Telugu Mankena Poovu - anilvaranasi/indianlanguages GitHub Wiki
ర్
వా
- య్ ( గంలో
జ 4 (దా ,స్తే జో టా!
ల ..
సిసి చల్లపల్లి స్వతూపరాణి
తా _--ముప్ ము ఈ. . వారికరన
మంకన పూవు కవిత్వం చల్లపల్లి స్వరూపరాణి
టామి4 పిం౦00 6౦11601010 0 ౦ల౫౩ 0 ౧148202111 ఏఇ220022 211 చల్లపల్లి స్వరూపరాణి అ మైత్రి ః ణా చల్లపల్లి స్వరూవరాణి 1 ష్లాట్ నెం. 2/17 ,ఈష్టన్ కాలనీ, ప శ్రీశైలం ప్రాజెక్టు, శ్రీశైలం - 518 101. ఫోన్ : 9440362433 ప్రధమ ముద్రణ : మార్చి, 2005 శం ప్రతులు : 500 (లీ పేజీలు : 3౮11 + 86 (7 వెల:రూ. 40 /- ముఖచిత్రం అక్బర్ ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, ఇతర బ్రాంచీలు. నవోదయ బుక్ వొన్, కాచిగూడ, హైదరాబాద్ నవోదయ పబ్లిషింగ్ హౌస్, విజయవాడ ప్రజాశక్తి బుక్ హొస్, హైదరాబాద్, ఇతర బ్రాంచీలు సహచర బుక్‌మార్క్, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్. డి.టి.పి : మను గ్రాఫిక్స్, ఫోన్ : 27633574 ముద్రణ *" అనుపమ ప్రింటర్స్ _ఎయా 126, గ్రీన్ వ్యూ, శాంతినగర్, హైదరాబాద్ - 28 జల" ఫబగ్లఫా న్న... ఫోన్ : 23391364 హ్స్ ళా ల్ని వారాయణ రెడ్డి ట్రస్టువారి సౌజన్యంతో త శ || ల్ో ్టీ షం నో చ తారం ఫీ వా
గున్ను వెలిగించే నాన్న స్ఫూర్తికి...
పృాదయ దళన కవిత అ డా.ఎన్.గోసి దళితవేదనకూ దళిత ధిక్కారానికి తార్కాణంగా వున్న కవితలివి. తెలుగు సాహిత్యంలో దళితోద్యమం ఉంది కాబట్టీ దళితకవిత్వం అంటున్నాను గాని అలా అనుకున్నా ఈ కవిత్వానికి లోటేమీలేదు. విసర్గమైన నిత్యజీవన నేపధ్యాన్ని వారుసుకొని నెత్తుటి జీరలతో దూకిన అక్షరాలివి. ఒకప్పుడు 'సామాజికస్పృహ' అనేవారు. కొన్నాళ్లకు ఆ మాట అరిగిపోయి వాడడం మానేశారు. ఆత్మాశ్రయకవిత్వ సన్నివేశంలో దానికి భిన్నంగా ఈ మాటపుట్టింది. అన్నివర్గాలు తమ అస్తీత్వ ప్రత్యేకతలను స్థాపించుకుంటున్న నేటి సందర్భంలో దళితస్పృహను ప్రదర్శిస్తున్న కవితల్లో ముందుకొస్తున్నది స్వరూపరాణి. ఈ సంపుటిలో 'ఆహ్వానం' అనే మొదటి కవిత దళితోద్యమానికి నిలువుటద్దం. కాలాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ “దశాబ్దాలు దమనకాండలుగా సంవత్సరాలు సంక్షోభాలుగా నెలలు నరమేధాలుగా దినాలు అత్యాచారాలుగా అనువదించి మా వెతల పట్టాలమీదుగా జోరుగా పరుగెడుతున్న నా ప్రియమైన కాలమా...! శం యి ఫి
నువ్వొక చైతన్య వీచికవని కీర్తించి ఘరానా పైరవీకారుడెవ్వడే...! ణయ ఖు 2 మారక్తపు మరకలంటని పేజీ ఒక్కటైనా నీ డైరీలో చూపించు...!” అనడంతో ఆగకుండా గత వర్తమానాలను ఒక భావస్థాయిలో సమీక్షిస్తూ ఈ పరిస్థితులు ఉండని, ఉండకూడని మంచికాలం కోసం ఎలుగెత్తి పిలుస్తున్నది కవయిత్రి కొన్ని అనుభవాల గాయాలు అనుభవించిన వాళ్లకే తెలుస్తాయి. “నాకు మార్కులెక్కువాచ్చాయని చదువూసంజా లేనోళ్లపిల్లకి ఎన్ని తెలివితేటలో చూడమని నా స్నేహతురాలి తల్లి ఆ పిల్లను కొట్టిన చీపురుదెబ్బలు నా వీపుపై వాతలై తేలినట్టుంటుంది.” పౌరుష్యం స్వరూపరాణికి తెలియదు. అందుకే “చదువూసంజాలేనోళ్ల పిల్లకి” అని నున్నితంగా అంది. ఆ తల్లి ఏమని ఉంటుందో అందరికీ తెలును. వాచ్యం చెయ్యకపోవటంతోనే ఇది బలమైన ధ్వనిగ పరిణమించింది. స్త్రీగా ఒక దళితస్త్రీగా కూడా తన అనుభవాన్ని దాచుకోలేదు. “అసలు నా జీవితాన్ని నేనుగా జీవించిందెప్పుడు...? ఇంట్లో పురుషాహంకారం ఇక చెంప చెళ్ళుమనిపిస్తే వీధిలో కులాధిపత్యం రెండో చెంప పగలగొడుతుంది.” అంటుంది 'మంకెనపువ్వు' కవితలో. మంకెనపువ్వెపువ్వుకు ప్రాంతీయనామం ఏమిటో!? ఎర్రటి పువ్వు, బంధూకం అంటారు సంస్కృతంలో. 'బంధూకం సంధ్యారాగం కావాలోయ్ నవకవనానికి' అన్నాడు శ్రీశ్రీ,
“మాయమ్మ? లాంటి కవిత స్వరూపరాణి తప్ప మరెవ్వరూ రాయలేరు. “పదునెక్కిన పాట' సంకలనంలో చదివినప్పుడే కదిలిపొయ్యాను. “మాయమ్మా. ! నిన్ను తల్చుకుంటేనే నువ్వు ఈదిన అవమానాల కాల్వ కట్టలు తెంచుకుని నా కళ్ళమీదుగా ప్రవహిస్తుంది.” స్వరూపరాణి వ్యక్తిగా కూడా నాకు తెలుసు. తెలుగు విశ్వవిద్యాలయంలో నేను వి,సిగా ఉన్నప్పుడే లెక్చరర్‌గా ప్రవేశించింది. విశ్వవిద్యాలయం, కేంద్ర సాహిత్య అకాడమీల అధ్వర్యంలో సంయుక్తంగా జరిగిన అఖిలభారత రచయిత్రుల మహాసభల్లో చురుకైన పాత్రను నిర్వహించింది. చక్కటిచిరునవ్వుతో మౌనంగా ఉంటూ, మాట్లాడితే మృదువుగా మాట్టాడే స్వరూపరాణిలో ఇంత అగ్నివుందా అనిపించింది ఈ కవితలు చదువుతున్నప్పుడు అల్హాటప్పా కవయిత్రి కాదు. ఉబలాటం కోసం ఇన్‌స్టాంట్‌గా కీర్తికోసం ఉరకలు వేసే కవితలు కావివి. “పలుగూ... పారా తీసుకొని మేటలు వేసిన హృదయాన్ని పారలు పొరలుగా తవ్వడం మొదలుపెట్టి” వెలికితీసిన ఒండ్రుమట్టి పరిమళాలు. వాటిలో ప్రేమ, స్నేహం సహజత్వాలు తళతళ మెరుస్తూ బయటపడ్డాయి. నిష్టుర సత్యాలు చెప్పేటప్పుడు కూడా కవితాత్మకతను వాదులుకోదు స్వరూపరాణి, అసలు ఎందుకు వొదులుకోవాలి? చూడండి. “నేను శిల్పాకృతిలో వున్న నల్లని మాంసపు ఖండాన్ని నాకు శరీరం తప్ప మనసెక్కడేడ్చింది మరి...! చాలీచాలని నారైకపై అద్దాల్లో వేలాడే యుగాలుగా మీరు నాపై పన్నిన
కుట్ర ప్రతిబింబాలు పరావర్తిస్తున్నాయి.” అద్దాల రవికలో ప్రతిబింబాలు అనేది సరికొత్త భావన. అనాదిగా అడిని మైదానాల మోసానికి గురవుతున్నది. ఎంతకాలమని సహిస్తుంది? ఆందుకే “మా అడవితల్లి పత్రహరితానికి బదులు పత్రవిషాన్ని విరజిమ్మేది” అంటున్నది. స్వరూపరాణి కవిత్వంలో దళితానుభవాలు. దళిత వేదన మాత్రమేకాదు విశాలమైన సన్నివేశంలో దళితావగాహనకూడ కనిపిస్తుంది. ఇది స్వరూపరాణి తొలిపుస్తకమే కాని తొలకరి పుస్తకం కాదు. కాగీకాగీ మాగీమాగీ వెలువడిన కవిత్వం దీనిలో వుంది. అయితే కాస్త శిల్చశ్రద్ధ వహించాలనే సలహా చెప్పాలనుంది నాకు. స్వరూపరాణిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అ
తొలిదళిత స్తీ వాదకవిత్వం - మంకెనపూవు అ శిఖామణి
తెలుగులో స్త్రీ దళితవాద కవిత్వాల ఆవిర్భావంతో సాహిత్యపీఠాల కుదుళ్ళు కదలడం ప్రారభమైంది. అంతవరకూ తెలుగు సాహిత్యాకాశాన్ని కమ్ముకున్న అరుణ వర్ణ మేఘాలు కాస్త పక్కకు తొలిగి నీలిమేఘాలకు, నల్లగబ్బిలాయిలకు చోటు యివ్వాల్సిన అగత్యం ఏర్పడింది. మరొకప్రక్క బహుజన, ముస్లిం, ప్రాంతీయవాదాలు మొత్తం సాహిత్యచరిత్ర నిర్మాణాన్ను ప్రశ్నించేస్థాయికి చేరాయి. ఆదికవి స్థానంలో నన్నయకు బదులు నాచన సోమన్ననూ, తొలి తెలుగు నవల విషయంలో రాజశేఖర చరిత్ర స్థానంలో రంగరాజచరిత్రను ప్రతిపాదించడం ఇందులోని భాగమే! తెలుగులో సాహిత్య చరిత్ర నిర్మాణాన్ని పునర్ మూల్యంకనం చేసే ప్రక్రియ ఆలశ్యంగానైనా ప్రారంభం అయిందని ఇలాంటి ప్రతిపాదనలు రుజువు చేస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ ఆరోగ్యకర పరిణామం.
తెలుగు సాహిత్యోద్యమంలో మొదటినుంచీ ఒక విచిత్రపరిస్థితి నెలకొని ఉంది. అదేమిటంటే ఈ కొత్త ఉద్యమాలతోపాటు పూర్వపు ఉద్యమాలు కూడా ఏకకాలంలో కొద్దోగొప్పో శేడాతో అస్థిత్వంలో ఉండటంవల్ల మా ఉద్యమం గొప్పదంటే మా ఉద్యమం గొప్పదనే గందరగోళం నెలకొంది. నిజానికి ఇవన్నీ అంతర్గతంగా ఒకదానికి మరొకటి పూరకంగా వచ్చినవే! అభ్యుదయంవల్ల వొనగూడే సోషలిజం కంటే, సాయుధ పోరాటంవల్ల సిద్ధించే వర్గరహిత సమాజమే మంచిదని విప్లవరచయితల సంఘం, విరసంలో వర్గదృష్టేతప్ప లింగ, వర్ణ దృక్పథంలేదని స్త్రీవాద, దళితవాద ఉద్యమాలు, మళ్ళీ స్రీవాదంలో దళితస్త్రీలకు ప్రాతినిధ్యంకూడా లేదని దళితస్రీవాదమూ, ముస్లిం స్రీలకు ప్రాతినిధ్యం లేదని ముస్లింప్రీవాదమూ, మొత్తం దళితవాదంనుండి బి.సి., మైనార్టీ ఉద్యమాలు ఒక్కొక్కటిగా పుట్టకొచ్చాయి. ఇది ఒక తంతర్గత చక్రం. ఎవరికి యిష్టంవున్నా లేకపోయినా ఈ ఉద్యమాలు తమ పనిని గొప్ప నిబద్ధతతో నిమగ్శతతో చేసుకుపోతున్నాయి.
మనకి “నిన్న మొన్నటివరకూ రచయిత్రులు వున్నారు కానీ స్రీవాద రచయిత్రులు లేరు. ముస్లిం కవులు వున్నారు కానీ ముస్లింవాద కవులు లేరు. అలాగే దళిత రచయితలు వున్నారు కానీ దళితవాద రచయితలు లేరు - దీనర్ధం ఏమిటంటే ఆయా జెండర్, కులం, మతంలో పుట్టినంత మాత్రాన ఆయావాద రచయితలు కాలేరని, తాము వచ్చిన మూలాల
నేపథ్యం నుండి మాట్లాడుతున్న వారే ఆయావాదాలకు ప్రాతినిధ్య రచయితలు అవుతారని దాదాపు రెండు దశాబ్దాలు పై చిలుకు నుండీ తెలుగులో స్త్రీలు, దళితులు తమ మూలాలనుండి మాట్లాడే ఒక అనివార్యతను తెలుగు సమాజం, సంఘటనలు కల్పించాయి “చిక్కనవుతున్న పాట' సంకలనంలో దళిత స్రీవాద కవిత్వం లేకపోవడం అంతకు ముందటి సాహిత్యోద్యమాల వైఫల్యం.
తెలుగు దళితకవిత్వానికి మొదటిసారిగా దళిత స్రీదృక్కోణం అందించిన కవయిత్రి చల్లపల్లి స్వరూపరాణి . ఆమె కవితాసంపుటి 'మంకెనపూవు" తెలుగులో తొలిదళిత స్రీవాదకవిత్వం. “చిక్కనవుతున్నపాట' సంకలనం వచ్చిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యనివర్శిటీ దళిత సాహిత్యవేదిక వెలువరించిన 'గుండెడప్పు' సంకలనంలో స్వరూపరాణి దళితస్తీ కోణం నుండి రాసిన మంకెనపూవు, మట్టిబతుకులు కవితలు తొలిసారిగా అచ్చయ్యాయి. 1996లో వెలువడిన “పదునెక్కినపాట' సంకలనంలో ఇతర దళితకవయిత్రు లతో పాటూ స్వరూపరాణి కవిత్వమూ చోటుచేసుకుంది.
దళితసాహిత్యోద్యమం బయలుదేరిన తొలిరోజుల్లో రెండు కొత్తబాధ్యతలనూ స్వయంగా నిర్వహించుకోవల్సి వచ్చింది. అందులో మొదటిది ఉద్యమసాహిత్యానికి ఒక కొత్త పారకవర్గాన్ని తయారుచేసుకోవడం. రెండవది ఆపాఠళకవర్గంనుండి కొత్తతరం రచయితలను, కవులను సృజించుకోవడం. ఈ రెండు పనులనూ దళితసాహిత్యోద్యమం విజయవంతంగా నిర్వహించింది. అందులో భాగంగానే కొత్తతరం దళితకవులు మరీముఖ్యంగా దళితస్రీవాద కవులు బయలుదేరారు. ఆ వరుసలో తొలితరం దళితస్రీవాద కవయిక్రులలో మొదటిది, బలమైనది స్వరూపరాణి గొంతు. అయితే అప్పటివరకూ దళితకవిత్వంలో దళితస్తీల సమస్యలు వ్యక్తం కాలేదా అంటే; అవుననే సమాధానం. అయితే అవి దళిత పురుష కవులు రాసినవి, సతీష్‌చందర్, ఎండ్లూరి సుధాకర్, మద్దూరి నగేష్‌బాబు, కత్తిపద్మారావు, కోయికోటేశ్వరరావు వంటి కవుల దళితస్రీల ఆర్తిని తమ కవితల్లో బలంగా వ్యక్తీకరించారు. దళితస్రీవాదం స్త్రీవాదం నుండి పురుషాధిక్య వ్యతిరేక భావజాలాన్ని , దళితవాదం నుండి కులాధిపత్య ధిక్కార స్వరాన్ని ఏకకాలంలో అందిపుచ్చుకున్నారు. అందుకే కులాన్ని ప్రశ్నించినంత తీవ్రస్వరంతోనే దళితపురుషాధిక్యాన్ని ప్రశ్నించగలిగారు. స్త్రీవాదం కేవలం జెండర్ సమస్యను ముందుకు తీస్తే దళితస్రీవాదం జెండర్‌తోపాటు కులం వలన అదనంగా దళితస్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించింది. దళితస్రీవాదం ప్రారంభమే స్త్రీవాదం వదిలేసిన ఖాళీలను ప్రశ్నించడం, పూరించడంతో ప్రారంభమైంది.
