనాథుడు ఉత్తరహరివంశములో (4-216) భంగ్యంతరముగా పేర్కొన్నాడు.
శ్రీనాథుని భీమేశ్వర పురాణములోను, కాశీ ఖండములోనూ దేశీనృత్త ప్రశంసలు చోటు చేసుకున్నాయి.
నాయక రాజు రఘునాథనాయకుడు దేశీనృత్యాభిమాని. వాల్మీకి చరితము లోని (3-42) దేశీనృత్యప్రశంస, రంభోర్వశుల నృత్తకేశీవిలాస వర్ణన, వీటిని బట్టి నాటి కవులే కాదు రాజులు కూడా నృత్తగీతవాద్య నిపుణులని స్పష్టంగా తెలుస్తున్నది.
పూర్వచాళుక్యులలో మొదటి చాళుక్యభీముడు లలిత కళలను విశేషంగా పోషించాడు. కళ్యాణి చాళుక్యులలోని వాడైన విక్రమాదిత్యుని కుమారుడు మూడవ సోమేశ్వరుడు స్వయంగా నాట్యాచార్యుడు మాత్రమే గాక భిల్లవేషంధరించి 'కుండలి' నృత్యం ప్రదర్శించాడని, అదే 'గోండలి' అయిందని, ఆనాటి ప్తీలు, రాణులు కూడా నృత్తవిద్యలో ఆరితేరిన వారని ప్రతీతి. వీరు శిల్పవిద్యను, నృత్యవిద్యను ఎంతగానో పోషించారు. సామర్లకోట భీమేశ్వరాలయంలో చెక్కబడిన మండప స్థంభాలపైన గాయక నర్తకీమణుల శిల్పాలు వారికి సంగీత -నృత్య-శిల్పాది లలితకళల మీదగల మక్కువకు సజీవ తార్మాణాలు. ద్రాక్షారామ భీమేశ్వరాలయం లోను, సామర్లకోట దేవాలయంలోను ఉన్న కోలాటపు నర్తకీమణుల శిలాప్రతిమలు దేశీ, లాస్యాది నృత్త భేదాలను, వాటి పరిణతిని సూచిస్తున్నాయి.
కాకతీయుల కాలంలో లలితకళలకు అత్యంత ప్రాధాన్యం లభించింది.
నృత్తరత్నావళిరోచి [11 రాజులు, రాజబంధువులు మహామాత్యులు, సేనాపతులు కూడా స్వయంగా కళాపోషకులే గాక కళావేత్తలు, కళాస్రష్టలు కూడా. ప్రథమ ప్రతాపరుద్రుడు విద్యా భూషణ బిరుదాంకితుడు (1158-1195). గణపతిదేవుడు, (1199-1261 వరకు ప్రజారంజకంగా పాలించినవాడు). వీరిరువురూ కళాకారులకు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించి, కళలకు పెద్దపీట వేసారు. మహాభారత ఆంధ్రానువాదకుల లోని తిక్కన సోమయాజి కాకతిగణపతి దేవుని సందర్శించాడన్నది చారిత్రిక సత్యం. బృహన్నల నృత్తనైపుణ్యం, రాజాస్టానంలోని నాట్యాచార్యుల పదవులు, నాట్యప్రదర్శనలకు తగిన భవన నిర్మాణాలు ఇత్యాది నృత్తనాట్య సంబంధిత విషయాలు నాటి నృత్త నాట్య ప్రాచుర్యాన్ని సూచిస్తున్నాయి.
అంతేగాక, కాకతి గణపతి దేవుడు తన బావమరిది అయిన జాయనకు నృత్తశాస్త్ర కోవిదుడైన మంత్రి గుండయామాత్యుని వద్ద శిక్షణ నిప్పించి, నృత్య పారంగతుని చేసాడు. ఆతని కోర్కెననుసరించి జాయన క్రీ.శ. 1253-54లలో “'నృత్తరత్నావళి' అనే నృత్తశాస్త్రగ్రంథాన్ని రచించాడు. దీనిలో భరతు ననుసరించిన నృత్తవివరణమే గాక, నాటి దేశీసంప్రదాయా లన్నింటినీ కూడా శాస్త్రబద్ధంచేసి నాట్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళికి ('ప్రముఖస్థానం ఏర్పరచాడు. నేడు అనేకమంది నృత్తవిద్యా విశారదులు నృత్తరత్నావళిని యథాతథంగా అనుసరించి ఉన్నారనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు.
కాకతిప్రభువులలో సుప్రసిద్ధుడైన ఈ గణపతిదేవుని కాలంలోను, రెండవ ప్రతాపరుద్రుని (1290-1326) కాలంలోనూ నాట్యకళసంపూర్ణ ఆదరణకు నోచుకొని, బహుముఖాల విస్తరించింది. కవి, పండిత, సంగీత, కళావేత్తలైన ప్రభువులు వివిధ కళాకారులని అనేక విధాలుగా సన్మానిరిచారు, గౌరవించారు. రాజబంధువులు, మవామాత్యులు, సేనానులు, ధనవంతులు కూడా తమహప్రభువులవలె స్వయంగా వివిధకళావేత్తలై కళాపోషకులైనారు. దేవాలయాలకే పరిమితమైన నర్తకీమణులకు గృహదానాలు చేసినట్లు పిల్లలమర్రి శాసనం (00/౮౩ 1౧90710100 37)లో వ్రాయబడింది. పానగల్లు శాననంలో మ్రైలాంబ నృత్తసంగీతకారులకు గృహదానాలు చేసినట్లు వ్రాయబడింది (36) అలాగే ధర్మసాగరశాసనంలో (1) నాట్యగత్తెలకు భూదానాలు చేసినట్లు, చేబ్రోలు శాసనంలో జాయసేనావతి వదహారుమంది ఆట గత్తెలకు గృహదానాలు చేసినట్లు
12 నృత్తరత్నావళిరోచి పేర్కానబడింది (5౯0 1౧6. ౪౦1౪ 38). రుద్రమదేవి మల్కాపూరు శాసనంలో పది మంది దేవాలయంలో నృత్యం చేయుటకు పదునాలుగు మంది గానం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లుగా ఉంది. శాసనాలలో మాత్రమే గాదు వారు కట్టించిన దేవాలయాలు, వానిలోని శిల్పాలు కూడా సాక్ష్యాధారాలుగానే ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వేయి స్తంభాలగుడి, రామప్పగుడి దీనికి తార్కాణాలు. ప్రత్యేకించి రామప్పగుడి మంటపంలో త్రిభంగీ నాట్యభంగిమలో నల్లరాతి నాట్యగత్తెల శిల్పాలు చెక్కబడ్డాయి. గణపతిదేవుని సేనాని, మంత్రి అయిన రేచెర్ల రుద్రదేవుడు క్రీశ. 1218లో ఈ దేవాలయాన్ని నిర్మించాడు. నృత్తశాస్త్రగ్రంథాలకు మణిభూషణం వంటి నృత్తరత్నావలియందు పేర్కొన్న అనేక సంప్రదాయాలు నృత్తభంగిమలు ఈ దేవాలయం శిల్పాలలో ్రతిబింబిస్తూంటాయి. వీరికాలంలో శైవసంప్రదాయవిద్య విరివిగా ప్రచారంలో ఉన్నట్లు రామప్పదేవాలయంలోని వినాయకుని నృత్తభంగిమలు నిరూపిస్తున్నాయి.
జాయన అయ్యకుల సంజాతుడు. పిన్నచోడన పుత్రుడు. ఇతని తాత ముత్తాతలది వెలనాడులోని కొయ్యూరు. ఈతని తండ్రితాతలు చందవోలు రాజధానిగా తెలుగుదేశాన్ని పాలించిన వెలనాటి చోళమహీపతులను సేవించారు. జాయన తాత నారాయణ నాయకుడు జనావాసమున కయోగ్యమైన దీవియందు గొప్పనగరమును నిర్మించి ప్రజలను స్వతంత్రరాజుగా పాలించాడు. కానీ క్రీ.శ, 1208లో కాకతి గణపతిదేవుడు, ఈ నగరంపై దండెత్తి జాయన తండ్రినోడించి, వశపరచుకొన్నాడు. అయ్యకుల సంజాతుల గుణగణాలు పరాక్రమాదులను చూచ్చి, వారితో సఖ్యము పెంచుకొని, జాయన అక్కలైన నారమ-పేరమ లనువారిద్దరినీ వివాహమాడాడు. (౬01. 1౧6. ౪౦||. ౧. 84). జాయన అప్పటికి చాలా చిన్నవాడు. ఆతని సౌమ్యాకారమును, నయవినయ శౌర్యగాంభీర్యములను గమనించి, ఆతనికి ఆందోళికాతపత్రాది గౌరవములను ప్రసాదించి, గజసైన్యాధిపతి పదవినిచ్చి, క్రీ.శ. 1218లో 'తామ్రపురిని గుంటూరు జిల్లాలోని చేబ్రోలును పరిపాలించడానికి ఇచ్చాడు. (501. 1౧6 ౪-౧౧ 142-43). అంతేగాదు కౌమారదశనుండి జాయన 'ప్రజ్ఞాతిశయముల నెరింగిన గణపతిదేవుడు, స్వయముగా శ్రద్ధవహించి, మంత్రి గుండయామాత్యునిచే జాయనకు సర్వ కళలు నేర్పించెను.
నృత్తరత్నావళిరోచి 13
పేక్ష్య ప్రజ్ఞామతిశయవతీం స్వామిభక్తిం చ హర్షాత్
ఆకౌమారాత్ గణపతినృపో జాయనం తం సమర్ప్య,
గుండామాత్యే సకలసుమనస్సేవ్యమానే జయంతం
వాచాం పత్యౌ హరిరివ కళాం శ్యాఘనీయాం వ్యనైషీత్. (న్ఫ.ర. 1. 139)
ఇంద్రుడు బృహస్పతికి తనకుమారుడైన జయంతుని విద్యాభ్యాసము కొరకప్ప చెప్పినట్లు, గణపతిదేవుడు తనను గుండామాత్యునకప్పచెప్పినాడని జాయనయే స్వయంగా పేర్కొన్నాడు.
గుండయామాత్యునిచే సర్వంకష శిక్షణ పొందిన జాయన, గణపతిదేవుని ఆజ్ఞచే, ఆయనకు మిగుల ప్రియమగు నృత్తలీలకు రత్నదర్చణము వంటి “నృత్తరత్నావళొని క్రీ.శ. 1258-54లో రచించాడు.
నృత్తశాస్త్రగ్రంథాలలో నృత్తరత్నావళికి ఒక విశిష్ట స్థానం ఉంది. భరతనాట్య శాస్త్రము అభినయ ్రదర్శనమునకు, నందికేశ్వరుని అఖినయదర్పణము భావ నిర్ణయమునకు, భరతరసప్రకరణము విశేషవినియోగములకు, భరతసార- భరతసార సంగ్రహములు కరణాంగహారములకు అనగా భంగిమలకు, ముద్రలకు నృత్తరత్నావళి నృత్తాలకు ప్రామాణిక (గగ్రంథాలని వానిని అనుకరించడం పరిపాటి అని నృత్తకోవిదులు భావిస్తున్నారు.
భరతుని నాట్యశాస్త్ర సిద్ధాంతములను వివరించు పట్ల, జాయన భరతుని అభిప్రాయము సంపూర్తిగా (గ్రహించి, మిక్కిలి శ్రద్ధతో కృషి సలిపినట్లు స్పష్టమవుతున్నది. అభినవగుప్తుడు వ్యాఖ్యానింపకుండా వదలిన నాట్యశాస్త్ర శ్లోకములు సైతము జాయన వివరించాడు. తనకాలం నాటికే దుష్పాప్యములైన కీర్తిధరాచార్య, భట్టతుండాది నాట్య (గ్రంథములనుండి ఉల్లేఖనములొసంగి, వారి సంప్రదాయమును పరిశోధించి, పరిరక్షించి ప్రచారము చేయుటకు తోద్పడ్డాడు. శార్బ్దదేవుని సంగీతరత్నాకరమును అడుగు అడుగున అనుసరించినప్పటికీ, అతనికి మించి దేశీనృత్తములను విస్తృత వివరణలతో ప్రచారం చేసాడు. ఈ విధంగా ఆనాటికి లభ్యములైన శాస్త్ర గ్రంథాలు, లోకమునందు ప్రచారంలో ఉన్న దేశీనృత్తములు మాత్రమే గాక రామప్పగుడి దేవాలయములందలి నృత్యశిల్పములు కూదా సహాయం చేసి ఉంటాయి.
ఇలా నృత్తవిషయంలోనే గాక జాయన దేశపాలన-రక్షణలందునూ దిట్ట.
14 నృత్తరత్నావళిరోచి రణరంగమునందు అతడు ప్రదర్శించిన ప్రజ్ఞాపాటవములను గుర్తించి అతనికి “వెరి గోధూమ ఘరట్ట” (శత్రువులనెడి గోధుమలను పిండిచేయగల తిరగలి) బిరుదు ఇవ్వడం జరిగింది.
కాకతి ప్రభువులు శైవులు, శివసంప్రదాయ ప్రచారకులు అవడంచేత, శివునికి ప్రీతికరమైన తాండవనృత్తము జాయనను 'నృత్తరత్నావళి" రచించడానికి ప్రేరేపించి యుండవచ్చు. జాయననాటికి నృత్త - నృత్య - నాట్యపదములు పర్యాయపదములుగా ప్రయోగింపబడు తున్నప్పటికీ 'నృత్తమే' జాయనచే స్వీకరింప బడింది.
ప్రప్రథమ ఆశీఃశ్లోకమునందే నృత్తము, శిరస్సునుండి పాదములవరకు గల అంగములన్ని నృత్తకళ కుచితము లైనవనియు, ఆదిలోనే నృత్తప్రాధాన్యత నిరూపించాడు జాయన. ఈ నృత్తము రెండువిధములనీ లాస్యతాండవ భేదములు గలవనీ, కాంతతో గూడిన శంభుడు ఈ రెండు నెరవేర్చుచున్నాడనీ, అట్టి శివుడు మనలనందరనూ రక్షించువాడని ఆశంసించాడు. అటుపిమ్మట వికటగతిగల నృత్తముతో బీరముగా వ్యంజింపచేయు గణపతిని ప్రార్థించి నృత్తప్రశంసను ఈ విధంగా చేసాడు. నిరాకారుడైన శివుడు నృత్తమందలి కుతూహలముచే ఆకారము ధరించాడట. నృత్త మంతటి శక్తి మంతమైనది. నిరాకారుణ్ణి సాకారుణ్ణి చేసింది: పరమశివుడు గౌరితోనూ, గోపాలుడు తన ప్రియురాళ్ళతోనూ, బ్రహ్మ వాగ్దేవితోనూ సలిపే ఈ నృత్తము లోకులందరికీ ఆనందామృతమును పంచునట్టిది. అట్టి అసాధారణమైన శోభాతిశయముగల నృత్తమును చూడలేని కన్నులు పూతేనె దొరకని తుమ్మెదలు, చంద్రకాంతి లభించని సౌగంధిక పుష్పం, వర్షపు జల్లు దొరకని నెమళ్ళతో సమానమైనవి అని నృత్తము యొక్క ఘనతను చాటినాడు.
కల్దారైరనవాప్తచం ద్రకిరణాశే షైరలబ్ధాంబుదైః
= 222 = = * = = అలికులైరప్రాప్తపుష్సాసవైః |
సౌమ్యాలాపదశామమూని దధతే నేత్రాణి యేషాం పురః
శశ్వన్నావతరంత్యుదారసుషమాః నృత్తప్రయోగకక్రమాః॥ (1.6)
నృత్తము అతిప్రొధమైనది, అన్యకళల విలాసమును పారద్రోలగల సమర్థత గలది, అంతరంగమునకు సుఖమిచ్చునది గావున తన (గ్రంథమునకు “నృత్తరత్నావళి అని బెచిత్యపూర్వకంగా నామకరణం చేసాడు. నృత్తమునందు
నృత్తరత్నావళిరోచి 15 పంచభూతములు ప్రతిష్టింప బడినవి. రత్నకాంతుల తళతళలు భూమియందు, తరంగముల లాలిత్యము నీటియందు, జ్వాలల ఊపు అగ్నియందు, సహజమైన వింతనడక వాయువునందు, మెరుపుతీగ ఆట ఆకాశమందు - ఇట్లు అకృత్రిమ సుందరమైన నృత్తకళ మహిమ పంచభూతములందు ప్రవేశించివెలయును.
ప్రవిష్ణో భూతేషు ప్రభవతి హి నృత్తస్య మహిమా (1.10)
నృత్తము శాస్త్రవిధానము మీరక ప్రయోగించినట్లైన దేవతలు సంతోషిస్తారు. ధనము గుణము, కీర్తులను సంపాదించి పెడుతుంది. అట్టి నృత్తకళ తన చిన్నవయసునుండియే గుండామాత్యుని వద్ద అభ్యసించాడు. గణపతిదేవుడు జాయనలోని ప్రజ్ఞను, స్వామి భక్తిని కనుగొని ఇంద్రుడు తనకుమారుడు జయంతుని బృహస్పతికప్ప చెప్పిన విధంగా, జాయనను గుండామాత్యునికప్పచెప్పినట్లు (1.18), ఇట్టి శ్నాఘనీయమైన కళను నేర్చి నందులకు కృతజ్ఞత సమర్పించు కొనుటకు, తన శౌర్యముతో భూమినంతటిని జయించి, లోకమును సుస్థిరం చేసి, సంగీతా ఖిమానము గల తన ప్రభువు కొరకు నృత్త లీలకు రత్నదర్పణము వంటి యీ చతురమైన “నృత్తరత్నావళి రచించుటకు పూనుకొనినట్లూ సవినయంగా వివరించాడు. (1.14). తను రచించిన ఈ నృత్త రత్నావళి కవులకు ప్రియమైనది, నృత్తకళ నెరిగినవారికి నిధివంటిది, రాజుల చిత్తమును వికసింపచేయు వెన్నెల వంటిది అని ప్రశంసించు కొన్నాడు.
“ఆశ్చర్యం పశ్యతేదం కథమధిగత నానాశయం మే సమగ్రం
స శ్రీమాన్ జాయసేనాపతి” (1.16)
(ఈ ఆశ్చర్యం చూడండి. ఆ శ్రీ జాయసేనాపతి నా ఆశయం సంపూర్ణంగా ఎలా కనుగొన్నాడో! అని భరతముని తన నృత్తరత్నావళిని ప్రశంసించాదడని ప్రకటించు కొన్నాడు. తన వాక్కు అనబడు నర్తకి, ఈ శాస్త్రము అను రంగస్థలమున మనోహరము లగు వర్ణములను, అంగములతో లక్షణము అను నృత్తమును అతి స్పష్టము చేయుచున్న దని ప్రాఢముగ పల్మినాదు శ్రీజాయసేనాపతి.
నాట్యమందలి చతుర్విధాభినయములలో నృత్తమునకు ఉపయుక్తమగు వాచిక, సాత్విక, ఆహార్యము లను ఈ త్రివిధాభినయములను విడిచిపెట్టి మిగిలిన ఒక్క ఆంగికాఖినయము మాత్రమే యిచ్చట చెప్పబడుచున్నది (7.84). అని
16 నృత్తరత్నావళిరోచి శార్జ్ఞ దేవువుడు ఒక ఆంగికాభినయమును - గాత్రవిక్షేపమాత్రమైన దానిని సంగీతరత్నాకరము, ఏడవ అధ్యాయములో వివరించాడు. అట్లే జయనయు కేవల గాధత్రవిక్షేవమా(త్రమైన ఆంగికాభినయముతో కూడిన నృత్తము నాశ్రయించాడు. ఈ నృత్తము -
“పూర్వరంగ ప్రయోజ్యత్వాత్ నృత్తం నాట్యోపకారమ్”
పూర్వరంగమందు (ప్రయోగింపదగినది నృత్తము. _.నాట్యమునకుప కరించునది అని చెప్పుచు సందర్భాను సారంగా నాట్యలక్షణములను సంక్షేపంగా వివరిస్తాను, కాని నృత్తమును మాత్రము విస్తారముగా వివరిస్తాను' అని (1.34) వాగ్దానము చేసి దానిని నిలుపుకొన్నాడు. నాట్యోత్పత్తి, నాట్య లక్షణము, చతుర్వి ధాభినయములను సంక్షిప్తంగా వివరించాడు. కేవలము గాత్రవిక్షేషమాత్రమైన నృత్తప్రయోజన మేమి? దానికొరకు ప్రత్యేక శాస్త్రగ్రంథ నిర్మాణమేల? దానికి సమాధానము -
భరతనాట్యశాస్త్రమునకు పూర్వము కేవల నృత్తనాట్య శబ్దములే వాడుకలో నున్నవి. శివుని తాండవమే నృత్తము. కేవలము శోభను (రంజనము) కలిగించుటకే నృత్తము (వ్రవర్తితమైనది. (ప్రాయికముగా నర్వలోకమునకు నృత్తము ఆమోదజనకము. మంగళప్రదము. ఇది కేవలము వినోదకారణమగుట చేతనే గీతకాదులందు సమ్యక్ నృత్తవిభాగకములైన శుష్మాక్షరములు, భూత సంఘములచే ప్రవర్తితమైనది (నా.శా.). దశరూపకకారుని “నత్తం తాలయా(శ్రయం” (నృత్తము తాళమును లయను ఆశ్రయించి యుందునది) అను వాక్యానికి ధనికుడు చంచత్పుటాదితాలద్రుతాదిలయా(శయమాత్ర మగు అంగవిక్షేపము కలదై అభినయశూన్యమగునది నృత్తమనబడును. అని వివరించాడు. గాత్ర విక్షేపము అను అర్ధము గల 'నృత్' ధాతువునుండి పుట్టి నప్పటికీ, శోభాహేతువగుటచే నృత్తము, నాట్యమునకు ఉపకారక మగుచున్నది. కేవలము శారదాతనయుడొకడు భావప్రకాశంలో “నృత్తం రసాశ్రయం” అని నిర్వచించాడు.
“దేశదేశజనానాం యద్రుచ్యా హృదయరంజనం |
గీతం వాద్యంచ నృత్తం తత్తద్దేశీత్యభిధీయతే ॥1” (సం.ర. 1. 22-24)
నృత్తం వాద్యానుగం ప్రోక్తం వాద్యం గీతానువర్తి చ
నృత్తరత్తావళిరోచి 17 అనీ' సంగీత రత్నాకరకారుడు నృత్తం కేవలం వాద్యానుగుణమైన అంగ విక్షేపం గానే పేర్కొన్నాడు. 'నృత్తం గీతం చ వాద్యం చ తత్ సంగీతక ముచ్యతే” అని సంగీతాన్ని నిర్వచించి, మూడు కలిసినట్లైెన సంగీతమగుననీ, నృత్తము వాద్యానుగుణము, వాద్యము గీతానుగుణము అని పేర్కొని నృత్తమును, గీతమును, వాద్యములను శాస్త్ర నియమితములుగా వివరించాడు. దాని ఆధారంగానే బహుశ జాయసేనాపతి కూడా (ప్రప్రథమంగా నృత్తమును వివరించడం ఎంతో సమయోచితముగా ఉంటుందని నృత్తమునకు వహోరమువంటిది అయిన “నృత్తారత్నావళి రచించాడు. వివిధ విలాసములతో కూడిన అంగ విక్షేపము, గీత వాద్యాదులతో మిళితమై లయనా(శ్రయించిన ఈ నృత్తము నాట్యాభి నయమునందు కలుగు కొరతలను కప్పిపుచ్చుటయే ప్రధానఫలముగా కలిగి ఆయా దేశముల జనుల యిష్టానుసారము ప్రవర్తిల్లునది కనుక 'దేశి అను పేరుతో కూడా నృత్తము సర్వజన ప్రీతిపాత్రమగుచున్నది. అందుచేతనే భరతుని నాట్యశాస్త్రము వాఖ్యానములతో సహా చదువుకొని, అభ్యసించి, దాని రహస్యమును సంపూర్తిగా గ్రహించి, జూాయన శాశ్వతమైన కీర్తిని గడింప గల ఈ నృత్తమును, తన ఈ నృత్తరత్నావళలియందు సుస్పష్టమైన అర్ధముతో దాని లక్షణమును సంపూర్ణముగా నిర్వచించాడు. ఇట్టి సర్వలక్షణ సమన్వితమైన నృత్తము “బహుజన హితాయ' అని, దాని ప్రయోజనము వివరించి, శాస్త్రగ్రంథపు ఆవశ్యకతను తెలిపాడు జాయన.
