Telugu Muggu - anilvaranasi/indianlanguages GitHub Wiki
కష టా. ॥ " టే మ! న ల
జ గ్రే లా | ం దు
గ
// /
ము , ఠి రణ శ్రీల కొడాజిలక్ష్యలరెవి
నళ రుుగ్లు “'అఎూ* ఆ జి. లక్ష్మణరావు సమతా ప్రచురణలు కరీంనగర్
ుస్లు కవితాసంపుటి డా! జి.లక్ష్మణరావు (అ రంస్ల ల గ్ ర్, ఫా జరి ర ర్ షై లూ గయ (గంధాల దై ళ్ సంర, అ బీ నై "ల్ ద య్శ 4 లో షా స్ట్ (్ట న లో సమతా ప్రచురణలు - కరీంనగర్. ఫిబ్రవరి, 2003. కవర్ డిజైన్ - పి.ఆగాచార్య, _ టబ్రెప్ సెట్టింగ్ - రామగిరి పద్మ ప్రతులకు - జి. విజయ - ఇ.నెం. 10-3-363, వివేకానందపురి, కఠీంనగర్. ఫోన్ : 0878 - 2221680. విశాలాంధ్ర బుక్‌హౌజ్, హైదరాబాద్, నవోదయ బుక్ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్. ముద్రణ - అరుణ ఆఫ్సెట్ ప్రింటర్స్, కరీంనగర్ (92222200 శారద ప్రింటర్స్, కరీంనగర్. (2243666 రూ. 20/
నన్నూ, మా అన్నలు రాజేళ్టుర్రావు, కీషనరావులన్నూ మా అక్కలు ఆనంద, ఇందిరలనూ కన్నతల్లికన్నమిన్నగా పెంచ్కి పెద్దచేసీ ఆగమయిపోయే మాబతుకులను ఆందంగా మలిచి జీవితమంతా మాకోనం త్యాగం చేసీ అయిదు నెలల క్రితం మన్ముల్ని వదలి వెళ్ళిన తల్లికానితల్లి - మా పినతల్లి - మా “అవ్వ ” గండ్ర కాంతమ్మకు - అంకితం చిన్నకొడుకు 28-2-2003
జ్ఞానపీర అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి, ఎం.పి. ఎం.ఏ.పి.హెచ్.డి.డి.లిట్, టు అభ్యకళ్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కళాభవన్, హైదరాబాద్ - 500 004 తేది : 24-2-2003 ఆఅధినంచన అచ్చమైన గగ్రామీఐతకు ముచ్చటైన ప్రతీక తుుస్లు. ముంగిళ్లను బట్టి ముగ్గులు. వేసేవారి వేళ్ల చతురతను బట్టి ముగ్గులు చిత్రకళాకృతులుగా రూపొందుతాయి. ఆ ముగ్గుపట్ల ఉన్న మమకారంతో డా॥ లక్ష్మణరావు తన తొలి కవితా సంపుటికి ముగ్గు అనే పేరు పెట్టుకున్నాడు. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ముగ్గు పోస్తారు. అలా చూస్తే డా॥ లక్ష్మణరావు కవితా మండపానికి వేసిన తొలి ముగ్గు ఇది. లక్ష్మణరావు భావుకుడు, దేశికుడు, సాహితీ సంస్టా నిర్వాహకుడు. అతని భావుకత రూపొందించుకున్న అక్షర రంగవల్లులు ఈ సంపుటిలోని కవితలు. ముగ్గు శీర్షికతో రాసిన కవితలో అతడిలా అంటాడు. ఈ ముగ్గు దారాల వలలో ఎంత అమాయకంగా పడిపోయాను, అంతటితో ఆగక ఈ ముగ్గు వలలో చిక్సిన వాంనను ఎగరలేను.
లక్ష్మణరావులో అల్లుకుపోయిన దేశీయతకు ఈ పంక్తులు తార్మాణంగా నిలుస్తాయి. ఈ కవిత ముగింపు మానవీయతకు ఎత్తిన అద్దంలా నిలబడింది.
కొన్ని కొత్త ఇతీవృత్తాలను తీసుకొని దా॥ లక్ష్మణరావు హృదయస్పర్శి కవితలు రచించారు. ఉదాహరణకు నేను వనిని (వేమిస్తాను నా విద్యాధ్ధులు, ఎ(ర్రబన్సు లాంటివి.
ఊళ్లలో ఎర్ర బస్సును ప్రవేశపెట్టడం మంచిమార్చే. ఆ బస్సు హారన్ మోత కోడికూత వంటిదంటాడు లక్ష్మణరావు. అందుకే ఎర్రఐన్సు రాకతోనే తెల్లారింది ఊరికి అంటూ ఎత్తుకోవడం.
అయితే ఎర్రదనం అంటే ఉలికిపడే దశ ఒకటి ఏర్పడినప్పుడు కుంకును బొట్టు పెట్టినట్టు ఉందే బస్సు నెత్తురు బొట్టుగా వుందనడం డా॥ లక్ష్మణరావు నిష్పాక్షిక యధార్ధ చిత్రణకు నిదర్శనం.
చెప్పదలచుకున్నది చెవృవలనిందైనవ్వుడే చెప్పే అలవాటు లక్ష్మణరావుకుంది. అలా చెప్పడంలో కూడా న్పష్టత, నిర్దిష్టత సరిపాళ్లలో వున్నాయి. మొదటి కవితాసంపుటితోనే సహృదయ పాఠకులను ఆకట్టుకుంటున్న డా॥ లక్ష్మణరావుకు నా ఆశీరభినందన.
లి (దా, స నారాయణరెడ్డి ,)
వాకిలి న్ా మనసు తలుపులు తెరుచుకుంటే ప్రపంచం మరోవిధంగా, మరింత అద్భుతంగా, మరింత అందంగా, మరింత స్పష్టంగా, మరింత నిజంగా... బ్రతుకు కదలికల్లో కుదుపులు ఏర్పడినప్పుడు, ప్రపంచం నడకలో మలుపులు కనిపించినపుడు, మెలికలు తిరిగినప్పుడు వాటంతట అవే వెలువడిన అక్షరాలు నా కవితలు. పద్యాలుగా, గేయాలుగా, వచన కవితలుగా అయా రూపాల్లో వచ్చిన కవిత్వాన్ని అచ్చువేయకపోవడం కనీసం దాచుకోకపోవడం నా అశ్రద్ధ - అనాసక్తత. నిరంతర సాహిత్య కార్యక్రమాల నిర్వహణ - కవితాస్వాదన - కవిపండిత మిత్రులతో కాలక్షేపం - వర్ణమానకవులను, విద్యార్థికవులను ప్రోత్సహించడం నా నిత్యజీవితంలో ఒక కేంద్రబిందువయింది. ప్రధానభాగమయింది. ఎందరో సాహితీ బంధువులు, స్నేహితులు, మా పిల్లలు కూడా ఒత్తిడి చేశారు ఒక పుస్తకం అచ్చువేయాలని. ఎంతో కాలంగా రాసినవి ఎక్కడ పోయాయో. ఈ రెండు మూడేళ్లుగా అప్పుడప్పుడు రాసినవి ఒక చోట పేర్చగలిగాను. అచ్చంగా ఈ సహహస్రొబ్దిలో రాసినవే అన్నీ. తేదీలు రాసిపెట్టుకోలేదు. సందర్భాలు కొన్ని సూచించాను. కొన్ని కవితలు పత్రికల్లో అచ్చయినాయి. ఎక్కువ కవితలు సభలో చప్పట్లు కొట్టించినవే. ఇవన్నీ ఇప్పుడు సభ నుంచి సమాజంలోకి వచ్చే ధైర్యం చేస్తున్నాయి. సహృదయుల ఆదరం పొందుతాయని ఆశ, మూడు తరాలకు శిఖరప్రాయమైన కవీ, మాకు పాఠాలు చెప్పిన గురువూ డా॥ సి. నారాయణరెడ్డి గారు అభినందనాశీస్సులందించారు. వారికి చేతులు జోడిస్తూ - ఎక్కువ విషయాలు చెపుతూ వాకిట్లో నిలబెట్టడం మర్యాద కాదు కదా- లోపలికి పోదాం పదా....... మీ _౭పేలొళ్తిబ్ట్లూల ॥ (డా; జి. లభ్ష్మృణరాపు ).
ఈ కవితకు ఈ వేజీ ప్రపంచం - నేను 01 నేను పనిని ప్రేమిస్తాను 02 చీమకుట్టింది 04 అనృశ్చను 05 మహర్షి 07 జాగ్రత్వ్వష్నాలు 08 ముగ్గు 10 దారం 13 కాన్సిడెన్నియల్ 15 పుజ్బాత్సులారా ! పుట్టకండి 17 మరువలేని మా బడి 19 మహాశక్తి 22 గిట్లనుకోలేదు 24 ఏక్‌దిన్‌కా సుల్తాన్ 27 బ్రతుకుదాం 29 అంతిమ న్యాయం 31 బాషెట్లి బతుకుతది 34 ఇప్పడే తేల్చకోవాలి 37 రామా! రామా |! రామూ |! 39 మాఊరి రోడ్డు 42 రిఫ్లెక్షన్ - రియాక్షన్ త ఎర్రబన్సు 46 స్వాగతం ఉం నా విద్యార్థులు 50 కరచాలనం క్3 మాయలేడి 5్5
రు మ. త్రవంచం - నేను పాలూ పంచదారా పంపునీళ్ళూ చాయ్‌పత్తా నాకు సుప్రభాతాలైనప్తుడు నా ఉదయం నాది కాదు తల్లీ తండ్రీ తమ్ముడూ తనయుడూ తప్పని సరిగా మిత్రుడూ ఏదో ఒకరుగా కాని క్షణమంటూ లేనపుడు నా హృదయం నాది కాదు పంచభూతాల పంచన చేరకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని అసహాయుణ్జయినపుడు నా బ్రతుకు నాది కాదు కనులు తెరచినప్పటినుంచి కడకు మూతపడేదాకా కలలు నిజాలైనా కాకపోయినా దారినబడి పోవడమే నా పనయినప్పుడు నా నడక నాది కాదు అనాది నుంచి అనంతం దాకా అమ్మ ఒడినుంచి అనంత విశ్వందాకా అల్లుకు పోయిన ప్రస్తారాన్ని అడుగు వేస్తున్న ప్రస్థానాన్ని ప్రపంచం నా జీవితం నా ప్రపంచం కవిత్యం.
