Telugu Khanvamaharshi - anilvaranasi/indianlanguages GitHub Wiki
| ఆసప్తుటానోల్ని శు. జాం శని. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి
వేదకథాభారతి - 2 గ లాయ క్ జఅ్వ్యమహ ల్ రచన డ్్చర్ బె, లామక్ఫష్ల ప్రధాన సంపాదకుడు పాఫెసర్ ఎఫ్, బి, కఘునాథాబార్య, || అశఖ్షీ$ || ప్రచురణ డ్వర్ ఐ.వి.సుబ్బారాపు, ఐ.ఏ.ఎస్., కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి దేవన్లా నములు, తిరుపతి 1999
“౯0కి గగ 864?! - 2 సషసిగి/ షు ఓటి న 4 " 0/ గ్రియల రిగ ఆ. గొతగా4గగ5గగ8 (అట్ న వా. 011౪ ౬6110 నిగం౦/9550/7 5. 8. 229౧6౮౧౩౯2 ౧౧2౧౧/2 [5506614000 1999 000165 : 10,000 00115066 0౫ ; రిగ [౪ 5జనీనీ* ౧2౦, 45, ౬9604146 0గ౦౫ | 00212 ౧1౧౧౭| 0౪298%20౧4016 0086 భతలేశి ఆంధాల్వ్య జి లాలా ఖ్భా నగ06 : గ కే ౧౦ ఒర్పి 626 | త్త (1 గా [| లో నిగగ(66 21 పసి. శీలి 6౬4౧౧63 -ఫ్0 53, (౮౨౦1215) ౧.౩. ౮౭౧66౧౩ 10088 2 : 30184 |
చూవమాట
డాక్టర్ ఐ.వి. సుబ్యారొపు, ఐ.ఏ.మ.,
కార్యనిర్వహణాధికారి
. తిరుమల తిరుపతి దేవస్తానములు
తిరుపతి
నిత్య సత్యమైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు
అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్ఫ్వార్ధ బుద్దితో, త్యాగమయమైన
'ప్రవృత్తితో తవు తవు జీవితాలను పండించుకున్న ఎందటో
వంహానుభావుల జీవన వైభవాలు వునకు వేద వాజ్మయంలో దర్శనమిస్తున్నాయి.
“ఆహా! ఎటువంటి కర్తవ్యదీక్ష! ఎంత విశాలదృష్టి! ఎటువంటి విశ్వకల్యాణభావన! ఎంతటి ధార్మిక చేతన 1' అని మనల్ని ఆశ్చర్యపరిచే జీవనవేదం మనకీ వాజ్బ్యయంలో ప్రత్యక్షమౌతుంది. ఆ వేదనాదాన్ని ఇంటింటా వినిపించాలనే మా ఆకాంక్షకు ప్రతిరూపమే -
ఈ వేద కథా భారతి.
వేదకథాభారతిలోని ఎనలేని మానవత్వపు విలువలు ఈ తరాన్ని (ప్రభావితం చేయగలిగితే అంతకంటే మాకు ఆనందమేముంటుంది ?
ఈ కథాపుష్టాలను సంపాదించి తీర్చి దిద్ది అందమైన మాలగా రూపొందించిన 'ప్రాఫెసర్ ఎస్. బి. రఘునాథాచార్య గారిని మనసార అభినందిస్తున్నాను.
ఇంత చక్కగా ముద్రించిన అన్నపూర్త (గ్రాఫిక్స్ వారికి అభినందనలు. జయతు జయతు భారతీ వేద కథా భారతీ _అఅిఉ
మనవి వేద కథాభారతి. .
-_ అంతళ్ళిత్రువులను అణచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు పట్టుంకట్టి, ధార్మిక జీవనానికి ప్రాణంపోస్తూ ఈ లోకంలోనే కాక ఇతరలోకాల వారికి కూడా నిండైన మౌనఎత్వమంటే 'ఇది' అని ఆచరణ పూర్వకంగా నిరూపిస్తూ, అందులోని మధురిమలను చవిచూపిస్తూ వేదనాదవిభాసురమైన ఒక జీవన (స్రవంతి ఈ గడ్డపై వెల్లివిరిసింది.
