Telugu Kondaveeti Reddirajulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

జై న్‌ అ అ | గె క్ష ” ల ॥ /| క [ కొండవీటి ౦డరా | | నా కం జనాా కలన న న ఇ | గ ని స మనసుపడి మక్కువతో సేకరించిన " శస సై లై ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం . “+ |; “ఇ... &[ సుందరయ్యవిజ్ఞాన కేంద్రానికి క శా ౧ క ఆనందంతో బహూకరిస్తున్నాం. 7 - మల్లెమాల కుటుంబం గ ష్‌ హా రోం టే రకం స (వోగ్‌ కరీ 'థశసే = | థి వా. 7 /| న భగ నే జ్‌ ౮ న జ్గ్‌ రెడ్డి సేవా సమితి - కడప

కొండవీటి రెడ్డిరాజులు డా॥ ఈమని శివనాగి రెడ్డి ప్రచురణ రెడ్డి సేవాసమితి 2/4 29, నాగరాజు పేట కడప- 516 001

రిం0గ% 71.5 : గస౦0%0ట/66౬1! గక౬౦౦! గంటల తీ [[10గ : ౧. ౬౯౬14411! 5స%4ఉ౮! ౧౬౦౦ (అ 4ం7౧౫౦గ 5600౧6 ౬6110౧ : 2002 00౧169 : 2000 భశ. ౪40 ధ2. లే కం ద లపల నిగ|౦౬ : ౧6.30/- గీ న0? ౦౦౧165 : గ" ౧౯౦౦౪ 56/4 84141141 (6 2429, [4ఉ౦గగుల ౧౯|| ౧౮౦౦|4౧||1 - 516 001 యానము 9౧: 08562-71279 పటన ము మె // జి న గ న్‌ €.ిర న. న్‌. వం. నిగగ౧1ండే 24: 354] 5౧|| ౦౯౧౯౦౬౯? ౧౧|౧|7౯౧౦ 136, ౧౬44౩4 2౦4౦ (1206౧471 - 517 502 8% 25841

అంకితం

తాన ౨తొ లాలీ లు

308రీ ఇశీలయరీం

సంబబూరి రీరీనారాయంఇిరె ల్సి [5 చెన్నూరి అంజునయీంరె శి గ గార్లీకు తినీ సరో

ఈమని. శివనాగిరెడ్డి

విషయసూచిక

పేజీలు తొలిపలుకు శ అభిలాష షే ముందుమాట ఖా 'భమునవి మాటలు" స! రెడ్డ చరిత్ర పూర్వరంగం ॥ రెడ్డిరాజుల ప్రారంభ దశ శ కొండవీడుకు రాజధానిని మార్చిన ఆనపోతారెడ్డీ ౨ ఠళింగగాంగులతో రెడ్డిరాజుల మొదటి యుద్ధం . ఆదర్శ పాలకుడు ఆనవేమూరెడ్మి 17 కర్పూర వసంత రాయలు : కుచూరగిరిరెడ్మి 25 కతొండవీట రాజనర్తకి లకువము 3తి కుమూరగిరిరెడ్డి చివరిరోజులు త తొండవీడులో పెదకోమటి వేమారెడ్డి 4లి రెడ్డి రాజ్యశాఖలు 51

తొలిపలుకు ఒక దేశం జొన్నత్వాన్ని తెలుసుకోవాలంటీ్‌ ఆదేశ చరిత్ర, సంన్మృతిని గూర్చిక్షుణ్గంగా తెలుసుకోవాలి దక్షిణ భారత చరిత్ర లో ముఖ్యంగా ఆంధ దేశంలో రెడ్డిరాజుల పాలన టఓ స్వర్ణ యుగమనే చెప్పాలి మన చరిత్రను ఇతర దేశస్థులు, ఇతర మతస్థులు రాయడం మూలానా ఎంతో విలువైన సమాచారం మరుగున పడిపోయింది వాస్తవాలను గుర్తించి, నిజానిజాలను వెలికి తీసినప్పుడే అసలు సిసలైన దేశ చరిత్ర, సంస్కృతి బయట పడ్డుంది. బక జాతిమీద ఈర్షతో. ద్వేషంతో చరిత్రను వక్రీకరించిన చరిత్ర కారుల తప్పల్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే అతిశయోక్తుల పట్ల జాగరూకత వహించాలి కూడా ఈ చిన్ని గంథం కేవలం రెడ్లకోసమే రాసిందికాదు రెడ్డి రాజుల చరిత్ర ఆంధుల చరిత్ర, మనందరి చరిత్ర రెడ్డీ రాజులు పరిపాలనే కాదు వారు చేసిన సాంస్కృతిక సేవ ఎనలేనిది తెలుగులో ఎన్నో గొప్పగంథాలు రావడానికి తోడ్పడ్డారు. రెడ్డినేవా సమితి కడప 2000 నంవక్షరం మే నెలలో ప్రారంభించిన తర్వాత తమ ఆశయాల సిద్ధి మేరకు వెలువరించిన మొదటి పుస్తకం *'కతొండవీటి రెడ్సిరాజులు' ఈ పుస్తకాన్ని తెలుగువారందరూ చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ (గగంథరచయిత డా ఈమని శివనాగిరెడ్డి (అసిస్టెంట్‌. స్థపతి, ఆర్కియాలజీ డిపార్టమెంట్‌, పైదరాబాద్‌) గార్కి - డాః పి.మునిరత్నం రెడ్డి (సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఆన్‌ ఇండోచైనా & సౌత్‌ పనిఫిక్‌, ఎస్‌. వి యూనివర్శిటీ) గార్మి- ఆచార్య పినరసింహారెడ్డి (తెలుగా డిపార్చవెంంట్‌, ఎస్‌ వియూనివర్చిటీ) గార్కి- డా పేటకశ్రీనివాసులురెడ్మి (తెలుగు డిపార్చవెంంట్‌. ఎస్‌. వి యూనివర్శిటీ గార్కి- డాః॥ ఎన్‌ కృష్ణారెడ్డి (పన్సియంట్‌ ఇండియన్‌ హిస్టరీ, కల్చర్‌ & ఆర్మియాలజీ డిపార్ట్‌మెంట్‌, ఎస్‌ వి యూనివర్సిటీ) గార్కి - నాయిశ్రీ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ తిరుపతి వారికీ - ఈ పుస్తకానికి ఆర్థిక సహాయం చేసిన దాతలందరికీ మూ ప్యాదయపూర్వరక కృతజ్ఞతలు.

  • రెడ్డి పేవచాసణుతి 2/429. నాగంంణా పేతు -518 001

డా|! ఇసుకపల్లి వెంకటళివాలెట్డి శ్రీబ్యోతి వెంకటసుబ్బారెడ్డి ఖాజనట సెక్షన్‌ అధికారి. అటవీవిభాగం హైదరాబాద్‌ శ్రీ బొమ్మారెడ్డి శ్రీమన్నారయణరెడ్డి యష్‌. ఇ తెలులు గంగ శ్రీ భూమిరెడ్డి జయరామిరెడ్డి అడ్వకేట్‌, మారుతీవగర్‌, కడవ శ్రీ మన్నెం వెంకటరామిరెడ్డి రాయలసీమ విద్యాసంస్థలు, తిరువతి శ్రీ గుమకుంట్ల సమధానందరెడ్డి ఉంతకొమ్మదిన్నె శీ గళ్లెల రామలింగారెడ్డి గూడవాండ్లపల్లె, కడవ అడ్వకేట్‌, నాగరాజుపేట, కడవ శ్రీ అన్నపురెడ్డి కొండారెడ్డి శ్రీ గురిజాల బాలనాగిరెడ్డి శ్రీలక్ష్మీ శ్రీవివాన అయిల్‌ మిళ[, మైదకూరు రిటైర్డ్‌ స్పెషల్‌ అసిస్టెంట్‌ (విజయ బ్యాంక్‌) పింహవురి కాలనీ, కడవ చా; అమ్మిరెడి వరదారెడ్వి అసోసిమేట్‌ ప్రొఫెసర్‌, కెమిఫ్తీ విభాగం శ్రీ కొవ్నల నాగిరెడ్డి వేరుశెవగకాయల వ్యాపారం డా|) శ్రీమతి పుట్టు హేమలత సాయిబాబా దేవాలయం వీథి, రాయబోటి కరస్పాండెంట్‌, ప్రభు హైస్కూలు, తిరువతి ప్రొఫెసర్‌ కొప్పోల్‌ గురివిరెడ్డిగారి శివారెడ్డి = ఉ.మహశ్వరరెడ్డి అధనిందనగర్‌, కడవ ఇిర్హిన్స స్పెషలిష్టు, అద్‌. యస్‌. రోడ్‌, కడవ ప్రమాలక్షదే చా| ఎం. వేణుగోపాల్‌రెడ్డి శయకి టెం, కడవ డా సాదితి మెమోరియల్‌ నర్సింగ్‌ హోచు ద్వారకానగర్‌, కడవ శ్రీ పాట్ట్‌టి మూర్యనారాయణరెడ్డి ఎ.సి.టి.ఓ. కడవ శ్రీ పోతిరెడ్డి రాజీవనరెడ్డి బిన్న బెవ్పలి. కమలావురం

డాక్టర్‌ పుట్టా మునిరత్నంరెడ్డి అసిప్టెంట్‌ ప్రాఫెపర్‌, సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ అన్‌ ఇండోచెనా & సొఠ్‌ పసిఫిక్‌, ఎస్‌.వి యూనివర్చిటీ, తిరుపతి. అభిలాష 1996-97 సంవత్సరాలలో ఒక సంవత్సరంపాటు శ్రీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ' రెడ్డిరాజుల చరిత్ర' ధారావాహిక వ్యాసాల్ని కొన్ని చదివాను. ఈమని శివనాగిరెడ్డిగారు. సామాన్య పాఠకునకర్థమలయ్యే రీతిలో, సులభ్లైలిలో రసవత్తరంగా అందివ్వడం నాకు చాల నచ్చింది. అ పత్రిక అర్ధాంతరంగా ఆగిపోయిన కారణాన తరువాతి వ్యాసాలు పారక లోకం చదవడానికీ నోచుకోలేక ఎదురు తెన్నులు చూసి తీరని వెలితిగా నిల్చిపోయింది. రెడ్డి సేవాసమితి, కడప ఆ బాధ్యతను చేపట్టి దీనిని ఒక పుస్తక రూపంలో తీసుకు రావడానికి డాక్టర్‌ శివనాగిరెడ్డిగారి నుండి అనుమతి పొందింది. ప్రచురణ బాధ్యతల్ని ఆచార్య జీ.శివారెడ్డిగారు (వైస్‌ ప్రెసిడెంట్‌ రెడ్డిసేవాసమితి, కడప) శ్రీ ఎల్‌. కొండారెడ్డిగారు (జనరల్‌ సెక్రటరీ) నాకు అప్పగించడం ఒక అదృష్టంగా భావించాను. ఇలా రెడ్డి రాజుల సంక్షిప్త చరిత్రను సామాన్య పారకునకు అందించాలనే రచయిత కోరికను నెరవేర్చిన వాళ్ళమయ్యాం. డాక్టర్‌ శివనాగిరెడ్డిగారు ముందు మూట (ఫోర్‌ వోరు) మీరే వ్రాయండని కోరినప్పుడు రెడ్డిరాజుల శాసనాల మీద రెడ్డిరాజుల కాలంలో వెలువడిన సాహిత్యం మీద పట్టు వున్నవారు వ్రాస్తే బాగుంటుందని నేను తెలియజేయగా ఆయన సున్నితంగా “యువతరం' మ్లోషణ చూడాలని వుందన్నారు. ఈ బాధ్యతల్నినాకు, రచయితకు ప్రియ మిత్రుడైన డాక్టర్‌ పేట శ్రీనివాసులురెడ్డి ( అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, తెలుగు అధ్యయన శాఖ, ఎస్‌.వి.యూనివర్సిటీ) కి అప్పజెప్పాను. సందర్భం వచ్చింది కాబట్టి చాలా మంది రెడ్డి మిత్రుల అభిలాషను తెలియ జేస్తున్నాను. అదేమంటే రచయిత డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి గారు, రెడ్డి సేవాసమితి, కడప సంయుక్తంగా కలిసి ' కల్చరల్‌ హిస్టరీ ఆఫ్‌ రెడ్డీస్‌ మరియు “రెడ్డి కల్చర్‌ టు డే' అనే అంశాలపై సమగ్ర పుస్తకాలను తీసుకు వస్తారని అశిస్తూ ... దాక్టీర్‌ పుద్దా $ఎనిరీన్నీంరెడ్డి

వుందువూాట

డా. పేట శ్రీనివాసులురెడ్డి

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

తెలుగు అధ్యయనళాఖ

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,

తిరుపతి- 517 502

ఉా॥ ఈమని శివనాగిరెడ్డి రాసిన కొండవీటి రెడ్డిరాజులు అనే ఈ గ్రంథం ఎంతో పరిశోధనాత్మకమైంది. సామాన్య పాఠకునికి సైతం అర్థమయ్యే విధంగా సరళమైన ఖాషలో రాశారు. గ్రంథం సక్సెస్‌ సగం ' రీడబులిటో మీదే ఆధారపడి ఉంటుంది. రచయిత పురావస్తు శాఖలో అసిస్టెంట్‌ స్పపతిగా పనిచేయడం వల్ల, అనేక శాసనాలను పరిశీలించి, సాహిత్యంలోని విషయాలతో అనుసంధానం చేసి చక్కని పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకం ఒక ఆసక్తికరమైన కథలా సాగిపోతుంది. ఒక సిట్టింగ్‌లోనే చదివింప చేస్తుంది. కొత్త కొత్త విషయాలతో చరిత్రను వునర్నిర్మించే అధునిక పరిశోధనా కెరటం డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి. “కొండవీటి రెడ్డిరాజులు' (గ్రంభాన్ని పరిశీలిస్తే మనకు ఎన్నో విషయాలు

మ్ఫురిస్తాయి. రెడ్ల పుట్టు పూర్వోత్తరాలు, రెడ్ల రాజ్య విస్తరణ - పొలన, రెడ్డి రాజుల కళా పాహిత్య పోషణ, రెడ్డిరాజుల వైదిక మతోద్దరణ, రెడ్డిరాజుల విదేశీవ్యాపారం, రెడ్డి రాజుల వ్యవసాయాభివృద్ధి, పరిశ్రమలు నంటి అంశాలుగా విభజింపచచ్చు. రెడ్ల పుట్ట పూరొశ్వేత్తరాలు : - నేటి మహారాష్ట్ర మాల్టేడ్‌ను రాజధానిగా చేసుకొని ౮ాస్ట్ర కూటులు పాలించారని, వారు అక్కడ్నుంచి రాజస్థాన్‌లో స్థిరపడి రాధోడ్లుగా పేరుపొందారు. అదే విధంగా మాల్టేడ్‌నుండి దక్షిణంగా వలన వచ్చిన రాష్ట్ర కూటులు తెలుగు దేశంలో 'రట్టొడ్లు' 'రెడ్డు'గా మారారని రచయిత సోదాహరణంగా వివరించారు. రెడ్ల రాజ్య జస్తరణ - పాలన: - క్రీశ 1325 - 1353లో అద్దంకిని రాజధానిగా చేసుకొని కొండవీటి రెడ్డి రాజ్యాన్ని స్థాపించి పాలించింది ప్రోలయ వేమారెడ్డి. ఇతను ధరణికోట, చందవోలు, కొండవీడు, బెల్లంకొండ, వినుకొండ, ఉదయగిరి మొదలెన 84 కోటలను నిర్మించాడు. ఇతను కొండవీటి సామ్రాజ్యానికి మూల పురుషునిగా కీర్తింప బడ్డాడు. ఇతని తర్వాత దత్త వుత్రుడు అనపోతారెడ్డి రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు

మార్చి క్రీశ 1354 నుండి 1364 వరకూ, అతని తర్వాత అనవేమారెడ్డి క్రీశ 1364 నుండి 1386 వరకూ, అతని తర్వాత కుమారగిరిరెడ్డి 1386 నుండి 1402 వరకూ పెదక్షోమటి వేమారెడ్డి, క్రీశ 1402 నుండీ 1420 వరకూ, దాని తర్వాత రాచవేముడు శ్రీశ 1420 నుండి 1424 వరకు పాలించారు. వీరు తమ రాజ్యాన్ని మొదట గోదావరి - 'ెన్ననదుల మధ్యగల తీరాంధ్ర దేశాన్ని వశపరచుకొని పరిపాలించారు. తర్వాత రెడ్డిరా జ్యాన్ని అనవేమారెడ్డి ఉత్తరాన సింహాచలం వరకు, పశ్చిమాన శ్షీశెలం వరకు, తూర్పున సముద్రం వరకు విస్తరింప చేశాడు. కుమూరగిరి రెడ్డి రాజ్య విస్తరణ పెన్న నదికి దక్షిణాన గూడూరు వరకు ఉత్తరం ఈళాన్యాన సింహాచలం నుండి ఒరిస్సాలోని కటకంవరకు జయించి రెడ్డీ రాజ్యాన్ని విస్తరించాడు. ఇలా అయా రెడ్డి రాజుల కాలంలోని రాజ్యపాలన విస్తరణలను గురించి రచయిత తెలియవేళారు.

రెడ్డిరాజుల సాహిత్వ సేవ - కలావోషణ : - పోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎజ్టాప్రగడ. ఎజ్జిన కవి మహాఖారత కావ్యాన్ని పూర్తి చేసి కవిత్రయంలో ఒకడైనాడు. తర్వాత అనవేమారెడ్డి కొండవీటిలో ప్రతి సంవత్సరం వసంతోత్సవాలను జరిపేవాడు. ఇతను అనేక కవులను, గాయకులను, పండితులను, భాషా శాస్త్రజ్ఞులను, కళా నిపుణులను, జ్యోతిష్కులను, గౌరవించి వసంతరాయలుగా బిరుదు పొందాడు. కుమారగిరిరెడ్డి కూడా ప్రతి ఏటా వసంతోత్సవాలను జరిపించి ' కర్పూర వసంతరాయలు' గా పేరు పొందాడు. ఇతడు సంస్కృతాంధ్ర పండితులను, సంగీత నాట్య విశారధులను సత్కరించేవాడు. కుమారగిరి రెడ్డి సంగీత నాట్య శాస్త్రాలలో ప్రవీణుడు. ఇతడు 'వసంత రాజీయము' అనే నాట్య శాప్రాన్నిరచించాడు. నంగీత, నాట్య కోవిదురాలెన లకుమూదేవి ఇతని ఆస్తాన నర్తకిగా ఉండేది. అలాగే పెదకోమటి వేమారెడ్డి సంగీత సాహిత్యాలలో అభినివేశం కలవాడు. ఇతను పాహిత్య చింతామణీ, సంగీత చింతామణీ, వీరనారయణ చరితము, శృంగార దీపిక, హాలుని గాధాసప్తసతిలోని నూరు గాధలకు వ్యాఖ్యానాలను రచించాడు. అలాగే కవిసార్వఖౌముడైన శ్రీవాధుడు ఇతని ఆస్థాన విద్యాధికారి. ఇతను శృంగార నైషధం, హరవిలాసం, భీమేశ్వర పురాణం, కాశీఖండము, శివరాత్రి మహాత్యము, పల్నాటి వీరచరిత్ర, నురుత్తరాట్పరిత్రము, ధనంజయ విజయం వంటి ఎన్నో కావ్యాలను రాని రెడ్డిరాజుల కీర్తి ప్రతిష్టల్ని దశదిశల వ్యాపింప చేశాడు. అలాగే పెదకోనుటి వేమారెడ్డి ఆస్థానంలోని వామన భట్ట బాణుడు శృంగార భూషణం, కనకలేఖ కళ్యాణము, ఉషాపరిణయము, పార్వతీ పరిణయము, నలాభ్యుదయము, రఘు

నాధాభ్యుదయము, నేమ భూపాల చరిత్రము, హంస నందేశం, శబ్దరత్నాకరము, శబ్ద చంద్రిక బృహత్కథా మంజరి వంటి ఎన్నో గ్రంథాలను రచించాడు. రాజమహేంద్రవర రెడ్డి రాజ్యంలో చివరి కాలంలో దొడ్డరెడ్డి చేత ఆదరింపబడ్డ శివలెంక కొమ్మన వీరమహేశ్వరము, శివలీలా విలాసము వంటి గ్రంథాలమ రచించినట్లు తెలుస్తోంది.

ఇలా రెడ్డిరాజులు సాహిత్యాన్ని, కళలను, శాస్తాల్ని పోషించిన సంగతిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రెడ్డిరాజులు - వెదక మతోద్ధరణ : - మహమ్మదీయుల అక్రమణతో కాకతీయ పొతమ్రాజ్యం విచ్చిన్నమై, ఆంధ్రదేశం ఇస్లాంమత వ్యాప్తి ప్రభావానికి లోనైంది. కాకతీయ సామంతులు ఆంధ్రదేశ ప్రజల దుస్థితిని గమనించి కొత్త సైన్యాలను సమకూర్చుకొని వైదిక మతాన్ని పునరుద్ధరించడానికి అనేక స్వతంత్ర రాజ్యాలను ఏర్పరచారు. వాటిలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించిన రెడ్డిరాజ్యమొకటి. రెడ్డి రాజులు ఒక శతాబ్దం పెగా వైదిక మతోద్దరణకు పాటువడ్డారు. కొండవీటి రెడ్డి రాజులు ధర్మ కార్యాచరణులు, శివభక్తులు. పరమత సహనం కలవారు. శ్రీశెలం, దాక్షారామం, సింహాచలం, శ్రీకూర్మం, త్రివురాంతకం వంటిశెవ, వెష్టవ దేవాలయాలకు అనేక దానధర్మాలను చేసి, శాననాలమ వేయించారు. అనేక దేవాలయాలను కట్టించారు. శిల్పకళా ళోభితాలైన వుండపాలు, శ్రీశైల, అహోబిల, సింహాచల క్లేత్రాలకుసోపానాలను నిర్మించారు. ఎందరో వేద పండితులకు, వైద్యులకు, జ్యోతిళ్ళాస్తవేత్తలకు, సంగీత, నాట్య కళాకారులకు అగ్రహారాలను దానంచేసివైదిళ మళోద్ధరణకు ఇతోధికంగా పాటుపడ్డారు. మహమ్మదీయుల దండయాత్రలవల్ల నశించిన వేద విద్యలను, యజ్ఞయాగాది క్రతువులను పునరుద్ధరించారు. అనేక మలాలను, విద్యాలయాలను నెలకొల్పారు. రిడ్డి రాజులు - ఐదేటీ వ్యాపారం : - రెడ్డీ రాజ్యంలోని వర్తకులు తీరాంధ్ర రేవుల నుండి దేశ విదేశీ వర్తకాలు చేసేవారు. మోటుపల్లి రేవునుండి అత్యధికంగా వర్తక వ్యాపారాలు జరిగేవి. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎంతో ధనం లభించేది. ప్రముఖ వ్యాపారి అవచి తిప్పయ్య శెట్టి కుమారగిరిరెడ్డి పాలనలో సుగంధ ఖాండాగార అధ్యక్ష పదవిని అలంకరించాడు. అవచి తిప్పయ శెట్టి రెడ్డి రాజ్యంలోనే కాకుండా విదేశాలలో కూడా గొప్ప “పేరు వ్రతిష్టలున్న వ్యాపారి. ఇతను రెడ్డి రాజల వనసంతోత్సచాలకయ్యే సుగంధ ద్రవ్యాలను దేశ విదేశాల నుండి తెప్పించేవాడు. బర్మా, నులయా, ఇండోనేషియా, చైనా, సింహళ, వర్వా,

అరేబియా దేశాలతో వర్తకం జరుగుతుండేది. నన్నని నూలు వప్రాలు, కలంకారి వస్త్రాలు, అనేక రకాలైన పట్టు బట్టలు వివిధ దేశాలకు వర్తకులు ఎగుమతి చేసేవారు. సీంహళం నుండి ఏమగులు, వర్వానుండి గుర్రాలు, కొళ్ళీరం, నేపాలు రాజ్యాలనుండి, గోవా, జావా, సుమిత్ర ద్వీపాలనుండి సుగంధ ద్రవ్యాలు, కస్తూరి. కుంకుమ, జవ్వాజి, కర్పూరం, పన్నీరు, చందనం వంటి వాటిని రాజాష్ట్థానానికి సమకూర్చేవారు. సింహళం నుండి ముత్యాలు, చైనా నుండి పట్టు వస్త్రాలు దిగుమతి అవుతుండేవి. రెడ్డి రాజాల - వృవసాయాభివ్పద్ద. పలమలు : - రెడ్డి రాజుల రాజ్యంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. కొంత నుంది వ్యవసాయానికి తోడుగా పరిశ్రమలను కూడా నిర్వహించారు. ప్రతి గ్రామంలో గృహ వరిశ్రమగా వస్త్ర పరిశ్రమ వృద్ధి చెందింది. సన్నని నూలు బట్టలు నేసేవారు వేల సంఖ్యలో ఉండేవారు. నీలి రంగు తయారు చేసి, వివిధ రంగుల్లో వస్త్రాలను అద్దు పరిశ్రమ మచిలీపట్నంలో ఉండేది. రెడ్డిరాజులు ఎన్నోతటాళాలు, కుంటలు, చెరువులు, బావులు, కాలువలను నిర్మించినట్లు శాననాలు తెలియ చేస్తున్నాయి. గ్రామాల్లో వృత్తివని వారుండేవారు. పొత్రలు, గృహోవకరణాలు, ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు తయారుచేస్తుండేవారు. దీపపు కుందులు, కెమ్ములు, గాజు గవాక్షాలు, తలుపులు, అద్దాలు, కాగితం తయారు చేసే పదిశ్రమలు కూడా అభివృద్ధి చెంది ఉండేవి. రెడ్డి రాజులకాలంలో జొన్న, నజ్జ, వరి, చెరకు, నువ్వులు, ద్రాక్ష వుష్కలంగా పండేవి. పశు సంపద, పాడి పరిశ్రమ అభివృద్ది చెంది వుండేది.

ఇలా రెడ్డి రాజులు ఆంధ్ర దేశంలో ఓ ప్రత్యేక తరహా పాలనను అందించి, దేశ విదేశాలలో ఎంతో పేరు ప్రతిష్టల్ని గడించారు. తెలుగు ప్రజలకు రెడ్డిరాజుల పాలన చిరస్మరణీయం.

డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి స్పపతి కావడం వల్ల అందమైన శిల్పాన్ని మలచినట్లు ఈ (గ్రంధాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు.

మిత్రులు శివనాగిరెడ్డి మున్ముందు ఇంకా విలువైన వుస్తకాలను వెలువరించాలని అశిస్తూ -

డాక్టర్‌ పేట శ్రీవివాసులురెడ్సి

వునవి వాటలు

కాకతీయుల పతనానంతరం పుట్టుకొచ్చిన రాజ్యాల్లో రెడ్డీ రాజ్యం ఆం[ధదేశంలోవి ఎక్కువ (ప్రాంతాన్ని చేజిక్కించుకొంది. ప్రోలయ వేమారెడ్డి రాజ్యస్థాపకుడుగా అద్దంకి నుంచి పాలించాడు. తరువాత అనపోతారెడ్డి రాజ్యాన్ని జొండవీటికి మార్చి రెడ్డి రాజ్య ప్రాభవాన్ని ఇనుమడింప చేశాడు. తరువాత అనవేమారెడ్డి, కుమారగిరిరెడ్డి రెడ్డి రాజ్యాన్ని విసృత పరిచారు. కుతూరగిరిరెడ్డి కాలంలో కొండవీడు తన ప్రాభవాన్ని కోల్పోగా రాజనముహీం[దవర రాజ్యం కొంతకాలం మనగలిగింది. అలాగే ప్రోలయ వేమారెడ్డి తమ్ముడు ముల్తారెడ్డి నేతృత్వంలో వెలువడిన కందుకూరి రాజ్యం కూడా స్వతంత్ర రాజ్యంగానే దాదావు 70 ఏళ్ళు నిలబడింది.

రెడిరాజులు పారుష, వికచు, పరా[6చూలనాు జాపుటేకాళ వ్యవసాయాన్ని, వర్తక వ్యాపారాలను పెంపొందించారు. కవులను, కళాకారులను పోషించారు. మధ్యాం్యధయుగంలో తనముకంటూ ఏఓ స్థానాన్ని కల్పించుకొన్నారు.