నాలాల డా జ. లక్ష్మణరావు నేను వనిని ప్రేమిస్తాను నేను పనిని (ప్రేమిస్తాను పనితనాన్ని ప్రేమిస్తాను నా దృష్టిలో నిజానికి సృష్టిలో పనిమంతుడే భగవంతుడు 2
రసు గవ పనితనానికి లొంగనిదేముంది పనితనానికి ప్రకృతి కూడా తలవంచుతుంది పనితనాన్ని చూసే కదా 'పైర్లుగా ఫలాలుగా పులకరిస్తుంది భూమి పనితనాన్ని చూసే కదా బండరాళ్ళు దేవుళ్ళుగా అవతరిస్తాం. ఒక్క నాజూకు వేళ్ళ పనితనానికే ఒదిగిపోతాయి పూలు దండలుగా ఒడుపుగా కదిలే వేళ్ళ పనితనానికే అడవి ఆకులు బీడీలుగా చుట్టుకుంటాయి దూది వత్తిగా వెలిగినోవడానికి సిద్ధమవుతుంది ఒక్క వేళ్ళ మాటేమిటి - ఒళ్ళు ఒళ్ళంతా ఒక అద్భుతమైన పనిముట్బు ఊపిరి ఆగేదాకా విశ్రాంతి ఎరుగని మెదడు ఒకదక్ష్రత గల మేనేజ్మెంటు పనీ పనీ పనీ ప్రాణం ఉన్నంత సేపూ పనీ పనీ పనీ పనిలోనే మనల్ని మనం కాపాడుకుందాం పనితనంతోనే మనల్ని మనం అలంకరించుకుందాం అయితే పనితనం ఒక మోసం కాకూడదు పనితనం ఒక త్యాగం కావాలి పనిచేయడం ఒక తపం కావాలి పనీ - పనితనం మన ఘనమైన వారసత్వం కావాలి. 3
వా డా! జి. లక్షణరావు తిను కుట్టింది చీమ కుట్టింది ఎంత ధైర్యం పట్టుకొని నలిపేయ్ పుట్టను తవ్వేయ పూర్తిగా తగులబెట్టు చీమలు చచ్చాయి - కొన్ని చీమలు చస్తాయి - కాని జాతి చావదు ఎంత ఏనుగంత పాదమైనా ఎదరబడితే తరిమేస్తాయి చీమ కుట్టింది - కుడుతుంది చేతనయితే చక్కెర వేయి లేదా నీదారిన నువు నడువు ( ఆవ్లాన్ పై అమెరికా యుద్ధం సందర్భంగా ) ట్స
గళ రుసుం అన్పృశ్వను ఒకప్పుడు నేను అందరికీ అందిన అందాన్ని అవధులు లేని ఆనందాన్ని ముందూ వెనకా చూసి నన్ను ముద్దుగా ఉందని మురిసి పోయేవారు అబువణువూ అక్రరమక్షరమూ చూసి అవతలి ప్రపంచాన్ని మరిచిపోయేవారు “ దాన్నంటుకున్న పురుగువయ్యావురా ' అని పెద్దలచేత - మిత్రుల చేత అనిపించుకుంటే అదో గర్వంగా ఉండేది నానుండి ఎందరు (ప్రేరణ పొందారు నా వలన ఎందరు జ్ఞానులయ్యారు ఎన్నెన్ని కొత్త ప్రపంచాలు చూపించాను ఎన్నెన్ని కొత్త పుట్టుకలకు తల్లినయ్యాను నా కోసం ఎందరు ఎంతగా తపించే వారు నన్నెంత ఆప్యాయంగా ఒకరినుంచాకరు స్వీకరించేవారు నన్ను బహుమానంగౌ, కానుకగా అందించడం నాగరికతగా భావించేవారు ఏ మూలన దాగినా ఎంతగా అన్వేషించి పట్టుకునేవారు ళ్
వరానావానానాానునునమవానం నమన వవానానానాలవాలావాశవాణయాంయలయయంయాంణణాంలా. ఈర! 25, ుక్షుణరావను ఏ సాయంత్రమా, రాత్రి ఆలస్యంగానో, ఉదయానికి ముందో కొంతయినా నన్ను చూడకుండా ఉండలేని: వాళ్ళు కనీసం చేతిలో ఉంటే గౌరవంగా ఎంచేవాళ్ళు నేనొక మహాభారతం కావచ్చు - రామాయణం కావచ్చు భగవద్గీతనో, బైబిలో, ఖురానో కావచ్చు ఒక మహాప్రస్థానమో - మాలపల్లెనో - మా బాబునో చరిత్రనో - భూగోళాన్నో, జాతీయ విష్లవ భావ జ్వాలనో శాస్త్రీయ విజ్ఞాన విశ్వసంపదనో ఎవరినైనా కావచ్చు ఎక్కడైనా ఉండవచ్చు " నన్ను వెతికి పట్టుకోవడం నాడొక శోధన నేను తరతరాల విజ్ఞాన వారసత్వ సంపదను యుగయుగాల మానవ మేధస్సుకు వారధిని ఆ నేను ఇవాళ రంగుల టీవీలను చూసే కళ్ళకు రంభను కాలేక పోతున్నాను చూపులక్సూ చేతులకూ అనక ఐటీ కిటికీల్లోంచి అద్భుతాలు చూపక మూలకు నక్కి కూచున్న పుస్తకాన్ని-- గ్రంధ్రాలయాన్ని అందరికీ - అన్సృశ్యను: - ( గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా ) 6
రగు మ. మవార్షి ఆయనది స్ఫురద్రూపం ఆయన స్వరం విలక్షణం మాటలు విపరీతం - మనను నవనీతం ఆలోచన అగాధం - అవేశం క్షణికం ఆశయం ఉన్నతం - అనుభవం అపారం ఆయన బ్రతుకు సామాన్యం జీవితం అసామాన్యం అన్నీ తెలిసిన అమాయకుడు అంతరాంతరాలలో కాళేశ్వర ముక్తీశ్వరుడు భోళా శంకరుడు రాజకీయ పంకంలో తామరాకుపై నీటి బొట్టు ఈ శతాబ్దిలో వెలిగిన మంచి మనీషి ఏ కళంకం లేని మహర్షి ( కీ.శే. జువ్వాడి చొక్కారావు సంస్మరణ సందర్భంగా) 7
తతత | జి. లక్ష్మణరావు జాగ్రత్స్యప్నాలు నా కళ్ళు మూతపడుతున్నాయి నిద్రపట్టడం లేదు నా కళ్ళు తెరచి చూడడానికి ఎంత మాత్రమూ ఇష్టపడడం లేదు కళ్ళు తెరిస్తే భయంకర భీభత్స దృశ్యాలు నొసలు చిట్లించిన నేల గుండె పగులుతున్న పాలాలు నిస్సహాయంగా దీనంగా నీరింకిన కళ్లతో నీలాకాశం మౌనిలా మౌనసాక్షిగా తెల్లబోయిన చంద్రుడు ఉదయమే పశ్చిమంగా అనిపించే గతి తప్పిన సూర్యుడు................ కళ్ళు తెరవడానికి మొరాయిస్తున్నాయి మూసుకుంటే లోపల ............... అశాంతి - అస్థిరత ఆందోళన 8
టు అప్పులు ఆకలి అనుద్యోగం ఆలోచనలు ఆలోచనలు అపరిష్కృత సమస్యలు అన్నీ విదిలించుకుంటే భరించరాని ఏకాకితనం చావడానికి సంఘర్షణ బతకడానికి సంఘర్షణ గతాగతాలు చిందరవందరౌతూ జాగ్రత్స్వష్నాలు - స్వాప్నిక సంచలనాలు రంగులు - రంగులు - జెండాలు - గుర్తులు మాటలు - కోటలు - మనసుల బీటలు పులుల సత్యాగ్రహాలు పూల విస్ఫోటనాలు మందిరం మస్టిద్ అందరం ఒక్కటే అసలు విషయానికి వచ్చేటప్పటికి ఎవడికి వాడే ఉరివేనుకుంటున్న బట్టలు పురుగుమందు తాగుతున్న పంటలు కళేబరాలను తయారుచేస్తున్న కాలేజీలు పసిపిల్లల మార్కెట్లు ఇంటర్నెట్ ఇంద్రజాలం ఇంకా ఇంకా ఏవో ఏవేవో అర్ధమయ్యి కాని అసంబద్ధ వాస్తవాలు......... నాకు నిద్రపట్టడం లేదు......... ం్ర
తతత || జి. లక్షణరావు ముళ్లు ఎంత అందంగా ఉంది ఈ ముగ్గు ఎంత ఆకర్షణ ఉంది ఈ ముగ్గులో అడుగు పెట్టినపుడు చూడలేదు నిలబడి పైకి చూసినపుడు కనబడలేదు సుదూరంగా చూపులు సారించినపుడు తెలియలేదు తలను అకాశం నుంచి నేలకు దించి చూపులను దూరంనుంచి దగ్గరికి, చాలా దగ్గరికి, రెండు కళ్ళూ, మనసూ, ఆత్మా చూడగలిగినంత దగ్గరికి, తెచ్చుకొని చుట్టూరా చూస్తే, ఎంత అందంగా ఉంది ఎంత ఆకర్షణీయంగా ఉంది ఎన్నో దారులు - ఎన్నో రంగులు 10