జలజలసాగే ఆ అమృత వాహిని వసుంధరను రసమయం చేసింది. సస్యశ్యావులం చేసింది. సుగంధపరిముళాలను వెదజల్లే నందనోద్యాలను వెలయించింది. వూనవ సృష్టిలో అరుదైన ప్రమాణాలను కొన్నింటిని నిలబెట్టింది. వాటికి కాలదోషం లేదు. ఆనాటికి ఈ నాటికి, ఏనాటైైనా మానవతకు గమ్యాన్ని, జీవనానికి అర్జాన్ని ఫరవళార్జాన్ని సాధించడంలో ఆ (ప్రవూణాలు చరితార్జాలయినాయి. అలాంటి జీవన చిత్రాలకు పట్టిన అద్రమే ఈ వేదకథాభారతి.
ఒక్కసారి పరిశీలించండి 1! ఆ చిత్రరావుణీయకతను మంచిమనసుతో దర్శించండి ! వారి ఆత్మల జౌన్నత్యాన్ని వారి భావనల జాచిత్యాన్ని మీరు తప్పక అభినందిస్తారు ! అవి మంచివని తోస్తే అనుసరించచడానికి ప్రయత్నించండి ! ఆనందించండి 1 (ప్రమాఠథి - నిజభ్య
బహుళ- సప్తమి 5-7-1999 పాఫెసర్ ఎస్. బి. రఘునాభాలాళ్ళ
సనన టు న! న . ల్ న్స్ న వన ఓ ( క ॥ స మశ! స్తూ గ. గ: నో ॥ ల్, "|
త... ర మ. ల: టం టం న గ్గ (మ. స్ కన లం ల
కణర్రమహాద్లి
భారతీయసంస్కృతికి మూలాధారం వేదాలు. బుగ్వేదము మొదలైన నాలుగు వేదాల్లో మం(త్రపాఠం కంచే ముందు ప్రతిమంధ్రానికి సంబంధించి బుషి - దేవత - ఛందస్సుల వివరణ ఉంటుంది. ““'బుషయో మంత్ర(ద్రష్థారః' మంత్రద్రప్టలు లేక స్తోత్రకర్తలను బుషులంటారు. అలౌకికమైన సవాూధిస్టితిలో వుంత్రాలను దర్శించగలిగిన వారు మం(త్రద్రష్టలు. ధర్మసాక్షాత్కారం పొందిన మహానుభావులు వీరు. సకల పదార్ధ విజ్ఞానఖనులైన వీరు తమ తరువాతి తరంవారికి మం(త్రాలనుపదేశించారు. ఇలాంటి బుష్ లక్షణ సమన్వితులైన మహనీయుల్లో పేర్కొనదగినవాడు కణ్వుడు. ఆహా! ఎంత చక్కని ఆశ్రమం!
సుందరమైన ఒక ఆశ్రమం. సుమ పరిమళాలతో విందుచేసే చల్లని గాలులు వీస్తున్నాయి. కుహూ కుహూ రావాలతో (శ్రవణానందం చేస్తున్నాయి కోయిలలు. పరవశంతో పురివిప్పి నాట్యం చేస్తున్న మయూరాలు చూపరులకు నయనానందం పంచిపెడుతున్నాయి. మధుర మకరందాస్వాదంతో రుంరుమ్మంటున్న తుమ్మెదల పాటలు, గలగల పారే సెలయేరుల అలల మధురరాగాలు - ఇలా మధురభావలహరులలో
2 తేలిపోతున్న ఆనందానుభూతుల నిలయం - ఆ ఆశ్రమం. 'బ్రహ్మతే జస్సంపన్నుడు, సకలవిద్యావిశారదుడు, వహాతపస్వి, యమ- నియమాద్యష్ట్రంగ యోగ నిలయుడు, కపిల జటాధారియ్టైన కణ్వ మహర్షి ఆశ్రమమది. కేశిని - ఘోరులనే పుణ్యదంపతుల పుత్రరత్నం కణ్వుడు. పతివ్రతా లక్షణాలన్నిటిని పుణికి పుచ్చుకొన్న సాధ్వీమణి కణ్వపత్ని. అపురూప దాంపత్యం : ఒకనాడు ఆ మహర్షి తన దండ-కమండలాలను చేత పుచ్చుకొన్నాడు. ఎక్కడికో ప్రయాణమయ్యాడు. క “గ్రేవీ కి? లి (ప్రేమానురాగాలు నిండిన కళ్ళతో తన ఇల్లాలిని పిలిచాడు కణ్వుడు. మనోహరంగా ఉందా పిలుపు. సిగ్గుతో బుగ్గలు సొట్టలు పడ్డాయామెకు: “పిలిచారా స్వామీ 1 అంది. ఆమె మాటలో ఆరాధన. “తమ్ముడు (ప్రగాథుడేడీ ?*: అడిగాడు కణ్వుడు. తన ప్రియసోదరునికోసం ఆశ్రమం చుట్టు అన్వేషిస్తునాయి మహర్షి నయనారవిందాలు.