కురవడం నేర్పిన / నా నీలిమేఘమా / ని ప్రశ్నల చినుకులు అన్నీ అమరిన వంటింటి దాకా వచ్చాయిగానీ / అసలు ఇల్డే లేని నా మూడు రాళ్ళ పాయ్యి గుమ్మమయినా తొక్కలేదేం స్త్రీవాదం దళితస్రీవరకూ రాలేకపోయిన ఒక దూరాన్నీ అంతరాన్నీ ఈ పాదాలు సూచిస్తున్నాయి. సరిగ్గా స్త్రీవాదం ఆగిపోయిన ఈ చోటనుండే దళితస్తీవాదం మొదలయింది. ఈ మంకినపూవుల కళ్ళు ఈ శతాబ్దపు జాములోయలో నిలబడి నెత్తుటిమరకలంటని సరికొత్త శకాన్ని ఎలుగెత్తి పిలుస్తున్నాయి. ఈ సంపుటికి శీర్షకై నిలిచిన 'మంకెనపూవు" కవిత సగటు దళితస్తీ ఆత్మకథనం. ఊరి కులాధిక్యంతో పాటు వాడ పురుషాధిక్యాన్నీ గుర్తించడం, ప్రశ్నించడం ఈ కవిత సాధించిన ప్రయోజనం. ముందు నుయ్యి వెనక గొయ్యిలా నా చుట్టూ ఎపుడూ ప్రమాదం బుసలు కొడుతుంది. అసలు నా జీవితాన్ని నేనుగా జీవించిందెపుడు ఇంట్లో పురుషాహంకారం ఒక చెంప చెళ్లుమనిపిస్తే వీధిలో కూలాధిపత్యం రెండో చెంప పగలగొడుతుంది. ఒక దళితస్రీ జీవితంలోని ప్రతినందర్భంలోనూ సన్నివేశంలోనూ ఎదుర్కొన్న కులపీడనకు శక్తివంతమైన ఆవిష్కరణ ఈ కవిత. చివరికి తాను చేయగలిగింది కష్టాల మంటల్లో బతుకుని కడుక్కుని మంకెనపూవులా విచ్చుకోవడం. ఈ విచ్చుకోవడంలో నేత్రధ్వని వ్యంజింపబడింది. అది శక్తిం3106 కి ప్రతీక. తిరుగుబాటుకు సూచిక, మాయమ్మ కవిత ఒకరకంగా 1౫౭1111008 00602 లక్షణాలను కలిగి ఉన్న కవిత. దళితస్త్రీ పీడనతోపాటు స్త్రీవాదంలోని డొల్లతనాన్ని బోనులో నిలబెట్టి ప్రశ్నించడం కనబడుతుంది. అంటరానివాంటిని కోరికల స్కేళ్ళతో కొలిచే వూరి అడుగులను మరుగుదొడ్డకు మల్డే కడుగుదాం అంటూనే ఆ బంగారుచేత్తోనే మిమ్మల్ని బాబుగాడి సొమ్ములా వాడుకుంటున్న మీ పెట్టుబడీదారి పెనిమిటిని కిందనుంచి పైదాకా ఫినాయిల్‌తో జాడీద్దాం! కవిత్వం నిర్వర్తించే అనేకానేకమైన చర్యల్లో మనసుల్ని శుభ్రపరచడంకూడా ఒకటి. మంకెనపూవు కవిత్వం అ పనిని విజయవంతంగా నిర్వహించిందని ఈ కవిత రుజువుచేసింది. దళితసాహిత్యంలో గిరిజనకవుల ప్రాతినిధ్యమేకాదు, కనీసం గిరిజన జీవితాలను
ప్రస్తావించిన కవితలూ అరుదే! 7106 1018 మోద అధ్యయనం చేసినందువల్లనేమో స్వరూప ఈ సంకలనంలో కొండమల్లి, చెంచిత వంటి కవితల్లో గిరిజన జీవితాల్ని వాస్తవిక దృష్టి, సౌందర్యం మేళవించి ఆవిష్కరించగలిగింది. బడాబాబుల బంగ్లాల్లో అందంగా అమర్చిన లంబాడీ స్త్రీల పెయింటింగ్‌ల సౌందర్యం వెనుక వున్న (క్రూరత్వాన్ని కవి ఇలా పసిగడుతుంది. “రాళ్ళు రప్పల్లో / ఎండావానల్లో/ రేయింబవళ్ళు తిరిగి/ రాటుదేలిన నా సలపరింతల వళ్ళు / వొంపులు వాంపులుగా తైలవర్ణ చిత్రమై మా గోడపై తళుకు మంటుంటే /లజ్జతో కుచించుకుపోయిన నా మనసుతోపాటు / ఆకలికి అంటుకుపోయిన/ పేగులు సైతం కలుక్కుమంటున్నాయి సునీత, బసివి, బిడ్డసంచులు, మట్టిచేతులు, పూలన్‌దేవి వంటి కవితలు వివిధ అంతరువులలో దళితస్త్రీ ఎదుర్కొంటున్న మానసిక స్థితిని విశ్లేషించిన మంచి కవితలు. దళితస్రీల విషయంలో ఇంత నైశిత్యపు చూవుగల ఈ కవి మానవ సంబంధాల విషయంలోనూ అంతకంటే అరంగా స్పందించడం అబ్బురపరిచే విషయం. నాన్నకోసం, తాతయ్యకోసం రాసిన నల్లసూర్యుడు, పెచ్చులూడిన బాల్యం వంటి కవితలు 'దళిత నేటివిటీ' తోపాటు ఆత్మ కథనాత్మక (ఆటో బయోగ్రాఫికల్) రూపంలో వ్యక్తమైన అపురూప చిత్రాలు. మరాఠీ దళితసాహిత్యంలో ప్రాచుర్యంలో ఉన్న ఈ ప్రక్రియ తెలుగులో ఇంకా విస్తరించాల్సి ఉంది. అందుకు ఇటువంటి కవితలు మంచి ఊతం ఇస్తాయి. ఇంతరాసి ఈ కవి నిలవనీటి కాసారంలా నిలిచిపోయిన దళిత ఉద్యమం గురించి “సుఖంగా ఉద్యమిద్దాం రండి” కవిత రాసినా, దళిత ఉపకులాల మధ్య వర్గీకరణ చిచ్చుకు కలవరపడి 'కవలపేగు' కవిత రాసినా స్వరూప వర్తమాన దళితసమాజాన్ని తన 'మంకెనపూవు' కన్నుతో వీక్షిస్తున్నట్టు వివేచిస్తున్నట్టు అర్ధంచేసుకోవచ్చు. తెలుగులో దళిత స్రీవాదకవిత్వానికి తొలిస్వరం అందించిన స్వరూప కవిత్వం పుస్తకంగా ఇంత ఆలస్యంగా రావడానికి కారకుల్లో నేనూ ఒకడినైనందుకు దళిత సాహిళత్యోద్యమానికి క్షమాపణలు చెప్పుతున్నాను. కవిగా స్వరూప మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందని ఆశిస్తూ అభినందనలు. అ
దళిత స్త్రీవాదానికి అచ్చనయిన కవితారూపం అ జి. లక్ష్మీ నరసయ్య
ఎట్టకేలకు దళితస్రీవాద చైతన్యానికి ఓ 'మంకెనపూవు' పూసింది. చల్లపల్లి స్వరూపరాణి చేతులమీదుగా దళితస్రీవాదం చిక్కని కవిత్వమయ్యింది. దళితస్తీ వాదానికి కవితారూపమిచ్చే ప్రయత్నం అరకొరగా కొంతమంది చేశారు. వీరంతా ఈ ప్రయత్నంలో సెయిలవ్వడమో లేక సగం దూరం వచ్చి అగిపోవడమో జరిగింది. స్వరూపరాణి కవితాస్థాయికి వీరెవరూ నిలబడరని స్పష్టమయింది. ఈ మూడు ఎందుకంటున్నానంటే తెలుగు కవిత్వంలో ఆధునిక దళితస్రీవాదాన్ని మొదలుపెట్టి దానిప్రధాన అంగాలను ఈ కవి తనదయిన బాణీలో ప్రదర్శించింది కాబట్టి దళితస్రీవాదం అనేది ఒకటుందని తెలుగుసాహిత్యానికి తొలిగా చాటటమే కాక దానికొక నిండు సంస్కారానన్నీ, శరీరాన్నీ ఈకవి ఇచ్చింది. కవిత్వాన్ని మొక్కుబడిగా కాకసీరియస్గా చదువుతున్న ఎవరయినా ఒప్పుకునే విషయం ఇది.
ఒకపక్క స్రీవాద కవిత్వం మరోపక్క దళితవాద కవిత్వం ఇబ్బడిముబ్బడిగా వస్తున్నరోజుల్లో ఈ రెండు కవిత్వాల ప్రభావానికి స్వరూపరాణి లోనయ్యింది. ఈ ప్రభావం నుంచి ఆ కవిత్వాలను ఇమిటేట్ చెయ్యడం కాకుండా వాటి పరిమితుల్ని ఎత్తిచూపుతూ వాటికి సమగ్ర రూపాన్ని ఇచ్చే చారిత్రక కర్తవ్యంతో చల్లపల్లి స్వరూపరాణి రంగంమీదికొచ్చింది. జనరల్ స్త్రీవాదం, జనరల్ దలితవాదంనుంచి దళితస్త్రీ వాదం ఎక్కడ భిన్నంగా కనబడుతుందో స్వరూపరాణికి స్పష్టంగా తెలుసు.
అగ్రకుల స్త్రీకిగానీ, దళిత పురుషుడికిగానీ ప్రతికూల అంశాలతోపాటు అనుకూల అంశాలూ ఉన్నాయి. వారిదయిన అధికారక్షేత్రం వారికీ ఉంది. పురుషాధిక్యత వల్ల పీడనకు గురవుతున్న అగ్రకులస్త్రీకి అగ్రకులత్యం ద్వారా సంక్రమించే సాంఘిక అధికారం, సౌకర్యం
ఉన్నాయి. అగ్రకుల పెత్తందారీ తనానికి బలవుతున్న దళితపురుషుడు పురుషత్వం ద్వారా ఒనగూడే లింగాధిక్యతను ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. ఇందుకు భిన్నంగా దళితస్త్రీకి అన్నివైపులనుంచీ అధికారం, పీడనే ఎదురవుతాయి తన చుట్టూ వున్నవన్నీ తనకు ప్రతీకూలాంశాలేకానీ అనుకూలాంశాలు కాదు. అగ్రకులపురుషులూ, అగ్రకులస్తీలూ, దళితపురుషులూ అందరూ తమ తమ పరిధుల్లో దళితస్త్రీని పీడించేవారే తనపై అధికారం చలాయించేవాళ్ళే. కులం, లింగం, పేదరికం ముప్పిరిగొన్న మూడంచెల పీడన దళితస్తీని పీడితులకే పీడితురాలు దళితస్తీ ఇల్టు, పనిచోటు, బయట సమాజం అన్నీ తనను పీడించేవే. కులవివక్ష లింగవివక్ష ఆర్థికదోపిడీ - అన్నీ తనకు దగాచేసేవే.
ఈ అవగాహన ఉంది కాబట్టే స్వరూపరాణి, “ఎటు కదిలినా! ముళ్ళన్నీ గుచ్చుకునేది నాకే” అని ప్రకటించగలిగింది. చుట్టూ నిరంతరం “ప్రమాదం బుసకొడుతున్న లోకంలో 'అఆసలునా జీవితాన్ని నేనుగా జీవించిందెప్పుడు?'అని దళితస్తీగా సభ్యసమాజాన్ని నిలదీస్తుంది. ఈ అవగాహన పదే పదే ఈమె కవిత్వంలో గొంతు విప్పుతుంది. దళితస్త్రీని “ఇంట్లో పురుషాహంకారం/ఒక చెంప ఛెళ్ళుమనిపిస్తే/వీధిలో కులాధిపత్యం/ రెండో చెంప పగలగొడుతుంది” అనటమే కాకుండా.:
కూలి డబ్బులకోసం
పాలం పనికెళికే
అక్కడ కామందు
చెమటతో పాటు నన్నుకూడా
దోచుకోవాలని
కాపేసినప్పుడు
నన్ను నేను విత్తనంగా
భూమిలోకి పాతుకోవాలనిపించింది.
అనడంలో దళితస్త్రీ మూడంచెల పీడన బలంగా వ్యక్తమయ్యింది. ఈ ఇతివృత్తాన్ని
వీలున్నప్పుడల్లా ఈ కవి ప్రదర్శిస్తుంది.
ఇంట్లో పెళ్ళాంగా నిత్యావసర వస్తువై
వీధుల్లో అవహేళనల మూటలు మోసే
కులం తక్కువ గొడిదవై
వెరసీగాయపడింది నీ బతుకే గదా! దళితస్రీ వాస్తవికతకి సంబంధించిన ఈ జనరల్ స్పృహే ఈమెకు దళితస్రీ వాదతత్వం బాగా వంటబట్టిందనడానికి నిదర్శనం. దళితస్రీ వాద తత్వం తలకెక్కిన కారణానే ఈ కవికి తన మూలాల గురించీ కుదురు గురించీ న్పష్టమయిన అవగాహన ఉంది. “ఆనాటి నూర్చణఖనుంచీ /చలకుర్తి ముత్తవ్వమీదుగా/ సజ్జ్ఞలగూడెం మహదేవమ్మ వరకు/ పరాభవాల పరంపర”గా “కన్నీటి హోరులో కొట్టుకుపోతున్న ' పీడితురాలిగా ఈనాటి దళితస్త్రీని ఈకవి గుర్తిస్తుంది. ఈ చారిత్రక దృక్పధం చెంచులక్ష్మినీ, గిరిజనస్రీని కూడా సొంతంచేసుకునే స్తిఇలో ఈమెను నిలబెట్టింది. దళితస్త్రీకి పుట్టుకతో సంక్రమించిన '“అయిదోతనం' గురించీ, పెరుగుటలో ప్రాప్తించిన కూడులేనితనం గురించీ ఏ అభ్యుదయవాదీ పట్టించుకోనంతనం గురించి ఈ కవి బలమయిన విమర్శ పెట్టడానికి పునాదిగా తన చారిత్రక అవగాహన తోడ్పడింది. తన పునాదినుంచీ, కుదురునుంచీ చూసినప్పుడు స్రీవాదంగా ఇప్పటివరకూ నడుస్తున్న చైతన్యమంతా అగ్రకుల స్త్రీల సమన్యల్నే తప్ప దళితస్రీల సమన్యల్ని ఉద్దేశించి మాట్లాడలేదని ఈ కవికి అర్ధమయ్యింది. జనరల్ స్రీవాదనుంచే ఇక్కడ అగ్రకుల 'స్రీవాదమేననే సత్యాన్ని ఈమె కవిత్వీకరించింది. తనతోపాటు పితృస్వామిక వ్యవస్థ పీడనని అనుభవిస్తున్న సాటి అగ్రకుల స్త్రీ దళితస్తీని కులకారణంగా అవమానిస్తున్న వాస్తవాన్ని ఆమెపై ఈమెనెరిపే సపెత్తనాన్నీ కవి సృజానాత్మక విమర్శకు గురి చేస్తుంది. సాటి ఆడమనిషివని కూడా చూడకుండా ఆ సేతుసే అని నిన్ను చితక్కొట్టకపోతే ఇక్కడి కులప్రతిష్టలు కుదించుకుపోతాయనీ నువ్వు పొలం పనిలో ఇంటిచాకిరీలో మాడి నలుపెక్కకపోతే పెద్దపెద్ద రంగులన్నీ పళ్ళికిలించలేవనీ బొట్టును చీకొట్టి నువ్వు పర్మినెర్గా ముండమోయబట్టి ఈ హిందూ కమలాలన్నీ వికసించాయనీ ఈ జీను ఫాంటుల జమునారాణికి తెలుసా! దళితస్రీ వాదం అగ్రకుల స్తీవాదంతో ఎక్కడ వివాదపడుతుందో, ఎక్కడ వేరుపడుతుందో
చూపడానికి పైవిధంగా కవి ఆగ్రహిస్తుంది. అగ్రకులస్త్రీవాదం హిందూ ఆచారాలనుంచి బయటపడలేదని చెప్పటం బాగానే ఉంది. మరిచివరి లైనును బట్టి చూస్తే ఆడవాళ్లు జీన్సు ధరించడం ఆమెకి అయిస్టమా అనే అనుమానం కలుగుతుంది.
ఈ కవి విమర్శనాధోరణి స్రీవాదాన్ని విమర్శించడంతోనే ఆగిపోలేదు. అది దళిత శిబిరాన్ని కూడా నిర్మాహమాటంగానే నిలదీస్తుంది. దళితస్త్రీ మీద దళితపురుషుడి పెత్తనాన్ని కూడా ఆమె ఎండగడుతుంది. అగ్రకులాలకి లోకువగా బతికే దళితపురుషుడు తన స్త్రీని తాను లోకువగా చూడటాన్ని ఈమె క్షమించదు.
వూళ్ళో వాళ్లందరికీ మానాన్న లోకువైతే ఆయనకు మా అమ్మ లోకువయినట్టు నీలో భార్యత్వానికి సానబెట్టి
ఆర్యుల దగ్గర అప్పుతెచ్చుకున్న గొడ్డలితో ఆకాశమంత ఎత్తైన నీ ఆత్మని
ముక్కలు ముక్కలుగా తెగనరుకుతాడు
దళితస్త్రీ ఆత్మగౌరవాన్ని దళితపురుషుడు కాలరాయటమనేది మగదురహంకారానికి చెందిన సమస్య. దళితుడితో ఉన్న ఈ పితృస్వామికత్వాన్ని బయటకీడ్పడంలో కూడా దళితస్రీవాద ప్రత్యేకత ఉంది. ఈ ధోరణి స్వరూపరాణి కవిత్వానికి సానుకూలతను పెంచుతుంది.
