Telugu Nene Ee Kshanam - anilvaranasi/indianlanguages GitHub Wiki
ం స ॥ ఉం న. శ్ / న ॥ జ ళీ న. క రీ | న్ లై. | | న్ | 1 | | న! క: చవి" ల ల " గ 1 లో (1 ళా కీ, క... ( | | ॥ భం లట 12 మమ ; 'జిటడ గ్ ఈ. ం
- ప. య్! సో! ర 0 లే. ॥ ॥ భి గోకటు న. |. 3 10 మట న లం ( - వ. ర టి చ్ నట మ ళీ 1 వట + ( క న? నళ టే శ 1; ప ౫ ౧ . వి! న ఇ ॥ న్! ల్ . | . బె ॥ | యు ఇత ల్, - | లో స్ట ల హా! " జ ర సట | మ న స ; శ! 1 టి సం శా సంతం ఆస లట ' శన ్ గ లో న! త చ ఖీ, ౯ || ] శ ఈ ఖు! ర్య? | స న తట బ్లో న ఆ ః 1 “ఓ కం. గీ పభ 4లో అట్లా య లే జ షస (1 , శ సహ క ఓ ప... క . త్న (లై క 060/4 యి “అ య గో స్తే రా కవిత్వం 1
నేనే ఈ క్షణం
బి.వి.వి. ప్రసాద్ కవిత్వం 1995 - 2004
గ6౧౪6 ౬6 గంగి 202800 4౧౦౦100” ౦1 ౧౦6౧౧ 1౧ 181680 9/9౪. గిగిగ5గం 5.౮. ౧౧9౬6 లం 11 య్ శ్ తా గ్. ల్? డ్ [౯1౪46100 : ౮ 2006 00౧189 ; 1000 00౪6! ౧౭౩6 : శిగిగిడం౮౧౧౭ 5001), [902 8౧౦10 6)” ౬. */6618! 205 0౦౪6౯: ౧6 ని/2౦|302౧౬ ౧4 0 4౮౧౦౧214. ౧9119౧66 65: యి 5.౮౪ ౧౦౬6, క్
- 23-12-21, 52)400/౧2%, ల ₹4040గ౮ల - 534211, 6.0.౬, న ౬౧0211: న౧౯9460౪/ ఈ ౧6ఉ%గ౧2|1.0001 (7 న్యు దిగ౧160 4: (భా టి, 3/ ౧౭౧౬ ౧౧8%, (౫ ంం125ర గో... ల, [1414001౪/2/ 56690 ల లో ( గషుగ1110106౧4 జా2476345 ఇ పు హైదరావాద- 5 00౧183 281016 2% ౪192412206 800% [106456 | 0/200%165. శీ) ౧౦౧౮1 |16/641418 000% 51099 1% గి. నగ06: గ౧౩. 20/-
మీరు అంటున్నారు 'నువ్వూ, నేనూ ఒకటే అని.
ఎంత దృఢమైన ఢ్రేమ,
“రూ, నేనూ వేరు అనే బలహీన (ేమికుడి పైన ! భగవాన్ శ్రీ రమణ మహార్శికి
ఆత్మీయులు
కొవ్షర్తి జీయన్వీ నరనింవోరావు, ఆలపాట్ రాంబాబు,
గోపిరెడ్డి రామళ్ళష్ణారావు, నామాడి శ్రీధర్స్ రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు,
కొవ్వలి ఆంజనేయళర్చ, వారనాధ్స్ రనరాజ్కు రత్నమాల, ఎమ్మెన్ నూర్వనారాయణ, గొట్టుముక్టుల శ్రీనివాసరాజు, బాలాజీ వర్హ, మద్దాల శ్రీనివాన్స్ రెంటాల నుబ్రవ్మాణ్యం, . లంకా వెంకటేశ్వర్లు, జియల్ఎన్ మూర్తి, ఎన్.వి. రామశాస్త్రి కృష్ణమోవాన్ గార్లను,
క్రొ శివారెట్టి గారిని ఓల్లా గారిన్కి
సాపొత్యం ద్వారా పరిచయమై, నా జీవితాన్ని స్నేహా నంవన్నం చేసిన ఎందరో కవిమిత్రులని సాపొతృవేత్ర్తలని, సాపొత్సాభిమానులని,
కవితల్ని ప్రచురించిన వత్రికలు, నొపొత్వనంచికల వారిని
ట్రసారం చేసిన ఆకాళవాణే, దూరదర్ధున్ వారిని
ఇంకా
అమ్మ విజయలక్ష్మి, నాన్న అచ్యుతం గార్లన్సీ
నవాచరి మాలతీ, వీల్లలు గాయత్రి, భార్హవిలని,
ఇతర ఐబంధువులనీ, మిత్రులనీ ేయోభిలావులనీ...
అందరినీ తలచుకొంటూ,
అందరిలోంబీ (్రకటితమౌతున్న జీవనోత్సవానికి నమన్సురిన్తూ...
ఇ 'వీ క్షణాలు...
-
నాటిన మబ్బు రి ల విశ్వరూపి 10 3 నదీ-ఒడ్డూ క్ష త్తే అశ్చబింబాలు 12 చు రెండుమాటలు 1డీ
-
పాపొయితో దేవుడు 15 ళా ప్రపంచాలు 16 8&. ఇరుతీరాల నడుమ 17 ర ఒక (ప క జాతి 18
-
వన లగ 19 11 తూనీగల గురించి 20 12, బిగ్బాంగ్ లై 18 తూనీగ లబ
-
కదిలేనావలు 23
-
ఒక సౌందర్యం ఒక విధ్వంసం లశ
-
చిన్నప్పటి బొమ్మ బగ్ర
-
ఒక కొత్త ఆకాశం లగా
-
విషాదపర్వం 28
-
అంకురం 29 20, పేరు 30
-
రాత్రిని పలుకరిస్తూ తి
-
కల ఒక నిజం 88
-
_కొవొత్తి 3౩5
-
_ ఎండుటాకుల మీద నడకీ 86
-
నదిని చూసి 87
-
నిరీక్షిస్తూ 89 బ్ర, అస్తిత్వానికి అటూఇటూ శ0
-
చివరి పూలు శ్రే 20, మహా వైఫల్యం త్త
-
పిల్లలలోకం త్రి
-
పాపా - సీకాకోకా 4ీర్
-
వేసవికల త్త శ... ప్రేమలో త్స వెక్త పరాజితుడు త్తే
-
_ శూన్యానికి ముందు 50 36, కల వెలుపలి కల ర్2 ౩7 ఇంకా యుద్దాలు చేస్తున్నాం ర్కీ
-
నేనే ఈ క్షణం ర్7
-
మరొక మెలకువ కోసం 60 శత0. ఆనంధం 68 శీ1. మహిమ 64
-
పిల్లలకి ఒక ఉత్తరం 66 48, _రహస్యంలోకి 68 44... వెన్నెల కవిత 69 శీర. అద్దంలో పాపాయి 70 కీ6. నల్లని కాంతి 71
-
_ చివరి స్మృతి లోనికి 72
-
_ వేసవి వర్షాన్ని ౯74 49, _ పాప ఇచ్చిన ఆకాశం ౯75
-
అగరువత్తుల అమ్మాయి 76
-
చీకటి బాగా
-
సంతోషం అంటే ఏమిటి? 79
-
జీవించటం గురించి రి 54ఓ దుఃఖ స్వప్నం 88
-
మంచు బిందువు 86 56, _ దృష్టి మాత్రమే 87
-
_ ఏదీ తాకలేవు 89
-
_ ఇస్మాయిల్ గారికి 91
-
సీతాకోక రంగుల ప్రయాణం 93
-
నిన్ను ఊహించటమే... 8ిర్
నాటిన మబ్బు ఎండ కురిస్తే చెట్టునిండా ఆకుపచ్చని చినుకులు. చీకటి కురిస్తే చెట్టునిండా నల్లనిమబ్బులు. గాలి వీస్తే మబ్బుల్లోని చినుకుల్ని కురుస్తూంది చెట్టు. 27 మే 1995 వార్త 'స్పష్టి 10 ఆగష్టు 1996 9 ఇ నేనే ఈ క్షణం
విశ్వరూవి చందమామ వామనుడిలా వెన్నెల పాదాలని నింగీ, నేలలపై మోపింది. మూడో పాదానికి నా హృదయాన్ని చూపాను. ఇక రహస్యాంతర లోకాలకి అణగి కవిత్వాన్నయి (ప్రకాశించాలి. 13 జూన్ 1995 చైతన్యకవిత సంచిక: 24 బి.వి.వి. ప్రసాద్ ౪ 10
నదీ-ఒడ్డూ
వెన్నాల రాత్రి కంటే
చీకటి రాత్రి బాగుంటుంది.
