Telugu Ma anna doctor venkatasubhayya - anilvaranasi/indianlanguages GitHub Wiki

డాక్టర్‌ వెంకటసుబ్బయ్య రు. స సహజ కవి మల్లెమాల - ల 2 "మనసుపడి మక్కువతో సేకరించిన (౧ స లో “ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం శ (| | సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి . స. 2. + ఆనందంతో బహూకరిస్తున్నాం. అధ. - మల్లెమాల కుటుంబం ఏ శచ్న ఆదితి ఆట -. శి బం సంస్మరణ = సాహిత్య సంచిక

మా అన్న దాకర్‌ వెంకట సుబ్బయ్య ట్‌ త్రుషయా 1 ల మ చ లో | సంస్మరణ = సాహిత్య సంచిక సంకలనం : సాకం నాగరాజ అభినవ ప్రచురణలు 6-1-7౯0 వరదరాజనగర్‌ తిరుపతి "సెల్‌ ; 9440881016

9/6ల్ల్లో శ సగం లా అన్య అల్లో మా అన్న దాక్టర్‌ వెంకట సుబ్బయ్య సంకలనం : సాకం నాగరాజ ట్‌ గ్ర" మొదటి ముద్రణ : జనవరి 2007. _ య. | గ ఉం ట775ళరా శ్‌ ' ష్టల మూ! య. సా యట ముఖచిత్రం : అన్వర్‌ ్యుస్టానూటాద మరో ప్రచురణ : అభినవ ప్రచురణలు, తిరుపతి ముద్రణ : శ్రీ వెంకటేశ ప్రింటింగ్‌ హౌస్‌, చెన్నె, పుస్తకాలకు : విశాలాంధ్ర ప్రచురణాలయం అన్ని బ్రాంచీలూ ప్రజాశక్తి బుక్‌హౌస్‌ అన్ని బ్రాంచీలూ ధర : రూ. 25/-

9 ఠఅు తీపి గుర్తు అన

క్షమించాలి రచయితలూ పారకులూ కూడా. ఇంతమంది ప్రముఖులు ఎక్కడెక్కడో రాసిపెట్టిన ఆణిముత్యాల్లాంటి వ్యాసాలను కొన్నింటిని గుచ్చి పుస్తకంగా కూర్చి ఆ పుస్తకానికి మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ముఖాన్ని చిత్రంగా అట్టమీద ముద్రించుకుంటున్న సాహసానికీ, తప్పుకీ మీరందరూ కూదా నిజంగానే క్షమించాలి, మన్నించాలి.

మా అన్నను గురించి మేం ఏమేమో వూహించాం గానీ ఆయన చావుని ఎప్పుడూ వూపొంచలేదు. ఆయనెప్పుడూ అంతుచిక్కని విధంగానే జీవించి పోయాడు.

మాది చిత్తూరు జిల్లా పాకాల మండలం వరదప్ప నాయుడుపేట. ఉండూర్లో ప్రాధమిక స్థాయిలో తెలివైన విద్యార్థిగానే మెలిగిన మా అన్న హైస్కూల్‌ చదువుకి పొరుగూరు వెళ్లేస్పటికి- హిందీ సబ్జెక్టుకు భయపడిపోయి స్ఫూలికి పోకుండా వంకల్లో, వాగుల్లో, చెరకు తోటల్లో మకాం!

మనిషి విభూతి పండు వర్ణం. ఎండకుపోతే కందిపోతాడు. వ్యవసాయానికి సనికేరాడు. ఈ వుద్దేశంతో మా తమ్ముడు సుధాకర్‌ని బడి మానిపించి వ్యవసాయానికి పెడితే మా అన్న పి.యు.సి. తప్పి కూర్చున్నాడు. హిందీ పుణ్యమా అని పాసయ్యే సమస్యే లేదనేశాడు. సుధాకర్‌ని మళ్లీ బడికి పంపి ఈ మనిషి వ్యవసాయానికి తయారయ్యాడు. ఆయన చేసిన వ్యవసాయం సంగతి ఏమోగానీ మా సుధాకర్‌ మా అన్న పుణ్యాన్నే చదువుకొని ఈరోజు డిగ్రీ కళాశాలలో కామర్స్‌ రీడర్‌గా స్థిరపడ్డాడు. ఇంకో తమ్ముడు ప్రభాకర్‌కు కూడా మా అన్న తోడు నిలిచాడు.

నా అన్న ఒకపక్క వ్యవసాయం చేస్తూనే ఎలాపెంచుకున్నాడో గానీ హోమియోవైద్యం మీద ఆసక్తి పెంచుకున్నాడు. హోమియో పోస్టల్‌ పాఠాలు చదివి ఏకంగా వైద్యం నేర్చుకున్నా ననేసి తిరుపతి చేరి 35 ఏళ్లు వైద్యంచేశాడు. తిరుపతిలో హోమియో వైద్యుడుగా ఆయన చేసిన సేవలు మేం చెప్పుకోవలసినవి కావు, జనం చెబితే వినవలసినవి.

లోటుపాట్లు కూడా చెప్పాలిగదా. ఈయన దగ్గర ఆరేడుమంది ఉద్యోగులు. రోగులైతే గంటలకొద్దీ నిరీక్షించే పరిస్థితి. పక్కమార్గం పట్టాడు, రియల్‌ ఎస్టేట్‌లోకి దిగి. ఎందుకంటే, తమ్ముళ్లకు జీతాలున్నాయి, పింఛన్లువస్తాయి. నాభార్యా పిల్లల జీవితాలకూ భద్రత వుండాలి టైపులో ఆలోచించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి పీకల్లోతు దిగాడు. క్లినిక్‌లో రోగుల కంటె ప్లాటు బ్రోకర్లకే క్షణాల్లో అపాయింట్‌మెంట్‌ దొరికేది. బయట ఎందరు పేషెంట్లు క్యూలో వున్నా సరే గంటల తరబడి (బ్రోకర్లతో-

శీ

'సేదల డాక్టర్‌గా, డాక్టర్‌ దేవుడుగా పేరుపొందిన ఈయన 'ఆందోళనలితో చనిపోయేనాటికి 'పరానులకు నేను బాకీ-ఫకీరులు నాకు బాకి అంటూ బాధ్యతలు మాకు అప్పగించేశాడు. ఇల్లుతో సహా కుదువలు పెట్టి ఎవరెవరికో 20 లక్షల రూపాయలకు పూచీలుపడ్డాడు. 20 లక్షలు చొక్కాపట్టుకొని వసూలు చేసేవారి దగ్గర అప్పులు తెచ్చేశాడు.

మా అన్న రచయిత కూడా. రోగుల గురించీ, వైద్యవృత్తి గురించి ఎన్నో కవితలు, పాటలూ రాసి క్యాసెట్‌ తయారుచేసి, సి.ఎం.చేత ఆవిష్కరింపచేయాలని కలలు కంటూ- పోయాడు.

నా ప్రీతి ఏమంటే - మా అన్నను స్మరించుకోవడం అనేపేరుతో పిడికెడు మంచి రచనలతో ఒక పుస్తకంగా వేసి ఉత్తమాభిరుచిగల పాఠకులచేతుల్లో పెట్టి వారందరికీ - శిష్‌ట్లానీ, శ్రీశ్రీనీ, జరుక్‌నీ, అబ్బూరినీ, బాలన్నయ్యనీ.... ఎందరో మహామహులను ఒకసారి గుర్తుచేసి... ముచ్చట తీర్చుకుందామని! ఇంతకంటే ధన్యత మా అన్నకేముంటుంది!

పారకులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకానికి నామ మాత్రంగా ధరను నిర్ణయించామని మనవి.

=సాకం నాగరాజ

ర్‌ బాలన్నయ్యకు జేజేలు -ముళ్ళపూడి వెంకట రమణ

రారె చిన్ని పిల్లలార

రారె చిట్టి తల్లులార

ఆట పాటలన్ని చేరి

ఆడికూడి పాడుదాం - ఆదుదాం

దాచుకోండి పుస్తకాలు

పాఠములిక చాలు చాలు

చేయి చేయి కలిపి - చెంగు

చెంగున పరుగెత్తుదాము

1944లో బాలన్నయ్యగారు నేర్పిన ఈ పాట ఇంకా జ్ఞాపకం వుంది. అంటే ఈ పాటకు 60 ఏళ్లు. సిక్స్‌టీ యియర్స్‌! అన్నమాట.

శేడియో అన్నయ్యగారే పక్కన వుంటే - సిక్స్‌టీ యియర్స్‌ అన్నమాట విని వుంటే- అ-బ్బ్భా! అరవై చెవులే! అంటూ హహమాహ అని నవ్వేవారు. పక్కన అక్కయ్యగారే వుంటే ఆవిడా నవ్వేసి - చెవులు కాదండి - ౬%గిక కాదు 7౬4గి5 - అంటే ఏళ్ళు అన్నమాట అని సరిదిద్దేవారు. ఏవిటీ నా కషగిక కి 60 ౪౬49! నో నో - నాకు నలభై చెవులు!? ఫార్టీ యియర్సే!? అని మళ్ళీ నవ్వి నవ్వించేవారు.

ఆలిండియా రేడియో స్టేషన్‌లో ఆదివారం మధ్యాన్నాలు ఇలా వుండేవి. ఆరు మాటలూ పాటలూ అరవై కేరింతలూ తుళ్ళింతలూ, అంకా పిల్లలమయం. అందులో మేమిద్దరం బాపు, నేనూ.

మెడ్రాసు ఎగ్మూరులోని మార్షల్స్‌ రోడ్డులో వుండేది ఆలిండియా రేడియో స్టేషన్‌. దిబ్బరొట్టెల్లా వుందే లావుపాటి తలుపులు వెనక ఏర్‌కండిషన్‌ చల్లహా... చాక్లెట్లూ బిస్మట్ల వాసన వేసేది - ముక్కులు ఎగబీల్చి మరీ ఆనందించే వాళ్ళం - తెలీకుండా బుజాలెగరేసే వాళ్ళం. గెంతుతుండే వాళ్ళం - మాపేర్లు రేడియో జిలేబి - రేడియో మిరపకాయ, పొట్టిబావ- చిట్టి మరదలు, రేడియో తాతయ్య, జేజిమావయ్య - ఇలాఎందరో.

బుజాలెగరేన్తారేమర్రా అంటూ నవ్వుతూనే

బుజబుజరేకుల పిల్లుందా-

బుజ్ఞారేకుల పిల్లుందా-

6 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

సామీదండల పిల్లుందా-

పెళ్ళికి వచ్చే పిల్లుందా-

అంటూ పాట కట్టేసేవారు - పిల్లుందా అంటే పిల్లి కాదు పిల్ల అంటూ నవ్వుతూ వరస కట్టేవారు పాడేవారు - పాడించేవారు - ఆడేవారు ఆడించేవారు.

ఆదివారం అంటే మాకు పండగే పండగ. శనివారం పొద్దుటినుంచి ఇంట్లో రేడియో సందడే. పొద్దున్నే లేచి చద్దన్నాలు తినేసి చొక్కా లాగూ వుతికేసి, చిరుగులు కుట్టేసి, చెంబిస్తీ చేసేసి, హోంవర్క్‌ కూడా చేసేసేవాళ్ళం. ఎందుకంటే ఆదివారం పొద్దున్నే పదిగంటలకి రేడియో వాన్‌ వచ్చేది. అది కారు కన్న పెద్దది. బస్సు కన్న చిన్నది. అందులో ఎక్కుతుంటేనే వోంవర్కు చేశావా అని అడిగేవారు. యస్సంటే ఆవేళ నాటకంలో మంచివేషం - ఇంకా లేదు అంటే చిన్నవేషం, అబద్ధం చెప్పితే నో వేషం.

ఆ వాన్‌లో పదిమంది కూర్పోవచ్చుగాని మేము పాతికమంది కూర్చునే వాళ్ళం ఒకరి వడిలో ఒకరు కూర్చుని, కొందరు నుంచునీ, అంతా కోళ్ళగంపలా వుందేది, వాన్‌దైవరు అబ్బుల్లా, 'సుడు మూంజి' అంటే ధుమ ధుమ లాడుతూ భయపెట్టేలా వుండేవాడు. కానీ ఎప్పుడైనా చోటుచాలక ఒకపిల్లవాడు మిగిలి దిగిపోతే వాడిని తన వడిలో కూర్చోపెట్టుకునేవాడు. నాకోసారి అలాగే జరిగింది. అప్పుడు పోలీను వాడిని టైము అడిగేసినంత గొప్పగా ఫీలయిపోయాను. అబ్బుల్లా వడి అంటే అది - కాస్త బీడీ కంపు....

ఒకసారి ఇంకోటి జరిగింది. నేను మాయింటి దగ్గర పరుగెత్తి ట్రాంబడి (రోడ్డమీద వెళ్ళే రైలుపెట్టె) ఎక్కబోయి పడిపోయాను. కాని మెట్టుదగ్గర పట్టుకున్న ఊస వదల్లేదు - రోడ్డుమీద వందగజాలు ఈడద్చేసింది ట్రాము - ఎలాగో వదిలాను. తల నుంచి కాలిదాకా వళ్ళంతా దెబ్బలు. అలాగే ఏడుస్తూ ఇంటికెళ్ళి - గుమ్మంలో ఏడువు మానేసి నవ్వేసి - మాయింటి ఓనర్‌ - కార్చెంటర్‌ - అతనికి చూపించాను. వెళ్ళి పడుకో అన్నాడు. “ఇల్లే ఇల్లే - రేడియోకి పోణుం” అన్నాను నవ్వేసి - అతను దెబ్బలన్నిటికీ టించరైడిన్‌కి బదులు టర్పెంటైన్‌ రాసి - అన్నిటికీ విడివిడిగా చిన్న చిన్న కట్లు కట్టాడు గుడ్డ పీలికలతో - నేను అలాగే పన్నెండు కట్టులతో రోద్దుమీద నుంచున్నాను. రేడియో వాన్‌ వచ్చింది. అక్కయ్యగారు నన్ను చూడగానే “అమ్మో! అన్ని దెబ్బల్లో ఎందుకొచ్చావు రవణా, వెళ్ళి పడుకో” అన్నారు. “పోడు - పడుకోడు ఇవాల రవణకి పెద్ద హీరోవేషం ఇస్తాను - రావయ్య రవణా ఎక్కు అన్నారు అన్నయ్యగారు - నా మోహం చూసి. వాన్‌ కిటకిటలాడుతోంది, ఎక్కబోయాను = కుదరలేదు - దెబ్బలు నొప్పి-

“డాయ్‌! కాలికట్‌ సోల్దర్‌ - ఇప్పిడివాడా” అని వినిపించింది - అబ్బుల్లా! నవ్వుతున్నాడు. అతని వడిలో కూర్చున్నాను - త్రిల్లయిపోయాను

న

బాలన్నయ్యకు జేజేలు... 7

రేడియో ప్రోగ్రాములు గంటసేపు జరిగేవి - కథలు, నాటికలు, పాటలు ఎన్నో... అవి అయ్యాక అన్నయ్యగారు అందరికీ స్వీటు హాటు కూల్‌డ్రింకూ, పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు కాఫీ, టీ యిప్పించేవారు - ఆ టిఫిను ప్రోగ్రాంకి నేనూ, అన్నయ్యగారి అన్నయ్యగారబ్భ్బాయి. రాఘవా, తమ్ముడు గోపాల్‌ ఇన్‌ఛార్జీలమి. ప్రోగ్రాం రివోర్సలు అవుతూండగా పిల్లలెందరో పెద్దలెందరో లెక్క రాసుకుని కాంటీనుకి వెళ్ళి ఇన్ని టిఫిన్లు ఇన్ని కాఫీలు అని ఆర్దరు చెప్పేవాళ్ళం, ఆ రకంగా పిల్లల్లో మోతుబర్లం కాబట్టి కాంటీనువాడు మా నేస్తం. మేము ఒక వడ, రెండు కూల్‌డ్రింకులు, కలర్‌ షోడా - తాగేసేవాళ్లం. దొంగలెక్కలు అన్నమాట - సాయంత్రం బిల్లులో కలిపేసే వాళ్ళం. ఓసారి కలర్‌ తాగుతూ జోకేసుకుని నవ్వాం - నాలుగు చుక్కలు తుళ్ళి చొక్కాల మీద పడ్డాయి - మేమూ చూసుకోలేదు. ఆరోజు సాయంత్రం (ప్రోగ్రాం అయిపోయి టిఫినులు తినేసి అందరం వానెక్కుతుండగా అన్నయ్యగారు రవజా, రాఘవా అనిపిల్చారు - కొంచెం దూరంలో చెట్టుకింద ఒక్కరే నిలబడ్డారు - ఎందుకో అని వెళ్ళాము

“మీరు ఇవాళ ఒక తప్పుచేశారు - ఇప్పుడు నిజం దాస్తే రెండు తప్పులు - అబద్ధం చెప్పితే మూడు తప్పులవుతాయి - చెప్పండి అన్నారు అన్నయ్యగారు - మా రంగు మచ్చల మీద మునివేళ్ళతో నిమురుతూ.

మేము ఒకళ్ళనాకళ్ళం చూసుకున్నాం.

కళ్ళవెంట నీరు తిరిగింది. దండాలు పెట్టేశాం -

“క - కలర్‌ సోదాలు తాగాం” అనేశాం.

“గృడ్‌ - వెరీగుడ్‌” అన్నారు అన్నయ్యగారు. మా తలలు నిమురుతూ - మేం ఆశ్చర్యపోయాం -

“కలర్‌ సోడాలు తాగినందుకు కాదు - నిజం ఒప్పుకున్నందుకు” అని హహ హ హ అని నవ్వేశారు.

మేం కూడా హాయిగా నవ్వేశాం.

_.. “మ్రాదండి రవణా, రాఘవా - ఈ రంగు మచ్చలు సబ్బేసి కడిగితే పోతాయి - మీరు దొంగలు అన్న మచ్చ చాలారోజులు వుంటుంది. ఈ కాస్త చెడ్డపేరు చెరిగిపోడానికి మీరు బోల్డంత మంచిపేరు తెచ్చుకోవాలి - రాముడు సోముడు అవడం ఈజీయే గాని సోముడు రాముడు అవడం కష్టం” అన్నారు.

మేం తలకాయలూపాం- “పదండి - ఇది ఎవరికీ చెప్పకండే - సీక్రెట్‌! నేనూచెప్పను - ఒట్టు...?” అని చెయ్యిజాపారు.

8 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

“ఒట్టు” అని మేమూ ప్రామిస్‌ చేశాం.

ఇలాటి హాయి వారాలు ఎన్నో

1945లో మాకోసం “బాలి పత్రిక పెట్టారు. చిన్నపిల్లల కోసం ఇద్దరు 'పెద్దపిల్లలు” నడిపే పత్రిక. అందులోనే బాపు బొమ్మ, నాకథలూ పద్యాలూ అచ్చు అయ్యాయి. ఆయన మాయిద్దర్నీ మౌంట్‌రోడలోని హిగ్‌న్‌బాతమ్స్‌ బుక్‌షాపుకి తీసుకెళ్ళి డ్రాయింగ్‌ పేపరూ, ఇండియన్‌ యింకూ, బ్రష్నలూ, బొమ్మలున్న కధల పుస్తకాలు కొనిపెట్టేవారు.

అప్పుట్లో నేను ఫోర్తుఫారం చదువుతూ రెండోక్సాసు మూడోక్లాసు పిల్లలకి (పైవేట్లు చెప్పేవాడిని. నెలంతా చెపితే రెండురూపాయలిచ్చేవారు - ఆదివారాలు నాగా పెడితే అర్ణణా కోసేవారు. అలాటిది ఒకసారి “బాలో పత్రికలో నా కథ పడగానే పదగానే బిస్కట్టులా వున్న కొత్త అయిదు రూపాయలనోటు యిచ్చారు.

ఇంటిదగ్గర మా అమ్మా, అమ్మమ్మా హడలిపోయారు. భయంతో నన్ను తీసుకుని ట్రిప్లికేను నుంచి మైలాపూర్‌ రసికరంజని సభ దగ్గర వున్న అన్నయ్యగారింటికి తీసుకు వెళ్ళారు - 'నిజమా' అని అడిగారు. ఆయన నవ్వేసి “ప్రైవేట్లకి రెండ్రూపాయలూ ఇవ్వచ్చు, కధలకు అయిదురూపాయలూ యివ్వచ్చు. మీవాడు బాగా రాశాడు అన్నారు.

మా అమ్మా, అమ్మమ్మా కంగారుతో, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు... “బాలి పత్రికను నిలబెట్టే భారం నాదేననుకున్నారు - ఇంక నేను రాయవలసింది కథా, నాటకమా నవలా - అని చర్చించడం మొదలుపెట్టారు - ఓ గంటసేపు మమ్మల్ని భరించాక ఆయన నవ్వేసి ధైర్యం చెప్పారు.

“ “బాల రేపే మళ్ళీరాదు - నెలకోసారి గదా. చాల్గాటైముంది - మీవాడు పిడుగు

  • రాస్తాడు - ఒకటేమిటి - వందల కొద్దీ రాస్తాడు - ఇంటికెళ్ళి రాయించండి - ఇప్పుడు నేను ఆఫీసుకు వెళ్ళాలి” అంటూ లేచారు.

అప్పుడు ఆయన వారానికి ఆరు రోజులు 'హిందూ” పత్రికలో రిపోర్టరు, సబెడిటరు

  • ఏదోరోజు అదివారం నాడు '“బాలికూ, 'బాలానందాని'కీ ఎడిటరూ, రీడరూ అన్నీ

ఆ తరంలో మాలాటి బాలలకీ బాలన్నయ్యే అదృష్టదీపుడు... అవన్నీ మాజికల్‌ డేస్‌,

ఆదివారం రేడియోలో ప్రోగ్రాం ఆరంభించినపుడు పాడే జెండా పాట.

రారె చిన్న పిల్లలార

రారె చిట్టి తల్లులార

అని పాడుతూ వుంటే ఇంక ఎప్పటికీ ఆదివారం అయిపోదూ, సోమవారం రాదూ

బాలన్నయ్యకు జేజేలు... 9 అన్నంత ధైర్యంగా హుషారుగా పాదేవాళ్ళం - గంట ప్రోగ్రాం అయిపోగానే జెండా దింపేసే పాటలో “పోదామా యిక పోదామా ఇళ్ళకు యిప్పుడు పోదామా ఆటలు పాటలు నాటికలూ నేటికీ యిక చాలిద్దామా వచ్చే ఆదివారము నాడూ మెచ్చుచు తిరిగి కలియుదమా” అని పాడుతూ వుంటే గుండెలో బెంగతో డిక్క పదేది. కాని వచ్చే ఆదివారం కోసం ఎదురు చూడటం కూడా ఎంతో సరదాగా, హాయిగా వుండేది... చాలా చాలా జేజేలు బాపు రమణల జేజేలు బాలలందరి జేజేలు.

10 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

లీ నా గాడ్‌ ఫాదర్‌...గురించి కాస ఎవి

ఆల

నా బొమ్మల కథ మరి కాస్త.... జాలి -బాపు

ఇంగ్లీషులో గాడ్‌ ఫాదర్‌ అనే మాట ఉంది. తెలుగులో దానర్ధం “ప్రత్యక్షదైవం' అని నా నమ్మకం. నాకు గాడ్‌ ఫాదర్‌ - ప్రత్యక్షదైవం ఆర్బూర్‌ ఈసెన్‌బర్ట్‌ అనే అమెరికన్‌ జ్యూ (బర్గ్‌ అని చివరాస్తే జ్యూ అన్నమాట. ఇంకో మహనీయుడు స్టీవెన్‌ స్పీల్‌బర్ల్‌).

156౧ అని ఉంది కదా ఐసెన్‌ అనాలా? అంటే - కాదు ఈసెన్‌ అనాలి - మీ కామరాజుని కేంరాజ్‌ అంటే ఎలా వుంటుంది అనేవారు. ఆయన 1955-60 ప్రాంతాల్లో ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధిగా మద్రాసులో ఉండేవారు. పుస్తకాలంటే ఆయనకున్న అభిమానం (తెలుగులో చెప్పాలంటే అబ్సెషన్‌) ఇంతా అంతా కాదు. రాత్రి పన్నెండూ రెండూ అయినా సరే - మేలుకుని గుడ్‌ - బాడ్‌ - అగ్లీ (చదివేదాకా తెలీదుగా) ఏదో ఓ పుస్తకం పూర్తి చేయాల్సిందే. అలా చదివినవి అప్పుడప్పుడు నాకిస్తూ - ఆన్‌ (18 ౧౧0౧౫౫56 ౧౦ 10 6111) అనే వారు.

మన దేశం ట్రాన్స్‌ఫర్‌ అవగానే ఇక్కడికి తెచ్చుకున్న ముఖ్యమైన సామాను తన లైబ్రరీ. అది రాగానే నల్లటి మహాగనీ షెల్ళులు చేయించేశారు. ఆయన లైబ్రరీలోకి అడుగు పెట్టగానే పుస్తకాలూ పైపు టుబాకో సువాసనా మృదువుగా తగిలేది. ఆయన చార్మినార్‌ కూడా కాల్చేవారు. వాళ్ళ ఊళ్ళో అలవాటయిన ఫ్రెంచి సిగరెట్‌ గలోయస్‌ (అనుకుంటా) ఘాటుకి దీటైనది ఇదేట. ఒహాయన (ఆవకాయలాటి) చార్మినార్‌ చూసి గుండె బాదుకుని ఆ.... ఆ...., మీ.... మీరు.... మీరు కాల్చేది .... చ్‌.... చ్‌... చా... ర్మి.... నా.... రా అని కింద పడిపోయాడు. ఈసెన్‌బర్గ్‌ - 'ఏం చచ్చిపోతాననా మీ బాధ? చార్మినార్‌ కాల్చకపోయినా చచ్చిపోతాం కదా, అన్నారు. (చావు తప్పదు కదా)

ఫోర్ట్‌ ఫౌందేషన్‌ తరవున ఆయన 50641162 ౬20౧062669 800% 76451 మొదలెట్టారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషలలో మంచి పుస్తకాలు - అందరికీ అందుబాటులో ఉండేలా ప్రచురించడం దాని పని.

నేనన్నా నా బొమ్మలన్నా - ఆ వరుసలో వాత్సల్యం, (ప్రేమా చూపించేవారు. అదీ 'అవ్యాజమైనిటు వంటిది. (ఈ మాట వాడాలని ఎన్నాళ్ళనుంచో ప్రయత్నం) ప్రతి వానికీ నా కారు చూపించి (సెకండు వ్యాండుది) మా బాపు బొమ్మలేసి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్నాడు తెలుసా అని గర్వంగా - మా నాయనమ్మ గారు చెప్పినట్టు చెప్పేవారు.

నా గాద్‌ ఫాదర్‌...గురించి కాస్త... 11 ఓమారు శ్రీ ఉత్చల వారి పద్యాలకి నా బొమ్మలున్న పుస్తకానికి అవార్డు వస్తే గర్వంగా వెళ్ళి చెప్పా. ఆయన “నేను అవార్డు కమిటీలో ఉన్నానోయ్‌. మిగతా కమీటీ సభ్యులు చూడకుండా అడుగునుంచీ పైకి తీసిపెట్టే వాడిని - నీ పుస్తకాన్ని” అని నవ్వారు. ఈ సంగతి గుర్తు చేస్తూ ఆ మధ్య ఇజ్రాయిల్‌లో ఉన్న ఆయనకు (ఇప్పుడక్కడ రిటైరయ్యారు) ఉత్తరం రాస్తూ */16౧ | [0160౪006 ఇం0౪[గ౫/ జ౭॥6 ౪౦౪ 5416 - ౧౫౮6౬16101 1 ౪౬5 | ౪1౦ ౮56610 5౧ 400 116 10౧ 011౧6 ౦116౯00013 ౬|| 16 1౧౪) అని ౧606 చేస్తే

  • ఆయన జవాబుగా ఫోన్‌ చేస్తూ, 8206 - |! ౧6౪8౯౦2906 ౪06 2౧ 160- 26291 ౧01 1౧ ౪౦౮౯౧౧696౧09' అన్నారు. ఆయన జోకు పడే ఛాన్సు దొరికితే వదిలేవారు కాదు, ఓమారు ఓ తమిళ సంప్రదాయ కుటుంబం ఇంటికెళ్ళినప్పుడు - రూద్రాక్షమాలలను సగం చేసి వాటిమీద భగవద్గీత అంతా చెక్కి ఉన్నది చూపారు. "౪/0 19 11 ౧౦110512/667" మరి బొమ్మలేవీ అని అడిగారు.

సదరు సదరన్‌ లాంగ్వేజస్‌ బుక్‌ ట్రస్టు (5681) కి నన్ను ఆనరరీ ఆర్టు డైరెక్టరుని చేసేశారు.

ఎం శేషాచలం కంపెనీ పేరు వినే ఉంటారు. ఆ ప్రచురణ సంస్థ పార్య పుస్తకాలూ అవీ వేసేవారు బందరు నించి,

ఈసెన్‌ బర్ట్‌కి వారబ్బాయి శ్రీ 14 [[. ౧౬౦ గారితో స్నేహమయింది. ఇహ రావుగారి చేత బ్రహ్మాండమైన పుస్తకసేవ చేయించారు. రకరకాల సాహిత్యం పాకెట్‌ బుక్‌ సైజులో ఎమెస్కో పాకెట్‌ బుక్స్‌ పేరిట నెలకి నాలుగేసి వేయించారు. ఒకోటి రెండు రూపాయలు! సంప్రదాయ సాహిత్యం - పాండురంగ మహత్యం శ్రీ విశ్వనాధ వారి పరిచయంతో రెండు రూపాయలకి ఊహించగలరా! అలాగే ప్రకాశం గారి జీవిత చరిత్ర!

ఎమెస్కో వారి ద్వారా ఈసెన్‌బగ్గ్‌ వేయించిన పుస్తకాలు చిత్తగించండి.

సంప్రదాయ సాహితిలో

శ్రీనాధుడు, ధూర్జటి, పింగళి సూరన, పిల్లలమర్రి పినవీరభద్రుడు, చేమకూర వారి విజయ విలాసం, మొల్ల రామాయణం, ముద్దుపళని, శ్రీధరబాబు గారి ఉపనిషత్మథలు, విశ్వనాధ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర, వేంకట పార్వతీశ కవులు, నోరి నరసింహశాస్త్రి, కందుకూరి పంతులుగారు, పిలకా గణపతి శాస్త్రి, పానుగంటి వారు, అడవి బాపిరాజు, గోపీచంద్‌, బలివాడ కాంతారావు, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, మునిమాణిక్యం వారి రచనలు, గురజాడ వారి కన్యాశుల్మం

లత, భానుమతీ రామకృష్ణ, వాసిరెడ్డి సీతాదేవి, రామలక్ష్మీ ఆరుద్ర, ఆనందారామం, పౌొరీస్‌, మాలతీ చందూర్‌, రావి కొండలరావు.

గుంటూరు శేషేంద్రశర్మ గారి కవిత, విద్యార్ధి సాహితి, తెలుగు ఇంగ్లీషు పాకెట్‌ డిక్షరీ

12 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య

ఆఖరికి చలంగారి మైదానం కూదా వేశారు. (ఈ పుస్తకం ముఖచిత్రం చూసి ఈసెన్‌బర్గ్‌ ఖంగారుపడిపోయారు. పొదలచాటున ఏదో పడిపోతే వెతుక్కుంటున్నారు. ఆ కంగారులో ఒకళ్ళ మీదొకళ్ళు పడ్డారనిన్నీ సర్ది చెప్పాం) ఇవన్నీ ఒకోటి రెండు రూపాయలకు ప్రచురించేవారు.

1965లో ఒక పెద్ద సంస్థ చేయవలసిన బృహత్మార్యం శ్రీ ఆరుద్ర గారు ఒంటి చేత్తో సాధించిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం 12 వాల్యూములు [11% (40౧౪ ౪0/20౧/ ౧1౧ ఇంటింటి గ్రంథాలయం) ఆధ్వర్యంలో రావుగారి చేత వేయించారు.

శ్రీ రాజమన్నార్‌ గారి పీరికతో, ఒక్కో వాల్యూంకి సర్వశ్రీ వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాధ, శివశంకరస్వామి, మల్లాది రామకృష్ణశాస్త్రి, గిడుగు సీతాపతి, ఖందవల్లి, దివాకర్త, రాళ్ళపల్లి, నేలటూరి, తాపీ ధర్మారావు, కప్పగంతుల లక్ష్మణశాస్రి గారల పరిచయాలతో వేయించారు - ఒక వాల్యూము ఖరీదు అయిదు రూపాయలు!

1969లో ఎమెస్కో శత పుస్తకోత్సవం చేయించారు.

ఇంటింటా స్వంత (గ్రంథాలయం స్కీము పెట్టించారు. పుస్తక ప్రపంచం అనే మాసపత్రిక బులెటిన్‌ - అనేక బహుమతి స్కీములు - ఇదంతా ఆయన జీవిత ధ్యేయం. పుస్తకాలు కొనిపించడం - చదివించడం - ఇంటింటా పుస్తకాలు చేర్చి చిన్న పుస్తాలయం ఏర్పాటు చేసుకోవడం. ఇంటికి ముఖ్యమైన అలంకరణ పుస్తకం అని ఆయన జెండా. నన్ను - పత్రికలకి కథా చిత్రాలు వేసేటప్పుడు - ఏదో మూల చిన్న పుస్తకాల బీరువాయో

  • అలమారలో గడియారం పక్క పుస్తకాలు - అలమారలో లేకపోతే బల్లమీద పుస్తకాలు
  • వంటిల్లయితే కూరలబుట్ట పక్కసగం చదివిన వారపత్రిక - ఆఖరికి రిక్షావాడి గుడిసేనా సరే పొట్లం కట్టిన ౧౧166 ౧౭06 వేయమనేవారు. దీని పేరు [116606౧ ౧౭562100 అంటారట. సినిమాలో ఎడారి సీను వస్తోందనుకోండి. మధ్యమధ్య ఒకటంటే ఒకే ఫ్రేము 1068 0/8౧ బొమ్మ చూపిస్తుంటే - ఇంటర్వెల్‌ అయేసరికి స్టాల్స్‌లో ఉన్న ఐస్‌క్రీమంతా నిమిషాల్లో ఖాళీ అయిపోతుందట. ల్‌

అప్పట్లో పుస్తక ప్రచురణా రాజ్యానికి బెజవాడ రాజధాని. అక్కడి ప్రచురణ పరిస్టితి అంతా ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నాలుగైదు కోట్ల ఆంధ్ర ప్రజలకి ఒక్కో పుస్తకం వెయ్యి కాపీలేస్తే గొప్ప! ఆ 641-11/081 పద్దతులు చూసేసరికి ఆయనకి మతిపోయింది. బెజవాదను పాకీస్తాను కిచ్చేస్తే వాళ్ళు దాంతో సతమతమయిపోయి మళ్ళీ మన జోలికిరారు = కాళ్ళీర్‌ ప్రాబ్లం ౪1|| 06 301/684 అనేవారు నవ్వుతూ - ఓ మారు టూరుకి నన్ను తీసికెడుతూ ఎజెండాలో బెజవాడ చూశారు అది వానాకాలం. “బెజవాడ 1! 62% 54206. [౧|౧9 &౧౮ 31090 [020౧ 512౧06 066౧010011 109616 అన్నారు. అప్పుడు బెజవాదలో 0౧9౧ 612౧206. అయినా ఆయన పట్టు విడవలేదు. “పుస్తకాలు కొనడమా!! బార్చేరియస్‌” అన్న రమణగారి గిరీశం మాటల్ని తిరక్కొట్టి ఎన్ని మంచి పుస్తకాలు కొనిపించారో - ఎన్ని ఇళ్ళల్లో చిన్నచిన్న పుస్తకాల బీరువాలు నిలబెట్టారో చెప్పలేను.

నా గాద్‌ ఫాదర్‌...గురించి కాస్త... 18

రచయితలకీ ఆర్టిస్టులకీ ప్రచురణకర్తలిచ్చే సంభావన తెలుసుకుని ఆశ్చర్యపోయారు. నేను బొమ్మల వృత్తిలో కాస్త నిలదొక్కుకునే టైముకి ముఖచిత్రానికి వంద, కధల బొమ్మకి పాతికా ముప్పయ్యి ఇచ్చేవారు. ఒకప్పుడు బాల పత్రికలో బొమ్మలేసేటప్పుడు నెలకు వచ్చే అయిదు రూపాయలూ - 6ఆ మేనేజరు అరగంట నించోపెట్టి రేపు రమ్మనేవాడు. అలా వారం తిప్పి అప్పుడు విసిరేసేవాడు) మరో పబ్లిషరు ఆ పాతిక కూడా ఇచ్చేవాడు కాదు. కానీ చాలా మంచి పుస్తకాలు వేశాడు. వాటికి ఆయా రచయితల పేరు కాకుండా యూనిఫారంగా తన పేరే వేసుకునే వాడు. అందువల్ల బెజవాడలో ఫలానా పబ్లిషరు బాధితుల సంఘం అని పేరు పెట్టుకున్నాం. ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. గృహ ప్రవేశానికెళ్ళి - తలొకరూ - ఈ కిటికీ నాది - ఈ తలుపు నాది - ఈ ద్వారబంధం నా డబ్బుల్తో - అని చెప్పుకుని తృప్తిపడ్డాం.

ఇంకో పత్రికాయన రాత్రి పదింటికి లేపేవాడు. డబ్బులు తెచ్చాడేమో అని గబగబా వస్తే - ఇవాళ మీ బర్త్‌డే కదండీ - అంటూ ఒక యాపిల్‌ పండు చేతిలో పెట్తి వెళ్ళిపోయేవాడు. ఇంకో ఆయన నా చొక్కా కాలరు సర్దుతూ గుండీలు సరిచేస్తూ చిన్న చిన్న దారమ్ముక్కలు బయటకొస్తే అవి తుంపి పారేస్తూ నించునే ఆ కబురూ ఈ కబురూ చెప్పి - పండు ఫలము కూడా ఇవ్వకుండా వెళ్ళేవాడు. ఇంకో ఆయన నాకు లంకచుట్టలు ఇష్టమని తెలిసి వాళ్ళూర్నించి ఓ గ్లాక్సో డబ్బాడు తెప్పించి ఇచ్చేవాడు. ఇతను ఎలాగా దబ్బులివ్వడు బొక్కిందే దక్కుడని తీసుకునేవాణ్సి. ఆయన మాత్రం బయటకెళ్ళి - కన్నుకొడుతూ జృింప్పుల్‌ - నాలుగు చుట్టలు పడెయ్‌ - నాలుగు సంచికలకు బొమ్మలు లాగేస్తాం” అని చెప్పుకునేవాడు. ఇంకొకరు బొమ్మకోసం వచ్చేవారు. దమ్మిడీ ఇవ్వడని తెలుసు. చాలా కష్టమండి - ఏమాత్రం వీలుపడదు అంటూ అరగంట చెప్పి లోపలికెళ్ళ బోతుంటే “అయితే రేప్పాద్దున్నాచ్చి బొమ్మ కలెక్ట్‌ చేసుకుంటాను" అని వెళ్ళిపోయేవాడు. తమాషా ఏమిటంటే నేను బొమ్మ అర్ధరాత్రి వేసి, రెడీగా ఉంచేవాణ్ణి - ఆయన దమ్మిడీ విదల్బకుండా పొద్దున్నే వచ్చి కలెక్టు చేసుకుని వెళ్ళిపోయేవాడు. అందువల్లే ఆయనకీమధ్య నేషనల్‌ అవార్జిచ్చారు.

ఇంకో సంఘటన - డబ్బులొచ్చాయి. కానీ సబ్జెక్టు కష్టం! రామాయణ కల్పవృక్షానికి ఎగెనెస్ట్‌గా రామాయణ విషవృక్షం” అన్న పుస్తకం - ముఖ చిత్రానికి చెక్కు పంపారు. అంత గొప్ప రైటరు? ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానం వహించిన ఆ గ్రంథాన్ని ఇలా అర్హం చేసుకున్నారా అని చెక్కు వెనక రామ! రామ! అని రాసి తిరిగి పంపించేశా. అది ఆ

ఇ;

గొప్ప రచయిత రచనా సామర్ధ్యం మీద కామెంట్‌ కాదు. కేవలం జాలి.

నాకిచ్చే ఆ కాస్త డబ్బూ బొమ్మ వెయ్యడానిక్కాదు. బొమ్మ వెయ్యాల్సిన ఆ కథో, పుస్తకమో చదివినందుకు కూలి అనుకుంటాను అంటే ఈసెన్‌బర్గ్‌ గారు పకపకా నవ్వి ఓ సంగజ్జెప్పారు. అమెరికాలో ఒహాయన వండర్‌బుక్స్‌ అని పిల్లలకి పుస్తకాలు వేశారు. తన

14 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆర్లిస్టు స్నేహితుణ్జి ఎంబ్లం వేసి పెట్టమన్నాడు. ఆయన ' అక్షరాన్ని తెరచిన పుస్తకంలానూ పైన రెండు సున్నాలు చుట్టి ఒకటి పిల్లాడి మొహం - అటూ ఇటూ రెండు జడరిబ్బన్లేసి పిల్లమొహం చుక్కలు పెట్టారు. చూడగానే ధ్రిల్లయిపోతాం. ఎంతిమ్మంటావురా అన్నాట్ట పన్లిషరు. పాతికవేలిమ్మన్నాడు ఆర్టిస్టు పబ్లిషర్‌ షాకయిపోయి - ఏడిశావు - రెండు సున్నాలు చుట్టి పాతికవేలా అన్నాట్ట. అప్పుడు ఆర్టిస్టు - ప్రతి పుస్తకం మీదా నా ఎంబ్లం వాడుకుంటావు కదా - అలా ఏటా ఎన్నివేలు వేస్తావ్‌ - ఆ వేలతో భాగించు ఒక్కో పుస్తకానికి పైసాల్లో వెయ్యోవంతు కూడా ఖర్చుండదు. ఇహ ఇలా ఎన్నేళ్ళు వేస్తావు చూసుకో

  • ఆ విలువ అర్ధమయితే పాతికవేలూ ఇయ్యి - లేదా 1246 ౪1% గ౫/౦6900గ౧౧||౧౪౧(౩ అన్నాట్ట.

ఒక అమెరికన్‌ పత్రికలో ఓ కార్టూను పడింది - దాంట్లో మొహంలో రెండు కళ్ళూ ముక్కుకి ఇవతల ఉన్నాయి. అది కార్టూను సుమండీ. మరు సంచికలో 1616౯ 10 116 ౬610? లో - అయ్యా “కళ్ళు అన్నవి ముక్కుకి అటూ ఇటూ ఉంటాయి గానీ ఒకే ప్రక్కన ఉండవు. పొరబాటు దిద్దుకోండి” అని ఓ ఉత్తరం! ఈసెన్‌బర్గ్‌కి చూపించి “మీ దేశమంతటి ఫార్వర్డ్‌ కంట్రీలో కూడానా?” అని ఆశ్చర్యపడికే ఆయన “//6 &80 ౧౭౪౭ ౦౮౯౧౮౦1201 161015 - 00౧౪00 ౪౦/౧౧” అన్నాడు.

కానీ నా వృత్తిలో గొప్పదనం - ఉండుండి చాలా గొప్ప కధలు వస్తుంటాయి. ఇన్నాళ్ళు ఇన్ని వందల బొమ్మలకి ఎంత -తక్కువ ఇచ్చినా - అసలివ్వకపోయినా - ఈ ఒక్క కథా మొత్తం కాంపన్సేట్‌ చేసేస్తుంది. శ్రీ నండూరి రామమోహనరావు గారూ, శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారూ ఆంధ్ర వారపత్రికలో సంపాదకత్వం నెరపేటప్పుడు లా చదువుతూ పత్రికకు బొమ్మ లేసేవాణ్ణి. అలాంటి గొప్ప కథలొచ్చినప్పుడల్లా బతిమాలి రచయిత స్వదస్తూరీతో ఉన్న ఒరిజినల్‌ స్రిస్స తీసుకుని దాచుకునేవాణ్ణి - శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారివీ - రాచకొండ విశ్వనాధశాస్త్రి గారి 'జరీ అంచు పట్టుచీర - భమిడిపాటి రామగోపాలం గారి 'వెన్నెలనీడ' - ఇలా.

కధకి గానీ, నవలగ్గానీ ఏదో ఓ సన్నివేశం చిత్రించడం కన్నా కథకుడు ఏం చెప్పదలచుకున్నాడో అది బొమ్మలో చూపించాలని తాపత్రయం. శ్రీ నామిని గారి గొప్ప కథలకి ఇది కొంచెం సాధ్యపడింది. ఎటొచ్చీ మిధునం అనే శ్రీరమణ గారి కథా రత్నానికి మాత్రం దాని అంతస్థుకి తగిన బొమ్మ కుదరలేదు. అందువల్ల కధంతా స్వదస్తూరీతో రాసి ఆప్పులైన స్నేపితులకి నిలిజీళిని కాపీలు పంపి ఆ మహానుభావుడికి కృతజ్ఞత తెలుపుకున్నాను వంశీగారి నవలొక దానికి పెద్ద కన్నువేసి కన్నీరు నెమలిపింఛం రూపంలో కుదిరింది. దువ్వూరి వేంకటరమణ శాస్రిగారు రాసిన 'జానకితో జనాంతికం” అద్భుతమైన రచన - శాస్త్రిగారు సీతతో రాముడు అమెకు చేసిన అన్యాయం గురించి జనాంతికంగా చెప్పి వాపోతాడు. దానికి బొమ్మలో - సర్వం తానే అయి వుండి వ్యాపించి ఉన్న స్వామి పాదాల వద్ద అమ్మవారు కూచుని అంతటా ఉన్న ఆయన వద్ద జనాంతికం ఎలా అన్నట్టు

నా గాడ్‌ ఫాదర్‌...గురించి కాస్త... 15 చిన్న నవ్వు నవ్వుతున్న బొమ్మ నాకెంతో ఇష్టం. అలాగే భద్రాచల రామదాసు ప్రాజెక్టు వారు వేసిన పాటల ఆడియో కాసెట్టు మీది బొమ్మ - ఇటు ఆంజనేయస్వామి అటు రామదాసూ తన్మయత్వంతో చిందేస్తూ పాడుతుంటే ఆశీర్వదిస్తున్న రాముడు చేతివేళ్ళు తాళం వేస్తున్నట్టు కుదిరింది. అలాగే పత్రిక అనే మేగజైన్‌కి రాసిన అక్షరాల 1000. విశాలాంధ్ర వారి తెలుగు కథ సంకలనానికి - ఎప్పుడో వేసిన అద్దంలో చూసి బొట్టు పెట్టుకుంటున్న ఎంకిని - అద్దం బదులు తెలుగు పుస్తకంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటున్నట్టు మార్చి వేసిన బొమ్మ చాలా తృప్తినిచ్చింది.

మళ్ళీ వెనక్కి వెళితే...