ర
“బహుశ ఇక్కడే ఎక్కడో ఉంటాడు" ఆమె సమాధానం.
మితభాషిణి ఆ బుపిపత్ని. నిండు యౌవనంతో ఉన్న రూపసి. పున్నమి వెన్నెలను గుర్తుకు తెచ్చే ప్రశాంతవదనం. చూపుల్లోచల్లదనం. పలుకుల్లోతేనెదనం. సకలసుగుణరాశి. ఆమెను భార్యగా పొందడం తన భాగ్యంగా భావించాడు మహర్షి. తనకోసం దివినుండి భువికి దిగివచ్చిన రంభగా తలచాడు. అవ్యాజమైన అనురాగమనే రాగాలాపనతో ఆమెను లాలించాడు. ఒకరికొకరు తోడు- నీడ. ఎరుగరాని అనుబంధవమది. ఎడబాటులేని ప్రేమ వారిది.
ల! దేవీ (|? పిలిచాడు మళ్ళీ. దరి చేరింది. అడిగాడు. కలువల చిరునవ్వుతో తెచ్చిపెట్టిందా స్మితవదన. అందుకొన్నాడు. వురోసారి తనివితీరా తన అందాలరాణీని చూసుకొన్నాడు. గాలిలో తేలుతున్న అనుభవం. పాదుకలు ధరించాడు. (ప్రయాణ సూచకవుది. తడబడే అడుగులతో తారకలాగ తన నెలరాజుననుసరించింది. ఆశ్రమం పాలిమేరదాకా నడచింది. సాదరంగా వీడ్కోలు పలికింది. వెళ్ళిపోయాడు కణ్వుడు.
తీ ఎంతటి సాహసం ;
ఆ తరువాత కొంతసేపటికా శ్రమానికొచ్చాడు కణ్వసోదరుడు 'ప్రగాథుడు. కణ్వకుటీరం చాల సాధారణంగా ఉంది. ఆర్బాటాళ్లేవు. తప్పని సరిగ దర్శించవలసిన వస్తువంటూ ఏదీలేదక్కడ. మట్టినేల. గోమయంతో అలకబడింది. అక్కడక్కడా కొన్ని దర్భాసనాలు. ఒకచోట పూర్మకలళవలన్నది. కొన్ని తాళప(త్ర గ్రంథాలున్నాయుక్కడ. మహర్షియొక్క నిరంతరాధ్యయన శీల 'ప్రతీకలవి. చిన్న కొయ్యమీద ఒక దీపం. "చిన్నగా వెలుగుతోంది. షగటి పూట విశ్రాంతి, రాత్రిళ్ళు మేలుకోవడం దీపస్వభావం.
కణ్వపత్ని కూర్చొన్నది. గాఢనిద్రలో ఉన్నాడు ప్రగాథుడు. అతని తల ఆమె ఒళ్ళో ఉన్నది. నిర్వికారంగా కొయ్యబొమ్మలా ఉన్నదా మహాసాధ్వి. .
కుటీరం బయట పాదుకల చప్పుడు. అటుకేసి వెళ్ళిందామె దృష్టి తాను కదల్లేదు. కదిల్తే పసివాడైన ప్రగాథునికి నిద్రాభంగమవుతుందేమో! అదీ ఆమె ఆలోచన. ఆమె కూర్చొనే ఉంది. 'ప్రగాథుడు నిద్రపోతూనే ఉన్నాడు. మరింత దగ్గరైంది పాదుకల చప్పుడు. కుటీరం గుమ్మంలో కొచ్చాడు కణ్వుడు. అక్కడి దృశ్యం చూశాడు. తన భార్య తొడమీద తమ్ముడి తల నిర్హాంతపోయాడు. అంతే. తామస భావం శరీరంలోకి (ప్రవేశించింది. కళ్ళెరుపెక్కాయి. క్రోధాగ్ని అతన్ని దహిస్తోంది.
