Telugu Nijamabhad jillalo natakaragam - anilvaranasi/indianlanguages GitHub Wiki
నిజామజాద్ జిలాలో
క క ర రం కసత. శ్ చం రకాలకరంగం
తుంపర ఉం క ఆకలఆళఆఈ
_ వ్వ వాము (ఠ0 =" త(మాన౦
శటం భాం ౫)
గ్షరాసలాాాాాాాాాాాాాాాాాాాాాాలోాఅోలక్ష || న న న. లు సిత సస టం... ల ల ౯ ఛి ల ॥ గ గ] న్ 2 గో | | మ న వ ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా 27-3-1995 ఆకాశవాణి వారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లలితకళా తరంగిణి వారు స్రదర్శించిన 'శ్రీకృష్ణ రాయబారం?*లో పాల్గొన్న నటబ్బందం. (ఘే ' _ ఆకాశవాణీ.నీజోమాబార్ కేసు | య్ ల స ణి కో ల్ ' (నా. ష్. జా న. ప. ( గ్ ర. వ. న న. నా నన టీ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారు ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సుప్రసిద్ధ నాటక, సినీరచయిత, దర్శకులు కీర్తోషులు జంధ్యాల - వేదికై ఇతర ప్రముఖులు సర్వశ్రీ గొల్లపూడి, జొన్నవిత్తుల, ఆకాశవాణి సంచాలకులు ప్రయాగ వేదవతి.
చ యే. ళ్య డ్డ [| న ర్యా జె |] గ్ల లా 7 ( ర క య య లం ఎటు గప స్ట గా భే ర ఢి లే మ! జ్జ లో కా అం షీ = లీ వ భష నాటి రై సన్లు స సైరర నటీ మ్ గ్రత్రర్తి వ్ర న్యు న్ హ్ స్ో టన పక యట న సట గ్గే . మనం షస సన నం న యు లే ప ీ | ధన. వ మ మ. టట శ్, 3. దాఘవ్తులు
ప్రతులు వ 500 ప్రథమ ముద్రణ : 2004 ప్రతులకు ౬౫ శ్రీమతి కె, వి. పద్మలత గో న 1110. 5-157 గల. 1.3.0. కాలని, 600/౧ కర్నూలురోడ్, ఠా శు ఒంగోలు - 523001 ర ళో ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ౧౧౦౧౭ : 08592/2381 7/7 వెల వ 265/- రూపాయలు ప్రకాశకులు ఏ జనని 13/53, 2వ వీథి, ఖో వాసుకినగర్, కొడుంగైయూర్, ల చెన్నై - 600 118. “ల తమిళనాడు. (్ట ముద్రాపకులు : గోటేటి గ్రాఫిక్స్ 64, తంబయ్యరెడ్డి స్ట్రీట్, వెస్ట్ మాంబలం, చెన్నై - 600 038 ఫోన్ :; 24742091 గం ధ్ధయపరలటరిు ల ్ బ,.2' [త 0 సర్ర్ కకక క. న ల లో సం పదమ,
మ ఉస. ఇక్క చ కనమాల కోటయ్య ఇం). లం (౧923 - 1989) ఓ న్న నులు ర్ూ దోరెళి 88% ల సనం న జ్ఞ రిగి రావగానినీ ః [| కొంచెం లాంన్మ స్రష్క కాలి నో గొరొ. బ్లూ అని. అంత ఫ్రేమీగా, లలక్షగా, ప గః నంత న / . క్లే! న! నాం పెంచొన్టు [తు యు జ్జ న ఫ్రుటాశీస ల్ని నుల్చు ౧8 స స్పులు తుమ్మర్ని శంటొదుతో య గి దుతోళానే ర్రీన్నాయి ల గళ శి | కే ఈ చిన్న పుస్తకం ఫ్రే 111
“భయుందు మాట ”
ఓ గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకొని నలుగురు శిష్యులు స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. గురుకులంలో ఉండగా నలుగురి మధ్య గాధస్నేహం ఏర్పడి ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంత సన్నిహితులైపోయారు. సరే, మార్గమధ్యంలో సేదదీర్చుకునేందుకు ఓ చక్కని ఉద్యానవనంలో ఆగారు. మార్గాయాసం వల్ల నలుగురిలో ముగ్గురు మాగన్నుగా నిద్రలోకి జారిపోయారు. నిద్రరాని శిష్యుడు, శిల్పవిద్యలో (ప్రావీణ్యం గడించినవాడు గనుక, కళ్ళుచెదిరేంత అందంగా చక్కని సుందరాంగి శిల్పాన్ని చెక్కాడు. తృప్తిగా తనూ పడకేశాడు. కాస్సేపటికి నిద్రలేచిన మరో శిష్యుడు, వజ్రవైఢూర్య మణిభూషణాల తయారీలో, అలంకరణలో, నగిష్షీలు కూర్చడంలో ఘనాపాఠి కావడంచేత ఆ శిల్పానికి సర్వాంగ సుందరంగా నగలు అలంకరించి మురిసిపోయాడు. మలయమారుతం మంద్రంగా వీస్తుంటే, పరిసరాల్ని పరికిస్తూ అలా...అలా తిరగడానికి ముందుకు సాగాడు. మూడో శిష్యుడు మరి కాస్సేపటికి నిద్రలేచి ఎదురుగా వున్న శిలాప్రతిమను చూసి విభ్రాంతికి గురయ్యాడు. ఏ ఆచ్చాదనా లేని శిల్పాన్ని తదేకంగా చూసి, నేతపనిలో నిష్టాతుడైన అతగాడు, తళుకులూరే జలతారు చీరతో శిల్పాన్ని అలంకరించి, తృప్తిగా ఒకసారి చూసుకొని, చల్లగాలిని ఆస్వాదిస్తూ అలా...సాగిపోయాడు. మరికొంత సేపటికి, నిద్రలేచిన నాలుగో శిష్యుడు, వైద్యశాస్త్రంలో దిట్ట, మృతసంజీవని విద్యలో స్రష్ట కావడంచేత, అ అందాల బొమ్మకు ప్రాణం పోశాడు. ఇంకేముందీ... ఊపిరందగానే శిల్పం సమ్మోహనంగా కదిలింది. ఉద్యానవనం ఇలికిపడింది. ప్రకృతి పరవశించింది. జగన్నోహిని తన ఆటపాటలతో నలుగురు శిష్యుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. 'సుందరి నాదంటే నాదని” అంతవరకూ అజఖమరికలెరగని నలుగురు మిత్రులూ పోట్లాటకు దిగారు.
అప్పుడు శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న వచ్చి తీర్పుచెప్పాడిలా...
శిల్పాన్ని చెక్కినవాడు తండ్రి అనీ, నగలు అలంకరించినవాడు అన్న అనీ, 'ప్రాణంపోసినవాడు దేవుడనీ, చీర కట్టి మానం కాపాడిన వాడే మగడని, తనే మనువాడాలనీ.
అయ్యా! ఇదంతా మీరు విన్న కాశీ మజిలీ కథే... శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కధ' సినిమాలోని మధుర దృశ్యమే అయితే ఆ కథకూ, ఈ చిన్న పుస్తకం ముందు మాటకూ 'లింకేమి'టంటారా? అవధరించండి. ఎనిమిదేళ్ళక్రితం, నిజమాబాద్ జిల్లా,
౪
ఆర్మూరులో ఉండగా, జర్నలిజం పి.జి.డిప్లామాకు అవసరమై నేనీ “నిజమాబాద్ జిల్లాలో నాటకరంగం- గతం, వర్తమానం) అనే అందమైన శిల్పాన్ని చెక్కాను. (నిజంగా, అందంగా, వుందంటారా? ఏమో..మనకు 'కాకిపిల్ల కాకికి ముద్దు అనే సామెత వుండనే వుంది)...అంటే పై కధలోని శిల్పిని నేనేనన్న మాట. నేను శిల్చంచెక్కేటప్పుడు నా ప్రక్శనే వుండి గమనిస్తూ శిల్పసౌందర్యాని చూసి ముచ్చటపడి, అచ్చులోకి తేవాలని నన్ను సతాయించిన మిత్రుడు శ్రీ సి.వి. అప్పారావు (నిజమాబాద్ నివాసి, నాటకాల్లో నా సహవాసి) శిల్పానికి నగలతో నగిషీలు అద్దిన రెండో శిష్యుడు. ఇటీవలే నాకు పరిచయమైన చెన్నపట్నం నివాసి, జనని” (సాంఘిక, సాంస్కృతిక సమితి) ప్రధాన కార్యదర్శి, శ్రీ గుడిమెట్ల చెన్నయ్య, ఎక్కడో భూగర్భగ్భృహంలో పడివున్న శిల్పాన్ని జనం మద్యలోకి (రాతప్రతిని పుస్తక రూపంలోకి) తేవడంలో కృతకృత్యుడైన మూడో శిష్యుడు, కధలో శిల్పానికి ప్రాణంపోసిన శిష్యుడీయనే.. రచనను అచ్చులో చూసుకోవాలనే ఉబలాటం నాకెంతగా ఉన్నా నా ఉబలాటానికి మిత్రుడు అప్పారావు ఎంత ఊతమిచ్చినా, పుస్తకరూపం రావడానికి పూర్తి బాధ్యుడు మాత్రం శ్రీ గుడిమెట్ల చెన్నయ్యగారే... ఆయన నా చెవిలో ఇల్లు గట్టుకొని పోరకపోతే పుస్తకం పారకుల చేతిలోకొచ్చుండే అవకాశమేలేదు.
నేను శిల్పం చెక్కాను. అప్పారావుగారు నగలు అలంకరించాడు, గుడిమెట్ల చెన్నయ్యగారు జనంలోకి తేవడానికి ఎంతో తపన పడ్డాడు. అంతా బాగానే వుంది. నిజం చెప్పాద్దూ- ఈ స్థితివరకూ నా శిల్పం నగ్నంగానే వుది. అలా దిశమొల మొలతో వున్న నా అందమైన శిల్పానికి చీరకట్టి, సింగారించి జనం ముందుకు తెచ్చినవాడు నా అనుంగు బావ. కాలేజి రోజుల్లో నాతో నాటకాలేసిన వాడు, ఆడిపొడినవాడు, “చెంచులక్ష్మి వీధిభాగవతంలో నేను 'ఆదిలక్ష్మిగా అలరిస్తే, “చెంచులక్ష్మిగా జనాన్ని ఉర్రూతలూగించినవాడు, (ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇన్‌కంటాక్స్ అసిస్టెంటు కమిషనర్‌గా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ బొందు నాగేశ్వరరావుగారు. పుస్తక ప్రచురణకు నేను మీనమేషాలు లెక్కెడుతుంటే 'నేనున్నాను గదా... ప్రాసీడవరా బామ్మక్షి' అని వెన్నుతట్టాడు. నా వెనుక, దన్నుగా నిలబడ్డాడు. అంటే... శిల్పానికి చీరగట్టి, మర్యాదరామన్న తీర్చు (ప్రకారం మనువాడిన వాడన్నమాట. పుస్తక పరిభాషలో చెప్పాలంటే “కృతికర్త నేనైతే, కృతిభర్త మా నాగేశ్వరరావు బావ... అలా ఈ చిన్న పుస్తకం మీ చేతుల్లోకి రావడానికి సహకరించిన ముగ్గురు మిత్రులకు శిరసు ఫంలి సమసిస్తన్నాను,
ఆర్వు్టరులో వున్న ఆ నాలుగు వసంతాలు (1993-1997) నొ జీవనయానంలో మధుర సోపానాలు నిజమాబార్ జిల్లా ప్రజలు ఎంతో సౌమ్యులు, నాకేగాదు నా
షి
బి, రుల అర్భాంగికి, పిల్లలకు కూడా ఎంతో నచ్చింది ఆర్మూరు. ఉద్యోగరీత్యా పైలా ప్రశంస లందుకుంటూనే, నాలో దాగున్న కళాకారుడ్ని ప్రజల ముందు స ప్రతిభను ప్రదర్శించుకోవడానికి నిజమాబాద్ రంగస్ట్థలి, ఆకాశవాణి ఎం స్త అపురూపమైన అవకాశాల్నిచ్చాయి. ఆర్భూరులో ఉండగానే 'ఎండమావులు' అ నాటికను, సారాహుషార్ అనే నాటకొన్ని వ్రాశాను. ఎంత ప్రయత్నించినా తర్వాత కాలంలో అంత చురుగ్గా సాప్రాత్రీ వ్యాసంగం, కొనసాగించలేక పోయాను. అందుకే ఇడ్యూడు అన్నా నిజామాబాద్ జిల్లా అన్నా నాకు అంత ఇష్టం. జ తం నిజమాబాద్ జ్ఞాపకాలు మ్వుష్ఫేటలా ముసిరినప్పుడు, నన్ను కళ్ళనీళ్ళ పర్యం క్త చేసే అంశాలు కూదా కొన్ని ఉన్నాయి. నేను బదిలీపై ఒంగోలు వచ్చిన కొ హై! నూకారావు గారి మరణవార్త విని దుఃఖసాగరంలో మునిగిపోయాను. నా సిజమాబార్ర్ జ్రిల్లా రంగస్టలానికి పరిచయం చేసింది ఆయనే, జిల్లాలో పొరా రో నాటకాలకు భీజాలు వేసింది ఆయనే. ఆ బాధనుంచి తేరుకోక ముందే హార సంచి మనిషి ప్రమ్సృ చిత్రకారులు, కళానిధి సైబపరంధాములు గారి మరణ ద్ విన్నాను చేలా నాటకరంగ విషయస్సేకర్యక్తు ఆయన ఎంతగానో సహాయపద్డా ర ఆ వన్న య పను విఠల, పెద్దలు ్రీ పేక్ వాగార్ మరణర అందించేవార్డు జ్ఞ ఆన కొరినెట్ విద్వాంసుడు మా నాటకాలకు వాద్యసహకారం “ఈ వృస్తక్ర పచురణ స్వ మిత్రుల ఆ(్రనివాల్డి అర్పిస్తున్నాను, (ప్రచురణ సందర్భంగా, ఆ ముగ్గురు మి దేల్లా నాట్రకకంగ్వా ల నాక్కుల్స న్యాక్ కి కననిన్నిన రిపోర్టు సమగ్రంగా వుందని చెప్పే సళ విషయాల్స గ్రంథ రన ింశాలు, సదీసటులు, సాంకేతిక నిపుణులు, మ ణ్ దారు పట్టణ ప్రాంత న. సరిశోధనాంశాలు జిలాకేంద్రానికీ, నం ఇటీవలే నాక కలిగింది కట మ్య లోమై పోయాయేమో నన్న అనువౌ త నావి అగ రులో నేను చేస్పి చిన్న క్షత *రీ తీరిగ్గా చదివాక అయినా వరిమి శ్రుసు కొవాలన్ల చేజ్ఞాస్తు్టలక్ష సకమం అన్సుక్ర్వో జిల్లా నాటకరంగ చరిత్రను (ప్రయత్ష ఫలించ్వజ్ఞ చిన్న ప్యస్త్వ్ప కొంతమేరకైనా ఉపయోగపడితే: ౩. రాఘున్దులు న.
పీఠిక నాటకరంగం పై ఆంధ్రదేశంలో రచనలు కొద్దిగానే వున్నాయి. కొన్ని సమగ్రంగా వున్నా, అవి బహుళ ప్రాచుర్యానికి నోచుకోలేదు. ఈ పరిస్థితి, నాటకరంగం నేదున్న తీరుతెన్నులకు అద్దంపడుతుందేమో మనం ఆలోచించాలి. నాటకరంగం సజీవంగా వుంటే, దాన్ని గూర్చిన రచనలూ బలంగా వుంటాయి. గత యాఖైయేండ్లలో, నాటక రచన, ప్రయోగాల్లో మార్పులు చోటుచేసుకున్నా, యివ్వాళ తెలుగు నాటకం (నాటికలు కూడ్రాలో యెదుగుదల కన్పించదు. దీనికి అక్కడా, యిక్కడా, ఏవోకొన్ని మినహాయింపు లుండవచ్చు. మొత్తం మీద, సమూలమైన మార్పులు రాలేదు. అందుకే అది స్థాణువులా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయింది. ఏమిటి యీ పరిస్థితికి కారణాలు? చిత్తశుద్ధితో, నిష్మపటంగా, యే అరమరికలు లేకుండా, యేక్కదైనా చర్చ జరిగిందా? నాటక రచనలో పోటీకి ఆ మధ్య వచ్చిన సుమారు వంద నాటకాల్లో, కనీసం చెప్పుకోదగ్గవి అరడజనైనా లేకపోవడాన్ని కారణమేమిటి? రచనకు జవనత్వాలనిచ్చే, వైవిద్యభరితమైన సామాజిక ఆజీవితం లేకపోవడమా? సమాజమంటే కేవలం మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలేనా? గత పదేండ్లుగా, దేశ అర్ధిక, రాజకీయ, సామాజిక రంగాల్లో చోటుచేసుకొంటున్న ప్రబల మార్పులు నాటక రచయితలకు, ప్రయోక్తలకు కనపడ్డంలేదా? ఏమైనా తెలుగునాట నాటక రంగం వుండాల్సినంత ఆరోగ్యపరంగా లేకపోవడం దురదృష్టకరం. ఇవ్వుడు మీముందున్న యీ చిన్న (గ్రంధం, నాటకరంగ చరితకు సంబంధించినది. నిజామాబాద్ జిల్లాకు పరిమితమైంది. ఆ జిల్లాలోని గత కాలపు నాటకరంగ విశేషాలను ముందుగా వివరించి, అక్కడ ప్రస్తుతంలో ఏంజరుగుతున్నదీ వివరిస్తుందీ గ్రంధం. గత వర్తమానాలను బేరీజువేయడం ద్వారా, భవిష్యత్‌ను సూచిస్తుంది. నాటకం ఎందుకు యివాళ యీ దశలో వుందో, ఆఖర్లో, రచయిత వివరించడం జరిగింది. చారిత్రక నేపద్యంలో ఆరంభించి, (గ్రంధ పరిధిని ఏిసరించుకుంటూ, తృణమూలాల నుండి సంక్రమించిన సంప్రదాయాలను, అప్పటి కళాకారుల, సమాజాల, నాటక ప్రదర్శనలను గూర్చి చర్చించాడు గ్రంధకర్త. ఆసక్తికర యీ పధకంలో 'బిందు భాగవతం' గూర్చిన వివరణ సజావుగా సాగి, ఆ కళ నిజామాబాద్ జిల్లాకు తెచ్చిన ఖ్యాతికి కారకులైన కళాకారులకు- మాడవేది నారాయణ ను ఎల్లమ్మ గొర్లు- వారి కృషిని అంచనావేయడం జరిగింది. చిందు భా నన? వాబుకమా, కాదా అన్న అంశంపై- చర్చను సంక్షిప్తంగా వివరించి, దాన్ని నాటలంగా
నిగ్గదేర్చాడు రచయిత "పౌరాణిక నాటకాలు” అన్న అంశంలో సురభి నాటక సమాజ సేవల్ని ఎంతోమందికి తెలీని సూక్ష్మ సమాచారాన్ని తెలిపాడు. సురభి కళాకారుల సమప్టికృష్మి వారి నాటకాలు విజయవంతం కావడాన్ని ఎలా తోడ్చద్దాయో వివరించాడు. అదే క్రమంలో, జిల్లాలోని సాంఘిక నాటకాల గూర్చిన సర్వే, జిల్లాకేంద్రంలోనే గాక, జిల్లాలోని యితర ప్రాంతాల్లో జరిగిన, జరుగుతున్న కృషిని గూర్చి రాశాడు. శ్రవ్య నాటకాలు సరే, వాటితోపాటు, దృశ్య నాటకాలకు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం జరిపిన కార్యక్రమాలను (గ్రంధస్తం చేశాడు.
ఇదంతా నిజామాబాద్ జిల్లాలో నాటకరంగ పరిస్థితిని (3149) ని తెలియచేస్తూ, రచయిత గావించిన డాక్యుమెంటేషన్ (0006090141 0౧), చారిత్రకతను సంతరించుకొన్న ఒక రచనగా నడిచింది. దీనికి రచయిత తన భావాలను వ్యక్త పరిచాడు. తనవంటు కొన్ని అంచనాలతో గూడిన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. ఇవి పరిశీలింప దగ్గవిగా వున్నాయి. జిల్లాలో నాటకం తగినంతగా అభివృద్ధి చెందకపోవడాన్మి చారిత్రకంగా సంక్రమించిన కారణాలతో సరిపుచ్చుకోలేదు. నాటకం ఒక సమష్టికళ అని చెపుతూ, సమష్టి స్వభావంతో అంతర్గతంగా యిమిడి వున్న సాధ్యా, సాధ్యాలను, కష్ట నష్టాలను ఎంతో సున్నితంగా విశ్లేషించాడు. బెత్సాహికులైన నటీ, నటులకున్న పరిమితులు, నాటక్ష ప్రదర్శనలను ఎలా దెబ్బతీస్తాయో, సవివరంగా పేర్కొన్నారు నాటకం యింత అధోగత్రిలో వుండడాన్ని ప్రేక్షకాదరణ లేకపోవడమన్న అతి ముఖ్యకారణాన్ని చెప్పి, 'పేక్షక సమాజాల నేర్పర్చాల్సిన అవసరాన్ని వుగ్గడించాడు ఇది చాల ముఖ్యమైన సూచన, నిజానికి, యీ భాగంలో (గ్రంధ రచయిత తన సాంత అభిప్రాయాలను చెప్పడం ద్వారా, యీ గ్రంధానికి చక్కని (ప్రయోజనాన్ని చేకూర్చాడు సరళమైన భాషలో, విషయాలను చక్కగా కూర్చి, అందరికీ బోధపడే రీత్రిలో రాసిన (గ్రంధం.
రచయిత చిరంజీవి తై, రాఘవులు నాకు గత మూడు దశాబ్దాలకు పైగా తెలుసు. స్వయంగా, కళాశాలలో, నా విద్యార్థి, ఆ తర్వాత నాక్షు సన్నిపొతుదైనాడు. పట్టభద్రత వరకూ జవహర్ భారత్తి కళాశాలలో చదివాడు. ఆ తర్వాత పోస్టుగ్రాద్యు యేషన్ చేసి, వృత్తిరీత్యా బ్యాంక్ ఉద్యోగంలో వృన్నాడు. ఆతనికి చరిత్రపై, యితర సామాజిక శాస్త్రాలపై మక్కువ, అధ్యాపకుడుగా చక్కగా రాణించ గలిగిన చక్మని సౌజన్యంతో గూడిన రూపం, విద్వత్తూ వున్నా ఆ అవకాశం రాలేదు. (ఒక సంవత్సరం మా జవహర్ భారతిలో, తాత్కాలికంగా పనిచేసి మృంచ్చి శేరు సంపాదించుకున్నాడు) సామాజికంగా దోపిడికీ, పీడనకు, తరతరాలుగా గురిచేయబడ్డ వర్గం నుండి వచ్చినా, తన తాత, తండ్రులు సంగీతంలో దిట్టలు. గొంతెత్తి పాడినా, (శావ్యంగా కధ, తంబుర మీటుతూ, చెప్పినా, శ్రోతల్ని
ట్ట.
మంత్రముగ్దుల్ని చేసే ప్రతిభ కలిగిన సంగీత కళాకారులు. అందుకేనేమో, రాఘవులుకు మంచి గాత్రసాలభ్యం వుంది మధురంగా పాడగలడు. కధలాగ సంభాషించగలడు, కవిత్వం రాయగలదు. నాటకాలు రాయడమే గాక, నటించనూ గలదు. జవహర్ భారతి కళాశాలలో నెలకొన్న అధ్యయన, సారస్వత, కళాభినివేశ వాతావరణానికి తోడు, సామాజిక స్పృహనూ తలకెక్కించుకొన్నాడు సమాజంలో మతం, కులం, వర్గం పేరుతో జరిగే అన్యాయాల్ని. అక్రమాల్ని సహించలేని మనస్తత్వం అలవర్చుకొన్నాడు. మా కళాశాల తయారుచేసిన ఆదర్శ విద్యార్థుల్లో ఒకడుగా పేరుతెచ్చుకొన్నాడు. ఆలోచనాపరుడు. జీవితంలో, కావల్సిన హంగుల్ని సమకూర్చుకొన్నా అంతటితో తృప్పిచెందక, యింకా యేదో సాధించాలని, కళాకారుడుగా రాణించాలనీ తపనపదే జిజ్ఞాసువు, చిరంజీవి రాఘవులు. అతని సాహిత్య వ్యాసంగానికి నా ఆశీస్సులు.
హైదరాబాద్, -లచొర్భు తకుళలాఖరీణం రామీక్యర్ణ
ఏప్రిల్ *04
కగు
లోస ఇన వరిశో ఐలక్షణ వైలిలో నలక్షణఘైైన ధన భావనలో బలం, భాషలో జీవం, ధారలో సారళ్యం, ఇతివృత్తంలో ఐతిహాసికత- ఈ *'నాలుగు లక్షణాలు కలిగిన రచన. మంచి రచన. రాఘవులు గారి రచనలో ఈ నాలుగు లక్షణాలు సమగ్రంగా సముచితంగా ఉన్నాయి. అందుకనే ఇది ఒక విశిష్ట రచన. ప్రయోజనకరమైన రచన. “నిజమాబాద్ జిల్లాలో నాటకరంగం” అనే ఇతివృత్తాన్ని తీసుకుని ఆయన ఎంతో (శమించి, ఎన్నో ఆధారాలు సేకరించి, వాటిని లోతుగా విశ్లేషించి ఈ రచన చేశారు. ఒక ఇతివృత్తాన్ని మనసులో భావన చేసుకొని దాని ఆనుపానులను నిసితంగా పరిశీలించి కాలగర్భంలో నిక్షిప్తమై ఉన్న చారిత్రక యదార్జాలను వెలికి తీయటమే పరిశోధన లక్ష్యం. అటువంటి కృషిని రాఘవులు గారు కార్య నిష్టతో సత్య నిరతితో జరిపి మనకెన్నో కొత్త విషయాలను తెలుగు నాటకరంగం గురించి విశదపరిచారు. ఈ రచనలో ఆయన వాడిన భాష సజీవమైనది. దీనినే ఆంగ్లంలో డ్ఇ9/- 10౪109 120/ 90/6 అని అంటారు. అటువంటి శైలి ఈ రచనలో మొదటి నుంచి చివరిదాకా మనలను ఆకర్షించి చదివింప జేస్తుంది. నాటక రంగం గురించిన వీరి పరిశోధన ఏదో నాలుగు ఉదాహరణలు ఇచ్చి పైపై మెరుగులు దిద్ది రచించినట్టిది కాదు. నిజామాబాద్ జిల్లాలో నాటక రచన, ప్రదర్శన కళలలో వచ్చిన పరిణామాన్ని సోదాహరణంగా కూలంకషంగా వివరించారు. ఒక పరిశోధనకు సహజభూమిక అనదగిన ఆ ప్రాంతం భౌగోళిక, సాంఘిక చరిత్రను కూడా ఆయన సంగ్రహంగా వివరించారు. మొత్తం తెలుగు నాటకరంగం పూర్వాపరాలను కూడా సంగ్రహంగా తెలిపారు. సందర్భం వచ్చింది గనుక, ఇక్కడ ఒక వాస్తవాన్ని చెప్పుకోవాలి. మన ప్రాచీన పండితులు, పరిశోధకులు సంస్కృత కావ్యాలను ఎన్నింటినో అనువదించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం గావించారు. కానీ, నిన్న మొన్నటి దాకా నాటక రచన ప్రదర్శనలను గురించి పట్టించుకోలేదు. సంస్కృతంలో గొప్ప నాటకాలున్నా వాటిని తెలుగులోకి అనువదించడం జరగలేదు. ఇందుకు కొన్ని చారిత్రక కారణాలున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. మన సాహిత్యం ప్రధానంగా పద్యరూపంలో ఉన్నది రాజ పోషణవల్లనే ప్రధానంగా స
సాహిత్యం వృద్ధివెందిన ఆ కాలంలో రాజులకు, రారాజులకు, మహరాజులకు చక్రవర్తులకు సైతం నాటకాల పట్ల ఆసక్తి ఉందేదికాదు. అందువల్ల రాజాదరణకు నోచుకోని నాటకరంగం వైపు ఆనాటి పండితుల దృష్టి మళ్లలేదు. భక్తి సాహిత్యంతో పాటూ తమను కీర్తించే పద్య సాహిత్యాన్ని మాత్రమే ఆనాటి పాలకులు ఆదరించారు. రాఘవులు గారు ఉదహరించిన వీరేశలింగం పంతులుగారి “వ్యవహార ధర్మ బోధిని మొదటి నాటక ప్రదర్శన అనిపించుకుంటుంది. కాగా, ఇరవయ్యవ శతాబ్లిలో 'మృచ్చ కటికం' వంటి సంస్కృత నాటకాల ఆంధ్రీకరణ జరిగింది. స్ట ఏమైనా రాఘవులు గారు ఈ రచన ద్వారా మరుగున పడివున్న ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చారు. తెలుగు నాటకరంగ చరిత్రకు వారు ఈ రచన ద్వారా మంచి దోహదం చేశారు. ఉచిత సలహాలివ్వడం సముచితం కాదు గానీ, రాఘవులు గారి వంటి పరిశోధకులు సేకరించిన అమూల్యమైన అనేక ఆధారాల ప్రాతిపదికను యావత్తు ఆంధ్రావనిలో ఆవిర్భవించి వికసించిన నాటక రంగం గురించి ఒక సమగ్ర పరిశోధన జరిపినయెడల, వారు తెలుగు సాహిత్యంలో “నాటకరంగం అధ్యాయానికి నిండుతనం చేకూర్చిన వారవుతారు ఈ కృషిలో డాః మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి రచనలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ రచన ద్వారా నాటకరంగ వికాసం గురించిన రాఘవులు గారి కృషిని మనసారా అభినందిస్తున్నాను. “౭న ఆరీ, కృష్ణు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నత కార్యదర్శి, ప్రపంచ తెలుగు సమాఖ్య, చెన్నై చిరునామా : ౧౭4౬ 0. 82, [04౧6 ౧1౦౦! 2, ౬082౧41౧4౧ 0౦ ౦0౧౫ [4/1200/3, 0౧6౧౧౫| - 600 004. ౧౧ : 24992237 గ
అభినందనలు
శ్రీపాద కుమారశర్మ, ఛార్టర్డ్ అకౌంటెంట్, నిజమాబాద్. చతుస్టష్టి కళలలో నాటక కళకు ప్రత్యేక స్థానం ఉందన్న విషయం అందరికీ తెలిసినదే. అట్టి నాటకరంగ వికాసానికి అవిరళకృషి సలుపుతున్న నటుడు, ప్రయోక్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కె. రాఘవులుగారు ఎంతో అభినందనీయులు. వృత్తి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాన్ని తనదైన శైలిలో అత్యంత క్రమశిక్షణతో నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఉన్నత స్థానాలు అధిరోహించడం ఒక విశిష్ట లక్షణమైతే ప్రవృత్తి అత్యంత ప్రీతిపాత్రమైన నటన. పౌరాణిక సాంఘిక నాటకాలలో వేషం వేయడంలో
ఆయనకున్న శ్రద్ధ మక్కువ బహుధాప్రశంసనీయం.
