Telugu Nenerigina Nethalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
న్ . క జ్ స . సీ ం . || వ్ అననని | ననన ౮
- జ్జ న్ ననన వ ననా ననన ననాననానా
- వా " శ “జు . ' ఇ ళో - స ట్ స ౮! ళ్ | న్్ నో న్ _్ . “మా న. వ. | 1 _ నా లాలో న! మసన జున్ న ! ప మ. న చా! ప... ం పో... ఇ
ప్రచురణ నెం.-396_ ముద్రణ: 1996 జనవరి ప్రతులుః, 2000 వెల: 6-00 నగ శ్వ శి వ్ ల నం 4 “సంకలనం ॥ విఆర్. బొమ్మారెడ్డి. 9 ఏం ] 6(6౮ల్ స డిటిపిః వ్రజాశక్తి డైలీప్రింటింగ్ ప్రెస్ ముద్రణ: యుగంధర్ ఆఫసెట్ చెస్ విజయవాడ-3 211 81-86317-24-4 మం.
ముందుమాట
కాలం గదిచిన కొలదీ తరాలు మారుతున్నాయి. గత చరిత్ర మారిన విధం, అందుకు సంధానకర్తలుగా కృషి చేసిన యోధానుయోధుల కృషి సదా గుర్తు చేయవలసిన అననరం ఎంతైనా వున్నది. ప్రస్తుత దశలో సాంకేతిక పరిజ్ఞానం బకవైవు పరుగులెత్తుతూన్నది. దోపిడీ వ్యవస్థ దుర్గంధం మరో వైపు సామాజిక వాతావరణాన్ని
_మలిన్తం.చేన్తున్నది. అందువల్లనే సమాజం మారి నూతన సమాజి నిర్మాణానికి యీ "పరిణామం చాలా ఆటంకంగా వున్నది.
తాత్వికులు చరిత్రకు పరిపరి విధాల వ్యాఖ్యానాలు చెప్పారు. కాని నేడు
అత్యవసరంగా కావలసినది ఆ చరిత్రను సామాజికాభివృద్ధికి అముగుణంగా మానవుడు "| మలుచుకోవదం. మార్ మహనీయుడు ప్రబోధించిన ఆ కర్తవ్యం మున్నెన్నటి కంటే నేడు ప్రత్యక్షంగా మన ముందుకు వచ్చి కూర్చున్నది.
- ఇటీవల సంవత్సరాల్లో సోషలిస్టు సమాజాలు కొన్ని దెబ్బతినడంతో ఆ మౌలిక కర్తవ్యం నెరవేరకుందానే. దోపిడీ వ్యవస్థను నిర్మూలించకుండానే సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందిన కొలదీ అందరికీ అన్నీ సమకూరుతాయన్న భ్రమలు పెచ్చరిల్లాయి. అవి వెర్రితలలు వేసిన చోట, తమ గమ్యాన్ని తప్పెన శక్తులు కల్పవృక్షాలను, కామధేనువులను కూల్చకోవడం జరిగింది. కాని అనతికాలంలోనే, నాలుగైదు సంవత్సరాల్లోనే ఆ సంఘటనల దుష్పలితాలు నసాళానికి అంటే అనుభవాలు ఆ దేశాల్లో ప్రజలకు కనువిప్పు కలిగిస్తున్నాయి. ఆ కారణంగానే రష్యాలోనూ, తూర్పు యూరప్ రాజ్యాల్లోమూ కమ్యూవిస్టులకు అత్యంత ఆదరణ కలుగుతున్నట్లు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
ఆ నేపథ్యంలో మార్కిస్టు మహోపాధ్యాయుల ప్రబోధాలను పునశ్చరణ చేయవలసిన అగత్యం ఎంతైనా వున్నది. వారు తమ జీవితాలను ఏ మార్గంలో మలుచుకొని భావితరాలకు మార్గదర్శకులైనారో తెలుసుకొని మవ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం ఎంతైనా అవసరం,
ఆ అవసరాన్ని గమనించి, కామ్రేడ్ మోటూరు హనుమంతరావు రచించిన “మార్విస్టు మహో పాధ్యాయులు" అన్నగ్రంధాన్ని లోగడ ప్రచురించాం. ఆ వెలుగుబాటలో భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన మహనీయుల్లో గతించిన కొందరి జీవిత విశేషాలను గురించి వారు చేసిన రచనలను, జ్ఞాసకాలను ప్రస్తుత ప్రచురణ ద్వారా అందిస్తున్నాం.
తమకు ప్రత్యక్షంగా పరిచయం, సాన్నిప్రాత్యం గల అఖిలభారత స్తాయి నాయకులను గురించి మాత్రమే యీ రచనలు వున్నందున “నేనెరిగిన నేతలు అని వారుయీ ప్రచురణకు నామకరణం చేశారు. గత రచనలకు వలెనేయీ మా ప్రచురణకు కూదా విశేష ఆదరణ లభించగలదని ఆశిస్తున్నాం.
-ప్రచురణ కర్తలు,
కావ్రేడ్ బి.టి. రణదివె | కావ్రేడ్ ఎ.కె. గోపాలన్ 8 కావ్రేడ్ సుందరయ్య 13 కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య 23 కావ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 34 కావ్రేడ్ ఎం.ఆర్. వెంకట్రామన్ త!
శ తాను “న 4 సాటిలేని కార్రేగ్ య్ శ
మార్క్స్ అస్తమించిన మరోక్షణం “ఒక గొప్ప మెదడు ఆలోచించడం మానివేసింది. ఒక బలమైన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది” అని ఎంగెల్సు వ్యాఖ్యానించారు. బి.టి.ఆర్. కన్నుమూశారన్న వార్త వినగానే ఆ మాటలు పదేపదే నాకు గుర్తుకు" వచ్చాయి. పోలికేలేని ఒక ప్రపంచ మహోపాధ్యాయుడితో బి.టి.ఆర్ని పోల్చడానికి కాదుగాని, భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మహత్తర శక్తి సామర్థ్యాలు గల ఒక రత్నం రాలిపోయిందన్న భావం వెంటాడినందునే నాకు అలా అనిపించింది. ఆయనకంటే ముందే కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన డాంగే, ఇప్పుడు ఏ ఆలోచనలో వున్నప్పటికీ యీ సందర్భంలో అన్నమాట అతి వాస్తవమైన నివాళిగా వున్నది. బి.టి.ఆర్. మరణించినారన్న వార్త విని “భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని తీర్చిదిద్దిన శిల్పులలో ఆయనాకరు” అన్నారు డాంగే.
తాలి రోజుల నుండి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ధక్కా మొక్కీలు తిన్న కాకలు తీరిన యోధుడు రణదివె. ఆధునిక కమ్యూనిస్టు ఉద్యమంలో అద్వితీయ పాత్రధారిగా వున్న సి,పి.ఎం. నాయకాగ్రేసరుడు. ముజఫర్ అహమ్మద్ అనంతరం ఆతి పెద్ద వయస్సుగల వ్యక్తి ఆయన .
మార్కిజం-లెని నిజం అన్న మహత్తర సిద్దాంతానికి యీ దేశంలో ఆయన మహోపాధ్యాయుడే. అది ప్రపంచ కార్మికవర్గ అత్యుత్తమ సిద్ధాంతం కాగా దానికి యీ దేశంలో అద్వితీయ వారసత్వం ఆయనకే దక్కుతుంది. అంతగా కార్మికవర్గ ఆలోచనా
విధానం జీర్ణించుకుపోయిన వ్యక్తి మరొకరు కానరారు. విశ్వవిద్యాలయంలో అగ్రశ్రేణి బెన్నత్యం పొందిన రణదివె, అమాంతం కార్మికవర్గ సిద్ధాంతంలోకి ఆకర్షించబడటమేగాక, అంతిమ ఘడియల వరకూ మరో అన్యవర్గ ధోరణిని దేనినీ దరిచేరనీయని దీక్షాపరుడైనొడు. కేవలం సిద్ధాంత వేత్తగాదు, అందుకోసం సర్వస్వాన్నీ ఒడ్డిన త్యాగధనుడు. అనేక విప్లవోద్యమాలలో పాల్గాని వాటిని నిర్మించడానికి ఆయన చేసిన కృషి అపారం. బొంబాయి తాతా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో వున్నారని తెలిసి నేనూ కామ్రేడ్ గంగాధరరావు జనవర్ 31వ తేదీన ఆయన్ను చూడడానికి వెళ్ళాము. అప్పటికే అక్కడ కాద్రేడ్ ఏచూరి సీతారాం కూడా వున్నారు. అదేపనిగా వేధించిన వాంతుల ఘట్టం నుండి బయటపడి రణిదివె అప్పటికి కూర్చోగలిగిన స్ధితిలో వున్నారు. ఆనందంగానూ, ఆప్యాయతతోనూ ఆయన మమ్ములను కూర్చోమన్నారు. శారీరకంగా బాగా చిక్కిపోయివున్నా మానసికంగా అన్నిటికన్న మిన్నగా ఆయన్ను వేధిస్తూన్న విషయం అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం అని మాకు అర్థం అయింది. మాటల మధ్య సీతారాం రేపు మీకు నా రక్తాన్ని ఎక్కించవలసి వున్నదన్నారు. నవ్వుతూ బి.టి.ఆర్. “ఏ రక్తాన్ని ఎక్కించినా సరే గాని, రివిజనిస్టు రక్తాన్ని మాత్రం ఎక్కించవద్ద'ని చమత్కరించారు. తూర్పు యూరప్నుండీ, సోవియట్ యూనియస్ నుండీ కల్లోలపూరిత వార్తలు వస్తూండగా మార్కిజం-లెనినిజంను సమర్చిస్తూ నేను అప్పటికే వ్రాసిన సంపాదకీయాన్ని గురించి కామ్రేడ్ సీతారాం అంతకుముందే ఆయనకు చెప్పినట్లున్నారు. బహుశా అందుకు సంబంధించిన ఆయన స్పందన మాతో హృదయపూర్వకంగా మాట్లాడడంతో ప్రతిబింబించి వుండవచ్చు. ఏమైనా మీము ముగ్గురుమూ 45 నిమిషాల సేపు ఆయనలో అంతర్జాతీయంగా వస్తున్న అన్యవర్గ ధోరణుల పై ఇష్టాగోష్టి జరపడం, ఒకవైపు అప్పటికే అలసిపోతున్న ఆయనకు ఆనందాన్ని కలిగించిందనస మము భావించాం. ఇక మాకు కలిగిన అనందోత్సాహాలకు అంతులేదు. అనతికాలంలోనే ఆయన రాలిపోతారని తెలియకగాదు. అయినా ఆయన అంకితమై పోరాడిన ఆశయం అంతటి ఆచంచలమైనది గనుక కలిగిన స్పందన అది. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళారు. అక్కడా ఆయనను అపుతి గొనబోతూన్న వ్యాధిని గురించి పట్టించుకోకుండా ఎదలెరిపి లేకుండా చూడటానికి వచ్చిన కాడ్రుచ్చ అందరితోనూ సిద్ధాంత విషయాలను గురించే చర్చించారని విన్నాను. చర్చించడమే కాదు దాన్ని గురించిన రచనలను కూడా చేశారట. అంతేగాదు శారీరకంగా హాజరు కాలేకపోయినా కార్మిక వర్షానికి తన అంతిమ సందేశమా అన్నట్లు, ఓ “సందేశాన్ని చ్రాయించి దుర్గాపూర్ కార్మిక సదస్సుకు యీనెల 2వ తేదీన పంపడం కూడా జ౩గింది. “పని హక్కు లేనినాడు హక్కులన్నీ ఉత్తివే” అన్నదే ఆ సందేశం. 2
ఏమైనా క్యాన్సర్ వ్యాధి ఆ మానవ మాత్రుణ్ని వదులుతుందా! మరింత విజృంభించి అతి బాధాకరంగా పరిణమించింది. బొంబాయి క్యాన్సర్ ఆసుపత్రి నుండీ. దాని అధినేత డొక్టర్ కామత్ డిల్లీ వచ్చి రణదివెను చూసి వెంటనే బొంబాయికి _ తీసుకురమ్మని సలహా ఇచ్చారు. ఈ వార్త విని ఢిల్లీలో వున్న నేను వెంటనే వారింటికి వెళ్ళాను. ఒక గంటలో ఆయన్ను విమానాశ్రయానికి తీసుకువెళ్ళనున్నారు.. ఆయన "అత్యంత బాధననుభవిస్తున్నారు. కేవలం కళ్ళతో చూసి వెళతానని కామ్రేడ్. వివలతో చెప్పి లోపలికి వెళ్ళాను. వడక కుర్చీలో కూలబడి కాళ్ళారబాచుకొని తల పైకెత్తలేని స్థితిలో ఆయన్ను చూశాను. కామ్రేడ్ విమల నేను వచ్చినట్లు ఆయనకు చెప్పి, ఆపాదమస్తకం ఆయన ఎటువంటి బాధలో వున్నదీ నాకు. వివరించారు. ఈసారి ఆయన్ని, ఆ దశలో చూడటం వల్ల నా యావజ్జీవాలూ క్రుంగిపోయాయి. ఎంతటి మనిషి ఎంతగా కూలబడి పోయాడా అన్న ఆవేదన నన్ను పట్టుకొన్నడి. ఏమీ చేయలేకపోతున్నానని అతికష్టం మీద ఆయన అన్న మాటలు యమపాశాలుగా నాకు .. లోచాయి. అంతకు ముందు ఒక కొమైేడ్ నాలో అన్నమాటలు గుర్తుకు వచ్చి వెంటనే అన్నాను. “బి.టి.ఆర్. బీ టి ఆరే, అందుకు సాటిలేరు, అన్నదే కామ్రేడ్స్ భావం. మీ జీవితమంతా అత్యంత విలువైన కృషిని పార్టీకి నమర్పించారు. అంతకు మించి మీరేమి చేయగలరు. ఇంకా చేయలేదని ఆవేదన పడకండి” అని నేను గదీ నుండి బయటికి వెళ్ళాను. కాని ఆ ఆవేదన తర్వాత నన్ను వదలనే లేదు. ఏప్రిల్ 6వ తేదీ ఆరుగంటల రేడియో ఇంగ్లీషు వార్తల్లో విన్నాను “కమ్యూనిస్సు యోధుడు, బి.టి.రణదివె తెల్లవారు జామున మూడు గంటలకు కన్నుమూశార”ని. ఏంటనే యల్బి.జుకి ఫోను చేశాను. 7వ తేదీ జరగవలసిన కార్యదర్శివర్గ సమావేశాన్ని వాయిదా వేసుకొని వెళ్ళడానికి ప్రయాణం గట్టాము... బొంబాయి పార్టీ ఆఫీసుకు శామ్మిది గంటలకు చేరుకున్నాం. అక్కడ కామ్రేడ్ సాంజిగిరి (రాష్ట్ర కార్యదర్శి) మమ్ములను రిసీవ్ చేసుకుని ఒక అరగంటలో రణదివె భౌతిక కాయం ఆఫీసుకు: చేరుకుంటుందని చెప్పారు. కొంచెం సేపట్లో పార్టీ ప్రథాన కార్యదర్శి, పహలిట్ బ్యూరో పెద్దలు, ఎందరెందరో దేశం నలుమూలల నుండి వచ్చిన కేంద్ర కమిటీ పభ్యులు, రాష్ట్ర కార్యడర్శులూ, ఇతర పార్టీల పెద్దలు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడీకి 9-30" గంటలకు వచ్చిన భౌతికకాయానికి అందరం పూలమాలలు వేసి జోహారులర్నించాం బి.టి.ఆర్.ది ఒక కమ్యూనిస్టు కుదురు. ఆయన భార్య.కామ్రైేడ్ విమలో రణదివె, చెల్లెలు అహల్యా రంన్నేకర్ కేంద్ర కమిటీ సభ్యులు. బొంబాయి కొర్మికభోధ్యమ పోరాటాల్లోనూ, మహిళా ఉద్యమాల్లోనూ ఆరితెరిన అతివలు. ఆయన. బావమంది పి.బి.రంగ్నేకర 1937 విద్యార్హి టఆద్యమాల డశనుండీ పరిచయుడైన మాకు చనువు గల, కామ్రేడ్. రాష్ట్ర పార్టీ నేతలలో ఆయనొక ముఖ్యుడూ, పత్రికా సంపాదకుడూను. అలాగే 3
కమ్యూనిస్టు ఉద్యమ పితామహుల్లో ఒకరైన డాక్టర్ అధికారి ఆయన పెదళల్లి కుమారుడు. కామ్రేడ్ సర్దేశాయి విమల సోదరుడు, గోదావరీ పెరులేకర్, ఆమె భర్త పెరులేకర్ రణదివెకి అత్యంత సన్నిహితులు, వారి కుటుంబం. ఆ విధంగా బొంబాయిలో కమ్యూనిస్టు ఉద్యమానికి మూలస్తంభంగా వుండేది. కాగా ఆ కుదురుకు పెద్దగా వున్న రణదివె భౌతిక కాయం పక్కనే వున్న కామ్రేడ్ అహల్యను కదిలిస్తే తన మూలస్తంభం కూలిపోయిందన్నంతగా కన్నీటి ధారలతో కుమిలిపోతున్నది. కామ్రేడ్ విమల తెరలు తెరలుగా శోకతప్తమై పట్టలేకుండా వున్నది. తనయుడు ఉదయ్ దీనవదనుడైై ఆమెను ఓదార్చుతున్నాడు. జీవితమంతా.మార్కిజం-లెనినిబానికి ధారబోసిన ఆ మహనీయుడికి అర్హమైననివాళి ఏది అన్న తపనలో వున్నారు పి.బి. రంగ్నేకర్. రణదివె అంతిమ యాత్ర ఆ నగర కార్మిక వర్గాన్నీ మధ్య తరగతి మేధావి వర్షాన్నీ కుదిపివేసింది. సాయంకాలం 4 గంటల వరకు ఎడతెరిపి లేకుండా ఆయన భౌతికకాయానికి నివాళులర్పిస్తూ వచ్చిన అశేషజనంలో ఏదో పోగొట్టుకున్న బాధ కనిపించింది. వివిధ పార్టీల పెద్దలు, రాష్ట్ర, కేంద్ర నాయకులు అంతిమయాత్రలో పాల్గాని,' అంత్యక్రియల నమయంలో జోహారులర్చించారు. ఆయన గొప్ప ఆర్థిక వేత్తేగాదు, గతితార్కిక భౌతిక వాది. నేను ఎప్పుడైనా ఆయనతో విడిగా మాట్లాడినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌లో నాస్తిక వాదులెవరు? వారి ధోరణులేమిటి? అని ప్రస్తావిస్తూ వుండేవారు. దళితులంటే, వారిలో గల కొన్ని సెక్టేరియన్ ధోరణుల కంటే ప్రధానంగా అది దీర్చకాలంగా అణగద్రొక్కబడిన పీడిత వర్గం అన్న భావమే ఆయనలో ప్రదర్శితమయ్యేది. దళితుల పేరిట పెడమార్గాలు బట్టిన అనేక ఉద్యమాలకు ప్రతిగా రియాక్టయి పార్టీ కామ్రేడ్స్ దళితుల వర్గ స్వభావాన్ని మరచిపోతారేమోనని ఆ హెచ్చరికను ఆయన ఎప్పుడూ చేస్తుండే వారు. సాధారణంగా పార్టీ రాజకీయ తీర్మానాలన్నింటా ఆ అంశాన్ని ఏదో రూపంలో చేర్చుతూనే వుండేవారు. ఎంతో సంస్కారం గలిగిన వ్యక్తిత్వం ఆయనలో ప్రదర్శితమయ్యేది. ఎంత వనిలో వున్నా ఏ నమయాన్నయినా తనతో మాట్లాడటానికి వచ్చిన వారితో ఓపికగా,ఆనందంగా మాట్లాడే ఆయన స్వభావాన్ని ఎవరూ మరువలేరు. వైఖరి ఎంత సౌమ్యంగా వుండేదో భావం అంత సునిశితంగా వుండేది. ప్రజలకు, ప్రజా భావాలకు సిద్ధాంత వేత్తగా ఆయనెంతో దూరాన వుంటాడని అనేక మంది భావిస్తారు. కాని అది వాస్తవం గాదు. సిద్ధాంత వివాద సమస్యలను ఆయన ఎంత హెచ్చుస్థాయిలో రచించేవారో ప్రజలతో, ప్రజల భాషలో మాట్లాడటంలోనూ ఆయనకు అంతటి ప్రత్యేకత వుండేది. మరాఠీ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఆయన వక్త. వ్యంగ్యం, హాన్యం, దాడిచేయడంలోనూ, నవ్వించడం, కవ్వించడంలోనూ ఆయన ప్రత్యేకత వుండేది. త
అగ్రస్థానంలో ఆదర్శంగా క్రమశిక్షణను పాటించడంలోనూ ఆయన ఘనుడే. ఆయన కార్యదర్శిగా వుంటూ కఠోరమైన ఉక్కు శిక్షణను అమలు జరిపి చాలామందిని వేధించాడని ప్రతీతి. పైగా నాయకత్వంలో వున్నప్పుడు తప్పులు చేశాడన్న ఆరోపణలతో కొన్ని సంవత్సరాలపాటు ఆయనను నాయకత్వ స్థాయికి దూరంగా వుంచడం జరిగింది. ఆ ఆరణ్యవాసాన్ని ఆయన హూందాతనంలో, క్రమశిక్షణకు కట్టుబడి అమలు జరిపారు. ఆఅశయమే సర్వస్వం అనుకున్న యోధులకే అది సాధ్యం.
అటువంటి ఆదర్శమూర్తులు అన్తమించినాడు, వారేనాడూ తమంత తాముగా న్వయంగా చెప్పుకోని గుణగణాలన్నింటినీ ప్రస్తావించి భావి తరాలకు వెలుగుబాట చూపడం ఎవరికైనా ధర్మం. కొని అందరూ అలా వుండలేరు. కోడి నరిహద్దు గోడ ఎత్తుకే ఎగరగలదు. గద్ద వినువీధికి ఎగరగలదు. కొందరి రచనలు చూన్తుంటే ఆ సామెత గుర్తుకొస్తుంది. '“ఉదయం' పత్రికలో ఏప్రిల్ 7వ తేదీన రణదివె గారిని గురించి శేషాద్రి గారు ఒక సమీక్ష ఇచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభ దినాల నుండి యిప్పటి వరకు ఆయన చేసినవన్నీ విచ్శిన్నాలని, తప్పుల తడకలని చిత్రించడానికి ఆ రచయిత చనిపోయిన రోజునే సమీక్ష చేశారు. ఆయన నిర్మించిన ఉద్యమాలను, చేవట్టిన వైఖరులను నల్లగా చిత్రించడానిక్తి అది వరకే తయారుచేసుకున్న నమీక్షలా అది వున్నది.