రుస గ. ఎన్నో అంచులు - ఎన్నో ముళ్ళు ఏదారి అవతలికి వెళుతుందో ఎంత శోధించినా అంతుపట్టడంలేదు ఏ రంగు అంటుకుంటుందో ? ఏ రంగు కళ్ళలో పడుతుందో ? ఎప్పుడు కళ్ళను తిప్పి పడేస్తుందో ?........... అప్పుడప్పుడూ కదులుతున్నట్లనిపిస్తుంది కాలచక్రంలా దీనికీ చలనముందో ఏమో ? ఆశ్చర్యంగా ఉంది - భ్రమగా ఉంది భయంగానూ ఉంది - ఈ ముగ్గు తీగలు నా కాళ్ళకు అందాల బంధాలై బతుకు వాకిలి దాటకుండా శాసిస్తున్నాయి ఈ ముగ్గు దారాల వలలో ఎంత అమాయకంగా పడిపోయాను ఈ ముగ్గులో ఎన్ని అద్భుతాలు ! ఎన్ని సిరులు 1! ఎన్ని మరులు ! బంతులై, చేమంతులై గంతు లేస్తున్నాయి కొంగులై పాలపొంగులై చెంగలిస్తున్నాయి ఎన్నెన్ని చిన్న పిల్లల చూపుల మ్యాజిక్‌లు ఇల్లాలి చేతివేళ్ళతో పలికిన సరాగాల మ్యూజిక్‌లు ఎంత అందంగా ఉంది ఈముగ్గు ఎంత ఆకర్షణ ఉంది ఈ ముగ్గులో అయినా ఎందుకో ఉండి ఉండీ అందులోంచి ఎగరాలనిపిస్తుంది
క్షే
తతతతతతతతాడాాయలయయాలా ఆ5(1 6. లక్ష్యణరావు ఎంత ఎగరాలని ఉన్నా ఈ ముగ్గు వలలో చిక్కిన * హంస ' ను ఎగరలేను కనీసం కొక్కొరో కో అని కూయాలని ఉన్నా కూయలేను కూసే గొంతును కోసే అంచులున్నాయి ఈ ముగ్గుకు ఆఖరికి, హరిలో రంగ హరీ - భిక్షగాణ్ణయ్యాను డూడూ బసవన్ననూ అయ్యాను దక్షిణ లేని ఉత్తర భాస్కరుణ్జయ్యాను అనుకోకుండానే ఆముక్తమాల్యదనయ్యాను అయినా ఈ ముగ్గు నన్ను వదలదు ఎన్నెన్ని యుగాలుగా - ఎప్పుడెప్పుడో తెలియకుండా ఈ ముగ్గు నేనే వేసుకున్నాను ఇంకా నాకే స్పష్టంగా తెలియకుండా ఇలా అవుతుందని అనుకోకుండా ఈ ముగ్గును నేనే వేసుకున్నాను ఎన్ని తరాల నిరంతర తపః ఫలాలు ఎన్ని రుచిర స్వప్నాలు ఎన్ని ఆగామి ఆశల స్వర్గాలు ఎన్నెన్ని మధురోహల హర్మ్యాలు అన్నీ పిండి పిండి వేసుకున్నా ఈ విశ్వసంసారం ముంగిలిలో స్వయం నిర్మిత, చమత్కార, సంక్షిష్ట సాద్భుత రంగవల్లిలో స్వయం బందీని సగటు మానవుణ్ణి 12
రుస లా ళ్ దారం గాలికి ఎగిరి పోయే దూది కణాల్లోంచి మా జీవన రాట్నం కదురుల మీద మా చేతి వేళ్ళ శిల్పంగా మృదువైన కళగా మా బ్రతుకు చూపుల రంగుల కలగా సుతారంగా సున్నితంగా 'పేనుకున్న ప్రేమవు అల్లుకున్న అత్మబంధానివి నువ్వు వేల వేల సంవత్సరాల విజ్ఞాన పునీతవు యజ్ఞోపవీతవు జన్మజన్మాల బంధాల సంధాతవు మంగళ సూత్రానివి 13
ఎ డా; జ. లక్షణరావు వర్ణభేదాలు వదిలి వపుస్సౌందర్యాన్ని వ్యాఖ్యానించే అపురూప ఆచ్చాదనా చిత్రానివి ఎండలో వానలో చలిలో అమ్మ కొంగువి నులివెచ్చని పాత్తిలివి మా దుందుడుకు తనువుల కింద నలిగి మా తలల కింద ఒత్తిగిలి సహనాన్ని శాంతినీ పరోపకారాన్నీ ప్రబోధించే దానివి మా అభిమానానికీ శార్యానికీ ఎగరేసిన పతాకానివి మా మానానికి పరదావి పువ్వుగా ఉన్నప్పుడు నువ్వు నవ్వితే వెన్నెల పూసిందనుకునేవాళ్ళం నువ్వు నలిగితే దీపం వెలిగిందనుకునేవాళ్ళం అన్నం తరువాత అన్నీ నీవేనని ఆరాధించాం అయినా............. ఏం చేశావు ? నువ్వు మా పాలిట ఉరితాడువయ్యావు పురుగుమందువయ్యావు మృత్యుద్వారానివయ్యావు పడమటి దారాల ఉచ్చులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డావు
ష్నేత్త
రు గ. కాల్చిడెన్మియల్ నేను ప్రభుత్యోద్యోగిని ప్రభుత్వ యంత్రంలో పకడృ్పందీగా బిగించబడిన “మర "ని గడియారం గానుగకు కట్టేసిన వడిగల ఎద్దుని అన్ని రహస్యాలను కడుపులో పెట్టుకొని అసలే నోరు విప్పని అల్మారా 'అర'"ని 'ఫైళ్లకూ పై వాళ్ళకూ తలవంచిన విధేయుణ్జి మంత్రులకూ నాయకులకూ మా బాస్‌కూ మంత్రముగ్గుణ్ణీ 15
వావ ౮|| 8. లక్ష్మణరావు
ప్రజల విన్నపాలు పైకి పంపించే పూజారిని, ప్రభుత్వ పథకాల సంచుల్ని మోసుకొచ్చే హమాలీని
ఫలానా సెక్షను ఫలానా కుర్చీగా
ప్రసిద్ది కెక్కిన వాణ్ణ
నన్నూ నా పేరునూ సంతకంగా తప్ప ఎన్నడూ గుర్తింపు లేనివాణ్ణి
నా భార్యా పిల్లలక్కూడా
నేనొక యంత్రాన్ని
మనసులేని క్యాలికులేటర్‌ను .
ఎన్నిసార్లు కొట్టినా ఒకటో నంబరే వస్తుంది ఏ సాయంత్రమూ
ఇంట్లో పిల్లలతో ఆహ్లాదంగా గడపనివాణ్ణి ఎప్పుడూ జీవోల కీలతో పనిచేసేవాణ్ణి ప్రశంసా పత్రాలకు పరవశించే వాణ్ణి
నేను నేనుకాని కాలేని
నేనుగా మిగలని యోగిని
జనం దృష్టిలో ఉత్యోగం గలవాడిని ఉద్యోగిని
నా జీవితం డిస్పోజ్ చేయని
మోస్ట్ అర్జంట్ ఫైల్
ఎందుకు కదలదు ఫైల్ అంటే
స్థిక్ట్లీ కాన్ఫిడెన్షియల్
16
రుదు శ్ వుణత్యాత్కులారా వుట్టకండి ౯ ఓ పువ్వుల్లారా మీరు ప్రసవించకండి మీ బిడ్డలు ఎదగడానికి నేలమీద ఖాళీ లేదు ఓ పక్షులారా |! మీరు పిల్లల్ని కనకండి మీపిల్లలు వ్రాలడానికి ఇక్కడ కొమ్మలూ రెమ్మలూ లేవు ఓ దివ్యలోకాల్లో విహరించే భావి శిశువుల్లారా ! పుణ్యాత్ములారా ? పుట్టకండి ! పుట్టకండి |! క్షే
తతా డా! జ. లక్ష్మణరావు
ఒకవేళ మీరు పుడితే పొరపాటున ఈ భూమ్మీద పడితే
వచ్చీరాని లేత రెక్కలతో
కరకు చర్మపు పాదరక్షలకు పాలిష్ చేయాల్సి వస్తుంది వచ్చీరాని లేత కాళ్ళతో
పశువుల మేతకోసం పరుగులు తీయాల్సి వస్తుంది
మీ చివురాకుల వంటి వేళ్ళు
దీపావళి టపాసులై పేలిపోవలసి వస్తుంది
మీ పచ్చిమాడల మీద ఇటుకలు మోసి
ఇనప్పెట్టెలకు మేడలు కట్టాల్సి వస్తుంది
వచ్చీరాని మాటలతో జీవనవాచకంలో
అమ్మా - అకలి మొదటి పాఠం అవుతుంది
మీ లేత భుజాల మీద సరస్వతీ దేవి
రెండుపూటలా స్వారీ చేస్తుంది
మీరు
ముళ్ళ కంచెల్లో
మట్టి పెళ్ళల్లో
బండ రాళ్ళల్లో
చిక్కిపోతారు
మక్కిపోతారు
నక్కిపోతారు
వద్దు వద్దు వద్దు
ఓ పుణ్యాత్ములారా !