క్
అతడు బూడిద కావాలి :
భర్తను చూసిందామె. ప్రగాథుణ్లి నిద్రలేపే ప్రయత్నం చేసింది. లాభం లేదు. కదళల్లేదతడు. లేపడం భావ్యం కాదేమో అనిపించి ఆ (ప్రయత్నం మానుకొంది.
తనను చూశాక కూడ ఆవెలో మార్పురాక పోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు కణ్వుడు. సిగ్గువూలిన ఆడది - అనే నిర్ణయానికొచ్చేశాడు. నిబ్బరం కోల్పోయాడు. అమాంతంగా ఆమెను లాగెయ్యాలి - ఈ పాపకృత్యానికి తగిన శిక్ష వేయాలి - (ప్రగాథుణ్లో ముక్కలు ముక్కలుగ చేయాలి - ఇవీ అతని ఆలోచనలు.
ఇంతింతై పెరుగుతోంది తమోగుణం. తన బట్టులు విసిరేశాడు. దండ - కమండలాలు దూరంగా పడేశాడు. ఏదేమైనా సరే ఆ ఇద్దర్నీ శిక్షీంచాలి. అంటే శపించాలి. వడివడిగ అడుగులేశాడు. వివేకం వశం తప్పింది. వివేకముండవలసినచోట క్రోధమావహించింది పిశాచంలా. ఆదమటుచి నిద్రపోతున్న తమ్ముణ్లో కాలితో తన్నాడు. కోపంతో వణకి పోతున్నాడు. కళ్ళల్లో నిప్పులు. తన కోపాగ్నికి తమ్ముడు బూడిదకావాలి. ఆ దృశ్యం ఆమె చూడాలి - ఇదీ అతని కోరిక,
కాలి దెబ్బలు తిన్న (ప్రూథుడు నిద్రలేచాడు. జ్యేష్టభ్రాతనెదురుగా చూశాడు. వినయంతో ప్రణమిల్దాడు. కోపంతో ఊగిపోతున్న అన్నయ్య భంగిమను చూశాక తనకు దెబ్బలు తగిలిన విషయం సైతం మరచాడు
6 ఆ అమాయకుడు. కణ్వుని కోపం తగ్గలేదు. కేకలు, అరుపులతో పెదవులు వణుకుతున్నాయి. వేగం కారణంగా వరాటల్టో అస్పష్టత. వినయాభరణుడు (ప్రగాథుడు. అన్నయ్యముందు (ప్రశాంతంగా నిల బడ్డాడు. అన్నకోపానికి కారణం తెలియలేదు. ఈమె తల్లినంటిది : ఇప్పుడు కణ్వుని దృష్టి భార్యమీద పడింది. బుసలుకొడుతున్నాడు. అతని కోపానికి కారణమేమిటో ఆమెకూ తెలియలేదు. కోపావేశంలో అతని మాటతీరు మారింది. “ధీ పాపాత్మురాలా 1” ఈ సంబోధనతో ఆమె అవాక్కయింది. తన అన్నయ్య కోపానికి కారణం అప్పుడు తెలిసింది. నొచ్చుకొన్నాడు తవ్ముడు. అయినా నిబ్బరంగానే ఉన్నాడు. రజస్తమోగుణాలకవకాశం లేని పరమసాత్తిికుడతడు. అన్నయ్య పట్లు జాలి కలిగింది. అంజలి ఘటించాడు. “* అన్నయ్యా । నీవు (భమ పడుతున్నావు" అన్నాడు. త వమ్ముడు (ప్రశాంతంగా ఉండడం చూసి వురింత
7 రెచ్చిపోయాడన్నయ్య. పళ్ళు బిగపట్టి - “+ఛీ పాపాత్ముడా 1" అంటూ కొట్టబోయాడు. అతని దృష్టిలో ప్రూథుడు నయవంచకుడు. తెలివైన వ్యభిచారి. ఏ మా(త్రం వెరవలేదు (ప్రగాథుడు. తన వదినమ్మకేసి చూస్తూ “+ ఈ మహాసాధ్వి నాకు తల్లివంటిది”' అన్నాడు శాంత స్వరంతో. “మరి నేనో ?** గద్దించాడన్నయ్య. 4 నీవు నాకు పితృతుల్యుడవు”'” (ప్రగాథుని సమాధానం. వీకు శుభం కలగాలి : ఇంత చెప్పినా కోపం తగ్గలేదు. భార్యకేసి చూస్తూ “ఛీ కళంకితా!** అన్నాడు. మౌనం దాల్చిందా ఉత్తమ ఇల్లాలు. జలజలా కన్నీళ్ళు రాలాయి, మొహం (ప్రక్కకు తిప్పుకొన్నాడు కణ్వుడు. “4 నీవు నాకన్నయ్యనవు. కాని, ఇవ్మాల్సినుంచి తండ్రివే. ఈమె నాకు తల్లియే?”