ఏదో వేసెయ్యాలని బుర్రనిండా తాపత్రయం నిండిపోతుంది కానీ చేతకావద్దూ! పునాది లేదే! ఇంటర్‌ చదవగానే బొంబాయి ౮ 501001 0 గీగకలో చేరతానని మా నాన్నగారిని అడిగాను. (మానాన్న గారంటే నాకు చచ్చే భయం - ఏదైనా అడగాలంటే ఆయన ఆఫీసు రూంలో ఆయన కూచున్న కుర్చీ వెనకాల గుమ్మానికి అర్ధగంట సైలెంటుగా వేళ్ళాడుతూ నించుంటే - ఆయన అలికిడి పసిగట్టి “ఏమిటి” అంటే అప్పుదు 90164 అయ్యావాడిని. కానీ ఆయనెప్పుడూ (ప్రేమతోనే మాట్లాడేవారు) ఆయన లాయరు. ఆ రోజుల్లో ఆర్టిస్టు వృత్తి భుక్తికి సరిపోయేది కాదు. అందువల్ల - కాస్త ఆలోచించడానికి టైమియ్యి - ఈలోగా డిగ్రీ తీసుకో అన్నారు. 8.001. లయోలా కాలేజీలో పూర్తిచేసి మళ్ళీ గుమ్మానికి వేళ్ళాడా. ఆయన పాపం - “బామ్మలు కూడూ గుద్దా పెట్టవురా. £/0506615 కనిపించడం లేదు. ఈ చిత్రకళని పెళ్ళి చేసుకునే కంటే 007౧81612| టాక్స్‌ స్పెషలైజ్‌ చెయ్యి. అయినా కాస్త ట్రైమియ్యి - ఈలోగా 2615310౧09 కి టబైమయి పోతోంది కాబట్టి లా కాలేజీలో చేరిపో అన్నారు. మొదటి ఏడాది పూర్తికాకముందే ఆయన పోయారు. ఆయన మీదుండే గౌరవం కొద్దీ లా పూర్తిచేసి అడ్వకేటుగా 6౧/0 అయ్యా. వెంటనే నల్లకోటు విప్పేసి - ఫ్రీలాన్స్‌ ఆర్టిస్టు వృత్తి మొదలెట్టాను. ఆ విధంగా గగ 50[001 లో చేరే అదృష్టం కుదరలేదు.

మా అమ్మగారు రమణగారితో - ఏమోయ్‌ - వాడేదేనా గవర్నమెంటు ఉద్యోగంలో ఉంటే పింఛనేనా వస్తుంది. నాలుగు కరుకులు కనబడతాయి. మీవాడేం చేస్తున్నాడమ్మా అనెవరైనా అడిగితే బొమ్మలేస్తాడు అంటే ఏదోలా ఉంటుందోయ్‌ అనేవారు. రమణగారు- “ఏం ఫరవాలేదమ్మా - ఉద్యోగం కన్నా రెండింతలు బొమ్మలు సంపాయించి పెడుతున్నాయి" అనేవారు.

కానీ వండుకున్నమ్మకి ఒకటే కూర - దండుకున్నమ్మకి పది అన్నట్టు నాకు స్కూల్లో ఒకరు బదులు వందలాది గురువులు. అమెరికన్‌ బ్రిటీష్‌ లైబ్రరీకెళ్ళి పత్రికలూ, పుస్తకాలూ తెగ చూసేవాణ్ణి. అప్పుడు సెంట్రల్‌ స్టేషన్‌ పక్కన మూర్‌ మార్కెట్‌ అని ఉండేది. అక్కడి సెకండ్‌ హాండ్‌ పుస్తకాలు - ఓహో - 8250616! ప్రతి శనాదివారాలు వెళ్ళి ఆ గురుతుల్యుల పుస్తకాలు దొరికితే తెచ్చుకునే వాజి.

16 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

నాకు దేవుళ్ళలాటి ఈ ఆర్టిస్టులందరి గురించీ ఈసెన్‌బర్గ్‌కి చెప్పే వాణ్ణి. వాళ్ళని కలుసుకోవాలని నాకు ఎంత ఆశ ఉందేదో గ్రహించారు ఆయన. ప్రతి ఏడూ అమెరికాలోని హార్‌వర్డ్‌ యూనివర్శిటీలో సెమినార్‌ జరుగుతుంది. దానికి నన్ను పంపించాలని రెండు మూడేళ్ళు విశ్వప్రయత్నం చేశారు. సాధ్యపడలేదనుకోండి. 1978లో రాముడి ధర్మమా అని సీతాకల్యాణం సినిమాతో లండన్‌, షికాగో ఫిలిం ఫెస్టివల్స్‌కి వెళ్ళినప్పుడు బెల్లియంలో 116/6 ని, అమెరికాలో 10/00 [౦6౧౪61 నీ కలవాలని ప్రయత్నించా. సరిగ్గా ముందురోజే పేపర్లో వారి మరణవార్త వచ్చింది. ఇహ ఎవరినీ కలుసుకో కూడదని నిశ్చయించుకున్నా

ఓమారు ఈసెన్‌బర్గ్‌ కంచి పరమాచార్యుల వారిని కలిసి ముచ్చటించి వచ్చారు. ఆచార్యుల వారు “ఆడదాని చోటు వంటిల్లే. చదువూ సంధ్యలు అనవసరం” అన్నట్టు మాటాడారట. నేను - నాబోటి వాడికి మంచి చెడ్డ అభిప్రాయాలు ఉండొచ్చునేమోగానీ బాధ్యతాయుతమైన పీఠంపై కూచుని భగవంతుని సృష్టిలో అంతా సమానులే అని చెప్పడంపోయి ఇలా అనడం వారికి భావ్యమా అని అడిగాను. ఇలాటి అభిప్రాయాలు అంతటి మహానుభావుని నోటి వెంట వస్తే మూఢ నమ్మకాలున్న కొంతమందికి మరింత బలం ఇస్తున్నట్టే కదా అన్నాను.

ఈసెన్‌బర్గ్‌ నవ్వీ - “వారి అభిప్రాయం వారిది. మహా పండితులైన వారిని 4696 చేయడానికి మనకి హక్కేది ముందు మనని మనం సరిచూసుకుందాం' అన్నారు. ఎవరో కోట్‌ చేసిన భగవాన్‌ రమణ మహర్షి మాటలు గుర్తుకొచ్చాయి.

ఆయన ఇంకోటనే వారు. సాటి మనిషి మీద నమ్మకం - 17051 - పోగొట్టుకోవద్దు. పదిమందిలో తొమ్మిది మంది నిన్ను మోసం చేసినా పదో వాడు నిన్ను ఆదుకుంటాడు.

నేను ఒక గర గం్రంగం/ లో పనిచేసేటప్పుడు నాపై ఉండే ఆర్ట్‌ దైరెక్టరుకు ఈసెన్‌బర్గ్‌ గురించి చెప్తే - “వాడా - ఖద్దరు చొక్కా వేసుకుని చేతులు జోడించి నమస్తే అంటాడు

  • ఆ దొర పీనుగా?” - అని వేళాకోళంగా నవ్వారు.

నాకు మరి ఆ రెండిట్లోనూ తప్పు కనిపించలే - అయినా నేనింకోరిని 469౪ చేయకూడదుగా.

ఈసన్‌బర్గ్‌ ఎప్పుడూ జోకులేస్తూ సరదాగా ఉండేవారు. హోటల్‌కి పిలిచి పక్కన కూచోపెట్టుకుని భోజనం పెడుతూ తన ప్లేటులోంచి చికెన్‌ ముక్కనా ప్లేట్‌లో వేసి ఫరవాలేదు తినచ్చు. ఈ కోడి చంపి వండినది కాదు అదీ సూయిసైడ్‌ చేసుకుంది అనేవారు. రాత్రి మవుంట్‌ రోడ్డులో ఉన్న జింఖానా క్లబ్బుకి కార్లో తీసికెళ్ళమనే వారు. నేను అసలే దూకుడు. అందులో - తిరిగి వచ్చేటప్పుడు పది దాటి రోడ్లు ఖాలీగా ఉండేవేమో స్పీడు తాక్కేవాణ్డి. ఆయన 021% గా - 04 జం ₹4/౧0100 [04 8406” అనేవారు. ఆయన తండ్రిగారు

నా గాడ్‌ ఫాదర్‌...గురించి కాస్త... 17 కూడా చాలా సాదాగా ఉండేవారట. ఓనాడు అమెరికాలో పెళ్ళాం బిడ్డల్ని తీసుకుని కొంచెం హైక్షాసు రెస్ట్రారెంట్‌కి వెళ్ళారట. వీరి దుస్తులూ సాదాతనం చూసి ఒక ౪/26 వచ్చి ఆర్డరు తీసుకుని కనుబొమ్మలు పైకెత్తి చాలా కాండెసెండింగ్‌గా "4౧ 1౧1౧0 6156 5-1-౧" అన్నాట్ట. వీళ్ళ నాన్నగారు - "౪89 - ౧౦1౧6? ౪1116 అన్నార్ట. ఈసెన్‌బర్ల్‌ ఆఫ్‌ కలర్‌ జోక్స్‌ అంటారే - అవి బలే చెప్పేవారు. గింగాంం/20%౫ 15 16 0౧ 11౧0 ౪10% 62% 20016౪6 ౮౧|/6521 0[0౧6/0006 అనేవారు సరదాగా. నిజమే - అలాటి సరదా జోకులకి కులమత విచక్షణ ఉండదుకదా - అందుకే కవి చౌడప్ప “బూతు లేనిదే నీతియే లేదయా” అన్నాడు. 1967లో సాక్షి తీశాము. అది నా మొదటి సినిమా - రమణగారి బ్రిలియంట్‌ డైలాగులు స్క్రీన్‌ప్లే - నా భయంకరమైన ఓవర్‌ యాక్షింగులు, అపుడు నేను చేయించిన - 0౯ సదరు నటులు చేయగా నేను అనుమతించిన నాటకీయ నటనలు తలచుకుంటే ఇప్పటికీ చచ్చే సిగ్గేస్తుంది. ఎంచేతో అది ఈసెన్‌బర్గ్‌కి చూపించా - మీ దౌరలకి చూపించొచ్చా అని. ఇంకోరయితే ఆరోజు నించి నాతో మాట్లాడేవారు కాదు. ఆయనకు నా మీద ఎంత వాత్సల్యం అంటే - జాలిగా చూసి 0 82౧061 50౧/- 7౧6/౪ ఓ400% 2! 6 ౪౧0౧3 ౧11065" అన్నారు సున్నితంగా. నా చిన్నప్పుడు ఓరోజు మా నాన్నగారి ఆఫీసు రూంలో గోడకి తగిలించిన కోటులో చిల్లర దొరికితే కొట్టేద్దామని చెయ్యి పెట్టా. సరిగ్గా అప్పుడే ఆయన రూంలోకి వచ్చారు. గుండె ఆగిపోయి “కోటు కిందపడిపోతే తీసి మేక్కు తగిలిస్తున్నాః అని నసిగాను. “జేబులో చెయ్యి పెడుతూ కోటు కిందపడిందంటా వేమిరా” అన్నారంతే. ఇంకేం చెయ్యలే. చావగొట్టినా అంత బాధ సిగ్గూ వేసేదికాదు. అది గుర్తొచ్చింది.

1960లో - ఫోర్డ్‌ 1060౧6460౧ వారు మన దేశంలో వారు సబ్బిడీలిచ్చి సహాయపడుతున్న సంస్థల్ని సందర్శించి రిపోర్టు తయారు చేయమన్నారు ఆయన్ని. అప్పుడు నేను జె.వాల్టర్‌ ధాంసన్‌ యాడ్‌ ఏజెన్సీలో ఆర్టిస్టుగా పనిచేస్తున్నా. మొత్తం ఇండియా - అటు నేపాలూ కూదా తిరుగుదాం సెలవు పెట్టెయ్‌. నాతో అఫీషియల్‌ కెమెరామేన్‌గా రా అన్నారు. నాకు ఫోటోగ్రఫీ నిల్లని చెప్పా. ఏదో డబ్బా కెమెరా కొనుక్కుని రావో అన్నారు. బొంబాయి ఎజెండాలో ఉందా అని అడిగాను. “ఏం ముసిలాయన్ని చూడాలని కదూ అన్నారు. ముసిలాయన అంటే హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్‌ బడే గులాం ఆలీఖాన్‌. అప్పుడాయన బొంబాయిలో ఉండేవారు. ఆయన సంగీతం అంటే నాకెంత పిచ్చో ఈసెన్‌బర్గ్‌కి తెలుసు. ఆ రోజుల్లో ఈసెన్‌బర్గ్‌ వద్ద నించి ౫6౭౪/6!8 అనే 50001 1206 ౧6౦౦66 కొన్నాను. అప్పటికి కేసెట్లు రాలేదు. రోజూ తెల్లారకట్ల అయిదింటినించీ ఎనిమిదింటి దాకా మాటల్లేకుండా రమణ గారూ, నేనూ పనిచేసుకునే వాళ్ళం, వినే శబ్దమల్లా ఆ గి౭౪6/8 7209 గి౭౦0/66/ లో వచ్చే ఖాన్‌ సాహిబ్‌ బడే గులాం అలీ పాటలే! రోజంతా వేయవలసిన బొమ్మలూ రాయవలసిన కథలూ ఆ మూడు గంటల్లోనే పూర్తయిపోయేవి. (ఇప్పటికీ నా రోజు బదే గులాం ఆలీఖాన్‌ సంగీతంతో మొదలవుతుంది. అయిదింటికి మార్నింగ్‌ వాక్‌లో వాక్‌మన్‌లో ఐడేగారి సంగీతం పెట్టుకుంటాను).

18 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

యాత్ర మొదలయింది. హైదరాబాద్‌ - అటునించి బొంబాయి (ఇంతకీ అక్కడ ఖాన్‌ సాహిబ్‌ని చూసే అదృష్టం కలగలే - ౮/౧ బొంబాయి ఆఫీసు కెళ్ళాను. అప్పుడు నా జీతం పదిహేను వందలు. యాడ్‌ ఏజెన్సీలతో అంతంత జీతాలు పొందే ఆర్ట్‌ డైరెక్టర్స్‌ పదిమందిలో నేనాకణ్జిట!) వెళ్ళా. నాకు బ్రహ్మరధం పట్టేశారు. అక్కడనించి అహమ్మదాబాద్‌

  • ఢిల్లీ ఇండట్టియల్‌ ఎస్టేటు - అప్పుడే తాజ్‌మహల్‌ చూశా - తరువాత పంజాబు- చండీగర్‌ - పంజాబులో ప్రతి వీధికీ కిళ్ళీ కొట్టలాగ ఒక బుల్లి ఇండప్టీ - సైకిలు దైన్లో
  • బాల్‌ బేరింగ్పో - బెల్పో ఏదో ఓ చిన్నది తయారు చేసేది ఉందేది. రోడ్లమీదా పొలాలలోనూ ఆడా మగాను చూస్తుంటే మానవ రూపం ఇంత గొప్పగా ఉంటుందన్న మాట అనిపించేది. పంజాబు నించి తిరిగి వస్తూంటే వరసగా మిలిటరీ ట్రక్కులు వెళ్ళడం చూశాను. మర్చాడు పేపర్లో చూదుం కదా - ఇండో చైనా యుద్ధం! నా యాత్ర ఆగిపోయింది. లేపోతే తూర్పు దక్షిణ దేశం, నేపొలూ కూడా చూసేవాణ్ణి. ప్రాప్తం లేదు.

ఈసెన్‌బర్గ్‌ పుస్తకాల విషయంలో హెడ్‌ ఆఫీసుకి ఎన్నో ప్రపోజల్స్‌ ఇచ్చారు. కానీ వారిలో చలనం లేదట. “7౫6౧ - ।! 2౧ 16 ౧౦౩౦౪6౧౬16 018/6 ౧6/8“ అనేసి రిజైన్‌ చేసి యూదుల దేశం ఇస్రాయిల్‌ వెళ్ళిపోయారు. ఎం.ఎన్‌. రావు గారు పోయారు. ఇంటింటి (గ్రంథాలయం పాకెట్‌ పుస్తకమూ మొత్తం చిరిగిపోయాయి. నాకూ ఆయనకీ ఉత్తర 'ప్రతుత్తరాలు మాత్రం ఆగలేదు. ఎప్పుడూ నా బాగోగులు కనుక్కుంటారు. నేను వేసిన బొమ్మల పుస్తకాలు పంపుతుంటాను. నేను హిందీ సినిమాలు కూడా తీశానని తెలుసు. 85 ఆగష్టులో ఆయన శ్రీమతితో మద్రాసు వచ్చారు. ఒకటే అడిగారు “50 - ౧౦౪౫ - ౬/8 ౫౦౪ ॥౧0౪౧ 110091 0౮1౧6 006౧10/- 1౦గ0 2౧6 5061?" అని. (అంటే ఇది జరిగి తీరాలి అని ధ్వనిస్తూ) "904 0% 91” అన్నా. తృప్తిగా నవ్వారు. అంతే - నెలక్రితం ఇస్రాయిల్‌ నించి ఫోన్‌ చేసి “అభిజ్ఞాన శాకుంతలం' ౪| 5౧0౮150 120531240౧ రెండు కాపీలు పంపమన్నారు. ఒకటి ఎవరికిట తెలుసా - ఒక ఎనిమిదేళ్ళ ఇస్రాయిల్‌ అమ్మాయికిట!! పుస్తకాలంటే సాటివారిలో ఆయన రేకెత్తించే ఆసక్తి అటువంటిది.

ఆయనకి నా బొమ్మలంటే ఎంత ఇష్టమైనా నా బొమ్మల అంతస్తు నాకు తెలుసు. కొందరు చెప్పలేనంత (ప్రేమతో - “నువ్వే కనక ఏ బెంగాల్‌లోనో అమెరికాలోనో పుట్టివుంటే” అంటూ విచారించేవారు. కానీ తెలుగుదేశంలో పుట్టడమే నా అదృష్టం. నా పూర్వజన్మ సుకృతశుభం వలన మూడు దశాబ్దాలుగా మరో ఆర్టిస్టు లేనందువలన గంజాయివనం బాపతుగా పేరొచ్చేసింది. నేను డావిన్సీ మైకేల్‌ ఏంజలో దగ్గర నించీ నేటి నందలాల్‌ బోస్‌, పిలకావారు, వైకుంఠంగారి కళాఖండాలు చూశాను. ఆనాటి ఆర్తర్‌ రాకాం దగ్గర నించి నేటి ఆర్‌.కె. లక్ష్మణ్‌ గోపులుగారి బొమ్మలూ చూశాను. అందువల్ల నా చోటూ, ప్లేసూ నాకు తెలుసు. (తెలుగులో - | గగ౦౫ ౪౧6/8 | 31206) డెరెక్‌ మాల్కం అనే ఇంగ్లీషు దొర, గార్డియన్‌ అనే లండన్‌ పేపరు యొక్క ఫిలిం క్రిటిక్‌ మా సీతాకళ్యాణం చూసి లండన్‌ ఫిలిం ఫెస్టివల్‌కి తీసికెళ్ళిన దగ్గరినించీ బాగా స్పేహితుడై బాగా చనువు

నా గాడ్‌ ఫాదర్‌...గురించి కాస్త... 19 ఏర్పడింది. ఆయన్నోనూరు అడిగాను - నేను మీ దేశంలో పుడితే ఆర్టిస్టుగా నా (హోదా) స్థానం 'ఎక్కడుండేది అని. ఆయన “0౪ ౪0౮16 06 11196 29 2 [1 (206 2గ50 అన్నారు. నేను అనుకున్న దానికన్నా రెండు మెట్లు ఎక్కువ మెట్లే చెప్పారు. అయినా - బుడుగు అన్నట్టు నా అంతటి వాడు నేనే! నాకు నచ్చిన బొమ్మ ఇతరులు బాలేదన్నా బెంగలేదు, నచ్చనిది ఇతరులు పొగిడినా తేడా ఉండదు. రాముడి దయవల్ల అప్పుడప్పుడు కొన్ని బొమ్మలు బాగా కుదురుతూ ఉంటాయి. అవి రమణ గారికి చూపిస్తాను. ఆ తరవాత వాటి సంగతి మర్చిపోతాను. అంత బాగా రానివి చూపించను. అంతే సంగతులు, బాగా కుదిరిన బొమ్మలు కొన్నాళ్ళయిన తరువాత చూసుకుంటే - అయ్య బాబోయ్‌ ఇపుడిలా మళ్ళీ కుదరడం ఇంపాజిబుల్‌ అనిపిస్తుంది.

ఇహ కొస జోకులు.

ఓ ఫ్రెండు పొడుగాటి గొట్టంలో (హోల్దరులో) సిగరెట్‌ అమర్చుకుని పీల్చేవాడు. ఓ కార్టూనూ వేశా. ఆయన్ని కుర్చీలో కూచోబెట్టి నోట్లో మూడు గజాలున్న ఈ హోల్దరుని పెట్టేను. దాంటో కొడిగట్టిన సిగరెట్టు - పెళ్ళాన్ని కేకేస్తూ “ఇదిగో సిగరెట్టు కొడిగట్టినట్టుంది. ఇలా వచ్చి కాస్త కుదుపు ఆయన తెగ నవ్వాడు కానీ మళ్ళీ ఆవిడకి మాత్రం చాలా కోపం వచ్చిందట.

మరో కార్టూను - శోభనం గదిలో కొత్త పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మీద విలాసంగా చేతులేసి “నేను మా అమ్మకడుపులో ఉండగా రోజూ ఈ (గగ్రామఫోనులో పాత రికార్డులు వినేదట. నన్ను కనే టైము వచ్చేసరికి అవన్నీ అరిగిపోయి..... రిగిపోయి .... రిగిపోయి.... రిగిపోయి.... రిగిపోయి...”

ఈ కార్టూను చూసేసరికి ఆవిడ డబుల్‌ కోపంతో ఇది పచ్చి కాపీ - ఇంగ్రీషు కార్టూన్‌కి పచ్చి కాపీ అని సంపాదకునికి లేఖల్లో రాసేసింది. నేను జవాబుగా - “ఆవిడ పప్పులో కాలేసింది. ఇది ఇంగ్లీషు కార్టూనికి ఏ మాత్రమూ కాపీకాదు. అమెరికన్‌ కార్టూన్‌కి

  • రికన్‌ కార్టూనికి - రికన్‌ కార్టూనికి... రికన్‌ కార్టూనికి... రికన్‌ కార్టూనికి... రికన్‌ కార్టూనికి...” అని రాశాను.

నమ్మితే నమ్మండి. నాకన్న ఒక గొప్ప కార్టూనిస్టు ఉండేవారు. ఆయన పేరు జేమ్స్‌ తర్చర్‌. (ఆయన రచయిత కూడాను) న్యూయార్మర్‌ అనే పత్రికలో ఆయన కార్టూన్లు చూసి ఒక పారకుడు సంపాదకునికి - “అవేం కార్టూన్లండీ - బోడి కార్టూన్లు వాడికన్న మా రెండేళ్ళ అబ్బాయి బాగా వేస్తాడు - ఎక్కడ దొరికేడు ఆ 6110 (216 గాడు” అని రాశాడు. తర్చర్‌ గారు ఇలా రిప్లయి ఇచ్చారు. “నన్ను ౬|| [216 గాడు అనడం ఇన్సల్టు. నేను ౧1౦ 48 గాడిని”.

(అంటే నా కన్నా రెండు మెట్లు పైన ఉన్నాడు).

ర.

20 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య నకలులేని సాహిత్యకుడు జరుక్‌! = కొడవటిగంటి కుటుంబరావు “ఇతనెవరో తెలుసా? కొడవటిగంటి కుటుంబరావు”. రుక్మిణీనాధశాస్త్రి నాకేసి ఎగాదిగా చూసి శ్వాస ఎగపీల్చి 'కాడు!? అన్నాడు. “అదేమిటి? అన్నాడు నన్ను పరిచయం చేసిన వ్యక్తి ఆశ్చర్యంతో. సాపాత్యరంగంలో నకలులేని వ్యక్తిని వరిచయం చేసుకోబోతున్నానని అప్పుడే అనుకున్నాను. 'కుటుంబరావైతే కోరలు, రక్తనేత్రాలు, చేతిలో బరిశెలూ అవీ ఏవీ అని అడిగాడు రుక్మిణీనాథశాస్రి. ఆ విధంగా (ప్రారంభమయింది మా పరిచయం గుంటూరు నవ్య సాహిత్య పరిషత్‌ సమావేశంలో. అటు తరువాత మేం అడపాదడపా కలుస్తూనే వచ్చాం. ఆ రోజుల్లో నాకతడు అభినవ నారదుడులాగా కనిపించేవాడు. ప్రతిచోటికీ వెళ్ళేవాడు. రచయితలందరినీ ఎరుగును. ఊరికే ఎరగడంకాదు వాళ్ళనూ వాళ్ల రచనలనూ, జీర్ణించుకునేవాడు. మనుషుల్లోనూ, రచనల్లోనూ ఉండే ఆయువుపట్లు పసికట్టడంలో అతన్ని మించిన వేటకుక్కలుంటారను కోను. ఆ శక్తి పేరడీల రూపంలో కొంతవరకే వ్యక్తమయింది. 1940-42 మధ్య నేనూ, అతనూ కలసి ఆంధ్రవారప[్రిక చూస్తూ ఉండిన రోజుల్లో శ్రీపాదవారి “వడ్లగింజలు' సీరియల్‌గా వేశాం. (రుక్మిజీనాధ శాస్త్రీ ఆ రచనకు 'బహుట్రీః అని పేరు పెట్టాడు). శ్రీపాదవారికి పాత్రల మనఃప్రవృత్తులను చేతలద్వారా వ్యక్తీకరించడం మహాయిష్టం. రుక్కిజణీనాధ శాస్త్రి యీ గుణాన్ని ఉదహరించడానికి 'యాజులు పూటకూళ్ళమ్మకేసి చూశాడు. పూటకూళ్ళమ్మ శంకరప్ప కేసి చూసింది, శంకరప్ప కప్పుకేసి చూశాడు, అని ముక్తసరిగా అన్నాడు. నేను మెచ్చుకున్నాను. విశ్వనాధ సత్యనారాయణ గారి ధోరణి ఏమిటని అడిగాను. రుక్కిణీనాథ శాస్త్రి మొహం గంభీరంగా పెట్టి (ధర్మారావు వచ్చెను అన్నాడు. చాలునన్నాను. సత్యనారాయణ రచనల్లో ధర్మారావు వంటి వ్యక్తి రావటమే ఒక గొప్ప సంఘటన. రచయితలా, రచనల ఆయువుపట్టు పట్టడంలో రుక్మిణీనాధుడికి గల శక్తి తాలూకు మరోప్రదర్శన చాలామందికి తెలియదేమో. ఒకరోజు బెజవాడలో చలంగారింటికి నేనూ, రుక్మిణీనాధుడు వెళ్ళాము. శ్రీశ్రీ కవిత్వం విషయం ప్రస్తావన వచ్చింది. రుక్కిణీనాథుడు శ్రీశ్రీ 'జీవఫలం - చేదు విషం - చేదు విషం - జీవఫలం - బెను నిజం. బెను నిజం అన్నది మృదువుగా చదివాడు. చలంగారి కళ్ళవెంబడి అశ్రువులు జలజలరాలాయి. ఆ పొడిమాటలను రుక్కిణీనాథుడు కన్నీరు తెప్పించేటట్టుగా ఎట్లా చదవగలిగాడంటే చెప్పటం కష్టం. అతనిలో ఆ శక్తి ఉండేది. అతను ఉత్త పేరడీ శాస్త్రులు మటుకు కాడు. ఒకసారి

నకలులేని సాహిత్యకుడు జరుక్‌... 21 అతను రైల్లో మద్రాసు వస్తూ పై బెంచీమీద పడుకున్నాట్ట. కింద బెంచీమీద కూర్చున్న వాళ్ళెవరో ఏదో పథత్రిక చదువుతున్నారుట. రెండు మూదు వాక్యాలు చెవినపడగానే అతను కిందకు తొంగి చూసి 'అది రాసింది కుటుంబరావు అన్నాట్ట. నిజమేనట. సాహిత్యమంటే అభిలాష ఉందేవారున్నారు. ఎన్‌సైక్షోపీడియాలాగా ప్రతి రచనా జ్ఞాపకం పెట్టుకునేవాళ్లూ ఉన్నారు. రుక్మిణీనాధుడిలాగా ఇంతమంది రచయితల సారాన్ని సంగ్రహించిన వాడు మరొకడుండదేమో. అతని 'సాహిత్య పిపాస అనన్యమైనది'. అతను పత్రికా ప్రపంచంలోనే ఉండదగినవాడు. ఎవరన్నా ఒక ఐడియా అందిస్తే చప్పున దాని ఒడుపు గ్రహించి చక్కని రచన చేసేవాడు. ఒకసారి చక్రపాణిగారు బెంగాలీ పత్రికల్లో నుంచి ఒక ఐడియా చెప్పారు. గొప్పవాళ్ళు ప్రతి చచ్చు వ్యాపారానికి సిఫార్సులివ్వటం. వెంటనే రుక్మిణీనాథుడు ఆ ఐడియాను దించేశాడు. ఒక కూరల అంగడివాడికి విశ్వనాథ సత్యనారాయణా, తల్లావరుల శివశంకరశాస్రి మరొకరు యోగ్యతా పత్రాలిచ్చినట్టుగా వ్యాసంరాసాడు. చాలా చక్కగా వచ్చింది. ఎన్నోశక్తులూ, స్నేహపాత్రంగా, మేధాతృష్టగల రుక్కిజీనాధశాస్రిలో అనేక సంఘర్షణలుందేవి. తనకు ఇంగ్లీషు రాదన్న దిగులుందేది. నిజానికి అందువల్ల అతనికొచ్చిన లోటేమీ లేదు. తన ప్రవర్తన నక్రమంగా ఉన్నట్టున్నదేమోనని చేతికర్ర ఒకటి ఏర్పాటుచేసుకున్నాడు. అనవసరం. ఇవి చిన్న ట్రాజెడీలు. పెద్ద ట్రాజెడీ అతను రేడియోలో చిక్కుకుపోవటం. కాని ఆర్జిక కారణాలు తెచ్చిపెట్టే ట్రాజెడీలంత అనివార్యమైనవి ఏమీ ఉండవు.

ష్‌

22 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య అల్లి అలి ల ఒట్టి ప్రాక్‌ - పశ్చిమ సంఘర్షణలు ఎ*చందమామ” రామారావు

“ఏమండీ రామారావుగారూ, నేను సడెన్‌గా చచ్చిపోయినా మీకు ఏమీ యిబ్బంది వుండదు, మార్చినెల వరకూ కథలన్నీ తయారుచేశా”, నన్నారు కుటుంబరావు, ఎవరో వర్థమాన రచయితకు జవాబు వ్రాసి, అతగాడి వుత్తరం చింపేస్తూ.

ఈ రిమార్ములో నిస్పృహ, నిస్తాణ, రోత ధ్వనించిన. ఇది ఆయన నిష్కమణకు పదిరోజుల ముందు.

స్థలం : 'చందమామి సంపాదకవర్గపు గదిలో, వారి బల్లవద్ద, సమయం : వారు యింటికి ప్రయాణమవుతున్న ఒంటిగంట. వారూ, నేనూ, మరాక ఉద్యోగీ మధ్యాహ్నం యిళ్ళకు కలిసి వెళ్ళటం రివాజు,

వెంటనే నా సహజ ధోరణిలో “ఎక్కడికి వెళ్ళుతారండి? ఎందుకా తొందర. యింకెంత సాహిత్య సేవచేయాలో” అన్న నాతో, “ఎందుకండి యింకా బ్రతకటం. యీ వెధవ సాహిత్యంలో నాపేరుకూడా వుండాలీ!” ఛళ్ళున అన్నారు.

కుటుంబరావూ, నేనూ 32 సంవత్సరాలు ఒకే వృత్తివలయంలో పరిభ్రమించాము “చందమామ” కార్యాలయంలో - నేను మేనేజర్‌గా, ఆయన వర్శింగ్‌ ఎడిటర్‌గా.

1938లో మొదటిసారిగా ఆయనతో ప్రత్యక్ష పరిచయం. అంతకు ముందే 'యువ (ప్రచురణల సంస్థ “తెనాలి ప్రచురించిన 'కారుణ్యం” అనే కుటుంబరావు కధల పుస్తకాన్ని కలకత్తా నుండి వెలువడే [106617 2౪164 పత్రికలో నిశితంగా విమర్శించా, ఒక కధలో - ఒక ఆడకూతురు తన సవతి కొడుక్కి అతని తండ్రి తనను శారీరకంగా ఎంత పాడుచేశాడో నిదర్శనంగా చీరె పైకి లాగి చూపిస్తుంది- మనం చదవాల్సిన మచ్చల్ని విశ్వనాధ, చలం పుస్తకాలు వచ్చినై. 'యువి సంస్థ అధినేత అయిన చక్రపాణి (ఆలూరి సుబ్బారావు) వారి వారి సిద్ధాంత ప్రచారాల ప్రభావంతో తన ప్రతిపేజీలోను ముతకగ్రామ్యంతో మాట్లాదేడు అప్పట్లో.

తెనాలి నుండి విజయవాడ వచ్చిన కుటుంబరావు, గోపీచంద్‌ ద్వారా నా గురించి విని ఒక మధ్యాహ్నం తలుపు తట్టారు. మరునాడు, అదే సమయానికి చక్రపాణి ప్రత్యక్షం

  • కుటుంబరావు చెప్పాడంటూ. వీరిద్దరూ, చిత్ర నిర్మాత పుల్లయ్య, నేనూ - నలుగురమూ బాతాఖానీ, తదాది మా మధ్య గౌరవపూరితమైన మైత్రి, ఆపేక్షలు నడిచినై.

ప్రాక్‌-పశ్చిమ సంఘర్షణలు... ఏతి

కుటుంబరావు 1940-41 లో “ఆంధ్రవారపత్రికలోను, ఆ తర్వాత, నాగిరెడ్డి,

చక్రపాణి ప్రారంభించిన 'సంచారి, “ఆంధ్రజ్యోతి' మాసప(త్రికలకు 1945-46 లోను

సంపాదకుడుగా పనిచేశారు. ఈ చివరి రెండు పత్రికలకు నేను మేనేజర్‌గా ఉన్నాను.

1952లో కుటుంబరావు “చందమామలో చేరారు. అప్పటి నుండి చివరి వరకు మరోమారు సహోద్యోగులం మేము.

కుటుంబరావును ఆఫీసులో కలుసుకోని రోజు యింటికి వెళుతుండేవాడిని. ఆయన నాకు హోమియోపతిలో 00౧9౪11౧00 ౧౧౫61౦1౧. అ సమయాల్లో ఏవేవో కబుర్లు, తెనాలి పాత జ్ఞాపకాలు - ఫస్టు కంపెనీ, రామవిలాస సభ నాటకాలు, స్టార్‌ టాకీస్‌ వింతలు, డాక్టర్‌ గోవిందరాజుల సుబ్బారావు, యడవల్లి, మాధవపెద్ది, పెద్దిభట్ల చలపతిరావు మొదలైనవారి నటనా వైశిష్ట్రం, జొన్నవిత్తులవారి సంగీత ప్రతిభ, బాలగంధర్వ, బాలమురళీ కృష్ణు చిట్టిబాబు - ఒకరేమిటి, సంగీత - సాహిత్య - నటజీవనుల జీవిత గాధలు, ఎన్నెన్నో మధురస్కృతులను ఆయన వెలువరించే వారు.

కుటుంబరావు తన చిన్న మనుమరాల్ని ఎంతో అవ్యాయతతో పెంచారు. ఇంచుమించు ఆయన పొట్టమీద ఆడుకుంటూ పెరిగింది ఆ పసిది. కుమార్తె అల్లుడు దూరదేశాల్లో ఉండటం, ఆ పాప కూడా వారితోపాటే వెళ్ళటం జరిగినపుడు - మమకారం ఎరుగని కుటుంబరావు వృదయం ఎంతో తల్లడిల్లింది. “మా అమ్మాయవాళ్లు వస్తున్నారండి. త్వరగా యింకా వారం ముందు రాగూడదూ!” అన్నారు ఒకరోజు. ఆయన కీర్రిశేషులైన సరిగా వారానికి కుమార్తె, పిల్లలు ఢిల్లీలో దిగారు. ౧/8౧౧౦౧110౧ అనుకుంటా.

19456లోనూ మా “ఆంధ్రజ్యోతి” పత్రికకు వ్యాసాలు రాయించటం, సేకరించటం చేస్తుందేవాడిని నేను. ఒకసారి, “ఏమండి కుటుంబరావుగారూ, మీరు మధ్యతరగతి శ్రోత్రియ కుటుంబంలో పుట్టారు. ఆ వ్యవస్థకు శాశ్వతమైన అక్షరరూపం యివ్వరాదూ?” అన్నాను. నా సూచనను మన్నించి, విమర్శనా దృష్టితో 'చదువు నవల రాశారు. మరోమారు, “ఏమండీ, మీరు ఒక ట్రక్కుకు సరిపడ్డ రచనలు చేసి వుంటారు. ఏదీ ఒక్క పాభత్రనయినా రూపొందించలేదే. మీ రెందుకు చేయరు?” అన్నాను. ఆయనకు చురకలా తగిలింది. “వం, నా డిటెక్టివ్‌ కేయాస్‌ నిలుస్తాడేమో” అన్నారు చిరునవ్వుతో.

“మన స్టూడియో వాళ్ళు డఇం% ౯106010 1౧5006౧1 తెప్పించారు, చూసారా?” అని అడిగారు. ఒకరోజు నేను తన సీట్‌ వద్దకు వెళ్ళినపుడు “ఏమండి కుటుంబరావుగారూ మనం మోసే తలకంటె మించిన 11914౧06౧1 ఎక్కడుందండీ! 1441460106౧910౧8 లో ౧౧01601 అవుతుందే” అన్నాను. అందుకు సమాధానంగా, ఎంతో తేజోవంతమైన కళ్ళతో, “అదేనండి నేను సాగిస్తున్న పరిశోధన. ఎన్నో అడ్డంకులు, సమాధానాలు, సందేహాలు ఎదురవుతున్నాయి. సాహిత్యంలో ఏముంది చచ్చు ఆనందం” అన్నారు.

౨4 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

'ప్రముఖ చరిత్రకారుడు కోశాంబి పరిశోధనలు కుటుంబరావుకు యిష్టమైన విషయం. సుమేరియన్‌, బాబిలోనియన్‌, సిరియన్‌, ఈజిప్షియన్‌, హరప్పా - మొహంజొదారో నాగరికతల గురించి, హిందూ సమాజ పరిణామాల గురించి ఆయన సాధికారికంగా చెప్పేవారు. దీనిపై చిన్న చిన్న పుస్తకాలు కొన్ని వేయించారట కూడా.

కుటుంబరావు రచనలు రాశిలో, వాసిలో ఎన్నికగన్నవని అందరికీ తెలుసు. ఆయన ప్రతిదినం దైరీ రాసేవారు, సామ్యూల్‌ పెప్పీస్‌లాగా, ఏం రాస్తారండీ అంటే, ఎప్పుడైనా చూస్తారుగా అని సమాధానం ఇచ్చారు ఒకసారి. (శ్రీమతి వరూధిని ఈ పనికి పూనుకోవాలి):

“రామారావుగారూ, ఇంక నేను 1౧౪౭64 నండీ. ఎందుకండి యింకా బ్రదకటం” అనేవారు ఒక్కొక్క రోజు, కాని కలం వీరుడు. చనిపోవటానికి ముందు అరగంటవరకూ రాస్తూనే ఉన్నారు.

ఆయన *“చందమామి ద్వారా పిల్లల కధలకు ఒక ఆకృతి, శైలీ రూపొందించారు. ఒకమారు విజయవాడలో విశ్వనాధను చూడటానికి వెళ్లాను. “ఏమయ్యా, చందమామను నాచేత కూడా చదివిస్తున్నారు. హాయిగా బాగుంటుంది” అన్నారు. ఈ ఖ్యాతి అక్షరాలా కొడవటిగంటిది.

బుల్లి కధను నవలీకరిస్తున్నా బృహత్మధను సంక్షిప్తపరుస్తున్నా ఆయన వ్రాతప్రతిలో ఒక్క కొట్టివేత, ఒక తుడుపు కనిపించదు. పూసల్లాంటి చిన్న అక్షరాలు దండ గుచ్చినట్లు వుంటాయి. ఆయన మనస్సు లాగే అక్షరాలూ సున్నితంగా వుంటై.

కుటుంబరావు ఎరుగని కళగాని, శాస్త్రంగాని లేదేమో. క్రమశిక్షణ, నియమ జీవనం, చిరుకోపం ఆయన ప్రత్యేకతలు. తోటపని, ఫోటోగ్రఫీ ఆయన హాబీలు. సంగీతం అంటే ప్రీతి, పువ్వులు ఆనందదాయకాలు.

నలభై మూడు సంవత్సరాలపాటు ఓ మహామేధావి నాకు దగ్గర కొండ. అయితే ఆయన విప్లవాత్మక దృక్పథం, రచనలు నాకు చుక్కెదురు. ఆయన ఆశయాలు, రచనలు నాపై ఏ ప్రభావాన్ని కలిగించలేదు. నాకు కుటుంబరావుగానే కనిపించాడు. ఆయనలో నాకు ప్రాక్‌ - పశ్చిమాల సంఘర్షణలు కనిపించేవి. కుటుంబరావు అలౌకికుడు, అప్రాచ్చుడు గాదు (౧౦1 ౪65168).

285 పుట్టపర్తి నారాయణాచార్యులు ఎీతెలుగు వెలుగులు నుంచి

పట్టరాని ఆవేశం, పట్టి చూద్దామనే కావేషం; ఏ పిల్లగాలి వీచినా కదలిపోయే మనసూ, ఏ చల్లగాలి సోకినా వడలిపోయే దినుసూ; మాట వినకపోతే మతి చలించేటంత ఆగ్రహం, మాట వింటే కనకాభిషేకం చేసేటంత అనుగ్రహం; మూడు అంగల్లో ముల్లోకాలూ జయిద్దామన్న ఆశ, మానవమాత్రులం ఏమిటి సాధ్యమన్న నిరాశ, ('ధ్రువునికన్నా దృఢతరమైన భక్తీ, దానికి ప్రతిధ్రువమైన విశ్చంఖల రక్తీ ఛీ ఛీ ఏమిటీ పాడులోకం అన్న విరక్తి ఇదే కదా మన తరణోపాయానికి మెట్టు అన్న ఆసక్తి, మంత్ర తంత్రాలపై మరులు, అధివాస్తవిక భావాల తెరలు, ఇంతవాణ్ఞయినా జనం అడుగులకు మడుగులొత్తలేదే నన్న సంతాపం, ఆం మనది ఎంతపాటి పాండిత్యంలే అన్న పశ్చాత్తాపం- ఇలాటి పరస్పర వైరుధ్యాలే శ్రీ వుట్టపర్తి నారాయణాచార్యులు. ఉవ్వెత్తుగా లేచి సంఘర్షించుకునే ఈ వైరుధ్యాలే ఈయనను బహుభాషావేత్తగా తీర్చాయి, రచనలో బహుమార్ధానుసారిగా వచ్చాయి. సంస్కృత కవయిత్రి అయిన కన్నతల్లి చల్లనిచూపు, ఉద్దండ పండితులైన తండ్రి శ్రీనివాసాచార్యుల వారి తీవ్ర శిక్షణ, వీనికి తోడు ఎంతటి స్తబ్ధ్బ హృదయుణ్ఞయినా కదలించివేసే జీర్ణ విజయనగర సామ్రాజ్య భాగమైన పెనుగొండ నివాసమూ చిన్ననాటి నుంచే నారాయణాచార్యుల రసావేశావిష్ట హృదయానికి, పట్టుదలకి ఉద్దీపకాలయ్యాయి. అందువల్లనే పదునాల్గవ యేటీ "పెనుగొండ లక్ష్మా కావ్యం చెప్పగలిగారు. అపురూపమైన ప్రతిభ, దానికి మించిన బహుభాషా పాండితి, పాండితికి తగిన బహుముఖ వ్యుత్పత్తి, వ్యుత్చత్తికి తగిన ధారణ, ధారణను సార్ధకం చేసే నిరర్ణళ వాగ్గాటి, వాగ్జాటిని పొంకంగా కుదించే సుందర వచన రచనా చాతురి ఇన్ని ఉన్నా సులభంగా ఆవేశపడి స్పందించే హృదయం వల్ల చిత్ర విచిత్ర పరిస్థితులలో పడి, సాహిత్యంలో అడ్డదిడ్డగా దారులు తొక్కారు ఈయన. చిన్ననాటి ప్రబంధ కవిత్వపు పుట్ట నుంచి పైకి లేచి, అప్పటి జాతీయ భావపరవశతతో “అగ్నివీణ” మీటారు. ఇంతలో ఎందుకో, ఏమో హరాత్తుగా ఈయన చూపు భక్తి మీదికి, భగవంతుని మీదికి ఎగబ్రాకింది. తులసీదాస రామాయణం నిత్యపారాయణం (ప్రారంభించి, ఆ వేడిలోనే తులసీదాసు చరిత్రలోని ఒక ఘట్టాన్ని “నాక్షాత్మారమూగా చిత్రించి, రామచంద్రుని సాక్షాత్కారమైనట్టు మురిసి “పాద్యము” సమర్పించారు.

26 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

ఈ సమయంలోనే త్యాగరాజులవారి సోదరులు దొరస్వామయ్య గారి “ఆదెనమ్మా శివుడు అనే గొప్ప కృతి ఈయన అంతరంగంలో అనురణించింది. “ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు దూగ నమిత సంరంభ హాహాకారములురేగ”, “శివతాండవము”, “ఇటువంటి గేయక్ళతి ఇంకొకటి బేదు” అన్నంత హాయిగా అసద్భృశంగా పాడారు.

అంతలో ఈయనపై చరిత్ర జల్లులు పడ్దాయి. “శివభారతం” లాగ్క “రాణాప్రతాప చరిత్రొలాగా “విజయనగర భారతం (వ్రాయబూనుకున్నారు. ఎట్లో, వమా అంతలో అరవిందుని తత్త్వం సోకింది. రచనలకు న్వస్తిచెప్పి ఆ్యశమమొకటి స్థాపించి అవరారవిందులయి స్థిరసుఖాసనంతో తపస్సుకు తపన పడ్డారు. ఈయనిది కవి వ్యృాదయం! యోగం - బిత్తవృత్తి నిరోధం సాధ్యమా? మరల కలం వట్టారు. జాతీయతానుఖూతితో “గాంధీ మహా్రస్థానము” ముగించారు; భావుకత పైకొని కాళిదాసు ఒరవడిగా, ఒక నిరుపేద నిర్దోషి కారాగారం నుంచి తన ఇల్లాలికి జలధరంతో సందేశం వంపినట్టు “మేఘదూతము ముచ్చటగా పాడారు. ఈ మేభుం రామగిరి నుంచి బయలుదేరింది; కాదు; హంపీ నుంచి బయలుదేరి “మంద సుందరముగా మరుతుండు శనతోడ పయనంబు దూగించి రాగా” శ్రీకాకుళం మీదుగా వెళ్లుతుంది.

తిరువాన్మూరులో ఎటిమలాజికల్‌ డిక్షనరీలో పనిచేసినప్పుడు నేర్చుకున్న తమిళ, కేరళ భాషల పరిచయం వ్యర్థం కాకుండా ఆ భాషలలోని కొన్నిటిని తెనుగులోకి, “ఏకవీర మున్నగు వాటినీ కేరళంలోకి అనువదించారు, మరెన్నో రచనలూ సాగించారు.

అయితే ఈయనను మరారిభక్తులు - తుకారాం, నామ్‌దేవ్‌, ఏక్‌నాథ్‌, సమర్థ రామదాస్‌ - ఊపిరి సలుపనివ్వబేదు, తమవైపు లాక్కున్నారు. మరి, ఈ భక్త్షశిఖామణి వారి కనుసన్నలలో మెలగుతూ 20 వేల ద్విపదలతో “పండరి భాగవతము” రచించి కాని నిద్రపోలేదు. ఇటీవల రామాయణ రచనకూ కడంగి, వాల్మీకి కొన్ని పాత్రలకు అన్యాయం చేశాడనే శ్రాంతితో దిద్దడానికి కూడా జంకడం లేదట. రామాయణం వాల్మీకి సృష్టి స్వోపజ్జం, దానిలో ఎవరి వేలూ అవసరం లేదు.