ఆశయసిద్ధీ, శుద్దీ పట్టని పడక కుర్చీ భావాల రాయుళ్ళకు గిట్టని ఉద్యమాలపై రాళ్ళు వేయడం, తమ భ్రమలను ఇతరులకు ఎక్కించడం, అలవాటుగా వుంటుంది. కాని వివ్లవోద్యమాలు, అందునా పీడిత ప్రజా ఉద్యమాలు, వరవడులు అంత తేలికగా ఎవరికీ అబ్బవు. చరిత్రను నిర్మించే ఆ ఉద్యమాలకే కంకణధారులైన మహనీయులు అనేక ఢక్కామక్కీలు తినిగాని తమ బాటను సరిచేసుకోలేరు. శైశవ దశలోని పిల్లలవలె తప్పటడుగులు వేస్తూ, సరైన ఎత్తుగడలూ, వ్యూహాలు రూపొందించుకొని గట్టిగా నడవ గల, నడపగల నేతలు కాలేరు.
! కామ్రేడ్ రణదివె జాతీయోద్యమంలోనూ, బొంబాయి కార్మికోద్యమంలోనూ కాకలు తీరిన యోధుడు. అయినది ఆ తప్పటడుగులను' సరిదిద్దుకుంటూనే, ఆ కాలంలో ఆదిగా ఎ(ర్రబావుటాను ఎగురవేయడానికి, పీడిత (వజలను సమీకరించుకోవడానికి ఎన్ని సంఘాలను, ఏ సమయంలో ఎందుకు పెట్టిందీ తెలియకుండానే శేషాద్రిగారు రణదివె గారిపై అనేక రాళ్ళు విసిరారు. అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తీరు, అది నిలదొక్కుకున్న వైనం ఏమీ తెలియకుండా నెహ్రూ ప్రభుత్వాన్ని రణదివె వ్యతిరేకించడాన్ని ఒక నేరంగా శేషాద్రి చిత్రిస్తున్నారు. “మహనీయుడైన ప్రజాస్వామ్య సోషలిస్టు వాది జవహర్లాల్ నెహ్రూ” అనీ, ఆయనను ఆ విధంగా హీరేన్ ముఖర్జీ గారు కూడా వర్గిస్తున్నారని అతికీ అతకని మాటలతో శేషాద్రి గారు రణదివెని క్
దుయ్యబట్టారు. స్వాతంత్రోద్యమంలో సోషలిజం కొరకు కార్మిక కర్షక ఉద్యమాలు తమ ళమ దృక్పథాలలో పోరాడకుండా వుంటే ఈ దేశంలో కమ్యూనిజం వుండేది గాదు. “ప్రజాస్వామిక సోషలిజం” అన్న దాని ఊసే వుండేదిగాదు. మనకు సిద్ధించిన స్వాతంత్ర్యం ఆ ఉద్యమాలు, అంతర్జాతీయ పరిణామాలు కూడా తోదృడకుండా వూడిపడినది గాదు. అది బ్రిటిష్ పాలకులతో రాజీపడిన స్థితిగతుల్లోనూ సంభవించినది. అందుకే 1948-51 తొలి దశలో బాతీయంగా అత్యంత అభివృద్ది నిరోధకంగానూ, అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదానికి అణుకువగానూ నెహ్రూ ప్రభుత్వం మెలగింది. చైనా, కొరియా విముక్తి పోరాటాలు జయప్రదమై, మూడవ వంతు ప్రపంచం సోషలిస్టు విజయపతాకాన్ని ఎగురవేసిన అనంతరమే నెహ్రా ప్రభుత్వం నిజమైన స్వాతంత్ర్య ప్రభుత్వంగా నిలదొక్కుకోగలిగింది.
ఆకొలంలో జరిగిన తర్జన, భర్దనలు రణదివె సృష్టిగాదు, వాస్తవిక పరిణామాల ప్రతిబింబాలు మాత్రమే. అలాగే దేశ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామిక సోషలిజాన్ని అభివృద్ది చేయడానికి గాను నెహ్రూ (ప్రభుత్వం ప్రయోగించింది. అనేక కార్మిక కర్తకోద్యమాలను, సంస్థానాధథశులకు వ్యతిరేకింగా జరిగే పోరాటాలను అణచిపెట్టడానికి నిర్బంధకాండ ఆ రోజుల్లో లాండవించింది. తెలంగాణా వీరోచిత రైతాంగ పోరాటంలో సోషలిజం అన్నందుకే, దున్నేవాడికే భూమి నినాదం ఇచ్చినందుకే ఆయిదువేల మంది నెహ్రూ “ప్రజాస్వామిక సోషలిబానికి” బలైనారు. ఈ విషయం గొనక, ఆరోజుల్లో జరిగిన ప్రతిఘటనలు, జైలు పోరాటాలు అందుకు ప్రతివించించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కొరవడిన వ్రాతలు రాయడం ఎవరివైనా ఆతి హేయమైన పని. అవి రణదిఐ సృష్టకాదు. నెహ్రూ ప్రభుత్వ పాతకాలు, వాటిని హిరేన్ ముఖర్జీగారో శేషాద్రిగారో మరచిపోవచ్చు. కమ్యూనిస్టు వాసన కలనారెవ్వరూ మరవజాలదు.
1948 నాటి వాతావరణం దేశంలో కార్మికోద్యమాల విప్లవ ప్రభంజనం పర్యవసానం, అందుకు తగిన విప్లవ శందారావాన్నిపూరించినందున రణదివె నాయకత్వాన వేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో ఏర్పడి పనిచేశాయి. ఆ ఉద్రిక్త సమయాల్లో తప్పులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. పారపాటు సిద్ధాంతాలు చేపట్టిన సంఘటనలూ ఉన్నాయి. కాని వాటిని పరిశీలించవలసింది బూర్జువా, భూస్వామిక ప్రభుత్వంగా వున్న నెహ్రూ వ్రభుత్వ పంజరం నుండి కాదు. అప్పటికే హిరేన్ ముఖర్జీ గారు ఒక స్వాతంత్రోద్యమ చరిత్ర వ్రాశారు. రెండవ పార్టీ మహాసభలో విప్లవ దృక్పధం నుండి పార్టీని విమర్శించారు. అప్పుడు రణదివె లేచి “కార్మిక వర్గ పాత్రను గురించి నుతారాం పేర్కొనకుండా స్వాతంత్రోద్యమ చరిత్రను వ్రాసిన హీరేన్' అలాంటి విమర్శలు చేయడం భావ్యం గొదని హెచ్చరించారు.
ఏమైనా చరిత్రలో జరిగిన కొన్ని పారపాట్లుగాదు, మహనీయుల కృషికి
6
మచ్చుతునకలు. వారు నిర్మించిన ఉద్యమాలు. చైనాలో మావో అనేక పారపాట్లు ఆఖరి దశలో చేశారు. అయినా చైనా కమ్యూనిస్టు పార్టీ ఆయన పొరబాట్లను విమర్శించిందే తప్ప ఆయన వ్యక్తిత్వాన్నీ కాదు-విప్లనతత్వాన్నీ కాదు. మార్కిజం- లెనినిజం, మావో ఆలోచనా విధానం జన చైనా విముక్తికి మార్గదర్శకాలని చైనా పార్టీ పునరుద్దాటిస్తున్నది.
ఉద్యమ నిర్వహణలో జరిగిన తప్పుల నుండి గుణపాఠాలు తీసుకొని పురోగమించిన రణీదివె భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) ఏర్పడినది లగాయితూ దానక్ "సిద్దాంత, రాజకీయ నిర్మాణ సమన్యలన్నింటా సంధానకర్తగా, సారధిగా, ప్రబోధకుడుగా వనిచేశారు. కార్మికోద్యమ నేతగా ఉద్యమాన్ని నిర్మించారు. అంతర్జాతీయంగా రష్యా, చైనాలు గాడి తప్పిన సందర్భాల్లో మార్క్సిన్టపార్టీ తన స్వంత వైఖరిని వల్లడించడంలో గాని, పార్గమెంటరీ-పార్లమెంటేతర ఉద్యమాలనూ, పోరాటాలనూ సమన్వయం చేయడంలో గాని కాంగ్రెస్ నిరంకుశత్వాన్ని ఎదుర్కొంటూనే మతతత్వ శక్తులను చేరు చేయదంలో గాని కామేడ్ బీ.టటి.రణదివె పార్టీ విధానాలను రూపొందించడంలో అమోఘంగా తోచ్చగ్జారు. ఎడపెడ ధోరణులనుండి పార్టీని కంటి శెప్పవలె కాపాడడంలోనూ ఆయన కృషి ఎనలేనిది.
నేడు దేశంలో కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వామపక్షాల్లో ప్రధాన పాత్రధారి. వామపక్ష ఉద్యసూల సంధాగకర్త. దేశం మొత్తంమీద వామపక్ష ప్రజాస్వామిక శక్తుల ప్రత్యామ్నాయం కొరకు పోరాడుతున్న ప్రధమ పార్టీ, ఆ పార్టీకి యీ గర్వకారణమైన స్తాయిని కర్పిఃంచడంలో ఘనమయిన పాత్రను నిర్వహించిన పెద్దలలో ముఖ్యుడు కొయ్రెడ్ బి.టి.రణదివె. ఈ వ్యాసం ద్వారా ఆయనక్షివే మరొకసారి నా విష్లవాంజలులు
సామ్రాజ్యవాద వ్యతిశవత, ఆంరర్జారీయతా, సిద్ధాంత పవిత్రత, విప్లవ దీక్షా, పార్టీ నిర్మా దక్షత, ప్రజల మనిషిగా మెలిగిన ఘనత కాధయ్రేడ్ సుందరయ్యకు గలవని 1935 మ 21వ తేదీన కాడుప్ రనిదిదె అప్పటి సుందరయ్యగాగి స్మారక సభలో చెప్పారు. నిజానికి పానుదిరిగి చూస్తే అవన్నీ రణదివె జీవితానికి వతిచింబాబేననిపిస్తున్నాయి.
7
| జ వ యి అశోాల | నని న
కోకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ ఎ.కె.గోపాలన్. స్వాతంత్ర్య సమరయోధుడుగా తొలుత కేరళలో కాంగ్రెస్‌ను నిర్మించిన ముఖ్యుల్లో గోపాలన్ ఒకరు. తర్వాత కామేడ్స్ కృష్ణపిళ్ళై, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్లతోపాటు కేరళలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని నెలకొల్పారు. పిదప ఆ కాంగ్రెస్ సోషలిన్టు పార్టీ మొత్తంగా కమ్యూనిస్టు పార్టీగా మార్పు చెందడానికి వారే సంధానకర్తలైనారు.
విద్యార్థి దశ దాటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినా, తన 16వ యేటనే ఆయన స్వాతంత్రోద్యమంలోకి అడుగుపెట్టారు. తర్వాత గడిపిన అయిదున్నర దశాబ్దాలూ ప్రజాందోళనే కార్యక్రమంగా, పోరాటమే ఊపిరిగా. ఆ జీవితం సాగింది. అరెస్టులు, జైలు జీవితం, నిరాహార దీక్షలు ఆయనకు నిత్యకృల్యాలైనాయి. ఖైదీగా తనకొరకు, ఖైదీలందరి హక్కుల కొరకు పోరాడటమే ఆయన జీవిత విధానంగా వుండేది. ఒక పౌరుడుగా, ఖైదీగా రాజ్యాంగ చట్టంలో గల హక్కులన్నింటినీ అమలు జరిపించుకునేందుకు కోర్టుల కెక్కడం, రిట్లు వేయడం ఆయనకు అలవాటు. పాతికేళ్ళుగా ప్రజా ప్రతినిధిగా పార్లమెంటు సభ్యత్వాన్ని కలిగి వున్నా పార్లమెంటరీ తత్వం అనేది ఆయన్ను సుతరాం ఆవరించలేకపోయింది. పార్లమెంటరీ, పార్లమెంటరీయేతర కార్యక్రమాలను జోడించి నిర్వహించడంలో ఆయన దిట్ట. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు, వెలుపల రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నేత. ఆ కష్టజీవుల కోర్కెలను గురించి ప్రతిపక్ష నాయకుడుగా పార్లమెంటులో గర్జించడము గాదు, వెలుపల అందుకు పోరాడటంలోనూ ఆయన ఘనుడే. కేరళలో భూ సమస్యపై రైతుల హక్కుల కొరకు నిరాహారదీక్షబూనారు. ఆ రాష్ట్రానికి కక్షతో బియ్యం సవ్లయి కోటాను కత్తిరించినందుకు
8
ప్రధాని పండిత నెహ్రూ ఇంటి ముందే ఆయన నిరాహార దీక్షను నిర్వహించారు. ప్రజల సమస్యలకు, రాజకీయ పోరాటాలకు మాత్రమే ఆయన పరిమితం కాలేదు. అక్రమ సాంఘిక అంక్ష్తలను బ్రద్దలు గొట్టి హరిజనులు గురువాయూర్ దేవాలయంలో ప్రవేశించేందుకు జరిగిన పోరాటంలోనూ ఆయన ముందే వున్నారు. అన్యాయం ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నదని భావించినా అప్పటికప్పుడు దాన్ని నివారించేందుకు రంగం మీదికి దూకడం, అది పరిష్కారం కాకపోతే తానే నిరాహార దీక్షను ప్రారంభించడం ఆయన తత్వం. గా -గా* లక్షలాది జనం తరలి వచ్చిన సుందరయ్య అంతిమ యాత్ర అనంతరం 1985 మే 21వ తేదీన విజయవాడ కళాక్షేత్రంలో జరిగిన సంతాప సభలో ప్రసంగిస్తూ కామ్రేడ్ బి.టి.రణదివే, ఎ.కె.గోపాలన్‌తో సుందరయ్య గారిని పోల్చారు. వారిద్దరే ప్రజానేతలైన ఆదర్శ కమ్యూనిస్టులని పేర్కొన్నారు. ఆ మహనీయుడితో పాటు రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన మహాభాగ్యం నాకు లభించింది. 1953 నుండి ఆయన అస్తమించేవరకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోనూ, మార్క్సిస్టు పార్టీలోనూ కూడా కేంద్ర కమిటీ సహచర సభ్యుణ్ణిగా నేనున్నాను. సి.పి.ఐ. (ఎం) రాష్ట్ర కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన షర్యటనా కార్యక్రమాలను నిర్వహించడంలో తోడయ్యాను. ఆ విధంగా కామ్రేడ్ గోపాలస్కి నేను సన్నిహితుణ్లి. ఆ సాన్నిహిత్యాన్ని పురస్కరించుకొని నాకున్న జ్ఞాపళాలు కొన్నింటిని మీ ముందుంచుతున్నాను. ఆయనతో నాకు కలిగిన తొలి పరిచయం కడలూరు జైలులో. స్వాతంత్ర్యానికి ముందూ వెనకా గూడా కాంగ్రెస్ పాలకులు కమ్యూనినులను కాల్చుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర మంత్రివర్గాల్లోనూ ఆర్టినెన్స్లను అనుభవించాం. తర్వాత నిప్పులు చెరిగే నిర్భంధ కాండలకు గురైనాము. 1948 సెప్టెంబర్ 13న జరిగిన పోలీస్ యాక్షన్ అనంతరం ఆంధ్ర, తెలంగాణా ఖైదీలందరం యూనియన్ ఖైదీలుగా ఉమ్మడి జైళ్ళలలో ఖైదీలం అయినాము. అప్పటికి ఇటు ఆంధ్ర, అటు మలబారు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో భాగాలుగానే వున్నాయి. అందుకే కడలూరు జైలు మా కందరికీ కూడలి స్థానం అయ్యింది. 1949లో ఎక్కడెక్కడో వున్న ఆంధ్ర-తెలంగాణా డిటెన్యూలందరినీ అక్కడికి ప్రభుత్వం తరలించింది. 4005కు పైగా వున్న తెలుగు వాళ్ళతో ఆ బైలు నిండింది. అంతమంది తెలుగు వాళ్ళకూ మధ్య వున్న ఆంధ్రేతరులు ఇద్దరే. వారు కామ్రేడ్ ఎ.కె.గోపాలన్, ఎం.ఆర్.వెంకట్రామన్గారలు. తమిళ, మళయాళ డిటెన్యూల
- నుండి వేరు చేయడానికే వారిద్దరినీ మా మధ్యకు చేర్చింది ప్రభుత్వం. ప్రభుత్వానికి కలిగిన ఆదురుద్దేశ్యమే మాకు వరప్రసాదం అయింది. , _ అనుభవజ్ఞులైన ఆ పెద్దలిద్దరి సలహా సంప్రదింపులు యవ్వనంలో వున్న ఆంధ్ర డిదెన్యూలకు అనేక విధాలుగా తోడ్పడ్డాయి. అందులోనూ వారిద్దరూ ౦
అందరితో అతి చనువుగా మెలగడం మా పైలు జీవిలొనిక్ ఎంతో స్ఫూర్తినిచ్చింది. వారి మధ్యవారు కూడా బావా బావమరుదులుగా సంబోధించుకుంటూ సరహలాడుకునేవారు. రాను రాను తెలుగు అర్ధం చేసుకునేవాళ్ళు. మాలో కొందరికి తమిళం నేర్పారు. గోపాలన్‌కి తెలుగు రాదని తెలుసుకొని కొందరు యువకులు చిలిపితనంగా ఆయనకు బూతు మాటలు నేర్పారు. ఆ విషయాన్ని గ్రహించి ఆయన ఆ చిలిపి వాళ్ళపైనే ఆ మాటలను ప్రయోగించేవారు. హాన్యవల్లరిలా వైలు జీవితాలు గడవడానికి వారక్కడుండడం తోడ్బ్చడ్డది. జైల్లో ఆయన నేర్చుకున్న తెలుగు మాటలతో తర్వాత ఆంధ్ర పర్యటనలో కామ్రేడ్ గోపాలన్ తన ప్రసంగాలను (ప్రారంభించేవారు.
డీబెన్యూలకు సేవ చేయడానికి కాన్విక్ట్ను వెలుపలి వైలు నుండి రోజూ మా మధ్యకు జైలు అధికారులు తీసుకొని వచ్చేవారు. వారందరూ తమిళులు. వారిని రోజూ ఒక చోట చేర్చి ఎకె.జి, ఎం.ఆర్.గారలు చదువు నేర్పేవారు. రాజకీయ పాఠాలు చెప్పేవారు. క్రమశిక్షణతో, చైతన్యవంతులైన ఆ కాన్విక్ట్ మాతోపాటు కలిసిమెలిసి వుంటూ మాకు వంటల్లో, దుస్తులు కుట్టడంలో, వాషింగ్లో, క్లీనింగ్‌లో ఎంతో తోడ్పడేవారు. ఎ.కె.జి., ఎం.ఆర్.లు అంటే వారికి అపార(పేమ. “ఉలఘం పలు విధం, ఎకెజి, ఎం.ఆర్. ఒరువిధం”అంటూ పాటలు పాడేవారు. “ప్రపంచం పలు విధాలు, ఎె.బి., ఎం.ఆర్. మాత్రం ఒకే విధం” అన్నది దాని అర్ధం. 1950 ఆగస్బు 11న, అక్టోబర్ 11న మాపై జరిగిన రెండు ఫైరింగ్ల్లోనూ కామ్రేడ్స్ అనుమర్లపూడి సీతారామారావు గారితో సహా 4గురు కామ్రేడ్స్ నేలకొరిగారు. అందులో ఇద్దరు తెలంగాణా కామేర్స్ కొలికుంట రాఘవయ్య, వేగుంట జోగయ్యగారలు. నాల్లవవాడు మాతోపాటు ఎదురు తిరిగి పోరాడిన కాన్విక్ట్ కామ్రేడ్ ఉత్తరావది.
కొమ్రేగ్ ఎం.ఆర్, వెంకట్రామన్ సీనియర్ లాయరు. లా చదవకపోయినా, హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయటంలో సిద్ద హస్తుడు కామ్రేడ్ గోపాలన్. ఆ జంట కవుల ఆధ్వర్యంలో దాదావు అక్కడున్న డిటెన్యూలందరూ హెబియస్ కార్చస్ పిటిషన్లు హైకోర్భలోనూ, నుప్రీంకోర్టులోనూ కూడా దాఖలు చేశాం. ఆ సందర్భంగా నేనూ, కామ్రేడ్ ఎం.ఆర్. మోహన్‌కుమారమంగళం, మొదలుగాగల వాళ్ళం ఒక నెలరోజులు ఢిల్లీ సెంట్రల్ జైలులో వున్నాం. అక్కడికి అస్సాం నుండి ఒరిస్సా నుండి కూడా ఆ సమయంలో ఆ జైలుకు వచ్చి వున్నారు. ఆ పిటిషన్ల ఫలితంగా కొందరు విడుదలైనారు. ఎ.ె.జి. కూడా విడుదలైనా, మళ్ళీ ఆయన్ను అరెస్టు చేసి ఇంకో జైలుకు మార్చారు. మద్రాసులో వున్న రావు అండ్ రెడ్డి అడ్వకేట్స్ బృందం వారు మాకు లీగల్‌గా ఎంతో తోడ్పడ్డారు. కావాలని ఎ.కె.జి., ఎం.ఆర్‌లను మా మధ్యకు మొదటి చేర్చిన ప్రభుత్వమే వారిని అక్కడి నుండి మరో జైలుకు పంపాలనీ, అక్కడే వేరు చేసి మాతో కలవనీయకుండా చేయాలని నానా తిప్పలు పడ్డది. ఆ ప్రయాత్నాలను మేము తీవ్రంగా ప్రతిఘటించి నివారించగలిగాం.