స్రీవాదంలోని అగ్రకులత్వాన్ని విమర్శించినా స్రీవాదదృక్పధాన్ని ఈమె గౌరవిస్తుంది. లైంగిక వివక్షనీ, స్త్రీపురుషుల మధ్య అధికారసంబంధాల్ని ఈమె గట్టిగా ప్రతిఘటిస్తుంది. పురుషుని ఆధిపత్యంలో స్రీదుస్థితికి స్రీవాద దృక్పధంనుంచి ఆవిష్కరిస్తుంది. ఆడదానికి జీవితం ఒక అద్దె ఇల్లనీ, ఆ యింటికి కొంతకాలం తండ్రీ, కొంతకాలం భర్తాయజమానులుగా ఉంటారనీ, ఏ క్షజానయినా యజమానికి ఇల్లు ఖాళీ చేపిస్తాడనీ కవితాపరంగా వ్యాఖ్యానిస్తుంది:;
యజమాని ఏ క్షణానైనా యిల్గు ఖాళీ చేయ్యమంటాడు బళుకు చుట్టూ అల్లుకున్న గచ్చుపాదల విలువల్లాగే
యింటిచుట్టూ కాపాలా కాస్తూ దొంగలా తనను వెంటాడుతున్న రెండునాల్కల రేచుకుక్కలు. పురుష ప్రపంచంలో స్రీ అనుభవించే అనిశ్చితనీ, శ్రార్యాన్నీ ఈ రకంగా వైటపడుతుంది. స్వరూపరాణి కవిత్వంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశమేమంటే జీవితంలోని అనేక మూలాల్ని దళితవాద దృక్పధం నుంచి ఆవిష్కరించడం. “ఇక్కడ ఉరికొయ్యలు కూడా / కులం కలపతో చేసినవే కదా?” “పెట్టిపుట్టిన వాళ్లకు / హృదయం అంటే సుమధుర సుమం/ ప్రేమంటే తీయని స్వప్నం/ మరి నాలాంటి మాలపీల్లకి మాత్రం/మనసుండడమే మహానేరం,” “అడక్కుండానే ఈ దేశం నీచేతికి చేపనిచ్చి / నా మెడలో పామును వదిలింది/ అది నీకు రొట్టె నిచ్చి/ నానోట్లో రాళ్లు కుక్కిన సవతి తల్లి” ఇలాంటి వ్యక్తీకరణలన్నీ స్వరూపరాణి దళితచూపును పట్టిస్తాయి. మమకారాలను పండించిన సేద్యగాడయిన తాతయ్యమీద రాసినా, మనిషితనం కోసం వట్టిచేతుల్తో పెనుగులాడిన నాన్న మీద రాసినా ఇంకా అన్నయ్యమీద రాసినా అందులో దళిత ఆత్మగౌరవం ఉంది. గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. 'సుఖంగా ఉద్యమించాలని చూసే చాలామంది దళితకవుల్ని మేధావుల్నీ ఎత్తిపాడుపులతో తిట్టినప్పటికీ ఆ తిట్లలో బాధ్యత ఉంది. దళిత ఉద్యమం _ కాకతో నిండాలనే తపన ఉంది దళిత ఉద్యమం కోసం ఉన్నామనుకునే అందరూ ఈ కవి వెదుకుతున్న 'పిడెడికెడు నైర్మల్యం', 'కాస్తంత నమ్మకం' కేవలం వ్యక్తులకు సంబంధించింది కాదు ఉద్యమాలకి కూడా. స్త్రీవాదం, దళితవాదాల మధ్య తన మొగ్గు దళితవాదం వైపే అని తన కవిత్వం చెబుతుంది. స్రీవాదాన్ని బయటి వ్యక్తిగానూ, దళితవాదాన్ని లోపలివ్యక్తిగానూ ట్రీట్చేస్తున్న ధోరణి చాలా కవితల్లో కనిపిస్తుంది. తాను దళితురాలు కాబట్టి సహజంగా దళితవాదాన్నే ఈమె సొంతం చేసుకుంటుంది. దళిత శిబిరం నుండి ప్రీవాదపు సాంఘిక పరిమితుల్ని కవిత్వం చేసింది: కురవడం నేర్పిన నా నీలిమేఘమా! నీ ప్రశ్నల చినుకులు అన్నీ అమరిన వంటింటి దాకా వచ్చాయికానీ అసలు యిళల్లే లేని
నా మూడు కాళ్ల పొయ్యి గుమ్మమైనా తొక్కలేదేం?
మా క్రాఫింగులన్నీ కుర్చీలకోసం కొట్లాడి
అడ్డగించిన పురుషాహంకారపు కాలర్ పట్టుకుంటుంటే
మా వేలిముద్రల మట్టిగాజులు
చేతిముద్రల సీడకచందమామల్ని
లెక్కపెట్టకోవడం దగ్గరే ఆగిపోయాయి. స్వరం కాస్త కటువుగా వినిపించినా దాని నెనుక న్యాయబద్ధమైన నిలదీత ఉన్నదని
గమనించొచ్చు. ఇంతకీ దళితస్తీకి కావల్సిందేంటి? మనిషితనాన్ని నిలుపుకునే సామాజిక వాతావరణం అని బదులు పలుకుతుంది ఈ కవి.
ఇక్కడ
నా కాళ్లపై నేను నిలబడటానికి
నాకింత నేలా
నా తలపైకెత్తి చూడటానికి
నాపైన ఆకాశమూ
నేను గుండెల నిండా శ్వాసించడానికి
గుప్పెడు 'స్వేచ్భ్చావాయువూ
వెరసి పిడికెడు మనిషితనం
యిప్పుడు
నా ప్రాధమిక అవసరాలు
వస్తువు విషయంలో దళితస్రీవాదం ప్రధానంగా కనిపించినట్టే, కవితావాతావరణ
విషయంలో కూడా దళితతనం అల్లుకుపోయింది. దళిత జీవితంతో ముడిపడిన వస్తువులన్నీ పనిముట్టనీ, పరిసరాల్నీ ప్రతిమలుగా ప్రతీకలుగా వాడుకోవటం వల్ల శిల్పవిషయంలో తాజాతనం చోటుచేసుకుంది. పొట్టమీది కొచ్చిన వరిచేలూ, సూడిమోసిన గేదా, చావిట్లో నులకమంచం, దూడల పచ్చివాసన, కొండమల్లి, మంకెనపువ్వూ, చెరువులూ, కాలువలూ ఇవన్నీ పాఠకుడికి తాజా వాతావరణాన్నిస్తాయి. అక్కడ కూడా కొత్త పదబంధాల్ని వేసే ధోరణి కూడా ఈమెలో ఉంది. కవిత నిర్మాణంలో,
శైలిలో ఒదులుతనం, పొడవుతనం ఎక్కువగా కనిపిస్తాయి. క్లుప్తత తక్కువ. టోన్ విషయానికొస్తే అంత వైవిధ్యం కనిపించదు. కొంచెం టోన్ మారినచోట పైవాక్యాల మూడ్‌నుంచి ఒక్కసారి కృత్రిమంగా గెంతినట్టు అగుపిస్తూ ఉంటుంది.
ఏది ఎట్లా ఉన్నా తన భావాన్ని బలమయిన కవితా వాక్యంగా మలచడానికి ఈమె పెద్దకష్టపడదనిపిస్తుంది. వ్యక్తీకరణలోని ఈ సులవుతనం ఈమెని చేయితిరిగిన కవిగా నిలబెడుతుంది. మంచి కవికుండాల్సిన గాఢత,స్పష్టత, కళాత్మకత _- ఈ మూడు ఈ కవిలో పుష్కలంగా ఉన్నాయి. దానికి 'మంకెనపువ్వు' నిలువెత్తు సాక్ష్యం. ఈ పుస్తకానికి అటు పస్రీవా, కవిత్వంలోనూ ఇటు దళితవాద కవిత్వంలోనూ చారిత్రాత్మక స్థానం ఉంటుందనడంలో సందేహం లేదు. అ
నామాట అ చల్లపల్లి స్వరూపరాణి
నిచ్చెనమెట్ల సమాజంలో అట్టడుగున నిలబడి వున్న దళితస్రీ జీవితంచుట్టూ ఎటుకదిలినా ముళ్ళపాదలే! బాల్యం నుంచే ఇంట్లో పైకి కనిపించని పురుషాధిపత్యం ఒకవైపు, తప్పని సరిగా బయటికి వెళ్ళి పనిపాటలు చేసుకోవల్సిన పరిస్థితుల్లో నీడలావ ఎంటాడే పరాభవాలు మరోవైపు ఆమె అస్టిత్వాన్ని భూమి పారల్డోకి నెట్టివేసి, ఆమెకు పిడికెడు మనిషితనాన్ని మిగిల్బకుండా చేశాయి. సమాజం దళితస్తీ మానప్రాజాలకు అతి తక్కువ పరిహారం చెల్లిస్తుంది.
సహజంగానే ఇతర స్త్రీల కవిత్వంలోనూ, దళితపురుషుల కవిత్వంలోనూ వుమ్మడిగా నా కవిత్వ పార్భ్వాలున్నాయి. అయితే స్రీలందరి ఆర్థిక, సామాజిక నేపథ్యాలు వేరయినపుడు వారిపై అమలయ్యే అణిచివేత స్వభావం కూడా వేరువేరుగా వుంటుందని, అలాగే ఎంతో ప్రజాస్వామికంగా కనిపించేదళిత కుటుంబాలలో కూడా పురుషాధిపత్యం కొనసాగుతుందని నేను అన్నప్పుడు చాలామంది స్రీల్హూ దళితపురుషులూ నొచ్చుకొన్నారు. వారిని సంతృప్తి పరచడంనా వుద్దేశ్యం కాదు. ఈ దేశంలో వర్గకుల సమాజం, పితృస్వామ్యం )నే వ్యవస్థలో వున్నంతవరకు ఒకవ్యక్తి రచనలు ప్రగతిశీలంగా, ఆలోచనాత్మకంగా వుండడమంటే అవి తప్పనిసరిగా దోపిడీవ్యవస్థను మొత్తంగా వ్యతిరేకించడం అనేది నా అవగాహన. దళిళస్త్రీగా కులపరమైన అణిచివేతకు సంబంధించిన సామాజిక రోదనను , వివిధ స్థాయిలలో స్త్రీల అస్తిత్వ వేదనను నా కవిత్వం ప్రతిబింబిస్తుందనుకుంటాను. అసమసమాజం పట్ల నాకున్న అసహనాన్ని శతృత్వాన్ని యిలా వ్యక్తీకరించగలిగాను.
ఎటువంటి సాహిత్య వాతావరణం లేని కుటుంబం నుండి వచ్చిన నాలో సాహిత్యాభిలాషని కలిగించింది నాసోదరుడు, మిత్రుడు సాగర్... ప్రగతిశీల రాజకీయాలు, సాహిత్యం పట్ట నా అవగాహనకు మెరుగులు దిద్దే ఆత్మీయస్నేహితురాలు కాత్యాయని...
ఈ సందర్భంగా వీరిద్దరిని జ్ఞాపకం చేసుకోవడం నాకు అత్మతృస్త... నా కవిత్వాన్ని ముందునుంచీ ప్రోత్సహిస్తూ పుస్తకానికి ముందుమాటలు రాసిచ్చిన ఆత్మీయులు జి. లక్ష్మీనర్భయ్య, శిఖామణి గార్లకూ, చరిత్ర చదువుకున్నప్పటికీ సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకున్నందుకు ముచ్చటపడి, నాకు వుద్యోగమిచ్చి, వాత్సల్యంతో నా కవిత్వానికి ముందుమాట రాసిచ్చిన పితృతుల్యులు మా యూనివర్శిటీ పూర్వపు ఉపాధ్యక్తులు ప్రముఖకవి ఆచార్య ఎన్.గోపిగారికి కృతజ్ఞతలు.
నా పుస్తక ప్రచురణకు గాను ఆర్ధిక సహాయం అందించిన శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టువారికి ముఖ్యంగా డా! సి. నారాయణరెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అనివార్య కారణాలవల్ల ఈ పుస్తక ప్రచురణలో తీవ్ర జాప్యం జరిగినందుకు చింతిస్తున్నాను.
నా సాహితీ వ్యక్తిత్వాన్ని గుర్తించి కవితా సంపుటి తీసుకురావాలని నన్ను ఎంతగానో ప్రోత్సహించిన అనేక మంది సాహితీమిత్రులకూ, నా అభిరుచి మేరకు పుస్తకానికి కవరొపేజీ రూపుకల్పన చేసిన సోదరుడు అక్బర్‌కూ, నా సాహితీ వ్యాసాంగాన్ని ప్రోత్సహించిన సహచరుడు శ్రీనివాస్కీ, నా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకూ, ఈ పుస్తకం యిలా రావడానికి డి.టి.పి. చేసిపెట్టిన స్నేహితురాలు రేవతికీ, వరలక్ష్మి గారికీ, ముద్రించిన అనుపమ ప్రింటర్స్ వారికి పేరుపేరునా కృతజ్ఞతలు. అ
కవితా క్రముం అ నరికొత్త శకం 1 అ సపెచ్చులూడిన బాల్యం 4 అ వంటల మానవుడు 7 అ వంకన మావు 9 అ గరిక పూలు 12 అ మాయమ్మ 14 అ అన్వేషణ 2] అ కొండమల్లి 24 ఉ మట్టిచేతులు 27 తవేలాడే ప్రశ్న 30 అ దగావడ పాట 34 అ నల్స గులాబీలు 37 అమరో యుద్ధం త్ర అ నిషిద్ధ చరిత43 అ విస్ఫో టన 45 అ 'బిడ్డ సంచులు 479 ఒక న్వవ్నం 49 అ అపశకున పక్షి 51 అ పూల్ బెల్ కాంటే 53 అ జ్ఞాపకం 55 అసవతి తల్లి 58 అఇల్గ్లు 616 సుఖంగా వుద్యమిద్దాం రండి! 649 చెంచిత 68 ఆ అవ్వప్రశ్న 70 అ పోతురాణి 72 9 (పేమ వాయిదా 746 అంటరాని అత్యాచారం77 అనల్ల సూర్యుడు 809 కవల పేగు83అ నాన్నకోసం 85
సరికొత్త శకం దశాబ్దాలు దమనకాండలుగా సంవత్సరాలు సంక్షోభాలుగా నెలలు నరమేధాలుగా దినాలు అత్యాచారాలుగా అనువదించి మా వెతల పట్టాలమీదుగా జోరుగా పరుగెడుతున్న నా ప్రియమైన కాలమా... నిజంచెప్పు... హంతకి చరిత్రలాగే నువ్వు కూడా నాపై విషవాయువై ప్రవహించావు పురుషసూక్తం నుంచీ కొరడా దెబ్బలతో కదునుకట్టిన నా నల్లని ఒంటిపై కడగండ్ల జల్లె కురిశావు.... నువ్వొక చైతన్య వీచికవని కీర్తించిన ఘర్ధానా పైరవీరకారుడెవ్వడే....! నువ్వు సైతం
అ చల్లపల్లి స్వరూపరాణి 1
నాపై చెలరేగే కీచకకాండలకు రంగస్థలమైతివి కదా....! నువ్విచ్చిన అరకొర స్వతంత్రం పట్టపగలే మా మానప్రాణాలతో పరాచికాలుడుతుంటే ఏమీ పట్టనట్టు చెవుల్లో సీసం పోసుకుని + కళ్ళకు గంతలు కట్టుకున్నావు మా రక్తపు మరకలంటని పేజీ ఒక్కటైనా నీ డైరీలో చూపించు... మనువుగాడి దాష్టీకంలో పీనుగుల పెంటగా మారిన మా వాడలను నగ్న వూరేగింపుల్లో మాకులకు వేలాడిన మా మానాలను అచ్చులు పచ్చులు అలకించాయి గానీ ఎన్నడన్నా నీ చెవిలో జొరబడ్డాయా...? నీ ముద్దుబిడ్డను ఎవడో ఎక్కిరించాడని అకాళశమెత్తున వురిమిన నీ శౌర్యం నా అవయవాల్ని కైమాకొట్టి వూరుకొక శకలాన్ని విసిరేసినవుడు ఏ ఫైవ్‌స్టార్ హోటల్లో మందుకొట్టి నిద్రపోయింది తల్లీ....! కురవడం నేర్పిన నా నీలిమేఘమా...! నీ ప్రశ్నల చినుకులు అన్నీ అమరిన వంటింటి దాకా వచ్చాయిగానీ అసలు యిల్డేలేని
2 అ నుంకెన పూవు
నా మూడురాళ్ళ పొయ్యి గుమ్మమైనా తొక్కలేదేం...! మీ క్రాఫింగులన్నీ కుర్చీలకోసం కొట్లాడి అడ్డగించిన పురుషాహంకారపు కాలర్ పట్టుకుంటుంటే మా వేలిముద్రల మట్టిగాజులు చేతిముద్రల పడక చందమామల్ని లెక్క పెట్టుకోవడం దగ్గరే ఆగిపోయాయి నీ జీన్స్ ప్రగతి మా గుండెలకు రవికల్నిచ్చింది గానీ గుండెల్ప్నిండా పీల్చుకోడానికి కాసింత ఆత్మగౌరవాన్నివ్వలేదు నెత్తుటి వాగుల్ని ఒరుసుకుంటూ కొత్తలోకంవైపు దూసుకెళ్తున్న నా క్షిపణి వేగమా...! నెరవేరని మమకారాల కోనం వూరి పొలిమేరలోనే ఆగిపోయిన వేకువ కోసం మూడోదినాన తిరిగిలేస్తానని చెప్పిన క్రీస్తుకోసం హృదయాన్ని వత్తిగా వెలిగించుకుని రాత్రంతా చీకట్లో కనిపెట్టుకు కూర్చున్న మగ్దలైనే మరియలాగా కలలారని మా కళ్ళు ఈ శతాబ్దపు జాములోయల్లో నిలబడి నెత్తుటి మరకలంటని సరికొత్త శకాన్ని ఎలుగెత్తి పిలుస్తున్నాయి. (కాత్యాయినికి ప్రేమతో...) 10.12.7999 (ఆంధ్రభూమి శైలీ 8 జూలై 2007 అ ఛల్లసల్లి స్వరూపరాణి
జి
పెచ్చులూడిన బాల్యం
జొ౦పండు బుగ్గలు
చూడగానే ఎవరికైనా ముద్దొచ్చే బాల్యాన్ని
ఎక్కడన్నా చదివినపుడల్లా
పాత ట్రంకు పెట్టెలో అదిమి వుంచిన
అట్టలూడిన ఎక్కాలు పుస్తకం లాంటి
నా బాల్యం
నన్నూ కవిత్వం చెయ్యమని
పేజీల చేతులు చాస్తుంది
అసలి మురికి బాల్యాన్ని తలుచుకుంటే
నా కాలు నులకమంచానికి కట్టేసి
వరి నాటుకుపోయిన అమ్మకోసం
నేను గుక్క పెడుతున్నప్పుడు
మధ్యాహ్నం పాలివ్వడానికొచ్చి
ఏడ్చిచారికలు కట్టిన నా బుగ్గల్ని
అమ్మ ముద్దుపెట్టుకుంటున్న
తడి తడి జ్ఞాపకం
పాలం నుంచి వచ్చేటప్పుడు
నాకోసం
నార కట్ట తెచ్చినట్టుంటుంది
నన్ను మిరపతోట దగ్గర కాపలా వుంచి శీ అ మంకెన వూవు
అమ్మ కల్లం వూడ్చుకు రావటానికి పోయినపుడు తోటలో గొడ్డు పడినా చూడకుండా నక్క దోసకాయలేరుకుంటున్నానని నాజడలు మెలేసికొట్టి
పాయ్యి దగ్గర కూర్చుని
కళ్ళు తుడుచుకుంటున్న అమ్మరూపం ఇంకానా కళ్ళలో తొణికిసలాడుతుంది నా మొట్టికాయల బాల్యం గుర్తొస్తే పరిగ ఏరుకురావటానికి
బలవంతంగా బడెగ్గొట్టీ
మరుసటి రోజు
మా 'మంగల పొంతులు' చేత తన్నులు తిన్నట్టుంటుంది
నాకు మార్కులెక్కువొచ్చాయని చదువూ సంజా లేనోళ్ల పిల్లకి
ఎన్ని తెలివితేటలో చూడమని
నా స్నేహితురాలి తల్లి
ఆ పిల్లను కొట్టిన చీపురు దెబ్బలు
నా వీపుపై వాతలై కేలినట్టుంటుంది ఎదురు దెబ్బలతో పెచ్చులూడిన
నా బాల్యాన్ని తడిమి చూసుకుంటే ఇరవై రూపాయల నెలజీతం కట్టలేదని ప్రవేటు పంతులు
నా పుస్తకాల సంచిని వైటికిసిరేసినట్టుంటుంది
క్రిస్మస్ పండక్కి
అల్లుడికి బట్టలు పెట్టేదెలాగని అమ్మానాన్నా చలిలో నిద్రలేకుండా మల్లగుల్లాలు పడుతున్నపుడు
అ చల్లపల్లి స్వరూవరాణి వ్
నేను మెలకువగా విని
మాకు కొత్తబట్టలు లేకపోయినా ఫర్వాలేదు
మా బావకు మాత్రం ఒక జతబట్టలివ్వు ప్రభువా...! అని
శేపు పుట్టబోయే ఏసయ్య ని
గడ్డం పుచ్చుకుని
బతిమాలినట్టుంటుంది
కాళ్ళకు చెప్పుల్లేని
నా చిన్నారి శైశవంలో
"సెలవు రోజుల్లో
తాత పై పంచెని బాడీ ఫ్రాకులో దోపుకుని
యిళ్ళ సందుల్లో అన్నాల ఆటలాడి
కాళ్ళకు నత్తగుల్ల గజ్జెల పట్టీలు కుట్టకుని
ఎండిన చేనుగట్టుపై
గలగలమని తిరిగిన
నెమలికన్ను జ్ఞాపకం
దొంగతనంగా పిల్లి పెసరకాయలు కోసుకుని
జనపచేల పరిమళాల మీదుగా
పారిపోయినట్టుంటుంది
ఆడిపాడిన అమ్మమ్మ యిల్లులాంటి
మా వూరెళ్ళినప్పుడు
ఈ పండు వేపకాయ జ్ఞాపకాలన్నీ
మా పెరట్లో సన్నజాజితీగల్లా
నన్ను చుట్టుకుంటాయి.
