Telugu Matladukovali - anilvaranasi/indianlanguages GitHub Wiki
ల [గి . | క | | ॥ గ. = . స... . స / మ న్ షా ల 1 | " థీ జ. " 1. | యం. 1 " [' (| పనాదమూరి 9 కత్తీం
దణ. కర స్ట -జిర్హప్తుఖకకతి సాహా త్త స్రదస్యోరంచర గ్రసావమ్తూక్త
ప్రసాదమూర్తి కవి త్తే 0 నూట్టాడుకోనాతి హాలు
(ఈ దృష థగ రి ధూడూ ధు22 గీ/తరీడరం[ం*డ!! 0 క౧29262 గిగంగం/ అ 0౧9.౧.౪50/39262 సీం ౯65656160౧ : 14౧6, 200/7. 6౦౧1౪5 : 1000 [01166 : స. 50/- ౮5 $ 10/౧ | ౬౬.) 60౪౪ 0410608 & 06518౧ : 021 1౧౧౮ ౧266 065180 : £ి2౪! గీగ 6 56826: ౪౭౧6061 564610, ౧/౮. [1౧666 26: ౧౧౩/2 1౧౫౧౯౭౩౦౧3, 6. [0/ 6౦౧16౩ : ౪523120602, గి౭2 56011 సజాండేష/2, గ220/6083, 050౧4 2౧06 0068 16261౧6 8౦01 5%005. చ్ 2౧01 న 6/0 16 గిఆ0౪21/ 06|| వ్! 0]. 79146౪ రు 24202 సీంం0ర2/2 ౪1021220), (6౮ 624100100౪), గ.6౬౮ 62గ౧౪ [/6ఆ20436-500 046. (4౧) 1౧౮1. [1410016 : 2007 ౯౫7౮ 994 82998 66/36 కండ కక/5/ ( ౧౧౦౧6 : 040 - 2301 1288 భో (గ్రంధాలయ నరా ఖః
- (6%. న
ల్ ల! సీ లో షష సు. 7 న న న? ల మద్దూరి నగేష్‌బాబు స్మృతిలో
కృతబ్లతలు న. నా గురించి నా కవిత్వం గరించి మిత్రుల ద్వారా తెలుసుకుని నా పుస్తక ప్రచురణకు ఆర్థిక స్తహాయాన్మి అందించడానికి ముందు సాన్ ముగ్గురు సహృదయులున్నారు. వారు శ్రీయుత పెన్మెత్స బోసురాజు, టి.సురేష్ రెడ్డి జ,.పద్మనాభం. వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను. ఈ పుస్తకాన్ని ఇంత అందంగా, అనుకున్న సమయంలోనే ప్రచురించడానికి ముఖ్యకారకులు, అప్తమి[త్రులు కుమార్ సుబ్బరాజు. వారికి నేనెప్పటికి రుణపడి ఉంటాను. ఇంకా నా కవిత్వాన్ని నిరంతరం ఎంజాయ్ చేస్తూ పుస్తకరూపంలో నా కవితలను చూడాలని ఆరాటపడి ఎలాంటి సహాయని్లైనా తమ సంసిద్ధతను తెలియజేసిన మిత్రులు ఎందరో వున్నారు. ముఖ్యంగా అనా అంటే కన్ని లంటూ పలకరించే సోదరుడు ఎం.ఎస్.నారాయణ, చంద్రశఖర్ అజాద్, నీలం ప్రసాద్, అరుణ్ సాగర్, లక్ష్మీ నరసయ్య, శంకర్సేంగ్: మంతినీడి శ్రీనివాస్, రఘు, డ.వి.రాజు, మైలవరపు శ్రీనివాస్, దుర్గ రాజు, జగన్ మోహన్, శిఖామణి, ఖాజా, ఉదయలక్ష్మి, వసంతలక్ష్మి, దేవి, శాంతారాం, సురేష్ ఆర్కె, వీరూ హరీష్ చక్రి. అలాగే ఆమెరికాలో వుంటు నా కవిత్వాన్ని ఆస్వాదించి ప్రచురణకు ప్రోత్సహించిన హరిశంకర్ రామకృష్ణ శ్యామ్ శారద ఇలా వందరో ఎందరో మిత్రుల (ప్రోత్సాహం, ప్రేరణ, సహాయసహకారాల ఫలితమే ఈ పుస్తకం. నా పుస్తకానిక అడిగిన వెంటనే ముందుమాట రాయడానికి అంగీకరించి ఆ మాటలో నన్ను నన్నుగా ఆవిష్కరించి ఆశీర్వదించిన ఆత్మీయ కవి మిత్రులు శివారెడ్డి గార్కి, నా వృన్తక ఆవిష్కరణకు నిండుమనన్సుతో అంగీకరించిన వూజ్యులు డా!సి.నారాయణరెడ్డి గార్కి. అందమైన, అర్ధవంతమైన ముఖ చిత్రాన్ని అందిచిన తమ్ముడు అక్సర్‌కి, నా కవితలను (ప్రచురించిన ఆంధ్రజ్యోతి, (ప్రజాశక్తి తదితర పత్రికలకు, కవితలన్ని చక్కగా డి.టి.పి చేసి పుస్తకం తుది రూపు దిద్దుకునే వరకు అండగా నిలబడ్డ తమ్ముడు ఎం,రవికి, అమ్మ, నాన్హు రాజీ... ఇంకా నా కవితలు అచ్చులో చూడడానికి ఆరాటపడే నా బంధువులు, మిత్రులు, శిళ్యులు, సహోద్యోగులు ఎందరో ఎందరో అందరికి...
- ప్రసాదమూర్తి
కె.శివారెడ్డి య్ తేజోవంత మౌతూ “0 1౪6౪110 0410100 ౧2౧౮9 15 ౧౦ 685) 10615 10 1001౧416 ౦ ౧1406 0110౪6 15 546 ౬/60 ౬514016 02౧ 09 ౧౬2636 ౬096 ౧1౦ 66 ౧౦166 న0గ140656 ౧౦61 (ప్రసాద మూర్తి వస్తుతః కవి. వస్తుతః కవిగాని కవులుంటారా? ఉంటారు; తత్వాన్ని బట్టిగాక సాధన వల్ల కవులయిన కవులుంటారు. కవుల్లాంటి కవులుంటారు. వస్తుతః కవి అంటే స్వభావం వల్ల కవి. అతను రాయక పోయినా కవే. పల్లెటూళ్ళలో పనిపాటలు చేసుకునే చాలా మంది కవులే. చుట్టూ పరిసరాలు, భౌగోళిక నేపథ్యాలు, దృక్పథాలు జీవన సమరాలు ఈ తత్వకవుల్ని యింకా పదునక్కేట్టు, తీవ్రతర మయ్యేట్టు చేస్తాయి. తను నమ్మిన ప్రాపంచిక దృక్సథం తన తనకొక్తొ మార్గ నిర్దేశం చేస్తుంది. ప్రసాదమూర్తి బేసికల్‌గా కవి. అతను కవిత్వం రాయకపోయి వుండినా కవే. ఒక కవి జీవన విధానం వేరు. వానపాములాగా మట్టిలోవలికి తొలుచుకెళ్ళేతత్వ౦. మట్టిని సారవంతం చేసే తత్వం. అతని స్వభావమది. విద్య, లోకానుశీలన, సామాజిక రాజకీయాధ్యయనం దీనికొక భూమికని ఏర్పరుస్తాయి. ఏపుగా ఎదగడానికి, పూలు పూసి కాయలు గాయటానికీ దోహదపడుతాయి. " మాట్లాడుకోవాలి ౪ 1
(ప్రసాదమూర్తి వస్తుతః కవి అంటే జీవన వైరుధ్యాలు, సమాజవైరుధ్యాలు అతన్ని తాకలేదని కాదు. అవన్నీ ముడిసరుకు అందించటానికి పనికి వచ్చాయి. 1999 లో వచ్చిన అతని మొదటి పుస్తకం చూసినా, ఇప్పుడొస్తున్న ఈ కవితా సంపుటి చూసిన్నా మీ కర్టమౌతుంది, తన చుట్టూ వుండే సర్వ సంబంధాలనీ వాటిని నిర్ణయించే శక్తుల్నీ అర్ధం చేసుకున్నాడని. (ప్రసాదమూర్తితో (ప్రత్యక్ష పరిచయం లేనప్పుడు మొదటి సంపుటి 'కలనేత' చదివా, పేరే అద్భుతంగా అన్పించింది. జీవితానికి సంబంధించి కవిత్వానికి సంబంధించి సమస్త అర్జాల్ని వ్యక్తీకరించే పేరు 'కలనేత'. అప్పుడు 'కలనేత' చదివి ఆనందించా, అప్పుడూ నే గుర్తించింది ఇతను కవే అని. ఇతను మొదట కవి. కవిగావటానికి అన్ని దినుసులు అతని బాల్యం దానివెనక వున్న సామాజిక వాతావరణం అందించాయనుకున్నా. దాన్ని పరిపూర్తిగా ఆ౫౦౫ చేశా, తనకొక జీవితం వుంది. తనకొక కులం, తనకొక వర్గం - తనకొక ఊరు, వాటన్నిటిని బట్టి ఏర్పడిన ఒక ఉనికి వుంది. కులాల మథ్య, వర్గాల మథ్య, ప్రదేశాల మథ్య, అర్టికాల మథ్య వున్న అంతస్వూత్రాన్నీ అర్ధం చేసుకుని చాలా తీవ్రంగా పలికిన కవితలు అవి. మళ్ళా ఇన్నేళ్ళ తర్వాత 'కలనేత' చదివితే పూర్వానుభవం తగ్గలేదు. నిజానికి ఈ కవితా సంపుటి ఏడెనిమిదేళ్ళ తర్వాత వస్తుంది. కనీసం మధ్యలో ఒక కవితా సంపుటన్నా రావాల్సింది. రాలేదు. నిదానంగా నిరాటంకంగా పాఠరటం తెలుసు. కవిగా పరివర్తన చెందటం తెలుసు. చదువుకున్న వాడు కాబట్టి పూర్వ సాహిత్యాన్ని, అలంకార శాస్తాల్ని అధ్యయనం చేసిన వాడు కాబట్టి కవిత్వం ఆను పానులు తెల్పు. ఎత్తుగడలూ, వ్యూహాలూతెల్సు. వూమూలు మాట కవిత్వం ఎట్లా అవుతుందో తెల్సు, మామూలు వాక్యాన్ని కవితా వాక్యంగా ఎలా చేయాలో తెల్సు. కవిత్వానికి మూఖ్యంగా ఉద్యమ కవిత్వానికి కావాల్సిన ఒక ఇసురు', ఖడ్గ చాలనం లాంటి ఇసురు, ప్రవాహ గతి తన ర్త నిష్టమయ్యాయి. [6౧౦ 000౧163 గొవున్లు 2 ప్రసాదమూర్తి ౪ 1
ఆఫ్రికన్ దేశాల్గోని కవులు [13౧60 భాషలోనే రాసి, కవిత్వం, కథ, నవల 0010౧14 ౧16కి ఒక 6౧౫16౧06 విసిరారు. అలాగే ప్రసాదమూర్తి ఆధిపత్య కులాలందించిన చదువునీ, సంస్కృతినీ, భాషనీ, వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పాల్సి నప్పుడు, దాన్ని తిప్పి వాళ్ళపైకి ఎలా ఎక్కు పెట్టాడన్నది ఒక అంశం. అందులోనూ అతను విజయం సాధించాడు. అన్ని రకాల కవితా వ్యూహాల్ని తననుగుణంగా కవిత్వంలో వాడుకున్నాడు. మామూలు మాటని ఎలాతిప్పితే, ఎలా కదిలిస్తే కవిత్వమౌతుందో కవికి తెలియాలి, తను పుట్టి పెరిగిన గ్రామీణ వాతావరణం, పల్లెల సాంస్కృతిక నేపథ్యం అద్భుతంగా ప్రసాదమూర్తికి అంది వచ్చి కవిత్వమయ్యాయి. “గుండెకి ఒక కొస నిప్పంటించుకుని ఒక అక్షరానికి ఓ కన్నీటి చుక్క ఒక అక్షరానికి ఓ నెత్తుటి బొట్టు ఇచ్చి అక్షరాల్లోకి అంతర్జానమైపోతాడు” = కవిత 'కలనేత' నుంచి ప. “ఎవరిజీవితాలను వాళ్ళు మోసుకుంటూ వీలైనప్పుడల్లా ఒకరిబరువును ఒకరు దింపుకోవడమే కదా కలుసుకోవడమంటే! ఎలాగూ వచ్చాక వెళ్ళడం తప్పదు కాబట్టి కలుసుకోవడానికే వచ్వాము కాబట్టి జీవితాన్ని ఉత్సవంగా జరుపుకోవాల్సిందే నలుగురి నవ్వుల్లో మన బొమ్మను చూసుకోవాల్సిందే” మాట్లాడుకోవాలి * 111
కలయికలే జీవితం
కలయికల జ్ఞాపకాలే జీవన సౌందర్యం
ఈ కొత్త కవితా సంపుటి 'మాట్టాడుకోవాలి' లో మొదటి కవితలోని వాక్యాలివి. తొలిసంపుటిలో బలమయిన దళిత, బహుజన కవిగా ముందుకొచ్చిన (ప్రసాదమూర్తి రెండో సంపుటి కొచ్చేసరికి 'జీవనోత్సవాన్ని గురించి మాట్టాడుతున్నాడేంటి; తనూ అందరిలాగే జనరల్ కవిత్వం రాయటానికి పూనుకున్నాడా! అని చదివేవాళ్ళకీ, మారుతున్న దృశ్యాల్ని చూడ నిచ్చగించని వాళ్ళకీ అన్పించవచ్చు. కాదు అక్కడా (ప్రసాదమూర్తి కవే, ఇక్కడా (ప్రసాదమూర్తి కవే. నిజానికి ఈ జీవనోత్సాహం - జీవితాన్ని ఉత్సవంగా ఒక పండుగగా ౪1601216 చేసుకునే తత్వం బలంగా పల్లె బతుకుల్గోనే వుంది. పల్లెల్లో విభిన్న వైరుధ్యాల మధ్య ఆర్థిక, ఆధిపత్య ఆంతరాలమధ్య వెలుగుతున్న, ఇంకా సజీవంగా వున్న అంశం - జీవితాన్ని జీవించడం - పండగ చేసుకోవటం - పస్తులున్నా సరే - చమత్కారం పోదు, వెటకారం పోదు, ఆనందించటం పోదు; ఆస్వాదించటం పోదు. బతుకు పట్ల అమోఘమైన (ప్రేమ, ఎలా బతికి బట్ట కడుతున్నాయో తనుకనుభవమే. దాన్నే ఒక కొత్త సందర్భంలో (ప్రస్తుతీకరించాడు. తత్వకవులూ, భక్తి కవులూ, సంచారకవులూ, పాడిందిదే, 6లో అద్భుతమయిన 1౪౦16౧6౧ కలయికే కవిత అన్నా డింకొక చోట. (ప్రపంచీకరణ నేపథ్యంలో సంబంధాలు, ప్రేమలూ, ఆర్థిక సంబంధాలు అవుతున్న స్థితిలో మనుషులు ఏకాకులుగా మిగులుతున్న నేపథ్యంలో జీవితాన్ని గురించి పాడటం ఒక ఎత్తయితే, మనుషుల్ని కలపటం మరొక ఎత్తు, సామ్రాజ్యవాది, పెట్టుబడి దారుడు మనుషుల్ని విడదీస్తారు - కవి, కవిత్వం మనుషుల్ని కలుపుతుంది. సంగమమే ఒక పండగ, సంపద. ఇప్పుడ కవిత్తం (ప్రాధాన్యత నలుగుర్ని పోగేయటం కలపటం, కలిని పంచుకోవటం, ఆనందించటం, కలిసి మార్చ్చేయటం, యుద్దాలు చేయటం,
మార్షిన నేపథ్యంలో, సందర్భంలో దేనికి ప్రాధాన్యత యివ్వాలో ప్రసాదమూర్తికి తాం
ప్రసాదమూర్తి *
తెలుసు. అందుకే £గా౧౧2919 501 అయ్యింది తప్ప. అసలు విషయం అంతర్జానం కాలేదు. అసలు పల్లెటూరు 0256 గా వచ్చిన కవి కవిత్వంలో 'ప్రకృతిదే ప్రథాన పాత్ర. జీవితం నుంచి విడదీసి చూసే ప్రకృతికాదు. పల్లెటూళ్ళ జీవితాలలో అంతర్భాగమయిన ప్రకృతి. అది 'వాని కావచ్చు, కాలవ వదిలినప్పుడు కావచ్చు. మనుషుల్లో కలుపుకుని ప్రకృతిని పాడేతత్వం నిజమయిన 960011/కవికి వుంటుంది. ఇన్నాళ్ళ తర్వాత నాలాగే ప్రసాదమూర్తి 5001150216 కాలేదు. నాగరీకుడు, ౪02౧196 కాలేదు. అతని ప్రేరణలన్నీ సహజాతాలన్నీ (గ్రామీణమయినవే. ఈ కొత్త సంపుటిలో 'వాన అనే కవిత ఉంది చూడండి, నాలుగు పేజీల కవిత, వాన కురిసినప్పుడు ఏరుపొంగినట్టు పొంగింది, అద్భుత దృళ్య పరంపర, ఎంత తన్మయత్వం. ఎంత ఐక్యత - వానతోనేనా, సర్వ ప్రకృతితో, కుందుర్తి గారి 'నగరంలో వాన' నగరంలోని వానే. దానికి పల్లె వాసన లేదు. ప్రసాదమూర్తి వాన పద్యం; ఒక చిరు కావ్యం. కవిత అయిపోయే సరికి మనం వానలో లీనం కావల్సిందే. “సన్నసన్నగా వాన - చల్లచల్లగా వాన జల్టులు జల్టులుగా వాన తుంపరతుంపరగా వాన ఈ ఉదయం పూట వాన నా హృదయాన్ని స్మృతుల మునివేళ్ళతో మీటుళూనే వుంది”. ఒక పాట స్థాయికి ఒక వచన కవిత ఎదగటం. బహుశ యిన్నాళ్ళ వచన కవిత్వం ఆదిశగా ప్రయాణిస్తుందేమో, ఒక జానపద కథాకథన శక్తిని ఒక నవ్మోహ నంగీత శక్తినీ అది అంతర్లీనం చేనుకునే (క్రమంలో ఎదుగుతుందనుకు౦టా. ఇష్రీష్త్మ మాట్లాడుకోవాలి ౫
ప్రసాదమూర్తి ఏ కవిత తీసుకున్నా ఈ గుణం కన్పిస్తుంది. వరికోతలయ్యాక, కట్టు ముడి వేసుకుంటూ అర్హరాత్రి దొటిందాక, జానపద పాటలు పాడుతూనో, కథలు చెబుతూనో కాలం గడిపే వ్యవసాయ కూలీల స్పర్శ ఏదో ప్రసాదమూర్తి కవితల్లో తొంగిచూస్తుంది. పోర్చుగీస్ మహాకవి అద్రాదే అన్నట్టు ప్రసాదమూర్తి కవితలన్నీ కాంతితో కొట్టుకుంటూ, భూమి మొరటు తనంతో, తొలకరి వచ్చాక, కాలన వదిలాక, ఎండాకాలం అంతా ఎండిన, నెరైలు పడ్డ చేలల్లోకి తొలిసారి నీళ్ళు పారేటప్పుడొచ్చే వాసనతోనూ సంగీతంతోనూ, గాలి ఈలల్లోనూ కదులుతూ వుంటాయి, కాలువ సంబరంలో మావూరు అనే కవిత చూడండి. 'కలనేత' లో వుంది. 021601210౧ అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. కవికి తెలిసి వుండాలి. పల్లె పట్టుల కవికిది కరతలామలకం, “విజయోత్సాహంతో యుద్ధం నుండి తిరిగొస్తున్న వీరుడిలా వస్తుంది కాలువ కాలువ వదిలినప్పుడు చూడాలి మావుళ్ళో సందడి. తలుపు సందుల్లోని చేతికర్రలు చెప్పులు తొడుక్కుని చేతులూపుకుంటూ పొలం గట్టుకు బయల్దేరతాయి" అని మొదలయిన కవిత విస్తరిల్లి “ఏమీ ఎరుగనట్టు వస్తుంది కాలువ = మా వూరిని మాత్రం తం ప్రసాదమూర్తి * 1/1
ఎక్కడ ముట్టుకుంటే అక్కడ కొత్త మొల“లు పుట్టుకొస్తాయి” అని ముగుస్తుంది, “అమ్మ” మీద రెండు కవితలు ఒకటి మొదటి సంపుటిలో వుంది. రెండోది ఈ సంపుటిలోనే. 'అమ్మను చూడాలి" అనే ఈ సంపుటిలో వున్న కవిత - గొప్ప కవిత. “అమ్మను చూడాలి అమ్మలాంటి ఊరును చూడాలి, అని మొదలై వ్యాపార సంస్కృతి విపరీతంగా అల్గుకుపోతున్న సమయంలో ఊళ్ళు, మనుషుల సంబంధాలు ఎలా వున్నాయో వివరిస్తుంది. “నీక్సు తెలియకుండానే నువ్యో సరుకైపోతావు. రంగుకాగితాలలో చుట్టబడి వెలకట్టబడి నడిరోడ్డులో నిలబెట్టబడి గమ్మత్తుగా అమ్ముడైపోతావు”. “అమ్మను చూడాలనుంది. అమ్మ ఒడిలో దాక్కోవాలనుంది అమ్మతో అమ్మ భాషలో ఆడుకోవాలనుంది అమ్మ తన పాత పెట్టిలో నాకోసం మడత పెట్టి దాచి వుంచిన కలల పట్టు వస్త్రాన్ని ఒకసారి వాసన చూడాలి” అమ్మను చూడాలి అమ్మలాంటి ఊరును చూడాలి ణి సి స 2 " మాట్లాడుకోవాలి 4 1/1
“ఆయుధం మీద చర్భ నిజానికి చిత్రంగానే ఉంటుంది. అయుధం మీద ఆయుధం నిఘావేస్తున్న వేళ ఆయుధాన్ని, ఆయుధం నిషేధిస్తున్న వేళ ఎటు తిరిగీ ఎండింగ్ ఎన్‌కౌంటరే అని తేలిపోయిన వేళ ఆయుధాల మీద చర్చలు కాస్త చికాగ్గానే వుంటాయి" బహుళ నక్సలైట్ల చర్చల నేపథ్యంలో రాసిన కవితేమో మంచి కవిత, అధ్యాపక వృత్తిలో వున్నాడు కాబట్టి స్కూలు పిల్లల మీద ఐదారు కవితలున్నాయి. దేనికదే సాటి. 'జహీరా' మీద, మేధాపాట్కర్ మీదా, బుష్ మీదా, ఇలా చాలా సందర్భాల నుంచి పుట్టిన కవితలూ వున్నాయి. దళితకవి మద్దూరి నగేష్‌బాబు మీద అతను చనిపోయినప్పుడు రాసిన కవిత గొప్పది. తన్ను, తన నమ్మకాన్ని శంకించిన ఒకే ఒక సందర్భం. ఎంపీల పాస్‌పోర్ట్ కుంభకోణమప్పుడు రాసిన కవిత “నమ్మకం పోతోంది నాకు”. “నమ్మకం పోతోంది నాకు నాదేశం మీద, నా ప్రజాస్వామ్య సందేశం మీద నమ్మకం పోతోంది నాకు” ఇలా మొదలయిన కవితలో చివరగా అన్నిటికంటే ప్రమాదకరమయినది. “నమ్మకం పోతోంది, నమ్మకంపోతోంది జనం తిరగబడతారన్న ప్రసాదమూర్తి * 1/11
నమ్మకం మీదే నమ్మకం పోతోంది నాకు” అని ముగుస్తుంది, ఇది తాత్కాలికంగా ఎగిసిన ఒక నిరాశ ఫలితం కావచ్చు గానీ, ప్రసాదమూర్తి తత్వం అది గాదు. “మాట్లాడు కోవాలి మెత్తగా బత్తాయి పండు తొనలు విప్పినట్టు మనసు విప్పి మాట్టాడుకోవాలి మాటకు వెలుగే కాని చీకటి లేదు మనుషుల్లా మాటాడు కోవాలి ఛా ధరా పంజరంలో నుండి పక్షిని వదిలేసినట్టుండాలి. కొళాయి తిప్పితే నీళ్ళురికినట్టండాలి. నీ నుండి ఏమీ ఆశించని ఓ చిట్టిపాప చటుగ్కన నీ బుగ్గని ముద్దు పెట్టుకున్నట్టుండాలి"”. ఈ రెండో కవితా సంపుటిలో ప్రసాదమూర్తి మెల్లో అయ్యాడు, మెచ్యూర్ అయ్యాడు. సిద్ధాంతాలతో ఎక్కడ మొదలై ఎలా విస్తరించాలో అర్ధం చేసుకున్నాడనుకుంటా, కవిత్వ విస్ఫృతిక్తీ విశాలత్వానికీ, సిద్ధాంతానికీ మథ్య గల సంబంధాన్ని బాగా అర్థం చేసుకున్నాడనుకుంటా. అందుకే ఒక వైవిధ్యం వుంది, ఒక విసృతీ వుంది. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టీ కవిత రూపు రేఖలు మాట్లాడుకోవాలి * క
మారుతూ వుంటాయి. మారుతున్న స్టితిని కవి గుర్తించలేక పోతే 0162166 అయిపోతాడు. తనను తాను [92064)49[చేసుకోవాలి. 8239659 చేసుకోవాలి. 6౪11256 చేసుకోవాలి. ఆ(క్రమం ప్రసాదమూర్తికి బాగా తెలుసు.