నారాయణాచార్యులు ఎన్ని వ్రైరుధ్యాలతో ఎన్నిరకాల [వ్రాతలూ (వ్రాసినా, సిద్ధహస్తుడు, రసావిష్ణుడు, వ్యుత్సన్నుడు గనుక అగ్రభ్రేజినే ఉంటూ, సహృదయులను తలలూపేట్టు చేశాడు. ముఖ్యంగా శివతాండవం “వమానందము భూమీతలమున, శివతాండవమట, శివలాస్యంబట - ఓహోహోహో ఊపహాతీతంబీయానందం బిలా తలంబునొ అన్న (ప్రారంభ గీతాలను సార్ధకం చేస్తుంది.

ష్‌

27 కవి త్వంలో రౌడీ వేషం

  • అబ్బూరి వరదరాజేశ్వర రావు ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్తేరులో ఏర్పడ్డ మొదటి మూడు నాలుగు సంవత్స రాలూ సెలవుల్లో బెజవాడ, గుంటూరు పోతుందేవాణ్ణి. బెజవాడలో గుడిపాటి వెంకటచలం గారింట్లో మకాం. గుంటూరులో మా తాతగారింట్లో. అక్కడ కొన్నాళ్ళు కాలక్షేపం. ఓ సంవత్సరం గుంటూరులో మా మేనత్త కొడుకు వాడపల్లి లక్ష్మీనరసింహా రావు. అతను లకొషీలో లా చదువుతూ సెలవులకి ఇంటికొచ్చాడు. నన్ను తనతో తన స్నేహితులతోపాటు సాయంకాలం షికారుకు తీసుకుపోతూండేవాడు. ఒకరోజున అమరావతి రోద్దుమీద పోతున్నాము. కొంత దూరం నడిచిన తరవాత అరండల్‌పేట సరిహద్దుపైన రోడ్డు కానుకుని పెద్ద వటవృక్షం. దానికి దరిదాపున పెద్ద భవంతి.

అందులో కుడివేపున పెద్దగది. మా బావా, స్నేహితులూ అక్కడ ఆగి గది తలుపు తట్టారు. తలుపు తెరుచుకుని లోపల్నించి మంచి యవ్వనంలో ఉన్న ఓ పెద్ద విగ్రహం వాకిట్లోకి వచ్చి, ఏం మాట్లాడకుండా నవ్వటం మొదలుపెట్టాడు. ఓ నిమిషం అయిన తరవాత అతను మా బావతో- “మీరు లోపలికి వస్తారా, నన్ను బయటికి రమ్మంటారా? ఏదోటి ఏడవండోయ్‌!” అన్నాడు. అతను లాల్చీ, పైజమాలో ఉన్నాడు. మా బావా, అతని స్నేహితులిద్దరూ, నేనూ గదిలో ప్రవేశించాము. ఆ గదిలో ఓమూల ఓచాప, ఆ చాపమీద మాసిపోయిన దిండూ, గోడకి మేకులమీద వేళ్ళాడుతున్న లాల్చీలూ, తువ్వాళ్ళూ, గదినిందా తెల్లకాగితాలు ఈగల్లా గాలి కెగురు తున్నాయి. అందరికన్న వెనక నిలబడిన నేను అలా ఎగురుతున్న ఓ కాగితం కేసి చూశాను. పద్యాల్లా ఆ కాగితం మీద ఎవరి దస్తూరిలోనో ఉన్నాయి. ఇంతలోకి మా బావ నన్నతనికి పరిచయం చేస్తూ “మా మామయ్య కొడుకు వరద. వీడూ కవిత్వం రాస్తాడుట!” అని నవ్వుతూ అన్నాడు. అంతే. అమాంతం అతను నేలమీద సాష్టాంగపడి నాకు నమస్కరించాడు. లేచి “మహాకవిని చూసినట్టే లెక్క రామకృష్ణా

రావు గారిని చదివాను; వాళ్ళబ్బాయిని చూశా” నన్నాడతను. అతని పేరు శిష్‌ట్లా ఉమామహేశ్వరరావనీ, మా బావకు సహాధ్యాయి అనీ, అప్పుడు బెనారస్‌ విశ్వవిద్యాలయంలో చదువు ముగించుకుని వచ్చేశాడనీ, మేధావంతుడనీ విన్నాను. ఎందువల్లనో అతజ్జి చూసీచూట్టంతో అదోరకం వ్యక్తిగా కనిపించాడు. అతని వాలకంలోనే ఏదోవిశేషం ఉన్నట్టు తోచింది. అతని గదిలోనే ఓ గంటసేపు అందరూ నేలమీద కూర్చుని అవీ ఇవీ మాట్లాడారు. మధ్య మధ్య మా బావ ఉమామహేశ్వరరావు కవిత్వం రాస్తాడని అంటున్నాడు. అయితే, అతని పేరు నేను చదువుకున్న సాహిత్యంలో ఎక్కడా తటస్థపడలేదు. ఊరుకోక "శ్రీరంగం శ్రీనివాసరావు పేరు విన్నారా?” అని ఉమామహేశ్వరరావు కేసి చూస్తూ

౨8 ...మా అన్న డాక్షర్‌ వెంకటసుబ్బయ్య అడిగాను. నా వంక తీక్షణంగా చూసి - 'అతనెవ'రన్నాడు. నాక్కోపం వచ్చింది. అయినా “విశాఖపట్నం కవిత్వం బ్రహ్మాండంగా రాస్తాడు” అన్నానో లేదో అతను మొహం అటుపెట్టి “రాయనీో అంటూ మళ్ళీ అందరి ధోరణిలో పడ్డాడు. నా కొళ్చర్యం వేసింది - మా నాన్నగారి పేరు విని నాముందు సాష్టాంగపడ్డవాడు కవిత్వం అంటే కించిత్తు ఆసక్తి చూపించడేం అని. కాస్సేపయిన తరువాత అందరం లేచాం. బయటికివస్తూ గాలికెగురుతున్న కాగితాలకేసి మళ్ళీ చూశాను. అలాచూస్తున్న నన్నుచూసి “అదంతా నా కవిత్వం - చదవాల్నుందా?” అని రెండు కాగితాలు తీసి చూపించాడు. కవిత్వంలాగే ఉంది అందులో ఒక కాగితాన్ని తిరిగీ చూసుకొని నాకిచ్చేని ఉంచుకోమన్నాడు. మగ్రోజున బ్రాడీపేట మొదట్లో ఉన్న ఆమంచర్ల శేషాచలపతి గారింటి ముందు తల్హావర్తుల శివశంకరశాస్ర్రిగారు కనిపించారు. ఆ రోజుల్లో నేనంటే ఆయనకి అభిమానం. ఎదురుగా ఉన్న హోటల్లోకి తీసుకుపోయి కాఫీ ఇప్పించి అవీ ఇవీ మాట్లాడుతూ “మీరంతా శ్రీనివాసరావూ, శ్రీనివాసరావు అంటారు. మా ఉమామహేశ్వరరావు పోలిక్కిరాడు. అతను అద్భుతంగా కొత్త పద్ధతిలో కవిత్వం చెప్పబోతున్నాడు” అని సభాపతి ధోరణిలో చెప్పారు. శాస్త్రిగారికి వ్యక్తిగతంగా అనేక అభిమానాలు. ఏ అభిమానంతో అలా మాట్లాడుతున్నారో నాకర్థం కాలేదు. గుంటూరులో నేనున్న పదిరోజుల్లోను మరోసారి ఉమామహేశ్వరరావును యాదృచ్చికంగా కలుసుకోవటం జరిగింది, వేదుల సత్యనారాయణగారితో కలిసి వెళ్ళాను. అరోజుల్లో వేదుల మా మేనమామకు సంస్కృతం చెప్పేవాడు. అప్పుడే మొదటిసారిగా ఉమామహేశ్వరరావు తన కవిత్వాన్ని పాడి వినిపించటం చూశాను. అతను బాగా పాడగలడనే అభిప్రాయం కలిగింది నాకు. సత్యాగ్రహాలమీద పోలీసుల లారీ దౌర్దన్యంమీద రాస్తున్న ఓ గేయాన్ని వేదులకి వినిపించాడు. “మారో మారో మారో ఒకటీ, రెండూ, మూడూ...” ఇలా సాగుతుంది. అతను పాడుతుంటే ఉత్తేజితులై వేదుల తెగ మెచ్చుకున్నారు. నాది మరీబాల్యం కనక మరింత తన్మయుణజ్బయిపోయిన మాట వాన్త్నవం. ఉమామహేశ్వరరావు సామాన్య కవి కాదని నాకనిపించింది తనగదిలో అంతకుపూర్వం నాకిచ్చిన కాగితంమీద రాసిన పద్యం పాడాడు. నా కర్థంకాలేదు. వేదులకీ అనుకుంటాను. ఆయన కనుబొమలు ముకుళించారు పాదేతీరు అద్భుతం. ఇంటికొచ్చిన తరవాత ఆ కాగితం ముక్క చూశాను. పద్యంలా వుంది. ఛందస్సు అర్ధంకాలేదు. అంతా అయోమయంగా వుంది.

కవిత్వంలో రౌడీ వేషం... 29

నేను విశాఖపట్నం చేరీ చేరగానే శ్రీనివాసరావుని కలిసి గుంటూరు వ్యవహారం పూసగుచ్చినట్టు చెప్పాను. నేను పట్టుకొచ్చిన 'పద్యం' చూపించాను. అతనికీ ఆశ్చర్యం వేసింది. అతణ్జి ఒకసారి చూడాలని అన్నాడు - అలాగేనని చెప్పి మా బావకు ఉత్తరం రాశాను. ఓనెల రోజుల తరవాత ఉమామహేశ్వరరావు కలకత్తా పోతున్నాడనీ, వాల్తేరు స్టేషనులో కలవమనీ మా బావ ఉత్తరం రాశాడు. నిర్జీత సమయానికి నేనూ, శ్రీనివాసరావూ స్టేషనుకి వెళ్ళాము. కలకత్తా మెయిలు ఆగగానే వెతికి గుర్తుపట్టి ఉమామహేశ్వరరావుని దించాను. శ్రీనివాసరావుని పరిచయం చేశాను. ఉమామహేశ్వరరావుకి ఓ పాడలవాటుంది. అందర్నీ 'ఒరే' అనేవాడు. శ్రీనివాసరావుని చూసి “నీ గురించి విన్నానురా - మనం తీరిగ్గా కలవాలి” అన్నాడు. “కవిత్వం యాంత్రికంగా వుంటోంది. దాన్ని తాంత్రికంగా నడిపిస్తాను. కుందడలాలనూ, శ్రీ చక్రాలనూ పరిశోధిస్తున్నాను. నాలో మిమ్మల్నందర్నీ చేర్చుకుంటానులే- భయపడకు అన్నాడు.

నేను జేబులోంచి అతను లోగడ ఇచ్చిన కాగితం ముక్కతీసి చదివి వినిపించు అన్నాను. స్టేషను గడియారం చూస్తూ పాడాడు. ఒక్కొక్కప్పుడు అమ్మవారంత గొంతు- దూరంగా వున్న ప్రయాణీకులు మావంక చూస్తున్నారు.

“ద్రాగుడు మూత పడ వీమనస్సంచారములు

కత్తెర పెట్టినన్‌ తెగవు. ఎక్కడ కేగుచుంటిరని

పోవునపు డడిగిన నవి పక పక నవ్వు, అక్కడ

ఏమి చేసితిరన సిగ్గుచే లోనికి

జొత్తురు. వెంటనే యుప్పెన వచ్చినట్లు మహ

ర్నవమి పిల్లలవలె అల్లరిచేతురు...”

రైలు కదిలిపోయింది. శ్రీనివాసరావుకి అతని వైఖరి రుచించలేదని తెలిసి పోయింది. అయితే, ఉమామహేశ్వరరావుని గురించి ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం శ్రీనివాసరావుకి పట్టుకుందని తెలుసుకున్నాను. మా నాన్నగారి అభిప్రాయం కనుక్నోమన్నాడు శ్రీనివాసరావు. నేను చెప్పినదంతా విని, నేను చూపించిన 'పద్యం'” చదివి “కవిత్వంలో వీడిది రౌడీవేషంలా ఉందిరా!” అన్నారు నవ్వుతూ మా నాన్నగారు.

యుద్ధకాలంలో విశ్వవిద్యాలయాన్ని వాల్తేరు నుంచి గుంటూరు తర లించటంతో మా కుటుంబం అక్కడికే వచ్చింది. అప్పుడు రాజకీయాల్లో ఎమ్‌.ఎన్‌. రాయ్‌గారి అనుచరుణ్ణిగా ఉండేవాణ్ణి.

మా ఇంటి పక్కనే జంధ్యాల వారిల్లు. జంధ్యాల వెంకటప్పయ్య శాస్త్రిగారు వెల్కం ప్రెస్సు నిర్వహిస్తుందేవారు. నేను తోచనప్పుడు వెంకటప్పయ్య శాస్త్రి గారి ప్రెస్సుకు వెళ్లి ఆయనతో మట్లాడుతుండే వాణ్ణి - అక్కడే శిష్‌ట్లా ఉమామహేశ్వర రావు 'శాంతిని అనే

30 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య పత్రికను అచ్చేయించేవాడు. కాని, నన్ను గుర్తుపట్టలేదు. అప్పుడతను - కవిత్వంలో ఏదో ఎవరికీ అర్థంకాని “ప్రాహ్మాది కవిత్వం అంటూ ఓ ఉద్యమాన్ని లేవదీయటానికి (ప్రయత్నించాడు. యుద్ధ సంక్షోభంలో నేనంతగా ఉమామహేశ్వరరావు ప్రయత్నాన్ని పట్టించుకోలేదు. ఎన్నాళ్ళో కాలేదు. అతను అన్నీ మానేసి సైన్యంలో చేరాడు. నేను గుంటూరు వదిలి మదరాసు వెళ్ళిపోయాను. నేను మదరాసులో మకాం పెట్టిన మరుసటి సంవత్సరం నేనూ, బెల్లంకొండ _ రామదాసూ కలిసి తిరువళ్ళిక్కేజిలో ఓ గదిలో ఉండేవాళ్ళం. ఒకరాత్రి స్నేహితులతో పోయి మర్నాడు పొద్దునే గది కొచ్చాను. గది తలుపులు బార్లగా తీసి ఉన్నాయి. గడపకి ముందుగా ఒకతను అర్ధనగ్నంగా తలకింద మిలటరీ సంచి పెట్టుకుని నేలమీద పడుకుని ఉన్నాడు. లోపలికి అతజ్జి దాటుకు పోవటం కష్టం. అతనెవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను. గదిలోంచి సారా వాసన! ఏం చెయ్యాలో తోచక వరండాలో పచార్లు చేస్తుండగా రామదాసు వచ్చాడు నవ్వుతూ. “ఉమాయ్‌ రాత్రొచ్చాడు. ఇక్కడే వుంటానన్నాడు. సరేనన్నాను.” అలా, మా దగ్గర నెలరోజులున్నాడు. అతనితో మేం వేగలేక పోయాము. మదరాసులో ఆంధ్రపత్రిక సంపాదక వర్గంలో ఉమామహేశ్వరరావు చేరాడు. అతనూ, ఆ పత్రికాధిపతి శివలెంక శంభుప్రసాద్‌గారూ సహాధ్యాయులని విన్నాము. పొద్దున ఆలస్యంగా లేచి, ఏ రాత్రి పన్నెండు గంటలకో వచ్చేవాడు. నేనూ, రామదాసూ గాఢనిద్రలో ఉండగా లేపేవాడు. ఒకంతట ఉమాయ్‌కి నిద్రపట్టేది కాదు. ఏదో మాట్లాడమనేవాడు. చిత్తుగా తాగిన మైకంతో ఉందేవాడు. గది అంతా వాసన, వరండా అంతా వాసన. వరండాలో మా ఇంటాయన మొదలియారు పడుకుని ఉండేవాడు. ఆయనది యమగురక, ఆ గురకకు తోడు ఉమాయ్‌ వాగుడు, వాసన, మాకు దుర్భరంగా ఉండేది, ఈ విషయం మీద ఓ రోజు నేనూ రామదాసూ ఘర్షణకూదా పడ్డాము. ఉమాయ్‌ని ఎలా సంస్కరించాలో మాకు బోధపడలేదు. వయస్సులో అతనికన్నా చిన్నవాళ్ళం. అతనికీ, మాకూ సాహిత్యమే ఒక లంకెలా ఉండేది. అదే మా బలహీనత అని గుర్తించాము. ఓ రోజున ఉమాయ్‌తో వేరేగది చూసుకోమని చెప్పాము. సరేనన్నాడు కాని, ఆ ప్రయత్నం చేస్తున్నట్లు మాకు తోచలేదు. రాత్రిళ్ళు తొందరగా ఇంటికి రావటం మొదలుపెట్టాడు. రావటంతోటే మాతో కవిత్వం మీద చర్చ ్రారంభించేవాడు. తను ఎలాంటి వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడో సోదాహరణంగా చెప్పేవాడు. రాత్రి పన్నెందయ్యేది. అప్పుడు తన గేయాలను పాడేవాడు. మాకు నిద్ర వస్తోందనీ, మర్నాడు ఉద్యోగానికి పోవాలనీ చెప్పినా వినేవాడుకాదు. మేం నిద్ర నటించేవాళ్ళం. అతడు పాడుతూనే ఉండేవాడు. మేం నిద్ర నటించినా ధ్యాస అంతా అతని పాటమీదే ఉండేది. “నా పేరు లీల!

కవిత్వంలో రౌడీ వేషం... 81

ఆ ఊరి గోల పడలేక పొరుగూ రొచ్చాను!”

మేం నిద్రలో ఉండేవాళ్ళం. అతను పాట ముగించి నిద్రపోయేవాడు. పొద్దున్నే లేచి నేనూ, రామదాసూ ఎవరిమానాన వాళ్ళం వెళ్ళిపోయే వాళ్ళం. మళ్ళీరాత్రిదాకా ఉమాయ్‌ కనిపించేవాడు కాదు.

ఆ రోజుల్లో అతను కవిత్వం రాయటం పూర్తిగా మానేశాడు. ఓ నవయుగానికి తనో(ద్రష్ట ననుకునేవాడు. ఆ విషయాన్ని ఎక్కువగా ఎవరూ పట్టించుకోలేదని కొంచెం కోపంగా కూడా ఉండేదతనికి. ముఖ్యంగా శ్రీరంగం శ్రీనివాసరావుని అలాంటి సందర్భాల్లో ప్రస్తావించటం అతనికి కొంచెం కష్టంగా ఉండేదని మేము గ్రహించేవాళ్ళం. దానికో కారణం ఉంది. 1933 మార్చిలో అభినవాం(ధ్ర కవి పండిత సభ బరంపురంలో జరిగింది. ఆ సభలో మొదటిసారి ఉమామహేశ్వరరావు కవిగా యావదాంధ్రానికీ పరిచయమయాడు. అతను రానీన 'మారో మారో మారో” అనే గేయాన్ని ఆ నభా నమక్షంలో ఉమామహేశ్వరరావే పాదాడని నాకనిపించేది - శివశంకరశాస్రిగారు చదివారని తరవాత శ్రీశ్రీ రాశాడు. అప్పటికి శ్రీశ్రీ 'మరోప్రపంచం' రాయలేదు. మిత్రులందరూ ఆ పాటను విన్న తరువాతనే శ్రీశ్రీ తత్రోద్చలం మీద 'మరో ప్రపంచం” రాశాడని అనేవారు. అందులో నిజం లేకపోలేదని నాకు తెలుసు. శ్రీశ్రీకి తెలుసు. మా మదరాసు రోజుల్లో శ్రీశ్రీ సుతరామూ అందుకు ఒప్పుకొనేవాడు కాదు. శ్రీశ్రీకి నేను నచ్చచెప్పచూశాను. గీతాలు వేరు, ఎత్తుబడిలోనే కదా నీ అనుకరణ, ఆమాత్రం ఒప్పుకుంటే తప్పులేదన్నాను. అతను వినలేదు. తరవాత ఎన్నాళ్ళకో అన్నాడు. ఇప్పుడు ఉమామహేశ్వరరావు గీతం పూర్తి పాఠం దొరకటం దుర్లభం.

మదరాసులో డేవిడ్‌ కఫే అనే మధుశాల ఉండేది. ఓసారి నేనూ, శ్రీశ్రీ - మల్లాది రామకృష్ణశాస్రిగారితో కలిసి అందులోకి పోయాము. అదే సమయంలో దారిన పోతున్న ఉమామహేశ్వరరావు మమ్మల్ని అనుసరించాడు. తీరా మేం బల్లదగ్గర కూర్చోగానే ఎదుట (ప్రత్యక్షమయ్యాడు. అవీ ఇవీ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాము. కొంచెం తలకెక్కితే ఉమామహేశ్వరరావు సంస్కృతంలో పలకరించటం రివాజు. మేం పట్టించుకునేవాళ్ళం కాదు. ఆ రోజున శ్రీనివాసరావుకు ఒళ్ళుమండి పోయినంత కోపం వచ్చింది. “మా అమ్మనంటావురా?...” అని లేచాడు. ఇద్దరూ ఒకరిచాక్కా ఒకరు పట్టుకున్నారు. శాస్త్రిగారు కిమ్మనకుండా కూచున్నారు. నేను కలగజేసుకోబో తుంటే కనుసైగ చేసి ఊరుకోమన్నారు. ఇంతలోకి అక్కడి బేరర్సు వచ్చి వాళ్ళను విడదీశారు. అంతటితో వాళ్ళిద్దరూ ఆగలేదు. ఒకళ్ళనొకళ్ళు నోరారా ఆడిపోసు కున్నారు. అప్పుడే ఉమామహేశ్వరరావు “నిన్ను చంపేదాకా నిద్రపోనురా!” అని బల్లగుద్ది అరిచాడు. అప్పుడు శాస్రిగారు ఆపేయమన్నారు.

ఆ తరువాత కొన్నేళ్ళకి ఉమామహేశ్వరరావు అన్నంతపనీ చెయ్యటానికి 'ప్రయిత్నించాడు. శ్రీశ్రీని గుంటూరు దగ్గర పొలాల్లో గడ్డివాముకు కట్టి కాల్చెయ్య పోయాడు. అదో పెద్దకధ. శ్రీశ్రీ నాకు ఆ కధ చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో వెనకటి భయం

92 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య కనిపిస్తుండేది. అతణ్జి కాల్బటానికి ప్రయత్నిస్తున్నప్పుడు “మారో మారో మారో” అని ఉమామహేశ్వరరావు పాడాడట! ఇంతకీ నేనూ, రామదాసూ మేం తీసుకున్న గదిని వదిలేసి వెళ్ళిపోయాం. ఉమాయ్‌ అందులోనే కొన్నాళ్ళున్నాడు. ఇంటి యజమాని మొదలియారుతో దెబ్బలాట పెట్టుకుని ఉమాయ్‌కూడా ఖాళీచేశాడు. వెంటనే ఆంధ్రపత్రికలో ఉద్యోగం కూడా పోయింది. ఉమామహేశ్వరరావు విచిత్రమైన వ్యక్తి. మనిషి శుభ్రత పాటించేవాడు. మాటాడినంత సేపూ బాగానే వున్నట్లుండి - హఠాత్తుగా మారిపోయే వాడు. అక్కడే అందరికీ అతనంటే బాధాకరంగా వుండటం. అంతేకాక వ్యక్తిగత జీవితంలో కొన్ని అవాంఛనీయమైన లక్షణాలు అందరికీ అర్ధం అయేరకంగా ప్రవర్తించేవాడు. వెర్స్‌ లిబ్రో అనే ప్రక్రియ తెలుగులో అతనితోనే ఆరంభం. అందులో పరిపూర్ణ ప్రావీణ్యం సంపాయించకుందా ప్రయోగాలు చెయ్యటం ప్రారంభించాడు. ఆంగ్లసాహిత్యంలో అతనికి దొరికినంత ప్రవేశం తెలుగులో దొరక్కపోవటం వల్ల అతనికి తగిన పేరు రాలేదు. భాషమీద అతనికున్న అధికారం అత్యల్పం. దానికితోడు సంక్షిషుయిన భావ శబలత. అయితే, ఒక నవీన మార్గాన్ని తెలుగు సాహిత్యంలో నిర్దేశిస్తున్న అహంభావాన్ని తన సంభాషణల్లో ప్రస్ఫుటం చేసేవాడు. అతను నవీన మార్గదర్శిగానే వుండిపోయాడు ఆ మార్గాన పయనించ లేకపోయాడు. అలాంటి మార్గాన పయనించి కొంతవరకు కృతకృత్యు దయినవాడు, శ్రీరంగం శ్రీనివాసరావని మనందరికీ తెలుసు. శిష్‌ట్లా ఉమామహేశ్వరరావుని వినూత్న మార్గదర్శిగా (ప్రచారం చేసేందుకు శివశంకరశాస్రి ప్రభృతులు చాలా దోహదం చేయటం జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారిచేత కూడా యోగ్యతాపత్రం ఇప్పించే ప్రయత్నమూ జరిగింది. వారి ఆశయాల కనుగుణంగా ఉమామహేశ్వరరావు కవిత్వంలో పురోగమించ లేకపోయాడు. దానికితోడు అనతికాలంలోనే కవిత్వానికి స్వస్తి పలికాడు. అంతమాత్రాన ఉమామహేశ్వరరావుకి తెలుగు సాహిత్యంలో సముచిత స్థానం లేకపోలేదు. అతను రాసిన ఒకటి, రెండు గీతాలు కలకాలం చెప్పుకోదగ్గవి. అందులో 'జ్ఞాపకాలు' అన్న గీతం 'వెర్స్‌ లిబ్రొలో తలమానికంలాంటీిది. అది చదువుతున్నప్పు డల్లా “ఎజ్రాపౌంద్‌” గుర్తుకు రాకమానడు. అతడు ఎనిమిదో శతాబ్దంలోని చైనా కవి రిహాకు రాసిన పాటల్ని ఆంగ్లంలో తర్జుమా చేశాడు. అందులో ముఖ్యంగా నదీ వ్యాపారి భార్య

  • ఉత్తరం - అనే గేయం, ఉమామహేశ్వరరావు “జ్ఞాపకాలు చదువుతుంటే, గుర్తుకు రాక మానదు. ఉమామహేశ్వరరావు నాతోనూ, రామదాసు తోనూ కలిసి వున్న రోజుల్లో ఈ గేయాన్ని తరచు పొడుతుండేవాడు. గుండె కదిలి కరిగిపోయేది. అమాంతం ఒళ్ళు కంపించేది. ఇప్పటికీ ఆ పాటా, అతని గానమాధుర్యమూ నాకు స్ఫురణకు వస్తుంటాయి. ష్‌

తం వోల్లేర్‌ రగిలించిన లా అల్లి భావ విప్లవ జ్వాల ళా -నండూరి రామమోహనరావు

“న్స్‌ చైప్పేదానిలో ఒక్కమాటను కూడా నేను అంగీకరించను. కొని, ఆమాట

చెప్పడానికి నీకు గల హక్షును నా ప్రాణమిచ్చి అయినా సమర్ధిస్తాను”. ప్రజాస్వామ్యానికి వాక్‌ స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి ఈ సుభాషితాన్ని పలువురు ఉదహరిస్తూ వుంటారు.

“నేను నమ్మినట్టు నమ్ము, లేకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు” అంటూ ఇవాళ భయపెట్టేవాడు 'నేను నమ్మినట్టు నమ్ము, లేకపోతే నిన్ను చంపేస్తాను" అని రేపు నిన్ను బెదిరించడానికి వెనుకాడడు.”

మత మౌధ్యం వెనుక ఎంత క్రౌర్యం దాగివుందో తెలపడానికి ఈ సుభాషితాన్ని కూడా పలువురు ఉదహరిస్తూ వుంటారు.

ఈ సుభాషితాల కర్త (ఫెంచి మహా రచయిత, మేధావి, తాత్వికుడు అయిన వోల్టేర్‌.

ఇవే కాదు. ఇలాంటి వందలాది సుభాషితాలకు అతడు కర్త. నిజానికి వోల్టేర్‌ సుభాషిత రత్నాకరుడు.

చిత్రం ఏమంటే ఈ రోజులలో ఈ సుభాషితాలు అతి సామాన్యంగా కనిపిస్తాయి. నియంతృత్వం వున్న దేశాలలో తప్ప ఇలాంటి సుభాషితాలు చెప్పడానికి పెద్ద ధైర్యం అక్కరలేదు.

సాహసి

కాని, వోల్టేర్‌ కాలంలో ఫ్రాన్సులో అలాకాదు. అప్పటి ఫ్రాన్సులో ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదు. నిరంకుశత్వం రాజ్యంచేస్తూ వుండేది. మతమౌధ్యం వేయి పడగలు విప్పి బుసలుకొడుతూ వుండేది. రాజు పద్నాలుగవ లూయీ “నేనే రాజ్యాన్ని” (ఐ యామ్‌ ది స్టేట్స్‌ అన్నాడు. రాజుకు, రాజదర్చారుకు, మతానికి, మతాధికారులకు వ్యతిరేకంగా పల్లెత్తుమాట పలికినా, 'బాస్టీల్‌ అనే ఘోర కారాగారం తలుపులు తెరుచుకునేవి. నిందితుడిని కబళించి మూసుకునేవి. ఆనాటి రాజరిక నిరంకుత్వానికి ప్రతీక బాప్టీల్‌. దాని మరోపేరు నరలోక నరకం.

84 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య చివరికి ఫ్రెంచి ప్రజలు 1789లో రాజుపై తిరుగుబాటు చేశారు. అదే ఆధునిక ళీ ప్రవానికి ఫ్రెంచి ప్రజలను మానసికంగా, చరిత్రను మలుపుతిప్పిన (ెంచి విప్లవం. ఆ విష్ల వున్నారు. వారందరిలోకి సిద్ధాంతపరంగా సిద్ధంచేసిన మహామహులు చాలామంది వున్నాలు. ప్రసిద్ధులైన వారిలో ఒకడు వోల్టేర్‌. మరొకడు రూసో. వోల్టేర్‌, రూసోలు ఉత్తర, దక్షిణధ్రువాలు, వోల్టేర్‌ హేతువాది, మేధావాది. రూసో హృదయవాది, ప్రకృతివాది. వీరిరువురు కలిసి స్వదేశ, విదేశాలలో సమకాలికులను విపరీతంగా ప్రభావితులను చేశారు. దంత గోపురంలో కూర్చొని పరవస్తు తత్వాన్ని గురించి తర్జనభర్జనలు చేస్తున్న తత్వశాస్తాన్ని నేలమీదకు లాక్కువచ్చి నాలుగు బజార్ల కూడలిలో నిలబెట్టి ప్రజలకు మార్గనిర్దేశం చేసే సాధనంగా దాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా వోల్టేర్‌. జననం వోల్టేర్‌ అసలు పేరు ఫ్రాన్‌స్వా మారీ అరూయేట్‌. పారిస్‌లో 1694లో జన్మించాడు. తండ్రి వృత్తిరీత్యా నోటరీ : మధ్య తరగతి కుటుంబీకుడు. వోల్టేర్‌ పుట్టడమే అర్భకంగా అనారోగ్యంతో పుట్టాడు. నాలుగు రోజులకంటె ఎక్కువ బ్రతకడని దాది చెప్పింది. నాలుగు రోజులు కాదు - 84 సంవత్సరాలు బ్రతికాడు వోల్టేర్‌. ముగ్గురు (ఫెంచిరాజులు - 14వ, 15వ, 16వ లూయీల - పరిపాలన చూశాడు. అయితే అంత దీర్ధకాలమూ అర్భకంగా, అనారోగ్యంతోనే బ్రతికాడు. పొడుగు ముక్కు పొడుగు ముఖం, ముఖంనిండా మచ్చలు, గుంటకళ్లు, చప్పి దవడలతో వికారంగా వుండేవాడు. అయితే అర్భకత్వం దేహానికే తప్ప మేధకు కాదు. కురూపం ముఖానికే తప్ప మనస్సుకు కాదు. అంత చురుకైన, పదునైన మేధాశక్తి, విద్వత్తు, (ప్రతిభ, ప్రపంచ చరిత్రలోనే అరుదు. ధైర్యసాహసాలలో, అపాయాన్ని లెక్కచేయని మొండితనంలో అతనిదే బిరుదు. 99 సంపుటాలు తొలి యావనంలోకి తొంగిచూచిన క్షణంనుంచి 84వ యేట కన్నుమూసే వరకు వోల్టేర్‌ ఎత్తిన కలం దించలేదు. తెరిచిన నోరు మూయలేదు. అతని కలంనుంచి పుంఖాను పుంఖంగా - సమకాలికులను పొట్టచెక్క లయ్యేటట్టు నవ్వించిన- మనదీ ఒక బ్రతుకేనా అని వారి ఆలోచనలను కవ్వించిన- నవలలు, నాటకాలు, పిట్ట కథలు, కట్టుకథలు, చరిత్రలు, సంగీత రూపకాలు, లఘుకావ్యాలు, మహాకావ్యాలు, వ్యాసాలు, తాత్విక, వైజ్ఞానిక (గ్రంథాలు - ఒకటేమిటి - సమస్త సాహిత్య ప్రక్రియలలోను రచనలు వెలువడ్డాయి. అవికాక వారికీ వీరికీ పదివేలదాకా ఉత్తరాలు (వ్రాశాడట! అతని రచనా సంపుటాలు 99 వరకు వుంటాయట. ఇక అతడు ఎక్కడవుంటే అక్కడ విద్వద్గోష్టి జరగవలసిందే. శరపరంపరగా అతడు గుప్పించే హాస్యచకురోక్తులతో శ్రోతలు హాస్యపరవశులు కావలసిందే.

వోల్టేర్‌ రగిలించిన భావ విప్లవ జ్వాల... 35 కత్తిగా కలం

అయితే అతడు సాధారణ సాహిత్యవేత్త మాత్రమేకాడు. తన రచనలను సరదాగా పాఠకుల వినోదంకోసం (వ్రాయలేదు. సమకాలిక సమాజ వ్యవస్థలోని దురన్యాయాలను, దురంతాలను, మోసాన్ని శ్రార్యాన్ని రాజు నిరంకుశత్వాన్ని మూఢ మత విశ్వాసాలను చీల్చి చెండాడడానికి తనకలాన్ని కత్తిగా వాడాడు. తన మాటలను ఈటెలుగా ప్రయో గించాడు. సమాజ పరివర్తన కోసం, పీడిత ప్రజల భుజం తట్టి ధైర్యాన్ని పురికొల్పడానికి, వారి కన్నీరు తుడవడానికి, వారిలో భవిష్యత్తుపై ఆశను చిగురింప జేయడానికి తన సాహిత్య సమస్తాన్ని అంకితం చేశాడు.

ఆ కాలంలో వోల్టేర్‌ రచనలు ప్రజలను ఎంతగా వినోదింపజేసేవో, అంతగా అతడు లేవదీసిన రాజకీయ, తాత్విక, మత సమస్యలను గురించి ఆలోచింప చేసేవి. ఫ్రెంచిలో నాటికి నేటికి అంత అందమైన, శక్తివంతమైన వచనశైలి మరొకరిలో కనబడదని ప్రతీతి. అయినా ఈ రోజులలో అతని అసంఖ్యాక రచనలలో ఏవో కొన్ని తప్ప మిగిలినవి ప్రచారంలో లేవు. వాటిని ఇప్పుడెవరూ చదవరు. అవి సమకాలిక ప్రయోజనాలను ఉద్దేశించి వ్రాసినవి. వాటి ప్రయోజనం తీరిపోవడంతో అవి విస్యృతి యవనిక చాటుకువెళ్ళి పోయాయి. కాని, నేటికీ కాండిడ్‌, మైక్రో మెగాన్‌, జాడిగ్‌ వంటి కథలు, ముఖ్యంగా అతని లేఖా సాహిత్యం పారకులను అలరిస్తూనే ఉన్నాయి.

సాహిత్యోపజీవి

తండ్రి అతనికి మంచి చదువే చెప్పించాడు. జెసూయిట్‌ కాలేజీలో చదువుకున్నాడు. ఆ రోజుల్లో నీతి నాటకాల (మొరాలిటీ ప్లేస్‌లో వేషాలు వేసేవాడు. కొన్ని తనే వ్రాసి ప్రదర్శించేవాడు. (బహుశా చిన్ననాటి ఈ నాటకాల ప్రభావం అతనిపై వుందేమో, సాహిత్యం సందేశాత్మకంగా, సమాజ పరివర్తనకు సాధనంగా వుండాలన్న భావానికి ఆ నీతి నాటకాల (ప్రభావమే కారణమేమో).

తండ్రి అతడిని వ్యాపారంలో ప్రవేశపెట్టాలని, ఒక ధనిక వర్తకుని కుమార్తెతో వివాహం చేయాలని తన ఇల్లు పిల్లాజెల్లాతో కలకల లాడాలని కలలు కన్నాడు. కాన్ని, వోల్టేర్‌ తండ్రి మాట పెడచెవిని పెట్టాడు. సాహిత్యమే తన భ్యేయమన్నాడు. సాహిత్యం కూడు పెట్టదని తండ్రి కోప్పడ్డాడు. కాని సాహిత్యం అతనికి కూడు పెట్టడమే కాదు. అపార భోగభాగ్యాలు ఇచ్చింది. అజరామరమైన కీర్తి తెచ్చింది.

తండ్రి మరి లాభంలేదని వోల్టేర్‌ను హేగ్‌ నగరానికి (ఫెంచి రాయబారివద్ద ఉద్యోగిగా పంపించాడు. అక్కడ అతడు ఒక పేదపిల్లను (ప్రేమించి ఆమెతో లేచిపోవడానికి ష్లాన్‌ వేశాడు. తండ్రి అతడిని అరెస్టు చేయిస్తానని బెదిరించి తిరిగి పారిస్‌ లాక్కొచ్చాడు.

86 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య తిట్టే నోరు తిట్టేనోరు, తిరిగే కాలు వూరుకోవని సామెత. వోళ్టేర్‌కు తిట్టేనోరు, తిరిగే కాలు రెండూ వున్నాయి. అతడి నోటికి తాళం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఛలోక్తులు పిసురుతూండేవాడు. ముఖ్యంగా రాజదర్చారుకు చెందిన ఉన్నతాధి కారులపై, ప్రభువంశీకులపై వ్యంగ్య బాణాలు గుప్పిస్తూ వుండేవాడు. అవి వూరంతా పాకేవి. పారిస్‌లో ఎవరు ఏ రాజోద్యోగిపై ఛలోక్తి విసిరినా అది వోల్టేర్‌కే అంట కట్టేవారు. అప్పటికి 14వ లూయీ చనిపోయి, పసివాడయిన 15వ లూయీ రాజు అయ్యాడు. అతని పేరుపై పరిపాలన చేసే రాజ ప్రతినిధి విలాస జీవితంపై వోల్టేర్‌ ఏదో అనరానిమాట అన్నాడని ఫిర్యాదు వచ్చింది. వెంటనే వోల్టేర్‌ను బాప్టిల్‌ జైలులో పెట్టారు. జైలులో వోల్టేర్‌ పదకొండు నెలలు గడిపాడు. ఆ రోజులలోనే అతడు తనపేరును “వోల్టేర్‌”గా మార్చుకొన్నాడు. “హెనియాడ్‌” అనే మహాకావ్యం రాసి పారేశాడు జైలునుంచి విడుదల అయిన తర్వాత కూడా అతని కలం, నోరు ఆగలేదు. మత అసహనాన్ని నిరంకుశ రాజరికాన్ని విమర్శిస్తూ రచనలు ప్రారంభించాడు. నాటక రచన ఆ రోజులలోనే “ఈ డి పొ అనే విషాదాంత నాటకం వ్రాశాడు. దాన్ని పారిస్‌లోని 'ప్రధాన నాటక మందిరంలో (ప్రదర్శించారు. ఆ నాటక మందిరంలో ఎంత గొప్ప రచయిత నాటకమైనా అయిదు రాత్రులు వరుసగా ఆడితే గొప్ప. వోల్టేర్‌ నాటకం నలఖై రాత్రులు వరసగా ఆడింది. అతనికి నాలుగువేల ఫ్రాంకుల ఆదాయం వచ్చింది. (ఫెంచివారు అతడిని 23-24 ఏళ్లకే ఒక మహారచయితగా గుర్తించారు. ఇక అక్కడనుంచి అతని ఆదాయం, కీర్తి పెరగడమే తప్ప తరగడం అనేది లేదు. వోల్టేర్‌ సాహిత్యంలో ఎంత ఘనుడో వ్యాపారంలో అంత ఘటికుడు. సాహిత్యంలో వచ్చిన ఆదాయాన్ని స్పెక్యులేషన్‌ వ్యాపారంలో మదుపుచేసి ఇంకా భాగ్యశాలి అయ్యాడు. వోల్టేర్‌ నోటి తీట మరొకసారి అతడిని జైలుకు పంపించింది. షెవాలియర్‌ డీ రోహన్‌ అనే కులీనుడితో ఒక స్త్రీ విషయమై తగాదా పడ్డాడు. రోహన్‌ వోల్టేర్‌ను అవమానించడానికి అదనుకోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరోజున వోల్టేర్‌ స్నేహితులతో ముచ్చటిస్తూ జోకుల బాకులు విసురుతూ నవ్విస్తూ వుండగా అక్కడికి రోహన్‌ వచ్చాడు. “అరూయేట్‌, వోల్టేర్‌ - ఈ రెండింటిలో నీ అసలు పేరు ఏది” అని అడిగాడు. “నా పేరు అంత చెప్పుకోదగిన గొప్పపేరు కాదు. కొని, నా పేరు నా పేరుకు గొప్పపేరు తెచ్చే పేరు” అన్నాడు వోల్టేర్‌. దీని అర్ధం “నీ వంశం పేరు గొప్పది కావచ్చు. నీకు దానివల్లనే పేరు వచ్చింది తప్ప నువ్వు వట్టి బడుద్దాయివి. నేను సామాన్యుడిగా

వోల్టేర్‌ రగిలించిన భావ విప్లవ జ్వాల... 87 పుట్టినా ప్రతిభవల్ల గొప్పవాడిని” అని. వోల్టేర్‌ సమాధానం విని అందరూ గొల్లున నవ్వారు. రోహన్‌ ముఖం కందగడ్డలా అయింది. అప్పటికి వెళ్లిపోయి మర్నాడు చీకటిలో వోల్టేర్‌ ఒంటరిగా పోతుండగా ఆరుగురు గూండాలచేత చితక్కొట్టించాడు.

వోల్టేర్‌ చాపు తప్పి కన్ను లొట్టపోయి బయటపడినా పౌరుషశాలి కనుక, ఆ రాత్రికి రాత్రి కత్తియుద్ధం నేర్చుకున్నాడు. మర్నాడు రోహన్‌ను ద్వంద్వయుద్దానికి ఆహ్వానించాడు. అతని మాట ఎంత పదునో కత్తికూడా అంతపదునే అని (గ్రహించిన రోహన్‌ భయపడిపోయి, పోలీసులకు ఫిర్యాదుచేశాడు. మళ్లీ బాప్టీల్‌కు అతిధిగా వెళ్లాడు వోల్టేర్‌.

ప్రవాస జీవితం

కాని, వెంటనే అతడిని అధికారులు విడుదలచేశారు. దేశ బపొష్మార శిక్ష విధించారు. వోల్టేర్‌ తన (ప్రవాస జీవితానికి ఇంగ్రండును ఎంచుకున్నాడు. ఇంగ్లండులో మూదేళ్ల (ప్రవాసం వోల్టేర్‌ జీవితంలో ఒక ముఖ్యఘట్టం.

వెళ్లిన మూడు నెలల్లో ఇంగ్లీషు భాష వ్రాయడం, చదవడం నేర్చుకున్నాడు. ఇంగ్లీషులోని ఉత్తమోత్తమ సాహిత్యాన్ని, వైజ్ఞానిక వాజ్మయాన్ని అపోశన పట్టాడు. ఇంగ్లీషువారు ఆరాధించే షేక్‌స్పియర్‌ నాటకాలు అతనికెందుకో నచ్చలేదు. వాటిని నాటురకం, మోటురకం నాటకాలుగా ఈసడించాడు. అనుభూతి వాద (ఎంపి రిసిజమ్‌) ప్రవక్త జాన్‌ లాక్‌ గ్రంధాలను మధించాడు. వాటివల్ల ప్రభావితుడయ్యాడు. అతడు ఇంగ్లందు వెళ్లిన కొద్దిరోజులకే (1727) న్యూటన్‌ మరణించాడు. న్యూటన్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. న్యూటన్‌ సిద్ధాంతాలను జీర్ణించుకుని, అతడిని తన ఏకైక గురువుగా భావించుకున్నాడు. ఆనాటి ఇంగ్లీషు మేధావులు, రచయితలు - ముఖ్యంగా జొనాధన్‌ స్విఫ్ట్‌, కాంగ్రీన్‌, ఎడిసన్‌, అలెగ్జాండర్‌ పోప్‌లాంటి వారితో స్నేహంచేశాడు. వారుకూడా ఇతడిని ఎంతో గౌరవించారు.

ఇవన్నీ ఒక ఎత్తు. ఇంగ్లీషువారి లిబరల్‌ రాజకీయ, సాంఘిక, మత వ్యవస్థల పట్ల వోల్టేర్‌ పెంచుకున్న ఆరాధనాభావం మరొక ఎత్తు. ఇంగ్రండును వర్తకుల దేశమని (ఎ నేషన్‌ ఆఫ్‌ మర్చంట్స్‌) ఎగతాళి చేశాడుగాని, అక్కడి వాక్‌ స్వాతంత్ర్యం, మత స్వేచ్చ, భావస్వేచ్చలను, ఫ్రాన్స్‌లోని దుర్భర పరిస్థితులతో పోల్చి చూసుకుని బాధపడ్డాడు. ఇంగ్లండు పట్ల తన మెచ్చుకోలును, '్రాన్సు పట్ల తన ఏవగింపును పారిస్‌లోని స్నేహితులకు ఉత్తరాలలో వ్యక్తంచేశాడు.

తిరిగి పలాయనం

ప్రవాసశిక్ష ముగిసిన తర్వాత పారిస్‌ తిరిగి వచ్చాడు. కొన్నాళ్లు బాగానే గడిచింది.