10
ఎశె.జి. అంటే జైలు అధికారులకు సింహస్వప్నం. కాన్విక్పై జైలు అధికారులు చేయి చేసుకొంటే వారిపై కామ్రేడ్ గోపాలన్ విరుచుకుపడేవారు. ఆ బెబ్బులి ముందు మేకపిల్లల వలే ఆధికారులు జారుకునేవారు.
కడలూరు బైలు నాలుగు గోడల మధ్య నిర్భంధించబడిన ఆంధ్ర డిటెన్యూలకు ఎశె.జి. ఎంతో అండదండగా వుండటమే కాదు. ఆంధ్రకు వచ్చి కూడా భయభ్రాంతులై యున్న ప్రబానీకానికి గుండె ధైర్యాన్నిచ్చారు. పలనియప్పన్ దురంతాలను గురించి, మలబార్ స్పెషల్ పోలీను దళాలు ప్రజలపై ప్రయోగించిన రాక్షస పింసాకాండను గురించి, అత్యాచారాలను గురించి డిటెన్యూల నుండి తెలుసుకున్న గోపాలగ్ తాను విడుదలైన వెంటనే విజయవాడకు హుటాహుటిన చేరుకున్నారు. అది 1951వ సంవత్సరం. అప్పటికింకా మేమంతా విడుదల కాలేదు. నాయకత్వం ఇంకా అండర్ గ్రౌండ్ నుండి బయట పడలేదు. మీటింగ్‌లకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. అఆ దశలో ఆయన ఆంధ్ర పర్యటన, సాహసించి పోలీసు కిరాతకత్వాన్ని దుయ్యబట్టిన తీరు మరువరానిది. అమావాస్యనాటి కటిక చీకటి నుండి బయట పడి రాజకీయ వెలుగులోకి త్వరగా రావడానికి ఆంధ్రలో పార్టీకి తోడ్పడ్డది.
అప్పుడే కాదు, జై తెలంగాణా, జై ఆంధ్రా వేర్పాటు ఉద్యమాలు జనాన్ని దారులు తప్పించిన సమయంలో కూడా పార్టీ ఇక్కడ నిర్వహించిన సమైక్యతా సభలకు ఆయన తోడ్చడ్డారు. 1972లో పాలకొల్లు సికెసి మీటింగ్‌కు రాగా పెద్ద ర్యాలీ జరిగింది. 1972లో హైదరాబాద్‌లో జరిగిన రైతు కూలీ సమీకరణకు ఆయన హాజరయ్యారు. అదేవిదంగా ఖమ్మం, నల్గాండలలో ఆయన పర్యటనలు తోడ్పడ్డాయి. తర్వాత జరిగిన ఎన్నికల 1ప్రచార సభల్లోనూ ఆయన తోడ్చడ్డారు. ఆ సభలో సమైక్యతా నాదం ప్రతిధ్వనించింది.
నాకు ఆయనంటే అపార గౌరవం వుండేది. ఆయన నాతో ఆంత సన్నిహితంగా ప్రవర్తించేవారు... ఒకసారి నాకు పెద్ద అగ్నిపరీక్ష వచ్చిపడ్డది. నేను విశాలాంధ్ర సంపాదకుడిగా వున్నాను. చైనా, భారత దేశాల మధ్య సాయుధ ఘర్షణ సంభవించింది. బూర్జువా పత్రికలు, ప్రభుత్వమూ దేశంలో సృష్టించిన ఉద్రిక్త వాతావరణంలో ఆయన “చైనా డురాక్రమణను” తీవ్రంగా ఖండించినట్లు పి.టి.ఐ. వార్త వచ్చింది. శోటి సంపాదకవర్గ సభ్యుల్ఫు డాన్ని ప్రకటించాలని వత్తిడి చేస్తున్నారు. నేను సాహసించి ఆ ప్రకటనను తొక్కిపట్టాను. దాన్నాక నేరంగా ఉమ్మడి పార్టీ నేతలు నాపై కస్సుమన్నారు. కాని కామ్రేడ్ గోపాలన్ మాత్రం తన ఆ ప్రకటనకు తర్వాత కట్టుబడడానికి నిరాకరించారు. చైనా, భారత దేశాలు స్పేహపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలన్న పంథానే అనుసరించి ఆయన రివిజనిస్ట్రల వైఖరిని ఖండించారు. ఆయన స్మృతులను మనముందుంచిన ఈ గ్రంధంలో ఆ విషయం సృష్టమవుతూన్నది.
11
కామ్రేడ్ గోపాలన్ ఆరోగ్యం ఎప్పుడూ ఆందోళనకరంగానే వుండేది. అనేక యుద్ధాలలో ఆరితేరిన అ నేత అంతటి అనారోగ్యవంతుడా అన్న ఆశ్చర్యం నాకూ కలిగేది. 1949-50లో మేము జైలులో వున్నప్పుడే ఆయన కాళ్ళు ఉబ్బరించి వుండేవి. లెక్కకు మించినన్నినిరాహార దీక్షల ప్రయోగంతో ఒహంళా ఆ శరీరం గుల్లయిపోయిందా అనిపించేది నాకు. 1953లో ఆయన మాస్కోలో అనారోగ్య కారణంగా 8 మాసాలు వుండిపోయారు. 1958 లో అమృతసర్ మహాసభ ముందు ప్రీతీనగర్లో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. అందులో నేనూ, అజయ్‌ఘోష్, నృపేన్ చక్రవర్తి, ఎ.కె.జి. ఒక అరుగుమీద వ్రక్కప్రక్కనే కూర్చుని వున్నాం. చర్చలు జరుగుతూండంగానే ఆయన నెమ్మదిగా నేలమీదకు ఒరిగారు. వెంటనే అమృతసర్ తరలించి హాస్పటల్లో చేర్చడం జరిగింది. అలాగే తర్వాత అనేక సార్లు జరిగింది. అఖరిసారి కలకత్తాలో ఒక నర్సింగ్ హోమ్‌లో ఆయన్ను చూశాను. కామ్రేడ్ సుశీల అనేక జాగ్రత్తలు తీసుకోని శుశ్రూష చేస్తూండేది. ఆమె లేనిపోని అదుపు ఆజ్ఞలకు తనను గురిచేస్తూన్నదని చూడడానికి వెళ్లిన వాళ్ళందరి ముందూ ఆయన నవ్వుతూ కంప్లయింట్ చేసేవారు.
జాతీయోద్యమాన్ని నిర్మించడంలో ఆయున బాగస్వామి. ఆ జాతీయోద్యమాశయాలను వమ్ము చేసిన కాంగ్రెస్ పాలకుల పై నిరంతరం పోరాడిన మహనీయుడు. ఇందిరా గాంధీ నిరంకుశ అత్యవసర పాలన అంతమై మరో ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందా అని 1977 ఎన్నికల పోరాటంలో కలలుగన్న కమ్యూనిస్టు యోధుడు. తీరా ఆ కల నిజమైందని ఎన్నికల ఫలితాలు వెలువడుతూండగానే అసువులు బాసిన ధన్యజీవి కామ్రేడ్ గోపాలన్. ఆయనకిదే నా భాష్పాంజలి. విష్ణవాంజలి. "
భావి తరాలకు వెలుగుదీపం ఆయన జీవితం. మరపురానిది ఆయన విప్లవ దీక్ష ॥ ఆయన చనిపోయిన వెంటనే ఎందుకో నా శ్రద్ధాంజలిని వాయలేకపోయాను. తెలుగులో ఆయన స్వీయ చరిత్ర మూడో ముద్రణకు నన్ను పరిచయం వ్రాయమని కోరడం ద్వారా ఇప్పుడునాకు ఆ అవకాశం కలిగించిన ప్రచురణాలయం వారికి నేనెంతైనా కృతజ్ఞుణ్ణి.
12
“కంట! బక వ్యక్తికాదు ఉద్యమం కౌామేడ్ సుందరయ్య మన మధ్య లేరు. అయినా ఆ విషయం నమ్మబుద్దిగావటం లేదు. నమ్మినా ఆ వాస్తవం మింగుడుపడటంలేదు. అందుకే ఆయన మృతజీవి అని సంతృప్తి చెందుతున్నాము. సంతృప్తి చెందటమేగాదు అది సత్యం. సహజంగా ఆయనతో దీర్ణకాల పరిచయమూ, సాన్నిహిత్యమూ వున్న కామ్రేడ్స్ అనేక సంఘటనలనూ, సందర్భాలనూ పేర్కొని ఆ ఆదర్శమూర్తి గుణగణాలను అద్దంలో చూపినట్లు చెప్పడం ఎంతైనా ఆసక్తిదాయకం. భావితరాలకు ఆ స్మృతులు ఉఊత్సాహాన్నిస్తాయి. అయితే రాజకీయ సిద్ధాంత చర్చలు, డొక్యుమెంట్లు, తీర్మానాలు, " కుడి ఎడమ పెడరోరణుల ఖండన మండనలు మొదలైన వాటితో సతమతమవుతూన్న వా బోటి వాళ్ళకు అందుకు ఉపకరించే కొన్ని చక్కని సంఘటనలూ, సందర్భాలూ మరుగునపడటం కద్దు. ఏమైనా ఎక్కువగా వాటిని పేర్కొనలేకపోయినా రెండు మూడింటినైనా పేర్కొంటాను. కామ్రేడ్ సుందరయ్యళతో నాకు మొదటి ప్రత్యక్త పరిచయం నేను గుంటూరు ఎ.సి. కాలేజీలో చదువుతున్నప్పుడు కలిగింది. అది 1937 శీతాకాలం. కమ్మహాస్టలు రెండవ అంతస్తు రూములో వున్నాను. సామాన్యంగా తలుపులు గడియవేయకుండా కోర్గలానీసి చుయాత్యనేనాయ్త. షి మైంందిగో జాయేడ్ ుషతనంత గాడ టడణాలి ౨ ట్రీ నాలి అక్కడికి వచ్చారు. కాని నన్నులేపలేదు. పైగా ఆ వరండాలో తన వద్దనున్న పత్రికలను; 13
చాపగా వేసుకొని, తన సంచిని దిండుగా పెట్టుకుని నిద్రపోయారు. తెల్లవారుతుందనగా వేను లేచి బయటికి వచ్చి చూసేసరికి కనిపించిన దృశ్యం ఇది. అంతకుముందు ఆయన్ను గురించి వినడమే తప్ప నేను చూడలేదు. అయినా విన్నదాన్నిబట్టే గుర్తించి పలకరించాను. “మీరు నన్ను లేపకపోవడం నాకు బాధ కలిగించిందండీ' అన్నాను. 'నీ నిద్ర చెడగొట్టడం ఇష్టంలేక అలాచేశాను. నాకు ఏమీ ఇబ్బంది కలగలేదు' అన్నారాయన. అప్పుడేగాదు ఆ తర్వాత ఇన్నేళ్ళుగా ఎన్నో సందర్భాలలో మేమంతా శిబిరాల్లోనూ, లార్జీలలోనూ వున్నప్పుడుకూడా గమనించాను. నాలుగు గంటలకే నిడ్రలేచే అలవాటున్న కామ్రేడ్ సుందరయ్య ఇతరులకు నిద్రాభంగం కలుగుతుందని లైట్లువేసేవారు గాదు. నిశ్శబ్దంగా తనపని తాను వూర్తిచేనుకుని అవనరమైతే మరో చోటికిపోయి చదువుకునేవారు.
ఈ నమాజంలో మనిషిని మనిషి దోచుకోవడం ఎంత సహజమో, మనిషిని మనిషి మోయడమూ అంత సహజం. వాటిని గురించి సామాన్యంగా బాధపడేవారుండరు. కాని కామ్రేడ్ సుందరయ్యకు అటువంటివెంతో బాధాకరంగా వుండేవి. గుర్రపుబండ్ల కాలం దాటింది. సైకిల్ రిక్షాలు వచ్చాయి. మన బస్తీలలో మధ్యతరగతుల వ్రయాణీకులకున్న నదుపాయం అదే. అయినా చాలాకాలం కామ్రేడ్ సుందరయ్య రిక్షాలుఎక్కేవారు గాదు. అదేమంటే మనుషులు తొక్కుతున్న రిక్షాలు ఎక్కడం ఎలా అనేవారు. మేమంతా ఆందోళన చేయగా చేయగా రిక్షాలు ఎక్కడం ప్రారంభించారు. అదైనా తానొక్కడుగా తప్ప మరొకర్ని ఆ రిక్షాలో ఏ పరిస్థితుల్లోనూ ఎక్కించుకునే వారుగాదు.
ఆంధ్రప్రదేశ్ ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు రాష్ట్రం అని (ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటిస్తూంటుంది. దాన్ని కామ్రేడ్ సుందరయ్య శాసననభలోనూ, వెలుపలా కూడా ఎప్పుడూ ఖండిస్తూనే వుండేవారు. ఒకవైపు అందరికీ తిండి పెట్టకుండా, వారి కడుపులు మాడ్చుతూ ధాన్యం మిగిలివున్నదని గొప్పలు చెప్పుకోవడం తగనిపని అని ఆయన విమర్శించేవారు. సంవత్సరం పొడుగునా మనిషికి సగటున ఎంత ఆహారధాన్యం కొవాలో లెక్కవేసి, జనాభా అంతటికీ ఆ వంతున కావలసిన ధాన్యాన్ని అంచనావేసి, ఆహారధాన్యాల లోటు ఎంత వుండేదీ గుర్తించమని పదేపదే వాక్కిచెప్పేవారు. ఈ విధంగా అందరికీ తిండి లేదన్న ఆవేదన నిరంతరం ఆయన్ను వెంటాడుతూండేది. అందరికీ తిండిపెట్టే బాధ్యతను ప్రభుత్వం విస్మరించరాదన్న విషయాన్ని ఎప్పుడూ ఎజెండాలో ఆయన పెట్టివుంచేవారు.
ప్రజావైద్యశాలలన్నవి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. బెంగాల్ కరువు బాధితులకు శవదెని వచ్చిన డాక్టరో రామచంద్రారెడ్డి (నుందరయ్యగారి తమ్ముడు) మొదట దాన్ని వెల్లూరులో నెలకొల్పారు. ఆయన, చనిపోయినా పేదల ఆస్పత్రిగా అది మరింత
శ
అభివృద్ది చెంది వ్రఖ్యాతిగాంచింది. దాని ఆదర్శంతో ఉత్సాహపడిన అనేకమంది పార్టీ డాక్టర్లు పలు ప్రాంతాల్లో అటువంటి వైద్యశాలలను నడుపుతున్నారు. వైద్యవృత్తిలో ఈ 'సేవాతత్పరతను ప్రోత్సహించి తగు సలహా సంప్రదింవులతో రాణింవుకు తెచ్చిన మానవతావాది కామ్రేడ్ సుందరయ్య.
ఇవన్నీ ఆయనలో గల మానవతకు కొన్ని మచ్చుతునకలు. ఆయన గొప్ప ల్యాగి, నిరాడంబరుడు. అంతేగాదు కపటమెరుగని రాజకీయవేత్త. ఈ సద్గుణం యితర పార్టీ పెద్దలతో నంధప్రదింపులు, సంభాషణలు, రాయబారాలు నడిపేటప్పుడు కొన్ని చిక్కులు లెచ్చిపెట్టేది. మనం ఎంత నహేతుకంగా వుంటామో, ఇతరులూ అంతేననుకుంటూ తన తురుపు ముక్కలన్నింటినీ ఒకదాని తర్వాత మరొకదాన్ని ప్రత్యామ్నాయంగా ఆయన బయటపెట్టేసేవారు. అలాగే తాను అనుచితం అనుకున్న నిర్ణయాన్ని ఆయన కుండబ్రద్దలు గొట్టినట్లు ప్రకటించి పట్టుబట్టేవారు.
మర్యాద, మన్నన, సౌమ్యంగా ప్రసంగించడం, విషయాన్ని విపులంగా విప్పిచెప్పడం మొదలైనవన్నీ ఆయన సహజలక్షణాలు, అటువంటి లక్షణాలు గల రాజకీయవేత్తలు చాలామంది వుండవచ్చు. కాని వాటన్నింటితోపాటు అద్యంతం ఒక మహత్తర ఆశయానికి అంకితమై ఆయనవలె అనేక అగ్ని పరీక్షలకు తట్టుకుని అందుకొక ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తులు బహంకొద్దిమందే వుంటారు. కామైడ్ సుందరయ్య ఒక వ్యక్తిగాదు. ఒక ఉద్యమం. మార్క్సిజం... లెనినిజం అన్న మహత్తర సిద్దాంతాన్ని ఈ రాష్ట్రంలోనూ, దేశంలోనూ విప్లవోద్యమంగా నిర్మించిన ముఖ్య పాత్రదారుల్లో ఆయనొకరు. ఇటీవల ఘటనలు చాలామందికి తెలుసు. అందుకే ఆరంభదివాల్లో ఆయన ప్రతిభకు ప్రతిబింబాలుగా నిలిచిన ఉద్యమాలను నేను ఈ సందర్భంగా ఉదహరించదలిచాను.
క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యమాల నిర్మాణం, నిర్వహణ
1934 నుండీ ఆంధ్రలో పార్టీ నిర్మించబడ్డది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆది అనేక రూపాల్లో ప్రజ్వరిల్లింది. అందుకు అనేక అగ్ని పరీక్షలను అది ఎదుర్కొనవలసి వచ్చింది. ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వ నిషేధాలు, నిర్బంధాలు గడిచి గట్టెక్కవలసి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం కక్షతో కత్తికట్టి కమ్యూనిస్టుల ఉద్యమంపై సాగించిన డాడినీ అది తట్టుకోవలసి వచ్చింది. ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంయెడ, కాంగ్రెస్ నాయకత్వం తప్పుడు వైఖరి తీసుకుని, క్విట్ ఇండియా పేరిట కొన్ని పారపాటు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆది విఫలం కాగా అందుకు కారణం కమ్యూనిస్టులేనన్న దుష్ప్రచారాన్ని కొనసాగించింది. ప్రజలను రెచ్చగొట్టింది. కనుక కమ్యూనిస్టులం మా ఉనికివి మేమే కాపాడుకోవలసి వచ్చింది. రాజకీయ ప్రచార హక్కునూ, సభలనూ, పార్టీ
15
ఆఫీసులనూ రక్షించుకోవలసి వచ్చింది.
అదే సమయంలో రాయలసీమ కరువూ ఉత్తరాంధ్రజిల్లాల కరువూ సంభవించాయి. లక్షల మందిని పీనుగుల్ని చేసిన బెంగాల్ కరువూ ఆనాటిదే. అందుకుతోడు జీవితావసర వస్తువుల,ముఖ్యంగా ఆహార పదార్థాల కొరత జనాన్నందరినీ ఇబ్బందులపాలు చేసింది. మండుటెండల్లో నిలబడి దొంగ మార్కెట్‌ని ఎండగట్టి కంట్రోల్ ధరలను అమలు జరిపించవలసి వచ్చింది. కరువు బత్తెం, బంజరు పంపకం, వ్యవసాయ పనిముట్లు సరసమైన ధరలకు లభించేకృషి మొదలైన వాటన్నింటినీ సాధించేందుకు ఉద్యమాలు నడపవలసి వచ్చింది.
క్రమశిక్షణ, విప్లవదీక్షాగల కామ్రేడ్ సుందరయ్యవంటి నాయకులు లేకుండా అనాడు కమ్యూనిస్టు ఉద్యమం మొదట కోస్తారాయలసీమ ప్రాంతాల్లోనూ తర్వాత తెలంగాణాలోనూ ఆ స్థాయికి ఎదిగేదికాడం. స్వాతంత్ర్య ఏవిపానుటలైన యువతీయువకులను కమ్యూనిస్టు ఉద్యమంవైపు ఆకర్షించి, వారిని సైనికులవలె కదంతొక్కించి ఉద్యమాలను నిర్మించిన (ప్రారంభదినాలవి. ఆకర్షితులైనవారు విద్యార్భలూ, యువకులూనూ. గాంధీజీ మార్గంతో అసంతృప్తి చెంది సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలతోనూ, విష్లవోత్సాహంతోనూ ఉర్రూతలూగి ఉద్యమంలోకి వచ్చిన 'సైన్యమే అదంతా. ఆ నూతనోత్సాహాల ్రతిబింబాలే ఆనాటి ఉద్యమాలు, త్యాగాలు, క్రమశిక్షణ,విప్లవదీక్ష మొదలైనవన్నీ.
పైన పేర్కొన్న అగ్ని పరీక్తలన్నింటినీ అధిగమించి కమ్యూనిస్టు ఉద్యమం ఊపందుకోవడం తద్వారానే సాధ్యపడ్డది. కమ్యూనిన్సు శిక్షణ కమ్యూన్‌లతో ప్రారంభమైంది. ఆలిండియా పార్టీ హెడ్‌క్వార్టర్స్‌గా వున్న బొంబాయిలో లీలగారి తల్లి ఆధ్వర్యాన కమ్యూన్ జీవితం (ప్రారంభమైంది. అనేక కుటుంబాలు ఒక కుటుంబంగా కొమన్ కిచన్‌ను నడుపుతున్న రోజులవి. అటువంటిదే విజయవాడలో కామ్రేడ్ బుల్లెమ్మగాగి ఆధ్వర్యాన నడిచింది. అలాగే గుంటూరు మొదలుగా గల కేంద్రాలలో కమ్యూన్లు, వ్రతి కమ్యూన్కి ఒక తల్లి ఆధ్వర్యం, వాటికి కొన్ని కట్టుబాట్లు ఏర్పడ్డాయి.