వెన్నెల నదిలో
చూపులెంతసేపూ
పడవ చంద్రునిలోనే కూర్చుంటాయి.
చీకటిలో అవి
తారల ఇసుక మైదానంలో
గంతులేస్తూ ఆడుకొంటాయి. 13 జూన్ 1995
వార్త 'సృష్టి 10 ఆగష్టు క్ష996
114 నేనే ఈ క్షణం
అశ్చబింబాలు ఆమెని ఢ్రేమించాను. మాపై శరీరాలు కప్పిన అన్ని ఛాయలనీ విప్పుకొని తొలి ప్రాణస్పందనతో మా చూపులు స్పృశించుకొన్నాయి. నిను ప్రేమిస్తున్నానని మా ప్రాచీన (ప్రేమని ఆమెకి జ్ఞాపకం చేసాను. ఆమె అమ్మయి నా పసితనాన్నీ నేను అమ్మనయి ఆమె పసితనాన్నీ రక్షించుకోవాలని కలగన్నాం. మా (ప్రేమతో రోజుకో సూర్యుని వెలిగించాలనీ రాత్రి చంద్రరేఖల్ని చిత్రించాలనీ ఊహించాం. ఆమె నాకొలనులో వెన్నెలైంది. నాలోకి ఎవరే మాటల్ని విసిరినా చెదిరిన అలఅలకీ ఆమె అల్లుకుపోయింది.
బివి.వి. ప్రసాద్ శ 12
కలిసి ఉన్నా దూరమైనా మా కనులు అశ్చ్ళవులతో నిందేవి. అశ్చవులలో ఎపుడూ మా ప్రతిబింబాలు తొణికిసలాడేవి.
షా ళ్ షా (ప్రేమల్ని వేరుపరిస్తే ప్రపంచానికెంత సంతోషం. హృదయం మాత్రం, కన్నీటితో (ప్రేమకి బదులు ప్రపంచాన్ని కడిగేసుకొంది.
ళా ళా శ ఆమె ఉన్న ప్రపంచం కదా ఇది. ఈ ప్రపంచాన్ని మరింత ప్రేమించాలి. నా (ప్రేమ అలలై పరుగులెత్తి అజ్ఞాత తీరాన ఉన్న ఆమెని తాకాలి. ఈ (ప్రపంచమనే చిన్ని బంతిపై ఎప్పటికీ మేం కలిసే జీవిస్తాం. ఎక్కడ ఉన్నా ఒకే సూర్యకాంతి మమ్మల్ని లాలనగా తాకుతుంది.
15 ఫిబ్రవరి 1996 ఆం(ధ్రభూమి 'సాహితి' 8 జులై 1996 13 * నేనే ఈ క్షణం
రందుమూటలు అబ్బాయి పుడితే తండ్రి మాత్రమే అయ్యేవాడిని. అమ్మాయి పుట్టి తల్లిని కూడా అయ్యాను. స్త్రీని మగాడితో సమంకమ్మని ఎలా శపించను? మగాదిని స్త్రీతో సమంకమ్మని దీవిస్తాను. 17 మార్చి 1996, 29 జూన్ 1996 ఆహ్వానం అక్టోబర్ 1996 బి.వి.వి. ప్రసాద్ 4 14
పొపొయితో దేవుడు
నిద్రలో పాపాయి నవ్వింది.
తల్లి చెప్పింది
“పాపాయితో దేవుడు మాట్లాడుతున్నాడని,
మనకి దేవుడు లేడు.
కానీ,
దేవుడంటేనే లేకపోవటం.
మబ్బు మరకలు లేని నిర్మలాకాశం దైవం.
మననిండా మబ్బులు పట్టి
రంగులూ, మెరుపులూ, శబ్దాలూ, జల్లులూ వెదజల్లుతాం.
మనకి దేవుడు వుండడు.
కానీ,
ఏమీలేని నిర్మలాకాశంవంటి పాొపాయితో
లేకుండా ఉన్న దేవుడు మాట్లాడితే
ఆశ్చర్యమేముంది! 14 ఏప్రిల్ 1996 15 $ నేనే ఈ క్షణం
టప్రవంచాలు మనిషి ఒక ప్రపంచం. బలం-బలహీనత వెలుతురు-చీకటి ఒక ప్రపంచానికి ఒక మిశ్రమం. ప్రతి ప్రపంచంలో పూలుంటాయి. ఎడారులుంటాయి. ప్రతి ప్రపంచంలో ముప్పాతిక ఉప్పు సముద్రమూ వుంటుంది. బహుశా ప్రతి ప్రపంచంలో తనకే తెలియని అనంతాకాశం వుంటుంది. 29 ఏప్రిల్ 1996 చైతన్యకవిత సంచిక : 24 బి.వి.వి. ప్రసాద్ ఖ్ 16
ఇరుతీరాల నదుము మా మధ్య పావాయి నిదురించటం ఎంత బావుంది! ఇన్ని రోజులూ మేం నదులమో తెలీదు; నదీ తీరాలమో తెలీదు. మాలోంచి ప్రవహించి పాపాయి మమ్మల్ని నదులుగా రుజువు చేసింది. పాపాయి మా మధ్య ప్రవహించి మమ్మల్ని నదీ తీరాలనూ చేసింది. మా మధ్య పాపాయి ప్రవహించటం ఎంత బావుందీ! 10 అక్టోబర్ 1996 రాహ్రి 12.40 ఆం(ధ్రజ్యోతి వారపత్రిక 1 నవంబర్ 1996 17 * నేనే ఈ క్షణం
ఒక (ప్రశ్నార్ధక జాతి మనిషి వినా భూమ్మీద అసహజమేముంది? భూమినో, నింగి పొరనో, మనస్సునో గాయపరచి గర్వించే మనిషి వినా భూమ్మీద భయానకమేముంది? పువ్వులా, తొలివెలుగులా, నవ్వులా విప్పారలేని మనిషి వినా భూమ్మీద జాలిపదాల్సిందేముంది? పర్వతాల లోయల మధ్య, వృక్ష జాతుల మధ్య, వేలాది ప్రాణుల మధ్య ఒకటికాలేని ఒకే ఒక్క మనిషి వినా భూమ్మీద అసహజమేముంది? 11 అక్టోబర్ 1996 ఆంధ్రజ్యోతి వారపత్రిక 8 నవంబర్ 1996 బి.వి.వి. ప్రసొద్ జ 18
వామస్వవ్నం తొలి చలి రోజుల్లో దుప్పటి లేకుండా పడుకొంటే నేనే ఒక మంచుఖండమైనట్టు తెల్లని ఆలోచన ఏదో 'పెంగ్విన్లా రెక్కలల్లార్చుతుంది. ఉక్కసోసిన రోజుల తర్వాత మంచు నీరయినట్టూ నీరు మంచయినట్టూ నిద్రలూ, మెలకువలూ చల్లగా, చప్పుదేమీ లేకుండా రోజుల పేజీలని తిరగేస్తాయి. కానీ, నీడనిచ్చిన చెట్టు పత్రాలు రాల్బ్ఫుతుంటే ఎటోపోయిన అనాథని వెదుకుతూ నాలో ఒక మంచుపగులు వ్యాపిస్తుంది. 12 అక్టోబర్ 1996 ఆంధ్రభూమి 'సాహితొ 7 జులై 1997 19 జ నేనే ఈ క్షణం