కవిత్వం రాయటం కూడా దీర్హకాలిక పోరాటం లాంటిదే. పోరాడటమే ధ్యేయమయినట్టు, తన్ను తాను వివిధ సందర్భాలలో వ్యక్తీకరించుకోవడమే ధ్యేయమవుతుంది. తన్నుతాను బతికించుకోవడ౦ం ఎంత కష్టమో (ప్రసాదమూర్తికి తెలుసు. తను 182196 అయ్యాడు. దీర్ధకాలికంగా ఎలా బతకాలో, ఎలా ఉద్యమించాలో అనుభవంలోకి వచ్చినట్టు ఈ కవితా సంపుటి చెబుతుంది. (౭౧ రావచ్చు కాని, ఆగిపోకూడదు, ఆగిపోతేమరణిస్తావు. వస్తుతః కవి ఆయిన (ప్రసాదమూర్తి ఆగడు కాక ఆగడు.
“116 116 1469 1౧ 16 91661
౪0౪ 61500౪79 116 10౫ 01 16
౬/60 11 & 0660616 0! గరర/ ౪2167
సై వాక్యాల్గోని ఆనందాన్ని దేన్నో, సౌందార్యాన్ని దేన్నో, మ్టమవ్వటాన్ని దేన్నో నేను ప్రసాదమూర్తి కవిత్వంలో అందుకున్నా. ఒక జీవనానందాన్ని పంచిన (ప్రసాదమూర్తికి అభినందనలు.
23-5-2007
ప్రసాదమూర్తి జ ౫
ఇలా వెళదాం...
పిడికెడు కలలూ దోసెడు జ్ఞాపకాలు............] అమ్మను చూడాలి ..44404040440000000000000400000444ఆ కీ మమతల బస్సు.4400000000000ంరంలలు 9 బుష్ మళ్లీ రావద్దు .యయయయే పిచ్చి నాన్టుఎంంంంరరరరటతరరటలలలలి క ఆయుధ౦ .౨౨4౦౭౦44402600000024000600600002000004402000444 క వీరులు బతకాలి ...44444004040400406జ కి మాట్టాడు కోవాలి య 2కి కలల పరిమళాలు .....44440000002 ఇక్ దీక్షిత్ యంత 2 ఎ పాయం ఫర్ మేధౌ 0000000000 2కి ఇది ఏ సంస్కృతి? జయలల కిక పద్యం పండగ చేసుకుంది... 34 ఈ (ప్రపంచం పిల్లలదే ౨... తిక నాన్నగారు వచన వవ 022 00క6ఐవ0ఐ0220004060000020000000040000400042. శీకే మరో ప్రియురాలు .......౮44లల కీ? పిడికిలి నక్షత్ర౦ ౦౦౮౦౮ కరి వాన్ 440440400000000000000004000060004606 ర్2ై జహీరా! జహీరా$! ౮4౦౫445 5? జిస్కీ రస్పీ ఉన్కీ ఫాయీ 60
దెయ్యం కలి ......,22044044440040600444400404046004444442 ర్ ('ప్రేమంయరమలయలలంలుల 5౯ స్వామీ ఇది ఏమి? లం కొ0ీ ఫణీంంంంయంంంరతరంరులటటలలు ₹లై పరీక్షల రుతువు... కోటీ మార్నింగ్ అసె౦ల్లీ 96 మి(త్రుడొచ్చిన వేళ్ 4 కొరి నవ్వుల సూట్కేన్తో అమెరికా ...................81 నమ్మకం పోతో౦ది.....40440404004444ఆ రీక్ బడీ ంలంంరలంరలలలల00004400444 రీతి (ప్రతిభ ప్రేమ - ప్రతిభ స్నేహం ..............90 అమ్మలేనోడు ౨ లలంం కి2ై ఆపండి వాటే 2000002000000000000000000220464= కిర్ ది బరియల్ ఎస్టేట్.........................97 విశాఖ రెండో సముద్రం... 200 జెండాకు సంకెళ్ళు... 103 కలయికల కవర్పేబీ ...............౨౨౭ $05 వీరులు (ప్రజల హృదయాల్లో ఉంటారు........ 107 ఆశ భావెబ్.........40ల ఆ 109 బౌద్ద సంగీత్0 ౦౦౦౦౦ లఆఆల కేశేకే
ఆ ఫగ్లిరెడు కలలూ రోసెడు బ్జాపకాలు జీవితమంటే పిడికెడు కలలూ దోసెడు జ్ఞాపకాలే. జీవితం ఓ విజిట్ ఓ కలయిక ఓ 'ప్రయాణం.
కలుసుకుంటాం
తల్లీబిడ్డలుగానో అన్నాదమ్ములుగానో
స్నేహితులుగానో ఇరుగుపారుగ్లానో
కలుసుకున్న ప్రతిసారీ
మన జ్ఞాపకాల పువ్వు ఓ కొత్త రేకు తొడగాలి
ప్రతి కలయికా
అలసిన కళ్ళకు కలల విసనకర్రలు కానుకగా ఇవ్వాలి. కలుసుకోవడం నిజానికి
ఒకరినొకరు మళ్ళీమళ్ళీ తెలుసుకోడానికే హృదయాలతో ఒకరినొకరు చూసుకోడానికే,
మాట్లాడుకోవాలి * 1
ఎవరిరెక్కల మీద వాళ్ళు కొత్త ఆకాళాలను చి(త్రించుకుంటూ అప్పుడప్పుడూ ఓ నీరెండ తామరాకు మీద పలకరింపుల పిల్ల చేపలై మెరిసిపోవడమే కదా కలుసుకోవడమంటే ఎవరెవరో ఇక్కడ కలుసుకున్నారు (ప్రేమించుకున్నారు ద్వేషించుకున్నారు మట్టిమీద గీతలుగీసి సరిహద్దుల సంబరాలు జరుపుకున్నారు మన౦ మళ్ళీమళ్ళీ కలుసుకోవడం గతం బూజు దులిపేసుకోడానికే కలిసివేసే కలల అడుగుల్ని సరిచూసుకోడానికే. కలుసుకోవడం చెప్పాలంటే లాభనష్టాల క్యాలిక్యులేషన్ కాదు అది కష్టసుఖాల కల్మినేషన్. ఎవరిజీవితాలను వాళ్ళు మోసుకుంటూ వీలైనప్పుడల్లా ఒకరిబరువును ఒకరు దింపుకోవడమే కదా కలుసుకోవడమంటే! ఎలాగూ వచ్చాక వెళ్ళడ౦ తప్పదుకాబట్టి కలుసుకోవడానికే వచ్చాము కాబట్టి జీవితాన్ని ఉత్సవంగా జరుపుకోవాల్సిందే. నలుగురి నవ్వుల్లో మనబొమ్మను చూసుకోవాల్సిందే. తా ప్రసాదమూర్తి శ ౨2
కలుసుకోవడం
కాలాన్ని దొర్లించుకోవడానిక్కాదు వెళ్ళిపోయిన క్షణాలను మనవైపు మళ్ళించుకోవడానికే. కలుసుకుంటే
తరాల మానవ (శ్రమకు కృతజ్ఞతగా
తలలు వంచాలి
ఒకరి చెంపల మీద ఒకరు
భరోసా బాష్పకణమై పుప్పించాలి
కలయికలే జీవితం
కలయికల జ్ఞాపకాలే జీవన సౌందర్యం.
ఆీఅ మాట్లాడుకోవాలి ౫ 3
అమ (ను చూడ్రాలి
అమ్మను చూడాలని ఉంది
అమ్మలాంటి ఊరుని చూడాలనుంది షావుకారుగారూ!
ముఖం నిండా ఈ లేబుళ్ళు
ఒంటినిండా ఈ రేపర్హు ఎప్పుడు ఊడదీస్తారు? పెళ్ళాంగారూ మీ పట్టు ఎప్పుడు సడలిస్తారు? పిల్లలూ మీరు తెలుగులో ఎప్పుడు మాట్టాడతారు? బాన్ బాస్!
మే ఐ స్పీక్ ఇన్ తెలుగు?
తొడుక్కున్న బట్టలు తాడుక్కున్నట్టే వుంటాయి రాసుకున్న సెంటు రాసుకున్నట్టే వుంటుంది రక్తమాంసాలు ఎక్కడికి పొయ్యాయో తెలీక జీవుడు లబోదిబోమంటాడు _ నీకు తెలీకుండా నువ్వో సరుకైపోతావు రంగుకాయితాల్లో చుట్టబడి వెలకట్టబడి నడిరోడ్డులో నిలబెట్టబడి
గమ్మత్తుగా అమ్ముడైపోతావు
ప్రసాదమూర్తి ౪ &
నీ వేషం నిన్ను గేలిచేస్తుంది నీ భాష నిన్ను పరాయివాడిగా చూస్తుంది న్సీ నవ్వు - నీనడక నీ పలుకు - నీ స్పర్శ ఏదీ నీదికాదు నిన్ను కనిపెట్టిన కొలంబస్ నీ మీద పేటెంట్ హక్కుల్ని ఎప్పడో కొట్టేసాడు. అమ్మను చూడాలనుంది అమ్మలాంటి ఊరుని చూడాలనుంది నా భాషలో ఆరవాలనుంది నా యాసలో నన్ను నేను తడుముకోవాలనుంది. వేయిస్తనాల మార్కెట్ పిల్ల నిన్ను వెక్కిరిస్తూ చూస్తుంది బుల్లి తెరలూ వెన్నెల వెండి తెరలూ చీల్చుకుని పాడుగుకాళ్ళ సుందరీమణులు నీ గుండెకాయ మాంచి సుతారంగా ఇంటూ మార్కుల్లో నడుచుకుంటూ పోతారు. ఒక అపార వ్యాపార సంస్కృతి నీ సై రోజూ అఘాయిత్యమే. వచ్చిన జీతం వచ్చినట్టే వుంటుంది. బ్యాంకు బ్యాలన్సుకి వేసిన తాళం వేసినట్టే వుంటుంది ఏటిఎమ్ కార్డు రివర్సు గేరులో నీ మొహాన్ని సెడేల్మని తన్నుతుంది నీ పర్సు పరిహాసంగా నవ్వుతుంది మాట్లాడుకోవాలి ౫ 5
నిన్ను నిలువుదోపిడి చేసిన ఆ ఎకనామిక్ హీట్మాన్ ఏ ఖండాంతరాలలోనో ఉండి ఉంటాడు కార్పొరేట్ కలల సౌథంలో నువ్వు మహారాజువి నీ టేబుల్ మోద వెండి స్పూన్గూ వెండి ఫోర్కులూ నీ మెడమీద ఓ కత్తినీడ నీ కళ్ళ చుట్టూ శృంగార తటిల్లతలు నీ గుండెవైపు మురిపెంగా చూస్తున్న ఓ బుల్లెట్ వేసిన పక్క వేసినట్టే వుంటుంది. మూసిన తలుపు మూసీనట్టే వుంటుంది పరుపుమోద పూలరేకులు ఏ రాత్రో గాజుపెంకులై గుచ్చుకుంటాయి అదిరిపడి అమ్మా అని అరుస్తావు నీబతుకు నీది కాదు - నీ యవ్వనం నీది కాదు నీ అవయవాల నెత్తుటి జీవచలనాలు నీవి కావు నీ జీవన సుగంధ (ద్రవ్యాన్ని దోచేసిన వాస్కోడగామా | నీ కందనంత దూరంలో ఎక్కడో ఏ అద్భుత ద్వీపకల్పంలోనో నక్కివుంటాడు అమ్మను చూడాలనుంది అమ లాంటి ఊరుని చూడాలనుంది అమ్మ ఒడిలో దాక్కోవాలనుంది అమ్మకోసం ఓ బండెడు ఆటబొమ్మల్లి ప్రసొదమార్తి జ (
తీసుకెళ్ళాలనుంది అమ్మతో అమ్మ భాషలో ఆడుకోవాలనుంది అమ్మ తన పాత పెట్టిలో నాకోసం మడతపెట్టి దాచివుంచిన కలల పట్టు వస్త్రాన్ని ఒకసారి వాసన చూడాలి మజ్జిగ కవ్వం పట్టుకుని నన్ను తరుముతున్న అమ్మని ఊరంతా తిప్పాలి అలసిపోయి అలసిపోయి అమ్మను వొటేసుకోవాలి అక్కడ నున్ను భుజాలకెక్కించుకుని గాలికతలు చెప్తూ ఊగిన చెట్టున్నాయ్ నేను అమ్మమీద అలిగినప్పుడల్లా నన్ను కడుపులో దాచుకున్న చెరువులున్నాయ్ నాకు ఎదురీత నేర్పిన కాలవలున్నాయి. ఒళ్ళంతా గీట్టుపెట్టుకొని తాటీచెట్టెక్కి గెలలు నరికి _ ముంజికాయల మూతులు కోసి బొటన వేలితో గుంజు జుర్రుకోవడంలో ఆనందం ఇప్పుడెన్ని (క్రెడిట్ కార్డులు విసిరికొట్టినా రావడం లేదు ముళ్ళ బాధ ఎంత సలపరంపెట్టినా మూల గదిలో గడ్జికప్పీ కావుపెట్టిన ఈత గెలల్లో పండిన మొదటి పండును అమ్మ చేతుల్లో పెట్టిన సంతోషం మాట్లాడుకోవాలి * 7
ఇప్పుడు జీతమంతా తెచ్చి పెళ్ళాం చేతుల్లో పెట్టినా కలగడం లేదు ఊరుకి పోవాలి అమ్మను చూడాలి
సార్ పార్ మే ఐ గో ఆన్‌లీవ్? మాస్టారూ ప్లీజ్!
కాస్త పిల్లల్ని తెలుగులో తిడతారా! దయచేసి నన్ను తెలుగులో నవ్వనిస్తారా! చుక్ చుక్ చుక్ చుక్
చుక్ చుక్ బండి పోతోంది
దూరం దూరం జరగండి
అమ్మను చూడాలి
అమ్మలాంటి ఊరుని చూడాలి.