పుట్టకండి ! పుట్టకండి ॥
18
రు న. మరువలేను మా బడ్ వందేమాతరం ప్రార్థన వన్ టూ త్రీ టన్ టన్ టన్ ఫస్ట్ సెకండ్ ధర్డ్ వన్ బై వన్ పాఠాలు పాఠాలు పాఠాలు ఇంగ్లీషు తెలుగు హిందీ మ్యాథ్స్ సోషల్ సైన్స్ పాఠాలు పాఠాలు పాఠాలు మహాకవులూ - సైంటిస్టులూ ముందు తరం రాజకీయ నాయకులూ 19
చలా | జ. లక్షణరావు ఐఏఎస్‌లూ ఐపిఎస్ లూ అందర్నీ మాలో చూసే అందర్నీ మాలో చూపే బోధలూ - పూర్వపు గాధలూ ఎన్నో - ఎన్నో - ఎన్నో పాటలూ - మాటలూ ఉదయం పదినుంచి సాయంత్రం నాలుగు దాకా చదువూ చదువూ చదువూ ఆ పైన సమయం దొరికితే గేమ్స్, డాన్సెన్, డ్రామా రిహార్సల్స్ ఆ పైన సమయం లేకపోయినా హోంవర్క్, ట్యూషన్ ఇంటికి వెళ్లి తింటూ తింటూ టీవి ఆడ్స్ అమ్మతో మేం మాట్లాడేది అమ్మా నిదురొస్తుంది అన్నం పెట్టు అమ్మ మాతో మాట్లాడేది హోంవర్క్ అయిందా అన్నం తిందూరా ముందు చదువుకో - తరువాత ఆడుకో డాడీ మాతో - మేం డాడీతో ఎప్పుడో ప్రోగ్రెస్ మీద సంతకం కోసం (ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవడం వస్తూ పోతూ ఆటోలో రోడ్డుమోద సైకిల్‌పై సర్కస్ చేస్తూ ఉదయం ఉరుకులు పరుగులు బాక్స్, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ లగేజి - టూర్‌కు పోయినట్లు 20
శు మ. ( అసలు టూరుకు పోయినప్పుడు మాకు లగేజి ఉండదు అన్నీ అమ్మా నాన్నల బ్యాగుల్లో కలిసిపోతాయి ) సాయంత్రం అలసిపోయి నిదురలు ఆడుకోవడానికి - మాట్లాడుకోవడానికి అసలే టైం దొరకదు అప్పుడప్పుడనిపిస్తుంటుంది - అసలే తీరికలేనిది మాకేనా ? అందరికీ అంతేనా ? సూర్యునితో స్టార్ట్ రన్నింగ్ ఆయన తరువాతే మేం పడుకుంటాం అప్పుడప్పుడూ ఊరేగింపులూ ఆగస్టు 15, జనవరి 26 వనమహోత్సవాలు, ఎయిడ్స్ డేలు అప్పుడు మేం గాయకులం - సైనికులం అద్భుతమైన నటులం - కళాకారులం ఆఖరుకు పరీక్షలు - పరీక్షలు ఆరాటం ర్యాంకుల కోసం అందోళన మార్కుల కోసం ఆఖరుకు ఏమయిన కావచ్చు - రేపు ఏదయినా చేయవచ్చు - ముందు ఎంత పనయినా మాపయిన పడవచ్చు మా బడి మరుపు లేనిది ంధా మా చదువు తరుగులేన్తిజందో లీ లయ వ్ టా ఏఐ. ఖా గ్ "మ జ్ క ల తీ[తీ 6. 0.6.223రి) జ || 22
త ౮౫|| జి, లక్ష్షణరావు మవాోశక్తి ఎత్తునుండి పల్గ్లానికి దిగడం తలవంచడం కాదు దయపంచడం కరిగిపోవడం కదిలిసాగడం నేలనుండి పైకెదగడం అహంకారం కాదు ఫలవంతం కావడం బ్రతకడం బ్రతికించడం నిమ్నోన్నతాలు వైరుధ్యాలు కావు నిత్య జీవన సందేశాలు సాఫల్య వైఫల్యాల సారాంశాలు మానవతా సూత్రానికి రెండు కొసలు 22
రా గ. ఏకవర్ణ చిత్రం కన్నా బహువర్ణ చిత్రం సుందరం కదా ఎన్ని రంగులు గుండెలో రంగరిస్తే ఎండ తెల్లగా మారింది ఎంత తేజస్సుతో ప్రకాశిస్తుంది పసిగళంలో నలిగిన మాలలోని వర్జాలకు ఖేదం లేదు అన్ని వర్ణాలు భుజాలమీద చేతులు వేసుకున్నప్పుడే అవుతుంది మహాకావ్యం అద్భుతంగా సమత సృష్టిలో కాదు దృష్టిలో ఉంది మండితే కాష్టం పండితే జీవం ప్రాణాలు తీయడం పిరికితనం ప్రాణాలు పోయడం మనిషితనం ప్రాణాలు ఇవ్వడం నిలువెత్తు ధనం మట్టిని ఆహారంగా మలుచుకోవడం మనకవశ్యం మట్టీకోసం గుండె నెత్తురు ధార పోయడం మన అదృష్టం శతఘ్నుల గుండెలు ద్రవింపజేసే సహనం శక్తి ఒక్క పిడికిలి బిగిస్తే శక్తి రెండు చేతులు జోడిస్తే మహాశక్తి. 23
తతత డౌ జ, లక్షణరావు ర్ల్లను కోలేదు ఎంతపనయింది ఎల్లన్నా ! మనగతేంది మల్లన్నా |! గిట్టయితదనుకోలేదు గింతగన౦ కొంపలు ముంచుతడనుకోలేదు గిట్ల జేత్తడనుకుంటే గింతగూడ గెలువనియ్యకపోదుం ఏమో |! అందరు మంచోడు మంచోడు అనిరి ఎనకటి ముసలోళ్ల తీర్గగాదు ఎంత తెలివి గలోడు, మంచి వయసు మీదున్నడు అనిరి ఏరే దేశాలోల్లు గూడ ఎగబడి మెచ్చుకుంటాండ్రు - అనిరి ఎవ్వలు చెయ్యని పనులు ఎన్నడు గాని పనులు, ఎక్కడ గాని పనులు 2ైర్త
రు గ. చేసి చూపిత్తడన్నరు గదే నిజమయిందిగని కరెంటు చూడ బోతే అగ్గయింది పంటలమ్మవోతే బూడిదాయె బడి పాల్లగాండ్లకు సర్కారు సదువు పనికి రాకుంటవాయె బయటి బళ్లల్ల సదువులకు వేలకు వేలు కుమ్మరిచ్చుడాయె బాగ జదివిన పారగాండ్లు బజాగక్లే తిరగవట్రి ఏందిరా ! ఎట్ల బతుకుతవురా ! అంటే ఏం జేయమంటవు - ఈడ నౌకరు దొరకదు ఏదేశమన్న ఎల్లిపోవాల్నంటరు పెద్ద పెద్ద సదువులు సదువుడేంది పొట్టసేత బట్టుకొని దేశాల పాంటి పోవుడేంది ఇంత కాలం కాంగ్రేసోల్లో - బిజెపోళ్ళో ఏదో పార్టీలోళ్ళు - లేకపోతే అన్నలో బందులు - బందులు - అందురు ఇప్పుడు సర్కారే బందులు వెట్టింది సర్కారు సదువులు బందు సర్కారు నౌకరు బందు సర్కారు కార్ధానాలు బందు సర్కారు బస్సులు బందు ఇది వరకు ఎవల వాకిలివాళ్లమే ఊడ్చుకుంటున్నం ఇప్పుడు ఎవల బజారు వాళ్ళే ఊడ్చుకోవాలంటున్నడు 25
వ వవవవవవావావా ౮౫|| జి. లక్ష్ష్యణరావు ఎవల చెరువు ఆళ్ళే తవ్వుకోవాలి ఎవల బొంద ఆళ్ళే ఎత్తిపోసుకోవాలి ఇగ సర్కారెందుకున్నదో - ఇంక ఇండ్లెక్కడికెల్లి ఇత్తరు ఎవుసానికి అప్పులెక్కడికెల్లిత్తరు జీతా లత్తలేవని సార్లు మొత్తుకుంటున్నరు ఖజాన౦ంతా ఏడ బోయిందో - ఏమో.! అంత ఆగమాగమయింది గిట్లని ఎరుకుంటే గింత కూడా గెలువనియ్యకపోదుం ఎగబడి ఎగబడి మన ఆడోళ్లు ఓట్లేసిరి ఆల్లకేం జేసిండు అన్న బందు జేయించిన బరండి దుకాన్లు మస్తు తెరిపించిండు అన్నాయం అన్నాయం అన్నోళ్ళను ఆడోళ్ళని సూడకుంట లారీల తోటి గొట్టించిండట గుర్రాలతోటి తొక్కించిండట - గింత అన్నాయమా ? గింత అడివా ? గిట్టని ఎరుకుంటే గింతగూడ గెలువ నియ్యకపోదుం అయిందయిందిగని అయిసి పోవద్దు మళ్ళ మనకాడికి రారా... మనం గప్పుడు సేసేపని జెయ్యమా .... 26
