Telugu Kavithraya Virachita Srimadandhra Mahabharathamu Adiparvamu (Bhagamu 2 , Samputamu 1) - anilvaranasi/indianlanguages GitHub Wiki

" న్‌ పా కరకర లఅభాలాాాలలనాలనకాందనడా దాన నాల నాలాలాంణనాతాలాడ . భారాంలా్తాంాననాానమకాాననానా అజాయ వూతతు వున. - ఇం గా నా సామా ల్‌ జ నా క్షా? సకాల కాలాల ారాతేభ కనాలి. కవల నాననా వర్‌ వా? న న శ శ. ॥ వ ఫ్‌ (అడి పనీ! స్స (& గే వ. |, యల లుం ఆఅ(౪అ' ల ౦6 లు ( శె రం మాలు యం. ॥ ళా కా ఏ + కం టం. 0 స "కృతికర్త “ " సం టు మటు న వ ఆ మ టు పా ర్‌ ని బారం అ ల కరోల్‌ కం గి య్‌ శె _ 4 ము . ( _ యూ “ప్‌ సం ల్‌ో ౯ స్‌ వాత: = ॥ ో ర్ట క్త శ = ల ట్‌ న 1 4 "భ్‌ ॥; , తనన ఎగ సు శ్‌ గట (2 జ (| శం కీ షే సిగల్‌ లభ వం [| “| గ న. " | | " ల క్‌ కీ చలన లా | ( వు. శ "సు... 1 జ ననా 1 ల ంలసొ ర్త శ ఉర. శ్రే వట స లం ఆ స 7 న్‌ , తిం | గ! స అ రో తము: 4 [1 ॥ రణ వ సా ణల స ం| " య ౧న గీ స యే ం చనం గ్గ రతా వ / ఇ ; స! క స ఈ హి కం గ + చ | జ్జ [ | స |. కీ గ! గ. శ్‌! ఉం శ్‌ క్ట వు న్న లు... నా న ల గ న శన పభ ఓ కం సస. న | సం. మే త న న నం. స 5 తనమా టల లన. మ తమా నా... / స ల క! ర ఖ్‌ న. భు క సు ర స క టం. [తయా టి న యన స పయత ' టల" క. ఉట త ౫ న చస లట. షు సా న త్త ల చం ని వ నలై టర వ త. నమా. నస శన! ష్య | గ న్‌ వట! మేక సా శశతావ్నా ష్‌ 7 సే 7/6 న గ నంట ఇ అత. ళీ [ఆ స. “శాం సస న గ శ్‌ క యాం టం 4 జరా ఖా! య భల ల... న 1 న్న (1. స స స్‌ /| లో గ ఎ) త 1 “క్యా ః ఫై ప ఖం త! నూ గ్గా మం టా ఏ క లట టా నీ కరక శు శ్తరు. న క్ష || క ప స. స్తాన యయ సస టం ము మ పాటను ప టు. అశ న మం వే మే. టీ నే క క స ల! ష్య! “శ స ట్‌ి పి క లే టీ ర. స. సము [1 .. 1 క్‌ . (0 ( ్‌ా. అటి లం. . ః / శ మ ల (| క ఇని. ప = స లల్ల న | | నావా మళ జ న ఖ్‌ యుతి వష ర్త త్‌ న హా జ్‌6ం జ? య న. “గో కటక 2 న్‌ య. /| న. ఓ, ర క. స చ ళా (1 4 |. వ, టం త్తు వ స. నికట... లా... ను? తమ జ. " గ లన. , క యయ (క లోలా న్డ్‌ నన హస ను ష్‌ ననన ననన లు మ! సక. యా ,

కవిత్రయ విరచిత అంజి శ్రీమదాంధ్ర మహాభారతము (సరళ వ్యాఖ్యాన సహితం సంపుటము - 1 రెండవ భాగము (5,6.7,8 ఆశ్వాసములు) కృతికర్త నన్నయుభట్టారకుడు వ్యాఖ్యాత డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య ప్రధానసంపాదకుడు డాక్టర్‌ జి.వి, సుబ్రహ్మణ్యం 'ఆఖూ ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి జం౪ం

కడి 1712కు ౪712401111

9£21%44504$19142గ సీడగదిోననిడ 714141౮

౪/1౯ 60గ౧౭౧1౧/

తీర02గ/2౧04 0 ౧౧4/4 8046416660

౪01.1. దణ - | ఇ

(04౧0109 5,6,7 ఇ౧౮ 6) మల

లం రంగగ8౧120/0 ఓ 05 &004064 ౪6౧1262 540012 ల్తాష గి” గ్‌ 5666 0 ( రం 6౪ 5202002004 1.1.0. ౧61౩1069 ద010210౧9 56/63 ౧0. 601 [1515601100 : తీ49491 2000 000166 : 3000 అ4॥ ౧౧౪ ౧6౩9౧66 . ర ఈష గతి అం న కహ ్‌ ల్‌ న్యా ట్య ని0'5066 0 (46 261 దసర స. 901/6 01106; నాం గ

శ. 1.06/2911202గ9, ల పటం 00 002% -517 5607. నానా 9.723006 561౧0

5/1 0244 వ్‌ 6720౧109,

5/౪0, 1-8-702/05,

21242౧11 (1/66/2024 - 500

( శ

ర్‌; 7633276, 3020710 04

నగగ/66 ఇ

రం 05ఆఈ బ్‌౧(8్య్ర

553 జ్య 660%]

| శ ల్‌ ల్‌ అష యామ. ను మె పసం ; | న్‌ / త మ. షన 1]. షు టీ, క్‌ స సా ఖో శ నా (౧ సం సూ.. కలా మా [గ తి క ల్వుడ్తాబ్రాత ర్ల 1 న. నీ ల కాట స్ట గను వం ల సు | అ ర క గా 1 య టి మోన న గ. ప నా. నె టో. ల.

న్‌ జ. ర మం న్న్న శీ! గ బ్ఞాస్తాధా వార్దా రి స టను క టం. | క పవనసుత నప ము షు . న ర |

న 1. |

గిరి ళన ౪1౧4011171 క52144లిగ!1ర424 4884న? 84ఆ 0 ౦౦౧౧6౭౧11౧/ &ీర[020/4%06 0 ౧౧4/౬ 5౧46048060 ౪01.1. గి౭గ- 11 (02009 5,6,7 2౧౮ 8) స సరు లా =... 0౦గ౧౧౭౧1౧/ 0 0 0౯ గంం2)0604 ౪9౧1212 5షన912 య! గగ లో 5601896 0 (ల 0౧6౪ 940720004%/201 1.70. గ6|1008 న40|॥0440౧9 5669 110. 601 [151౬6106 : &౮ర69 2000 ౦౧169 : 3000 అ॥4॥ 210౧ నింం౧/66 . వ ణే ( | గల న్ను నాలి 5086 5౪ (4౦ ఇం, మ్‌ సర శే. 0 1.4 94064 ౧౦, 1.4.9. త వ. క60010 ౦0%66॥ ము వారక. ౫..09/29042010%9, 14044 - 517 507. క్ట 0౫/06 5611౧0 5/1 0464 541 61201109, 5%1౪/10) 1-8-702/1 05, 21250౧0, గర6?2086 - 500044. 5౧: 7633275, 3020719 నిశగ(66 41 5164౪3 05866 నిగగ1ల9, 553, 5ఇఇ| 0౦1౦౧౫ 74024.

4 కమ యేసు న న || . ౩్తాశీ నస్‌ ళత. టి | | మ. గ ను. శు నా | న యల ఐక 1. క్‌ సనం గ్‌ స్‌ క. ఈ.:?: (న; | న. నే . / ఈ: యాకు ఏన న్న త. న. క | ఖ ౫ క సట. న టం భి 14... 11 . | | న న రాలా _

? స్ట స? య లా నే. క! ”

లా మం, న.

స. సాన న | శ; నా జ మ్మ చును... గట న్న (త. ”ా 1 రటపా ఛా శతా ప్‌! జక ర న యిు' నన ము న లా షు నన ల (౮ | శయ్యా?! శిలా. ర! న తస నా యల్‌ ఉం త; స సన వజ గా. త! నాం ఈ ఆల స న పర క టం ల టల. మ శ ల త మన టి గం | ! షన స. బశ ప మంట. స య 1

ముందుమాట నారాయణం నమస్కృత్య నరంైవ నరోత్తమమ్‌, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేల్‌.

మహాభారతం మన జాతీయ కావ్యం (౫240221 2010. ఈ ఇతివీసంలో వ్యాసమహర్షి ధర్మం, అర్ధం, కామం, మోక్షం - అనే నాలుగు పురుషార్థాలను సాధించటానికి అవసరమయ్యే విజ్ఞానం అంతా చక్కగా ఇమిడ్చాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం ఇందులో సముచితంగా చోటుచేసికొన్నందువల్ల, ఈ గ్రంథం '“పంచమవేదం'గా, * భారతీయ విజ్ఞాన సర్వస్వం*గా ప్రశస్తి పొందింది.

వ్యాసభగవానుడు లోకశ్రేయస్సును కోరి మూడు సంవత్సరాలు నిష్టతో భారతకథను “జయ” కావ్యంగా రచించాడు. దానిని తన శిష్యులద్వారా వివిధ లోకాలలో వ్యాపింపజేశాడు. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ కథను వినిపించాడు. అట్లా వినిపింపగా పెంపొందిన కావ్యాన్ని 'భారతిమని పిలిచారు. తరువాత ఆ కథను రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తున్న శౌనకాది మహామునులకు వివరించాడు. అక్కడి మునులడిగిన ప్రశ్నలకు ఉగ్రశవసుడు చెప్పిన కథార్థాలతో కలిసి భారతం *మహాభారతం'గా వాసి గాంచింది.

ఉగ్రశ్రవసుడు ( సూతుడు) శౌనకాది మునులకు భారత కథనంతా చెప్పి, చివర ఇలా అంటాడు-

“యదివోస్తి తదన్యత్ర యన్హేవోస్తి నతల్‌ క్రృచిత్‌??

“ఇందులో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు” (1121912 34మజ0 022004 2 రాజు లం 704113 200021 042040%జ2213 ౧0 ఇసీలల) - అని.

ఆసక్తికరమైన విషయం, ఏమంటే మహాభారతం ప్రపంచంలోని గ్రంథాలన్నింటిలోకి గొప్పుది. ఉదాహరణకు ““ఇలియడ్‌”, “ఒడెస్సీ*” - అనేవి గ్రీకుల ప్రావీన ప్రసిద్ధ వీరకావ్యాలు. మహాభారతం ఆ రెంటికన్నా అనేకరెట్లు పెద్దది. ఈ పెద్దతనం ఒక పరిమాణంలోనేగాక, పాత్ర చిత్రణ (యజు౭ం1౯ ఢ010440%), భావాల వైవిధ్యం (మ్యుం౦[లంథం[ు) వంటి అంశాల్లో స్పష్టంగా తెలుస్తుంది.

మహాభారతంలో పాండవుల ఉత్తమ చరిత్ర, కౌరవుల దుర్చృత్తం చక్కగా ఆవిష్క రింపబడ్డాయి. పాండవులు ధార్మిక, సాత్త్విక, దైవీశక్తులు; కౌరవులు అధార్మిక, రాజస, తామసిక, ఆసురీశక్తులు. ఈ రెండురకాల శక్తుల నడుమ జరిగిన సంఘర్షణయే కురుక్షేత్ర సంగ్రామం. అందులో ధార్మికశక్తులకు జయాన్ని కలిగించి, అధర్మశక్తులను అంతమొందించి, అవతార పురుషుడుగా, జగద్గురువుగొ నిలిచి ఉపదేశించిన దివ్యశక్తి శ్రీకృష్ణుడు.

గ

భగవద్గిత భారతానికి ఆత్మ; పాండవుల చరిత్ర శరీరం; చతుర్విధ పురుషార్ధ విజ్ఞానం జీవితం; ఇతిహాసాలు, ఉపాఖ్యానాలు జవసత్త్వాలు. మానవ జీవితమనే మహాసముద్రాన్ని మధించి బాదరాయణుడు మానవాళికి అందించిన అమృతకలశం వముహాభారతం. మానవజీవిత క్రమానికి వుహాభారత ఇతివృత్తగమనానికి ఎంతో సాదృశ్యం గోచరిస్తుంది. ఒక్కమాటలో మానవ ధార్మిక జీవన ప్రవృత్తికి మహాభారతం ప్రాణాధారం.

మహాభారతం వేదాలు మొదలుకొని పురాణాలవరకు గల భారతీయ వాబజ్బ్యయంయొక్క సారాంశాన్ని అందించటమేగాక;, ఆ యా అంశాలకు వైరుధ్యం ఏర్పడినప్పుడు, వాటికి సామరస్యాపూర్వక మార్గాన్ని నిర్దేశించే సమన్వయ సంహితగా పేరు గాంచింది:

“వేదములకు, అఖిలస్మృతి వాదములకు, బహువురాణ వర్గంబులకున్‌ వాదైన చోటులను తా మూదల ధర్మార్టకామమోక్షస్థేతికిన్‌””

ఈ విధంగా అర్హవాజ్మయానికి అంతటికీ మూదల (ప్రమాణం) అయి ఉండటం మహాభారతం యొక్క ప్రత్యేకత!

దేవభాషలో ఆవతరించిన భారతం కాలక్రవేణ తమిళ, కర్ణాటాది దేశభాషలలోనికి అనువదింపబడుతూవచ్చింది. ప్రాంతీయ భాషలలో వెలువడిన ఆ యా భారత అనువాదాలన్నిట్లోనూ తెలుగులో 'కవిత్రయం'*వారు రచించిన ఆంధ్రమహాభారతానికి ఒక ప్రత్యేకత నెలకొనిఉంది. తెనుగు భారతం కేవల అనువాదం కాదు; కృష్ణద్వైపాయనుడు వెదికమైన ఏ పరమార్ధాన్ని మూలంలో నిరూపించాడో, అ నిరూపీతార్ధం చెక్కుచెదరకుండా పుణికిపుచ్చుకొని అవతరించిన స్వతంత్ర రచన ఆంధ్రమహాభారతం. కవిత్రయం కావించిన పునఃసృష్టి!

“తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి”, “భారతం చదివినవాడు పండితుడు” - ఇత్యాది లోకోక్తులు తెలుగులో వెలశాయంటే ఆంధ్రులకు మహాభారతమంటే ఎంతటి ఆదరమో తేటపడుతోంది. అంధ్రావళికి అలాంటి ఆదికావ్యాన్ని ప్రసాదించిన మహాకవులు మువ్వురూ త్రిమూర్తుల లాంటివారు. వారిలో అదికవియే విష్ణువు, కవిబ్రహ్మయే బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడే పరమేశ్వరుడు. ఈ ముగ్గురు సారస్వత మూర్తులు వేరువేరు కాలాల్లో, తెలుగుదేశంలోని వేరువేరు ప్రాంతాల్గో తమతమ రచనల్ని కొనసాగించినప్పటికీ, కవిత్రయ భారతం స్వరూపంలోనూ, సందేశంలోనూ ఏకవాక్యతతో విలసిల్లుతూవుంది. ఇది ఆంధ్రావనికి దైవికంగా సిద్ధించిన అద్బష్ట.విశేషం. తరతరాల తెలుగుజాతికి ఆదర్భుంగా తెనుగు సంస్కృతీమందిరంపై నిర్మించిన సమున్నత స్వర్షగోపురం ఆంధ్రమహాభారతం. ఆ సుందర గోపురాన్ని నెలకొల్పిన అక్షరశిల్పులు *కవిత్రయం”"” అందరకూ ఆరాభ్యులు.

నీ

పై త్రిమూర్తుల్లో ఆద్యుడు, ఆంధ్రసారస్వతానికి “అపర వాల్మీకి" నన్మయభట్టారకుడు. ఆ మహాకవి వేంగీదేశపు రాజ ధాని అయిన రాజమహేంద్రవరంలో చాళుక్యవంశ ప్రభువగు రాజరాజుయొక్క ప్రోత్సాహంతో క్రీ.శ. 1053 ప్రాంతంలో వ్యాసభారత ఆంధధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు. ఆంధ్రవాబ్బ్యయ చరిత్రలో అపూర్వమైన ఆ మహానీయ సన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1982-*83 విద్యావత్సరాన్ని '““నన్నయ 'సంవత్సరం'”*గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్రాబ్ది జయంతి - ఉత్సవాలు తెలుగుదేశంలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడినాయి.

ఆ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఆర్హధర్మానికి, ఆంధ్రభాషా సాహిత్యాలకు, సంస్కృతీ సభ్యతలకు మార్గదర్శకమైన ఆది కావ్యానికి - ముఖ్యంగా తొలి మూడు పర్వాలకు స్రసిద్ధ విద్వాంసులచే ప్రతిపదార్థ, తాత్పర్య, విశేషాలను వ్రాయించి ప్రచురించే ధార్మిక కార్యక్రమాన్ని ఆసక్తితో చేపట్టారు. తొలుదొలుత నన్నయ భారతభాగంతో ఆరంభమైన ఈ కార్యక్రమం క్రమేణ తరువాతి పదిహేను పర్వాలకు కూడా వ్యాఖ్య వ్రాయించాలనే ఉదాత్త సంకల్పానికి దారితీసింది.

ఈనాటి విద్యార్థుల పాఠ్య ప్రణాళికల్లో భారతీయ సంస్కృతీ వైశిష్ట్యాన్ని బోధించే అంశాలకు తగినంత ప్రాధాన్యం లేక, అరుదైపోతూవున్నందున, కవిత్రయమహాభారతం అందించే సందేశం సామాన్య జనులకూ, అలాగే నేటి యువతరానికీ అందేటట్లు చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాఖ్యానసహిత కవిత్రయ భారత ప్రచురణను అందుకు అనువైన మహోద్యమంగా చేపట్టి పురోగమిస్తున్నది.

మొదట నన్నయ భారతభాగానికి సరళగ్రాంథికంలోనూ, తరువాత తిక్కన భారత భాగానికి శ్యష్టవ్యావహారిక భాషలోనూ - అందులోనూ భిన్న భిన్నశెైలులలో - వ్యాఖ్య రచింపబడి వున్నందున, ఈ మొత్తం సంపుటాల వ్యాఖ్యాన స్వరూపానికి ఏకవాక్యతనూ, సామాన్యపారకులకు సైతం సుబోధంగా ఉండే విశిష్ట, వ్యావవారికరీతినీ సంతరించటానికి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారిని సంపాదకులుగా నియమించటమైనది.

వెయ్యేళ్ల తెలుగు సాహిత్యానికే కీర్తికిరీిటమైన ఆంధ్రమహాభారతాన్ని సరళవ్యాఖ్యతో అచిరకాలంలో సమగ్రంగా ముద్రించి, ఈ రీతిగా ఆంధ్రావళికి సమర్పింపగలుగుతున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ఎంతో సంతోషిస్తూవుంది.

అదికవి నన్న్మయభట్టారకుణ్ణి ఆంధ్రమహాభారత రచనకు స్రోత్సహించిన రాజరాజు క్రీశ. 1022 ఆగస్టు 22వ తేదిన పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అద్వితీయ చారిత్రక సన్నివేశాన్ని పురస్కరించుక్‌ ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సంవత్సరం ఆగస్టు 22న శ్రీ పద్మావతీ శ్రీనివాసుల మంగళాశాసనములతో ఆదిపర్వ, సభాపర్వ సంపుటాలను రాజమహేంద్రవరంలో ఆవిష్కరింపనున్నారు.

ఛే అదినుండీ ఈ వాజయయజ్ఞంలో పాలుపంచుకొన్న సుగ్భహీతనామధేయులయిన విద్యావేత్తలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూవున్నాము. వేదత్రయమూర్తి అయిన వేంకటేశ్వరుని అను గ్రహంవల్ల, వ్యాఖ్యానసహితమైన ఈ “జయేతిహాసం' సర్వులకు జయప్రదము, ఆనంద సంధాయకము కాగలదని మా ఆశయము, ఆకాంక్ష, “వ్యాసరవిత భారతాిమ్మాయ మాం(ద్రభా షగ నొనర్చి జగతి బొగడు గనిన నన్హుపార్వుం దొక్కనను గ్ధుత(్రతు, శంభు దాసు నెక్రుసుకవిం దలంతు భ్‌క్జీ, 77 డా.. ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., తిరుపతి, కార్యనిర్వహణా ధికారి 6-7-2000. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు

శ్రీవేంకటేశ్చరస్వామి వారి దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్తానం ఆదినుండీ అర్రధర్మవ్రబోధం నిమిత్తం అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శా స్తాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు మొదలైనవాటిని, తళ్సంబంధి రవనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా ప్రచురిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంవారు అర్ర సంస్కృతీ సముద్ధరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ వుంది. పూర్వరంగం:

ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతన పంచశతాబ్రి జయంతి ఉత్సవాలు ఆం ధ్రవ్రదేశ్‌ బ్రభుత్వ ఆధిపత్యంలో ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిస్టించే నిమిత్తంగా పోతన వి గ్రవోన్ని నిర్మించడం, పోతన భాగవతం స్రథమ స్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, 'శ్రీనివాస బాలభారతి” పక్షాన “పోతన?= పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితా మహత్తా గన్ని చాటే స్మారక సంచికను ము ద్రించటం - ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించడంద్వారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్లి జయంత్యుత్సవాలు ఆంధధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్రే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహ స్రాబ్ది జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత** గ్రంధప్రచురణకు అంకురార్పణ గావించాయి. నన్నయ భారత ప్రాజెక్టు:

ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత నన్నయభట్టారకుడు. క్రీ శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు శ్రీకారం చుట్టినాడు. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయ సన్నివేశాన్ని పురస్క రంచుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1982 -*93 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం”'*గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్త్ర వార్షిక జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోసీతంగా నిర్వహింపబడ్డాయి.

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవవారాల శాఖ, అంతకు మునుపటి పోతన జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపా త్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ, అదే విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో ్రతిష్టించే నిమిత్తం నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వవనం)- అనేపుస్తకాలను, “నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్తి సంచికను ప్రచురించింది.

౪111 తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత ప్రధానమైనది నన్న్మయభారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య వ్రాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవాఖ్యా గ్రంథ ప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవరవమణ చేసిన అప్పుటి పౌరసంబంధాధికారి డా॥ రావుల సూర్యనారాయణమూర్తికి అప్పుగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి ద్రసిద్ధ విద్వన్మణులతో ఈ క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. కళా ప్రపూర్ణడా॥ దివాకర్ల వేంకటావధాని డా॥ నండూరి రామకృష్ణమాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమాపేశకర్త)

ఈ సంపాదకమండలి 1983 జులై 11వ తేదీన హైదరాబాదు బాలాజీ భవనంలో తొలిసారిగా సమావేశమై, నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూ త్రాలను రూపొందించింది. అసూత్రాల సారాంశం:

“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్బయములో పరమస్రామాణికమైన ఆది గ్రంథము. ఆరణ్య పర్వములో శేషభాగము ఎజ్జున నవ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్పర్య సహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్టమగుట. కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళగ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు ప్రయోగించుటలో సామాన్యులకు అర్ధమగునట్లు, భారతముయొక్క ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధములైన పదాలు వాడవలెను.

మూలపదాలు యథాతధముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని ద్రుతాంతముగా వ్రాయవలెను. 'సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దానిక్రింద ప్రతిపదార్ధము, తరువాత తాత్పర్యము, పిమ్మట - ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణ విశేషాలు, అలంకార విశేషాలు పొందుపరచవలెను. వచనమునకు గూడ పద్యాలకు వ్రాసినట్రే అర్ధతాత్చర్యాలు వ్రాయదగును.

ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధిత ప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి శీర్షికలను యధాతథముగా ఉంచవలెను. సంస్క్రతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత పీఠికలో సూచించవచ్చు; లేదా వోేషాంశములలో చేర్చవచ్చు. పారాంతరాలలో - సంశోధిత ప్రతిలో ఉన్నదానికంటె ఇతర పాఠము మేల్తరముగా తోచినవో రచయిత దానినికూడ స్వీకరించి అర్ధము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది.

ప రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రవయితల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడు పర్వముల) రచనలో ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్ల వేంకటావధానిగా రికి అప్పగించుటకు ఏక [గ్లీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు గ్రాతస్రతిని సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (12156) సంసిద్ధముచేయగానే , ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము వ్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక ఉండవలెను. వై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్వానికి, డా! అప్పజోడు వేంకటసుబ్బయ్య సభాపర్వానికి, డా నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్వానికి - వ్యాఖ్యలను రవించే కార్యక్రమం చేపట్టారు. ఇలా వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూవుండగా, దేవస్తానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, వైమువ్వురు రవరయితలతో కూడిన సంపాదకవర్ల సమావేశాలను నిర్వహిస్తూ వచ్చింది. ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాక్యర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువు8ి రవనలను పునభరిశీలన చేస్తూ, తుదొమెలుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్ధంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ ఆకస్మిక సంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్న్మయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది! ప్రణాళిక ఈ ఆటంకంనుండి అధిగమించటానికి, తిరుమల తిరుపతి దేవస్టానంవారు తగిన పెద్దలతో విస్తృతంగా సమాలోచించారు. తదుపరి, కళా ప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశా స్త్రిగారు కీ శే. దివాక్షర్తవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 1987 మే నెలలో నియుక్తులయ్యారు. అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారవయితల పరస్పర సమీక్షా సమావేశాలు యధారితిగా నిర్వహింపబడుతూవచ్చాయి. వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశా స్రిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను క్రమంగా పర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. ఆయా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆయా సంపుటాల సంపాదకులు పీరిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొక సమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్ని బట్రి పీరికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశంకావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో చిట్టవివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణశా స్త్రీ,గారి గృహంలో 1991 జులై3వ తేదిన జరిగింది. అనంతరం ఈ గ్రంధాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. తిక్కన భారత సంయెోోజన: ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల విభాగంలో '“పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూవుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్డు ప్రిన్సిపాల్‌,

గ యస్‌.వి. ఓరియంటల్‌ కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్టాన కార్యనిర్వహణాధికారిగారికి '“తిక్కన భారత వ్యాఖ్యారవనా ప్రణాళికను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదిక సారాంశం:

“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు ప్రసిద్ధ విద్వాంసులచేత వ్యాఖ్య వ్రాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలో ని ప్రముఖ పండితులచేత వ్యాఖ్య వ్రాయించి ప్రచురించటం సముచితంగానూ, సమగ్రంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ ప్రణాళికకు నేను సమన్వయ సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్హినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”).

తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన [గగ్రంధనిపుణుల సంఘం (ుఖులరు ౦ంయు[గ9ల పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా ప్రణాళికకు సంబంధించిన తొలి సమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్దహణాధికారిగా రి ఆధ్వర్యవంలో 1992 నవంబరు ర5వ తేదీన జరిగింది. ఈ ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం - అని ఈ క్రింది రెండు సంఘాలుగా విభజింపబడింది. సంపాదకవర్గం థ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రాః। ఎన్‌.వి. రఘునాథాచార్య ప్రొః కె. సర్వోత్తమరావు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) సలహా సంఘం

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సు(హ్మణ్యం

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులేోఖరరావు

ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు డొ॥ రావుల సూర్యనారాయణమూర్తి

ఆచార్య కొర్హపాటి శ్రీరామమూర్తి శ్రీకాటథుపొటి సుబ్బారావు

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణకాశ్త్రి

వై సమావేశంలో చర్చింబడిన అంశాల్లో అత్యంత ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు క్రోడీకరింపబడ్డాయి. ఆ నియమాల సారాంశం ;

“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే వుండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం తెలిసిటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్సంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని అతికే సమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైన చోట ఫ్టూలంగా ఐదారు పంక్తులు అవతారిక (పరిచయం) వ్రాయాలి. వ్రతిపద్యానికి అక్కరలేదు.

)

విశేషాంశాల్లో అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను “సంపాదకులు” 'ఎడిచోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్చులు చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొ నడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రవయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రవనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర న్రతులలో సాబ్బగైన పారములున్నవో వాటిని రచనలో ఉటంకించవచ్చు..”*

వై సూచనల ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 456 అశ్వాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. “తిక్కన భారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదీన కార్యనిర్వహణాధికారి గారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది.

1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషేంచివున్న తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలను స్టానికులగు మరికొందరు విద్వాంసులచేత వ్రాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారవన, తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమగ్రతను సంతరించుకొని, చివరకు ““కవిత్రయ మహాభారత ప్రణాళికగా”* సార్ధకమయింది. కవివ్రయ మహాభారతం ప్రాజెక్టు :

మొదటి మూడు పర్వాలు సరళగ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశెలుల వ్యావహారికంలోనూ రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం స్టానికులైన నిపుణులను కోరింది.

అనుభవజ్ఞులగు నిపుణుల అభిప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు””కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో ఆహ్వానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీ స్వామివారి అదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు” కార్యాలయంలోని ప్రచురణల విభాగం (౦1024013 ఇగల్రులో భద్రపరుపబడియున్న భారతం వ్రాత్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ గ్రంధ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్య పద్ధతులను, విధానాలను ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల సారాంశం:

“వుహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్లు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాభ్యానమంతా ప్రామాణిక

౫01 వ్యావవారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్లు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధ్తోలులను ప్రామాణిక వ్యావహారిక శ్రైలిలోనికి మార్చి, ఒకే గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్పూర్తిని పఠితలకు కల్పింపచేయాలని నిర్థయించడమైనది. భాషాశైలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న “ఒరిజినల్‌” వ్రాతప్రతిని చెడగొట్టకుండా “వైస్‌ కాపీని లేఖకులచే వ్యావహారిక భాషలో మరల వ్రాయించ వలసివుంటుంది. వ్యాఖ్యానరచనకు ఒకస్టూలమైన ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరవటమయింది. కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పొటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరవనలో ఏకరూపత (0%9ణ౫90) ఒక్కొక్కచోట లోపించినట్లు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్లు తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. వ్యాఖ్యానం వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆంధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయంచడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, కొందరు రవయితలు న్లోశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం గ్రాశారు. అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని బ్రాతప్రతులను తగినవిధంగా మార్చవలెనని నిర్ణయించటం జరిగింది. మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పం డ్రైండు సంపుటాల్లొ ప్రచురించాలని నిర్ణయించడమైనది. పుస్తకం సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భద్రపరమకోవాలని భావిస్తుంటాడు. అందువల్ల, “వాల్యూమ్‌”కు పర్వాన్ని ప్రమా ణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని బట్రి చూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించే సంపుటికి “క్లాసిక్‌” (0123980) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 1/4 “డెమ్మీసైజు” బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్వంలాంటి పెద్దపర్వాలు, మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు ప్రచురిస్తున్నప్పుడు “వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికా రిగా రి ముందుమాట, “ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి. విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది పద్యాను!క్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. వై పద్ధతుల ననుసరించి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిష్క రించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సయుటుల ప్రచురణ కార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్చహించింది. ఈ'ససమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీ*లను సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ

1 సమావేశంలో కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (౧264110521 క0జు6), సలహామండలి (గీర౧50౧/30జ6) -అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్త్రీకరించటం జరిగింది. సంపాదక మండలి సభ్యులు

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీపొత్తూరి వెంకటేశ్వరరావు

ప్రా॥ ఎస్‌.వి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య

ఆచార్య శె.జె. కృష్ణమూర్తి ఆచార్య శె. సర్వోత్తమరావు

సలహా మండలి సభ్యులు

ప్రా విరుదురాజు రామరాజు హై॥ ఎన్‌.వి. రఘునా థాచార్య

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు అీపొత్తూరి వెంకటేశ్వరరావు

డా॥ అప్పజోడు వేంకటసు బ్బయ్య ఆచార్య ఎం. కులోఖరరావు

ఆచార్య ౩.జె. కృష్ణమూర్తి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు

డా[॥మేడసాని మోహన్‌ ప్రా॥డి. బుద్దన్న

ఆచార్య హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద

తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన “క్యాంవ్‌ ఆఫీస్‌లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్త సమావేశం నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటా అన్నింటినీ వెలువరించాలనే ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు “వర్క్‌ షావ్‌లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గ్రెకొనబడింది.

కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ముద్రించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేద” మందలి ధర్మప్రబోధాన్ని యావదాం ధ్రులకు అందించే ఉదాత్తపా త్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ప్రధమ సంపుటం

  • ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగుచూడ నున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్ధం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య “కరదీపిక? కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత '్రచురిస్తూవున్న ఈ “వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతం? ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయసాహితీవేత్తలు వాటిని మాకు తెలియజేయగలరని మనవి. కృతజ్ఞతలు:

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్టాన ధర్మక్తర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహా(గ్రంథం వెలుగు చూడటంలో ముఖ్యకారకులైన సహృదయులు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణా ధికారులు డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏఖస్‌., గారికి అనేక భన్యవాదాలు.

77

ఈ ద్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆంధ్రావళికి అందజేయటంలో ప్రధానపాత్ర వహించిన- వ్యాఖ్యాతలు, వై ఉభయ మండలుల (సంపాదక మండలి, సలహా మండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన

సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ విద్వాంసులందరికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. “సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి ప్రముఖ పాత్ర వహించిన కీ.శే, కాట్రపాటి సుబ్బారావుగారికి హార్టిక కృతజ్ఞతలు. ' “సప్తగిరి” సంపాదక కార్యాలయ ప్రచురణల విభాగంలో 'సబ్‌ఎడిటరు*గా ఉద్యోగిస్తూ 1995లో పదవినుండి విరమించేదాకా ఈ ప్రణాళిక విషయమై మిగుల సహకరించిన విద్వత్కవివర్యులు శ్రీమాన్‌ ముదివర్తి కొండమాచార్యులు గారికి, ఆచార్య కె.బె. కృష్ణమూర్తి (కంట్రోలర్‌ ఆఫ్‌ పభ్లికషన్సు) గారికి అనేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రిసెర్చ్‌ అసిస్టెంటు శ్రీ కోరాడ రామకృష్ణ తెలుగు సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ గారికి, తదితర సిబ్బందికి, టి.టి.డి. ముద్రణాలయ అధికారి శ్రీ ఎం. లక్మణరావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అను గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ[గ్రంధం వెలుగు చూస్తున్నందుకు, ఆవేదత్రయ

స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. డా॥ఎన్‌.ఎన్‌. రామమూర్తి కన్వీనర్‌ సంపాదకుడు - సప్తగిరి తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి

కవిత్రయు విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సంపాదక మండలి సభ్యులు డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ-ఎ.ఎస్‌., అభ్యక్షులు కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, ప్రధాన సంపాదకులు ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు పా । ఎస్‌.బి. రఘునాథాచార్య డా! అప్పుజోడు వేంకటసు బృయ్య ఆచార్య తె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వోత్తమరావు సలహా మండలి సభ్యులు డా॥ బిరుదురాజు రామరాజు ప్రా॥ ఎస్‌.ఏ. రఘునాథాచార్య ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య ఆచార్య ఎం. కులశేఖరరావు ఆచార్య 3.జె. కృష్ణమూర్తి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు డొ మేడసాని మోహన్‌ ప్రా॥ డి. బుద్దన్న ఆచార్య హెచ్‌.ఎస్‌. (బ్రహ్మానంద డా| ఎన్‌.ఎస్‌. రామమూర్తి, కన్వీనర్‌ “సప్తగిరి: సంపాదకులు, తి.తి.దేవస్థానములు, తిరుపతి.

సగ! కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము వ్యాఖ్యాతలు పేర్లు పర్వాలు, ఆశ్వాసాలు

  1. డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని అది. ఆళశ్వా. కీశితి

శి. డాక్టర్‌ జి.వి. సుబహ్మణ్యం ఆది. ఆళ్వా. ఓ; శాంతి. ఆశ్వా. 1

తె. డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య ఆది. ఆశ్వ. 5,6,7. 8; సభా. ఆశ్వాం 1 వి 4. డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు ఆరణ్య. ఆక్వా. 1 నుండి ₹ వరకు; ఫిష్క. ఆర్వా. క, జె 5. డాక్టర్‌ ౩. సర్వోత్తమరావు విరాట. అశ్వా. 1

  1. డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనా భరావు విరాట. ఆశ్వా. శి

  2. థ్రీ సింగరాజు సచ్చిదానందం విరాట. ఆక్వా. తి; ద్రోణ. ఆశ్వా. తి, జీ; శల్య. ఆళ్వా- ని

  3. డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణళర్మ విరాట, ఆక్వా. కీ

  4. డాక్టర్‌ 3. రామగోపాలకృష్ణమూర్తి విరాట. ఆశ్వా-ర్‌

  5. డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు ఉద్యోగం. ఆశ్వాం 1 శి; సౌప్తిక. ఆశ్వా- = శి

  6. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు ఉద్యోగ. ఆశ్వా. +

1న. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాన్రి ఫీష్మ. ఆశ్వా-తి

  1. డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ దోణ. ఆళశ్వా- 11

  2. డాక్టర్‌ మళ్లేల గురవయ్య దోణ. ఆక్వా. శి

  3. డాక్టర్‌ కె. రాజన్న శాస్త్రి ద్రోణ. ఆక్వా, త్‌

  4. థ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య కర్ణ. ఆశ్వా- 1

  5. డాక్టర్‌ యస్వీ రామారావు కర్ణ. ఆశ్వాం ని

  6. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి కర్ణ. ఆశ్వా. తి

  7. డాక్టర్‌ పి. వెంకటరాజు శల్య. అక్వా, 1

  8. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌, బ్రహ్మానంద శ్రీ. ఆక్వా. 1,2; అశ్వ. 1,2; మౌసల-1;మహా.1; స్వర్గా-1 ని1. డాక్టర్‌ ఎస్‌. గంగప్ప శాంతి. అక్వా, శి

నిశి. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి శాంతి. ఆశ్వాంతి

వతి. డాక్టర్‌ ఆకురాతి పున్నారావు ధాంతి. ఆక్వా. క

నికీ. శ్రీ సముద్రాల లక్మణయ్యనాయుడు శాంతి. ఆశ్వాం స్‌

  1. డాక్టర్‌ బేతవోలు రామ(బహ్మం కాంతి. ఆక్వా. ల

  2. డాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు ఆను. అశ్వ. కేశి

27, డాక్టర్‌ శలాక రఘునా థశర్మ ఆను. ఆక్వా. తి కీ

  1. డాక్టర్‌ ఎమ్‌. కులోఖరరావు ఆను. ఆక్వా. త్‌

  2. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు అశ్వ. ఆక్వా. తి, జీ

  3. డాక్టర్‌ ఎ. నాగభూషణం ఆశ్ర. ఆశ్వా. 1, జ

కు. సంకతాక్షర సూచి

ఆది లా ఆదిపర్వం క ఆ కందపద్యం సభా -ా సభాపర్వం వ ఎ వచనం ఆర ఆ ఆరణ్యపర్వం ఆ -ా ఆటవెలది విరా -.... విరాటపర్వం తే - తేటగీతి ఉద్యో - ఉద్యోగపర్వం క్సీ - సీసం భీష్మ ఆ భీష్మపర్వం ఉ - ఉత్పలమాల దణ - ర్రోణపర్వం చ _ చంపకమాల కర్ణ -.... కర్ణపర్వం మ - మత్తేభ విక్రీడితం శల్య = శల్యపర్వం శా _ శార్దూల విక్రీడితం సౌప్తి. - పౌప్టికపర్వం ఆశ్వా - అశ్వాసం స్తీ. -. స్రీపర్వం క్రీశ... ట్రస్తకం శాంతి ఆా శాంతిపర్వం య -ా యగణం అను -..... అఆనుశాసనికపర్వం మ - మగణం అశ్వ - అశ్వమేధపర్వం త _ తగణం ఆశ్ర ఆ ఆశ్రమవాసపర్వం ర ఆ రగణం మౌస ఆ మౌసలపర్వం జ ఒ జగణం మహా - మహా్రస్థానికపర్వం భ - భగణం స్వర్గా -_ స్వర్గారోహణపర్వం న - నగణం సం _ భండార్కరు సంస్థవారి స - సగణం

'సంస్క్టాతభారత ప్రతి ల బా లఘువు సం.మ.భా - సంస్కృత మహాభారతము గ - గురువు అను - పై ప్రతిలోని అనుబంధాలు అలం = అలంకారం సంపా. -... ప్రధాన సంపాదకుడు సం _-...... సంవత్సరం

మొ... - మొదలైన

7 ఆదిపర్వ కథాసారం (6ండవ భారం)

ధృతరాథ్థునికి షెళ్లియీడు వచ్చింది. గాంధార దేశాన్ని పరిపాలించే సుబలుడనే రాజుకు గాంధారి అనే కూతురు ఉన్నదనీ, ఆమె రూపలావణ్యశీలాలలో ఉత్తమురాలనీ, నూరుగురు బిడ్డల తల్లి కాగలదనీ జ్యోతిష్కులవలన విని భీష్ముడు స్వయంగా ఆ సంబంధాన్ని కుదిరాడు. అంతేకాదు, గాంధారికిపదిమంది తోబుట్టువులున్నారు. వారందరినీ ధృతరాష్ట్రుని కిచ్చి పెళ్చిేచయించాడు. అంతేకాక, కులశీలవతులైన నూరుగురు కన్యల నిచ్చి అపై వివాహాలు జరిపించాడు. ధృతరాష్ట్రుడు గ్రుడ్తివాడయినా అతనికి ఎటువంటి లోపం రాకుండా చూచాడు. ఆతనికి పట్టాభిషేకం చేశాడు.

పాండురాజు అఖిలాన్త శన్హ విద్యలను గడించి విస్పృత దేశదండయాత్రలు చేసి అపార ధనరాసులు తెల్పి ధృతరాష్హుని వశం చేసేవాడు. బంధువులకు పంచేవాడు. అతడు స్వయంవరంలో పొందిన కన్య కుంతి; భీష్మానుమతితో పెండ్లాడిన కన్య మాద్రి. పాండురాజు కుంతీ మాద్రులను అమితానురాగంతో చూచుకొంటూ ఉండేవాడు. కర్షుని జన్మరహస్యం

ఇక్కడ కుంతి జీవితంలో జరిగిన ఒక రహస్య వృత్తాంతం చెప్పాలి. కుంతి భోజుని యింట కుంతి కన్యగొ పెరుగుతున్నప్పుడు అతిథులకు సత్కారాలను స్వయంగా నిర్వహిస్తూ వారి ఆశీస్సులను, ప్రశంసలను పొందుతూ ఉండేది. ఒకసారి దుర్వాసుడు వారింటికి అతిధిగా వచ్చాడు. అతనికి ఇష్టమైన పదార్థాలను వండి వడ్డించి భక్తితో చ్‌ న్‌ు 9, సీవించింది కుంతి. ఆ ముని సంతసించి ఒక దివ్యమంత్రాన్ని ద్రసాదించాడామెకు. ఆ మంత్రంతో ఏ వేల్పునైనా ఆరాథిస్తే అతడు, కోరిన పుత్రుడిని ఇచ్చి సంతోపపైడతాడు. అది ఆపద్ధర్మంగా వాడుకోతగినది మాత్రమే.

ఆ ముని వెళ్లిపోగానే ఆ మంత్రశక్తిని పరీక్షించాలని ఆసక్తి కలిగి గంగదరి కేగి కుంతి సూర్యుడిని స్మరించి అతనివంటి కొడుకును కోరి మంత్రాన్ని జపించింది. సూర్యుడు తరుణద్యుతితో ఆ తరుణి దగ్గరకు దిగి వచ్చాడు. సహజ కవచకుండల శో భితుడైన బిడ్డ నివ్చాడు. అతడే కర్ణుడు. అయితే కుంతి కోరికై ఆమె కన్యాత్వం యథాతథంగా ఉండేటట్లు వరమిచ్చాడు. కుంతి సూర్య ప్రీరితమై వచ్చిన ఒక మందసంలో కర్ణుడిని ఉంచి నదిలో వదిలింది. సూతుడొకడు ఆ పెట్టెను పట్టి కర్ణుని తన పట్టిగా పెంచుకా న్నాడు.

కుంతి కర్లుని జన్మరహస్యాన్ని బైట పెట్టలేదు. అది దేవరహస్యంగా ఉండిపోయింది. పాండవ, కౌరవ జననం

ఒకసారి పాండురాజు వేటకు వెళ్లాడు. ఆ రోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు. విసిగివేసారి పోయాడు. చివరకు ఒకచోట, రెండు మృగాలు క్రీడిస్తుంటే చూచి వాటిని బాణాలతో కొట్టిచంపాడు. క్రిందముడనే ముని తన భార్యతో కలసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు. అతడు పాండురాజు బాణాలకు చనిపోతూ శాపం పెట్టాడు _ “నేను నా భార్యతో కూడినప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవు నీ భార్యతో కూడినప్పుడు చనిపోతావు. నీ భార్యకూడా చనిపోతుంది” - అని శపించి ఆ బుషి దంపతులు కన్నుమూశారు. పాండురాజు విషజ్ణుడయ్యాడు; విరక్తుడు కూడా అయ్యాడు. భార్యాసమేతుడై శతశ్చంగపర్వతం చేరి ఘోరతపస్సు చేయనారంభించాడు. అది

2కే! బ్రహ్మలోకానికి మ్లోదారి. కొందరు మునులు బ్రహ్మలోకానికిపోతూ ఉంటే పాండురాజు వారితో తానూ వస్తానన్నాడు. కాని, వారు “అపుత్రస్య గతిర్నాస్తి - అని వినలేదా! నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి ల్పర్గతలే'దని చెప్పారు. వారి మాటలు పొండురాజును మరీ క్రుంగదీశాయి. సంతానాన్ని గురించి కుంతీమా ద్రులతో కలసి ఆలోచించాడు. దుర్వాస మహర్షి తన కిచ్చిన మహామంత్ర మొకటి ఉన్నదని ఆపద్ధర్మంగా దానిని పు త్రలబ్ధికి వాడుకోవచ్చునని కుంతి చెప్పింది. పాండురాజు అంగీకరించాడు. కుంతిని ఫు త్రసంతానంకొరకు మంత్రమహిమ నా శ్రయించుమని నియోగించాడు. ఆమె భర్తకు ప్రదక్షిణం చేసి సమాహిత చిత్తంతో మంత్రాన్ని జపించింది. మొదటగా - సర్వలోకాలకు ఆశ్రయమైన ధర్మానికి మూలమైనవాడు ధర్ముడు; అతనిని స్మరించి ఉత్తమ ధర్మవర్తనుడైన పు క్రుడిని కోరుకొన్నది. దిక్కులు కాంతులతో పిక్కటిల్లేటట్లు వెలుగొందే బాలుడు ధర్ముని అంశాన జన్మించాడు. అతడు పుట్టినప్పుడు సర్వభూతములు సంతోషించాయి. ఆకాశవాణి ఇట్లా పలికింది: “ఇత్రడు కురుకుల దీపకుడౌతాడు; ధర్మస్థిరమతి కావటంచేత యుధిష్టిరుడు- అని పిలువబడతాడు. యుధిస్టిరుడు పుట్టిన సంగతి హస్తినాపురానికి వార్త అందింది. అందరూ సంతోషించారు. కాని, గాంధారి అప్పటికే గర్భవతి. సంవత్సరం నిండుతున్నా ముందుగా సంతానాన్ని కనలేకపోయింది. ఆ అసూయతో కడుపువై బాదుకొన్నది. గర్భపాతమైపోయింది. వేదవ్యాసుడు వచ్చి ఆ పిండఖండాలను నూటొక్కటిని లెక్కించి వేరువేరు తైలభాండాలలో భద్రపరిచాడు. నూర్వురు కొడుకులు, ఒక్క కూతురు పుడతారని చెప్పి వెళ్లాడు. అక్కడ - శత శృంగపర్వ్పతంమీద పాండురాజు మరొకపు కత్రుని పొందాలనే కోరికతో కుంతిని - వాయుదేవుని ఆరాధించి ఉత్తమజవసత్తుడైన కుమారుడిని పొందుమని - అడిగాడు. ఆమె అలాగే చేసింది. వజదేహుడైన విక్రమోన్నతుడైన బాలుడు పుట్టాడు. దివ్యవాణి అతనికి “భీమసేనుడు”' అని పేరు పెట్టింది.

అదేరో జున హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్నీ, లోకాన్నీ నాశనం చేయగల దుళ్ళకునాలు ఎన్నో పొాడసూపాయి. అందరూ భయవిహ్వలు లైనారు. అట్లాగే క్రమంగా దుశ్శాసనుడు మొదలైన తొంభై తొమ్మిదిమంది తమ్ములు, దుళ్ళల అనే చెల్లెలు పుట్టారు. కులనాశకుడైన దుర్యోధనుని ఒక్కడిని దూషించటం మంచిదని పెద్దలు ధృతరా స్ట్రనికి సూచించారు. అతడు పు త్రవ్యామోహంతో దాన్ని అంగీకరించలేదు.

ఈ సంగతి విని - పాండురాజు త్రిలోకవిజయుడైన పుత్రునికొరకు ఏకపాదంమీద నిలువబడి ఒక సంవత్సరంకాలం ఇంద్రుడిని గురించి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రసన్నుడై శత్రుకయాన్ని చేయగల మహావీరుడు నీకు కొడుకుగా పుడతాడని వరమిచ్చాడు. కృతార్జుడైన పాండురాజా, కుంతీదేవిని దేవేంద్రుని ఉపాసించుమని కోరాడు. అమె అట్లాగే ఆరాధించింది. స్థిరపొరుషుడు, లోకోత్తరుడు, వంశకరుడు అయిన పుత్రుడు ఇం ద్రాంశతో పుట్టాడు.

ఆ సమయంలో దేవతలు ఆ బాలుని భావి బలవీర్యాలను క్షీరిస్తూ పూలవానలు కురిపించారు. ఉత్తరఫల్లునీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ బాలుడీని ఫల్లునుడనీ పిలిచారు,

ముగ్గురు కొడుకులను చూచి పాండురాజు మూడులోకాలు జయించినట్లు పొంగిపోతుండేవాడు. కాని, మాద్రి తనయందుపు త్రసంతానం పొందే ఉపాయం లేకపోవటంవలన విచారిస్తూ ఉండేది. దీన్ని గమనించి, కుంతితో ఒప్పించి, దుఠ్వాసుని మంత్ర ప్రభావంతో మా ద్రచేత ఆశ్వినీ దేవతలను ఆరాధింపజేసే కవలప్మిల్లలను పొందగలిగాడు. వారే నకుల

స... సహదేవులు. సౌందర్య పరాక్రమాలలో సాటిలేనివారు. ఇట్లా పంచపాండవులు పుట్టి శ్తుకపక్ష చంద్రబింబాలవలె పెంపాందుతూ ఉన్నారు. అంతలో ఒక విపత్తు. వసంత బుతువు వచ్చింది. ప్రకృతిశోభ మానవుల హృదయాల నుషప్పాంగ జేస్తున్నది. ఒకనాడు కుంతి అన్నదానవ్రతంలో నిమగ్నురాలై ఉన్నది. మాద్రి ఒక్కతే పాండురాజు ఫ్రక్కన ఉన్నది. ఆమె మనోహరరూపం వసంత ప్రభావంతో అతని మనస్సు నాక్షర్షించింది. పాండురాజు మాద్రిని సమీపించాడు. మునిశాపంచేత మరణించాడు. శతశ్చంగీయులందరూ గుమికూడారు. హృదయ విదారకంగా విచారించారు. మాద్రి తాను పాండురాజుతో సహగమనం చేసింది. కుమారరకణకు కుంతి దృఢవిత్తంతో జీవించ సంకల్పించింది. మా ద్రీపాండురాజుల అంత్య క్రియల తర్వాత వారి అవేషాలతో అందరూ హస్తినాపురం చేరారు. రగిలిన పగలు హస్తినాపుర రాజమందిరంలో అటు కౌరవులు, ఇటు పాండవులు అందరూ కలసి బాల క్రీడ లాడుతుండేవారు. అందరిలో బలాఢ్యుడు భీమసేనుడు. జలక్రీడ లాడేటప్పుడు భీముడు కౌరవులను బుజాలవైకెక్కించుకొని నీటిలో ముంచి తేల్చి ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. పండ్లకోసం కౌరవులు చెట్రెక్కితే భీముడు చెట్ల మొదళ్లు పట్టి ఊపి పండ్రతోబాటు వారిని కూడా క్రింద పడేసేవాడు. ఇట్లా భీముని చేతిలో బాధపడలేక దుర్యోధనుడు- శకుని దుశ్శాసనాదులతో మంతనాలు సలిపి, భీముడిని ఒంటరిగా ఉన్నప్పుడు చంపటానికి పన్నాగాలు పన్నాడు. ఒకనాడు భీముడు జలక్రీడలలో వేయిమంది వీరకువూరులతో పోటీపడి గెలిచి, బాగా అలసిపోయి, చల్లగాలి వీస్తుంటే నీటి ఒడ్డునే పడుకొని గాఢనిద్రపోయాడు. దాన్ని గమనించిన దుర్యోధనుడు భీముడిని లతాపాశాలతో గట్టిగా కట్టించి నీటిలో త్రోయించాడు. కాని, భీముడు ఒళ్ళు విరుచుకుండే సరికి ఆ లతలన్నీ వెటవెటా తెగి పోయాయి. భవబంధవిముక్తుని వలె నీటినుండి బయటికి వచ్చాడు. ఒకనాడు బాగా శ్రమించి భీముడు ని ద్రిస్తున్నాడు. ఆ అదను కనివెట్టి దుర్యోధనుడు ఒక సారధి చేత పాములను తెప్పించి అతడిని కరిపించాడు. భీముని శరీరం వజ్రతుల్యం కావటం చేత పాముల కోరలు అతని చర్మంలో దిగబడలేదు. కాని, నిద్ర మెలకువ వచ్చింది. అతడు సారథి నొక్క చరుపుతో చంపివేశాడు, పాములను కాళ్ళతో నలిపివేశాడు. ఒకసారి అన్నంలో విషం కలిపి పెట్టించాడు దుర్యోధనుడు. యయుత్సుడు వద్దంటున్నా ఆకలిగొన్న భీముడు ఆ విషాన్నం తిన్నాడు. విషంకూడా ఆకలి వలన అతనికి అమృతంగా మారింది. ఇట్లా ఎన్నో ఉపాయాలతో భీముడిని వధించి ధర్మరాజును ఒంటరివాడిని చేసి చంపాలని దుర్యోధనుడు ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరకు - పాండవుల కందరికీ అపాయం కలిగించే ఉపాయమే ఉపాదేయ మనుకొన్నాడు,. భీష్ముడు బాలురకందరికీ మొదట కృపాచార్యునిచేత విలువిద్య నేర్పించాడు. అపై ద్రోణుడిని కూడా నియోగించాడు. ద్రోణుడిని ద్రుపదుడు అవమానించాడు. అందువలన అతనివై ప్రతీకారం తీర్చుకోవాలని ఆతడు లోలోన మండిపోతున్నాడు. శిష్యులందరిని తనకోర్కె తీర్చగలరా అని అడిగాడు. అర్జునుడు ఒక్కడే మాట ఇచ్చాడు. అందువలన అతడిని జగదేకవీరునిగా తీర్చిదిద్దుతానని ద్రోణుడు వరమిచ్చాడు. ఏకలవ్యుని వంటి వారి అడ్డును ఉపాయంతో తొలగించాడు. రా త్రియుద్ధం, శబ్దభేది, అ న్రశస్తాలు, విలువిద్యా రహస్యాలు ఎన్నెన్నో అర్జునుడికి బోధించాడు. విలువిద్యలో పార్టుడే ప్రధమగణ్యుడు.

ఎ రాజుకుమారుల అ న్హశన్తపాండిత్యాన్ని వెద్దల ముందు స్రదథ్ణింప చేయటానికి ద్రోణుడు ఒకవిశాలసమతల ప్రదేశంలో రంగం ఏర్పాటు చేయించాడు. తెల్లని వస్త్రాలను ధరించిన ద్రోణుడు అశ్వత్థామ వెంటరాగా క్రీడారంగం మధ్యకు వల్చి నిలువబడ్డాడు. కురుకుమారులందరూ జ్యేవషానుపూర్వంగా మహాధనువులతో తనుత్రాణాలతో గురువుగారి వెనుక వరసగా నిలిచారు. చూడముచ్చటగా ఉన్నది దృశ్యం.

మొట్టమొదట భీమ దుర్యోధనుల గదా ద్వంద్వ యుద్ధం ప్రవర్తిల్లింది. భూమి దద్రరిళ్లేటట్లు పాద ఘట్టనం చేస్తూ మదపుటేనుగులవలె భయంకరంగా పోరాడ సాగారు భీమదుర్యోధనులు. ప్రజలలో వారిరువురి పట్ల అభిమానం గల వారు వెద్ద అరుపులతో పాటు పరస్పర వివాదాలు గూడా చేయటం మొదలు వెట్టారు. దానితో వారిద్దరి పోరును ద్రోణుడు అశ్వత్థామను పంపి ఆపించాడు.

ఆ తరువాత హేమకవచావృతుడు, ఉన్నతచాపధరుడు, అసితోత్పలవర్డుడు, బద్ధతూణీరుడు అయిన అర్జునుడు రంగమధ్యంలో నిలివి జనహృదయాలను ఆకట్టుకొన్నాడు. ప్రజలు చేసే ద్రస్తుతి మిన్నంటింది. అర్జునుడు ఆచార్యుని అనుమతితో ఆగ్నేయ, వారుణాది మహాస్త్రాలను ప్రయోగించి, పరుగెత్తుతున్న మృగాలవై బాణాలు నాటే పలునేర్పులను ప్రదర్శించి విలువిద్యలో మేటివీరుడని జయజయధ్వానాలు పొందాడు.

అంతలో సహజకవచకుండలధా రియ్టైన కర్ణుడు రంగద్వారం వద్ద నిలివి భుజాస్సాలనం చేసి అర్జునుడిని ద్వంద్వ యుద్దానికి ఆహ్వానించాడు. ద్రోణుని అనుమతితో ముందుగా అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ వ్రదర్శించి చూపించాడు. అతని పరాక్రమాన్ని చూచి దుర్యోధనుడతనిని కౌగిలించుకొని “నాతో స్నేహం చేసి నాకూ నా బంధువులకూ హితం

చేసీ నన్ను కురురాజ్యం ఏలించి, నా ఐశ్వర్యం ఉపయోగించుకో” అని కోరాడు. కర్ణుడు దానికి అంగీకరించాడు.

ఆ తరువాత కర్ణార్డునుల ద్వంద్వ యుద్ధం మొదలైనది. కర్ణుడు పర్షన్యాన్తం వేశాడు. అర్జునునివై మేఘాలు దట్టంగా క్రమ్మాయి. కుంతి భయపడింది. అంతలో అర్జునుడు వాయుబాణం వేసి మేఘాలను చిమ్మివేశాడు. కుంతి శాంతపడింది. వారిద్దరి నడుమ పంతాలు వెరుగుతున్నందువలన కృపాచార్యు డడ్డంవచ్చి, అర్జునుని తల్లిదండ్రుల వేర్లు కులం అందరికీ తెలుసు. అట్లాగే నీ వివరాలు తెలియజెమ్హు మని కర్ణుడిని అడిగాడు. కర్ణుడు చెప్పడానికి సిగ్గుపడి తలవంచుకొన్నాడు.

దుర్యోధనుడు రంగప్రవేశం చేసి, రాజైతేనే గాని పార్థునితో యుద్ధం చేయడానికి వీల్లేదంటే ఇదుగో అంగరాజ్యాన్నిస్తున్నానని, రంగమధ్యంలో సింహాసనం వేసి అంగరాజ్య పట్టాభిపేకం చేసి కర్టుడిని అంగరాజుగా పిలిచాడు. సూతుడు, కొడుకును చూచి ఉప్పాంగిపోయి కౌగలించుకొన్నాడు. కర్టుడు అతనికి అభివాదనం చేశాడు. దానితో అతడు సూతపుత్రు డని అందరికీ తెలిసి పోయింది. సూతపు త్రుడు క్షత్రియునితో యుద్ధం చేయటం తగదన్నాడు భీముడు. దుర్యోధనుడు అతని మాటలకు అడ్డువచ్చాడు. 'లేడి కడుపున పులి పుడుతుందా? ఇంతటి దివ్యతేజస్సు కలవాడు సామాన్యుడై ఉంటాడా? సూరుల జన్మం సురల జన్మం, ఏరుల జన్మం ఎవరు చెప్పగలరు? సహజ కవచ కుండలథారియైన ఇతడు అంగరాజ్యానిక్షే కాదు, అఖిల మహీమండలానికే అధిపతి కాగలిగినవాడు' అని ప్రశంసిస్తూ ఉండగా స్రొద్దుక్రుంకింది. అందరూ వారివారి మందిరాలకు వెళ్ళారు.

2004 గురుదక్షిణ మరునాడు ద్రోణాచార్యులు శిష్యులనందరినీ పిలిచి “గురుదక్షిణ ఇవ్వండి!” అన్నాడు. అందరూ గురువుగారిని ఆదేశించుమన్నారు. “ఐశ్వర్యమదగర్వితుడైన ద్రుపదుడిని ఓడించి పట్టి నాముందు పెట్టండి. అదే నేను కోరే గురుదక్షిణ” అని ప్రకటించాడు ద్రోణాచార్యుడు. ఆమాట వినగానే కౌరవులందరూ సైన్యాలను వెంటబెట్టుకొని రథా లెక్కి పాంచాలపురం వైపు పయనం సాగించారు. పాండవులు గురువుకు స్రదక్షిణంచేసి ఆయనను వెంట తీసికొని ఆతరువాత బయలుదేరారు. కౌరవుల సేనను ద్రుపదుడు చతురంగసేనతో ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా సాగింది. ద్రుపదుని పరాక్రమానికి కారవులు నిలువలేకపోయారు. వెనుదిరిగి పోసాగారు. పాండవు లెదురుపడ్డారు. వారి అండన నిలిచారు. అర్జునుడు భీముని సాయంతో ముందుకు నడిచాడు. ద్రోణుడినీ, ధర్మజుడినీ ఒకవోట నిలిపారు. సైన్యంతో భీముడు ద్రుపదుని గజబలాన్ని మట్టుపెట్టాడు- అర్జునుడు అశ్వబలాన్ని మట్టుబెట్టి ద్రుపదునివై బాణాలు గుప్పించాడు. అంతలో ద్రుపదుడు అర్జునుని విల్లును విరుగకొట్టాడు. అర్జునుడు సింహంవలె లంఘించి కత్తితో ద్రుపదుని రథంపైకి దూకాడు; మెరుపుదాడి చేసి అతడిని రథాకంతో కట్టి ద్రోణుని యెదుటకు తెచ్చి ఉంచాడు. అప్పుడు అవహేళనగా నవ్వుతూ ద్రోణుడు ద్రుపదునితో ఈవిధంగా అన్నాడు. కు వీ రెవృరయ్య 'ద్రుపదమ హారాజులె యిట్లు కృపణులయి పట్టువడన్‌ వీరికి వలసెన యహహ! మ హా రాజ్యమదాంధకార మది వాసెనాకో 1?" ఇప్పటికైనా నేను జ్ఞాపకానికి వచ్చానా? అని అధికేపించి ద్రుపదుడిని వదలివేశాడు. ఇట్లా గురుదక్షిణను పాండవులే ఇవ్వగలిగారు. లాక్షగృహ దహనం రాజ్యభారాన్ని వహించగలవాడినిగా భావించి భీష్మ విదురాదులతో విచారించి ధృతరాషుడు ధర్మరా జూకు యువరాజాగా పట్టంగట్టాడు. ధర్మజుడు నలుగురు తమ్ముల సాయంతో నాలుగుదిక్కులా విజయయా త్రలు సాగించి అపారధనరాసులను తెచ్చి హస్తినాపురవైభవాన్ని పెంచాడు. ధర్మరాజు పేరుకు యువరాజాగాని, తీరుకు సార్వభౌముడు. పాండవులమీద పెరుగుతున్న ప్రజానురాగం దుర్యోధనుని గుండెలో అసూయారగిని రగిల్చింది. అతడు ధృతరా స్టుని దగ్గరకు వెళ్లి తన దుఃఖాన్ని వ్లగ్రక్కాడు. వైతృకమైన ఈ రాజ్యలక్ష్మి ని పూర్వం పాండురాజు భరించాడు కాబట్టి ఇప్పుడు ధర్మరా జాను యువరాజునుచేశారు. ఆ తరువాత అతని కొడుకులు, మనుమలే రాజ్యాధిపతు లౌతారు- మేము వారిని సేవించి బ్రతికే దుర్గతి ఏర్పడుతుంది. రాజ్యం మీ అధీనంలో ఉన్నది కాబట్టి మీరే మాకు రాజ్యానికి మార్గం వేసి చూపించాలి. పాండవులకీర్తి ప్రజలలో పెరిగిపోతున్నది. ముందు వారిని దూరం వేయండి. వారణావతొనికీ పంపండి. అరు నెలలలో నేనూ హస్తినాపురి ప్రజలలో నామీద అభిమానం కలోటట్లు చూచుకొంటాను' - అని వాదించి తండ్రిని ఒప్పించాడు. ధృతర్యాస్తుడు నయంతో ద్రీముతో పాండవులను క్తుంతితో సహా వారణావతానికి పంపాడు. అక్కడ దుర్యోధనుడు పురోచనునితో లక్కయింటిని కట్టించి సమయం కనిపెట్టి అందులో పాండవులు తగులపడేటట్లు చూడాలని పన్నాగం

ఎం! పన్నాడు. విదురుడీ రహస్యాన్ని గోప్యంగా స లాగాలో నిపుణంగా లూక జి స గగౌ౦చి, భీమునితాచెప్పి, = ఢచారిని పాండవుల చెంతకు పంపించి లక్కయింటినుండి వారు తప్పించుకొని పోవటానికి బిలమార్గాన్ని ఏర్చరవి, కృష్ణ చతుర్దశినాటి రాత్రి లాక్షాగృహదహన మవుతుందని సూచించాడు. భీముడు ఈ రహస్యాన్ని గమనించి పురోచనుని, ఒకదాసిని, దాని అయిదుగురు కొడుకులను ఆ లక్కయింటిలో ఉంచి, అన్నదమ్ములను తల్లిని బిలంద్వారా పంపించి, నియమించిన ముహూర్తం కంటే ముందే లక్కయిల్లు మొత్తం దహనమయ్యేటట్లు చూచి తాను బిలంద్వారా వెడలిపోయాడు. ఒక్క విదురుడు తప్ప అందరూ పాండవులు లక్కయింటిలో పడి కాలి పోయా రని దుఃఖించారు. ధృతరాష్ట్ర దుర్యోధనుల పాప సంకల్పాలను ప్రజలు గర్భించారు. బిల ద్వారం గుండా పాండవులు బయటపడి పాదచారులై నడిచి ఒక వనం చేరారు. భీముడు నీరు తెచ్టే లోపలే ఒక చెట్టుకింద ధర్మజాదులూ, కుంతీ గాఢనిద్రలో మునిగిపోయారు. వారి దీనావస్టకు విచాయడుతూ ఆ రాత్రి భీముడు వారికి కాపలా కాస్తూ ఉన్నాడు. అది హిడింబాసురుడు నివసించే వనం. నరవాసన కొట్టింది అతనికి. పాండవులను చంపి వండి వడ్డించుమని వెల్లెలైన హిడింబను అజ్ఞాపీంచాడు. ఆమె ఆ చెట్టు ద్య్గరకు వచ్చింది. భీముని సుందర వీరాకారం చూచింది. మనసారా స్రీమించింది. అతని తోడిదే తన జీవిత మని మొదటిచూపులోనే నిర్ణయించుకొన్నది. అన్నను పోగొట్టుకొన్నా భీముడిని మాత్రం పొందాలని అనుకొన్నది. అన్ని విషయాలు భీముడికి చెప్పింది. ఆలస్యమైనదని హిడింబుడు వచ్చాడు. భీము డాతనితో యుద్దానికి తలపడ్డాడు. రాక్షసుని అరుపులకు కుంతి నిద్ర లేచింది; ధర్మజాదులు లేచారు. హిడింబ మానవాకారంలో ఎదుట కనపడింది. కుంతి ఆమెను గురించి అడిగింది. హిడింబ ఏ సంగతీ దాచుకోకుండా మనసు విప్పి కుంతితో చెప్పుకొన్నది. ఆమెకు ఎన్నో మహిమ లున్నాయి. వాటిని ప్రదర్శించి చూపింది. భీముడు హాడింబాసురుడిని చంపాడు. పాండవులను హిడింబ అనుసరించింది. భీముడు వారించాడు. ధర్మజుడు, కుంతి భీముడికి నచ్చచెప్పారు. శాలిహో త్రుని ఆశ్రమం గురించి హిడింబ చెప్పిన మాటలు నిజమని తెలిశాయి. భీమునితో హిడింబకు వివాహమయింది. పగలల్లా ఆ దంపతులు అడవులలో విహరించేవారు; రా త్రిళ్ళు ధర్మరాజాదుల వద్ద ఉండేవారు. కొన్నాళ్లకు ఘటోత్కచుడనే పుత్రుడు పుట్టాడు హిడింబకు. భయంకరాకారుడు, సద్యోయౌవనుడు, అ'స్టశన్త కుశలుడు, రాక్షస పిశాచబలపరివృతుడు అయిన ఘటోత్కచుడు పాండవులను కొంతకాలం సేవించి రాక్షస రాజ్యానికి వెళ్లిపోయాడు తల్లిని తీసికొని. స్మరిస్తే చాలు స్రత్యక్షమౌతా నని తండ్రితో చెప్పాడు. శాలిహోత్రుని ఆశ్రమంలో వ్యాసుడు పాండవులకు దర్శన మిచ్చాడు. జరిగిన దానికి విచారించ వద్దని ధైర్యం చెప్పి, భావికార్య క్రమాన్ని సూవించి వెళ్లాడు. పాండవులు బ్రాహ్మణవేషాలతో ఏకవ[్రపురం చేరారు. అక్కడ భిక్షాటనం చేసికొంటూ బ్రతుకు సాగించారు. అయినా, అక్కడ ప్రజలను పట్టి పీడించే బకాసురుడిని భీముడు వధించి వారికీ శాంతి సౌఖ్యాలను అందించాడు. పాండవ వివాహం అనాడు అర్జునుడి చేతిలో ఓడిననాటినుండి ద్రుపదుడు - ద్రోణుడిని చంపే కొడుకును, అర్జునుని వివాహమాడే కూతురును పొందాలని అనేకఘోరవ్రతాలు చేశాడు. చివరకు ఒక క్రతువు నిర్వహించాడు. యజ్ఞాగ్నిలో నుండి ఉజ్జ్వల కరవాలంతో రథారూఢుడైన ధృష్టద్యుమ్నుడు పుట్టాడు, దివ్యతేజస్విని ద్రౌపది పుట్టింది. ఆ ద్రౌపదిని అర్జునున కివ్వాలని

ర. లోన సంకల్పం. వైకి, చలత్‌ మత్స్య యంత్రభేదనాన్ని వరపరీక్షగా వెట్టాడు ద్రపదమహారాజు. ఈ సంగతి పాండవులు ఏకచక్రపురంలో విన్నారు. పాంచాలపురికి హుటాహుటి పయనమైనారు. ద్రుపద నగరం స్వయంవరోత్సవంతో కోలాహలంగా ఉన్నది. ఎత్తుగా కట్టబడిన మత్స్య యంత్రాన్ని అయిదు బాణాలతో ఎవడు కొట్టగలడో, ఆ విలుకాడే ద్రౌపదికి భర్త కాగలడని పాంచాలపతి ప్రకటించాడు. రాజులు నగరం చుట్టూ డేరాలు తీర్చి స్వయంవరానికి దిగి ఉన్నారు. పాండవు లాపురిలో బ్రాహ్మణ వేషాలతో స్రవేశించి ఒక కుంభకారుని యింట్లో వసించి మత్స్య్యయంత్రసభకు వెళ్లారు. ధృష్టద్యుమ్నుడు స్వయంవర నియమాన్ని ప్రకటించాడు. స్వయంవర సభలో విస్చసియున్న రాజుల నందరినీ ద్రౌపదికి చూపించాడు. అందులో నూరుగురు కారవు లున్నారు; కర్ట్ణాశ్వత్థామాదులు కూడా ఉన్నారు. వారిలో ఎవరు లక్ష్యాన్ని భేదిస్తే అతడు కల్యాణమాలకు అర్హుడని సూచించాడు. ఆ సభలోని అతిధులలో వాసుదేవు డున్నాడు. అతడు బ్రాహ్మణవర్గంలో పంచాగ్నుల వలె వెలుగొందుతున్న పాండవులను గ్రహించి, పార్టుడు పాంచాలిని గ్రహిస్తాడని సంతోషించాడు. కొందరు రాజులు విల్లును ఎక్కుబెట్టలేక వెనుతిరిగి పోయారు; కొందరు ప్రయత్నమే చేయలేకపోయారు; కొందరు చేసి విఫలురయ్యారు. బ్రాహ్మణులలోనుండి అడ్టునుడు లేవి యంఠ్రాన్ని సమీపించి, గురువులకు నమస్కరించి, ధనువునకు ప్రదక్షిణం చేసి యొక్కి, దానిని అవలీలగా ఎక్కుపెట్టి, అలవోకగా మత్స్య యంత్రాన్ని భేదించాడు. సభికులందరూ ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణులుప్పాంగిపోయారు. ధృష్టద్యుమ్నుడు సైన్యంతో అర్జునుని వెంట నిలువబడ్డాడు. ధర్మజుడు నకుల సహదేవులతో కలిసి వసతి గృహానికి వెళ్లాడు. ద్రౌపది కల్యాణమాలను అర్జునుని మెడలో ఉంచటానికి బయలు దేరింది. దుర్యోధనాదు లది సహించలేకపోయారు. రాచకన్నైను విఫ్రుడి కివ్వటం అవమానమని ఆగ్రహించారు. విస్రాకారంలోనున్న అర్హునుడిని అపహసించారు. [ద్రుపదుడు భయపడి బ్రాహ్మణుల వెనకాల నిలువబడ్డారు. వారందిరికి అభయమిచ్చి అర్జునుడు భీమసవాయంతో తిరుగబడ్డాడు. అర్జునుడికి ఎదురుగా కర్ణుడు నిలిచి బాణయుద్ధం చేశాడు. తన ఎదుట నిలువగలిగిన ఆత డెవడా? అని కర్ణుడాశ్చర్యపోయాడు. ఎవడో విస్రశ్రేస్టునివలె నున్నాడని రణరంగం నుండి తొలగిపోయాడు. భీముడు శల్యుడిని నేలపై పడవేసి కొట్టాడు. అతడు లేవి దుమ్ము దులుపుకొని వెళ్లిపోయాడు. ఆ బ్రాహ్మణు లెవరో తేల్చుకోవాలని పట్టుబట్టిన దుర్యోధనాదులకు మొగం వాచేటట్లు సమాధానం చెప్పి వాసుదేవుడు పంపివేశాడు. రాజులు మరలి పోయారు. భీమార్జునులు ద్రౌపదిని తీసికొని యింటికి వచ్చారు. ధర్మజాదులతో కలిసి “తల్లితో అమ్మా! మే మొకభికతెచ్చాం”” అని అన్నారు. కుంతి అసలు విషయాన్ని గమనింపక ““మీరయిదుగురూ ఉపయో గించుకొనండి”” అని కొడుకులను నియోగించింది. ఆ తరువాత ద్రౌపదిని చూచి అధర్మాన్ని ప్రబోధించానని చిన్నబోయింది. ఆమె అన్నమాట అయితీరుతుంది. పాండవులు అమ్మమాట జవదాటరు. కుంతి కలత చెందింది. ధర్మజుడు తల్లి నోదాల్చి ద్రౌపదిని అర్జునుడినే వివహమాడుమన్నాడు. అర్జునుడు వెద్దవాడైన ధర్మరా జాను వెండ్లాడుమన్నాడు. వీరిద్దరూ ఇట్లా అంటూనే ఉన్నారు. పాండవు లైదుగురూ పాంచాలిని చూచి మన్మథభావాన్ని ఒకేసారి పొందారు. పాంచాలి కూడా వారి అయిదుగురియందు బద్దానురాగర్చై నిలిచింది. ధర్మజుడు వేదవ్యాసుని మాటలు స్మరించి ద్రౌపదిని పాండవు లైదుగురు పాణిగ్రహణం చేయటమే ఉత్తమమని నిర్ణయించాడు.