ఆ
ప్రసాదమూర్తి జ 8
మమతల బస్సు బస్సు అంటే దేహాల మూటలూ ఆత్మల పెట్టెలూ మోసే కూలి యంత్రమే అనుకున్నాను రెండు దేశాల హృదయ స్పందన అని ఇప్పుడే తెలిసింది. నాలుగు చక్రాలూ ఒకస్టీరింగూ 'డైవరూ కండక్టరూ సీట్లూ టిక్కెట్టూ కలిస్తే బస్సనుకున్నాను బస్సంటే బంధమని విడిపోయిన అన్నదము్ని కలిపే మమతల సుమ గంధమ ఇప్పుడిప్పుడే తెలిసింది. ఇక్కడి మాననీయ సౌరభాన్ని అక్కడికి అక్కడి స్నేహ సౌందర్యాన్ని ఇక్కడికి మోసుకుంటూ తిరుగుతున్న ఈ బస్సును చూస్తే (ప్రపంచశాంతికి బస్సునే చిహ్నంగా (ప్రకటించాలనుంది. రెండుదేశాల ఆత్మల్ని రెండు రెక్కలుగా చేసుకుని బస్సు పక్షిలా ఎగురుతోంది రెండు దేశాల గుండెల్ని జెండాలుగా ఎగరేసుకుంటూ బస్సు సైనికుడిలా దూసుకుపోతోంది. మాట్లాదుక్జోవాలి వ
రెండు దేశాల మధ్య విస్తరించిన అగాథాలను పూడ్చడానికి వచ్చిన మ్యాజిక్ ్రాక్లేనర్లా బస్సు సాగిపోతోంది. అది నడుస్తుంటే నాగరికతకు చిహ్నమైన ;రోడ్డు పులకించి ధన్యవాదాలు చెప్తోంది. (శ్రీనగర్ నుండి ముజఫరాబాద్ దాకా హిమాలయం తనమంచుదేహాన్ని కరిగించి ఆనందాన్ని ప్రకటించింది. దేశమంటే మట్టనీ మట్టిమీద సుకున్న సరిహద్దు గీతలనీ న! నమ్మబలికే స్యార్థంబిద యుద్దానికి వెళూతున్న వీరుడిలా వుంది బస్సు బస్సు మనషుల్నే కాదు ఆళల ఆశయాల జలష్టావితమైన మనసుల్ని కూడా ళా
బట్వాడా చేయగలదని ఇప్పుడే అర్థమైంది గతం నెత్తులిమరళళ్ళి చెరిపేసుకుంటూ భవిష్యత్తు గీతరచన చెసుకుంటూ వర్తమానాన్ని నమ్మకంగా పాడుకుంటూ తిరుగుతున్న ఈ బస్సును చూస్తే రెండుదేశాల ఉమ్మడి జెండాగా బస్సునే ప్రకటించాలనుంది. (07/4/2005 న శ్రీనగర్ నుండి ముజఫరాబాద్ తొలి సారి బస్సు నడిచిన సందర్భంగా ఇరు దేశాల (ప్రజలలో ఉత్సాహం వెల్లివిరిసింది)
ఆల ప్రసాదమూర్తి ౫ 10
కా
బుషి మళీ రావదు
లే టి ఒక విళ్చ కిరాతకం విమానం దిగింది నా పిచ్చి భారతం స్వాగతం పలికింది మా ప్రధానమంత్రి పగిడీ పరవశంతో ఊగిపోయింది మా ముఖ్యమంత్రి పంచె సంతోషంతో ఊడిపోయింది వద్దు వద్దన్నా సరే రావద్దు రావద్దన్నా సరీ మా గుండెల్ని గోడల్ని చేసి న్లో బ్యాక్ నినాదాలతో నింపేసినా సరే ఒక ఆ(గ్రరాక్షస౦. నా నేలమీద అడుగుపెట్టింది నా అమాయక భారతం హారతిపట్టింది ఆయన మన నాగలినీ మనమగ్గాన్నీ పరవశంగా పట్టుకున్నాడంట మన డ్వాక్రా మహిళ మధ్యతరగతి బుగ్గని మెచ్చుకోలుగా ముద్దు పెట్టుకున్నాడంట ఇంక పత్రికలకు పట్టపగ్గాల్లేవు టీవీలకు అడ్డూ ఆపుల్లేవు
మాట్లాడుకోవాలి * 11
ఆయన కూడా తెచ్చుకున్న జామ్సీసొల్లో ఆస్టన్ ఆడవుల నుండి బాగ్దాద్ నగరం దాకా చెలా చెదురంన అసహాయుల నెతుటి గడ్డలున్నాయి స్. మూ కా! గా
ఆయన ముచ్చటపడి తెచ్చుకున్న తలదిండు కవర్లలో అబూగ్రాయిబ్, గ్యాంటనామా యుద్దఖైదీల
భార్యల బిడ్డల కన్నీటి మరకలున్నాయి
ఆయన పెట్టెల్లో పెట్టి తెచ్చుకున్న చైనా కత్తుల్లో
ళా టబ న్ ళు
బిక్కుబిక్కుమంటున్న స్వతంత్ర దేశాల
భయం పేగులు చుట్టుకున్నాయి
ఛీఛీ అన్నా సరే పోపో అన్నా సరే ఒక ప్రపంచ టెర్రరిస్టు నా ప్రజాస్వామ్యాన్ని కౌగలించుకున్నాడు
నా పాలకవర్గం పరమానందంగా పల్లికిలించింది రాజ్‌ఘాట్ నుండి హుస్సేన్సొగర్ దాకా
మన శాంత్యహింసల చిహ్నాలను
ఒక రాబందు అపవిత్రం చేసిపోయింది
మన ఆత్మహత్యల ఆర్థికపత్రాల వ్సీద
ఒక నక్క సంతకం చేసిపోయింది
మన సార్వభౌమత్వం మీద
ఒక డేగ కన్షేసి పోయింది "
ప్రసొదమూర్తి ౪ 12
పురానాఖిల్దానుండి పాతబస్తీ దాకా మన పీలల కళ్లమీద ళా గొ నీలి నీడలు విసిరి ఒక భూతం ఎగిరిపోయింది వద్దు వద్దన్నా సరే రావద్దు రావద్దన్నా సరే ఒక యుద్ధ రాక్షసి మన సహనాన్ని పరీక్షించిపోయింది. 3-3-2006 ఆల మాట్లాడుకోవాలి * 18
ర్తి
పళ్ళి నాన్న
ఎప్పుడూ
గుండెల మీద రెండు కలువపూల పాదాలు
కదలాడుతున్నట్టుగానే వుంటుంది
రెండు వెన్నపూస పెదాలు
నా బుగ్గల్ని ఎంగిలిచేసి నవ్వుతున్నట్టే ఉంటుంది
రెండు తమలపాకు చేతులు
నా మెడని సుతారంగా చుట్టుకుని
ఉయ్యాలలూగుతున్నట్టే అనిపిస్తుంది
వెల నుండి చమ్మీల చుడీ దార్లదాక
పబ్బపషేములనుండి పట్టుపావడాలదాకా
అదెన్ని వేషాలు మార్చినా
ఈ నాన్న కన్నుల్లో తానింకా కుందేలు పిల్లే
ఈ తండ్రి గుండెల్లో తానింకా మంచుపూలబల్లే,
పిల్లల్లో పిల్లలా, అమ్మాయిల్లో అమ్మాయిలా కనిపిస్తూ ళా న!
నన్ను లక్షల కూతుళ్ళున్న లక్షాధికారిని చేసేస్తుంది.
ఏ షాపుకైనా వెళతానా
అక్కడ బొమ్మలన్నీ నా చిట్టితల్లిలా
నాన్నా నాన్నా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది
ప్రసాదమూర్తి 4 14
అలా దారిలో కాన్వెంటు పిల్లల్ని చూస్తానా అనేక రూపాల్లో మా అమ్మాయే ఆడుకుంటున్నట్టు ఉంటుంది ఏ కాలేజీ దగ్గర నిలబడ్డా రంగు రంగుల దుస్తుల్లో మా పిల్లే
తూనీగలా ఎగురుతున్నట్టు ఉంటుంది
క్రిక్కిరిసిన ఏ బజారులో నిలుచున్నా నేనూ నా కూతురూ వందల వేల రూపాల్లో విడిపోయి
చెట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది.
ఎవరికీ కనబడదు గాని
నా నెత్తిమీద ఓ బుల్లి సింహాసనం
దానిలో నా బుజ్జి యువరాణి
ఈ ప్రపంచం తిరునాళ్ళలో తనను ఆలా అలుపులేకుండా తిప్పుతున్నట్టే వుంటుంది.
దానికిప్పుడు అద్దంలో తన బొమ్మతప్ప
ఏమీ పట్టదుగాని
అది రాత్రంతా పడీ పడీ చదువుతుంటే
నేను టీ డికాక్షన్‌లా మరుగుతూనే వుంటాను
అది పరీక్షలు రాస్తుంటే
ఆ మూడుగంటలూ రోడ్డుమీద వాహనాలేవీ కదలొద్దని కసురుకునే ట్రాఫిక్ పోలీసునైపోతాను.
తను చలిలో వణికిపోతే
నేను పత్తికాయనైపగిలిపోతాను
మాట్లాడుకోవాలి * 15
తను జృరంతో మండిపోతే వందరెక్కల విసనకర్రనై తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను తను జబ్బు పడితే మొత్తం వైద్య శా(స్రాన్నే తప్పుపడతాను. ఒక్కసారి నవ్వి౦దా ఒళ్ళంతా వేల పియానోలు చుట్టుకొని సజల సంగీతమై ద్రవించిపోతాను. ఇంక తన పుట్టినరోజు వచ్చిందంటే ఆకాళానికి నేనే బెలూనై వేలాడతాను కొమ్మకొమ్మకీ చాక్లెట్టూ, కేకులూ వేలాడదీసి పక్షులకు ఫలహారంగా పెడతాను. ఇప్పుడు తను పెద్దదయ్యింది కదా నాన్న బొజ్జతో ఆడుకోవడం ఎప్పుడో మానేసింది పైగా నన్ను చూసి 'పిచ్చినాన్న' అంటూ నవ్వేస్తుంది. అదేమిటో గాని ఎప్పుడూ కోతిపిల్ల తల్లిపొట్ట కరచుకు పట్టుకున్నట్టు గబ బి లి ఒక సుతిమెత్తని ప్రాణగీతమేదో నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది నాకు మాత్రం కూతురంటే ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ. (2006 అటా పోటీలలో ఉత్తమ కవితగా ఎంపికైంది) ఆ ప్రసాదమూర్తి ౫ 16
ఆయుధ౦
దేవుళ్ళు కూడా మారణాయుధాలు పట్టుకు తిరిగే దేశంలో
ఆయుధ బకాసురులు
సగానికి పైగా బడ్జెట్టుల్ని భోంచేస్తున్న సన్నివేశంలో
నాయకుల భద్రతకోసం కట్టే
అయుధాల కోటలకే కోట్టు ఖర్భయి పోతున్న కాలంలో
ఆయుధం మీద చర్చ
నిజానికి చిత్రంగానే ఉంటుంది.
ఆయుధంమీద ఆయుధం నిఘావేస్తున్న వేళ
ఆయుధాన్ని ఆయుధం నిషేధిస్తున్న వేళ
ఎటుతిరిగీ ఎండింగ్ ఎన్కొంటరే అని
తేలిపోయిన వేళ
ఆయుధాల మీద చర్చలు కాస్త చికాగ్గానే వుంటాయి. మాట్లాడుకోవాలి ౫ 17
పక్షులు తుపాకులు పట్టుకు తిరగటం అడవికి అభ్యంతరం కానప్పుడు 'వేటకాడు వేలెత్తిచూపడం కొంత వింతగానే వుంటుంది. ధాన్యాగారాల కంటె ఆయుధ గిడ్డంగులే అధికంగా ఉన్న చోట ఆయుధాన్ని చూసి ఆయుధం భయపడ్డం ఆళ్యర్యంగానే వుంటుంది. ఎ౦దుకున్నా మంచిది పిల్లల బ్యాగుల్ని కూడా వెదకండి తుపాకులుండొచ్చు ఆలా పొలాల్లోకి పోయి చూడండి మొక్కలు ఆయుధాలపవుతున్నాయేమో. ఆల ప్రసాదమూర్తి ౫ 18
ఏీగ్రులు బతకాలి ఇల్టుఖాళీచేసినంత సులువు కాదు దేహాన్ని ఖాళీచెయ్యడం ఎంత సునాయాసంగా ఎంత చిద్విలాసంగా ఎంత పరిహాసంగా వెళ్ళిపోయావురా తమ్ముడూ! అఫీసుకు వెళుతూ పిల్లల చేత్తుల్లో నాలుగు డబ్బులుంచినట్టు మా కళ్ళల్లో ఒక దుఃఖ సముద్రాన్ని పెట్టి వెళ్ళిపోయావు అందరం ఇక్కడ ఉండిపోవడానికే రాలేదుగానీ నువ్వుమాత్రం వెళ్ళిపోవడానికే వచ్చినట్టు ఒకటే తొందరపడ్డావు ఈ అన్షిశిశువును ఎత్తుకోవడం మా వల్లకాదేమోనని నీ తొలిప్రేమ స్పర్శలోనే నాకనిపించింది. ఒరేయ్ నాయనా ఇక్కడ బతకడమే గొప్పకదరా! క్యాలండర్ మీద దువన్మి దులపడం గడియారం ముల్గు కదపడం బతుకంటే బతకడమే అదేవిప్ణవ౦ం = అదే జీవరహస్యం మాట్లాడుకోవాలి ౫ 19
ఎవడు ఎన్నేళ్ళు బతికాడన్నదే లెక్క వందేళ్ళు బతికినవాడే చక్రవర్తి నువ్వేంటో చావుని చంకలో పెట్టుకొచ్చినట్టు ఒకటే కంగారు పడ్డావు అయితేనేం బతికిన క్షణకొలమైనా బతుకును బతికించాలన్నావు వసంతాలు గణించుకోవడం కాదు అభిశప్తవనాల వాకిళ్ళవైపు పచ్చదనాన్ని తోలుకొచ్చే వసంతోత్సవానివి నువ్వే కావాలన్నావు. బతుకంటే అక్షరమన్నావు గుప్పెడు అక్షరాలను ఎక్కడ ఒలకబోసినా అపి నిప్పపిట్టలై కపటారణ్యాలను తగలబెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నావు అవును నువ్వు పాగరుమోతు కవివే అనార్కిస్టునే అంటరాని అక్షరానికి ధిక్కార చొక్కాతొడిగి కాలరెగరేసుకు తిరగమన్నావు తెల్లునువులూ ఎర్రమనువులూ తెల్లమొగాలు వేసుకు చూస్తోంటే వాడమగాడికి మొలతాడుకట్టి మీసం మెలేసిన మొనగాడివి నువ్వు నిన్ను చూడ్డానికి ధైర్యం చాలని వాళ్ళకి తెలీదుగాని ప్రసాదమూర్తి ౪ 20
నువ్వు ఉ(గ్రవాదిగా అ(గ్రహారాల మీద బాంబులు విసిరినప్పుడే అనుకున్నాను ఈ పట్టపగ్గాల్లేని గుర్రాన్ని పట్టుకోవడం మా చేతకాదని నువ్విక్కడ ఎవర్నీచూసి ఏమి నేర్చుకోలేదల్లేవుంది నిత్య సన్మానాలతో నిత కళ్యాణాలతో కాకున్నా నిత్యమూ సుత్యుసంభో గాలీ నైనా ఇక్కడ బతకడమే గొప్ప మరినువ్వేమో జీవితాన్ని కాలంతోకాదు కాలాన్ని జీవితంతో లెక్కించాలని చెప్పడానికే వెళ్ళిపోయినట్టున్నావు ఓనా ప్రియాతిప్రియమైన సోదరుడా! నువ్వు బతికుంటేనేకదా ఈ బతుకు బతుకు కాదని తెలుసుకునేవాళ్ళం నువ్వు సజీవ జీవన ్రవాహమై మమ్మల్ని ముంచెత్తితేనేకదా స్వచ్చంగా పభ్రంగా బతికేసే వాళ్ళం ఉద్యోగానికి సెలవుపెట్టినంత తేలిక కాదు జీవితానికి టాటా చెప్పడం, ఎంత ఈజీగా ఎంత పొగరుగా ఎంత ఆత్మగౌరవంగా వెళ్ళిపోయావురా నేస్తం! మాట్లాడుకోవాలి ౫ 921
అదిసరే ఆవసరాల మచ్చలు కనబడకు౦డా (ప్రేమ అత్తర్లూ స్నేహాల పొడర్లూ పూసుకు తిరుగుతున్న మా బతుకులు నీకు నచ్చలేదు అనుకుందాం మరి నిన్నే అల్లుకుని పల్లవించిన ఆ తీగపిల్ల మాటేమిటి! నీకోసం విరిసిమురిసిన ఆ జంట పుష్పాల లేతగొంతులు నాన్నేడని అడిగితే అన్ని చుక్కల్లో ఏచుక్కని చూపమంటాన్? - నిత్యం వందిమాగదులతో యువరాజులా తిరిగే చెట్టంత కొడుకు చటుక్కున కూలిపోతే తల్లడిల్లి రును అ తల్లిపేగు దుఖాన్ని వర్షించడానికి . అక్షరాలను ఏ లోకాలనుండి అరువు తీసుకు రమ్మంటావ్? ఇక్కడ ఉండిపోవడానికే ఎవరూ రాలేదుగానీ నువ్వు మాత్రం వచ్చినపని అయిపోయినట్టు వెళ్ళిపోవడానికే కంగారుపడ్డావు అందుకే తమ్ముడూ నీ సమాధిమీద తలలుబాదుకుంటూ మా రక్తంతో ఒకేమాట రాస్తున్నాం “వీరులు బతకాలి” (వెలివాడల్లో వేనవేల నగేష్‌బాబులు పుట్టాలని కోరుకుంటూ) ఆీఅ ప్రసాదమూర్తి ౫ 22
మాట్లాడు కోవాలి (౧) మాట్లాడు కోవాలి మెత్తగా బత్తాయి పండు తొనలువిప్పినట్టు మనసువిప్పి మాట్లాడుకోవాలి. గుండెలోపలికి చేతులు పెట్టి బయటకుతీసిన మూటల్ని షవర్‌బాత్ చేయించి (ఫ్రెష్‌గా ఎదుటివాళ్ళముందుంచాలి. మాటలేకదా అమ్మా నాన్నా గురువూ సంఘం వీళ్ళంతా నీళ్ళుపోసి పెంచిన మాటలే కదా అంతా చేయిపట్టుకునిలబెట్టిన మాటలే కదా మాట్లాడితే అందరికీ కృతజ్ఞతతో అభివాదం చేస్తున్నట్టుండాలి. అప్పుడే స్నానమాడిన రెండు తడిదేహాలు తమకంగా కౌగలించుకున్నట్టుండాలి. మాట్టాడితే శుభ్రంగా మంచు కడిగిన నిలువెత్తు ఆరిటాకుమీద ఆత్మీయులకోసం నిన్ను నువ్వు వొడ్డించుకున్నట్టుండాలి. మాట్లాడుకోవాలి ౫ 28
మాటకు బొమే కొని బొరుసులేదు మాటకు వెలుగేకాని చీకటిలేదు మనుషుల్లా మాట్లాడు కోవాలి అందరిముందు నిన్ను నువ్వు (గ్రుమ్మరించేసుకుని శూన్యంగా చిద్విలాసించాలి. తొడుగుల్లేని మాటల్ని జేబ్బుల్నిండా నింపుకుని గృహదేహాల నుండి బయటపడాలి ఇంట్లోనైనా వీధిలోనైనా ఆఫీసులోనైనా పార్లమెంటులోనైనా (ప్రేమకోసం స్నేహం కోసం శాంతికోసం మాట్లాడుకోవాలి. ప౦జరంలోనుండి పక్షిని వదిలేసినట్టుండాలి కొళాయితిప్పితే నీళ్ళురికినట్టుండాలి నీ నుండి ఏమీ ఆశించని ఓ చిట్టిపాప చటుక్కున నీ బుగ్గని ముద్దుపెట్టుకున్నట్టుండాలి మాటలే కదా మాటలంటే మనుషుల మనసులే కదా దయచేసి మాటని మార్కెట్ చేయొద్దు,
|
_ఆీల
ప్రసాదమూర్తి * 24
కలల ఫరిమళాలు దయచేసి పిల్లల్ని కొట్టాద్దు పువ్వులు బాధపడతాయి పిల్లలంటే మాటలూ నడకలూ నేర్చిన మన కలల పరిమళాలు పిల్లలంటే జీవితమంతా మనం కష్టపడి రాసుకున్న కవితలు, దయచేసి పిల్లల్ని తిట్టొద్దు చం'ద్రవంకలు బిక్కమొహం వేస్తాయి పిల్లల్ని బెత్తాలతో కాదు (ప్రేమనిండిన చిత్తాలతో పలకరించాలి. వెన్నెల ఒళ్ళంతా పూసుకుని మెరిసిపోతున్న కోనేటి నీటిని మునివేళ్ళతో తడిమినట్టు పిల్లల్ని లాలనగా స్పృశించాలి పిండిగువ్వల్ని చేతుల్లో తీసుకున్నట్టు పిల్లల్ని అక్కున చేర్చుకోవాలి. మాట్లాడుకోవాలి ౫ 25
దయచేసి పిల్లల్ని కసురుకోవద్దు
చిలకలు చిన్నబోతాయి
పిల్లలు మన తియ్యటి జ్ఞాపకాలు
పిల్లలు మన రేపటి జాతకాలు.
పాలకంకులమీద పిచ్చుకలు కళ్ళుపారేసుకున్నట్టు పిల్లల అడుగులమీద మనం బతుకుల్ని ఆరేసుకోవాలి పిల్లలు మన ఊహల విహాయసాలు
పిల్లలు మన ఆశల ఆకాశాలు
పిల్లలు మన (ప్రతిరూపాలు.
దయచేసి పిల్లల్ని కొట్టాద్దు
ఒళ్ళంతా ప్రేమ నిండిన కళ్ళతో అలా చేతులుచాపండి వంద హరివిల్లులు మీ దోసిట చిందులేస్తాయి.
ఆ్తోల
ప్రసాదమూర్తి ౪ * 26
దీక్షిత
చుక్కలన్నీ తనముందు దీక్షగా కూర్చుంటే
అప్పుడు దీక్షిత వాటికి వెలుగుతూ
(బ్రతకడం నేర్పుతుంది.
పూలన్నీ తనముందు ముద్దుగా కూర్చుంటే
అప్పుడు దీక్షిత వాటిరీకుల మీద
ఆమాయక్షపు నవ్వుల పరిమళాలు అద్దుతుంది.
పక్షులన్నీ తనముందు పరవశంగా వాలితే
అప్పుడు దీక్షిత వాటిరెక్కలమీద
ఒక స్వేచ్చాగీతం రాస్తుంది.