రుద లా మ. వక్ దిన్కా నుల్తాన్ అతడు సామాన్యుడు ఎప్పుడూ సామాన్యుడే ఆ ఒక్కరోజు మాత్రం అతడసామాన్యుడు ఇంద్రుడు - చంద్రుడు ఆ ఒక్కరోజు మాత్రం తానూ మనిషినేనని తనకూ ఒక గొప్ప విలువుందని ఒక ఆలోచన తళుక్కుమనిపించే రోజు అందరూ - అందులో పెద్దలు తనకే చేతులు జోడించడం చూసి తల ఎత్తుకొని తిరిగే విలువ గల మనిషి ఆ ఒక్కరోజు అతడు దాత రేపటి విధాత ఆ ఒక్కరోజు 27
లాలాాలాలలాలాసంా | జ. లక్ష్మణరావు తన శక్తీనీ విలువనూ తన సర్వాధికారాన్నీ ముద్రవేసి దానం చేశాక అతను మళ్ళీ సామాన్యుడు అతని తలరాత నలిపిపారేసిన చిత్తు కాగితం అందరికీ తానే తలవంచే సాధుజంతువు తన బతుక్కు తానే కొత్త శక్తిని కూడగట్టుకునే నిత్య శ్రామికుడు ఆతి తేలికగా వంచింపబడ్డ అమాయకుడు ఒక్క మాటకో - ఒక్క నోటుకో ఒక్క సీసాకో - కులానికో మతానికో కూటానికో చిక్కిపోయిన అస్వతంత్రుడు - అజ్ఞాని ఇది ఎప్పుడూ జరుగుతున్నదే కదా ఎప్పుడూ పూలే అందంగా ఉంటాయి వేళ్ళు మట్టికొట్టుకొనే ఉంటాయి జెండాలు పెట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు జెండా కర్రలు పట్టుకున్న వాళ్ళే కొట్టుకుంటారు అధికారం పాందిన వాడు ఆ ఒక్కరోజే సామాన్యుడు అధికారం అందించినవాడు ఆ ఒక్కరోజే మాన్యుడు ఓట్లు పొందినవాడు ఒక్కరోజులో అవుతాడు రాజు ఓటు వేసినవాడు ఏక్‌దిన్‌కా సుల్తాన్ 28
రు గ్. తతుకుదాం బ్రతుకుదాం అందరం అంతా కలిసి హాయిగా ఆనందంగా బ్రతుకుదాం |! మనుషులూ - చెట్లూ - చేమలూ పక్షులూ - పశువులూ - సకల ప్రాణులూ గాలి - నీరూ - నేలా అంతా - అందరమూ కలసి సంతోషంగా బ్రతుకుదాం ! అన్నీ ఉన్నాయి సమృద్ధిగా అందరం కలిసి అనుభవిస్తే ఉండదు కొరత ఒక్కజణ్ణి - ఒక్కజ్దే బతకాలి. . ఒక్కళ్లే - ఏలాలి - అంటే అది నిజంగా చావు కోరిక 2ం
తతత డా| జి. లక్ష్మణరావు
ఎంత సంపాదించినా - భోగించినా నీ కోసం మాత్రమే అయితే అది బ్రతుకే కాదు ఎంత పార్లినా - ఎంత దుఃఖభించినా నీకోసం మాత్రమే అయితే అదీ బ్రతుకే కాదు పచ్చదనాల్ని నరికినా ప్రవాహాల్ని ఇంకింప జేసినా పక్షుల రెక్కలు విరిచినా వాయువు గొంతునులిమినా అది అధికారమూ కాదు - అహంకారమూ కాదు అసలు బ్రతుకే కాదు ఊళ్ళన్నీ ఊడ్చేసి నగరాల్ని అలకరించడం . నాగరికతా కాదు
. ఒక కుక్కలా కాదు ఒక నక్కలా కాదు గుహలో నుంచి పాంచి చూసే సింహంలానూ కాదు సరిహద్దులు గీసుకోని ఆకాశంలో పక్షిలా పరిధులు లేకుండా మట్టిలో పెరిగే చెట్టు వేళ్ళలా పరిమళాన్ని అందాన్నీ పంచే చిన్న ఆయువు గల పూలలా బాధలూ - దుఃఖాలూ నిండిన ఆత్మ లోయల్లోకి ప్రవహించే నదిలా సాగుదాం | బ్రతుకుదాం ॥
30
రు వా మ. అంతిను న్యాయం యుద్ధం యుద్ధం యుద్ధం అంతటా యుద్ధం లోపల యుద్ధం బయట యుద్ధం అంతరాత్మదొక మాట ఆచరణదింకొక బాట అక్కడే మొదలు అంతర్యుద్ధం ఆలు బిడ్డలొక దారి అతనిదింకో దారి ఆ యింట్లో యుద్ధం ఒక్కొక్క పార్టీ దొక్కొక్క దారి అందరి లక్ష్యం ఒకటే అధికార సింహాసనం అక్కడా యుద్ధమే అంతటా యుద్ధం లోపల యుద్ధం అంతటా యుద్ధం వెలుపల యుద్ధం ఆర్టీసీకీ ప్రభుత్వానికి యుద్ధం ప్రయాణీకులు బలి అడవికీ ప్రభుత్వానికీ యుద్ధం . పల్లెలు బలి అహంకారానీకీ అభిమానానికీ అహరహమూ పోరాటం అసలు సిసలైన మానవత బలి
తై
అనావృష్టీ వరదలూ తుఫానులూ భూకంపాలూ కరువూ పన్నుల బరువు ప్రాణ సంపదా సంపదా బలి అనుక్షణం బ్రతుకంతా యుద్ధం యుద్ధం అంతటా యుద్ధం హిమాలయాల్లో - అఫ్టాన్లో ఇండియాలో ఇజ్రాయిల్‌లో........ అనేకానేక దేశాల్లో వాటి సరిహద్దుల్లో రాళ్ళల్లో నీళ్ళల్లో గాలిలో భూమ్మీదా ఎక్కడైనా ఎప్పుడైనా యుద్ధం యుద్ధం అంతా అలవాటయిన భీభత్సం నరబలి నరబలి పర్యావరణం రక్త కాలుష్యం శాంతి శాంతి ప్రశాంతి ప్రపంచశాంతి ప్రవక్తల సూక్తులు చెవిట్వాడి ముందు శంఖనాదాలు కలవరపడే కవులమయినా గట్టిగా అరుద్దామా ? ఎదురు మాట్లాడితే తీవ్రవాదం ఏమన్నా గిల్లితే ఉగ్రవాదం కిమ్మనకుండా ఉంటే వలసవాదం ఉక్కుపాదం 32
రండు శ్ గాంధేయం ఒక్కటే పరిష్కారం అందామా ఒక చెంపకొడితే ఇంకో చెంప చూపుదామా ఎవరూ చెంపమీద కొట్టడంలేదు ప్రతివాడూ బ్రతుకు మీదే కొడుతున్నాడు మనం చూపడానికీ ఇవ్వడానికీ రెండో బ్రతుకు లేదు కదా! హిట్లర్ ముసోలినీ - నాజీ - ఖాసిం రజ్వీ ఇంకా బతికే ఉన్నారు ఇవాళ గతం యుద్ధమే మతం యుద్ధమే మాట్లాడటం యుద్ధమే మౌనమూ యుద్ధమే అనివార్యం యుద్ధం ప్రతి యుద్దానికి ముందు' ప్రకటన నీతి ధర్మం న్యాయం నిలపడమే తమ ధ్యేయం నిర్వచనాలే మారతాయి అనివార్యమైన యుద్ధం అంతర యుద్ధం బాహిర యుద్ధం _ అయితే కానీ - కొనసాగనీ కానీ, మనం మనుషులమేనా ? అన్న ప్రశ్నకు అంతిమ యుద్ధం ప్రకటించు అంతిమ న్యాయం ఏదో వివరించు 33
చ డ| బి. లక్ష్మణరావు జాచ్సెల్లు బతుకుతది ? ఏషం మారింది ఎవారం మారింది నడక మారింది నాయం మారింది బాషెట్ల బతుకుతది నెత్తికి రుమాలు లేదు బుజంమీద తువ్వాల లేదు సెక్కిన సింగుల దోతుల్లేవు సెవులకు పోగుల్లేవు సేతుల కట్టెలేదు - ఏషం మారింది - ఎవారం మారింది బాషెట్ల బతుకుతది గోసివెట్టి కట్టిన చీరల్లేవు దాశన్న పూలుపెట్టిన సిగల్లేవు 'సెంపలకు పసుపుల్లేవు గద్వలకు గంధం లేదు నొసట కుంకుమ బొట్లుల్లేవు ఏషం మారింది - ఎవారం మారింది బాషెట్ల బతుకుతది అవ్వలేదు - అయ్యలేడు అన్నదమ్ములక్కసెల్లెండ్లాయింతలేరు ( ఒక్కరు లేక అసలే వద్దనె సర్కారు ) అదిన మరదండ్లు లేరు ప్రశ