ఉద్యోగరీత్యా 1993 వ సం లో నిజమాబాద్ దగ్గరలో వున్న ఆర్భూర్కు బదిలీ అయినా, నాటకం మీదున్న పట్టు సడలించకుండా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పౌరాణిక నాటకరంగ వికాసానికి ఎంతో దోహదపద్దారు. నాకు తెలుసున్న మటుకు, శ్రీరాముడిగా, దుర్యోధనుడుగా నటించి ఎంతో పేరుగడించారు.
అలాగని పౌరాణిక నాటకాలక్తే పరిమితమైపోకుండా, నిజామాబాద్ తదితర ప్రాంతాలలో వివిధ సమాజాలవారు ప్రదర్శించిన సాంఘిక నాటకాల ప్రదర్శనలకు తప్పక హాజరవడం ఒక ఎత్తయితే, నాటక వికాసానికి జరిపిన పలు సెమినారల్లలో కూడా పాల్గొని నాటకకళయందు వారికున్న అభిరుచిని చాటుతూ తమ వంతు కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహించడమే కాక వారి అమూల్య సహాయ సహకారా అందించడం మెచ్చుకోదగ్గ విషయం.
ఈ విధంగా వారి 'ప్రజ్ఞాపాటవాలను ప్రస్తుతించడం అతిశయోక్తి కాదనుకుంటాను. ఉన్న వాస్తవాన్ని వ్యక్తీకరించడంలో సంకోచించడానికి తావులేదని నా వ్యక్తిగత అభిభాషణ.
శ్రీ రాఘవులుగారు నిజామాబాద్ వచ్చిన కొద్ది రోజులకే నాకెంతో ఆప్తులయ్యారు. నాటకాల మీద నాకున్న మక్కువను, అనుభవాన్ని తెలుసుకుని నిజామాబాద్‌లో నాటక వికాసానికి తమ సహాయ సహకారాలనందిస్తూ, నాటక పక్షులలో తనూ ఏకమై తన సాన్నిహిత్యాన్ని అంచెలంచెలుగా పెంచుకున్న కళావతంస. అప్పటికి,
ఇప్పటికీ చెక్కుచెదరని నాటక ప్రవృత్తి బహుధాప్రశంసనీయం. శ్రీ రాఘవులుగారు, నిజమాబాద్ జిల్లా నాటకరంగానికి వారు చేసిన కృషి-సేవ అనితరసాధ్యం. ఎందుకంటే నిజమాబాద్‌లో ఇంతమంది కళాకారులం ఉండి న.
సేవలందిస్తున్నా- ఎక్కడినుండో నిజామాబాద్‌కు ఉద్యోగరీత్యా తరలివచ్చి, మాలో మావాడై ఎన్నో వ్యయప్రయాసలకోర్చి “నిజామాబాద్ జిల్లాలో నాటకరంగం-గతం- వర్తమానం” అనే శీర్షికతో వ్రాసి, నిజమాబాద్ జిల్లా ప్రజలకూ, ముఖ్యంగా- నటులకూ, నాటకాభిమానులకూ అందించిన మహోతృష్టమైన (గంధం అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి ప్రక్రియ నభూతో నభవిష్యతి- ఇంతవరకూ ఎవరూ చేయలేని పనిని- శ్రీ రాఘవులు అత్యంత దీక్షతో పట్టుదలతో చేపట్టి నిజామాబాద్ జిల్లా నాటక వికాసానికి ఆద్యులయ్యారు. ఆయన చేపట్టిన ఈ ప్రక్రియా, స్వామికార్యం, స్వకార్యం, నిర్వహించడానికి దోహదపడిందని నా విశ్లేషణ. ఎందుచేతంటే పై శీర్షిక వ్రాయడం వల్ల నిజామాబాద్ జిల్లా నాటకరంగ వికాసానికి దోహదపడటమే కాక, జిల్లా కళాకారులకు, జిల్లాకు పేరుప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన మహోత్కష్ట శీర్చిక. అదేకాకుండా నిజమాబాద్ జిల్లా కళాకారులను తట్టిలేపి, అంతంత మాత్రంగా వున్న నాటకరంగ వికాసాన్ని భవిష్యత్తులో దేదీష్యమానంగా వెలుగొందేందుకు తమవంతు కృషి ఎంతైనావుందని చురకవేసి, జాగృతపరచిన వారితీరు చాలా గొప్ప విశేషంతో కూడుకున్న ప్రక్రియ. అట్టి అమూల్య గ్రంధాన్ని దీసీస్ సమర్పించడం తద్వారా డిప్లమా వారు పొందడం, ఆయన జీవితంలో సాధించుకున్నట్టి కలికితురాయి. ఇది నిజమాబాద్ జిల్లా వాసులు ముఖ్యంగా అన్ని రంగాల కళాకారులు మరవలేని గొప్ప అనుభూతి అని నా విశ్వాసం. శ్రీ రాఘవులుగారు పైప్రతిని ఎంతో ఆప్యాయంగా పంపడం, విశ్లేషిచమని కోరడం విషయంలో నా ఆనందానికి అవధులు లేవు. అట్టి గ్రంథాన్ని ఆమూలాగ్రం చదువుతున్న దశలో వారు పొందుపరచిన కొన్ని విషయాలు గగుర్పొరచడమేకాక, ఎంతో ఉత్కంఠను రేపుతూ ఇంత సుదీర్భ అభినందనలు చేయడానికి, దోహదకార యిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇందులో నాకు నచ్చిన విషయాలు క్ష ఉపోద్దాతంలో (ప్రసిద్ధిగాంచిన “ఇందూరు” పట్టణం నిజామాబాద్‌గా రూపాంతరం చెందిన వివరాలను (ప్రాశస్థాన్ని విశదీకరించడంలో రాఘవులుగారు తీసుకున్న శ్రద్ధ అత్యద్భుతం అనితరసాధ్యం. క్రీ.శ. 388 మరియు 500 ప్రాంతంలో చోటుచేసుకున్న విశేషాలు- క్రీ.శ. 1015 నుండి 1017 వరకూ, మరియు 1876లో వయేప్రాంతాలతో “ఇందూరు జిల్లాగా ఏర్పడింది. క్రీ.శ. 1905లో పరిపాలన పునర్జిర్మాణం జంరిగినపుడు అప్పటి నవాబు నిజాం అసఫ్ జాహి *1 పేరిట “నిజామాబాద్'గా రూపాంతరం చెందడానికి సంబంధించిన వివరాలను సవివరంగా న.
(కోడీకరించడం చాలా ఇన్ఫర్మేటివ్గా వుండడం గొప్ప ప్రక్రియ అని చెప్పవచ్చు.
- నూట పదహారేళ్ల తెలుగు నాటకరంగం గురించి విశదీకరిస్తూ :-
(1) క్రీ.శ. 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి గారు రచించిన 'మంజర మధు కరీయం” నాటకాన్ని ప్రప్రథమ తెలుగు నాటకంగా నిర్ధారించిన విషయం తెలియజేయడంలో.
(2) 1880లో ప్రప్రధమంగా రాజమండ్రిలో ప్రముఖ సంఘ సంస్కర్త వీరేశలింగ పంతులుగారి నిర్దేశికత్వంలో ప్రప్రధమంగా రంగస్థలం మీద 'ప్రదర్శనభాగ్యం పొందిన “వ్యవహార ధర్మబోధిని నాటకం మొట్టమొదటి తెలుగునాటకంగా గుర్తింపు పొందిన విషయాన్ని తెలియజేయడం చాలా వివరణాత్మకంగా వుంది. అందుకనే కాబోలు ఈమధ్యకాలంలో “రాష్ట్ర తెలుగు నాటక దినోత్సవం' జరుపుకోవడం ఆంధ్రదేశంలో పరిపాటయింది.
(3) పై వివరాలు వివరిస్తూ 1996 సం రానికి తెలుగు నాటకరంగం వయస్సు 116 సంవత్సరాలయితే, నిజామాబాద్ నాటకరంగం వయసు 'మూడు పదుల ముచ్చటే అని కుండబద్దలు కొట్టినట్లుగా వ్యత్యాసాన్ని వివరించి చెప్పిన వైనం, మెచ్చుకోతగ్గది.
పై వివరాల్నిబట్టి తేటతెలమయే విషయాలు
తెలంగాణా ప్రాతం 1957 సం1ములో ఆంధ్ర ప్రాంతంలో విలీనం గావింపబడి విశాలాంధ్రగా ఏర్పడే సమయానికి నిజామాబాద్ జిల్లాలో నాటకరంగానికి ఏలాంటి (ప్రాధాన్యం లేదన్నట్లుగానూ అంతంత మాత్రంగా వుండి 1966 సం ।ము నుండి నిజామాబాద్ జిల్లాలో నాటకరంగాభివృద్ధికి అంకురార్పణ జరిగిందని వారి విశ్లేషణ, నిజమేననిపిస్తోంది. అందుకనే కాబోలు- రాఘవులుగారు- 'తారీఖులు, దస్తావేజులు, ఇవి కాబోయే చరిత్రకర్ధం' అని 'మహాకవి' అన్నట్లు గుర్తుచేస్తూ- ఇంకా లోతుగా వెడుతూ- 'ధరిత్రిలో నిన్నటి గతానికి నేడు సాక్షీభూతంగా నిలిచేది చరిత్రే. నేటి వర్తమానం రేపటికి గతం. గనుకనే ఈ వ్యాసానికి, వారు-
“నిజామాబాద్ జిల్లాలో నాటకరంగం- గతం- వర్తమానం
నామకరణం చేసిన తీరు అద్భుతం.
నాటకరంగం జిల్లాలో ఆలస్యంగా ప్రాచుర్యానికి వచ్చిన, ఇతర కళారూపాలు
కురంజీ, యక్షగానం వీధినాటకాలు, పగటివేషాలు, తోలుబొమ్మలాటలు, జముకుల మ.
కథలు మొదలైన వివిధ కళారూపాలు నూటఏఖై పైచిలుకు- ఆంధ్ర ప్రజలను ఉగర్రూత లూగించాయని సుప్రసిద్ధ రంగస్టల సినీనటులు కళాప్రపూర్ణ శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ గారు తెలిపారని వ్యాసకర్త గుర్తుచేయడం విశేషం.
దశలవారీగా నాటకరంగం ఏ విధంగా అభివృద్ధిచెందింది- ఇని వివరించిన విధానం అత్యంత ప్రశంసనీయం.
రాష్ట్ర సరిహద్దులు- దేశ సరిహద్దులు దాటిన చిందు భాగవతం ప్రదర్శన విధానాన్ని పరికిస్తే ఒక అసాధారణ జానపద ప్రక్రియగా ప్రస్తావిస్తూ- నాటక ప్రక్రియలో భాగంగా దీన్ని చేర్చవచ్చని తెలిపిన వ్యాసకర్త వివరం సరియైనదేనని అనకతప్పదు.
కొసమెరుపు :-
రాఘవులు కార్యదీక్షా పట్టుదలకు జోహార్లు.
అట్టి బహుముఖ ప్రజ్ఞావంతుదైన శ్రీ రాఘవులుగారికి, భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని కోరుకుంటూ, కళారంగంలో, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.
సా
నాకు రచంంతకు నడుదు పాటిబండ్ల ఆనందరావు సినీ, నాటక రచయిత పద్నాలుగేళ్ల కిందట పరిచయమైన రాఘవులుగారు కేవలం బ్యాంకు మేనేజరు. చెన్నైలో కోడంబాకంలోని (బ్రౌన్ స్టోన్ అపార్ట్మెంట్ సెవెంత్ ఫ్లోర్లో నేను జోకర్ సినిమాకు వర్క్చేస్తున్నప్పుడు మా జయపాల్‌తో కలసి వారు నాదగ్గర కొచ్చారు. అప్పుడు వారు నిజమాబాద్‌లో పనిచేస్తున్నట్టు చెప్పిన గుర్తు. మా పరిచయం పెరిగి స్నేహంగా మారడానికి మరో ఏడేళ్లు పట్టింది ఉద్యోగరీత్యా యిద్దరం ఒంగోల్లోనే వుంటున్నా వారిలో దాగివున్న ప్రతిభావ్యుత్పత్తుల్ని నేను గుర్తించలేకపోయాను. గుర్తించటంలో నేను పొరపాటుచేశానా, వ్యక్తంచెయ్యటంలో వారు నిరాసక్తులయ్యారా అనేది ఒక ప్రశ్న. రెండువేల సంవత్సరంలో అనుకుంటా... కావలి జవహర్ భారతి పాత విద్యార్థుల సమావేశం రవీంద్ర భారతిలో జరిగింది ఆ సందర్భంగా ప్రదర్శించిన రాయబారం పడకసీన్లో దుర్యోధనుడి పాత్రలో వారిని చూశాను. ఇదేంటీ...? పది సంవత్సరాలుగా నాకు సన్నిహితంగా వున్న యీ మనిషిలో యింత మంచి కళాకారుడున్నాడా అని విస్తుపోయాను. నిజంగా నిజం సుమండీ. ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం, పద్యాన్ని శాస్త్రీయంగా ఆలపించటం... దేన్లోనన్నా యింత లోపం కనిపించకపోతుందా అని చూశాను. ఆయవకాశం వారివ్వలేదు. అప్పుడు నిర్ణయించుకున్నాను చాలా బలంగ. రాఘవులుగారిని నా నాటకంలోకి తీసుకోవాలని. ఓ మంచి పౌరాణిక నాటకం తయారు చెయ్యాలి అని అప్పుడప్పుడూ నా సన్నిహితుల్లో అంటుండేవాణ్ణి. అది నీవల్ల కాదుగదా నీ తాత తరంకూడా కాదు పొమ్మన్నాడొకసారి మిత్రుడమీ డా మాచిరొజు రామచంద్రరావు. అలా నన్ను రెచ్చగొట్టడానికే అనుకోండి. మాచిరాజుతోపాటు మరో మంచి నటుడు దొరికాడులే అని సంబర పడ్డాను. అంబేడ్కర్ జీవిత చరిత్రని వీధి భాగతం ఫాంలో నాటకంగా రాయాలని నిర్షయించుకొని ఆ బాణీలకోసం, అవి తెలిసినవారి కోసం వెతుకుతున్నాను. అప్పుడు నాకు మరో విశ్వరూపం చూపించారు రాఘవులుగారు పక్కా పల్లెటూరి వీధిభాగవత కళాకారుడు లాగా 'నరసింహూడడవికి వేటాలాడాగ వెడలే' అంటూ చెంచునాటకంలో పాటందుకొని తన్మయంగా పాడుతూ, అందంగా అడుగులు వేస్తూ నన్ను అబ్బుర పరిచాడు. తన ఖర్చుతో కారు కట్టించి నన్ను పులికొండ (గ్రామానికి తీసుకుపోయి వీధిభాగవత కళాకారుల్ని పరిచయం చేశారు. వాళ్లతో నా పరిచయం, మూడు నెల్ల పాటు ఆ ప్రక్రియని అధ్యయనం చెయ్యటం అదంతా జీవితంలో ఓ మధురమైన అనుభూతిగా మిగిలిందనుకోండి. ౫1
తర్వాత అంబేడ్కర్ నాటకంలో సూత్రధారుడుగా కదని నడిపించే ప్రయోక్త పాత్రని రాఘవులుగారిచేతనే వేయించాలని నిర్ణయించుకున్నాం. అంతలో సీనియర్ మేనేజర్‌గా ప్రమోషన్ పైన వారు చెన్నైకి బదిలీ అయ్యారు. అయినా ఫరవాలేదూ రెండు మూడు నెల్లు సెలవుపెట్టి రిహార్సిల్స్కి వస్తానన్నారు. నాటక రచన మొదటి సగం పూర్తయింది. వారికి వినిపించాను. రెండో సగం రచన కాస్త ఆలస్యమవుతూ వుంది. ఇదుగో యింతలో మరో బాణం బయటికి తీశారు. అదే పుస్తక రచన, ప్రచురణ.
ఇదంతా యెందుకు చెపుతున్నానంటే- ఇంతకాలం నా పక్షనే వున్న మనిషి గురించి నాకు తెలియడానికి యింత కధ నడిచిందే. వేలాది సంవత్సరాలుగా... కోట్లాది మానవుల్లో... ఎన్ని ప్రతిభాపాటవాలు, ఎన్ని కళలు... ఎన్ని సంఘటనలు. ఎన్ని అనుభవాలు... ఎన్ని కదలు... అజ్ఞాతంగా వుండిపోతున్నాయోగదా. చీకటి కోణాల్లో దాగివున్న అద్భుతాలను అక్షరబద్ధం చేసి, నిశానిర్దేశం కోసం భవిష్యత్తరాలకు అందించే చరిత్ర రచన యెంతగొప్పది. అలాంటి ఉత్తమోత్తమ (ప్రక్రియలో ప్రారంభ రచనకు పూనుకున్నందుకు రాఘవులుగార్ని అభినందిస్తున్నాను. అదీ నాటక చరిత్ర కావటం నాకు మరీ ఆనందమైన విషయం. పైపైన కాకుండా కాస్త లోతుకి దిగి అనేక గ్రంధాలు చదివి సశాస్త్రీయంగా ఒక జిల్లా నాటక చరిత్రని రాయటం చిన్నపనా! అందులో రచయిత కృతకృత్యులయ్యారని భావిస్తాను తారీఖులు దస్తావేజులతో నిండివుండే చరిత్ర రచనలో రసానుభూతిని కలిగించటం కష్టం. చరిత్రను వక్రీకరించి అభూతకల్పనలతో నింపితే తప్ప గాలి పోగుజెయ్యటానికి వీల్లేదు. అలంకారాలతో సొబగులు అద్దానికి లేదు. మరి చదవడానికి పారకుడికి ఆసక్తిని కలిగించడం మెలా? ఇది సృజనాత్మక స్వతంత్ర రచన కాదే. అయితే రచయితకి అందమైన ప్రోంజ్ రాయగలిగే శక్తి వుంది. అదే పారకుడికి ఆసక్తిని కలిగించే అంశమైంది.
ఇందులో నాకు అమితంగా నచ్చిన అంశం ఒకటుంది. సాధారణంగా నాటక పెద్దలు తెలుగు నాటకం మూలాలను సంస్కృత నాటకంలోనో, యింగ్లీషు నాటకం లోనో వెతుకుతుంటారు. కానీ యీ రచయిత తెలుగు నాటకం మూలాలను చిందు భాగవతంలోనూ వీధిభాగవతంలోనూ, పంబకథ్లోను, శారదగాండ్ర ప్రదర్శనల్లో దర్శించారు. ఇది వాస్తవ చారిత్రకదృష్టి. రచయిత తొలిపోటీలో గెలిచారు
విడివిడిగా అన్ని జిల్లాల నాటక చరిత్రలూ వ్రాయబడడానికి యిది స్ఫూర్తి కాబోతుంది. రాఘవులుగారి వచన రచనలో ఒడుపుంది. ఒయ్యారముంది. తెలుగు నుడికారం ఉంది అదే యీ రచనని బ్రకికిస్తుంది ముందుకి నడిపిస్తుంది రాఘవులు గారు యింకా మంచి రచనలు చెయ్యాలని ఆశిస్తూ. .
న.
న శ శ... , [షు (టీ.
ల్ ర నట స 'శ్రీకృష్ణ్ణాయబారం” లోని ఒక రసవద్రట్టం శ్రీకృష్ణుడు పీ. చంద్రయ్య, దుర్యోధనుడు కె. రాఘవులు, అర్జునుడు శ్రీ బి. నాగేశ్వరరావు.
మ మ న ఈం వం లస. ఖు
| అకాల క. య్య స్త నం. ఖ్ వ 2 2-9-1995 తేదీన నిజామాబాద్ రాజీవ్ ఆడిటోరియంలో స్రదర్శించిన “మహారథి కర్ణ” నాటక బృందం (శ్రీ వేమూరి రామయ్య & పార్టీ తో పుస్తక రచయిత, ఆకాశవాణి డైర్టర్ తదితరులు.
.
__గదామాబాద్ బలలో నాసరంగ్ం గడం - వర్రమానం. అనంతమైన జీవకోటిలో మానవుడికో ప్రత్యేక స్థానం వుంది. పరిసరాల్ని తనకనుకులంగా మార్చుకోవడీరో ప్రకృతి సంపదను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడంలో మనిషికున్న వివేకం, చారవ జీవజాలంలో మరేజీవికీ లేవు. అందు కుపకరిస్తున్న పని ముట్టు అతనిలోని మేధస్సే. పరిణామ (క్రమంలో మానవ మేధస్సు ఎన్నో మజిలీలు చూసింది. ఎన్నో (ప్రయోగాలు చేసింది. ఆదిమ మానవుడు తన సహచరుడికి సమాచారం అందించే ప్రయత్నంలో ఎలుగెత్తి అరిచాడు. ఆ అరుపే పొందికైన *'మాటి యింది. వినసొంపైన “పాటి” యింది. ఆ “పాటకు అనువుగా శరీరావయాల్ని కదల్చడం మొదలెట్టి దాన్ని 'ఆట” అన్నాడు. ఏమీ తోచనపుడు, తాను నివసించే కొండ గుహల గోడలపై పిచ్చిగీతలు గీయడం మొదలెట్టాడు. ఆ గీతలకో రూపం రాగానే మురిసి పోయాడు. దాన్ని 'బొమ్మ'న్నాడు. ప్రకృతి అందాల్ని చూస్తూ మైమరపుతో పాటలు పాడాడు, కవిత్వం అల్లాడు, నాట్యం చేశాడు, శిల్పాల్ని చెక్కాడు, చిత్తరువులు గీశాడు. ఒక్కటేమిటి తన ఆనందం కోసం ఎన్ని పోకడలుపోవాలో అన్ని పోకడలు పోయాడు. అరవై నాలుగు కళల్ని జెపాసన పట్టాడు, అలాంటి చతుష్టష్టి కళల్లో మహోన్నతమైన కళ నాటకం. ఆ నాటకానికి నాకు దొరికిన వేదిక నిజామాబాద్ జిల్లా. ఎక్కడుంది ఈ జిల్లా ? అదిగదిగో అల్లడే ఇందూరు ఖిల్లా నిజమాబాద్ ఖిల్లా అనగానే మొదటగా గుర్తొచ్చేది ప్రజా కవి దాశరథి. ఈ ఖిల్లా జైలుగొడల మీద రాసిన దాశరథి గేయం సాహితీ ప్రియుల నాలుకల పై తారాడుతుంది. “ఓ నైజాము పిశాచమా ! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని క రాధని క్షే
తీగలను తెంపి, అగ్నిలో దింపినావు నా తెలంగాణ, కోటి రతనాల వీణ”
ఆ కోటి రత్నాల వీణ తెలంగాణలో, ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ సరిహద్దుగా నిలిచివుంది. జిల్లాకు ఉత్తరాన ఆదిలాబాద్, తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్, పడమర మహారాష్ట్రకు చెందిన నాందేడ్, బీదర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జీల్లా విస్తీర్ణం 7956 చదరపు కిలోమీటర్లు, ఉత్తర రేఖాంశంపై 77.4 డిగ్రీలు, తూర్చు రేఖాంశం 78.37 డిగ్రీల మధ్య నిజామాబాద్ జిల్లా వుంది. జిల్లాలో ఉత్తర సరిహద్దున 118 కిలోమీటర్ల పొడవున పావన గోదావరి నది ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో పుట్టిన మంజీరా, బోధన్ ప్రాంతంలోని “కందకుర్తి దగ్గర గోదావరిలో కలుస్తుంది.