8 మళ్ళీ వినయంగా అన్నాడు (ప్రగాథుడు. ఆ సమయంలో కణ్వుని చిత్తంలో ఏదో అలజడి మొదలైంది. రజస్తమో గుణాలు అతన్ని వీడాయి. వివేకం ఫునః ప్రవేశించింది. '“'అన్నయ్యా ! నీవు వుంత్ర (ద్రష్టు. అంగిరస వంశోద్దారకుడవు. పరమ పవిత్రాత్మవు! అన్నాడు ప్రగాథుడు. నఖ శిఖ పర్యంతము తమ్ముణ్ణి చూశాడు కణ్వుడు. ప్రగాథుడు తప్పు చేయలేదు. అతని కళ్ళల్లో కామంలేదు. హృదయంలో కళంకం లేదు. మాటల్లో మోసం లేదు. అంటే మనోవాక్కాయ పరిశుద్దుడనే ఫ్రీరన్నిరయానికొచ్చాడు. (ప్రగాథుడు వదిన పాదారవిందాలపై మోకరిల్లాడు. ““అమ్యా ! నేను నీ వుతసమానుడను*” అన్నాడు. “వఫుత్రా/ (మౌాథా /*" అని సంబోధించిందావె. ఆ పిలుపుతో పులకరించిపోయాడు 'పగాథుడు.
ం్ర “నీవు కూడ నీ అన్నయ్య వలె మంత్ర (ద్రష్షవు. అన్నయ్యకు తగ్గ తమ్ముడివి. నీకు శుభం కలగాలని కోరుకొంటాను'' అన్నదామె. వాత్సల్య పరిప్యూర్ణవచనాలవి. నిండు మనసుతో చేసిన ఆశీర్వచనమది. చూసిందంతా నిజంకాదు :
ఈ తతంగ వాంతా చూస్తున్నాడు కణ్వుడు. కింకర్తవ్యతామూఢుడయ్యాడు. వారిద్దజీతో ఆమె అన్నది - “గురువుల ఆజ్జానుసారము మీ ఇద్దటు ఈ ఆశ్రమంలో
నివసిస్తున్నారు. పరమ వవి(త్రమీ ఆశ్రమం. మీరు సదాచార సంషన్డులు. కళ్ళతో చూసిందల్లా వాస్తవం కాదు. ఒకమ్టుడది (భమ కావచ్చును. మనసులో ఏదో కల్చినలొస్తుంటాయి. అవన్నీ నిజుం నావు”.