02.06.2000 (ఆంధ్రభూమి డైలీ 05.72.2000 6 అ మంకెన పూవు
మంటల మానవుడు రగిలే గాయాల్ని ఈదుకుంటూ రహదారి ప్రవాహానికి అడ్డంగా పరుగెత్తే ఈ మంటల మానవుడెవరు....? ఇతడ్నెక్కడో చూసిన జ్ఞాపకం పొగలు కక్కుతున్న ఆ మాంసపు ముద్ద నా 'వెలివాడి వంటిపై మనువాదం చేసిన లక్షల గాయాల్ని కెలుకుతుంది అంతుచిక్కని ప్రశ్నల ముళ్ళకిరీటాల్ని మోస్తున్న నా దళిత శిరస్సుకు పాొగచూరిన అతని తల నిలువెత్తు సమాధానం వుడుకుతున్న ఆ దేహభాష గోనెసంచుల్లో భూస్ట్థాపితమైన వేల రహస్యాల్ని బద్దలు చేస్తుంది అతని గాయాలు అంటరాని ఆలీసమ్మపై కారంచేడు కౌటిల్య సంతకాలు అవి తలెత్తిన ఆత్మాభిమానం పై అ చల్లపల్లి స్వరూపరాణి 7
చుండూరు రగిల్చిన కార్చిచ్చులు
అవును... అతడు కోటేశు కదూ...!
మంటల వస్తాల్ని ధరించి
నిలువునా దగ్గమవుతూ
బతికే హక్కుకోసమే
దేశం నడివీధుల్లో హాహాకారాలు చేసిన
నా కంచికచర్ల కోటేశు
ఇపుడు ..... ఇక్కడ... ఇలా....
204,.1997 (ఆంధధజ్యోతి డైలీ ఆదివారం 165.7 7997) 8 అ మంకెన వూవు
మంకెన పూవు నేను ముళ్ళకంపలో చిక్కుకుని అల్లాడుతున్న పాలపిట్టను ఎటు కదిలినా ముళ్ళన్నీ గుచ్చుకునేది నాకే... ఇవి ఈనాటి ముళ్ళు కావు తరాల నుండీ నా చుట్టూ పేర్చిన బానిస సంకెళ్ళు... ముందు నుయ్యి వెనక గొయ్యిలా నా చుట్టూ ఎపుడూ ప్రమాదం బుసలు కొడుతుంది అసలు నా జీవితాన్ని నేనుగా జీవించేందెప్పుడు...? ఇంట్లో పురుషాహంకారం ఒక చెంప ఛెళ్ళుమనిపిస్తే వీధిలో కులాధిపత్యం రెండో చెంప పగలగొడుతుంది కూలీడబ్బుల కోసం పొలం పనికెళ్తే అక్కడ కామందు
అ చల్లపల్లి స్వరూపరాణి 9
చెమటతో పాటు నన్ను కూడా
దోచుకోవాలని కాపేసినపుడు
నన్ను నేను విత్తనంగా
భూమిలో పాతుకోవాలనిపించింది.
ఏళ్ళ తరబడి దూరమైన చదువుకోసం
హాస్టల్ ఒడికి చేరువైనపుడు
అక్కడ కూడా వార్డెన్గాడి
ఆకలి చూపుల్ని తట్టుకోలేక
ఒంటిని గుప్పిట్లోకి తీసుకుని
దూరంగా విసిరేయాలనిపించింది
చిన్నప్పుడు బడిలో
నాకు బొట్టులేదని
పెద్దయ్యాక కులం లేదని
అందరూ నన్ను ఆడిపోస్తుకున్నప్పుడు
కంపుకొడుతున్న వూరును చూసి
గట్టిగా ముక్కుమూసుకోవాలనిపించింది
కామానికి పనికివచ్చిన నేను
కాపురానికి పనికి రానపుడు
ఏ కాలవలోనో తలదాచుకోవాలనిపీంచింది
ఈ అవమానాలకు ఎదురీదుతూనే
నాలుగక్షరాలు నేర్చుకుని
నేను కూడా వుద్యోగస్థురాలినై
ఆఫీస్కెళ్ళినప్పుడు
“రిజర్వేషన్ కేటగిరి అనే
గుసగుసల్ని వినలేక
నాకే నా చెవులో సీసం పోసుకోవాలనిపించింది 10 అ మంకెన పూవు
సహనం చచ్చిపోయినప్పుడు గడ్డిపోచ కూడా దబ్బనమై గుచ్చుకుంటుంది క నాకు పరుగెత్తే ఓర్చులేదు ఈ కష్టాల మంటల్లోనే బతుకును కడుక్కుని మంకెనపూవులా విచ్చుకుంటాను... అగచాట్ల్ట అడవుల్ని దాటి సెలయేరులా దూకుతాను.... 28.6. 1996 (ఆంధ్రభూమి డైల్సీ 27 జూలై 1996) (గుండెడప్పు, పదునెక్కిన పాట సంకలనాలు), అ చల్లపల్లి స్వరూపరాణి 11
గరికపూలు
శ పువ్వులకు
పుట్టడం తప్ప పరిమళించడం తెలీదు
కన్నవారి కడుపులూ
కూలిడబ్బులిచ్చి కొన్నవారి జేబులూ
వికసించడానికి
మొగ్గదశలోనే బొగ్గులుగా మారిన
పొగచూరిన చేతులు
శైశవగీతాన్ని గౌడుగీతంగా
పల్లవి మార్చి పాడుకుంటున్న
గూడులేని గువ్వలు
పత్తిచేలకు గర్భస్రావం కాకుండా
తమ లేతదనాన్ని
పౌష్టికాహారంగా పంచుతున్న
పాలిపోయిన చిరునవ్వులు
అవయవాల్ని అన్నం మెతుకులుగా
బాడీఫ్రాకులుగా, జడరిబ్బన్లుగా
మలుచుకోవడం వాటి సహజవిద్య
బీటలు వారిన నల్లరేగడిలో
చెప్పుల స్పర్శ తెలియని చిట్లిన పాదాలు 12 అ నుంకెన పూవు
కళ్లు మూసుకుని కవాతు చేస్తాయి
ఆ లేత వేళ్ళ నుండి విడివడిన
నూలు కండెలు
మెత్తని రంగురంగుల వస్త్రాలుగా ముస్తాబై
షోరూమ్ ఒంటిపై తళుక్కుమంటుంటే
రంగు వెలిసిపోయిన లంగా జాకెట్టు
ఎండిన రెల్లుగడ్డి పిలక జడలు
ఒక టూరింగ్ టాకీసు సినిమాతో
అలసిన శరీరాన్ని
అడుగంటిన అశల్ని
నిద్రపుచ్చుకుంటాయి
పటేలయ్య మిద్దెపై
మరోమిద్దె లేవాలన్నా
గుడిసె పొయ్యిలో పిల్లి లేవాలన్నా
ఈ గడ్డి పువ్వులే ముడిసరుకులు
కట్టాల జల్లులు కురిపించే
వంళోధ్ధారకుడి కోసం
పట్టు చీరలన్నీ
ఏడుకొండలెక్కుతుంటే
ఇక్కడి ముతక కోకలు మాత్రం
గుప్పెడు మెతుకుల నిచ్చే
ఆడ చినుకుల కోసం
వూరిబయట
చెట్టుకింద పోలేరమ్మకు
మొర పెట్టుకుంటున్నాయి
25.7.1999 (భూమిక నవంబర్ 99 - ఫిబ్రవరి 2000 అ చల్లపల్లి స్వరూపరాణి 13
మాయమ్మ అబ్బాయిలంతా అమ్మకొడుకులైపోయి అమ్మాయిలంతా నాన్నకుతుళ్ళైపోయి వారి కీర్తికి కవితా దండలేస్తుంటే బతుకంతా అగచాట్ల కిరీటాలు తప్ప ఏమన్ననకీ నోచుకోని నిన్ను తల్చుకుంటేనే నువ్వు ఈదిన అవమానాల కాల్వ కట్టలు తెంచుకుని నా కళ్ళమీదుగా ప్రవహిస్తుంది అందరిలాగే అందంగా పుట్టినా వర్ణ అంధకారంతో గుడ్డిదై పురుషపక్ష(పాతం) వాతంతో అవిటిదైన ఈ భూమిపై పుట్టిన ఛేరానికి నువ్వు బతుకు శ్వాసతోపాటు అఆడస్పర్శను కూడా కోల్పోయావు అసలు నువ్వు కోమలివీ స్వతహాగా సుకుమారివీ అన్న విషయమే
కత అ మంకెన పూవు
నీకు గమనానికి రాదు ఎందుకొస్తుంది... కళ్ళు మూసినా తెరిచినా అంటరానిదానివీ.....ముట్టరానిదానివీ.. అని ఇక్కడి పరిసరాలు సైతం
నిన్ను ప్రతిక్షణం పరాభవిస్తుంటే మనిషిగా నువ్వేం పోగొట్టుకున్నావో అర్ధమవ్వాలంటే కష్టమే!
ఇంట్లో పెళ్ళాంగొ
నిత్యోవసర వస్తువువై
వీధుల్లో
అవహేళనల మూటలు మోసే కులం తక్కువ గాడిదవై
అటు గోడదెబ్బ ఇటు చెంపదెబ్బ వెరసి గాయపడీంది నీ బతుకే కదా! ఈ కర్మభూమి మీద వెలసిన మూడుకోట్ల దేవతలూ కలిసి నిన్నాక్కదాన్ని చేసి వెలివేసినపుడు ఎవరికీ అక్కల్లేని నిన్ను కూడా (పేమించే దేవుడికోసం
మేలీ ముసుగులో మోకరిల్లి
తండ్రీ వీళ్ళేం చేస్తున్నారో
వీళ్ళకే తలియదయ్యా!
దయతో వాళ్లను క్షమించమని కన్నీటితో వేడుకున్నావు తీప్ప
అ చల్లపల్లి స్వరూపరాణి 15
నీకోనం నువ్వేం చేసుకున్నావు తల్లులంతా అమ్మాయిని డాక్టర్కిచ్చి పెళ్ళి చెయ్యాలనీ అబ్బాయిని ఇంజనీర్ చెయ్యాలనీ కలలు కలుగుల్గోంచి బుసలు కొడుతుంటే జీవితాంతం కూసింత మర్యాదకోసమే ఆకలి దప్పులతో అలమటించావు నీ పిల్లలు సైతం తోటివాళ్ళతో ఒకే బెంచీలో కూర్చోవాలనీ మనుషులుగా ఎదగాలనీ పూరి గుడిసెపై ఆశల తీగలల్లావు నీతోటి యిల్గాళ్ళంతా భర్త కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుంటే నువ్వు ఈతిబాధలతో పాటు వెలివేతలకి సైతం తలొంచావు అయినా " వూళ్ళో వాళ్ళందరికీ మా నాన్న లోకువైతే ఆయనకి మా అమ్మ లోకువన్నట్టు నీలో భార్యత్వానికి సానబెట్టి ఆర్యుల దగ్గర అప్పుతెచ్చుకున్న గొడ్డలితో ఆకాశమంత ఎత్తైన నీ ఆత్మను ముక్కలు ముక్కలుగా తెగనరుకుతాడు అమ్మా! అటు చూశావా పెద్దింటి అడపడుచులంతా మగాళ్ళతో సమానవత్వం కోసం పట్నాల్గ్లో సమరం చేస్తున్నారంట!
16 అ నుంకెన వూవు
వాళ్ల నిప్పుల నినాదాలు
వూరి చివరి మనవాడకు కూడా వినవస్తున్నాయి
నువ్వు చుట్టు గుడిసెలోంచి తొంగిచూశావు కదా! ఏమిటాలోచిస్తున్నావు... “నాన్నకి నాలుగు పెట్టి
ఎడంకాలితో తన్ని బయటికెళల్ళామనా అలా జరిగిన రోజు
బజాట్లోనీ అస్థిత్వం కేవలం
ఫలానా మాదిగ ముత్తాయి పెళ్ళాం మాత్రమే! ఆ చేదు నిజానికి
అక్కడే కళ్ళు తిరిగి పడిపోతావు
నీ గోత్రం లేనితనం మీదే కాక దిక్కుమాలిన నీ ఆడతనంపై కూడా ఒక్కసారే రోత పుడుతుంది
నిన్నో వెన్నెముక లేని అమీబాను చేసి ఎవరిష్టమైన రూపంలో వాళ్ళు
నీ మనసుమీద వంటిమీద
పెట్టిన వాతలు
తరతరాలకీ మాసిపోయేవి కావు
పోనీ నగరానికొచ్చి మేకప్ చేసుకుని నలుగురిలో కల్సిపోదామన్నా
ఆ కాస్మటిక్స్ పేర్లు కూడా
నీ భాషా లోకానికందవు
అమ్మా! మనూళ్ళో
అ చల్లపల్లి స్యరూవరాణి 1/
రాయిచెట్టు కింద రచ్చబండలాగే అక్కడ (పెస్సుక్షబ్బులనీ రవీంద్రభారతనీ వ్యవహారాలు మాట్లాడడానికి వుంటాయిలే! అక్కడి బాబ్జ్ హైయిర్ వుద్యమాల్లో పట్టుచీరల పోరాటాల్లో స్లీవ్‌లెస్ స్పీచ్‌ల్లో నీ అద్ది పిల్లి అరవయ్యో నంబర్కోక బిక్కమొహం వేలాడేస్తుంది అక్కడ “మహాలక్ష్మమ్మ' “అంకాళమ్మ, 'సీత్రారామమ్మ' గార్లంతా ఈ దేశంలో స్రీలపై అణచివేత నళించాలనీ మహిళలకు లైంగిక స్వేచ్చ కావాలనీ బ్యాంకు బ్యాలెన్స్‌ను ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఆర్థికస్వేచ్చ కావాలనీ నోరు నెప్పి పుట్టేలా వుపన్యాసాలిచ్చి చివర్లో పాపం! దళిత స్త్రీని కూడా “పైకి తీసుకెళ్ళాలనీ ముగిస్తారు తర్వాత కథ మామూలే! మీటింగు అయ్యాక ఇటీవల కొన్న చీరల గురించీ కలర్‌టీవీ గురించీ మధ్య మధ్యన ఎక్కడో ఉన్న బీజింగ్ గురించీ
18 అ మంకెన వూవు
పొగడ్తల స్నాక్స్ కబుర్ల టీలు చప్పరిస్తారు అమ్మా! అనాటి సూర్చణఖ నుంచి
చలకుర్తి ముత్తవ్వ మీదుగా సజ్జెలగూడెం మహాదేవమ్మ వరకు పరాభవాల పరంపరవై
కన్నీటి హోరులో కొట్టుకొని పోతూ ఇక్కడ నువ్కొకదాని వున్నావనీ పుట్టుకతో నీకు సంక్రమించిన
కులం లేనితనాన్ని గురించీ 'పెరుగుటతో నీకు ప్రాప్తించిన
కూడు లేనితనం గురించీ
ఒకళ్ళు ఒక్కళ్ళన్నా మాట్టాడారా....? అసలు నీ స్పర్శ తగలందే
ఇక్కడ గాలీ వెలుతురూ ప్రకాశించవనీ నీ చేతులు మట్టిలో దేవి
రత్నాల చేపలు పట్టందే
ఈ దేశం పొట్ట నిండదనీ
సాటి ఆడదానివని కూడా చూడకుండా అసే ఓసే అని
నిన్ను ముక్కలు చెయ్యందే
ఇక్కడ కుల (ప్రతిష్టలు కుచించుకుపోతాయనీ
పాలంపనుల్లో యింటి పనుల్లో
నువ్వు నలుపెక్క బట్టే
అ చల్లపల్లి స్వరూపరాణి 19
పెద్దపెద్ద వర్జాలన్నీ
పళ్ళికిలించాయనీ
సౌభాగ్యాన్నిచ్చే బొట్టును ఛీ కొట్టి
నవ్వు పర్మినెంట్‌గా ముండమోయబట్టే ఈహిందూ కమలాలన్నీ వికశించాయనీ
ఈ జీనుఫాంటుల జమునారాణీలకు తెల్చా...? నీలాగా అలగా పుటకపుడితే తప్ప " ముక్కోటి జన్మలెత్తినా
ముక్కు మూసుకుని తపస్సు చేసినా నువ్వు వాళ్లకు అర్ధం కావు వుట్టికెక్కలేనమ్మ
స్వర్గానికెగబాకినట్టు
చూరుకింద కూర్చుని
పగటికలలు కంటే లాభంలేదు
ఇరుగింటి ఇమాంజలమ్మలనీ చుట్టుపక్కల సువార్తమ్మలనూ పోగుచేసి మూలనున్న చీపురుకట్ట తీసుకో....!
