Telugu Mahaamaneeshi Dr.Sarvepalli Radhakrishnan - anilvaranasi/indianlanguages GitHub Wiki
న. లూ... బాల సాహిత్యం | నా " య ణి ఖే | ! 2 న న వానో 1 షం టా వ . [న గ్ కండ లిం త శవ వ. గ సాం రోల - వాట్ వ్ లొ గ గ (ఆయ ॥/ / నయ వెలా కా కత శ్నా 1 “ న్ గ ౪ న ఇ ( | | 4 లి భాజే ( (శ్రా ఓ] 0 నవ్వ (ఆ అసి ల శ న! / (
- సంక్షిప్త జీవిత పరిచయం +
ఉన్ ల ఛి
వముహామనుషి
౫|| సర్వేపల్లి రాభాకృష్ణన్
- సంక్షిప్త జీవిత పరిచయం + రోవినూతల శ్రీరాములు గయా విశాలాంత ఉపబ్తిషంగ్ హౌస్
సీ డగ220020౧6631౧]| 0౯ 52౧/602111 గడడ౧డగ719[౧౧2౧ 9 గడ౭౪1౧400212 5౯66౧20౧0౪16 ప్రచురణ నెం. ; 2850/35 -2 గ ప్రతులు వ 1000 గళ ప్రథమ ముద్రణ : అక్టోబర్, 2004 జా ద్వితీయ ముద్రణ :జనవరి, 2006 తృతీయ ముద్రణ : డిసెంబర్, 2007 నాల్గవ ముద్రణ _ : సెప్టెంబరు, 2008 తో 2004, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్. / ల వెల :; రూ.2ెక్ ర్ట యనం నే. (ఎల య న ప్రతులకు : ఐఇశాలాం[్ర పజ్మషింగ్ హగ్ కాం ల బ్యాంక్ సీట్ హైదరాబాద్- 5033్తు.. ఫోన్స్: 24744580/24735905 కాణ211 : 1941420602 ౧0(డ్రు౭100.0001 ఇగ ₹19312204గ201.00101 మిరాలాం॥[ బుక్ వశాస్ అబిడ్స్ & సుల్తాన్ బజార్ - హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, హన్మకొండ, అనంతపురం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, కరీంనగర్, ఒంగోలు. హెచ్చరిక: ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ, కొంతగానీ కాపీరైట్ హోల్డరు & (్రచురణకర్తల నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగ్గా వాడుకున్నా, కాపీరైట్ చట్టరీత్యా నేరం. = ప్రచురణకర్తలు అక్షరాలంకరణ : కాంపాక్ట్ గ్రాఫిక్స్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాదు. ముద్రణ : ది ప్రింట్ షాపి, హైదరాబాద్.
స | | స నిరాడంబరతకు నిజాయితీకి ప్రతీక తండ్రీ గురువూ, దైవమూ అయిన నా జనకులు క్షీనే రావినూతల సత్యనారాయణ గారి శతజయంతి (1904-2004 అలీ జోషీ ప్యతి చిహ్నంగా సమర్పితం.
అట్ పరిచయం
స్వతంత్ర భారతంలో దేశ (ప్రధానులుగా అధిక సంఖ్యాకులు ఉత్తరదేశీయులు కాగా రాష్ట్రపతులలో ఎక్కువమంది దక్షిణాదివారే, విశేషించి ముగ్గురు ఆంధ్రులే!
నిష్పక్షపాతంతోపాటు ధైర్యం, చాతుర్యం, గాంభీర్యం అవసరమయిన పదవులు నాలుగు. 1ఓ న్యాయమూర్తులు 2. విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్‌లు 8. చట్టసభల సభాపతులు 4 పాత్రికేయులు.
ఈ నాల్గింటిలో అందరికంటే ఆంధ్రులే చక్కగా రాణించగలరని కాలం నిరూపించింది. కోకా సుబ్బారావు, చిన్నపరెడ్డి లాంటి న్యాయమూర్తులు, అనంతశయనం అయ్యంగార్, సంజీవరెడ్డి లాంటి సభాపతులు, సర్. సి.ఆర్.రెడ్డి వంటి విశ్వవిద్యాలయ కులపతి, ఎ.ఎస్.రామన్, యం. చలపతిరావుల వంటి పాత్రికేయులు తెలుగువారికి గర్వకారణం. కాగా ఆచార్యుడుగా మూడు గొప్ప విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌గా, దౌత్యవేత్తగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రదర్శించిన ప్రతిభా సామర్ధ్యాలు, అనితరసాధ్యం. కోలముఖం, విశాలమయిన నుదురు, తీర్చిదిద్దినట్లుగా వుండే ముక్కు కాంతులీనే కళ్ళు, ఏపుగా పెరిగి అణగి మణిగి వుండే జుట్టూ, కంచు గంటను తలపింపచేసే కంఠం - ఇదీ రాధాకృష్ణన్ మూర్తి.
ఆయన ప్రసంగ ధోరణి
జటిల భావాలను సైతం సరళంగా విశదీకరించగల శైలి. అందులో అప(శ్రుతులుండవు. అన్వయ కాఠిన్యాలుండవు. కత్తివలె ఒకసారి పదును, మరొకసారి పూవువలె మెత్తనైనది. వెన్నెల చల్లదనంతోపాటు తల్లి పిలుపులోని మృదుత్వం, దేళికుని హెచ్చరికలోని అధికారం వుంటుంది.
అర్థశతాబ్టిపాటు ప్రపంచంలోని మేధావులను 'ప్రభావితంచేసిన రాధాకృష్ణన్ జీవితం ఆద్యంతం స్ఫూర్తిదాయకం. మహాత్మాగాంధీ విశ్వకవి ఠాగూర్‌ను కలిసికొని ఆలింగనం చేసికొన్నపుడు ఆ సంఘటనను భారతకోకిల సరోజినీదేవి సత్యసౌందర్యాల సమాగమం అని అభివర్ణించింది. మహాత్మాగాంధీ విశ్వకవి ఠాగూర్‌తో కొన్ని దశాబ్దాలు సన్నిహితులుగా మెలగి వారి హృదయాలు గ్రంథాలుగా ఆవిష్కరించిన రాధాకృష్ణన్ 'శివం' కాగా, సత్య, శివ, సుందరులు ఒకే కాలంలో దర్శనమివ్వడం సమకాలీనుల భాగ్యం,
= రావినూతల శ్రీరాములు ళ
ఇందులో క్షే బాల్యం, విద్యాభ్యాసం క. న్నే 2. ' వేలూరులో విద్యాభ్యాసం లలల లలల లం లై 8. కుటుంబ జీవనం ........౨౨౨ ౨౨ టై *ఓ మద్రాసులో విద్యాభ్యాసం ౨... తి 5. ప్రెసిడెన్సీ కాలేజీలో .........౨౨౨౨౨౦౨౨౯౧౨౨ ల్ 6. మైసూరులో ఆచార్య పదవి .........౨.౨౨౧౦౦౨౦౮౨ 6 7. కలకత్తా జీవనం" ........౨.౦౨ ౨౦౦౨౦ 7 8. విదేశీ యాత్రల ప్రారంభం ........౧౨ ౨౨8 ఓ కోర్టు వ్యవహారం .......౨ వటం క .20..ఆంధ్ర. విశ్వవిద్యాలయంలో లలల లలల లలల కే0 11. స్నాతకోత్సవ ప్రసంగాలు .....౨.౨౨౨౦ ౨౨౨౨౨౨. కేకే 12 ఆంధ్ర మహాసభ లం కేర్ 13, ఆక్స్‌ఫర్డ్‌లో స్పాల్టింగ్ పీఠం ...............౨౨౨౨ కేరి 14 మహాత్మాగాంధీ 70వ జన్మదిన సంచిక ............౨. 19 ర. దక్షిణాఫ్రకాలో ౨.౨౨౨౨౨౨ ౨20 14 బెనారస్ హింధూ విశ్వవిద్యాలయంలో .........౨.౨౨౨౨ 21 17. చారిత్రాత్మక ఆగస్టు ప్రసంగం ౨... ఏడ 18,:విశ్వవిద్యాలయాల కమీషన్‌లో ............-.౨౨౨౨౨ 25 19. సొంస్కుతిక రాయబారిగా .....౩ ౨ 27 20. సోవియెట్ భూమిలో ............౧౨౨౨౨ 22రి 21,.భారత ఉపరాష్ట్రపతిగా . 22.:రాష్టపతిగా . ౨.౨౨౨౨౨౨ పటలం తెరి 23. కడపటి అధ్యాయం ......౨౨౨౨ ౨౦౨ ఉత 24. రోధాకృష్ణన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు ........... 46
ఈూర్ ఈ మహామనషి ఎని నట్ ట్ డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్
బాల్యం, విద్యాభ్యాసం;
18వ శతాబ్ది మధ్య కాలంలో నెల్లూరుజిల్లా సర్వేపల్లి నుండి ఒక నియోగి (బ్రాహ్మణ కుటుంబం తిరుత్తని పట్టణానికి తరలి వెళ్ళింది. 1959 వరకూ ఈ పట్టణం ఆంధ్రలోని చిత్తూరుజిల్లాలో భాగంగా వుండి తరవాత తమిళనాడులో చేర్చబడింది.
ఈ కుటుంబం తమ పూర్వీకుల స్థావరమైన సర్వేపల్లిని మరిచిపోకుండా తమ యింటిపేరుగా నిలుపుకున్నారు.
తిరుత్తనిలో స్థానిక జమీందారు దగ్గిర వీరాస్వామి చిన్న రెవెన్యూ ఉద్యోగి. ఆయన భార్య సీతమ్మ. ఈ దంపతులకు అయిదుగురు కుమారులు ఒక కుమార్తె. 1888 సెప్టెంబర్ 5న వీరికి కలిగిన రెండవ కుమారుడే మన కథానాయకుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. నాలుగేండ్ల వయస్సున రాధాకృష్ణను తిరుత్తని బోర్డు హైస్కూలులో చేర్చారు. అక్కడ నాలుగు సంవత్సరాలు చదివి, ఇంగ్లీషు తెలుగు, లెక్కలు, చరిత్ర, భూగోళంలలో పరిచయం సంపాదించాడు రాధాకృష్ణన్.
1896లో రాధాకృష్ణన్‌ను తిరుపతిలోని హెర్మాన్సుబర్లు ఎ.లాజికల్ లూథరన్ మీషను హైస్కూలులో చేర్చారు. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభం అయ్యేవరకు దీనిని జర్మన్ మిషనరీలు నిర్వహించేవారు. ఇక్కడే రాధాకృష్ణన్ మొదటిసారిగా బైబిల్ చదివాడు. హిందూ ఆచారాలను పొటిస్తూ దేవాలయాలకు వెళ్ళేవాడు బాల రాధాకృష్ణన్. తొలిదశలో రాధాకృష్ణన్ చదువును గూర్చి చెప్పుకోవాల్సిన విశేషాలు లేవు. చురుకుగా వుంటూ ఉపకార వేతనాలు పొందుతూ వుండేవాదు. కానీ ఎక్కువగా చదివినట్లు కనపదేవాడుకాదు. ఆటల జోలికి అసలు పోయేవాడు కాదు.
ఆయన ఆటవిడుపు ఏమంటే దూరంగా వున్న ఊళ్ళ వెంట తిరగడం, స్మాలర్‌షిప్పు డబ్బూ ఇంటినుండి వచ్చే డబ్బుల్లో ఏ కొంచెం మిగిలినా పర్యటనకు బయలుదేరేవాడు. ఇలా తిరిగే సందర్భాలలో ఒకసారి ఒక దొంగ, బాలుణ్ణి బాటనుండి తప్పించి ఒక బావి దగ్గరకు తీసికొని వెళ్ళాడు. (బ్రాహ్మణ బాలుడు కదా ఏమైనా బంగారందొరకక పోతుందా అని ఒళ్ళంతా వెదికాడు. ఏదో తిండి గింజలు దాచిన చిన్ని సంచి తప్ప ఏమీ కనబడలేదు. బావిలో పడవేయకుండా బాలుణ్ణి అంతటితో వదిలివేశాడు.
గ
ఇట్లా తిరగడం అలవాటై పరీక్షలకు అప్లికేషన్ పెట్టే రోజు స్కూలుకు రాకుండా పోయాడు. హెద్‌మాస్టరే అతనికిగాను దరఖాస్తు ఫారం తానే పూర్తి చేశాడు. అయితే పరీక్షలకు మాత్రం రాధాకృష్ణన్ ఠంచనుగా హాజరై మంచిమార్కులతో ఉత్తీర్డుడైనాడు.
తల్లిదండ్రులకు ఇంగ్లీషు భాషాజ్ఞానం ఏమాత్రం లేదు. తండ్రి, పిల్లవాడి తిరుగుళ్ళు గూర్చి బాధపడేవాడు. వేలూరులో విద్యాభ్యాసం:
రాధాకృష్ణన్ తండ్రి వీరాస్వామి తిరుపతిలో చదువుపట్ల కుమారుడి అశ్రద్ధ గూర్చి తెలుసుకున్నాడు. తనకు తటస్థపడిన సోదరునితో వీని ప్రస్తావన తెచ్చాడు. ఆయన పేరు సర్వేపల్లి నరసింహంగారు. వేలూరు ఉరీస్ కాలేజీలో కింది తరగతులకు టీచరు పిల్లవాణ్ణి తనదగ్గిర వుంచుకొని చదివిస్తానన్నాడు. అలా 1900లో రాధాకృష్ణన్ వేలూరు. మిషన్ హైస్కూలులో చేరాడు. రెండు సంవత్సరాలకు మద్రాసు యూనివర్సిటీ మెట్రిక్యులేషను పరీక్ష ప్రతిభతో ఉత్తీర్ణుడైనాడు. ఉరీస్ కాలేజీ ఉపకార వేతనం కూడా లభించింది. బైబిలు సూక్తులు వప్పజెప్పడంలో ఆయన ప్రతిభకు యోగ్యతాపత్రం కూడా వచ్చింది. ఇదంతా సాధారణమే. [గగ్రంథపఠనంపట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో పుస్తకాలు చదివేవాడు. వివేకానందస్వామి లేఖలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. యువతకు తయన యిచ్చిన సందేశం ఆత్మగౌరవం, జాతీయభావం పెంపొందించు కోవాలన్న హితోక్తి రాధాకృష్ణన్ మనస్సులో నాటుకున్నది. సావర్మర్ రచన “జారత్ర స్వాతంత్ర్య- తొలి సమరం” కూడా ఆయనను ఆకట్టుకొన్న గ్రంథం. వ స్మాలర్‌షిప్పు డబ్బులో కొంతమిగుల్చుకొని తనకునచ్చిన పుస్తకాలను ఖరీదు
'సేవాడు రాధాకృష్ణన్. తనకంటే బీదస్థితిలో వున్న తోటి విద్యార్దులకు వీలయినంత
సాయం జ? క సర వన్న ర్య
ఆయన పినతండ్రి ప్రభావం రాధాకృష్ణన్‌పై ఎక్కువగా ప్రసరించింది. సర్వేపల్లి నరసింహంగారు ఆ దినాల్లో మెట్రిక్యులేషన్ వరకే చదివినా సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్ల భాషలలో నిష్ణాతుడు. బైబిల్ ఎలా చదవాలో ఆయన మిషనరీలకే నేర్చేవాడు. వాల్ళీకి రామాయణం ఒకరు చదువుతుంటే ఇంగ్లీషులో వెంటనే అనువదించి చెప్పేవాడు. కావ్య కంఠగణపతిముని శిష్యుడై హం్రీన్ అనే పోలీసు అధికారికి ఆయనను పరిచయం చేశాడు. భగవాన్ రమణమహర్షికి అంకిత భక్తుదైన నధసింహం సన్యసించి '('ప్రణవానందస్వామి' గా పిలువబడినాడు. ఆయనకుభక్త రామదాసుకృతి* ఎ తీరున నను దయచూచెదవో ఇనవంశోత్తమ
2
రామా” చాలా ఇష్టమైనది. ఆయన ప్రభావంవల్ల కాబోలు రాష్ట్రపతి పదవిలో వున్నప్పుడు .ఇదే కృతిని రాధాకృష్ణన్ ఒంటరిగా పాడుకానటం తానొకసారి గమనించానని ప్రముఖ జర్నలిస్టు కృష్ణ తెలిపాడు. కుటుంబ జీవనం;
బాల్య వివాహాలు ఆచారంగా ఉన్నదినాలవి. 16 సంవత్సరాల రాధాకృష్ణన్‌కు 10 సంవత్సరాల బాలిక శివకాముకు 1903లో వివాహం జరిగింది. పెండ్లి కుమార్తె వారికి దూరపు బంధువు. తండ్రి స్టేషన్ మాస్టరుగా వుంటూ చనిపోతే తల్లిగారే పెండ్లి చేసింది.
దంపతుల శరీర సౌష్టవాలు భిన్నంగా వుండేవి, రాధాకృష్ణన్ అయిదడుగులా పది అంగుళాల పొడగరి. శివకాము పొట్టి. మంచి ఛాయలగలది. అన్యోన్యంగా వుండే ఈ దంపతులకు 1908లో తొలి సంతానం ఆడపిల్ల కలిగింది. తరువాతి 15 సంవత్సరాలలో ఆరుగురు సంతానం కలిగారు.
భార్యను రాధాకృష్ణ 'పద్మ' అని ముద్దుగా పిలిచేవాడు. మేధావిగా పరిణతి చెందుతున్న రాధాకృష్ణ పురోగతి ఆమె గ్రహించలేకపోయింది. ఆర్థిక యిబ్బందులన్నీ సహిస్తూ కుటుంబపోషణ చక్కగా నిర్వహించిన ఆదర్శ్భగ్భహిణి అమె,
కాలేజీలో తనకు వచ్చిన (పైజులను, పతకాలను భార్యకు చూపిస్తూ ఇలాంటివి మరికొన్ని వస్తాయని చెప్పి రాధాకృష్ణ ఆమెకు సంతోషం కలిగించేవాడు. ఆమె కోరిన ఆభరణాల కొనుగోలుకు అప్పుకూడా చేశాడు. మద్రాసులో విద్యాభ్యాసం :;
తాను అదృష్టజాతకుడిననీ ఏదో అద్భశ్యశక్తి తనను నడుపుతున్నట్లుగా రాధాకృష్ణన్ తెలిపాడు. కదిలే వేలు రాస్తుంటుంది. రాస్తూ రాస్తూ కదిలిపోతుంది.
ఆయన బి.ఏ. తరగతిలో సైన్సుకు బదులు ఫిలాసఖీకి మారడంలో ఇది కన్పీస్తుంది. ఆ సంవత్సరంలో తనకంటే ముందుగా డిగ్రీ తీసికొసిన బంధువు లాజిక్, సైకాలజీ, ఎతిక్సుకు సంబంధించిన తన పాఠ్య (గ్రంథాలను మూడింటిని ఆయనకిచ్చాడు. ఆ సంఘటన ప్రపంచానికొక మహాతత్వవేత్తను ప్రసాదించింది. '
వేలూరులో యఫ్.ఏ (ఫెలో ఆఫ్ ఆర్ట్స్) ప్రతిభావంతుడుగా ఉత్తీర్ణు డైన రాధాకృష్ణన్ మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బి.ఏ. (ఫిలాసఫీ)లో చేరాడు. అక్కడ నిష్ణాతులైన ఆచార్యులుందేవారు. విలియం మెగ్గన్‌గారు ్రిన్సిపాలు, విలియం స్మిన్నరు, ఆల్‌ఫ్రెడ్ హాగ్ గార్లు ప్రఖ్యాత ఆచార్యులు. వీరిలో ఆచార్య
3
హాగ్ హిందూ - జైస్తవ మత విషయాలు క్షుణ్ణంగా ఎరిగినవాడు. 1906లో రాధాకృష్ణన్ బి.ఏ. డిగ్రీని మొదటి తరగతి ఆనర్సుతో ఉత్తీర్ణుడైనాడు. ఆ సంవత్సరంలో ఆయనే ఫిలాసఫీలో ఉత్తమ విద్యార్థి. ఆయనకు న్యాయశాస్త్రం చదవాలనే వుండేది. కానీ ఆ సంవత్సరమే తండ్రి వీరాస్వామి ఉద్యోగం చాలించాడు. రాధాకృష్ణన్ భార్య కాపురానికి వచ్చింది. కుటుంబ పోషణభారం ఆయనపై పడింది. విద్యార్థి వేతనం నెలకు రూ. 25/- కాకుండా ట్యూషన్లు చెప్పి కొంత సంపాదించాలనుకుంటూ యం. ఏ. పూర్తి చేశాడు. కైస్తవ కళాశాలలో హిందూమత నిరసన ఆయనకు బాధ కలిగించింది. యం.ఏ. క్లాసులో ఆ విషయం “వేదాంతంలో నైతిక సూత్రాలు” అనే వ్యాస రచనకు ప్రేరేపించింది. దాక్టర్ హాగ్ దీనిని ఎంతో మెచ్చుకున్నాడు. 1009లో యం.ఏ. అయిన రాధాకృష్ణన్ స్మ్కాలర్‌షిప్పుతో ఇంగ్లాండు వెళ్ళి చదవాల్సిందిగా కొందరు సూచించారు. రాధాకృష్ణన్ గర్వంగా “నేను ఇంగ్లాండు /వెళ్ళాల్సి వస్తే చదువు నేర్వడానికి కాదు, చదువు చెప్పడానికే వెళ్తానన్నాడు. కొంతకాలానికి ఆమాటే నిజమయింది. - ఉద్యోగాన్వేషణలో వున్న రాధాకృష్ణన్‌కు ఆయన అధ్యాపకుడు స్మిన్నరు విద్యాశాఖ. దైరెక్టరుకు ఒక సిఫార్సు లేఖ రాసిస్తూ “ఇటీవల కాలంలో మనకు లభించిన మంచి యువకుడు” అంటూ తెలిపారు. రూ. 60/- జీతంతో మద్రాసు విద్యాశాఖలో రాధాకృష్ణన్ సబ్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టరుగా నియమితుడైనాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ., బి.ఏ.(ఆనర్సు) యం.ఏ. క్లాసులు కూడా తీసికునేవాడు. న 1910లో ప్రభుత్వమే ఆయనను టీచరు. టైనింగ్ (౬.7)కు పంపించింది. ఆ కాలంలో అర్ధజీతమే రు. 37.50 యిచ్చేవారు. ఈ సంవత్సరకాలంలో కుటుంబం కడగండ్లకు గురి అయింది. భోజనం చేయటానికి అరటి ఆకులు కొనడానికి కూడా డబ్బులేక నేల శుభ్రం చేసుకొని భోజనం కానిచ్చేవారు. యూనివర్సిటీ యిచ్చిన మెడల్సు అమ్ముకొని అప్పులు చేసి కాలం గడిపాడు. వీలయినన్ని ఎగ్జామినర్ షిప్పులు సంపాదించి డబ్బు సమకూర్చుకొనేవాడు. . తాను రాసిన [గ్రంథం “సైకాలజీ సూత్రాలు,” హక్కులు . అమ్మివేసి ఆక్స్‌ఫర్జు యూనివర్సిటీ (ప్రెస్సు నుండి రూ.500/- సంపాదించాడు. టీచర్ ట్రైనింగ్‌లో వుంటూనే తోటి విద్యార్థులకు రాధాకృష్ణన్ క్లాసులు తీసుకునేవాడు. తీ
ప్రెసిడెన్సీ కాలేజీలో...
