Telugu Marxist Mahanayakulu Lenin, Stalin, Mao La Bhodhanalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
“=? మార్చిస్లు మహానాయికులు
- లస / ఓ ఒ ॥ ం ” "| . లెనిన,సాలిన,మావోలి బోధనలు '" / రత్త ర్త్తోర్తో రరర రర రరర రరర రరర రరర + 7 గ్గ. ,) 1. ॥ | "గ న. | ల | గ్ శ ॥ వ గే కీ ను ర్ ణ | ౪ ,. స. గ్గ వ్ గ్గ 1" వీ భి / | గ జ ॥ గ. " 1 లీ గే | /గ ముని .! గ్గ. ై | | ర్స్ ల్సో - (గ గ శ ఫై ళీ . నో ుబ్బంపల్లిసుందరయ్యా . శకలక న స “ / వ. య గ్ బాలు న | శ | | యహ న్
అగి అగి గ్ మార్క్సిస్తు మహానాయకులు లెనిన్, స్టాలిన్, మావోల బోధనలు అలర్ట్ జస్స్ ఇని పుచ్చలపల్లి సుందరయ్య న మాం లి
ప్రచురణ నెంబరు : 486 ముద్రణ : 1997 నంబరు ప్రతులు : 2000 ల్శ్తా వెల: రు. 6-00 ౩ఒరా 5 చ నుందంపొరిటీ గంధాలయ స ళో స / (క స, / గంజి యా ఫ్ // ట్ యు ల్ పలా. క ముద్రణ: ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్గ్రొస్, = విజయవాడ. నాలా. న యు మా ర సా టా. యయ కిరానా బుకర్. న ల గ్. మం గ క మ కే స తాతను తిలక్ కారల్‌మార్క్స్‌రోడ్డు, విజయవాడ-520 002 ఫోన్: 432 792 బాలాజీనగర్, సుందరయ్యభవన్, ఖమ్మం 507 001 1-8-52/2, శ్రీ రామాకాం ప్లెక్స్, చిక్కడపల్లి, హైదరాబాద్-20, ఫోన్760 8107 5, ఎ.జి.కె. కొంప్లెక్స్, గౌంధీరోడ్డు, తిరుపతి-517 501 6-2-250, విజయటాకీస్రోడ్డు, హన్మకొండ-506 011
“ముందుమాట
ఆంధ్రలోనే కాదు; యావద్ద్ధారతదేశంలోనూ అత్యంత గౌరవ మన్ననలను పొందిన మహావ్యక్తి పుళ్ళలపల్లి సుందరయ్యగారు. ఇంతగా ఆయనను ప్రజలు ప్రేమించడానికి గౌరవించడానికి కారణాలు లేకపోలేదు. దేశంలోనూ, విదేశాలలోనూ శాస్ర్తీయ సోషలిస్టు నాయకుడుగానూ, న్వాతంత్స సమరయోధుడుగానూ, శ్రమజీవుల ఉద్యమ నాయకుడుగానూ, అఖిలభారత కమ్యూనిస్టు ఉదధ్యమనేతగానూ ఆయన గుర్తింపు పొందారు. భారత కమ్యూనిస్టుపార్టీ వర్షడినప్టటి నుండీ తన తుటి క్షణాలవరకూ వరుసగా ఆపాల్టీ కేంద్ర కమిటి సభ్యుడుగా వుండటమేగాక, పన్నేంఢేండ్ల పాటు భారత కమ్మూనిస్టుపార్టీ (యార్ష్మిస్టు ప్రధాన కార్యదర్శిగా వున్న గౌరన ప్రతిష్టలు ఆయనకున్నాయి.
అంతేకాదు; ఆంధ్రదేశానికి నంబంధించినంతవరకూ తెలుగుప్రజలందరినీ ఒక గొడుగుకిందకు .తీసుకునివచ్చేలక్ష్యంతో “విశాలాంధ్రలో ప్రజారాజ్ళానికొ తొలుత శంఖారావం పూరించిన తొలి తెలుగుబిడ్డ ఆయన. దక్షిణభారతంలో కమ్మూనిస్టు ఉధ్యమ న్థావనకూ, ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని వృవసాయ కార్తిక, రైతు, విద్భార్ణి యువజన, మహిళా ఉదృ్కమాలను నిర్మించడానికి ఆయన చేసిన కృషి అపారం. తెలుగు సాహితీ, సంస్కృతులను విష్లవోన్నుఖంగా మళ్చించేందుకు ఉద్యమాలను నిర్మించిన మార్గదర్శి ఆయన.
_ దాదాపు యాభై యేండ్లపాటు సుందరయ్యగారికి సన్నిహిత సహచరుడుగా వున్న కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య్మగారి మాటల్లో చెప్పాలంటే... “సుందరయ్య ఒక మహర్షి -మార్నిస్టు- లెనినిస్టు మహర్షి, ఈ మానవాళిని పీడననుండి, దోపిడినుండి విమ్సుక్తి చేసి, సుఖప్రదమైన, ప్రయోజనకరమైన జీవనానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన శాస్త్రీయ మార్మిస్తు - లెనినిస్తు అవగాహనలో అసమానమైన కృషి చేశారు. అందుకే ఆయనను “మార్మిస్టు- లెనినిస్టు మహర్షి అని నేను అంటున్నాను. నేను ప్రపంచంలో అనేకమంది కమ్యూనిస్టు నాయకుల జీవిత చరిత్రలను చదివాను. ప్రపంచ కమ్మూనిస్టు నాయకులుగా
పేర్కొనదగినవారు యాభైమంది వరకు వుంటారు. వారిలో సుందరయ్యగారు జకరు -
“ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక సమస్యలపై ఆయన అధ్యయనం అపారం. ఆంధ్రదేశంలో నటీజలాలకు సంబంధించిన క్లిష్టమైన అంశాలు ఆయనకు కరతాలమలకం. రాజకీయాలేకాదు సాహీత్యం, కళల దగ్గర నుండి అన్ని విషయాలను గురించి ఆయన అధ్యయనం చేశారు. అయితే ఆయన మేధావి వలే కనపడేవారుకాదు. తన అధ్యయనానికి తగినట్లు ఆయన పలు గ్రంధాలు రచించలేదు. ఉద్యమాల అనసరాన్నిబట్టే ఆయన కొన్నిపుస్తకాలు, వ్యాసాలురాశారు”
ఇక విద్యార్థి మవోసభలో “ఫ్రంట్‌లైన్” పత్రిక ఎడిటర్ శ్రీ ఎన్.రామ్ అధ్యక్షోపన్యానం యిస్తూ, నుందరయ్యగారిని ఆదర్శ మూర్తిగాను, విప్షవయోధుడుగాను పేర్కొని, ఆయనతో తనకు గటి అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని యిలా చెప్పారు:
“సుందరయ్యగారు మూర్తీభవించిన నైతిక విలువలకు విదర్శనం. నాకు, నాలాంటి అనేకమందికి నైతిక విలువలలోనూ, సామాజిక, రాజకియ వివ్లవసాధన విషయంలోనూ వ్యక్తిగతంగా సలవాలిచ్చి తీర్చిదిద్దినది ఆయనే. నేను వ్యక్తి ఆరాధనకు వ్యతిరేకిని. అయుతే' కొందరీకి కొంతమంది నూర్తినిస్తారు. ఆ వధంగా నైతిక విలువలను పాటించడంలో నుందరయ్యగారిని నా హీరోగా పరిగణిస్తాను.”
సమగ్ర ఆంధ్ర సాహిత్య రచయిత, ప్రముఖ కవ, పరిశోధకుడు అయిన ఆరుద్రగారు సుందరయ్యగారిని గురించి యిలా పేర్కోన్నారు:
“విశాలాంధ్రలో ప్రజారాజ్యం” అన్న సుందరయ్యగారి పుస్తకం చదవగానే, వారి నాయకత్వంలోని నాణ్యత, ధ్యేయం, గమ్మం నన్ను ఉద్భుక్తుడ్డి చేశాయి.
_ “ఏరతెలంగాజా ఏప్లవ గాథలపై హిరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ ఇంగ్లీషులో రచించిన గేయాగికి నేను తెలుగులో చేసిన అనువాదాన్ని మెచ్చకొంటూ నాకు ఆయన రాసిన లేఖను కొహినూర్ వజ్రాన్నికన్నా విలువైన దానిగా దాచుకొన్నాను”
రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 'విగాలాంధ్రలో ప్రజారాజ్యం' అన్న సుందరయ్య గారి పుస్తకంచూసి “ఈ పుస్తకం చాలా బాగుస్తది.
విశాలాంధ్రను స్వర్ణయుగంలోకి ఎలా అభివ్యద్ధి చేయవచ్చననే విషయంలో జక సుందర స్వష్నాన్ని మన ముందుచుతున్సదిొ అని వ్యాఖ్యానించారు.
ఆయన రచించిన ముఖ్య రచన “టర తెలంగాణా వివ్లవే పోరాటం - గుణపాఠాలు” అన్న గ్రంధం ఇప్పటికీ సంపూర్ణంగా మూడుముద్రణలను, సంక్షిప్తంగా రెండు ముద్రణలను తెలుగులో పొందింది. ఇంగ్లీషులో రచించిన ఆ గ్రంథం భారతదేశంలోని అన్ని భాషల్లోనూ పూర్తిగానో సంక్షిప్తంగానో ప్రచురించబడటమేగాక చైనా భాషలోకూడా ప్రచురించబడింది.అలాగే “విశాలాంధ్రలో ప్రజారాజ్బం” అన్న గ్రంథం మూడు ముద్రణలను పొందింది. అలాగే “ఆంధ్రప్రదేశలో సమగ్ర నీటిపథకం” అన్న గ్రంథం మూడు ముద్రణలను పొందింది. అదేఐధంగా ఆయన పార్లమెంట్లో చేసిన ప్రస- 3లలో కొన్ని ముఖ్యమైన వాటిని అనువదించి ప్రచురించిన గ్రంథం రెండు ముద్రణలను పొందింది.
ఇప్పుడీ గ్రంథంలో ఉదృమాల అవసరాల దృష్హా ఆయా సమస్స్శలపై అప్పుడప్పడు ఆయన చేసిన రచనలను, ప్రసంగాలను కొన్నింటిని ఎంపికచేసి ప్రచురించుతున్నాం.
ఈ వ్యాసావళి ఆయా సమస్మ్కలపై మార్క్సిస్టుపార్జీ అభిహ్రాయా లను తెలునుకునేందుకు కమ్మ్యూనిస్టులకేగాక, ప్రజాభ్యుదయాన్ని దేశప్రగతిని కాంక్షించేవారందరికీ ఉపయోగ వడుతుందని ఆశించుతున్నాం.
= ప్రచురణకర్తలు.
నా జీవితంలో లెనిన్
(మూర్చున్దు మవోపాధ్వాయుడు, ప్రధమ సోషలిను రాజ్ఞాన్సావకుడు అయిన లెనిన్ మవానీయుని శతజయంతి నందర్భంగా పీవుల్సొ డెమోగసీ” వ(థత్రిక వ్రత్వేక నంచిళలో కామ్రేడ్ నుందరయ్య రొనీన వ్వానమిది)
కొమ్రడ్ లెనిన్ శతజయంత్రి ఉత్సవం 1970 ఏప్రిల్ 22వ తేదీన జరుగుతున్నది. గత యీ వంద సంవత్సరాల కాలంలో చరిత్రపురోగతిని మరల జ్ఞప్తికి తెచ్చుకుంటే మొదటి శ్రామిక వర్గ రాజ్యం ఏర్పడిన పారిస్ కమ్యూన్కు సంబంధించిన మహత్తర ఘటనల నుండి 1917లో రష్యాలో సోషలిస్టు విప్లవం జయప్రదమైనప్పటి వరకు 1949లో చైనా విప్లవం విజయంతో ప్రపంచ సోషలిస్టు శిబిరం అవతరణ, పాతవలన వ్యవస్థ అంతంకావడం, సోషలిజం వ్యాప్తికోసం ప్రపంచంలోని వివిధప్రాంతాల్లో శ్రామిక ప్రజానీకం కృతనిశ్చయంతో
... వీరోచితంగా సాగించుతున్న పోరాటాలు, ఇందుకు కామ్రేడ్ లెనిన్ - ఆయన సీద్ధాంతమైన మార్కిజం-లెనినిజం నిర్వహించుతున్న మహోన్నతమైన పాత్ర-ఇదంతా మన కళ్ళముందు ప్రకాశవంతంగా కనిపించుతుంది. ఈ చరిత్రాత్మక సందర్భంగా లెనిన్ మహాశయుని ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి మరోసారి ప్రతిజ్ఞ తీసుకుంటూ “నాజీవితంలో లెనిన్” అనే పేరిట కొన్ని జ్ఞాపకాలను పారకుల ముందుంచుతున్నాను. లెనిన్ గ్రంధాలతో తొలిపరిచయం
1929 అఖరులో కొంతమంది యువ కాలేజీ విద్యార్థులతో నాకు సంబంధాలు ఏర్పడిన తరువాత నేను మార్క్స్-ఎంగెల్సుల రచన “కమ్యూనిస్టు ప్రణాలికను చదివాను. దాని ప్రభావం నాపై ఎంతగానో పడిన కారణంగా కమ్యూనీస్టు గ్రూపులో చేరి నా యావత్తు జీవితాన్ని 1930 ఆరంభం నుండి కమ్యూనిజం - లక్ష్యంకోసం అంకితం చేయాలని నిర్ణయించుకొన్నాను. మార్క్పిస్టు-లెనినిస్టు ప్రామాణిక గ్రంథాలకోసం అన్నిచోట్ల గాలింపు ప్రారంభించాను. ఎందువల్లనంటే ఆరోజుల్లో ఆ పుస్తకాలు లభ్యంకావడం అతికష్టంగ్ధా, ఉండేది. ॥
- 1932-33 సంవత్సరాల్లో లెనిన్ గ్రంధాలను కొన్నింటిని నేను చదవగలిగాను. ఆ దశాబ్దం ముగిసేప్పటికల్లా ఇంగ్రీషులో లభ్యమయ్యే లెనిన్ ప్రధానమైన రచనలన్నింటినీ సంపాదించుకొని చదవగలిగాను. కామ్రేడ్ లెనిన్ గ్రంధాల్లో ఆనాడు ఏవి నాకు బాగా నచ్చినాయో, ఏవి నాకు మార్క్సిజంలో లోతైన పునాదినివేసి, నాకు మార్గదర్శకంగా
[
లెనిన్ స్టాలిన్, మావోల బోదనలు
ఉపయోగపడ్డాయో నాకు ఈనాటికి కూడా బాగా జ్ఞాపకం వుంది. అవియివి
“కారల్ మార్కు ఉపదేశాలు”, “రాజ్యాంగ యంత్రమూ-వివ్లవమూ”, “ఏమిచేయాలి”, “అతివాద కమ్యూనిజం-ఒక బాలరిష్టం”, “పల్లెటూరు పేదలకు”
మార్క్ ఉపదేశాలు
'కారల్‌మార్క్ ఉపదేశాలు' అన్న గ్రంధంలో కామ్రేడ్ లెనిన్ మార్క్సిజం సిద్దాంతాన్ని క్లుప్తంగా క్రోడీకరించారు అంటే తాత్విక భౌతికవాదం, గతితార్కిక శాస్త్రం, భౌతికవాదం, దృష్టితో చరిత్ర అధ్యయనం విలువ - అదనపు విలువ, సోషలిజం, శ్రామికుల వర్గపోరాట ఎత్తుగడలు. అయితే లెనిన్ వివరించిన మార్క్సిజాన్ని నేను నేటికి కూడా సంపూర్ణంగా అవగాహన చేసుకోగలిగానని భావించరాదు ఆ (గ్రంధాలు నాకు మార్క్సిజాన్ని క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. మార్క్సిజాన్ని అవగాహన చేసుకుని దానిని వర్తింపచేయాలంటే ఏ ప్రధానమైన అంశాలకు ముఖ్యంగా కట్టుబడి వుండాలో మాత్రం ఆ గ్రంథాలద్వారా నేను తెలుసుకోగలిగాను. జీవితకాలమంతా అధ్యయనం చేయడం ద్వారా, అచరణ ద్వారామాత్రమే ఎవరైనా మార్క్సిజాన్ని మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి, దానిని ఫలవంతంగా వర్తింపచేసి మన ముందున్న విష్ణవకర్తవ్యాలను జయప్రదంగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది.
ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థను సమూలంగా నాశనంచేసి, దొనిస్ట్రానే శ్రామికవర్గ నియంతృత్వాన్ని నెలకొల్పనిదే శ్రామిక ప్రజలు వర్గరహిత సమాజం వైపుకు పురోగమించడానికి వీలుపడే కమ్యూనిస్టు సమాజాన్ని స్థాపించాలనే ఆశయం నెరవేరదనే దృఢ విశ్వాసానికి “రాజ్యాంగ యంత్రమూ-విప్లవమూ” అన్న (గ్రంధం చదివిన తరువాత నేను వచ్చాను. 1935లో నేను కూర్చొని “రాజ్యాంగ యంత్రమూ-విప్ణవమూ” “ఏమి చేయాలి”, “కమ్యూనిస్టు (ప్రణాళికలను తెలుగులోకి అనువదించి, నా యువ సహచరులందరినీ వాటిని చదివేలా చేశాను. అదే కాలంలో “అతివాద కమ్యూనిజం-ఒక బాలరిష్టం”, కారల్‌మార్క్ ఉపదేశాలు” *, “పల్లెటూరు పేదలకు” అన్న లెనిన్ గ్రంథాలను నా యితర సహచరులచేత తెలుగులోకి తర్జుమా చేయించి మన కమ్యూనిస్టు గ్రూపుల్లో వున్న వారందరూ చదవడానికి ఏర్పాటు చేశాం.