కాని, అతడు స్నేహితులకు (ప్రయివేటుగా (వ్రాసిన ఉత్తరాలన్నిటిని ఎవరో సేకరించి

88 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య పుస్తకంగా అచ్చువేశారు. అందులో ఫ్రాన్సు పేరు ఎక్కడా లేకపోయినా, అన్యాపదేశంగా అతడు విమర్శించిన దేశం అదే అని తెలుస్తూనే వుంది. దానితో అధికారులు మండిపడి ఆ పుస్తకం (ప్రతులు తగలబెట్టించారు. వోల్టేర్‌ అరెస్టుకు ఉత్తర్వు జారీ అయింది. ఫెంచివారికి బుద్ధిచెప్పే ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించి తనకాలికి బుద్ధిచెప్పాడు. అప్పుడు షాంపేన్‌ రాష్ట్రంలోని 'సైరీలో మార్క్విస్‌ డు షాటిలే అనే సామంత ప్రభువు వోల్టేర్‌ కు తన లోగిలిలోను, ఆయన భార్య మదాం డు షాటిలే తన కౌగిలిలోను ఆశ్రయమిచ్చారు. వోల్టేర్‌ పట్ల వారి గౌరవప్రవత్తులు అంతటిని. ముగ్గురు పిల్లల తల్లి మదాం దు షాటిలే అద్భుత సౌందర్య ఖని, అద్భుత విదుషీమణి. గణిత, భౌతిక, రసాయనిక శాస్త్రాలను, సాహిత్యాన్ని ఆమె కాచి వడబోసింది. న్యూటన్‌ “ప్రిన్సిపియా” (గ్రంధాన్ని ఫెంచిలోకి అనువదించింది. ఆమె భర్త ఎప్పుడూ కదనకుతూహలంతో ఏవో యుద్దాలలో సేనానిగా పాల్గొంటూ దేశాంతరాలలో వుందేవాడు. ఇంటివద్ద ఈమె వోల్టేర్‌తో మదన కుతూహలం తీర్చుకునేది. ఈ విషయం ఫ్రాన్సు అంతా పొక్కింది. భర్త తెలిసీ తెలియనట్టు నటించేవాడు. అర్లీ విద్వద్దోష్టులు సైరీలో వోల్టేర్‌ పదిహేనేళ్లు గడిపాడు. వారి శృంగార వ్యాసంగం మేధా వ్యాసం గానికి అడ్డురాలేదు. పొద్దున లేచింది మొదలుకొని పగలంతా ఎవరి గదులలో వారు రచనలలో, వైజ్ఞానిక పరిశోధనలలో, ప్రయోగాలలో మునిగి తేలేవారు. వోల్టేర్‌ కోసం దేశదేశాంతరాల నుంచి కవి - పండితులు వచ్చేవారు. రాత్రి తొమ్మిది గంటలకు వారికి వోల్టేర్‌ మదాం డు షాటిలే దర్శనమిచ్చే వారు. పండిత గోష్టులు సందడిగా జరిగేవి, వోల్టేర్‌ తన కథలు, నవలలు, నాటకాలు వినిపించేవాడు. నాటకాలు ప్రదర్శించేవాడు. వాటిలో వేషం వేసేవాడు కూడా. రాను రాను మదాం డు షాటిలేకు వోల్టేర్‌ పై మోజు తగ్గింది. ఒక యువకవిని చేరదీసింది. వోల్టేర్‌ అసూయాగ్రస్తుడయ్యాడు. ఇంతలో మదాం డు షాటిలే వ్యాధిగ్రస్తురాభై మరణించింది. వోల్టేర్‌ విషాదభాదతో పారిస్‌ ముఖం పట్టాడు. కాని, అతడిని అధికారులు పారిస్‌లో అడుగు పెట్టనివ్వలేదు. (ఫెదరిక్‌ ఆశయం ఎటు పోవడమో తోచని స్థితిలో అంతకుముందు నుంచి ఉత్తరప్రత్యుత్తరాలతో వోల్టేర్‌పట్ల ఆరాధనా భావం పెంచుకున్న ప్రష్యా రాజు ఫ్రెడరిక్‌ ది గ్రేట్‌ ఆహ్వానం పంపాడు. వోల్టేర్‌ బెర్లిన్‌ వెళ్లాడు. తిరిగి మూడేళ్లు ప్రష్యాలో ప్రవాసం, తిరిగి రచనలు, గోష్టులు, మిత్రులపై ఛలోక్తులు, శత్రువులపై చండోక్తులు.

వోల్టేర్‌ రగిలించిన భావ విప్లవ జ్వాల... 89

కొన్నాళ్లకి (్రెదరిక్‌కి కూడా మోజు తగ్గింది. “మహా అయితే వోల్టేర్‌ను మరో ఏడాది వుందనిస్తాను. బత్తాయిపండును ఎవరైనా రసమంతా పిండేశాక తొక్క పారేస్తారు కదా” అని ఎవరితోనే అన్నాడట. ఆమాట వోల్టేర్‌ చెవిని పడింది. (ఫ్రెడరిక్‌ చేతిలో బత్తాయిపండు కావడం ఇష్టంలేక మళ్లీ పలాయన మంత్రం పఠించాడు.

అటు తిరిగి, ఇటు తిరిగి, ఎక్కడా నిలవలేక, నిలవనీడ దొరక్క, చివరికి స్విట్టర్లాండుకు, ఫ్రాన్సుకు మధ్య సరిహద్దులో ఫెర్నీ అనేచోట స్థిరపడ్డాడు. స్విస్‌ పోలీసులు అరెస్టు చేయవస్తే ఫ్రాన్సులో కాలు పెట్టవచ్చు. (ఫ్రెంచి పోలీసులు వస్తే స్విట్టర్లాండులోకి దూకవచ్చు.

ఫెర్నీలో ఒక పెద్ద ఎస్టేటు ఏర్పాటుచేసుకున్నాడు. విశాలమైన ఉద్యానవనం నిర్మించాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ విద్వత్సభలు జరగవలసిందే కదా? ఇంగ్లండు నుంచి గిబ్బన్‌, బాస్వెల్‌ లాంటివారు, పారిస్‌ నుంచి, తక్కిన యూరపియన్‌ నగరాల నుంచి తీర్ధ ప్రజలాగా రచయితలు, తాత్వికులు వచ్చేవారు. వోల్టేర్‌ ఆతిధ్యం స్వీకరిస్తూ కొన్నాళ్లు గడిపి వెళ్లేవారు.

దీర్ధ వార్ధక్యం

అప్పటికి అతనికి వృద్ధాప్యం వచ్చేసింది. అయితే ఇంకా ఇరవై ఏళ్లకు పైగా ఆ వృద్ధాప్యం గదపవలసి వుంది, దేహం కృశిస్తున్నకొద్దీ మేధ పెరిగింది. రచనా బాహుళ్యం, వైవిధ్యం పెరిగాయి. పుంఖాను పుంఖంగా రచనలు చేసి పారిస్‌పై కుంభవృష్టిగా కురిపించాడు. (ఫ్రెంచి ప్రజలు అతని రచనా మకరందధారలు గోలి మత్తెక్కిపోయేవారు.

ఫెర్నీలోవున్న చివరి ఇరవై ఏళ్లు వోల్టేర్‌ రచనా జీవితంలో సాహిత్య కేదారాలు సమృద్ధంగా పండిన ఘట్టం. కథలు, నాటకాలు, లేఖలు, చరిత్రలు, తాత్విక గ్రంథాలు, వివాద రచనలు అసంఖ్యాకంగా చేశాడు. మత మౌద్యంమీద పట్టించాడు. మానవుల అల్పత్వాన్ని, కౌటిల్యాన్ని చీల్చి చెందాడాడు. మానవుడు సాటి మానవుడినిపెట్టే హొంసలకు ప్రతిస్పందించి ఆవేదనాభరితమైన వ్యంగ్యరచనలు చేశాడు. “క్రాండిద్‌ో అనే సుప్రసిద్ధ నవలిక అనాటిదే. దానిలో మానవ “జాతి”పై తన విద్వేషాన్ని మానవ “వ్యక్తుల”పై తన కారుణ్యాన్ని అమిత శక్తిమంతంగా వ్యక్తంచేశాడు.

పారిల్‌ లో దిదిరో, డి అలెంబేర్‌ ప్రభృతులు “ఎన్‌సైక్లోపీడ అనే గ్రంథ సంపుటా లను సంకలిస్తున్న రోజులవి. ప్రపంచ విజ్ఞానమంతా వాటిలో పొందు పరచడానికి వారు కృషి సాగిస్తున్నారు. అకారాదిగా ఒక్కొక్క విషయాన్ని తీసుకుని ఒక్కొక్కరికి రచనా బాధ్యత అప్పగిస్తున్నారు. ప్రజా సామాన్యానికి మానవ విజ్ఞాన సంపదను అందజేయడం, వారిలో విప్లవ భావాలను రేకెత్తించడం, మూఢ విశ్వాసాలను ఛేదించడం, నిరీశ్వర వాదాన్ని ప్రచారం చేయడం వారి ధ్యేయాలు వీరిని “ఎన్‌సైక్లోపీడిస్టు” లంటారు. ఫ్రెంచి విష్లవానికి ముందు

40 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య

(ఫ్రెంచివారి మనస్సులలో విప్లవజ్యోతిని వెలిగించడంలో వీరిపాత్ర ఎంతోవుంది. వీరి నాయకుడు దిదిరో. ఎన్‌సైక్సోపీడీలో ఎక్కువభాగం వ్రాసింది, సంపాదకత్వ భారం వహించింది అతడే.

వోల్టేర్‌ను కూడా కొన్ని వ్యాసాలు అందించవలసిందిగా ఎన సైక్లోపీడిస్టులు కోరారు. అతడు వారు కోరినవి వ్రాసి ఇచ్చాడు. అయితే అతడు నిరీశ్వర వాదికాడు. అదేసమయంలో సాధారణ ఈశ్వరవాది కూడా కాడు. ధీయిస్టు ౧౫6130 గాని, ఎథీయిస్టు (416151) కాని కాదు. అతదు “డీయిస్టు. (౧౪౪0.

దైవ విశ్వాసం

వోల్టేర్‌ దృష్టిలో ఈశ్వరుడున్నాడు. ఉన్నాడని లోకమంతా కోదై కూస్తోందన్నాడు. ఒకవేళ ఈశ్వరుడు లేకపోతే అతడని సృష్టించడం అవసరం అన్నాడు. (119/9 (5 ౧౦ 06 115 ౧౭౦౪౩9౬౧/ 10 1౧౪6౧1 ౧1౧) ఈశ్వరుడు లేకపోతే సృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు. గడియారం సృష్టించినవాడు లేకపోతే గడియారం ఎక్కడినుంచి వస్తుంది అని ప్రశ్నించాడు.

అయితే, గడియారం తయారుచేసినవాడు తయారుచేసి కీ ఇచ్చిన తర్వాత మరి కల్చంచుకోడు. దానంతట అది యాంత్రికంగా నడుస్తుంది. అలాగే దేవుడు లోకాన్ని సృష్టించి వదిలేస్తాడు. దాని సహజ సూత్రాల ప్రకారం అది కొనసాగుతుంది. లోక వ్యవహారంలో దేవుడు మరి కలిగించుకోడు. మానవుల ప్రార్ధనలు, బాగోగులు పట్టించుకోడు. దేవుడు వుండడంవల్లనే లోకంలో ఒక నియతి, నైతికత్వం వున్నాయి. వోల్టేర్‌ వలె ఈ విధమైన దేవుడిని విశ్వసించేవారిని “డీయిస్టులు” (06:50 అంటారు. అతడు వెలిబుచ్చిన ఈ విశ్వాసాలను ఎన్‌సైక్లోపీడిస్టులు ఏవగించుకున్నారు.

ఆ తర్వాత వోల్టేర్‌ స్వయంగా ఒక తాత్విక నిఘంటువు (ఫిలసాఫిక్‌ డికిషనరీ) సంకల్పించాడు. అకారాదిగా ప్రతి విషయాన్ని తీసుకుని తన అపార పాండిత్యాన్ని పరిశోధనా ఫలితాలను దానిలో సమీకరించాడు. ఒక్క చేతిమీదుగా ఆ (బ్రహ్మాండమైన ఎన్‌సైక్షోపిడియాను ఎంతో అందమైన వచనంలో రచించాడు.

అవసాన దశ

అతనికి అవసానం ఆసన్నమవుతోంది. జన్మస్థలమైన పారిస్‌ చూడాలని పించింది. తన ఆఖరు రచనలలో ఒకటైన “ఐరీన్‌” అనే విషాదాంత నాటకాన్ని తీసుకుని గుర్రపు బగ్గీలో బయలుదేరాడు, వట్టి ఎముకల గూడుతప్ప మనిషి కనిపించడంలేదు, డాక్టరు ఈ ప్రయాణం వద్దని వారించినా వినలేదు. “జీవితమంతా నా ఇష్టం వచ్చినట్టు జీవించాను. చనిపోవడం కూడా నా ఇష్టం వచ్చినట్టు చనిపోతా” నన్నాడు.

వోల్టేర్‌ రగిలించిన భావ విప్లవ జ్వాల... 41

పారిన్‌ అతనికి బ్రహ్మరథం వట్సింది. అవ్పటికి వదహారవ లూయీ పరిపాలిస్తున్నాడు. అతగాడు కూడా అసూయపడేటంతగా ప్రజలు వోల్టేరను తమ గౌరవాభిమానాలలో ముంచెత్తాడు. “ఐరీన్‌” నాటక ప్రదర్శనకు హాజరయ్యాడు. నాటక మందిరం వోల్డేర్‌పట్ల 'ప్రశంసాధ్వనులతో దద్దరిల్లిపోయింది. నాటకాంతంలో అతడిని జనం ముట్టిడించి కదలనివ్వలేదు. అతడు ఈ అపూర్వ గౌరవానికి ఉక్కిరి బిక్కిరయ్యాడు.

కన్నుమూత

వోల్టేర్‌కు అప్పటికి 83 వెళ్లి 84 వచ్చింది. తనపట్ల ప్రజలు చూపిన గౌరవం వల్ల కల్గిన ఉత్సాహాన్ని అతని బడుగుదేహం తట్టుకోలేకపోయింది. ఆరోగ్యం క్షీణించింది, 1778 మే 30వ తేదీన ప్రశాంతంగా, శాశ్వతంగా కన్నుమూశాడు. (అతని తాత్విక ప్రత్యర్థి), మహా రచయిత రూసో కూడా ఆ యేడాదే కన్నుమూయడం ఒక విశేషం).

వోల్టేర్‌ను అధికారులు పారిస్‌లో ఖననం చేయనివ్వలేదు. క్రైస్తవమత లాంఛనాలతో వేరేచోట ఎక్కడో ఖననం చేయవలసి వచ్చింది. మరి పదకొండదేళ్లు గడిచిన తర్వాత ఫ్రెంచి ప్రజలు రాజుపై తిరుగుబాటు చేశారు. భూలోక నరకానికి ప్రతీక అయిన “బాఫ్టీలొ కారాగారాన్ని 1789 జూలై 14వ తేదీన భూస్థాపితం చేశారు. దాని అవశేషాలమీద వోల్టేర్‌ భౌతిక విశేషాలను అతని అంతిమ విజయ చిహ్నంగా ప్రతిష్టించారు.

“వోల్టేర్‌ అంటే 18వ శతాబ్దం” అని విక్టర్‌ హ్యూగో కీర్తించాడు. అతని భావ ప్రభావం 18వ శతాబ్దాన్ని దాటి ప్రసరించింది. మానవ ప్రగతిపధంపై అతని ప్రభావజ్యోతి నిరంతరాయంగా అలా ్రసరిస్తూనే వుంటుంది.

క2ి ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య తిరుపతి సంస్కృత కళాశాలలో దినచర్య

-తిరుమల రామచంద్ర (హంపీ నుంచి హరప్పాదాకా...) న కస్యచిత్‌ కశ్చిదిహ స్వభావాత్‌ భవత్యుదారః అభిమతః ఖలోవా, లోకే గురుత్వం విపరీతతా వా స్వచేష్థితాన్యేవ నరం నయంతి.

ఈ లోకంలో స్వభావంతోనే - పుట్టుకతోనే ఎవడూ ఎవరికీ ఇష్టుడో, దుష్టుడో, ఉదారుడో కాడు. మానవుడు తను చేసే పనుల వల్లనే గౌరవమో, అవమానమో పొందుతున్నాడు. అందువలన కుటుంబంలోను, సమాజంలోను గౌరవంగా ఉండడానికి మానవుడు న్యాయంగాను, నీతితోను వ్యవహరించాలి.

తిరుపతి సంస్కృత కళాశాల విద్యార్ధి వసతి గృహంలో దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఉందేవారు వీరిలో దాక్షిణాత్యులయిన తెలుగు కన్నడ తమిళ, మలయాళుల సంఖ్యే ఎక్కువయినా, అందులోను తెలుగువారి సంఖ్య పెద్దదయినా, మహారాష్ట్ర గుజరాత, వంగ, బిహార, రాజస్టానాది రాష్ట్రాల వారూ ఉండేవారు. ఇతర రాష్ర్రాలవారితో వ్యవహారం మొదట్లో సైగలతోను, తర్వాత వచ్చీరాని సంస్కృతంతోనూ జరిగేది. వివిధ భాషల విద్యార్థులతో సహవాసం వల్ల, సహపరనం వల్ల కలిగిన లాభం నాకు ఉత్తర జీవితంలో ఉపయోగకరమయింది. ఆ సంస్కృత కళాశాల చిన్నభారత దేశమే. పాఠ ప్రవచనాలు ప్రధానంగా సంస్కృతంలోనే గనుక ఎలాటి ఇబ్బందీ లేదు, భాషలు వేరైనా.

నేను అక్కడ ్రవేశించేటప్పటికి నా వయస్సు పదకొండదేళ్లు. శిరోమణి తరగతిలో చదివే వాళ్లు ఇరవై, ఇరవై రెండేళ్లు వాళ్లూ ఉండేవాళ్లు. ఇంత పెద్ద వాళ్ళు, చదువేమిటి?- అని ఆశ్చర్యపడేవాణ్జి - ప్రపంచం తెలియక. క్షీరాబ్చినాధ శర్మ అనే విద్యార్ధి ఉండేవాడు. అతడు బదిరీ నారాయణ క్షేత్రంలో స్థానాచార్యుడు. తమిళ భాషలోని దివ్య ప్రబంధ పారాయణం అనువంశిక వృత్తి. భగవ(ద్రామానుజులు భక్తియోగ (ప్రధానమయిన, హరిసర్వోత్తమత్వ ్రతిపాదకమైన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి దేశమంతటా పర్యటించినప్పుడు, వారు దర్శించి, ఆరాధించిన క్షేత్రాలలో దివ్యప్రబంధ

తిరుపతి సంస్కృత కళాశాలలో... 48 పారాయణం కూడా నియతంగా జరిగే ఏర్పాటుచేశారు. దానికోసం కొన్ని తమిళ శ్రీవైష్ణవ కుటుంబాలు అక్కడక్కడ స్థిరపడిపోయాయి. అలాటి కుటుంబాలలో ఒకటి క్షీరాబ్టీినాథ శర్మ కుటుంబం. అలాటి కుటుంబాలు అయోధ్య, మధుర, కాశీ, గుజరాత్‌లోని డభోయి మున్నగు క్షేత్రాలలో ఉన్నాయి. దాదాపు వేయి సంవత్సరాలుగా అక్కదే ఉండడం వల్ల ఆ కుటుంబాల వారు మాతృభాష అయిన తమిళును మరిచారు. కాని దివ్యప్రబంధం వారి వృత్తికి సంబంధించింది గనుక వేదంలాగ దానిని వల్లెవేస్తారు.

శ్షీరాబ్టినాథ శర్మకు అప్పటికే ఇరవై యేళ్ల వయస్సు. సంస్కృత, హిందీ విద్వాంసుడు. దివ్య (ప్రబంధాధ్యయనం కోసం తిరుపతి వచ్చాడు. తిరుపతి కళాశాలలో దివ్యప్రబంధం నాలుగేళ్ల కోర్సు. అప్పుడు బాలమందే చదివేవారు. జాతకర్మ నామకరణాది, షోడశకర్మలకు వేదమంత్రాలు ఉన్నట్టు దివ్యప్రబంధంలోను ఉన్నాయి. చాల వర్ణాలలో దివ్యప్రబంధం పాశురాలతో సకల కర్మలూ నిర్వర్తించడం నేటికీ ఉంది. (బ్రాహ్మణ వైష్ణువులు కూడా పితృమేధంలో శుభస్వీకారం నాడు, వివాహదుల లోను తమిళ పాశురాలతో కొన్నిక్రియలు చేయిస్తారు. దీనివల్ల తమిళ సంప్రదాయాన్ని పాటించామని సంతృప్తి.

క్షీరాబ్టినాధుడు నిర్ణయ సాగర ప్రెస్‌ (బొంబాయి) వారు దేవనాగరీ లిపిలో ముద్రించిన తిరువాయి మొళి మొదలయిన దివ్య ప్రబంధ (గ్రంధాలు ముందు పెట్టుకొని తిరుప్పావైనో, తిరుప్పళ్లి యెళుచ్చినో తులసీదాస్‌ రామాయణం చదివినట్టు చదువుతుంటే ముచ్చటగా ఉండేది. అతడు నాలుగేళ్ళూ ఆ విధంగా ప్రబంధాధ్యయనం చేసి, ఉత్తీర్ణుడై వెళ్లిపోయాడు. అటుతర్వాత ఎప్పుడో పదేళ్లకు కనిపించాడు యాత్రార్జిగా వచ్చి. నా హృదయంలో గాంధీజీ సిద్ధాంతానుసరణంతో మొలకెత్తిన సమతాభావం, తిరుపతి కళాశాలతో వివిధ రాష్ట్రాల, వివిధ భాషల విద్యార్థులతో పాటు నివసించడం వల్ల బాగా విస్తరించింది. అప్పుడు రాష్ట్రాలు పదిలోపే, తమిళ, తెలుగు, కన్నడ, ఒరియా, మళయాళ ప్రాంతాలతో మద్రాసు రాష్ట్రం. మహారాష్ట్ర కన్నడ, గుజరాత, సింధు, హిందీ ప్రాంతాలతో బొంబాయి రాష్ట్రం. ఒరియా, అస్సాం, వంగ, బీహార్‌ ప్రాంతాలతో కలకత్తా రాష్ట్రం. యు.పి., సి.పి., పంజాబ్‌, సరిహద్దు రాష్ట్రాలు, తక్కిన ప్రాంతాలన్నీ స్వదేశ సంస్థానాలు. తెలుగు ప్రాంతంలో చాలభాగం, తమిళనాడు పూర్తిగా, కన్నడ మలయాళాలు సగం, మద్రాసు రాష్ట్రంలో ఉన్నందున ఈ భాషల వారికి సహజీవనం అనివార్యంగాను ఉండేది.

సమాన శీల వ్యసనేషు సఖ్యం - అనే ఆర్బోక్తికి లక్ష్యంగా సమాన శీలస్వభావాలు గల కొందరం కలిసి ఉండేవాళ్లం, వయోఖేదం గాని, తరగతి భేదం గాని అడ్డువచ్చేవి గావు. నేను చాలమట్టుకు పై తరగతుల వారి సావాసంతోనే ఉండేవాడిని.

అప్పుడు తిరుపతి రైలు స్టేషనుకు ఫర్లాంగు కైవారంలో ఎలాంటి కట్టడాలూ లేవు, వరి, రాగి, చేలు వాటిలో దిగుడు బావులు. పంట కపిల నీళ్లతో జరిగేది. మేము తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి, గంటసేపు చదువుకొని, ఐదు గంటలకు జట్లుగా

44 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య బయలుదేరి, పొలాల్లో కాలకృత్యాలు తీర్చుకొని బావులలో స్నాన సంధ్యలు ముగించి కట్టుకున్న బట్టలు ఉదుకుకొని, ఆ తడిగుడ్డలతోనే మా గదులకు. తిరిగి వచ్చేవాళ్లం పోయేటవ్వుడు, తిరిగి వచ్చేటప్పుడు, వెనుకటి దినం జరిగిన పాఠాలను ఆవృత్తి చేసుకొనేవాళ్లం. అప్పటికి దాదాపు 6.80 అయ్యేది.

ఉదయ 7.00 గంటలకు ప్రార్ధన, హాజరీ. ఇదంతా అరగంట. ప్రార్ధనలో వేంకటేశ్వరస్తోత్రం. అనంతరం తరగతులు మొదలయి పదిన్నర, పదకొండున్నర వరకు సాగేవి. పదకొండున్నర నుంచి ఒకటిన్నర వరకు భోజనకాలం. మళ్లీ రెండు గంటల నుంచి సాయంకాలం ఐదుగంటల వరకు పారాలు.

తక్కిన ఆంగ్ల పాఠశాలలకు ఆకాలంలో వారంలో శని ఆదివారాలు సెలవు దినాలు. ఆ పద్ధతిలోను సంస్కృత కళాశాలలకూ పక్షానికి నాలుగు దినాలు - పాడ్యమి. అష్టమి, చతుర్ధశి, పూర్ణిమ - అమావాస్య, పాడ్యమి నాడు మాత్రం పుస్తకం తాకే వాళ్లంకాదు. వాల్మీకి అశోకవనంలో సీతమ్మను “'ప్రతిపద్‌ పారశీలస్య విద్యేవ తనుతాంగతా” అని వర్ణించాడు. పాద్యమినాడు పారాలు చదివే వాడి చదువులాగ చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాద్యమినాడు చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవికావు. చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం.

మా కళాశాలకు ఆట స్థలం ఏదీ ఉండేది కాదు. కనుక ఊరి బయటున్న నక్కలేరు ఇసుకలోనో, రౌండ్‌రోడ్‌ అనే మహంతు తోటలోనో, ఊరిబయట తిరుచానూరు రోడ్దులోనో పొలాలలోనో ఆదుకొనే వాళ్లం. ఆటలలో ప్రధానమైనవి బలిగుడ్‌ - కబడ్డీ, పరుగు పందేలు, పగ్గం లాగుడు, కాలి బంతి. నేను స్కూలులో చేరిన తర్వాత ఎప్పుడయినా ఇతర ఉన్నత పాఠశాలల విద్యార్థులతోపాటు బ్యాట్‌ మింటన్‌ అదేవాడిని. కొన్నాళ్లతర్వాత ఉదయం స్నానానికి పోకముందు, సాయంకాలాల్లోను దండాలు, బస్మీలు తీయడం దేవస్థానం హైస్కూలు ఆవరణలోని పేర్లల్‌ బార్‌ మీద పులప్స్‌ తీయడం అలవాటయింది.

వావిలికొలను సుబ్బారావుగారి బంధువొకరు కాశీ విశ్వవిద్యాలయంలో వ్యాయామ శిక్షకులుగా ఉండి తిరుపతికి వచ్చారు. స్కౌట్‌ మాస్టరుగా, ఆయన పేరు నరసింగరావుగారు. మహోత్సాహి, కండలు తిరిగిన దండలతో బంగారు మైచాయతో, సమున్నత శరీరంతో సుందరంగా, మరి కొన్నిసార్లు చూద్దామా అని అనిపించేవారు. ఆయన మమ్ముల్ను స్కౌట్‌సంఘంలో చేర్చారు. దానితో సంస్కృత పారశాలవాళ్లు ఛాందసులు కారని, లోకానికి కూడా ఉపయోగపడతారని పేరు వచ్చింది. ఉత్సవాలు జరిగినప్పుడు గుంపులను సర్దడం, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు సహాయపడడం వంటి పనులకు ముందుండే వాళ్లం. నా జట్టు నాయకుడు, నా సహాధ్యాయుడు గురుమూర్తి. ఇతను ఫోర్త్‌ఫారం వరకు చదివి పాఠశాలలో చేరాడు. తిరుమల తిరుపతి దేవస్థానం పారుపత్తేదారు వేంకటశాప్రిగారి కుమారుడు, తర్వాత నెల్లూరు ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు ఓరుగంటి వెంకట సుబ్బయ్యగారి జామాత అయ్యాడు.

తిరుపతి సంస్కృత కళాశాలలో... 4ర5్‌ స్మౌటుగా నేను చాలా మంచిపనులే చేశాను. తగలబడుతున్న హరిజన వాడలలో మంటలు ఆర్బడానికి నీళ్లు మోశాను. వాళ్లపిల్లలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాను. వాటుపడిన బండ్లను ఎత్తి, చిక్కుకుపోయిన వారిని ఆస్పత్రులకు చేర్చాను. రధోత్సవాల సమయంలో రధచక్రాల కింద పిల్లలు పడిపోకుండా (త్రద్ధతీసుకొన్నాను. అన్నదానాలు జరుగుతున్నప్పుడు దొమ్మీలు జరుగకుందా జాగరూకతతో ప్రవర్తించాను. గంగజూతర వంటి జాతరలలో తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చాను. ఇవన్నీ తర్వాత నేను కాంగ్రెస్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి దోహదం చేసే పరిచయాలకు తోడ్పడ్డాయి. సాయంకాలం ఆటల తర్వాత సంధ్యావందనానంతరం ఉత్సవాల సమయంలో విష్ణుసహస్రనామ పారాయణం చేసేవాళ్లం. రాత్రి ఎనిమిది గంటలకు భోజనం. పది పదకొండు వరకు చదువు. అప్పటికింకా విద్యుద్దీపాలు రాలేదు గనుక ఒక పెద్ద హరికేను లాంతరు చుట్టూ మూగి గోలగా చదివేవాళ్లం. మేము రాత్రులు గదిలో వున్నామోలేదో అని తనిఖీ చేయడానికి వంతుల వారీగా ఉపాధ్యాయులూ, ప్రాంశుపాలుడూ (ప్రిన్సిపాలు) వచ్చేవాళ్లు. కాని, మానవునికి నహజంగానే న్యాయబుద్ధి ఉండాలిగాని, తనిఖీలతో తెల్లవారుతుందా? రాత్రి సినిమాలకు వెళ్లేవాళ్లు దొంగచాటుగా వెళ్లనే వెళ్లేవాళ్లు. అప్పటికి టాకీలు ప్రాచుర్యం పొందలేదు. మూగసినిమాలే. సినిమా హాలులో కధకులు ఉండేవాళ్లు. వాళ్లు చెప్పిందే కథ. మాస్టర్‌ విఠల, మాస్టర్‌ బచ్చూ, మాస్టర్‌ దాతార్‌ జనాదరం పొందిన నటులు, కమలాదేవి చట్టోపాధ్యాయ, సులోచన విఖ్యాత నటీమణులు. నేను వారానికి రెండు మూడు సినిమాలయినా చూచేవాడిని, అణాకునేల, రెండణాలకు బెంచీ, నాలుగణాలకు దర్జాగా కుర్చీ, మూక సినిమాల పిచ్చి నాకు బాగానే ఉండేది. తనిఖీలు, అనుమతుల బాధలేకుండా సెలవుల్లో రెండు మూడు చూచేవాడిని. సెలవుల్లోనూ తనిఖీ ఉండేదికాని, అంత తీవ్రంగా కాదు. ధనుర్మాసంలో విద్యార్థుల దొక మహాసాహసం. అప్పుడు తిరుమలకు బస్సులు, రోడ్లూ లేవు. నడక లేక డోలి. ముసలివగ్గులయితే డోలీ. సామాన్యంగా యాత్రికులందరూ నడిచేవెళ్లేవాళ్లు, మొదటి కొండ, మోకాళ్ల పర్వతం ఎక్కడానికి కష్టపడవలసి వచ్చేది ధనుర్మాసంలో ఊరంతా రంగరంగ వైభవం. తిరుమలలోనైతే ప్రసాదాల కోసమయినా వెళ్లాలి. తెల్లవారు జామున చక్కెర పొంగలి, ఉక్కెర (హల్వా), ఉప్పుపొంగలి గుమగుమలాడే నేయి ఓడికలై పారుతుండగా దోసిలినిండా పెట్టేవారు. తినలేక ఇదయిపోయే వాళ్లం. మేము పందేలతో కొండ ఎక్మేవాళ్లం అడివారం (కొండ కింద ప్రాంతం) నుంచి కొండమీద శ్రీనివాసుని వరకు దూరం ఐదున్నర, ఆరుమైళ్లు మెట్లమీదుగా. కళాశాల నుంచి అడివారం వరకు దాదాపు మైలు. కొండ ఎక్కడానికి గంటన్నర, దిగడానికి గంట. స్నానాదులు ముగించుకొని నాలుగుకు బయలుదేరిన వాళ్లం, శ్రీనివాసుని దర్శించుకొని (ప్రసాదం తిని, ప్రార్ధన ముగిసి పేరు పిలిచేవేళకు “ఏషోస్మి” అంటూ చేరేవాళ్లం,

46 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య పోటాపోటీలతో, పరుగులతో రెండున్నర గంటలలోపే తిరిగి వచ్చి పందేలుకూడా గెలిచాను. దిగేటప్పుడు తూలిపడతామనే భయం ఉన్నా ఎక్కేటప్పుడు యమవేగంతో వెళ్లేవారం. మొదటి గాలిగోపురం దాటిన పిదప మోకాలి పర్వతం వరకూ దాదాపు సమతలమే కనుక పరుగులే, ఉపాధ్యాయులు అప్పుడప్పుడు మందలించేవారు అలాటి సాహసాలు చేయవద్దని. ఏవో కారణాలవల్ల భోజనశాల మూసివేసి, నెలకు పన్నెండు రూపాయలు విద్యార్ధి వేతనం ఇచ్చేవారు. హోటలులో భోజనానికి ఎనిమిది రూపాయలు. అదీ ఎక్కువ అనుకుని ఐదున్నర, ఆరు రూపాయలకు భోజనాలు పెట్టే పూటకూళ్ల ఇళ్లలో భోజనం చేసేవాళ్లం. ముప్పూటలా భోజనం. పాకశాల మూసివేసినందున మా తరగతుల సమయం కూడా తొమ్మిదినుంచి పన్నెండు, రెండు నుంచి ఐదుకు మారింది. కనుక ముప్పాద్దులా ఉదయం 8.80 కు, మధ్యాహ్నం ఒంటిగంటకు, రాత్రి 7.80, 8కి సుష్టుగా తినేవాళ్లం. పూటకూటిల్లు నడిపేవారు మధ్యబ్రాహ్మణ దంపతులు. ఎప్పుడూ పండుగలూ, పబ్బాలే! కొంతకాలం తర్వాత నాకు మేనమామ వరస అయిన మా బంధువొకరు విద్యార్థిగా చేరాడు. ఆయన తనతోపాటు ఉండమన్నాడు. ఆయన ఇంటిఖర్చంతా అందరికీ పంచేవాడు. నెలకు ఐదురూపాయలు ఎక్కితక్కి ఎండకాలం సెలవులకు ఊరికి వెళ్లేముందు ఎనఖై - దెబ్సై రూపాయలు చేతికి ఇచ్చేవాడు. ఆశ్చర్యపదేవాణ్ని మా ప్రాంతాలలో దొరకని నూవుల నూనే, మొదలయినవి, నారాయణవనం చీరలు, చెల్లెండ్లకు ఎర్రచందనం బొమ్మలు తీసుకొని వెళ్లేవాడిని. ఊరికంతా నేను మంచి కుమారుణ్ని. తిరుపతి చుట్టుపట్ల కరివేపాకు చెట్లు దూది నిమ్మచెట్లు కలిమిచెట్లు (వాక్కాయచెట్లు) అడవుల్లాగ పెరిగేవి. నేను బస్తాలలో కరివేపాకు, కలిమి కాయలూ, దూది నిమ్మకాయలూ తీసుకువెళ్లేవాడిని. ఇవన్నీ కొన్నవి కావు. అడవి. కోసుకోని వాడు పాపాత్ముడు. మా అమ్మ మావాడు తెచ్చింది, అంటూ బంధువులకంతా పంచేది. నూవులనూనె వీశ (ఐదుసేర్లు) నాలుగణాలు. నెయ్యి వీశ రూపాయిన్నర. నన్నుచూచిన మా అమ్మ నాన్న తాత, పినతండ్రులు పిల్లవాడు పరాయిచోట ఉన్నా మిస మిసలాడుతూ నిండుగా ఉన్నాడు అని అనుకొనేవారు. నేను ఇతరులతో భాగా ప్రవర్తించేవాడిని కనుకనూ ఆరోగ్యంగా ఉండేవాడిని. పొతాపాతం మనుప్పాణాం కేవలం వచని థిా్‌ తస్మాత్‌ నంయోజయద్ద్వాచం ఆ(వమత్తూ నిర్తీళ్టు చో మానవుల మేలు, కీడు వారి మాటలపై ఆధారపడి ఉంది కనుక ఎలాటి పొరపాటులేకుండా ఎంతో ఆలోచించి మాట్లాడాలి. ష్‌

త్న విద్య -గుడిపాటి వెంకటచలం (బిడ్డల శిక్షణ)

బాల్యంలో పారశాలకు వెళ్ళకముందూ, వెళ్లేప్పుడూ కూడా ఉపాధ్యాయుడుకన్న కూడా, తల్లిదండ్రులు బిడ్డకు జ్ఞానాభివృద్ధి చెయ్యగలరు. విద్య అనగా చదవడమూ, (వ్రాయడమూ అనీ, పరీక్షలు పాసుకావడమనీ వుద్యోగాలు చెయ్యడము అనే అభిప్రాయాలు పెద్దలకూ బిడ్డలకూ పోవాలి.

బిడ్డ ప్రతి వస్తువునీ పరిశీలించేందుకు వీళ్ళు కలుగచెయ్యాలి. పరిశీలించాలనే కుతూహలం స్వతసిద్ధంగానే వుంటుంది బిడ్డకి. దాన్ని చంపకుండా వుంటేచాలు. షికార్లు, రైళ్ళుమీదా, బళ్ళమీదా పడవలమీదా ప్రయాణాలూ, ఫ్యాక్టరీలూ, మ్యూజియంలూ, పట్టణాలు చూడడమూ, యివన్నీ చాలామంచిది. మృగాల్నీ మొక్కల్నీ పెంచేట్టు చెయ్యాలి. యేది చూడాలని పిల్ల అభిలాషపడ్డా, వీలు కలుగజేసి, యింకా ప్రోత్సహించి బిడ్డ కెటువంటి వస్తువులలో, (ప్రదేశాల్లో, ఇష్టమో కనిపెట్టి అటువంటివన్నీ చూపాలి.

సంగతుల్ని బిడ్డంతట బిడ్డనే తెలుసుకోనియ్యాలి, పెద్దవారు చెప్పకూడదు. బిడ్డ అడిగితే, వీలైన సంగతులన్నీ “నువ్వేచూడు. తెలుసుకో” అనాలి. యింక బిడ్డ తెలుసుకోలేనివైతే, బిడ్డ ప్రయత్నించి తెలుసుకోలేకపోతే చెప్పాలి. బిడ్డ జ్ఞానంకోసం అపాయకరమైన పనులైనా చెయ్యనియ్యాలి. బాధకలిగేవైతే, బాధ కలుగుతుందని ముందు చెప్పడం విధి. అప్పుడూ తనే చూస్తానంటే, చూడనియ్యాలి. వేడిదీపం తాకుతానంటే కాలుతుందనిచెప్పి, అయినా తాకుతానంటే తాకనిచ్చి తీరవలసిందే.

(ప్రకృతిశాస్త్రం (సైన్సు)లో బిడ్డకు విశ్వాసం కుదర్చాలి. ప్రతిదీ మనుషులు తెలుసుకోగలరని, ప్రత్యక్షంగా ఎక్సెరిమెంటు వల్లగాక మూర్ధంగా నమ్మాలని అనే సంగకుల్లో చాలా అబద్ధాలుంటాయని బిడ్డకి తెలియచెప్పడం మంచిది. శాస్త్రాటా, మనుష్యులూ, చెప్పడంవల్లగాక, తనంతట తానుచూచి, స్వబుద్ధితో విచారించి తెలుసుకునే అభ్యాసాన్ని కలగచెయ్యాలి. పెద్దవారు ఏదో సంగతిచెప్పి, తాము చెపుతున్నారు గనక, నమ్మమని బిద్దననగూడదు. తల్లిదండ్రులు చెప్పినా నమ్మక, తానే స్వబుద్ధి నుపయోగించే అలవాటు వీలైనంతవరకెక్కువ చెయ్యాలి.

బిడ్డ ప్రశ్నలు వేస్తుంది. ఒకటే అడగడం. కాని విసుక్కోకూడదు. పనిగావుంటే ఇప్పుడు చెప్పననాలి. చెప్పను పొమ్మనకూడదు. పెద్దవాళ్ళకట్లా సరైన జవాబు పెద్దవాళ్ళు చెపుతారో అట్లానే చెప్పాలి బిడ్డలకికూడా. తమకి తెలీకపోతే పెద్దవాళ్ళు తెలుసుకొని చెప్పాలి

48 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య కాని బిడ్డ తనంతట తాను తెలుసుకోగల విధం వుంటే, పెద్దవారు చెప్పకూడదు మార్గంచూపి వదలాలి. పెద్దవాళ్ళకి తెలీకపోతే తెలీదనాలి. కాని అబద్ధం జవాబు చెప్పకూడదు. బిడ్డ పనిలేకుండా, ఆసక్తిలేకుండా వేసే సోమరి ప్రశ్నలు 'ఎన్మరేజ్‌' చెయ్యకూడదు. “నువ్వేచెప్పు జవాబూ అనాలి. లోకంలోని దారిద్యమూ, మూర్థమూ, మోసమూ, కరినత్వమూ అన్నీ బిడ్డకు తెలిసేట్టు పెద్దవాళ్ళు చూపనజ్ఞర్లేదు. బిడ్డ అడిగితేమాత్రం వాటిసంగతి తెలిసేట్టు చెప్పాలి. ఆ చెదుగు ఈవిల్‌ శాశ్వతం కాదనీ, దాన్ని తొలగించడానికి వీలుందనీ, ఈశ్వరుడో, మాయో, కర్మమో దానికి కారణమైనా కాకపోయినా, మనుషులు ప్రయత్నించి, పోరాడి దాన్ని నిర్మూలం చెయ్యగలరనీ, అట్లా చెయ్యడం ప్రతివారి ధర్మమనీ విశ్వసింపచెయ్యాలి. చెడ్డవాళ్ళపైన కోపమూ, అసహ్యమూ, లోకువా కలిగించకూడదు. వారు చాతకాక జీవితాన్ని పాడుచేసుకున్న మనుష్యులని నిరూపించాలి. మృగాలవలె, చెట్లవలె, కథల్లో మనుషులవలె అనుకుని పిల్లలతో పెద్దవారు కలిసి ఆడించడంవల్లా, చిన్న నాటకాలచేతా పిల్లల భావనాశక్తి అభివృద్ధి చెయ్యవచ్చు. పనిలేకుండానే మట్లాడించడంవల్లా, కథలూ, అనుభవాలూ చెప్పడం వల్లా భాష నఖభివృద్ది చెయ్యవచ్చు. గొప్ప కవుల పద్యాలు వప్పచెప్పేట్టు చెయ్యటం మంచిది. వాళ్ళనే కూచుని చదివి వప్పచెప్పమంటే వప్పచెప్పరుగాని పెద్దవారు ముద్దుగా దగ్గిర కూచోపెట్టుకుని పద్యం వొచ్చిందాకా నోటితో చెపితే సంతోషంగా నేర్చుకుంటారు. దేశాన్ని గురించి, దేశాన్యత్యాన్ని గురించి సంకుచిత అభిప్రాయాల్ని నేర్చుకొననీ గూడదు. దేశంమీదకంటె లోకంమీద (శ్రేమనెక్కువ చెయ్యాలి. తనవారిదే, తనవూరుదే, తనదేశందే గొప్పతనమనమనీ, వారి ఆచారాలన్నీ ఉత్తమాలనీ, ఇతరులవి పనికిరానివనీ బిడ్డ అనుకోగూడదు. నిష్పక్షపాతంగా తనవిగాని, తనవారివిగాని, దేశానివిగాని తప్పుల్ని వొప్పుకోవాలి. చాపలల్లడం, నూలు వడకడం, తవ్వడం, తోటపనులు, మట్టిపనులు, కాయితప్పు పనులు, వడ్రంగం, సీమసున్నంతో బొమ్మలు గియ్యడం సాధన చేయించాలి. బడి పిల్లని బళ్ళో వెయ్యడంతోటే తమ బాధ్యత సర్వవిధములా తీరిందనుకుంటారు. భోజనమూ, బట్టా యివ్వడమూ, రోగం రాకండా చూడ్డము, ఇంతే పెద్దవారు విచారించేది. బడికిపోయి, యేదాదిచివర పై తరగతిలోకి పోతేచాలు. ఈలోపున బిడ్డ యేం చేస్తున్నదీ, యేం నేర్చుకుంటున్నదీ వారికఖ్మ్యర్లేదు. ఎట్లానన్నా, బిడ్డ వొకటి యింటో వున్నదని మరిచిపోవడానికే పెద్దల ప్రయత్నం.

విద్య... 49

బిడ్డని బలవంతపరచి పాఠశాలకు యెన్నడూ పంపకూడదు. ఏడుస్తో బడికిపోయి పండితురాలు కావడంకన్ను చదువులేకుండా మూర్చురాలుగా వుండడం వుత్తమం, కొందరు పిల్లల స్వభావం బళ్ళో శాశ్వతంగా గాయపడుతుంది. చాలా బళ్ళు వున్న తెలివిని చంపే విషశాలలూ పిల్లల్ని బాధపెట్టే కటిక స్తలాలూ, అనారోగ్యాన్ని అఖివృద్ధిచేసే నరకకూపాలై వున్నాయి.

బళ్ళో బిడ్డని ప్రవేశపెట్టిన తరవాత తల్లిదండ్రులు చాలాసార్లు ఆ బడికి వెళ్ళి చూడాలి. అక్కడ యేంచెప్పేది, ఎట్లా చెప్పేదీ, బిడ్డల్ని బాధపెట్టేదీ, యివన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి తమ సలహాలను ఉపాధ్యాయుడు వినేట్టు చెయ్యాలి.

బిడ్డని అయిదేళ్ళురాగానే బడికి పంపాలి. ఎందుకు పంపాలంటే-

  1. తక్కిన పిల్లలతో స్నేహం చేసుకోడం, ఆడుకోడం చెయ్యవలసిన వయసు గనుక, అట్లా కలవడం వల్ల చాలా గొప్ప వికాసం కలుగుతుంది బిడ్డకి అన్నివిధాలా.

  2. అక్షరజ్ఞానం కోసం, అది చాలా అవసరం జీవితానికి.

౩. బిడ్డకి తోచడానికి ఏం పనిలేకపోతే ఇంటిదగ్గిర బిడ్డ 'న్యూసెన్సు' అవుతుంది.

  1. ముందు జీవితంలో సంపాయించుకుని పోషించుకునే సాధనం నేర్చుకోవడానికి.

కాని ప్రస్తుతపు విద్య బాగాలేదు. బడులు ఘోరంగా వున్నాయి. చాలాకాలం ఈ బడులలో చదివితే బిడ్డకి కలిగే లాభాలకన్న నష్టాలు ఎక్కువ కలుగుతాయి. ఆరోగ్యం నళిస్తోంది. మెదడు మందగిస్తోంది. ఏది నమ్ముతున్నదో బిడ్డకే తెలియదు. జీవశక్తీ, నిశ్చయశక్తీ, ఆనందించే శక్తీ నశిస్తున్నాయి. మనుషులతో, కుటుంబంతో చక్కగా మెలిగి సౌఖ్యపడే తెలివి అసలు లేకుండా పోతోంది. జీవితంలో ముఖ్యమైన ఆనందం శరీరం ఎముకలలోంచి వస్తోంది. సుఖమైన భోజనం, చక్కని స్నేహం మనసులో శాంతి, స్రీని గొప్పగా అనుభవించడం, ఆరోగ్యం - ఇవే ముఖ్యం. ఇట్లాంటి శాంతినిచ్చేవే సరైన విలువలు. ఈ విలువలు పోయి ధనార్డనా, అధికారం, పలుకుబడీ- ఆస్తీ కీర్తి దర్జా, ఈవిధమైన విలువలు మనసులో స్టిరపడి, వాటి ప్రయత్నంలో ఏ సొఖ్యమూలేని అనాధలౌతున్నారు. యీ విద్యావంతులు, ఈ కొత్త విలువలు మనను పైపైన పనిచేస్తాయిగాని లోపల ఏమీ సుఖాన్నివ్వవు. అందుకనే అంత అశాంతిగా మిజరబుల్‌గా కనపదాతారు యీ చదువుకున్న మనుషులు. బళ్లోకూడా పరీక్షలనే భూతాలు. ఏమీ ఆటలకి, విశ్రాంతికీ, స్నేహానికీ, అభిరుచులకీ వ్యవధినివ్వక, మనిషిని శరీరం, మనసూ, హృదయం పిండి పిప్పి చేస్తున్నాయి. విద్య అనే పేరుతో ఎందుకూ కొరగాని జ్ఞానాన్ని మనసుల్లో ఎక్కిస్తున్నారు. చాలావరకు అది విషప్రాయమవుతోంది.

