Telugu Mouna Samudram - anilvaranasi/indianlanguages GitHub Wiki

తి / | . , న న. 1 ర టం | | స! హన. / క ర. మ 2 ల్‌ |. టక లీయు:! _ మ. టు మ న. క్ట నం! ం/! | ల మ; ట్‌ స్య. ॥ పం. (లా ట్‌. హ్జ్‌ ల న. నన్‌ యా. న. . న్ను స 2 ర య తో చాటత్ననై ంంం | 2 క ఈ! ః వ న | య తము! - 1 లం న న ఇ లో ॥ యా లి! ॥ / స క. | న. టు. హం. వ. | ల. | గా శ్‌. వ. * యు క .

మౌన సముద్రం (కవితా సంపుటి సబ్బని లక్ష్మినారాయణ శ్రీవంశీ ప్రచురణలు సాయినగర్‌, కరీంనగర్‌, 1999

మె 100114 548౮081411 రగ ల! ౧౦౭౫౫8 గి ల , లి

5200271 ఓ2%170104727208 బనీమీ.. ౯౫1 ౬౯0100౧ : 0౭౦౭౫06 1999 00౧16 : 1000 నిగం : [5. 30/- 0౮౪౭ ; శీగన!80 564 &| సోంగార8! 5684-5008

ర౧౦0040| : 9౫ 16 గిం 146 065100 : ఓఖజ0)10401

౧౦? 000195 :

951౬ 6. 5%127262

  1. 6643/6, 5జ08025 స2గ0104027 - 505 001.

తగరం నిర, (61౬ య కగం006 : 08722 - 30339 05 944986 800% 80095 5 820% 599 గృంం0464 జర 2|| 19 0800066 ౮ గ.

సం 800% ॥0౮9౬ లీ

9౧0: గగ౧౭ 5జ02), గజం్రంయ, గరం/2046. ( సటం64 800% ॥0౮9౯

841182 82241 663086. గ

ఇ య లబ భ్రాబ్ర రక ౮994 50248 (సందర రీ రు గాలయి సై 0110020400 గరం:2020. గ్‌ ఫా

౯

14౧0044 ౮8115985౧3 న ౫0.2. మషమి(ి) గ క! సజ; గిండర, బజ42602ఒ వ లో యే [4/౦0%4 9౮81131౯౧3 మై వాద్‌.గ00 084, 50 1౧6, తంంగ66090 660౧104

థిం100566 & నిగ౧166 21 :

5802042120 01861 ౧౧19

తర125, 1144 గర, గ8000482 - 505 001. గి

దగంగిం8 : 43026, 47851

అంకితం శీశాదం దిద్దించి అ, ఆ లు నేష్పుకుంటున్న అపారేళ్ళ ప్రాయంలోనే ఈ లోకంలోంచి వెళ్ళ్టోోయిన నాయనగారి దిక్యస్యృత&

ముందుగా నా కవితలు ప్రచురించిన

“ఆంధ్రప్రభ' సచిత్ర వారపత్రిక సంపాదకులకు

“రచన” మాసపత్రిక

“ఆంధ్రప్రదేశో మాసపత్రిక

'మానేర్‌ టైమ్స్‌" వారపత్రిక

ఏపి.టి.ఎఫ్‌. “ఉపాధ్యాయ” మాసపత్రిక సంపాదకులకు మరియు... “స్వేచ్భాస్వరాలు' రాష్ట్ర కవుల సంకలనం సంపాదకులు

శ్రీ కొల్లు రంగారావు (కామారెడ్డి) గారికి

నన్ను తన 'బాల వెన్నెలిలో జ్ఞాపకముంచుకొన్న కరీంనగర్‌ “బాల వికాససమితి' వ్యవస్థాపకులు శ్రీ వావిలాల భూపతిరెడ్డి గారికి,

“సమైక్య సాహితి" కరీంనగర్‌, అనంతాచార్యకు

పుస్తకప్రచురణలో సలహాలిచ్చిన

సాహితీమిత్రులు శ్రీ ఆడెపు లక్ష్మీపతి గారికి

శ్రీ వారాల ఆనంద్‌ గారికి, శ్రీ నలిమెల భాస్కర్‌ గారికి

కవి మిత్రులు సౌభాగ్యకు

ప్రసిద్ధ రచయిత, సహృదయులు “అంపశయ్య” నవీన్‌ గారికి

నా పిహెచ్‌డి. నూర్గదర్శకులు, మిత్రులు, గురువులు,

డా॥ కె. రాజేశ్వర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, కాకతీయ విశ్వవిద్యాలయం గారికి

నా కవితలు అభిమానంతో విని, చదివి పుస్తకం వస్తుందంటే

సంతోషపడి అమూల్య సలహాలనిచ్చిన

మా కరీంనగర్‌ “ఉపాధ్యాయ శిక్షణా సంస్థ" సహచరమిత్రులు శ్రీ వి. ఉమాపతి రాజు, శ్రీ టి. రాజమౌళి, శ్రీ ఎల్‌. సంపత్‌ రావు, శ్రీ 3. అమరేందర్‌ రెడ్డి,

శ్రీ సి.హెచ్‌. కేశవరావు, శ్రీ పి. రమేష్‌చంద్ర, శ్రీ 3. రాంచంద్రం గారలకు “ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ప్రధానాచార్యులకు, సోదర ఉపన్యాసకులకు, కార్యాలయ మిత్రులకు మరియు నన్ను అభిమానించే శిక్షణా సంస్థ విద్యార్థులకు ప్కిప్ట్‌ చదివి సూచనలు ఇచ్చిన తెలుగు పండితులు

శ్రీ బి.వి.ఎన్‌. స్వామి, శ్రీ గాజుల రవిందర్‌ గారలకు

నాపై ప్రేమతో, అభిమానంతో ఆత్మీయంగా ముందుమాట ఇచ్చిన

ప్రముఖ కవి, పరిశోధకులు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ డాః॥ ఎన్‌. గోపి గారికి ఆత్మీయులు మా పచ్చునూరి నర్సయ్య గారికి

వా కవితలను (ప్రేమతో పుస్తకంగా ముద్రించి ఇచ్చిన సత్యనారాయణ ప్రింటింగ్‌ ప్రెస్‌, శ్రీ జక్కని కిషన్‌, శ్రీ జక్కని- ప్రభాకర్‌ సోదరులకు కంపోజింగ్‌ వర్క్‌ చేసిన బి. వెంకటరమణ,.వి. అమర్‌, సిహెచ్‌. ప్రసాద్‌, జి. వేణు, జి. పురుషోత్తం మరియు ప్రెస్‌ సిబ్బందికి బైెటిల్‌ అలంకరించిన లక్ష్మిపతికి నన్ను నా కవిత్వాన్ని ఎరిగిన నా బాల్యమిత్రులు కె. నారాయణరెడ్డిక్కి బి. చంద్రశేఖర్‌కు, టి. కిషన్‌రావుకు దూరప్రాంతాలకైనా అభిమానధనంతోనే నా కవితలను పంపించే కరీంనగర్‌ “౧019951002 0064గ615' మిత్రులు శ్రీ కె. ప్రభాకర్‌రెడ్డికి, సతీష్‌కు, రవికాంత్‌కు నన్ను నా కవితలను అభిమానించే మా కర్‌ంనగర్‌ (గంజ్‌) హైస్కూల్‌ సోదరసోదరీ ఉపాధ్యాయులకు “లచ్చన్నా' అని ప్రేమతో పిలుచుకొనే ఎందరో మా కరఠింనగర్‌, ఎస్‌.ఆర్‌.ఆర్‌. కళాశాల 1979-81 బ్యాచ్‌ మిత్రులకు నన్ను ప్రాణంలా చూసుకొనే అమ్మకు నన్ను అణువణువునా అర్థం చేసుకొనే నా జీవిత భాగస్వామి శారదకు మా పెద్దబ్బాయి శరతరు, చిన్నబ్బాయి వంశికి ముద్దులతో మరచిపోయాననుకొన్నా మరచిపోలేని చెప్పే స్పేహమయికి ఇంకెందరో ఆత్మీయులకు, అభిమానులకు కూడా ........

ఆ లక్ష్మినారాయణ

  • ముందుమాట |!
  • నామాట |
  1. మౌన సముద్రం 1]

  2. అక్షరాలు 2

  3. ఉదయం 8

  4. కవీ! నువ్వ ఆత్మహత్య చేసుకో! (|

  5. _ ఎక్కడ జనులు మునులై సంచరిస్తారో ర్‌

  6. ఫుట్‌పాత్‌ 7

  7. మనను 8

  8. గల్ఫ్‌ వార్‌ 10

  9. గోడలు 12

  10. జీవితం 13 11 దాహం 114

  11. భావకుసుమము 15

  12. నువ్వూ-నేనూ 16

  13. ఈస్టర్‌-పక్షి 17

  14. వేట 18

  15. దేశభక్తి 19

  16. విచ్శిన్నక్రియ 20 18... మార్చు దాని తీర్చు 21

  17. అలిళెట్టీ ప్రభాకర్‌ స్మృతిలో లల

  18. కొన్ని హైకూలు 24 21 ఫలవృక్తం 26

  19. కడలిపై 27

  20. సీతాకోకచిలుకలు 28

  21. మనిషీ - మౌనసముద్రం 29

1 25. డైరి 30 26. ఐ పిటీ యూ! 31 27. అక్షర సత్యాలు 32 28. కవినై 33

|! 29. ఆత్మహత్యా సదృశం 34 30. పిల్లలు 35 31. కవిత ఊర్కే పుట్టదు 36 32. అక్షరం 37 33. అనుభవం 38 34. నగరం 39 35. బతుకు 40 36. సినీ కల్చర్‌ శ

| 37. తెర తీయగరాదా! 42 38. స్వర్ణభారతి 43

. 39. చూపులు మోసపోతున్నాయి జీత 40. కీర్తి శీర్‌ జక ప్రకృతి ఒడిలోకి 46 42. వెన్నెల శీ 43. జీవనది 48 44, కూలి 4రి 45. ఉత్తరం క్‌0 46. పనిమనుషులు 51 జే, పునర్జన్మ క5్‌2 48, కవిత 54 జేరి కన్నీళ్ళు. రానీయద్దు క్‌5్‌ 50. కార్గిల్‌ వీర జవాన్ల స్మృతిలో 56

డాః ఎన్‌. గోపి ఎం.ఏ., పిహెచ్‌డీ.

ప్రముఖ కవి, పరిశోధకులు వైస్‌ చాన్స్‌లర్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హెదరాబాద్‌. నో తేది : 22-12-1999.

సబ్బని లక్ష్మినారాయణ రచించిన 'మౌొనసముద్రం'లో మునకలు వేశాను. ఈ లక్ష్మినారాయణుడు పత్రికలనుండి అనాదరణకు గురై, శంకరుడిలా గరళం మింగాడు. ఆ గరళం ఈ సంపుటిలో అమృతంగా మారింది. ఈ అమృతాన్ని కవితాభిమానులకు పంచడానికి ఈయన సముద్రమంత తపస్సు చేశాడు. ఇతడు పారుషమున్న కవి. ఈ పుటల్లో ఇతడెన్ని ప్రయోగాలు చేశాడో, ఎంత వైవిద్యాన్ని చూపాడో మీరే చూడండి.

అకాలంగా మరణించిన అలిశెట్టిని గురించి రాస్తూ

“వెళ్ళి పోయిన నేస్తమా

రాయడానికి సంగతులనేకం ఉన్నా

నీ సృృతిలో లీనమై

ఈ కొన్ని అక్షరాలు ఈ రోజున” అంటూ వ్యవస్థను గుర్తుకు చేస్తున్నాడు.

ఇతని కవితలు చదివితే ప్రతి కవితలో ఒకటి రెండు గట్టిలైన్నను ఉటంకించవచ్చు.

“కవిత నన్ను ఒలలాడించే హృదయరాణి

కవిత నన్నెప్పటికీ కరుణిస్తుంది”.

“కన్నీళ్ళు రానీయద్దు

కర్కషత్వం ముందు, దానవత్వం ముందు, కల్మషత్వం ముందు

కన్నీళ్ళు రానీయద్దు”

అనే ఇతని పొారుషమే ఇతని కవిత్వం.

సబ్బని ఏ కవిత ముట్టుకొన్నా కన్నీళ్ళు వెచ్చగా తగుల్తాయి. మానవత్వం చల్లగా స్పృశిస్తుంది.

లక్ష్మినారాయణా! “'మౌనసముద్రం' అన్నావు కాని, అది నిజంగా శబ్ధసము(ద్రం! నీ హృదయ శబ్ధసముద్రం. నీకు నా హృదయ పూర్వక అభినందనలు.

నా మాటు 4 న౮౭| 5౧౦6410 6262 2 (60000, గా౭॥9 ౧600/6 ౧/0 06/67 6౮/276౧౩” = శీగ9/00౧4౧65 45 - 380 8,6, నా గురించి చెప్పుకోడానికి నా దగ్గర ఏమీలేవు గొప్పగా, నా కవితలు తప్ప. పందొమ్మిది వందల డెబ్బె తొమ్మిది ఎనబైల నుండి ఈ ఇరువైయేళ్ళ సాహితీ ప్రస్థానంలో, మరీ సీరియస్‌గా తొంబైల నుండి పత్రికలను, కవిత్వాన్ని గమనిస్తుంటే ఆంధ్రదేశంలోని పత్రికల్లో నా కవితలు బొటాబొటిగా తొమ్మిది మాత్రమే ప్రచురితమైనాయి. కవికి పత్రికల్లో కవిత్వం ప్రచురణ విషయంలో ఇంతటి వడపోత, వస్త్రగాళం పట్టడం ఎందుకో, ఏ గీటురాయితో కవి రచనలను పత్రికలవాల్లు గుర్తించి స్వీకరిస్తున్నారో తెలియదు. కవికి రచనలు పత్రికల్లో వస్తాయని, పేరు, కీర్తి గుర్తింపు వచ్చాక కాస్త ఆగి పేరు గుర్తింపు వచ్చాక పుస్తకం అచ్చేసుకొమ్మని చేప్పే కవులున్నారు ఆంధ్రదేశంలో. నిజంగా కవి అన్నవాడు పేరు, కీర్తికోసం పాకులాడులా? పత్రికల్లో కవితలు రావాలని, వస్తాయని వెర్రిగా ఎదురుచూడాలా? కేవలం తెలుగునేల పత్రికల్లోనే రావాలని ఎదురుచూడాలా? ప్రపంచం చాలా పెద్దదని కవి రవి లాంటివాడని, నర్వప్రపంచం అతని హద్దు అని కవులు, రచయితలు, పత్రికా సారథులు గుర్తించకూడదా! కవుల్లో ప్రాంతాల వారిగా, వర్ణాల వారిగా వాదాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా కవులు అని వేరుగా ఉంటారా! కవి అంటేనే విశ్వప్రపంచం, విశాల విశ్వం అతని అవది, హద్దు అని గుర్తించే ధన్యులుంటే ఎంత గొప్ప లోకానికి! కవి అంటే సమాజమని, కవి అంటే దేశమని, కవి అంటే విశాల విశ్వమని, కవి నిజాయితిపరుడని, కవి నీతిగలవాడని, కవి ఈర్ష్యగలవాడు కాదని, కవి స్నేహితుడని, కవి ఆప్తుడని, కవి మిత్రుడని, కవి లోళహితుడని, కవి సముద్రుడని, కవి బోళాశంకరుడని, కవిని శ్రేమించాలని కవిని ఆదరించాలి, కవిని గౌరవించాలి. కవిని మామూలు మనుషులు పాళకులు గౌరవిస్తారేమో, గుర్తిస్తారేమో కాని కవిని కవే గుర్తించని గౌరవించని సమాజంలో కవి మౌనిలా బతుకాలేమో పేరు కీర్తిలను త్యజించి. నిత్య వ్యవహారాలన్ని తనవని భావించి చూసుకుంటున్న కవికి, కవితలు కవితల పుస్తకాలు కూడ తన బిడ్డలాంటివే, వాటి బాగోగులు కూడ చూసుకొవాల్సిన బాధ్యత శవిదే. తన కవితలకు జీవానిచ్చి శక్తినిచ్చి ప్రపంచం మీదికి వదిలిపెడితే అవి తమ స్థానాన్ని వెతుక్కుని నిలదొక్కుకొని బతుకుతాయి. కవిత్వానికి పాఠకులు తక్కువ, కవిత్వం పుస్తకాల అమ్మకాలు తక్కువని చెప్పేవారున్నారు. కవి నిరుత్సాహపడవలసిన 1||