ంర/111 మత్స్యయం(్రం భేదించింది అర్జునుడనీ, ద్రౌపదిని వివాహమాడేది పాండవులనీ తెలిసికొని ద్రుపదుడు సంతోషించాడు. ద్రౌపదికి భర్సపంచకం ఏర్పడటానికి గల పూర్వ జన్మ వృత్తాంతాన్ని వ్యాసుడు వినిపించాడు. ఆమె అయిదుగురు భల భార్య అయినా ఎవరిద్యురి కన్యాత్వం సతీత్వం వారివద్ద మొక్కవోకుండా ఉండే వరం ఉండటంవలన వివాహంలో కూడా వరుసగా ధర్మజాదులు తాళిగట్టేటప్పు డామె కన్యాత్వం చెక్కు చెదరకుండా నిలిచింది. ఆ మహిమను చూవి అగ్షిజాతయైన ద్రౌపదియొక్క విశ్ఞ లక్షణంగా అందరూ భావించారు. వాసుదేవుడు సంతోషించాడు. పాండవుల వివాహం వైభవంగా జరిగింది. వారు పాంచాల నగరంలో ఒక యేడాదిపాటు ఉన్నారు. ఇంద్రప్రస్థపురం ధృతరా డు భీష్మాదుల నీతివచనాలు విని విదురుని పంపి పాండవులను హస్తినాపురానికి పిలిపించాడు. లాక్షాగ్స్గహదహనం నుండి పాండవులు బైటపడ్డందుకు దుర్యోధనుడు లోలోన మండిపోతుండేవాడు. పాండవులు ఎక్కువ కాలం హస్తినాపురంలో ఉండకుండా చూడుమని తండ్రిని బలవంతపెట్టేవాడు. కొడుకుపోరు పడలేక ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్య మిచ్చి ఇంద్రప్రస్థపురం రాజధానిగా ఏలుకోండని పంపొడు. ధర్మరాజును పట్టాభిషిక్తుడిని చేశాడు. శ్రీకృష్ణాదులు వెంటరాగా పాండవులు ఇం ద్రప్రస్థపురాన్ని చేరుకొన్నారు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని, ఇంద్రుడు విశ్వకర్మను స్మరించగా విశ్వకర్మ సాయంతో ఇంద్రప్రస్థపురం దిక్పాలకుల పురాలతో దీటైనదిగా రూపొందింది. వాసుదేవుని అనుమతితో ఆశీస్సులతో ధర్మజు డా నగరంలో ప్రవేశించి అపర దేవేంద్రుని వలె వెలుగొందుతూ ఉన్నాడు. ఒకనాడు నారదుడు వచ్చి పాండవులలో ఒక్కొక్కరు ద్రౌపదిని ఒక్కొక్క యేడు తన భవనంలో ఉంచుకోవాలనీ, ఆ కట్టడిని తెలిసిగాని, తెలియకగాని ఎవరైనా మీరితే ఒకయేడాది పాటు ఆతడు తీర్ణ్భయాత్రలు చేసిరావాలనీ నియమం వేశాడు. పాండవులు దానికి కట్టుబడి ఉన్నారు. ఒక యేడు ధర్మరాజు అంతఃపురంలో ద్రౌపది ఉంటున్నది. అర్జునుడు బ్రాహ్మణ ధేనువును రక్షించటానికె ఆయుధాలు తెచ్చుకొందామని ధర్మజుని భవనానికి వెళ్ళివచ్చాడు. దొంగలను చంపి ధేనువును (బ్రాహ్మణున కిచ్చి ఆయుధాలు ఉన్నచోట వెట్టాడు. కాని, ఆ సమయంలో అర్జునాదులు ధర్మజునింటికి పోగూడదు. నియమం తప్పినట్రెనది. ధర్మజుడు వలదన్నా అర్జునుడు తీరయా త్రలకు బయలుదేరాడు. ఆ యాత్ర అతనికి పుణ్యం పురుషార్ధం కలిసి వచ్చేటట్లు చేసేంది. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలు అర్జునుని వివాహమాడారు. సుభద్ర - బలరామశ్రీకృష్ణుల ముద్దుల చెల్లెలు. అర్జునుడు యతివేషంలో సుభద్రకు సన్నిహితుడు కావటానికి, ఆమెను వివాహమాడి ఇంద్రవ్రస్థపురానికి చేరటానికీ శ్రీకృష్ణుడు సూత్రధారుడుగా నిలిచాడు. సుభ ద్రార్జునుల వివాహం ఇంద్రోపేంద్రులేస్వయంగా వేయించారు. ఆమీద బలరాము డంగీకరించాడు. సుభద్రను ద్రౌపది దీవించింది. పాండవవంశాన్ని నిలిపే కౌరవ వధువుగా సుభద్ర మహాభారతంలో చిరస్మరణీయురాలుగా నిలివింది. ఇది ఆదిపర్వ కథాసారంలో రెండవ భాగం. జి.వి. సుబ్రహ్మణ్యం ప్రధాన సంపాదకుడు

శ్రీమదాంధ్ర మహాభారతము సంపుటము - 1 ఆదిపర్వము రండవ భాగము (5,6,౯₹,8 ఆశ్వాసములు) విషయసూచిక పంచమాశ్వాసము

విషయము సంస్కతమూలము పుట ధృతరాన్హ్ర పాండుకుమారులు పెరుంగుట 1-102-1 త్తం ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహంబు సేసికొనుట 1-103-10 త్త2ైశ్త కుంతి చరిత్రము 1-104-1 426 కర్టుండు జనియించి సూతగ్భహంబు సేరుట 1-104-10 43౦0 పాండురాజు వివాహమై దిగ్విజయము సేయుట 1-105-1 433 పాండురాజు సత్యృత్యములు 1-106-1 436 వేటకుం బోయిన పొండురాజునకు శాపంబు గలుగుట 1-109-5 438 పాండురాజు శతశ్చంగంబునం దపోవృత్తి నుండుట మడమకు -1 తత్తర వ్యుషీతాశ్వుండను రాజువృత్తాంతము మ -2మ2-7 తర2 శ్వేతకేతుండు స్త్రీపురుషుల విషయంబున గావించిన కట్టడి 2-113-1 455 కుంతీదేవియందు ధర్మరాజు జననము మతం 459 గాంధారి యుదరతాడనంబు గావించుకొనుట 1-107-8 త్తిగే దుర్యోధనాదుల జననము 1-107-24 4653 భీముని శరీరదార్హ్యము మ ంపమత్త డడ 466 ఇంద్రప్రసాదంబున6 గుంతి కర్టునుం. డుదయించుట మ మేమేశ-కర్‌ త్తద్ర7 మాద్రికి నకులసహదేవులు పుట్టుట 1-మే1ర్‌-1 వ్‌ వసంత వర్ణనము 1-126-1 475 పాండురాజు మరణము 1-116-4 త్త మాద్రి సహగమనము సేయుట 1-116-25 479

మునులు పాండవులను హస్తిపురంబునకుం గొనివచ్చి ధృతరాున కొప్పగించట 1-117-6 శ౭1 కురుపాండు కుమారుల బాలక్రీడలు 1-119-13 శ దుర్యోధనుండు భీముని జంపింపం దివురుట 1-119-28 49౦0 'కృపాచఛార్యుల జన్మవృత్తాంతము 1-120-2 త్వర్రిత్త ద్రోణాచార్యుల జన్మవృత్తాంతము 1-121-3 త్తం ర్రోణుండు ద్రుపదునిచే నవమానితుండగుట 1-22-2 501 ద్రోణుండు హస్తీపురంబునకు వచ్చుట 1-122-14 503

౫00 భీష్ముండు కురుపాండుకుమాూరులకు ద్రోణుని గురువుగా నియమించుట 1-122-40 508 ఏకలవ్యుం డనువాండు ద్రోణు నారాధించి విలువిద్య గజుచుట 1-123-10 511 ద్రోణుం డన్తవిద్యం దనశిష్యులం బరీక్షించుట 1-123-15 517 అర్జునుండు ద్రోణుని మొసలినుండి విడిపించుట 1-123-68 519 షష్టాశ్వాసము కుమారాన్త, విద్యాసందర్థునము 1-124-1 524 భీమ దుర్యోధనులు దమ గదాకౌశలంబు సూపుట 1-124-30 529 అక్జునుండు తన యన్త్రవిద్యాకాశలంబుసూపుట 1-125-18 534 కర్డుండు ప్రవేశించి యర్డును నధికేపించుట 1-126-2 536 కర్టార్జునుల ద్వంద్వయుద్ధము 1-126-23 540 దుర్యోధనుండు కర్ణుని నంగరాజ్యమున కభిషిక్తుం జేయుట 1-126-36 543 కౌరవపాండవులు గురుదక్షిణార్ధంబు ద్రుపదుం బట్టం జనుట 1-127-1 549 భీమార్జునులు ద్రుపదుని సేనను దునుమూడుట అను 1-78-40 పంక్తి 554 అర్జ్హునుండు ద్రుపదుం బట్టి కట్టి తెచ్చుట 1-128-3 558 ధృతరాస్త్రుండు యుధిస్టిరుని యౌవరాజ్యాభిషిక్తునిం జేయుట 1-179-191 560 భారద్వాజుం డర్జునునకు బ్రహ్మశిరోనామక దివ్యబాణం బొసంగుట అను 1-80-20 పంక్తి 562 కణిక నీతి 1-81-10 564 దుర్యోధనుండు తండ్రితోం దన మనోదుఃఖంబుం దెలుపుట 1-129-10 571 దుర్యోధనుండు పాండవులను వారణావతంబునకుం బంపుమని తండ్రితోం జెప్టుట 1-130-8 575 దృతరా స్త్రుండు పాండవులను వారణావత నగరంబునకు6 బోవం బనుచుట 1-131-2 578 దుర్యోధనుండు లాక్షాగ్భహనిర్మాణమునకై పురోచనుని వారణావతంబునకుం బంపుట 1-132-2 518 వారణావత ్రస్థానము - విదురోపదేశము 1-133-4 582 పాండవులు జననీసహితంబుగా వారణావతంబుం జేరుట శ -1934-ర 555 లాక్షాగృహదహనము 1-135-1 589 పాండవులు లక్కయింటః జన్చి రని ధృతరాష్హండు దుఃభించుట 1-137-10 594 పాండవులు వారణావతముననుండి దక్షిణదిశగా నడచుట 1-197-17 596 భీముండు నిద్రితు లైన జననీసోదరులను జూచి చింతిల్లుట 1-138-14 598 హిడింబ భీమసేనునిం జూచి మోహీంచుట 1-139-1 602 భీమసేన హిడింబాసురుల యుద్ధము 1441-15 607 భీముండు తల్లీయనుమతంబున హిడింబను బరి([గ్రహించుట కలం! 615 పాండవులకు వ్యాసుండు హితోపదేశము సేయుట 1-144-7 616 హిడ్రింబయందు ఘటోత్కచుండు పుట్టుట 1-143-27 620 హిండవు లేకవక్రపురంబున విస్రగ్సృహంబున నుండుట 1-14ర-1 621 బకున కాహారముగా6 బోవుటనుగూర్చి బ్రాహ్మణకుటుంబము

000

విచారించట 1-145-20 624 కుంతీదేవికి బ్రాహ్మణుండు తన దుఃఖకారణంబును దెలుపుట 1-148-1 630 బకునిం జంప భీమునిం బంపుటకు. గుంతి నిశ్చయించుట 1-149-13 634

కుంతి ధర్మజునకు. బరదుఃఖనివారణము పరమపుణ్యంబని తెలుపుట 1-150-20 636 భీముండు బకాసురుని జంపంబోవుట 1-151-1 640 భీమసేనుండు బకాసురుం జంపుట 1-151-15 642

సప్రమాశ్వాసము

ధృష్రద్యుమ్న (ద్రౌపదుల యుత్పత్తి వృత్తాంతము 1-153-1 649 ద్రౌపదీ వివాహ ప్రయత్నము 657 పాండవులు పాంచాలపురంబునకు బయలుదేరుట 1-156-2 660 పాండవులు దద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట 1-157-1 661 అక్జును6 డంగారపర్జ్టుని జయించుట 1-158-9 664 అంగారపర్డుం డర్జునునితో సఖ్యము సేయుట 1-158-35 668 అంగారపర్హుండు పాండవులకు. బురోహితునిం బురస్కరింపుండని చెప్పుట _1-159-17 672 తపతీసంవరణోపాఖ్యనము 1-160-3 674 సంవరణుండు తపతిం జూచి మోహంచుట 1-160-25 6576 వసిస్టుండు తపతినిం గొనితెచ్చి సంవరణునకు వివాహంబు సేయించుట 1-162-12 680 అంగారపర్జుం డర్జునునకు వసిష్టుమహిమ సెప్పుట 1-165-2 685 శక్తి మహాముని కల్మాషపాదుని శపీయించుట 1-166-7 690 పుత్రశోకంబున వసిష్టుండు ఆత్మహత్యకుం 'బ్రయత్నించుట 1-166-40 693 వసిష్టువలనం గల్మాపపాదుండు శాపవిముక్తిం జెందుట 1-168-5 697 వసిష్ట ప్రసాదంబున గల్మాషపాదుండు పుత్రవంతుండగుట 1-168-11 699 భార్గవుండయిన బౌర్వుని జననము 1-169-20 701 పిళ్చదేవతలు కౌర్వుని శాంతచిత్తుని. జేయుట 1470-14 703 పరాశరుండు రాక్షసవినాశార్థంబు సత్త్రయాగంబు సేయుట 1-172-2 706 పాండవులు ధౌమ్యునిం బురోహితుంగా వరియించుట 1-174-6 709 (ద్రౌపదీ స్వయంవరము 1-176-11 713 రాజపుత్రులు మత్స్య్యయంత్రమును భేదింపంబోయి భంగపడుట 1477-22 717 అర్జునుండు మత్ళ్యయంత్రంబుం దెగనేయుట 1-179-4 719 ద్రౌపది యర్జునుని వరించుట 1-179-22 724 అర్జునుండు కర్దునితో యుద్ధంబు సేసి జయించుట 1-181-3 727 అర్జునుండు (ద్రౌపదిం దెచ్చి తల్లికి నివేదించుట 1-182-1 732 శ్రీకృష్ణబలరాములు ధర్మరాజాదులం జూడవచ్చుట 1-183-2 735 పాండవుల వంశాదికము నెటీంగిరమ్మని ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం బనుచుుట 1-184-3 737

ర! పాండవులు ద్రుపదమవారాజగృ్భహంబునకుం బోవుట 1-185-25 "742 వ్యాసమహాముని ద్రుపదునియొద్దకు వచ్చుట 1-186-38 747 'ద్రుపదునకు వ్యాసుండు ఇంద్రసీన యను పతివ్రతకధ సెప్పుట 21-100-60 751 [ద్రుపదునకు వ్యాసుండు పంచేంద్రోపాఖ్యానంబు సెప్పుట 1-189-1 755 ద్రౌపదీ వివహమహోత్సవము 1-90-5 761 అష్టమాశ్వాసము

పాండవులు ద్రుపదరా జుపురంబున నిష్టోపభోగంబు లనుభవించుచు సుఖంబుండుట 1-190-25 "767 చారులవలన పాండవుల యభ్యుదయమును విని దుర్యోధనుండు నిర్వేదింయట 1-191-1 770 దుర్యోధనుండు తండ్రితో. బాండవ పాంచాల విభేదనోపాయంబు నాలోచించట 1-192-25 77 భీష్మద్రోణులు దుర్యోధనునకు బుద్ధి సెప్పుట 1-195-1 779 పాండవులను దోడ్తేర ధృతరా(ఘ్లుండు విదురునిం బంచుట 1-198-3 788 పాండవులు హస్తిపురంబునకు వచ్చుట 1-199-10 702 విశ్వకర్మ యింద్రట్రస్థపట్టణమును నిర్మించుట 1-199-28 795 నారదుండు పాండవులపాలికి వచ్చుట 1-200-8 803 సుందోపసుందోపాఖ్యానము 1-201-1 805 సుందోవసుందు లొండౌరులతో6 బోరి చచ్చుట 811 నారదట్రేరితులయి పాండవులు సమయము సేయుట 1-204-27 912 సమయభంగకారణమున నర్జునుండు తీర్ణయాత్రకుం జనుట 1-206-12 817 ఉలూచి యర్జునునిం గామించుట 1-206-12 818 అర్జునుండు చిత్రాంగదను వివాహంబగుట 1-207-14 823 అర్జునుండు పంచతీర్థంబులం దప్సరసలను శాపవిముక్తల నొనరించుట 1-208-1 825 అర్జునుండు ద్వారకానగరంబునకు. జనుట 1-210-4 893 అర్జునుండు యతిరూపంబున కన్యాపురంబున నుండుట అను 1-114-64 పంక్తి 639 అర్జునుండు సుభద్రను వివాహంబగుట అను 1-114-270 పంక్తి 844 అర్జునుండు సుభద్రాసహితుండై యింద్రప్రస్థపురంబునకు6 జనుట 1-213-13 850 శ్రీకృష్ణబలదేవాదులు పాండవులకు గానుకలు తెచ్చి యిచ్చుట 1-213-33 853 అభిమన్యు ప్రభృతుల జననము 1-213-58 856 అగ్నిదేవుండు ఖాండవసమీపమున విహరించుచున్న కృష్ణార్డునులకడకు వచ్చుట 1-214-29 859 శ్వతకి యను రాజర్షి వృత్తాంతము 1-215-11 (అను.1-18) 862 అగ్నిదేవుండు కృష్ణార్డునులకు. జక్రకార్ముకాదు లొసంగుట 1-215-12 866 కృష్ణారును లస్టిహో క్రునిచే ఖాండవంబు దహింపంజేయుట 1-216-28 869 ఇంద్రుండు కృష్ణార్డునులతో: బోరుట 1-218-13 875 మందపాలోపాఖ్యానము 1-220-1 880 ఇం(ద్రుం డర్జునునకు నాన్నేయ వారుణ వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చుట 1-225-7 888

ఉర ల

శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము 6౦డవ భాగము

శ్రీరస్తు శ్రీమ్‌ మట్‌ తము బ్రజుబాంధ్ర మహాోభార జి ఆదిఐర్వము - పంచమాశ్వాసము

శ్రీనాథమూర్తి! విబుధని । ధాన! మహాదాన తర్పితద్విజవర! వేం

గీనాథ! పార్థనిభ! యభి । మాన మహార్దవ! మహేంద్రమహిమాతిశయా! శ (ప్రతిపదార్థం: శ్రీనాధమూర్తి= లక్ష్మీదేవికి భర్త అయిన విష్ణువువంటి ఆకారం కలవాడా!: విబుధ, నిధాన= పండితులకు నిధివంటివాడా!; మహా, దాన, తర్పిత, ద్విజ, వరజ గొప్పదానాలచేత తృప్తిని పొందింపబడిన (బ్రాహ్మాణథ్రేష్టులు కలవాడా!; వేంగీ, నాథ= వేంగీదేశానికి ప్రభువు అయినవాడా!; పార్ట, నిభ= అర్జునునితో సమానం అయినవాడా!; అభిమాన, మహా+అర్హవజ ప్రమయందు సము(ద్రంవంటివాడా లేదా ఆత్మగౌరవంలో సము(ద్రంవంటివాడా!; మహా+ఇం(ద్ర, మహిమ+అతిశయాజ= దేవేంద్రునిగొప్పతనంవంటి గొప్పతనం కలవాడా! తాత్పర్యం: విష్ణుమూర్తివంటి ఆకారం కలవాడా! పండితులకు నిధివంటివాడా! మహాదానాలచేత (బ్రాహ్మాణ(శ్రేష్టులను తృప్తి పొందించినవాడా! వేంగీదేశానికి రాజైనవాడా! అర్జునునితో సమానమైవాడా! సము(ద్రమంత (ప్రేమ కలవాడా లేదా సముద్రమంత ఆత్మాభిమానం కలవాడా! దేవేంద్రునినంతటి గొప్పతనం కలవాడా! విశేషం: ఇది రాజరాజనరేంద్రుని మనోహరమైన ఆకారాన్ని, మహా దానగుణాన్ని, పరాక్రమ విశేషాన్లి, ప్రేమాతిశయాన్ని, వైభవాన్ని తెలియచేసే ఆశ్వాసారంభ సంబోధన పద్యం.

ధృతరాష్త్ర పాండుకుమారులు పెరుగుట (సం. 1-102-1)

వ. అక్కధకుండు శౌనకాదిమహామునులకుంజెప్పై: నట్లుద్భృతరాష్త్రపాండువిదురులు భీష్మాభిరక్షితు లైపెరుంగుచు,

నుపనయనానంతరంబున నధ్యయనం బొనరించి రాజవిద్యలయందు జితశ్రము లై యున్నంత. 2 ప్రతిపదార్థం: ఆ+కథకుండు= కధను చెప్పే ఆ ఉ(గ్రశ్రవసమహర్శి శౌానక+శఅది, మహా, మునులకున్‌= శౌనకుడు మొదలైన

మె

మహర్షులకు; చెప్పెన్‌; అట్టు= ఆ విధంగా; ధృతరాష్ట్ర పాండు, విదురులు; భీష్మ+అభిరక్షితులు+ఐ= భీసు శ్రనిచేత పోషింపబడినవాళ్ళయి 'పెరుగుచు; ఉపనయన+ అనంతరంబునన్‌= ఉపనయనం జరిగినతరువాత; అధ్యయనంబు= విద్యాభ్యాసం; ఒనరించిజ చేసి; రాజ, విద్యల+అందు; జిత,శ్రములు+ఐ= జయింపబడిన శ్రమ కలవాళ్ళయి- అనగా సమర్భు లై; ఉన్నంత. తాత్పర్యం: మహాభారతకధను చెప్పే ఆ ఉఊగ్రశ్రవసుడు, శౌనకాదిమహామునులకు ఇట్టా చెప్పాడు: ఆ విధంగా ధృతరాష్ట్రుడు, పొండురాజు, విదురుడు భీష్ముని పోషణలో పెరుగుతూ ఉపనయనమైన తరువాత విద్యాభ్యాసం చేసి రాజవిద్యలలో ఆరితేరి ఉండగా,

శ్ర20 శ్రీనుదాంధ్ర మహాభారతము సీ అమరాపగాసుతు ననుశాసనంబునం । గౌరన రాజ్యంబు గడు వెలుంగెం గురుభూము లుత్తరకురువులకంటెను । నధికలక్ష్మీయుక్తి నతిశయిల్లె, ధర్మాభిసంరక్షితం బైన భూప్రజ । కెంతయు నభివృద్ధి యెస౦గుచుండె, నలసినయప్పుడు వానలు గురియుట । సస్యసమృద్ధి ప్రశస్త మయ్యెం ఈ బాలుసేడుం బుష్పఫలభరితంబు లై; తరువనంబు లొప్పె, ధర్మకర్మ నిరతి. జేసి కరము నెమ్మితో నన్యోన్య ; హితముం జేయుచుండి రెల్ల జనులు. 3 ప్రతిపదార్థం: అమర+ఆపగా, సుతు, అనుశాసనంబునన్‌= దేవనది అయిన గంగయొక్క పుత్రుడు భీష్మునిఏలుబడిచేత; కౌరవ, రాజ్యంబు; కడు= మిక్కిలి; వెలుంగెన్‌= ప్రకాశించింది; కురు, భూములు= కురుదేశంలోని భూభాగాలు; ఉత్తర, కురువులకంటెను= ఉత్తరకురుదేశంలోని ప్రదేశాలకంటె; అధిక, లక్ష్మీ య్యుక్తిన్‌= అధిక మైన సంపదచేత; అతిశయిలైై; ధర్మ+అభిరక్షితంబు+ఐన= ధర్మంచేత చక్కగా రక్షింపబడిన; భూ, 'ప్రజకు=ఐ దేశ ప్రజలకు; ఎంతయున్‌= మిక్కిలి; అభివృద్ది; ఎసంగుచుండె= కలుగుతూ ఉండెను; వలసిన, అప్పుడు= అవసరమైనపుడు; వానలు, కురియుట= వానలు కురవటంచేత; సస్య, సమృద్ది= పంటలఅతిశయం; (ప్రశస్తము+అయ్యెన్‌= గొప్పుగా ఉండెను; పాలు, చేయెన్‌= పాలు పోసుకొన్నవి; (పంటగింజలు పాలుపోసుకోవటం అంటే పంటలు సారవంతంగా పండటమని భావం లేదా పొడి ఎక్కువయింది అని భావం); తరు, వనంబులు= చెట్ల సమూహాలు; పుప్పు, ఫల, భరితంబులు+ఐ= పూలతో, పళ్ళతో నిండిన వై) ఒప్పె= శోభిల్లినాయి; ఎల్ల, జనులు= (ప్రజలంతా; ధర్మ, కర్మ, నిరతిన్‌+చేసి= ధర్మకార్యాలమీద ఆసక్తిచేత; కరము, నెమ్మితోన్‌= మిక్కిలిప్రేమతో; అన్యోన్య, హీతమున్‌= ఒకరికి ఒకరు మేలును; చేయుచుండిరి= చేస్తూ ఉన్నారు. తాత్పర్యం: భిష్మునిపాలనలో కౌరవరాజ్యం గొప్పుగా వెలిగింది. కురుదేశం ఉత్తరకురుదేశాలకంటె అధిక సంపదతో విలసిల్లింది. ధర్మంచేత చక్కగా రక్షింపబడిన దేశప్రజలకు అభివృద్ది కలుగుతూ ఉన్నది. అవసరమైనప్పుడు వానలు కురవటంచేత పంటలు సమృద్దిగా పండాయి. పాడి ఎక్కువ అయింది. వృక్షాలు పూలతో, పళ్ళతో నిండాయి. ప్రజలంతా ధర్మకార్యాలమీద ఆసక్తి కల వాళ్ళయి మిక్కిలి ప్రేమతో ఒకరికొకరు మేలు చేస్తూ ఉన్నారు. విశేషం: సమర్భుడు, ధర్మబద్దుడు అయిన భీష్ముని పాలనలో దేశంలో శాంతిసౌభాగ్యాలు ఎట్లా ఉన్నాయో ఈ పద్యం తెలుపుతున్నది. మ. అమలాచారపవిత్రభూసురవరేణ్యాగార పుణ్యప్రదే శములం దధ్యయనారవంబు విధివత్స్వాహాస్వధాస్వస్తిశ బ్ఞములున్‌ మంగళతూర్యఘోషములు నుద్యత్కొతుకాశీర్నినా దములున్‌ రమ్యతరంబు లయ్యె ధరణిం దద్రాజ్యసంవృద్ధితోన్‌. జ ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిమీద; తత్‌*రాజ్య,సంవృద్ధితోన్‌= ఆ భీష్మునిపరిపాలనయొక్క “పెంపుతో; అమల+ఆచార, పవిత్ర, భూసుర, వరేణ్య+ అగార, పుణ్య (ప్రదేశముల, అందు= నిర్మల మైన ఆచారంచేత పరిశుద్దాలు అయిన (బ్రాహ్మాణ్రేష్టుల ఇళ్ళల్లోని, పుణ్యస్థలాలలో; ఆధ్యయన+ఆరవంబుః వేదపఠ్తనధ్వని; విధివత్‌+స్వాహా, స్వధా, స్వస్తి శబ్దములున్‌= వేదశా(స్తకర్మలతో కూడుకొన్న స్వాహా, స్వధా, స్వస్తి శబ్దాలూ; మంగళతూర్య, ఘఫోషములున్‌= మంగళవాద్యాల ధ్వనులూ; ఉద్యత్‌+కౌతుక+ఆశీ:+ నినాదములున్‌= వృద్ధి పొందే సంతోషంతో కూడిన ఆశీర్వచన శబ్దాలూ; రమ్యతరంబులు= మిక్కిలి మనోహరాలు: అయ్యెన్‌. తొత్పర్యం: పెంపు వహించిన భీష్ముని పరిపాలనలో- సదాచారంచేత పవి(త్రాలైన బ్రాహ్మణ శ్రేష్టుల ఇళ్ళలో, పుణ్యస్థలాలలో- వేదనాదాలు, (శ్రౌత స్మార్త కర్మసంబంధాలైన స్వాహా, స్వధా, స్వస్తిశబ్దాలు: మంగళవాద్య ధ్వనులు, మహానందంతో కూడిన ఆశీర్వచనాలు మిక్కిలి మనోహరాలై వినిపిస్తున్నాయి.

ఆదిపర్వము - పంచమాశ్వాసము శ21 విశేషం: బ్రాహ్మాణుల ఇళ్ళలో వేదకర్మలు, లౌకిక కర్మలు నిర్విఘ్నంగా సౌగుతున్నాయని వస్తుధ్వని. అధ్యయన అధ్యాపనాలు, నిత్యనైమిత్తిక యజ్ఞక్రియలు, శుభకార్యాలు, ఆశీర్సచనాలు అనే నాల్లు క్రియలు వాటికి మూలమైన (బ్రాహ్మణ సదాచార సంపత్తిని ధ్వనింపచేస్తున్నాయి. వర్ణాశ్రమ ధర్మ రక్షణపరుడైన భీష్ముని ్రవృత్తి వస్తుధ్వని. (ప్రసాదగుణమిశ్రితమైన ఓజస్సును ఉదాత్తవస్తు వర్షనంలో నిబంధించటం నన్నయ రచనలో తరచుగా కనపడే శైలీశిల్పం. (సంపా) వ. ఇట్లు బ్రహ్మోత్తరంబుగాంబ్రజాభివృద్ధియు సస్యసమృద్ధియు నగుచుండ, నాంబికేయు ధృతరాష్తురాజ్యాభిషిక్తుం జేసి, భీష్ముండు దనకు విల్లును విదురుబుద్ధియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత. 5

ప్రతిపదార్హం: ఇట్టు; బ్రహ్మ+ఉత్తరంబు, కాన్‌= (బ్రాహ్మణులు అధికులు కాగా; ప్రజా, వృద్దియు= ప్రజలయొక్కఅభివృద్ధి; సస్వ, సమృద్ధియున్‌= పంటలు దండిగా పండటం; అగుచుండన్‌; భీష్ముండు; ఆంబికేయు= అంబికకొడుకు అయిన వాడిని; ధృతరా(్తు; రాజ్య+అభిషిక్తున్‌= రాజ్యానికి అభిషేకింపబడినవాడిని- అంటే రాజును; చేసి; తనకు; విల్లును; విదురు, బుద్దియును; సహాయంబులుగా, రాజ్యంబు; రక్షించుచు+ఉన్నంత. తాత్పర్యం: ఈ విధంగా బ్రాహ్మణులు అధికులు అవుతుండగా, ప్రజలు అభివృద్ధి చెందుతుండగా, పంటలు సమృద్దిగా పండుతుండగా భీష్ముడు అంబికకొడుకు అయిన ధృతరాష్క్రుడిని పట్టాభిషిక్తుడిని చేసి, తనకు ధనుస్సు, విదురుడి బుద్ధిబలం సహాయకాలుగా కారవరాజ్యాన్ని రక్షిస్తూ ఉండగా. విశేషం: ధృతర్య(ష్టుని పట్టాభిపిక్తత వివాద[గ్రస్తం. జౌత్తరాహభారతప్రతులలో అంధత్వంచేత ధృతరాష్ట్రుడు, పారసవత్వంచేత విదురుడు రాజ్యాన్ని పొందలేక పోయినట్టూ పాండురాజు రాజు అయినట్టూ చెప్పబడింది.

ధృతరాష్ట్ర స్పృచక్షుష్టా (ద్రాజ్యం న ప్రత్యపద్యత

పారసవత్వా ద్విదురో రాజా పాండు రృభూవహ. (సం.భా.అధ్యా 109 క్లో 25) దాక్షిణాత్య(ప్రతిలోమా(త్రం ధృతరా(స్త్రుడు పట్టాభిషిక్సు డైనట్టు ఉన్నది.

భీష్మేణ రాజా కొరవ $ ధృతరాహ్రై౭భిషేచితః (సం.భా. దాక్షిణాత్యప్రతి. అధ్యా 18. క్లో 22

కాని అదే ప్రతిలో అదే అధ్యాయంలో ధృతరా(ష్ట్రడు అంధుడు అవటంచేత రాజ్యాన్ని పాందలేకపోయినట్లు, పారసవత్వంచేత విదురుడు రాజు కానట్టు, పాండురాజే రా వైనట్టు చెప్పబడి ఉండటం గమనించతగింది.

దృతరాష్ట్ర స్వ్యృచక్షుష్వ్వా (ద్రాజ్యం నప్రత్యపద్యత

పారసవత్వా ద్విదురో రాజా పాండు రృభూవహం. (సం. భా. దాక్షిణాత్య ప్రతి. అధ్యా 18. క్ల 30)

తెలుగుభారతంలోకూడ అనేక సందర్భాలలో ధృతరాష్ట్రుడిపట్టాభిపిక్తతకు ప్రతిబంధకా లైన వాక్యా లున్నాయి. (ఆది. షష్ట్రా. వ. 123. 124; ప. 128, వ 129. ప. 143) ఉ. ఆయము గర్వమున్‌ విడిచి యన్యపతుల్‌ పనిసేయ నిట్లు గాం

గేయభుజాబలంబున నికృత్తవిరోధిసమాజుం డైకుమూ

రాయితశక్తిశాలి ధృతరాస్త్రుండు రాజ్యము సేయుచుండె న

త్యాయతకీర్తితోం దనకు హస్తిపురం బది రాజధానిగన్‌. 6

(ప్రతిపదార్థం: ఆయము= ఆదాయం; గర్వమున్‌, విడిచి; అన్య, పతులుజ తక్కినరాజులు; పనిచేయన్‌; ఇట్టు గాంగేయ, భుజా, బల౦బునన్‌= భీషు శ్రనిభుజబలంచేత; నికృత్త విరోధి, సమాజుడు+ఐజ= నరక్తబడిన శత్రువులసమూహం కలవాడై; కుమార+ఆయిత,

శ22 శ్రీమదాంధ్ర మహాభారతము శక్తిశాలి= కుమారస్వామి అంతటి పరాక్రమం కలవా డైన; ధృతరా(్ష్రుడు; అతి+ఆయత, క్రీర్తితోన్‌= మిక్కిలి పొడవైన కీర్తితో - అనగా అత్యధిక మైన కీర్తితో) తనకు; హస్తి పురంబు; అది; రాజధానిగన్‌; రాజ్యము; చేయుచు; ఉండెన్‌. తాత్పర్యం: ఇతర దేశాల రాజులు తమ ఆదాయాన్ని, గర్వాన్ని విడిచి తనను కొలుస్తూ ఉండగా, భిష్మునిభుజబలంచేత శత్రురాజులనుసంహరించి, కుమారస్వామి అంతటి శక్తిశాలి అయిన ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని తనకు రాజధానిగా చేసికొని అత్యధిక కీర్తితో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. విశేషం: ఆయము గర్వమున్‌ అనేదానికి ఆయతగర్వమున్‌ అనే పారాంతరం ఉన్నది. అప్పుడు అధికమయిన గర్వమును విడిచి ఇతరరాజులు అందరూ ధృతరా'స్టుడిని కొలిచారు అని అనవలసివస్తుంది. పద్యంలోని ప్రసాదగుణం పరిపాలనలోని ప్రశాంతతను ధ్వనింపచేస్తున్నది వ ఇట్లురాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం దైన యా ధృతరాష్తునకు వివాహంబు సేయ సమకట్టి, భీష్ముండు గాంధారపతి యయిన సుబలుకూంతు గాంధారి యనుదాని, నతిశయరూపలావణ్య శీలాభిజాత్య సమన్వితా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె. 7 ప్రతిపదార్థం: ఇట్టు రాజ్యంబు; చేయుచు; ఆరూఢ, యౌవనుండు+ఐన= ఎక్కినయౌవనం కలవా డైన - అనగా యౌవనవంతు డైన; ఆ, ధృతరాష్ష్రునకు; వివాహంబు; చేయ; సమకట్టి= పూనుకొని; భీిష్ముండు; గాంధార పతి, అయిన= గాంధారదేశానికి రాజైన; సుబలు, కూతు= సుబలుని పుత్రికను; గాంధారి; అను; దానిన్‌; అతిశయ, రూప, లావణ్య, శీల+అభిజాత్య; సమన్వితగా= మిక్కిలి అందమైన రూపంతో: కాంతితో, మంచినడవడితో, ఉన్నతమైన వంశంతో కూడిన దానినిగా? బ్రాహ్మాణులవలన; విని; విదురునకు; ఇట్టు+ అనియె. తాత్సర్యం: ఈ విధంగా రాజ్యం చేస్తూ యౌవనవంతు డైన ఆ ధృతరాష్ట్రునికి వివాహం చేయటానికి పూనుకొని భీష్ముడు, గాంధారరాజైన సుబలుని కూతురు గాంధారి - అందమైన రూపం కలదని, కాంతి కలదని, మంచి నడవడితో, ఉన్నత మైన వంశంతో కూడుకొన్నదని, బ్రాహ్మణులవలన విని విదురునితో ఇట్టా అన్నాడు. క. ఈ వంశము విచ్చేదము | గావచ్చిన గులము నిలుపంగా సత్యవతీ దేవి వచనమున సంతతి । గావించెను వ్యాసుః డను జగత్మర్త దయన్‌. 8 ప్రతిపదార్థం: ఈ, వంశము; విచ్చేదముజ= నాశం; కావచ్చినన్‌; కులము నిలుపంగా; సత్యవతీదేవి, వచనమునవా సత్యవతీదేవి మాటవలన; వ్యాసుడు; అను; జగత్‌+కర్త= (బ్రహ్మ: దయన్‌, సంతతి; కావించెను. తాత్పర్యం: ఈ కురువంశం నశిస్తూ ఉండగా, సత్యవతీదేవి మాటప్రకారం వ్యాసుడు అనే బ్రహ్మ, కులాన్ని నిలపటానికి దయతో సంతానాన్ని కలిగించాడు. విశేషం; అలం: రూపకం. క _ ఈ కులము వివర్థింపంగ | నా కభిమత; మేను వింటి నలినేక్షణ దా నేక శత సుతులం బడయంగ । నా కన్యక వరము వడసె నటె హరుచేతన్‌. 9 ప్రతిపదార్థం: ఈ, కులముజ ఈ వంశాన్ని; వివర్షింప(గన్‌= వృద్రిపొాందించటానికి; నాకు; అభిమతము= ఇష్టం; ఏను= నేను; ఏంటి= విన్నాను; నలిన+-ఈక్షణ= తామరల వంటి కళ్ళు కలది; ఆ, కన్యక= ఆ గాంధారి; ఏక, శత, సుతులన్‌= ఒక కూతురును

ఆదివర్వము - పంచమాశ్వాసము శత23 ఎక్కువగాగల వందమందికొడుకులను; పడయంగన్‌= పొందటానికి; హరుచేతన్‌= శివుని వలన; వరము; పడసెన్‌, ఆటె= పొందెనట కదా.

తాత్పర్యం: ఈ వంశాన్ని వృద్దిపొందింప చేయడం నాకు ఇష్టం. తామరలవంటి అంద మైన కళ్ళు కల ఆ గాంధారి

ఒకవందమంది కొడుకులు, ఒక కూతురు-మొత్తం నూటొక్కరు తనకు కలిగేటట్టు శివుడి వలన వరం పొందిందట

కదా.

విశేషం: తనతరంలోనే సంతతిలేని కారణంగా రాజవంళంలో వారసుడులేని దీనస్థితి ఏర్పడటం భీష్ముడు చూచాడు. దేవరన్యాయంతో

ధృతరాష్ట్ర పాండురాజులు పుట్టారు. వారి తరంలో నుళ్ళీ వారసులులేని దుస్థితి రాకూడదని భావించాడు. నూరుగురు కొడుకులను,

ఒక కూతురిని కనగలిగిన వధువును అన్వేషించాడు. పైకి చూస్తే అది ఒక అత్యాశగా ఉండవచ్చు. కాని, కులవిస్తారం కావాలంటే విసృత సంతానం గల కులసతి కావాలి. వంశాభివృద్దినిగూర్చిన భీష్ముని ఆసక్తి ఈమాటలలో ధ్యవిస్తూ ఉన్నది. ఏకశతసుతులన్‌

  • ఇందులో సుతశబ్దం ఏకశేషసమాసంలో ఉన్నది కాబట్టి కొడుకులనీ, కూతురనీ అర్ధం ఇస్తుంది. సుతులును= సుతయు, సుతుడును;

ఏకశేషసమాసంలో పుంలింగమే శేషిస్తుంది. ఏకశతమంటే నూటజఒక్కరని అర్ధం. గాంధారి నూర్లురుకొడుకులకు, ఒకకూతురిని

కంటుందని శివునివరం.

వ. “కావున ధృతరాస్తునకు గాంధారిని వివాహంబు సేయుదము; గాంధారపతి మనతోడి సంబంధమునకుం దగు" నని నిశ్చయించి సుబలు పాలికిం దగుముదుసళ్ళం బంచిన, సుబలుండును సుముఖుం డై 'కురుకులవిస్తారకుం దయిన ధృతరాస్తుండ యిక్కన్యకకు నర్హుండు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి' ననిన, వాని బంధుజనంబు లెల్లం దమలో ని ట్లనిరి, 10

(ప్రతిపదార్థం: కావున; ధృతరా[ష్టునకు; గాంధారిని; వివాహంబు; చేయుదము; గాంధార, పతి= గాంధారరాజు: మనతోడి;

సబంధమునకున్‌, లేము అన్‌ విఖ్చియించి; సుబలు, పాలికైి= సుబలునిదగ్గరకు; తగు, ముదుసళ్ళన్‌= తగినపెద్దలను: పంచిన=

ప ఏ సుబలుం సస =

ధాతరాషుండు+అ= ధ ంా మైండుళఐ అనుకూలు డై; కురు, కుల, విస్తారకుండు+అయిన= కురువంశాన్ని పెంచేవా డైన;

అ= షుడే; ై ర 'ష్రు దూ అగ రః రాస్తు ? ఈ+కన్యకకున్‌; అర్హుండు=తగినవాడు; కావునన్‌= ఆ రాజునకు; గౌంధారిని; ఇచ్చితిన్‌: అనిన; వాని= ఆ సుబలు, ; ॥ ఇ | బంధు జనంబులు+ ఎల్లన్‌; తమలోన్‌; ఇట్టు+ అనిరి= ఈవిధంగా అనుకొన్నారు.

తాత్పర్యం: 'కాబట్టి ధృతరా్ట్రునితో గాంధారిని వివాహం చేద్దాము. గాంధారదేశప్రభువు సంబంధం యోగ్యమైనది'

అని తీర్మానించి, సుబలునిదగ్గరికి యోగ్యు లైన పెద్దలను పంపగా, సుబలుడుకూడ అనుకూలుడై 'వంశాన్ని

విస్తరించేవా డైన ధృతరా్షుడే ఆ కన్యకు తగినవాడు, కాబట్టి, ధృతరాష్ష్రునికి గాంధారి నిస్తానని వాగ్దానంచేయగా గాంధార రాజుబంధువు లందరూ తమలో ధా వు తాము ఇట్టా అనుకొన్నారు.

విశేషం: తమతో సంబంధానికి తగినవాడు గాంధారరాజు అని భావించాడు భీష్ముడు. దానికి కారణమేమిటో చెప్పడు నన్నయ.

సారమతులు లోనారసి తెలిసికొనదగిన అంశమని వ్యంగ్యంచేశాడు. వంశళవిస్తారాన్ని కోరీవారే గాంధారిని వివాహమాడటం సహజం,

నూటబఒక్క బిడ్డల తల్లి కొగల వరం పొందిన గాంధారికి వంశ విసృతి కొరకు వివాహం చేసికొనే ధృతరా'ష్త్రుడే. (గ్రుడ్డివాడైనా అనువైన వరుడు అని వ్యంగ్యార్థం. గాంధారరాజు తన కూతురికి తగిన భర్త లభించాడని భావించాడు, తనభారం తీరిందని తలంచాడు. ఎవ్వరికీ చెప్పకుండానే అంగీకరించాడు. ఇదంతా ఊహిస్తే కధ ప్రసన్నమౌతుంది. ఇది నన్న్మయకధాకథన శిల్పం. (సంపా) తే. అంగములలోన మే లుత్తమాంగ, మందు నుత్తముంబులు గన్నుల యుర్విజనుల,

కట్టి కన్నులు లే వను నదియకాక । యుత్తముండు గాండె సద్గుణయుక్తి నతయడు. 11

డ2డ్ష శ్రీమదాంధ్ర మహాభారతము

ప్రతిపదార్హం: ఉర్వి, జనులకు= భూమిమీదప్రజలకు; అంగములలోనజ= అవయవాలలో; ఉత్తమ+అంగము= తల; మేలు; అందున్‌; కన్నులు+అ= కన్నులే; ఉత్తమంబులు= (శ్రేష్టాలు; అట్టి; కన్నులు; లేవు; అనున్‌; అదియకాక=అంతమా(త్రమేకాని; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; సత్‌+గుణ, య్యుక్తిన్‌= మంచిగుణాల కూడికతో; ఉత్తముడు; కాండే=ఐ అగునుకదా.

తాత్పర్యం: లోకంలో మానవులకు అవయవాలన్నింటిలో శిరస్సు (ప్రధానం. ఆ శిరస్సులో కన్నులే ప్రధాన మైనవి. అటువంటి కన్నులే ధృతరాష్ట్రునికి లేవు. కాని అతడు మంచి గుణాలచేత ఉత్తముడే కదా!

విశేషం: 'కన్యా వరయతే రూపమ్‌' అనీ “సర్వేంద్రియాణాం నయనం 'ప్రధానమ్‌”, అనీ అభియుక్తోక్తి. గాంధారి పద్మాలవంటి అందమైన

కళ్ళుకలది. అమెకు పుట్టుగ్రుడ్డితో పెండ్లి, ఆమెకు తగినవాడు ధృతరా(ుడే అని గాంధారపతి నిర్ణయించి, వివాహం నిశ్చయించాడు.

అతడు చండశాసనుడు. అతని మాటను ఎవరూ కాదనలేరు. చివరకు గాంధారి కూడ. ఆమెకు కూడ వివాహం కావాలంటే ధృతరా[్త్రునివంటి వంశవిస్తారకుడే ముందుకు రావాలని తెలుసు. బంధువులు మాత్రం చూచి చూచి (గ్రుడ్డివానికి పిల్లనివటం ఇష్టంలేక అధిక్షేపాత్మకంగా, వ్యంగ్యంగా గుసగుసలాడుకొన్నారు.

ధృతరాష్ల్రుడు గాంధారిని వివాహంబు సేసికొనుట (సం. 1-103-10)

వ. అనిన వారిపలుకులు విని గాంధారి ధృతరాష్తునకు. బితృవచనదత్తంణాం దన్ను నిశ్చయించి, 'నాకుం బతి యిమ్మహీపతియ కాని యొరుల నొల్ల' నని యప్పరమపతివ్రత పరపురుషదర్శనంబు పరిహరించి పతి కనుగుణంబుగా నేశ్రపట్టంబునం దన నేత్రంబులు గట్టికొని యుండె; నంత నక్కన్యం దోడ్కొని దాని సహోదరుండయిన శకుని మహావిభూతితో హస్తిపురంబునకు వచ్చిన, ధృతరాస్తుండును బరమోత్సవంబున గాంధారిని వివాహం బై దానితో. బుట్టిన కన్యకల సత్యవప్రతయు సత్యసేనయు సుదేస్టయు సంహితయు. దేజతృవయు సుశ్రవయు నికృతియు శుభయు శంభువయు దశార్హ్ణయు నను పదుండ్ర నొక్కలగ్నంబున వివాహం బయి మజియును. 12

ప్రతిపదార్థం: అనిన; వారి; పలుకులు; విని; గాంధారి? ధృతరా'్ట్రునకున్‌; తన్ను తనను; పితృ వచన, దత్తన్‌, కాన్‌= తండ్రిమాటతో ఇవ్వబడిన దానినిగా; నిశ్చయించి; నాకున్‌; పతి= భర్త; ఈ+మహీపతియ, కాని= ఈ ధృతరాష్ట్రమహారాజేకాని; ఒరులన్‌= ఇతరులను ఒల్లను=ఇష్టపడను; అని; ఆ+పరమ, పతివ్రత? పరః పురుష దర్శనంబు= ఇతరపురుషులను చూడటం; పరిహరించి= వదలి; పతికి= భర్తకు; అనుగుణంబుగా= తగినట్టు; నేత్ర, పట్టంబున= కంటివస్త్రంతో; తన, నేత్రంబులు= తనకళ్ళు; కట్టికొని= కనబడకుండా కట్టుకొని ఉన్నది; అంతన్‌= తరువాత; ఆ+కన్యన్‌= ఆ గాంధారిని; తోడ్కొని= వెంటపెట్టుకొని; దాని= ఆ గొాంధారియొక్క; సహోదరుడు +అయిన= తోడబుట్టినవాడైన; శకుని; మహా, విభూతితో= గొప్పసంపదతో; హస్త, పురంబునకు; వచ్చిన; ధృతరాష్ట్రుండును; పరమ+ఉత్సవంబునవ= మహావైభవంగా; గాంధారిని; వివాహంబు+ఐ=పెళ్ళిచేసికొని; దానితోన్‌, పుట్టిన= గాంధారీదేవి తోబుట్టువు లైన; కన్యకల, సత్యవ్రతయు, సత్యసేనయు; సుదేష్ణయు, సంహితయు, తేజశ్రవయు; సుశ్రనయు; నికృతియు, శుభయు, శంభువయు, దశార్ణయున్‌; అను; పదుం[డ్రను= పదిమందిని; ఒక్క; లన్నంబున; వివాహంబు+అయి: మజియును.

తాత్పర్యం: సుబలుని బంధువుల మాటలు విన్న గాంధారి, తండ్రి తనను ధృతరాష్ష్రుని కిచ్చినట్టు నిశ్చయించుకొన్నది.

నాకు భర్త ధృతరాష్ట్ర మహారాజే, అన్యులను వివాహమాడ అంగీకరించి నని, ఆ మహాపతివ్రత పరపురుషులను

తాను చూడటానికి ఇష్టపడక, భర్తకు కళ్ళు లేవు కనుక తాను కూడ కళ్ళకు అడ్డంగా గుడ్డ కట్టుకొన్నది. తరువాత ఆమెసోదరుడు శకుని అధికసంపదతో ఆమెను వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చాడు. ధృతరా(్ష్రుడు మహావైభవంగా గాంధారినే కాక ఆమె చెల్లెళ్ళు పదిమందిని కూడ ఒకే ముహూర్తంలో వివాహమాడాడు.

ఆదివర్వము - పంచమాశ్వానము శ్త2ర్‌

విశేషం: తండ్రి తీసికొనిన నిర్ణయాన్ని గురించి బంధువులు మాట్లాడుకొనే మాటలు గాంధారి విన్నది. తండ్రి మాటను గౌరవించి తాను ధృతరా(ష్టుడిని పత్నిగా భావించుకొని, అతనికి అనురూపంగా కళ్ళకు గంతలు కట్టుకొన్నది. ఆమె చర్యవలన అటు పితృభక్తి ఇటు పతి భక్తి వ్యక్తమయ్యాయి. బంధువుల నోళ్ళు మూతపడ్డాయి. గాంధారి తనతో పాటు పదిమంది తోబుట్టువులతో సహా ధృతరాష్త్రుని అంతఃపురంలో (ప్రవేశించింది. వారిని కూడ ధృతరా్త్రుడు వివాహమాడాడు. క. కులమును రూపము శీలము । గల కన్యలం దెచ్చి తెచ్చి గాంగేయుం డీ

నలఘుండు ధృతరాష్త్రుండు కుల ; తిలకుండు పరిగ్రహించె దేవీశతమున్‌. 13 ప్రతిపదార్థం: కులమును; రూపము; శీలమున్‌; కల= ఉన్న; కన్యలన్‌, తెచ్చితెచ్చి; గాంగయుండు= భీష్ముడు; ఈన్‌= ఇవ్వగా; అలఘుడు= గొప్పవాడు; కుల, తిలకుండు= వంశానికి అలంకారమైనవాడు; ధృతరాష్ట్రుడు; దేవీ, శతమున్‌= భార్యలు వందమందిని; పరి(గ్రహించె= పెళ్ళిచేసికొన్నాడు. తాత్సర్యం: కులం, రూపం, శీలం ఉన్జ కన్యలను భీష్ముడు తెచ్చి ఇవ్వగా ధృతరాష్ట్రుడు వందమందిని పెళ్ళిచేసికొన్నాడు. విశేషం: కన్యలను తెచ్చి తెచ్చి అని చెప్పటంలో భిష్ముడు వంశవిసృృతిమీద ఎంత ఆసక్తిని ప్రదర్శించాడో స్పష్టమౌతుంది. వందమంది కొడుకులను కనే గాంధారితో పాటు నూటపదిమంది రాణులను ధృతరాష్ట్రుని కిచ్చి పెళ్ళి చేయించాడు భీష్ముడు. వారి అందరి వలన కలిగే సంతానంతో మరెప్పటికీ కురువంశంలో వారసులు లేరనే ప్రశ్న పుట్టదని అనుకొన్నాడు ఆ కురుపితామహుడు. అనావృష్టిని చూచిన గంగాసుతుడు అతివృష్టిని అభిలషించాడు. చివరకు ధృతరాష్టసంతతి అంతా గంగపాలు కావటం విధివిలాసం. తొత్సర్యం: ఆ తరువాత. సీ. వేదంబులందుం బ్రవీణుం డై నులి సర్వ । శాస్త్రంబులందుం గౌశలము మెఅసి

యసికుంత కార్ముకాద్యాయుధ విద్యల ; యందు జితశ్రముం డై తురంగ .

సింధురా రోహణశిక్షల దక్షుం డై ; నీతిప్రయోగముల్‌ నెజయ నేర

సే

యతి మనోహర నవ యౌవనారూధుం డై; కఠిలేని హామరశ్షికాంతి దాల్చి ఆ. పెరు(గుచున్న కొడుకు€ బృధువక్షు నాయత ; బాహు దీర్టదేహుం బాండుం జూచి

వీనివలనం గులము వెలుంగు నంచును నెడ , జాహ్నవీసుతుండు సంతనసిల్లి. 15 ప్రతిపదార్థం: వేదములందున్‌: ప్రవీణుండు+ఐ= నేర్పరి అయి; మటి= అంతేకాక; సర్వశాస్త్రంబులందున్‌? కాశలము= సామర్థ్యం; మెజసి= ప్రకాశింపచేసి; అసి, కుంత, కార్ముక+ఆది+ఆయుధ, విద్యల, అందు= కత్తి ఈటె, విల్లు మొదలైన ఆయుధాలకు సంబంధించిన విద్యలందు; జితశ్రముడు+ఐ= జయింపబడిన 'శ్రమకలవాడై - అనగా సమర్భుడై; తురంగ, సింధుర+ఆరోహణ, శిక్షలజ గుట్టాలను, ఏనుగులను ఎక్కునటువంటి అభ్యాసాలలో; దక్షుండు+ఐ= నేర్పరి అయి; సీతి, 'ప్రయోగముల్‌= అనేకనీతులను ప్రయోగించేమాటలు; నెజయ= బాగా; నేర్చి; అతి, మనోహర, నవ, యౌవన+ఆరూఢుండు+ఐ=ఐ మిక్కిలి మనోహరం అయిన 'క్రొత్తయౌవనం పొందినవాడై; కటలేని= మచ్చలేని; హిమరళ్ళ్శి కాంతి= చలని కిరణాలు కల చంద్రనికాంతిని; తాల్చి= ధరించి; పెరుగుచు+ఉన్న; కొడుకున్‌; పృధు, వన్షున్‌= విశాల మైన వక్షస్తలం కలవాడిని; ఆయత, బాహు= పొడవైన చేతులు కలవాడిని;

శ26 శ్రీమదాంధ్ర మహాభారతము ద్‌ర్హ , దేహున్‌= పొడ వైన శరీరం కలవాడిని; పాండున్‌= పాండురాజును; చూచి; వీనివలనన్‌; కులము= వంశం; వెలుంగున్‌; అంచును= అనుచు (అంటూ; ఎడ= హృదయంలో; జాహ్నవీ, సుతుండు= గంగాప్యుత్రు డైన భీష్ముండు; సంతసిల్లి= సంతోషించి. తాత్పర్యం: వేదాలను, సర్వశా(స్త్రాలను బాగా నేర్చి, కత్తి ఈటె, ధనుస్సు మొదలైన ఆయుధవిద్యలలో ఆరితేరి గుర్రాలను, ఏనుగులను ఎక్కి స్వారి చేయటంలో బాగా నేర్పరి అయి, మనోహరమైన నవ యౌవనం కలవాడై మచ్చలేని చం(ద్రుడివలె ప్రకాశిస్తూ విశాల మైన వక్షం, పొడవైన చేతులు, నిడుపైన శరీరం కల పాండురాజును చూచి ఇతనివలన వంశం వన్నెకు ఎక్కుతుం దని భీష్ముడు సంతోషించి. విశేషం: వేదాలు నాలుగు - బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. శాస్త్రాలు ఆరు - తర్కం, వ్యాకరణం, ధర్మం, మీమాంస, వైద్యం, జ్యోతిషం. యౌవనారూఢులైన ధృతరా్ష్రుడిని పాండురాజును వర్షించే తీరులో నన్నయ ఒక భేదాన్ని పాటించి కథాకథన శిల్పాన్ని ప్రదర్శించాడు. పాండురాజుకు గల వేదశాస్త్రపాండిత్యంగాని, యుద్దోచిత పరిశ్రమగాని ధృతరా(్షునికి లేవు. పాండురాజాయొక్క యౌవనం అతి మనోహరంగా ఉన్నదట. ధృతరా(్ట్రునివలన కులం విస్తరిల్లుతుందనీ, పాండురాజువలన కులగౌరవం పెరుగుతుందనీ భీష్ముని ఆశయం. ధార్తరాష్ట్రులు సంఖ్యలో అధికమైనా, పాండవులు యశళస్సులో అధికులౌతారని పాండురాజు వలననే కులం కీర్తి కెక్కుతుందనీ వస్తుద్వని. వ ఇ కృుమారున కెందు వివాహంబు సేయుద మని విదురుతో విచారించుచుందె; నంతం దొల్లి. 16 ప్రతిపదార్థం: ఈ+కుమారునకు; ఎందు=ఎక్కడ, వివాహంబు; చేయుదము; అని; విదురుతో; విచారించుచున్‌, ఉండెన్‌= ఆలోచిస్తూ ఉన్నాడు; అంతన్‌= తరువాత; తొల్లి= పూర్వం. తాత్పర్యం: ఈ యువకు డైన పాండురాజుకు వివాహం చేయా లని విదురునితో కలిసి ఆలోచిస్తూ ఉన్నాడు. తరువాత - పూర్వం కుంతి చరిత్రము (సం. 1-104-1) సీ యాదవకులదిభుం డగు శూరుం డను నాతం । డాత్మతనూజలయందు. బెద్ద దాని నంబుజముఖి ధవళాక్షి వనసుదేవు । చెలియలిం బృథ యను చెలువ. బ్రీతి దనమేనయత్తనందనుం డపుత్తకుం డైన । యా కుంతిభోజున కర్థితోదం గూంతుగా నిచ్చినం గోమలి యాతని । యింటం దా నుండి యనేక విప్ర తే. వరుల కతిథిజనులకు నవారితముగం ; దండ్రి పనుపున నిష్టాన్నదాన మొనరం

  • జేయుచున్న దుర్వాసుం డన్‌ సిద్ధమౌని । వచ్చె నతిథి యై భోజనవాంఛం జేసి. శే (ప్రతిపదార్థం: యాదవ, కుల, విభుండు+అగు= యాదవవంశరాజు అయిన; శూరుండు:; అనువాడు; ఆత్మ, తనూజల, అందున్‌= తనకూతుళ్ళలో; పెద్దదానిన్‌ అంబుజముఖి= పద్మంవంటి ముఖం కలదానిని; ధవళశఅక్షి= తెల్లనికళ్ళు కలదానిని; వసుదేవు, చెలియలిన్‌= వసుదేవుని చెల్లెలిని; పృథ; అను; చెలువన్‌= అందమైన పిల్లను; ప్రీతిన్‌= ప్రియమార; తన; మేనయత్త, నందనుడు== మేనత్తకుమారుడు; అపుత్రకుండు+ఐన= సంతానం లేనివాడైన; ఆ, కుంతిభోజునకు: అర్జితోడన్‌= ప్రీతితో; కూతున్‌, కాన్‌; ఇచ్చినన్‌; కోమలి= ఆ సుకుమారి - పృథ; ఆతని, ఇంటన్‌; తాన్‌= తాను; ఉండి; అనేక, విప్ర, వరులకు= అనేకమంది బ్రాహ్మణ(్రేష్టులకు; అతిథి, జనులకున్‌; అవారితముగన్‌= అడ్డులేకుండా; తండ్రి, పనుపునన్‌= తండడ్రిఆజ్ఞతో; ఇష్ట+అన్న, దానము= ఇష్ట మైన భోజనం

ఆదిపర్వము - పంచనూశ్వాసము త్త2గ పెట్టటాన్ని; ఒనరన్‌= తగువిధంగా; చేయుచు+ఉన్న; దుర్వాసుడు+అన్‌; సిద్ధ, మౌని= సిద్ధికలముని; భోజన, వాంఛన్‌, చేసి= భోజనంమీద కోరికతో; అతిధి+ఐ=; వచ్చెన్‌.

తాత్పర్యం: యాదవవంశరాజు అయిన శూరుడు తనపెద్దకుమార్తె పృథను, పిల్లలు లేని తన మేనత్తకొడు కైన

కుంతిభోజుడికి ప్రియంతో పుత్రికగా ఇచ్చాడు. ఆ సుకుమారి కుంతిభోజుడి ఇంట్లో తా నుండి, తండ్రి ఆజ్ఞతో

అనేకమంది (బ్రాహ్మణ(్రేష్టులకు, అతిథిజనులకు యథేచ్చగా అన్నదానం చేస్తూ ఉండగా దుర్వాసు డనే సిద్ధమౌని

'భోజనం పెట్టు' మని అతిథిగా వచ్చాడు,

వ. కుంతియు న మ్మునివరు కోరిన యాహారంబు వెట్టిన సంతుష్టుం డై యమ్మునివరుం డి ట్లనియె: 'నీమంత్రంబున నీ వే వేల్పుల నారాధించి తవ్వేల్పులు నీకోరినయట్టి పుత్రకుల నిత్తు' రని యాపద్ధర్మంబుగా నొక్కదివ్య మంత్రంబుంబ్రసాదించి చనిన, నమ్మంత్రశక్తి యెటుంగ వేండి కుంతి యొక్కనాం డే కాంతంబ గంగకుం జని యవగాహనంబు సేసి. 18

ప్రతిపదార్హం: కుంతియు; ఆ+ముని, వరు కోరిన= ఆ ముని (శ్రేష్టుడు కోరిన; ఆహారంబు: పెట్టిన; సంతుష్టుండు+ఐ= పూర్తిగా తృప్తిచెందినవా డై; ఆ+ముని, వరుండు= ఆ ముని'శ్రేష్టుడు - దుర్వాసుడు; ఇట్టు+అనియెన్‌: ఈ,మంత్రంబున= ఈమం'త్రంచేత; నివు ఏ వేల్పులన్‌= ఏ దేవతలను; ఆరాధించితి= పూజించావో; ఆ+వేల్పులు= ఆ దేవతలు; నీ, కోరిన, అట్టి= నీవు కోరిన; పుత్రకులన్‌; ఇత్తురు+అని; ఆపద్ధర్మంబుగాన్‌= ఆపత్కాలంలోని ధర్మంగా; ఒక్క; దివ్య, మం(త్రంబున్‌; 'ప్రసాదించి= ఇచ్చి; చనినన్‌= వెళ్ళగా; ఆ+మంత్ర, శక్తి ఎయజుంగ, వేండి= తెలియకోరి; కుంతి; ఒక్కనాండు: ఏకాంతంబు+అ= ఒంటరిగా; గంగకున్‌*చని= గంగకు వెళ్ళి; అవగాహనంబు= స్నానం; చేసి,

తాత్సర్యం: కుంతి ఆ ముని(శ్రేష్టుడు కోరిన ఆహారం పెట్టగా దుర్వాసుడు తృప్తి పొంది ఈ మంత్రంచేత నీవు

ఏ దేవతలను ఆరాధిస్తావో ఆ దేవతలు నీవు కోరిన కొడుకులను ఇస్తారు" అని ఆపద్దర్మంగా ఒక దివ్యమంత్రాన్ని

ఉపదేశించి వెళ్ళాడు. తరువాత ఆమె ఆ మంతత్రశక్తిని తెలిసికొనాలని ఒకరోజు ఒంటరిగా గంగకు వెళ్ళి స్నానం

చేసి.

విశేషం: ఆపద్దర్మం అంటే గత్యంతరం లేకపోయినప్పుడు పాటించదగిన న్యాయం అని భావం. త్రికాలజ్ఞ డైన దుర్వాసుడు

పాండవోత్పత్తికి ఆ మంత్రం ఆపద్ధర్మంగా వినియోగింపబడా లని భవిష్యద్దర్శనంతో వరంగా (ప్రసాదించాడు. అట్టా పుట్టినవాళ్ళే

కౌంతేయు లయ్యారు (ధర్మజాదులు). అపద్దర్మంగా కాక మంత్రశక్తి పరీక్షార్థం వినియోగించినప్పుడు పుట్టిన కర్గ్ముడు కౌంతేయుడుగొ కాక రాధేయుడుగా ప్రసిద్ధికావటం జరిగింది.

క. _ అ మృంత్రముం దనదగు హృద । యమ్మున నక్కన్య నిలిపి యాదిత్యున క ర్వ మ్మెత్రి 'నాకు నిమ్ము ప్రి; యమ్మున నీ యట్టి పుత్తు నంబుజమిత్రా!' 19

ప్రతిపదార్థం: ఆ+మంత్రమున్‌; తనది; అగు; హృదయమ్మునన్‌; ఆ+కన్యు నిలిపి; ఆదిత్యునకు= సూర్యుడికి; అర్హ్యమ్ము=

పూజకోసం దోసిట్లోకి తీసికొనే నీటిని; ఎత్తి= పైకెత్తి; అంబుజ, మిత్రా నీటిలోంచి పుట్టిన పద్మానికి మిత్రుడవు అయినవాడా-

ఓ సూర్యుడా!; నాకున్‌; ప్రియమ్మున; నీ, అట్టి; పుత్రున్‌; ఇమ్ము.

తాత్పర్యం; కుంతి ఆ మంత్రాన్ని తన మనస్సులో జపించి సూర్యునికి అర్ధ్యం ఇచ్చి 'అదిత్యా! నాకు నీవంటి

కొడుకును ప్రేమతో ఇమ్ము.

డ28 శ్రీనుదాంధ్ర మహాభారతము క. అవికేలు మొగిచి నిలిచిన; వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనం బున మండి కమలమిత్రుండు । తన తీవ్రకరత్వ ముడిగి తరుణ ద్యుతితోన్‌. 20 (ప్రతిపదార్హం: అని; కేలు= చేతులు; మొగిచి= మోడ్చి; నిలిచిన; కమల, మిడ్రుడు= పద్మాలకు మిత్రుడు అయిన సూర్యుడు; తన; తీవ్ర, కరత్వము= వేడికిరణాలు కలిగి ఉండటాన్ని; ఉడిగి= విడిచి; తరుణ, ద్యుతితోన్‌= లేతకాంతితో, యువకుడి అందంతో; వనజ+ఆయత, నేత్ర, కడకు నీటినుండి పుట్టిన పద్మాలవలె విశాల మైన కన్నులు కల కుంతి దగ్గరకు; గగనంబుననుండి= ఆకాశంనుండి; వచ్చెను.

తొత్సర్యం: అని కుంతి చేతులు మోడ్చి నిలబడగా, సూర్యుడు తన వేడికిరణాలను విడిచి కోమలకాంతితో

(యువకుడి అందంతో) ఆకాశంనుండి ఆమెదగ్గరకు దిగి వచ్చాడు.

వ అ కృన్యకయు నట్టితేజోరూపంబు సూచి విషయంబునను భయంబునను గడు సంభ్రమించి నడునడ నడుంగుచున్నదాని 'నోడకుండు' మని సూర్యుండు ప్రసన్నుం డై 'నీకోరినవరం బీ వచ్చితి' ననిన గొంతియు లజ్ఞావనతనదన యై 'యొక్కబ్రహ్మవిదుండు నాకుం గరుణించి యిమ్మంత్రం బుపదేశించిన దానిశక్తి నెబుంగ వేండి యజ్ఞానంబున నిన్నుం ద్రిలోకైకదీపకుం ద్రిపురుషమూర్తిం బ్రివదమయు రావించిన యీాయపరాధంబు నాకు సహింపవలయు.” 21

(ప్రతిపదార్థం: ఆ+కన్యకయున్‌= ఆ కుంతీదేవి; అట్టి: తేజ:+రూపంబు= కాంతిమంత మైన ఆకారం; చూచి; విస్మయంబునను= ఆశ్చర్యంతో: భయంబునన; కడు= మిక్కిలి, సంభ్రమించి= తొ(ట్రుపడి; నడునడ= నడకమధ్యలో: నడుంగుచు+ఉన్న, దానిన్‌= వణకుతున్నదానిని; ఓడక+ఉండుము= భయపడకుము; అని; సూర్యుండు; ప్రసన్నుండు+ఐ= దయకలవాడై; నీ, కోరిన, వరంబుజ నీవు కోరిన వరం; ఈ= ఇవ్వటానికి; వచ్చితిన్‌? అనిన; కొంతియు= కుంతీదేవికూడ; లజ్ఞా+అవనత, వదన+ఐ= సిగ్గుతో వంచుకొన్న ముఖం కలదై; ఒక్క; బ్రహ్మ, విదుండు= బ్రహ్మమును తెలిసినవాడు; నాకున్‌; కరుణించి= దయతలచి; ఈ+మం(త్రంబు; ఉపదేశించిన; దాని, శక్తిన్‌; ఎలుంగ, వేండి= తెలిసికొనాలని; అజ్ఞానంబున, త్రిలోకశఏక, దీపకున్‌=మూడులోకాలను ముఖ్యంగా వెలిగించేవాడిని? (త్రి, పురుషు మూర్తిన్‌ = (బ్రహ్మ విష్ణు మహేశ్చరులు అనే ముగ్గురు పురుషుల ఆకారం అయినవాడిని; (త్రివేదమయున్‌= మూడు వేదాలరూపం అయినవాడిని; నిన్నున్‌; రావించిన= రప్పించిన; ఈ+అపరాధంబు= ఈతప్పు; నాకు= నాయందు; సహింపవలయుజ= ఓర్చుకోవాలి.

తాత్పర్యం: ఆ కుంతిదేవికూడ అటువంటి కాంతిమంత మైన సూర్యునిరూపాన్ని చూచి ఆశ్చర్యంతో, భయంతో మిక్కిలి తొట్రుపడి వణకుతూ ఉండగా సూర్యుడు, భయపడకు అని (ప్రసన్నుడై వీవు కోరిన వరం ఇవ్వటానికి వచ్చాను" అన్నాడు. కుంతి సిగ్గుతో ముఖం వంచుకొని 'ఒక బ్రహ్మజ్ఞాని దయతో నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించగా దానిశక్తి తెలిసికొనాలనే కోరికతో - మూడులోకాలను ముఖ్యంగా వెలిగించేవాడవు, (త్రిమూర్తుల స్వరూపుడవు, మూడువేదాల ఆకారం తాల్చినవాడవు అయిన నిన్ను అజ్ఞానంచేత రప్పించిన నా తప్పును క్షమించుము. విశేషం: సూర్యుడు ఉదయం బ్రహ్మస్వరూపు డని, మధ్యాహ్నం శివస్వరూపు డని సాయంకాలం విష్ణుస్వరూపు డని ప్రసిద్ది, అందువలన సూర్యుడు త్రిపురుషమూర్తి. బ్రహ్మస్వరూప ముదయే । మధ్యాహ్నే తు మహేశ్వరమ్‌ సాయం ధ్యాయే త్సదా విష్ణుం (త్రిమూర్తిం చ దివాకరమ్‌ । అట్టాగే సూర్యుడు ఉదయం బుగ్వేదస్వరూపుడు, మధ్యాహ్నం యజుర్వేదస్వరూపుడు సాయంకాలం సామవేదస్వరూపుడు. అందువల్లనే త్రివదమయుడు.

ఆదిపర్వము - పంచమాశ్వాసము శ్త29

ఆ. 'ఎజుకలేమిం జేసి యింతు లెప్పడు నప । రాధయుతలు సాపరాధ లయిన

వారి గరుణ నెల్లవారును రక్షింతు' ।; రనుచు సూర్యునకు లతాంగి మొక్కె, 22 ప్రతిపదార్థం: ఎజుక= జ్ఞానం; లేమిన్‌ చేసి= లేకపోవటంచేత; ఇంతులు= (స్త్రీలు; ఎప్పుడున్‌; అపరాధయుతలు= తప్పిదాలతో కూడినవారు; స+అపరాధలు= తప్పులతో కూడినవారు; అయిన; వారిన్‌= ఆ్రీలను; కరుణన్‌= దయతో; ఎల్లవారును= అందరూ; రక్షింతురు; అనుచు; లతా+అంగి=ఐ లతవంటి (సుకుమారంఅయిన) దేహంకలది - కుంతి; సూర్యునకు: మొైక్కె= నమస్కరించింది. తాత్సర్యం: 'తెలివి లేక స్త్రీలు ఎప్పుడూ తప్పులు చేస్తారు. తప్పులు చేసిన స్త్రీలను దయతో అంతా మన్నిస్తారు' అని కుంతి సూర్యునికి నమస్కరించింది. వ. సూర్యుండును 'నీకు దుర్వాసుం డిచ్చిన వరంబును మంత్రంబుశక్తియు నెలుంగుదు; మదీయదర్శనంబు వృథ

గాదు; నీ యభిమతంబు సేయుదు' ననిన గొంతి యి ట్లనియె. 23 ప్రతిపదార్థం: సూర్యుండును; నీకు; దుర్వాసుడు+ఇచ్చిన; వరంబును; మంధత్రంబు, శక్తియున్‌= మం్యత్రంయొక్కబలాన్ని; ఎయింగుదు; మదీయ, దర్శనంబు= నాదర్శనం - నీవు నన్ను చూడటం; వృధ= వ్యర్ధం; కాదు; నీ, అభిమతంబు= నీయిష్టప్రకారం; చేయుదును; అనిన; కాంత; ఇట్టు+అనియె. తాత్పర్యం: “నీకు దుర్వాసుడు ప్రసాదించిన వరంగురించి, మండత్రశక్తినిగురించి నాకు తెలుసు; నా దర్శనం వృథా కాదు. నీ కోర్కె నెరవేరుస్తాను' అని సూర్యుడు పలుకగా, కుంతి ఈ విధంగా అన్నది. ఆఅ. ఏను మంత్రశక్తి యెటుంగక కోరితిం। గన్య కిదియు కోరంగాదు నాక;

నాకు గర్ధ మయిన నాతలిదంద్రులు6 । జుట్టములును నన్ను జూచి నగరె? 24 ప్రతిపదార్థం: ఏనుజ నేను; మంత్ర, శక్తి మంత్రంయొక్కశక్తిని; ఎలుంగక= తెలియక; కన్యకువ పెళ్ళికానిస్రీకి; ఇదియు: కోరన్‌+కాదు= కోరకూడదు; నాక= అని అనక; కోరితిన్‌; నాకు; గర్భము+ అయిన; నా, తల్లిదండ్రులున్‌; చుట్టములును; నన్నున్‌: చూచి; నగరె= నవ్వరా? తాత్చర్యం; నేను మంత్రశక్తి తెలియక, ఇది పెళ్ళికానిస్త్రీ కోరకూడ దని తెలియక కోరాను. నాకు గర్భం వస్తే నన్ను చూచి నా తల్లిదండ్రులు, బంధువులు నవ్వరా? వ. అనిన విని సూర్యుండు దానికి. గరుణించి 'నీకు సద్యోగర్ధంబునం బుత్తుం డుద్ధవిల్లు; నీకన్యాత్వంబును

దూషితంబుగా' దని వరం బిచ్చిన దత్‌క్షణంబ యక్కన్యకకు నంశుమంతునంశంబునం గానీనుం దై.25 ప్రతిపదార్థం: అనిన; విని, సూర్యుండు; దానికిన్‌= ఆ కుంతీదేవిని; కరుణించి దయతలచి; నీకు; సద్యః+గర్భంబునన్‌= ఇప్పటికి ఇప్పుడు కలిగే గర్భంవలన; పుత్రుండు: ఉద్భవిల్లుజ పుడతాడు; నీ, కన్యాత్వంబును= నీ కన్నెతనంకూడ; దూషితంబు= దోషం కలది; కాదు; అని; వరంబు+ ఇచ్చినన్‌; తత్‌+క్షణంబు+అ= ఆ క్షణంలోనే; ఆ+కన్యకకు; అంశుమంతు, అంశంబునన్‌= సూర్యునిఅంశంచేత; కానీనుండు+ఐ=ఐ కన్యకు పుట్టినవా డై; (కానీనః కన్యకాజాత: - అని అమరకోశం). తాత్పర్యం: అని కుంతి అనగా విని సూర్యుడు ఆమెమీద దయతలచి 'నీకు సద్యోగర్భంవలన పుత్రుడు పుట్టుతాడు. నీ కన్నెతనం కూడ చెడదు' అని వరం ఇవ్వగా అప్పటికి అప్పుడే ఆ కన్యకకు సూర్యునిఅంశాన కన్యాపుత్రుడై.