రెర్సీ రాజుల చరిత గురించి గతంలో జరిగిన [1పయుత్నాల్లో రాజమండ్రిలోని ఆం(ధ్రేతిహాసక పరిశోధకమండలి, కాకినాడలోని ఆంధ సాహిత్య పరిషత్తు, అనవర్తిలోని మల్లిడి సత్తిరెద్ది ' రెడ్డి రాడి' త్రిక మల్లంపల్లి సోమశేఖరశర్మ రాసెన 'హిస్టలీ ఆఫ్‌ ది రెడ్డి కింగ్‌డమ్‌", వడ్డాది అప్పారావు సంపాదకత్వంలో వెలువడ్డ 'రెడ్డి సంచిక, దోమకొండ సంస్థానంవారు వెలయించిన ' రెడ్డికుల నిర్ణయ చందికా, తేరాల సత్యనారాయణశర్శ రాసిన 'రెడ్డి రాజ్య చరిత్రము', మద్దులపల్లి గురుబ్రహ్మ శర్మ రాసిన 'కొండవీటి సామాజ్యం'. ఇటీవల కొండాలక్షీకాంతరెడ్డి కృషితో ఐ. ఎన్‌.శాస్తి రాసిన 'రెడ్డిరాజ్య సర్వస్వం'. మేడపాటి శ్రీనివాసరెడ్డి సంపాదకత్వంలో బయటికొచ్చిన 'రెడ్డచరిత్ర, సంస్కృతి' వుస్తకాలు పీర్కొనదగినవి. కొంతకాలం క్రితం నిలిచిపోయిన మహేందర్‌రెడ్డి, పెంటారెడ్డి, చందదకాంతరెడ్డి నడిపించిన “రెడ్డి పత్రిక, వనపర్తి నుంచి నడుస్తున్న 'రెడ్డి పరివార్‌' పత్రికలను ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకోవాలి. అయితే ఇవన్నీ పరిశోధకులకు పనికొచ్చే (గంధాలేగాని, సొచూన్యులు తేలిగ్గా అర్ధంచేసుకొని రెడ్డిరాజుల చరిత శెలుసుకోవటానికి సులభ, వ్యావహారిక భాషలో చిన్న పుస్తకమైనా లేదనే కోరిక

చాలా మంది వ్యక్తం చేశారు.

శ్రీ యండపల్లి శ్రీనివాస్‌రెడ్డి ! 996 - 97లో నడిపించిన ''రెడ్డినాడు”' పత్రిక ప్రోత్సాహంతో నేను ధారావాహికంగా రాసిన వ్యాసాలను కడప జిల్లా రెడ్డి సీవా సమితి ఒక పుస్తక రూపంలో తేవటానికి నన్నడగగానే సంతోషంగా ఒప్పుకొన్నాను. ముఖ్యంగా ప్రొఫెసర్‌ జి.శివారెడ్డి, డాక్టర్‌ పి. మునిరత్నంరెడ్డి, ప్రొఫెసర్‌ పె.నరసింహారెడ్డి, డాక్టర్‌ పీట శ్రీనివాసులురెడ్డి (పేటశ్రీ), డాక్టర్‌ ఎన్‌.కృష్ణారెడ్డి, డాక్టర్‌ జి. జయచందారెడ్డి, '“రెడ్డినాడు'' శ్రీ యండపల్లి శ్రీనివాసరెడ్డికి, రెడ్డిసీవా సమితి వారిని నాకు పరిచయం చేసిన శ్రీ పె. వెంగళరెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుళొంటున్నాను. టూకీగా చరిత్రను అందించాలన్న ఈ [ప్రయత్నంలో ఏవేవి లోటుపాట్లుంటే మలి ముద్రణలో సవరించుకొని ఇంకా రెడ్డి రాజుల కాలపు సాంఘిక, అర్థిక, సాహిత్య, కళా రంగాల గురించిన సమాచారాన్ని కూడా పొందుపరుస్తానని తెలియ జేస్తున్నాను.

ఈ పుస్తకాన్ని ముదించటంలో ఎన్నో విధాలుగా సహకరించిన నా

శ్రీమతి రాజ్యలక్షికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్‌ దాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి 28-10-2001

రెడ్ల చరిత - పూర్వరంగం ఆంధ్రదేశ చరిత్రలో క్రీ.*. 7వ శతాబ్ది నుంచే రెడ్లు శాసనాల్లో తమ ఉనికిని 'ప్రకటించుకొన్నారు. రెడ్ల పుట్టు పూర్వోత్తరాల గురించి ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల నేవధ్యంలో మాన్యఖేటాన్ని (నేటి మహారాశ్చ్రలోని మాళల్టేడ్‌) రాజధానిగ చేసుకొని పాలించిన రాష్ట్ర కూటులు మహారాన్చ్రలో మహారథులుగా పిలువబడిన వారే. అక్కడి నుండి వాయువ్య ప్రాంతానికెళ్ళి రాజస్ట్రాన్‌లో స్టిరపడిన ఒక జాతి “రాథోఢ్లు' గా పేరుపొందారు. మాళల్టేడ్‌ నుండి దక్షిణంగా వలస వచ్చి తెలుగుదేశంలో ప్రరపడిన వారు రాన్చ్ర కూట ప్రముఖులుగా పిలువబడి తరువాత ' రట్టాడ్డు “రెడ్లు గా మారారు. అయితే రాథోడ్లు పొడవాటి శరీరంతో ఉండటానికి కారణం వారు సహజంగా పొడగరులైన ఉత్తర భారతీయులతో వివాహ సంబంధ బాంధవ్యా లుండటంచేత, వర్త, దేహ ధారుఢ్యంలో జన్యుపరమైన మార్పులు గోచరించటమే, ఇక దక్షిణ భారతదేశానికి వచ్చిన రాష్ట్ర కూటులు అంత పొడవూ, పొట్టి కాని శరీరాకృతి కలిగిన వారితో గల సంబంధంతో స్టానికులతో కలిసిన మాట వాస్తవం. రట్టడికం అంటే గ్రామసీమల్లో పాలనా బాధ్యతలను పన్ను వసూళ్ళు, రభుత్వానికి చెల్లింపులు, న్యాయపరమైన నిర్ణయాలు తీసుకో వడం మొదలైన పనులను నిర్వహించే ఒక కార్యాలయంగా పేర్కొనవచ్చు. ఈ ““రట్టడికం'” వంశపరంపరగా లభించే హక్కుగానూ, పదవిగానూ ఉండేది. రట్టడికాన్ని నిర్వహించే పెద్దను రట్టోడి లేక రెడ్డి అనేవాళ్ళు. గ్రామ రక్షణతోపాటు వ్యవసాయాభివృద్ద్రి కూడా ముఖ్యమైనవి కాబట్టి రెడ్డిని కాపుగా పిలిచేవాళ్ళు. రెడ్డి రాజులు కొండవీడులో సుప్టేర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పూర్వమే రెడ్లు వివిధ అధికార హోదాలు పొందినట్లు ప్రాచీనాంధ్ర దేశ శాసనాలు బుజువు చేస్తున్నాయి. క్రీ.ళ. 10వ శతాబ్దంలో తూర్పు చాళుక్య ప్రభువు ఆమ్మరాజు, తనకు ేవలందించినందుకు మాడియ రట్టోడికి, మహాసామంత బిరుదుతోపాటు ఆత్తిలి సమీపంలోని “పొందువి అనే (గ్రామాన్ని ఇచ్చి సత్కరించాడు. (గ్రామపాలనా స్టాయి నుండిరెడ్గు సామంత ప్టాయికి క్రీ.శ. 10వ శతాబ్రికే ఎదిగినట్లు పై వివరం తెలుపుతుంది. రాష్ట్ర కూటుల పాలన తరువాత అంటే క్రీ.శ. 973 నుండి, నేటి తెలంగాణా, రాయల సీమ ప్రాంతాలను పాలించిన కళ్యాణీ చాళుక్యుల పాలనలో కూడా రెడ్డు

2

రట్టడికాల్ని నిర్వహించారు. క్రీ.శ. 11వ శతాద్దికి 'రెడ్డి' అనే పదం కులాన్వయిగా వాడుకలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల తరువాత ఆంధ్రదేశాన్ని ఏకచ్చత్రాధిపత్యం క్రిందకి తెచ్చిన కాకతీయులకు రెడ్డి వీరులు సహకరించిన ఆధారాలున్నాయి.

కాకతీయ మొదటి ప్రోలరాజు దగ్గర రేచర్ల బమ్మిరెడ్డి అనే బమ్మసేనాని సేనాధిపతిగా ఉండి, అనేక యుద్దాలలో పాల్గొని రాజుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. రెండవ ప్రోలరాజు సైన్యాధ్యగుడైన రెడ్డి కులస్తుడు కామచమూవతి. అతనికి మంధని యుద్దంలో సహకరించి గుండ్యనను సంహరించాడు. కా మచమూపతికి రేచెర్ల బేతిరెడ్డి, నామిరెడ్డి అనే ఇద్దరు కొడుకులున్నారు. వాళ్ళిద్దరూ కాకతీయ రుద్రుడు, గణపతి దేవుల వద్ద సేనా నాయకులుగా పనిచేశారు. రేచర్ల వంశానికే చెందిన రుద్రుడనే రుద్రరెడ్డి గణపతి దేవుని దగ్గర సర్వ సైన్యాధ్యక్షుడుగా పని చేశాడు. ఇతని తరువాతి తరమువారు సూర్యాపేట సమీపంలోని పిల్లల వు(ర్రిని రాజధానిగా చేసుకుని పాలించారు. ఇదే కాలంలో నెల్లూరి సీమను పాలిస్తున్న తెలుగు చోడరాజైన తిక్కన సైన్యంలోనున్న రెడ్డి ధీరులు, కర్నాట రాజునోడించడంలో ప్రధాన పొత్ర పోషించారు. కాకతి రుద్రమదేవికి గోన గన్నారెడ్డి, గోన విఠలరెడ్డి, ప్రతాపరుద్రునికి గొంకారెడ్డి సామంతులుగా ఉంటూ ప్రభువులకు విధేయ సహాయకులుగా ఉన్నారు.

కాకతీయ ప్రతాప రుద్రుని పాలనలో పాలనా సౌలభ్యం కోసం ప్రత్యేకంగా నియమింపబడిన బాహత్తర (72) నియోగాధిపతుల్లో బ్రాహ్మణులు, కాపులు, వెలమలు, కాయస్టులతోపాటు రెడ్డు కూడా ఉన్నారు. “వెలుగోటి వారి వంశావళాలో ప్రతాపరుద్రుని 72 నియోగాధిపతుల్లో కొలిపొక నాగిరెడ్డి, తాడిపర్తి గన్నారెడ్డి, చందమల్లారెడ్డి, బాచి బూచారెడ్డి, బాచి పెంచలి మల్లారెడ్డి, గడ్డి మన్నారెడ్డి, గోన కో బారెడ్డి మొదలైన వారున్నట్లు పేర్కొనబడింది. వీరితోపాటు ప్రతాపరుద్రునికి అంతే వాసులుగా ప్రోలయ రెడ్డి, ముసునూరి ప్రోలయ నాయకులు కూడా ముఖ్యులు. ప్రతాపరుద్రుడు దక్షిణ దేశ దండయాత్రకు వెళ్ళినపుడు పాండ్యులను జయించి కంచిని స్వాధీన పరచుకోటానికి ప్రోలయరెడ్డి ప్రముఖ పాత్ర వహించాడు. బాహత్తర నియోగాధిపతుల్లో నున్న “దేళట్ల పురవరాధీశ్వరుడు”, బహుశా ఈ ప్రోలయ రెడ్డి అయి ఉంబాడు.

(శ్రీ.శ. 1323లో ఢిల్లీ సుల్తాన్‌ ఘయాజాద్దీన్‌ తృుగ్గక్‌ సేనలు వరంగల్‌ కోటను ఆక్రమించి, ప్రతాప రుద్రచక్రవర్తిని బంధించి ఢిల్లీకి తీసుకెళుతుండగా, ఆయన నర్మదా

3 నదీ తీరంలో చనిపోవడంతో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. వరంగల్‌ ముస్లింల వరమై *“సుల్తాన్‌పురం?? గా మారింది.

(క్రీ.శ. 1323 నుండి క్రీ.శ. 1336 వరకూ వరంగల్‌ పై ముఫ్టింల ఆధిపత్యం కొనసాగింది. అప్పటిదాకా వైదిక మతంతో వునీతమైన ఆంధ్రావని, మేచ్చుల అధర్మ పాలనలో విలవిల లాడిందని 'విలసతామ్ర శాసనాలు' పేర్కొంటున్నాయి. ఢిల్లీ సుల్తానుకు, ప్రతాప రుద్రునికి జరిగిన యుద్దంలో కొందరు సేనానులు చనిపోగా మరికొందరు బందీలైనారు. ఎలాగో తప్పించుకొని బయట పడిన కొలనిరుద్రుడు, రేచర్ల సింగమనాయకుడు, అన్నయ మంత్రి, ముసునూరి ప్రోలయ నాయకుడు ఇంకా ప్రోలయ వేమారెడ్డి ఒక చోట సమావేశమై మ్రేచ్చుల బారి నుండి ఆంధ్రభూమిని రక్షించి, ధర్మాన్ని పునరుద్ద రించడానికి ప్రతిజ్ఞ చేశారు. స్వదేశం పరులచేతిలో బంధీగా ఉండటాన్ని సహించలేక మేచ్చులపై యుద్దం ప్రకటించబానికి, ప్రోలయ నాయకుని సారధ్యంలో ఒక ఉద్యమం రూపుదాల్చింది. ప్రోలయ వేముని ' మల్లవరం శాసనం, కొలని రుద్రుని 'సంతమాగులూరు శాసనం, ప్రోలయ నాయకుని *“విలాస తామ్ర శాసనాలు' ఆం(ధ్రావనికీ ఈ వీరులు స్వాతంత్ర్యం అందించిన వివరాలను తెలుపుతున్నాయి. ఈ యుద్దాన్ని చారిత్రకులు మొదటి ఆంధ్ర స్వాతంత్ర్య యుద్ధంగా అభివర్ణించారు.

ఢిల్లీ పాలకుల నుండి అం(ధ్రదేశానికి విముక్తి కలిగించటానికి పూనుకొన్న ఆంధ్రవీరులు ముసునూరి ప్రోలయ నాయకుడు, ప్రోలయ వేమారెడ్డి గురించి, తరువాతి కాలంలో “రెడ్డిరాణి అనితల్లి కలువచేరు శాసనం' వివరిస్తుంది. మ్లేచ్చులతో జరిగిన యుద్దంలో పాక్షిక విజయం సాధించిన ప్రోలయ నాయకుడు, గోదావరీ ప్రాంతాన్ని స్వాధీన పరచుకొని భద్రాచలం సమీపంలోని రేకపల్లిని రాజధానిగా చేసుకుని, ముసునూరి రాజ్యాన్ని స్థాపించాడు. తరువాత ఆతని తమ్ముడు కాపయనాయకుడు పొరుగువారి సాయంతో ఓరుగల్లు కోటను ముట్టడించి, క్రీ.శ. 1336లో స్వాధీన పరచుకొన్నాడు. ప్రోలయ నాయకునికి చేదోడుగానున్న ప్రోలయ వేమారెడ్డి క్రీ.శ. 1323లోనే గోదావరి - పెన్న నదుల మధ్యగల తీరాంధ్రదేశాన్ని వళవరచుకొని 'రెడ్డిరాజ్యాన్ని" స్థాపించి ' అద్దంకి” ముఖ్యపట్టణంగా పాలించాడు.

రెడ్డి రాజుల ప్రారంభ దశ అద్దంకి రాజధానిగా ప్రోలయ వేమూరెడ్డి పాలన (క్రీశ1326 - 1363) కాకతీయుల పతనానంతరం, ఆంధ్రదేశంలో వెలసిన స్వతంత్ర రాజ్యాల్లో కొండవీటిరెడ్డి రాజ్యం ముఖ్యమైంది. ్రీ.శ.1325లో అద్దంకి నుండి ప్రారంభమై, తరువాత కొండవీడు, కోరుకొండ, పిఠాపురం, కందుకూరు, చందోలు శాఖలుగా దాదాపు 100 సంవత్సరాలపాటు ఆంధ్రతీర ప్రాంతాన్ని అప్రతిహతంగా పాలించి, పాహీతీ, కళా రంగాలకు సేవవేయడమేకాక సాంఘిక, ఆర్థిక రంగాలలో కూడా ముందంజ వేసింది. రెడ్డిరాజుల వంశకర్త అయిన వేమునికి ప్రోలుడు జన్మించాడనీ, ఆ బ్రోలునికి మాచారెడ్డి, దొడ్డరెడ్డి, వేమారెడ్డి, మల్లారెడ్డి అనే నలుగురు కొడుకులనీ, వీరిలోని వేమారెడ్డే కాకతీయుల పాలనలో నాయకునిగా నాయంకరాన్నేలాడని సాహిత్యం, శాసనాలు వివరిస్తున్నాయి. అద్దంకిని రాజధానిగా పాలించడంచేత అద్దంకీ వేమారెడ్డిగానూ, ప్రోలయ కుమారుడు గాబట్టి ప్రోలయ వేమారెడ్డిగానూ పిలువబడి, కొండవీటి సాధ్రూజ్యం మూల పురుషునిగా కూడా కీర్తింపబడ్డాడు. ఇతడు క్రీ.శ. 1325 నుండి 1353 వరకూ పాలించి, తనకు సంతానం లేకపోతే తమ్ముని కొడుకులను దత్తత తీసుకుంటాడు. ఆ దత్తపుత్రుడు అనపోతారెడ్డి రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చి క్రీ.శ. 1354 నుండి 1364 వరకూ, అతని తరువాత అనవేమారెడ్డి (్రీ.ళ. 1364 నుండి 1386వరకూ, అతని తరువాత కుమారగిరిరెడ్డి క్రీ.శ. 1396 చుండి 1402 వరకూ, పెదకోమటి వేమారెడ్డి క్రీ.శ. 1402 నుండి 1420 వరకూ, అటు తరువాత రాచవేముడు క్రీ.శ. 1420 నుండి 1424 వరకూ పాలించారు. రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి చరిత్ర, పాలనా పరమైన వివరాలను వలివేరు, నకరికల్లు, సంతమాగులూరు, ముట్టూరు, గణపేశ్వరం, ద్రాక్షారామం, పువ్వాడ, మల్లవరం, ఆతుకూరు, దృజ్ఞవరం, మంచాళ, కల్వపాముల, వేమవరం, "పెరవలి ఇంకా ఆమరావతి శాసనాలూ, ఎళ్టా(ప్రెగడ రచించిన హరివంశం, నృసింహ పురాణం, వామనభట్ట భాణుని వేమభూపాల చరితం, శ్రీనాధుని హరవిలాసం మొదలైన (గ్రంథాలూ అందిస్తున్నాయి. ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్య స్థాపన చేసిన వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. క్రీ.శ. 1324లో ముసునూరి ప్రోలయ నాయకునికి సహాయంగా ఉన్న

క్‌ ప్రోలయ వేమారెడ్డి అతని వలెనే తాను కూడా తన నాయకత్వాన్ని స్వతంత్రంగా పాలించాలను కొంచాడు. తన నాయంకరమైన పూగినాడు, పాకనాడు, వెలనాడు ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను కలుసుకొని, తన నిర్ణయాన్ని తెలియజేస్తాడు. ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన ్రజలవడంచేత, ఒక రైతు రాజవుతుంటే తమకు కావల్సిందేముందని కాపులంతా సహకరిస్తారు. వ్యవసాయంపై అవగాహన, సాగునీటి వనరుల వినియోగం, చెల్లిస్తున్న పన్నులు, పండుతున్న వంటలు మొదలైన విషయాలు బాగా తేలిసిన ఒక రైతు తనుకు పాలకుడొతుంటే వారి హృదయాల్లో ఆనందం వెల్లివిరిసింది. (ప్రతి పల్లె పులకించింది. హాలీకులంతా ఏలీకలైనట్లు ప్రోలయ వేమునికి హార్దిక స్వాగతం పలికారు. ప్రోలయ వేమారెడ్డి స్వతంత్రరాజ్యూన్ని స్టాపించడంలో సలహాలనిచ్చి, ప్రోత్సహించిన రాజుగురువు ఘోడెరాయగంగ దేవుడు. ఇతడు త్రిపురాంతకదేవుని భక్తుడు. వైదిక ధర్మాన్ని కాలరాస్తున్న ముస్లింను తరిమికొట్టి, ముష్కురమూకల నుండి ఆంధ్రావనిని కాపాడిన వీరులలో ఒకడైన ప్రోలయ వేమారెడ్డి ధర్మనిరతి, ఈ రొజుగురువును ఆకట్టుకొంది. ఆతుకూరు, దృజ్హవరం శాసనాలూ, ఎర్రన హరివంశం, బొలయ వేముడు ఈ ఘాడ రాయగంగుని శిష్యుడని, భక్తుడని తలియజిస్తున్నాయి. పాలవాపరమైన వ్యవహారాల్లో తన అన్న మౌచారెడ్డి, తమ్ముడు మల్హారెడ్డి , పంటనాటిని పాలిస్తున్న తాత దొడ్డారెడ్డి, మేనమామ నాగసేనాపతి, ఘోడెరాయ గంగునితోపాటు ప్రోలయ వేమునికి సహాయ సహకారాల నందించారు. తన బంధువులను ఉన్నత పదవుల్లో నియమించి, వారి పూర్తి సహకారాన్ని తిసుకొని పాలించాడు. మల్గారెడ్డిని పర్వపైన్యాధ్యక్షునిగా నియమించి యుద్దతంత్రం, కొండలపైనున్న కోటలపాలన అప్పగించాడు. ప్టాపించిన రాజ్యాన్ని రక్షించడం రాజు ముఖ్య కర్తవ్యాల్గొ ఒకటి. కోటలను

కట్టుకొని చతురంగ బలగాన్ని సమకూర్చుకొవాలి. ఇందుకు పెద్ద మొత్తంలొ ఆర్థిక వనరులుండాలి. తన తండ్రీ తరంనుండి వస్తున్న నాయంకరం, తల్లి తరపున పంటనాటి నుండి వచ్చిన అర్థిక సాయంతోపాటు అద్దంకి సీమలోని పెద్ద రైతులు కూడా స్వచ్చందంగా ముందుకొచ్చి తమ శక్తి కొద్ద పాయంచేసి ప్రోలయ వేముని రాజ్యస్థాపన, నిర్వహణకు పూనుకొన్నారు. అంతేకాక తీరాంధ్రదేశంలో చీరాల సమీపంలో నున్న

6 మోటుపల్లిని రేవు పట్టణంగా తమవ్యాపారాన్ని సము ద్రంమీద, ఇటు భూమిమీద వృద్ధి చేసుకున్న సెట్టి ప్రముఖులు కూడా ప్రోలయ వేమునికి దోహదం చేశారు. కంచీపురానికి చెందిన అవచి పావాణిశెట్టి కొడుకు అవచి దేవయశెట్టి. ఇతడు రామనాధయో గీశ్వరుని ఉపదేశం మేరకు వీరమహేశ్వర వ్రత నిష్టతో ఉండేవాడు. శ్రైవభక్తుడైన ప్రోలయ వేమారెడ్డి రాజ్య స్థాపన సమయంలో అవసరమైన ధనాన్ని ప్రోగు చేయడంలో తనవంతు పాత్ర పోషించి ఆతనికి ఆతి సన్నిహితుడైన ప్రముఖ వ్యాపార వేత్తగా ఉన్నాడు దేవయశెట్టి. మోటుపల్లి రేవు నుండి విదేశాలతో ఖరీదైన వస్తువుల ఎగుమతి, దిగుమతుల ద్వారా ధనాన్ని సంపాదించి సుంకం రూపంలో ప్రోలయ వేముని రాజు భాండాగారానికి జమ చేశాడు. ప్రోలయ వేముడు స్వతంత్రుడై అద్దంకిని రాజధానిగా జేసుకొని మొదట్లో గుండ్లకమ్మ నదికి రెండువైపుల గల ఫ్టలాన్నీ, తూర్సున బంగాళాఖాతం, పశ్చిమాన శిశ్రైలం, ఉత్తరాన కృష్ణానది వరకూ రాజ్యాన్ని పాలించాడు. తరువాత అతని తమ్ముడు మల్లారెడ్డి తోడ్పాటుతో దక్షిణాన పెన్నానది వరకూ, ఉత్తరాన గోదావరి తీరం వరకూ విస్తరించాడు. శ్రీనాధుడు భీమేశ్వర పురాణంలో రెడ్డిరాజుల గురించి (ప్రస్తావిస్తూ పన్నానటి తీరం వార స్థావరమని, సీంహవి[క్రమ నగరం (నల్లూర్సు), దువ్వూరు, గండవరం ముఖ్య పట్టణాలుగా ఉన్న పాకనాటిలొని కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని అద్దంకి రాజధానిగా పాలన సాగించారని పేర్కొన్నాడు. తూర్పు సముద్రం ప్రోలయ ఆధీనంలో లేకపోతే అక్టిక స్వావలంబన కుదరదని మల్లారెడ్డి తెలుసుకున్నాడు. ఈన భుజబల పరాక్రమంతో, తూర్పుతిరాన గల రేవు పట్టణాలను, ద్వీపాలను జయించి, ప్రోలయ వేముని తూర్పు సముద్రాదీశ్వరునిగా చేశాడు. మోటుపల్లి వశమైన తరువాత సుంకం ద్వారా లభించిన ఆదాయం ప్రోలయ వేముని రాజ్య సుస్టిరతకు తోడ్పడింది. ప్రోలయ వేముడు స్వతహాగా మంచి పాలకుడు. కాకతియుల వద్ద చేసిన నాయక విధులు ఆతన్ని పరిపాలనాదక్షునిగా తీర్చి దిద్దాయి. రాజనీతి, యుద్దనీతి, అన్హ శస్త్ర) ప్రయోగాలు తెలిసిన గొప్ప విలుకాడని వేమ భూపాల చరితం తెలియ జేస్తుంది. 84 కొటలను నిర్మించినట్లు మంచాళ శాసనం పేర్కొంటుంది. కొండవిటి కొండపైన శతృదుర్భేద్యమైన కోటను నిర్మించాడు. బెల్లంకొండ, వినుకొండ,

7

ధరణికొట, చందవోలులను వశపరచుకొని, అక్కడ కొంత సైన్యాన్ని ఉంచి శాంతి భద్రతలను కాపాడి ప్రజా రంజుకుడై పాలించాడు.

రాజగురువు ఘోడెరాయగంగుని సలహాలను స్వీకరిస్తూ తన శక్తి యుక్తులతో రాజనీతిని కాపాడుతూ పాలించాడు. విజయనగర మొదట హరిహర రాయలు ప్రోలయ వేమునికి సమకాలికుడు. సెన్నకు దక్షిణ భాగం విజయనగర ప్రభువుల ఆధీనంలో ఉన్నా, వారితో సఖ్యతగానే ఉన్నాడు. ముస్లింల దండయాత్రలను త్రిప్పికొట్టడంలో రెండు రాజ్యాలూ ఏకమలయ్యేవి. అలానే తన రాజ్యానికి పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో నున్న వెలమ, ముసునూరు రాజులు, తూర్పు గాంగులతోనూ స్నేహంగానే ఉన్నాడు. క్రీ.శ. 1352 ప్రాంతంలో అల్లావుద్దీన్‌ బహమనీ అంధ్రదేశంపైకి దండెత్తి రాగా, తరిమికొట్టి తన అన్నరాజ్యాన్ని కాపాడిన ధీరుడు మల్హారెడ్డి. తరువాత కొద్ది కాలానికే చనిపోయిన మల్గారెడ్డికి అకయ పుణ్యంగా ప్రోలయ వేముడు అమరావతి అలయాన్ని వునరుద్దరించి, శిఖరంపైన పసిడి కలళాలను, పసిడి పట్టును చేయించి బుణాన్ని తీర్చుకున్నాడు. ప్రోలయ వేముని దండయాత్రలలో మేనమామ నాగసేనాని కూడా పాల్గొనేవాడు. అతడందించిన సహాయానికి గుర్తుగా అతని మరణానంతరం నేటి గుంటూరు జిల్లాలోని 'ముట్లూరూ (గ్రామానికి *నాగపురమి ని పేరు పెట్లి అగ్రహారంగా ధ్రకటించి, జొన్నలగడ్డ మృత్యుంజయార్యునికి ఏక భోగంగా దానం చేశాడు.

మధ్యాంధ్రయుగంలో రాజులు కవులను పోషించి కావ్యాలను రచియింప జేసి కృతి భర్తలయేవారు. అలాగే, తమ్ముడు మల్లారెడ్డి ద్వారా ఎల్జిన కవితా కౌశలాన్ని విన్న ప్రోలయ వేమారెడ్డి, ఎఆ్రా(ప్రెగడను తన ఆస్టానంలో నియమించుకున్నాడు. శంభుదాసుడని పిలువబడిన ఎజ్జన రామాయణం, హరివంశం, అహోబిల క్షేత్ర మాహాత్మ్యం అనే (గ్రంథాలను రచించి హరివంశాన్సి వేమునికంకితమిచ్సాడు. తక్కి,న రెండు గ్రంథాలూ లభించక పోయినా, హరివంశం ఎల్లిన పాండిత్యాన్ని, సమకాలీన చరిత్రనూ కళ్ళకు కట్టినట్లు వెల్లడిస్తుంది. తాను శైవమతాన్ని ఆవలంభించినా వైష్ణవ పాంప్రదాయాన్ని కూడా సమాదరించిన ఉదారుడు ప్రోలయ వేముడు. ఆయన సాహిత్యంతోపాటు సంగీతాన్ని కూడా పోషించాడు. అతని ఆస్థానంలో లొల్లమవాదేవుడనే సంగిత, వాగ్గీయకారుడుండేవాడని, అతడు భరతుని నాట్య శాస్రా నికి వ్యాఖ్యానం రాసిన లొల్లట భట్టుకు శిష్యుడనీ, ఎల్జున హరివంశంలో పెర్కొన్నాడు.