“గీతరత్నావళి” అని గానానికి సంబంధించిన మరొక గ్రంథం కూడా రచించా నన్నాడు. “స చాస్మాభిః స్ఫుటం గీతరత్నావల్యాం ప్రపంచితళొ (దానిని మేము గీతరత్నావళి యందు స్పష్టముగా వివరించితిమి.) అని అయిదవ అధ్యాయము లోని 109వ శ్లోకం చెప్తోంది. కానీ అది యిప్పటికీ అలభ్యము.
జాయపసేనాపతి నృత్తరత్నావళికి స్ఫూర్తినిచ్చినది భరతుని నాట్యశాస్త్రమే. భరత నాట్యశాస్త్రమును సంపూర్తి వ్యాఖ్యానాలతో సహా పరిశీలించానని జాయన పేర్మాన్నాడు. “ప్రోక్తం జాయచమూపేన మునేరాశయమేవం” అను వాక్యా లనేకంగా నృత్తరత్నావళిలో కనిపిస్తాయి. భరత - అభినవగుప్తులను అనుసరించిన విధానం జాయనకు వారిపట్లగల గౌరవం సూచిస్తుంది. నృత్తరత్నావళిలో మొదటి నాల్గు అధ్యాయములు (నర్తన వివేకము, అంగనిరూపణము, చారీస్థానకమండల లక్షణ
18 నృత్తరత్నావళిరోచి నిరూణము, కరణాంగ హార వివేచనములు) భరతనాట్యశాస్త్రము ననుసరించి వ్రాయబడినవి. భరతుని అభిప్రాయము సుస్పష్టంగా వివరించడానికి అభినవగుస్తని వ్యాఖ్యానం ఎంతో తోడ్పడింది. భరత-అభినవగుషప్తాదులను అనుకరిస్తూనే జాయన, కోహల, తుంబుర, మతంగ, భట్టతండు -కీర్తిధర-సోమేశ్వర -పార్యదేవ -శార్బ్లదేవాదులను అంతేగాక అన్యే, అపరే, కేచిత్ అంటూ పేర్లు చెప్పకుండా మరికొందరిని ఉటంకించడం బట్టి, అతనికి గల అపారపాండిత్యం ప్రస్ఫుటమవుతుంది. ఆ యా (గ్రంథాలను కూలంకషంగా పరిశీలించిన పిమ్మటనే నృత్తరత్నావళిని రచించడానికి పూనుకొని ఉంటాడు. నాట్యశాస్త్రము తరువాత జాయన అనుసరించిన మరొక ఉద్దంథము శార్బ్బదేవుని సంగీతరత్నాకరము. నృత్త-గీత-వాద్యములకు సముద్రము వంటి ఈ సంగీత రత్నాకరంలో మంచి ముత్యము వంటిది ఏడవ అధ్యాయము అయిన నృత్తాధ్యాయము. బహుశ జాయన ఈ ముత్యమువంటి నృత్తాధ్యాయమునే అనుకరించి తద్విషయము లన్ని ఏకత్రా కూర్చి ఉండవచ్చు. సంగీతరత్నాకరమునే అనుసరించిన మరొక అర్వాచీన నృత్తశాస్త్ర గ్రంథము విప్రదాసుని సంగీతచంద్రము. ఈ (గ్రంథమునకు గల ఒకేఒక్క (ప్రతి రాజా జగజ్యోతిర్మల్లునిచే దాక్షిణాత్య దేశాలనుండి నేపాలుకు తీసికొని వెళ్ళబడిందని ఉపనంహార శ్లోకంలో వ్రాయబడింది. వి'ప్రదాసుని సంగీత చంద్రమునకు జాయన నృత్తరత్నావళికి చాలా సామ్యాలున్నాయి. ఈ రెండూ కూడ సంగీత రత్నాకరమును అనుసరించి, అనుకరించినవే అయిననూ తమ తమ ప్రత్యేకతలను నిలుపుకొన్నాయి. ఈ రచయితలు సిద్ధాంతాల విషయంలో స్పష్టమైన అభిప్రాయములు కలిగి, వాటిని నిస్సంకోచంగా వివరిస్తూ తమదైన పంథాలో గ్రంథరచన సాగించారు. ఆశీస్సులు, నృత్తప్రశంస, గ్రంథకర్త ప్రశంస, గ్రంథ ప్రశంస చేసి, నృత్త సమయాలు వివరించి జాయన నాట్యావతరణాన్ని భరతకథితనాట్యోత్పత్తి విధానాన్ని వివరించాడు. నాట్యలక్షణాన్ని దాదాపుగా భరతుడు నిర్వచించిన విధంగానే నిర్వచించాడు. లోకస్య చ స్వభావో యః సుఖదుఃఖవిమిశ్రితః నాట్యం తస్యానుకరణం చతుర్థా౭_భినయాత్మకమ్ ॥ (1.25)
నృత్తరత్నావళిరోచి 19
స్పందించుట అను అర్ధముగల 'నటొ ధాతువు సాత్త్విక భావములతో నిండి, రసాశ్రయమై వాక్యార్థము నభినయించుచు నాట్యమగుచున్నది. ఈ అభినయపదము 'ణీ ధాతువునకు “అభి అను ఉపసర్గ కూర్చుటచే ఏర్పడినది. ఈ అభినయము ప్రయోగమును ప్రేక్షకులకు అభిముఖము చేయునది. అభినయము “ఆంగికో వాచికాహార్యా సాత్త్వికశ్చేత్యసౌ” అని (ఆంగిక- వాచిక -ఆహార్య-సాత్త్వికములని) నాలుగు విధములుగా నాట్యకళయందు ప్రతిష్టితమైనది. వీనిలో ఆంగికాభినయము శారీరము, ముఖజము, చేష్టాక్సతమని మరల మూడు విధములు. శాఖ-అంగ-ఉపాంగ ప్రత్యంగములచే చూపబడునది శారీరము. కేవలం ముఖమునందలి ఉపాంగములచే వ్యక్తము చేయబడదునది ముఖజము. నిలుచుట, కూర్చునుట, నడుచుట ఇత్యాది చేష్టల ద్వారా ప్రదిర్శంపబడునది చేష్టాక్సతము. ఈ మూడింటియందు అనుక్రమముగా శాఖ, అంకురము, నృత్తము అనునవి ప్రధానములు. నృత్తహస్తములను విచ్శిత్రముగా మలచుట శాఖ; జరిగిపోయిన విషయములను సూచించుట అంకురము; రాబోవు విషయములను తెలుపుట సూచి. (ఇది అంకురమనందలి భాగమే). జాయన నృత్తము నిచట, ఇంత క్లుప్తంగా వివరింపదలచలేదు. నృత్తము అతని ప్రధాన విషయము గావున దానిని విస్తారముగా వివరించుట న్యాయమని ఇక్కడ చెప్పలేదు.
రెండవదైన వాచికాఖినయము, సంస్కృత ప్రాకృతముల నాశ్రయించి రెండు విధములగుచున్నది. నామాఖ్యాత (నామ, క్రియ) లను బట్టి యిది విస్తృత మగుచున్నది.
మూడవదైన ఆహార్యాభినయము నేపథ్యమునకు కావలసిన వస్తువులను ఏర్పరచునది. ఇది పుస్తం, అలంకారం, అంగరచన, సజీవం అని నాలుగు విధములచే ఏర్పడును. నాట్యమున చూపబడుకొందలు, విమానాదులు పుస్తము. ఇది చాప, చర్మము, గుడ్డలు మొదలైన వానితో చేయబడిన యెడల సంధిమమగును. సూత్రము, అయస్మాంతములతో చేసినయెడల వ్యాజిమమగును. లక్క మైనము మొదలైనవాటితో సంబంధము కలిగిన చేష్టిమము. (నేటి బాక్గ్రౌండ్ సీనరీ నాటి పుస్తమని చెప్పవచ్చు). *యేనాలండక్రియతే దేహః సో౭౬లంకారః ప్రకీర్తితపొ (1.40) దేనిచే దేహమలంకరింపబడునో అది అలంకారము అగును.
20 నృత్తరత్నావళిరోచి అది ఆవేధ్యము అనగా రంధ్రము వేసిపెట్టుకొనబడునది, చెవికమ్మలవంటిది (ఇయిర్రింగు), ప్రక్షేష్యము అనగా తొడుగు కొనునది చీర, గౌను వంటివి, ఆరోష్యము అనగా మీదవేసుకొనునది శాలువ, ఉత్తరీయము ఇత్యాదులు, బంధనీయము అనగా ముడి వేసుకొనునది - రవిక, మొదలైనవి అని అలంకారము నాలుగు విధములు. రంగులు దేహమునకు పులుమకొనుట అంగరచన. “సా భవేదంగరచనా యద్రంగై రంగవర్తనం” (1.48) ఈ రంగులు స్వభావజన్యములైన తెలుపు, నలుపు, ఎరుపు, పసుపులు, మరియు వీని కలయిక వలన ఏర్పడు ఇతర రంగులు సందర్భోచితముగా పూయవలెను. సజీవః ప్రాణినాం రంగప్రవేశః పరికీర్తితః ద్విచతుశ్చరణే పాదరహితళశ్చేతి న త్రిధాః 1॥ (1.45) అని రంగస్థలమున ప్రవేశించు ప్రాణులు సజీవమనబడును. రెండుకాళ్ళు కలవి, నాల్గు కాళ్ళు కలవి, కాళ్ళు లేనివి అని సజీవము మూడు విధములు. ఇక నాల్గవదైన సాత్తికాఖినయము సత్త్వముచే నెరవేర్చదగిన భావములను ప్రదర్శించునది. సత్త్వమనగా ఇతరుల సుఖదుఃఖములను చూచినపుడు అదే భావన మన మనస్సులందునూ కలుగుట. అనగా ప్రదర్శించు నటునితో వకాత్మభావము కలుగుట సత్త్వము. ఇది స్తంభము, ప్రస్వేదము, రోమాంచము, స్వరభేదము, వేపథు (వణుకు), వివర్ణము, కన్నీరు, ప్రళయము అని ఎనిమిది విధములు. ఒక శృంగార దృశ్యమును చూసిన కలుగు (వ్రస్వేదము, భయానకదృశ్యము చూసిన కలుగు గగుర్పాటు, శోక సన్నివేశమును చూసినపుడు గలుగు కన్నీరు, ఇలాంటివి సత్త్వభావములు. “యస్మాత్ ప్రయోగం నయతి తస్మాదభినయః స్మృతః దేనివలన ప్రయోగము నెరుపబడునో అది అభియనము
- అని భరతుడు, 'అవస్థానుకృతిర్నాట్యం' పాత్రయొక్క స్థితిని అనుకరించుట నాట్యము - అని ధనంజయుడు, “భవేదభినయో2. వస్థానుకా రః అవస్థను అనుకరించునది అభినయము - అని సంగీతరత్నాకరకారుడు అభినయాన్ని నిర్వచించారు. నాటకలక్షణకోశంలో సాగర నంది 'అభినయతి హృదయగతభావాన్ ప్రకాశయతి, అభిముఖం నయత్యార్థానితి అభినయ" హృదయము నందలి భావములను అఖభివ్యక్తీకరించునది అఖియనము. ప్రయోగమును ప్రేక్షకులకు అభిముఖమును చేయునది అథఖినయము - అని నిర్వచిస్తే ““సవాసనావ్యాపారాః
నృత్తరత్నావళిరోచి 21 కథయన్తే2.భినయః ఇతి” రసములయొక్క ప్రయోగము అభినయమనబడును
- అని విప్రదాసు సంగీతచంద్రలో నిర్వచించాడు. ఇట్టి లక్షణం గల అభినయం చతుర్విధమైననూ సాత్తికాభినయము సర్వసమ్మతమైనది. “నాట్యం సల్వే ప్రతిష్టితం, సత్వాతిరిక్తో 2. భినయః జ్యేష్టు, సమసత్త్వో భవేన్మధ్యః, సత్త్వహీనో౬_ ధమఃా సత్త్వము నందు నాట్యము ప్రతిష్టితమైనది, సత్త్వములో నిండిన అభినయము జ్వ్యేష్టము (ఉత్తమము), సమసత్త్వభావము కలది మధ్యమము, సత్త్వహీనమైనది అధమము
- అంటూ సాత్త్వికాఖి నయానికే తొలిపీట వేసారు. కాని జాయన, విప్రదాసులు ఊంగికాభినయాన్నే ప్రధానంగా స్వీకరించారు. “అంగికో ముఖ్య ఉచ్యతే? అంగికాభి నయమే ముఖ్యమైనది - తిరుగులేని విధంగా అన్నాడు విప్రదాసుడు. విప్రదాసుని సమర్ధన ఈ విధంగా ఉంది. (ప్రేక్షకుని మనస్సునందు రసోత్పత్తి కలుగ చేయుటయే ప్రధానముగా అభినయము.
“*రసవాసనావ్యాపారాః కథ్యన్తే£ ఖినయా ఇతి” (సం.చ. 863)
ఇది ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్త్వికములని నాతిగు విధములు. అంగములద్వారా రసనిష్పత్తి కలిగిన అది ఆంగికాభినయము. 'గీతప్రబంధాదుల గానము ద్వారా అభినయించుట వాచికము. భూషణాది ఆభరణముల ద్వారా ప్రదర్శించుట ఆహార్యాభినయము. సత్త్వముతో కూడిన మనసుతో అభినయించుట సాత్త్వికాభినయము.
భరతుడు సామాన్యాభినయము, చిత్రా భినయము అని మరిరెండు అభినయములను కూడా పేర్కొనినాడు గానీ వానికంతగా ప్రాధాన్యము నీయలేదు-
విప్రదాసు సైనాల్గు అభినయములలో ఆంగికానికే ప్రాధావ్యంఇచ్చాడు. ఏలనన ఆంగిక, వాచిక, సాత్త్వికాభినయములు చేస్టవాక్కు మనోభావ ప్రదర్శితములు. ఆహార్యము దేశకాల పరిస్థితులను ఇట్టి మార్పు చెందునది గాన అది అంత ముఖ్యమైనది కాదు. ఇట్లుండ నర్వమనోభావములు, వికారములన్నియు చేష్టల ద్వారా (ఆంగికాభినయము) లేదా వాక్కుద్వారా (వాచికాభినయము) (వదర్శివంవలెను. అందువలన అబభినయమున సాత్త్వికాఖినయమును వదలి ముఖ్యమైనవి వాచికాంగిము లైనవి.
తస్మాత్ ముఖ్యాభినయౌ జ్లేయావాంగికవాచికౌ (సం.చ.381)
22 నృత్తరత్నావళిరోచి అయినను వాచికము లేకున్నను కొన్ని సందర్భములలో అర్ధమును ప్రదర్శించ వచ్చును. భాష రాని దేశములందు ప్రాయికముగా ఆంగికాఖియము వలననే అర్ధము ప్రదర్శింపబడుతుంది. చేష్టాక్సత అభినయమును విశదీకరించునది వాక్కు అందుచే చతుర్విధాఖినయములలో ఆంగికాభినయమునకే ప్రాధాన్యతం. వాచికము ఆంగికమునకు కేవలమాభరణము. వాచికోపస్కృతః తస్మాదాంగికో ముఖ్య ఉచ్యతే (సం.చ. 382) విప్రదాసు ఇంతస్పష్టంగా నృత్తమున ఆంగికాభినయమే ముఖ్యమని తెలిపాడు. ఆంగికాఖినయమే తన నృత్తరత్నావళి యొక్క ప్రధాన విషయంగా చర్చించాడు జాయన. చతుర్విధాఖినయములను ఈ విధముగా వివరించి జాయన నృత్త నృత్య నాట్యముల మార్గదేశీభేదముల గూర్చి చెప్పుటకు పూనుకొన్నాడు. సందర్భాను సారం నృత్త, నృత్య, నాట్యముల లక్షణములను నిర్వచించి, మార్గ, దేశీలను కూడా ప్రస్తావించాడు. నృత్త-నాట్య-నృత్య పదములను నందికేశ్వరుడు స్పష్టంగా విపులీకరించాడు. పూర్వకథాయుతమై పూజనీయమైన నాటకమే నాట్యము, భావాభినయ హీనము నృత్తము, రసభావవ్యంజనాది యుక్తము నృత్యము. “నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతమ్, భావాభినయపహీనం తు నృత్తమిత్యభిధీయతే. రసభావవ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే” (అ.ద. 15,16) (తె.నా.శా. 1339) నృత్త-నృత్య-నాట్యాలను పై విధంగా నిర్వచించినప్పటికీ నందికేశ్వరుని అభినయదర్చణం లోని - “కంఠేనాలంబయేద్ల్గీతం హస్తేనార్ధంసమాచరేత్, చక్షుర్భ్యాం దర్శయేద్భావం పాదాభ్యాం తాలమాచరేత్ | యతో హస్తః తతో దృష్టిః యతో దృష్టిన్తతో మనః, యతో మనస్తతో భావో యతో భావస్తతో రసః” ॥ (భ.సా.) (కంఠముతో గీతము, హస్తములతో అర్థము, కన్నులతో భావము,
నృత్తరత్నావళిరోచి 23 పాదములతో తాళమును ప్రదర్శింపవలెను. హస్తము ననుసరించి దృష్టి, దృష్టిననుసరించి మనస్సు, మనస్సు ననుసరించి భావము, భావముననుసరించి రసము యుండును).
అనే శ్లోకాన్ని బట్టి నృత్తము కేవలము అంగవిక్షేపము మాత్రము నెరపినప్పటికీ దాని పరమోద్దేశము రసస్ఫ్పోరణమనియే తెలియుచున్నది. అందుచేతనే అర్వాచీన కవులు, పండితులు ఈ శబ్దములను మూడింటిని పర్యాయ పదములుగానే గ్రహించారు. కాళిదాసు మాళవికాగ్ని మిత్రంలో ఛలితమనే నాట్యాన్ని పేర్కొన్నాడు. 'దాక్షిణ్యాతుల నాట్యకళాచరిత్ర అనే గ్రంథములో శ్రీ నటరాజ రామకృష్ణగారు నాట్యం గురించి పురాణపురుషుల అభిప్రాయాలు ఈ క్రింది విధంగా తెలిపారు. అర్జునుడు -
“భకారో భావసంయుకో రేఫో రాగేణ మిశ్రిత 1
తకారో తాలమిత్యాహుర్భరతార్థః విచక్షతైవ॥।
(భకారము భావము, రకారము రాగము, తకారము తాళము అయి భరత శబ్దము భావ, రాగ, తాళ మిశ్రితమైనది). నారదుడు -
ఉత్తమం భరతశాస్త్రం జ్ఞానవైరాగ్య సాధనం ॥
(భరత శాస్త్రము ఉత్తమమైనది, జ్ఞాన వైరాగ్యములు సాధించుటకు . ఉపకరించునది) రావణుడు -
ఉత్తమం భరతశాస్త్రం భక్తిముక్తిఫలప్రదం ।
జ్ఞానవైరాగ్యసద్భోధకారణం మోక్షదాయకం ॥
(ఉత్తమమైన భరతశాస్త్రము భక్తిముక్తుల నిచ్చునది, జ్ఞాన వైరాగ్యాది సద్బోధలు చేయుచు మోక్షమును ప్రసాదించునది) కోహలుడు -
“నృత్యగీతాభినయైః రాజానం దైవతం గురుమ్”
తోషయేద్భరతం శాస్త్రం । భక్తిముక్తి ఫలప్రదం ॥
24 నృత్తరత్నావళిరోచి
(భక్తిముక్తి ఫలప్రదమైన ఈ భరతమును నృత్యగీతాఖినయములతో ప్రదర్శించి రాజును దేవతలను గురువులను ప్రీతిపొందించవలయును).
ఈ విధంగా శాస్త్రకర్తల నిద్దేశానుసారం భక్తి, ముక్తి, ఫలప్రదము లయిన నృత్తనృత్యములు రెండునూ సమానములే కాగా, నృత్తము భావహీనమైనది, నృత్యము అభినయాత్మకమైైనది. ఈ విధంగా నృత్యం ఆంగికాభినయ ప్రధానం కాగా, నాట్యము సాత్త్వికాభినయప్రధానమై, కథాత్మక మవుతున్నది. నృత్యమున ప్రతిపదమునకు భావము, అభినయము చేయబడుచుండగా, నాట్యమున వాక్యార్థము సూచనామాత్రముగా అభినయింపబడును. కావుననే నృత్యము (ప్రతివదార్థాఖినయ మనీ, నాట్యము వాక్యార్ధాఖినయమనీ శాస్త్రకారుల అభిప్రాయము.
ఆంగికాభినయములచే భావము వ్యంజకము చేయు నర్తనము నృత్యము. సర్వాభినయవర్ణితమై, వక్ష్యమాణమగు అంగోపాంగప్రత్యంగసహిత గాత్రవిక్షేప మాత్రమగు నర్తనము నృత్తము అను సంగీత రత్నాకరకారునిచే నిర్వచింపబడిన నృత్య-నాట్యములు తరువాతి కాలం నాటికి (సంగీత చంద్రము - విప్రదాసు 15వ శతాబ్ది) పర్యాయపదములుగా వాడబడినట్లు తెలియుచున్నది. అట్లే నృత్యశబ్బమునకు నృత్తశబ్ధము, పర్యాయవదముగా కనబడుచున్నదనియు రనభావములతో కూడినది నాట్యనృత్యమనీ *“మార్గము” అనబడుననియు, అంగవిక్షేపములతో కూడినది నాట్య నృత్తమని దేశి అనబడునని విప్రదాసు విశ్లేషించాడు.
“భవేత్ భావాశ్రయం నృత్యం పదార్థాభినయాత్మకం” (1.50)
భావముల నాశయించి, వదార్థముల నభినయించునది నృత్యం. నాట్యవేదము నుండి పుట్టినది మహర్షులు వెలికి దీసినది గొవున “మార్గ మనబడును. ఇది సత్పురుషులచే ప్రచారము చేయబడినది. శ్రీగదితము (అలభ్యము) ఇత్యాదులు నృత్యమని నాటకాదులు నాట్యమనీ జాయన అభిప్రాయము. గాశ్రవిక్షేపము మాత్రమే ప్రయోజనముగా గలది కనుక నృత్తమందు ఆంగికాభినయము ఎక్కువగా నుండును.
“గీతవాద్యాదిమిళితం లయమాత్రసమాశ్రయం |
అంగవిక్షేపణం నృత్తం భవేదభినయ్యోక్టితం' ॥1 (1.53)
నృత్తరత్నావళిరోచి 25
పాట వాద్యములు మొదలగువానితో కలసి, లయనుమాత్రము ఆశ్రయించి, అభినయము లేక కేవలము అంగముల నాడించుట నృత్తము. నాట్యము నందలి కొరతను పూడ్చుటయే దీని ఫలము. ఆయాదేశ జనుల యిష్టానుసారముగా ప్రదర్శింప బడునది కనుక 'దేశి అని కూడా ప్రసిద్ధికెక్కినది. దీని ప్రవర్తకుడు మృడానీశుడైన శంభుడే. ఎందువలననంటే “సంధ్యాసు నృత్యతా మయా పీదం స్మృతం” 'సాయం కాలము నృత్యము చేయుచున్నప్పుడు నాకీ నృత్తము స్మృతికి వచ్చినది అన్నాడని భరతుని నాట్యశాస్త్రం నాల్గవ అధ్యాయం 18వ శ్లోకం చెప్తోంది. దీనిని బట్టి నృత్తము బహు ్రాచీనమైనదని తెలుస్తున్నది. “అవన్థానుకృతిర్నాట్యం' ..........0.02224.0
అన్యద్భావాశ్రయం నృత్యం నృత్తం తాలలయా(శ్రయమ్ ।
ఆద్యం పదార్థాఖినయో మార్గో దేశీ తథా పరం ॥
మధురోద్ధత భేదేన తద్దయం ద్వివిధం పునః
లాస్యతాండవరూపేణ నాటకాద్యుపకారకం ॥ (ద.రూ.)