శం శ్రీమదాంధ్ర మహాభారతము కర్ణుండు జనియించి సూతగ్భహంబు సేరుట (సం. 1-104-10) చు సలలిత మైన పుట్టుగవచంబు నిసర్గజ మైన కుండలం బుల యుగళంబు నొప్పంగ సుపుత్తుండు కర్టుండు పుట్టె సూర్యమం దలమొకొ భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుంగెడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండంగన్‌. 26 ప్రతిపదార్హం: సలలితము+ఐన= అందమైన; పుట్టు: కవచంబు= పుట్టుకతోనే ఏర్పడ్డకవచం: నిసర్గజము+ఐన= సహజమైన; కుండలంబుల, యుగళంబున్‌= చెవిపోగుల జంటయు; ఒప్పంగ= 'ప్రకాశించగా; సు+పు(త్రుండువ= చక్కనికుమారుడు; కర్టుండు; సూర్య, మండలము+ఒకొ= సూర్యమండలమే యేమో; భూతలంబునన్‌= భూమిమీద; బెడంగు+అయి= అందమై; దీప్తి సహస్రకంబుతోజ= వేయికిరణాలతో; వెలులౌడు, నా= ్రకాశిస్తున్నదా అన్నట్టు; నిజ, ద్యుతి= తనకాంతి; సవిస్తర, లీల= విరివి ఆయిన విలాసంతో; వెలుంగుచు+ఉండంగన్‌; పుట్టెఐ పుట్టాడు. తాత్పర్యం: అంద మైన సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తూ సూర్యమండలమే భూమిమీద వేయి కిరణాలతో (ప్రకాళిస్తున్నదా అన్నట్టు అధిక మైన కాంతితో కర్చుడు పుట్టాడు. విశేషం: అలం: ఉ(్రేక్ష, 'నిజద్యుతిసవిస్తరలీల వెలుంగుచుండగన్‌' అనే విశేషణం సార్హకం. మహాభారత పాత్రలలో స్వీయవ్యక్తిత్వంతో ఒంటరిపోరుతో దిగంత యశస్సు గడించిన వీరుడు కర్ణుడు. కర్టుడు లేకపోతే భారతం లేదన్న లోకోక్తి ఈ పొ(త్రకున్న ప్రత్యేకతను తెలుపుతున్నది. పుట్టుకవచంతో, కుండలాలతో పుట్టిన దివ్యరూపం కలవాడైనా, కర్ణుడు నిజ జీవితంలో విషాదాంతనాయకుడు, వ. అంత నాదిత్యుం డొకాశంబున కరిగినం గొడుకుం జూచి కుంతి దద్దయు విషయం బంది యెద్దియుం జేయునది నేరక. 27 ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; ఆదిత్యుండు= సూర్యుడు; ఆకాశంబునకు; అరిగినన్‌= వెళ్ళగా; కుంతి; కొడుకున్‌; చూచి; తద్దయు= మిక్కిలి; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; చేయునది, నేరకజ ఏమి చేయాలో తెలియక. తాత్పర్యం: తరువాత సూర్యుడు ఆకాళానికి వెళ్ళిపోగా, కుంతి కొడుకును చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఏమి చేయాలో తెలియక, తరువోజ, ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర? మిమ్మంత్రశక్తి యే నెటుంగంగ వేండి యేల పుత్రకుం గోరి యెంతయుభక్తి నిను దలంచితి బ్రీతి? నినుండును నాకు నేల సద్యోగర్ధమిచ్చె? గుమారు డేల యప్పుడ యుదయించి? నిం కెట్టు లీ లోక పరివాద మే నుడిగింతు? నింతకు నింతయు నెబు6గరె జనులు! 28 ప్రతిపదార్థం: ఏల; ఆ+ముని= ఆ దుర్వాసుడు; నాకున్‌: ఈ+మం(త్రము; ఇచ్చెన్‌్‌ ఈ+మం'త్ర, శక్తి ఏన్‌= నేను; ఎజుగంగ, వండి తెలిసి కొనాలని కోరి; ఏల; పుత్రకున్‌= కొడుకును; కోరి; ఎంతయుజ= మిక్కిలి; భక్తిన్‌= భక్తితో; ఇనున్‌= సూర్యుడిని; తలంచితి= తలచుకొన్నాను; ప్రీతిన్‌= ప్రేమతో; ఇనుండును= సూర్యుడుకూడ; ఏల; నాకున్‌; సద్యః+గర్భము= అప్పటికి అప్పుడే కలిగే గర్భాన్ని; ఇచ్చెన్‌; ఏల; కుమారుండు; అప్పుడు+అ= అప్పుడే ఉదయించెన్‌= పుట్టాడు; ఇంక; ఎట్టులు= ఏ విధంగా; ఈ,లోక,

ఆదిపర్వము - పంచమాశ్వాసము శ31

పరివాదము= ఈలోకాపవాదం; ఏను= నేను; ఉడిగింతున్‌= లేకుండా చేస్తాను; ఇంతకున్‌= ఇప్పటికే? జనులు; ఇంతయున్‌= టిరిగినది అంతా; ఎజు(గరె= తెలిసీకోరా? తాత్పర్యం: దుర్వాసుడు నాకెందుకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు? ఆ మంఢత్రప్రభావాన్ని తెలిసికొనాలని నేను ఎందుకు భక్తితో సూర్యుడిని స్మరించాను? ఆ సూర్యుడుకూడ నాకు ఎందుకు సద్యోగర్భాన్ని ఇచ్చాడు? అప్పుడే ఈ పుత్రుడు ఎందుకు నాకు పుట్టాడు? ఇంక ఏ విధంగా లోకాపవాదాన్ని తప్పించుకొంటాను? ఇప్పటికే జరిగినదంతా ప్రజలు తెలిసికొని ఉండరా? విశేషం: తరువోజలోని ప్రతిపాదంలోనూ రెండు ద్విపదపాదా లుంటాయి. ద్విపదలో ప్రతిపాదంలోనూ మూడు ఇంద్రగణాల మీద ఒక సూర్యగణం ఉంటుంది. అంటే తరువోజలో ఒక్కొక్క చరణంలో 3 ఇంద్రగణాలు+ ఒక సూర్యగణం + 3 ఇంద్రగణాలు+ 1 సూర్యగణం ఉంటాయన్నమాట, ప్రతి రెండేసి గణాలమీద మూడు యతులు ఉంటాయి. ప్రాసనియతికూడా ఉన్నది. మొదటి పాదం గురువుతోకాని, లఘువుతోకాని ప్రారంభ మైతే మిగిలిన పాదాలన్నీ అట్టాగే సాగాలి. “తరువోజ యలసము, సుకుమారమైన ఛందమని కవిత్రయమువా రభిప్రాయపడినట్టు వారి ప్రయోగమునుబట్టి యూహింపందగియున్నది. చింత, శంక, దైన్యము, గ్లాని, శోకము మున్నగు నలసచిత్తవృత్తులందే తరువోజలు తఆచుగాం బ్రయోగింపబడి యున్నవి విశేషించి భారత మందలి పందొమ్మిది తరువోజలలో నేడు తరువోజలు 'స్తీవాక్యములై యుండుటచే విన్నకోట పెద్దన యన్నట్టు ఫైణమైన మృదువృత్తముగా, గవిత్రయము భావించిరని కూడ తలంపవచ్చును.... ఈ తరువోజయందు మత్తకోకిలా సంక్రమణ కల్పితమైన గమక చమత్కారము గుర్తింపదగియున్నది..... తరువోజ మత్తకోకిలా భ్రాంతిని మాటిమాటికి గలిగించు చున్నది. విరుద్దావిరుద్ధ నానాభావసాంకర్య చిత్రితమైన కుంతీదేవి తత్కాలచిత్తవృత్తి రమ్యముగ ధ్వనితమగుచున్నది.” (డాక్టర్‌ పాటిబండమాధవళర్మ- ఆంధ్ర మహాభారతము. ఛందళ్ళిల్పము). వితర్క రూపమైన వాక్యవిన్యాసం పద్యమంతా ఒకే పద్ధతితో కూర్చబడి ఉండటంచేత సమత (మార్లాభేదం) అనే శబ్దగుణం సార్ధకంగా సమకూరింది. (సంపా) వసంతతిలకము,

“ఈ బాలు నెత్తుకొని యింటికిం జన్న నన్నున్‌

నా బంధులందజటు మనంబున నేమనా? రె

ట్లీ బాలసూర్యనిభు నిట్టుల డించి పోవం

గా బుద్ధిపుట్టు” నని కన్య మనంబులోనన్‌, 29 (ప్రతిపదార్థం: ఈ, బాలున్‌; ఎత్తుకొని; ఇంటికిన్‌; చన్నజ వెళ్ళిన; నన్నున్‌; నా, బంధులు+ అందణు; మనంబునన్‌= మనస్సులో: ఎమి+అనారు= ఏమి అనరు? = అనగా ఏమైనా అంటారు; ఎట్టు: ఈ, బాల, సూర్య, నిభున్‌= ఈ బాలసూర్యుడితో సమాన మైన వాడిని; ఇట్టుల; డించి= దించి, వదలిపెట్టి: పోవంగా; బుద్దిపుట్టున్‌, అని: కన్యజ పెళ్ళికానికుంతి; మనంబులోనన్‌, చౌత్సర్యం: “ఈ బాలుడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళితే నన్ను నాబంధువులంతా దూషిస్తారు. అట్లని, బాలసూర్యుడి వంటి ఈబాలుడిని వదలి వెళ్ళటానికి బుద్ధి ఎట్లా పుట్టుతుంది?' అని కన్యగా ఉన్న కుంతి మనస్సులో. విశేషం: వసంత తిలకవృత్తంలోని (ప్రతిపాదంలోనూ వరుసగా - త-భ-జ-జ-గగ- అనే గణాలుంటాయి. ఎనిమిదవ అక్షరం యతిస్టానం, 'ప్రాసనియమం ఉన్నది. దీనికి సింహోన్నత, సింహోద్ధత, ఉద్దర్షిణి, మధుమాధవి, శోభాతతి, కర్షొత్సల మొదలైన పేర్లున్నాయి. నన్న్మయ ఈ వృత్తంలో మూడుపద్యాలు (వ్రాశాడు. వాటిలో రెండు అశ్వాసాంత్యపద్యాలుగానూ, ఒకటి (అంటే ఈపద్యం) కథాసందర్భంలోనూ ఉపయోగించాడు. కుంతీదేవియొక్క అనిశ్చితమైన చిత్తవృత్తిని ఈ వృత్తం ధ్వనింపచేస్తున్నది. పుత్రుడిమీది

క్త్ర2ై శ్రీమదాంధ్ర మహాభారతము మమకారం, బంధువులవలన కలిగే అపవాదం అనే రెండు భావావస్టల నడుమ అల్లల్హాడుతున్న అ మాతృమూర్తి వత్సల, భయభావాలను మాధుర్యమనే గుణంతో పోషించటం నన్మయరచనాశిల్పం. పృథక్‌పదత్సంతోపాటు ఉక్తివైచిత్రంకూడా ఇందులో ఉన్నది. కుంతి మాతృమూర్తిగా వేదనపడుతున్నది. కాని, కన్య మనంబులో ఈ మాటలనుకొన్నట్టు నన్నయ చెప్పాడు. అది పొసగదు కదా! అనిపించవచ్చును. ఆమెకు సద్యోగర్భంలో కర్ణుడు పుట్టంగానే సూర్యవరంవలన ఆమె కన్యాత్వం దూషితం కాకుండా యథాస్థ్రితిగా ఉన్నదని వస్తుధ్వని. ఆ కన్యాత్వస్థితి వచ్చినందువలననే పసిపాపడైన కర్ణుడిని మందసంలో ఉంచి వెంటనే రాగలిగిందని భావించాలి. నన్నయ 'కన్య' అనే మాటతో పాత్రయొక్క తత్కాలస్థితిగతులను ధ్వనింపచేయటం ఉక్తి చమత్కారం. (సంపా.) వ. వందురి వగచుచున్నదాని పుణ్యంబున నాదిత్యప్రేరితం బబు యనర్హరత్నవసుభరితం బయిన యొక్కమంజస వదీప్రవాహవేగంబునం దనయొద్దకు వచ్చిన, దానిలో. జెచ్చెరం దనకొడుకుం బెట్టి కుంతి నిజగ్బృహంబునకు వచ్చె; నంత. 30 ప్రతిపదార్థం: వందురి= దుఃఖించి; వగచుచు+ఉన్న= ఆలోచిస్తున్న; దాని, పుణ్యంబునన్‌= దాని పుణ్యంవలన; ఆదిత్య, ప్రేరితంబు+అయి= సూర్యుడిచేత పంపబడినదై; అనర్హ, రత్న, వసు, భరితంబు+అయిన= అమూల్యాలైన రత్నాలచేత, బంగారంచేత నిండినట్టిది అయిన; ఒక్క; మంజస= పెట్టె; నదీ, ప్రవాహ, వేగంబునన్‌= నదీ'ప్రవాహవేగంచేత; తన, ఒద్దకు; వచ్చిన; దానిలోన్‌; చెర+చెరన్‌= వెంటనే; తన, కొడుకున్‌, పెట్టి; కుంతి; నిజ, గృహంబునకు= తనఇంటికి; వచ్చెన్‌; అంతజ= ఆ తరువాత. తాత్పర్యం: దుఃఖిస్తూ, ఆలోచిస్తున్న కుంతిదేవిపుణ్యంవలన సూర్యుడు పంపిన ఒక పెట్టె అమూల్యాలైన రత్నాలతో, బంగారంతో నిండి నదీప్రవాహవేగంవలన ఆమెదగ్గరకు వచ్చింది. ఆ విధంగా తనదగ్గరకు వచ్చిన పెట్టెలో వెంటనే తన కొడుకును పెట్టి కుంతి తన ఇంటికి వచ్చింది. ఆ తరువాత. ఆ. ఘనభుజుండు రాధ యను దాని పతి యొక్క! సూతుం డరుగుదెంచి చూచి రత్న పుంజభరిత మయిన మంజసలో నున్న: కొడుకు దానితోన కొనుచు వచ్చి. 31 ప్రతిపదార్థం: ఘన, భుజుండు= గొప్పభుజాలు కలవాడు; రాధ; అను, దాని పతి= భర్తు ఒక్క, సూతుండు= సూతవంశంలో పుట్టినవాడు ఒకడు; అరుగుదెంచి= వచ్చి; చూచి; రత్న, పుంజ, భరితము= రత్నాలసమూహంతో నిండినది; అయిన; మంజసలోన్‌= పెట్టెలో: ఉన్న; కొడుకు; దాని, తోన= ఆ పెట్టెతోనే: కొనుచు= తీసికొంటూ: వచ్చి. తాత్పర్యం: రాధ అనే స్త్రీకి భర్త అయిన ఒక సూతుడు, గొప్పభుజాలు కలవాడు వచ్చి చూచి, రత్నాలపెట్టెలో ఉన్న బిడ్డను ఆ పెట్టెతోకూడ తీసికొని వెళ్ళి. కు తన భార్యకు రాధకు ని । చ్చిన నదియును గరము సంతసిల్లి కుమారుం గని చన్నులు సేయ్‌ ముదం । బునం బెవిచెను సుహృదు లెట్టిపుణ్యమొ యనంగన్‌. 32 ప్రతిపదార్థం: తన, భార్యకు; రాధకున్‌; ఇచ్చినన్‌; అదియును; కరము= మిక్కిలి; సంతసిల్లి; కుమారున్‌: కని= చూచి; చన్నులు: చేటి; సుహృదులు= చెలులు; ఎట్టి; పుణ్యమొ; అనంగన్‌, ముదంబునన్‌= సంతోషంతో; పెనిచెను= పెంచింది. తాత్పర్యం: తన భార్యఅయిన రాధకు ఇవ్వగా, ఆమె చాలా సంతోషించి; ఆ కుమారుడిని చూచి చన్నులు చేపగా అతనికి పాలిచ్చి, చెలులంతా “ఇదంతా నీపుణ్యం' అని పొగడగా, ఆ బాలుడిని పంచింది. వు ఇ్లు వసునివహంబుతో వచ్చుటంజేసి వసుషేణుం డను నామంబునం బరడి కర్దుండు రాధేయుం దై సూతగ్భహంబునం బెరుంగుచుండె; నంత నిట. 33

ఆదిపర్వము - పంచమాశ్వాసము త్త ప్రతిపదార్థం: ఇట్టు: వసు, నివహంబుతో= రత్నాల, బంగారుసమూహంతో; వచ్చుటన్‌+చేసి= రావటంవలన; వసుషేణుండు; అను; నామంబునన్‌= పేరుతో; పరగి= ఒప్పి; కర్టుండు; రాధేయుండు+ఐజ రాధకొడుకై; సూత, గృహంబునన్‌= సూతుని ఇంట్లో; 'పెరుగుచు+ఉండెన్‌; అంతన్‌; ఇట. తాత్పర్యం: ఈ విధంగా బంగారంతో, రత్నాలతో రావటంచేత వసుషేణుడు అనే పేరుతో కర్చుడు రాధకొడుకుగా సూతుడి ఇంట్లో పెరుగుతున్నాడు. ఆపైన ఇక్కడ. విశేషం: వసుశబ్దానికి బంగారు, రత్నాలు అనే రెండుఅర్జాలూ ఉన్నాయి. పాండురాజు వివాహ మై దిగ్విజయము సేయుట (సం. 1-105-1)

సీ, యదుకులవిమలపయఃపయోనిధిసుధా । కరరేఖం గమనీయకాంతినిలయ,

ననవరతాన్నదానాభితర్పితముని : విప్రజనాశీఃపవిత్రమూర్తి,

వినయాభిమాన వివేక సౌజన్యాది ।; సదమల గుణరత్న జన్మభూమిం

బరమపతివ్రతాభరణాభిశోభితం ; దామరసేక్షణం దాల్మియందుం ఆ. బృథివిం బోనిదానిం బృథయను కన్యక ; నధికవీరు డై స్తయంవరమునం

బడసి పరనరేంద్రపరిభావిపాండు భూ । వరు౮డు పేర్మితో వివాహ మయ్యె: 34 (ప్రతిపదార్హం:; యదుకుల, విమల, పయః పయోనిధి, సుధాకర, రేఖన్‌= యదువంశం అనే నిర్మల మైన పాలసముద్రానికి చంద్రరేఖ అయిన దానిని; కమనీయ, కాంతి, నిలయన్‌= మనోహర మైన కాంతికి స్తానం అయినదానిని; అనవరత+ అన్నదాన+అభితర్చిత,

థా! ముని, విప్రజన+ఆశీః, పవిత్రమూర్తి= ఎడతెగని అన్నదానంచేత తృప్తి పొందింపబడిన మునుల, బ్రాహ్మణుల ఆశీర్వచనంచేత పవిత్ర మైన ఆకారం కలదానిని; వినయ+అభిమాన, వివేక, సౌజన్య+అది, సత్‌+అమల, గుణ. రత్న, జన్మభూమిన్‌= అడకువ, గౌరవం, వివేకం, మంచితనం మొదలైన ఉత్తమాలు అయిన నిర్మలగుణాలు అనే రత్నాలకు పుట్టుచోటు అయిన దానిని; పరమ, పతి[వ్రతా+ఆభరణ+అభిశోభితన్‌= ఉత్తమ మైన పాతివ్రత్యం కల స్త్రీలకు నగవలె ఎక్కువగా ప్రకాశింపచేయబడుతున్నదానిని; తామరస+ఈక్షణన్‌= కమలాలవంటి కన్నులు కలదానిని; తాల్మి, అందున్‌= ఓర్పులో; పృథివిన్‌= భూమిని; పోనిదానిన్‌= పోలినట్టిదానిని; ప్పధ; అను; కన్యకన్‌; పర, నర+ఇం(ద్ర, పరిభావి= శత్రురాజులను అవమానించువాడు; పాండు, భూవరుండు= పాండురాజు; అధిక, వీరుండు+ఐవ= మిక్కిలి పరాక్రమశాలి అయి; స్వయంవరమునన్‌; పడసి= షాంది; 'సేర్మితో= గొప్పుగా, ప్రీతిగా; వివాహము+అయ్యె= పెళ్ళి చేసికొన్నాడు. తాత్సర్యం; యదువంశ మనే నిర్మలసముద్రానికి చం(ద్రరేఖవంటిది, మనోహర మైన తేజస్సుకు స్థాన మైనది, ఎడతెగని అన్నదానం చేత మునులను బ్రాహ్మణులను తృప్తిపొందించి వాళ్ళ ఆశీర్సచనంచేత పవిత్ర మైన ఆకారం కలది, వినయం, గౌరవం, వివేకం, మంచితనం మొదలైన ఉత్తమగుణాలనే రత్నాలకు జన్మభూమి అయినది, పరము పతివ్రతలకు అలంకారంవలె ్రకాశించేది, కమలాలవంటి కన్నులు కలది, ఓర్పులో భూమితో పోల్చదగింది అయిన వ్‌

పృథను, శత్రురాజులను జయించిన పాండురాజు మహాపరా(క్రమళాలి అయి, స్వయంవరంలో పొంది, ప్రీతితో పెళ్ళి చేసికొన్నాడు. విశేషం: అలం: రూపకం, ఉపమ. ఈ పద్యంలో నన్నయ కుంతిని ఒక శృంగారనాయికగా కొక పుణ్యవతిగా, పవిత్రమూర్తిగా వర్ణించాడు. 'గణనీయకాంతినిలయ' అన్న విశేషణంద్వారా ఈ పద్యరచనలో కాంతి అనే శబ్దగుణం గణనీయంగా పోషింపబడిందని

3డీ శ్రీమదాంధ్ర మహాభారతము సూచించాడు. వాడిన దీర్హ సమాసాలు జౌజ్జ్వల్యం అనే స్వభావాన్ని ప్రదర్శించటంచేత కుంతిలోని కాంతిశీలం ధ్వనిమయం అవుతున్నది. అక్షరరమ్యత కాంతిగుణశోభకు వ్యంజకం కావటం ఈ రచనలోని విశేషం. భారతకథలో మాతృమూర్తిగా అత్యంత కీలకమైన పాత్రను నిర్వహించే పృధను(కుంతిని) సీసపద్యంలో గుణసుందరంగా ఉదాత్తంగా పరిచయం చేయటం రుచిరార్హసూక్తినిధి ప్రదర్శించిన శిల్పం. వ. మజియుభీష్మానుమతంబున మద్రరాజతనయ మాధ్రియనుదాని మహోత్సవంబున వివాహం బై పాండురాజు భరతకులరత్నాలంకారుం డై పరాక్రనుంబున నెవ్వరిని మెచ్చక యపారచతురంగబలసమన్వితుం డై. 35 ప్రతిపదార్థం: మజియు; భీష్మ+అనుమతంబున= భీష్ముడి అనుమతితో; మద్ర, రాజ, తనయ= మద్రదేశానికి సంబంధించిన రాజు కూతురు; మాద్రి, అను, దాని; మహా+ ఉత్సవంబున; వివాహంబు+ఐ= పాండురాజు; భరత, కుల, రత్న+అలంకారుండు+ఐ= భరతవంశానికి రత్నాభరణం వంటివాడై; పరాశక్రమంబునన్‌; ఎవ్వరిని; మెచ్చకజ లెక్కచేయక; అపార, చతురంగ, బల, సమన్వితుండు+ఐ= అంతు లేని నాలుగు అంగములు (రథ, గజ, తురగ, పదాతులు) కలసేనతో కూడుకొన్నవా డై, తాత్పర్యం: పాండురాజు భీష్మునిఅనుమతితో మద్రరాజుకూతురైన మాద్రినికూడా వైభవంగా వివాహంచేసికొని, భరతవంశానికి రత్హాభరణంవంటివాడై పరాక్రమంతో ఎవరినీ లెక్కచేయక చతురంగబలాలతో కూడుకొన్నవాడై. మ. _ ధ్వజినీపాత భరంబునం దలరంగా ధాత్రీధరాహీంద్ర మూ ర్థజరత్నప్రకరంబు లున్నతగజేంద్రస్యందనప్రోల్లస ద్ధ్యజ వాతాహతి. దూలంగా జలదబృందం బీక్రియన్‌ సర్వది గ్విజయార్థం బరిగెం గురుప్రభుండు దోర్వీర్యప్రకాశార్థి యై. 36 ప్రతిపదార్థం: ధ్వజినీ, పాత, భరంబునన్‌= సైన్యంనడకభారంచేత; ధాత్రీ, ధర+అహి+ఇంద్ర, మూర్చజ, రత్న, ప్రకరంబులు= భూమిని మోస్తున్న నాగరాజైన ఆదిశేషుని శిరస్సునందు పుట్టిన రత్నాలసమూహాలు; తలరంగా= చలింపగా; ఉన్నత, గజ+ఇంద్ర, స్యందన, ప్ర+ఉల్లసత్‌+ద్దుజ, వాత+ఆ, హతిన్‌= ఎత్తైన మేలిమి ఏనుగులయొక్క, రధాలయొక్క బాగా ప్రకాశించే టెక్కములగాలిదెబ్బచేత: జలద, బృందంబు= మేఘాలసమూహం; తూలంగా= చలించంగా; ఈ, క్రియన్‌= ఈ విధంగా; కురు, ప్రభుండు= కురురా జైన పాండురాజు; దోః+వీర్య,. (ప్రకాశశఅర్థి+ఐ= బాహుబలాన్ని ప్రకటించాలన్నకోరిక కలవాడై; సర్వ దిక్‌+విజయ+అర్థంబు= అన్నిదిక్కులను జయించటంకొరకు; ఆరిగెన్‌= వెళ్ళాడు. తాత్పర్యం: సైన్యంయొక్క పొదఘట్టనలభారంవలన భూమిని మోస్తున్న ఆదిశేషునిశిరోమణులు చలించేటట్టు, ఎత్తైన మేలిమిఏనుగులమీద, రథాలమీద కల జెండాల గాలిదెబ్బకు మేఘాల సమూహం చెదిరేటట్టు పాండురాజు తన బాహుబలాన్ని ప్రకటించాలన్న కోరికతో దిగ్విజయంకోసం వెళ్ళాడు. విశేషం: అలం: అతిశయోక్తి, మత్తేభవృత్తం సమాసఘటితమై, సంధిబంధుర మై, ఉదాత్తగంభిరంగా ప్రసాదమి(థిత ఓజోగుణంతో సాగింది. ఈ పద్య శైలి వీరరసోచితం; అక్షరరమ్యం, క, _ అతులప్రతాపలీలా |; యుతుండై ప్రార్టక్షీణాపరోత్తరదిగ్గూ పతుల నిజశాసన వశీ । కృతులం గావించె. దనదుకీర్తి వెలుంగన్‌. 37 (ప్రతిపదార్థం: అతుల, ప్రతాప, లీలా, యుతుండు+ఐజ= సాటిలేని పరాక్రమవిలాసంతో కూడినవా డై; ప్రాక్‌*దక్షిణ+అపర+జిత్తర, ఉిక్‌+భూపతుల= తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తర దిక్కులరాజులను; తనదు కీర్తి వెలుంగన్‌:? నిజ,శాసన, వళీకృతులన్‌= తనఆజ్ఞకు లొంగేటట్టు చేయబడిన వారినిగా - అనగా తనకు లొంగినవారినిగా; కావించెన్‌= చేశాడు.

ఆదిపర్వము - సంచమాశ్వానము 435 తాత్పర్యం: సాటిలేని పరాక్రమ విలాసంతో పాండురాజు నాలుగు దిక్కుల రాజులను తన ఆజ్ఞకు లౌంగేటట్టు చేశాడు. మహాస్రద్దర.

అతిరౌద్రాకారకీలాయతదవదహనోగ్రాగ్ర సేనానిపీడా

హతు లై నానావిధోపాయనములు గొని సౌహార్ధవాంఛన్‌ జయశ్రీ

శ్రీతబాహుం గానంా వచ్చిరి సకలజగత్సేవ్యమానున్‌ మహేంద్ర

ప్రతిముం గౌరవ్యవంశప్రభు నఖిలమహీపాలు రాంబాలికేయున్‌. పల ప్రతిపదార్థం: అఖిల, మహీ, పాలురు= భూమిమీది రాజులంతా; అతి, రౌద్ర+ఆకార, కీలాశఆయత, దవదహన+ఉ(గ్ర+అ(గ్ర,

ర్‌ సేనా నిపీడా హతులు+ఐ= మిక్కిలితీక్ష్‌ణ మైన ఆకారం కల మంటలచేత గొప్పదైన కార్చిచ్చువలె భయంకర మైన ముందు ఉన్న సైన్యంతాకిడిచేత కొట్టబడిన వారై; నానావిధ+ఉపాయనములు= పలురకాలకానుకలు; కొని= తీసికొని; సౌహార్ష, వాంఛన్‌= జ్‌ ం స్నేహంమీదికోరికతో; జయశ్రీ, శ్రిత, బాహున్‌= జయలక్ష్మిచేత ఆ(శ్రయించబడిన చేతులు కలవాడిని; సకల, జగత్‌* సేవ్యమానున్‌= అన్నిలోకాలచేత సేవింపదగినవాడిని; మహా+ఇంద్ర, (ప్రతిమున్‌= దేవేంద్రుడితో సమాన మైన వాడిని; కౌరవ్య, వంశ ప్రభున్‌= కురువంశరాజును; ఆంబాలికేయున్‌= అంబాలికకొడు కైన పాండురాజును; కానంగా= చూడటానికి; వచ్చిరి. తాత్సర్యం: భూమిమీది రాజులంతా మహా తీవ జ్వాలలతో మండుతున్న కార్చిచ్చువలె భయంకరమయిన ముందున్న సైన్యం తాకిడిచేత కొట్టబడినవాళ్ళయి అనేక రకాల కానుకలు తీసుకొని, మి(త్రత్వాన్ని కోరి జయలక్ష్మిని ఆశ్రయించిన చేతులు కలవాడు, అన్ని లోకాలచేత సేవించబడేవాడు, దేవేంద్రునితో సమానమయినవాడు, కురువంశప్రభువు అయిన-పాండురాజును చూడటానికి వచ్చారు. విశేషం: అలం: ఉపమ. మహాస్రగ్దర పాదానికి 22 అక్షరాలుంటాయి. స త,త్యున,స్కర,ర, గ అనే గణాలు వరుసగా ఉంటాయి. క 16 అష్టా లకు యతి చెల్టుతుంది. నన్నయ (వ్రాసినవి మొత్తం రెండు మహాస్రగ్రరలు. మొదటిది (ఆది. 2. 22) దేవదానవ యుద్ధం నరనారాయణులు ప్రదర్శించిన ప్రతాపాన్ని వర్షించేది. రెండవది ఇది. దిగ్యిజయయాత్రలో పాండురాజు ప్రదర్శించిన పరాక్రమాన్ని వర్షించేది. “వీరస్య భుజదండానాం వర్షనే (్రగ్టరా భవేత్‌” అని క్షేమేంద్రుని మతం. (స్రగ్రరలోని మొదటి గురువును

ఇల "జీ, ఇబ రెండు లఘువులు చేస్తే మహాస్రస్టరకౌతుంది. కాబట్టి ్రగ్రరవలె మహా(్రగ్టరను కూడ మహావీరుల పరా(క్రమ ప్రదర్శనకు వినియోగించి నన్నయ వృత్తాచిత్యాన్ని పాలించాడు. (సంపా) చ లలిత హయ ద్విపంబుల విలాసినులన్‌ మణిరౌప్య కాంచనా

వనలుల నజావిగో మహిష వర్గములన్‌ బహుభూషణంబులన్‌

బలువిడి. గప్పముల్‌ ధరణిపాలురచేం గొని నూఖువేల్‌గజం

బులం బెటికించి తెచ్చె గురుముఖ్యుం దకుష్యధనమ్ము లిమ్ముగన్‌, 39 ప్రతిపదార్థం: కురు, ముఖ్యుండు= కురువంశంలో ముఖ్యుడైన వాడు - పాండురాజు: లలిత, హయ, ద్విపంబుల= మనోహరా లైన గుజ్ఞాలను, ఏనుగులను; విలాసినులన్‌= అందమైన ప్రీలను; మణి, రౌష్య, కాంచన+ఆవలులన్‌= మణుల వెండిబంగారాల సమూహాలను: అజ+అవి, గో, మహిష. వర్గములన్‌= మేకల, గొర్రెల, గోవుల, దున్నల సమూహాలను; బహు, భూషణంబులన్‌= అనేక ఆభరణాలను; బలువిడిన్‌= మిక్కుటంగా; కప్పముల్‌? ధరణిపాలురచేన్‌= రాజులనుండి; కొని= (గ్రహించి; అకుష్య, ధనమ్ములు= వెండి బంగారు రూపం అయిన సంపదలను; ఇము శ్రగన్‌= సులువుగ; నూలు, వేల్‌, గజంబులన్‌= నూరువేలఎనుగులతో; పెటికించి= మోయించి; తెచ్చెన్‌.

కంర శ్రీనుదాంధ్ర మహాభారతము తాత్పర్యం: పాండురాజు మనోహరా లైన గుర్రాలను, ఏనుంగులను, అందమైన (ప్రీలను, మణులను, వెండిని, బంగారాన్ని, మేకలను, గొర్రెలను, ఆవులను, దున్నలను, చాలాధనాన్ని రాజులనుండి కప్పాలుగా (గ్రహించాడు. వెండి, బంగారు రూప మైన ధనాన్ని నూరు వేల ఏనుగులతో మోయించి తెచ్చాడు. క్ర శరనిధి పరివృత విశ్వం | భర గల భూపతులు పాొందుపతికృతమునం గిం

కరు లై ప్రతిసమకల్పిత । కరు లై రది మొదలుగాంగ6 గౌరవ్యులకున్‌. 40 ప్రతిపదార్థం: శర, నిధి, పరివృత, విశ్శంభరన్‌= సముద్రంచేత చుట్టబడిన భూమిమీద; కల= ఉన్న; భూపతులు= రాజులు; పాండుపతి, కృతమునన్‌= పాండురాజు చేసిన పనివలన; కింకరులు+ఐ= సేవకు లై; అది, మొదలు, కా(గన్‌= అప్పటినుండి; కౌరవ్యులకున్‌= కురువంశరాజులకు; (ప్రతి, సమ, కల్పిత, కరులు+ఐరి= (ప్రతిసంవత్సరం ఏర్పాటు చేయబడిన కప్పం కలవారు అయ్యారు - అనగా (ప్రతిసంవత్సరం కప్పం చెల్లిస్తున్నారు.

తాత్పర్యం: భూమిమీది రాజులంతా పాండురాజు చేసిన పనివల్ల సేవకులై. అప్పటినుండి కురు వంశ రాజులకు

(ప్రతి సంవత్సరం కప్పం చెల్లిస్తున్నారు.

పాండురాజు సత్యత్యములు (సం. 1-106-1)

వ ఇట్లు పాండురాజు దిగ్విజయంబు సేని తదుపార్ణితంబు లైన యవపరిమితధనంబుల. దెచ్చి ధృతరాస్తుననుమతంబున భీష్మునకు సత్యవతికిం దమతల్లు లైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు నిచ్చి, వారివలన ననేకాశీప్రశంసలు వడసి సుఖం బున్నంత. శ]

ప్రతిపదార్థం: ఇట్టు; పాండురాజు; దిక్‌+విజయంబు, చేసి= దిక్కులను జయించి; తత్‌+ఉపార్జితంబులు+ఐన= ఆ దిగ్విజయంవలన సంపాదించబడిన; అపరిమిత, ధనంబులన్‌= అంతులేని సంపదలను; తెచ్చి; ధృతరాహ్త్ర, అనుమత౦ంబున= ధృతరా్తుని అంగీకారంతో; భీష్మునకు; సత్యవతికిన్‌; తమ; తల్టులు+ఐన; కౌసల్యలకు= కోసల రాజుకూతుళ్ళకు; విదురునకు; సుహృత్‌+జనులకు= స్నేహితులకు; బ్రాహ్మణులకున్‌; ఇచ్చి; వారివలనన్‌; అనేక+ఆశీః, ప్రశంసలు= పెక్కుఆశీస్సులు, పొగడ్తలు; పడసి= పొంది; సుఖంబు+ఉన్నంత= సుఖంగా ఉండగా.

తాత్పర్యం: ఈవిధంగా పాండురాజు దిగ్విజయం చేసి, అంతులేని సంపద తెచ్చి, ధృతరా్ష్రుని అనుమతితో

భీష్మునికి సత్యవతికి, తమతల్టులకు, విదురునకు, మిత్రులకు, బ్రాహ్మణులకు ఇచ్చి, వారివలన అనేక

ఆశీర్వచనాలను, ప్రశంసలను పొంది సుఖంగా ఉండగా.

చు వినుత యశుండు పాండు నృప వీరుండు దిగ్విజయంబు సేసి పెం వున గొనివచ్చి యిచ్చిన యపూర్వ మహా ధనరాశి పేర్మి వా రని విభవంబుతోడ ధృతరాస్తుండు సేసె శతాశ్వమేధముల్‌ దని సన భూసురేశులకు దక్షిణ లిచ్చి యధోచితంబుగన్‌. 42

ప్రతిపదార్థం: వినుత, యశుండు= పాగడబడిన కీర్తికలవాడు; పాండున్నప, వీరుండు= వీరు డైన పాండురాజు; దిక్‌+శవిజయంబు,

చేసి= దిక్కులను జయించి; పెంపునన్‌= గొప్పతనంచేత; కొనివచ్చి= తీసికొనివచ్చి; ఇచ్చిన; అపూర్వ: మహా, ధన, రాశి, పేర్మి= అంతకుముందు లేని గొప్ప ధన సమూహం యొక్క అతిశయంతో; వారని, విభవంబుతోడ= ఎడతెగని వైభవంతో; ధృతరా్ష్రండు;

ఆదిపర్వము - సంచనూశ్వాసను శ? చనిసన= తృప్తిదీర; భూసుర+-ఈశులకు= బ్రాహ్మణ శ్రేష్పులకు; యథా+ఉచితంబుగన్‌= ఎవరికి తగినట్టు వారికి; దక్షిణలు: ఇచ్చి; శత+అళ్ళమేధముల్‌= వందఅశ్షమేధయాగాలు; చేసెన్‌. తాత్పర్య: క్తీర్తిమంతు డైన పాండురాజు దిక్కులను జయించి గొప్పగా తెచ్చి ఇచ్చిన ధనసమూహంతో ధృతరాష్ట్రుడు, మహావైభవంగా తృప్తిదీర బ్రాహ్మణోత్తములకు ఎవరికి తగినట్టు వారికి దక్షిణలు ఇచ్చి వంద అశ్వమేధయాగాలు చేశాడు.

వ. మజియునప్పాండురాజు వినయవిధేయత్వంబున ధృతరాషస్తునకు, నభిమతకార్యకరణంబున బాంధవులకు, ననుకూ నస స లత్వంబున సుహృజ్జనులకుం బరిశ్రమజ్ఞానంబున విద్వాంసులకు. గారుణ్యదానంబున ననాథులకు, నభయంకరత్వంబున మహీప్రజలకు సంతోషంబు సేయుచు. 43 ప్రతిపదార్థం: మజియున్‌; ఆ+పాండురాజు; వినయ, విధేయత్వంబున= అణకువతో లొంగిఉండటంచేత; ధృతరా్ష్రునకున్‌; అభిమత, కార్య, కరణంబున= ఇష్టమైన పనులు చేయటంచేత; బాంధవులకున్‌ అనుకూలత్వంబున= అనుకూలంగా ఉండటంచేత; సుహృత్‌+జనులక్షున్‌= మిత్రులకు; పరిశ్రమ, జ్ఞానంబున= కృషిని గుర్తించటంచేత; విద్వాంసులకున్‌= పండితులకు; కారుణ్య, దానంబునన్‌= దయను దానం చేయటంచేత - అనగా కరుణ చూపటంచేత; అనాథులకున్‌= దిక్కులేనివాళ్ళకు; అభయంకరత్వంబున= భయం లేకుండా చేయడంచేత; మహీ, ప్రజలకు= భూమిమీది ప్రజలకు; సంతోషంబు; చేయుచు= కలిగిస్తూ, తాత్సర్యం; అంతేకాక ఆ పాండురాజు వినయవిధేయతలతో ధృతరాష్ర్రునికి, ఇష్టమైన పనులు చేయటంతో బంధువులకు, అనుకూలంగా ఉండటంతో మిత్రులకు, చేసిన కృషిని గుర్తించడంతో పండితులకు, దయ చూపటంతో దిక్కులేనివాళ్ళకు, భయంలేకుండా చేయటంతో (ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తూ, విశేషం: ఇవి ఉత్తమరాజుకు ఉండే లక్షణాలు, ఉత్తమరాజు లక్షణాలే కాదు ఉత్తమవ్యక్తులందరిలో ఉండే ఉన్నతమైన గుణాలు. వృకులంతా అలవరచుకో వలసిన ఉత్తముగుణాలు. పాండురాజు వంశకర్త, భావి చక్రవర్తుల వర్తనవిధిని ఆదర్శంగా ఆచరించి = పాండురాజు తన నంశాన్నీ, కుటుంబాన్నీ సమైక్యంగా, సంపన్నంగా, సంతోషంగా, ఆదర్శవంతంగా ఉంచటానికి తన శక్తి యుక్తులన్నీ ధారపోసి వంశకర్త అయినాడు. పాండురాజు తె ము, చేసిన ధృతరా! వంశవిచ్శాత్తికి దోహదంచేశాడు. పాండురా ఇ తెచ్చియిచ్చిన ధనంతో వంద అశ్వమేధాలు ₹ విన ధృత వ భై పాం జా ప్రవర్తిల్లచేసిన ఉదార చరిత్రాన్ని పాండవులు కొనసాగించారు. అందువలననే ధార్తరాస్ర్రులు నశించారు; పాండవులు వంశోద్దారకులైనారు. పాండురాజు ప్రవర్తనలో ధ్వనిస్తున్న భావికథార్ద్థాలను సారమతితో ఎని చవి ళు భావించాలి. కు “మండిత గుణ సంపద నధి । కుం డగుచున్‌ బూరు భరత కురు పతులకుందు ల్యుం డయి వంశకరుం డగు; బాండుమహీశుం డని బుధసభలు దనుం బొగడన్‌. తట్‌ ప్రతిపదార్థం: మండితగుణసంపదన్‌= అలంకరింపబడిన సుగుణాల అతిశయంలో; అధికుండు= గొప్పవాడు; అగుచున్‌: పాండు, మహీ+ఈశుండుజ పొండురాజు;పూరు, భరత, కురుపతులకున్‌= రాజులైన పూరు, భరతకురురాజులకు; తుల్యుండు+అయి= సమానమైన వాడై; వంశ కరుండు= వంశాన్ని నిలొపీవాడు; అగున్‌; అని; బుధ, సభలు= పండితులసమూహాలు; తనున్‌: పాగడన్‌. తాత్పర్యం: 'అనేక సుగుణాలతో గొప్పవాడై పాండురాజు పూరు భరత కురు చక్రవర్తులతో సమానుడై, వంశాన్ని నిలిపేవాడు బొతా' డని పండితులు తనను పొగడుతూ ఉండగా, క నానాద్రవ్య నిరంతర ।; దానముల ననూనయజ్ఞదక్షిణలను ధా త్రీనాధుండు బ్రాహ్మణులను । శ్రీనలయులం జేయుచుండె శిష్టప్రియుం డై. 45్‌

శ38 శ్రీమదాంధ్ర నుహాభారతము ప్రతిపదార్థం: ధాత్రీ, నాభుడుఐ భూపతి - పాండురాజు; నానా, ద్రవ్య, నిరంతర, దానములన్‌= అనేక విధా లైన సంపదలను నిరంతరం దానంచేస్తూ ఉండటంవలన; అనూన, యజ్ఞ, దక్షిణలను= తక్కువకాని యజ్ఞాలలో దక్షిణలచేత - అనగా యజ్ఞాలలో గొప్పగా ఇచ్చే దక్షిణలచేత; శిష్ట ప్రియుడు+ఐ= సదాచార సంపన్నులకు (ప్రియమైన వాడై; బ్రాహ్మణులను; శ్రీనిలయులన్‌= సంపదకు ఉనికిపట్టు అయిన వారినిగా, చేయుచు+ఉండె తాత్పర్యం: పాండురాజు అనేకవిధా లైన సంపదను నిరంతరం దానం చేయటంచేత, యజ్ఞాలలో గొప్పగా దక్షిణలు ఇవ్వటంచేత సదాచారసంపన్నులకు (ప్రియమైనవాడై, (బ్రాహ్మణులను ధనవంతులుగా చేస్తూ ఉన్నాడు. వేటకు! బోయిన పాండురాజునకు శాపంబు గలుగుట (సం. 1-109-5) వ. మజథియు ననేకవినోదంబులను ననవరతకామానురూపవిషయసుఖానుభవంబులనుం బ్రొద్దు పుచ్చుచు నాతండు మృగయావ్యసనంబునం దగిలి. 46 (ప్రతివదార్హం: మజియున్‌; అనేక వినోదంబులను; అనవరత, కామ+అనురూప, విషయ, సుఖ+అనుభవంబులనున్‌= ఎడతెగని కామానికి తగిన విషయ సుఖాలను అనుభవించటంచేత; (ప్రొద్దు, పుచ్చున్‌; ఆతండు= పాండురాజు; మృగయావ్యసనంబునన్‌= వేటమీద మితిమీరిన ఆసక్తితో; తగిలి= తగులుకొని, తాత్పర్యం: అంతేకాక, వివిధ సుఖవిలాసాలతో, ఎడతెరిపి లేకుండా కోరుకొన్న భోగాలు అనుభవించటంతో కాలంపుచ్చుతూ, పాండురాజు వేటమీద మితిమీరిన ఆసక్తితో తగులుకొని. ఉ. వాసవ సన్నిభుండు హిమవన్నగ దక్షిణ పార్యభూములన్‌ శ్రీసతి. బోని కుంతియును జెల్వగు మాద్రియుం దోడ రాంగ బా ణాసన బాణ భాసిత మహాభుజుంై విహరించుచుండె ని చ్ధాసద్భశంబుగా గజవశా ద్వయ మధ్య గజేంద్ర లీలతోన్‌, శ ప్రతిపదార్హం; వాసవ, సన్నిభుండు= దేవేంద్రునితో సమానుడు అయిన పాండురాజు; హిమవత్‌+నగ, దక్షిణ; పార్టు, భూములన్‌= హిమాలయపర్సతంయొక్క దక్షిణంవైపున ఉన్న భూములలో; శ్రీసతిన్‌+పోని= లక్ష్మీదేవిని పోలినట్టి: కుంతీదేవి: చెలువు+అగు= అందమైనది అయిన; మాద్రియున్‌; తోడ, రాగ= వెంట రాగా; బాణ+ఆసన, బాణ, భాసిత, మహా, భుజుండు+ఐ= ధనుస్సుచేత, బాణాలచేత (ప్రకాశింపచేయబడిన గొప్పభుజాలు కలవాడై; ఇచ్చా, సదృశంబుగాన్‌= కోరికకు తగినట్టు; గజవశా; ద్వయ, మధ్య, గజ+ఇంద్ర, లీలతోన్‌= ఆడేనుగులు రెండింటి మధ్య ఉండే మదపుటేనుగువంటి విలాసంతో; విహరించుచు+ ఉండెన్‌. తాత్సర్యం: దేవేంద్రునితో సమాను డైన పాండురాజు, హిమాలయపర్వతానికి దక్షిణపు వైపున ఉండే భూములలో లక్ష్మీదేవివంటి కుంతి, అందమైన మాద్రి తన వెంట రాగా, ధనుస్సును, బాణాలను చేపట్టి ఇష్టంవచ్చినట్టుగా, ఆడేనుగులు రెండింటిమధ్య ఉండే మదపుటేనుగువంటి విలాసంతో విహరిస్తూ ఉన్నాడు. విశేషం: అలం: ఉపమ. వ మజణియుందనకు ధృతరాస్తుం డిష్టాన్నపాన మాల్యానులేపన భూషణాదులు నిత్యంబునుం బుత్తెంచుచుండ నిట్లు ననవాసవ్యాసంగంబున నుండి, యొక్కనాండు పెక్కున్చుగంబుల నెగిచి యొక్కటి నేనియు నేయంగానక కినిసి యొక్కయెడ. శై

ఆదిసర్వము - పంచమాశ్వానము శం9 ప్రతిపదార్థం: మజియున్‌; తనకు; ధృతరా(ష్ణ్రుండు; ఇష్ట+శఅన్న, పాన, మాల్య+అనులేపన, భూషణ+ఆదులుః= ఇష్టమైన అన్నపానాలు, పూదండలు, మైపూతలు, ఆభరణాలు మొదలైనవాటిని; నిత్యంబునున్‌= ప్రతిరోజు; పుత్తైచుచు+ఉండన్‌= పంపుతూ ఉండగా; ఇట్టు: వన, వాస, వ్యాసంగంబునన్‌= అడవిలో ఉండటంమీది ఆసక్తితో; ఉండి; ఒక్కనాండు; పెక్కు, మృగంబులన్‌, ఎగిచిజఐ తరిమి; ఒక్కటిన్‌, ఏనియున్‌= ఒక్కదానిని కూడా; ఏయన్‌+కానక= కొట్టడానికి సాధ్యపడక;కినిసిజ కోపించి; ఒక్క+ఎడ= ఒకచోట. తాత్సర్యం: అంతేకాక తనకు ఇష్టమైన అన్నపానాలు, పూదండలు, మైపూతలు, ఆభరణాలు మొదలైనవి (ప్రతిరోజు ధృతరా(్లుడు పంపుతూ ఉండగా, అడవిలో ఉండాలనే ఆసక్తితో ఉండి, ఒకరోజు అనేకమృగాలను తరిమి ఒక్కదాన్ని కూడా కొట్టటం సాధ్యంకాక కోపించి, ఒకచోట. క. _ మనసిజ రాగంబునం బెనం। గిన యిత్ణిని లేడిం జూచి కృతహస్తుండు పె ల్సన యే నమ్ముల నారెం । టిని ద్రెళ్ళంగ నేసిం గడుం గరినహృదయుం డై. 49 ప్రతిపదార్థం: మనసిజ, రాగంబునన్‌= మన్మథరాగంతో; పెనంగినజ కలిసిన; ఇళ్జీని= మగజింకను; లేడిన్‌= ఆడుజింకను; చూచి; కృత, హస్తుండు= బాణాలను ప్రయోగించటంలో అలవాటుపడిన చేయి కలవాడు; కడున్‌= మిక్కిలి; కఠిన, హృదయుండు+ఐ= కరినమైన మనస్సు కలవాడై; పెల్బ్చన= గట్టిగా; ఏను+అమ్ములన్‌= ఐదుబాణాలలో; ఆ, రెంటిని=ఐ ఆ రెండుమృగాలను; త్రైళ్ళంగన్‌= చనిపోయేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. తాచ్చర్యం: మన్మథరాగంతో కలిసి ఉన్న మగ ఆడుజింకలను చూచి, బాణ ప్రయోగంలో నేర్పుకలవాడైన పాండురాజు కరినహృదయుడై అయిదు బాణాలతో అవి చనిపోయేటట్టు గట్టిగా కొట్టాడు. వ. ఇట్లేసి యబ్బాణంబులు పుచ్చికొనియున్న యప్పాండురాజుం జూచియమ్ముగమిధునంబునం దల్వావశిష్టజీవం బై పడియున్న మృగంబు మనుష్య వచనంబుల ని టనియె. 50 ప్రతిపదార్థం: ఇట్టు+ఏసి= ఈవిధంగా కొట్టి; ఆ+బాణంబులు; పుచ్చికొని= తీసికొని; ఉన్న; ఆ+పాండురాజున్‌; చూచి; ఆ, మృగ, మిధునంబునందు= ఆ మృగాలజంటలో; అల్ప+అవశిష్ట్ర జీవంబు+ఐ= కొంచెం మిగిలినప్రాణం కల దై; ఉన్న; మృగంబు= మగజింక; మనుష్య, వచనంబులన్‌: ఇట్టు+ అనియె. తాత్సర్యం: ఈ విధంగా కొట్టి ఆ బాణాలు తీసికొన్న ఆ పాండురాజును చూచి, ఆ మృగాల జంటలో కొసఊపిరితో ఉన్న మగజింక మానవవాక్కులతో ఈవిధంగా అన్నది, తరలము, హరిపరాక్రమ! యేను గిందము. డన్మునిన్‌; మృగముల్‌ నిరం తరము నిట్లు రమింపణా. గని తద్రతం బెడ గోరి సుం దర మృగాకృతి నేను భార్యయు దారుణాటవిం గామ భో గరతి నుండితి మిష్టచారి మృగవ్రజంబుల పొత్తునన్‌. ర్‌1 (ప్రతిపదార్థం: హరి, పరాక్రమ దేవేంద్రునిపరాక్రమంవంటి పరాక్రమం కలవాడా!; ఏనుజఐ నేను; కిందము6డు; అను; మునిన్‌; మృగముల్‌; నిరంతరమున్‌= ఎల్లప్పుడు; ఇట్టు; రమింపన్‌+కాన్‌= సంభోగించటాన్ని; కని= చూచి; తత్‌+రతంబు= వానియొక్కక్రీడను; ఎడన్‌= మనస్సులో; కోరి; సుందర, మృగ+ఆకృతిన్‌= అంద మైన జింకల రూపంతో; ఏను; భార్యయు; దారుణ+అటవిన్‌= భయంకర

త్త్త్త0 శ్రీమదాంధ్ర మహాభారతము మైన అడవిలో; కొమ, భోగ, రతిన్‌= మన్మథసుఖంమీది ఆసక్తితో; ఇష్ట చారి, మృగ, వ్రజంబుల, పొత్తునన్‌= ఇష్టంగా తిరుగుతున్న జింకలసమూవాల సహావాసంతో; ఉండితిమి. తొచ్చర్యం: దేవేంద్రునివంటి పరాక్రమం కలవాడా! నేను కిందముడు అనే మునిని. ఎల్లప్పుడూ ఈవిధంగా మృగాలు సంభోగించటాన్ని చూచి అట్టా సంభోగించాలని భావించి, నేనూ, నా భార్యా అందమైన మృగరూపాలు ధరించి, భయంకర మైన ఈ అడవిలో స్వేచ్చగా తిరిగే తోటి జింకల సమూహంతో కలసి మన్మథ సుఖాలను అనుభవిస్తున్నాం. విశేషం: తరల వృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న, భ, ర, స, జ, జ, గ - గణాలు ఉంటాయి. 12వ అక్షరం యతిస్టానం. ప్రాసనియమం ఉనుది. తరలం తనపేరుకు తగినట్టుగా చంచలం, తరంగితం, కంపితం అయిన ఛిత్తవృత్తిని ధ్వనింపచేస్తుంది. కిందముని చంచలత్వాన్ని కంపిత కంరంలో (కొనఊపిరితో) చెప్పే సందర్భంలో వాడి నన్నయ ఛందళ్ళిల్పాన్ని (ప్రదర్శించాడు. వ. మృగముల మై యున్న మమ్ము వధియించిన దీన నీకు పాతకంబు లేదు; వేటలాడుటయు మృగంబులం జంపుటయు రాజులకు ధర్మంబ: యయినను. 52 ప్రతిసదార్థం: మృగములము+ఐ; ఉన్న; మమ్ము; వధియించినః= చంపిన; దీన= దీనివలన; నీకు; పాతకంబు= పాపం; లేదు; వేటలు: అడుటయు; మృగంబులన్‌; చంపుటయు; రాజులకు; ధర్మంబు+అవః న్యాయమే; అయినను, తొత్సర్యం: జింకల మై ఉన్న మమ్మల్ని చంపటంవలన నీకు పాపం రాదు. వేటాడటం, మృగాలను చంపటం క్షత్రియులకు ధర్మమే, అయినా. తే. పజవనోపక యున్న, మైమఖచి పెంటి. బెనంగియున్నను, బ్రసవింప మొనసియున్నం దెవులు గొనియున్న మృగములం దివిరి యేయ : రెజచి యాహారముగ నును నెలుకులయిన. 53 ప్రతిపదార్థం: పజవన్‌= పరుగెత్తటానికి; ఓపక= శక్తి లేక; ఉన్నన్‌; మైమజుచి; పెంటిన్‌= ఆడుదానితో; పెనంగి= కూడి; ఉన్నను; 'ప్రసవింప= ఈనటానికి; మొనసి= పూని; ఉన్నన్‌; తెవులు, కొని= వ్యాధిని పొంది; ఉన్న; మృగములన్‌: ఎఆచిజఐ మాంసం; ఆహారంగా; మను= జీవించే? ఎజుకులుజ బోయవారు; అయిన; తివిరి= ప్రయత్నించి; ఏయరువ కొట్టరు. తొత్పర్యం: పరుగెత్తలేనివి, ఆడుదానితో కూడుకొన్నవి, ఈనుతున్నవి, వ్యాధితో బాధపడుతున్ల్నువి అయిన మృగాలను మాంసం ఆహారంగా జీవించే కిరాతులు కూడా కొట్టరు. చ. ఇవసమతేజు లై ధరణి నెన్నడు ధర్మపధంబు దప్పం ద్రొ కృని భరతాదిరాజుల జగన్నుతవంశమునందుం బుట్టి నీ కనఘచరిత్ర! యిట్లు దగునయ్య యధర్మువు సేయ? నీ యెజబుం గని నృపధర్మువుల్‌ గలవె? కౌరవపుంగవ! గౌరవస్థితిన్‌, 54 ప్రతిపదార్థం: ఇన, సమ, తేజులు+ఐ= సూర్యుడితో సమాన మైన తేజస్సు కలవా రై; ధరణిన్‌= భూమిమీద; ఎన్నడున్‌; ధర్మ, పథంబు= ధర్మమారాన్ని; తప్పన్‌, త్రొక్కని= తప్పుగా త్రొక్కని; భరత+ అది, రాజుల, జగత్‌+నుత, వంశము+అందున్‌= భరతుడు మొదలైన రాజులు పుట్టి, లోకంచేత పాగడబడినవంశంలో; పుట్టి; అనఘ, చరిత్ర= పాపం లేని నడవడి కలవాడా! నీకు; ఇట్టు; అధర్మువు= అన్యాయం; చేయన్‌, తగును+అయ్య; కౌరవ, పుంగవజ కురువంళంలో (శ్రేష్టుడా!: గౌరవ, స్రితిన్‌= ఉన్నతస్థితిలో ఉండటంచేత; నీ, ఎటుంగని= నీకు తెలియని; నృప, ధర్మముల్‌= రాజధర్మాలు; కలవె= కలనా?

ఆదిపర్వము - పంచమాశ్వాసము క్ష

తాత్సర్యం: సూర్యునితో సమాన మైన తేజస్సు కలవారై, భూమిమీద ఎప్పుడూ ధర్మమార్లాన్ని తప్పుని భరతుడు మొదలైన రాజుల ప్రసిద్ధవంశంలో పుట్టి, పుణ్యాత్ముడవైన నీకు అధర్మం చేయటం తగునా? కౌరవ్రేష్టా! ఉన్నత స్టితిలో ఉన్న నీకు తెలియని రాజధర్మాలు ఉన్నాయా? విశేషం: భరతుడు మొదలైన వంశకర్తలు ధర్మమూర్తులు. వారి వంశంలో పుట్టిన పాండురాజుకూడ ఆదర్భ్శమూర్తిగా ఉండక, అధర్మంగా రతివివళ లైన మృగాలను చంపటం గర్హింపదగినదని మునివచనం, “యద్యదాచరతి ్రేష్టు తత్తదేవేతరో జనః సయత్‌ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే” భ.గీ. 3.21. అని గీతావాక్యం. పెద్దవారి ఆచరణలనే ఇతర జనులు అనుసరిస్తారు. పెద్దలు చూపిన ప్రమాణాలకు లోకం కట్టుబడిఉంటుంది అన్న ధర్మాన్ని ఆధారంగా చేసికొని కిందముడు పలికాడు. వ. అని తన్నునిందించి పలికిన నామృగంబు పలుకుల కలిగి పాండురా జి ట్లనియె. క్‌, ప్రతిపదార్థం: అని; తన్ను= తనను; నిందించి; పలికినన్‌; ఆ,మృగంబు; పలుకులకు; అలిగి= కోపించి; పాండురాజు; ఇట్టు+అనియె. తాత్సర్యం: అని తనను నిందించి పలుకగా ఆ జింకమాటలు విని కోపించి పాండురాజు ఈ విధంగా పలికాడు. తే. పగఅంగని సైంతురేనియు మృగకులంబు । గని సహింపరు రాజులు; మొనసి వాని

గ్రచ్చజఖగం జంపుదురు; నమ్మి కిచ్చి చంపం: జనదు; మాయాబలంబునం జనదు చంప. క్‌6 ప్రతిపదార్థం: రాజులు; పగఆన్‌= శత్రువులను; కని= చూచి; సైంతురు+ఏనియు= సహించినప్పటికి; మృగ, కులంబు= మృగాలసమూహాన్ని; కని= చూచి; సహీంపరు; మొనసి= పూని; వాని= ఆ మృగాలను; (కచ్చజగన్‌= వేగంగా; చంపుదురు; నమి శక ఇచ్చి= నమ్మించి; చంపన్‌; చనదు= కూడదు; మాయా, బలంబునన్‌= మోసంయొక్క బలంచేత - అనగా మోసగించి; చంప; తాచ్చర్యం: రాజులు శత్రువులను చూచి సహిస్తారేమో కాని మృగాలను చూచి సహించరు. వెంటనే వాటిని చంపుతారు. అయినా నమ్మించి కాని, మోసంచేసి కాని చంపకూడదు. వు 'తొల్లి యగు మహామునీంద్రుండు మృగ మాంసంబున నిత్యక్రాద్ధంబు సేయుచుండి రాజులకు మృగవధ

దోషంి కుండ నిర్మించె; దీని నీకు నిందింపందగునే? యనుచున్న నమ్ముగంబులు బాణఘాతక్షతవేదన

సహింపనోపక 'సర్వప్రాణులకు సాధారణం బయి యిష్టం బగు సుఖావసరంబున నున్న మమ్ము ననపరాధుల

వధించితి గావున నీవునుం బ్రియాసంగమం బయిన యప్పుడ పంచత్వం బొందెడు' మని, 'నీ ప్ర్రియయు

నిన్ను ననుగమించు' నని పాండురాజునకు శాపం బిచ్చి గతప్రాణము లై పడియున్న మృగంబులం జూచి

శోకించి పాండురాజు పరమనిర్వేదనపరుం డయి, 57 ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; అగస్త్య మహా, ముని+ఇం[ద్రుండు= అగస్త్యమహర్షి మృగ, మాంసంబున; నిత్య, శ్రాద్రంబు= ప్రతిదినశ్రాద్ధం; చేయుచు+ఉండి; రాజులకు; మృగ, వధ, దోషంబు= మృగాలను చంపటంవలని పాపం; లేకుండ; నిర్మించె= చేశాడు; దీని; నీకు; నిందింప; తగునే; అనుచు+ఉన్నన్‌; ఆ+*మృగంబులు; బాణ, ఘాత, క్షత, వేదన= బాణందెబ్బలవలన ఏర్పడిన గాయాలబాధ; సహింపలగన్‌, ఓపక= ఓర్చుకోలేక; సర్వ ప్రాణులకు, సాధారణంబు+అయి, ఇష్టంబు+అగు; సుఖ+అవసరంబునన్‌= సుఖసమయంలో; ఉన్న; మమ్మున్‌!: అనపరాధుల= తప్పుచేయనివారిని; వధించితి= వధించావు; కావున; నీవునున్‌, ప్రియా, సంగమంబు= ప్రియురాలితో కలయిక; అయిన; అప్పుడు+అ; పంచత్వంబు= మరణం; ఒందెడుమ= పొందుతావు; అని; నీ, ప్రియయు= నీప్రియురాలు కూడ; నిన్నున్‌; అనుగమించున్‌= వెంబడిస్తుంది; అని; పాండురాజునకు; శాపంబు+ఇచ్చి; గత,

కశ? శ్రీమదాంధ్ర మవాభారతము

ప్రాణములు+ఐ= పోయిన (ప్రాణాలు కల వై; పడియున్న; మృగంబులన్‌; చూచి; శోకించి; పాండురాజు: పరమ, నిర్వేదన, పరుండు+అయి= మిక్కిలి నిరాశ చెందినవా డై.

తొత్ప్సర్యం; పూర్వం అగస్త్యమహర్షి మృగ మాంసంతో ప్రతిరోజూ (శాద్దం చేస్తూ, రాజులకు మృగవధవలన పాపం లేకుండా చేశాడు. అందువలన నీవు నన్ను నిందించటం తగునా?” - అని అంటూ ఉండగా, ఆ మృగాలు బాణం దెబ్బలవలన కలిగినబాధ ఓర్చుకోలేక, (ప్రాణులన్నిటికి సాధారణ మై, ఇష్టమైన సంభోగ సుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో ఏ తప్పు చేయని మమ్మల్ని చంపావు. కాబట్టి నీవు కూడా నీ ప్రియురాలితో కలిసినప్పుడు మరణాన్ని పొందుతావు; నీ భార్యకూడ నీతో మరణించుగాక అని పాండురాజుకు శాప మిచ్చి, ప్రాణాలు విడిచి పడి ఉన్న ఆ మృగాలను చూచి, పాండురాజు మిక్కిలి నిరాశ చెందినవాడై.

విశేషం: శ్రాద్ధము - (శ్రద్ధతో కూడినది - కాల, పాత్ర నియమాలతో చేసే పితృక్రియ.

క ఎట్టి విశిష్టకులంబునం। బుట్టియు, సదసద్వివేకములు గల్లియు, మున్‌ గట్టిన కర్మఫలంబులు : నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్‌? 58

ప్రతిపదార్హం: మనుజుల్‌= మానవులు; ఎట్టి, విశిష్ట కులంబునన్‌= ఎంతటి ఉత్తమవంశంలో; పుట్టియున్‌; సత్‌+అసత్‌+వివేకములు=

మంచి చెడ్డలను గురించిన పరిజ్ఞానాలు; కల్గియు; మున్‌= పూర్వజన శైలోః కట్టిన= కూడబెట్టుకొన్న; కర్మ, ఫలంబులు= కర్మఫలాలు; నెట్టన= తప్పక; భోగింపకఐ అనుభవించక; ఉండ, నేర్తురె = ఉండగలరా?

తాత్పర్యం: మానవులు ఎంతటి ఉత్తమ వంశంలో పుట్టినా, మంచిచెడ్డలనుగురించిన పరిజ్ఞానాలు కలిగిఉన్నా

పూర్వ జన్మ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పుదు.

విశేషం: విధికంటె కర్మ బలీయ మని సుభాషితం. “ఫలం కర్మాయత్తం కి మమరగణైః కించ విధినా నమస్తత్కర్మేభ్యో విధి

రపి న యేభ్యః ప్రభవతి” అని భరహరి సుభాషితం (కర్మపద్దతి - 91 శ్లో - ఫలం కర్మాధీనం కాబట్టి దేవతలతోనూ, దైవంతోనూ

మా కేమిపని? దేవతలకుకూడా దాట శక్యంగాని కర్మకే నమస్కారం అని భర్శహరి కవితోక్తి. (సంపా.)

వ కామవ్యామోహితుం డయి కొండుకనాండు మదీయజనకుండు పరలోకగతుం దైనం దత్‌క్షేత్రంబున ధర్మమయుం డయిన కృష్ణద్వైపాయనమునివలన నుద్ధవిల్లి, ధర్మప్రవృత్తుండ నై యున్న నా కిట్టి దుర్వసనంబు కర్మవశంబున సంభవించె; నింక మునివృత్తియ యుచితంబు గావున సర్వసంగంబులు విడిచి, సర్వభూతంబులయందు సమచిత్తుండ నై, హింస దలంపక నిత్యంబు నొక్కొక్కననస్పతియందు నొక్కొక్కనన్య ఫలంబు భిక్ష గొని, యసంభవం బయిననాం డుపవాసంబు సేసి, వృక్షమూలంబున నుండి పొంసు పరిచ్చన్నదేహుండ నయి. 59

ప్రతిపదార్థం: మదీయ, జనకుండు= నాతండ్రి; కామ, వ్యామోహితుండు+అయి= మన్మథునిచేత మిక్కిలి మోహింప చేయబడినవా

డై; కొండుకనాండు= ఒకానొకరోజు; పర, లోక, గతుండు+ఐనన్‌= స్వర్లలోకానికి వెళ్ళినవాడు కాగా; తత్‌+క్షేత్రంబున= అతని భార్యకు, ధర్మమయుండు+అయిన= ధర్మస్వరూపుడు అయిన; కృష్ణద్యైపాయన, మునివలనన్‌; ఉద్భవిల్లి= పుట్టి: ధర్మ, 'ప్రవృత్తుండను+ఐ= ధర్మమార్గంలో నడుస్తున్నవాడ నై; ఉన్న: నాకు; ఇట్టి; దుర+వ్యసనంబు= చెడ్డఅవస్ట; కర్మ, వశంబున= పూర్వజన్మలో చేసిన పనులను అనుసరించి; సంభవించెన్‌= కలిగెను; ఇంక; ముని, వృత్తి అ= మునిజీవనమే; ఉచితంబు= తగినది; కొవున; సర్వ, సంగములు=

ఆదిపర్వము - పంచమాశ్వాసము త్తం హింస; తలంపక; నిత్యంబున్‌= ప్రతిరోజు; ఒక్కొక్క; వనస్పతి, అందున్‌= చెట్టునందు; ఒక్కొక్క; వన్య, ఫలంబు= అడవిసంబంధ మైన పండును; భిక్ష కొని; అసంభవంబు+అయిన, నాండు= దొరకని రోజు; ఉపవాసంబు; చేసి; వృక్ష మూలంబునన్‌, ఉండి= చెట్టుమొదట ఉండి; పాంసు, పరిచ్చన్న, దేహుండను+అయిజ= దుమ్ముతో కప్పబడినదేహం కలవాడ నై. చాత్ప్సర్యం; నా తండ్రీ కామపరవళశు డై ఒకనాడు చనిపోగా, ఆయన భార్యకు ధర్మస్వరూపు డైన కృష్ణద్యైోపాయనుని వలన పుట్టి, ధర్మమార్గంలో నడుస్తున్న నాకు ఈ దురవస్థ పూర్వజన్మకర్మను అనుసరించి కలిగింది. ఇక నాకు తగింది ముని వృత్తే. అందువలన బంధాలనన్నింటిని విడిచిపెట్టి, అన్నిప్రాణులందు సమబుద్ది కలిగి, హింస మాని, ప్రతిరోజూ ఒక్కొక్కచెట్టునుండి ఒక్కో పండు భిక్షగా తీసికొని, అది దొరకనిరోజు ఉపవాసం ఉంటూ, చెట్టుమొదట్టో నివసిస్తూ దుమ్ముతో నిండిన శరీరాన్ని కలవాడ వై. విశేషం: పాండురాజు మునివృత్తిని స్వీకరించాలని సంకల్పించాడు. మునినిగురించి భగవద్గీతలో ఇట్లా చెప్పబడింది. “దుఃోప్పునుద్విగ్దమనాః సుఖేషు విగతస్పృహః । వీతరాగభయ'క్రోధః, స్టితధీ ర్ముని రుచ్యతే॥” (భ.గీ.2.56) దుఃఖాలు కలిగినప్పుడు కలతచెందని మనస్సు కలవాడు, సుఖాలపై కోరికలేనివాడు, అనురాగ భయ (క్రోధాలను వదలినవాడు, అయిన స్టిత'ప్రజ్ఞుడు ముని. అట్టి ముని చిత్తవృత్తిని, జీవనవిధానాన్నీ స్వీకరించాలని బ్రతుకుమీది నిరాశతో పాండురాజు సంకల్పించాడు. సీ, ఇంద్రియార్ధంబులం దింద్రియవ్యాపార । ముడిగించి, క్రియ లెల్ల విడిచి, పుణ్య పాపబంధంబుల నోపి బంధింపంగ. ; బడక మనోవ్బత్తి నొడిచి, నాకు నిది ప్రియం బప్రియం బది నింద యిది మహా; స్తుతి యిది యనక, సంతత నితాంత సంతోషయుతు(డ నై వంతయు భయమును । శీతాతపంబులు వాతగతియు ఆ. _ నెలుంగ కివ్విధమున మఖచి, శరీరంబు ।; మరణజీవితముల కురువిషాద తోషవృత్తు లుడిగి, భీషణాటవి నుండి । చేసిదను దపంబు భాసురముగ. 60 ప్రతిపదార్థం: ఇంద్రియ+అర్ధంబుల, అందు= ఇంద్రియ విషయా లైన శబ్దరూప గంధాదులను; ఇంద్రియ, వ్యాపారము= ఇంద్రియాలు పనిచేయటాన్ని; ఉడిగించి= మాన్పించి; క్రియలు+ఎల్ల= పనులు అన్నీ; విడిచి; పుణ్య, పాప, బంధములన్‌= పాపపుణ్యాలబంధాలను; ఓపి= సహించి; బంధింప.గన్‌, పడక= కట్టుపడకుండా; మనో, వృత్తిన్‌= మనోవ్యాపారాన్ని; ఒడిచి= జయించి; నాకున్‌; ఇది, ప్రియంబు= ఇది ఇష్టం; ఇది, ఆప్రియంబు= ఇది ఇష్టం కాదు; ఇది, నింద; ఇది, మహా, స్తుతి= ఇది గొప్పపొగర్తు అనక; సంతత, నితాంత, సంతోష యుతుండను+ఐఃజఐ ఎడతెగని అధిక మైన సంతోషంతో కూడుకొన్నవాడ నై; వంతయుజ దుఃఖాన్ని; భయాన్ని: శీత+ఆతపంబులు= చలి, ఎండను; వాత, గతియున్‌= గాలికదలికను: ఎజుంగక= తెలియక: ఈ+విధమున; శరీరంబు; మజచి; మరణ జీవితములకు= చావు బతుకులకు; ఉరు, విషాద, తోష వృత్తులు= గొప్పదు:ఖం, సంతోషం అనే మనోవృత్తులను; ఉడిగి= విడిచి; భీషణ+అటవిన్‌= భయంకర మైన అడవిలో; ఉండి; తపంబు; భాసురముగ= ప్రకాళించేటట్టు; చేసెదను. తాత్సర్యం; నేను ఇంద్రియాలను బంధించి, అన్ని కర్మలను వదలి, పాపపుణ్యాలను విడిచి, మనస్సును జయించి, ఇది ఇష్టం, ఇది అయిష్టం, ఇది నింద, ఇదిస్తుతి అనే భావం లేకుండా, ఎడతెగని మహానందంతో-దు:ఖం, భయం, చలి, ఎండ, గాలి అంటే ఏమిటో తెలియక, శరీరాన్ని మరచిపోయి, చావుకు దుఃఖాన్నీ, బ్రతుకునకు సంతోషాన్నీ లేనివాడ నై భయంకర మైన అరణ్యంలో పెద్దతపస్సు చేస్తాను.

! శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: మునివృత్తికి ఫలం స్టీతప్రజ్ఞత్వం. భగవద్గీతలో చెప్పబడిన స్థిత ప్రజ్ఞ లక్షణాలను పాండురాజు సంకల్పంలో (ప్రతిఫలిస్తున్నాయి. “యదాసంహరతే చాయం, కూర్మో20గానీవ సర్వశః ॥ ఇంద్రియాణీంద్రియార్జేభ్యః, తస్య ప్రజ్ఞా ప్రతిష్టితాః యన్సర్వత్రానభిస్నేహః, తత్తత్రాప్యశుభాశుభం । నాభినందతి న ద్వేష్టి తస్యప్రజ్ఞా ప్రతిష్టితాః. మొదలైన శ్లోకాల తాత్పర్యం (భ.గీ. అధ్యా.2. శ్లో 57- 72) స్మరింపతగినది. తపింపచేయటం తపస్సు. తపస్వి (క్రమంగా ఇంద్రియాలను, క్రియలను, మనస్సును, రాగద్వేషాదులను, ద్వంద్వాలను, సుఖదుఃఖాలను తపింపచేసి బ్రహ్మానందసిద్దిని పొంది, ఆపై బ్రహ్మపదవిని పొందుతాడు. పాండురాజు ఆ మార్గాన్ని ఆశ్రయించా లని సంకల్పించాడు. వు అని నిశ్చయించి, గొంతిని మాద్రినిం జూచి, “మీర లిందుండి ననయక హస్తిపురంబునకుం జని నాతపోవృత్తి మనికి రాజునకు సత్యవతీదేవికి భీష్మునకు విదురునకుం గౌసల్యలకు వృద్ధపురోహితబ్రాహ్మణులకుం జెప్పి యందుండుం'దనిన, వారలు బాప్పపూరితనయన లయి “యిట్టి యుగ్రతపంబు విడిచి మమ్ము విడువనియట్టి యాశ్రమంబున నుండి తపంబు సేయు నది; యేము నిన్ను విడిచి పోవనోపము; మమ్ము విడిచితేని యిప్వుడ ప్రాణంబులు విడుతు' మనిన వారల నిశ్చయం బెజీంగి 'యట్లేని నాయొద్దన యుండుం; డేను వానప్రస్థాశ్రముంబున వల్కలంబులు గట్టి, రేపును మాపును మధ్యాహ్నంబునప్పుడును స్నానంబు సేసి వేల్చుచుం గందమూల ఫలాశనుండ నై, పితృదేవతల వాక్సలిలవన్యఫలంబులం దనుపుచుం గ్రమంబున దేహమోక్షణంబు సేయుదు' నని యప్పుడు. 61 ప్రతిపదార్థం: అని; నిశ్చయించి; గొంతిని; మాద్రినిన్‌; చూచి; మీరలు; ఇందు+ఉండి; నవయకః= కృశించిపోక; హస్తి పురంబునకున్‌= చని= వెళ్ళి: నా. తపోవృత్తి, ఉనికిజ నేను తపోవృత్రిస్వీకరించే విషయాన్ని; రాజునకు= ధృతరాహ్రునకు; సత్యవతీదేవికి; భీష్మునకు; విదురునకున్‌; కౌసల్యలకు= అంబికకు, అంబాలికకు; వృద్ద, పురోహిత, (బ్రాహ్మాణులకున్‌; చెప్పి; అందు+ఉండుండు; అనిన; వారలు; బాష్ప, పూరిత, నయనలు+అయి= కన్నీటితో నిండిన కళ్ళు కలవారై? ఇట్టి; ఉ(గ, తపంబు= భయంకరమైన తపస్సు; . విడిచి; మమ్ము, విడువని, అట్టి, ఆశ్రమంబునన్‌+ఉండి= మమ్మల్ని విడిచిపెట్టనటువంటి ఆ(శ్రమంలో ఉండి; తపంబు, చేయునది= తపస్సు చేయండి; వీము= మేము; నిన్ను; విడిచి; పోవన్‌, ఓపముజ= పోలేము; మమ్ము; విడిచితి+ఏని= వదలివేసితివా; ఇప్పుడు+అ; (ప్రాణంబుల, విడుతుము; అనిన; వారల; నిశ్చయంబు; ఎజింగి=ఐ తెలిసికొని; అట్టు+ఏని= అట్లా అయితే; నా, ఒద్దన= నాదగ్గరే; ఉండుండు; ఏను; వానప్రస్థ+ఆ(శ్రమంబున; వల్కలంబులు= నారచీరలు; కట్టి, రేపునుఐ ఉదయం; మాపును= సాయంకాలం; మధ్య+అహ్నంబు, అప్పుడును; స్నానంబు; చేసి; వేల్చుచున్‌= హోమం చేస్తూ: కంద, మూల, ఫల+అశనుండను+ఐ= గడ్డలు, వేళ్ళు, పళ్ళు ఆహారంగా కలవాడనై; పితృదేవతల= పితృదేవతలను: వాక్‌: సలిల, వన్య, ఫలంబులన్‌= మాటలతో, నీళ్ళతో. అడవిలో ఉండే పళ్ళతో; తనుపుచున్‌= తృప్తిపెట్టుతూ; (క్రమంబున; దేహ, మోక్షణంబు= శరీరాన్ని విడువటం; చేయుదును. అని; అప్పుడు. తాత్పర్యం: అని నిశ్చయించి పాండురాజు కుంతిని, మాద్రిని చూచి “మీరు ఇక్కడే ఉండి కృళించి పోక హస్తినాపురం వెళ్ళి నేను తపోవృత్తిలో ఉండటాన్ని ధృతరాష్ష్రునికి, సత్యవతికి, భీష్మునికి, విదురునికి, తల్టులకు, వృద్దులకు, పురోహితులకు, బ్రాహ్మణులకు చెప్పి అక్కడ ఉండండి' అని చెప్పగా వారు కంటతడిపెట్టి - “ఈవిధమైన భయంకర తపస్సు మాని మాతోకూడ ఆశ్రమంలో ఉండి తపస్సు చేయండి. మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేం. మీరు మమ్మల్ని వదలితే ఇప్పుడే (ప్రాణాలు విడుస్తాం' అనగా, వారి నిర్ణయం తెలిసికొని 'అట్లా అయితే మీరు నాదగ్గరే ఉండండి. నేను వానప్రస్థ్యాశ్రమంలో నారచీరలు కట్టి ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం స్నానం చేసి హోమం చేస్తూ కందమూలాలు, ఫలాలు ఆహారంగా తీసికొని, పితృదేవతలను మాటలతో, నీళ్ళతో. ఫలాలతో తృప్తిపరుస్తూ (క్రమంగా శరీరాన్ని విడుస్తాను' అని అప్పుడు.

ఆదిపర్వము - పంచమాశ్వాసము త్త్త5్‌ విశేషం: ఆశ్రమాలు నాలుగు. అవి- బ్రహ్మచర్యం, గార్హస్ట్యం, వానప్రస్థం, సన్యాసం. గృహస్థాశ్రమాన్ని వదలి వనంలోనే నివసిస్తూ తపస్విర్లై నియమజీవితాన్ని సాగించే ఆశ్రమం (జీవనవిధానం) వానప్రస్థం, వానప్రస్టంలో భార్యలతో కలిసి జీవించవచ్చును. సన్బ్యాసంలో ఆ అవకాశం లేదు. అందువలననే చాలమంది రాజులు వానప్రస్థాశ్రమంలోనే తనువులు చాలిస్తారు.

పృథ్వి.

అమూల్య మణి భూషణంబులు గజాశ్వ బృందంబులున్‌

సమృద్ధ ధన ఛాన్యరాసులు. బ్రశస్తగోవర్గముం

గ్రమంబునను భూసురేశుల కగణ్యపుణ్యార్జి యై

యమర్తనిభుం డిచ్చె. బాండువిభుం డత్యుదారస్థితిన్‌. 62 ప్రతిపదార్థం: అమూల్య మణి, భూషణంబులుజ వెలలేని (అనగా ఎంతో విలువైన) రత్నాల సొమ్ములు; గజ+అశ్చ, బృందంబులున్‌= ఏనుగుల, గుర్రాల సమూహాలు; సమృద్ధ, ధన, ధాన్య, రాసులున్‌= అధికమైన ధనరాసులు, ధాన్యరాసులు; ప్రశస్త గోవర్గమున్‌=

'శ్రేస్టమైన ఆవులసమూహాన్ని; ఆమర్య్య, నిభుండు= దేవతలతో సమాన మైనవాడు; పాండు, విభుండు= పాండురాజు: అగణ్య,

పుణ్య+అర్జి+ఐ= లెక్కకు మించిన పుణ్యాన్ని కోరినవా డై; అతి+ఉదార, స్టితిన్‌= మిక్కిలి ఎక్కువగా: భూసుర+ఈశులకు=

(బ్రాహ్మణ్రేష్టులకు; ఇచ్చెన్‌.

తాత్పర్యం: దేవతలతో సమానుడైన పాండురాజు, అపరిమిత మైన పుణ్యాన్ని కోరి, మిక్కిలి ఉదారంగా

(బ్రాహ్మాణ్రేష్టులకు ఎంతో విలు వైన రత్నాల సొమ్ములను, ఏనుగులను, గుజ్ఞాలను, ధనరాసులను, ధాన్యరాసులను,

(శ్రేస్టమైన ఆవులను ఇచ్చాడు.

నిశేషం: పృద్వీ వృత్తపాదంలో 17 అక్షరాలుంటాయి. జ, స, జ, స, య, లగ- అనే గణాలు వరుసగా ప్రతిపాదంలోనూ నిలుస్తాయి.

12వ అక్షరం యతిస్థ్రానం. ప్రాస నియతి ఉన్నది. ఆంధ్రభారతంలో ఈ వృత్తాన్ని నన్మయ మాత్రమే 5 సార్హు వ్రాశాడు. “సాక్షేప

క్రోధ ధిక్కారే పరం పృద్వీ భరక్షమా” అనే క్షేమేంద్రుని మతానికి చెందిన వాడు నన్నయ. సంపదలపై తీవ్రమైన వ్యతిరేకభావంతో విరివిగా విప్రులకు దానం చేయటం ఈ వృత్తంలో వర్షితం. (సంపా)

వ. మజఖియుం గల వస్తువు లెల్లను ధృతరాష్తున కిచ్చి పుచ్చి మమత్వాహంకారవిముక్తుండై, ధర్మపత్ను లయ్యిరువురుందనయట్ల తపస్విను లై తోడరా నుత్తరాభిముఖుండై యరిగి, నాగశైలంబును జైత్రరథంబును బారిషేణంబును హిమనంతంబునుం గడచి, సురసిదసేవితం బయిన గంధమాదనంబునం గొండొక కాలం బుండి, యింద్రద్యుమ్మం బను కొలనును హంసకూటంబును నతిక్రమించి 63

ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; కల వస్తువులు+ఎల్లనుజఐ ఉన్నవస్తువులన్నీ; ధృతరాష్తునకు; ఇచ్చి; పుచ్చిన పంపి; మమత్వ+ అహంకార, విముక్తుండు+ఐ= మమకారంచేత, అహంకారంచేత విడువబడిన వాడై; ధర్మ, పత్నులు= ధర్మనిర్వహణకోసం అగ్నిసాక్షిగా పెళ్ళిచేసుకొన్న భార్యలు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరు; తన, అట్ట= తనవలె; తపస్వినులు+ఐ= తపస్సు చేసే వారై తోడరాన్‌= వెంటరాగా; ఉత్తర+ అభిముఖుండు+ఐ= ఉత్తరదిశవైపు ముఖం కలవాడై; అరిగి= వెళ్ళి; నాగశ్రైలంబును; చైత్రరథంబును; పారిషేణంబును; హిమవంతంబునున్‌; కడచి= దాటి; సుర, సిద్ద, సేవితంబు+అయిన= దేవతలచేత, సిద్దులచేత సేవింపబడిన దైన; గంధమాదనంబునన్‌= గంధమాదనపర్వతంమీద, కొండు+ఒక, కాలంబుజ= కొంతకాలం; ఉండి; ఇం(ద్రద్యుమ్నుంబు+అను: కాలనును; హంసకూటంబును; అతి(క్రమించి= దాటి.

కేడ6 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: ఇంకా ఉన్నవస్తువులన్నీ ధృతరాష్ట్రునికి ఇచ్చి పంపి, మమకారాన్ని, అహంకారాన్ని విడిచి, తన ధర్మపత్స్నులు కుంతీమాద్రులు తనవలె తాపసవృత్తిని స్వీకరించి వెంటరాగా, ఉత్తరదిశవైపు పయనించి, నాగశైలాన్ని, చైత్రరథాన్ని, పారిషేణాన్ని, హిమవంతాన్ని దాటి, దేవతలు, సిద్దులు సేవించే గంధమాదనంమీద కొంతకాలం ఉండి, ఇం[ద్రద్యుమ్నం అనే కొలనును, హంసకూటాన్ని దాటి వెళ్ళి. పాండురాజు శతశ్చంగంబున( దపోవ్చత్తి నుండుట (సం. 1-111-1) మ. యతి సంఘంబుల సంగతిన్‌ దురితకర్మాపేతుం డై యేంి, సం తతసిద్ధామరయక్ష సేవితసముద్యచ్ధ్య్రంగ మై యున్న యా శతశ్చంగం బను పర్వతంబున శుభాచారుండు నిత్యవ్రతో ద్యతుః డై ఘఫోరతపంబు సేసె మునిబ్బందం బద్దుతం బందంగన్‌. 64 ప్రతిపదార్హం: యతి, సంఘంబుల, సంగతిన్‌= మునుల సమూహాల సహవాసంతో; దురిత, కర్మ+అపేతుండు+ఐ= పాపకర్మలనుండి తొలగినవాడై; ఏంగి= వెళ్ళి; సంతత, సిద్ధశ+అమర, యక్ష, సేవిత, సముద్యత్‌*శ్చంగము+ఐ= ఎల్లప్పుడు సిద్దులచేత దేవతలచేత, యక్షులచేత సేవింపచడిన మిక్కిలి ఎత్తైన శిఖరాలు కలదై ఉన్న; ఆ, శత, శృంగంబు; అను; పర్వతంబున; శుభ+ఆచారుండు= శుభమైన నడవడి కలవాడు; నిత్య, వ్రత+ ఉద్యతుండు+ఐ= ఎడతెగని (వ్రతాలమీద పూనిక కలవాడై; ముని, బృందంబు= మునులసమూహం; అద్భుతంబు+అందంగన్‌= ఆశ్చర్యపడేటట్టు: ఘోర, తపంబు; చేసె.

తొత్సర్యం: పాండురాజు మునులతో కలిసి పాపకర్మలకు దూర మై, ఎప్పుడూ సిద్దులు, దేవతలు, యక్షులు సేవించే

ఎత్తైన శిఖరాలు కల శతశ్చ్రంగ మనే పర్వతంమీద శుభమైన నడవడితో, ఎడతెగని వ్రతాలతో మునులంతా

ఆశ్చర్యపడేటట్టు ఘఫోరమైనతపస్సు చేస్తూ ఉన్నాడు.

వ. ఇట్లు శతశృ్ళంగంబున నుత్తర భాగంబునందు.దపంబు సేయుచు బ్రహ్మబుషి సమానుం డై, దివ్యవిమానంబు లెక్కివచ్చుచుం బోవుచున్న దేవగణంబులచేత సంకీర్ణం బైన స్వర్గమార్గంబున నుత్తరాభిముఖు లై యూర్థ్వ లోకంబున కనాయాసంబున నరిగెడు మునిసహస్రంబుం జూచి, “మీర లెందులకు. బోయెదిరని యడిగిన నప్పాండురాజునకు వార లి ట్లనిరి. 65

ప్రతిపదార్హం: ఇట్లు: శతశ్చంగంబునన్‌; ఉత్తరభాగంబునందున్‌; తపంబు; చేయుచు; బ్రహ్మ బుషి సమానుండు+ఐ=

(బ్రహ్మర్జులతో సమాన మైన వాడై; దివ్య, విమానంబులు; ఎక్కి; వచ్చుచున్‌; పోవుచు+ఉన్న; దేవ, గణంబులచేత= దేవతలసమూహంతో;

సంక్షీర్ణంబు+ఐన= నిండిన; స్వర్గ, మార్గంబునన్‌; ఉత్తర+అభిముఖులు+ఐ= ఉత్తరదిశ వైపు ముఖాలు కలవారు అయి; ఊర్హ్య,

లోకంబునకు= స్వర్గానికి; అనాయాసంబునన్‌= శ్రమలేకుండ; అరిగెడు= వెళ్ళుతున్న; ముని సహ(స్రంబున్‌= వెయ్యిమంది మునులను; చూచి, మీరలు; ఎందులకున్‌, పోయెదరు; అని; అడిగినన్‌; ఆ+పాండురాజునకు; వారలు; ఇట్లు: అనిరి.

తాత్పర్యం: ఈ విధంగా శతశ్చృంగపర్వతానికి ఉత్రరభాగంలో తపస్సు చేస్తూ బ్రహ్మర్షులతో సమానమైనవాడైై,

దివ్యవిమానా లెక్కి వస్తూ పోతూ ఉండే దేవతాసమూహాలతో నిండిన స్వర్గమార్గంలో, ఉత్తర దిక్కుగా స్వర్గలోకానికి

శ్రమ లేకుండా వెళ్ళుతున్న వెయ్యిమంది మునులను చూచ్చి, 'మీరు ఎక్కడికి పోతున్నా?” రని అడుగగా, ఆ

పాండురాజుతో వారు ఇట్టా అన్నారు.

ఆదిపర్వము - సంచమాశ్వాసము డీడీ? క. _ అమవస గావున నేండ । కృనులజుం గొలువంగ మహర్షిగణములు పితృసం ఫఘములును బోదురు బ్రహ్మాం ।; డమునం గలవార లం దొడంగూడంగన్‌. 66 (ప్రతిపదార్థం: నేడు= ఈరోజు; అమవస= అమావాస్య; కావున; ఆ+కమలజున్‌= పద్మంనుండి పుట్టిన ఆ (బ్రహ్మదేవుడిని; కొాలువంగవా సేవించటానికి; మహర్షి గణములుజ మహర్షుల సమూహాలు; పితృ, సంఘములును= పితృదేవతల సమూహాలు; (బ్రహ్మాండమునన్‌= విశ్వంలో; కల, వారలు; అందు= ఆ (బ్రహ్మలోకం; ఒడన్‌+కూడంగన్‌= చేరటానికి; పోదురు, తాత్పర్యం: ఈ రోజు అమావాస్య. అందువలన (బ్రహ్మదేవుడిని "సేవించడానికి మహర్షుల సమూహాలు, పితృదేవతల సమూహాలు, (బ్రహ్మాండంలో ఉన్నవాళ్ళంతా ఆ (బ్రహ్మలోకం చేరటానికి పోతారు. విశేషం: అమావాస్య పితృదినంగా (ప్రసిద్ధం. న, “అది కారణంబుగా నేమును బ్రహ్మలోకంబునకుం బోయెది మనిన నమ్మునుల పిలుంద భార్యాద్వయ సహితుండై సమవిషమప్రదేశంబులం జనుచున్న య ప్పాండురాజుం జూచి బుసు లి ట్లనిరి. 67 ప్రతిపదార్థం: అది, కారణంబుగాన్‌; ఏమును= మేముకూడా; బ్రహ్మ లోకంబునకున్‌; పోయెదము; అనిన్‌; ఆ+శమునుల; పిజటుందజు వెనుక; భార్యా ద్వయ, సహితుండు+ఐ= భార్యల జంటతో కూడినవాడు అయి; సమ, విషమ, ్రదేశములన్‌= సమంగా, మిట్టపల్లాలుగా ఉన్న భూములలో; చనుచు+ఉన్న= వెళ్ళుతున్న; ఆ+పాండురాజున్‌? చూచి; బుషులు, ఇట్టు+అనిరి. తాత్పర్యం: 'ఆ కారణంగా మేము (బ్రహ్మలోకానికి పోతున్నాం' అని అనగా, ఆ మునుల వెనుక భార్య లిద్దరితో సమంగాన్తూ మిట్టపల్దాలుగానూ ఉన్న భూమిమీద పోతున్న ఆ పొండురాజును చూచి బుషులు ఇట్టా అన్నారు. క వీర లతి లలిత మృదులా । కారలు, గిరివిషమ గహనగహ్వరముల రా నేరరు గావున నిట చను ; దేరక మీ రుండు డివియు దేవపథంబుల్‌. 68 ఆకారాలు కలవారు; గిరి, విషమ, గహన, గహ్వరముల= కొండలలో మిట్టపల్లాలై చారశక్యం కాని గుహలలో; రానేరరు; కావునన్‌; ఇట; చనుదేరకజ రాకుండ; మీరు; ఉండుడు; ఇవియుజ= విశేషించి ఇవి; దేవు పధంబుల్‌= దేవలోకానికి వెళ్ళే దారులు. తాత్పర్యం: నీ భార్యలు మిక్కిలి సుకుమార మైన శరీరాలు కలవాళ్ళు. వీళ్ళు కొండలలో మిట్టపల్హాలై చాం శక్యం కాని గుహలలో రాలేరు. మీరు ఆగండి. విశేషించి ఇవి దేవమార్గాలు. విశేషం: నీ భార్యలు సుకుమార శరీరాలు కలవారు; మిట్టపల్టాలతో చొరశక్యం కాని ఈకొండగుహలలో రాలేరు- అనటం సమంజసమే. కాని, తాము వెళ్తూ మీరు ఆగండి; ఇవి దేవమార్గాలు అనడంలో - ఈ మార్గంలో వచ్చే యోగ్యత మీకు లేదనే అంశాన్ని సూక్ష్మాతిసూక్ష్మంగా పాండురాజు మనస్సు నొవ్వకుండా మునులు ధ్వనింప చేశారు. పాండురాజుకు తస స్సున్నది. సంతానం లేదు. సంతాన హీనులకు దేవమార్గంలో ప్రవేశించడానికి అర్హత లేదు. ఈ విషయాన్ని పాండురాజు (గ్రహించాడు. క. _ అనిన విని నరుల కక్కడం; జనంబోలమి యెజింది పాండుజనపాలకుం డి ట్లనియెను 'స్వర్గద్వారం ।; బనపత్యులు గాననోపరటె మును లయ్యున్‌,' 69 (ప్రతిపదార్థం: అనిన; విని; నరులకు; అక్కడన్‌; చనన్‌+పోలమి= వెళ్ళటం సాధ్యం కాకుండటాన్ని: ఎటింగి= తెలిసికొని; పాండు, జనపాలకుండుజ పాండురాజు; ఇట్టు+అనియెను; అనపత్యులు=సంతానం లేనివారు; మునుల్‌+అయ్యున్‌= బుషులైనప్పటికి; స్వర్ణ ద్వారంబు; కానన్‌, ఓపరు+అటె=ఐ చూడలేరట కదా.

డశ్షర త్రీనుదొంధ్ర మహాభారతము

తాత్పర్యం: బుషులన్న మాటలు విని, మానవు లక్కడికి పోలే రని తెలిసికాని పాండురాజు-'సంతానం లేనివాళ్ళు

మునులైనప్పటికీ స్వర్గద్వారాన్ని చూడలే రట కదా' అన్నాడు.

విశేషం: 68వ పద్యంలో వ్యంగ్యంగా చెప్పబడిన అంశం ఈ పద్యంలో వాచ్యం కావటంచేత అత్యంతతిరస్కృతవాచ్యర్వని ఇక్కడ

గుణీభూత మయింది. (సంపా)

వ. “అపుత్తస్య గతిర్మాస్తి యను వేదన వచనంబుం గలదు గావున నేనపుత్తకుండ నేమి సేయుదు?' ననిన ముమలుమను గరుణించి యోగదృష్టి ననాగతం బెజింగి,. 'నీ వపుత్రకుండవు గావు; దైవాధిప్టితం బై న సంతానంబు నీకు ధర్మానిలశక్రాశ్వినులవరంబున నగు; నక్షయలోకంబులుం బడయుదువు గావున సంతానార్థంబు యత్నంబుం సేయు' మనిన విని పొండురా జాత్మగతంబునం 'బురుషుండు పుట్టుచుండి దేవబుషి పితృమనుష్యులబుణంబులు నాలుగింటితోడం బుట్టి యథాకాలవిధుల వానివలన విముక్తుండు గావలయు;నట్లుగాని వానికింబుణ్యలోకంబులు లేవు; యజ్జంబులం జేసి దేవతలబుణంబును, దపస్వ్వాధ్యాయ బ్రహ్మాచర్యప్రతంబులంజేసి బుషుల బుణంబును, శ్రాద్ధపుత్రలాభంబులం జేసి పితరుల బుణంబును, నానృశంస్యంబునం జేసి మనుష్యుల బుణంబునుం బాపవలయు; నందు. బితరుల బుణంబు దక్క దక్కిన మూయబుణంబుల వలన విముక్తుంద నయితి. 70

(ప్రతిపదార్హం: అపుత్రస్య= బిడ్డలులేనివారికి; గతి:= పుణ్యలోకం; నాస్తీజఐ లేదు; అను; వేద, వచనంబున్‌= వేదవాక్యంకూడ: కలదు, కావున; నేను: అపుత్రకుండను= సంతానంలేనివాడిని; ఏమి; చేయుదును; అనిన; మునులును; కరుణించి= దయతలచి; యోగ, దృష్టిన్‌: అనాగతంబు= రాబోవుదానిని; ఎటీంగి= (గ్రహించి; నీవు; అపుత్రకుండవు= పుత్రులు లేనివాడివి; కావు; దైవ+అధిస్టితంబు+ఐన= దేవతలచేత ప్రభావితం చేయబడిన; సంతానంబు; నీకు; ధర్మ+అనిల, శక్ర+అశ్వినుల, వరంబునన్‌= యమునియొక్క, వాయువుయొక్క, ఇంద్రునియొక్క, అశ్వినీదేవతలయొక్క వరంచేత: అగున్‌= కలుగుతుంది: అక్షయ, లోకంబులున్‌= నాశం లేని లోకాలు - అనగా పుణ్యలోకాలు; పడయుదువు= పొందుతావు; కావున; సంతాన+అర్హంబు= సంతానంకొరకు; యత్నంబు; చేయుము; అనిన; విని; పాండురాజు; ఆత్మగతంబునన్‌= మనస్సులో: పురుషుండు; పుట్టుచుండి; దేవ, బుషి పితృ మనుష్యుల, బుణంబులు; నాలుగింటితోడన్‌; పుట్టి: యథాకాల, విధుల= ఆ యా కాలాల్లో చేసే కార్యాలచేత; వానివలన= ఆ బుణాలవలన; విముక్తుండు= విడువబడినవాడు; కావలయున్‌; అట్టు; కానివానికిన్‌ పుణ్యలోకంబులు; లేవు; యజ్ఞంబులన్‌, చేసి, దేవతల, బుణంబును; తపః+స్వాధ్యాయ, (బ్రహ్మచర్య, వ్రతంబులన్‌, చేసి= తపస్సుచేత, వేదాధ్యయనంచేత, (బ్రహ్మచర్య (వ్రతంచేత; బుషుల, బుణంబును; శ్రాద్ధ, పుత్రలాభంబులన్‌, చేసి= శ్రాడ్దాలచేత కొడుకులను పొందటంచేత; పితరుల, బుణంబునున్‌: అన్నశంస్యంబునన్‌+చేసి= అక్రూరమైన భావంచేత - అనగా దయ కలిగి ఉండటంచేత; మనుష్యుల బుణంబునున్‌; పాపవలయున్‌= పోగొట్టవలెను; అందున్‌; పితరుల, బుణంబు; తక్కన్‌= తప్ప; తక్కిన, మూడు, బుణంబులవలన; విముక్తుండను+అయితి= విడువబడినవాడను ఆయ్యాను.

తాత్పర్యం: ' పుత్రులు లేనివారికి పుణ్యలోకం లేదు” అనే వేదవచనంకూడా ఉన్నది. నేను పుత్రులు లేనివాడిని.

ఏమి చేసేది?" - అని పాండురాజు అనగా మునులు దయతలచి, యోగదృష్టితో ముందు జరిగేదాన్ని తెలిసికొని

“నీవు పుత్రులు లేనివాడివి కావు; యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతల వరంతో నీకు సంతానం

కలుగుతుంది; నీవు పుణ్యలోకాలు పొందుతావు; కాబట్టి సంతానంకొరకు ప్రయత్నించుము' అని చెప్పారు. అది

విని పాండురాజు మనుస్సులో ఇట్టా తలచాడు: 'పురుషుడు దేవ, బుషి, పితృ మనుష్య బుణాలు నాలుగింటితో పుట్టి, ఆయా కాలాలలో చేయవలసిన కార్యాలచేత ఆ బుణవిముక్తుడు కావాలి. అట్టా బుణవిముక్తుడు కొనివాడికి

ఆదిపర్వము - పంచమాశ్వాసము త్తడ్త9 పుణ్యలోకాలు లేవు. యజ్ఞాలు చేసి దేవతల బుణాన్ని, తపస్సు, వేదాధ్యయనం, ('బ్రహ్మచర్యవ్రతం చేత బుషుల బుఖణాన్ని, శ్రాద్దాలు పెట్టి, కొడుకుల్ని కని పితృ దేవతల బుణాన్ని, దయా।/ర్రహృదయు డై మానవ బుణాన్ని తీర్చుకోవాలి. నేను ఒక్క పితరుల బుణం తప్ప మిగతా మూడూ తీర్చుకొన్నాను. విశేషం: పంచమవేద మైన మహాభారత ఆంధధ్రికరణంలో నన్న్మయ సందర్భోచితంగా వేదధర్మాలను వివరించడమే కాక వేదవాక్యాలను కూడ చెప్పాడు. 'అపుత్రస్య గతి ర్నాస్తి' అనే వాక్యం అటువంటిదే. 'బుణం' శబ్దంలో బువర్ణానికి బదులు రు, రి వర్ణాలు - బుషి - రుషి - రిషి బుణము - రుణము - అని తాళపత్రప్రతులలో ఉండటం గమనించదగింది. తే. దేహ నాశంబుతోడన తీలు నెల్ల; బుణములును మథీ పితరులబుణము దేహ నాశ మయినను దీజదు నాకు నదియ । తక్కియున్నది యే నెట్లు దాని. బాతు. 71 ప్రతిపదార్థం: దేహ, నాశంబుతోడన= శరీరం నశించిన వెంటనే; ఎల్ల, బుణములును= అప్పులన్నీ; తీజున్‌; మజి; పితరులబుణము; దేహ, నాశము+అయినను; తీఅదు; నాకున్‌, అదియః= ఆ పితరుల బుణమే; తక్కి, ఉన్నది= మిగిలిఉన్నది. ఎనుజ నేను; దానిన్‌; ఎట్టు; పాతు= తొలగించుకొంటాను. తాత్పర్యం: శరీరం నశించిన వెంటనే అన్ని బుణాలు తీరిపోతాయి. పితరులబుణం మాత్రం శరీరం నళించినా తీరదు. నాకు అది ఒక్కటే మిగిలిఉన్నది. నేను దానిని ఎట్టా తీర్చుకొనగలను? వ, అని దుఃఖించి మృగశాపంబు దలంచి తనవలన సంతానం బయ్యెడి విధంబు లేమి యెజింగి యొక్కనాం దేకాంతంబ గొంతి కి ట్లనియె. 72 ప్రతిపదార్హం; అని; దుఃఖించి; మృగ శాపంబు; తలంచి; తనవలన; సంతానంబు; అయ్యెడి; విధంబు; లేమి= లేకపోవటాన్ని; ఎఆింగి; ఒక్కనాడు; ఏకాంతంబు= ఒంటరిగా; కొంతికిి; ఇట్లు+అనియె. తాత్సర్యం: అని విచారించి మృగశాపాన్ని తలచికొని, తనవలన సంతానం కలిగే మార్గం లేకపోవటాన్ని తెలిసికొని, ఒకరోజు ఒంటరిగా ఉన్న కుంతితో ఈ విధంగా అన్నాడు. ఉ. దానములం దపంబుల స దక్షిణ యజ్ఞములన్‌ విపాన సం తానుల కూర్వలొక సుపథంబు ॥ ర్ధ్యలో పథంబు లవశ్యము గావు; లబ్ధ సం తానుల యెందు. బుణ్యు; లిది తధ్యము గావున నొందు దక్కి సం తానము నాకు నయ్యెడువిధం బొనరింపుము ధర్మసంస్థితిన్‌. 73 ప్రతిపదార్హం: దానములన్‌; తపంబుల; స. దక్షిణ, యజ్ఞములన్‌= దక్షిణలతో కూడిన యజ్ఞాలచేత; విహీన, సంతానులకు= సంతానం లేనివాళ్ళకి; ఊర్హ్య, లోక, సుపధంబులు= పై లోకాలకు మంచిమార్లాలు; అవశ్యము= తప్పక; కావు= లభించవు; లబ్ద, సంతానులు+ఆ= పొందబడిన సంతానం కలవాళ్ళే; ఎందున్‌; పుణ్యులు= పుణ్యంకలవాళ్ళు; ఇది; తథ్యం= నిజం; కావునన్‌; ఒండు= ఇతరకార్యాలు; తక్కి= మాని; నాకున్‌; సంతానము; ధర్మ, సంస్థితిన్‌=ఐ ధర్మమార్గంలో; అయ్యెడు; విధంబు; ఒనరింపుము= చేయుము. తాత్పర్యం; దానాలు చేసినా, తపస్సులు చేసినా, దక్షిణలతో యజ్ఞాలు చేసినా సంతానం లేనివాళ్ళకు పుణ్యలో కాలు లభించవు. సంతానం కలవాళ్ళే పుణ్యవంతులు. అందువలన నీవు ఇతర కార్యా లన్నీ మాని ధర్మమార్గంలో నాకు సంతానం కలిగేటట్టు చేయుము.

డ50 శ్రీమదాంధ్ర మహాభారతము

క. _ అనపత్యుడ నై జీవిం। చిన, మృతిం బొందినను నిర్విశేషంబ; యిహం బును బరమును నఫలమ; గా । వున సంతతినడయు ధర్మువున ధర్మసతీ! 74

ప్రతిపదార్థం: అనపత్యుండను +ఐ= బిడ్డలు లేనివాడ నై; జీవించిన; మృతిన్‌+పొందినను= మరణం పొందినా; నిర్‌శవిశేషంబు+అవ=

విశేషం లేదు - అనగా ఒక్కటే; ఇహంబును= ఈ లోకం; పరమును= పర లోకం; అఫలము+అ= ఫలం లేనిదే: కావున; ధర్మసతీ= ధర్మపత్నీ = కుంతీ! ధర్మువున= ధర్మంచే; సంతతి= సంతానాన్ని; పడయు= పొందుము.

తాత్పర్యం: బడ్డలు లేనివాడి నై జీవించినా, మరణించినా ఒకటే; ఇహ పర లోకాలు రెండూ ఫల రహితాలే. అందుచేత

నీవు ధర్మపద్ధతిలో సంతానం పొందుము.

వ, _ 'బెరసక్షేశ్రజి దత్తక కృత్రిమ గూఢోత్ప న్నాపవిద్ధు లను నార్వురు పుత్రులు బంధువులు దాయాదులు నగుదురు; శానీన సహోధక్రీత పానర్ధవ స్వయందత్త జ్ఞాతులను నార్వురు పుత్రులు బంధువు లగుదురు గాని దాయాదులు గా; రట్టి పుత్తులలో నౌరసున కించుకయ తక్కువగాని తక్కటి పుత్తులకంటిె క్షేత్రజం డుత్కష్టుం; డందును 'వేవరన్యాయజాతుం డుత్తముం డండ్రు గావున నస్మన్నియోగంబునంజేసి ధర్మమార్గంబున క్షేత్రజూులం బడసిన నేనును బుత్రవంతుల పుణ్యలోకంబులు వడయనేర్లు: నె ట్లనినం దొల్లి గకేయరా జైన శారదండాయని పుత్రోత్సాదనంబునం దశక్తుం డయి తనధర్మపత్ని నీచెలియలి శ్రుతసేనం బుత్రార్ధంబు నియోగించిన నది బ్రాహ్మణవచనంబునం బుణ్యస్నాత యై పుంసవనహోమంబు సేయించి బుత్విజులవలన దుర్టయాదు లయిన కొడుకుల మువ్వురం బడసెం బుత్తలాభంబున ననంతపుణ్యఫలం బగుట నది ధర్యం బయిన యాచారం" బనిన విని కుంతి యి ట్లనియె. 75

ప్రతిపదార్థం: జారస, న్షేత్రజ, దత్తక, కృత్రిమ, గూఢ+ఉత్పన్న+అపవిద్దులు+ అను= వివాహం చేసికొన్న భార్యయందు తనకు

పుట్టినవాడు, నియోగంచేత తన భార్యయందు ఇతరులవలన పుట్టినవాడు, తనకు కుమారుడుగా ఇవ్వబడిన ఇతరుల కుమారుడు, అభిమానంతో కుమారుడుగా పెంచుకొనబడినవాడు, తనభార్యయందు తనకు తెలియకుండ ఇతరుల వలన జన్మించినవాడు; తల్లిదంద్రులచేత విడిచిపెట్టబడి తనదగ్గర చేరినవాడు, అను; ఆర్వురు= ఆరుగురు; పుత్రులు; బంధువులు; దాయాదులున్‌= తన సంపదలో భాగం పొందేవాళ్ళు; అగుదురు; కానీన, సహోఢ, ్రీత, పౌనర్భవ, స్వయందత్త, జ్ఞాతులు= పెళ్ళికిముందు తనభార్య కన్యగా ఉన్నప్పుడు పుట్టినవాడు, వివాహసమయానికే గర్భిణిగా ఉన్న తన భార్యకు వివాహానంతరం పుట్టినవాడు, తల్లిదండ్రులకు ధన మిచ్చి కొనబడినవాడు, భర్తచే విడువబడిన స్త్రీకి లేదా విధవకు తనచేతపుట్టింపబడినవాడు; స్వయందత్తుండు= నీకు పుతు డను అవుతా నని తనంత తానుగా వచ్చినవాడు; జ్ఞాతుడు= తనగో(త్రం వాడు; అను; ఆర్వురు= ఆరుగురు; పుతత్తులు; బంధువులు; అగుదురు; కాని; దాయాదులు= ఆస్తిలో భాగం పంచుకొనేవారు; కారు? అట్టి; పుత్రులలో: క్షేత్రజాండు= నియోగంచేత తన భార్యకు ఇతరులచేత పుట్టిన కుమారుడు; జారసునకు= వివాహమాడిన తన భార్యయందు తనకు పుట్టినవాడికంటె; ఇంచుకయ= కొంచెం; తక్కువగాని; తక్కటి= మిగిలిన; పుత్రులకంటె; ఉత్కృప్టుండు= శ్రేష్టుడు; అందును; దేవర, న్యాయ, జాతుండు= దేవరన్యాయంవలన పుట్టినవాడు; ఉత్తముండు; అం(డ్రుఐ అంటారు; కావున; అస్మత్‌=నియోగంబునన్‌+ చేసి= నా ఆజ్ఞతో; ధర్మ, మార్గంబున; క్షేత్రజులన్‌: పడసీన= పొందినబో; నేనును; పుత్రవంతుల, పుణ్యలోకంబులు= పుత్రు లున్న వాళ్ళు పొందే పుణ్యలోకాలు; పడయ, నేర్చుదున్‌= సొందగల్లుతాను; ఎట్టు+అనినన్‌; తొల్లి= పూర్వం; కేకయ, రాజు+ఐన; శారదండాయని; పుత్ర+ఉత్సాదనంబు, అందు= కొడుకులను పుట్టించటంలో; అశక్తుండు+అయిజశక్తి లేని వా డై; తాన, ధర్మ, పల్ని= తాను అగ్నిసాక్షిగా వివాహం చేసికొన్న భార్యను; నీ, చెలియలి= నీ(కుంతియొక్క) చెల్లెలిని; (శ్రుతసేనన్‌, పుత్ర+అర్థంబు= పుత్రులకొరకు; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; అది; బ్రాహ్మణ, వచనంబునన్‌? పుణ్య, స్నాత+ఐ= పవిత్ర మైన స్నానం చేసిందై; పుంసవన, హోమంబు= కొడుకు పుట్టడానికి చేసే వైదిక శుభ

ఆదిపర్వము - పంచనూశ్వాసము కకక కర్మకు సంబంధించిన హోమం; చేయించి; బుత్విజులవలన= యజ్ఞం చేయించే (బ్రాహ్మాణులవలన; దుర్ణయ+ఆదులు+అయిన= దుర్ణయుడు మొదలగు వారైన; కొడుకులన్‌, మువ్వురన్‌= ముగ్గురిని; పడసెన్‌= పొందెను; పుత్ర లాభంబునన్‌= కొడుకులు పుట్టటంవలన; అనంత, పుణ్య, ఫలంబు+అగుటన్‌= అంతులేని పుణ్యం కలుగటంచేత; అది= దేవరన్యాయంతో పుత్రులను పొందటం; ధర్మ్య్యంబు+ అయినః= ధర్మంతో కూడిన; ఆచారంబు; అనిన; విని; కుంతి; ఇట్టు+అనియె. తాత్పర్యం: “జొరసుడు, కేత్రజుడు, దత్తకుడు, కృత్రిముడు, గూఢో త్పన్నుడు, అపవిద్దుడు అనే ఆరుగురు పుత్రులు బంధువులు మాత్రమే కాదు, ఆస్తిలో భాగస్వాములు కూడా... కానీనుడు, సహోఢుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతుడు అనే ఆరుగురు పుత్రులు బంధువులే. కాని, ఆస్తిలో భాగస్వాములు కారు. ఈ పుత్రులందరిలో క్షేత్రజుడు జొరసుడికన్నా కొంచెం తక్కువ; తక్కిన వారి కన్నా మిన్న. అందునా దేవర న్యాయంచేత పుట్టిన క్షేత్రజాడు ఉత్తముడు. అందువలన నీవు నా ఆజ్ఞ్జదేత ధర్మమార్గంలో క్షేత్రజులను పొందితే పుత్రులున్న వాళ్ళు పాందే పుణ్యలోకాలు నేను పొందుతాను. ఎట్టా అంటే - పూర్వం కేకయరాజు శారదండాయని తాను పుత్రులను పొందలేక తన ధర్మపత్ని, అంటే నీ చెల్లెలు (శ్రతసేనను పుత్రులకొరకు నియోగించగా, ఆమె (బ్రాహ్మణులు చెప్పినట్టు పుణ్యస్నానం చేసి, పుత్రులు పుట్టటంకొరకు చేసే పుంసవన హోమం చేయించి, బుత్విజులవలన దుర్ణయుడు మొదలైన ముగ్గురుకొడుకులను పొందింది. పుత్రులు పుట్టటంచేత అంతు లేని పుణ్యం కలుగుతుంది కాబట్టి దేవరన్యాయంచేత పుత్రులను పొందటం ధర్మంతో కూడిన ఆచారం” అని పాండురాజు చెప్పగా కుంతి ఇట్టా అన్నది. విశేషం: ఆంధ్రమహాభారత సంశోధిత ప్రతిలో ఈక్రింది విశేషాలున్నాయి. “సంస్కృతమూలము సంతానమును బంధుదాయాదులు, అబంధుదాయాదులు - అని రెండుగా విభజించినది. అందు బంధుదాయాదులు: (1) స్వయంజాతుండు (2) ప్రణీతుండు (3) పరికక్రీతుండు (4) పౌనర్భవుండు (5) కానీనుండు (6) స్వైరిణీసుతుండు. అబంధుదాయాదులు- (1) దత్తుండు (2) శ్రీతుండు - కృత్రిముండు (3) స్వయందత్తుడు (9 సహోఢుడు (5) జ్ఞాతరేతుండు (6) హీనయోనిధృతుండు. క్షేత్రజుండు - అనుటకు బదులు పి.పి.ఎస్‌ ప్రతిలో క్షేత్రిక పదము కలదు. మూలమునందు శ్షేత్రజుండు' అను పేరు లేదు. ప్రణీతుండనియే కలదు. “ఊఢాయా మేవ ఉత్తమాను[గ్రహాజ్ఞాతః ప్రణీత” అని నీలకంరీయవ్యాఖ్య. బంధు దాయాద, అబంధుదాయాద విభాగమునందు నన్నయ మార్పులు చేసెను. దత్తక కృత్రిమాపవిద్దులు - అనువారిని నన్మయ బంధుదాయదులలో చేర్చెను. బంధుదాయాదులనుండి పరి|క్రీతుండు, పొనర్భవుండు, కానీనుండు - అను వీరిని తొలగించెను. హీనయోనిధృతుండు మూలములో అన్ని ప్రతులయందును 'పేర్కొనంబడెను. ఆంధ్రమునం దీతండు విడువండెను. షట్సంతానమును పూర్తి చేయుటకై క్రీతుండు, కృత్రిముండు వేర్వేరుగా పరిగణింపంబడిరి. (ప్రధమసంపుటం పు. 273)” మరొక విశేషం: నన్నయ ఆపస్తంబసూత్రుడు కాబట్టి ఆపస్తంబధర్మసూత్రాలను అనుసరించి సంతానవిషయాన్ని సమీక్షించి ఉండవచ్చును. మనువు, బోధాయనుడు గౌతముడు ద్వాదశవిధ పుత్రులను పేర్కొన్నారు. వారు కౌరస, క్షేత్రజ, దత్తక, కృత్రిమ. గూఢోత్పన్న అపవిద్ధ, కానీన, సహోఢ, ్రీత, పొనర్భవ స్వయందత్త జ్ఞాతులు. ఆపస్తంబుడు ఆరుగురిని మాత్రమే వారసులుగా, దాయాదులుగా పేర్కొన్నాడు వారిలోకూడ క్రీతుడినీ, దత్తుడినీ తిరస్కరించాడు. నన్నయ మనువు పేర్కొన్న ద్వాదళపుత్రులను పేర్కొన్నప్పటికీ ఆరుగురినే వారసులుగా నిర్దారించాడు. శౌరసుని తరువాత క్షేత్రజుడిని నిలిపొడు. (సంపా) క భరతకులశ్రేష్టుడ వయి పరఃగిన నీ కేము ధర్మపత్నుల మయి యిం

కొరుల మనుష్యుల నంతః । కరణంబులం దలయం బొందంగా నోపుదుమే? 76

శ్షప్‌2 శ్రీమదాం(ధ్ర మహాభారతము ప్రతిసదొర్థం: భరత, కుల, (్రేష్టుడవు+అయి= భరతవంశంలో ఉత్తముడవు అయి; పరంగిన= ఒప్పిన' నీకు; ఏము= మేము; ధర్మపత్ములము+అయి= అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యలమై; ఇంక, ఒరుల, మనుష్యులన్‌= ఇతర పురుషులను; అంతఃకరణంబులన్‌= మనస్సులలో; తలయపన్‌; పొందంగా= కలవడానికి; ఓపుదుమె= ఒప్పుకొందుమా? (ఒప్పుకొనమని భావం) తాత్పర్యం: భరతవంశంలో శ్రేష్టుడ వైన నీకు ధర్మపత్నుల మై, పర పురుషులను మనస్సులలో తలవటానికి, కలవటానికి ఒప్పుకోగలమా? వ. “భవత్ర్రసాదంబున మా యందు బుత్ర్తోత్పత్తి యగు నెట్లనిన: దీని కనుగుణం బయినది యొక్క పుణ్య కథం దొల్లి పారాణికులవలన నా వినిన దానిం జెప్పెదం జిత్తగించి విను' మని పాండురాజునకుం గుంతి యి టనియె. 77 ప్రతిపదార్ధం: భవత్‌+ప్రసాదంబునజ నీ అను[గ్రహంతో; మాయందున్‌; పుత్ర+ఉత్పత్తి; అగున్‌= కొడుకులు పుట్టటం జరుగుతుంది; ఎట్టు+శఅనిన; దీనికి; అనుగుణంబు+అయినది= తగినట్టిది:; ఒక్క; పుణ్య, కధ; తొల్లి= పూర్వం; పౌరాణికులవలనజ పురాణాలు చెప్పేవారివలన; న్నా వినిన, దానిన్‌= నేను విన్న దానిని; చెప్పెదన్‌? చిత్తగించి= మనస్సు ఉంచి; వినుము; అని; పాండురాజునకున్‌: కుంతి; ఇట్టు + అనియె. తాత్పర్యం; నీ దయవలన మాకు కొడుకులు కల్గుతారు. ఎట్లా అంటే దీనికి తగ్గ ఒక పుణ్యకథ పూర్వం పౌరాణికులు చెప్పగా విన్నాను. అది చెప్పుతాను. మనస్సు నిలిపి వినండి" అని పొండురాజుతో కుంతి ఇట్టా అన్నది. వ్యుషితాశ్వుం డను రాజు వృత్తాంతము (సం. 1-112-7) చ. అతుల బల ప్రతాప మహిమాధికు. డై వ్వుషితాశ్వుం డన్మహీ పతి నయధర్శతత్పరుండు పారననంశజు దశ్వమేధముల్‌ శత మొనరించుచుండి భుజశక్తి జయించె మహీశులం బ్రన ర్థితరయశుం డై ప్రతీచ్యుల నుదీచ్యుల బ్రాచ్యుల దాక్షిణాత్యులన్‌. 278 ప్రతిపదార్థం: అతుల, బల, ప్రతాప, మహిమ+ అధికుడు+ఐ= సాటిలేని బలపరా(క్రమాల ప్రభావంచేత గొప్పవాడై; నయ, ధర్మ, తత్పరుండు= నీతి, ధర్మాలమీద ఆసక్తికలవాడు; పౌరవ, వంశజాండు= పూరువు వంశంలో పుట్టినవాడు; వ్యుషిత+అశ్వుండు: అన్‌+మహీ, పతి= అనే రాజు; అశత్చమేధముల్‌ శతముజ వంద: ఒనరించుచు+ఉండి= చేస్తూ ఉండి; భుజ, శక్తిః భుజ బలంతో; ఫ్రవర్షిత, యశుండు+ఐజఐ పెంపొందింపబడిన కీర్తి కలవాడై; ప్రతీచ్యులన్‌= పడమటి దిక్కులో ఉన్నవాళ్ళను; ఉదీచ్యులన్‌= ఉత్తరాన ఉన్నవాళ్ళను, ప్రాచ్యుల= తూర్పున ఉన్నవాళ్ళను; చాక్షిణాత్యులన్‌= దక్షిణాన ఉన్నవాళ్ళను; మహి+ ఈశులన్‌= రాజులను; జయించి, తాత్పర్యం: సాటిలేని బలపరా(క్రమాలతో అందరిని మించినవా డై నీతిలో, ధర శంలో ఆసక్తి కలిగి, పూరువంళశంలో జన్మించిన వ్యుషితాశ్వు డనే మహారాజు అశ్వమేధ యాగాలు వంద చేసి, భుజబలంతో సపెంపొందిన క్షీర్తి కలవాడై నాలుగుదిక్కులలో ఉన్న రాజులను జయించాడు. విశేషం; వ్యుషితొశ్వుడు బలపరా(క్రమాలలో, దిస్విజయాలలో పాండురాజును పోలి ఉండటంచేత కుంతికి అతని వృత్తాంతం జ్ఞాపకం వచ్చినట్టు ధ్వని, పాండురాజుయొక్క దిగ్విజయ(ప్రశంసలోను, వ్యుషితాళ్వుని ('ప్రశంసలో నన్నయ చంపకమాలను వినియోగించటం విశేషం. వృత్తరచనాశిల్పం. చూడు. 39, 42 పద్యాలు. (సంపా,

ఆదిపర్వము - పంచమాశ్వాసము ఢ్త53 క. _ ఆతని యజ్ఞంబునం బురు । హూత పురస్పర మరుద్గణోత్తము లధిక ప్రీతి. జనుదెంచి హవ్యము । లాతత హస్తములం గొందు రగ్ని ముఖమునన్‌. 79 ప్రతిపదార్థం: ఆతని, యజ్ఞంబున;ః పురుహూత, పురఃసర, మరుత్‌+గణ+ఉత్తములు= దేవేంద్రుడు మొదలైన దేవతా శ్రేష్టులు, అధిక, ప్రీతిన్‌: చనుదెంచి= వచ్చి; అగ్ని, ముఖమునన్‌= అగ్జిదేవునిమూలాన:; హవ్యములు= హోమంలో వేసిన ఆహుతులు; ఆతత, హస్ర్తములన్‌= చాపబడిన చేతులతో; కొందురు= తీసికొంటారు. తాత్పర్యం: ఆ వ్యుషితాశ్వునియజ్ఞంలో దేవేంద్రుడు మొదలైన దేవతా(్రేష్టులు మిక్కిలిప్రీతితో వచ్చి, చేతులు చాచి అస్లిదేవునిముఖంగా ఆహుతులు గైకొంటారు. వ. అట్టి వ్యుషితాశ్వుండు కాక్షీవతి యైన భద్ర యను తన భార్య యందు ననవరత కామాసక్తిం జేసి యక్ష్మ రుజాక్రాంతుం డయి యస్తమించిన నది పుత్రాలాభదుఃఖిత యయి పతివియోగంబు సహింప నోపక. 80 ప్రతిపదార్థం: అట్టి వ్యుషిత+అశ్వుండు; కాక్షీవతి+ఐన; భద్ర; అను; తన, భార్యయందున్‌; అనవరత, కామ+ఆసక్తిన్‌+చేసి=ఐ ఎడతెగని కామంమీద ఆసక్తితో; యక్ష్మ రుజా+ ఆశక్రాంతుండు+ అయి=క్షయరోగంచే ఆ(క్రమింపబడిన వాడై; అస్తమించినన్‌= మరణించగా; అదిజఐ అతని భార్య అయిన భద్ర; పుత్ర+ అలాభ, దుఃఖిత+అయి కొడుకులను పొందలేక పోవటంతో దుఃఖించినదై; పతి,వియోగంబునుజ భర్తను కోల్పోవటాన్ని; సహింపన్‌+ఓపకజ ఓర్చుకోలేక తాత్పర్యం: అటువంటి వ్యుషితాశ్వుడు తనభార్యమీద మితిమీరిన కామంతో ఆసక్తుడై వ్యవహరించి క్షయ రోగ (గ్రస్తు డై మరణించగా, అతనిభార్య భద్ర కొడుకులు లేకపోవటంతో దుఃఖించి, భర్తను కోల్ఫోవటాన్ని సహించలేక. తే. పతియులేక జీవించు నయ్యతివ కయిన ; జీవనముకంటె దానికి జావ లగ్గు కాన నీతోన చనుదెంతుం గాని నిన్నుం। బాసి యిం దుండలణా నోప వాసవాభ! 81 ప్రతిపదార్థం: పతియు= భర్త; లేక; జీవించు= జీవించే; ఆ+అతివకుఐ ఆ (స్త్రీకి; అయిన= ఏర్పడిన; జీవనముకంటె= బతకటంకన్నాః దానికిన్‌= ఆ స్త్రీకి చావుఖఅ, లగ్గు= చావే మేలు: కాన; నీతోన; చనుదెంతున్‌= వస్తాను; కాని; వాసవ+ఆభ= దేవేంద్రునివంటి తేజస్సు కలవాడా! నిన్ను; పాసి= విడిచి; ఇందు= ఈ లోకంలో; ఉండన్‌+కాన్‌= ఉండటానికి; ఓపజ ఇష్టపడను. తాత్ప్చర్యం: భర్త లేకుండా జీవించటంకన్నా స్త్రీ చావటమే మేలు. అందువలన నేను నీతో వస్తాను కాని, ఇక్కడ ఉండలేను. వ. "కాదేనినాకునీ పుణ్యమూర్తిప్రతిమూర్తు లైన పుత్తులం బ్రసాదింపు' మని దర్ధాస్తరణశాయిని యై యాశనంబుం గౌధగిలించుకొని విలాపించుచున్న దానికి వాని శరీరముననుండి యొక్క దివ్యవాణి యి ట్లనియె. 82 ప్రతిపదార్థం: కాదు+ఏని= అట్లా కాకపోతే; నాకు; నీ, పుణ్య, మూర్తి ్రతిమూర్తులు+ఐన= నీ పవిత్ర మైన రూపం కలవా రైన; పుత్రులన్‌; (ప్రసాదింపుము= దయతో ఇమ్ము అని; దర్భ+ఆస్తరణ, శాయిని+ఐ= దర్భలపరుపుమీద పడుకొన్నది అయి; ఆ, శవంబున్‌; కౌగిలించుకొని; విలపించుచు+ఉన్నజ ఎడుస్తున్న; దానికి= ఆ భద్రకు; వాని, శరీరమునుండి= ఆ వ్యుషితాశ్వనిశరీరంనుండి; ఒక; దివ్య, వాణి= దేవతాసంబంధ మైన వాక్కు; ఇట్టు+ అనియె తాత్సర్యం: 'అట్లా కాకపోతే నాకు నీ పవిత్రరూపంవంటి రూపం కల కొడుకులను ప్రసాదించు" మని దర్భల పరుపు మీద పడుకొని భర్తశవాన్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉండగా, ఆమెతో అతని శరీరంనుండి ఒక దివ్యవాణి ఇట్టా అన్నది.

డ5డ శ్రీమదాంధ్ర మహాభారతము క. _ విదితముగ నీకు వరమి । చెద నోదకు లెమ్ము; గుణ వశీ కృత భువనుల్‌ సదమలచరిత్రు లాత్మజు । లుదయింతురు వగవకుండు ముదితేందుముఖీ! 83 ప్రతిపదార్థం: విదితముగజ (ప్రసిద్దంగా; నీకు; వరము; ఇచ్చెదన్‌; ఓడకు= భయపడకుము; లెమ్ము; ఉదిత+ఇందు ముఖీ= ఉదయించిన చంద్రునివంటి ముఖం కలదానా; గుణ, వశీ, కృత, భువనుల్‌= గుణాలచేత వళం చేసుకోబడిన లోకాలు కలవాళ్ళు; సత్‌+అమల, చరిత్రులు= ఉత్తమమై నిర్మల మైన నడవడి కలవాళ్ళు; ఆత్మజులు= కుమారులు; ఉదయింతురు= పుట్టుతారు; వగవకజ= చింతించక; ఉండుము.

తాత్పర్యం: నీకు వర మిస్తాను. భయపడవద్దు. లెమ్ము. ఉదయించినచంద్రునివంటి ముఖం కలదానా!

సుగుణాలచేత లోకాలను వశంచేసుకొనేవాళ్ళు, ఉత్తమ మైన నడవడి కలవాళ్ళు అయిన కొడుకులు నీకు పుట్టుతారు.

బాధపడకుము.

వ. 'బుతునతి వయిన యష్టమ దినసంబున నేనిం జతుర్ద్హశ దివసంబున నేని శుచి వై శయనంబున నుండి నన్నుందలంపు" మనిన నదియుం దద్వచనానురూపంబు సేసి మువ్వురుసాల్వులును నల్వురుమద్రులునుంగా నేడ్వురు కొడుకులం బడసె; నది గావున 'నీవు మాయందు దైవానుగ్రహంబున నపత్యంబువడయు' మనినం గుంతిం జూచి పాండురాజు ధర్వ్యం బయిన యొక్క పురాణ కథం జెప్పెదం 'దొల్లి స్త్రీలు పురుషులచేత ననావృ్ఫత లయి స్వతంత్రవృత్తి నఖిలప్రాణిసాధారణం బైన ధర్మంబునం దమతమవర్హంబులయందు బుతుకాలంబు దప్పక నియతానియతపురుషు లయి ప్రవర్తిల్లుచున్న , నుద్దాలకుం డను నొక్కమహాముని భార్య నతిసాథ్వి నధికతపోనిధి యైన శ్వేతకేతుతల్లి బుతిమతి యైన దాని నొక్క వృద్ధవిప్రుం దతిథి యై వచ్చి పుత్రార్థంబు గామించిన శ్వేతకేతుం దలిగి యిది ధర్మవిరుద్ధం బని యాక్రోశించి దాని సహింపనోపక. 824

(ప్రతిపదార్థం: బుతుమతివి= ముట్టుఅయినదానివి; అయిన; అష్టమ, దివసంబునన్‌+ ఏనిన్‌= ఎనిమిదోరోజున కాని; చతుర్దశ

దివసంబునన్‌*ఏని= పద్దాలుగో రోజున కాని; శుచివి+ఐ= పరిశుద్ద మైన దాని వై; శయనంబునన్‌+ఉండి= పడకమీద ఉండి;

నన్నున్‌; తలంపుము; అనినన్‌; ఆదియున్‌= ఆమెకూడా; తత్‌+వచన+అను రూపంబునన్‌*+ చేసి= అతని యొక్క మాటకు తగినట్టుగా ఆచరించి; మువ్వురు; సొల్వులును; నల్వురు; మ(ద్రులునున్‌, కొన్‌; ఏడ్వురు=ఐ ఏడుమంది; కొడుకులన్‌; పడసెన్‌= పొందెను; అది; కావున; నీవు; మాయందు; దైవ+అనుగ్రహంబునన్‌; అపత్యంబు= సంతానాన్ని; పడయుముజ పొందుము; అనినన్‌; కుంతిన్‌; చూచి; పాండురాజు; ధర్మ్య్యంబు+అయిన= ధర్మసంబంధ మైన; ఒక్క; పురాణ, కథను; చెప్పెదన్‌; తొల్లి=ఐ పూర్వం; స్త్రీలు; పురుషులచేతన్‌! అనావృతలు+అయి= చుట్టుకొనబడనివా రై- అనగా కట్టడి లేనివా రై స్వతంత్ర, వృత్తిన్‌= స్వతం[త్ర మైన (ప్రవర్తనతో: అకిల ప్రాణి, సాధారణంబు+ఐన= అన్నిప్రాణులకు సామాన్య మైన; ధర్మంబునన్‌; తమ, తమ, వర్ణంబులఅందు= తమతమ జాతులల్‌, బుతుకాలంబు= ముట్టయిన తరువాత పదహారురోజులు; తప్పక= దాటకుండ; నియత+అనియత, పురుషులు+అయి= నియమింపబడిన, నియమింపబడని పురుషులు కలవా రై; ప్రవర్తిల్లుదు+ఉన్నన్‌; ఉద్దాలకుండు: అను; ఒక్క: మహా, ముని; భార్యన్‌: అతి, సాధ్విన్‌= మిక్కిలిపతిద్రత అయిన దానిని; అధిక, తపోనిధి, ఐన= అధిక మైన తపస్సునకు స్టానమైనవాడు అయిన; శ్వేతకేతు, తల్లి= శ్చేతకేతునియొక్క తల్లి; బుతుమతి+ఐన= ముట్టు అయినది కాగా; దానిన్‌; ఒక్క; వృద్ద, విప్రుండు= ముసలి(బ్రాహ్మాణుడు; అతిథి+ఐ; వచ్చి; పుత్ర+అర్ధంబు= కొడుకును పొందటంకొఆకు; కామించిన: శ్చేతకేతుండు; అలిగి= కోపించి; ఇది; ధర్మ, విరుద్దంబు= ధర్మానికి వ్యతిరేకం; అని; ఆ|్రోశించి= తిట్టి; దాని; సహింపక= ఓర్వక.

తాత్స్చర్యం: “నీవు ముట్టయిన ఎనిమిదో రోజు కాని, పద్నాలుగో రోజు కానీ పరిశుద్దురాల వై పడకమీద ఉండి నన్ను స్మరించుము'- అని అనగా ఆమె కూడా ఆ మాట(ప్రకారం చేసి ముగ్గురు సాల్వులను, నలుగురు మద్రులను

ఆదిపర్వము - పంచమాశ్వాసము శ్త5ర్‌ మొత్తం ఏడుగురు కొడుకులను కన్నది. కాబట్టి మాయందు నీవుకూడ దైవానుగ్రహంతో సంతానాన్ని పొందు” మని కుంతి చెప్పగా, పాండురాజు ఆమెను చూచి 'నీకు ధర్మసంబంధ మైన ఒక పురాణ కథ చెప్పుతాను. పూర్వం స్త్రీలు భర్తవలన కట్టడి లేని వాళ్ళయి, స్వతంత్రమైన ప్రవర్తన కలిగి, సర్వప్రాణి సాధారణ మైన ధర్మంతో, తమ తమ జాతులలో ముట్టయిన తరువాత గర్భ ధారణకు యోగ్యమైన పదహారురోజుల కాలం దాటకుండా, నియమింపబడిన లేదా నియమింపబడని పురుషులతో రమిస్తూ ఉండగా, మహాతపస్వి అయిన శ్వేతకేతుని తల్లి, మహాముని అయిన ఉద్దాలకుని భార్య, మహాపతివ్రత- ముట్టయి ఉన్న సమయంలో ఒక వృద్ద బ్రాహ్మణుడు అతిధిగా వచ్చి తనకు పుత్రుడు కావా లని ఆమెను కామింపగా, శ్వేతకేతుడు కోపించి, ఇది ధర్మ విరుద్దం అని తిట్టి దాన్ని సహించక. శ్వేతకేతుండు స్త్రీపురుషుల విషయంబున గావించిన కట్టడి (సం. 1-113-1)

సీ. 'ఇది యాదిగా సతు లెన్నండుం బర పురుషార్థినుల్‌ గాం జన; దన్యపురుషు

సంగమంబునం జేసి సకలపాతకములు నగు; బరిగ్రహ భూత లయిన సతుల

కిట్టైిద మర్యాద యి న్మునుష్యుల కెల్లం జేసితి లోక ప్రసిద్ధి గాంగ

నని ధర్వ్య మైన మర్యాద మానవులకు. దద్దయు హితముగా ధర్మమూర్తి ఆ. యబ్ద భవ సమానుం డగు శ్వేతకేతుండు , నిలిపి; నదియు ధారుణీ జనంబు

నందు లోకపూజ్య మై ప్రవర్తిల్లుచు , నుండె శిష్ట సంప్రయుక్తి జేసి. 85 పరపురుషులను కోరేవారుగా; కాన్‌, చనదు= కాకూడదు; పరి[గ్రహభూతులు+అయిన, సతులకు= చేపట్టబడిన స్త్రీలకు - అనగా పెళ్ళి అయిన (్రలకు; అన్య, పురుషు, సంగమంబునన్‌+చేసి= పరపురుష సంబంధం వలన; సకల, పాతకములున్‌= అన్నిపాపాలు; అగున్‌= కలుగును; ఇట్టిది+అజ ఇదే; మర్యాదజ కట్టుబాటు; ఈ+మనుష్యులకు+ ఎలన్‌= ఈ మానవులందరికి; లోక, ప్రసిద్ది, కాగన్‌= (ప్రపంచంలో ప్రసిద్దిచెందేట్టు;: చేసితి; అని; ధర్మ్య్యము+ఐన= ధర్మంతో కూడిన దైన; మర్యాదజ హద్దు; అబ్బ, భవ, సమానుండు+అగు= పద్మంనుండి పుట్టిన బ్రహ్మదేవునితో సమానమైన వాడైన; శ్వేతకేతుండు; నిలిపెన్‌= ఉంచెను; అదియు= ఆ నియమం); శిష్ట సంప్రయ్యుక్తిన్‌+చేసి= పెద్దల ఆచారంచేత, లోక్త పూజ్యము+ఐజ= లోకంచేత పూజింప తగినదై; ప్రవర్తిల్లుచున్‌+ ఉండె= నడుస్తూ ఉన్నది. తాత్పర్యం: 'ఇది మొదలు (స్త్రీలు ఎప్పుడూ పర పురుషులను కోరకూడదు, వివాహిత స్రీలకు పర పురుష సంగమం వలన సర్వపాపాలు కలుగుతాయి. ఈ కట్టుబాటు లోక ప్రసిద్దంగా మానవు లందరికీ చేశాను" - అని ధర్మంతో కూడిన ఈ కట్టడిని మానవులకు మేలు కలిగేటట్టు ధర్మమూర్తి, (బ్రహ్మతో సమానుడు అయిన శ్వేతకేతుడు ఏర్పాటు చేశాడు. ఆ మర్యాదనే శిష్టులంతా అనుసరించటంతో అది లోకానికి పూజింపతగిందై నడుస్తున్నది. వ. మజఖియు.. దిర్యగ్యోనులయందును నుత్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పుడుం

బ్రవర్తిల్లుచుండునట్లు మనుష్యులయందు శ్వేతకేతుం డు సేసిన ధర్మస్థితి కారణంబున నాటంగోలె. 86 ప్రతిపదార్థం: మజియున్‌; తిర్యక్‌+యోనుల, అందున్‌= పశుపక్ష్యాదులలోకూడ; ఉత్తర, కురు, దేశంబుల+అందును, మొదలింటి, ధర్మంబ= మొదటి పద్ధతే = అనగా ఆడు(ప్రాణి బుతుకాలంలో ఇష్టం వచ్చిన మగప్రాణితో రమించే పద్దతి" ఇప్పుడున్‌'

456 శ్రీమదాంధ్ర మహాభారతము

(ప్రవర్తిల్లుదు+ఉండున్‌= జరుగుతూ ఉన్నది; అట్టు= ఆ విధంగా; శ్వేతకేతుండు; మనుష్యుల, అందు; చేసిన; ధర్మ, స్థితి= ధర్మం

యొక్క ఉనికి; కారణంబున; నాటన్‌+కోలె= ఆ నాటినుండి.

తాత్పర్యం: పశు పక్ష్యాదులలోకూడ, ఉత్తర కురు భూములలో ఇప్పటికీ ఆడు(ప్రాణి బుతు కాలంలో ఏ నియమం

లేకుండా ఇష్టం వచ్చినట్టు మగ ప్రాణితో రమించే మొదటి పద్ధతే ఉన్నది. శ్చేతకేతుడు ఆ విధంగా మానవులలో

ఏర్పాటు చేసిన ధర్మంవలన ఆ రోజునుండీ.

క పురుషులచే ధర్మస్థితిం | బరిగ్రహాంపంగం బడిన భార్యలకు నిరం తరము నిజ పురుష భక్తియుం। బరపురుష వివర్దనంబుం బరిచిత మయ్యెన్‌. 87

ప్రతిపదార్థం: పురుషులచే; ధర్మ, స్థితిన్‌= ధర్మమార్గంతో: పరి[గ్రహింపంగన్‌*పడిన= వివాహం చేసికొనబడిన; భార్యలకు;

నిరంతరము= ఎల్లప్పుడు; నిజ, పురుష భక్తియున్‌= తమ భర్తల మీద భక్త పర, పురుష వివర్జనంబున్‌= పరపురుషులను విడవటం; పరిచితము+అయ్యెన్‌= అలవడినదిగా అయింది.

తాత్పర్యం: పురుషులు ధర్మమార్గంలో వివాహం చేసుకొన్న భార్యలకు, ఎల్లప్పుడూ తమ భర్తల మీద భక్తి కలిగి

ఉండటం, పర పురుషులను విడవటం అలవడింది.

త్తే, భర్తచేత నియోగింపం బడక సతికి : నెద్దియును జేయంగాం దగ; దెద్ది యైన భర్తచేత నియోగింపం బడిన దానిం జేయకునికి దోషం బని చెప్పె మనువు. 88

ప్రతిపదార్థం; “భర్తచేత; నియోగింపన్‌, పడకజ= ఆజ్ఞాపింపబడక; సతికిన్‌= భార్యకు; ఎద్దియును= ఏదీ; చేయగాన్‌; తగదు; ఎద్దిశఐన;

భర్తచేత; నియోగింపన్‌, పడిన, దానిన్‌= ఆజ్ఞాసింపబడినదానిని; చయక+జఉనికి= చేయకుండటం; దోషంబు; అని; మనువు; చెప్పె. తాత్సర్యం: భర్త ఆజ్ఞాపించనిదే భార్య ఏదీ చేయకూడదు. భర్త దేనిని ఆజ్ఞాపించినా అది చేయక పోవటం దోషం” అని మనువు చెప్పాడు.

వ పతి నియోగించిన దానిం జేయని నాయడు భార్యకుం బాతకం బని యెజింగి కాదె తొల్లి సౌదాసుం దైన కల్మాషపాదుం దను రాజర్ష్నిచేత నియుక్త యై వాని భార్య మదయంతి యనునది వసిష్టు వలన నళ్మేకుం డను పుత్తుం బడసె; నస్మజ్జన్మంబు నిట్టిద;: మహాముని యయిన కృష్ణద్వైపాయనువలనం గురుకులవృద్ధిపొంటె నే ముద్ధవిల్లితిమి; కావున నీ విన్నికారణంబులు విచారించి నా నియోగంబు సేయుము. 689

(ప్రతిపదార్థం; పతి= భర్త; నియోగించిన, దానిన్‌= ఆజ్ఞాపించిన దాన్ని: చేయని, నాండు= చేయని రోజు; భార్యకున్‌; పాతకంబు+అని= పాప మని; ఎజింగి= తెలిసి; కాదె=ఐ కదా; తొల్లి= పూర్వం సౌదాసుండు+ఐనజ సుదాసుడి కుమారు డైన; కల్మాషపాదుండు; అను; రాజ+బుషిచేత; నియుక్త*ఐ= ఆజ్ఞాపించబడినది అయి; వాని; భార్య; మదయంతి; అనునది; వసిష్టు వలనన్‌; ఆశ్శకుండు+అఆను; పుత్రున్‌; పడసెన్‌= పొందింది. అస్మత్‌+జన్మంబున్‌= మా పుట్టుక కూడా; ఇట్టిద= ఇటువంటిదే; మహా, ముని; అయిన; కృష్ణ ద్వైపాయను వలనన్‌; కురు, కుల, వృద్దిపొంటెన్‌= కురువంశవృద్ది కొరకు; ఏము= మేము; ఉద్భవిల్లితిమి= జన్మించాం: కావున; నీవు ఇన్ని; కారణంబులు= విచారించి; నా నియోగంబు= నా ఆజ్ఞ చేయుము.

తాచ్స్చర్యం: భర్త ఆజ్ఞాపించిన దానిని చేయని రోజు భార్యకు పాపం వస్తుం దని తెలిసే కదా, పూర్వం సుదాసుడి

కుమారు డైన కల్మాషపాదుడి ఆజ్ఞతో అతని భార్య మదయంతి వసిష్టునివలన అశ్మకు డనే పుత్రుడిని పొందింది.

ఆదిపర్వము - పంచమాశ్వాసము శ్తీ5?