ఠి

ప్రోలయ వేముడు ప్రజాసంక్షేమ కార్యక్రమాల నెన్నింటినో చేపట్టి అమలు జరిపాడు. రాజ్యంలో చెజువులు త్రవ్వించి, తోటలు పెంచి, వాణిజ్య పంటలను, ప్రోత్సహించి వ్యవసాయాన్ని వృద్ది చేసి, రైతులకు సహాయపడి ్రతి పల్లె స్వయం పోషకంగా ఉండేటట్లు పాలించాడు. దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకుల కోసం దారిలో భోజన, విశ్రాంతి మందిరాలను నిర్మించి, చలీపందిళ్ళు వేయించాడు. శ్రీశైలం దర్శించిన యాత్రికులు పాతాళగంగలో స్నానం చేసీ కొండనెక్కి మల్లికార్జునుని దర్శించడం, చాలా కష్టంగా ఉందని ప్రోలయ వేమునితో చెప్పగా, వెంటనే పాతాళగంగ నుండీ కొండమీదికి మెట్టు కట్టించి తరయాత్రలను ప్రోత్సహించాడు. అహోబిలానికి కూడా చక్కవి మెట్టు కట్టించి వైష్ణవులనూ సంతృప్లి పరచాడు. నిజానికి మత వైవిధ్యం గురువులు, రాజులకే కాని, ప్రజలకు లేదని తెలుసుకున్నాడు. సామాన్య ప్రజానీకం

  • శివకేశవ టేధం లేక అన్ని దేవాలయాలనూ భక్తి పూర్వకంగా దర్శిస్తారని మెట్టు కట్టించాడు.

విద్యార్థులు, ధ్యానం చేసుకొనేవారికి, బ్రాహ్మణులకు ఆగ్రహారాలనిచ్చి, యజ్ఞకర్తలుగా నిలిపాడు. బ్రాహ్మణుల హక్కు, భుక్తంలో నున్న భూముల్ని తురుష్కులు ప్వాధినం చేసుకోగా, వారి నెదిరించి, తరిమి కొట్లిన తరువాత అ భూముల్లి యధాతథంగా బ్రాహ్మణులకు అప్పజెప్పి, అగ్రహారాలను పునరుద్ద రించడంతోపాటూ ఎన్నో భూదానాలను చేసి 'అపరిమిత భూదాన పరళురామ' అనే బిరుదును పొందాడు.

సనాతన ధర్మ రక్షకునిగా బ్రాహ్మణులకు ఎన్నో దానాలను చేశాడు. క్రీ.శ. 1330వ సం.లో వలివేరు గ్రామాన్ని అగ్రహారం చేసి బ్రహ్మభట్లకు, క్రీ.శ. 1335లో చీమకుర్తి, భమేశ్వరం, పులికొండ, మైలవరం, కొమరి పులాల్లోని కొన్ని భూములను సర్వమాన్వాలుగా ప్రకటించి దానం చేశాడు. క్రీ.శ. 1344లో మంచాళ ఆగ్రహారాన్ని యలకూవి వల్లభశివ్నకు, అదే సంవత్సరంలో తన తల్లి అన్స్నమాంబపుణ్యం కొరకు పెరవలి గ్రామాన్ని 106 వృత్తులుగా విభజించి బ్రాహ్మణులకు సర్వాగ్రహారంగా, అష్టభోగ తేజ స్వామ్యంగా దానంచేశాడు. ఎల్జన నివసించిన చదలవాడను తన తమ్ముడు మల్లారెడ్డి పేర ' రెడ్డి మల్లవరి మని పేరుపెట్టి, దేవ భోగంగా ప్రకటించాడు. హేమాద్రి వ్రత, దాన ఖండాల్లో చెప్పిన దానాలనన్నిటినీ చేసి ధర్మవిరతునిగా పేరు తెచ్చుకున్నాడు ప్రోలయ వేమారెడ్డి

రి

ప్రోలయ వేముని ధైర్యసాహసాలు, దొననిరతి, గుణగణాలనుబట్టి వివిధ శాసనాలు, సమకాలీన సాహిత్యం అతని బిరుదులను తెలియజేస్తున్నాయి. వాటిలో, పల్లవాదిత్య, పల్లవ త్రినేత్ర, జగనొబ్బగండ, చెంచుమల చూరకార, వీరనారాయణ, మ్లేచ్చాబి కుంభ సంభవ, ఏకరాయ స్టాపనాచార్య, ఏక సింహాసనాలంకార, అపరిమిత భూదాన పరశురామ, శ్రీ పర్వతాహోబల, కేళాదిరాయ, సం[గ్రామధనుంజయ, 'బ్రహ్మకుండినీ సహ్యజా గౌతమీ జులక్రీడా వినోదుడు అనేవి ముఖ్యమైనవి. దొదాపు 26 సంవత్సరాలు నిరాటంకంగా, జనరంజకంగా పాలించి, కాపు జన కల్పతరువుగా ఏలిన ప్రోలయ వేమారెడ్డి తరువాత ఆతనికి దత్తపు త్రుడైన అన పోతారెడ్డి క్రీ.శ. 1354లో అద్దంకి సింహాసనాన్ని అధిష్టించి పాలన సాగించాడు.

కొండవీడుకు రాజధానిని మార్చిన అనపోతారెడ్డి (శ్రీశ 1353 - 1364)

ప్రోలయ వేముని తరువాత రెడ్డి రాజ్యూన్నేలిన ఆనపోతారెడ్డి చరిత్ర తెలుసుకోవడానికి ద్రాకారామం, ఈడ్పుగల్లు, మోటుపల్లి, నాగళ్ళ, ఆమరావతి, మాన్యమావురం, పచ్చల తొడిపర్రు, కొల్లూరు, అన్నవరం, రాజమండ్రి మ్యూజియం శాసనాలూ, ఉత్తర హరివంళం, విష్ణుపురాణం, వెలుగోటివారి వంశావళి, వేమభూపాలీయం, కొండవీటి దండకవిలె, మెకంజీ రాతప్రతులు ఎంతో ఉపకరిస్తాయి.

రెడ్డి రాజ్యూన్ని స్థాపించిన ప్రోలయ వేమారెడ్డికి సంతానం లేదు. తాను కలలుగన్న రాజ్యాన్ని సుష్టిరం చేసుకోవడంలో మునిగిన అతనికి తన తరువాత ఆం(దదేశాన్ని యవనుల నుంచీ, ఇంకా ఇరుగుపొరుగు రాొజులనుంచీ కాపాడుకోవటమెలా అన్న ప్రశ్న వేధించ సాగింది. తన తమ్ముని సంతానంలో ఒకర్ని దత్తత తీసుకోవడం ఉచితమనిపించింది. నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళున్న తమ్ముడు అన్నారెడ్డి మదిలో మెదిలాడు. పుత్ర సంతానంలోని మొదటి, చివరి వాళ్ళయిన ఆనపోత, అన వేమారెడ్లను, ఒక కుమార్తెను తనకు దత్తత ఇమ్మని అన్నారెడ్డిని కోరాడు. రెడ్డి రాజ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్నారెడ్డి అంగీకరించాడు. అనపోత, అనవేమారెడ్లను ప్రోలయ వేముడు దత్తత తీసుకున్నట్టు అన్న వరం శాసనం తెలియజేస్తుంది.

దత్త పుత్రులిద్దరికీ విద్యాబుద్దులతోపాటు సస్తాంగ పాలనా పద్దతులు, రాజనీతి, యుద్దతంత్రం, ఆర్థిక విధానాలు, ప్రజాసంక్షేమ చర్యల గురించి ఆయా రంగాల్లో అనుభవమున్న వాళ్లతో శిక్షణ ఇప్పించాడు ప్రోలయ వేమారెడ్డి. పెద్దవాడైన అనపోతారెడ్డి, చురుకుదనంతో అన్నింబా అగ్రగామిగా ఉంటూ “యువరాజు గా పట్టాభిషిక్తుడయ్యాడు. ఎర్రాప్రగడ రచించిన హరివంశం అవతారికలో యువరాజైన అనపోతారెడ్డి ప్రస్తావన ఉంది. పాలనా వ్యవహారాల్లో ప్రోలయ వేమునికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆకస్మేకంగా ఉత్పన్నమయ్యే సమస్యలను అవలీలగా పరిష్కరించే నేర్చును, ప్రజల కష్ట సుఖాలను వినే ఓర్పును అలవర్చుకొన్నాడు ఆనపోతారెడ్డి. వేముని కొలువులో సేనా నాయకునిగా వనిచేయటంవల్ల సైన్య సమీకరణ, ఆధునీకరణ, దుర్గ నిర్మాణ, నిర్వహణ ఇంకా రక్షణ వ్యూహాల్లో కూడా అనుభవం గడించాడు.

11

కార్యదక్షతతో రాజ్యాన్ని పాలిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రోలయ వేమునికి చివరి దశలో శ్వాసకోశ సంబంధమైన వ్యాధిసోకింది. బాధపడుతూనే రాజ్యపాలన చేస్తున్న ప్రోలయ వేముడు విశ్రాంతి తీసుకోవాలనుకొని యువరాజైన అనపోతారెడ్డి పై సంపూర్ణ విశ్వాసంతో పాలనా బాధ్యతలను అప్పగించాడు. క్రీ. శ. 1353లో సింహాసనాన్నధిష్టించిన అనపోతారెడ్డి అద్దంకి రాజధానిగా పాలిస్తూ, రెడ్డి రాజ్య వైభవానికి కృషీ చేశాడు.

పాడి పంటలతో తుల తూగుతూ, అర్థిక స్వావలంబనతో సుస్టిరంగొనున్న రెడ్డి రాజ్యాన్ని ఆక్రమించటానికి శతృరాజుల కవ్వింపులు అనపోతారెడ్డి పాలన ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మొదలయ్యాయి. ఉత్తరం నుండి కళింగ గాంగులు, వాయువ్యం నుండి రాచకొండ వెలమలు, బహమనీలు, దక్షిణం నుండి విజయనగర రాజులు ఒకరి తరువాత ఒకరు అద్దంకిపై యుద్దానికి సిద్దమయ్యారు. తండ్రి నుంచే కాక, ఏన తండ్రి మల్గారెడ్డి, మేనమామ నాగారెడ్డి నుండి యుద్ద విద్యల్లో తర్ఫీదు పొందిన అనపోతారెడ్డి ఆ యుద్ధాలను సవుర్దంగా తిప్పికొట్టాడు. విజయపరంపర కొనసాగినా ఒకటి రెండు ఓటములను కూడా చవిచూళాడు.

కళింగ గాంగులతో రెడ్డిరాజుల మొదటి యుద్ధం

ముసునూరి కాషయనాయకుని అధీనంలో ఉన్న రాజమహేంద్రవరాన్ని అతని ఆజ్ఞలకు లోబడి తొయ్యేటి అనపోతానేడు పాలిస్తుండే సమయంలో, దక్షిణ కళింగాన్ని దాటి రెడ్డిరాజ్య సరిహద్దుల వరకు దండెత్తాడు తూర్పు గాంగరాజైన మూడవ నరసింహదేవుడు. కృష్ణా తీరం వరకూ గల భూభాగం వశమైతే సముద్ర వ్యాపారాన్ని వృద్ది చేసుకోవడం ద్వారా ఆర్రికంగా మరింత బలపడవచ్చని, ఎక్కువ దిగుబడినిచ్చే పారవంతమైన భూములను ఆక్రమించడం ద్వారా దేశం సుభిక మౌతుందనుకొవి, తన సేనాపతులైన కాళిదాసు, గోవిందులను క్రీ.ఛ.1353లో దక్షిణ కళింగానికి హద్దెన గోదావరిని దాటి, కృష్ణానది వరకూ పంపుతాడు. వ్రస్తుతం కృష్ణాజిల్లాలోని (శ్రీకాకుళం వరకూ వచ్చిన సైన్యాలు రాజు, రాణీల కోరికపై (శ,కాకొలని దేవునికి పట్టు గొడుగులు, వెండి దీపాలు, బంగారు మామిడి పఏిందెలతో అలంకరింపబడిన వింజామరలు గుడిగంటలను సమర్పించినట్లు క్రీ.శ. 1353వ సం. పు నరసింహదేవుని శాసనం వల్ల తెలుస్తుంది. గాంగరాజు దుందుడుకు చర్యను గమనించిన అనపోతారెడ్డి, రెడ్డి రాజ్యానికి ముప్పు వాటిల్దుతుందని (గ్రహించి, శక్తి యుక్తులతో కళింగ గాంగులపై యుద్దాన్ని ప్రకటించాడు. అఆనపోతారెడ్డి యుద్ద చతురతకు, వ్యూహరచనకు పాలుపోని నరసింహదేవుని సేనలు వెనుదిరిగి కళింగం చేరుకున్నాయి. ఇదే కళింగ గాంగులకు, రెడ్డి రాజులకు జరిగిన మొదటి యుద్దం.

విజయపరంపరలో భాగంగా “ద్వీపాన్ని (దివిసీమ) జయించడం ద్వారా అనపోతారెడ్డి 'ద్వీపజేతు అన్నబిరుదును పొందాడు. కళింగ ప్రాంతపు శబరులను కూడా జయించినట్టు ఈడ్పుగల్లు, పచ్చల తాడీవర్రు శాసనాలు తెలియజేస్తున్నాయి.

వేంగిని పాలిస్తున్న చోడభక్తి రాజుకు, ఆనపోతారెడ్డికి కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలో సూరవరం దగ్గర జరిగిన యుద్ధంలో అనపోతారెడ్డి ఓడిపోయాడని, చోడభక్తిరాజు కొడుకు అన్నదేవుని రాజమండ్రి మ్యూజియం శాసనం వల్ల తెలుస్తున్నా, వేంగిరాజుకు అది తాత్కాలిక విజయం మాత్రమేనని పిస్తోంది. తరువాత అనపోతారెడ్డి చేపట్టిన జైభ్రయాత్రలో చోడభక్తిరాజు, ఉండిరాజా, నిరవద్యవురం మహదేవుడు, కోన మండలాధిపతులను జయించినట్లు తెలిపే చారిత్రకాధారాలు లభించాయి. ప్రతి సంవత్సరం అనపోతారెడ్డి శత్రు రాజుపై యుద్దానికి వెళ్ళేవాడనీ, అనవేమారెడ్డి కొల్లూరు

13

శాసనంలో ఉంది. అనపోతారెడ్డి దండెత్తి వస్తున్నాడని తెలుసుకున్న శత్రు రాజుల భార్యలు, ఇక తమ భర్తల ప్రాణాలు దక్కవని శోకించేవారని శాసనాల్లో ప్రస్తావించటాన్ని బట్టి ఆనపోతారెడ్డి విక్రమ, పరాక్రమాలను అంచనా వేయవచ్చు. అతడు క్రీ.శ. 1356 వసం,.లో ద్రాక్షారామంలో వేయించిన శాసనం వల్ల తూర్పు జైత్రయాత్ర కళింగ వరకూ జరిగిందని చెప్ప వీలవుతుంది. ఎన్నో యుద్దాల్లో పాల్గొని జయించి, శత్రురాజుల కోటలను వశపరచుకొన్నందువల్ల ఆతనిని 'వీరాన్నపోత* బిరుదు వరించింది.

యుద్దాల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్భకోవడానికీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయాన్ని విస్తరింపచేయడం ముఖ్యమని గమనించి సముద్ర తీర వ్యాపారాభివృద్ధికి మోటుపల్లి రేవును పూర్తిస్తాయికి వినియోగించుకోవడం, కొత్తగా బీడు భూముల్ని వ్యవసాయ యోగ్యంగా మార్చడం, సేద్యవు నీటి నిరంతర సరఫరాకు చెరువులను శత్రవ్వించడం లాంటి చర్యలను చేపట్టాడు అనపోతారెడ్డి.

మోటుపళ్లి రేవు అభివృద్ధి

ప్రోలయ వేముని తమ్ముడు మల్లారెడ్డి, చీరాల సమీవంలో సముద్రతిరానున్న మునుళపురమని పేరున్న మోటుపల్లి రేవును రెడ్డి రాజ్యాంతర్భాగంగా చేయడంతో నౌళలద్వారా విదేశాలతో వ్యాపారం చేయటానికి వీలు కల్గింది. స్థానికంగా అందుబాటులో లేని ఎన్నో వస్తువులు విరివిగా లభించాయి. ఇక్కడ తయారైన బట్టలు, పండిన ధాన్యం మోటుపల్లి ద్వారా ఎగుమతి అవుతుండేవి. దిగుముతిగా వచ్చే విలువైన వజ్రాలు, నగలపైన విధించిన సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం లభించేది. తన రాజధాని అద్దంకి సమీపంలో నున్న రేవును ఇంకా అభివృద్ది చేసే ఆదాయ వనరుల్ని పెంపాందించుకోవాలనుకొన్నాడు. మోటుపల్లి రేవును సందర్శించి, స్వదేశీ, విదేశీ వ్యాపారుల సాధక, బాధకాల్నీ విన్నాడు.

కొన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకం ఎక్కువగా ఉందని, ఓడలు వచ్చినప్పుడు రాజోద్యోగులు స్వేచ్చగా వ్యాపారాన్ని చేయనీయడం లేదని, వ్యాపారస్తులు అనపోతారెడ్డికి తెలియజేస్తారు. సముద్రంలో ప్రమాదానికి గురైనప్పుడు ఒడ్డుకు చేరిన ఓడలలోని సరుకుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలే గానీ మొత్తం సరుకులను ద్రభుత్వం స్వాధీనంచేసుకో కుండా, నామ మాత్ర సుంకం తీసుకొని మిగతా

శక

వాటిని వారి బంధువులకు అప్పగించే చర్యలు తీసుకోవాలని రాజుతో వారు చెప్పుకొంటారు. దాదాపు వంద సంవళ్సరాల క్రితం కాకతీయ గణపతి దేవుడు సముద్ర వ్యాపారుల సంక్షేమానికి సంబంధించి క్రీ.శ. 1244లో ఇచ్చిన అభయ శాసనాన్ని అనపోతారెడ్డికి గుర్తు చేస్తారు.

పన్నుల మదింపు, విధింపుల్లో ఉచితానుచితాలను పరిశీలించగల విశాల హృదయమున్న అనపోతారెడ్డి వ్యాపారుల బాధలు, రొజోద్యోగుల ప్రవర్తనలకు చలించి గణపతిదేవుని అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకొంటాడు. మంత్రులు, మిత్రులతో సంప్రదించి ఆదాయాన్నందించే వ్యాపారులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకొంటాడు. క్రీ.శ. 1358లో తాను కూడా ఒక అభయ శాసనాన్ని సంస్కృత, తెలుగు భాషల్లో విడుదల వేశాడు. దీన్నే మోటుపల్లి ధర్మశాసనం అని కూడా అంటారు. మోటుపల్లి వీర భద్రాలయంలో నున్న ఈ శాసనం ప్రకారం నౌకా వ్యాపారులకు లాభం కలిగే అనేక చర్యలు చేపట్టాడు. విదేశీ వ్యాపారులపై విధించి వసూలు చేస్తున్న *“అపుత్రికము ' కద్బాయము' అనే సుంకాలను పూర్తిగా తొలగించాడు. అలంకార ప్రియులైన ఆంధ్రదేశ స్త్రీల అవసరాలకు, ఇతర ప్రాంతాల్లో తయారైన బంగారు అభరణాలు, విలువైన వజ్ర, వైఢూర్యాల దిగుమతి విషయంలో సుంకాలను బాగా తగ్గించాడు. గంధం దిగుమతి చేసుకొన్నప్పుడు చెల్లించే పన్నులో 3౩3 శాతం తగ్గించి, తమిళనాడు మొదలైన ప్రాంతాల నుండి వచ్చే పట్టు బట్టలు, నూలు, ముత్యాల మీద వ్యాపారులకు అంగీకారయోగ్యమైన పన్నులను మాత్రమే వసూలు చేయాలని సుంకాధికారుల్ని ఆదేశించాడు.

సరుకుల ఎగుమతి దిగుమతి సమయాల్లో వ్యాపారులు బసచేయబానికి వసతి సౌకర్యాలను కల్పించాడు. స్వదేశీ విదేశీ వ్యాపారం సాగించడానికి సరలీకృత ఆర్టిక విధానాన్ని ప్రకటించాడు. సుంకాలను పూర్తిగా తొలగించడం, మరికొన్నింటిపై రాయితీల నివ్వడం, రేవులో వ్యాపారులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడం, రాజోద్యోగులు, సుంకాధికారులు వ్యాపారులను పీడించి వసూలు చేయటాన్ని నిరోధించడం లాంటి అనేక చర్యలు చేపట్టి ఆనపోతారెడ్డి మోటుపల్లి రేవు పట్టణాభివృద్ధికి, తద్వారా నౌకా వ్యాపార విస్తరణకు పూనుకొన్నాడు. 1970 దశకంలో మోటుపల్లి వద్ద రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాల్గ్లో మధ్యయుగానికి

15 చెందిన వైనా పింగాణీ పాత్రలు, నాణేలు, చోళుల వాణేలు, కంచు వి([గ్రవోాలు వెలుగుచూశాయి. మోటుపల్లి రేవును ఇరుగుపొరుగు ప్రాంతాల వారే కాక వైనా లాంటి సుదూర ప్రాంత వ్యాపారులు కూడా వినియోగించుకొ న్నారని రూఢి అయింది. ఇసుక దిబ్బల నుండి బయల్పడ్డ రెండు కట్టడాల్లో ఒకటి సుంకాలను వసూలు చేసే ' కస్టమ్స్‌ హౌొసిగానూ, మరోటి వ్యాపారులవసతి కొరకో లేక సరుకులను నిల్వ చేసే గిడ్డంగి గానో ఉపయోగవడి ఉంబాయని పురాతత్వ వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఆవచి కుటుంబం ఈ రేవు ద్వారా నిర్వహించిన నౌకా వ్యాపారం రెడ్డి రాజుల కాలంలోనే కాబట్టి, ఈ కట్టడాలు రెడ్డి రాజుల నాటివేననే మరో అభిప్రాయం కూడా ఉంది. బహమనీలతో యుద్గ్ధం

బహమనీ సుల్తాన్‌ మొదటి మహమ్మదుషా సింహాసనమెక్కిన సంవత్సరం (శ్రీ.శ.1360)లో అతడు కాాయనాయకుని పాలనలోనున్న వరంగల్‌ పైకి దండెత్తాడు. వరంగల్‌ను వశపరచుకొని తూర్పుగా గుంటూరు సమీపంలో కృష్ణా తీరానున్న ధరణికోట వరకూ వెళ్ళి అక్కడి అమరేశ్వరాలయానికి నష్టం కలిగిస్తాడు. బహమనీ సైన్యాన్ని అనపోతారెడ్డి మంత్రి కేతయ మల్ల వేను సేనాధిపతి ఎదిరించి తడిమికొట్టడమే గాక రెడ్డి రాజ్యాన్ని రక్షించాడు. అనపోలారెడ్డి తనపట్ల చూపుతున్న అభిమానానికి మల్లయ మంత్రి, ఈ యుద్దంలో విజయానికి కృషీ చేశాడు. అనపోతారెడ్డీ ఆయురారోగ్య, ఐశ్వర్య, వంళా భివృద్దికి (శ్రీధాన్య వాటీ పురం ( అమరావతి) లోని అమరేశ్వరాలయానికి జిర్థొద్దరణ చేస, ఆమరేశ్వరుణ్ణి పునః ప్రతిష్టచేసినట్లు మలయ వెముని శ్రీ.శ.1361వ సం. పు అమరావతి శాసనం తెలియజేస్తుంది.

రేచెర్ల వెలమలతో యుద్ధం

ముసునూరి కాషయనాయకుడు వరంగల్‌ను స్వాధీనం చేసుకొన్నపుడు జరిగిన యుద్దంలో ఆతనికి సాయంచేసిన రేచెర్ల వెలమలు తరువాత స్వతంత్రులై ఆమనగల్లును రాజధానిగా చేసుకొని కొంత భూభాగాన్ని పాలించారు. ఆ వంళానికీ చెందిన సింగమనేడు తన రాజ్య విస్తరణలో భాగంగా జల్లిపల్లి కోటను ముట్టడిస్తాడు. కొందరు రాజుల మూకుమ్మడి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోతాడు. సింగమనేని కొడుకులైన అనపోత, మాదొానాయకులు (క్రీ.శ. 1361-1384) తమ తండ్రి

16 మరణావికి కారణ భూతులైన శత్రు రాజులను హతమార్చడానికి పూనుకొంటారు. సింగమనేడు మరణానికి రెడ్డిరాజులు కూడా కారణమని అపోహపడిన వారు, అనపోలారెడ్డి పాలిస్తున్న రెడ్డీ రాజ్యంపై దండెత్తి పోయి ధరణికోట దగ్గర తీవ్రమైన యుద్ధం చేస్తారు. అయితే జయాపజయాలెలా ఉన్నా, వెలుగోటివారి వంశావళి అవపోతారెడ్డి ఓడిపోయాడవి తెలుపుతోంది. రెడ్డి రాజ్యములోని (శ్రీశైల ప్రాంతాన్ని అక్రమించుకొని వూదా నాయకుడు (ప్రతీకారం తీరిందన్న సంతృప్తితో వెనుదిరిగిపోతాడు. శాసవాధారాలు లేని ఈ యుద్దం పై చారిత్రకులు సరైన నిర్ణయానికి రాలేక పోయారు. ఈ ధరణి కోట యుద్దమే రెడ్డి రాజులకూ, రేచెర్ల వెలమలకూ జరిగిన మొదటి యుద్దం. విజయ నగరరాజు కవ్వింపు : రాజధావి కొండవీడుకు మార్పు

అనవేమూరెడ్డి కొల్లూరు శాసనంలో చెప్పినట్లు అనపోతారెడ్డికి ప్రతి సంవత్సరమూ యుద్దాలతోనే సరిపోయింది. బహమనీలు, వెలమలతో పోరాడి రాజ్యాన్ని రక్షించుకొంటున్న సమయంలో విజయనగరాధీళుడైన మొదటి బుక్కరాయలు, రెడ్డి రొజ్యపు దక్షిణ, పశ్చిమ భాగాలను వళపరచుకొన్నాడు. జ్రీ.శ. 1364లొ బుక్కరాయలు తూర్చుదండయాత్రలొ రెడ్డిరాజ్యంలొోవి కొంత భూభాగాన్ని ఆక్రమించినట్లు తెలుస్తుంది. విజయనగర రాజుల నల్ల రానున్న ముప్పును (గ్రహించిన అనపోతారెడ్డి రాజ్యరక్షణ వ్యూవాళ్లో విమగ్నుడౌతాడు. ముందు రాజధాని అద్దంకి నగరంపై దృష్టిని పారిస్తాడు. కేవలం సల దుర్గమైన అద్దంకి చిన్న నగరమేకాని, వలు దిక్కులనుండీ వచ్చే శత్రువుల దాడిని తట్టుకోగల దుర్గము కాదని గ్రహించాడు. సమతల బ్రదేశంలో ఉండడం చేత శత్రువులు సులువుగా దాడిచేసే వీలుంది. రాజ్యాన్ని రక్షించుకోవాలంటే బలమైన కోటగోడలతో మున్న రాజధాని ఉండాలనుకొన్నాడు. కుండిన నగరంగా పిలువబడిన కొండవీడును, వినుకొండ, బెల్లంకొండ, కొండపల్లి కోటరికంటే బలమైనదిగా నిర్మించాడు ప్రోలయ వేమారెడ్డి. శాఖా నగరంగా కూడా అయిన కొండవీడులో ఒక పట్టణాన్ని నిర్మించి, సకల సౌకర్యాలు కల్పించి తన రాజధావిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చాడు. శత్రు దుర్చేద్యమైన కోట గోడలను విర్మించి, యంత్రోపరికల్పితంగా చేపి కొండవీటినుండి అనపోతారెడ్డి పాలింఛాడని క్రీ.శ. 1364వ సంవత్సరపు మాన్యమాపుర శాసనం, కాటయవేముని

17

అన్నవరం శాసనం, శ్రీ,నాధుని శృంగార నైషధం తెలియ జేస్తున్నాయి.

అనపోతారెడ్డికి మల్లన, సోమయ, కేతయ మళల్లవేమన మంత్రులు రాజ్యాంగ, రాజకీయ, ఆర్టిక విషయాల్లో సలవాలనిచ్చి పరిపాలన సజావుగా సాగడానికి తోడ్పడ్డారు. అర్జిక, వాణిజ్య శాస్త్రాలపై అవగాహన ఉన్న సోమయ మంత్రి మోటుపల్లి రేవు అభివృద్దికి రాజుకు తగు సలహాలనిచ్చి, నౌకా వ్యాపారుల కొరకు సంస్కృత, తమిళ, తెలుగు భాషల్లో అభయ శాసనాన్ని వేయించాడు. చతురంగ బలనిర్వహణా దక్షుడైన కేతయ మల్ల మంత్రి ధరణికోటను రకీస్తుండేవాడు. బహమనీ సైన్యాన్ని తిప్పికొట్టడంలో కీలక పాత్ర వహించాడు. అనపోలారెడ్డికి కుడిభుఅంగా ఉంటూ రెడ్డి రాజ్య బౌన్నత్యానికి తనవంతు సహకారం అందించిన యుక్తి పరుడుగా కూడా పేరుగాంచాడు.