పని లేదేమో, కవి స్వేచ్చగా పిట్టల్లాగా తన కవితలను లోకం మీదికి వదిలిపెట్టాలి. కవుల్లో సిన్సియారిటీ, నిజాయితి వున్నప్పుడు, కవిత్వానికి అంత శక్తి వున్నప్పుడు అవి తప్పకుండా బతికి నిలుస్తాయి. వాటిని అందుకుని ఇదరించే ధన్యులు తప్పకుండా వుంటారు. సర్వకళలను ఆదరించి అభిమానించే కళాహృదయులు వున్నప్పుడు సాహిత్యలోకంలో కవిత్వాన్ని కూడ ఆదరిస్తారనే నమ్మకం . 1991లో పుస్తకథ అచ్చువేసుకోవలసిన నేను 1999వరకు ఆగవలసి వచ్చింది కాసేపు పత్రికలతో ఈ తొమ్మిదేళ్ళు హోరాహోరి పోరాటం కవితలు పంపడంలో. నేను తెలుగు కవిత్వ లోకానికి సంకలనంతో ముందుకు రావడం ఓ పదేళ్ళు లేటు. ఏ కవికైనా అతని కవిత్వం అతని జీవితం, సమాజం, అతని చదువు, అవగాహన పరిధిలోనే వుంటాయి. కవిత్వానికి ఇది మాత్రమే రాయాలి, కవిత్వానికి ఇదే కావ్యవస్తువు అని గమ్యాన్ని మార్గాన్ని దిశను నిర్జేశించవలసిన అవసరం ఎవరికైనా ఉండకూడదేమో! దేశ కాల పరిస్థితులను బట్టి, సమాజ అవసరాలను బట్టి కవిత్వం తన మార్గాన్ని తన బాటను అదే సుగమము చేసుకుంటూ ముందుకెల్తుంది. కవిత్వం కాలనికి ప్రతిబింబమే ఏప్పటికైనా. ఏ వ్యవస్థనైతే లోకానికి వెలుగులు చూపెట్టాలో, మంచిని చెప్పాలో, నీతి నిజాయితిగా వుండాలో అలాంటి సాహిత్య వ్యవస్థలోనే దీపం కింది చీకటిలా లోసుగులున్నాయేమో. కవిని, కవిత్వాన్ని తూచడానికి నిజాయితీపరులు, నిష్పక్షపాతులు కావాలి. అల్పులు, అవకాశవాదులుండకూడదు. అలాంటి వారుంటే కవిత్వ లోకానికి భావితరాలకు అది గొడ్డలిపెట్టే. గంజాయి వనంలో తులసి మొక్కలా సాహిత్యలతను బలవంతంగా బతికించుకుంటున్న కాలంలో, కొత్త కలాలకు, కొత్త గళాలకు సాహిత్య లోకంలో చోటు లేకుండ చేయడం, చూడడం సాహిత్యనేరం, సాహిత్య ద్రోహం కూడ అవుతుంది. సమకాలీన భారతంలో 25 భాషల నుండి కవిత్వం వస్తుంది. భారతీయాంగ్ల కవిత్వంతోపాటు సరిహద్దుల్ని చెరిపేసుకుంటూ ఎల్లలు దాటి విశ్వకవిత్వం వస్తుంది. అందులో తెలుగువారి కవిత్వం స్థానం ఎంత అని మనం నిజాయితీగా మననం చేసుకోవాలి. శ్రీశ్రీలు, తిలక్‌లు పుట్టిన ఆధునిక తెలుగు కవిత్వసీమలో మనకిపుడు ఉత్తన్లు సాహిత్యాన్ని, కవిత్వాన్ని గుర్తించి, ఆదరించి; ఆహ్వానించి, విశ్లేషించి, గైడ్‌చేసి, ప్రమోట్‌చేసే పత్రికలు కవులు, విమర్హక్రులు కావాలి. ఈ శతాబ్ధి తొలుదొల్త సంప్రదాయ కవిత్వం నుండి, భావ కవిత్వమని, అభ్యుదయ కవిత్వమని, దిగంబర కవిత్వమని, విప్లవ కవిత్వమని, దళిత కవిత్వమని, స్త్రీవాద కవిత్వమని, మైనారిటీ కవిత్వమని ముందుకు వచ్చింది. ఇన్ని మలుపులను, మార్పులను చూసిన తెలుగు 111

సాహిత్య సీమ గొప్పదే. ఇంకేప్రత్యేకమైన వాదాలుగా తెలుగు కవిత్వం ముందుకు వస్తుందో చూడాలి. _ కవికి, కవిత్వానికి పరిధి విశ్వవ్యాప్తం. మన వేమన్న ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయాడంటే అది వేషున్న పద్యానికున్న గొప్ప తనమే. 'షేకప్పెయర్‌లాగా. మన కాళిదాసు విశ్వవ్యాప్తమయాడంటే, అది ఆ కవి ప్రతిభావ్యుత్పత్తులే కారణం. కవులకు, కావ్యాలకు కరువా ఈ దేశంలో! అమూల్యమైన, అమోఘమైన సాహిత్య చరిత్ర, సాహిత్య బాండాగారం ఉన్న దేశంలో పుట్టినందుకు మనము గర్వపడాలి. కాని సంకుచితంగా నేను, నా వర్గం, న్నా వాదం, నా మతం అంటు కవిత్వం యొక్క విశ్వ జననీయతను మరచి బావిలోని కప్పల్గ్లాగా బతకడం, కృత్రిమ దాహార్తిని తీర్చుకుంటూ బతకడం, విడివిడి గ్రూపులుగా ఉండిపోవడం సాహిత్య సీమలో మంచి వాతావరణం కాదు. సాహిత్య ప్రయోజనాన్ని సర్వ ప్రపంచాన్ని మరిచి లిమిటెడ్‌ సర్కిల్స్‌లో బతుకడం దురదృష్టకరం. మౌలిక సామాజిక అంశాల ప్రాధాన్యత దృష్ట్యా సహజపరిణామంలో ఏ వాదాన్నయినా ఆహ్వానించవలసిందే. కాని బలవంతపు పెంపుడు సాహితీ సిద్ధాంతాలు, వ్యక్తుల వాదాలు కాలానికి తలవొగ్గి కొట్టుకపోతాయి. “తేలిగ్గా వచ్చింది, తేలిగ్గానే పోతుంది”. ౧6 06 అం 616, 116 ౧06 ౪6 1/6 అన్నారు పెద్దలు. ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగునేల సాహితీ వ్యవస్థ గురించి చెప్పడానికి మాటలు చాలక, కలుషితమైన వ్యవస్థలో అది క్రుళ్ళిపోతున్న పండు. “'క్రుళ్ళిపోతుంది వ్యవస్థ పడుతుంది ద్‌ర్బ అవస్థ చేయాలి దానికి శస్త్ర చికిత్స అందుకు కావాలి లోకానికి సత్తా" అని చెప్పవలసి వస్తుంది. నా బోటివాడు ఎందుకిదంతా రానుకొంటున్నాడు. ఇక్కడంతా మౌన గొడాంధకారమే. ఏ గుండెలోతుల్సి తట్టిచూసినా, పట్టిచూసినా స్నేహ హస్తాలు, అమృత హస్తాలు. కరువే. సాహిత్య వ్యవస్థలో విమర్శ సమీక్ష కళ్ళలాంటివి, కరదీపకల్లాంటివి, ముందు బాటల్లాంటివి. అటువంటి ప్రక్రియ ఇట్టి మొక్కుబడి వ్యవహారం అయిపోయింది. ఏదోకొంత కవిత్వం రాసాను, ఈ శతాబ్ధి చివ్వర్గో 1993 లోనైనా పుస్తకం వేసుకోవాలనే కోరిక ఇది. కావాలని కవిత్వం రాయాలని వేనెప్పుడూ కవిత్వం రాయలేదు. ఒక్కో కవితకు ఒక్కో సందర్భం, కవి సమయాలున్నాయి. నిశితంగా చూస్తే కొన్ని కవితల్లో నేనే కవితై, కవితే నేనై నాలో నేను కంపించిపోయిన నందర్భాలున్నాయి, అనుభూతులున్నాయి, జ్ఞాపకాలున్నాయి. కవిత్వానికి కావాలని సీ

సొగసులు దిద్దాలని నేనెపుడూ చూడలేదు, నిరాడంబరంగా సహజంగానే వచ్చింది ఇదంతా. కవిత్వంలో మెటాఫర్డ్లు, ఇమేజరీలు లెవ్వు అనే మిత్రులుండచ్చు. మల్లెపువ్వు గుభాళిస్తూ సువాసనలిస్తూ చూడడానికి బాగుండచ్చు కాని గడ్డిపువ్వు రూడా సువాసనలు లేకున్నా చూడడానికైనా బాగుండదా బతుకును ప్రతిబింబిన్తూ. వివిద సందర్భాలు, వివిద జ్ఞాపకాలు, అనుభవాలు, సన్నివేశాలు, పరిస్థితులకు స్పందిస్తూ కవిత్వం గురించి కూడా, సాహితీ వ్యవస్థ గురించి కూడా స్పందించక తప్పలేదు కవితల్లో. ప్రతిభావంతులైన కవి కుమారులెందరో ఉన్నారు ఆంధ్రదేశములో. జీవితాల్ని కూడా త్యాగం చేసిన కవులు, ధన్యజీవులు కూడా ఉన్నారు, వాల్లకు తలవంచి నమస్కరించాలి. ఇంకా కొంత ముందుకెల్తే వ్యక్తి ప్రాధాన్యతకన్న, వ్యక్తి అనుభూతులకన్న వివిద సామాజిక అంశాలపై విసృతంగా అధ్యయనం చేసి అవగాహనతో కవిత్వం రాయొచ్చు. అవి జనజీవనంలోని సామాన్య వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, మౌలిక భావనలు కావచ్చు, పనులు కావచ్చు. ఈ సంకలనంలో ఉన్న యాబై కవితల్లో 1998 వరకు రాసుకొన్నవి నలబై కవితలు ఉన్నాయి. 1999లో రానుకొన్న పది కవితలు నాకు వస్తువురీత్యా, కవిత్వీకరించడం రీత్యా తృప్తినిస్తాయి. నేను వాటిని ప్రత్యేకమైన శ్రద్ధతో, కొంత అవగాహనతో, అధ్యయనంతో, గమనింపుతో జూలై 1999 నుండి నవంబర్‌ 1999 లోగా రాసాను. కవిత రాయడంలో కవి ఎన్నో మెలకువలను నేర్చుకోవాలి. నాకు అలవడిన, నాకు అందిన కవత్వమింతే. కవిత్వంపై ప్రేమతో, మమకారంతో కవిత్వం చదువుకునే విద్యార్థిగా ఆధ్యయనం చేసే అవకాశం కల్గింది కాబట్టి కూడా కవిత్వనుంటే ఇంకా శేమనే. కవిత గురించి “కవిత'లో రాసినట్టు కొన్ని కొన్ని నందర్భాల్లో కవిత్వం రాయకుండా ఉండలేనేమో. ఏది రాసినా, ఏమి రాసినా కవిత్వంలోనే రాయాలన్నంత ప్రేమ. కవిత అనే ముద్దు బిడ్డను ఆదరంగా లోకం అందుకొని అక్కున చేర్చుకునేలా చేయడం కవుల బాధ్యతే. ఎక్కడ విన్నా కవిత్వానికి పాఠకులు కరువు, కవితా సంకలనాల అమ్మకాలు తక్కువ అనే మాటనే. అంధ్రదేశంలోని అన్ని పుస్తకాల షాపుల్లోకి కూడా రెండు వందలకు మించి పుస్తకాలు అడగరేమో. మంచి సాహిత్యాన్ని, మంచి కవిత్వాన్ని మంచి కవిత్వ వాతావరణాన్ని కవి మిత్రుల సర్కిల్స్‌ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవనరం ఉంది. కవిత్వ ప్రచురణ, కవిత్వ పుస్తకాల పంపిణీ ఒక సమిష్టి వ్యవహారంగా చూసుకొనే వ్యవస్థ ఉంటే బాగుంటుందేమో. మంచిని కాంక్షించేవారు, మంచిని పెంచేవారు ఎప్పటికీ ఉంటారు. అలాంటి మంచికోసం చూడడం మంచిది. ౪

చివరగా కవి యొక్క కవిత్వానికి న్యాయనిర్లేతలు ఉత్తములైన పాఠకులే. వ్యక్తులను కలవడానికి, కొలవడానికి ప్రమాణాలన్ని వేరైపోతున్న కాలంలో నిరాడంబరంగా, నిజాయితీగా మీ ముందుకు వస్తున్నాను. ఆదరించి, అక్కున చేర్చుకునే ధన్యులు, సాహితీప్రియులు తెలుగు తెలిసిన నేలలో ఉన్నారని అలాంటి 'స్పేహహస్తాల కోసమే ఈ కవితా సంపుటి. మాతృభాషపై మమకారంతో, అభిమానంతో తెలుగు కవిత్వాన్ని ఆధ్యయనం చేసి, అంగ్ల సాహిత్య విద్యార్థిగా విశ్వకవిత్వాన్ని కూడ కొంత చూసి భారతీయాంగ్ల కవిత్వంలో పరిశోధన చేస్తున్న విద్యార్థిగా భారతీయ కవిత్వాన్ని భారతీయాంగ్ల కవిత్వాన్ని కూడ జీవితంలోకి ఆహ్వానించి, స్వీకరించి కవిత్వ మార్గంలో ముందుకెళ్తున్నాను. వ్యవస్థలో కవికి శత్రువులు, మిత్రులు ఎవరు ఉండరని, ఏ కవికైనా అతని కలమే అతని బలం, ఖ్యాతి, కీర్తి అని నమ్ముతూ నా కవితలను ఆదరించే మిత్రులకు, హితులకు, శ్రేయోభిలాషులకు, అమృత హృదయులకు నమస్కరిస్తూ కొత్త సహస్రాబ్ధిలోకి వెళ్ళిపోతున్న తరుణంలో తెలుగునేల సాక్షిగా శుభాభినందనలతో ....... కరీంనగర్‌, 7 నయా ఆ 24 డిసెంబర్‌ 1999. బ్యా "

(లక్షినారాయణ) ॥ స!