రుడు లా ల ం అల్ల పిల్లగాండ్లు ఈల్లపిల్లగాండ్లుు అఆడుకుంట పెరిగే అరుగుల్లేవు ఏషం మారింది - ఎవారం మారింది బాషెట్ల బతుకుతది ఊరూరికి రోడ్డు వడ్డయి రోడుకు రొండు దిక్కుల టేలాలు మొలిచినయి షావుకార్లయి, దొరలయి, పటేండ్లయి షటర్లు వడ్డయి - బస్సులు జీబులు ఆటోలు మస్తుగయినయి - ఏషం మారింది - ఎవారం మారింది బాషెట్ల బతుకుతది మబ్బుల సుక్క వొడువకముందు నుంచి మస్కయినంక పొద్దు గూట్లె వడెదాక పాలాలపాంటి కాలువల పాంటి 'సేన్లపాంటి, సెలకల పాంటి, సెరువు కట్టపాంటి బతుకు పొద్దు గడిపెటోళ్ళు చాయ హోటల్లపాంటి సడకుల పాంటి బస్సుల పాంటి బరండి షాపులపాంటి తిరగప్పోతె బతకమనుకుంటుండ్రు ఏషం మారింది - ఎవారం మారింది బాషెట్ల బతుకుతది అవుసులాయిన హోటల్ వెట్టిండు 'మేరాయన చికెన్ సెంటర్ వెట్టిండు 35
తతతతతతతతతతతతతతతతతతవవవవవవవవవవావావావాాం 6|| బి. లక్ష్మణరావు శాలాయన కట్టెల దుకాణం బెట్టిండు వడ్డాయన వైద్యం నేర్చుకున్నడు శానమంది ఓటికోట్ జేత్తండ్రు ఊరంత సిత్తు బొత్తయింది - ఏషం మారింది - ఎవారం మారింది బాగా జదివిన పడుసు పిల్లగాండ్ల బతుకు దెరువుకోసం బళ్ళు పెడతండ్రు అచ్చిరాని ఇంగ్లీషు జెప్తండ్రు అందరటే ఎగవడతండ్రు - ఏషం మారింది - ఎవారం మారింది బాషెందుకు బతుకుతుంది పండుగలు పబ్బాలు పాటలు ఆటలు మాటలు మనసులు పోతున్నాయ్ - పోతున్నాయ్ ఏషం మారుతున్నది మస్తుగున్నయి సెప్పాలంటె అన్నమంత పిసికి సూత్తమా ఉన్నయన్ని జెప్ప్తుకుంటమా - శాస్త్రానికి నాలుగు మాటలు జెప్పిన అన్ని చెప్పాలంటె నేనేం జాల్త - ఎన్ని జెప్పినా ఎంత చెప్పినా ఏషం మారింది ఎవారం మారింది బాషెట్ల బతుకుతది బాషెట్ల బతుకుతది ౩36
రగు గ. ఇవ్పుడే తేల్చుకోవాలి ఇవాళ ప్రపంచమంతా ఒక గ్రామంగా మారుతూ నిన్నటి ఊరు శతాబ్ది పాలిమేరల్లో నరికివేయబడుతూ బలంగా తనపాదం మోపుతోంది నవసహస్రాబ్ది ఇపుడు నా దేశంలో కంప్యూటర్ వటవృక్షం కింద చదువుల సంత సాగుతోంది _ దారులు కాచికాచి - బారులుగా చేతులు సాచిసాచి పల్లెలను ఎత్తుకపోతున్నాయి రోడ్డు 37
నన స స పాలాలు ఏడ్చి ఏడ్చి దుఃఖాన్ని కడుపులోనే దిగమింగుతున్నాయి ప్రాణాలు అడుగుపారల్లో ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి జనం శక్తి సర్వస్వం వడ్డీ చెల్లింపు చెమటగా ఇంకిపోతున్నది ఆధారం లేని నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు సర్దిఫికెట్లు మార్టిగేజి చేసి అపార మేధా సంపత్తిని అన్యదేశాలకు ధారబోస్తున్నారు. ఆకాశ వీధుల్లోంచి ఉపగ్రహం కిరణాల నుంచి పాశ్చాత్య సుందరి అంగాంగ ప్రదర్శనలతో రంజింప జేస్తున్నది మాయామోహిని మరోసారి మోసం చేస్తున్నది నా పల్లెలకు ఎయిడ్స్ అంటించి పోతున్నది నేల మీది విసర్గ సౌందర్యమంతా వేలం పాట పాడబడుతోంది ఏమిటది ? ఏమిటది ? ఉదయమా ? సాయంత్రమా ? ఈ ఉదయం తూర్పు నుండి పడమటికా ? పడమర నుండి తూర్పుకా ? ఇప్పుడే తేల్చుకోవాలి ఇప్పుడే తేరుకోవాలి 38
రంగు గ్. రామూ £ రామా. రామూ ల రామా 1! రామా !! రామా [| నువ్వు దేవుడివనీ అవతార పురుషుడివనీ ప్రజారంజకుడవనీ యుగయుగాలకు - తరతరాలకూ ఆదర్శ మానవుడిననీ ఆరాధించి అర్చించినప్పుడు మాకు బాధలేదు తలచిన ప్రతి హృదయంలో నీవుంటావనీ పిలిచిన నాలుకలపై కదలాడుతావనీ 39
చా 6౮|| జి, లక్ష్మణరావు
ప్రాణంలో జడంలో ప్రతి అణువునా పరమాణువులోని ప్రతి సహస్రాంశంలోనూ నీవున్నావని సాధువులూ వేదాంతులూ నిత్యం ఘోషిస్తుంటే - బోధిన్తుంటే నిజమే కావచ్చునని నమ్మిన మాకు నష్టం లేదు ఈ క్రీస్తుశకం ఇరవై ఒకటీ, రెండులలో
ఇవాళ నీకు కొత్తగా ఇల్లు కావలసి వచ్చిందా ? “ అయ్యో 1! నా అయోధ్యాపురం ”
అని కలవరిస్తున్నావా ?
అయోధ్యలో నీకు ఆలయం లేకుంటే అడ్రసుండదని భయపడుతున్నావా ! అన్నిటికన్నా ! ఆశ్చర్యం
నువ్వు కూడా మా వలెనే
మాలో కొందరి వలెనే
రాజకీయాల్లో చేరడం
నీ పేరు - నీ ఉనికి - నీ ఊరు - నీ ఇల్లు నిరంతర ధ్యానంకాక
నిత్య రాజకీయం కావడం
నీ పునరుత్థానం
మా సమాధుల మీద కావడం
నీ పునఃప్రతిష్టానం
మానవ కళేబరాల మీద కావడం
ఏది దివ్యమో ? ఏది మానవత్వమో ?
ఏది రాక్షసత్వమో ? ఏది న్యాయమో ?
ఏదయినా చివరకు తేల్చేది రాజకీయమేనా ?
త్తం
రుదు రామా! రామా ॥ రామా 1! రాజకీయ ఖైదీ 1 ఒక్కసారి నువ్వు నిజంగానే ఊడి పడ్డావనుకో నీకే ఈ రాజ్యం కట్టబెడతామనుకో ఏలగలవా ? ఈ దేశాన్ని నిలుపగలవా ఈ జెండాలను గెలువగలవా ఈ అధికార మహారధుల్ని గెలువగలవా నిజంగానే సంహారాలు - సింహాసనాలే తప్ప మమకారాలు - మానవత్వం మచ్చుకైనా లేని మా నాయకులను - గెలువగలవా ? గెలువగలవా ? పదవీ భూజాతను పట్టిన మదోన్మత్త రావణులను కత్తులను దాచుకొని వచ్చే కలియుగ ఖరదూషణాదులను కాదులే - నీతో కాదు నింద పోగొట్టుకోవడానికి నిండుచూలాలిని వదిలావు ఇంత అపకీర్తి రాళ్లయి రువ్వుతుంటే ఇంకెవరిని వదులుకుంటావు నిన్నునీవే... రామా! రామా !! రామా!
క!
చత డా జి. లక్ష్మణరావు మా ఊరి రోడ్డు పిల్లబాటలన్నిటనీ మింగేసిన కొండచిలువ పచ్చని పాలాల పాయల్లో పరుచుకొని పడుకున్న నల్లత్రాచు త్త
రు అమాయకపు పల్లె సముద్రంలోకి అపార (ప్రేమైక జీవరాశుల్లోకి ఆధునికులు విసిరిన గాలం అప్పుడే బ్యాంకునుండి అప్పుతీసుకున్న నవనవలాడుతున్న కొత్తనోటు వంపుసాంపులతో వయ్యారాలతో వంచనచేసేమోహనాంగి పూర్తిగా తెల్లారకముందే పొదుగునుండి జారి నురుగులు పొంగుతున్న పాలగిన్నెను తన్నుకుపోతున్న నల్లపిల్లి పండ్లూ కూరగాయలూ ధాన్యమూ గంపలు గంపలూ మూటలు మూటలూ పట్నానికి చేరవేసే దళారీ ఊరు ఊరంతా ఏరువదలి, చెరువుగట్టు వదలి ఉన్నచోటూ ఇరుగు పొరుగూ మరచి అమాంతంగా తనకే అతుక్కుపోయేటట్లు అకర్షిస్తున్న అయస్కాంత బండ్లూ బస్సులూ జీబులూ ట్రాక్టర్లూ బరబరా జరజరా తిరుగుతూ ఉంటే పసుల అంగడిని మాయం చేసి యంత్రాల నంత సాగించే కుహనా అహంకారి.