అంతపెద్ద ఆరిందాకూడా
మనం బతుకు బైకు బర్రుమనిపిస్తే
తుర్రుమని తూనీగలా మనవొళ్ళో వాలుతుంది. మాట్లాడుకోవాలి * 27
ముద్దొచ్చి తనను చేతుల్లోకి తీసుకుంటే ఎవరో దేవకన్య అలా ఆకాశంలో విహరిస్తూ నేలకు జారవిడిచిన వజ్రపుటుంగరంలా ధగధగా మెరిసిపోతుంది తనివితీరక తనని భుజం మీదికెత్తుకుంటే విశ్ళాంతరాళంలోంచి ఏదో ఒక క్రొత్త గ్రహం ఈ చిట్టి తల్లి రూపంలో మనమీద వాలినట్టనిపిస్తుంది. దీక్షితా... దీక్షితా... నిజంగా నీ పుట్టినరోజు వెలుగూ వెన్నెలా మా తలుపులు తట్టిన రోజా,
ఆల ప్రసాదమూర్తి ౫౪ 28
శో ఎ పాయం ఫర్ మేధా దయచేసి అమెను బతకనివ్వండి లక్షలాది నిర్యాసితుల కన్నీళ్ళను ఆమె తన కళ్ళలో దాచుకుంది. పీశెయ్యడానికి (ప్రజల ఇళ్ళు పిచ్చి మొక్కలు కాదు కోటి ఆశలతో కట్టుకున్న కలల గూళ్ళు. దయచేసీ ఆమెను ఊపిరితో ఉండనివ్వండి లక్షలాది నిస్సహాయుల గుండెచప్పుళ్ళను ఆమె తన శ్వాసలో నింపుకుంది. ముంచెయ్యడానికి (గ్రామాలు బీడుభూములు కాదు వేల సంవత్సరాల నాగరికత చిహ్నాలు. మాట్లాడుకోవాలి ౫ 20
సామాన్యుల శవాల పునాదుల మీద మీరు ఏ సౌధాలు నిర్మిస్తారు? అణగారిన ఆసహాయుల ఆత్మలతో మీరు ఏ అభివృద్ధిని కొలుస్తారు? దయచేసి ఆమెను సజీవంగా నడవనివ్వండి పాలకులు కీచకులవుతున్న వేళ ఆమె (ప్రజల పక్షాన తన పైటకొంగును జెండాగా ఎగరేస్తుంది. తొక్కి పారెయ్యడానికి బడుగుబతుకులు మట్టి పెళ్ళలు కాదు మానవమహేతిహాసాొనికి అవిజీవధాతువులు. మీరు ప్రాజెక్టులు కట్టండి దయచేసి మనుషుల జీవితాలక్కూడా కాస్త విలువకట్టండి లేదంటే దేశమంతా మేధా పాట్కర్‌లతో (క్రిక్కిరిసిపోతుంది ర్స రాజగద్దె వణికిపోతుంది 15-4-2006
(నర్మదా డ్యామ్ ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ నిరాహారదీక్షతో నీరసీంచిపోతున్న నర్మదాబచావ్ అందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ కోసం)
ఆ ప్రసాదమూర్తి * 80
( ఇదీ ఎ సంస్మృతి? ఇప్పుడు సంస్కృతి పేరుచెబితే కంపరం పుడుతోంది సంప్రదాయం మాట వింటే కడుపులో దేవినట్టవుతోంది ఒకానొక బూటకపు సంస్కృతీ పరిరక్షక దర సంగీతంలో విశ్వాసాల వీణలు కాలిపోతున్నాయి ఆశల గిటార్జు పేలిపోతున్నాయి గొంతు తెగిన అమరుల త్యాగాల స్వరాలు ప్రజాస్వామ్య కళేబరంమిద నెత్తురు కక్కుకుంటున్నాయి. నీ ఊపిరితో ఊగిసలాడే అక్షరం నీ నెత్తుటితో జవజవలాడే పెయింటింగ్ నైతిక ఖడాలకు అనైతికంగా బలైపోతాయి ఇది హింసా విధ్వంస సంస్కృతి ఇది అరాచక అమానుష సంస్కృతి మాట్లాడుకోవాలి * 31
ఇక ఈ ఆర్జుగ్యాలరీలూ లైబ్రరీలూ
కలాలూ కుంచెలూ రెక్కలు తొడుక్కొని
మరో స్వేచ్చా దేశాన్ని వెదుక్కుంటూ పారిపోతాయి
నీ జీవితాన్ని రీళ్ళుగా కత్తిరించుకుని
నిర్మించుకున్న నీ సినిమా
దుండగుల దయాదాక్షిణ్యాల
కోటగుమ్మాలకు వేలాడుతుంది
నీ గుండెల్లోంచి ఉరికొస్తున్న పాట
నిళ్ళబ్దంగా ఉరిపోసుకుంటుంది
మాటకులేని స్వాతంత్రం మనిషికి మాత్రం దేనికని . ఒక పిట్ట రాజ్యాంగం మోద
'ప్రఖ్ళీల రెట్టవేసి ఎగిరిపోతుంది
నీకు తెలీకుండానే
ఓ తెల్లవారు జామున
సంస్కృతీ పరిరక్షకులు నీ ఇంట్లో చొరబడి
షోకేసులోని గుడియాకు గుడ్డల్లేవని
నీ గుడ్డలూడ దీస్తారు
నీ షెల్ళ్లో ఒక పుస్తకాన్ని తీసి
అక్షరాలు నగంగా ఉన్నాయని
వాటిమాద కిళ్ళీ నమిలి ఉమ్మేస్తారు
నీ కళ్ళెదుటే నీ సంతానాన్నో
నీ సగభాగాన్నో సంస్కృతి పేరుమిద
అన్యాయంగా అవమానిస్తారు.
ప్రసాదమూర్తి ౫ 392
దేశం నిండా బూతుబొమ్మల గుడిగోపురాలు రాత్రికి రాత్రే పండుగ చేసుకుంటాయి శృంగార కావ్యాల దేవతల అంగాంగ వర్ణనల్లో వేదభూమి సేదతీరుతుంది పెదాలకీ పీరుదులకీ తేడాచూపని ఓపెన్ మార్కెట్ టీవీల్లో సినిమాల్లో కలర్‌ఫుల్ హోర్టింగుల్లో సంస్కృతిని రసమయంగా రక్షిస్తుంది మనం లౌకిక రాజ్యం కోసం కలలు మాత్రమే కంటూ వుంటాం ఒక అసాంఘిక పరివారం నరకబడ్డ మనకలల తలలు చేతబట్టి వీరంగమాడుతుంది ఇది పురాతన సైశాచిక సంస్కృతి ఇది సనాతన కిరాతక సంస్కృతి " 13-05-2007 (చంద్రమోహన్ అనే యువ చిత్రకారుడు దేవతల న్యూడ్ చిత్రాలు వేశాడనే ఆరోపణతో గుజరాత్లో వొదోదరాలో ఇటీవల హిందుత్వ శక్తులు అతని ఆర్ట్ ఎగ్జిబిషన్ ధృంసంచేసి అతనిని అరెస్ట్ చేయించారు. దీనిపై దేశ వ్యాప్తంగా కవులు, కళాకారులు, రచయితలు మేధావులు అమాహ్యమైన రీతిలో నిరసన ప్రదర్శనలు సభలు నిర్వహించారు) మాట్లాడుకోవాలి ౫ 33
జో న్ పద్యం ప౦డగ చేసుకు౦ది మానవ హక్కులతో తలపడీ భంగపడీ ఒక కిరీటం ముక్క ముక్కలైంది యువకుల రక్తంతో ఆటలాడి ఒకసింహాసనం మట్టి పెళ్ళల్లో కూరుకుపోయింది నిజంగా నా పద్యం ఇప్పుడు పండగ చేసుకుంటోంది నా వాక్యం ఇప్పుడు తన పై తానే రంగులు జల్గుకుంటోంది మంచుకొండల మధ్య ఎగిసిపడుతున్న అన్జితరంగాలను కౌగలించుకుని నా మనసు ఇప్పుడు (ప్రజాస్వామ్యం పాటపాడుతోంది జీన్ ప్యాంటూ టీషర్టూ తొడుక్కొని నా అక్షరాలు ఇప్పుడు హిమాలయాల వీధుల్లో (ప్రజాస్వామ్య పతాకాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాయి ప్రసాదమూర్తి ౫ 34
ఒక రాజ(ప్రాసాదం మొద కాలం వీథి కుక్కయి ఒంటేలు పోస్తోంది జ్ఞానేంద్రుడి కళ్ళల్లో చరిత్ర మంచుకత్తై దిగబడుతోంది ఆ మనోహర దృశ్యాన్ని శీతల శిఖరాల తుహీన ఫలకాలమీద సూర్యుడు వేయిరంగుల చిత్రకావ్యంగా రచిస్తున్నాడు. స్వెటర్జు వేసుకుని మస్టర్లు చుట్టుకుని నా కవితలు ఇప్పుడు ఆ హిమవన్నగ సామ్రాజ్యంలో విష్ణప గుడారాల ముందు పహారా కాస్తున్నాయ్. ఆ తేయాకు తోటల్లో ఆ బాస్మతీ పంటభూముల సువాసనల్లో అ చిన్ని కళ్ళ చిట్టిముక్కుల నేపాల్ పిల్లల కలల్లో నా కలం ఇప్పుడు షికార్డు కొడుతోంది ఆహా ఇప్పుడు నా పద్యం కరిగి కరిగి నీరవుతున్న రాచరికపు శీతశైలాన్ని చూసి అట్టహాసంగా నవ్వుతోంది. (ప్రజాస్వామ్యం కోసం ప్రాణలర్పించిన శేలాది నేపాల్ వీరుల కోసం) ఆల మాట్లాడుకోవాలి * 35
ళ్ రి
ఈ ప్రపంచం పీల్లలదే ౮
పిల్లలు అనాథలైతే
(ప్రపంచమూ అనాథే
ఈ ప్రపంచం పిల్లలదే
మనమంతా పిల్లల "పెంపకానికి
కాలం నియమించిన సంరక్షకులం
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ వైల్డ్
ఆండర్ వెయిట్ అండర్ నరిస్ట్
దయచేసి అలా వదిలేయొద్దు
ఏమో పట్టనట్టు ఎవరికీ కానట్టు
చూసీ చూడనట్టు అలా పారిపోవద్దు
పిల్లలు దిక్కులేని వాళ్ళయితే
దేశమూ దిక్కులేనిదే.
మన కలలూ మన కష్టం పిల్లలే
మన సౌఖ్యం మన స్వార్థం పిల్లలే
ఈ ప్రపంచం పీల్లలదే.
ప్రసాదమూర్తి * 86
ఈ ఉదయ్హామయాలు - ఈ రుతు సంగీతాలు ఆ సూర్యుడు జాంగ్రీ - ఆ చంద్రుడు కోవా ఆ చుక్కల చాక్సెట్టు అన్నీ అన్నీ పిల్లలకే ఆకాశం కష్టపడి నేసిన ఇంద్రధనుసు వ'స్తాన్ని పిల్లలకు కొత్తబట్టలుగా కుట్టించాలి
చుక్కలకు రంగులు వేసి
వాళ్ళ చొక్కాలకు గుండీలుగా కుట్టాలి పగలంతా చెమటోడ్చి సూర్యుడు పోగేసిన సాయంకాలపు నీరెండ వెలుగు
పిల్లల బుగ్గల నిండా పూయాలి
పక్షుల రెక్కల్లోని ఉత్సాహం
పిల్లల వేళ్ళ చివర వేలాడదీయాలి
వాళ్ళ నవ్వుల్లో కదిలే అలల సంగీతమే
మన బతుకు పాటకు బాణీలు కొవాలి
పిల్లలు ఆకలితో అల్హాడితే
దేశాన్ని కోటి కోరలతో కరువు కాటేసినట్టే
ఈ ప్రపంచం పిల్లలదే.
మనం వేసిన ఈ రోడ్డన్నీ
పిల్లల అడుగుల్లో
అది మానవుని పాద ముద్రల్ని అన్వేషించాలి
మనం నిర్మించిన ఈ ఆకాశ హర్య్యాలు
పిల్లల ముందు బొమ్మరిళ్ళయి ఒదిగిపోవాలి
ఆ మాట్లాడుకోవాలి * 37
మనం సైకి పంపే ఉపగ్రహాలు అన్యగ్రహాల నుండి పిల్లలకు ఆటబొమ్మల్ని తీసుకురావాలి పంటపొలాల్లొ ఫ్యాక్టరీల్లో వికసించే మన చెమట పుష్పాలు పిల్లల నుదుళ్ళ మీది మెరుపుసోకి పునీతం కావాలి పిల్లలు హీనంగా దీనంగా నీరసించిపోతే ఒక దేశం అస్తమిస్తున్నట్టే బిడ్డలెవరైనా వాళ్ళు మన నెత్తుటి గడ్డలు మనమంతా పిల్లలకు ఈ ప్రపంచాన్ని ఆటస్ట్థలంగా రాసిచ్చి తృప్పిగా సెలవు తీసుకోవాలి అప్పుడు మనం పిల్లల చేతుల్లో గాలిపటాలమై హాయిగా ఆలా ఆకాశంలోకి ఎగిరిపోతాం నిజంగా నిజంగా నిజంగా నిజంగా ఈ ప్రపంచం పిల్లలదే, " రా (ప్రపంచ వ్యాప్తంగా పౌష్టికాహారలోపంతో కృంగి కృశించి పోతున్న పిల్లల్లో అధికభాగం లాయే వున్నారు. ఈ విషయంలో మనదేశం ఇధియోపియాతో పోటీపడింది.) ఆఅ ప్రసాదమూర్తి + 38
రా గ్గొడీస్ స్టెయిన్స ౧ టట తల్లీ నీకు వందనాలు. మతమంటే క్షమాగుణమని మా (క్రూరాత్మలకు నూరిపోసిన నీ బౌదార్యానికి స్తుతులు స్తుతులు. నీ కట్టుకున్న వాణ్ణి, కన్న బిడ్డల్నీ మా మతోన్మాదం కాల్చిబూడిద చేస్తే మమ్మల్ని కనికరించమని ఆ దేవుణ్ణి ప్రార్థించిన కరుణా మూర్తీ నీకు జేజేలు ఎవడో రైలు తగలబెట్టినందుకు రాషష్ట్రాన్నే తగలబెట్టిన రాక్షసులంమేము గర్భస్థ పిండాలను (త్రిళాలాలకు గుచ్చి వీధుల్లో వీరంగం వేసిన వీరభక్తులం మేము మాట్లాడుకోవాలి 1 39
పచ్చి బాలెంతలను ముక్కుపచ్చలారని ఆడపిల్లలను చెరిచి జబ్బ చరిచిన భక్త యోధులం మేము కొటికి కాళ్ళుచాచిన ముసలి వాళ్ళను కాళ్ళూ చేతులూ కట్టి నూతుల్లో పడేసిన ముక్తి ప్రదాతలం మేము (ప్రతీకారం మామతానికి పర్యాయ పదాన్ని చేసిన అతీంద్రియ శక్తులం మేము అమ్మా! ఒక్కసారి నీచల్లని చేతులు తాకాలని వుంది సోదరీ! ఒకసారి నీదయగల నేత్రాలను చూడాలనివుంది. నీ పాదాలు కడిగి మా పాపాలు “డుక్కోవాలని ఉంది. మా కుప్పు రోగాన్ని నయం చేయడానికి వచ్చిన ఓ దేవతా! నువ్వు మమ్మల్ని చిరునవ్వుతో క్షమించినా దేవుడు క్షమిస్తాడంటావా? (999లో గ్రాహం స్టెయిన్స్ అనే ఆఫ్రేలియన్ ఫాదర్‌ని అతని కొడుకులిర్హరిని ఒరిస్సాలో భజరంగ్దళ కార్యకర్తలు సజీవ దహనం చేశారు. నిందితులకు చాలా సంవత్సరాల తర్వాత కోర్టు శిక్ష వేస్తే గ్రాహం స్టెయిన్స్ భార్య గ్లాడిస్ వారిని క్షమిస్తున్నట్టు ప్రకటించింది) ఆల ప్రసాదమార్తి * 40
నాన్నగారు
నాన్నగారూ మాకు తెలుసు
మీరు ఆమ్మ దగ్గరికే వెళ్ళారని
'ప్రయాణాలంటే మీకు ఇష్టమేకదా
మీరు లేరంటే మీరింక తిరిగి రారంటే
ఎందుకో నమ్మలేక పోతున్నాం
పొద్దున్నే కొళాయిలో నీళ్ళచప్పుడు లాగా
మాకు అలవాటైన మీ ఆడుగుల చప్పుడు కోసం
రిక్కించిన మా చెవుల్ని
నిశ్శబ్దమే వెక్కిరిస్తోంది.
నాన్నగారూ అన్నం తిందాంరండని
అలవాటుగా పీలిస్తే
పక్కనున్న కంచంలో శూన్యం పరిహాసంగా నవ్వుతోంది.
యథాలాపంగా మీరు విశ్రమించే గదివైపు తొంగి చూస్తే
మీ శరీర సౌరభాన్ని కోల్పోయిన మంచం
ఒంటరిగా దిగులు చూపులు విసురుతోంది. మాట్లాడుకోవాలి ౫ 41
మీరున్నారంటే అకాశమంత ఆశీర్వాదం మాకు గొడుగుపట్టినట్టుగా ఉండేది మీరుపక్కనుంటే ఒక నది పక్కనున్నట్టు మీరు చెంతనుంటే చెట్టునీడనున్నట్టు మీరు మా మధ్యనుంటే చీకట్టో దీపం చుట్టూ కూర్చున్నట్టు కొండంత ధైర్యంగా ఉండేది. మీరు ఎక్కడున్నా టెలిఫోనులో అమ్మాఅంటూ నాన్నా అంటూ మీ పలకరింపు వింటే ఒక చల్లని మబ్బుతునక మా వీపుల్ని తడుముతున్నట్టుండేది. 'ప్రేమించడమేగాని ద్వేషించడం తెలీదు మీకు క్రమశిక్షణ మీరు మాకిచ్చిన నజరానా స్థిత ప్రజ్ఞత్వానికి మీరే చిరునామా _ నాన్నగారూ మీరు మాకు పాఠాలు బోధించారు కాని జీవన రహస్యాలు చెప్పలేదు షెల్ళ్లో దాచివుంచిన గొప్పపుస్తకంలాగా ప్రసాదమూర్తి * 42
మీరు మామధ్యనే ఉన్నా మిమ్మల్ని చదవడానికి ఏనాడూ మేం సాహసించలేదు. ఏ మహాగ్రంథాలూ చదవనవసరం లేదు ఏ మహాయుద్దాలూ చెయ్యనవసరం లేదు మీ బతుకు పుస్తకాన్ని తెరిస్తేచాలు మా బతుకుల్ని మేం చక్కదిద్దుకోగలం మీరు మాస్తారు కదా! (క్రమశిక్షణ తప్పి డబ్బుపారలు కప్ప స్వార్ధాలు ఏవో మమ్మల్ని విడదీస్తున్నప్పుడు ద్వేషాలు ఏవో మమ్మల్ని లొంగదీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఒకసారి బెత్తం పట్టుకుని రావాలి సుమా! నాన్నగారూ! అమ్మతో పాటు ఆకాశంలో మీరలా వాహ్యాళికి వచ్చినప్పుడు మా కోసం మీ కళ్ళు వెదుకుతున్నప్పుడు మీ చల్లని దీవెనల విరిజల్దుల కోసం మేం దోసిళ్ళుపట్టుకు నిలుచుంటాం (నన్ను కన్న కొడుకులా ప్రేమించిన మా మామగారు కలపాల వెంకటేశ్వర రావు గారి స్మృతిలో... ఆల మాట్లాడుకోవాలి ౫ 438
అ త్రూర్తుపుగ్గాథి అలా మేము ఓ సాయంకాలానికి స్నేహ గంధాన్ని అద్దే పనిలో ఉంటాం నువ్వు ఓ పాతడైరీతో (ప్రత్యక్షమవుతావు అది నీ నవయవ్వనాల పాటల పరిమళాల పేటిక, అప్పుడు సావాసగాళ్ళను మోసుకుంటూ తిరిగే పూల పల్లకిలా సాయం సంధ్య ముస్తాబవుతుంది నువ్వుపాతపాటల తేనెటీగలను మోసుకుంటూ తిరిగే తేనెపట్టులా ఉంటావు ఒంటెలు వారాలకు సరిపడా నీళ్ళను దేహంలోనే ఓమూలదాచుకుని కదులుతాయంటారు నువ్వు మాత్రం ఓ జీవితానికి సరిపడా పాటల జీవధారలను నీ గొంతులో దాచుకున్నావు, చెలిమి కలయికల తీపిగుర్తుగా మనసులు ముందేసుకుని ముడులు విప్పుతాం = నువ్వు సుతారంగా నీ గొంతుముడి విప్పుతావు ప్రసాదమూర్తి వు క్రీడ
మేమెన్నడూ వినీకనని చిత్రవర్ష స్వరచిత్రంలా నువ్వు కనబడతావు
నీ కంఠం నుండి ఘంటసాలలూ రఫీలూ వెన్నెల కెరటాలై ప్రవహించి
మా మనోవీధుల్ని ముంచెత్తడం
మాకో నిత్యనూతన అనుభవం.