మా పుట్టుక కూడా ఇటువంటిదే. మహాముని కృష్ణద్వైపాయనునివలన కురువంశం వృద్ది పొందటానికి మేము జన్మించాం. కాబట్టి నీవు ఈ కారణాలన్నీ విచారించి నేను చెప్పినట్టు చేయుము. చ అలయక ధర్మ్శశాస్తములయందు. బురాణములందు. జెప్ప ను

త్పలదళనేత్ర! విందుమ యపత్యము మే లని; కావునన్‌ యశో

నిలయుల. బుత్తులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ

దళ విలసన్మవీయ కరతామరసద్వయ యోజతాంజలిన్‌. 90 ప్రతిపదార్థం: ఉత్పల దళ, నేత్ర= కలువ రేకుల వంటి కన్నులు కలదానా; అలయక= విసుగులేకుండ; ధర్మశా(్తముల, అందున్‌, పురాణములు, అందున్‌; చెప్పన్‌= చెప్పగా; అపత్యము= సంతానం; మేలు; అని; విందుము+అ= వింటున్నాం కదా; కావునన్‌; యశు+నిలయులన్‌= కీర్తికి స్పాన మైన వారిని; పుత్రులన్‌:; పడయు= పొందుము; సంగత+అంగుళీ, దళ, విలసత్‌*మదీయ, కరః తామరస, ద్వయ, యోజిత, అంజలిన్‌= కూడినద్రేళ్ళు అనే రేకులతో (ప్రకాశిస్తున్న నా కర కమలాల జంటచేత కూర్చబడిన నమస్కారాన్ని; నీకు; ఒనరించెద= చేస్తాను. తాత్సర్యం:- కలువ రేకులవంటి కన్నులు కల ఓ కుంతీ! విసుగు లేకుండా ధర్మశా(స్తాలలోను, పురాణాలలోను సంతానం మే లని చెప్పగా వింటున్నాంకదా! అందువల్ల క్షీర్తిమంతు లైన పుత్రులను పొందుము. కమలాల జంట వంటి నా చేతు లెత్తి నీకు నమస్కారం చేస్తాను. విశేషం; అలం: రూపకం. పాండురాజు కరకమలాలను జోడించి భార్యను ప్రార్ధించటంలో ఒక వైశిష్ట్యాన్ని ప్రదర్శించాడు. పాండురాజు చెప్పిన కధనాన్ని బట్టి సమాజ వ్యవస్థలో పూర్వం మాతృ స్వామ్య వ్యవస్థ మాత్రమే ఉండేది. ఆ తరువాత శ్వేతకేతువు మొదలైనవాళ్ళు వివాహిత అన్యపురుషసంయోగం పొందటం పాపమనే కట్టుబాటు ఏర్పరచి పీతృస్వామ్య వ్యవస్టకు ప్రాతిపదికలు వేశారు. మధ్యే మార్గంగా దేవరన్యాయం ప్రవర్రిల్లింది. దానితో మిశ్ర స్వామ్య వ్యవస్థ తలయొత్తింది. భర్త బ్రతికిఉండగా అన్య పురుష స్మరణం, (గ్రహణం సముచితం కాదని కుంతి చెప్పింది. కాని, పాండురాజు, పతి అనుమతితో దేవరన్యాయంతో కలిగే సంతానం - క్షేతజులను- పొందుమని మాతృస్వామ్య ప్రవృత్తిని ప్రార్షిస్తున్నాడు దేవాంశసంభూతులు దేవరన్యాయజులకంటె ఉత్తములని కుంతి అభిప్రాయం. నమస్కరించే పాండురాజులో పుత్రులకొరకైన దైన్యం, మాతృవ్యవస్థ్రమీది గౌరవం ధ్వనిస్తున్నాయి. (సంపా) వు అని పుత్రముఖావలోకన లోలత్వంబున దీన నదనుం డై దేవిం బ్రార్జించినం గుంతియుం బుత్రోత్స్పాదనోన్నుఖే

యై కుంతిభోజునింటం దన కొండుకనా(డు దుర్వాసునిచేతం బడసిన మంత్రంబుతెఅంగు పతి కెటింగించి

'యమ్మంత్రంబున కిది యనసరం బయ్యె; నేవేల్పు నారాధింతు? నానతి' మ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం

బాండురా జి ట్లనియె. తశ (ప్రతిపదార్థం: అని; పుత్ర ముఖ+అవలోకన, లోలత్వంబున= కొడుకుల ముఖాన్ని చూడా లనే ఆసక్తితో - అనగా కొడుకులు కావా లనే కోరికతో; దీన, వదనుండు+ఐ= దీన మైన ముఖం కలవా డ్రై; దేవిన్‌= భార్యను - కుంతిని; ప్రార్టించినన్‌: కుంతియున్‌; పుత్ర+ఉత్సాదన+ఉన్ముఖి+ఐ= కొడుకులను పుట్టించటంలో అనుకూలమైనది అయి; కుంతిభోజు, ఇంటన్‌; తన, కొండుక, నాండుక తన చిన్నతనంలో; దుర్వాసుని చేతన్‌: పడసిన= పొందిన; మంత్రంబు; తెజంగు= మంత్రంయొక్క విధం; పతికి= భర్తకు; ఎజింగించి= తెలిపి; ఆ+మంత్రంబునకు; ఇది; అవసరంబు= సమయం; అయ్యెన్‌; ఏ, వేల్పున్‌= ఏ దేవుడిని; ఆరాధింతున్‌= సేవింతును; ఆనతి; ఇమ్ము; అనిన; సంతసిల్లి; కుంతీదేవికిన్‌; పాండురాజు: ఇట్టు+అనియె.

క్షర్‌8ీ శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: అని కొడుకుల ముఖాన్ని చూడా లనే కుతూహలంతో దీన వదను డై పాండురాజు కుంతిని ్రార్జించగా ఆమె కూడా కొడుకులను కనాలనే కోరికకు అనుకూలమైనదై, తన చిన్నతనంలో కుంతిభోజుని ఇంట్లో దుర్వాసునిచేత తాను పొందిన మంత్ర విషయాన్ని భర్తకు చెప్పింది. 'ఆ మంత్రానికి ఇది సమయ మనీ, ఏ దేవుడిని సేవించాలో ఆజ్ఞాపించు" మని భర్తను అడిగింది, పాండురాజు సంతోషించి.

క. లలితాంగి! యెల్లలోకం । బులు ధర్మువునంద నిలుచు6 బోలుపుగ ధర్ముం

దలయు్రుమ; యాతండ మటి వే। ల్పుల లోపలం బెద్ద ధర్మమున సత్యమునన్‌. 92 ప్రతిపదార్థం: లలిత+అంగి= అంద మైన శరీరం కలదానా! ఓ కుంతీ! ఎల్ల, లోకంబులు; ధర్మువు, అంద= ధర్మం మీదే; పాలుపుగ= స్థిరంగా; నిలుచున్‌? ధర్మున్‌= ధర్మదేవతను; తలంపుము+అ= స్మరించుము; మథి; వేల్పుల లోపలన్‌= దేవతలలో; ధర్మమునన్‌; సత్యమునన్‌: ఆతండు+అ= అతడే; పెద్ద= గొప్పవాడు.

తాత్సర్యం: అందమైన శరీరం కల ఓ కుంతీ! అన్ని లోకాలు ధర్మంమీదే స్థిరంగా నిలుస్తాయి. ధర్మదేవతను

స్మరించుము. దేవతలలో ధర్మంలోనూ, సత్యంలోనూ అతడే పెద్దవాడు.

విశేషం: “విశ్ళం ధరతీతి ధర్మః” లోకాన్ని ధరించేది ధర్మం. ఆ ధర్మానికి అధిదేవత ధర్ముడు; అతడిని స్మరించి సంతానాన్ని

పొందటంలో పాండురాజుయొక్క విశ్వ(శ్రేయోదృష్టి వ్యక్తమౌతున్నది. ధర్మాన్ని రక్షించే సంతానాన్ని కోరటం ఉత్తమ గృహస్టుయొక్క

ధర్మం. పుట్టబోయే కొడుకు మూర్తికట్టిన ధర్మం కావాలని పాండురాజు సంకల్పం.

న. అని నియోగించినం గుంతియుం బతికి. బ్రదక్షిణంబు€ జేసే సమాహిత చిత్త యై మహాముని యిచ్చిన మంత్రంబు విధివంతంబుం జేసి ధర్ముని నారాధించిన, నా ధర్ముండును యోగమూర్తి ధరుం డై నచ్చి వరం బిచ్చినం, గుంతియుం దత్ర్రసాదంబున గర్ధంబు దాట్రి సంవత్సరంబు పరిపూర్ణం బైన. 93

ప్రతిపదార్థం: అని; నియోగించినన్‌= అజ్ఞాపించగా; కుంతియున్‌; పతికిన్‌= భర్తకు; ప్రదక్షిణంబున్‌; చేసి; సమాహిత, చిత్త+ఐ= నిలువబడిన మనస్సు కల దై; మహాముని; ఇచ్చిన; మంత్రంబు; విధి, వంతంబున్‌= విధితో కూడిన దానినిగా; చేసి; ధర్ముని= ధర్మదేవతను; ఆరాధించినన్‌= ప్రార్ధించగా; ఆ, ధర్ముండును; యోగ, మూర్తి, ధరుండు+ఐ= యోగబలంచేత ఆకారాన్ని ధరించినవా డై; వచ్చి; వరంబు; ఇచ్చినన్‌; కుంతియున్‌; తత్‌+ఫ్రసాదంబున= అతని దయచేత; గర్భంబు; తాల్చిజ ధరించి; సంవత్సరంబు; పరిపూర్ణంబు+ఐన= పూర్తి కాగా.

తాత్పర్యం: అని అజ్ఞాపించగా, కుంతీదేవి భర్తకు (ప్రదక్షిణం చేని, మనస్సు నిలిపి మహాముని ఇచ్చిన మంత్రాన్ని

యథావిధిగా జపించి ధర్మదేవతను (ప్రార్ధించింది. ధర్ముడు యోగంచేత రూపాన్ని ధరించి వచ్చి వర మిచ్చాడు.

కుంతీదేవి అతని దయ వలన గర్భం ధరించి సంవత్సర కాలం పూర్తి కాగానే.

విశేషం: కుంతి గర్భంధరించి, సంవత్సరకాలం పూర్తిఅయిన తరువాత - కుమారుడిని కన్నట్టు ఈ కధనంలో ఉన్నది. సంవత్సరకాలం

గడిచినట్టు మూలంలో చెప్పబడలేదు. కుంతీదేవి ధర్ముడిని ఆహ్వ్యానించేనాటికే గాంధారి ఒక సంవత్సరం గర్భవతి అయిఉన్నది.

సంవత్సరధృతే గర్భే గాంధార్యా జనమేజయ!” అనిమూలం,. (భం.ఆది.పు.505)

ఆదిసర్వము - పంచమాశ్వాసము శ్తక9 కుంతీదేవియందు ధర్మరాజు జననము (సం.1-114-3) ఉ. _ శాత్రవజైత్రతేజమున సర్వదిశల్‌ వెలుంగంగ నైంద్ర న క్షత్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నత మైన యసష్టమిన్‌ మిత్రముఖగ్రహప్రతతి మేలుగ నాభిజతోదయంబునం బుత్రుండు ధర్మునంశమునం బుట్టె నతిస్థిరధర్మమూర్తి యై. 94 ప్రతిపదార్హం; శాత్రవ, ద్వైత, తేజమున= శత్రువులను జయించే పరాక్రమంతో; సర్వ, దిశల్‌= అన్నిదిక్కులు: వెలుగంగన్‌; శశి= చంద్రుడు; ఐరద్ర, నక్షత్ర, యుతుండుగా= జ్యేష్టా నక్షత్రంతో కూడిన వాడుగా; ప్రకాశ జయ+ఉన్నతము+ఐన= కాంతితో, జయంతో ఉచ్చస్థితిలో ఉండగా; అష్టమిన్‌; మిత్ర ముఖ, (గ్రహ. ప్రతతి= సూర్యుడు మొదలైన (గ్రహాల సమూహం; మేలుగన్‌= బాగుండగా; ఆభిబిత+ఉదయంబునన్‌= అభిజిన్ముహూర్తం (ప్రారంభంలో; ధర్ము, అంశమునన్‌= ధర్ముని యొక్క అంశచేత, పుత్రుండు; అతి, స్థిర ధర్మ, మూర్తి+ఐ= మిక్కిలి స్థిర మైన ధర్మం ఆకారంగా కలవా డై; పుట్టెన్‌. తాత్పర్యం: దిక్కులన్నీ వెలుగగా, చంద్రుడు జ్యేష్టా నక్షత్రంతోకూడి ఉచ్చస్థితిలో ఉండగా, సూర్యాది (గ్రహాలు శుభన్థానాలలో ఉండగా, అష్టమినాడు అభిజిను శ్రహార్త (ప్రారంభంలో ధర్మదేవత అంశచేత శతువులను జయించగల పరా[క్రమంతో ధర్మరాజు జన్మించాడు. విశేషం: ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణప్రతిలో ఈక్రింది వివరణం అధస్సూచికలో ఇవ్వబడింది: “యుధిష్టిరుండు వికృతి సంవత్సర ఫాల్గుణ బహుళ అష్టమియందు జన్మించినట్టు భారతకూలంకష వ్యాఖ్యాకారుండు వివరించెను. కలియుగాది (ప్రనూది సం వైైత్రశుద్ధపాడ్యమిగనుక, ఆ పయిని నూటయెనిమిది యేళ్ళ యెనిమిది దినముల క్రిందట యుధిస్టిర జననము. ఆ తిధికి

  • అనగా ఫాల్గునబహుళఅష్టమికి - జ్యేష్టానక్షత్రము వచ్చును. జయతిధిన్నీ అవును. ధర్మరాజు తరువాత సంవత్సరమునకు భీముని పుట్టుక - ఖరసం ర ఫాల్లునళుక్షత్రయోదళి మాఘనక్షత్రము. దుర్యోధనుండు భీమునికన్న మూండుయామములు 'చింన్న” చిన్న అర్జునుండు నందనసం। ర ఫాల్గుణళుక్త పౌర్షమాసి” (పుట. 279), సంశోధితము[ద్రణప్రతిలో 'శాత్రవ', 'మిత్ర శబ్దప్రయోగం ఉన్నది. వావిళ్ళప్రతిలో 'మిత్ర' శబ్దం ఉంది. 'క్షత్ర' శబ్దం 'క్షత్ర గా వాడబడింది. ఈ రెండింటిని గమనించి (ప్రాససామ్యం పరిష్కరించటమైనది. నన్నయ ధర్మజుని పుట్టుకను ఉత్పలమాలలో వర్షించాడు. మహావీరుల పుట్టుకలను, వారికి సంబంధించిన అంశాలను వర్షించినప్పుడు కొన్నిటికి ఉదాత్త గంభీర మైన ఉత్పల చంపకమాలా వృత్తాలను ఎన్నుకొని నన్నయ సజాతీయ ఛంచస్సంవాద శిల్పాన్ని వెలార్భి పద్యవిద్యను (ప్రదర్శించాడు. ఉదాహరణకు: కర్ణుని పుట్టుక (5.26), పాండురాజు తనకు సంతానాన్ని సమకూర్చుమని కుంతిని కోరటం (5.90), వ్యుషితాశ్వుని పరాక్రమం (578), మరొక పుత్రునికొారకు వాయుదేవుడిని ఉపాసించుమని పాండురాజు కుంతిని కోరటం (5.102, భీముని పుట్టుక (5.104), ఇంద్రుని అంశతో కుమారుడిని కనుమని పాండురాజు కుంతిని కోరటం (5.120), ధర్మజాదుల నందరిని పాండురాజపుత్రులుగా గుర్తించి హస్తివాపురి ప్రజలు మొదటిసారిగా వారిని చూచినతీరు (5.150) మొదలైన చోట్ల చంపకమాలలు గమనించతగినవి. ధర్మరాజు జననం (5-9), ధృతరాష్ట్రరాజ్యపాలనం(5.6), పాండురాజవిలాసం(5.47). సంతానం కొరకు ప్రార్ధన (5.73), మాద్రి సంతానం కొరకు పరితపించటం (5. 129), హస్తినాపుర ప్రజలు పాండవులను అసాధారణ వ్యక్తు లని క్షీర్తించటం (5.151) (5.153), ఏకలవ్యునివర్షనం (5.235) ఉత్పలమాలలో ఉన్నాయి. ఈ పద్యాలన్నింటిలో కంటె ధర్మజుని పుట్టుక వర్ణించే ఉత్పలమాల వృత్తంలో సంయుక్షాక్షరంతో దుష్కరప్రాస వాడి మిగిలినవారికంటె ధర్మజుని సంక్లిష్టమైన ఉదాత్త వ్యక్తిత్వాన్ని ధ్వనింపచేయటం విశేషం. పద్యరచనలో కాంతి అనే శబ్దగుణాన్ని ఉజ్బలంగా పోషించి నన్న్మయ గుణవ(ద్రచనాశిల్పాన్ని వెలార్చాడు. 'శాత్తవ జైత్ర తేజమున సర్వదిశల్‌ వెలుగంగ' అనే విశేషణంలోనే కాంతిగుణం సూచించబడింది. ఉజ్ఞల మైన తారాచం[ద్ర (గ్రహ దైవబలాల వర్షనతో అది ప్రకాశించింది. జ్యేష్వా నక్షత్రం(పెద్దవాడుగా సూచించే నక్షత్రం)తో తారాబలం, చంద్రుడి శుభస్టితిత చంద్రబలం, మిత్రగ్రహస్థితితో గ్రహబలం, 'అతిస్టిరధర్మమూర్తి' అనిచెప్పి లోకాన్ని ధరించే ధర్మమే మూర్తికట్టినవాడని చెప్పటంతో దైవబలం సూచించటంవలన ఒక పరిపూర్ణపురుషుడి ఉజ్జ్వల వ్యక్తిత్వాన్ని నన్నయ ధ్వనింపచేశాడు. జననకాల శుభ(గ్రహలక్షణాదుల వివరంతో ఇతిహాోసనాయకు డైన ధర్మజుడి జన గ్రఘట్టాన్ని వర్షించి(ఇతరులకు ఈ వివరాలు ఇవ్వలేదు) అతడు భావికాలంలో చరిత్రపై వేయబోయే ప్రభావాన్ని ధ్వనిమయంగా నన్నయ సూచించాడు. (సంపా)

ఉ60 శ్రీమదాంధ్ర మహాభారతము

క. _ ధరణీసురు లాదిగ ను । ర్వరలో( గల సర్వభూతవర్గం బెల్లం

బరమోత్సవ మొందెను గుణ । శరణ్యుం డగు ధర్మజన్సు జన్మదినమునన్‌. 95 ప్రతిపదార్హం: ధరణీ, సురులు+ఆదిగన్‌= బ్రాహ్మణులు మొదలుగా; ఉర్వరలోన్‌= భూమిమీద; కల= ఉన్న; సర్వ, భూత వర్గంబు=

ల

అన్ని ప్రాణుల సమూహం; ఎల్లన్‌= అంతయు; గుణ, శరణ్యుండు= మంచిగుణాలకు స్టానమైనవాడు; అగు; ధర్మ, జన్ము, జన్మ దినమునన్‌= ధర్ముడినుండి పుట్టిన వానియొక్క జన్మదినాన - అనగా ధర్మరాజు పుట్టినరోజున, పరమ+ఉత్సవము= మిక్కిలి ఆనందం; ఒందెను= పొందాయి. తాత్పర్యం: గుణవంతు డైన ధర్మరాజు పుట్టినరోజున బ్రాహ్మణులు మొదలుకొని భూమిమీద ఉన్న అన్ని ప్రాణులు ఎంతో ఆనందాన్ని పొందాయి. విశేషం: ఇది శుభకరమైన మహాళకునం. సర్వభూతహితుడు, ధర్మరక్షకుడు, ప్రజారంజకుడైన స(మ్రాట్టుకానున్నాడన్న భావిసూచన ఇందులో ధ్వని, క శతశ్ళంగ నిలయు లగు సం । శ్రితప్రతులు విప్రవరులు సేసిరి ధర్మ

స్థితి జాతకర్మ మత్యు । న్నతిం బాండుప్రధమ పుత్తునకు హర్షముతోన్‌. 96 ప్రతిపదార్థం: పాండు, ప్రధమ, పుత్రునకు= పాండురాజుయొక్క మొదటికుమారునికి; శత, శృంగ, నిలయులు+అగు= శతళ్ళంగ పర్వతాన్ని ఉనికిపట్టుగా కలవాళ్ళయిన; సంథ్రిత, వ్రతులు= ఆ(శ్రయింపబడిన (వ్రతం కలవాళ్ళు; విప్ర, వరులు= (బ్రాహ్మణ (శ్రేష్టులు; ధర్మ, స్టితి= ధర్మమార్గంలో; అతి+ఉన్నతిన్‌= మిక్కిలి గొప్పగా: జాతకర్మము= పుట్టినప్పుడు శిశువుకు చేసే సంస్కారం; హర్షముతోన్‌= సంతోషంతో; చేసిరి. తొత్సర్యం: పాండురాజుయొక్క మొదటి కుమారునికి శతశ్చంగపర్వతంమీద (వ్రతదీక్ష పూని ఉన్న (బ్రాహ్మణ (శ్రేష్టులంతా ధర్మమార్గంలో సంతోషంతో చాలాగొప్పుగా జాతకర్మ చేశారు. కు కురుకుల విభుం డగు ధర్మ: స్టిరమతి యగు నీతం డనుచు ధృతిః జేసి యుధి

స్టిరుం డను నామముందా ను। ఛ్చరించె నాకాశవాణి జనవినుతముగన్‌. ం్ర7 ప్రతిపదార్థం: “ఈతడు; కురు, కుల, విభుండు= కురువంశానికి రాజు; అగు; ధర్మ, స్థిర, మతి= ధర, గంలో స్టైర మైన బుద్రికలవాడు; అగు; అనుచున్‌్‌ ఆకాశవాణి; ధృతిన్‌+చేసి= ధైర్యం వలన; యుధిస్టిరుండు= యుద్ధంలో నిలుకడ కలవాడు; అను; నామమున్‌= పేరును; తాను; జన. వినుతముగన్‌= జనులచేత కొనియాడబడేది జౌనట్టుగా; ఉచ్చరించెన్‌= పలికింది. తాత్సర్యం: “ఈతడు కురువంశానికి రాజవుతాడు, ధర్మంలో స్థిర మైన బుద్ది కలవాడు అవుతాడు. ధైర్యంవలన యుధిష్టిరు డవుతాడు' అని ఆకాశవాణి లోకంకొనియాడేటట్టుగా ఆతనికి యుధిస్టిరుడనే పేరు పెట్టింది. విశేషం: ఆకాశవాణి పేరుపెట్టటంచేత యుధిస్టిరుడు దేవహితుడని సూచన. పాండుధృతరా్త్రుల తరువాత వంశకర్తల గొారనం నిలిపే చక్రవర్తి అత డౌతాడనీ, ధర్మాచరణంలో వీరుడూ ధీరుడూ స్టిరుడూ అయి ధర్మవీర రస ప్రధాన కధానాయకుడు కాగలడని ధ్వని - మహాభారతేతిహాసంలో మొదటినుండి చివరిదాకా ధృతితో నిలిచే ధర్మమూర్తి, యుధిష్టరుడు. (సంపా.)

ఆదిపర్వము - పంచమాశ్వాసము తేర గాంధారి యుదరతాడనంబు గొవించుకొనుట (సం.1-107-8)

వ. ఇట్లు పుత్తోదయంబునం బరమహర్ష సంపూర్ణ హృదయుం డై పాండురాజు కుంతీ మాద్రీ సహితుం డై శతశ్చంగంబున నుండునంత, నట ముందజ ధృతరాస్తువలనన్‌ గాంధారి కృష్ణద్వైపాయనువరంబున గర్ధంబు దాల్చి యొక్కసంవత్సరంబు నిండిన బ్రసూతి కాకున్నం బదరుచు బుత్రలాభలాలస యయి యున్న యది యప్పు డయ్యుభ్యోకుజన్మంబు విని మనస్తాపంబున నుదరకాడనంబు జేసికొనిన, గ్భుపాతం బగుడును. 98

ప్రతిపదార్థం: ఇట్టు; పుత్ర+ఉదయంబునన్‌= కొడుకు పుట్టుక చేత; పరమ, హర్ష సంపూర్త హృదయుండు+ఐజ= ఎక్కువ సంతోషం

చేత నిండిన మనస్సు కలవాడై; పాండురాజు; కుంతీ, మాద్రీ, సహితుండు+ఐ= కుంతీదేవితో, మాద్రితో కూడినవాడ్రై; శతశ్చంగంబునన్‌; ఉండునంతన్‌= ఉండగా; అట= అక్కడ - హస్తినాపురంలో: ముందజ: ధృతరాష్రవలనన్‌; గాంధారి; కృష్ణదైపాయను, వరంబున= కృష్ణద్యైపాయనుని వరంచేత; గర్భంబు; తాల్చి; ఒక్క, సంవత్సరంబు; నిండినన్‌; ప్రసూతి= కొన్సు; కాకున్నన్‌; పదరుచు= త్వరపడుచు; పుత్ర లాభ, లాలస+అయి= కొడుకును పొందాలనే మితిమీరిన ఆసక్తి కలది అయి; ఉన్న, అది; అప్పుడు, ఆ+యుధిస్టిరు, జన్మంబు= ఆ యుధిస్టిరుని పుట్టుకను; విని; మనః, తాపంబునన్‌= మనస్సులోని దుఃఖంచేత; ఉదర, తాడనంబున్‌= కడుపును బాదుకోవటం; చేసికొనిన; గర్భ, పాతంబు= గర్భం క్రిందపడటం; అగుడునుజ కాగా. తాత్పర్యం: ఇట్టా కొడుకుపుట్టటం వలన ఎంతో ఆనందించి పాండురాజు కుంతీమాద్రులతో శతశృంగాన ఉండగా, హస్తినాపురంలో కృష్ణద్యైపాయనునివరంచేత, ధృతరా(ఘ్టునివలన, కుంతికన్నా ముందే గర్భవతి అయిన గాంధారి. ఒక సంవత్సర మైనా తనకు కాన్సు కాకపోవడంతో త్వరపడుతూ కొడుకును పొందాలని తహతహలాడుతూ ఉండగా, యుధిష్టిరుడు కుంతికి పుట్టాడని విని కడుపును బాదుకోగా గర్భపాత మయింది.

విశేషం: తల్గుల మనఃప్రవృత్తులకు పిల్లలు ప్రతిబింబా లౌతారు. విశ్చశ్రేయస్సును కోరి ధర్మమూర్తిని కోరి కన్నది కుంతీదేవి.

కుంతీదేవికంటె ముందే గర్భవతి అయినా, తాలికాన్సు కుంతీదేవికే దక్కిందని అసూయతో తన గర్భాన్ని తానే విచ్చిన్నం చేసుకొన్నది

గాంధారి. ధర్మరాజు వంశాన్నీ, ధర్మాన్నీ నిలిపేవాడౌతాడు; దుర్యోధనాదులు వంశాన్ని విచ్చిన్నం చేసే వా రౌతారు. ఇది వస్తుద్వని.

(సంపా)

క, దాని నెలళింగి పరాశర । సూనుయ చనుదెంచి సుబలసుతం జూచి 'మనో హీన వయి గర్భపాతము : గా నిట్టులు సేయు టిదియు. గర్తవ్యం బే.' 99

ప్రతిపదార్థం: దానిన్‌; ఎతింగి= తెలిసికొని; పరాశర, సూనుండువ= పరాశరుని కుమారుడు - కృష్ణద్యైపాయనుడు; చనుదెంచి= వచ్చి; సుబల, సుతన్‌= సుబలునియొక్క కూతురిని - గాంధారిని; చూచి; మనోహీనవు+అయిజు మనస్సులేని చాన మై చర్య పాతముజ= గర్భం క్రిందపడుట: కాన్‌=ఐ అగునట్టుగా; ఇట్టులు= ఈ విధంగా; చేయుట; ఇదియున్‌, కర్తవ్యంబు+ఏ= చేయతగిందా? తాత్పర్యం: అది తెలిసి కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. గాంధారిని చూచి నీవు బుద్ది లేకుండా ఈవిధంగా గర్భపాతం చేసికొనటం తగునా?" అన్నాడు.

క ఇమ్మాంసపేశి నేకశ । త మ్ముదయింతురు సుతులు ముదమ్మున; నిది త థ్యః మ్మింక నైన నతియ ; త్నమ్మున రక్షింపు దీని నా వచనమునన్‌, 100

ప్రతిపదార్థం: ఈ+మాంస, పేశిన్‌= ఈ మాంసపు ముద్దనుండి; ఏక శతమ్ము= నూటొక్కమంది; సుతులు= కుమారులు, కూతుళ్ళు;

ముదమ్మునన్‌= సంతోషంతో; ఉదయించుదురు=ఉదయింతురు= పుట్లుతారు; ఇది; తధ్యమ్ము= నిజం: ఇంకన్‌, ఐనన్‌; నా బి

క62 శ్రీమదాంధ్ర మహాభారతము

వచనమునన్‌= నా, మాటచేత; దీనిన్‌= ఈ మాంసపుముద్దను; అతి, యత్నమ్మున= మిక్కిలి ప్రయత్నంతో; రక్షింపు= కాపాడుము

తాత్పర్యం: ఈ మాంసపు ముద్దనుండి నూటొక్కమంది కొడుకులు కూతుళ్ళు (నూరుగురు కొడుకులు,

ఒకకూతురు) పుట్టుతారు. ఇది నిజం. నా మాట నమ్మి దీనిని చాల జా(గ్రత్తగా కాపాడుకొమ్ము.

విశేషం: ఏకళశతము - (చూడు, 9వ పద్యవిశేషం).

వ. _అనిగాంధారింబదరితొల్లి వేదంబులు విభాగించిన మహానుభావుం డమ్మాంస పేశి నేకోత్తర శతఖండంబులుగా విభాగించి 'వీని వేలు వేఐ ఘృత కుండంబులం బెట్టి శీతలజలంబులం దడుపుచు నుండునది; యిందు నూర్వురు గొడుకులు నొక్కకూతురుం బుట్టుదు' రని చెప్పి చనినం దద్వచనప్రకారంబు చేయించి గాంధారీ ఛృతరాష్తులు సంతసిల్లియున్న నిట శతశ్చంగంబున. 101

(ప్రతిపదార్హం: అని; గాంధారిన్‌; పదరి= నిందించి; తొల్లిజ పూర్వం; చేదంబులు; విభాగించిన;: మహానుభావుండు ఆ+మాంస,

పేశిన్‌= ఆ మాంసపు ముద్దను; ఏక+శఉత్తర, శత, ఖండంబులుగా= నూటొక్క ముక్కలుగా; విభాగించి; వీని= ఈ ముక్కలను; వేటు, వేజ; ఘృత, కుండంబులన్‌= నేతికుండలలో; పెట్టి; శీతల, జలంబులన్‌= చల్లని నీటితో; తడుపుచున్‌; ఉండునది; ఇందు; నూర్వురు; కొడుకులున్‌; ఒక్క, కూతురున్‌, పుట్టుదురు; అని; చెప్పి; చనినన్‌= వెళ్ళగా; తత్‌+వచన, (ప్రకారంబు= ఆయన మాట ప్రకారం; చేయించి; గాంధారీ, ధృతరా(ష్త్రులు: సంతసిల్లి; ఉన్నన్‌; ఇట; శతశ్చంగంబున. తాత్పర్యం: అని గాంధారిని ఆక్షేపించి, పూర్వం వేదాలను విభజించిన మహానుభావుడు వ్యాసుడు, ఆ మాంసపు ముద్దను నూటొక్క ముక్కలుగా చేసి, “వేర్వేరుగా వీటిని నేతి కుండలలో పెట్టి, చన్నీళ్ళతో తడుపుతూ ఉండండి. వీటినుండి వందమంది కొడుకులు, ఒక్క కూతురు పుట్టుతారు' అని చెప్పి వెళ్ళగా, గాంధారీ ధృతరా(్ష్రులు ఆయన చెప్పిన ప్రకారం చేయించి సంతోషంతో ఉండగా - ఇక్కడ శతశ్చంగ పర్వతం దగ్గర. చ. నిరుపమకీర్తి పాండుధరణీపతి వెండియుం గుంతిం జూచి 'యం

బురుహదళాక్షి! యింక నొకపుత్తు నుదారచరిత్రు నుత్తమ

స్థెరజనసత్త్వు నయ్యనిలదేవుదయం జనియింపు పెంపుతోం

గురుకులరక్షకుం డత డగున్‌ బలవద్దుజవిక్రమోన్నతిన్‌'. 102 (ప్రతిపదార్థం: నిరుపమ, కీర్తిఐ సాటిలేని కీర్తి కలవాడు; పాండుధరణీపతి= పాండురాజు; వెండియున్‌= మళ్ళీ; కుంతిన్‌: చూచి; అంబురుహ, దళ+అక్షిజ తానమరరేకులవంటి కన్నులు కలదానా; ఇంకన్‌; ఒక, పుత్రున్‌; ఉదార, చరిదత్రున్‌= గొప్పనడవడి కలవాడిని; ఉత్తమ, స్థిర జవ, సత్తున్‌= (శ్రేష్ట మైన, స్టిరమైన వేగం, బలం కలవానిని; ఆ+అనిలదేవు, దయన్‌= ఆ వాయుదేవునిదయచేత; జనీయింపుజ వుట్టించుము; అతడు; పెంపుతోన్‌= గొప్పతనంచేత; బలవత్‌+భుజ, విక్రమ+ఉన్నతిన్‌= బలమైన భుజాల పరాక్రమం యొక్క అతిశయంచేత; కురు, కుల, రక్షకుండు= కురువంశాన్ని రక్షించేవాడు; అగున్‌. తాత్పర్యం: సాటిలేని కీర్తి కల పాండురాజు కుంతీదేవిని చూచి, “నీవు గొప్పనడవడి కలవాడు, శ్రేష్ట మైన, స్టైర మైన వేగం, బలం కలవాడు అయిన మరో కొడుకును వాయుదేవుని దయతో కనుము. అతడు గొప్పగా తన భుజ బల పరా(క్రమంచేత కురువంశళాన్ని రక్షిస్తాడు.” విశేషం: పాండురాజు పుత్రసంకల్పాలు విశిష్టంగా ఉన్నాయి. సత్యాన్నీ, ధర్మాన్నీ సర్వలోకంలో నిలుపగలిగినవాడుగా మొదటికొడుకును కోరాడు. ధర్ముడిని ఆరాధించి యుధిస్టిరుడిని పొందాడు. ఇప్పుడు మహాబలశాలి అయిన కొడుకును వంశరక్షణం కొరకు

ఆదిపర్వము - పంచమాళ్వాసను 463 కోరుకొంటున్నాడు. ముందు ధర్మరక్షణం (లోకరక్షణ౦) ఆ తరువాత వంశరక్షణ౦. ఆ (క్రమంలో పాండురాజాయొక్క ధార్మికచింతన వెల్లడిఅవుతున్నది. పాండురాజు చంద్రవంశ కర్తలలో ఒకడుకదా! (సంపా.)

న. అనిపనిచిన నెప్పటియట్ల కుంతీదేవి వాయుదేవు నారాధించి తత్ర్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు

సంపూర్ణం బగుడును. 103 ప్రతిపదార్థం: అని; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; ఎప్పటి, అట్ట; కుంతీదేవి; వాయుదేవున్‌, ఆరాధించి; తత్‌+*ప్రసాదంబున= ఆయన అను(గ్రహంచేత; గర్భంబు; తాల్చిజ ధరించి; సంవత్సరంబు; సంపూర్ణంబు; అగుడునుజ కొగొ. తాత్చర్యం: అని ఆజ్ఞాపించగా ఎప్పటివలెనే కుంతీదేవి వాయుదేవుడిని పూజించింది. అతని దయవలన గర్భం తాల్చింది. ఒక ఏడాది పూర్తి కాగానే- చ. సుతుండు నభస్వదంశమున సుస్థెరుం డై యుదయించినన్‌ మహా

యతికృత జాతకర్షుం డగు నాతని కాతతవీర్యవిక్రమో

న్నతునకు భీమసేను. డను నామము. దా నొనరించె దివ్యవా

కృతి శతశ్చంగనైల నివసన్మునిసంఘము సంతసిల్లం గన్‌. 104 ప్రతిపదార్హం: సుతుండు= కుమారుడు; నభస్వత్‌+అంశమునన్‌= వాయుదేవునియొక్క అంశచేత; సుస్టిరుండు+ఐ= మిక్కిలి నిలుకడ కలవాడై; ఉదయించినన్‌= పుట్టగా; మహా, యతి, కృత, జాతకర్ముండు= గొప్ప బుషులచే చేయబడిన జాతకర్మం కలవాడు; అగు; ఆతనికి; ఆతత, వీర్య, విక్రమ+ఉన్నతునకుజ అధిక బల పరా(క్రమాలచేత గొప్పవాడైన వానికి; దివ్య, వాక్‌+సతి=ఐ ఆకాళవాణి; తాన్‌= తాను; శతళ్ళ్చంగ, శైల, నివసత్‌+ముని, సంఘము= శతశ్చంగ పర్వతంమీద నివసించే మునుల సమూహం; సంతసిల్లంగన్‌: భీమసేనుండు; అను; నామమున్‌; ఒనరించెన్‌= చేసింది. తాత్పర్యం: వాయుదేవునిఅంశతో మహాబలవంతు డైన కొడుకు పుట్టగా, మహర్షులు అతనికి జాతకర్మ చేశారు. అధిక బలపరాక్రమాలచేత ఉన్నతు డైన ఆ బాలునికి శతశ్చంగ పర్వతం మీద నివసించే మహర్షులంతా సంతోషించేటట్టుగా ఆకాశవాణి భీమసేను డని నామకరణం చేసింది. విశేషం: ఈ పద్యరచనలో ప్రసాదగుణం పోషింపబడింది. మునిసంఘం పొందిన సంతోషానికి కారకుడైన భీముని పుట్టుకను ఆ గుణంలో వర్ణించటం జౌచిత్యం. ధర్మజుని పుట్టుకను వర్ణించిన పద్యంలో (5-94) సంయుక్తాక్షరమైన తవర్థాన్ని ప్రాసగా నిలపటంవలన ధర్మజుడు నాయకుడు కాగా, ఈ వృత్తంలో అసంయుక్త మైన తకారం ప్రాసగా నిలపటంవలన భీమసేనుడు అనునాయకుడుగా ఎల్లప్పుడు అన్నను అనుసరించి ఉంటాడని ఛందళ్ళిల్పంతో నన్నయ సాధించిన వస్తుధ్వని. (సంపాం

దుర్యోధనాదుల జననము (సం.1-107-24)

క. _ అనిలజు పుట్టిన దివసము । నన యట దుర్యోధనుండు నరనుత! ధృతరా

ప్రునకున్‌ గాంధారికి న । గ్రనందనుండు ఘనుండు పుట్టె. గలియంశమునన్‌. 105 ప్రతిపదార్థం: నరనుత= జనులచేత పొగడబడేవాడా! ఓ జనమేజయ మహారాజా! అనిలజు, పుట్టిన, దివసమునన= వాయుదేవుని కువూరు డైన భీమసేనుడు పుట్టిన రోజే; అట= హస్తినాపురంలో: కలి, అంశమునన్‌= కలియొక్క అంశంలో; గాంధారికి; ధృతరాష్ష్రునకున్‌; అ(గ్ర, నందనుండు= పెద్దకొడుకు; ఘనుండు= గొప్పవాడు; దుర్యోధనుండు: పుట్టెన్‌.

డ్తర్రక్ష శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: ఓజనమేజయమహారాజా! వాయుపుత్రుడు భీముడు పుట్టినరోజే, హస్తినాపురంలో గాంధారీ ధృతరా(్ట్రులకు కలిఅంశంతో పెద్దకొడుకుగా గొప్పవాడైన దుర్యోధనుడు పుట్టాడు. (అని వైశంపాయన మహర్షి చెప్పటం ప్రారంభించాడు. శా, _ఆదుర్యోధను డుద్ధవిల్లుడును గ్రవ్యాదారవంబుల్‌ శివా నాదంబుల్‌ మదఘూకఘూంకృతులు నానారాసభధ్వానముల్‌ భూదిక్కంపముగాం జెలంగె విగతాంభోభృన్నభోవీథియం దాదిత్యద్యుతి మాయంగా గురిసె నుగ్రాసృజ్మహావర్షముల్‌. 106 ప్రతిపదార్థం: ఆ, దుర్యోధనుడు; ఉద్భవిల్లుడును= పుట్టగా; (క్రవ్యాద+ఆరవంబుల్‌= (క్రూరమృగాల అరుపులు; శివా నాదంబుల్‌= అడునక్కలయొక్క కూతలు; మద, ఘూక, ఘూంకృతులు= మదించిన గుడ్డగూబల ఘూంకారాలు; నానా, రాసభ, ధ్వానముల్‌= అనేకవిధా లైన గాడిదల ఓండ్ర శబ్దాలు; భూ, దిక్‌*కంపము, కాన్‌= భూమికి, దిక్కులకు చలనం కలిగేటట్టు; చెలంగెన్‌= (మైోగెను; విగత+అంభ:+భృత్‌ +నభ:+వీథి, అందున్‌= పోయిన మేఘాలు కల ఆకాశమార్గంలో: ఆదిత్య, ద్యుతి= సూర్యునియొక్కకాంతి; మాయగాన్‌= నళించేటట్టుగా; ఉ(గ్ర+అసృక్‌+మహా, వర్షముల్‌= భయంకర మైన నెత్తుటి పెనువానలు; కురిసెన్‌. ఛాత్సర్యం:; దుర్యోధనుడు పుట్టగానే (క్రూర మృగాల అరుపులు, నక్కల కూతలు, మదించిన గుడ్డగూబల ఘూంకారాలు, నానావిధా లైన గాడిదల ఓండ్రలు, భూమి, దిక్కులు కంపించే విధంగా చెలరేగాయి. ఆకాశంలో నీటిని ధరించిన మేఘాలు తొలగి, సూర్యకాంతి మాసేటట్టుగా భయంకర మైన పెద్ద నెత్తుటి వానలు కురిశాయి. విశేషం: ఇవి అన్నీ లోకోప(ద్రవాన్ని సూచించే అపశకునాలు. పాండురాజు పెద్దకొడుకు పుట్టినప్పుడు సర్వలోకానందకరాలైన శుభశకునాలు కలిగాయి, ధృతరాష్ట్రుని పెద్దకొడుకు పుట్టినప్పుడు సర్వలోకారిష్టదాయకాలైన అపశకునాలు కలిగాయి. ఇవి భావికధలో కురువంశంలో వాళ్ళిద్దరూ వరుసగా నిర్వహించే నిర్మాణాత్మక, విధ్యంసకాత్మక పాత్రల ప్రవృత్తులను ద్వనింపచేస్తున్నాయి. వ. మభథియు దుర్యోధనజన్మానంతరంబున ధృతరాష్తునకు వైశ్యాపుత్తుం డయిన యుయుత్సుండు పుట్టె; నంత గాంధారికి నొక్కొక్కదివసంబున నొక్కొక్కరుండుగా6 గ్రమంబున దుశ్శాసన దుస్పహ దుశ్శల జలసంధ సమ సహ విందానువింద దుర్ధర్ష సుబాహు దుస్త్రథర్నణ దుర్మర్షణ దుర్ముఖ దుష్కర్హ కర్ణ వివింశతి వికర్హ శల సత్త్వ సులోచన చిత్రోపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర శరాసన దుర్మద దుర్విగాహ వివిత్సు వికటాన నోర్డనాభ సునాభ నందోపనందక చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్విమోచనాయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమవేగ భీమబల బలాకి బలవర్ధ నోగ్రాయుధ సుషేణ కుండధార మహోదర చిత్రాయుధ నిషంగి పాశి బృందారక దృఢవర్మ దృథక్షత్త సోమకీ ర్వమూదర దృథసంధ జరాసంధ సద సువా గుగ్రశ్రవ ఉగ్రసేన సేనానీ దుప్పరాజ యాపరాజిత కుండశాయి విశాలాక్ష దురాధర దుర్జయ దృఢహస్త సుహస్త వాతవేగ సువర్ద ఆదిత్యకేతు బహ్వాశి నాగదత్తాగ్రయాయి కవచి క్రధన కుండి ధనుర్ధరోగ్ర భీమరథ వీరబాహ్వ లోలుపాభయ రౌద్రకర్మ దృఢరథాత్రయా నాధ్భృష్య కుండభేది విరావి ప్రమథ ప్రమాథి దీర్షరోమ దీర్షబాహు వ్యూధోరు కనకధ్వజ కుండాశి విరజసు లనంగా నూర్వురు గొడుకులు పుట్టిన. 107

ఆదిపర్వము - పంచమాశ్వాసము 465 ప్రతిపదార్థం: మజియు; దుర్యోధన, జన్మ+అనంతరంబున= దుర్యోధనుని పుట్టుక తర్వాత; వైశ్యా, పుత్రుండు+అయిన= కోమటి స్త్రీ కొడు కైన; యుయుత్సుండు' పుట్టెన్‌; అంత” గాంధారికిన్‌; ఒక్కొక్క, దివసంబునన్‌= ఒక్కొక్క రోజు ; ఒక్కొక్కరుండుగాన్‌; క్రమంబున' దుశ్శాసనుడు, దుస్సహుడు మొదలైన వారు, అనంగా; నూర్వురు; కొడుకులు; పుట్టిన= పుట్టగా; చఛాత్సర్యం: అంతేకాక, దుర్యోధనుడు పుట్టిన తరువాత ధృతరాష్ట్రునికి వైశ్య కుల పళ్చ్నివలన యుయుత్సుడనే కొడుకు పుట్టాడు. ఆ తరువాత గాంధారికి రోజు కొక్కడుగా దుశ్తాసనాదులు వరుసగా పుట్టారు. (వారి "పేర్లన్నీ 'పైవచనంలో వరుసగా ఉన్నాయి). ఈ విధంగా మొత్తం నూరుగురు కొడుకులు పుట్టారు. తే. ఆ తనూజుల కందఅ కనుజ యై ల। తాంగి దుశ్చల యను కూంయ రనరం బుట్టె

నందు దౌహిత్రవంతుల దైన పుణ్య; గతియు. గాంతు నే నని పొంగం గౌరవుండు. 108 ప్రతిపదార్హం: ఆ, తనూజులకు+అందణకు= ఆ కుమారులందరికి; అనుజ+ఐ= అనుసరించి పుట్టిన దై - అనగా చెల్లె లై; లత+ అంగి= తీగవంటి దేహం కలది; దుళ్ళల; అను; కూతురు; అమరన్‌= ఒప్పుగా; పుట్టెన్‌; ఆందు= ఆమెయందు; దౌహిత్రవంతులది+ఐన= కూతురియొక్క కొడుకులు కలవారిది అయిన; పుణ్య, గతియున్‌= పుణ్యలోకంకూడ; నేను; కాంతున్‌= పొందుతాను; అని; కౌరవుండు= ధృతరాష్ట్రుడు; పొంగెన్‌= సంతోషించాడు. తాత్పర్యం: ఆ కొడుకు లందరికి చెల్లెలుగా సుకుమారి అయిన దుశ్ళల అనే కూతురు పుట్టింది. ఆమెవలన దౌహిత్రులు కలవాళ్ళు పొందే పుణ్యలోకాన్నికూడా పొందుతా నని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. విశేషం: దుహిత అంటే కూతురు అని అర్ధం. అమె కొడుకు దౌహిత్రుడు.

వ. _ఇట్లేకోత్తరశతపుత్తులం బడసి కృతార్ణుండై యున్న ధృతరాష్తుకడకు భీస్మవిదురాది బంధుజనంబులు€

బురోహితప్రముఖ బ్రాహ్మణవరులును వచ్చి యొక్కనాం డేకాంతంబున ని ట్లనిరి. 109 ప్రతిపదార్థం: ఇట్టు; ఏకోత్తర; శత, పుత్రులన్‌= నూటొక్కమంది కొడుకులను కూతుండ్రను (100 మందికొడుకులు, ఒకకూతురు); పడసి= పొంది కృత+అర్జుండు+ఐజ= తీరిన కోరిక కలవా డై; ఉన్న; ధృతరా్త్రు, కడకు= ధృతరాహ్ర్రునిదగ్గరకు; భీష్మ, విదుర+అది, బంధు, జనంబులున్‌= భీష్ముడు, విదురుడు మొదలైన బంధువులు; పురోహిత, ప్రముఖ, (బ్రాహ్మణ, వరులును= పురోహితులు మొద లైన (బ్రాహ్మణ ్రేష్టులు; వచ్చి; ఒక్కనాండు; ఏకాంతంబునన్‌= ఒంటరిగ; ఇట్టు+అనిరి. తాత్సర్యం: ఈ విధంగా నూటొక్కమంది పిల్లల్ని పొంది కోరిక తీరిన ధృతరా్షుని దగ్గరకు భీష్ముడు, విదురుడు మొదలైన బంధువులు, పురోహితులు మొదలైన బ్రాహ్మణ శ్రేష్టులు వచ్చి ఒంటరిగా అతనితో ఇట్టా అన్నారు. క. _ మన దుర్యోధను జన్మం ; బున బెక్కులు దుర్మిమిత్తములు పుట్టె: జగ

జ్ఞనసంక్షయజననుం డగు | నని పలికెద రెటుక గల మహాత్ములు వానిన్‌. 110 (ప్రతిపదార్థం: మన దుర్యోధను, జన శంబునన్‌= మన దుర్యోధనుడు పుట్టినప్పుడు; దుర్నిమిత్తములు= చెడ్డశకునాలు; 'పెక్కులు= చాల; పుట్టె; ఎలుక= జ్ఞానం" కల= ఉన్న: మహాత్ములు; వానిన్‌= ఆ దుర్యోధనుడిని; జగత్‌*జన, సంక్షయ, జననుండు= లోకంలోని

ప్రజలకు నాశం కలిగించేవాడు; అగున్‌; అని; పలికెదరు= చెప్పుతారు. తాత్పర్యం: మన దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుళ్ళకునాలు పుట్టాయి. జ్ఞానులైన మహాత్ములు వా డు లోక జన నాశకుడని అంటారు.

కరర శ్రీమదాంధ్ర మహాభారతము క. కులమునకు నఖిల లోకం । బులకు నపాయంబు సేయు పురుషాధము ని మ్ముల దూషించి జగంబును ; గులమును రక్షించు టుణదె కువలయనాథా! 111 ప్రతిపదార్థం: కువలయనాథాజ= భూమికి ప్రభువు అయిన వాడా! కులమునకున్‌= వంశానికి; అఖిల, లోకంబులకున్‌= అన్ని లోకాలకు, అపాయంబు= కీడు; చేయు; పురుషణఅధమున్‌= పురుషులలో నీచుడిని; ఇమ్ముల= సంతోషంతో; దూషించి= విడిచివేసి; జగంబునుజ లోకాన్ని; కులమును= వంశాన్ని; రక్షించుట; ఉఅదు+ఏ= తగదా?

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కులానికి, లోకాలకు కీడు కల్గించే నీచు డైన ఈ దుర్యోధనుడిని వదలివేసి

లోకాన్ని, కులాన్ని రక్షించటం తగదా?

వ. “కావున నిప్పుడ దుర్యోధను దూషింతము; నీకు వెండియు.బుత్తశతంబు సంపూర్ణం బయి పెరుగుచున్నయది' యనిన ధృతరాస్తుండు వుత్రమోహంబున నప్పలుకులు విననొల్లకుండె; నంత నట శతశృంగంబునం గుంతీదేవి భీమసేను సుపుత్తుం బడసి దశమదివసంబున వేల్పులకు మొక్క గొడుకు నెత్తికొని దేవగ్భృహంబునకు+ బోవునెడ నతివిషమగహనగిరిగహ్వరంబుననుండి యొక్కపులి వెలువడి యామిషార్థి యయి పయికి లంఘించిన. 112

ప్రతిపదార్హం: కొవునన్‌; ఇప్పుడు+అవ= ఇప్పుడే; దుర్యోధను; దూషింతము= వదలి వేద్దాం; నీకు; వెండియున్‌= మరియు; పుత్ర శతంబు= వందమంది కొడుకులు; సంపూర్ణంబు+అయి= నిండుగా; పెరుగుచు+ఉన్న; అది; అనిన; ధృతరా(ష్ణ్రుండు; పుత్ర మోహంబునన్‌= కొడుకుమీది మమకారంతో; ఆ+పలుకులు; వినన్‌= వినటానికి; ఒల్లకశఉండె= ఇష్టపడలేదు; అంతన్‌= అప్పుడు; అట; శతశ్చంగంబునన్‌; కుంతీదేవి; భీమసేను; సుపు్రున్‌, పడసి= పొంది; దశమ, దివసంబున= పదోరోజు; వేల్పులకు:; యమొక్కన్‌; కొడుకున్‌: ఎత్తికొని; దేవ, గృహంబునకు= దేవాలయానికి; పోవు, ఎడన్‌=ఐ పోవుచోట; అతి, విషమ. గహన, గిరి, గహ్యరంబునన్‌, ఉండి= మిక్కిలి మిట్ట పల్లా లై ప్రవేశించడానికి సాధ్యం కాని కొండగుహనుండి; ఒక్క; పులి; వెలువడి= బయటికి వచ్చి; ఆమిష+లర్ది, అయి= మాంసం కోరిన దై; పయికి= మీదికి; లఘించిన= దూకగా.

తాత్పర్యం: 'అందువలన ఇప్పుడే దుర్యోధనుడిని విడిచి పెట్టుము, నీకు ఇంకా వందమంది పిల్లలు నిండుగా

పెరుగుతున్నారు అని అనగా, ధృతరాష్ట్రుడు పుత్రమమకారంతో ఆ పలుకులు వినటానికి ఇష్టపడలేదు. అప్పుడు శతశ్చంగ పర్వతం మీద కుంతి భీమసేనుడిని కని, పదోరోజున దేవతలకు (మొక్కటానికి ఆ బాలుడిని ఎత్తుకొని దేవాలయానికి పోయేచోట - మిక్కిలి మిట్టపల్లా లై ప్రవేశించ సాధ్యం కాని కొండగుహనుండి ఒకపులి బయటికి వచ్చి, మాంసాన్ని కోరి మీదికి దూకగా.

భీముని శరీర దార్ధ్యము(సం.1-114-11) క. _ వీరుండు పాండుమహీపతి । దారుణ బాణ త్రయమునం దద్వ్యాఘ్రంబున్‌ ధారుణిం ద్రెళ్ళగ నడుమన ; భూరిభుజుం డేసి కాచెం బుళ్తుం దేవిన్‌. 113

ప్రతిపదార్థం: వీరుండు; భూరి, భుజుండు= గొప్పభుజాలు కలవాడు; పాండు, మహీపతి= పాండురాజు; దారుణ, బాణ, ['త్రయమునన్‌= భయంకర మైన బాణాలు మూడింటితో; తత్‌+వ్యాఘ్రంబున్‌= ఆ పులిని; నడుమన్‌+అ= మధ్యలోనే; ధారుణిన్‌= భూమిమీద; త్రెళ్ళంగన్‌= (చచ్చి) పడేటట్టు; ఏసి=ఐ కొట్టి; పుత్రున్‌= కొడుకును; దేవిన్‌= భార్యఐన కుంతీదేవిని; కాచెన్‌= రక్షించాడు.

ఆదిపర్వము - పంచమాశ్వాసము కర

తాత్పర్యం: వీరుడు, బలమైన భుజాలు కలవాడు అయిన పాండురాజు మూడు భయంకరాలైన బాణాలతో మధ్యలోనే ఆ పులిని భూమిమీద చచ్చిపడేటట్టు కొట్టి కొడుకు భీముడిని, భార్య కుంతీదేవిని కాపాడాడు. క. ఉరు శార్జూల భయంబునం ; బరవశ యయి కుంతి యున్న బాలకుండు శిలో

తృ్మరముపయిం బడియెం దన ని । ప్టుర తను హతిం జేసి రాలు చూర్తంబులుగన్‌. 114 (ప్రతిపదార్హం: ఉరు, శార్దూల, భయంబునన్‌= పెద్దపులివలన కలిగినభయంతో; కుంతి; పరవశ+అయి= ఒడలు తెలియని దై; ఉన్న= ఉండగా; బాలకుండు; తన, నిష్టుర, తను, హతిన్‌= తన కరిన మైన శరీరంయొక్క దెబ్బచేత; రాలు, చూర్ణంబులుగన్‌= రాళ్ళు పొడి అయ్యేటట్టు; చేసి; శిల+ఉత్కరము, పయిన్‌= రాళ్ళ సమూహంమీద - కొండమీద; పడియెన్‌. ఊాత్ప్సర్యం: పెద్దపులివలన కలిగిన భయంతో కుంతీదేవి శరీరం స్వాధీనం తప్పగా, బాలుడు భీముడు క్రిందపడ్డాడు. కరినమైన అతని శరీరంతాకిడికి ఆ కొండమీది రాళ్ళు పొడి అయ్యాయి. వ. _దానిం జూచి పాండురాజు సంభ్రమంబునం బఅతెంచి విస్శితుం డై కొడుకు నెత్తికొని కుంతీదేవిం దోడ్యొని

వేల్పులకు మైొక్కించి మగుడి నిజాశ్రమంబునకు వచ్చి సుఖం బుండి, గాంధఛారీధృతరాస్తులకుం బుత్రశతంబు

పుట్టుట విని, బుషులవలన దివ్యమంత్రోపదేశంబు. గొని. 115 ('ప్రతిపదార్దల: దానిన్‌+చూచి; పాండురాజు; సంభమంబునన్‌= వేగిరపాటుతో; పజఅతెంచి= వచ్చి; విస్మితుండు+ఐ= ఆళ్చర్యపడినవా డై; కొడుకున్‌” ఎత్తికొని; కుంతీదేవిన్‌; తోడ్కొని; వేల్పులకు= దేవతలకు; (మొక్కించి; మగుడిజఐ మరలి; నిజ+ఆ(శ్రమంబునకు= తనయొక్క ఆశ్రమానికి; వచ్చి; సుఖంబు; ఉండి; గాంధారీ, ధృతరాష్ష్రులకున్‌: పుత్ర, శతంబు= వందమంది కొడుకులు: పుట్టుట; విని బుషులవలన; దివ్య, మంత్ర+ఉపదేశంబున్‌; కొని= (గ్రహించి. తాత్పర్యం: దానిని చూచి పాండురాజు వేగిరపాటుతో వచ్చాడు. ఆళ్ళర్యపడి ఆ కొడుకును ఎత్తికొన్నాడు. కుంతీదేవిని తోడ్కొని దేవతలకు మొక్కించి తిరిగి తన ఆశ్రమానికి వచ్చి సుఖంగా ఉండగా, గాంధారీ ధృతరాష్రులకు వందమంది కొడుకులు పుట్టా రని విని, బుషులవలన దివ్యమంత్రోపదేశాన్ని పొంది.

ఇంద్రప్రసాదంబున( గుంతి కర్టును. డుదయించుట (సం.1-114-15)

క, _ కొడుకుం ధ్రిలోక విజయుం ।; బడయుదు నని ఘోర మగు తపం బొనరింపం

దొడణె సురరాజు నెడలో ; నిడికొని యేకాగ్రబుద్ధి నేకాంతమునన్‌. 116 ప్రతిపదార్థం: త్రిలోక విజయున్‌= మూడులోకాలను జయించేవాడిని; కొడుకున్‌; పడయుదును= పొందుతాను; ఆని; ఘోరము+అగు= భయంకర మైనట్టి; తపంబు; సురరాజున్‌= దేవతలరా జైన దేవేంద్రుడిని; ఎడలోన్‌= మనస్సులో; ఇడికొని= ఉంచుకొని" ఏక+ అగ్ర, బుద్దీన్‌= ఒకదానిమీదే లగ్నమైన మనస్సుతో; ఏకాంతమునన్‌= ఒంటరిగా; ఒనరింపన్‌= చేయడానికి; తొడగె= పూనుకొన్నాడు. తాత్పర్యం: ముల్లోకాలను జయించగల _ కొడుకును పొందా లని దేవేంద్రుడిని ధ్యానిస్తూ, ఏకాగ్ర బుద్ధితో, ఏకాంతంగా గొప్పతపస్సు చేయడానికి పూనుకొన్నాడు. విశేషం: కధలో కారణం చెప్పకుండా కార్యాలు జరుగుతున్నట్లు చెప్పటం ప్రసన్న కధాకవితలో ఒకశిల్పం. వందమంది కొడుకులు ధృతరాష్ట్రునికి పుట్టారని వినగానే పాండురాజు దివ్యమంత్రాల ఉపదేశం పొందాడు; ఒంటి కాలిమీద గొప్ప తపస్సు చేశాడు

తర8 శ్రీమదాంధ్ర మవాభారతము

త్రిలోకవిజయుడైన కొడుకును కోరుకొన్నాడు. ఈచర్యకు కారణం కథలో స్పష్టంగా లేదు. కాని లోనారసి చూస్తే కారణం స్పష్టమౌతుంది. ధార్తరా్తులు నూరుగురు ఏకమైతే మూడు లోకాలనే జయించగలరేమో. ధర్మరక్ష కులరక్షకులైన ధర్మజ భీము లిద్దరూ ధార్తరాష్ల్రుల ధాటికి నిలువలేకపోవచ్చును. (త్రిలోకవిజయుడైన పుత్తుడు మాత్రమే ధార్తరాష్ర్రులకు దీటుగా నిలిచి, పాండవ (ప్రాభవాన్ని, లోకాధిపత్యాన్ని నిలుపగలడనే భావం పాండురాజులో కలిగినట్లు స్పష్టమౌతూజఉంది. అందుకే త్రిలోకవిజయుడైన పుత్రుని కొరకు (త్రిలోకాధిపతిని ఆరాధించటం. (సంపా.) వ. ఇట్లతి నిష్ట నేక పాద స్థితుం దయి తపంబు సేయుచుం గుంతి నొక్క సంవత్సరంబు వ్రతంబు సేయం

బంచియున్న నప్పాండురాజువ కింద్రుండు ప్రత్యక్షం బై. 117 ప్రతిపదార్థం: ఇట్టు; అతి, నిసష్టన్‌= మిక్కిలి నియమంతో; ఏక, పొద, స్టితుండు+అయి= ఒక పాదం మీదనే నిలిచి ఉన్నవా డై _ అనగా ఒంటి కాలిమీద నిలబడి; తపంబు; చేయుచున్‌; కుంతిన్‌; ఒక్క; సంవత్సరంబు; వ్రతంబు; చేయన్‌; పంచి= ఆజ్ఞాపించి; ఉన్నన్‌= ఉండగా; ఆ+పాండురాజునకు; ఇంద్రుండు; ప్రత్యక్షంబు+ఐ= ఎదుట కన్పించినవాడై. తాత్పర్యం: ఈ విధంగా మిక్కిలినిష్టతో ఒంటికాలిమీద నిలబడి తాను తపస్సు చేస్తూ, కుంతీదేవిని ఒక సంవత్సరం (వ్రతం చేయవలసిందని ఆజ్ఞాపించి ఉండగా, ఆ పాండురాజుకు దేవేం(ద్రుడు (ప్రత్యక్షమై. కు పుత్రుండు నీ కుదయించు న । మిత్రక్షయకరుండు బంధుమిత్రాంబుజి ౧

ఇిత్రుం' దని వర మిచ్చిన । ధాత్తీపతి పొంగి పృథకుం దా ని ట్లనియెన్‌. 118 ప్రతివదార్థం: నీకు; అమి'త్ర, క్షయ, కరుండు= మిత్రులు కాని వాళ్ళకు నాశం కల్గించేవాడు - అంటే శత్రువులను నాశనం చేసేవాడు; బంధు, మి(త్ర+అంబుజ, సత్‌+మి(త్రుండు= చుట్టాలు, స్నేహితులు అనే పద్మాలకు చక్కని సూర్యుడివంటివాడు; పుత్రుండు; ఉదయించును= పుట్టుతాడు; అని; వరము; ఇచ్చిన; ధాత్రీ, పతి= పాండురాజు; పొంగి= మిక్కిలి సంతోషించి; తాన్‌= తాను; పృథకున్‌= కుంతీదేవికి; ఇట్టు+అనియెన్‌. తాత్సర్యం: “నీకు శత్రువులను నాశనం చేసేవాడు, బంధువులు, స్నేహితులు అనే పద్మాలకు సూర్యుని వంటివాడు అయిన కొడుకు పుట్టుతాడు' అని వరం ఇవ్వగానే పాండురాజు ఎంతో సంతోషించి కుంతీదేవితో ఇట్టా అన్నాడు. విశేషం: సాండురాజు వరం కోరినట్టు చెప్పకుండా, ఇంద్రుడే తనంతట తాను వరమిచ్చినట్టు చెప్పటం ఇక్కడ విశేషం. శత్రువులను సంహరించేవాడు, బంధువులను సంతోషపెట్టేవాడు అయిన కొడుకు పుట్టుతాడని ఇంద్రుని వరం. నిజానికి అటువంటి కొడుకు కావాలన్నది పాండురాజు మనసులోనికోరిక. ఆ శత్రువు లెవరు? ఆ బంధువు లెవరు? - అనే ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పవలసిందే. సారమతులు లోనారసి భావించతగిందే. క. ధనమున విద్యను సంతతి. ; దనిసిన వా రెందు. గలరె? ధవళేక్షణ! కా

వున నా కింకను బలువురం। దనయులం బడయంగ వలయు ధర్మ్మువు పేర్షిన్‌. 119 ప్రతిపదార్థం: ధవళ+ఈక్షణ= తెల్లని కన్నులు కలదానా!; ధనమున; విద్యను; సంతతిన్‌= సంతానంచేత; తనిసినవారు= తృప్తిపొందిన వారు; ఎందున్‌= ఎక్కడైనా; కలరె=ఐ ఉన్నారా? కావున; నాకు; ఇంకను; పలువురన్‌= పెక్కుమందిని; తనయులను; ధర్మువు, పేర్మిన్‌= ధర్మంయొక్క అతిశయంచేత; పడయంగవలయు= పొందాలి. తాత్సర్యం: ఓకుంతీ! లోకంలో ధనం, విద్య, సంతానం విషయాలలో తృప్తి పొందినవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందువలన నా కింకా ఎందరో కొడుకులను ధర్మమార్గంలో పొందా లని ఉన్నది.

ఆదిపర్వము - పంచమాశ్వాసము త్తే్ర9

చ. అమరగణంబులోనం బరమార్ధమ యింద్రుండు పెద్ద, సర్వలో

కములకు వల్లభుం డతండ కావున నయ్యమరాధిపప్రసా

దమున సుతున్‌ సురేంద్రసము ధర్మసమన్వితు నస్మదీయవం

శము వెలుంగింపంగా. బడయు సర్వజగత్పరిరక్షణక్షమున్‌. 120 (ప్రతిపదార్థం: అమర, గణంబులోన= దేవతలసమూహంలో; పరమ+అర్హము+అజ సత్యంగానే; ఇంద్రుండు; పెద్ద; అతడు+అ= ఆతడే; సర్వ, లోకములకు; వల్లభుండు= రాజు; కావునన్‌= అందుచేత; ఆ+అమర+అధిప, ప్రసాదమున= ఆ దేవతలరాజుయొక్క దయతో; సుర+ఇం(ద్ర, సము= దేవేంద్రునితో సమాను డైనవాడిని; ధర్మ, సమన్వితున్‌= ధర్మంతో కూడినవాడిని; సర్వ, జగత్‌+రక్షణ, క్షమున్‌= లోకాలన్నింటిని కాపాడటంలో సమర్చుడు అయినటువంటి వాడిని; అస్మదీయ, వంశము= నా వంశం; వెలు6ంగింపంగాన్‌= (ప్రకాశింప చేయటానికి; పడయుజ= పొందుము. తాత్సర్యం: దేవతలలో నిజంగా దేవేంద్రుడు పెద్ద. అతడే లోకాలకన్నింటికి రాజు. అందువలన ఆ దేవేం[ద్రుని దయతో అతనితో సమాన మైనవాడు. ధర్మాత్ము డైనవాడు, అన్నిలోకాలను రక్షించటంలో సమర్జు డైనవాడు, నా వంళాన్ని వెలిగించేవాడు అయిన కొడుకును పొందుము. వ. అని నియోగించినం గుంతియుం దొల్లిటి యట్ల దుర్వాసుం డిచ్చిన మంత్రంబున నింద్రు నారాధించినం

దత్ర్రసాదంబునం గుంతికి. 121 (ప్రతిపదార్థం: అని; నియోగించినన్‌ - అజ్ఞాసించగా; కుంతియున్‌; తొల్లిటి, అట్టు+అవ= ఇదివరకటివలెనే; దుర్వాసుండు; ఇచ్చిన; మం(త్రంబునన్‌; ఇంద్రున్‌; ఆరాధించినన్‌= పూజించగా; తత్‌+ఫ్రసాదంబునన్‌= అతని దయతో: కుంతికి. తాత్పర్యం: అని పాండురాజు ఆజ్ఞాపించగా, కుంతికూడ ఇదివరకటివలెనే దుర్వాసు డిచ్చిన మంత్రంతో ఇంద్రుడిని (ప్రార్ధించగా ఆతని దయతో కుంతికి, క, _ స్థిర పౌరుషుండు లోకో : త్తరుం డుత్తరఫల్లునీప్రధమ పాదమునన్‌

సురరాజునంశమున భా । సురతేజుయ వంశకరుండు సుతుం డుదయించెన్‌. 122 ప్రతిపదార్థం: స్థిర, పౌరుషుండు= నిలక డైన పౌరుషం కలవాడు; లోక+ఉత్తరుండు= లోకంలో (శ్రేష్టుడు; భాసుర, తేజుండు= ప్రకాశిస్తున్న తేజస్సు కలవాడు; వంశ, కరుండు= వంశాన్ని నిలిపేవాడు; సుతు;డు= కుమారుడు; సుర, రాజు, అంశమున= దేవేంద్రుని అంశంతో; ఉత్తర ఫల్లునీ, ప్రధమ, పాదమునన్‌= ఉత్తర ఫల్గునీ నక్షత్రం మొదటి పాదంలో; ఉదయించెన్‌= పుట్టాడు. తాత్సర్యం: స్టిర మైన పౌరుషం కలవాడు, లోకంలో కెల్ల (శ్రేష్టుడు, (ప్రకాశించే తేజస్సు కలవాడు, వంశాన్ని నిలిపేవాడు, అయిన కుమారుడు, దేవేంద్రునిఅంశతో ఉత్తరఫల్నునీనక్షత్ర 'ప్రధమపాదంలో జన్మించాడు. విశేషం: పాద మనగా నాల్లోవంతు. వ. అయ్యవసరంబున. 123 తాత్పర్యం: ఆ సమయంలో,

తా0 శ్రీమదాంధ్ర మహాభారతము సీ. 'విను కార్తవీర్యుకంటెను వీరు. డగుట నర్దుననామ మీతండ యొనరః దాల్డు; నీతండ యనిం బురుహూతాదిసురుల నోడించి ఖాండవము దహించు బలిమి; నీతండ నిఖిలావనీతలేశుల నోర్టి రాజసూయము ధర్మరాజు నునుచు; నీతండ వేల్పులచేత దివ్యాస్తముల్‌ వడసి విరోధుల నొడుచు. గడిమి' ఆ. ననుచు నవపయోదనినదగంభీర మై । నెగసి దివ్యవాణి గగనవీథిం గురిసెం బుష్పవృష్టి, సురదుందుభిధ్వనుల్‌ । సెలంగ సకలభువనవలయ మద్రువ. 124 ప్రతిపదార్ధం: విను; కార్తవీర్యుకంటెను; వీరుండు; అగుటన్‌= అవటంచేత; అర్జున, నామము= అర్జును డనే పేరు; ఒనరన్‌= ఒప్పేటట్టు; తాల్చున్‌= ధరిస్తాడు; ఈతండు+అ= ఇతడే; అనిన్‌= యుద్ధంలో; పురుహూత+ఆది, సురులన్‌= ఇంద్రుడు మొదలైన దేవతలను; ఓడించి; బలిమిన్‌= పరా(క్రమంతో; ఖాండవము; దహించున్‌= కాల్చును; ఈతండు+అ= ఇతడే; నిఖిల+అవనీతల+-ఈశులన్‌= మొత్తం భూమిమీది రాజులను; ఓర్చి= జయించి; రాజసూయము= రాజసూయయాగంలో; ధర్మరాజున్‌; ఉనుచున్‌= ఉంచుతాడు; ఈతండు+అ= ఇతడే; వేల్పులచేత= దేవతలచేత; దివ్య+అ(స్తముల్‌= దేవతా సంబంధ మైన బాణాలు; పడసి= పొంది; కడిమిన్‌= పరా(క్రమంతో; విరోధుల్‌= శత్రువులను; ఒడుచున్‌= ఓడగొట్టుతాడు; అనుచున్‌; నవ, పయోద, నినద, గంభీరము+ఐ= [క్రొత్త మేఘంయొక్క ఉరుమువలె గంభీరమై; దివ్య, వాణి= దేవతాసంబంధ మైన పలుకు; గగన, వీధిన్‌= ఆకాశవీధిలో; నెగసె=ఐ వ్యాపించింది; పుష్ప, వృష్టి పూలవాన; కురిసెన్‌? సుర, దుందుభి, ధ్వనుల్‌= దేవతలయొక్క నగారాల (మైోతలు; సకల, భువన, వలయము= మొత్తం భూమండలం; అద్రువ= అదిరేటట్టు;: చెలం= (మోగాయి. తాత్సర్యం: “ఇతడు కొర్తవీర్యుని కన్నా వీరుడు కావటంచేత అర్జునుడు అనే పేరు వహిస్తాడు. యుద్దంలో ఇం(ద్రాది దేవతలను ఓడించి పరా(క్రమంతో ఖాండవాన్ని దహిస్తాడు. భూమిమీద రాజులందరినీ జయించి, ధర్మరాజుచేత రాజసూయయాగాన్ని చేయిస్తాడు. దేవతలవలన దివ్యాస్తాలు పొంది శత్రువులను జయిస్తాడు" అని ఆకాశవాణి క్రొత్త మేఘం మోసిన ఉరుమువలె గంభీరంగా పలికింది. పూలవాన కురిసింది. భూమండలం దద్దరిల్లేటట్టు దేవ దుందుభులు (మోగాయి. విశేషం: పుట్టుకను కందపద్యంలో వర్ణించి, మహిమను సీసపద్యంలో వివరించటం నన్నయ ప్రదర్శించిన పద్యవిద్యాప్రొడి. ధర్మజభీములు స్టిర పాత్రలుగాను, అర్జ్హునునిపాత్ర వికాస దశలను పొందేదిగాను చిత్రించబడటం భారతకథలో కనపడుతుంది. ధర్మజు డనే ధర్మకక్తికి భీముడు భౌతిక బలాన్ని కూర్చేవాడు; అర్జునుడు దైవబలాన్ని అనుసంధించేవాడు. ఆ ఖేదం చెప్పటం నన్నయ వస్తుళిల్పం. -ఈతండ' ఏవార్థకమైన తదర్ధకసర్భనామాలను మూడు చరణాలలో మొదట వాడి అర్జునుని పరిణామస్థితులను నన్నయ కథలో చక్కగ సూచించాడు. ఏవార్ధకం అర్జునుని అనన్య పరా[క్రమాన్ని ధ్వనింప చేస్తున్నది. ఖాండవ దహన ఘట్టంనుండి అర్జునునికి శ్రీకృష్ణ్టహాయం, దేవతలవలని దివ్యాస్త్రలాభం కలగటం (ప్రారంభ మౌతుంది. ఇవి భావికధాబీజాలుగా ప్రస్తావించి వాటి వివరాలను తెలిసికొనటానికి పరితల హృదయాలలో ఉత్కంఠను రేకెత్తించటం 'ప్రసన్నకధాకవి(లి) తార్హయోజనం. (సంపాం) వ. మజఖియు మరీచ్యాది ప్రజాపతులును, ఛాత్రాది ద్వాదశాదిత్యులును, మృగవ్యాధాది రుద్రులును, ధరాది వసువులును, భరద్వాజాది మహర్షులును, భీమసేనాది గంధర్వులును శేషాది మహానాగముఖ్యులును, వైనతేయాది ఖచరులును, మేనకాద్యప్పరసలును, నాశ్వనులును, విశ్వేదేవతలును, మజియు స్వర్ణంబున నున్న రాజులుం జనుదెంచిన, 125 ప్రతిపదార్థం: మజియు; మరీచి+ఆది, ప్రజాపతులును= మరీచి మొద లైన బ్రహ్మలు; ధాతృ+అది, ద్వాదశ+ఆదిత్యులును= ధాత మొదలైన పన్నెండుమంది సూర్యులు; మృగవ్వ్యాధ+అఆది, రుద్రులును= మృగవ్యాధుడు మొదలైన రుద్రులు; ధర+ఆది,

ఆదిపర్వము - సంచమాశ్వాసము క్షా వసువులును= ధరుడు మొదలైన వసువులు; భరద్వాజ+అఆది, మహర్షులును= భరద్వాజుడు మొదలైన మహామునులు; భీమసేన+అఆది, గంధర్వులును= భీమసేనుడు మొదలైన గంధర్వులు; శేష+ఆది, మహా, నాగ, ముఖ్యులును= శేషుడు మొదలైన సర్బశ్రేష్టులు; వైనతేయ+ఆది, ఖచరులును= వైనతేయుడు మొదలైన ఆకాశసంచారులు; మేనక+ఆది, అప్పరసలును= మేనక మొదలైన అప్సరసలు; ఆశ్వినులును= అళ్చినీదేవతలు; విశ్చేదేవతలును; మటియు; స్వర్గంబునన్‌; ఉన్న; రాజులున్‌: చనుదెంచిన= రాగా, తాత్పర్యం: అంతేకాక, మరీచి మొదలైన నవబ్రహ్మలు, ధాత మొదలైన ద్యాదళాదిత్యులు, మృగవ్యాధుడు మొదలైన ఏకాదశరుద్రులు, ధరుడు మొదలైన అష్టవసువులు, భరద్వాజుడు మొదలైన మహర్షులు, భీమసేనుడు మొదలైన గంధర్వులు, శేషుడు మొదలైన సర్ప్రేష్టులు, గరుత్మంతుడు మొదలైన ఆకాశగమనం కలిగినవాళ్ళు, మేనక మొదలైన అప్సరసలు, ఆళ్వినీదేనతలు, విశ్వేదేవతలు, ఇంకా స్వర్గంలో ఉన్న రాజులు రాగా. విశేషం; (ప్రజాపతులు తొమ్మిదిమంది. వారిని నవ(బ్రహ్మలంటారు. వారు: భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి. ద్వాదశాదిత్యులు - ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట పూషుడు, అర్యముడు. భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు; ఏకాదశరుద్రులు - అజుడు, ఏకపాదుడు, అహిర్చుధ్య్యుడు, త్వష్కు రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, (త్రిభువనుడు, (మృగవ్యాధుడనగా రుద్రుడు); క. _ శతశ్చంగ నగేంద్రము శత । ధృతి సర్గ దినంబపోలెం ద్రిభువన భూత ప్రతతిం బరిపూర్హ శోభా । ధృతి నింద్రతనూజు జన్షదినమున నొప్పెన్‌. 126 (ప్రతిపదార్థం: ఇంద్ర, తనూజా, జన్మదినమునన్‌= ఇం(ద్రునికొడు కైన అర్జునుని పుట్టినరోజున; శతశ్చంగ, నగ+ఇం(ద్రము= శతళ్ళంగం అనేపేరు కల పర్వత(శ్రేష్టం; త్రి, భువన, భూత, ప్రతతిన్‌= మూడులోకాలలోని భూతాలసమూహంతో; పరిపూర్ణ, శోభా, ధృతిన్‌= నిండుశోభను ధరించటంచేత; శతధృతి, సర్గ దినంబు పోలెన్‌= బ్రహ్మయొక్క సృష్టీరోజువలె; ఒప్పెన్‌. తొత్సర్యం: అర్జునుడు పుట్టినరోజు శతశ్చంగ పర్వతం మూడులోకాలలోని భూతాలు అక్కడికి రాగా పరిపూర్ణ శోభతో (బ్రహ్మదేవుడు సృష్టిచేసే రోజువలె ప్రకాశించింది. విశేషం; అలం: ఉ(త్రేక్ష ఇందులో అలంకారకృతవస్తుధ్వని ఉన్నది. త్రిభువనాలనుండి "పెద్దలు రావటంచేత రెండు విశేషార్జాలు స్ఫురిస్తున్నాయి. పాండవులలో మూడులోకాలను దర్శించి తన విజయగీతాలను పాడించుకొన్నవాడు అర్జును డొక్కడే. ఈ భావి కధార్థ ధ్వని ఒకటి. బ్రహ్మదేవుడు సృష్టిచేసేరోజేమో అన్న ఉత్రేక్షవలన అర్జును డొక్కడే పాండవులలో వంశకారకు డౌతొడని లోనారసినవారిభావనకు అందే మరొక భావికధార్థ వస్తుధ్వని. (సంపా) మాలిని, సరస సురవధూలాస్యంబులున్‌ సిద్ధవిద్యా ధరపటుపటహాతోద్యంబులుం గిన్నరీ కిం పురుష లలితగీతంబుల్‌ మహారమ్య మయ్యెన్‌ వరమునిదివిజాశీర్వాదనాదంబుతోదన్‌. 127 ప్రతిపదార్థం: సరస, సుర వధూ లాస్యంబులున్‌= మనోహరా లైన అప్పరసలయొక్క నృత్యాలు; సిద్ధ విద్యాధర, పటు, పటహ+ఆతోద్యంబుల్‌= సిద్దుల, విద్యాధరులయొక్కృ గట్టి తప్పెటల, వీణ, వేణువు, మృదంగం, కాంస్యం (కంచువాద్యం) అనే నాలుగువిధా లైన వాద్యాలయొక్క శబ్దాలు" కిన్నరీ, కింపురుష, లలిత, గీతంబుల్‌= కిన్నర ్రీల, కింపురుషులయొక్క మనోహరాలైన

డ్త72 శ్రీమదాంధ్ర మహాభారతము గానాలు; వర, ముని, దివిజ+ ఆశీర్వాద, నాదంబుతోడన్‌= ఉత్తము లైన బుషులయొక్క, దేవతలయొక్క ఆశీర్వచన శబ్దంతో; మహా, రమ్యము= మిక్కిలి మనోహరం; అయ్యెన్‌.