కొమ్రేడ్ లెనిన్ రాసిన “రాజ్యాంగ యంత్రమూ-విప్లవమూ'”, 'సోవియట్ ప్రభుత్వ తక్షణ కర్తవ్యాలు" బోల్నివిక్లు రాజ్యాధికారాన్ని తమ.చేతుల్లో అట్టిపె ట్టుకోగలు గుతారా? అన్న గ్రంధాలు రాజ్యాంగ యంత్రానికి సంబంధించిన సిద్ధాంతాన్ని సమగ్రంగా అర్థం
2
వుచ్చలపల్లి సుందరయ్య జేసుకోవడానికి ఉపయోగపడత్తాయ్యి. అలాగే ,ర్తాజ్యాధ్సికారాన్ని విప్లవాత్మకంగా ఎలా చేపట్టాలన్న విషయంపై చక్కటి అవగాహన యిస్తాయి. విష్టవానికి జీవితాలను అంకితం: చేసిన వారి పార్టీ
“ఏమి చేయాలి? అన్న గ్రంథం చదివిన తరువాత తమ పూర్తి కాలాన్ని విష్ణవానికే వినియోగించే వారితో కార్మికవర్గ పార్టీని నిర్మించవలసిన ఆవశ్యకత నాకు స్పష్టంగా బోధపడింది. అలాంటి పార్టీ నిర్మాణానికై పనిచేసినప్పుడు 'ప్రాప్తకాలజ్ఞతను, ఆర్టికవాదాన్ని అధిగమించి మామూలు వర్గ చైతన్యాన్ని సోషలిస్పు' చైతన్యానికి అభివృద్ది చేయడానికి వీలవుతుంది. ప్రజాసామాన్యంపై పాలకవర్గాలు'సాగించే "అన్ని రకాల దోపిడీని, పీడనను వ్యతిరేకించి కార్మికవర్గం ఎలా పోరాడాలో ఆ గ్రంధఠ నాకు బోధించింది. ప్రజల్లోని వివిధ 'సెక్షన్ల విశ్వాసాన్ని పొంది, వారిని ముందుకు తీసుకొని వెళ్లడానికి నాయకత్వం వహించవలసిన అవసరాన్ని కూడా ఆ గ్రంథం నాక్తునేర్పింది. అలాగే చైతన్యపూరితమైన పార్టీ నిర్మాణాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను, పాలకవర్ణాలక్తు సంబంధించిన షోల్సీసు యంత్రాంగం అనుసరించే కుట్రలను, అమలు జరిపే నిర్చ్వంధ చర్యలను అధిగమించేందుకు తగిన ఉక్కు శిక్షణ గలిగిన పార్టీని యేర్పాటు చేసుకోవలసిన అవసరాన్ని అది నాకు బోధించింది. అలాంటి పార్టీ బహిరంగంగాన్తూ అవసరమైతే రహస్యంగానూ పనిచేయగలిగిన సత్తాను, నైపుణ్యతను పెంపొందించుకోగలిగి వుండాలి. తమ జీవితంలో ప్రతి ఒక్క నిమిషాన్ని విప్లవాన్ని జయప్రదంగా నిర్వహించడం ఎలాగా అని ఆలోచించి, విప్లవం కోసమే తమ జీవితాలను పూర్తిగా అంకితం చేసి, అందుకోసం అహోరాత్రులు కృషి చేయగలిగిన విప్లకారులను తగినంతమంద్ధిని తయారుచేసుకోవలసిన ప్రాధాన్యతను కూడా నాకు ఆ గ్రంధం' ప్రబోధించింది పార్టీకోసం పూర్తికాలం లేదా కొంతభాగం, పనిచేసే సభ్యులందరికీ తగిన సలహాలిచ్చి వారి కార్యక్రమాలను సమన్వయం చేయగలిగే కర్తవ్యాన్ని ఆ విప్ణవకోరులు నిర్వహించాలి. (పార్టీలో పనిచేసే సభ్యులు, పనిచేయని సభ్యులు అంటూ వుండటానికి వీలులేదు). మనకు వ్యతిరేకమైన రాజకీయ ధోరణి గలవారి కంట్రోలులో వున్నప్పటికీ వివిధ ప్రజాసంస్థల్లో పనిచేయవలసిన ఆవశ్యకతను ఆ గ్రంధం నాకు నేర్పింది. అలాంటి సంస్థలో పనిచేస్తూ, జన సామాన్యంతో సన్నిహిత సంబంధాలను వుంచుకుంటూ ఉమ్మడికోర్కెల లక్ష్యాల ప్రాతిపదికపై ఐక్యపోరాటొల్లోకి వారినీ తీసుకొని రావాలి. ఈనాడు కూడా మనపార్టీ కార్యకర్తలలో చాలామంది -ఆర్ధికవోటం, ప్రాప్తకాలజ్ఞత, చట్టబద్ధ కార్యకలాప్తాల్లో భ్రమలను కలిగి వుండటాన్ని నేను చూస్తున్నాను. ఈ అన్ని విషయాలలోనూ లెనిన్ మహాబోధనలను మన పార్టీ సభ్యులందరికీ ఇప్పటివరకు అందించటేకపోయిన నేరానికి నేను. బాధపడుతున్నాను."
ఏ
విష్ణ్లవానుభవాల సర్వస్వం
“అతివాద కమ్యూనిజం-ఒక బాలారిష్టం- అన్న గ్రంథంలో కామ్రేడ్ లెనిన్ దశాబ్దాలుగా సాగిన కార్మిక వర్గ విప్రచోద్యమాల మహత్రర అనుభవాన్ని'క్రోడీకరించి తద్వారా గుణపారాలను తీసి, కమ్యూనిస్టు పార్టీలు. మితవాద-అతివాద_ స్వభావగల అన్ని అవకాశధోరణులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో విశదీకరించి, విప్లవ ఉద్యమాన్ని ముందుకు తిసుకొని వెళ్ళడానికి వివిధ రకాలైన సున్నితమైన ఎత్తుగడలను ఏ విధంగా అనుసరించాలో వివరించాడు. విప్ణవానుభవాలకు ఆగ్రంధమొక సర్వస్వంలాంటిది. దానిని ఎన్నిసార్లు చదివితే అంత ఉపయోగంగా ఉంటుంది.
పల్లేటూరు పేదలకు
“పల్లెటూరు పేదలకు” అన్న గ్రంథంలో కామ్రేడ్ లెనిన్ శ్రామికవర్గ విష్ణవానికి కార్మిక-కర్షకుల సన్నిహిత మిత్రత్వం ఎంతగా అవసరమో మామూలు రైతుకు కూడా అర్ధమయ్యే విధంగా బహుచక్కగా వివరించారు. అతి క్లిష్టమైన మార్క్సిస్టు-లెనినిస్టు దృక్పథాలను విశాలమైన ప్రజాసామాన్యానికి ఎలా సుబోధకం చేయాలో తెలపడానికి ఇదొక నమూనా గ్రంధమని చెప్పవచ్చు. లెనిన్ రాసిన ఈ గ్రంథం ద్వారానే పల్లెసమాజంలో వర్గ విభజన ఎలా అభివృద్ధి చెందుతున్నదీ నేను నేర్చుకున్నాను కార్మికవర్గంతో పల్లెటూరు 'పేద ప్రజలు (వ్యవసాయ కార్మికులు, పేదరైతులు) ఐక్యమై మధ్యతరగతి రైతాంగంతో దృఢమయిన మైత్రిని నెలకొల్పుకొని, ధనిక రైతులు తమ ఊగినలాటను అధిగమించేటట్లు సాగిన విప్లవ ప్రధమదశలో సామ్రాజ్యవాదానికి, ప్యూడలిజానికి వ్యతిరేకంగా వారిని కలుపుకొని రావలసిన ఆవశ్యకతను ఆ గ్రరధంలో ఆయన వివరించారు. అదే సమయంలో ధనిక రైతాంగంతోనే పల్లెటూరు పేదలు పోరాటాలను సాగించుకోవలసి వుంటుంది మన విప్లవం సోషలిస్టు దశలో వున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మన పోరాటాన్ని ధనిక రైతాంగానికి వ్యతిరేకంగా సాగించవలసి వుంటుంది. కమ్యూనిస్టు అంతర్జాతీయ ద్వితీయ మహాసభలో లెనీన్ ప్రతిపాదించిన వ్యవసాయ సిద్ధాంత పత్రమూ, రైతాంగ సమస్యపై కామ్రేడ్ స్టాలిన్ యిచ్చిన మూడు ప్రధాన నినాదాలు నాకు వ్యవసాయ సమస్యపై అవసరమైన సిద్ధాంత పరిజ్ఞాన పునాదినిచ్చాయి.
గ్ వ్యవసాయ సమస్య - లెనిన్ భోధనలు
1938లో మా రాష్ట్ర కమిటీలో మాకు కలిగిన తీవ్రమైన సందేహాలు ఆ తరువాత 1948లో తెలంగాజూ పోరాటం సందర్భంగా రైతాంగంలో వర్గీకరణ సమన్యపైనా, మన ఉద్యమానికి ఏ సెక్షనకు చెందిన రైతాంగాన్ని ప్రధానంగా ఆధారం చేసుకోవాలన్న
శీ
వుచ్చలపల్లి సుందరయ్య సమస్యపైనా వచ్చిన తీవ్రమైన సందేహాలు ఇప్పడు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. "ఆ సమయంలో జరిగిన చర్చల సందర్భంలో మేము వ్యవసాయ సమస్యపై మా అవగాహనను ఇతోధికం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడినాయి. మన పార్టీ మొట్టమొదటి గ్రూపు ఏర్పడి ఈ నాటికి యాభైయేండ్లు గడిచినప్పటికీ, కామ్రేడ్ లెనిన్ తన మొదటి రచనల్లో చేసినట్టుగా మనపార్టీ ఇంతవరకూ గ్రామీణ ప్రజలను వర్గీకరించలేకపోవడం దురదృష్టకరమైన విషయం. మన దేశంలోని శ్రామికవర్గ విప్ణ్లవోద్యమంలోని ప్రధానమైన వైఫల్యమేమంటే నగరాల్లోనూ, పల్లెలలోనూ మనం జరిపే కృషిని సమన్వయపరుచుకోలేకపోవడమే. కార్మిక వర్గంతో, రైతాంగ ప్రజలతో కలిసి ఉమ్మడి ఉద్యమాన్ని అభివృద్ధి చేసుకొంటే కనీసం కొంతకాలంలోనైనా ప్రాధమికంగా కార్మికవర్గానికి, రైతాంగానికి మధ్య ప్రాథమిక ఐక్యతను నిర్మించగలం. కిసాన్ రంగంలో మన కర్తవ్యాలను గురించే మన కేంద్రకమిటీ ఒక తీర్మానం చేసినప్పటికీ, నాయకత్వంలో వున్న కేడర్ కూడా దాన్ని ఆచరణలో అమలు జరపడం లేదు. నాపై అయిదు గ్రంథాల ప్రభావం కామ్రేడ్ లెనిన్ రాసిన యీ ఐదు గ్రంథాలు నన్ను అత్యంతగా ఆకర్షించి నాపై శాశ్వతమైన ప్రభావాన్ని కలుగజేశాయని నేనంటున్నానంటే దానిఅర్థం కామ్రేడ్ లెనిన్ రాసిన యితర ముఖ్యమైన సిద్ధాంత రాజకీయ (గ్రంధాలకు, రచనలకు, ప్రసంగాలకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తున్నానని ఎవరూ భావించరాదు. “ప్రజాతంత్ర విష్టవంలో సోషల్ జెమోఠ్రసీ యొక్క రెండు ఎత్తుగడలు" అన్న గ్రంధం లేదా "పెట్టబడి విధానం అత్యున్నత దశ సామ్రాజ్యవాదం' అన్ని గ్రంధం ఇలాగే యితర గ్రంధాలూ, రచనలు యిచ్చే మహోన్నతమైన సిద్ధాంత పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకోకుండా మార్క్సిజాన్ని పూర్తిగా అర్థం చేసుకోవఢం ఎవరికైనా సాధ్యమా? మానవ చరిత్ర అంతటిలో వున్న అత్యున్నకమైన విజ్ఞాన సంపదనంభటినీ అధ్యయనం చేసి మానవాభ్యుదయానికి ప్రయత్నించిన మార్కు, ఎంగెల్సుల మహోన్నతమైన వారసత్వాన్ని కామ్రేడ్ లెనిన్ ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా ఆయన మార్కిస్టు లెనినిస్టు సిద్దాంత ఆచరణలను అభివృద్ధిపరచాడు.. లెనిన్ మహానీయుడు మనకు విడిచిపెట్టి వెళ్ళిన ఆ మహోన్నతమైన విజ్ఞాన సంపదను మరల మరల అధ్యయనం చేసి, లెనిన్ ఆశయాలను సఫలీకృతం చేయడంలో అవసరమైనంతగా కృషి చేయడంలో విఫలమవుతున్నామనేదే నా విచారమంతా. స్పష్టంగా నా మనస్సులో పడిన మరో (ప్రభావమేమంటే అత్యంత క్లిష్టమైన విప్లవ వెల్లువ సందర్భంగా పరిణామాలు ఎలా- అభివృద్ధి అవుతాయనే విషయంలో లెనిన్ 5
లెనిన్, స్తాలిన్ మావోల బోదనలు సీల్లడంచిన అభిప్రాయాలు, 1905లోని ఆయన రచనలు, విదేశాలనుండి ఆయన రాసిన లేఖలు, 1917 ఏప్రిల్, అక్టోబరు-.రోజుల్లో ఆయన చేసిన రచనలు ఇవన్నీ చదివి నేను అత్యంతగా అకర్షితుడైనాను. రాబోయే పరిణామాలను గ్గురించి లెనిన్ ఎంత సరిగ్గా అంచనా వేయగలడో, ఆ పరిణామాలకు అనుగుణ్యంగా పార్టీకి, ప్రజలకు తగిన నాయకత్వం మిచ్చి, విప్లవాన్ని జయప్రదం చేయడంలో ఎంత రాజకీయ నైపుణ్యతను ప్రదర్శించగలడో ఆ రచనల వలన విదితం కాగలదు
ఉత్తేజపరచే లెనిన్ విప్లవ జీవితం
ఆయన ఉపదేశాలు, రచనల మాట అటుంచి, విష్ణవకారుడుగా, మానవుడుగా ఆయన జీవితం నన్ను ఎంతగానో ఉల్తేజపరిచింది ఆయనవలెనే నా జీవితాన్ని కూడా మలచ్యుకోవాలని నాశక్తికొలదీ ప్రయత్నించడానికి ఆయన మహోన్నతమైన జీవితం నన్ను ఉత్సాహపరిచింది అయికే నా ప్రయత్నంలో జయప్రదం కావడానికి నేను ఎంతోకాలం కృషిచేయాలన్నది వేరే చెప్పవలసిన పనిలేదు
కామ్రేడ్ బబుషిన్ రాసిన “లెనిన్స్టృతులు 'క్లారాజట్కిన్ రాసిన 'లెనిన్ నా జ్ఞాపకాలు”, కామ్రేడ్ కృపస్కయా రాసిన 'లెనిన్ స్పృతులు ఈ గ్రంధాలు ఆయన ఎంతటి మహోన్నతమైన విప్లవకారుడో గ్రహించడానికి సహాయపడతాయి. మానవులువట ఆయనకుగల గాఢమైన డ్రేమ, చెడు అన్నా పీడకులన్నా ఆయనకున్న విపరీతమైన ద్వేషాగ్న్ శ్రామికవర్గ విప్లవ లక్ష్యాలపట్ట ఆయనకుగల అకుంరిత దీక్ష ఆయన నిరాడంబరత్వం, సమరశీల ప్రజానీకంతోనూ, తన సహచరులతోనూ ఎలాంటి సంకోచం లేకుండా కలసిమలసి వుండే ఆయన స్వభావం - ఇవన్నీ ఆయన విప్లవ జీవితంలో కొట్టవచ్చేటట్లు కనిపించే గొప్పలక్షణాలు. -
ఈ స్మృతుల్లో వివరించిన ఒక సంఘటననుమీకు జ్ఞాపకం చేయాలని నా కనిపించుతోంది. వీనులకు 'విందునాసగే మృదుమధుర సంగీతం విన్న తరువాత లెనిన్ ఇలా అన్నాడట ' ఇలాంటి సంగీత స్వరాలను రూపొందించిన వారి తలలను ఒకసారి (ప్రేమగా కట్టి అభినందించాలని నాకు అనిపిస్తున్నది. అయితే ఇప్పుడు పీడకుల తలలను బ్రద్దలుకొట్టే కార్యక్రమంలో మేము నిమగ్నమై వున్నాం. దానిని బట్టి ప్రతి ఒక్క మానవుడూ మంచిదైన, సుందరమైన వాటినన్నింట్నీ అనుభవించే అవకాశం వుండాలని ఆయన వాంఛించుతున్నట్లు స్పష్టమవుతున్నది. అయితే మానవులంతా అనందంగా జీవించడానికి పడుతున్న ఆటంకాలను- తొలగించే తక్షణ కర్తవ్యాల నిర్వహణకుగాను వాటిని
ఓ
వుజ్చలవల్లి నముందరయ్య వొదులుకోవాలని, ప్రతి ఒక్కరూ పూనుకొని శ్రామిక వర్గ విప్లవ విజయం కోసం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించుతున్నట్టు విదితమవుతున్నది. లెనిన్ స్మృతులపై గ్రంధాలు చదవాల్సిన ఆవశ్యకత
ఈ స్మ్మృతిలన్నింటిలోకి కామ్రేడ్ రాల్ఫాక్స్ రాసిన “లెనిన్ జీవితం” అన్న గ్రంథం నాకు బాగా నచ్చింది. అందులో రచయిత లెనిన్ విప్లవ ఉపదేశాలు, కృషిని వివరించడమేగాక “ఒక మానవుడుగా, లెనిన్ జీవితాన్ని చక్కగా చిత్రించాడు.
అలాగే పిల్లల కోసమని సోవియట్ యూనియన్‌లో “ మన లెనిన్. ' అన్న గ్రంధమొకటి ప్రచురితమైనది అది చక్కని రీతిలో లెనిన్ జీవితాన్ని, ఆయన సాధించినే విజయాలను వివరించి బాలబాలికలు లెనిన్ ఉపదేశాలను , ఆయన జీవితాన్ని అనుసరించేటట్టు ఉత్తేజపరుస్తుంది. దురదృష్టవశాత్తు, ఆఖరున ఉదహరించిన ఈ రెండు పుస్తకాల ఇప్పుడు అందుబాటులో లేవు లెనిన్ రచనలను, ఆయన ఉపదేశాలను బాగా అవగాహన చేసుకొని, ఆయనను 'అనుసరించాలనుకుంటే మనలో ప్రతి ఒక్కరం ఆయన సహచరులు లెనిన్‌ను గురించి వ్రాసిన స్పృతులన్నింటిని వదిలి "పెట్టకుండా చదవాలి.
లెనిన్ పతాకం క్రింద
లెనిన్ శతజయంతి ఉత్సవం జరుగుతున్న నేడు భారతదేశంలో మనం జనతా ప్రజాస్వామ్యం కోసం, సోషలిజం కోనం జరుగుతున్న పోరాటంలో ఒక క్లిష్టమైన కర్తవ్యాన్ని ఎదుర్కొంటున్నాం, మనమూ, మన ప్రజలూ తీవ్రమైన నిర్చ్వంధాలను అనుభవించాల్సివుంది. అనేక త్యాగాలను చేయవలసివుంది. మార్క్సిజం లెనినిజం పతాకం క్రింద ప్రజలు రక్షణకోసం ఎలా పోరాడాలో వియత్నాంలోని మన క్రామేడ్స్ మనకు చూపెడుతున్నార్పు, సామ్రాజ్యవాదులకూ, వారి తొత్తులకూ వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న ఈ. పోరాటంలో లెనిన్ రచనలు అధ్యయనం మన నిత్య జీవితంలో ఆయన జీవితాన్ని అనుసరించడం యివే మనకు నిజమైన మార్గదర్శకం కావాలి. లెనిన్‌ను లనుసరించడం మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, అంత అధికంగా మనం లెనిన్ ఆశయాలను సఫలీకృతం చేయగలిగిన సమర్ధతను సంపాదించుకోగలం.