కే మౌన సముద్రం గరళం మింగాలి తప్పదు శంకరుడిలా బతుకు సముద్రాన్ని చిలికితే హాలాహలమే వస్తుంది ముందుగా. మౌన సముద్రం ఇది బతుకు గాంభీర్య హృదయ సముద్రం ఇది. పాలసముద్రం కాదు ఇది తుపాను ముందటి ప్రశాంత సముద్రం ఇది. దేవతలు లేరిక్కడ అంతా మానవులు, దానవులే. కాలసర్పంతో బతుకు సముద్రాన్ని చిలకాల్సిందే ఎవరైనా తలవైపో, తోకవైపో చేరిపోవాల్సిందే. విభజనరేఖ తప్పదు మూడోపక్షం ఉండదు, ఉండకూడదు. హాలాహలం, అమృతదార, కవిత్వదార వస్తుంది. అమృతదార, కవిత్వదార స్వీకరించడానికి సజ్జనులకు, సుకవులకు స్వాగతం. సబ్బను లక్ష్యినారాయణ

౭2 అక్షరాలు అక్షరాలు ధ్వనిస్తాయి, అక్షరాలు జ్వలిస్తాయి అక్షరాలు కదిలిస్తాయి, అక్షరాలు కరుణిస్తాయి. అక్షరాలను అందంగా పొదిగితే గీతాల మాలికలౌతాయి, అక్షరాల గవాక్షాలౌతాయి సాహితీ పందిరికి తోరణాలై నిలుస్తాయి భాషకు, భావానికి నిచ్చెనలౌతాయి. అక్షరాలు గుండె గుండెకు బాటలు వేస్తాయి ఎల్లలు తెలియని సీమలను కలిపివేస్తాయి. అక్షరాలు అరుస్తాయి వేధనతో ఆనందంతో కేరింతలు కొడుతాయి. అక్షరాలు కవి గుండెల్లో కదులుతాయి వెన్నెల సముద్రాలౌతాయి, రుధిర జ్వాలలౌతాయి కమ్మని వసంతాలౌతాయి, కావ్యగానాలౌతాయి. అక్షరాలను వినమృడనై చూస్తాను, వింటాను శ్వాసిస్తాను, శాసిస్తాను. కలం గుండెల్లో అక్షరాలను నింపి వేధనతో, ఆర్తితో, ఆనందంతో పండు వెన్నెలను, కటిక చీకట్లను కలిపి కలం కుంచెతో బతుకు పందిరిని గీస్తాను జీవిత అనంత సీమలను చూస్తాను. 1990 ప్రచురణ: “మానేరు టైమ్స్‌" వారపత్రిక 8-14 మార్చి 199] మౌన సముద్రం

వ ఉదయం ఉదయం ఒక ఆశాకిరణం, ఆశల పాదరిల్లును అవనిపై వెదజల్లడానికి కాలం నిచ్చెనపై నిలుచుండి గమ్యాన్ని చేరడానికి ఉదయం రేపటి జీవితానికి సోపానం. ఉదయం వేయి వసంతాలను పూయిస్తుంది వేయి గతాలను మననానికి తెస్తుంది తెలకెలవారిన ఆ కువకువల చప్పుడులో ఓ ప్రశాంత గాంభీర్య సముద్రంలా ఏ మానవుడో తాలిసంధ్యాకిరణాలు ఆస్వాదించి ఈ జగతికి ఆహ్వాన గీతం పాడినపుడు ప్రకృతంతా పులకించి పోయినప్పుడు నేను కవివై, రవినై ఈ జగతిని వీక్షించినపుడు నాలో అణువణువు ప్రకృతిలో లీనమై, స్వరమై, నాదమై కాలంతో లయించి పోయినపుడు అక్షరాలే ఆహ్వానగీతికలై కలం కన్నీటి సిరాలో ముంచి ఏ కమ్మని కావ్యమో రాయాలని ఏ చక్కని చిత్రమో గీయాలని వేయి ఉషస్సుల అనంతసాగరానికి ఆహ్వానం పలుకుతూ ......... 19390 ప్రచురణ; “ఉపాధ్యాయ' మాసపత్రిక, డిసెంబర్‌ 1995 సబఖ్బని లక్షినారాయణ

త

కవీ! నువ్వు ఆత్మహత్య చేసుకో! కవీ! నువ్వు ఆత్మహత్య చేసుకో!

ఇది నా హృదయం, బద్దలయ్యిందో

అగ్ని పర్వతం అర్ధం చేసుకో

కవీ! ఎవరు గుర్తిస్తారు ఈ దేశంలో

నువ్వు గొంతెత్తుకుంటే తప్ప.

కవీ! కాసుల కోసం చూస్తూ కవిత్వం రాయకు కవీ! అక్షరాలచ్చుపోసి ఇంటింటికీ తిరిగి అమ్ముకొంటానని మాత్రమసలూ రాయకు కవీ! అక్షరాలను అమ్ముకోకు

అవి ఏడుస్తాయి పసిపిల్లల్లా

కవీ! గాలి నెవరు బంధిస్తారు

జలపాత ప్రవాహాన్నెవరడ్డగిస్తారు

సముద్రపు హోరు నెవరాపుతారు

నిప్పు నిజాయితీ నెవరు కాదంటారు

కవీ! కన్నీటికి విలువనెవరు కడుతారు

కవీ! నీ అక్షరాలను తూచడానికి

ఈ దేశంలో హృదయాలు లేనప్పుడు నిజంగా నువ్వు ఆత్మహత్య చేసుకో!

కవీ! నీవాడు తెలుగువాడు, భారతీయుడు నిన్ను గుర్తించనినాడు

వెళ్ళిపో! ఎల్లలు తెలియని సముద్రాలు దాటి కవీ! కవీశ్వరుడివైపో అక్షరాల గవాక్షాలు దాటి కవీ! అక్షరాలను కన్నీటిసిరాలో ముంచి కవిత్వం వ్రాయి

అక్షరాలను నెత్తుటి మరకలతో జోడించి రుధిర-జ్వాలలు వాయి

కవీ! మరుగుజ్జులు, ఊష్త్ర పక్షుల మధ్య మేరునగధీరుడివై నిలిచిపో

కవీ! గాలిలా వ్యాపించు

మౌన సముద్రం

వ్‌

నీరులా ప్రవహించు నిష్పులా అంటుకో నేలనేలంతా కవిత్వమైపో ఆకాశ హర్మ్యానివై, అవని కిరీటమైపో కవీ! నిజాయితీ నీలో ఉన్నప్పుడు నీ సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తివి! కవీ! నీ కవిత్వాన్ని తూచడానికి ఈ ప్రపంచంలో రాళ్ళు లేనప్పుడు నిజంగా నువ్వు ఆత్మహత్య చేసుకో!

ర ఫిబ్రవరి 1991 సబఖ్బని లక్షినారాయణ

6 ఎక్కడే జనులు మునులై సంచరిస్తారో ఎక్కడ జనులు మునులై సంచరిస్తారో ఎక్కడ మంచి, మానవత వికసించబడి ఉంటాయో ఎక్కడ అభాగ్యుల, అన్నార్తుల రోదనలు వినబడవో ఎక్కడ సత్యం, ధర్మం, న్యాయం బతికి నిలుస్తాయో ఎక్కడ దగా, మోసం, కుట్ర, దోపిడీ లేని సమాజముంటుంటో ఎక్కడ అమాయక హరిణాలు స్వేచ్చగా బతుకుతాయో ఎక్కడ కులాలు, కుమ్ములాటలు, బతుకు బాధలు ఉండవో ఎక్కడ అబలలు సబలలై బతుకును పండించుకుంటారో ఎక్కడ యువత నిర్వీర్యమై నీరు కారిపోకుండా ఉంటుందో ఎక్కడ మనిషి 'నేను'గా కాళఠ 'మనరిగా కలిసి బతుకుతాడో ఎక్కడ జనం గొజ్టెల్లా తలవంచక బతుకుతారో ఎక్కడ కవులు, కళాకారులు, రచయితలు నిర్భయంగా గొంతెత్తుతారో ఎక్కడ మానవుడు మహనీయుడై, మనిషై బతికి నిలుస్తాడో అక్కడ నన్ను పుట్టించు తండ్రీ! అలాంటి సమాజములో నన్ను బతకనీయి తండ్రీ! ఏప్రిల్‌ 1991 ప్రచురణ: 'అంధ్రప్రభ' వీక్లీ 29-05-1991 మౌవ సముద్రం

7

ఫుట్‌పాత్‌ అలా అలలా జన సముద్రంలో కదలి పోతున్నపుడు మట్టిలో మట్టి కొట్టుక పోయే నీగ్రో పిల్లలు వైభవ భవనాల ముందు అనాధ శిశువులై, అద్దాల్లో కళేబరాలై, ఆనంద డోలికలై తేలిపోతుంటారు కాళ్ళు చేతులు లేని మానవ కళేబరంవాడు ఆకలీ సంద్రములో పడి నడిరోడ్డులో తాబేలులా ఈదుకుపోతుంటాడు. గోచీ గుడ్డలు లేని నిర్భాగ్యపు ముసలివాడు కాలే కడుపు కోసం చౌరస్తాలో పక్షిలా గొంతెత్తి పాడుతుంటాడు. పుట్‌పాత్‌లన్నీ బతుకు ఫ్రంగళ్ళయిన చోట పులి చూసిన లేడి అదిలింపులే బతుకులైన చోట ఏ నిర్జాక్షిణ్యపు లాఠీదెబ్బలకో బతుకులన్నీ ఉరుకులు పరుగులు తీస్తాయి ఏ గుండీలో, పిన్నీసులో, మొలదారాలో బ్రాకెట్లో, జాకెట్లో, పాత గుడ్డలో కొత్త సీరుకులో బతుకు అందాలన్నీ పుట్‌పాళ్‌పై అంగడిలా దర్శనమిస్తాయి. కూటికోసం కోటి విద్యలన్నీ పుట్‌పాత్‌పై గౌరడీ పిల్లలా నాట్యమాడుతాయి ఇక్కడే రోడ్డే స్వంతమైన వారందరు బతుకు లోగిళ్ళను ప్రాంగణములా పరచుకొంటారు. ఇక్కడే బతుకులన్నీ అలసిపోయి రాత్రుల్లోకి చొరబడి పాలపుంత వెన్నెల్లో మంచు"ముద్దలా తడిసిపోతాయి. ఇక ఎవరంటారు పుట్‌పాత్‌లుట్టి జనులు నడిచే రోడ్డని మాత్రమే అవి నడీచే చరిత్రకు సరాసరి రహదారులు రోడ్డుమీద బతుకుల సజీవ దర్పణాలు అవి ఎందరికో బతుకునిచ్చెన్లు మరెందరికో బతుకు వాకిళ్ళు,

ఆగష్టు 1991

ప్రచురణ: 'ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక జూన్‌ 1999 సబ్ద్బని లక్షినారాయణ

8

నునసు

మసకమసగ్గా మనసు పొరల్లోకి

తాలుచుకస్తుంది బాధా కెరటం

పక్షిలా ఎగిరిపోతూ వస్తూ, గుండె లోతుల్లో చిక్కుకుంటుంది.

రస ప్లావితమై తేలిపోతూ

హృదయ మేఘమౌతుంది.

దూరానికి భారం పెరిగి

గుండె గొంతుక మాటరాని పక్తిలా మౌనంగా రోదిస్తూ అశ్రుకబాల సంచలనమై ఆవిరవుతుంది.

కన్నుల పారదర్శకంలోకి చూడలేని బతుకులో . వేయిమబ్బు తునకల ఆశల వలయాలైపోతుంది. పాటనే పోగొట్టుకొన్న పక్షిలా

హృదయం శూన్యగోళమై, నీటి బుడగై పగిలిపోతుంది. మనసే కాని మనను గాలిపటమై

దొరం తెగి శూన్యంలోకి గమ్యం తెలియక రాలిపోతుంది. ఎగ్రట్‌ చవిటిపర్ర ఇసుక శేణువుల్లో

ఒడ్డునపడ్డ చేపపిల్లలా గిలగిల కొట్టుకొంటుంది. వేటగాడి ఉండేలు దెబ్బతిన్న ఒంటరి పక్షిలా సుడిదిరిగిపోతుంది.

జ్ఞాపకమొక మల్లెల సౌరభమై నిలిచి కూడా

మనస్సు మేఘమై కడివెడు కన్నీళ్ళు కుమ్మరిస్తుంది. అందీ అందని అనంత సుదూర తీరాల్లో పోగొట్టుకోబడి చుక్కాని లేని నావలా సముద్ర కెరటాల్లో తేలిపోతుంది. బతుకు పారల్లోని నీలినీడల్లో

కన్నీళ్ళ బరువెక్కి తడీసి ముద్దయిపోతుంది రంగురంగుల ఇంద్రధనుష్సు వెన్నెల జలతారై

నీట్‌ తుంపర వేగానికి కరగి మటుమాయమనవుతుంది. చొూన సముద్రం

శే

ఎవరెన్నయినా చెప్పనీయండి కనలిపోయి గుండె పొరల్లోంచి పెల్లుబికి వచ్చిన హాహాకారపు ఆర్తిని మీరు వినలేరు రక్తానికి, కన్నీటికి విలువ కట్టలేరు డాలర్ల కంచెలు కట్టి మానవత్వాన్ని పూయించలేరు ఇక ఇవ్వాల్ల చూసుకొంటే బేరీజు వేసుకొంటే గెలిచిన వారెవరో ఓడిన వారెవరో.

(గల్ఫ్‌వార్‌ ముగిసాక 27-2-1991) సబ్బుని లక్ష్కినారాయణ

12

గోడలు

మన హృదయాలకు కవాటాలుంటాయి మన మనస్సుల్లోనే మెలికలుంటాయి అసలు మనలోనే గోడలుంటాయి

కాని గోడలకు గోడలేముంటాయి. కళ్ళున్నా చూపులేని వ్యవస్థలో

అవి గోడలే!