తాత్పర్యం: మనోహరా లైన అప్సరసల నృత్యాలు, సిద్దవిద్యాధరుల వీణా వేణు మృదంగాది వాద్యాల ధ్వనులు,

కిన్నర కింపురుషుల లలిత గొనాలు, మహర్షులు, దేవతలు చేసే ఆశీర్వచనాల శబ్దంతో మిక్కిలి మనోహరంగా

ఉన్నది.

విశేషం: మాలినిపాదంలో వరుసగా న, న, మ, య, య అనే గణాలుంటాయి. 9వ అక్షరం యతిస్ట్రానం. (ప్రాసనియతి ఉన్నది.

వరముని దివిజాశీర్వాదాలతో సహా దేవతల లలితగీతాలు మహారమ్య మయ్యెనని సహోక్తిరమ్యంగా నన్నయ వర్లించాడు. వర్ష్యవస్తువుకు

తగిన అక్షరరమ్యత రచనాసౌందర్యాంశం. శ్లేష సమతగుణాల నిర్వహణం దానికి పోషణం. కాగా, మునుల ఆశీస్సులు తపస్సుచేసి ఇంద్ర పరమేశ్చరాదులను మెప్పింపగలిగే అర్జునుని తపోవీరాన్నీ, లలితగీతాదులు ధీరలలితుడుగా ప్రదర్శించే ఆతడి సరసశ్చంగారవిలాస యశోవీరాన్నీ భావింప చేసేవిగా ఉన్నాయి. (సంపా.)

న. పాండురాజును బరమోత్సవంబునం గుంతివలన. బురుషత్రయసమానం బయిన పుత్రత్రయంబు వదసి భుననత్రయ రాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, కుమారులతోడి వినోదంబులం దగిలి యున్నంత; మాద్రి దనయందుం బుత్రజనృంబు వదయు నుపాయంబు లేమికి దుఃఖించి యాత్మగతంబున. 128

(ప్రతిపదార్థం: పాండురాజును= పాండురాజుకూడ; పరమ+ఉత్సవంబునన్‌= మిక్కిలి వేడుకగా; కుంతివలనన్‌; పురుషు (త్రయ,

సమానంబు+అయిన= పురుషులు ముగ్గురితో (బ్రహ్మ, విష్ణు మహేశ్చరులతో) సమానమైన; పుత్ర, త్రయంబు= కొడుకులు

ముగురిని; పడసిజ= పొంది; భునవ, (త్రయ, రాజ్యంబు= మూడులోకాలయొక్క పొలనాధికారం; పడసినంతియు+అజ= పొందినంతగా; గ్‌.

సంతసిల్లి= సంతోషించి; కుమారులతోడి; వినోదంబులన్‌= విలాసంగా ఆటలలో; తగిలి= తగుల్కొని - అనగా ప్రొద్దు పుచ్చుతూ;

ఉన్నంత; మాద్రి; తనయందున్‌; పుత్ర జన్మంబు= కొడుకులు పుట్టటం; పడయు= పొందే; ఉపాయంబు; లేమికి= లేకున్నందుకు;

దుఃఖించి; ఆత్మగతంబున= మనస్సులో.

తాత్పర్యం; పాండురాజు మిక్కిలివేడుకగా క్రుంతీదేవివలన (త్రిమూర్తులతో సమాను లైన ముగ్గురు కొడుకులను

పొంది త్రిలోకాధిపత్యం పొందినంతగా సంతోషించి, కుమారులతో విలాసంగా ఆటలతో (ప్రొద్దు పుచ్చుతూ ఉండగా

  • మాద్రి, తనకు కొడుకులు పుట్టేమార్గం లేనందుకు దుఃఖించి మనస్సులో.

ఉ. కోరిన కోర్కికిం దగంగం గుంతి సుతత్రితయంబు. గాంచె; గాం భారియు నక్కడన్‌ సుతశతంబు ముదం బొనరంగ€ గాంచె; నేం బోరచి యాండుయిట్టువునం బుట్టి నిరర్ధకజీవ వైతి సం సారసుఖావహం బయిన సత్పుతజన్మముం గాన బోలమిన్‌. 129

ప్రతిపదార్థం: కుంతి; కోరిన, కోర్కెకిన్‌; తగంగన్‌= తగినట్టు; సుత, తయంబున్‌= కొడుకులు ముగ్గురిని; కాంచెన్‌= కన్నది; గాంధారియున్‌; అక్కడన్‌= హస్తినాపురంలో; సుత, శతంబు= కొడుకులు వందమందిని; ముదంబు= సంతోషం; ఒనరంగన్‌= ఒప్పేటట్లు; కాంచెన్‌= కన్నది; ఏన్‌= నేను; పోరచి, ఆడు, పుట్టువునన్‌= నిస్పార మైన 'ప్రీజన్మతో; పుట్టి: సంసార, సుఖ+ఆవహంబు+అయిన= సంసారంలో సుఖాన్ని కలిగించేది ఐన; సత్‌*సుత, జన్మమున్‌= మంచి కొడుకుల పుట్టుకను; కానన్‌పోలిమిన్‌= కనలేకపోవటంచేత; నిరర్థక, జీవన్‌= వ్యర్థ మైన (బ్రతుకు కలదాన్ని; ఐతి.

తాత్పర్యం: కుంతి తాను కోరిన కోర్కెకు తగినట్టు ముగ్గరుకొడుకులను కన్నది. అక్కడ హస్తినాపురంలో గాంధారి

సంతోషంగా వందమంది కొడుకులను కన్నది. నేను నిస్పార మైన ఆడజన్మ నెత్తి సంసారంలో సుఖాన్ని కలిగించే

కొడుకులను కనలేక పోవటంచేత వ్యర్థ మైన (బ్రతుకు కలదాన్ని అయ్యాను.

ఆదిపర్వము - పంచమాశ్వానము త్త్గరె

విశేషం: మాద్రిమాట లలో తోడికోడళ్ళవలె తానుకూడా సంతానవతి కాలేకపోయినందుకు పడే వేదనతోపాటు, స్త్రీకి జీవితంలో

సంతాన కాంక్ష ఎంత ప్రబలమో వ్యక్తమవుతున్నది. 'పోరచియాడుపుట్టువునం బుట్టి నిరర్ధకజీవి నైతి'- అనే వాక్యం సంతానం లేని

జీవితం ఎంత నిరర్ధక మని ఆమె ఎంతగా భావిస్తున్నదో ధ్వనింపచేస్తున్నది. వాక్యం అలక్ష్యక్రమ వ్యంగ్యానికి వ్యంజన మయ్యే

రచన కిది చక్కని ఉదాహరణం. ఓజఃప్రసాదగుణమి(శ్రరూపమైన పద్యరచన మాద్రి మనోవేదనను ప్రసన్నం చేస్తున్నది. (సంపా) మాద్రికి నకులసహదేవులు పుట్టుట (సం.1-115-1)

వ. అని వగచుచు నొక్కనాం డేకాంతంబునం బతియొద్ద గద్దద వచన యై తన మనోవాంఛితంబు. జెప్పి “కుంతీదేవి యనుగ్రహంబుం బడయ నగునేని కొదుకులం బడయుదు; నట్లయిన నాకును నీకును లోకంబులకును హిత, ”

౦ బగుంగావున నాకుంబుత్రోత్పాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యి' మృనిన మాద్రికి. బాండురా జి ట్లనియె. 130

(ప్రతిపదార్హం: అని; వగచుచున్‌= చింతిస్తూ; ఒక్కనాడు; ఏకాంతంబునన్‌= ఒంటరి పాటున; పతి, ఒద్ద= భర్త దగ్గర; గద్గద, వచన+ఐ= తడబడుతున్న మాటలు కలదై; తన, మనో, వాంఛితంబున్‌= తన మనస్సులోని కోరికను; చెప్పి; కుంతీదేవి; అను[గ్రహంబున్‌= కుంతీదేవియొక్క దయను; పడయన్‌+అగున్‌+ఏని; పొందకల్షినటైైతే; కొడుకులన్‌; పడయుదును= పొందుతాను; అట్టు+అయిన, నాకును; నీకును; లోకంబులకును; హితంబు+అగున్‌= మేలు కల్గుతుంది. కావున; నాకున్‌; పుత్ర+ఉత్పాదనంబు= కొడుకులు పుట్టేటట్టు: దయ, చేయన్‌= కరుణచూపేటట్టు; కుంతీదేవికిన్‌; ఆనతి; ఇమ్ము; అనిన; మాద్రికి; పాండురాజు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: అని చింతిస్తూ 'ఒక రోజు ఒంటరిగా భర్త దగ్గర తడబడే మాటలతో తన మనస్సులోని కోరికను

తెలిపి 'కుంతీదేవి దయతలిస్తే నేను కొడుకులను పొందుతాను; అట్లా అయితే నాకు, నీకు, లోకాలకు మేలవుతుంది.

లా

అందువలన నాకు కొడుకులు పుట్టేటట్టు చేయవలసిందిగా కుంతీదేవికి ఆజ ఇవ్వండి" అని మాద్రి అనగా పాండురాజు

చా

క. నావచనమున నపత్యముం; గావించును గుంతి నీకుం గడు నెయ్యముతో; నీ వగచిన యీాయర్ధమ । చూవె! మనంబున6 దలంచుచుందడుదు నేనున్‌. 131

ప్రతిపదార్థం: నా, వచనమునన్‌= నామాటచేత; కుంతి; నీకున్‌; కడు, నెయ్యముతోజ మిక్కిలి ప్రేమతో; అపత్యమున్‌= సంతానాన్ని;

కావించును; నీ, వగచిన= నీవు ఆలోచించిన; ఈ అర్హము+అ= ఈ విషయాన్నే; ఏనున్‌: మనంబునన్‌: తలంచుచుండుదున్‌; చూవెజ సుమా,

తాత్చర్యం: నా మాట ప్రకారం కుంతి మిక్కిలి ప్రేమతో నీకు సంతానాన్ని కలుగజేస్తుంది. నీవు తలచిన ఈ

విషయాన్నే నేనూ నా మనస్సులో కోరుకొంటూజఉండేవాడిని సుమా.

వ. అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద్రరాజపుత్తిదయిన మనోవాంఛితంబు. జెప్పి 'సకలలోక కల్యాణ కారు లాశ్వినులు గావున వారి నారాధించియపత్యంబు వదయు'మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసిన మాద్రికి. 132

(ప్రతిపదార్థం: అని; పలికి; అప్పుడు+అ; కుంతీదేవిన్‌; పిలిచి; మద్ర, రాజ, పుత్రిది+అయిన= మ(ద్రరాజు కూతు రైన మౌద్రియొక్క;

మనోవాంఛితంబున్‌= మనస్సులోని కోరికను; చెప్పి; సకల, లోక, కల్యాణ, కారులు అన్నిలోకాలకు శుభాన్ని కూర్చేవారు; ఆశ్వినులు=

డ్తీగడ్త శ్రీమదాంధ్ర మహాభారతము ఆక్వినీదేవతలు; కావున; వారిన్‌: ఆరాధించి= పూజించి; అపత్యంబు= సంతానం; పడయుము= పొందుము; అనిన; కొంతియున్‌; పతి, వచన+అనురూపంబు= మగనిమాటకు తగినట్టుగా; చేసిన; మాద్రికి. తాత్పర్యం: అని పలికి అప్పుడే కుంతీదేవిని పిలిచి, మాద్రి కోరికను తెలియచెప్పి, 'లోకానికంతా మేలుచేసేవాళ్ళు అళ్వినీదేవతలు కాబట్టి వాళ్ళను ఆరాధించి సంతానాన్ని పొందుము” అని చెప్పాడు. కుంతికూడా మగనిమాటకు తగినట్టు చేయగా మాద్రికి. తే. కవలవారు సూర్యేందుప్రకాశతేజు లా । శ్వినుల యంశములం బుట్టి రమరగుణులు

వారలకు. బ్రీతి నాకాశవాణి సేసె । నకుల సహదేవు లనియెడు నామయుగము. 133 ప్రతిపదార్థం: కవలవారు= కవల పిల్లలు; సూర్య+ఇందు, ప్రకాశ తేజులు= సూర్యచంద్రులవలె (ప్రకాశించే కాంతి కలవాళ్ళు; అమర, గుణులు= దేవతలయొక్క గుణాలవంటి గుణాలు కలవాళ్ళు; ఆశ్వినుల, అంశములన్‌; పుట్టిరి; వారలకున్‌; ట్రీతిన్‌= సంతోషంతో: ఆకాశవాణి; నకుల, సహదేవులు; అనియెడు; నామ, యుగము= పేర్లజంటను; చేసె. తాత్పర్యం: సూర్య చంద్రులవలె ప్రకాశించే తేజస్సు కలవాళ్ళు, దేవతలవంటి గుణాలు కలవాళ్ళు అశ్వినీదేవతల అంశలలో కవలలు పుట్టారు. వారికి ఆక్యావాణి సంతోషంతో నకుల సహదేవులనే పేర్టు పెట్టింది. క ఊర్జితులు యుధిష్టిర భీ; మార్దున నకుల సహదేవు లన నిట్లు వివే

కార్జితయశు లుదయించిరి | నిర్ణరుల వరప్రాదనిర్మితశక్తిన్‌. 134 (ప్రతిపదార్థం: ఊర్జితులు= బలం కలవాళ్ళు; యుధిష్టిర, భీిమ+ అర్జున, నకుల, సహదేవులు; అనన్‌; వివేక+ఆర్జిత, యశులు= వివేకంచేత సంపాదించబడిన కీర్తి కలవాళ్ళుు; నిర్ణరుల, వర, ప్రసాద, నిర్మిత, శక్తిన్‌= దేవతలయొక్క వరప్రసాదంచేత కల్పించబడిన శక్తిచేత; ఇట్లు ఉదయించిరి= పుట్టారు. తాత్పర్యం: బలవంతు లైన యుధిస్టిర భీమార్జున నకులసహదేవు లనే వాళ్ళు - వివేకంచేత సంపాదించిన కీర్తి కలవాళ్ళు, దేవతల వర ప్రసాదంచేత ఈ విధంగా పుట్టారు. విశేషం: 'పాండవులు పుట్టిన శుభవేళలలో ఆకాశవాణి పలికింది: వాళ్ళకు పేర్లనుకూడా తానే పెట్టింది. అర్జునుని జన్మదినం త్రిలోకవైభనంగా జరిగింది. దైవాంశసంభూతులేకాక, దైవబల సమన్వితులు, దైవాశీర్యాదయుతులు పాండవులు. ఊర్జితులు అంటే పురుషకారాన్ని సాధింపగలిగిన బలం కలవాళ్ళని విశేషార్ధం. వివేశ ఆర్జితయశులు అనే విశేషణం కూడా పాండవులకు సార్హకమే. సదసద్వివేకం ధర్మవీరుల లక్షణం. పాండవుల సద్వృత్తం, ధార్తరాహ్త్రుల దుర్చుత్తమే భావి భారత కధ. ఇది వస్తుద్వని. (సంపా) వు అంతనట. 135 టీ. _అంతన్‌= తరువాత; అట= అక్కడ. సీ మృగ శాప భయమున జగతీశు. డప్పాండు । పతి శతశ్చంగపర్వతమునందుం

బత్మీసమేతు(దై యత్నంబుతో ఘోర ।; తప మొనరించుచు విపులశక్తి

నమరవరప్రసాదమున ధర్మస్థితి.। గొడుకుల నేవురం బడసె ననియు

విని వసుదేవుండు మనమున హర్షించి ;: యనుజను మందిని ఘనుండు చూడం తే. దనపురోహితుం గశ్యపుం డను మహాత్ముం। జీరి పుత్తెంచె నవ్విప్రుచేత భాగి

నేయు లగు కుమారులకు నమేయరత్న ; భూషణావళు లిచ్చి విశేషలీల, 136

ఆదిపర్వము - పంచమాశ్వాసము త్ష5 ప్రతిపదార్హం:; జగతి+ఈశుండు= లోకానికి అంతటికి ప్రభువు; ఆ+పాండు, పతి= ఆ పాండురాజు; మృగ, శాప, భయంబునజ మృగశాపంవలన కల్లిన భయంతో - అనగా మృగరూపం పొందిన కిందము డనే బుషివలన కల్గిన శాాభయంతో; శతశ్చంగ, పర్వతమునందున్‌; పత్నీ, సమేతుండు+ఐ= భార్యలతో కూడిన వాడై; యత్నంబుతో; ఘోర, తపము: ఒనరించుచు= చేస్తూ: విపుల, శక్తిన్‌= గొప్ప శక్తిచేత; అమర, వర, ప్రసాదమునజ దేవతలయొక్క వరప్రసాదంచేత; ధర్మ, స్థితిన్‌= ధర్మమార్గంలో; కొడుకులన్‌: ఏవురన్‌= ఐదుగురిని; పడసెన్‌= పొందెను; అనియు; విని; ఘనుండు; వసుదేవుండు; మనమున= మనస్సులో; హర్షించి= సంతోషించి; అనుజను= తోడబుట్టిన దానిని - చెల్లెలిని (కుంతిని); మజందిని (అనగా పొండురాజును); చూడన్‌; పురోహితున్‌; కళ్యపుండు; అను; మహాత్మున్‌; చీరి= పిలిచి; ఆ+విప్రుచేతన్‌= ఆ బ్రాహ్మణునితోః భాగినేయులు= తోబుట్టువుయొక్క కొడుకులు: అగు; కుమారులకు; అమేయ, రత్న, భూషణ+ఆవళులు= అపరిమిత మైన రత్నాభరణాల సమూహాలను; విశేష లీలన్‌= అధిక మైన విలాసంతో; ఇచ్చి; పుత్తెంచె= పంపాడు.

తాత్పర్యం: పాండురాజు మృగశాపభయంవలన భార్యలతో కలిసి శతశ్చంగ పర్వతం మీద ఘోరతపస్సు చేస్తూ,

దేవతల వరప్రసాదం వలన ధర్మమార్గంలో అయిదుగురు కొడుకులను పొందా డని విని, కుంతి అన్న వసుదేవుడు,

తన చెల్లెలిని, మరదిని చూచి రావడానికి తన పురోహితు డైన కళ్యపుడిని పిలిచి, ఆతనిచేత తన చెల్లెలి పిల్లలకు అపరిమిత మైన రత్నాభరణాలను విశేష వైభవంతో ఇచ్చి పంపాడు.

విశేషం: పాండవులకు యాదవులతో ఏర్పడబోయే గాఢమైన అనుబంధాలకు ఇది ప్రస్తావన వంటిది. పాండురాజుతో బంధుత్వం

కలుపుకొన్న వసుదేవుని తరువాత వాసుదేవుడు కూడా పాండవులతో బంధుత్వాన్ని కలుపుకుంటాడు (సుభద్రను అర్జునుడికిచ్చి);

అంతేకాదు వారి యోగక్షేమాలను చూచే రక్షకుడుగా నిలుస్తాడు.

వ. అ కృళ్యపుండును జనుదెంచిపృధా మాద్రీ సహితుం దయియున్నయప్పాందురాజుం గని వసుదేవు సందేశంబు6 జెప్పి యక్కుమారులకు రత్నభూషణాంబరంబు లిచ్చి క్రమంబునం జౌలోప నయనంబు లొనరించి, వేదాధ్యయనంబు సేయించుచున్నంత వసంతసమయం బఖిలజీవలోకానందజననం బై యేర్పడం జనుదెంచిన. 137

ప్రతిపదార్థం: ఆ+కశ్యపుండును; చనుదెంచి= వచ్చి; పృధా, మాద్రీ, సహితుండు+అయి= కుంతీమాద్రులతో కూడినవాడై; ఉన్న; ఆ+పాండురాజును; కని= చూచి; వసుదేవు, సందేశంబువ= వసుదేవుడు చెప్పి పంపిన సమాచారాన్ని; చెప్పి; ఆ+కుమారులకు= పాండవులకు" రత్న భూషణ+అంబరంబులు= రత్నాల ఆభరణాలు, వ'స్తాలు; ఇచ్చి; 'క్రమంబునన్‌; చౌల+ఉపనయనంబులుః= బొల కర్మ, ఉపనయన కర్మ; ఒనరించి= చేసి; వేద+అధ్యయనంబు; చేయించుచు+ ఉన్నంత; వసంత, సమయంబు= వసంతకాలం; అఖిల, జీవ, లోక+ఆనంద, జననంబు+ఐజ=ఐ అన్ని ప్రాణి సమూహాలకు ఆనందాన్ని కలిగించే దై.

తాత్పర్యం: ఆ కశ్యపుడు వచ్చి కుంతీమాద్రులతో కలిసి ఉన్న పాండురాజును చూచి, వసుదేవుడు చెప్పి పంపిన

సందేశాన్ని వినిపించి, (క్రమంగా వాళ్ళకు చౌలోపనయనకర్మలు చేసి వేదాధ్యయనం చేయిస్తూ ఉండగా అన్ని

(ప్రాణులకు ఆనందాన్ని కలిగిస్తూ వసంతకాలం వచ్చింది.

వసంత వర్ణనము (సం.1-116-1) లయగ్రాహ. కమ్మని లతాంతములకు మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసంగెం: జూ తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముద మ్మొనర వాచా లమ్మ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధుర మ్మగుచు విన; ననిశమ్ము సుమనోభా రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్‌, 138

డేగ6 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్హం: కమ్మని, లతా+ఆంతములకున్‌= మంచివాసన కల పూలకు; మొనసి= పూని; వచ్చు; మధుపమ్ముల; సుగీత, నినదమ్ములు= తుమ్మెదలయొక్క చక్కని గానాల ధ్వనులు; ఎసలాన్‌= అతిశయించినాయి; చూతమ్ముల లసత్‌+కిసలయమ్ముల. సుగంధి, ముకుళమ్ములనున్‌= మామిడిచెట్టయొక్క ప్రకాశిస్తున్న చివుళ్ళను, మంచివాసన కల మొగ్గలను; ఆనుచున్‌= తింటూ ముదమ్ము= సంతోషం; ఒనరన్‌= ఒప్పుగా; వాచాలమ్ములు= కూయునటువంటివి; అగు; కోకిల, కులమ్ముల రవమ్ముూూ కోయిల గుంపులయొక్క ద్వని; మధురమ్ము+అగుచు; వినిచెన్‌=ఐ వినిపించింది; అనిశమ్ము= ఎల్లప్పుడూ; సుమన:+భారమ్ములన్‌= పూల బరువుచేత; అశోక, నికరమ్ములును= అశోకవృక్షాల సమూహాలు; చంపక, చయమ్ములును= సంపెంగల సమూహాలు; కింశుక, వనమ్ములును= మోదుగులసమూహాలు; ఒప్పెన్‌. తాత్సర్యం: సువాసన కల పూలకు మూగిన తుమె శ్రదల రుంకారం అతిశయించింది. మావిడి చివుళ్ళను, మొగ్గలను తింటూ సంతోషంతో కూసే కోయిల గుంపుల కూతలు మనోహరంగా వినిపించాయి. అశోకాలు, సంపెంగలు, మోదుగులు బాగా పూచాయి. విశేషం: లయగ(గ్రాహి పాదానికి 30 అక్షరాలుంటాయి. భ జ స్కనుభజ,స్కన, భయ అనే గణాలు వరుసగా ఉంటాయి 9, 17, 25 అక్షరాలు ప్రాస యతిసానాలు. (ప్రాసనియమం ఉన్నది. నన్నయ రచించిన మూడు లయ॥గ్రాహులలో రెండింటిని (క్రింది పద్యంకూడా) వెంటవెంటనే వసంతర్హువర్షనలో వినియోగించటం విశేషం. (తరువాతి పద్యం కూడా లయ(గ్రాహియే). ఈ పద్యంలో వసంత బుతువులో వనాలలో విరబూసి కనువిందుచేసే పూలచెట్ల అందాన్ని, వీనుల విందుచేసే తుమ్మెదల రుంకార నాదాన్ని కోయిలల సుస్వర మాధుర్యాన్ని నన్నయ వర్షించాడు. మకారం నాదాక్షరం, సప్త్రస్వరాలలో ఒకటి. అటువంటి మకారాన్ని ద్విరుక్తంగా, నియతసుందరంగా, మళ్ళీమళ్ళీ (ప్రయోగించి, ఆ తుమ్మెదల రుంకారనాదాన్ని, ఆ కోయిలల సుస్వర మాధుర్యాన్ని పారకుల చెవి సోకీటట్లు చేశాడు. శృంగార భావోద్దీపకంగా ఏర్పడిన వాతావరణాన్ని అక్షరరమ్యంగా ధ్వనింపచేశాడు. లయాగ్రాహె.

చందన తమాలతరులందు నగరుద్రుమములందు. గదళీవనములందు లవలీ మా

కంద తరుషండములయందు ననిమీల దరవింద సరసీవనములందు వనరాజీ

కందళిత పుష్పమకరందరసముం దగులుచుం దనుపు సౌరభము నొంది జనచిత్తా

నందముగం బ్రోషితులడెందము లలందురంగ ముందమలయానిల మమందగతి వీచెన్‌. 139 ప్రతిపదార్హం; చందన, తమాల, తరుల+అందున్‌= మంచి గంధపు చెట్టయందు, తమాల వృక్షాలందు: అగరు, 'ద్రుమముల+అందున్‌= అగరు వృక్షాలందు; కదళీ, వనముల+అందు= అరటిచెట్ల సమూహాలందు' లవలీ, మాకంద, తరు, షండముల+అందున్‌= లవలీ తీగల, తియ్యమామిడి చెట్టయొక్క సమూహాలందు; అనిమీలత్‌౪అరవింద, సరసీ, వనముల+అందు= వికసించిన తామరలు కల కొలకుల సమూహాలందు; వనరాజీ, కందళిత, పుష్ప మకరంద, రసమున్‌= ననసమూహంలో వికసించిన పూలమీది తేనెను; తగులుచున్‌= తాకుతూ; తనుపు= చల్లదనం; సౌరభమున్‌= సువాసనను; ఒంది= పొంది; జన, చిత్త+ఆనందముగన్‌= (ప్రజలమనస్సుకు సంతోషం కలిగేట్టు; ప్రోషితుల, డెందములు= దేశాంతరంలో ఉన్న వారి మనస్సులు; అలందురంగ= దుఃఖించేట్టు మంద, మలయ+అనిలము= మెల్లని చల్లగాలి; అమంద, గతి=ఐ అధిక మైన వ్యాప్తితో; వీచెన్‌. తాత్పర్యం: మంచిగంధపుచెట్ల, తమాలపు చెట్టు అగరుచెట్ట, అరటితోటల, లవలీతీగల, తియ్యమామిడి చెట్ల సమూహాలలో, పూచిన తామర కొలనులలో, వికసించిన పూలలోని తేనెమీద పాకుతూ చల్లదనాన్ని, సువాసనను

ఆదిపర్వము - పంచనూశ్వాసము త్త77 పొంది ప్రజల మనస్సుకు ఆనందం కలిగేటట్టు, దేశాంతరంలో ఉన్న వాళ్ళ మనస్సులు దుఃఖించేటట్టు మందమారుతం అధికంగా వీచింది.

విశేషం: ముందు పద్యంలో రూపనాదాత్మక వన సౌందర్యాన్ని రమణీయంగా వరించిన నన్స్నయ్య-ఈ పద్యంలో కనువిందుచేసే

సం శ్ర ర్యాన్ని వ బ్రయ్యు శ్ర

వన సౌందర్యంతో పాటు స్పర్శాత్మక మందమలయానిలాన్ని మనోహరంగా వరించాడు. ఆ పద్యంలో తుమ్మెదల రుంకారనాదాన్ని,

కోయిలల స్వరమాధుర్యాన్ని ధ్వనింపచెయ్యటానికి దిర్తుక్తమకారాన్ని వాడుకుంటే--ఈ పద్యంలో మందమలయానిలాన్ని అందచేయటానికి

బిందుపూరక దకారాన్ని వాడుకొన్నాడు. అక్షరశిల్సి నన్నయ. అక్షరరమ్యం, రుచిరార్థమనోజ్ఞం ఆయన కవిత. పాండురాజు మరణము (సం.1-116-4)

వ. ఇట్లుసర్వభూతసమ్మోహనంబయిన వసంత సమయంబునం బాండురాజు మదనసమ్మోహనమార్గణ బందీకృత మానసుం డై మద్రరాజపుత్రి దైన మనోహరాకృతియందు మనంబు నిలిపి యున్నంత; నొక్కనాండు కుంతీదేవి బ్రాహ్మణభోజనంబు సేయించుచుండి మాద్రీరక్షణంబునం దేమజి యున్న యనసరంబున. 140

ప్రతిపదార్థం: ఇట్టు: సర్వ, భూత, సమ్మోహనంబు+అయిన= అన్ని ప్రాణులను మోహింపచేసేది అయిన; వసంత, సమయంబునన్‌:; పాండురాజు: మదన, సమ్మోహన, మార్గణ, బందీకృత, మానసుండు+ఐ= మన్మథుడియొక్క సమ్మోహన బాణంచేత కట్టివేయబడిన మనస్సు కలవా డై; మద్రరాజు, పుత్రిదిశఐన; మనోహర+ఆకృతియందు= అంద మైన రూపంమీద, మనంబు= మనస్సు; నిలిపి; ఉన్నంతన్‌; ఒక్కనాండు; కుంతీదేవి; బ్రాహ్మాణ; భోజనంబు; చేయించుచు; ఉండి; మాద్రీ, రక్షణంబునందు; ఏమజి= మరచి; ఉన్న: అవసరంబున= సమయంలో.

తాత్పర్యం: ఈవిధంగా అన్నిప్రాణులను మోహింపచేసే వసంత కాలంలో పాండురాజు మన్మథునియొక్క

సమ్మోహన బాణానికి లొంగిన మనస్సు కల వాడై మాద్రియొక్క మనోహర రూపం మీద మనస్సు నిలిపి, ఒక

రోజు కుంతీదేవి (బ్రాహ్మణ భోజనం చేయిస్తూ మాద్రిని కనిపెట్టటం మరచి ఉన్న సమయంలో.

విశేషం: మానవ మనస్తత్వంపై ప్రకృతి ప్రభావం ప్రబలం. విశేషించి వసంత(ప్రభావం విపరీతం. మాద్రి వయస్సులో చిన్నది. మహా

సౌందర్యవతి. ఆమె పాండురాజువశం కాకుండా, వాళ్ళిద్దరికీ ఏకాంతం ఏర్పడకుండా కుంతి కనిపెడుతూనే ఉన్నది. కానీ ఆ రోజు

(బ్రాహ్మాణభోజనంలో నిమగ్నురా లై ఆమె మాద్రి విషయం మరచింది.

ఉ. _చారుసువర్హహాసి నవచంపక భూషయు సిందువారము క్హా రమణీయయున్‌ వకుళదామవతంసయు నై యపూర్వ శృం గార విలాసలీల యెసంగం దనముందట నున్న మాద్రి నం భోరుహనేత్రం జూచి కురుపుంగవుం దంగజరాగమత్తుం డై, 441

ప్రతిపదార్థం: చారు, సువర్ణ హాస, నవు చంపక, భూషయు= అంద మైన బంగారాన్నే గేలిచేసే క్రొత్త సంపెంగ పువ్వులే ఆభరణంగా కలది; సిందువార, ముక్తారమణీయయున్‌= వావిలి పూలనే ముత్యాలచే మనోహర మైనది; వకుళ, దామ, వత౦సయున్‌, ఐ= పొగడదండలు చెవి ఆభరణాలుగా కలదై; అపూర్వ, శృంగార, విలాస, లీలజ అంతకుముందు లేని అలంకార విలాసం యొక్క అతిశయం; ఎసంగన్‌= ఒప్పగాః తన, ముందటన్‌; ఉన్న; అంభోరుహ, నేత్రన్‌= కమలాలవంటి కన్నులు కల దానిని; మాదద్రిన్‌: చూచి; కురు, పుంగవుండు= కురుశ్రేష్టు డైన పాండురాజు: అంగజ, రాగ, మత్తుడు+ఐ= మన్మధరాగంచేత మదించిన వాడ్డై

డ్త78 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: అందంలో బంగారాన్ని మించిన క్రొత్త సంపెంగ పువ్వులే ఆభరణాలుగా కలదై, వావిలి పూలనే ముత్యాలచేత మనోహర మైనదై, పొగడదండలు చెవి ఆభరణాలుగా కలదై అంతకుముందెన్నడూ లేని శృంగారవిలాసంతో తన ముందున్న - కమలాలవంటి అందమైన కన్నులు కల మాద్రిని చూచి, కురు 'శ్రేష్టుడైన పాండురాజు మన్మథరాగవళశుడై.

విశేషం: సహజంగానే సౌందర్యవతి అయిన మాద్రికి వసంతపుస్పాలంకారాలు అమిత మైన శోభను కల్లించాయి. ఆమె రూపం అనాడు పాండురాజుకు మత్తెక్కించింది. వతంస - అవతంసయొక్క రూపాంతరం, క కిందముశాపము డెందము । నం దలంపక శాపభయమునన్‌ మాద్రి గడున్‌

వందురి వారింపంగ బలి । మిం దత్సంభోగసుఖసమీహితు. డయ్యెన్‌, 142

ప్రతిపదార్థం: కిందము, శాపము= కిందమమునియొక్క శాపాన్ని; డెందమునన్‌= మనస్సులో తలపక; మాద్రి శాప, భయమునన్‌= శాపంవలని భయంచేత; కడున్‌= మిక్కిలి; వందురి= దుఃఖించి; వారింపంగ= అడ్డుకోగా; బలిమిన్‌= బలాత్కారంచే* తత్‌+సంభోగ, సుఖ సమీహితుండు= దానితో సంభోగసుఖంమీద కోరిక కలవాడు; అయ్యెన్‌.

తాత్పర్యం: పాండురాజు కిందమునిశాపాన్ని మరచాడు. ఆ శాపం గుర్తున్న మాద్రి ఎంతో భయంతో,దుఃఖంతో

తనను వారిస్తున్నా. బలాత్కారంగా ఆమెతో సంభోగ సుఖాన్ని పాందకోరాడు.

విశేషం: ప్రకృతిప్రభావం, మాద్రి సౌందర్యం, మానవ సహజ మైన కామతృష్ట విశేషించి ఆ కామతృష్ట తీర్చుకోవటానికి అనుకూలించిన

ఆ సమయం పాండురాజు ప్రాణాలు తీశాయి. విధి బలీయం.

వ. దానం జేసి విగత జీవుం డైన యప్వాండురాజుం గౌంగిలించికొని మాద్రి యజచుచున్న దాని యాక్రందన ధ్వని విని వెలచి కుంతీదేవి గొడుకులుం దానునుం బఅతెంచి పతియడుగులపయిం బడి యేద్దుచున్ననెజింగి, శతశ్ళంగ నివాసు లగు మునులెల్లం దెరలివచ్చి చూచి శోక విసయాకులిత చిత్తు లయి; రంత. గుంతీదేవి మాద్రి కి ట్లనియె. 143

ప్రతిపదార్థం: దానన్‌+చేసి= దానివలన; విగత, జీవుండు+ఐనవ= కోల్పోయిన [ప్రాణాలు కలవా డైన; ఆ+పాండురాజున్‌; కౌగిలించుకొని; మాద్రి; అజచుచున్న; దాని; ఆక్రందన; ధ్వని= ఏడుపు శబ్దం; విని; వెజచి= భయపడి; కుంతీదేవి; కొడుకులున్‌; తానునున్‌: పజుతెంచి= వచ్చి; పతి, అడుగుల, పయిన్‌= భర్త పాదాల మీద; పడి; ఏడ్చుచు+ఉన్నన్‌; ఎటింగి= తెలిసికొని; శతశ్చంగ, నివాసులు+అగు; మునులు+ఎల్లన్‌= మునులందరూ; తెరలి= కలతచెంది; వచ్చి; చూచి; శోక, విస్మయ+ఆకులిత, చిత్తులు+అయిరి= దుఃఖంచేత, ఆశ్చర్యంచేత కలత చెందిన మనస్సు కలవాళ్ళు అయ్యారు; అంతన్‌= అప్పుడు; కుంతీదేవి; మాద్రికి; ఇట్టు+అనియె. తొత్సర్యం: దానివలన ప్రాణాలు కోల్పోయిన ఆ పాండురాజును కౌగిలించుకొని మాద్రి అరుస్తూ ఉన్నది. దాని యేడుపు సవ్వడి విని భయపడి కొడుకులతోసహా కుంతీదేవి వచ్చి, భర్రపాదాలమీద పడి ఏడ్వసాగింది. ఆ సంగతి తెలిసికొని శతశ్చంగంలో నివసిస్తున్న మునులంతా గుమికూడి వచ్చి చూచి దుఃఖంతో, ఆశ్చర్యంతో కలతచెందిన మనస్సు కలవారయ్యారు. అప్పుడు కుంతి మాద్రితో ఈ విధంగా అన్నది,

ఆదిపర్వము - పంచమాశ్వాసము త్ర ఉ. "నా కెడ యిమ్ము లెమ్ము కురునాధు మనఃప్రియధర్మపత్ని నే నేకత మెట్టు లుండుదు? మహీపతితోడన పోదు. బుత్రులం జేకొని పెను: నాపనుపుం జేయుము" నావుడు మాద్రి దద్దయున్‌ శోకపరీతచిత్త యగుచుం బృథ కి టనియెం బ్రియంబునన్‌. శ44 ప్రతిపదార్థం: నాకు; ఎడజ= చోటు; ఇమ్ము; లెమ్ము; కురునాధు, మనఃప్రియ, ధర్మపత్నిన్‌= కురురా జైన పాండురాజుయొక్క మనస్సుకు ప్రియ మైన భార్యను; ఏన్‌= నేను: ఏకతమ= ఒంటరిగా; ఎట్టుల=ఐ ఉండుదు; మహీపతితోడన= రాజుతోనే: పోదున్‌= సోతాను - అనగా (ప్రాణాలు విడుస్తాను, పుత్రులన్‌; చేకొని= తీసికొని; 'పెన్పు= పెంచుము; న్నా పనుపున్‌= నాయొక్కఅఆజ్ఞను; చేయుము; నావుడు= అని అనగా; మాద్రి; తద్దయున్‌= మిక్కిలి; శోక్క పరీత, చిత్త, అగుచున్‌= దుఃఖంచే చుట్టబడిన మనస్సు కలదై; ప్రియంబునన్‌= అనువుగా; పృథకు= కుంతికి; ఇట్టు; అనియెన్‌, తాత్పర్యం: “నీవు లేచి నాకు చోటిము ఖై నేను పాండురాజుమనస్సుకు ప్రియ మైన ధర్మపత్నిని. ఆయనను విడిచి ఉండలేను. ఆయనతో వెళ్ళిపోతాను. నీవు కొడుకులను పెంచుము” అని కుంతి అనగా మాద్రి ఎంతో దుఃఖంతో ఆమెమనస్సుకు (ప్రియంగా ఇట్టా పలికింది. విశేషం: కురునాథుమనఃప్రియధర్మపత్ని - అని మాద్రిని సంబోధించి - నేను, ఏకతమ ఎలా ఉండగలను అని కుంతి అన్నట్టు కూడా (గ్రహింపవచ్చు. ఆ సంబోధనలో కుంతి మాద్రిని ఎత్తిపాడవడం ధ్వనిస్తుంది. పాండురాజు మనస్సుకు ప్రియమైన నీ ధర్మ పత్నీత్వం ఇదేనా? భర్త (ప్రాణం పోవడానికి కారణభూతురాలవు అయ్యావు - అనేనింద అందులో స్ఫురించక మానదు. అట్లా కాక కుంతి తననే కురునాధు మనః ప్రియధర్మపత్నిన్‌ అని చెప్పుకొని, ఏన్‌= నేను, ఏకతమః= ఒంటరిగా, ఎట్టా ఉండగలను అన్నట్టు భావించినా అందులోనూ కొంత ఎత్తిపొడుపు లేకపోలేదు. పాండురాజుకు నేను నీ కన్నా తక్కువ ప్రియమైన భార్యను కాను; అయినా మైమరచి నీవలె ఆయనకు ప్రాణాపాయం కలిగింపని ధర్మపత్నిని సుమా! ఆయన ధర్మపత్నిని అయిన నేను ఆయన లేకుండా ఎట్టా జీవించగలను అనే పదునెనభావం పరోక్షంగా మాద్రికి ఎత్తిపొడుపే. అప్పటి పరిస్తితుల్లో కుంతి ఎంత సానుభూతితో మాద్రిని చూచినా, ఆమెమీద కుంతికి ఒకింత కోపం లోలోపల కలగటం సహజమే. తదనుగుణంగా ఆమె మాటలలో కొంత ఎత్తిపొడుపు చోటుచేసికొనటం కూడా సహజమే అలతి అలతి మాటలతోకూడిన వాక్యాలు శోకతీవ్రతను వ్యక్తంచేసేటట్టు మాధుర్యగుణం ఈ పద్యంలో నాటకీయంగా పోషించబడింది. మాద్రి సహగమనము సేయుట (సం.1-116-25) తరువోజ. కురువంశ నిస్తారకుల ధర్మయుక్తిం గొడుకులం బడసి యి క్కురుకుంజరునకుః గరము మనప్రీతి గావించి పుణ్యగతికిం గారణమవై కమలాక్షి! నీవు దిరముగా నిష్టంబు దీర్చి; తే నిందు ధృతిం బతియిష్టంబు దీర్వన; కాన యరిగెదం బతితోడ నన్యలోకంబునం దైనం బ్రీతసేయంగ గాంతు ననియు. 145 ప్రతిపదార్థం: కమలాక్షి= తామరలవంటి కన్నులు కలదానా! ఓ కుంతీ! నీవు; కురు, వంశ నిస్తారకులన్‌= కురువంళాన్ని తరింప చేసేవారిని; కొడుకులన్‌; ధర్మ, యుక్తిన్‌= ధర్మంతోడి కూడికచేత - అనగా ధర్మమార్గంలో; పడసి= పొంది ఈ+కురు, కుంజరునకున్‌= ఈ కురుశ్రేష్టు డైన పాండురాజుకు; కరము= మిక్కిలి; మనః ప్రీతి= మనస్సంతోషాన్ని; కావించి; పుణ్య, గతికిన్‌= పుణ్యలోకానికి; కారణమవు+ఐ; తిరముగాన్‌= శానతంగా; ఇష్టంబు; తీర్చితి; ఏన్‌= నేను; ఇందు= ఈ లోకంలో; ధృతిన్‌=

శర0 శ్రీమదాంధ్ర మహాభారతము

సంతోషంతో: పతి, ఇష్టంబు= భర్రయొక్క కోరిక; తీర్చన= తీర్భనే లేదు; కాన్‌= అందుచేత; అన్య, లోకంబు, అందు+ఐనన్‌=

పరలోకంలో నైనా; ప్రీతి= ఇష్టం; చేయంగన్‌; కాంతున్‌= చూస్తాను; పతితోడన్‌= భర్తతోకూడా; అరిగెదన్‌= వెళ్తాను; అనియు. తొత్సర్యం: కుంతీ! నీవు కురువంశాన్ని తరింప చేసే కొడుకులను ధర్మమార్గంలో కని ఈ కురుశ్రేష్టు డైన పాండురాజుకు మిక్కిలి సంతోషం కలిగించి పుణ్యలోకం పొందడానికి కారణ మయ్యావు. శాశ్వతంగా ఆయన కోర్కె తీర్చావు. నేను ఈ లోకంలో భర్తకోర్కె తీర్చనే లేదు. అందువలన పరలోకంలో నైనా తీర్చటానికి ఆయన వెంట వెల్తాను.

విశేషం: తరువోజ లక్షణానికి అది. 5.28 చూడండి. ఎత్తిపొడుపుగా పలికిన కుంతితో గడుసరిగా మాద్రి మాట్లాడింది. కుంతి ఎత్తిపొడుపును తన మాటలలో ఎంత గోప్యంగా మలచిందో, మాద్రికూడా తన గడుసరితనాన్ని అంత నిపుణంగా గోప్యంచేసి సహజసంభాషణవలె పలికింది. ముందటి పద్యంలో 'మనః[ప్రియధర్మపత్ని' అనే విశేషణం వ్యంజకం. అందులోని 'మనః ప్రీతి అనే మాటనే మాద్రి గడుసరిగా వాడింది. కుంతియే మనఃప్రియధర్మపత్షిగా భావిస్తే ఆమె పాండురాజు అనుమతితో మంత్రశక్తివలన పుణ్యగతికి కారకు లైన కొడుకులను కని ఆయనకు పుణ్యగతిని, మనఃప్రీతిని కలిగించింది. మాద్రికి మంత్రశక్తి లేదు కాని అందమైన అకృతి కన్నది. దానిని పాండురాజు కోరాడు. కాని, దానివలన పాండురాజుకు మనః ప్రీతి కలిగించలేకపోయింది శాపకారణంగా. మనఃప్రీతిని కలిగించటంలో కుంతి కృతార్జురాలైంది. తాను కాలేకపోయింది అని వాచ్యమైన అర్ధం. ఆ వాచ్యం వెంట వ్యంగార్హ్య'ప్రతీతికూడా కలుగుతున్నది. కుంతీ! నీవు పాండురాజు ఇష్టం తీర్చినదొనవు. ఆ యిష్టపూర్తివలలన ఆయనకు ఇహలోకసుఖంకంటె పరలోకసుఖమే కలుగుతుంది. పాండురాజు నన్ను కోరింది ఇహలోక సుఖాన్ని. దాన్ని తీర్చే అవకాళం లేదు

ఈ లోకంలో. అందువలన ఆయనతోపాటు నేనుకూడా సహగమనంచేసి ఆ కోర్కె పరలోకంలోనైనా తీరుస్తాను అన్నది మాద్రి.

పతికి మనఃప్రియధర్మపత్ని' అని ఎత్తిపాడుపుగా మాద్రిని సంబోధించిన అర్జాన్ని పురస్కరించుకొని తానే సహగమనయోగ్యత

కలిగినదానిననీ, అదే పాండురాజుకు మనఃప్రియహేతువనీ చెప్పింది. మాద్రి శోకపరీత చిత్త ప్రవృత్తి వ్యంజకంగా కాంతిగుణంతోకూడిన తరువోజ సార్ధకం. (సంపా.)

న “మజియు మృగశాపభయం బెజింగియు ని ట్లేమజిన యతిప్రమత్తురాల; నే నిందుండి పుత్రుల రక్షింప నేర; నన్నువారింప వలనదు; కొడుకుల నేమజక రక్షించునది' యని చెప్పి కుంతీదేవి వీడ్కొని మునిసహస్రంబునకు మ్రొక్కి మద్రరాజపుత్తి పతితోడన చితారూఢ యై యగ్నిశిఖల నపగత ప్రాణ యయ్యె: నంత నయ్యిరువుర యంగంబులు సంగ్రహించుకొని మహామునులు కుంతీదేవిం గొడుకుల నూరాల్చి. 146

(ప్రతిపదార్హం: మజియు; మృగ, శాప భయంబు= జింకయొక్క శాపంవలనకలిగే భయం; ఎటింగియున్‌= తెలిసికూడ; ఇట్టుః ఏమటిన= మరచిపోయిన; ఆతి, ప్రమత్తురాలన్‌= మిక్కిలి మత్తు గొన్న దానను - అనగా జూగరూకత లేనిదానను; ఏన్‌= నేను; ఇందు+ఉండి; పుత్రుల; రక్షింపనేరజ కాపాడలేను; నన్ను; వారింప, వలవదు= అడ్డగించవద్దు; కొడుకులన్‌; ఏమణక; రక్షించునది; అని, చెప్పి; కుంతీదేవి; వీడ్కొని; ముని, సహస్రంబునకు= మునులు వేయిమందికి (మునుల సమూహానికి); (మొక్కి; మ(ద్రరాజు, పుత్రి; పతితోడన= భర్తతో కూడా; చితా+ఆరూఢ+ఐ= చితిపైకి ఎక్కిందై; అగ్జి, శిఖలన్‌= నిప్తుమంటలలో; అపగత, ('ప్రాణ= పోయిన (ప్రాణాలు కలది; అయ్యెన్‌: అంతన్‌ ఆ+ఇరువుర; అంగంబులు= అవయవాలు (శవదహనం తరువాతి రోజు ఆయా అవయవాల ఎముకలు); సంగ్రహించుకొని= సమకూర్చుకొని - అనగా ఒకటిగా చేర్చి తీసికొని; మహామునులు; కుంతీదేవిన్‌? కొడుకులన్‌; ఊరార్చి= ఓదార్చి.

తాత్పర్యం: 'మృగశాపంవలన కలిగే భయం తెలిసికూడా ఈవిధంగా జాగ్రత్త లేనిదాన్ని అయిన నేను, ఇక్కడ

ఉండి కొడుకులను కాపాడ లేను. నన్ను అడ్డుకోవద్దు. జాగ్రత్తతో నీవే కొడుకులను కాపాడుము” అని కుంతీదేవికి

ఆదిపర్వము - పంచనూశ్వాసము శృర్‌1ే

చెప్పి, వెయ్యి (అనేక) మంది మహర్షులకు (మొక్కి, భర్తశవంతోపాటు తానుకూడా చితి ఎక్కి మంటలలో మాద్రి ప్రాణాలు వదిలింది. తరువాత మహామునులు మాద్రీ పాండురాజుల అస్టిసంచయనం చేసి, కుంతిదేవినీ, ఆమె కొడుకులను ఓదార్చి. విశేషం: కిందముడిచ్చిన శాపంప్రకారం పాండురాజు ఏ సతితో (క్రీడింపబోతాడో ఆమెకూడా చనిపోతుంది. అది ఇక్కడ నిజమయింది. క, _ ధరణీరాజ్యవిభూతియు । పరిజనులను బాంధవులను బ్రజ విడిచి తప

శ్చరణ తపస్వుల తనకున్‌ । శరణం బని నమ్మి పాండుజనపతి నెమ్మిన్‌. 147 ప్రతిపదార్హం: పాండు జనపతి= పాండురాజు; ధరణీ, రాజ్య, విభూతియు= భూమి రాజ్యసంపదను: పరిజనులను= సేవకులను; బాంధవులను= చుట్టాలను; 'ప్రజ= ప్రజలను; విడిచి; తపః:+చరణ= తపస్సు చేసే; తపస్వుల= బుషులే; తనకున్‌; శరణంబు+అని= దిక్కని; నమ్మి; నెమ్మిన్‌= ప్రీతితో తాత్పర్యం: పాండురాజు రాజ్యసంపదను, సేవకులను, చుట్టాలను ప్రజలను వదలి తపస్సుచేసే బుషులు మాత్రమే తనకు దిక్కని నమ్మి నిశ్చితంగా. క, _ కొడుకుల నిందట కిల్లడ । యిడి పరలోకమున కరిగె; నెదసేయక యి

ప్పుడ వీరలం గురువృద్ధుల । కడకుం గొని పోవవలయు గజపురమునకున్‌. 148 (ప్రతిపదార్హం: కొడుకులన్‌; ఇందలుకుజఐ ఇంతమందికి - (ఇంతమంది మహర్షులకు); ఇల్లడ. ఇడి= ఇల్లడ పెట్టి - అప్పగించి; పరలోకమునకు= స్వర్గానికి అరిగెన్‌= వెళ్ళాడు; ఎడ, చేయక= ఆలస్యం చేయక; ఇప్పుడు+ అవ ఇప్పుడే; పఏీరలన్‌=ఐ పాండవులను; గజ, పురమునకున్‌= హస్తినాపురానికి; కురు వృద్దుల కడకున్‌= కురువంశంలోని పెద్దల దగ్గరకు; కొనిపోవవలయు. తాత్పర్యం: కొడుకులను మన అందరికి అప్పగించి స్వర్గానికి వెళ్ళాడు. మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ పాండవులను హస్తినాపురంలో కురువంశంలోని పెద్దల దగ్గరకు తీసికొనిపోవాలి. విశేషం: ఎవరైనా తీర్భయాత్రాదులకు పోతూ తిరిగివచ్చేంతవరకూ ఒకరివద్ద భద్రంగా ఉంచి, మరల తిరిగి ఇచ్చేటట్టు అర్థాన్ని ఉంచటం ఇల్లడపెట్టటం అంటారు. ఇక్కడ పాండవులు పాండురాజుకు, ఆతని వంశానికి సంబంధించిన ధనం వంటివారు. పాండురాజు పరలోకగతుడైనాడు కాబట్టి అతని వంశానికి వారసులైన పుత్రులను ఆ వంశంలోని పెద్దలకు ఒప్పచెప్పటం న్యాయం. బుషులు ధర్మబుద్దితో తమకు ఆ కర్తవ్యమున్న దని భావించటం మానవసంబంధాలలో ఉండదగిన ఒక మహనీయ లక్షణంగా కావ్యోపదేశం.

మునులు పాండవులను హాస్తిపురంబునకుం గొనివచ్చి ధృతరాష్ర్రున కొప్పగించుట (సం.1-117-6) వ. అని తమలో విచారించి కుంతీదేవిని గుమారులం దోడ్కొని మునులెల్ల హస్తిపురంబునకు వచ్చి రంత. 149

ప్రతిపదార్థం: అని- తమలో, విచారించి= ఆలోచించి; కుంతీదేవిని; కుమారులన్‌; తోడ్కొని; మునులు+ఎల్ల= మునులందరు; హస్తి పురంబునకు, వచ్చిరి; అంత= అప్పుడు. తాత్సర్యం: అని మునులు తమలో ఆలోచించి కుంతీదేవిని, కుమారులను వెంటపెట్టుకొని హస్తినాపురానికి వచ్చారు. అప్పుడు.

శ్షర2 త్రీమదొంధ్ర మహాభారతము చ. 'సురల వరసప్రపాదమునం. జూవె సుపుత్రులం బాండురాజు భా సురముగం గాంచె6 దత్పుతులం జూతము రం'డని పారు లెల్ల నొం డొరులకుం జెప్పచుం దెరలి యొండొరులం గడవంగ వచ్చి చూ చిరి భుజవిక్రమాధరిత సింహకిశోరులం బాండవేయులన్‌. 150 ప్రతిపదార్థం: పౌరులు+ఎల్లన్‌= హస్తినాపుర (ప్రజలందరును; పాండురాజు; సురల, వరప్రసాదమునన్‌+చూవె= దేవతలయొక్క వరప్రసాదంచేత సుమా; సు, పుత్రులన్‌= యోగ్యులైన కొడుకులను; భాసురముగన్‌= (ప్రకాశించేటట్టు; కాంచెన్‌= కన్నాడు; తత్‌+సుతులన్‌= ఆయనయొక్క కొడుకులను; చూతము; రండు; అని; ఒండు+ఒరులకున్‌= ఒకరి కొకరు; చెప్పుచున్‌; తెరలి= బయలుదేరి; ఒండు+ఒరులన్‌= ఒకరు మరొకరిని; కడవంగన్‌= దాటి; వచ్చి; భుజ వి([క్రమ+అధరిత, సింహ, కిశోరులన్‌= బాహు పరా(క్రమంచే తక్కువగా చేయబడిన సింహపుపిల్లలు కలవారిని - అనగా సింహపుపిల్లలను మించిన పరాక్రమవంతులను, పాండవేయులన్‌= పాండుపుత్తులను; చూచిరి. తాత్పర్యం: “పాండురాజు దేవతల అను[గ్రహంచేత సుపుత్రులను కన్నాడు. వారిని చూద్దాం రం'డని హస్తినాపుర (ప్రజలందరూ ఒకరితో ఒకరు చెప్పుకొంటూ, ఒకరికంటె ఒకరు ముందుమిగిలి సింహపుపిల్లలకంటె పరాక్రమవంతు లైన పాండుకుమారులను చూచారు. విశేషం: హస్తినాపురానికి దూరమై చాలకాలంగా అడవులలో పాండురాజు ఉంటున్నా, ఆ నగరంలో, రాజ్యంలో (ప్రజలలో అతనికి ఉన్న పలుకుబడి, గౌరవం ఈ పద్యంలో వ్యంగ్యం. ఈ పద్యరచనలో సమాధి అనే శబ్దగుణం సార్దకంగా పోషించబడింది. పాండవులను చూడాలన్న ఉత్కంరను [క్రమంగా పౌరులు పెంచుకొంటూవచ్చి చివరకు పాండవులను చూచినట్లు వర్ణించిన ఈ పద్యరచన చిన్నచిన్న పదాలతో, సమాసాలతో సాగి పాండవులను 'భుజవిక్రమాధరితసింహకిశోరులు'గా వర్షించిన దీర్హసమాసంతో ముగియటంతో ఆరోహగతిని సూచిస్తూ చూపరుల ఆసక్తిని, అద్భుతాన్నీ ధ్వనింపచేస్తున్నది. “'పాండవేయులనో అన్న చివరి విశేషణం 'తంగడ్రికి తగిన తనయులు" అనే భావం ప్రజలకు కలిగిందని ధ్వనింపజేస్తున్నది. ఉ. 'వీరలు దైవశక్తి. బ్రభవించిన వా రగు టేమి సందియం? జీరమణీయకాంతి నుపమింప(గ వేల్పుల కారి? యిట్టి యా కారవిశేషసంపదం బ్రకాశితతేజముపేర్మిం జూడ సా ధారణమర్వులే[ యని ముదంబునం బౌరులు దమ్ము. జూడంగన్‌. 151 ప్రతిపదార్హం: వీరలు; దైవ,శక్తిన్‌= దేవతల ప్రభావంచేత; ప్రభవించిన వారు+అగుట= పుట్టినవాళ్ళుకావటంలో: ఏమి, సందియంబు= అనుమానం ఏమున్నది? ఈ, రమణీయ, కాంతిన్‌= ఈ మనోహరమైన కాంతిని; ఉపమింపంగ= పోల్చి చూడగా; వేల్పులు+అ, కారె= దేవతలే కదా; ఇట్టి; ఆకార, విశేష సంపదన్‌= ఈ విధమైన రూపవిశేషంయొక్క అతిశయాన్ని; ప్రకాశిత, తేజము, పేర్మిన్‌= (ప్రకటం చేయబడిన తేజస్సు యొక్క అతిశయం; చూడన్‌; సాధారణ, మర్ష్యులే= సామాన్య మానవులా; అని; పౌరులు; ముదంబునన్‌= సంతోషంతో; తమ్మున్‌= తమను; చూడంగన్‌. తొత్సర్యం: “వీళ్ళు దైవశక్తివలన పుట్టిన వాళ్ళవటంలో సందేహం ఏముంది? ఈ మనోహరమైన కాంతిని పోల్చి చూస్తే వీరు దేవతలే. ఈ విధమైన రూపసంపద, తేజస్సు సామాన్యమానవులకు ఉంటాయా?” - అని పౌరులు తమను సంతోషంతో చూడగా.

ఆదిపర్వము - పంచమాశ్వాసము 483 విశేషం: పాండవులను చూడాలన్న ప్రజల ఆసక్తిని ముందుపద్యంలో వర్షించి, వాళ్ళనుచూచిన తరువాత ప్రజలు వాళ్ళనుగూర్చి చేసే ప్రశంసను ఈ పద్యంలో నన్నయ వర్షించాడు. పై పద్యంలో కరృపదస్థానీయులు ప్రజలు, ఈ పద్యంలోని ప్రజలవాక్యాలలో చూడటానికి వచ్చిన ప్రజలను ఆకట్టుకొని వారిని తమ అభిమానులుగా మార్చుకొంటున్న పాండవుల మహిమ వ్యంగ్యం. పాండురాజు తరువాత పాండవులే హస్తినకు (ప్రభువు లన్నది ధ్వని.

వ. ముని సహస్ర పరివృతులయి జననీ సహితంబు పొండురాజ కుమారులు రాజమార్గంబు దజీయవచ్చి రాజమందిర ద్వారాసన్నులగు నంత, మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ ధార్తరాష్ట్రశతంబును నెదురు వచ్చి పాండవులం దోడ్కొని తెచ్చిన, భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవత్యంబికాంబాలికలు మొదలుగా నమ్మునులకు నమస్కరించి; రంతం దమకు మొక్కిన కుమారుల నతిస్నేహంబున నెత్తికొని, కుంతిని బ్రయపూర్వకంబున సంభావించి, పాండురాజవియోగదుజఖీతు లయి మహాశోకంబునం దేలుచున్న విదురధృతరాస్తుల గాంధారీ సహితం బూరార్జి, యమ్మునులయం దొకృన్ఫద్ధతసస్వి మునిసహస్రానుమతంబున నిట్లనియె. 152

ప్రతిపదార్థం: ముని, సహస్ర, పరివృతులు+అయి= మునులు వెయ్యి మందిచే చుట్టబడినవాళ్ళయి; జననీ, సహితంబు= తల్లితోకూడా; పాండురాజ, కుమారులు; రాజమార్గంబు; దణీయ, వచ్చి= చేరవచ్చి; రాజ, మందిర, ద్వారశఆసన్నులు+అగునంత= రాజభవనం యొక్క ద్వారం దగ్గరకు వచ్చిన వారు కాగానే; మంత్రి, పురోహిత, బ్రాహ్మణ, నివహంబులు= మంత్రుల, పురోహితుల, (బ్రాహ్మణుల యొక్క సమూహాలు; దుర్యోధన, దుశ్శాసన, ప్రముఖ, ధార్త రాష్ట్ర శతంబును= దుర్యోధనుడు, దుళ్ళాసనుడు మొదలైన ధృతరా(్ర్రని కుమారులు వందమంది; ఎదురువచ్చి; పాండవులన్‌: తోడ్కొని, తెచ్చిన; భీష్మ విదుర, ధృతరాష్ట్ర సత్యవతి+అంబికా+అంబాలికలు= భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, సత్యవతి, అంబిక, అంబాలిక: మొదలుగాన్‌= ముందుగా; ఆ+మునులకు; నమస్కరించిరి; అంతన్‌; తమక్షు; (మొక్కిన; కుమారులన్‌; అతి, స్నేహంబునన్‌= మిక్కిలి ప్రేమతో ఎత్తికొని; కుంతిని; ప్రియ, పూర్చకంబునవ= ప్రీతిగా; సంభావించి= గౌరవించి; పాండురాజు, వియోగ, దుఃఖితులు+అయి= పొ ండురాజుయొక్క ఎడబాటుచే (మరణంచే) దుఃఖాన్ని పొందినవాళ్ళయి; మహా, శోకంబునన్‌= పెద్దదుఃఖంలో; తేలుచున్న; విదుర, ధృతరాష్రుల; గాంధారీ, సహితంబు; ఊరార్చి= ఓదార్చి; ఆ+మునులయందు; ఒక్క; వృద్ధ, తపస్వి; ముని, సహ(్ర+అనుమతంబునన్‌= బుషులు వెయ్యిమందియొక్క అనుమతితో; ఇట్టు+అనియె. తాత్పర్యం: వెయ్యిమంది మునులు తమను చుట్టి వెంటరాగా, తల్లితో కూడి పాండవులు, రాజమార్లాన్ని చేరటానికి వచ్చి, రాజభవన ద్వారాన్ని సమీపించగానే మంత్రులు, పురోహితులు, (బ్రాహ్మణులు, దుర్యోధనుడు, దుశ్ళాసనుడు మొదలైన ధృతరాష్షుని కొడుకులు వందమంది ఎదురువచ్చి, వారిని తోడ్కొని లోపలికి తీసికొనివచ్చారు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక ముందుగా ఆ మునులకు నమస్కరించి, తమకు (మొక్కిన పాండవులను (ప్రేమతో ఎత్తుకొని, కుంతిని ఎంతో ప్రీతితో గౌరవించారు. పాండురాజు మరణానికి పెద్దగా దుఃఖిస్తున్న విదుర ధృతరాస్రులను గాంధారితోకూడా ఓదార్చి, ఆ మునులలో పెద్దవా డైన ఒక మహాముని మిగతా మును లందరి అనుమతితో ఇట్టా అన్నాడు.

విశేషం: ఇది - ఒక రాజకుటుంబాన్ని రాజకుటుంబసభ్యులు ఆహ్వానించే తీరును తెలిపే వర్ణన. ప్రజాపరిషత్తులలోనూ,

సామూహికంగా రాజును దర్శించే సందర్భాలలోనూ అందరూ మాట్లాడకుండా వారిచేత అనుమతింపబడిన (ప్రతినిధులే మాట్టాడే

సాంఘిక సంప్రదాయం వృద్దతపస్వి మాట్లాడటంలో కనపడుతున్నది.