నృత్యము భావాశయము, నృత్తము తాలలయా(శ్రయము మరియు పదార్థాభినయమైన నృత్యము “మార్గ మనబడును. నృత్తము 'దేశి అనబడును. మధుర ఉద్ధత భేదములచే నృత్య-నృత్తములు రెండు విధములు. మధురము (మధురనృత్య, మధుర నృత్త) తాండవమునబడును. ఇవి నాటకాదులకు ఉపకారకములు. దీనిని వివరిస్తూ ధనికుడు ఇలా అంటున్నాడు. ్రేక్షణీయము, (ఛవ్యమును కూడా అగుటచే నాట్యము నృత్యము కంటే భిన్నమగుచున్నది. చజక్బుత్పుటాదితాలద్రుతాదిలయాశ్రయమగు అంగవిక్షేపము కలదై అభినయశూన్య మగునది నృత్తమనబడును. నృత్త-నృత్యములు రెండును గాత్ర విక్షేప విషయమున సమానములే అయినను అనుకరణాత్మకమైన నృత్యము నృత్తము కంటె భిన్నమగుచున్నది. నృత్త-నాట్యములు రెండు అనుకరణ విషయమున సమానములే అయినను రసాశయమైన నాట్యము నృత్యము కంటే భిన్నమగు చున్నది. కించిదవాంతర పదార్థాభినయముచే నృత్యమును, శోభాహేతు వగుటచే నృత్తమును నాట్యమునకు ఉపకారకములగు చున్నవి”. (తె.నా.శా.)
నాటకాదులకు ఉపకారకములైన నృత్తము బ్రహ్మచే ఆవిష్కృతమై శివునిచే 'ప్రవర్తిల్ల చేయబడి ముక్తిదాయకమగునది “మార్గము. ఆయాదేశ రీతులనను
26 నృత్తరత్నావళిరోచి సరించి, ఆయా జనులను రంజింప చేయునది 'దేశీ నృత్తము. ఇది లాస్యతాండవ భేదములచే తిరిగి రెండువిధములు. లాస్యము సుకుమార ప్రయోగము కలది. తాండవము ఉద్ధతమైనది. “సుకుమారం తయోరాద్యం భవేదపరముద్ధతం' (1.56) లాస్యము కామోల్లాసమునకు హేతువైన మృదువైన అంగవిక్షేపము కలది. లాస్యం మనసిజోల్లాసహేతు మృద్వంగహారవత్ (1.57) ప్రాయికముగా స్రీలు ప్రయోగింపదగినది. స్తీ పురుషుల పరస్పర భావములను అర్ధము చేయించుటకొరకు ప్రయోగింపబడునది లాస్యము. ఇది పది అంగముల ద్వారా ప్రదర్శింపబడును అవి గేయపదము, స్థితపాఠ్యము, ఆసీనము, పుష్పగంధిక, ప్రచ్చేదకము, త్రిమూఢము, సైంధవము, ద్విమూధము, ఉత్తమోత్తమము, ఉక్త ప్రత్యుక్తము. ఇవికాక చిత్రపదము, భావికము అను మర్రి రెండు అంగములు ఇతర శాస్త్రకారులు పేర్కొన్నారు. కానీ భరతునికి అంగీకారము కాక పోవుటచే తనకూ అంగీకారము కాదని స్పష్టపరచాడు జాయన (1.72),
శివుని ఆజ్ఞచే తండువు భరతమునికి నేర్చినది గావున ఉద్ధతనృత్తము తొండవ మను పేరుతో లోకమున ప్రసిద్ధమైనది.
ఉద్ధతం తు మహేశస్య శాసనాత్ తందునోదితం |
భరతాయ తతః ఖ్యాతం లోకే తాండవసంజ్ఞయా ॥
ఉద్ధతమైన అంగహారములతో పురుషులచే ప్రదర్శింపబడునది, కావున ఉత్సాహాది భావప్రదర్శనకు తాండవము ప్రదర్శించదగునని విజ్ఞుల అభిప్రాయమని చెప్పుచూ “నర్తనవివేకు మను ప్రథమాధ్యాయాన్ని పూర్తిచేసాడు గణపతిదేవుని గజసాధనికుడు జాయసేనాపతి.
“అంగనిరూపణిమను ద్వితీయాధ్యాయమునందు నాట్యనృత్యముల అంగములు,' వాని లక్షణములు వివరింపబడ్డాయి. అంగములు ఆరు. అవి తల, చేతులు, వక్షస్థలము, ్రక్కభాగములు, కటిప్రదేశము, పాదములు. వీని ప్రత్యంగములు కూడా ఆరు. అవి మెడ, భుజములు, పొట్ట, వెన్ను, తొడలు, పిక్కలు. అట్లే ఉపాంగములు ఆరు. అవి కన్నులు, కనుబొమలు, ముక్కు పెదవుల్పు, చెక్కిళ్ళు మరియు గడ్డము.
నృత్తమొనరించునపుడు శిరస్సుయొక్క ప్రయోగము లేదా చలనము
నృత్తరత్నావళిరోచి 27 పదమూడు విధములుగా నుండును. అవి అకంపితము, కంపితము, ధుతము, విధుతము, అంచితము, పరివాహితము, అధూతము, అవధూతము, నికుంచితము, అధో ముఖము, పరావృత్తము, ఉత్క్షిప్తము, లోలితము అనునవి.
భరతుడు కేవలము వదమూడు శిరఃకర్మలనే పేర్కొన్నాడు. లోకవ్యవహారమున ఇంకను అనేక విధములుగా తలత్రిప్పుట కలదు కనుక వానినెల్ల లోకస్వభావానుగుణముగ ప్రయోగించవచ్చును అనిన భరతుని అంగీకారమునాధారముగా తీసికొని, ఇతర శాస్త్రకర్తలు పేర్కొన్న మరొక పదకొండు భేదములు కూడ ఇందుచేర్చి తల్లక్షణము లను వివరించాడు. అవి సమము, నైరాజితము, తిర్యక్తతము, తిర్యబ్నతోన్నతము, పార్వ్వాఖిముఖము, ఉన్నీతము, సకంపపరివాపాతము, నకంపధుతము, ఉద్భుతము, పార్వకంపితము, పార్య్వాకంపితము. వీనిలోని సమమను శిరోభేదము బరోడా నాట్యశాస్త్ర ముద్రణమందు 38వ శ్లోకముగా చెప్పబడింది. అది అచట ప్రాకృత శిరమని చెప్పబడినది. బుజు స్వభావ సంస్థానము, స్వభావజము అయినది ప్రాకృత శిరమనబదును. మాంగల్య, అధ్యయన, ధ్యాన, స్వభావ జయకర్మలందిది ప్రయుక్తము. (తె.నా. పేజి.271) కాగా జాయన నిర్వచనమిట్లున్నది.
ప్రకృతిస్థం సమం ప్రోక్తం యతో ఖేదాః వినిస్సృతాః
తత్ స్యాత్ సమనఖధ్యానస్వభావాభినయాదిషు 1
స్వాభావికముగానుండు శిరస్సు సమము. సమనఖమను కరణమందు, ధ్యానము, స్వభావమును అభినయించుట మొదలగు సందర్భములందు దీనిని ప్రయోగింపవలెను.
రసోత్పత్తి క్రమముననుసరించి రసదృష్టులు ఎనిమిది, న్థాయిభావము ననుసరించి స్థాయిదృష్టులు ఎనిమిది, వ్యభిచారి భావముననుసరించి వ్యభిచార దృష్టులు ఇరవై, ఇలా మొత్తం దృష్టులు (దృష్టికర్మ) ముప్పైఆరు రకాలు. అవి రసదృష్పులు కాంత, హాస్య, రౌద్ర, కరుణ, వీర, అద్భుత, భీభత్స, భయానకములు. న్థాయిభావదృష్టులు న్నిగ్ధము, హృష్టము, (క్రుద్ధము, దీనము, దృష్తము, సవిస్మయము, జుగుప్సితము, భయాంచితము అనునవి. అట్లే వ్యభిచారిదృష్టులు శూన్యము, లజ్ఞాన్వితము, (శ్రాంతము, విషణ్ఞము, మలినము, శంకితము, ముకుళము, గ్లానము, కుంచితము, లలితము, వితర్మితము, ఆకేకరము,
28 నృత్తరత్నావళిరోచి వికోశము, జిహ్మము, త్రస్తము, విఫ్లతము, మదిరము అను ఇరవై వ్యభిచారిభావ దృష్టులు. రసములందు జనించిన దృష్టులు రసమునందే, స్థాయి జనితములు స్థాయియందు మాత్రమే వినియోగింప వలెను. వ్యభిచారిదృష్టులు సంచారి భావములందు, చింతయందు శూన్యదృష్టి, నిద్ర, కల సుఖానుభము లందు ముకులదృష్టి, ఓర్వలేని తనము జడత్వము ఇత్యాదులందు జిహ్మదృష్టి, బెదిరినప్పుడు త్రస్తదృష్టి ఇలా సంక్షిప్తంగా ఆయా దృష్టుల వినియోగములను వివరించాడు. పై విధంగా స్పష్టరీతిలో ముప్పదియారు దృష్టులు వివరించిన పిమ్మట దృష్టులందలి తారా, పుట, భ్రూకర్మలను, వాని భేదములను, లక్షణములను వినియోగములను క్రమముగా వివరించాడు. భ్రమణము, వలనము, పాతము, చలనము, సంప్రవేశము, వివర్తనము, సముద్వత్తము, నిషష్రామము, ప్రాకృతము అని తారకల నడక తొమ్మిది విధములు. ఇది కూడా రసభావములందు వినియోగించవలెను. అయినప్పటికీ ఈ తారాకర్మ స్వభావసిద్ధముగా లోకుల నడతలో నుండును. అట్టి తారాకర్మలు రసభావములలో చేర్చవలెను. సమము, సాచి, అనువృత్తము, ఆలోకితము, విలోకితము, ప్రలోకితము, ఉల్లోకితము, అవలోకితము అని దర్శించురీతులు ఎనిమిది. ఉన్మేషము, నిమేషము, ప్రవృతము, కుంచితము, సమము, వివర్తితము, స్పురితము, పిహితము, వితాడితము అను ఎనిమిది కనురెప్పల నడక. క్రోధమున నిమేషోన్మేష వివర్తితములు, ఆశ్చర్య, సంతోష, వీరరసములందు ప్రసృతము, ఇష్టము లేనివానిపట్ల కుంచితము, శృంగారమున సమపుటము, వేడి, పొగ, వాన, నేత్రరోగము లందు పిహితము ఇలా రసభావములందు తారాపుటములు యేర్పాటు చేయబడినది. తారాపుటకర్మ ననుసరించి యుండునది కనుబొమల (భూకర్మ) నడక యుండును. ఇది ఉత్సేపము, పాతనము, (భ్రుకుటి, చతురము, కుంచితము, రేచితము, సహజము అని ఏడువిధములు. జతగాగానీ, వేర్వేరుగాగానీ కనుబొమల నెత్తుట, కోపము, చూచుట, వినుట మొదలైన కర్మలందు ఉత్నేసము, మిక్కిలి కోపము కలిగినపుడు, పెద్ద వెలుతురు చూసినపుడు భ్రుకుటి ప్రయోగింప
నృత్తరత్నావళిరోచి 29 వలెను. కనుబొమల రనభావ వినియోగమును వివరించుచూ వివిధ అవస్థాభేదములు గల స్రీపురుషసల్లాపము లందు, మోట్టాయిత, కుట్టమిత, కిలికించితాదులందు నికుంచితము, సౌమ్యశృ్ళంగార మందు చతురమును, నృత్తమందు రేచితము ప్రయోగింపవలెను.
ఈ విధంగా దృష్టి తారా, పుట, భూ, అను నాల్లు విధముల కన్నులకు సంబంధించిన ఉపాంగముల లక్షణ వినియోగములను వివరించి, ఆరు విధములైన నాసాకర్మ (ముక్కులు వివరించాడు. అవి నతము, మందము, వికృష్ణము, సోచ్చ్వాసము వికూణితము, స్వాభావికము అనునవి.
అటుపిమ్మట వివర్తనము, విసర్గము, వేపనము, వినిగూహనము, సందష్టము, సముద్గము అను ఆరు అధర (ఓష్ట్ర) క్రియలు వాని లక్షణ వినియోగములు విపులముగా చర్చిపంబడ్డాయి. భరతసం(ప్రదాయానుసారము పేర్కొనిన ఈ ఆరు భేదములేగాక ప్రయోగములో నున్న మరి నాల్గుఖేదములు ఆయతము, రేచితము, వృత్తము, వికాసి అనునవి పేర్కొనబడినవి. పై పెదవిని కలిపి పొడుగుగా లాగుట ఆయతము. ఇది సన్ననవ్వునందు ప్రయోజ్యము. స్థిరవిభ్రమము నందు పెదవి చివరలు కదలుట రేచితము. తిరస్మారమున, పరిహాసము మోపులు ముడుచుకొని ముక్కు దగ్గర చేరుట వృత్తము మరియు కొద్దిగా పలువరస చూపుచు నవ్వట వికాసి (180-131)
కన్నులు, ముక్కు పెదవుల తరువాత చెక్కిళ్ళు (కపోల) భేదము చెప్పబడినవి. అవి కుంచితము, కంపితము, ఫుల్లము, క్షామము, పూర్ణము, సమము అని భరతముని కల్పించిన విధమునే అంగీకరించాడు జాయన.
జిహ్వా ఓష్ట్ర దంతకర్మల (నాలుక, పెదిమలు, పళ్ళు) ననుసరించి చుబుకము (గడ్డము) ఏడు విధములుగా నుండును. కుట్టనము, లేహనము, ఛిన్నము, ఖండనము, చుక్కితము, సమము, దష్టము అను ఏడు చుబుక భేదములు. వాని లక్షణ వినియోగములు క్రమముగా తెలుపబడ్డాయి. అట్లే ఆరు విధములైన హనులక్షణములు, వాని వినియోగములు చెప్పబడినవి. లోలము, శ్లథము, చలసంహతము, సంహతము, స్ఫురిథము, వక్రము అనునవి. తెరచుకొన్న నోటితో కదులు హనువు లోలము. ఇది నెమరువేయుట, ఇత్యాదులందు ప్రయోజ్యము. ఊపిరి విడుచునపుడు, ఆశ్చర్యకరమైన దానిని చూచునపుడు ఒక అంగులమంత
30 నృత్తరత్నావళిరోచి క్రిందకి జారిన హనువు శ్లథము. పెదవులు మూసుకొని కదిలించిన చలసంహతము, కదలించకపోయిన అది సంహతము. చలి జ్వరముతో వణకునది స్ఫురితము, ్రక్కలక్షీద్చ బడినది వక్రము. ఇది గ్రహములు పీడించినపుడు, రోగము బాధలందు ప్రయోజ్యము. (1. 142-144) ఇవి జాయన చెప్పిన హను భేదములు. నాట్యశాస్త్రమున గానీ, సంగీత రత్నాకరమున గానీ హనుభేదములు చెప్పబడలేదు. బుజువు, సృక్కానుగము, వక్రము, నతము, లోలము, లేహిని అని జిహ్వ (నాలుక) ఆరు విధములు, చర్వణము, ఛేతనము, పీడనము, గ్రహణము, నిష్మర్షణము అని అయిదు విధములైన దంతకర్మలు, సమము, అంచితము, నతము, త్ర్యశ్రము, రేచితము, కుంచితము, ఉన్నతము, వలితము, నివృత్తము అను తొమ్మిది భేదములతో కూడిన గ్రీవా (మెడ) కర్మల లక్షణ వినియోగములు ఇవ్వబడినవి. ఈ విధముగా గ్రీవాకర్మ తొమ్మిది విధములైనప్పటిక్తీ, మెడ నడక తలననుసరించియే ఉండును గాన శిరఃకర్మలన్నియు గ్రీవాకర్మలై ఉండునని అభిప్రాయపడ్డాడు. శిరఃకర్మానుగామిత్వం గ్రీవాయాః కర్మణో యతః | యత్మించిదస్తి తత్కర్మ తదస్యామఖిలం స్మృతం॥। (1.157) ఆంగికాభినయమున ముఖ్యమైనది, (ఛద్ధ వహించదగినది, మనోవృత్తిని సూచించునది, అయిన ముఖరాగము (ముఖము నందలి వన్నె నాల్లు విధములని, స్వాభావిక, ప్రసన్నము, రక్తము, శ్యామము అని నాల్గు విధములైన వానిని నిరూపించి నాడు. స్వభావాభినయమునందు, మధ్యస్థ మొదలగు భావములందు స్వాభావికము, శృంగారాద్భుతహాస్యాదులందు ప్రసన్నము, మద, కరుణ, వీర, రౌద్రములందు రక్తము, భీభత్స భయానకములందు శ్యామము అను ఈ నాల్గు ముఖరాగము లేక ఆంగికాఖి నయము రాణించదు. సూర్యోదయము లేక తామరపువ్వు, యవ్వనం లేని శృంగార చేష్టలు ఏ విధంగా ప్రకాశించజాలవో ముఖరాగము లేని ఏ అభినయము కూడా రాణించదు. ముఖరాగమే _ఆంగికాభినయమునకు ప్రాణము. అది లేనిచో అభినయము తోలు బొమ్మలాట వలె నుండునని జాయన నిర్ద్యంద్వంగా ప్రకటించాడు. వినా తేన బిభర్త్యేష సాదృశ్యం పుస్తచేష్టితైః (1.168)
నృత్తరత్నావళిరోచి 3౩1 ఉత్తమాంగమైన శిరస్సు, దాని ప్రత్యంగమైన మెడ, ఉపాంగములైన కన్నులు, కనుబొమలు, ముక్కు పెదవులు, చెక్కిళ్ళు, చుబుకములను వాని వాని సూక్ష్మ భేదము లతో సహా వివరించి, ముఖరాగము యొక్క ్రాముఖ్యమును తెలిపి రెండవ అంగము హస్త (చేతులు) లక్షణ, వినియోగములను నిరూపించుట కాయత్తమైనాడు. “జలథిజలమివేదం బ్రూమహే హస్తలక్ష్మ అంటూ హస్తలక్షణము సముద్రజలము వంటిదని, చతురము, మకరము, పద్మకోశము, (భమరము, లలితము, హంసపక్షము, అలపద్మము, కర్మటము మున్నగు భేదములు ౨లదని విపులముగా వానిని చర్చించుటకు ప్రారంభించాడు. అసంయుత, సంయుత, నృత్తహస్తము లని హస్తలక్షణము ప్రధానముగా మూడు విధములు. అసంయుత హస్తములు 24, సంయుత హస్తములు 18, నృత్త హస్తములు 29. మొత్తము ఈ మూడు విధముల హస్తాభినయము 66 భేదములందు ప్రసిద్ధమై యున్నా భరతుడు నాట్యశాస్త్రమున 24 అసంయుత హస్తములు, 18 సంయుత హస్తములు, 80 నృత్త హస్తములను కలిపి 67 హస్తముల అగుచుండగా, “చతుఃషష్టికరా హ్యేతే నామతో౭_ భిహితా మయా అని 64 హస్తములను పేర్లతో వచించితి నన్నాడు. అసంయుత హస్తములోని సూచ్యాస్యము, సంయుత హస్తములందలి స్వస్తికము అవే పేర్లలో నృత్తహస్త భేదములు కూడా అగుచుండుటచేత భరతుడు 'నామతఃి అన్నది సత్యమే అని జాయన సమర్ధించాడు. యత్తు నామత ఇత్యాహ మునిః సత్యం న చాన్యథా | (1.178) అదేవిధంగా “అంజలి” మొదలగు సంయుతహస్తములు రెండుచేతులతో ప్రయోగింప వలసియుండగా, వానిని భరతుడు ఏకవచనముతో నిర్దేశించుటకు, నృత్తహస్తములందు ద్విచనప్రయోగము చేయుటకు గల కారణము లకు జాయన యిలా సమాధానమిస్తున్నాడు. నృత్యమందెప్పుడూ రెండుచేతులు కలిసియే హస్తములగును. నృత్తహస్తము లందు మాత్రము రెండు చేతులుగానీ, ఒకచేయిగానీ హస్తమనుట చాలు. కనుక భరతముని రెండింటి ప్రాముఖ్యము తెలుపదలచి ద్విచనము వాదెనని తెలిపాడు. ప్రాధాన్యం వక్తుకామో౭.సౌ మునిద్దివచనాజ్జగౌ! (1.186)
32 నృత్తరత్నావళిరోచి
అసంయుత హస్తములు 24. అవి పతాకము, త్రిపతాకము, భుజంగము, మృగశీర్నము, కర్తరి, కటకాముఖము, సూచీముఖము, శుకముఖము, హంస ముఖము, కపిత్టము, శిఖరము, పద్మకోశము, కాంగులము, ముష్టిచతురము, (భ్రమరము, అరాళము, హంసపక్షము, అర్ధచంద్రము, సందంశము, ముకుళము, ఊర్జనాభము, అలపల్లవము, తామచూడము అనునవి విడిగానుండెడి అసంయుత హస్తములు.
అంజలి, కటకావర్ధమానము, స్వస్తికము, కర్కటము, కపోతము, నిషధము, ఉత్సంగము, గజదంతము, అవహిత్ధము, డోలము, పుష్పపుటము, వర్ధమానము, మకరము అనునవి పదమూడును కూడియుండిన సంయుత హస్తములు.
చతుర(స్రములు, ఉద్వృత్తములు, తలముఖములు, స్వన్తికములు, విప్రకీర్ణములు, అరాళకటకాముఖముల్సు ఆవిద్ధ వక్రములు, సూచ్యాస్యములు, రేచితములు, అర్ధ రేచితములు, ఉత్తానవంచితములు, పల్లవములు, నితంబము, కేశబంధములు, లతలు, కరిహస్తములు, పక్షవంచితములు, పక్ష్మప్రద్యోతములు, తార్యపక్షములు, దండపక్షములు, ఊర్యమండలములు, పార్యమండలములు, ఉరోమండలము, ఉరఃపార్య్వార్థ మండలము, ముష్టి స్వస్తికములు, నళినీ పద్మకోశములు, అలపల్లవోల్బణములు, లలితములు, వలితములు అను ఈ 29 నృత్తహస్తములు.
అనంయుతహస్త ములందలి పతాకము మూలభూళతము కనుక స్వాభావికముగా అన్ని కర్మములందు ్రవర్తించును. దిని వినియోగము చాల గొప్పది. అనేక హస్తములు దీనినుండే పుట్టునవి గాన దీనికి ప్రాముఖ్యము. ప్రాయికముగా వానివాని ననుక రించుటచేత హస్తముల పేర్లు సొర్ధకములె యున్నవి.
అనుకృత్యా యథార్థాఖ్యాః భవేయుః ప్రాయశః కరా (1.198)
కటాకముఖ హస్తమును వివరించుపట్ల ఆ హస్తమునందు చూపుడువేలు దీర్దముగా నున్నవో సూచీముఖమగుచున్నదని తెలిపి అదే సందర్భములో హస్తమందలి తర్జని (చూపుడు వ్రేలు) యొక్క సప్తరీతులు ఈ విధములైనవని తెలిపాడు. అవి ఊర్జాననము, నతము, లోలము, కంపితము, జృంభితము,
నృత్తరత్నావళిరోచి వ్ ఉద్వాహితము, చలము అని ఏడు విధములు. వీనియొక్క వినియోగ విధానమే పరస్పర భేదములు ఏర్పడుటకు కారణమైనదని ప్రత్యేకంగా నిరూపించినాడు.
నిషధహస్త క్రియలోకూడా జాయన భరతాదుల అభిప్రాయంకన్నా కొద్దిగా అభిప్రాయ భేదము కలిగియున్నట్లు గోచరిస్తున్నది. ఎడమచేతితో కుడిభుజమును మోచేతివద్ద పట్టుకొని, కుడిచేతిని ముష్టిగా చేసుకొని యెడమ మోచేతిలోపల నిలుప వలెను. అప్పుడది నిషధహస్తమగును.
కూర్చరాభ్యంతరే ధృత్వా భుజం వామేన దక్షిణం |
అన్యం ముష్టిక్సృతం వామే కూర్చరాభ్యంతరే న్యసేత్ 11 (1.278)
“కపిష్ధహస్తముచే ముకులహస్తమును చుట్టిపట్టుట నిషధహస్తము” అని అభిప్రాయభేదమున అభినవగుప్తాచార్యులు వచించారు. కానీ జాయనకు కీర్తిధరా చార్యుల అభిప్రాయమామోదమైన దగుటచే దీనినే పేర్కొన్నాడు.