అలా ఓ రాత్రిని నువ్వు రాగమయం చేస్తావు
ఓ కలయికను కమనీయం చేస్తావు
బహుళా నీ అడ్రసు చెప్పమంటే
ఎప్పుడు చూసినా కొత్తగా కనిపించే
ఆ తీపిపాటల పాతడైరీనే
మా ముందు పెడతావు కాబోలు
అందులో పాటలేఉన్నాయో
నీ చిన్ననాటి చిలిపిజ్ఞాపకాల అలలమూటలే ఉన్నాయో
మాకు తెలీదుగాని
నువ్వు మునివేళ్ళతో ఆకాగితాలను సుతిమెత్తగా తిప్పుతుంటే
పాటకోసమే పుట్టినట్టున్న నీ హృదయాన్ని
మా ముందు ఆవిష్కరిస్తున్నట్టే ఉంటుంది
హాయిగా తీయగా ఓ తూరుపు గాలివై.
నువ్వు మా హృదయాల్ని స్పృశిస్తుంటే
తూలీ సోలే పక్షులమై
నీ పాటల్ని మా రెక్కల జేబులనిండా నింపుకొని
పరవళంగా ఎగిరిపోతాం. ఆలా మాట్లాడుకోవాలి ౫ కక్
నీ మల్లెపువ్వులాల్చీ దానిలోపల మృదులంగా మధురంగా కువకువలాడే నీ మనస్సూ ఆ మనసుపాడే పాట ఆ పాటలోని లాలస మా కెప్పటికీ కావాలి ఆ కెరటాలను మా మీద వొంపుకుని జలకాలాడాలి ఆ తేనెపిట్టల్ని మా చెవుల దోసిళ్ళతో ఒడిసిపట్టుకొని మురిసిపోవాలి ఆపూల రేకుల్ని మా శరీరాల నిండా అతికించుకుని గాలిరాయుళ్ళమై అలాఅలా తేలిపోవాలి నిజంగా నువ్వుకావాలి, నీ పాట కావాలి. (పాటల చెలికాడు రామకృష్ణకోస౦) ఆల ప్రసాదమూర్తి ౫ 46
ర మరో ప్రియురాలు హలో డియర్ బాగున్నవా! మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడిలా, నిన్ను చూద్దామని నీ గుండెల మీద నా పద్యాన్ని కప్పిపోదామని వచ్చాను ఏదీ ఆ చేయిటివ్వు నీకు గుర్తుందో లేదో గాని సముద్రమా ఈ తీరంలో ప్రతి రేణువు మీదా నా అక్షరాల తీపి మరకలున్నాయి నీ అలల అవయవాలమీద కరిగిన నా కలల కర్పూర కళికల చారలున్నాయి. అప్పుడు నేనో నవనవోన్మేష జీవన గీతాన్నయితే నువ్యో నిత్యనూతన యవ్వన రాగానివయ్యేదానివి నేనూ నా ప్రేయసి తీరానికి చేరుకోగానే చందమామ పఫ్‌తో వెన్నెల పౌడర్ నీ ముఖానికద్దుకుని నీలాకాశం జిలుగుపైట గుండెల మీద పరచుకుని మాట్లాడుకోవాలి ౫ 47
కెరటాల శిరోజులు ఎగరేస్తూ వచ్చేదానివి మేమిద్దరం పొద్దు తెలియని ముద్దుల్లో మునిగిపోతే అలిగి నీ అలల పిర్రల్ని దులుపుకుంటూ వెళ్ళి పోయేదానివి నువ్వూ నా ్రాణసఖి చెరో పక్కా నడుస్తుంటే (ప్రపంచం కుక్క పిల్లయి నా కాళ్ళ దగ్గర కువకువలాడేది ఒక సారి అలా వీచికల పేజీలను వెనక్కి తిప్పితే ఒకనాటి నా జ్ఞాపకాల ఇంద్రచాపం వెల్లి విరుస్తుంది నీకు తిపించిన ప్రేమ కబుర్ల శెనక్కాయలు నీ గొంతులో నే క్రుమ్మరించిన ప్రణయగీతాల కూల్డ్రింకులు నీకు రుచిచూపించిన తీపిముద్దుల ఐస్‌క్రీములు నిజంగా భలే బాగుండేది కదూ! నువ్వు కెరటాల చేతులతో నా పాదాలను అల్లుకుపోయినప్పుడు శబ్దాలకెక్కని కవిత్వాన్ని కలగంటూ నేనెలా కరిగికరిగి నీలో కలిసి పోయేవాడిని! నా ప్రియురాలు అలిగి కూర్చున్నప్పుడు నువ్వు నడిపిన నీటితుంపర్ల తుంటరి రాయబారం నేనింకా మర్చిపోలేదు. పాలనురగల పట్టుదారాలతో నువ్వుల్లిన తివాచిమీద ప్రసాదమూర్తి * 48
నా చెలిపాదాలు మోపినప్పుడు ఇసుక తిన్నైల పత్రాల మీద నేను రాసిన పద్యాలన్నీ ఉరుకుతూ వచ్చి ఉడాయించుకు పోయేదానివి అప్పుడామె ఎంత ఉడుక్కునేదో నీక్కూడా తెలుసు హృదయేశ్చరి నా కన్నుల్లోకి చూస్తూ కవిత్వం చెప్పమన్నప్పుడు నువ్వు అలల సంగీతాన్ని జతచేసి కలల మెహఫిల్ని సజాయించేదానివి - మళ్ళీ నీ లోలోపలికి దిగాలనుంది మళ్ళీ నీ దేహంతో దాహంగా ఆడుకోవాలనుంది నీ కళ్ళల్లో నా కవిత్వాన్ని వొంపి ఆ వెలుగులో లోకాన్ని చూడాలనివుంది నీ అలల వక్టోజాలమీద నా అక్షరాలు తలలు వాల్చిన అనుభూతిని చిత్రాతి చిత్ర వర్గాలతో చిత్రించాలని వుంది ఏద్ద ఆ చేయిటివ్వు కనీసం ఇప్పుడైనా నిన్ను నాతో తీసుకు పోవాలనుంది, (మొన్నామధ్య విశాఖ సముద్రాన్ని కలిసిన సందంర్భంలో) ఆీల మాట్లాడుకోవాలి. ౫ 439
ఏడికీలి నక్షత్రం ల పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగల్లా పాలకులే ప్రజల్ని భయపెడుతున్నారు దిక్కులేని కన్నీటి చుక్కల మిద ఇనపపాదాల నీడల నగ్జనాట్యాలు నేలను కౌగలించుకున్న అమాయక జనం కలలమిద పరుచుకుంటున్న డబ్బు సంచుల వలల వలపు గీతాలు అభివృద్ది పేరుతో ఆటవిక ఆట ఉన్నట్టుండి ఒక ఆనకట్ట వందలాది (గ్రామాల మోద విరుచుకు పడుతుంది కూలిపోయిన ఇళ్ళనూ బంధాలు అనుబంధాల కలల గూళ్ళనూ మోసుకుంటూ దిక్కుతోచక కొట్టుకుపోతున్న దిక్కులేని జనం సెజ్ సెగపెట్టింది సెజ్ పగపట్టింది బకాసురుల ఎకనామిక్ జోన్ బడాచోరుల ఎకనామిక్ జోన్ వెళ్ళగొట్టాలి వెళ్ళగొట్టాలి ఎలాగోలా కొంపాగోడూ కొల్లగొట్టి వెళ్ళగొట్టాలి చెరువుల్లోంచి చేపల్ని ఆకాశంలోంచి చుక్కల్ని చెట్టమాంచి పిట్టల్ని నేలమించి మనుషుల్ని
మనుషుల్నించి మనుషుల్ని మునుషుల మనసుల నుంచి మమతల్ని వెళ్ళగొట్టాలి వెళ్ళగొట్టాలి కేటుగాళ్ళంతా కలిసి
జనం భయానికి రేటుకడుతున్నారు
భయం బరిసెలా ఆశల గుండెకాయని కుళ్ళబొ, 'డ్రుస్తోంది భయం శరీరంలోకి మనసులోకి నమ్మకంలోకి చొచ్చుకుపోయి జీవితాలను డొల్ల చేసేస్తోంది
జనం భయంతో ఆడుకోవడమే
పాలకులకు ఆటవిడుపుకాబోలు
శాంతి పేరుతో యుద్దం
ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వం
అహింస పేరుతో హింస
అభివృద్ధి పేరుతో అణచివేత
అక్షరం కూడా ఇప్పుడు
అసైన్హు భూమిలా బిక్కుబిక్కు మంటోంది
ఇక చరిత్ర ఒళ్ళు విరుచుకుంటుంది కాబోలు
ఇక కాలం జూలుదులుపుతుంది కాబోలు
ఇక అమాయక జనాల పిడికిళ్ళు
ఆకాశంలో నక్షత్రాలై మెరుస్తాయి కాబోలు
అటో యయాతి రం చుర్యు అఆ య్ ఠం * మాట్లాడుకోవాలి * 61 (స సంయిం.తడ గో త "లో లీలిజాల్ర. హైదరాబా
వాన ఉదయం పూట వాన ఎవరో తలుపుతట్టినట్టు చూస్తే తడిసి తడిసి వణికి పోతున్న పిట్టల గుంపు నిజంగా ఈ వాన గమ్మత్తుగా ఉంది మంత్ర గత్తెగా ఉంది మార్మికంగా ఉంది వాన నీటిలో ఆడుకుంటున్నాడో పిల్చాడు వొడి కళ్ళల్లో కోటి కలల కత్తిపడవలు వర్షంలో తడిసి చివికిపోయిన కాగితప్పడవలా నేను. నన్ను చూస్తే వాడికెంత వేళాకోళంగా వుందంటే తొడుక్కున్న చొక్కావిప్పి గిర్రున గిరాటు వేసి నన్ను వెక్కిరిస్తూ చూశాడు ప్రసాదమూర్తి ౪ 652
కురుస్తున్న వర్షానికి దూరంగా నిలబడి జ్ఞాపకాల వర్షంలో తడుస్తున్నాను ఉదయం పూట వాన నింగికీ నేలకీ మధ్య పరచిన పట్టుదారాల పడుగులా ఉంది అప్పుడు, చెడ్డీల వయసప్పుడు పొలందగ్గర చెరువు గట్టుమీద ఎవరూ లేరు కదా అని వర్షంలో బోసి ఒంటితో గెంతులేసిన జ్ఞాపకం కితకితలు పెడుతోంది. ఈ ఉదయం పూటవాన నింగి పువ్వు నుండి నేలరాలుతున్న చమ్కీల పుప్పాడిలా ఉంది. పైన కుండఫోతగా వాన కింద నిలువెల్టా ఉబ్బిన చెరువు చుట్టూ తామరపూలు మధ్యలో ఈతకొడుతూ నేను గట్టుమీద తడిసిన పుస్తకాల సంచీతో చెల్లి అబ్బబ్బా ఈ ఉదయం పూట వాన జ్ఞాపకాల రీళ్ళు గిరగిరా తిప్పుతోంది. మాట్లాడుకోవాలి * 58
ఎవరో ఒక మిత్రుడైనా రాకపోతాడా అని రాత్రంతా ఎదురు చూసి పడుకున్నాను అందుకే పొద్దున్నే ఈ వాన లక్షవేతులతో నన్ను చుట్టేసింది. వాన వాన వాన - నాలో నీలో అందరిలోనా కురుస్తుంది కురుస్తుంది బాబూ! బాబూ! అమ్మ పిలుస్తుంది పీడకలేదో వచ్చినట్టు నటించి నాన్నను తోసేసి అమ్మపక్కలో పడుకున్నాను అమ్మ తియ్యగా జోకొడుతున్నట్టంది వాన ఎంత చిత్రంగా కురుస్తోందో! నాలో ఏ౦ తవ్వుకు పోదామనోగాని సూటిగా కళ్ళల్గొంచి గుండెల్లోకి మెత్తగా దిగబడుతోంది ఊరిని ముంచేసిందో సారి గాలీవాన అప్పుడలా గూడెం గుడిసెలు వాన నీటిలో పడవల్లా తేలిపారిపోతుంటే గండెలేని ఊరు గేట్టు మూసేసింది చెమ్మగిల్లిన కళ్ళతో నేను చాచిన చేయి ఇంకా అలా బిగ్రబిగుసుకోనే ఉంది. వానమ్మా వాన - మాయదారివాన - మహమ్మారివాన కన్నీటివాన - కనకాంబరాల వాన నవ్వులవాన - ఏడ్పులవాన - జాతర వాన - జ్ఞాపకాలవాన ప్రసాదమూర్తి ౪౫ 54
ఆకాశంలో చుక్కలన్నీ ఎవరో పొడి పొడి చేసి జల్లెడ పడితే తళుకు తళుకున నేలకు రాలిపోతున్నట్టు వాన సైలోకంలో వున్న కవులంతా కుండపోతగా పద్యాలు నేలకు క్రుమ్మరిస్తున్నట్టుంది వాన అమ్మ బడికి పొమ్మని నాన్న పొలం రమ్మని నా చదువుకోసం ఆత్తింటికీ పుట్టింటికీ మధ్య అమ్మ తీసిన పరుగల జడిలా వుంది వాన వీధి మొగలో గోళలీకాయలాడుతుంటే నానమ్మ కర్రతో ప్రత్యక్షం చటుక్కున చెట్టెక్కి చెట్టమీంచి చెరువులోకి దూకి తామరాకుల కింద నుంచి నక్కి నక్కి చూస్తే గట్టుమీద నానమ్మే కాదు చెరువు చెరువంతా ఫక్కుమని కెలకవేసింది (ప్రపంచంలోని పిల్లలంతా ఆకాళాన్ని గాలిపటంచేసి నవ్వులదారాలు పట్టుకుని ఆడుకుంటున్నట్టుందివాన ఆకాశరాజు భూదేవికి పెడుతున్న చల్లని జల్టుల కితకితల్లా వుంది వాన, అన్నం తింటున్నప్పుడు పొలమారితే ఎక్కడో దూరాన ఉన్న అమ్మ కొడుకా అని పలవరిస్తూ నెత్తిమీద సుతారంగా చేత్తో తడుతున్నట్టుంది వాన మాట్లాడుకోవాలి * 55
ఆ కుర్రాడు అలా ఆడుకుంటూనేఉన్నాడు ఆడుకుంటూ అల్లరి కళ్ళతో నన్ను ఆటపట్టిస్తూనే ఉన్నాడు సన్జ సన్షగా వాన - చల్లచల్లగా వాన జల్లులు జల్టులుగావాన = తుంపర తుంపరగా వాన ఈ ఉదయం పూట వాన నా హృదయాన్ని సృృతుల మునివేళ్ళతో మీటుళూనే ఉంది ఆఅ ప్రసాదమూర్తి ౪ 656
శ్ర క్ర జెవారా! జవారా!! ఇంత పెద్ద (ప్రజాస్వామ్యం ఆకాశంవైపు ఆశగా చూస్తున్న ఒక అసహాయురాలిని బందిపోటులా భయపెడుతోందన్న మాట
అంతంత ఎత్తైన హిమాలయాలు
చీకటితో ఒంటరి పోరు చేస్తున్న ఓ దిక్కులేని దీపాన్ని ఊదెయ్యడానికే ఉబలాటపడుతున్నాయన్న మాట
ఇన్ని నిర్మల నదీ'ప్రవాహాలు
దాహార్తితో ఉన్న ఓ మొక్కముందు
ఊరిస్తూ ఉరకలేసే ఉత్తుత్తి ఎండమావులైపోయాయన్నమాట ఇంత పురాతన సనాతన వేదభూమి
ఒక ఒంటరిపక్షి జంటరెక్కల్ని కత్తిరించే
పైశాచిక భూమిగా పతనమైందన్నమాట
మాట్లాడుకోవాలి * 57
జహీరా! జహీరా!! నీ నాలుక ఎన్నీ మడతలు పడ్డా తుపాకులు గురిపెట్టబడ్డ నీ గుండెగూటిలో విలవిల్లాడుతున్న ఆ గువ్వగొంతు మాకు వినిపిస్తూనే ఉంది. ఈ సస్యశ్యామల స్వర్గధామ రామరాజ్యం ఒక ఉడుతపేల్ల పీక పిసికే రక్తస్తీక్త రాకాసీహస్తమయిందన్న మాట ఈ సుందర విభ్రమాభ్ర శుభ్రజ్యోత్తులు మిణుకు మిణుకుమ౦టున్న ఓ చుక్కతల్లి గుండెల్లో గునపాలై దిగబడుతున్నాయన్న మాట జహీరా! జహీరా!! నీరోలు హీరోలవుతున్నారు రుషులు ఇండియన్ బుష్లవుతున్నారు జటాధారుల మఠాలు ముఠా తగాదాల్లో ముక్తిపొందుతున్నాయి ఇంత పెద్ద ధర్మకాటాల ధర్మపీఠాల ధర గురువుల ధార్మికదేశం ఒక అన్యాయాన్ని ్రళించే అడ బిడ్డతో ఆడుకునే ఆటవిక శ్రీడోన్మాదిగా ఆవతరించిందన్నమాట ప్రసాదమూర్తి + 58
జహీరా! జహీరా! నీ ఒప్పును తప్పుగా దిద్దుకునే అవకాశాన్ని నీకు ఇస్తున్నాం నీస్టృతిని విస్టృతిగా మార్చుకునే ఛాన్సు నీకు పారేస్తున్నాం. నీ నాలుకను కోసుకుని మళ్ళీ అతికించుకుని మళ్ళీకోసుకుని మళ్ళీ ఆతికించుకుని నిలువెత్తు నెత్తుటిబొట్టయి మా ముందు నువ్వు ఘనీభవించేదాకా మాట మీద మాటమారుస్తూ బతికిపొమ్మని వదిలేస్తున్నాం. కాకుంటే కొన్నాళ్ళు జైల్లో పెడుతున్నాం జహీరా! జహీరా॥ 8-2-2006 (2002లో జరిగిన గుజరాత్ హింపాకాండలో 14 మంది సజీవదహనానికి కారణమైన బెస్ట్బేకరీ కేసు ప్రత్యక్ష సాక్షి జహీరా షేక్ కోసం) ఆోల మాట్లాడుకోవాలి * 59
ఇస లీ ఎది క్షీ జిస్కీ ర్స డిస్కీ ఫాీ ఉరిశిక్ష కావాల్సిందే ఇప్పుడు ఉరితాడు వాడిదే కావచ్చు ఉరికొయ్య వాడిదే కావచ్చు రేపు ఉరిశిక్ష కూడా వాడికే. ఉరితీయాల్సింది బుష్నే నియంతల చేతుల్లో మళ్ళీ మళ్ళీ గాయపడుతున్న చరిత్ర వొడి ఉరిని ఉత్సవంగా జరుపుకోవాలి అబద్ధం చేతుల్లో మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్న నిజం వాడి ఉరిశిక్షకోసం ఎదురుతెన్నులు చూడాలి. ఉరిశిక్ష రద్దు చేయాలని గొడవచేస్తున్న మానవహక్కుల సంఘాలన్నీ వౌడి ఉరిని పండగ చేసుకోవడం అద్భుతఘటనగా చరిత్రకారులు పాఠాలు రాయాలి. మనం కాకుంటే మన పిల్లలైనా ఏకమవుతారు ప్రసాదమూర్తి ౪ 60
ఒక లోకమవుతారు ఒకే గమ్యం వైపు ప్రవహించడం నదుల్ని చూసి తెలుసుకుంటారు చీకటిని చీల్చిచెండాడే గుణాన్ని సూర్యుడి నుండి 'ప్రాణవాయువుగా పీల్చుకుంటారు మనం కాకపోతే మన పిల్లలైనా మానవ విలువల రక్షణకోసం ఉద్యమాల వాకిళ్లలో నెత్తుటి ముగ్గులు పెడతారు రాజ్యదాహం రాజ్యమోహం రాజ్యకాంక్షల రాక్షసత్వం మీద ఉమ్మడిగా ఉమ్మేస్తారు. నియంతల్ని ఆకాశానికి వేలాడదీసి నిజమైన ఉరిశిక్ష అమలు చేస్తారు ఇక ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రపంచమంతా అప్పుడు ముక్త కంఠంతో ప్రకటిస్తుంది. చరిత్ర ఇలా తిరగబడుతుంది: జిస్కీ లాఠీ ఉస్కీ భైస్ కాదు జిస్కీ రస్పీ ఉప్కీ ఫాదీ. (ఉరితియ్యాల్సింది బువ్నే అంటూ సద్దాం హుస్సేన్ ఉరిశిక్షతీర్పును ఖండిస్తున్న ప్రపంచంతో గొంతు కలుపుతూ) ఆల మాట్లోడుకోవాలి ౫ 61
చుక్కలన్నీ ఏదో ఎడారిలో రాల్ఫేసుకున్న ఆకాశంలా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు
అలా చిర్రుబుర్రులొద్దు - ఆ చిటపటలొద్దు నవ్వాలి - గలగలా = జలజలా
అలా బడుల్టోకి పోయి
చిన్న పిల్లల ముందు నిలబడు
నాలుగు నవ్వులు నీ చేతుల్లో పడేస్తారు తోటల్లోకో పకల గూళ్ళల్లోకో తొంగి చూడు నీ కళ్ళు నవ్వుల దీపాలవుతాయి.