1911లో తిరిగి ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడుగా ప్రవేశించిన రాధాకృష్ణన్ మూడేండ్లు అడిషనల్ అసిస్టెంట్ ప్రొాఫెసరుగాను, తరువాత రెండేండ్లు అసిస్టెంటు ప్రొాఫెసరుగాను పనిచేశాడు. ఆయన క్లాసులు వినడానికి ఇతర కాలేజీలనుండి విద్యార్థులు వచ్చేవారు. ఒకవైపు దారిద్ర్యం బాధిస్తున్నా దుస్తుల విషయంలో రాధాకృష్ణన్ తస వ్యక్తిత్వానికి అనువైన దుస్తులు ఎంచుకున్నాడు. ఒక పొడుగాటి మెడనుండి మోకాళ్ళవరకు వేళ్ళాడే సిల్కు లాంగుకోటు, నల్లబార్దరు తెల్లధోవతి, తెల్లటి మస్లిన్ తలపాగా, నల్లటి స్లిప్పర్లు ఆయన తరువాతి కాలంలో ఎంత గొప్ప గొప్ప పదవులు అధిష్టించినా ఈ వేషంలో మాత్రం మార్చులేదు.
విద్యార్థులతోనేగాక _ పరిచయస్తులందరి తోను స్నేహభావంతోనున్న రాధాకృష్ణన్‌ను అందరూ “బాయ్ ప్రొఫెసరు” అని పిలిచేవారు.
రాధాకృష్ణన్ జీవితంలో 1914లో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. రాత్రిపూట బాగా పొద్దుపోయిన తరువాత లాంతరు వెలుగులో తన చిన్న ఇంటిలో రాధాకృష్ణన్ ఏదో సంస్కృత [గ్రంథం చూస్తున్నాడు. తలుపు చప్పుడు వినిపించి గది వెలుపలికి వచ్చి తలుపు తీసేసరికి ఒక నల్లటి యువకుడు తన విద్యార్ధి నొకనిని వెంటబెట్టుకుని లోనికి ప్రవేశించాడు. భవానీమాత కలలో కనపడి యిచ్చిన ఆజ్ఞమేరకు తాను కేంబ్రిడ్జి వెడుతున్నట్లు, ఆశీస్సుల కొరకు వచ్చానని నల్ల యువకుడు రాధాకృష్ణన్‌తో చెప్పాడు.
మీ పేరేమిటి అని రాధాకృష్ణన్ ప్రశ్నించారు. శ్రీనివాస రామానుజం అన్నాడా యువకుడు. అతడే విశ్వవిఖ్యాత గణిత శాస్త్రవేత్త. వారిద్దరూ తిరిగి కలిసికొనలేదు.
మద్రాసులో కాలేజీలో చదివే దినాలలో ప్రఖ్యాత న్యాయవాది అల్లాడి కృష్ణస్వామి రాధాకృష్ణన్‌కు సీనియర్. ప్రముఖ కాంగ్రెస్ ప్రముఖులు సత్యమూర్తి, మహమ్మద్ ఉస్మాన్ మిత్రులుగా ఉండేవారు. ఉస్మాన్ చదువులో వెనుకబడి వుండేవాడు. రాధాకృష్ణన్ ఆయనకు "లాజిక్ పాఠాలు బోధించేవాడు. తరువాత కాలంలో మద్రాసు ఆక్టింగ్ గవర్నరుగా ఆయన పనిచేశాడు. అలాగే ఇ ఎల్.యతిరాజ్ అనేగొప్ప వదాన్యుడు కూడా రాధాకృష్ణన్ వద్ద ట్యూషన్ చెప్పించుకున్నవాదే.
రాధాకృష్ణన్ విద్యార్థులలో ప్రముఖ జర్నలిస్టు ఖాసా సుబ్బారావు ఒకరు. రాధాకృష్ణన్ బోధించే పద్ధతి వివరిస్తూ “ఆయన 30 నిమిషాలే క్లాసు తీసుకునేవాడు. పది నిమిషాలు ఆలస్యంగావచ్చి పది నిమిషాలు ముందుగా వెళ్ళిపోయేవాడు.
క్
అయితే ఆయన బోధించే అర్ధగంట గంగా ప్రవాహంలా సాగేది. పరీక్షలకోసం కాకుండా జీవితంలో ఉపయోగపడే విధంగా ఆయన పాఠం సాగేది. ఫిలాసఫీ విద్యార్థులే గాకుండా ఇతర తరగతులవారు ఆయన పాఠం వినడానికి హవాజరయ్యేవారు. (క్రెసిడెన్సీ కాలేజీలో రాధాకృష్ణన్ హాయిగా కాలక్షేపం చేస్తూ వచ్చాడు. 1916లో ఆయనను అనంతపురం ప్రభుత్వ కళాశాలకు బదిలీచేశారు. అక్కడ 3 నెలలు మాత్రమే వుండి తిరిగి మద్రాసు చేరుకున్నాడు. (బ్రాహ్మణ, అబ్రాహ్మణ వైషమ్యాల ప్రారంభ దినాలవి. ఒక అబ్రాహ్మణుని కోసం రాధాకృష్ణన్‌ను 1917లో రాజమండ్రి కాలేజీకి ఐదిలీ చేశారు. కొంత అయిష్టంతోనే ఆయన మద్రాసు వదిలి వెళ్ళారు. ఆ కాలేజీలో అప్పటికే ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అధ్యాపకులుగా వున్నాడు. ఎడింబరో పట్టభద్రుడు. ఆనంద కుమారస్వామి శిష్యుడు, మధుర గాయకుడు గొప్ప జాతీయవాది అయిన దుగ్గిరాల వారి సాహచర్యం రాధాకృష్ణన్‌కు ఆనందం కలిగించింది. మైసూరులో ఆచార్య పదవి; 1916లో మైసూరులో విశ్వవిద్యాలయం _ స్థాపించబడింది. మైసూరు దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశంలోని ప్రఖ్యాత విద్యావేత్తలను అక్కడికి ఆహ్వానించాడు. మైసూరు యూనివర్సిటీకి అనుబంధంగా వున్న మహారాజా కాలేజీలో డా॥ కట్టమంచి రామలింగారెడ్డి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. ఆయన రాధాకృష్ణన్‌కు మంచిమిత్రుడు. అప్పటికే రాధాకృష్ణన్ కీర్తి దేశమంతటా వ్యాపించడంతో మహారాజా కళాశాలకు ఆయనను 1918 జూలైలో ఫిలాసఫీ ప్రొఫెసరుగా నియమించారు. ఆ దినాలలోనే మద్రాసు ప్రభుత్వం ఆయనను ఇంపీరియల్ (గ్రేడ్‌కు పదోన్నతి కల్పించింది. మైసూరు వాతావరణం రాధాకృష్ణన్ రచనా వ్యాసంగానికి అనువుగా వుంది. 'మైండ్” పత్రికకు పలువ్యాసాలు పంపాడు. “తత్వశాస్త్రంలో మతప్రాబల్యం' (ది రెయిన్ (౧618౧) ఆఫ్ రిలిజియన్ ఇన్ ఫిలాసఫీ) అనే (గ్రంథం కూడా రాధాకృష్ణన్ రాశాడు. ఆయన రచనల్లోకెల్లా తలమానికమనదగిన భారతీయ తత్త్వశాస్త్రం (1౧౮618౧ ౧౧|1౦9౦౧౧౫) చిత్తు ప్రతిని ఈ కాలంలోనే తయారుచేశాడు. 1918లోనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పై 'రవీంద్ర దర్శనం అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రాథాకృష్ణన్ వెలువరించాడు. “తాను ఆశించిన దానికంటే ఎంతో ఉత్తమ రచనగా అది వుందని అందులో శైలి కడు సుందరగా ఉండి తనకెంతో ఆశ్చర్యం కలిగించిందని రవీంద్రుడు మిక్కిలి ప్రశంసించాడు. . ఇంతలో కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీ శాఖలో ౪ జార్జి చక్రవర్తి 6
ప్రొఫెసరు పదవికి ఖాళీ ఏర్పడింది. దానికి దరఖాస్తు చేయవలసిందిగా వైస్ ఛాన్సలర్ ఆశుతోష్ ముఖర్జీ, రాధాకృష్ణన్‌కు సూచించారు. కలకత్తా యూనివర్సిటీ వీరిని ఆ పదవికి ఎంపిక చేసింది.
మైసూరు నుండి కలకత్తా వెళ్తున్న రాధాకృష్ణన్‌కు అపూర్వమైన వీడ్కోలు ఏర్పాటయింది. విద్యార్థులు కోచ్‌ను రథంగా అలంకరించి రాధాకృష్ణన్‌ను అందులో కూర్చుండబెట్టి తామే లాగుతూ స్టేషన్‌కు తీసుకొని వచ్చారు. రైల్వే ప్లాటుఫారం నిండా పూలు పరిచారు. కంపార్టుమెంటు కూడా రోజూ పూలతో అలంకరించారు. కొన్ని గంటలు ఆలస్యంగా బయలుదేరిన రైలు కదలికతో రాధాకృష్ణకీ జయ్ అనే ఘోష మారుమోగింది. ఆ దృశ్యం రాధాకృష్ణన్‌కు కండ్త నీళ్ళు తెప్పించింది. కలకత్తా జీవనం:
రాధాకృష్ణన్ జీవితంలో కలకత్తా ప్రవేశం ఒక గొప్ప మలుపు. ఆయన మేధ విశ్వవ్యాప్త గుర్తింపుకు తోడ్చడింది. జార్జి ౪/ ప్రొఫెసరు పదవి ప్రతిష్టాత్మక మైనది. రాధాకృష్ణన్ నెలసరి జీతంకూడా రూ.500/- నుండి ఒకసారిగా రెట్టింపు (రూ. 1000/-) అయింది. ఆర్ధికంగా వెసులుబాటు కలిగింది. బెంగాల్ (ప్రజలు ఆవేశపరులు. అది రవీంద్రుని స్వస్థలమై రాధాకృష్ణన్‌కు ప్రీతిపాత్రమైనదే కాని కొన్ని సందేహాలు మొలకెత్తాయి. బెంగాలీలు కానివాండ్లకు అక్కడ గౌరవం లభింపదని ఒకవైపు, మరొకవైపు అయిదుగురు ఆడపిల్లలు, భార్యతో కాపురం ఎలా వుంటుందో అని అనిపించింది. అప్పటికి ఆయన రాజమండ్రి దాటి ప్రయాణించి ఎరుగడు. కానీ డా॥ సి.ఆర్.రెడ్డి, ఆశుతోష్ ముఖర్జీలు గట్టిగా పట్టుబట్టి కలకత్తా రప్పించారు.
రాధాకృష్ణన్‌ను పరిచయం చేసేందుకు ఆశుతోష్ ముఖర్జీ సెనేట్ హాలులో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తత్వశాస్త్రంపై రాధాకృష్ణన్ చక్కని ఉపన్యాసమే యిచ్చాడు. కానీ ఫిలాసఫీ శాఖలోని వారంతా తనకంటే పెద్దవారు. ప్రొఫెసరు ఉద్యోగానికి తనతో పోటీపడి విఫలులయినవారు. వారికి సహజంగానే అసూయ ఏర్చడింది. -
ఆ దినాల్లో శాస్త్రవేత్త సి.వి.రామన్ ఒక్కడే ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఎక్కువ సమయం ఇంటిలోనే గడిపేవాడు రాధాకృష్ణన్. కుటుంబీకులు కాకుండా ఒకరిద్దరు బీద విద్యార్థులు తనతో వుండేవారు. పైగా దక్షిణాదినుండి మిత్రులు ఎవరు వచ్చినా రాధాకృష్ణన్ యింటిలోనే దిగేవారు. రాధాకృష్ణన్ “భారతీయ తత్వశాస్త్రం రచించడంలో అధికకాలం వ్యయం చేసేవారు. మొదటి భాగం 1928లోను రెండవ భాగం 1927లోను ్రచురితమయినవి. “భారతీయ కత్వశాస్త్రం దేశంలో సంచలనం కలిగించింది. సామాన్యులను అలరించింది.
క్
పండితుల మెప్పుపొందింది. ఈ గ్రంథం రాధాకృష్ణన్ మేధకు దర్పణం పట్టింది. భారతీయ దర్శనాలు, వాటిలో భేదాలు పాశ్చాత్య దర్శనాలతో సరిపోల్చి దీనిని ఒక విజ్ఞాన సర్వస్వంగా రాధాకృష్ణన్ తీర్చిదిద్దాడు.
బ్రిటన్ ప్రచురించే విజ్ఞానసర్వస్వం (ఎన్‌సైక్షోపేడియా (బ్రిటానికా) అప్పటికి పదమూడు సంపుటాలు వచ్చాయి. వాటిలో ఎక్కడా భారతీయ తత్వశాస్త్రం గూర్చి ప్రస్తావన లేదు. ఈ (గ్రంథం వెలువడిన తరువాత ఎన్‌సైక్షోపేడియా (బ్రిటానికా 14వ సంపుటానికి భారతీయ తత్వశాస్త్రం గూర్చి రాయమని రాధాకృష్ణను కోరారు. క్రమంగా రాధాకృష్ణన్ కార్యక్రమాలు విశ్వవిద్యాలయ పరిధి దాటి విస్తరింప సాగాయ్యి! 1925లో ఇండియన్ ఫిలాసఫీ కాంగైసు కలకత్తాలో నెలకొన్నది. విశ్వకవీ రవీంద్రుడు ఈ సభకు అధ్యక్షత వహించాడు. ఈ సంస్థ 1952లో రజతోత్సవం జరిగినప్పుడు రాధాకృష్ణన్ వైస్-ఢ్రైసిదెంట్‌గా వుంటూ అధ్యక్షత వహించడానికి కలకత్తా విచ్చేశాడు. విదేశీ యాత్రల ప్రారంభం:
1926 నాటికి రాధాకృష్ణన్ హిందూమతం గూర్చి, భారతీయ తత్వాన్ని గూర్చి రాసిన గ్రంథాలు, వ్యాసాలు పాశ్చాత్య మేధావులకు వివేకవంతమైనవిగా తోచాయి. అమెరికా, ఐరోపా దేశాల వారు ఈ అంశాలపై ఉపన్యాసాలు యివ్వవలసిందిగా రాధాకృష్ణన్‌ను ఆహ్వానించడం మొదలెట్టారు.
. 1926 జూలైలో లండన్‌లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల మహాసభ ఏర్పాటైంది. శ్రీ జగదీశ్ చంద్రబోస్ రాధాకృష్ణన్ కలకత్తాలోని విశ్వవిద్యాలయ ప్రతినిధులుగా అందులో పాల్గొన్నారు.
. అదే సమయంలో హార్వర్డులో జరిగిన అంతర్జాతీయ తత్త్వశాస్త్ర సమావేశానికి రాధాకృష్ణన్ ప్రతినిధిగా వెళ్ళాడు. ఆక్స్‌ఫర్జులో మాంచఛెస్టరు కాలేజి ప్రిన్సిపాల్ ఎల్.పి. జాన్స్ హిందూమతం ముఖ్యలక్షణాలపై కేంద్రీకృత విలువలపై ఉప్ప్టోన్ ం ఉపన్యాసాలివ్వమని కోరాడు.
రాధాకృష్ణన్ హిందూయిజం ఒక మతం అనటం కంటే జీవన విధానం అనటం సమంజసమని వర్జాశ్రమ విధానాన్ని చారిత్రకంగా విశ్లేషించాడు. ఈ ఉపన్యాసాలు పాశ్చాత్యులను సమ్మోహన పరచాయి. ఈ ఉపన్యాసాలన్నిటిని
కలిపి “హిందూ జీవిత దృష్టి (ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్) గ్రంథంగా వెలువడింది. ఈ (గ్రంథాన్ని యువకుడుగా నెహ్రూ రెండుసార్లు చదివి ఆనందించి చదవండని ఇతర మిత్రులకు కూడా -యిచ్చేవారు. ఆక్స్‌ఫర్జులోని మాంఛెస్టరు కాలేజీ ప్రిన్సిపాల్‌గావున్న జె.ఎస్‌ట్లిన్ కార్చెంటర్ 1929 - 30౦0లలో పదవీ
8
విమరణ చేశాడు. ఆ పదవి రాధాకృష్ణన్‌కు యివ్వజూపారు. “తులనాత్మక మతం” గూర్చి రాధాకృష్ణన్ ఉపన్యాసాలిచ్చేవాదు.
1929లో హిబ్సర్జు ఉపన్యాసాలు యిచ్చాడు. ఆ సమయంలో సభామందిరం లోనికి రాగానే రాధాకృష్ణన్‌పట్ల గౌరవ భావంతో సభాసదులు నిలబడేవారు.
1930 జనవరిలో లండన్ విశ్వవిద్యాలయంలో రాధాకృష్ణన్ ప్రసంగాలు బెట్రంద్ రస్సెల్ వినడం తటస్థించింది. రాధాకృష్ణన్‌ను వ్యక్తిగతంగా కలిసికొని తాను మున్నెన్నడు తత్వశాస్త్రంపై ఇంత వివరంగా చేసిన ఉపన్యాసాలు వినియుండలేదని అభివందనలు తెలిపాడు.
హెచ్. ఎన్.స్పాల్టింగ్ కూడా ఈ ప్రసంగాలవల్ల ప్రభావితుడై ఆక్స్‌ఫర్జులో ప్రాచ్యదేశాల మతంపైన ఒకపీఠం నెలకొల్పాలని నిశ్చయించాడు.
(1936లో రాధాకృష్ణన్‌కు ఈ పీఠం అధిష్టించే అపూర్వ గౌరవం లభించింది.)
జ ఈ కోర్టు వ్యవహారం:
1928లో కలకత్తా విశ్వవిద్యాలయానికి బీహార్‌నుండి జాదూనాధ్ సర్కార్ అనే చరిత్రకారుణ్ణి వైస్-ఛాన్సలర్‌గా నియమించారు. ఆయన నియామకాన్ని అధ్యాపకు లెవ్వరూ' హర్షించలేదు.
1928 ఫిబ్రవరిలో కలకత్తాకు సైమన్ కమీషన్ వచ్చినపుడు విద్యార్థులు సైమన్ గోబ్యాక్ అంటూ నిరసన ప్రదర్శనలు జరిపారు. వైస్-ఛాన్సలర్ పోలీసు సాయం కోరాడు. వారు విద్యార్ధులను దారుణంగా హింసించారు.
కలకత్తా యూనివర్సిటీ సిండికేట్ రాధాకృష్ణనను ఈ సంఘటనపై విచారణ జరపాల్సిందిగా కోరింది. విద్యార్థులపై పోలీసు చర్య అనాలోచితము అన్యాయ మంటూ ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు. రాధాకృష్ణన్ పట్ల విద్యార్థుల, అధ్యాపకుల అభిమానం పెరుగుతూ వచ్చింది.
రాధాకృష్ణన్ అవిశ్రాంతంగా పనిచేసేవాడు. వారంలో ఎనిమిది గంటలు ఉపన్యాసాలిచ్చేవాడు. పరిశోధకులను పర్యవేక్షించేవాడు. పోస్టు గ్రాడ్యుయేట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాలనా సంబంధ వ్యవహారాలు చూచేవాడు. 'ఫాకల్టీ క్షబ్బు స్థాపించి కలకత్తా మరియు పరిసరాలలోగల కళాశాల అధ్యాపకులతో సమావేశాలు జరిపేవాడు. ఇదిగాక నగరంలోని వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవాడు.
1928 వరకూ యూనివర్సిటీకి బస్సు/ట్రాములోనే వెళ్ళేవాడు. ఆ సంవత్సరమే ఒక పాతకారు కొన్నాడు. మరి రెండు సంవత్సరాలకు కొత్త కారు కొన్నాడు.
కొందరు బెంగాలీలు అకారణంగా రాధాకృష్ణన్‌పట్ల అసూయ పెంచుకున్నారు.
9
జాదూనాధ్ సిన్హా అనే యువ పరిశోధకుడు రాధాకృష్ణన్ రాసిన “భారతీయ తత్వశాస్త్రంలో తన పరిశోధనా వ్యాసంనుండి గ్రంథ చౌర్యం చేశాడని ప్రచారం ప్రారంభించాడు.” 'మాడరన్ రివ్యూ పత్రిక ఈ వివాదానికి ఆజ్యం పోసింది. తాను ఎన్నో సంవత్సరాలుగా సంస్కృత (గ్రంథాలను పాఠంచెప్తూ వచ్చానని, వాటిని ఇంగ్లీషులో అనువాదం చేసే సందర్బాలలో ఎవరైనా ఒకే రకమైన పదజాలం ఉపయోగిస్తారని అంతమాత్రాన అది కాపీ ఎట్లా కాగలదని రాధాకృష్ణన్ ప్రశ్నించాడు.
1929 వేసవిలో రాధాకృష్ణన్ జాదూనాధ్ సిన్హా రామానంద ఛటర్జీ (మాడరఎ రివ్యూ పత్రికాధిపతి) లపై పదివేల రూపాయలకు పరువునష్టం దావా
[గ్రంథ చౌర్యం అభియోగం మోపుతూ సిస్టా మరొక దావా రూ.20 వేల నష్టపరిహారం కోరుతూ అదే కోర్టులో వేశాడు. 1938 మధ్యకాలంలో రెండు కేసులు విచారణకు వచ్చాయి. రాధాకృష్ణన్ తరపున ప్రముఖ న్యాయవాదులు ఎన్.ఎన్. సర్మారు, సుభాస్ చంద్రబోసు సోదరుడు శరత్ చంద్రబోసు, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీలు ఎలాంటి ఫీజు తీసికొనకుండా వాదించారు. “మీరు బెంగాల్‌కు అతిధులు. ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చినవారు. మిమ్ము చూచుకోవాల్సిన బాధ్యత మాపై వుంది అని వారు తెలిపారు. ప్రముఖ సంస్కృత పండితులు గంగానాధ్ రూ, * కుప్పుస్వామి శాస్త్రులు రాధాకృష్ణన్ తరపున సాక్ష్యమిచ్చారు. సిన్హా కేసు తాను ఓడిపోవడం తథ్యం అని తెలిసి రాజీకి వచ్చాడు. రాధాకృష్ణన్ పట్టుదలకు పోకుందా రాజీకి అంగీకరించాడు. ఈ కేసు జరిగినంతకాలం రాధాకృష్ణన్ అశాంతికి లోనయినాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో...