తూనీగల గురించి మేం గదిలో పాటలు పాడుకొంటుంటే ఇద్దరు చిన్నారి తూనీగలు గుమ్మాలలోంచి అటూ, ఇటూ ఎగురుతుంటారు. మాకు పాటలు పాడుకోవటమే తెలుసు. పాటకావటమంటే ఏమిటో వాళ్ళకి తెలుసు! 2 నవంబర్ 1996 ఆంధ్రజ్యోతి వారపత్రిక 13 డిసెంబర్ 1996 బి.వి.వి. ప్రసాద్ 4 20
బిగ్ బాంగ్ నీవే గెలాక్సీలు. బ్లాక్ హోల్స్. నీవే భూమీ. దానిమీద అడవీ, సముద్రమూ. నీవే ప్రాణీ, ప్రాణులూ. మానవుడూ, మానవులూ. నీవే (పేమికుల తొలి, మలి, చివరి ముద్దులు. నీవే కల. కల చెదరటం. సీవే నీవే అనే సాహసం. నీవు కావనే సాహసం. 4 నవంబర్ 1996 ఆంధ్రజ్యోతి వారప(త్రిక 29 నవంబర్ 1996 ష్ ఒక మహావిస్పోటనం నుండి విశ్చం ఆవిర్భవించిందని "సైన్సులో ఒక ప్రతిపాదన వుంది. 21 4 నేనే ఈ క్షణం
తూనీగ ఎగురుతూ, ఎగురుతూ గాలిలో దిగిన బాణంలా తటాలున ఆగుతుంది తూనీగ! కదలని తూనీగకి పైన, కదలని ఆకాశం, కింద, కదలని తటాకజలం. తటాకంలోకి ఎవరో విసిరినా ఎలా పడాలో తెలియని మట్టిబెడ్డలా ఆగుతుంది తూనీగ! ధ్యానాన్ని విప్పుకొన్న ఒకటి, రెండు రెక్కల కదలికల తర్వాత కదిలే కాలం గుర్తొస్తుంది తూనీగకీ, నాకూ. పల్చని నీటిలో తన ప్రతిబింబాలనో, తననో వెదుకుతూ తూనీగ్గా, చిక్కని ప్రపంచంలో నా ప్రతిబింబాలనో, నన్నో వెదుకుతూ నేనూ, అక్కడినుండి విడిపోత్రాం. 17 నవంబర్ 1996 ఆంధ్రభూమి 'సాహితి' 5 మే 1997 బి.వి.వి. ప్రసాద్ * 22
కదిలేనావలు నిద్రలో తల్లి ఒత్తిగిలి మీద పడిందేమో పొపాయి కెవ్వుమంటుంది. అప్పటివరకూ వేరు వేరు చీకటిలోకాలలో కలిసి ప్రయాణిస్తున్న ఇద్దరూ ఒకరి ముఖంలోకి మరాకరుగా మేలుకొంటారు. ఒక్కక్షణం రెప్పల వెనుక ఒకరినొకరు భద్రపరచుకాని మరలా వేరు వేరు లోకాలకి కలిసి ప్రయాణం మొదలు 'పెడతారు. వారి నిద్రలోనూ, మెలకువలోనూ భాగంకాలేని నేను మాత్రం సముద్రం ఒడ్డున దీపస్తంభమై కదిలే నావలని చూస్తూ నిలుచుండిపోతాను. 26 నవంబల్ 1996 రాత్రి 115
ఒక సౌందర్యం ఒక విధ్వంసం సముద్రాన్ని తవ్వుకౌని వైటపడ్డ పురాప్రకృతి తుఫాను. సముద్రంలోంచి దూకిన మహాశక్తి పదఘట్టనకి భూమి చినుకుపడ్డ పచ్చనాకై వణికింది. భూమీ, సముద్రం, నేనూ, ఆకాశం ఒకరిలోకి ఒకరం వ్యాపించిపోయాం. ఊగే చెట్లలాగే నాలోని మనిషీ శతాబ్దాల ముందుకీ, వెనుకకీ కదిలిపోయాడు. తొలిప్రేలుడుతో విడిపోయిన సమస్తం బెంగ సుడి తిరిగి ఏకమయే ప్రయత్నమే చేసిందో, రాత్రి నిద్రించే ధాత్రికి నల్లబిలం కలే వచ్చిందో... ప్రాణం, హరితం, ఇళ్ళూ, వేళ్ళూ మనిష్కీ పిశాచం, పశువూ, పక్షీ ఏకమై, అనేకమై విడిపోతూ, కలబడుతూ... తుఫాను ముగిసింది. కన్ను మూసింది. ష్ శ ఒక కొత్త అల వణికే తీరాన్ని నిమిరింది. కానీ, మనిషి నిద్రలో, మెలకువలో, నెత్తురులో, చూపుల్లో జలశంఖం చుట్టిన వృత్తాల వృత్తాంతాలు. గాలినీడలు. భూమి తిరుగుతోంది. గుండ్రంగా త్రిప్పి వదిలిన పిల్లవాడికి కనిపించేంత బి.వి.వి. ప్రసాద్ జ 24
స్పష్టంగా, మృదువుగా, నిదానంగా, వేగంగా ఒక్కలాగే తిరుగుతోంది భూమి. తుఫాను పీడకలతో ఎర్రగా, అశాంతిగా నిద్రలేని కన్నులాంటి సూర్యోదయం. మృతుల్ని చూపే కిరణాల మృత్యోదయం. మృతులు, ప్రాణంలేనీ, ప్రాణంపోనీ, ప్రాణంతీసే మృతులు. చెట్టలాంటి మనిషీ, మనిషిలాంటి చెట్టూ కూలిన వైనాల కన్నీటిచారల విషాదతంటత్రులు. ఊరూ, స్మశానం వేరుకాని దుఃఖపతాకం,. చెట్టుకూలిన చోట, చెట్టంత శూన్యం. మనిషి చివరి శ్వాస తరువాత అతను నడిచిన నేలంతా, సముద్రమంతా మనిషి భవిష్యత్తంత శూన్యం.
యః ళ్ ళ్ తుఫాను శూన్యంలో పాఠాలు రాసిపోయింది. తీరందాటే తుఫాను ప్రపంచ తీరందాటి మనిషిలోకీ, కలల్లోకీ జ్బరమై ప్రవేశించి శుభ్రపరచాలి. జ్వరపడ్డ సముద్రం తేరుకొని తీసుకొనే అలల శ్వాసలా మబ్బుల్లో మళ్ళీ మొలిచిన వెలుగు పచ్చికలా చేలల్లో తిరిగి విచ్చుకొన్న పచ్చని కిరణాల్లా మనిషికూడా ఇంటినీ, కలల్నీ సరిచేసుకోవాలి. తుఫానుల్లో స్నేహానికీ, తుఫానుల్లో యుద్దానికీ మనిషి నిలబడ్డ సముద్రంలాంటి నిలువెత్తు తుఫాను కావాలి.