రాజకీయ ప్రచారంలో, ప్రజాసంఘాల నిర్మాణంలో, ప్రజాసమస్యల పట్ల కదిలి పనిచేయడంలో, వివ్లవసాహిత్యం, సాంస్కృతి, సంస్కరణ పెంపాందడంలో ఆంధ్రరంగస్థలంలో అన్ని రంగాల్లోనూ నూతనోత్సాహం వెల్లివిరిసింది. వీరేశలింగం, గిడుగు, గురజాడ, చిలకమర్తి, మాడపాటి, సురవరపు ప్రతాపరెడ్డి వంటి వారి సంస్కరణలు, రచనలు పునరుజ్జీవం పోనుకున్నాయి. బాల, విద్యార్థి, యువజన, మహిళానంఘాలు, కార్మిక, వ్యవసాయ కార్మిక, నేత, గీత, రైతుసంఘాలు, ప్రజానాట్యమండలి, ప్రజారక్షణ దళాలు, అభ్యుదయరచయితల నంఘం-ఒకటేమిటి ఆబాలగోపాలాన్ని ఆకర్షించే ఉద్యమాలన్నీ అప్పుడు విజృంభించాయి. గ్రామగ్రామాన సభలు, ఆటలు, పాటలు,
16
వైజ్ఞానిక ప్రదర్శనలు, వీధిభాగవతాలు, బుర్రకఠలు మొదలుగా గల జానపద కళారూపాలన్నీ వినూత్న భావాలతో పూరించబడి పవ్రదర్శనలుగా తయారైనాయి. “మాభూమి” వాటకం లాంటివి రంగస్థలినలంకరించాయి. ఉరికంబాలకెక్కిన కయ్యూరు కామ్రేడ్స్ ఊరూరా మోగిపోయారు. బెంగాల్ కరువు నృత్యం జనాన్ని కదిలించింది. వాలంటీరు శిక్షణా కేంద్రాలు, రాజకీయ పాఠశాలలు నిత్యకృత్యాలైనాయి. వీటన్నింటికి పరాకాష్టగా ఆంధ్రలో ఒక అపూర్వ మహాసభ జరిగింది. అదే 1944లో జరిగిన అభిలభారత రైతు మహానభ. వీటన్నింటికీ నాందీవాచకం పలికింది పార్టీ. ఆ విజృంభణకు వ్రతిబింబాలుగా, వాణిగా, మార్గదర్శకంగా నడిచాయి నవశక్తి, ప్రజాశక్తి పత్రికలు. త్యాగశీలతలో నూతన ఒరవడి
రాజకీయ చైతన్యం, త్యాగం, సేవానిరతి, సాహసం, సంసిద్ధత, క్రమశిక్షణ మొదలైనవన్నీ ఆనాడు కామ్రేడ్ సుందరయ్య లాంటివాళ్ళు ఆనలు వేయగా అభివృద్ది చెందాయి. అనేకమంది నాయకులు , కార్యకర్తలు, యువతీ యువకులు ఆయన ఆడర్శాన్ని అనుసరించి తమ ఆస్తులూ, నగలూ అమ్మి పార్టీ నిధికి సమర్చించారు.
డెల్టా ప్రాంతాల నుండి కొమ్రేడ్స్ అనేకమంది పార్టీ పిలుపందుకుని కరువు నివారణ కృషికోసం అటు రాయలసీమ, ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నంవైపు తరలివెళ్ళారు. కొందరక్కడే స్థిరపడిపోయారు. తర్వాత తెలంగాణా వీరోచిత పోరాటంలో పాల్గొనడానికి వురకలు తీశారు.
ఆ యుద్దకాలంలోనే కొద్రేడ్ సుందరయ్య నాయకత్వాన అన్ని జిల్లాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి బందరు కాలువలో మైళ్ళకాలదీ మేటవేసిన సిల్ట్‌ను రోజుల తరబడి త్రవ్వి, తలకెత్తుకుని మోసి అవతల కట్టలుగా పోసిన దృశ్యం మరపురానిది. ఒక సంవత్సరం ఆ కాలువ నీరు పారక పాలాలు బెట్టతీశాయి. వేసవిలోవైనా సిల్ట్ తీయించమని అధికార్ల వద్దకు రాయబారం వెళితే, తాము అంతమంది కూలీలను సమీకరించి సకాలంలో పని పూర్తిచేయలేమని వారు నిస్సహాయతను వెలిబుచ్చారు. అయితే ఆ పని మేమేచేస్తాం అని కామ్రేడ్ సుండరయ్య వంటి నాయకులు భుజం కాచి ఆ తరం కమ్యూనిస్టులను, ప్రజాసంఘ కార్యకర్తలను,ప్రబారక్షణడళం వాలంటీర్లను ఆ కాలవలోకి మార్చి చేయించడం జరిగింది. అందుకొక కమ్యూన్ భోజన శిబిరం ఏర్పాటు జరిగింది. తైదజావ, అన్నం, పులుసు, మజ్జీేగ ఆహారం, మంచినీళ్ళకు ముంతలు, భోజనానికి మూకుళ్ళు పాత్రలు, క్యూలో నిలబడి వాటిని పుచ్చుకుని తిన్న తర్వాత ఎవరి మూకుళ్ళూ, ముంతలూ వారు కడిగి ఒకచోట పేర్చడం నిత్యకృత్యం. ఈ వింత చూద్దానికి వేలాది ప్రజలు వచ్చివిస్తుపోయేవారు. కమ్యూనిస్టులు తలచుకుంటే ఏమైనా చేయగలరన్నది జనవాక్యం అయింది.
17
కార్మిక, కర్షకోద్యమాలు, పోరాటాలు, వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విజృంభణ, వేలాదిమంది జైళ్ళలో మగ్గడం, మరికొన్ని వేలమంది వీరోచితంగా 'ప్రాణాలొడ్డి నేలకొరగడం, లక్షలాది మంది నిర్చంధాలకు గురై అష్టకష్పాల పాలవడం, మళ్ళీ లేచి నిలబడి ఎన్నికల్లో విజయపరంపరలు సాధించడం వంటివన్నీ తర్వాత ఘట్టాలు. - ఉద్యమాల నిర్మాత జీవిత సర్వస్వాన్నే ఒడ్డిన సుందరయ్యగారి వంటి కమ్యూనిస్టునేతలూ, కమ్యూనిస్టు ఉద్యమమూ ఇంతకూ సాధించిందేమిటి? అన్న ప్రశ్న నేటి తరాల వారు, భావితరాలవారు అడగవచ్చు. రష్యా-చైనాలవలె మనం విష్లవాలను ఇంకా సాధించకపోవచ్చు. కాని కమ్యూనిస్టు ఉద్యమం ఆ విధంగా ఉత్పన్నమై పెంపొందకపోతే ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ ఈ నాటి అభ్యుదయ విస్లవభావాలు, నినాదాలు అవిర్భవించే వుండేవిగావు. పీడిత ప్రజావాణి ఈ మాత్రంగానైనా వినిపించేదిగాదు. కామ్రేడ్ నుందరయ్య ఉద్యమం (ప్రారంభించిన దినాల్లో సోషలిజం ఒక వింత. ఆచరణ సాధ్యంగాని ఊహ. నిరసించదగిన విదేశీ సిద్ధాంతం. సమానత్వం అన్నదొక కల. దున్నుకునేవాడికే భూమి, భూపంపకం, కనీస వేతన నిర్ణయం మొదలయినవన్నీ సొమాజిక విచ్చిన్నకర పోకడలు. కులం, మతం మొదలయిన కుదుళ్ళన్నీ కదపడానికి వీలులేనివి. కామ్రేడ్ సుందరయ్య విరచిత “విశాలాంధ్రలో ప్రజారాజ్యం" ఒక కల. నైజాం పాలనపోదు, ఆంధ్ర తెలంగాణాలు రెండూ ఏకంగావు-ఇవే ప్రజల్లో ప్రబలివున్న భావాలు. ఒక్క కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ వుండరాదు. ఏప్రజాసంఘమూ తలెత్తరాదు. వ్యవసాయ కార్మిక, రైతుయువజన, విద్యార్థి, మహిళానంఘాలన్నీ, వృత్తిసంఘాలన్నీ జాతీయోద్యమాన్ని చీల్చడానికి, కాంగ్రెస్‌కు పోటీ పెట్టడానికి ఏర్పాటైనవేనన్న భావాలు ప్రజల్లో ప్రచారమయ్యేవి. అభివృద్ధి నిరోధకశక్తులు ఆ వెనుకబాటు స్థాయిని ఆధారం చేసుకుని జనాన్ని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేవి. ఆ భావాలను ప్రబోధించి, వాటికోసం ఉద్యమాలు నిర్మించి పోరొడినందుకే పాలకులు వేలాదిమంది ప్రాణాలు తీశారు. నంఘాల ప్రారంభకులు కమ్యూనిస్టులు. నేడు సర్వత్రా ఆమోదించబడిన సోషలిజం, నమానత్వం, భూవంవకం, వెనకబడిన కులాల ఉద్భరణ, హరిజన,గిరిజనోద్ధరణ, కనీన కూలి నిర్ణయం వంటివన్నీ ఆ ఉద్యమాలనుండి ఉత్పన్నమైనవే. తమ నినాదాలతో అందరినీ ఆకట్టుకోలేమన్న తాపత్రయంతో కాంగ్రెస్ 1945 నుండి పోటీసంఘాలు (ప్రారంభించింది. ఐ.ఎన్.టి.యు.సి., రైతు కాంగ్రెస్, యువజన కాంగైస్, విద్యార్థి కాంగ్రెస్ వంటివన్నీ ఆ తర్వాతనే తలెత్తాయి. కమ్యూనిస్టులను 18
అణచి, కమ్యూనిస్టు నినాదాలతో ప్రజలను ఆకట్టుకోవడానికి సోషలిస్టు తరహానమాజం, సోషలిజం,గరిష్ట పరిమితి చట్టాలు, గరీబీ హఠావో మొదలైనవన్నీ ప్రయోగించబడినాయి. కాని అవి అమల్లోకి రాలేవు. కమ్యూనిస్టులు అణగిపోరన్నది చరిత్ర చెప్పిన సత్యం,
కమ్యూనిస్టు ఉద్యమాలు, వాటి ప్రభావంతో 1952 ఎన్నికల విజయాలు సంభవించకపోతే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం, నైజాం సంస్థాన విచ్చిన్నం, ఆంధ్రా-తలంగొణాలు ఆంధ్రప్రదేశ్‌గా అవతరించడం, నాగార్జునసాగర్ (ప్రాజెక్టు నిర్మాణం మొదలైనవేవీ సాధ్యపడేవిగావు. వీటన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ మొదటి శ్రేణిని నిలబడి దారిచూపగా ప్రజలు పోరాడి సాధించుకున్న విజయాలు కనుకనే ఆ మాట చెబుతున్నాను.
మళ్ళీ ఆ ఉద్యమమే నిలబడి అడ్డంపడకపోతే సాధించిన ఆంధ్రప్రదేశ్ ఏలినవారి పుణ్యమాంటూ వేరు తెలంగాణా,ప్రత్యేకాంధ్రలుగా చిన్నాభిన్నమై వుండేది అని కూడా మరచిపోరాదు.
ఈ ఆశయాలను ప్రబోధించడంలో, ఉద్యమాలను నిర్మించడంలో ప్రధములు కామ్రేడ్ సుందరయ్య. అందుకే ఆ తర్వాత దశలో ఎడాపెడా ధోరణుల నుండి వాటిని రక్తించి నిలబెట్టడంలోనూ ఆయన ప్రధాన పాత్రధారి అయినారు. భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) ను రూపాందించి పెంపాందించడంలోనూ జీవితాంతం బాధ్యత వహించారు. కామ్రేడ్ సుందరయ్య ఒక వ్యక్తిగాదు, ఉద్యమం అని అందుకే అంటున్నాం.
తన హైస్కూల్ విద్య పూర్తికాగానే కారల్ మార్క్‌ను ఆ సంస్థ వారడిగారట నీ జీవిత లక్ష్యం ఏమిటని?" అండుకు ఆ చిన్నతనంలోనే ఆయన చెప్పిన సమాధానం “పువ్వు పుడుతూనే పరిమళాన్ని" వెదజల్లినట్లున్నది. 'ఉమ్మడి ప్రయోజనం కొరకు పాటుపడాలన్న మహత్తర భాడాలు గలవారినే గొప్పవాళ్ళనుగా చరిత్ర పరిగణించింది. అత్యధిక సంఖ్యాకులకు ఆనందాన్ని చేకూర్చినవాడే ఆనందమయుడు కాగలడని అనుభవం చాటింది" అన్నది సందేశం.
మరో మహత్తరమైన భావాన్ని ఒక రష్యన్ రచయిత వెల్లడించాడు. “జీవకోటిలో మానవ జీవితం ఉత్తమమైంది. మానవుడికి ఆలోచనాశక్తి వున్నది. నాకా శక్తి
వున్నందుకు, అందరి ఆనందం కోసం నా శాయశక్తులా కృషి చేశానని అంతిమ దశలో ఎవరు గుండెమీద చేయివేసి చెప్పగలరో వారే ధన్యజీవులు కాగలరు' అన్నది ఆ సూక్తి.
పై రెండు సూక్తులకూ ఆనుగుణమైంది కాడ్రుడ్ సుందరయ్య జీవితం. వప్రజాసేవే పరమ ధర్మమంటూ ఆ మహాప్రస్తానానికి ఆయన చిన్ననాడే పయనం గట్టారు.. జీవిరాంతం అండుకే అంకితమై అసువులు బాశారు, పీడిత ప్రజలచే ప్రియతమ నాయకుడుగా పిలవబగ్జారు. మోశ్యులడి మవామనిషి ఆనిపందుకున్నారు. అందుకే ఆయన ధన్యజీవి, చిరస్మరణీయుడు.
129
న లో ఆ ఆతి న్యారక సభలొ ప్రసంగం
(21-5-85న విజయవాడ కళాక్షేత్రంలో జరిగిన సుందరయ్య గారి స్మారరసభకు అధ్యక్షత వహించిన హనుమంతరావుగారి ప్రసంగంలోని భాగం.)
సుందరయ్యగారి విష్లవ దీక్త ఆదర్శాలను గురించి కామ్రేడ్ రణదిపగారు ఇంతకుముందు వివరించారు. అలాగే కామ్రేడ్ బసవపున్నయ్యగారు మన రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమాన్ని అభివృద్ది చేయడంలో తమ పాత్రను, ముఖ్యంగా సుందరయ్య గారి ఆదర్శాన్ని గురించీ వివరించారు. ముఖ్యంగా సి.పి.ఐ, నాయకత్వంలో తొమువుండి, వ్యక్తిగత వ్యవహారంగా గాక విప్లవ సిద్దాంతానికి అనుగుణంగా ఎలా నడుచుకోవలసి వచ్చిందీ చెప్పారు.
అయితే సాధారణంగా మన సభ్యుల్లోనూ, సానుభూతిపరుల్లోనూ ఒక సందేహం వున్నది. అంతటి "పెద్ద నాయకులు విప్లవాన్ని ఎందుకు సాధించలేకపోయారు అంటూ వుంటారు. వివ్లవాలనేవికేవలం నాయకుల గొప్పతనాన్నిగురించి వచ్చేవిగావు. ఇందుకు తగిన సాంఘిక, ఆర్థిక పరిస్థితులనుంచి అవి ఉత్పన్నమవుతాయి. ఒకసారి అటువంటి నందర్భం ఉత్పన్నమైనప్పుడు నాయకత్వం దాన్ని నిర్వహించి ముందుకు తీసుకుపోయేందుకు కృషిచేస్తుంది. అందుకు సంకుచిత ధోరణిలో ఆలోచిస్తే సమాధానం దొరకదు. మార్క్స్, ఎంగెల్స్ వంటి మహనీయుల పుట్టిన జర్మనీలోనే విప్లవాలు ఎందుకు జయప్రదంకాలేదు అని అడగవచ్చు. విప్లవాలనేవి కొన్ని చారిత్రక పరిణామాల్లో సామాజిక కదలికలు. వ్యక్తులనుబట్టి అవిరానూ రావు, పోనూపోవు. అవి వర్గ పోరాటాలు.
అలాగే మన పార్టీలో వచ్చిన చీలికలను కూడా వ్యక్తిగత విషయాలుగా పరిగణించడం తప్పు. మార్కిజం-లెనినిజం అన్నదానికి ఎవరు కట్టుబడివున్నారు, వినరు దొడివష్పార్తు అన్న అటోచను ముఖ్యం. ఏవో అన్సదముఖువవె ఒక ఉమ్మడి కుటుంబంలా పార్టీ అంతా ఒకటిగా కలిసివుంటే యీ పాటికి యీ రాష్ట్రంలోనే మనం
20
అధికారానికి వచ్చేవారిమేమో, దేశంలోనే మన పార్టీ ఒక పెద్దపార్ట్ అయివుండేదేమో ఆలోచించడం తప్పు. కోటానుకోట్ల కుటుంబాలు కలిసివున్నంత మాత్రాన వివ్లవాలు వస్తున్నాయా? మనం కొన్ని ఆశయాలు సాధించడానికి అనుగుణంగా కొన్ని సూత్రాలపై ఆధారపడి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పూనుక్తున్నాం. పార్టీని ఆ సూత్రాలపై కట్టుబడనీయకుండా మితవాద, అతివాద ధోరణులు వచ్చిపడితే ఒంటరిగావైనా నిఫబడి పోరాడాలిగాని వదిలిపెడితే విప్లవం ఎలా వస్తుంది? కొన్ని ఆర్థిక, సాంఘిక, చారిత్రక పరిస్థితులలో తెలంగాణా వీరోచిత పోరాటం ఉత్పన్నమైనది. ఎప్పుడురమ్మంబే అప్పుడు అలాంటి పోరాటం వన్తుందా? పార్టీ ఆ పరిస్థితుల్లో దానికి నాయకత్వం వహించగల శక్తిగా ముందుకు వచ్చింది. ఆ పరిస్థితులు వ్రస్తుతం లేకపోయినా ఆ పోరాటానికి మనం పిలుపు ఇద్దాం అంటే అది అలా నడున్తుందా? నగ్గలైట్ల పోరాటం వలె ప్రజలకు దూరమై పతనం అవుతుంది. ఉన్న పరిస్థితులకనుగుణంగా ఏ పోరాటాల ద్వారా ప్రజలకు విప్లవ చైతన్యం కలిగించగలమో ఆ పోరాటాలను అనుసరిస్తాం. పరిస్టితులు మారాయి గనుక విప్లవ పోరాట ఆశయాన్ని విస్మరించడమూ తప్పే అవుతుంది. ప్రజలు అందుకు సంసిద్భులు గాని సమయంలో సాయుధ విప్లవపోరాటానికి పిలుపు ఇవ్వడమూ తప్పే అవుతుంది. ఆ దృష్టితోనే మనం మితవాడులనుండి అతివాద డుందుడుకువాద్యుల నుండీ విడగొట్టుకొని నిలబడవలసి వచ్చింది. ఈ గుణపారాలన్నింటినీ కామ్రేడ్ సుందరయ్యగారు తాను రచించిన “వీర తెలంగాణా విప్లవ పోరాటం-గుణపారాలు” అన్న గ్రంధంలో చక్కగా వివరించారు.
సూత్రబద్ధంగా మన పార్టీ నిలబడ్డది గనుకనే నేడు పశ్చిమబెంగాల్, కేరళ, త్రవుర వంటి రాష్ట్రాల్లో నామపక్షశక్తుల్నీ, ఇతర ప్రజాస్వామిక ప్రతిపక్షాలను కూడగట్టి దేశానికాక బాట చూపగలుగుతున్నది. దేశ వ్యాపితంగా అటువంటి బలం మనకు లేకపోయినా, మన రాజకీయ ప్రభావం ఇతర చోట్ల కూడా పడక తప్పదు. దేశం మొత్తం. మీద మనమే నిర్ణాయక శక్తి కాకపోయినా మన రాజకీయ ప్రభావం అన్ని చోట్లకు విస్తరించేలా కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తుల్ని కూడగట్టుకు రావాలి. ఆ క్రమంలో ప్రజల్లో విప్లవ చైతన్యాన్ని కలిగించాలి. ఆ విధంగా ఏ మేరకు మన (ప్రభావం పెరిగిందీ తరిగిందీ పరిశీలించాలి గాని సోషలిజం రాలేదు గనుక మనం చేసిందీ ఏమీ లేదన్న అభిప్రాయానికి రావడం పారపాటు. ఆ విధంగా అంతాపోయిందనో, మనం చేయకలిగిందేమీ లేదనో దిగజారడం విప్లవోద్యమ సాంప్రదాయంగాదు. విప్లవ కారుల లక్షణమూ గాదు. విష్ణవోద్యమానికి ఎన్నో ఆటుపోట్లు వుంటాయి. అన్నింటికీ తట్టుకొని భవిష్యత్తులో కూడా మనం నిలబడాలి. ఆ విధంగా మన కామ్రేడ్ సుందరయ్యగారి ఆశయాన్ని సాధిస్తాం అన్న దీక్ష బూనాలి. _ 2 ల
ఈ సందర్భంగా కామ్రేడ్ స్టాలిన్ చేసిన: "హెచ్చరిక ఒకటి. మన దృష్టిలో
" ఫే శ హ్.
వుండాలి. ఏ పెడధోరణికి వ్యతిరేకంగా పోరాడటం మానివేస్తే ఆ పెడధోరణే తర్వాత ప్రమాదకరంగా తయారవుతుందన్నది ఆ హెచ్చరిక. ఆ విషయం మన గమనంలో వుండాలి. అదే విధంగా కామ్రేడ్ రణదివె మనలో చాలా బలహీనతలు వున్నాయని చెప్పారు. ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలు జరుగుతున్నయీ రోజుల్లో
విష్లవ చురుకుదనం, వర్గపోరాటతత్వం సన్నగిల్లి మర్యాదగా తప్పుకోవడం జరుగుతున్నది.
వర్గపోరాటం అంబే భయం, అన్యాయం జరుగుతున్నా ఉపేక్షాభావం మనలో
పనిచేన్తుంటాయి. వాటిని అధిగమించాలి. ఏ మేరకు మనం ఆ అవలక్షణాల నుండి
బయలుపడ్డామో ఆ మేరకే మనం విప్లవపార్టీగా నిలబడ్డాం.