ఉమ్మడి మధ్రాసురాష్ట్రంలో ఆంధ్రులు తీవ్రంగా ఆందోళన చేసిన పిమ్మట 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాట్టయింది. దానికి మొదటి వైస్-ఛాన్సలర్‌గా దా॥ కట్టమంచి రామలింగారెడ్డి ఎన్నికైనాడు. 1927లో డిసెంబరులో జరిగిన మొదటి స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించాడు. దానిలోనే రాధాకృష్ణన్‌కు తొలి గౌరవ డాక్టరేట్ యివ్వబడింది.
దా॥ రెడ్డిగారి కాల వ్యవధి ముగిసిన పిమ్మట అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆంధ్రుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్-ఛాన్సలర్‌గా వస్తే బాగుండునని పలువురు భావించారు. కాని, సి.ఆర్.రెడ్డి తాను మరొకసారి - 1928 మార్చిలో - వైస్-ఛాన్సలర్‌గా ఎన్నికయినాడు. అయితే మహాత్మాగాంధీ ఆధ్వర్యాన సాగుతున్న
10
సత్యాగ్రవాన్ని ప్రభుత్వం దమననీతితో అణచివేస్తున్నందుకు నిరసన తెలుపుతూ 1930 డిసెంబర్‌లో ఆయన రాజీనామా చేశారు.
మిత్రుల ప్రోత్సాహంతో రాధాకృష్ణన్ వైస్-ఛాన్సలర్ పదవికి పోటీచేశాడు. ఆయనతో పోటీచేసినవారు బ్రహ్మసమాజ ప్రముఖులు రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు. రాధాకృష్ణన్‌కు 38 ఓట్లు రాగా నాయుడుగారికి 28 ఓట్లు వచ్చాయి. రాధాకృష్ణన్ మే 1న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు.
ఆంధ్ర యూనివర్సిటీ _ అభివృద్ధికి ఆయన మిక్కిలి కృషి చేశాడు. విశ్వవిద్యాలయానికి స్వంత భవనాలు లేక తరగతి గదులు బొబ్బిలి రాజా. వారి భవనంలోను ఆఫీసు హోటలు గదులలోను నదుపుతూ వుండేవారు.
రాధాకృష్ణన్ ముందుగా చరిత్రలో, తెలుగులో బి.ఏ. ఆనర్సు కోర్సులు ప్రారంభించాడు. తరువాత తత్వశాస్త్రం, గణితం, ఆర్థికశాస్త్రం, రాజకీయ శాస్త్రం, విదేశీ భాషలలో ఆనర్భు, పోస్టుగ్రాద్యుయేటు కోర్సులు వర్పాటయినాయి. దేశంలో ఆయా విషయాలలో నిష్టాతులయినవారిని ఆచార్యులుగా ఆహ్వానించాడు. వారిలో 'లూడ్విగ్ వుల్సు, సర్.జె.సి. కోయజీ, వి.కె.ఆర్.వి. రావు, హీరేన్ ముఖర్జీ, ఆర్. శేషాద్రి మున్నగు వారుందేవారు.
ప్రొఫెసర్లకు నెలకు రూ.1000/- జీతం ఏర్పాటు చేశాడు. ఆ దినాలలో మరెక్కడా అంత వేతనం లేదు. 1982 జూలైనుండి భౌతిక రసాయనిక శాస్త్రాలలో ఆనర్సు కోర్సులు 'ప్రారంభమయినాయి. నోబల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్‌గారు సిండికేట్ మెంబరుగా కో-అప్టు చేయబడినారు.. గౌరవ ప్రాఫెసరుగా నియమితుదైనారు. ఇంజనీరింగ్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య బాధ్యత తీసుకొని టెక్నాలజీ కోర్సులు నిర్వహించారు. దక్షిణ దేశంలోని టెక్నాలజీ కోర్సు ప్రవేశపెట్టిన మొదటి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీయే.
రాధాకృష్ణన్ తన పలుకుబడిని ఉపయోగించి రాజులు, మహారాజుల నుండి విరాళాలు సేకరించి యూనివర్సిటీలోని వివిధ శాఖలకు ఆఫీసు భవనాలను ఏర్పరచాడు. భవననిర్మాణం పర్యవేక్షణకు ఒక ఇంజనీరును నియమించి అతనికి పూర్తి స్వేచ్చనిచ్చాడు. అనతికాలంలో భవన నిర్మాణాలు జరిగాయి. విద్యార్థులు చివరి సంవత్సరానికి వచ్చేసరికి భవనాలు సిద్ధమయినాయి.
ఆయనకాలంలో తగినరీతిలో వసతులు లేని. కారణంగా మెడికల్ కాలేజీని, మెడికల్ కౌన్సిల్ గుర్తించలేదు. రాధాకృష్ణన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు
111
సంపాదించి మెడికల్ కాలేజి మూసివేతకు గురికాకుండా కాపాదాడు. ఆ దినాలలో యూనివర్సిటీ అధ్యాపకులు ఎక్కువమంది ఖద్దరు ధరించేవారు. వారంతా కాంగ్రెసు సానుభూతిపరులని ప్రభుత్వం అనుమానించేది. రాధాకృష్ణన్ టీచర్ల పక్షం వహించి వారి స్వేచ్చకు ఎలాంటి భంగం రాకుండా చూశాడు.
ప్రముఖ నాస్తికవాది గోపరాజు రామచంద్రరావు (గోరా) కాకినాడ కాలేజిలో బాటనీ లెక్సరరుగా వుండేవారు. ఆయన నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తున్నాడని యాజమాన్యం ఉద్యోగం ఊడబెరికింది. బందరు హిందూ కళాశాల యాజమాన్యం గోరాకు తమ కళాశాలలో ఉద్యోగం యివ్వడానికి సంసిద్ధతను వ్యక్తంచేసింది. అయితే వారి కాలేజిలో బాటనీశాఖ ఏర్చాటు కాలేదు. వారు యూనివర్సిటీని కోరగా రాధాకృష్ణన్ వెంటనే బాటనీ కోర్సుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు పంపాడు. గోరాకు తన భావాలను ప్రచారం చేసుకునే హక్కువుందని ఆయన చెప్పాడు.
ఒక వైపు యూనివర్సిటీ పాలనా బాధ్యతలను నెరవేరుస్తూనే మరొక వైపు రాధాకృష్ణన్ ఫిలాసఫీ క్లాసులు తీసుకునేవారు. ఆయన తత్త్వశాస్త్రం, తర్మశాస్త్రం చెబుతుంటే ఇతర శాఖల ప్రొఫెసర్లు కిటికీల దగ్గిర నిలబడి వినేవారు. ఆయన సబ్జెక్టుపై ఆసక్తితో ఆచార్యత్వం వహిస్తే ఆసూయాగ్రస్తులు కేవలం డబ్బుకోసం అలా చేస్తున్నాడని భావించేవారు.
ఆయన విద్యార్థులలోను అధ్యాపకులలోను గట్టి క్రమశిక్షణ నెలకొల్పారు. :. _.ఠంథాలయం విశ్వవిద్యాలయానికి గుండెకాయ వంటిదని రాధాకృష్ణన్ భావించే వాడు. ఆయన పదవిలో చేరేసరికి యూనివర్సిటీ లైబ్రరీలో గ్రంథాలు ఏడువేలలోపు వుండేవి. ఆయన పదవీకాలం ముగిసే సరికి 23 వేల (గ్రంథాలయినాయి. సుమారు 200 పత్రికలు వచ్చేవి. యోగ్యత కలిగిన లైబ్రేరియన్‌ను నియమించారు. రాధాకృష్ణన్ విదేశాలకు వెళ్ళినపుడు మనదేశంలో నిషేధింపబడిన మార్చిస్టు (గ్రంథాలను తీసికొనివచ్చి లైబ్రరీలో చేర్చేవాడు.
తరచూ _హాస్టళ్ళను తనిఖీ చేసి విద్యార్థులు క్రమశిక్షణతో మెలగునట్లు చూచేవాడు. భోజనశాలలో విప్లవాత్మకమైన మార్చు - (బ్రాహ్మణులకు వేరుగా ఇతరులకు. వేరుగా భోజనం వడ్డించడం మాన్పించి, అందరికి ఒకే పంక్తి భోజనం ఏర్పాటు చేశాడు.
ఇంగ్రీషులోకంటే మాతృభాషలో. బోధన ప్రయోజనకారి అని రాధాకృష్ణన్ భావించాడు. విద్యార్థులను తెలుగులో పరీక్షలు రాయడానికి (ప్రోత్సహించాడు. ప్రముఖ దేశభక్తులు ఉన్నవ లక్ష్మినారాయణగారి విప్లవాత్మక- రచన 'మాలపల్లి బి.ఏ. విద్యార్ధులకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. స్త్రీలలో విద్యావ్యాప్తికి
12
మహిళాకళాశాల స్థాపించాడు. విద్యార్థినులను ఆకర్షించడానికి ఫీజులలో రాయితీ ప్రకటించాడు. హాజరు విషయంలో పట్టుదల పట్టరాదని చెప్పాడు.
విశ్వవిద్యాలయ విద్యార్థులను, పరిశోధకులను గ్రామీణాభివృద్ధి పునర్నిర్మాణం కార్యక్రమాలకు పురికొల్పాడు. ఈనాటి నేషనల్ సర్వీస్ స్మీము (0.5.5) కు అదే పునాది.
క్రీడల ప్రాముఖ్యాన్ని గుర్తించిన రాధాకృష్ణన్ పూర్తికాలం పనిచేసే వ్యాయామ అధ్యాపకుని నియమించాడు. అంతర్ విశ్వవిద్యాలయాలలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు పెక్కు బహుమతులు సాధించగలిగేవారు.
తన మిత్రుడైన అల్లాడి కృష్ణస్వామిని ప్రోత్సహించి ఎండోమెంట్‌కు నిధులు . ఏర్పాటు చేశారు. యూనివర్సిటీకి మహాత్మాగాంధీని ఆహ్వానించాడు. కానీ ఆయన రాలేకపోయాడు. విశ్వకవి రవీంద్రుడు రెండుసార్లు విచ్చేసి ఉపన్యాసాలు యిచ్చాడు. ఒకసారి ఒక నృత్య నాటికకు దర్శకత్వంకూడా వహించారు. రైట్ ఆనరబిల్ శ్రీనివాస శాస్త్రి సప్రూ మొదలగువారి ప్రసంగాలను రాధాకృష్ణన్ ఏర్పాటు చేశాడు.
మద్రాసు గవర్నరు, యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన స్టాన్లీ రాధాకృష్ణన్‌కు మంచిమిత్రుడు. ఆయన పదవీ విరమణ చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ యం.ఏ. (ఇంగ్రీషు)లో ప్రథములుగా వచ్చిన విద్యార్థి కోసం తన పేర బహుమతి (ప్రైజ్) ఏర్పాటుచేశాడు.
1933లో రాయలసీమలోని కళాశాలలు ఆంధ్రయూనివర్సిటీ పరిధిలోనికి తీసుకొనిరావాలన్న రాధాకృష్ణన్ కృషి ఫలించలేదు. ఈ సమస్య గూర్చి ఒక సభ్యుడు మద్రాసు శాసనసభలో అనధికార బిల్లు ప్రవేశపెట్టాడు. రాధాకృష్ణన్ ఆయనను సమర్ధిస్తూ లేఖ రాశాడు. ఆంధ్రుల సాంస్కృతిక సమైక్యతకు ఇది అత్యవసరమని ఆయన తెలిపాడు. 1934 జనవరిలో స్వయంగా అనంతపురం వెళ్ళాడు. రాయలసీమ వారికి ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని సీట్లు ప్రత్యేకించ గలమని హామీ యిచ్చాడు. స్కాలర్‌షిప్ యిస్తామని వాగ్ధానం. చేశాడు. అనంతపురంలో న్యాయ (లా) కళాశాల ఏర్పాటు చేస్తామని, సెనేట్ మీటింగ్ కూడా తరచూ ఇక్కడే నిర్వహిస్తామని కూడ తెలిపారు. కానీ కన్నడం మాటలాదే 'ప్రజలమూలంగా ఆయనకృషి సఫలం కాలేదు.
1934లో 'కావ్యకంఠ' వాశిష్టగణపతిముని ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాశాల వార్షికోత్సవాలకు ఆహ్వానించబడినాడు. తన పినతండ్రి సర్వేపల్లి నరసింహంగారికి వీరు గురువులని రాధాకృష్ణన్‌కు తెలుసు. కానీ ప్రత్యక్ష పరిచయం అప్పుడే
13
జరిగింది. గణపతిమునిని తన యింట కొన్ని దినాలు వుంచుకున్నాడు రాధాకృష్ణన్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భారతచరిత్ర పరీక్ష గూర్చి మునిగారు రెండు ఉపన్యాసాలకు ముగ్భుదైన రాధాకృష్ణన్ వారిని అచటనే ఒక పీఠం (0[౭1౧ నెలకొల్సి నిలుపుకోవాలని ప్రయత్నించాడు. ఆనాటి పండితులు ఆయన సంస్కార భావాలను ఆమోదించలేకపోయారు. గణపతిముని విశ్వవిద్యాలయ ప్రసంగాలను నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికలో ప్రచురించారు.
1931లో వైస్ - ఛాన్సలర్‌గా ఎన్నికైన రాధాకృష్ణన్ పదవీకాలం 1984తో ముగిసింది. 1934లో ఆయన తిరిగి మరొకసారి ఎన్నికైనారు. 1937 ఫిబ్రవరి వరకు ఆయనకు పదవీకాలం ఉంది. వాల్తేరు వాతావరణం రాధాకృష్ణన్‌కు బాగా నచ్చినప్పటికీ 1935లోనే అక్కడి నుండి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చింది.
ఆయనను, కొందరు నియంతగా వ్యవహరిస్తున్నాడని ఉద్యోగాలలో ఆంధ్రులను విస్మరిస్తూ ఇతర ప్రాంతాలనుండి తీసికొని వస్తున్నాడని ప్రతిభనుమాత్రమే పరిగణనలోకి తీసికుంటున్నారని గుసగుసలు రాధాకృష్ణన్ చెవినిబడినవి.
1984లో మద్రాసులోని మైలాపూర్‌లో ఒక పష్లాటుకొని, 1935లో ఇల్లు కట్టుకొని “గిరిజ అని పేరు పెట్టుకున్నాడు. ఒక వైపు ఆక్స్‌ఫర్జులో స్పాల్దింగ్ ప్రొఫెసరుగా ఆహ్వానం వచ్చినా రాధాకృష్ణన్ విద్యాశాఖ డైరెక్టరు పదవి లభిస్తే మద్రాసులోనే వుండి పోవచ్చునని కూడా ఆలోచించాడు. కానీ ఆయనకంటే సీనియర్లు ఇంగ్లీషువారు ఉన్నంతకాలం తనకు డైరెక్టరు పదవి ఇవ్వజాలమని మద్రాసు ప్రభుత్వం తేల్చిచెప్పింది. 1986 ఫిబ్రవరిలో ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మీటింగ్‌లో తాను మేలో పదవీ విరమణ చేస్తున్నట్లు రాధాకృష్ణన్ ప్రకటించాడు. స్మాతకోత్సవ ప్రసంగాలు:
రాధాకృష్ణన్ అద్భుత ప్రతిభాపాటవాలను గుర్తించిన అనేక యూనివర్సిటీలు వారి స్నాతకోత్సవ ఉపన్యాసాలకు రాధాకృష్ణన్‌ను ఆహ్వానిస్తూ వచ్చారు.
మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్ ఇలా అన్నారు. “స్వాతంత్ర్యం అంతర్గతంగా సాధించేదిగానీ బయటనుండి వచ్చేదికాదు. భారతీయ సంప్రదాయం విడనాడవద్దు. కొత్త పద్ధితులకు దానిని అనుసంధానం చేయండి. బ్రిటిష్ పాలకులు ఒక ధర్మం పాటించాలి. లందన్‌లో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధులు గుర్తించాల్సింది ఏమంటే భారతదేశం పరిపాలించదగిన దేశంకాదని తన ఆత్మను శోధిస్తున్న జాతి అని.” ముందుగా రాసిన ఈ ప్రసంగంలోని చివరి వాక్యాన్ని తొలగించాల్సిందిగా
114
ఇంగ్లీషువాడైన వైస్-ఛాన్సలర్ కోరాడు. రాధాకృష్ణన్ నిరాకరించాడు. 1980 డిసెంబరులో పంజాబ్ విశ్వవిద్యాలయంలో రాధాకృష్ణన్ స్నాఠకోత్సవ ప్రసంగం ఇలా సాగింది. “భారతదేశానికి స్వాతంత్ర్యం రాక తప్పదని విశ్వవిద్యాలయాలు యువకులకు నాయకత్వంలో శిక్షణ యివ్వవలసి వుందని కోరాడు. భారత జాతీయత పాశ్చాత్యులకు రుణపడి ఉన్నది కాని దాని వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొనరాదు. విశ్వవిద్యాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి వుండాలన్నాడు.
ఉపన్యాసం పూర్తికాగానే ఒక యువకుడు రాధాకృష్ణన్‌కు మోకరిల్లి జేబులోని రివాల్వరు తీసి గవర్నరు సర్ జాఫరీ డిమోంట్ మొరెన్సీ పైకి కాల్చి గాయపర్చాడు.
గవర్నరును వేదికపైనే తీవ్రంగా కాల్చి వుండవచ్చు గదా అని ఆ యువకుణ్ణి అడిగినప్పుడు, “పక్కన వున్న రాధాకృష్ణన్ గాయపడకుండా జాగ్రత్తపడినానని” అతడు జవాబిచ్చాడు. ఇదేకాలంలో రాధాకృష్ణన్‌కు బ్రిటిష్ ప్రభుత్వం నైట్‌హుడ్ యిచ్చింది. ముందుగా బెంగాల్ గవర్నరు అభిప్రాయం అడిగింది. నాటి గవర్నరు జాఫ్రన్ “పోలీసు రిపోర్టులన్ని ఆయనకు వ్యతిరేకంగా వున్నాయి. అయినా ఆయనంటే నాకు యిష్టం” అని రాశాడు. పంజాబ్ గవర్నరు జాఫ్రరీ డిమోరిచ్ మొరెన్సీ “ఇది చాల అసాధారణం. ఒక వైపు రాజునుండి గౌరవం పొందుతూనే మరొకవైపు విప్లవకారుడైన వ్యక్తి నుండి నివాళులందుకొనడం రాధకృష్ణన్‌కే చెల్లింది” అని (ప్రకటించారు.
1934లో అల్హాబాద్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో రాధాకృష్ణన్, “నియంతృత్వం ప్రబలుతూ ఆయుధసేకరణ వృద్ధి అవుతున్న సందర్భంలో హింసద్వారా సాధించిన స్వాతంత్ర్యం తనకెంత మాత్రం అంగీకారంకాదు. అంధకార బంధురమైన విశ్వంలో గాంధీజీ ప్రకటన స్వర్గ్ణంనుండి వెలువడిన వెలుగులా భాసిస్తుందని పేర్కొన్నాడు. రాధాకృష్ణన్ ప్రసంగం చదివిన రాజాజీ రాధాకృష్ణన్‌ను అభినందిస్తూ లేఖ రాశాడు. ఆంధ్ర మహాసభ;
తమిళనాడులో విద్యనభ్యసించి అక్కడే స్టిరపడినప్పటికీ తెలుగు వారసత్వం రాధాకృష్ణన్ కొనసాగించాడు. తెలుగు సాహిత్యంతో ఆయనకు గట్టి పరిచయమే వుంది. తెలుగులిపిలో వున్న సంస్కృత వేదాంత [గ్రంథాలు ఆకళింపు చేసుకునేవాడు,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోగల ఆంధ్రుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలంటూ 1918లో ఆంధ్ర మహాసభ ఏర్పాటయింది. ఆంధ్రదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క పట్టణంలో మహాసభలు జరుగుతూ వచ్చాయి. 1928లో
15
నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షులుగా రాధాకృష్ణన్ ఎన్నికైనాడు. అప్పుడు అనంతపురం, కడప, కర్నూలు, బళ్ళారి జిల్లాలను దత్తమండలాలని పిలిచేవారు. దత్తమండలం పదం న్యూనతగా భావించి ఇకనుండి, ఆ ప్రాంతాన్ని రాయలసీమగా పిలవాలని నంద్యాల ఆం[ధ్ర మహాసభలో తీర్మానం చేశారు. తరువాత సరిగా పది సంవత్సరాలకు 1988లో మద్రాసులో జరిగిన ఆంధ్ర మహాసభకు రాధాకృష్ణన్ అధ్యక్షత వహించాడు. ఆనాటి ఆయన ప్రసంగం ఇలా సాగింది. “ఆంధ్రుల భావాలు, సామర్ధ్యము నాకు బాగా తెలుసు. ఇతరులతో పోలిస్తే వారిలో అసూయ కూడా తక్సువే! వారు త్యాగానికి సంసిద్ధులు. ఉత్సాహ పూరితులు. మంచిదేశ భక్తులు. సహాయ నిరాకరణ దినాల్లో ఈ లక్షణాలన్నీ వ్యక్తమైనాయి. ఆరోజుల్లో స్వాతంత్ర్య ఉద్యమానికి ఆంధ్రులు విరివిగా విరాళాలిచ్చారు. పనివారలు అధిక సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్రదేశంలో అందులో పాల్గొనని గ్రామమంటూ బహుశా లేదేమో. మన రాజకీయ జీవితంలో కూడా క్రమశిక్షణ ప్రజలలో తేవడానికి వీలున్నదని నా నమ్మకం. ఎలాగైతే ప్రపంచ సౌభాగ్యానికి స్వరాజ్యోద్యమం అవరోధంకాదో అలాగే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ జాతీయోద్యమానికి హానికరం కాదు. మన అంతర్గత విభేదాలే మన లక్ష్యసాధనకు అవరోధం. ఏదో కొంతకాలం తప్ప 1920 మధ్య నుండి 1987 తాత్కాలిక మంట్రి మండలివరకు మనవారే మద్రాసులో ముఖ్యమంత్రులు. వారి ఆంధ్రాఖిమానం తెలిసినదే! కానీ వారు అధికారంలో వున్నప్పుడు రాష్ట్ర సాధనకు చిటికెనవేలు కూడా కదిలించలేదు. అన్ని తెలుగు జిల్లాలు ఒకే విశ్వవిద్యాలయంలో వుండడానికి బదులు అంధ్ర యూనివర్సిటీ కోస్తా జిల్లాలకే పరిమితమయింది. ఉత్సాహం ఆదర్శం వుండాల్సినమాట నిజమే, కాని అత్మనియంత్రణ, క్రమశిక్షణలు కూడా అంతే అవసరం. సర్మారు రాయలసీమ విభేదాలు తొలగించాలంటే ఒకటి చేయాలి. మద్రాసు ఆంధ్రదేశానికి మధ్యగా వున్నది. అది రాయలసీమ కోస్తా జిల్లాలను కలుపుతున్నది. ఆంధ్ర నాయకులకు సంస్థలకు మద్రాసుతో చిరకాలంగా సంబంధం వుంది. మద్రాసు ఆంధ్రుల చేతిలో పుట్టి పెరిగింది. లక్షాయాఖైవేల మంది ఆంధ్రులు ఇక్కడ ఉన్నారు. ఆంధ్ర దేశానికి మద్రాసు సహజమైన కేంద్రం అని నా అభిప్రాయం. (ప్రభుత్వం అందుకు అంగీకరించక పోతే నగరాన్ని రెండుగా విభజించవచ్చు. మద్రాసు శాసనమండలి తీర్మానం విన్నపాలతో ప్రారంభమయింది, సిద్ధాంతంతో ముగిసింది. ఆంధ్రరాష్ట్రం కావాలని ఒత్తిడి కూడా వుంటే ఆంధ్రులు తృప్తి పదేవారు.” మహాసభ జరుగుచుండగా ముఖ్యమంత్రి రాజాజీ అనుకోకుండా వచ్చాడు. సభ ఎజెండాను కాసేపు పక్కనపెట్టి రాధాకృష్ణన్ ఆయనను ఆహ్వానించాడు. 16
కొన్ని మాటలు చెప్పాల్సిందిగా కోరాడు. రాజాజీ “రాష్ట్రం తగిన సమయంలో వస్తుందని తొందర పనికిరాదని” హితవు చెప్పాడు. రాధాకృష్ణన్ ఆయన మాటకు అడ్డువచ్చి, “మాకు ఇక్కడే ఇప్పుడే రాష్ట్రం కావాలనుకుంటున్నాం” అని చెప్పాడు.