7
లెనిన్ స్టాలిన్ మావోల బోధనలు కావ్రేడ్ స్టాలిన్ (కామ్రేడ్ స్టాలిన్ శతజయంతి సందర్భంగా 1979లో ఇంగ్లీషులో వ్రాసిన వ్యాసమిది. ఇది ఆయన మరణించిన తరువాత ఆయన సైల్సు లభ్యమైంది)
కామ్రేడ్ స్టాలిన్ శతజయంతి సందర్భంగా ఆయన బహుముఖంగా సాధించిన బ్రహ్మాండమైన విజయాలను స్టూలంగానైనా- ఈ చిన్న వ్యాసంలో పేర్కొన గలగడం అసాధ్యమైన విషయం, రష్యాలో కమ్యూనిస్క ఉద్యమాన్ని అభివృద్ది చేయడంలోనూ, సోషలిస్‌ట ఉద్యమాన్ని సాధించడంలోనూ, ఆయనకు గణనీయమైన పాత్రవుంది. 1924లో కామ్రేడ్ లెనిన్ అకాలంగా మరణించిన తరువాత పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదులు శత్రు వైఖరితో చుట్టముట్టివుండగా, సోవియట్ యూనియన్‌లో సోషలిస్టు సమాజాన్ని నిర్మించడంలోనూ, దాన్ని సంఘటిత పరచి పెంపాందించడంలోనూ కామ్రేడ్ స్టాలిన్ కృషి అపూర్వమైనది. అలాగే ప్రపంచవ్యాపితంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని, వలస, స్వతంత్ర దేశ్లాల్లో విష్ణవోద్యమాలను నిర్మించడంలోనూ, ఆయన కృషి ఎంతగానోవుంది. తన రాజకీయ, మిలటరీ నాయకత్వాన ద్వితీయ ప్రపంచ యుద్దంలో ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా సోవియట్ ప్రజలు , ప్రపంచ విప్ణవ శక్తులు (ట్రహ్మాండమైైన విజయాన్ని సాధించాయి. ఈ మహా విజయం తూర్పు యూరప్‌లోనూ, చైనాలోనూ, కొరియాలో న్యవియత్నాంలోనూ, ఆ" తరువాత 1960లో క్యూబాలోనూ సోషలిస్టు రాజ్యాలు ఏర్పడటానికి దోహదం చేసింది. అంతే కాదు, ఆ తరువాత ప్రపంచవ్యాపితంగానే సోషలిస్టు శబిరం అవతరించడానికి, భారతదేశంలోనూ, అగ్నేయాసియాలో , దక్షిణాసియాలో, పశ్చిమ ఆసియాలో, ఆ'తరువాత 1960లో దక్షిణాఫ్రికా మినహా మొత్తం ఆఫ్రికాలో వలసపాలన అంతమొందించడానికి ఆ మహా విజయం సహాయపడింది. ఇరవయ్యో శత్తాబ్దం మొదటి అర్ధభాగంలో ప్రపంచంలో ఈ చారిత్రాత్మకమైన మార్పులు జరగడానికి కొమ్రేడ్ స్టాలిన్ పాత్ర అద్వితీయమైనది మానవజాతి చరిత్రలో ఈ ఆమోఘమైన,
చారిత్రాత్మకమైన ఈ దశను చెరిపీివేడయం ఎవ్వరికీ సాధ్యం కాదు. కామ్రేడ్ స్టాలిన్ గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు. ఆయన అత్యంత సులభమైన శైలిలోమార్కిజం,- లెనినిజాన్ని బోధించగల సమర్ధుడు ఏకైక దేశంగా సోవియట్ యూనియన్‌లో సోషలిస్టు సమాజాన్ని నిర్మించడంలోనూ, ప్రపంచ విప్లవోద్యమాన్ని అభివృద్ది చేయడంలోనూ స్వయంగా గడించిన అనుభవాల నుండి ఆయన మార్క్సిస్టు- లెనినిస్టుగా అనేక విషయాలను అవగాహన చేసుకోగలిగాడు. కామ్రేడ్ స్టాలిన్ అనుభవం ద్వారా పెంపాొందించుకొన్న సిద్ధాంత, ఆచరణకు సంబంధించిన ఈ మహత్తర విజ్ఞానం ఆయన రచించిన ' జాతుల వలన విధానం- సమస్య” “వ్యవసాయక రైతాంగ సమస్యలు"
8
వుచ్చలనల్లి సుందరయ్య లెనినిజం-భౌతికవాదాలపై ఆయనరచించిన అధ్యయాలలోనూ ప్రతిభావంతగా కానవస్తుంది.
భారత కమ్యూనిస్టు ఉద్యమంలో వున్న మనం సోవియట్ సోషలిస్టు విప్లవమూ, లెనిన్ అస్తమయం అనంతరం కామ్రేడ్ స్టాలిన్ నాయకత్వాన అది అభివృద్ధి చెందిన ప్రభావంలో పెరిగిన మనదేశంలోని ఉద్యమాన్ని అభివృద్ధిపరచుకున్నాం. 1951లో మనపార్టీకి కామ్రేడ్ స్టాలిన్ ఇచ్చిన నిర్ధిష్టమైన సిద్ధాంత, ఆచరణపరమైన సలహాకు మాత్రం నేను ఈ వ్యాసంలో పరిమితమవుతాను.
ద్వితీయ ప్రపంచయుద్ధం ముగిసిన వెనువెంటనే భారతదేశంలోబ్రిటిష్
సామ్రాజ్యవాదుల పాలనకు వ్యతిరేకంగా విప్లవ వెల్లువ వెల్లివిరిసింది ఆరేండ్ల ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన అధ్వాన్నమైన అర్థిక పరిస్థితులు రాజకీయంగా అణచివేత చర్యలు - ఈనేపధ్యంలో భారత, జాతీయ -.కాంగ్రెస్ నేతృత్వంలో ప్రారంభించిన “ క్విట్ ఇండియా' ఉద్యమం, సుభాష్చంద్రబోస్తు, నాయకత్వంలో భారత జాతీయ "సైన్యం ఏర్పడటం- ఇవన్నీ మనదేశప్రజలను విష్లవ వెల్లువకే ఉత్తేజపరచాయి. తమ ఆర్థిక కోర్కెల కోసమేగాక, భారతజాతీయ సైన్యానికి నంబంధించిన దేశభక్తులను. ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలన్న నినాదంతో జరిగిన'వివిధ కార్మిక సమ్మెల్లోనూ, ప్యూడల్ జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని నినదించుతూ ప్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల జరిగిన" రైతాంగ పోరాటాల్లోనూ, రాజుల- నవాబుల పాలనను అంతమొందించాలని డిమాండ్ చేస్తూ స్వదేశ "సంస్థానాల్లో జరిగిన - ప్రజల తిరుగుబాటుల్లోనూ ఈ విప్లవ వెల్లువ ప్రతిబింబించింది. అంతిమంగా నావికుల తిరుగుబాటు-దానికి "అండగా _ కార్మికవర్గం జరిపిన సమ్మెలు- "ఇవన్నీ బ్రిటీషవారు ఇండియాను విడిచిపెట్టి వెళ్ళేటట్ట్లుగా చేశాయి అయితే, వారు మనదేశాన్నుండి వైదాలగుతూ భారతదేశాన్ని ఇండియా, పాకిస్తాన్‌లుగా- రెండుగా విభజించి 1947 ఆగస్ఫృలో అధికారాన్ని కాంగ్రెస్, ముస్లీంలీగులకు అప్పజెప్పి మరీ వెళ్ళిపోయారు.
తమను భూముల నుండి తొలగించడానికి పూనుకొన్న భూస్వాముల ప్రయత్నాలకు వ్యతిరేకంగానూ, బలవంతంగానూ వస్తూలు చేస్తున్న లెవీలకు ప్రతికూలంగానూ, వెట్టిచాకిరికి వ్యతిరేకంగానూ తెలంగాణా ప్రజలు -ముఖ్యంగా. రైతుల, వ్యవసాయ కార్మికులు, 1946ఆఖరి భాగంలో ఆయుధాలతో తిరుగుబాటు చేశారు.నైజాం సాయుధ రజాకార్ గూండాలను, ప్రభుత్వ సైన్యాలను తెలంగాణా ప్రజలు వీరోచితంగా ప్రతిఘటింఛారు “నైజాం సంస్థానాన్ని రద్దు చేయాలి” హైద్రాబాద్ సంస్థానాన్ని విభజించి అందులో వున్న వివిధ భాషాప్రాంతాలను పొరుగునున్న ఇండియన్ యూనియన్‌లోని ఆయా భాషా రాష్ట్రాల్లో విలీనం చేయాలి” ఆ విధంగా విశాలాంధ్రను, సంయుక్త కర్ణాటకను, సంయుక్త
ర
లెనిన్ స్టాలిన్ మావోల బోదనలు
మహారాష్ట్రను ఏర్పరచాలి” అనే నినాదాలను వారు ఎలుగెత్తి చాటారు. హైద్రాబాద్‌ను వేరే ఒక స్వతంత్ర -దేశంగా చేయాలన్న నైజాం నవాబు కుట్రలను వారు వీరోచితంగా
ఎదుర్కొన్నారు.
తెలంగాణా ప్రజల్లు- ముబ్యంగా రైతులు, వ్యవసాయ కార్మికులు తమ సంఘాన్ని
-ఆంధ్ర మహాసభను కమ్యూనిస్ట్రపార్టీ నాయకత్వాన నిర్మించుకొని పోరాడారు వారు తమ పోరాట క్రమంలో బడా భూస్వాములను, నైజాం సాయుధ మూకలను దాదాపు 3వేల గ్రామాల నుండి తరిమివేయగలిగారు: ఆ గ్రామాలలో పంచాయతీ వ్యవస్థను నెలకాల్పుకొని, సుమారు 10 లక్షల ఎకరాలను పేదలకు పంచిపెట్టారు అదే సమయంలో వారు తమ పలుకుబడిని, ప్రభావాన్ని ఇంకా అనేక జిల్లాలకు వ్యాప్తి చేయడం ప్రారంభించారు సరిగ్గా ఆ-దశలో భారతప్రభుత్వం హైద్రరాబాద్కు తన సైన్యాలను పంపించింది రజాకార్ మూకల దౌర్జన్యాలను అంతమొందించడానికి, నైజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో వీలినం చేసేందుకు ఈ పోలీసు-చర్యను తీసుకొన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది..భూమి కోసం, ప్రజాస్వామ్యం కోసం వీరోచితంగా కమ్యూనిస్టులు సాగిస్తున్న తెలంగాణా పోరాటాన్ని కూడా తుడిచిపెట్టడం తమ లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్ర ప్రాంతంలోనూ, తెలంగాణా ప్రాంతంలోనూ పార్టీ నాయకత్వంలోని
మెజార్టీ భారత సైన్యంతో. సంఘర్షణ పడరాదని నిర్ణయించింది అదే సమయంలో రజాకార్లతోనూ, నైజాం సైనికులతోనూ పోరాటాన్ని కొనసాగించాలని భావించింది. ఇండియన్ సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలో అన్ని (ప్రదేశాల్లోకి ప్రవేశించకముందే రజాకార్ల పై దాడులు జరిపి, వారి వద్ద గల ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని కూడా నిర్ణయించింది. ప్రజల సాయుధ దళాలను, గెరిల్లా బృందాలను రద్దు చేయవలదని, "హైదరాబాద్సంస్థానంలో ప్రవేశించిన ఇండియన్ సైన్యాలు, ఇండియా ప్రభుత్వం ఏమి చేయబోతున్నదో వేచిచూడాలని. పార్టీ తన కమిటీలను, సభ్యులను ఆదేశించింది. పారిపోయిన' భూస్వాములను తిరిగి తెచ్చి, భూముల నుండి లక్షలాది రైతులను, వ్యవసాయ కార్మికులను తొలగించి ఆ భూములను భూస్వాములకు ఇండియా సైన్యాలు అప్పగించి రైతాంగం పై క్రూరమైన నిర్బంధ విధానాన్ని సాగించితే తెలంగాణా రైతాంగం, ప్రజల రక్షణకై కమ్యూఎస్స్టు పార్టీ పూనుకోవాలని నిర్ణయించింది ఈ పోరాటం అఖిలభారత పోరాటంగా అభివృద్ధి చెంది, చివరికి బూర్జువా-భూస్వాముల పెత్తనం అంతమయ్యేంతవరకూ కొనసాగించాలని అనుకొన్నాం: తెలంగాణాను "భారతదేశపు 'యేనాన్'గా పరిగణించాం. ఈ రకమైన కార్యాచరణ ఎంతవరకు సరియైనదనే విషయం భారత కమ్యూనిస్టు పార్టీలోనూ, ఆంధ్ర,తెలంగాణా పార్టీ స్థాయిల్లోనూ తీవ్రమైన భేదాభిప్రాయాలు ఏర్పడినాయి. "తెలంగాణా భారతదేశపు 'యేనాన్'అన్న నినాదమూ, ఆ దృష్ట్యా తీసుకొన్న
10
అనలవలినుందరయే కార్యాచరణ దుస్పాహసమైనదనీ,పోలీసు చర్య ప్రారంభించిన వెనువెంటనే పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించి, అప్పటివరకూ పోరాటం ద్వారా సాధించుకొన్న విజయాలను సంరక్షించుకొనేందుకు లీగల్, చట్టబద్ధమైన పద్దతులను చేపట్టాలని పార్టీ నాయకత్వంలోని ఒక భాగం అభిప్రాయపడింది. పార్టీ నాయకత్వంలోని మరొక భాగం తెలంగాణా పోరాటాన్ని కొనసాగించాలని చెపుతూనే ఆంధ్ర నాయకత్వం రైతాంగ మనస్తత్వాన్ని కలిగివున్నదనీ, అది భారత విప్లవంలో కార్మికవర్గ నాయకత్వాన్ని తిరస్కరించినదనీ విమర్శించింది. చైనామార్గమున్నదనీ, అది జనరల్ సమ్మె, కార్మికవర్గ సాయుధ తిరుగుబాటు మాత్రమేనని, దాని ప్రభావంతో గ్రామసీమల్లో రైతాంగ సాయుధ తిరుగుబాటు వస్తుందనీ, వాదించింది అయినప్పటికీతెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని వారు కోరారు. ఎందువల్లనంటే, ఆ పోరాటం ప్రజలను ఉత్తజపరుస్తుందనీ మహోజ్వలమైన వీరోచిత వారసత్వాన్ని అది ప్రజలకు అందజేయడం ద్వారా కార్మిక వర్గ జనరల్ సమ్మెకూ, సాయుధ తిరుగుబాటుకు నాందీ ప్రస్తావన చేయగలదని వారు అభిప్రాయపడ్డారు.
మరొకవైపున తమ పోరాటాల ద్వారా సాధించుకున్నభూములను సాగుచేనుకున్న రైతాంగానికి గల హక్కులను సంరక్షించుతూ, భారత ప్రభుత్వ సైన్యాల అండదండలతో తిరిగి వస్తున్న భూస్వాముల రాకను ప్రతిఘటించుతూ ఈ సందర్భంగా పాలకవర్గాన్నుండి వస్తున్న అత్యంత క్రూరమైన బీభత్సాన్ని , నిర్చంధాలను, పోరాటంలో పాల్గొంటున్న, అభిమానించుతున్న వేలాదిమందిని మూకుమ్మడిగా హత్యచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, దాని సైన్యాలను ఎదిరించుతూ రంగంలో వుండి తెలంగాణా ప్రజల సాయుధ పోరాటాన్ని నిర్వహించుతున్న పార్టీ నాయకత్వం మరో విధంగా భావించింది వారు ఈ క్రింది విధంగా వాదించారు “మ విస్ణవం చైనా మార్గాన్ని పోలివుంది ఎందువల్లనంటే, మన దేశం సువిశాలమైనది 80 శాతం ప్రజలు గ్రామసీమల్లోనే నివశించుతున్నారు.. వారు వలన విధానానికీ చెందిన,ఎంతో వెనుకబడిన నికృష్టమైన ఆర్థిక పరిస్థితులలో జీవించుతున్నారు. అంతేకాదు, ఒకసారి ఆయుధాలను చేబట్టిన తరువాత ముఖ్యంగా తాము సాధించుకున్న విజయాలను అభివృద్ధి నిరోధక బూర్జువా-భూస్వామ్య ప్రభుత్వపు సాయుధ శక్తులు వమ్ముచేస్తున్న సమయంలో ఆయుధాలను విడనాడటం ఎలా సాధ్యమవుతుంది? ఈ వూచకోత నుండి మన కార్యకర్తలను, ప్రజలను ఎలా రక్షించుకోవడం? అందువలన అది ఎంత కష్టతరమైనప్పటికీ, ఈ పోరాటం ఎంత సుదీర్ధకాలం సాగించవలసినప్పటికీ, దేశంలోని యితర వ్రదేశాల్లోని ప్రజలు కూడా సాయుధ తిరుగుబాటు దశకు వచ్చేంతవరకూ ఈ పోరాటాన్ని కొనసాగించటమొక్కటే ఏకైక మార్గం”.