మట్టి మొక్కలా నవ్వుతుంది
చెట్టు నీడలా నవ్వుతుంది
ప్రసాదమూర్తి ౪ 9
మనం నవ్వితే ఇల్లంతా మాటలు నేర్చిన మల్లెపందిరవుతుంది మనం నవ్వితే వీధులూ ఆఫీసులూ రోడ్లూ తంబురాలూ-వీణలు-గిటార్లయిపోతాయి మనకు నవ్వడం కూడా తెలుసని మన పిల్లలు అబ్బురాల అలలై ఆనందంతో మన కాళ్ళను చుట్టేసుకుంటారు. నవ్వాలి - హాయిగా - తీయగా పువ్వులు జలజలా రాల్భుకుంటూ ఒక చెట్టు మన మధ్యనుండి అలా నడిచిపోవడం నవ్వు, ఆఫీసునుండొచ్చిన అమ్మను చూసి ఉయ్యాల ఆనందంగా ఊగడం నవ్వు, మాఘమాసం చలిలో ఓ అనాధ శరీరం మోద ఉన్నట్టుండి ఒక ఉన్నిశాలువా వాలడం నవ్వు ఒక పలకరింపు నవ్వు = ఒక స్పర్శనవ్వు నవ్వు జొషధం - నవ్వు అవసరం చేప పిల్లల్నీ తామరపువ్వుల్నీ ఒక్కసారే పోగొట్టుకున్న చెరువులా ఎప్పుడూ అదోలా ఉండొద్దు ఒక మాట్లాడుకోవాలి * 68
నవ్వాలి = ముచ్చటగా = మురిపెంగా, అజ్ఞాత వీరుల్ని జోకొడుతున్న అడవి పాట నవ్వు - నలుగురు కూర్చున్న చోట మానవహక్కుల గీతం గొంతు విప్పినట్టు నవ్వాలి (ప్రేమగా చేయి చాపడం నవ్వు అణకువగా భుజాలు వంచడం నవ్వు నవ్వితే ఎగురుతున్న పక్షి ఓ సారి వెనక్కి చూడాలి పైకెగసిన కెరటం ఓసారి ఆగిపోవాలి నది దేహం మిద పడవరాసిన పాట నవ్వు ఆకాశానికి పక్షి ఇచ్చే షేకహ్యాండ్ నవ్వు చెట్టు బుగ్గ మాద గాలి ముద్దు నవ్వు ప్రకృతి విశ్చవిద్యాలయం మనుషులకు ప్రసాదించే పట్టా నవ్వు నవ్వడం చేతకాక పోతే బతకడం చేతకానట్టే, ఆఅ ప్రసాదమూర్తి ౫ 64
దెయ్యం క్
కాకి ముక్కుకి వేలాడుతున్న
మనిషి కనుగుడ్డు నన్ను డిస్టర్బ్ చేసింది.
ఏ అడవిలో ఏ మృతదేహం నుండి ఎత్తుకొచ్చిందో!
ఒంటినిండా శవాల కంపుతో
ఓ గాలిదయ్యం నా నిద్రపాడుచేసింది.
ఏ అడవిలో మనిషిరక్తంతో తడిసిన ఏ నేలమీంచి
అది నడుచుకుంటూ వచ్చిందో!
మబ్బుల్లో అడవులు కనబడుతున్నాయి.
అడవుల్లోంచి మనుషులు కురుస్తున్నారు
మనుషుల్టోంచి పురుగులు బయటపడుతున్నాయి.
పురుగుల్లో ఏదో గర్వరేఖ మెరుపై నా అక్షరాలను అల్టుకుంటోంది మాట్లాడుకోవాలి * 65
పురుగులు పట్టిన సినిమాలు పురుగులు పట్టిన టీవీలు పురుగులు పట్టిన భవనాలు పురుగులు పట్టిన ఎప్టేట్లు పురుగుల రాజు - పురుగుల రాజ్యం ఇన్ని పురుగులు పట్టిన సజీవ దేహాల మధ్య ఓ కల కసిగా కలయ తిరుగుతోంది పురుగులు దేహాలకేగాని, కలలకు పట్టించలేరని అది మన కనురెప్పల్ని మీటుతూ కవ్విస్తోంది. దయచేసి ఆ కలను కాల్చండి. అది మన బిడ్డల మీద కన్నేసింది. (ఎన్కౌంటర్ చేసి మృతదేహాలను పురుగులు పట్టించి తల్లిదండ్రులకు అందజేసే నీచాన్ని నిరసిస్తూ ఆ ప్రసాదమూర్తి + 66
ఎవి (ఎమ భూమ్మీద మనిషి కాలాన్ని ఒక్క రోజులో కుదిస్తే అది (ప్రేమికుల రోజుకావాలి ప్రపంచం సమాధిలో రెండు సజీవ ఆత్మలు సమాధి చుట్టూ కోట్లాది పాదముద్రలు జీవితంలోనూ మరణంలోనూ మరణానంతర జీవితంలోనూ కురిసే వెలుగుజల్లు (ప్రేమే కావాలి అలకతో ఓ అమ్మాయి విసిరిన పుస్తకాల సంచి రోడ్డును (ప్రేమ లేఖల మొగలి పొత్తు చేసింది మాట్లాడుకోవాలి * 67
(ప్రేమ ఇండాన్ని కనుక్కోవడంలో ఎవడికి వాడే ఓ కొలంబస్ తనను రోడ్డు దాటించిన చేయి కబోదికి కలలో కనిపించడం (ప్రేమ స్వార్థమూ త్యాగమూ కొత్తదంపతుల్దా ఆడుకునే పూలబంతి ప్రేమ తెగిన గిటారు తీగల్లో విషాదమై ప్రవహిస్తున్న పెదాల అన్వేషణ (ప్రేమకోసమే మనుషుల్ని కరెంటు తీగెల్ని చేసి (ప్రపంచం పందిరికి వేలాడే బల్బు పువ్వు (ప్రేమ శరీరాల సంగీతానికి హృదయాలు కూర్చే లిరిక్ ప్రేమ చెబితే (ప్రేమ గురించే చెప్పాలి
- మనుషులు ప్రాణాలతో అల్టుకున్న దీపాల గూటిలో నిత్యం కువకువలాడే (ప్రేమ పక్షి గురించి చెప్పాలి పాటను వెదుక్కుంటూ పయనమైన ఒంటరి పడవ నదిమధ్య కొండకు తలబాదుకోవడం గురించి చెప్పాలి ప్రసాదమార్తి * 68
ఎక్కడో పారేసుకున్న సెల్‌ఫోనులో నువ్వెదురు చూస్తున్న కాల్ మిస్‌కావడం ప్రేమ 'ప్రేమ ఎస్సెమ్మెస్సులు కాదు అలాగని పష్టయింగ్ కిస్సులూ కాదు (ప్రేమ నాలుగు చేతుల రహస్య ఒప్పందమే కాదు అది మనిషి నుండి మనిషికి అనాదిగా ప్రవహిస్తున్న నిశ్చబ్ద సంగీతం 'ప్రేమ చీకటి వెన్నులో మెత్తగా దిగబడే వెన్నెల (ప్రేమ ఎడారి గుండెలో నీటి కత్తి నిద్దుర రెప్పల మీద మత్తగా జోగే మెలకువ (ప్రేమ ఒక ఆంధయువకుడికి మూగపిల్ల చేసిన కొంటె సైగ నిన్నూ నన్నూ వెక్కిరిస్తుంది (ప్రేమగా ఎవరిని ఎవరు ప్రేమించినా అందరినీ అందరూ ప్రేమిస్తున్నట్టే మనుషులంతా (ప్రేమికులు కావాలి రోజులన్నీ ప్రేమికుల రోజులవ్వాలి. ఆ మాట్లాడుకోవాలి * 69
స్యామి ఇది ఏమి?
సాధుత్వమా అంధత్వమా
ఇది హత్యా రాజకీయాలతో బంధుత్తమా చెప్పండి స్వామీ
మా చెవులు కోసి మీ చేతుల్లో పెడుతున్నాం. మీక్కూడా అచ్చం మాలాగే
పాడుపాొట్టా పీతి ముడ్డీ వుంటాయని
మీరూ అచ్చం మాలాగే
ఒకటికీ రెంటికీ పోతారని
అందర్నీ ధీనించే ఆ పవిత్ర కరకమలాలతో అన్ని దుర్గంధాలను కడుక్కుంటారని గమనించినప్పుడైనా
మీరూ మాలాంటి మనుషులేనని (గ్రహించలేకపోయాం. ధార్మికత్వమా మార్మికత్వమా
ఇది సింహాసనం మీద వాలే మీ దృష్టి తత్వమా? చెప్పండి స్వామీ!
మా చర్మాన్ని వొలిచి మీ చేతుల్లో "ెడతాం, ప్రసాదమూర్తి * 70
మీ దేహాన్ని వెలిగిస్తున్న ఆ పవిత్ర వస్త్రం దేవుడు నేసింది కాదని మీ యోగముద్రకు శీతల ఛత్రాన్ని పట్టిన ఆ కనకభవనం దేవుడు కట్టింది కాదని మీ ముఖారవిందం అందం చెడకుండా గెడ్డం గీసిందీ మీపాద పద్మాలు కమలకుండా చెప్పులు కుట్టిందీ మీ పక్కలు సర్దేది, మీ పొట్టలు నింపేదీ దేవుడుకాదని చూసికూడా పోల్చుకోలేక పోయాం మీరు కూడా మాలాంటి మానవ మాత్రులేనని సన్యాసమా విన్యాసమా ఇది మతం పేరుతో మనుషుల్ని చేస్తున్న పెనుమోసమా! చెప్పండి స్వామీమాజీవితాలను మీ పాదాల [క్రింద పరుస్తున్నాం. మీక్కూడా మాలాగే కోరికలూ ఆశలూ వుంటాయని డబ్బుకోసం, అధికారం కోసం మీరుకూడా గడ్డిలాంటి బ్రహ్మపదార్జాన్ని ఆరగించగలరని అచ్చం మనుషుల్లాగే మీరు హత్యలు కూడా చేయించగలరని ఇప్పుడు కళ్ళారా చూశాకనైనా తెలుసుకోగలమంటారా! మేం చదువుకున్న మూర్భులమని కళ్ళున్న కబోదులమని చెప్పండి స్వామీ (ప్రజలంతా చెప్పులు పట్టుకు సిద్ధంగా వున్నారు. (హత్యా నేరం మీద పీఠాధిపతులు కూడా అరెస్టు అవుతున్న నేపథ్యంలో) మాట్లాడుకోవాలి * 71
ఫణీ
కళ్లల్లో ఖాళీ పడవల్గా
తడితడి కలలేవో
నిన్ను తీరంగా వెదుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి తలలు వాల్చుకున్న జ్ఞాపకాలేవో
గుండెల్లో కన్నీళ్ళు తోడుకుంటూ
నిన్ను పాడుకుంటున్నాయి,
ఫణీ! మమతల మణీ!
ఒక్కమాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు! నువ్వు వెలుగంతా మాకు పంచిపెట్టి
బాధల చీకటి గడ్డల్ని
గొంతు జేబులోనే దాచుకున్నావు
నీ స్పాంటేనియస్ పౌంటేన్లో మమ్మల్ని తడిపేసి నీ చమత్కారాల సత్కారాలతో
మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసి
విషాదమంతా నీ గొంతు సంచిలో కుక్కేసుకున్నావు మమ్మల్నింతగా మోసపుచ్చడానికి
నిన్ను నువ్వు ఎన్నిపార్టు మోసం చేసుకున్నావో. కదా! తెరమీద హీరోల విజయోత్సవాలకోసం
తెరవెనుక జీరోగా మిగిలిపోయిన చెలకాడా ప్రసాదమూర్తి 4 72
నీకు నవ్వడం నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసని ఒక్కసారైనా చెప్పడానికే వెళిపోయావనుకుంటున్నాం కిక్కిసిన ఇన్నిస్యార్హశరీరాల త్రొక్కిసలాటలో నలిగిపోయిన రెల్టుపువ్వులాంటి నీ ఆత్మ ముద్రల్ని ఇప్పుడు మా కన్నీటి టార్చిలైట్టతో అన్వేషిస్తున్నాం. కలం భుజాన వేసుకుని
ఎన్ని సినిమాలను అలవోకగా దున్నిపాడేశావో అయినా ఒక్కపంటా చేతికందని
బక్క రైతుగానే మిగిలిపోయావు
నేస్తం!
నీ నిశ్శబ్ద నిష్క్రమణ
ఇక్కడ ఏ వెండి తెరల గుండె తలుపులూ తట్టలేదు చిన్న పిల్దాడిలా బుగ్గల నిండా
అశ్రువులు పూసుకుని
విలపిస్తున్న ఎమ్మెస్ మాద ఒట్టు
మేం నవ్వడం మర్భిపోయినప్పుడల్లా
నిన్నే గుర్తుచేసుకుంటాం
జీవితం ఎంత ట్రాజెడీని మిగిల్ళినా
(ప్రపంచానికి కామెడీనే పంచాలని
నీ నుండి పాఠాలు నేర్చుకుంటాం.
ఆ$ీల మాట్లాడుకోవాలి ౫ 78
పరీక్షలి రుతువు
మాయదారి మార్చినెల
మా పిల్లల్ని తరుముకుంటూ వస్తుంది పరీక్షలొస్తే చాలు
టపాకాయల్హాంటి మా పిల్లకాయలు యూనిఫాంలో ఉన్న రుషిపుంగవులైపోతారు పూల వనంలాంటి మాబడి
తటాలున ఒక తపోవనమైపోతుంది
బాలల మేధస్సు హవిస్సుగా సాగుతున్న క్రతువు ఇది పరీక్షల రుతువు
మా సంగీతం గది మూతి మీద
'తాళం' వేలై వెక్కిరిస్తుంది
అటస్థలానికి జృరంతగిలి మంచంపడుతుంది బడితోటలో చెట్టకొమ్మలకి
'నిళ్ళబ్దం' బోర్టుల్లా పిట్టలువేలాడతాయి చప్పుడు చేయకుండా పువ్వులు
అల్లరి చేయకుండా ఆకులు
కొత్త విద్యను అభ్యసిస్తాయి
ప్రసాదమూర్తి ౫ 74
పరీక్షలొస్తేచాలు మా స్కూలు స్కూలంతా యుద్ధసమమంలో బాలబాలికల్ని దాచిన నేలమాళిగ అయిపోతుంది. భూతంలా భవిష్యత్తు భయదగీతం పాడుతుంటే అమ్మానాన్నల కలల బాంబులు కనురెప్పల మీద పేలుతుంటే చుట్టాల పిల్లల విజయాలు చుట్టుముడుతుంటే టీచర్లమెడలమీద మెమోల కత్తిగొట్టు కలవరపెడుతుంటే ఇంజనీరా? డాక్టరా? తేల్చుకోమంటూ కార్పొరేట్ గద్దలు కవ్విస్తుంటే టెన్షన్-టెన్టన్-టెన్షన్ పరీక్షలొస్తే చాలు మా చిలిపి శిష్యులు కలాల శిలువలు మోస్తున్న చిట్టి ఏసులైపోతారు స్కూలు స్కూలంతా ఒక బోధివృక్షమైతే మా చిన్నారులంతా బాలగౌతములైపోతారు బాలల మేధస్సు హవిస్సుగా సాగుతున్న క్రతువు ఇది పరీక్షల రుతువు,
ఆఅ
మాట్లాడుకోవాలి ౫ 5
మార్చింగ్ అసెంగ్టీ గొ
మార్నింగ్ షోస్ ద డే” అన్నవాడు ఎవడోగాని మా పిల్లల గురించే అనివుంటాడు. నాలుగొందలపొవురాలు లైనులో నిలబడి 'నవోదయ గీతం" ఆలపిస్తుంటే గగనతలం నుదుటిమీద సూర్యాక్షరాలు భారత భాగ్యోదయాన్ని ప్రకటిస్తాయి. వేదికమీద హోర్మోనియ౦ం తబలా కాంగో పియానో మా బాలల మునివేళ్ళతాకిడికి పరవశించి స్పరనాట్య విన్యాసం చేస్తుంటే జలపాతాలు ఒక కొత్త సంగీతాన్ని కలలు గంటాయి. యూనిఫాం వేసుకున్న పూలమొక్కలు ముక్త కంఠంతో ప్రతిజ్ఞ పలుకుతుంటే ఆకాశంలో మబ్బులు కాసేపు ఆగి తన్మయత్వంతో మా బడిని తడిపీపోతాయి. ప్రసాదమూర్తి జ 76
నాలుగొందల చంద్రవంకలు నవ్యంగా (శ్రావ్యంగా జాతీయ సమైక్యతా గీతాలాపన చేస్తోంటే నెత్తుటీ మరకలతో నిండిన చరిత్ర పుస్తకాల్లో మానవత్వపు పేజీలు కొన్ని మారాకుతొడుగుతాయి. చిలకలు వార్తలు చదవడం వెన్నిల తునకలు జనగణమన పాడడం పిల్లనదులు ఉపన్యాసాలివ్వడం ఎవరికైనా చోద్యంగా అనిపిస్తే మా స్కూలుకొచ్చి చూడొచ్చు. మా బాలయోధులు మార్చింగు చేసినప్పుడు చూస్తే మరి గద్దల్టాంటి పెద్దల గుండెల్లో పిడుగుల జడి,
ణల లా (జవహర్ నవోదయ విద్యాలయం, వట్టెం మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థుల కోసం)
ఆల మాట్లాడుకోవాలి * 77
మిత్రుడొల్ళిన వేళ
ఇంద్రధనుస్సు ఫ్రెండ్పిప్ బ్యాండుని ఆకాశం భూమికి కట్టినట్టు
కెరటాల గుదిగుచ్చి సముద్రం
చంద్రుడి మెడలో వేసినట్టు
మి(త్రుడొచ్చిన వేళ
వేకువ జాము కోకిల గొంతు గుండెతాకినట్టు అనాదిగా కురిసిన వెన్నెలంతా ఒక్క దోసిట ఒదిగినట్టు ఉదయ భానుడు తలుపుతట్టి గుడ్ మార్షింగ్ చెప్పినట్టు మిత్రుడొచ్చిన వేళ
తెరచిన కొత్త పుస్తకంలోంచి
పక్షులు బిలబిలా ఎగిరినట్టు
పగలూరాత్రీ కలిసి యుగళ గీతమైనట్టు అరు రుతువులు ఏకమై
ఒకే స్నేహర్పుతువుగా వెలిగినట్టు మి(త్రుడొచ్చిన వేళ
వసంతాన్ని మోసుకుంటూ ఒక చెట్టు
మన ఇంటికి విచ్చేసినట్టు
అద్భుతమేదో జరిగి
అన్ని మతాల పండుగలూ
క్యాలెండర్లో ఒక్కరోజే విను
ముద్దుల చిన్నారి కొత్తపరికిణ్ వేసుకుని ప్రసాదమూర్తి * 78
పుట్టినరోజు చాక్సెట్ పంచినట్టు మి(త్రుడొచ్చిన వేళ ఊరువాడా ఏకమై గత౦ గాయాలమరకల్ని కలిసి కడుక్కున్నట్టు మందిరాల్ని ముస్లింలూ మసీదుల్ని హిందువులు నిర్మిస్తున్నట్టు కులాలూ మతాలూ కట్టగట్టుకొని గంగలో దూకేసినట్టు పసిపాపలా దేవుడు నవ్వినట్టు
మిదత్రుడొచ్చిన వేళ
తుపాకుల కత్తుల కర్మాగారంలో
అఆగరబత్తులు ఉత్పత్తయినట్టు
ప్రపంచంలో అఆణుబాంబులన్నీ
అకస్మాత్తుగా తుస్సుమన్నట్టు
యుద్ధవిమానాల నుండి పువ్వులు కురిసినట్టు మిత్రుడొచ్చిన వేళ
రాజ్యాల మధ్య సరహద్దులు
రాత్రికి రాత్రే మాయమైపోయినట్టు
ఒకప్పుడు మనుషులు యుద్దాలు చేసుకునే వారంటూ పీల్చాడెవడో చరిత్రపాఠం చదువుతున్నట్టు
ఒకేఒక్క శాంతికపోతం౦
వెయ్యి సూర్యచింబాల పెట్టయి
(ప్రపంచాన్ని వెలిగించినట్టు
మిత్రుడొచ్చిన వేళ
అవినీతి అంటే ఏమిటని
మన నాయకులంతా అడిగినట్టు
మాట్లాడుకోవాలి ౫ 70
సన్నాసులూ సన్యాసినులు రాజకయ సన్యాసం పుచ్చుకున్నట్టు బతుకు జీవుడా అని దేవుడు ఊపిరి పీల్చుకున్నట్టు మి[త్రుడొచ్చిన వేళ ఎన్నికల సమయాన సారా కొట్టులో పానకం పంచినట్టు ఒక్క దొంగ ఓటుకూడా లేకుండా (ప్రజాస్వామ్యం పరిమళించినట్టు మిత్రుడొచ్చిన వేళ అ(గ్రవాదం ఉగ్రవాదం క ద్రవాదాలనీ భూమి పారల్గ్ నిద్రపోతున్నట్టు మనిషి గుండె వాకిట మానవత్వం ఒక వింత పుష్పుమై విరిసిట్టు మిత్రుడొచ్చిన వేళ రూపాయి విలువ డాలర్ కంటె ఎన్నోరెట్టు పెరిగిపోయినట్టు అమెరికాలోని భారతీయులంతా హడావుడిగా ఇండియా ఫ్లైటెక్కేసినట్టు మి(త్రుడొచ్చిన వేళ 10-1-2004 (ఆప్త మిత్రుడు కుమార్ అమెరికా నుండి వచ్చిన సందర్భంగా) ఆ ప్రసాదమార్తి ౪ క
ద్
నవ్వుల సూటేస్లో అమెరికా ఇక్కడ గోదావరి మిద వెన్నెలనవ్వితే అక్కడ “లిబర్టీ” విగ్రహానికి కితకితలు పుట్టాలి.