ఈ విధంగా అసంయుత, సంయుత, హస్తముల లక్షణ వినియోగములు నిర్వచించి హస్తములనంతములనీ, జగత్తంతయూ అభినయ యోగ్యమనీ, తగురీతిగా ఏ హస్తము దేనికి తగునో అదే విధముగా అభినయింపవలెనని పేర్శొనెను. బుద్ధి మంతుదైన మనుజుడు దేశు కాల, ప్రయోగ, ప్రయోజనము నెరిగి, అనుకూలమైన స్థాయి, సంచారిభావములను సూచించు నేత్రాది చేష్టలతో కూడ ప్రయోగింపదగును. ఇతర సంప్రదాయములనుబట్టి, వ్యవహారములను బట్టి, పేరును బట్టి లక్ష్యమును నిశ్చయించి ప్రయోగింపవలెను. ఉత్తములు ఫాలభాగమున, మధ్యములు వక్షము వద్ద, అధములు వక్షస్టలమువద్ద హస్తములు సంచరించునట్లు చేయవలెను.
హస్తముల లక్షణవినియోగములను వివరించి ఇరవై సార్ధక సంజ్ఞలు గల హస్త కర్మలను పేర్కొన్నాడు. అవి వికర్షము (అడ్డముగా ఈడ్చుట) ఆకర్షణము (తన వద్దకు లాగుకొనుట) ఉత్మర్షము (లేవనెత్తుట) నిగ్రహము (పట్టినిలుపుట) పరిగ్రహము (స్వీకరించుట) మోక్షము (పట్టువిడుపు) రక్షణము (కాపాడుట) విక్షేపము (విసిరి వేయుట) విసర్గము (క్రిందికి విడుచుట), ఛేదము (నరుకుట) భేదనము (పగుల్చుట) సంశ్లేషము (కూడుట) ఆహ్వానము (పిలుచుట) విశ్లేషము (విడివడుట) తోదము (క్రుచ్చుట) తాడనము (దెబ్బవేయుట) తర్జనము
34 నృత్తరత్నావళిరోచి (వెరపించుట) ధూననము (విదిలించుట) ఆమోటనము (నలచుట) స్ఫోటము (చీల్చుట) అనునది ఈ ఇరవై హస్త కర్మలు.
ఏ క్రియావిశేషణముచే అభినయమునకు ఒక విశేషము, అందము చేకూరునో, వ్రేళ్ళకదలికలచే సుందరత్వము ఆపాదింపబడునో అది హస్తకరణ మగును. పతాకాది హస్తములకు ఇతరాపేక్ష లేకయే లక్షణములచేతనే, స్వరూపమేర్ప్చడుచున్నది: కరణము లకు (వ్రేళ్ళ కదలికయే ముఖ్యమగుచున్నది. అపవేష్టనము, ఉద్వేష్టనము, వ్యావర్తనము, పరివర్తనము అని హస్తకరణములు నాలుగు, ఇవి హస్తములనుండి పుట్టినవి, మరియు పుట్టించునవి కూడా.
హస్తానాం కరణాన్యేవం జన్యాని జనకాని చ | (1.298)
ఈ నాలుగు హస్తకరణములు నాట్య నృత్తములందు ప్రయోగ యోగ్యములు. అట్లే హస్తప్రచారములు అయిదు సార్థకములైనవి భరతసమ్మతములైనవి పేర్మాన బడినవి. అవి ఉత్తానము (వెలికిలినది) అధస్తలము (బోరగిలినది) తిర్యక్కు (అడ్డము) ఊర్చ్యముఖము (మీదమొగమైనది) అధోముఖము (క్రిందిమొగమైనది) ఇవిగాక ఊర్వముఖము, అధోముఖము, తిర్యక్ ముఖము, అగ్రముఖము స్వసమ్ముఖము అని మరి అయిదు భేదములు ఇతరులు పేర్కొన్నను, సమ్ముఖ మిగిలినవి తలభేదములో కలిసిపోవును గాన (ప్రత్యేకముగా భావించవ ॥ లేదని భరతాభిప్రాయము స్పష్టపరచినాడు. (1.307) లూది
ఊర్వ్యగతము, పృష్టగతము, తిర్యగ్గతము, స్వస్తికము, మండలము అపవిద్ధము, అంచితము, ఆవిద్ధము, కుంచితము, అధోముఖమని బాహృవ్య (బాహుప్రకారములు) పదివిధములని నృత్తకోశవిదుల అభిప్రాయమ్స. ఇవిక్షాక్ర సరళము, ఆందోళితము, నమ్రము, ఉద్వేష్టితము, ఉత్సారితము, ప్రస్తాత్వ్వ అని బాహువు ఆరు విధములని మరికొందరు వచించారు. కానీ ఇవన్ని అవాంతర
భేదములగుటచే భరతుడు వానిని వదిలి వేసాడు. (1.817)
ఈ. హస్తకరణములు (ద్రుత, మధ్యాది కాల భేదములతో బ్రావా ప్రకారములతో కలిపిన అనేక వర్తనములు చేయవచ్చును. గనుక సంఖ్యాపరిమిత్తి చేయరాదని జాయన అభిప్రాయము. దానిని బట్టి లోకధర్మి ననుసరించి, దేశ్చి
నృత్తరత్నావళిరోచి 35 సంప్రదాయ మనుసరించి అభిప్రాయప్రకారములు అనేకవిధములుండుట జాయన కంగీకారమేనని తెలియు చున్నది.
చింత, శోక, వృద్ధాప్యము, రోగము ఇత్యాదులచే పీడింపబడువారు, పడవ, సముద్ర, తపస్సులందున్నవారు, సిగ్గు, అలసట, జారిపడినవారు, యుద్ధములందు, చేష్టలుడిగినవారు, స్వప్నము, స్వప్నవిషయము లనుభవించువారు, హస్తాభినయము చేయరాదు. కేవల సాత్త్వికభావ విశేషమును మాత్రమే చూపవలెను.
నాట్యనృత్త నృత్యముల కుపకరించు అసంయుత, సంయుత హస్తముల ప్రయోగములు, వాస్తప్రచారము, బఐహు(ప్రకారములు అయిన పిమ్మట నృత్తవాస్తములు వాని ౩2 భేదములతో సమగ్రముగా వివరించుటకు పూనుకొన్నాడు.
సంయుత అసంయుత హస్తములకు పతాకహస్తము ముఖ్యమైనట్లు నృత్త హస్తములకు చతురథశ్ర హస్తములట్లే ముఖ్యమైనవి. శరీరము అనగా అంగములు చతురథ్రముగా ఉండుట, నృత్యమునకు జీవితము వంటిది. అందుచే సమస్తమైన నృత్తహస్తములన్ని అందుండియే పుట్టినవి అని నృత్తశాస్త్రవేత్తల అభిప్రాయము. (1.826)
ఈ నృత్తహస్తములు కేవలము నృత్తమునందే ప్రయోగింపవలెను, అయినను నాట్యనృత్యప్రయోగము లందచటచట ఈ నృత్తహస్తములు ప్రయుక్తమగుట కనబడుచునే యున్నది. ఇవి సంయుత అసంయుత హస్తములవలె పదార్ధాభి వ్యక్తములు కాకపోయినను శోభాకరములుగానే యుండును.
ఇరవైతొమ్మిది నృత్తహస్తములు మాత్రమే తనకు సమ్మతమైనను మరి రెండు ఇతరభేదములను కూడా నృత్తహస్తములందు చేర్చినాడు. నికుంచికమనే అసంయుతహస్త భేదము, ద్విశిఖరమను సంయుత హస్తభేదము, నృత్తహస్తభేదము నందు చేర్చబడినవి. నికుంచకము వేదాధ్యయనమునందు, న్వల్పమని సూచించుటకు ప్రయోగింపవలెను. ద్విశిఖరహస్తము శపించునపుడు, మెటికలు విరచుటకు, కోపగించిన స్రీలు, “నాస్తి అని చెప్పుటకు కూడా ప్రయోగింపవచ్చును. అట్లే వరదాభయమను నృత్తహస్తకము సార్థకమైనది కూడా ఇందు చేర్చబడినది. ఒక చేయి వరదము రెండవది అభయమును సూచించునపుడు వరదాభయమను ఈ నృత్తహస్తము ఉపయోగింపవలెను.
36 నృత్తరత్నావళిరోచి మూడవ అంగమైన వక్షము అయిదు విధముల లక్షణములతో కూడినది. అవి సమము, ఉద్వాహితము, అభుగ్నము, నిర్భుగ్గము మరియు ్రకంపితము. వాని లక్షణ వినియోగములు వచించి పార్వలక్షణములు అయిదు విధములైనది వినియోగముతో. కూడ చెప్పబడినది. వివర్తితము, అపసృతము, ్రసారితము, సమున్నతము, నతము అనునవి అయిదు పార్వ్వకర్మలు. వక్ష పార్వముల లక్షణము లతో చేరిపోయినది కనుక పృష్టలక్షణములు భరతుడు చెప్పలేదు గావున తానును చెప్పుటలేదని భరతునిపై గౌరవాన్ని ప్రకటించుకున్నాడు. క్షామ, ఖల్వ, పూర్ణమని ప్రత్యంగమైన జఠరకర్మలు, రేచితము, కంపితము, ఛిన్నము, నివృత్తము, ఉద్వాహితము అని కటి (మొల) అను అంగపు అయిదు ప్రయోగములు కంపనము, వలనము, స్తంభము, ఉద్వర్తనము, నివర్తనము అని ప్రత్యంగమైన ఊరు (తొడల) నడక అయిదు విధముల వానిని లక్షణ వినియోగములు నిర్వచింపబడ్డాయి. ఉన్నతము, వివృతము, నమ్రము, అర్ధకుంచితము, కుంచితము, లై ॥ + క్షిప్తము, ఆవర్తితము, ఉద్వాహితము అను 'ప్రత్యంగమైన జంఘా (పిక్కల) కర్మ లక్షణ వినియోగములు స్ఫుటీకరింపబడినవి. చివరి అంగమైన పాదము సమము, అగ్రతలసంచారము, కుంచితము ఉద్దటితము, అంచితము అని అయిదు భేదములతో భరత సమ్మతమైన లక్ష్యవ' కలది. తాడితము, ఘట్టితోత్సేధము, ఘట్టితము, మర్దితమ్మ, అగ్ర గమ పార్ష్టిగము, పార్వ్వగము, సూచి, అంగుళి పృష్టగము, తలాహత్రి అన్సి ఇతరుల్తు చెప్పిన పది భేదముల లక్షణ వినియోగములు కూడా ఇందులో పొందుపరిచాడు అట్లే పాద లక్షణము చెప్పిన ప్రసంగవశమున పాదాంగుళుల లక్షణము ప్రయోగములు చెప్పినాడు. అవి ఉత్క్షిప్తములు, కుంచితములు, స్తబృముల్సు, అవక్షిప్త్రములు, స్వభావజములు, అనంగుష్టయుతములు, అంగుష్టసంయుక్షమృుల్వు అని కాలివేళ్లు (పాదాంగుళీ) ఏడు విధములు. దీనిలో అంగుష్టము తక్కిన అన్ని కాలి వ్రేళ్ళతో కలిసియున్నప్పుడు ఏడు విధములైన అంగుళీలక్షణములన్సు (గ్రహించును. కానీ ప్రత్యేకమగు అంగుష్టము (బొటనవేలు) మూడు విధములైన లక్షణ ప్రయోగములు కలిగియున్నది. అవి ఉత్క్షిప్తము అవనతము, సహజము
నృత్తరత్నావళిరోచి 3/7 అనునవి. నఖముఖముల సూచించునపుడు మీది మొగమగుట ఉత్క్షిప్తము, క్రిందికి వంచినది అవనతము, దీనిని సిగ్గుతో నేల గోకునపుడు ప్రయోగించవలెను. స్వభావముతో నుండు సహజమైన నడకతో కూడినది సహజము.
ఈ విధముగా జూయన శిరస్సు మొదలుకొని పాదముల వరకు గల అంగముల లక్షణములను వాని వినియోగముతో పాటుగా స్పష్టముగా భరతముని ఆశయమును అనురించినప్పటికీ, తన విధానములో వ్యక్తపరచాడు.
కటిమొదలుకౌని పాదముల వరకు గల అంగప్రత్యంగ ఉపాంగముల అనగా కటి, ఊరు, జాను, జంఘా, పాద, పాదాంగుళీ కర్మల పరస్పర సంయోజితమైన చేష్టచే “చారు” లనబడును. చాషగతి, మృగఫ్లతము, (భ్రమరి మొదలైన వానితో అందము గాను, స్వందిత, జనితాదులతో శోభాజనకమైన “చారి” యొక్క లక్షణ వినియోగముల వివరణతో మూడవ అధ్యాయము ప్రారంభమైనది.
“చర్ ధాతువునకు కరణ, భావార్థములందు “ఇజ్” (ఇ) ప్రత్యయము చేరి “కృదికారాదక్తినళి అను పాణిని సూత్రముచే 'జీష్ (ఈ) ప్రత్యయము చేరి “చారీ” అనుపదము ఏర్పడినది. మంచిరాజువలె, శివుని తలయందలి పామువలె, మేథుము లోని మెరుపు వలె (దండపాదచారి, భుజంగ త్రాసితచారి, విద్యుద్భాంతచారి) చారి తరగని సౌందర్యము గలది. పాదోరు జంఘల అన్యోన్య కరణమే పాదచారీ. ఏకపాద (ప్రచారము “చారి, రెండు పాదముల ప్రచారము కరణమగును. మూడు కరణముల (ప్రచారము ఖండము. ఈ ఖందములు మూడు నాలుగు చేరిన మండలమగును. యుద్ధమున చక్రము, శక్తి ఉపయోగించుట ఎంత ముఖ్యమో, అట్లే నాట్యమందుగానీ నృత్తమందుగానీ చారీ ప్రయోగింపక ఏమియు జరగదు. ఈ చారులు మొత్తము 36. అందులో భూచారులు 16, ఆకాశచారులు 16. సమపాదము, స్థితావర్తము, జనితము, స్యందితము, అవస్యందితము, బద్దము, శకటాస్యము, విచ్యవము, ఏలకాక్రీడితము, చాషగతి, ఉత్స్యందితము, అడ్జితము, సమోసరతమత్తల్లి, మత్తల్లి, అధ్యర్థికము, ఊరూద్యృత్తము అను ఈ పదహారు భూచారులు. అతిక్రాంతము, పార్వక్రాంతము, అపక్రాంతము, సూచి, మృగపఫ్లతము, భుజంగత్రాసితము, అలాతము, ఆవిద్ధము నూపురపాదిక, ఆక్షిప్తము, భమరి, దండము, విద్యుద్భాంతము, ఊర్హ్వజానువు, ఉద్వృత్తము,
ఈ నృత్తరత్నావళిరోచి డోలాపాదము అనునవి పదహారు ఆకాశచారులు. పాదములు ఎక్కువగా భూమియందు, ఆకాశమందును అనగా నేలకన్నపైన చరించుట చేత ఆపేళ్ళు వానికి కలిగినవి. భూమ్యాకాశచరత్వేన ప్రాయశస్తాస్తదాహ్వయాః. (1-13) ఒక్కొక్కసారి పాదము (వధానమగును. ఒక్కొక్కసారి వాస్తము ప్రధానమగును. వాని వాని శోభను కనుగొని ఆయా ప్రయోగములు చేయవలెను. చారీని [ప్రయోగించు నపుడు అడుగులున్న దిక్కులోనే హస్తము, ఎక్కడ హస్తమున్నదో అక్కడే త్రికము, ఎక్కడ త్రికము (వెన్నెముక) యున్నదో అక్కడే కన్నులు మొదలైన ఉపాంగములను ప్రయోగింపవలెను (1-65) పాదచారి 'ప్రయోగము పూర్తికాగానే పాదము నేలను, హస్తము కటిప్రదేశమునందు అర్ధ్భచంద్రముగా నాట్యమందు,. పక్షవంచితములో లేదా పక్ష్మప్రద్యోతములో నృత్తమందుండవలెను. నృత్యమందీ మూడును ఉండవలెను. ఈ గతి భేదముల నంతము లైనను వానిలో లలిత స్వరూపముగలవి 392 మాత్రమే భరతముని పేర్మానెను. ఈ చారుల ఆద్యంతములు తెలుస్తుకొనుటకు స్తాన కరణము, కా అను మూడర్థముంయ్ దష నను బడినది. “కరణాధారభావేషు స్థానశబ్లో నిరుచ్యతే.” యూ?70, చేయబోవు ఒకభావమును చూపుటకు కన్నులు, శరీరాంగము నిశ్చలముగా నిలుపుట స్థానము. చారికిఅను కూలముగా ఏదో ఒక స్థానమందు నిలువవలెను, స్లానము లేకుండా ఏ ప్రయోగము ఉండదు. వైష్ణవము, సమషాదము, వైశ్యా మండలము, ఆలీధము, ప్రత్యాలీధము అనునవి ఆరు పురుషస్థానములు. ఆర్రి పురుష స్థానముల లక్షణ వినియోగములు విపులముగా చర్చించబడినది. శస్త్రములు ప్రయోగించుట, వాని బారి నుండి తప్పించుకొనుటకు తగిన అంగ వ్యాపారము న్యాయము. భారతము, సాత్వతము, వార్షగణ్యము, కైశికము అనునవి ఈ నాలుగు న్యాయములు. ఇవి కటి, పాదములు, వక్షస్థలము, తలలను భేదించుట కుపయోగించవలెను. ఒక చేతిలో వేయదగిన శస్త్రములు, కత్తి మొదలైనవి ఒక రకము, రెండు చేతులతో వేయదగిన శస్త్రములు విల్లు మొదలైనవి రెండవ రకమైనవి. ఈ రెండింటి ప్రయోగము పలు విధములైన
నృత్తరత్నావళిరోచి 29 చారులు కలిగి న్యాయములచే నెరుపబడును. దీనినే ప్రవిచారము అందురు. సార్ధకమైనది. విశిష్టమైనది. ఆయుధ ప్రహరణముల రక్తము చిందుట, మనసుకు గాయం, ఉద్వేగం కలిగించు వేదనాభరితములైన పనులు రంగస్థలమున చేయరాదు. కేవలము శాప్రీయమైన అభినయముల ద్వారా వ్యక్తపరచవలెను. అట్లే సౌష్టవోపేతమైన అంగవిక్షేపములచే మనోహరముగా లయతాళములు చేర్చి వ్యాయామము చేయించవచ్చును. సాధకుడు తాళలయబద్ధముగా వ్యాయామము చేసి తన అంగములను సమరేఖలో సౌస్టవముతో సుందరముగ నుంచుకొనవలెను. లేని యెడల అట్టి సాధకుడు ఇష్టానుసారం, ఆయాదేశ పద్ధతుల ననుసరించి మోకాళ్ళను, తొడలను 4, 8, 12 అంగుళముల వరకు కుదించవచ్చును. అంతకు మించి కుదించిన శోభాకరముగ నుండదు. వైష్ణవ స్థానములో వక్షస్థలముండి, హస్తములు కటినాభులందు చేరుచుండిన *చతురశ అంగములతో శరీరము నేత్ర సుఖావహంగా ఉంటుంది.
శస్త్రప్రయోగములో ముఖ్యమైనది ధనస్సు. కత్తియుద్ధము నొనరించుటకు వ్యాయామము వలె ధనుర్యుద్ధమునందు పరిమార్దనము, ఆదానము, సంధానము, మోక్షణము అను నాలుగు కరణములు. ఇవి ధనుః కరణము లనబదును. సార్ధకములు.
కూర్చుని యుండు వాని స్థానములు నాలుగు ఉత్కటము - జపతపాదులకు తగినది, యోగకృతము, క్రాంతము అని కూడా చెప్పబడును. ఇది ఓడినవానికి, శోకమును, వ్యాకులతను ్రకటించువారు ప్రయోగింపదగినది. మదాలసము
- చింత వియోగములను ప్రదర్శించుటకు, అవహిత్ధము ఆకారగోపనము సిగ్గు ఇత్యాదులు ప్రదర్శించుటకు ప్రయోగింపవలెను. ఇట్లు ఆసన స్టానరీతులు నాలుగు.
పడుకొని ఉన్నవాని స్థానములు ఆరు. అవి సమము - వెలికలు, చక్కగా అంగములు చాచి పరుందునది. ప్రసారితము - సుఖానుభవము సూచించునది. ఉద్వాహితము - లీలగా ఆస్థానమందు అలవోకగా చేయబదునది, వివర్తితము
- రోగ, గాయాదులచే బాధపదువారు ప్రదర్శించునది. నతము - ఆలస్యము, (శ్రమ మున్నగునవి ప్రదర్శించుటకు, ఆకుంచితము - చలిచే పీడింపబడు చున్నప్పుడు ప్రదర్శించునవి. ఇట్లు సుప్తన్ధానకములు ఆరు.
ప్రీల స్థానకవిషయమున భరతుడు 'ప్రతిపాదించినవి మూడు అవి ఆయుత,
40 నృత్తరత్నావళిరోచి
అవహిత్ణ మరియు అశ్వక్రాంతము. 'అథాపి' అని మరి అయిదు సూచింపబడ్డాయి.
అవి గతాగతము, వలితము, మోటితము, వినివర్తితము, ప్రోన్నతము అనునవి. ఈ మొత్తము ఎనిమిది ప్రీల స్థానకములుగా జాయన గుర్తించి, వాని లక్షణ వినియోగము లను విపులముగా చర్చించాడు. ఆయుత స్థానమునకు లక్ష్మీదేవి, అవహిళ్ళమునకు మహిషమర్దినీదేవి, అశ్వక్రాంతమునకు సరస్వతీ దేవి అధిదేవతలు. ప్రయోగ విని యోగములు స్వాభిప్రాయమును స్పష్టముగా వెలిబుచ్చాడు.
'" బహుపదచారుల సమ్మేళనము మండలమగును. వేర్వేరు జాతుల పూలను కలిపి అందముగా కట్టిన పూలదండవలె, పరంపరగా చారులు అందముగా కూర్చుట మండల మనబడును.