అనపోతారెడ్డి కూడా తన తండ్రీ ప్రోలయ వేముని వలెనే ప్రజారంజుకుడై పాలించాడు. జ్యోతిష ఆయుర్వేద విద్యలను ప్రోత్సహించి, అ(గ్రహారాలను పునరుద్దరించడమే కాక, బ్రాహ్మణులకు ఎన్నో దానాలు చేళాడు. తెనాలి సమీపంలోని కొల్లూరు, గుడివాడ సమీపంలోని ఈడుపుగల్లు, వినుకొండ సమీపంలోని నాగళ్ళ, పొన్నూరు సమీపంలోని పచ్చల తాడిపారు మొదలైన గ్రామాలను అ(గ్రహారాలుగా మాళ్చి బ్రాహ్మణులకు దానం చేశాడు. యోగ్యులైన బంధువులకు తగిన పదవులనిచ్చి గౌరవించాడు. అనపోతారెడ్డి ఆస్థానంలో కవులు, గాయకులు, వేద మంత్రాలను వలించే ఘనాపాటీలు ఉన్నారు. అనపోతారెడ్డి ఆష్ట్రాన విద్వాంసుల్లో బాలసరస్వతి ముఖ్యుడు. శాసన పాఠ రచయితగా పేర్కొనబడి, అనవేముని ఆస్థానంలో కూడా సేవలను అందించిన గొప్పపండితుడు.

అవపోతారెడ్డి భార్య మనుమూంబ, త్రిపురాంతక దేవుని కృపవల్ల కలీగిన బిడ్డగా భావించి వీరికి కలిగిన కుమారునికి, త్రిపురాంతకాలయము నిర్మింపబడిన "కుమారగిరొ కొండపేరు మీదుగా ' కుమారగిరి రెడ్డి అని పేరు పెట్టారు. అనపోతారెడ్డి కూతురు అవ్యమలేక దొడ్డాంబికను మేనల్లుడు కాటయ వేముని కిచ్చి వివాహం చేశాడు. అనపోతారెడ్డి అనంతరం, కుమారగిరి రెడ్డి చిన్న వాడైనందున, అనవేమారెడ్డి క్రీ.శ. 1364లో కొండవీడు సింహాసనాన్నధిష్టించి రెడ్డి రాజ్యాన్ని పాలించాడు.

ఆదర్శ పాలకుడు అనవేమారెడ్డి (ఉశ1364- 1386)

అనపోతారెడ్డి తరువాత, కొండవీటి సింహాసనాన్ని అతని తమ్ముడు అనవేమారెడ్డి అధిష్టించి, క్రీ.శ. 1364 నుండి శ్రీ.శ. 1386 వరకూ ప్రజారంజకుడై రెడ్డి రాజ్యాన్ని పాలించాడు. అనవేముని చరిత్ర, జీవిత విశేషాలు తెలుసుకోవటానికి పెద చెరుకూరు (క్రీ.శ. 1371), నడుపూరు (క్రీ.శ. 1374), సింవోచలం (క్రీ.శ. 1375), వాడపల్లి (క్రీ.శ. 1377), పలివెల (క్రీ.శ. 1377), (శ్రీశైలం (శ్రీశ.1378), (ద్రాక్షారామం (క్రీ.శ. 1381), మాన్యమాపురం ( క్రీ.శ. 1382), అనపర్తి (కుమారగిరి రెడ్డి శ్రీ.శ. 1390) శాసనాలతోపాటు దృజ్జవరం, ఇప్పగల్లు, వచ్చల తొడిపగ్రు, కొల్లూరు, వానపల్లి, పెదపలకలూరు శాసనాలు, వెన్నెలకంటి సూరన రచించిన విష్ణుపురాణం, శ్రీ;నాథుని శృంగారవైషధ గ్రంధాలు ఉపకరిస్తాయి.

యుద్ధాలతో సతమతమైనా, రెడ్డి రాజ్య కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేసిన అనపోతారెడ్డి అనుకోకుండా ్రీ.శ.1364వ సం.లో మరణించాడు. తక్షణ కర్తవ్యం బోధపడని రాజసప్రాసాదంలోనే కాక రాజధాని-నగరంలో కూడా గుసగుసలు (ప్రారంభమైనాయి. అనపోతారెడ్డీ కుమారుడు కుమారగిరి రెడ్డి అందరి మదిలో వెదిలాడు. రాజ్యవుంటే ఏమిటో, రాజకీయ వుంటే ఏమిటో తెలియని అతిపిన్స్నవయసు, విద్య, వినోదాలు, అటపాటలతో కాలం గడువుతున్న కుమారగిరి రెడ్డికి పట్టం కడితే, రాజ్య రక్షణ సవాలుగా పరిణమించే అవకాశమున్నందున, రాజధానిలో రాజకీయ దురంధరులు ఆలోచనల్లో మునిగారు. రెడ్డి రాజ్య నిర్మాత ప్రోలయ వేమారెడ్డి ఆశయాల మేరకు పాలించిన అనపోతారెడ్డికి పాలనా పరంగానూ, రక్షణపరంగానూ చేదోడు వాదోడుగా నున్న అతని తమ్ముడు ఆనవేమారెడ్డికి పట్టం కట్టాలని కాటయరెడ్డి మొదలైన రాజకుటుంబీకులు, మంత్రులు, పండితులు, ఏకాభిప్రాయానికి వచ్చారు. సోదర వియోగ దుణఖంలోనున్న అనవేమునికి ఈ నిర్ణయం రుచించక, ప్రశ్నార్దకంగా చూశాడు.

కుమారగిరికి యుక్త వయసూ, పరిపాలనా దక్షతా అబ్బిన తరువాత తిరిగి అతనికే కొండవీటి సామ్రాజ్యాన్ని అప్పగించమనీ, అంతవరకూ రాజ్యంలో శాంతి భద్రతలను కాపాడి, రాజ్యభారాన్ని వహించమని ప్రాధేయపడిన రాజకీయ చతురులు, మంత్రులు, హీతులు ఇచ్చిన సలహా ప్రకారం సింహాసనాన్నధిష్టించడానికి అనవేముడు

19

అంగీకరించాడు. ప్రచారంలో నున్నట్లు, అనవేముడు కుయుక్తితో సింహాసనాన్ని ఆ(క్రమించాడనడం సరికాదని తెలుస్తుంది. అతని అనవర్తి శాసనంలో అనపోతారెడ్డి, అనవేమారెడ్డి, ధర్మనిరతితో పాలించారని పేర్కొనడంచేత పై వాదం అపోహ చూత్రచునిపంచక వూనదు. శ్రీశైలం, దృజ్ఞ్దవరం శాసనాల్లోని “ రాజ్యరమారమీ.శ్రీ స్వయంవర లబ్రనాయకి”, *“రాజ్య(శ్రీ, రమాళీస్వయంవరపతి శ్రీయన్న వేమప్రభుః'” అన్న విశేషాలు అప్పటి కాల పరిస్టితుల ప్రకారం అనవేముని రాజ్యశ్రీ స్వయంగా వరించిందనుకోవ డానికి ఆస్కారమిస్తున్నాయి. -

మంత్రులు, సామంతులు, దండనాయక, మండలేశ్వరులు ముక్త కంఠంతో అనవేముని ప్రతిభా పాటవాలు, శక్తి యుక్తులను అంచనా వేయటంతో, అన్నతో పాటు పాలనా వ్యవవారాల్లో కూడా అనుభవమున్నందున అనవేమారెడ్డిని రాజమకుటం వరించింది. కొండవీటి సింవాసనంపై తొలిసారిగా కూర్చున్న అనవేముని మదిలో రెండు ఆలోచనలు మెదిలాయి. పిన్నవాడైన కుమారగిరిని విద్యాబుద్దుల్లో, యుద్ద తంత్రాల్లో వేర్చఠరిని గావించి యువరాజుగా పట్టాభిషిక్తుణ్లి చేయడం మొదటిదైతే, తన తండ్రి ప్రోలయ వేముడునిర్మించిన సామ్రాజ్యంలో తన అన్న పాలనలో శత్రువులపాలైన కొన్ని భూభాగాలను తిరిగి వళశపరచుకోవడంతోపాటు రాజ్యాన్ని ఇంకా విస్తరించడం రెండొది. మేనమామ దగ్గర నేర్చుకున్న యుద్ద చతురత, అన్న ఆజ్ఞల కింద నిర్వహించిన రాజ్యాంగ విధులు, అతని ఆలోచనలను మరింత బలోపేతం చేశాయి. కుమారగిరికి రాజవిద్యలనన్నింటినీ నేర్చబానికి తగు ఏర్పాట్లు చేశాడు. అ;న్హ్ర, శన్త, ప్రయోగంలో వెలకువలను నేర్చించడమేకాక, మల్లయుద్దం, గుర్రపు స్వారీ మొదలైన వాటిలో "పేరుగాంచిన ఏలు విద్యా నిపుణులు, మల్ల యుద్ద యోధులను నియమించాడు. సంగీత, వాద్య పరికరాలపై సాంప్రదాయ పద్దతిలో శిక్షణ నిప్పింలి, నృత్య, గొన ప్రశ్రీయలపట్ల అవగాహన కల్పించడానికి తగు ఉపాధ్యాయులను నియమించాడు. తరువాత రాజ్యంలో సుఫ్టిరత సాధించి, ప్రజల మన్ననలను పొందాడు అనవేమారెడ్డి. ఆర్దిక స్వావలంబనకు వర్తకాన్ని ప్రోత్సహించి ఎగుమతి, దిగుమతులను కూడా అనుమతించాడు.

అనపోతారెడ్డి పాలన చివరి సంవత్సరాలలో శత్రువులు చేజిక్కించుకొన్న కాంత భూభాగాన్ని తిరిగి స్వాధీన పరతుకొని కొండవీటి సామ్రాజ్య గత వైభవ ప్రొభవాలను దిగంతాలకు ప్రసరింపజేయాలని దృఢంగా విశ్వసించాడు. మంత్రులు,

20 సామంతులు, మండలేశ్వర, దండవాయకులతో మంతనాలు జరిపాడు. యుద్దానికి సిద్ధం కావాలన్న వారి ఏక గ్రీవ నిర్ణయానికి బాధ్యుడైనాడు. బలవంతులైన విజయనగర రాజుల జోలికిగానీ, కొండవీటికి ఎంతో దూరంలో నున్న తూర్పు గాంగుల మీదికి గాని, సమ ఉజ్జీలైన వెలమల మీదికి గానీ యుద్దానికి తరలిపోవడానికీ ఇది అదను కాదని గూఢచారులు సమాచారాన్ని అందించారు. వారి సూచనమేరకు ముందుగా గోదావరీ ప్రాంతంలో స్వతంత్ర పాలన పా గిస్తున్న మండలేశ్వరులను జయించి తరువాత తూర్చుదిశగా ముందుకు సాగటం మంచిదనుకొన్నాడు. అందుకు కావలసిన సైన్యం, అయుధాలు, గజ, అశ్వ, వస్తు, వాహనాలను సమకూర్చు కొన్నాడు. కొండవీటిలో యుద్దభేరి మోగింది. పైన్యాధ్యక్షుడు, వివిధ దళ నాయకులు, సంకేత వచనాలతో సైన్యాన్ని సమాయత్తంచేశారు. కదన కుతూహలంతో సేనావాహిని బయలు దేరింది. తన అన్న జయించిన దీవిని తిరిగి శత్రువులు చేజిక్కించుక న్నందున దీవివి జయించడానికి అటువైపుగా వెళ్లమని తన సేనానాయకుడు, అంతరంగిక మంత్రివర్యుడైన చెన్సమనాయకునికి సూచనలిచ్చాడు అనవేమారెడ్డి. దివి కోటను చుట్టు ముట్టి అనతి కాలంలోనే స్వాధీనం చేసుకుని “దీవి దుర్గ విభాళ అనే బిరుదును పొందాడు. దీవిని జయించిన సమరోత్సాహంతో కృష్ణాగోదావరీ నదుల మధ్యగల ప్రాంతాన్ని స్వాధీన పరచుకోవాలనుకొని ముందుకు సాగాడు. డిండి, సూరవరం పట్టణాల నుండి కొద్దిపాటి భూభాగాలను పాలిస్తున్న సూర్యవంశపు రాజులను లొంగదీసుకొన్నాడు. నిడదవోలు (నిరవద్యపురం) నుండి పాలిస్తున్న చంద్రవంశపు చాళుక్యులు అనవేముని ఆధిపత్యాన్ని అంగీకరించారు. కొమవరపు కోటనుండి పాలిస్తున్న భక్తిరాజు శోడుని కొడుకైన అన్నదేవచోళుడు అన్యాయంగా కాజేసిన రాజసింహాసనాన్ని చేజిక్కీంచుకొన్న అనవేమారెడ్డి తన ముద్దుల చెల్లి వేమసాని భర్త భీమదేవ చోడునికి పట్టం కచ్చాడు. కోనసీమకు వెళ్ళిన అనవేముని సేనలు అక్కడున్న అనేక ఫ్టల, జల, వన, గిరి దుర్గాలను జయించడంతో అనవేమారెడ్డి “సాగర గౌతమీ సలిల సంగమ జలదుర్ల సాధన రఘురామ” అనే బిరుదును పొందాడు. విజయ పరంపరతో సమర సింహుడైన అనవేముని మదిలో రాజమహేంద్రవరం మెదిలింది. కవులతో, గాయకులతో అలరారిన రాజమహేంట్రిని తన అధీనంలోకి

వ్‌

తెచ్చుకోవాలనుకొన్నాడు. శక్తి యుక్తులతో శత్రుదుర్చేద్యమైన రాజమహేంద్రవరపు కోటను జయించి పట్టణాన్ని పూర్తిగా స్వాధీన పరచుకొన్నాడు,. తూర్పు దండయాత్రలో జయించిన కోటలను (వ్రస్తావిస్తూ అనవేముని శ్రీశైలం శాసనం “రాజమహేంద్ర నిరవద్య నగరాది బహు విధస్రల దుర్గ వర్ల విదళన బలరామ అని శఇ్రాఘించింది. తన అన్న అనపోతారెడ్డి సూరవరం వద్ద పొందిన అపజయానికి ప్రతీకారంగా వేంగిని జయించిన అనవేమునికి, తాను బుణం తీర్చుకొన్న సంతృప్తి మిగిలింది.

రాజమహేంద్రానికి సమీవంలో నున్న కోరుకొండను పాలిస్తున్న మంచికొండ వంశీయులు ముమ్మడి, సింగమ నాయకులకు అనవేమారెడ్డి సకల సైన్యంతో వస్తున్న సంగతి తెలిసింది. ఎదుర్కొనడానికి సిద్దమయ్యారు మంచికొండ (ప్రభువులు. ఇరు వర్గాలకూ జరిగిన యుద్ధంలో ముందుగా ఊహించినట్లే విజయం అనవేమారెడ్డినే వరించింది. అనవేముని సార్వభౌమత్వాన్ని అంగీకరించిన కోరుకొండ పాలకులు, ప్రతి యేటా కొంత కప్పంచెల్లిస్తూ తమ ప్రాంతాన్ని పాలించుకునే హక్కును సంపాదించారు.

కోరుకొండను జయించిన తరువాత, పిళావురం, కొతాము ప్రాంతాల వేలుతున్న కొవ్పుల వంశీయులను కూడా లోబరచుకొన్నాడు. కొద్ది సంవళ్సరాల క్రితం కొండవీటిరాజ్యంపైకి దండెత్తివచ్చిన కళింగ గాంగరాజు మీద (ప్రతీకారం తీర్చుకోవాలను కొన్నాడు అనవేమారెడ్డి. దండనాయక, సైన్యాధ్యక్షులతో చర్చించిన మీదట తూర్పు దిశగా సింహాచలం వైపు పేనలను నడిపించాడు. చెన్నమనాయుని అధ్వర్యంలో సాగిన ఈ దండయాత్రలో మార్గమధ్యంలో ఉన్న యలమంచిలి చాళుక్యులను, ఒడ్డాది మత్స్యరాజులను కూడా లోబరచుకోవబానికి పథకరచన చేశారు. యలమంచిలి చాళుక్య రాజు నాలుగవ ఉపేంద్ర దేవుడు, అనవేమారెడ్డికి లొంగిపోయాడు. వళపరచుకొన్న సైన్యము కూడా కదిలీరాగా, కదన కుతూహలుడైన అనవేమారెడ్డి తను ఆకక్రమించదలచుకొన్న సీింహాతలం దగ్గరలోనే ఉందని తెలుసుకొని సంతోషించాడు. అంధ్ర, కళింగ దేశాలకు సింహాచలమే ఎల్లగా ఉండాలని, సింవాద్రి అప్పన్న తన రాజ్య సరిహద్దును శత్రువుల బారి నుండి కొపాడాలని మనసారా కోరుకొన్నాడు. శారదా నదీ తీరానున్న వడ్డాది నుండి సింహాచలం ప్రాంతాన్ని తమ అధినంలో ఉంచుకొని పాలిస్తున్న మత్స్యరాజు వీరార్డున దేవుడు అనవేముని సైన్యపు

22

ధాటికి తట్టుకోలేక లొంగిపోయాడు. మళ్లీ సైన్యం ముందుకు సాగింది. సింహాచలం కొండను చూచిన సైనికులు కేరింతలు కొడుతూ ఆలయాన్ని సమీపీంచారు. సింహాద్రి నరసింహనాథునికీ ఏప్రిల్‌శవ తేదీ, క్రీ.శ. 1375వ సం.లో తన కోర్కె వెరవేరినందుకు కొన్ని దానాలను ప్రకటించాడు. అనవేమారెడ్డి అతని వ్రధాని, దండనాయకుడు చెన్నమనాయకుడు ఒడ్డాది రాజు తనకు బహుమతిగా ఇచ్చిన 'గోటివాడ*లో కొంత భూమిని దానం చేళాడు. ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకొన్నందున అనవేమారెడ్డి, “సింహాచలాది వింధ్యపాద ప్రతివ్యాపిత కీర్తి స్తంభి' అనే బిరుదును పొందాడు. తరువాత కొండవీటికి తిరిగి వచ్చి ధర్మపాలన సాగించాడు.

కొండవీటి సింహాసనానికి తూర్పుదిశ నుండి ముప్పు తప్పినా వాయువ్య ప్రాంతంలో వెలనులు, పశ్చిమ ప్రాంతంలో విజయనగరరాజులు కయ్యానికి కాలుదువ్వుతూనే ఉన్నారు. ముందుగా రేచెర్ల వెలమల పైకీ దండెత్తివెళ్ళి, వారి భూభాగంలోని వాడపల్లి వరకూ స్వాధీనంచేసుకొన్నట్లు అక్కడున్న క్రీ.శ. 1377వాటి శాసనం వల్ల తెలుస్తుంది. వెలుగోటి వారి వంశావలిలో పేర్కొన్నట్లు అనవేమారెడ్డి వెలనురాజుల చేతిలో ఓడిపోయాడనేది వాస్తవం కాదని చారిత్రకుల అభిప్రాయం. తాను తూర్చు దండయాత్రలో ఉన్నప్పుడు విజయనగర మొదటి బుక్కరాయలి ప్రోత్సాహంతో అతని దండనాయకుడు కొండవీటి భూభాగంలోనున్న వినుకొండ ప్రాంతాన్ని ఆక్రమించుకొన్నాడు. అంతేగాక, తన భూభాగంలోని వింజనంపాడు అనే గ్రామాన్ని అతడు దానం చేయడం, అనవేమునికి మరీ ఆగ్రహం తెప్పించింది. (క్రీశ. 1372వ సం.పు చాంగలవీడు శాసనం ఈ విషయాన్ని ధ్రువ పరుస్తుంది. ఉదాసీనంగా ఉంటే ఉనికికే ముప్పు కలుగుతుందని గ్రహించి పడమటి దూకుడుకు కళ్ళెం వేయడానికి నిశ్చయించుకొన్నాడు. భారీపైన్యంతో కదిలిన అనవేముని పశ్చిమ దండయాత్రలో (శ్రీశైలం వరకూ అక్రమించుకొని తన విజయానికి చిహ్నంగా శ్రీశైలంలో క్రీ.శ. 1378వ సం. జనవరిరివ తేదీన ఒక శాసనం వేయించాడు. అందులో అతవి గుణ గణాలతోపాటు పూర్వ దిగ్విజయ యాత్ర విశేషాలు అన్నీ ఉన్నాయి.

తూర్పు దండయాత్రలో అనవేమారెడ్డి కొలువులో ఉన్నతోద్యొగాల్లో ఉన్న అతని బావమరిది కాటయరెడ్డి, అతని పోదరుడు మారయరెడ్డి, నూంకయ, వల్లనూంకయ, దువ్వూరి దొడ్లారెడ్డి, మొదలైన యుద్దతంత్ర నిపుణులు సహకరించారు.

23 కాటయరెడ్డి జల దుర్గాలను ముట్టడించి యుక్తితో వశపరచుకోవటంలో సిద్ద హస్తుడు. అనవేమునికీ ఎన్నో జలదుర్గాలను సాధించి పెట్టి ' జలదుర్గమల్ల” అని పీలువ బడినాడు. అనవేమునవి వ్యక్తిత్వం

అనవేమారెడ్డి దిగిజయ యాత్ర, పూర్తయిన తరువాత కొండవీటి నుండి (ప్రజారంజకమైన, ధర్మపాలన సాగించినట్లు ఆతను విడుదల చేసిన శాసనాలు, వెన్నెలకంటి సూరన రాసిన విష్ణు పురాణం తెలియ జేస్తున్నాయి. దక్షిణాన కందుకూరు చుండి ఉత్తరానపింవాచలం వరకూ, పశ్చిమాన శ్రీశైలం నుండి, తూర్పు సముద్రం వరకూ గల మహితాంధ్రదేశాన్ని పాలించినట్లు అతని మాన్యమాపురం శాసనం 'పేర్కొంటూంది. అనపోతారెడ్డి జయించిన కొత్త ప్రాంతాలు అతని పాలనలోనే తిరిగి అయా పాలకులు వెనక్కు పొందారనీ, ఇంకా చివరిరోజుల్లో విజయనగర రాజులు రెడ్డి రాజ్యపు నైబుతి భాగంలో కొంత భూమిని అక్రమించారని తెలుసుకొన్నాము. అనవేముడు అన్న తనకు అందించిన రాజ్యాన్ని కాపాడి, ఇంకా విస్సృతం కూడా చేసిన ధీశాలి. ప్రజలతో చక్కటి సంబంధ, బాంధవ్యాలను కలిగి ఉన్నాడు. శాంతి భద్రతలను కాపాడటానికి, సమాజాన్ని నీతిమంతం చేయటానికి అవసరమైనపుడు సామదాన భేద, 'దండోపాయాలను వినియోగించి, 'ప్రజాపరిచిత చతుర్విధోపాయా అనే బిరుదు పొందాడు. యుద్ద నీతిలో చతురుడు. ప్రత్యేకించి ఏనుగుల్ని లొంగదీసుకోవడంలో రహస్యాలను తెలుపుకొన్నవాడు. కత్తి సావఎలో 'కరవాళ టైరవుడు, *క్షురికాసవళశయ', *కరవాళవైన తీయ” బిరుదులను పొందాడు. కొత్తగా స్వాధీనం చేసుకొన్న భూములను రెడ్డి రాజ్యానికి కలీపి, “మహనీయాంధ్రదేశ పచ్చాభిషేక సంవృత

మహాభాగ్య' అని శ్లాఘించబడ్డాడు. అనవేమునికి సకల విద్యలలో ఆరితేరిన మామిడి పెద్దన్న మంత్రిగా మంళతనాట్లో సహకరించాడు. మంత్రి పదవితో పాటు దండనాయక పదవిని కూడా నిర్వహించిన వీరుడు. చక్కటి పాలన సాగించడంలో అనవేమారెడ్డికి సహాయపడి “అనవేమాధిప రాజ్యభార భరణ” అని పేరుగాంచాడు. అతని ధ్రత్యేక సేవలకు గుర్తింపుగా వేతనంతోపాటు, అదనపు సౌకర్యాలను కూడా కల్పించాడు. అతని మరొక మంత్రి ఇమ్మడింద్రుడు, నమ్మకమైన సేవలకు అనవేముడు ఇమ్మడిలంక అను గ్రామాన్ని దానంచేశాడు. సైన్యాధ్యకుడైన అల్లాడరెడ్డి, సలవాలతోపాటు సైన్య సమీకరణ,

ల!

ఆధునిక సైన్య పద్దతుల్లో తర్భీదువిచ్చి నిర్వహించడంతో పాటు పూర్వ దిగ్సిజయయాత్రలో ప్రధానపాత్ర పోషించాడు. రాజదర్భారు కవులు, గాయకులు, కళాకారులతో నిండి ఉండేది. కొలువులో బాల సరస్వతి, త్రిలోచనాశార్యుడు, ప్రకాశ భారతి యోగి అనే కవులున్నారు. వారి పాండిత్యానికి మెచ్చి దొనాలను చేసిన అనవేమారెడ్డి 'బహుసహ'స్ర సువర్ణదానసంతోషిత మహాకవీశ్వర* అనే బిరుదును పొందాడు.

అనవేముని పాలనలో రాజ్యము ఆర్థికంగా ముందంజలో ఉందనీ, మోటువళ్లి రేవునుండి విదేశీ వ్యాపారం బాగా జరిగి ప్రభుత్వానికి సుంకం రూపేణా ఎంతో ఆదాయాన్ని అందించేదనీ అనవేమారెడ్డి వానపల్లి శాసనం తెలియజేస్తుంది. వ్యవసాయాభివృద్ధికి చెరువులు, బావులు త్రవ్వించాడు. పంటలు బాగా పండి, రాజ్యం సుభిక్షంగా, శాంతి యుతంగా ఉందని అదే శాసనం పేర్కొంటుంది.

వసంతోత్పవం

సౌంప్రదాయకంగా చిరకాలం నుండి వైత్ర మాసంలో జరుపుకునే వసంతోత్సవం లేక వుదన వుహోత్సవం అనే వేడుకలను అనవేవూరెడ్డి వునరుద్దరించాడు. వసంత మానంలో రాజధాని వీధులన్నింటినీ మామిడి తోరణాలతో అలంకరింపజేసి, రాజ్యంలోని వివిధ ప్రదేశాలనుండి తరలివచ్చే జనానికి వసతి, సౌకర్యాలు కల్పించాడు. మార్గ మధ్యంలో సత్రాలు, చలిపందిళ్ళు నిర్మించి, యాత్రీకుల భద్రతకు రక్షక భటులను నియమించాడు. అవ్సరసలను పోలిన అంధ్ర యువతులు అలంకరించుకొని తమ జతగాళ్ళతో బండ్లపైన, కాలినడకన జంటలు జంటలుగా, జట్లు జట్టుగా రాజధానికి చేరుకానేవాళ్ళు. శృంగార పురుషులు రవసెల్లాలు ధరించి హుషారుగా వురవీధుల్లో సంచరిస్తూ రాజు వసంతోత్సవం జరోపీ చోటుకు చేరేవాళ్ళు. తి యువకుడూ ఆ రోజు మన్మధుడే. మోటుపల్లి రేవు ద్వారా విదేశాల నుంచి వచ్చే కస్తూరి, కుంకుమ, ఘనసార, హిమాంబు, కాలాగరు, గంధం మొదలైన సువాసనలు వెదజల్లే ద్రవ్యాలను విదేశీ, స్వదేశీ వ్యాపారుల నుండి పెద్ద మొత్తాల్లో సేకరించి వసంతోత్సవంవాడు జలకాలాటలూ, వసంతం (రంగు నీళ్ళు) చల్లుకొనేపుడు రాజు వ్రల్యేకంగా సందర్శకుల మీద చల్లేవాడు. అప్పుడు వ్రజలవొళ్ళు పులకించేది. నాట్యం, వృత్యం, కోలాటం. మొదలైన అటలను అడ, మగ తేడా లేకుండా అడేవాళ్ళు.