“పాక పనులు మనకెటూ అలవాటేగా! కులం కంపుకొడుతున్న
ఈ దేశం రోడ్డన్నీ
బంగాళాఖాతంలోకి వూడ్చుదాం! మాలమాదిగ ముండలంటూనే
అంటరాని ఒంటిని
కోరికల 'స్కేళ్ళతో కొలిచే
వూరి అరుగులను
మరుగుదొడ్డకు మళ్లే కడుగుదాం!
20 అ మంకెన వూవు
ఆ బంగారు చేత్తోనే మిమ్మల్ని బాబుగాడి సామ్ములా వాడుకుంటున్న మీ పెట్టుబడిదారీ పెనిమిటిని కింద నుంచి పై దాకా ఫినాయిల్‌తో జాడిద్దాం....! డిసెంబర్ 95 వదునెక్సీ నపొటీ, అమ్మ నంకలనాలు మలాలా నా ఘన రా ము స్లో జె క 1 ఖ్ యే క [6 (వా షా అ చల్లపల్లి స్వరూవరాణి!, శో గృ లో 21 సు అ న * లో స్ముపైద్ కాడ్ కి (కీ
అన్వేషణ
ఎప్పుడూ ఏదో మర్చిపోయినట్టనిపిస్తుంది ఎటు చూసినా ఖాళీతనం...
చెయ్యాల్సిన పనేదో
చాలా రోజులుగా
వాయిదా వేసుకుంటున్నట్టు జ్ఞాపకమొస్తుంది. ఒక వెలితితనం వెన్నంటి నడుస్తుంది మరిచిపోయిన విషయాన్ని వెదుక్కుంటూ రోడ్డన్నీ మనుషుల్నీ పరికిస్తే
అందరూ నాలాగే కాసింత వెలితిని భుజాన తగిలించుకుని
చిరునవ్వుల్ని అలంకరించుకుని
మాట్టాడే వాహనాల్లా పరుగెత్తుతున్నట్టనిపిస్తుంది
బహంశా నేను కూడా వాళ్ళకు
నవ్వడం నేర్చుకున్న
మరబొామ్మల్లా కనిపిస్తుండొచ్చు విచిత్రంగా
ఈ వాహనాలూ, మరబొమ్మలూ అప్పుడప్పుడూ
నగరం ఎడారి గుండ్తెప్లై
కాసింత కవిత్వాన్థి చిలకరిస్తాయి
22 ఇ మంకెన వూవు
స్నేహాన్ని ఆనవాయితీగా పాటిస్తాయి అక్కడున్నంతసేపూ
పలకరింపులతో కరస్పర్శలతో
మనసు కాస్త చెమ్మగిల్లినట్టు అభినయిస్తుంది
ఇంతలో మర్చిపోయిన విషయం వెనుకనుండి వీపు చరుస్తుంది
గూటినుంచి ప్రవాహంలోకి పారిపోయినా.... ప్రవాహం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చినా.... చివరకు తడముకొంటే
నేనూ నా వెలితే మిగులుతున్నాం... చినిగిన బట్టలకు మాసిక వేసినట్టు 'పెచ్చులూడిన గోడలకు
సిమెంటు అద్దినట్టు
వెంటాడే ఈ వెలితిని వూడ్చడానిక్కుడా ఏదైనా పదార్ధం వుంటే బాగుండు... పలుగూ.. పారా తీసుకుని
మేటలు వేసిన హృదయాన్ని
పొరలు పొరలుగా
తవ్వడం మొదలుపెట్టాను
లోపల నుంచి కమ్మటి ఒండ్రుమట్టి వాసన హాయిగా ముక్కుపుటాల్ని తాకింది పురావస్తు శాస్త్రజ్ఞుడి చేతిలో
అపురూప రాతియుగం పనిముట్టులాగా పేమ... స్నేహం... సహజత్వం
తళతళ మెరుస్తూ బయటపడ్డాయి. 12108.97
అ చల్లపల్లి స్వరూపరాణి 23
కొండమల్లి నేను శిల్పాకృతిలో వున్న నల్లని మాంసపు ఖండాన్ని నాకు శరీరం తప్ప మనసెక్కడేడ్చింది మరి...! చాలీచాలని నా రైకపై అద్దాల్లో వేలాడే యుగాలుగా మీరు నాపై పన్నిన కుట్రా ప్రతిబింబాలు పరావర్తిస్తున్నాయి నా చేతుల్ని బిగించిన బండగాజుల చప్పుడు బంగారు గాజుల నాజూకు సవ్వడి లాంటిది కాదు మరి! అదినా వేదనారాగాలు మోసుకొచ్చే వింత శబ్దం . ఇక నాకాళ్ళ కడియాలు చూశారా! ఈ బందిఖానా నుండి ఎంత పరుగెడదామన్నా అవి నా నడకను ముళ్ళబాటకే బంధించిన 2డీ అ నుంళెన వూవు
బానిస సంకెళ్ళు
పొద్దు పొడిచింది మొదలు
కొండ కోనలు గాలించి
కుండల కొద్దీ తేనె బుట్టలనిండుగా చింతపండు కోసుకొచ్చి
కొట్టులో అమ్మితే
ఒంటినిండా కష్పాకోడానికి ముతకచీర కూడా కొనలేక ఆడకూతురై పుట్టినందుకు వెనకొక గుడ్డా
ముందుకొక గుడ్డా
అడ్డం పెట్టుకొని
బతుకు బండరాళ్ళ మధ్య ఈదులాడుతుంటే మీకేం రసిక రాజులు.....
మా అంగాంగ వర్ణనలతో శృంగార కావ్యాలల్డుతారు... రాళ్ళూ రప్పల్లో ... ఎండా వానల్లో రేయింబవళ్ళు తిరిగి
రాటుదేలిన నా వళ్ళు
ఒంపులు ఒంపులుగా
తైలవర్ణ చిత్రమై
మీ గోడలపై తళుక్కుమంటుంటే లజ్జతో కుచించుకుపోయిన
నా మనసుతో పాటు
ఆకలికి అంటుకుపోయిన
అ చల్లపల్లి స్వరూపరాణి 25
"పేగులు సైతం కలుక్కుమంటున్నాయి
గంధపుచెక్క విప్పపూలతోపాటు
అడవి అందాలు సైతం అమ్మకపు సరుకై
ఎన్నిసార్లు అంగళ్లకు రవాణా కాలేదు
మా తాత ఏకలవ్యుడి వేలును
మీ పాళీగా... వాడుకొన్నది చాలక
మా పచ్చ పచ్చని పరువాలను కూడా
నిప్పులో తగలబెడతారని తెలిస్తే
మా అడవి తల్లి
పత్రహరితానికి బదులు
పత్ర విషాన్ని విరజిమ్మేది.
267.96 (అదివారం ఆంధ్రజ్యోతి 271298 26 అ నుంకెన పూవు
మట్టిచేతులు
తోలి కోడికూత
చిమ్మవీకటిని చీల్చుకుంటూ
వూరి గుడిసెని వెలిగించగానే
ఆమె సత్తు గిన్నెల సంగీతంలో
ఇంటిని మేల్కొలుపుతుంది
పిల్లలకి నాలుగు మెతుకులు పెట్టి
చేతిలో సద్దిమూటతో
పడుతూ లేస్తూ పొలం వెళితే
అక్కడ కామంధు తిట్లతో
అమెకు స్వాగతమిస్తాడు
మోకాలిలోతు బురదలో నడుం వొంచి
నారు మొక్కలతో పాటు
నాజూకు తనాన్ని కూడా
భూమిలో నాటుతున్నప్పుడు
గుప్పెడు కారం మెతుకుల కోసం
కడుపులో పేగులు కరాళనృత్యం చేస్తాయి
చెట్టుకొమ్మకేసిన వుయ్యాల గుడ్డలో
చంటోడు పాలకోసం గుక్కడపెడుతున్నా అ చల్లపల్లి స్వరూపరాణి 27
తలెత్తకుండా అమె మాత్రం చేనుకు ఎరువు వేస్తూను ఉంటుంది ఆలనాపాలనా లేని ముద్దుల కూతురు మురికి గుంటల్లో ఆడుతున్నా ఏమీ పట్టనట్టు ఆ మట్టిచేతులు కలుపు తీస్తూనే వుంటాయి ఆమె ఒంటిరంగును కూడా తాగేసి బంగారంలా మెరుస్తున్న వడ్డగింజల్ని కుప్పలుగా పోస్తున్నా ఆమె రోజూ పొయ్యి మీదకి లేక అగచాట్లు పడాల్సిందే... రెక్కలు ముక్కలు చేసి మట్టిలో పసిడి పూలు పూయిస్తే కూలిడబ్బుల దగ్గర కూడా ఆమెను ఆడతనం వెక్కిరిస్తుంది రెండు రూపాయల సంపాదనతో పసివాళ్ల పొట్టనింపుదామని గంపెడాశతో గూట్లో వాలితే ఆమె చెమటను సారాలా తాగటానికి పెనిమిటి తయారుగా ఉంటాడు ఎండకు ఎండి వానకు తడిసి మాపటికి మొగుడు పెట్టే తన్నులు తిని ఏటా పురుడు పోసుకుని
28 అ మంకెన వూవు
ముద్దబంతి పూవులా కళకళలాడే ఆమె ఒళ్ళు
వాడిన తోటకూర కాడలా వెలవెలబోతుంది
కన్నీటి వరవడిలో కొట్టుకుపోయి
కాంతిని కోల్పోయిన అఆ పిచ్చితల్లి
బతుకు రాళ్ళ బాటలో
ఆకలి శిలువను మోస్తూ
పాయ్యిలో కట్టెలా
పొద్దు గూకులూ తగలబడుతుంది
౧807895 (గుండెడవ్సు, నదునెక్స్న పాట నంకలనాలు, అ చల్లపల్లి స్వరూవరాణి 29
వేలాడే ప్రశ్న
నిజమే
ఆ కమురు వాసన
ఇంకా గుండెను దహిస్తూనే ఉంది
అనాటి అర్తనాదాల ఘోష
చెవులను చిల్లులు పొడుస్తూనే ఉంది
నా ముసలి తల్లి ఆకలి పేగులను
వెలిగించటం కోసం
కొన్ని చిన్నారికళ్ళకు
అమ్మను శాశ్వతంగా దూరం చేస్తాననుకోలేదు
కళ్ళు తెరిచిన దగ్గరనుండీ
నన్ను వెంటాడి వున్న ఆకలి
అకస్మాత్తుగా దాహమై రగిలి
ఇన్ని కడుపుల్లో చిచ్చు పెడుతుందని
తోచనేలేదు
ఆ రోజు పత్రికలన్నీ
గుండెల్సిండా ఆక్రందనల అక్షరాలను
బరువుగా మోసుకురావడం చూసీ
నా తల్లి
తన అమ్మతనాన్నే శంకించుకుంటూ 30 అ మంకెన పూవు
నావైపు అసహనంగా చూసినపుడు నా నరనరాలు వురితీతకు గురయ్యాయి నేను చేసిన క్రౌర్యానికి
నా అణువణువూ చిద్రం కావల్సిందే....! కాని
నేను చచ్చిపోయే ముందు
నా చుట్టూ ఆలుముకున్న
ప్రశ్నలకు సమాధానం కావాలి
చావు పొగ
చుట్టుపక్కల కమ్ముకొస్తున్నా
ఏనాడో ఈ దేశం నా జాతికి విధించిన మరణశిక్ష గురించి ప్రశ్చిస్తున్నాను
ఈ భూమిపై మొలిచిన నేరానికే వుమ్మి ముంతా తాటాకు చీపుర్లను బతుకంతా అనుభవించిన
నా తాత ముత్తాతలు
ఏం నేరం చేశారని...?
వ్యాధి నిర్ధారణలో
వైద్యుడు పారబడ్డాడేమోననిపిస్తుంది ఈ దేశంలో వరపుత్రులంతా సహజంగానే
సవర్ణ కవచకుండలాలతో పుడతారు మేము మాత్రం
అకలి పుట్టమచ్చలతో
గంపెడు చీకటిని నెత్తిన పెట్టుకుని
అ చల్లపల్లి స్వరూపరాణి 3]
పుడతాం...! పుట్టగానే మీ అమ్మ వెండిస్పూన్ చేతికిస్తే నా ప్చ్చితల్లి ఎండిన గుండెను నా నోటికిచ్చింది పొట్టనిండిన నువ్వు పట్టపగలే గుడిలింగాన్ని మింగితే నేను చీకట్లో అరుగునే చప్పరించాను అడక్కుండానే ఈ దేశం నీ చేతికి చేపనిచ్చి నా మెడలో పామును వదిలింది అది నీకు రొట్టెనిచ్చి నానోట్లో రాళ్లు కుక్కిన సవతి తల్లి అయినా దీన్ని నెత్తిన పెట్టుకుని వూరేగుతూనే వున్నాను అది మాత్రం నా అన్నదమ్ముల రక్తాన్ని స్నానానికి అడుగుతుంది మా తలకాయల్ని కాసికాయల దండగా ధరిస్తుంది దాన్నీ దాని అనుంగు బిడ్డలనూ హుందాగా దాటవేసింది ఈ న్యాయస్థానాలే కదా! అవును ఇక్కడ వురికొయ్యలు కూడా కులంకలపతో చేసినవే! 32 అ మంకెన వూవు
ఏ నేరం చెయ్యనివాడే ముందుగా శిక్ష విధించదల్చుకుంటే మా మాన ప్రాణాల్ని మింగిన ఘరానా హంతకుల వురికంబాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించి ఉండేవి నా నాలుకకు ఆకలి రుచితప్ప రక్తం రుచి తెలీదు ఓనా ప్రియమైన “మాతృదేశమా'..! నువ్వు నన్ను క్షమిస్తావో లేదో గానీ నీ సవతి తల్లిప్రేమను నేను క్షమిస్తున్నాను గుమ్మడి కాయలు పోయేకంతల్ని కానకుండా ఆవాలకంతల్ని వేదికే నీ అజ్ఞానాన్నీ క్షమిస్తున్నాను హవాలా కొండల్ని బొజ్జల్నిండా బొక్కి మాకు ఆకలి మెతుకుల్సి తినిపించిన స్వాహారాయుళ్ళను వదిలేసి ఎంగిలిస్తరాకుల్ని ఏరుకునే ఎండిన డొక్కలపై లాఠీలు యుళిపించే నీ పోలీసు తనాన్నీ క్షమిస్తున్నాను కానీ నా సమాధి మీద ఒక తుపాకీ మొక్క చిగురు తొడిగితే అందుకు కారణం నేను కాదు. 02.7796 బలనఠీ విజయవర్థనం, బిత్రరువు నంకలనొలు అ చల్లపల్లి స్వరూపరాణి తత
దగాపడ్డ పాట చెట్లు ఎర్రటోపీలను పుష్పిస్తున్న చోట... అడవి “రాగోలు అంగటి సరుక్రై నగరాలకు రవాణా అవుతున్న చోట... ఆమె నిప్పులు చెరిగే పాటయ్యింది. జనం యాస అబాసుపాబైన చోట... జనం కళలు వురితీయబడ్డ చోట... అతడు “ఏకునాద'మై మోగాడు ఇక్కడ ఆడబతుకులాగే పాటలకూ పరాభవం తప్పదు నీటిబొట్టకోసం నాలుక పిడచకట్టుకుపోతున్న మా పల్లె గడప తొక్కిందంటే తాట తీస్తానని సారా బొట్టుపై కన్నెర్ర చేసిన పాటంటే కడుపుమంటే మరి! ముసలి వయసులో చేతిరైనా కాలేని కొడుకు ఏ అజ్ఞాత శవమై
34 అ మంకెన వూవు
చెట్టుకు వేలాడుతున్నాడో తెలీక ఆఖరి చూప్తుకోసం విలవిల్లాడిన కపుడు తీపిని వీరబాహువై చల్లార్చిన గుండెలు మండించే పాటను చూస్తే తడిగుడ్డతో గొంతుకొయ్యాలనిపిస్తుంది ఇక్కడ కాఫీ నీళ్ళకోసం చిల్లర పైసలు దొంగిలించే మా నేరస్థ తలలకు న్యాయస్థానాలు వెలను నిర్ణయించినట్టే మా పాటకూ మారణదండన విధిస్తారు. ఇక్కడి విలుకాడు వృత్తి విప్లవకారుడు కావచ్చు... (పేమికుడు కూడా పైరవీకారుడు కొవచ్చు... కానీ.... పాటకు మాత్రం శీలం ఉండి తీరాలి అది సలసలమండే చీమూ నెత్తురున్న పాటైనా దానికి పాతిప్రత్యం కనీసార్హత పాట మర్యాదస్తురాలూ... నీతిమంతురాలూ అయినంతవరకే దాన్ని భరించేది... అది ప్రశ్నలు అడగకూడదు గడపదాటకూడదు అ చల్లపల్లి స్వరూపరాణి వె్్
ఆజ్ఞల్ని అతిక్రమించినపాటను
ఇక్కడి ప్రబంధకావ్యాలు
ఖండఖండాలుగా నరికి
కాకులకూ గద్దలకూ విసిరేస్తాయి
గూటిలో గమ్మున పడి ఉండకుండా
గోచీ గొంగడి కట్టి
వీధి కెక్కిన పాట గుండెను
నన్నయ్య తిక్కన జీపులో వచ్చి
డైనమైట్లతో పేల్చేస్తారు
ఇపుడు
చిన్నయ్యసూరి లాఠీకర్ర పుచ్చుకుని
తరుముకొస్తుంటే
మా పాట
తెలంగాణా పల్లెల్లో
రహస్యజీవి అయింది
06.20.97 ఇండియాయడే సాహిత్య నంచిరో 2002
36 అ మంకెన వూవు
నల్లగులాజీలు నేటి బాలలే రేపటి పౌరులు
నేటి బాలకార్మికులు మాత్రం రేపటి వృద్ధ కార్మికులు తప్ప మరేమీ కారు ఇక్కడ మా బాల్యానికి 'దినం' చేస్తారు అమ్మ పక్కలోనే బాల్యాన్ని హత్య చేసుకుని బతుకును చేత పట్టుకుని
నడిరాతిరి యిల్లు విడిచిన
వలస పిట్టలం
అల్లారు ముద్దుల్లో తడుస్తూ
అక్షరాలు దిద్దుకోవాల్సిన మా చిన్ని చేతులు బాల్యానికి బలవంతంగా
వీడ్కోలు చెబుతున్నాయి
బొమ్మలతో ఆడుకునేనేళ
మేమే మీ పిల్లల చేతిలో ఆటబొమ్మలమై వయసు మోయలేని వెట్టి చాకిరితో గిడసబారిపోతున్నాము
ఇసుకలో పిచ్చక గూళ్ళు కట్టి
సంతోషం చిందులు వేసే
మా బోసినవ్వుల్ని
అ చల్లపల్లి స్వరూపరొది 3
మీ యింటి పెరట్లోనే పాతేశారు మీవళ్ళు వంగకపోతే మా బుల్లి బుల్లి అవయావాల్ని తీగల్లా సాగదీసి పెద్ద పెద్ద పనులు చేసింది మేమే కదా...! కర్మాగారాల్లో బొగ్గుగనుల్లో యింకిపోయిన మా పసితనంపైనే ఈ దేశ పరిశ్రమలు పల్లవించాయి బుడిబుడి అడుగుల బుజ్ఞాయిలంతా మమ్మీడాడీల చెయ్యి పట్టుకుని జూపార్క్ సాలార్జంగ్లలో కేరింతల సంగీత మాలపిస్తుంటే మా పొగ చూరిన చేతులు వూపిరాడని కార్ణానాల్లో చెమట గింజలేరుకుంటున్నాయి ఈ నేలపై మొలకెత్తిన నేరానికి మీరు వదిలేసిన వ్యర్థ పదార్థాలు పీల్చుకుని
- మీకు జీవఫలాలిచ్చే త్యాగవృక్షాలై నిలిచాము దిక్కులేని పిల్లలపై సినిమాలు తీసి ఈ రోజు మీరు అవార్డులందుకుంటుంటే రోజు రోజుకూ విస్తరిస్తున్న మా ఉనికిని చెత్తకుప్పల్లో మురికి కాల్వల్లో ఏరుకుని గోతాలకెత్తుకుంటున్నాం అందుకే 38 అ మంకెన వూవు
మా బుగ్గల ఎరుపును కాజేసి
గుండె గులాబీలు ధరించే
ఏ చాచాలపై మాకు నమ్మకం లేదు
మీ ఛీక్కారాల మంటల్లో
కమురుకుపోయిన
మా లేతపచ్చని చిన్నతనం సాక్షిగా
నవంబర్ పధ్నాలుగును నిరశిస్తూ
(ప్రేమరాహిత్యంతో
రాటుదేలిన మా చిన్నారి గుండెలపై
నల్లగులాబీలు పూయిస్తాం!