1988 డిసెంబరులో రాధాకృష్ణన్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుని హోదాలో వార్చాలో మహాత్మాగాంధీని కలిసి ఆంధ్రరాష్ట్రం తక్షణం నిర్మాణం కావాలనే వాదన ఆయనచేత అంగీకరింపచేశాదు. ఆ ఆంధ్ర మహాసభ ఇరవై అయిదు సంవత్సరాలుగా పనిచేసున్నా దానికొక కార్యవర్గం ఏర్పడలేదు. రాధాకృష్ణన్ అధ్యక్షుడుకాగానే దానికొక రూపం ఏర్పడింది.
ఆంధ్ర మహాసభ తరపున సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెట్ లాంద్‌ను కూడా రాధాకృష్ణన్ లండన్‌లో కలుసుకున్నాడు.
1952 డిసెంబరు 15న పొట్టి - శ్రీరాములు ఆత్మాహుతితో మద్రాసు రాష్ట్రంలో భాగంగా వున్న ఆంధ్ర ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. వివాదరహిత తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించిందని ప్రధాని సభకు ఈ విషయం తెలుపవలసిందిగా చెప్పాడని ప్రకటించి సభ్యులను శాంతింప చేశాడు. ప్రధాని నెహ్రూ తనకు అండగానిలిచిన ఆంధ్ర మహా పురుషుడు (రాధాకృష్ణన్) కర్నూలు ఆవిష్కరణ సభలో తన సరసన వుండాలని కోరారు.
1958 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రాన్ని ఆంధ్రకేసరి ప్రకాశం ముఖ్యమంత్రిగా ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. నాటి సభలో దేశ ఉపాధ్యక్షుని హోదాలో వున్న రాధాకృష్ణన్ “స్వర్గీయ దేశభక్త కొండ వెంకటప్పయ్య, దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గార్లు రాష్రోద్యమంలో విశేషంగా కృషి చేసినవారు. ఈ శుభసమయాన వారు లేనందుకు విచారం కల్గుతున్నది” అని పేర్కొన్నారు.
ఒక సంవత్సరం ప్రముఖ పుణ్యక్షేతమయిన భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఉత్సవసభలో రాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఆయన ఇంగ్లీషులో ఉపన్యసిస్తే రాయగల లేఖకులు అందుబాటులో లేరని గమనించాడు. చక్కని తెలుగులో ధారాపాతంగా ప్రసంగించాడు. సుప్రసిద్ధ పాత్రికేయుడు తిరుమల రామచంద్ర దానిని యథాతథంగా రాసి ఆంధ్రప్రభకు పంపాడు. రాధాక్ళష్ణన్ గంభీర ప్రసంగం తెలుగులో రాయగలిగినందుకు నీలంరాజు వెంకట శేషయ్య (ఆంధ్రప్రభ సంపాదకులు) రామచంద్రను మిక్కిలి అభినందించాడు.
1958లో అలంపురంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌వారి సభకు అధ్యక్షులుగా విచ్చేసిన రాధాకృష్ణన్ తెలుగు కావ్యాలనుండి. పద్యాలను ఉదహరిస్తూ
గ/
మహోపన్యాసం చేశాడు. ఆ సభలోనే సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఆదికవి నన్నయ్యపై కన్నడకవి పంపని ప్రభావం గూర్చి మాటలాడారు. నిర్వాహకులు కొద్దినిముషాలు మాత్రమే ఆయనకు కేటాయిస్తే ప్రసంగ ధోరజికి ముగ్గుడైన రాధాకృష్ణన్ సమయ నిబంధన పక్కనపెట్టి ఆచార్యుల వారికి మరింత అవకాశం యిచ్చాడు.
న (ల ం ఆక్స్‌ఫర్డ్‌లో స్పాల్టింగ్ పీఠం:
1986 వేసవిలో రాధాకృష్ణన్ స్పాల్టింగ్ ప్రాఫెసరుగా చేరడానికి బ్రిటన్ బయలుదేరి వెళ్ళాడు. (ప్రతి సంవత్సరం ఆక్స్‌ఫర్జులో రెండు టర్ములు మాత్రమే ఆయన ఉద్యోగం. మిగతా సమయం కలకత్తా విశ్వవిద్యాలయంలో కొనసాగేవాడు.
బ్రిటన్‌కు బయలుదేరేముందు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ విశాఖలోనేగాక
మద్రాసు పౌరులూ ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. మద్రాసు సభలో ఉన్నతాధికారులే గాక రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి, డా॥ కట్టమంచి రామలింగారెడ్డి లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. రాధాకృష్ణన్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపి ఆక్స్‌ఫర్జ్డ్‌లో తాను తత్త్వశాస్త్రం భారతీయ దృక్పథం గూర్చి ప్రచారం "చేయగలనని తెలిపాడు. _ _ఆక్స్‌ఫర్జులో రాధాకృష్ణన్ నియామకంపట్ల సర్వత్రా ఆనందం వ్యక్తమైంది. ఇండియన్ సోషల్ రిఫార్మర” అనే పత్రిక, “భారతదేశంలో దేశీయులను అరదజను మందిని గవర్నర్లుగా అంతకన్నా వైస్రాయిగా ఒక భారతీయుణ్ణి నియమించిన దానికన్నా ఈ పదవి ఉన్నతమైనదని వ్యాఖ్యానించింది. భారత్ బ్రిటన్ ప్రజలమధ్య సదవగాహనకు ఈ నియామకం దోహదం కాగలదని ఆశాభావం ' ప్రకటించింది.
మద్రాసు విద్యాశాఖనుండి విరమించిన రాధాకృష్ణన్ ఇకనుండి ప్రభుత్వ ఉద్యోగి కాడు. స్వేచ్చగా తన అభిప్రాయాలను వెల్లడించగలిగారు.
2986 డిసెంబరు ఎద్వర్జు ౪/1 బహిష్టరణ సందర్భంలో తమ పరిధిలోవున్న భారతదేశాన్ని సంప్రదించనందుకు బ్రిటిష్ (ప్రభుత్వాన్ని రాధాకృష్ణన్ తప్పు పట్టాడు. కాంగ్రెసు పార్టీలో ఎవరికి కూడా ఇలాంటి ఆలోచన తట్టలేదు.
రాధాకృష్ణన్ రాజకీయాభిప్రాయంలో మహాత్మాగాంధీని ఆయన అహింసా విధానాన్ని పూర్తిగా సమర్ధించాడు. ఆ సమయంలోనే వచ్చిన పండిట్ నెహ్రూ “ఆత్మకథ” గ్రంథాన్ని అక్షరం అక్షరం చదివి ముగ్గ్భుడై నెహ్రూపట్ల అభిమానం పెంచుకున్నాడు. -
18
రాధాకృష్ణన్ (ప్రతి బుధవారం ఆల్ సోల్స్ కాలేజీలో సాయంత్రం 5 గంటలకు ఉపన్యాసాలు యిచ్చేవాడు. ప్రేక్షకులలో విద్యార్థులతోపాటు పట్టణంలోని కొందరు మహిళలు ఆ సమయంలో ఆక్స్‌ఫర్జులో వున్న భారతీయ విద్యార్థులు వుండేవారు. మతం గూర్చి తులనాత్మకంగా ఆయన ఉపన్యాసాలు సాగేవి.
1988లో (బ్రిటిష్ అకాడమీ ఆధ్వర్యాన మహామేధావుల పరంపరలో రాధాకృష్ణన్ గౌతమ బుద్దుని గూర్చి ఉపన్యాసం యిచ్చాడు. బుద్ధభగవానుని గూర్చి విపులంగా అర్ధవంతంగాచేసిన ప్రసంగానంతరం ఉత్తేజితుడైన అకాడమీ అధ్యక్షుడు కృతజ్ఞత తెలుపుతూ “ఈనాటి ప్రసంగం ఒక మహామేధావి (142516 111౧6) గూర్చి మరొక మహామేధావి గావించాడన్నాడు.
సాధారణంగా _ రాధాకృష్ణన్ ఉపన్యాసాలలో ్రచారంలోవున్న కథలు ఉదంతాలు జోడించి చెప్పేవాడు. (పేక్షకుల ఆసక్తి గమనిస్తూ వుండేవాడు. ఒకసారి మార్మికత (143/541016౧)) గూర్చి కొంత సంక్షిష్టంగా ఉపన్యసిస్తుండగా (ప్రేక్షకులు ఉదాసీనంగా వుందడం గమనించాడు. సందర్భానుసారంగా ప్రపంచంలో ఒక ప్రాంతంలోవున్న విశ్వాసాన్ని ఇలా వివరించాడు. “భగవంతుడు మొట్టమొదటిసారిగా పురుషుణ్ణి సృష్టించాడు. అతడు ఒంటరితనం అనుభవిస్తూ తనకొక సహచరజీవి కావాలని దేవునితో మొరపెట్టుకున్నాడు. సృష్టికర్త వాయువు శక్తిని, సూర్యుని తీక్షణత, మంచు చల్లదనం, సీతాకోకచిలుక అందం పిడుగు శబ్దం కలబోసి స్త్రీని సృష్టించాడు.” ఈ పిట్టకథ (శ్రోతలను బాగా ఆకట్టుకొన్నది. ఉపన్యాసం ముగిసేవరకు (శోతలెవరూ తమ స్థానాలనుండి కదలకుండా కూర్చున్నారు. కళాశాలలో ఇతర బహిరంగ సభలలో ప్రసంగాలేగాక రాధాకృష్ణన్ పరిశోధకులకు పర్యవేక్షకుడుగా వుందేవాడు. దక్షిణదేశపు ఆహారమే వారి అతిథులకు యిచ్చేవాడు. ఆయన పూర్తిగా శాకాహారి. మద్యపానానికి విముఖుడు. తమ సంప్రదాయాలను పాటించే భారతీయులంటేనే పాశ్చాత్యులు ఎక్కువగా ఇష్టపడతారని ఆయన భావించేవాడు. మహాత్మాగాంధీ 70వ జన్మదిన సంచిక;
మహాత్మాగాంధీ ముమ్మాటికి మతాన్ని అభిమానించే వ్యక్తి అయికూడా రాజకీయ రంగంలో పనిచేస్తున్నాడు. కానీ ఆయన మతద్భక్పథం విశ్వమానవాళికి సంబంధించినదని రాధాకృష్ణన్ భావించాడు.
దక్షిణాఫ్రికాలోను భారతదేశంలోనూ ఆయన కార్యకలాపాలు ఆర్థిక కార్యక్రమం ఈ అంశాన్ని స్పష్టపరుస్తున్నాయి. ఆయనలాంటి మతసంబంధ వ్యక్తికి అహింస
19
ఒక్కటే మాధ్యమం. అహింసతో జోడించిన సత్యాగ్రహమే రాజకీయ మార్గం. సామ్రాజ్యవాద తత్తాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆయన బ్రిటీష్ వారికి మంచి మిత్రుడే! స్వేచ్చా జీవన విధాత గాంధీజీ అని రాధాకృష్ణన్ తెలిపాడు.
1939 అక్టోబరు 2 నాటికి గాంధీజీకి 70 సంవత్సరాలు నిండుతాయి. ఆ సందర్భంగా ఆయనను గూర్చిన వ్యాస సంకలనం ఒకటి కూర్చి వారికి బహూకరించాలని రాధాకృష్ణన్ తలపోశాడు. గాంధీజీని స్వయంగా ఒక సభలో స్వీకరించవలసిందని కోరగా మహాత్ముడు తిరస్కరించాడు. ఒక (ప్రత్యేక దూత ద్వారా అది ఆయనకు పంపబడింది.
రాధాకృష్ణన్ గాంధీజీ 80వ జయంతికి కూడా ఒక విశేష సంచిక ప్రకటించాడు. 1947 డిసెంబరులో మహాత్ముని దర్శించి దానిని అంకితం తీసుకొమ్మని రాధాకృష్ణన్ కోరాడు. గాంధీజీ సున్నితంగా తిరస్కరిస్తూ నేనెవరిని, నా సేవ ఏ పాటిది? నీవే నాకృష్ణుడివి నేను మీ అర్జునుణ్ణి అని వినయంగా ప్రకటించాడు.
680వ జన్మదిన సంచికనాటికి గాంధీజీ శరీరం చాలించాడు.
. మహాక్ళునికీ, రాధాకృష్ణన్‌కు కూడా అభిమాన గ్రంథం భగవద్గీత. రాధాకృష్ణన్ 1948లో ఇంగ్లీషులో వ్యాఖ్యానంతో ప్రకటించాడు. ఈ (గ్రంథానికి అనూహ్య స్పందన వచ్చింది. కాగితం కొరతగా వున్న దినాలలో మొదటిసారి పదివేల ప్రతులు అచ్చువేస్తే ఒక సంవత్సరంలోనే ఆ ప్రతులు అమ్ముడయ్యాయి. భగవద్గీత సారాంశాన్ని వివరిస్తూ రాధాకృష్ణన్ “కర్మలు చేస్తూ ఫలితాన్ని ఆశించరాదు. మతం యొక్క ఆశయం వ్యక్తి ఆత్మోద్ధరణ మాత్రమే కాదు. భూమిమీద సౌభ్రాతృత్వం నెలకొల్పబడదం” అన్నాడు.
1989 ఈస్టరు సెలవుల్లో రాధాకృష్ణన్ దక్షిణాఫ్రికాలో పర్యటించాడు. దక్షిణాఫ్రికాలోని ఇండియా ఏజెంట్-జనరల్ దక్షిణాఫ్రికా భారతీయ కాం(గైస్, కేప్‌టౌన్ విట్ వాటర్ స్రాండ్ విశ్వవిద్యాలయాలు రాధాకృష్ణన్‌ను ఆహ్వానించాయి:
దక్షిణాఫ్రికొలో స్థిరపడిన భారతీయుల మనో స్టెర్యాన్ని పెంపొందించడానికి భారతీయులపై తెల్లవారికి గల వర్ణవివక్షతను ని్వీర్యం చేయడానికి ఈయన పర్యటన తోద్చడింది. భారతదేశానికి సంపన్నమైన ప్రాచీన సంస్కృతి కలదని అక్కడి విద్వాంసులు పాశ్చాత్యులచే అధికంగా ఆదరణ పొందుతున్నారనడానికి రాధాకృష్ణన్ ఉదాహరణగా నిలిచాడు.
20
ఆ కాలంలో విడుదలయిన రాధాకృష్ణన్ రచన “ప్రాచ్యమతాలు - పాశ్చాత్యుల దృక్పథం” బహుళ (ప్రచారం పొందింది.
“పిక్చరుపోస్టు' పత్రికలో పుస్తకాన్ని సమీక్షించిన ఎద్వర్టు హాల్దన్ తనపాఠకులకు “మనలో చాలామంది మన పుస్తకాలన్ని అమ్మివేసి ఇది ఒక్కటి కొనుక్కుంటే చాలు - ఎందుకంటే తరతరాలుగా సత్యానికై మానవుడు చేసే ప్రయత్నానికి ఇది మార్గదర్శి అని రాశాడు. విశ్వవిద్యాలయాలలో రాధాకృష్ణన్ వివిధ మతరీతులగూర్చి తులనాత్మక ప్రసంగాలు చేశాడు. బహిరంగసభల్లో చేసిన ప్రసంగాలు వర్ణవిచక్షత పొటించేవారికి హెచ్చరికగా సాగాయి.
“మానవుని ఆత్మ (30/0 ఎల్లకాలం అణచివేయడం సాధ్యంకాదు. సమాజానికి అన్యాయం తలపెదుతూ దేవుని పేరు ఉచ్చరించడంలో అర్థంలేదు. మానవ సేవే మాధవ సేవ. మానవుడు సర్వతోముఖంగా అభివృద్ధి కాగల హక్కును గుర్తించడమే సర్వోత్తమ మతం. అక్కడి భారతీయులు కూడా తమ సంస్కృతీ వారసత్వం విస్మరించక దక్షిణాఫ్రికానే తమ జన్మభూమిగా భావించాలని రాధాకృష్ణన్ హితవు చెప్పాడు.
మహాత్మాగాంధీ కుమారుడు తాను నడుపుతున్న “ఇండియన్ ఒపీనియనొ”లో స్వర్గం నుండి వెలువడిన మెరుపుగా రాధాకృష్ణన్ పర్యటనను అభివర్ణించాడు.
తెల్ల జాతీయులు అయిన స్మట్స్, హాఫ్‌వేరలుకూడా రాధాకృష్ణన్ పట్ల అత్యంత గౌరవాదరాలు చూపారు. ॥ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో...
హిందువులకు పరమ పవిత్రమయిన బెనారస్‌లో 1917లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఏర్పాటయింది. దీనికి మూలపురుషుడు పండిత మదన మోహన్ మాలవ్యా. హిందూ సంస్కృతీ వికాసానికి ఉద్దేశించబడిన ఆ సంస్థ 1989కల్లా దేశంలోనే సంప్రదాయిక విద్యల్లోనూ సైన్సులోను గొప్ప ఆశ్రమ విద్యాలయంగా రూపుదాల్చింది. వ్యవస్థాపకుడూ వైస్ - ఛాన్సలర్ అయిన మాలవ్యా పరమ వైస్టికుడు. లండన్ వెడుతూ ఆయన తన పానానికి గంగాజలాన్ని తీసికొనివెళ్ళాడు. ఆయన హిందువులయిన పాలకులనుండి, సంస్థానాధీశులనుండి వణికముఖులనుండి విరివిగా విరాళాలు సేకరించి విశాలమైన ప్రాంగణంలో గొప్ప భవనాలు ఏర్పడడానికి కారకులయినారు. మరే యితర చోటులలో లేని కోర్సులు బెనారస్ విశ్వవిద్యాలయంలో వుండేవి. దేశం నలుమూలలనుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడ విద్య నభ్యసించేవారు. భారత ప్రభుత్వం నుండి యునైటెడ్ ప్రావిన్సు 21]
ప్రభుత్వంనుండి వచ్చేగ్రాంటులు ఏటా మూడు లక్షలకు మించేవికావు. విస్తృతంగా విస్తరణ _ తలపెట్టినందువల్లా పాలనా సామర్థ్యం లోపించడం వల్లా విశ్వవిద్యాలయం రెండు కోట్ల అప్పులలో కూరుకుపోయింది. ఆ కాలంలో అది చాలాపెద్ద మొత్తమే.
ఇంతలో తన ఆరోగ్యం క్షీణిస్తున్న కారణంగా వైస్ - ఛాన్సలర్ మాలవ్యా పదవీ విరమణ చేసి ఒక యువకునికి అవకాశం యివ్వాలని తలచాడు. ఆయన దృష్టిలో వైస్- ఛాన్సలర్‌గా వుండడానికి అయిదు అర్జతలు కొలబద్దగా నిర్ధారించాడు. అవి 1. గొప్ప హిందువు అయి వుండాలి. 2. దేశభక్తుడై వుండాలి. 8, అంతర్జాతీయ గుర్తింపు పొందిన మేధావి అయి వుండాలి. 4&. విశ్వవిద్యాలయాలతో సంబంధం కలిగి ఉండాలి. 6. ధన సమీకరణ సామర్థ్యం కలిగి వుండాలి. ఈ లక్షణాలన్నీ రాధాకృష్ణన్‌లో గమనించిన మాలవ్యా 1939 ఆగస్టులో రాధాకృష్ణన్ వైస్‌ఛాన్సలర్ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరాడు. తాను సంవత్సరంలో ఆరునెలలు ఆక్స్‌ఫర్జులో వుండటం మూలంగానూ, విశ్వవిద్యాలయం ఆర్థిక దుస్థితి కారణంగాను తాను న్యాయం చేయజాలనని రాధాకృష్ణన్ సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. కానీ మాలవ్యా అనేక విధాల నచ్చచెప్పినందున 1939 సెప్టెంబరు 21న రాధాకృష్ణన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర యూనివర్సిటీలో చేసిన మాదిరే కృషిచేసి బెనారస్ యూనివర్సిటీని అగ్రస్థానంలో నిలిపాడు.
రాధాకృష్ణన్ దృష్టిలో హిందువు ఎవరంటే ఇతరుల మతాన్ని తన మతంవలె గౌరవించేవాడు. 1938లో ఇదే విశ్వవిద్యాలయంలో స్నాతకోపన్యాసం ఇస్తూ ఇస్లామిక్ విద్యకు అవకాశం కల్పించాలని కోరాడు. ఆయన విశాల దృక్సథానికి ముగ్భుడైన నిజాం నవాబు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి భూరి విరాళం అందజేశాడు.
చాదస్తపు కట్టుబాట్లను తోసిరాజని వేదాభ్యాసానికి సంబంధించిన కోర్సులో ఒక విద్యార్థినికి అవకాశం కల్పించాడు. నగరంలోనున్న దినాలలో ఆయన స్వయంగా భగవద్గీతపై ఉపన్యాసాలు యిచ్చేవాడు. ఈ ఉపన్యాసాలు వినడానికి సుదూర ప్రాంతాలనుండి కూడా జనం విచ్చేసేవారు.