25 రంగురంగుల బట్టల్ని ధరించేవాళ్ళు. వివిధ ఆభరణాలతోపాటు పూలను కూడా ధరించేవాళ్ళు. ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న జనంతో రాజధానీ నగరం నిండిపోయేది. ఈ వసంతోత్సవాల్ని ప్రతి సంవత్సరం జరిపించడం చేత ''వసంతరాయి” బిరుదును పొందాడు. వసంతోత్సవ సమయంలో కర్పూరం వ్రజలపైకి రాజు నవ్యంగా చల్లడంతో అనవేముని “కర్పూర వసంతరాయలు” ని పిలిచారు. అనవేముడు తిరిగి వ్రవేశ పెట్టిన ఈ వసంతోత్సవాలను కుమారగిరి రెడ్డి ఇంకా ఘనంగా జరిపించి అతడు కూడా “కర్పూర వసంతరాయా'” బీరుదునొందాడు. అనవేమువి ధర్మకార్యాలు

స్వతహాగా అనవేముడు ధార్మికుడు, శాంతికాముకుడు. రాజధర్మంగా, ధర్మబద్దమైన యుద్దాలుచేశాడు. శైవ మతాన్ని ఆచరించి, ప్రచారం చేయడానికీ కృషిచేశాడు. శివునికి ప్రతిరోజూ ఆరుసార్ల పూజలను నిర్వహించాడు. పంచారామాలకు గజఘంటలను, శ్రీశైలం, త్రిపురాంతకం ఆలయాలకు ఎన్నో దానాలను సమర్చించాడు. శైవ మతాన్ని స్వీకరించినా, (శ్రీకూర్మం, సింహాచల దేవాలయాలకు దానాలిచ్చాడు. క్రీ.శ. 1371వ సం.లో సముద్ర తీరంలో నున్న చెఅకుపల్లి (ఇతు(గ్రామం)లో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా ఏర్పడిన చంద్రగ్రహణం రోజాన అనుష్టానాలను స్వయంగా నిర్వర్తించి, ఇకుగ్రామాన్ని వేదశా స్రాల్గ్లో నిష్ణాతులైన లాహ్మాణులకు అష్టభోగ తేజ స్వామ్యంగా దానంచేశాడు. వాడపల్లిలో మాచారెడ్డి ఉద్యోగి అనవేమారెడ్డికి పుణ్యంగా అక్కడి ఆగస్తేశ్వరాలయ గోపురాన్ని, చంద్రశాలను నిర్మించబానికి అర్థిక సాయాన్నందించాడు. రెడ్డి రాజుల కులదేవత మూల గూరమ్మకు యుద్దాల్లో విజయం లభించినందుకు మూడు గ్రామాలను దానం చేసినట్లు క్రీ. 1377వ సం.పు అమీనాబాదు శాసనంలో చెప్పబడింది.

శీశ్రైలంలో వీర్ణైన భక్తులు తమ మొక్కుబడుల్లో భాగంగా గండకత్తెరతో తమ శిరస్సులను తామే కత్తిరించుకుని శివునికి అర్పించి శివాయుజ్యాన్ని పొందేవారు. కర్నాటక, అంధ్ర ప్రాంతాల నుండి శ్రీ శైలం ఆలయంలో శైవాగమార్చనలు జరుపుకొన్న తరువాత శిరస్సులను కత్తిరించుకొనేవాళ్ళు. వారికి సౌకర్యంగా *వీరశిరో మంటపాన్ని నిర్మించాడు. హేమాద్రి వ్రత ఖండంలో చెప్పిన వివిధ దానాలను చేసి బ్రాహ్మణులకు అ(గ్రహారాలను బహూకరించాడు. సత్రాలను నిర్మించి బాటసారులకు ఊరట

" 26 కలిగించాడు. ప్రోలయవేముని ఆశయాలనూ, అనపోతారెడ్డి ఆదర్శాలను స్వీకరించి రెడ్డి రాజ్యాన్ని పాలించి, ధర్మాన వేమునిగా పిలువబడి రెడ్డి రాజ్య కీర్తి పతాకను ఎగుర వేశాడు.

“కర్వూర వసంతరాయలు' కుమారగిరి రెడ్డి (ఉళ 1386 - 1402) కొండవీటికి వశ్చిమవైపునున్న త్రిపురాంతకుడు శత్రువుల దాడుల నుండి కాపాడలాడని రెడ్డి రాజుల నమ్మకం. నేటి ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం కొండకు కుమారాచలం. కుమారగిరి అని పేర్గున్నాయి. అనపోతారెడ్డికి పుట్టిన మగ శిశువుకు కుమారగిరిపై నున్న త్రిపురాంతక దేవుని పేర "కుమారగిరి రెడ్డి* అని పేరు పట్టుకొన్నాడు. శాసన సాహిత్యాల్గొ ఇతన్ని కొమరగిరిరెడ్డిగా కూడా ప్రస్తావించడం జరిగింధి. చక్కని పరిపాలననందించి, కొండవీటి సామ్రాజ్య ప్రాభవాన్ని, రెడ్డి రాజుల వైభవాన్ని కందుకూరు నుండి కటకంవరకూ, శ్రీ శైలం నుండి తూర్పు సముద్రం వరకూ శ్రసరింవజేసి, వసంతోత్సవాలను ఘనంగా జరిపించి కర్పూర వసంతరాయలుగా పేరు గాంచిన కుమారగిరి రెడ్డి చరిత్ర తెలుసుకోవడానికి సమకాలీన శాసనాలు, సాహిత్యం, లోకల్‌ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. కాటయ వేమారెడ్డి పాలకొలను, సింహాచలం, ఆమరావతి, తొత్తరమూడి, మధురపూడి, సంతానసాగరం, గోపవరం శాసనాలూ, గొగ్గయ దేవనాయని సర్పవరం శాసనం ( క్రీ.శ. 1388), భండారుశెట్టి తాళ్ళూరి మఠం శాసనం(క్రీ.4. 1399) అల్లయవేముని కోరుమిల్లి, వేమవరం శాసనాలూ, కుమారగిరి రెడ్డి అనపర్తి, కొమరగిరిపురం (క్రీ.శ. 1390), కొత్తూరు శాసనం (క్రీ.శ. 1400), ఇంకా విజయనగర పాలకులైన రెండవ హరిహరరాయలు, అతని మనుమడైన రామచందద్రరాయల త్రిపురాంతకం (్రీ.శ. 1385 - 95), యనమదల, పరుతూరు శాసనాలూ, కాటయవేముని కువూర రాజీయం, మాళవికాగ్ని మిత్ర, శాకుంతల వ్యాఖ్యలూ, శ్రీనాధుని హరవిలాసం, కాశీఖండం, భీవేశ్వరపురాణం, కొమ్మన శివలీలావిలాసం ఇంకా తెలుగు చాటువులను పరిశీలించాల్సి ఉంటుంది. అప్పటి వరకూ కొండవీటి సింహాసనం పైనున్న పనతండ్రి అనవేమారెడ్డి మరణించిన నేపథ్యంలొ కుమారగిరి రెడ్డి సింహాసనాన్నధిష్టించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అనవేమారెడ్డి క్రీ.శ. 1386లో మరణించిన వార్త రాజ్యమంతచా పాకింది. రాచనగరులోనూ, రచ్చబండల మీద కొండవీటి సింహాసనం గురించిన చర్చలు కొనసాగాయి. తన తరువాత కుమారగిరిని రాజాను చేయాలనుకొన్న అనవేమారెడ్డి

28

ఆలోచనలను తెలుసుకున్న అతని వారసులు సింహాసనాన్ని కాజేయాలని కుట్ర పన్నారు. ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టిన కుమారగీరిరెడ్డి బావమరిది కాటయవేమారెడ్డి నాటకీయంగా కుమారగిరిని కొండవీడుకి రాజుగా చేశాడు. అంతేగాక, ధర్మరాజుకు కృష్ణునివలే పరిపాలనలో శక్తియుక్తుల నర్చించినట్లు కాటయ వేముని తొత్తరమూడి శాసనం వల్ల తెలుస్తుంది. కాటయ వేముని రాజకీయ చతురతకు పాలుపోని కుమారగిరి దాయాదులు మౌనం వహించక తప్పిందికాదు,

కుమారగిరి రెడ్డి కొండవీటి నుండి రాజ్యం చేస్తుండగా, కలిగిన కొడుక్కి తన తండ్రీ పేరు మీదుగా ' వీరాన్న పోతారెడ్డి అని పేరు పెట్టుకొన్నాడు. ఇతడే రెండవ అనపోతారెడ్డి. కుమారగిరిరెడ్డి అతనికి బాల్యంలోనే సకల శాస్త్రాలూ, విద్యలూ నేర్పించాడు. అనపోతారెడ్డి ఏన్నవయస్కునిగా నున్నప్పుడే, దాక్షారామాన్ని సందర్శించిన కుమారగిరిరెడ్డి, తనతొడపై కొడుకునుంచుకొని వెండి, బంగారు నాణెములతో తులాభారం తూగి, వాటిని దాన, ధర్మాలకు వినియోగించాడు. అనపోతారెడ్డికి యుక్త వయుసొచ్చిం తర్వాత యువరాజ పట్టాన్ని అప్పగించాలనుకొన్నాడు. కుమారగిరి రెడ్డి అంత వరకూ ఉన్న ఆచారాన్ని కాదని ట్రాహ్మణుల స్థానంలో మంత్రిగా, దండనాయకునిగా తనబావమరిది కాటయ వేచూరెడ్డిని నియమించడానికి సాహసీంచాడు. రాజు అనతి మేరకు పాలనా పరమైన బాధ్యతలను అతడు విర్వర్తించాడు. కాటయవేమారెడ్డి, కువూర గిరిరెడ్డి కి దండనాయుకునిగా, ప్రధానిగా చతురంగ బలసమీకరణ, చతుర్విధోపాయాలనందిస్తూ ఆతనికి అండదండగా నిలిఛాడు. తన మనసులో మెదిలిన తూర్పు దేశ దండయాత్ర గురించి కాటయవేమునికి వివరించాడు.

కాటయ వేమారెడ్డి తూర్పు దండయాత్ర

యుద్దతంత్ర నిపుణుడైన కాటయవెముడు అదును చూచి దండయాత్రకు ఏర్పాట్లను కావించాడు. కొండవీటి కోట ఖురుజు మీద యుద్ద భేరీ మోగింది. వివిధ దళాధిపతులూ, దండనాయకులూ సహాయక మంత్రులూ సర్వసన్నద్దమైనారు. పథక రచన చేసిన కాటయ వేమారెడ్డి ముందుగా రాజు ఆదేశాలను చదివి సైన్యానికి వినిపించాడు. శత్రు రాజులవల్ల ఏర్పడ్డ బెడద గురించీ, దేశభక్తి పరాయలణులైన సైనికులకు గంభీరోపన్యాసం చేశాడు. యుద్దభేరిలు మోగుతూనే ఉన్నాయి.

29

కాటయవేముని ఆవేశపూరిత ప్రసంగం, భేరి, కాహళవాద్య శబ్దాలకు సైనికుల్లో కదన కుతూహలం పెల్టుబికింది. అప్రమత్తంగా ఉన్న వీరసైనికులంతా సరంజామాతో బయలుదేరారు. కాల్చల నాయకులు గమ్యస్థానమైన తూర్పు దేశ చిత్రపబాన్నీ, వివిధ కోటల ముట్టడికి చారబడాల్సిన మార్గాలున్న పటాలను తమ వెంట ఉంచుకొని కదనానికి కాలు కదిపారు.

కొండవీటి నుంచి బయలుదేరి కృష్ణానదిని దాటిన తరువాత దండు బాటలో నున్నపాలకొల్లు పట్టణాన్ని చేరుకొన్నారు. సైనికులు, పంచారామాల్లో ఒకటైన ఈ అలయం ఎప్పుడూ భక్తులతో కిటకిట లాడితే ఆ రోజు సేనావాహినితో నిండిపోయింది. కాటయవేముడు క్షీరారామలింగేశ్వరుని దర్శించి ఆలయ నిర్వహణకు కొంత భూమిని ప్రకటించాడు. తనరాకకు గుర్తుగా పాలకొల్లులో ఒక శాసనం వేయించుకున్నాడు. మహా పరాతక్రమువంతుడైన కాటయవేమునికి జగనొబ్బగండ, కేళాదిరాయ, భుజబలభీమ, పాండ్యరాయగజసింహ, పల్లవ త్రినయన మొదలైన బిరుదులున్నట్లు ఈ శాసనం పేర్కొంటూంది.

సేనలు పాలకొల్లు నుంచి రాజమహేంద్రవరం వైపు కదిలాయి. క్రమశక్షణతో, వరుసలుగా ఏర్పడి కదులుతున్న చతర్వి ధదళాలు రెడ్డి రాజుల పొరుషానికి ప్రతీకలుగా ఉల్సాహంగా ముందుకు సాగాయి. గోదావరిని చూచిన సైనికులు ఉరకలు వేశారు. ఎక్కువగా లోతులేని గోదావరిని సులువుగా దాటి రాజమహేంద్రవరం కోటలో ప్రవేశించారు. ఈ తూర్పు దండయాత్రలో తనకు విజయం చేకూర్చవుని కాటయవేముడు స్టానిక వేణుగోపాల స్వామిని ప్రార్ధించి ముందుకు సాగాడు. తరువాత కాటమరేని కోటను జయించాడు.

కాటయవేముడు రాజనీతిజ్ఞుడేకాక గొప్ప సాహితీవేత్త కూడా. కుమార రాజీయం, మాళవికాగ్లి మిత్రం, శాకుంతల (గగ్రంధాలపై చక్కటి వ్యాఖ్యలు రాసిన పండితుడు. అతని కుమారరాజీయంలో తూర్పు దండయాత్ర గురించి మరిన్ని వివరాలున్నాయి. రాజమహేంద్రానికి ఈశాన్యంగా ఉన్న కొప్పుల రాజ్యాన్ని క్రీ.ళ. 1388లోనే వశపరచుకొన్నాడు. అంతటితో ఆగక, మొల్లేరు, రామగిరి, వజ్రకూటం మొదలైన కోటలను జయించాడు.

సైన్యానికి సూచనలిస్తూ ముందుకు నడిపిస్తున్న కాటయవేముడు సింహాచలం

30

చేరుకున్నాడు. స్వామిని దర్శించి కొన్ని దానాలను ప్రకటించినట్లు క్రీ.శ. 1366 నాటి శాసనం తెలియజే స్తుంది. సింహాచలాన్ని స్వాధీనంచేసుకున్న తరువాత, కళింగంలోని వీరకొట్టాన్ని జయించాలని నిశ్చయించుకొని ముట్టడించాడు. పాలకుడైన పురుషోత్తముడు లొంగిపోగా, కాటయవేమారెడ్డి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొన్నాడు. కుమారగిరి తూర్పు దండయాత్రలో అల్లయ వేమారెడ్డి, అల్లయదొ ధ్లారెడ్డి పాల్గొని సహకరించి సింవాచలం, చిలుకాసరస్సుల వద్ద జయస్టంభాలను నాటినట్లు వేవువరం శాసనం, శివలీలా విలాసం తెలియజేస్తున్నాయి. వీరు ఇంకా సప్తవూడియములు, జంతరునాడు, జయపురాలను జయించినట్న కూడా చెప్పబడింది. ఇంకా ఈశాన్యంగా ముందుకు నడిచిన కాటయవేమునికి కళింగంలోని ముఖ్యనగరమైన కటకంపై దృష్టి వురలింది. అతడు కటకాన్ని జయించి “కటకచూరకార? బిరుదును పొందినట్లు గోపవరం శాసనంలో ఉంది. తూర్పు దండయాత్ర ముగించుకొని క్రీ.శ. 1387లో కొండవీటికి తిరిగి వచ్చాడు. విజయపరంపరతో వచ్చిన యోధునికి రాచమర్యాదలతో, కర్పూర హారతులతో కుమారగిరిరెడ్డి ఎదురెళ్ళి స్వాగతం పలికి సభా మందిరానికి తీసుకొచ్చాడు. కాటయవేముడు ప్రారంభం నుండి దండయాత్రా విశేషాలను పూసగుచ్చినట్లు చెప్పాడు. వ్యూహ బ్రతివ్యూహాలు, సాధించిన విజయాలు, ఓడిపోయిన రాజులిచ్చిన కట్నకానుకల గురించి వివరించిన తరువాత వాటిని రాజుకప్పగించాడు. విజయగర్వం తొణికిసలాడుతున్న కాటయవేముని కౌ గిలించుకొని అభినందించాడు కుమౌరగిరరెడ్డి ఈ దండయాత్రలో కాటయవేమునికి వెన్నంటి నిలిచిన వీరుడు అల్లాడ రెడ్డీ, కుమారగిరిరెడ్డి తూర్పు రాజ్యానికి రాజమహేంద్రవరాన్ని రాజధానిగాచేసి, తన కుమారుడు వీరాన్న పోతారెడ్డిని యువరాజుగా పట్టంకట్టి పాలనా భాద్యతలను అప్పగించాడు. తాను కొండవీటికి పరిమితమై, దేశవిదేశాల నుంచి వస్తున్న సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవాలను జరుపుకొంటూ సాహిత్య, కళారంగాలకు ఎంతో సేవ

చేశాడు. కుమారగిరి రెడ్డి అనపర్తి శాసనంలో తనతో దక్షిణ (విజయనగర రాజా), పశ్చిమ (వెలమలు), ఉత్తరం (కళింగ గాంగులు)వై వున్న రాజులు స్నేహ భావంతో ఉన్నారని చెప్పకొన్నాడు. కాని కుమారగిరి పాలనా కాలంలో అదను చూచుకొని

౩1 విజయనగర, వెలమ, బహమనీ, తూర్పుగాంగులతో పోరాటాలు తప్పలేదు. విజయనగర రాజులతో యుద్ధం, మైత్రి

కుమౌరగిరిరెడ్డి సింవాసనాన్న ధిష్టించేప్పుడు కొండవీటిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు విజయనగర పాలకులకు అనుకూలంగా ఉన్నాయి. అదనుచూశుకొని కుమారగిరికి సమకాలికుడైన రెండవ హరిహరరాయలు (క్రీ.శ. 1377 - 1404) కొండవీటి భూభాగంలోకి పశ్చిమ ప్రాంతంపై క్రీ.శ. 1385వ సంవత్సరంలో దాడిచేసి (శ్రీశైలం, శ్రిపురాంతకంల వరకూ ఆక్రమించుకున్నాడు. దాంతో కుమారగిరి తగిన అంగబలాన్నిచ్చి కాటయవేమారెడ్డిని రాయల సైన్యం మీదికి పంపాడు. "సేనా వాహినిగా కదిలి వస్తున్న కాటయ వేమునితో యుద్దం కంటే సంధి మేలనుకొన్నాడు హరిహర రొయలు. రెడ్డిరాజులతో సఖ్యతగావుంటే బహమనీ, వెలమరాజులను సులువుగా ఎదుర్కొనవచ్చని హరిహరరాయలు సంధి కుదుర్చుకొన్నాడు. (శ్రీశైలం, త్రిపురాంతక ప్రాంతాన్ని కుమారగిరి రెడ్డికి తిరిగి అప్పగించాడు. అంతేకాక కాటయవేమారెడ్డికితన కూతురు హరిహరాంబనిచ్చి వివాహం జరిపించి మైత్రీ బంధాన్ని మరింత ధృడం చేసుకున్నట్లు అల్లయ వేవూరెడ్డి వేమవరం శాసనం పేర్కొంటుంది. ఐదారు సంవత్సరాలు ఇలా కొనసాగిన మైత్రికి భంగం కలిగింది. కొండవీటిలోని అంతర్గత కలహాలు, కరువుల మూలంగా కుమారగిరిరెడ్డి పాలనా పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ( క్రీ.శ. 1400 సం.లో), విజయనగర సేనలు శ్రీశైలం, ఎనమదల, వరుచూరు ప్రాంతాలను వశపరచుకొన్నట్లు అక్కడి శాసనాలు రుజువు చేస్తున్నాయి.

బహమనీలతోపోరు

బహమనీ సుల్తాను ఫిరోజ్‌షా (క్రీ.ళ. 1397 - 1422) విజయనగర సామ్రాజ్యం మీదికి దండయాత్రకు వెళ్ళేప్పుడు రెడ్డి రాజ్యంపైకి కూడా కొంత సైన్యాన్ని పురమాయించాడు. వాయువ్య ప్రాంతంలో జరిగిన దాడిని, కుమూరగిరికి అణకువగొ పాలిస్తున్న తిప్పానాయకుడు తన సైన్యంతో ఎదుర్కొని కంభం మెట్టు వద్ద బహమనీ సైన్యాన్ని తిప్పీకొట్టడంతో పలాయనం చిత్తగించారు.

వెలమలతో సంబంధం రెడ్డి రాజ్యానికి పశ్చిమంగా ఉన్న వెలమలతో వైరం లేదని కొమరగిరి

తజ చెప్పుకొన్నాడు. సింగయమాదానేడు, దాచభూపాలుడు అనే వెలమరాజాల చేతిలో కుమారగిరి ఓడిపోయినట్లు ప్రస్తావిస్తున్న వెలుగోటి వారి వంశావళి కధనాన్ని ఛారిత్రకులు అంగీకరించడం లేదు. వెలుగోటి వారి వంశావళిలోగానీ, వెలమరాజుల శాసనాల్లో గానీ కాటయ వేముని ప్రస్తావన లేకపోవటాన్ని గమనించాలి. అందుచేత కుమారగిరికి వెలమలకు జరిగినట్టు చెబుతున్న యుద్దానికి చారిత్రక ఆధారాలు లేవు. కళింగ గాంగులతో యుద్గం _కళింగ దేశాన్ని పాలిస్తున్న నాలుగవ నరసింహదేవుడు (క్రీ.శ. 1377 -

1409), తన రాజ్యపు దక్షిణ భాగాన్ని రెడ్డీ రాజులు ఆక్రమించుకోవడం సహించలేక సైన్యంతో సమాయత్తమై క్రీ.శ. 1399లో రాజమహేంద్రవరం పైకి దండెత్తి వచ్చాడు. తూర్పు రాజ్యాన్ని పాలిస్తున్న అనపోతారెడ్డి, అతని సహాయకుడు దేవనాయకుడు గాంగ సైన్యంతో తలపడి విహరణగిరి (సింహాచలం) వద్ద ఎదుర్కొని తరిమికొట్చారు. వారు తిరిగి వస్తూ, సర్పవరంలోని భావనారాయణ ఆలయాన్ని దర్శించి కొన్ని భూదానాలను కూడా చేసినట్లు సర్పవరం శాసనం తెలియజేస్తుంది.

కుమారగిరిని కుంగదీసిన అనపోతారెడ్డి మరణం

రాజ్యంలో శాంతిని సాధించి, సుష్టిర పాలన సాగిస్తున్న కుమారగిరిరెడ్డి వనంతోత్సవాలను జరువుకొంటూ సంగిత, సాహిత్య సభలతో విలాసంగా, వినోదంగా కాలం గడుపుతున్నాడు. కొండవీటి ప్రాభవం దశదిశలా వ్యాపించింది. అనంద డోలికల్లో ఓలలాడుతున్న కుమారగిరి జీవితంలో విషాదం కమ్ముకొంది. తూర్పు రాజ్యాన్ని పాలిస్తున్న తన కుమారుడు యువరాజు అనపోతారెడ్డి అనుకోకుండా మరణించిన వార్త కుమూరగిరి పాలిట పిడుగుపాటైంది. తాను నిర్మించుకున్న కలల సౌధం కళ్ళముందు కువ్పకూలింది. విధి వక్రించినందుకు కుంగి కుమిలిపోయాడు కుమారగిరిరెడ్డి.

రాజ్యంలోని తూర్పు ప్రాంతాన్ని నియంత్రించటానికి రాజు ప్రతినిధిని నియమించాల్సిన అవసరాన్ని గుర్తించిన కువూరగిరిరెడ్డి బాగా ఆలోచించి ఒక నిర్ణయాని కొచ్చాడు. తనకు అన్ని వేళలా, అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉన్న కాటయ వేమునికి రాజమహేంద్రవరం అప్పగించాలనుకొన్నాడు. తాను సాహిత్య కళాపోషణలతో, ఉల్లాసంగా గడిపిన రోజుల్లో రాజ్య భారాన్ని మోయటమే కాక,

33 రాజ్యాన్ని విన్దరించిన కాటయ వేమారెడ్డిలోని సమర్హ్ర నాయకత్వాన్ని గుర్తించాడు. రాజకీయ చతురత, కార్యదక్షత, పాండిత్య ప్రతిభ మూర్తీభవించిన కాటయ వేమునికి రాజమహేంద్రవరం పాలనను అప్పగించాడు. ఈ విషయాన్ని కాటయ వేముని గోపవరం శాసనం వెల్లడిస్తోంది. కొండవీటిలో వసంతోత్సవం

తొలికోడి కూసింది. గొండవీడు నిద్రనుండి కొద్దికొద్దిగా మేల్కొంటోంది. అది వైత్రవూస 'పర౦చమి రోజు. అందరూ లేచి పండుగ సంవత్సరానికీ ఉమాయత్తమౌతున్నారు. ఇంకా మసక చీకటి తెర తొలగనేలేదు. పిన్నలూ, పెద్దలూ, యువతులూ, ఫ్రౌఢలూ, వనితలూ వృద్ధ నారీమణులు సుగంధ పరిమళ (ద్రవ్యాన్ని కలబోసిన నులివెచ్చని నీటితో తలంటుకొని, పాంటబ్రాణితో కురులార బెట్టుకొంటున్నారు. యువకులు బావుల వద్ద చేరి స్నానాలు ముగించుకొని కడవలతో నీళ్ళను ఇళ్ళకు తెస్తూ ముచ్చటించుకొంటున్నారు. వనితలు వాకిళ్లూడుస్తూ, కళ్ళాపులు అల్గుతూ, రంగవల్లులతో అలంకరిస్తున్నారు. లేగదూడల అరుపులతో ఆకాశాన ఉదయ భానుడుపక్రమిస్తున్న సంగతి తెలిపి, ఇంటి పనులు త్వరత్వరగా ముగించుకోవాలను కొంటున్నారు పుర జనులు. కొత్త చీరలను కట్టుకున్న యువతులు సిగలకు చుట్టుకున్న బట్టల్ని తీసీ మల్లె చెండుల్ని తురుము కుంటున్నారు. కళ్ళకు కాటుక, చెంపలకు లక్కు, నుదిటిపై తిలకాన్ని దిద్దుకొంటూ అద్దంలో ఒద్దికగా చూచుకొంటూ, మైమరచి పోతున్నారు. కొండవీటి సుందరీనుణులు, యువకులు తెల్లని వస్ర్తాలు ధరించి ఈలపాగాలు చుట్టుకొని మెడలో ముత్యాల వారాలు, ముంజేతులకు నుల్లెమాలలను అలంకరించుకొని యువతులతో పోటీ పడుతున్నారు. తెలియని ఆనందంతో ఆ గడపా ఈ గడపా తిరుగుతున్న బాలబాలికల కేరింతలు ఏదో పండుగ సంబరాన్ని తలపిస్తున్నాయి.

అంతణురంలో వింత అలంకరణలతో, ద్వారాలకు తోరణాలతో, నేలంతా ముగ్గులతో కొత్త అందాల్ని సంతరించుకొని, రాజధాని ముస్తాబైంది. రాజును మేల్కొలుపు గీతాలతో నిద్రలేపారు. చెలికత్తెల అందెల సవ్వడికి రాణి సైతం మేల్కొంది. వందిమాగధులు పొగడ్తలు కురిపిస్తుండగా రాజూ, రాణీ తమ తమ స్నాన గృహాలకు చేరుకున్నారు. పన్నీరు, అగరు, చందనం, మందార పూలను, పాఠసీ దేశాల నుంచి

రశ

తెప్పించిన పరిమళ ట్రవ్యాన్ని మేళవించిన నీటితో స్నానం చేయించారు. కేశాలంకరణ, వస్త్రాలంకరణ, తరువాత చర్మ సౌందర్యాన్ని ఇనుమడించే సుగంధ ద్రవ్యాలనుపూసి బయటికి రావడానికి సీద్ధంచేశారు.

నిన్నటి రోజున కొండవీటికి చేరిన చుట్టాలు సైతం కొత్త బట్టలతో మెరిసి పోతున్నారు. బాల సూర్యుడు బారెడు పైకి లేచాడు. ఒక్కసారిగా ఊరంతా కదలిక. రాజమందిరం నుంచి కదిలిన సేవకులు, పరివారం, ఏనుగులు, గుళ్టూలు బారులు తీరి బయటికీ రానడంతో వాటి వెనుక దండనాయకుడు, వువీ (ప్రఛాని కాటయవేముడు, తరువాత తెల్లని వస్త్రాలతో అలంకరించిన ఏనుగుపై అంబారీలో కొండవీటి ప్రభువు కుమారగిరిరెడ్డి, అతని పట్టపురాణి. అంతే వాసులు ఉమ్మడిగా సందడితో కోట ద్వారం నుంచి ప్రవాహమై బయటకి వస్తుండగా నగర వాసులు వరుసల్లో వారిని అనుసరిస్తుంటే ఉత్సవ కుతూహలం, పండుగ సంబరం, మూడేళ్ళ పాపనుండి పండు ముదుసలి వరకూ ఆనందం పొంగి పొర్గుతుండగా బయలు దేరారు. అది వసంతోత్సవ ప్రారంభ సన్నివేశం. దేశం నలుమూలల నుండి వచ్చిన జనపదుల సమావేశం, వసంతోత్సవ వేడుకలకు అలా అంతః పురంతోపాటు నగరజన సందోహం కూడా సమాయత్తమైనాయి,

వసంతోత్సవాలను పునరుద్ధరించి, ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన జనం మీదికి స్వయంగా కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలనూ, కర్పూర కళికలను వెదజల్లి ఆనందించిన అనవేమారెడ్డిని ' ఘనసార కస్తూరికాది వస్తు విస్తార విరవితాపూర్వ వసంత వివారి అనీ, 'కర్పూర వసంత రాయలు నీ జనం కొనియాడారు. వసంతోత్సవాన్ని వైత మాసంలో జరుపుకోవడం చేత వైత్రోత్సవమనీ, మదనుని పూజించడం చేత వమదనోత్సవవునవి, రంగులు చల్లుకొని ఉల్లాసంగా పండుగ చేసుకోవడంతో హాలికోత్సవమనీ అంటారు. వైత్రమాసంలో వసంతాగమన సందర్భంగా జరుపుకొనే వసంతోత్సవాల గురించి కాళిదాసు శాకుంతలం, వాత్స్యాయనుని కామ సూత్రాలు, ధర్మ సింధు, నిర్ణయసింధు, భోజుని రత్నావళి, హేమాద్రివ్రత ఖండం, ఎజ్జన నృసింహపురాణం, శ్రీనాథుని హరవిలాసం, భీమేశ్వరపురాణం, కాటయవేముని కుమారగిరి రాజీయం, తెనాలి రామకృష్ణుని పారిజాతాపహరణం, కొణవిగోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనే కావ్య, ప్రబంధాల్లో ఎన్నో వివరాలున్నాయి.