13.7295 క్వొాంవస్ కవిత్వం, సెంద్రల్ యూనివర్శిటీ అ చల్లపల్లి స్వరూపరాణి 39
మరో యుద్దం అ౦క్షల అడవుల్ని ఈది నువ్వొస్తావని నువ్వొచ్చేది అచ్చం నాకోసమేనని మన మధ్య పేరుకున్న యుగాల మౌనాన్ని హృదయోల్హాస వాక్యాలతో ముక్కలు చేయబోతున్నామని నిలువెల్లా నీ వూసులతో అలంకరించుకుని ఎదురుచూశాను నీ గురించి ఏ అపస్వరం ఎటునుంచి వినాల్సి వస్తుందోనని బిక్కు బిక్కుమంటూనే నిముషాల యుగాల్ని కళ్ళు మూసుఖుని దొర్జించాను చీకట్లను చీల్చే నీ అడుగుల చప్పుడు కోసం కాలాన్ని కరిగి పొమ్మని శపించాను నీకోసం దిగులు పడడాన్ని
40 అ నుంకన పూవు
ఒక్కోసారి అలవాటుగా అనేకసార్లు నా జీవన విధానంగా మలుచుకున్నాను నీకోసం ఎంత వేగంగా కొట్టుకుందో... ఎన్నికలల్సి రచించుకుందో... తాలిజాములో నువ్వాచ్చినపుడు ఒక్కొక్క పేజీ విస్పి చదువుకుంటావని నా గుండె పుస్తకాన్ని నీకందించాను మన మధ్య పరచుకున్న నల్లని సూన్యంలో స్విచ్ వేయగానే చందమామలు వెలుగుతాయి కాబోలని ఆనవాయితీగా వెదికాను కానీ నీకోసం చిక్కి శల్యమైన నా వొంటిని నిద్దట్లో కూడా నీ క్షేమాన్నే కలవరించిన మన యింట్ని పోలీసుకుక్కలా తనిఖీ చేస్తూ నీ కళ్ళు... అ కళ్ళల్లో వసంతాల కోసం వెదకటం వురిశిక్షార్హమని తెలిసింది కుళ్ళిపోకుండా భద్రపరచుకోవడానికీ కాదంటే ఖండఖండాలుగా పేల్చి వేయడానికీ నేనిప్పుడు అ చల్లపల్లి స్వరూపరాణి త
అవయవ సర్వస్వాన్ని కాదల్బుకోలేదు నేను సైతం మరో మందు పాతరౌతాను నా అకాశం నుంచి నిన్ను బహిష్కరించి నా అడుగులు మరో యుద్ధభూమికి తరలివెళ్తున్నాయి 12112000 శై అ మంకెన పూవు
నిషిద్ద చరిత నేను గర్భస్థ శిశువుగానే అస్పృశ్యురాలిగా చిత్రించబడి హీనకుల ముద్రతో పుట్టాను పుట్టిన నాడే కులటగా గుర్తించబడి వెర్రి మొర్రి కట్టుబాట్లలో మూఢాచారాల రొచ్చుగుంటల్లో పారవేయబడి నిషిద్ధ జీవినయ్యాను లాలింతలు కేరింతలతో పల్లవించాల్సిన నా బాల్యం చిగురులు తొడగకముందే దుఃఖ సంగీతాన్ని ఆలపిస్తుంది అడ్డాలనాడు అమ్మానాన్నల ముద్దూ మురిపాలలో తడిసి పరిమళాంచాల్సిన నా యవ్వనం గుడిలో దేవత సాక్షిగా అంగడి బొమ్మగా ఆవిష్కరించబడుతుంది మమ్మల్ని వివస్తాలుగా వూరేగించి మా లేలేత యవ్వనాల్ని కాష్టంలో కాల్చి మాచేత మలం తినిపించిన
అ చల్లపల్లి స్వరూపరాణి 43
నిర్ణజ్ఞాఅత్యాధనికంలో
నాదో కన్నీటి వింతగాథ
తరతరాల చీదరింపును
యుగయుగాల అలక్ష్యాన్ని
వారసత్వంగా మోస్తున్న దాన్ని
ఈ కర్మభూమిపై
కళ్ళు తెరవని పసికందుగానే
'వేశ్య'గా గుర్తించబడ్డ ఖ్యాతి నాదే!
సైబర్ విప్ణవాలన్నీ
ఒక్కసారి
రాతియుగంలోకి తలదించుకోవాల్సిన నా కథను
ఘనత వహించిన
ఈ దేశ చరిత్ర గ్రంథాల్లో
ఏ పర్వంలో లిఖిస్తారో...!
కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో దళిత కుటుంబాలకు చెందిన ఆఅడప్లిలలను
పుట్టగానే బసివి రాళ్ళుగా మార్చే ఆచారం ఉంది.
24,04,905 (ఆంధ్రజ్యోతి డైలీ నవీన 24.65.90 త్న అ నుంకెన వూవు
విస్వ్పటన
ని౦డు కుండ తనం కోసం అణువణువూ పరితపిస్తున్నా
నిరంతర విస్ఫోటనలే
నన్ను అక్కున చేర్చుకుంటున్నాయి అచ్చంగా.... అప్పుడే పుట్టిన మనిషిలా లేత పచ్చని చిగురంత అమాయకంగా బతకాలన్న ఒక్కగానొక్క కోరికను చుట్టూ పేరుకున్న కాంక్రీటు లౌక్యం రోజు రోజుకూ ఘనీభవింప చేస్తుంది నేను 'మనిషి'ని అని ప్రకటించుకోడానికి ఎన్ని విధ్వంసాల్ని దాటాల్సి వచ్చింది... నాలో రక్త చలనం ఉందని చాటడానికి ఎన్నియుగాల అనుబంధాలతో సంఘర్షించాను...!
ఒకింత ఆత్మశాంతి కోసం
ఎన్ని యుద్ధాలు చేసినా
చివరికి పెనుగులాటే
నా చిరునామాగా మిగులుతుంది ఎంత వెదికినా
అ చల్లపల్లి స్వరూపరాణి 4వ
లోకంలో పిడికెడు నైర్మల్యం కాస్తంత నమ్మకం ఎండమావులని తేలాక స్వచ్చందంగా యుద్దాన్నే నిత్యావసర వస్తువుగా తెచ్చుకుని రోజుకో చిటికెడు చొప్పున మింగుతున్నాను. “510.97 4 అ మంకెన పూవు
“బిడ్ద సంచులు నొ్లుగు వేళ్ళూ లోపలకు పోవడానికి మొన్న బండెడు కష్టాన్ని అమ్ముకున్నాం నిన్న చెంబూ చేటా తాకట్టు పెట్టుకున్నాం గుక్కెడు గంజీనీళ్ళు కోసం వాంట్లో నెత్తురుని అమ్ముకున్నాం కిడ్నీలు అమ్ముకున్నాం _ పిడికెడు ఖాళీని పూడ్చడానికి రోజూ గుండెని తాకట్టు పెట్టుకుంటున్నాం మా ఆత్మనూ... దేహాన్నీ అంచెలంచెలుగా... ముక్కలు ముక్కలుగా కత్తిరించి అమ్ముకున్నాం... ఇంకా అమ్ముకోడానికి మా దగ్గర ఏముంది బాబూ? అందుకే కడుపు కూటికోసం కడుపు తీపిని కిలోల లెక్కన అమ్ముకుంటున్నాం మీలాగా అమ్మి అక్కర్లు తీర్చుకోడానికి మా దగ్గర దేశాలు లేవు పెద్ద పెద్ద బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అత్యవసరంగా ఎన్‌క్యాష్ చేసుకోవడానికి మా దగ్గర
అ చల్లపల్లి స్వరూపరాణి జా
పత్తిరైతుల నేత కార్మికుల
బక్కచిక్కిన బతుకులు లేవు సారూ!
కడుపున కాసిన ఆడపిందలు తప్ప
అమ్ముకోడానికి
ఏమీ మిగల్చుకోలేని వాళ్ళం నాయినా!
మొలకెత్తని విత్తనాల్ని నమ్ముకుని
అగచాట్ల మూటల్ని తలకెత్తుకునే
పత్తిరైతులారా!
అప్పుల దిగుడు బావుల్లో దిగబడిపోయిన
చేనేత కార్మికులారా!
అమ్మతనాన్ని అంతర్జాతీయ మార్కెట్లో
అమ్మకానికి సిద్ధం చేసిన
లంబాడీ తల్లులారా!
రండీ!
మనకోసం
వినూత్న ఆర్థిక విధానం వెలిసింది
ఇప్పుడు మనకి
గిట్టుబాటు ధరలతోనూ రాయితీలతోనూ
వెరసి డబ్బు సంచులతోనూ పనిలేదు
అడ్డాలనాడే అన్నం మెతుకులయ్యే
పసిమొగ్గల్ని విరబూయడానికి
సారవంతమయిన
“బిడ్డ సంచులుంటే చాలు
దేవుడా! రక్షించు
మా “బిడ్డ సంచుల్ని!
0౩06.2007 (ార్త డైలీ 24.4200₹ 48 ఛ మంకెన వూవ్ప
జోసి ఆషి ఒక స్వప్నం ర౦గు రంగుల స్వష్పాలు కనురెప్పల్ని పలకరించడం నా జ్ఞాపకాల పేజీల్లో కానరాదు నా కలలో నన్నెప్పుడూ ఎవరో తరుముకొస్తుంటే ఒక అభద్రతా భావాన్ని చేతపట్టుకుని నాకు తెలియని చోటుకు పారిపోతుంటాను నిజానికి జీవితమూ అక్షరాలా కలలాగే...! నా అస్థిత్వాన్ని ఒక మూటకట్టి దిగంతాలవైపు విసిరేసి “నువ్వెవరు'...? అని నన్నెవరూ ్రశ్నించని చోటుకు పారిపోదామని అ... ఆల నుండీ జనారణ్యానికి అడ్డంగా పరుగెడుతున్నాను అయినా అది రక్తం మరిగిన పులిలా నన్ను తరుముకొస్తూనే ఉంది చిన్నబడిలో నా వేషభాషలు నన్ను పట్టించి యిస్తే పెద్దబడి నోటీసు బోర్డులో
అ చల్లపల్లి స్వరూపరాణి త్రి
నా పేరు పక్కన నక్షత్రం గుర్తు నన్ను మళ్ళీ అపరాధిని చేసింది చదువుల కార్థానాల్లో జారబడి పుస్తకాలతో కుస్తీపట్టి మెదడు పనిముట్టును సానబెట్టుకుంటుంటే నా పనితనం వైపు ఒక ముసలి జంధ్యం అనుమానంగా చూసింది నా గుండె చప్పుళ్ళతో ప్రమేయం లేకుండా మెడలో వేలాడే కనిపించని వుమ్మిముంత నా కుర్చీ దాకా నన్ను వెంటాడి నా కదలికలపైన కలలపైన నడకపైన నవ్వులపైన అహర్షిశలా నిఘా అయింది నా వూహలకు వూసులకు సహారా కాస్తుంది నా సర్వస్వంపై రిమోట్ కావాలని పాపం దాని కల కాబోలు... యింత జరిగాక నా పరుగును తుదముట్టించి ఒక సరికొత్త కల కనడం యిప్పుడూ నా కళ్ళకు నేర్చుతున్నాను ఆ కలలో నేనే రింగ్ మాస్టర్... కొరడా చేత పట్టుకుని అడవి మృగాలను ఆదిలించడం నా స్వచ్చంద నిత్యకృత్యం. 74.2000 50 అ మంకెన పూవు
అపశకున పక్షి వైవాహిక వనంలో వాసంత సమీరాలు వీస్తూ నవ్వులు పూసే పచ్చని చెట్టు ఒక్క అల్పపీడనానికే పత్రహరితాన్ని కోల్పోతుంది మెడలో మెరుస్తూ గుండె చప్పుడు వింటున్న బంగారు తీగె పుటుక్కున తెగిపోయి అయిదోతనం ఆవిరౌతుంది దాని నుదట దోబూచులాడే చందమామ నడిజాముకే చిన్నబోతాడు సిగలో నవ్వే నక్షత్రాలు ఆర్ధరాత్రికే వెలవెలబోతాయి చేతుల చుట్టు అల్లుకున్న యింద్రధనస్సులు మూడు నాళ్ళకే ముక్కలై నా మట్టిలో న ధరర జై గృహలక్ష్మిగా .. అమ్మగొ క్ గ గం, కఠర్తో ప క న 51 అచల్లపల్లి న్వరూపరాణి 1 స్నా పం నస లో స్స 0న ౪౩
బహుపాత్రాభినయం చేసిన ఈ బంగారు బొమ్మ యిప్పుడు రంగుల నాటకరంగం నుండి తెల్లని రిటైర్మెంట్ తీసుకుంటుంది నిన్నటివరకు _ రంగురంగుల సీతాకోకచిలుకలా కళకళలాడిన అందాల చెట్టు ఇవుడు అందరికీ అపశకున పక్షి అవుతుంది వేడుకల వెలుతురునుండి దూరంగా వెలివేయబడి ఆ ఎండిన మోడు చీకటి గదిలో బండ చాకిరీ చుట్టూ గానుగెద్దులా తిరుగాడుతుంది “4.819985
క్2ై అ ముంళిన వూవు
ఫూల్ జెర్ కాంటే
పూలన్ |
నా రాటుదేలిన గడ్డిపువ్వు సోయగమా!