ఈ పరిస్థితుల్లో సోవియట్ కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం నుండి, కామ్రేడ్ స్టాలిన్
11
లెనిన్ స్టాలిన్ మావోల బోధనలు పంచ నంచాలను వందాలన నర్ణయంచుకున్నా. ఇందుకు స్యలన్ వంటనే అంగకంంచి. మన పార్టీ ప్రతినిధి వర్గం రహస్యంగా సోవియట్ యూనియన్‌కు చేరుకునేందుకు అవసరమైన సాంకేతిక పరమైన ఏర్పాట్లను చేశారు ఇది శ్రామికవర్గ అంతర్జాతీయ దృక్పధం యెడల, ప్రపంచ విష్లవసాధన పట్ల, కమ్యూనిస్టు సౌభ్రాతృత్వం పట్ల కామ్రేడ్ స్టాలిన్‌కు గల అంకితభావానికి ప్రబల నిదర్శనం. ఆనాడున్న ప్రపంచ పరిస్థితినీ, సోవియట్ యూనియన్ ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్ట పరిస్థితిని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే, మనకు సహాయపడటానికి వెంటనే ముందుకువచ్చిన కామ్రేడ్ స్టాలిన్ గొప్పతనాన్ని అర్ధం చేసుకోగలం ముందుగా సోషలిస్టు విప్లవాన్ని సాధించుకొన్న దేశం - లేదా ఆ తరువాత విప్లవాలు సాధించుకున్న దేశాలు ప్రపంచ విప్లవాలకు పునాదులుగా వుండాలని, ఇతర దేశాల్లోని విప్లవాలకు సాధ్యమైనంత వరకూ సహాయపడవలసిన బాధ్యత వాటికి గలదని లెనిన్ మహానీయుడు చేసిన ఉపదేశాన్ని కామ్రేడ్ స్టాలిన్ అంకితభావంతో అనుసరించాడు ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో సోవియట్ యూనియన్ విపరీతమైన విధ్వంసానికి గురైంది ఆ నష్టాన్నుండి అప్పుడే బయటపడుతోంది సోవియట్ యూనియన్‌కు, యితర సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా అణుయుద్దాన్ని సాగించుతానన్న అమెరికా బెదిరింపులకు జవాబుగా సోవియట్ యూనియన్ అప్పుడే తన మొదటి అణుబాంబును తయారుచేసింది నూతనంగా స్వాతంత్ర్యాన్ని సాధించుకొన్న దేశాలతోనూ, ముఖ్యంగా ఇండియాతోనూ సోవియట్ యూనియన్ స్నేహసంబంధాలను నెలకొల్పుకుంటోంది. సామ్రాజ్యవాదుల బెదిరింపులకు, దోపిడీకీ వ్యతిరేకంగా నిలబడి తమ రాజకీయ స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకునేందుకు, తమ జాతీయ ఆర్ధిక విధానాన్ని పెంపాొందించుకొనేందుకు వీలుగా ఆ వర్థమానదేశాలకు సోవియట్ యూనియన్ సాంకేతిక, ఆర్థికపరమైన సహాయాన్ని అందజేస్తున్నది కొత్తగా ఏర్పడిన యీ నూతన స్వాతంత్ర్య దేశాలతో నెరపదలచిన స్నేహ సంబంధాలకు ఏదైనా విఘాతం కలిగితే, అది పరోక్షంగా సోవియట్ యూనియన్‌కు దురాక్రమణ ఉద్దేశ్యాలున్నట్లు అమెరికన్ సామాజ్యవాదులు చేస్తున్న ప్రచారానికి అవకాశం యిచ్చినట్లు అవుతుంది అలాంటి ప్రమాదం వున్నప్పటికి కామ్రేడ్ స్టాలిన్, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వమూ అంతర్జాతీయ విష్ణవ కర్తవ్యాలకు కట్టబడ్డారు మన పార్టీతో సంప్రదింపులు జరిపి, మనలను ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే నలహాలనిచ్చి సహాయపడేందుకు సాహసించారు. ఈనాడు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో వున్న పరిస్థితులను ఆనాడు స్టాలిన్ నేతృత్వంలో సోవియట్ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ప్రదర్శించిన కార్మికవర్గ అంతర్జాతీయ దృక్పధాన్ని పోల్చిచూస్తే ఎంతో తేడా మనకు కనిపించుతుంది. కామ్రేడ్ స్టాలిన్ నాయకత్వాన మాలటోవ్, మాలెంకోవ్, సుస్తోవ్లతో కూడిన 12
వుచ్చలవళ్లి సుందరయ్య సోవియట్ పార్టీ ప్రతినిధివర్గంతో జరిపిన చర్చలను గురించి మన పార్టీ ప్రతినిధి వర్గం మాకు వివరించింది. ఎంతో బిడియంగా వున్న మన ప్రతినిధివర్గంతో నమాన ఫొయిదాతో ప్రవర్తించి మనవాళ్ళు 'స్వేచ్ళగానూ, నిర్మొగమాటంగా తమతో చర్చించేందుకు అవకాశాన్ని కలిగించిన కామ్రేడ్ స్టాలిన్ నిరాడంబరత, సౌభ్రాతృత్వ భావంఎంతో ప్రశంసనీయమైనది. ఖారత విప్లవ పంధా
రెండు ప్రధాన విషయాలపై భారత కమ్యూనిస్టు పార్టీలో తీవ్రమైన విభేదాలు ఏర్పడినాయి. భారత కమ్యూనిస్టులమైన మమ్ములను అందోళనపరుస్తున్న ఆ రెండు "ప్రధాన సమస్యలు ఇవీ.
-
భారత విషస్ణవం రష్యా మార్గాన్ని అనుసరించాలా? లేక చైనా పంధా ననుసరించాలా? _
-
పాక్షిక సాయుధ గెరిల్లా (పార్టిజాన్) పోరాటం అంటే ఏమిటి? ద్దానికి భారత విప్లవంలో గల స్థానమేమిటి? |
భారత విష్ణవ పంథా : భారతదేశ విప్లవ మార్గం యిటు రష్యా మార్గం కాదు, అటు చైనా మార్గం కాదనీ, అది దానికి గల నిర్దిష్టమైన పంధాను అనుసరించాలనీ, దాన్ని రూపొందించుకునే బాధ్యత భారత కమ్యూనిస్టుల దేననీ కామ్రేడ్ స్టాలిన్ తేటతెల్లం చేశారు.
భారతదేశంలో వలస అర్ధిక విధాన స్వభావాన్ని మరిచిపోయే ధోరణిని చైనా తదితర వలస దేశాల్లోని విప్లవోద్యమాల అనుభవాన్నుండి గుణపారాలను వేర్చుకోవడానికి నిరాకరించడాన్ని, రైతాంగ పోరాటాలకు గల అత్యధిక ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయడాన్నీ -- ఈ విధంగా నగరాల్లోనూ, పారిశ్రామిక (ప్రాంతాల్లోనూ రాజకీయ జనరల్ నమ్మెలను సాగించడమే భారత విష్ణవ సాధనకు ప్రధానమైన ఆయుధమని, అదే చివరికి దేశ వ్యాపితంగా సాయుధ తిరుగుబాటు రావడానికి సహాయపడి నేటి పరిపాలనా వ్యవస్థను కూలద్రోయగలదనే సిద్ధాంతీకరణను కామ్రేడ్ స్టాలిన్ విమర్శించారు
నాయకత్వంలోని మరో భాగం వెల్లడించిన రెండో ధోరణిని కూడా కామ్రేడ్ స్టాలిన్ విమర్శించారు. ఈ ధోరణి ఏమంటే, చైనాలో విప్లవం వచ్చిన మాదిరిగానే ఇండియాలోనూ సరిగ్గా ఆ మార్గాలలోనే వివ్లవాన్ని సాధించగలమని గెరిల్లా (పార్టీజాన్) పోరాటమే 'ప్రధానమైనదని దాదాపు అదొక్కటే విజయాన్ని సాధించగలదని చేసే వాదనది. చైనా విప్లవానుభవాన్ని పొరపాటుగా అవగాహన చేసుకున్న ఫలితంగానే ఈ సిద్దాంతీకరణ ముందుకొచ్చిందని కామ్రేడ్ స్టాలిన్ చెప్పారు.
మొదటి సిద్దాంతీకరణ రైతాంగ జన సామాన్యాన్ని వారి పోరాటాలను తక్కువ అంచనా వేస్తే రెండో సిద్ధాంతం కార్మిక వర్గాన్ని, దాని కార్యాచరణను తక్కువ అంచనా వేసింది ఈరెండు ఎత్తుగడల విధానాలు భారత దేశంలో వున్న నిర్ధిష్ట పరిస్థితులను దృష్టిలో
13
లెనిన్ స్టాలిన్ మావోల బోధనలు
తీసుకోకుండా కేవలం యితర దేశాలను యాంత్రికంగా అనుకరించడం వల్లనే ముందుకొచ్చాయని కామ్రేడ్ స్టాలిన్ వివరించారు
సిద్ధాంతంలోను, ఆచరణలో కూడా యీ రెండు ఎతుత్తగడల విధానాలు కార్మికవర్గం - రైతాంగం మథ్య ఐక్యతను సాధించాలనే కీలకమైన కర్తవ్యాన్ని త్రోసిపుచ్చాయి ఆ విధంగా ఐక్య జాతీయ సంఘటనను నిర్మించే కర్తవ్యాన్ని తిరస్కరించాయి. అలాంటి కార్మిక-కర్షక ఐక్యత మాత్రమే దృఢమైన పునాదిని నిర్మించగలదు అదే విధంగా ప్యూడల్ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక విష్ణవానికి కార్మికవర్గ నాయకత్వం వుండాలన్న విషయాన్ని కూడా ఈ రెండు ఎత్తుగడల విధానాలు విస్మరించాయని కామ్రేడ్ స్టాలిన్ తెలిపారు
ఆనాడు భారతదేశంలో నెలకొనివున్న నిర్ధిష్ట పరిస్థితులను గురించి చర్చించి వాటిని చైనా పరిస్థితులతో పోల్చి చూసిన తరువాత కామ్రేడ్ స్టాలిన్ క్రింది నిర్ణయానికి వచ్చారు “ఇతర అన్ని వలస దేశాల్లో వలెనే భారతదేశంలో కూడా పాక్షిక సాయుధ గెరిల్లా పోరాటం (పార్టిజాన్ వార) ఒక ప్రధాన ఆయుధంగా వుంటుంది. కానియీ ఒక్క ఆయుధం వల్లనే విజయాన్ని సాధించగలగడం అసాధ్యం, గెరిల్లా పోరాటానికి తోడుగా యితర ప్రధాన అయుధాలైన కార్మికుల జనరల్ సమ్మె, కార్మికవర్గ అగ్రశ్రేణి దళాల నాయకత్వాన నగరాల్లో తిరుగుబాటులను కూడా జోడించాలి అందువలన జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదంగా సాగించాలంటే, విప్లవానికి సంబంధించిన రెండు ప్రధాన ఆయుధాలను అంటే కర్షకుల గెరిల్లా పోరాటాన్ని నగరాల్లో కార్మికుల తిరుగుబాటును సమ్మిళితం చేయవలసి వుంటుంది ” అని ఆయన వివరించారు
2 తెలంగాణా సాయుధ పోరాటం - ఆ పోరాటం స్వభావం, అది అభివృద్ధి చెందిన క్రమం - బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు దాన్ని ప్రజా విముక్తి పోరాటంగా అభివృద్ధి చేయగలగడం సాధ్యమా?
తెలంగాణా ప్రజల పోరాటానికి సంబందించిన వివరాలన్నింటినీ మన ప్రతినిధి వర్గం నుండి అడిగి తెలుసుకున్న తరువాత దాన్ని మీరు సంరక్షించుకోలేకపోవడం విచారకరమైన విషయమని కామ్రేడ్ స్టాలిన్ వ్యాఖ్యానించాడు వెట్టిచాకిరికి, బలవంతంగా లెవీల వసూళ్ళకు నిరసనగానూ, భూముల నుండి తొలగింపుకు వ్యతిరేకంగాను ఇంకా ఇతరమైన కోర్కెలను సాధించుకునేందుకు తెలంగాణా రైతులు, ప్రజలు ఆయుధాలను చేబట్టడం సరైనదే ఆ పోరాట క్రమంలో భూస్వాముల అధీనంలో వున్న భూములను స్వాధీనం చేసుకొనే స్థితికి అది అందుకొన్నది ఆ పోరాటం అభివృద్ధి చెందిన కొలదీ నైజాం ప్రభుత్వ సాయుధ బలగాలతో ఢీ కొనవలసిన పరిస్థితి ఏర్పడింది దీనితోపాటు నైజాం నవాబుగిరినే రద్దుచేయాలనీ, హైద్రాబాద్ సంస్థానాన్ని మూడు భాగాలుగా విభజించి వాటిని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసి ఆయా భాషా రాష్ట్రాలతో కలిపినేయాలనే
శ4
వుచ్చలవల్లి నుందరయ్య నినాదం లేవనెత్తడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనే.సమస్య ముందుకువచ్చింది. ఇందుకు నైజాం పరిపాలనను కూలద్రోయడానికి అది విముక్తి పోరాటంగా పరిణామం చెందింది
అయికే భారతీయ సైన్యాలు హైద్రాబాద్ సంస్థానంలో ప్రవేశించి నైజాం నవాబు తన సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసేటట్లు చేయవచ్చు. ఆ తరువాత పారిపోయిన భూస్వాములను భారతీయ సైన్యాలు వెనక్కి రప్పించి తెలంగాణా, సమరశీల రైతాంగాన్ని క్రూరంగా అణచివేయవచ్చు అప్పుడు కూడా కాంగైసు పాలననూ, కేంద్ర ప్రభుత్వాన్నీ కూలద్రోసే లక్ష్యంతో సాయుధ పోరాటాన్ని సాగించడం పొరపాటు కాగలదు. ఆ లక్ష్యంతో పోరాడేందుకు ఇంకా అభిలభారతంగా విప్లవ పరిస్థితులు ఏర్పడలేదు. అధికారానికి వచ్చిన ప్రభుత్వంపై పూర్తి అసంతృప్తి ఇండియాలోని ఏ ప్రాంతాలలోనూ యేర్చడలేదు. అయికే తెలంగాణా ప్రజలు తాముసాధించుకున్న భూములను, ప్రజాతంత్ర హక్కులను సంధరక్షించుకునేందుకు పాక్తిక సాయుధ గెరిల్లా పోరాటాన్ని (పార్టిజాన్) సాగించవచ్చు. అలా పోరాటం చేయకపోవడమంటే సవురశీల తెలంగాణా ప్రజానీకానికి ద్రోహం చేసినట్లే కాగలదు. అదే సమయంలో వున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత అనుకూలమైన షరతులతో ప్రభుత్వంతో రాజీపడేందుకు గల అవకాశాలను కూడా పరిశీలించడం కూడా తప్పనిసరిగా అవసరం ఇంకా ఏ షరతులపైన, ఈ పరిస్థితుల్లో, ఎప్పుడు పోరాటాన్ని విరమించాలనే విషయం నిర్ణయించుకోవలసింది భారత కమ్యూనిస్క పార్టీ నాయకులే!
తమ పాక్షికమైన కోర్కెలను సాధించుకునేందుకు రైతాంగ గెరిల్లా పోరాటానికి - విముక్తి పోరాటంలో భాగంగా సాగించే రైతాంగ గెరిల్లా పోరాటానికి మధ్యగల సిద్ధాంతపరమైన ఈ తేడాను తెలుసుకోవడం ద్వారానే మేము సరైన ఎత్తుగడలను అవగాహన చేసుకోవడానికి వీలయ్యింది. ఆ విధంగా తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఉపసంహరించుకొని, తెలంగాణా రైతాంగ ప్రయోజనాలను రక్షించుకొనేందుకూ, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ, మొత్తం భారతదేశంలోనూ పెంపొందించుకొనేందుకు నూతన ఎత్తుగడలను చేపట్టగలిగాం.
పాక్షిక సాయుధ గెరిల్లా పోరాటాన్ని గురించి కామ్రేడ్ స్టాలిన్ ఈ క్రింది విధంగా వివరించారు “ఒకానొక ప్రత్యేక ప్రాంతంలో అందుకు పరిస్థితులు పరిపక్వమై వుంటే ఇతర గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అందుకు పరిస్థితులు పరిపక్వం కాకపోయినప్పటికీ అక్కడ కార్మికులు తమ కార్యాచరణతో పోరాటానికి సంఘీభావం తెలువనప్పటికీ పాక్షిక సాయుధ పోరాటాన్ని అక్కడ ప్రారంభించవచ్చు. అయితే, పాక్షిక సాయుధ పోరాటం ప్రారంభించడమా, ప్రారంభించకపోవడమా అన్నది మనమీద ఆధారపడి వుండదు. అది అక్కడ (ప్రజల సంఘటిత శక్తిమీద, వారొమనోభావాల పైన ఆధారపడివున్నది. ప్రజలు అందుకు సంసిద్ధమైతే 'ప్రారంభించవలసిందే.
15
లెనిన్ స్టాలిన్ మావోల బోదనలు తమ పాక్షిక డిమాండ్ల కొరకు ఫ్రజల పోరాటం ఇంకా ఉద్యమదశలోనే ఉన్నప్పటికీ, ఇంకా భూముల పంపిణీ దశకు రానప్పటికీ, గ్రామపంచాయతీ కమిటీలు ఏర్పడనప్పటికీ మనం పాక్షిక సాయుధ గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించవచ్చు
“పాక్షిక సాయుధ గెరిల్లా పోరాటానికి కూడా దశలున్నాయి. అతి చిన్న చిన్న కోర్కెల కోసం - ఉదాహరణకు కౌలు తగ్గింపుకోసమే అది ప్రారంభంకావచ్చు కాని అది పాక్షిక సాయుధ పోరాటం కాజాలదు శత్రువు రైతుల డిమాండ్లను అంగీకరించ నిరాకరించితే
- బలప్రయోగం ద్వారానైనా తమ కోర్కెలను సాధించుకోవాలని అదుర్దాలో వుండే పక్షంలో అప్పుడు పాక్షిక సాయుధ గెరిల్లా పోరాటాన్ని సాగించవచ్చు అయితే, శత్రువు చుట్టుముబ్దినప్పుడు ఉన్నవాటిలో ఉత్తమశక్తులను మరో [ప్రాంతానికి తరలించివేయాలి ఇతర ప్రాంతంలో వున్న సాయుధశక్తులకు వారిని తోడుచేయాలి. ఆ విధంగా స్వంత విముక్తి సైన్యాన్ని నిర్మించుకోవాలి.”
ఇక్కడ కామేడ్ స్టాలిన్ పాక్షిక సాయుధ పోరాటం వున్న ప్రాంతాలను విముక్తి సైన్యాలుగా అభివృద్ధి చేసే అవకాశాన్ని ఊహించి చెప్పారు.
“పాక్షిక సాయుధ పోరాటాన్ని వ్యక్తిగత హింసావాదం (టెర్రరిజం)తోనో లేక దళాల టెర్రరిస్టు చర్యలతోనో జమకట్టి గందరగోళపరిచే విషయం పట్ల కామ్రేడ్ స్టాలిన్ తీవ్రంగా హెచ్చరించారు. పాక్షిక సాయుధ పోరాటానికి వ్యక్తిగత హింసావాదం పూర్తిగా విరుద్ధమైనది. అసలు ఆ లక్ష్యానికే విరుద్ధమైనది వ్యక్తిగత టెర్రరిజం జనసామాన్యం వలనగాక వ్యక్తులతో జరుగుతుంది లేదా కొద్దిమంది సభ్యులు గల దళాలతో జరుగుతుంది వీరికి ప్రజా సామాన్యంతో సంబంధం వుండదు అలాకాకుండా పాక్షిక సాయుధ గెరిల్లా పోరాటం ఆనాడున్న పరిపాలనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సన్నిహిత సంబంధం వుంచుకొని ప్రజలు జరుపుతారు.
“ప్రధానమైన పోరాటశక్తి ప్రజాసామాన్యంగాక, వీరులైన టెగర్రరిస్పృలనే విశ్వాసాన్ని వ్యక్తిగత హింసావాదం కలుగజేన్తుంది. వేచిచూస్తూ నంతోషించడం మాత్రమే ప్రజలు నిర్వహించవలసిన పాత్ర, అంటే ప్రజలు ఉ పేక్షాభావంతో వుండాలని చెప్పడమే కాగలదు ప్రజానీకం తమ విముక్షిని తామే సాధించుకోవలసి వుంటుందని మార్కు, ఎంగెల్సులు మనకు బోధించారు. ఈ విషయాన్ని వ్రజలచే గుర్తింపజేయకుండా వ్యక్తిగత హింసావాదం టెర్రరిస్టులను వీరులుగానూ, తమకు విముక్తిదాతలుగ్లానూ షరిగణించేటట్లు చేస్తుంది.
(వ్యక్తిగత హింసావాద సిద్దాంతం విప్లవపోరాటం తగ్గుముఖం పట్టినప్పుడు మాత్రమే ముందుకు వస్తుంది అది ఉద్యుమం బలహీనతకు చిహ్నం వివవ ఉద్యమం బాగా విజ్బృంభణలో ఉన్నప్పుడు వ్రజలే స్వయంగా ముండుకొవ్చుతరుగుబాటు చేసినప్పుడు వ్యక్తిగత హింసావాదం రంగంనుండే అద్మశ్యమవుతుంది.