28 నవంబర్ 1996 ఆంధ్రజ్యోతి వారపత్రిక 20 డిసెంబర్ 1996 25 4 నేనే ఈ క్షణం
చిన్నప్పటి బొమ్మ పొపాయి చేయి లేత అలలా నా ముఖాన్ని తాకి నవ్వుతూ ఉంటే వసంతం పూలలోయలో నడిచినట్లుంటుంది. నేలకి పూచాయో, కాలానికి పూచాయో పూలు, పూలు నా నదక ముందూ, వెనుకా. ఎండిన పులళ్లేదో తగిలినట్లు నా నవ్వుల మధ్య ఒక ఆలోచన తగులుతుంది. నా మొదటి క్షణాల్లో నేనూ ఇలా నవ్విన మరపు వెనుకటి జ్ఞాపకం ఏదో ఆనందాన్నోో విచారాన్నో కలిగిస్తుంది. బహుశా, పాపాయిలోనూ పోగొట్టుకొన్న బొమ్మలాంటి నా చిన్నప్పటి ప్రతిబింబాన్నే వెదుక్కాంటున్నాను. కనుకనే, ఎవరైనా '“పాపాయిపై నీకెంత (మేమా అంటే “ఆమె నాకు ఇంకా అపరిచిత. నేను ఆమెలో కనిపించే బాల్యాన్ని (ప్రేమిస్తున్నాను.” అని చెప్పాలనిపిస్తుంది. 30 నవంబర్ 1996 ఆంధ్రభూమి 'ఆదివారం' 23 ఫిబ్రవరి 1997 బివివి. ప్రసాద్ జ 26
ఒక కొత్త ఆకాశం ఈ పాప ఆకాశంలో ఉందా, ఆకాశం ఈ పాపలో ఉందా! రెండూ నిజమేనేమో! ఇంకా ఏ జ్ఞాపకాలూ మబ్బులు కట్టని నిర్మలమైన ఆకాశమేదో పాపలో ఉండి వుంటుంది. ఏటినురగలా తనలోపలి ఆకాశంలో తానే తేలుతుందేమో, పాప మంచంమీద ఉన్నా ఆకాశంలో ఉన్నట్లుంటుంది. పిట్టలా రెక్కలూపి గిరికీలు కొట్టే పాపకి కిందా, పైనా ఆకాశమే! పాప నా చేతుల్లో కేరింతలు కొడితే భూమిలో వేళ్ళు పొతుకొని నింగిలోకి కొమ్మలు చాపిన చెట్టులా, ఎగిరే పిట్టని చూస్తూ అసహాయంగానూ, ఆనందంగానూ నిలబడిపోతాను. 1 డిసెంబర్ 1996 ఆం(ధ్రభూమి “సాహితి 6 జనవరి 1997 27 ఓ నేనే ఈ క్షణం
విషాదపర్వం మనిషిగా పుట్టి మనిషిగా చనిపోతూ వుండడం విషాదం. ఎన్ని శ్వాసలు తీసుకొన్నా లోపల ఏ జ్వాలా రేగక పోవటం విషాదం. రోజు నాలుగు దిక్కులకీ పల్చని అలవాట్లు అల్లుకొని సాలెపురుగై బ్రతకటం విషాదం. కలకీ, కర్తవ్యానికీ మధ్య బద్దకం చెదలు వ్యాపించటం విషాదం. గెలుపూ, ఓటమి మినహా జీవితం లేకపోవటం విషాదం. గెలుపుని ఆరాధిస్తూ ఓడిన కళ్ళూ వికసించటం విషాదం. ' సాహసం లేకపోవటం, సొహసించే సందర్భం లేకపోవటం విషాదం. సాహసి తనని తాను జయించలేకపోవటం విషాదం. బాధ లేకపోవటం, బాధ భరించలేకపోవటం విషాదం. లోతైన బాధల్లేని నునుపైన (బ్రతుకు విషాదం. శరీరసుఖం చివరి మజిలీ కావటం విషాదం. బతుకు ప్రశ్న కావటం, ప్రశ్న కాకపోవటం విషాదం. ప్రశ్నల పాదాల మధ్య ఎక్కే మెట్టులాంటి ఎదిగే మౌనం లేకపోవటం విషాదం. మనిషిగా చనిపోయే ప్రతిసారీ పాత మనిషే తిరిగి పుట్టడం విషాదం. 23 డిసెంబర్ 1996 సాహిత్యనేత్రం సంచిక: 8 బివివి. ప్రసాద్ జ 28
అంకురం పాపాయి గుర్తుపడుతోంది. ఆమె మేథాబీజం తొలి జ్ఞాపకాల చిగుర్లు విప్పుతోంది. ఇక ఆమె మనస్సు (క్రమంగా నిన్నూ నన్నూ మనల్నీ రంగున్నీ నీడల్నీ మాటల రంగుల నీడల్నీ చూపుల రంగుల్నీ నీడల్నీీ గుర్తుపడుతూ, గుర్తుంచుకొంటూ శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఇక ఈ మొక్క ఏ పూలు పూస్తుందో, ఏ ఫలాల నిస్తుందో, ఏ నీడల నిస్తుందో ఎదురు చూడాలి. ఎదురు చూడాలి. 8 జనవరి 1997 ఆంధ్రజ్యోతి వారపత్రిక 21 ఫిబ్రవరి 1997 29 ఫి నేనే ఈ క్షణం
పేరు “పాపని ఏమని పిలుస్తావిని అడిగారెవరో. ఏమని చెప్పాలి? ఏ రెండు పూలనీ ఒక పేరుతో గుర్తించటం ఇష్టంలేనివాడిని. ఏ రెండు క్షణాల పాపల్నీ ఒక పేరుతో ఎలా పీలవను? నేను అన్నాను “చినుకునుండి సముద్రానికీ, సముద్రం నుండి చినుకుకీ నీటికెన్ని పేర్గో పాలనవ్వుల నుండి కంటతడికీ, కంటితడి నుండి పాలనవ్వులకీ, పాపాయికి అన్ని పేర్లు.” 9 జనవరి 1997 బివివి. ప్రసాద్ ౪ 30
రాత్రిని వలుకదిన్తూ హాస్పిటల్లో దీపాల వెలుతురు. బయట నక్షత్రాలు కురిసే చీకటి. చీకటికీ, వెలుతురుకీ మధ్య ఆమె. వెలుతురు కింది అక్కడక్కడి నీడల్సీీ చీకటి కింది అక్కడక్కడి వెలుతుర్లనీ చూస్తూ నిద్రకీ, మెలకువకీ మధ్య ఆమె. రోగానికీ, ఆరోగ్యానికీ మధ్య, జీవితానికీ, మృత్యువుకీ మధ్య రోగులు. వారితో మాటలకీ, మౌనానికీ మధ్య ఆమె. అప్పుడప్పుడూ, ఎవరో ఒకరు ఎడారి నిశ్శబ్దంలో అడుగుల చప్పుడు ముద్రిస్తూ వెళిపోతారు. ఎవరో ఒకరు ఆమె మౌనతీరం మీదికి అలలాంటి మాటల్ని విడిచిపెడతారు. అల వెళ్ళిపోయాక మాటలు నెమ్మదిగా మౌనంలోకి ఇంకిపోతాయి. 31 జ నేనే ఈ క్షణం
అప్పుడప్పుడూ, ఫోనుమోగిన చప్పుడు ఎండిపోతున్న మెలకువచుట్టూ లతలా పచ్చగా చుట్టుకొంటుంది. మరలా రేపటికీ, నిన్నటికీ మధ్య కూర్చుని తెగనీ, సాగనీ ఆలోచనల తీగలపై చీకటిని మీటుతుంది. ఏ పత్రిక పుటలనో కనురెప్పల్లా మూస్తూ, తెరుస్తూ తూర్పూ, ఆమె కనులూ ఎర్రబడేవరకూ ఎదురుచూస్తుంది. 9 జనవరి 1997 రాత్రి 100 చైతన్యకవిత సంచిక : 38 & 39 బివి.వి. ప్రసాద్ శ 32
కల ఒక నిజం కలలు కలలే. కలలకి రక్తమాంసాలుందవు. నిజంలాంటి చలించని భూతీరాన్ని కలలు అలల్లా చరుస్తూ వుంటాయి. భూమి కదలదు. సముద్రం వదలదు. కలల సముద్రంలో పడి వ్ స్వర్ణోదయాలవైపుకో ఈదుకొంటూ పోతానా నిజం ఒంటికన్నుతో దీపస్తంభమై నా కోసం చూస్తూనే వుంటుంది. కలలు నన్ను నడవనిస్తాయి. కలలు నన్ను నడవనియ్యవు. అయినా కలని (్రేమిస్తాను. కలని ఒక నిజంలా ్రేమిస్తాను. కల కుడి, ఎడమలు మార్చుకొన్న నిజంలా వుంటుంది. 'ప్రతిబింబానికి రక్తమాంసాలుండవు. రక్తమాంసాలలో కలలు సంచరిస్తాయి. నిలువెత్తు కలలో రక్తమాంసాలు ప్రవహిస్తాయి. 32 ఖ నేనే ఈ క్షణం
కలకి అనువాదం నిజమా? నిజానికి అనువాదం కలా? తెలీదు. కల విషాదం కాదు. నిజం విషాదం కాదు. విషాదమంతా అనువాదమే. నేనెవరో తెలీదు. కలనో, నిజాన్నో అనువాదాన్నో తెలీదు. కలకీ తెలీదు నేనెవరో. తెలియకుండా పుడతాం కదా, ఏమీ తెలియకుండానే మరణిస్తాం. క్త ళ్ చా ఇప్పుడు సూర్యుడూ లేదా నక్షత్రాలు. తరువాత అంతా ఒకే మహామౌనం. 25 ఫిబ్రవరి 11997 ఆంధ్రజ్యోతి వారపత్రిక 28 మార్చి 1997 బివి.వి. ప్రసాద్ శ 34
కొవ్వొత్తి
గది అంతా కాంతినిచ్చే ఈ జ్వాలకి
చిక్కని కాంతిచర్మం ఒక సరిహద్దు.
విత్తనంలాంటి వత్తిని
పారదర్శకంగా దాచుకుంది ఈ కాంతిద్రాక్ష
వణికీ వణికీ
కదలని కాంతి ఏ చలికి గడ్డ కట్టింది?!
ఇంతలో రూపాంతరమై
జారుతున్న చినుకులా మృదువుగా మొనతేలింది.
ఏ పిల్లాడు చెక్కాడు
ఈ కాంతిముల్లును ఇంతసూటిగా?!
ఈ కొవ్వ్యొత్తికి పొడవునా నీడవుంది కానీ,
నీడకి కాంతిరేఖ లేదు.