ఒకప్పుడు రష్యా మనది చీలిపోయిన ముఠా అని చిత్రించింది. మరోనైవు చైనా పార్టీమన పార్టీని, మన ఐక్య సంఘటన ఎత్తుగడలను, ప్రభుత్వాలను సామ్రాజ్యవాద తొత్తులపని అని దుయ్యబట్టింది. నగ్ధలైట్లను బుజాన వేసుకున్నది. వాళ్ళ చర్యలను విస్లవ జ్వాలలని వర్ణించింది. ఒక రవ్వరాజుకుంటే దావానలమై దేశాన్ని ముట్టడిస్తుందని వాళ్ళ మాటలకు అర్ధం చెప్పింది. ఆ చైనానో, రష్యానో ఆధారం చేసుకుని ఇక్కడ మితవాదులు, ఉగ్రవాదులు మనలను దుయ్యబట్టారు. అటు రష్యానూ కాదని, ఇటు చైనానూ కాదనే సి.పి.ఐ.(ఎం) ఏమి పార్టీ అని యద్దేవా చేసిన వాళ్ళూ వున్నారు. కొని తర్వాత పరిణామాలు ఏమి రుజువు చేసినాయి? ఆ వాదోపవాదాలను అధిగమించి సూత్రబద్ధంగా నిలబడ్డ మనపార్టీయే పెద్ద పార్టీ అయిందని గమనించారు. మనం బర్వాన్ ప్లీనంలో రష్యా అనుసరిస్తున్న రివిబనిజాన్నీ విమర్శించాం. చైనా అనుసరిస్తున్న ఒంటెత్తు వాదనలనూ విమర్శించాం. అదే సమయంలో ఎవ్వరినీ దుయ్యబట్టలేదు. రష్యాలో వున్న సోషలిజాన్ని, చైనాలో వున్న సోషలిజాన్ని మనం గౌరవించాం. ఇప్పుడు ఇద్దరూ మన పార్టీని గౌరవించి దానితో సత్సంబంధాలు కలిగి వున్నాయి. చైనా పదేళ్ళు గాడి తప్పి దేశానికి నష్టం చేకూర్చిందని ఆ చైనా పార్టీయే విమర్శించుకున్నది. ఆ పదేళ్ళూ వాళ్ళు గాడి దప్పి వ్యవహరించడాన్నే ఇక్కడ నగ్జలైట్లు మహా విప్లవం అని చిత్రించారు. " /' = 22
క. స ప్రఖ్యాత టూ లో నే ( నానన _. = "(నా విబవా౦జి జొరీయంగానూ, అంతర్జాతీయంగానూ కామ్రేడ్ యం.బి.గా "పేరుపొందిన మాకినేని బసవపున్నయ్య గారు ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 7గం.45 నిముషాలకు కన్నుమూశారు. కంగుమంటూ మోగే ఆ అనర్గళ గళం అంతటితో మూగబోయింది. పదునుకు, పరిపక్వతకు ప్రసిద్ధికెక్కిన ఆ చేతి కలం నేలవాలింది. నమ్మినా, నమ్మబుద్ది పుట్టకపోయినా కామ్రేడ్ యం.బి. మనమధ్యలేరన్నది చేదునిజం. ఇప్పుడు ఆయన జాడలు తప్ప నీడలు మనకు లభ్యంగావు. యం.బి. అస్తమయంతో దేశం ఒక మహత్తర మేధావిని కోల్పోయింది. సోషలిస్టు మహోద్యమం విప్లవ ఆచరణకు సిద్ధాంతం వెలుగుబాట అని నిరూపించిన గొప్ప మార్క్సిస్టు సిద్ధాంతచేత్తను కోల్పోయింది. పీడిత ప్రజానీకం, జనతా ప్రజాస్వామిక విప్లవ వ్యూహాన్ని ఎత్తుగడలను తీర్చిదిద్దడంలో వన్నెకెక్కిన ఒక గొప్పనేతను కోల్పోయింది. మార్క్సిస్ట్రుపార్టీ వరదల్లో, వాగుల్లో, గాలీవానల్లో --న్ని వేళలా చుక్కాని బట్టి పార్టీని నడిపించిన ఒక బహుముఖ ప్రబ్ఞాశాలిని కోల్పోయింది. వ్యక్తిగతంగా నేనొక చిరకాల ఆప్తమిత్రుణి కోల్పోయాను. చనువుగా, “అదిగాదురా యం.హెచ్.! ఇదీ పాయింటు అని చెప్పగల వ్యక్తి నాకిక కరవైనారు. 58 సంవత్సరాలపాటుఅనేక అవాంతరాలను, అగ్నిపరీక్షలను అధిగమించి ఒకే ఆశయానికి అచంచలంగా అంకితమైన ఆయన తోటి ప్రయాణీకుణ్ణి నేను 23
అండుకు ఆయన్ను గురించి ఎంతో చెప్పాలని వున్నది. అయినా కలం ఆడటంలేదు. వయస్సులో, స్థాయిలో, అనుభవంలో అన్నింటా ఆయన నాకు సీనియర్. పైగా సముద్రకెరటాలవలె లెక్కకుమించిన అనేక సందర్భాల్లో ఆయన పాత్రధారికాగా యీ విప్లవాంజలిలో ఎన్నెని పేర్కొనగలను! [ ఆయనతో నా పరిచయం హైస్కూలువిద్యార్థి దశతో ప్రారంభమైంది. తొలుత భావకవిత్వం, తర్వాత అభ్యుదయ సాహిత్యం, మొదట జాతీయోద్యమం, తర్వాత సోషలిస్టు ఉద్యమ మహాప్రస్థానం మాతరంవారిని, ముఖ్యంగా మమ్మూ ప్రభావితం చేశాయి. అక్టోబర్ మహా విప్లవ పోరాట కాలంలో పుట్టిన మా తరాన్ని దీర్ధకాల చైనా విప్లవపోరాట నేపధ్యం మున్ముందుకు నడిపింది. నిజానికి నా బాల్యమిత్రుడు, యం.బి. మేనమామ కొడుకు తర్వాత బావమరిదీ అయిన కాధేడ్ కంరంనేని వెంకటరత్నం మా మధ్య సొన్నిహిత్యానికి సంధానకర్త. 1950 నవంబరులో కమ్యూనిస్టు ఉద్యమంపై కాంగ్రెస్ రాజ్యం ఇంకా నిప్పులు కక్కుతూనే వున్నది. అప్పుడు తానున్న రహస్య కేంద్రాన్ని ముట్టడించిన ఒక కర్కోటక సర్కిల్ఇన్ స్పెక్టర్‌ను కాల్చిచంపి ఆయన వెంటనున్న కిరాతక పోలీనుల కాల్పులకుకంఠంనేని నేలకొరిగిన అమరుల రక్తర్పణతోపాటు అత్యంత సన్నిహితుడుఐన ఆ మహావీరుని త్యాగమూ మా దీక్షకు మరింత జీవం పోసింది. నాయకత్వం ఆయన సహజలక్షణం ఏ సందర్భంలోనైనా, ఏ సమావేశంలోనైనా ఆయన ఆదినుండీ, నాయకత్వ పాత్ర నిర్వహించేవాడు. మా విప్లవోద్యమ 'ప్రారంభదినాలు మాతరం వాళ్ళను అనేక విధాల ఉర్రూతలూగించేవి. భగత్‌సింగ్‌ను ఉరితీసిన రోజులు విద్యార్ధుల ఉడుకు రక్తాన్ని ఉడికించి సమ్మె పోరాటాల్లోకిదించాయి. గాంధీజీ హరిజనోద్యమం, కల్లుగీత వ్యతిరేక ఉద్యమం మొదలైనవన్నీ మమ్మురంగంలోకి కదిలించినా మరో ప్రత్యామ్నాయం ఏమిటన్న ఆలోచనలకు అంకురంగా పనిచేశాయి. అప్పటి పల్లెలోకి ప్రవేశించిన తీరు తర్వాత పల్లెకోన, దొవులూరు వంటి గ్రామాలతో ప్రారంభించి రేపల్లె, తెనాలి తాలూకాల్లో వ్యవసాయ కార్మికోద్యమాన్ని అభివృద్ది చేయడానికి నాంది ప్రస్తావనలు అయినాయి. మా రాజకీయ తృష్ణకు 1935 నుండి 38 వరకూ రాష్ట్రంలో మొదటి రాజకీయ పారశాలలుగా గుంటూరు జిల్లా నిడుబ్రోలు (1935), కొత్తపట్నం (1937), మంతెనవారిపాలెం (1938) వేసవి పాఠశాలలు ఉపయోగించాయి. 1935లో రంగాగారు నిర్వహించిన రైతాంగ విద్యాలయానికి బసవపున్నయ్య, వెంకటరత్నంగారలు వెళ్ళివచ్చారు. తర్వాత వామపక్ష కాంగైస్ వాదుల సహకారంతో పార్టీ కొత్తపట్నం, మంతనవారిపాలెంలలో రాష్ట్ర వ్యాపిత రాజకీయ పోఠశాలలను విసృతంగా నిర్వహించింది. గుంటూరు జిల్లాలో 24
అనాడు మాకందరికీ రాజకీయ సైద్దాంతిక గురువుగా పనిచేసిన వులువుల శవయ్యగారు ధ్రిన్చిపాల్గా అవి నడిచాయి. కామ్రేడ్ నుందరయ్యగారితోపాటు ఆవాటి ఆలిండియా కమ్యూనిన్న యోధులు అవేక మంది మంతెనవారిపాలెం హాజరై లెకర్లు వర్పారు. ఈ పాఠశాలలకు హాజరైన వారవేశమంది, ఆవాటి మండి రాష్ట్రవ్యాపితంగా పోషలిజు క్ష! కమ్యూనిజానికీ అంకితమై కార్యకర్తలుగా, వాయకులుగా పవిచేమ్తా వచ్చారు. శ నేవథ్యంలో 1937లో జరిగిన శావననభ ఎన్నికలూ, మ్యాళ్ళలోమా,. కాలేజీల్లోమూ ప్రజ్వరిల్లిన డిటెన్షన్ వ్యతినేక పోరాటాలు ఆచరణలో మాకు 'ప్రారమిక పాఠాలు నేర్చుకునేందుకు రంగస్థలాలుగా పవిచేశాయి. వెహూ కాంలైవ్ అధ్యక్షుడుగా పొషలిజాచ్ని ప్రచారంలో పెట్టేందుకు ఉపయోగవడగా, 1935లో ఏర్చడివ కాంల్రైప్ హోషలిష్టు పార్టీ మన రాష్ట్రంలో కమ్యూనిన్థ ఉద్యమ వ్యాప్తికి ఆపరా కలిగించింది. ప్రత్యేకంగా అయా నందర్భాల్లో నెహ్రూ డాంగే, బాటిల్వాలా, జయధ్రకాశ్ వారాయణ్లు గుంటూడు రావడం మేము రాజకీయ రంగస్థలంలో మరింత చురుకుగా పాల్గొవేండుకు అవకాశం కలిగించాయి. కాంగ్రెస్ మంత్రివర్గాలు ఏర్పడిన ఆనంతరం జాతీయోద్యమ వరవడులు తప్పి చీరాలలో కార్మికులపై కాల్పులు జరపడం, బాటిల్వాలాపై రాజద్రోహం చేరం క్రింద కేసు పెట్టటం వంటివి ఆ రోజుల్లో తీవ్రాందోళనలను రేకెత్తించాయి. రాజాజీ గుంటూరు వచ్చినప్పుడు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఆందోళనమ కూడా ముందుకు తేవడం జరిగింది.
, ఆ సందర్భంగావే అదివరకంతా వామమాత్రంగా ఉన్న విద్యార్థి ఫెడరేషన్ పునర్జీవం పోనుకున్నది. 1937 ఆగస్టు ఆఖరున గుంటూరులో జరిగివ 14వ రాష్ట్ర వద్యార్థి మహాసభల్లో కామ్రేడ్ యం... కార్యదర్శిగా ఎన్నికైనారు. అక్టోబర్‌లో గుంటూరులో జరిగిన చరిత్రాత్మక ఎ.సి.కాలేజి సమ్మె రాష్ట్రవ్యావిత డిబెన్షవ్ వ్యతిరేక పోరాటాల 'ప్రజ్వలనకు దోహదం చేసింది. పదిరోజులపాటు జరిగిన ఎపి. కాలేజి పమ్మె ఆ 32శవ దశలో మాకు ఉద్యమవ్యూహం, ఎత్తుగడలు, పజలలోప్రచారం చేసి సానుభూతి
_ పాందవలసిన అవవరం మొదలైన విషయాల్లో ప్రాకమిక పాఠాలు వేర్పింది. కులమళతాతీతంగా జరుగుతున్న వమ్మెను విచ్చిన్నం చేయడానికి మైవారిటీలకు చెండిన క్రిస్టియన్, ముస్లిం విద్యార్థులను రెచ్చగాట్టే ప్రయత్నాలు జరిగాయి. మేము డేట్లకు అడ్డంగౌ పఢుకుందే మమ్ములను తొక్కుకుంటూ కొందరు కాలేజీలో ప్రవేశించబోయినా రెచ్చిపోకుండా నిగ్రవాంగా, శౌంతియుతంగా ఉద్యమాన్ని వపందుకు తీసుకుపోయేందుకు, సమ్మెను జయప్రదం చేసుకునేందుకు మేము ప్రయత్రంచాం
కామ్రేడ్ యం.వి. యీ ఉద్యమానికి ప్రధాన వాయకత్వం వహించాడు. "రాత
1938లో మద్రానులోనూ 1939లో కలకత్తాలోడూ జరిగిన విద్యార్థి మహావభలకు
యం.బి,తోవ్బు, నేనూ వెంకటరత్నం పతినిధులుగా దెళ్ళాం. విద్యా ఉద్యదూన్ని 25
'పెడత్రోవను పట్టించడానికి మద్రాను వచ్చిన మినూమసానిని వ్యతిరేకించి కామ్రేడ్ రంగ్నేకర్ ఆలిండియా కార్యదర్శిగా ఎన్నుకోబడడానికి, కలకత్తాలో విశ్వనాథ ముఖర్జీ ఎన్నుకోబడడానికి మన రాష్ట్ర ప్రతినిధి వర్గం దోహదం చేసింది.
ఈ పరిణామాలన్నీ మేము పార్టీ సభ్యులమూ నాయకులమూ అయ్యేందుకు దోహదం చేశాయి. మాకు అగ్రగణ్యుడు కామ్రేడ్ యం.బి. గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం కామ్రేడ్ పోలేపెద్ది నరసింహమూర్తిగారి జిల్లా కార్యదర్శిత్వం క్రింద 1935 నుండి 37 వరకూ నడిచింది. 1937లో వులుపుల శివయ్యగారు, 1940లో బసవపున్నయ్యగారు, 1943లో నేనూ జిల్లా కార్యదర్శులుగా ఎన్నికయ్యాం,
1939 సెప్టెంబర్‌లో రెండవ ప్రపంచయుద్ధం (ప్రారంభమైంది. పార్టీ రహస్య పత్రిక స్వతంత్ర భారత్‌ను పంచుతున్నానన్నకేసుతో 1940 మార్చిలోనేను అండర్‌గ్రౌండ్‌కు పోవలసి వచ్చింది. తర్వాత కొన్నాళ్ళకు కామ్రేడ్ శివయ్యను వినుకొండలో ఇంటెరన్ చేయడం, తప్పించుకొని ఆయన రహస్య కేంద్రానికి చేరడం జరిగింది. మరికొన్నాళ్ళకు యం.బి.ని అరెస్టు చేయబోగా సమయస్ఫూర్తితో ఆయన తప్పుకోవడం జరిగింది. జల్లా విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శిగా వుండగా కామ్రేడ్ గంగాధరరావుగారు వారంటును తప్పించుకొని రహస్యంగా రావడం జరిగింది. గుంటూరు, తెనాలి పట్టణాలను కేంద్రాలుగా చేసుకొని ఆ రోజుల్లో రహస్య జిల్లా కేంద్రం నడిచింది. ం
సమయస్ఫూర్తికి కామ్రేడ్ యం.బి. పెట్టింది పేరు. మేమిద్దరం సైకిళ్ళపై ఒకరోజు అర్థరాత్రి పాతగుంటూరు మీదుగా తెనాలి వెళుతున్నాం. ఆ రాత్రి దొంగల కోసం వ్రత్యేకంగా నిఘా వేసి వున్న పోలీసులు నలుమూలల నుండి మావైపు రావడం గమనించి మేము నిలబడి, అర్జెంటు పనిమీద తక్కెళ్ళపాడు వెళుతున్నాం అని నిబ్బరంగా చెప్పాం. మా వేషభాషలను గుర్తించి మమ్ములను గుర్తించకుండానే
పోలీసులు పోనిచ్చారు. అలాగే మరొక రాత్రి తెనాలి-గుంటూరు రైలు కట్టపై లీగల్ నాయకులతో ఒక ఇంటర్వ్యూ పెట్టాం. ఆ దగ్గరలో వున్న పల్లెలో నుండి బడితెలు తీసుకుని మా వైపు కొందరు పరుగెత్తుకు వస్తున్నారు. ఏదో మూడిందనుకున్నాం. పరిగెత్తడానికి పూనుకుంటే వెంటబడి రభస చేయడం ఖాయమని భావించి అక్కడే కూర్చున్నాం. తీరా మా వద్దకు వచ్చిన ఆ దండు అయ్యా మీరా అని ఆగిపోయారు. ఆ పల్లెకు కొందరు పోకిరి యువకులు వచ్చి ఆడపిల్లలను వేధిస్తూండగా వాళ్ళపని
- బట్టాలని వచ్చామని తర్వాత చెప్పారు. ఇలాగే ఎన్నో సందర్భాల్లో ప్రత్యేకంగా ఆయన
సమయస్ఫూర్తి విదితం అయ్యేది. ఉద్యమానికి తీవ్రలవరోధాలూ, వాటిని అధిగమించిన తీరు 1942 వచ్చే వరకు యుద్ధ స్వభావం మారింది. అది ఫాసిజానికి వ్యతిరేక
26
యుద్ధంగా పరిణమించింది. కమ్యూనిస్టు పార్టీ యుద్దానికి అనుకూలతను వ్యక్తం చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం దానిపై నిషేధాన్ని తొలగించింది. ఆ 1942లోనే గాంధీగారి క్విట్ఇండియా ఉద్యమం (ప్రారంభమైంది. జాతీయ నాయకులపై ప్రభుత్వ నిర్భంధం తీవ్రతరమైంది. జాతియోద్యమ ధోరణికి కమ్యూనిన్స ఉద్యమానికి మధ్య వైరుధ్యం ప్రబలింది. ఒకవైపు ఫాసిజం పేతకళ వేయగా విజయం తధ్యం అనిపిస్తోంది. మరోవైపు అనతికాలంలోనే స్వాతంత్రోద్యమం విజయదుందుభి (మైోగించనున్నది. అయితే నరిగా యీ కాలంలోనే 1942-47పై కారబాలను ఆసరా చేసుకొని కాంగ్రెస్స్ కమ్యూనిస్టు ఉద్యమంపై తీవ్రమైన దాడులను కొనసాగించింది. అది వరకు ప్రజాసంఘాల విషయం పట్టించుకొనవి కాంగ్రెస్ అన్ని రంగాలలోనూ పోటీ సంఘాలు నిర్మించి ఘర్షణలను పెంచింది. గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా యీ దాడులను మేము ఎదుర్కోవలసి వచ్చింది. సభలూ, సమావేశాలూ జరపనీయకుండా అడ్డుకోవడం, విచ్చిన్నం చేయడం, ఆఫీనులపై దాడులు చేసి జెండాలు తగలబెట్టటం, స్రీలను దుర్భాషలాడటం, వెంగమ్మనాటకంలాంటి నీచమైన నాటకాలను, బూతుబుర్రకథలను ప్రచారం చేయడం జరిగింది. !
ప్రజలకు పట్టుదలగా ఆ యద్ధకాలంలో సేవచేయడం ద్వారా ప్రజల మధ్య నిలబడటానికి కమ్యూనిస్టులం ప్రయత్నించాం. దోపిడీ దొంగ మార్కెట్లను ప్రతిఘటించి జీవితావసర వస్తువులను, ఎరువులను, వ్యవపాయ పరికరాలను ప్రజలకు అందించాం. ప్రాచీన కళారూపాలను వునరుద్దరించి, అభ్యుదయ సాహిత్యాన్ని, నంఘ సంస్కర్తల ఉద్చోధలను ప్రచారంలో పెట్టాం. ప్రజాకర్ష్ణణీయమైన యీ కార్యక్రమాలు పార్టీ ప్రజాపంఘాలు బహుముఖంగా పెంపాందడానికి దోహదం చేశాయి. ఈ సందర్భంలో ప్రజలకు సేవ చేసేందుకు, ప్రచార కార్యక్రమాలను సంరక్షించుకునేందుకు ప్రజారక్షణ దళాలను ఏర్పర్చదలుచుకున్నాం.
కామ్రేడ్ యం.బి. రాష్ట్ర కమిటీ బాధ్యతలకు వచ్చినా ప్రధానంగా యీ కాలంలో అన్నికేంపెయిన్లలోనూ గుంటూరు జిల్లాలో వున్నారు. అనేక వందలమందిని ఉత్పాహపరిచి రంగంలోకి తీనుకురావడంలోనూ, అనేకమంది తమ ఆస్తులు అమ్మి త్యాగాలు చేయడంలోనూ ఆయన ఇచ్చిన ఉత్సాహం, ఊపు పనిచేశాయి. ఆ రోజుల్లోనే సుందరయ్య గారిచ్చిన పిలుపందుకొని బందరు కాలువసిల్చు తీసే కార్యక్రమంలో 400 మంది గుంటూరు జిల్లా నుండి పాల్గొన్నారు. పొగాకు కార్మికుల చరిత్రాత్మకమైన సమ్మెలు, మున్సిపల్ కార్మికుల సమ్మెలు జరిగాయి. 1946 ఎన్నికలలో కామ్రేడ్ యం.బి. అభ్యర్థిగా తెనాలి, రేపల్లె కలిసి వున్న శాననసభా నియోజకవర్గానికి పోటీ చేయడం జరిగింది. తద్వారా విసృత రాజకీయ ప్రచారాన్ని సాగించి 20 శాతం ఓట్లు సాధించడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాపితంగా వున్న ఉద్యమాన్ని అణచడానికి
27
1947లో ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఆర్షినెన్స్ తెచ్చారు.
1948 నుండి మళ్ళీ తీవ్ర నిర్బంధ విధానం పార్టీ ఎదుర్కొన్నది. కలకత్తాలో జరిగిన రెండవ పార్టీ మహాసభ నుండి రహస్యంగానే కామ్రేడ్ యం.బి., నేనూ తిరిగి వచ్చాం. ఆయన ప్లాను ప్రకారం జబల్బూరులో విద్యార్ధి ఉద్యమంలో మాతోపాటు అభివృద్ధి చెందిన కనగాల కుటుంబరావులాంటి వాళ్ళను ప్రయోగించి ఆయుధ "సేకరణకు పూనుకున్నారు. ఆ సందర్భంగా కొంత మందుగుండు సామగ్రిని తెలంగాణాకు చేర్చాము.