1942 జనవరిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం రజతోత్సవాలకు మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ హాజరు కావడంతో అక్కడ కాంగ్రెసు వాతావరణం నెలకొన్నదని ప్రభుత్వం బెదిరిపోయింది. వివిధ సందర్భాలలో బాబూ రాజేంద్రప్రసాద్, గోవింద వల్లభపంత్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, విజయలక్ష్మీ పండిట్ గార్లను అహ్వానించి రాధాకృష్ణన్ వారిని సత్కరించాడు. ॥
22
రాధాకృష్ణన్ వైస్-ఛాన్సలర్‌గా వున్నదినాల్లో ఆంధ్రదేశంనుండి విద్యార్థులు అధిక సంఖ్యలో బెనారస్ పిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునేవారు. ఆంధ్రులకు - ఆంధ్ర, బెనారస్ రెండు యూనివర్సిటీలు అని కొందరు చమత్మరించారు. ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, కమ్యూనిస్టు నేతలు తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి ప్రభృతులు బెనారస్ విశ్వవిద్యాలయంలో వున్నకాలంలోనే మార్చిజం పట్ల ఆకర్షితులైనారు.
1942 సంవత్సరంలో ప్రభుత్వానికి కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణ నివారించడానికి రాధాకృష్ణన్ తీవ్రంగా కృషి చేశాడు. కాంగ్రెస్, ముస్లింలీగ్‌లతో మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించమని వైస్రాయి లిన్‌లిత్‌గోకు లేఖ రాశాడు. అప్పటికే కాంగ్రెస్ ప్రముఖులందరూ అరెస్టు కాబడినారు. యునైటెడ్ (ప్రావిన్సులో కాంగ్రెస్ సేవాదళ్ చాలాచురుకుగా పనిచేస్తున్నది. పండిట్ నెహ్రూ వారికి మిక్కిలి ప్రోత్సాహమిచ్చేవాడు. కేంద్ర నాయకత్వం ఇక్కడ విప్లవానికి కుట జరుగుతున్నదని, దానికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కేంద్ర బిందువని (ప్రభుత్వం భావించింది. రాధాకృష్ణన్ బహిరంగంగానే కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండించాడు. విద్యార్థులలో కలిగిన ఉద్వేగం గమనించి ఒక నెలరోజులు విశ్వవిద్యాలయం మూసివేసి విద్యార్థులను స్వస్థలాలకు వెళ్ళిపొమ్మని కోరాడు. కానీ రాధాకృష్ణన్‌కు తెలియకుండానే విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ ప్రాంతాలకు వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పూనుకోవాలని నిర్ణయించారు. ఇరువురు అధ్యాపకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కూడా. - విశ్వవిద్యాలయం మూతపడటం, విద్యార్థులు తమ (ప్రాంతాలకు వెళ్ళడంతో ఉద్యమం బలపడింది. ఆగస్టు 14న పోలీసు బలగంతో వచ్చిన జిల్లా కలెక్టరు విశ్వవిద్యాలయం ముఖద్వారం దగ్గరే వైస్-ఛాన్సలర్‌తో మాట్లాడి వెనుదిరిగి పోయాడు. గవర్నరు దీనిని తప్పుగా అద్ధం చేసుకున్నాడు. జిల్లా కలెక్టరుని కూదా లోనికి రాకుండా విశ్వవిద్యాలయం “స్వేచ్భా భారతం”గా వుంటూ లోపల భారత జాతీయ సైన్యం శిక్షణ జరుగుతున్నదని భ్రమపడినాడు. వైస్రాయికి ఈ విషయం వివరించాడు. ఆగస్టు 19న విశ్వవిద్యాలయ ప్రాంగణం అక్రమించాల్సిందిగా మిలిటరీ పంపబడింది. యునైటెడ్ (ప్రావిన్సు ప్రభుత్వం ఈ సంగతి రాధాకృష్ణన్‌కు ముందుగా తెలుపలేదు. ఆయన గాంధీజీని విడుదలచేస్తే హింసాయుత ధోరణులు అరికట్టబడగలవని వైస్రాయికి లేఖ రాశాడు.
విశ్వవిద్యాలయ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాదాలనీ మిలిటరీని వెంటనే ఖాళీ చేయించాలని వైస్రాయికి రాధాకృష్ణన్ మరొక లేఖ రాశాడు.
సెష్టెంబరు 14న రాధాకృష్ణన్ గవర్నరు హాలేట్‌ను స్వయంగా కలిసి పరిస్థితి వివరించాడు. గవర్నరు విశ్వవిద్యాలయంలో (క్రమశిక్షణ నెలకొల్పడానికి 23
ప్రభుత్వ ఉన్నత్రాధికారిని పంపుతానన్నాడు. అలాచేస్తే తాను రాజీనామా చేయగలనని రాధాకృష్ణన్ బెదిరించాడు.
మెకేేల్ నెదర్‌సోల్ అనే అధికారి బెనారస్ పంపబడినాదు. ఆయనకు రాధాకృష్ణన్ పట్ల అత్యంత గౌరవం. ఒకనాడు చిత్తుగా విస్కీ తాగిన మత్తులో గవర్నరుతో “మీరు రాష్ట్ర గవర్నరు కావచ్చుకానీ బ్రిటిష్ అకాడమీ!
“అల్ సోల్స్‌లో "ఫెలో జన్మలో కాలేరనే సరికి గవర్నరు అక్కడినుండి నెమ్మదిగా నిష్క్రమించాడు.
వాలేట్ రాధాకృష్ణన్ కాంగైస్ అభిమానంటూ ఎన్ని రిపోర్టులు పంపినా ఫలితం లేకపోయింది. రాధాకృష్ణన్ ప్రపంచ యుద్ధకాలంలో విశ్వవిద్యాలయం నిర్వహించిన తీరుపట్ల ఆయన జాతీయభావం' బలపడటానికి చేసిన కృషి గుర్తించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయనను రాజ్యాంగ నిర్మాణసభలో వుండాలని పట్టుబట్టారు. చరిత్రాత్మక ఆగస్టు ప్రసంగం;
పండితులచేత, రాజకీయవేత్తలచేత ప్రపంచమన్ననలనందిన జవహర్‌లాల్ నెహ్రూ సర్వేపల్లి రాధాకృష్ణన్ - ఇరువురిలోనూ కొన్ని సారూప్య లక్షణాలు కన్పిస్తాయి. ఇరువురూ మేధావులు. గొప్ప వక్తలు. రచయితలు. విసృతంగా ప్రవంచ పర్యటనలు చేసినవారు. విశాల దృక్పథం కలిగినవారు. ఒకరినొకరు బాగుగా అర్థంచేసికొని అనురాగం పెంపొందించుకొనినవారు. నెహ్రూగారి “ఆత్మకథ రాధాకృష్ణన్‌ను అమితంగా అకర్షిస్తే, రాధాకృష్ణన్ రాసిన 'భారతీయ తత్త్వశాస్త్రం పండిట్‌జీని పరవశింపచేసింది.
1947 ఆగస్టు 14 అర్ధరాత్రి రాజ్యాంగ నిర్మాణసభ ప్రారంభం కావాల్సివుంది. “యావత్తు ప్రపంచం నిద్రలో మునిగిన తరుణంలో భారతజాతి మేల్కొంటున్నది” అంటూ తన ప్రసంగం ప్రారంభించిన పండిట్ నెహ్రూ చరిత్ర సృష్టించాడు. తన తరువాత రాధాకృష్ణన్‌ను మాట్లాడవలసిందిగా కోరి, (ప్రమాణ స్వీకార ముహూర్తం వరకూ ప్రసంగం కొనసాగించాలని సూచించాడు.
రాధాకృష్ణన్ మాట్లాడుతూ ముందుగా బ్రిటిష్ ప్రజలను, ప్రభుత్వాన్ని కొనియాడాడు. ప్రపంచ మహానాయకులైన వాషింగ్టన్, క్రామ్‌వెల్, లెనిన్, హిట్లరు, ముస్సోలినీ సరసన మన తరంలోని మహాపురుషుడైన గాంధీ మహాత్ముని అహింసా పోరాటాన్ని ప్రశంసించాడు. మన బాధ్యత పూర్తిగా లేకపోయినా భారతదేశ విభజన ఆనందో త్సాహాలతో జరుపుకోవాల్సిన స్వాతంత్ర్య దినానికి మేఘంలాగా అద్దు వచ్చినదన్నాడు. ఆయన ఉపన్యాసం కొనసాగిస్తూ, “విభజనపట్ల
24
క్రోధం ఎక్కడికీ దారితీయదు. ఉద్రేకం, విజ్ఞత ఎన్నడూ కలిసి వుండలేవు. విభజన ఊహాతీతం. తాత్కాలికం, రాజకీయంగా విభజన జరిగి వుండవచ్చు గాక! చారిత్రికంగా విభజన అసంభవం. చేజారిపోయిన ఐక్యత మిగలాలంటే భారత్, పాకిస్తాన్‌లను ఐక్యంగా నిలిపిన సాంస్కృతిక ఆధ్యాత్మిక భావాలు దృఢతరం చేసికోవాలి. స్వాతంటత్ర్యం తెచ్చిన బాధ్యతలు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ సామర్ధ్యతను అధికారం అణచివేస్తే చెడురోజులు మొదలవుతాయి. మన గౌరవం సామాన్య మానవుణ్ణి స్వేచ్చాభారతం ఎలా చూసుకుంటున్నది అనే దానిని బట్టి నిర్ణయంపబడుతుంది. నెహ్రూ ప్రపంచ పౌరుడు. మానవతా వాది. కొండంత ఆశావాది. ఆయన నేతృత్వంలో భారతదేశం తన స్వేచ్చను మానవాళి సంక్షేమం కోసం వినియోగించాలి. సోదర పౌరులందరూ స్వీయ అభినందన సందర్భంగా భగవంతుని ముందు వినమంగా నిలచి తనముందున్న సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రాచీన జెన్నత్యానికి వారసులుగా నిలవాలి. అసహనం పురోగతికి ప్రబల విరోధి. తోటి మానవునిలోని దివ్యత్వం చూడగలిగే సహనశక్తియే నిజమైన స్వాతంత్ర్యం.” రాధాకృష్ణన్ ప్రసంగం సరిగా నిర్జీత సమయానికి సమాప్తమయింది. పండిట్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశాడు.
వక్తృత్వ కళలో నిష్టాతులయిన ఇరువురు మహానాయకుల ప్రసంగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. రాజ్యాంగ సభలో జాతీయపతాకం గూర్చి రాధాకృష్ణన్ వివరణ మిక్కిలి స్ఫూర్తిదాయకం. “మూడు రంగుల జెండాలోని తెలుపు సత్య పథానికి నెలవైన సూర్యకిరణాలకు, వెలుగుకు, పారదర్శకతకు, నిరాడంబరతలకు ప్రతీక. మధ్యలోని అశోక చక్రం న్యాయం, ధర్మం, పవిత్రతలకు ప్రతీక. పైన గల కాషాయరంగు త్యాగానికి, నిరపేక్షతకు చిహ్నం. ఆకుపచ్చరంగు భూతల స్వర్ధం సాధించాలనే మన అకాంక్షకు ప్రతీక. మొత్తంమీద మన పతాకం నిరంతరం అప్రమత్తంగా వుండాలని చాటుచున్నది.” విశ్వవిద్యాలయాల కమీషన్‌లో:
విద్యా విషయికంగా రాధాకృష్ణన్ ఆలోచనా సరళి సృటిక_సదృశ్యమని పండిట్ నెహ్రూ ప్రగాఢ విశ్వాసం. 1988లో నేషనల్ ష్లానింగ్ కమిటీలో ఎడ్యుకేషనల్ సబ్‌కమిటీకి అధ్యక్షుడుగా రాధాకృష్ణన్‌ను నెహూయే నియమించారు.
1948లో ఆక్స్‌ఫర్జు నుండి ఒక ఏడాది సెలవుపై విచ్చేసి దేశంలోని విశ్వ విద్యాలయాల పనితీరుని పరిశీలించే కమీషన్‌కు సారధ్యం వహించాల్సిందిగా రాధాకృష్ణన్‌ను పండిట్ నెహ్రూ కోరాడు.
రాధాకృష్ణన్ అధ్యక్షుడుగా ఏర్పాటైన యూనివర్సిటీ కమీషన్‌లోని పదిమంది
25
విద్యారంగంలో నిష్ణాతులు. వీరిలో జాకీర్ హుస్సేన్ (అలీఘర్ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు), లక్ష్మణస్వామి మొదలియార్ (మద్రాసు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు), మేఘనాథ్ సాహ (రాయల్ సొసైటీ సభ్యుడు), ఆర్ధర్ మోర్గాన్ (టెన్నెసీవాలీ అథారిటీ), జాన్ టైగర్జు (ఫ్లోరిడా విశ్చవిద్యాలయం), జేమ్సుడఫ్ (దుర్దాం విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు) వున్నారు.
1948 డిసెంబరులో కమీషన్ సమావేశమై ఒక ప్రశ్నావళి రూపొందించింది. దేశంలోని విశ్వవిద్యాలయాలకు, (ప్రముఖ వ్యక్తులకు 2900 ప్రతులు పంపింది. దేశంలోని 25 విశ్వవిద్యాలయాలను దర్శించింది. సిన్లూలో 1949 ఏప్రిల్‌లో సమావేశమై సుదీర్ధంగా చర్చించి, విపులమైన నివేదిక ఏకగ్రీవంగా ఆమోదించి, ఆగస్టుకల్లా (ప్రభుత్వానికి అందజేసింది. రాధాకృష్ణన్ అసాధారణ పలుకుబడివల్లనే యిది సాధ్యమయింది. మొదటి రెండు అధ్యాయాలు విద్య పరమావధి మతబోధకు సంబంధించినవి. నివేదిక మొత్తం రాధాకృష్ణన్ భావాలకు, శైలికి దర్చణం పట్టింది. సాధారణ విజ్ఞానంతోపాటు (ప్రజాస్వామ్యంలో నాయకత్వానికి అవసరమయిన శిక్షణ యిస్తూ ప్రపంచ పౌరసత్వానికి విద్యార్థులను యోగ్యులుగా చేయాలనే రాధాకృష్ణన్ ప్రియతమమైన భావన ఇందులో చోటు చేసికొన్నది.
లౌకిక రాజ్యంలో మూఢనమ్మకాలకు తావులేని విధంగా ఆధ్యాత్మికత బోధింపబడాలని కమీషన్ సిఫార్సు చేసింది. విద్యాసంస్థలలో నీతిబోధ ప్రాముఖ్యాన్ని గుర్తించి ఈ కింది సూచనలు చేసింది.
ప్రతి విద్యాసంస్థ ముందుగా మౌన ధ్యానంతో కార్యక్రమం [ప్రారంభం కావాలి. మొదటి సంవత్సరం ప్రఖ్యాత మత ప్రవక్తలగూర్చి, రెండవ సంవత్సరం విశ్వవ్యాపిత (గ్రంథాల సారాంశం, మూడవ సంవత్సరం మతం దాని యొక్క ప్రయోజనం గూర్చి విద్యార్థులకు బోధించాలని సూచించింది. అన్ని మతాల సారాన్నిబట్టి వాటి ఐక్యతా సూత్రాలను బోధించిననాడు (ప్రభుత్వ తటస్థ విధానం రక్షింపబడుతుంది. _ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వంనుండిగాక యూనివర్సిటీ గ్రాంట్సు కమీషన్ (౮.6.0) నుండి నిధులు చేకూర్చాలి. పరిశోధకులకు పునశ్చరణలకు విరివిగా నిధులు సమకూర్చబడాలి. బోధనామాధ్యమంగా ప్రాంతీయ భాషలను ఫ్రోత్సహించాలి. జ్ఞానార్జనకు తోడ్బడేందుకు హైస్కూళ్ళలో ఇంగ్రీషు బోధన జరగాలి. ప్రాంతీయ భాషలు పరిపూర్ణంగా అభివృద్ధి పొందే వరకు ఇంగ్లీషును కొనసాగించాలి. విశ్వవిద్యాలయాలలో ప్రవేశం ప్రతిభపైన మాత్రమే జరగాలి. షెడ్యూలు లేక వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మూడవ వంతు సీట్లు రిజర్వేషన్ పది సంవత్సరాలు వుండాలి. ఒక్క యుజీసీ ఏర్పాటు తప్ప కమీషన్ సూచనలేవీ ఆచరణలోకి రాకపోవడం దురదృష్టకరం.
26
సాంస్కృతిక రాయబారిగా...
1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న రాధాకృష్ణన్‌ను నానాజాతిసమితివారి మేధావుల సహకారంకోసం వేసిన కమిటీలో సభ్యునిగా (ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీలో వున్న 15 మంది విశ్వవిఖ్యాతులు, శాస్త్రవేత్తలు మేడం క్యూరీ, ఆల్బర్జు ఐన్‌స్టీన్, హెన్రీ బర్గనన్, గిల్బర్టు ముర్రే మొదలగు వారుండేవారు. ప్రతి సంవత్సరం జూలైలో జెనీవాలో సమావేశాలు జరిగేవి. 1931 నుండి 1985 వరకు రాధాకృష్ణన్ ఈ సమావేశాలలో పాల్గొని చక్కని ప్రసంగాలు చేశాడు. మతం, మతానికి సంబంధించిన భావనలు నీరసించినందువల్లనే శాంతి కొరవడినదనీ మతం స్థానే కళారంగం, కవిత్వం ప్రవేశపెడితే ఒక జాతి యొక్క లక్షణాలు అభివ్యక్తమౌతాయని ఆయన ఉద్దాటించాడు. మాక్సిం గోర్కీ రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారిని కలుపుకోవాలని, ఆసియా నాగరికతను చిన్నచూపు చూడరాదని రాధాకృష్ణన్ సమావేశాల్లో చెప్పేవాడు.
రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి అనుబంధంగా విద్య సాంఘిక సాంస్కృతిక సంస్థ (౮౬౯9౦0౦) రూపుదిద్దుకుంది. 1946 నుండి 1954 వరకు, తిరిగి 1958లో యునెస్కో మహాసభలకు భారత ప్రభుత్వ ప్రతినిధివర్గానికి నాయకుడుగా వున్నాడు. 1952లోను మరలా 1954, 1958లో ఆ మహాసభలకు అధ్యక్షుడుగా ఎన్నికైనాడు. 1948లో ఆయన యునెస్కో కార్యవర్గం అధిపతి. విద్యకు, విజ్ఞానానికి, కళలకు, శాస్త్రాలకు, సంస్కృతికి, సభ్యతకు ప్రాధాన్యమిచ్చి ప్రపంచ వ్యాప్తంగా వాటి పరిపోషణకు కృషిచేస్తోన్న ఆ సంస్థ లక్ష్యాలకు దాని ప్రణాళికలకు రూపమివ్వడానికి తోడ్పడిన ప్రపంచ ప్రముఖులలో ఆయనొకరు.
1958లో యునెస్కో వెళ్ళిన భారత ప్రతినిధివర్షంలో ప్రముఖ జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నాడు. అన్ని దేశాలవారు రాధాకృష్ణన్‌ను మిక్కిలి గౌరవంతో చూడడం తాను స్వయంగా చూచానని ఆయన తెలిపాడు.
1958 నవంబరులో పారిస్‌లో యునెస్మోవారి కొత్త భవనాన్ని రాధాకృష్ణన్ ప్రారంభించాడు. జర్మన్ ఆహ్వానంపై బాన్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రసంగించాడు. మర్నాడు మాయింజ్ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానంచేస్తూ మానవ దైవిక విషయాల దూత అనీ, మానవతకు ఆదర్శమనీ, మహావిద్వాంసుడనీ రాధాకృష్ణన్‌ను అభివర్ణించింది.
1959లో అంతర్జాతీయ రచయితల (౧౬౫) సమావేశం ఫ్రాంక్‌ఫర్జులో జరుగగా అందులో - (ప్రతిష్టాత్మకమైన గెటీ అవార్డు రాధాకృష్ణన్‌కు అందజేయ
27
బడింది. 1961లో తిరిగి వరల్టు బుక్ ఫెయిర్ రాధాకృష్ణన్‌కు శాంతి బహుమతి అందించింది. సోవియెట్ భూమిలో...
భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత సోవియెట్ యూనియన్‌లో తాలి భారత రాయబారిగా ప్రధాని పండిట్ నెహ్రూ సోదర విజయలక్ష్మి పండిట్ నియమితులయినారు.
సోవియెట్ యూనియన్ ఆ కాలంలో స్టాలిన్ అధిపతిగా వుంటూ ఆ దేశాన్ని అ(గ్రరాజ్యాలకు దీటుగా నిలిపాడు. భారత - సోవియెట్ సంబంధాలు బలపడేట్లు చేయడంలో విజయలక్ష్మి పండిట్ సఫలం కాలేదు. ప్రధాని నెహ్రూ రాధాకృష్ణన్‌ను సోవియెట్ దేశంలో రాయబారిగా వెళ్ళవలసిందిగా కోరాడు. ఆయన మొదట అంగీకరింపకపోయినా పండిట్ నెహ్రూగారి బలవంతంపై సమ్మతించాడు.
1949 జూలైలో రాధాకృష్ణన్‌ను మాస్కోలో భారత రాయబారిగా నియమిస్తూ ప్రకటన వెలువడింది. ఆయనకు వీడ్కోలు చెప్తూ ప్రధాని పండిట్ నెహ్రూ “ంాధాకృష్ణన్ భారత చిహ్నంగా సోవియెట్ యూనియన్ వెళుతున్నాడు. ఆ దేశంలో పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు (గ్రహించే శక్తి ఆయనకు పుష్కలంగా వుంది. ఇంకా ఇతరులకు భారతదేశాన్ని గూర్చి చెప్పగలనేర్ప్చు కూడా వుంది” అన్నాడు.
రాధాకృష్ణన్ నియామకం భిన్న కోజాల నుండి ప్రశంసింపబడింది. ఆర్.యస్.యస్. నేత గోల్వాల్కర్, కమ్యూనిస్టు నాయకుడు పీరేన్ ముఖర్జీలు హర్షం. ప్రకటించారు.
రాధాకృష్ణన్ మనదేశంలో ఉన్నప్పుడు చేసినట్లే మాస్కో నుండి తడవకు ఎనిమిది వారాల చొప్పున ఆక్స్‌ఫర్జుకు వెళ్ళి స్పాల్టింగ్ ప్రొఫెసరుగా విధులను నిర్వర్తించేవాడు. ఈ అనుబంధాన్ని సోవియెట్‌లు జీర్ణించుకోలేకపోయేవారు.
ఇతర రాయబారుల మాదిరి రైళ్ళలోనూ మ్యూజియంలలోనూ స్వాన్‌లేక్‌లోనూ రాధాకృష్ణన్ కన్పీంచేవాడు కాదు. ఆయన ప్రభుత్వ విందులకు విధిగా హాజరయ్యేవాదేగానీ అందరికంటే ముందుగా నిష్రమించేవాడు. తరచూ సినిమాలకు, బాలే నృత్యాలకు వెడుతూ వుండేవాడు. కుటుంబ సభ్యులెవరూ తనతో మాస్కో రానందున ఒంటరిగానే కాలక్షేపం చేసేవాడు. రాధాకృష్ణన్ జీవనశైలిపట్ల రప్యన్లు' ఆశ్చర్యపడుతూనే ఆకర్షితులయ్యేవారు.