తల్లి- దం(డ్రులుగ స్వీకరించిన ఆ పుణ్యదంపతులకు సాష్టాంగ (ప్రణామం చేశాడు (ప్రగాథుడు. వారి చల్లని దీవెనలందుకొన్నాడు. కొణ్వ పరంపర;
ఈ సోదరులుభయులు ఆయా వేదాల్లోని వుం(త్రాలను దర్శించారు. ఈ కణ్వ గో త్రానికి సంబంధించిన బుషులెందరో ఉన్నారు. వీరిని కాణ్వులు లేదా కాణ్వాయనులంటారు. బుగ్వేదంలోని ఎనిమిదవ
10 మండలంలో ఈ అందటి పేర్లు మనకగుపిస్తాయి. అవి -
-
ప్రగాథుడు యౌఠుడు || గోషూక్తుడు.... 21. మేధ్యుడు
-
మేధాతిథి ఠా 12. ఇరిమ్బికుడు 22. మాతరిశ్వుడు (మేధ్యాతిథి)
-
సోభరి 23. కృశుడు
-
దేవాతిథి
-
నీపాతిథి 24. పృష్యధ్రుడు
-
బ్రహ్మాతిథి ఎన(
-
నాభాకుడు 25. సుపర్డుడు
-
వత్సుడు
-
(త్రిశోకుడు ,
-
పునర్వత్సుడు (6 26. భర్గుడు
-
సాధ్వంసుడు 17. ప్రస్కణ్వుడు 27.కలి
-
శశకర్గుడు 18. పుప్టిగుడ 28. హర్యతుడు
-
పర్వతుడు కేం, 'శ్రుప్టిగుడు 29. కురుసుతి
-
నారదుడు 20. ఆయువు 30. కుసీది కాణ్వ సంహిత ;
ఈ సందర్భంలో ''కాణ్వసంహిత?** విషయుమై కొంత 'ప్రస్తావించవలసి యున్నది. శుక్షయజుర్వేదం, కృష్ణయజుర్వేదమనే భేదంతో యజుర్వేదం రెండు రకాలుగున్నది. శుక్షయజుర్వేదంలో 10 శాఖలు, కృష్ణయజుర్వేదంలో 14 శాఖలున్నాయి. పది శాఖల్లో మొదటిది కాణ్యళాఖ. ఈ శాఖ సంహిత, (బాహ్మణరూూపూలతో
1 మనకందుబాటులో ఉంది. కాణ్వ సంహితలో మొత్తం 40 అధ్యాయాలు 328 అనువాకాలు, 2086 మంత్రాలున్నాయి. కణ్వుడంటే ఎవరు?
యాస్కముని (ప్రణీతమైన “నిఘంటువు' లో వేంధావి పర్యాయాల్లో కణ్వశబ్దం పేర్కొనబడింది. గనుక కణ్వుడు అంచిే మేధావి అని అర్థం. ఈ శబ్దానికి పురోహితుడనే అర్ధం సాయణభాష్యం చెబుతోంది. గానం చేయుడం, స్తోత్రం చేయుడం వురియు దేవతలను యాగక్రియలకాహ్వానించడం ఇతని విధులని కూడ వక్కాణిస్తోందా గ్రంథం. ఈ కోణంలో ఆలోచించినపుడు 'కణ్వ' శబ్దం ఒక వ్యక్తి పేరును గాక అతని విధిని సూచిస్తున్నది. కాణ్వశాఖలు :
ఈ కాణ్వ పరివారానికి సంబంధించి ముఖ్యమైన శాఖలు నాలుగు బుగ్వేదంలో అగుపిస్తాయి. అవి - 1. వైయశ్వ శాఖ 2. ప్రియమేధ శాఖ 3. ఉపస్తుత శాఖ 4. సోబరి శాఖ. నూతన శబ్ద ప్రయోగాలు ;
కాణ్వుల (ప్రయోగాలలో “'బ్రహ్మణస్పతి' అనే ళ₹బ్దం వినిపిస్తున్నది. అగ్ని, ఇం(ద్రుడు, బృహస్పతి అనే అర్జాలలో ఈ శబ్దం ('ప్రయుక్తమైంది. రుద్రుడనే అర్ధంలో ' జలాషభేషజు' అనే శబ్దాన్ని కాణ్వులు
12 (ప్రయోగించారు. ఇలాగే అగ్నికి పర్యాయంగా ““అమీవచాతన''* అనే శబ్దాన్ని వారు వాడారు. రోగ నాశకుడని ఈ శబ్టానికర్టం. కొణ్వస్తుతులు ;
బుగ్వేదంలోను యజుర్వేదంలోను కణ్వ్యమహర్షి ఆయన వంశంవారు చేసిన అనేక దేవతాస్తుతులు మనకు సాక్షాత్కరిస్తాయి. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని ఇక్కడ పరిశీలిద్దాం - వార్టేవీస్తుతి :