1948 బుద్ధవరం రాష్ట్ర మహాసభలో నన్నూ రాష్ట్ర కార్యదర్శి వర్గంలోకి ఎన్నుకోవడం జరిగింది. అప్పటికి తూర్చుగోదావరి జిల్లాలో గల మిలిటెంటు పార్టీ ఉద్యమం అరాచక శక్తుల ముఠాతల్వానికి గురై వున్నది. ఆ జిల్లాలో పార్టీ ప్రక్షాళనకు, వునర్నిర్మాణానికీ కామ్రేడ్ యం.బి.ని, నన్నూ రాష్ట్ర కార్యదర్శి వర్గం పురమాయించింది. యం.బి.తోపాటు నేనూ ఒకటిన్నర మాసాల కాలం రహస్యంగా ఆ జిల్లాలో పర్యటించి కమీషన్ నివేదికను తయారు చేయడం, పార్టీ వునర్నిర్మాణానికి తోడ్పడటం జరిగింది. కష్ట నిష్టూరాలు ఎలావున్నా సరకు చేయకుండా పార్టీని వునర్నిర్మించడంలో ఆయన సిద్ధహస్తుడన్న అనుభవం ఆ నందర్భంగా నాకు కలిగింది.
విష్లవవ్యూహ రచయిత
విప్లవ వ్యూహం, ఎత్తుగడలూ మార్క్సిస్టు లెనినిస్సు అవగాహనను అనుసరించి రూపొందించడం ఆయనకు మనదేశ రాజకీయాల్లో కరతలామలకం. 1948 రెండవ పార్టీ మహాసభలో ఇచ్చిన వివ్లవ పంధా ఏ నిర్హిష్టూపం తీనుకుంటుందన్న మీమాంస మాలో ప్రబలింది. తెలంగాణా, త్రిపుర పోరాటాల నేపథ్యంలో ఆ ఆలోచనలు రేకెత్తాయి. కామ్రేడ్ యం.బి., నేనూ విజయవాడలో రహస్యంగా ఒక పాకలో వుండగా ఆయనమన విప్లవ దశ, వ్యూహాలను గురించి ఒక నోట్తయారు చేశారు. మన విప్లవం చైనా మార్గం పట్టేదిగా వున్నది గనుక ఆ మార్గాన్ని మనం చేపట్టాలన్నది దాని సారాంశం. ఆ తర్వాత నేనూ మిగతా కార్యదర్శివర్గ సభ్యులం దానిపై సంతకాలు పెట్టి ఆంధ్రా సెక్రటేరియట్ నోట్‌గా దొనిని పి.బి.కి. పంపించాము. పి.బి. ఆనోట్ను త్రోసిపుచ్చుతూ మనదేశ పరిస్థితులు రష్యా వివ్లవ మార్గాన్నే చేపట్టగలవని సమాధానం ఇచ్చింది. అనంతరం ఆ పి.బి.ని త్రోసిపుచ్చుతూ 1950 జూన్‌లో ఆంధ్రా సెక్రటేరియట్ పంధాను అనుసరించే వారితో ఒక నూతన కేంద్ర కమిటీ ఏర్పడ్డది. దాన్నే ఆంధ్రా సి.సి. అన్నారు. అది పని చేసిన ఆరుమాసాలకే మొత్తం పార్టీ సంక్షోభంలో పడి మూడు ధోరణులు చెలరేగాయి.
దాని పరిష్కారం కోసం ఒక ్రతినిధి వర్గం రహస్యంగా మాస్కో వెళ్ళి స్టాలిన్‌తో సంప్రదించడం జరిగింది. అందులో ఒకరుగా కామ్రేడ్ ఎం.బి. వున్నారు. “మీది రష్యా 28
మార్గముగాదు చైనా మార్గముగాదు బలమైన కార్మిక కర్షకవర్గాలున్న మీ దేశంలో కార్మిక కర్షక ఐక్యత (ప్రాధాన్యంగా మీ విప్లవ పోరాటం దాని పంధాను అదే తీసుకుంటుంది. అందుకు అనుగుణమైన వ్యుహాన్నీ ఎత్తుగడలనూ మీరు రూపొందించుకోవడం మంచిది” అని కామ్రేడ్ స్టాలిన్ నలహాలిచ్చారు. తదనుసారం 1951లో కార్యక్రమం, ఎత్తుగడల పంధా రూపొందించబడ్డాయి. అయితే సోషలిస్టు శిబిరం పురోగమించడంతో, కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలకు తమ సర్వంసహాధికారాన్ని కాపొడుకోగల అవకాశం వచ్చింది. తదనుసారం కార్యక్రమాన్ని మార్చడం అవసరమైంది. కాని 1955 "జూన్‌లో కేంద్ర కమిటీ ఒక తీర్మానం చేస్తూ మొత్తం నెహ్రూ ప్రభుత్వ వర్గ స్వభావాన్ని మరచి, జనతా ప్రజాస్వామిక విప్లవ గమ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. ఈ తీర్మానానికి మైనారిటీగా వున్న మేము ప్రత్యామ్నాయ ముసాయిదాను వివరణా పత్రాన్నీ తయారు చేశాం. ఆ ముసాయిదాల ప్రధాన రచయిత కామ్రేడ్ బసవపున్నయ్య గారే. ఆఅ ముసాయిదాలు కొమైేడ్స్ సుందరయ్య, బసవపున్నయ్య, ప్రసాదరావు, హనుమంతరావు, సూర్జిత్గారలపేరిట పార్టీకి దిగువకంటా నాలుగూ ఐదు నెంబర్లు గల ఫోరంల ద్వారా 1955 ఆఖరులో పార్టీలో సర్క్యులేట్ చేయబడినాయి. ఇవిగాక ఆనాటి పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ ఘోష్గారి వ్యాఖ్యానాన్ని విమర్శిస్తూ కామ్రడ్స్ నుందరయ్య, బసవపున్నయ్య, హనుమంతరావుగార్ల పేరిట మరొక విమర్శను సైతం నర్క్యులేట్ చేయడం జరిగింది. ఫైనల్‌గా పాల్హాట్ పార్టీ మహాసభలో నెహ్రూ ప్రభుత్వంతో సహా ఐక్య నంవుటన కట్టాలన్న తీర్మానం ఓడిపోయింది. మరో కార్యక్రమాన్ని పార్టీ రూపాందించుకోవలసియున్నా, మౌళికంగా అది జనతా ప్రజాస్వామిక విస్లనాన్ని కార్మికవర్గ వాయకత్వాన సాధించేదిగానే వుంటుందని కూడా పాల్చాట్ పార్టీ మహానభ పునరుద్దాటించింది.+ అంతకుముందు కూడా తెలంగాణా పోరాటాన్ని కొనసాగించడానికి, ముగించిన తర్వాత ఆ ఉద్యమాన్ని కాపాడటానికి కామ్రేడ్స్ సుందరయ్య, బసవపున్నయ్యగారలు ముఖ్య నాయకత్వ స్థానాల్లో వున్న వారికి వ్యతిరేకంగా నిలిచి పోరాడవలసి వచ్చింది. ఆ నందర్భాలన్నింటినీ కామ్రేడ్ ఎం.బి. “సాయుధ తెలంగాణా పోరాటం-వాస్తవాలు” అన్న గ్రంథంలో పొందుపరిచారు. 1953లో మూడవ పార్టీ మహాసభ మదురైలో జరిగింది. ఆ మహాసభకు బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు హారీపాలిట్ వచ్చారు. అప్పటికి భారతదేశంలో బీటిష్ సామాజ్యవాదులు ప్రధాన విదేశ ఎట్టుబడిదారులుగా వుండి మన సంపూర్ణ స్వాతంత్ర్యానికి ప్రధాన శత్రువులుగా వుండగా ఆ స్థానంలో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని 29
ప్రధాన శత్రువుగా పేర్కొనడం సరిగాదని రాజకీయ తీర్మానానికి సవరణలు ఇచ్చాం. కొమ్రడ్ ఎం.బి. ఆ విషయంపై ప్రసంగించారు. సవరణలు ఓడిప్లోయ్రినా పేత్తం తీర్మానాన్ని వ్యతిరేకించడానికిగాని, తటస్థంగా వుండటానికిగాని అవకాశం వుండాలని మేము కోరాం. పార్టీ మహాసభ తీర్మానం అన్నది ఏకగ్రీవంగా ఆమోదం పొందడమే సత్సాంప్రదాయం అని మమ్మునివారించడానికి పాలిట్గారు చాలా ప్రయత్నం చేశారు. మౌళికాంశం మీద భిన్నాభిప్రాయం వుండగా సాంప్రదాయం కోసం సెంటిమెంటల్‌గా ఓటు చేయడం సరిగాదని కామేడ్ ఎం.బి.గాని, ఇతరులంగాని మా ఇష్టానుసారం మేము ఓటు చేశాము.
పాల్చాట్ పార్టీ మహాసభలో ఓడిపోయిన మితవాద వైఖరి పార్టీలో తర్వాత పుంజుకొని పార్టీకి మరింత ప్రమాదం తెచ్చింది.
ప్రపంచ రాజకీయాల్లో కృశ్చేప్ రివిజనిజం ప్రభావం భారత కమ్యూనిస్టు పార్టీపై విసృతంగా పడటం ఇందుకు కారణం. తర్వాత అంతర్జాతీయంగా ప్రపంచ శాంతికి అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని కృశ్చేవ్ నీళ్ళు గార్భకుండా చూసేందుకు మౌలికంగా మార్క్సిస్టు దృక్చధాన్ని నిలబెట్టేందుకు బాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం 'సైడ్ధాంతిక పోరాటాలు సాగుతూ వచ్చాయి. సోవియట్ 20వ పార్టీ మహాసభ స్టాలిన్‌పై సాగించిన దాడిని పాల్చాట్ పార్టీ మహాసభ ఒక తీర్మానం ద్వారా విమర్శించింది. 1957లో అంతర్జాతీయ రంగస్థలంలో రుమేనియా పార్ట్ మహాసభ సందర్భంలోనూ, 12 పార్టీల తరపున వెలువడిన మాస్కో ప్రకటన సందర్భంగానూ కామ్రేడ్ ఎం.బి. భారత ప్రతినిధి వర్గంలో సభ్యులుగా పాల్గొన్నారు. 1960లో వెలువడిన 81 దేశ పార్టీల సమావేశం సందర్భంగా కూడా రివిజనిజాన్ని నిలువరించడానికి పెద్ద ప్రయత్నం జరిగింది. ఆ ప్రకటన కూడా లక్ష్య పెట్టకుండా కృశ్చేవ్ ఉల్లంఘించి మౌలిక సూత్రాలను దిగజార్చుతున్న సమయంలో చైనా పార్టీ సాధారణ సూత్రాలపై తన అవగాహనను ప్రకటించింది.
మనదేళంలోనూ, మనరాష్ట్రంలోనూ రివిజనిబానికి వ్యతిరేకంగా మేముకొనసాగించిన పోరాటం రేవేంద్రపాడులో జరిగిన రాష్ట్ర మహానసభలోనూ, అనంతపురంలో జరిగిన రాష్ట్ర మహాసభలోను (1960) విశాలాంధ్ర పత్రికా నిర్వహణ పాలసీల్లోనూ కొనసాగుతూనే వచ్చింది. 1961లో జరిగిన విజయవాడ పార్టీ మహాసభలో యీ అంతర్గత సైద్ధాంతిక పోరాటాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. భారత, చైనా సరిహద్దు యుద్ధ సమయంలో కూడా ఇది ప్రతిబింబించింది. జాతీయ కౌన్సిల్ మెజారిటీ సంకుచిత జాతీయోన్నాదానికి లొంగి యీ వివాదాన్ని సంభాషణల ద్వారా గాక యుద్ధం ద్వారా పరిష్కరించాలని తీర్మానించింది. అలాగాక యీ దేశాలు రెండు సంభాషణల ద్వారా పరిష్కరించుకునేందుకే ప్రయత్నించాలని ఆనాడు పదముగ్గురు బాతీయ కొన్సిల్ సభ్యులం సవరణను ప్రతిపాదించాం. ప్రధాన తీర్మానానికి ఓటు చేయలేదు.
3౦
అనాటి ఉమ్మడి పార్టీలోగల అటువంటి వారందరినీ విడగొట్టి తర్వాత ప్రభుత్వం 8 మాపాల్గు జైలులో పెట్టి విడుదల చేసింది. అప్పుడు నిర్భంధించబడిన కామ్రేడ్స్ రణదీవేముదలైన వారందరినీ మహారాష్ట్ర ప్రభుత్వం 1966లోగాని విడుదల చేయలేదు.
ఢిల్లిలో జాతీయ కౌన్సిల్ సమావేశానంతరం జాతీయోన్మాదశక్తులు పార్టీ కేంద్ర కార్యాలయాలపై దాడులు చేశాయి. చైనా దురాక్రమణను ప్రతిఘటించండి అని తీర్మానం చేసిన రివిజనిస్టు నాయకులెవ్వరూ ఆ కార్యాలయాల్లో లేకుండా అదృశ్యమైనారు. అప్పుడు కామ్రేడ్ ఎం.బి. అత్యంత సాహసంతో పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సిబ్బందిని సమీకరించి ప్రతిఘటించడం జరిగింది. కేంద్ర పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో కామ్రేడ్స్ ఎం.ఆర్,వెంకట్రామన్‌ను, రమణినిని బాతీయోన్మాదశక్తులు తీవ్రంగా కొట్టడం జరిగింది.
1963లో జైళ్ళ నుండి బయటికి వచ్చిన కామ్రేడ్స్ 17 మందిమి పార్టీ ఐక్యతకు వచ్చిన ప్రమాదాన్ని నివారించేందుకు 1963 డిసెంబర్ 7వ తేదీన కొన్ని ప్రతిపాదనలను ఉమ్మడి పార్టీ నాయకత్వం ముందుంచాం. దానిని కామ్రేడ్ ఎం.బి. తయారు చేయగా కామ్రేడ్స్ సుందరయ్య గారు, నేనూ, నండూరి ప్రసాదరావుగారూ, తరిమెల నాగిరెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ నుండి సంతకాలు పెట్టాం. తమిళనాడు, కేరళ కామ్రేడ్స్ మిగతావారు. ఈ ఐక్యతా ప్రతిపాదనలు కేంద్ర నాయకత్వం నిరాకరించింది. దానిపై జాతీయ కౌన్సిల్లో 11.4.64న 32 మందిమి వాకౌట్ చేశాము.
జాతీయ కౌన్సిల్ నుండి విడిపోయిన వాళ్ళం పార్టీ పునర్నిర్మాణానికి పూనుకోకుండా వుంటే కమ్యూనిస్టు ఉద్యమానికి దేశంలో తీవ్రమైన హాని జరుగుతుందని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయానుసారం 1964 జూలై 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు అదే దృక్పధం కలిగిన ఆలిండియా నాయకులందరితోనూ కలిపి తెనాలిలో సదస్సు నిర్వహించాం. ఆ తర్వాత కలకత్తాలో 1964 అక్షోబర్ 31 నుండి నవంబర్ 7 వరకూ పార్టీ పునర్నిర్మాణం కొరకు 7వ పార్టీ మహాసభ జరిగింది.
ఈ పార్టీ మహాసభ అంతర్జాతీయ సిద్ధాంత అవగాహనను గాక కేవలం మనదేశంలో జనతా ప్రజాస్వామిక విప్లవ కార్యక్రమాన్ని గురి ఎచే చర్చించి ఆమోదించింది. విప్లవ దళ, వ్యూహం, పవ్రభుత్వవర్గ స్వభావం, జనతా 1పజుస్వామిక విప్లవ కార్యక్రమం, అది విర్వహించే కర్తవ్యాలు,అందుకు అవసరమైన జనతా బౌస్వామిక విప్లవ సంఘటన నిర్మాణం మొదలైన అంళశాబన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పరచుకున్నది ఆ కార్యక్రమం. నాటి నుండి నేటికీ ప్రధానాంశాలన్నింటా ఆ కార్యక్రమమే మనకు దిక్పూచిగా వున్నది.
అనేక డొక్యుమెంట్ల వలెనే యీ కార్యక్రమ ముసాయిదాను రచించిన ప్రధాన పాత్రధారుడూ కామ్రేడ్ ఎం.బి.యే. ఈ మహాసభ కామ్రేడ్ సుందరయ్యగారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నది.
31
ఈ పార్టీ మహాసభ జరగనీయకుండా నివారించాలన్న దుష్ట సంకల్పంతో కాంగ్రైస్ ప్రభుత్వం కలకత్తాలో ఆహ్వానసంఘ నాయకత్వాన్నంతటినీముందే అరెస్టు చేసింది. ఈ విప్లవ కార్యక్రమాన్ని పార్టీ రూపొందించుకున్న అనంతరం, పొలిట్‌బ్యూరో నుండి తాలూకాస్థాయి కార్యకర్తల వరకు 1,200 మందిని 1964 డిసెంబర్ 30 నుండి 1966 షు, జూన్‌ల వరకు జైళ్ళలో కుక్కింది. ఒక్క ఆంధ్రప్రదేశలోచే 200 మందికి పైగా బైళ్ళలో పెట్టడం జరిగింది.
కార్యశగ్రమాన్నగాక తర్వాత ఎత్తుగడల తీర్మానాలను రూపాందించడంలోనూ కామ్రేడ్ ఎం.బి.ప్రధానపాత్రనే నిర్వహించారు. “నూతన పరిస్థితులు-కర్తవ్యాలు” అన్న డొక్యుమెంట్ను 1967లో రూపొదించుకున్నాం. కాంగ్రెసు 8 రాష్ట్రాల్లో ఓడిపోయి కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భంగానూ, ముఖ్యంగా బెంగాల్స్ కేరళ వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భంగానూ పార్టీ కార్యక్రమానికి అనుగుణంగా అవి ఎలానడుచుకోవాలో ఆ పత్రం వివరించింది. పార్టీ నిర్ణాయక పాత్ర నిర్వహించలేని రాష్ట్రాల్లో మంత్రివర్గాల్లో చేరరాదన్న నిర్ణయాన్ని కూడా అందులో రూపొందించడం జరిగింది. అదే విధంగా భారతదేశంలో గల పరిస్థితుల్లో జాతుల సమస్యను, జాతీయ సమగ్రతను కాపడుకోవడం ద్వారానే పరిష్కరించుకోవాలన్న అంశంపైన కూడా ఆయన ప్రత్యేక అధ్యయనం చేశారు. 1972లో మధురై పార్టీ మహాసభలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించి, పార్టీ కార్యక్రమంలో సవరణగా చేర్చడం జరిగింది. ఆ సవరణపై ఆయన చేసిన ప్రసంగాన్ని తర్వాత కార్యక్రమంతోపాటు అచ్చువేయడం జరిగింది. 1976లో కేంద్ర కమిటీ ఎత్తుగడల పంధాను పునఃపరిశీలించి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సరిదిదిద్దింది. ఆ విషయంలోనూ ఆయన (ప్రాధాన పాత్రధారే.
చైనా పార్టీ, తానే రూపొందించిన సాధారణ పంధా నుండి తప్పుదారి బట్టినప్పుడు, మనదేశంలో నగ్గలిజం పుట్టినప్పుడు కొమ్రేడ్ ఎం.బి. దానిపై సునిశిత పోరాటాన్ని కొనసాగించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అది తీవ్రరూపం దాల్చి పార్టీని విచ్చిన్నం చేసిన సందర్భంగా కామ్రేడ్స్ సుందరయ్య, బసవవున్న్మయ్యగారలు మన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ విచ్చినాన్ని అధిగమించేందుకు పూర్తిగా తోడ్పడ్డారు. ఆంధ్రా కామ్రేడ్డకు పిచి. ఆ సందర్భంగా వ్రాసిన లేఖను రచించినదీ కామ్రేడ్ ఎం.బి.యయే.
1967లో సైద్ధాంతిక ముసాయిదాను కామ్రేడ్ బి.టి.ఆర్తోపాటు ఎం.బి. తయారు చేయడం, 1968 ఏప్రిల్‌లో బర్జ్వాన్ ప్లీనంలో దానికి తుది రూపం ఇవ్వడం జరిగింది. ఉమ్మడి పార్టీలోనూ, సి.పి.ఐ. (ఎం.) ఏర్పడిన ఆఅనంతరమూ ఎడాపెడా ధోరణులకు వ్యతిచేకంగా కామ్రేడ్ ఎం.బి. అమోఘమైన పాత్ర నిర్వహించారని చెప్పేందుకు కొన్ని అంశాలను ఇక్కడ పేర్కొన్నాను. ఇది సమగ్ర సమీక్షకాదు. ఇవి ఉడతాభక్తిని కామ్రేడ్ ఎం.బి.కి నివాళులర్పించిన సందర్భంగా పేర్కొన్న కొన్ని సందర్భాలు మాత్రమే. ఆయన, అనేక సిద్ధాంత రాజకీయ పోరాటాల్లో ఆరితేరిన యోధుడు. సవ్యసాచివలె
32
ఎడాపెడా ధోరణులను ప్రతిఘటించిన ధీరుడు. దాదాపు అన్ని సోషలిస్టు దేశాల్లోనూ పర్యటించి ఆయా పార్టీల నాయకులతో సమానస్థాయిని చర్చలు జరిపిన దిట్ట.
ఆయనతో కొన్ని విషయాల్లో నేను విభేదించి చర్చించిన సందర్భాలు లేకపోలేదు. అయినా గత 58 సంవత్సరాల్లో ఆయనతోపాటు ఒకే బాటను నడవకలిగినందుకు నేను గర్విస్తున్నాను.
రెండుసార్లు రహస్య జీవితాన్ని, రెండుసార్లు వైలు జీవితాన్ని మేము కలిసే గడిపాము.
1937లోనూ, 1938లోనూ మా వివాహాలు రెండూ సంస్కరణ వివాహాలుగానే జరిగాయి. మా కుటుంబాలు రెండూ దాదాపు ఒక సంవత్సరం పాటు గుంటూరులో ఒకే ఇంట్లో కలిసి వుండేవి. గుంటూరులో రాజకీయంగా నిలదొక్కుకుని నివసించేందుకే నేను 1938లో “సిటీ స్టూడెంట్స్ ఎంపోరియం"” అనే పేరున ఒక షాపు తెరిచారు. అందుకూ కామ్రేడ్ ఎం.బి. నాకు చేయూత నిచ్చారు.