ఆర్చివేసాక చూస్తే
కొవ్యొత్తి టేబిల్ మీద వుండిపోయింది.
నీడని వెంటబెట్టుకొని కాంతి ఎటో వెళ్ళిపోయింది! శ మార్చి 1997
ఆంధ్రజ్యోతి వారపత్రిక 30 మే 1997
35 ఇ నేనే ఈ క్షణం
ఎందుటాకులమీద నదక పక్క కుదరదు. కలలు పట్టవు. రెప్పలకింద సూర్యబింబం మెరమెరలాడుతుంది. ప్లాస్టిక్ పూలని తాకి గాలి గాయపడుతుంది. నాగరికుడు వాడిపోడు. వికసించనూ లేడు. సంభాషణలో కొత్తవాక్యం, పదం లేదా ఉచ్చారణ. నవ్వే చూపు రెక్కముడిచి ఆలోచనపై వాలుతుంది. కొయ్య స్పర్శలూ, కొయ్య మాటలూ. కొయ్యబారిన చెట్లకి పూలు పూయవు. నమ్మకాల బుడగలకి సూదిస్పర్శ. కలల రంగులు ముడుచుకు పోతాయి. కన్నీరు రాని దుఃఖం. కోపం రాని దుఃఖం. కెరటాన్ని మడిచి లోయలోకి విసురుకొన్న దుఃఖం, ఏ కారణమూ, ఏ ఉద్వేగమూ శాశ్వతంగా ఆదుకోవు. దొరికిన శబ్దాలు పట్టుకొని ఎటో ఈదుతుంటాం. 22 మార్చి 1997 రాత్రి 12.45 ఆంధ్రజ్యోతి “ఆదివారం 13 జులై 1997 బి.వి.వి. ప్రసాద్ * 36
నదిని చూని తెల్లవారుతోంది. రైల్లోంచి గోదావరి కనిపించింది. మబ్బులు ఇవాళ ప్రయాణమెటో ఇంకా తేల్చుకోలేదు. పగటి మసక వెలుగులో ఇసుకతిన్నెలూ, తెరచాపలూ ఉల్లాసకరమైన మగతలో ఊగుతున్నాయి. ఒడిలోని మా అమ్మాయితో “అమ్మా గోదావరిరా” అన్నాను. ఏదో చెప్పబోయి మాటలు తెలీక మా అమ్మాయి చేసే చప్పుడు నాలోపల. గోదావరి గురించి ఏంచెప్పను? ఈ నేల పచ్చదనంలోకీ, పూలలోకీ ప్రవహిస్తుంది ఈ నీరు. పూలమీద ఎగరేస్తుంది సీతాకోకల్ని. వెచ్చగా మాలోకి ప్రవహించి మాలో ఆకాశాన్ని ప్రతిఫలిస్తుంది. ఈ నీరే లేక కదా ఎండిన నేలలమీద వెన్నెల కూడా పొడిగా రాలుతోంది. ఏం అర్ధమయిందో, పాప గోదావరిని కన్నార్చకుండా చూసింది. 37 కః నేనే ఈ క్షణం
పాప కనుపాపలో గోదావరి ప్రవహించింది. పాప, నాన్నలా కవిత్వం రాస్తుందా అనుకొనేవాడిని. రాస్తుందో, లేదో. ఆమె నదిని (ప్రేమిస్తోంది. నిండారా ప్రవహించే నదిని. అంతకన్నా ఏం కావాలి? 1 ఆగష్టు 1997 ఆం(ధ్రభూమి 'ఆదివారం' 28 డిసెంబర్ 1997 బి.వి.వి. (ప్రసాద్ శ 38
అబీ నిరీక్షిస్తూ నీ కోసం ఎదురుచూస్తాను. కలుసుకొంటే ఏముంది! ఇద్దరు మానవులూ, ఒక సంభాషణా. ఊరికే కలిసే సరదాకి ఒకరినొకరు వెదికితే విస్మయం చెందే రోజులలో, ఎదురుచూపు అంతకన్నా విస్న్మయకరమూ, అందమైన సంగతీ. ఎండిపోతున్న చెట్లకి పూచే చివరి రెండు పూలలా, మాటలకో, మౌనానికో మనం వికసించే తొందర. నిరీక్షణ నాలోని ప్రాచీనకాలాల మానవ పరిమళాన్ని మేల్మాలుపుళూ వుంటుంది. బయటి శూన్యంనించి ముడుచుకొంటూ, నేను నీకోసం నాలోపలి సమస్తం తెరచి వెదుకుతాను. తీరా నువ్వు వచ్చేసరికి నేను నాలోపలెక్కడో వుంటాను. బహుశా, అది మనం ఎప్పుడూ కలిసి వుండే చోటు. అంతే కదూ! 17 ఆగష్టు 1997 ఆంధ్రజ్యోతి వారపత్రిక 19 సెష్టెంబర్ 1997 39 ఖ నేనే ఈ క్షణం
అస్తిత్వానికి అటూఇటూ కలనించి మేలుకొన్నట్టు మెలకువనించీ మేలుకోవాలనిపిస్తుంది. ఇంత జీవించే రొదలోనూ, ఏదో నిశ్శబ్దం వెంటాడుతుంది. లోతైన నీటిలోకి ఎండ మృదువుగా అంతరిస్తుంది. ఈ కాంతికింద నాలోకి ఒలికిన అనుభవాలు మాత్రం, జ్ఞాపకాలుగా ఘనీభవిస్తాయి. ఒక పాట ఏదో క్రమంగా వికసిస్తూ వుంటుంది. గడచిపోయిన కల ఎంతకీ కరగదు. మర్యాదలూ, సంస్కారమూ ఉట్టిపడే చెట్టుబెరదవుతుంది ముఖం. ఎగసిపడే జీవజ్వాలని ఎలా అదిమిపెట్టాలి? పగటికలలు సరిపోవు. పలచని కలలు జీవనానందాన్ని మోయలేవు. నిజమైన ఆకాశంకింద పగలూ, రాత్రులూ ఒక అభివ్యక్తి విస్తరిస్తూపోవాలి. ఈ అస్తిత్వపు రాయినెవరో విసిరారు కాలం కొలనులోకి. నా అలలారా బద్దకించకండి. వేలమైళ్ళ పొడవైన కాంతిని మోశాక, నా స్థలం ఖాళీ చేయాలి, ఒక గడ్డిపువ్వు కోసం లేదా వానచినుకు కోసం. అప్పుడిక, ఎవరి అడుగుల చప్పుడూ వినిపించని ఏకాంతం నన్ను స్వీకరిస్తుంది. 18 ఆగష్టు 1997 రాత్రి 2.25 బి.వి.వి. ప్రసాద్ జ 40
చివరి వూలు పూలనీ, పూల జ్ఞాపకాలనీ కాలానికి అలంకరించిన మొక్కలు ఎండిపోయినట్టున్నాయి. ఇపుడే ఏ నిప్పుకణమో పుష్పొడిలా ఎగిరివచ్చి ఎండిన కొమ్మల్ని తాకినట్లుంది. జ్వాలల పూలరేకుల్తో కొమ్మలు వికసిస్తున్నాయి చివరిసారి. మృదువైన రంగుల కాంతులు కొమ్మల్లోంచి చరచరా వెళ్ళిపోతున్నాయి. ఇక, సంధ్యకాంతులు వెళ్ళిపోయాక ఆకాశం నల్లబడినట్లు దగ్ధమైన కొమ్మలు విరిగిపడిన రాత్రి శకలాల్లా నల్లగా మిగులుతాయి. 20 అక్టోబర్ కం97 41 ౪ నేనే ఈ క్షణం
మవాో వైఫల్వం విఫలమైన కాంతి రంగులుగా కనిపిస్తుంది. అన్నీ అంతే. సత్యంనించి వైఫల్యమే జీవితం, ప్రపంచం, పాలపుంతలు. నా కవిత్వమూ అలాగే వుండాలని. ఒక మహానిశ్శబ్దం వైఫల్యంగా. జలజలా మాటలు కాదు. మహా నిశ్శబ్దాన్ని అదిమిపట్టుకొన్న ఒక్కొక్క అక్షరం కావాలి. ఇంత ప్రపంచం ఇన్ని అనుభవాలూ అక్కర్షేదు. చాలా వరకూ చెరిపేయవచ్చును. ఓ మంచు కణం... ఓ తృణం... ఓ నేను... అది కూదా (క్రమంగా చెరిగిపోవచ్చును. 30 అక్టోబర్ 1997 బి.వి.వి. ప్రసాద్ శ 42
వీల్లలలోకం ఏ లోకంనించి వస్తారో ఈ పిల్లలు! ఈ కాత్తప్రపంచాన్ని తేరిపార చూస్తారు. అక్కడ వాళ్ళు సంగీతంలో సంభాషిస్తారేమో! మన ఎదగని భాషని వాళ్ళ సంగీతంలోకి అనువదించుకొంటారు. వాళ్ళ లోకంలో జీవించటమంటే నర్తించటమేమో! ఇక్కడ కూడా అల్లరి లయబద్ధంగా చేస్తారు. మొక్కలూ, పిల్లలూ కలిసి ఆడుకొనే లోకమేమో అది! ఇక్కడ నవ్వుతారా, నిద్రిస్తారా, ఏడుస్తారా అన్నీ పూలు పూస్తున్నట్టో, రాలుతున్నట్లో వుంటాయి. తాము చేసేవి తమకు తెలీదు మొక్కలకులాగే! ఏ లోకమో ఈ పిల్లలది! అక్కడ కాలం వుండి వుండదు! ఆనందం తరువాత ఆనందమే కాని క్షణాల లెక్క తెలీదు. వాళ్ళ కలలూ, జ్ఞాపకాలూ నీటిమీది బుడగలలా ఎటో కొట్టుకుపోయినా పట్టించుకోరు. పిల్లలకి పుట్టామని తెలీదు. చనిపోతారని తెలీదు. అవి లేని లోకంనించి వచ్చారేమో, అవి వాళ్ళకి అర్ధంకావు!