క్రీ.శ.1876లో పది తాలూకాలతో ఇందూరు జిల్లా ఏర్పడింది. నిజామాబాద్‌ను “ఇందూరు” అని పిలవడానికి మూడు కారణాలు ఉండి ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడ్డున్నారు. మూడుతరాలకు చెందిన ముగ్గురు రాజులు “ఇంద్రపురి” అనే నగరాన్ని నిర్మించారని తెలుస్తోంది. క్రీశ.388 ప్రాంతంలో నర్మద, తపతి నదుల మధ్య ప్రాంతాన్ని (త్రికూట రాజవంశానికి చెందిన ఇంద్రదత్త (ఇంద్రసేన) మహారాజు పరిపాలించాడని, “ఇంద్రపురిని ఆయనే నిర్మించాడని, కాలక్రమేణా “ఇంద్రపురి ఇందూరుగా మారిందని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.శ.500 సంవత్సర కాలానికి చెందిన విష్ణుకుండిన వంశపురాజు మొదటి ఇంద్రవర్మ కాలంలో “ఇంద్రపురి ఏర్పడి వుంటుందని మరికొందరి భావన. క్రీ.శ 1015 నుంచి 1017 వరకు బోధన్ రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాష్ట్రకూట రాజు ఇందద్రవల్లభుని కాలంలో ఇంద్రపురి ఏర్పడి వుండవచ్చని మరికొందరు చరిత్రకారులు అభిప్రాయ పడ్డున్నారు. కాని ఇంద్రపురి ఇంద్రసేనుడి కాలంలోనే
._ లదమౌదాద్ దల్లాలో నొటరంగ్ం గీతం - వర్రమానం, నిర్మించారనదానికి చారిత్రక ఆధారాలు ఎక్కువగా ఉన్నాయి. క్రీ.శ. 1876 లో ఇందూరు, నిర్మల్ ఆర్భూర్, భీంగల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బోథన్, ముథోల్స్ నర్సాపూర్, తాలూకాలతో ఇందూరు జిల్లా ఏర్పడింది. అనంతరం క్రీ.శ 1905 లో పరిపాలన విధాన పునర్నిర్మాణ సమయంలో ఇందూరును నిజామ్ అసఫ్ జాహీ-/! పేరుతో “నిజామా బాద్ గా మార్చారు. నిజాం+ఆబాదు= నిజామాబాద్ అయింది. 'ఆబాదు' అనే ఉర్చుపదానికి అధిక సంఖ్యలో ప్రజలు నివసించేందుకు సౌకర్యం గల పట్టణం అని అర్థం. నిర్మల్, నర్సాపూర్ తాలూకాలు అదిలాబాద్ జిల్లాలో చేరాయి. 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు 1958లో బిచ్ కుంద మద్నూర్ ప్రాంతాలు నిజామాబాద్ జిల్లాలోకి వచ్చాయి. మెదక్ జిల్లాలోని కొంత భాగం ఈ జిల్లాలో కలిసింది. 1979 లో ఆర్మూరు, కామారెడ్డి తాలూకాల్లోని కొన్ని గ్రామాలతో కొత్తగా దోమకొండ, భీంగాల్ తాలూకాలు ఏర్పడ్డాయి. మొత్తం తాలూకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. 1985లో ఏర్పడ్డ మండల వ్యవస్థ కారణంగా తొమ్మిది తాలూకాలను 35 మండలాలుగా విభజించారు. 1988 లో 86వ మండలంగా “ఎడపల్లి ఏర్చడింది. కావ్యేషు నాటకం రమ్యం - నాటకాంతం హి సాహిత్యం కావ్యాల్లో నాటకం అత్యంత రమ్యమైందని, సాహిత్య సృష్టికి ఆఖరిమెట్టు నాటక రచన అని మన పూర్వీకులు నాటకానికి పెద్ద పీట వేశారు. కోస్తా, రాయలసీమ జిల్లాలతో పోల్చిచూసినప్పుడు, తెలంగాణా జిల్లాలలో ఒక వైవిధ్యం కనబడుతుంది. కొన్ని శతాబ్దాల పాటు ఈ ప్రాంతం నైజాం నవాబుల పాలనలో ఉండటం వల్ల, తెలుగు స్థానే ఉరూ మాధ్యమంలో విద్యావిధానం కొనసాగడం వల్ల, ఇక్కడి ప్రజలపై, తెలుగు భాష పై, ఉర్దూ ప్రభావం ఎక్కువ. మహారాష్ట్ర ౩. రాఘవం 3
నిజామాబాద్ ఉల్లాలో నాటకరంగం గతీం -వర్రమాసీల | సరివాద్దులో వున్న నిజామాబాద్ జిల్లా ప్రజలపై ఉర్జూతో పాటు మరారీ ప్రభావం కూడా ఎక్కువనే. ఆందుచేతనే, రాయలవారిచే కీర్తించబడ్డ “తెలుగుభాషు ఈ (ప్రాంతంలో అంత 'లెస్సగా అనిపించదు. కానీ సజీవమైన నుడికారాల్తో, పలుకు ఐబళ్ళతో, జానపదుల నోళ్ళలో నలిగి నలిగి, ఇక్కడి తెలుగు గలగలపారే సెలయేరులా, గోదావరితో పోటీపడి పరుగులు తీస్తుంటుంది. ఈ విషయాన్ని సుమారు 165 సంవత్సరాల క్రితమే గుర్తించి గ్రంధస్తం చేశారు వనుగుల వీరాస్వామయ్య గారు తన 'కాశీ యాత్ర చరిత్రలో. “కడప వదిలినది మొదలుగా అరవ భాషతెలిసి మాట్లాడ తగినవారు సకృత్తుగా నున్నారు. తెలుగు మాటలు సర్వ సాధారణముగా రాగసరళి చెప్పుచున్నారు. ప్రశ్న పూర్వకముగా ఉత్తర (ప్రత్యుత్తర మిచ్చేటప్పుడు శబ్బములను సంకుచిత పరచి మాట్లాడుచున్నారు. ఎట్లాగంటే యీ యూరు ఆ యూరుకి ఎంత దూరమంటే నాకు యేమి ఎరుక యని ్రత్యుత్తరము పుట్టుచున్నది. పండుకొన్నాడు అనడానికి పండినాడని అనుచున్నారు. హిందుస్థాని తురక మాటలు దేశ భాషలయినందున తెనుగు భాషతో కలిపి మాట్లాడుచున్నారు.” నూట పదహారేళ్ళ నాటక రంగం. తెలుగు వారికి నూటపదహారు చాలా ఇష్టమైన సంఖ్య. చదివింపుల్లో నూటపదహార్లకు, వెయ్యిన్నూట పదహార్లకు ఉన్న సముచిత స్థానానికి పెళ్ళి పందిళ్ళే సజీవ సాక్ష్యాలు. తెలుగు నాటకానికి పదహారణాల సాక్షిగా ఈనాటికీ నూటపదవారేళ్ళు. తెలుగు నాటకరంగ చరి(త్రకారులు, క్రీ.శ. 1860లో కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రచించిన “మంజరీ మధుకరీయం' నాటకాన్ని ప్రప్రధమ తెలుగు నాటకంగా నిర్ధారించారు. అలాగే రాజమండ్రిలో 1880లో ప్రప్రధమంగా ప్రదర్శన భాగ్యం పొందిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి “వ్యవహార ధర్మబోధిని' రంగస్థలంపై ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు క రారనఒల త్తే
. నిబామాబాద్ బర్లాలో నొటకీరంగ్ం గీతం - నర్వమాసం నాటకంగా గుర్తించబడింది. అంటే 1996 సంవత్సరం నాటికి తెలుగు నాటక రంగం వయసు నూట పదహారు సంవత్సరాలు. కానీ నిజామాబాద్ జిల్లాలో నాటకరంగం వయసు మూడపదుల ముచ్చటే. ఆ మూడు పదుల ముచ్చటను రసజ్ఞుల మందుంచే అతిచిన్న ప్రయత్నమే ఈ “దుస్సాహసం” “నిజామాబాద్ జిల్లాలో నాటకరంగం - గతం, వర్తమానం”
“తారీఖులు దసావేజులు - ఇవీ కావోయ్ చరి[తకరం”
అలా అని మహాకవి కోప్పడ్డంలో అర్ధం వుంది. ఆయనన్నట్లు చరిత్రకు అర్ధం తారీఖులూ దస్తావేజులూ కాకపోవచ్చును గానీ చరిత్రకు ఆధారం మాత్రం నిస్సంకోచంగా అవే. అది దేశ చరిత్ర కావచ్చు, సాహిత్య చరిత్ర కావచ్చు, సాంఘిక చరిత్ర కావచ్చు, నాటకరంగ చరిత్ర కావచ్చు, చరిత్ర చరిత్రే. ధరిత్రిలో నిన్నటి గతానికి నేడు సాక్షీభూతంగా నిలిచేది చరిత్రే. నేటి వర్తమానం రేపటికి గతం. కనుకనే ఈ వ్యాసానికి నిజామాబాద్ జిల్లాలో నాటకరంగం - గతం
- వర్తమానం అని పేరుంచాను.
జిల్లాలో ఇతర కళారంగాల్లో జరిగిన కృషి నాటకరంగంలో జరగలేదనేది నా అభియోగం. విజ్ఞులందరూ నాతో ఏకీభవిస్తారని భావిస్తాను. జిల్లాలో నాటకరంగం వెనుక బడటానికి కారణాలు అనేకం. వాటిని వ్యాసం చివరలో ప్రస్తావిస్తాను.
నాటకరంగం అభివృద్ది చెందక పోవదానికి ఎన్ని అడ్డంకులున్నా, “నాటక హంసి కళారంగమనే నరస్సులోంచి పై పెక్కి నిక్కి నిక్కి చూస్తున్నది అవ్పుడప్పుడు. అందుకోసం, ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి; ఎందరో కళాకారులు జిల్లాలో నాటకరంగాన్ని (బ్రతికించటం కోసం, అహర్నిశం కృషిచేస్తున్నారు. వారినందర్నీ ముందు ముందు పలకరిద్దాం.
వరుల లాడ
“నిజామాబాద్ జిల్లాలో నాటకరంగం గతం- వర్తమానం అనే శీర్షిక నా మనసులో అనుకోకుండా మెదిలింది. కానీ కొంత ఆలోచించాక గానీ ఈ శీర్షికలో వున్న చిక్కుముడి గురించి తట్టలేదు. “నిజామాబాద్ జిల్లాలో నాటకరంగం - ఒక 'పరిశీలని అని గానీ “నిజామాబాద్ జిల్లా నాటకరంగ చరిత్ర అని గానీ శీర్షిక ఉంచితే అంతగా ఇబ్బంది అని పించేది గాదు. సేకరించిన సమాచారాన్ని కాలాను క్రమణిక (0౧/0౧౦100104| 066౧ లో వ్రాసుకుంటే సరిపోయేది. గతమంటే? ఏది గతం? ఏది వర్తమానం? గతాన్ని ఏ కాలనాళికతో కొలవాలి? వర్తమానాన్ని ఎక్కడినుంచి ప్రారంభించాలి అనే ప్రశ్నలు తలెత్తాయి. శీర్షికను మారుద్దామా అన్న ఆలోచన కలిగింది. కానీ, యాదృచ్చికంగా, మొదటిగా మనసులో మెదిలిన శీర్షికనే ఖాయం చేసుకొని, కాల నిర్ణయానికి సంబంధించిన వీతలాటకమేదో నేనే పడదామనుకున్నాను. ఎలా ఆలోచించినా దారి కనబళ్ళేదు, నాటకరంగం నాకు క్రొత్తగాదు, జిల్లాకు నాటకం కొత్తది గాదు. జిల్లాకు నేను కొత్త వాణ్ణి, ఉద్యోగరీత్యా మూడేళ్ళక్రితం అంటే జూలై 1998లో ఈ జిల్లాకి వచ్చాను. అప్పట్నించి నాకళ్ళముందు జరుగుతున్నది నడుస్తున్న చరిత్రే గదా! అదే వర్తమానం. నేను చూడనిది గతం. ఈ కాలనిర్ణయం సహేతుకంగా అనిపించకపోవచ్చు కానీ ఇంతకంటే మరో మంచి నిర్ణయం నాకు స్ఫురించలేదు. కనుక 1993 జూలైకు ముందు జరిగింది గత చరిత్ర ఆ తర్వాత నడుస్తున్నది వర్తమానం. పరిశోధనకు పరిమితులున్నాయి
విషయ సేకరణకు మినవోయింపులున్నాయి. పరిశోధనక్రు
పరిమితులున్నాయి. ఎంతచేసినా ఇంకా ఏదో మిగిలి పోయి నట్లు అనిపిస్తుంది. తరళ కా నన నా
న దరయాబాద్ దల్లాలో నాటకరంగం గక - నర్రమాసం ఎంతో సమర్ధవంతంగా నిర్వహించినట్లు కనిపించే కార్యక్రమంలో కూదా, ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, కొంతవెలితిగానే వున్నట్లు తోస్తుంది. నేను ఎంచుకున్న అంశం విస్తృతమైందే కాదు, క్షిష్టమైంది కూడా. అందుకనే కొన్ని పరిమితులు విధించుకోవలసి వచ్చింది. పాఠశాలల్లో, కళాశాలల్లో వార్షికోత్సవాల సందర్భంగా నాటకాలు, నాటికలు ప్రదర్శించడం, ఆనవాయితిగా వస్తున్నదే. అయితే నా పరిశోధన వృత్తి నాటక సంస్థలకూ, బెత్సాహిక (ఎమెచ్యూర్) నాటక సంస్థలకూ ఉద్దేశించినది కావడం వలన, పాఠశాల, కళాశాల న్థాయి ప్రదర్శనల వివరాలను ఈ వ్యాసంలో పొందు పర్చడం లేదు. కళాకారులతో, సాంకేతిక నిపుణులతో వ్యక్తిగత పరిచయాలు, గతంలో నాటకరంగంపై వచ్చిన రచనలు, వివిధ కళాసంస్థలు ప్రచురించిన సావనీర్లు, ప్రత్యక్షంగా నేను చూసిన ప్రదర్శనలు నా పరిశోధనకు ఆధారాలు. మొత్తానికి ఎలాగైతేనేం, నాటక సాగరంలో దిగాను. ఇక మంచి ముత్యాలేరుకొవడమే తరువాయి. తెరలేచింది:
“నూరు సంవత్సరాల క్రితం మన ప్రజల కున్న వినోద కార్య క్రమం ఏమిటని విశాల ధృక్చధంతో ఆలోచిస్తే, కోకొల్లలుగా కనిపించేవి ఆనాటి జానపద కళారూపాలు మాత్రమే. అవి మన ప్రజలకు అందుబాటులో వుండి వారి విజ్ఞాన వికాసాలకు తోడ్పడ్డాయి. నాటి కళారూపాలైన కురంజీ, యక్షగానము, వీధినాటకాలు, పగటి వేషాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, జముకుల కథలు, హరికథ మొదలైన చిత్ర విచిత్రమైన నూటయాఖై కళారూపాలు ఆం(ధ్ర ప్రజలను ఉ(రూత లూగించాయి.” అన్నారు. సుప్రసిద్ధ రంగస్థల, సినీనటులు, నాటక రంగ చరిత్రకారులు, కళా'వ్రషూర్న ఘికి్టినేసి రాధాకృష్ణమూర్తి గారు అలా ఉర్రూత లూగిన ఆంధ్ర ప్రజల్లో నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఉన్నారనేది చారిత్రక సత్యం. అయితే ఈ వ్యాసం
లా
క రాధని ళ్
నాటక రంగానికి ఉద్దేశించింది గనుక, నాటక ప్రక్రియ జిల్లా ప్రజల్ని ఏమేరకు సంతోష పెట్టిందో వివరించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా, ఈ నాటకరంగ చరిత్ర రచనా వ్యాసంగంలో గతంలో జరిగిన కృషిని మననం చేసుకోవడం నా కర్తవ్యంగా భావిస్తాను. “కోరిభజింతును భక్తితో మిమ్ముల” ఆంధ్ర దేశంలో నాటక రంగ చరిత్రను గూర్చి జరిగిన పరిశోధనలు చాలా తక్కువ. “నాటక సాహిత్యం, నాటకరంగం యొక్క పరిణామ దశలను గురించి విశ్లేషాత్మకమైన విమర్శనా (గ్రంధాన్ని ప్రపధమంగా వెలువరించిన వారు కీ.శే. పసుమర్తి యజ్ఞ నారాయణ శాస్త్రి గారు, ఆయన వ్రాసిన ఆంధ్ర నాటక ప్రకాశిక 1930 ప్రాంతంలో వెలువడింది” (గండవరపు సుబ్బరామిరెడ్డి
- “ఆధునిక తెలుగు నాటకం” నః మొదటి భాగం) ఆ తర్వాత తరంలో నాటకరంగరచన పై ఎక్కువగా కృషి చేసిన వారిలో డా॥ పి.యస్.ఆర్, అప్పారావు, నాట్యకళ సంపాదకులు శ్రీనివాస చక్రవర్తి, మిక్కలినేని రాధాకృష్ణమూర్తి ముఖ్యులు. డా॥ పి, యస్.ఆర్. అప్పారావు గారి 'తెలుగు నాటక వికాసము ఎంతో ఉపయోగకరమైన రచన శ్రీనివాస చక్రవర్తి గారి 'ఆంధ్రనాటక సమీక్ష, 'ఆంధ్రనాటక రంగ పరిణామం, “నాటక పోటీలు", “నాటక దర్శిని, “అభినయం, “యవనిక, 'నాట్యశాల' మొదలైన పుస్తకాలు ఆంధ్రనాటక రంగాన్ని గురించి ఎన్నో విశేషాలు తెలియ జేస్తాయి. మిక్కిలినేని గారి 'నటరత్నాలు” ఎందరోనటుల జీవిత విశేషాలను ఆంధ్రులకు పరిచయం చేస్తే వారి “ఆంధ్ర నాటకరంగ చరిత్ర నాటకరంగ పరిణామాన్ని మన కళ్ళముందుంచుతుంది. నాటకరంగంతో మమేకం చెంద్ది, జీవితాంతం నాటక రంగం కోసం తపించిన మరో ప్రముఖ వ్యక్తి కూర్మా వేణుగోప్రాా స్వామిగారు. నాటకరంగాన్ని గూర్చి వారెన్నో వ్యాసాలు ప్రచురించారు, ఆయన సంపాద చసత నన ని రి
లలనా ననన దామాదాద్ లాలో నాటకరంగం గతం - వర్తమానం. కత్వంలో ఎన్నో నాటిక, నాటక సంకలనాలు వెలువడ్డాయి. ఆధునికుల్లో నాటకరంగ రచన పట్ల కృషి చేస్తున్న వారిలో డా॥ పి.వి. రమణ, చాట్ల శ్రీరాములు, డా॥ అబ్బూరి గోపాలకృష్ణ, గండవరపు సుబ్బరామిరెడ్డి డా॥ మొదలి నాగ భూషణశర్మ, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, డి.యస్.ఎన్. మూర్తి, ఏ.ఆర్. కృష్ణ, కర్నాటి, ప్రభ్ళుతులు ముఖ్యులు. నిజామాబాద్ జిల్లాలో నాటక రంగ చరిత్ర పై రచనలు చేసిన వారు, ఆ దారిలో నడుస్తున్న వారు పెద్దగా లేరనే చెప్పుకొవాలి. నిజామాబాద్ వాస్తవ్యులు కీ.శే. కేశనకుర్తి వీరభద్రాచారి గారు నాటక రంగాన్ని గురించి కొన్ని వ్యాసాలు వ్రాసినట్లు, అవి స్థానిక పత్రికల్లో కళాసంస్థల సావనీర్లలో ప్రచురితమైనట్లు తెలుస్తున్నది. అలాగే ప్రముఖ చిత్రకారుడు, కవి, కళానిధి, సైబ పరంధాములు గారు కొన్ని పత్రికల్లో నాటకరంగాన్ని గూర్చి వ్యాసాలు వ్రాశారు. నాటక రచయిత, నటులు చావలి కృష్ణమూర్తి గారు నాటకరంగ చరిత్రపై కొంత పరిశోధన జరిపినట్లు తెలుస్తున్నది. ఏమైనప్పటికీ నాటకరంగ చరిత్ర రచనలో, జిల్లాలో జరిగిన కృషి అత్యల్పమనే చేప్పుకోవాలి. ముందే వివరించనట్లు నాటకరంగం జిల్లాలో వేళ్ళూనలేదనేది నిర్వివాదాంశం. అయితే ఆదినుంచి పరిస్థితి ఇలానే వున్నదా, లేక ఈ మసక మధ్యలో వచ్చిందా? అనేది చర్చించ వలసిన విషయం. జిల్లాలో నాటకాలు చూసే కళాహృదయాలే కరువయ్యాయా? నాటకరంగంలో ఆవగింజంతయినా కృషి జరగలేదా అని అనుమానం రావడం సహజం. స్వదేశీ నాటకాల జోరు ఆం(ధ్రలో నాటకరంగం ఎలా వరిణామంచెందిందో ముందు తెలుసుకొవాలి. అప్పుడే మనం నాటకరంగ చరిత్రను గూర్చి సహేతుకమైన అధ్యయనం చేయగలం. ఇప్పుడు మనం చూస్తున్న నాటకానికి మాతృక ఒకప్పటి వీధినాటకం - యక్షగానం. ఈ వీధి నాటకం, యక్షగొ నాలే వాడా శద లా
తెలంగాణా ప్రాంతంలో స్వదేశీ నాటకాలుగా ప్రసిద్ధి చెందాయి. పల్లె పట్టుల్లో ప్రజానీకానికి వినోదం విజ్ఞానం అందజేసిన ఘనత ఈ స్వదేశీ నాటకాలకే దక్కుతుంది. జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో యాచక కులాలున్నాయి. వారంతా అనువంశికంగా స్వదేశీ నాటకాలు అడుతూ ఊరూరా తిరుగుతూ, పొట్టపోసుకుంటూ జీవించే వాళ్ళు. ఈ కులాల్లో దాసర్లు జంగాలు, బుడిగ జంగాలు, గోసంగులు ప్రసిద్ధులు. వీరంతా ఒకప్పుడు సంచార జాతులకు చెందినా, ఇప్పుడు స్థిర నివాసాలకు అలవాటు పడ్డారు. వీధి నాటకాలు, యక్షగానాలు ఆడటమే వీరి వృత్తి, సంవత్సరం పొడుగునా ఊరూరా తిరుగుతూ నాటకాలు వేస్తుంటారు. పురుషులే స్తీ పాత్రలు ధరిస్తారు. వీళ్ళకు ప్రత్యేకమైన మేకప్‌మెన్ ఉండరు. ఎవరివేషం వాళ్ళే వేసుకుంటారు. వీరిలో విద్యా గంధం తక్కువ. కానీ అనువంశికంగా వచ్చే విద్యగాబట్టి ధారణ శక్తి అపారం. ఈ కళాకారుల్లో సమయస్పూర్తి కూడా ఎక్కువనే. లౌక్యాన్ని ఉపయోగించి ఎలాంటి ప్రదేశంలోనైనా ప్రదర్శన రక్తిగట్టించగల నేర్చు వీరికి కరతలామకం. ఆ రోజుల్లో వీళ్ళకు (ప్రత్యేకమైన స్టేజీక్ట్టి ప్రదర్శనలిచ్చే అవసరం ఉండేది కాదు. ఇప్పుడిప్పుడే వీరు స్టేజీలకు, మైకులకు ఇతరడ్రా సాంకేతిక పరికరాలకు అలవాటు పడుతున్నారు.
తాద్వాయి మండలం సంతాయిపేట దాసరులకు శతాబాల స్వదేశీ నాటక రంగ చరిత్ర వుంది. వీరు నిజాంపాలనలో నందలాది మైళ్ళు కాలినదకన వెళ్ళి ఊరూరా నాటకాలు ప్రదర్శించేవారు. స్వాతంత్ర్యానంతరం 'స్వదేశి నాటకమండలీ పేరున ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తుకాన్సి ఉత్సవాల సమయాల్లో ఊరూరా నాటకాలు 'ప్రదిర్శించేవారు. ముప్పయి మూడు కుటుంబాలకు చెందిన దాదాపు 250 మంది ఒకే సమాజంగా వుండి, వేర్వేరు చోట్ల నాటకాలు ప్రదర్శించేవారు. కానీ జీవనం కష్టం కావడంతో కొందరు భీంగల్ మండలంలోని పెద్దవాల్లోట్కు వలస వెళ్ళి అక్కదే జీవిస్తున్నారు.
వనన ననన
లా
టం దదూబాద్ ఉ్తారో నాటకరంగం గరం వరమానం సంతాయిపేటలో వున్న సమాజం దాసరి నడిపి సాయిలు ఆధ్వర్యంలో నడుస్తున్నది తెలంగాణా జిల్లాల్లో, పండుగలు, జాతరల సందర్భంగా వీరు వివిధ (గ్రామాల్లో ప్రదర్శన లిస్తున్నారు. బాల నాగమ్మ, భక్తప్రహ్లాద, లవకుశ, మాయాబజార్, నర్తనశాల, సతీసావిత్రి, సతీఅనసూయ, భక్తరామదాసు, కచదేవయాని, అల్లీరాణి, నలదమయంతి, పాండవ వనవాసం, భక్తమార్మండేయ, సత్యహరిశ్చంద్ర ఇత్యాది స్వదేశీ నాటకాలు వీరు ప్రదర్శిస్తున్నారు. భీంగల్ మండలంలోని పెద్దవాల్సోట్ లోని దాసరులు కూడా విరివిగా స్వదేశీనాటకాలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. వీరిలో దాసరి లక్ష్మన్, దాసరి రాములు, శేషాద్రీ మొదలైన వారు ఎంతో పేరున్ననటులు సంవత్సరంలో తొమ్మిది నెలల పాటు వీరు నిజామాబాద్ జిల్లా లోనే గాక, అదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా సంచరిస్తూ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. వీరి పూర్వీకులు జంట నగరాల్లో కూడా ప్రదర్శనలిచ్చి మెప్పు పొందినట్లు ఇప్పటి తరం నటులు సగర్వంగా చెప్పకున్నారు.
ఆర్మూర్ మండలంలో స్వదేశీ నాటకాలు అడిన వారిలో 'బుడగజంగాలు
ప్రసిద్ధులు. వీరిలో కొన్ని కుటుంబాలు వారు ఆర్మూరు రాజారాం నగర్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలోనే కాకుండా ఇతర చోట్ల కూడా జయకేతనం ఎగరవేసి, కళాసేవచేసిన వృద్ధ కళాకారులు ఈనాడు దయనీయమైన స్థితిలో వున్నారు. ఇటివలే మరణించిన వానరాసి ఎల్లయ్య తన జీవితాంతం నాటక సమాజం నడిపి, పెక్కుస్వదేశీ నాటకాలు ప్రదర్శించాడని ఆయన అనుచరులు చెప్పారు. ఆయన అనుచరుల్లోని ముఖ్యుల్లో సదుల అడివయ్య డెబ్బయి సంవత్సరాల వయసులో కూడా ౌవ్యంగా పొడుతూ, అభినయం చేస్తో ఎన్నో పద్యాల్ని పాటల్ని వినిపించాడు. ఆయన శ్రీరాముడు, త్రీ కృష్ణుడు; రావణుడు, అర్జునుడు, యమధర్మరాజు, రాజరాజనరేంద్రుడు, నరసింహస్వామి
తా లాడ
నిజానూబాద్ శిల్లారో నాటకరంగీం నీతీం - నర్రమానం ఎల్లయ్య కుమారులందరూ తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నరు. వీళ్ళలో వానరాసి లక్ష్మణ్ మృదంగం, తబలా వాయించడంలో దిట్ట, హాస్య పాత్రలు పోషించడంలో అందెవేసిన చెయ్యి, వంశపారంపర్యంగా వస్తున్న కళను విడిచి పెట్టకుండా మానిక్ భండార్‌లో వున్న మిత్రులతో కలిసి జిల్లాలో తిరుగుతూ అవిశ్రాంతంగా ప్రదర్శనలిస్తున్నాడు లక్ష్మణ్. ఆర్మూర్ మండలంలోని అంక్సాపూర్ వాస్తవ్యులు అవధాని రాజన్న పంతులు స్వదేశి నాటకాలు ప్రదర్శించిన వారిలో లబ్ద ్రతిష్టులు. ఈయన గురువు వెంకటాచారి ఆ రోజుల్లో మంచి పేరున్న నటులు. రాజన్న పంళులు తమ్ముడు అవదాని శివరాం పంతులు అన్నగారితో పాటు స్వదేశీ నాటక (ప్రదర్శన లిచ్చేవాడు. అంక్సాపూర్ లో వీరికొక నాటక సమాజం పుండేది. ఈ అన్నదమ్ములు ప్రధాన పాత్రలు పోషిస్తూ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో హరిశ్చంద్ర, కృష్ణలీలలు, భక్తప్రహ్లాద, సభాపర్వం, సీతాస్వయంవరం, శశిరేఖా పరిణయం, సుగుణవతి, సుందర కాండ మొదలైన నాటకాలు ప్రదర్శించే వారు. అగ్గు లింబన్న అగ్గు గంగమల్లు, అవుసుల లింబన్న గాండ్ల మల్లయ్య, మేర గంగారాం తదితరులు వీళ్ళట్రూపులో సభ్యులు. పైన పేర్కొన్న నటుల్లో చాలా మంది కీర్తిశేషులే. బ్రతికున్నవాళ్ళు గతస్మృతుల్ని నెమరువేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఆరోజుల్లో బ్రాహ్మణుల్లో నాటకాలు ఆడేవారు తక్కువ. అంక్సాపూర్ అవధాని సోదరులతో పాటు కుస్తాపురం (బ్రాహ్మలు కూడా స్వదేశీ నాటకాలు ఆడేవారు. ఈ రెండు సమాజాల వారు కలిసి జిల్లాలో చాలా చోట్ల నాటకాలు ప్రదర్శించారు. (శ్రుతిపెట్టె మృదంగం, తబలా వీరి ప్రధాన వాయిద్యాలు, వురుషులే స్త్రీ పాత్రలు ధరించే వారు. ఆధునికుల్లో శివరాం పంతులు కుమారుడు నరసింహ శాస్తి ఆయన బంధువు ప్రకాష్ వృత్తి కళాకారులు కాకపోయినా, నాటకరంగానికి ఇతోధికంగా ౩ రాఘరిలథ - 12
వభమాబాద్ బల్లాలో నాటకరంగం గీతం - సర్రమాసం
సేవచేస్తున్నారు.. వీళ్ళు అనువంశికంగా వస్తున్న స్వదేశీ నాటకాలతో పాటు సాంఘిక నాటకాలు కూడా ప్రదర్శిస్తున్నారు. వీరి పూర్వీకులు అసలుసిసలైన స్వదేశి నాటకాలు ప్రదర్శిస్తే ఈ తరం వాళ్ళు స్టేజీ నాటకాల్లోని మెళుకువలు (గ్రహించి, స్వదేశీ నాటకాల్ని ఆధునీకరణచేసి ప్రదర్శిస్తుంటారు. జిల్లాలో మంచి మేకప్మాన్గా పేరున్న బ్రహ్మయ్యగారు వీళ్ళ నాటకాలకు ఆహార్యం సమకూరుస్తున్నారు. పైన చెప్పకున్నట్లు ఆ కళాకారులెవరూ వృత్రికళాకారులు కారు. ఉద్యోగస్థులు కావడంతో పుర్తి కాలం నాటకరంగానికి కేటాయించలేక పోతున్నామని నరసింహశాస్త్రి చెప్పారు. అయినా వీరు వంశపారంపర్యంగా వస్తున్న స్వదేశీ నాటక కళను బతికించడానికి పడ్తున్న తపన అభినందనీయం. మంధినిలోని జంగం సంగయ్య గారి నేతృత్వంలో ఒక సమాజం ఊరూరా తిరుగుతూ నాటకాలు ప్రదర్శించేది.