ఆరోగ్యమైన శరీరం ఆహారాన్ని ఎంత సహజంగా మధురంగా కోరుతుందో, ఆరోగ్యమైన మనసు అంత ఆతృతతోనూ జ్ఞానాన్ని కోరుతుంది. భోజనశాలకు వెళ్ళడం

50 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఎంత ప్రియమో, అంతకన్న ఎన్నోరెట్లు సహజం, సుందరం, కావాలి బడికివెళ్ళడ మనేది. బడీ, పంతులూ, అంటే అంత ఘోరమైపోవడం, బిడ్డతప్పు వమాత్రమూ లేదు! ఎప్పుడు బడికి వెడతానా, అనే ఆత్రుత బిడ్డ కనపరచకపోతే, ఆ బడి విషమన్నమాట ఆ బిడ్డకి. సాధారణమైన బిడ్డకి ప్రతిబిద్దకూ అవసరమయినది, తెలుగు పత్రికలు చదవగల జ్ఞానము, ఉత్తరాలు వ్రాయగలగడమూ, చిన్నభాగారాలు, హెచ్చవేతలు చెయ్యగలగడమూ, ఇవి నేర్పితీరాలి. లోకవ్యవహారం కోనం అవనరవమ్హైతే టీకాలు వేయించినట్లే బలంవంతంగానన్నా నేర్పాలి. తక్కినజ్ఞానం అవసరం. ఇది సులభంగా తల్లి చెప్పవొచ్చు. ఇంటి దగ్గిర తోచకుండా ఉండకండా అతనికి ఏ కర్మాగారానికో పంపి జీతం లేకుండా, సరదా ఉన్నంతసేపూ పనిచేసేట్టు, ఏర్పాట్లు చెయ్యవొచ్చు. పొలానికి తోటపనికి పంపవొచ్చు. అన్నిటికన్నా సరదా అవుల్చో గొర్రెల్నో కాయమనటం, వాటి జాగ్రత్త తీసుకోడం. తక్కిన పిల్లలతో స్నేహాలూ అవుతాయి, బైట తిరిగే పిల్లలకి.

ఇకముందు జీవితమంటారా, ఈ దనమూ, ఆన్నీ, అదికారవూ సంపాయించేందుకు, పదవులకు పాకులాడే మనుషులు ఎత సౌఖ్యాన్ని బలి ఇచ్చుకుంటారో తెలిస్తే, తమ పిల్లల్ని ఆవిధంగా ఎన్నడూ ్రోత్సహించరు. చాలా స్వల్పమైన ధనంతో, మామూలుగా బతకడం తప్పకుండా అలవాటు చెయ్యాలి.

ముఖ్యంగా అంగీకరించవలసింది, ఆనందం బిడ్డకి జన్మహక్కు అని, ఏమాత్రమైన బాధ బిడ్డకి గలగచేసినా, అ విద్య బిడ్డకి పడదన్న మాట. ఎక్కువగా సౌఖ్యపడడం నేర్పాలి విద్య. తన భౌతిక అవసరాల్ని తగ్గించుకోడం, అంటే [64%04౧69 వొదులు కోడమూ, తక్కువగాచేని, [61506 ఎక్కువగా తెచ్చుకుని, ఆకాలాన్ని తన సౌఖ్యానికి ఎట్లావుపయోగించుకోవాలో నేర్పాలి చదువు.

ఈ పారశాలలు ఇప్పుడుచెప్పే తుక్కునంతా చెప్పడం మానెయ్యాలి. టీచర్లు సానుభూతి కలవాళ్ళూ, ఉత్సాహవంతులూ, సంతోషం కలవాళ్ళూ, తెలివిగలవాళ్ళుగా వుండాలి. పాఠశాలలు గొప్ప మందిరాల మళ్లే ఆకర్షకంగా వుండాలి. అంతవరకూ పిల్లల్ని బళ్ళకి పంపమని తల్లితండ్రులు సమ్మెకట్టాలి. ఇప్పుడు బళ్ళలో చెప్పే విషయాలు గాని, చెప్పే పద్ధతులుగాని, ఏవీ బిడ్డకి ఉపకారం చెయ్యవు. ఘోరమైన అపకారాలు చేస్తున్నాయి. ఆరోగ్యం నశిస్తోంది. తెలివి మందగిస్తుంది. సర్వమైన గొప్ప గుణాలూ మలినమవుతాయి,

ఈ బిళ్ళలో చదవడం గొప్ప దురదృష్టం, చదువు లేకండా వుండడం గొప్ప అదృష్టం.

ఎందుకూ కొరగాని భారాలతో, ఆచారాలతో, బానినత్వాలతో, గుంపుని అనుకరించడంతో కుంగి బిగుసుకుపోయే జీవితంలో పడకండా స్వేచ్చగా నిర్భయంగా బతకడం నేర్పాలి బిడ్డకి.

విద్య... 51 ప్రస్తుతం ఏ సారమూలేని ధనం తప్ప తక్కిన విలువలేవీ లేకుండా ఐపోతోంది లోకం. అధికారం, కీర్తి యీ రెండు ఆశుష్మమైన ఆ విలువకి తోద్బడ్డాయి. గొప్పకావడం, పైకి పాకడం, 56060699 పాందడం కన్న 51%018 గా సుఖపడడంలో వుండే విలువను నేర్పాలి విద్య తెలుసుకోడం, జ్ఞానం పొందడం సుఖమివ్వాలి. ఆ సుఖంలేంది విద్య విషతుల్యం. పనిచెయ్యడం మనిషికి సహజం. పని ఆనందమివ్వాలి. ఆనందమివ్వని పనిని, జీవితానికి ఎంత అవసరమో అంత కొంచెం చెయ్యడమే తెలివి. పరీక్షలు గడిచి పై తరగతిలోకి పోతున్నంత మాత్రాన బిడ్డ అభివృద్ధి చెందుతోందనుకోకూడదు. విద్య వుద్దేశ్యంకూడా పై తరగతులకి పోవడం కాదని బిడ్డా, పెద్దవారు కూడా విశ్వసించాలి. కథలు చాలా కథలు చెప్పాలి పిల్లలకి. పెద్దవారికి రాకపోతే నేర్చుకుని చదివి చెప్పాలి. వాళ్ళ వయస్సును పట్టి దేవతులూ, బుషులూ, జంతువులూ చెట్లూ, తిరిగి మాట్లాడే కధలూ, మహాపురుషుల జీవిత కధలూ, యొన్నెన్నో చెప్పాలి. చెప్పిన తరవాత మళ్లీ ఆ కధను చెప్పమని బిడ్డను బాధపెట్టకూడదు. బిడ్డ కుతూహలపడితే పెద్దవాళ్ళు చెప్పిన కథల్నిగాని, తన సొంత కధలనుగాని చెప్పనియ్యాలి. నీతి చెప్పనూ కూడదు. కథకి నీకేమిటని బిడ్డని అడగకూడదు. ముఖ్యంగా దేశంలో వాడుకలోవున్న కధలు చెప్పాలి. అసహ్యమైనవీ, అమితంగా క్రోధమూ, దుఖ్ధమూ, భయమూ కలిగించే కథలూ చెప్పకూడదు. మంచికథల్ని బిడ్డలచేత నాటకాలుగా ఆడించవొచ్చు. పెద్దపిల్లలు చిన్నపిల్లలకు కధలు చెప్పవొచ్చు. బిడ్డకి చదవడం రాగానే చాలా కధల పుస్తకాలియ్యాలి. కళలు సృష్టితో యెప్పుడూ బిడ్డకి సంబంధముండేట్లు చూడాలి. తోటలూ, గాలీ, నీళ్ళూ అకాశమూ వీటిలో బిడ్డకి ఆనందం కలగచెయ్యాలి. షికార్లు పంపాలి. యింటికి తోటవుంటే బిడ్డ కష్టమున్నంతసేపు దాంటోనే వుజ్ణియ్యాలి. పెద్దవాళ్ళు అనుభవిస్తో, బిడ్డనీ సృష్టి సౌందర్యాన్ని సూర్యోదయాన్నీ అస్తమయాన్నీ వెన్నెలనీ అనుభవించి ఆనందించి అద్భుతంలో నిండేట్టు చెయ్యాలి. కానిపెద్దవారి ఆనందాన్ని బిడ్డ కపటంగా 'ఫాషన్‌కి తనూ తలతిప్పే ఆపదలో పడకండా కాపొదాలి. దానికి సృష్టి పౌందర్త్య_మ్రర్గధః ాత్తననం వూరుకుంటే మంచిది. కాని సృష్టిని శ్రేమించని బిడ్డ వుండర్త్లప్రక్య్యట అరా ప గగనం 1 ॥

52 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

బాలుడికి ఏ కళలో యెక్కువ రుచివున్నదో కనిపెట్టి ఆ విధమైన కళా వాతావరణంలో పెంచాలి. దేంటోనూ అభిరుచిలేకపోతే వదిలెయ్యాలి. కాని నేర్చుకోమని బలవంతం చెయ్యకూడదు.

మాటల్లో చేష్టలో, బట్టల్లో టేస్టు అభివృద్ధి చెయ్యాలి. ఏవి అందమైనవో, యేవి మర్యాదైనవో తెలియచెయ్యాలి కాని తన అందమే చూచుకుని కులికేవాణ్జిగా తయారుచెయ్యకూడదు. పెద్దవారి అభిప్రాయాలే సరైనవని అనుకుని అవే అతను "కాపీ చేసేటట్లు చెయ్యకూడదు. ఇతరులెట్లా చేస్తున్నారో చూసి దాన్నికూడా బిడ్డ గుడ్డిగా అనుకరించేట్టు చెయ్యకూడదు. బిడ్డ టేస్టుకి స్వతంత్రముండాలి. జుట్టూ కట్టూ తీరుగా, విద్యావంతులకు, మర్యాదస్తులకు తగివుండేట్టుగా అలవరచాలి. కాని వాటిని నిర్ధారణ చేసిన తరవాత ఆ జుట్టుసంగతీ, వేషం సంగతీ ఆలోచించక బిడ్డ వాటినీ, తననీ మరచిపోవాలి.

బిడ్డని మంచి నాటకాలను, బయస్మోపులను, సర్మసులను చూదనివ్వాలి. మంచి సంగీతం విననివ్వాలి. బిడ్డ తన నడవడిలోకూడా ఇది మంచిపనా, అసహ్యమైన పనా అని ఆలోచించుకోడం మంచిది.

పెద్దవారు తమ టేస్టులను బిడ్డ నెత్తిమీద రుద్దకూడదు. తమకు అభిలాష వుందని బిడ్డకి యిష్టం లేకపోయినా సంగీతము మొదలైనవి బిడ్డని బాధపెట్టి నేర్పే వారున్నారు.

మ! జ _గో ర్మీ (సాహిత్య వ్యాసాలు)

నిస్తేజమైన, ఊషర మైదానంమీద పోయే పధికుడు, ఒకప్పుడు తాను నడిచి వెళ్లినటువంటి సారవంతమైన, అందమైన, శోభాయమానమైన క్షేత్రాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలా ఆనందంగా వుంటుంది బాల్జాక్‌ నవలల్ని జ్ఞాపకం చేసుకోవడమంటే.

ఒక ్రెంచి రచయిత రాసిన పుస్తకాన్ని నేను తొలిసారిగా చదివినప్పుడు నాకు పదమూడేళ్లు, యిది ఎడ్నాం గొన్‌కూర్‌ రాసిన “జైంగాన్నీ సోదరులు”. నటుల గురించి, విద్వేషభరిత జిజ్ఞాసకత అనే పరిమిత, ఆత్మనాశక ప్రపంచంలో మానసిక యేకాంతం పాలబడిన మనుషుల గురించిన స్పందనాత్మక గాథ.

మానవ సహజమైన విషాదం వున్న ఆ పుస్తకం నన్ను కదిలించి వేసింది. తనకి గల ఉత్తమమైన దాన్నంతటినీ ప్రపంచానికి అర్చించిన ్రతివాడి పట్లా దయాపూరిత, తీవ్రోద్రేక, సానుభూతి పూర్వక గౌరవం నాలో శాశ్వతంగా కలిగేటట్టు చేసింది,

అదేసమయంలో ఫ్రాన్స్‌ దేశపు సాహిత్యాన్ని గురించి యెక్కువగా తెలుసుకోవాలన్న కాంక్షని ఎడ్మాం గొన్‌కూర్‌ నాలో ఉద్దీపనం చేశాడు. దాని చరిత్రని గురించి నాకు కొద్దిగా, చిన్న తునకలు తెలుసు. ఆ దేశాన్ని యోధుల గడ్డగా, వీరభూమిగా నేను చిత్రించుకున్నాను. నాకు తెలిసినటువంటి బడిపిల్లల్ని ఫ్రాన్స్‌లో యే రచయితలున్నారో చెప్పమనీ, తమకి దొరికిన (ఫ్రెంచి నవలల రష్యన్‌ అనువాదాల్ని నాకు యిమ్మనీ కూడా అడిగాను.

అలెగ్జాండర్‌ డ్యూమా, పొంపాన్‌ ద్యు టెరైల్‌, ఫార్చుస్‌ దు బాయిస్‌ గాబ్చే పీర్‌ జాకోనే, ఎమిలీ గబోరియో మరో డజను మంది రాసిన ఉద్దంథాలని ఆపోశన పట్టేశాను, నాకు యెవరోగాని బాల్డాక్‌ పుస్తకం ఒకదాన్ని యిచ్చేదానికి ముందే అది “మేక తోలు ముక్క”.

బాల్దాక్‌ పాతవన్తువుల అంగడిని వర్ణించిన పేజీలని యెంతటి చెప్పలేని సంతోషంతో చదివింది నేను మర్చిపోలేను. మాటలని యెలా పడితే అలా మలుచు కోడానికి తగ్గ అతి చక్కటి ఉదాహరణగా ఆ వర్ణనని నేను యెన్నటికీ మర్చిపోలేను. యీ పుస్తకంలో ఆశ్చర్యకరమైన నేర్పుతో రాసిన మరో భాగం విందు దగ్గర సంభాషణ : భోజనాల బల్ల దగ్గర జరిగే సంభాషణలో అక్కడొకటీ, యిక్కగొకటీ పొడిముకృల్ని మాత్రమే వాడి, బాల్డాక్‌ మనుషుల ముఖాలకీ, వాళ్ల పాత్రలకీ సంబంధంచిన ఆశ్చర్యకరమైన స్పష్టమైన చిత్రాన్ని రూపు కట్టిస్తాడు.

54 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య

నేను బాల్దాక్‌ పుస్తకాల కోసం చూడ్డం మొదలుపెట్టాను. నేను చదివిన ఆయన మరో పుస్తకం “తండ్రి గొరియో”. నేను వివశుడినై పోయాను. యిక చాలాకాలం నేనే ఆ రస్టిన్యాక్‌ని అనీ, మానవుడి గౌరవాన్ని అణగదొక్కినందుకూ, తను పడే మానసిక వ్యధలన్నిటికీ కారకమైనందుకూ ప్రవంచాన్ని కనితో బెదిరించే ఆ వ్యక్తిని అనీ, భావించుకున్నాను. ఆ రోజుల్లో నేను నికృష్ణంగా బతికాను. అయినా మంచి ఆరోగ్యంగా వుందేవాళణ్ణి. అంచేత కాల్పనికవాదిని అయాను.

“మూనవ ప్రహసనం” చదివేటప్పటికప్పుడే నాకు దగ్గరదగ్గర యిరవై యేళ్లు. నాలో రూపు తీసుకోని కాల్పనికత్వంమీద ఆ పుస్తకం చావుదెబ్బ కొట్టింది. ఆ పుస్తకంలో నాకు బాల్డాక్‌ ప్రతిభ తెలిసింది. యిక ఆయన్ని నేను మహాతీవ్రమైన ఆరాధనతోటి, ఉదాహరణకి ఒక గురువు పట్లా, స్పేహితుడి పట్లా వుండేటు వంటి భావంతోటి, (ప్రేమించాను.

రెండేళ్ల తర్వాత ఆయన పూర్తి రచనల అనువాదం రష్యాలో వచ్చింది. అన్నిటినీ రెండుసార్లు చదివాను. నిజంగా యీ రచయిత గొప్పతనాన్ని అభినందించాను. ఆశ్చర్యకరమూ నమ్మోహనకరమూ అయిన (వ్రతిభగల ఆ వీరోచిత రూపాన్ని అభినందించాను. ఆయన (ప్రణాళికల పరిధి, ఆలోచనల్లోని సాహనం, వాక్కులోని సత్యసంధత, భవిష్యత్తుని గురించిన జోస్యాలు - వాటిల్లో యిప్పటికే చాలామట్టుకు నిజమయ్యాయి - అన్నీకూడా ఆయన్ని ప్రపంచపు మహా బోధకుల్లో ఒకణ్ణిగా చేస్తున్నాయి.

షేకస్పెయర్‌, బాల్డాక్‌, టాల్‌స్టాయ్‌ - నా మట్టుకి నాకు వాళ్లు ముగ్గురూ మానవాళి తనకిగా స్టాపించుకున్న మహత్తర శిఖరాలులాగా కనిపిస్తారు. బాల్డాక్‌ లేకపోయినట్లయితే ఫ్రాన్స్‌ గురించిన నా అవగాహన తక్కువగా వుండేది. ఆ దేశం మానవాళికి పధనిర్దేశకంగా యెప్పుడూ నడిచింది. యింకా నడుస్తూనే వుంది. సర్వదా సృజనాత్మకతలో నూతన రూపాలనీ, యేదో ఒకరంగంలో జీవితపు నూతన రూపాలనీ వికసింపచేస్తూనే వుంది. తనవడ్డీ ప్యాపారస్టులవల్ల ఫ్రాన్స్‌ అవమానం పాలైంది. దాన్ని గురించి ఒకసారి నేను మాట్లాడాను. ఆ మాట్లాడ్డం నేను (ప్రేమించిన దేశంలో కోపకారణమైంది. అలా కోపం కలగడం నాకు అర్ధంకాలేదు, దాన్ని గురించి నేను పశ్చాత్తాపపడనూ లేదు. కాని (ఫ్రెంచి స్టాక్‌ ఎక్స్‌ఛేంజి చేసే సంస్కృతీ వ్యతిరేక, మానవ వ్యతిరేక కార్యకలాపాలు - స్వేచ్భావధంమీద వెళ్లకుండా కాళ్లడ్డం పెట్టి రష్యన్‌ (ప్రజల్ని తొాట్రువడజేసిన ఆ కార్యకలాపాలు - హ్యూగో, బాల్డాక్‌, ఫ్లాబెర్‌ లాంటి ధగద్ధగాయమానమైన తేజస్సు మీద యెొన్నటికీ నీడని కమ్మలేవు. మహత్మార్యాలకీ, మహత్తర మనుషులకీ గడ్డ అయిన ఫ్రాన్స్‌కి వాళ్లు నిజమైన పుత్రులు

యెందుకనో కారణం చెప్పలేను, గాని వ్యక్తిగతంగా దేనికి నేను బల్డాక్‌కి రుణపడి వున్నదీ నాకు తెలీదు. కాని మొత్తం రష్యన్‌ సాహిత్యంమీద ఆయన (ప్రభావం, టాల్‌స్టాయ్‌ చెప్పినట్టు గణనీయంగా వుందన్న విషయం నిస్సందేహం. టాల్‌స్టాయ్‌ ఒకసారి నన్నడిగాడు.

బాల్డాక్‌... 55

“మీరు యెక్కువగా యేం చదువుతారు?” అని.

నేను చెప్పాను.

“బాగుంది” అన్నాడాయన. శాని యింకా ఫ్రెంచి రచయితలని చదవండి. బాట్బ్టాక్‌ని చదవండి. అతన్నుంచే పప్రతివాళ్లూ రాయడం నేర్చుకున్నారు. స్టెండాల్‌ని, ఫ్లాబెర్‌ని, మషపాసాని చదవండి. ఎలా రాయాలో వాళ్లకి తెలుసు. రూపానికి సంబంధించి వాళ్లకి అద్భుతంగా పరిణతి చెందిన అనుభూతి వుంది, తాము తీసుకున్న వస్తువుమీద కేంద్రీకరించే సామర్థ్యమూ వుంది. ఒక్క డికెన్స్‌ని మాత్రమే, బహుశా థాకరేని, వాళ్లు తర్వాత చెప్పుకోవచ్చు. నేను గనక స్టెండాల్‌ రాసిన “పర్మలో వున్న ఆశ్రయం” చదవకపోయి వున్నట్టయితే 'యుద్ధమూ - శాంతీ అన్న నా నవలలోని యుద్ధరంగాలు రాయలేకపోయి వుందేవాణ్జి.”

బాల్జాక్‌ అనంతం, నాకు ఆయన్ని గురించి చెప్పేటంతటి శక్తి లేదు. ఆయన్ని గురించిన నా జ్ఞాపకాలతో బాటుగా నా జీవితంలోని పరమ గద్దు రోజులు పెనవేసుకుని పోయివుంటాయి. అది ఉద్రేకాలని కల్లోల పరుస్తుంది.

నా జీవితంలో సాహిత్యం తల్లిలాంటి పాత్ర వహించింది. మనుషుల పట్ల తనకి గల (ప్రేమ వల్లా, జీవితం గురించి తనకి గల అద్భుత పరిజ్ఞానం వల్లా నేను బాల్డాక్‌ పుస్తకాలని అత్యంత ప్రియమైన వాటినిగా యెంచుతున్నాను. యీ ప్రేమ, అద్భుతపరిజ్ఞానం ఆయన నవలల్లో యెప్పుడూ యెంతో గాఢంగా, ఆనందదాయకంగా నాకు అనుభూతం అయ్యాయి.

56 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య రంగనాయకమ్మ గారి ఇంటర్వ్యూ నా సాహిత్యం నా దుఃఖంలోంచి (ప్రారంభమైంది యూ

ప్రశ్న: సాంప్రదాయకంగా ప్రతీ రచయితనూ మొదట అడిగే తప్పనిసరి ప్రశ్న మీ రచనా జీవితం ఎలా ప్రారంభమైంది? అందుకు (ప్రేరణలేమిటి?

జవాబు : క్లుప్తంగా చెప్పాలంటే, చిన్నతనం నించీ పుస్తకాలు చదవడమే తర్వాత కాలంలో రాయాలనిపించడానికి (ప్రేరణ అనుకుంటున్నాను. కధల పుస్తకాలు చదవడం చాలా చిన్నతనం నించే వుందేది. నా చిన్నతనంలో మేము తాడేపల్లి గూడెంలో వుండేవాళ్ళం, అక్కడ మా ఇంటికి కొంచెం దూరంలో ఆడవాళ్ళ లైబ్రరీ, ఇంకా దూరంలో జనరల్‌ లైబరీ వుండేవి. ఆ లైబ్రరీలకు వెళ్లడం ఎలా ్రారంభమైందో గుర్తులేదు. కానీ, నాకు 7, 8 ఏళ్ల వయస్సు నించే ఆ లైబ్రరీలకు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుంటూ వుండేదాన్ని. ఆడవాళ్ళ లైఖరీలో కొవ్వలి” నవలలే ఎక్కువగా చదివినట్టు గుర్తు. జనరల్‌ లైబ్రరీలో చాలా అనువాద పుస్తకాలు వుండేవి. అందులో ఇప్పుడు 'వనపూలొ అనే రచయిత పేరు మాత్రమే గుర్తు. శరత్‌, (ప్రేమ్‌చంద్‌, టాల్‌స్టాయ్‌లాంటి పేళ్లేవీ అప్పుడు తెలీవు. ఆ రోజుల్లో మా ఇంట్లో చిన్న ప్రింటింగ్‌ ప్రెస్‌ వుండేది. మానాన్న “పద్మనాయక పత్రిక అనే పేరుతో కులం పత్రిక ఒకటి అప్పుడప్పుడూ నడుపుతూ వుండేవాడు. అందులో కులంలో వాళ్ళ పెళ్ళిళ్ళ వార్తలూ, తీర్థయాత్రల వార్తలూ, కులం వాళ్ళు రాసే పద్యాలూ అవీ వుందేవి. నేను ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ వంటాను కాబట్టీ, మానాన్న నన్ను ఆ పత్రిక కోసం ఏదన్నా కధ రాసి ఇవ్వమని అడుగుతూ వుండేవాడు. నేను రాజకుమార్తెని రాక్షసుడు ఎత్తుకుపోతే ఎక్కడ్ణించో గుర్రం మీద రాజకుమారుడు వచ్చి రక్షించే కధలు రాసి ఇచ్చేదాన్ని. మానాన్న చాలా సంతోషంగా ఆ పిచ్చికధలు ఆ పత్రికలో వేసేవాడు. ఆరోజుల్లో 'అంధ్రపత్రిక', “ఆంధ్రప్రభ వార పత్రికలు వుండేవి. అవి మానాన్న రెగ్యులర్‌గా కొనేవాదు. 'ఆంధ్రపత్రికులో ఇంగ్లీషు నవలల అనువాదాలు సీరియల్స్‌గా వుండేవి. అనువాదకుల్లో మద్దిపట్ల సూరి పేరూ, అప్పుడు కథలు రాసేవాళ్ళల్లో తురగా జానకీ రాజీ పేరూ బాగా గుర్తు. అలాగే కధలు రాయాలని అనిపించేది నాకు. నా చిన్నతనంలో, మా ఇంట్లో గ్రామఫోను వుందేది. తమిళ సంగీతం రికార్డులు వుండేవి. చాలా చిన్నప్పుడు కొన్నాళ్ళు ఒక పంతులమ్మగారి దగ్గిర 'ఆర్మణీ' మీద సంగీతం కూడా మిడికాను. తర్వాత అవిడ రాలేకపోవడమో ఏదో జరిగి సంగీతం అడుగంటింది. స్కూలు ఫైనల్‌తో చదువు ఆగిపోయాక, హిందీ పరీక్షలకు

రంగనాయకమ్మ గారి ఇంటర్యూ... 57 చదువుతూ వార పత్రికలకు ఏదో ఒకటి రాసి పంపుతూ వుండేదాన్ని ఆ పత్రికల సంపాదకులు పాపం చాలా దయగా ఎలా రాసేసినా వేస్తూవుందేవారు. నాకు పద్దెనిమిదో ఏట అనుకుంటాను. 'పల్లెటూరు' అనే కొంచెం పెద్దకధ రాశాను. “వేనరికాలు చేసుకోకూడదు. చాలాఇష్టం కలిగిన తర్వాతే పెళ్లిచేసుకోవాలి” అనేది అందులో విషయం. తర్వాత, పందొమ్మిదో సంవత్సరంలో “కృష్ణవేణి నవల రాశాను. (ప్రేమలూ, కష్టాలూ, తప్పుడు నిర్ణయాలూ, అపార్థాలూ, అస్తవ్యస్తపు వాదనలూ, మూధనమ్మకాలూ అన్నీ వున్నాయి అందులో, ఎప్పుడూ ఏదో ఒకటి రాయాలనిపించేది. (ప్రేరణ ఏమిటో ఇంతకన్నా చెప్పలేను. ప్ర : మీ చిన్నతనంలో మీ కుటుంబపు ఆర్థిక పరిస్థితి ఎలా వుండేది?

జ : మా ఇంట్లోనే చిన్న ప్రింటింగ్‌ ప్రెస్‌ వుండేది. ఒకరో ఇద్దరో వర్కర్స్‌ బైటినించీ వచ్చి పనిచేసేవారు. బంధువుల పిల్లలు ఒక్కరో ఇద్దరో ప్రెస్‌లో పని నేర్చుకోడానికి ఇంట్లో వుండేవారు. మా నాన్న ్రూఫులు దిద్దే పనులు మాత్రమే చేసేవాడు. ఆ ప్రెస్‌ద్వారా ఎంత ఆదాయం వుండేదో మాకు తెలీదు. తాడేపల్లి గూడేనికి దగ్గిర్లో 'బొమ్మిడి' అనే వూళ్ళో మా అమ్మకి వాళ్ళ నాన్న ఇచ్చిన (ఇంకా అచ్చంగా ఇవ్వని) భూమి కొంత వుండేది. ఆ భూమి మీద 'కౌలే' మా కుటుంబానికి ఆధారంగా వుండేది. కొంత కాలానికి మాతాత జబ్బుచేసి హరాత్తుగా పోయాడు. ఆయన అస్తి అంతా ఆయన భార్యకే (మా అమ్మమ్మకి) హక్కు అయింది. వాళ్ళ కుటుంబం, భద్రాచలం దగ్గిర 'ాచవరం'లో వుండేది. మా అమ్మన్ము తాగుడికి బానిస. చాలా తెలివి తక్కువది. మా అమ్మ చెల్లెలు, తల్లికి బాగా తాగుడు పోయించి, బొమ్మిడిలో వున్న పొలం అంతా తన కొడుకు పేర రాయించేసింది. మా కుటుంబానికి ఆధారంగా వున్న పొలం అంతా పోయింది. మానాన్న నడిపే (ఫైస్‌కూదా క్రమంగా మూలపడింది. చీకట్లు కమ్ముకొచ్చినట్టుగా ఏడుగురు పిల్లలు గల మా ఇంటిని పేదరికం చుట్టేసింది. తాడేపల్లిగూడెం నించీ బొమ్మిడికి కుటుంబం మారింది. పల్లెటూళ్ళో ఎలాగో గడుస్తూ వుండేది. ప్ర : ఈ రోజుల్లో ఎక్కువగా వినవస్తున్న స్హ్రీల అస్తిత్వం, వికాసాల గురించి చిత్రించడం మీ రచనల్లో ప్రారంభం నించీ కనిపిస్తుంది. ఇది ఎలా జరిగిందో కొంచెం చెపుతారా? జ * అప్పుడు నాకు 'అస్తిత్వం), “వికాసం” లాంటి మాటలేవీ తెలియవు. జీవితమే నాకు ఆ విషయాలు నేర్పింది. ప్రతి ఒక్కళ్ళకీ ఎదురవుతుందే "పెళ్ళి అంటారే, అది నా ఇరవయ్యో ఏట నాకు సంభవించింది. దానితో నా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. అది ఒక చీకటి యుగం. దాన్ని చీకటితో పోల్చడం నిజంగా తగిన మాట కాదు. ప్రకృతిలో చీకటి ఎంతో సహజంగా, చల్లగా, ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, హాయిగా వుంటుంది. కానీ, జీవితంలో చీకటి అలాంటిది కాదు.

చిన్నతనం ఎంత పేద తనంతో గడిచినా ఆరోజుల్లో మాకు విచారం అనేది తెలిసేదికాదు. తండ్రి పెత్తనాలూ, అన్న పెత్తనాలూ మామీద ఎన్నడూ వుండేవికావు మా

58 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

అమ్మ, మా నాన్న కన్నా వందరెట్లు ఎక్కువ మృదువైన మనిషి, (ప్రేమ తెలిసిన మనిషి, బాధ్యతలు తెలిసిన మనిషి ఎంత పల్లెటూరు అయినా, ఎంత పేదరికం అయినా, ఆరుగురు ఆడపిల్లలు అయినా, మా గురించి ఇంట్లో ఎన్నడూ ఒక్క చులకన మాట మేము ఎరగం. చెప్పాలంటే, ఇరుగు పొరుగు ఇళ్ళల్లో కూడా ఆడపిల్లల్ని చులకన చెయ్యడం ఎరగం. మా ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలూ, కొంచెం సంగీతమూ, పిల్లలంటే ఎంతోముద్దూ, అలా గడున్ల్తూ వుండేది. అలాంటి మనుషుల మధ్యనించీ హరాత్తుగా నేను నరకంలో పడిపోయాను. చెట్టుమీద పిట్ట వేటగాడి బుట్టలో పడిపోయినప్పుడు, ఆనాటి నాకన్నా ఎక్కువ దుఃఖిస్తుందని నేననుకోను. నా దుఃఖంలోంచి ప్రారంభమైంది నా సాహిత్యం. మనుషుల రూపంతో పశువులు వుంటాయని ఆకాలంలోనే తెలియడం ప్రారంభమైంది. చిన్నతనం నించీ ఎరిగిన వూళ్ళోనే, ఎంతో తెలిసిన వ్యక్తిని అయితే తప్ప పొరుగూరు వ్యక్తిని కూడా నమ్మరాదనీ, మేనరికాలే చాలా మంచివనీ కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చింది. “అవ్వయారొ కథలో లాగా ఒక రాత్రికి రా్రే వృద్ధాప్యం ఆవరించాలనీ, జీవితం తొందరగా ముగిసి పోవాలనీ తపన (ప్రారంభమైంది. నా అనుభవాలూ, ఇరుగు పొరుగు స్త్రీల అనుభవాలూ వింతగా, కొత్తగా కనపడదం (ప్రారంభమైంది. నా శాంతికోసమే “పేకమేడలు' లాంటి కధలు మొదలుపెట్టాను. అందులో మేనరికాన్ని సమర్ధించాను. అంతేగాక, భానుమతి ఆత్మహత్య చేసుకుంది. ప్రీలు అనుభవించే అవమానాలకు వ్యతిరేకంగా రాయాలనేదే

లక్ష్యంగా ప్రారంభమైంది. అందులో ఎన్ని పారపాట్లయినా వుండనీగాక. జీవితానుభవాలే

కళ్ళు కెరిచేలాగ చేశాయి.

ప్ర : మీ కధల్లో పాత్రలకు అధారాలు ఉన్నాయా? కొన్ని ముఖ్యమైన వాటికి... కమల,

కృష్ణవేణి, భానుమతి, రాజేశ్చర్కి జానకి... ఇలాటి వాటికీ.

జ: దాదాపుగా ప్రతీ ముఖ్యపాత్రకీ కొన్ని ఆధారాలు వున్నాయి. '"పేకమేడలు'లో భానుమతిని

నేనే. 'రచయిత్రిలో విజయని నేనే. “చదువుకున్న కమలిలో కమలని నేనే. నా అనుభవాలూ,

నాకు తెలిసిన ఇతర స్త్రీల అనుభవాలూ అనేక కథల్లో వున్నాయి. కానీ, జీవితాల్లో వున్న

నిజమైన విషాదాన్ని కధల్లోకి తేవడం ఎవరివల్లా కాదు. కధలనేవి జీవితాలకి

మసకబారిపోయిన ్రతిబింబాలుగా మాత్రమే వుంటాయి. జీవితాల్ని కధలు చాలా

బలహీనంగా మాత్రమే చెపుతాయి.

'స్వీట్‌హోమ్‌'లో విమలని నేనుకాదు. నేను వైజాగ్‌లో వుందేరోజుల్లో, ఆకాలనీలో, మాలతి అనే ఆవిడ వుండేది. (ఆవిడ అసలు పేరు మరుధ్వతి). ఆమె తరుచుగా నా దగ్గిరికి వస్తూ వుండేది. వాళ్ళాయన్ని గురించి సరదాగానూ, ముచ్చటగానూ విమలలాగా మాట్లాడుతూ వుందేది. ఆమె కబుర్లు వినీ వినీ 'స్వీటొిహోమ్‌' లాంటి కధని వూహించాను. కానీ, కొన్ని కధల్లో వున్న పాత్రలంత స్వచ్చంగానూ, స్పష్టంగానూ జీవితంలో మనుషులు వుండరు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, నిజాలూ కల్చనలూ కలిసిపోయిన పాత్రలు తయారవుతాయి. అవి వాస్తవమైన వ్యక్తులకన్నా ఆదర్శవంతంగా వుంటాయి.

రంగనాయకమ్మ గారి ఇంటర్యూ... 59 “బలిపీరం' సంగతి చెప్పాలంటే, దానికి విచిత్రమైన పునాది వుంది. ఒకసారి 'మూర్తి' అనే వ్యక్తి నా దగ్గిరికి వచ్చ “మా స్నేహితుడి జీవితం గురించి చెపుతాను. కథగా రాస్తారా?” అన్నాడు. “ముందు చెప్పండి. నాకు నచ్చితే, రాయగలనని అనిపిస్తే రాస్తాను” అన్నాను. తర్వాత కొంతకాలానికి ఏవేవో కాయితాలు పట్టుకుని వచ్చాడు. కొన్ని విషయాలు చెప్పాడు. ఒక తక్కువ కులం వ్యక్తి, చిన్ననాడే వితంతువు అయిన ఒక బ్రాహ్మణ యువతిని సంఘ సంస్క్మరణాభిలాషతో పెల్లిచేసుకున్నాడనీ, కానీ తర్వాత కాలంలో ఆమెవల్ల చాలా అవమానాలకు గురి అయ్యాడనీ కోర్టులో కేసు కూడా నడిచి ఇద్దరూ విడిపోయారనీ చెప్పి కోర్టు కాయితాలూ, కొన్ని ఉత్తరాలూ చూపించాడు. నెమ్మదిగా ఆ కధ తనదేననీ, తను చాలాబాధలు పడ్డాననీ, తాము విడిపోయామనీ చెప్పాడు. ఆ కాయితాలన్నీ ఆకథకి తగినట్టుగానే వున్నాయి. అగ్రకులాల వాళ్ళకి కులాల పిచ్చి వదలకపోతే అలాంటి వాళ్ళతో జరిగే కులాంతర వివాహాల వల్ల జీవితాలు సామరస్యంగా సాగవు - అని చెప్పాలనే దృష్టితో “బలిపీరం' కధ తయారు చేశాను. చిన్న కులస్తుడైన భాస్కర్‌కి, కులాంతర వివాహం “బలిపీరం” లాగా తయారైందని చెప్పాలని ఆ పేరు పెట్టాను. కధలో అనేక మార్పులూ, చేర్పులూ వున్నాయి. అది సీరియల్‌గా వచ్చాక, ఒకరిద్దరు వ్యక్తులు నాతో అన్నారు - “బలిపీఠం”, ఒక నవలగా బాగుందిగానీ, ఆ విషయాలు మీకు చెప్పిన వ్యక్తి చాలా దుష్టుడు. చాలా అబద్దాల తోటే ఆ కేసుకూడా నెగ్గాడు. ఆవిడే చాలామంచిది ఆవిణ్ణి ఇతను చాలా బాధలు పెట్టాడు” అని చెప్పుకొచ్చారు. ఇదంతా నమ్మాలో లేదో తెలీక చాలా అయోమయంలో పడిపోయాను. నిజానికి ఆ నవలని, 'ఫలానా వ్యక్తి జీవిత చరిత్రగా నేను చెప్పలేదు. అగ్ర కుల దురహంకారానికి వ్యతిరేకంగానే దాన్ని రాశాను. కాబట్టి, ఆ విషయాలు చెప్పిన వాడు నిజంగా దుష్టుడైనా, నేను చేసిన పని తప్పుకాదు. కొంతకాలానికి ఆ 'మూర్తి' రెండో పెళ్లి చేసుకున్నానంటూ కొత్త భార్యని తీసుకువచ్చాడు. ఆవిడ తనని ఎంతో ఇష్టంతో పెళ్ళి చేసుకున్నదని చెప్పాడు. కానీ, ఆవిడ తర్వాత నాతో రహస్యంగా అతని మీద చాలాచెప్పింది - “మీ బలిపీరం చదివాను. తనే భాస్కర్‌నని ఇతను చెప్పాడు. అంత మంచి భర్త దొరకడం కన్నా ఇంకేం కావాలని ఇతన్ని పెళ్ళిచేసుకున్నాను. కానీ, ఇతను చాలా నీచుడు. ఒక మంచి బట్ట కట్టుకోనివ్వడు. తల దువ్వుకోనివ్వడు. ప్రతీదానికి అనుమానిస్తాడు” అని గబగబా చెప్పి, “ఇతన్ని వదిలిపెట్టేసి, నా ఉద్యోగం స్తలానికి వెళ్ళిపోదల్చు కున్నాను” అని చెప్పింది. మూర్తి వ్యవహారం అప్పటికి పూర్తిగా అర్ధమైంది. ఆవిడ అతన్ని వదిలెయ్యడం తొందరగానే జరిగిపోయింది. కానీ, ఆశ్చర్యంగా అతను మూడోపెళ్ళి కూడా చేసుకున్నాడు. మరింత ఆశ్చర్యంగా ఆ మూడో భార్య కూడా అతన్ని వదిలేసింది. ఆ మూదో భార్యని, ఒక సందర్భంలో నేను కలవాల్సి వచ్చింది. ఎందుకంటే అదోకధ. 'బలిపీరం' నవలని నేను సినిమాకోసం ఇచ్చినప్పుడు ఈ మూర్తి సినిమా వాళ్ళవెంటబడి, అది తనకథేననీ, తన ఫోటో సినిమా తెరమీద

60 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

చూపించాలనీ వాళ్ళని డిమాండ్‌ చెయ్యడం మొదలుపెట్టాడు. వాళ్ళు “ఇదంతా ఏమిటిని నన్ను అడిగారు. నేను వాళ్లకి గట్టిగా చెప్పాను- “అతన్ని మీరు పట్టించుకోవద్దు'అని. వాళ్ళు అతనితో ఆమాటే అన్నారు. ఇక అతను నామీద హైదరాబాదులో కేసు పెట్టాడు. “బలిపీఠం నవలలో కథ తనదేననీ, దానిమీద తనకి హక్కు వున్నట్టుగా కోర్టు ధృవీకరించాలనీ పెట్టాడు. ఆ సందర్భంలోనే కొంత సమాచారం కోసం ఆ మూడోభార్యని కలవాల్సివచ్చింది. అప్పటికే ఆవిడ అతని నించీ విడిపోయింది. ఆవిడ చాలాచెప్పింది. ఆవిడ జీతం అంతా ఇచ్చెయ్యమనే వాడట. అవిడ, ఆపీసునించి ఇంటికి వచ్చేటప్పటికి, పాలుతోడుపెట్టేసి, కాఫీ తాగడానికి కూడా వీలులేకుండా చేసేవాడట. పైకి శాకాహారినని చెప్పుకుంటూ, ఇంట్లో కోడిగుడ్లు తినేసి, ఆ డొల్లలు కాయితంలో చుట్టి బైటికి తీసుకుపోయి పారేసేవాడట. అలాంటివే బోలెడు చెప్పింది. కోర్టులో పెట్టడానికి కావలసిన ఉత్తరాలు కొన్ని ఇచ్చింది. ఆకేసులో అతనే ఓడిపోయాడు. “బలిపీఠం” నవల మీద రచయిత్రికి తప్ప అతనికి హక్కు వుండదని జడ్జీ చెప్పాడు. అతను దానిమీద అపీల్‌ చేశాడు.

తర్వాత అతను నాలుగో పెళ్ళికూడా చేసుకున్నాడు. ఇంకా కొన్ని పెళ్ళిళ్ళు చేసుకునే అదృష్టం లేకుండానే, అతను నాలుగో పెళ్ళి నడుస్తూ వుండగా అనారోగ్యంతో చచ్చిపోయాడు.

“బలిపీరం' నవలకి ఏదైనా ఆధారం వుందో లేదో చెప్పాలంటే ఆధారం వున్నట్టా లేనట్టా? అది అతని చరిత్రకాదు. కానీ అతను చెప్పిందే. అతను అబద్దాలతో చెప్పిన కథే దానికి ఆధారం అయింది.

“అంధకారంలో...” గురించి చెప్పాలంటే, అది చాలా చిన్న ఆధారం. ఒక పారకుడు, ఒకసంగతి రాశాడు - “తనకి తెలిసిన ఒక వ్యక్తి ఒక 'వేశ్యని పెళ్ళిచేసుకుని, కొంతకాలానికి ఆమెని మళ్ళీ ఆ వృత్తిలోకి దింపడానికి (ప్రయత్నించా దని! అంతే. ఆ వాక్యమే ఆ నవలకి దారితీసింది.

“జానకి విముక్తికి అలాంటి ఆధారాలేవీ లేవు. “స్త్రీల విముక్తి, పురిషాధిక్యతకి ఆధారంగా వున్న ఆస్తి హక్కుల్ని తీసివెయ్యగల కమ్యూనిస్టు సమాజంలోనే సాధ్యం'- అని చెప్పాలనే ఆలోచనే దానికి ఆధారం. కానీ, స్పష్టమైన ఆధారంగా ఒక జానకి లేకపోయినా, ఆడవాళ్ళలో చాలామంది జునకిలే కదా? అలాగే, ప్రతి కధకీ ఆధారాలు వున్నాయి. అన్నీచెప్పడం సాధ్యంకాదు. ప్ర : భావాలలో సీరియస్‌గా వుంటారని సాధారణంగా పారకులు మీ గురించి అనుకుంటూ వుంటారు. అలాంటి మీరు హాయిగా ప్రవర్తించే బుచ్చిబాబు పాత్రని ఎలా సృష్టించగలిగారు? అలా అని అతను మళ్ళీ వ్యక్తిత్వం బేని ఆషామాషీ మనిషి కూడా కాడు. విశాలంగా, ఉన్నతంగా ఆలోచించగల వ్యక్తి. ఆ పాత్ర మీ అకాంక్షా? లేదా, పురుషులు అలాకూదా

రంగనాయకమ్మ గాది ఇంటర్వ్యూ... 61 వుండగలరనీ, అలాంటివారు వున్నారనీ చెప్పదలిచారా? విమల కొన్నిసార్లు “మరీ కరినంగా” వున్నట్టు బుచ్చిబాబును సృష్టించిన మీకు అనిపించలేదా?

జ : బుచ్చిబాబు పాత్ర మొదట మాలతి కబుర్లలోంచి పుట్టింది. తర్వాత నా ఊహలతోటీ ఆశలతోటీ పెరిగింది. మగవాళ్ళు చేసే పెత్తనాలతో, అవమానాలతో విసిగిపోయి అసహ్యపడే వివేకంగల ఆడవాళ్ళు అడుగడుగునా సంస్కారవంతులైన మగవాళ్ళనే ఊహిస్తారు. జీవితసంబంధాలతో పెనవేసుకుపోయే తండ్రీ, అన్నా భర్తా, అందరూ, ఎంతో మృదువుగా, స్నేహంగా, ప్రేమగా తమతో ప్రవర్తించాలని కలలు కంటారు. అందుకే చాలామంది ఆడవాళ్ళు బుచ్చిబాబుని ఇష్టపడ్డారు. కొంచెం మెత్తగా, చనువుగా వుండే భర్రలుగల ఆడవాళ్ళు, “మా ఆయన బుచ్చిబాబు లాంటి వాదేనండీ” అంటూ వుంటారు. అలాంటి మగవాళ్ళులేని వాళ్ళు, “మా ఆయన బుచ్చిబాబు లాంటి వాడుకాడు లెంది” అంటారు. అంటే, భర్త మంచివాడైనా కాకపోయినా, బుచ్చిబాబుతోటే పోల్చి చూడదం. కొన్ని ఇళ్ళల్లో బుచ్చిబాబులు వుండే వుంటారు. సందేహంలేదు. ఆత్మగౌరవం గల ఆడవాళ్ళు వున్నారంటే, దానికి తగిన సంస్కారం గల మగవాళ్ళు కూడా వున్నారని అర్ధం. సరైన భావాలు ఇరుపక్షాలలోనూ అభివృద్ధి చెందుతూనే వుంటాయి. అభివృద్ధి, ఏకపక్షంగా సాధ్యంకాదు. విమల కొన్నిసార్లు 'కఠినంగా వున్నట్లు అనిపించిందా మీకు? బుచ్చిబాబు “చేతకాని వాడిలా” వున్నట్టు కొంతమంది ఆడవాళ్ళకు కూడా అనిపించింది. పొత అలవాట్లతో చూసినప్పుడే అలా అనిపించి వుండవచ్చని నా అభిప్రాయం. దీనిమీద ఇంతకన్నా మాట్లాడుకోగలిగే సందర్భం కాదు గదా ఇది!

ప్ర : మీకుబాగా నచ్చిన, నచ్చని రచయితలు లేదా రచనల గురించి చెపుతారా?