శం
వుచ్చలనలైి సుందరయ్య క
ఆ దశలో అంటే, 1951 (ప్రారంభంలో కామ్రేడ్ స్టాలిన్ భారత ప్రజల విప్లవ పోరాటంలో భాగంగా పాక్షిక సాయుధ పోరాటాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశమున్నట్లు భావించారు. ఆయన ఇలా అన్నారు *
“ఇండియా సువిశాలమైన దేశం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజా చైతన్యమూ, ప్రజా ఉద్యమమూ ఒకే స్థాయిలో కాక హెచ్చుతగ్గులతో వుంది. వ్యవసాయ సంక్షోభం కూడా విభిన్న తరహాల్లో వుంది. అదేసమయంలో పార్టీ పలుకుబడి, బలంకూడా వివిధ ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో వుంది. రైతాంగ ఉద్యమమూ అన్నిచోట్ల ఒకేరూపంలో అభివృద్ధి చేయడం కూడా సాధ్యంకాదు. పరిస్థితులు పరిపక్వం కాకుండా తిరుగుబాట్లు చేయడంగాని, దుస్సాహసిక చర్యలకు పూనుకోవడంగాని, నిన్సందేహంగా మానుకోవాలి అయితే అదే సమయంలో పాక్షిక సాయుధ గెరిల్లా పోరాట రూపంలో సాయుధ చర్యలను దేశంలో అన్ని (ప్రాంతాల్లో తిరుగుబాటు స్థాయికి చేరుకునేంతవరకూ ఏ నిర్దిష్టమైన ప్రాంతంలోనూ జరపరాదనడం పొరపాటు కాగలదు. అలా కాకుండా, ఉద్యమం అభివృద్ది చెందుతున్న ఈమంలో పాక్షిక సాయుధ గెరిల్లా పోరాటం రూపంలో అనేకచోట్ల సాయుధ పోరాటానికి సిద్ధపడాలనే డిమాండ్ రావచ్చు. ఉదాహరణకు, భౌగోళికంగా అనుకూలంగా వుండే ఒక పెద్ద ప్రదేశంలో రైతాంగ ఉద్యమం భూములను స్వాధీనపరచుకొనే స్థాయికి చేరుకోగలిగితే, ఆ స్వాధీనపరచుకోవడం ఎలా? స్వాధీనం చేసుకొన్న భూములను. సంరక్షించుకోవడం ఎలాగా అన్న సజీవమైన ప్రధాన సమస్య ముందుకు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో సహేతుకమైన కర్షక ఉద్యమాన్ని రైతు ఉద్యమ ఐక్యతను, అలాగే రైతాంగ జనసామాన్య సమైక్యతను ముఖ్యంగా బాగా అణచివేసి దోపిడీకీ గురవుతున్న పేద వర్గాలను ఆధారం చేసుకొని పార్టీ ధృడమైన నాయకత్వాన పాక్షిక సాయుధ పోరాటాన్ని ప్రారంభించవచ్చునని పార్టీ అభిప్రాయపడుతున్నది అయితే దానితోపాటు భూస్వాములను బహిష్కరించడం, మూకుమ్మడిగా కౌలు చెల్లించనిరాకరించడం, వ్యవసాయ కార్మికుల సమ్మె మొదలుగా గల పోరాట రూపాలను జోడించాలి ఈ పోరాటాలను సరైన పద్ధతుల్లో పార్టీ నిర్వహించగలిగిన పక్షంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో అది ఇచ్చే వూతం, కలిగించే ప్రభావం బ్రహ్మాండంగా వుండగలదు. వారి పోరాటాన్ని అత్యంత ఉన్నతస్థాయిలోకి తీసుకుని వెళ్ళగలదు.
“అలాంటి పాక్షిక సాయుధ పోరాటాలు అభివృద్ధి చెందనిచోట్ల వాటిని ముఖ్యంగా ప్రక్క ప్రాంతాల్లో సమ్మెలు, ప్రదర్శనల రూపంలో కార్మికుల కార్యాచరణను జోడించాల్. పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా అంచనావేసి, నన్నాహాలను అత్యంత నైపుణ్యంతో పూర్తిచేసి పాక్షిక సాయుధ పోరాటాలను అత్యంత ధైర్య సాహసాలతో నిర్వహించాలి. సాధించుకున్న విజయాలను అన్నివిధాలుగా సంరక్షించుకోవాలి. _
“ ఆదే సమయంలో శత్రువు మనపై పెద్దఎత్తున పారాటం జకగే ప్రాంతాలపై
17
లెనిన్, స్టాలిన్ మావోల బోదనలు శేంద్రీకరించిన పరిస్థితుల్లో పార్టీ పట్టువిడుపుల పద్ధతులను జాగ్రత్తగా అనుసరించాలి ఆలాకాని పక్షంలో పరాజయం పొందడమేగాక, మతం మనం నాశనమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.” అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత యీ మూడు దశాబ్దాల కాలంలో మనదేశంలోనూ, ప్రపంచంలోనూ కూడా ఎన్నో ఆర్థిక, రాజకీయపరమైన మార్పులొచ్చాయి అందువల్ల మన కార్యక్రమ అవగాహనలో కూడా మనం మార్పులు చేసుకోవలసివచ్చింది. 1961 కార్యక్రమంలో సామ్రాజ్యవాదానికీ, ప్యూడలిజానికి వ్యతిరేకమైన సంఘటనలో బడా బూర్జువా వర్షానికి కూడా స్థానం ఇవ్వాలనుకొన్నాం కాని యిప్పుడు భూస్వాములతో ఏకమైన సామ్రాజ్యవాదంతో మిలాఖత్ అయి బూర్జ్డువా-భూస్వామ్య రాజ్యానికి నాయకత్వం వహించుతున్న ఆ బడా బూర్జువా వర్గమే మనకు ప్రధాన శత్రువుగా తయారైంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టడంతో రైతాంగంల్లో దాదాపు 15-25 శాతంగా వున్న మధ్య ధనిక రైతాంగంపై భూస్వామ్య విధానాన్ని రద్దుచేయాలని, వ్యవసాయ కార్మికులకూ, "పేదలకు భూములను పంచిపెట్టాలన్న నినాదం పనిచేయడంలేదు. ఇప్పుడు భారత ప్రజల విషప్ణవోద్యమాభివృద్ధిని ప్రభావితం చేసే అనుకూల, ప్రతికూల శక్తులు అంతర్జాతీయంగా, జాతీయంగా ఏర్పడినాయి అందువలన యిప్పుడు భారత విప్లవ సాధనకు గల రెండు ప్రధాన ఆయుధాలైన సాయుధ తెలంగాణాపోరాటం, కార్మిక వర్గం తిరుగుబాటుల విషయంలో మరింత క్లిష్టమైన, మరింత కష్టతరమైన బాధ్యతలు ఏర్పడినాయి. అయితే రష్యా, చైనా విష్ణవానుభావాలను ఆధారంచేసుకొని కామ్రేడ్ స్టాలిన్ ఇండియాలాంటి దేశాలలో నిర్వహించే విప్లవాలు జయప్రదం కావాలంటే ఎలాంటి మార్పుకు అవకాశంలేని ఒక సూత్రాన్ని మాత్రం గట్టిగా చెప్పారు అదేమంటే, “కార్మిక- కర్షకుల మధ్య అత్యంత సన్నిహిత మిత్రత్వం ఏర్పడాలి ఆ మిత్రత్వ కూటమికి కార్మికవర్గ నాయకత్వం వుండాలి”. ఈ పరిణామాన్ని కామ్రేడ్ స్టాలిన్ ఈ క్రింది మాటల్లో వివరించారు " “కర్షకుల కోర్కెలను కార్మికవర్గం ధైర్యంగా బలపరుచుతూ ముందుకు రావడం ద్వారా మాత్రమే ఆచరణలో ఈ కార్మిక-కర్షక ఐక్యత నిర్మాణం కాగలదు. రైతాంగం సాగించే పోరాటాలకు కార్మికవర్గం ప్రదర్శనల, సమ్మెల ద్వారా ప్రత్యక్షంగా సంఘీభావాన్ని వెల్లడించాలి. ఈ ఐక్యతకు కార్మికవర్గ నాయకత్వం కేవలం కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం వల్లనేగాక, అన్నింటికీ మించిన కర్షక జనవాళి కోర్కెలను, పోరాటాలను తమ కార్యాచరణ ద్వారా, బలపరచడం ద్వారా మాత్రమే కార్మికవర్గ నాయకత్వం ఆచరణలో ఏర్పడుతుంది. అన్నివర్గాల కంటే కార్మికవర్గాన్నే కర్షకులు తమ సన్నిహితమైన మిత్రంగానూ, సహచరునిలా భావించుతారు. 18
వుచ్చలవల్లి మందరయ్య
అనేకమంది కార్మికులు గ్రామీణ ప్రాంతాలనుండే వస్తారు. అనేక రీతుల్లో రైతాంగం ఈ కార్మికులకు సన్నిహిత సంబంధ బాంధవ్యాలుంటాయి. కార్మికవర్గ కార్యాచరణ కేవలం అప్పటి పోరాటాలకేగాక, మన జాతీయోద్యమం చూపించినట్టుగా-ప్రక్కనేవున్న రైతాంగాన్ని ఉత్తేజపరుస్తుంది. వారిని మరింతగా తీవ్రతర స్థాయిలో చైతన్యపరిచి, నూతన రైతాంగ పోరాటాలను అభివృద్ధి పరుస్తుంది. ఇండియాలోని నేటి పరిస్థితులలో కొద్దిముందిగల దోపిడీదారులు మినహా అన్ని తరగతుల ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై వారికి ద్వేషభావం పెరుగుతుంది ఆహారం, రేషన్ కోతలు మొదలుగాగల సమస్యల పై కార్మికవర్గ సమ్మెలు అత్యంత శక్రివంతమైన ఆయుధంగా వినియోగపడతాయి
అవి మొత్తం ప్రజలనే ఉత్తేజపరుస్తాయి. వారి అసంతృప్తికి నిర్ధిష్టమైన రూపమేర్పడతుంది. ఆవిధంగా కార్యాచరణలో ఐక్యత యేర్చడి అత్యున్నతస్థాయికి ప్రజా ఉద్యమం" పెంపొందుతుంది. కార్మికవర్గం కేవలం తన కోర్కెల సాధనకేగాక, అసంతృప్తి చెందుతున్న అన్ని తరగతుల, వర్గాల ప్రజలు ముఖ్యంగా కర్షక జనావళి డిమాండ్ల కోసంకూడా అది
పోరాడుతూ, మొత్తం ప్రజాతంత్ర ఉద్యమ ప్రయోజనాల కోసం పోరాడే మొనగాడుగా నిలబడుతూ, విప్లవ ప్రజల నాయకుడుగా ముందుకువస్తుంది. ఆ విధంగా వారి విష్ణవ
సమైక్యతను నిర్మించుతుంది”
“అందువలన కార్మికవర్గంలో అలాంటి రాజకీయ చైతన్యాన్ని కలిగించడం పార్టీకి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం తనకు యావత్ ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత గలదనే భావాన్ని కార్మికవర్గానికి ఏర్పరచాలి. ఇప్పుడున్న కార్మికవర్గంలో గల అనైక్యతను అధిగమించాలి. ప్రధానమైన పరిశ్రమల్లోని కార్మికుల్లోని మెజార్టీని తన వైపుకు తిప్పుకోవాలి. ఫ్యాక్టరీ, వర్కుషాపు కమిటీల ప్రాతిపదికగా శక్తివంతమైన కార్మికోద్యమాన్ని నిర్మించాలి. అందులో ఉత్తమమైనవారినీ, బాగా అభివృద్ధి చెందిన వారినీ పార్టీలోకి చేర్చుకోవాలి. ఇదంతా జరగాలంటే కార్మికవర్గాలలో ఓపికతో నిరంతరం వినృతమైన రాజకీయ ప్రచారాన్ని సాగించాలి. కార్మికుల సత్వర నిర్దిష్టమైన డిమాండ్లకోసం జరిగే పోరాటాలకు నాయకత్వం వహించాలి బలమైన ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించాలి. ఐక్య కార్మికవర్గం మాత్రమే-తాను నాయకత్వం వహించాలనే చైతన్యపూర్వకమైైన పాత్రను నిర్వహించడం మూలంగానే కార్మికవర్గం జాతీయ సమైక్యతను నిర్మించగలుగుతుంది”.
“గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ అన్ని తరగతుల రైతాంగాన్ని - ధనిక రైతాంగంతో సహా వ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా ఉత్తేజపరచాలి. గ్రామసీమల్గో అత్యధిక మెజార్టీగా వున్న వ్యవసాయ కార్యికులను, పేదరైతులను పునాదిగా చేసుకొని ఫమైక్య ఉద్యమాన్ని నిర్మించాలి. వ్యవసాయ విప్లవానికి కీలక నినాదమయిన ఫ్యూడలిజాన్ని అంతమొందించటం, భూపంపిణీ ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈ మొత్తం దశలో పనిచేయవలసి వుంటుంది. ఇందుకోనం
19
లెనిన్ స్టాలిన్ మావోల బోధనలు ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి కౌలు తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు, ప్యూడల్ లెవీల రద్దు, వెట్టిచాకిరి రద్దు, వ్యవసాయ కార్మికులకు జీవనానికి సరిపడే వేతనాలు మొదలుగా గల సమస్యలపై నిర్ధిష్టమైన డిమాండ్లను రూపాందించవలసి వుంటుంది ఈ డిమాండ్ల ఆధారంగా ప్రజలను సమీకరించడానికి నాయకత్వం వహించాలి... దేశ వ్యాపితంగా అసంతృప్తి వున్నప్పటికీ - దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక రైతాంగ పోరాటాలు సాగినప్పటికీ, మొత్తం దేశంలోని రైతాంగ ఉద్యమం ఇంకా చాలా బలహీనంగానే వుంది. రైతాంగంలో ఇంకా అనేక తరగతులకు చెందినవారు పోరాటంలోకి రోవలసివుంది. ఇందుకు ప్రధాన కారణం సరైన నిర్మాణం లోపించడం, దృఢమైన నాయకత్వం లేకపోవడమూను. మన వ్యవసాయ కార్యక్రమాన్ని గురించి బాగా ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా ఈ బలహీనతను అధిగమించడం మన కర్తవ్యంగా భావించుకోవాలి సులభంగా అర్థం చేసుకోగల రీతిలో మన డిమాండ్లను రూపొందించుకోవాలి. వాటిని ఆధారం చేసుకొన్నప్పుడే విశాల ప్రాతిపదికపై ప్రజాకార్యాచరణను సాగించగలగడం సాధ్యమౌతుంది. నిత్యమూ ఓపికతో పనిచేయడం ద్వారా, పోరాటాలకు సరియైన నాయకత్వాన్ని లభ్యం చేయడం ద్వారా మాత్రమే వారి డిమాండ్లను సాధించగలం ఈ పోరాటాల క్రమంలోనే రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలను విరివిగా నిర్మించుకోవాలి ఇవి గ్రామసీమల్లో నాయకత్వ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి. శత్రువుదాడులకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాన్ని సంరక్షించుకొనేందుకు సమరశీల, చైతన్యయుతమైన రైతులను వలంటీరు దళాలుగా నిర్మించుకోవాలి. ప్రజలు బాగా చైతన్యవంతులైనారని అతిశయోక్తిగా ఎంచి, పెద్దపెద్ద నినాదాలతో కార్యాచరణకై ఫలితంలేని పిలుపులివ్వడం పట్ల కామ్రేడ్ స్టాలిన్ హెచ్చరించారు ఇలాంటి పిలుపులకు ప్రజల్లో అప్పుడున్న చైతన్యస్థాయికి ఎలాంటి సంబంధం లేకుండా వుంటుందని ఆయనన్నారు అదే సమయంలో బలహీనత, ప్రజా ఉద్యమంలో అనైక్యత, శత్రువు దాడి వగైరాలను చూసి పట్టణాల్లోనూ, గ్రామసీమల్లోనూ అన్ని రకాల సమరశీల పోరాటాలను మానుకోవాలనే ధోరణిని గురించి కూడా ఆయన హెచ్చరించారు. కొమేడ్ స్టాలిన్ ఇంకా ఇలా చెప్పారు “ప్రజల అసంతృప్తికి తగ్గట్లు ప్రజా ఉద్యమం యింకా పెరగలేదు ఇది కేనలం ప్రభుత్వ నిర్చధ చర్యలవల్లనే జరిగిందికాదు. ప్రధానంగా ఇదంతా పార్టీ బలహీనత వలన, అభ్యుదయ శక్తులలో వున్న అనైక్యత మూలంగానే జరుగుతున్పది. అందువల్ల కార్మికవర్గ ఐక్యతను సాధించడం, నిర్దిష్ట కార్యక్రమం ఆధారంగా ప్రజాశక్తులను ఐక్యం చేయడం; నాయకత్వాన్ని ఆందించడావికి ఒక (ప్రజాపార్టీగా అభివృద్ధి చెందడం - ఇవీ పార్టీ తక్షణం నిర్వహించవలసిన కీలకమైన బాధ్యతలు అప్పుడే ప్రజా ఉద్యమాన్ని విస్తరింపచేసి, దాన్ని 20
వుచ్చలవల్లి సుందరయ్య కామ్రేడ్ మావోకు జోహార్లు ! చైనా విప్లవానికి జేజేలు |!
(చైనా కమ్య్వూనిన్దుపార్జీ అధినేత కామ్రేడ్ మావో చనిపోయినవుడు కామ్రేడ్ నుందరయ్యగారు ఎమర్గన్సీ మూలంగా రవాన్వజీవితం గడువుతూ వనిబేన్తున్నారు. ఈ వ్యాసాన్ని ఆయన నవ్రత్వేకంగా ్రజూళ్త్తీలో వ్రచురణ కోనం అజ్జాతవానం నుండీ వంపించాడు)
కామ్రేడ్ మావో 1883 డిశంబరు 26వ తేదీన జన్మించారు 1976 సెప్టెంబరు 8వ తేదీ రాత్రి 2 గంటల 10 నిమిషాలకు తన 89వ సంవత్సరంలో చనిపోయారు. 1921 జూలై ఆరంభంలో షాంఘై నగరంలో చైనా కమ్యూనిష్టు పార్టీని ప్రారంభించిన పునాది పురుషులలో ఆయన ఒకరు.