నువ్వు నిలువెత్తు ఆయుధానివై
బతుకుచుట్టూ ముసురుకున్న
కీచక చీకట్లను చెండాడుతూ
ఎగుడుదిగుడు భూముల్లో
నిటారుగా నడిచి వెళ్తుంటే
నీ సాహసానికి
చంబల్ లోయ సలాము చేసింది
నడుంచుట్టూ తూటాల వడ్డాణం ధరించి
కొవ్వు పట్టిన బెహ్మోయిపై
నువ్వు కవాతు చేస్తుంటే
దొరల గడ్డివాముల్లో నలిగి
చిట్లిన నా మట్టి పెదాలు
నీ ఎర్రని బూట్లను ఆబగా ముద్దొాడాయి
మనల్ని 'ఫలానా' అవయవంగా తప్ప
అమ్మా బాబుకి పుట్టిన
మనళ్ళరీరాల కలయికగా చూడలేని
మనువుగాడి ముదిగారపు అంగాల పాలిట అ చల్లపల్లి స్వరూపరాణి వవ
నువ్వు మారణాయుధానివై భగ్గుమంటే నా మసిబారిన ఆకాశం ఎరుపెక్కింది చట్టాన్ని పిడికిట్లో బిగించి నువ్వు వుత్తరాది గ్రామాలలో మోషేధర్మాన్ని పంచిపెడుతున్నావని పేపర్లలో చదివి ఇక్కడ మా మాన ప్రాణాలకు ఖరీదుకట్టే రచ్చబండ షరాబులు వులిక్కిపడ్డారు ఫూల్సింగ్! నా శౌర్య పతాకమా! నీ మరణం నా మడుగు కట్టిన గాయాల్ని కెలుకుతుంది నిర్జీవంగా నేలకొరిగిన నీ దేహం నా గుండెని సలపరిస్తుంది మనల్ని దొంగలుగా... మంత్రగత్తెలుగా కాదంటే మాతంగులుగా తప్ప మనుషులుగా చూడలేని వ్యవస్థలో ఆదమరిచి మనం అవయవాలుగా మిగలడానికి వీల్లేదు ఆత్మరక్షణ కోసం గుడ్డి గులాబీ ముళ్ళ కిరీటాన్ని ధరించినట్లు ఇక్కడి పూలన్లైనా మద్దికెర మార్తమ్మలైనా కదిలే ఆయుధాగారాలు కావాల్సిందే! 72722007
క్శీ అ నుంకన పూవు
జి జ్ఞాపకం ప్రీయమైన పద్మా.......! ఎక్కడున్నావ్....? నీ వుత్తరం కోసం చాలా రోజుల్నుంచి చూస్తున్నాను నీ నుంచి సమాధానం లేదు చిరుగాలి సవ్వడి వంటి నీ మాటలు సెలయేటి పరుగు వంటి నీ అడుగులు తెల్లపావురాన్ని మరిపించే నీ నవ్వు ఒక్కసారిగా మౌనం దాల్బాయని తెల్సి నేనాక దుఃఖ పర్వతంలా బిగుసుకుపోయాను వుద్వేగాన్ని మోసుకొచ్చే నీ అక్షరాలను పోస్టుమాన్ ఎటునుంచి తీసుకొస్తాడోనని నా కళ్ళు కాయలై చూస్తున్నాయి కానీ నా వుత్తరాన్ని చదువుకోవడానికి నీ కళ్ళు తెరిచి లేవన్న విషయం తల్చుకుంటే ఆకాశం అమాంతంగా నా తలపై విరిగి పడ్డట్టు అనిపిస్తుంది అందుకే నువ్వు లేవన్న నిజాన్ని నేను ధృవీకరించను
అ చల్లనల్లి న్వరూపరాబి క్
నేను నీకోసం రాసేది ఎలిజీ కానేకాదు చిన్న బడిలో మొద్దు పిల్లలకు మొట్టికాయ లేసే పంతులమ్మగానే నువ్వింకా జ్ఞాపకమొస్తున్నావు స్వచ్చంగా నవ్వే పూలలో స్వేచ్చగా ఎగిరే పక్షుల్లో రోజూ నీ అడుగుల చప్పుడు వింటున్నాను తళతళ మెరిసే నీ కళ్ళల్లో కనిపించని ఎడారులు నీ కంఠంలో వినిపించే అవ్యక్తరాగాలూ మా నుదుటిపై ప్రశ్నల నెలవంకల్ని లిఖించాయి రూమ్‌నెంబర్ 174... ఓహ్! ఎంత అందమైన పేరు...! ఏ లక్ష్మీ నిలయాలూ.. శాంతి నివాసాలూ.... ఆ రూమ్‌కి సాటి రావు అక్కడ చిక్కురొక్కరుగా పడుండే పుస్తకాలలో విసిరేసినట్టుండే చిన్న చిన్న వస్తువుల్లో మన మాటలతో ప్రమేయం లేకుండా తనంతట తాను మాట్లాడుకొనే బుల్లి రేడియోలో ఎంతటి సౌందర్యాన్ని చవిచూశాం...! చల్లని సాయంత్రాలు చెట్టుకింద క్యాంటీన్లో (మన ముద్దు పేరు హోటల్ గ్రీన్లాండ్) కబుర్ల టీని చప్పరించి ఆహ్లాదాన్ని పాడుకుంటూ వెళ్ళి 56 అ మంకెన వూవు
రోడ్డుపక్కన పడి వున్న పాన్నాగపువ్వులేరుకొచ్చుకోవడం వీ.సీ. కొండెక్కి నెమళ్ళ కోసం చెట్టూ పుట్టా రహస్యంగా వెదకడం యింత లోనే నెమరు వేసుకోవల్సిన జ్ఞాపకాల జాబితాలోకి చేరిపోవడం నా మనసు అంగీకరించడం లేదు నిన్న మనం కల్సి పంచుకున్న నులివెచ్చని క్షణాలు ॥ భూమి పొరల్లోకి యింకిపోవడానికి వీల్లేదు అందుకే నన్ను ఒరుసుకుంటూ నా కలంలోకి ప్రవహించు...! నా కవితా వనంలో పత్రహరితమై మిగిలిపో...! మన చిరకాలపు మమకారాల సాక్షిగా... నా అక్షరాలలో హసించు....] మన మైత్రీవనంలో నువ్వు కలగన్న 'స్వేచ్భా మైదానాన్ని సృజించి అక్కడ వసివాడని స్నేహ “పద్మాలు పూయిస్తాను. (వద్మ జ్ఞాపకాలలో) 25.10.2000 అ చల్లనల్లి స్వరూపరాణి 5
సవతి తల్లి నౌ హైందవ సవతి తల్లీ... నువ్వు నా మూతికి చిక్కం కట్టి నా వీపుకు చీపురు వేలాడదీసి నిన్నో వింత జంతువును చేసి నా స్పర్శను త్రిశంకు స్వర్గానికి బహిష్కరిస్తే నా నేలపై నేను పరవాసినై నాకంటూ జానెడు భూమిలేక నన్నాదరించే దేవుడికోసం దిక్కుల్సి దేబిరించాను నా అంటరాని గాయాలకు మందురాసి యుగాల పరాభవాలతో అవనతమయిన నా తలను ఒక మసీదు తన కడుపులో దాచుకుంది ఒక శిలువ నా నెత్తిన మీరు పులిమిన కుష్టును తన రక్తంతో కడిగి శుభ్రపరిచి నాకు మనిషి తనాన్ని బహూకరించింది కన్నతల్లి తన్ని తగలేస్తే
న్8ి ఇ మంకెన పూవు
యిరుగు పొరుగు వారి పంచన చేరే పసిపిల్లలంత సహజంగానే నేను కూడా నా మసీదునూ... నా శిలువనూ..... కావలించుకున్నాను మీ వేదాలు ఆలకించినందుకు సీసం పోయించుకుని దిబ్బళ్ళెత్తిన నా చెవులకు నా మసీదూ నా శిలువా అమృతం చిలికే నాలుగు ఆప్తవాక్యాలు చెప్పి ధారకట్టిన నా కన్నీటిని _ పైట చెంగుతో తుడిచాయి వాళ్ళు దేవుళ్ళో . దెయ్యాలో... అయినవారో.. కానివారో.... తర్కించి తేల్చుకోవడానికి ఈ తత్వాలేవీ నాకు తెలియవు ఈ దేశంలో కడుపునిండని వాడూ కడుపు మండినవాడూ ఎప్పుడూ భౌతికవాదే...! అమ్మవై యుండి నాకు తిండి పెట్టకుండా మాడ్చి నును అడుక్కుతింటానంటే దేశద్రోహాన్ని మోపి నాపై కరసేవ చేస్తూ నన్ను పెట్రోలుతో అభిషేకించే నీ రెండు నాల్కల నీతినేమనాలి..? నీ నీతి
అ చల్లపల్లి స్వరూపరాణి కో
నన్ను దేవదాసిని చేసి వాడ వదినపు కమ్మంటే వూరుమ్మడి సేవ కోనం నేను చెల్లెలి తనాన్ని ఎంచుకున్నాను అది కూడా అంతర్జాతీయ కుట్రేనని నా తెల్లని గౌనుపై నువ్వు చిలికిన కాషాయం రసికను ఏ దూదితో తుడిచేది...? నేను చచ్చాక ప్రాప్తిస్తాయని నువ్వు బోధించే మోక్షంగానీ మా శిలువలూ మసీదులూ ప్రవచించే పరలోకంగానీ నా కొద్దు నేను బతికి వుండగానే ఇక్కడ నా కాళ్ళపై నేను నిలబడడానికి నాకింత నేలా... నా తల పైకెత్తి చూడడానికి నా దైన ఆకాశమూ... నేను గుండెల నిండా శ్వాసించడానికి గుప్పెడు స్వేచ్చా వాయువు... వెరసి పిడికిడు మనిషితనం ఇపుడు నా ప్రాథమిక అవసరాలు 70012002
60 ఉ మంకెన వూవు
ఇల్లు 'అడపిల్లే యింటికి ముద్దు “యింటికి దీపం యిల్లాలు" కొటేషన్లు ఎంత దగా చేస్తున్నాయి... యిప్పుడు యిళ్ళన్ని అందం కోసం దీపాల్ని అలంకరించుకున్న ఈష్టర్ పండగనాటి సమాధుల్లా కనిపిస్తున్నాయి అ యిల్లు తనది కాదని ఏ రోజుకైనా ఖాళీ చేయ్యాల్సిన అద్దె యిల్లు కన్నా పరాయిదని చిన్నా పెద్దా ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ యింటి ప్రతి యిటుక రాయితోనూ దాని అణువణువుతోనూ ఎంతటి అనుబంధాన్ని 'సెనవేసుకుందీ వెర్రి ఆడపిల్ల...! పెరట్లో సన్నజాజి తీగలూ కనకాంబరం మొక్కలూ ఎంతో నిజాయితీ కలవి అ చల్లపల్లి స్వరూపరాణి 61
తన చెమట చుక్కలపై రోజూ దొంతర్జు దొంతర్జ్లుగా కృతజ్ఞతను పుష్పిస్తాయి చిన్ని చిన్ని చేతులతో యిసుకమోసి ఎద్దులతో పాటు లేగదూడలా గొనుగ తిప్పి ఆమ మతల సౌధానికి రాళ్ళెత్తిన ఆడకూలీ తానైతే అది పుత్రరత్నం సాత్తట ఈ దోపిడీని ...పరాయీకరణను ఏ తూనిక రాళ్ళతో కొలుస్తావు మార్క్... మొగుడనే అగంతకుని చెయ్యి పట్టుకుని ద్వీపాంతర వాసాన్ని చేరుకుని వలస జీవితంతోపాటు మెట్టిన్లిలనే శత్రు శిబిరాన్ని కూడా ఆనవాయితీగా ప్రేమిస్తుంది ఆడపక్షి అణుకువ అద్దెకట్టకపోతే యజమాని ఏ క్షణానైనా యిల్లు ఖాళీచెయ్యమంటాడు బతుకు చుట్టూ అల్లుకున్న గచ్చపొదల విలువల్త్లాగే యింటి చుట్టూ కాపలా కాస్తూ దొంగలా తనను వెంటాడుతున్న రెండు నాల్కల రేచుకుక్కలు... ఆమడదూరంలో పచ్చని చెట్టుపై కువకువ స్వేచ్చని ఆలపిస్తూ 62 ఇ మంకెన పూవు
వివిధ జాతుల పిట్టలు... ముక్కుకు కరుచుకున్న అభద్రతను తుపుక్కున వుమ్మి టూలెట్ బోర్డుల నుంచి కళ్ళు ఆరుబయటకు ప్రయాణం... 10.05.88 అ చల్లపల్లి స్వరూసరాణి 6
ను సుఖంగా వుద్యమిద్దాం ... రండి..! రొలుకందకుండా కడుపులో నీళ్ళు కదలకుండా నాలుగు సిరాచుక్కల్ని వెచ్చించి కులాన్ని క్షణాల్లో కూల్చివేద్దాం.. రండి! సాయంకాలాలు సరదాగా మందుకొట్టినపుడు ఆఫీసు పని చెయ్యాలంటే బద్ధకం వేసినపుడు పుంఖానుపుంఖాలుగా కవిత్వం రాసి పడేద్దాము తెలిసో. తెలియకో నమ్ముకున్న ఆశయం కోసం చావుకు సరిహద్దుల్లో నిలబడి బతుకుకు పహారా కాస్తూ ప్రాణాల్ని నూలుపోగతో జమకట్టి ఎవరికీ మిగలకుండా రాలిపోతున్న పొరుగమ్మ కొడుకు పైనే మనకలాల్ని గురిపెడదాం...!
రీ అ నుంకెన పూవు
ఒక పక్కన పక్కింట్లో
గుండె కుంపట్లు రగులుతున్నా...
అటువైపు కన్నెత్తి చూడొద్దు
మానిపోయిన గాయాన్ని చూసి
గేయాల్లో కుమిలిపోతూ
ప్రశాంతంగా చెక్కిళ్ళపై
ఇన్స్టెంట్ కన్నీళ్ళని
బొట్టుబొట్టుగా జారవిడుద్దాం...!
అత్మగౌరవం అంటే
కవిగారి ఆత్మకు దక్కవలసిన
గౌరవమేనని
పెస్క్షబ్బులు దద్దరిల్లేలా
గొంతెత్తి నినదిద్దాం...!
ఒక్క సి.ఎత్. కూడా ఖర్చుకాకుండా
తీరికవేళల్లో
సరికొత్త దళిత వుద్యమాన్ని
బలంగా ముందుకు తీసుకెళదాం
కారంచేడు హంతకులను
సుఖంగా దాటేసిన
మహారాజశ్రీ “రాజ్యం” గారిపై
మనకు కోపం తగదు
వీలైతే దళిత దేశభక్తి గీతాల్ని
అత్యంత ఆర్జంగా రాసి
“శతాబ్దపు కవి”
పురస్కారాన్ని గెల్బ్చుకుందా....
అరుంధతీరాయ్ ముక్కుపుడక స్ తి చల్లపల్లి స్వరూపరాణి
అందాన్ని తల్చుకుని గాలిలో తేలిపోతూ మద్దికెర మార్తమ్మ శవం మీద కరుణ రసాత్మక కవిత్వాన్ని చిలకరిద్దాం...! మన సంకలనాల నిండా అగ్రహార వ్యతిరేకతను దెమ్మరించి బాహ్మణత్వాన్నే దైనందిన జీవితంలో అనుదిన ఆహారంగా భుజిద్దాం...! మనకంటే కాస్త పల్చటి కవిత్వం రాసి ఎల్లప్పుడూ దళిత కవిగానే వర్థిల్లమని మన శిష్య పరమాబణువుల్ని ఆశీర్వదిద్దాం...! కొత్తగా కలంపట్టిన వాడ్ని పాగడ్తల కత్తులతో ముక్కలుగా నరికేద్దాం...! లేదంటే అతడికి టినీళ్ళు సిగరెట్లు ఇప్పించి మన భాజాభజంత్రీ గణంలో చేర్చుకుందాం...! ఇపుడైనా మించిపోయింది లేదు దళిత మహాకవులంతా ఒక్కసారి సింహాసనాలు దిగండి... రూపాల పాయల్ని మార్చుకుంటూ జీవనదిలా ప్రవహిస్తున్న లేగదూడల రక్తపుటేరుల్ని
66 అ మంకెన పూవు
ఏకాత్మతో కలిసి ఎండగడదాం....! ఇకనైనా మనం సిసలైన మనుషులగా మనగలిగే సరికొత్త శకం కోసం చీమూ నెత్తురున్న కవిత్వాన్నే రాద్దాం...! మన పిల్లలు దళిత కవిత్వం రాయనక్కర్లేని ఒక కొత్త సాహితీ సౌధాన్స్నే సామూహికంగా పలవరిద్దాం...! 2252000
అ చల్లపల్లి స్వరూనరాణి 6౮7
చెంచిత ప౦చభక్ష్య పరమాన్నాలు బొజ్జల్నిండా తిని తాంబూలం సేవిస్తూ శృంగార కావ్యాలు అల్లే మదమెక్కిన కవులచే ప్రబంధ నాయికలకు సరితోడుగా కీర్తించబడిన నా నీలి అందాల చెంచితా...! ఏవమ్మా... ! నీ భోగభాగ్యాలు... నీ చిరుతలు బూడిదలో చింతపండు అద్దుకుని ఎండిన డొక్కల్ని పూడ్చుకుంటున్నారెందుకు తల్టీ..! గంధపుచెక్కతో వెదురు బియ్యాన్ని వండుకుతినే నీ సంపద నెవరు దొంగిలించారు...? యింద్రనీలమణుల్ని తలదన్నే నీ దేహకాంతి
68 అ మంకెన పూవు
యిలా రక్తహీనంగా పాలిపోయిందేమి...? పట్టుచీరలు కట్ట సిరిగలదానా...! నీ ఆడతనాన్ని కప్పడానికి నార బట్టలు కూడా నిరాకరించాయా...! క్రూరమృగాలను ముంజేతితో అదిలించే నువ్వు మా 'నవ' మృగాల చేతిలో చిక్కి గువ్వపిల్లలా దిక్కులు చూస్తున్నావు చిరుత పులుల్ని చూపులతో వేటాడే నా రాటుదేలిన సోయగమా...! నీ సరిసంపదలపై కల్లబొల్లి కవిత్వాన్ని కుమ్మరించి స్కాముల్లో కొట్టేసిన కీర్తిని కడవలకొద్దీ చిత్తుగా తాగి మత్తెక్కిన అగ్రహారాలను నీ విల్లమ్ములతో ధ్వంసం చేద్దువుగానిరా...! 19.10.1998 అ చల్లపల్లి స్వరూపరాణి 69
అవ్వ ప్రశ్న మొదటి పాపం నాదేనని అన్ని దోషాలకు మూలం నేనేనని దేవుడి నుంచి దెయ్యం వరకు అందరూ నన్నే తూర్పారబట్టారు చెయ్యని నేరానికి శిక్షగా మాయదారి దేవుడు గర్భసంచిని శాపంగా నాకు అంటగడితే రెండు నాల్కల నీ పురుషనీతి నా బండెడు కష్టాన్ని ఆదర్శీకరించింది అసలు ఈ భూమ్మీద మొదటి తిరుగుబాటును నేనే కదా...! నిషేధించిన వెలుతురుకోసం సరిహద్దుల్ని అతి(క్రమించిందీ నేనే! పరలోకాన్ని ఎడంకాలితో తన్ని వచ్చిన సిసలైన హేతువాదిని నేనైతే పాపభీతినీ పాత్రివ్రత్యాన్నీ నా చేత బలవంతంగా తాగించారు నాకు సైతం జ్ఞానం కావాలనీ నాకు సైతం (పేమ కావాలనీ నాకు సైతం మనిషితనం కావాలనీ గొంతెత్తి అరిచినందుకు
70 ఉ మంకెన పూవు
నన్ను శాపగ్రస్తురాలిని చేసి
నా ముక్కూ చెవులూ కత్తిరించారు మనుధర్మాన్ని మత్తుగా తాగిన వూరుకుమల్లే నువ్వు కూడా
నాపై కర్ర పెత్తనం చెయ్యడానికి
నా కాలు కందకుండా
నన్నేమన్నా అందలమెక్కించావా..