కార్యగ్రమ కేంద్రాలు, నివాస ప్రదేశాలు వేరైనా మా సాన్నిహిత్యం చెదరలేదు. ఆయన ఈసారి మళ్ళీ గుండెపోటుకు గురైన తర్వాత 4 సార్లు చూశాను. ఆఖరి సారి ఏప్రిల్ 1వ తేదీ. ఆయన ఇంట్లో ప్రవేశించగానే నాకు ఏదో అధైర్యం కరిగింది. ఆయన గుండె కొట్టుకోవడంలో ఇర్రైెగ్యులారిటీ వుండటంతో విజయవాడకు వళ్ళాలనువాని కూడా ప్రయాణాన్ని మానుకున్నానని చెప్పారు. కామ్రేడ్ జగదాంబ వపు చూస్తేనా మనస్సు కుంగిపోయింది. నేను ఎన్నడూ ఆమెను ఆ స్పితిలో అంతగా క్లీణించి యుండగా చూడలేదు. వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానని చెప్పింది. అంటూనే ఎపరీతంగా ఆయానపడుతున్నది. ఆ కుటుంబానికి అక్కడ ఏలోపమూ జరగదని నాకు బాగా తెలుసు. అయినా అక్కడ యీ దశలో వుండటం ఒంటరితనమేనని నేను భావించాను. నా నిరాళా నిస్ప్సృహలను వెల్లడించకుండానే మీరు వెంటనే మా మభ్యకు విజయవాడ రావాలని ఒకటికి రెండుసార్లు చెప్పివచ్చాను.
జరిగేచేదో జరిగిపోయింది. ఆఖరిక్షణం వరకు ఆయన తన పోస్టును తాను విడువలేదు. ఈ గుండె జబ్బుతో తాను ఆఖరిపోరాటం చేస్తున్నట్లు ఆయనకూ మా అందరికంటే స్పష్టమయ్యే వుంటుంది. కాగా తనకై నిర్టే:ంచబడిన పార్టీ పోస్టును కూడా విడిచిపెట్టడం ఎందుకని అనుకొని వుంటారు. అందుకే చివరి క్షణం వరకు రాజకీయ సలహా సంప్రదింపులిస్తూనే ప్రాణం విడిచారు. ఆ అచంచల విప్లవదీక్షా పరుడికీ, ధన్యజీవికి ఇదేనా విప్లవాంజలి. ఆయన సతీమణి జగదాంబకు, కుమారుడు జస్వంతకీ, వారి కుటుంబాలకూ ఇదేనా కన్నీటి సంతాపం!
కామ్రేడ్స్ సుందరయ్య, జసవపున్నయ్యగారల అడుగుబాడల్లో మరోసారి పునరంకితులమై ముందుకు సాగుదాం!
గ
(| ళ్శా ఈ కి రేస, సాన కాన్రడ్ సట త్... స! శదాంబిలి ఆర్వగ్రప్రదేశ్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదిలో తీర్చిదిద్దిన ఆద్యుల్లో కామ్రేడ్స్ సుందరయ్య, చండ్రరాజేశ్వరరావు, మాకినేని బసవపునయ్యగారలను ముఖ్యంగా ముందు పేర్కొనాలి. కామ్రేడ్స్ సుందరయ్య, బసవపున్నయ్యగారలు 1964 భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు)కి దేశవ్యాపిత నాయకులుగా పనిచేశారు. కాగా కొద్రేడ్ చండ్ర రావేశ్వరరావుగారు సి.పి.ఐ. ఆలిండియా నాయకులుగా వున్నారు. ఈ రెండు పార్టీల మధ్యగల సిద్ధాంత, రాజకీయ, నిర్మాణ బేదాభిప్రాయాలే వారి మధ్యగలవు. కనుక రాజేశ్వరరావుగారిని గురించి నేను వ్రాసేటప్పుడు ఆ విభిన్న వైఖరులను ఇక్కడ పునరుద్దాటించపోవడంలేదు. కామ్రేడ్ రాబేశ్వరరావుగారు చనిపోయిన అనంతరం తన సంపాదకత్వాన “సి.ఆర్కు నివాళులు” అన్న పుస్తకాన్ని అచ్చువేయాలనుకున్నట్లు తెలుపుతూ నా శ్రద్దాంజలిని కూడా పంపమని కామ్రేడ్ రాజ్‌బహద్దూర్ గౌడ్ లేఖ వ్రాశారు. నేనా విధంగానే నా రచనను పంపాను. “ట్రిబ్యూట్ టు సి.ఆరొలో నా రచన వెలువడగ్డది. ఇప్పుడు నేను దాదాపు అందుకు పరిమితమై నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నా 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో మేమిద్దరం ప్రత్యర్దులంగానే వున్నాము. అయినా కమ్యూనిస్టు ఉద్యమ ఆరంభంలో 20 సంవత్సరాల పాటు మేము సన్నిహితులం. సహచరులం. చాలామంది చరిత్రాత్మక పశ
నాయకుల జీవితాల్లో అనేక దశలున్నట్లుమనముందు అనేక అనుభవాలున్నాయి. ఆయనలో కలిగిన మార్చును కూడా ఆ నేపధ్యంలోనే చూస్తూ ఆయన ఎడ నాకుగల ప్రశంసలను ఇక్కడ పేర్కొంటున్నాను.
1937లో కొత్తపట్నం రాష్ట్ర రాజకీయ పారశాల కాలం నుండి 1955 శాసనసభ ఎన్నికల కాలం వరకు మేమిద్దరం సన్నిహితులం. ప్రారంభంలో ఆయన్ని నా నాయకుడిగా గౌదవించేవాడిని. ఆయన్నుచూసి నేను ఉత్సాహాన్ని పొందేవాడిని,. ఆ రోజుల్లో తయనకుగల విప్ణవదీక్ష మాకు అనుసరణీయంగా వుండేది. సోషలిజంకొరకు జరగవలసిన పోరాటంలో ఆయన చూపిన సాహసం ఎంతో ఆకర్షణీయంగా వుండేది. ఆయన నిరాడంబరుడు. ఆదర్శజీవి. స్వార్రత్యాగి. శారీరకంగా అజానుబాహుడు. ఆజ్ఞాపించగలవాగ్దాటి అందుకు తోడుగా వుండేది. ఈ గుణగణాలన్నీ అనేకమంది యువకులకు సైనిక శిక్షణగరిపి కార్యరంగంలోకి దింపడానికి తోడ్బడేవి. తీవవాద దేశభక్తియుత యువతరాన్ని ఆకర్షించి, సమీకరించి, సైనికశిక్షఐగరిపి, వలంటీర్లనుగా కార్యక్రమంలోకిదించి, సోషలిస్టు నూతన సమాబంబవైపు తరలించగల సామర్థ్యం ఆయనకు వుండేది.
వారి వివాహానికి ముందే కొత్తపట్నం రాజకీయ పారశాల ద్వారా కాద్రుడ్స్ రాజేశ్వరరావు, సావిత్రమ్మగారలతో నాకు పరిచయం కలిగింది. వివాహానంతరం రాజకీయరంగస్థలంలో సన్నిహితులం అయ్యాము.
1942 క్విట్ ఇండియా ఉద్యమానికి కమ్యూనిస్టులు ద్రోహం చేశారన్న దుష్ప్రచారాన్ని 1942 అనంతరం కాంగ్రెస్ నాయకులు కొనసాగించారు. అది నమ్మి రెచ్చిపోయిన దేశభక్తులు మాపై దౌర్జన్యాలకు పూనుకున్నారు. సంఘవ్యతిరేక శక్తులు ఆ పరిణామాలను ఆసరా చేసుకొని కాన్ని పట్టణాల్లో అల్లరి చేష్టలకు దిగజారారు. ముఖ్యంగా సాహసంగా ముందుకువచ్చి సాంఘి కసంస్కరణలను ప్రోత్సహిస్తున్న మహిళా కామ్రేడ్స్ పై నిందలు వేయటానికి వీధుల్లో వెక్కిరించడానికి సిద్దమైనారు. విజయవాడలో 1943లో శేషాద్రివీధిలో ఒక భవనంలో రాష్ట్ర ఆఫీసు వుండేది. అందులో ఒకరోజు రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుండగా బీసెంటరోడ్డులో ఒక రౌడీ గ్యాంగు మా మహిళా కామ్రేడ్స్‌ను గేలిచేసి వేవిస్తున్నారన్న వార్త వచ్చింది. వెంటనే కామ్రేడ్ రాజేశ్వరరావు నాయకత్వాన కామ్రేడ్ మానికొండ సుబ్బారావూ నాతో సహా ఒక అరడజను మందిమి అక్కడికి పరుగెత్తి ఆ రౌడీ గుంపును ఎదుర్కొన్నాము.. వెళ్ళీ వెళ్ళడంతోనే కామ్రేడ్ రాజేశ్వరరావు ఆ గ్యాంగ్‌లీడర్‌ను కర్రతో పొడిచి తలపై కొట్టారు. అతనెవరో ఆయనకు అంతకుముందే తెలుసు. ఆ దెబ్బతో అతడి తలకు గాయం తగిలి రక్తంకారుతున్నది. కా(మ్రేడ్ చండ్ర పార్టీ శత్రువులపై ఎంతగా చండ ప్రచండంగా వుండగలడో అప్పుడు
ఏర్
గమనింగాను. అప్పుడు అక్కడ గుంపుగా చేరిన వాళ్ళు తిరిగి వెళుతూన్న మాపై రాయ రప్పా విసరడానికి పూనుకున్నారు. మేమున్నది అరడజన్మందిమే అయినా, శిక్షం పొందిన సైనికదళంవలె మేమున్నాము గనుక మా దగ్గరకువచ్చి దాడి చేయడానిక ౬ గుంపు సాహసించలేదు.
ఆ విధంగానే ఆయన అంతకుముందు చల్లపల్లిలో కామ్రేగ్ బాపనయ్యతో సహా స్థూల ఆక్రమణదారులైన పేదలపై రాజా గుర్రపుదళం జరుపుతున్న దాడిని సొవానంగా వ్రతిచుటించారు. అదొక వీరోచిత వుటనగా ఆ రోజుల్లో ప్రసిద్ధికెక్కింది.
అది యుద్దకాలం. ఆహారధాన్యాన్ని అధికంగా ఉత్పత్తి చేయా* ౬“ = ాదాన్ని మేము చేపట్టాము. ఆ సందర్భంలో బందరు కాలువలో సిల్చు వేసి నీట 3లగాక పాలాలు బెట్టతీస్తున్నాయి. ఆధికారులు కూలీలను సమీకరించలేకుండా వున్నరు. ఆ స్థితిలా ఆ సిల్బను మనమే తీసివేద్దామని పార్టీ నేత కామ్రేడ్ సుందరయ్య పిలుపు నిచ్చారు. ఆఫిలుపందుకొని వేలాది మందిమి అన్ని జిల్లాలనుండీ వచ్చి విజయవాడవద్ద రెండు మైళ్ళహాడు.పన సిల్టులీసి కట్టపై గుట్టలుపేర్చాం. బొచ్చెలలో కూరా మజ్జిగలతో అన్నంతిని సిల్చుతవ్వి పల్లికలకెత్తుకొని పార్టీ సభ్యులు, నాయకులు పనిచేసినతీరు ద్రజలు కథలు కధలుగా చెప్పుకున్నారు. “నిలో క్రమశిక్షణను అమలు జరపదానికి కామ్రేడ్ రాజేశ్వరరావు శక్తిసామర్థ్యాలు తోడైనాయి. తర్వాత ఆంధ్రలో అపూర్వంగా ఒక గొప్ప సమీకరణను జరిపిన ఘనత కమ్యూనిస్టులకు వచ్చింది. అది 1943లో విజయవాడలో జరిగిన అభిల భారత కిసాన్్ససభ సందర్భం. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలనుండి స్త్రీలు, పురుషులు అత్యధికంగా బళ్ళుకట్టుకొని, పడవలమీద ప్రయాణంచేసీ ఇతరత్రాను తిరుణాళ్ళకువచ్చినట్లు జనం వచ్చారు. ఆ సభ భోజన ఏర్పాట్ల నిర్వహణ, జయప్రదం చేయడంలో వలంటీరు కమాండర్‌గా రావేశ్వరరావుగారు బాగా మెల్టపాందారు. 'పైనపేర్కొన్న కమ్యూనిస్టుల శ్రమదానశక్తీ, ప్రజాసమీకరణ నిర్వహణ సామ సం. కమ్యూనిస్టులు తలచుకుంచే ఏమైనా చేయగలరన్న విశ్వాసాన్ని ప్రజానీకానికి కలిగించాయి.
గుంటూరుజిల్లా కార్యదర్శిగా 1947 జనవరి 21వ టేడీని బిల్లా కమిటీ సమావేశాన్ని ఏర్పరచి కామ్రేడ్ రాజేశ్వరరావును ఆహ్వానించాము. అప్పుడు మా ఆఫీసు కొత్తపేటలో అమీర్మహల్ వద్ద వుండేది. ఆరోజు హరాత్తుగా మా ఆఫీసుపై నిఘాలో వున్న కానిస్టేబుల్ ఒక సమాచారం అందించాడు. మ[దాసు ప్రధానమంత్రిగా వున్న (ప్రకాశం పంతులు ఒక ఆర్గినెన్సు జారీ చేశారని వెంటనె ఆఫిసుపై దాడిరాసున్నదనిజయన ఉప్పు అందించాడు. నమ్మాలావద్దా లని సంబహిస్తూనే ఎందుకైనామంచిదని అందరం
ఏ6
వేరొక చోట రహన్యంగా మీటింగు పెట్టుకునేందుకు తరలిపోయాం. కొద్దిసేపట్లో మాపై అవెస్ట్ వారంట్లతో ఆఫీసుపై పోలీసు దాడి జరగనే జరిగింది. దేశభక్తితో అత్యంత శర్ద్చతో నమాచారం అందించిన ఆ "స్పెషల్ బ్రాంచి పోలీను పుణ్యమా అని సి.ఆర్.తో నవా మేమంతా ఆ ఆర్షినెన్సు దాడినుండి 1947 ఆగన్సు 15న జరిగిన ప్రథమ స్వాతంత్రోత్సవ దినం వరలూ తప్పుకోగలిగాం. మళ్ళీ 1948 జనవరి 30వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం మాపై దాడిచేసింది. అది ఢిల్లీలో రాష్టీయస్వయం సేవక్ సంఘానికి చెందిన గారే గాంధీపై కాల్పులు జరిపి చంపినరోజు, విజయవాడతో నహా అన్నిపట్టణాల్లోనూ ఉల్లానంగా ఆర.ఎస్.ఎస్.వాళ్ళు ప్రదర్శనలు జరిపి ఛాక్లెట్లు పంచిపెడుశున్నారు. ఈ అఘాయిత్య ప్రదర్శనకు కోపోద్రిక్తులైన ప్రజలు విజయవాడలో ప్రదర్శనపై రాళ్ళు రువ్వారు. ఆ సందర్భంగా చెల్లా చెదరై అటూ ఇటు పరుగెత్తుతున్న అమాయగుకుడొకరు గాయపడి చనిపోయారు. ఇంత అఘాయిల్యం జరిగినందుకు అధికార ఉన్మావంలో వున్నకాంగ్రెస్ ప్రభుత్వం చర్యతీసుకున్నది, ఆర్.ఎస్.ఎస్.మీదగాదు. ఎప్పటివలెనే కమ్యూనిస్టుల మీదనే. ఆ క్రితం రోజునే మేము బుద్ధవరంలో రాష్ట్ర మవ'సభ జరుపుకొని విజ... వాడకు వచ్చాము. మొగ్రాజపురంలో ప్రజాశక్తి దినపత్రికకు నిర్మించుకున్న తాటాకు పాకలలో కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ సమావేశం వేసుకున్నాం. కాని అనూహ్యంగా పోలీసులు మా పొకలను చుట్టుముట్టి అరెన్టు చేసేందుకు దాడిచేశారు. కుట్రకేసు పెట్టాలన్నది వాళ్ళ పథకం. కొంతమంది దొరికారు. కాని వేనూ, కాద్రేుడ్ సీ.ఆర్. అమాంతంగా చెరికొక తడికల తలుపుల్ణ చాటుకు తప్పుకున్నాం. ఆ విధంగా మళ్ళీమా దీర్హకాల రహస్య జీవితం (ప్రారంభమైంది. బుద్దవరం మహాసభలోవే నన్నుమొదట రాష్ట్ర సెక్రచేరియట్లోకి తీసుకోవడం ఐరిగింది. తర్వాత సవిగ్గా నైబాం సంస్థానం పై పోలీస్‌యాక్షన్ జరిగిన రోజు మేము సూరంపల్లిలో కార్యడర్శివర్ల సమావేశం జరుపుకుంటున్నాం, మెట్టపల్లిలో కూడా కొందరం వున్నాం. బుద్రవరంలో ఎన్నుకోఐడీన అంధ్ర, తెలంగాణా కార్యదర్శివర్గసభ్యులందరిలోనూ ఇవ్పుడు నజివంగా వున్నవావిని నేనాక్కళ్లే.
(ధమ్తైన విష్ణవదీక్రగల కాన్రేడ్ నుందరయ్య, బనవవున్నయ్య, రాబేశ్వరరావుగారల ఆధ్వర్యాన మొదట ఆంధ్రలో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించబడ్డాయి. ఆ శక్తులన్నీ విబృంభించిన నేపథ్యమే తెలంగాణా వీరోచిత వైతాంగ సాయుధ పోరాటం సాగించేందుకు తోడ్చడ్డది. మొదట వైబాంనవాబు వ్రయోగించిన రజాకాదు దళాలను, తర్వాత దేశముల (ప్రాబల్యాన్ని పునరుద్గరించడానికి పయత్సించిన యూనియన్ సేనలను మన సాయుధ డళాలుప్రతిఘటించి పోరాతవలసివచ్చింది. ఆ
37 "
పోరాట ఫలితంగానే వేలాది కామ్రేడ్స్ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్చించుతూ మూడువేల గ్రామాల్లో పదిలక్షల యకరాల భూమినిసాగుదార్ల వశం చేశారు.
ఆ కాలంలో కేంద్ర నాయకత్వంలో మార్చు వచ్చింది. రెండవపార్టీ మహాసభ ఎన్నుకున్నకేంద్ర కమిటీని రద్దుచేసి మరొక కమిటీని ఆ రహస్య దినాల్లోనే ఏర్పరచుకోవడం జరిగింది. ఆ కమిటీకి కార్యదర్శిగా సి.ఆర్.నే ఎన్నుకున్నారు. బసవపున్నయ్యగారు ఆ వ్యవహారాల్లో ముఖ్య సంధానకర్తగానూ, ఆ కమిటీలో ఒక ముఖ్యమైన సభ్యుడుగానూ వున్నారు. ఆ రోజుల్లో దానినే ఆంధ్ర సి.సి. అనికూడా అంటుండేవారు. అయినా విచ్చిన్నమైన పార్టీకి ఐక్యత చేకూరలేదు. కామ్రేడ్ స్టాలిన్ వద్దకు వెళ్ళి ఆయన పలహా సంప్రదింపులతో పార్టీ ఐక్యతకు ప్రయత్నించడం జరిగింది. అందుకై రహస్యంగా రష్యా వెళ్ళిన నల్గుగురిలో ఒక వైపు కామ్రడ్ సి.ఆర్., ఎం.బి.గారలు, మరో వైపు కామ్రేడ్స్ అజయ్‌ఘోష్, డాంగేగారలు వున్నారు. అక్కడ ఒక కార్యక్రమం మీద, ఎత్తుగడల పంధామీద ఐక్యత ఏర్పడ్డది. ఆ ప్రాతిపదికపై పార్టీ 1952 మొదటి సాధారణ ఎన్నికల ప్రచారానికి పురోగమించింది.
మనం నిర్వహించిన విప్లవ పోరాటాల ఫలితంగా 1952 ఎన్నికల్లో పార్టీకి అపూర్వమైన విజయాలులభించాయి. ఈ విజయాల ఆధారంగా పార్టీ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ప్రధానపాత్ర వహించింది. వైజాంసంస్థానాన్ని బ్రద్దలుగొట్టి ఆంధ్రప్రదేశ్ రూపాందడంలో పార్టీ సూత్రధారి అయింది. కామ్రేడ్ సుందరయ్య 1946లోనే ప్రచారంలో పెట్టిన విశాలాంధ్ర రూపొందింది. యీ పోరాటంలవల్ల దేశంలోనే భూపంపకం రంగస్థలం మీదికి వచ్చింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ఉద్యమం మన రాష్ట్రాన్ని భారతదేశపటంలో (ప్రాముఖ్యతకు తెచ్చింది.
1952 ఎన్నికల అనంతరం మద్రాస్ శాసనసభలో ప్రకాశం పంతులుగారి ఆధ్వర్యాన ఐక్యప్రజాస్వామిక సంఘటనను ఏర్పరచుకొని, దానికొక కార్యక్రమాన్ని
రూపొందించడంలో కామ్రేడ్ సి.ఆర్., నేనూ కలిసిచేసిన కృషి నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నది. ఆ రోజుల్లో కామ్రేడ్స్ సుందరయ్య, బసవపున్నయ్యగారలు పార్టీ కేంద్రంనుండి పనిచేస్తున్నారు. కామ్రేడ్ రావేశ్వరరావు, నేనూ, తదితర కామ్రేడ్స్ రాష్త్ర కేంద్రంనుండి పనిచేస్తున్నాం. రాబేశ్వరరావుగారు అప్పుడు మద్రాసు శాసనమండలి సభ్యులుగా కూడా వున్నారు. మద్రాస్‌తో సహా ఆంధ్రరాష్త్రం ఏర్పడాలని పొట్టి క్రీరాములుగారు నిరాహారదీక్ష చేస్తున్నారు. అలాగాక 'వివాదరహిత ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు ఆంగీకరించేట్లు నచ్చచెప్పమని బులుసు సాంబమూర్తిగారి వద్దకు సి.ఆర్., నేనూ రాయబారం వెళ్ళాము. అక్కడే పొట్టి శ్రీరాములుగారు ఆమరణ నిరాహారదీక్షలో వున్నారు. కొని ఆ రాయబారం ఫలించలేదు.