లింగంపేట మండలంలోని కంచిమల్ కొండాపూర్ నివాసి రామక్రిష్టియ్య వీధి నాటకాల్లో ఆరితేరిన వాడే. ఈయన ప్రస్తుతం ఆర్టీసి బోధన్ డిపోలో పని చేస్తున్నాడు. తనకున్న అనుభవంతో ఆర్.టి.సి కళాబ్బందం ద్వారా గొల్ల సుద్దులు, వివిధ ప్రచార నాటకాలు ప్రదర్శిస్తున్నాడు. వర్ని మండలంలో కూడా కొన్ని బృందాలవారు స్వదేశి నాటకాలు ప్రదర్శిస్తున్నారు. కామా రెడ్డి మండలం రామారెడ్డిలో ఒక సమాజం గతంలో విస్తృతంగా విదేశీ నాటకాలు (ప్రదర్శించేది. రాష్ట్ర సరిహద్దులు దాటిన చిందు భాగవతం
జిల్లా నాటకరంగ చరిత్రను వివరించేటప్పుడు, విధిగా ఒక అసాధారణ జానపద (ప్రక్రియను ప్రస్తావించక తప్పదు. అదే చిందు భాగవతం. అసలు చిందు భాగవతాన్ని నాటకం క్రింద వర్గీకరించవచ్చునా అన్నది నాకు ఉత్పన్నమైన మొదటి ప్రశ్న ఎందుకంటే తోలుబొమ్మలాట, యక్షగానం, వీధి
నమాాానననననననననననననననననననననననన
బిబామాదాన్ ఉల్లాలో నౌటకతంగ్ం గతల వత్రమానేల భాగవతం చిందుభాగవతం ఇత్యాది కళారూపాలన్నింటినీ జానపద కళారూపాలుగానే మన నాటకరంగ చరిత్రకారులు, విమర్శకులు పేర్కొన్నారు. కనుక చిందు భాగవతం ప్రక్రియను నాటకరంగ చరిత్రలో చేర్చవచ్చునో లేదో నన్న సంశయం నాకు కలిగింది. ఈ ప్రక్రియను గురించి చర్చిస్తే, మిగిలిన జానపద కళారూపాల్ని గురించి కూడా చర్చించాలి. ఎంచుకున్న అంశాన్ని పక్కదారి పట్టించినట్టవు తుందేమోనన్న భయం కలిగింది. అయితే నాటకాన్ని గురించి శ్రీ ఆకెళ్ళ అచ్యుత రామమ్ గారిచ్చిన నిర్వచనాన్ని బట్టి చిందు భాగవతాన్ని నాటక విభాగంలో చేర్చవచ్చునన్న ధైర్యం కలిగింది. * తెలుగు నాట నాటకం” అనే పదాన్ని దృశ్యకావ్యం అనే అర్థంలోనే సామాన్యంగా వాడుకుంటాం. తెలుగు నాటకం అంటే రంగస్థలం మీద ప్రదర్శించగా చూసే (పేక్షకులకు రసానందం కలిగించేది అని మనసుకు తట్టుతుంది ” (తెలుగు నాటకంలో పద్యం పోయిన పోకడలు - ఆకెళ్ళ అచ్యుతరామమ్) చిందు భాగవతులు షెడ్యూలు కులానికి చెందిన వారు. కొన్ని వందల సంవత్సరాల నుండి తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో ఈ కుటుంబాలవారు, రామాయణ, మహాభారతాల్లోని ముఖ్య ఘట్టాలు, ప్రాంతీయ జానపదగాధల్ని (ప్రదర్శిస్తున్నారు, స్వదేశి నాటకాలు ప్రదర్శించే సమాజాల వారు స్త్రీ పాత్రలు పురుషులే ధరిస్తే ఈ చిందు భాగవతులు స్త్రీ పాత్రల్ని పురుషులే కాకుండా స్త్రీలు కూడా ధరిస్తారు. ప్రతి ఏటా మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలలు కాలం తప్పించి, మిగతా నెలల్లో నియమం తప్పకుండా ఈ చిందుభాగవతులు (గ్రామాల్లో ప్రదర్శన లిస్తుంటారు. వీరి మేకప్ సామాగ్రి ప్రత్యేకంగా వుంటుంది. మేకప్ లో వాడే రంగులు చెట్టు బెరడుల నుంచి వీరే ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు, దుస్తులు, కిరీటాలు, భుజకీర్తులు, ఆయుధాలు వీరు ప్రత్యేక శ్రద్ధతో, అత్యంత నైపుణ్యంగా తయారు చేస్తారు. వీరి ఆహార్యం కూచిపూడి, కధాకేళి సాంప్రదాయాలకు దగ్గరగా వుంటుంది. వల నేడే.
వీరు తమ ప్రదర్శనల్లో హార్మోనియం, మృదంగం, తప్పెట్లు మొదలైన వాయిద్యాలు ఉపయోగిస్తారు. వీళ్ళ ప్రదర్శనలు గతంలో పగటిపూటనే జరిగేవి. కానీ మారుతున్న కాలంతో పాటు వీరి ప్రదర్శనల్లోనూ మార్పు వచ్చింది. ఎక్కువ మంది చిందు భాగవతులు బోధన్, వర్ని ఆర్మూర్ మండలాల్లో నివసిస్తున్నారు. వీళ్ళందరూ (గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. చిందు భాగవతం కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా మాడవేది నారాయణ గారిని పేర్కొనాలి. వీరు ఆర్మూరులోని బాలుర సెకండరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తన చిన్న తనంలో చిందు భాగవత (ప్రదర్శన చూసిన ఈయన ఆ కళ పట్ల" ఎంతగానో ఆకర్షితులయ్యారు. ఆ కళకోసం ఏదో చెయ్యాలనుకున్నారు. గత నలభై సంవత్సరాలుగా ఆ కళను బ్రతికించడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఎక్కడెక్కడో వున్న చిందుకళాకారుల్ని ఒక వేదికపైకి తెచ్చి, వారి చేత ప్రముఖుల సమక్షంలో ప్రదర్శనలిప్పించి, ఆ కళకు ఎంతో గుర్తింపు కలిగించారు. 1979లో నిజామాబాద్ పట్టణంలో చిందు భాగవత ప్రదర్శనను తిలకించిన సుప్రసిద్ద నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ గారు ఆ కళ పట్ల ఎంతగానో ప్రభావితులయ్యారు. నారాయణ మాష్టారి కృషిని ఎంతో మెచ్చుకున్నారు శ్రీ నటరాజు రామకృష్ణ “తెలుగు ప్రజల ప్రాచీన నృత్య, సంగీత కళారూపమని చెప్పుకోదగ్గది చిందు భాగవతం మినహా వేరొకటి కన్పించదు. దాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి నారాయణ. ఆయన కృషి ఆభినందించతగ్గది అని అన్నారు.” నారాయణ గారి కృషి వల్ల, చిందు భాగవత ప్రదర్శన న్యూఢిల్లీలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రొజీవ్ గాంధీ సమక్షంలో జరిగింది. (ప్రదర్శనలు వారినెంతగానో ఆకట్టుకున్నాయి. చిందు భాగవతం అనగానే మొదటగా గుర్తొచ్చేది చిందు ఎల్లమ్మ ఈమె దేశ వ్యాప్తంగా కీర్తి గడించిన కళాకారిణి. మోస్రా దగ్గర్లోని అమ్హాపూర్ గ్రామానికి కె రాఘవం 15
నిజామాబాద్ ఉల్లాలో నాటకీరంగ్ం గీతం -నర్రమానీల చెందిన ఎల్లమ్మ తన బృందంతో వేలాది ప్రదర్శనలిచ్చారు. ఆవిద కళాసేవను గుర్తించి రాష్ట్రంలోని ఎన్నో సంస్థలు ఘనంగా సన్మానించాయి. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. పౌరాణిక నాటకాలు ఆంధ్ర నాటకరంగ చరిత్రలో పౌరాణిక నాటకానిదో ప్రత్యేక స్థానం. పౌరాణిక నాటకానికి పంచ ప్రాణాలు పద్యమేనంటే అతిశయోక్తి కాదేమో. అసలా మాటకొస్తే తెలుగు పద్యానికి ప్రపంచ భాషల్లోనే ఒక ప్రత్యేక స్థానముంది. మహాకవి శ్రీశ్రీ తెలుగు పద్యాన్ని ఫ్రెంచి పద్యంతో పోల్చాడు. ఆ రెండింటి రుచి తెలిసిన వాడు మరి. “ప్రపంచంలో ఏదేశంలో నైనా సరే ఇతర నాటకాల కన్నా సంగీత నాటకాలకి ప్రచారం ప్రభావం జాస్తి. అలాగే పద్యప్రధాన నాటకాలు ప్రజలను అవ్లాద పరిచాయి". (పాతూరి శ్రీరామ శాస్త్రి - పద్య ప్రధాన నాటకాలు) అలా పద్యనాటకాలతో నిజామాబాద్ జిల్లా ప్రజలను ఆహ్లాద పరచిన వారిలో సురభి సమాజాల వారు, వెంకటేశ్వర నాట్యమండలి వారు ముఖ్యులు. సురభి కంపెనీ వారు జిల్లాకు రాక పూర్యమే స్వదేశి నాటకాలు గ్రామాల్లో ప్రదర్శింపబడేవి. అవీ పౌరాణిక ఇతివృత్తాలే. వాటిల్లోనూ పాటలూ, పద్యాలు ఉన్నాయి. కానీ వాటిపైన ప్రాచీన జానపద కళారూపాలైన కురంజీ, యక్షగానం, వీధి భాగవతం, తోలుబొమ్మలాటల ప్రభావం ఎక్కువ, వేషభాషల్లో ఆధునికత తక్కువ. కానీ సురభి నాటకాలు ఐలాకాదు. వారివేషం, భాష సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల్ని మంత్రముగ్గుల్ని చేసింది. సుశిక్షితులైన సురభి కళాకారులు తమకున్న సాంకేతిక వనరుల్లో నాటకాల్ని రక్తి కట్టించి (ప్రేక్షకుల్ని దిగ్ర్భాంతికి గురిచేశారు. మిగిలిన తెలంగాణా జిల్లాల్లో లాగానే సురభి కంపెనీ వారు నిజామాబాద్ జిల్లాలోని దాదాపు అన్ని (గ్రామాల్లోనూ నాటకాల్ని ప్రదర్శించి ప్రజల్ని ఆనంద పరిచారు. వారి జీవిక నాటకరంగం కావడం చేత, తమ జీవనాధారమైన నాటకం కోసం నిరంతరం వలల కేక్
నిజాసూటబాద్ జిల్లాలో నాటకరంగం గీతం - వర్రమానం
(మించే వారు. ఒక సమాజంలో రమారమి ఏడెనిమిది కుటుంబాలుందేవి. ఈ కుటుంబాలు రంగస్థలం వెనుకనే వేర్వేరు గదులు ఏర్పాటు చేసుకొనే వారు. ఆ గదిలోనే ఆ కుటుంబం వంట చేసుకునేది. తీరిక సమయాల్లో దుస్తులు, తెరలు వాటికి కావలసిన పరికరాలను సరి చూసుకొనే వారు. చెడిపోయిన వాటిని బాగుచేసుకునే వారు. ఎవరి మేకప్ వారే చేసుకునే వారు. వీరిది కుటుంబ నాటక రంగం కావడం వల్ల స్త్రీ, బాల పాత్రలకు వెతుక్కోనవసరంలేదు. ఆ రోజుల్లో సురభి సమాజాల్లో నటించిన, పనిచేసిన వారిలో కొందరు జిల్లాలో వేర్వేరు చోట్ల, వివిధరంగాల్లో స్థిరపడిపోయారు. ఇంకొందరు అదే రంగాన్ని నమ్ముకొని వృద్దాప్యంలో ఆదుకునే దిక్కులేక పలు అగచాట్లు పడ్తున్నారు. నాటక సమాజం నడిపి ఆర్థికంగా నిలదొక్కుకున్న సురఖి వారిలో చేగుంటలోని వెంకొజీ రావు సోదరులు ముఖ్యులు. ప్రజలకు సినిమాల పట్ల మోజు పెరగడంతో, సురభి నాటకాలకు ఆదరణ తగ్గింది. ఆ కారణంగా కొన్ని సురభి సమాజాలు మూత పద్దాయి. కళాకారులు మరోదారిలేక జంటనగరాలకు ఇతర ప్రధాన పట్టణాలకు వలస పోయారు. పాతిక, ముప్పై సంవత్సరాల క్రితం జిల్లానుండి వలసవెళ్ళిన ఎందరో సురఖి కళాకారులు హైదరాబాద్‌లోని బాలానగర్, కూకట్పల్లి, పటాన్చెరు, మౌలాలి తదితర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలలో పనిచేసుకుంటున్నారని ఒక వృద్ధ కళాకారుడు చెప్పాడు.
(ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో నివసిస్తున్న సురభి కళాకారుల్లో రవిరాజ్, ఎస్. రామారావు, ప్రకాశ రావు, వసంతరావు, హనుమంతరావు తదితరులు ముఖ్యులు. వీరందరూ నిజంగా సురభి కుటుంబానికి చెందిన వారు కారు. జిల్లాలో ప్రదర్శనలిస్తున్న సురభి నాటక (ప్రదర్శనలు చూసి, ఉత్సాహం కొద్దీ వారి వెంట తిరిగి, ఆ తర్వాత సమాజంలో సభ్యులై ప్రదర్శన లిచ్చిన వాళ్ళు, వివిధ కారణాలరీత్యా సమాజాలు చిన్నా భిన్నం కావడంతో, వీరంతా మరలా యధాస్థితికి చేరుకొని తమ పూర్వ వ్యాసంగాలలో కుదురుకున్నారు. వీరిలో
క రాఘవులు క్షే
లాసూబాద్ ఉల్సాలో నాటకరంగం గతం నర్తనం
రవిరాజ్ మంచి అనుభవమున్న నటుడు. ఈయన ప్రస్తుతం ఎల్లారెడ్డిలో ఆర్.ఎమ్.పి. డాక్టరుగా ప్రాక్టీసు చేస్తున్నారు. అప్పుడప్పుడూ నాటకాలు వేస్తున్నారు. వీరు సత్యహరిశ్చంద్రలో హరిశ్చంద్రునిగా, శ్రీరామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడిగా, చింతామణిలో బిల్వమంగళుడిగా, ఇలా ఎన్నోప్రొరాణిక పాత్రల్ని పోషిస్తున్నారు. ఆకాశవాణిలో పలుసార్లు రంగస్థలి కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఎన్.రామారావు గత ముప్పయి సంవత్సరాలుగా జిల్లాలో వుంటూ ఎన్నో సురభి నాటకాల్లో నటించారు. వీరు పలు నాటకాల్లోని ప్రధాన పాత్రల్ని నిర్వహించడమే గాకుండా, హాస్య పాత్రల్ని కూడా సమర్ధవంతంగా నిర్వహించగలడు. ఈయన దావీదు విజయం, రక్తబలి, శిలువధారి మొదలైన క్రైస్తవ నాటకాలలో కూడా పా(త్రధారణ చేశారు. నగరంలో నివసిస్తున్న వసంతరావుకు సురభితో ఎన్నోవసంతాల గాధానుబంధం వుంది. ఆయన నటుడే గాక మంచి తబలిస్టు కూడా. వీరి తల్లి కూర్మాబాయి ఆ రోజుల్లో సురభి కంపెనీలో పేరెన్నిక గన్న హార్మోనిస్టు. ఎనఖై ఏళ్ళపైబడ్డ ఈ వృద్ధ కళాకారిణికి ఈ నాటికీ నాటకరంగం పట్ల వల్లమాలిన ఆపేక్ష. ఆకాశవాణి వారు నిర్వహిస్తున్నరంగస్థలి కార్యక్రమానికి ఎందరో కళాకారులకు ఆమె వాద్య సహకారం అందిస్తున్నారు.
బాల్కొండ మండలం, నల్లూరులో నివసిస్తున్న ప్రసాదరావు చాలా సంవత్సరాల పాటు సురభి సమాజంలో హార్మోనిస్టుగా పనిచేశారు. జిల్లాలో (ప్రదర్శిస్తున్న కొన్ని పౌరాణిక నాటకాలకు ఇప్పటికీ వాద్యసహకారం అందిస్తున్నారు. వీరితల్లి శ్రీమతి మనోహరమ్మ సురభి కళాకారుల్లో పేరెన్నికగన్న నటీమణి. ప్రస్తుతం మామిడి పల్లిలో ఉంటున్నారు. ప్రసాదరావు, భార్య కూడా సురభి నాటకాల్లో వేషాలు వేసింది. ప్రస్తుతం ఆవిడ రంగసలానికి దూరంగా వుంటుంది. పాతతరం సురభి నటీమణుల్లో కృష్ణవేణి, జిజియాబాయి,
₹ రారట లలా 18
నర్సమ్మ ఆరోజుల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఈ తరానికి చెందిన చంద్ర కళ సురభి సమాజాల్లో బాలనటిగా నటించింది. కోస్తా జిల్లాల నుండి పద్యాల వలస
'పొరాణిక నాటకాలను జన జీవనంలోకి శృతి చేసిన కొన్ని అద్భుత సంఘటనలు అరవయ్యవదశకంలో జరిగాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి రైతులు నిజామాబాద్ జిల్లాకు వలస రావడంతో, వారితో పాటు కోస్తా జిల్లాల్ని రాగరంజితం చేస్నున్న “రంగస్థలి? జిల్లాకు కదిలివచ్చింది. పౌరాణిక నాటకం వృత్తి సమాజాల విచ్చిత్తితో జారిపడి, కాంట్రాక్టర్ల అండదందడలలో పూనకం వచ్చిన దానిలా ఊరేగుతున్న దశ అది. తెలుగునాట పౌరాణిక నాటకాల్లో మహామహులని పించుకున్న ఈలపాట రఘురామయ్య, అబ్బూరి వర ప్రసాదరావు, షణ్ముఖి, ఎ.వి.సుబ్బారావు, బండారు రామారావు, పీసపాటి, ధూళిపాళ తదితరులు మంచి బెన్నత్యంలోవున్న దశ అది. నిజామాబాద్ జిల్లాలో గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్ళు 'సెటిలయిన బోధన్, వర్ని ఆంధ్రనగర్, నందిపేట్, నవీపేట్, ధర్మారం(బి), మొదలైన (ప్రాంతాల్లో బెత్సాహిక నాటక సంస్థలేర్చడటంతో పౌరాణిక నాటకాల సందడి మొదలైంది. ధర్మారం (బి) లో ఆలపాటి పిచ్చయ్య చౌదరి, శ్రీ రాములు తదితరులు గుంటూరు నుండి, హార్నోనిస్టును రప్పించి, నాటకాలు ప్రాక్టీసు చేసి ప్రదర్శించడం ప్రారంభించారు. 1968లో పౌరాణిక నాటకం పట్ల అభిరుచి, అనుభవం కలిగిన కె. నూకారావుగారు హైదరాబాద్ నుండి బదిలీపై నిజామాబాద్ వచ్చారు. ఆయనకు ఈలపాటి రఘురామయ్య, శ్రీమతి కనకం మొదలైన వారితో వున్న పరిచయాన్ని పురస్కరించుకొని, వాళ్ళట్రూపును టిక్కెట్టు నాటకాలు ఆడటానికి జిల్లాకు 1970లో ఆహ్వానించారు. రఘురామయ్య బృందం ఆ పర్యటనలో బోధన్, సిరాప్రల్లి, నిర్మల్‌లో 'శ్రీ కృష్ణ రాయభారం నాటాన్నిష్ట్య్య న్న
నిజాసూటాద్ ఉల్లాలో నాటకరంగం గీతం - వర్రమానం రఘురామయ్యగారు, కనకం గారు కృష్ణులుగా నటిస్తే, నూకారావు అర్జునుడిగా, మైనేపల్లి రామారావు దుర్యోధనుడిగా, సురభి రామారావు నకులుడిగా నటించారు. శాశ్వతమైన సమాజమంటు ఒకటి లేకపోయినా నూకారావుగారు జిల్లాలో తనకందుబాటులో వున్న కళాకారుల్ని కలుపుకుంటూ 1970 నుండి, అప్పుడప్పుడు పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూనే వున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఆలపాటి పిచ్చయ్య చౌదరి, రేటూరి సుబ్బారావు, ఎమ్.వి. సుబ్బారావు, బొమ్మల (మోల్డింగ్) సుబ్బారావు, ఎల్లారెడ్డికి చెందిన డా॥ ప్రకాశరావు, రవిరాజ్స్ సురభి రామారావు, సురభి కృష్ణవేణి, సురఖి జిజియాబాయి ఇత్యాదులు జిల్లాలో పౌరాణిక నాటకాన్ని బ్రతికించడానికి తమ వంతు కృషిచేశారు. ఇక్కడ ప్రసిద్ధ క్లారినెట్ విద్వాంసులు షేక్ నాగూరు గారిని గురించి కొంత చెప్పుకోవాలి. వీరిది కళాకారుల కుటుంబం. వీరి సోదరులు గుంటూరు జిల్లాలో ప్రసిద్ధులైన నాదస్వర విద్వాంసులు. బుర్రకధ పితామహ, పద్మత్రీ, షేక్ నాజర్ ఈయనకు మేనమామ, వేదాంత కవి గారి 'తెలుగు తల్లి నాటకంలో కోస్తా ఆంధ్ర ప్రజల్ని ఉర్రూత లూగించిన సి.ఆర్. దాసు నాగూర్‌కు రంగస్థల గురువు. ఈయన జిల్లాలో జరిగిన జరుగుతున్న పౌరాణిక నాటక ప్రదర్శనలకు క్లారినెట్తో వాద్య సహకారం అందిస్తున్నారు. జిల్లాలో అడపాదడపా పౌరాణిక నాటకాలు వేస్తున్న బౌత్సాహిక కళాకారుల్ని అలావుంచికే: ప్రసిద్ధులైన ఎందరో ఆతరం కళాకారులు జిల్లాలోని పలుప్రాంతాల్లో నొటకొలు ప్రదర్శించారు. 1975లో బోధన్‌లో షణ్ముఖి, పీసపాటి నరసింహమూర్తి ఎ.వి.సూబ్బారావు, ధూలిపాళ, మాధవపెద్ది సత్యం, పిఠాపురం బి.వి. రంగౌొను తదితరుల లో 'కురుక్షేతం' నాటకం ప్రదర్శించారు- వాహ ( స ఆచంట వెంకటరత్నం నాయుడు తదితరుల కౌం కురుక్షేత్రం ప్రదర్శించారు. బుర్రా సుబ్రమణ్య శాస్తి బృందం నిజామాబాద్
ననా దామాబాద్ ఉల్లారో నాటకరంగం గతం - వర్రమాగం లో వరసగా రెండు రోజులు “చింతామణి నాటకం ప్రదర్శించింది. లతాలక్ష్మి చీరాల సుబ్బయ్య, వి.వి. స్వామి బృందం “చింతామణి” నాటకాన్ని 1980లో నిజామాబాద్‌లో కడురసవత్తరంగా ప్రదర్శించి నట్లు చూసిన (ప్రేక్షకులు చెప్పారు. నిజామాబాద్‌లోని మురళీ కృష్ణ కళానిలయం వారు పౌరాణిక నాటకాలు ప్రదర్శించకపోయినా పౌరాణిక నాటకాన్ని జిల్లా ప్రజలకు పరిచయం చేయడానికి ఎంతో ప్రయాస పడ్డారు. 1985 లో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ వారి సౌజన్యంతో, 1986లో తెలుగు విశ్వవిద్యాలయం, సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో, మురళీ కృష్ణ కళానిలయం వారు, ప్రాంతీయ పౌరాణిక నాటక పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ పట్టణంలో చక్కని పౌరాణిక నాటక ప్రదర్శనలిప్పించిన (ప్రముఖుల్లో ఎమ్.వి. సుబ్బారావు గారిని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈయన నేతృత్వంలో నిజామాబాద్ లో చాలాసార్లు పౌరాణిక నాటక ప్రదర్శనలు జరిగాయి. ఎల్లారెడ్డిలో శారద లలిత కళామండలి ఆధ్వర్యంలో 1979లో రాష్ట్రస్థాయి ఏక పాత్రాఖినయ పోటీలు జరిగాయి. సంస్థ అద్యక్షులు డా॥ రామచంద్రరావు, కార్యదర్శి టి. శ్రీరాములు, పౌరాణిక నాటకాల పట్ల ఆసక్తిగల వారు కావడంతో, తమ సంస్థ ద్వారా కొన్ని పౌరాణిక నాటకాలు ఎల్లారెడ్డిలో ప్రదర్శింపజేశారు. జిల్లాలో పౌరాణిక నాటకరంగానికి సేవచేసిన వారిలో మురళీ మోహనాచార్యులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత పరంధాములు, కోనసముద్రం మల్లిఖార్జున శర్మ, పోస్టల్ డిపార్టుమెంటులో పనిచేస్తున్న కృష్ణంరాజు తదితరుల్ని కూడా చెప్పుకోవాలి. జిల్లాలో పౌరాణిక నాటకాల్ని పునరు జ్జీవింపజేయడానికి తనవంతు కృషిచేస్తున్న సంస్థల్లో నిజామాబాద్ పట్టణంలోని లలిత కళాతరంగిణి నాట్యమండలిని ప్రత్యేకంగా పేర్కొనాలి. పోలీస్ సబ్ఇనస్పెక్టర్గా రిటైరయిన క రాళ్టుర్రోం ంద య్య 21 ల్ నా ఉ(ట 0. 16...ఢీ మనతో | హు క్
నూకారావుగారు ఈ సంస్థకు అద్యక్షులు. ఈయన 1970 ప్రాంతాల్లో ప్రముఖులతో నాటక ప్రదర్శన లిప్పించినట్లు ముందేవివరించాను. విజయవాడ వాస్తవ్యుడు, ఎందరో లబ్బప్రతిష్టులైన రంగస్థల కళాకారులతో కలిసి నటించి మంచి పేరు సంపాదించుకున్న జి. వెంకటేశ్వరరావు 1983లో నూకారావుకు పరిచయమయ్యారు. నాటకాలపట్ల అభిరుచి గల సి.వి. అప్పారావు వీరికి తోడయ్యారు. జనజీవాలు కొల్పోతున్న పౌరాణిక నాటకాన్ని జిల్లాప్రజలకు సుపరిచితం చేయాలనే సదుద్దేశంతో వీరు 'లలిత కళాతరంగిణి నాట్యమందలిని స్థాపించారు. ఈ సంస్థ సభ్యులు ప్రప్రధమంగా 1990 సెప్టెంబరులో నిజామాబాద్ బాలికల హెస్కూలు ప్రాంగణంలో “సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. నూకారావు, వెంకటేశ్వర రావు, అప్పారావు, రామసూర్య (ప్రకాశరావు, సాదుగంగాధర్, లక్ష్మీనరసయ్య, బాలక్రిష్టారావు, కామేశ్వరరావు, రామలక్ష్మి తదితరులు ఆ నాటంలో వేషధారులు. ఇవా వర్తమానాని కొస్తే 1998లో ఉద్యోగరీత్యా జిల్లాకు వచ్చిన కె.రాఘవులు (వ్యాస రచయిత) ఈ సంస్థలో సభ్యునిగా చేరాడు. ఈ సంస్థ ద్వారా శ్రీ కృష్ణరాయబారం, శ్రీరామాంజనేయ యుద్ధం, బాలనాగమ్మ, గయోపాఖ్యానం లోని కొన్ని ఘట్టాలను జిల్లాలోని పలుప్రాంతాల్లో ప్రదించారు. చిరంజీవి, కేశవులు, తదితరులు కూడా ఈ సంస్థ ప్రదర్శనల్లో పాలు పంచుకున్నారు. - నిజామాబాద్‌లో రేడియోస్టేషన్ ఏర్పడటం కళారంగానికి, ముఖ్యంగా నాటకరంగానికి, సరిక్రొత్తమలుపు. రంగస్థలి కార్యక్రమం ద్వారా ఎందరో పొరాణిక నటుల్ని వెలుగులోకి తెచ్చిన ఘనత ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం వారికి దక్కుతుంది. గతంలో ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన వై. రాఘవులు పౌరాణిక నటుడు కావడం చేత, జిల్లాలోని పొరాణిక నాటక కళాకారులకు ఎంతో మేలు జరిగింది. జిల్లాలో,ఎక్కడెక్కడో కూనిరాగాలు య 22.
నిజామాబాద్ జిల్లాలో నాటకీరంగం గీతం - వర్రమానం
తీస్తున్న గళాల్ని వెదికి పట్టి, ఆకాశవాణిలో అవకాశం యిచ్చి, జిల్లా ప్రజలకు ఆ గళాల మాధుర్యాన్ని వినిపింపచేసిన కీర్తి రాఘవులు గారికే దక్కుతుంది. ఆయన స్థానంలో విజయవాడ నుండి బదిలీపై వచ్చిన (ప్రముఖ రచయిత) ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ గారు కూడా నాటకరంగం పట్ల అఖిరుచి ఉన్నవారే. ఆకాశవాణిలో డ్రామా విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లు ఎన్. బాబూరావు గారు, రూన్సీ కె.వి. కుమారిగారు ఎందరో కళాకారులకు రంగస్థలిలో అవకాశం ఇస్తున్నారు.