నీతోపాటు వేటాడి
కందమూలాల్ని గాలించి
రెక్కలు ముక్కలు చేసుకొని
నా కడుపున కొసిన పిందల్ని సాకుకున్నాను
నువ్వు దున్నిన నేలలో
నా చెమట నారు పోస్తే గానీ
నాలుగువేళ్ళూ లోపలకు పోలేదు
నిన్ను తెగటార్చడానికి కూడా
వూరకుక్కలన్నింటికీ
నా శరీరమే రంగస్థలమైంది
నువ్వీ పాడులోకంపై కలత చెంది
అర్థరాత్రి యిల్లు విడిచిన సిద్ధార్థుడివైతే
నా అణువణువూ నిఘాల మయమై
నా అడుగు జాడలన్నీ మందుపాతర్ణై
నోరు చాచాయి
యిపుడు చెప్పు
నీకు ఉరమడం వుగ్గుపాలతో తాపించి
నీ చేతికి ప్రశ్నల లాంతర్లిచ్చి
మనవాడ పొలిమేర్ల దాకా
సాగనంపింది నేను కదాదంటారా...!?
120798 (కవితా నిన్హా “ఈవ్ స్టేల్స్ టూగాడ్' చదివాక
అ చల్లపల్లి స్వరూపరాణి 71
పోతురాణి నొకూ ఒక మొగుడుండాడెందుకు....? అడి కోసి వూరూ వాడలకు పోగులెయ్యడానికా...? ఆడు రాజ్యాలు లేని రాజు పోతురాజు వూరోళ్ళ మదాగ్ని సాచ్చిగా నా మెళ్ళో తాళికట్టి నా నుదుట జోగిని పచ్చబొడిసి అచ్చేసిన ఆంబోతులాంటి ఆచారం వాకిట్టో నన్నాదిలేశాడు నాలుగు రూపాయలూ గ్లాసుడు సారాతో కడుపు నింపుకుని “కసాయి” వృత్తిని భుజాన తగిలించుకుని ఆడిదోవన ఆడెల్లిపోతూ పడుపు రోగాన్ని నాకంటించాడు ముక్కోటి దేవతలకు ఎన్ని జన్మల దాస్యం చేసినా ఈ పుట్టు దాసికి శాపవిముక్తి లేదు ఈ ఆంబోతు భక్తులు “గోపంచకం” కళ్ళకద్దుకుని తాగి
72 ఇ మంకెన వూవు
వూరెలపలి నల్ల గేదెకోసం మోరలెత్తుకుని ఎగబడతారు ఇక్కడి పల్లెలు పచ్చపచ్చగా రెపరెపలాడాలంటే నాబతుకు కర్రిబాగ్గులా మసిబారాలంట... ఆళ్ళపండుగలు పకపకలాడాలన్నా మా జల్మ చిత్తకార్తె తిరునాళ్ళ పండగై తెల్లారాలంట... నన్ను లోకుల పరం చేసి అంతులేకుండా పోయినోడు గుక్కెడు గంజికోసం గావులెత్తి గస పెడుతుంటే అడ్నని ఏం లాభం... ఇక్కడ మా పుటకే శాపగ్రస్థమై రోగగ్రస్థ కట్టబాట్ట్ల మురికికూపంలో పందుల్తా దొర్గాడమని మావంటి పై హీనకులాన్ని ముద్రించిన ముక్కోటి మనువుల పీకల్ని గావుపట్టి అడవుల కురుల్ని విరబోసుకుని నేనూ మా పోతురాజూ కల్సి రాజధాని నడివీధుల్లో చిందెయ్యాలని వుంది... 10.3.2000
అ చల్లపల్లి స్వరూపరాణి 3
ప్రేమ వాయిదా ప్రేమ కవిత్వమా...! అది నేను రాయడమేమిటండీ.. ఆ రెండక్షరాలు వుచ్చరించడానికే యుగాల నుండీ నా పెదవులు ప్రాణభీతితో వణుకుతుంటే నాప్రేమపై కవిత్వం కూడానా మళ్ళీ... నా నల్లని శరీర సౌష్టవాల వెనుక హృదయం ఒకటి ఏడ్చిందనీ దానిలో మమతానురాగాలు పాయలుగా ప్రవహిస్తాయనీ ఎవరు గుర్తించారు గనుక..! నా మనో కుసుమం గురించీ అందులో వూరే జుంటి కేనియల గురించీ వింటే చరిత్ర పుటల్లోని అమర గ్రేమికుల కథలన్నీ పుస్తకాల్గ్లోంచి బూజుదులిపేసుకుని స్మశానాల్లోకి పరుగెడతాయి మీరంతా ఒప్పుకోరు గానీ ః” అ మంకెన వూవు
అనాదినుండీ
ప్రణయసొరభం ఏ మూలనుండి
నా ముక్కుపుటాలను పరామర్శించినా
నిలువెల్లా అనురాగతరంగమయ్యింది నేను కాదా...!
కులకుష్టు సోకిన
ఈ మగ ప్రపంచాన్ని
నా ఆప్యాయతల బుట్టలో పెట్టుకుని
తరాల నుండి నా తలపై మోస్తుంటే
పరాభవాల శిలువను
కన్యగానే కడుపులో మోయమని
శాసీంచిందీ కరుణలేని కాలం
మనుసు మమత అనే పదాల వెంట
బతుకు ఎడారిలో పరుగెత్తి
ఓ ఎండమావి నా చూపును కలవరపెట్టినప్పుడు
నా అస్థిత్వాన్నే పాదాల వద్ద పరిస్తే
నా మెడ చుట్టూ చేతులుంచి
పసుపుతాడుకు బదులు
వురితాడును అలంకరించాడు
పెట్టిపుట్టిన వాళ్ళకు
హృదయం అంటే
సుమధుర సుందర సుమం
(ేమంటే ఒక తీయని స్వప్పం
మరి నాలాటి 'చండాలిక' కు మాత్రం
మనసుండడమే మహా నేరం
దానిలో డ్రేమధార అంతకంటే నిషిద్ధం
అందుకే నన్నో అవయవాల దొంతరలా కాకుండా అ చల్లపల్లి స్వరూపరాణి ణ5
మమతల వెల్లువలా చూసి
అందులో మునకేస్తే గానీ
ఈ మనుషులకు (్రేమౌన్నత్యం
అర్థం కాదంటాను
అందాక కళ్ళుండీ చూడలేని
మెదడుండీ ఆలోచించలేని
ఈ అంధలోకానికి అందకుండా
ఒక్క విశాలత్వం వరకూ
నా ప్రేమ పరిమళాన్ని వాయిదా వేస్తాను
04.05.7996 (ుకలవ్యవ వ్రత్వేకనంచిక్క విడిఅరాళం నంకలనాలు/ 76 అ నుంకెన వూవు
అంటరాని అత్యాచారం
నేను మీరంతా మర్చిపోయిన
అనగనగా
ఓ 'అంటరాని సునీతను మాట్టాడుతున్నాను
అంటరానిదాన్నని
ఎందుకు అడ్రస్ చేసుకుంటున్నానంటే
ఈ దేశంలో
అంటరాని ఆకలీ
అంటరాని దోపిడీ లాగే
అంటరాని (ఆత్మహత్యలూ
అంటరాని అత్యాచారాలూ వుంటాయి కాబట్టి
మీకు అశ్చర్యం కలగవచ్చు గానీ
యోగేశ్వర్రెడ్డిపై నా (పేమసాక్షిగా
నాది అంటరాని అత్మహత్యే...!
మరికాకపోతే నేను కూడా
వార్తాపత్రికల వెనుక ఖననం కాకుండా
పార్లమెంటు డైనింగ్ టేబుళ్ళ మీద
తందూరీ ఘుమఘుమలా ఘాటెక్కేదాన్నే...! అ చల్లపల్లి స్వరూపరాణి 77
ఇక్కడ చదువుకీ (ప్రేమకీ పెళ్ళికీ కులం రంగూ రుచీ వాసనా వుండబట్టే మొన్న మా నిర్మల చావు అతి 'సహజ మరణం' కింద కొచ్చింది నిన్నటి మా చంటిదాని మాటకొస్తే దాని కులం తక్కువ కళ్ళు విజ్ఞానంతో ఎక్కడ ప్రకాశిస్తాయోనని బడిలో నాలుగక్షరాలు నేర్చుకుందో లేదో పంతులమ్మ గురుదక్షిణ కోసం దాని కన్నుమీద మోజుపుట్టింది హాస్పిటల్లో అలగా నర్ఫుల సంగతి ఇక చెప్పనవసరం లేదు కళ్ళల్లో (పేమ వత్తులు వెలిగించుకుని రేయింబవళ్ళు రాచపుళ్ళకు మందేస్తే ఫ్లారెన్స్ నైటింగేల్ ప్రశంళశా పత్రానికి బదులు ఆమె 'సిస్టరో మనసుపై క్యాన్సర్ క్రీిమిలా పాకుతారు ఇక్కడ మా మాన ప్రాణాలకు అపుడపుడూ నష్టపరిహారం కూడా చెల్లిస్తారు విచిత్రం ఏమిటంటే ఇక్కడ మేము (చంపబడి) చచ్చిపోయి కూడా పిడికెడు గౌరవానికి నోచుకోకపోగా
78 అనుంకెన పూవు
“ఎవడు తిరగమన్నాడు' “ఎవడు చావమన్నాడు' మాటల ఈటెలతో మా ఆత్మను కుళ్ళబొడిచి మళ్ళీ చంపుతారు ఇపుడు చెప్పండి ఈ దేశంలో హత్యలకీ అత్యాచారాలకీ సైతం అంటరానితనం లేదంటారా...? (సునీత స్మృతికి) 25.3.2996 (భూవు ఆగను 96) అ చల్లపల్లి స్వరూపరాణి 79
నల్లసూర్యుడు అతడు అక్షరాలు దిద్దకపోయినా జీవితాన్ని మదించి మమకారాలను పండించిన సేద్యగాడు... సిద్ధాంతాలూ రాద్ధాంతాలు తెలియకపోయినా ఓనమాలను ఎడంచేత్తో దిద్దించిన వాదించడం చేతకాని సిసలైన భౌతికవాది.... నా యూనివర్శిటీ చదువుల్లో. ఏనాడూ తన గుమ్మం తొక్కని చదువుల తల్లిని పోల్చుకుని ముసిముసిగా నవ్వుకునే పిచ్చోడు... నా కుంటి అక్షరాలలో తాను రాయని కావ్యాలను పలవరించిన స్వాప్పికుడు... చేనుగట్టు మీద వాలే పొద్దును చేతితో చూసి గంటలు నిముషాలతో సహాగుఖించి చెప్పే మా 'కాలజ్ఞాని' వైపు గోడలమీద చేరగిలబడే గడియారాలన్నీ 80 అ మంకెన వూవు
అంకెల కళ్ళు ఆర్పకుండా చూసేవి... పొట్టమీద కొచ్చిన వరిచేనన్నా సూడి మోసిన గేదెన్నా ఆయనకు మా అమ్మతో సమానం... మా అమ్మను ఎంతో ముదిగారంగా సాకుకున్నట్టే మా పొలాన్ని గొడ్డునూ కూడా తన రక్తమాంసాల ఎరువేసి పెంచుకున్నాడు ఆయన మా కళ్ళకు చిన్నారి శకుంతలను క్రనురెప్పలా కాచుకున్న కణ్యుడిలా కనిపిస్తాడు మా పొలం మీదుగా బస్‌లో వెళ్తున్నప్పుడు చొక్కాలేని నీరు కావిపంచె, తలగుడ్డా దిబ్బమీద నడుం వంచి ఏదో పనిచేస్తున్న దృశ్యం క్షణకాలం నా కళ్ళలో తొణికిసలాడుతుంది వున్న ఫళాన బస్‌లోంచి దూకి పిల్లకాలవ గట్టున పరుగెత్తుకుంటూ వెళ్ళి తాతయ్య మధ్యాహ్నం పూట తినే ఎగ్రగారపు పచ్చడి అన్నం ముద్దలు పెట్టించుకు తినాలనిపిస్తుంది... ఆయన చెమటతో నాని చుట్టూతా విస్తరించిన మామట్టి పెళ్లలు ముక్కలు చెక్కలుగా చీలిపోవడం చూసి మా నల్లసూర్వుడి బోసినవ్వులు గుండెపగిలి
అ చల్లపల్లి స్వరూపరాణి 81
నమ్ముకున్న మన్నులో తలదూర్చాయి . మమ్మల్ని కన్నీటి కాలువలుగా వదిలివెళ్ళాయి... నా పద్యాలు ఎప్పుడన్నా మట్టివాసన వేసినా అమ్మవొడిలాంటి వూరును పవరించినా అవన్నీ మా 'కుంటా' వుగ్గిన్నితో తాపిన నా 'వెలివాడి నుడికారాలే....! ఎండమావుల వెంట తిరిగి వేసారినపుడు నేను ఆయన జ్ఞాపకాల ఒయాసిస్సుల దగ్గరకు పరుగెడతాను ఆయన స్కృతి నన్ను వీపుమీద ఎక్కించుకుని కబుర్లతో వూరంతా తిప్పి మా చావిట్లో నులక మంచం మీద నిద్రపుచ్చుతుంది దూడల పచ్చి వాసన నిండిన తాత పై పంచెని నిండుగా కప్పుకుని గాఢ సుషుప్తిలో మునిగిపోతాను జీవితాన్ని గుండెల్నిండుగా (ప్రేమించడం నేర్పిన మా బట్టతలకు మనసునెత్తి నమస్కరిస్తూ నేనొక పునరుత్థానమవుతాను... (తాతయ్యకు)
౧60298 (వ్రజాతంత్ర వర్తమాన సాహిత్వనంబికు మాత్చి 2007
82
కవలపేగు
నో చేతులు కందుతాయని
నన్ను బడికి పంపించి
వేకువజామునే తలగుడ్డ కట్టుకుని
నాన్నతో పాటు నడం వంచి
మండుటెండలో మాడిమసై పోయావు
బావినీళ్ళకెళ్ళినపుడు కూడా
నాకు చిన్న కడవనెత్తి
రెండు కుండల కావిడిని
నీ భుజాన మోళశావు
మనం మింగింది
కారప్పచ్చడి మెతుకులే అయినా
నొ పళ్ళెంలో వుడుకన్నం పెట్టీ
నీరుకారే చద్దన్నం నువ్వు తిన్నావు
అన్నా..!
నన్నెంత మురిపెంగా చూసుకున్నావో
నా నాజూకుచేతులూ...
చెప్పుల్లేక నెర్రెలిచ్చిన
నీ మొరటు పాదాలూ....
సాక్ష్యం చెబుతున్నాయి
నన్ను వుప్పెక్కించుకుని ర
దించకుండా వూరంతా తిప్పిన నువ్వు ఈ రోజు లెక్కలు తీసి నన్ను పంటినిండా గదిమావని నీ మమకారాన్నంతా మర్చిపోయాను నీతో తెగతెంపులు చేసుకుని నీకు మొహం చాటేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నా పాదం మీద పుట్టమచ్చలాంటి నీ చెల్లెలి గుర్తింపే....! ఎక్కడికి పారిపోవాలో తెలీదు పదిమందిలో పట్టుకుని రెండా మూడా అని అడిగినంత అవమానంగా ఉంది నాకాళ్ళు నీవైపే తరుముకొస్తున్నాయి అలిగి నీతో పలక్కపోయినా ఐదనే చెబుతున్నా... ఒకే స్తన్యాన్ని పంచుకున్న కవలలం నీ వొంటి గాయాలు నా హృదయాన్ని సలపర పెడుతున్నాయి నీ ఖాళీ పేగులు నా పొట్టను మెలిపెడుతున్నాయి మనం తెంచుకున్న కవలపేగు సాక్షిగా చావునైనా కలిసే ఎదుర్కొండాం మన యింటికి చిచ్చుపెట్టిన శకుని బాబుల భరతం పడదాం 07.08.2001
84
నాన్నకోసం నొ బస్సు కదిలిపోతున్నా కనబడినంత మేరా కిటికీ గుండా నన్నే చూస్తూ దిగులుగా నిలబడిపోయే నీ రూపం నా జాగ్రత్తల్నే పలవరించే నీ మాటలు నాన్నా! యింకా నాతో పాటు ప్రవహిస్తున్నాయి పోలీసు నాన్నల్ని... రిమోట్ నాన్నల్ని చూసినపుడు నువ్వెంత ముద్దాస్తావో చెప్పలేను మా నాన్నంటే మనసెరిగిన అంతరంగిక మిత్రుఢు నా బాల్యస్నేహితుడు కదా అని హృదయం కాలరెగరేస్తుండ్తి బతుకు చుట్టూ వెతల తుఫొన్లో చెల్లరేగి వేళ్లను కుదిపేసినా నిశ్చలంగా నిలిచిన నీ నిలువెత్తు ఓరిమి ముందు
85
మా పట్ల నీ రాజీలేని డ్రేమముందు భూమ్యాకాశాలు చిన్నబోతాయి నాన్నా ఎంతకీ తెల్లవారనీ నా చిక్కుముడుల చీకటి కుహరంలో నీ స్కృతి పలచని తొలిపొద్దులా మెరుస్తుంది నిన్ను సలపరించే దిగులు గొయానికి కాసింత మందునైనా కాలేక అపరాధ శిలువ గుండెకెత్తుకున్నాను నీ సమాధి తల వాకిట్లో వెలితి వెలితిగా నిలబడి బొట్టు బొట్టుగా కరిగే కొవ్వొత్తిని నేనే నాన్నా! (నన్ను వెలిగించే నాన్న స్పృతికి) 1622007 సంర లా | ఖ్ / % గ డరయ్యాస్లో ప్నున వాజ్.6006 94. కర
గో స క! న ర తీ శై శ _ గ్ ॥ | 1 స . 11 " క్ స ల 1 | స. ల 11411614 ౧001ల. నం. గ 0౧౭12081 8200002 [2% నే . లు ౫ "| |. రు | 1 - ర్ ళ్ , వ ష్య . ళ్ (. / ః॥ మం. య " - 4 జ య | న జ | ు క న | జీ అతల క బై వ ల్ మజ. యి గ్ స ం శ ల మ న టి భం! ( | ఇ -' ట్ జం (1; ॥ | అ