43 ఖై నేనే ఈ క్షణం
శరీరాలు అకృ్లేని ఏ లోకంనించి వచ్చారో ఇక్కడ దోబూచి ఆడతారు. అద్భశ్యమయ్యే లోకాలు మనకు అందవు కదా కళ్ళు తెరిచి ఫకాలున నవ్వుతారు. పిల్లలకి చీకటి భయం. నిశ్శబ్దం భయం. అవి లేని కాంతినించి వచ్చి వుంటారు. శబ్దంనించి వచ్చి వుంటారు. పిల్లలు తపతపా అడుగులేస్తూ మన లోకంలోకి నడుస్తూ వుంటారు. వాళ్ళ అడుగులలో చివరిసారి ప్రతిఫలిస్తూ ఆ లోకపు సౌందర్యం అదృశ్యమౌతూ. వుంటుంది. వాళ్ళ చేతులు పట్టుకొని నడక నేర్పుతామా ఎపుడైనా వాళ్ళిటు రావటం మాని మననే అటు తీసుకుపోతే బావుండునని ఎదురుచూస్తాము. 2 నవంబర్ 1997 రాత్రి 200 ఆం(ధ్రప్రభ వారపత్రిక 23 నవంబర్ 1998 బి.వి.వి. ప్రసాద్ ఇ 44
వాసా - నీతాకోకా
రంగురంగుల పూసలతో అల్లిన సీతాకోకతో ఆడుకొని
పాప నిద్రపోయింది.
నిద్రలో పాప పెదాలమీద
ఒక నవ్వు సీతాకోకలా
రెక్కలు విప్పి ఎగిరిపోయింది.
ఇప్పుడు పాప కలలో
పూసల సీతాకోక
ఎగురుతూ వుండివుంటుంది!
కలలు తేలిక కదా!
తేలికైన కలలో
సీత్రాకోకా, పాపా కూడా ఎగురుతారు.
కొంతసేపు ఆడుకొన్నాక
సీతాకోక నిశ్శబ్దంలోకి ఎగిరిపోతుంది.
కీత్రాకోక వెనుకే
కల కూడా ఎగిరిపోతుంది.
పాప కూడా వాటి వెనుకే
తనలోని శూన్యంలోకి వెళ్ళిపోతుంది.
20 నవంబర్ 1997 వార్త 'ఆదివారం' 21 డిసెంబర్ 1997 45 జా నేనే ఈ క్షణం
వేనవి కల వేసవి ఆకాశంలో సూర్యుడు నీటివిత్తనాలు నాటుతాడు. ఇక లేత మబ్బులు మొలిచి శాఖోపశాఖలుగా గుబురులెత్తి చిక్కబడతాయి. గాలిలో వేర్లు నాటిన మబ్బులు గాలి వెంటే తిరుగుతుంటాయి. మబ్బుకింద పరిగెత్తే నీడ కదలని చెట్ల నీడల్ని చెరిపేసి, గీచి వెళుతుంది. మబ్బులకీ శిశిరం వస్తుంది. ఆ రుతువుని మనం వర్షాకాలం అంటాము. గాలికి ఊగీ, ఊగీ, మెరుపు కొమ్మల్ని రాచుకొంటూ చినుకు, చినుకుగా అవి పత్రాల్ని రాల్భ్బుతాయి. చినుకులు వాటి పత్రాలు, పూలు, ఫలాలు. రాలిన చినుకుల కడుపులో మబ్బుల విత్తనాలు (ప్రతిఫలిస్తాయి. ఆకాశం నేర్చిన చెట్టు పాఠం చినుకులిప్పుడు నేలమీద పొటిస్తాయి. కనుకనే, చినుకులు మట్టిలో ఒక విత్తనాన్ని వెదకి, మృదువుగా నిద్రలేపి మొక్క కావటం ఎలాగో నేర్పుతాయి. 2 ఏప్రిల్ 199 ఆంధ్రజ్యోతి 'సాహిత్యవేదిక' 29 జూన్ 1998 బి.వి.వి ప్రసాద్ * 486
(ప్రేమలో
ఎవరెవరినో (ప్రేమించాను.
వారూ నన్ను (ప్రేమించారనుకొన్నాను.
వారు నన్ను ప్రేమించలేదని
నా ప్రేమను (్రేమించారని తెలిసినపుడు
నిరాశ కలిగింది.
నిన్ను చూసాక తెలిసింది.
నేనూ వారిని (ప్రేమించలేదు.,
వారిని నువ్వనుకొని ప్రేమించానని.
నిన్ను చూసాక తెలుస్తోంది.,
నేను నిన్నూ (ప్రేమించటం లేదు.,
నీ రూపంలో ఉన్న నన్నే (ప్రేమిస్తున్నానని.
నిన్ను ప్రేమించాక తెలిసింది.,
నా లోపల ప్రేమ తప్ప ఏమీలేదని.
ఇప్పుడు
మానవులూ, వారి ఫొరపాట్లూ, దుఃఖాలూ, నవ్వులూ,
పిట్టలూ, పూలూ, నక్షత్రాలూ,
ఆకాశమూ, భూమీ, జీవితమూ,
చివరికి మృత్యువు కూడా-
నా లోపల నువ్వు వెలిగించిన (ప్రేమ కాంతిలో ఎంతో అందంగా, నిర్మలంగా గోచరిస్తున్నాయి. నేస్తం నిన్ను పప్రేమించాక తెలుస్తోంది. నేను సమస్తాన్నీ (ప్రేమించటానికి పుట్టానని.
25 మార్చి 1999 రాత్రి 12.40 చైతన్యకవిత సంచిక : 40 47 జ నేనే ఈ న్నాం
వరాజితుడు మనిషి స్త్రీలని జయించాడు. వృద్దుల్ని జయించాడు. పిల్లల్ని జయించాడు. దుర్చలులైన మనుషుల్నీ జాతుల్నీ దేశాల్నీ జయించాడు. అహం అతని దౌర్చల్యం., అది అతన్ని జయించింది. మనిషి నేలని జయిస్తున్నాడు. సముద్రాన్ని జయిస్తున్నాడు. అకాశాన్ని జయిస్తున్నాడు. తనని తాను జయించని అతనికి ప్రతి విజయమూ పరాజయమౌతోంది. మనిషి బహుశా, మరణాన్నీ జయిస్తాడు. జ్ఞాపకాలనీ, కలల్నీ జయించని అతను ఈ క్షణం ముందు ఓడిపోతూనే వుంటాదు. బి.వి.వి. ప్రసాద్ క 48
మనిషి సమస్తాన్నీ జయిస్తాడు. అతని కోరిక అతన్ని జయిస్తుంది. అతను రాల్చే పూలూ, అతను రాల్చే నక్షత్రాలూ రాలుతూ అతన్ని చూసి జాలిగా నవ్వుతుంటాయి. 28 మార్చి 1999 రాత్రి 12.25 చైతన్యకవిత సంచిక : 40 19 జ నేనే ఈ క్షణం
శూన్వానికి ముందు
కాలం పొరలు చేదు అనుభవాలని కప్పివేస్తాయి. ఒక పదం లేదా ఒక రూపం
ఏదో ఒక ప్రతీక దుఃఖాన్ని మరలా తట్టిలేపుతుంది.