1994 అక్టోబరులో ఆకాశవాణి, అసిస్టెంటు స్టేషన్ డైరక్టరుగా విజయవాడ నుంచి పి. పాండురంగారావు గారు రావడం జిల్లా నాటక రంగానికి శుభపరిణామం. నాటక ప్రియులకు '“పాండురంగి గా పరిచయమైన పాండురంగారావు గారు, నిజామాబాద్ జిల్లా నాటక రంగానికిచేస్తున్న సేవల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను.
హైదరాబాదుకు చెందిన అంధ కళాకారుడు ఎమ్.వి. సుబ్బారావుగారు నిజామాబాద్ జిల్లా నాటక రంగానికి గతంలో చేసిన సేవల్ని ముందే ప్రస్తావించాను. ఆయన 1994లో ఎ. వెంకటేశ్వర రావు, శ్రీమతి సుభాషిణి, కనకాంబరం ్రభ్యుతులచే “శ్రీకృష్ణకులాభారం' నాటకాన్ని స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (ప్రదర్శింప జేశారు. 1996లో ఎ, వెంకటేశ్వరరావు, ఆచంట వెంకటరత్నం తదితరుల కాంబినేషన్ లో “శ్రీ కృష్ణ్ణాయబారం' నాటకాన్ని ప్రదర్శించారు. అందులో సుబ్బారావు గారు దృతరాష్ష్రుడి పాత్రలో జీవించారు. కొనీ యావదాంధ్ర దేశంలో పౌరాణిక నాటకాన్ని పునరుజ్జీవింప చేయడానికి (శ్రమించిన ఈ కళాకారుడు ఇటీవలే హైదరాబాదులో మరణించారు.
గత సంవత్సరం ఫిబ్రవరి 2 నుండి 4 వరకు, జిల్లా సాంస్కృతిక మండలి, ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ సౌజన్యంతో నిజామాబాద్ లో “అఖిలాంధ్ర నాటకోత్సవాలు జరిగాయి. ఆ
క రాఘవులు 23
నిజామాబాద్ జిల్లాలో నాటకీరంగీం గీఠీం - నీర్రసూనం = సందర్భంగా కడప సవేరా ఆర్ట్స్ వారు సమర్పించిన “శ్రీరామ వనవాసం” నాటకం, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ నాటకం '“పంచనటి” పేరుతో దూరదర్శన్ లో ప్రదర్శించబడింది. ఈ నాటకంలో రావణుడిగా శివనాగిరెడ్డి, శూర్చణఖగా గూడూరు సావిత్రి నటించారు. ఈ నాటకం ఢిల్లీలో ప్రధాని శ్రీ పివి. నరసింహరావు గారి సమక్షంలో ప్రదర్శింపబడింది. ఏదో ఆనవాయితిగా, ఐదు నిమిషాల పాటు నాటకం చూస్తానన్న ప్రధాని నాటకం పూర్తయ్యే వరకు, తన స్థానం నుండి కదల లేదట. ఈ నాటకం నిజంగా, నిజామాబాద్ (ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా గూడూరు సావిత్రి గారి నటనకు ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారంటే అతిశయోక్తి కాదు. నాటకరంగాన్ని సినిమా, టెలివిజన్ మీడియాలు చావు దెబ్బ తీశాయని కళాభిమానులు, కళాకారులు ఘోషిస్తున్నా, ఆక్కడక్కడా పౌరాణిక నాటకాలు ప్రదర్శింపబడుతున్నాయంటే దానికి కారణం కళాకారుల మొండి ధైర్యం, కొందరు కళాపిపాసుల ఆదరణేనని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా పౌరాణిక నాటకం పడుతూ లేస్తూ ముందుకు నడుస్తుంటే, జిల్లాలో మాత్రం, జ్ఞాపకాని కొచ్చినప్పుడల్లా నేనున్నానంటూ ఒక్కొక్కగెంతుగెంతి, వెంటనే చతికల బడుతున్నది ఈ దుస్థితికి కారణాలనేకం. ఇది ఒక్క పొరాణిక నాటకానికే పట్టిన (గ్రహణం కాదు. మొత్తం నాటక రంగానికే పట్టిన గ్రహణం. ఆ కారణాల్ని వ్యాసం చివరలో ప్రస్తావిస్తాను. జిల్లాలో సాంఘిక నాటకం - తీరుతెన్నులు :
“ఆంధ్ర దేశంలో జరిగినంత నాటక కళాభివృద్ధి తెలంగాణాలో జరగలేదు. నిజామాబాద్ లో 1948వ సంవత్సరంలో మహారాష్ట్ర మహిళా మండలి, 1958లో లలిత కళాసమితి ఏర్పడి సంగీత, నృత్య, నాటక కళల్లో కృషిచేశాయి. నిజామాబాద్‌కు 40 మైళ్ళ దూరంలోవున్న బాన్స్వాడలో కొన్ని సమాజాలు
క రఘురాం 24
ల. దామాబాద్ లల్లాలో నాటకరంగం గీతం - వర్రమాసం. పని చేశాయి”. కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు జిల్లా నాటకరంగాన్ని గూర్చి గ్రంధస్థం చేసిన సమాచారంయిది.
“న్వాతం(త్యం పొందిన తరువాత ఇందూరు మండలం అన్ని రంగాలలో ప్రగతిని సాధించింది. గడచిన 15 ఏళ్ళలో ప్రముఖంగా సాంస్కృతిక రంగం గణనీయమైన వికాసంపొందింది. గత శతాబ్ధి ఆరంభంలోనే నాటకం, నృత్యం, చిత్రలేఖనం మొదలైన కళలు ప్రజల మనసులను రంజింపజేస్తి, వారి ఆదరణను, మన్ననను పొంది ప్రస్ఫుటమైన వికాసాన్ని ప్రదర్శించాయి. స్థానికంగా నగరంలో, ఇతరపట్టణాలలో, పల్లెలలో కూడా ఎన్న్హీనాటక కళాసమాఖ్యలు వెలసినవి” (ఇందూరు భారతి. నాల్దవ వార్షిక సంచిక - “వెలుగులోకి” కె.వీరభద్రాచారి గారి వ్యాసం) 1960 ప్రాంతంలోనే సాంఘిక నాటకాలు, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించ బడినట్ట్లు, కొన్ని బెత్సాహిక సంస్థలు ఈ కృషిలో పాలు పంచుకున్నట్లు ఈవ్యాసం ద్వారా అర్ధమవుతుంది. సమగ్రమైన పరిశోధన జరిగితే గాని, ఆ సంస్థల పూర్వాపరాలు, ప్రదర్శించిన నాటకాల వివరాలు ఇవ్వడం సాధ్యపడదు. నాకున్న పరిధిలో సేకరించిన సమాచారం ఆధారంతో జిల్లాలో సాంఘిక నాటకరంగం పట్ల జరిగిన కృషిని, రేఖమాత్రంగా వివరించడానికి ప్రయత్నిస్తాను: తొలి అడుగులు నేర్చిన లలిత కళాసమితి :
1958 లో రిజిస్టరైన ఈ కళాసంస్థ ఐ.సి. శర్మగారి ఆధ్వర్యంలో నడిచేది. ఈ సంస్థ ఒక్కనాటక రంగానికే పరిమితమైంది కాదు. వివిధ కళారూపాల్ని పట్టణ (ప్రజలకు పరిచయం చేయడానికి వుద్దేశించిన సంస్థ. ఆ క్రమంలో కొన్ని నాటకాలు (వదర్శించి వుండొచ్చునేమో గాని, ఆ వివరాలు తెలియరావడంలేదు, తమ బాల్యంలో గోశాలలో 'దొంగవీరడు నాటకం చూసినట్లు కొందరు కళాకారులు చెప్పారు. కొడాలి గోపాలరావు 1998ల
కె రాధను 25
(వాసన ఈ నాటకం ఆంధ్రదేశంలో వలుచోట్ల విజయవంతంగా ప్రదర్శింపబడింది. బహుశా 1958-60ల మధ్య ఈ నాటకం నిజామాబాద్ లో ప్రదర్శింపబడి వుండాలి. శ్రీ గౌతమ కళాసమితి పార్శి బాల రాజయ్య గుప్త గారి అధ్యక్షతన కేశనకుర్తి వీరభద్రాచారి నేతృత్వంలో 1965 ఆగస్టు నెలలో నిజామాబాద్ లో ఏర్పడిన సంస్థయిది. స్థానికంగా ప్రదర్శనలివ్వడమే గాకుండా, రాష్ట్రంలోని కొన్ని పరిషత్‌లలో పాల్గొని, బహుమతులందుకున్న ఘనక్తీర్తి ఈ సంస్థది. నెల్లూరు నెఫ్టా, బెల్లంపల్లి, బోధన్ మొదలైన పరిషత్తుల్లో ఈ సంస్థ ప్రదర్శనలిచ్చి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఉత్తమ రంగాలంకరణం తదితర బహుమతులు గెల్చుకుంది. జిల్లాలో నాటకరంగానికి చేయూత నివ్వాలనే సదాశయంతో ఈ సంస్థ “నాటక మిత్రా అనే పధకాన్ని చేపట్టి కొంతకాలం అమలు పరచినట్లు గత చరిత్ర చెబుతుంది. ఆ పధకం ఉద్దేశ్యం ఏమంటే, రెండు మూడు నెలల కొకసారి ఒక (ప్రదర్శన ఏర్పాటు చేయడం ప్రతి ప్రదర్శనలో కనీసం ఇద్దరు నూతన నటులకు అవకాశం ఇవ్వడం. కానీ ఈ మధ్య కాలంలో ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని కొన సాగిస్తున్నట్లు లేదు. గత సంవత్సరం ఈ సంస్థ 30వ వార్షికోత్సవం జరుపుకుంది. సినీనటుడు బాబుమోహన్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఆ రోజు 'పునరపి' నాటిక ప్రదర్శించారు. ఈ సంస్థ ఎందరో కళాకారుల్ని రంగస్థలానికి పరిచయం చేసింది. ఈ సంస్థ గత 30 సంవత్సరాలలో 200 పైగా నాటక ప్రదర్శన లిచ్చింది. ఈ సంస్థకు బోధన్ లో ఒక శాఖ కూడా వుండేది. కాని ఇప్పుడు పని చేయడం లేదు. ఈ సంస్థ ద్వారా కీర్తి గడించిన కళాకారుల్లో కళాధరరావు, చంద్రప్రకాష్, చావలి కృష్ణమూర్తి, మెండా ప్రభాకరరావు, వేంకటేశం ప్రభ్ళుతులు ముఖ్యులు. వీరిలో చావలి కృష్ణమూర్తి, మెండా ప్రభాకరరావులు రచయితగా ప్రసిద్ధులు. బాల
గేయరచయితగా ప్రభాకరరావు గారికి మంచి గుర్తింపు వుంది. వీరు వ్రాసిన సంగీత రూపకాలు ఎన్నోసార్లు ప్రదర్శింపబడ్డాయి.. ఆకాశ వాణిలో ప్రసారమయ్యాయి. చావలి కృష్ణమూర్తి నాటికలు పలుచోట్ల ప్రదర్శితమైనాయి. కళాధరరావు విద్యార్థి దశ నుండి మంచి కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆయన మంచి నటుడే కాదు మధురగాయకుడు కూడా. విద్యార్ధి దశలో ఢిల్లీలో జరిగిన యువజనోత్సవాలలో పాల్గొన్నాడు. మరొక ముఖ్య విషయమేమంటే ఈ సంస్థకు, ్రసిద్ధనటులు, దర్శకులు కీ.శే. యగ్రంనేని చంద్రమౌళి గారికి విడదీయరాని సంబంధంవుంది. ఈ సంస్థ నిర్వహించిన కొన్ని ప్రదర్శనలకు చంద్రమౌళి నిర్దేశకత్వం నెరపినట్లు సంస్థ సభ్యులు చెప్పారు. ఈ సంస్థ సభ్యుల్లో ముఖ్యులైన చంద్రప్రకామ్ మంచి నటుడిగా గుర్తింపు పొందారు. కీర్తిశేషులు” వీరికి మంచి పేరు తెచ్చిన నాటకం. ఆర్మూరు లో సాంస్కృతిక రంగంలో కొంత కృషి చేసిన తన సోదరుడు సూర్యప్రకాష్‌తో కలిసి, చం(ద(వకాష్ ఆర్మూరు పరినర(ప్రాంతాల్లో కొన్ని నాటకాలు (ప్రదర్శించినట్లు ఆర్భూరు కళాకారుడు భాస్కర్ చెప్పారు. చంద్రప్రకాష్ గారిప్పుడు నాట్యరంగం పై దృష్టి సారించడంతో నాటకరంగం పై దృష్టినిలపలేక పోతున్నారు.
గౌతమ కళాసమితికి మరో మూలస్తంభం రూపశళిల్చి (బ్రహ్మయ్య. ఈయన జిల్లాలోని కళాకారులందరకీ చిరపరిచితులు, మేకప్ ఆర్టిస్ట్‌గా ఆయన సేవలు ఉపయోగించుకోని సంస్థ జిల్లాలో తేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో నాటకరంగం ఈ మా[త్రమైనా ఎదగటానికి, కళామతల్లి రత్నఖచిత మకుటంలో ఓ మూలన చిన్ని రత్సంలా ఒదగడానికి, ఇలాంటి కళాపిపాసుల సేవలే కారణం. వీరి చేతుల్లో రూపుదిద్దుకున్న మెందా ప్రభాకరరావు గారి రూపకం “రక్షకుడు, పలుచోట్ల ప్రదర్శింపబడి, రసజ్ఞుల మెప్పుపొందింది. కళాభారతి సమర్పించిన సిద్ధార్ధ సంగీత నృత్య రూపకం, ఈయన చేతుల్లో రూపుదిద్దుకొని, మన
న ఇరుకు లాడ
నిబాసూటాద్ జిల్లాలో నాటకరంగీం సీతం - నర్రమాస్రం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో, మహారాష్ట్రలో కూడా ్రదర్శింపబడింది. సైబ పరంధాములు గారు రచించిన నృత్యనాటిక ఉమేష్ కుమార్ గారి దర్శకత్వంలో, బ్రవ్మాయ్య గారి కళాదర్శకత్వంలో రూపుదిద్దుకొని చాలా చోట్ల ('ప్రదర్శింపబడింది. 1994 జనవరిలో భోపాల్‌లో జరిగిన జాతీయ యువజనోత్సవాల్లో కూడా ప్రదర్శింపబడ్డ ఈ రూపకం పేరు 'సౌహార్దభారతి”. నెల్లూరు నెఫ్టావారు నిర్వహించిన రాష్ట్రస్థాయి నాటిక పోటీల్లో ప్రదర్శించిన “కుక్క నాటికకు, బ్రహ్మయ్య గారందించిన, ఆహార్యానికి ప్రధమ బహుమతి వచ్చింది. స్థానిక సంస్థలు, రాష్ట్రంలోని ఇతర కళాసంస్థలు బ్రహ్మయ్య గారిని సన్మానించాయి. కళా సాంస్కృతిక రంగాలలో వీరందించిన విశిష్టసేవలకు 1985లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. శ నటరాజ కళానిలయం 1968 జూలైలో నిజామాబాద్ పట్టణంలో ఏర్పడ్డ మరో నాటక సంస్థ శ్రీ నటరాజ కళానిలయం. వృత్తిరీత్యా పట్టణంలో స్థిరపడ్డ చార్జర్డ్ వికౌంటెంట్ శ్రీపాద కుమారశర్మ గారు ఈ సంస్థ నిర్వాహకులు. నాటక రంగంపట్ల అభిరుచి గల ఆదెయ్య, జోజయ్య, బి. లక్ష్మీనరసయ్య, డి.వి. రావు, రామ్మోహనరావు, వెంకటేశ్వరరావు మొదలైన వారు ఈ సంస్థలో సభ్యులు. ఈ సభ్యులే 'శ్రీ విజయసారథి ఆర్ట్స్ అనే మరొక సంస్థను కూడా స్థాపించారు. రెండు సంస్థలూ బెల్లంపల్లి లో 1968లో జరిగిన పరిషత్ పోటీలో *కళాకార్” 'మంచుతెర'” నాటికల్ని ప్రదర్శించాయి. శ్రీనటరాజ కళానిలయం బేనర్‌పై ప్రదర్శించిన 'కళాకారో నాటికకు బహుమతులొచ్చాయి. అందుకే ముందుగా అనుకున్న మాట ప్రకారం, (పైజులు సాధించిన శ్రీనటరాజ కళానిలయన్ని రిజిస్టరు చేసుకొని, 'శ్రీ విజయసారథి ఆర్ట్స్'ను రద్దుచేసుకున్నారు. సంస్థ ప్రారంభించిన నాటినుండి స్థానికంగానే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కె రాఘర్రలం 28
_ నబమాబద్ దల్తాలో నాటకరంగం గరం - వర్తమానం, కూడా ప్రదర్శనలిచ్చిందీసంస్థ శక్కర్ నగర్, ఆర్మూర్, నెల్లూరు నెప్లా పరిషత్‌లలో పాల్గొని బహుమతులెన్నో అందుకున్న ఈ సంస్థ, చాలా సంవత్సరాలుగా కార్యక్రమాలేమి నిర్వహించకుండా స్తబ్దుగా వుంది.
ఈ సంస్థ'నిర్వాహకులు కుమారశర్మ గారు మంచి నటులు, గాయకులు. రాజమండ్రి వాస్తవ్యులైన "వీరు వృత్తిదీత్యా పట్టణంలో స్థిర పడ్డారు. వీరిది నాటకరంగానికి అంకితమైన కుటుంబం. వీరి తండ్రిగారు శ్రీపాద కృష్ణమూర్తి రాజమండ్రిలో మంచి పేరున్న నటులు, ఆయన కాళ్ళకూరి వారి “చింతామణి” “వర విక్రయం” నాటకాలు విస్తృతంగా ప్రదర్శించారని కుమారశర్మ గారు చెప్పారు. కుమారశర్మ అన్నగారు పట్టాఖి మంచి నటులేగాక రాష్ట్ర సంగీత నాటక అకాడమి కార్యవర్గ సభ్యులు. వీరి తమ్ముడు జిత్ మోహన్ మిత్రా (ప్రసిద్ధులైన సినీ నటులు, గాయకులు. కీశే. గరికపాటి రాజారావు గారి శిష్యబృందంలోని వాడైన కుమార శర్మ తన గురువుగారి వద్ద నటనలో ఎన్నోమెళుకువలు నేర్చుకున్నాడు. తన తండ్రిగారి ప్రోద్బలంతో చిన్ననాటినుండే నాటకాలు (్రదర్శిచడం ప్రారంభించారు. రాజమండ్రి రాఘవ కళాసమితి తరఫున ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. గరికపాటి రాజారావుగారితో కలిసి ఆ(త్రేయగారి “పరివర్తన భయం” నాటకాలు ప్రదర్శించారు సుప్రసిద్ధ సినీనటులు రాజబాబు, కాకరాల, దర్శకులు బీరం మస్తాన్‌రావు, ప్రముఖ రంగస్థల, సినీనటి నవీన లక్ష్మి (మస్తాన్ రావు భార్య). కుమారశర్మగారికి రాజమండ్రిలో నాటకాలలో సహనటులు. కుమార శర్న్మగారిలో మరోసుగుణం వుంది. పట్టణంలో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా ఆయన ముందు వరసలో వుంటారు. బెత్సాహిక కళాకారులకు (ప్రోత్సాహం ఇస్తారు. నాటకరంగంలో సుప్రసిద్ధులైన నటులు, రచయితలు, విమర్శకులతో ఈయనకు సన్నిహిత పరిచయం వుంది. కళారంగంలో పరిచయం ఉన్న ప్రముఖులెవరైనా నిజామాబాద్ పట్టణం వచ్చినప్పుడు, కుమారశర్మ గారిని పలకరించకుండా
ఘట. 20.
జామాబాద్ ఉత్చాలో నాటకరంగం తల వత్రమాసద యం
వెళ్ళరు. ఆదీ ఆయన ప్రత్యేకత.
మురళీ కృష్ణ కళానిలయం
నిజామాబాద్ పట్టణంలో 1967లో గీతాసాంస్కృతిక విభాగంగా
ప్రారంభమై, 1971వ సంవత్సరంలో మరింత విస్తృత ప్రాతిపదిక పై చెతన్య వంతంగా పని చేసే సంకల్పంతో “మురళీకృష్ణ కళానిలయం'” గా మారిన ప్రముఖ నాటక సంస్థ 1971 ఏప్రిల్ 18,14 తేదిల్లో రజతోత్సవం జరుపుకున్నది. మఘలోపుట్టి, పుబ్బలో కనుమరుగవుతున్న నాటక సంస్థలూ, ఒక నాటక ప్రదర్శనతోనే కళ్ళుబైర్లుగమ్మి మూటాముల్లె సర్దుకుంటున్న కళాకారులూ కొల్లలుగా వున్న ప్రస్తుత పరిస్తితుల్లో ఒక కళాసంస్థ పాతికేళ్ళు బతికి బట్ట కట్టడం, పైపెచ్చు రజతోత్సవం జరుపుకోవడం ఎంతగొప్ప విషయం! ఈ పాతికేళ్ళ ప్రాయంలో దాదాపు నూట అరవై నాటిక, నాటకాలను షుమారు 500 ప్రదర్శనలిచ్చి, రసజ్ఞుల్ని మెప్పించిన ఘనత ఈ సంస్థకు దక్కుతుంది. కళాభిమానులు కీ.శే. పెండ్యాల వెంకటేశ్వర గుప్తాగారు ఈ సంస్థ సంస్థాపక అద్యక్షులు, వై. సాయన్న డా. రామమోహన రావు, జి. వెంకటేశ్వర రావు, ఉమేష్ కుమార్ మొదలైన వారు ఈ సంస్థకు మూలస్తంబాలు. ఈ సంస్థ ఇంతగా ఎదగడానికి కృషిచేసిన వారిలో కీ.శే ఆర్.ఎన్. శ్రీనివాసన్, పి. మల్లా రెడ్డి ముఖ్యులు. ఎ, శ్రీరాములు గారు ఈ సంస్థకు ప్రత్యేక సలవోదారు. ఈ సంస్థ మహారాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ లోని పలు పట్టణాల్లో జరిగిన పరిషత్‌లలో పాల్గొని ఎన్నో బహుమతులు గెల్చుకుంది. 1985 లో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ, 1986లో తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర సాంస్కృతిక వ్వవవారాల శాఖల సౌజన్యంతో ప్రాంతీయ పౌరాణిక నాటక పోటీలు నిర్వహించిన ఘనత ఈ సంస్థకు దక్కుతుంది.
ఈ సంస్థద్వారా ఎందరో రంగస్థలానికి పరిచయమయ్యారు. టి, శ్రీధర రావు, వి. నారాయణ, డి.వి. మురళీ మోహనాచార్యులు, ఎస్, ఉమేష్ కుమార్స్ పరుల కె న యు
జగదీశ్వర్, హరిష్ కుమార్, మధుకర్, దత్తాత్రేయలు లాంటి వారు ఎన్నో నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సంస్థ ప్రస్తుత కార్యదర్శి ఉమేష్ కుమార్, మంచి మేకప్ మాన్‌గా పేరు తెచ్చుకున్నారు. బ్రహ్మయ్య గారి శిష్యుడైన ఈయన జిల్లాలోని నాటక సమాజాలకు తన ఆహార్యంతో సేవలందిస్తున్నాడు.
ఈ సంస్థకు వెన్నెముక లాంటి వ్యక్తి శ్రీ వై. సాయన్న వీరు ప్రసిద్ద నటులే గాక మంచి దర్శకులుగా బహుమతులందుకున్నారు. వీరు నాటక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా, 1985, మే 28న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా రాష్ట్రప్రభుత్వం వీరిని 'కళానీరాజని పురస్కారంతో గౌరవించింది.
ఈ సంస్థ నాటక ప్రదర్శనలతో పాటు సంగీత సాహిత్య కార్యక్రమాలు, నాటక గోప్టులూ నిర్వహించారు నిష్ణాతులైన నాటక రచయితలచేే, విమర్శకులచే, నాటకోపన్యాసాలు ఇప్పించింది. రజతోత్సవాల సందర్భంగా, ఈ సంస్థ సభ్యులు “మరో మొహంజదారో నాటకాన్ని రసవత్తరంగా ప్రదర్శించడమే గాక, ఆ నాటక రచయిత, ఎన్.ఆర్ నంది గారిని షునంగా సన్మానించి, నాటకరంగం పట్ల తమకున్న భక్తిని చాటుకున్నారు. ఆ రోజే, స్థానిక ఆకాశ వాణి, ఉపసంచాలకులు ప్రహరాజు పాండురంగా రావు గారి అద్యక్షతన, “నాటకరంగ సదస్సు” ను నిర్వహించి, ఈ సంస్థ “నాటకం” పట్ల తమకున్న నిబద్ధతను, బాధ్యతను చాటుకుంది. ప్రోగైసివ్ ఆర్:
ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగుల సాంస్కృతిక సంస్థ. 1967లో శ్రీమతి లీలావెంకటేశ్వర రావు గారి అద్యక్షతన ఈ సమాజం ఏర్పడింది. మొదటి ప్రయత్నంగా ఆమె రచించిన బ్లేదు నిజాల) నాటకం ప్రదర్శించారు. 1968లో ఈ సంస్థ భమిడిపాటి రాధాకృష్ణ 'కీర్తిశేషులు'
బాాచోలంంతా తతా నాటకాన్ని సమర్ధవంతంగా ప్రదర్శించారు. ఈ సంస్థ ద్వారా ప్రసిద్ధిలోకి వచ్చిన నటుడు శశాంక్. ఈయన ఈ సమాజానికి దర్శకుడు కూడా. "తుగ్లక్, “గుడిగంటలు, “ముగింపులేని కథ* మొదలైన నాటకాల్ని ఈ సంస్ధ ప్రదర్శించింది. శ్రీ శశాంక్ కొంతకాలర పట్టణంలోని “నగర నట సమాఖ్యకు అధ్యక్షులుగా వ్వవహరంచాడు. ఈయన “శివాజీ ఏకపాత్రాభినయం రసవత్తరంగా ప్రదర్శించే వారని ప్రదర్శన చూసిన వారు చెప్పారు. యగ్రంనేని చంద్రమౌళి గారి దర్శకత్వంలో శశాంక్ హీరోగా “విషజ్వాల” అనే సినిమాను నిజామాబాద్ జిల్లాలో నిర్మించినట్లు కొందరు కళాకారులు చెప్పారు, కానీ ఆ సినిమా విడుదల కాలేదు. శశాంక్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ బదిలీ కావడంతో ఈ సంస్థ కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఈ సంస్థ జెన్నత్యమంతా గత కీర్తిగానే మిగిలిపోయింది. నగర నట సమాఖ్యః ఈ సంస్థ 1978వ సంవత్సరం జనవరి ఒకటో తేదిన ఆనాటి జిల్లా కలెక్టర్ ఆనంద కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. పట్టణంలోని నాటక సమాజాలన్నీ ఒక ఫెడరేషన్‌గా “నగర నట సమాఖ్య పేరుతో ఏర్పడ్డాయి. శ్రీ గౌతమ కళాసమితి నటరాజు కళానిలయం, మురళీ కృష్ణ కళానిలయం, స్నేహమయి, ప్రోగ్రెసివ్ ఆర్ట్స్ ఈ “నగరనట సమాఖ్యలో సభ్యత్వమున్న సంస్థలు. ఒకచోట పనిచేసే నాటక సమాజాలన్నీ ఒక ఫెడరేషన్‌గా ఏర్పడి, ఐకమత్యంగా కళాసేవ చేయడం అరుదైన విషయం. ఈ గౌరవం నిజామాబాద్ పట్టణ కళాకారులకు చెందడం గర్వించదగ్గ విషయం. సంస్థ ఆవిర్భవించిన రోజే, నాటక ప్రదర్శన యిచ్చి, తద్వారా వచ్చిన మొత్తాన్ని దివిసీమ తుఫాను బాధితులకు సహాయనిధిగా పంపడం విశేషం, పట్టణంలోని నాటక సమాజాలన్నీ ఇతర ప్రాంతాలలో పరిషత్ పోటీలలో పాల్గొనేవి. కానీ ఈ సంస్థ పట్టణంలో నాటిక, నాటక పొటీలు విజయవంతగా నిర్వహించి
చంమాటాద్ చల్తాలో నాటకరంగం గీతం - వర్రమాసం, నిజామాబాద్ జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చింది.
ఈ సంస్థ 1979 మే నెల 11,12,18 తేదిల్లో ప్రధమ తెలంగాణా స్థాయి నాటిక పోటీలు నిర్వహించింది. నటరాజకళానిలయం (అదిలాబాద్) వారి “నేను రాముణ్ణి కాను ఉత్తమ ప్రదర్శనగా, ఇసి.ఐ.ఎల్ హైదరాబాదు వారి “మాకు శాంతి కావాలి” ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఎన్నికైనాయి. 1980 నవంబర్ 28,29,380 తేదీల్లో ద్వితీయ తెలంగాణా స్థాయి నాటిక పోటీలు జరిగాయి. *'ఫర్సేలొ (సమర్చణ ఆదర్శ యువభారతి, సికింద్రాబాద్) “కోహినూర్” (సమర్చణ-లలిత కళాసమితి, బి.ఎచ్.ఇ.ఎల్స్ హైదరాబాదు) ప్రధమ, ద్వితియ బహుమతులు పొందాయి.