1927 - 1949ల మధ్య చైనాలోని భూస్వామి వర్గాలకు బ్యూరాక్రటిక్ బడా బూర్జువా వర్గాలకు ప్రతినిధిగా పాలనాధికారం సాగిస్తూ వచ్చిన కామింగ్టాంగ్ ప్రభుత్వానికి
- చియాంగ్ కై షేక్ ప్రభుత్వానికి, వ్యతిరేకంగాను ఇంగ్లీషు, జపాను, అమెరికా సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగాను సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. చైనాలో జనతా (ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని 1949 అక్టోబరు 1వ తేదీన, చైనారాజధాని పెకింగ్ నగరంలో కమ్యూనిస్ట్రపార్టీ నాయకత్వాన నెలకొల్పారు " "
కామ్రేడ్ మావో నాయకత్వం క్రిందనే గత 27 సంవత్సరాలుగా 23 కోట్ల చైవా ప్రజలు తమ దేశంలో సోషలిన్స సమాజ నిర్మాణున్ని కాపాడుతూ వచ్చారు వేడు ప్రపంచంలో పెద్ద రాజ్యాలలో మూడవ రాజ్యంగా, అమెరికా, సోవియట్ యూనియన్ల తర్వోత బలిష్ట రాజ్యంగా చైనా అభివృద్ధి చెందింది
ఈ సంవత్సరంలో చైనా ప్రజల విప్లవ త్రిమూర్తులు - ప్రధాని కామ్రేడ్ చౌ = ఎన్
- లై జనవరి 3వ తేదీన, చైనా ప్రజా విప్లవ నాయకుడు కామ్రేడ్ ఛూటే జూలై 6వ తేదీన, ఇప్పుడు సెష్టెంబర్ 8వ తేదీన చైనా వివ్లవ రధసారధి, చైనా కమ్యూనిస్టుపార్టీ అధ్యక్తుడు అయిన కామ్రేడ్ మావో - ముగ్గురూ మరణించారు చైనా కమ్యూనిస్టుపార్టీ నిర్మాతలు, చైనా వివ్లవ విజయ నాయకులు ముఖ్యులు చాలామంది యిదివరకే 80 నంవత్చరాల వయోనవృద్ద్ధులై చైనా సోషలిస్టు సమాజ నిర్మాణంలో కార్యరంగంలోనే వుంటూ మరయెదారు. వీరందరి నాయకత్వం క్రింద ముఖ్యంగా కామ్రేడ్ మావో వాయకత్వం ్రీంద "పెరిగిన అనుభవజ్ఞులైన నూతన తగమే-వేడు బైవా ధ్రజలకు వాయకత్వం వహిమ్తా ముండుకు వడుస్తోందె.
పైకే
_ లెనిన్ స్టాలిన్ మావోల బోదనలు మార్క్సిస్టు - లెనినిస్టు సిద్ధాంతాన్ని, మార్కిజం-లెనినిజం చైనా పరిస్థితులకు అనువర్తింపజేసి, చైనా విప్లవాన్ని విజయవంతం చేయడంలో కొత్త మార్గాలు చేపట్టవలసివచ్చింది. వెనుకబడిన ఆర్ధికవిధానాలతో, అర్థవలస దేశంగా, నూటికి 80- 90మంది- ప్రజలు గ్రామసీమలలో వ్యవసాయంమీద నివసిస్తూ జమీందాకీ కాలపు భూస్వామ్య దోపిడీకి గురి అవుతూన్న దేశంలో సోషలిస్టు సమాజ నిర్మాణం సొగించడంలో కొన్ని కొత్త పుంతలు, మార్గాలు త్రాక్కవలసివచ్చింది ఈ సందర్భంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కొన్ని భేదాభిప్రాయాలు రావడం, కొంతమందిని ప్రక్కకు నెట్టడం జరిగింది కొన్ని పారపొట్టు, తప్పులు కూడా జరిగినాయి అంటే ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు. అయితే ప్రతిఒక్కరూ, ముఖ్యంగా కార్యరంగంలో నున్న ప్రతి కమ్యూనిస్టు గమనించాల్సింది, దృష్టిలో పెట్టుకోవలసినది కామ్రేడ్ మావో నాయకత్వం క్రింద చైనా విష్ణవ విజయపంథాలో ఆ కమ్యూనిస్టుపార్టీ అవలంభించిన ప్రత్యేక విధానాలు అందులో ఏవి? ఏ మోతాదున, ఎంతవరకు మారుతూవున్న ప్రపంచ పరిస్థితుల్లో తమతమ దేశ పరిస్థితులకు, విప్లవ విజయసాధనకు ఆచరణ యోగ్యమో పరిశీలించుకోవడం ప్రతి కమ్యూనిస్టుపార్టీ కర్తవ్యం. మావో ప్రత్యేకంగా ముందుకు తెచ్చిన విషయాలు మార్క్సిజం-లెనినిజం చైనా పరిస్థితులకు వర్తింపజేసి, చైనా విప్లవ విజయాన్ని సాధించడానికి కామ్రేడ్ మావో ముందుకు తెచ్చిన ప్రముఖ ్రత్యేక విషయాలు ఏమిటి?
- దైనా జనాభాలో నూటికి 80-90 మందిగా గ్రామసీమలలో జమీందారీ కాలపు భూస్వామ్య దోపిడీకి గురవుతూవున్న రైతాంగాన్ని విస్లవ పోరాటంలో శక్తివంతంగా మొదటినుండి ఆఖరివరకు కార్యదీక్షతో చురుకుగా పాల్గానేటట్టు చేయడం, రైతాంగం ఆ విధంగా పాల్గానకపోతే కార్మికవర్గం, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం క్రింద పట్టణాలలో సార్వత్రిక సమ్మె సాయుధ తిరుగుబాటులతో పట్టణాలను ఆక్రమించుకోనారంభించినా విప్లవ విజయం పొందజాలదని మావో గ్రహించారు 1925-27ల మధ్య కాంటన్, షాంఘై, పూహాన్ తదితర నగరాలు కార్మికుల హస్తగతమయినా సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష సహాయంతో చియాంగ్‌కై - షేక్ కొమింగ్టాంగు ప్రభుత్వం వారిని క్రూరంగా అణచివేసి, వేలాదిమంది కార్మికు కమ్యూనిస్టు పోరాట యోధులను మారణహోమంపాలు చేసింది. అప్పుడు గ్రామసీమలలో శత్రువుకు సులభసాధ్యంకాని పర్వతాలు, అడవులు, జలాశయాలున్న ప్రాంతాలను ఆధారం చేసుకొని రైతాంగ గెరిల్లా పోరాటాలు, విముక్తి ప్రాంతాలు, విముక్తి సైన్యాలు నిర్మించుకోవడం, వాటికి పట్టణ పారిశ్రామిక కార్మికవర్గం తోడునీడగా నిలబడి, వెన్నెముకగా పనిచేసేటట్లు చేయడం చైనా విష్ణవం యొక్క ప్రత్యేకత న 22
వుచ్చలవల్లి మందరయ్య (గ్రామీణ ప్రజల వర్గీకరణ ప్రాముఖ్యత
(గామసీమలలో రైతాంగ పరిస్థితులు, వారిలో వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు ఎవరు, భూస్వాములు ఎవరు అనేది సరిగా అంచనా వేయాలని అందుకు జాగ్రత్తగా అధ్యయనం చేయాలని పదే పదే వివరించారు. రైతాంగపోరాట పాఠాలను పార్టీ సభ్యులకు వివరించేవారు 1925-49ల మద్య వివిధ పరిస్థితులలో రైతాంగ సమస్యలలో ఏ నినాదాలు తీసుకోవలసినది, భూమి పంపక నినాదాలు ఏ దశలో, ఏరూపంలో, ఏ మోతాదులో తీసుకోవలసినది చాలా జాగ్రత్తగా వీవరించారు. భూస్వాములను, అందులో ప్రజలను మరింత అధికంగా పీడించేవారిని మొదట వేరుచేసి వ్యవసాయ కార్మికులు, 'పేదరైతులు తదితర గ్రామీణ పేదలు వారితో ఏ విధంగా పోరాడవలసిందీ, మధ్యతరగతి రైతులను ఏ రీతిగా తమతో సన్నిహిత మిత్రులుగా చేసుకోవలసినదీ, ధనిక శితును కలుపుకొని రావడానికి ఏ రీతిగా కృషిచేయవలసినదీ, ఎప్పుడు ఏ మేరకు వారితో ఘర్షణ పడవలసిందీ చాలా వివరంగా ఉద్బోధించారు.
ఆర్థికంగా రైతాంగంలోని వర్గవిభజనను చూడటమేగాక, రాజకీయంగా కూడా భూస్వామ్యవర్గ కుటుంబాలనుండి, ధనిక రైతుల కుటుంబాలనుండి, విప్ణ్లవపోరాటాల్లో పాల్గొంటూ వచ్చిన కుటుంబాలు, రెడార్మీచైనా ప్రజాసైన్యంలో పాల్గొన్న సభ్యుల కుటుంబాలు వర్గ స్వభావాన్ని ఏ రీతిగా అంచనా వేయవలసివుంది, వుట్టిన వర్గ స్వభావాన్ని వదిలివేసేది వివరించారు.
ఈ విషయాలన్నీ మార్కిజం-లెనినిజం సూత్రాల ననుసరించి చైనా దేశంలోని పరిస్థితుల కనుగుణంగా అనువర్తింపజేశారు అధీన దేశాలలో జనాభాలో అత్యధిక భాగం గ్రామసీమలలో నివసిస్తూ ఉన్న దేశాలలో, ఆర్థికంగా, పారిశ్రామికంగా వెనుకబడి వున్న దేశాలలో రెతాంగం ్రత్యేకపాత్ర ఆ దేశాలలో ఆ రైతాంగాన్ని కార్మికవర్గ నాయకత్వం ఎ గ్రతిగా ముందుకు తీసుకురావలసి వుండేది కామ్రేడ్ మావో వివరించారు. ఆ రీతిగా చైనాలో సాధించి విష్టవాన్ని విజయవంతంగా నడిపారు
చైనా విప్లవానికి తోడ్పడిన పరిస్థితులు
2 చైనా వి్లవంలో రెండవ ప్రత్యేక అంశం గ్రామసీమలలో దీర్ధకాలం 20-25 నంవత్సరాల కాలంపాటు రైతాంగ సాయుధ పారాటం ఇది గెరిల్లా పోరాట పద్ధతులలో ప్రారంభమై, గెరిల్లా ప్రాంతాలు, విముక్తి ప్రాంతాలు, సాయుధ సేనా వాహినులేర్చరచుకుంటూ శతు సైన్యాలను ఆఖరుకు ఓడించి విస్ల్ణవ విజయాన్ని సాధించడం. ఈ రైతాంగ సాయుధ పోరాటానికి అన్ని దశలలోనూ పారిశ్రామిక కార్మికవర్గం అండదండగా ఉండటమే గాకుండా, అవసరము వచ్చినప్పుడల్లా కార్మికదళాలు ఈ విముక్తి సేనలతో చేరి వానిని పటిష్టవంతంగా చేస్తూవచ్చాయి. "
23
సామ్రాజ్యవాదులు ప్రత్యక్షంగా కొమింగ్‌టాంగ్ ప్రభుత్వానికి అనుకూలంగా పాల్గొనడం వలన, జపాను సామ్రాజ్యవాద దురాక్రమణ చైనాలో సగభాగాన్ని 1931-41 ల మధ్య ఆశక్రమించుకోవడం వలన సామ్రాజ్యవాద కూటమి బలం కుదించుకొనిపోయి, చైనా వివ్లవశక్తులది పైచేయి కావడానికి గల పరిస్థితులు అంతర్జాతీయంగా వచ్చేవరకు పోరాటం దీర్ధక్షాలం సాగవలసివచ్చింది రెండవ ప్రపంచయుద్ధంలో ఫాసిస్టు కూటమి ఓడిపోవడం, సోవియట్ యూనియన్ మంచూరియాలో జపాను సేనలను ఓడించి చైనా ప్రజా సైన్యాలకు వూర్తిగా యుద్ధ సామగ్రి అందజేయడం, సామ్రాజ్యవాద దేశాలు తమ సైన్యాలను (ప్రత్యక్షంగా దించలేని పరిస్థితులు చైనా విప్లవ అంతిమ విజయానికి తోడ్పడ్డాయి ఆ పరిస్థితిని ఉపయోగించుకోగల విప్ణవశక్తులను, కమ్యూనిస్టు పార్టీని నిర్మించుకుంటూ, దానికి కావలసిన సైనిక నిర్మాణాన్ని, గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని సాయుధ పోరాట వ్యూహాన్ని సూత్రీకరణలను కామ్రేడ్ మావో కామ్రేడ్ ఛూటేతో కలిసి రూపొందించారు. విప్లవ విజయసొాధనలో మావో అద్భుత కౌశల్యం -_ 8 మూడవ ప్రత్యేక అంశం కామ్రేడ్ మావో జనతా ప్రజా ఐక్యసంఘటన నిర్మించడానికి, కాొమింటాంగు ప్రభుత్వానికి వ్యతిరేకంగాను, ఆ తర్వాత జపాను దురాక్రమణకు వ్యతోేకంగాను, జపాను ఓటమి తర్వాత తిరిగి చియాంగ్ కై షేక్ ప్రభుత్వాన్ని ప్రజల నుండి వేరుపరుస్తూ తీసుకున్న ఎత్తుగడలు, నినాదాలు, కార్యాచరణ ప్రతి విప్లవకారునికి గుణపారాలు ఆయా సందర్భాలలో అప్పటి వాస్తవిక పరిస్థితిని అంచనా వేయడీంలోను, విప్ణవశక్తుల శత్రువు బలాబలాలను పరిశీలినలోకి తీసుకొన్న పద్ధతిలోను, వాటిని ఎంతో సులభ గ్రాహ్యాలుగా వినరించడంలోను కామ్రేడ్ మావో అద్భుతమైన కౌశల్యాన్ని చూపించాడు కామ్రేడ్ మావో మరోవిషయంలో కూడా చైనాలో సోషలిస్టు సమాజ నిర్మాణంలో, సోషలిన్టు మానవుడ్ని అభివృద్ధి చేయడంలో కొత్త పద్ధతులు త్రాక్కారు 80 కోట్ల ప్రజలకు పనిచూపడం, తిండి, గుడ్డు చదువు, మందులు, ఇంటి వసతి, కనీస సాంఘిక సంక్షేమ భీమా కలుగజేయాలంటే ఏటేటా ఎంత అదనంగా ఉత్పత్తి పెరగవలసివుందో లెక్కించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆధునిక యంత్రాలతో, భారీ పరిశ్రమతో దేశాన్ని శక్తివంతమైన ఆధునిక పారిశ్రామిక దేశంగా మార్చడానికి 50 ఏండ్లయినా పడుతుందని కామ్రేడ్ మావో, చైనా కమ్యూనిస్టు పార్టీ అంచనావేశారు. అంటే యింకా మరో 26 సంవత్సరాలు 20వ శతాబ్బాంతానికి గాని యిది సాధ్యంకాదు అందుచే సోనియట్లోను, తూర్చుయూరపు రాజ్యాలలోను అవలంభించినట్లు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ, సోషలిస్టు సమాజ నిర్మాణానికి పురోగమించడానికి బదులు, వ్యవసాయాన్ని పునాదిగా చేసుకొంటూ అత్యవసరమైన కీలక పరిశ్రమలలో మాత్రమే భారీ యంత్రాగారాలను, విసృత పారశ్రామిక ఫ్యాక్టరీలను నెలకొల్పుతూ సోషలిస్టు సమాజం వైపుకు నడుస్తున్నారు 24
వ్రుచ్చలపల్లి నుందరయ్య నైతిక ప్రోత్సాహానికి ప్రాధాన్యత
చైనాలో సోషలిస్టు సమాజ నిర్మాణానికి, దానికి కావలసిన ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గ్రామసీమలలోను, పట్టణ పరిశ్రమలలోను, సోవియట్ యూనియన్‌లోను, తూర్పు యూరప్ _రాజ్యాలలోవలె ఆర్థికంగా మరిన్ని సౌకర్యాలు కలుగచేసే పద్ధతికి ప్రాధాన్యత యివ్వడంలేదు. కొద్దిగా ఆర్థిక ప్రోత్సాహమిస్తూ ప్రధానంగా తనతోటి మానవుని యెడల, నమాజాభివృద్ధి యెడల తన కర్తవ్యాన్ని పూర్తి చేయాలనే నైతిక ప్రోత్సావానికి (ప్రాధాన్యత యిస్తున్నారు. సొంత ఆర్ధిక ప్రయోజనాలనే ప్రధానంగా పెట్టుకొని పనిచేయడం తప్పుగా చైనా ప్రజలు చూస్తున్నారు. దీనివలన ఆదాయాలలో తారతమ్యాలు తక్కువగా వుంటున్నాయి గ్రామసీమలకు - పట్టణ ప్రజలకు మధ్య, కాయకష్టం చేసేవారికి- మేధావులకు మధ్య తారతమ్యాలు తక్కువగా వున్నాయి శక్తికొలది పనిచేయాలి. ఇతరుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తన సాంత అవసరాలను పరిమితం చేసుకోవాలి అనే చైతన్యంతో ముందుకుసాగుతూ, కమ్యూనిస్టు సమాజం వైపుకు నడుస్తున్నారు.
మార్కు - ఎంగెల్సు సిద్ధాంతాలను ప్రపంచ సామ్రాజ్యవాద దశకు రష్యాలోని వాస్తవిక పరిస్థితులకు వర్తింపచేసి సోషలిస్టు విప్లవాన్ని లెనిన్ సాధించారు. పెట్టుబడిదారీ సమాజంలో మొదటి గండికొట్టి మానవజాతి చరిత్రలో మొదటిసారిగా దోపిడీ వ్యవస్థలేని నూతన సోషలిస్టు సమాజాన్ని ప్రారంభించారు.