డ్త్ర
తతా డా| జ. లక్ష్యణరాను రిఫ్లెక్షన్ - రియాక్షన్ నా చూపులు రిప్లెక్సు అవుతున్నాయి నామనసు రియాక్టు అవుతున్నది నాకు చూపు తెలిసినప్పటినుంచి నా చూపుకు ఒక అర్థముందని అనిపించినప్పటినుంచి నా చూపుకు ఒక అభినయముందని అనుమానించినప్పటినుంచి నా చూపులు రిపైెక్సవుతున్నాయి నా మనసు రియాక్టు అవుతున్నది పిల్లలను కొడుతున్న తల్లులను తల్గులను తిడుతున్న పిల్లలను కళ్ళు విప్పి చూస్తున్న మొగ్గలను పూలు శాల్చుకున్న తీగలను చూస్తున్న ప్రతిసారీ నా చూపులు రిప్లెక్సవుతున్నాయి నామనసు రియాక్టు అవుతున్నది వేరు వేరు ప్రవాహాల్లో స్నానాలు చేసి తీరు తీరుగా చూపించే అవయవాల సోయగాలు వేరు వేరు విలాసాల్లో మునకలు వేసి తీరు తీరు సిరుల మాటలు విప్పే వ్యాపారాల నఖరాలు చూస్తున్న ప్రతిసారీ నా చూపులు రిష్టెక్టు అవుతున్నాయి నా మనసు రియాక్టు అవుతున్నది ట్తేత్త
తు చల్లని తెలుగునోట ఫెళ్ళున మరోబాస ఆడినపుడు జాజిపూలునిండిన జడ మెడ కత్తిరించబడినపుడు అన్నా తమ్ముడు, అక్కా చెల్లెలు, ఆలు మగలు ఆత్మీయతలన్నీ ఢ్రేమ బంధాలను రూపాయలతో కొరత వేస్తున్నపుడు నా చూపులు రిప్పెక్టు అవుతున్నాయి నా మనసు రియాక్టు అవుతున్నది తెల్లారక ముందునుంచి- రాత్రి చల్లారే దాక' అనంతంగా దురంతాలు సాగడం అమాంతంగా మనుషులు ఆహారంగా మారడం అమాయికంగా సత్యాలు-అలమారాల్లో న్యాయాలు గాలిలో కూడా కరువైన తేమ కపట వేషాల్లో పరంధామ ఎటు చూసినా ఎప్పుడు చూసినా ఎదురయిన ప్రతి సన్నివేశమూ కనిపించిన ప్రతిసారీ నా చూపులు రిప్లెక్టు అవుతున్నాయి నా మనసు రియాక్ట్చ అవుతున్నది ఆ రియాక్షన్ మాటలై వెలువడుతున్నాయి అందరికీ శత్రువుగా మార్చుతున్నాయ అందుకే నా చూపుల రిప్టెక్షన్ నన్ను నేను ప్రశ్నించుకోవడం నా మనసు రియాక్షన్ నా ఉనికిని నేను వెతుక్కోవడం తప్
చా డ| జ. లక్షణరావు ఎర్ర బన్సు ఎర్రబస్సు రాకతోనే తెల్లారింది ఊరికి ఎర్రబస్సు రాకతోనే ఎంత వెలుగు ఊరికి తం
ముదు గో. ఒరైెల మడుగులనుంచి నెర్రైలువారిన మట్టి దారులనుంచి ఆపసోపాలు పడుతూ అర్భాటాలు చేస్తూ హారన్మోతే కోడికూతగా ఎర్రబస్సు రాకతో ఇక తెల్లారింది ఊరికి ఎర్రబస్సు ఎన్ని నేర్పింది ఏమీ తెలియని ఊరికి ఎర్రబస్సు ఎన్ని చేసింది తన బతుకు తాను బతికే ఊరికి దేశ దేశాల తలరాతల్ని తెచ్చి పడేసేది పేపర్లో చుట్టి రంగు రంగుల విలాసాలూ, ఫ్యాషన్లూ దింపేసేది డబ్బాలలో సెట్టి లాల్చీ కండువా గొంగడీ రుమాలూ సిల్కుచీరా గోచీపెట్టి కట్టిన ముతక నేత చీరా క్యాష్బ్యాగూ ధోవతి సింగు ముడీ పక్కపక్కనే కూర్చొనే చక్కని నంప్రదాయం నేర్పింది “అంటరానితనం నేరం) ఆచరించి చూపింది గుడిసెలో నిదురపోతున్న జీవులకు - గడుసుదనం నేర్పింది గడిలో నివసిస్తున్న పెద్దలకు గడువు చెల్లిందని తెలిపింది. త్త
జ డా| జి. లక్షణరావు పంటల ఎగుమతీ పైసల దిగువుతీ పట్నం బజారు రీతీ పొట్లాలు పొట్లాలుగా అందించింది నా అంత గొప్ప లేదనుకున్న ఊరికి నాదేం బతుకని చప్పబడడం తెలిపింది ఖద్దరంగీలు తొడుక్కోగలిగితే కాసింత గౌరవం దొరుకుతుందని చూపింది ఇప్పుడిప్పుడే కొంత కొంత అర్థమవుతున్నది తూర్పు దిక్కు తెల్లారదు బస్సువచ్చే రోడ్డు దిక్కే తెల్లారుతుందని ఎర్రబస్సు రాని రోజు ఎంతబెంగ ఊరంతటికి ఎర్రబస్సు ఎక్కితే ఎంతపొంగు దారంతటికి ఎర్రబస్సు ఎర్రబస్సు ఎర్రదనం అస్పలు పనికిరాదట ఎర్రబస్సునిలబడితే కుంకుమబొట్టు పెట్టినట్టుండేది ఇప్పుడదే నెత్తురుబొట్టుగా ఉందట రంగులు మార్చేస్తరట రెండుతరాల బస్సుకు రాజకీయంలో మామూలే కదా ॥ ఏ రంగయితే ఏమిటి పల్లె అందులో పోవడం తప్పదు పట్నం అందులోంచి దిగడం తప్పదు. చ్తప్రి
రుం
మ.
వ్వ్కైితతం
గతం ఎప్పుడూ జ్ఞాపకాల వరద
ఆగత౦ ఎప్పుడూ అదోరకం సరదా
ఆ రెంటి నడుమ ఎప్పుడూ అదృష్టం పరదా నిదురనుండి మెలకువ వరకు స్వప్నించి
మెలకువ నుండి నిదురవరకు వాటినే ఎదిరించి హాయిగా తేలుతూ గాయాలతో మూలుగుతూ
స్వప్న వాస్తవాల చక్రభమణంలో
సరిహద్దు క్షణమొక సంరంభం
కొత్తగా పాత అంకెలనే తొడుక్కొని
గొప్పగా మురిసిపోతుంది క్రొత్త సంవత్సరం
ఏడాదికి ఎన్నిసార్లు ముఖం మార్చినా
ప్రతి ఒకటో తేదీకి పడుచువేషం వేసినా
గోడకు వేలాడడం గాలికి తలబాదుకోవడం
జాడలు చిరిగిపోవడం తప్పదని తెలియదు పాపం అయినా కాలం అరక్షణమయినా అతిక్రమించకుండా అడుగిడుతున్న తిథి బాంధవా
ఆశల మూటలు మోసుకొస్తున్న నవాబ్దమా అగకుండా వచ్చే నీకు ఆనవాయితీగా మా ఆహ్వానం అనాదినుంచీ జీవన వేదాలందించిన
అనుభవ సందేశమా నీకు స్వాగతం
డం
ణా విద్యార్థులు అధ్యాపకత్వం అద్భుతమైన వరం పాఠం చెప్పిన ప్రతిగంటా ప్రాణవాయువులు లేచి వస్తాయి తరగతి గదిలో ప్రతినిమిషం పెరుగుతుంది నా ఆయుర్దాయం పద్యం గేయం కథా నాటకం పాఠం ఏదయినా కానీ పారవశ్యంలో నేనూ నా వశంలో నా విద్యార్థులూ అనందతరంగాల్లో ఈదులాడినపుడు నేనూనా విద్యార్థుల్లో ఒకణ్ణి నా విద్యార్థులూ నా గురువులు “ నిదురను మించిన సుఖం జీవితంలో లేదు కనీసం క్లాసులోనయినా నిదురపాండి కమ్మగా పాఠం చెపుతాను ” అన్నప్పుడు ర5్0
మస్తు గ. మందలింపో, బుజ్జగింపో తేల్చుకోలేక తేరిపారచూసే చదువులూ, పరీక్షలూ, సర్జిఫికెట్లూ పదవులూ, సంపాదనా, భార్యా పిల్లలూ బ్రతుకంటే ఇంతేనా ? ప్రశ్న వికటంగా వినిపించి పరమార్థాల వేటలోపడ్డ నా విద్యార్థులు ఆలోచనాపరులు అపర తాత్వికులు శ్యాస్తాలూ - విశ్వాసాలూ సగం సగం తెలిసీ తెలియకా సగం బోధించీ సగం బాధించీ నా విద్యార్థులు అకురాళ్ళు అహంకరించే పిడుగురాళ్ళు “అత్తా మామా ఆయనా ఆడపడుచూ అలంకరణ ఆకర్షణ ఎంత చదివినా అమ్మాయిలూ ఇంతేనా ? ” అన్నప్పుడు సిగ్గునూ భయానీ చిలిపితనం గడుసుతన్హ టర లాం ఈ గం టా త[కి.6. ఓ వితె6రి జ 151