లోపల ఒక మహా సముద్రమే మేలుకొంటుంది.
మిక్రుడా, మరొకసారి జీవన్మరణాల సరిహద్దులు కంపిస్తాయి. లోలోపల ఎవరో సున్నితంగా నవ్వుతారు.
“ఇంతటి నీ దుఃఖమూ కేవలం నటన,
నీముందు నువ్వే నటిస్తున్నావు' అని ఆ నవ్వు,
ళా శ చా
నేను రెండు 'నేనులుగా వుంటాను.
ఇది అంతా అణువుల సముదాయం.
అణువుని చివరి వరకూ విప్పిచూస్తే ఆద్యంతాలు లేని శూన్యం. నేనూ ఈ అణువుల సముదాయాన్నే,
నన్ను చివరి వరకూ విప్పిచూసినా ఆద్యంతాలు లేని శూన్యవ్వే దేహాణువులలోని మానసిక అణువులలోని చరమశూన్యం న్స ఏ వ్యక్తిత్వం సమగ్రం కాదు. ఏ అనుభవం సమగ్రం కాదు. ఏ నవ్వూ, ఏ విచారం సమగ్రం కాదు.
అన్నిటిలోనూ వెలితి. అన్నిటిలోనూ నటన.
చివరి శూన్యం దేనినీ పూర్ణంగా ఉండనీయదు.
ష్ ళ్ ళ్ బి.వి.వి. (ప్రసాద్ ౪ 50
చిన్న గాలి సుడి త్రకమంగా గాలి అలల్ని కదిలించి సుడిగాలిగా మారుతుంది. నాలోపలి దుఃఖమూ అంతే. సంతోషమూ అంతే. చిన్న విచారరేఖ క్రమంగా మవాదుఃఖంగా బలపడుతుంది. ఎలాంటి పెనుగాలీ సమగ్రం కాదు. గాలి వృత్తాలు పెరుగుతాయి. వాటి గర్భంలో శూన్యమూ వ్యాపిస్తుంది. మహాదుఃఖమూ అంతే. మహదానందమూ అంతే. వాటి వలయాలు బలపడతాయి. వాటిలో బోలుతనమూ విస్తరిస్తుంది. నటన తేలిపోతూనే వుంటుంది. శూన్యం చిరునవ్వుతో చూస్తూనే వుంటుంది. ళా ఛా ళా మనుషులు ఉల్లాసంగా ఎన్నిటిని సవాలు చేయలేదు? దుఃఖంలో ఎన్ని ప్రశ్నలు వేయలేదు? మిత్రుడా, సమాధుల్ని చూడు. అవి చరమశూన్యం ఇచ్చిన జవాబులు. 28 జూలై 1999 రాత్రి 10.00 వార్త '“ఆదివారం' 15 ఆగష్టు 1999 కయ్యుకు జౌలయన డ్రం ఫ్ రే స్ట్ ల సీ న్ / స న్ా వాయ 51 జ నేనే ఈ క్షణం
కల వెలుపలి కల
దేనినో పోగొట్టుకొన్న బెంగ
ఎప్పుడూ నాలో నీడలా పరుచుకొని వుంటుంది. ఏది పోగొట్టుకొన్నానని?
ఎవరిని విడిచి వచ్చానని?
ఏ పరాయిచోట వున్నానని?
ఏదీ జ్ఞాపకం రాదు.
బెంగ మాత్రం విస్తరిస్తూనే వుంటుంది. సందేహం లేదు.
ఎక్కడో మోసపోయి వుంటాను.
లేదా నన్ను నేనే మోసగించుకొని వుంటాను. బెంగ ఏమీ సరదా కాదు.
చవకబారు సరదాలతో ఈ దిగులుని కప్పుకోనూ లేను. ఒక మోసం తప్పించుకొనేందుకు మరొకసారి మోసగించుకోలేను. రెండు వైపులా మోసమే అనిపించాక,
రెండు వైపులా మృత్యువే కనిపించాక
ఇక వెనుకకు తిరగలేను.
ళ్ షా షా
ఎవరో అంటున్నారు.
నేను నన్నే పోగొట్టుకొన్నానని.,
నా నుండే దూరమయ్యానని.
వారు మాట్లాడుతూనే “నేను మౌనాన్ని" అన్నారు. కనిపిస్తూనే 'నేను శూన్యాన్ని అన్నారు.
బి.వి.వి. ప్రసాద్ జ 52
వారు అంటున్నారు “నువ్వూ, నేనూ ఒకటే అని. ఎంత దృఢమైన (థేమ, “మీరూ, నేనూ వేరు' అనే బలహీన (ధ్రేమికుడి పైన!
వారు చెబుతున్నారు,
“మిత్రమా! నువ్వు లేవు. కదలిక లేదు. సృష్టి లేదు.
హాయిగా వుండు.” అసి.
వారి మాటలతో
నా బరువంతా ఒక్కసారి కలలాగా తేలిపోయింది.
శ్లో ళా ళా
నిజమే కావచ్చును.
జననం, జీవితం నేను కంటున్న కల కావచ్చును.
సంతోషం, విచారం కల అయినప్పుడు
సంతోషంగా వుండటం ఎంత తేలిక!
ఇవ్వటం, తీసుకోవటం కల అయినప్పూడు
ఇవ్వటం ఎంత తేలిక!
నేను ఉండటం, లేకపోవటం కల అయినప్పుడు
నేను ఉండటం ఎంత తేలిక!
నేను లేకపోవటం ఎంత తేలిక!!
28 జూలై 1999 రాత్రి 10.35 53 ఇ నేనే ఈ క్షణం
ఉట, ఇంకా యుద్దాలు చేస్తున్నాం మొదటి మానవుడు భూమి మీద నడిచి వేల తరాలు గడిచాయి. ఇవాళ మనిషి బలవంతుడు, తెలివైనవాడు. ఇప్పుడు మనిషికి సంస్కారం తెలుసు, ప్రేమ తెలుసు. అన్నిటి కన్నా మనిషికి తాను ఎవరో తెలుసు. అయినా ఆశ్చర్యం! విషాదం! మనిషి యుద్ధాలు చేస్తూనే వున్నాడు. మసిషి తనలాంటి మనిషిని చంపగలుగుతున్నాడు. తన హత్యలకు సిగ్గుపడకుండా వున్నాడు. చ్ ళా ళా నేను మాట్లాడేది సైనికుడి గురించి కాదు; సైనికుడు మన ఇంటిలోని యువకుడు. మనలాగే అమ్మా నాన్నల్నీ సహచరినీ, పిల్లల్నీ సంతోషాలనీ, జీవితాన్నీ మనకంటే బాగా (ప్రేమించేవాడు. మనం యుద్ధం ఒక ఆట అంటే నమ్మి అమాయకంగా వెళ్ళిన వాడు. వెళ్ళి తిరిగి రానివాడు. చనిపోయిన సైనికుడు శత్రువునే కాదు తన వారినీ గెలుస్తాడు. భయం లేకుండా ఎలా (బ్రతకాలో, బివి.వి. ప్రసాద్ జ 54
త్యాగం అంటే ఏమిటో అతను తన మరణాన్ని మన మీదికి గురిపెట్టి నేర్పుతాడు. శత్రువో, మనవాడో ఏ వీరుడు చనిపోయినా ఎవరో ఒక తల్లి కన్నీరు కారుస్తుంది. ఆడుకొనేందుకు వెళ్ళిన పిల్లవాడు ఆలస్యంగా తిరిగి వస్తే తల్లి ఆందోళన అర్ధమవుతుంది. " “వస్తాను అమ్మా అని నవ్వుతూ వెళ్ళిన పిల్లవాడు చివరి చిరునవ్వుతో తిరిగి వస్తే ఆమె ఏమవుతుంది? ఆమె కళ్ళు మనని ్రశ్చిస్తున్నాయి. బహుశా, మన ప్రాణం ఉన్నంతవరకూ ప్రశ్నిస్తూనే వుంటాయి. షష * ఎవరు గెలిస్తే ఏమ్టి? యుద్ధం ఒక సామూహిక ఉన్మాద క్రీడ. యుద్ధం ఒక సామూహిక నేరం. మన లోపలి నేరస్తుడి ప్రతిబింబం యుద్ధం. ఎవరు సైనికుల్ని తయారు చేస్తున్నారు? యుద్దాల్ని ఎవరు రచిస్తున్నారు? ఏ భద్రజీవుల వినోదం యుద్ధం వెనుక దాగివుంది? యుద్ధం ఎవరు గెలిస్తే ఏమిటి? యుద్ధం మొదలైనప్పుడే మానవుడిగా మనం ఓడిపోతున్నాం. మన బలం ముందు, మొండితనం ముందు, బాధ్యతా రాహిత్యం ముందు 55 జ నేనే ఈ క్షణం
మన తెలివి ఓడిపోతోంది. సంస్కారం ఓడిపోతోంది. (పేమ ఓడిపోతోంది. చనిపోయిన వీరుడికి యుద్దాలు లేనీ భవిష్యత్తుని వోమీ ఇవ్వగలమా?