1982, మే నెల 6 నుండి 10వరకు జరిగిన తృతీయ తెలంగాణా స్థాయి నాటిక పోటీల్లో మవతి, హైదరాబాద్ వారి పద్మవ్యూహం ఉత్తమ ప్రదర్శనగా కళాప్రియ, హైదరాబాదు వారి 'పండగొచ్చింది, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికయ్యాయి. పోటీల అనంతరం ఆంధ్ర ప్రదేశ్ నాట్యమండలి, హైదరాబాద్ వారిచే 'ఆశి, 'మూకాభినయం' నాటికలు, ఎ.ఆర్. కృష్ణగారి దర్వకత్వంలో “శాకుంతలి సంగీత నాటకం. దేవదాస్ కనకాల గారి దర్శకత్వంలో 'మానాన్న కావాలి” నాటకం ప్రదర్శింపబడ్డాయి. 1988 మే 20,21,22 తేదీల్లో జరిగిన నాల్గవ తెలంగాణా స్థాయి నాటిక పోటీల్లో, మురళీ కళానిలయం వారి “కాక్కారొకో' ఉత్తమ ప్రదర్శనగాను, ఆదర్శయువభారతి, హైదరాబాదు వారి “ఢిల్లీ ద్వితీయ ఉత్తమ ప్రదర్శన గానూ ఎన్నుకోబడినాయి.. 1984 జూన్ 1,2,3, తేదిల్లో ఐదవ తెలంగాణా స్థాయి నాటిక పోటీలు జరిగాయి. స్పందన ఆర్ట్స్ వారి “పెద్దబాలశిక్ష ఉత్తమ ప్రదర్శన గానూ, “మనకో నియంత,కావాలా (సమర్చణ - ఆదర్శయువ భారతి, హైదరాబాదు) ద్వితీయ ఉత్తమ ప్రదర్శన గాను ఎంపికయ్యాయి.
1987 జూన్ 12,18,14 తేదిల్లో ప్రప్రధమంగా రాష్ట్ర స్థాయిలో నాటిక
కమాను!
నిదాసూబాద్ ఉల్లాలో నాటకరంగం గీతం - నర్రమాస్రం పొటీలు నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రి ఎ. మహిపాల్ రెడ్డి ఈ పోటీలకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. బహుమతి ప్రధానం చేయడానికి విచ్చేసిన ప్రముఖ రంగస్థల, సినీనటులు “రక్తకన్నీరు” నాగబూషణం గారి ఈ సందర్భంగా సన్మానించి, ఆంధ్ర నాటక రంగాన్నే సన్నానించినంత సంబరపడి పోయింది నగరనట సమాఖ్య, ఈ పోటీల్లో 'తేనెతీగలు పగబద్దాయి, కళ్ళు, ఆకలివేట, సర్పయాగం, జాగృతి, దండోరా, గారడి, లేడిపంజా, అనే నాటికలు 'ప్రదర్శింపబడ్డాయి. ఈ పొటీలకు శ్రీ శ్రీహరిమూర్తి, సదాశివ రావు న్యాయమూర్తులుగా వ్వవహరించారు. 1989మే 9,10, తేదీల్లో రాష్ట్రస్థాయి నాటిక పోటీలు జరిగాయి. 9వ తేది నాటి కార్యక్రమానికి ప్రముఖ నాటకరంగ విమర్శకుడు, సాహితీ వేత్త శ్రీ మొదలి నాగభూషణ శర్మ ముఖ్య అతిధిగా విచ్చేసారు. 10వ తేదీ కార్యక్రమానికి రంగస్థల, టి.వి కళాకారుడు అశోక్ రావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ పోటీలకు హైదరాబాదుకు చెందిన శ్రీయుతులు డి.యస్. ఎన్. మూర్తి, రమణమూర్తి న్యాయ నిర్దేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో, రాయి, చైతన్య జ్యోతి, 'నవ్వండి!ఇది విషాదం” గారడి, కుంజర రాజంబు దోమకుత్తుక జొచ్చెన్స్ 'సత్యం శోచితు మర్షసి' అనే నాటికలు ప్రదర్శింపబడ్డాయి. ఇహ, వర్తమానాని కొస్తే 1995 ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయం, జిల్లాసాంస్కృతిక వ్వవహార మండలి, నగర నటసమాఖ్య సంయుక్త నిర్వహణలో “అఖిలాంధ్ర” నాటకోత్సవాలు జరిగాయి. (ప్రముఖ రంగస్థల, సినీ నటులు జె.వి. సోమయాజూలు గారు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రవూలలో వివిధ ప్రాంతాలకు చెందిన నాటక సమాజాలు ప్రదర్శించిన సాంఘిక, చారిత్రక, పౌరాణిక నాటకాలు ప్రవర్శితమయ్యాయి. వీటిలో,కడప, సవేరా ఆర్ట్స్‌వారి 'శ్రీ రామ వనవాసం” ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నదని ముందే మనవి ఇ రాఘవుంథ 3౩4
గబమాదాద్ లల్లాలో నాటకరంగం గీతం - నర్రమూసం,
చేశాను. ఈ నాటకోత్సవాల సందర్భంగా, పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ప్రదర్శించబడిన “ఆధునిక వీధి నాటకాలు” ప్రజల్ని విశేషంగా ఆకర్షించాయి.
ఇంతటి అర్ధవంతమైన కార్యక్రమాలతో కళాప్రియుల్ని రంజింపజేసిన ఈ నటసంఘాల సమాఖ్య, ఆరేడు సంవత్సరాలుగా నిస్తేజంగా వుండటం, కళాభిమానులకు నిరాశ కలిగిస్తున్నది. ఐకమత్యానికి వేదికగా నిల్చిన ఈ సంస్థ పది కాలాల పాటు కొనసాగి ముందు ముందు మరెన్నో కార్యక్రమాల్ని చేపడుతోందని ఆశిద్దాం. తన్మయీ ఆర్ట్స్ ధియేటర్స్:
పేరులోనే కొత్త దనాన్ని సంతరించుకున్న ఈ నంస్థ వయసులో చిన్నదయినా, వయసుకు మించిన గడుసు పనులుచేసి, కళాప్రియుల్ని తన్మయంలో ముంచెత్తింది. పూర్వాశమంలో మురళీకృష్ణ కళానిలయం సభ్యుడైన కె.సుదర్శన్ ఈ సంస్థకు మూలవిరాట్టు. రమణమూర్తి, నాగరాజు, రాజబాబు, మల్లేష్ పవన్ కుమార్, లింగం, వర్ధన్ తదితరులు ఈ సమాజంలో సభ్యులు. ఈ సంస్థకార్యక్రమాలు పరికిస్తే వీళ్ళు ఇంట్లో కన్నా వీధిలోనే ఎక్కువ రాణించారని అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిషత్ పోటీల్లో పాల్గొంటున్న సమాజం ఇదొక్కటే నేమో. 1996 ప్రారంభంలో సిర్పూర్కాగజ్నగర్ లో జరిగిన రెండు వేర్వేరు పరిషత్ లలో 'పునరపి' నాటిక ప్రదర్శించి, ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్, ఉత్తమ వాస్యనటుడు, ఇత్యాది ముఖ్యమైన బహుమళతుల్ని గెల్బుకొచ్చి జిల్లా నాటక రంగానికున్న గతవైభవాన్ని సాటి చెప్పిందీసంస్థ. ఈ సమాజం నిర్వాహకుడు సుదర్శన్ “భద్రం కొడుకో” సినిమాలో విలన్‌గా నటించాడు. కొన్ని టి.వి సీరియల్స్ కూడా ఈయన నటించాడు. ప్రస్తుతం వీరు ఈ టి.వీ, జెమిని టీవిలలో వచ్చే సీరియల్స్‌లో, డబ్బింగ్ చెప్తున్నారు. అక్షినేని
రయ సక
నిజామాబాద్ ఉల్తాలో నొటిక్షరంగీం గీతీం -వ్రమూనీం కుటుంబరావు గారు తెలుగులో డబ్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “గాంధీ లో కూడా ఈయన గాత్రాన్ని ఆంధ్ర ప్రేక్షకులు వినబోతున్నారు.
ఈ సంస్థకు చెందిన మరో మంచి నటుడు రమణమూర్తి. “భార్గవ రాముడు' ఏక పాత్రాఖినయం ద్వారా ఈయన పట్టణ ప్రజలకు చిరపరిచితుడు. అడవి రాజబాబు మంచి వాయిస్ వున్న నటుడు. సాధన చేస్తే ఇంకా రాణిస్తాడు, మంచి టాలెంట్వున్న నటులున్న ఈ సమాజం నుండి పేక్షకులు మంచి (ప్రదర్శనలు ఆశించవచ్చు. లింగం మెమోరియల్ ఆర్ ఎన
కళాభిమాని లింగం గారి పేరు రచయిత, దర్శకుడు, నటుడు సుదర్శన వర్మగారు నడుపుతున్న సంస్థయిది. ఈ సంస్థ ఎక్కువగా వర్మగారు వ్రాసిన నాటికల్ని ప్రదర్శించింది. కృష్ణంరాజు తదితరులు ఈ సంస్థలో సభ్యులు, సంగీతంలో ప్రవేశమున్న సుదర్శన వర్మ హరి కధలు చెప్పంటారు. స్నేహమయి:
ప్రకాష్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ సంస్థకు నగరనట సమాఖ్యలో సభ్యత్వంవుంది. ఈ సంస్థ గతంలో కొన్ని నాటకాలు ప్రదర్శించింది. వీరు నిజామాబాద్ పట్టణంలో త్రిభాషా నాటకోత్సవాన్ని నిర్వహించారు. ఒక హిందీ నాటకం, ఒక మరాఠీ నాటకం, మరో తెలుగు నాటకం నాటకోత్సవంలో సరస్తచుర్నాయి. ఈ సంస్థ దంతా గతవైభవమే. ఇప్పుడు గాఢ నిద్రావస్థలో
అలు, జ్యోతి కళానిలయం/ బాబు కల రల్ అసోసియేషన్ ; పొస్టల్ డిపార్ణుమొంటులో పని చేస్తున్న కొందరు కళాకారులు ఏర ర అం ల్ పే నే బెత్సాహిక నాటక సంస్థ జ్యోతి కళ్రానిలయ్వం, 1970-80 ప్రాంతాల్లో ఈ సంస్థకొన్నినాటికలు, నాటకాలు ప్రదర్శించింది. ఈ సంస్థ నిర్వాహకుడు టి. హరనాధబాబు మంచి నటుడు, దర్శకుడు. కొన్ని పరిషత్‌లలో
లా పాల్గొన్న అనుభవం కూడా ఈ సంస్థకు ఉంది. రామ్మోహన రావు, రంగనాధ్ తదితరులు ఈ సంస్థలో సభ్యులుగా వుండే వారు. హరనాధబాబు ఆధ్వర్యంలోనే బాబు కల్చరల్ అసోసియేషన్ కొద్ది రోజులు నడిచింది. ఉద్యోగుల బదిలీల కారణాల వల్లనైతేనేమి, ఇతరకారణాల వల్లనైతేనేమి ఈ సంస్థలు రెండూ ఇప్పుడు పనిచేయడం లేదు. ఉద్యోగ విరమణ చేసిన హరనాధబాబు అనారోగ్యకారణంగా ప్రస్తుతం నాటక రంగానికి దూరంగా ఉంటున్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య / ప్రజాకళా మండలి : ప్రజల్లో రాజకీయ, సాంఘిక చైతన్యం కలిగించేందుకు నిరంతరం కృషిచేస్తున్న కళా సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రజాకళామండలి, అరుణోదయం సాంస్కృతిక సమాఖ్య, జిల్లా (ప్రభుత్వోద్యోగుల సాంస్కృతిక సంస్థ, మొదలైనవి చెప్పుకోదగ్గవి. ఈ సంస్థల్లో ఏదీ ప్రత్యేకంగా నాటక రంగానికే పరిమితమైన సంస్థకాదు. “కళ కళ కోసం కాదు ప్రజల కోసం” అని నమ్మే ఈ సంస్థలు తమ ప్రచార సాధనకు అవసరమనుకున్న ఏ కళారూపాన్నయినా ప్రదర్శించడానికి సర్వదా సంసిద్దంగా వుంటాయి. నాటకానిక్షున్న శక్తి నెరిగిన ఈ సంస్థలు నిరంతరంగా నాటకాలు ప్రదర్శిస్తూనే ఉన్నాయి. ఈ సంస్థలన్నింటిలోనూ ఏదో ఒక రూపంగా సంబంధమున్న కళాకారుడు సిర్బలింగయ్య. ఈయన ప్రధానంగా జానపద గాయకుడు. అవసరార్థం నటుడు, నిబద్దతతో సాహితీ వ్యాసంగం నెరుపుతున్న రచయిత. అది నాటకమైనా, జానపదగీతమైనా, సంగీత రూపకమైనా, ఆధునిక వీధినాటకమైనా దానిలో లీనమైపోయి, (పేక్షకుల్ని తనవెంటలాక్కుపోవడం ఈయన ప్రత్యేకత. జిల్లాకు చెందిన పాత్రికేయుడు గిరి నాగభూషణం గారి మాటల్లో చెప్పాలంటే “రంగ స్థలం మీద నిలబడి గొంతెత్తితే ఆ చుట్టు ప్రక్కల ఉన్న వారంతా ఆ పాటలో లీనమయ్యేలా చేసే గాయకుడు సిర్బలింగయ్య,. ప్రజాకళామండలి పరిచయం చేసిన కళాకారుడు, రచయిత, నటుడు, వివిధ ఇళటట నా
చాాతాలంనంంతంట నాటకాల్లో వీరు అద్భుతనటన, ప్రదర్శనలిచ్చి, జిల్లాలోనే గాక ఇతర ప్రాంతాల్లో కూడా అనేక ప్రదర్శన లిచ్చి, పాటలు పాడుతూ ప్రజల గాధామయ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించే విధంగా ఈ నాడు పాటలు రాయడంలో కృషిచేస్తున్నారు”. (నిజామాబాద్ జిల్లా సాహిత్యం - గిరి నాగభూషణం), సిర్బలింగయ్య తాను రచించిన 'గంజ్, “మస్కట్ మొదలైన నాటికల్ని పలుచోట్ల (ప్రదర్శించారు. గంగిరెడ్డి రచించిన “నాంది, కానూరి వెంకటేశ్వరరావు గారి ఆధునికవీధి నాటకాల్సి సిర్బలింగయ్య బృందం జిల్లాలోని 386 మండలాల్లో ఇటీవలి కాలంలో విజయవంతంగా ప్రదర్శించింది. సిర్బలింగయ్యతో పాటు, హన్నాంధ్సు పి.సుదర్శన్, బ్రహ్మం, పి, రాజు, సుభాష్ రావు, రమేష్ సత్తెక్క కవిత, లక్షణ్ పి. భీమాలు, ఈ ఆధునిక వీధి నాటకంలో నటిస్తున్నారు. సాంఘిక చైతన్యంతో (ప్రజల్ని జాగృతం చేస్తూ, (ప్రజాసమస్యల పట్ల స్పందిస్తూ, నాటకాలు వ్రాసి, ప్రదర్శంచిన వారిలో కన్నెగంటి నర్సింహారావు (క. యన్. రావు) ఆరెట్టి నారాయణ, ఎం. నారాయణ ముఖ్యులు, వీరందరూ ఒక రాజకీయ సిద్దాంతం ఆలంబనగా రచనలు చేయడం నాటకాలు రాయడం యాదృచ్చికం కాదు. అది వారి సైద్ధాంతిక నిబద్ధతకు నిలువుటద్దమే. కాదని ఎవరన్నా అంటే అది కేవలం బూకరింపే. కె.యన్. రావు వ్రాసిన “పరిష్కారం” సంఘ శక్తి తెగిన సంకెళ్ళు (మాగ్దింగోర్మి 'అమ్మ' నవలకు అనుసరణ) నాటకాలు జిల్లాలో కొన్నిచోట్ల ప్రదర్శింప బడ్డాయి. ప్రజా కళామండలి, అర్సపల్లి కళాకారునిగా పరిచయమై, రచనా రంగంలోకి ప్రవృేంచిన ఎం. నారాయణ నాలుగు నాటకాలు రాశారు. ఇవేవీ ప్రచురణకాక పోయినా ప్రదర్శన లిచ్చారు. బాన్స్వాడ పోస్టాఫీసులో పనిచేసే ఆరెట్టి నారాయణ మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు ఆయన పొటలు, కధలలో పాటు కొన్ని నాటకాలు కూడా వ్రాశాడు. “జిల్లాలో ఒక నిబద్ధ సాంస్కృతిక సైన్యాన్ని తయారు చేసింది ఈయనే (వజావ్యతిరీక నాటకాలు, రాజ్యం చేన్తున్న కాలంలో ఇ రయరైం 38
చబామాదాద్ బీల్లాలో నాటకరంగం గీతం - వర్రమానం. (ప్రజాకళామండలిని స్థాపించారు. జనజీవిత కళా రూపాలు ప్రదర్శించి జనంలోకి వెళ్ళారు. వీధి నాటకాలు ద్వారా ప్రజాసమస్యల్ని చిత్రించారు. “మట్టా లాంటి వీధి నాటకాన్ని రాసి, ప్రదర్శించిన కృషి ఆరెట్టిది” (నిజామాబాద్ జిల్లాసాహిత్యం - గిరి నాగభూషణం, ఆరెట్టి నారాయణ, ఆర్నూరుకు చెందిన భాశెట్టి నాగభూషణంతో కలిసి జోగిని వ్వవస్థ పై 1ప్రత్యూషు అనే చిత్రాన్ని నిర్మించారు. బాశెట్టి నాగభూషణం చనిపోయాడు. ఆసినిమా విడుదలకు నోచుకోలేదు. కె.హన్న్మాండ్లు వ్రాసిన “తెగింపు నాటకం కూడా కొన్ని చోట్ల ప్రదర్శించబడింది. జిల్లాలో 'ప్రదర్శింపబడ్డ ప్రముఖుల సాంఘిక నాటకాలు : ప్రసిద్ధ సాంఘిక నాటకం “రక్తకన్నీరు చూడని ఆతరం నాటక ప్రియులు ఆంధ్ర దేశంలో అరుదుగా కనిపిస్తారు. “తమిళంలో ప్రసిద్ధ రంగస్థల నటుడు యం. ఆర్. రాధా గారి నేతృత్వంలో ప్రదర్శింపబడి అపూర్వ సంచలనం కలిగించిన నాటకం “రక్షకన్నీరు'. ఈ నాటకాన్ని పాలగుమ్మి పద్మరాజు గారు తెలుగులో అనువదించారు. ఆంధ్రదేశ్‌లో కొన్ని వేల సార్లు ప్రదర్శింప బడి రికార్డు స్థాపించిన నాటకం ఇది. ఒక తెలుగు సాంఘిక నాటకం వృత్తి కళాకారుల చేత “టిక్కెట్లి తో ప్రదర్శింపబడి కనక వర్షం కురిపించుకున్న ఘనత “రక్త కన్నీరుకే దక్కుతుంది.” (ఆధునిక తెలుగు నాటకం - మొదటి భాగం - గండవరపు సుబ్బరామిరెడ్డి) ఈ నాటకాన్ని నాగభూషణం గారు నిజామాబాద్‌లో రెండు సార్లు బోధన్‌లో ఒకసారి ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ప్రముఖ నాటక ప్రయోక్త, దర్శకుడు ఎ.ఆర్. కృష్ణగారి సారధ్యంలో శాకుంతలం, ప్రముఖ రంగస్థల సినీ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల గారి నిర్వహణలో “మానాన్న కావాలి" నాటకం ప్రదర్శించబడ్డాయి. ఆంధ్రనాటక రంగంపై ఎంతో శ్రద్ధాసక్తులు కనబరచిన లబ్ధిప్రతిష్టులు సర్వ శ్రీడా! పోణంగి శ్రీరామ అప్పారావు, యగ్రంనేని చంద్రమౌళి, గోపాల చక్రవర్తి తదితరులు క రాధను వు
"జామాబాద్ ఉల్తాలోనాటకరంస్ం గీతం - నర్రమాసీం ఖు నిజామాబాద్ పట్టణానికి విచ్చేసి నాటకరంగం పై ఉపన్యాసాలు ఇచ్చారు. ఇటీవలి కాలంలో సర్వ శ్రీ జె.వి. సోమయాజులు, జె.వి. రమణమూర్తి, కాకరాల, చాట్ల శ్రీరాములు, కప్పగంతుల మల్లిఖార్జునరావు, ఎన్. ఆర్. నంది, డియస్.ఎన్. మూర్తి గుంటూరు శోస్తి, లింగరాజుశర్మ సుబ్బరాయ శర్మ డా అక్మిరాజు సుందరరామకృష్ణ డా॥ముదిగొండ శివప్రసాద్, డా! కె.రాజన్న శాస్త్రి, డా తిరుమల శ్రీనివాసాచార్య డా॥కొట్టే వెంకటాచార్యులు, అయ్యదేవర పురుషోత్తమ రావు తదితర నాటకరంగ ప్రముఖలు జిల్లాకు విచ్చేసి తమ అనుభవాల్ని జిల్లా కళాకారులతో పంచుకున్నారు. జిల్లాలోని ఇతరప్రాంతాల్లో సాంఘిక నాటకం పట్ల జరిగిన కృషి :
జిల్లా కేంద్రం వెలుపల సాంఘిక నాటకం దిశలో జరిగిన, జరుగుతున్న కృషి స్వల్చమేనని చెప్పుకోవాలి. జిల్లాలోని ప్రధానమైన పట్టణాలు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌లలో జరిగిన కృషి బహుస్వల్బం. కామారెడ్డి మంచి వ్యాపార కేంద్రం. డిగ్రీ కళాశాల, ప్రాచ్యకళాశాల వున్నాయి. పేరున్న కవులు, రచయితలు, సంస్కృత పండితులు ఉన్నారు. సాహితీ సేవ చేస్తున్న కొన్ని సంస్థలున్నాయి. కళపట్ల మక్కువ వున్న కళాభిమానులకు కొదవలేదు. అయినా నాటకరంగం పట్ల కృషి జరుపుతున్న వాళ్ళెవరూ లేరనే చెప్పుకోవాలి. సాహితీ గోపష్టులు, కవి సమ్మేళనాలు, పుస్తకా విష్మరణలూ పెద్ద ఎత్తున జరిగే ఈ పట్టణంలో ఒక్క నాటక సమాజం లేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజామాబాద్ లోని తన్మయీ ఆర్ట్స్ ధియేటర్ కార్యదర్శి సుదర్శన్ ఉద్యోగ రీత్యా కామారెడ్డి టెలిఫోన్స్‌లో పనిచేసినప్పుడు, తన సహచరులతో కొన్ని నాటకాలు ఆడినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన నిజామాబాద్ వెళ్ళడంతో ఆ ముచ్చటా ముగిసింది. ప్రస్తుతం, టెలిఫోన్స్‌లో పని చేస్తున్న దక్షణామూర్తి -బందె ఆలీ ప్రభ్యుతులు 'సాయి కళానమితి పేరుతో ఒక సంస్థను నడుపుతున్నారు. కానీ ఆ సంస్థ ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే శ్రవ్య ఇ రారన్టం 40
__గభమాబాద్ ఉల్లాలో నాటకరంగం గం - నర్రమానం
నాటకాలకే పరిమితమైంది.
పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ వారు కూడా వాళ్ళకు చేతనైనంత కళాసేవ చేస్తున్నారు. ఈ సంస్థ కొన్ని రేడియో నాటికల్ని ఆకాశవాణి ద్వారా నిర్వహించింది. నిజామాబాద్ డివిజన్ పోస్టల్ డిపార్టుమెంటు వారి ఆధ్వర్యంలో “మధ్యతరగతి మందహాసం?” అనే నాటికను 1995 నవంబరు 14వ తేదిన ఢిల్లీలో జరిగిన పదవ జాతీయ తపాలా సాంస్కృతికోత్సవంలో ప్రదర్శించారు. ఈ నాటికను కామారెడ్డి పోస్టాఫీనులో అనిస్టెంటుగా పని చేస్తున్న బాలగేయరచయిత గర్భకుర్తి రాజేంద్ర రాశారు. ఈ నాటికలో రాజేం(ద్రతో పాటు, నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, మధుసూధన రావు, రంగనాధ్, రమాదేవి నటించారు. జిల్లాలోని ఒక కళాసంస్థ, జాతీయస్థాయిలో ఎన్నికై ఢిల్లీలో ప్రదర్శన ఇవ్వడం, జిల్లా కళాకారులందరికీ గర్వకారణం.
బోధన్‌లో (ప్రసిద్ధులైన పౌరాణిక నటులు అప్పుడప్పుడు టిక్కెట్స్ నాటకాలు ప్రదర్శించడం మినహాసాంఘిక నాటకాలు ప్రదర్శించినట్టు తెలియడం లేదు. నాగభూషణం గారు “రక్తకన్నీరు' నాటకాన్ని ప్రదర్శించినట్లు ముందే తెలిపాను. షక్మర్ నగర్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కళాసంస్థ తరుపున కొన్ని సాంఘిక నాటక ప్రదర్శనలు జరిగాయి. ఈ సంస్థ తెలంగాణా స్థాయిలో నాటిక పోటీలు నిర్వపొంచింది. మాజీ ఎమ్ఎల్ఎ, శ్రీ. ఎస్.వి.ఎల్. నరసింహారావు గారి నేతృత్వంలో 'జ్వలిత కళాసమితి” అనే సంస్థ కొంతకాలం పని చేసింది.
ఆర్మూర్‌లో నాటకరంగం పట్ల జరిగిన కృషి అంతంత మాత్రమేనని చెప్పుకోవాలి. ఎ.సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఒక సాహితీ సంస్థ కొన్నాళ్ళు సాహితీ కార్యక్రమాలు ప్రదర్శించింది. కానీ వారు నాటక రంగం వైపు దృష్టి సారించలేదు. సూర్యప్రకాష్ సోదరుడు, నిజామాబాద్ గీతకళాసమితి సభ్యుడు చంద్ర ప్రకాష్ ఆర్బూరు పరిసరప్రాంతాల్లో కొన్ని చోట్ల సాంఘిక నాటకాలు
కె రాధను మ!
ప్రదర్శించారు. చిందు భాగవతానికి జాతీయ న్థాయిలో గుర్తింపు తేవడానికి కృషిచేసిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత మాడవేది నారాయణ, నాట్యరంగంలో కొంత కృషి చేసిన కొండప్ప మోహన్, తదితర కళాకారులు ఈ పట్టణంలో వున్నా వీరెవరూ నాటకరంగం వైపు దృష్టిసారించక పోవడం వల్ల, ఆర్మూర్‌లో నాటకరంగం శైశవావస్థలోనే ఉండిపోయింది. మాడవేది నారాయణ గారు పాతిక సంవత్సరాల క్రితం తమగ్రామంలో “రక్త పిపాసి' తదితర సాంఘిక నాటకాలు ప్రదర్శించినట్లు చెప్పారు. జిల్లాలో పేరున్న మెజీషియన్లలో ఒకరైన రంగనాథ్ నేతృత్వంలో ్రాగ్రెసివ్ ఆర్టిస్ట్ కల్చరల్ క్లబ్ అనే సంస్థ గత ఐదారేళ్లుగా పనిచేస్తున్నా నాటకరంగంలో వారు సాధించిందితక్కువ. స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం సంయుక్తంగా 1994 మార్చిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈ సంస్థ వారు ఈ వ్యాస రచయిత రాసిన “ఎండమావులు నాటిక ప్రదర్శించారు. రంగనాధ్, ఉమేష్మ్ రామచంద్రరావు, ప్రకాష్క్ దామోదర్ రెడ్డి చంద్రకళ, ఈనాటికలో పాత్రధారులు. గతంలో ఎల్ ఐ.సి. కళాకారులు కొన్ని నాటికలు ప్రదర్శించారు. దోమకొండ కు చెందిన కళాకారుడు జి. ఓంప్రకాష్ విద్యార్ధి దశనుండి నాటకాలు రచించడం, ప్రదర్శించడమే గాకుండా, ఎన్నో నాటకాలకు దర్శకత్వం వపొస్తున్నారు. ఆయన రాసిన నాటకాలు జిల్లాలోనే గాకుండా మెదక్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల ప్రదర్శింపబడ్ద్డాయి. జిల్లా ఆర్టీసి కళాబ్బందం ప్రదర్శించిన 'మేరా భారత్ మవాన్' నాటకం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శనగా ఎన్నికైంది. ఈ నాటకాన్ని నిజామాబాద్ ఆర్టీసి డిపో ఉద్యోగి చిన్నయ్య రచించారు. బోధన్ డిపో కండక్టర్ సుదర్శన్ కామారెడ్డి డిపోకండక్టర్ మల్లయ్య, ఆర్మూర్ డిపో పెయింటర్ కరీం, నాగరాజు తదీతరులు ఈ బృంద సభ్యులుగా రాష్ట్రవ్యాప్తంగా 180 ప్రదర్శన లివ్వడం
ప... బామాబాద్ జల్లారో నాటకరంగం గతం- వర్రమూనం జిల్లాకు గర్వకారణం. ఈ బృందం గతంలో “బంద్” అనే నాటికను కూడా విజయవంతంగా (ప్రదర్శించింది.