35 అనవేముని తరువాత అంతటి భారీగా ఉత్సవాలను జురిపిన కుమారగిరి రెడ్డికి అపచి తిప్పయశెట్టి ఎంతగానో సహకరించాడు. నౌకా వ్యాపార దక్షుడైన తిప్పయ బర్మా నుండి పర్షియా వరకూ సముద్ర వ్యాపారం చేస్తూ , అక్కడ లభించే సుగంధ పరిమళ (ద్రవ్యాలను సేకరించి కొండవీటి వసంతోత్సవాల సందర్భంగా కుమార గిరికి ప్రతి ఏటా అందించేవాడు. వసంతోత్సవాల పట్ల ఆసక్తిగల తిప్పయను సుగంధ ఖాండాగార అధ్యక్షునిగా నియమించాడు కుమారగిరిరెడ్డి,

అ రోజు ఉత్సవాలకు పంజాబు నుండి హీామము, సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, పాదరసం, చందనాగరులు, సింహళము నుండి ముత్యాలు, గంధం, సింధూరాలను, గోవానుండి సంకు మదాన్ని, భూటాన్‌ దేశం నుండి కస్తూరి, చీనా నుండి అంబరాలు, తరుశిగా నుండి సుగంధ ద్రవ్యాలు, సిరియా నుండి పరిమళ ద్రవ్యాలు, తన సొంత నౌకల్లో తెచ్చి వసంతోత్సవాల్లో పాల్గొని 'వసంతరాయ' బిరుదును పొందాడు తిపయ శెట్టి. అతని ఉదారత్వానికి, కళాభిమానానికి ముగ్దుడైన శ్రీనాధుడు తన హరవిలాసాన్ని అతనికే అంకిత మిచ్చాడు.

అంబారీలోని కస్తూరి నౌదిసుగంధ ద్రవ్యాన్ని చేతినిండా తీసుకుని చుట్టూ అనుసరిస్తున్న ప్రజానీకంపై విసరగా, మహదానంద భరితుడై ఉప్పాంగిపోతున్నారు. మోదుగుపూల రపాన్ని, సీంధూరాన్ని, రంగురంగుల నీటిలో కలిపి తయారుచేసిన వసంతాన్ని చలకోవడానికి తవుతోపాటు బిందెలనూ, పిచుకారీలను తెచ్చుకొంటున్నారు. కొందరు యువకులు ఎవరొపై చల్లాలో వా 6ని అనుసరిస్తూ మెల్ల మెల్లగా ఊరేగింపులో ముందుకు సాగుతున్నారు. రోజూరాజు కనరాడవేమో పూబంతులు ధరించిన యౌవనవతులు, మేడలపైనుంచి, కిటికీలు, తలుపుల సందుల నుంచి ఓరకంటితో ఓసారి చూసి మురిసిపోతూ ఊరించే అతని అందచందాలను వర్జించుకొంటున్నారు. పెళ్లైన స్త్రీలు కూడా ఆతురతతో అతన్ని అలకించడం భర్తలకు కోపం తెప్పించింది.

నదిలా పాగుతున్న ఆ ఊరేగింపు నగరం వెలవల నిర్మించిన ఉద్యాన వనాన్ని సమీపించింది. వనం మధ్యలో వేదిక, నాలుగు వైపులా అరటి బోదెలను స్తంభాలుగా నిలబెట్టి పైన మామిడిచిగుర్లు, పూలు, తీగలతో అలంకరించారు. వేదిక మధ్యలో హేమాద్రి తన వ్రతఖండంలో' చెప్పినట్లు మన్మధ, వినాయక, శివ, వసంత, అప్సరసల

36

విగ్రహాలనుంచారు. అందంగా అలంకరించారు. చందన, వుష్ఫాలతో పూజారులు మంత్రాలు వల్లిస్తూ పూజిస్తున్నారు. వేదిక చుట్టూ నృత్త, గీత, వాద్యాలతో కూడిన మదన పూజా కార్యక్రమం మొదలైంది.

రాజు అసీనుడై వచ్చిన ఏనుగు వేదిక ముందు మోకరిల్లింది. భటులు భద్రాసనాన్ని తీసుకు వచ్చారు. ఉత్తరీయాన్ని సవరించుకొని, కుడికాలు ముందు మోపి, రాణికి తనచేయి నిచ్చి, దిగిన వెంటనే మంగళ వాద్యాలు మార్మోగాయి. వంది మాగధులు చిందులతో రాజు కీర్తిని దిగంతాలకు పాకేట్లు పాడారు. నర్తకీమణులు వివిధ భంగిమలతో రాజు దృష్టి నాకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. గాయకులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ “వసంత” రాగాన్నాలపిస్తున్నారు. పల్లె ప్రజలు వెల్లి విరిసిన అనంద డోలికల్లో ఓలలాడుతున్నారు. నగర వాసులు కాళ్ళూ, కళ్ళూ ఆడిస్తూ ఆనందిస్తున్నారు. ఊరంతా సంశక్రాంతిలా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వాద్య ప్రకంపనాలకు వులకితుడైనాడు కొమరగిరొరెడ్డి. అతని ముఖంలోని ఆనంద పారవశ్యాన్ని గమనించిన రాణి తాను కూడా పులకించి పోయింది. ఒక్కసారి ఈల పంకించి చూచిన రాజుకు అశేష జన సమూహం ఓ సముద్రంలా భాసిల్లీంది. తెల్లని, ఎర్రని, వచ్చని, తలపాగాలతో వనమంతా నిండిపోయింది. అక్కడక్కడా బృందగానాలు , పల్లెపదాలు, కోలాటాలు, చెక్కభజనలు జనాన్ని ఆకట్టుకొంటున్న దృళ్యాలు అతన్ని మరింత అనంద పరుస్తున్నాయి. తన వెంట ఉను కాటయవేముని దగ్గరగా పలుచుకొని అంతాకలియ జూపాడు. ఇంతటి ఉత్సవవేడుకలకు నీవే కారకుడవన్నాడు. రాజ్య భారాన్ని పూర్తిగా తన బావమరిది, వ్రధానీ కూడా అయిన కాటయ వేమారెడ్డికి అప్పగించి తాను లలితకళల్ని ఆదరించి, కవుల, గాయకులు, నర్తక, నర్తకీమణులతో కొలువు తీరడానికి వీలు కలగటానికి అతడే కారణమని మదిలో తలచుకొన్నాడు.

పూజలు ముగుస్తున్నట్లు భజంత్రీలు వేగం వుంజుకోవడంతో (ప్రత్యేకంగా తెచ్చిన సుగంధ ద్రవ్యాలు, పూలు, చందనం, అగరు, బిందెలతో తెచ్చిన వసంతోదకాన్ని పూజూరులకిచ్చి తాను ఆ వేదిక ముందు అసీనుడైనాడు. వేదోక్త మంత్రాలతో పూజను కొనసాగించారు. రొజూ, రాణీ, ప్రధానీ, తిప్పయశెట్టి లేవి వేదికను సమీపించి దేవతలందరికీ కానుకలను సమర్పించి, వుదనుని ప్రత్యేకంగా పూజించి నమస్కరించడంతో పూజ ముగిసింది. తన ప్రజలను కలుసుకోవాలనుకొన్నాడు.

్ర్ర7

కణాల్లో ఆ వార్త వనవుంతా వ్యాపించింది. రాజుతో ముచ్చటించే భాగ్యం కలుగుతుందేమోనని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ. తనవెంట రాణీ, అవచి తిప్పయశెట్టి, సుగంధ ద్రవ్యాలను తలపై మోసుకొస్తున్న భటులు రాగా ముందుకు సాగాడు వసంతరాయలు. అటువైపూ, ఇటు వైపూ బారులు తీరిన జనం పైకి కర్పూర కళికల్ని వెదజల్లుతూ వారి కేరింతలు, ఆనందపు పరవళ్ళ మధ్య వనమంతా కలియ దిరిగాడు. 'కర్పూర ఖండాలను వెదజల్లుతూ దిక్కులనే నవ వధువుల ముఖాలను వసంత రాయలు అలంకరించాడని, సమకాలీన సాహిత్యం వివరిస్తుంది. ఆ రోజు కవులకు, గాయకులకు, ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన (గ్రామీణులకు చేతికందిన ధనాన్ని ఆనందంగా పంచిపెట్టాడు. అవచి తిప్పయ శెట్టిని చూచి పరవళుడైన కుమారగిరి తిప్పయ భుజుం తట్టి మెచ్చుకోలుగా దరహాసాన్ని చిందించాడు. యువతీ యువకులు ఒకరినొకరు చూచుకొంటూ చిరునవ్వులు చిందించుకొంటున్నారు. గుణగుణాలను, వసంతోత్సవ కౌతుకాన్ని గుర్తించిన తి వయకు కుమారగిరి రాచ చివ్నాలనిచ్చి గౌరవించాడు. తను స్వయంగా కవి. నాట్యశాస్త్ర ప్రవీణుడు. వసంత రాజీయమనే నాట్య శాస్తం రచించగా, తన మంత్రి కాటయ చేముడు కాళిదాసు నాటకత్రయానికి వ్యాఖ్యానాలను రచించిన పండితుడు. సాహితీవేత్త. బావ, బావమరుదుల ఆలోచనా సమాగమ ఫలితంగా ఆ రోజు '్రత్యేక నాట్య ప్రదర్శన ఏర్పాటుచేశారు. కుమారగిరిని, తానురాసిన ' వసంతరాజీయం లోని వివిధ అంశాలను శదర్శిస్తున్న ఓ నర్తకి ఆకర్షించింది. తదేకంగా చూస్తున్నాడు రాజు. రాజు తనయందే దృష్టిని నిలిపాడని తెలుసుకొన్న ఆ నర్తకి ఆసక్తిగా, అభినయ యుక్తంగా వివిధ 'ప్రశ్రియల్ని ప్రదర్శిస్తూ మరింత ఆకర్షితురాలైంది. అమె ముగ్ద మనోహర రూవ లావణ్యానికి, హస్త ముద్రల ప్రదర్శనకూ పరవళుడైనాడు. భావ ప్రకంపనలకు రూపు రేఖలు కల్పిస్తున్న ఆమె సుందర సౌకుమార్యం మరింత ఆకట్టుకొంది. ఆ యౌవన ఎవరో తెలుసు కోవాలనుకొన్నాడు. లాస్య, భావ. అభినయ '్రకటనా (ప్రతిభను కొనియాడాలనుకొన్నాడు. పరవళుడైన తనను, పరికించి చూస్తున్న కాటయ వేముని కళ్ళతో పైగచేశాడు. రాజా అజ్రగా భావించిన కాటయ దగ్గర చేరగా, ఆ నర్తకి ఎవరని అడిగాడు. వాట్యశా;న్హ) విదుషీమణి, లలనామణి “లకుమ” అని మెల్లగా చెప్పగా, వసంతరాయని హృదయాంతరాళం నుంచి “లకుమి, “లకుమ' అని ప్రకంపనలు ప్రారంభమైనాయి.

కొండవీటి రాజనర్తకి లకుమ

అందమైన యువతీ యువకులతో ఉద్యానవనమంతా నిండి ఉంది. గోపికా జనంతో నిండిపోయిన బృందావనంలా తోచింది. నాట్యానికి, వాద్యగాత్రానికి పరవశులైన కాంతలు మురళి మోగిస్తున్న కృష్ణుడు ఎక్కడెక్కడా అని ఆదుర్దాగా ముందూ వెనుకా పరికించి చూస్తున్నారు. నచ్చి మనసిచ్చిన వరుని కోసం నేనిక్కడ, నేనిక్కడ అని సైగతో మూగబాసలు చేస్తున్నారు! వయసు కాంతలు. ఒకరికొరకు మరొకరు, ఇంకొకరికొరకు వేరొకరు అన్నట్లు ఒళ్ళంతా కళ్ళుచేసుకొని వనమంతా కలియ చూస్తున్నారు. రతీమన్మధుల జంటల పంటపాలమా అన్నట్లు అలంకృతమైందా నాడు కొండవీడు.

తదేకంగా తన్మయుడై ఆమె వంకే చూస్తున్న రాజును ఓరకంటితో రాణి గమనిస్తూనే ఉంది. అంతవరకూ 'లకుమూ' నాబ్యానికి లోలమైనరాణి మది చివుక్కు మంది. రేడు నా వాడు కాడేమో నన్న భయంతో కాటయ వేముని వంక చూచింది. రాజా ఉన్మత్త ఫ్టితిని, రాణి మానసీక పరిస్థితిని గమనించిన వేముడు నేనున్నాగా అన్న భరోసాతో తల పక్కకు తిప్పుకున్నా చిరునవ్వు తొణికిసలాడే అమె పెదవులపై చంద్రిక జారినట్టుగా గోచరించింది. ఇది చూస్తున్న ప్రజలకు, లకుమ నాట్య విన్యాస లాస్య చంద్రికల కాంతి పుంజములా (ప్రేక్షకులను పరవళుల్ని చేస్తోంది. నట్టు వాంగ శభావితమైన లకుము యాంత్రికంగా ఆడుతోంది. వాద్య, గాయక శిభామలులు మమేకమై రాజును మెప్పించాలని తమ కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు.

మన్మధ మనస్కుడైన కుమారగిఠ చూపులు, నర్తకి అభినయ చాతుర్యంపై వాలాయి. నర్తకి రాజువంకే చూస్తూ అతవి చూపులకు నిశ్చేష్టయై లిప్తకాలం మంత్రించినట్లు ఊరకుంది. వాద్యాలు పైతం మూగవోయి నిశ్శబ్దంగా మిన్నకున్నాయి అక్షణం. కొండవీటి రేడు రతీరూవ చంచలితయైన 'లకుమిను తదేకంగా చూస్తూనే ఉన్నాడు. అప్రయళ్న నిళ్శబ్దానికి సభ స్థాణువైపోయింది. గోపబాలుని మురళీ గానానికి లీనమైన బృందావనిలా, వెన్నెల్లో మెల్లమెల్లగా జాలువారుతున్న మందాకినిలా ఉంది. ఎక్కడ నుండో సన్నగా వినిపిస్తున్న వేణుగానం లకుమును తన్మయినిచేసింది. తాను రాధా, తనువు బాధగా తోచిన ఆమెకు ఎదురుగా ఆసీనుడైన రాజు యదురాజుగా తోచాడు. తన నాకర్షించిన శందనపు బొమ్మ, అర్దవికసిత పూరెమ్మ తనదైతే

ంంి

బావుండనిపీంచింది.

ఒకరినాకరు చూచుకొంటూ ఒకరి కొరకు మరొకరన్నట్ళు నిశ్చేష్టులైనారు. నాట్యానికి పరవళుడైన కుమారగిరి అనందవరవశుడై మెడలోని వారాన్ని తీసి ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకొని వేదిక సమీపిస్తుంటే వినమ్రంగా ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్న లకువు తలను వంచింది. రాజు తన అందమైన చేతులతో ముత్యాలదండను ఆమె మెడనిండా వేసి చిరునవ్వు చిలికించగా కనులు తిప్పుతూ ఆ జవ్వని వళ్ళంతా పులకించింది. కళాకారులను ఉచిత రీతిన సత్కరించే రాజు రస హృదయానికి ఉప్పాంగిన రాణి ముఖంలో మరుక్షణమే అసహనం తొణికిసలాడింది.

మృదంగం ముక్తాయింపుతో సభ సద్దు మణి గింది. ఒక్కరాక్కరే లేవి ఉద్యాన ఉపాంత మార్గముగుండా బయటకు వెళుతున్నారు. అందరూ వెళుతున్నారు. రాజు లేచాడు. కాటయ వేముడు, రాణీ అతని ననుసరించారు. అడుగు ముందుకు వేయని రాజువాంక పరికించి చూచి చేయి చాచి దోవచూపాడు కాటయ. మేలిముసుగు కప్పుకొని విభుని వైపు చూచింది రాణి. రాజు మాత్రం దెవినుంచి దిగి వచ్చిన అప్సర కాంత లకుమ యందే దృష్టిని నిలపటంతో రాణికి మనస్సు చివుక్కు మంది. అసహనం అలగా లేచింది. సవినయంగా మన్మధ వివశమైన లకుమ తలవంచుకొని వేదిక దిగి పూలబాటకు పక్కగా నిలుచుండిపోయింది. అప్రయత్నంగా కుమారగిరి చేయి లకుము భుజాన్ని తాకటోయింది. గమనించిన బావమరిది కర్పూర కళికల్ని, వికసిత మల్లికల్ని అ చేతికందించడంతో తేరుకున్న రాజు వాటిని నర్తకిపై విసరి వసంతోత్సవాన్ని ఆ నాటికి ముగించి రాజునుందిరం చేరుకున్నాడు.

ఎన్నడూ లేనట్లు అనాటి రాత్రి గంభీరంగా తోచింది. హంస తూలికా తల్పం పైన క్షణంలో నిద్రలోకిజారుకునే రాజుకు క్షణమొక యుగమైంది. అలోచనలతో ఉక్కిరి బిక్కిరైన తనకు ఎంతకూ నిద్దుర రానందుకు పక్కకు తిరిగాడు. లాభం లేకపోయింది. మన్మధ తాపం తన పాలిట శాపమైంది. ఇటు దిరిగాడు. జాలికూడా లేవి జాబిల్లి వెక్కిరించి వెటకారం చేసింది. అటూ ఇటూ పొరలుతున్న రాజును గమనించింది రాణి. లకుమను సమీపించి, ఊహా జగత్తులో విహరిస్తున్న అతనికి తన పక్క మీదున్న రాణి స్మృతి పథంలో లేదు.

అది వెన్నెల విరబూసిన ఉద్యానవనం. మల్లెలు విచ్చుకొని మలయ మారుతంతో కలసి కబుర్లు చెప్తుకొంటున్సు వేళు తనమనసు కోరుకునే అప్పర.

త0

తనువంతా నిండిపోయిన ఊర్వశి కన్నుల్లో కనుసన్నల్లో కవ్విస్తున్న సుకుమార మనోహర రూపలావణ్య సుందరి అటుగా వెళ్లిన అలికిడి, పొదపాదలో వెతికాడు. లత లతనూ పలకరించాడు. నీటి మడుగు నడిగాడు. అమె ఎటు వెళ్ళిందని, తన నిరీక్షణలో అనుక్షణం ఉత్కంఠత, కనిపీస్తుందేమోననే ఆత్రుత. దూరంగా నీలమణికాంత శిలా వినిర్మిత మందిర మధ్యప్రంగా భాసిల్లిందో భామినీ రూపం. పరుగులెత్తి పరికించాడు. ఆనందంతో పులకించాడు. ఆమె ముమ్మూర్తులా తన మనో ఫలకంపై లీఖితమైన సౌందర్య ప్రతిమ, లకుమ.

ఇక్కడవాడలో నర్తకీమణి ఇంటిలో కూడా అవతరించింది మౌనం. ఈననాట్యాన్ని తదేకంగా చూచి మైవురచిన చ(క్రవర్తి తనచేతుల మీదుగా మెడకలంకరించిన వారాన్ని తాకుతూ అ క్షణాన్ని మళ్ళీమళ్ళీ గుర్తు చేసుకొంటూ మదినిండా నిండిపోయిన ఆ మన్మధ మూర్తి రూపాన్ని అలవోకగా తిలకిస్తూ ఏదో లోకంలో విహరిస్తుంది లకుము.

విద్దురరావి ఆపొద్దు కంటకప్రాయంగా తోచింది. లీలగా సాగుతున్న మురలీ గొనావికి లోలయైై తాను కూడా దూరతీరాలకు పయనిస్తోంది. కొండల్లో, కొనల్లో లోయల్లో, వాగుల్లో వనాల్లో, వంకల్లో ఎక్కడ చూవినా అపరమన్మధ మూర్తి కుమారగిరి రూపమే. తన నెంతగానో అభిమానించే రాజు ఆ రోజు హారాన్ని బహూకరించాడు. శేష జీవితం ఆ అమృత మూర్తికి అంకితమవ్వాలనీ, అనుక్షణం అ లాకణికుని ఎదుట నృత్త, గీతికలతో కాలక్షేపం చేయాలని కోరుకొంటుంది లకుమాదెివి. ఇద్దరి మనసులూ ఒక్కటైనాయి. ఇద్దరి భావాలూ పరస్పరం ముచ్చటించు కొంటున్నాయి, ఇచ్చగించుకొంటున్నాయి.

ఇద్దరూ నిద్దరకుపక్రమించారు. అక్కడ రాజమందిరంలొ ఒకరు. ఇక్కడ నర్తకీమణి ముఖశాలలో ఇంకొకరు. కలల అలలపై పయనించిన ఇద్దరూ తెల్లవారగానే ఊహాల్లోంచి ఉలిక్కిపడి లేచారు.

కువూరగీరిరెడ్డి కొండవీటి సభను అలంకరించాడు. మంత్రులు, దండనాయకులు, సాహితీ మూర్తులు, రాజుకుటుంబీకులు తమ తమ ఆసనాల్లో ఉన్నారు. అది (ప్రత్యేక సమావేశం కావచాన రాజు ఏ విషయాన్ని వ్రకటిస్తాడోనని ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. రాజు తలవంకించి కాటయవేముని వంక చూశాడు. ఉదయాన్సే తనకు పంపిన వర్తమానం మదిలో మెదిలింది కాటయవేమునికి. తొము

శ

ముచ్చటించుకొన్న లకుమూ దేవి గుణగణాలను తను సభకు (ప్రస్తావించి ఆమెను రాజనర్తకీగా నియమించటానికి రాజు తీర్మానించాడవి ప్రకటించాడు.

సదస్యులతో సభ నిండుగా ఉంది. చాన్నాళ్ళ తరువాత కొలువు దీరిన కుమూరగిరి రత్న ఖచితవుణి ముకుటాన్ని ధరించి, వజ్రసింవోసనంపై ఠీవిగా కూర్చున్నాడు. అందాలొల్‌కే ఇద్దరు సుందరాంగులు అటూ ఇటూ వింజామరలు వీస్తుండగా, ఆ చల్లగాలి రాజు మదిలో, మరికొద్ది నిముషాల్లో తన కొలువులో అస్ట్రాన నర్తకిగా రాబోయే '“లకుమును తలపింపజేసింది. సభను కలియ జూళాడు. అఆహూతులంతా ఆనందాతిశయంతో తన నిర్ణయాన్ని అంగీకరిస్తూ ప్రకటన కొరకు నిరీక్షిస్తున్నల్లు తోచింది. వంది మాగధులు రాజాను స్తుతించి, ప్రశంసించారు. వేదళ్ళాన్హ్ర, పారంగతులెన బ్రాహ్మణులు మంత్రోచ్చాటనలు గావించారు.

ద్రళువు విర్ణయం ప్రకారం, వరిచారికలు వెంటరాగా చక్కగా అలంకరించిన సౌందర్యరాశి లకుమను సాదరంగా ఆహ్వానించాడు దండనాధుడైన కాటయ వేముడు. తనమదిలో మెదిలిన అసహనాన్ని అణలి పెట్టుకొంటూ, చిరుదరహాసంతో రాజువంక చూశాడు. ఆతని దృష్టి మాత్రం లకుముపైనే ఉందని గమనించి, “ప్రభూ” అని పలకరించగా, పులకితుడైన వసంతరాయడు మంగళవాద్యాలు, వేద ఘోష్క పెద్దల అశ్వీరచనాల నడుము బ్రభుత్వ నిర్ణయాన్ని ద్రకటించమని ఆదేశించాడు.

రాజాకు ముందుగా కూర్చున్న పట్టమహిషినభకు అలంకారంగా ఉన్నా అమె ముఖంలో చోటుచేసుకున్న గాంభీర్యం, దాని వెనుక అంతర్లీనమై, అవ్యక్తమైన ఆమె బాధను కూడా గమనించక పోలేదు. ప్రభుత్వ పరంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాణీ కూడా ఆమోదిెంచిందని భావించాడు కుమారగిరి. తాను మాత్రం ఉల్లాసంగా, పరససాత్రూట్టుగా వెలిగిపోతున్నాడు.

సంగీత, నృత్య శాస్త్రాల్లో ప్రావీణ్యము కలిగి తన మనోభావాలకు తగినట్లు ఆడీ, పాడగల నర్హకి, రాజునర్తకిగా తన కొలువులో నెలవౌతున్నందుకు అతని అనందం అవధులు దాటింది. ప్రతిభకు పట్టం కట్టే భాగ్యం కలిగినందుకు ఎంతగానో సంబంరపడ్డాడు. ఇంకేవో ఊహాలోకాల్లో విహరిస్తున్న రాజుకు కాటయ అందించిన సువర్హఫలకం, పట్టు పీతాంబరములో నున్న * పట్టము లను అందుకొని, సభాముఖంగా లకువాదేవికి బహూకరించాడు. అప్సర శిరోమణిగా భాసిల్లుతూ, సవినయంగా

శత2

అవనత శిరస్సుతొ కొండవీటి సామ్రాట్టుకు నమస్కరించింది. ఆ క్షణంలొ ఆమె కనులు భాష్ప్రజలంతో నిండిపోయాయి. మరో మారు సభకు కూడా నమస్కరించి తన కృతజ్ఞతా పూర్వక ఆనందాన్ని వ్యక్తపరిచింది. కరతాళ ధ్వనుల మధ్య మందహాసంతో తన ఆసనంలో కూర్చుంది లకువు. కుమారగిరి తనువులోని అణువణువూ సంతోషంతో పులకించి పోయింది. గౌరవ సూచకంగా అందరూ లేచి నిల్చున్నారు. స్వస్తి వచనాలతోను, మంగళాశీస్సులతోను రాజనర్తకిగా లకుము నియామకోత్సవం ముగిసింది. రాజు మదిలో ఉత్సాహం, ఉత్తుంగ తరంగంలా లేచింది.

కుమూరగీరికి నమస్కరించినపుడెల్లా, లకుమ కాళ్ళకు గట్టెకట్టి అతని నుత్తేజపరిచింది. లక్షణ యుతంగా నర్తిస్తున్న లకుము పట్ల రాజుకు మోజు పెరిగింది. అభిమానం అనురాగంగా మారింది.

సరసుడు, కళాభిజ్ఞుడూ నైన కుమారగిరి కొండవీటి నగరంలొ ఎత్తైన ప్రాసాదములలో మేలైన పుష్పక జాతికి చెందిన గృహరాజసౌధాన్ని నిర్మెంచాడు. ప్రియురాళ్ళతో విహరించడానికి కేలీరధాలను, క్రీడా సరస్సులను కూడా నిర్మించాడు. వసంతోత్సవ వేడుకలను ప్రజల ఉత్సవాలుగా కొనసాగించాడు. రాజనర్తకి హొదాలో నివసించడానికి లకుమకు పలు అంతస్తుల భవంతిని కేబాయించాడు. సేవకులను నియమించాడు, వస్తు, వాహన, గాయక, వాద్య గొండ్రను కూడా సమకూర్చాడు.

రాజు తన కోరికను పైకి వెల్లడించకున్నా అతని విరహ తప్తహృదయాన్నిః అర్హంచేసుకొన్నా, లకుమ మాత్రం తనపరిధికి లొబడే మసలుకొంటొంది. నర్తనశాలలో. ఆమె నాట్యానికి స్పందిస్తూ, కానుకల నందిస్తూ అనేక బహువూనాలను పకటించేవాడు. రాజమందిరంలోనూ, కొండవీటి ఉద్యానవనాల్లోనూ కేలీగ్భవోల్లో నూ విహరించే స్వేచ్చ ఉన్నా, తనకలలరాణి, అంతరంగ వాణి, నర్తకీమణి లకుముతో కొన్నాళ్ళపాటు గడపటానికి రాజధానికి దూరంగా వెళ్ళాలనుకున్నాడు.