పారంపర్యేణ చారీణాం మండలం చారుగుంఫితం । దామేవ పుష్పజాతీనాం న కస్య నయనోత్సవః ॥ (1.142) ప్రయోగించిన చారి 'పాముఖ్యతనుబట్టి జఖౌమీ మండలము, ఆకాశమండలము అని రెండు విధములు. పది భౌమీ మండలములు, 10 ఆకాశ మండలములు. 'భ్రమరము, ఆస్మందితము, పిష్టికుటము, చాషగత్రమ్స, అడ్జితము, ఏలకాక్రీడితము, అధ్యర్థము, ఆవర్తము, శకటాస్యము, సమోసరిత్రమ్హు అనునవి భౌమీ మండలములు. సూచీవిద్ధము, అతిక్రాంతము, దండపాద్రమ్వు అలాతకము, విచిత్రము, విహృతము, వామబంధము, లలిత సంచరమ' కాంతము, లలితము అనునవి పది ఆకాశమండలములు. ఆభ రణముల్ల విచిత్రముగా ధరించి, సుకుమార శరీరము గలిగి (లలితము) సుడివంటి నాఖిగల్చగ (ఆవర్తము) తుమ్మెదవంటి కురులు కలిగి (భమరము) సొంపైన నడక గలిగి (క్రాంతము) స్తీ జనుల మనసును హరించునట్సు, అందముగా కూర్చబడిన చారీమండలము పేక్షకుల హృదయానందము కలిగించు ననుటలో అతిశర్చాజ్ఞ లేదు. ॥ ఒక్కొక్క మండలము నందు కనీసము ఏదెనిమిది చారులు కలపవచ్చున్స. ఇవేగాక బుద్ధిచాతుర్యముతో యోగములైన దారులను పరస్పరముగ్గా కలిప్పి మరికొన్ని మండలములను స్వతంత్రముగా చేయవచ్చును. 'అతఃపరమపి స్వైరం కల్పనీయాని కాన్యపి” (11-198
నృత్తరత్నావళిరోచి 41 ఈ మండలములు ఖండములు (అనగా 8 కరణములు) కలిగి, అందమైన అంగయష్టి కలిగి, మనోహరములై వాద్యముల పొందికతో శాస్త్ర సమ్మితముగా ప్రయోగింపవచ్చును. అందమైన సుడులు గలిగి, విలాసముతో రవగాలి నడక గలిగిన ఆడగుర్రము వంటిది మండల లక్షణమని పోల్చి చెప్పి చారీస్థానక మండలక్షణ మను తృతీయాధ్యాయాన్ని ముగించాడు జాయసేనాపతి. న్థానములు, నృత్తహస్తములు, చారుల సమన్వయ పూర్వక సమాగమనము కరణమునకు మూలాధారము. హస్త పాదముల కదలికలు అనేక విధములుగా నున్ననూ, విలాసముగానూ, మనోహరముగానూ ఉన్న యెడల అది కరణమగును. హస్తమనగా ఊర్పకాోయము, అందలి శాఖాంగోపాంగములు. అట్లే పాదమనగా అధఃకాయము, అందలి శాఖాంగోపాంగములు. అట్లే నృత్తకరణము అన్ననూ, కరణము అన్నను ఒకటియే అన్వర్థకములు. పూర్వక్షేత సంయోగ త్యాగమునుండి సముచిత క్షేత్రాంతర ప్రాప్తి పర్యంతమైన ఏక రూప క్రియ కరణమనబడును. “హస్తాంఘీ ప్రముఖానాం తు పూర్వాధఃకాయవర్తినామ్, అంగానాం క్షేత్రతః క్షేత్రప్రాప్తిరూపాఠ.త్ర యా క్రియా. విలాసనిర్భరా నృత్తకరణం తదుదాహృతం”, (7-8) శరీరావయములయొక్క విలాస విక్షేపషమునకు సంబంధించిన క్రియ కరణ మనబడును. ఇది 108 విధములు. వాక్యార్ధ, పదార్ధముల నభినయించునపుడు యథోచితముగ ముందు, మధ్య, చివర ప్రయోగించుట ద్వారా ప్రాముఖ్యము ప్రకటించ బడును. ఏ కరణమందు అభినయహస్తమునకు 'ప్రాధాన్యమో అక్కడ ఆ వాక్యార్థమునే అభినయింప వలెను. కేవలము నృత్తము చేయరాదు. కరణమున నృత్తహస్తము ప్రధానముగా ఉండుట మంచిది. వాక్యార్ధాఖినయస్తత్ర కార్యో, నృత్తే న కేవలే, నృత్తహస్తప్రధానం తు కరణం తత్ర శస్యతే. (17-21) నృత్యప్రయోగము నారంభించునపుడు సమపాదము, లతాహస్తములు, చతుర్థ దేహమును సామాన్యముగా నుండవలెను. కరణముల నభినయించుటలో
42 నృత్తరత్నావళిరోచి ప్రత్యేకముగా హస్తమునుగానీ, పాదమునుగానీ 'పేర్కొానబడకపోయిన యెడల ఆ కరణము కుడిచేయి లేదా పాదములతోనే చేయవలెను. కరణాభినయేష్వేషు హస్తో వా చరచో౭.థవా । 'ప్రాథమ్యాత్ దక్తిణః (ఫ్రోక్తో విశేషో యత్ర నోచ్యతే 1 నూటవఎనిమిది కరణముల లక్షణ వినియోగములను వివరించి, ఏయే కరణములకు వినియోగము చెప్పబడలేదో, ఆకరణవములన్నింటినీ ఉద్ధతములైన అంగములతో, ఉద్దత పరిక్రమములతోనూ చేయవలెను. లం వినియోగో న యే షూక్త కరణేషు సమానతః, ఉద్ధతాంగతయా స స్యాత్ తత్రోద్ధతపరిక్రమః. (7-240) కవ్వమునుండి తీసిన. వెన్నకై నర్తించువాడు (వైశాఖరేచితము) చక్రము ధరించిన వాడు (చక్రమండలము) గరుడునిపై స్వారి చేయువాడు (గరుడప్లతమ్స అంటూ కృష్ణునితో పోల్చి కరణలక్షణముల నందించినాడు శ్రీజాయన ) ఈ విధంగా కరణముల లక్షణ వినియోగములను వివరి ॥ క్ష చి, కర ఏర్పడు అంగహారములను గూర్చి చర్చించుటకు సిద్దపడ్దాు ణములచే చెప్పినవానితో కలిపి, అవి కొన్ని చతురశ్రతాళముతో, కొన్ని తశ భరతుడు ప్రయోగింపదగిన వానిని, విడదీసి ఉద్దేశములతో కూడా లక్షము నాళముత్రో చేసాడు. వ లిలు తెలియ రెండు మూడు కరణములు చేరి న్నృతమాత్త్సక నిశయమును కలిగించును. అట్లివి 2,8 న న నరించుచున్నాడు అను అంగహారమనగా అంగ విక్షేపషమని అమరకోశారము. కరణములచే బడును. థ లచ అంగములన్స సహజస్థానమునుండి సముచితమైన వేరొక ప్రదేశమునకు తీసికొనిపోవుట ఆ వారమునబడును. ంగ “అంగానాం యోగ్యదేశేషు హరణేన నిరుచ్యతే” గల్లి 49) అంగములను తగిన చోట్లకు తీసికొని పోవునది అంగహారము; అంగమృులవ్ర నెరవేర్చ బడునవి. కొందరు రెండు కరణముల కూడిక 'మాతృక' యని, మూడింటి కలయిక 'కలాపమని నాల్లింటి కలయిక 'ఖందిమని ఐదింటి కలయిక 'సంఘాతి మని
నృత్తరత్నావళిరోచి 43 పేర్లు ఇచ్చారు. కానీ ఈ కరణముల కలయికకు సంఖ్యానియమము లేదు. 6,7,8 ఎన్నైననూ కరణములను ఒక్కచో చేర్చవచ్చు. ఏది ఏమైననూ కరణమే నృత్తమునకు మాతృక. ఈ కరణముల కూడిక అంగహారము. ఇది హరునికి సంబంధించిన హారము.
అంగహారో£_థవా హారః ప్రయోగో హరయోగతః గ/-249) =
తండువు శివుని యాజ్ఞచే భరతమునికి, పూర్వ రంగమున ప్రయోగించినచో దృష్ట ఫలముతోబాటు అదృష్టఫలమును కూడా. ఇచ్చునని, ఈ అంగహారములను ఉపదేశించుటయే, నృత్తమున వాని ప్రాముఖ్యతను చాటుచున్నవి.
అంగహారములు చతుర(శమానముతో పదహారు, త్య్థశ్రమానముతో పదహారు ఉన్నాయి. అవి న్ఫీరహస్తము, పరిచ్చినము, పార్వచ్చేదము, అపరాజితము, పర్యస్తము, భ్రమరము, ఆలీధము, మత్తాక్రీడము, అపసర్పితము, మదవిలసతము,: విద్యు ద్ర్భాంతము, వైశాఖ రేచితము, సూచీ విద్ధము, ఆక్షిప్తము, పార్వస్వస్తికము, ఆచ్చురితము అను ఈ పదహారు చతురథశ్రతాళముతో కూడినవి.
గతిమండలము, విష్కంభము, పరావృత్తము, అపవిద్ధము, మత్త స్థలితము, సంభ్రాంతము, ఆక్షిప్తరేచితము, రేచితము, విష్కంభావసృతము, అలాతము, ఉద్వృత్తము, అర్ధ నికుట్టకము, ఉద్ధటితము, వృశ్చికాపనృతము, స్వస్తికరేచితము, పరవృత్తిరేచితము అను ఈ పదహారును త్ర్యశ్ర తాళములో కూడినవి.
కరణాంగహారములు అనంతములు.
అనంతతా౭.౦గహారాణాం కరణానాం వికల్పనాత్ ((౧/-351) వానిని అందమునకు, బుద్ధికి, రుచికి తగినట్లుగా ప్రయోగించుచు ప్రత్యేక కరణముల చేరికయందలి మైత్రినిచూచి, దృష్ట ఫలమును జా(గ్రత్తగా గమనించి చేయవలెను.
ఎనిమిది కరణములు మొదలుకొని రెండు రెండింతలుగానున్న అంగహారములు చతుర(శ ప్రమాణము కలవి, ఆరు కరణములు, రెండింతలైనవి త్య్రథభమానము కలవని విజ్ఞలు అభిప్రాయము. ఏ అంగహారమందైనను ఇంతకు తక్కువగానీ ఉన్నయెడల, క్రియను రెండుమార్లు చేసి పూరించ వలెను. ఎక్కువగా నుండిన తాళకళల' పొడుగు తగ్గించి సరిపుచ్చవలెను.
త్య నృత్తరత్నావళిరోచి కరణాంగహారముల నిర్వచనము చదివి ప్రయోగింప పూనుకొనుట అసాధ్యము. సంప్రదాయమును అనుసరించు ఆచార్యుని వద్ద నృత్తము నభ్యసించ వలెను. శాస్తము లవగాహనము చేసుకొనిన నృత్తాచార్యుడు అంగహారములోని ఛిద్రములను (ఖాళీ- ౮౧) పూరించి నృత్తప్రయోగ సమర్భుని చేయును. కరణముల మార్చుతో అంగహారము లనంతములు అయిన యెడల ముప్పది రెండు నిద్దేశించుటెట్లు అను ప్రశ్నించిన దానికి ఇతరుల సమాధానములు తన అభి ప్రాయమును యిలా వ్యక్తపరుస్తున్నాడు జాయన. పూర్వరంగప్ప అంగములు పదహారు. అవి ఒకొక్కటి రెండు విధములు గాన మొత్తం ముప్పైరెండని కొందరి అభిప్రాయం. పూర్వరంగము నలుగురు నర్తకీమణులు ప్రవేశించి షిండీరేచకమున కలుగు న్యాసాప న్యాసములతో ప్రతి ప్రయోగమునందు ఎనిమిది అంగరహారములగును గాన మొత్తం 392 అవుతాయని కొందరి మతం. గీతానికి అంగాలు 24, ఆసారితములు 4, వస్తువు ౩ విధములు, పాణిక 1 ఇట్లు పాటల్రోన్సి విచిత్రత వలన అంగహారములు 32 అని కొందరంటారు. కానీ ఇవేవీ జాయనక్త అంగీకారము కాదు. పార్వతీ పరమేశ్వరుల కిష్టమైనవి, దృష్టాదృష్ట ఫల్సు నిచ్చునవి, మహేశ్వరుడు నిర్దేశించినవి, ఇవి మాత్రమే (32) అని ఘంటా ప్రదంగా తన అభిప్రాయం వెలిబుచ్చాడు. వయంతు శివయోరిష్టాః దృష్టాదృష్టఫలప్రదాః ॥ మహేశ్వరేణ గదితా ఇయంత ఇతి చక్ష్మహే ॥ (౫7-౩56) ఈ అంగహారము మత్తుతో తడబడు (మత్తస్టలిత) తుమ్మెదలు (భ్రమర ములు) తేనె గ్రోలుతూ తిరుగాడు (సంభ్రాంత) అందమైన పూదోట వలె శోభిల్లునది. “కరణరేచకములతో కూడిన అంగహారములను, రేచక స్వప్హిత్రముగ్గా అంగ హారమును వివరింతును” అను భరతాభిప్రాయముననుసరిం్చి అధ్యాయాంతమన్స నాల్లు విధములైన రేచకములు పాదము, హస్తములు, కటి, మెడతో కూక్షిన్స తెల్పుచున్నాడు. “రేచితమనగా వేరుపడుట, కదలుట, పైకెత్తి వేరు పరచుటచ్చ కదిలించుట కూడా రేచకమగును”. అని నాట్యశాస్త్ర పాఠాంతరము. రేచితాఖ్యః పృథగ్భావే వలనే చాభిధీయతే | ఉద్వాహనాత్ పృథగ్భావాత్ చలనాచ్చాపి రేచకః ॥ (/-8692)
నృత్తరత్నావళిరోచి ఉర్
పాదరేచకము (అడుగులు ఒక ప్రక్కనుండి వేరొక ప్రక్కకు సాగివచ్చుట), కటీ రేచకము (త్రికము మీదికెత్తి రాచుట, చలించుట, ప్రక్కకొరుగుట), హస్త రేచకము (చేతిమీద రాచుట, చుట్టుట, విసిరివేయుట, లోపలకు మలచుట), (గ్రీవా రేచకము (మెడనెత్తుట, వంచుట, త్రిప్పుట) అను ఈ నాల్లు రేచకములు. రేచకము లెల్లప్పుడు కరణములతోనూ అంగహారములతోనూ కూడియే యుండును.
కరజైరంగహారైశ్చ సహితా ఏవ రేచకాః (౧7-868) “ఈ రేచకములు అంగహారముల ఆది మధ్యాంతము లందెప్పుదైననూ చేయు వచ్చునని” తుంబురుడు భరతునికి చెప్పెను. ([/-369). ఈ రేచక ప్రయోగము తప్పక పుణ్య సంపదనిచ్చునది.
ప్రయుక్నా పుణ్యసంపత్తిహేతవో రేచకా ఇమే (17-౩71)
భరతుడు శివుని నృత్యము రేచకాంగహారములతో నిండియున్నదని చెప్పుటయే జాయన అభిప్రాయమును బలపరుచుచున్నది.
“రేచకైరంగహారైశ్చ నృత్యంతం వీక్ష్య శంకరమ్” (నా.శా.)
ఈ విధముగా పుణ్యమునిచ్చు కరణాంగహార రేచక సహిత నృత్తము వివరించు నృత్తరత్నావళి యందలి కరణాంగహారవివేచన మను చతుర్ధాధ్యాయ మును ముగించాడు శ్రీ జాయసేనాపతి.
ఇప్పటి వరకు భరత సంప్రదాయానుగుణంగా అంగ ప్రత్యంగ ఉపాంగముల చారీస్థానక మండలముల, కరణాంగహారముల లక్షణవినియోగములు చర్చించు టచే ఇది ప్రథమ భాగమనదగినది. ఇక రెండవ భాగమనదగిన పంచమాధ్యా యము మొదలు అష్టమాధ్యాయము వరకు దేశీ స్థానక, కరణ, చారి భ్రమర, లాస్యాంగాదులు, పేరిణి, రాసక, కొల్లాటాది ప్రత్యేక నృత్తపద్ధతులు చెప్పబడినవి.
దేశి సంప్రదాయ వివరణము సంగీతమునకు (గీతమునకు) సంబంధించి నది కొంత వరకు మతంగుని బృహద్దేశిలో లభించింది. కోహలుని సంగీతమేరువు (అలభ్యము) నుండి కల్లినాథుడు “చాలకము' అను భాగము నుద్ధరించి సంగీతరత్నాకర వ్యాఖ్యానంలో ఉదహరించాడు. ఇందులోనే నారదుని 'దేశీనృత్త సముద్రము” కూడా ఉదాహృత్తమైనది. కానీ అది ఇప్పుడు అలభ్యము. ప్రస్తుతము మనకు లభించిన గ్రంథాలలో సోమేశ్వరుని మానసోల్లాసము (అభిలషితార్థ
46 నృత్తరత్నావళిరోచి చింతామణి) శార్జ్ఞదేవుని సంగీతరత్సాకరము పార్వదేవుని సంగీత సమయ సారము, జాయన నృత్తరత్నావళి ఇటీవలే ముద్రితమైన వి(ప్రదాసుని సంగీత చంద్రము*. ఈ అయిదే ప్రస్తుత ప్రామాణిక శాస్త్రగ్రంథాలు. దేశీ నృత్తభేదములన్నింటినీ కడపటి నాల్లు అధ్యాయములలో వివరించాడు జాయన. జాయన వర్ణించిన ఈ దేశీభేదములను రెండు వర్గములుగా విభజించారు శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు. ('ప్రథమవర్గము దేశీ స్థానక, ఉత్సుతికరణ, ('భ్రమరి, పాద, పాట, చారి, లాస్యాంగ, గతి భేదములుగాగలది, ఇవి మార్గభేదములకు ఆనుషంగి కములు (26610౧20). రెండవవర్గము పేరణి, రాసకము, చర్చరి, బహురూపము, భాండిక, కొల్దాము ఇత్యాది నృత్తపద్ధతులతో కూడినది. _ రాజుల ప్రీతికొరకు క్రొత్తక్రొత్తగా ఏ నృత్తము కల్పింపబడునో, అది ఆయా దేశముల ననుసరించునది కనుక 'దేశి అనబడును. “నృత్తం తతః స్మృతం దేశీ తత్తద్దేశానుసారతః” (7-౩) దేశీ నృత్తము తగిన వేషము, భాష అలంకారములు కలిగి మనస్సులను హరించునది. రాజులచే లాలింపబడునది. అనేక దేశపు రీతుల నెరిగిన విదగ్ధజనులచే ఆదరింపబడునది. ఇంతకు మునుపు ప్రవర్తిల్లిన దేశీ నృత్తమును శాస్త్రముఖమున తెలుసుకొన వచ్చును. కానీ ముందు రాబోవు దానిని తెలియుట సాధ్యము కాదు కావున ఆనాటికి, అనగా కలియుగమున 4855వ సంవత్సరము నాటికి, ఏ ప్రయోగము లోకమున (ప్రచారము నందున్నదో జనాదరణ పొందియున్నదో దానిని, ఆ దేశీని, నిరూపించ ఉపక్రమించాడు జాయసేనాపతి. భూతం శాస్త్రముఖాద్జ్లేయం భవిష్యన్నావగమ్యతే | భవన్నిరూపణీయం స్యాత్ నృత్తం దేశీతి సంజ్ఞితం ॥ (7-4) కాకతి గణపతిదేవ మహారాజు యుద్ధమున, పాలనముననే గాదు నృత్తగీత వాద్యములందు కూడా నేర్పరి. మార్గ-దేశీ భేదముల నేర్చరచుటలోనూ -విశారదుడు. అట్టి వానిని మెప్పించుట కొరకై ఈ నృత్తరత్నావళి రచింపబడినది.
నృత్తరత్నావళిరోచి శా దేశి న్థానకములు ఇరవై మూడు. అవి సమపొదము, పరావృత్తము, స్వస్తికము, వృషభాసనము, ట్రాహ్మము, వైష్ణవము, శైవము, గారుడము, సంహతమృు, పృష్టోత్తాన తలము, వర్ధమానము, కూర్మాసనము, ఏకపార్వగతము, నంద్యావర్తము, చతురశ్రము, పాణిపార్వగతము, ఏక జానుగతము, పార్ష్టి విద్ధము, ఏకపాదము, నాగబంధము, సమసూచి, విషమసూచి, ఖండసూచి అనునవి. మార్గ సంప్రదాయ బద్ధములైన స్థానక, కరణాదుల లక్షణములతో పాటు వినియోగమును కూడా చర్చించినాడు. దేశీ భేదములందు కేవలము లక్షణము మాత్రమే వివరించాడు గానీ వినియోగమును గూర్చి చెప్పలేదు. అంచితము, కర్తర్యంచితము, ఖైరవాంచితము, వకఫాదాంచింతము, క్షేత్రాం చితము, స్కంధాంచితము, లేహద్యాంచితము, దండాంచితము, ప్రణామాంచి తము, లంకాదాహాంచితము, భ్రాంత పాదాంచితము, అంగుష్ట బంధాంచితము, బలిబంధాం చితము, అలగాంచితము, సమకర్తర్యంచితము అని ఉత్పుతి కరణములు పదునాల్గు విధములు. ఇవి ఉత్సుతి కరణపు అంచిత భేదములు. ఉత్పుతి కరణపు అలగాది భేదములు నాలుగు. అవి అలగము, కూర్మాలగము, ఊర్జాలగము, అంతరాలగము, అనునవి. ఉత్స్పుతికరణపు లోహడి భేదములు ఆరు. అవి కర్తరీలోహడి, సమకర్తరీ లోహడి, బాహుబంధలోహడి, విచిత్రలోహడి, వకపాదలోహడి, చతుర్ముఖలోహడి అనునవి. ప్రధానమైన లోహడితో కలిసి ఇవి మొత్తం వడగును. ఉత్సుతికరణపు దర్ప్ససరణ భేదములు మూదు. అవి జలశయనము, నాగ బంధము మరియు దర్ప్చసరణము అనునవి. ఉత్పుతికరణపు కపాల స్పర్శనము దాని భేదములు కపాలస్పర్భనము, వ్యంకోలము, సూచ్యంతము, మత్స్యకరణము అనునవి. ఇట్లు ఉత్సుతి కరణములు వాని భేదములన్నింటిని కలిపి మొత్తము ముప్పది రెందు (14+4+7+3+4వ=32) అయినవి. ఉత్సుతి (గంతు) అనునది ఈ కరణము నందలి ముఖ్య విశేషము. శార్బ్బదేవుడు దేశీ భ్రమరులను కూడా ఇందే చేర్చినాడు. సమపాదమందు నిలిచి మీదికి ఎగిరి, మొదటివలె అంగములు సవరించు కొని నిలబడుట అంచిత మనబడుతుంది.
4 నృత్తరత్నావళిరోచి సమపాదస్థితో యత్ర కృతోత్తానోత్సుతిర్దివి । వివృతః పూర్వవత్తిష్టేత్ తదంచితముదీరితం 11 (7-47) ఈ అంచిత లక్షణము అంచిత భేదములైన పదునాల్గు ఉత్సుతి కరణముల నందునూ గోచరించును. ,
- క్రింది మొగమై మీదికెగిరి, విడివడిన అంగములతో ముందు ప్రక్కనేలపై పడుచు, ఉత్కటాసనము చేయుట అలగము. ం ఉత్కాటాసనమాదధ్యాత్ యత్రేదమలగం మతం (7-69) మిగిలిన అలగ భేదము నన్నింటియందు ఇట్లే ఆచరించి చివరకు వేరొక కరణము నాచరించబడును. సమపాదమందు నిలిచి, మీదికెగసి, త్రికమును అడముగా క ! తిక మొగమై పడుట లోహడి యనబడును. (౫-66 లప్ప, వెనుక ఉత్స్పుత్య సమపాదస్థః తిర్యగావర్తితత్రికః । పరాజ్ముఖః పతేద్యత్ర లోహడీ సా ప్రకీర్తితా 1 (17-66) పై వాని వలెనే ఇతర లోహడీభేదములన్నింటి ప్రవర్తిల్ల చేయబడును. ౦౯ ఈ లోహడ్డి
- వైష్ణవస్థానము నందుండి, ఒక పాదమును త్ర చేసి, ఆ ప్రక్కనే అడ్డముగా చక్రము వలె దేహమ్స న్ా చేస్టే త్ర్యశముగా స్వస్థాన వు ఇంకొక పాదము త్ర్య॥ "వాభినము చేరునట్లు తీర్చుట దర్చసరణము. (17-78-74) వైష్ణవస్థానకే పాదః త్యశః పార్వముఖశ్చ యః | తత్పార్వదిళి కాయస్య తిర్యక్ స్యాచ్చక్రవద్భ్యమః 11 (17-78) పె విధముగా ఆచరించి స్వస్థానము బదులు నీటిపై పరుండి నట్టున్స జలశయనము, నాగబంధమున కూర్చొనిన నాగబంధమగును. నర్తకుని తల నేలను తాకినచో అది కపాలస్పర్శనము. లోహంమలగడీ బడ్ద్వా స్పృశేన్మూర్ధా మహీం మనాక్ (17-77) న వ జ్ దినికే కపాల చూర్ణమని కూడా పేరు. కానీ శోభాకరమైనది గాదు. కపాలన్పర్శనము నుండియే జనించిన వ్యంకోలమునకు నతపృష్టమని
నృత్తరత్నావళిరోచి తం యింకొకపేరు. మిగిలిన రెండు భేదములయందును నర్తకుని శరీరము నేలను తాకి అభినయింపబడదును.
అట్లే భ్రమరులు పదమూడు. అవి అంతగర్భృమరి, బహిగ్షృమరి, ఛత్రభ్రమరి, తిరిపభ్రమరి, ఓతా భ్రమరి, అలగ భ్రమరి, ఉచిత భ్రమరి, విద్యుద్భృమరి, చక్రభ్రమరి, శిరోభమరి, హస్త భమరి, కుంచితభ్రమరి, అంగభ్రమరి అని (భ్రమరలు పదమూడు. వీనియందు ఎనిమిది శుద్ధమైనవి. చక్రభ్రమరి, అంగ[భ్రమరి, ఓతాభ్రమరి, శిరోభ్రమరి, హస్తభ్రమరి, తిరిపభ్రమరి, ఛత్రభ్రమరి, కుంచిత భ్రమరి అను ఈ ఎనిమి శుద్ధమైనవి. అంతగర్షృమరి, బాహ్యభ్రమరి, అలగభ్రమరి, విద్యుద్రమరి, ఉచితభ్రమరి అను అయిదు భ్రమరుల అన్యోన్య సంకరముచే ఏర్పడినవి. శుద్ధ, సంకర భ్రమరులు నాలుగో అయిదో వరుసగానో, వరుస తప్పించియో, విచిత్రముగానో చతురులైనవారు ఏదువందల అరవై విధములుగా అభినయింపవచ్చును. ఈ (భ్రమరుల ప్రస్తారము కూడ కూట తానముల ప్రస్తారముల వలెనే గ్రహింపదగినది. “కూటతానముల ప్రస్తారము గీతరత్నావళి యందు చర్చించినాను” అన్నాడు జాయన. కానీ నేడు గీతరత్నావళి అలభ్యము. ఇంతటితో దేశీస్థానకకరణభ్రమరీలక్షణ మనే పంచమాధ్యాయము ముగించాడు.