డరిక్ల శ్రీమదాంధ్ర మవోభారతము ఉ. భాను నిభుండు పొందుజనపొలుండు ఘఫోరతపంబు సేసి ధ ర్యానిల వాసవాశ్వినుల దైనవరంబున శక్తిపేర్మితో నీ నరనాథ నందనుల నేవుర నంశవివృద్ధిపొంటెం బం చానన సత్తులం బడసె నాశతశ్చంగమహానగంబునన్‌. 153 ప్రతిపదార్థం: భాను; నిభుండు= సూర్యునితో సమానుడు; పాండు, జన, పాలుండు= పాండురాజు, ఆ, శతశ్చంగ, మహా, నగంబునన్‌= ఆ శతశృంగ మనే గొప్పపర్వతంమీద; ఘోర తపంబు= భయంకర మైన తపస్సు; చేసి; ధర్మ+అనిల, వాసవ+అత్వినులది+ఐన= యమునియొక్క, వాయుదేవునియొక్క, దేవేంద్రునియొక్క, అళ్వినీదేవతలయొక్క; వరంబున, శక్తి పేర్మితో=ఐ వరప్రభావంయొక్క అతిశయంతో; వంశ వివృద్ధి, పొంటెన్‌= వంశంయొక్క గొప్పపెంపుదలకొరకు; ఈ, నరనాధ, నందనులన్‌= ఈ రాజకుమారులను; పంచానన, సత్తులన్‌= సింహంయొక్క బలం వంటి బలం కలవాళ్ళను; ఏవురన్‌= ఐదుగురిని; పడసెన్‌= పొందాడు. తాత్పర్యం: సూర్యునితో సమాను డైన పాండురాజు, శతళశ్చంగ పర్వతం మీద పెద్ద తపస్సు చేసి, యమ, వాయు, దేవేంద్ర, అశ్వినీ దేవతలయొక్క వరప్రసాదంతో, వంశాభివృద్ధికొరకు సింహంవలె బలవంతు లైన అయిదుగురు కొడుకులను కన్నాడు. విశేషం: ఈ పద్యరచనలో అర్థవ్యక్తి అనే గుణం సార్ధకం. వృద్ధతపస్వి మాట్లాడిన మాటలలో వంశవృద్దికొరకు పాండురాజు దేవతల వరాలతో పుత్రులను ఏ విధంగా పొందాడో ప్రతిపదసార్ధకంగా వివరించాడు. వస్తుస్వభావాన్ని రుటితిస్పూర్తితో వ్యక్తమయ్యేటట్టు చెప్పటం అర్థవ్యక్తి గుణస్వభావం. పాండురాజు ఘఫోరతపస్సుచేత సూర్యునివలె ప్రకాశించాడు. దానికి దేవతలు మెచ్చి వరాలుగా తనయుల నిచ్చారు. అరణ్యంలో పెరిగిన పాండవులు సింహసత్తులుగా (శ్రేష్టు లనిపించుకొన్నారు. దీనికి శతశ్చంగాలతోకూడుకొన్న ఆ పర్వతంమీది వేలాదిమునులు సాక్ష్యం! అని ్రత్యక్షప్రమాణంగా పాండవులను పరిచయం చేశాడు, (సంపా) క. త్రిదశాధినాథసదృశుండు । ద్రశాలయమునకు మాద్రిదేవియు. దానున్‌ ముదమొనర వరిగి నేంటికిం।, బదియేదగు నాండు దురితబంధచ్యుతు. డై. 154 ప్రతిపదార్థం: త్రిదశశఅధినాథ, సదృశుడు= దేవేంద్రునితో సమాన మైన వాడు - పాండురాజు; మాద్రిదేవియున్‌; తానున్‌; దురిత, బంధ, చ్యుతుం డై= పాపబంధాలనుండి విడువబడిన వా డై; నేటికిన్‌; పది+ఏడగు, నాండు= పదిహేడో రోజు; త్రిదశశఆలయమునకు= స్వర్గానికి; ముదము= సంతోషం; ఒనరన్‌= ఒప్పగా? అరిగెన్‌. తాత్పర్యం: దేవేంద్రునితో సమాను డైన పాండురాజు మాద్రితో పాపబంధాలనుండి విముక్తుడై పదిహేడు రోజులక్రితం స్వర్గానికి వెళ్ళాడు. విశేషఠిః; మాద్రీపాండురాజులు మరణించారు అని వాచ్యంగా చెప్పకుండా స్వర్గస్తు ఖైనారని పొరుష్యం లేనట్టుగా ముని చెప్పటంలో సౌకుమార్యం అనే శబ్దగుణం పోషింపబడింది. ఉత్తమ సంతానంవలన పాండురాజుకు ఉత్తమగతి- అంటే స్వర్లలోకటప్రాప్తి- లభించిందని వ్యంగ్యం, భూలోకంలో ఇంద్రునివలె బ్రతికిన పాండురాజు స్వర్గానికి వెళ్లేటప్పుడు శ్రచీసమేతంగా వెళ్ళినట్టుగా మాద్రీసహితంగా వెళ్ళాడనీ, సతీసమేతుడై స్వర్గగమనంచేసిన పాండురాజు పాపబంధాలన్నీ తెగిపోవటంవలన శాత్యతస్వర్లలోకావాప్తిని పొందాడనీ వస్తుధ్వని, (సంపా.) క. కమనీయలీల నొక్కట ।; నమరపురంబునకు€ జనిన యయ్యిరువుర యం గము లివి; పితృమేధవిధి । క్రమ మొనరంగ సంస్కరింపం గడయండు వీనిన్‌, 155

ఆదిపర్వము - పంచమాశ్వాసము డరి5్‌ ప్రతిపదార్థం: కమనీయ, లీలన్‌= మనోహర మైన విలాసంతో; ఒక్కటన్‌= ఒకరితోఒకరు; అమర, పురంబునకున్‌= స్వర్గానికి; చనిన= వెళ్ళగా; ఆ+ఇరువుర, అంగములు= ఆ ఇద్దరియొక్క అస్టులు; ఇవి; పితృమేధ, విధి, క్రమము= ఉత్తరక్రియలయొక్క విధానం; ఒనరన్‌= ఒప్పేటట్టు; వీనిన్‌; సంస్కరింపన్‌= సంస్కరించటానికి; కడగుడు= ప్రయత్నించండి. తాత్పర్యం: ఆ విధంగా ఒకటిగా స్వర్గానికి వెళ్ళిన ఆ ఇద్దరి అస్సు లివి. ఉత్తరక్రియలు శాస్త్రోక్తంగా జరిపి వీటిని సంస్కరించటానికి ప్రయత్నించండి. వు “ఈ దేవియును బతితోడన పోవ సమకట్టినం బుత్ర రక్షణార్థంబు మునిగణ ప్రార్థిత యై యెట్టకేనియు ధృతప్రాణ యయ్యె: నిక్కునూరులు కురుకులవిస్తారకులు, దేవమూర్తులు, యుధిస్టిర భీమార్డున నకుల సహదేవు లనంగా దేవాధిష్టిత నామంబులు దాల్చి, బ్రహ్మర్షి ప్రశీతోపనయను లై శ్రుతాధ్యయన సంపన్ను లగుచుం బెరు. ఠి గుచున్నవారు వీరలం జేకొని కురువృద్ధులు ధర్మబుద్ధి రక్షించునది' యని చెప్పి సిద్ధచారణ గణంబులతో నమ్మహామును లంతర్థానంబు సేసి; రంత వ్యాస భీష్మ ధృతరాస్తుల యనునుతంబున.1 56 (ప్రతిపదార్థం; ఈ, దేవియును= -ఈ కుంతిదేవికూడ; పతితోడన్‌+అ= భర్తతోనే; పోవ= వెళ్ళటానికి; సమకట్టినన్‌= పూనుకోగా; పుత్ర రక్షణ+అర్ధంబు= కొడుకులను కాపాడటం కొరకు; ముని, గణ, (ప్రార్హితశఐ= బుషులసమూహంచేత ్రార్థింపబడినదై; ఎట్టకు+ఏనియుజ చిట్టచివరకు; ధృత, ప్రాణ= ధరింపబడిన ప్రాణాలు కలది; అయ్యెన్‌; ఈ+శ+కుమారులు; కురు, కుల, విస్తారకులు= కురువంశాన్ని వృద్ధిచేసేవారు; దేవమూర్తులు= దేవతాస్వరూపులు; యుధిస్టిర, భీమ+ అర్జున, నకుల, సహదేవులు; అనంగా; దేవ అరిస్టితం దేవతలచేత ప్రభావితా లైన; నామంబులు= "పేర్లు తాల్చి= ధరించి; 'బ్రహ్మ+బుషి ప్రణీత+ఉపనయనులు+ఐ= సక శో యబడీన ఉపనయనం కలవాళ్ళయి; క్రుత+అధ్యయన, సంపన్నులు= వేదాధ్యయనం అనే సంపద కలవాళ్ళు. అగుచున; పెరుంగుచున్న వారు; వీరలన్‌; చేకొని= తీసికొని; కురు, వృద్దులు= కురువంశంలోని ఎద్దలు; ధర్మ, బుద్ధి= ధర్మంతో కూడిన బుద్దితో; రక్షించునది; అని; చెప్పి? సిద్ద, చారణ, గ న్‌ ॥ ది ॥ గద్ద, + గణంబులతోన్‌= సిద్దుల, చారణులయొక్క సమూహాలతో; ఆ+శిమహా, మునులు, అంతర్జానంబు+చేసిరి= కనపడకుండా పోయారు; అంత= తరువాత; వ్యాస, భిష్మ, ధృతరాష్ట్రుల, అనుమతంబున= వ్యాస, భీష్మ, ధృతరాష్ష్రులయొక్క అనుమతితో. తాత్పర్యం: ఈ కుంతీదేవి కూడ భర్తతో సహగమనం చేయటానికి పూనుకొన్నది. అయితే, బుషులు _ ప్రాక్టించటంచేత కొడుకులను రక్షించటానికి బ్రతికి ఉన్నది. ఈ కొడుకులు కురువంశాన్ని వృద్ది చేస్తారు; దేవతాస్వరూపులు. యుధిస్టిర భీమార్జున నకుల సహదేవు లని దేవతల ప్రభావం కల పేర్లు ధరించి, బ్రహ్మర్చ్డులు ఉపనయనం చేయగా, చక్కగా వేదాధ్యయనం చేస్తూ పెరుగుతున్నారు. కురువంశంలో పెద్ద లైన మీరు వీళ్ళను చేరదీసి ధర్మబుద్ధితో రక్షించండి" - అని చెప్పి ఆ మహామునులు సిద్దచారణులతోసహా అంతర్జాన మయ్యారు. తరువాత వ్యాస భీష్మ ధృతరాష్షుల అనుమతితో. విశేషం: శతశృంగపర్వతంలో జరిగిన వృత్తాంతాన్నంతా వృద్ధమునిచేత సగ్రహంగా చెప్పించి హస్తినాపురకధ కొక సంబంధాన్ని పునరుద్ధరించాడు నన్నయ. భర్తతోపాటు సహగమనం చేస్తానని మాద్రి చెప్పినమాటలే పూర్వకథలో ఉన్నాయి. ఆ తరువాత కుంతి తానుకూడా సహగమనానికి సిద్ధమైనట్లూ, మాద్రియే కాక మునిగణా లెంతో ఆమెకు నచ్చజెప్పి పుత్రరక్షణార్హం బ్రతుకుమని 'ప్రబోధించారనే వివరణం ఇక్కడ చెప్పాడు నన్నయ. సమయసందర్భా లెరిగి కధార్థాలను ఉత్కంఠావహంగా కూర్చటం ప్రసన్నకధాకలితార్థయుక్తి లక్షణం. (సంపా)

జీకర శ్రీనుదాంధ్ర నుహాభారతము నీ. వెలయంగం బితృమేధవిధి విచక్షణశీల : సద్దూసురోపదేశక్రమమున నభికవిభూతితో నతిపవిత్రప్రదే; శమున నయ్యంగముల్‌ సంస్కరించి, పుణ్యస్వధామృతంబుల నొప్పణా । శ్రాద్ధవిధి యొనరించి, సద్విప్రతతికి నగ్రహారములు దివ్యాంబరాభరణ శ । య్యాసన ఛత్ర గవాశ్వకరుల ఆ. _ నిచ్చి, సర్వజనుల కెల్లను భోజన । దాన మొనరం జేసి, ధర్మవిదుండు విదురు€ డట్లు పాండువిభునకు. జేయించె । నన్యలోకహితము లైన విధులు. 157 ప్రతిపదార్హం: ధర్మ, విదుండుజ ధర్మం తెలిసినవాడు; విదురుండు; వెలయంగన్‌= ఒప్పేటట్టు; పితృమేధ, విధి, విచక్షణ, శీల, సత్‌*భూసుర+ఉపదేశ, (క్రమమునన్‌= పిత్సయజ్ఞ విధానంలో పండితస్వభావం కల ఉత్తము లైన బ్రాహ్మణులు చెప్పిన విధంగా; అధిక విభూతితోన్‌= మిక్కిలి ఐశ్చర్యంతో; అతి, పవిత్ర, ప్రదేశమునన్‌= మిక్కిలి పవిత్ర మైన స్థలంలో; ఆ+అంగముల్‌= ఆ అస్థికలు; సంస్కరించి; పుణ్య, స్వధా+అమృతంబులన్‌= పుణ్య మైన హోమాలతో, జలతర్పణాలతో; ఒప్పంగా? (శ్రాద్ధ, విధి= (శ్రాద్ధకర్మను; ఒనరించి= చేసి; సత్‌+వి'ప్ర, తతికిన్‌= ఉత్తమ (బ్రాహ్మణుల సమూహానికి; అ(గ్రహారాలు; దివ్య+అంబర+అభరణ, శయ్యా+ఆసన, ఛత్ర, గో+అక్చ, కరులన్‌= (శ్రేష్టమైన వ(స్త్రాలను, ఆభరణాలను, పడకలను, ఆసనాలను, గొడుగులను, గోవులను, గుర్రాలను, ఏనుగులను; ఇచ్చి; సర్వ, జనులకు+ఎల్లన్‌; భోజన, దానము; ఒనరన్‌= తగినట్టు; చేసి: పాండువిభునకు= పాండురాజుకు; అన్యలోక, హితములు+ఐన= పరలోకంలో మేలు చేసేవి అయిన; విధులు= కర్మలు; అట్టు; చేయించెన్‌. తాత్పర్యం: ధర్మజ్ఞు డైన విదురుడు పితృయజ్ఞవిధానం చక్కగా తెలిసిన (బ్రాహ్మణోత్తములు చెప్పిన ప్రకారం మిక్కిలి వైభవంగా మహా పవిత్ర స్థలంలో ఆ అస్థికలకు సంస్కారం జరిపించి, పుణ్యహోమంతో, జలతర్చణాలతో (శ్రాద్ధకర్మ చేయించి, సద్పాహ్మాణులకు అ(గ్రహారాలు, వ(స్తాలు, ఆభరణాలు, పడకలు, ఆసనాలు, గొడుగులు, లు గోవులు, గుజ్ఞాలు, ఏనుగులు దానా లిచ్చి, ప్రజలందరికీ అన్నదానం చేసి పాండురాజుకు ఉత్తరక్రియలు చేయించాడు. విశేషం: గో+అశ్ళ= గవాశ్ళ్వ - అయవాయావాదేశసంధి. వ, అంతంగృష్టద్వైపాయనుండు వారి కందజకు దుఖోపశమనంబు సేసి, యొక్కనాయడు సత్యవతికి నేకాంతంబున ని ట్లనియె. 158 ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; కృష్ణద్దైపాయనుండు; వారికి+అందఅకు; దుఃఖ+ఉపశమనంబు, చేసి= దుఃఖం తగ్గేటట్టు ఓదార్చి; ఒక్కనాండు; సత్యవతికిన్‌; ఏకాంతంబునన్‌= రహస్యంగా; ఇట్టు+అనియె, తాత్పర్యం; తరువాత కృష్ణద్వైపాయనుడు వాళ్ళందరినీ ఓదార్చి ఒకనాడు సత్యవతితో రహస్యంగా ఇట్లా అన్నాడు. క్ర మతి6. దలథయంగ సంసారం । బతి చంచల మెండమావులట్టుల సంప త్ర్రతతు లతిక్షణికంబులు; ।; గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్‌. 159 ప్రతిపదార్థం: మతిన్‌= బుద్దితో; తలంపంగ= ఆలోచించగా; సంసారంబు; అతి, చంచలము; ఎండమావుల+అట్టుల; సంపత్‌+ప్రతతులు= సంపదల యొక్క సమూహాలు; అతి, క్షణికంబులు= మిక్కిలి త్తరగా నళించేవి; గత, కాలము= గడచిన కాలం; వచ్చు, కాలముకంటెన్‌= రాబోయే కాలంకంటె; మేలు= మంచిది, ఉత్తమమైనది. తాత్సర్యం: ఆలోచించి చూస్తే సంసారం ఎండమావులవలె అతిచంచలం. సంపదలు అశాశ్చతాలు. రాబోయే రోజులకంటె గడచిపోయిన రోజులే మేలు.

ఆదిపర్వము - సంచనూశ్వాసము 87 విశేషం: అలం: ఉపమ. అతిప్రసిద్దా లైన నన్న్మయసూక్తులలో ఇది ఒకటి. ఏ యుగంలో నైనా ఎవరికైనా ఇది సత్య మనిపిస్తుంది. క కూరులు విలుప్త ధర్మా: చారులు ధృతరాష్ట్ర సుతు లసద్వృత్తులు ని

ష్కారణ వైరులు వీరల । కారణమున నెగ్గు పుట్టు. గౌరవ్వులకున్‌. 4160 ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర సుతులు= ధృతరా(్త్రుని యొక్క కొడుకులు; క్రూరులు; విలుప్తు ధర్మ+ఆచారులు= నళించిన ధర్మ బద్ద మైన నడవడి కలవారు; అసత్‌+వృత్తులు= మంచివి కాని పనులు కలవాళ్ళు; నిష్కారణ, వైరులు= కారణం లేకుండానే శత్రువులయేవాళ్ళు; వీరల, కారణమునన్‌; కౌరవ్యులకున్‌= కురువంశంలో పుట్టిన వాళ్ళకు; ఎగ్గుజ కీడు; పుట్టున్‌= కలుగుతుంది. తాత్పర్యం: ధృతరాఘ్ట్రుని కొడుకులు దుర్మార్గులు, కారణం లేకుండానే వైరం వహించే వారు. వారికారణంగా కౌరవవంశానికి కీడు కలుగుతుంది.

వ. 'దాని ధృతరాస్తుండు తాన యనుభవించుంగాని మీ రీ దారుణంబు. జూడక వీరి విడిచి తపోవనంబున కరుగుం'డని చెప్పిచనిన సత్యవతియుం బారాశర్యునుపదేశంబు భీష్మవిదురుల కెజింగించికోదంద్రనంబికాం బాలికలం దోడ్కాని వనంబునకుం జని, తానును వారు నతిఘఫోరతపంబు సేసి కొండొక కాలమునకు శరీరంబులు విడిచి పుణ్యగతికిం బోయి; రిట ధృతరాష్తుండును. 161

(ప్రతిపదార్థం: దాని; ధృతరా(ష్టుండు; తాను+అ= తానే; అనుభవించున్‌; కొని; మీరు; ఈ, దారుణంబున్‌; చూడక; వీరి=ఐ వీరిని;

విడిచి; తపోవనంబునకు; అరుగుండు= వెళ్ళండి; అని; చెప్పి; చనిన= పోగా; సత్యవతియున్‌; పారాశర్యు ఉపదేశంబు= పరాశరుని

కొడు కైన కృష్ణద్యైపాయనుని ఉపదేశాన్ని; భీష్మ, విదురులకు; ఎజింగించి= తెలిపి; కోడం(డ్రన్‌; అంబికా+అంబాలికలన్‌; తోడ్కొని; వనంబునకున్‌= అడవికి; చని= వెళ్ళి; తానును; వారు; అతి, ఘోర, తపంబు= మిక్కిలి భయంకర మైన తపస్సు; చేసి; కొండొక, కాలమునకు= కొంతకాలానికి; శరీరంబులు; విడిచ్చి; పుణ్య, గతికిన్‌= స్వర్గానికి; పోయిరి; ఇట; ధృతరాష్ట్రుండును. తాత్పర్యం: 'దానిని ధృతరాష్ట్రుడు తానే అనుభవిస్తాడు. కాబట్టి మీరు ఈ దారుణాన్ని చూడకుండా వీళ్ళను విడిచిపెట్టి తపోవనానికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళగా, సత్యవతికూడ వ్యాసుని ఉపదేశాన్ని భిష్మునికీ, విదురునికీ తెలిపి, కోడళ్ళయిన అంబిక, అంబాలికలను వెంటతీసికొని అడవికి వెళ్ళి తానూ వాళ్ళూ తీవ్రమైన తపస్సుచేసి కొంతకాలానికి శరీరాలు విడిచి స్వర్గానికి చేరారు. ఇక్ష ఇక్కడ ధృతరాష్ట్రుడు.

విశేషం: ద్రష్ట అయిన కృష్ణద్రైపాయనుడు కౌరవుల స్వభావాలు, భవిష్యత్పరిణామాలు దర్శించాడు. కౌరవ వంశాభ్యుదయంమీద

కొండంత ఆశ పెట్టుకొన్న సత్యవతీదేవి గుండె బ్రద్దలు కాకుండ ముందుగానే దాన్ని తెలిపి, ఆమెను తపోవనానికి పంపాడు.

కురు పాండు కువమూరుల బాలక్రీడలు (సం.2-119-13)

క. తన సుతులు పాండు సుతు లని; మనమున భేదింప కతిసమంజసభానం బున నొక్కరూపకా€ జే; కొని యుండెం బాండురాజుకొడుకులం బ్రీతిన్‌, 162

ప్రతిపదార్థం: తన, సుతులు= తన కొడుకులు; పాండు, సుతులు పాండురాజు కొడుకులు; అని; మనమున= మనస్సులో; భేదింపక= తేడా చూపక; అతి, సమంజస, భావంబునన్‌= మిక్కిలి న్యాయబుద్ధితో; ఒక్కరూపు+అ, కాన్‌= ఒకే విధంగా; ప్రీతిన్‌= (ప్రేమతో; పాండురాజు, కొ డుకులన్‌; చేకొని, ఉండెన్‌= చేపట్టి ఉన్నాడు.

శీ88 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: తనకొడుకులు, పాండురాజుకొడుకులు అనే భేదభావం లేక, మిక్కిలిన్యాయబుద్దితో అందరినీ ఒకే విధంగా చూస్తూ, పాండవులను (ప్రేమతో పెంచుతూ ఉన్నాడు. క. ధృతరాస్తునెయ్యమున సం । తతవర్థితు లగుచుం బాండుతనయులు వినయా న్వితులు కుమారక్రీడా । రతు లయి యొడంగూడి ధార్తరాస్తులతోడన్‌. 163 ప్రతిపదార్థం: ధృతరాషు, నయ్యమున= ధృతరాష్ట్రుని (ప్రేమతో; సంతత, వర్షితులు+అగుచున్‌= ఎల్లప్పుడు పెంచబడిన వాళ్ళయి, వినయ+అన్వితులు= వినయంతో కూడిన వారు; పాండు, తనయులుజ పొండురాజు కొడుకులు; ధార్త రాష్తులతోడన్‌= ధృతరాష్ర్రుని కొడుకులతో; ఒడన్‌*కూడి= కలిసి; కుమార, (క్రీడా, రతులు+అయి= బాల(క్రీడలలో ఆసక్తి కలవాళ్ళయి. తొత్ప్సర్యం: ధృతరాష్రుని ప్రేమచేత పెరుగుతూ వినయవంతు లైన పాండవులు కౌరవులతో కలిసి బాల'క్రీడల మీద ఆసక్తి కలవాళ్ళయి. క గిలుపునెడ నేయునెడ వడిం: బజచునెడం బెనంగునెడ నపార బలంబుల్‌ మజయునెడ భీమునకు నం । దొజు! గీడ్పడం దొడంగి రుద్ధతులు రాజసుతుల్‌. 164 ప్రతిపదార్థం: గిటుపు, ఎడన్‌= తిరిగేటప్పుడు; ఏయు, ఎడ= కొట్టేటప్పుడు; వడిన్‌= వేగంగా; పఆఅచు, ఎడన్‌= పరుగెత్తేటప్పుడు; 'పెనంగు, ఎడన్‌= పెనగులాడేప్తుడు; అపార, బలంబుల్‌= అంతులేని బలాలను; మెజయు, ఎడన్‌= చూపేటప్పుడు, ఉద్ధతులు= గర్వించినవారు:; రాజ, సుతుల్‌= రాజకుమారులు; అందొజున్‌= అందరూ; భీమునకున్‌, కీడ్పడన్‌= తక్కువ అవటానికి; తొడంగిరి= పూనుకొన్నారు. తాత్పర్యం: గుండ్రంగా తిరిగేటప్పుడు, కొట్టేటప్పుడు, వేగంగా పరుగెత్తేటప్పుడు, పెనుగులాడేటప్పుడు, అపార బలాలను ప్రదర్శించేటప్పుడు గర్బంతో ఉన్న రాజ కుమారు లంతా భీమునికన్నా తక్కువ అవుతున్నారు. క. వదలక పెనంగి పదుండ్రం । బదియేవుర నొక్కపెట్ట పట్టి ధరిత్రిం జెదరం బడవైచి పవనజుం।; డదయుండయి వీపు లొలియ నందణ నిద్దున్‌. 165 ప్రతిపదార్థం: వదలక; పెనం= పోరాడి; పదుం(డ్రన్‌= పదిమందిని; పదియేవురన్‌= పదిహేను మందిని; ఒక్క పెట్టా ఒక్కసారిగ; పట్టి ధరిత్రిన్‌= భూమిమీద; చెదరన్‌? పడవైచి; పవనజుండు= వాయుదేవునికి పుట్టినవాడు - భీముడు; అదయుండు+అయి= దయలేనివాడై; వీపులు+ఒలియన్‌= వీపుల చర్మం ఊడిపోయేట్టుగ; అందజన్‌; ఈడ్చున్‌, తాత్సర్యం: వదలక పోరాడి, పది లేదా పదిహేనుమందిని ఒక్కసారిగా పట్టి నేల మీద చెల్లాచెదురుగా పడవేసి భీముడు దయలేనివాడై అందరినీపుల చర్మాలు లేచిపోయేట్టు ఈడుస్తాడు. సీ, కూడి జలక్రీడ లాడుచోం గడంగి యా । ధృతరాష్టతనయుల నతులశక్తి లెక్కించియు6 బదుండ్ర నొక్కొక్క భుజమున । నెక్కించుకొని, వారి యుక్కడంగ6 గ్రంచల నీరిలో ముంచుచు నెత్తుచుం । గారించి తీరంబు చేరం బెట్టుం గోరి ఫలార్థు లై వారల యెక్కిన । మ్రాకుల మొదళుల వ్‌కం బట్టి ఆ. వడిం గదల్టుం బండ్లు దడణుడువారల । తోన ధరణిమీం౦ద దొరంగుచుందడ; నిట్టిపాట గాడ్పుపట్టిచే దుశ్మాస । నాదులెల్ల బాధితాత్ము లైరి. 166

ఆదిపర్వము - సంచమాశ్వాసము త్ష&్ర9 ప్రతిపదార్థం: కూడి; జల|క్రీడలు; ఆడుచోన్‌; కడలి= పూని; ఆ, ధృతరాష్ట్ర తనయులన్‌; అతుల, శక్తి= సాటిలేని బలంతో; లెక్కించియున్‌= లెక్కపెట్టి; పదుం(డ్రన్‌= పదిమందిని; ఒక్క+ఒక్క, భుజమునన్‌, ఎక్కించుకొని; వారి; ఉక్కు= బలం: అడంగన్‌= అణగేటట్టుగా; (క్రంచణజ= వేగంగా; నీరిలో; ముంచుచున్‌? ఎత్తుచున్‌; కారించి= బాధించి; తీరంబు= గట్టును; చేరన్‌= చేరేట్లు; "పెట్టున్‌? కోరి; ఫల+అర్జులు+ఐ= పళ్ళు కోరినవాళ్ళయి; వారల, ఎక్కిన, మాకులజ= వారెక్కినట్టి చెట్టమొదళ్ళను; వీకన్‌= బలంతో: పట్టి; తడబడు, వారలతోన; పండ్డు; ధరణి, మీంద= భూమిమీద; తారగుచుండన్‌= పడుతుండగా; వడిన్‌= వేగంగా; కదల్బున్‌: ఇట్టిపాట= ఈ విధంగా; గొడ్డు, పట్టిచే= వాయుదేవుని కొడుకైన భీమునిచేత; దుశ్చాసన+ఆదులు+ఎల్ల= దుశ్ళాసనుడు మొదలైన వారంతా; బాధిత+ఆత్ములు+ఐరి+ బాధింపబడిన శరీరాలు కలవాళ్ళు అయ్యారు. తాత్పర్యం: అంతా చేరి జల(క్రీడలు ఆడేటప్పుడు భీముడు సాటిలేని బలంతో పూని ధృతరాుని కొడుకులను ఒక్కొక్క భుజంమీద పదిమందిని లెక్కపెట్టి ఎక్కించుకొని, వాళ్ళ బలం అణిగేటట్టు వేగంగా నీటిలో ముంచుతూ, పైకెత్తుతూ బాధించి గట్టుకు చేర్చేవాడు. వాళ్ళు పండ్లు కోయడానికి ఎక్కిన చెట్ల మొదళ్ళను బలంగా వేగంగా కదల్చి, వాళ్ళూ, పండ్లూ నేలమీద రాలేటట్టు చేసేవాడు. ఈ విధంగా దుశ్శాసనుడు మొదలైన వాళ్ళంతా భీమునిచేత బాధింపబడుతూ ఉండేవాళ్ళు. వ. దాని సహింపనోపక యొక్కనాండు దుర్వోధనుండు శకుని దుశ్మాసనాదులతో విచారించి యిట్లనియె. 167 ప్రతిపదార్థం: దాని= భీమునిచేత కలిగే బాధను; సహింపన్‌+*ఓపకజ ఓర్చుకోలేక; ఒక్కనాడు; దుర్యోదనుండు; శకుని; దుశ్శాసన+ఆదులతో= శకుని, దుళశ్ళాసనుడు మొదలైన వాళ్ళతో; విచారించి= ఆలోచించి; ఇట్టు; అనియె. తాత్పర్యం: భీమునిచేత కలిగే బాధను ఓర్చుకోలేక ఒక్కనాడు దుర్యోధనుడు శకుని, దుశ్శాసనుడు మొదలైన వాళ్ళతో ఆలోచించి ఈ విధంగా అన్నాడు. పృథ్వి, ఉపాంశువధ' జేసి మధ్యము మదోద్ధతుం జంపి ని సృపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే నపాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మ తృపాణపటుశక్తి నత్యధికకీర్తి నై యేలెదన్‌, 168 ప్రతిపదార్థం: మద+ఉద్ధతున్‌= గర్వంతో విబ్బంభించినవాడిని, మధ్యము= నడిమివాడిని - అనగా కుంతీదేవి కొాడుకులలో మధ్యవా డైన భీముడిని; ఉపాంశు, వధన్‌+చేసి= రహస్యంగా హత్యచేసి; చంపి; అశక్తు= శక్తిలేనివా డైన; ధర్మనందనున్‌; బంధించి; చుట్టబడిన సమస్త భూమండలాన్ని; మత్‌, కృపాణ, పటు, శక్తిన్‌= నాకత్తియొక్క గట్టిబలంతో; అతి+అధిక, శ్రీర్తినిశఐ= మిక్కిలి ఎక్కువైన క్రీర్తల వాడనై; ఏలెదన్‌= పరిపాలిస్తాను. తాత్పర్యం: గర్వంతో విజ్బంభిస్తున్న భీముడిని రహస్యంగా చంపి, అశక్తు డైన ధర్మరాజును చెరసాలలో పెట్టి, శత్రువు అనేవాడు లేకుండా, అపాండవంగా సమస్తభూమండలాన్నీ నా కత్తికి ఎదురులేకుండా అఖండ కీర్తితో పరిపాలిస్తాను.

త్తం శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: పాండువులకు బలం, తనకు ప్రబలశత్రువు భీముడు మాత్రమే అని దుర్యోధనుని భావన. అతడిని ప్రత్యక్షంగా ఎదుర్కొని చంపడం సాధ్యపడదు. అందువలన అతడిని రహస్యంగా చంపి, తనకన్నా పెద్దవాడైన ధర్మరాజును చెరసాలలో పెట్టితే ఇక తనను ఎదిరించే శత్రువు లుండ రని, మిగతా వారిలో తానే పెద్ద కనుక రాజ్యాధికారం తనకే సం(క్రమిస్తుం దని, సమస్త భూమండలాన్ని తానే పరిపాలించవచ్చని దుర్యోధనుని దురాలోచన. అప్పటి కింకా అర్జున నకుల సహదేవుల శక్తి సామఠ్ద్యాలు దుర్యోధనుని దృష్టికి వచ్చినట్టు లేదు. పాండవధార్తరాహ్ట్రుల విభేదానికి బీజం భీమునిబలమనీ దుర్యోధనుని దుశ్చింత అనీ వస్తుధ్వని. (సంపా.) ఛందళ్ళిల్పం:- పృథ్వీవృత్తంలోని ప్రతిపాదంలోనూ 17 అక్షరాలుంటాయి. జ, స, జ, సృ య, లగ - అనే గణాలు వరుసగా అమరి ఉంటాయి. 12వ అక్షరం యతిస్టానం. ఈ సందర్భంలో నన్నయ ప్పర్వీవృత్తం వాడటంలో గల సార్టక్యాన్ని గురించీ ఈ పద్య రచనలోని అక్షర రమ్యత, వాక్యవృత్తులగురించీ డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారిట్లా వ్యాఖ్యానించారు- “పృర్వీరాజ్యహరణోత్సాహమును, తదంగమైన పృథానందనోత్సాహమును ప్పర్వీవృత్తమున నిబంధించుట వృత్తనామాశ్రితమైన శిల్పము. పద్యమందలి పూర్యోత్తరార్హములందు. అక్షర, పదరచనా రూపమైన శిల్పమును గుర్తింపవచ్చును పూర్వార్హ మందలి మహా(ప్రాణవ్యంజనము, నీచమధ్యస్వరములు, వ్యస్తపదములు దుర్యోధను డా వాక్యఖండములను రహస్యముగ, అనుదాత్తస్వరమున సనిశ్చసితముగ, ససంభ్రముగ నుచ్చరించెనని స్పష్టము చేయుచున్నది. ఉత్తరార్హము నందలి సమస్తపదములు, నాదాక్షరములు విశేషించి చతుర్థపాదమునందలి ఉదాత్తస్వరములు దుర్యోధను డావాక్యమును అనర్గళముగ (క్రమవర్హమాన స్వరమున ఉచ్చరించె నని స్ఫుటము చేయుచున్నవి. భీమవధ, ధర్మజబంధనములు రహస్య విషయములు. అపాండవమైన క్షోణీరాజ్యపాలనము ప్రకాశ విషయము. స్వరవ్యంజన విన్యాస శిల్పము వాక్యార్హవ్య్యంజకమైన వాచికాభినయమునకు చక్కగా నుపకరించుచున్నది. “అసమాసై;ః పదై ర్భాతి పృద్వీ పృద్వీ పృథక్‌ స్టితైః (సువృత్తతిలకం. 2-27). వ్యస్తములైన యసమస్త పదములచే పృధ్వీవృత్తము పృథువుగా భాసించునని క్షేమేంద్రు. డొకరహస్యమును వెల్లడించెను. నన్నయ యారహస్యమునే పైపద్యమునందలి పూర్వార్దమున (ప్రదర్శించెను. (ఆంధ్రమహాభారతము: ఛందళ్ళిల్పము-పు.280, 281). దుర్యోధనుండు భీముని( జంపింప( దివురుట (సం.1-119-28) న. అని పాపబుద్ధియందుం గృతనిశ్రయుం డై దుర్యోధనుండు భీష్మ విదురు లెలటుంగకుండ భీమున కపాయంబు సేయ సమకట్టి యంతరం బన్వేషించుచున్నంత నొక్కనాండు జలక్రీడావసరంబున. 169 ప్రతిపదార్థం: అని; పాప, బుద్ధియందున్‌= చెడ్డఆలోచనతో; కృత, నిళశ్చయుండు+ఐ= చేయబడిన నిర్ణయం కలవాడై; దుర్యోధనుండు; భీష్మ, విదురులు; ఎలుంగకుండ; భీమునకు; అపాయంబు; చేయ; సమకట్టి= పూనుకొని; అంతరంబు= అవకాశాన్ని; అన్వేషించుచు= వెదుకుతూ; ఉన్నంతన్‌? ఒక్కనాడు; జల, (క్రీడా+అవసరంబున= జలక్రీడలు ఆడే సమయంలో. తాత్సర్యం: అని దురాలోచనతో దుర్యోధనుడు భీష్మ విదురులకు తెలియకుండా భీమునికి కీడు చేయాలని అవకాశంకొరకు వెదకుతుండగా ఒక రోజు జలక్రీడలు ఆడే సమయంలో. ఉ. వేడుక నొక్కరుండు శతవీరకుమారులతోడ. జల్లుం బో రాడి జయించి యందలి, ననంతపరిశ్రమ పారవశ్యముం గూడి ప్రమాణకోటి ననఘుండు సమీరణనందనుండు మే యాడక నిద్రవోయె శిశిరానిలముల్‌ పయి వీచుచుండంగన్‌. 170 ప్రతిపదార్హం: అనఘుండు= పాపంలేని వాడు; సమీరణ, నందనుండు= వాయుదేవుని కొడుకైన భీముడు; వేడుకన్‌; ఒక్కరుండు; శత, వీర కుమారులతోడన్‌= నూరుమంది వీరు లైన కురుకుమారులతో - దుర్యోధనాదులతో; చల్లున్‌*పోరు+ఆడి= నీళ్ళలో

ఆదిపర్వము - పంచనూశ్వాసము న! దిగి ఒకరిమీద ఒకరు నీళ్ళు చల్లుకొనే ఆట ఆడి; అందణన్‌; జయించి; అనంత, పరిశ్రమ, పారవళ్యమున్‌= అంతులేని (శ్రమవల్ల కల్గిన మైమరపుతో; కూడి; ప్రమాణకోటిన్‌= ప్రమాణకోటి అనే స్థలంలో; శిశిరశఅనిలముల్‌= చల్లని గాలులు; పయి= మీదః వీచుచుండంలగన్‌; మేయి= దేహం; ఆడక= కదలకు నిద్ర, పోయె. తొత్పర్యం: పాపరహితుడు, వాయుపుత్రుడు అయిన భీముడు ఒక్కడే వేడుకగా వందమంది కౌరవులతో జల'(క్రీడలాడి అందరినీ జయించి, అంతులేని (శ్రమచేత కలిగిన అలసటవలన మైమరచి (ప్రమాణకోటి అనే స్థలంలో చల్లగాలులు వీస్తూ ఉండగా మేను కదల్బకుండ గాఢనిద్రలో ఉన్నాడు. నిశేషం; ధార్తరాష్తులందరిని మట్టుపెట్టగల దిట్ట భీముడనే అర్జాన్ని వ్యంగ్యంగా బీజతుల్యంగా ఈసన్నివేశం వ్యక్తంచేస్తున్నది. కు ఆ పవనజు నతిఘనలతి । కాపాశావలుల నంటం గట్టించి మవా

కోపమున గంగమడువునం | ద్రోపెంచె సుయోధనుండు దురితకరుం దై. శ71 ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; దురిత, కరుండు+ఐ= పాపం చేసేవాడై; ఆ, పవనజున్‌= ఆ వాయుపుత్రు డైన భీముడిని; అతి, ఘన, లతికా, పాశ+ఆవలులన్‌= మిక్కిలి గట్టి వైన తీగలనే తాళ్ళ సమూహంచే: అంటన్‌+కట్టించి; మహాకోపమున; గంగమడువునన్‌; (త్రోపించె. తాత్పర్యం: దుర్యోధనుడు దుర్మార్లుడై భీముడిని గట్టి తీగలచేత గట్టిగా కట్టించి మహాకోపంతో గంగమడుగులోకి 'తోయించాడు. క, _ అనిల సుతుం డంతన మే । ల్మని నీల్గుడు నతని వజ్రఘనకాయముం బొం

దిన లతికాపాశము లె | ల్లను ద్రెస్సె మృణాళనాళలతికల పోలెన్‌. 172 ప్రతిపదార్థం: అనిల, సుతుండు= వాయుదేవుని కొడుకు - భీముడు; అంతన= అప్పటికప్పుడే; మేల్కని; నీల్లుడున్‌= ఒళ్ళు విరుచుకోగా; అతని, వజ్ర ఘనకాయమున్‌= అతనియొక్క వజ్రం వంటి దృఢ మైన దేహాన్ని; పొందిన; లతికా, పాశములు+ఎల్లను= తీగలనే (త్రాళ్ళన్నీ; మృణాళ నాళ లతికల పోలెన్‌= లేతతామరతూళ్ళతీగలవలె; ్రెస్పె= తెగాయి. తొత్సర్యం: భీముడు అప్పటి కప్పుడు మేల్కొని ఒళ్ళు విరువగానే, వజ్రం వలె కఠినమైన అతని శరీరానికి కట్టిన తీగల తాళ్ళన్నీ లేత తామర తూళ్ళ తీగలవలె సులభంగా తెగిపోయాయి. విశేషం; అలం: ఉపమ. అ. కర్మ బంధనములు గ్రక్కునం బాయుదడు. ; బుణ్యగతికి నెగయు పురుషు నట్లు

బంధనంబు లెల్లం బాయుడు భీముండు ; నీరిలోననుండి నెగయుదెంచె. 173 ప్రతిపదార్థం: కర్మ బంధనములు; (గ్రక్కునన్‌= తటాలున; పాయుడున్‌= తాలగిపోగా; పుణ్యగతికిన్‌= పుణ్యలోకానికి? ఎగయు, పురుషునట్టు= ఎగిరిపోయే పురుషుని వలె; బంధనంబులు+ఎల్లన్‌= కట్టన్నీ; పాయుడు= తొలగిపోగా; ఛీముండు; నీరిలోన, నుండి; నెగయుదెంచెజఐ పైకి లేచాడు. తాత్పర్యం: కర్మబంధాలు తాలగిపోగా పురుషుడు స్వర్గానికి ఎగిరిపోయినట్టు, కట్టు తెగగొనే భీముడు నీటినుండి పైకి లేచి వచ్చాడు.

డ్త్ర2 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: అలం: ఉపమ. వ వజణియు నొక్కనాడు. 174 తాత్పర్యం: ఇంకా మరొకరోజాు. కు జనపతి పనుపంగ సారథి ।; ఘన విష కృష్ణోరగములం గజపించె శ్రమం బున నిద్రితుం డైన ప్రభం । జనసుతుసర్వాంగమర్మసంధుల నెల్లన్‌. 175 ప్రతిపదార్థం: జన, పతి= రాజా - దుర్యోధనుడు; పనుపంగ= ఆజ్ఞాపించగా: సారధి; శ్రమంబున= ఆలసటచేత; ని(ద్రితుండు+ఐన= నిద్రపోయిన వాడైన; ప్రభంజన, సుతు, సర్వ+అంగ, మర్మ, సంధులన్‌, ఎల్లన్‌= వాయుపుత్రుని అన్చి అవయవాల కీలకస్టానాల కూడిక లన్నింటను; ఘన, విష కృష్ణ+ఉరగములన్‌= గొప్పవిషం కల నల్లత్రాచుపాములచేత; కటపించెన్‌. తాత్పర్యం: దుర్యోధనుడు ఆజ్ఞాపించగా సారది, అలసి నిద్రపోయిన భీమసేనుని అన్ని అవయవాల మర్మస్తానాల సంధు లన్నిటా గొప్పవిషం కల నల్లత్రాచు పాములతో కరపించాడు. క అవిరళ విష ఫణిదంస్త్రలు : పవనజు వజ్రమయతనువుపయితోలును నో పవ భేదింపంగం బాప । వ్యవసాయులచెయ్వు లర్ధవంతము లగునే?. 176 ప్రతిపదార్హం: అవిరళ, విష ఫణి, దం[ష్టలు= దట్టమైన విషం ఉన్న పాములకోరలు; పవనజు, వజ్రమయ, తనువు, పయితోలునున్‌= వాయుపుత్రుని వజ్రంవంటి (అనగా వజ్రం వలె గట్టిదైన) శరీరంమీది చర్మాన్ని కూడ; చేదింపంగన్‌= చీల్చటానికి; ఓపవ= సమర్థ మైనవి కాలేక పోయాయి; పాప, వ్యవసాయుల, చెయ్వులు= పాపం చేయడంలో నిశ్చితమైన బుద్ది కలవాళ్ళచేష్టలు, అర్హవంతములు= ఫలాన్ని కూర్చేవి; అగునే=ఐ అగునా? - కావు. తాత్పర్యం: దట్ట మైన విష మున్న ఆ పాముల కోరలు, భీమసేనుని వజ్రం వంటి శరీరం పై తోలును కూడా చీల్చ లేక పోయాయి. పాపబుద్ది కలవారి పను లెప్పుడూ ఫలించవు. విశేషం: అలం: అర్జాంతరన్వాసం. చు అలఘు బలుండు భీము(డును నంతన మల్కని యవ్విషోరగం బులం జరణంబులం జమరి, ముక్కున వాతను నెత్తు రొల్కగాం దలరంగ సారథిం జటిచెం దా నపహస్తమునన్‌; వసుంధరా తలమున౦ ద్రెళ్ళె సారథియు దత్‌క్షణమాత్రన ముక్తజీవు. డై. 177 ప్రతిపదార్థం: అలఘు, బలుండు= తక్కువ కాని బలం కలవాడు; భీముండును; అంతన= అప్పుడే; మేల్కని; ఆశ+విష+ఉరగంబులన్‌= ఆ విషపు పాములను; చరణంబులన్‌= కొళ్ళతో; చమరి= రాచి; ముక్కున; వాతను; నోట; నెత్తురు; ఒల్కగాన్‌= కారేటట్టు; తలరంగ= చలించునట్టుగా; తాన్‌= తాను - అనగా భీముడు; అపహస్తమునన్‌= పెడచేత్తో; సారధిన్‌; చజచెన్‌= కొట్టాడు; సారథియున్‌; తత్‌+*క్షణ, మాత్రన= ఆ క్షణంలోనే; ముక్త జీవుండు+ఐ=ఐ విడువబడిన (ప్రాణాలు కలవా డై వసుంధరా, తలమునన్‌= నేలమీద; త్రెళ్ళెన్‌= చచ్చిపడ్డాడు. తాత్పర్యం; మహాబలవంతు డైన భీముడు, అప్పుడే మేల్కొని ఆ పాములను కాళ్ళతో రాచి చంపి, ముక్కున నోట నెత్తురు కారేటట్టు సారథిని పెడచేత్తో కొట్టాడు. సారధి ఆ క్షణంలోనే చచ్చి నేలమీద పడ్డాడు.

ఆదిపర్వము - పంచమాశ్వాసము త్ర

క. మథియును నొకనాం డెవ్వరు । నెబుంగక యుండంగం గౌరవేంద్రుండు ధర్మం బెటుంగక విష మన్నముతో । గులుకొని పెట్టించె గాడ్పుకొడుకున కలుకన్‌. 178

(ప్రతిపదార్థం: మజియునున్‌; ఒకనాడు; ఎవ్వరున్‌; ఎలు(గక; ఉండంగన్‌: కౌరవ+ఇం[ద్రుండు= కౌరవరాజు - దుర్యోధనుడు;

ధర్మంబు; ఎజుంగక; గాడ్పు, కొడుకునకు= వాయుదేవుని కుమారునికి - భీమునికి; అలుకన్‌= కోపంతో; విషము; అన్నముతో;

గుణుకొనిజ పూని; పెట్టించె.

తాత్పర్యం: ఇంకోరోజు ఎవ్వరికీ తెలియకుండా దుర్యోధనుడు, ధర్మాన్ని గూర్చి ఆలోవించక, కోపంతో విషాన్ని

అన్నంలో కలిపి భీమునికి పెట్టించాడు.

క, _ సముండై యుయుత్సుం డయ్య । నము దుష్టం బగుటం జెప్పినను గుడిచె విషా న్నము నాకటిపెలుచను; నది ।; యమృతాన్నం బయ్యె జీర్ద మై మారుతికిన్‌, 179

ప్రతిపదార్హం: యయుత్సుండు= ధృతరాష్ట్రునికి వైశ్సవనితయందు పుట్టినవాడు, వయసులో దుర్యోధనుని తరువాతివాడు;

సముడు+ఐజ=ఐ సమ బుద్ధి కలవాడై; ఆ+అన్నము; దుష్టంబు= చెడ్డది; అగుటన్‌; చెప్పినను; ఆకటి, 'పెలుచనున్‌= ఆకలి యొక్క అతిశయంతో; విష+అన్నమున్‌; కుడిచెన్‌= తిన్నాడు; అది; మారుతికిన్‌= వాయుపుద్రు డైన భీమునికి: జీర్షము+ఐ: అమృత+అన్హంబు; అయ్యెన్‌.

తొత్పర్యం: యుయుత్సుడు సమబుద్ది కలవాడై ఆ అనం చెడ్డదని చెప్పినా, భీముడు అధిక మైన ఆకలివలన

దాన్ని తిన్నాడు. అది అతనికి జీర్ణ మై అమృతంవంటిది అయింది.

వ. ఇట్లుదుర్యోధనుండు భీమునకుం దనచేసిన యెగ్గులెల్లను గృతఘ్నునకుం జేసిన లగ్గులునుంబోలె నిష్పలంబు లైన సిగ్గువడి, వెండియు6 బాండవుల కెల్ల నపాయంబు సేయ నుపాయంబు! జింతించుచుందె; నంత భీష్మనియోగంబున. 180

ప్రతిపదార్దం: దుర్యోధనుండు; భీమునకు; తన, చేసిన, ఎగ్గులు+ఎల్లను= తాను చేసిన అపకారాలన్నీ; కృతఘ్నునకున్‌ చేసిన=

మేలు మర్చిపోయే వాడికి చేసిన; లగ్గులునున్‌+పోలె= ఉపకారాలవలె; నిష్టలంబులు+ఐన= వ్యర్థం కాగా; సిగ్గు, పడి; వెండియున్‌= మరల; పాండవులకు+ఎల్లన్‌= పాండవులందరికి; అపాయంబు= కీడు; చేయన్‌; ఉపాయంబున్‌; చింతించుచు+ఉండెన్‌; అంతః అప్పుడు; భష్మ నియోగంబున= భీష్ముని ఆజ్ఞతో.

తాత్పర్యం: ఈ విధంగా దుర్యోధనుడు భీమునికి చేసిన అపకారాలన్నీ కృతఘ్నునికి చేసిన ఉపకారాలవలె వ్యర్థం

కాగా, సిగ్గుపడి, మళ్ళీ పాండవులందరికి కీడు చేయాలని ఉసాయం ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు భీష్ముని ఆజ్ఞవలన.

విశేషం: ఒక్క భీముడిని చంపితే పాండవులు నిర్వీర్యులౌతారని దుర్యోధనుడు భావించి విఫలుడైనాడు; తర్వాత పొండవులందరిని కలిపి ఒకసారిగా చంపటానికి ఆలోచించాడు.

క. _ విలువిద్యం గజచుచుండిరి ।; బలయుతులు కుమారకులు కృషద్రోణాచా ర్యులతోడం గలసి యొక్కట ; నలఘు పరాక్రమ సమేతు లధిక స్పర్థన్‌, 181

క్తి శ్రీమదాంధ్ర మహాభారతము (ప్రతిపదార్థం: బలయుతులు=బలంతో కూడినవాళ్ళు: అలఘు, పరా(క్రమ, సమేతులు= గొప్పపరాక్రమంతో కూడినవాళ్ళు; కుమారకులు= పాండవులు కౌరవులు; ఒక్కటన్‌= ఒకటిగా; కలిసి; కృప, (ద్రోణ+ఆచార్యులతోడన్‌= కృషద్రోణాచార్యుల వద్ద; అధిక, స్పర్దన్‌= అధికమైన పోటీతో; విలువిద్యన్‌; కజచుచు+ఉండిరి= నేర్చుకొంటూ ఉన్నారు. తాత్పర్యం: బలవంతులు, పరాక్రమవంతులు అయిన కురుపాండవులు, ఒక్కటిగా కలిసి, కృపద్రోణాచార్యులవద్ద, ఒకరిని మించవలె నని మరొకరు పోటీపడుతూ, విలువిద్య నేర్చుకొంటూ ఉన్నారు. విశేషం: 'స్పర్ణయా వర్హతే విద్యా అని పండితోక్తి విలువిద్యను కురుకుమారులు ఒకరికంటె మరొకరు మించాలని స్పర్హతో నేర్చుకొంటున్నారన్నమాట. న. అనిన వని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 182 తాత్పర్యం: అని చెప్పగా విని వైశంపాయనునితో జనమేజయుడు ఈవిధంగా అన్నాడు. తే కృపుండు ద్రోణుండు ననంగ సత్మీర్తు లైన । వారి జన్మప్రకారంబు, వారు వచ్చి కౌరవులకెల్ల గురు లైన కారణంబు । విప్రముఖ్య! నా కెజుంగంగ విస్తరింపు. 183 ప్రతిపదార్థం: కృపుండు; ద్రోణుండున్‌, అనంగ; సజ్‌+కీర్తులు+ఐన= మంచికీర్తి కలవాళ్ళయిన; వారి. జన్మ, ప్రకారంబు= వాళ్ళ పుట్టుక యొక్క విధం; వారు, వచ్చి, కౌరవులకు+ఎల్ల= కురుకుమారులందరికీ; గురులు+ఐన; కారణంబు; వి(ప్రముఖ్య= (బ్రాహ్మణోత్తమా! వైశంపాయనమహర్షీ నాకు ఎణయుంగంగజ తెలిసేటట్టు; విస్తరింపు= వివరంగా చెప్పుము. తాత్పర్యం: ఓ వైశంపాయన మహర్షీ! కృపుడు, ద్రోణుడు పుట్టిన విధాన్నీ, వాళ్ళు వచ్చి కురుకుమారు లందరికీ గురువు లైన విధాన్నీ నాకు తెలిసేటట్టుగా వివరంగా చెప్పుము. వ అని యడిగిన వైశంపాయనుం డి ట్లనియె. 184 తాత్సర్యం: అని అడుగగా వైశంపాయనుడు ఇట్టా చెప్పాడు. కృపాచార్యుల జన్మవృత్తాంతము (సం.1-120-2) సీ. వినవయ్య! గౌతముం డన బ్రసిద్దుం డైన : మునికి శరద్వంతు. డను మహాత్ముం డురుతరతేజు. డై శరసమూహంబుతో ।; నుదయించి, వేదముల్‌ చదువ నొల్ల కతిఘోరతపమున నుతభూసురోత్తముల్‌ । వేదముల్‌ చదువున ట్లాదరమున సర్వాస్త్రవిదుండు ధనుర్వేద మొప్పంగం। బడసి, మహానిష్టం గడంది తపము ఆ. సేయుచున్న దివిజనాయకు. డతిభీతి । నెటింగి, వానితపము. జెటుపం బనిచె జలజనయనం దరుణి జలపద యనియెడు । దాని; నదియు వచ్చె వానికడకు. 185 ప్రతిపదార్థం: వినవయ్య; గౌతముండు; అనన్‌, ప్రసిద్దుండు+ఐన; మునికి; శరద్వంతుండు+అను; మహాత్ముండు; ఉరుతర, తేజుండు+ఐ= ఎంతో (మిక్కిలి) తేజస్సు కలిగిన వాడై; శర, సమూహంబుతోన్‌= బాణాల సమూహంతో; ఉదయించి= పుట్టి; వేదముల్‌! చదువన్‌; ఒల్లకజ ఇష్టపడక; అతి, ఘోర, తపమునజ ఎంతో భయంకరం అయిన తపస్సుచేతు అతి, నుత, భూసుర+ఉత్తముల్‌= పొగడబడిన (బ్రాహ్మణ శ్రేష్టులు; వేదముల్‌; చదువునట్టు;: ఆదరమున= ప్రీతితో; సర్వ+అ(స్తు విదుండుజ

ఆదిపర్వము = పంచమాశ్వాసము శక్‌ అన్ని అ(స్తాలూ తెలిసినవాడు; ధనుర్వేదము; ఒప్పగన్‌; పడసిజ పొంది; మహా, నిష్టన్‌= గొప్ప నియమంతో; కడంగి=ఐ పూని; తపము; చేయుచు+ఉన్న; దివిజ, నాయకుండు= దేవేంద్రుడు; ఎజీగిఐ తెలిసికొని; అతిభీతిన్‌= మిక్కిలి భయంతో; వాని, తపమున్‌; చెజుపన్‌: జలజనయనన్‌= కమలాలవంటి కన్నులు కలదానిని; తరుణిన్‌= యౌవనంలో ఉన్నదానిని; జలపద, ఆనియెడు దానిన్‌; పనిచె= పంపినాడు; అదియు; వాని; కడకు; వచ్చె. తాత్పర్యం: గౌతము డనే పేరు గల (గౌతముడనే పేరుతో 'ప్రసిద్దుడైన) మహామునికి, శరద్వంతుడనే మహాత్ముడు గొప్పతేజస్సుతో, బాణసమూహంతో పుట్టి, వేదాలు చదవటానికి ఇష్టపడక, అతి భయంకర మయిన తపస్సు చేసి, (బ్రాహ్మణోత్తములు వేదాలు చదివే విధంగా తాను ధనుర్వేదాన్ని సాధించి, మహానిష్టతో తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు అది తెలిసికొని భయపడి, అతని తపస్సును భగ్నం చెయ్యాలని కమలాలవంటి కన్నులు గల జలపద అనే యౌవనవతిని పంపించాడు. ఆమె అతనిదగ్గరికి వచ్చింది. విశేషం: 'జలపద'కు జానపది, జాలపది, జాలవతి, జలవతి అనే పారాంతరా లున్నాయి. క. అమ్ముదితం జూచి కాముశ | రమ్ములచే విద్ధుం దై శరద్వంతుండు చి త్తమ్మలర మదనరాగర ; సమ్మునం ద న్నెలుంగకుండె. జంచలతను. దై 186 ప్రతిపదార్హం: ఆ+ముదితన్‌= ఆ కాంతను; చూచి; శరద్వంతుండు; కాము, శరమ్ములచే= మన్మథునియొక్క బాణాలచేత; విద్దుండు+ఐ= కొట్టబడినవాడైై; చిత్తమ్ము= మనస్సు; అలరః= వికసించగా; మదన, రాగ, రసమ్మునన్‌= మన్మథరాగం అనే ఆనందంలో; చంచల, తనుండు+ఐ= చలిస్తున్న శరీరం కలిగిన వాడై; తన్ను+ఎయు(౧క+ఉండెన్‌= తనను తాను తెలియక ఉన్నాడు. తాత్పర్యం: ఆ కాంతను చూచి శరద్వంతుడు మన్మథబాణాలచేత పీడించబడి, మనసు చెదరి, మన్మథరాగంలో మైమరచి ఉన్నాడు. కు ఆ తరుణికటాక్షేక్షణ ; పాతము గౌతమున కపుడు పటుబాణధనుః పాతముతోడన రేతః; పాతము గావించె రాగపరవశు. డగుటన్‌, 187 ప్రతిపదార్థం: ఆ తరుణి, కటాక్ష+-ఈక్షణ పాతము= అ కాంతయొక్క కడగంటిచూపు పడడంతోనే; అపుడు; రాగ, పరవశుండు+అగుటన్‌= మన్మధరాగానికి స్వాధీనం అయినవాడు అవటంచేత; గౌతమునకు గౌతముని కుమారుడైన శరద్వంతునికి; పటు, బాణ, ధనుః, పాతముతోడన= గట్టివైన బాణాలు గల ధనుస్సు పడటంతోనే; రేతః పాతము= వీర్యం పడటం; కావించె= చేసింది. తాత్పర్యం: ఆ కాంత కడగంటి చూపు శరద్వంతునిమీద పడగానే, అతడు మన్మధరాగపరవశు డై ఉండటం చేత, అతని చేతి ధనుర్చాణాలతోపాటు వీర్యంకూడా జారిపడింది. విశేషం: అలం; సహోక్తి వ. దాని నెజింగి శరద్వంతుం దయ్యాకశ్రమంబు విడిచి చని యొండుచోటం దపంబు సేయుచుండె; నవ్వీర్యం బొక్క శరస్తంబంబున ద్వివిధం బయి పడిన, నందొక కొడుకునుం గూంతురుం బుట్టి; రంత శంతనుండు మృగయా వినోదార్థం బరిగిన వాని సేనాచరుం డా శరస్తంబంబున నున్న కొడుకుం గూంతుం దత్సమీపంబున నున్నశర చాప కృష్ణాజనంబులుం జూచి, యివి యెయ్యేనియు నొక్కధనుర్వేదవిదుం డయిన బ్రాహ్మణునపత్యం బగునని శంతనునకుం జూపిన , శంతనుండును వారల. జేకొని కృపాయత్త చిత్తుం దయి పెనుచుటం యయ్యిరువురు. గృపుండును గృపియు ననం బెరు(గుచున్నంత. 186

శీ9ర శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్ధం: దానిన్‌; ఎజింగి=ఐ తెలిసికొని; శరదంతుండు; ఆ+ఆ(శ్రమంబు; విడిచి; చని= వెళ్ళి ఒండు; చోటన్‌= మరొక చోట; తపంబు; చేయుచు+ఉండెన్‌?; ఆ+వీర్యంబు= ఆ రేతస్సు; ఒక్క; శర, స్తంబంబున= రెల్లు గంటలో; ద్వివిధంబు+అయి= రెండు భాగాలు కలిగినదై; పడినన్‌: అందు; ఒక; కొడుకునున్‌?: కూతురున్‌; పుట్టిరి: అంత= తర్వాత; శంతనుండు; మృగయా, వినోద+అర్థంబు= వేటకోసం; అరిగిన= వెళ్ళగా; వాని, సేనా, చరుండు= అతనియొక్క సేనలో తిరిగేవాడు: ఆ, శర, స్తంబంబునన్‌= ఆ రెల్టు గంటలో; ఉన్న; కొడుకున్‌: కూతున్‌; తత్‌+సమీపంబునన్‌, ఉన్న= దానికి దగ్గరగా ఉన్న; శర, చాప, కృష్ణ+అజినంబులున్‌= బాణాలు, ధనుస్సు, జింకచర్మం; చూచి; ఇవి; ఏ+వీనియున్‌= ఎవరేని; ఒక్క; ధనుర్వేద, విదుండు+అయిన= విలువిద్యలో పండితుడైన; బ్రాహ్మణు, అపత్యంబు= (బ్రాహ్మణునియొక్క సంతానం; అగును; అని; శంతనునకున్‌; చూపిన; శంతనుండును; వారలన్‌; చేకొని= తీసికొని; కృపా+ఆయత్త; చిత్తుండు+అయి= దయతో కూడిన మనస్సు కలిగినవాడై; పెనుచుటన్‌+చేసి= పెంచటం చేత; ఆ+ఇరువురున్‌; కృపుండును; కృపియు; అనన్‌= అనే పేర్లతో; పెరుగుచు+ఉన్నంత= పెరుగుతూ ఉండగా. తాత్పర్యం: దానిని తెలిసికొని శరద్వంతుడు ఆ ఆ(శ్రమాన్ని విడిచివెళ్లి, వేరొకచోట తపస్సు చేసికొంటూ ఉన్నాడు. ఆయనవీర్యం ఒక రెల్టు గంటలో రెండు భాగాలుగా పడింది. దానినుండి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. తర్వాత ఒక రోజు శంతనమహారాజు వేటకు రాగా, అతని సైనికులలో ఒకడు ఆ రెల్టు గంటలో ఉన్న పిల్లలనూ, అక్కడే పడి ఉన్న ధనుర్చాణాలనూ, జింకచర్మాన్నీ చూచి, వీళ్ళెవరో ఒక ధనుర్వేదపండితు డైన (బ్రాహ్మణుని సంతానం అని తలచి శంతనునికి చూపించగా, ఆయన వాళ్ళను తీసికొని కృపతో పెంచటంచేత వాళ్ళిద్దరూ కృపుడు, కృపి అనే పేర్లతో పెరుగుతూ ఉండగా. కు చనుదెంచి శరద్వంతుం । డనవద్యుండు దన యపత్య మని వారిని శం తనున కెజింగించి కృపు న । త్యనుపము నుపనీతు. జేసి నధికప్రీతిన్‌. 189 (ప్రతిపదార్థం: అనవద్యుండు= దోషం లేనివాడు; శరద్వంతుండు; చనుదెంచి= వచ్చి, తన, అపత్యము+అని= తన సంతానం అని; వారిని; శంతనునకు; ఎజింగించి= తెలియజేసి; అతి+అనుపమున్‌= ఏమాత్రం సాటిలేనివాడిని; కృపున్‌; అధిక, ప్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; ఉపనీతున్‌= ఉపనయనసంస్కారం కలవానిగా; చేసెన్‌. తాత్పర్యం: పవిత్రు డైన శరద్వంతుడు వచ్చి, వాళ్ళు తన సంతాన మని శంతనునికి తెలిపి, అద్వితీయు డైన కృపునికి అమిత మైన ప్రేమతో ఉపనయనసంస్కారం చేశాడు. శా. వేదంబుల్‌ చదివించె భూసురులతో విఖ్యాతిగా, నాత్మసం వేదిం జేసి జతుర్విధం బగు ధనుర్వేదంబు నానాస్తవి ద్యాదాక్షి్యముతోడ6 దాన కఅపెం, దద్విత్తముల్‌ సూచి సం వాదుల్‌గా౯ దననందనుం గృపు శరద్వంతుందు దాంతాత్ముం డై. 190 ప్రతిపదార్థం: దాంత+ఆత్ముండు+ఐ= ని(గ్రహించబడిన మనస్సు కలిగిన వాడై శరద్వంతుండు: తన; నందనున్‌= తన యొక్క కుమారుడిని; కృపు; విఖ్యాతిగాన్‌= ప్రసిద్దిగా; వేదంబుల్‌; భూసురులతో= బ్రాహ్మణులతో; చదివించె: ఆత్మ, సంవేదిన్‌= ఆత్మ నెరిగినవానిగా; చేసెన్‌; చతుర్విధంబు+అగుజ నాలుగువిధాలు కలిగినదైన; (రధ, గజ, తురగ, పదాతి సంబంధాలు కలిగినది); ధనుర్వేదంబు; నానా+అస్త్ర, విద్యా, దాక్షిణ్యము, తోడన్‌= అనేక విధాలైన అ(స్త్రవిద్యలలోని నేర్పుతో; తత్‌*విత్తముల్‌= ఆ ధనుర్వేదాన్ని స్రలిసినవారు - అంటే ధనుర్వేదపండితులు; చూచి; సంవాదుల్‌= ఏకీభవించేవారు; కాన్‌= అయ్యేటట్టు; తాను+అ= తానే; కజుపెన్‌= ఎంచా! 4

ఆదిపర్వము - పంచమాశ్వాసము క్ష

తాత్పర్యం: శరద్వంతుడు (బ్రాహ్మణులవద్ద తన కుమారుడికి వేదాలు చెప్పించి ఆత్మజ్ఞానం కలవాడినిగా చేశాడు. రధ, గజ, తురగ, పదాతి బలాలతో సంబంధం ఉన్న ధనుర్వేదాన్ని, నానావిధాలైన అస్త్ర (ప్రయోగ నైపుణ్యంతో, ధనుర్వేద పండితులు చూచి మెచ్చుకొనే విధంగా తానే నేర్పించాడు. వ. అట్టికృపాచార్యురావించి భీష్ముం దతి భక్తిం బూజించి వానితోడందన మనుమల నందటజ విలువిద్య గణవం

బంచిన. 191 ప్రతిపదార్హం: అట్టి; కృపాచార్యు; రావించి= రప్పించి; భిషు గండు; అతి, భక్తిన్‌, పూజించి; వానితోడన్‌; తన, మనుమలన్‌; అందట; విలువిద్య; కజవన్‌= నేర్చుకొనటానికి; పంచిన= ఆజ్ఞాపించగా, తాత్పర్యం: అటువంటి కృపాచార్యుడిని రప్పించి భీష్ముడు, మిక్కిలి భక్తితో గౌరవించి, తన మనుమల నందరినీ విలువిద్య నేర్చుకొనటానికి ఆజ్ఞాపించగా.

ఇ

క. సవిశేషముగ ధనుర్వే। దవిశారదు లైరి కడు జితశ్రములై పాం

దవ దృతరాష్త్రాత్మజ యా । దవు లాదిగ రాజసుతులు తత్కృపుశిక్షన్‌. 192 ప్రతిపదార్హం: పాండవ, ధృతరాష్ట్ర+ఆత్మజ, యాదవులు+ఆదిగజ పాండవులు, ధృతరాష్ట్రుని కొడుకులు, యాదవులు మొదలైన; రాజ, సుతులు= రాజకుమారులు" తత్‌+కృపు శిక్షన్‌= ఆ కృపుని శిక్షణచేత; సవిశేషముగన్‌= అతిశయంతో కూడినట్లుగా; కడు= మిక్కిలి; జిత, (శ్రములు+ఐ= జయించబడిన (శమ కలిగినవారై; ధనుర్వేద, విశారదులు+ఐరి= విలువిద్యలో పండితు లయ్యారు. తాత్పర్యం: పాండవులు, కౌరవులు, యాదవులు మొదలెన రాకుమారులు కృపునిశిక్షణలో (శ్రమను జయించి విలువిద్యలో గొప్ప పండితు లయ్యారు.

ట్రోణాచార్యుల జన్మ వృత్తాంతము (సం.1-121-3)

వ. “'మజియు వారలకాచార్యుం డైన ద్రోణుజన్మంబును వానిచరిత్రంబును జెప్పిద విను' మని జనమేజయునకు

వైశంపాయనుం డి ట్లనియె. 193 (ప్రతిపదార్హం: మజియు వారలకు; ఆచార్యుండు+ఐన= గురు వైన; ద్రోణు, జన శంబును; వాని, చరిత్రంబును; చెప్పెద; వినుము; అని; జనమేజయునకు; వైశంపాయనుండు: ఇట్టు+అనియె. తాత్చర్యం: “అంతేకాక, కురుపాండవులకు ఆచార్యు డైన 'ర్రొణునిపుట్టుకనూ, చరిత్రనూ తెలుపుతాను' విను మని జనమేజయునితో వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. క సద్వినుత చరిత్రుండు భ । రద్వాజుం డను మునీశ్వరప్రవరుండు గం

గాద్వారమునం దపంబు జ । గద్వంద్యుండు సేయుచుండె గతకలృషుం దై. 194 ప్రతిపదార్దం: సద్‌+వినుత, చరిత్రుండు= సత్పురుషులచేత పొగడబడిన నడవడి కలవాడు; జగత్‌+వంద్యుండు= లోకాలచేత నమస్కరించదగినవాడు; భరద్వాజుండు అను, ముని+ఈశ్వర, (ప్రవరుండు= బుషి (శ్రేష్టులలో ఉత్తముడు: గత, కల్మషుడు+ఐ= పోయిన పాపం కలిగినవాడై గంగా ద్చారయునన్‌; తపంబు; చేయుచు; ఉండె.

క్త8్ర శ్రీనుదాంధ్ర మహాభారతము తాత్పర్యం: సత్పురుషులచేత ప్రశంసించబడిన నడవడి కలిగినవాడు, లోకంచేత నమస్కరించదగినవాడు, పవిత్రుడు ఆయిన భరద్వాజ మహాముని గంగాద్యారంవద్ద తపస్సు చేస్తూ ఉన్నాడు. నీ. అమ్ముని యొక్కనాం డభిషేచనార్దంబు | గంగకు. జని, మున్న కరము లీల నందు జలక్రీడ లాడుచునున్న య । పరస ఘృతాచి యన్సదమలాంగి పటుపవనాపేత పరిధాన యైన య । య్యవసరంబున జూచి, యమ్మగాక్షిం గామించి యున్నం దత్కానురాగంబున । యతిరేకమునం జేసి యాక్షణంబ తే. తనకు శుళ్లపాతం బైన, దానిం దెచ్చి । ద్రోణమున సంగ్రహించిన, ద్రోణు. దనంగం బుట్టె శుక్రునంశంబున బుణ్యమూర్తి । ధర్మతత్త్వజ్ఞు డగు భరద్వాజమునికి. 195 ప్రతిపదార్హం: ఆ+ముని; ఒక్కనాండు; అభిషేచన+అర్ధంబు= స్నానంకొరకు: గంగకున్‌; చని; మున్న= ముందుగానే; కరముజ= మిక్కిలి, లీలన్‌= విలాసంతో; అందు; జల'క్రీడలు; ఆడుచున్‌, ఉన్న; అప్పరస; ఘృతాచి; అన్‌= అనే పేరుకల; సదమల+అంగి= మిక్కిలి నిర్మలం అయిన దేహంగలది; పటు, పవన+అపేత, పరిధాన+ఐన= పెద్దగాలిచేత తొలగించబడిన చీర కలది కాగా; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; చూచి; ఆ+మృగ+అక్షిన్‌= ఆ జింకకన్నులవంటి కన్నులు గల స్త్రీని; కామించి; ఉన్నన్‌; తత్‌+కామ, రాగంబున, అతిరేకమునన్‌+చేసి= ఆ మన్మధరాగంయొక్క అతిశయంచేత; ఆ, క్షణంబ= ఆనిమిషంలోనే; తనకు; శుక్షు పాతంబు+ఐన= వీర్యం జారిపడగా; దానిన్‌: ఆ వీర్యాన్ని; తెచ్చి; బ్రోణమున= కలశంలో; సంగ్రహించిన= పట్టిపెట్టగా? శుక్రు, అంశంబునన్‌= శుక్రునియొక్క అంశచేత; పుణ్య, మూర్తి; ధర్మ, తత్త్రజ్ఞుండు= ధర్మంయొక్కతత్త్వాన్ని తెలిసినవాడు; అగు, భరద్వాజ, మునికి; ద్రోణుండు; అనంగన్‌; పుట్టె.

తాత్సర్యం: ఆ భారద్వాజముని ఒకనాడు స్నానానికై గంగానదికి వెళ్ళాడు. ఎదురుగా మహావిలాసంతో

జల(క్రీడలాడుతూ పెనుగాలిచేత చీర తొలగి నిర్మల మైన దేహంతో ఉన్న ఘృతాచి అనే అప్పరసను చూచి

కామించాడు. ఆ మన్మధరాగాతిశయంచేత ఆ క్షణంలోనే తనకు వీర్యస్థలనం కాగా, ఆ వీర్యాన్ని తెచ్చి కలశంలో పెట్టాడు. దానినుండే శుక్రుని అంశతో పుణ్యాత్ముడు, ధర్మతత్త్యం తెలిసినవాడు అయిన భరద్వాజమునికి ద్రోణుడు పుట్టాడు.

విశేషం: 'తెచ్చి ద్రోణమున సం[గ్రహించిన' అనే దానికి చేతి ద్రాణమున సంగ్రహించిన అనే పాఠాంతరం ఉన్నది. ఆ పరిస్థితులలో

వీర్యాన్ని తెచ్చి ద్రోణంలో సం(గ్రహించా డనటంకంటే, స్నానార్దమై వెళ్ళిన (ద్రోణుడు చేతిద్రోణంలో సం(గ్రహించా డనటం ఎక్కువ

సమంజసం అనిపిస్తుంది. 'శుక్రునంశంబున' అనే దానికి గురుని యంశంబున అనే పాఠాంతరం కూడా ఉన్నది.