రాయడానికి కాగితాలు, కలాలు ఉన్నాకూడా ఎవరు రాస్తారులే కన్నీటి పాట నమ్మకాల నీడల్లోనే

నమ్మక్షాలన్ని వమ్మయి పోతున్నపుడు రేపటి బతుకు పేజీలన్ని

ఇవ్వాల్లే చిరిగి పోతున్నపుడు

గొడలుట్టి గోడలే కాదు

చరిత్ర పాఠ్య పుస్తకాలు

శిథిల జీవిత గాథల సజీవ సత్యాలు కాలప్పు కఠిన శిలల కింద

నలిగి నిలచిన బళుకు గాథలు

బతుకు బరువుల్ని మోస్తు

మౌనంగా తపస్సు చేస్తున్న మునులు. బతుకుల్లో పోరాడే వారో

బతుకుల్నే పోగొట్టుకొనేవారో

అక్షరాలై, అగ్నికణాలై

ఈ చరాచర విశ్వప్రాంగణంలో

పాటై, పల్లవై, జీవనరాగమై

శిలువ వేసిన క్రీస్తుల్లా బలైపోతున్నపుడు మనం రాయలేని గీతాలన్నింటికి

అక్షర ప్రతిరూపాలు గోడలు

మనం తలలు వంచినా

కళ్ళెగరేసినా

కనిపించే కఠిన సత్యాలు గోడలు.

మే 1991

మౌన సముద్రం

శే

ఎవరెన్నయినా చెప్పనీయండి కనలిపోయి గుండె పొరల్లోంచి పెల్లుబికి వచ్చిన హాహాకారపు అర్తిని మీరు వినలేరు రక్తానికి, కన్నీటికి విలువ కట్టలేరు డాలర్ల కంచెలు కట్టి మానవత్వాన్ని పూయించలేరు ఇక ఇవ్వాల్ల చూసుకొంటే బేరీజు వేసుకొంటే గెలిచిన వారవరో ఓడిన వాంవరో,

(గల్ఫ్‌వార్‌ ముగిసాక 27-2-1991) మము బక్ష్వైివాదాయణ

12 గోడలు మన హృదయాలకు కవాటాలుంటాయి మన మనస్సుల్లోనే మెలికలుంటాయి అసలు మనలోనే గోడలుంటాయి కాని గోడలకు గోడలేముంటాయి. కళ్ళున్నా చూపులేని వ్యవస్థలో అవి గోడలే! రాయడానికి కాగితాలు, కలాలు ఉన్నాకూడా ఎవరు రాస్తారులే కన్నీటి పాట నమ్మకాల నీడల్లోనే నమ్మకాలన్ని వమ్మయి పోతున్నపుడు రేపటి బతుకు పేజీలన్ని ఇవ్వాల్లే చిరిగి పోతున్నపుడు గొడలుట్టి గోడలే కాదు చరిత్ర పాఠ్య పుస్తకాలు శిథిల జీవిత గాథల సజీవ సత్యాలు కాలప్పు కఠిన శిలల కింద నలిగి నిలచిన బతుకు గాథలు బతుకు బరువుల్ని మోస్తు మౌనంగా తపస్సు చేస్తున్న మునులు. బతుకుల్లో పోరాడే వారో బతుకుల్నే పోగొట్టుకొనేవారో అక్షరాలై, అగ్నికణాలై ఈ చరాచర విశ్వప్రాంగణంలో పాటై, పల్లవై, జీవనరాగమై శిలువ వేసిన శ్రీన్తుల్లా బలైపోతున్నపుడు మనం రాయలేని గీతాలన్నింటికి అక్షర ప్రతిరూపాలు గోడలు మనం తలలు వంచినా కళ్ళెగరేసినా కనిపించే కఠిన సత్యాలు గోడలు. మే 1991 మౌన సముద్రం

13 జీవితం కష్టాన్ని కన్నీటితో కడిగితే జీవితం. కాలాన్ని నెత్తురుతో కడిగితే పోరాటం. తెగిపోతున్న ఉల్కలకోసం ఆరాటం ఆశ, ఇవ్వాల్టి క్షణాల్ని ముక్కలు ముక్కలుగా నరుక్కొంటే రేపటి ఉదయం. మంచు ఖడ్గంపైనుండి హిమవన్నగం పైకక్కాలనడం ఇంకా దురాశే. ముఖ మండలమంత చిన్న చిన్న రేణువులుగా చిమచిమ జివ్వున లాగుతుంటె ఉట్టిపైసా, రూపాయి నాణెం, నోట్టకట్ట బతుక్కు ఉత్ర్రేరకం. రోడ్డు జారిపోతుంది మనిషిని మోసుకొని మనసు జారిపోతుంది ముఖాన్ని కమ్మేస్తు. డబ్బే డబ్బు పిల్లల్ని పెడుతుంది డబ్బే మనసుల్ని, మనుషుల్ని విరిచేస్తుంది. డబ్బే గుండెలపై దిగబడేసుకొన్న పిడి బాకవుతుంది. ఇక హత్యో, అత్మహళ్యో చివరికి మిగిలేది ఓ నిట్టూర్చే! 31 మార్చి 1991 ప్రచురణ: 'ఆంధ్రప్రదేశో మాసపత్రిక, ఆగష్టు 1999 గుష్టని లక్షినారాయణ

కేత్మ

దాహం

దాహం!

ఏమిటి?

పదవికావాలి.

దాహం!

ఏమిటి??

డబ్బుకావాలి.

దాహం]

ఏమిటి???

కీర్తి కావాలి.

అయికే నీ దాహం తీర్చుకోడానికి

అడ్డదారి ఉంది, రాజమార్గం ఉంది

ఏ దారి కావాలి నీకు?

అడ్డదారే కావాలి.

“అయితే నీ దాహమెప్పటికీ తీరదు.”

30 ఆగష్టు 1993 ప్రచురణ: “స్వేచ్భాస్వరాలు', రాష్ట్ర కవుల సంకలనంలో, ఫిబ్రవరి 1996

మౌన సముద్రం

శే5

భావకుసుమము భావం విత్తులానాని వేళ్ళూనుతూ నరనరాల్లో జీర్ణించుకుపోతు నాలోంచి మొలకెత్తుతుంది. నన్నణువణువునా ఛేదిస్తు తల్లి గర్భం నుండి తన్నుకచ్చే పాపలా చీల్చుక వస్తుంది. నాగటి చాలులో కర్రు కదులుతున్నట్లు గుండె గూట్లో భావన రాటుదేలుకుంది. ఏ పలుగుతో తవ్వాలి బతుకును ఏ ఊటబావిలోకి చూడాలి అర్థంకోసం! మొన్నటి న్వప్పం నిన్నటి కన్నీరు కలిపి చేపటి భవిష్యత్త్‌ పైకి కొత్త కాన్వాసు గీస్తున్నాను. కశలచెదరడం లేదు భావమింకా స్థిరపడడం లేదు నన్నింకా తడుతూ, తడుముతూ తడిలేని బతుకులో సారమేమిటని ఒక్కొక్క కన్నీటి బొట్టును కార్చిస్తు భావం నన్నింకా గుండె లోతుల్లో శిలువ వేస్తుంది. అథ్రువుకు విలువెవరు కడుతారు? ఎన్ని సుత్తిదెబ్బలు తింటే బతుకవుతుందని ఇంకా నన్నునేను నరుక్కొని ముక్కలు ముక్కలుగా చేసుకొని సమీకరించుకొంటే ఒక భావకుసుమాన్నై వికసిస్తున్నాను ఒక మేల్కొన్న స్వప్నాన్నయి ఉదయిస్తున్నాను.

30 ఆగష్టు 1993 సబ్జని లక్షినారాయణ

16

నువ్వూ-నేనూ

నువ్వు నేల, నేను ఆకాశం

ఎప్పుడైనా కలుస్తామా?

రెండు దిగంతాల పర్యంతం

నిశితంగా సూటిగా చూసినపుడు

కాలం కడపటి ఆవల

ఊహా రేఖల్లా మాత్రం కలుస్తాం.

అప్పుడప్పుడు

ఏడు రంగుల ఇంద్రధనుస్సు

మనిద్దరి మధ్యన లంకెలా వంతెన వేస్తుంది.

బహుశా క్షణికమే!

సూర్యుడు, వాన చినుకులు

పరస్పరం జరిగి పోయినపుడు

మంచులా భ్రమలా కరిగిపోతుంది.

అప్పుడు నువ్వు నువ్వే.

నేను నేనే. సెప్టెంబర్‌ 1993 ప్రచురణ: 'రచని మాసపత్రిక, ఏప్రిల్‌ 1999

మౌన సముద్రం

| కో ఆంగ్లమూలం: (హెర్‌బర్ట్‌, 1593-1633) ల్‌ క గ్ల ళ్‌ లీ స్‌ జ ప స ర్‌ యక ళ్తు వష స ఇల ల "గో ఇ జ్ర రి న క త్త భఖ లబ్ది స్ట్‌కళ క స. న? జల శైజో ల లత కిల అలో ఇ క్‌ జ ఠి లలా కలక కి లర త కే లలిత్‌ 6కి ౩ 8 సత కల జత రాం 8కి చరిత ల! శ్‌లో ల కైసా ర లలా లని క లాభాపాకు 6 ప్తి 6 ఇర జ” దేశి ల కటలా క క స కలో ర్‌ ల కలీ లో తికి ంతెక వే క్‌ సక క్‌ భతి కళ్‌ డ్‌క్త్‌ ల్‌ క్‌ [ల ఉలోర్దాం లారా ల్‌ జ క్‌ జో జ్టర్డ్‌ క జర స ర్‌ వత్‌ న

మల్లో వ్‌ (ల్ని సే న్‌ లో ళ్‌ ల గోటొ-.. పై కవితలో ఇమిడి ఉన్న చిత్రమును ఎగురుతున్న వక్షిలో పోల్చుకొనవచ్చును. కవితలోని లైనుల నిడీవి మొదటి లైను నుండి క్రమగ్రమంగా తగ్గుతూ మళ్ళీ క్రమక్రమంగా పెరిగి మొదటి దళకు చేరుకోవడాన్లి దైవనమానుడైన మనిషి పతనమై పొళ్చాత్తప్త హృదయుడై మళ్ళీ దైవ నన్చిధికి చేరడాన్లి నూచిస్తుంది.]

నవంబర్‌ 1393

ప్రచురణ: “ఆంధ్రప్రభ వీక్లీ

డిసెంబర్‌ 30 - 6 జనవరి, 1993 నుబ్బని లక్షినారాయణ

18

వేట

కుందేళ్ళను, లేళ్ళను

పులులు వేటాడేవి.

పులుల్సిి లేళ్ళను

మనిషి వేటాడేవాడు.

నేడు లేళ్ళూ లేవు, పులులూ లేవు.

బళుకే అడవైపోయి

మనిషిని మనిషే

వేటాడుతున్నాడు. 1993 ప్రచురణ: “ఆంధ్రప్రభ వీక్లీ ఫిబ్రవరి 1994

మౌన సముద్రం

కైం

దేశభక్తి నువ్వు నీ మతాన్ని (ప్రేమించు నీ దేవున్ని పూజించు భక్తి కావాలి నీకు కాదనను కాని నీ మతంకన్న నీ దేవునికన్న నీ దేశం గొప్పది నీకు దేశభక్తి కావాలి. మనిషివి నీవు, శూన్యంలో బతుకడం లేదు నిర్జీవమైన ఏ గ్రహాంతరం మీదనో బతుకడం లేదు కూడు గుడ్డ నీడనిస్తున్న ఈ పుడమి తల్లి ఒడిలోనే బతుకుతున్నావు. అన్నం పెట్టే తల్లి చెయ్యి నెవరైనా నరిక్షేస్తారా స్తన్యమిస్తున్న తల్లి రొమ్మునే కోసేస్తారా నీ అన్ననో, అక్కనో, అమ్మనో, చెల్లినో పాపనో, బాబునో నిర్ధాక్షిణ్యంగా నిలువునా చంపేస్తారా కూడు, గూడు, నీడనిస్తున్న ఈ విశాల ధాత్రిని బాంబులతో, మారణాయుధాలతో నింపుతారా సమస్త మానవ చరిత్రలో నెత్తురు కూడు తిన్నవాడెవ్వడైనా ద్రోహిగానే మిగిలాడు. చరిత్ర ద్రోహులను క్షమించదు. మతం మంచిని చెప్పాలి, మానవత్వం చెప్పాలి సమతను చెప్పాలి, శాంతిని చెప్పాలి అది అర్హుల కన్నీళ్ళు తుడవాలి. మతం కావాలి నాయనా నీకు కాదనను కాని మనిషి కన్న మతం కన్న దేశం గొప్పది, దేశభక్తి గొప్పది నీకు దేశభక్తి కావాలి

7 సెప్టెంబర్‌ 1993 నుఘ్టని లక్షృనాదాయణ

20

విచ్చిన్నక్రియ

వ్యవస్థ చిట్లిపోతుంది

విచ్చుకొన్న పల్లేరు కాయలా.

కులమని, వర్గమని, మతమని

బతుకు బీటలువారుతుంది.

కుళ్ళిపోయిన రాజకీయ' శవపేటికను మోయడానికి జనులందరు దఫాలుదఫాలుగా, వర్గాలువర్గాలుగా సమాయత్తమవుతున్నారు.

మతాన్ని పక్కన పెడితే

ఇక రాజ్యమేలుతుంది కులమే.

వాడకో సంఘం, వీధికో వేదిక

కలసిపోవడం కాదు

విచ్చిన్నంగా విడిపోవడం

నాది నావాళ్ళు, నీది నీవాళ్ళు

అంటుకోకు, ముట్టుకోకు

బహుశా చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని బ్రహ్మాండమైన రాజకీయ నాటకం

ఇరవయ్యో శతాబ్ధి చివ్వరి అంచున

ముందుకు ముందుకు వస్తుంది.

మనిషి సంఘటితం కాక

విచ్చిన్నం వైపు పయనిస్తూ.