మతంగుడు బృహద్దేశిలో చెప్పిన పదహారు దేశీ పాదములు దేశీనృత్తమునకు శోభ గలిగించునవి అని తెలుపుచూ వాని వివరణ మొదలు పెట్టడంతో ఆరవ అధ్యాయ ప్రారంభం అయింది. ఈ దేశీ పాదములు పదహారు. అవి సరిక, స్వస్తికము, ఉల్లాలము, స్ఫురిక, అద్ధపురాటి, పురాట్స, వేష్టనము, ఉద్వేష్టము, ఖుత్త, అర్ధస్థలితము, ప్రావృతము, పృష్టోత్క్షేపము, లతిక్షేపము, నికుట్టకము, సమస్థలితము, ఉత్క్షేపము అనునవి పదహారు దేశీ పాదములు. వీని లక్షణములు సంక్షిప్తంగా ఇవ్వబడ్డాయి.
“'దేశీనృత్తసముద్రము' అను గ్రంథము నుండి సార్ధ్థకములైనవి, చూచువారి మనసులు హరించునవి విచిత్రములైనవి కొన్ని మణుల వంటి 'పాటములు” మాత్రమే ఎత్తి చూపినాడు. “ఎడతెగని కాలి తట్టులచే వాద్యముల పాటాక్షరములను
- తరికిట మొదలగు వానిని - స్పష్టముగ నుచ్చరించుదానివలె, రేఖాసౌష్టవము గల పూర్వాంగ మును కదలింపక, నట్టువగత్తె నర్తించుట పాదపాట మనబడును అని సంగీతచింతామణిలో వేమభూపత్మి నిర్వచనము. (నృర.[.9. 291)
కం నృత్తరత్నావళిరోచి పాటములు-పాటములు, తాడితపాటములు, ఉద్వృత్త పాటము లని మూడు విధములు. ఊరుద్వయ తాడితము, పార్య్వోరుతాడితము, వ్యత్యాస తాడితము, స్వస్తిక తాడితము, త్రితాడితము, తలతాడితము, 'పార్వతాడితము, క్రమతాడితము అని తాడితపాటము ఎనిమిది విధములు. సమోద్వత్తము, స్వస్తికోద్చత్తము, పర్యాయోద్వృత్తము, పృష్టోద్బత్తము, విద్యుతోద్భృత్తము, పార్ఫోద్యత్తము అని ఉద్వృత్త పాటము ఆరు విధములు. స్వస్తిక విచ్యుతము, తలోద్ధటితము పాదతలోద్ధట్టితము, కలనూపురము, చిత్రము, లుఠితమ్స్మ, కుడుపము, అలగము, చతుష్మోణము, త్రికోణము, మంజీర శింజితము, కుచుంబిని, షడ్రశము, లంఘిత ప్రతి లంఘితము అని పాటముల పదునాలుగు భేదములు కలిపి మొత్తము పాటములు ఇరువది ఎనిమిది అగుచున్నవి, ఇవన్నియు సార్థకములు అనుచునే ఇరువై ఎనిమిది పాటములు ప్రయోగ విధానము చెప్పినాడు. ఇదేకాక మరికొన్ని పరస్పర మిశణము చేసి అందమైన విచిత్రమైన పాటములు ప్రొఢబుద్భ్ధులు కల్పించ వచ్చునని తన అంగీకారము తెలిపినాడు. మతంగుడు దేశీ నృత్తమును సంక్షేపముగ నిరూపించుచు పాటముల లక్షణము చివర “స్వ బుద్ధ్యా కల్పయిత్వై వమన్యానపి సమాచరేత్” (ఇల్లే స్వబుద్దిత్రో మరి కొన్నింటిని కల్పించి చేయదగును) అని అన్నందువలన ప్రాచీనాచార్యులు కొన్ని పాటములను కల్పించిరి. వీనిని దేశీచారులన్నారు. సంచార ధర్మమును బట్టి భౌమములని, ఆకాశికములని రెండు విధములుగా విభజించిరి. సమనఖము, పార్ష్టి రేచితము, తలదర్శిని, అర్ధమండలి, తిర్యక్కుంచితము, అపకుంచితము, కాతరము, ఉత్కుంచితము, తిర్యజ్ముఖము, నూపురవిద్గమ్సు, మదాలసము, పరావృత్తము, లంఘిత జంఘము, మరాళము, స్ఫురిక, ఊరువేజ్రి సంఘట్టితము, హరిణత్రాసితము, కరిహస్తము, కుళీరకము, స్తంభక్రీడనర్న' రథ చక్రము, ఊరుతాదితము, సంచారితము, విళ్లిష్టము, తలోద్యత్తము అనుస) ఇరవైఆరు దేశీభూమిచారులు. విద్యుద్ర్భాంతము, పురణశ్హేపము, అవక్షేపము, అంఘితాడితము, ధమర్తి, భ్రమరి, దండపాదము, విద్ధము, ఊర్జ్వ్యజానుకము, అలాతము, ఆందోల్లిత్రు' సూచి, విక్షేషము, హరిణ వ్లతము, జంఘాలంఘనకము, జంఘావర్తనమ్సు అనునవి పదహారు దేశీ ఆకాశచారులు. ఇవిగాక తలసర్పణిక, హంసరుతం, తిత్తిరిగతి, మరియు అంతర పద్మాసనము అనునవి నాలుగు సంకీర్ణచారులు.
టా ॥ నృత్తరత్నావళిరోచి న. 51 ఆకాశచారుల, భూబారుల, పాటముల కలయిక చేతను, హస్తాదులగు అంగముల భేదము చేతను ఇది అనంతములగును. వీనియందు హస్తాద్యంగ క్రియలు 'ప్రయోగముననుసరించి నడుపవలెను. అటుపిమ్మట ప్రసిద్ధములైన దేశీ లాస్యాంగములు నలభై ఆరు సౌష్టవము, స్థాపన, రేఖ, దాలము, చాలి, చలావళి, లలి, తృకని, ఉల్లాసము, సుకలాసము, ఊరోంగణము, భావము, ధరహరము, కిత్తు, దేశీకారము, నిజాపణము, డిల్లాయి, లవణి, గీతవాద్యత, అభినయము, లయము, కోమలిక, ఓయారము, అనీకి, అంగహారము, మనోధర్మము, అంగము, అనంగము, వివర్తనము, రింఖ, ముఖరసము, లేవ, విహసి, ధసకము, తలము, వితలము, రసవృత్తి, మసృణత, అనుమానము, ప్రమాణము, లంఘితము, అంశగతి, సుసంధి, పాదపాటము, గతిస్థము, చందనము అను వీని లక్షణ ప్రయోగము ఇవ్వబడ్డాయి. నర్తనమున ధుతము, మధ్యము, విలంబితము అను మూడు విధములైన గతులుండును. తాళముల దీర్హ అల్పకాలములన్నింటి యందును ఈ మూడు భేదము లుండును. ధ్రుత, మధ్య, విలంబిత గతులు శుద్గ గతు రెండు కలిసి సంకీర్ణ గతులగును. ఆది మధ్యాంతములందు ఏదో క యుండిన అది శుద్ధము. రెండు గానీ మూడు గాని కలిసియుండిన సంకీర్ణము. విలంచిత ధ్రుతము, మధ్యవిళంబము, ధ్రుత మధ్యము - ఇట్లు గతుల వృత్తులు మూడగును. రెండు గతులు కలిసిన ఆరగును. ఈ రెండు గతులలోనే ఒక దానిని ఆవృత్తి చేసినచో ఆరువిధములగును. ఎట్లన మధ్యాది మధ్యాంతము అను విధముగ. అట్లే ధ్రుతమధ్య విలంబితము, మధ్యధ్రుత విలంబితము, విలంభబిత ్రుతమధ్యము ఇలా మూడు గతుల మిశ్రణముచే ఆరు విధములగును. ఇవి అన్నియు కలిసి ఇరవై ఒకటి అగును. అయినను పరివర్తన సమములైన తాళములకు మానసామ్యము గల తాళములకు ఏయే లయములు నియమితమైయున్నదో, ఆయాలయములలోనే గతి'ఫ్రొఢథిమగల నర్తకి నర్తింపవలెను. ఊర్జాంగరేఖ చెడకుండా వ్యత్యాసము చేసియు ఆడవచ్చును. పరివర్తసమానా యే తాలానాం నియతా లయాః మానసామ్యయుజో యే చ తైరేవ ప్రాధయా గతౌ నర్తనీయం విపర్యాసాదప్యుక్తోర్ధాంగరేఖయా (11-178)
52 నృత్తరత్నావళిరోచి అదితాళ, ఏకతాళ, ముఠిక (మఠ్య) తాళాదులు పరివర్తన సమములు. (ప్రతితాళ - ద్వితీయములు, నిస్సారుక - తృతీయములు మొదలైనవి జంటమానసములు. ఏకసర, ద్విసర, త్రిసరములని గతులు అన్ని దిక్కులందు సంభవించును. ఈ గతులందే ముందు వెనుక, ఆరు దిక్కులందు దేనిని వదలక మొదటి పాదము స్వస్తిక గూర్చవలెను. రెందడవదానిచే దానిని విడిపించు కొనుచూ సాగవలెను. అప్పుడా గతులు స్వస్తిక పూర్వకము లగును, చారులు, పాటము, లాస్యాంగములను గలిపిచనో ఈ గతులు అనంతము లగును. అందముతో కూడి, సౌష్టవముతో, ఉల్లాసమును గూర్చుచూ, విభ్రమముతో కూడిన చూపులతో, హస్తకరణములతో ఈ గతులు సర్వజన మనోహరములగును. ఈ విధంగా దేశీపాట, చారీ, లాస్యాంగ గతుల లక్షణముల వివరణతో ఆరవ అధ్యాయము ముగింపబడింది. సేరణీ, చిందు, శివ(వ్రియము ఇత్యాది దేశీవృత్తముల వివరణ ప్రారంభించుటకు ముందు జాయన నర్తకికి ఇవ్వవలసిన శిక్షణ పద్గతి, ఆమె అభ్యసించవలసిన విధానము, వాద్యపద్ధతులను అత్యంత విస్తారముగా విపులీకరించాడు. నున్ముందుగా నృత్య మారంభించుటకు ప్రశస్తమైన తిధి వార, నక్షత్రములు ఇవ్వబడినాయి. రిక్త తిథులు మినహాయించి అన్ని తిధ్రులు' బుధ, గురు, శుక్రవారాలు, హస్త శతభిష పుష్య, అనురాధ, ఉత్తర, ఉత్తరాషాథధ్ధ, ఉత్తరాభాద్ర, ధనిష్ట రేవతి, జ్యేష్ట అను నక్షత్రము శ్రేయస్కరములు. నేర్చుకొనదగిన స్థలము, రంగ భూమి, మేడపైనగానీ, కేళికావనమునగాన్సీ, వచ్చికబయలులో గానీ శుభమైనదై, నున్నగా, సమమైన నేలతో అన్ని వాతావరణము లకు (కాలములకు) అనుగుణంగానూ ఉండవలెను, (బ్రాహ్మణునిచే యథావిథిగ పలు విధములైన నైవేద్య ధూపదీపములతో విఘ్నేశ్వరుని (బ్రహ్మాది దేవతలను, సరస్వతిని, ఇలవేల్పులను వాద్య, తాళ, దండికను, రెండు స్థంభములను రంగభూమిని, ఉపాధ్యాయునికి, కన్యకును పూజ నెరిపించ వలెను. ఆరేండ్ల వయస్సుగల కన్యకకు బిగువైన వస్త్రములు మోకాళ్ళవరకు (అర్జోరుకం) గట్టి, రవిక తొడిగి ప్రారంభింపవలెను. ఏడు కణుపులుగల కర్రబాలిక స్తనముల ఎత్తువరకు గల దానిని రెండు స్తంభములకు కొన తూర్పుగాగానీ, ఉత్తరముగా
నృత్తరత్సావళిరోచి 53 గానీ ఉండునట్లు కట్టవలెను. ఆ దండికను (కర్రను) చేతబుట్టకొని, నర్తకి, ఆచార్యుని ఉపదేశము ననుసరించి, మార్గదేశీ విభాగము ననుసరించి సుకరములైన స్థానకముల నుండి మొదలుపెట్టి దుష్కరములైన వాని వరకు నెమ్మదిగా, అలసిపోవకుండ అభ్యసించవలెను. ఆ తరువాత తాళ, వక్ర వాద్యములతో తధిగిణ అను జతులలో కూడిన పాటతో నేర్వవలెను. అటుపిమ్మట గురువును స్వర్ణ వస్త్రములతో సంతోషపరచి, పూజచేసి, వాద్యములు వాయించు వారితో గూడి, బృందముతో కలిసి సాధన చేయవలెను. నర్తకి పాటయందు, వాద్యమందు, నర్తన మందు నేర్పరి అయినపిమ్మట ఆచార్యుడు ఆమెకు పంరపరగా వచ్చిన రవాన్యము నువదేశింవవలెను. “గీతము యొక్క అవయవములను అంగములతోను, భావములను దృష్టిచేష్టలతోను, అర్ధమును హస్తములతోనూ, లయను అడుగులతోను, వర్ణములను పాటములతోనూ చూప వలయును. గతాక్షరములకు సరియైన వాద్యమును, వాద్యము లేని గీతమునైనను, లాస్యాంగములైన పాదములు, హస్తములు మున్నగువాని మిశ్రణముచే నృత్తము నాచరించవలెను. ఏయే ప్రయోగములు చూచువారికి రుచి పుట్టించునో ఇంగిత మరిగి అట్టి ప్రయోగములు చేయవలెను. రసముల వినియోగములందు, ఏ కారణము వలన హస్తము రూపుగొనునో, దానిపైననే దృష్టి మనస్సు, భావము క్రమముగా ప్రసరించవలెను. రసములు, భావించిన భావములచే మాత్రమే పుట్టును.
రసానాం వినియోగేషు యతో హేతోః కరో భవేత్,
దృష్టిర్మనశ్చ భావశ్చ తత ఏవ భవేత్ క్రమాత్.
రసానాం పునరుత్పత్తిర్భావైర్చవతి భావితైః. (71120) ఇది నందికేశ్వరుని అభినయదర్పణమందలి -
యతో హస్తః తతో దృష్టిర్యతో దృష్టిస్తతో మనః ।
యతో మనస్తతో భావో యతో భావస్తతో రసః |
(ఎచ్చట హస్తముండునో దృష్టియచట, ఆ దృష్టి ననుసరించి మనసు, మనసు ననుసరించి భావము, భావము ననుసరించి రసముండును) అను శ్లోకపు భావాన్ని స్పష్టపరుస్తున్నది.
రడీ నృత్తరత్సావళిరోచి బృహద్దేశియందలి నృత్తప్రకరణమందు చెప్పిన విధంగా రెండు విధముల వాద్యపద్ధతిని వివరించాడు. అవి శుద్ధ, విచిత్రములనబడును. శుద్ధ లేదా విచిత్ర పద్ధతులలో వాద్యములు వాయించ బడుచుండగా నర్తకి సమపాదముతో రంగమందు ప్రవేశించి, సందంశ హస్తమును చేసి ఎడమపాదముని కుట్టితము చేయవలెను. మొదట సమహస్తపు వాయింపుతో మొదలు పెట్టి సాంగమగు ముఖత్రయము ()తో పుటిలము చేయవలెను. దానియందు పాట నడుపవలెను. మంఠికలో కొంతకాలము గతిజరిపి, తరువాత శుష్మవాద్యములను (ప్రయోగింప వలెను. నాలుగు తాళములందు యిదేవిధముగా సాగవలెను. ఇది మతంగుడు నిర్దేశించిన శుద్ధపద్దతి. స్వరములతో, తాళముతో, పాటముతో క్రమముగా గాయకులు వర్ణ స్వర సహితముగా పాడవలెను. వాద్యముల వారు అక్షరముల ప్రకారము ఆపెన వాయింప వలెను. ఇది విచిత్ర పద్ధతి. ఇందు నర్తకి వాద్యాక్షరములకు త్రగ్గ్య విధంగా నర్తించ వలెను. పాలించు ప్రభువుల, నాగరికుల అభిరుచుల ననుసరించి రూపొంద్రిద్వ బడినవి 'దేశి నృత్తములు. ఈ నర్తన రీతికి శాస్త్రము ఆధారమైనను, క్షొబ్షై చు రాజులు, ప్రజల అభిరుచుల కారణంగా మార్పులు కలుగుతూ వచ్చినవి. అనేక నాట్యశాస్త్ర గ్రంథములు పరిశోధించి, శాస్త్ర సంప్రదాయములను సమన్వర్వ పరచి, అనాటి ఆంధ్రదేశంలోని నృత్త కళారీతులను చర్చించాడు. జాయసేన్యా త్రి అవి పేరణీ ఇత్యాదులు. పేరణి : పేరణి నృత్యము చేయదగిన నర్తకుడు రూపసంపన్నుడు రక్తి కలిగింప గలవాడు, తాళగమకముల జ్ఞానము కలవాడు, మంచి రేఖగలవార్స గీత ప్రబంధములు పాడగలవాడు, లాస్యతాండవ పద్ధతి తెలిసినవాడు, భ్ర్వశ్ర పాటములు తెలిసినవాడు, ఉత్సుతికరణాలు, అతి తేలికగా చేయగలవాడ్డు, ఇట్ల ల లక్షణాలు కలవాడు 'పేరణి' అవగలడు. (1/11. 384-387) పేరణి ధరింపవలనిన వేషము, రంగ (ప్రదేశము ఈ విధంగా వివరింపబడింది. గవ్వలతోగానీ, బంగారు రత్నములతోగానీ చేసిన సొమ్ములు
నృత్తరత్నావళిరోచి 5్5్ ధరించి, విభూతి పులుము కొని, శిఖధరించి, కృతిమమైన నాగుపామును గానీ రంగయపష్టిని గానీ పట్టుకొని, జంఘలందు గజ్జెలను నిందుగా కట్టుకొని, అట్టి వేషమే గల ఆరుగానీ, ఎనిమిదిగానీ జంటలు జంటలుగా ఉన్నవారి నడుమ సమపాదముతో గానీ, భుజంగ త్రాసిత పాదముతో గానీ రంగస్థల ప్రవేశము చేయవలెను.
ఇట్టి వేషముతో రంగప్రవేశము చేసిన పేరణి యొక్క పేరణమునకు అంగములు అయిదు - అవి నృత్తము, కైవారము, ఘర్జరము, వికటము, గతము అనునవి. లాస్య, తాండవ భేదములు గలది నృత్తము. సభాపతిని స్తుతి చేయుట కైవారము. తాళము లేక, తాళములు కలిగి, క్రమముగా ఘర్ధరిని వాయించుట ఘర్ధర మనబడుతుంది. ఇది ఏడు రీతులుగా గలిగినది. చావడ, పడివాడము, రుంధము, సిరిభరము, ఖలుహులము, అలగ్నపాటము, సిరిపిటి అనునవి. తాళములేని వికృతనృ్ఫత్తము వికటమందురు. శుదరాగములతోగానీ, సాళగరాగములతో గానీ, ఆలప్తి సహితముగా ప్రబంధములు పాడుట గీతము.
పై అంగములందు సమర్ధుడైన పేరణి సమహస్తమను వాద్యము వాయింపబడిన పిమ్మట రిగవణి, పదము, పైసారము అను యతులతో శుష్మవాద్యము నడిపి, ఆపైన ఉపశమన యతులతో (ప్రవేశించి కైవారము చేయవలెను. తరువాత గజ్జెలతో పాదములను చలింపచేసి మార్గదేశి గతులలో రెండవ తాళమునారంభించి, వికటాంగమైన విషమతాందవము చేయవలెను. జనులకు రక్తి కలుగునట్లు సూడయొక్క మొదటి ప్రబంధము పాడి, యతి ముగింపుతో మరల ఉద్ధతముగా నర్తించి తకారముతో ఛండనము చేయవలెను. సూడయందలి రెండవది, మొదలగు ప్రబంధములను ఇట్లే ప్రయోగింపవలెను. ఇది సంక్షిప్తముగా పేరణి పద్ధతి.
మొదట సమహస్తముతో వాద్యముల మేళగింపు, తరువాత యతి ప్రహరణము, ఆపై శూన్యమందు పుష్పాంజలి, ఆమీద రుంకారము, రిగవణి, తుండుకము, చమత్కారము. అటుపిమ్మట గీతాంగ వాద్యము, ఉచ్చలితమైన యతి, ప్రహరణము ఇది దేశి పద్ధతి.
ఆతోద్యమేలనం పూర్వం సమహస్తమతః పరం,
యతిప్రహరణే శూన్యే పుష్పాంజలి రతః పరం,
56 నృత్తరత్నావళిరోచి రుంకారో రిగవణాఖ్యా తతః స్యాత్తుండాకిభేదనమ్ చమత్మారో£.థ గీతాంగవాద్యముచ్చలితా యతిః తద్వత్ ప్రహరణం చైతత్ దేశీపద్ధతిరుచ్యతే. (౧/70) నర్తకి పైసారమ ను సముదాయ(ప్రబంధముతో వేరాక చిత్రవాద్యముతో నైననూ రంగమున 'ప్రవేశింపవలెను. అనంతరము ముఖవాద్యము నడుపవలెన్స దీనికే పుటిల మని పేరు. పుష్పాంజలి దీనితోనే వేయవలెను గనుక పుష్పాంజలి అని కూదా పిలువబడును. థేంఖణము ; అటుపిమ్మట వాద్యములు తాళసహితముగా వాయింప వలెను. తాళము లేని ఆలాపముతో కూడిన రుంకారము, దానిపై పదము రూపకము, రెండింటి నడుమ ఓతము, మలపము, అవచ్చేదము, ప్రహరణము ఇత్యాదులు ప్రేక్కణమునకు ప్రబంధములు. వీని పాటాక్షరములతో సమానముగ ఉత్త్స్పుతకరణములతో, భ్రమరు లతో, ఉద్ధతమైన చారీమండలముతో నర్తంచు ప్రేక్కణము (ప్రేంఖణము). ఇది ముఖ్యముగా చమత్కారము గలిగించు నమ 0177-79) లిక్తము. భ్రమరీభిస్తథా చారీమండలైరుద్ధతైరపి 1 నర్తనం ప్రేక్షణం ప్రోక్తం చమత్శారైకకారణం ॥ (1-79) సందర్భోచితముగా రెండువిధముల సూడల గురించి చెప్పబడి నర్తనమున సూడశుద్ధమనీ, సాలగమని రెండు విధములు. అందులో వి. కరణము, వర్ణసరము, కైవారము, రుంబడము, త్రిభంగి, వర్తని, రాసకవ్వ' ఏకతాళి. అనునవి తొమ్మిది శుద్ధ సూడ మందలి ప్రబంధములు. అట్లే ధ్రువము మట్టము, ్రతిమట్టము, నిస్సారువు, అటతాళము, రాసకము, ఏకతాల్లి అనునవి సాళగసూదయందలి ప్రబంధములు. రాసకము : పదహారు గానీ, పన్నెండు గానీ, ఎనిమిది మంది గానీ స్త్రీలు పిండీ మొదలగు బంధములను, కట్టుబాట్ల నాశ్రయించి చేయు బృందనృత్తము రాసకము. పిండి, శృంఖలిక, భేద్యము, లత అనునవి బంధములు. నాయికలు ఆయా బుతువుల యందు ప్రయోగింపవదగిన రాగములతో, గాయకుల చర్చరి మున్నగు ప్రబంధములను, దేశీ సూడయందున్న వానిని పాడుచుండగా, నేర్చరులైన వాద్యగాండ్రు తగిన వాద్యములు వాయించుచుండగా పలువిధములైన నిండు బంధములతో నర్రింపవలెను. న్
నృత్తరత్నావళిరోచి 57 చర్చర్యాదిఒఎంధేషు దేశీసూడస్థితేషుచ ఖందమండలచారీఖిః లాస్యాంగప్రముఖైరపి ॥ బంధురైర్వివిధైర్భంధైః నృత్యేయురిహ నాయుకాః ॥ (7.95-79) బంధము పూర్తి అగుటకు సరిపడు నర్తకీమణులచే ఇది ప్రయోగింపదగును. ఆయా దేశ పద్ధతుల ననుసరించి వేషము ఇంపుగా నుండవలెను. నాయికలు దివినుండి దిగివచ్చిన చంద్రకళలో, పదహారువేల గోపికలో అన్నట్లాడవలెను. (711 95-98) చర్చరి : రాసకమునందు వలెనే నాయికలు వర్ణతాళములతో గూడిన వాద్యములతో చర్చరి, ద్విపదలు పాడుచు నాయకుని శృంగార వీర గుణములు కీర్తించుచు, బుతు వర్జ్దనములతో వసంతోత్సవములందు నర్తించుట చర్చరి. (౧71. 98.99). మండలేన ్రన్ఫత్యంతి కాంతా వాసంతికోత్సవే || (17|| 99) నాట్యరాసకము : యువతీమణులైన నాయికలు, వసంత బుతువున దేశీ ఉయ్యాల పాటలు పాడుచు, రాజుగారి చరిత్రమును, పదార్ధాఖినయముతో చూపుటయే నాట్య రాసకమ ను దేశీనృత్తము. (౧/1 100) దండరాసకము : నాయకుని యిచ్చానుసారము ఎనిమిది మంది మొదలు, క్రమముగా నలుగురు నలుగురుగ ఆడుచుండుట దండరాసకము. అందరు రెండురెండు సరిజట్లుగా నుండవలెను. అట్లు అరవై నాలుగువరకు కూడా సంఖ్య పెరగవచ్చు. రెండు చేతులందు రెండు కోలలు ధరించవలెను. ఆయా దేశరీతులలనుసరించి ఒక చేత కోల, ఒక చేత చామరము గానీ, అట్లే ఒకచేత కోల, ఇంకొక చేత చురకత్తి గానీ ధరింపవచ్చును. (క్షురికా దండకౌ యద్వా తత్తద్దేశీయ భంగిభిః) నర్తనము నందు చెప్పిన అన్ని ప్రబంధములు వాయింప వచ్చును. రాజు చిత్తానుసారముగా ్రౌఢనర్తకులు నేర్చిన సమస్త నర్తనమును చేయవచ్చును. చిత్రబంధములు వాదకులు వాయించు చుండగా, లాస్యాంగము లతో, అందముగా ఎదమకుడి ప్రక్కలకు తిరుగుచు, చక్రము వలె తిరుగాడుచూ సశబ్దములగు ఐదు ఘాతములతో పరస్పరము కోలలు కలుపుచు హృద్యముగా ఆదడవలెను.