పోచంపాడు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉద్యోగుల సాంస్కృతిక సంస్థ, పోచంపాడ్ లోనే కాకుండా పరిసరప్రాంతాల్లో కూడా కొన్ని నాటికలు గతంలో ప్రదర్శించినట్లు పోచంపాడుకు చెందిన కళాకారుడు శ్రీఆర్. గంగాధర్ చెప్పారు. ఈయన మంచి హార్బోనిస్టు, డొలక్, క్యాసియో, ప్లూట్ కూడా వాయించగలరు. ఆర్భూర్, బాల్గొండ, శ్రీరాంసాగర్ (ప్రాజెక్టులో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలకు వీరు తన వాద్యసహకారం అందజేస్తుంటారు. ఈయన గతంలో కొన్ని బుర్ర కధలు కూడా చెప్పినట్లు తెలుస్తున్నది.
నందిపేట్, ఆలూరు తదితర ప్రాంతాలలోని కాన్ని బెత్సాహిక సంస్థలు గతంలో పూలరంగడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, రక్తజ్వాల తదితర సాంఘిక నాటకాలు ప్రదర్శించినట్లు అక్కడి కళాకారులు కొందరు చెప్పారు. (శవ్యనాటకం - ఆకాశవాణి కృషి;
1989 సెప్టెంబరు 6వ తేదీ నుండి నిజామాబాద్ లో రేడియో స్టేషన్ (ఎఫ్.ఎమ్) పనిచేస్తున్నది. ఆనాటి నుంచి నాటకరంగం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నది. శ్రీ గొల్లపూడి మారుతీరావు గారన్నట్లు “మన దేశంలో రేడియో నాటికకు వయస్సుతక్కున. ఇదొక ప్రత్యేకమైన 'మీడియం'గా చేపట్టి, ప్రతిభను గడించిన వారులేరు. అధవావున్నా వేళ్ళమీద లెక్కపెట్ట గలిగినంతమంది కనిపిస్తారు. మిగతా వాళ్ళంతా దృశ్యనాటకాలు వ్రాసి - ఆదే కలంతో దాదాపు అదే ధోరణిలో రేడియో నాటికలు రాశారు. ఇప్పటికీ అదే జరుగుతుంది” (దృశ్య (థ్రవ్యనాటికలు - గొల్లపూడి మారుతీ రావు). అయితే ఈ జిల్లాలో దృశ్యనాటకాలు వ్రాసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు. ఇక్కడి రచయితలకు, నటులకు శ్రవ్యనాటిక కొత్తప్రక్రియే. అయితే, తేడియో నాటకాలు ప్రసారం చేయడంలో, రచనలో, అనుభవమున్న ఆకాశవాణి,
ాత్తాంలంంనా తంల విజయవాడ, ఉద్యోగులు రూన్సీ కె.వి. కుమారి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ తదితరులు నిజామాబాద్ కేంద్రానికి బదిలీపై రావడంతో, జిల్లా రచయితలకు, నటులకు కొంత మేలు జరిగింది. ఇక్కడి కళాకారులకు వీరు కొంత తర్చీదు ఇవ్వగలిగారు. విజయవాడ కేంద్రాలలో చాలా కాలం డ్రామా విభాగంలో పని చేసిన నల్లూరి బాబురావు గారు సాంఘిక నాటికలను, వై. రాఘవులు గారు రంగస్థలి కార్యక్రమాలను పర్వవేక్షిస్తూ, జిల్లా కళాకారులకు స్పూర్తిని
కలిగించారు.
రేడియోస్టేషన్ ఆవిర్భావంతో ఎందరో నూతన రచయితలు, కళాకారులు తయరయ్యారు. శ్రవ్యనాటికల్ని నిర్వహించడానికే జిల్లాలో కొన్ని కళా సంస్థలు వెలిశాయి. తన్మయీ ఆర్ట్స్, లింగం మెమోరియల్ ఆర్ట్స్, ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ కల్చరల్ క్లబ్స్ కల్పనా క్రియేషన్స్, కళాసమితి, ఒకటేమిటి, 1990 నుంచి జిల్లాలో పుట్టిన కళాసంస్థలన్నీ ఆకాశవాణి జెరస పుత్రికలే, (శ్రవ్యనాటికల్ని ఎక్కువగా జిల్లా ప్రజలకు విన్చించిన సంస్థల్లో, పై సంస్థలతోపాటు, మురళీ కృష్ణ కళానిలయం, గౌతమీ కళాసమితి, లలిత కళాతరంగిణి నాట్యమండలి ముఖ్యమైనవి. రేడియో నాటికలు వ్రాసిన వాళ్ళలో సరోజ, కొడాలి లక్ష్మి రూన్సీ కె.వి. కుమారి పుండరీకాక్షరావు, చావలికృష్ణమూర్తి, రవీందర్ రాజు, సుదర్శన్, సుదర్శన వర్మ, వర్ని లక్ష్మణరావు, గర్సకుర్తి రాజేంద్ర, కొల్లు రంగారావు, సూరారం శంకర్, సైబ పరంధాములు ('ప్రభ్యృుతులు ముఖ్యులు. (శవ్యనాటికల్చి నాటకాల్ని ప్రసారం చేయడం ఆకాశవాణి [ప్రాధమిక భాధ్యతల్లో ఒకటి. అయితే దృశ్యనాటకానికి కూడా అంతే (ప్రాధాన్యత ఇవ్వడం నిజామాబాద్ ఆకాశవాణి ప్రత్యేకత. అందుకు స్టేషన్ అసిస్టెంటు దైరక్టర్ పాండురంగారావు గారిని అభినందించాలి. ఈయన ఆ కేంద్రానికి వచ్చినప్పటి నుండి చాలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 1995,1996 సంవత్సరాల్లో ప్రపంచ రంగస్థల దినోత్సవాలు నిర్వహించారు, విజయవాడ, హైదరాబాద్
కతన న నాం
ననన క నా
లాలా దామాబాద్ చల్లాలో నాటకరంగం గరం - వర్తమానం తెనాలి నుండి రంగస్థల కళాకారుల్ని రప్పించి, జనరంజకమైన పప్రదర్శనలిప్పించి జిల్లా కళాకారులకు స్ఫూర్తిని, ప్రేక్షక లోకానికి ఆనందాన్ని కలగజేశారు. ఆకాశవాణి ఏర్పాటు చేసిన రంగస్థల కార్యక్రమాలను కాలక్రమణిక లో తెలియ జేస్తాను.
౩-1-1995 తేదిన కామారెడ్డి లో 'సంక్రాంతిహేలి కార్యక్రమాన్ని నిర్వహించారు. లలిత సంగీతం, జానపద సంగీతంతో పాటు ఆదివిష్ణు రచించిన నాటిక 'అతిధి దేవుళ్ళొస్తున్నారు జాగ్రత్త ప్రదర్శింపబడింది - సమర్పించిన వారు తన్మయి ఆర్ట్స్ ధియేటర్, నిజామాబాద్.
4-3-1995 తేదిన ఆర్మూరులో స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారి సహకారంతో ఎయిడ్స్ వ్యాధి పై సెమినార్ నిర్వహించారు. తదనంతరం “ఎండమావులు” నాటిక, “శ్రీకృష్ణ రాయబారం” నుండి ఒక మట్టాన్ని ప్రదర్శించారు.
1995 మార్చి 27,28 తేదిల్లో జరిగిన ప్రధమ రంగస్థల దినోత్సవాల సందర్భంగా, నిజామాబాద్ బాల భవన్ లో విజయవాడ కళాకారులు “పండగొచ్చింది” నాటిక ప్రదర్శించారు. గౌతమి కళాసమితి 'ఛత్ర పతి శివాజీ” లింగం మెమోరియల్ ఆర్ట్స్ “రాంపండు”, తన్మయీ ఆర్ట్స్ “కన్యాశుల్కం” లోని ఒక ఘట్టం, లలిత కళాతరంగిణి “శ్రీ కృష్ణ్ణాయబారం' లోని ఒక ఘట్టం ప్రదర్శించాయి హైదరాబాదుకు చెందిన అయ్యదేవర పురుషాత్తమ రావు, కొట్టే వెంకటాచార్యులు “కర్ణసంవాదరి ఘట్టాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, ప్రయోక్త చాట్ల శ్రీరాములు గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఆకాశవాణి వార్షికోత్సవం సందర్భంగా 1995, సెప్టెంబరు 6వ తేదిన జరిగిన కార్యక్రమం లో నగరనట సమాఖ్య చే 'వరుడుకావాలి' నాటిక (ప్రదర్శితమైంది ప్రముఖరంగ స్థలనటులు వేమూరి రామయ్య బృందంచే
క రాష్ట్రల శీ5్
“మహారధి కర్ణ నాటకం (ప్రదర్శింప బడింది. ఈ కార్యక్రమానికి, సుప్రసిద్ద నాటక సినీ రచయిత ఆదివిష్ణు, శ్రవ్యనాటకాలతో (శ్రోతల్ని నాలుగు దశాబ్దాల పాటు అలరించిన శ్రీమతి శారదా శ్రీనివాసన్ అతిధులుగా విచ్చేసి తమ అమూల్య సందేశాల్ని అందించారు.
1996 జనవరి 8వ తేదిన సంక్రాంతి సందర్భంగా ఎల్లారెడ్డిలో ఆకాశవాణి, స్థానిక కళాసంస్థ సాహిత్య తరంగిణి నిర్వహించిన కార్యక్రమంలో “భువన విజయం” సాహితీ కార్యక్రమాన్ని హైదరాబాదుకు చెందిన కళాకారులు ఆద్యంతం రక్తి కట్టించారు. 'శ్రీరామాంజనేయ యుద్ధం' లోని యుద్ద ఘట్టాన్ని ప్రదర్శించారు. ఇందులో శ్రీరామునిగా కె. రాఘవులు(వ్యాసరచయిత) ఆంజనేయుడిగా రవిరాజ్ నటించారు.
1996 లో మార్చి 16న “ఉగాది పచ్చడి” కార్యక్రమం నిజామాబాద్ బాలభవన్‌లో జరిగింది. భమిడిపాటి రాధాకృష్ణ గారి 'మనస్తత్వాలు నాటికను విజయవాడ కళాకారులు మనోజ్ఞంగా ప్రదర్శించారు. “గయోపాఖ్యానం నాటకం లోని యుద్దఘట్టాన్ని కె.నూకారావు, జి. వెంకటేశ్వర రావు ప్రదర్శించారు.
ఆకాశవాణి హైదరాబాద్, నిజామాబాద్ కేంద్రాల సంయుక్త నిర్వహణలో, నిజామాబాద్ బాలభవన్‌లో, 1996 మార్చి 27వ తేదిన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆరోజు ఉదయం “రంగస్థల నాటకం -
(శ్రవ్యనాటకం' అనే అంశం పై సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిధిగా నాటకరచయిత, విమర్శకుడు శ్రీ కప్పగంతుల మల్లిఖార్జున రావు విచ్చేశారు. ప్రత్యేకాహ్వానితులుగా సర్వశ్రీచాట్ల శ్రీరాములు, గుంటూరు శాస్త్రి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ విచ్చేశారు, సదస్సు ఎంతో స్ఫూర్తి దాయకంగా సాగింది. స్థానిక నాటక సమాజాలకు చెందిన కళాకారులు, ఎంతో ఉత్సాహంగా సదస్సులో పాల్గొన్నారు. ఆ రోజు రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య
లాన్ లోటుంణ నా - పంద
అతిధిగా నాటక సినీ రచయిత దివాకర్ బాబు విచ్చేశారు. మురళీ కృష్ణ కళానిలయం వారిచే “పోస్టుమార్టం? గౌతమ కళాసమితి వారిచే 'ఫిప్టీ-ఫిప్టీ, హైదరాబాదు ఆకాశవాణి కళాకారులచే “చెప్పుడు మాటలు, తన్మయి ఆర్ట్స్ వారిచే “సావిత్రి సవాల్, విద్యా నగర్ కల్చరల్ అసోసియేషన్ వారిచే “చరమాంకం” నాటికలు ప్రదర్శింప బడ్డాయి.
ఆకాశవాణి నాటకోత్సవాల సందర్భంగా 1996 ఏప్రియల్స్ మూడవ తేదిన ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం ద్వారా నల్లూరి బాబూరావు నిర్వహణలో గాజులపర్తి రాజారావు రచించిన 'పరివర్తని నాటకం ప్రసారమైంది. రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని “6లే చేశాయి. జోగినీ వ్యవస్థ పై రాసిన ఈ నాటకంలో రూూన్సీ, కె.వి. కుమారి, శకుంతల, పద్మసాక్ష్మి మధుకర్, దత్తాత్రేయులు, సుదర్శన వర్మ, రాజబాబు,పాండురంగ, రంగస్వామి, (ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నాటకం శోతల్ని ఆకట్టుకుంది.
నాకున్న పరిమిత జ్ఞానంతో జిల్లా నాటకరంగాన్ని సమీక్షించే సాహసం చేశాను. ముందే విన్నవించినట్లు ఈ పరిశోధన సమగ్రమైంది కాదు. అయినా ఉన్నంతలో నా దృష్టికి వచ్చిన అంశాలన్నింటినీ ఘీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పటి వరకు నేను మీ ముందుంచింది జిల్లాలో జరిగిన నాటక ప్రదర్శనలపై సవివరమైన రిపోర్టు మాత్రమే. ఈ మూడేళ్ళలో, నేను చూసిన నాటకరంగాన్ని దృష్టిలో వుంచుకొని, జిల్లా కళాకారులతో నాకున్న అనుబంధాన్ని మననం చేసుకుంటూ,సంబంధిత ప్రభత్వసంస్థలు నాటక రంగానికిస్తున్న ప్రోత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, నా అభిప్రాయాన్ని మీ ముందుంచే, (ప్రయత్నం చేస్తాను.
- ఆది నుంచి జిల్లాలో నాటకరంగం పట్ల అభిరుచి, శ్రద్ధా తక్కువే. కళల పట్ల అవగాహన అభిరుచి ఉన్నవాళ్ళే కళల్ని పోషిస్తారనేది జగమెరిగిన సత్యం.
వరుల లాడ
ాహావచ్యరోనటకందు తంవ్తకూటు యా తెలంగాణాలోని చిన్నచిన్న సంస్థానాధీశులు, దొరలు, ప్రజల్ని తమచెప్పుచేతట్లో ఉంచుకోవడం లో చూపిన చొరవ, (శ్రద్ధ వారి బాగోగులు పట్టించుకొవడంలో చూపలేదు. అంటే మిగతా ప్రాంతాల్లోని పాలకులు ప్రజల్ని పువ్వుల్లో పెట్టిచూసుకున్నారనీ, వాళ్ళ కష్టాల్ని కన్పీటిని తుడిచేశారని నా అభిప్రాయం కాదు. తెలంగాణా (ప్రజల పట్ల పాలకులు చూపిన నిర్లక్ష్య వైఖరి, కానసాగించిన దోపిడి, రాష్ట్రంలో మరేప్రాంతంలో కొనసాగలేదని నా భావన. అందుకే ఈ ప్రాంతంలో 'నీ బాంచను కాల్గ్మొక్త అనే పదం జన జీవన స్రవంతిలో అంతర్భాగమై. పోయింది. బానిస శృంఖలాల్లో మగ్గిన బడుగు జీవులకు ఒకింత ఊపిరి పిల్చుకునే అవకాశమే దొరకలేదేమోననిపిస్తుంది. ఎంతో కొంత వెసులుబాటు దొరికిన వాళ్ళకూ, భయమన్నదిలేని వాళ్ళకే గదా కథలూ, కాలక్షేపాలూ, నవ్వులూ, నాటకాలు. అందుకే “నాటకం” ఈ జిల్లాలో వృద్ధిచెందలేదు. తెలుగు నాటక రంగం వయసు నూటపదహారేళ్ళయితే, జిల్లా నాటకరంగం వయసు ముప్పయి సంవత్సరాలని అందుకే అన్నారు. 2) నాటకం సమష్టికళ, నలుగురు ఒక చోట కూదాలి. వాళ్ళ అభిప్రాయాలు కలవాలి. అందర్ని ఒక బాటన నడిపే నిర్ధేశకుడు కావాలి, రంగస్థలం పై ప్రదర్శన జరిగేంత వరకూ విరామం లేకుంధా రిహార్సలు జరగాలి. మధ్యలో ఏ నటుడు జారిపోయినా కథమాములే 'రెడ్డొచ్చెమొదలాడు' అన్న సామెత మనకు ఉండనే వుంది. మిగిలిన కళాప్రక్రియలు అలాకాదు వ్యష్టి తత్వం రాజ్యమేలుతుందక్కడ. కవికి “కుదుపు వస్తే కవిత్వం రాస్తాడు. ఎదురొచ్చిన వాడ్ని నిలేసి తన భావావేశాన్ని వినిపిస్తాడు. ఊహలు ఉక్కిరి బిక్కిరి చేస్తే చిత్రకారుడు కుంచెపట్టు కుంటాడు. రంగుల ప్రపంచంలోకి శరవేగంతో దూసుకుపోతాడు. మనసు పులకరిస్తే పరిసరాల్నే మరిచిపోయి ప్రణవనాదం పుట్టిస్తాడు గాయకుడు కానీ నటుడికి అలాసాధ్యం కాదు. కారణం నాటకం కనన య డక
సకల కళల సమహారం. సమిష్టిగా చేయవలసిన కృషి జనం ఇక్కడ సమిష్టిగా కలవలేక పోయారు అందుకే జిల్లాలో నాటకరంగం వెనకబడి పోయింది. 8) జిల్లాలో కాస్తో కూస్తో నాటకం పట్ల అభిరుచి వున్న వాళ్ళు వృత్తి నటులు కాదు. బెత్సాహిక నటులు. తమ ఉద్యోగాల్ని వ్యాపారాల్ని చూసుకుంటూ నాటకాలు వేయడం వల్ల పూర్తి సమయం కేటాయించడం వారికి సాధ్యపడదు. ఆటవిడువుగా నాటకలాడ్డమే తప్ప, అదొక ఉద్యమంగా కొనసాగించడం దుర్లభమైపోయింది. పైగా ఒక సమాజంలోని ముఖ్యనటులు ఉద్యోగ రీత్యా బదిలీ అయినప్పుడు, ప్రత్యామ్నాయంగా వేరే మంచి నటులు లేక పోవడంతో ఎన్నో బెత్సాహిక నాటక సంస్థలు మరుగున పడ్డాయి. స్వంత దబ్బుతో నాటకాలాడటం ఎంతటి సంపన్న నటుడికైనా బరువే. మైలవరం జమీందారు లాంటి మహామహుల్నే నాటకరంగం ఆర్పేసింది. ఇక మామూలు మనుషు లేపాటి? ఒకటి రెండు నాటకాలకే చేతి ఉంగరాలు, గడియారాలు అమ్ముకున్న నటుల్ని చూసి ఏ బెత్సాహికుడూ ముందుకు రాక పోవడం నాటకానికి వెనకడుగే.
-
పౌరాణిక నాటకానికి ముఖ్య వాయిద్యం హార్మోనియం అన్నది జగమెరిగిన సత్యం. జిల్లా కేంద్రంలోగానీ, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోగానీ, చేయితిరిగిన హర్మోనిష్టులేడు. దూర ప్రాంతాల నుండి హర్మోనిష్టును రప్పించి, అతనిని పోషించే న్స్తిలో నమాజాలు లేవు. న్వంత వోర్మోనిచ్చును సమకూర్చుకోలేకపోతున్న లలిత కళా తరంగిణి వారు పడుతున్నపాట్లు వర్జనాతీతం.
-
జిల్లాలో డ్రామాడ్రస్ కంపెనీ ఒక్కటి కూడా లేదు. సొంఘిక నాటకాలకు
క రధులైలు 49
ఆహార్యం సమకూరుస్తున్న మేకప్ మెన్ల వద్ద పౌరాణిక నాటకాలకవసరమైన (డ్రెస్సులు సెట్టింగులు, తదితర సరంజామాలేదు. విధిగా హైదరాబాదు నుండి తెప్పించు కోవాలి. అక్కడి రేట్లు బెత్సాహిక కళాకారులకు అందుబాటులో లేవు. అందుకే నాటకాలు వేయడానికి ఎవరూ సాహసించడం లేదు. 6) జిల్లాలో నటీమణులు లేకపొవడం నాటకరంగానికి పెద్దదెబ్బ. హైదరాబాదు, విజయవాడ లాంటి దూరప్రాంతాలనుండి నటీమణుల్ని రప్పించడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. రంగస్థలానికనువైన రూపం, చక్కని అభినయం, వినసొంపైన వాచికం ఉన్న నటీమణి ఒక్కరైనా స్థానికంగా వుండి ఉంటే, జిల్లాలో నాటక రంగం మరింత వృద్ధిచెంది వుండేది. 7) రాష్ట్రంలో నాటక కళ ఉచ్చదశలో ఉన్నప్పుడు 'ప్రతిచిన్న పట్టణంలోనూ అన్ని హంగులతో నాటక శాలలుండేవట. సినిమాలు రాగానే నాటక శాలలన్నీ సినిమాహాళ్ళగా తీర్చిదిద్దబడ్దాయి. ఈ నాడు నాటకాలు వేయడానికి అనువైన వేదికలే కరువయ్యాయి. నిజామాబాద్ పట్టణాన్ని తీసుకుంటే నాటకానికి అనువైన ప్రదర్శన శాలలు రెండే రెండు ఒకటి జవహర్ బాలభవన్, రెండోది రాజీవ్ అడిటోరియం. ఉన్నంతలో బాలభవనే మెరుగు. 010566 &46110- 147) కాకపోవడమే దానికున్న లోపం. బాలభవన్‌లో రంగాలంకరణ ఖర్చుతో కూడుకున్నపని. కోస్తాజిల్లాలతో పోల్చితే, ఇక్కడ మైక్ లైటింగ్ ఖర్చులుభారీగా ఉన్నాయి. ఆర్భూరులో రెండు గంటల వ్యవధిలో ఒక మీటింగ్, మరోచిన్న నాటిక ప్రదర్శించడానికి, కేవలం మైక్ & లైటింగ్‌కు రెండు వేల రూపాయలు డిమాండ్ చేస్తే మాకు మతిపోయింది. ఇంత భారీ ఖర్చుతో నాటకం ప్రదర్శించే బెత్సాహిక కళాకారులకు మామూలు గుండెలు కాదు మరగుండెలుండాలి. రాజీవ్ ఆడిటోరియం ఇంకా పూర్తిగా ముస్తాబు కాలేదు. వలం ర్
న్ నిజామాబాద్ జిల్లాలో నాటకీరంగీం గీరీం - పీర్రసూసీం
- సినిమా, టి.వి. రంగాలు నాటకాన్ని చావుదెబ్బ తీస్తున్నాయనేది తిరుగులేని సత్యం. ఒకనాడు నాటకరంగానికి పట్టుగొమ్మలైన తౌనాల్సి విజయవాద గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు లాంటి పట్టణాల్లో సైతం నాటకాల్ని చూసే (పేక్షకులు కరువయ్యారంటే నాటక రంగానికి పట్టిన దుస్థితిని అర్దంచేసుకోవచ్చు. పేక్షకులు లేందే ఎవరి కోసం నాటకం వెయ్యాలి? మరి నాటకాన్ని చూసేందుకు ఆ ప్రేక్షకుల్ని ఎలారప్పించాలి? అందుకు (ప్రేక్షక సమాజాలు మినహా వేరే గత్యంతరం లేదన్నారు ప్రసిద్ధ నటులు కీ.శే. రామ చంద్ర కాశ్యప గారు. వారి మాటల్లోనే చెప్పాలంటే “నాటక కళ అనే మహావ్బక్షానికి తల్లివేళ్ళు (ప్రేక్షకులు. నాటక కళను పోషించేది సంరక్షించేది వారే! (పేక్షకుల ఆదరణననుసరించే నాటకకళ వికాసం ఆధారపడి వుంటుంది. నాటక కళకు సంబంధించిన ఏ పధకాన్ని ఆలోచించినా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొనే ఆ పధకాన్ని అమలుచేయాలి. షేక్ స్పియర్ అంతటి వాడు, ప్రదర్శనల కోసం, అంటే పేక్షకులకోసం నాటకాలు రాశాడు. ప్రేక్షకులు కావాలి. దానికి (ప్రేక్షక సమాజాలను ప్రతి పట్టణంలోనూ స్థాపించడానికి పధకాన్ని రూపొందించడమే తక్షణ కర్తవ్యం” (రామచంద్ర కాశ్యప గారి వ్యాసం - ప్రేక్షక సమాజాలు) నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు లాంటి పట్టణాల్లో అలాంటి (ప్రేక్షక సమాజాలు ఏర్పడాలి. అందుకోసం నాటక సమాజాలు కృషిచేస్తే కొంత ప్రయోజనం వుంటుంది:
- ఆంధ్ర దేశంలో నాటకం ఈ మాత్రమైనా ఈసురోమని కాళ్ళీడిస్తున్నదంటే అదంతా పరిషత్తుల పుణ్యమే. గండవరం సుబ్బరామిరెడ్డి గారిచ్చిన జాబితా ప్రకారం ఒకనాడు రాష్ట్రంలో 106 పరిషత్తులు పోటీలు నిర్వహించేవి. అవన్నీ అన్ని హంగులున్న పరిషత్‌లే. ఇవిగాక అధమం -మరోయాఖై చిన్నా చితక
క ౯్రైలైలు క్ష
ఉ( ఉం గండి న. నళ | ల య.
నిజామాబాద్ ఉల్లాలో నాటకరంగం గీతీం - వత్రమాసీం నాటక సమాజాలు పోటీలు నిర్వహించేవి. కానీ ఈనాడు ఆంధ్రదేశంలో పోటీలు నిర్వహిస్తున్న సమాజాల్ని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. ఎందరో కళాపిపాసులు, వ్యాపార వర్ణాల దగ్గర చందాలు దండి, ఉద్యోగస్థులకు నెలమొదటి వారంలో బలవంతంగా టిక్కెట్లు అంటగట్టీ, ఈ రెండూ కుదరనప్పుడు, వచ్చినవి చాలనప్పుడు, ఎకరమో, రెందెకరాలో కొం(ద్ర అమ్మి లేక ఏ పైవేటు ఫైనాన్సియర్ దగ్గరో తలతాకట్టు పెట్టి, నిత్యం తాము చస్తూ, నాటకాన్ని బ్రతికించడానికి తపన పడ్తున్నారు. అందులో అంతర్భాగం గానే నిజామాబాద్.పట్టణంలో నగర నటసమాఖ్య, మురళీకృష్ణ కళానిలయం, షక్షర్ నగర్‌లోని కళాసంస్థ కొన్నేళ్ళు పోటీలు నిర్వహించారు. కానీ ఇప్పుడు జిల్లాలో ఎక్కడా పోటీలు నిర్వహిస్తున్న జాడలేదు. పోనీ జిల్లాలోని నాటక సమాజాలు గతంలో లాగా ఇతర ప్రాంతాల్లో జరిగే పరిషత్ పోటీల్లో పాల్గొాంటున్నాయా అంటే అదీలేదు. ఎందుకని ఈ పరిస్థితి ఉత్పన్నమయింది. వ్యక్తులు చేయలేని చోట ఆ పనిని సంస్థలు నిర్వహించాలి. సంస్థలు కూడా నిర్వహించలేని చోట ఆ పనిని ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించాలి. మరి ప్రభుత్వ యంత్రాంగం నాటక రంగానికి ఏం మేలు చేస్తున్నదన్నది ప్రశ్న రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ, జిల్లా సాంస్కృతిక వ్యవహార మండలి, జిల్లా పౌరసంబంధాల శాఖ ఈ దిశగా అందిస్తున సహయ సహకారాలు ఏమిటి? ఆ సంస్థలకున్న పరిమితులేమిటి? నాటకరంగానికి చెందిన కళాకారులు ఇలాంటి సంస్థల్ని ఏమేరకు ఉపయోగించుకో గలుగుతున్నారు ? వీటిపైన రంగస్థల కళాకారులకు సరియైన అవగాహన వుండాలి" ప్రభుత్వం నాటకరంగానికి ఏమీ చేయుత నివ్వడంలేదా? లేదని పూర్తిగా చెప్పలేం. బ్రహ్మాండంగా సహాయం చేస్తున్నదని “ఊగ కొట్టనూలేం. ఠీ రమణాచారి గారిలాంటి కళా ప్రియులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టరుగా వున్నప్పుడు జరిగిన కృృషి నాటకరంగానికిచ్చిన ప్రోత్సాహం అంతకుముందుగానీ, ఆ తర్వాత
౩రఘరోాాోోోాాాాాాాాాాాాాాొ 62
లాటకమాదాద్ లల్లాలో నాటకరంగం గతం _ నర్రమానం
గానీ జరుగలేదని నేననటంలో అవాస్తవం లేదనుకుంటాను. పాండురంగారావ గారు ఆకాశవాణి ఉపసంచాలకులుగా ఉన్న ఈ రెండేళ్ళలో నాటకరంగం పట్ల చూపిన శ్రద్ద, మరొక డైరక్టరు చూపక పోవచ్చు. ఆకాశవాణివారు, తమ లక్ష్యంగా ఎంచుకున్న రెండు నాటికల ప్రసారంతో సంతృప్తి చెందవచ్చు. ఇక్కడ రమణాచారిగార్నో పాండురంగారావు గార్నో ఆకాశానికెత్తడం, మరొకర్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. వ్యక్తుల వల్ల సంస్థల రూల్సుమారవు. వదవిలో వున్న వారి అభిరుచిని బట్టి రూల్సును తదనుగుణంగా మార్చుకుపోడానికి అవసరమైతే పై అధికారులతో సంప్రదించి, మార్పులు చేసుకోవడానికి అవకాశం వుంది. నేను చెప్పాచ్చేదేమంటే కళారంగం పట్ల అవగాహన, మక్కువ వున్న వ్యక్తి పదవిలో వుంటే కళారంగానికి కొంత (ప్రోత్సాహం ఇవ్వగలరు. అందుకని కళారంగంతో ప్రత్యక్ష సంబంధం వుండే సాంస్కృతిక వ్యవహారాల శాఖ, పొర సంబంధాల శాఖ, ఆకాశవాణి, టెలివిజన్ లాంటి సంస్థల్లో కళారంగం పట్ల అభిరుచిగల వ్యక్తులు కీలక పదవుల్లో వుండాలి.