తీర్రయాత్రలపై అహోబిలాన్ని సందర్శించి, నరసింహుని పూజించాలను కొంటున్నట్లు తెలిపిన కుమారగిరికి తగు ఏర్పాట్లను గావించాడు అతని మనసెరిగిన కాటయ వేమారెడ్డి. కాటయ వేముని ద్వారా విషయం తెలుసుకున్న రాణి కెంగగా ఉంది. తనదైనదేదో దూరమౌతున్నట్లు భావించింది. అహోబిల సోపాన నిర్మాత, తన తాత ప్రోలయ వేముని బౌదార్యాన్ని, ఆతడు చేపట్టిన పరహిత, (ప్రజూ సంక్షేమ

తప

కార్యక్రమాలను కనులారా చూడాలను కొంటున్నట్టు తెలిపాడు కుమారగిరి, దుర్గమారణ్యం గుండా ప్రయాణించడం కష్టమని, ఈ ఒక్కసారికి తానొక్కణ్ణి వెళ్తున్నానని ఆమెను బుజ్జగిస్తూ చెప్పాడు. రెండు మూడు క్షణాలు మౌనంగా ఉన్న రాణి, తగు భద్రతా ఏర్పాట్లతో వెళ్ళి త్వరగా తిరిగి రమ్మని ముకుళిత హస్తాలతో వీడుకోలు చెప్పింది.

చారుశిల్పానికి మారు రూపమన్నట్టు కొండవీటి తక్షకుల పనితనానికి మచ్చుతునకలుగా నిర్మించిన రెండు కేళలీరథాలను సిద్దపరిచారు. ఉద్యాన, ఉపాంత వనాలనుండి తెప్పించిన వివిధ పుష్పాలతో, లతలతో మాలకారులు అలంకరించారు. వసంతరాయని కిష్టమైన కర్పూరాది సుగంధ పరిమళాలను వెదజల్లారు. ఆవచి తిప్పయ విదేశాలనుంచి కుమారగిరి కోసం తెచ్చిన అగరు, జవ్వాది మొదలైన వాసన [ద్రవ్యాలను రధాల చుట్టూ కట్టిన రంగురంగుల యవనికలపై చల్లారు. ఆ రెండురథాలూ రతీ మన్మధుల పూల విమానాల్లా భాసిల్లాయి. తెల్లటి గుర్రాలను పూన్చి యాత్రకు సిద్దం చేశారు. అంతః పురంలో గుసగుసలు మొదలైనాయి. కుమారగిరి వెంట నర్తకి లకుము మాత్రమే వెళ్తుందనీ, రాణి కొండవీటే ఉంటుందని.

కేళలీరథాలు కొండవీటి నగర రాజువీధిన సాగిపోతున్నాయి. ఆ దృశ్యాన్ని పుర జనులు సౌధాగారాల్గోంచి తొంగితొంగి చూస్తున్నారు. రాజు కొరకు యువతులు, లకుమ కొరకు యువకులు పోటీపడి చూస్తున్నారు. రథం మధ్యలో రేడు పూ విలుకాడా అన్నట్లు కూర్చున్నాడు. వెనుక వస్తున్న రధాన్ని అందరూ కుతూహలంగా చూస్తున్నారు. అఆ రథం మధ్యలో రతీదేవిని పోలిన సుకుమార లావణ్యవతి లకుమాదేవి ఒద్రికగా కూర్చుంది. అందాన్ని రాశిగా పోసినట్లుంది. ధమ్మిళ్ళపు శిరోజాలంకరణ, లత్తుక దిద్రిన చెంపలు, చెవులకు స్పటికపు తమ్మెలు, మెడలో చంద్రహారాది సరాలు, ముంగురులలో తారలు, పాపటలో చూడామణి, నాటి అలంకార ప్రియత్వాన్ని తెలియజేస్తూ, ఆమె అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తున్నాయి.

చూపులతో మన్మధ తాపాన్ని రేకెత్తించే ముగ్ద మనోహర రూపం, ఊర్వశిని తలపించే లలనామణి, నర్తకీశిరోమణి లకుము నిజసొౌందర్యాన్ని చూచే భాగ్యం కలిగినందుకు ఆనందించిన కొండవీటి మగధీరులు, కుమారగిరికి ఆ సౌందర్యరాశి సౌంతమైనందుకు కొంచెం అసూయ పడ్డారు. పురవీధులు దాటి రెండు రథాలు

వశ దూరంగా వెళ్ళిపోయాయి. కొండవిటి నుండి దక్షిణంగా సాగింది ప్రయాణం. బ్రకృతి కాంత అందచందాలను కనులారా చూచిన లకుమ పులకించిపోయింది. చెట్టూ, లతలూ, పొదలూ వారిద్దరినీ ఉల్లాప పరిచాయి. ఆలయాన్ని సమీపించిన రాజు తన్మయంతో పులకితుడైనాడు. ప్రయాణంలో అలసిన రాజు, ఆ రోజు రాతినేలపై నిదురించాడు. ఇద్దరూ పావన భవనాశిజలపాతంలో స్నానంచేశారు. ప్రోలయ వేమారెడ్డి కట్టించిన మెట్లను ఒక్కొక్కటి ఎక్కుతూ అంతటి మహత్కార్యాన్నీ, యాత్రీకులకు సౌకర్యాన్ని కలిగించిన తనతాత గురించి లకుముకు వివరించాడు బ్రభువు తన పెదవులపై చిరుదరహాసంతో, ఇంతలో పూజా ద్రవ్యాలుంచిన పళ్ళేలను రాజుకు, లకుముకు అందించారు పరిచారికలు. ఆలయ స్థానాధిపతి పూర్ణ కుంభంతో స్వాగతమిచ్చాడు ఇద్దరికీ. పత్ర, చిత్ర తోరణాలతో ఆలయ ప్రాంగణమంతా అలంకరించారు. కర్పూర వసంతరాయల అంతరంగమెరిగిన అనుచరులు మండపంలో పరిమళ ద్రవ్యాలనుంచారు. అర్బన పూర్తికాగానే అర్భకుడందించిన హారతిని స్వీకరించి కొంచెం సేపు అక్కడే విశ్రాంతి తీసుకొన్నారు. ఆలయ దర్శన సందర్భంగా స్వామికీ, పూజారులకూ అనేక దానాలను ప్రకటించాడు కువూరగిరిరెడ్డి. (చెంచు) లవ్ష్మీనరసింహుల ఇతివృత్తాన్ని స్మరించుకొని తమ తమ విడిది గృహాలకు చేరుకున్నారు. వేరు వేరుచోట్ల విశ్రాంతి తీసుకొంటున్నారు రాజు, రాజనర్తకి. మధ్యాహ్నం భోజనం ముగించుకొని, లకువును చేరుకున్నాడు. పరిచారికలు పక్కకు తప్పుకొన్నారు.తన వునోభీష్టము సిద్దించి నందుకు రాజు ఎంతో అనంద భరితుడైనాడు. జీవితాంతం లకుమతో గడపాలనుకొంటున్నట్టు తెలిపాడు. రాజునర్తకీ వదవినిచ్చి సత్కరించిన విభునికి పాదాభి వందనం చేసింది. అది తన భాగ్యమనుకొంది. ఆ అందాల భరిణె రెండు భుజాలను పట్టుకొని అప్యాయంగా పైకి తీసుకొని కౌగలించుకున్నాడు. పక్క పక్కన కూర్చుని వీళ్ళిద్దరూ అరమరికల్లేని సంభాషణలు చేసుకున్నారు. మనసు విప్పి మాబ్లాడుకొన్నారు. అవధులెరుగని (ప్రేమను ప్రకటించు కొన్నారు. అలా సాయం సమయం వరకూ సాగిన వారి ప్రణయ కలాపాలు, సందెవేళ గుడిగంటల శబ్దంతో ఆగిపోయాయి. రాత్రికి తిరిగి సింహాచల క్షేత్రానికి పయనం కట్టాలి. ఏర్పాట్లను చూడమని సచివునితో చెప్పిన కుమారగిరికి, తమక్షిష్టదేవతయైైన అహోబిల నరసింహుని సన్నిధిలో రొజనర్తకి చేత నృత్యము చేయించి ఆ స్వామిని ప్రసన్నుని చేసుకోవాలనిపించింది.

తక్‌

లకువు కొద్దిసేపట్లో నృత్యాభినయానికి తగు అలంకరణ చేసుకొని సమాయత్తమైంది. నట్టువాంగం మొదలైంది. అహోబిలుని ఎదుట తన విద్యను థదర్శించడం ఒక మహదావకాశంగా భావించింది. ఎదురుగా రాజు ఆసీనుడు కాగా, లకుము ఆడింది. జానపదుల గుండెల్లో నిండిపోయిన చెంచిత నృత్యాన్ని ప్రదర్శించ నారంభించింది. వసంతరాయలు తదేకంగా చూస్తూ, ఆమెతో కలసి "నరహరిగా నర్హిస్తూన్నట్లు ఊహించుకొన్నాడు. నాట్యం పూర్తి కాగానే సింహాచలానికి వెళ్ళడానికి నరసింహుని వద్ద శెలవు తీసుకొన్నాడు. అహోబిలం నుండి కదిలిన రథాలు ఉత్తరంగా ప్రయాణించి కృష్ణా, గోదావరి నదులను దాచాయి. గోదావరి తీరమంతా పచ్చగా పొలాల్లో, ప్రకృతి కాంత పులకింతగా తోచింది. కోనసీమ కొబ్బరవెట్లు శిరస్సు వంచి స్వాగతమిస్తున్నాయి. ఆంధ్రదేశంలో ప్రసిద్ధి గాంచిన ద్రాకారామాన్ని దర్శించాలను కొన్నారిద్దరూ, లకుము, కుమారగిరులు భీమేశ్వర, మాణిక్యాంబలను దర్శించడానికి వచ్చారని తెలుసుకొన్న పురకాంతలూ, యువకులూ ఆరాటంతో వీధిలోకి వచ్చారు. రధాలను అనుసరించారు. రాజును చూడాలనే తలంపు నవ వధువులకూ, లకుమను తిలకించాలనే కోరిక కోడెగాండ్రకూ కలిగింది. ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు రావాలని పోటీ పడుతున్నారు. మునిగాళ్ళపై లేవి రాజును, రాజు నర్తకిని చూశారు.

అ అందాల భామినుల ముఖారవిందాలను పరికిస్తూ, పులకిస్తున్నాడు వసంతరాయలు. హావభావాలను స్రదర్శిస్తున్న ఆ కాంతలను ఉగాది వసంతోవ్సవాలకు రప్పించాలనుకొన్నాడు. లకుమ నృత్యాభినయాన్ని కనులారా చూసే భాగ్యం తమ కెప్పుడు కలుగుతుందోనని దాక్షారామ యువకులురక లేస్తున్నారు. ఆలయ (ప్రధాన ద్వారం గుండా ప్రాంగణంలోకి ప్రవేశించిన లకుము, కుమారగిరులు పరివార దేవుళ్ళకు ప్రణమిల్లారు. అతడు భీమేశుని దర్శించి, స్తుతించాడు. లయకారుని మాయలకు మైమరిచాడు. అప్పటికే వార్తతెలిసిన జాణలు లకుమ నాట్య విన్యాసాల్ని, అభినయ చాతుర్యాన్ని చూడాలనుకొని రాజనర్తకిని నాట్యమాడకోరారు. రాజుకూడా ఆడమన్నాడు. ఆగను సాంప్రదాయాలతో దైవ సాన్నిధ్యంలో అలయ నర్తకి నాట్యమాడాలేగానీ, రాజునర్తకికి ఆ అర్హత లేదంటుంది లకుమ. రాజాజ్లగా స్వీకరించి నాట్యమౌడాలని మళ్ళీ ఆదేశిస్తాడు. సర్వజగదారాధకుడైన పరమ శివుని ముందు. అహంకరించడం తగదని రాజును వేడుకొంది. మళ్ళీ మళ్ళీ ఆజ్ఞాపించాడు.

శ6్క

ఒక్కసారి స్పృతి పధంలోనున్న గతంలోకి వెళ్ళింది లకుము. తనతల్లి బాపట్ల భావనారాయణ స్వామి ఆలయ నర్తకీమణి. పల్లెను, తనను వదలి రాజనర్తకిగా వెళ్ళొద్దని వారించిన దృశ్యం కళ్ళ ముందు మెదలాడింది. కుమారగి8ి కొలువులో చేర్పించిన దోరపరెడ్డి మాటలకు ప్రభావితయ్లై తప్పిదాన్ని తలచుకొని కంట నీరు బెట్టుకాంది.

తన తల్లి దేవదాసిగా తనకు తాను ఆలయానికి అర్చించుకొన్న సాంప్రదాయశీల. తానో, భోగలాలసుడైన రాజును మెప్పించబానికి తన నాట్యాన్ని వదర్శించ ఒప్పుకొన్న ఊహాలోక విహారిణి. ఆ నాడు సేనాని వెంట కొండవీటికి బయలు దేరినపుడు, తన కోసం దాచి ఉంచిన మాంగల్యం కూడా చూపించింది. హోదాకోసం పొదా జీవితాన్ని కాదనుకొన్న తాను ఆటు రాజుమనసు నొప్పించలేక, దొక్షారామ ఆలయ నర్తకిని ఒప్పించలేక బాధపడింది. సాంప్రదాయం పట్ల లకుమకుగల గౌరవాన్ని గుర్తించిన రాజు సరిపుచ్చుకొన్నాడు. ఆ క్షణం నిళ్ళబ్దంగా ఫ్రంభించింది ఆలయ ప్రాంగణం.

తొలుత భీమేళునికి, తరువాత భూమీశునికి నమస్కరించటంతో సద్దుమణిగింది ఉత్కంఠత. లకుమ కాలీ గజ్జెలను స్పృశించి, అంతటి గొప్ప నర్తకిని దర్శించినందుకు తమ జన్మధన్యమైందని ఉప్పొంగి పోయారు ఆలయ నర్తకీమణులు. తనతండ్రి కాపయరెడ్డికి, మాణిక్యాంబలకు రెండు ఆఖండ దివ్వెలను కానుకగా సమర్పించింది లకుమ.

అలకతోనున్న చెలికాని చెంతచేరింది. రాజధిక్కారాన్ని మన్నించమంది. సమాధాన పడనిరాజును ఎలాగో ఒప్పించింది. గోదావరీతీరసైకత సీమలో తాను నర్తనమాడటానికి. ఆనంద పరవశుడైన రేడు చిటికెలో మునుపటి వాడయ్యాడు.

సింహాచలం దర్శించకనే కుమారగిరి కొండవీటికి చేరుకొన్నాడు. అనాడు కొండవీట వెల్లివిరిసిన వెన్నెలకాంతి పరిజనుల కళ్ళలో తొణికిసలాడింది సంబరాల సంక్రాంతి. సౌదాగ్రాలనుండి వడివడిగా దిగుతున్నారు యౌవ్వన వతులు. వారిననుసరిస్తున్నారు యువక మన్మధమతులు. ఎదురేగి స్వాగతించాడు కాటయ వేముడు. రాజు వెంటనడిచింది లకుము. దూరంగా నిల్చుండి చూస్తుండి పోయింది రాణి.

తీ

కొండవీట గుసగుసలు బయలు దేరాయి. రాజా, ప్రజాహితాన్ని మరచి, వేశ్యాలోలుడైనాడని, పట్టపురాణిని నిర్లక్ష్యం చేస్తూ, నాట్యగానాలతో కాలంవెళ్ళ దీస్తున్నాడని. ఇంకా అటు విజయనగర రాజుల కుతంత్రాలకు తోడు, అంతఃపురంలో అసంతృప్తి ఛాయలు పొడచూపుతున్నాయని.

వసంతరాయలు, పగలనక, రేయనక లకుమ నాట్యగత మనస్కుడై, తన ఊహల్లో కేరింతలు కొడుతున్న భంగిమలకు రూపకల్పనలు గావించాడు. నాట్యకళ పట్లు రాజుకున్న ఆదరణ, తనంటే అభిమానం వెలకట్టలేని లకుమ అతడు కో రినపుడెల్లు నాట్యం చేసింది. భావ ప్రకంపనలు వెల్ళువ కాగా, వసంత రాజీయాన్ని రచించాడు. తన మనోవాంఛ తీరిందని, జన్మకు సాఫల్యత చేకూరిందని తృప్తి పడ్డాడు కుమారగి6.

ప్రభువు పరకాంతా లోలుడై రాచవఎంర్యాదను కాలరాస్తున్నాడని కాటయవేముడు, మహారాణి బాధపడ్డారు. రాజును తిరిగి రొచకార్యాలవైపు మళ్ళించడానికి పథకం పన్నారు. మహారాణి, లకుమ చెంతకు చేరింది. రాజు, ప్రజల కొరకు రాజ్యం విడీచి వెళ్ళమని, తగు ఏర్పాట్లు చేస్తానని బతిమాలింది. తనకంటే కొండవీటి ప్రతిష్ట జనహితం ముఖ్యమని భావించిన లకుము అలాగేనని వాగ్దానం చేసింది. చెమ్మగిల్లిన కళ్ళను ఒత్తుకొని లకుమ మందిరంనుండి వెళ్ళిపోయింది రాణి. కొంచెం సేపు బిత్తరపోయింది నర్తకీమణి.

తాను లేని రాజా, రాజులేని తాను ఊహించలేకుంది ఆ చిత్రమైన పరిస్థితిని లకుమ. రాజుకు తన సౌభాగ్యం కంటే లక్షల మంది బాగోగులే ముఖ్యమనీ, అందుకు తన దేహ త్యాగమే ఉచితమనితోచింది లకుమకు. ఆలయ నర్తకినైన తనకు ఆస్టాన నర్తకిగా ఉన్నతమైన హోదా, స్థానం లభించాయి. రాజుతో కూడా ఎంతో కాలం సన్నిహితంగా గడిపింది. తృప్తిగా తనువు చాలొస్తే చరిత్రలో స్థానముంటుందని భావించింది. తనకు బాగా గుర్తు. రాజునర్తకిగా తన తల్లిని కలుసుకోవాలని బాపట్ల వెళ్ళింది. ఆభరణాలతో అలంకరించు కొని దాసదాస్‌ జనంతో, రాజపల్లకిలో వచ్చిన తనను చూచి తన తల్లి ఆనందంతో ఉప్పొంగి పోతుందనుకొంది. ఆలయం ముందర తనను గుండెల కత్తుకొంటుందని ఆశపడింది. సాంప్రదాయం పట్ల గౌ రవమున్న తన తల్లీ, ఒక నర్తకిగా ఆలయ గ్రవేశంచేస్తే తనకభ్యంతరం లేదనీ, ఆలయాన్ని వదిలి వెళ్ళిన లకుమ స్థానంలో మరొకరిని నియమించుకొన్నారని కబురు పంపింది. కనీసం తన

శ్రి

కోసం దాచిన మాంగల్యాన్నైనా ఇమ్మని ప్రాధేయపడింది. దాన్ని కూడా ఆమె పెంపుడు కూతురుకిచ్చిన సంగతి తెల్సి కుమిలిపోయింది. ధ్వజ స్తంభం వరకూ వచ్చిన తల్లిని దూరంనుంచే చూచి నమస్కరించింది. తనను మన్నించమని భావనారాయణుని వేడుకొని వెనుకకు వుళ్ళింది. కని పెంచిన తల్లిని కాదన్నందుకు తనకు ప్రాయశ్చిత్తంలేదని పించింది. అందుకే... ఈ కఠోర నిర్ణయం తీసుకుంది.

కేలీ గృహంలో ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్న టేనికి ఎదురుగా వచ్చిన లకుము వింతగా తోచిందా రోజు. రాజు ముఖంలో కూడా ఎందుకో ఆనందం తొలిగి, అందోళన దోబూచులాడులోంది. తెచ్చుకొన్న చిరునవ్వుతో ఆమె అభినయించింది. అప్పుడప్పుడూ ఆమె నడుమున బిగించుకొన్న వడ్డాణంలోని ఛురికను స్పృశిస్తుంది. రాజా ఆనందంలో మునిగి పోయాడు. నాట్యంలో హస్తాభినయం వతొక స్థాయికి చేరుకొంది. పరవశుడైన రాజా ఆనందంతో తలాడిస్తున్నాడు. లకుమకు మదిలో రాణికి తానిచ్చిన వాగ్దానం మెదిలింది. వేగంగా కదిలిస్తున్న ఒక హస్తంతో ఛురికను తీసీ తన కడుపులో గుచ్చుకొంది. రక్తపు చుక్కలు తన చెంపలపై బడటంతో తత్తర పడ్డరాజు చకీతుడై 'లకుమా, “లకుమౌ' అని పీలుస్తూ సమీపించాడు. నడుము చేతినుంచుకొని పదతాడనం చేస్తున్న నర్తకి కూలిపోయింది. మరు నిముషంలో బిత్తర చూపులతో రాయని ఒడిలో వాలిపోయింది. చివరిసారిగా లకువు 'ప్రభూ'* అన్న శబ్దం రాజును కలచివేసింది. ఒకరి కళ్ళలో మరొకరు నిలిచారు నిముషంపాటు, రెప్పపాటులో శ్వాస విడిచింది లకుమ. తనకలల రాణి, వలవుల విరిటోణి ఇక లేదని తెలీసీ విల విల లాడాడు రేడు. ముందుగానే ఊహించిన కాటయ వేముడు రాజును ఓదార్చాడు. వార్త విన్న రాణి, అసమాన ప్రజ్ఞాశాలి అకాల మరణానికి తాను కారణమని వగచి వగచి విలపించింది. జనహితంగా, ఆ నర్తకి పేరు కొండవీట చిరస్థాయిగా ఉంటుందని ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దించింది మవారాణి.

వసంతోత్సవాలను పునరుద్దరించి, సంగీత, నృత్య, సాహిత్య సదస్సులలో ఉల్లాసంగా వినోదంగా కాలం గడుపుతున్న కుమారగిరి ఈ విషాదఘడియలను ఊహించవైనా లేదు. తన స్వవ్నం కళ్ళముందు కల్లగా మారింది. గృహరాజ సౌధం అలీకిడి లేని చావడీగా వూరింది. వసంతోత్సవ సంబరాలతో వెలిగిపోయిన కొండవీటివిసీలాకాళళలో విషాద చంద్రోదయమైంది. రాజు కళ్ళల్లో తిమిర

త్రి

మలుముకొంది. రాజు గుణగణాలను వల్లిస్తూ, కాటయ 'కుమారగిరి రాజీయా న్ని రచించాడు. కుమారగిరి కొడుకు అనపోతారెడ్డి అకాల మరణం ఆతనికి మరో పిడుగుపాటు, అనసూయతో ఉబుసుపోని విధి తనను వెక్కి రించిందని కుంగిపోయాడు. తనకు అన్ని వేళలా అసట, బాసటగా నున్న కాటయ వేమునికి రాజమహేంద్రవర పాలన నవ్పుగించాడు. నిర్లిప్తంగా కొంతకాలం పాలించిన కుమారగిరి క్రీ.శ. 1402లో మరణించడంతో కొండవీడు రాజకీయం బీటలు వారింది. కొండవీటి రాజ్యం నిట్టనిలువునా రెండుగా చీలి కృష్ణానది హద్దుగా మారింది. కాటయ వేమునికీ, పెదకోమటి వేమారెడ్డికీ స్పర్దలు పెరిగి కొండవీటి వైభవ, ప్రాభవాలు స్టాణువైన జ్ఞాపకాల (ప్రవాహంగా మిగిలి పోయాయి.

కుమారగిరిరెడ్డి చివరి రోజులు

కొండవీడు సింహాసన మెక్కి నప్పటినుంచి కవితాగోస్టులు, సంగీత కచేరీలు, నృత్యహేలలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడిపాడు కుమారగిరొరెడ్డి. రాజుకైనా బతుకు బాట ఎగుడు దిగుడేనని, ఎదురైన కొన్ని చేదు అనుభవాలు రుజువు చేశాయి. మనసారా (ప్రేమించిన లకుమాదేవి మరణం, అల్లారు ముద్దుగా పెంచుకొన్న ఆశాదీపం అనపోతారెడ్డి అణగారి పోవటం, కుమారగిరిని కుంగదీశాయి. ఉత్సవ సంరంభంతో వసంత వేడుకల్ని జరిపించిన వసంతరాయనికి దెబ్బమీద దెబ్బ తగిలి గుండె పగిలిపోయింది.

అనపోతారెడ్డి చనిపోయిన తరువాత రాజమహేంద్రవరరెడ్డి రాజ్యశాఖకు తనమహా్రధాని కాటయ వేమారెడ్డిని అధిపతిగా చేశాడు కుమారగిరిరెడ్డి. ఇది నచ్చని పెదకోమటిరెడ్డి వర్గీయులు కుమారగిరికి వ్యతిరేకులైనారు. వరుస విజయాలను తెచ్చి "పెట్టి కుమారగిరి అభిమానానికి పాత్రుడైన కాటయపై పెదకోమటి వేమారెడ్డి, అతని అనుచరులు అసూయ పెంచుకుని, ఎప్పటికైనా దెబ్బ తీయాలని నిర్ణయించుకొంచారు. తనకు అత్యంత అప్పుడూ, అన్ని విషయాల్లో సలహాలూ, సూచనలిచ్చే మవా్రధాని కాటయ వేముడు రాజమహేంద్రవరం వెళ్ళటంతో కుమారగిరొరెడ్డి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. అదే సమయంలో రాజ్యంపై ముస్లింల దండయాత్ర, వెనువెంటనే వచ్చిన కరువు రాజును మరిన్ని ఇబ్బందులకు గురిచేశాయి. కంభంమెట్టు దగ్గర గజారావు తిప్పానాయని చాకచక్యంతో ముస్లిం దండయాత్రను తిప్పికొట్టడం కుమారగిరికి కొంచెం ఊరట కలిగించింది.

(శ్రీ.శ.1399 - 1400 ప్రాంతంలో కుమారగిరి రాజ్యంపై కళింగ గజపతి కూడా దాడిచేశాడు. కుమారగిరికి నమ్మకమైన గొగ్గయదేవుడు పెద్ద సైన్యంతో వెళ్ళి గజపతి సైన్యాన్ని సింవాచలం వద్ద జరిగిన యుద్దంలో తిప్పీకొట్టటం కూడా కొంచెం సంతోషాన్ని కలిగించింది. గొగ్గయ దేవుని సర్పవరం శాసనం ఈ విషయాన్ని తెలియ జేస్తుంది.

మునుపటి కొన్నత్యాన్ని కోల్పోయి బలహీనపడిన కుమారగిరి విజయనగర రాజుల దాడిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల్లూరు సీమలోని ఉదయగిరి రాజ్యాన్నేలుతున్న విజయనగర రాజు రామచంద్రరాయలు కుమారగిరి ఆధీనంలోనున్న

కొండవీటి రాజ్యం దక్షిణ భూభాగంలో కొంతమేరకు అ్రనమనానాశనళాస్టంలో కలుపుకొన్నాడు. యుద్దం మీద యుద్దం, కొండవీడులో సమన్వయంలేని అధికారులతో సతమతమౌతున్న కుమారగిరిరెడ్డి ఈ యుద్ధంలో మాత్రం గెలువు సాధించలేక మిన్నకుండి పోయాడు.

ఇదే అదుననుకొన్న కందుకూరురెడ్డి రాజ్యశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి మాచారెడ్డి కొడుకు కువూర కోమటి రెడ్డి, కుమారగిరిరెడ్డి పాలనలో ఉన్న కృష్ణాతీరం వరకూ గల కోస్తా ప్రాంతాన్ని చెప్పాపెట్టకుండా ఆక్రమించుళొన్నాడు. ఏ మాత్రం విశ్వాసం లేకుండా దాయాదులైన కందుకూరిరెడ్డు చేసన ఈ దుశ్చర్య కుమారగిరిరెడ్డి ఆధిపత్యానికి సవాలై కొండవీటి కోట బీటలు వారినట్లయింది. ఇన్ని బాధల్లో కూడా కుమారగిరిరెడ్డి తన దానగుణాన్ని మానుకోలేదు. కృష్ణాతీరంలో ఉన్న కొత్తూరు వద్దగల వసంత రాయలక్ష్మి నరసింహ దేవాలయానికి క్రీ.ళ. 1400వ సంవత్సరంలో కొంత భూమిని దానంచేసినట్లు చెబుతున్న అక్కడి శాసనమే కుమారగిరొరెడ్డి ఆఖరి శాసనంగా చెప్పుకోవచ్చు.

దురదృష్టాలన్నీ ఒక్కుమ్మడిగా వెంబడిస్తాయనే సామెత కువూరగిరి పాలిట రుజువైన నిజం. క్రీ.శ. 1402వ సంవత్సరంలో కోమటి వేమారెడ్డి కొండవీడు సింహాసనాన్ని ఆక్రమించటానికి గట్టి ప్రయత్నమే చేశాడు. దేశ విదేశాలతో వర్తక, వాణిజ్యాలను నెరపి, నట, గాయక, పండితులతో కీర్తింపబడిన దర్పారును కాపాడుకోలేని దుఫ్టితిని తట్టుకోలేక, కొండవీటిలో ఉండటానికి మనసొప్పక, తనకు వురింత ఆప్తుడైన కాటయ వేమూరెడ్డి దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకొని రాజమహేంద్రవరం చేరాడు కుమారగిరిరెడ్డి. ఎంతో మంది పండితుల్ని తన రాజ్యానికి రప్పించుకొని, వారిని మెచ్చుకొని ఎన్నో బహుమతులతో గౌరవించిన కుమారగిరి, చివరికి తన స్వంత రాజ్యాన్నే వదిలి వేరే చోటికి పోవాల్సిన దురవస్థ అతని అభిమానుల్ని, రాజ్యంలోని రైతుల్ని ఎంతగానో బాధించిన విషయం.