2 ఫిబ్రవరి 1993

మౌన సముద్రం

బే మార్పు దాని తీర్పు గాలిని బంధిస్తామనడం అవివేకమే నిప్పును కాలరాస్తామనడం అజ్ఞానమే అణువును ఛేదిస్తే వచ్చేది విస్పోటనమే శూన్యంలోంచి కూడా ప్రసరించేడి కాంతి మాత్రమే మండుటెడారిలో కూడా ఇసుక తుఫానులు వస్తాయి గాలి వేగంతో పెనుతుఫానులు వీస్తాయి గర్జించిన సముద్రాలన్ని ఉప్పెనలై లేస్తాయి ఎప్పుడూ ఘర్షణలోంచే నిప్పురవ్వలు పుడతాయి ఎప్పుడూ ఒరిపిడిలోంచే బతుకులు రాటుదేలుతాయి చీకటిలోంచి నడవందే రేపటి పొద్దు కనపడదు కష్టాల కడలిలోంచి ఈదందే రేపటి తీరం అందదు చరిత్ర చెప్పిన పాఠం ఒక్కటే మాళ్సు దాని తీర్పు. 1994 గం భాలై డరచాశి టం య్చ హం ౯గా వినం "టు గంలమిమిళళ్కు స మబ్టుని లక్ష్రినారాయణ

22 అలి జీ

అలిశెట్టి ప్రభాకర్‌ స్మృతిలో కాలం కాగితాల పాత్తిళ్ళ పడవలో

అక్షరాలను ఆవాహన చేస్తు

ఎవరు చొచ్చి చూసారులే నీ హృదయం రాయడానికి కలాన్ని అక్షర శిల్చిలా సమాజాన్ని సిజేరియన్‌ చెయ్యడానికి పూనుకున్న నీ గుండెల గోడు ఎవరు విన్నారులే

ఆకలి పేగుల్ని దున్నేస్తుంటే

కరకర కరెన్సీ నోట్ల లోకంలో

ఆవగింజ మీద అనంత సత్యాన్ని ఆవిష్కరించడానికి

నువ్వుపడ్డ యాతన ఎవరికి తెలుసులే గమ్యం తెలియక కొట్టుక పోతున్న

శవితా కపోతాల అస్పష్టమార్గంలో సునిశితమైన, సుస్పష్టమైన

నీ పదచిత్రాలు ఎవరు కన్నారులే

గుండెలు రక్తాన్ని చిమ్మినా

బళుకులో రక్తాక్షరాలను అద్దుతు

నువ్వు గీసిన అక్షర శిల్పాలకు

ఏ కళాజీవి విలువ కడుతాడులే

ఎవరికోసం ఏడ్చావని

ఎందుకోసం ఆశపడ్డావని

ఎండిపోయి మోడువారిన చెట్టులా బతుకులోని పచ్చదనాన్ని కోల్పోతూ

నీ భార్యాబిడ్డల కోసమైనా నువ్వు మిగిలావా కవి అన్నవాడు, చచ్చింతరువాతే బతుకుతాడన్నట్టుగ నిజంగా నువ్వు చచ్చింతరువాతే, బాగా బతికావు కాలిపోయిన నీ చితాభస్మమ్మీద

కన్చీళ్ళు కార్చిన వాల్లెందరో, అత్మీయులెందరో గుర్తించిన వాల్లెందరో

నిన్ను గుర్తించని వాల్లెందరో మౌన సముద్రం

23

రాయడానికి ఏమున్నాయి నాదగ్గర

నీవీ లోకంలో లేనినాడు

నీ అక్షర శిల్పాలను పట్టుకొని

నీ హృదయపు లోతుల్లోకి దిగడానికి

నన్ను నేను ఊట బావిలా తవ్వుకొన్నాను.

నీ కవితా చిత్రాల ఒక్కొక్క భావం

ఒక్కొక్క అనంత సత్యం.

ఇంకా ఏమున్నాయిలే ఈ సాహితీ లోకాన సమస్త వ్యక్తిగతాలను నెమరేసుకొంటు

సాహితీ వేదికల మీద తిట్టుకుంటున్న కాలంలో ఎవరు లేరులే

ఇక్కడ “సాహితీ దిక్సూచి”.

వాదాలన్ని పిడి వాదాలై

పత్రికల గోడలెక్కి కూతలు కూస్తున్నాయి. చుట్టమనో, బంధువనో, హితుడనో, 'స్నేహితుడనో కాలానికి నిచ్చిన వేసుకొని, చేతిలో బాకా పట్టుకొని కలం రాయుళ్ళు సాహితీపల్లకిని మోస్తూ బోయిల్లా పొగడ్తల తుంపరల్లో తేలిపోతూ మందుకు సాగుతున్నారు.

నవనవలా చక్రవర్తులను

విలువల తిలోదకాల రాయుళ్ళను

జోకర్లను, బ్రోకర్లను పత్రికలు

భుజాన వేసుకొని సాకుతున్నాయి.

హిపోగక్రసి లేని రంగమంటూ లేక

రెండు నాల్కల దోరణుల్లో

సాగుతుందిలే సాహితీ రథం.

వెళ్లిపోయిన నేస్తమా

రాయడానికి సంగతులనేకం ఉన్నా

నీ స్మృతిలో లీనమై

ఈ కొన్ని అక్షరాలు, ఈ రోజున.

12 జనవరి 1994 (అలిశెట్టి ప్రభాకరో ప్రథమ వర్ధంతి సందర్భంగా రాసింది)

నుజ్బుని లక్షినారాయణ

2డీ కొన్ని హైకూలు ఇసుక తిన్నెల్లోంచి చూసా నీ కన్నులు దూరాన్నుంచి నిదానించి నన్ను ఎక్స్‌రే తీసాయి. రెప్పపాట్న కంటి రెటీనాపై నీ చిత్రపటం స్టిల్‌ ఫోటోగ్రాఫ్‌లా నిక్షిప్త్రమయ్యింది. నీ కన్నుల లోగిల్లో కాంతులున్నాయి, కలువలున్నాయి నన్ను వెలిగించేందుకు. నీ కంటిపాపలోని నీలి సముద్రం మునుగదీనుకొంది నన్ను రారమ్మని చెప్పి. కాలం ఫోటో తీసాను ప్రతి ఫేమ్‌లోను కూడా నువ్వే దృశ్యకావ్యం రాయాలి ఇక. నిశ్శబ్ధం అంతటన టిక్‌... టిక్‌... టిక్‌... టి5... టిక్‌ శబ్ధం తప్ప అందులోను నీపేరే ఉంది. నవ వసంతం మళ్ళీ వచ్చినది నువ్వు వస్తావని చూసా కాని రాలేదు ఇక నవ వసంతమెక్కడీది. చభొన సముద్రం

25

నింగి చూసి చిన్న పోయినది పుడమి నన్ను తల్లిలా ఓదార్చింది నువ్వునా దరి లేనపుడు. అద్దంలోనికి చూసాను అద్దం నన్ను చూసి జాలిగా నవ్వినది ఎంతటి అల్బజీవివని. తుమ్మెదలా వచ్చాను పువ్వే కనిపించకుండా వెళ్ళిపోయినది ఇక అడవంతా గాలించాలి.

1994 వబ్బని లక్ష్మినారాయణ

26

ఫలవ్ఫక్షం

ఈ చెట్టు కాలానికి వేళ్ళూని

తరతరాలనుంచి నిలిచి వస్తుంది.

ద్‌ని కొమ్మలన్ని శాఖోపశాఖలుగా

విస్తరించిన విశాల ప్రపంచపు భాగాలు. చెట్టు కొమ్మల్లోని

పక్షులన్ని కవుల సమూహాలు.

దీని ఆకుల సవ్వడులు భాషల గుసగుసలు. ఈ చెట్టు పూసే, కాసే పూలన్నీ

కవుల మేధస్సు ఫలాలు.

వీటిని అందుకునే

అమృత జీవి, రసాస్వాదకుడు

నిజమైన మానవుడు.

13 జూన్‌ 1994

మౌన సముద్రం

27

కడలిపె

జీ కడలిపై సూర్యుడు కన్నెర్ర చేస్తే జలం అదిరి, బెదిరి, ఆవిరై. మబ్బుతునకై ఆకాశ నూర్జాన పయనించింది. ఆవురావురుమంటు విహరించిన మబ్బుతునక అలసి సేదదీరడానికని మళ్ళీ కడలి ఒడిలోనే వర్షమై కురిసింది. మళ్ళీ సూర్యుడు రావాలి కిరణాల కొజడాలతో కడలి ఒడలుపై యుళిపించాలి అప్పుడు కొత్త మబ్బు శిశువుల్ని కనడానికి కడలి సమాయత్తమవుతుంది.

16 అక్టోబర్‌ 1394

నుజ్బుని లక్ష్యినాదాయణ

28 సీతాకోకచిలుకలు అక్షరాలకు చెమ్మీలు తొడిగాను చెముక్కున మెరువాలని సగీషీలు చెక్కాను నాణ్యంగా కనిపించాలని పువ్వుల్ని అదిమాను సువాసనలు గుబాళించాలని అయినా ప్లవర్‌వేజ్‌ పువ్వే అన్నారు. అక్షరాల్ని గుండె గూట్లో పక్షిలా పాదిగాను భావాల పక్షిపిల్లలు సీతాకోక చిలుకల్లా ఎగిరివచ్చాయి.

1994 మౌన సముద్రం

29 ల్సో అతి మనిషి - మౌన సముద్రం పత్రిక పేజిలోంచి ఒక అల ఉవ్వెత్తున లేచి వచ్చి హృదయానికి తటాలున తాకింది. వేయి ప్రకంపనల్తో హృదయం తునాతునకలయ్యింది. ఏమి లేనివాడే లాడలొడ వాగుతున్నాడు మహా సముద్రమంత గాంభీర్యమున్న మనిషిమాత్రం మౌనిలా కనిపిస్తున్నాడు. అపుడు ప్రతిఘాతంలా హృదయంలో సంచలనం మొదలై కలం గలగలా పారి కాగితాల ఎదపై శిరసుమోదుకొని అక్షరాలను జులిపించి కవిత్వమై కూర్చుంది. 1994 సుళ్టువమి లక్ష్మినారాయణ

30 డైరి అక్షరాలన్ని పదచారులై పయనించి కాలానికి కాపలాగార్జుల్లా నిలిచి భావాలు ఏరులా పారి కాగితాల పాత్తిల్లలో ఒలలాడుతాయి. మానవ వ్యాపారాలన్ని కృత్రిమమై, యాంత్రికమై (పేమలులేని కల్తీ బతుకులైపోయి హృదయాలు విచ్చినమైపోయినపుడు అక్షర సత్యాలన్ని కాగితాల ఒడిలో పడుకొని సేదదీరుతాయి. ఎవరున్నారు, ఎవరుంటారని? ఎవరికివారు ఒంటరి ద్వీపమై చీకట్లో గిలగిలా కొట్టుకొంటున్నపుడు భావాలు పురివిప్పిన నెమలిలా విస్తరిల్లి వేయి భావకుసుమ పరిమళాల్లా కాగితాల హృదయాల్లో గుబాళిస్తాయి. రాయడానికి కవితైనా, కావ్యమైనా ఉఊర్కే వెలువడుతుందా కబంధ రాక్షసుల దుశ్చర్యలకు ఉండేలు దెబ్బతిన్న ఒంటరి పక్షిలా గిలగిలా కొట్టుకొని సేదదీరాల్సిందే మనసు. అందరు బతుకును వధించే కీచకులే అయినపుడు వ్యధాభరిత జీవితాన్నిచ్చే శాడిస్టులే అయినపుడు బాధ గుండెల్ని పిండి చేసినపుడు అనుభూతులు మనసును కుదిపేసినపుడు కందిరీగల్లా భావాలు చెలరేగినపుడు బాధను మింగేసి సేదదీర్చేకన్న తల్లి డైరి. కంటినీరులాంటి, కన్నతల్లి పాలలాంటి స్వచ్చమైన హృదయం డైరి. 11 ఫిబ్రవరి 1994 మొన సముద్రం

ఐ పిటీ యూ! కాలిజోడికాన్నుంచి, కాస్మొటిక్స్‌ వరకు హోల్‌ ఇండియా అంగడి బజారు అతి ఖరీదుగా, ఆకర్షణీయంగా బహుళజాతి మార్కెట్టయి కూర్చుంది. ఇక బుల్లితెరపై మన కళ్ళని మనమే మోసంచేసుకోవచ్చు. పొద్దున ఏడు గంటలకు మొదలవుతుంది నున్నగా సన్నటి గడ్డానికి మార్గదర్శకం ఈ బ్లేడు, ఈ క్రీమ్‌. జవసత్వాలుట్టిపడడానికి ఈ టీ, ఈ కాఫీ ఈ పౌడర్‌, బేబీ సాఫ్ట్‌ సబ్బుల తళతళలు, డిటర్టెంట్ల మిలమిలలు, అత్తర్ల గుమగుమలు మీ పళ్ళు వెండిలా తళతళలాడాలంటే, ఈ బ్రష్‌లు, ఈ పేస్టులు నువ్వు పచ్చి పల్లెటూరి వాడివైనా వాటికి దాసోహమే. హాయిగా హార్లిక్స్‌, బోర్నువీటాలు తాగచ్చు బిష్కెట్టు చాక్లెట్లు తీయగా తినచ్చు చల్లటి పానీయాలు మరీమత్తుగా ఈ దేశ గ్రామగ్రామాల్లోకి ప్రవహించి బొటనవేలు సాక్షిగా నిన్ను చిత్తు చేస్తాయి. ఐస్‌శ్రీమ్‌లు, వంట నూనెలు, ఉప్పు పొట్లాలు అగ్గిపెట్టెలు, ఫ్యాన్‌లు, బ్యాటరీలు, పాలబుగ్గలు రేడియోలు, టీవీలు, కంప్యూటర్జు, కార్లు పెన్నులు, కాగితాలు, రెడీమేడ్‌ దుస్తులు ఒకటేమిటి దొరకనిదేది లేదు మార్కెట్లో తొంబైకోట్ల భారతం సాక్షిగా బహుళదాహంలో పడిపోయాం. ఇక మందులంటే ఆకాశనక్షత్రాల్ని చూడాలి తిండిగింజలంటే విశాల ప్రపంచాన్ని చూడాలి ఒకనాడు “ఈ బ్రాండ్‌ గోధుమలు, బియ్యం తినండి ఆరోగ్యానికి మంచిది” అనే ప్రకటనలు, హోర్డింగ్‌లు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఒకనాడు స్వదేశీ అంటే ప్రాణమిచ్చారు ఇప్పుడు విదేశీ అంటే ప్రాణమిస్తున్నాం ఇక ఐ పిటీ యూ! అనడానికి ఎవరున్నారని?

1994 నుబ్బని లక్షినారాయణ

౩2 టో అక్షర సత్యాలు “కవి కాలుతూ వెలుగునిచ్చే స్వయం జ్యోతి బతుకు కొలిమిలో సానదేరిన వజ్రం. “కవిత్వం” బతుకును కాచి వడబోసిన అనుభవసారం. “బతుకు” ఎంత తవ్వినా తరగని ఊట అందని లోతు. “సత్యం” నిజమైంది మరణించంది నింగిలా, నేలలా. 1995 చూద సముద్రం

33 కవినె ౬...