ళ్ ఛూ ఛా వీరుడు యుద్ధం శాంతికోసం చేస్తాడు. ఉన్మాది యుద్ధం యుద్ధం కోసం చేస్తాడు. ఉన్నాది వీరుడు కాడు. వీరుడు ఉన్నాది కాలేడు. ఇండియా కార్టిల్లో యుద్ధం చేయలేదు. యుద్ధం అపింది, ఈ దేశం ఇవాళ ఒక యుద్ధం నివారించింది. ఇది నా దేశం అని కాదు; ఒక యుద్ధం నిలిపిన దేశంగా ఈ నేలకి, ఈ జాతికి, ఈ సంస్కృతికి నమస్మదిస్తాను. యుద్ధం కోసం కాదు, శాంతి కోసం పూలు రాలినంత తేలీకగా ప్రాణాలు విడిచేస్తున్నందుక్షు ఇక్కడి వీరులకి నమస్మరిస్తాను.
29 జులై 1999 వైతన్య కవిత బి.వి.వి, ప్రసాద్ శ 560
నేనే ఈ క్షణం గాలి బిగిసినట్టు లోపల ఏ కదలికా లేని క్షణం, ఒక కోరిక చినుకులా రాలుతుంది. చినుకులాగే కోరిక ఒంటరిగా రాదు. చినుకు చుట్టూ అనేక చినుకులు. కోరిక చుట్టూ అనేక కోరికలు. కోరిక ఒంటరిగా తీరదు. కోరిన చోటికి అనేక కోరికల ద్వారాలు తెరిచి వెళ్ళాలి. కోరికలని గమనించి చూసాను. తీరినవీ, ఎన్నటికీ తీరనివీ. తీరిన కోరికలు నా లోపల ఏ ముద్రా మిగల్బలేదు. వాటి అనుభవం గతంలోనే నిలిచిపోయింది. తీరిన కోరిక ఏదీ నశించనూ లేదు. ఇంకా బలమైన కోరికగా మరలా మొలకెత్తింది. తీరని కోరికలు నాలో అగ్నిపాదాలతో నడుస్తున్నాయి. అవి నన్ను భవిష్యత్తుకు నడిపిస్తున్నాయి. అనుభవం నుండి కోరికలోకి గతం నుండి భవిష్యత్తులోకి తెంపులేని నడక. నడిచి, నడిచీ విసుగు వచ్చినప్పుడు, 57 క నేనే ఈ క్షణం
నన్ను నేనే అడిగాను
“ఏ కోరిక అయినా నీకు శాంతినిస్తుందా?'
మనస్సు మొదటిసారి తనలోకి చూసుకాంది.
ఏ అనుభవం దానిలోపలికి ఇంకలేదు.
ఏ అనుభవం దానికి స్పృహలేని పారవశ్యం కలిగించలేదు.
ళా ళా యా
మనస్సు నాలోపలి శూన్యం.
కోరికలు దానిలోంచి పుట్టాయి.
విశ్వం తేలుతోంది నా వెలుపలి శూన్యంలో. విషయాలు దానిలో పుడుతున్నాయి.
రెండు శూన్యాలు ఒకదానినొకటి ఏమీ చెయ్యలేవు. బహుశా, రెండూ ఒకే శూన్యానికి రెండు చివర్లు. రెండు శూన్యాలు కెలిసాక నన్ను చూసుకొన్నాను. అవి లేవు. నేను మాత్రమే వున్నాను. గతం ఒక శూన్యం. భవిష్యత్తు ఒక శూన్యం. బహుశా, రెండూ ఒకే శూన్యానికి రెండు చివర్శు, నేను ఒక్క క్షణమైనా గతంలోకి వెళ్ళలేను. ఒక్క క్షణమైనా భవిష్యత్తులోకి వెళ్ళలేను. అవి ఎప్పుడూ లేవు. ఎప్పుడూ ఈ క్షణమే వుంది.
ఖ్ ళ్ ళ్తో బి.వి.వి. ప్రసాద్ * 58
ఇప్పుడు కోరిక తీరే స్టలం లేదు... నేనే వున్నాను... నేనే నా కోరికనై వున్నాను... ఇప్పుడు కోరిక తీరే కాలం లేదు... ఈ క్షణమే వుంది... ఈ క్షణమే నా అనుభవమై వుంది... ఇప్పుడు కోరిక లేదు... నేను మాత్రమే వున్నాను... ఈ క్షణం మాత్రమే వుంది... నేనే ఈ క్షణమై వున్నాను... ఎప్పటికీ నశించని క్షణం. ఏ మార్పూ లేని క్షణం. దేనినీ పొందని, కోల్పోని క్షణం. 30 జూలై 1999 రాత్రి 2.00 ఆంధ్రభూమి 'సాహితి' 14 ఫిబ్రవరి 2000 59 జ నేనే ఈ క్షణం
మరొక మెలకువ కోసం
నాయకులని చూసి నేనొక నాయకుడిని కావాలనుకోలేదు. ప్రతి మనిషీ తన జీవితానికి తానే నాయకుడినని (గ్రపించినప్పుడు మానవులు అడుగుతారు “మాకు లేని ఏ భయాన్ని సృష్టించి మాకు నాయకుడిగా ముందు నడవాలనుకొంటున్నావు? అని. శాస్త్రవేత్తలను చూసి నేనొక శాస్త్రవేత్తను కావాలనుకోలేదు. ఏ మొక్కలనుండో కొంచెం ఆహారం సేకరించి మిగిలిన కాలం మానవులు సంతోషంగా గడుపుతున్నపుడు వారు అడుగుతారు “మాకు లేని ఏ బలహీనతలు కలిగించి నీ ప్రయోగఫలాలు మా ముందు ఉంచాలనుకొంటున్నావు?: అన్ని కవులని చూసి నేనొక కవిని కావాలనుకోలేదు. జీవనానందమే కవిత్వ రహస్యమని, (ప్రతి మనిషీ తానాక కావ్యాన్నని కెలుసుకొన్నప్పుడు వారు అంటారు చూపాటమేం పాడుకొంటున్నాం.
బివివి. ప్రసాద్ ౪ 60
మేమే మా పాటలమై వున్నాం. ఇక నీ పాట వినే తీరిక లేదని. ఏ మానవుని చూసీ నేను అతనిలా కావాలనుకోలేదు. నేను చూసిన (ప్రతి మనిషీ తాను మరొకలా, మరొకరిలా కావాలనుకొంటున్నాడు. కానీ, పూలని చూసి నేనూ ఒక పూవు కావాలనుకొన్నాను. పూవుకి తననెవరో చూడాలన్న లక్ష్యం లేదు. మరొక పూవులా ఉండాలన్న కోరిక లేదు. సాయంత్రానికి రాలిపోతానన్న దిగులు లేదు. ఒక రంగుల నవ్వులా వికసించి, నిశ్శబ్దంలో కలిసి పోతుంది. ఆకాశాన్ని చూసి నేనూ ఆకాశాన్ని కావాలనుకొన్నాను. ఎన్ని రాత్రులు, పగళ్ళు వచ్చి వెళ్ళినా అకాశం కొంచెంకూడా చలించలేదు. మబ్బులూ, సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ ఎన్నిసార్లు నడిచి వెళ్ళినా, దానికి వ మరకా కాలేదు. తెంపులేని ఆనందంలా ఆకాశం ఎప్పుడూ తెరుచుకొని వుంటుంది. ఇ షా సా 61 నేనే ఈ క్షణం