బావమరిది పంచన కొంతకాలం గడుపుదామని వచ్చిన కుమారగిరిని ఇక్కడ కూడా విధి వెక్కిరించింది. మానసికంగా కుంగిపోయిన రాజుకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తన బాగోగులకు కారణ భూతుడైన కువూరగిరి ఆరోగ్యం కుదుటపడటానికి రాజా వైద్యులను రప్పించి చేయగలిగిందల్లా చేశాడు కాటయ

52

వేమారెడ్డి. ఆరోగ్యం బాగుపడటానికని క్రీ.శ.1402వ సంవత్సరంలో మకర సంక్రాంతి సందర్బంగా కాటయ కొన్ని దానాలను కూడా చేశాడు. అయినా లాభం లేక పోయింది. రోహి రోజుకీ ఆరోగ్యం క్షీణించి ఆదే సంవత్సరంలో కాటయ వేముని సమక్షంలోనే కుమారగిరి చనిపోయాడు. కర్పూర కళిక ఆరిపోయింది. కొండవీడు చిన్నబోయింది. ““ఆవమరావతికి సరిజోడు కొండవీడు” అని కీర్తింపబడిన కొండవీడు గత వైభవస్రాభవాలను ఒక్కసారిగా కోల్పోయింది. కొండవీటి నుండి కవులూ, కళాకారులూ, నాట్యగత్తెలూ, సంగీత విద్వాంసులూ ఒక్కొక్కరుగా వలన బోయారు. కొండవీడు బోసీపోయింది.

53 కొండవీడులో పెదకోమటి వేమారెడ్డి (ఉళ 1402-1420) దాదాపు తిరుగుబాటే చేసన పెదకోవుటి వేవూరెడ్డి, కోటలోని ఉన్నతోద్యోగులను, రాజవంశీకులను మంచి చేసుకొన్నాడు. మెల్లమెల్లగా తనపట్ల ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకొన్నాడు. అంతః కలహాలతో సతమతమౌతున్న విజయనగర రాజులను ఆసరాగా తీసుకొని, ఇంతకుముందు వారు కాజేసిన భూభాగాన్ని పెదకోమటి వేమారెడ్డి తిరిగి స్వాధీనం చేసుకొని కొండవీడులో తన పాలన సుస్టిరం చేసుకోవటంలో కూడా విజయం సాధించాడు. అంతేకాక కొద్ది రోజుల క్రితం కొండవీడుకు చెందిన తెనాలి వరకూ గల ప్రాంతాన్ని ఆక్రమించుకాన్న కందుకూరురెడ్డి రాజ్యశాఖకు చెందిన కోమటి రెడ్డి నుంచి తిరిగి స్వాధీనపరచుకొని కొండవీడు వైభవాన్ని ప్రాభవం చేశాడు. ఒక్కొక్క ప్రాంతాన్ని కలుపుకొంటూ వస్తున్న పెదకోమటి వేమారెడ్డి రాజమహేంద్రవర రాజ్యాన్నికూడా కొండవీడు కిందికి తేవాలనుకొన్నాడు. అయితే ఈ కోరిక రెడ్డి రాజ్యం చిన్నా భిన్నం కావడానికి దారి తీస్తుందని ఊహించలేక పోయాడు. దాంతో రాజమండ్రీ పాలనా వ్యవహారాలను చూస్తున్న కాటయవేమారెడ్డితో తలపడటానికి సిద్ధమయ్యాడు పెదకోమటి వేమారెడ్డి. ఇందుకోసం రాజమహేంద్రవరం పళ్ళిమ ప్రాంతాన్ని పాలిస్తున్న అన్నదేవ చోడునితో చేయి కలిపి వ్యూహరచన చేశాడు. మరో వైపు బహమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌షాతో కలసి రాజమహేంద్రవరంపైకీ దండెత్తి వచ్చాడు పెదకోమటి వేమారెడ్డి. రాజమహేంద్రవర రెడ్డిరాజ్య శాఖకు చెంది, కాటయ వేమునికి కుడి భుజంగా నిలిచిన అల్లాడరెడ్డి ఆ దాడిని ఎదుర్కొని తిప్పికొట్టి రాజమహేంద్రవరం వరువు నిలిపాడు. ఈ సందర్భంగా వెలమలు, రెడ్లకు మధ్య పాడచూపీన విభేదాలు బహమనీలకు, విజయనగర రాజులకూ, ఓఢ్ర గజపతులకూ బాగా ఉపయోగపడ్డాయి. ఏది ఏమైనా ఈ యుద్ధ తంత్రాలకు రెడ్డి రాజ్య యోధులైన కాటయ వేముడూ, పెదకోమటి వేముడూ చివరికి బలికావాల్సీ వచ్చింది. పెదకోమటి వేమారెడ్డి గొప్ప విద్వాంసుడు, కవి. మునుపటి రెడ్డిరా జాలవలెనే అతడు కూడా (ప్రజారంజకుడై, సాహిత్యాన్నీ, కళల్ని అవకాశమున్నంత వరకు ప్రోత్సహంచాడు. సంగీత, సాహిత్య, నృత్య (గ్రంథాలపై స్వయంగా వ్యాఖ్యానాలు

క్‌ 4

రాశాడు. అంతటి ప్రతిభా విశేషాలు పెదకోమటి మరణంతో విజయనగర రాజులు విజృంభించి కొండవీడు సీమలో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించుకొన్నారు. దాదాపు నూరేళ్ళపాటు విజయ గర్వంతో ప్రకాశించిన కొండవీట రాజ్యకాంతులు

కొడిగట్టబోయే దీపంలా మిణుకు మిణుకు వుంటున్న కొండవీటి సీంవాసనంపై పెదకోమటి వేమారెడ్డి కొడుకు రాచవేమారెడ్డి క్రీ.ళ. 1420 వ సంవత్సరంలో వచ్చాడు. రాజ్యభారాన్ని ఏ మాత్రం మోయలేని రాచవేముడు ఖాలీ అయిన ఖజానాను నింపటానికి అనాలోచితం, అసంబద్దమైన పన్నులు విధించి, ప్రజాకంటకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. కేవలం నాలుగేళ్ళు మాత్రమే పాలించిన రాచవేమారెడ్డి ప్రజలచేతిలోనే హత్యకు గురై బాగా కాసిన కాయల స్టానంలో కుక్కమూతి ఏందె కాసీనట్లు ఉజ్వలంగా వెలుగొందిన ఒకప్పటి కొండవీటి రాజ్యానికి చరమగీతం పాడాడు. రెడ్డిరాజ్యం పూర్తిగా విజయనగర రాజుల వశమైంది.

రెడ్డిరాజ్య శాఖలు

అధ్గంకి నుంచి కొండవీటికి పాకిన రెడ్డి రాజ్లు ప్రాభవం తూర్పు తీరంలోని కళింగం వరకూ వ్యావించటానికి కృషి చేసిన మొదటి రెడ్డిరాజు అనపోతారెడ్డి అప్పటి నుంచి గోదావరి

  • కళింగ దేశాల మధ్య ప్రాంతం రెడ్డ అధీనంలోనే ఉంది. అనపోతారెడ్డి పాలనలోనే నెల్లూరు సీమకు చెందిన దువ్వూరి వంశీయులైన కాటయరెడ్డి కుటుంబీకులు రొజమహేంద్రవర బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు.

కుమారగిరి రెడ్సి పాలనలో తూర్పు తీరంలో కొద్దికొద్దిగా అలజడులు పొడచూపాయి. స్త్వరెన నాయకుణ్ణి ఆ ప్రాంథంలో నియమించకపోతే అ ప్రాంతాన్ని కోల్పోవలసి వస్తుందని భావించాడు కుమారగిరిరెడ్డి. మంత్రి మండలి సూచన మేరకు క్రీశ 1370లో కుమారగిరి కొడుకు రెండో అనసోతారెడికి రాజమహేంద్రవర సీమ అధికారాన్సి అప్పగించి, అతనికి సలహాలనిచ్చి, రాజ్యం బాగోగులను చూడటానికి తనకు ముఖ్య సలహాదారు, మహాప్రధాని అయిన కొటయ వేమారెడ్డిని నియమించటంతో కొండవిటిరెడ్డి రాజ్యానికి రాజమహేంద్రవర శాఖ పుట్టుకొచ్చింది.

కొండవీటి సింహాసనంపై వసంతరాయనిగా వెలుగొందుతూ, అర్ధ సింహాసనం పె తన కొడుకును నిలిపి కొన్ని బాధ్యతల నుంచి తప్పుళొన్న కువూరగిరిరెడ్డి సంతోషానికిఅవధులు లేవు. మునుపటి కంటే మిన్నగా సాహితీ చర్చలు, సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు, విందులు, వినోదాలతో కొండవీడు పండుగలు చేసుకొంటుంది.

అదను చూసుకొని విధి చక్రం తిప్పింది. సంతోష సంరంభాలలో మునిగి తేలుతున్న కుమారగిరికి పిడుగుపాటులాంటి వార్త చెవినబడింది. తన ఒకే ఒక్క కొడుకు యువరాటైన రెండో అనపోతారెడ్డి రాజమహేంద్రవరంలో చమురణిందాడన్న వార్త అది. కుమూరిగిరి, అతని భార్య కుప్పకూలారు. అనుకోని ఈ శిక్ష వారిని తల్లడిల్ల జేసింది. బ్రశుకుపై ఆశలు సన్నగిల్లాయి. కళ్ళముందే కన్నకొడుకు మరణించటం భరించరాని బాధను మిగిల్పింది. కొటయ వేముడు పైతం వమూగవోయిన ఘటన అది. కుంగిపోయి, కుమిలిపోతున్న కుమారగిరికి కాటయ వేముడు బాసటగా నిల్పాడు. అనపోతారెడ్డి బాల్య చేష్టలను గుర్తుకు తెస్తూ రాజును ఓదార్చాడు.

పుత్రశోకంతో పరిపాలనా వ్యవహారాలను పట్టించుకోలేశ పోతున్న కుమారగిరి సంతాపొన్ని తనుకూడా పంచుకొని కష్టకాలంలో కూడా నేనున్నానంటూ వెన్నంటి ఉన్నాడు కొటయ వేమారెడ్డి. తనకు జరిగిన ఈ నష్టం ప్రజలకు కష్టం కలిగించకూడదనుకొని

ళల

కుమారగిరిరెడ్డి, కొటయ వేమారెడ్డిని రెండో అనపోతారెడ్డి స్థానంలో రాజమహేంద్రవర సింహాసనంపె కూర్చోబెట్టాడు. పూర్తి కాలం రాజకీయ కార్యకలాపాలకు పనముయం వెచ్చించలేని కుమూరగిరి బలహినతను ఆసరాగా తీసుకొని కోండవిటి సింహాపవంపై కన్నేసి ఉంచిన ఇంటి దొంగల గురించి కలలోనైనా ఊహించలేక పోయాడు కుమారగిరి రెడ్డి. రాజకీయాల్లో బంధుత్వాన్ని రక్త సంబంధాల్ని మరచిపోతే అధికార వసాస కుమారగిరి పసింహాసనానికే ఎసరుపెట్టింది.

అస్తవ్యప్రంగా ఉన్న కొండవీటిలో ఉండటానికి ఇష్టపడని కువూరగిరిరెడ్మి రాజమహేంద్ర వరానికి చేరుకొంటొడు. చేరిన కొద్దివాళ్ళకే మరణిస్తాడు. కుమూరగిరి రెడ్డి మురణించిన తరువాత కొండవీటి బాధ్యతలను విర్వ్యర్రిస్తున్న పెదకోనుటి వేమారెడ్డికీ, రాజనుహేంద్రనరం బాధ్యతలు చూస్తున్న కొటయ వేమారెడ్డికి వైరం పెరిగింది.

కాటయ వేచూరెడ్ని కొండవిటితో తెగతెంపులు చేసుకొని స్వతంత్రం ప్రకటించుకొన్నాడు. కాటయవేమునికి కువూరగిరి అనే కొడుకు, హరిహరాంబ, ఆవితల్లి అనే కూతుళ్ళున్నారు. కుమూరగిరి రెడ్డి (కర్పూర వసంతరాయలు) సోదరి దొడ్డాంబిక కాటయ వేనూరెడ్డి భార్య. రాజమహేంద్రపుర శాఖకు చెందిన అల్లాడరెడ్డి కొడుకులు వేమారెడ్డి, వీరభద్రారెడ్డకు హరిహరాంబ, అనితల్లులనిచ్చి పెళ్ళి చేశాడు.

కాటయ వేమారెడ్డి మరణించెటప్పటికి అతని కొడుకు రెండొ కుచూరగిరి రెడ్డి వయసు కేవలం పది సంవత్పరాలలోపే. రెండో కుమారగిరి లెడ్డిని సింహాసన మెక్కించిన అల్లొడరెడ్డి, కర్పూర వసంతరాయనికీి కాటయ వెముని మూదిరిగా, అతనికి చెదొడు వాదోడుగా రాజమహేంద్రవర రాజ్యాన్ని నడిపించాడు. దరదృష్టం వెన్ను చరుస్తుంటీ రాజ్యం ముందుకెలా వెళ్తుంది? ఎవరూ ఊహించవి సంఘటన ఒకటి చోటు చేసుకొంది. రెండో కుమారగిరిని కూడా విధి కబళించింది. అకాల మృత్యువు అతన్ని కొలసర్పమై కాటేసింది.

పదవీ వ్యామోహం, అధికార దాహాలు లేక అంకిత ఖావంతో రెడ్డిరాజ్యానికి సేవలందిస్తున్న అల్లాడరెడ్డి, రెండో కుమారగిరి రెడ్డి పోదరి అనితల్లికి రాజ్యాన్ని అప్పగించి రాజ్యభారాన్ని తాను కూడా మోయటానిక్‌ నిద్ధపడతాడు. రెడ్డిరాజుల పట్ల

ర్‌ 5

తనకుగల విశ్వాసాన్ని ఈ విధంగా ప్రకటించుకొన్నాడు.

ఇంతలో అన్న దేవరోడుడు, కోనసీమను ఆక్రమించుకోవబానికి కొద్దిపాటి సైన్యంతో దొడ్డిదారిన బయలు దేరాడు. ఎత్తుకు పై ఎత్తు వేసిన అల్లాడ రెడ్డి ఆ దాడిని ఎదుర్కొని తిప్పికొట్టి అనితల్లికి బాసటగా నిలిచాడు. అదే సవుయంలో రాజమహేంద్రపుర రాజ్యాన్ని సవాలుచేసిన ఓఢ్రగజవతులను, విజయనగర రాజులను సమాధానపరచి వారితో స్నేహ సంబంధాలను నెలకొల్పిన వ్యక్తి అల్లాడరెడ్డి. ఆ రెండు రాజ్యాలతో ఏ మా(త్రం ముప్పురాకుండా చూసుకొన్నాడు. అంతేకాకుండా బంధుత్వాన్ని కూడా మరచిపోయి కయ్యానికి కాలు దువ్విన పెదకోమటి వేముని ఓడించి, పీచమణచిన ఘనత కూడా అల్గ్లాడరెడ్డికే దక్కింది. రెడ్డి రాజ్య సుస్టిరతకు పాటుపడ్డ అల్లాడరెడ్డి క్రీ.శ.1420లో చనిపోవడంతో రాజమహేంద్రవర రాజ్యం బలహీనపడింది.

పరిపాలనా దక్షుడు, సమర్హుడూ అయిన అల్లాడరెడ్డి మరణించిన తరువాత రాజమహేంద్రపుర రాజ్యాన్ని, అల్లాడరెడ్డి అన్న అనప్రోలారెడ్డి కొడుకులైన మూడవ కుమారగిరి రెడ్డ, మూడవ అనపోతారెడ్డి వశపరచుకొన్నారు. ఆర్భాటంగా సాగిన ఈ వ్యవవారం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. పాలనానుభవం లేని వాళ్ళిద్దరూ మూడేళ్ళు మాత్రమే పాలించ గలిగారు.

అటు తరువాత అల్లాడరెడ్డి కొడుకు వేమారెడ్డి గజపతితో ఒప్పందం కుదుర్చుకొని రాజమహేంద్రపుర రాజ్యంలోని కళింగ ప్రాంతాన్ని ఆతనికి అప్పగించి, అతని చయూతతో రాజమహేంద్రపుర సింహాసనాన్ని కైవసం చేసుకొన్నాడు. శివలీలా విలాసంలో మాత్రం రాజమహేంద్రపుర సింహాసనంపై తన తమ్ముడైన వీరభద్రా రెడ్డిని వేచూరెడ్డే కూర్పోటెట్టాడని చెప్పబడింది. క్రీ.శ. 1423లో సింహాసనమెక్కిన వీరభద్రారెడ్డి 25 ఏళ్ళపాటు రాజ్యాన్నేలి, చివరి రోజుల్లో ఓఢ్రగజవతులు, దేవరకొండ వెలమల పన్నాగాలకు బలై, రాజ్యాన్ని గజపతులకు అప్ప గించాల్పొచ్చింది. కొండవీడు మాదిరిగానే రాజమహేంద్రపుర రాజ్యం కూడా తన దీవులను దిగమింగుకొని, మరుగున పడిపోయింది.

కందుకూరు శాఖ కాకతీయ పతనానంతరం ఆంధ్రదేశంలో కొత్తగా ఏర్పడిన రాజ్యాల్లో రెడ్డి

5్‌6

రాజ్యాం ఒకటి, నెల్లూరి సీమలోని పాకనాటికి చెంది ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా జేసుకొని రెడ్డి రాజ్యాన్ని విస్తరించటానికి పూనుకొన్నాడు. అదే సమయంలో రెడ్డీ రాజ్యంపై సాగిన ముస్లిం దండయాత్రను తిప్పికొట్టి, అన్నకుతోడుగా నిలీవినవాడు మల్లారెడ్డి. అంతవరకూ ఇతరుల పాలైన మోటుపల్లి ఓడరేవును తిరిగి స్వాధీనం చేసుకొని తన పరాక్రమాన్ని చాటుకొన్నాడు. కృతజ్దతా పూర్వకంగా ప్రోలయ తమ్మునికి నెల్లూర6 సీమలోని కందుకూరు ప్రాంతాన్ని స్వతంత్రంగా ఏలుకోమని ఇచ్చాడు. అప్పటినుంచి కందుకూరును ముఖ్యపట్టణంగా చేసుకొని పాలించాడు.

కందుకూరి రెడ్ల చరిత్ర తెలుసుకోటానికి చుండి, పెదపూడి, లేపాక, టంగుటూరు, కందుకూరు, కొండమురుసుపాలెం, తమిళనాడులోని కంచికి సమీపంలోని చామల్‌ వద్ద దొరికిన శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెనాలి సమీపంలోని పెదపూడి వద్ద దొరికిన రాగరేకు శాసనం కందుకూరి రెడ్ల గురించిన వివరాలను అందిస్తుంది.

అయితే అటు శాసనాల్లోగాని, ఇటు సమకాలీన సాహిత్యంలో గాని ఎక్కువగా కనబడేది మల్లారెడ్డి, పినకోమటిరెడ్డి, మాచారెడ్డి, అన్నారెడ్డి, శ్ర,గిరరెడ్లే. ఈ శాఖ పతినిధులు నేటి నెల్లూరు, కడవ, ప్రకాశం జిల్లాల్లోని కొంత భూభాగాన్ని పాలించారు. తమిళనాడులో దొరికిన శాసనం ప్రోలయ వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి మనుమడైన మాచారెడ్డి కొడుకు గణవతిరెడ్డికి చెందింది. బహుళా కంచిని సందర్శించిన సందర్భంలో గజపతి రెడ్డి పై శాసనాన్ని వేయించి ఉండొచ్చు. అంతేకాని అక్కడవరకూ వీరిరాజ్యం విస్తరించిందని చెప్పటానికి వీలులేదు.

మల్లారెడ్డి తరువాత అతని మనుమడు ఏినకోమటి రెడ్డి కొడుకూ అయిన 'శ్రీ/గిరి రెడ్డి కాలం నుంచి వీరు స్వతంత్రులుగా పాలించారు. వీరి శాసనాల్లో అద్దంకి కిచ్చిన ప్రాధాన్యత కొండవీడుకు లేకపోవడం గమనించాల్సిన విషయం. ఎందుకంటే అద్దంకి నుంచి పాలించిన ప్రోలయ వేముని తమ్ముడైన మల్లారెడ్డి అద్దంకి రాజధానిగా నున్నప్పుడే కందుకూరు సీమను పొందాడు కాబట్టి.

కందుకూరు శాసనంలో (క్రీ.శ. 1398) శ్రీగిరి, ఏన కోమటిరెడ్డి, గౌరాంబికల పెద్దకొడుకని చెప్పబడింది. రెడ్డి రాజన్యుల లాగే ఇతడు కూడా సాహితీ

ర్‌7 పిపాసి. సంగీత మకరందాన్ని తాగిన వాడు. చుండి శాసనం ఇతన్నాక కళాకారునిగా పేర్కొంటుంది. శ్రీగిరి అనే గురువును అనుసరించిన ,శ్రీ,గి6 రెడ్డి ఎన్నో వ్రతాలు, దానాలు చేయటమే కాక, సాగునీటికి, తాగునీటికి ఎన్నో చెరువులు తవ్వించి రైళు బాంధవుడనిపించుకొన్నాడు. కందుకూరు రాజ్యంపై దండయాత్ర చేసిన ముఫ్లింలను తరిమి కొట్టడంలో శ్రీగిరి రెడ్డి ప్రముఖ పాత్ర పోషంచాడని పెదపూడి శాసనం పేర్కొంటుంది. విజయనగర రాజైన రెండవ హరిహర రాయలు చనిపోగా సింహాసనం కోసం

అతని కొడుకులు విజయనగర పాలనలో నున్న సిద్దవటం, చంద్రగిరి సమీప ప్రాంతాలను వళ పరచుకొన్నారు. శ్రీగిరి సోదరుడు అన్నారెడ్డి, అతని కొడుకు మూడో మల్లారెడ్డి ఈ దండయాశ్రల్లో పాల్గొన్నట్లు టంగుటూరు, లేపాక శాసనాలు తెలియజేస్తున్నాయి. కందుకూరు రాజ్యానికి ,శ్రీ/గిరి తరువాత, అతని తమ్ముడు రెండో మాచారెడ్డి కొడుకు రెండో కోమటిరెడ్డి రాజయ్యాడు. ఈ సమయంలోనే రెండో కోమటిరెడ్డి పెదతండ్రి కొడుకు మల్లారెడ్డి చుండి నగరాన్ని వశపరచుకొని కందుకూరులోని జనార్హనస్వామికి అలయాన్ని నిర్మించి భూములను దానం చేశాడు. తరువాత క్రమంగా కందుకూరు రాజ్యం విజయనగర రాజుల పాలైంది.

క్రీ.శ. 1325 ప్రాంతంలో ఆవిర్భవించిన రెడ్డి రాజ్యం ్రీ.శ. 1424 వరకూ, అటు తరువాత మరో పాతికేళ్ళపాటు అంధ్ర దేశంలో తనకంటూ ఒకస్టానాన్ని, చరిత్రనూ సృష్టించుకొని తరువాతి తరాల వారికి ఆదర్శవంతమైంది.

| కొండవీటి రెడ్డి వంశ వృక్షము. మరియు కొండవీటి రెడ్డి రాజుల రాజ్య విస్తరణ చిత్ర పటములు

| కొండవిటి రెడ్డి వంశము ॥ కొను భూపాలుడు | ప్రోలయరెడ్డి = అన్నమాంబ | మాచారెడ్డి ప్రోలయ వేమారెడ్డి అన్నయ దొడ్డ వేనుపాని నుల్గారిత్సి | (శ్రీ? 328 - 1368) | (హమ గయ | రెడ్డీపోత.. పెరకోనమటి నార అనసోళారెడ్డి అచవేమారెడ్సి. దొడ్జాంటిక = కాటయరెత్సీ / | (ఓ౬13క3 - 1364) (శ్రీ1864 - 1386) ' పరకోమటివమూరెద్దు చూదా కునూరగిరిరెడ్డి బొడ్దాంధిక[్‌ = కాటయవేమారెక్డీ ' (శ1402- 1420) (ట1344- 142 | (ఓ౬1480 = 1424) | రాజమహేంద్రవర రెడ్డీ నంశము | షన | శాటుెట్తి న = దొడ్దాందిళ (ఊం. బోలయ వేమూరెట్సి ) | ॥ ఇాటియ! నమారెల్సి = దొత్బాంిక క ( ఊం. అనవోతారెళ) | (ఉఓట1462- 1414) కుమారనిరిరెడ్డి 13 హాం వయారెళ 28. అల్లాడ) మెం ఆ లవ . (శశ 1414 - 1417) (తళ 1428 - 1448) | మ గ .. | కం (౫ మూతవ రోమటిరెట్సీ. రెండన కోమటిరెడ్డి | -టూగరెళ్స |

నా దష కంగు తోడల వధరతల్నా ఒద్బొటి ల గల్‌ జం లు లోలకొంత్కల స్తిర “కప్పలు క్‌ నీ 1 భా పల్లీ . ఖగ ఖీ త్రం రోలు ళ్‌ ఈ /ో వయయితడు సలి ళ్‌. గ్‌ నా క్షు కంటే. ₹ కొంయిథ విజయనగరరాజ్ఞుం సన

కొండవీటి రెడ్డి రాజ్యం క ల్‌ జోతావరి ఇవిజో ( నంత్య శకముతల్ను 9 న న్‌ా [| న్‌ కవకకంక * ల పూంయాతు '్‌ష ళీ కూ లయ వేచూరెడ్డి పాలించిన ప్రాంతము [_ర్రంయుమార్తి టొ

కొండవీటి రెడ్డి రాజ్యం న ఆద్య శలించరాజ్యము | న్‌ పక శరుదల్‌ 4 క్‌ స్‌ గ గమ ల్లా యం శ శ ష్ట్ర రా గ్‌ అనపోతారెడ్డి పాలించిన ప్రాంతము

(ఉ1353- 1364)

గ్రివనాగిరెడ్డి )

కొండవీటి రెడ్డి రాజ్యం ళా వరంగల్లు వ్ర / ట్ల గ్ర నేము శ స్వహావలం ల ష్‌ ఠి ల్‌ తాడపల్లి ఇ / టౌక్షొళామణ గ లి శ్తీఫింం ఇ తెక్తకీ లే గ కందుతాతు ళీ (|) అనవేమారెడ్డి పాలించిన ప్రాంతము (శఓ1364 - 1886)

కొండవీటి రెడ్డి రాజ్యం లా వ్‌ (1 బింయు రము చశలనల్న న! బహనవీరాజ్యం జశోలకొంత ర్త, ల్లి _ తెలమరౌజ్యాం లొకారాములి (త చకోంత కిండదిడు' // అ భ్‌ అమేరావతీ భోటస్ట్య్సో ళా ఇ అల్మేతక్త్‌ ఖ్‌ ప్రోఫైరాంకము తలోమాట గ్‌ ఖ్‌ నమన మదుమకు ఇ కఐ కుమారగిరిరెడ్డి పాలించిన ప్రాంతం (4౬1366 - 1402) ప (శాగరట్టి

కొండవీటి రెడ్డి రాజ్యాలు కటకం' కలింగ గొంరులు సకం 84 ళో చి య | అజా వంహాచలం తోలకొంద 9 వన లే జై పెదకోనుటివేమూరెడ్డి పాలించిన ప్రాంతం (శ&1402- 1420) ై కాటయవేమారెడ్డి రాజమహేంద్రవరం మంచి పాలించిన ప్రాంతం (&ఓ1402 = 1414) లతో స | 1 స! ఖో (1 లాలన 47బ "ల ,] ళల ళా పనన ఎ చద లం

  • క నం ల |!

| 4]| _| 0) //ఈు| | |॥|* | డాక్టర్‌ ఈమని శివనాగి రెడ్డి గుంటూరు జిల్లా ] తెనాలి సమీపంలోని వలివేరులో కీ॥ శే; ఈమని | | భూపషిరెడ్డి - అన్నపూర్ణమ్మలకు 15.4.55న జన్మించారు. ( తిరుపతిలోని శిల్ప కళాశాలలో నాలుగేళ్లపాటు వాస్తుశిల్బ ( | శాస్త్రంలో శిక్షణ పొంది, ఉస్మానియా నుంచి పురావస్తు శాస్త్రం - చరిత్రలో ఎం.ఎ.ని, 1995లో హైదరాబాదులో | సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచీ ఎవల్యూషన్‌ ఆఫ్‌ బిల్డింగ్‌. | వివిధ వత్రికల్లో ఇవ్పటికి వరకూ అనేక |; " వ్యాసాలు, వది వుస్తకాలు రచించిన శివనాగిరెడ్డికి ( | 1997లో త్రివేండ్రంలో జరిగినిన ప్రపంచ వాస్తు శి, సమ్మేళనంలో “వాస్తు శిల్ప వాచస్పతి" బీరుదునిచ్చి

  • (౧ నత్మరించారు. ఇవ్చటివరకూ దాధావు 100 (ా ఆలయాలను వృనరుద్ధంచారు. అనేక వరిశోధక ఇ హైదరోవాదులో నవోయ న్ఫవతిగా ఉద్యోగం. ల్‌ స్‌ క 2... టా - ౪ ద్య మా నని ల్‌ నన నాల