జ : వీరేశలింగం గారినించీ దాదాపు ఈనాటి దాకా అందర్నీ చదివాను. చదువుతూనే వున్నాను. మరీ అభివృద్ధి నిరోధకంగా వుంటే తప్ప, లేకపోతే ప్రతీ రచనలోనూ ఏదో ఒక మంచి విషయం వుంటుంది. కానీ, అన్నీ అందర్నీ ప్రభావితం చెయ్యవు. నాకు చాలా ఎక్కువగా ఉపకరించిన రచయితలు వీరేశలింగమూ, చలమూ. చలంలో అద్భుతమైన విషయాలతో పాటు నెగిటివ్‌ కోణాలూ వున్నాయి. వాటిని నేనూ ఎక్కడా ఇష్టపడలేదు. అలాగే, వీరేశలింగంలో హేతువాద భావాలనే గానీ, ఏకేశ్వరోపాసన లాంటి భావాల్ని నేను ఇష్టపడలేదు. ఆ ఇద్దరిలోనే తప్ప మిగిలిన రచయితల్లో ఏమీ లేదని నేనుచెప్పడం లేదు. నన్ను ప్రభావితం చేసిన వారినే నేను చెప్పాను.

ప్ర: మీ నవలల్లో “అంధకారంలో...” విశిష్టమైందని చాలామంది భావిస్తారు. మీ అభిప్రాయం?

జ ; విశిష్టత అని నేను అనను. కానీ, నాకు కూడా ఆ పుస్తకం చాలా నచ్చుతుంది.

62 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

ప్ర: మీ రచనల్లో మీకు బాగా నచ్చినవి ఏవి? ఎందుకు?

జ : మంచిభావాలు చెప్పగలిగిన పుస్తకమే ఎక్కువ నచ్చుతుంది. “కృష్ణవేణి రాసిన కాలంలో, “చక్కగా రాశాన'నే అనుకున్నాను. కానీ, స్త్రీల ఆత్మగౌరవానికి తగిన అంశాలు అందులో చక్నగా లేవనీ, పైగా అందులో కొన్ని మూఢనమ్మకాలు కూడా వున్నాయనీ అర్థమయ్యాక, “అయ్యో, అలా రాశానా?” అనుకోకుండా ఎలా వుంటాను?

“పేక మేడలులో భానుమతి ఆత్మహత్య చేసుకుంది. 'రచయిత్రిలో విజయ, భర్త నించీ కొంతకాలంపాటు విడిపోయి, మళ్ళీ నిష్కారణంగా రాజీపడింది. కానీ 'జానకి విముక్తిలో జానకి, అన్నిరకాల అజ్ఞానాలనించీ బైటపడింది. తనని పోషించుకునే శక్తి తనకే వుండాలని అర్ధంచేసుకుంది. తనమీద ఆధిక్యత నెరిపేవాడిని పూర్తిగా తిరస్కరించింది. నాజ్ఞానం 'పేకమేడలు" స్థాయి నించీ ఈరకంగా మారుతూ వచ్చిందన్నమాట. 'జానకి విముక్తి రాసిన తర్వాత, దానికన్నా తక్కువ జ్ఞానంతో వున్న శ్పేక్రవేడలూగానీ, 'రచయి(త్ర గానీ, దానికన్నా ఎక్కువగా ఎందుకు నచ్చుతాయి? మంచి విషయాలు చెప్పగలిగిన పుస్తకాలే ఎక్కువగా నచ్చుతాయి కదా? ప్ర: అప్పటికి 10 సంవత్సరాలు పైగా స్త్రీల సమస్యలమీద రాస్తూ మార్చిజం వైపు ఆకర్షితులయ్యారు. ఆ మార్గంలో రచనలు ప్రారంభించారు. తెలుగు సాహిత్యంలో అరుదైన ఈ పరిణామం గురించి కొంచెం చెపుతారా? మీరు మార్చిజం వేపు రావడం ఎలా జరిగింది?

జ : మార్క్సిజం ఇంకా తెలియకముందే నేను నా చీకటి జీవితం నించీ బయట పడ్డాను. నా గాడిద సహనానికి కూడా అప్పటికి సిగ్గు లజ్జలు పుట్టినట్టున్నాయి. వైజాగ్‌ జీవితం నించీ పిల్లలతో మావూరు వెళ్లిపోయాను, నిరాధారంగా “అతని” నించీ పోషణలూ, ఆస్తిలో వాటాలూ అలాంటివేవీ నా దృష్టిలో లేవు. నాడబ్బుమీద కూడా నాకు లక్ష్యంలేదు. అంతా వదిలేశాను. మావూళ్ళో స్కూలు పిల్లలకు (ప్రైవేట్లు చెప్పుకునే పనేదో మొదలుపెట్టాలనే అభిప్రాయంతో వెళ్ళాను. కానీ అతను పచ్చిమోసంగా పిల్లల్ని తీసుకుపోయాడు. తర్వాత నేను కంటి ఆపరేషన్‌ కోసం హైదరాబాదు వచ్చి భద్రంగారనే స్నేహితుల ఇంట్లో వున్నాను. ఆయన నాకు పాఠకుడిగానే పరిచయం. అక్కడికి గాంధీ వచ్చి మార్క్సిజం గురించి ఎంతో ఇష్టంతో మాట్లాడుతూ వుండేవాడు. అతనితో కూడా పారకుడిగానే పరిచయం. అప్పుడతను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ వుండేవాడు. చలాన్ని నాకన్నా కూడా ఎక్కువగా ఇష్టపడేవాడు. యూనివర్శిటీలో జార్జిరెడ్డీ వాళ్ళతో కలిసి స్టడీ సర్కిల్స్‌లో మార్క్సిజం గురించి చదువుతున్నట్టు చెప్పేవాడు. కానీ ఎంత అద్భుత విషయాలైనా చెవిని పెట్టేస్తితిలో అప్పుడు నేనులేను. నా పిల్లలు నాకు దూరమై వున్నారు. నా పబ్లికేషన్‌ పుస్తకాలు “అతని చెరలో వున్నాయి. అవి రావాలంటే వైజాగ్‌ కోర్టులో కేసు నడవాలి. చేతిలో చిల్లి గవ్వలేదు. స్నేహితులే తిండి పెడుతున్నారు. నా పేర్ష వుందని అప్పటిదాకా నేను నమ్ముతూ వున్న

రంగనాయకమ్మ గారి ఇంటర్యూూ... 68 ఒక చిన్నస్తలం, నా పుస్తకాల డబ్బుతోనే కొన్నది, నా పేర్న లేదనే రహస్యం అప్పుడే బయటపడింది. దాన్ని అమ్మికే నా సమస్య కొంతన్నా తీరేదేగానీ, దానికి అవకాశం లేకుండా పోయింది. అలాంటి సమస్యల్లో నాకు ఎంత మంచి విషయాల మీదైనా ఆస్తి కలిగేదికాదు. రెండేళ్లపాటు హైదరాబాదులో భద్రంగారి కుటుంబమూ, వైజాగులో క్రిష్టాబాయి గారి కుటుంబమూ నా చర్మంతో చెప్పులు కుట్టి ఇచ్చినా నా రుణం తీర్చుకోలేనంత ఉపకారం చేశారు ఆకాలం అంతా పిల్లలు లేకుండానే స్నేహితుల ఇళ్ళల్లో గడిపాను. అప్పటికి కోర్టుకేసు ద్వారా నా పుస్తకాలు నాకు వచ్చాయి. హైదరాబాదులోనే వుండాలనే అభిప్రాయానికి వచ్చాను. నాకూ గాంధీకీ కూడా ఇద్దరం కలిసి వుండాలనే అభిప్రాయం ఏర్పడింది. అతను నాకన్నా పదేళ్ళు చిన్నవాడు. అతనికి ఇంకా పెళ్ళికాలేదు. నాకు ముగ్గురు పిల్లలు. చలం శిష్యులమైన మాకు ఈ విషయాలేవీ అభ్యంతరాలు కాలేదు. కొన్నాళ్ళకి పిల్లలు మా దగ్గిరికి వచ్చేశారు. నా పుస్తకాల మీద నాకు నెలకి 500 వస్తూ వుండేది. ఆ డబ్బుతో ఒక అద్దె ఇంట్లో చింతలన్నీ మరిచిపోయి కొత్తజీవితాలు ప్రారంభించాం.

పుస్తకాలు చదువుకోవడమే ప్రధానమైన దినచర్య అయింది. ఆ పుస్తకాలన్నీ కమ్యూనిస్టు పుస్తకాలే. చిలీలో అలెండీని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు దుర్మారంగా చంపివేసిన సంఘటనలతో సి.పి.ఎం. పార్టీ ప్రచురించిన పుస్తకం ఒకటి - ఇది కాస్ట్రో ఉపన్యాసం అనుకుంటాను - ఆ రోజుల్లో చదివాను. అది నన్ను తీవ్రంగా మార్చేసింది. గాంధీ మాటలతో చాలా రోజుల్నించీ జరగని పని ఆ పుస్తకంతో జరిగింది. మార్క్సిజం అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువైంది. అప్పటి నించీ మార్కిజంమీద చదవడం ఎక్కువచేశాను. మార్కు రాసిన 'కాపిటల్‌' చదవాలనే తహతహ ప్రారంభమైంది. అది చదవకుండా సిద్ధాంతం తెలుసుకోవడం సాధ్యంకాదనే అభిప్రాయం ఆనాటి నించే నాకు వుండేది. అది అలా వుండగా రామాయణ విష వృక్షం రాసే పని చాలా తొందరలోనే మొదలైపోయింది. ఆ రకంగా మర్క్సిజంలోకి ప్రవేశం జరిగిపోయింది. ప్ర: మార్మి ఎస్టు సిద్ధాంత మార్గం చేపట్టాక కథలూ నవలలూ తగ్గించి వివరణాత్మక వ్యాసంగం చేపట్టదానికి కారణం? జ : అదే మొదటి అవసరం అనుకోవడమే. సిద్దాంత విషయాలు కధల్లో చెప్పడం కన్నా వ్యాసాల్లో చెప్పడమే ఎక్కువ సాధ్యం. 'కాపిటలొలో చాఫ్టర్షన్నీ వ్యాసాల్లో చెప్పగలం గానీ కధల్లో ఎలా చెప్పగలం? సాధ్యమైన అంశాలు కథల్లోకూడా చెప్పువచ్చు. కానీ, అన్నిచోట్లా అదిసాధ్యం కాదు. ప్ర: కధలూ, వ్యాసాలూ కూడా (ఫిక్షన్‌, నాన్‌ఫిక్షన్‌) ఎక్కువగానే రాసిన మీరు అ రెండుప్రక్రియల మధ్యతేదాను, వాటి ప్రయోజనాల్ని ఎలా పరిగణిస్తారు? జ : కధలు రాయడం కన్నా వ్యాసాలు రాయడం చాలాతేలిక. ప్రయోజనాలు అంటారా? దేని ప్రయోజనం దానిదే. కొన్నివిషయాలు కథలలోనే ఇముడుతాయి. 'స్పీట్‌హోమ్‌'ని

64 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య వ్యాసాలుగా చెప్పడం కన్నా కధల్లో చెప్తే, ఎక్కువ ప్రభావం కలిగిస్తుంది. అలాగే, 'కాపిటల్‌ని వ్యాసాల్లో చెపితేనే అన్నిఅంశాలూ అర్ధమై ఎక్కువ ఉపయోగపడుతుంది. చెప్పే విషయాన్ని బట్టి రెండు పద్ధతులూ అవసరమే కదా? ప్ర : మీకు వ్యక్తిగతంగా హాస్య రసం ఇష్టమా? సీరియస్‌ విషయాలు రాస్తూ కూడా మధ్యలో జోకులు (లేదా, (స్తోకులు) రాయడం పాఠకాకర్షణకా లేక అలా రాయడం అవసరమని మీ ఉద్దేశ్యమా? జ : నా వ్యక్తిగత ఇప్పాయిష్టాల్ని బట్టికాదు. అలా అని పారకుల్ని ఆకర్షించడానికి అంతకన్నా కాదు. ఆ జోకులు కూడా ఆ సందర్భాలమీద విమర్శలే. ఎంత గొప్ప “దేవుత్తి అయినా ఎంత కీర్తిగల నాయకుణ్ణి అయినా, వాళ్ళల్లో తప్పులు వుంటే, కేరిలెస్‌గా విమర్శించవచ్చు _ అనే ధైర్యం ఆ జోకులు ఇస్తాయి. కీర్తివంతుల్ని చూసి భయపడడం పోతుంది, చద్రత్ష విషయాల మీద ఎలా ఆలోచించాలో తెలుస్తుంది. జోకులు కూడా విమర్శలకు ఒకర్తూపం రచనలో అవి అవసరం కాబట్టే అవి వుంటాయి. పారకులకు నేర్పడం కోసమే గానీ అకర్షించడం కోసం కాదు. ప్ర: “విష వృక్షానంతర దశలో మీ నవలలు లేదా కధలు మీకు సంతృప్లి కలిగిందా యా పారకుల స్పందన అదివరకు లాగానే వుందా? అవి కేవలం కొన్ని అభిషప్రాయా ల చెప్పడానికే రాయబడ్డాయనే భావన ఎక్కడైనా మీకు వ్యక్తమైందా? లు జ:నా పుస్తకాల గురించి నేను చెప్పాలంటే, అవి నాకు సంతృప్తికరంగాన్సే వున్నాయి. అనే నేను చెపుతాను కదా? కాకిపిల్ల కాకికి ముద్దు కదా? కాబట్టి విషవృక్షానంతర ర ట్ట బాగున్నాయో లేదో చెప్పవలసింది నేనుకాదు. పాఠకులు చెప్పాలి. కొందరు వె నలు కృష్ణవేణినీ, 'బలిపీరాన్నీ మెచ్చుకుంటూ, ఇప్పటికీ వాటి దగ్గరే వుంటారు, తర్వాత రకులు పుస్తకాలు చదవలేదనీ, టైము దొరకదం లేదనీ చెపుతూ వుంటారు. కానీ బాల పారకులు పాతవీ కొత్తవీ అన్నీ చదువుతారు. కొత్తవే తమకు ఎక్కువ ఉపయోగకర ంది వున్నాయని చెపుతూ వుంటారు. అలా అని వాళ్ళందరూ నాస్తికులుగానూ వా ఎస్తులుగానూ మారిన వాళ్ళుకాదు 'జానకి విముక్తి ఉపన్యాస ధోరణిలో వుందని పర్వా బీ సుబ్రమణ్య శర్మ అనడమే తెలుసునాకు. పారకులెవరూ అలా అనలేదు. ఆయన కూడా అలా ఎందుకు అన్నాడంటే, ఆ సీరియల్‌లో మార్క్సిజం గురించి చెపుతున్నాను కాబట్టి అది ఇష్టం లేక అలా వంకబెట్టి దాన్ని ఆపేశాడు. ఏమైనా, ఇది పాఠకులు చెప్పవలసిందేగాసే నేను చెప్పవలసింది కాదు. ప్ర: 'మార్క్సిజం'లో 'గతి తర్భం'చాలా కీలకం కదా? మీరు తరచూ “తర్మం' అని మాత్రమే వాడుతూంటారు. శుద్ధతర్శం స్థల కాలాలతో నిమిత్తంలేని శుష్క విమర్శకు లేదా వ్యర్థచర్చకు దారికీసే ప్రమాదం వుంది కదా? స

రంగనాయకమ్మ గారి ఇంటర్యూ... 65 జ : “తర్మం” అన్నప్పుడల్లా నా అర్ధం 'సరైన తర్మం' అనేదే. విషయాల్ని పరస్పర సంబంధాలతో చూడాలనీ, కాలమాన పరిస్థితుల్ని బట్టి చూడాలనీ, ఆ సరైన అర్ధం అంతా “తర్మం' అనేమాటలోనే వుంటోంది. అలాంటి అర్థం లేకపోతే అది తర్మమే అవదు. 'శుద్ధతర్శం' అనీ, 'గతి తర్మం' అనీ, తర్మానికి సంబంధించిన చరిత్ర మెజారిటీ పాఠకులకు తెలీదు. ప్రతీచోటా “గతితర్మంి, “గతితర్మం'అని చెప్పలేము.

“గతితర్మం అనే మాటే వాడాలి కదా?” అని మీరనే ప్రకారమే చూస్తే, నిజానికి ఆమాట కూడా సరిపోదు. 'భౌతికవాద గతి తర్కం” (మెటీరియలిస్టిక్‌ డైలెక్టిక్స్‌) అనాలి. ఎందుకంటే, హెగెల్‌ది భావవాద గతి తర్కం అనీ, తనది భౌతిక వాద గతి తర్కం అనీ మార్క్స్‌ అన్నాడు కదా? మరి అలాంటప్పుడు 'గతి తర్మం” అనేమాట మాత్రం ఎలా సరిపోతుంది? 'తర్మం' గురించి ఎప్పుడు చెప్పాలన్నా “భౌతికవాద గతి తర్మం! “భౌతికవాద గతి తర్కం! అంటూ వుండవలసిందే కదా? అలా అనకుందా దాన్ని 'గతి తర్మం అనేమాటతో సరిపెట్టగలిగితే, అదికూడా అనకుండా దాన్ని 'తర్మం” అనేమాటతో కూడా సరిపెట్టవచ్చు. 'తర్మం' అనేమాట చక్కగానే సరిపోతుంది. నేను, 'తర్మం' అనీ, 'ఠార్మికంగా అనీ ఏ సందర్భాలలో అయితే అన్నానో అక్కడ నాచర్చ స్తలకాలాల తోటీ, పరస్పర సంబంధాల తోటీ వుందా లేదా అనేది ముఖ్యం. 'తర్మం” అనేమాటలో పొరపొటేమీ లేదనీ, అది 'సరైన తర్మం' అనే అర్భాన్నే ఇస్తుందనీ ఆ వుద్దేశ్యంతోనే అలా వాడుతున్నాను. ప్ర : ఏ రచయితకైనా సమాజంతో ప్రత్యక్ష పరిచయం, పరిశీలన అవసరం. అలాగే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడమూ తప్పనిసరి. ఇందుకు మీరు ఎలాంటి మార్గాలు అనుసరిస్తారు? ఎందుకంటే, ఒక సీనియర్‌ రచయిత్రి, స్త్రీగా తాను కొన్ని విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉండదని అన్నారు.

జ : చెప్పాలనుకున్న సమస్య మీద అప్పటికే వున్న పుస్తకాలు చదవడం, ఆ జీవితాలు తెలిసిన వ్యక్తులతో మాట్లాడడం, ఆ పద్దతుల్లోనే కావలసిన సమాచారం తెలుసుకోగలం. ఏ రచయిత అయినా చెయ్యవలసింది అదే. అవసరమైన సందర్భాల్లో నేనూ అలాగే చేశాను. “అంధకారంలో...” రాయాలనుకున్నప్పుడు, కథా వస్తువు ఎలా చెప్పదల్పుకున్నానో అది సిద్ధంగానే వుంది. కానీ, కొన్ని వివరాలూ కావాలి. దానికోసం అఆ రకం జీవితాలమీద అప్పటికే వున్న కొన్ని పుస్తకాలు చదివాను. ఆ జీవితాలలో వున్న కొందరు స్త్రీలతో మాట్లాడాను. వాళ్ళు ఆ జీవితాలు ఎందుకు ప్రారంభించారో వాళ్ళు చెప్పింది విన్నాను. అలాగే, “స్టో రాసేటప్పుడు, దాక్టర్ల గురింఛి కావలసి వస్తే కొందరితో మాట్లాడాను. మెడికల్‌ కాలేజీ స్టూడెంట్స్‌ కొందరు పారకులుగా నా దగ్గరికి వచ్చేవారు. వాళ్ళతో వెళ్ళి మెడికల్‌ కాలేజీలో 'ఎనాటమీ' ధియేటరూ అదీచూశాను. 'బలిపీఠం' రాసే టైములో వైజాగ్‌లో ప్రేమ సమాజం' అంతాచూసి, అక్కడ కార్యక్రమాలన్నీ తెలుసుకున్నాను. 'కాపిటలొ పరిచయం రాసే టైములో బ్యాంకుల సమాచారం కావలసి వస్తే, రిజర్వ్‌ బ్యాంకుకి వెళ్ళి, అక్కడ

66 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆఫీసర్లతో మాట్లాడి, ఆ సమాచారం తెలుసుకున్నాను. పేర్ల వివరాల కోసం బోలెడు మంది (బోకర్లతో మాట్లాడాను. వాళ్ళు చెప్పేదే నేను రాస్తానని కాదు. నాకు కావలసిన వివరాలు తెలుసుకుంటాను. 'జానకి విముక్తి రాసేటప్పుడు, బిస్కట్‌ ఫ్యాక్టరీ వివరాలు కావలసి వస్తే, హైదరాబాదులోనే బిస్కట్‌ ఫ్యాక్టరీలు చూశాను. ఏ సందర్భంలో ఏ సమాచారం కావలసివచ్చినా, దాన్ని ఎవరు ఇవ్వగలుగుతారో చాలా (శ్రద్ధగా కావలసిన వివరాలన్నీ ఇస్తారు. ఎప్పుడూ ఆ పద్ధతుల్లోనే తెలుసుకున్నాను. ఇప్పుడు వున్న సమాజ పరిస్తితుల్ని బట్టి, స్త్రీ రచయితలకు కొన్ని విషయాల్లో సమాచారం సేకరించు కోవడం కష్టం అవుతుందనే మాట నిజమే. కానీ అది అసాధ్యం అనే అర్ధానికి రాలేము. కొన్ని విషయాల్లో ఇబ్బందులు మగ రచయితలకు కూడా వుంటాయి. వేశ్యా వృత్తి మీద రాయాలంటే, ఆ స్రీల ఇళ్లకు వెళ్లడం స్రీ రచయితలకు సాధ్యం కాకపోతే, మగ రచయితలకు మాత్రం సాధ్యం అవుతుందా? సమస్య ఇద్దరికీ ఇబ్బందే. సాహిత్యం అంటే కుటుంబ సంబంధాల మీదా, సంఘం సంబంధాల మీదా వుంటుంది. ఈ విషయాలు తెలుసుకోవడంలో ప్రీలకు అసాధ్యమైన విషయాలేవీ వుండవు. లేకపోతే కొంచెం ఎక్కువ ఇబ్బంది కావచ్చు. ప్ర: ఈనాటి ప్రపంచీకరణా, ప్రగతి నిరోధక మతోన్మాదశక్తుల సవాళ్ళూ - శ్క నేపధ్యంలో చైతన్య వంతులైన సాహితీ పరుల కర్తవ్యం ఏమిటీ, మీ ఉద్దేశ్యంలో? మీరు ఇందుకోసం చేయాలనుకుంటున్నది? జ : 'ప్రపంచీకరణ” పేరుతో జరుగుతోన్నదంతా అమెరికాలాంటి దేశాలకు లాభాలు సమకూర్చేదే. ఇండియాలాంటి దేశాలు, స్వశక్తికోసం ప్రయత్నాలేవీ లేకుందా ప్రపంచ బ్యాంకు నించీ అవ్వులు తీసుకుని వాటికి వడ్డీలు సమకూర్చి పెడుతున్నాయి ప్రపంచబ్యాంకు షరతుల ప్రకారం విదేశీ పెట్టుబడులూ, విదేశీ సరుకులూ ఈ దేశంల్రోక్త పెద్ద ఎత్తున ప్రవేశించడానికి ఆటంకాలన్నీ తొలగిస్తున్నాయి. ఈ దేశంలో భూముల్ని కూడా విదేశీ కంపెనీలు కొనుక్కోగలిగే అవకాశాలు కలిగిస్తున్నాయి. ఇదంతా మారు రూపంలో వున్న సామ్రాజ్యవాదమే. . మతోన్మాదం సంగతి తీసుకుంటే, దాని అభివృద్ధి నిరోధక సవాళ్ళు ఈనాడు కౌత్తవా? వెనకటి కాలాన్ని వదిలేసి కనీసం నిన్నమొన్నటి భారతదేశ చరిత్రని తీసుకున్నా వేశ విభజన కాలంలో జరిగిన మత హత్యలకన్నా తీవ్రమైన పరిస్తితా ఈనాటిది? ఈ ఉన్మాదం ఎప్పుడూ వుంది. మతం, దోపిడీ వర్షానికి వంత పాటగాడిగా ఏనాడైతే తలెత్తిందో' అనాటి నించీ అది ప్రగతి నిరోధక ఉన్న్మాదశక్తే. చైతన్యవంతులైన వ్యక్తులైనా సంస్థలైనా ఈనాదైనా, వనాడైనా చెయ్యవల్సింది, సమాజ స్వభావాన్ని మొదట అర్ధంచేసుకుని, తమకు చేతనైన పద్ధతుల్లో దాన్ని తోటి ప్రజలకు వివరించడమే. సమాజ స్వభావాన్నీ ప్రభుత్వాల ప్రవర్తననీ అర్ధంచేసుకోవడం వర్గ దోపిడీని వివరించే మార్క్సిజం ద్వారానే సాధ్యమవుతుంది.

రంగనాయకమ్మ గారి ఇంటర్యూూ... 67 ఏనాటి నించో అనేకమంది మేధావులు అనేక సమస్యలమీద పోరాడుతూనే వున్నారు. కానీ, “వర్గ సమాజం' అనేదాన్నిగానీ, అది ఈనాడు పెట్టుబడిదారీ విధానంలో వున్నదనే విషయాన్ని గానీ ఏ మాత్రమూ పట్టించుకోరు. తాము పోరాడే సమస్యలకూ, పెట్టుబడిదారీ విధానానికీ వున్న సంబంధం ఏమిటో అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించరు. ఉదాహరణకు పర్యావరణ కాలుష్యం గురించి తీసుకోండి. ఈ సమస్యమీద ఉపన్యాసాలు ఇచ్చే మేధావులు “కాలుష్యం, కాలుష్యం' అనే కేకలేస్తారు గానీ, దానికి పెట్టిబడిదారీ విధానమే అసలైన కారణమనీ, ఆ విధానం మీద పోరాడితేతప్ప కాలుష్యాన్ని అరికట్టలేమనీ ఆ ఉపన్యాసాల్లో ఒక్కమాట కూడా చెప్పరు. అలాగే, “మతోన్మాదం మీదైనా, భారీ నీటి ప్రాజెక్టుల సమస్యమీదైనా, ఇంకే సమస్యమీదైనా పోరాడే సంస్కర్తలు, పెట్టుబడిదారీ రూపంలో వున్న వర్గదోపిడీని పట్టించుకోకపోతే ఆ పోరాటాల వల్ల ప్రజలకు సరైన మార్గం చూపించలేరు.

“ఈనాడు మీరేం చెయ్యదల్చుకున్నారు?” అని నన్ను అడిగారు కదా? మార్క్సిజాన్ని అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించి, దానితో ఏకీభవించిన క్షణంనించీ దాన్ని గురించి చెప్పడమే నా పనిగా పెట్టుకున్నాను. దానికోసమే ప్రయత్నిస్తున్నాను. ఇక ముందైనా అదే చేస్తాను. ప్ర: ఈనాటి సాహిత్య దృశ్యంపై మీ అభిప్రాయం? అంటే, రకరకాల ధోరణుల, వాదనల గురించి. అంతకంటే, వాటి ప్రాతిపదికలుగా వెలువడుతున్న రచనల గురించి, సాధారణీకరణ కష్టమే అయినా, అలా చెప్పగలిగిన మేరకు...

జ : సాధారణీకరణ కష్టం కాదు. అదే తేలిక. వేరు వేరు ధోరణులూ వాదనలూ ఈనాడే కాదు ఏనాడూ వున్నవే. మనుషులు భిన్న వర్గాలుగా వున్నారు కాబట్టి, వారి ధోరణులూ భిన్నంగానే వుంటాయి. “ఈనాటి సాహిత్యదృశ్యం” అన్నప్పుడు, మీరు మీ ప్రశ్నలో స్పష్టంగా ప్రస్తావించకపోయినా, మీ దృష్టిలో వున్నది ఫెమినిస్టు ధోరణులూ, దళితధోరణులూ, పోస్టు మోడర్నిస్టు ధోరణులూ లాంటివే అనుకుంటున్నాను. తెలుగు సాహిత్యంలో "ఫెమినిజం పేరుతో, కొంతకాలంగా కనపడుతున్నది పెట్టుబడిదారీ సంస్థల ఫండ్స్‌తో వర్ణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సాగే కార్యక్రమమే. పెట్టుబడిదారీ వర్గం ఏ దేశంలో నైనా ఇలాంటి కార్యక్రమాల కోసం కొంత ఆదాయాన్ని, అంటే “అదనపు విలువగా లాగిన దాంట్లోంచి ఒక ముక్కని, ఈ పనుల కోసం ఖర్చు పెడుతుంది. ఆ వర్ణానికి సేవ చెయ్యడానికి పూనుకున్న వ్యక్తులూ సంస్థలూ ్రతీచోటా సిద్ధంగానే వుంటారు. దానివల్ల వాళ్ళ లాభం వాళ్ళకి వుంటుందనుకోండ్‌. పైకి “స్త్రీల హక్కులూ, పురషాధిక్యత మీద పోరాటాలు” అని చెపుతారు. కానీ వాళ్ళు చేసేదంతా పురషాధిక్యతకి దన్నుగా నిలిచే ఆస్తి సంబంధాల్ని (ప్రశ్నించే వేపు చూడకపోవడమే. ఆ రకంగా, ఆ ఆస్తి సంబంధాలకూ పురుషాధిక్యతకూ వత్తాసుగా నిలబడడమే. అలాగే, దళితవాదనలు కూడా అలాంటివే. అవి దళిత ప్రయోజనాల్ని పట్టించుకోవు. దోపిడీ ఆస్తి నంబంధాల్నీ, దోపిడీ (శ్రమ విభజననీ

68 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య ప్రశ్నించవు. పైగా, అలా ్రశ్చించాలని చెప్పే సిద్ధాంతం మీద కత్తికడతాయి. దోపిడీ రాజ్యాంగంలోకి జొరబడడమే తమ విముక్తి మార్గమని దళిత మేధావులు బోధిస్తారు. వారికి, దాన్ని మించిన కార్యక్రమం ఏదీలేదు. ఇక, పోస్టు మోడర్పిస్తులు సమాజాన్ని పరస్పర సంబంధాలు గల విషయంగా చూడరు. సమస్యలన్నీ దేనికది విడివిడిగా వుంటాయి. ఒక మౌలిక విషయమూ, దానినించే పుట్టుకొచ్చే అనుబంధ విషయాలూ - అనే విభజన వాళ్ళ అవగాహనలో వుండదు. కానీ, ఇలాంటి అవగాహన లన్నీ సమాజాన్ని యధాతధంగా వుంచడానికే అనుకూలిస్తాయి. ఇవి, ప్రీలకూ, దళితులకూ, ఇంకా మీరు ప్రస్తావించే మైనారిటీలకూ ద్రోహం చేసేవే. ఏ తప్పుడు ధోరుణులని ఎదుర్కోవాలన్నా సరైన ధోరణి మెజారిటీ ప్రజలకు తెలిసివుండాలి. సిద్ధాంతం అనేది మెజారిటీ ప్రజలకు తెలిసినప్పుడు అది ఒకశక్తి అవుతుంది. సరైన ధోరణి (ప్రజలకు అందనంతకాలమూ, తప్పుడు ధోరణులు విజృంభిస్తూనే వుంటాయి. రూపొలు మారుస్తూ వుంటాయి. ఏనాటి సాహిత్య దృశ్యాన్ని అయినా, ఈ పద్ధతిలోనే అర్ధం చేసుకోవాలి. ప్ర: యువ రచయితలకు, రచనలు చేయాలనే ఉత్సాహం వున్నవారికి మీ సలహాలూ సూచనలూ చెపుతారా? జ : ఇతరులకు సలహాలూ సూచనలూ ఇవ్వదగ్గ స్థాయిలో నేను వున్నాను" అనుకుంటూ సలహాలు ఇవ్వడం నాకు నచ్చదు. ఏదైనా రాయదల్పుకున్న వాళ్ళు అంతకు ముందే రాసిన వాళ్ళ పుస్తకాలు చదవాలనీ, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలనీ ప్రత్యేకంగా చెప్పాలా? ఎవరి పాటలూ వినకుండా ఎవరూ పాడలేరు. అలాగే, ఎవరినీ చదవకుండా ఎవరూ రాయలేరు. ఆ సంగతి తెలుసుకోవాలని చెప్పడమే సలహా అయితే, మరి సలహా ఇచ్చినట్టే! ప్ర: రచనా జీవితంలో పాఠకుల స్పందనలూ, వాటికి మీ ప్రతిస్పందనలలో గుర్తించుకోదగి నవి. జ : పారకుల నించి సాధారణంగా ఏకగ్రీవంగా వినపడే మొదటి అభిప్రాయం ఏమిటంటే = “మీ పుస్తకాలు తేలిగ్గా అర్థమవుతాయి" అంటారు. దాదాపుగా అందరూ ఈమాట అంటారు. రెండో అభిప్రాయం ఏమిటంటే = 'మీ ఫలానా పుస్తకం చదివాం. కొత్తవిషయాలు తెలిసినట్టుగా వున్నాయి అంటారు. నెగిటివ్‌ స్పందనల గురించి చెప్పాలంటే నాకు “పురుషద్వేషం' అని “పేక మేడలు” టైము నించీ అనేవారు. క్రమంగా ఆ మాట వదిలేశారు, రాముణ్ణి తిట్టింది" అని కొంతమంది అన్నారు గానీ, అదీ వదిలేశారు. 'అసలు విషయం చెప్పి వూరుకోరాదూ? వెటకారాలెందుకూ?” అంటారు కొందరు. 'వెటకారాలు కూడా అసలు విషయమే. వెటకారాలు చెయ్యవలసిన చోట చెయ్యకుండా వూరుకుంటే అది అసలు విషయం అంతా చెప్పినట్టు ఎలా అవుతుంది?” అంటాను నేను. మొత్తం మీద, “పాఠకులు తార్మికంగా వుండే విమర్శలన్నిటినీ ఇష్టపడతారు.

రంగనాయకమ్మ గారి ఇంటర్వ్యూ.. 69 “విషవృక్షం” పారకుల ప్రశ్నలకు జవాబులూ, 'కాపిటిల్‌ పరిచయం, 'వాడుక ఖాషే రాస్తున్నామా?), 'తెలుగు నేర్చడం ఎలా”, “నీడతో యుద్ధం' లాంటి పుస్తకాల గురించి పారకులు రాసే వుత్తరాల ద్వారా నాకు ఏర్పడ్డ అభిప్రాయం ఏమిటంటే - జీవిత సమస్యల గురించి రచయితలు చెప్పగలిగితే, వాటిని తెలుసుకోవడానికి పారకులు చాలా ఇష్టపడతారు, తమకు మంచి విషయాలు తెలిసినట్టూ తమ ఆలోచనా శక్తి పెరిగినట్టూ అనుకుంటారు. అంబేద్కర్‌ మీద రాస్తున్నప్పుడు కొందరు అనేవారు - “అంబేద్కర్‌ మీద రాస్తే దళితులు వూరుకోరు” అని. అంటే, “ఏం చేస్తారు?” అనే దాన్ని నేను. 'ఏమో, వూరుకోరు" అనే వాళ్లు మళ్ళీ. ఆ పుస్తకం బైటికి వచ్చాక, “అదంతా వక్రీకరణి అన్న “దళితులే గాక, “ఈ పుస్తకంలో వివరణ మాకు నచ్చింది” అన్న దళితులు కూడా ఎదురయ్యారు. ఇప్పటికీ, పురుషాధికృ్కతతో వుండే భర్తలకి నా పుస్తకాలు నచ్చవు. ఆ సంగతి భార్యలే చెపుతారు. అంటే, భార్యలకి అవి నచ్చుతాయి.

70 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆదిభట్ల నారాయణదాసుగారు -చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి శతావధాని యీ పరమ భక్తాగ్రేసరుండు హరికథ అంటే యేమిటో తెలియని కాలంలో మన ఆంధ్రదేశానికి దాన్ని రుచి చూపడమేకాక పలువురికి వుపదేశించిన మహోపాధ్యాయు డు. హరికధలకు సంస్కృతాంధ్ర సాహిత్యముండాలి. మంచి (శ్రుతి లయ జ్ఞానంతో మిళితమైన గాన (ప్రవేశముండాలి. యీయనకు వూర్వోక్తమైన శక్తులే కాక ఉభయభాషలయందు మంచిగా కవిత్వంచెప్పే వైపుణ్యంకూడా వుంది. యాయన యెన్నో హరికథలు రచించారు. ఇంగ్లీషు పారసీ లోనైన దేశాంతరభాషలలో కూడా ప్రవేశం వుంది. ఇన్నిశక్తులు యేకత్ర వుండడం చాలాఅరుదు. తే.గీ. ఆదిభట్టీతందయ్యెను హరికధలకు ఆదిభట్టీతండయ్యె గేయపు ఫణితికి ఆదిభట్టీతండయ్యె నాట్యంపుగళకు ఆదిభట్టీతండయ్యె లోకాద్భతులకు. యీయనతో నాకు ప్రధమపరిచయం నేటి 50 సంవత్సరముల నాండు శ్రీ విజయనగరం మహారాజావారి దర్శనార్ధం వెళ్ళినప్పుడు కలిగింది. ఆ వూళ్ళోనే యాయన హరికధ విన్నాను. అంతవణకు నేను సీసపద్యం రేగుప్తిరాగంమీందా ఆనందభైరవి రాగంమీం దా చడవడమే విన్నానుగాని యితర రాగాలమీంద చదివిన వారిని యెలంగను. యాయన ఆవేళ కేదార బిలహారి జంరూటి యీరాగాలమీంద చదవడం విన్నాను. యీయన మనదేశపు గానానికే కొన్నిమార్పులు కలిగించి వన్నెపెట్టిన స్వతంత్రుండు యీయన గాత్రం చాలాగంభీరమైనది. చాలామంది గాత్రాలు విన్ననాకు యెక్కడా యీయనగాత్రం మాదిరి గాత్రం తటస్థంకాలేదు. యీయన దినచర్య ధీరోదత్త లక్షణాని కుదాహరణంగా వుండదుగాని థీరోద్ధతలక్షణానికి ఉదాహరణంగా వుందును. తృణీకృత బ్రహ్మపురందరుం డు. గానమేకాదు. సంస్కృతాంధ్ర సాహిత్యమేకాదు, నాట్యమేకాదు. ఆయియిదీ అనడమెందుకు? యీయనకు వశమైన సర్వవిద్యలున్నూ గురూపదేశంవినాగా లభ్యమైనవే. విజయనగరంలో అప్పుడు సర్వవిద్యలూ తాండివిస్తూ వుండేవి. యీ వరప్రసాదునకు (శుతిమాశ్రంచేత అవన్నీ స్వాధీనపడ్డాయి. వీణ గురుశుశ్రూషవినాగా లభించదని నాకుతోస్తుంది. యాయనకు ఆ విద్యకూడా అలాగాక స్వాధీనపడ్డది. ఆ సంస్థాన ప్రభువులు యీయన్ని యేలా గౌరవించవలెనో ఆవిధంగా గౌరవించి చరితార్జులైనారు. సంగీతపారశాలా ప్రధానాధికారిగా నేర్చథజిచి పూజించి నారు. యాయన వంటి సరస్వత్యావతారులు

అదిభట్ల నారాయణదాసుగారు... 71 యేకాలంలోనో గాని అవతరింపరు, వార్ధక్యంలో కూడా యీ పుంభావ సరస్వతి హరికధ అంటే వేలకొలదిగా జనం వచ్చేవారు. ఆవయస్సులో (70 యేండ్ల దాదాపులో అన్నమాట) గాత్రం వపలకమంటే వలుకుతుందా? దగ్గరవాళ్లకే వినపదనిస్టితిలో దూరస్థులకు చెప్పేదేమిటి? కాని యెప్పుడో శంభో అని తన సహజమేఘ గంభీర ధ్వనితో వొకగర్జింపు గర్జిస్తే దానికే సంతోషించి తృప్తిపడేవారు.

బాలాజీదాసుగారు యాయనకన్న సుమారు పదేళ్ళేనా పెద్దలు. ఆయనశైలివేయిగాని అదిన్నీ జనరంజకమైనదే. యింతసామ([గ్రిగల హరికథకులు యింతకుపూర్వం లేరు. భవిష్యత్తులోనేనా బయలుదేరతారనడం పుస్తాకాపేక్షే యాయన వయస్సిప్పుడు 84 వత్సరాల కించుమించు. యింతటిధన్యమూర్తి యింతటి అదృష్టశాలి మజివుండడు. ధన్యః ధన్యః ధన్యః నారాయణుని నారాయణుండు గౌరవించుగాక., ష్‌

72 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య విడుదల కాబోయే సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలోని అవకతవకల్ని అక్షేపిస్తూ 24-11-1935 న, పర్గాకిమిడిలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాప్రిగారితో గిడుగు వెంకటరామమూర్తిగారు చేసిన శపథమిది. త్స బాగా వినండి. గట్టిగా నమ్మండి. నే నిదివరకి చేసిందల్లా వుండనియ్యండి. నే నింకో పని చెయ్యవలసి వుంది. అది చెయ్యకుండా నే నీ శరీరం విడిచిపెట్టను. ఇది నా యిచ్చకు వ్యతిరేకంగా జరగదు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు యొక్క స్థితిగతులు మీకు బాగా తెలుసు. జయంతి రామయ్యగారు దాని చిగుళ్ళన్నీ చిదిమేశారు. ఇప్పటికీ చిదిమేస్తూనే వున్నారు. అది పూర్తిగా గిడసబారిపోయింది. దానికింక యెదుగు బొదుగులు లేవు. అది ఇక చిగిర్చదు. పుయ్యదు. కాయదు. ఫలించదు, ఇక రామయ్యగారు ఆశ పెట్టుకుని వున్నదల్లా సూర్యరాయాంధ్ర నిఘంటువు. దేశం కనిపెట్టుకుని వున్నది దానికోసమే. అయితే, అది శబ్దరత్నాకరం మీద యింప్రవుమెంటు తప్ప స్వతంత్రం కాదు. సమ(గ్రం అంతకంటే కాదు. నిర్దుష్టం కానేకాదు. కావడానికి తగిన సన్నివేశాలక్కడ లేనేలేవు. అది అచ్చులో వుందని తెలుస్తోంది. కనక యెప్పటికేనా బయటికి వస్తుంది. నేను దానికోసం యెదురు చూస్తున్నాను. వచ్చీ రావడం తోటే దాన్ని నేను ముక్కా చెక్కా కింద చిదక్కొట్టేసాను.

విడుదల కాబోయే సూర్యదాయాంధ్ర నిఘంటువు... 78

ఇంత పనిచేస్తేనే కాని కృతకాం[ద్రం యొక్క దౌర్చల్యమూ, దౌర్భాగ్యమూ దేశీయులకు పూర్తిగా బోధపడవు.

నిఘంటువు రాయడాని కెలాంటివారు పూనుకోవాలో, వారి హృదయం యెంత విశాలమైనది కావాలో, సంకుచిత భావాలతో పూనుకుంటే అది యెలాగ నిరర్ధకం అయిపోతుందో, జీవద్భాషను విడిచిపెట్టి నిఘంటువు రాయడం యెంత శవాలంకరణమో దేశీయులకు బోధపడడం చాలా అవసరం.

ఏది జరిగినా ఏది జరగక పోయినా నే నిదిమాశత్రం చేసి తీరతాను.

మీరు చూస్తారు.”

74 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఒ్ల్‌ ఒల్ల వల్లూరిలో నా ప్రపంచం -శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (అనుభవాలూ జ్ఞాపకాలూనూ)

వల్లూరిలో ప్రవేశించడం మరో ప్రపంచాన పడ్డట్టుంది, నాకు.

చదువు రాసాగింది, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి జయించుకురాగలం అన్న ధైర్యం కలగజొచ్చింది, జీవనసరళిలో స్ఫుటమైన మార్పున్నూ ప్రారంభం అయింది, దాంతో.

నిజమే, అయితే, పొరుగూరిలోనే కలిగే మార్చది.

స్వగ్రామంలోనే వుండిపోతే అది నంభవించనూ సంభవించదు, జీవితం రసవంతమూ కాదు, ఆనందం అన్నది అనుభవానికీ రాదు.

పదమూడో సంవత్సరంలోనే నా కది ప్రారంభం కావడం నా అదృష్టం. బాగానే వుంది, పొరుగూరిలోనే యిలాంటిది తటస్టపడితే, మరి జిల్లా దాటి వెడితే?

దేశమున్నూ దాటి వెడితే?

ఖండానికి ఖందమే దాటి వెడితే?

పుల్లయ్య వేమవరం లాగ వెళ్ళడం కాక, ఆ వెళ్ళినచోట చదువుకోడమో, వ్యాపారం చెయ్యడమో సాగించివుంటే?

భారత రణక్షేత్రంలో అర్జునుడికి కలిగిందన్న విశ్వరూప సందర్శం అప్పుడే లభిస్తుంది, మనిషికీ.

స్వార్ధానికి పరసీమ లేవో, పరార్దానికి ప్రారంభాలున్నూ యెక్కడో అప్పుడే బోధపడుతుంది, కర్తవ్యపరాయణుడికి.

ఇంగితజ్ఞానం కలిగి, సృష్టిరహస్యం తెలిసి, మానవశక్తికి పరిమితి యెంతో గుర్తుకివచ్చి, ఐహికజీవితానికి ప్రాష్యం యేమిటో అదిన్నీ అవగాహన అయి, ధన్యత సిద్ధిస్తుంది, జిజ్ఞాసువుకి.

ప్రవృత్తిపరంగా చూస్తే, పౌరుషానికి పరిపూర్ణత సిద్ధించదానికి సుగమం అయిన మార్గం యిదీ.

వల్లూదిలో నా ప్రపంచం... 75

ఎప్పటి కప్పుదే - ఎక్కడి కక్కడే - ఎంత కంతే సంస్కారమున్నూ కలిగించే మార్గం యిదీ. సే

కాగా:-

“వల్లూరిలో ప్రవేశించడం మరో ప్రపంచంలో పడ్డట్టయింది నాకు” అన్న మాటకి వివరణ యిక్కడ ప్రారంభం అవుతుంది, మెల్లిగా.

జరిగిందేమిటంటే?

పాలమూరిలో నేను మా నాయనగారి కొక్కరికే భయపడేవాణ్ణి, వూరిపెద్దలతో నాకు ప్రసక్తే వుందేదికాదు. ౯

వీలుతప్పితేనే పుస్తకం పుచ్చుకునేవాణ్ణి.

భోజనభాజనాలకు నా ప్రయత్నమే అక్కరలేకపోయేది.

ఇందుకు భిన్నంగా, = వల్లూరిలో నాకు పెద్దలతోనే ప్రసక్తి,

వారి కందరికీ నేను విధేయుణ్ణయి వుండవలసివచ్చింది.

నా భోజనం నేనే సంపాదించుకోవలసివచ్చింది.

చదువే అక్కడ ముఖ్యం అయిపోయింది, నాకు.

దాంతో, కశాఘాతం తిన్న పందెపుగుర్రం అయిపోయింది, నా పురుషకారం. ఏమంటే?

వల్లూరిలో, నేను, సూర్యోదయాత్పూర్యమే మేలుకోవాలి, స్థందిలశయ్య విడిచి లేచిన్నీ నోవాలి, యెంత బద్ధకంగా వుండినా.

కాలకృత్యాలు తీర్చుకోడం తడువుగా, నా చెంబు నేను తోముకోవాలి, చన్నీళ్ళతో స్నానంచేసి నా బట్టలు నేనుతుక్కోవాలి, ఆరవేసుకోవాలి, అవి జాగ్రత్త కూడా నేనే చేసుకోవాలి.

పాత పారాలు చింతన చేసుకోవాలి.

స్త్రీలు వంట ప్రయత్నాలు ప్రారంభించకపూర్వమే వెళ్ళి వారం చెప్పుకోవాలి.

గురువుగారి యింటో నియతం అయిన పనీ, బస యిచ్చిన వారున్నూ వీలుతప్పి యేదయినా చెబితే అదీ చేసెయ్యాలి, నిమిషాలమీద.