28
రాధాకృష్ణన్, ప్రపంచంలో శాంతిస్థాపనకు ఆరుగురు దేశాధినేతలు - అమెరికా, సోవియెట్ యూనియన్‌గాక రెండు ఆసియా దేశాలు, రెండు ఐరోపా దేశాలు - సమావేశం కావాలని సూచించాడు. ఈ సూచనకు పలువురు హర్షించారు.
బ్రిటీష్‌వారి చట్టబద్ధపాలనా, అమెరికన్ల స్వేచ్చా ప్రవృత్తి సోవియెట్ ప్రజల సంఘీభావం ప్రపంచానికి అవసరమని ఆయన ప్రకటించాడు. 1950 జనవరి 14 రాత్రి 9 గంటలకు తనను కలిసికొనగోరుచున్నానని స్టాలిన్, రాధాకృష్ణన్‌కు వర్తమానం పంపాడు.
అధిక సమయం చదువుకొనడంలోను, రచనలలోనూ గడిపే భారత రాయబారిపట్ల స్టాలిన్‌కు ఆసక్తి కలిగింది. సమావేశం అరగంట జరిగింది. రాధాకృష్ణన్ ముందుగా తాను ఏ (ప్రత్యేక సమస్య చర్చించటానికి రాలేదని, ఇరుదేశాల మధ్య బంధం పటిష్టం కావాలనే మా దేశపు ఆకాంక్షను తెలుఎదానికే వచ్చానని తెలిపాడు. స్టాలిన్ తాము అదే కోరికతో వున్నామని బదులు చెప్పాడు.
“మా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని స్వతంత్ర విదేశీ విధానం రూపొందించుకునే ప్రయత్నం చేస్తున్నామని సోవియెట్ యూనియన్‌తోనూ ప్రజా చైనాతోను సన్నిహితంగా కలసి పనిచేయాలని అభిలషిస్తున్నామని “రాధాకృష్ణన్ స్టాలిన్‌కు తెలుపగా ఆయన అంగీకారం తెలిపాడు.
(ప్రపంచంలో దీర్ధక్రాలిక విషపూరిత ప్రచారం అంతం కావాలని అందుకు మీరు ముందువుండాలని రాధాకృష్ణన్ సూచించగా అది తన జఒక్కనిపైనే ఆధారపడిలేదని స్టాలిన్ బదులిచ్చాడు. రాధాకృష్ణన్ ఘర్షణ కైతే ఇద్దరు వుండాలనీ దానిని నివారించడానికి ఒక్కరే చాలని బదులు చెప్పాడు. స్టాలిన్ మరి మాట్లాడలేదు. వారి సంభాషణకు దుబాసీగా వ్యవహరించిన పాన్‌లోవ్ “మీ నిర్మాహమాట సంభాషణకు స్టాలిన్ ముగ్ధుడైనా*డని రాధాకృష్ణన్‌కు తెలిపాడు. స్టాలిన్ తనతో “ఇతరులెవరైనా శాంతి గూర్చి ప్రస్తావిస్తే వారు యుద్దాన్ని దృష్టిలో వుంచుకుంటారు. ఈ వ్యక్తి మాత్రం ఇతర రాయబారుల మాదిరిగా గాక రగిలిన గుండెనుండి మాట్లాడినాడని” చెప్పాడన్నాడు.
రాధాకృష్ణన్ అప్పుష్పుడూ మాస్కో విద్యాలయాన్ని దర్శించేవాడు. ఒకసారి అక్కడి ప్రొఫెసర్లు, విద్యార్థులతో కూడిన సమావేశంలో ఒకవ్యక్తి రాధాకృష్ణన్‌ను ఇలా ప్రశ్నించాడు. “భగవంతునిలో నమ్మకాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? రాధాకృష్ణన్ సమాధానమిస్తూ, “మీరు సత్యం, శివం, సుందరంలను అంగీకరిస్తున్నారా” అని ఎదురు ప్రశ్న వేశాడు. బెనని వారనగా, అలా అయికే అదే భగవంతుని నిర్వచనం అనగానే మేము అలాంటి భగవంతుని విశ్వసిస్తాం అన్నారు.
29
1951 మార్చిలో అమెరికా షరతులు లేకుండా భారతదేశానికి ఆహార ధాన్యాలు పంపడానికి నిరాకరించింది. రాధాకృష్ణన్ తన పలుకుబడిని ఉపయోగించి 5 లక్షల టన్నుల గోధుమలు సోవియెట్ నుండి భారత్‌కు దిగుమతికి ఏర్పాటు చేశాడు. ఐక్యరాజ్యసమితిలో కాళ్ళీర్‌పై అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. అది భారతదేశ విధానానికి అనుగుణంగా లేదు. రాధాకృష్ణన్ సోవియెట్ రష్యాకు మన విధానం వివరించి వారిచే మన వాదాన్ని అంగీకరింప జేశాడు. సోవియెట్ యూనియన్ ఐక్యరాజ్యసమితిలో అమెరికా తీర్మానాన్ని వీటో చేసింది.
మూడు సంవత్సరాలు మాస్మోలో భారత్ - సోవియెట్ సంబంధాలు బలపడటానికి కృషిచేసి రాధాకృష్ణన్ స్వదేశానికి పయనమైనారు. ఆయన వీడ్కోలు సందర్భంగా స్టాలిన్ ఇంటర్వ్యూ యిచ్చాడు. 1952లో ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో “నెహ్రూను మిమ్ము మేము మా విరోధులుగా భావించం. ఈ విధానం కొనసాగుతుంది. మా సాయంపై మీరు ఎప్పుడూ ఆధారపడవచ్చు'నని స్టాలిన్ భరోసాయిచ్చారు.
వీడ్కోలుగా స్టాలిన్ చేయి చేయి కలుపగా రాధాకృష్ణన్ స్టాలిన్ చెక్కిళ్ళు తడుముతూ ఇలా అన్నాడు. '“మాదేశంలో కళింగయుద్ధం తరువాత జరిగిన ప్రాణనష్టానికి శోకించి శాంతిప్రియుడిగా మారిన అశోక చక్రవర్తి మాదిరి మీరు కూడా శాంతి ప్రియుడు కావాలి.”
మానవుడు తన ఆత్మను కోల్పోయినపుడు ప్రపంచమంతా తన వశం అయితే మాత్రం ఏమి లాభం అన్న రాధాకృష్ణన్ మాటకు చకితుడైన స్టాలిన్, “నేను కూడా అలాంటి చింతనలోనే వున్నానని, అద్భుతాలు జరుగవచ్చు అని అన్నాడు.
“రాధాకృష్ణన్ ఒక్కడే నన్ను మృగంగాగాక మనిషిగా చూచినవాడు” అని స్టాలిన్ సన్నిహితులకు తెలిపాడు. భారత ఉపరాష్ట్రపతిగా
సోవియెట్ యూనియన్‌లో రాయబారి పదవిని జయ(్రదంగా నిర్వహించిన రాధాకృష్ణన్ సేవలను భారత రిపబ్లిక్‌లో ఉపరాష్ట్రపతిగా వినియోగించుకోవాలని పండిట్ నెహ్రూ యోచించాదు.
1952 లోనేగాక 1957లో కూడా ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. తానొక మతానికి చెందినా అన్ని మతాలవారి (ప్రేమను ఆయన ఎంతగా చూరగొన్నారో పోటీలేకుండా ఆయన ఎన్నిక కావడమే
30
నిరూపిస్తుంది. వైస్- డ్రైసిడెంట్‌గా ఎన్నిక కాగానే ఆక్స్‌ఫర్జులో తనపదవికి రాధాకృష్ణన్ రాజీనామా చేశాడు.
ముందు నెహ్రూ ప్రతిపాదన రాధాకృష్ణన్ అంగీకరించలేదు. ఉపరాష్ట్రపతి పదవి కేవలం రాజ్యసభకు అధ్యక్షత వహించడమే అయితే దానిలో తనకు ఆసక్తి లేదనినాడు. కాని ప్రధాని నెహ్రూ వైస్ ప్రెసిడెంట్ స్థాయిని అన్ని రాష్ట్ర (ప్రభుత్వాలకు తెలియజేశాడు: ఉపరాష్ట్రపతి ఢిల్లీ వెలుపల పర్యటనకు వెడితే 'ప్రధానికిచ్చే గౌరవ మర్యాదలు జరగాలని ఉత్తర్వులు వెలువడినాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్సు విమానాలను ఆయన నిరాటంకంగా వినియోగించుకోవచ్చు. రాజ్యసభ సమావేశాలు లేని సమయంలో రాధాకృష్ణన్ దేశం అంతటా పర్యటిస్తూ తరచూ ఉపన్యాసాలు చేస్తూ వుండేవాడు.
“చరిత్ర పురోగమిస్తున్నది. మనం సందేహిస్తూపోతే మనం తోసి వేయబడతాం, కాంగ్రెస్‌నే నమ్మకుండా పురోగామి శక్తులన్నిటికీ నాయకత్వం వహించాలి” అని ప్రధానికి రాధాకృష్ణన్ సూచించాడు.
“మీ నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం వుంది. మికు నిజాయితీ దార్భినికత (1/19100) వున్నాయి కానీ, అభివృద్ధి నిరోధకులు, పనికిరానివారిని మీరు దగ్గిరకు రానిస్తున్నారు” అని కూడా రాధాకృష్ణన్ నెహ్రూను హెచ్చరించాడు.
“౨952 నుండి 1964లో నెహ్రూ మరణ పర్యంతం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రధాని నెహ్రూ మధ్య సంబంధాలు సౌహార్ధంగా వుండేవి. ఒకరిపట్ల మరొకరికి గౌరవభావం వుండేది. ఇరువురు సమ వయస్కులు. దేశప్రజలకు, మానవాళికి మేలు చేయాలనే కాంక్ష గాఢంగా కలవారు. తాను ప్రధానిగా ఎదుర్శొనే సమస్యలు కూడా రాధాకృష్ణన్‌తో దాపరికం లేకుండా చర్చించేనాడు నెహ్రూ. వారు అనేక విధాలుగా ఒకరికొకరు పరిపూరకములు.
ప్రధాని విధులలో సైతం రాధాకృష్ణన్ సహాయకారిగా వుండేవాడు. 1952లో రాధాక్ళష్ణన్ కాళ్ళీర్ ప్రధాని షేక్ అబ్బుల్లాతో మాట్లాడడానికి రెండుసార్లు కాళ్ళీర్ వెళ్ళాడు. పండిట్ నెహ్రూ, హిందూమహాసభ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలు కలిసి చర్చించాలని రాధాకృష్ణన్ సూచించాడు. కానీ నెహ్రూ అందుకు అంగీకరించలేదు.
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాళ్ళీర్ ప్రవేశాన్ని నిషేధించారు. కాని ఆయన అక్కడకువెళ్ళి అరెస్టు కాబడినాడు. శ్రీనగర్‌లో ఆకస్మికంగా చనిపోయాడు. హిందువుల్లో అవేశాలు తారాస్థాయికి చేరాయి. మరొకవైపు షేక్ అబ్బుల్లా వేర్పాటువాదం లేవనెత్తాడు.
31
రాధాకృష్ణన్ నెహ్రూకు యిచ్చిన సలహాతో ప్రమాదం తప్పింది. నెహ్రూ స్వయంగా శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టాడు.
పది సంవత్సరాలపాటు (1952-69) రాజ్యసభకు అధ్యక్షత వహించిన రాధాకృష్ణన్ అది పెద్దలసభ అనే పేరును సార్ధకం చేశాడు. మొదటి సమావేశంలోనే ఆయన ఇలా చెప్పాడు. “నేను ఏ పార్టీకి చెందినవాణ్ణి కాదు. అందుచేత అన్ని పార్టీలకు చెందిన వాడినని గ్రహించాలి” ప్రభుత్వ ప్రతిపక్షాలకు తన నిష్పక్షపాత వైఖరి దృష్ట్యా ప్రేమపాత్రుడైనాడు. రాజ్యసభకు ఎన్నికైన. కమ్యూనిస్టు సభ్యుని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద నిర్భంధింపగా ఆతణ్జి విడుదల చేయించాడు. అవసరమయినపుడు ప్రధానినిసైతం మందలించిన రాధాకృష్ణన్ కొత్తగా ఏర్పడిన రాజ్యనభకు ఎన్నో సంప్రదాయాలు నెలకొల్పారు. లోక్‌సభ స్పీకరు పానెల్‌లో పాలకవర్గ సభ్యులే వుండేవారు. ఇందుకు భిన్నంగా రాజ్యసభలో ప్రతిపక్షాల సభ్యులను కూడా ఉపాధ్యక్షుల పానెల్‌లో రాధాకృష్ణన్ నియమించాడు.
కాళ్మీర్, ప్రివెంటివ్ డిటెన్షన్ మొదలగు సున్నిత సమస్యలు చర్చలకు వచ్చినప్పుడు దూకుడుగా మాట్లాడే సభ్యులనోటికి ఆయన కళ్ళెం వేసేవాడు. సభా నిర్వహణలో విజయం సాధించడానికి ఛలోక్తులు విసిరేవాడు. ఒకసారి నిరుద్యోగ సమస్యపై చర్చ జరుగుతున్నది. సంబంధిత మంత్రి హాజరుకాలేదని ప్రతిపక్ష సభ్యుడు లేవనెత్తాడు. దానిపై రూలింగ్ ఇస్తూ రాధాకృష్ణన్ ఎవరో ఒక మంత్రి వుంటే (పోర్టు పోలియో ఏదైనా) చాలు అన్నాడు. నిరుద్యోగ సమస్యకు యావత్తు మంతట్రివర్గమే సాక్ష్యం అని ఛలోక్తి విసిరారు.
రాధాకృష్ణన్ రాజ్యసభ ఎలా నిర్వహించింది. అప్పట్లో సభ్యులుగా ఉన్న ప్రఖ్యాత జర్చలిస్టు నార్ల వెంకటేశ్వరరావు గారిలా తెలిపాడు. “నా రాజ్యసభ సభ్యత్వ కాలంలో (1958-62) ఆయన రాజ్యసభ ఛైర్మన్. ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చుంటే సభామందిరానికి కళాకాంతులు వచ్చేవి. మాన్యత, ఉదాత్తత, విజ్ఞత, వివేకం, ఘనత, గాంభీర్యం ఆయనతోపాటుగానే సభా మందిరంలోకి పాదం పెట్టేవి. ఆయన కన్నెత్తి చూస్తే ఆజ్ఞ, ఆయన చేతితో సంజ్ఞ చేస్తే అదే ఆదేశం. కంట్రోల్ చేస్తున్నట్లు కనపడకుండానే ఆయన క్రమబద్ధంగా సభా కార్యక్రమాన్ని నడిపించేవాడు. అయినా ఏ చర్చిలోనో, ప్రార్ధనా మందిరంలోనో కానవచ్చే వాతావరణం సభామందిరంలో వుందేదికాదు. చర్చ మధ్యలో ఛలోక్తులకు ఆయన అవకాశమిచ్చేవాడు. సందర్భోచితంగా తాము కూడా కొన్ని ఛలోక్తులను విసురుతూ వుండేవారు. సభ్యులను నవ్వించేవాడు. తాను నవ్వేవాడు. తలవని తలంపుగా తలయెత్తిన క్లిష్టమైన సన్నివేశాన్ని సయితం సమయస్ఫూర్తితో
౩32
ఎదుర్శొనేవాడు. పెరిగిన ఉద్రేకాలను ఒక చల్లనిమాట, మెత్తని మందహాసంతో తగ్గించి వేసేవాడు.
ఎప్పుడు సభలో వేడెక్కినా చిరునవ్వతో, ఉద్వేగంతో వున్న సభ్యుని పేరు పిలిచి కూర్చోండి అనేవాడు. ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞను వినమ్రంగా పాటించేవారు సభ్యులు. కమ్యూనిస్ట్ నాయకుడైన భూపేష్ గుప్తా ప్రతిపక్ష నాయకుడుగా వుండేవాడు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో రాధాకృష్ణన్ శిష్యుడు. ఆయన కొంత ఇబ్బంది కలిగించే పార్లమెంటేరియన్ అయినా రాధాకృష్ణన్ చీవాట్లు తరగతి గదిలో విద్యార్థిలాగా స్వీకరించేవాడు. రాధాకృష్ణన్, నెహ్రూ, భూపేష్ గుప్త త్రిభుజాలుగా సభలో చెణుకులు విసురుతూ నిర్జీవంగా వుండే సభను రక్తికట్టించేవారు.
పది సంవత్సరాల కాలంలో రాధాకృష్ణన్ ఎన్నడూ సభకు గైర్దాజరయ్యే వాడు కాదు. తనకు జ్వరం తగిలినా హారజయిన దినాలున్నాయి. ఒకసారి బొంబాయిలో ఒక ముఖ్య కార్యక్రమంలో పాల్గొని ఆ రాత్రే విమానంలో ఢిల్లీ చేరుకుని మరునాడు సభకు అధ్యక్షత వహించాడు.
ఒకసారి రాజ్యసభ, లోక్‌సభ ఘర్షణకు దిగగా ప్రధాని నెహ్రూ రాజ్యసభ అధ్యక్షుడిగా రాధాకృష్ణన్ ఇరువురు కలసి చాకచక్యంగా పరిస్థితిని శాంతింప చేశారు.
రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా వున్న దినాలలో హీరేన్ ముఖర్జీ అధ్యాపక వర్గంలో పనిచేశాడు. రాజ్యసభలో కమ్యూనిస్టు పక్ష నాయకుడుగా ప్రభుత్వాన్ని దుయ్యబట్టేవాడు. కాని రాధాకృష్ణన్‌పట్ల అపార గౌరవం (్రదర్శించేవాడు.
రాధాకృష్ణన్ రాజ్యసభకు అధ్యక్షత వహిస్తూనే ఢిల్లీలో మూడు 3 గంటలపాటు ప్రజలను కలుసుకొనేవాదు. ప్రధాని నెహ్రూ వద్ద ఆయన పలుకుబడి తెలిసిన మం(త్రులు మొదలు ఎందరో ఆయనకు విన్నపాలు సమర్చించుకునేవారు. ఇక రాయబారులు, విదేశీయులు దర్శించడం అధికంగానే వుండేవి.
విదేశీ రాయబారులు, ప్రధాని, రాష్ట్రపతి ఏర్పాటు చేసే విందులకు ఉపరాష్ట్రపతి హోదాలో రాధాకృష్ణన్ తప్పక హాజరయ్యేవాడు. పని వత్తిడి జాస్తిగా వున్నా సమయం దొరకబుచ్చుకుని రచనా వ్యాసంగం సాగించేవాడు రాధాకృష్ణన్.
ధర్మోద్ధరణ (౧౭౦౦౪౭౧/ ౦! [౭॥0), ప్రాచ్య మరియు పాశ్చాత్యం (5251 2౧6 (650) ప్రసిద్ధ రచనలు ఉపాధ్యక్షునిగా రాసినవే! ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రాధాకృష్ణన్ ఆక్స్‌ఫర్జులో పదవికి రాజీనామా యివ్వగా ఆక్స్‌ఫర్డ్ వీడ్కోలు యిస్తూ
33
థి రెండు అత్యున్నతమయేన గౌరవాలు కట్టబెట్టింది. ].సివిల్ లాస్‌లో డాక్టరేట్ 2.ఆలోసోల్స్ ఫెలోషిప్పు. ఆ సందర్భంగా ఆక్స్‌ఫర్జు యూనివర్సిటీ రిజిస్త్రారు రాధాకృష్ణన్‌తో ఇలా అన్నాడు. “వృత్తిపరంగా మీరు పొందిన గౌరవం అనన్య సామాన్యమైనది. ఒక భారతీయ ఆచార్యుడు అంతర్జాతీయ కీర్తి గడించాడు. మీ పరిచయం నాకు గర్వకారణం. ఆక్స్‌ఫర్జును మాత్రం వదలవద్దు. అది మీది. మీరు ఎప్పుడూ దానివారే.” ఉపాధ్యక్షుడుగా రాధాకృష్ణన్ విదేశాలలోచేసే ప్రసంగాలు ఒక్కొక్క సారి ప్రధాని నెహ్రూను సైతం ఇబ్బందిలో పడవేసేవి. అయినా ఆయనను దేశంలోనేగాక విదేశాలలో కూడా విసృతంగా పర్యటించాల్సిందిగా నెహ్రూ కోరారు. భారతదేశ విధానాలు దేశంలో నెహ్రూ నిల్వ చేస్తూంటే (510/9), రాధాకృష్ణన్ విదేశాలలో వాటికి మంచి విక్రయదారుడు (52169౧2౧) అయినాడని కొందరు చమతృరించేవారు. ప్రపంచంలో అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియెట్ ఇరువురికీ ఆమోదయోగ్యమైన రాధాకృష్ణన్ పేరు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ - జనరల్‌గా ప్రతిపాదించబడింది. నిర్ణయం నెహ్రూ రాధాక్ళష్ణన్‌కే వదిలివేశాడు. రాధాకృష్ణన్ ఆ ప్రతిపాదనను నిరాకరించాడు. నెహ్రూ తనకు సంతోషము, దుఃఖమూ రెండూ కలిగాయి అన్నాడు. రాధాకృష్ణన్ మన దేశంలోనే వుంటున్నాడు గదా అనేది సంతోషముకాగా, అంతర్జాతీయ స్థాయిని కోల్పోతున్నాడన్నది దుః ఖం కలిగించేది. -. 1958 మార్చిలో రష్యా నియంత స్టాలిన్ మృతికి సంతాపం తెలపడానికి రాధాకృష్ణన్ రష్యన్ ఎంబసీకి వెళ్ళాడు. అక్కడ రాయబారి “స్టాలిన్‌ను వెన్నుతట్టిన వ్యక్తి అంటూ రాధాకృష్ణన్‌ను పరిచయం చేశాడు. సోవియెట్ ప్రజలతో సాన్నిహిత్యం కారణంగా రాధాకృష్ణన్ కమ్యూనిస్టు సానుభూతిపరుడని అమెరికన్లు మరికొన్ని దేశాలవారు భ్రమపడసాగారు. ఆయన గాఢ (ప్రజాస్వామ్యవాది. సోవియెట్ యూనియన్‌ను అంతర్జాతీయ కమ్యూనిస్టు కూటమి “కోమిన్‌ఫామ్” రద్దు చేసి ప్రపంచ శాంతికి తనవంతు బాధ్యత నెరవేర్చాలని రాధాకృష్ణన్ ఒక ప్రకటన చేశాడు. అమెరికా ఈ ప్రతిపాదనపట్ల హర్షం (ప్రకటించింది. ప్రధాని నెహ్రూ సూచన మేరకు రాధాకృష్ణన్ అమెరికా పర్యటనకు వెళ్ళాడు. విదేశాలలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ “మనకు కావలసింది అమెరికన్ల మార్గం కాదు. రష్యన్ల మార్గంకాదు. మానవతా మార్గం. విశ్వాసం, సహనం, పట్టువిడుపులు పాటిస్తే ప్రపంచ పరిస్థితి మెరుగవుతుంది” అన్నారు. 34
బ్రిటిష్ మాజీ ప్రధాని అంధోన్ని ఈడెన్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రెండవసారి పాల్గొన్నాడు. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఆయనకు స్వాగతం చెప్పాడు. ఈడెన్ తన సమాధానంలో “వైస్ (ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ ఇంపుగా కూర్చిన పదజాలంతో స్వాగత వచనాలు విన్న మీదట ఈసారి మాట్లాడడం నాకు కష్టమ్రాతున్నది. ఏ కొద్దిమంది ఇంగ్లీషువారు మాత్రమే ఆయన ప్రసంగానికి సరిజోడు కాగలరు. నా ప్రసంగం నీరసంగా వుండక తప్పదు అని బప్పాడు.