38
వ్యక్తిగతంగా కొమ్రేడ్ రాేశ్వరరావు, నేను బాగా సన్నిహితులంగా వుండేవాళ్ళం. 1952 ఎన్నికల అనంతరం నేను విజయవాడలో మకాం పెట్టవలసి వచ్చింది. వ్రజాశక్తినగర్లో అప్పుడు ఆయన వేసుకున్న ఇల్లు ఖాళీగా వున్నందున అందులో వుండమని బెదార్యంగా ఆయన ఆఫర్ చేశారు. ఒక సంవత్సరానికి పైగా ఆ ఇంట్లో మా కుటుంబం వున్నది. అందుకు నేను ఆయనకు కృతజ్ఞుడ్ని. 1955లో జరిగిన ఆంధ్ర ఎన్నికలలో కాంగ్రెస్ కూటమితో పార్టీ హోరా హోరి పోరాడింది? మెజారిటీ సీట్లు వచ్చి అధికారంలోకి రావచ్చని ఆశించి అపజయం పాందింది. 15 సీట్లను మాత్రమే జయించుకోగలిగింది. ఈ ఓటమితో కామ్రేడ్ సి.ఆర్.ఖంగుతిన్నారని నాకు అనిపించింది. దాంతో ఆయన సైద్ధాంతిక రాజకీయ ఆలోచనల్లోనే పెద్ద మార్చు వచ్చింది. మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యంసడలిషోవడానికి అదే ప్రారంభం. అందుకు తోడు 1956లో సోవియట్ కమ్యూనిస్పృపార్టీ 20వ పార్టీ మహాసభలో కృశ్చేవి దిగజారుడు రివిజనిస్టు సిద్దాంత ప్రబోధం చేయడం, మన రాష్ట్ర పార్ట్ నాయకత్వంలో ఎక్కువమంది ఆ లైనును చేపట్టడం మమ్ములను వారికి దూరం చేసింది. ఒకే పార్టీ రెండు లైనులు అమల్లోకి వచ్చాయి. 1964లో ఈ పరిణామం పరాకాష్టకు వచ్చింది. ఆ రోజుల్లో విజయవాడ పట్టణ కమిటీ ఒక జనరల్ బాడీ రైస్‌మిల్లర్స్ హాలులో ఏర్పరచి మా ఇద్దరినీ ఎవరి వైఖరిని వారు వివరించమని కోరింది. సభ్యులు, సానుభూతిపరులు 1600 మంది వరకు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 10గంటల వరకు కామ్రేడ్ పోతఠాజు అధ్వర్యాన ఆ సుదీర్ధ చర్చావేదిక నడిచింది. చెరొక 5గంటల సేపు మేమిద్దరం వివాదగ్రస్తంగా వున్న సిద్ధాంత రాజకీయ నిర్మాణ అంశాలన్నింటిమీద (ప్రనంగించాము. మొదట రాజేశ్వరరావుగారే మాట్లాడారు. తర్వాత నేను అందుకు సమాధానం ఇవ్వడానికి ప్రారంభించాను. సహజంగానే ఆయనకునా ప్రసంగాన్ని భరించటం కష్టమై వుంటుంది. నంచి నర్జుకొని హరాత్తుగా ఆయన వేదికదిగి వెళ్ళిపోయారు. ఆ దశలో పట్టణంలోగల అత్యధిక నంఖ్యాక పార్టీ సభ్యులు కృశ్చేవ్ రివిజనిజానికి వ్యతిరేకంగా నిలిచారు. ఆ కారణంగా సిటి పార్టీ నాయకత్వం కొంతకాలం మార్క్సిస్టుపార్టీలో భాగస్వామిగా వుండి, తర్వాత కొంతకాలం స్వతంత్రంగా వుండి చిరవకు సి.పి.ఐ.లో చేరింది. ఏది ఏమైనా కామ్రేడ్ సి.ఆర్కూ నాకూ మధ్య సాన్నిహిత్యం అంతటితో అంతరించింది. అయినా అనేక సందర్భాల్లో ఉమ్మడి వేదికల పై మేము కలుసుకుంటూనే వాం మర్యాదలు మామూలుగానే సాగిపోయాయి. ఆయన సీనియర్ నాయకుడని నెఖ్చడు గౌరవిస్తూనే వచ్చాను. ఆంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఆద్యులైన కామ్రేడ్స్ నుందరయ్య, బనవవున్నయ్య, రాజేశ్వరరావుగారలు ముగ్గురూ 39
బేదాభిప్రాయాలెన్నివున్నా అఖిల భారత స్థాయిని వామపక్షాలకు నాయకత్వం వహించడం యాదృచ్చికంకాదు. అంతేగాదు తొలిదశలో కమ్యూనిస్టు ఉద్యమం ఆంధ్ర, ఆలంగాణాలలో బలపడటానికి ఆయన నిర్వహించిన పాత్ర గణనీయమైనది.
మహత్తరషైన మన ఆశయంకొరకు ఆయన కనపరచినదీక్షా, త్యాగం నేటి తరాలకు అనుసరణీయం
పాత సహచరుణ్దిగా నేను కాద్రేడ్ చండ్ర రాబేశ్వరరావు అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్చించాను. ఆయనకు మరోసారి ద్దాంజలి ఘటిస్తూ, ఆయన నతీసుతులైన సావిత్రమ్మకు, అబాద్‌కు నా గాఢసంతాపాన్ని, సానుభూతిని తెలుపుతున్నాను.
40
- ఎన్నీ రర || అలా నయ్... ఎం.ఆర్, అదన సస క కక కౌమ్రడ్ ఎం.ఆర్. వెంకట్రామన్తో నాక్తు మొదటి పరిచయం 1949 కడలూరు బైలులో, తర్వాత 1953లో మధురైలో జరిగిన పార్టీ మహాసభలో ఇద్దరం ఒకేసారి కేంద్ర కమిటీలోకి ఎన్నికైనాము. నాటి నుండీ గడిచిన 35 సంవత్సరాలూ ఆయన నాకు అప్తమిత్రుడుగా, సన్నిహిత కామ్రేడ్‌గా, సహచరుడుగా, పెద్దగా పరిగణించబడిన వ్యక్తి. పెద్దల్లో పెద్దగా, చిన్నల్లో చిన్నగా మెలగ గలిగిన - తత్వం ఆయనది. అందుకే ఆయన అందరితోనూ చనువుగా వుంటారు. ఆందరికీ ఆయన అందుబాదైన కామ్రేడ్. మేము పనిచేస్తున్న రాష్ట్రాలు వేరు. భాష పేరు. అయినా రెండున్నర సంవత్సరాల కడలూరు జైలు సాంగత్యం మా మధ్య మరువలేని మమకారాన్ని ఏర్పరచింది. ఆ తర్వాత “ఇద్దరం కేంద్ర కమిటీ సభ్యులుగా నాటి నుండీ కొనసాగడం వల్ల సంవత్సరానికి మూడు నాలుగుసార్లు, ఒక్కొక్క వారం కలసి వుండే అవకాశం కలగడంతో పోరాటకాల సాన్నిహిత్యం పెంపాందుతూనే వచ్చింది. కడలూరు వైలు అనాటి మద్రాసు ఉమ్మడి రాష్ట్ర స్మృతి. మలబారు, ఆంధ్ర, తమిళనాడులకు మద్రాసు రాజధాని. జాయింట్ రాష్ట్రం. తెలంగాణా అప్పటికింకా వేరుగా వున్నా, వీర తెలంగాణా విప్లవ పోరాటం ఆంధ్ర, తెలంగాణాలను రెండింటినీ ఒకటిగా చేర్చింది. రాజకీయాలు, రణరంగం, నిర్బంధం, కారగారవాసం విస్లవకారులందర్నీ ఒక చోటికి చేర్చాయి. అందుకే 1918 నుండీ డిటెన్యూలుగా నిర్చంధించబడిన ఆంధ్ర తెలంగాణా కామ్రేడ్స్ అయిదువందల మంది వరకు కడలూరు జైలు నివాసులైనారు. -1952 మొదటి సాధారణ ఎన్నికల ముందే అందులో చాలా మంది వైటపడ్డారు. . దిశే
చేదాభిప్రాయాలెన్నివున్నా అఖిల భారత స్థాయిని వామపక్షాలకు నాయకత్వం వహించడం యాదృచ్చికంకాదు. అంతేగాదు తొలిదశలో కమ్యూనిన్దు ఉద్యమం ఆంధ్ర, తెలంగాణాలలో బలపడటానికి ఆయన నిర్వహించిన పాత్ర గణనీయమైనది.
మహత్తరచై న మన ఆశయంకొరకు ఆయన కనపరచినదీక్షా, త్యాగం వేటి తరాలకు అనుసరణీయం
పాత సహచరుబ్దిగా నేను కాద్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్చించాను. ఆయనకు మరోసారి శద్దాంజలి ఘటిస్తూ, ఆయన నతీనుతులైన సావిత్రమ్మకు, అబాద్‌కు నా గాఢనంతాపాన్ని, సానుభూతిని తలుపుతున్నాను.
తం
ఆ రోజుల్లో కేరళ, తమిళనాడు కామ్రేడ్స్‌ను ఎక్కువగా, వెల్లూరు, మద్రాను మొదలైన బైళ్ళలో పెట్టారు. ఎక్కడైనా అది పోరాటకాలం. చేతికొచ్చిన అధికారాన్నితన గుత్తాధిపత్యంగా భద్రపరుచుకుందామన్నది కాంగ్రెస్ తాపత్రయం. పీడిత ప్రజలకు దక్కకుండా పోతోన్నదే అన్నది మా ఆవేదన. ఘర్షణలు పెరిగి పెద్దవైనాయి. వెలువల జరుగుతూన్న రక్తతర్పణం, ప్రాణత్యాగం, ఆస్తినష్టం బైళ్ళలోనూ భుగభుగలురగళ్ళింది. ఆ జైలు పోరాటాల్లో ఆరితేరిన యోధులు కామ్రేక్స్ గోపాలన్, ఎం.ఆర్.గొరలను తమిళ మళయాళ కామ్రేడ్స్‌కు దూరం చేయాలని మద్రాసు ప్రభుత్వం కడలూరు సెంట్రల్ జైల్‌కు తెచ్చి తెలుగువారి మధ్య పడేసింది. అప్పటి నుండీ ఆ జంట అమూల్యానుభవాలు మాకు మార్గదర్శకాలైనాయి.
శారీరకంగాగాని, లీగల్గాగాని పోరాట యోధుడు కామ్రేడ్ ఎ.కె.జి.. లెక్కకు మించినవి ఆయన పోరాటాలు, నిరాహారదీక్షలు. సలహా సంప్రదింపులకు, లీగల్ పాండిత్యానికి రాయబారాల పెద్దరికానికి పెద్ద ఎం.ఆర్.ఒకరికొకరు తోడుగా చేరారు. డిటెన్యూల పని పాటలకు పంపే మామూలు ఖైదీలకూ మాకూ లింకులు కొమ్రేర్స్ ఎ.కె.జీ., ఎం.ఆర్.లు. అదొక శిక్షణా కేంద్రంగా, రాజకీయ పాఠశాలగా వారు మామూలు ఖైదీలకు చదువు సంధ్యలు నేర్చిన గురువులు. అ ఖైదీలు అప్పుడంటూ వుండేవారు. “ఉలఘం పలు విదం-ఎ.కె.జి., ఎం.ఆర్. ఒరువిదం"” అని.
మేమంతా ఆంటూండేవాళ్ళం-వారిని బావ బావమరుదలని. ఎం.ఆర్, ఎశె.జీ.ని బావగారు అని తెలుగులో సంబోధించే వారు. తెలుగు వారి మర్య వారున్నారు. ఎకె.జి. తెలుగు బాగా అర్ధం చేసుకొని కొద్దిగా మాట్లాడే వారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చినా బహిరంగసభల్లో ఒకటి రెండు వాక్యాలైనా తెలుగులో మాట్లాడేవారు. ఎం.ఆర్. అర్థం చేసుకోవడమే గాదు ధారళంగా తెలుగులో మాట్లాడేవారు. చదవడం కూడా నేర్చుకున్నారు. పట్టిపట్టి, “'ప్రజాశక్తి' చదువుతుండేవారు. మేమెవ్వరం కనిపించినా తెలుగులోనే ఆయన ప్రసంగం. ॥ ॥
మాలో కొందరితోనే కాదు వారు చనువుగా వుండటం. ప్రతి డిటెన్యూవాకికి సన్నిహితులే. రంగారావువంటి బాలురిని, రఘురామయ్య వంటి అమాయకుల్ని అనేక మందిని కాంగ్రెస్ ప్రభుత్వం కక్తకొలదీ డిటెన్యూలుగా పట్టుకొచ్చింది. వారితోనూ వీరిద్దరూ చనువుగొనే వుండేవారు. ఆంధ్ర, తెలంగాణాలలో, నేడు ఉభయ కమ్యూనిస్టు, పార్టీల్లోనూ వున్న ఆనాటి నాయకులు, కార్యకర్తలు వారికి చిరపరిచితులు. ప్రతి కేంద్ర కమిటీ సమావేశ సందర్భంగాను, కాస్త వ్యవధి వున్నప్పుడల్లా కామ్రేడ్ ఎం.ఆర్. పేరుపేరు వరుననూ అందరియోగక్తేమాలను గురించి అడిగేవారు. అమరులు కామ్రేడ్స్ డి.వి.సుబ్బారావు, బాసనయ్య, కె.ఎల్:నరసింహర, మానికొండ సుబ్బారావుగారలందరూ
ఆయనతో చనువుగా వుండేవారే. త2
థైలు పోరాటాలు ఆ రోజుల్లో అనేకం జరిగాయి. కడలూరు డైల్గోనే శెండుసోర్లు మేము సామూహికంగా 21 రోజులొకసారి, 28 రోజులాకసారి దీర్ధకాల నిరాహారదీక్షలు జరిపాము. రెండుసార్లు 1950 ఆగస్టులోనూ, అక్టోబర్‌లోనూ 'ైరింగ్స్ జరిగాయి... రెండుసార్లూ ఇద్దరిద్దరి చొప్పున తుపాకులు బలిగొన్నాయి.. దాదాపు వందమంది వరకు తీవ్రమైన గాయాలకు గురైనారు. మొదటి 'పైరింగ్‌లో కామ్రేడ్ రాఘవయ్య, రెండవ _సైరింగ్లో కామ్రేడ్ అనుమర్షపూడి సీతారామారావుగారు ఆహుతెనారు. రెండవ సారి పైరింగ్‌లో మేమంతా గభాలున నేలపై పడుకున్నాము. అయినా ఒక వార్డరు ప్రత్యేకంగా లారీతో మెడ మీద కొట్టినందున కామ్రేడ్ ఎం.ఆర్. ఒక రోజంతా స్పృహతప్పి పోయారు.
వైలు కమిటీలలో మా కెదర్కున్నవి అనేక సమస్యలు. కామ్రేడ్ మద్దుకూరి చంద్రంగారు కొన్నాళ్ళు, ఆయన బెయిలు మీద బయటపడ్డ తర్వాత నేనూ, ఆయనా జైలు కమిటీ కార్యదర్శులుగా వుండేవాళ్ళం. ఎ.కె.జీ., ఎం.ఆర్లు ఇద్దరూ జైలు
- కమిటీలో వుండేవారు. కామ్రెడ్స్ టి.వెంకటేశ్వరరావు కొన్నాళ్ళు, కె.ఎల్.నరసింహం కాన్నాళ్ళూ జైలు మేయర్లుగా వుండేవారు. సామూహిక పోరాటం ద్వారా హక్కులన్నింటిని సాధించుకొని దొన్నాక మార్క్సిస్టు విశ్వవిద్యాలయంగా రాజకీయ పాఠశాలగా కొన్నాళ్ళు నడిపాం. ఎం.ఆర్, సహాయంతో అనేక వందల హెైబియన్కార్చన్ పిటిషన్లు హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ దాఖలైనాయి. అందువల్ల అనేక మంది కొమైేడ్స్ విడుదలైనారు . కూడా. ఎం.ఆర్., నేను ఆ సందర్భంగా ఢిల్లీ సెంట్రల్ జైల్లో కూడా వుండి సుప్రీంకోర్టుకు హాజరవడం జరిగింది.
1950 మధ్యభాగం నుండి ప్రభుత్వం మాపై దాడిని తీవ్రతరం చేసింది. సేలం జైల్లో దాడ్ చేసి 20 మందిని కాల్చి చంపిన సమయమూ అదే. కాలం గడిచిన కొలదీ పార్టీలో బేధాభిప్రాయాలు బజారునపడి చర్చనీయాంశాలైనాయి. కామ్రేడ్స్‌లో నిరుత్సాహం, నిస్పృహ ప్రబలాయి. కొంత మంది అండర్ దేకింగ్ ఇచ్చి జారుకున్నారు. తాయవెల్లూరు జైలు నుండి కొందరు కేరళ, తమిళనాడు కామ్రేడ్స్‌ను కడలూరుకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. అప్పటికి కామ్రేడ్ ఎ.కె.జి. విడుదలైనార్గు. నేనూ, కామ్రేడ్ ఎం.ఆర్., మరికొందరం జైలు కమిటీలో మిగిలాం. అనాటికి కామ్రేడ్ బి.టి.ఆర్, నాయకత్వంపైన, ఆంధ్ర సి.పి. నాయకత్వం పైన, తెలంగాణా పోరాటంపైన, కలు పొరాటాలపైన తిరుగుబాటును ప్రదర్శించిన, మూడు రాష్ట్రాల కామ్రేడ్స్ ఏకమై వైల్లో విప్లవకారుల కుండవలసిన క్రమశిక్షణను బ్రద్ధలుకొట్టారు. కామ్రేడ్స్ మధ్య వుండవలసిన సాన్నిహిత్యాన్ని ధ్వంసం చేశారు.
అయినా జైలు కమిటీ అత్యంత మెలకువతో కనీన కట్టుబాట్లను కాపాడుకుంటూ జైలు అధికారుల ముందు గంభీరంగా గడిపింది.
తప
నాక "మేడ్ ఎం.ఆర్.క మధ్య ఏర్పడ్డసాంగత్యానికి, సాన్నిహిత్యా...: ప్రాతిపదిక అది. కాగా ఒక సంవత్సరంగా ఇద్దరం కలుసుకోలేకపోయాం. నాకు యాక్సిడెంటై నేను కేంద్ర కమిటీ సమావేశానికి వెళ్ళక, తర్వాత నేను వెళ్ళిన సమావేశానికి జయన ఆరోగ్యం బాగుచేక రానందున కలుసుకోలేక పోయాం. నాకు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలాయని కేం, కమిటీలో విన్న ఎం.ఆర్. 82 అక్టోబర్ 2వ తేదీన ఒక లేఖ వ్రాశారు. “ఆ గాయాల వల్ల నీవెంత బాధపడ్డావో. గాయాల వల్ల కలిగిన బాధ కంటే పనిలో పాల్గొనలేకపోయానన్న బాధ నిన్ను మరింతగా క్రుంగదీసి వుంటుంది” అంటూ వ్రాశారు. నిజానికి ఆ వ్యాఖ్య ఆయన మనస్తత్వానికే ప్రతిబింబం. ఆయన కుమా భారతి, ఆమె భర్త పిల్లలూ ఉద్యోగ రీత్యా బొంబాయిలో వుంటున్నారు *"- ఒమున్న ఆయన ఆరోగ్య పరిస్థితికి ఆందోళన చెంది వారు ఆయన్ను తమవద్రన వుండమని ఎంత చెప్పినా వినలేదు. తమతోనూ, పిల్లలతోనూ రెండుమూడు రోజులు గడిపి నాల్గోరోజు నుండి ఎప్పుడు మద్రాసులో పార్టీ ఆఫీసుకు చేరతానా అని ఆవేదన పడుతూంటే విధిలేక పంపివేశామని మే 3వ తేదీన వారు చెప్పారు. తమతోనే వుంటూ కార్యక్రమాల్లో పాల్గొనాలని పట్టుబడితే ఆఫీసులోనే ఒక గది ఏర్పరిచి, సహాయపడగల కామేడ్ని తోడు చేసి వుంచామని తమిళనాడు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ నల్గశివం చెప్పారు. కామ్రేడ్ ఎం.ఆర్.గుణగణాలనేకం ఆకర్షణీయమైనవి. ఆయనకు తెలిసినన్ని సామెతలు ఇంకెవరికీ తెలియవనిపించేది. చీటికీ మాటికీ ఒక సామెతను ప్రయోగించే వారు. ఎంతటి తీవ్ర పరిస్థితుల్లోనైనా సరే, సామాన్య సంభాషణల సందర్భం నుండి కేంద్ర కమిటీ చర్చల సందర్భం వరకు ఏదో ఒక సామెత విసిరి, నవ్వించి ఉద్రిక్తతను నడలింపచేయడం ఆయనకు అలవాటు. జీవితానుభవాన్ని, విస్లవ పరిజ్ఞానాన్ని జోడించి ఆచరణయుక్తంగా సలహాలివ్వడం ఆయన విశిష్టత. అసలే ఆరోగ్యం దెబ్బతింటూన్నది గనుక ఎక్కువ తినవద్దన్నా, పని చేయవద్దన్నా హాస్యంగా ఆయన సమాధానం చెప్పేనారు. “ప్రాఖం పోతూ వస్తూ వుంటోంది. ముందున్న వ్యవధి తక్కువ. తిన్నా ఇప్పుడే తినాలి, చేయగలిగినదంతా ఇప్పుడే చేయాలి” అని. కామ్రేడ్ బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన అనతికాలంలోనే కామ్రేడ్ ఎం.ఆర్. వెంకట్రామన్ అస్తమించడం తమిళనాడు కామ్రేడ్స్‌కు మరీ పెద్ద దెబ్బ అయింది. కామ్రేడ్ ఎం.ఆర్: వెంకట్రామన్ మరువరాని మనిషి. జీవితాన్ని విప్లవాశయానికి అంకితం చేసిన మహాయోధుడు ; ధన్యజీవి. లో బంపర శశ .