ఆతర్వాత కామ్రేడ్ స్టాలిన్ 30 ఏండ్లు సోవియట్ కమ్యూనిస్టుపార్టీ నాయకుడుగా సోషలిస్టు సమాజాన్ని రష్యాలో - ప్రపంచంలో ఏకైక రాజ్యంలో నిర్మిస్తూ, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి తోడ్పడుతూ, రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిస్టు యుద్ధ కూటమిని ఓడించి, సోషలిస్టు విప్లవాలు తూర్ప్చుయూరపు రాజ్యాలలోను, తూర్పు ఆసియా, చెనాలలోను విజయం పొందడానికి తోడ్పడ్డారు. _ వ... కామ్రేడ్ మావో మార్కిజం - లెనినిజం, కామ్రేడ్ స్టాలిన్ సూచనలను చైనా పరిస్థితులకు వర్తింపచేసి 80 కోట్ల ప్రజలు గల చైనాలో మొదటిసారిగా వలస, అర్ధవలన ప్రపంచంలో సోషలిస్టు విప్లవాన్ని విజయవంతంగా చేసి ప్రపంచ సోషలిస్టు విప్లవ పరిమాణంలో మరో నూతన దళ ప్రారంభించారు. మానవజాతి చరిత్రలో లెనిన్ నాయకత్వం క్రింద విజయవంతమైన సోషలిస్టు సోవియల్ విప్ణవానంతరం చైనా విప్లవం రెండో మహా విష్లవం
నూతన అనుభవాలు
ఈ విప్ణవ విజయానికి అనుసరించిన మార్గాలు, విషప్ణవ పాఠాలు, అదే విధంగా వనుకబడిన కోటానుకోట్ల జనాభాగల దేశాలలో సోషలిస్టు సమాజ నిర్మాణంలో అనుసరిస్తున్న క్రొత్తపంధాలు, వాని పారాలు ప్రతి కమ్యూనిస్టుకు, ముఖ్యంగా వెనుకబడిన దేశాలలోని విప్లవశక్తులకు నూతన అనుభవాలను ఇస్తూ వున్నాయి. వీటినికూడా దృష్టిలో పెట్టుకొని
25
లెనిన్, స్టాలిన్ మావోల బోదనలు మార్క్సిజం - లెనినిజాన్ని ప్రపచంలో నేటి నూతన పరిస్థితిలో ఆయా దేశ పరిస్థితులకు అనువర్తింపచేసుకొని అవసరమయిన విధానాలు, ఎత్తుగడలు, అవలంబించినప్పుడే విష్ణవ విజయాలకు, సోషలిస్టు సమాజ నిర్మాణానికి పురోగమించడం సులభమవుతుంది అయితే నేటి ప్రపంచ పరిస్థితులలో అమెరికా సొఘ్రాజ్యవాదాన్ని ఏ రీతిగా ఎదుర్కోవాలి, జాతీయ విముక్తి పోరాటాలకు ఏ రీతిగా తోడ్పడాలి, వివిధ కమ్యూనిస్టుపార్టీల మధ్య సమానసంబంధాలు ఏ రీతిగా అమలుచేయాలి, తదితర విషయాలలో సోవియట్ కమ్యూనిస్టు పార్టీతో భేదాలు వచ్చాయి. సోవియట్ రష్యా చైనాకు అణు ఆయుధ రహస్యాలను చెప్పుతానన్న ఒడంబడికను రద్దుచేసింది చైనా నుండి తన సాంకేతిక నిపుణులను-వారు నిర్మిస్తున్న ఫ్యాక్టరీలు అసంపూర్తిగా వున్నా ఉపసంహరించడం జరిగింది మరోప్రక్క అమెరికా సామ్రాజ్యవాదులు చైనాను కవ్విస్తూ, చుట్టముడుతున్నారు వియత్నాంలో, ఇండోచైనా దేశాలలో, ధాయిలాండ్‌లో, ఫిలిప్పైన్స్‌లో, తైవాన్‌లో - చియాంగ్ కై షేక్ ప్రభుత్వానికి, జపానులో, దక్షిణకొరియాలో తమ స్థావరాలు ఏర్పరచుకొని, సోషలిస్టు చైనాపై దురాక్రమణకు సర్వసన్నాహాలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితులలో చైనా స్వయంశక్తిమీదనే ఆధారపడి తన ప్రజల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్పుకుంటూ తమ ఆయుధశక్తిని - అణు అయుధాలు, బండాంతర రాకట్టులను తయారుచేసుకుంటూ, ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగవలసి వచ్చింది. శకపురుషుడు మావో సోవియట్ యూనియను, సోషలిస్టు చైనాల మధ్య విభేదాలు ప్రపంచ సోషలిస్‌ట శిబిరంలో చీలికకు దారితీసింది ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో ఐక్యతలేకుండా పోయింది. ప్రపంచ వివ్లవోద్యమానికి యిది ఎంతో కష్టం కలుగజేస్తూవుంది సోవియట్ కమ్యూనిస్టుపార్టీ రివిజనిస్పు ధోరణులను ఎదుర్కోవాలని. బయలుదేరిన చైనాపార్సీ తానే అతివాద పెడధోరణులను చేబట్టి సోవియట్ యూన్సియన్ను సోషల్ సామ్రాజ్యవాదంటూ అంతర్జాతీయ సమస్యలలో పారపాటు ఎత్తుగడలను అవలంభిస్తూంది. భేదాభిప్రాయాలున్నా, ఈ చీలికలున్నాప్రపంచ సోషలిస్టు ఉద్యమం, విప్లవోద్యమం, రోజురోజుకు మరింతగా, పైచేయిగా పెరుగుతూనే వున్నాయి. సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల శక్తి రోజురోజుకు మరింతగా క్షీణిస్తూనే వృంది కొన్ని లోపాలున్నా కామ్రేడ్ మావో చైనా ప్రజల విప్ణ్లవవిజయ సారధి. ఆసియా తదితర అధీన దేశ ప్రజలకు ఒక నూతన విప్ణవపంధా చూపాడు. మార్కిజం-లెనినిజాన్ని అధీన దేశ ప్రజలు తమ దేశ పరిస్థితులకు వర్తింపజేసుకొని విప్లవ విజయాలకు వురోగమించగలరని చూపాడు. ప్రపంచసోషలిస్టు సమాజ నిర్మాణంలో మార్కు, ఎంగెల్బు, లెనిన్, స్టాలిన్‌లతో పాటు కామ్రేడ్ మావో ఒక శకపురుషుడుగా నిలబడిపోతాడు కామ్రేడ్ మావోకు యివే మన జోహార్లు ! చైనా, విపష్లవానికివే మన జేజేలు 26
వుచ్చలవల్లి సుందరయ్య
నా చైనా సందర్శన విశేషాలు
(ైనా కమ్యూనిన్టుపార్టీ, వైసా వ్రభుత్వోల అన్వోనం పై నుందరయ్యగారు 984 అక్టోబరులో బైనా నందర్భిం్దబారు. ఆరోగ్య వరిస్థితిని గురించి అక్కడ డాక్టర్లు వూర్తిగా వరీక్ల జరిన నలనోలివ్స్పారు. నుందరయ్యగాడు అక్కడున్నవుడు చైనా తమ్యూనిన్దుపార్జీ వ్రధాన కార్వదర్శితో నవో అనేకమంది వైనాపార్ధీ నాయకులతో నంఖాషవణలు జరిపారు. అంతకుముందు 1957లో బైనా .ళమ్వూనిన్దుపార్ధీ 8వ మవోనభకు అనాటి ఉమ్మడి కమ్యూనిన్దుపార్హీ వ్రతినిధివర నభఖ్యులుగా దైనా నందర్భించాడు. 1984లో తన దైనా నందర్శనకు నంబంధించిన విశేషాలను గుళించి నుందరయ్యగారు (వ్రజూక్తక్తి'కి వ్రత్యేకంగా వ్రాసిన వ్వానమిది.,
మద్రాస్‌లో వైద్యం చేయించుకొన్న తర్వాత క్రమంగా కోలుకుంటున్నాను మరికొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని, చైనానుండి వచ్చి వుండిన ఆహ్వానం మేరకు ఆ దేశంలో విశ్రాంతి తీసుకోమని మనప్పార్టీ నాయకత్వం నన్ను కోరుతూ వచ్చింది కానినా ఆరోగ్య పరిరక్షణకే గాక చైనాలో పర్యటించి ఆ దేశ ప్రజల స్థితిగతులను నారు సాధించిన విజయాలను పరిశీలించేందుకు తగిన శక్తి వచ్చిన తరువాత అక్కడికి వెళ్ళాలని వాయిదా వేస్తూ వచ్చాను కాని అక్టోబరు 1వ తేదీన-జరుగుతున్న చైనా ప్రజాతంత్ర విప్ణవపు 35వ వార్షికోత్సవ సంద ర్భంగా తమదేశం రావలసిందిగా చైనా నాయకత్వం నుండి మరొక అహ్వానం అందింది..
అఆ ఆహ్వానం మేరకు ఈ సంవత్సరం. సెప్టెంబరు 22న విజయవాడలో
బయలుదేరాము. ఢిల్లీ నుంఢి 28న దిఎయిర్ ఫ్రాన్స్ విమానంలో బయలుదేరి ఆ సాయంకాలం 5 గంటలకు బీజింగ్ చేరాము. చైనా నాయకులు నా ఆరోగ్య విషయంలో జూగభత్తకోనం ఒక డాక్టరును కూడా వెంటతీనుకురమ్మని కోరారు. కొని నా ఆరోగ్యం కొలత మెరుగైవుండడం మూలంగా డాక్టర్‌ను తీసుకెళ్ళలేదు నాకు తోడుగా నాశ్రీమతి లీల వచ్చింది.
బీజింగ్ విమానాశ్రయంలో చైనా కమ్యూనిస్టుపార్టీ కేంద్రకమిటీ అంతర్జాతీయ సంబంధాల నమన్వయ శాఖ అధ్యక్షులు కామ్రేడ్ షీలీ-జెన్, ఉపాధ్యక్షులు కామ్రేడ్ జూలియాంగ్, ఆ శాఖ కార్యకర్తలు కామ్రేడ్ షూ-జన్-హౌ, షూ-లీ-పెంగ్లు స్వాగతం చెప్పారు. నా ఆరోగ్య విషయం వారికి ముందే తెలుసు కాబట్టి చక్రాల బండి (వీల్ చైరొతో విమానందాకా వచ్చారు. ఎంత వారిస్తున్నా పట్టుబట్టి ఆ బండిలో కూర్చోబెట్టి కొారుదాకా తీసుకొనివచ్చారు. ఒక ప్రత్యేక అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు. మేము చైనాలో
2
ఉన్నంతకాలం కామ్రేడ్ షూ-జన్-హౌ, షూ-ల్సీలు మాతో వుండ్వేఏర్పాట్లు చేశారు భోజన ఏర్పాట్లు ప్రత్యేకంగా చేశారు మా వాడక్తొనికి ప్రత్యేశంగా ఒక కారు కేటాయించారు.
బీజింగ్ చేరిన మరునాడే నన్తూ లీలను వైద్యపరీక్షల కోసం బీజింగ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ బెటొపేషెంట్ శాఖలో డాక్టర్ 'పాన్-షీ-యంగ్ నన్ను పరీక్ష చేశారు మూత్రపిండాల పరిస్థితి, కాలేయం స్ర్కీనింగ్ చేశారు. రక్తపరీక్షలు, ఇతరపరీక్షలు పూర్తచేశారు మెదడు' స్ర్కీనింగ్ కూడా చేశారు ప్రస్తుతానికి 'మూత్రపిండాలు' స్థిమీతంగా వున్నా, జాగ్రత్తలు “తీసుకోవలసి వుందని చెప్పాకు. భారతదేశంలో నిర్ణయించిన వైద్యాన్ని కొనసాగ్గించాలని చెప్పారు. దానితోపాటు చైనా మూలికా లేహ్యాన్ని"భస్మాలను,-మరికొన్ని విటమిన్లను ఇచ్చారు
వార్షికోత్సవ విందు
సెస్టెంబర్ 30న 35వ వార్షికోత్సవ విందు ఏర్పాటైంది ఇది ప్రభుత్వం ఇచ్చిన విందు ఉీపుల్స్ హాలులో జరిగింది వివిధ దేశాల నుంచి వచ్చిన ఆహ్వానితులను, ఆయా దేశాల రాయబారులను ఈ విందుకు ఆహ్వానించారు. చైనాపార్టీ, ప్రభుత్వ ప్రముఖ నాయకులు ఈ విందులో పాల్గొన్నారు. ఆ విందుకు మమ్మల్ని ఆహ్వానించారు ప్రత్యేక శ్రద్ధతో మాకు" ఏర్పాట్లు చేశారు విందు జరిగే హాలు చాలా పెద్దది అక్కడ కూడా నడవనీయకుండా ఒక చక్రాల కుర్చీలో ప్రత్యేకమైని గదికి తీసుకువెళ్ళారు. చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కౌర్యదర్శి కామ్రేడ్ హూ-యావో-బాంగ్, చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్ అధ్యక్షులు కామ్రేడ్ లీ-షియాన్, చైనా ప్రజ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ .అధ్యక్తుడు పెంగ్-చెన్, బౌ-ఎన్-లై సతీమణి మేడమ్ డెంగ్:ఇంగ్-చావో మమ్మల్ని కలిసి" స్వాగతం చెప్పారు విప్ణవవార్సికోత్సవం సందర్భంగా వచ్చినందుకు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు" ఇందుకు-తాముఏరితో ఆనందపడుతున్నట్లు పేర్కొన్నారు.
మాతోపాటు మా టేబుల్లో కామ్రేడ్ లీ-యాన్ భోంచేశారు. ఆయన 80 ఏండ వయోవృద్మడు, లాంగొమార్చ్లో పాల్గొన్న యోధుడు. మువరుసలో చైనా కమ్యూనిస్టుపార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి వర్గ. సభ్యులు కామ్రేడ్. హూషిలీ. కూడ్నా మాకు ప్రత్యేకంగా వార్చికోళ్స్ళవ్న విప్లవ అభినందనలు అందచేశారు. మా రాకకు హర్దామోద్తాలు వ్యక్తంచేశారు.
విందు సందర్భంగా ప్రధానమంత్రి కామ్రేడ్ జావో-జియాంగ్ స్వాగతోపవ్యాసం యిచ్చారు .
“ప్రపంచంలోని ఐదు ఖండాల్లో వున్న వివిధ దేశాలనుండి విచ్చేసిన మ్రూ గౌరవనీయ అతిధులకు బైనా ప్రభుత్వం, చైనా ప్రజల తరపున మా హృదయ పూర్వకస్వాగతం చెవుతున్నాము. చైనా విప్లవ కర్తవ్యం పట్ల, పునర్నిర్మాణం పట్ట మా విదేశీ మిత్రులంతా వ్యక్తం చేసిన సానుభూతికి, ప్రకటించిన మద్దతుకు మేమెంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ”
“పురాతన వైనా ముక్కచెక్కలయ్యింది. చైనాజాతి అవమానాలగురయి ప్రజలు
28
నికృష్టమైన యిబ్బందులను ఎదుర్కొరట్టున్నారు చైనా ప్రజా రిపబ్లిక్ అవతరణ అటువంటి అంధకార దినాలకు చరమగీతం పాడింది. చైనా రిపబ్లిక్ ఆవిర్చావంతో తూర్పున ఉషో దయమైంద్యి చైనా చరిత్రలో నూతనయుగం ప్రారంభమైంది అప్పుడే చైనా ప్రజలు.తలెత్తు కొని నిలిచారు. తమ నూతన జాతికి, కొత్త సమాజానికి నిజమైన యజమానులు అయినారు “నేడు మా ఘహత్తర మాతృభ్యూమి అంతా సౌొభాగ్యతా దృశ్యాలతో, శక్తవంతమైన అభివృద్ధితో నిండివుంది. చైనా ప్రత్యేకతలతో కూడిన సోషలిజం నిర్మాణపు బాటలో పూర్తి విశ్వాసంతో మా ప్రజలు విజయవంతంగా పురోగమిస్తున్నారు ఉత్పత్తిశక్తులను అభివృద్ధి చేయడం సోషలిస్టు నిర్మాణ సమయంలో మౌలిక కర్తవ్యం మేము మా శక్తినంతా కేంద్రీకరిస్తాము సోషలిస్టు ఆధునికీకరణను హృదయపూర్వకంగా సాగ్స్తాము. మా ప్రజల భౌతిక, సాంస్కృతిక సంక్షేమాన్ని క్రమబద్ధంగా అభివృద్ధి చేస్తాము. పెద్దఎత్తున విదేశీ శత్రు దురాక్రమణ వంటి ఘటన ఎదురైతే తప్ప'మా కృతనిశ్చయంతో తడబాటు వుండదు. “మేము ఆర్థిక పునర్చిర్మాణాన్ని వేగవంతం చేసే మహత్తర ప్రాధాన్ఫత గల కర్తవ్యాన్ని ఎదుర్కొంటున్నోము. మా గ్రామీణ సంస్కరణలు ఇప్పటికే గొప్ప విజయాలను సాధించి, మరింత లోతుగా వేళ్ళూనుకొంటున్నాయి. పరిశ్రమలను శక్తివంతం చేసే కర్తవ్యం కేంద్రంగా అమలు జరుగుతున్న పట్టణ: సంస్కరణలు సహితం స్థిమితంగా. ఆవిష్కరణ బెతున్నాయి. "పరిశ్రమలను సజీవ సంస్థలుగా పెంపొందించే సోషలిస్టు/విధానంగా చైనా ఆర్థికవ్యవస్థ వుంటుంది. చైనా ప్రణాశికాయుత ఆర్థిక విధానం విలువ సూత్రాలను .చైతన్యయుతంగా ఆనుసరించే, అమలుజరిపే సామ్యవాద పద్ధతిలో. వుంటుంది... .ఈ సంస్కరణల ద్వారా చైనా విశిష్టతలతో కూడిన ఆర్థిక వ్యవస్థను ఖచ్చితంగా ఏర్పర్చగలం సోషలిస్టు విధానవు. ఆధిక్యతను పరిపూర్తిగా నిరంతరం ఆచరణలో స్పష్టమయ్యేలా చేయగలరి; ... ఆర్థిక చట్టంలోని, సంస్కరణలతో _కలిసి చైనా సోషలిస్టు ఆర్థికాభివృద్ధి నూతనంగా.ముందంజ వేస్తుందని.ఆశించవచ్చు ” “అంతర్జాతీయ రంగంలో.స్వాతంత్ర్యం, శాంతి అనే మా విదేశాంగ. విధానాన్ని తడబాటు లేకుండా. మేము కొనసాగించాల్సి వుంది . ఏ విదేశీ ఒత్తిడికి లొంగము. ఏ అ(గ్రరాజ్యంతోగాని, అధికార మురాతోగాని.-చేతులు కలపము. ఏ అ(గ్రరాజ్యంతోనూ విలీనం కాము దాని వ్యూహాత్మక కూటమితో చేరము. చైనాకు శాంతి కావాలి. అలాగే ప్రపంచానికి వాంతి కావాలి శాంతియుత సహజీవనపు పంచసూత్రాల పునాదిగా ఇతర మూడవ ప్రపంచ దేశాలతో, 'ప్రజలతో-ఆర్థిక సాంకేతిక రంగ మార్పిడులను, స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకుంటాము ” వార్షికోత్సవ సెరేడ్ అక్టోబరు 1 ఆనాడు వార్షికోత్సవ ప్రదర్శన ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12 గంటలవరకు జరుగుతుంది ఈ ప్రదర్శన తియాన్న్మెన్ మైదానంలో జరుగుతుంది. 29
ప్రదర్శన జరిగినంతసేపూ ఆతిధులకు కేటాయించిన చోటునుండి నిలబడి దానిని తిలకించడం నా ఆరోగ్యరీత్యా మంచిది కాదని నిర్ణయానికి వచ్చారు అందువల్ల ప్రజాహాలు రెండవ అంతస్థులో ప్రత్యేక ఏర్పాటుతో కూర్చొని ప్రదర్శనను అంతా తిలకించే ఏర్పాటును నాకు చేశారు ప్రదర్శన కాలమంతా మా దుబాసీలు, కామ్రేడ్ జూనియాంగ్ మాతోనే వుండి ప్రదర్శన విశేషాలన్నింటినీ వివరించారు. పెరేడ్లో సైనిక దళాలు, పారిశ్రామిక, వ్యవసాయ దళాలు పాల్గొన్నాయి చైనాలోని వివిధ జాతులు తమ తమ కళా “వైభవంతో పాల్గొన్నారు చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్ వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధికి దర్చణంగా ఆ ప్రదర్శన సౌగింది. చైనాలోని వివిధ అలంకారాలు అందులో దర్శనమిచ్చాయి. చైనాభాషలో వివిధ నినాదాలు గుర్తుల (అక్షరాల) రూపంలో కనిపించే పద్ధత్లో విన్యాసాలు ఏర్పాటైనాయి. సుమారు ఐదులక్షల మంది పాల్గొన్న ఆ ప్రదర్శన చూడవలసిందేగాని, మాటలలో వర్ణించడం అసాధ్యం ప్రదర్శనను అంతా వీడియో ఫిలిం తీశారు దానిని మనదేశంలో ప్రదర్శించేందుకు అనువుగా తయారుచేసి పంపుతామని వాగ్దానం చేశారు. మావో మాసోలియం సందర్శన కామ్రేడ్ మావో మాసోలియంను చూడాలని మేము కోరాము ఏర్పాట్లు చేశారు మాసోలియం గర్భగుడిదాకా చర్రాల కుర్చీలోనే తీసుకువెళ్ళారు. ఎంఛ వారించినా వారు నన్ను నడవనీయలేదు. మాసోలియంను సందర్శిస్తున్నప్పుడు గతం కళ్ళలో మెదిలింది. 1956లో చైనా పార్టీ ఎనిమిదవ మహాసభకు భారత కమ్యూనిస్క పార్టీ తరపున. అనాడు ప్రతినిధివర్గంలో సభ్యుడుగా చైనా వెళ్ళాను. ఆనాడు కామ్రేడ్ మావో కరచాలనంచేసి స్వాగతం చెప్పారు. ఆనాటి కామ్రేడ్ మావో రూపం మనసులో మెదిలింది. ఈనాడు మాసోలియంలో ఒక స్పటికపు పెట్టెలో నిద్రబోతున్నట్లు వున్న అమరత్వం చెందిన కామ్రేడ్ మావో భౌతికకాయం చూశాము. కామ్రేడ్ మావోను నవచైనా నిర్మాతగా, విష్ణవ విజయనేతగా, మార్కిిస్టు-లెనినిస్టు సిద్ధాంతాలను వారి దేశ పరిస్థితులకు అన్వయించి, సోషలిజం నిర్మించేందుకు పునాదులను వేసిన నాయకుడుగా ఆయనను చైనా పార్టీ, చైనా ప్రజలు భావిస్తున్నారు. ఆయన జీవితపు చరమాంకంలో సాంస్కృతిక విప్లవకాలంలో కొన్ని తీవ్రమైన పొరపాట్లు చేసినా, ఆ పొరపొట్లను ఎత్తి చూపుతున్నారు కాని చైనా చరిత్రలో కామ్రేడ్ మావోకు గల ప్రత్యేక స్థానాన్ని ఆయన నాయకత్వవు విశిష్టతను వారెంతగానో తమ ప్రజలముందు పెడుతున్నారు. తియాన్మెన్ గేటులో మావో ఫొటోతోపాటు, మార్క్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ల పెద్ద చిత్రపటాలను కూడా ప్రదర్శించారు. పార్టీ కొర్యదర్శి విందు . చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి హూ-యావో-బాంగ్ మమ్ములను ప్రత్యేకంగా కలుసుకోనున్నారని తెలిసింది. మా గౌరవార్థం ఆయన అక్టోబర్ 15న (ప్రత్యేక 30
వుచ్చలవల్లి నుందరయ్య.. విందు ఏర్పాటుచేశారు. -ఆ రోజుల్లో చైనా పార్టీ కేంద్రకమిటీ సమావేశమవుతున్నది. చైనా ఆర్థిక విధానంపై నూతన విధానం రూపొందిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ పారిశ్రామిక కార్మికులలో ఉత్సాహాన్ని పెంపొందించి, వారి చారవను అధికతరం చేసి, త్వరితగతిని పారిశ్రామికాభివృద్ధితో వురోగమించేందుకు నూతన విధానానికి రూపకల్పన చేస్తున్న ప్రత్యేక సమావేశం అది అంతటి పనివత్రిడి వున్నా భారత ప్రజలపట్ల ప్రత్యేకించి భారత కమ్యూ నిస్టుపార్టీ (మార్కిస్టు) ఎడల తమ ప్రత్యేక ఆదరణను చూపేందుకు ఈ విందు ఏర్పాటుచేశారు. విందు జోన్-నాన్-హైపాలెస్లో ఏర్పాటుచేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ, చైనా ప్రభుత్వ అధినేతలు నివసించే భవన సముదాయం అక్కడే వున్నది. ఆ విందు రెండుగంటలపాటు సాగింది. చనువుగా మాట్లాడుకుంటూ, ఛలోక్తుల మధ్య ఆ విందు సాగింది.
చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యులు కామ్రేడ్స్ డెంగ్-సియావో-పింగ్, లీ-షీ-యాన్, చెన్-యూ, జావో-జి-యాంగ్ తరపున, తన తరపున కార్యదర్శి కామ్రేడ్ హూయావో-బాంగ్ మాకు ప్రత్యేక స్వాగతవచనాలు చెప్పారు. మరొక స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎ-జి-యాంగ్ సంవత్సరం పైగా అన్వస్థులుగా వున్నారని, అందువల్ల స్వాగత సందేశం పంపలేకపోయారని తెలియచేశారు. 1956లో మమ్ములను కలుసుకున్న చౌ-ఎన్-లై సతీమణి మేడమ్ డెంగ్-ఇంగ్-చావో, పెంగ్జెన్లు మా రాకకు ప్రత్యేకించి తమ సంతోషాన్ని వ్యక్తం చేయమన్నారని, తమ తరపున స్వాగతం చెప్పమన్నారని ఆయన తెలియజేశారు.
విందు జరుగుతున్నది... కామ్రేడ్ హూ-యావో-బాంగ్ నా భోజనం గమనించి “మీరు డాక్టర్ల సలహాను ఖచ్చితంగ్లా జ్లమలు చేస్తున్నందుకు తృప్తిగా వుంది" అని నాతో అంటూ, లీలవైవు తిరిగి “మీరు కామ్రేడ్ సుందరయ్య భోజన విషయంలో మరీ ఖచ్చితంగా తనిఖీ :చేస్తున్నారని విన్నామరీ అంత ఖచ్చితంగా .ఉండకండి. బాగా సంతృప్తిగా .భోజనం చేసేటట్లు చూడండి. బలం రావల్సి,వుంటుంది గదా!” అన్నారు. నేను లీల వైపు తిరిగి “చూశావా! బాగా గుర్తుపెట్టుకో. నీ నియమాలు కొంత తగ్గించాలి” అన్నాను అందరం నవ్వుకున్నాము.
మరొకసారి మా సంభాషణ సందర్భంగా చైనా వైద్య విధానాలను వివరిస్తున్నారు హూ-యావో-బాంగ్. చైనాలోని అనేక జీవజంతువులు తమకు లభ్యమయ్యే ఆకు- అలము, గడ్డీ-గాదం తిని తమకువచ్చే వ్యాధులను నివారించుకుంటున్నాయని చైనా పురాతన వైద్యులు తమ పరిశోధనలలో పేర్కొన్నారని అన్నారు. నేను నవ్వుతూ “అందువల్లే కాబోలు డొక్టర్లు నాకు ప్రొటీన్లు తగ్గించి, గడ్డీ-గాదంతో ఉండే ఆకుకూరలు ప్రిర్కైబ్ చేశారేమో!” అన్నాను. అందరం నవ్వుకున్నాము ఇలా కబుర్లతో రెండుగంటలపాటు విందు జరిగింది. ఈ విందు సందర్భంగానే కామ్రేడ్ హూ-యావో-బాంగ్ భారతదేశం నుండి
31
వివీధ రకాలకు చెందిన ప్రతినిధి వర్గాలు అంతకంతకూ ఎక్కువగా రావాలని కోరారు ప్రజా జీవితం నుండి వచ్చే అలాంటి ప్రతినిధివర్గాల మూలంగా భారత-చైనా దేశాల ప్రజల మధ్య మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు అ-వార్సిక ప్రదర్శనకు జపాన్ నుండి మూడువేలమందితో కూడిన యువబ్బృందం హాజరైంది జపాన్ చైనాకు దగ్గరగా వుంది. భారతదేశం దూరంగా వుంది దూరప్రయాణం గనుక మూడు వందలమంది అయినా రాగలరనే తకాంక్షను ఆయన వ్యక్తం చేశారు విప్లవ మ్యూజియం, ఒపేరా సందర్శన నా ఆరోగ్య రీత్యా వారు నన్ను నడవనీయడం లేదు 'ప్రతిచోటికి చక్రాల కుర్చీలో ప్రయాణపు ఏర్పాట్లు చేస్తున్నారు. నేనుకూడా ఎక్కువగా నడపగలిగిన స్థితిలోలేను. ఇందువల్ల బీజింగ్ వదలి ఇత్తర స్థలాలకు వెళ్ళేందుకు నాకు ఇష్టం లేకపోయింది. చక్రాలబండిలోనే కూర్చొని, చైనా విప్లవ మ్యూజియంను మాత్రం చూశాము రెండు ఒపేరా ప్రదర్శనలను చూశాము. చైనా విప్లవ వార్చికోత్సవం సందర్భంగా “విష్టవగీతం” అనే కొత్త ఒపేరా ప్రదర్శిస్తున్నారు. దానిని చూడాలని పట్టుపట్టాము అదొక సంగీత, నృత్యభరిత ప్రదర్శన. అందులో వెయ్యిమంది కళాకారులు పాల్గొంటున్నారు. ఆరోజు వారి డాక్టర్లు నన్ను మరాకసారి పరీక్తించాల్సిన రోజల అన్ని షరీక్షలు.చేసి అదనంగా మరేదైనా చికిత్స బేయాలేమోనని నిర్ధారించేందుకు ఆరో హాస్పిటల్క్సు చెళ్ళాల్సి ఉంది అయినా నా ఆసక్తి గమనించి ఆ ప్రదర్శనను చూపేందుకు మాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రదర్శన కాగానే రాత్రి పదిగంటలకు హాస్పిటల్చేర్చారు అక్కడ అనాడు 'రక్తం ఎక్కించారు మరొక వారంపాటు ఆసుపత్రిలోనే వున్నాము చైనా పార్టీ, ప్రభుత్వ అధినేతలకు కేటాయించిన గదులలో ఒకదానిని నాకు ఇచ్చోరు అక్టోబరు 23న మరొక యూనిట్ రక్తం ఎక్కించారు. నా ఆరోగ్యం కొంత మెరుగుపడిందని భావించారు. మరికొన్ని చైనా మూలికా లేహ్యాలు, భస్మాలు మూడు నెలలపాటు సరిపోయేవి యిచ్చి పంపారు సోషలిస్టు వ్యవస్థలో వైద్యం ఈపారం రోజుల అనుభవం మరువరానిది డాక్టర్లు, నర్సులేగాక మాతోపాటు వున్న అంతర్జాతీయ సంబంధాల కార్యాలయ కార్యకర్త కామ్రేడ్ షూ-జన్-హూ కూడా ఆసువత్రిలో ప్రక్క గదిలోనే వుండి రాత్రింబవళ్ళు అవసరమైన సపర్యలన్నీ చేస్తుండేవాడు రక్తం ఎక్కిస్తున్నప్పుడు ఆరుగంటలపాటు పక్కనే వుండి సపర్యలు చేసేవాడు అలా రాత్రింబవళ్ళు సపర్యలు చేయవలసిన స్లితిలో నేను లేను అని అన్నా అంగీకరించేవారు కాదు ఆయన ఒకప్పుడు సైన్యంలో కమాండర్, సాంస్కృతిక విప్లవ కాలంలో 5 ఏండ్లపాటు లేబర్ క్యాంపులో కరిన శిక్ష అనుభవించాడు. ఇండియాలోని వివిధ రాజకీయ పార్టీల 31
వుచ్చలవల్లి నురదరయ్య గురించి, భారత్త రాజకీయాల. గురించి ప్రత్యేక నైప్రణ్యంకోసం స్పెషలైజ్ చేస్తున్న కామ్రేడ్. అలాంటి కామ్రేడ్ సాధారణ మేల్నర్భులాగా- నాకు సపర్యలు చేస్తుంటే నాకెంతో సిగ్గుగా వుండేది
అక్కడవున్న రోజుల్లో చైనా వైద్యవిధానంలో నిపుణులు, 80 ఏండ్ల వయోవృద్ధులు అయిన డాక్టర్ ధావో, శ్రీమతులు జాంగా-హూ-యీ, పీలీ-జన్ల్సు డాక్టర్ చీ"నాకు వైద్యం జేశారు. పదేసదే పరీక్షల్నుచేసి వైద్యం నిర్ణయించారు వారు చూపించిన శ్రద్ధాశక్తులు, ఇచ్చిన సలహాలు సోషలిస్టు దేశాల్జోన్ని వైద్యుల శ్రద్ధాశక్తులను నా కళ్ళముందుకు తెచ్చాయి 1660లోను, 1965లోను సోవియట్ యూనియన్‌లో డాక్టర్ మయత్ నాకు ఆపరేషన్ చేశారు ఆయన శస్త్రవైద్యనిపుణుడు, లెనిన్ పతాకగ్రహీత, చైనాలొ వైద్యులు నాపట్ల ప్రదర్శించిన శ్రద్ధతో ఆ కామ్రేడ్ కూడా నాకు గుర్తువచ్చాడ్డు
డేంగసియావో-పింగ్, లీ-షావ్-చి, 'పెంగొడ్యేహాయు. రచనలు చదువుతూ, టెలివిజన్ ప్రదర్శనలు చూన్తూ గెస్టహౌస్లో కాలం గడిపేవాడిని' చైనాపార్టీ అంతర్జాతీయ ఫంబంధాల సమన్వయశాఖ ఉపాధ్యక్షులు కామ్రేడ్స్ జూ-లి-యాంగ్ అనేకమార్లు నావద్దకు వచ్చారు ఆర్థిక, వశ్ధవసాయ, పారిశ్రామిక రరగాతలో చైనా పార్టీ అనుసరిస్తున్న విధానాలను, చేస్తున్న మూర్చ్పులను నాకు వివరించారు. ఆంతర్జాతీయ రంగంలో వారు అవలంభించే విధానాలను వివరించారు భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) అంతర్జాతీయంగా వారి విధానాలలో కొన్నింటితో ఏక్రీభవించడంలేదని వారికి ఇదివరకే స్పష్టంగా తెలుసు వాటిని నేను కూడా మరొకసారి వివరించాను.
చైనా అంతర్జాతీయ విధానాలు
ప్రపంచ శాంతికి, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడా చైనా నిరంతరం కృషి చేస్తున్నదని ఈ సంభాషణల, ద్వారా నేను గమనించాను, సోవియట్ యూనియన్‌తో తమకు వున్నభేదాభిప్రాయాలను అధిగమించి, సంబంధాలను సాధ్యమైనంత త్వరలో పెంపొందించేందుకు కృషి చేస్తుందని స్పష్టమైంది సోవియట్ చైనా కమ్యూనిస్టుషార్టీల మధ్యన ఐక్యత ఏర్పడుతుందని, చైనా-వియత్నాంల మధ్య 1975కు ముందున్న రీతిగానే సుహృద్భావం, పరస్పర సాన్నిహిత్యం ఏర్పడగలవనే ఆశాభావం నేను వెల్లడింఛాను.
1984 అక్టోబర్ 26న మా తిరుగుప్రయాణం. మేము ఫస్స్టుక్లాస్లోనే ప్రయాణం చేయాలని వారు పట్టుబట్టారు. టిక్కెట్ మార్చి ప్రయాణ ఏర్పాట్లు చేశారు.
మమ్ములను అఆహ్వానించినందుకూ, ఎంతో ఆదరణ చూపినందుకూ చైనా పార్టీకి మా కృతజ్ఞతలు తెలియజేశాము. భారత-చైనా దేశాల, ఉభయ దేశాల 'ప్రజలమధ్య సన్నిహిత స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు, మన రెండు పార్టీబమధ్య సంబంధాలను మరింత దృఢతరం చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేశాము.
ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో తిరిగి ఢిల్లీ చేరుకున్నాము
33
సుందరయ్య గారికి చైనాపార్టీ అభినందనలు
చైనా కమ్యూనిస్టృపార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ హూ-యావో-బాంగ్ సుందరయ్యగారికి తమ పార్టీ తరపున ప్రత్యేకమైనవిందు "జరిపిన సందర్భంగా అందజేసిన అభినందనలలో యిలా వుంది;
_ గోసుందరయ్యగారూ! మీరు చైనా సందర్శించినందుకు మా కేంద్ర కమిటీ కామ్రేడ్స్ ఎంతో ఆనందపడుతున్నారు. వారి తరపున మీకు అభినందనలు తెలియజేయమని వారునన్నుకోరారు. = ॥
“మిరు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో విశ్వానపాత్రులైన పోరాటవీరులు. భారత జాతీయ విమోచన్లోద్యమం లో దృఢతరంగా పాల్గొన్న కార్యకర్తలు. ప్రజాభ్యుద్యయానికి అంకితమైన వ్యక్తిమీరు. .భారత-చైనా దేశాల ప్రజలమధ్యు, ఉభయ దేశాలమధ్యగల మహత్తర స్పేహ పరిరక్షకులు. మీ ఈ విశిష్ట లక్షణాలను ఎరిగిన మా పార్టీ కేంద్రకమిటీలోని. వృద్ధ కామ్రేడ్స్ మిమ్ములను యెంతో గౌరవిస్తారు.
“మీకు సుదీర్ధ ఆయురారోగ్యాలు కలగాలని వారు ఆకాంక్షిస్తున్నారు.”
గ్రం (౮, అ 34
/ | త్త్ః ల్ ం! కమ్యూనిస్టు మహాోనాయికుల జీవిత గాధలు
-
- మార్యిస్తుమహోపాధ్యాయులు .మెటూరుహనుమంతరావు 20-00
- ప్రజాసేవలో నా అనుభవాలు -ఎ.ె. గోపాలన్ 35-00 . ,
- వివ్లవవథంలో నావీయనం (రండు భాగాలు) 22-00 |. -పుచ్చలపల్లి సుందరయ్య 1
- నేను కమ్యూనిస్తును ఎలా అయ్యాను? -ఇ.యమ్.ఎస్.నంబూద్రిపాద్ 20-00
- రాజకీయ్ జ్ఞావీఠాలు జ్యోతిబసు. 16-00
- సీక్ష్త్వాలా జీవితం -వి.ఆర్.బొమ్మారెడ్డి 7-00 . | “* నవవైనా నిర్మాత -డెంగ్ సియావోపింగ్ 4-50
- ననెరిగిన నేతలు -మోటూరు హనుమంతరావు 6-00 _
- రజనీ పామద్త్ -వి.ఆర్. బొమ్మారెడ్డి 5-00 || . లై లైల లైల ప్రతులకు : " ప్రజాశక్తి బుక్‌హౌస్ కారల్ మార్క్స్ రోడ్డు, 1-8-52/2 5, ఎ.జి.కె.కాంప్లెక్స్ విజయవాడ-520 002 గాంధీరోడ్డు, || శ్రీరామా కాంప్లెక్స్ క న్: ౮ స్ పతి-517 50] | ఫోన్: 432 792 చిక్కడపల్లి త్రుప ( . జ్నగం హైదరాబాద్-20 | బాలా స్: 6-2-250, - సుందరయ్యభవన్ వోన్: 760 8107 విజయటాకీస్రోడ్డు, చౌరస్తా, ఖమ్మం 507 001 హన్మకొండ-506 011 . | |