ఇక్కడ కోనసీమ కొబ్బరాక్షై కదిలితే
అక్కడ న్యూయార్క్ వీధుల్లో పచ్చని చల్లదనం పరుచుకోవాలి. అన్నా! నువ్వు అమెరికాలో అడుగుపెడితే
అక్కడ ఆంధ్రులగుండెల్లో పులకింతల పూలు పూయాలి. గురజాడ “గరీశాన్ని” స్పష్టించాడు
మొక్కపాటి “పార్వతీశాన్ని” పుట్టించాడు
తెలుగు సినిమా “ఎం.ఎస్"ని డిస్కవరీ చేసింది.
బరిసెలు, కర్రలు కదనుతొక్కి పొగరుమోతు మట్టిలో మొలకెత్తిన మమతల మల్లెచెట్టువు నువ్వు.
నిడమర్రు పెద్దచెరువులో వేయిరేకుల నవ్వులతో
వికసించిన తెల్ల తామరపువ్వువు నువ్వు,
మాట్లాడుకోవాలి ౫ 81
(ప్రపంచం అరచేతిలో విషాదం కన్నీటి బొట్టె కదలాడుతుంటే నువ్వు హాస్యాన్ని జీవన భాష్యంగా ్రకటించావు. నవ్వడం, ఎదుటివాణ్ణి నమ్మడం కరువైపోతున్న రోజుల్లో నవ్వుల తారాజువ్వల్ని మా చీకటి మనస్సుల్లో వెలిగించిన “కామెడీకింగ్'వి నువ్వు... కల్లాకపటంలేని కాల్లేరంత పెద్దమనస్సుతో (. ళా ర! నువ్వు మమ్మల్ని కౌగిలిస్తే. మేం కొంగలమై ఆకాళందాకా గింగిరాలు కొడతాం, మా ఛాతీల గోడలనిండా నీ పోస్టర్లనే అతికించుకొని మా నేత్రాల పత్రికలలో నీ వార్తలే ముద్రించుకొని మా గుండెల “వెండితెర”ల మీద నీ బొమ్మే వెలిగించుకొని జాతర జరుపుకోవడం మాకోవేడుక నువ్వు మాకు కాలం ప్రసాదించిన ఓ “గొప్పకానుక” శీ-5్-2005 (అత్మీయ సోదరుడు ఎం.ఎస్.నారాయణను అమెరికాలో తెలుగువారు సన్మానించినప్పుడు) ఖ్తోల ప్రసాదమూర్తి ౫ 82
ఏడ్కోలు పాట
గుప్పుమని గుబాళిస్తూ
వికసించే పువ్వుల్ని చూసినప్పుడల్లా
చిన్నారులారా మీలేత ముఖాలనే గుర్తుచేసుకుంటాను.
ఉదయించే సూర్యుడినీ, ప్రవహించే నీటినీ
పైపైకి ఎగిరే పక్షుల్ని చూసినప్పుడల్లా
మీ ఉజ్బల భవిష్యత్తునే ఊహించుకుంటాను.
అద్భుత ఫలితాలు సాధించి
ప(త్రికలకెక్కే పిల్లల ఫోటోలలో
మీరు కనబడతారేమోనని
నా కళ్ళనే కాగడాలుగా మార్చుకుంటాను.
నా ఒంటరి క్షణాల్లో మీరంతా
నా చుట్టూ ఉన్నట్లూహించుకొని మురిసిపోతాను
మీరు విజయపథంలో ముందుకు సాగిపోతుంటే
మీరు వేసే ప్రతి అడుగులోనూ
నా ఆశీస్సుల పువ్వుల్ని జల్లుతూ
మీకంటే ముందే పరుగులు తీస్తుంటాను. మాట్లాడుకోవాలి * 88
ఓనా ప్రియమైన పిల్లల్లారా మీరు విజయం అనే రైలెక్కి దూసుకుపోతుంటే ప్రతి స్టేషన్లోనూ పచ్చజెండా పట్టుకొని నిల్చుంటాను మీరు భవిష్యత్ సౌధనిర్మాణంలో నిమగ్శమైనప్పుడు ఇటుకలు అందిస్తూ చిటికలో మీముందుంటాను. తప్పుల్లో హెచ్చరిస్తుంటాను ఒప్పుల్లో వెన్ను చరుస్తుంటాను వెనకబడితే చురకలేస్తుంటాను మున్ముందుకు సాగిపోతే ఆనందంలో ఉరకలేస్తాను వెన్నెల మీలో చల్లదనాన్ని వెదుక్కోవాలి పువ్వులు మీలో మెత్తదనాన్ని కనుక్కోవాలి మీ జొన్నత్యం ముందు అకాశం తలవొంచాలి ఓకే, బై పిల్లలూ, 30-6-2003
(కర్నూలు నవోదయ స్కూలు వదిలివస్తున్నప్పుడు)
ఆఅ ప్రసాదమూర్తి * 84
నమ్మకం పోతోంది
నమ్మకం పోతోంది నాకు
నా దేశం మీద - నా ప్రజాస్వామ్య సందేశం మీద
నమ్మకం పోతోంది నాకు
చట్ట సభల మీద - న్యాయస్థానాల మ్సీద
'ప్రజల మీద - ప్రజా ప్రతినిధుల మీద
నిజం మీద - నిజాయితీ మీద
నమ్మకం పోతోంది - నమ్మకం పోతోంది
నమ్మకం పోతోంది నాకు
ఓడిపోతున్నాం మనం ఓడిపోతున్నాం
నిస్సహాయంగా నిస్తేజంగా
జారి పోతున్నాం శిఖరాల మీంచి
రాలిపోతున్నాం
దొంగల ముందు హంతకుల ముందు
జారచోరుల నేర నిపుణుల ముందు
నిస్సత్తువగా - నిస్సారంగా
లౌంగిపోతున్నాం కృంగిపోతున్నాం వానకీ
నమ్మకం పోతోంది నాకు
నా చరిత్ర మీద
నా వీరుల నెత్తుటి జ్ఞాపకాల సువాసనల మీద నమ్మకంపోతోంది
నన్ను ఊరించిన ఉద్యమాల మీద
నన్ను ఊగించిన ఉరితాడు కొసల ఊసుల మీద యోధుల అడుగులతో
వీరంగమాడిన వీధుల సంగీత సవ్వడు లెక్కడ? సూర్యుడు ఉరికొచ్చి
జనం పీడికిళ్ళమీద నాట్యమాడిన
ఆ రణోత్సాహ సౌందర్యమెక్కడ? నమ్మకంపోతోంది నాకు
ఆశమీద - ఆశయం మీద
నకిలీల రాజ్యమైంది
స్వాతంత్ర్యం నకిలీల భోజ్యమైంది
ఇప్పుడు ఎఏంపిలూ ఎమ్మెల్యేలే
రేపు ముఖ్యమం'(త్రులూ ప్రధాన మంత్రులూ కూడా నకిలీల ముందు వరుసలో కూర్చోవచ్చు
నీరు కారిపోతున్నాం
నిర్భలంగా దుర్చలంగా
మనం మననుండే పారిపోతున్నాం
నమ్మకంపోతోంది నాకు మన మీద - మన ఐకమత్యంమీద మన సంఘీ భావాల మీద మన సమరశంఖారావాల మీద నమ శకంపోతోంది నమ్మకం పోతోంది నమ్మకం పోతోంది నాకు నేలకొరిగిన అమరుల చివరిశ్వాసలో దోబూచులాడిన ఆశల పతాకం మీద దుండగులు కీచకులు వంచకులు ఘాతకులు నేరగాళ్ళు అమ్మాయిల బేరగాళ్ళు మోసగాళ్ళు తార్పుడు గాళ్ళు రౌడీలు గూండాలు పాలకులు నాయకులు నమ్మకం పోతోంది నమ్మకం పోతోంది జనం తిరగబడతారన్న నమ్మకం మీడ్రే నమ శం పోతోంది నాకు (నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో ఎం.పీలు ఎమ్మెల్యేల నిర్యాకం బైటపడ్డ నేపధ్యంలో) ఆోల మాట్లాడుకోవాలి * 87
బిడీ
బడంటే బంతిపూల వనంలా ఉండాలి
బడంటే చుక్కపిల్లల్ని అక్కునదాచుకున్న నింగితల్లిలా ఉండాలి విరగ కాచిన జామ పళ్ళమీద చిలకలు వాలిన చెట్టులా ఉండాలి బడంటే పుస్తకాలు - పెన్నులూ - పెన్సిళ్ళూ పరీక్షలే కాదు బడంటే స్నేహం - బడంటే ప్రేమ - బడంటే నమ కం.
బడి అంటే అమ్మ ఒడిలా ఉండాలి
బుడి బుడి పాదాల తడియారని నాన్న వక్షస్టలంలా ఉండాలి బడంటే భయంకాదు... బడంటే బతుకు
బడంటే చదవడం చదివించడమే కాదు
బడంటే వెలగడం - వెలిగించడం
బతకడం - బతికించడం
ప్రసాదమూర్తి ౫ 88
మునిమాపువేళ తూనీగలు తోటలోకి చొరబడినట్టు రెక్కల నిండా పుప్పొడి అంటించుకున్న తుమ్మెదలు చెరువు గట్టు మొద ఆటాడుకుంటున్నట్టు నవ్వుల రవ్వలు విరజిమ్ముతూ పిల్లలు బడిలోకి అడుగుపెట్టాలి బడంటే ఆట - బడంటే పాట బడంటీ సామాజిక సామూహిక స్వష్షం. బడంటే రంగులు పూసుకున్న పసిడి పిట్టలు తోటలో వసంతమాడుకుంటున్నట్టుండాలి చదువుతూ నవ్వాలి నవ్వుతూ చదవాలి బడంటే బాలపరిమళాలు నలుదిశలా వెదజల్లే వేయిరేకుల వెలుగుపువ్వు, బడంటే కలలు - బడంటే అలలు బడంటే ఎదగడం - బడంటే ఎగరడం బడంటే మనిషి - బడంటే మంచి. (రెయన్బో కాన్సెఫ్ట్ స్కూల్, మహబూబ్‌నగర్, పిల్లలు, టీచర్ల కోసం) ఆ మాట్లాడుకోవాలి ౫ 89
జ్ చ్ ప్రతిభ (ఎమ - ప్రతిభ స్నహం ఈ వాటాల తగాదా తీరేదెప్పుడో! సగం కాలిన దేహంతో దేశం. మగతనిద్రలో ప్రజాస్వామ్యం ప్రతిభ గురించి పలవరించింది అన్నదమ్ములు మరోసారి అంతర్యుద్ధానికి సిద్ధమయ్యారు దున్నినప్పుడో విత్తినప్పుడో కోసినప్పుడో నూర్చినప్పుడో చర్చకురాని ప్రతిభ అక్షరాలకు మాత్రమే ఎందుకు అవసరమైందో ఈ యువరక్తానికిప్పుడు ఏ మెరిటోరియన్ జీనియస్ చెప్తాడు? ఒక కన్ను రెండో కంటిని వెక్కిరిస్తోంది ఒక చేయి రెండోచేతిని ఛీత్కరిస్తోంది తన అవయవాలను తానే కోసుకుంటోంది దేశం. అలా చీపుళ్ళు పట్టుకుని చెల్లెళ్ళని అవమానించొద్దని చెప్పండి బూట్టు పాలిష్ చేసి తమ్ముళ్ళని తక్కువ చెయ్యొద్దని చెప్పండి ప్రసాదమూర్తి ॥ 90
పాపపుణ్యాలు విచారించే ప్రపంచీకరణ రేపు ఎవరికి ఏ శిక్షవేస్తుందో! దయచేసి ఎవరినీ ఎద్దేవా చెయ్యొద్దని చెప్పండి
నే ౧ అలలు భాగస్యామ్యాన్ని అడిగితే కడలి కళ్ళెరజెయ్యడం తప్పు రెక్కలు హక్కుల్ని డిమాండ్ చేస్తే పక్షులు పళ్ళుకొరకడం తప్పు నాయనలారా ఈ వాటాల కోటాల కుమ్ములాట త్వరగా తేల్చుకోండి విశ్శవిపణిలో మన (ప్రతిభాపాటవాలను బేరంపెట్టే ముసలి నక్కలను పసిగట్టి పనిపట్టాలి
లి లు గుప్పెడు మట్టికోసం కాదు కలిసికట్టుగా నిలబడండి ఆకాశం మీ చేతుల్లో వాలిపోతుంది (ప్రతిభ (ప్రేమ - ప్రతిభ స్నేహం ప్రతిభ శాంతి - ప్రతిభ త్యాగం (ఉన్నత విద్యాసంస్థల్లో బి.పి. లకు రిజర్వేషన్ల విషయంలో మరోసారి చెలరేగిన వివాదం నేపథ్యంలో) ఆఅ మాట్లాడుకోవాలి * 1
అమ (నోడు
అన్నంలేకపోయినా ఫర్వాలేదు
అమ్మ కావాలి
అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నువ్వు గుర్తుకొస్తావు. ఎప్పుడో ఏడాదికో రెండేళ్ళకో వూరెళ్ళి
అమ్మచేతి ముద్దలు తింటున్నప్పుడు
నువ్వు తటాలున గుర్హుకొస్తావు
జీవితానికి జ్వరంపట్టి సలసలమని మండిపోతుంటే చల్లగా మనమీదవాలే మబ్బుదుప్పటికదా అమ్మ నిలవడానికి నీడ లేకున్నా పర్వాలేదు అమ్మకావాలి.
ప్రసాదమార్తి ఖు 99
అమ్మ ఎలావుందోనని టెలిఫోను తీగల్ని ఒంటికి చుట్టుకుంటే
నాన్నా అంటూ అమ్మ
నా ఒళ్ళంతా తడిమినప్పుడల్లా
నువ్వు చటుక్కున గుర్తుకొస్తావు
కాలికి నొప్పితగిలినప్పుడు
గుండెకు దెబ్బతగిలినప్పుడు
'చూసినడుసుకోబిడ్డా అంటూ
ఎక్కడోవున్నా అమ్మ పక్కనేవున్నట్టు
జాగ్రత్తలు చెప్పినప్పుడల్లా
నువ్వు చెంగున గుర్తుకొస్తావు
అమ్మంటే రెండు బాయిలూ ఒకఒడీ
ఒక తన్మయత్వపు తడీ మాత్రమే కాదు కదా అమ్మంటే వాడిపోనిచెట్టు - చినిగిపోనిగొడుగు - ఎండిపోనివాగు. నాన్నతో ఆడుకునే క్షణాల్లో కూడా
నిద్రపోయే బిడ్డకోసం
తపనపడే బేలతనం కదా అమ్మ
(ప్రపంచానికి కావాల్సినన్ని పాలిచ్చి
లేగదూడకోసం దోసెడు చుక్కల్ని కడుపులో దాచుకుని మనం ఎంత పిండినా చుక్కరాల్చ్బకుండా
పొదుగు ఉగ్గబట్టే ఆవుకదా అమ్మ,
మాట్లాడుకోవాలి * 93
అందుకే నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా అమ్మగుర్హుకొస్తుంది అమ్మ గుర్తుకొస్తే నువ్వు గుర్తుకొస్తావు అమ్మలేనోడా! కనపడ్డ పసిపాపనల్లా అమ్మా అంటూ వాటేసుకుని పద్యాల పాలకోవాలు తినిపిస్తావు'" ఎప్పుడు చూసినా తిరునాళ్ళలో దారితప్పి అమ్మకోసం వెదుకుతున్న పిల్లాడల్లే కనిపిస్తావు మా మధ్యకూర్చుని నువ్వు కవిత్వం కట్టలు విప్పుతుంటే అమ్మకోసం అంజనం వేస్తున్నట్టే అనిపిస్తుంది. ఒరే సఖా శిఖా! మళ్ళీ జన్మంటూ వుంటే నీకు అమ్మనై పుట్టాలనుందిరా, (శిభామణికోసం)
ఆల ప్రసాదమూర్తి ఇ 94
4 ఆప౦ది వాజి భ్ ఆపండి ఆపండి ఆపండి వాణ్ణి ఆ దుష్ట దురాక్రమణదారుణ్ణి ఆ క్రూర సామ్రాజ్య మదగర్వితుణ్ణి గొంతు గొంతూ విప్పండి హద్దు హద్దూ చెరపండి చేయి చేయీ కలపండి నిలపండి నిలపండి కాలర్ పట్టుకొని నిలప౦డి వాణ్ణి ఆ డాలర్ జెండాగాణ్ణి ఆ గోబల్ గూండాగాణీ భా [ర శాంతి మంత్రాల సాక్షిగా శాంతి దేవతను చెరిచేవాణ్ణి మనుషుల రక్తమాంసాలు భోంచేస్తూ మారణాయుధాలు వద్దని అరిచేవాణ్ణి పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి వాణ్జే మాట్లాడుకోవాలి * 95
అ పరస్వేచ్చా హంతకుణ్లే
అ విచ్చకీచకుణ్ణి
దేశ దేశాల దీపాలు ఆర్పేవాణ్డి
ఆ పాపాల భైరవుణ్ణి
చెప్పండి చెప్పండి
చెప్పండి వాడికీ
దేశాలంటే మనుషులని
మనుషులంటే
వాడి అబ్బా తల్లీ పెళ్ళాం పిల్లల్లాంటి వారేనని
నిలవండి కలవండి
ఆకాశం జెండాకింద ఒక్కటై కదలండి
వెనిజులాని చూడండి క్యూబాని చూడండి
గోరంత దేశాల కొండంత ధైర్యాన్ని చూడండి
చావెజ్‌లు కండి కాస్త్రోలు కండి
గొంతు గొంతూ విప్పండి
చేయి' చేయీ కలపండి
ఆపండి ఆపండి ఆపండి వాబ్దీ
చీకటి ఖండాల నల్ల యోధుల రక్తంతాగి బలిసిన
అ సామ్రాజ్యవాదిని
ఆ యుద్దోన్మాదిని,
(ఇరాన్ మీద దాడికి కాలుదువ్వుతున్న బుష్ వ్యతిరేక జ్వాలల్లో జ్యాలనై) ఆల
ప్రసాదమూర్తి * 96
ఇవ్, ది బరియల్ ఎస్టేట్ కాయ్ రాజా కాయ్ కాస్తే వుంది చూస్తేలేదు కొనురాజా కొను కొంటే వుంది వింటే లేదు ఒకటికి పది పదికి వంద లక్షపెట్టు కోటి కొట్టు నేల నవ్వుతోంది నింగి నవ్వుతోంది నీరూ నిప్పు గాలీ ఒకటే నవ్వు పంచభూతాల సాక్షిగా మనిషిని చూసి మట్టి నవ్వుతోంది ఎస్టేట్ ఎస్టేట్ రియలెస్టేట్ రియల్లీ రియల్లీ బరియలెస్టీట్ ఇవాళ కొను రేపుఅమ్ము తెగిస్తే కుబేరుడివి తోకముడిస్తే కుచేలుడివి. మాట్లాడుకోవాలి * 97
కంట్రోల్ చెయ్యాల్సిన వాడే క్యాష్ కౌంటర్లో కూర్చుంటాడు అన్యాయమని ఆరవాల్సిన వాడే కొనుగోళ్ళ అమ్మకాల క్యూలో ముందు నిల్చుంటాడు రేటు ఎవడు పెంచుతున్నాడో బోటు ఎవడు నడుపుతున్నాడో ఎవడికైనా తెలుసో లేదో ఎవడికీ తెలీదు ఇది గమ్మత్తయిన గారడీ వ్యాపారం ఇక్కడ స్వపక్షాలూ విపక్షాలూ విచిత్రంగా ఏకమైన లోగుట్టు వ్యవహారం. భూమి నీకూడా రాదు నిన్ను చూసి నవ్వుతుంది అయినా తొందరపడు తొందర తొందరగా తొందరపడు నీకూడారాని భూమిని రోజుకోసారైనా కాగితాల్లో కౌగలించుకో వారానికోసారైనా సీడీలో త్రీడీలో నీభూమిని చూసుకుని మురిసిపో నెలకోసారి ఏరియల్ సర్వే సీరియల్‌గా చేసుకో ఇనప్పెట్టెలో బ్యాంకులాకర్లో కారుడిక్కీలో పడగ్గదిలో "ప్రసాదమూర్తి శ 98
నీతోనే భూమి వున్నట్టు నిబ్బరంగా నిద్రపో మాయామేయ జగంబె నిత్యమని.... అప్పుడప్పుడూ హరిశ్ళంద్రుణ్ణి గుర్తుచేసుకో సీపాల నిండా కన్నీళ్ళు పట్టి ఫ్రిజ్‌లో పెట్టుకో జా(గ్రత్త! దస్తావేజులు తడిసిపోతాయి వెనక్కి చూడొద్దు
ఆట ఆపొద్దు
ఉన్న చోటనే ఉండే నేలమోద
నొది నాదని ఆరుచుకుంటూ అలసిపోయేదాకా అంతా
రొము గే చరుచుకు౦టూ పోతారు
నాది నాదంటావు నేల నాద౦టావు
నీనేల ఎక్కడే చిలకా!