రాధాకృష్ణన్ ఉపన్యాసం గూర్చి నార్ల వెంకటేశ్వరరావుగారు. ఇతర మహావక్తలతో పోలుస్తూ ఇలా రాశాడు.
'బర్క్ ప్రసంగాలు ప్రపంచ సాహిత్యంలోనే న్థానాన్ని సంపాదించుకున్నా వినడానికి సొంపుగా వుందేవికావట. చర్చిల్ ప్రసంగాల ధోరణి యింతకంటే చాల మెరుగైనా ఆంఫన సయితం ధారావాహికంగా ఉపన్యసించలేరు. లాయిడ్ జార్జి మంత్ర ముగ్జులను చేసినా మొత్తంపై ఆయన ప్రసంగాలలో సాహిత్యపు విలువలు తక్కుప. గ్లాడ్‌స్టన్ ధర్మావేశంతో ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేసేవారు. కాని సర్వసాధారణంగా అవి దీర్ణవాక్యాలతో కూడిన సుదీర్హ ఉపన్యాసాలు.
భారతీయులలో రైట్ ఆనరబుల్ శ్రీనివాసశాస్త్రి కంఠంలో స్థాయీ భేదాలుంటాయి. రాధాకృష్ణన్ కంఠంలో లేవు. కంచుగంట మోత నుంచి ప్రేయసీ ప్రియుల గుసగుసవరకు ఇది మారదు. అయినా విసుకు కలిగించదు. విన్న కొద్దీ మరింత వినాలని అనిపిస్తుంది. విన్నా చదువుకున్నా సమానంగా ఆకర్షిస్తాయి. అలరిస్తాయి. ఆహా! అనిపింపజేస్తాయి. రాధాకృష్ణన్ ప్రసంగాలు - భావంతో భాష చెట్టాపట్టాలు. వేసుకొని వాటితో పరుగుపెడుతూ వుంటాయి. ఏక సమయంలో అవి ప్రీతిదాయక కావ్యాలు, నీతిదాయక ధర్మోపన్యాసాలు.”
1955లో సోవియెట్ యూనియన్‌లో పర్యటిస్తూ రాధాకృష్ణన్ వారి విధానాలను విమర్శిస్తూ “మనకు రెండు పార్టీల విధానం వుండవచ్చు. ఒకపార్టీ అధికారంలో వుంటే మరొకపార్టీ జైలులో వుంటుంది.” ఇలాంటి భావాలు ప్రకటించినప్పటికీ సోవియెట్ యూనియన్ ఆయనను మాస్కో యూనివర్సిటీ గౌరవ ఆచార్యులుగా నియమించింది. ఆయన అప్పటికే కలకత్తా, ఆక్స్‌ఫర్జు, బెనారస్ విశ్వవిద్యాలయాలలో అలాంటి గౌరవం పొందే వున్నాడు.
1956 నవంబరులో రాధాకృష్ణన్‌కు భార్యావియోగం కలిగింది. దేశ విదేశాలనుండి రాధాకృష్ణన్‌కు సంతాప సందేశాలు వచ్చాయి. రాజాజీ, పండిట్ నెహ్రూలు రాసిన లేఖలు రాధాకృష్ణన్‌కు ఊరట నిచ్చాయి. రాధాకృష్ణన్ భార్య శివకాము పెద్దగా చదువుకొనలేకపోయినా తెలుగులో ఆమెకు మంచి పరిచయం
25
ఉండేది. కలకత్తాలో వుండగా ట్యూటర్‌నుపెట్టి రాధాకృష్ణన్ ఆమెకు ఇంగ్లీషు చదవటం, రాయడం నేర్పించాడు. ఆమె ఎంతో సహనంతో రాధాకృష్ణన్ విహారాలను భరించింది. ఢిల్లీలో వున్న రాధాకృష్ణన్ ఆమె మరణవార్త విని మద్రాసు చేరుకుని అంత్యక్రియలు పర్యవేక్షించారు. సుదీర్హ అధ్యాయం ముగిసింది అని పసివానిలాగా రోదించాడు.
1956 నవంబరులో జరిగిన 2500 బుద్ధ జయంతి సంబరాలకు రాధాకృష్ణన్ నిర్వాహక అధ్యక్షులు. ఆ కార్యక్రమంలో పాల్గొంటూ భార్యావియోగ దుఃఖాన్ని రాధాకృష్ణన్ కొంతవరకు సంబాళించుకున్నారు.
1955 జనవరిలోనే తాను పదవినుండి వైదొలగ తలచానని రాష్ట్రపతి రాజెన్‌బాబు ప్రధాని నెహ్రూతో ప్రస్తావించాడు. నిర్ణితకాలం అనగా 1957 వరకూ కొనసాగవలసిందిగా నెహ్రూ కోరికను ఆయన నున్నించాడు. ఆయన స్థానే రాధాకృష్ణన్‌ను రాష్ట్రపతిగా ఎన్నిక చేయనగునని నెహ్రూ తలపోశాడు. ఈలోగా పరిస్థితి మారింది. రాజెన్‌బాబు తాను రెండవసారి రాష్ట్రపతిగా వుంటానని తన నిర్ణయాన్ని నెహ్రూకు తెలిపాడు."
రాధాకృష్ణన్ తాను మరొకసారి వైస్-ప్రెసిడెంట్‌గా వుండజాలనని మద్రాసు ప్రయాణానికి సన్నద్ధుడైనాడు. ప్రధాని నెహ్రూకు సంకట పరిస్థితి ఎదురయింది. నెహ్రూ 'ప్రాధేయపడుతూ మరొకసారి వైస్-ప్రెసిడెంట్ పదవి స్వీకరించాల్సిందిగా రాధాకృష్ణన్‌ను కోరాడు. కానీ రాధాకృష్ణన్ వెంటనే తన నిర్ణయం మార్చుకోలేదు. పండిత గోవింద వల్లభపంత్, మురార్జీ దేశాయి చివరకు మౌలానా ఆజాద్ కూడా రాధాకృష్ణన్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. “మీ నిర్ణయం మా తండ్రికి మిక్కిలి పరితాపం కలిగించింది. ఢిల్లీలో మీరు లేకుండా రిపల్లిక్ ఊహింపజాలమని, మీ నివాసంనుండి ఆయన విలపిస్తూ వచ్చారని” ఇందిరా గాంధీ రాసిన లేఖతో రాధాకృష్ణన్ హృదయం ద్రవించి తన నిర్ణయం మార్చుకున్నాడు.
1957 రాష్ట్రపతి ఎన్నిక ముగిసినప్పటినుండి రాధాకృష్ణన్ నెహ్రూల మధ్య సన్నిహితత్వం మరింత పెరిగింది. రెండవసారి ఉపరాష్ట్రపతి పదవి స్వీకరించిన రాధాకృష్ణన్ దేశంలో పేట్రేగుతున్న కుల, మత తత్వాలను స్వలాభాపేక్ష అధికారదాహం ఎన్నికలను కలుషితం చేశాయని తన విచారం వ్యక్తం చేశాడు. ప్రపంచశాంతికిగాను ప్రధాని నెహ్రూ ప్రముఖపాత్ర వహించగలడనీ తనధోరణిలో తాను నెహ్రూ హస్తాలను బలోపేతం చేయాలని రాధాకృష్ణన్ భావించాడు. దేశం అరాచకాల మధ్య నెహ్రూ నిలిచాడని ఆయన విశ్వసించాడు.
1957లో తిరిగి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాగానే నెహ్రూ సూచన మేరకు రాధాకృష్ణన్ చైనా, మంగోలియా, కంబోడియాలలో పర్యటించారు.
36
కంబోడియాలో పర్యటిస్తున్న రాధాకృష్ణన్ చిటికెనవేలు కారుడోరులో ఇరుక్కొని రక్తంకారింది. రాధాకృష్ణన్ “నేను కంబోడియాకోసం రక్తం చిందిస్తు న్నాననిి చమత్కరించాడు. అందుకు బాధ్యుడయిన ఉద్యోగిపై చర్య గైకొనకుండా అధికారులను వారించాడు. చైనాలో అధ్యక్షుడు మావో వెన్నుతట్టిన రాధాకృష్ణన్ చర్యపై సమీపవర్తులు కలవరం చెందారు. “ఇందులో కబక చెందాల్సిందేమీ లేదు. నేను లోగడ స్టాలిన్‌ను, పోప్‌ను వెన్నుతట్టాను” అని రాధాకృష్ణన్ వారిని సమాధాన పరిచాడు.
1958లో నెహ్రూ సూచన మేరకు రాధాకృష్ణన్ అమెరికాలో పర్యటించాడు. భారతదేశ వైఖరిని వివరిస్తూ ప్రసంగాలు చేశాడు.
1958లో రాధాకృష్ణన్ హవాయ్ పర్యటన గూర్చి ప్రఖ్యాత తత్త్వవేత్త ఆచార్య మహదేవన్ ఇలా తెలిపాడు “ప్రాక్ పశ్చిమాల పొలిమేరగా వున్న హవాయి దీవులలో తత్త్వవేత్తల మహాసభ జరుగుచున్నది. దానిలో పాల్గొనడానికి వెళ్ళిన డా॥ రాధాకృష్ణన్ ఒక సాయంత్రం ఒక బహిరంగసభలో ప్రసంగిస్తున్నాడు. వినడానికి వచ్చిన జనసందోహంతో సభాభవనం కిక్కిరిసిపోయింది. సభకు ఆలస్యంగా వచ్చిన ఒక చైనీస్ వణిక్పముఖుడు లోనికి ప్రవేశింపలేక వెలుపలేవుండి ఆసాంతం డా॥ రాధాకృష్ణన్ ప్రసంగం విన్నాడు. ప్రాచీన కాలంలో హవాయ్ ద్వీపవాసులు బుద్ధుని సందేశాన్ని ఆయన శిష్యులద్వారా విని పులకరించిన వారే! శాక్య సింహుడు ఏ అశ్వత్థవృక్షం కింద మహాసంబోధితుడైనాడో దాని సంతతికి చెందిన దాన్నిగా తమ నేషనల్ పార్కులో సగర్వంగా దానిని చూపుతారు. శతాబ్దాల తర్వాత తిరిగి డా! రాధాకృష్ణన్ ద్వారా భారతవాణిని విన్న హవాయి ద్వీపవాసులు ఎంతగానో ఉత్తేజితులయినారు. అందరికంటే మిన్నగా పరవశుడైన వ్యక్తి సభా మందిరంలోకి ప్రవేశమైనా లభించక వెలుపలే నిలిచి ప్రసంగాన్ని విన్న చైనీస్ వణిక్ర్రముఖడీ ప్రాక్ పశ్చిమ తత్త్వవేత్తల రానున్న మహాసభకు కావలసిన వ్యయాన్ని తానే భరిస్తానని ఆ గౌరవాన్ని తనకు యివ్వవలసిందిగా అతడు కోరాడు.
1959లో భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రముఖులందరూ రాధాకృష్ణన్ కృషిని కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవరు “భారతీయులందరు కొందరు ప్రభుత్వ నేతలవలె - శాంతి కాముకులు కారు. డొ॥ రాధాకృష్ణన్ ఏి.కె.ఆర్.వి.రావు (ఢిల్లీ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్) లాంటివారు ఉన్నత కులాల హిందువులై, శాంతి ప్రియులూ దివ్యత్వానికి సన్నిహితంగా వున్నారని” పేర్మాన్నారు.
టోక్యోలోని ఇంటర్నేషనల్ హౌస్ మాదిరి ఢీల్లీలోకూడా ఒకటి స్థాపిస్తే దేశవిదేశీ ప్రతిభావంతులయిన స్తీ పురుషులు ఆహ్లాదకర పరిసరాలలో సమావేశం
3/7
కావడానికి వీలవుతుందని రాక్‌ఫెల్లర్ ॥1 ప్రతిపాదించాడు. ఆయన ప్రధాని నెహ్రూతో తన కోరిక వెలిబుచ్చాడు. లోడి గార్జెన్సు పక్క్మనగల ప్రదేశాన్ని అందుకు గాను (ప్రభుత్వం ధారాదత్తం చేసింది. రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ నిర్మాణానికి అవసరమయిన నిధులు అధిక మొత్తంలో సమకూర్చింది. 1960 నవంబరులో జపాన్ రాజమకుటానికి వారసుడు శంకుస్థాపన చేయగా, 1962 జనవరిలో రాధాకృష్ణన్ ప్రారంభించాడు. సుందరమైన భవనంలో నెలకొన్న సాంస్కృతిక అంతర్జాతీయ కేంద్రం ఢిల్లీకొక ఆకర్షణగా నేడు అలరారుతున్నది. రాష్ట్రపతిగా...
1961లో రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది. తాత్కాలిక రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ పదవీబాధ్యతలు స్వీకరించారు. 1962 మేలో కాంగ్రెసు అభ్యర్థిగా రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మే 13న ఆయన పదవీ స్వీకారం చేశారు. ప్రముఖ రచయత నార్ల వెంకటేశ్వరరావు ఆ సందర్భాన్ని గూర్చి ఇలా రాశారు. “ఆనాడు దార్భనిక శాస్త్రాలకే గౌరవం జరిగినట్లు బెర్‌ట్రండ్ రస్సెల్ సంతసించారు. అదే విధంగా దేశవిదేశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యారంగానికి చెందిన ప్రముఖులు, రచయితలు తమ కావ్య జగత్తుకు పట్టాభిషేకం జరిగినట్లు ఆనందించారు. రాజ్యాలకు రాజ్యాలకేకాక మానవాళికి కడగండ్లు తొలగడం ఈ ప్రపంచంలో తత్త్వవేత్తలు రాజులైనప్పుడు లేదా ఇప్పుడు రాజులుగా పరిపాలకులుగా చెల్లుతున్న వారు తత్త్వవేత్తలయినప్పుడు” అని రెండువేల యేండ్లకు పూర్వం “ప్లేటో పలికిన పలుకులు ఆనాడు ఎందరికో జ్ఞప్తికి వచ్చాయి. తత్త్వవేత్తగా వుండి, రాజ్యాధికారానికి వచ్చిన మార్శ్మస్ ఒలియస్ నాడు పాశ్చాత్య ప్రపంచానికి గుర్తుకు రాగా, రాజవంశంలో పుట్టి తత్త్వవేత్తగా (ప్రఖ్యాతి నందిన జనక మహారాజు భారతీయులకు గుర్తుకు వచ్చాడు.”
“తన సుదీర్ధ ప్రజాహిత జీవితంనుండి ఇండియా ప్రెసిడెంటుగా కొంతకాలం పాటు సేవ చేయకుండా డా॥ రాధాకృష్ణన్ విరమించివుంటే ఇండియా లోక నిందను బహుశా తప్పించుకొనగలిగేది కాదు” అని లండన్ నుండి వెలుడే “టైెమ్సు” పత్రిక రాసింది,
రాధాకృష్ణన్ దేశాధ్యక్షుడు కాగానే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్సు ఆయన పుట్టినరోజు సెప్టెంబరు 55 ప్రతివటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.
రాష్ట్రపతి పదవిలో రాధాకృష్ణన్ ఉత్సవ విగ్రహంగా వుండలేదు. రాష్ట్రపతి ధర్మం ప్రపంచాన్ని సమన్వయించడం. కాగా ప్రధాని కర్తవ్యం ప్రపంచాన్ని
38
మార్చడం. ప్రతి సోమవారం ఉదయం ప్రధాని, రాష్ట్రపతి సమావేశం అయ్యేవారు. రాధాకృష్ణన్ నిర్మాహమాటంగా చెప్పే పలుకులు నెహ్రూ ఎల్లవేళలా ఆమోదించేవాడు.
మరణశిక్ష రద్దుకావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించాడు. నెహ్రా కూడా ఆయనతో ఏకీభవించాడు. చాల అరుదుగా మాత్రమే అది అమలు కావాలని ఆయన అభిప్రాయపడినాడు. తన అయిదేళ్ళ కాలంలో ఏ ఒక్క క్షమాభిక్ష విజ్ఞప్తిని ఆయన తోసివేయలేదు.
రాష్ట్రపతి భవనంలో రాధాకృష్ణన్ ప్రజాదర్చారు నిర్వహించేవాడు. ఏ ప్రాంతం వారైనా ఏ పనిమీద అయినా రాష్ట్రపతిని ' కలిసికొనే అవకాశం కల్పించబడింది. ఇలాటి చర్యలు ఐక్యతకు ప్రజాస్వామ్యానికి దోహదం చేయగలవని పండిట్ నెహ్రూ అభిప్రాయపడినాడు. ఈ సందర్భాన్ని వివరిస్తూ విదేశంలోని తన బిడ్డకు ప్రముఖ శాస్త్రవేత్త జె.బి.ఎస్ హాల్టేన్ ఈ విధంగా లేఖ రాశాడు. “నేను ఇప్పుడు భారత రిపబ్లిక్ పౌరుణ్ణి మాకు రాధాకృష్ణన్ అనే అధ్యక్షుడున్నాడుు ఆయన చాల పుస్తకాలు చదివాడు. కొన్ని రాశాడుకూడా! ఆయనను రాష్ట్రపతిగా ఎన్నుకున్నప్పుడు ఒకింత భయపడినాడు. తనకు పుస్తకాల గూర్చి అయితే బాగా తెలుసు కాని ప్రజల గురించి ఏమి తెలుసునబ్బా అని అందుకని ఒకటి ఆలోచించాడు. ప్రతివారం - ఇంకా తరచుగా కూడా- ప్రజలను కలుసుకునేవాడు. బాలికలు - నీ అంత వయస్సు వాళ్ళెనా ఫరవాలేదు - మరెవరయినా కొనీ ఆయనను చూడవచ్చు. కొంతమంది ఆయనను చూచి ఆయన మాటలను విందామనే వచ్చేవారు. కొందరు తమకు అన్యాయం _జరిగింది. న్యాయం చేయమని కోరేవారు. ఉదాహరణకు ఒక పోలీసు తన కొడుకును కొట్టాడని తల్లి ఫిర్యాదు చేసుకుంటుంది. కష్టించి పనిచేసేవాణ్ణి ఒక _ (ప్రభుత్వాధికారి బర్తరఫ్ చేశాడు. రాష్ట్రపతి అన్ని పనులు చక్కదిద్దలేడు. కానీ సామాన్య మానవులు ఏది అన్యాయమనుకుంటారో దానిని ఆయన సరిదిద్ద ప్రయత్నిస్తాడు.”
1962 జూలై 1న బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ రాయ్ ఆకస్మికంగా మృతి చెందాడు. గవర్నరుకు ఆ పరిస్థితిలో ఏమిచేయాలో దిక్కుతోచలేదు. ఆ సమయంలో రాష్ట్రపతి రాధాకృష్ణన్ అక్కడ వున్నాడు. మంత్రిమండలిలో సీనియర్ అయిన వానిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించమనీ తరువాత శాసనసభ పక్షంనేతగా ఎన్నుకున్నవారిని ముఖ్యమంత్రిగా నియమించాలని సూచించాడు.
1962 అక్టోబరులో ఇండియాపై చైనా దురాక్రమణ జరిపింది. రక్షణమంత్రిగా కృష్ణమీనన్ వ్యవహరించిన తీరు రాధాకృష్ణన్‌కు నచ్చలేదు. అతనిని తక్షణం
39
మంత్రిమండలి నుండి తొలగించమని నెహ్రూకు సూచించాడు. ఆయన కొక్కడికే దేశరక్షణ విషయం బాగుగా తెలుసునని రాష్ట్రపతికి నెహ్రూ వివరించాడు. “ఆయనకు సమర్థత వుంటే వుండనీయండి. కానీ దేశానికి ఆయనపట్ల విశ్వాసంలేదు” అని కుండబద్దలు కొట్టినట్లు రాధాకృష్ణన్ స్పష్టం చేశాడు. నెహ్రూ మంత్రిమండలి నుండి కృష్ణమీనన్‌ను తొలగించక తప్పలేదు. (ప్రధాని ఆమోదంతో రాధాకృష్ణన్ తూర్పు సెక్టార్‌ను సందర్భించాడు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. ఆర్మీ జనరల్స్ వైనా ఇకముందుకు సాగలేదని రాష్ట్రపతికి చెప్పారు. కానీ నవంబరు 14న వారి దళాలు కదిలాయి. అధిపతిని వెంటనే మార్చాలనీ, అంతర్జాతీయంగా సమర్ధన సాధించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ కిష్ట పరిస్థితులలో రాధాకృష్ణన్, నెహ్రూలు ఒక వ్యక్తిగా పనిచేశారు.
_ దేశానికి అంతర్జాతీయ సమర్ధన పొందడానికి రాష్ట్రపతి రాధాకృష్ణన్ విదేశీ పర్యటనకు వెళ్ళాడు. ముందుగా ఆస్టనిస్తాన్, ఇరాన్‌లను దర్శించాడు. అమెరికాలో గతంలో ఎన్నడూ జరగని విధంగా రాధాకృష్ణన్ హెలికాప్టర్ వైట్-హౌస్ ముందు దిగడానికి అనుమతించారు. రాధాకృష్ణన్ చాకచక్యానికి ముగ్గ్దుడైన అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ జాతీయ భద్రతామండలిలో “రాధాకృష్ణన్ ఎలాంటి అర్థిక సైనిక సాయాన్ని అర్ధించలేదు.. ఇండియాకు ప్రతిష్ట చేకూరే విధంగా వాతావరణం ' సృష్టించి అమెరికా భారత్‌కు సాయం అందించకపోతే సిగ్గుపడే స్థితికి తెచ్చాడు” అన్నాదు. "
- "రాధాకృష్ణన్ బ్రిటన్ పర్యటన కూడా విజయవంతమయింది. బకింగ్ హాం ప్యాలెస్‌లో రాణి ఆయనకు 'ఆర్జర్ ఆఫ్ మెరిట్ ప్రసాదిస్తూ దానిని పొందటానికి వీరిని మించిన అర్హతగలవాడు లేదని తెలిపింది. అమెరికా బ్రిటన్‌లలో రాధాకృష్ణన్ చేసిన ప్రకటనలకు కొందరు కమ్యూనిస్టులు తప్పుపట్టారు. కానీ ప్రధాని నెహ్రూ అవన్నీ మన విదేశీ విధానానికి అనుగుణంగానే వున్నాయని కొట్టిపారేశాడు.