ఓ చదువులతల్లీ ! నీవు జ్ఞానప్రదాయినివి. మననరూపిణివి. బుద్ది మరియు బలస్వరూపిణివి. సకలవిధ రక్షకురాలవు. ద్విశిరస్కవైన నీవు అంతర్ముఖ - బహిర్ముఖ రూపాలతో మమ్మల్ని అనుగ్రహించు. (బ్రహ్మ శక్తీ నిన్ను ఛందోబద్దం చేయగలదు. నీవు సదా మాకు తోడుగ ఉండాలి. మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు. మా ఆయువును పెంచు. నీ సంరక్షణలో ఉంటాం. అగ్నిస్తుతి :
సర్వేశ్వరా 1 నేను దుష్కార్యాలు చేయరాదు. మంచి పనులు మౌా(త్రమే చేసేలాగ నన్ను అనుగ్రహించు. ఇలా చేయడం ద్వారా నేను దీర్హాయువునై పవిత్రమైన జీవనం సాగిస్తాను. తద్ద్వారా ఉన్నతస్థ్రితిని
పాందుతాను. సరళమార్గంలో నన్ను నడిపించి నాలో ద్వేష భావనలు
13 రాకుండునట్టు చేయాలి. అలాగైతే నేను ఐహికాముష్మిక శాంతులను పాందగలను. అగ్నిదేవా ! వేవూచరించే యాగాలు కోటిరెట్ట ఫలితాన్నివ్వాలి. అన్ని వేళలా మాకు శుభప్రదాయకుడవు కావాలి. సూర్యస్తుతి : లోకబాంధవా! నీవు చీకట్లను పారద్రోలగలవు. ఈ ప్రపంచానికి మార్గదర్శకుడివి. (ప్రకాశంతోపాటు జ్ఞాన (ప్రకాళప్రదాతవు. భూదేవీస్తుతి : భూమాతా! నీవు సుఖప్రదాయినివి, కంటకరహితవు కావాలి. అలాగైనపుడే మేము నిన్ను చేరుకోగలం. మా సుఖజీవనం కోసం అన్న - వ(స్రాదులనిచ్చి మా దారిద్ర్యాన్ని తొలగించు. మానవశరీరంలో సప్తర్డులు ; కన్ను - ముక్కు - చెవి - నాలుక - చర్మమనబడే పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు మరియు బుద్ది - ఈ ఏడు పదార్దాలు సప్తర్షుల్లాగ శరీరంలో ఉన్నాయి. తమ తమ స్టానాల్లో ఇవి పదిలంగా ఉన్నాయి. జీవుడు ని(ద్రించే వేళల్లో ఇవి తమ స్ట్రానాన్ని చేరతాయి. అయితే ఆ సమయంలో జీవులను రక్షించడానికి ప్రాణము మరియు అపానము మేల్కొనే ఉంటాయి.
14
రాజస్తుతి :
రాజా! ప్రజల పట్టు నీవాత్మీయతను చూపాలి. ప్రజాజేమం కోసం యాగాలు చేయాలి. శాంతిరక్షకుడవు కావాలి. ప్రజలను హింసించరాదు. పరిశుద్దుడవై మసలుకోవాలి. ప్రజాసౌకర్యాలు మెరుగు పరచాలి. ప్రజలకు శత్రుభీతి లేకుండ చేయాల్సిన కర్తవ్యం నీదే. నీవు సత్య(వ్రతుడవు కావాలి. నీ మాట, చూపు, వినికిడి పరిశుద్రం కావాలి. ఇంద్రియ నిగ్రూమలవజచుకోవాలి. నీ మననశ్తీ, ప్రాణ శ్తీ పెంపాందాలి. శక్తిమంతాలైన ఓషధులు నిన్ను కాపాడతాయి. లక్ష్మీ నుహిమ :
బుగ్వేదం తొమ్మిదవ మండలంలో లక్ష్మీదేవి మహిమ ఇలా వర్షితమైంది -
జీవుడు ధనసముపార్దనకోసం పుడతాడు. అందుకోసమనే తన ఇంటి నుండి బయటపడతాడు. తనను స్తోత్రం చేసిన వారికే జీవికనిస్తుందావెం. లక్ష్మీదేవి నాశ్రయించిన వారందజు అవ్చుత స్వరూపులయ్యారు. ఈ అర్జాన్ని చెప్పే మంత్రమిలా ఉన్నది - 'శ్రియే జాతః శ్రియ ఆ నిరియాయ (శ్రియం వయో జరితృభ్యో దధాతి। (శ్రియం వసానా అమృతత్వమాయనృవన్తి సత్యా సమిథా మిత(ద్రౌ ॥