వారంచెప్పినచోట సమయం గుర్తించి భోజనాల వేళకి ముందే వెళ్ళి అక్కడ కనిపెట్టు క్పూచోవాలి, కనపడుతూ.

76 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య

వంచిన తలయెత్తకుండా పీటమీద కూచోవాలి, అది కావా లిది కావాలని అడక్కుండా భోజనం చెయ్యాలి, పంక్తిలో వున్నవారికి వెగటు పుట్టకుండా.

కొత్తపారం స్వయంగా చూసుకొని క్రమం యేర్ప్చరచుకోవాలి, గురువుగారి వీలు కనిపెట్టి చెప్పుకోవాలి. అది మరపురాకుండా వల్లించుకోవాలి. ఆజ్ఞలకు చెవులోర జేసుకునేవుంటూ.

వేళ కనిపెట్టుకుని మళ్ళీ రాత్రి భోజనం చెయ్యాలి.

వెంటనే పడుకుని నిద్రపోవడానికి వల్లకాదు, దేహళీదత్త దీపం దగ్గిర కూచుని చదువుకోవాలి, యింటివారికి చిరాకు పుట్టుకుండా గట్టిగానో మెల్లిగానో.

ఇంటో అయితే, అర్ధరాత్రి అయినా ముసుగు తన్నుకునే వుండి, అమ్మని లేపి, గద్దించి తెమ్మనవచ్చు, అక్కడ మాత్రం దాహం కావచ్చు కనక, ముందే జాగ్రత్తపడి, సిద్ధంగా వుంచుకోవాలి మంచినీళ్ళ చెంబు - నిద్రమత్తుతో వాత్తిగిల్లడంలో చేతికో కాలికో తగిలి నీళ్ళు వాలికిపోయి, పడుకున్న చాపా, చాపమీద గావంచా, ముసుగుపెట్టుకునే దుప్పట్టీ తడిసిపోకుండా వుండేటట్టు.

ఇంత కార్యక్రమంలోనూ మధ్యాహ్నం చెప్పుకున్న కొత్తపారం వల్లించుకోవడం తడువుగా ఎగిరిపోయి దేవాలయ గోపురం పై అంతస్థున కూచునేవాణ్ణి, ఏమిటేమిటో కలలు కంటూ నేను.

నాకు జ్ఞాపకం వుండినంత వరకూ, ప్రయత్నపూర్వకంగా నేను కల్పనకు పూనుకోదానికి మొదలు ఆ గోపురంమీదే.

అక్కణ్డుంచి చూస్తే ఎదట, వరసగా, విరగబూసిన బొగడచెట్ల శిఖరాలు - ఎడమవైపున, ముడుచుకుపోయిన కలవలతో నిండివున్న కోనేరు - వెనక, చిరుగంటలతో ధ్వజస్తంభాగ్రమూ మిలమిల మెరిసే పసిడికుండతో దేవాలయ శిఖరమూను - కుడివైపున, చేతికందేటట్టు మనిషి కలవిగాని గెలలతో కొబ్బరిచెట్ల తలలు - ఇలాగ, ఆ పరిసరా లందు కనుకూలంగానే వుండేవి.

దీనికి సాయం, అక్కడ, నాలుగువైపులనుంచీ కమ్మనిగాలి రివ్వున కొట్టేది, మధ్యమధ్య మాత్రం గబ్బిలాల కంపుతో కలుషితం అయిపోతూ.

అయితే, భాష రాదు, అనుభవం లేదు, భావాలు పుట్టవు. అయినా, వినివుండిన కొద్ది కథలూ ఆధారంగా, చక్కని కథలు కల్పించాలనీ, రసవంతంగా చెప్పాలనీ సంకల్పమూ మొదటి ప్రయత్నమూ కూడా అక్కడే నాకు,

వల్లూరిలో నేను పడ్డ మరో ప్రపంచంలో, మళ్ళీ నాకిది యింకో ప్రపంచం.

వల్లూరిలో నా ప్రపంచం... 77

నేను లేశమూ సంస్కారం లేనివాణ్ణే అయినా, ఆ ప్రపంచ స్వభావం అది కనక, అందులో పడ్డ వెంటనే నిర్ధారణ చెయ్యలేని ఆవేశం యేదో తలమున్మలయి పరవశుణ్ణి చేసేసేది నన్నుత్తరక్షణంలో.

అందువల్ల గోపురం దిగడం అంటే నాకెంతో బాధగా వుందేది.

పోనీ అంటే, గోపురశిఖరాలమీద సాధారణంగా సరీసృపాలుంటా యంటారు, చీకడి పడితే అవి అక్కడికి వస్తాయేమో అని జంకు.

సూర్యాస్తమయం అవుతుందనగా, సంధ్యావందనం నిమిత్తం తోటి విద్యార్థులు కోనేటికి వస్తారు, వూరివారితోబాటు పరమేశ్వరదర్శనమూ చేసుకుంటారు - అప్పుడు వాళ్ళతో వుండకపోతే యేమి చిక్కో అని కొంకు.

అది రచనా కాదు, రచనాసమాధి అసలే కాదు. సమాధి అంటే యేమిటో ముక్కూ మొగమూ కూడా నా కప్పుడేమి తెలియదు - అయినా, సగంలో లేచిరావడం అంటే అప్పటికే నాకు బాధగా వుండేది.

తప్పేది మాత్రం కాదు.

గుడిగోపరంమీద సాయంత్రం దాకా కొనలుసాగినా యీ కల్పనా ప్రయత్నాలు, తరుచు, రాత్రిళ్ళు భోజన నమయానా, భోజనం అయాకా గూడా నా తలలో జూగృతాలవుతూనే వుండేవి.

అలాంటి సమయాన, ఎవరితో మాట్లాడ్డం అన్నా విసుగ్గానే వుండేది.

కాని, ఒక్కొక్క రాత్రి, బస యిచ్చిన బులుసు సుబ్రహ్మణ్యంగారు, యేమి టేమిటో అదుగుతూనూ, యేమిటేమిటో చెబుతూనూ జామున్నరాత్రి అయేదాకా కూచోపెట్టేవారు, కాదనడానికి వల్లకాకపోయేది.

ఒక్కొక్క రాత్రి, ఆయన భార్య యింటిపనులన్నీ తెమల్బుకొని బయటికి వచ్చేదాకా, అప్పటికి వారి ఏకపుత్రుదైన సంవత్సరంలోపు కుర్రవాణ్ణి ఎత్తుకుని తిరుగుతూ జోకొడుతూ నిద్రపుచ్చవలసి వచ్చేది. సుబ్రహ్మణ్యంగారితో మాట్టాడుతూనే.

ఇలాంటి న్వల్పవిషయాలు కొన్నివుండినా, గురువుగారి కుటుంబమూ, సుబ్రహ్మణ్యంగారి కుటుంబమూ చూపించే వాత్సల్యం నా కుత్సాహజనకంగానే వుండేది, మొత్తంమీద.

చదువుకంటే యెక్కువగా వల్లూరి జీవితమే నాకొక రకమైన విద్యాభ్యాసం అన్నట్టుందేది.

78 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య గురువుకు తగ్గ శిష్యుడు /( 'అణయ్యా -ఏటుకూరి ప్రసాద్‌

“మొఖానికి బొట్టు లేదేం?” అన్న పిడుగులాటి ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో తోచలేదు ఓ విద్యార్థికి. ఎలాగోలా సంబాళించుకొంటూ లేచి నిలబడి, “నేను నాన్‌బ్రాహ్మన్నండీ అన్నాడు”. “ఏం, అయితే బొట్టక్కళ్లేదూ?” మరో గర్జన. తుళ్ళిపడ్డం విద్యార్ధి వంతైంది. అలా మొదలైందో గురుశిష్యుల అనుబంధం.

ఈ సంభాషణ నిన్నా మొన్నటిదికాదు. 1905 నాటి ముచ్చట. జరిగింది పర్గాకి మిడి కాలేజీలో. గర్జించింది గిడుగు రామమూర్తి. తుళ్ళిపడ్డది బండారు ధర్మారావు. అదే తాపీ ధర్మారావు. ధర్మారావుగారి అసలింటిపేరు బండారువారు. వీరి తాతలు తాపీమేస్రీలుగా ఉండేవారు. అదేక్రమంగా వీరింటిపేరైంది.

తగాదాతో ప్రారంభమైన వీరి అనుబంధం మధ్యలో శతృత్వంగామారి చివరికి గిడుగు ఉద్యమానికి సరైన వారసుడు దొౌరికాడన్న తృప్తితో గిడుగు కన్నుమూసేలా పరిణమించింది.

ధర్మారావుగారు విజయనగరంలో మెట్రిక్‌ ఫస్టుక్సాసులో పాసయి, ఎఫ్‌.ఏలో జేరటానికి పర్షాకిమిడి వెళ్ళక తప్పిందికాదు. అప్పుదక్కడ చరిత్ర అధ్యాపకులుగా గిడుగు ఉండేవారు. ఆ కాలేజికి వీరు వైన్‌ వ్రిన్సిపాల్‌కూడాను. (వ్రన్సిపాల్‌ మంగు శ్రీనివాసరావుగారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ అంటే కాలేజి అంతా గడగళ్ళాడేది. ధర్మారావు గారికి వీరు గ్రీసు, రోము చరిత్రలు చెప్పేవారు. తాపీవారి జ్ఞాపకాలపొరలు తిరగేస్తే “ఆ చరిత్రలు అలాచెప్పేవారు మద్రాసు రాజధానిలో మరెవ్వరూ లేరని ప్రతీతి. చరిత్ర చెప్తూంటే ఆయా పాత్రలు ప్రత్యక్షమైనట్టు చెప్పేవారు. వారి లెక్చర్లు వింటే చాలు. వున్తకాలు చదవనకృర్లేకుండానే పరీక్షలు పానవుతారని నమ్మకం”. అందుకే తావీ అక్కడ చదువుకోటానికెళ్ళారు. అప్పుడక్కడ బంకుమల్లి మల్లయ్యశాస్త్రిగారు తెలుగు చెప్తూండేవారు.

బొట్టుతో ఆరంభమైన తగాదావల్ల తాపీవారు బొట్టెట్టుకొని క్లాసు కొచ్చేవరకు గిడుగు తాపీవారి మొఖం కనపడకుండా ఉండాలని వీరివైపు వీపుబెట్టే పాఠం చెప్తుందే వారు. అలా రెండుమూడు నెలలు గడిచాయి. ఇద్దరూ ఇద్దరే. ఇంతలో ధర్మారావుగారి పాండిత్యం అటు లెక్కల్లోనూ, ఇటు ఇంగ్రీషులోనూ అందరికీ తెలిసింది. లెక్పరర్లు కూడా వీరిచేత విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తూండేవారు.

గురువుకు తగ్గ శిష్యుడు... 79

గిడుగువారు పాఠం చెప్పే పద్ధతి చాలా గమ్మత్తుగా ఉండేది. చరిత్రను అనేక రకాల పటాలతో, రిఫరెన్సు పుస్తకాలతో గుప్పించేసేవారు. అదంతా లెక్బరింగ్‌ పద్ధతిగా అనిపిస్తూనే ఓ కావ్యం చెప్తున్నారా?! ఓ నాటకం అఆడిస్తున్నారా?! అనే అనుమానం వస్తూండేది క్లాసులో వాళ్ళకి. దాన్ని ధర్మారావుగారు గమనించారు. గిడుగు క్లాసులో సూచించే పుస్తకాలన్నీ చదువుతూందేవారు. ఇతర్లనడిగే (ప్రశ్నలకు కూడా తానే కల్పించుకొని సమాధానంచెప్పటం ఆరంభించారు. అలాగైనా గిడుగుకు తనమీదొచ్చిన చిరుకోపం ఉపశమిస్తుందేమోనన్న ఆశే తాపీవారికుందేది.

పిల్లలచేత పనిచేయిస్తూ పారంచెప్పే వ్యక్తి గిడుగు. ఇదిప్పుడు అత్యంత ఆధునికమైన పాఠంచెప్పే పద్ధతిగా గుర్తించారు బోధనా పద్ధతుల్లో. చరిత్రలోభాగం మాప్‌ డ్రాయింగ్‌.

ఓనాడు గిడుగు పిల్లలవైపు వీపు పెట్టి బోర్డుకు తగిలించిన మాప్‌లో స్పార్దా చూపించమని విద్యార్థులడుగుతున్నారు. అందరూ బికృమొగాలేసుకున్నారు. ఒకడు మాత్రం స్పార్టా చూపాడు. “ఎవడ్రా వీడు” అంటూ వెనక్కి తిరిగారు గిడుగు. ఇంకెవరు! తాపీవారే. దాంతో ధర్మారావంటే గిడుగుకు ఉన్న కోపం పోయింది.

లైబరీకి ధర్మారావుగారిని తీసికెళ్ళి “ఇతనికేం పుస్తకం కావాలన్నా ఇవ్వండి” అంటూ ఓ ఆర్డరు జారీచేశారు గిడుగు.

క్లాసులోని విద్యార్థులు ఏమేం పుస్తకాలు గ్రంధాలయం నుండి చదువుతున్నారో ప్రతివాడూ పుస్తకంలో రాయాలన్న రూలొకటి పెట్టారు గిడుగు. ఓనాడు ధర్మారావు గారి పేజీలో 'తారాశశాంక విజయం” రాసుండటం గిడుగు గమనించి తాపీగారి నడిగారు. అందులో పద్యాలతోసహా వివరించారు ధర్మారావు. ఆశ్చర్యపోవడం గిడుగువంత్రెంది.

దొంతో ధర్మారావుగారికి తన సొంత [గ్రంధాలయంలో పుస్తకాలు చదవమని ఇస్తూండేవారు. ఆ పుస్తకాల్లో గిడుగుచేసిన క్రీగితలూ, రాసిన కామెంట్సూ చూస్తే అసలు పుస్తకాన్నెలా చదవాలో తెలిసిందని ధర్మరావుగారన్నారు. విజయ విలాసాన్ని అంతటి ప్రతిభా పాండిత్యాలతో అధ్యయనం చేయగలసత్తా, దృష్టీ గిడుగువారు ప్రసాదించిన వరమే అనాలి తాపీగారికి. ప్రాదీన ప్రబంధాలను చదవటం తనకు అలవాటు చేసిన వ్యక్తి గిడుగేనంటారు తాపీ. పిల్లలకు ఎలా విద్యాబోధనచెయ్యాలో వారితో ఎలా మెలిగి సరైన మార్గానికి తిప్పాలో ధర్మారావుగారు గిడుగు శిష్యరికం లోనే నేర్చుకున్నారు. తాను న్యూయింగ్‌టన్‌ కాలేజిలో పనిచేసినా, జమీందార్లకు ట్యూటర్‌గాఉన్నా విజయనగరంలో ట్యుటోరియల్‌ కాలేజి నడిపినా, నాడు తనకు గిడుగు చూపించన మార్గమే ఇన్నిచోట్లా ఆసరాగా నిల్చిందన్నది వారి అభిప్రాయం,

మన ప్రాచీన పరీక్షా విధానంలో 'శలాకా' పద్ధతని ఓటుండేది. అలాగే గిడుగు వారి పద్ధతీనూ. ఉన్నట్లుండి ఓ టాపిక్‌ను క్లాసులో చెప్పి ప్రశ్చల పరంపర కురిపించే

80 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య వారు. అలాగే ఓనాడు తాపీవారి క్లాసులో “ఈవేళ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడు కుందాం” అంటూ మొదలెట్టారు గిడుగు. ఓ ప్రశ్న విసిరారు. క్లాసంతా తెల్లమొగం వేసింది. తాపీవారి బెంచీమీద కొచ్చి కూచాని “ఊ నువ్వూ” అన్నారు. ఆయనా మెజారిటీలో కల్సిపోయారు. గిడుగు తన చెవికున్న ట్రంపెట్‌ తీసి బల్లమీద విసిరేసి ఇక ఈ క్లాసుకు తాను రాననీ, ఎవ్వరూ రానకృ్కరలేదనీ కబురెట్టి వెళ్ళిపోయారు. వారి కోపమంతా తాపీమీదనే. తన అభిమాన విద్యార్థికూడా ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయాడే అన్న కోపం, ఓ కుర్రాణ్ని “ధర్మారావు దగ్గరున్న నా పుస్తకాలన్నీ ఈడ్చుకు రండి” అని పంపించారు. తాపీ తక్కువ తిన్నాడా! ఇవ్వను పొమ్మన్నాడు. ప్రిన్సిపాల్‌ కలుగచేసుకొని ఇద్దరికీ సామరస్యం కుదర్చడంతో ధర్మారావుగారు గిడుగు వారింటికెళ్ళి పుస్తకాలు అప్పగింతపెట్టిరావడంతో ఆ సమస్య తేలిపోయింది.

అలా ధర్మారావుగారి గిడుగు శిష్యరికం కోపంతో ఆరంభమై మిత్రత్వంతో ముగిసింది. ఎప్పుడైతే గిడుగు వ్యావవారిక భాషా ఉద్యమాన్ని తలకెత్తుకున్నాడో అప్పటి నుండి వారికి వ్యతిరేకంగా తాపీ గ్రాంధిక భాషాఉద్యమాన్ని నిర్వహించడం ఆరంభించారు.

గిడుగువారి కార్యదీక్ష వారిజ్ఞానం, వాదనా పటిమా, క్షుణ్ణంగా దగ్గరుండి గమనించిన వ్యక్తి తాపీ గనుక అలాగే వారి వాదాన్ని ప్రతిఘటించాలని తలపెట్టారు. గిడుగు కృషి తెలుగునాట ఇంకా ఉద్యమ స్థాయికి చేరుకోకముందే వారి వాదాన్ని మొగ్గలోనే తుంచాలన్న అభిప్రాయంతో 1908-1909 మధ్య తాపీవారు “గ్రాంధిక భాషావాదము” అనే చంపక మాలికను రాశారు. ప్రతిసభలోను దాన్ని చదివేవారు. దీన్ని ఖండిస్తూ ఆరోజుల్లోనే సెట్టి లక్ష్మీనరసింహంగారు ఓ శార్జూల మాలికను రాశారు.

ధర్మారావుగారి దృష్టిలో మొదటిరోజుల్లో బ్రాహ్మణుల మీద రవంత కోపం ఉండేది. దానికి చాలా కారణాలున్నాయి. వాళ్ళ నెదిరించాలంటే, వాళ్ళు ప్రయోగించే సాంప్రదాయ పద్ధతిలోనే భాషను అభిమానిస్తూపోయి వాళ్ళకన్నా గొప్పవాడననిపించు కోవాలనుకున్నారు. అప్పుడే వాళ్ళ కంటిని వాళ్ళ వేలితోనే పొడిచినట్టవుతుందని భావించారు. దానికి తోడు, నాటికి బాగా (ప్రచారంలో ఉంది గ్రాంధిక భాష ఆ గాలిలోనే కొట్టుకెళ్ళారు.

ఎప్పుడైతే జమీందార్ల దగ్గర పన్దేస్తూ వారి గ్రంధాలయాల్లో ప్రపంచ సాహిత్యాన్నీ సామాజిక చరిత్రలను అద్యయనం చెయ్యడం ఆరంభించారో భాష ఒక వర్ణం చేతులోది కాదన్న అంశం బోధపడింది. తాను ఎదుర్కోవలసింది (బ్రాహ్మణులను కాదనీ, బ్రాహ్మణ తత్వాన్ననీ, వారి పెత్తందారీ తత్వాన్ననీ తెలుసుకున్నారు. కనుక (బ్రావ్మాణులు నిర్వహిస్తున్నారని వారు నడిపే ఉద్యమాన్ని ద్వేషించకూడదనీ, సామాజిక పరిణామంలో భాషా పరిణామం ఓభాగం అవుతుందనీ నమ్మటం ఆరంభించారు. ఆ పరిణామం తెలుగునాట వ్యావహారిక భాషా ఉద్యమమే నని నమ్మారు. అయినా తాపీవారు ఈ అంశాన్ని దృథంగా నమ్మటానికి 1986 వరకూ పట్టింది. గిడుగువారి ప్రతిభాషా వాదం అధ్యయనం

గురువుకు తగ్గ శిష్యుడు... 81 చేశారు. అనేక కవి పండిత సభల్లో పాల్గొన్నారు. గిడుగు వారితో ఆయా సాహిత్య సభల ద్వారా మరింత సాన్నిపాత్యం సంపాదించారు. బరంపురంలో జరిగిన అఖిలాం(ధ్ర కవిపండితుల సభల కెళ్ళారు. గిడుగుదాన్ని ప్రతిఘటిస్తున్న కుండలాల వారి వాదంలో బలహీనతలను, డొల్ల తనాన్నీ గమనించారు. గురజాడ గిడుగుకు అందించిన సహకారాన్న్నీ కందుకూరి తాను చనిపోయే దశలో గిడుగు వాదాన్ని సమర్ధించి ఓ సంఘాన్ని స్థాపించిన పరిస్థితినీ అంతా తాపీ (శద్దగా చూశారు.

అంతే అంతవరకూ తానేవాదాన్ని మోస్తూ వచ్చారో, ఎవరికి ఫ్రతిద్వందిగా నిలిచారో దాన్ని విడిచేశారు.

1986లో తాను వ్యావహారిక భాషా ఉద్యమంలో చేరుతున్నట్టు గిడుగు మేష్టారికో లేఖ రాశారు. ఈ ఉద్యమాన్ని ఓ “మిషనరీ జీలొతో సాగించాలని చెప్పారు. ఈ ఉత్తరం చదివి గిడుగు “ఇక మన వ్యావహారిక భాషోద్యమానికి ఎలాంటి ఢోకాలేదు. మంచి నొంప్రదాయ పునాదులమీద పైకొచ్చిన ఓ పండితుడు ఆధునిక వాది మనతో చేతులు కల్పుతున్నాడు. ఆయనే తాపీధర్మరావు” అని గిడుగు సీతాపతి గారితో అన్నారు. తన బరువు కొంతన్నా మోసేవాడొచ్చాడని చాలా సంతోషించారు. ఈ అంశాన్ని గిడుగు సీతాపతిగారే ధర్మారావుగారికి మద్రాసులో జరిగిన ఓ సన్మాన నభలో స్వయానా ప్రకటించారు. అయితే దురదృష్టవశాత్తూ ధర్మారావుగారు రాసిన ఆ ఉత్తరం ఎక్కడా దొరకలేదు. ఈ విషయం తాపీవారు అక్కడక్కడా (ప్రస్తావించారు.

గిడుగుకు మనసుకెక్కిన శిష్యుడుగా ఉండి మధ్యలో నిరంతరం తనతో పోరాడిన తాపీ నిజాయితీని, చివరకు ఆ తాపీయే సామాజిక పరిణామంలో భాషల మార్చిడి ఆవశ్యకతను గుర్తించి తనకు లొంగిపోయిన ఘట్టం గిడుగు మనస్సును కదిల్చి ఉండాలి. తనంతటి శిష్యుడు తనకు దొరికాడని పొంగిపోయి ఉండాలి. అలాంటి గురువుకు తాపీ ఇచ్చిన థద్దాంజలి, పత్రికల్లో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టడానికి తీవ్రకృషి చెయ్యడం, తనకుతాను ఆ ఉద్యమంలో ముందు పీటీని ఉండడం. ఇంతకు మించి ఏ శిష్యుడు ఏ గురువుకేం ఇవ్వగలడు. పాత పాళినిసిరేసి కొత్తపాళీ కట్టి సరికొత్త సిరాతో రచనలు సాగించడం తప్ప. నరిగ్గా అలాగే చేశారు తాపీ. గిడుగు అందించిన వారసత్వం అందుకున్నారు.

82 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య మృత్యువుతో నా మూడో యుదం [నో -శ్రీత్రీ (అనంతం)

మొదటిసారి విదేశయాత్ర ముగించుకొని స్వర్గాదపీగరీయసి అయిన జన్మభూమి -మీద కాలుపెట్టేనో లేదో అన్నిదిక్కుల నుంచి ఆంధ్రదేశం నామీద దండయాత్ర సాగించింది. అవి 1955వ సంవత్సరపు ఎలక్షన్‌ రోజులు. నేను కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రచారానికి బయలుదేరాను. ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యానికి ఊడిగం చేసే పెట్టుబడీదారీ పత్రికలన్నీ తమ విద్వేషాగ్నిని నామీద కేంద్రీకరించాయి. ఒక్క “విశాలాంధ్ర' పత్రిక మాత్రమే నన్ను తొలినుంచీ నమరిస్తూ వచ్చింది. ఈ కాగితాల యుద్ధంలో, కురుక్షేత్రాన అభిమన్యుడిలాగా పోరాడిన నార్ల చిరంజీవిని నేను మరిచిపోలేను. హేతువాదానికి, మూఢవిశ్వాసానికి జరిగిన సంకుల సమరంగా పరిగణిస్తాను ఆనాటి ఎన్నికల సంరంభాన్ని! “నేను కుక్కచావు చస్తా” నని ఒక అమ్మాయి రాసిన ఉత్తరం కూడా ఈ సందర్భంలో ప్రచురణ గౌరవం పొందింది. తర్వాత ఆమెనెవరో అడిగారట, అలా ఎందుకు రాశావని! శ్రీశ్రీని తిడితే పత్రికలో తనపేరు పడుతుందని - అంతేగాని నేనెవరో ఆమెకు ముక్కూ మొగమూ తెలియదట.

ఆ రోజుల్లో ఆంధ్రపత్రికకు నేను రాసిన ఉత్తరాలూ, విశాలాంధ్రలో వ్రాసిన 'పజుఅనే ప్రశ్నలూ, జవాబులూ శ్రీశ్రీ సాహిత్యం మూడు (వచన విభాగం)లో అచ్చయిఉన్నాయి. 1955 జనవరి 7వ తేదీ ఆంధ్రపత్రికలో అమార్క్సిస్టు పండితులకు ఆరాధ్యులవారైన ఒక నాగస్వరంగారు 'ఒక రచయిత' అనే బురఖా తగిలించుకొని నామీద ఇలారాశారు,

“శ్రీరంగం శ్రీనివాసరావుగారు స్టాలిన్‌ స్థాపించిపోయిన సోవియట్‌ సామ్రాజ్య రక్షణభారం (దీన్నే ఏకాన్వయ దోషం అంటారు వ్యాకరణజ్ఞులు) ఇటీవలనే వెడల్పయిన వారి భుజస్కంధాలపై పడిందని భావిస్తున్నారు... ఇటీవల శాంతిపావు రాలను ఎగురవేసుకుంటూ మాస్కో వెళ్ళారు. మాస్కోనదిలో మునిగి (అబద్ధం!) సోవియెట్‌ నాయకుల నమాధుల వడ్డ అనుష్టానాలు తీర్చుకుని (వచ్చి అబద్ధం!) మాస్కో విశ్వవిద్యాలయం చూచి మూర్చిల్లి (మరీ పచ్చి అబద్ధం) వారికి తెలియకుండానే ఆ భూతల స్వర్గంలో నుంచి ఈ 'యమలోకం'లో పద్దారు. (ఇది మాత్రం నిజం!) కళ్ళు తెరిచే సరికి ఆ మరోప్రపంచం కనిపించలేదు. ఆ గంటలు విన్సించలేదు. అంతా అయోమయంగా ఉంది. పాపం!...” (ఇదంతా విషం).

మృత్యువుతో నా మూడో యుద్ధం... 88

ఈ గాలిదుమారాల మధ్య, ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్నప్పుడు నాకు మతిభ్రమించి పోయింది.

విజయవాడ నుంచి ఎవరు, ఎలాగ నన్ను మద్రాసు చేర్చించారో తెలియదు. కాని “మద్రాసు చేరుకున్నాను” అని నా 1955 డైరీలో రాశాను. (ఆ డైరీ ఇప్పుడెక్కడా కనబడదు) మద్రాసులో ఆరుద్ర నన్నాక మెంటల్‌ క్షినిక్‌లో ప్రవేశపెట్టాడట.

చిన్నప్పుడే ఒకసారి నేను చనిపోవలనింది. చుట్టచురకలతో (బతికాను. ఇరవయ్యోయేట టైఫాయిడ్‌ జ్వరంతో హోరాహోరీ పోరాడాను. అది నా రెండో యుద్ధం. “ఇక బతకడు కిందికి దించండి" అని అథశ్ళయనం చేయించడం కూడా నాకు జ్ఞాపకం ఉంది. మూడుసార్లు (ప్రతిఇరవై ఒకటో రోజున) జ్వరం తిరగబెట్టింది. 68వ రోజున టెంపరేచర్‌ నార్మల్‌కు వచ్చింది.

మూడవసారి విజయవాడలో పోయిన స్మారకం అయిదారు వారాల దాకా తిరిగిరాలేదు. ఆ మధ్యకాలంలో ఏమయిందో నాకు స్పృహలేదు. విజయవాడలో, కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో ఈజీవైర్‌లో విశ్రమించాను. నాకు ఎదురుగా గోడమీద లెనిన్‌ చిత్రం. వెనుక గోడ మీద స్టాలిన్‌ చిత్రపటం ఉన్నాయి. వాటిని చూస్తుండటం వరకే నాకు జ్ఞాపకం. తర్వాత కొన్నాళ్ళకు మద్రాసులోని దాక్టర్‌ ధైర్యం క్లినిక్‌లో నా గది తలుపు తాళం తీస్తూ ఒక వార్డుబోయి “నేనెవరినో తెలుసా! పోలీసు వాడిని” అనడంతో మళ్ళీ నా మనసు తేరుకుంది. ఆ తర్వాత కూడా మరో పదిహేను రోజులు అక్కడే విశ్రాంతి తీసుకున్నాను. ఎన్నికలలో కమ్యూనిస్టు పొర్టీ చిత్తుగా ఓడిపోయిందని పత్రికల ద్వారా అక్కదే తెలిసింది.

హనుమాన్‌ జంక్షన్‌లో నా చిత్తచాంచల్యపు మొదటి సూచనలు కనిపించాయని కె.వి. రమణారెడ్డి రాశాడు. అది కొంతవరకే నిజం. మొదటిరోజు గూడూరు ఎలెక్షన్‌ సభలోనే ఒక సంఘటన నా మనస్సును ప్రగాఢంగా చీకాకు పరిచింది.

గూడూరు రైల్వేస్టేషన్‌ ఎదుట మైదానంలో ఎన్నికల సభ ఇక ్రారంభమవు తుందనగా వెనకవైపు నుంచి రాళ్ళు రువ్వడం మొదలయింది. సభా వేదిక నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారు పోలీసులకు తీవ్రంగా హెచ్చరిక చేశారు “శాసనసభలో ప్రతిపక్ష నాయకుడినైన నేను పోలీసులు వెంటనే కలుగచేసుకోవలసిందని అడుగు తున్నాను. అది వారికి చేతకాకపోయినా యిష్టం లేకపోయినా, పరిస్థితులను మా పార్టీ వాలంటీల్లే అదుపులో పెట్టవలసి వస్తుంది” అని! అంతటితో రాళ్ళుపడడం ఆగిపోయింది. సభ సాఫీగా సాగిపోయింది. “పాతిక సంవత్సరాల నుంచి ఎప్పుడూ సీరియస్‌గా ఉండే సుందరయ్యగారి ముఖంలో ఎన్నికల ఫలితాల సూర్యోదయంతో చిరునవ్వులు వికసిస్తాయాని ఆయన చేత నవ్వించాను.

84 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య

సభ పూర్తికావడానికి ముందు, వేదిక వెనుక తట్టును కాపాడుతున్న వాలంటీర్లలో ఒకని తలను పగలగొట్టడం జరిగింది. రక్తం కారుతున్న ఆ యువకుని తలను కట్టుకట్టడం చూశాను. గాంధీగారి అహింసా భావాలకు అలవాటుపడిన నా మనస్సు ఈ కరోర దృశ్యాన్ని సహించలేకపోయింది. ఆ నిముషంనుండే ప్రారంభ మయింది నాలోని చిత్తచాంచల్యం. ఇది హనుమాన్‌ జంక్షన్‌ వద్ద పరాకాష్ట అందుకుంది. కనీసం లక్షమంది (ప్రేక్షకుల ముందు ఉపన్యసించారు. అప్పట్లో నాకున్న ఉపన్యాసధోరణి అంతంత మాత్రమే.

ఎలెక్షన్‌ ఫలికాలను తారుమారు చెయ్యడం కోసమే పనికట్టుకొని విజయవాడకు వేంచేసిన యస్‌.కే పాటిల్‌ మీద నా అక్కసంతా వెలిబుచ్చాను. ఏనుగుల మీద గాడిదల మీద (ఇవి అమెరికాలోని ప్రధాన రాజకీయపార్టీల ఎన్నికల గుర్తులు) తీవ్రంగా విరుచుకుపడ్డాను. ఒక్కొక్క ఉపన్యాసకుడు మాట్లాడుతుంటే, అతజణ్జి తప్పుకోమని మైకు ముందుకు వెళ్ళి ఏదోమాట్లాడి మళ్ళీ నా స్థలానికి వెళ్ళిపోయేవాణ్డి.

మిత్రుడు వల్లం నరసింహారావు నన్ను అహోరా్రులు కనిపెట్టుకు తిరిగాడు. తణుకు సభలో నేను ఉపన్యసించే ఓపిక లేనివాడినయ్యాను. అక్కడ నుండి నరసింహా రావే నన్ను విజయవాడకు చేర్చాడు. ఒకరాత్రి బయలుదేరుతున్న ట్రక్కుమీద నన్ను అనిపెట్టి సుబ్బారావు మద్రాసుకు చేర్చాడట.

విజయవాడలో నామీద చేతబడి ప్రయోగాలు జరిగినట్లు పుకార్లు బయలు దేరాయి. నేనొక రకం యోగనిద్రలో మునిగిపోయాను. “శ్రీశ్రీ అనే బీజాక్షరాలు చాలా శక్తివంతమైన వయ్యా! మన మాయలూ, మంత్రాలూ అతనిమీద పనిచెయ్యవు” అంటూ మంత్రవాదులు నిరుత్సాహం చెందారట. ముడోసారి మృత్యువుతో జరిపిన యుద్ధం అపస్మారకదశలో సాగింది. ఇందులో నాదేగెలుపు అనడానికి ఇంకా నేను బతికి ఉండడమే సాక్ష్యం.

దాక్టర్‌ మల్లిక్‌ గారు నన్ను రెండోసారి చావు నోటి నుంచి తప్పిస్తే మూడోమారు నన్ను రక్షించింది డాక్టర్‌ 'థైర్యం) నా నలఖై అయిదోఏట మద్రాసులో.

ష్‌

రిక్‌ నా కాలేజీల్లో నేను గాం

-రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రీయం)

మాఠ్ధాన అప్పారావుని మీకు తెలీదు. సలాది జగ్గారావుని కూడా మీకు తెలీదు. ఇమంది అప్పారావుని మీకు తెలియనే తెలియదు. మీకు అల్లబోయిన అప్పలస్వామినీ తెలీదు. అక్కరబోయిన అప్పలస్వామినీ తెలియదు. చిన్ని నరసింహులు పేరు వినే ఉండరు. మరింక నేనెంతో మందికి ఎంతో వై. బాలాజీ కూడా మీ కంతేనని నాకు తెలుసు. మీ కతణ్జి తెలిసే ఉండదు. అలాగే, రామచంద్ర పండా కాని, రామచంద్ర పండాలేకాని, శివదయాల్‌ సాహినీకాని, మున్నీ అబ్బుల్‌ గపూర్‌ఖాన్‌ కాని, పల్లి యాండర్‌ పిళ్ళేకాని, బలభ(ద్రశతవస్తికాని, రౌతు రాముడు కాని, గోపరాజు శివుడు కాని, కొల్లారామ్మోహనుడు కాని, పన్యాల రంగనాథుడు కాని, మోచర్ల అనంత పద్మనాభుడు కాని, ఉప్పల వెంకటేశ్వరుదుకాని, చట్టి రామచంద్రుడు కాని, సోమయాజుల సోమేశ్వరుడు కాని, అబ్బూరి వరద రాజేశ్వరుడు కాని మీకు ఎప్పుడూ తటస్థపడి ఉండకపోవచ్చును.

వాళ్ళంతమందీ, అలాంటివాళ్ళెంతో మంది నాకు ఏవి ఎన్‌ కాలేజీ - హైస్కూల్లో

నాకు ఏవి ఎన్‌ కాలేజీ అంటే చాలాయిస్టం. నే నెవరికంటే కూడా ఎక్కువ్వాణ్జి కాననే విషయాన్ని నేనక్కడే తెలుసుకున్నాను.

మార్గాన అప్పారావు ఆడినంత బాగా సలాది జగ్గారావు ఆడగలిగినంత చక్కగా నేను ఫుట్‌బాల్‌ ఆట ఆడలేను. అల్లబోయిన అప్పలస్వామంత తెలివిగా నేను లెక్కలు చేయలేను, చేసినాసరే. అంత ధైర్యంగా కానీ ఒకరికి ఇవ్వలేను. శివదయాల్‌ సాహినీలా చిన్ని నరసింహులులూ, అక్కరబోయిన అప్పలస్వామిలా, అమలకంటి అప్పారావులా ధైర్యంగా దెబ్బలాడలేను. దురిశేటి నరసింగుళ్ళా తొందరగా పరిగెట్టలేను. గోపరాజు శివుళ్ళా, రామచంద్ర పండలేలా ఎవ్వర్నీ తాటాకులు కట్టలేను. మామిడిపూడి పట్టాఖీ వెంకటోశ్వర్లులా పరీక్షల్లో ఫస్టుమార్ములు తెచ్చుకోలేను. రవీంద్రనాథ మీనన్‌లా తెల్లగా ఉండలేను. డి.ఎల్‌ఎస్‌. రాజులా పొడుగ్గా ఎదగలేను. పన్యాల రంగనాధుళ్ళా కధలు కట్టలేను. అబ్బూరి (వరద) రాజేశ్వరుళ్ళా గేయాలు రాయలేను. భగవంతుణ్ణి తిట్టలేను. కృష్ణమిశ్రలా చెడుగుడు ఆడలేను. మోచర్ల (అనంత) పద్మనాభుళ్ళా ఆడవేషం వెయ్యలేను. ఉప్పల వెంకటేశ్వరుళ్లా స్నేహంగా ఉండలేను. కొల్లా రామ్మోహనుళ్ళా, సోమయాజుల సోమేశ్వరుళ్ళా కల్మషం లేకుండా ఉండలేను.

88 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య

ఏ.వి.ఎన్‌, కాలేజీ - హైస్కూల్లో నా స్నేహితులు నా సహ విద్యార్థులు నా కెన్నెన్నో పాఠాలు నేర్చేరు. జీవితంలో నాకెంతో ఆనందాన్నిచ్చేరు. వారంత మందిని నేనెల్లప్పుడు స్నేహభావంతో చూసుకుంటాను. గురుతుల్యులుగా తల్ప్చుకుంటాను.

ఏ.వి.ఎన్‌. కాలేజీ అంటే నాకెంతో ఇష్టం. ఏ గురువో ఒకరు అభిమానించక పోతే, ఏ కొద్దిమందికో తప్పిస్తే చాలామందికి సరిగా చదువురాదని నా నమ్మకం. ఏ.వి.ఎన్‌. కాలేజీలోనే నేను చదువురాక తన్నులు తిన్నాను. అక్కడే మాస్టర్లని (శమపెట్టి వాళ్లవల్ల నేను కొంత చదువు నేర్చుకున్నాను. అక్కడ మా మాస్టర్లంతా మమ్మల్ని తిట్టినా, కొట్టినా, మందలించినా ఏంచేసినా మమ్మల్ని చాలా అభిమానంగా చూసుకొనేవారు. మేం అల్లరి చేసినా మమ్మల్ని అదుపులో ఉంచుకోగలిగేవారు. పారాలు సరిగా చెప్పగలిగిన శక్తి, సామర్భ్జాలుండటంచేత మా గౌరవం పొందేవారు. వారి స్వంత జీవితాల్లో ఎవరికైనా ఏవైనా పారపాట్లున్నాయని మాకు ఎవరైనా చెప్పినప్పటికీ తండ్రుల పారపాట్లని పిల్లలు క్షమించగలిగినట్టు మేం వారిని క్షమించ గలిగాం. మా గురువులందరికీ నేను వినయపూర్వకంగా నమస్కరిస్తాను.

అవును, ఏ.వి.ఎన్‌. కాలేజీ అంటే నాకెంతో ఇష్టం. అక్కడ మాకెంతో అందం.

మహాసము[ద్రం అక్కడ మాకు పెరట్లో చెరువులాగ, ఎండలో వెండిలాగ, కదలని ఆకాశానికి కదిలే ముద్దుల నీడలాగ వేసవిలో తరవాణి కుండలాగ, వెన్నెల్లో వేడెక్కిన ప్రియురాల్లాగా ఉప్పగా, చల్లగా, వెచ్చగా, మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఎంతో అందంగా మనోహరంగా ఉంటుంది. కోపంవస్తే భయంకరంగా మామీదికి భగవంతుళ్ళా విరుచుకుపడుతుంది. చల్లబడితే తన కెరటాల చేతుల్లో తల్లిలా లాలించి మమ్మల్ని మెత్తగా నిమురుతుంది. అన్ని అద్భుతాల సాగసుల్ని చూచి నివ్వెరపోయినట్టు యారాడ కొండ మాకు అనతిదూరంలో నీలంగా నిలబడి ఉంటుంది. కదిలే రధాల్లాగా, నడిచే మేడల్లాగా దేశదేశాల ఓడలు మాకు తేల్తూ, కనిపిస్తూ హార్చర్లోకి తేలి తేలి వెళ్తుంటాయి. తెల్లతెల్లని సీతాకోక చిలకల్లాగ జాలర్లు తెరచాపనెత్తుకొని కెరటాలని దాటుకొని మాకు దూరంగా వెళ్తూంటారు. మాకు దగ్గరగా వస్తూంటారు. మెత్తమెత్తని గాలి మాకు నీలిఆకాశంలో చల్లబడి నీలపు యారాడ కొండమీద చల్లబడి సముద్రమంత నీలాల నీటిమీద ఎంతో హాయిగా చల్లబడి మాకాలేజీలో మాకోసం మధురంగా వీస్తుంది.

అవును మరి. ఏ.వి.ఎన్‌. కాలేజీ అంటే నాకెంతో ఇష్టం. మా కాలేజీ చరిత్ర ఎంతో ఘనమైన చరిత్ర అని మాకు చెప్తూందేవారు. ఆ చరిత్ర అంత ఘనమైనదైనా కాకపోయినా, శాస్త్రవేత్త సి.వి. రామన్‌గారు చదివిన తావుల్లోనే నేనుకూడా చదవ గలిగినందున నేను గర్విస్తుంటాను. మహాకవి శ్రీశ్రీగారు చదివిన ఆలయంలోనే నాక్కూడా చదువు కొంత వచ్చినందుకు నేను గర్విస్తాను. అంతేకాదు. నావంటి ఎంతోమంది చిన్నలతోపాటు కలిసి నేను చదువుకోగలిగినందుకు కూడా నేను గర్విస్తాను. అక్కడ నేను

నా కాలేజీల్లో నేను... 87 దెబ్బలు తిన్నాను. తన్నులు కాసేను. బెంచీ లెక్కేను. కన్నీళ్ళు కార్చేను. కేరింతలు కొట్టేను కొద్దిపాటి చదువులు చదవగలిగేను. ఆ కళాశాలకి నా కృతజ్ఞత.

అక్కణ్జించి నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆర్బు కాలేజీకి వెళ్లేను. ఆ విద్యాలయం అంటే నాకిష్టమో కాదో నేను చెప్పలేను. ఎందుచేతనో తెలియదు. ఆ వాతావరణానికి నేను సర్జుకోలేకపోయేను. స్లెబియన్‌ కంపెనీకి అలవాటైపోవడం చేత పెట్రీషియన్‌ సోసైటీకి నేను తట్టుకోలేకపోయేనేమోనని నాకనిపిస్తూంటుంది. ఏ.వి.ఎన్‌. కాలేజీనించి అక్కడికి వెళ్ళడం నాకు అమలావురం కొబ్బరితోటల్లోంచి అనకాపల్లి వరిపొలాల్లోంచి అరేబియా ఎడారిలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఏ.వి.ఎన్‌. కాలేజి కొండమీద గాలెక్కువైతే, వాల్తేరు దిబ్బలమీద ఈదురు గాలెక్కువ. విశ్వవిద్యాలయంలోంచి కూడా మహాసముద్రం కనిపిస్తుంది. కాని అక్కణ్ణించి మా కది ఆడుకొనే చెల్లిలా కాకుండా జగజ్జననిలా కనిపిస్తుంది. జగజ్జనని మంచిదే కాని ఆవిదకి దూరంనించి దండం పెడతామే కొని దగ్గిరగా వెళ్ళి ఆవిడతో ఆడుకోలేం.

ఏ.వి.ఎన్‌. కాలేజీలో చదువు నాకు అమ్మదగ్గిర అ ఆలు నేర్చుకున్నట్టుగా వుంటే విశ్వవిద్యాలయంలోని చదువు స్వాములవారి దగ్గర సంస్కృతం నేర్చుకున్నట్టు ఉండేది. స్వాములవారు కూడా మానవుల్ని ప్రేమిస్తారు. కాని నిన్ను మీ అమ్మానాన్నా నన్ను మా అమ్మా నాన్నా అభిమానించినట్ట్స అభిమానించరు. అయితే వారు ఆ విధంగా ఉన్నారనుకోవడం నాలో లోపమే కాని వారి లోపం అయివుండదని ఆ తరువాత కొంతకాలానికి నేను గ్రహించేను.

బాల్యదశలోంచి ఆ తరవాత దశలోకి నేను వవిధంగా మారేనో నేను సరిగా చెప్పలేనుకాని ఆ మారడంలో ఏదైనా మంచి అంటూ ఉంటే అందుకు కొంతవరకూ డాక్టర్‌ తలిశెట్టి ఆత్మారాం. పురుషోత్తంగారు, దాక్టర్‌ పూళ్ళ తిరుపతిరాజుగారూ కారకులని నేను చెప్పగలను. మరోకారణం విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ!

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని లేబ్రరీ ఎవరికి ఏయే ఉపకారాలు చేసిందో నాకు తెలియదు. కాని, ఆ లైబ్రరీ నాకు మాత్రం తెలియని లోకాలని చూపెట్టింది. కొత్త కొత్త భావాలని కలిగించింది. మంచి మంచి సరదాలని అలవాటు చేసింది. నన్నది భయపెట్టింది. ఆశపెట్టింది. కలవరపరిచింది. ఉత్సాహపరిచింది. ఆ లైబ్రరీ నన్నెంతగానో మార్చింది. పుస్తకాలకి కూడా కొందరు ఎందుకు నమస్మరిస్తారో నేనందువల్ల అర్థంచేసుకోగలను. అందువల్లనే మంచి పుస్తకాలకి నేనుకూడా నమస్మరించగలను. వినిన వేదాల్లో అంతా ఉందంటారు. రాసిన పుస్తకాల్లో ఎంతో ఉంది.

నాదే మరోకాలేజీ మెడ్రాస్‌ లా కాలేజీ.

88 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య

కాలేజీలు కలకల్లాడుతూంటే నాకిష్టం. (అందుచేతనే, మా కాలేజీలనే రాత్రి వేళ చూస్తే నాకు భయంగా ఉంటుంది. సెలవుల్లో చూస్తే దిగులుగా ఉంటుంది) మెడ్రాస్‌ లా కాలేజీ కళకళ్ళాడుతూ ఉండేది. మా తండ్రి తాతలు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది అక్కడ చదివి ఉండడంచేత నొకా కాలేజీ కొత్తగా తోచలేదు. నే నక్కడ “లా” అట్టే చదవలేదు. కాని లోకం గురించి మాత్రం కొంత నేనక్కడ తెలుసుకున్నానని అనుకుంటాను.