తతా డ జ. లక్షణరావు కలగలిపిన చూపులతో నా విద్యార్థినులు గంభీరముద్రలు అలల సుడిగుండాలతో నడిచే నదులు పాటలతో రాగాలతో వరండాలనూ తరగతిగదులనూ సంగీతకచ్చేరీలుగా రాతలతో చేతలతో చెట్టనూ గోడలనూ కళాఖండాలుగా మలిచే నా విద్యార్థులు చైతన్య కళాజీవులు మరోలోకానికి సృష్టికర్తలు వార్షికోత్సవాలలో విహరించే వసంతాలు కదిలే నిత్యనూతన సౌందర్యాల ప్రతినిధులు పరీక్తలముందు క్యాంపస్ చెట్లకింద పుస్తకాల రెక్కలతో వాలిన పక్షులు కాలేజి వదలి గుంపులు గుంపులుగా కదలివెళ్తున్నప్పుడు గాలికి కొట్టుకుంటున్నపుస్తకాల పుటలు కొత్త చినుకులు కురిసేదాకా మా అధ్యాపకుల గుండెల్లో ఇంకి పోయిన తీపిచెలమల గురుతులు కాలేజీకి ఉదయాలనూ కలల హృదయాలనూ అందించే నా విద్యార్థులు రేపటి నా దేశంలో రెపరెపలాడే యశఃపతాకలు + 5్లై
రు గ. తరబాలనం నేనొక నైమిశారణ్యం నా నివాసం బుష్యాశ్రమం ఇక్కడ పులులూ - లేళ్ళూ సింహాలూ - కుందేళ్ళూ కలిసి బ్రతుకుతాయి జీవం నా దేశం 53
తతత డా! జ. లక్షణరావు నా ఆస్తి పిడికెడు మట్టే కావచ్చు ఐనా నాలో హిమశిఖరాల పాగరువుంది నా చదువు నాలుగు వేదాలే కావచ్చు ఐనా నాలో మంచులా కరిగే వినయం ఉంది జీవనం నా సందేశం పొరుగువాడా ! పిరికి వాడా !1 వౌరుషమా వైరభావం ? తీగలా అల్జ్లుకుపోతే సాగసుగా ఉంటుందని సహిస్తా ఆశ్రయం కోరి వస్తే ఆదరించి భరిస్తా దురాక్రమణ పరాక్రమం కాదు - దౌర్జన్యం చొరబాటు వీరత్వం కాదు - చౌర్యం ఆయుధంతో రావడం థైర్యంకాదు - పిరికితనం ఆశపడి దూకడం నీతికాదు - అవివేకం మైత్రి చేయడానికి గుండె కావాలి స్నేహ హస్తం చాచడానికి త్యాగం కావాలి మౌనిలాంటి మంచును కవ్వించకు ఫాలాక్తం తెరువకముందే పారిపో సరిహద్దు రేఖలో తుపాకితో కొలిస్తే తరిమి తరిమి తరిమి కొడతా సహనంతో స్నేహంతో చేయందిస్తే సాదరంగా ఆహ్వానిస్తా ర్త్క
రు మ. మాయలేడి మాయలేడివి నువ్వు మాయలాడివి నువ్వు మాయయే తానయిన సీతనూ మంత్రమే తానయిన రాముణ్జీ వంచించిన వన్నెలాడివి నువ్వు సూర్యుడూ చంద్రుడూ చుక్కలూ నీ చుట్టు తిరుగుతూ కొలుస్తుంటాయి మనుషులకూ గ్రహాలకూ ముడివేస్తూ మరిపించి మురిపించే ఎరుకసానివి నువ్వు గాయాలను చేస్తూ, వాటికి కలల లేపనం రాస్తూ, నీ వలలో పడవేసుకొని, బ్రతుకు అలల్లో ముంచెత్తే అందానివి నువ్వు గోడమీద బొమ్మలు మారుస్తూ ర్ర్
తతా డడ జ. లక్ష్మణరావు కొత్తగా వచ్చినట్టు భమ పెడతావు ఉగాది ఓనమ్ ఒకటో జనవరి ఏవేవో పేర్లతో ఆశల అకాశవీధుల్లో దించి పోతావు నిజానికి నీవు పోవు నీకు ఆద్యంతాలు లేవు నిత్యం మా చావు బతుకులమీద నిర్వికారంగా జారిపోతావు ఊపిరి ఉన్నంతసేపు నీ మీదే ధ్యాన ఉండాలంటే నీ మీదే ఆశ ఆహా ] నీవెంత నిశ్చల చలనానివి అనాద్యనంత రూపానివో శివశక్తివో ? విష్ణమాయవో ? మా నాలుకలపై మాత్రం చిక్కని కాలానివి దొరకని టైం మంత్రానివి నిమిష నిమిషం నీనామ జపమే నిన్ను మరిస్తే కరుస్తావు - కాటేస్తావు నిన్ను న్మరిస్తే వీపు చరుస్తావు నిరంతర మోహానివి నువ్వు నిర్బంధ సౌఖ్యానివి నువ్వు నీ పేరు కాలమా మాపాలి గాలమా .. మాయలేడివి నువ్వు మాయలాడివి నువ్వు.
ర5ి6
ఈ నంగ్గులోకి
నన్ను దింపిన సాహితీమిత్రులెందరో.... నా వెంటబడినవారు నలిమెల
భాస్కర్, వారాల ఆనంద్, డింగరి నరహరి, సంగనభట్ల నరసయ్య,
దర్భశయనం శ్రీనివాసాచార్య, వేణుశ్రీ, మచ్చ హరిదాసు, బి. దామోదర్‌రావు,
నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం...
సర్వదా ఆశీస్సులందించే గురువులు కోవెల సంపత్ముమారాచార్యులు,
తల్లిదండ్రులతో సమానులైన చిన్నమ్మ కాక చిట్నేని నీరజ దామోదర్‌రావు ,
నా నుంచి పుస్తకం ఆశించిన ఆబాల్యమత్రులు అనుమాండ్ల భూమయ్య,
జయ్రకాశ్రెడ్డి, కె. లక్ష్మారెడ్డి, పి. రాజేశం, ఏ. లక్ష్మినరహరి.
ఆత్మీయ మి(త్రులు ఆర్.చంద్రప్రభాకర్, ఎన్.గంగయాచార్యులు,
సామలక్ష్మారెడ్డి, జి.వి. కృష్ణమూర్తి, సముద్రాల వేణుగోపాలాచార్యులు,
హరిప్రసాద్, బి.రావువులు, ఎస్. నాగేంద్రశర్మ, యం.లక్ష్మయ్య,
ఏ. ఆనందరావు, రాజేశ్వర్‌రెడ్డి ...
నా విద్యారలు సాహితీ సహచరులు కె.ఎస్. అనంతాచార్య, మాడిశెట్టిగోపాల్,
నౌండ్ల శ్రీనివాస్,
పెద్ద మనసుతో మందలించిన బి. వెంకటరామారావు, మెత్తగా చెప్పిన గీట్ల
జనార్దన్‌రెడ్డి, శ్రేయోభిలాషులు డా॥ వి. భూంరెడ్డి, డా॥ భాగ్యరెడ్డి, ఎదవల్లి
జగ్గారెడ్డి, డా॥ విజయేందర్‌రెడ్డి....
సాధికార సన్నిహిత మిత్రులు టి.వి. విద్యాసాగర్‌రావు...
అన్ని కవితలూ అవును కాదనక విన్న మాతోటి ఉపన్యాసకులు సహృదయులు
జ్యోత్స్నప్రభ, నరసింహారెడ్డి
ఒక పుస్తకం వేయాలని పదే పదే గుర్తు చేసిన మా ప్రిన్సిపాల్ టి. లక్ష్మణరావు
భావోచితమైన ముఖచిత్రం వేసి, వెనుక నన్ను పరిచయం చేసిన కళామిత్రుడు
పి. ఆగాచార్య
అక్షరమక్షరమూ సానబట్టి చూస్తూ అన్ని జాగ్రత్తలు వహిస్తూ, తనదిగా
అందంగా ము(్రించి యిచ్చిన సౌజన్యశీలి, సాహితీహృదయుడు, జర్చలిస్టు,
అరుణ ప్రింటర్స్ - ' నవత ” చుక్కారెడ్డి
కవరు పేజీలు ముద్రించి కాగితం కూడా అందించిన క్లానుమేటు,
ఆప్తమిత్రుడు శారద ప్రింటర్స్ - బి. నాగభూషణం
ముగ్గు కన్నా ముచ్చటగా అక్షరాలను సెట్ చేసిన రామగిరి పద్మ
అరుణ (ప్రెస్ రమేశ్, కృష్ణ, శ్రీను, సతీశ్, ప్రతాప్
అందరికీ (ప్రేమతో నమస్సులు.
నారాతకూ చేతకూ చేదోడు వాదోడుగా నిలిచిన నా విజయకూ
అదడగడంనుంచి ముందలింము దాకా ఎదిగిన వూ విల్లలు
సమత - అమరేందర్‌రావు శడరదయ్య క్ష
సతీశ్, శరత్‌లకు (ఢేమతో ఆశీస్సులు...... న షో
అక్షణరావు వం. క్ శ(4ం సంప్ర గ్నాట్టల్లో |
. _ అ యుసమళుడ? ౧౦ ల ర్న య్" శ ం త? న /. టి నో గ్ ే . “ (/) / గ్గ / కా . అక్షర ఉజ్వల - నవోదయం - పత్రికలకు ఒక దశాబ్దం సంపాదకీయం సమతా సాహితి, సాహితీగౌతమి - సంస్థల అధ్యక్షులుగా
- శతాధిక సమావేశాల నిరహణ పలుకవితా సంకలనాలకు పరిష్కరణలు - పీఠికలు " ఇంకా... వెలిగందల నారయ భాగవతం ఏకాదశ, ద్వాదశ స్కందాలు, శతావధాని కృష్ణమాచార్యుల స్మారక సంచిక 'అక్షరార్టన', ల విశేష పద్య ఖండికలు 'రత్నమాలి, క " బురదలో జాబిల్లి కథా సంకలనం - సంపాదకత్వం సినారి కవితా పురస్కారాలు పొందిన కవితా సంకలనాలపై సమీక్ష వ్యాసాల సంపుటి 'సమీక్షణం' లకు సంపాదకత్వం ౧౭/|౧౬.00గ ఇంటర్నెట్ తెలుగు పత్రికకు సహసంపాదకత్వం ల