కవినై అక్షరాల మాల పట్టుకొని స్వచ్భమైన అనుభూతుల్ని గిజిగాడి గూడులా రమణీయంగా అల్లాలనుకొన్నాను. కవినై గున్నమావిపై కూర్చొని ప్రకృతిలో లీనమై కోకిలలా కవితా కుసుమాలు రాల్బాలనుకొన్నాను. కవినై జనసముద్రంలో నిలిచి ప్రజల గుండెల్లోకి సూటిగా మాటల పాటలు సేల్పాలనుకొన్నాను. కవినై, రవినై ఈ లోకాన్ని సూర్య తేజంలా కాచి వడపోయాలనుకొన్నాను. కాని కాకులలోకంలో కోకిలలా ఒంటరిగానే మిగిలాను. కవితా వసంతం రాలేదు కోకిలలా పాడలేకపోయాను ఒంటరి కాకిలా అరువలేక పోయాను నన్ను నేను మోసం చేసుకొన్నపుడే కవినని తెలిసి మౌనంగా ఊర్కొన్నాను.

1995

ప్రచురణ: “ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక, సెప్టెంబర్‌ 1399 గుబ్బని లక్షైవారాయణ

3ల ఆత్మహత్యా సదృశం ఆశ నన్ను పట్టుకు లాగుతుంది అల్బునివై బతకమని ఎవడు బతుకడం లేదని కాని బంగారంలా వన్నె తేలాలంటే నిప్పుల్లో పడి కాలాలని తెల్పింది. పోతూ పోళూ ఉంటే డబ్బు ఇంధనం సర్వ ప్రపంచమై కనిపిస్తుంది. ధన దాహమో శీర్తి దాహమో అడ్డదారో, అపమార్గమో పయనించమంది లోకం, కాని కలం సాక్షిగా నిలుచున్నపుడు ఈ పాకులాట దేనికని తెల్సింది నన్ను నేను పోగొట్టుకున్నపుడు ఆశలు, కోరికలు లేనపుడు నేను నేనని తెల్సింది. కాని మూర్చులకో, మూర్థత్వానికో కాసేపు సమాధానం చెప్పాలని ఆరాటంతో, ఆవేశంతో అనర్గళంగా, గలగల సెలయేరులా నిర్మల గీతంగా సాగిపోతానంటే ఎవడో అడ్డుకట్ట వెయ్యచూస్తాడు. ఎక్కడ ప్రశాంతత, ఎవడికి వాడు కీర్తికండూతి కప్పుకొని పొగడ్తల అగరొత్తులు పెట్టుకొని గుండెల్లో విషపు బాణాలు నింపుకొని మేళవన్నె పులుల్లా ఉట్టి డొల్లా హృదయంతో లేనిదాన్ని ఉన్నదని ఆపాదించుకొని సొగిపోతుంటే కాస్త ఈ లోకాన్ని చూస్తే జాలి వేస్తుంది. 2] సెప్టెంబర్‌ 1995 ప్రచురణ: “రచన మంళ్లీ మే 1996 మౌన సముద్రం

35

పిల్లలు

పిల్లలు

ఎగిరే గాలిపటాలు

అల్లరి చందమామలు పాపమేమిటో

పుణ్యమేమిటో తెలియని

నవ్వుల సోయగాలు

కష్టమేమిటో, కన్నీళ్ళేమిటో తెలియని నిర్మల హృదయాలు

దేవుడి ప్రతిరూపాలు.

పిల్లలు

ఆనందడోలికలు

ఆహ్లాదగీతికలు

బతుకు ఎక్వేరియంలో

గమ్మతైన చేపపిల్లలు.

పిల్లలు

వెన్నెల కిరణాలు

అమ్మనాన్నల గుండెల అభరణాలు నింగిలోని జాబిల్లికి

నేలమీది గడ్డిపువ్వుకి

చెట్టుమీది రామచిలుకకి

గాల్లోని తూనీగకి

తేలిగ్గా గుండెనర్చించే వాల్టు. పిల్లల్లేని ప్రపంచాన్ని ఊహిస్తే ఉహు

బతుకులో స్వర్గమేలేదు. బాల్యంలేని బతుకును ఊహిస్తే బతుక్కి అర్థమే లేదు.

22 డిసెంబర్‌ 1995

సజ్ఞుని లక్షినారాయణ

36 కవిత ఊర్కే పుట్టదు చెట్టులా విస్తరించాలి మనిషి కాని మర్రిచెట్టు కాకూడదు. నది ఆగిపోతే ఆ తప్పు నదిదా ఎడానిలోకూడా అమృతశ్రోతప్వినిలా ఒయాసిస్సులుంటాయి. నదిని చంపినా, నది గొంతును చంపడం ఎవరికి సాధ్యం? గంగనో, గోదారినో, సింధునో ఎవరు పుట్టించారని తనతోవన, తనబాటన, తనేతోసుకుంటు వడివడిగా పరిగెత్తుతుంది నది. ఊర్కే అలవోకగా కళ్ళు మూసుకుంటే మనుషులు మాట్టాడరు, మనసు మాట్లాడుతుంది. ఎన్ని అపశృతులు, అవరోధాలు, అడ్డుగోడలు దాటుకుంటూ వెళితే బతుకు ముట్టుకుంటే పచ్చినెత్తురులా తాకాలి మనిషి ఏది చెయ్యిపెట్టి అందుకొందామన్నా అందరు, ఎందరో బతుకు తన్ను తాను విస్తరించుకొనే విశాల ప్రపంచం దూరానికి దూరముంటుంది, కాలానికి దూరముంటుంది కాని మనసుకు దూరముంటుందా ఏమి మిగిల్బుకొన్న వాడికన్నా ఏమి మిగిల్బ్చుకోనివాడే కవి, మనిష్‌ కవిక్‌ కవి తెలియడంకన్న, కవికి మనిషి తెలిసినా చాలు పూలచెట్టులా కవితల పూలు పూయించాలంటే మట్టి బతుకు బతికి, గాలి హోరులకు వెరసి కాలానికి ఎదురీది నిలిచినపుడే కవిత్వం కవికి కళ్ళుండాలి, కవి కలానికి నాలుకలుండాలి కళ్ళుండి నాలుక లేని కవి పిచ్చివాల్ల స్వర్గంలో మౌనసముద్రం. సముద్రంలో రాళ్ళుంటాయో, రత్తాలుంటాయో కాలం చెబుతుంది. ఎవరి బతుక్కెనా వారి కలమే సాక్షి 1996 మౌన సముద్రం

37

అక్షరం అక్షరం ఆపివేసింది నన్ను ఎన్నోసార్లు అది నా గుండెలు కాల్చుతూ అగ్ని జలపాతాన్ని కురిపించింది. గొట్టెల్లా తలవంచుక పొమ్మన్న లోకం ముందు ఎందుకు అని ప్రల్షించినపుడల్లా గుండెల్లో గాయమైంది. గాయాలకు ఆలంబన అక్షరాలే గాయాల అలలు గుండెల్లో చెలరేగుతుంటే అక్తరాల సైనికులు కవాతులు చేసి గుండె గోడలు దాటి కలం ఉరుకులో జలపాతంలా పరుగులెత్తి అవినీతి మీద సమరం చేయమన్నాయి. అక్షరం అల్బుని చేతిలో పడితే అధమమవుతుంది సమర్భుని చేతిలో పడికే చిచ్చరపిడుగులా లేచి, నిప్పుకణికెలా మండుతుంది అక్షరాన్ని అవినీతిమీద సంధించడానికే అక్షరాలతో ఆడుకోడానికే ఈ బతుకు.

24 ఫిబ్రవరి 1996 సబ్బుని లక్షినారాయణ

38

అనుభవం

అనుభవం

కన్నీళ్ళ నిచ్చింది.

కవితల నిచ్చింది.

వీట్‌నివీడి బతగ్గలనా?

అప్పుడప్పుడు ఎవరో ఒకరు గుండెల్లో గాయంచేసి పోతుంటారు. గాయాలకు మందునాకు

వర్షించే కన్నీళ్ళు, కవితలే. అనుభవాల సుడిదెబ్బలు తగులుతున్నప్పుడు

గుండెలు ప్రక్షాళనమవుతుంటాయి కన్నీళ్ళు వర్షిస్తుంటాయి

కవితలు రాలుతుంటాయి అనుభవాల సారమే

కన్నీటి సారాంశమే కవిత్వం.

23 జూన్‌ 1396

మౌన సముద్రం

పం

నగరం పల్లెగుండెల్ని దాటి పట్నంలో అడుగిడితే జనసంద్రపు హోరులో బతుకు ఒక వేగిరపాటు గట్టుమీదపడ్డ చేపలా ఎప్పుడు మళ్ళీ పల్లె ముంగిట్లో వాలుదామనే తపన నగరంలో, తనదికాని కృత్రిమ వ్యవస్థలో గుండె లోలకం ఒంటరిగా ఆప్యాయతకోసం కొట్టుమిట్టాడుతుంది ఎక్కడచూసినా ఎవరికి వారు ఓ ఒంటరి ద్వీపం ఎవరి గుండె లోతుల్ని పట్టిచూసినా వాల్ల ఉనికి స్కృతి ఆనవాల్లన్ని పల్లెగూట్లోకి ఒదిగి ఉంటాయేమో! పంజరంలో లేమని భ్రమసే నగరవాసులకు నగరమొక సుస్థిరమైన అపార్ట్‌మెంట్‌ గాలి, నీరు, స్వేచ్చగా దొరికే పల్లెపరుధుళ్ని దాటితే పచ్చి మంచినీళ్ళు కూడా అమ్మబడుతాయి నగరంలో చెట్టుమీది చిలకనైనా, పున్నమి వెన్నెలనైనా తనివి తీరా చూడని దశలో బతుకు ప్రతిబింబాల్ని కృత్రిమపు, రంగురంగుల టీ.వి. బొమ్మల్లో చూస్తు సరిపెట్టుకోవాలి. నగరమెంత కృత్రిమం ఉట్టి షోకేస్‌ బొమ్మలా కాగితపు పువ్వులా.

27 జూలై 1996 గుబ్బని లక్షినారాయణ

40 బతుకు కాలాన్ని కవ్వం చేసి బతుకును చిలికాను. బతుకులోంచి “స్నేహం' వచ్చింది “పేమ” వచ్చింది “అనుబంధం' వచ్చింది “ఆత్మీయత' వచ్చింది కాని, 'డబ్బు' అన్నింటిని మింగేసింది కాసంత హృదయమున్న మనిషి దొరికితే ఎంత బాగుండు! 16 అగష్టు 1996 మొన సముద్రం

త్తే

సినీ కల్టర్‌

ప బతుక్కు కొలమానమిప్పుడు సినిమా ఏ తీరు చూసినా, ఏ టీ.వి. చూసినా కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా సినీ మాయలోకం పల్లెనుండి పట్నం వరకు సినీ సరదాలు, సినీ పరదాలు. నవ్వుల నాయకుడు, సెంటిమెంట్‌ మొనగాడు మన హీరో. నవరసాలు రంగరించిన అందాల భామ మన హీరోయిన్‌. బతుకులో ఏ విలువలు లేనట్టు ఉట్టి దుబారా బతుకులు ఒక్క మాటలో కాలాన్ని మన బతుకుల్ని మింగేస్తుంది టీ.వి. అడిన్నా పాడినా, ఏడ్చినా, గెంతినా మన ఆదర్శం సినిమా సినీ మాయజాలంలో కవి, సినీ కవి రచయిత, సీనీ రచయిత నటుడు, సినీ నటుడు బూతర్ధంలో బూస్టింగ్‌లా చూసుకొంటే తప్ప తృప్తిలేని బతుకులు. భాషను ఖూనీ చేసినవాడు, బపూన్‌ అయినా హీరోనే. పాగడడానికి, దండలు వేయడానికి ఎవరూ లేనట్టు కళా సంస్థల క్యూలు. చిత్తపుద్ధి నిజాయితీ ఉంటే ఒట్టు సినీ మాట, సినీ పాట, సీనీ కల్చర్‌ నేటి నవ నాగరికత.

10 మార్చి 1997

నజ్బని లక్షినారాయణ

42 తెర తీయగరాదా! తెర తీయగరాదా! కథ కల్తీ సరుకు సినీ పంటకు రెండు చనుగుబ్బలు, పిడికెడు నాజూకు నడుము బాడ్డూడగ బహుషోకుగ చూపిస్తే కాసులపంట రాలదా పన్నెండేళ్ళ పసి పోరన్నుంచి పండ్డూడిన పండు ముసలి వరకు పైట తొలగిన సీనులకే కదా మరీమరీ ఆసీనులయ్యేది. ఆశయమెవ్వడిది, డబ్బు ఆశనె కాని నిండు తెరసాక్షిగా క్షనువిందుకోసమేగా పొవులోవ్‌ కుక్కపిల్లలవుతున్నారు జనం. తెరతీయగ హీరోలస్తున్నారు ఈలవేస్తు హీరోయిన్ల స్తున్నారు ఒళ్ళు విరగ బూయిస్తు ఇక కళ్ళప్పగించి చూడాలి. జ 1997 పావులోవ్‌, రష్యన్‌ మానసిక శాస్త్రవేత్త. మౌన సముద్రం

43

స్వర్ణభారతి అయో్యోరామా! 'స్వామి' అంటే “స్కామ్‌” అని వినిపిస్తుంది రాజకీయ నాటకరంగంలో ఎటూ చూసినా అధికార లాలూచిలే అపమార్గాన పయనింపులే ఎవరిక్కావాలి విలువలు కిస్సా కుర్సీకా ఖేల్‌లో అంతా నాటకమే భజనకేసరీలు దొడ్డ ప్రభువులు, అధికారదాసులు పావులు కదుప్తుతుంటే ఎందరు కృష్ణులస్తారో ఈ ధరిత్రి నేలడానికి అయ్యోరామా! అయోధ్యరాముడు రూడ ఆయుధమే అధికార దాహంముందు ఇంకా 'స్వర్ణభారతి'ని చూడాలి.