“లా కాలేజీలో చాలామంది మధ్యతరగతివాళ్ళే చదివేవారు. వారంతా ముదిరిన విద్యార్థులే కాని నూనూగు మీసాలవారుకాదు. 1946-1948 రోజులవి. స్వాతంత్ర్యం వస్తూ వస్తూ వచ్చేసిన రోజులవి. “లా” కాలేజీ యువకులంతా చాలా ఉత్సాహంగానూ పశువుల సంతలో సొకుగుడు గాళ్ళల్లా చాలాగదుసుగానూ ఉండేవారు.ముందుకి వాళ్ళకి మంచి దినాలున్నాయని వాళ్ళు గ్రహించగలిగేరని నేననుకుంటాను. (ప్యూడల్‌ మనిషిని కాబట్టి నేనా వీషయాన్ని అంతగా (గ్రహించలేక పోయీను.)

పోతే, లా కాలేజీ నన్నెలా మార్చింది? ప్లీడరుగా మార్చింది. జీవితంలో కాస్త భుక్తి కల్పించింది. న్యాయంకోసం ఎల్లవేళలా నిలబడగలిగే ధైర్యం 'ప్రసాదించక పోయినా, నిలబడగలిగితే బావుండుననే కోరిక కల్పించింది. మధ్యతరగతి వారి వల్ల ప్రజలకు రాబోయే మహానర్థాలని కొంతగా నాకు సూచించింది. వ్యక్తిగతంగా వారితో ఇ. అయ్యప్పరెడ్డిలో, దామోదరం సంజీవయ్యలో, ఖజానా వెంకట్రావులో, పి. సుందరంలో, సత్యేంద్రన్‌లో వారిలో కొందర్లో ఉండే మంచితనం నేను కొంత అక్కడ తెలుసుకున్నప్పటికీ, సామూహికంగా మధ్యతరగతివారి తెలివి తేటల్నీ స్వార్ధపరత్వాన్నీ నాకు లా కాలేజీయే చూపించింది.

ఎన్ని కాలేజీల్లో ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత నేర్చినప్పటికీ, ఎన్ని చూసినప్పటికీ, నేను మంచివాజ్ఞయేనని చెప్పను. చెప్పలేను. కాని నాలో మంచితనం ఏ కొద్దిపాటి ఉన్నప్పటికీ అందుకు కారకులు నా గురువులు నా సహవిద్యార్థులూ అని మాత్రం నేను చెప్పుకోగలను. మా గురువులందరికీ నేను వినయపూర్వకంగా నమస్కరిస్తాను. నా సహ విద్యార్థులందరికీ, ముఖ్యంగా అబ్బూరి వరద రాజేశ్వర రావుకీ, అక్కరబోయిన అప్పలస్వామికీ, చాగంటి సీతారామయ్యకీ, మామిడిపూడి పట్టాభిరాంకీ, వెంకటేశ్వర్లుకీ, జయంతి సుధాకర రూసోకీ, ఇ అయ్యప్పరెడ్డికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.

షై

89 పాఠక మిత్రులకు నిర్షమన నీరాజనాలు -బంగోరె (ఒక పత్రికకు ఎడిటర్‌గా స్వస్తిపలికే సందర్భంలో బంగోరె పాఠకులతో

పంచుకున్న ఆవేదన)

యూత్‌ కాంగ్రెస్‌ ఎడిటర్‌గా నా నూకలు నేటితో చెల్లిపోయాయి. కనుక నిర్ణమిస్తున్నాను. గుడ్‌బై చెప్పేముందు ఈ నిర్గమనవేళ నాలుగుమాటలు.

ఈ పత్రికా పారకులుగా మీతో పరిచయమేర్చరచుకాని పట్టుమని పదినెల్లు కూడా కాలేదు. వోరుమంటే 50 సంచికల అనుబంధమైనా కాదు మనది.

మీతో నే గడిపిన రోజులు బహుతక్కున, మీతోనే పలికిన పలుకులు అంతకన్నా తక్కువ, అయినా యివాళ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోవడమంటే ఎందుకింత బాధ?

మీకు మరో ఎడిటర్‌ దొరక్కపోడు. నెల్లూర్లో ఎడిటర్లకు కొదవా? నాకు సరిపడే, నేను ఇమడగలిగే పత్రిక మళ్లీ మరొకటి దొరకడం నాకు కష్టం కావచ్చుగాక. అయినా ఇది కప్పని నిర్ణయం.

నిజమైన జర్నలిస్టుల (బ్రతుకులు ఎప్పుడూ ఇట్లాగే వుంటాయ్‌. ఆ రకం దేశదిమ్మరినే నేనుకూడా, ఎప్పుడూ ఒంటరిగా ఏకాకిమార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాణ్సి. శక్తిమేర వ్యాఖ్యానించుకుంటూ, రిపోర్టు చేసుకుంటూ వెళ్ళే దేశద్రిమ్మరులం మేము. నిత్యవార్తలతో నడుస్తున్న చరిత్రాంశాలతో ముడిబడిన వాక్సిత్రాలను చెక్కుకునే అల్ప సంతోషప్తు శిల్పులం మేము. నిత్యజీవితంలోని సూక్ష్మాంశాల నిజాంశాలమీద ముగ్గు అల్లే గాలిజీవులం మేము, వీలుంటే విశ్వాన లోకనంచేని చావాలనే అమాయకపు తహతవా గాళ్ళం. వఏమిచేయమంటారు. అది మా జర్నలిస్టుల జాధ్యం. ఏదో గాలిచేతిలో నెట్టబడి, అలవోకగా విసిలేయబడే విత్తనాల గింజలం మేము. చదివిన క్షణంలో ఎలాగో భావస్స్ఫూర్తిని కల్షించి మరుక్షణంలో మనసులోనుంచి మాయమైపొయ్యే, ఒకపూట సువాసన వెదజల్లి మరుపూట వాడిపొయ్యే పువ్వుల లిపుల్ని అల్లే పిచ్చి మొక్కలం మేము.

విపులాచ పృథ్వీ ఈ రకం బ్రతుకు మా జర్నలిస్టులకు పరిపాటే.

90 ...మా అన్న డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఈ ఉన్న పదినెలల్లో ఎదో నా శక్త్యానుసారం ఎడిటర్‌గా (శమించాను. ప్రమిదలో చమురుపోసి చిరుదీపం వెల్లించినట్లు నా జీవరక్తపు సిరాలో కలాన్నిముంచి వ్రాసుకొంటూ ఎడిట్‌చేసుకొంటూ ఇన్నాళ్ళు ఒంటరిగా నిస్సహాయంగా ఒక్కచేతి మీదుగా పత్రికను నడిపాను. అడపాదడపా సహకరించిన చెయ్యాసరా ఇచ్చిన మిత్రవర్యులకు ధన్యవాదాలు. చేసేపని చిన్నదైనా వళ్ళు దగ్గరపెట్టుకొని ప్రేమారచేయడం, వ్రాసే వార్త స్థానిక వార్తే అయినా, విశ్వగీతికే అయినా హృదయమిచ్చి వ్రాయడం మినహా మరో బాణీచేతగాని వాద్ది. = అందుకే ఉన్నమేరకు నా గుండెను పిండి తునా తునకలుచేసి మీముందు వెదజల్లాను. నా కాంక్షల సంతానాన్ని మీ ముందు దిసమొలతో కేరింతలతో తచ్చాడేలాగున చేశాను. బాధతోగాక, బరువుగుందెతో గాక ఇప్పుడు ఏదో బంధాన్ని అనుబంధాన్ని తెంచుకొని ఎడబాని పోవాలంటే చేతకావడం లేదు. తృష్టతో, దప్పికతో తీపెక్కిన హృదయాన్ని విడిచి వెళ్తున్నానా అన్పిస్తున్నది. అరబ్‌ కవి ఖలీల్‌ జీబ్రాన్‌ అన్నట్లు - 1115 ౧౦ & 27౧6౧1 1 6231 0% 115 రజ 00496౧ 411! 4 ౪11౧ గ 0౪/౧ ౧౧౮5. ఇక్కడ కొలిక్కి తగిల్చిపోతున్నది ఏదో మాసిన చొక్కాలాంటిది కాదు, చేతులారా వన్న చీల్చిపెట్టి పోతున్నానా? చర్మకారు డెవరికైనా ఏమాత్రం వుపయోగపడినా |

91 ఆమె యిచ్చిన పువ్వులు ఆచంట జానకి రామ్‌ (నా సతి పథంలో...)

బెంగుళూరులో నేనున్న ఏడేళ్ళు పూర్తిలఅయ్యాయి. పూర్తి అయ్యాయి అంటే ఏళ్ళు పూర్తి అయ్యాయి గాని ఇన్‌స్టిట్యూట్‌లో నా కృషి పూర్తిగాలేదు. ఆ కృషి అటువంటిది. రసాయనిక పరిశోధనకు పూర్తి అంటూ ఉండదు. ఐతే, మనం ఎన్నుకొన్న ఒకానొక విషయం గురించి కొన్ని కొన్ని విశేషాలు కనిపెట్టి విజ్ఞానాన్ని పెంపొదింపవచ్చు. కొందరు తద్వారా విశేషఖ్యాతీ ఉన్నత పదవీ సంపాదించవచ్చు. నాకా అదృష్టం లేకపోయింది. నా మూలికల గురించిన పరిశోధన అటువంటిది. అంజేగాక, ఆ ఏడేళ్ళూ నేను రసాయనిక పరిశోధనలో ఏకా(గ్రతతో కృషిచేశానని చెప్పలేను. నాకు లభించిన అవకాశాన్ని మరొకరయితే ఇంకా ఎక్కువ లాభకరంగా ఇంకా విజయవంతంగా ఉపయోగించుకొని ఉందురు. అందుకు సందేహం లేదు.

కాని, ఈ యేడేళ్ళలోనూ ఎన్నో అమూల్యమైన అనుభవాలను పదిలపరచు కున్నాను. నా జీవితంలో నేను, సాహిత్య ప్రపంచంలో, కళారంగంలో ఎందరెందరు (ప్రముఖ వ్యక్తులతోనో పరిచయమైనది నాకు. ఈ ఏడేళ్ళలోనే నాకు కృష్ణశాస్రితో, వెంకటచలంతో స్నహమైంది. ఈ ఏడేళ్ళలోనే కమలాదేవీ హరీంద్రనాధ చటోపాధ్యాయులు నన్ను తమవానిగా పరిగణించారు. నా అద్భష్టంవల్ల, ఆనాడు తెనుగునాట కవిత లల్గుచున్న యువకవులందరి తోనూ పరిచయం కలిగింది నాకు. అతిరూప లావణ్య, నా (ప్రేమంపు పెన్నిధి నా ఆరాధ్య దేవత, నా జీవిత ప్రాంగణాన ప్రవేశించింది ఆ రోజులలోనే. ప్రేమకూ ఆపేక్షకూ గల వ్యత్యాసాన్ని, నిజమైన 'ప్రేమఅంటే త్యాగమే అనే పరమసత్యాన్ని తెలుసుకో గలిగాను అప్పుడే. శన్పీవైత హరింతు, సుఖమెల్ల నీకె యుంతు!” అని అనుకోవడమేగాక, జీవితంలో అలా ఆనుసరించడము కూడా నేర్చుకున్నాను. "నేర్చుకున్నాను - కాదేమో, శేర్చుకో మొదలుపెట్టాను.” నేర్చుకుంటూనే ఉన్నానేమో అనాటినుంచీ ఈనాటికీ.

అన్నిటికంటె అమూల్యమైన అనుభవము : మహాత్మునితో ఆ క్షణిక పరిచయము, శేషజీవితంలో, దీపకళికగా వెలిగే వారి మధుర సంభాషణ.

నాన్నగారి వద్దనుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం కాదు, ఆర్డర్‌ ; నన్ను వారి ఫార్మశీలో వారికి పర్సనల్‌ అసిస్టెంట్‌గా నియమిస్తున్నట్టు, రసాయనిక శాస్త్ర పరిశోధనలో నేను నేర్చుకున్న విషయాలు ఆయుర్వేద బజెషధములను గురించిన పరిశోధనకై వినియోగించాలని వారి ఆశ.

92 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

పదిహేనేళ్ళయింది నేను నాన్నగారితో కలిసివుండి; ఎవరో స్నేహితులు కలుసు కుంటూన్నట్టు అప్పుడప్పుడు గంట, అరగంట కలిసి ఉండడమే గాని, వారిని విడిచిపెట్టి ఇన్నేళ్ళయింది నా జ్వరంలో మాత్రం మూడురోజులు ఉన్నాను వారివద్ద. ఇకనుండి వారితోనే ఉండి, వారికి కొంత చేయూతగా ఉండవచ్చుననే ఆశ ఎంతో ఉత్సావాన్ని ఇచ్చింది. కాని, ఈ క్రొత్త బాధ్యతను ఎలా నిర్వహింపగలనా అనే బెంగకూడా ఆవహించింది నన్ను

ఇన్‌స్టిట్యూట్‌లో మొదట నాతో కలసి కృషిచేసిన వారందరూ ఒక్కొక్మరే వెళ్ళి పోయారు. నా తరమువాడను నేను ఒక్కడనే. నేను తొలుత ప్రవేశించినపుడు మొక్కలుగా వున్న సంపెంగ మొక్కలు, చెట్లుగా పెరిగి మహావ్ఫక్షాలై పువ్వులు విరగపూస్తున్నాయి. ఇవతల, ఊళ్ళో, నాకు ప్రతిరోజూ, విడువకుండా పువ్వలిచ్చే ముసలి పువ్వులమ్మి మాత్రం, ఇంకా పువ్వు లమ్ముతూనే వుంది అక్కడే. రైలుకు వెళుతూ, బండి ఆపి ఆమెవద్ద ఇన్నిప్రవ్వులు పుచ్చుకొన్నాను. రోజూకంటే మరిన్ని పువ్వులు ఉంచింది నా దోసిలిలో, ఆమెకు తెలిసో, యేమో, నేను మళ్ళీ ఆమెకు కనుపించనని. కాని, ఆమెను, ఆమె ఇచ్చిన పువ్వులను ఎన్నటికీ మరచిపోలేను, జీవితంలో ఒకానాక మధురఘట్టపు స్మృతిచిహ్నాలు, అవి, ఎప్పటికీ!

ష్‌

99 వరద రాజేశ్వరరావుకొక అట్లీ ఆళి పూలహారం! -నామిని సుబ్రహ్మణ్యం నాయుడు

1962లో నేను ఎస్వీ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చదివేటప్పుడు మెయిన్‌ బిల్లింగ్‌ ముందర, "సెనేట్‌ హాలులో ఈ రోజు “భాష-సాహిత్యం' అనే అంశంమీద ఆరుద్ర మాట్లాడతాడు. అందరూ రండి!” అని ఒక బోర్డు పెట్టుండినారు. మెయిన్‌ బిర్జింగ్స్‌లో మేథమేటిక్సూ, స్టాటిస్టిక్సూ, ఎకనామిక్సూ మాత్రమే చెప్తారు. నేనా బోర్డు చూసి, “కోతి నాకొడుకులు! తెలుగూ ఇంగ్లీషూ చెప్పే ఆర్ట్స్‌బ్లాక్‌ ముందర పెట్టాల్సిన బోర్డును ఈడ పెట్టేసినారు!” అనుకుంటా మేథ్స్‌ డిపార్టుమెంట్‌లోకి దూరేసి సందేళకంతా - బతికి పొయ్‌నాంరా బగవంతుడా- అని చెప్పి యూనివర్శిటీ రోడ్డెక్మేసి చూద్దును కదా! నాపకృనే ఆరుద్ర! జుబ్బా పైజుమాతో బుజానికొక నంచీ తగలేస్మోని మల్లెపువ్వుమాదిర్లో పోతావుందాడు కవి.

ఆయన్ను ఆరుద్ర అని నేనెట్ట కనిపెట్టగలిగినానంటే- అప్పట్లో తిరప్తిలో మల్లెపూవు అని ఒక సిల్మా ఆడింది. దాంట్లో ఒక కవి వుంటాడు. వాట్టైత్తి నెత్తిన బెట్టుకోని పూజించ కుందా లోకమంతా దాని పనిలో అది వుండి పోతింది. అయితే ఆ కవి చచ్చిపాయ్‌నాడూ అని తెలియంగానే లోకంలో వుండేవాళ్లందరూ ఎవరి నెత్తిమింద వుండే బరువును వాళ్లు పారేసి ఆ కవినెత్తి పెట్టుకోని టెంకాయలు కొట్టడం, కర్పూరాలు వెలిగించి ఆరతులు పట్టడం! ఇట్లా నసనసగా నడస్తాది సిల్మా

అది కవిని గురించి తీసిన సిల్మాగదా దాంట్లో కవుల్ని చూపిద్దాం కాసేపు పాపం- అనుకోని డైరెక్టరు ఆరుద్రనూ వేటూరి సుందర్రామమూర్తినీ చూపించినాడు. కెమెరా ముందుకొచ్చినందుకు - ఇదెక్కడి పీడరా సామీనారాయణా! అని ఆరుద్ర సిగ్గుపడతా తలకాయ గీరుకోని కొంచేపు గమ్మనుంటే కెమెరా పాటికి కెమెరా చేసేదేం లేక శోభన్‌బాబు దగ్గిరికెళ్ళి పొయ్యుండేది. అవితే, ఆరుద్ర ధాటీగా వుండి, “కవిత కోసమె నేను పుట్టాను, కవిత కోసమె కలం పట్టాను” అనేరీతిలో ఏదో పద్యం వినిపించినాడు.

అదంతా చూసినోణ్లి గావడం వల్ల ఆరుద్రను వక్క కొరికినంత సేపుట్లో గుర్తుపట్టేసి, “నమస్కారం సార్‌” అన్నాను. ఆయన గూడా నిమ్మళంగా “నమస్కారమండీ” అన్నాడు.

94 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

“ఏం సార్‌ నడిచొస్తుండారు?” అన్నాను. దీనికాయన, “కాసేపు నడిస్తే మంచిది గదండి. నాకిది అలవాటే!” అన్నాడు. అంతటితో గమ్మనుండి పాయ్‌ నేనాయన్ని దాటుకోని నాదోవన్నేను వొచ్చేసుంటే నేను మిట్టూరోజ్చెందుకవతా? “ఏం సార్‌, ఈ మధ్య సిల్మాపాటలు రాయకుండా బాగా తగ్గించేసినారే!” అన్నాను. “ఇప్పుడు చాలా చెత్తవస్తోంది గదండీ. మనమేమిటి రాస్తాం, వాటితో సమానంగా!” అనేసి అన్నాడు. ఈయన వేటూరి మింద దొబ్బుదలతో వుండాడనుకోని నేనాయన్ని క్రాసుచేస్తా “అదేం అయ్యుండదు లెండి, మీరు వేటూరితో పోటీ పళ్లేరనుకుంటా. ఆరేసుకోబోయి పారేసుకున్నాను - తీస్కోండి. గుగ్గు గుగ్గు గ్లుడిస్సుందీ తీస్కోండి, అంత హిట్‌స్సాంగ్స్‌ మీతో అయ్యేపనేనా?” అని ఆయన మానం తీసేసినాను. నన్నాయన కంటద్దాల్లో నుంచి నిమ్మళంగా చూసి నవ్వినాడు. అంతే, వమన్లేదు.

మళ్ళా నేనే, “మీకు పాటకు ఎంతిస్తారు సా?” అనడిగినాను. “ఇంత అని ఖచ్చితంగా ఏముండదండీ. అయిదొందలూ ఇచ్చేవాళ్తుంటారు, వెయ్యేసి ఇచ్చేవోళ్లూ వుంటారు. మ్‌, చెప్పండి” అన్నాడు. ఇంతలో టౌన్‌ క్లబ్‌ వొచ్చేసింది. నేనక్కణ్ణుంచి వేశాలమ్మవీధిలోకి టర్న్‌ అయి రాయల్‌చెరువు బస్టాండుకు రావాల. “మంచిది సార్‌, నేనింకా పోదునా?” అన్నా. “మీరు నాకొక సాయం చెయ్యాలి. నాకు పుత్తూరొక్కపాడి అంటే ఇష్టం. అదెక్కడ దొరుకుతుందో కాస్తంత చెప్పదా?” అని అడిగినాడు. సడే, నేనాయన్తో గూడా డీలక్సు వోటల్‌ దాకా నడిచి 'పుత్తూరు వక్కపొడి అమ్మబడును బోర్డు చూపించినా. ఆయన రెండు పట్లాలు తీసుకుని సంచిలో వేస్కున్నాడు. “నేనింక వస్తాను సా అయితే!” అన్నాను. ఎవ్లీల్లేద్సు, డీలక్స్‌ హోటల్లో చాయ్‌ తాగుదాం రండి” అని పిలిచినాడు. ఆ భోగం వుండొద్దా! నేనెంతో సొంతంగా ఆయన చేతులు బట్టుకోని, “శ్రేన్లు పోతాలేసా! మళ్ల బస్సు దొరకదు నాకు! అన్నాను. “చాలా మంచిదండీ, చాలా థాంక్సండీ మీకు అని ఆయన అంటావుండినా వినిపించు కోకుండా *నో మెన్నన్‌' కూడా చెప్పకుండా మా బస్సుకోసం పట్టూపరుగు!

-హైదరాబాదులో ఇంతకంటె హీనంగా అబ్బూరి వరద రాజేశ్వరరావుతో కత నడిపించినాను. ఇక్కడ తప్పుచేసినోడు మాత్రం వరద రాజేశ్వరరావే. నేను పత్రికలో పనిచేస్తుండినంతమాత్రాన నన్నాయన ఇరవై నాలుగేండ్లమేధావి అనుకొని నాతో మాటలు బెట్టుకోవడం- గుంజిళ్లు పెట్టాల్సినంత తప్పు. అదెందుకో లోకంలో చానామంది పత్రికల్లో పన్దేసే వాళ్లను మేధావులని గౌరవిస్తారు. నా అట్టా శుంరలు పత్రికల్లో ఎక్కడ జూసినా కనిపిస్తారు. అందాకా ఎందుకు? మొన్న వరద రాజేశ్వరరావు చచ్చిపొయ్‌నాడనే వార్తను టెలిప్రింటర్‌ మీద చూడంగానే గబీమనింది. ఆ వార్తను మొదటిపేజీలో పెడితే చూసి సంతోషిద్దాం గదాని ఫస్ట్‌పేజీకాడికి పోతే- నిజంగానే ఫస్ట్‌పేజీలో పెట్టుందారు. నేను

వరద రాజేశ్వరరావుకాక పూలవారం!... 95 చానా కుశాలపడి, “ఫస్ట్‌ పేజీ వాళ్లూ, ఫస్ట్‌ పేజీవాళ్లూ! మీరు చానా మంచి పనిచేసినారు- వరద రాజేశ్వరరావు వార్తను ఫస్ట్‌పేజీలో పెట్టి!” అన్నాను. అందుకు ఫస్ట్‌పేజ్‌ీ వాళ్లు, “అమ్మా మాకా మాత్రం తెలీదా! ఆయన మొన్ననే అధికారభాషా సంఘం అధ్యక్షుడయ్యాడట గదా! వార్తలోవుంది కళ్ళుబాగా పెట్టిచూడు! అధికార భాషా సంఘం అధ్యక్షుడంటే- మోర్‌దేన్‌ ఐఏఎస్‌ ర్యాంకు! ప్రిన్సిపల్‌ సెక్రటరీ హోదా అనుకో! ఫస్ట్‌ ఎడిషన్‌కేగాదు సిటీ ఎడిషన్‌ దాకా ఈవార్త ఫస్ట్‌ పేజీలో వుండాల్సిందే!” అన్నారు. అదీకత!

నేను 'ఉదయరి' పేపర్లో చేరినాకనే నాకు వరద రాజేశ్వరరావు పేరు తెలిసింది. నా కెలీని తనంతో నాకూ ఆయనకూ పెద్ద తేడా లేదనుకున్నాను. ఆయన మంగళవారం మంగళవారం ఎడిట్‌ పేజీలో 'చరదకాలం' అని రాసేవాడు. నేను బుధవారం 'పచ్చనాకు నొక్షిగా రాసేవాణ్ని. ఒకరోజే గదా అడ్డం- అనుకొన్నంతగా ఆయన్ని నేను “నాకంటే పెద్ద గొప్పేం కాదులే అనుకున్నాను గూడా. రెండుమూడు వారాలు నేనాయనవి తద్దగానే చదివినాను. నేను మాయమ్మను గురించి రాస్తుంటే ఆయన వాళ్ల నాయిన గురించి రాసేవాదు. అయితే వాళ్లనాయన అబ్బూరి రామకృష్ణారావు చానా గొప్పవాడనిపించేది. ఇంతకు మించి నేను వరద రాజేశ్వరరావు గురించి ఆలోచించింది లేదు.

ఒకసారి ఏబీకే ప్రసాదు హడావిడిగా నన్ను పిలిపించి “నిన్ను వరద రాజేశ్వర రావుకి అటాచ్‌ చేస్తున్నాను. ఆయన బాగ్‌ లింగంపల్లి క్వార్టర్స్‌లో వుంటాడు. నసబెట్టి రాయించుకుంటే గొని ఆ మనిషి రాయడు. నాచేతిలో ప్రస్తుతానికి ఆయన కాలం ఒక వారానికే వుంది. మరో రెండు రాయమని చెప్పు, అర్జంటు, ఆ మనిషి ఆపేస్తే కష్టం. ఆయన కాలం మన వత్రిక్కి ఎంతో ఫెచ్చింగు తెల్సా!” అని వరనబెట్టి ఏదేదో మాట్లాదేసినాడు. దాని సారాంశం- నేను వరద రాజేశ్వరరావు దగ్గరికి పొయ్‌ అప్పుడప్పుడూ ఆయన వ్యాసాలు తెచ్చి ఈయన చేతికిస్తుండాల.

ఏ మాటకామాటే గదా! పనిజెప్పి చెయ్యించుకోవడంలో ఏబీకే ఇక్సామార్చుడు. ఇదొక్కటే ఆయన్లో వుండే మంచిగుణం, నేనాయన నోటికి బయపడి తొలిసారిగా వరద రాజేశ్వర రావింటికి పాయ్‌ చూద్దునుగదా! ఆయన నామాదిరి పసివాడు గాదు. పెద్దాయన! అరైయ్యేండ్ల "పైవాడు. ఇచ్చిత్రపాయ్‌ వచ్చిన పని చెప్పినా.

ఎప్పక్రీక్రేని తొందర పడొద్దని చెప్పండి. నన్ను తొందర బెట్టొద్దని చెప్పండి. ఆ పనిలోనే గదా వున్నానూ!” అని దీర్ధం తీసెనాడు వరద రాజేశ్వరరావు. నాపేరు అడిగి కనుక్కున్నాడు. కానీ నేను రాసేబివి చదవతా వుండానని ఆయన చెప్పక పోవడంతో నేను మూతిమూరడు పొడుగు బెట్టి నిష్టూరంగా కుచ్చుంటే ఛాయాదేవమ్మ వచ్చి టీ ఇచ్చింది. అది తాగేసి రాజేశ్వరరావును పరీక్షగా చూస్తే- ఆయన వుంగరం వేలికి వెంకటేశ్వరస్వామి వుంగరం!

96 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

నేను మా తిరప్తిలో వున్నంత ఆనందంగా, “నాకిప్పుడు బలే ఇదిగా వుండాది సార్‌. ఈ హైదరాబాద్‌ మొత్తం మీద మీ వేలికే చూస్తుండాను వెంకటేశ్వరస్వామి బొమ్మను. అయితే మీరు భక్తుడన్నమాట. ఈ హైదరాబాద్‌లో జానాబిత్తెడు నా కొడుకు గూడా దేముణ్ని పట్టుకోని తిట్టేవాదే!” అన్నాను.

దానికాయన తమాసగా నవ్వి, “దేముడు అనేభావం నాకు బాగుంటుంది. వెంకటేశ్వరస్వామి లేడు అనుకున్నా అన్నమయ్య చిట్రించిన ఒక పాత్రగా ఆయన కొక నమస్కారం పెడదాం. తప్పేముందీ? మీ తిరుమల వెళ్లి స్వామిని 'హలో” అని పలికరించి వస్తే ఆ ఆనందమే వేరయ్యా! గాడిద కొడుకులకు అర్ధం కావొద్దూ- అందులో వున్న ఇదీ!” అన్నాడు.

“అయితే మీతో సావాసం చెయ్యాల్సిందే!” అనేసి లేచొచ్చేసినాను.

వుండంగా వుండంగా నేను ఆయనకు బాగా దగ్గరైపాయనాను. ఆయన నన్ను మీరూ మీరూ అనడం మానేసి నువ్వూ నువ్వూ అనడానికొచ్చేసినాడు.

మేమిద్దరం మూడునెల్లు రాసేసరికల్లా కొంతమంది మావి నచ్చనివాళ్లు ఆయన ముందు అనే ధైర్యంలేక నన్ను బట్టుకుని, “నువ్వూ వరద రాజేశ్వరరావూ జనాల్ని చావదొబ్బేస్తుండారయ్యా, ఎంతసేపూ మానాయినా మానాయినా అని ఆయనా, ఎంతసేపూ మాయమ్మా మాయమ్మా అని నువ్వూ ఇంకా ఎంతకాలం వాయిస్తారు?” అనేవాళ్లు.

ఈ రకం విమర్శ వినిపించినప్పుడల్లా నాకెంత గొప్పయిపొయ్యాదో చెప్పలేను! వరద రాజేశ్వరరావునూ నన్నూ కలిపి తిట్టడం! అబ్బూరి రామకృష్ణారావునూ సినక్కనూ కలిపి తలకాయ నెప్పి అనుకోవడం!

ఒరెదెఖా! ఇంతకంటే భాగ్యమా!

ఒకసారి ఈమాటనెత్తకపాయ్‌ నేను రాజేశ్వరరావు దగ్గిర చెప్పినాను. ఆయన దీనికి, “గాడిద కొడుకులు!” అన్నాడు. అదాయనికి వూతపదం! నేనాయన్ని నవ్విపిద్దామని చెప్పి, “గాడిద కొడుకుల్ని పల్లెటూళ్ళల్లో పోతు గాడిదలు అని అంటారు. పోతు గాడిదలు - పెంటి గాడిదలకంటె గూడా నాణ్యంగా వుంటాయి. మ్మరీ అవి పుట్టినప్పుడు చూడాల. కాబట్టి మీరు వాళ్ళను గాడిదకొడుకులు అని గాకుండా ఇంకేమన్నా అనండి, తమాషాగా! అన్నాను. కడుపులో నుంచీ నవ్వేసినాడు. మేం మాటల్లో వుండంగానే రిట్టిహోటల్‌ వాడొకడు సూటూ కోటూ బూటూ యేస్మోని వొచ్చేసినాడు. వాడు రాగానే ఇంగ్లీషులో ఏందో దంచి వొదిలి పెట్టేసినాడు. ఈయన వాడి జుట్లో దూరిపొయ్‌ ఇంగ్లీషులో ఏందో దంచి వొదిలి పెట్టేసినాడు. ఆయనింగ్లీషు చూసి నాకు బిత్తరెత్తుకునింది. నేను చూసినప్పుడల్లా వరద

వరద రాజేశ్వరరావుకొక పూలవిరం!... 97 రాజేశ్వరరావు పొన్నూరు పంచా, ఖద్దరు చొక్కా యేస్మోని అచ్చం తెలుగోడు మాదిరిగా వుండేవోడు. మాయమ్మా నాయన వాసనతో నేనేదో రాస్తున్నట్టు ఆయన గూడా వాళ్ళ నాయన వాసనతో ఏదో రాసి గెలాయిస్తున్నాడనుకున్నానే గాని ఇంగ్లీషు అంత ధాటీగా మాట్లాద్దాడని నాకేం తెల్సు?

రిట్ట్‌ హోటలాయన అట్లాపోంగానే, “ఏందిసార్‌, బెదరగొట్టేసినారే నన్ను- ఇంగ్లీషు అట్లా మాట్లాడి! మీకింత ఇంగ్లీషు వాస్తిందని నేననుకోలా” అన్నా

“అదేందయ్యా నామినీ! నాకు ఇంగ్లీషు రాకపోవడం ఏందీ? నేను అల్లయిడ్‌ పబ్లిషర్స్‌కి ఎడిటర్‌గా చేశానయ్యా! అసలు నా గురించి నీకేమీ తెలీదా?” అనడగినాడు నవ్వతా.

నేను, “మీరా! అల్లీడ్‌ పల్లిషర్స్‌ అనేదానికి ఎడిటరుగా చేసినారా! మీరూ మా మామా ఒకటీ అయితే. చిన్నకత జెప్తావినండి. ఆర్నెల్ల క్రితం నాకు పెంద్లయ్యింది గదా? ఒక్కనా కొడుక్కీ నేను పెండ్లిపత్రిక ఇవ్వలేకపాయ్‌నాను. పెండ్లిపత్రికల కట్ట రిజిష్టరు పోస్తులో నాకు అందిన వెంటనే శుభలేఖలని గూడా ఎంచకుండా పరపరా చింపెయ్యాల్సొచ్చింది. ఎందుకంటే వరుడు - నామిని సుబ్రమణ్యంనాయుడు. పేరు పక్కన చీఫ్‌ ఎడిటర్‌, ఉదయం _ అని అచ్యెయ్యించేసినాడు. నాకు పిల్లనియ్యబొయ్యే నాకొడుకు. ఆ పత్రికను మా వోనర్‌ చూస్తే మక్లేమన్నా వుందా! సబ్‌ ఎడిటర్‌ను కూడా జనాలు చీఫ్‌ ఎడిటర్‌ అనుకుంటారు. అట్లావుంది మీరు చెప్పేది. ఇప్పుడూ సబ్‌ ఎడిటరూ దాని తర్వాత సీనియర్‌ సబ్‌ ఎడిటరూ ఆ తర్వాత చీఫ్‌ సబ్‌ ఎడిటరు- ఇట్లా వుంటాయి...” అని వాగేసినాను. ఆయన పడీ పడీ నవ్వతావుందాడు, ఇంక నవ్వితే చచ్చిపోతాడేమో అనిపించే అంత ఇదిగా-_

“ఏం సొ, అట్ట నవ్వతారు! నిజం, సబ్‌ ఎడిటర్‌కీ చీఫ్‌ ఎడిటర్‌కీ- నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా!”

ఆయన నామాటలకు ఇంకా ఇంకా నవ్వేదానికి బెట్టుకున్నాడు. ఆ తర్వాత నాకు సురేంద్ర రాజు చెప్తే తెలిసింది - ఆయన నిజంగానే ఆలైడ్‌ పబ్లిషర్సుకి చీఫ్‌ ఎడిటరంట. అయన జర్పలిస్టుగా చానాపేరు మోసినోదంట, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో గూడా చేసినాడంట. ఇన్ని నాశినాలు నాకేం తెల్సు?

సురేంద్రరాజు చెప్పిందాన్ని బట్టి “ఘటికుడుగా వుండాడే ముసిలోడుగొ అనుకున్నా

ఇంకొక దఫా ఇంకొకటి జరిగింది. నేను రాజేశ్వరరావు వాళ్ళింట్లో హాల్లో కూర్చొని వుండంగా కాలింగ్‌ బెల్‌ మోగింది. తలుపుతీస్తే ఎదురుగుండా కోట్ల విజీభాస్మరరెడ్డి! నీక్ళావాల్సిన ఇల్లు ఇదైయ్యుండదన్నట్టు- ఆయన కడ్డంగా నిలబడి, “ఇది అబ్బూరి వరద రాజేశ్వరరావిల్లు. మీకెవరు గావాల సా?” దీనికి విజీ భాస్మర రెడ్డి నవ్వమొకంతో

98 ...మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

“నాగ్గావాల్సింది గూడా రాజేశ్వర రావిల్లే లేవయ్యా, పద!” అని లోపలి కొచ్చి సోఫామింద కూచ్చోని “లేడా ఆయన?” అన్నాడు. ఇంట్లో నుంచి వరద రాజేశ్వరరావు హాల్లో కొచ్చినాక “అయితే నేనొస్తాన్‌ సా” అన్నాను. “పనేమన్నా వుంటే వెళ్ళు. భాస్మరరెడ్డి మనకు బెస్ట్‌ఫెండ్‌లే. వుండు ఫర్వాలేదు” అన్నాడు. విజీ భాస్కరరెడ్డి అరగంట వుండి వెళ్ళిపొయనాడు. ఆయనట్ల పోంగానే, “ఆయన రాజకీయ నాయకుడు గదసార్‌. మీకెట్లా పరిచయం?” అన్నాను.

“ఏమిటి నామినీ అట్లా అడుగుతావు? మనకు రాజకీయాలు కొత్తా ఏమిటి? ఇప్పుడు - నాకు నెహ్రూ పరిచయం లేదని గ్యారంటీ ఇవ్వగలవా?” అన్నాడు. ఆయన తల పొగురుకు నేను కోప్పడిపాయ్‌ “గమ్మనుండండి సా. నెహూకూ మీకూ ఏం సమందం?” అన్నాను.

“అయ్యోరామా!” అని ఆయనచెప్పింది విని ఇచ్చిత్రపాయ ఆయనంటే బయం ఎత్తుకొనింది. ఇదట్లా పోతే, నవ్వడం, నవ్విపించడం రాజేశ్వరరావు విద్య. ఆయన దగ్గిర నేనెప్పుడూ భేదం బెట్టుకుని మాట్లాళ్ళేదు. కడుపులో ఏం వుంటే అది అనేసేవాణ్ణి. ఒకరోజు “నేనిన్ని దినాలుగా మీ ఇంటి కొస్తుండాను. మీ పిల్లల్ను గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఎంతమంది పిల్లలూ ఏంచేస్తుంటారూ అది చెప్పండి” అనడిగినాను. “మాకు పిల్లల్లేరు నామినీగొ అన్నాడు. నాకు పెండ్లయి తొమ్మిది నెలలయినా నా పెళ్ళాం ఇంకా అంటు తప్పక పొయ్యేసరికి దిగులుపడి దాన్ని దినానికొక డాక్టరు దగ్గిరికి తిప్పుతున్న రోజులవి.

“అదేంది సార్‌ డాక్టర్ల దగ్గిర చూపించుకోక పోయినారా!” అన్నాను.

"”పెళ్ళికాగానే మేం ఆపరేషను చెయ్యించుకున్నాం- పిల్లలు కలక్కుండా! మాదేశ సేవ ఏదన్నా వుంటే ఇదేనయ్యా!* అన్నాడు.

నాకు చాలా బాదైపొయ్యింది. గమ్మనగదా వుండాల.

“ప్ప, చానా తప్పు పని చేసినారు అన్నాను, దాన్ని సాగలాగి. ఇంతలో ఇంట్లోనుంచి పిల్లి దాని పిల్లల్ని నాలుగిట్ని వెంటేసుకుని హాల్లో కొచ్చింది.

“మాకు నాలుగు పిల్లులు నామినీ! నువ్వేమీ దిగులుపడకూ!” అన్నాడు. ఆయన తమాసకు ఛాయాదేవమ్మా నేనూగూడా ఓ అని నవ్వేసినాం.

ఇంగొకసారి ఇంకొక తమాషా చేసినాడు. నేను చార్మినార్‌ సిగరెట్ల ఫ్యాక్టరీ దగ్గిరుండే “ఉదయం” నుంచి బంజారాహిల్స్‌ “ఆంధ్రజ్యోతికి మారుకున్నాను. ప్రయాణం జాస్తి. 20 రోజులు ఆయన్ని చూళ్ళేదు. ఒకసారి ఆంధ్రజ్యోతికి ఫోనుచేసి, “సాయంకాలం డ్యూటీ నుంచి దిగేసి చక్కా ఇంటికిరా, చక్కటి అయిడియా ఒగటొచ్చింది. నీకు చెప్పాలి అన్నాడు.

వరద రాజేశ్వరరావుకొక పూలహారం! 99 ఇంటికొస్తే ఆయన అయిడియా ఇదీ! “పెటీ కవులకందరికీ డిన్నర్‌ ఇప్పిద్దామనుకుంటున్నాను అందరూ మాంచి తిండిలో వుండంగా పోలీసుల్ని పిలిపించి లారీ చార్జి చెయమంటే సరి!” ఆయన మాటలకి ఆయనే ఎంత నవ్వినాదో! ఆయనకి ఇప్పుడొచ్చే కవిత్వం అంటేమంట “చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ మాదిరి పద్యాన్ని రాసిన వాణ్ణి ఒక్కజ్ణి చూపించు నామినీ! వాడి పాదాలు కడిగి నెత్తిన చల్లుకుంటాను పోనీ- నాకు చేత వెన్నముద్ద ౮ పద్యమంటే ఇష్టం అని చెప్పగలిగే కవి వుంటే పట్టుకురా! రిట్ట్‌హోటల్‌లో సన్మానం చెయ్‌పిద్దాం” అనేవాడు “ఇప్పుడు రాసేవాళ్ళు కవులు కాదు కౌలు కౌలు అంటే కౌస్‌ అనుకునేవు కౌస్‌ అంటే ఆవులు గదా! అవి పాలిస్తాయి, మంచివి కౌలు అంటే భావాల్ని శాలుకి తెచ్చుకునే వాళ్ళు, అని! తెలుగుదనం ఒక్కపద్యంలో వుందా” ఇదీ ఆయన వాటం! అయితే ఆయన ఎవరిమీదా ద్వేషం కక్కేవాడు గాదు ఆయనొక్కడూ బావ అయినట్టూ మిగతా అందరూ మరదళ్ళయినట్టూ, జడపట్టి లాగినట్టుగానే వేళాకోళం చీసేవాదే గాని- కిరసనాయిలు పోసి అగ్గిపుల్ల గ్‌సి ముట్టించి నట్టుండేది గాదు ఆయన అందర్నీ ఎగతాళి చెయ్యంగా విన్నానే గాని ఒక్కర్ని కూడా తిట్టంగా విన్లేదు నాకు హైదరాబాదు నుంచి తిరప్తికి ట్రాన్స్‌ఫర్‌ అయిన వెంటనే ఆయనింట్లో వూడిపడి, “మీకూ నాకూ రుడం తీరిపొయ్యింది సా ఇంక రెండు రోజుల్లో నేను మావూరు పోతుండాను నాకు సెలవివ్వాలొ అన్నాను “ప్రీ త్రల్లీ తండ్రిని చేరుకుంటున్నావన్నమాట, చాలా సంతోషం నామినీ” అన్నాడు నాకు దుఃఖం వచ్చింది ఆయన పాదాల మింద పడితే వికారంగా వుంటాదని చెప్పి చేతులు పట్టుకుని, “మిమ్మల్ని ఏది పడితే అది అనేసినాను శ్రీనివాసరావు నా బెన్షఫెండ్‌ అంటే శ్రీశ్రీ మీకు (ఫ్రెండా గొప్పలు చెప్పుకోవడంలో మీకు మీరే అన్నాను మీరింగీషు మాట్లాడితే ఇచ్చిత్రపొయ్‌ మీకు ఇంగ్లీషొచ్చా అనడిగినాను నెహ్రా నాకు తెలుసు అన్నప్పుడు నేన్నమ్మనని కుచ్చున్నా మీరు మన్నించినారు మీ గొప్పతనం ఏమాత్రం తెలుసుకోకుండా ” “ఏం నామినీ! నీ వైఫ్‌తో వెళ్ళి తెలుగు సిన్మాగాని చూసొచ్చావా? ఏంది నీ పిచ్చిమాటలు?” అని భుజం తట్టినాడు

100 మా అన్న దాక్టర్‌ వెంకటసుబ్బయ్య

“నేనాస్తాన్‌ సారొ అంటే రానివ్వలేదు

“మరొక గంట వుండు, పోదువుగాని” అన్నాడు

“లేదు సా, వూరెళ్ళే పనిగదా! నన్ను చూడంగానే మాయమ్మ తల పెరిగి పొయ్యిందేందిరా అంటాది ముందు తల కత్తిరించుకోవాల ఇంకపోతా!” అన్నాను

“నీక్షు తెలుసా? నేనెప్పుడూ నా తల మంగలికి అప్పగించను నేనే కత్తిరించు కుంటాను పది నిమిషాలు పెరట్లోకిరా నీతల కత్తిరిస్తాను రెండు రూపాయలివ్వు చాలు” అని నవ్విపిచ్చినాడు

నేనింక కదలబోతుంటే ఇంట్లోకి పొయి ఒక పాకెట్టుతో తిరిగొచ్చి, “నీ పచ్చనాకు సాక్షిగా అంతొ చదివానయ్యా! రంగారావు మిసెస్‌ సుశీల చెప్పింది నీ కధల గొప్పతనం! ఏల్చూరి సుబ్రహ్మణ్యం చెప్పినా నేను పట్టించుకోలేదు సుశీల చెప్పాక నీ పుస్తకం చదివా మీ అమ్మసరేగొని నాకు మీ నాన్నగారంటే ఇష్టం నువ్వెప్పుడూ నా పొన్నూరు పంచెను పొగుడుతుంటావు గదా! ఇది అదే! మీ నాన్నకు కటబెట్టు నా నమస్కారాలు చెప్పు” అనేసి ఆ ష్యాకెట్టు నా చేతుల్లో బెట్టి క్రావిలించుకుని వీధి దాకా వొచ్చినన్ను సాగనంపినాడు

నొ బిడ్డ బిడ్డకూ నేన్సు వరద రాజేశ్వరరావు గురించి చెప్పుకుంటా

టాం గ్ర 21 ్‌ ఇ / గింసీం 2 న శ ల్తా మో

సస్తుభొల్రి హైదాహాత యోగ

ఈ పుస్తకంలో.... పేజీ నెం. ని

బాలన్నయ్యకు జేజేలు -ముళ్ళవూది వెంకట రమణ త్‌ | నా గాడ్‌ ఫాదర్‌...గురించి కాస్త... నా బొమ్మల కథ మరి కాస్త... -బావు 10 నకలులేని సాహిత్యకుడు జరుక్‌! -కొదవటిగంటి కుటుంబరావు 20 ప్రాక్‌ - పళ్చిమ సంఘర్షణలు -చందమాను' రామారావు 22

పుట్టపర్తి నారాయణాచార్యులు -'తెలుగు వెలుగులు” నుంచి 25 1

కవిత్వంలో రౌడీ వేషం -అబ్బూరి వరదరాజేళ్వర రావు 27, |

వోల్టేర్‌ రగిలించిన భావ విప్లవ జ్వాల -నందూరి రామమోవానరావు 88,

తిరుపతి సంస్కృత కళాశాలలో దినచర్య -తిరుముల రామచంద్ర త్త విద్య -గుడిపాటి వెంకటచలం (బిద్దల శిక్షణ) 47 - బాల్దాక్‌ -గోరీ (సాపొత్య వ్యాసాలు) . క్‌ి రంగనాయకమ్మగారి ఇంటర్వ్యూ: నాసాహిత్యం నాదుఃఖంలోంచి ప్రారంభమైంది 56 ఆదిభట్ల నారాయణదాసుగారు -చెళ్ళనిళ్ళ వేంకటశాస్త్రీ శతావధాని 70 సూర్యరాయాంధ్ర నిఘంటువుపై గిడుగువారి సవాలు 72 వల్లూరిలో నా ప్రపంచం -శ్రీపాద సుబ్రహ్మణ్య, శాస్త్రి 74, గురువుకు తగ్గ శిష్యుడు -వటుకూరి సాద్‌ 78

మృత్యువుతో నా మూడో యుద్ధం -శ్రీశ్రీ (అనంతం) 82

నా కాలేజీల్లో నేను -రాచకౌంద విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రీయం) 85

పాఠక మిత్రులకు నిర్గమన నీరాజనాలు -ఐంగోర 89

ఆమె ఇచ్చిన పువ్వులు -ఆచంట జానకిరామ్‌ 91 . . వరద రాజేశ్వరరావుకొక పూలహారం! -నామిని సుబ్రవ్మాజ్యం నాయుడు 98