58 నృత్తరత్నావళిరోచి ఉక్తేషు వాద్యమానేషు చిత్రబంధేషు వాదకైః 1 లాస్యాంగభ్రమరీపాదచారీభి శ్చారుచక్రిమమ్ ॥ సవ్యాపసవ్యతశ్చక్రభ్రాంత్యా ఖండప్రయోగజైః | సశబ్దం పంచభఖిర్థాతై: కుర్వీరన్ దండమేళనమ్ ॥ (1౧. 105-106) శివప్రియము : శివునికి ప్రియమైన ఈ నృత్తము శివోత్సవములో
చేయదగినది. మృదంగాది వాదకులు యతి ప్రహరణాది 'ప్రబంధములు వాయించుచుండ, పురుషులు, స్రీలు లోహపుపాములను ఎడమచేత, ద్రాన్సి కొడుపులను కుడిచేత ధరించి, కిరికిటి అను శబ్దము చేయుచు రుద్రాకలు ధరించి, శివుని పాటలు పాడుచు, యథోచితములైన అంగములతో, ప్రాటంలో గతులతో కూడిన లాస్యాంగములతో, ఒకరికొకరు ఎదురు మొ గముగాన్న మరొకప్పుడు మండలముగానూ, పలువిధముల నర్తించవలెను. నూ, అన్యోన్యాభిముఖీభూతాః ద్విధాభూతాః కదాచన । కదాచిన్మండలీభూతాః నృత్యేయుర్చహుభంగిభిః | శివోత్సవేషు కర్తవ్యం నృత్తమేతత్ శివప్రియం ॥ (1౧ 1128) చింతు : లలితముబైన లాస్యాంగములతో, పాదములతో, చారు గతులతో, ద్రవిడ దేశమున పుట్టినవి, కాకురీతులతో నేర్చర్రప్రడ్డిన్వ ళో అను పేరుగల ద్విపదలు పాడుచు, ఆ పాట అర్ధమును అభినయించుచ్చు తు! అను లాస్యాంగమును ప్రదర్భ్శించుచు ఆడుటయే 'చింతు" నృత్తము. ఇది ద్రవిడ మిక్కిలి ప్రియమైనది. - గీతార్థాఖినయో పేతైః ద్విపదైః చింతుసంజ్ఞకైః | ప్రయోగైశ్చాపి తైః కిత్తుప్రచురైః సులయైర్ముహుః ॥ (౧6) కందుక వర్తనం (దెండాట) : ఎగురుచున్న పూలచెండ్లను పట్టుకొన్స్క్పత్ష పరుగెత్తుచు, కోమలములగు చారులు, గతులు, పాదములు, లాస్యాంగమ్వులతః నర్తించునది కందుక దేశీయనర్తనప్రోక్తప్రబంధేప్వథవా క్రమాత్ ॥ చారీభిర్లతిభిః పాదైర్గాస్యాంగైరపి కోమలైః ॥ నృత్యంతి వనితా యత్ర తత్ర స్యాత్ కందుకవర్తవమ్ ॥ (1/7. 119-125)
నృత్తరత్నావళిరోచి 59
నృత్తము : ఇందు పద్మము, గోమూత్రిక, నాగము, చక్రము మొదలైన బంధములను, దేశీనృత్తమునకు చెప్పిన ప్రబంధములను, నానాపాటములలో క్రమముగా వాద్యాలవారు వాయించవలెను. బంగారు, వెండి కంచులతో చేసిన, లోపల కదులు యినపగుళ్ళు కలిగి కలకల ధ్వనించు బంతులు ఒకరి మీద కొకరు వేసికానుచు, పక్షులవలె ఎగిరి పట్టుకొనుచు నర్రించవలెను.
భాందిక : ఇది భండులు హాస్యగాళ్ళు చేయు నృత్తము. వారు అనేక వాద్యములు వాయించుచున్నట్లు అభినయించుచు, జంతువుల కూతలను అనుకరించుచు, వారి చేష్టలతో చూచువారి విసుగును పోగొట్టుటకు నిరంతరముగా నవ్వించుచు అతి దుష్మరమైన పాటములతో నర్రించవలెను.
అత్యంతవామనీభూతాః ప్పాటైరత్యంతదుష్మ్కరైః |
యత్ర నృత్యంతి భండాస్తత్ భాండికం నర్తనం మతమ్ (1/11 129)
ఘటసణీ : మూపుమీద హుడుక్కు వాద్యమును పెట్టుకొని మృదువైన వేషము కలిగి, చర్యాప్రబంధము, దేశీసూడలందలి పాటలు శివపార్వతుల గురించి పాడుచు, కాహళ, మద్దెలతో కరటావాద్యమునుగూడ చేర్చి, యతి ప్రహరణ మొదలైన తాళప్రబంధములు వాయించుట, సుకుమార గతులతో నర్తించునది ఘటసణీ నృత్తమగును. నర్తకీ అని చెప్పినప్పటికీ పై గుణములు కలిగిన పురుషుడు కూడా ఈ నృత్తము చేయవచ్చును. ఈ నృత్తము వేరే యింకే నృత్తశాస్త్రగ్రంథము లందు వివరింపబడలేదు. బహుశ జాయన నాటికి వెలుగులోనున్న నృత్తరీతి అయివుండవచ్చు.
హుదుక్కాం స్మంధసంసక్తాం వాదయంతీ ౧7౧130)
చారణ ; వివిధములైన అనుప్రాసలు గలిగి, రసములకు తగిన రాగములతో దేశీ కాకువులతో పాడుచు, భీభూ శబ్దములు చేయుచూ, కరతాళములు మనోహరముగా అనేక విధములు వేయుచు, లలితోద్ధతమైన పాదవిన్యాసములతో నర్తించుట చారణీ నృత్తము. ఇది సౌరాష్ట్రకు (గుజరాతు) చెందిన నృత్తము. 'ప్రీలు తమ చీరకొంగును అవగుంఠనముగా చేసికొని నర్తించవలెను. మధురమైన రసపూర్ణమైన దోహకము (నానననాననాననానానా) అను ఛందస్సు యిందు ముఖ్యము.
60 నృత్తరత్నావళిరోచి నానానుప్రాస మధురాన్ దోహకాన్ రసనిర్భరాన్ । రసోచితేన రాగేణ గాయంత్యో దేశకాకుభిః 1 (11. 185) బహురూప నృత్తము :- అనేక రూపములు గల లోకుల ఆ యా రూపములను, వేషములను, చేష్టలను, భాషలను ్రదర్శించునది గనుక ఇది బహురూపనృత్త మైనది. త్రివిధాఖినయములతో, హావభావ సొగసులతో, సాత్త్వికాఖినయమును వదలి, లోక ధర్మము నాశ్రయించి, సజీవాభినయముతో ప్రవేశించి, వాద్యమందలి పాటములతోనూ, నృత్తములతోనూ, మనోహరము లోకప్రసిద్ధమైన రాజుల చరిత్రలను నర్తించ వలెను. నాట్యమున వర్ణితమైనవి, సభ్యుల కిష్టము కానిది మాత్రము ప్రదర్శించరాదు. బహురూపస్య లోకస్య తత్తద్రూపప్రదర్శనాత్ గ వేష చేష్టిత భాషాభిః బహురూపం నిరూప్యతే ॥ (711. 189) కొల్లాటము :- దొమ్మరి వాళ్ళ నర్తనము కొల్లాటమనబడును. అంచితాది కరణములతో తోలుపగ్గములపై వెదురుబొంగులపై నడచుచు, దుష్మరములైన (భ్రమరులు చేయుచు, కత్తులు మొదలైన శస్త్రములు త్రిప్పుట, ప్రాణాపాయ ఆయుధములనుండి తప్పించు కొనుచు, కంచుతాళములు, మద్దెలలు, జేగంటలు, భేరులు ఇత్యాది వాద్యములు మోగుచుండ కొల్లాట (దొమ్మరి) వారు చేయు నృత్తము కొల్లాట నర్తనము. యత్ర నృత్యంతి కోల్లాటాస్తత్ స్యాత్ కోల్లాటనర్తనమ్ 1 (1/11 152) ఈ విధంగా ఇవి పదునాల్గు విధములైన దేశీ నృత్తరీతులుగా శాస్త్రములందు _. నిర్వచింపబడినా సాహిత్య లోకమందు మరికొన్ని దేశీనృత్తరీతులు కనబడుచున్నవి. సింధు, ధమాళి, చేల, మతల్లీ, హల్లీస (భీమేశ్వర పురాణం) కొరవంజి, శివలీల ఇత్యాదులనేకం కనబడుతున్నవి. సుప్రసిద్ధమైన “గోండలి” నృత్తలక్షణము జాయనచే వివరింపబడలేదు. నర్తకి కుండవలసిన లక్షణములు వివరించి చివరగా ఒక చక్కని నర్తకి, భిల్ల వనిత, భూతమాతృక ఉత్సవ సమయమున ఆనందముగ, మనోహరముగ ఆడుచుండుట చూచి సోమేశుడు ఈ చిత్రగోండలి నృత్తమును కల్పించాడు. ప్రీతో నిర్మితవాన్ చిత్రగోందలీమిత్యయమ్ । (711 163)
నృత్తరత్నావళిరోచి 61
మహారాష్ట్ర భిల్లులను గోండలీ జాతివారందురు. కుండలి అనుపేరుగల ఒక దేవతాస్త్రీకి పార్వతి ఈ నృత్తమును నేర్పెను గాన “కుండలీ” అని పేరుతో కూడ పిలువబడుచున్నది. దేశీ నృత్తములలో అతి ప్రాచీన నృత్తమిది.
ఈ విధంగా దేశీనృత్త లక్షణములను వివరించి, అట్టి నృత్తమును నర్తించగల నర్తకీ లక్షణములు ఈ విధంగా పేర్కొంటున్నాడు జాయన. రూపయౌవన లావణ్య నృత్తవిద్యలకు ఆలవాలమై నేత్రానందము గలిగించు నర్తకి పాత్రము అనిపేర్కొన్నారు. ఉత్తమమైన నర్తకి సత్కులమునందు బుట్టి, రూప, ప్రాయ, అదృష్టములను కలిగినదియు (గ్రహణ, ధారణ, సామర్థ్యము కలిగినది, రసభావములు నెరిగినది, కళలు తెలిసి నదియు, అదుపులోనున్న అంగములు మంచిస్వరమును కలిగియుందునది, సభయందు ధీరురాలై, సమ, అతీత, అనాగత తాళగ్రహములందు చతురురాలై, (చతురాత్రివిధగ్రహే) అవధానము కలిగి, గీతవాద్యములందు నేర్చరిగా ఉండవలెను. గీతవిద్యా విశారదా అంగ ప్రత్యంగ ఉపాంగ, చారి, మండల, స్థానకాది సర్వనృత్త మార్గ-దేశి ప్రయోగము స్పష్టముగా తెలిసినదై ఉండవలెను. వినయ, బెదార్య, లజ్ఞాది గుణములచే అలంకృతయై, అడిగిన వెంటనే కోరిన ప్రయోగము చేసి చూపగలిగినది ఉత్తమ నర్తకి అనబడును. (1/1-154-160)
మార్గదేశీవిధానేన ప్రయోగాన్ జానతీ స్ఫుటమ్ ; _ (/1.160
నాతిస్త్టూలా వాతికృశా నాత్యుచ్చా నాతి వామినీ (71.158)
నర్తకుని లక్షణములీ విధముగా నున్నవి. కులీనుడు, నృత్యశాస్త్రము నెరిగిన వాడు, ఇంద్రియములను జయించినివాడు, లక్ష్యమును ప్రదర్శించుటయందు దక్షుడు, వాద్యముల ్రుతులన్నియు తెలిసినవాడు, శిష్యులకునేర్పుట యందు చతురుడు, తానే నర్తించు నైపుణ్యము గలవాడు, నృత్తగీత వాద్యములను మేళగింపనేర్పుగలవాడు, నానా దేశముల నృత్యరీతులెరిగినవాడు, పరంపరగా విద్యోపదేశము గలవాడు, తాళములందు కుశలుడు, క్రొత్తక్రొత్త విధములైన భంగులను కల్పింపగలవాడు, ఆరోగ్యవంతుడు, మచ్చరము లేనివాడు, రూపి, మంచిరేఖగలవాడు, నర్తకితో ఏకీభావము గలవాడు - నర్తకీ మనసా సార్థమేకీభావ మిహాగతః (౧/11. 170) రంజింప చేయ గలవాడు నర్తకుడగును. (1/11-165-171)
సంగీత మేలనాభిజ్ఞో నానాదేశీయ నృత్తవిత్ (71.167)
62 నృత్తర క్నావళిరోచి నర్తకీనర్తకులు కించిద్దలిత యౌవనులైన వారు అంతఃపురప్రీలకు నర్తనము నేర్చుటకు తగినవారగుదురు. వాద్యగాళ్ళలో ముఖ్యుడైన ముఖరి లక్షణము లిట్లున్నవి. తాళమునందలి మాత్రల లెక్కల నెరిగి యుండుట, మూర్దనాత్రయ వేదిత్వం - 11. 172. మార్దనాత్రయము నందు (మయూరి, అర్ధమయూరి, కార్మారవి) నైపుణ్యం, అవనద్ధ వాద్యములందు స్వరములు పుట్టించు క్రమములు, వాద్యప్రబంధములు రచింపగలుగుట, బృందమును కూర్చునేర్చు - బృంద మేలన దక్షత్వం 171 173, వాద్యముల శ్రుతి తెలిసి, సంగీత జ్ఞానము కలిగియుండుట, చిత్ర, ధ్రువ, వార్తిక, దక్షిణాది నాల్గు తాళగతులు తెలిసియుండుట, లోపములను కప్పిపెట్టునేర్చు - ఛిద్రావరణ నైపుణం 11176, ప్రస్తావమునకు తగినట్లు సభాపతిని కైవారము చేయు చతురత, ప్రక్కవాయిద్యగాళ్ళ వాద్యమందు మంచిచెవి కలిగి యుండుట, సావధానత, పట్టువిడుపులందు పటుత్వము స్థిరోత్సాహము మొదలైనవి ముఖరి లక్షణాలు. అట్లే ముఖరికున్న లక్షణములు అన్ని లేకపోయినా, ముఖరి చేసిన యతి మొదలగు వాద్యప్రబంధములలో, ఉచితములైన వానిని అతనివలె వాయింపగలిగి అనుకరింపగలవాడు ప్రతిముఖరి అనగా ఎదురువాద్యగ్గాని యొక్క లక్షణములు. ముఖరిని అనుసరించుచు, వాద్యకవులు రచించిన వాద్యప్రబంధములను త్వరగా నేర్చుకొనుచు, శ్రుతిజ్ఞానము కలిగి, పరుల యొక్క మరియు తమ రెండు వాద్యముల యొక్కపట్టు, విడుపులు తాళము ననుసరించి వేయుగల నేర్పుగలిగి, ఏకాగ్రమైన చిత్తము గలిగి, తాళజ్ఞానము, ఇతర వాద్యములతో కూర్చు నేర్పు గలగియుండుట తాలానుగత్వమైకాగ్యముభయోర్మేలనజ్ఞతా 1/11. 181. వాద్య బృంద లక్షణములు. ముఖ్య గాయక లక్షణము లిట్లున్నవి. మంధ్ర మధ్యతార న్థాయిలందు గమకములు వెలయునట్లు పాడగల - త్రిషు స్థానేషు గమకస్రాణగీతిప్రవీణతా । గంభీరమధురస్నిగ్ధశ్రావణధ్వనిశీలతా - 1711 182-188 ప్రావీణ్యము, గంభీరము, తియ్యనైన, వినుటకు తగిన గొంతు కలిగి యుండుట, అన్ని గీత ప్రబంధములందు ఆలాపనలందు పాడగల నేర్చు, శుద్ధము,
నృత్తరత్నావళిరోచి 63 సాళగము భాషాంగము మున్నగు రాగాలందు కౌశలము, పట్టు విడుపులందు దక్షత్వము, దోషములు లేకుండుట అన్ని రీతులందు వైదగ్ధ్యము. ఇలాంటి వన్నీ ముఖ్య గాయకుని కుండవలసిన లక్షణములు. ఇప్పట్టుల ప్రీ ముఖరిణిగా, వాద్యబృందము లందుండుట ఎంచదగినది. వలనన స్రీ కంఠస్వరము సహజముగానే మధురముగా నుండునుగాన వారికి తప్పనిసరిగా పాటనేర్చవలెనని జాయన అభిప్రాయము.
గాయక బృంద లక్షణములు ఇలా ఉన్నాయి. సమాన కంఠస్వరము కలిగి, మంద్ర, మధ్య, తార (త్రిన్థాయి) స్థాయిలందు గమకములు పలికింపగల నేర్చు, ఏకాగ్రచిత్తము, నర్తకి నర్తించు సమయమున నాదమును పట్టుకొని పాడగల - నర్తకీసుకలాస్టానే సమతా స్థాయకారితా - 1/1]. 185. నేర్పు, ప్రబంధములను గానము చేయగలుగుట, స్థాయిచివర ముఖ్యగాయకుని వదలి, మరల [గగ్రహింపగల
- న్థాయాంతే ముఖ్యదాయిత్వం నియమస్య ప్రతిగ్రహః - 171190. నేర్పు ఇత్యాదులు గాయక బృందానికి ఉండవలసిన లక్షణాలు.
ఈ విధంగా నర్తకీనర్తకుల, వాద్యగాండ్ర గాయకుల లక్షణములు పేర్కొని ఇప్పుడు మొత్తం అందరికీ కలిసి ఉండవలసిన లక్షణాలు పేర్కొంటున్నాడు. ఇది సంప్రదాయ లక్షణం అనుపేరు కలిగియున్నది. పాత్రననుసరించి జీవించు బృందము సముదాయము. పరంపరగా దీనికే సంప్రదాయమని పేరు.
పాత్రానుజీవినాం బృందం సముదాయ ఉదీరితం,
పారంపర్యోపదేశిత్వాత్ సంప్రదాయశ్చ కథ్యతే ॥ _ (1/21-198)
84 మంది కలిగిన బృందం ఉత్తమోత్తమం 64 మందితో కూడినది ఉత్తమం, 82 మందితో కూడినది మధ్యమం, 24 మందితో కూడియున్నది అవరం. 16 మంది మాత్రమే ఉన్నయెడల అది కనిష్టము. ఈ విధంగా సంప్రదాయము లేదా (నృత్త సముదాయము) అయిదు విధములు. ఉత్తమోత్తమమునకు మించిన సంఖ్య యుండిన దానిని కోలాహలమందురు. కానీ అది వాంఛనీయము కాదు. ఇంక ఉత్తమోత్తమంలో ఉండదగిన 84 మందిలో 1 ముఖరి, 1 ప్రతిముఖరి, 382 మంది మృదంగాలవారు, ఈ కంచుతాళం వాయించువారు, దేశీపటహ, కరట, తాళం, పిల్లనగ్రోవి, శంఖములు ఊదువారు ఇద్దరిద్దరు, హుడుకా, ఓతుకారు, కాహల, ముఖ్య గాయనులు నలుగురు చొప్పున, పదహారు మంది
64 నృత్తరత్నావళిరోచి బృందగాయకులతోనూ కూడిన సముదాయము ఉత్తమోత్తమం. (1+1+32+8+ (2౫5)ు10+16(4ఉ%44ఉ+16=84.
1 ముఖరి, 1 ప్రతిముఖరి, 16 మంది మృదంగం వాయించువారు, ఆరుగురు కంచుతాళం వాయించు వారు, నలుగురు చొప్పున హుడుక్క ఓతుకారు, కాహల వాదకులు, ఇద్దరిద్దరు చొప్పున దేశీపటహ, కరట, తాళం, పిల్లనగ్రోవి, శంఖం ఊదువారు మరియు ముఖ్య గాయనులు, వీరితోపాటుగా 16 మంది బృందగాయకులు ఉన్న సముదాయం (సంప్రదాయం) ఉత్తమం. (1+1+16+6+ (3౫4 12+(6౫29) 12 +16=64ు).
అట్లే ఒక ముఖరి, ఒక ప్రతిముఖరి ఎనిమిది మంది మృదంగాల వారు, నలుగురు కంచూ తాళం వారు, ఇద్దరిద్దరు హుడుక్క కాహలవాదకులు మరియు గాయనులు, ఒక్కరొక్కరు కరట, తాళం, పిల్లనగ్రోవి, ఓతుకారు, శంఖం వాయించు వారు మరియు 8 మంది బృందగాయకులతో కూడినది మధ్యమం (1+1+8+4+6 (3౫2) +5(1౫%5)+8=38) (ఇక్కడ సంఖ్యలో కొద్ది తేడా గోచరిస్తున్నది). అవర సముదాయము ఒక ముఖరి, ఏడుగురు మృదంగాలవారు, నలుగురు కంచుతొళం వాయించువారు ఇద్దరు కాహల వాదకులు, ఒక్కరొక్కరు హుడుక్క కరట, తాళం, పిల్లనద్రోవి, ఓతుకారు, ముఖ్యగాయినులు మరియు 4 గురు బృంద గాయకులతో కూడినది. 1+7+44+2-+(1%46)6+4=24 మంది ఇది అవర బృందము.