1964 జనవరిలో ప్రధాని నెహ్రూకు పక్షవాతం . వచ్చింది. అప్పటి నుండి ఆయన. రాధాకృష్ణన్‌ను లోగడకంటే తరచుగా కలుసుకునేవాడు.
' 1964 మే 27న ప్రధాని నెహ్రూ కాలధర్మం చెందాడు. రాధాకృష్ణన్‌కు ఇది గొప్ప అశనిపాతం. ఆయన ఒంటరివాడైపోయాడు. దుఃఖం దిగమింగుకొని ప్రభుత్వం నీర్వహించాల్సిందిగా సీనియర్ మంత్రి గుల్టారీలాల్ నందాను (ప్రధానమంత్రిగా నియమించాడు. కొద్ది రోజులకు జరిగిన కాంగ్రెసు పార్లమెంటు పార్టీలో నాయకత్వానికి లాల్‌బహదూర్ శాస్త్ర, మొరార్డీ దేశాయి తలపడినారు. లాల్‌బహదూర్ గెలిచాడు. ఆయన (ప్రధానమంత్రి కాగానే మొరార్డీని తన మంత్రిమండలిలో చేరమని చెప్పవలసిందిగా రాధాకృష్ణన్‌ను కోరాడు. రాధాకృష్ణన్
త0
తాను జోక్యం చేసుకోనని ఖండితంగా చెప్పాడు. లాల్‌బహదూర్ శాస్తి, పార్టీ నాయకుడు పేరుగలవాదేగానీ నెహ్రూ స్థానం భర్తీ చేయలేకపోయాడు. కురువృద్ధుడైన మొరార్జీ మంత్రివర్గంలో చేరలేదు. ఇందిరాగాంధీ ప్రచార సమాచారశాఖల మంత్రిగా చేరింది. కానీ ఆమెకూ ప్రధానికి సంత్సంబంధాలు లేవు. విదేశాంగ మంత్రి స్వర్ణసింగ్‌కు అనుభవం తక్కువ. ఈ పరిస్థితులలో అందరు రాధాకృష్ణన్ వద్దకు వచ్చి తమ సమస్యలకు పరిష్కారం చూపమనేవారు. రాధాకృష్ణన్ రాజ్యాంగ పరిధిలో తగువిధంగా సలహాలిచ్చేవాడు.
నెహ్రూ అనంతరం భారత అలీన విధానం పోషించాల్సిన బాధ్యత రాధాకృష్ణన్ వహించాడు. వాషింగ్టన్, లండన్ పర్యటించిన పిమ్మట ఆయన సోవియెట్ ఆహ్వానంపై మాస్కో వెళ్ళాడు. *“విద్వాన్ సర్వత్ర పూజయేత్' అనే నానుడి రాధాకృష్ణన్ పట్ల యధార్థమయింది. సోవియెట్ రష్యాలో ఆయనకు అఖండ గౌరవం లభించింది. ఆయన మాస్మోలో అడుగుపెట్టడానికి రెండు గంటల ముందుగానే భారత్- సోవియెట్ మిలిటరీ ఒప్పుందం కుదిరింది. అందువలన ఆయన చేయవలసినపని సులువయింది. -
సోవియెట్ యూనియన్ నుండి ఐర్లండు వెళ్ళిన రాధాకృష్ణన్ అక్కడి నేత డివెలరాకు కాశ్మీర్ సమస్య గూర్చి వివరించి ఆ దేశం మనకు అనుకూలమగునట్లు చేశారు. ఆ దినాలలో బొంబాయికి విచ్చేసిన పోప్‌పాల్ ౪! ను రాధాకృష్ణన్ ఢిల్లీనుండి వెళ్ళి సందర్భించాడు. అన్ని జాతులు కలిసి భగవంతుని ఒక కుటుంబంగా మెలగాలన్నదే తన ఆశయం అని వివరించాడు. పోప్ ఆ భావానికి సంతోషం వెలిబుచ్చాడు. " .
1965 జనవరి 26న ప్రధాని నెహ్రూ లోగడ హిందీపై ఇచ్చిన హామీ ఆ అవసరమయినంత కాలంలో ఇంగ్లీషు అనుసంధాన భాషగా కొనసాగుతుంది - కొనసాగదేమోనని సందేహం బయలుదేరింది. అది హిందీ వ్యతిరేకోద్యమంగా మారి తీవ్రస్థాయికి చేరింది. తిరుత్తణిలోని రాధాకృష్ణన్ జన్మగ్భవాన్ని (లైబ్రరీకి దానమివ్వబడింది)ి ఆందోళనకారులు ధ్వంసం కూడా. చేశారు. పరిస్థితి థుతిమించకుండా రాధాకృష్ణన్ తన పార్లమెంటు ప్రసంగంలో నెహ్రూ హామీని చేర్చి ఆందోళన విరమింప జేశాడు.
1965 ఆగస్టులో పొరుగు దేశాలయిన చైనా - పాకిస్థాన్‌లతో గౌరవప్రదమైన ఒప్పందాలు కుదుర్చుకొని దేశరక్షణ వ్యయం పొదుపు చేసుకొనుట ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాధాకృష్ణన్ ఒక ప్రకటన జూరీ చేశాడు. కమ్యూనిస్టులే గాక సర్వోదయ నాయకుడు జయప్రకాశ్ ఈ ప్రకటనకు హర్షం ప్రకటించారు.
లగే
కానీ 19865 సెప్టెంబరులో పాకిస్తాన్ దళాలు కాళ్ళీరుకు దక్షిణంగా వుండే అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లో (ప్రవేశించాయి. ఐక్యరాజ్యసమితి ఇతర రాజ్యాల జోక్యంతో సెప్టెంబరు 28న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రాష్ట్రపతి రాధాకృష్ణన్ దేశ (ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ, చైనా - పాకిస్తాన్‌లతో సఖ్యత కోరుతున్నామని, ఇది కష్టమేగానీ అసాధ్యం మాత్రం కాదు అన్నారు. భారత విధానాన్ని వివరిస్తూ రాధాకృష్ణన్ విసృతంగా విదేశాలలో పర్యటించారు. సోవియెట్ యూనియన్‌లో తాష్కెంట్‌లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిగార్లు ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు. తాష్కెంట్ ఒప్పందం కుదిరిన కొద్దిసేపటికే 1966 జనవరి 11న ప్రధాని శాస్త్రి తాష్కెంట్‌లో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. కొద్ది గంటలలోనే రాధాకృష్ణన్ గుల్టారీలాల్ నందాను తాత్కాలిక ప్రధానిగా నియమించాడు. కాంగ్రెసు పార్లమెంటరీపార్టీ నాయకత్వానికి నలుగురు పోటీదార్లు- మురార్తీ, నందా, ఇందిరాగాంధీ, వై.వి. చవాన్ రంగంలో ప్రవేశించారు. ఈ ఎన్నికలలో రాష్ట్రపతికి ప్రమేయం వుండకపోయినా “విశాలదృక్పథం గల వ్యక్తి ప్రధాని కావాలని ప్రకటన చేశారు. అది పరోక్షంగా ఇందిరాగాంధీకి సాయపడినట్టయింది. రాధాకృష్ణన్ తనప్రియమిత్రుడు జవహర్ కుమార్తె ఇందిరాగాంధీని ప్రధానిగా నియమించి తన కుమార్తెగా అభిమానిస్తూ దేశ విదేశీ విధానాలలో శిక్షణనిస్తూ వచ్చాడు. కానీ మొదటి సంవత్సరంలో ఆమె ఏమీ సాధించలేకపోయింది. రూపాయి విలువను తగ్గించి దేశంలో అపఖ్యాతి పాలయింది. స్వతంత్ర దినోత్సవసందర్భంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాలలో రాధాకృష్ణన్ దేశంలో ఆందోళనా ధోరణి పెరిగిపోతున్నదని బాధ వ్యక్తం చేస్తూ నీతి, నిజాయితీల కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఉద్దాటించాడు. 1966 చివరిలో రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ పదవీకాలం ముగిసే సమయం వచ్చింది. ఆయన చాలా ఉల్లాసంగా వుంటూ వచ్చాడు. మరొకసారి రాష్ట్రపతి
- పదవి ఖాయమనే అందరికీ అనిపించింది. చాలమంది పార్లమెంటరీ బోర్తు “సభ్యులు, కమ్యూనిస్టు నేత పీరేన్ ముఖర్జీ ఆయన అభ్యర్థిత్వం బలపర్బదానిక్తి సన్నద్ధులయినారు. సర్వోదయ నేత జయప్రకాశ్ నారాయణ కూడా "దేశంలో మీది ఒక్కటీ స్వచ్చమైనగళం” అని శ్లాఘించాడు. 1966 డిసెంబరులో రాధాకృష్ణన్ చేతివేళ్ళు మొద్దుబారడం, మాటలో తేడా గమనించాడు. ఆయన సెలవులో వెళ్ళి ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్‌కు బాధ్యత తై
అప్పగించదలిచాడు. కానీ (ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించలేదు. ఆమె ఆంతర్యంలో జాకీర్ హుస్సేన్‌ను రాష్ట్రపతి గద్దెను ఎక్కించాలని భావించింది. ఆరోగ్యం క్షీణదశ ప్రారంభమైనదని, ఇంక విశ్రమించడం మంచిదని రాధాకృష్ణన్ తలపోశాడు. ఉప రాష్ట్రపతినే రిపబ్లిక్ దినోత్సవాలలో పాల్గొనమని కోరాడు. కానీ జాతినుద్దేశించి తానే ప్రసంగించాడు. ఆయన ప్రభుత్వ పనితీరును గట్టిగానే విమర్శించాడు. ఉపరాష్ట్రపతిగా తాను మరొకసారి పోటీ చేయనని జాకీర్ హుస్సేన్ ప్రకటించాడు. కాంగ్రెసు పార్టీలో - ప్రధాని ఇందిరకు కాంగ్రెసు అధ్యక్షుడు కామరాజు నాడారుకు గల విభేదాలు బహిర్ణతమయినాయి. రాధాకృష్ణన్ దేశ పరిస్థితులకు తన అవసరం వుందని నమ్మకం కలిగితేనే తాను తిరిగి రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని కాగలనన్నాడు. కామరాజ నాడార్ “మీ సేవలు దేశానికి అవసరం” అన్నాడు. కానీ ఇందిరాగాంధీ మాత్రం మౌనం వహించింది. ఆమె మౌనం జాకీర్ హుస్సేన్ అభ్యర్థిత్వానికి ఊతం ఇచ్చినట్లయింది.
తిరిగి రాష్ట్రపతిగా వుండాలని కాంగ్రెస్ యువనేత (్రధాని 'ఇందిరకు సన్నిహితుడు దినేశ్ సింగ్ రాధాకృష్ణన్‌ను బలవంతం పెట్టాడు. రాజాజీ, వామపక్షాలు, చాగ్గా అందరు రాధాకృష్ణన్ పక్షాన్నే నిలిచారు.
ఏప్రిల్ 5న కాంగైస్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నలుగురు ఇందిర పక్షం వహించారు. కామరాజ్ వైపు ఇద్దరే నిలిచారు.
దేశంలోని రెండు అత్యున్నత పదవుల గూర్చి ఇటీవల జరిగిన సంఘటనలు తననెంతో కలవరపరచినవనీ విశ్రమించాలనే నా నిర్ణయాన్ని బఐలపరచాయని రాధాకృష్ణన్ ప్రకటించాడు. |
రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ వున్న అయిదేళ్ళ కాలంలో ముగ్గురు ప్రధానులు - నెహ్రూ - శాస్తి - ఇందిర - పరిపాలించారు. "
1962లో చైనా యుద్దం, 1965లో పాకిస్తాన్ యుద్ధం వచ్చాయి. మరెన్నో
మ్ భ్
సమస్యలను పరిష్కరిస్తూ రాజ్యాంగ పరిధిలో రాధాకృష్ణన్ గావించిన "సేవలు నిరుపమానం. "
ప్రధానులందరిలో నెహ్రూ ఆయన ధోరణిని పూర్తిగా ఆమోదించాడు. ఒకే కాలంలో ఇద్దరు విశ్వవిఖ్యాత మహనీయులు దేశపాలనా బాధ్యతలు నిర్వహించడం చరిత్రలోనే అపూర్వం. " . + కడపటి అధ్యాయం
1967లో రాష్ట్రపతి భవనం భాళీ చేసిన రాధాక్ళష్ణన్ మద్రాసు మైలాపూర్‌లోని స్వగృహం 'గిరిజ'లో (ప్రవేశించారు. సెంట్ జాన్ సువార్తపై బృహత్తర గ్రంథం
తపం
రాయదలిచాడు. గాంధీ షొండేషన్ వారు 1969లో వచ్చే గాంధీ శతజయంతి సందర్భంగా, “గాంధీ 100 సంవత్సరాలు సంకలనం చేయమని కోరగా అందుకు అంగీకరించాడు.
కుటుంబం - వారితో గడపడం ఆనందకరమే అయినా ఇంతకాలం 'ప్రజలమధ్య నివసించిన రాధాకృష్ణన్‌ను ఒక రకంగా ఒంటరితనం వేధించింది. 1968 భారతీయ విద్యాభవనన్ తమ ఉన్నతమైన బహుమతిని రాధాకృష్ణన్‌కు వారి నివాసంలోనే అందజేశారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుని హోదాలో జాకీర్ హుస్సేన్ 1968 సెప్టెంబరు 10న “అకాడమీ ఫెలోషిప్” అందజేశాడు. అప్పటికే శరీరం శుష్కించి ఎముకల గూడు అయింది. ఆయన ముగ్గురు అల్లుళ్ళు, ఆత్మీయ మిత్రులు రాజాజీ, టి.టి.కృష్ణమాచారి, మోహన కుమార మంగళం ఆయన కండ్ల ముందరే వెళ్ళిపోయారు. 1978 సెప్టెంబరులో తొంటి ఎముక విరిగి పూర్తిగా పడకలోనే వుండిపోయాడు. క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోయాడు. ఇంకా కొన్నిదినాలలో శరీరం చాలిస్తాడనగా 'మతం పురోగతిజై యిచ్చే ప్రతిష్టాత్మకమైన “టెంపుల్ టన్” అవార్డు. యిచ్చినట్లు ప్రకటించారు. ఆయనకు కుటుంబం వారు తెలిపినా గగ్రహించేశక్తి లేదు. ఆయన వారసత్వంగా ఆ డబ్బును ఆయనకిష్టమైన ఆక్స్‌ఫర్జు విశ్వవిద్యాలయానికి యిచ్చివేశారు.
1927లో ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ప్రారంభమైన డాక్టరేట్ డిగ్రీతోపాటు రాధాకృష్ణన్ ప్రపంచంలోని నూటికి పైగా విశ్వవిద్యాలయాల నుండి దాక్టరేట్‌లు అందుకున్నారు. ప్రపంచంలోనే ఆయన పొందినన్ని గౌరవాలు మరెవరూ పొంది వుండరు. భారతదేశం “భారతరత్న, “విశ్వభారతి,” “దేశికోత్తముడు” సింహళం “విద్యా చక్రవర్తి, _ మంగోలియా *జ్ఞానయోగి”, జర్మనీ .“ప్రాక్సశ్చిమాల మధ్య మవాసేతువు”గా మన్నన చేశాయి.
సర్వమతాల సారాన్ని కాచివడపోసినా రాధాకృష్ణన్ అద్వెతవాదాన్నీ అభిమానించాడు. . తన కాలంలోని శాస్త్రీయ తార్మిక దృక్పథంతో ఆయన: అద్వెతాన్ని వివరించాదన్నది స్పష్టం.
అద్వెతం కేవలం ఒక సిద్ధాంతం కాదు. దానికి ప్రతీకగా నిలిచిన భగవాన్ రమణ మహర్షిని 1933లోనూ తిరిగి 1943లోను ఆయన దర్శించాడు. రెండు సందర్భాలలోనూ మౌనంగా కూర్చొని వెళ్ళిపోయాడు. భగవాన్ “మిమ్ములను రాధాకృష్ణన్ ఏమైనా ప్రశ్చించాడా” అని అడిగిన భక్తులతో “వారంతా బాగా చదివినవారు. విషయం అంతా తెలుసుకున్నవారు. ఏమడుగుతారు” అనిభగవాన్ చెప్పారు.
44
భగవాన్ వద్దకు పాశ్చాత్య సాధకులయిన ట్రీడమెన్ ప్రభృతులను రాధాకృష్ణన్ పంపించేవాడు.
ఒక హిందువు. ఒక భారతీయుడు. ప్రపంచ పౌరుడు - ఈ లక్షణాలన్నీ తాదాత్మ్యం చెందిన వ్యక్తి రాధాకృష్ణన్.
ప్రపంచంలోని ఎందరి వ్యక్తులకో రాధాకృష్ణన్ ఒక అండగా న్‌డగా నిలిచాడు. తన వేదాంత కృషి ప్రజాసేవ కంటే గొప్పదని తలపోసిన మహామనీషి రాధాకృష్ణన్.
86 ఏండ్ల జీవితంలో ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించిన రాధాకృష్ణన్ మద్రాసులో 1975 ఏప్రిల్ 17న కాలధర్మం చెందాడు.
ఆనాడు వారి భౌతికకాయం దర్శనార్థం వచ్చిన వారిలో వేలాదిమంది సామాన్య మానవులు, కార్మికులు, రిక్షావాండ్లు, ఫ్యాక్టరీ కూలీలు మున్నగువారు. వారికి రాధాకృష్ణన్ వేదాంత భావనలు తెలియదు. పుస్తకాలు చదవలేదు. వారికి తెలిసిందల్లా ఒకటే. ఆయన వారి కోసమే జీవించాడని. _
స్వాతంత్ర్యం, సమానత్వం సౌహార్దంతో కూడిన వసుధైక కుటుంబం మన లక్ష్యంగా వుండాలని ప్రపంచంలో వివిధ ప్రదేశాలలో చాటిన విశ్వాచార్యుడు రాధాకృష్ణన్. ఏ పదవిని చేపట్టినా దానికి నిరాడంబరత్వంతో, నిశ్చల చిత్తంతో, విశాల దృష్టితో ఉదాత్త వర్తనతో ఘనత చేకూర్చిన మహామనీషి డాక్టర్ రాధాకృష్ణన్ తెలుగువారికి గర్వకారణం.
ఆచార్య గోపాల్ తన, తండ్రి జీవిత చరిత్ర రాసి లోకానికి మహోపకారం చేశాడు.
. 45
జ్ జి రాధాకృష్ణన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు తిరుత్తనిలో జననం ........౨౨౨౨౨౨౨౨౦ ౦౦౦ లంలవలంవంటలం 5-9-1888 తిరుపతి మిషన్ స్కూలులో మిడిల్ స్కూలు చదువు .... 1896 నుండి 1900 వేలూరులో హైస్కూలు చదువు ఎఫ్.ఎ ................... 1900 నుండి 1904 శివకాముతో వివాహం .........౨౨౨వంటంలటలటలటు 1903 మద్రాసు కైస్తవ కళాశాల నుండి బి.ఏ. ................. 1906 మద్రాసు జైస్తవ కళాశాల నుండి యం.ఏ................ 1909 టీచర్స్ టైనింగ్ లమ 1921 ప్రెసిడెన్సీ కాలేజిలో ఆచార్యుడు... 1911 నుండి 1916 గవర్నమెంట్ కాలేజి అనంతపురం (8 నెలలు) ......... 1916 గవర్నమెంటు కాలేజి రాజమండ్రి... 1917 మైసూరు మహారాజా కళాశాల ఫిలాసఫీ ప్రొఫెసరు ..... 19818 కలకత్తా యూనివర్సిటీ ౪ జార్జి పీఠం ................. 1921 భారతీయ తత్త్వశాస్త్ర మహాసభ అధ్యక్షత ................. 1997 ఆంధ్ర యూనివర్సిటీ తొలి గౌరవ దాక్టరేట్ స్వీకారం ..... 19927. ఆంధ్ర మహాసభ అధ్యక్షులు (నంద్యాల) ................. 1928 ఆక్స్‌ఫర్జు (మాంఛెస్టర్ కాలేజీ ఆచార్య పదవి) .......... 1929 ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ................... 1-5-1981 నుండి
-
- " 1936మే వరకు ఆంధ్ర మహాసభ అధ్యక్షులు (మద్రాసు .......... 1938 గాంధీజీ 70వ జయంతి సంచిక సమర్చణ ............ 2-10-1989 బెనారస్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ............... 24-9-1939 ఆక్స్‌ఫర్జులో స్పాల్డింగ్ ప్రొఫెసరు... 1986 యూనివర్సిటీ విద్యా సంఘం ఛైర్మన్ ..................... 1948 మాస్మోలో భారత రాయబారి ......౦౦లంంలటటల 12-7-1940 యునెస్మోకు భారత రాయబారవర్గం నేతృత్వం .......... 1946 యునెస్కో అధ్యక్షులు... 1852 (1954-1008 భారత రిపల్లిక్_వైస్-(పెసిదెంట్ (1852, 1001లో ఏక్టన మ్మ) ...... 1952 నుండి 1962 న (=. 1962 నుండి 1967 చమస్రాసులో ళ్లు . 17-4-2975 ఉం న (గూ ఢి య 46
భ్ రచయిత గురించి వు పేరు ; రావినూతల శ్రీరాములు
లి లే . జననం : తేది12-10-1936 రచనలు
జీవిత చరిత్రలు : 1. రమణ మహర్షి 2. ప్రజల మనిషి ప్రకాశం . 3. కల్లూరి సుబ్బారావు | 4 పప్పూరి రామాచార్ములు 5. గుత్తి కేశవపిళ్లె 7. మవాత్కాగి మద్దూరి అన్నపూర్ణయ్య | జీవిత చరిత్ర " 8. మవామనీషి డా! సర్వేపల్లి రాధాకృష్ణన్ నూతన చదువరులకు : 1.మంచిని పెంచుదాం " 2. తరతరాల భారతం 3. జాతి పురోగమనం 4. జాతీయ పతాకం - గీతం పురస్కారాలు 1977లో జాతీయ బహుమతి (నూతన , చదువరుల రచనకు విద్యాశాఖ నిర్వహించిన పోటీలో;1984 తెలుగు విశ్వవిద్చాలయం జీవిత చరిత్ర రచనలకు ఇల్లిందల సీతారామారావు స్మారక ప్రతిభా పురస్కారం. ' ఇచరునామా ; ఆర్. శ్రీరాములు _ “రమణన్హాన్” 10/228, వసంతపురి కాలనీ, మల్మాజ్‌గీరి, హైదరాబాద్ - 500 047. | ఫోన్ : 27055437 |