ముచ్చటగా ఇటుమూడు
అచ్చంగా అటు ఆరు
మూడూ ఇంటూ ఆరు గజాలు
ఇక ఎన్ని ఎకరాలైనా దానికి ఎక్స్‌టెన్షనే.
రియలెస్టేట్ రియలెస్టేట్
రియల్లీ రియల్లీ ది బరియల్ ఎస్లేట్.
న! ళా టి ఆల మాట్లాడుకోవాలి * 90
విశాఖ రెండో సముద్రం ఏమైనా అంత తృప్తిగా
ఒక బరువును దింపుకోవాలి
అ౦త హాయిగా
నడిచిన అడుగుల్ని చూసుకోవాలి
నాన్న రక్తాన్నిచ్చాడు అమ్మ ప్రాణాన్నిచ్చింది అలా బతకాలి - అలా నవ్వాలి
ఆలా నిబ్బరంగా నడవాలి.
అందరికీ ఉండే మాస్టారే
కానీ అందరిలాంటివారు కాదు
లాల్‌బీ సైజామానో ప్యాంటూ షర్టో తొడుక్కుని వేళ్ళమధ్య సిగార్ విలాసంగా పట్టుకుని విశాఖ సముద్రానికి సమాంతరంగా నడిచిన మొనగాడు మా మాస్టారు. ప్రసాదమూర్తి ౫ 100
ఆ సము(ద్రంలో మునగాలేగాని
మనకు అన్నీ రత్నాలే
ఆ సముద్రాన్ని తట్టుకోవాలే కాని
అకాశాలన్నీ మన పాదాగ్రాంతమే,
పాొఠాలనే కాదు
శిష్యుల కష్టసుఖాలను కూడా పంచుకోవడం
వేలంవెర్రిగా శిష్యుల్ని భుజాలకెక్కించుకుని ఊలేగడం
ఆ సముద్రానికో అలవాటు
చెడ్డమోద ఆయనకు మావెడ్డ చిరాకు
చిరైత్తుకొచ్చిందంటే రాజ్యాధినేతలకైనా
చెంపలు వాచిపోవాల్సిందే
కాస్త ఆందంగా అరిస్తే
దున్నపోతునైనా కౌగలించుకోవాల్సిందే.
ఇంక ఆయన నవ్వినవ్వీ
అలసిపోయినప్పుడు చూడాలి"
తన నీడకొచ్చిన వాళ్ళమాద
పువ్వులన్నీ రాల్చేసుకుని
తృప్తిగా నిలబడ్డ చెట్టు వాలకం,
ఇలా ఉండాలని ఆయన మాకెప్పుడూ చెప్పలేదుకాని
మంచి అంటే మా మాస్టారే అనుకునే వాళ్ళం మాట్లాడుకోవాలి * 101
ఏ చెట్టకిందో మమ్మల్ని చుట్టూ పెట్టుకుని ఆయన కబుర్జాడుతుంటే టీకప్పుల్లో కవిత్వం పొగలు కక్కేది మాస్టారి మెప్పుకోలు కోస౦ మా కుప్పిగంతులు గుర్తుకొస్తే మనసంతా జ్ఞాపకాల పూలపాొట్లమై మెత్తగా నవ్వుతుంది. చదువు అన్నంపెట్టింది = భార్య పిల్లల్నిచ్చింది మాస్టారు మంచిని మెచ్చే మనసిచ్చాడు, ఆయనకొచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్లేమో కాని మా జీవిత కాలం బెనిఫిట్ ఆయనే. సముద్రాలు రగిట్రైరవుతాయంటే వింతగానే ఉంది కావాలంటే శిష్యులమంతా కొంత కొంత వయసుకోసుకుని మా మాస్టారుకి దక్షిణగా ఇచ్చుకునే వాళ్ళం కదా! శిష్యులకోసం బొటనవేలు కోసిచ్చే గురువు మరి మా మాస్టారు 31-5-2006 (ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా రిటైరైన మా మంచి మాస్టారు అత్తలూరి నరసింహారావు గారి కోసం) ప్రసాదమూర్తి ౪ 102
జెండాకు సంకెళ్ళు
చాలా రోజులుగా నా కళ్ళు
రాజమండ్రి రహదారిమీద తచ్చాడుతున్నాయి
నాకలం
రాజమండ్రి నుండి వచ్చే
బస్సుల్నీ రైళ్ళనీ అదే పనిగా గాలిస్తోంది
ఏవేనో జ్ఞాపకాలు కనురెప్పల మీంచి
టపటపా రాలిపోతూనే వున్నాయి
ఇప్పుడు నాగుండె
రాజమండ్రి సెంట్రల్ జైలు గోడగడియారం మీద కూర్చుంది ఆక్కడ మా మిత్రుడున్నాడు
పోరాడే జెండాలను జైల్లో పెడితే
అవి గోడల్బకు రెక్కలు తొడుగుతాయి
నినదించే కంఠాలకు సంకెళ్ళు వేస్తే
అవి ఆకాశాన్నే నినాదంగా మార్చేస్తాయి
మాట్లాడుకోవాలి ౫ 108
అతనికి నచ్చిన పాటలన్నీ జాగ్రత్తగా మడత పెట్టి
సంచినిండా పెట్టుకుని
క్యారియర్ నిండా అక్షరాలు నింపుకొని
నాకు తెలీకుండానే నా మనసు ఎప్పుడో
రాజమండ్రీ జైలుదగ్గర బైఠాయించింది
ఆక్కడ మా చెలికాడున్నాడు
విష్ణవాల విద్య తెలిసిన విలుకాడున్నాడు.
లోపలికీ బయటకీ తేడా తెలిసిన వాడు
మంచిక్తీ చెడ్డకీ దూరం కొలిచిన వాడు
ఆ౦దరిమనసూ గెలిచిన వాడు
అక్కడ ఒక తాత్వికుడున్నాడు
ఒక స్యాష్నికుడున్నాడు
(ప్రజల (ప్రేమికుడున్నాడు
జంగారెడ్డిగూడెం గిరిజనులు కన్నీటితో కట్టిన
స్వాగతమాలను పట్టుకుని
ఇప్పుడు నా రెండు చేతులూ ఆకాశంలో అలా వేలాడుతున్నాయి.
(ప్రజల పక్షాన పోరాడినందుకు జైలు శిక్ష ఆనుభవించిన మిత్రుడు మంతెన సీతారాం కోసం) ఆల
ప్రసాదమూర్తి జ 104
వ్ కలయికల కవర్ పేబి తీరా మీరంత దూరం వెళ్ళిపోయాక కళ్ళు ఆకాశానికి అతికించుకుని వచ్చేపోయే విమానాలను ఆరా తీయడం ఒక ఆలవాటుగా మారిపోయింది. నువ్వు వస్తున్నావని మనం మళ్ళీ కలుస్తున్నామని ఆ వార్త మోసుకుంటూ పేపర్ బాయ్‌లా గాలి సైకిల్ మీద ఒకటేస్పీడు. అనాటి బాద్షాలు తిరిగొస్తే ఈ భాగ్యనగరం ఎలా ఊరేగుతుందో గాని మేం మాత్రం హైదరాబాద్ రోడ్లన్నీ మన జ్ఞాపకాల జల్లులతో శుభ్రంచేసి నీ రాకకోసం కవిత్వాన్ని కాపలా పెట్టాం, రాత్రికి రంగులు వెయ్యడమే కాదు దోస్తీకి ప్రాణం పాయ్యడమూ నీకు తెలుసు అందుకే నువ్వొచ్చాక మా నీడలు నిన్ను శ్వాసిస్తూ నాట్యమాడుతున్నాయి మా చూపులు నిన్ను మోసుకుంటూ ఊరేగుతున్నాయి మిత్రమా నువ్వు రాసిన నివాదాలు మా మనోఫలకాల మోద మెరుస్తూనే వున్నాయి మాట్లాడుకోవాలి * 105
నువ్వు వేసిన పోస్టర్టు మా జ్ఞాపకాల ఆకాశాలకు వేళ్ళాడుతూనేవున్నాయి. మా అక్షరాలకు నువ్వద్దిన స్నేహ పరిమళం
నిత్యం మమ్మల్ని ఆఘ్రాణిస్తూనే ఉంది.
ఎవడిగోల ఎవడికీ పట్టని ఈ బిజీట్రాఫిక్లో
(ఫ్రెండ్స్ కోసం చేతులు చాచి నిలబడ్డం
విమానందిగి నేరుగా ఫ్రెండ్స్ గదిలో చొరబడ్డం స్నేహానికి నువ్విచ్చిన కొత్త నిర్వచనం
మా కలయికల కవర్ పేజీవి నువ్వు
మూ సంబరాల వెబ్ డిజైనర్వి నువ్వు
నేను వినిపించిన కవిత్వాలు
నువ్వు తినిపించిన కబాబ్‌లు
రోడ్డనిండా అక్షరాలు రాల్చుకు౦టూ చెక్కర కొట్టిన ఆ రాత్రులు ఒకరచొక్కా ఒకరు వేసుకుని
మురిపెంగా నవ్వుకున్న ఆ రోజులు
ఆ ఉత్సవాలు - ఆ ఉత్సాహాలు
తలుచుకోవడానికైనా
మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి.
రావడం వెళ్ళిపోవడానికేనని తెలుసుగాని
వెళ్ళడం మళ్ళీ రావడానికేనన్నది ఓ అశ
13-7-2006 (మిత్రుడు శంకర్ అమెరికా నుండి వచ్చివెళుతున్న సందర్భాంగా.) ఆ “ప్రసాదమూర్తి ౪ 106
పరులు ప్రజలి హృదయాల్లో ఉంటారు వీరులు వి(గ్రహాల్లో కాదు (ప్రజల హృదయాల్లో ఉంటారు (ప్రజల ఆశల్లో ఉంటారు ప్రజల ఆడుగుల్లో ప్రజల మాటల్లో ప్రజల గుండె చప్పుళ్ళలో వీరులు గర్వంగా నవ్వుతూ ఉంటారు విగ్రహాలను మలిన౦ చేస్తే వీరులు మాయమైపోరు అది మరో విస్ఫోటనానికి నిప్పంటిస్తుంది విగ్రహాలు కూల్ళేస్తే వీరులు చచ్చిపోరు ఆ విగ్రహాలను తమ రక్షంతో నిర్మించుకున్న జాతిజనుల ఊపిరిలో ఉంటారు. సము(ద్రం మిదికి వొంగిన ఆకాశంలో వీరులుంటారు సూర్యుడు గుప్పిళ్ళతో జల్దుతున్న కాంతి కిరణాల్లో వీరులుంటారు మాట్లాడుకోవాలి * 107
ఉదయాన్ని రెక్కల మోద మోసుకుంటూ ఎగిరే పక్షుల్లో వీరులుంటారు ఆణగదొక్కడం అవమానించడం మీ సంస్కృతి కావొచ్చు రెచ్చగొట్టడం చిచ్చుపెట్టడం మీకు చేతనైన విద్యకావచ్చు కూలిన విగ్రహాల్గోంచి కోట్ట పిడికిళ్ళు మొలకెత్తడం ఇక అందరం చూస్తాం వీరులు మట్టిబొమ్మల్లోనో చిత్రపటాల్లోనో ఉండరు ఉక్కు పాదాలు తొక్కిన నేలంతా పొడుచుకొచ్చిన కత్తుల కాంతుల్లో వీరులుంటారు కలిసి నడిచే పాదాలు నేల మాద రాసే నినాదాల్లో వీరులుంటారు వీరులు జనంలో ఉంటారు జనం జరిపే రణంలో ఉంటారు వీరుడు అంబేద్కర్ (దళితుల మాద పెరుగుతున్న దాడుల నేపథ్యంలో 29/11/2006 నాడు కాన్ఫూర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని అల్లరి మూకలు అపవిత్రం చేయడం దళితయువకుల ఆ(గహానికి నిప్పంటించింది. ఆ మరునాడే మహారాష్ట్రలో దళితులు ప్రదర్శించిన నిరసన హింపారూపం దాల్చింది. ఇది చేశానికి ఓ హెచ్చరిక) ఆఅ (ప్రసాదమూర్తి * 108
ఆశ ఛావెజ్ పొగచూరిన ఆశల ఆకాశాన్ని ఒక అరుణారుణ రుతు పవనం చల్లగా తాకింది కలత చెందే ఆశయాల కనురెప్పలను ఓ ఎర్రటి చినుకు కొత్త కలై పలకరించింది ఈ అణచివేతల దమననీతుల కాలంలో మరో సారి వెనుజులా వెలుగుదారి పట్టింది సూర్యుడితో వెనుజులా విష్ణవాల ఛీర్స్ కొట్టింది వీరుడు ఛావెజ్.. ధీరుడు ఛావెజ్ విష్ణవం ఛావెజ్... విక్టరీ ఛావెజ్. అర్జెంటీనా ఫ్యాక్టరీ గొట్టాల నుండి దూసుకొస్తున్న ఎర్రని పాగమబ్బుల్లో ఛావెజ్ బొలీవియా నీటి గొంతులో పోటెత్తిన ఎర్రెర్రని అలల సంగీతంలో ఛావెజ్ లాటిన్ అమెరికా పోరుదారిలో విరిసే తొలిపొద్దు పువ్వులో ఛావెట్ ఆశ ఛావెజ్.. ఆర్పి ఛావెజ్. ఆ మాట్లాడుకోవాలి * 100
గతించిన వీరుల శౌర్య దీప్తుల్ని
పిడికిట్లో బిగించి వెనుజులా
దెయ్యాల రాజ్యం ఎదుర్రొమ్ముపై గుద్దింది ఆణగారిన దేశాల ఆగ్రహ జ్వాలల్ని
కన్నుల్లో నింపుకుని వెనుజులా
కయ్యాల రాజుపై కన్నైగ్ర చేసింది
హక్కుల పోరాటానికి కొత్త నెత్తురెక్కింది విలువల యుద్దానికి ఒక వింత వెపన్ దొరికింది. ఆకొళాన్ని జెండాగా వెన్నుపూసపై అతికించుకుని వెనుజులా ప్రపంచమంతా ఎగిరింది
ఊపిరి ఛావెజ్.. ఉద్యమం ఛావెజ్
ఇక ఎక్కడబడితే అక్కడ.
పిల్లల కళ్లల్లో ఛావెజ్
పిల్లల కథల్లో ఛావెజ్
సా(మ్రాజ్యవాదుల పీడకలల్లో ఛావెజ్
(వెనుజులా ఎన్నికల్టో ఛావెజ్ ఘనవిజయాన్ని స్మరించుకుంటూ...) ప్రసాదమూర్తి ౫ 110
జ్యో బౌద సంగీతం థఖ మాటలు లేని శబ్దాలు లేని ఒక సంగీత సౌఖ్యం కావాలి. వెన్టాల మాట్టాడదు పువ్వులూ పిల్లల నవ్వులూ మాట్లాడవు శాక్యముని నిమీలిత నేత్రాలు కూడ. ఇది మరో ప్రపంచాన్ని కలగంటున్న మౌన సంగీతం, మంచు కడిగిన మనుషుల మనస్సుల్ని భిక్టా పాత్రల నిండా నింపుకుని . సమూహాలు సమూహాలుగా కదలిపోతున్న కాంతి వలయాల శాంతి సంగీతం ఆ కదలని విగ్రహంలో అనాదిగా అనంతంగా కురుస్తున్న ప్రశాంత సంగీతం మనుషులంతా చిట్టీ పిల్లలై | కాశ సంగిత౦ తెలతెల్లని మబ్బుగువ్వలై ఆడుకుంటున్న ఆ విశుద్ద వినిర్మల బౌద సంగీతం ఠి ళల మాట్లాడుకోవాలి * 111
కురుస్తూ కురుస్తూ
కురస్తూనే మెరుస్తూ
నడుస్తూ నడుస్తూ నడుస్తూనే నవ్వుతూ (ప్రేమ పుష్పాల జడిలో తడుస్తూ
సన్నగా చల్లగా తన్మయంగా
గుండెల్ని తాకే
లౌకికాలౌకిక భౌతికాభౌతిక
సాల్విక తాత్విక సంగీతం,
అమ్మ పొట్టలో వినిపించిన సంగీతం అమ్మ ఉయ్యాలలూపినప్పుడు కన్పించిన సంగీతం బడిలో తోటలో చెట్టుతో నీడతో నీళ్ళతో ఆడుకున్నప్పుడు మైమరపించిన సంగీతం చేతుల తీగల్ని (ప్రపంచమంతా అల్లుతూ (ప్రవహిస్తున్న పరిమళ సంగీతం
వసుధైక గీతానికి మొదటి చివరి మంత్ర స్వరం
కాలం కంటే ముందు పుట్టి
కాలం ముందు పరుగు తీస్తున్న
ఒక చిరుపాప చిరునవ్వు సంగీతం
నేల మీద మన మనస్సుల మీద విస్తరించిన సరిహద్దుల రేఖల్ని తొక్కుకుంటూ చిందులేసే
సన్యాస సమ్మోహ సంగీతం
ము
ప్రసాదమూర్తి ఇ 112
మన లోపలా బయటా కనిపించీ కనిపించని ఆయుధాల సైనా అహంభావాల పైనా స్వార్థ సామ్రాజ్యాల సైనా దాడి చేసే నిరాయుధ రహస్య సంగీతం దిక్కులన్నిటికి దిక్కు చూపే దేవుళ్ళకు కూడా బుద్ధి చెప్పే మనుషులందరిని ఒకే ఉయ్యాలలో ఊపే సజల సంగీతం స్య సంగీతం బౌడ సంగీతం ౮ బుద్ధం శరణం గచ్చామి. (గౌతమబుద్ధని 2550వ జయంతిని ఈ ఏడాది ప్రపంచమంతా జరుపుకుంటోంది) ఆల మాట్లాడుకోవాలి * 118
యహ మమ్ము ్మ ౧ క య ప్రసాదమూర్తి ౫ 14 | న నల .. క్ష లల్ల నా
|/120126060౪41| ల. ౩ 6011606000 0 06౫3 మా స న . ౧ ౧0.[ంసచంరీడ సయ న! | " ౨ చంయంయంం0[060%011146... స... న స్స . లాలా! స ఆశ్లటీ గా పై: వాక్యాల్లోని ఆనంధాన్నీ దేన్నో [ ం టా. స్తా ప్రసాదమూర్తి కవిత్వంలో శ 1. ౨ శా. 'అందుకున్నా, ఒక జీవనానందాన్ని రా లం . (1 పంచిన ప్రసాదమార్తికి గే. [| పు కే!
- అభినందనలు; ఆ టి! 1 | | (| 1 కెశివారెడ్డి ల న న. / | తో! , [వ 11|| న ౧౧011626౧0౧౩ ఇ [