15
వాయుసూక్తం
బుగ్వేదం (ప్రథమ మండలంలో వాయుసూక్తార్ధమిలా ఉన్నది- వాయుదేవతలారా 1 మీ గమనం వలన గృహాలు దెబ్బతినవచ్చుననే ఉద్దేశ్యంతో గృహదార్హ్యం కోసం గట్టి స్తంభాలను నిర్మిస్తున్నారు మౌనవులు. మీ అమితవేగానికి భూమి కంపిస్తోంది. చలనం లేని ఆకాశంనుండి పుట్టిన మీ గమనం అనుపమానం. శబ్లోత్పత్తి కారకులు మీరు. వాయుదేవతలారా 1! మీరు బలవంతులు గనుక మానవులను తమ తమ విధులపట్లు ప్రేరేపించండి. మీ కారణంగానే మాకు వినికిడిశక్తి కలుగుతోంది. అమితవేగం గల మీ వాహనాలతో కర్మభూమిని చేరండి. మీ సేవకులమైన మేము హవిస్సులతో మిమ్మల్ని తృప్తిపజుస్తాము. తండ్రివలె మీరు మమ్మల్ని మీ చేతుల్లోకి తీసికోండి. ఏ మాత్రమూ ఆలస్యం చేయక భూలోకానికి తరలిరండి. మణిరత్నాలు, గజాశ్వాలు మొదలైన లాంఛనాలతో ఇక్కడికి దయచేయండి. మిమ్మల్ని స్తోత్రం చేసేవారిని మృత్యువునుండి దూరం చేయండి. వారు ఎట్టి పరిస్టితుల్లోనూ యమలోకం చేరరాదు. వాయువు కారణంగా వచ్చే మేఘ గర్జనలు కుంభవృష్టిని కురిపిస్తాయి. శత్రువుల బారినుండి మమ్మల్ని రక్షించండి. మీ రథాశ్వాలకు శుభం చేకూరుగాక! మాకు ఓజోగుణం ప్రసాదించండి. బుషులను ద్వేషించే వారిని శిక్షించండి. . కాణ్వుల నూతన దేవతా కల్పన :
ఒకప్పుడు పురుష దేవతలకు వూ(త్రవే యజ్ఞాలలో
16
హవిస్సులందేవి. అయితే కణ్వవంశీయుడైన మేధాతిథి - “ అగ్నేపల్నీ రిహావహ దేవానామ్”” అని అగ్నిదేవుళ్లీ (ప్రార్ధించాడు. *' ఓ అగ్నిదేవా 1 దేవపత్నులను సైతం యాగశాలకు తీసికొనిరా'' అని మంత్రానికర్టం. ఈ నూతన రీతిని పరిశీలించినపుడు స్త్రీలపట్ల కణ్వవంశీయులకు గల పూజ్యభావం స్పష్టమవుతోంది. ఇదేవిధంగా వాయువు, పృథివి, సదసస్పతి, విశ్వేదేవతలు మొదలైన నూతన దేవతలను కల్పన చేయడంలో కృతకృత్యుడయ్యాడు మేధాతిథి.
ఈ విధంగా మంత్రద్రష్టలలో ఎంతో ప్రాముఖ్యం పొందిన ఘన క్రీర్తిమంతుడు కణ్వుడు. కాణ్వాయనులుగ (ప్రసిద్దులైన (ప్రగాథుడు, మేధాతిథి, వత్సుడు మొదలైన బుషులు కూడ మంతత్రద్రష్టలై తమ వంశానికి వన్నె తెచ్చారు. ఈ బుషులందటీకీ మనమెంతో బుణపడీ ఉన్నాం. భక్తితో వీరిని స్మరించడం మన కనీసపు కర్తవ్యం.
ఓం శాంతిః శాంతిః శాంతి? వ్! శత$ (గ ధాలు భరయ ( ళ్ వి [ల 6. :0బ్రి 1620) . ర గే వ్్సళూ నో లలల లో మైల -లాడర్ధం 0న.
ననన శయ “త్వాం గి గు గీ సు ద ళో కరగ గా షా షే (స గా క! శఈ్/స త్ర (1 సం తం. వై ఉత న మం ఫా క కరా యమాయ తాం గస్తీ చ్ కయ క్ష స ప 1114 919% 5-7-1999 70 8-7-1999