ఇది కనిష్ట సముదాయము కేవలము పదహారు మందితో కూడినది. అందు 1 ముఖరి ముగ్గురు మృదంగవాద్యాలవారు, ఇద్దరు కంచుతాళం, ఒక్కొక్కరు హుడుకా, కరట, పిల్లన గ్రోవి, ఓతుకారు, కోహల వాదకులు, ముఖ్యగాయినులు,
నలుగురు బృంద గాయకులుందురు. (1+8+2+6(1౫6)+4= 16). (171. 198-210)
ఈ విధంగా ఏర్పడిన సంప్రదాయములతో గుంపులుగుంపులుగా నర్తించ వలసి యున్నది. ఈ నాట్య లేదా నృత్తప్రదర్శనకు అనుకూలమైన భవంతులు: శాలలు నిర్మించవలసిన అవసరం రాజులకెంతో ఉండేది. కళోపాసకులు
నృత్తరత్నావళిరోచి 65 అయిన ప్రభువులు తమ రాజ్యంలో వివిధములైన నాట్యశాలలు, మందిరాలు నిర్మించారు. దేవాలయాల్లో కూడా నర్తనమాడదానికి వీలైన విధంగా నిర్మాణం చేసారు. ఇలా నిర్మింపబడే రంగ స్థలానికి నిర్మాణానికి, ప్రదర్శనలకు తగిన నియమాలున్నాయి. రంగ మండపము జ్యేష్టము, మధ్యమము, కనిష్ట మని మూడు ప్రమాణాలు కలిగి ఉంటుంది. ఇవి వికృష్ణము, చతురశ్రము, త్ర్యశ్రము అను మూడు రూపములలో ఉంటాయి. నాట్యశాస్త్రము నందువలె జాయసేనాపతి కూడా మూడు విధముల నాట్య గృహాలనే అంగీకరించాడు. జ్యేష్టముండపము 108 హస్త ప్రమాణములు కలిగి దేవతా పాత్రములకు తగినదై ఉన్నది. మధ్యమము 64 మూరల (హస్తప్రమాణము) కొలత కలిగి రాజోచిత పొత్రములకు తగినదై యున్నది. కనిష్టము 382 మూరలు కలిగి ఇతరులకు యోగ్యమై ఉన్నది. అయినను ఈ మూడింటి యందు -జ్యేష్టము మరీ పెద్దదగుటచే ధ్వని 'ప్రసారమునకు, చక్కగా చూచుటకు యోగ్యముగా లేదు. కనిష్టము చిన్నదగుటచే ధ్వనిమాధుర్యమును కోల్పోతున్నది. అందువల్ల జ్యేష్ట కనిష్టము గాక మధ్యమము ప్రశస్తము, అభిలషణీయము. సుఖముగా చూడవచ్చును, వినవచ్చును.
ఈ మధ్యమ మంటపము వికృష్ణ (64 హస్తములు పొడవు - 82 హస్తములు వెడల్పు) గానూ, చతురశ్రము (82 హస్తప్రమాణము) లన్ని వైపుల, (రాజుల కొరకైనవమండపము) వికృష్ణముగానీ, చతురశ్రముగానీ ఉండవలెను. త్ర్యశ్రముగా గానీ ఉండవచ్చును. ఈ మండపం పూర్వభాగమున 8 హస్తములు వదలి 8 హస్తముల రంగశీర్నము ($61206 100 0 116 512069) తయారు చేయవలెను. రంగశీర్మము శుభ్రముగా నుండ వలెను. స్తంభాలపై సింహము సాలభంజికలు చెక్కి చీకటిని పారద్రోలు రత్నములు అద్ది ఉండవలెను. బంగారు గుహ వంటి ఆకారముతో, కలశములు శోఖిల్లుచూ, యంత్రపు ప్రీ విగ్రహములు చేయు ఆట పాటలతో నుండవలెను. ద్వారములు, వేదికలు, మత్త వారణములు సంగీతావసరములు కలిగి, నేలపై పూలుచల్లబడి ఉండవలెను. కమ్మని సుగంధము వెల్లివిరియుచు, రమణీయ ముగా ఉండవలెను. సరస్వతీ నివాసమువలె, లక్ష్మీదేవి క్రీడా గృహమువలె నాట్య గృహము నృత్త-నాట్య ప్రదర్శనలకు -
నివాస ఇవ భారత్యాః క్రీడాగారమివ శ్రియః 1
కర్తవ్యో నాట్యనృత్తార్థః మండపో లక్షణాన్వితః ॥ (౧1.228)
ఈ నృత్తరత్నావళిరోచి అనువుగాను, అందముగానూ ఉండవలెను. ఇట్టి ఉత్తమ నాట్యశాలయందు నృత్తము బహువిధముల రాణించును. (౧1.211 -218) ఉన్నతకులమున పుట్టినవాడు, పాత్రాపాత్రల భేదము తెలిసినవాడు, అన్ని శాస్త్రములు తెలిసినవాడు, మార్గ-దేశీ రహస్యముల నెరిగినవాడు - అభిజాతో గుణగ్రాహీ పాత్రాపాత్రవిశేషవిత్ 1 మార్గదేశీ రహస్యాని జ్ఞాతా సంగీత శాస్త్రవిత్ 1 (171-229-230) సంగీతజ్ఞానము కలిగినవాడు, వివేకవంతుడు, ఆలస్యము చేయనివాడు, అనుకూలమైన పరివారము కలవాడు, త్యాగగుణముతో కూడినవాడు ఇత్యాది లక్షణాలు కలిగినవాడు సభాపతి అని పిలవబడతాదు. (1711 229-230) అట్లే సభ్యులునూ మాటకారితనము, ప్రస్తావసదృశముగా మాట్లాడగల నేర్పు, కావ్యనాట కాదులందు పాటవము, గుణ వాత్సల్యము, అన్ని దేశ భాషలందు కౌశలము, రసభావఇంగిత జ్ఞానము, ప్రస్తావోచిత భాషత్వం ... రసభావేంగితజ్ఞతా / తౌర్యత్రితయ చాతుర్యం (17౧). 235-288) తౌర్యత్రికమందు అఖభినివేశనము, 'ప్రతిభాప్రాగల్యములు గలవారు సభ్యులుగా నుండతగిన వారి లక్షణములు. ఇలాంటి గుణములున్న సభాపతి, సభ్యుల ఎదుట నృత్తప్రదర్శన రక్తికట్టి యశో వైభవములనిచ్చును. ఈ విధంగా సభాసదులకుండవలసిన గుణాల వివరణతో సప్తమాధ్యాయము ముగించి, అష్టమాధ్యాయంలో సభాపతి సభ్యుల విన్యాసము, బృందముల విన్యాసము, నర్తకికి పట్టవలసిన తెరలు, వారందరలకు ఇవ్వవలసిన బహుమతులను వివరించాడు. ముందుగా చీని చీనాంబరములు ధరించి, పూలు తలలో ముడుచుకొని, పాదాంగుళీయముల పర్యంతము మణిమకుట భూషణాదులు ధరించి, దివ్యాంగనల వంటి అణిమాద్యపష్టసిద్ధి కధిదేవతల వలె నున్న వనితలు రాజును ఎదుర్శొని, మధురముగా పొడుచు, నానా వాద్యములు యతి ప్రహరణ ప్రబంధములు వాయించుచుండగొ, కోమలమైన నృత్యము చేయుచు వెంట నృత్యమును చూడవలెనని అభిలషించు మహారాజును (ప్రభువు) రాగా తోడ్మొని సభాప్రవేశము చేసి, నర్మసచివులతో
నృత్తరత్నావళిరోచి 67 కలసి నృత్తమండపముపై అలంకరించిన సింహాసనముపై కూర్చుండ వలెను. అతని ఎడమప్రక్క పట్టపురాణి కూర్చుండవలెను. రాజుకు కుడిఎదమ ప్రక్కల చామరలు వీచుచున్న స్రీలు, నృత్తగీత వాద్య వినోదినులైన వారు, కామకళాభిజ్ఞలైన విలాసినీ ప్రీలు ఉండవలెను. రాజుకు కుడిప్రక్క తాంబూలము నిచ్చు ప్రీ సత్తగుణో పేతురాలై తాంబూల పళ్ళిరము పట్టుకొని నిల్చుండవలెను. రాజు తన కుడిప్రక్క మంత్రులు, పురోహితులను కూర్చుండబెట్టుకొని వారి నడుమ యువరాజును, అతని కుడిప్రక్క సేనాపతులను కూర్చుండబెట్టవలను. అటుపిమ్మట మండలాధి పతులు, సామంతులు, పరమండలమువారు, కోశాధిపతులు, వైద్యులు, దైవజ్ఞులు, మల్లులు నృత్తగీతవాద్యముల నెరిగిన విద్వాంసులు, ప్రభువు ఆజ్ఞప్రకారము ఉచితాసనముల కూర్చుండ వలెను. వాగ్గేయకారులు, గాయకులు వాద్యములు వాయించువారు, పుణ్యగ్రంథములు పఠించువారి ఎడమప్రక్క కూర్చుండ వలెను. ద్వారపాలకుడు రాజు చిత్తానుసారము వేత్రమును ధరించి దగ్గరలోనే నిల్చుండ వలెను. అంగరక్షకులు సభచుట్టు ముట్టి పరి రక్షించవలయును.
ఈ విధంగా రంగమండపమునందు ఆసన విధానముండవలెను. ప్రేక్షకులు చక్కని సొమ్ములు, వస్త్రములు ధరించి, సువాసనలీను సుగంధ ద్రవ్యములు, కర్పూరముతో కూడిన దండలు ధరించి, రంగమండపమున వారికొరకై నిర్ణయించిన స్థలములందు కూర్చుండవలెను. ఇది సభాపతి, సభాసదుల ఆసన విధానము సభా విన్యాసము.
ముందురోజే రాజాజ్ఞను పొందిన నర్తకి, స్నానము చేసి ఇష్టదేవతాదులను, (బ్రాహ్మణులను, గురువులను పూజించి, చక్కగా అలంకరించుకొని, చారులు, కరణములు మున్నగు వానిని నర్తించుపట్లు అడ్డమురాని విధముగా అర్జోరుకము ధరించి, సూది పనిచేయబడిన పలచని వల్లెవాటును, పైన వేసుకొని పాత్రము (నర్తకి) బృందముతో సహా రంగభూమిన ్రవేశింపవలెను.
పాత్రము (నర్తకి) నకు కుడిప్రక్క ముఖరి, అతని ఎడమ ్రక్కమృదంగాది వాద్యాల వారు, ఆతని ఎడమ ప్రక్క ప్రతిముఖరి, అతని వాద్యాల వారు, వెనుక మిగిలిన బృందమంతయు తోడు రావలయును. ఈ బృందమంతా ప్రీలే అయికూడా ఉండవచ్చును. ఇది నర్తకనర్తకీమణుల, బృందముల విన్యాసము.
ఇక వాద్యముల మేళగింప విధానము వివరిస్తున్నాడు జాయన. ముందుగా
68 నృత్తరత్నావళిరోచి పిల్లనగ్రోవి వాయించువాడు, రాబోవు రాగము యొక్క స్వరమును మధ్యస్థాయి యందు, పాటగాడు ఎత్తుకొన వీలైన విధానములో ప్రయత్న పూర్వకముగా నాదము పలికించ వలెను. తక్కిన అన్ని వాద్యాల వారు అతనిని అనుసరించవలెను అట్లు వారు చరాచర జగత్తునంతటిని నాదమయం చేయవలెను. అట్టి ప్రయోగముచే నాదస్వరూపుడైన భగవంతుడు వారికి సత్ఫలితముల నిస్తాడు. యథా నాదమయం సర్వం జగత్ న్ధావరజంగమాత్మకం 1 స్యాదేవం సతి నాదాత్మా దేవో నేతుః ఫలప్రదః (1/11-55) నభానాయకుని అభ్యుదయము కొరకు, అన్ని వాద్యము వారు సమహస్తమును వాయించి వర్షాకాలపు మేఘపు గంభీర ఉరుము వంటి నాదమును 'ప్రతిధ్వనింప చేయవలెను. ముందుగా హుడుక్క వారు 'జోడనీ” క్రమము వాయించిన విమ్మట, అందలి రుంకార స్వరము ననుసరించి కరట, దేశీపటహముల వారు తాళలలయ బద్ధములుగా “లహరి వాయించగా మద్దెలవారు క్రమముగా నిస్సారుక, ఏకతాళములతో వాయింపవలెను. అమృతధారవంటి యతియందు తాళప్రమాణము రెండవ కాల మందు ప్రారంభించి పదహారు కాలమానములవరకు పెంచవలెను. ముఖరి ముందుగా యతిని వీజానాదమువలె కోమలముగా ప్రారంభించి, ఆపైన గట్టిదెబ్బలతో హర్నోత్భాహములతో పెద్ద ధ్వనిని కలుగచేయవలెను. దీని కరట, కాహల, కంచుతాళ ములవారు “వాహను'లతో కలియవలెను. అన్ని వాద్యముల వారు వకతాళములోనే మృదుత్వ, ఘనత్వ భేదములచే యథోచితముగా ప్రహరణము వాయింపవలెను. కంచు. రాగిలతో చేసిన కరట, కాహళ వాద్యముల పరుషమని కొందరు అనుమతింపరు. అందుచే ప్రభువుకు నచ్చురీతిలో వాద్యముల సమ్మేళనము చేయవలెను. ఈ వాద్యవు మేళగింవులో గీతనృత్తములు లేని కారణమున ఇది శుష్క వాద్యమనబడుతుంది. గీతనృత్తవిహీనత్వాత్ వాద్యం శుష్కమితి స్మృతం 1 (71-64 స్నిగ్ధ వాద్యమునకు సమానమని, ఉపశమమని ఘనమైన ఆరభటవాద్యమునకు గజరమని, ఉచ్చలమని మారుపేర్లు. (1721-65) సభామండపముపై మరియొక్క చిన్న చతురశ మండపము ఎనిమిది హస్తములు వెడల్పు గలదానిపై నర్తకి నిలిచి యుండగా ఇద్దరిద్దరు స్త్రీలు 8
నృత్తరత్నావళిరోచి 6 తెరల (ఎనిమిది మూరల వెడల్పు, 4 మూరల పొడవు ఎంబ్రాయిడరీ చేయబడినది) అంచులు పట్టుకొని ఉండవలెను. పుష్పాంజలికి ముందు ఆ యిద్దరు స్త్రీలు పాటబంధములతో క్రమముగా పాత్రమున కెదుటనున్న తెరదప్ప తక్కిన వానిని తొలగింపవలెను. తెల్లని వల్లెవాటు వెనుక నర్తకి లక్ష్మీదేవివలె' నిలిచి యుండ వలెను. పాట బంధముల చివర, వాద్యము లన్నియు ఒకేసారి చెవుల కింపుగా (మైోగుచుండగా మూడవతెర తొలగింపబడి నర్తకి ప్రత్యక్షమవవలెను.
తృతీయా పీఠబంధస్య శబ్దేనాంతే£ పసర్పితా 1
సర్వాతోద్యనినాదేషు యుగపత్(శ్రోత్రహారిషు (70-74)
సభాపతి, సభాసదులు బృందముతో కూడిన అనర్తకిని బహువిధ సువర్ణ, రత్నాభరణములు, బంగారు జరీ జలతారు వస్త్రములు, శ్రీగంధాది సుగంధ (ద్రవ్యములు కానుకలుగా నిచ్చి సత్మ్కరింపవలెను. మదించిన ఏనుగులు, గుర్రములు యథోచితముగా నిచ్చి వారిని సన్మానించి సంతోష పరచవలెను. ఆమె నృత్తమునకు సంతసించిన ప్రభువు పొమ్మని సెలవిచ్చిన పిమ్మట ఆమె రంగస్థలమును వీడవచ్చును. కీర్తిని కోరు ప్రభువులు ఈ విధంగా నానావిధ కళానిధులను, నమస్మరింపదగిన వారిని, తన బహుమతుల ద్వారా కృతకృత్యులను చేయవలెను. బహుమానముల బరువులతో ప్రభువు సంతోషించి గౌరవించినాదను ఆనందముతో ధన్యురాలైతినను కొనుచు నర్తకి సభామండపము బృందముతో సహా వీడవలెను.
సూచీముఖ, గతి, గుణము, శిఖర మను నృత్తాంగములతో కూడిన ఈ నృత్త రత్నావళిని నృత్తశాస్త్ర రీతులన్నింటిని సూదిమొన వెంట నడుచు దారమున గ్రుచ్చి శిఖరాగ్రమున శోభించు దానిగ చేసి సఫలీకృతుడైనాడు శ్రీజాయసేనాపతి.
సూచీముఖగతిస్యూతగుణా శిఖరశోఖినీ |
జాయసేనాధినాథేన నృత్తరత్నావళీ కృతా ॥॥ (0-83
ఇట్లని అష్టమాధ్యాయముతో తన నృత్తరత్నావళి సంపూర్తి చేసాడు.
ఈ ఎనిమిది అధ్యాయాల విషయ వివరణను గమనిస్తే నృత్తరత్నావళి నృత్తమును ప్రధానంగా తీసుకొని, నృత్తప్రదర్శనకు అనువైన సందర్భ, అవసరాలను కూడా సంపూర్తిగా వివరించింది. జాయన నృత్తమునకే ప్రాధాన్యం నిచ్చాడు.
70 నృత్తరత్నావళిరోచి “నృత్తం గీతం చ వాద్యం త్రయం సంగీతముచ్యతే' అను సంగీతము నందలి నృత్తమును ప్రధాన విషయంగా గ్రహించి నృత్తరత్నావళి రచించాడు. అట్లే గీతాన్ని ఆధారంగా “గీతరత్నావళి' అనే గ్రంథాన్ని రచించానని పేర్కొన్నాడు (17-106) కానీ ప్రస్తుతమది అలభ్యము. సంగితములోని మూడవదైన “వాద్యము” విషయముగా ఏ (గంథము రచించినట్లు లేదు కానీ ఏడు ఎనిమిదవ అధ్యాయములలోని ముఖరి, ప్రతిముఖరి, వాద్య గాండ్ర లక్షణములు, నర్తకి 'ప్రవేశించునపుడు వాద్యములు ఎట్లు వాయింపబడ వలెనో, వాద్యముల మేళగింపు, శుష్మవాద్యము మొదలైన ప్రసంగములు వివరించు సందర్భంలో జాయనకు వాద్యము లందు గల ప్రతిభ సుస్పష్టంగా కనబడుతుంది. నృత్తము ప్రధానముగా మార్గము, దేశీ అని రెండు విధాలని చెప్పబడింది కదా! అందులో భరతుడు నిర్దేశించినది మార్గము. ఆ తరువాత ప్రవర్తిల్లిన నృత్తము “దేశ్ అయింది. ఈ దేశీనృత్తమే జాయన ్రధానాంశమైనప్పటికీ, ప్రథమ భాగంగా పేర్కొనదగిన మొదటి నాలుగు అధ్యాయాలలో మార్గ నృత్తలక్షణాలు, వివిధ ఆచార్యుల, సంప్రదాయములను చర్చించిన విధానం, అతనికి పూర్వశాస్త్ర గ్రంథములందున్న విపుల పరిచయం మాత్రమే గాదు అవగాహన కూడా స్పష్టమవుతున్నది - మచ్చుకొకటి. స్థిత్వైవ సమపాదేన భౌమీమాకాశికీమపి యతః కుర్వాత్తతశ్చారీ సమపాదా నిగద్యతే ॥ శిష్టపార్నినఖం (యస్మాత్) తిస్టన్యై కైకశో వ్రజేత్ | సమం పాదద్వయం తస్మాత్ సమపాదేతి సంస్మృతా ॥అని (1-1415) సమపాదచారిని నిర్వచించాడు. సమపాదముతో నిలిచియే భౌమ- ఆకాశ చారులను చేయ వలయును గొన ఈ చారి సమపాదమనబడింది. మడమలు, గోళ్ళు దగ్గరగా చేర్చి నిలుచుని రెండు పాదములు సమముగా ఒక్కొక్కటిగా నడుచునది సమపాదచారి. . భరతుని అభిప్రాయము తెలుసుకొనలేక కొందరు శాస్త్రకారులు రెండడుగులు సమానముగా నిలుచుట మాత్రమే సమపాదచారి అని నిర్వచించారు గానీ అది 'సమనఖి మనే కరణమవుతుంది. చారీ నిలుచునది కాకుండగ, చలించునది
నృత్తరత్నావళిరోచి 71 కనుక భరతముని “పాదాభ్యాం? అని ద్వివచనము చెప్పక “పాదైఃి అని బహువచనము నిర్దేశించాడు.
అస్యాశ్చలనశీలత్యాత్ పాదైరిత్యబ్రవీన్మునిః ॥ ౧-17
అని భరతుని ఆశయం స్పష్టం చేస్తూ చారీ అనగా చలనశీలం కలిగినది అంటూ పూర్వుల అభిప్రాయాల ఖండన, సమర్ధన కూడా నిష్పక్షపాతంగా, సునిశిత విమర్శనా దృష్టితో చేసాడు.
మరే ఇతర శాస్త్రకారులు చెప్పని హను లక్షణ వినియోగములు ఆరు విధములైన వానిని పేర్కొనుట, దేశీచారులలోని 'హంసరుత'ము, ఇలాంటివి జాయన మౌలికత్వముద్రకు నిదర్శనాలు.
సంయుత హస్తములలో నిషధ హస్తమును అభినవగుప్తుడు విలక్షణముగా నిర్వచించినాడు. వినియోగము మాత్రము టీకలో స్పష్టపరచాడు. చాలమంది (గ్రంథ కర్తలీ మార్గమునే అనుసరించారు కానీ క్రీర్తిధరా చార్యుడు భరతుని మతమునే అంగీ కరించాదు. తాను అభినవగుస్తని బహుధా అనుసరించినప్పటికీ, తనకంగీకారంలేని విషయం స్పష్టపరస్తూ అత్యున్నత విమర్శా ప్రమాణాలు అందించాడు.
చేతనాప్రధానమైన మానవ జీవితంలో అనంతమైన కదలిక లుంటాయి. అందులో శోభాపూర్ణమైనవి విలాసముతో కూడి అర్ధమును ప్రదర్శించునవి కొన్ని మాత్రమే. అవి 108 కరణములు. ఈ కరణముల వివరణ, శాస్త్రగ్రంథాలలో ఒకే రీతిలో నున్నప్పటికీ కొన్నిచోట వేరొకపేరు కల్పింపబడి ఉండడం, కరణమందలి హస్తములు ముందు వెనుకగా ప్రయోగింపబడుట ఇలాంటి సూక్ష్మ విషయములు కూడా జాయన దృష్టిని దాటి పోలేదు. నృత్తహస్తములలో అరాళకటాకాముఖము ఇట్లు ప్రయోగింప బడును. మొదలు అలపద్మ రూపమున పతాకస్వస్తికహస్తములను వ్యావృత్త పరివృత్తములు చేసి ఊర్వముఖముగా పద్మకోశములను మలచి, వానిని వ్యావృత్త పరివృత్తములు చేసి, ఒక హస్తమును అరాళముగానూ, రెండవదానిని కటకాముఖము గానూ చతురశమును చేయుటచే ఏర్పడును.
72 నృత్తరత్నావళిరోచి అరాలమేకం అన్యం తు విదధ్యాత్మటకాముఖమ్, చతురథ్రేణ చేత్ స్యాతామరాలకటాకముఖౌ (11-386) “చత్రురశము బదులు స్వస్తికమని కొందరు, మరి కొందరు ముందుగా అరాళ హస్తమును అభినయించి, తరువాత కటకాముఖము ్రదర్శించవలెనందురు” అని ఇటువంటి సూక్ష్మ విషయములు కూడా చర్చించాడు. అట్లే కరిహస్తమునకు త్రిపతాకము, కటకాముఖము, మరికొందరు శత్రిపతాకమునకే లలాటమని మొదటి పేరన్నారని విమర్శించాడు. ఊర్వమండలహస్తముకు చక్రవర్తనిక అని మరొకపేరని, పార్యమండల హస్తమునకు 'కక్షవర్తనిక' అని పేరని, ముష్టిక స్వస్తికమునకు ఖడ్డవర్రనిక యని పేరని, ఇలా ఎక్కడెక్కడ ఇతరులు వేరుపేర్లతో పేర్మన్నారో అవన్నీ జాయన నృత్తరత్నా వళిలో పొందుపరచాడు. అంగ, 'ప్రత్యంగ, ఉపాంగముల లక్షణ వినియోగములు దేశీ లాస్యాంగ కరణాంగహారముల వివరణ, భౌమ ఆకాశికీ చారుల ప్రస్తావన, దేశ స్థానక పాట భేదములు, ఇలా జాయసేనాపతి ప్రతిపాదించిన ప్రతియొక్క విషయం పట్ల అతనికి గల పాండితీప్రకర్ష ప్రకటితమవుతూనే ఉన్నది. విషయం గతానుగతికమే అయినా నిర్వచనాలలో, వివరణ పట్ల, క్రొత్తవి చేర్చడంలో జాయన మౌలికతను చూపాడు. నృత్తశాస్త్ర గ్రంథాలకే మణిహారము వంటి ఈ నృత్తరత్నావళి నృత్త విధానము తెలుసుకొన గోరు వారందరూ పఠించదగిన ఉత్తమగ్రంథము. మము చే 2 గ్ _ న 1 ఓ 6%య5 మో ట్ర సఖి పంట) స్య సలా స గ ్నమ్రాదరూబాజ్.500
-. సిం... ₹ళఖె..' స్య్వమా మడ |