19 ఆగష్టు 1997 మజ్బని లక్ష్యెినారాయణ

తీర చూపులు మోసపోతున్నాయి చూపులు మోసపోతున్నాయి వేలెక్తే చూపెట్టేవారే లేనట్టు మనుష్యుల్లో ప్రశ్నించేవారే లేనట్టు చూపులు మోసపోతున్నాయి కన్నులు దాసోహమంటున్నాయి. చిన్ని తెరో, పెద్ద తెరో అధ్వాన్నంగా మారి కన్నులను మత్తెక్కిస్తున్నపుడు చూపులింకా మోసపోతూనే ఉన్నాయి సమస్త మానవాళి కరెన్సీ నోటుమీద కెబరా నృత్యం చేస్తుంది. విలువలను, వలువలను వదిలేస్తున్న పడతుల కేమితెలుసు అంగాంగాల్ని ఆంగారంలా మలిచి తెరమీద వదిలిపెడ్తున్న వారికేమి తెలుసు సమాజం కలుషితమయి పోతుందని పత్రిక దిగంబరంగా మారి పాఠకుల మెదళ్ళను తొలిచేస్తున్నపుడు కన్నుల నిండుగా టీ.వి. చావెళ్ళు కాలాన్ని బతుకుల్నే మింగేస్తున్నపుడు చూపులింకా మోనపోతూనే ఉన్నాయి. ఏమున్నాయి ఈ దేశానికి ప్రగతిలు, ప్రతీకలని చెప్పుకోడానికి మధ్య తరగతి మందహాసం సాక్షిగా అంతర్జాతీయ అందాల ఫేషన్‌ పెరేడ్‌ల సాక్షిగా బతుకు ఒక అంగాంగాల అందాల పోటీ. ప్రపంచనుందరి అయితేనేం గొప్పగా నిండుకెర సాక్షిగా ఆడే బొమ్మ ఆడించే బొమ్మనే అవుతున్నపుడు చూపులింకా మోసపోతూనే ఉన్నాయి. 1998 మౌన సముద్రం

త్న్‌ కీర్తి అటి కీర్తి అందమైనదని కీర్తి తెలివైనదని కీర్తి కావాలని కీర్తి రావాలని కీర్తిని పొందాలని పద్దెనిమిదేళ్ళు కీర్తివెంట పడ్డాను. కాని “కీర్తి అందలేదు. కీర్తి చంచలమైన అమ్మాయి ఎవన్ని ్రేమించాలో తెలియక అడ్డమైనవాన్ని (ఢ్రుమిస్తుందేమో! అందుకే కీర్తి కావాలనే, కీర్తి రావాలనే కోర్కెను వదిలేశాను. హృదయం నిండా తృప్తి. ఇపుడు నాకున్న బలం, ఖ్యాతి, కీర్తి నా కలమే! ఎన్నడయినా _నా కలానికి దాసోహమై కీర్తీ నా యింటి తలుపు తడుతుందేమో ఆశ చావడం లేదు నిజంగా కీర్తి ఎంత అందమైనది! 28 జూలై 1998 సజబ్బని లక్ష్యినారాయణ

వర

ప్రకృతి ఒడిలోకి

పరిమళాలు నిండి ఉన్న ప్రకృతి ఒడిలోకి సీతాకోకచిలుకల్లా ఎగిరిపోదాం రండి. విషసంస్కృతి నింపుకొంటున్న

కృత్రిమ కాంక్రీట్‌ నగరాల నాగరికతల్లో ఏముంది రండీ! తరలివెల్టాం

ప్రకృతి ఒడిలోకి, పరిమళాల గుడిలోకి.

ఆ నేల పరిమళం

ఆఅ గాలి పరిమళం

ఆ నీరు పరిమళం

కొండకొమ్ము పల్లెలోకి, సెలయేటి గూటిలోకి వాగువంక మలుపులోకి

(ప్రకృతి పూదోటలోకి

తరలివెల్డాం రండి.

ప్రకృతి ఎదపై వెలసిన

పూరిపాకలు, 'పెంకుటిండ్డు, వాగువంకలు సెలయేళ్ళు, చెట్టుచేమలు, పశుపక్షులు పంటపొలాలు, మట్టిమనుషులు

బండలు, కొండలు, అడవులు

నదులు, నాగరికతలు, తీర్ధస్థలాలు, పుణ్యక్షేత్రాలు.

ఏముందీ దినదినం విష సంస్కృతి

నిలువునా నింపుకొంటున్న నగరాల నాగరికతల్లో

రండీ! తరలి వెల్దాం

ప్రకృతి ఒడిలోకి

పరిమళాల గుడిలోకి

ప్రాఖవాయువు ఉనికిలోకి

పచ్చని పల్లెటూళ్ళలో,

2 ఆగష్టు, 1999

మౌన సముద్రం

న్‌

వెన్నెల వెన్నెల ఎంత చల్లని మాట! ఎంత ముద్దుల పేరు! మనిషన్నవాంవరికి నచ్చదు వెన్నెలంటే? కసాయి కరువు సాక్షిగా కన్నబిడ్డనే గొ్జెపిల్లలా తలనరికిన తలితండ్రులు రాక్తసులా, మనుషులా? మనుషుల్ని రాక్షసులు చేసే డబ్బెంత పాపిప్టిది! గంజినీళ్ళు కరువై పొట్టచేత పట్టుకొని వలస వచ్చిన పాలమూరు కూలీల 'పేదరికమిచ్చిన ఫలితమిది. ముచ్చటగా మూడేళ్ళయినా నిండని వెన్నెలా నీ తల్తిదండ్రులే కసకస గొట్జెపిల్లలా యంత్రానికి నిను బలి ఇచ్చినపుడు దేవకి ఏడోగర్భం ఆకాశవాణి సందేశంలా నువ్వీ లోకానికే సందేశమిచ్చి పోతున్నావు! “ఓనా పేదతల్గులారా, తండ్రులారా, కూలీల్లారా రానున్న ఐదేళ్ళలో, పదేళ్ళలో, చిన్న పిల్లలను నాలా డబ్బులకోసం కసాయిల్లా యంత్రాలకు బలి ఇవ్వకండి, "పేదరికంలో మగ్గి, అవిద్యతో, అజ్ఞానంతో, చేద్దామంటే పనుల్లేక, తిందామంటే తిండిలేక మలమల మాడి, చస్తూ బకతుకుతు, బతుకుతూ చస్తూ, వాల్లే చచ్చిపోతారు, కాని నాలా గొంతుకోసి మాత్రం చంపకండి” వెన్నెలా!..... చల్లని వెన్నెలా! పాలవెళ్లి వెన్నెలా! పసిడి వన్నెల వెన్నెలా! అభాగ్యపు తలిదండ్రుల వెన్నెలా! ఈ శతాబ్ధి ఈ సహస్రాచ్ధి నీ సందేశం ఇదేనేమో!

26 అగష్టు 1999 (తేది 24-8-1999 న, కసాయి కరువు సాక్షిగా తలితండ్రులే 'వెన్నెల' గొంతు కోసేసారు, యంత్రానికి బలిగా) గుస్తని లక్ష్యినారాయణ

తపి జీవనది నది మా యింటికి ప్రవహిస్తూ వస్తుంది నల్లా పైపుద్వారా మంజీరాలు, మానేరులు మాకు దూరంగా ఉన్నా మేము మంజీరా వాసులమంటే తప్పులేదు మేము మానేరు వాసులమంటే తప్పులేదు. ఎన్ని పల్టెలు, గ్రామాలు, నగరాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థస్థలాలు సస్యశ్యామల సారవంత అటవీక్షేత్రాలు దాటుకుంటూ నదులు నాగరికతలు నేర్పుతాయి. నదుల్సి విడిచిపెట్టి, నాగరికతల్ని వదిలిపెట్టి పొమ్మంటే ఎలా? నది సుజల, సుఫల ప్రవాహం వల్లి నది నా కన్నతల్లి! నదిని విడిచిపెట్టి పొమ్మంటే ఎలా? అమ్మ ఒడిలోలా నది కొంగులో, నది పొంగులో దాక్కొని చెట్టుకో, పుట్టకో, గుట్టకో, పశువుకో, పక్షికో, ఆకుకో, అలముకో కాయకో, సండుకో ఆలంబనగా బతుకుతుంటే నదిని విడిచిపెట్టి పొమ్మంటే ఎలా? గంగ్రైనా, గోదారైనా, నర్మదైనా నదే నది నా పుణణ్షేత్రం, నదినా తీర్ధస్థలం, నది నా సస్యశ్యామల క్షేత్రం నది కాళ్ళకి సంకెళ్ళు వేసి బంధించడమంటే నాగరికతల్ని బంధించడమన్నట్లే. పారే నదిలోనే జీవముంటుంది ప్రవాహంలోనే బతుకు పరిమళముంటుంది. నదికి తెలుసు ఉరుకు, పరుగు, వేగం, వడి నది నన్ను ముంచేయదు, మీరు నదిని బంధించి ముంచేస్తేతప్ప. కాలంలాగే నదికూడా సహస్రాబ్బుల్లో నిరంతర ప్రవాహమే. నదిని బంధించిన భారీ ప్రాజెక్టుల వల్లనే అభివృద్ధి అంటారా కావాలంటే మేము వానదేవుడి సాక్షిగా, జగతికి వెలుగు సూర్యుడి సాక్షిగా ప్రతి ఇంట్లో భూగర్భంలో జలవనరులను సమకూర్చుకొంటాం బతుకుల్లో విద్యుత్తును వెలిగించుకొంటాం కాని నదిని బంధించకండి చావనైనా చస్తానుగాని, నేను నదిని బతికించుకొంటాను నది వా జీవన ప్రవాహవల్లి, నదిని బంధించకండి. సెప్టెంబర్‌ 1999 (నర్మద బచావో' ఉద్యమానికి సంఘీభావంగా) మౌన సముద్రం

తం కూలి వయసుతో తేడాలేదు... ఆడ యాబై, మగ డెబ్బై కూలి అడ్డాల సాక్షిగా కందిరీగల్లా చుట్టముట్టుకుంటారు. “సార్‌ కూలీ కావాలా...... నేనస్తా, నేనస్తా పనిచేసే కూలీని కొత్తకుండలా కొట్టి చూసుకోవచ్చు. కరువు రక్కసి కసాయి కోరలకు బలిగా పాలమూరు కూలిలో, మెతుకు సీమ కూలీలో హుస్నాబాద్‌ నుంచో, ఒరంగల్లు నుంచో, ఖమ్మం, నల్లగొండల నుంచో ఏకంగా రాష్ట్రందాటి ఒరిస్సాల నుంచో బతుక్కోసం వలస వస్తారు జనం కూలిల్లా రంగు, వేషం, కులం, భాషాభేదం ఏమీలేదు లంబాడీలు, ఒడ్జెరలు, రైతులు కూడా చౌరస్తాపక్షుల్హ్లా అడ్డాల్లో పనులకోసం పడిగాపులు కాస్తారు. రెక్కల కష్టం చేద్దామంటే పనుల్లేని నాడు కనీసం రిక్షా అయినా తొక్కాలి ఏ లారిపైనో, ట్రాక్టర్‌పైనో ఎక్కాలి. పనిచేయడానికి తినాలి, తినడానికి పనిచేయాలి. చేద్దామంటే పల్లెల్లో పనులు కరువై ఊళ్ళల్లో నీళ్ళు కరువై, కరెంట్‌ కరువై బీడు భూముల సాక్షిగా “అన్నమో రామచంద్రా' అంటూ పట్నాల్లోకి వలస వస్తున్నారు జనులు కూలీల్తా. కాంక్రీట్‌ నగరాలు నిర్మిచడమే అభివృద్ధి అనుకుంటే కంప్యూటర్లమయం కావడమే దేశం ధ్యేయం అయితే పల్లెగుండెల్నిదాటి పనికోసం కూలీల్లా పట్నాలకేసి వలస వస్తున్న మనిషికి ఒకనాడు కూలికూడా దొరకని రోజంటూ వస్తే ఆ తప్పు మనిషిదా? వ్యవస్థదా? పల్లెల సాక్షిగా ఈ దేశంలో నేడు గ్రామీణ భారతం వర్ధిల్లాలి. (గ్రామాల్ని సస్యశ్యామలం చేసే నేతలు కావాలి. నేడిక్కడ వందలకొద్ది అన్నాహజారేలు పుట్టాలి. కూలీలు కాదు రైతే రాజని చెప్పేరోజులు మళ్ళీ రావాలి. సెప్టెంబర్‌ 19399 సబ్బని లక్ష్రినారాయణ

50 ఉత్తరం మనిషి తెలియకున్నా పర్వాలేదు, కనిపించకున్నా పర్వాలేదు మనసు తెలుపుతుందన్నట్లుగా ఉత్తరం మా యింటికచ్చి మనను నింపుతుంది, ప్రేమను పంచుతుంది. ఎలుగెత్తి చాటడానికి, గళమెత్తి చెప్పడానికి వీలు లేనపుడు ఉత్తరమే హృదయాలకు అనుసంధానం, ఉత్తరాలకు పలుకని శిలా హృదయాలెక్కడయినా ఉంటాయేమోగాని పలికేవారు, పలుకవలసినవారు, పలుకగలిగినవారు కూడా పలుకనపుడే బాధ. హృదయానికందుతారని అభిమానమున్నపుడేకదా ఎప్పుడైనా ఎవరికైనా రాస్తాం, చెప్పుకొంటాం. మనుషుల్ని కలవడానికి, హృదయాల్ని కొలువడానికి హోదాలు, అంతస్థులు, పదవులు, కీర్తులు కావాలా "స్నేహం స్నేహం కోసమే అనే ఒక్కమాట చాలదా ఉత్తరం ఎంత ఆలంబన! ఎంత తృప్తి, ఆనందం! రాయడానికి పేజీలు అక్కర్లే, రెండు మాటలు చాలు (ప్రేమతో గుండెలు నిండిపోతాయి. ఉత్తరం రాయడమే బద్దకమైనవాళ్ళు ఇక రాయడం గురించి రాయడమెందుకు, లోకం గురించి రాయడమెందుకు ఎవరికివారెప్పుడూ ఒంటరి ద్వీపం కాదు మనిషికి మనిషికన్న బహుశా ఉత్తరమే గొప్పది. హృదయాలకు, మనసులకు చెలియలికట్టలు కట్టుకొంటారేమో కొందరు. బహుశా ఎన్నడో హృదయ భారం పెరిగి, చెలియలి కట్టలు తెగి హృదయాలన్ని పారి ఉత్తరాలై ఆస్తుల్లోకి ప్రవహిస్తాయేమో. ఉఊత్తరమంటే కేవలం కాగితమేనా అది రక్తమాంసాల సజీవ దార అది మన మనసు పొరల సుస్వరాల వీణ హృదయాకాశపు సుందర విహంగం. మిత్రుల్లారా! ఆప్పుల్లారా! కాసేపు పలుకరించుకొందాం ఉత్తరాల ద్వారా మళ్ళీ మళ్ళీ. 29 సెప్టెంబర్‌ 1999 మౌన సముద్రం