కోట్లాది రూపాయల పెట్టు బడితో తీసే సినిమాలకు వివిధ రకాల సబ్సిడీలతో ప్రోత్సాహమిస్తున్న ప్రభుత్వం, వృద్దాప్యంలో జీవచ్చవాలుగా (బ్రతుకుతున్న రంగస్థల కళాకారులకు నెలకో రెండు వందలు వృద్దాప్య ఫించను మంజూరు చేయడానికి ఎంత ఆలోచిస్తున్నది? వాళ్ళనెన్ని ఇబ్బందులు పెడ్తున్నది? అనగనగా ఒక రంగస్థలనటి ఒకప్పుడు ఆమె నాటకాన్ని చూడటానికి బంద్‌లు కట్టు కొనివచ్చే వారట జనం. ఇప్పుడు ఆవిడేం చేస్తున్నరో తెలుసా? వృద్దాప్యంలో ఆదరించే దిక్కులేక అడుక్కుతింటున్నది. ఇదేదో కట్టుకథ కాదు. “ఈటివీ' 'ఆంధ్రావని లో కనిపించిన హృదయ విదారక దృశ్యం. ఈ దృశ్యం చూస్తే ఏ కళాకారుడి కళ్ళ వెంట నీళ్ళు రావు?
నాటకాన్ని బతికిస్తున్న పరిషత్‌లను ప్రభుత్వం ప్రోత్సహించాలి. వారిని ఆర్థికంగా ఆదుకోవాలి. పొందే సహాయం రూపాయలతో ముడి పడి వున్నప్పుడు
కరతి ర3
నిజామాటాద్ జిల్లాలో నాటకరంగం గిం -వర్రమానం ఎన్నిరూపాల్లో మోసాలు జరుగుతాయో ఊహించగలం. నాటక రంగంలో నిష్టాతులైన వారిచే కమిటీ వేయించి. ప్రత్యేక అధ్యయనం జరిపించి, సహాయం పొందే సంస్థలకు అర్హతల్ని నిర్దేశించ వచ్చు. అవసరమైతే పొరుగు రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతుల్లోని మంచిని (గ్రహించి పధకాలు రూపొందించు కోవచ్చు. ఏం జరిగినా, ఎలా జరిగినా, ఒక సజీవమైన కళను అంతరించిపోకుండా చూసుకోవడం కళాకారుల బాధ్యత. నాటక ప్రక్రియ మన పూర్వీకులు మనకందించిన అపురూపమైన వారసత్వం. ఆ వారసత్వాన్ని మనం కాపాడుతూ ముందు తరాల వారి కందించాలి. వారసత్వానికి మరోపేరు సంప్రదాయం. డా॥ సి. నారాయణ రెడ్డి గారన్నట్లు “శారీరక తత్వముపై వంశ పారంపర్య (ప్రభావమెట్టో, సాంఘిక జీవితమున సంప్రదాయము నిర్వహించు పాత్ర గుడా నట్టిదే. గతములోని కొంత భాగమును, ఒక తరము నుండి మరియొక తరమునకు అందజేయుటయే సంప్రదాయము యొక్క కర్తవ్యము.” ఆకాశ వాణి, నిజామాబాద్ కేంద్రం ఉపసంచాలకులు శ్రీ ప్రహరాజు పాండురంగారావు గారితో ఇంటర్వ్యూ: ఆకాశవాణి శ్రోతలకు, నాటక ప్రియులకు 'పాండురంగిగా సుపరిచితులైన పాండురంగారావు గారు ఉద్యోగరీత్యా నిజామాబాద్ పట్టణం వచ్చిన తర్వాత, నిస్తేజంగా వున్న నాటక రంగం కొంత ఊపందుకొంది. జిల్లాలోని కళాకారుల్ని ఒక వేదిక మీదకు తేవడంలోనూ, రాష్ట్రంలోని పలుప్రాంతాల నుండి నాటక రంగంలో నిష్ణాతులైన కళాకారుల్ని జిల్లాకు రప్పించి, వారి కళావైదుష్యాలను జిల్లా ప్రజలకు పరిచయం చేయడంలోనూ ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఆయన అనుభవాలను నాటకరంగం పై ఆయన అభిప్రాయాలను మీ ముందుంచటం నా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాన్సు. వలదాం రడ. వమా ననన
ప్రశ్చ మీకు నాటకరంగం పట్ల అభిరుచి ఎలా కలిగింది? సమాధానం: నేను పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా నర్ధాపూర్ అయినా నా విద్యాభ్యాసమంతా తెనాలి లో జరిగింది. మీకు తెలుసునను కుంటాను. తెనాలి కళలకు పుట్టిల్లు. ఎందరో మహానటుల్ని రంగస్థలానికి, సినిమారంగానికి పరిచయం చేసింది తెనాలి. అంచేత నాకు చిన్నతనం నుండి నాటకాలు చూడ్డం మహాసరదా. నన్ను రంగస్థలానికి పరిచయం చేసినవారు మా గురువు గారు శ్రీ దేనేపూడి రాజారావు గారు. ఆయన ప్రసిద్ధులైన రచయిత. మా హిందీ టీచర్. వి.యస్.ఆర్ కాలేజీలో చదివేప్పుడు నేను మొట్టమొదటి సారిగా “లక్ష్మీకా స్వాగత్” అనే హిందీ నాటికలో నటించి ఆ తర్వాత బెల్లంకొండ రామదాసు గారి 'ఆకాశరామన్న తెలుగు నాటికలో నటించాను. ఆ తర్వాత మిత్రులతో కలిసి తెనాలిలో “భార్గవ (డ్రమెటిక్ అసోసియేషన్” అనే సంస్థ స్థాపించి పినిశెట్టి గారి 'ఆదది? ఇసక పల్లి దక్షిణామూర్తి గారి 'కళాకారులు' మొదలైన నాటికలు ప్రదర్శించాం. నాటకరంగం పట్ల అభిరుచి ఆవిధంగా ఏర్చడింది. ప్రశ్న మీరు పరిషత్తు నాటకాలలో పాల్గొన్నారా? సమాధానం: 1962 నుండి పరిషత్ నాటకాల్లో పాల్గొంటూనే ఉన్నాను. ఉద్యోగ రీత్యా 1962లో హైదరాబాదు వచ్చినప్పుడు ప్రముఖ దర్శకులు, నటులు, ప్రయోక్త శ్రీ ఎ. ఆర్.కృష్ణగారితో పరిచయం ఏర్పడి ఆయన ఆధ్యర్యంలో నడిచిన నాట్య విద్యాలయంలో డిప్లొమా చేశాను. డ్రామాలోని అన్ని విభాగాల్లో అనుభవం సంపాదించాను. ప్రశ్న మీరు ఆకాశవాణి లో ఎప్పుడు చేరారు? ఈ సంస్థలో చేరడం వల్ల మీరు నటుడిగా ప్రత్యేకంగా ఏదైన గుర్తింపు పొందగలిగారా? సమాధానం: నేను ఆకాశవాణి, హైదరాబాదు లో పనిచేశాను. సహజంగా చ్లతభుల్టైటలు న 55
హార ంల్తరూంళంణటంతవట
నిభమాదాద్ ఉిల్హాలో నాటకరంగీం గీతీం - వర్తమానం మనలో నూటికి తొంబైఐదు మందికి వృత్తికి, ప్రవృత్తికి పొంతన కుదరదు. కానీనా అదృష్టంకొద్దీ నా ప్రవృత్తికి సంబంధించిన ఉద్యోగమే దొరికింది. నేను ఆకాశవాణిలో చేరినప్పుడు కీర్తి శేషులు స్థానం నరసింహారావు గారు మాప్రొడ్యూసర్ గా ఉండేవారు. అలాగే. బుచ్చిబాబు గారితో కూడా పనిచేసే భాగ్యం కలిగింది. వారిద్దరి వద్దా నాటకరంగానికి చెందిన మౌలిక సూత్రాలెన్నింటినో నేర్చుకున్నాను. ఆకాశవాణిలో పని చేయడంతో ఎందరో మంచి నటుల సరసన నటించే అవకాశం కలిగింది. పశ్చ నటుడిగా మీకు మంచి పేరు తెచ్చిన పాత్రలేమైనా ఉన్నాయా? సమాధానం: అన్ని పాత్రలూ మంచి పేరు తెచ్చినవే. అయితే “గురజాడ? వారి కన్యాశుల్కం లోని వెంకటేశం పాత్ర నాకెంతో ఇష్టమైనది నాకెంతో పేకు తెచ్చింది. ఎ.ఆర్. కృష్ణగారి సారధ్యంలో మేము ఆ నాటకాన్ని హైదరాబాద్, నాగార్జునసాగర్, ఢిల్లీ మరెన్నో చోట్ల విజయవంతంగా ప్రదర్శించాం. నా పాత్రను పేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు. అబ్బూరి రామకృష్ణారావు గారి దర్శకత్వంలో 'మృచ్ళకటికం” నాటకాన్ని మేమెన్నోసార్లు ప్రదర్శించాము. 1966లో ఢిల్లీలో రాష్ట్రపతి గారి సమక్షంలో ప్రదర్శించాం. నాది 'శకారుడి' బండివాడి పాత్ర నాకెంశ్రో ఇష్టమైన పాత్ర, నాకు మంచి పేరు తెచ్చిన పాత్ర. గిడుతూరి సూర్యం గారు రాసన “గవర్నమెంట్ ఇనస్పెక్టర్” నాటకంలోని నా పాత్రకు ఎన్నో ప్రశంశలొచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి దా॥ మర్రి చెన్నారెడ్డి గారు నా నటనను ఎంతో మెచ్చుకున్నారు.
ప్రశ్న మీరు ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో చాలా సంవత్సరాలు పని చేశారు గదా! అక్కడ నాటకరంగం కృషికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు?
మరలా న 56
లాలా ోయూబాద్ ఉర్తారో నాటకరంగం గతం - వర్తమానం సమాధానం: నాకు నాటకమంటే వల్లమాలిన ప్రీతి, ఆకాశవాణిలో నేను ఎక్కువకాలం డ్రామా డివిజన్‌లోనే పని చేశాను. నాటకరంగం పట్ల నాకున్న అభిరుచి, ఆసక్తి, నా పై అధికారులకు బాగా తెలుసు. అందుకే ఆ బాధ్యతలు నాకప్పగించేవారు. వాళ్ళు నాపై ఉంచిన నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము చేయలేదు. వాళ్ళ అంచనాలకు అనుగుణంగా నాటికల్ని నాటకాల్ని ప్రొడ్యూస్ చేసేవాణ్ణి. ప్రశ్న నాటక రంగంలో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి గదా! ముఖ్యంగా పోటీ నాటకాల్లో చూపిస్తున్నటెక్సిక్, రంగాలంకరణ వగైరా... మీరు ఎలాంటి ప్రయోగాలు చేసేవారు. సమాదానం: (కొంచెం సేపు అలోచించి) ప్రయోగాలు ఇవీ అని ఇదమిద్దంగా చెప్పలేను. నాటికను బట్టి టెక్నిక్ అది సందర్భోచితంగా మారుతుంటుంది. ఏ ప్రయోగం చేసినా పేక్షకుల్ని ఆకట్టుకునేదిగా, వారికి మనం చెప్పవలసినది అర్ధం కావాలి. మేము విజయవాడలో ప్రప్రధమంగా హాస్యకదంబం ప్రక్రియను ప్రదర్శించాము. ప్రేక్షకులు, విశేషంగా ఆదరించారు. నేనూ, సుత్తి వీరభద్రరావు, లింగరాజుశర్మ, విన్నకోట విజయరాం, మరెందరో ఆకాశవాణి కళాకారులు ఈ వాస్యకదంబంలో పాల్గొన్నాం. ఆ వినూత్న ప్రక్రియను ఈ నాడు ఎందరో కళాకారులు విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. ప్రశ్న మీరు ఎలాంటి నాటకాల్ని ఇష్టపడతారు? పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో దేనిలో నటించటం కష్టం? సమాదానం: నేను అన్నిరకాల నాటకాల్నీ ఇష్టపడతాను. నేను ఎక్కువగా నటించింది సొంఘిక నాటకొలే అయినా, పౌరాణిక, చారిత్ర నాటకాల్ని కూడా ఎంతో ఇష్టపడతాను. కానీ నాకు హాస్య నాటకాలు, నాటికలంటే ఎంతో వసన క న్ ఇలా!
ూనూాద్ లాలో నాటకరంగం గతం -నత్రమనం ఇష్టం. ఇహ నటించే విషయానికొస్తే ఏనాటకమైనా ఒకటే. కానీ పొరాణిక, చారిత్ర నాటకాలకు కొన్ని ప్రత్యేకమైన హంగులుంటాయి, పౌరాణిక నటుడికి శ్రావ్యమైన గాత్రముండాలి, భాషమీద మంచి అవగాహన వుండాలి ప్రశ్చః నిజామాబాద్ జిల్లాలో నాటకరంగం వెనకబడిపోవదానికి ప్రత్యేకమైన కారణాలేమిటి? నాటకరంగం అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి ఏమిటి? సమాధానం: ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు ఆంధ్ర దేశమంతటిలోను ఈనాడు నాటకరంగం నత్తనడక నడుస్తుంది. అందుకు కారణాలనేకం. ఇహ నిజామాబాద్ జిల్లా పరిస్థితి నాకు తెలిసినంతవరకు ఇక్కడ నాటకరంగం మహోన్నత స్థితిలో ఏనాడు లేదు. అయితే నాటకాన్ని బ్రతికించడానికి ఎందరో కళాకారులు, సంస్థలు తమవంతు కృషిచేస్తూనే ఉన్నారు. ఈ రెండేళ్ళలో కళాకారులందర్నీ ఒక వేదికపైకి తెచ్చి వాళ్ళకు స్ఫూర్తి నిచ్చేందుకు ఆకాశవాణి ద్వారా నేను కొంత ప్రయత్నించాను. కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాను. ఇక్కడ (ప్రతిభ వున్న నటులెందరో ఉన్నారు. వారినందర్నీ సరీగా ఉపయోగించుకుంటే ఎన్నో మంచి ప్రదర్శనలను ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇక్కదెనరూ లేడీ ఆర్టిస్టులు లేక పొవడం చాలా ఇబ్బందికరంగా వుంది. టెక్నీషియన్ల కొరత కూడా కొట్టొచ్చినట్లు కనపడుతోంది. వీటన్నిటికంటే ముఖ్యమైంది ప్రదర్శనలకు ప్రేక్షకుల్ని రాబట్టుకోవడం.
ప్రశ్నః (పేక్షకుల్ని ఎలా రాబట్టుకోవాలంటారు?
సమాదానం: (ప్రదర్శనలు రసవత్తరంగా ఉండాలి. ప్రదర్శనలో కొత్తదనం ఉండాలి. కళాకారుల్లో (క్రమశిక్షణ ఉండాలి. ప్రేక్షక నమాజాలు
ఏర్పాటుచేయడం వల్ల తమిళనాడు, మహారాష్ట్రలో నాటకరంగానికి మేలు
జరిగింది. హైదరాబాదులో రసరంజని వారు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నాటకాన్ని బ్రతికించడం కోసం కృషి చేస్తున్నారు. అలాగే మిగిలిన పట్టణాల్లో కూడా నాటకరంగంపట్ల అభిరుచి వున్న వ్యక్తులు సమిష్టిగా పనిచేసి నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని నా విశ్వాసం. ప్రశ్న సినిమా, టెలివిజన్ మాధ్యమాలు నాటకరంగాన్నిి చావుదెబ్బ తీశాయని ఒక అభిప్రాయం వుంది. మీరు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారా? సమాధానం: “చావుదెబ్బ” అనడం అతిశయోక్తి. కాకపోతే కొంత నష్టం జరిగిన మాట నిజం. సినిమా, టెలివిజన్ మాధ్యమాలకు మాత్ఫుక రంగస్థలమేకదా? సినిమా, టెలివిజన్ లలో వస్తున్న సాంకేతిక పురోభివృద్ధి నాటకాలలో సాధించడం సాధ్యంకాదు గదా! అప్పుడైనా, ఇప్పుదైనా రంగస్థలం మోద రాణించిన కళాకారుడే టి.వి. నినిమా రంగాల్లో కూడా ప్రశంసలందుకోగలుగుతున్నాడు. నోటకరంగంలో లబ్దప్రతిష్టులైన రచయితలే సినిమా, టి.వి రంగాల్లో నీరాజనాలందుకుంటున్నారు. కాకపోతే, నాటకంలో లేనిసులువు, సినిమా, టి.వి రంగాల్లో ఒకటుంది. (పేక్షకుడు తన ఇంట్లోనించి కదలకుండా, సుఖంగా సినిమా, టి.వి. చూసి ఆనందించే ఏర్పాటుంది. నాటకం అలాకాదుగదా! విధిగా ధియేటర్‌కు రావాలి. నాటకరంగం దెబ్బతినడానికి (ప్రధానమైన కారణాల్లో ఇది ఒకటని నాఅభిప్రాయం. అయితే నాటకంలో “రుచి” తెలిసిన (ప్రేక్షకుడు ఇప్పటికీ నాటకాన్ని వెదుక్కుంటూ ధియేటర్‌కు వస్తూనే ఉన్నాడు.
ప్రశ్న చివరిగా ఒక్కప్రశ్లు 'పరిస్థితి ఇలా కొనసాగితే “నాటకం” అనే చంద్రుణ్తి సినిమా, టి.వి అనే రాహుకేతువులు పూర్తిగా మింగెయ్యడం ఖాయం. మన వారసులకు మనం ఒకానొకప్పుడు నాటకం అనే ఒక ప్రక్రియ ఉండేది
నాం ననన రఘుల లాలి
గాటాబాద్ ఉర్తారోనాటరంం దం కహ అని చెప్పవలసి రావొచ్చు అని నాతో ఒక నాటక రచయిత అన్నాడు. ఈ అభిప్రాయంతో మిరు ఏకీభవిస్తారా? సమాధానం: (పెద్దగా నవ్వి) ఆయనెవరో మరీ నిరాశావాదిలా ఉన్నాడు. ఆయన స్టేట్మేంట్లోనే తిరుగులేని సమాధానం ఉంది. నాటకానికి తాత్కాలికంగా గ్రహణం పట్టవచ్చునేమోగాని పూర్తిగా కనుమరుగు కాదు. నాటకాన్ని చందమామతో పోల్చి తనకు తెలియకుండానే వాస్తవాన్ని అంగీకరించాడు. చందమామకు హెచ్చు తగ్గులు ఎంత సహజమో నాటకానికి మహోన్నత హీన దశలు అంతే సహజం. నాటకం ఇప్పుడు హీన దశలో ఉన్నమాట నిజం. రేపు మరలా మహోన్నత దశకు చేరుకుంటుందన్నది తిరుగులేని వాస్తవం సూర్య చం[ద్రులున్నంత వరకూ *నాటకం” చిరంజీవిగా నిలుస్తుంది.
ననన
మలం పోల
అంచలరలో మహానుఖాభ్రులు నాకు జన్మనిచ్చి తన చల్లని చూపుతో ఆశీర్వదించే తల్లి గోవిందమ్మ కళాశాల ప్రాంగణం విడిచి ముపష్పయ్యేళ్ళు గడిచినా, నన్నిప్పటికీ మరచిపోకుండా, సదా ఆశీస్సులందిస్తున్న మనసున్న మహామనిషి, పేద విద్యార్ధినీ విద్యార్థుల పాలిట పెన్నిది, కావలి విశ్వోదయ రథసారది శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి (డి ఆర్.) నాచేత ఓనమాలు దిద్దించిన తొలి గురువులు శ్రీ స్వర్ణ పిచ్చయ్య పంతులు, అయ్యవారమ్మ శ్రీమతి మరియమ్మ, స్వర్ణ సుందరరావు నాలో కవితాబీజాలు నాటిన గురుశ్రేష్టులు, కీర్తిశేషులు 5.1 భుజంగరాయశర్మ, ఇంద్రగంటి హనుమచ్చాస్తి, కె.వి రమణారెడ్డి చదువుతో పాటు మంచి నడత నేర్చిన జవహర్ బారతి ఆచార్య ప్రముఖులు కీర్తిశేషులు 1.0% 1. మాధవరావు, $4. నటరాజన్ అడిగిందే తడవుగా ఈనాటికీ మార్గ నిర్దేశనం చేస్తున్న గురువులు 11౮, మాణిక్యారావు, డా వి రామకృష్ణ లలితా రామకృష్ణ; కె.వి కోట్లింగం, ఇంద్రగంటి బానుమూర్తి దా జె.వి. సుబ్బారాయుడు, ఆర్ రత్న జోసెప్; యస్. నరసింవా రావు, కె. శ్రీనివాసులు, [4 రమణయ్య పుస్తకానికి ప్రేమతో ముందుమాట వ్రాసి యిచ్చిన ప్రముఖులు దా వి రామకృష్ణ సీనియర్ జర్చలిస్టు శ్రీ 8.5.2 కృష్ణ, ప్రసిద్ధ నాటక రచయిత శ్రీ పాటిబండ్ల ఆనందరావు; ప్రసిద్ధ నటులు శ్రీ శ్రీపాద కుమారశర్మ నాలోని నటుడి గుర్తించి రంగస్టలానికి పరిచయం చేసిన అన్నలు జి. కళ్యాణరావు, గంజి వెంకటేశ్చర్లు, పి. చంద్రయ్య అకాశవాణి, నిజమాబాద్ కేంద్రం ద్వారా నన్నెంతో ప్రోత్సహించిన స్టేషన్ డైరెక్టర్లు శ్రీ పి. పాండురంగారావు, ప్రయాగ వేదవతి, (ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్స్ మిత్రులు నల్లూరి బాబూరావు, శ్రీమతి రూన్సీ, కె.వి కుమారి, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, శ్రీ సుదాకరరావు నా 'రచని ఎంతో బాగుందని మెచ్చుకొని పుస్తక రచనకు ప్రోత్సహించిన 'రచని జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ గోవిందరాజు చక్రదర్ నిజమాబాద్ జిల్లాలో నాతో నాటకాలాడిన సహనటులు సర్వశ్రీ కె. నూకారావు, సి వి అప్పారావు, వెంకటేశ్వరరావు, రామ సూర్యప్రకాశరావు, లక్ష్మీనరసయ్య, 0]
కేశవులు, రవిరాజ్, చిరంజీవి, సాదు గంగాదర్, వాద్య సహకార మందించిన ప్రసాద్, షేక్ నాగూర్, కూర్మాబాయి, ఆహార్యం సమకూర్చిన రూపశిల్పి (బ్రహ్మయ్య విషయ సేకరణలో ఎంతో సహకరించిన పెద్దలు కళాదరరావు వై సాయన్న సైబ పరంధాములు, మాడవేది నారాయణ, కన్నెగంటి నరసింహారావు, వి పి చందన్రావు, రంగనాద్, గర్భకుర్తి రాజేంద్ర, నరసింహశాస్త్రి కె సుదర్శన్ నన్నెంతో ప్రోత్సహించి ఆదరించిన మిత్రులు ప్రముబ న్యాయవాదులు శ్రీయుత ఎల్ భూపతిరెడ్డి, వెంకటేశ్వర హండే, ఆర్మూర్ సర్పంచ్ రామచంద్ర హందే, ఆర్భూర్ రోటరీక్లబ్ మిత్రులుడా కె బ్చి కృష్ణ గంగారాం, సదానందం, డా రమణాచారి, డా మదుశేఖర్ నన్నెంతో ఆప్యాయంగా చూసి గౌరవించిన మా |08. ఆర్నూరు బ్రాంచి సిబ్బంది నేను నిర్వహించే ప్రతి కార్యక్రమానికి నిండు మనసుతో హార్టికంగా, ఆర్ధికంగా సహకరించే మా జవహర్ భారతి పూర్వ విద్యార్థులు రాతప్రతిని అందంగా 0౧ చేసిచ్చిన ఉషోదయా సంస్థ, ఒంగోలు యజమాని శ్రీ రామకృష్ణ గ్ ఎంతో ఓర్పుతో ప్రూప్రీడింగ్ చ్రూస్సి సహకరించిన మాన్య మిత్రులు శ్రీ పోపూరి విశ్వనాథ్ సర్వాంగ సుందరంగా పుస్తకాన్ని అచ్చువేసి మీ ముందుంచిన గోటెేటి గ్రాపిక్స్ అధినేత శ్రీ గోవ్రేట్రి శ్రీరామారావు, మరియు సిబ్బంది చివరగా నేనాడింది ఆటగా, పాడింది పాటగా జీవితం సాగిపోవడానికి సహకరిస్తున్న సహధర్మచారిణి వాణీ పద్మలత, మా కంటి దీపాలు అశోకవర్లన్, హర్షవర్ధన్, ఇంద్రసేన న అందరికీ కృతళ్ణతా కుసునవూంబలి, ణ్ న ఖ్ | హంంగగా థఫి.. అ గ క్ దే ఉజ[ 0 '0.ప్రారై! 06) న్ క్ క క. | లర 62 వె టో ఆవ్ గీ // మ్య జీ
క్షఠాజరాాాాాాాాాాాాాాాలలాఆలక్ష శే శస [స | తళ త్తి మ “ ర
- టే మం ట్. ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం స్టేషన్ రైర్టర్ శ్రీ పే పాండురంగారావును సన్మానిస్తున్న శ్రీ శ్రీపాద కుమారశర్మ- వీక్షిస్తున్న పుస్తక రచయిత శ్రీకె రాఘవులు. ల
- ల
ల“ * ( పం ప్రముఖ నాటక, సినీరచయిత, నటులు శ్రీ గొల్లపూడి, దర్శకులు జంధ్యాలతో మెజీషియన్ రంగనాధ్, సి వి అప్పారావు, పుస్తక రచయిత ఆకాశవాణి స్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ బాబురావు తదితరులు. గర్తూదాాాాాాలాాాాాాాాాోోోోలారాషుర
| శా జ చా - | జీ 4 సుల 1 .
- అడ్ పరిచయం . రచయిత పేరు. : కనమాల రాఘవులు తల్లిదండ్రులు : కోటయ్య, గోవిందమ్మ ॥ జన్మస్థలం ఏ కరవది, ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ విద్యార్హతలు .: .గ.,౬6.0.011.15., ౧.0.0. వృత్తి : సీనియర్ మేనేజర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కెతదడ్రల్ (బ్రాంచి, అన్నాసాలై, చెన్నై - 2. ఇతర రచనలు : సారా హుషార్ (నాటకం) ఎండమావులు (నాటిక) 1 వన్స్‌మోర్ (నాటిక) . | (అముద్రితాలు) ,
- కానరాని మంటలు - || | అభిరుచులు * : రంగస్థలమంటే అభిమానం, పౌరాణిక | నాటకాలంటే ప్రత్యేకమైన ప్రీతి. శ్రీరాముడు, | శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, న 1 బిల్వమంగళుడు తదితర పాత్రల్లో నటిస్తున్నారు. ఆశయం వ జానపద కళలపై ప్రత్యేకించి బుర్రకథలు, జముకుల కథలపై పరిశోధన చెయ్యాలని కోరిక, పూర్వీకులందరూ బుర్రకథల్లో నిష్ణాతులు. " జీవితంలో ఒక్కసారైనా బుర్రకథ చెప్పాలని " ...__ | “భేష్ అనిపించుకోవాలని ఆకాంక్ష చ్ || | నా.