హ్‌] పనిమనుషులు మనుషులు పనిచేయాలి, బతుకడానికి పనిచేయాలి పనికోసం పనిచేయాలి పనిచేయడంలో ఎంత తృప్తి, ఆనందం! ఎవరి పని వారే, ఎవరు చేయవలసిన పని వారే చేయాలి చేయవలసిన పనిని, చేయవలసినవారు, చేయవలసిన కాలంలో చేయకపోతే చేయవలసినవాల్లు, చేయవలసిన పనులను చేయలేనివాల్లు, చేయడానికి సమర్థత లేనివాల్లు చేసేస్తారు అప్పుడు అనర్థమే లోకానికి. కొందరు పనులు చేస్తారు కొందరు పనులు చేస్తున్నట్టుగా కనిపిస్తారు పనిచేయడాన్ని కూడా, పనిచేస్తున్నామని చెప్పుకోవడం విడ్డూరం. పనిచేయడం ధర్మం అయినపుడు, పనిచేయడం తప్పని సరైనపుడు ఫనిచేయాల్సిందే ఎవరైనా. వాకిల్లు ఊడ్వడానికో, బట్టలుతకడానికో, అంట్లు తోమడానికో, ఇల్లు కాపలాకో పనిమనుషులు౦టారని పనిమనిషులని, కేవలం పనికోసమే పనిమనుషులని "పేరు కుదిస్తున్నాం, దృష్టి మారాలి. రాజైనా, మంత్రైనా, 'సేవకుడైనా, సైనికుడైనా, ఉద్యోగైనా గృహివైనా, బోధకుడైనా, కవైనా, రచయితైనా ఎవరి పని వారు చేయాలి. పక్షి పక్షిలాగే బతుకుతుంది తనపని తాను చేసుకొంటు జంతువు జంతువులాగే బతుకుతుంది తన పని తను చేసుకొంటు బహుశా మనిషే మనిషీలాగా బతుకుతూ తనపని తానే సక్రమంగా చేసుకోవడం లేదేమో. కె పనిచేయడానికి వాయిదాలెందుకు భారా పనులు చేయడానికి ప్రత్యేకమైన పని మనుషులెందుక్క సనక నె పనికోసం పని అంటు | త్‌ 0. గ. డొల్ని న పని అనుభవంతో ఎవరిపనులు వారే సక్రమంగా ట్ట + విరు శ విద్యుక్త ధర్మంగా చేయాలి. స సం. 000 04 29 సెప్టెంబర్‌ 1క9 శ్రా నసబ్ద్హవి లక్షైనారాయణ

వణ

ఇలరి

పునర్జన్మ

పుట్టాలి, మరణించాలి, మరణించాలి మళ్ళీ పుట్టాలి కవిత్వానికి, కవికి ప్రతిరోజు పునర్జన్మే

కవి వెలగాలి, కవిచావాలి, కవి పుట్టాలి మళ్ళిమళ్ళి సూర్యుడిలా. సర్కస్‌ ఫీట్లు వేయడానికి కవి గారడీవాడు, బపూన్‌కాదు. పేరు, కీర్తికోసం నానాగడ్డి తినడానికి అడ్డమైన గాడిదకాదు. పాపులారిటికి 60డు నిర్వచనాలుండవట

అయితే శ్రీనాథుడైనా, శ్రీశ్రీ అయినా కావాలి కవి లేకుంటే వాడు చీప్‌ పాపులారిటిలోనే బతికినట్టు మెదళ్ళలోనే విషవృక్షాలు పెరిగినచోట

విషవృక్షాలు, వామన వృక్షాలే మహావృక్షాలని చెప్పబడేచోట గుబాళింపుల గులాబీలా కాదు, నువ్వు కూడా విషవృక్షంలాగే భ్రమిస్తూ సాగిపొమ్మనడం విజ్ఞతకాదు ఒక్కసారి పుట్టిన కవి, వెయ్యిసార్లు మరణించి వెయ్యిసార్లు పునర్జన్మించాలి

ఒకడు దాత కావచ్చు, ఒకడు భూనేత కావచ్చు

ఒకడు స్టారో, క్రికెట్‌ స్టారో కావచ్చు

కాని దాతకన్న భూనేతకన్న, స్టార్‌కన్న

ఎవర్‌ గ్రీన్‌స్టార్‌ కవి!

కవిది విశాల విశ్వం, విశాల సామ్రాజ్యం

కవి తన సామ్రాజ్యానికి తను చక్రవర్తి.

పేరునో, శ్రీర్తినో, డబ్బునో, హోదానో, అంతస్తునో

ఎవరి దగ్గరో అడుక్కునే పరాన్నబుక్కు కాదు.

విశ్వ సత్యాల్ని ఆవిష్కరించడానికి ఒక అరిస్టాటిల్‌ కవి, బతుక్కు బాటలు వేయడానికి ఒక హెమింగ్‌వే కవి. “'అత్మపరిశీలన చేనుకోడానికి ఒక ఎమర్సన్‌ కవి.

బతుకు విమర్హను చేపట్టడానికి ఒక అలెగ్జాండర్‌పోప్‌ కవి. పేరునో, కీర్తినో త్యజించడానికి ఒక జీన్‌పాల్‌సార్తే కవి. బతుకులో నమ్మకాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, నిర్మలత్వాన్ని, నిజాయితీని నింపుకోడానికి ఒక గోథే కవి.

చొన సముద్రం

53

సాలె పురుగుకున్న, గిజిగాడికున్న నేర్పు, పనితనం,

పట్టు పురుగుకున్న నైజం, త్యాగం

చీమకు, తేనెటీగకున్న తెలివి,

రంగురంగుల సీతాకోకచిలుక జీవిత రహస్యాలు తెలిసుండాలి కవికి కవిని చంపవచ్చు, కవి భావన్నెవడు చంపుతాడు "పేరుతో, కులంతో, గోత్రంతో, డబ్బుతో, హోదాతో

అంతస్తుతో గొప్పవాడనిపించుకొనేకన్న

కవి తన కవితలతోనే గొప్పవాడనిపించుకోవడం గొప్ప.

మనిషిగా కవి చచ్చిపోతాడు.

కవిగా కవి కలకాలం బతుకుతాడు, వాడు కవైతే.

కవిత్వం ఒక పునర్జన్మ కవికి, తరతరాలకి.

25 అక్టోబర్‌ 1999

నబ్బని లక్షినారాయణ

వశ కవిత కవితా సాక్షాత్కారంకోసం ఒకోసారి రోజులు చూశాను, నెలలు చూశాను, సంవత్సరాలు చూశాను. కవిత నేను కోరినప్పటికన్న నేను కోరనప్పుడే నాకు సాక్షాత్కరించింది. కవితకోసం ఒకోసారి నాలో నేను మథనపడ్డాను నన్ను నేను మరల మరల తిరిగి చదువుకొన్నాను మననం చేసుకొన్నాను, నాలో నేనే అన్వేషించాను. కవితకోసం, ఒకోసారి నేను రోడ్డుమీద పడ్డాను, జనంలోకి చూశాను పల్లెల్లోకి, పట్టాల్లోకి, చెట్లల్లోకి, గుట్టల్లోకి అడవుల్లోకి, దేశాల్లోకి కూడా చూశాను. కవిత చిరునామా ఎక్కడని నేను కవుల కలాల్త్టోకి, పుస్తకాల్లోకి తలమునకలై చూశాను. కవిత ఒకోసారి ఎటో వెళ్లిపోతుంది చెప్పాపెట్టకుండ మళ్ళీ ఎప్పుడు వచ్చిచేరుతుందో నా సరసన ఆలంబనగా కవిత లేనపుడు నేను ఒంటరినే కవిత నాలో, నాతో ఉన్నపుడు వేను గుబాళించే పువ్వులా ఉంటాను. కవిత నాకు జ్ఞానామృతాన్ని, ప్రేమామృతాన్ని పంచుతుంది. నేను లేకున్నా కవిత ఎప్పుడైనా, ఎక్కడైనా బతుకుతుంది కాని సుషుప్తావస్థలో కూడా, కవిత లేక నేను లేనేమో కవిత లేక నేను బతుకలేనేమో. కవిత నా నుండి దూరంగా వెళ్ళిపోయినపుడల్లా కవితకోసం చూస్తుంటాను, ఆనాహన చేస్తుంటాను కవితకోసం రాస్తుంటాను. ఇప్పుడైనా, ఎప్పుడైనా నా సాధన, నా తపస్సు చూసి కవిత నన్ను కరుణఖిస్తుందనే నమ్మకం. కవిత నే పెంచుకొన్న ముద్దుబిడ్డ కవిత నన్ను సేదదీర్చే కన్నతల్లి కవిత నన్ను ఒలలాడించే హృదయరాణి కవిత నన్నెప్పటికీ కరుణిస్తుంది.

11 నవంబర్‌ 1999 చూొూవ సముద్రం

వ్‌5్‌

కన్నీళ్ళు రానీయద్లు

లు కన్నీళ్ళు రానీయద్దు కర్కషత్వం ముందు, దానవత్వం ముందు, కల్మషత్వం ముందు కన్నీళ్ళు రానీయద్దు. కొండను చూసి నేర్చుకోవాలి అది ఎంత దృడంగా నిలుచుంటుంది ఎన్ని ప్రళయాలు వచ్చినా. సముద్రాన్ని చూసి నేర్చుకోవాలి అది ఎంత గాంభీర్యంగా ఉంటుంది ఎన్ని ఆటుపోట్లు వచ్చినా. నింగిని చూసో, నేలను చూసో నేర్చుకోవాలి పొంగిపోవాలి, పరవశించి పోవాలి వాటి స్థిరత్వానికి. కన్నిళ్ళందుకు కార్చాలి కారిన్యం, కర్కషత్వం, కల్మషత్వం బతుకులో భాగమైనపుడు. మంచితనం ముందు, మానవత్వం ముందు, కారుణ్యం ముందు కన్నీళ్ళు జలజల రాలుతాయేమో నిర్మలవర్షంలా వాటిని కన్నీళ్ళు అనే బదులు అఆనందబాష్పాలో, హృదయపు వర్షాలో, హృదయపు హర్షాలో అందాం. కన్నీళ్ళ విలువ తెలిసినవారెవరైనా ఉంటే వాల్ల పాదాలను కన్నీళ్ళతో కడుగుదాం తప్పులేదు, గొప్పపనే. కన్నీళ్ళు రానీయడద్దు తుపానులు వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా అకాల మరణాలు వచ్చినా నాది, నావాల్డు అనేవి సర్వం లేకుండా పోయినా “అతడు అడవిని జయించాడు' లోని ముసలాడిలా ఆత్మవిశ్వాసంతో బతుకాలి. బతుకంటేనే నిరంతరం బాధ, బాధ, పోరాటం,28 పోరాట గా ము అని తెలిసిన చరిత్రలో తొలి పోరాటనీరుడు ద ఖా “నారకస్‌' ఖం త్‌ స్పార్టకస్‌ లా బతుకాలి. గ్‌ శ కన్నీళ్ళు రానీయద్దు, కన్నీళ్ళు రానీయద్దు న్‌ 6 ఇండిమమిరకం య అత్మవిశ్వాసం సడలద్దు ఎప్పటికీ. య స

మైన చక సు 0

సబ్బుని లఅక్ష్రైనారాయణ

వ్‌6 వీరజవాన్ల స్మృతిలో కార్గిల్‌ వీరజవాన్ల స్మృతి కార్డిల్‌ వీరుడా! మేం నీవెంటే ఉన్నాం _్ర మేం హిందువులం, ముస్లింలం, జ్రైన్తవులం, సిక్కులీం, కైనులం, బౌద్భులం, | పార్షీలం, సమస్త భారతీయులం న క నీవెంటే ఉన్నాం. ం కాల్‌ వీరు! ( ము కార్మికులం, కర్షకులం కవ్పలం, కళాకారులల, రచయితలం, డొక్టర్లం, యాక్టర్లం, క్రళ్మ కార్దిల్‌ వీరుడా! న్న మేను వ్యాయవాదులం, నాయకులం, పైంట్‌న్టులం, ఇంజనీర్లం, వ్యాపారులం, గ / ఉపాధ్యాయులం, విద్యార్థులం, శ్రీడాకారులం, గాయకులం, జ్జ పిన్నలం, పెద్దలం, సమస్త భారతీయులం, నీవెంటే ఉన్నాం, పదహారు వేల అడుగుల ఎత్తున గడ్డకట్టిన చలిమంచు కొండల్లో నువ్వు ప్రాణాలొడ్డి దేశంకోసం పోరాడుతూ మువ్వన్నెల జండాను ఎగరేసి నిలిపి ఉంచినపుడు భరతజాతి ఎలా మరుస్తుంది నిన్ను! | శార్డిల్‌ వీరుడా) శత్రువుల కుతంభ్రాలముందు, తుపాకీ గుండ్ల ముందు విలిచి ప్రాణాలొడ్డి పోరాడుతున్న వీరుడా సలాం! భరతజాతి నీ త్యాగానికి పులకించిపోతుంది. మువ్వన్నెల జండాను చేతబూని మేము దేశం నలు మూలలా వల్లెల్లొ, పట్నాల్లో, దశదిశలా వోడవాడనా ఎగరేస్తూ నీ త్యాగాన్ని కీర్తిస్తూ విడయగీతం పాడుతున్నాం! దేశం కోసం ఆమనవ్వలు బాసిన వీరజవానులారా! వాతి ఎలా మరుస్తుంది మిమ్ము! కన్నతల్లీ, జన్మభూమి గొప్పవి, వీరజవానులారా! "హమారా భారర్‌ మహానా “గుండా ఊంచా సదా రహే హమారా క లవ్‌ మై ఇండీయా జై జనాన్‌ కై హింద్‌, 15 జూలై 1999 మౌన సముద్రం

క౨౬3ఆక45 సగ : 549940 ము! ౫4న నయగ 0116 0 8110 ; 01-04-1960 1106 0 811% న కెంణ0348 ౧11200), స12౧0241 & 015. గ2గ౧0౧201 (4౬) జీరరే[956 వ కసం. 66436, 32102021 క2గగిగి2ండ౯- 505 001. - క క ౧౦౧6 2 08722 - 30339 66044004 ౧44|1|0ట400089 : జీ4. (600190), ౬6. ౯60) (0౬౯౬) శీ/ ని౭96౧1 : ఆ౧646౯ ౯౧.౦ ౧౧౦౩౧2౫౧౫౦ 81 క౭202 ౮౧౫౭౯ 8200921, గి [౧612౧ గం) 1౧ ౬09131, 19805 & 19905: & 516) ౮ గాఖం? 8౧6౩ ౯౧01935104]! (0616006 వ 160215 అధ౭గ౧6౧౦9 25 10806 (4 ౧౧౦౦60౧1, 25 ౬661016? 1౧ 6౧0150 0౧ 6011000 2 604. 0191/04 1౧91416 0 6౬60062000 & 120100 (01.౬౧7), ఓ.84.0. 0010%4 గ2గణ0832% (ఉలి) )

(| ర్న గాలినెవరు బంధిస్తారు జలపాత ప్రవాహాన్నెవరడ్డగిస్తారు సముద్రపు హోరునెవరాపుతారు నిప్ప నిజాయితీనెవరు కాదంటారు కన్నీటికి విలువనెవరు కడుతారు కవీ! వెళ్లిపో ఎల్లలు తెలియని సముద్రాలు దాటి | . కవీశ్వరుడివైపో. అక్షరాల గవాక్షాలు దాటి ఇ ల కవీ! గాలిలా వ్యాపించు - టే . సీరులా ప్రవహించు ౯ . నిప్పలా అంటుక | శ నేలనేలంతా కవిత్వమైపో స ఆకాశ హర్ష్మ్యానివై. అవని కిరీటమై పో - కవీ! నిజాయితీ నీలో దన్నపుడు ' ' నీ సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తివి. .