వ. మజీయు ననంతరంబ భరద్వాజ సఖుం డైన పృషతుం డను పాంచాలపతి మహాఘోరతపంబు సేయుచు నొక్కనాండు దన సమీపంబున వాసంతికాపచయవినోదంబున నున్న యప్పరప మేనక యను దానిం జూచి మదనరాగంబున రేతస్కందం బయిన దానిం దన పాదంబునం బ్రచ్చాదించిన, నందు ద్రుపదుం డను కొడుకు మరుదంశంబునం బుట్టిన, వాని భరద్వాజూశ్రమంబునం బెట్టి చని పృషతుండు పాంచాలదేశంబున రాజ్యంబు సేయుచుండె, ద్రుపదుండును ద్రోణునితోడ నొక్కట వేదాధ్యయనంబు సేసి విలువిద్యయుం గజచి యా పృ్ఫషతు పరోక్షంబునం బాంచాలదేశంబున కభిషిక్తుం దయ్యె; ద్రోణుండును నగ్నివేశ్యుం డను మహామునివలన ధనుర్విద్యా పారగుం డై తత్ర్రసాదంబున నాగ్నేయాస్త్రం బాదిగా ననేకదివ్యబాణంబులు వడసి, భరద్వాజు నియోగంబునం బుత్రలాభార్థంబు కృపుని చెలియలింగృపి యనుదాని వివాహం బయి, దానియం దశ్వత్థామ యను కొడుకుం బడసి, యొక్కనాండు. 196

ఆదిపర్వము - సంచమాశ్వానము క్తం9 ప్రతిపదార్థం: మతజీయున్‌; అనంతరంబు+అజ=ఐ తరువాత; భరద్వాజ, సఖుండు+ఐన= భరద్వాజునియొక్క స్నేహితు డైన; పృషతుండు+అను; పాంచాల, పతి= పాంచాలదేశపురాజు; మహా, ఘోర, తపంబు; చేయుచున్‌: ఒక్కనాండు; తన, సమీపంబున; వాసంతికొ, కుసుమ+అపచయ, వినోదంబునన్‌= వసంతోత్సవ పుష్పాలను కోసే వేడుకలో; ఉన్న; అప్పరస, మేనక; అను, దానిన్‌; చూచి, మదన, రాగంబున= మన్మథరాగంచేత; రేతస్కందంబు+అయినః= వీర్యం జారిపడగా; 'రేతస్థలనంబు” అని పారాంతరం- ఉన్నది. దానిన్‌; తన; పాదంబునన్‌, ప్రచ్చ్భాదించినన్‌= కప్పీివేయగా; అందు; ద్రుపదుండు; అను; కొడుకు; మరుత్‌+అంళంబునన్‌; పుట్టిన= పుట్టగా: వాని; భరద్వాజ+ఆ(శ్రమంబున; పెట్టి; చని= వెళ్ళి; వృషతుండు; పాంచాల, దేశంబున; రాజ్యంబు; చేయుచు; ఉండె; (ద్రుపదుండును; (ద్రోణునితోడన్‌; ఒక్కట= ఒకటిగా; వేద+అధ్యయనంబు= వేదాధ్యయనం (వేదాలను చదవడం); చేసి; విలువిద్యయున్‌; కజచి= నేర్చి; ఆ, పృషతు, పరోక్షంబునన్‌= ఆ పృషతుని తర్వాత; పాంచాల, దేశంబునకు; అభిషిక్తుండు+అయ్యె; దోణుండును; అగ్షివేశ్యుండు అను; మహా, ముని వలన; ధనుర్విద్యా, పారగుండు+ఐజఐ విలువిద్యయొక్క అంతాన్ని (చివరిని) ముట్టిన వాడై తత్‌+ప్రసాదంబునన్‌= అతడి (అగ్నివేళ్యుని) యొక్క దయచేత; ఆగ్నేయ+అస్తంబు; ఆదిగాన్‌= మొదలుగా, అనేక, దివ్య, బాణంబులు= అనేకమయిన దేవతా సంబంధా లైన బాణాలు; పడసి= పొంది; భరద్వాజు, నియోగంబునన్‌= భరద్వాజునియొక్క ఆజ్ఞచేత; పుత్ర, లాభ+అర్ధంబుఐ పుత్రులను పొందటంకొరకు; కృపుని, చెలియలిన్‌; కృపి, అనుదాని, వివాహంబు+అయి; దాని, అందు; అశ్చత్చామ; అను, కొడుకున్‌; పడసి= పాంది; ఒక్కనాండు. తాత్పర్యం: భరద్వాజుని స్నేహితు డైన పృషతు డనే పొంచాలదేశపు రాజు మహా భయంకర మయిన తపస్సు చేస్తూ ఒక రోజు తన సమీపంలో వసంత కుసుమాలను కోస్తున్న మేనక అనే అప్పరసను చూచాడు. మన్మధరాగంచేత వీర్యస్థలనం కాగా, దానిని తన పాదంతో కప్పివేశాడు. అందులోనుండి ద్రుపదు డనే కొడుకు మరుత్తుని అంశతో జన్మించాడు. ఆ బాలుడిని భరద్యాజాశ్రమంలోనే ఉంచి పృషతుడు వెళ్ళి పాంచాలరాజ్యం పాలిస్తూ ఉన్నాడు. (ద్రుపదుడు దోణునితో కలిసి వేదాలు చదివి, విలువిద్యను నేర్చి, పృషతునితర్వాత పాంచాలదేశానికి రాజయ్యాడు. (ద్రోణుడు అగ్నివేళ్యుడనే మహామునివద్ద ధనుర్విద్యా పారంగతు డై, అతని అను(గ్రహంచేత ఆగ్నేయాస్త్రం మొదలుగా అనేక దివ్యాస్త్రాలు పొంది, భరద్వాజుని ఆజ్ఞదేత పుత్రులను పొందటానికి కృపునిచెల్లెలైన కృపిని వివాహమాడాడు. అమె వలన అశ్వత్థామ అనే కొడుకును కన్నాడు. ఒకనాడు- ం. క అనవరతము బ్రాహ్మణులకు. ।; దనియం ధన మిచ్చు జామదగ్న్య్యుండు రాముం

దను జనవాద పరంపర । విని యరిగెను వాని కడకు విత్తాపేక్షన్‌. 197 ప్రతిపదార్హం: అనవరతము= ఎప్పుడూ; (బ్రాహ్మణులకున్‌; తనియ6గ= తృప్తిపొందే విధంగా, జామదగ్బ్యుండు= జమదగ్జి కుమారుడు; రాముండు= పరశురాముడు; ధనము; ఇచ్చు; అను; జన, వాద, పరంపరజ జనుల మాటల వరుసను; విని, వాని, కడకు; విత్త+అపేక్షన్‌= ధనంమీది కోరికచేత, అరిగెను= వెళ్ళాడు. తాత్పర్యం: ఎప్పుడూ (బ్రాహ్మణులకు తృప్తి కలిగే విధంగా జమదగ్నికుమారు డైన పరశురాముడు ధన మిస్తున్నాడని అందరూ అనుకొంటుంటే విని, అతనివద్దకు ధనాపేక్షతో వెళ్లాడు. క. _ అరిగి మహేంద్రాచలమున । బరమ తపోవృత్తి నున్న భార్గవు లోకో త్తరు భూరి కర్మ నిర్మల । చరితుని ద్రోణుండు గాంచి సద్వినయమునన్‌. 198

ప్రతిపదార్థం: అరిగి= వెళ్ళి మహేంద్ర+అచలమునన్‌= మహేంద్రపర్వతంవద్ద; పరమ, తపోవృత్తిన్‌= గొప్పతపస్సు చేసే పనితో, ఉన్న; భూరి, కర్మ నిర్మల, చరితునిజ గొప్పపనులచేత పరిశుద్ధం అయిన నడవడి కలవాడిని; భార్గవువా భృగువంశం వా డైన పరశురాముడిని; ద్రోణుండు; కాంచి= చూచి సత్‌+వినయంబునన్‌= నిజ మైన వినయంతో

500 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: వెళ్లి, మహేంద్రపర్సతంవద్ద ఘోరతపస్సు చేస్తూన్నవాడూ, లోకంలో ్రేష్టుడూ, గొప్పపనులు చేయటం చేత పరిశుద్దమయిన నడవడి గలవాడు అయిన పరశురాముడిని చూచి సహజ వినయంతో వ. 'ఏను భారద్వాజుండ, ద్రోణుం దను వాండ; నర్ధార్ది నై నీ కదకు వచ్చితి' ననిన బరశురాముం డిట్లనియె.199 (ప్రతిపదార్థం: ఏను= నేను; భారద్వాజుండ= భరద్వాజుని కుమారుడను; ('బ్రోణుండు; అనువాండన్‌: అర్హ+అర్చిని+ఐ= ధనాన్ని కోరిన వాడివై; నీ, కడకు= నీ దగ్గరికి; వచ్చితిన్‌; అనినన్‌; పరశురాముండు; ఇట్టు+అనియె. తాత్సర్యం: 'నేను భరద్వాజుని కుమారుడ నైన ద్రోణుడిని. ధనాన్ని ఆశించి నీదగ్గరకు వచ్చాను' అని అనగా పరశురాముడు ఈ విధంగా బదులు పలికాడు. చ. కలధన మెల్ల ముంద జగన్నుత! విప్రుల కిచ్చి, వార్ధిమే ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపు డన్ముని కిచ్చితిన్‌: శరం బులును శరీరశస్త్రములుం బొల్పుగ నున్నని; వీనిలోన నీ వలసినవస్తువుల్‌ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్‌. 200 ప్రతిపదార్హం: జగత్‌+నుత= లోకం చేత పొగడబడే వాడా! కల, ధనము+ఎల్లన్‌= ఉన్న ధనాన్నంతటినీ; ముందఅజ= ముందుగానే, విప్రులకు= (బ్రాహ్మణులకు; ఇచ్చి; వార్ది, మేఖల, నిఖిల+ఉర్వి, అంతయును= సము(ద్రం ఒడ్డాణంగా కలిగిన సమస్త భూమండలాన్నీ; కళ్యపుడు; అన్‌, మునికి, ఇచ్చితిన్‌; శరంబులును= బాణాలు; శరీర, శస్త్రముల్‌= శరీరం, ఆయుధాలు; పాల్పుగన్‌= ఒప్పుగా; ఉన్నవి; వీనిలోన; నీ, వలసిన, వస్తువుల్‌= నీవు కోరుకొన్న వస్తువులను; కొను= తీసికొమ్ము; నీకున్‌; ధ్రువంబుగన్‌= తప్పుకుండా; ఇచ్చెద; నావుడున్‌= అని పరశురాముడు అనగా. తాత్పర్యం: 'లోకంచేత పొగడ్త లందుకొన్న ఓ బ్రోణా! నేను ఉన్న ధనం అంతా ముందే బ్రాహ్మణులకు ఇచ్చివేశాను. సముద్రం ఒడ్డాణంగా చుట్టిన భూమినంతటినీ కళ్యపమహరికి ఇచ్చివేశాను. ఇక శస్తాస్తాలు, శరీరం మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసినవాటిని తీసికొమ్ము తప్పక ఇస్తాను" అని పరశురాముడు అనగా. కు ధనములలో నత్యుత్తమ ।; ధనములు శస్తాస్త్రములు; ముదంబున వీనిం గొని కృతకృత్యుండ నగుదును । జననుత! నా కొసంగు మస్త్రశస్త్రచయంబులే. 201 ప్రతిపదార్థం: జన, నుత= జనులచేత కొనియాడబడేవాడా! ఓ పరశురామా!; ధనములలోన్‌; అతి+ఉత్తమ, ధనములు; శస్త్ర+ఆ(స్త్రములు; ముదంబునజ= సంతోషంతో; వీనిన్‌; కొని= తీసికొని; కృతకృత్యుండను= నెరవేరిన పని కలవాడిని; అగుదును: నాకు; అస్త్ర శస్త్ర చయంబుల్‌= అస్త్ర శస్తాల సమూహాలు; ఒసంము= ఇమ్ము. తాత్సర్యం: జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి మేలైన ధనాలు శస్తాస్తాలు. సంతోషంతో వీటిని తీసికొని కృతార్ణుడ నవుతాను. శస్తాస్తసమూహాన్ని నాకు ఇమ్ము. వ. అనిపరశురాముచేత దివ్యాస్తంబులు ప్రయోగ రహస్య మంత్రంబులతోడం బడసి, ధనుర్విద్యయు నభ్యసించి, ధనార్ధియయి తన బాలసఖుం డైన ద్రుపదుపాలికిం జని 'యేను ద్రోణుండ, నీబాల సఖుంద, సహాధ్యాయుండ న న్నెఖుంగుదే యని ప్రజయపూర్వకంబుగాం బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపదుం డలిదియి ట్లనియె. 202

ఆదిపర్వము - పంచమాశ్వాసము 501 (ప్రతిపదార్హం: అని; పరశురాముచేత; దివ్య+అ(స్తంబులు= దేవతాసంబంధ మైన అస్త్రాలు; ప్రయోగ, రహస్య, మంత్రంబులతోడన్‌= 'ప్రయోగించటంలోని మర్మాలతో, మంత్రాలతో; పడసీ= పొంది; ధనుర్విద్యయున్‌= విలువిద్యనుకూడా; అభ్యసించి= నేర్చుకొని; ధన+అర్హి+అయిజ= ధనాన్ని కోరినవాడై; తన, బాల, సఖుండు+ఐన= తనయొక్క చిన్ననాటి స్నేహితు డైన; ద్రుపదు, పాలికిన్‌= ద్రుపదుని దగ్గరికి; చని= వెళ్లి; ఏను, ద్రోణుండ; నీ, బాల సఖుండ; సహ+అధ్యాయుండన్‌= నీతో కలిసి చదివినవాడిని; నన్ను; ఎజుంగుదే= తెలిసి ఉన్నావు కదా, గుర్తుపట్టావుకదా! అని; ప్రణయ, పూర్వకంబుగాజ= 'స్నేహభావం ఉట్టిపడగా; పలికిన; విని; ఆ+పలుకులు; విన, సహింపకజ= వినటానికి ఇష్టపడక; ద్రుపదుండు; అలిగి=ఐ కోపపడి; ఇట్టు+అనియె. తాత్పర్యం: అని పరశురామునిచేత దివ్యాస్తాలను వాటి ప్రయోగ మర్మాలతో, మంత్రాలతోకూడా పొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటిస్నేహితు డైన ద్రుపదు దగ్గరికి వెళ్లి 'నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకొన్న వాడిని. తెలుసుకదా' అని స్నేహ పూర్వకంగా మాట్లాడగా, (ద్రుపదు డా మాటలను సహించలేక కోపించి ఈ విధంగా అన్నాడు. . దోణుండు ద్రుపదునిచే నవమానితు డగుట (సం.1-122-2) చ కొలంది యెజుంగ కిట్టి పలుకుల్‌ పలుకం దగు గాదు నా కనన్‌ బలుగుందనంబునం బలుకం బాడియె నీ సఖి నంచుంి బేదవి వ్రులకును ధారుణీశులకుం బోలంగ సఖ్యము సంభవించునే? పలుకక వేగ పొ; మ్మకట పాణుండు సంగడికాండె యెందునన్‌? 203 ప్రతిపదార్థం: కొలంది= అంతరం; ఎజుంగకవ= తెలియక; ఇట్టి, పలుకుల్‌; పలుకన్‌; తగున్‌, కాదు= తగును, కాదు; నొకు+అనన్‌; పలుగు+తనంబునన్‌= నిందాపూర్వకంగా; నీ, సఖిన్‌= నీ స్నేహితుడిని; అంచు=అంటూ; పలుకన్‌; పాడియె= న్యాయమా!; పేద, విప్రులకును= బీద బ్రాహ్మణులకు; ధారుణి+ఈశులకున్‌= రాజులకు; పోలంవ= సమానమైనట్టు; సఖ్యము= స్నేహం; సంభవించునే= కలుగుతుందా?; పలుకక= మాట్టాడకుండా; వేగ; పొమ్ము; అకటవ= అయ్యో; పాజుండు= (బ్రాహ్మణుడు; ఎందునన్‌= ఎక్కడైనా; సంగడికాండు+ఎ= స్నేహితుడా? తాత్పర్యం: మన ఇద్దరి అంతరం తెలియకుండా, 'నాకు ఈ విధంగా మాట్లాడ తగునా, కూడదా' అని అనుకోకుండా, రా నన్ను నీ స్నేహితుడి నని చెప్పడం న్యాయంగా ఉందా? బీదబ్రాహ్మాణులకూ మహారాజులకూ స్నేహం ఎట్లా సాధ్యపడుతుంది? నోరుమూసికుని పొమ్ము. అయ్యో! అసలు (బ్రాహ్మణుడు ఎక్కడైనా చెలికా డౌతాడా? విశేషం: అలం: అర్జాంతరన్యాసం. చ ధనపతితో దరిద్రునకు6 దత్వవిదుం డగు వానితోడ మూ ర్భునకుం బ్రశాంతుతోదం గడుం గ్రూరునకున్‌, రణశూరుతోడ భీ రునకు, వరూథితోడ నవరూథికి, సజ్జనుతోడం గష్టదు స 204 ర్హనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడంగూడ నేర్చనే?. ము ప్రతిపదార్థం: ధనపతితో= ధనానికి ప్రభువైనవానితో - అంటే సంపదకలవానితో; దరిద్రునకున్తే ట్‌ ర తత్య్యం తెలిసిన వానితో; మూర్చునకున్‌; ప్రశాంతుతోడన్‌= మిక్కిలి శాంతం కలిగిన వానితో; కజ్టీనన్‌ నకున; 2 ాార్లోష్యో స్మ యుద్దంలో పరాశ్రమవంతు డైన వానితో; భీరునకున్‌= పిరికివానికి; వరూధితోడన్‌= కవీ క్షి తీనతోజవర్లూర్ధికి, కవిచేరీ | శయ

502 శ్రీమదాంధ్ర మహాభారతము

లేనివానికి; సజ్జనుతోడన్‌; కష్ట దుర్దనునకున్‌= పాపి అయిన దుర్మార్లునికి; సఖ్యము= స్నేహం ఎ+విధంబునను; తాగ్‌ ఒడగూడ+నేర్చునే= కలుగుతుందా? కలుగ దని భావం.

తాత్పర్యం: ధనవంతునితో దరిద్రునికి, పండితునితో మూర్చునికి, ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచరక్షణ కలవానితో రక్షాకవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్లనికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? విశేషం: ఈపద్యం నన్నయ రుచిరార్థసూక్తులలో ఒకటి. ద్రుపదుడు చిన్ననాటి నెచ్చెలిని గుర్తించికూడా, పేదవాడూ ధనవంతుడూ అనే భేదభావంతో అతనిని తిరస్కరించాడు. అంతటితో ఆగకుండా తన ప్రవర్తనను ధర్మబద్ధమైనదానిగా సమర్దించుకొన్నాడు. అందుకై ముందు పద్యంలో మహారాజుకూ "పేదబాపనికీ ఎక్కడి సంబంధం అని ఎత్తిపొడిచాడు. ధనాపేక్షతో వచ్చిన (ద్రోణుని మనసు అతని పేదరికాన్ని ఎత్తిచూపుతున్నందుకు చివుక్కుమనేటట్టు చేశాడు. అంతటితో ఆగక అసలు బ్రాహ్మణుడు స్నేహంచేయ తగినవాడా? అని అధిక్షేపించాడు. ఇది అతని వర్ణాన్నీ, స్వభావాన్నీ నిందించేవాక్యం. అర్హహీనుడైన [ద్రోణుడు అభిమానహీనుడు కాడు. అందువలన ఆవాక్యం అతడిని రెచ్చకొట్టుతుంది. పైపెచ్చు ఈపద్యంలో ద్రుపదుడు తన ప్రవర్తనకు లోకధర్మాన్ని సూక్తిగా చెప్పి సమర్థించుకొంటున్నాడు. ఇందులో పేర్కొన్న పోలికల వలన (ద్రుపదుడు తనను ధనపతిగా, తత్పవేత్తగా, ప్రశాంతునిగా, రణశూరునిగా, సురక్షితునిగా, ఉత్తమునిగా, చెప్పుకొని ఆత్మప్రశంస చేసికొన్నాడు. (ద్రోణుడిని వరుసగా దరిద్రునిగా. మూర్చునిగా, క్రూరునిగా, పిరికిపందగా, అరక్షితునిగా, పరమ దుర్మార్షునిగా నిందించి నిష్కారణమైన పరనిందకు పాల్పడ్డాడు. ముందు పద్యంలోని మాటలే ద్రోణుని మనసును పుండుచేసి ఉంటాయి: పైపెచ్చు ఈ మాటలు పుండుమీద కారం చల్లి నట్టుంటాయి. సూక్తులను కధార్ధపోషకాలుగా వాడే నన్నయ కధాకధనశిల్స మిది.

క సమశీలశ్రతయుతులకు । సమధనవంతులకు సమసుచారిత్రులకుం దమలో సఖ్యమును వివా । హము నగు గొ; కగునె రెండు నసమానులకున్‌? 205

ప్రతిపదార్థం: సమ, శీల, (శ్రుత, యుతులకు= సమానమైన స్వభావంతో, విద్యతో కూడిన వాళ్ళకు; సమ ధనవంతులకున్‌= సమానంగా ధనవంతు లైన వాళ్ళకు; సమ, సుచారిత్రులకున్‌= సమాన మైన మంచి నడవడిక కలిగినవాళ్ళకు; తమలో: సఖ్యమును= స్నేహం; వివాహము; అగున్‌; కొక; రెండున్‌! అసమానులకున్‌= సమానులు కానివాళ్ళకు; అగునె= జాతాయా? (కావని భావం). తాత్పర్యం: సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమాన మైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచినడవడి రలవాళ్ళకు "స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని, సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం). విశేషం: కయ్యానికీ వియ్యానికీ సామ్యం ఉండాలనే జనసూక్తి కీపద్యం రమణీయ పద్యాకృతి.

వ. “మజి యట్లుంగాక రాజులకు. గార్యవశంబునం జేసి మిత్రామిత్ర సంబంధంబులు సంభవించుం గావున మా యట్టి రాజులకు మీ యట్సిపేదపాణువారలతో. గార్యకారణం బైన సఖ్యం బెన్నందును గానేర' దని ద్రుపదుం డైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన విని, ద్రోణుం డవమానజనిత మన్యుఘూర్హమాన మానసుండయి యెద్దియుం జేయునది నేరక పుత్త కళత్రాగ్నిహోత్ర శిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చెనంతనప్పుర బహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందను లందజుం గందుకక్రీడాపరు లయి వేడుకతో నాడుచున్నంత నక్కాంచనకందుకం బొక్కనూతం బడిన, 206

ప్రతిపదార్థం: మటి= ఇంకా; అట్టున్‌+కాక; రాజులకున్‌; కార్య, వశంబునన్‌, చేసి= అవసరంచేత; మి(త్ర+అమిత్ర, సంబంధంబులు=

స్నేహ, నైర సంబంధాలు; సంభవించున్‌= కలుగుతాయి; కావున; మాయట్టి, రాజులకు; మీయట్టి, పేద, పాజు వారలతోన్‌= మీవంటి బీద (బ్రాహ్మణులతో; కార్య, కారణంబు+ఐన= ప్రయోజనకర మైన; సఖ్యంబు; ఎన్సండును; కానేరదు; అని, ద్రుపదుండు; ఐశ్వర్య,

ఆదిపర్వము - పంచమాశ్వాసము 503 గర్వంబున= సంపదవలన కలిగిన పొగరుచేత; మెచ్చక= లక్ష్యపెట్టకుండా (నిర్లక్ష్యంగా); పలికిన; విని; బ్రోణుండు; అవమాన, జనిత, మన్యు, ఘూర్షమాన, మానసుండు+అయి= అవమానం వలన పుట్టిన కోపంచేత తిరుగుడు పడుతున్న మనసు కలిగినవా డై; ఎద్దియున్‌, చేయునది, నేరక= ఏమి చేయాలో తెలియక; పుత్ర కళ్యత+అస్టిహోత్ర, శిష్య, గణంబులతోజ= కొడుకుతో, భార్యతో, అన్నిహోత్రంతో, శిష్య సమూహంతో; హస్తి పురంబునకు; వచ్చెన్‌; అంతన్‌= అప్పుడు; ఆ+పుర, బహిః+అంగణంబున= ఆ పట్టణం వెలుపల; ధృతరాష్ట్ర పొండు, నందనులు= ధృతరా(స్టుని కుమారులు పాండురాజు కుమారులు (కౌరవ పాండవులు); అందలున్‌; కందుక. క్రీడాపరులు+అయి= చెండాట ఆడటంలో ఆసక్తి కలిగిన వారై; వేడుకతోన్‌= సంతోషంతో: ఆడుచు+ఉన్నంతన్‌= ఆడుతూ ఉండగా; ఆ+కాంచన, కందుకంబు= ఆ బంగారు చెండు (బంతి); నూతన్‌= బావిలో: పడిన= పడగా; తాత్పర్యం: 'అంతేకాదు; రాజులకు అవసరాన్నిబట్టి మిత్రత్వ శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి; అందుచేత మా వంటి రాజులకు మీ వంటి పేదబ్రాహ్మాణులతో ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు” అని ద్రుపదరాజు ఐశ్వర్యగర్వంతో తిరస్కరించి మాట్లాడగా ద్రోణుడు అవమానంచేత కలిగిన కోపంవలన కలత చెందిన మనసు కలవాడై, ఏం చేయటానికీ తోచక, కొడుకుతో, భార్యతో, అన్షిహోత్రంతో, శిష్య సమూహాలతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు ఆ పట్టణం బయట ధృతరాష్ట్రుని కుమారులు, పాండురాజు కుమారులు చెండాట ఆడుకొంటూ ఉండగా వాళ్ళాడుతున్న బంగారుబంతి బావిలో పడింది. అప్పుడు.

ఆ. నీరిలోనం దోంచు తారక ప్రతిబింబ । మొక్కొయనంగ వెలుం(గుచున్నదాని

రాచకొడుకులెల్లం జూచుచునుండిరి । దాని బుచ్చుకొనువిధంబు లేక. 207 ప్రతిపదార్హం: నీరిలోనన్‌= నీటిలో; తోచు= కనిపిస్తున్న; తారక, ప్రతిబింబము+జఒక్కో= నక్షత్రం యొక్క ప్రతిబింబమా?, అనంగ= అనేటట్టుగా; వెలుగుచు+ఉన్న; దాని= ఆ బంతిని" రాచ, కొడుకులు+ఎల్లన్‌= రాకుమారులంతా; దానిన్‌= ఆ బంతిని; పుచ్చుకొను, విధంబు= తీసికొనే మార్గం; లేక; చూచుచున్‌, ఉండిరి. తాత్పర్యం: నీటిలో ప్రతిఫలిస్తున్న నక్షత్రమా అన్నట్టుగా వెలుగుతున్న ఆ బంగారుబంతిని తీసికొనేమార్గం లేక రాకుమారులంతా ఊరకే చూస్తున్నారు. విశేషం: అలం; ఉ్రేక్ష. వ. అట్టి యవసరంబున, 208 తొత్సర్యం: అటువంటి సమయంలో,

ద్రోణుండు హస్తిపురంబునకు వచ్చుట (సం.1-122-14)

క నానావిధశరశరధుల ; తో నున్నతచాపధరుండు ద్రోణుండు వారిం

గానం జనుదెంచి యంతయు. | దా నప్పు డెజింగి రాజతనయుల కనియెన్‌, 209 ప్రతిపదార్థం; నాన్నా, విధ, శర, శరధులతోన్‌= అనేకవిధా లైన బాణాలతో, అమ్ములపొదులతో, ఉన్నత, చాప, ధరుండు= పొడ వైన ధనుస్సును ధరించినవాడు; ద్రోణుండు; వారిన్‌; కానన్‌= చ్హూడటానికై; చనుదెంచి= వచ్చి; తాన్‌=తాను; అప్పుడు; అంతయున్‌; ఎజీంగి' రాజ, తనయులకుజ రాకుమారులతో; అనియెన్‌= ఈవిధంగా అన్నాడు.

504 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: అనేక విధా లైన బాణాలతో, అమ్ముల పొదులతో, ఎత్తైన ధనస్సును ధరించిన (ద్రోణుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి విషయమంతా తెలిసికొని ఆ రాజకుమారులతో ఇట్లా అన్నాడు. వ్‌ ల్లా అన్నా చ. భరతకులప్రసూతులరు భాసురశస్రమహాస్త్ర విద్యలం గరము ప్రసిద్ధుం డై పరంగు గౌతమశిష్యుల; రిట్టి మీకు దు స్కరముగ నూతిలో. బడిన కాంచనపిండు. గొనంగనేర కొం డొరుల మొగంబు చూచి నగుచుండంగం జన్నె యుపాయహీనతన్‌. 210 (ప్రతిపదార్హం: భరత, కుల, ప్రసూతులరు= భరతవంశంలో పుట్టినవారు; భాసుర, శస్త్ర మహా+అస్త్ర విద్యలన్‌= (ప్రకాశిస్తున్న శస్రవిద్యలలో, గొప్పఆ(స్త్రవిద్యలలో; కరము= మిక్కిలి; ప్రసిద్దుండు+ఐ= పేరు పొందిన వాడై) పర(గు= ఒప్పు; గౌతమ, శిష్యులరు= కృపాచార్యుని శిష్యులు; ఇట్టి; మీకు; దుష్కరముగ= కష్టంగా; నూతిలోన్‌= బావిలో; పడిన; కాంచన, పిండున్‌= బంగారు బంతిని; కొనంగ, నేరక సైకితీయలేక; ఉపాయ, హీనతన్‌= ఉపాయం లేక; ఒండు+ఒరుల, మొగంబు= ఒకరిముఖాన్ని ఒకరు చూచి; నగుచు+ఉండంగన్‌= నవ్వుతూ(నిస్సహాయంగా)ఉండటం; చన్నె= తగినపనా? తాతృర్యం: మీరు భరతవంశంలో పుట్టి, శస్తాస్తవిద్యలలో మహాప్రసిద్దు డైన కృపాచార్యుని శిష్యులై, బావిలో పడిన బంతిని తీసికొనటం చేతకాక ఒకరి ముఖం ఒకరు చూచుకుంటూ నవ్వుకొనటం మీకు తగినపనా?

విశేషం: బాణవిద్యలో ్రాఢుడైన దద్రోణుడు- బావిలో బంతిపడితే పైకితీసికొనలేక వెలవెలపోతున్న పాండవులతో, ధార్తరాఘ్రులతో

అవహేళనగా మాట్లాడటం వాళ్ళను అవమానించటానికి కాదు. ఉత్తమవంశంలో పుట్టి, ఉత్తమ గురువుకు శిష్యులై సమయోచిత

ళా

మైన ఉపాయం ఆలోచించకుండ ఉద్విగ్నులు కావటం వీరులకు ఉచితం కాదని హెచ్చరించటానికి. ఆ తరువాత తన విద్యను,

యోగ్యతను ప్రదర్శించాడు. ఈ సన్నివేశం కృపాచార్యునికంటె (ద్రోణుడు గొప్పవాడనీ, అతని శిక్షణ రాజకుమారుల కవసరమనీ

భీష్ముడు భావించేటట్టు చేసిం దని వస్తుధ్వని. (సంపా,)

వ. దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదం జూడు/ డీ విద్య యొరు లెవ్వరు నేర' రని ద్రోణుం డొక్కబాణం బభి మంత్రించి దృష్టి ముష్టి సౌష్టవంబు లొప్ప నక్కందుకంబు నాట నేసి దాని పుంఖంబు మజియొక బాణంబున నేసి తత్పుంఖం బొండొకబాణంబున నేసి వరుసన బాణరజ్డువు గావించి దానిం దిగిచికొని యిచ్చినం జూచి రాజకుమారు లెల్ల విస్తయం బంది ద్రోణుం దోడ్మొని చని భీష్మున కంతయు నెజింగించిన నాతండును.

211 ప్రతిపదార్థం; దీని; ఈ బంతిని; బాణ, పరంపరన్‌చేసి= బాణాల వరుసతో; పుచ్చిఐ తీసికొని, ఇచ్చెదన్‌; చూడుండు; ఈ, విద్యః ఒరులు+ఎవ్వరున్‌= ఇతరు లెవ్వరూ; నేరరు= నేర్వలేదు; అని; ద్రోణుండు: ఒక్క, బాణంబు; అభిమంత్రించి= మంత్రంతో పిలిచి, దృష్టి ముష్టి సౌష్టవ్రంబులు= చూపు యొక్క, పిడికిలి యొక్క చక్కదనాలు; ఒప్పున్‌; ఆ+కందుకంబు= అ బంతిని; నాటన్‌+ఏసి= (గ్రుచ్చుకునేట్టుగా కొట్టి: దాని= ఆ బాణంయొక్క; పుంఖంబు= క్రింది చివర; మజియొక, బాణంబునన్‌; ఏసి= కొట్టి; తత్‌+పుంఖంబు= దానియొక్క చివరిఅంచును; ఒండు+ ఒక, బాణంబునన్‌= మరొక బాణంచేత; ఏసి= కొట్టి; వరుసన; బాణ, రజ్ఞువు= బాణాల తాడును; కావించి; దానిన్‌= ఆ బంతిని; తిగిచికొని= లాగుకుని; ఇచ్చినన్‌; చూచి; రాజకుమారులు+ఎల్ల; విస్మయము+ఆంది= ఆశ్చర్యపడి; ద్రోణున్‌, తోడ్కొని; చని= వెళ్ళి; భీష్మునకు; అంతయున్‌, ఎజింగించినన్‌; ఆతండును. తాత్పర్యం: “ఈ బంతిని బాణ పరంపరతో తీసి ఇస్తాను చూడండి. ఈ విద్య ఇతరు లెవ్వరికీ రాదు” అని (ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి, చూపును, పిడికిలిని చక్కగా నిలిపి, ఆ బంతికి నాటుకునే విధంగా ఆ బాణాన్ని

ఆదిపర్వము - పంచమాశ్వాసము 505 కొట్టి, ఆ బాణంచివరికి మరో బాణాన్ని, దాని చివరికి ఇంకో బాణాన్నీ కొట్టి, వరుసగా బాణాలతాడు చేసి బంతిని లాగి ఇచ్చాడు. అది చూచి, రాకుమారులంతా ఆశ్చర్యపడి, ద్రోణుడిని తీసికొని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పారు. ఆయనకూడా.

క. _ ఆసన్నపలితు ననఘు శ । రాసనగురు భూరిసత్తు నసితకృశాంగున్‌ భూసురవరు ద్రోణు గుణో । ద్దాసితు వినినట్ల చూచి పరమప్రీతిన్‌, 212 ప్రతిపదార్థం: ఆసన్న, పలితున్‌= సమీపించిన తలనెరిసినవాడిని; అనఘున్‌= పాపం లేనివాడిని; శర+అసన, గురున్‌= ధనుర్విద్యకు ఎరువైనవాడిని; భూరి, సత్తున్‌= గొప్పబలం కలిగిన వాడిని; అసిత, కృళ+అంగున్‌= నల్లని, సన్నబడిన శరీరం కలిగినవాడిని; భూసుర, వరు= (బ్రాహ్మణ శేష్టుడిని; గుణ+ఉద్భాసితున్‌= మంచిగుణాలచేత ప్రకాళిస్తున్నవాడిని; (బోణు; వినినట్టు+అ; చూచి; పరమ, ట్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో.

తాత్పర్యం: తల నెరియటం మొదలైనవాడు, పుణ్యాత్ముడు, ధనుర్విద్యాచార్యుడు, మహాబలవంతుడు, నల్లని

బక్కచిచ్కిన శరీరం కలవాడు, (బ్రాహ్మణ (శ్రేష్టుడు, మంచి గుణాలచేత (ప్రకాశించేవాడు అయిన ద్రోణుడిని తాను

ముందే విన్నట్టుగా చూచి భీష్ముడు ఎంతో సంతోషంతో.

క. _ 'ఎందుండి వచ్చి తిందుల; । కెం దుండంగ నీకు నిష్ట మెటిగింపుము స ద్వందిత!' యని యడిగిన సా । నందుడు ద్రోణుండు భీష్మునకు ని ట్లనియెన్‌. 213

ప్రతిపదార్థం: ఎందు+ఉండి= ఎక్కడినుండి; ఇందులకు= ఇక్కడికి; వచ్చితివి= వచ్చావు? నీకున్‌; ఎందు+ఉండంగ; ఇష్టము;

ఎజిగింపుము= తెలియజేయుము; సద్‌+వందిత= సజ్జనులచేత పొగడబడేవాడా!; అని; అడిగిన; స+ఆనందుండు= ఆనందంతో కూడిన వా డైన; ద్రోణుండు; భీష్మునకున్‌; ఇట్టు+అనియెన్‌.

చాచ్చర్యం: 'సజ్జనులచేత పొగడబడేవాడా! ఓ (ద్రోణాచార్యా! నీవు ఎక్కడినుండి ఇక్కడికి వచ్చావు? ఎక్కడ ఉండటం

నీ కిష్టం? చెప్పుము" అని అడుగగానే (ద్రోణుడు సంతోషించి భీష్మునితో ఈ విధంగా అన్నాడు.

వ. ఏను ద్రోణుం దను వాండ; భరద్వాజపుత్తుండ నగ్నివేశ్యుందను మహామునివరునొద్ద బ్రహ్మచర్యాత్రమంబున వేదాధ్యయనంబు సేసి ధనుర్వేదం బభ్యసించుచున్ననాండు పాంచాలపతి యైన పృషతుపుత్తుండు ద్రుపదుం డను వాండు నా కిష్టస్టఖుం డయి యెల్లవిద్యలు గజచి, 'యేను పాంచాల విషయంబునకు రాజయిననాండు నా యొద్దకు వచ్చునది; నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండ' వని నన్ను. బ్రార్థించి చని, పృషతు పరోక్షంబునం దద్దేశంబునకు రాజియి యున్న, నేను గురునియుక్తుండ నై గౌతమిం బాణిగ్రహణంబు నేసి యిక్కుమారు నశ్వత్హామ నధికతేజస్వి నాత్మజుం బడసి, ధనంబు లేమిం గుటుంబభరణంబునం దసమర్భుండ నయి యుండియు. 214

ప్రతిపదార్థం: ఏను= నేను; 'ద్రోణుండు+అను, వాండ; భరద్వాజ, పుత్రుండన్‌; అగ్నివేళ్యుండు; అను; మహాముని, వరు+ఒద్ద=

గొప్ప ముని(శ్రేష్టుని దగ్గర; బ్రహ్మచర్య+ఆశ్రమంబున; వేద+అధ్యయనంబు= వేదాలు చదవటం; చేసి; ధమర్వేదంబు: అభ్యసించుచు= నేర్చుకొంటూ; ఉన్న, నాండు= ఉన్నప్పుడు; పాంచాల, పతి+ఐన= పాంచాల దేశపు రాజైన, వృషతు పుత్రుండు= వృషతుడనేవాని కుమారుడు; (ద్రుపదుండు+అనువాడు; నాకు; ఇష్ట సఖుండు+ఐ= ప్రియమైన 'స్నేహితుడై; ఎల్ల, విద్యలు; కజచి= నేర్చుకొని, ఏను నేను; పాంచాల విషయంబునకు= పాంచాలదేశానికి; రాజు+అయిన, నాండు= రాజైనప్పుడు; నా, ఒద్దకు=

506 శ్రీమదాంధ్ర మహాభారతము నాద చ్చద రమ్ము; నా, రాజ్య, భోగంబులు; నీవున్‌= నీవు కూడా; అనుభవించన్‌; అర్హుండవు= తగినవాడివి; అని; నన్న “రాక చనిజ= వెళ్ళి; వృషతు, పరోక్షంబునన్‌= వృషతుని తర్వాత; తత్‌+దేశంబునకు= ఆ దేశానికి రాజు+అయి* ఉన్న; ను గురు, నియుష్పుండను+ ఐ= తండ్రిచేత ఆజ్ఞాపించబడిన వాడినై; గౌతమిన్‌= కృపిని; పాణిగ్రహణంబు+చేసి= వివాహమాడి? ఈ+కుమారున్‌; అశ్చత్సామన్‌; అధిక తేజస్విన్‌= మిక్కిలి తేజోశాలిని; ఆత్మజున్‌= కుమారుని; పడసి= పొంది. ధనంబు, లేమిన్‌= ధనం లేకపోవటంచేత; కుటుంబ, భరణంబు, అందు= సంసారాన్ని భరించటంలో; అసమర్జ్హుండను; అయి ఉండియు. ళ జ్‌ తాత్సర్యం: నా పేరు ద్రోణుడు. భరద్వాజుని కుమారుడిని. అగ్జివేళ్ళ్యు డనే గొప్ప మునిశ్రేష్టుని దగ్గర (బ్రహ్మచర్య వ్రతం అవలంబించి వేదాధ్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకొంటున్న కాలంలో, పాంచాల రాజైన వృషతుని కుమారుడు (ద్రుపదుడనే వాడు నాకు ప్రియమి(త్రు డై అన్ని విద్యలూ గురువుదగ్గర నేర్చి, 'నేను పాంచాలదేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించటానికి అర్హుడ' వని లౌ నన్ను (ప్రార్ధించి వెళ్ళాడు. వృషతుని తర్వాత (ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు. నేను కూడా తండ్రి ఆజ్జచేత న్‌ కృపిని వివాహమాడి, గొప్పతేజస్సు గల ఈ బాలుడు అశ్వత్భ్రామను కొడుకుగా పొంది, ధనం లేమిచేత సంసారాన్ని భరించలేని వాడనై ఉండి కూడా- క పురుషవిశేషవివేకా ; పరిచయు లగు ధరణిపతుల పాలికిం బోవం బరులందు దుష్ప్రతిగ్రహ : భర మెదలో రోసి ధర్మ పథమున నున్నన్‌, 215 ప్రతిపదార్థం: పురుషు విశేష వివేక+అపరిచయులు+అగు= పురుషునియొక్క గొప్పదనాన్ని గురించిన ఆలోచనలందు పరిచయం లేని వాళ్ళయిన; ధరణి, పతుల, పాలిక్షిన్‌= రాజుల దగ్గరికి, పోవన్‌= వెళ్లటం; పరులందు= ఇతరుల దగ్గర; దుష్ప్రతిగ్రహ, భరము= చెడుదానాలను తీసికొనటంయొక్క కష్టాన్ని; ఎదలో=ఐ మనసులో; రోసిజఐ అసహ్వించుకొని; ధర్మ, పథమునన్‌= ధర్మమార్గంలో; ఉన్నన్‌= ఉండగా. తాత్సర్యం: వ్యక్తుల యోగ్యతను గుర్తించలేని రాజుల దగ్గిరికి వెళ్లటానికి, ఇతరుల నుండి చెడు దానాలు తీసికొనటానికి ఇష్టపడక ధర్మమార్గంలో జీవితం గడుపుతుండగా క. _ ధనపతుల బాలురు ముదం । బున నిత్యము. బాలు ద్రావంబోయిన నస్మ త్తనయుండు వీండు బాల్యం ; బున నేడ్డెను బాలు నాకు బోయుం డనుచున్‌. 216 ప్రతిపదార్థం: ధన, పతుల, బాలురు= ధనవంతుల పిల్లలు; ముదంబున= సంతోషంతో; నిత్యమున్‌= (ప్రతిదినం; పాలు, (తావన్‌, పోయినన్‌= పాలుత్రాగుతుండగా; అస్మత్‌+తనయుండు= నా కుమారుడు; వీండు; బాల్యంబునన్‌; నాకున్‌ పౌలు, పోయుండు:; ఆనుచున్‌; ఏడ్చెను. తాత్పర్యం: ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు (త్రాగుతుండగా, నా కుమారుడు వీడు బాల్యంలో నాకుకూడా పాలు పోయంి డని ఏడ్చాడు. వ. _ దానిం జూచి 'దారిద్రంబున కంటె గష్టం బొం డెద్దియు లేదు; దీని నా బాలసఖుండగు పాంచాలు పాలికిం బోయి పొచికొందు; నాతండు తనదేశంబున కభిషిక్తుండు గాం బోవుచుండి నన్ను రాం బనిచిపోయె.” 217

ఆదిపర్వము - సంచనూశ్వాసము 507 (ప్రతిపదార్థం: దానిన్‌+చూచి; ద్రారిద్య్రంబున కంటెన్‌; కష్టంబు;: ఒండు+ఎద్దియు= మరొకటి ఏదీ; లేదు; దీని= ఈ "పేదరికాన్ని; నా బాల, సఖుండు= నా చిన్ననాటి స్నేహితుడు; అగు; పాంచాలు, పాలికిన్‌= పాంచాలదేశపు రాజైన ద్రుపదుని దగ్గరికి; పోయి; పాచికొందున్‌= పోగొట్టుకొంటాను; ఆతండు; తన, దేశంబునకు; అభిషిక్తుండు+కాన్‌= రాజు కావడానికి పోవుచుండి:; నన్ను; రాన్‌+పనిచి= రమ్మని చెప్పి; పోయె. తాత్పర్యం: దానిని చూచి దారిద్రంకంటే కష్టం మరొకటి లేదని తలచి, “ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమి(త్రు డైన పాంచాలరాజు (ద్రుపదునిదగ్గరికి పోయి తాలగించుకొంటాను, అతడు తనదేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్లాడు." మత్తకోకిల, వేయ టెంతయు. గష్టమైనను వేజులేని సుహృజ్ఞనున్‌ వేండికో లుచితంబ కావున వేడ్కతో. జని సోనుకున్‌ వేండినన్‌ ధన మోపండేనియు వీని మాత్రకు నాలుగేన్‌ పాండి కుట్లుల నీండె వీనికిం బాలు ద్రావుచునుండంగన్‌, 218 ప్రతిపదార్థం; వేడుట= యాచించటం; ఎంతయున్‌= మిక్కిలి; కష్టము; ఐనను; వేజులేని= భేదంలేని; సుహృత్‌+జనున్‌= మియత్రుడిని; వేడికోలు= వేడుకోవటం; ఉచితంబ= తగినదే* కావున; వేడ్కతోన్‌= సంతోషంతో; చని= వెళ్ళి, సోమకున్‌= ద్రుపదుడిని; వేడినన్‌; ధనము+ఓపడు+ఏనియు= ధనం ఇవ్వలేకపోయినప్పటికీ; వీని; మాత్రకు వీడికి (అశ్వత్థామకు) సరిపోయేంతగా; నాలుగు+ఏన్‌= నాలుగైనా; పాండి, కుజ్బులన్‌= పాడి ఆవులను; వీనికిన్‌= ఈ అశ్వత్థామకు; పాలు; త్రావుచున్‌; ఉండంగన్‌; ఈండె= ఇవ్వడా! తాత్పర్యం: యాచించటం ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం ఉచితమే. అందుచేత సంతోషంగా వెళ్లి ద్రుపదుడిని అడిగినట్టయితే, ధనం ఇవ్వలేక పోయినా, అశ్వత్థామ పాలు (త్రాగటానికి సరిపోయేటట్టుగా నాలుగు పాడి ఆవులను ఇవ్వడా? విశేషం; మత్తకోకిలపాదంలో ర,స,జ,జ,భ ర- అనే గణాలు వరుసగా ఉంటాయి. 11వ అక్షరం యతిస్టానం. 'ప్రాసనియమం ఉన్నది. వ. అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెజింగించిన, నాతండు దన రాజ్యమదంబున నన్నును దన్నును నెబుంగక 'యేను రాజను నీవు పేద పాజుందవు; నాకును నీకును నెక్కడి సఖ్యం? బని పలికిన వానిచేత నవమానితుండ నయి వచ్చితి' నని ద్రోణుండు దనవృత్తాంతం బంతయు. జెప్పిన. 219 ప్రతిపదార్హం: అని; నిశ్చయించి; (ద్రుపదు+ఒద్దకున్‌= (ద్రుపదుడి దగ్గరికి; పోయి; నన్ను+ఎజింగించినన్‌= నన్ను నేను పరిచయం చేసికొనగా; ఆతండు; తన, రాజ్య మదంబున= తనయొక్క రాజ్యంవలన కలిగిన పొగరుచేత; నన్నును: తన్నునున్‌; ఎటజుంగక; ఏను= నేను; రాజను; నీవు; పేద, పాటుండవు= బీద(బ్రాహ్మణుడివి; నాకును; నీకునున్‌; ఎక్కడి; సఖ్యంబు= స్నేహం; అని; పలికిన; వానిచేతన్‌; అవమానితుండను+అయి= అవమానించబడిన వాడి నై; వచ్చితిని; అని: ద్రోణుండు; తన, వృత్తాంతంబు; అంతయున్‌; చెప్పి. తాత్పర్యం: 'అని నిర్ణయించుకొని ద్రుపదుని దగ్గరికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసికొనగా, అతడు రాజ్యమదంచేత నన్ను, తనను ఎరుగకుండా నేను రాజును నీవు బీదబ్రాహ్మణుడివి. నాకూ నీకూ స్నేహం ఎక్కడ?" అని పలికాడు. ఆ విధంగా అతనిచేత అవమానం పొంది వచ్చా” నని ద్రోణుడు తనవృత్తాంతం అంతా చెప్పగా-

508 శ్రీమదాంధ్ర మహాభారతము

క. విని రోయు తీంగ గాళ్ళం , బెనంగెం దా ననుచు బొంగి భీష్ముండు ద్రోణున్‌

ఘనభుజు నభిష్ట పూజా । ధన దాన విధానముల ముదంబునం దనిపెన్‌. 220 (ప్రతిపదార్థం: విని; భీష్ముండు; రోయు, తీంగ= వెదుకుతున్న తీగ; తాన్‌; కాళ్ళన్‌; పెనలౌన్‌= చుట్టుకొన్నది; అనుచున్‌; పాంగి= సంతోషించి; ఘన, భుజున్‌= గొప్పభుజాలు కలిగినవాడిని; ద్రోణున్‌; అభీష్ట పూజా, ధన, దాన, విధానముల= ఇష్టమైన పూజలు చేయటం, ధనాన్ని దానం ఇవ్వటం అనే పద్దతులచేత; ముదంబునన్‌= సంతోషంతో; తనిపెన్‌= తృప్తిపరచాడు. తాత్పర్యం: విని భీష్ముడు వెదుకపోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్టు సంతోషించి, (ద్రోణునికి ఇష్టమైన పూజలు చేసి ధనధాన్యా లిచ్చి తృప్తి పరచాడు. వ. మజియును. 221 తాత్పర్యం: అంతటితో ఆగక.

భీష్ముండు కురుపొండుకునూరులకు (బోణుని గురువుగా నియమించుట (సం.1-122-40)

చ. మనుమల నెల్ల జూపి మతిమంచతుండు శాంతనవుందు 'వీరిం జే

కొని గురువృత్తిమైం గఅపు ఘోరశరాసనవిద్యలెల్ల6 బెం

పున జమదగ్నిసూనుండును బోలండు' ని న్నని విందు విల్లునే

ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమగర్వసంపదన్‌. 222 ప్రతిపదార్థం: మతిమంతుండు= గొప్పు బుద్ధి కలవాడు; శాంతనవుండు= భీష్ముడు; మనుమలన్‌; ఎల్లన్‌? చూపి; వీరిన్‌; చేకొని= (గ్రహించి; ఘోర శరశఆసన, విద్యలు+ఎల్లన్‌= భయంకరమైన ధనుర్విద్య లన్నింటినీ; పెంపున= అతిశయంగా; గురు, వృత్తిమైన్‌= గురుత్వంచేత; కజపు= నేర్పుము; నిన్ను; విల్లు, నేర్పున= విలువిద్యా నైపుణ్యంలో; నయ, నైపుణంబునను= నీతినేర్పులో: భూరి, పరాశక్రమ, గర్వ, సంపదన్‌= గొప్ప బలం కలిగిన గర్వమనే కలిమిలో: జమదగ్ని, సూనుండును= జమదస్లి కుమారు డైన పరశురాముడుకూడా; పోలడు; అని; విందు. తాత్పర్యం: మతిమంతు డైన భీష్ముడు తన మనమళ్ళందరిని ద్రోణునికి చూపించి వీరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్య లన్నింటినీ నేర్పుము. విలువిద్యలో, నీతిలో, పరాక్రమంలో పరవరాముడు కూడా నిన్ను పోల డని విన్నాను. వ. అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన, ద్రోణుండును వారలం జేకొని యందఅ

కి ట్లనియె. 223 ప్రతిపదార్హం: అని; కుమారులను+ఎల్లన్‌= కురుకుమారులందరినీ; చూపి; (ద్రోణునకు, శిష్యులన్‌+కా= శిష్యులయ్యేటట్టుగా; సమర్పించిన; (ద్రోణుండును; వారలన్‌; చేకొని= (శిష్యులుగా) (గ్రహించి; అందణకు; ఇట్టు+అనియెన్‌, తాత్పర్యం: అని పలికి కుమారు లందరినీ చూపి, వాళ్ళను (దోణునికి శిష్యులుగా సమర్పించాడు. దోణుడు వాళ్ళందరిని దగ్గరికి తీసి ఈ విధంగా అన్నాడు. తే. 'అస్తవిద్యలు గజచి నా దైన యిష్ట। మొగిన తీర్పంగ నిం దెవ్వ దోపు' ననిన

బాయ మొగమిడి కౌరవుల్‌ పలుకకుండి; రేను దీర్దైద' నని పూనె నింద్రసుతుండు. 224

ఆదిపర్వము - పంచనూశ్వాసము 509

(ప్రతిపదార్హం: అస్త్ర; విద్యలు; కజుచిజ నేర్చి; నాది+ఐన; ఇష్టము; ఒగిన్‌+అ; క్రమంగా; తీర్చంగన్‌; ఇందు: ఎవ్వడు; ఓపున్‌=

సరిపోతాడు; అనినన్‌; పాయమొగము= మారు మొగం; ఇడి= పెట్టి; కౌరవుల్‌? పలుకక+ఉండిరి; ఇంద్ర, సుతుండు= ఇంద్రుని

కుమారుడైన అర్జునుడు; ఏను= నేను: తీర్చెదను; అని; పూనెన్‌:

తాత్పర్యం: 'నా దగ్గర అ'స్త్రవిద్యలు నేర్చి నా కోరిక మీలో ఎవ్వడు తీర్చగల' డని అడుగగా కౌరవు లందరూ

పెడ మొగాలు పెట్టి మౌనం వహించారు. అర్జునుడు 'నేను తీరుస్తా' నని ముందుకు వచ్చాడు.

వ. ఇట్లు దన యిష్టంబు దీర్చం బూనిన యర్జును నాచార్యుం డతి స్నేహంబునం గౌంగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యంగఅపుచున్న నానాదేశంబులం గల రాజపుత్తు లెల్ల వచ్చి వారితోడంగలసి కఅచుచుండిరి; మలియు, సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యాకోశలంబున నర్ద్హునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె; నంత. 225

ప్రతిపదార్థం: ఇట్టు: తన, ఇష్టంబు= తన కోరికను; తీర్చన్‌+పూనిన= తీర్చటానికి పూనుకొన్నః అర్జునున్‌?; ఆచార్యుండు; అతి,

స్నేహంబునన్‌= మిక్కిలి ప్రేమతో; కౌగిలించుకొని, కరంబు= మిక్కిలి: సంతసిల్లి: కుమారులకు+ఎల్ల= కురుకుమారులందరికీ: వెలు, విద్యన్‌, కఆపుచు+ఉన్న= నేర్పుతూ ఉండగా; నానా దేశంబులన్‌. కల; రాజపుత్రులు+ఎల్ల వచ్చి; వారితోడన్‌; కలసి; కజచుచు+ఉండిరి= నేర్చుకొంటూ ఉన్నారు; మథటియు; సూత, పు'త్రుండు+అయిన= సూతుని కొడుకైన; రాబేయుండును; ధనుర్విద్యా, కౌలంబునన్‌= విలువిద్యలోని నేర్పుతో: అర్హునునితోడ; మచ్చరించుచు= ద్వేషం వహిస్తూ; దుర్యోధన, పక్షపాతి+ఐ= దుర్యోధనుని పక్షాన ఉన్నవాడై ఉండెన్‌; అంత= అప్పుడు.

కొని,

తాత్పర్యం; ఈ విధంగా తన కోరికను తీరుస్తా నని ముందుకు వచ్చిన అర్జునుడిని అపారట్రేమతో కౌగిలించు న

ఎ౦తో సంతోషించి, క్రురు కుమారు అందరికీ విలువిద్య నేర్చుతుండగా, నానాదేశాలనుండి రాకుమారులు వ థ్థ

వారితో కలిసి ఆ విద్య నేర్చుకొంటున్నారు. సూతుని కుమారు డైన రాధేయుడు విలువిద్యా నైపుణ్యంలో అర్జునుని సాని వహిస్తూ దుర్యోధనునిపక్షంలో చేరి ఉన్నాడు.

క నరుం డస్త్ర శస్త్ర విద్యా । పరిణతి నధికుం డయి వినయపరుం డయి శేశ్వ జం ద్గురుపూజాయత్నంబునం। బరయచు సంప్రీతు. జేసి భారద్వాజున్‌.

ప్రతిపదార్థం: నరుండు= అర్హునుడు; అస్త్ర శస్త్ర విద్యా, పరిణతిన్‌= అస్త శస్త్ర విద్యాదులలో పక్షతతో; అధికుడు+అయి;

వినయప జ్ర యతృంబునన్‌= నిరంతరం గురువును పూజించే

పరుడు+అయి= అడకువ ప్రధానంగా కలవాడై; శళ్చత్‌+గురు. పూజా: స పంతోషచిన వానినిగా:

(ప్రయత్నంలో; పరలపచు= ప్రవర్తిస్తూ: భారద్వాజున్‌= భరద్వాజుని కుమారు డైన (ద్రోణుని; సంటప్రీతున్‌= సంతోషించిన వానినిగా;

చేసె. లా

ల ప సూ (దోణుబ్ల్నో తాత్పర్యం; అర్జునుడు శస్త్రాస్త విద్యానైపుణ్యంలో అధికు డై; వినయంతో ఎప్తుడూ గురుపూజ చేస్తూ (ద్ర ణుబ్ఞ విశేషం: శిష్యుడు ఉత్తమగురువుకొరకు ఎట్టా అన్వేషిస్తాడో, గురువుకూడా ఉత్తమశిష్యుడికొరకు అట్టా అన్వేషిస్తా

ఇక్కడ ఉభయత్రా సార్ధక్యం ఏర్పడింది.

య ము

వ. అ య్యర్దునుతోడి విద్యా మత్సరంబునం జీళటి నాతం డేయ నేరకుండ వలయు నని తలంచి సు శ్ధి రహస్యంబున నన్నసాధకుం బిలిచి 'యెన్నండును నరునకు నంధకారంబునం గుడువం బెట్టకుమీ! యన్‌ పంచిన వాండును దద్వచనానురూపంబు సేయుచున్న నొక్కనాంటి రాత్రియందు. 2

510 శ్రీమదాంధ్ర నుహాభారతము ప్రతిపదార్థం: ఆ+అర్జునుతోడి? విద్యా, మత్సరంబునన్‌= విద్యలో పోటీ చేత; చీంకటిన్‌= చీకట్లో! ఆతండు= అర్జునుడు; ఎయ, నేరకుండ వలయును+అని= బాణాలు వేయటం నేర్వకుండా ఉండాలని; తలచి, అశ్చత్హామ; రహస్యంబునన్‌, అన్న సాధకున్‌= వంటవాడిని; పిలిచి; ఎన్నండును; నరునకున్‌= అర్జునునికి; అంధకారంబునన్‌= చీకట్లో; కుడువన్‌= తినటానికి; పెట్టకుమీ= పెట్ట వద్దు సుమా! అని; పంచిన= ఆజ్ఞాపించగా; వాడును; తత్‌+వచన+అనురూపంబు= అతని మాట ప్రకారం; చేయుచు+ఉన్నన్‌' ఒక్కనాంటి; రాత్రి; అందు. తాత్పర్యం: అర్జునునితో ఉన్న విద్యాస్పర్హతో అశ్చత్ధామ చీకట్లో బాణాలు వేయటం అర్జునుడు నేర్చుకోకుండా ఉండా లని తలచి, వంటవాడిని పిలిచి, “చీకట్లో అర్జునుడికి అన్నం పెట్టవద్దని ఆజ్ఞాపించగా, అతనిమాట ప్రకారం వంటవాడు అదే విధంగా చేస్తుండగా. ఒకనాటిరా(త్రి. చ వాసవనందనుండు గుడువం గుడువం బటుమారుతాహతిం జేసి చలించి దీపశిఖ చెచ్చెరం బాయుడు భోజనక్రియా భ్యాసవశంబునం గుడిచి 'పన్నుగ నిట్టుల విద్య లెల్ల న భ్యాసవశంబునం బడయ భారము లే' దని నిశ్చితాత్ముం డై. 228 (ప్రతిపదార్థం: వాసవ నందనుండు= ఇం(ద్రకుమారుడు - అర్జునుడు; కుడువన్‌, కుడువన్‌= తింటూ తింటూ ఉండగా; పటు మారుత+ఆహతిన్‌*చేసి=ఐ పెద్దగాలి తాకిడిచేత; చలించి= కదిలి; దీప, శిఖ= దీపపు మంట; చెచ్చెరన్‌= తటాలున; పాయుడు= తాలగిపోగా (ఆరిపోగా); భోజన, (క్రియా+అభ్యాస, వశంబునన్‌= అన్నం తినటం అనే పని చేయటంలో అలవాటు చొప్పున కుడిచి= తిని; పన్నుగన్‌= ఒప్పేటట్టుగా; ఇట్టుల= ఈవిధంగా; విద్యలు+ఎల్లన్‌: అభ్యాస, వశంబునన్‌= సాధన చేయటంచేత; పడయజ= పాందటం; భారము= కష్టం; లేదు; అని; నిశ్చిత+ఆత్ముండు+ఐ= నిశ్చయం పొందిన మనసు కలవాడై. తాత్పర్యం: ఇంద్రుని కొడుకైన అర్జునుడు అన్నం తింటూండగా పెద్దగాలికి తటాలున దీపం ఆరిపోయింది. అయినా, అలవాటు ప్రకారం ఆ చీకటిలోనే తిని, ఈ విధంగానే విద్య లన్నింటినీ సాధన చేసి నేర్చుకొన వచ్చని నిశ్చయించుకొని. | క _ పాయక చీళటియందును ।; నేయంగా నభ్యసించు నిట్టియెడం గౌం శేయ ధనుర్‌జ్యా ధ్వని విని । ధీయుక్తుండు ద్రోణు( డరుగుదెంచి ముదమునన్‌. 229 ప్రతిపదార్థం: పాయకజ విడవకుండా; చీకటియందున్‌; ఏ యన్‌, కాన్‌= బాణాలు వేయటాన్ని; అభ్యసించు= సాధన చేసే; ఇట్టి; ఎడన్‌= ఈ సమయంలో; కౌంతేయు; ధను:+జ్యా, ధ్వని= అర్జునుని వింటియొక్క అల్లెత్రాటి ధ్వని; విని; ధీ యుక్తుండు= బుద్దితో కూడినవాడు; (ద్రోణుండు; ముదమునన్‌= సంతోషంతో; అరుగుదెంచి= వచ్చి. తాత్పర్యం: పట్టుపట్టి చీకట్లో కూడా ఎప్పుడు విలువిద్యను అభ్యసించసాగాడో అప్పుడు అర్జునుని వింటియొక్క అల్లెత్రాటి ధ్వని విని, మేధావి అయిన (ద్రోణుడు సంతోషంతో అక్కడికి వచ్చి. నీ, ఆతని యస్ర్తవిద్యాభియోగమునకుం । బ్రయశిష్యవృత్తికిం బెద్ద మెచ్చి “'యన్న! ధనుర్ధరు లన్యులు నీకంటె । నధికులు గాకుందునట్లు గాంగం గఅపుదు విలువిద్య ఘనముగా” నని పల్కి। ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెజంగు రథ మహీ వాజి వారణములపై నుండి । దృఢచిత్ర సౌష్టవస్థితుల నేయ

ఆదిపర్వము - పంచమాశ్వాసము ద్‌ేశే

తే. బహువిధ వ్యూహ భేదనోపాయములను । సంప్రయోగ రహస్యాతిశయము గాంగం

గఅపె నర్జునుం దొంటి భార్గవుండు వింట । నిట్టి. డేయని పొగడంగ నెల్ల జనులు. 230 ప్రతిపదార్హం: అతని, అస్త్ర విద్యా+అభియోగమునకున్‌= ఆ అర్జునుని అస్త్ర విద్యా పూనికకూ; ప్రియ, శిష్య, వృత్తికిన్‌= ప్రియ మైన శిష్యుడి నడవడికి; పెద్ద మెచ్చి= మిక్కిలి సంతోషించి; అన్న! (ప్రేమ పూర్వక సంబోధన); అన్యులు= ఇతరులు; ధనుర్హరులు= విల్లును చేపట్టినవాళ్ళు; నీ కంటెన్‌, అధికులు; కాకుండునట్టు; కాంగన్‌; ఘనముగాన్‌= గొప్పగా; విలువిద్య; కజపుదు= నేర్పుతాను; అని; పలికి, ద్వంద్వ, సంకీర్ణ యుద్ధముల, తెజంగు= ద్వంద్వ యుద్దంయొక్క, సంకుల యుద్దంయొక్క పద్దతి; రధ, మహీ, నాజి, వారణములపైన్‌. ఉండి= రధంమీద, నేలమీద, గు[ర్రంమీద, ఏనుగుమీద ఉండి; దృఢ, చిత్ర, సౌష్టవ స్టితులన్‌= గట్టిగా, చిత్రంగా, చక్కగా ఉన్న స్టితులలో; ఏయ= కొట్టటానికి; బహు, విధ, వ్యూహ, భేదన+ఉపాయములనుజ అనేక విధా లైన వ్యూహాలను భేదించే ఉపాయాలను; సంప్రయోగ, రహస్య+అతిశయము, కాగన్‌= ప్రయోగ రహస్యాల అతిశయంతో కూడుకొనేట్టుగా; తొంటి; భార్గవుండు= ఒకనాటి పరశురాముడు; వింటన్‌= విలువిద్యలో; ఇట్టిండే= ఇటువంటి వాడా! అని; ఎల్ల జనులు; పొగడంగన్‌; అర్జునున్‌=అర్జునుడికి; కజపెన్‌= నేర్పాడు.

తాత్సర్యం: అ'స్తవిద్యలో అర్జునునికి గల పట్టుదలకు, అతని గురుభక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. “అన్న!

నీకంటె వే రెవ్వరూ అధికులు కానట్టుగా విలువిద్య నేర్చిస్తా' నన్నాడు. ద్వంద్వయుద్ధ, సంకులయుద్ధ పద్ధతులను,

రధంమీద, నేలమీద, గుర్రాలమీద, ఏనుగులమీద ఉండి దృఢం, చిత్రం, సౌష్టవం అయిన స్థితులలో బాణాలు

వేయటాన్ని, బహువిధా లైన వ్యూహాలను ఛేదించే ఉపాయాలను, బాణప్రయోగ రహస్యాలను ఇదివరకటి ఆ

పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటివాడు కాడని" ప్రజలు అర్జునుడిని పొగడేటట్టుగా అతనికి నేర్పాడు.

విశేషం: ఇద్దరువీరులమధ్య యుద్దం ద్వంద్వయుద్దం. అనేకమందివీరులు కలియబడి చేసే యుద్ధం సంకీర్షయుద్ధం. నే నే ఓ3 ఏకలవ్యుం డనువా(డు ద్రోణు నారాధించి విలువిద్య గజచుట (సం.1-123-10)

వ. మజియు గదాకార్హుకప్రాసాసితోమరకుంతశక్యాది వివధాయుధంబులయందును గుమారుల నందణి జతశ్రములం జేయుచున్న ద్రోణాచార్యుల మహాప్రసిద్ధి విని హిరణ్యధన్వుం డను నెబుకురాజుకొడు కేకలవ్యుం దనువా(డు ధనుర్విద్యాగ్రహణార్థి యయి వచ్చినవాని నిషాదపుత్తుం దని శిష్యుంగాం జేకొన కున్న వాండును ర్రోణుననుజ్ఞ వడసి చని వనంబులోన. 231

ప్రతిపదార్థం: మజియు; గదా, కార్ముక, ప్రాస+అసి తోమర, కుంత, శక్తి+ఆది, వివిధ+ఆయుధంబులయందును= గద, ధనుస్సు,

ఈటె, కత్తి తోమరం, కుంతం, శక్తి మొ న అనేకాలైన ఆయుధాలలో; కుమారులన్‌; అంద; బిత, శ్రములన్‌= జయించిన

'శ్రమగలవాళ్ళగా (నేర్చరులుగా); చేయుచు+ఉన్న; ద్రోణాచార్యుల; మహా, ప్రసిద్ధి= గొప్ప పేరు: విని; హిరణ్యధన్వుండు: అను;

ఎజుకు రాజు, కొడుకు; ఏకలవ్యుండు; అనువాండు; ధనుర్విద్యా, (గ్రహణ+అర్థి+అయి= విలువిద్యను నేర్చుకొనాలన్న కోరిక కలవాడై;

వచ్చిన; వాని= ఆ ఏకలవ్యుడిని; నిషాద, పుత్రుండు+అని= ఎరుకలవాని కొడుకని; శిష్యున్‌+కాన్‌; చేకొనక+ఉన్న; వాండును; ద్రోణు, అనుజ్ఞ అనుమతి; పడసిజ పొంది; చని= వెళ్లి; వనంబులోన్‌= అడవిలో,

తాత్పర్యం: అంతేకాకుండా గద, ధనుస్సు, ఈటె, కత్తి తోమరం, కుంతం, శక్తి మొదలైన అనేక విధాలైన ఆయుధ

విద్యలలో రాకుమారులందరినీ నేర్పరులను చేస్తున్న (ద్రోణాచార్యుల కీర్తి విని, హిరణ్యధన్వు డనే ఎరుకరాజు కొడుకు

ఏకలవ్యు డనేవాడు విలువిద్యను నేర్చుకోవాలని వచ్చాడు. ఏకలవ్యుడు ఎరుకువాని కుమారు డని (ద్రోణుడు శిష్యునిగా అంగీకరించలేదు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణుని అనుమతి పొంది వెళ్లి అడవిలో.

512 శ్రీమదాఐ[ధ్ర మహాభారతము తే. వినయమున ద్రోణురూపు మన్నున నమర్ది : దాని కతిభక్తితోడం బ్రదక్షిణంబుం జేసి మైక్కుచు సంతతాభ్యాసశక్తి నస్తవిద్యారహస్యంబు లర్థిం బడసి. 232

ప్రతిపదార్థం: వినయమున; ద్రోణు, రూపు= (ద్రోణుని బొమ్మను; మన్నునన్‌= మట్టితో; అమర్చి= చేసి; దానికి; అతి, భక్తితోన్‌; ప్రదక్షిణంబున్‌; చేసి; మైక్కుచు; సంతత+అభ్యాస, శక్తిన్‌= ఎడతెగని అభ్యాసబలంచేత; అస్త, విద్యా, రహస్యంబులు= విలువిద్యలోని మర్మాలు, అర్హిన్‌= సంతోషంతో; పడసె. తాత్పర్యం: వినయంతో ఏకలవ్యుడు ద్రోణునిబొమ్మను మట్టితో చేసి నిలిపి, దానికి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఎడతెగని, సాధనబలంచేత తానే విలువిద్యా రహస్యాలన్నీ (గ్రహించాడు.

విశేషం: ఇది ఏకలవ్యుని ముగ్ధ మైన స్టైరభక్తికి అద్దంపట్టే పద్యం. గురుముఖత: నేర్చుకొన్న విద్యకంటె గురువుకు దూరంగా

ఉన్నా, భక్తితో అధికమైన విద్యను సాధించవచ్చు ననీ, విద్యాప్రాప్తికి గురుసాన్నిధ్యంకంటె గురుభక్షియే ముఖ్యం అనీ ఈ పద్యం

బోధిస్తున్నది. గురుభక్తిని మించిన శక్తి లేదనే ఒక అర్జాంతరన్యాసాలంకార స్ఫూర్తిని కూడా కలిగిస్తున్నది. అందువలన ఇందులో స్వతస్పంభవ్యర్హశక్ష్యుద్భవాలంకారకృత వస్తుధ్వని ఉన్నది. (సంపా)

క ఇట పాండవకౌరవు లొ, క్కొట నందలు గురుననుజ్ఞం గొని మృగయాలం పటు లై ననమున కరిగిరి : పటుతర జవసారమేయభటనివహముతోన్‌. 233

(ప్రతిపదార్థం: ఇటజ హస్తిపురంలో; పాండవ, కౌరవులు,ఒక్కొటన్‌= ఒకటిగా? అందటు; గురు, అనుజ్జన్‌= గురువుయొక్క ఆజ్ఞను;

కొని= పొందీ; మృగయా, లంపటులు+ఐజ= వేట అంటే ఎంతో ఆసక్తి కలిగిన వాళ్ళయి; పటుతర, జవసారమేయ, భట నివహముతోన్‌=

మిక్కిలి ఎక్కువైనవేగం గల కుక్క లున్న భటులసమూహంతో; వనమునకుజ అడవికి; అరిగిరి= వెల్లారు.

తొచ్సర్యం: ఇక్కడ హస్తినాపురంలో పాండవులు, కౌరవులు కలిసి (ద్రోణాచార్యుని అనుమతి పొంది వేటపట్ట ఎంతో

ఆసక్తి కలవాళ్ళయి, మిక్కిలివేగం గల వేటకుక్కలతోకూడిన భటసమూహంతో అడవికి వెళ్ళారు.

వ. ఇ ట్లరిగి వసంబులోం గ్రుమ్మరుచున్న నం దొక్క భటుని కుక్క తోడు దప్పి పఅచి యొక్కెడ నేకతంబ యేయుచున్న నేకలవ్యుసమీపంబున మొఖింగిన, నయ్యెలుంగు విని దానిముఖంబునం దేదుబాణంబు లొక్కటం దొడిగి యక్కజంబుగా నతిలాఘవంబున వాండేసిన, నది శరపూరిత ముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాఖిన దానిం జూచి విస్తయం బంది య ట్లేసినవాం డెవ్వండో యని రోయుచు వచ్చువారు ముందణ. 234

ప్రతిపదార్దం: ఇట్టు, అరిగి= ఈ విధంగా వెళ్లి వనంబులోన్‌= అడవిలో; (క్రుమ్మురుచు+ఉన్నన్‌= తిరుగుతూఉండగా;? అందు; ఒక్క, భటుని, కుక్క; తోడు; తప్పి: పజచి= పరిగెత్తి; ఒక్క+ఎడ= ఒకచోట; ఏకతంబ= ఒంటరిగానే; ఏయుచున్నన్‌= బాణాలు వేస్తున్న; ఏకలవ్యు, సమీపంబున= ఏకలవ్యుని దగ్గర; మొజింగినన్‌; ఆ+ఎలుంగు= ఆ కంఠధ్వని; విని; దాని; ముఖంబున+అందు= దాని నోటిలో; ఏడు, బాణంబులు; ఒక్కటన్‌= ఒకటిగా; తొడిగి=ఐ ధనస్సులో ఎక్కుపెట్టి; అక్కజంబుగాన్‌= ఆశ్చర్యకరంగా: అతి లాఘవంబున= ఎంతో చాకచక్యంతో; వాండు= ఏకలవ్యుడు; ఏసినన్‌= కొట్టగా; అది= ఆ కుక్క; శర, పూరిత, ముఖంబు+అందు= బాణాలతో నిండిన నోరు కలిగిన దై: కురు కుమారుల, ఒద్దకున్‌; పాజిన= పరుగెత్తగా; దానిన్‌; చూచి; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; అట్టుః ఆ విధంగా, ఏసినవాండు= కొట్టినవాడు; ఎవ్వ6డో; అని; రోయుచు= వెదుకుతూ, వచ్చువారు= వస్తున్నవాళ్ళు; ముందజు= ఎదురుగా,

ఆదిపర్వము - సంచమాశ్వాసము 513 తాత్సర్యం: ఈ విధంగా వెళ్లి వెళ్లి అడవిలో తిరుగుతూ ఉండగా, ఒక భటుడికుక్క తోడు తప్పి పరుగెత్తి ఒకచోట ఒంటరిగా బాణాలు వేస్తున్న ఏకలవ్యుడికి దగ్గరగా వెళ్లి మొరిగింది. అతడు ఏడు బాణాలను ఒక్కటిగా వింట సంధించి అతిచాకచక్యంగా, ఆశ్చర్యకరంగా ఆ కుక్కనోట కొట్టాడు. అది బాణాలతో నిండిన నోటితో కురుకుమారుల దగ్గరికి పరుగెత్తింది. దానిని చూచి వాళ్ళు ఆశ్చర్యపడి ఆ విధంగా కొట్టినవా డెవ్వడా అని వెదకుతూ వస్తుండగా-ఎదురుగా-

ఉ. తేజతబాణహస్తు దృఢదీర్టమలీమసకృష్ణదేహుం గృ

ష్టాజినవస్తు, నస్తవిషయాస్తవిషాదు నిషాదు. జూచి యా

రాజకునూరులందణుం బరస్పరవక్ట్రవిలోకనక్రియా

వ్యాజమునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్‌. 235 ప్రతిపదార్థం: తేజిత, బాణ, హస్తున్‌= పదును పెట్టబడిన బాణం చేతిలో కలిగినవాడిని; దృఢ, దీర్హ, మలీమస, కృష్ణ దేహున్‌= దిట్టమైనదీ పొడవైనదీ, మురికి పట్టినది, నల్లనిదీ అయిన శరీరం కలవాడిని; కృష్ణ+అజిన, వ'స్తున్‌= జింకచర్మాన్ని వస్తంగా కలిగిన వాణ్ఞో. అస్త్ర విషయ+అస్త, విషాదున్‌= అస్త్రాల విషయంలో పోయిన దుఃఖం కలిగినవాడిని; నిషాదున్‌= ఎరుకవాడిని; చూచి; ఆ, రాజకుమారులు; అందయున్‌; పరస్పర, వక్త విలోకన, క్రియా, వ్యాజమునన్‌= ఒకరిముఖాన్ని ఒకరు చూచుకొనటం అనే పని నెపంతో; అతి, మత్సరంబునన్‌= మిక్కిలి స్పర్ధచేత; తత్‌+-ఈక్షణ, నివారితులు+ఐరి= అతడిని చూడడంనుండి తొలగించబడిన తాత్పర్యం: పదును పెట్టిన బాణాన్ని చేత పట్టుకొన్నవాడు, దిట్టమైనది, పొడవైనది, మురికి పట్టినది, నల్లనిదీ అయిన దేహాన్ని కలిగినవాడు, జింకచర్మాన్ని వస్తంగా ధరించినవాడు, అ'స్త్రవిద్యలో లోటు లేనివాడు అయిన ఏకలవ్యుడిని చూచి, ఆ రాకుమారులంతా విపరీతమయిన మాత్సర్యంచేత అతడిని చూడలేక ఒకరిముఖం ఒకరు చూచుకొన్నారు. విశేషం: ఈపద్యశైలి (ప్రసాదవిశిష్టమైన ఓజోగుణంతో పాత్రవిశిష్టతను ధ్వనింపచేస్తున్నది. అక్షరరమ్యం, ఉదాత్తమనోహరం అయిన నన్నయశైలికి ఉత్తమ ఉదాహరణాలుగా నిల్ఫే పద్యాలలో ఇది ఒకటి. స్థిరచిత్రాలను వర్షించటంలో నన్నయ చూపిన నైపుణ్యానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. (సంపా.) 'అస్త్ర విషయాస్త' - కు “అస్త్ర విషయాప్త' అని పాఠాంతరం ఉన్నది. వ. అ క్కునూరులు వాని శరలాఘవంబునకు మెచ్చి 'నీ వెన్వండ వెవ్వరిచేత విలువిద్యం గజచి?' తని యడిగిన

వారికి నయ్యెలు కి ట్లనియె. 236 (ప్రతిపదార్థం; ఆ+కుమారులు; వాని; శర, లాఘవంబునకు= అతని బాణ ప్రయోగంలోని నేర్పుకు, మెచ్చి; నీవు; ఎవ్వండవు; ఎవ్వరిచేత; విలువిద్యన్‌; కజుచితివి= నేర్పావు? అని, అడిగిన వారికిన్‌; ఆ+ఎలుకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: ఆ కుమారులు అతని బాణప్రయోగంలోని నేర్పరితనానికి మెచ్చి, 'నీ వెవుడవు? నీవు ఎవ్వరివద్ర విలువిద్య నేర్చుకొన్నావు?' అని అడుగగా నారితో ఆ ఎరుకలవాడు ఈ విధంగా అన్నాడు. క, _ విను( డే హిరణ్యధన్వుం । డను వనచరనాధు కొడుక; నాచార్యుండు ద్రో

ణునకున్‌ శిష్యుండ; నెందును |; ననవద్యుండ; నేకలవ్యుం డనువాండ మహిన్‌. 237

514 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: వినుండు: ఏ= నేను; హిరణ్యధన్వుండు; అను; వన, చర, నాథు, కొడుకన్‌= అడవిలో తిరిగే వారైన ఎరుకల రాజు కుమారుడిని; ఆచార్యుండు= గురువు; ద్రోణునకున్‌, శిష్యుండన్‌; ఎందునున్‌; అనవద్యుండన్‌= దోషం లేనివాడిని; మహిన్‌= భూమిలో; ఏకలవ్యుండు; అనువాండు+అ. తాత్సర్యం: వినండి. నేను హిరణ్యధన్వు డనే ఎరుకలరాజుకుమారుడిని. ద్రోణాచార్యుల శిష్యుడిని. ఏదోషం లేని వాడిని. నా పేరు ఏకలవ్యుడు. వ. అనిన విని కురుకుమారులందలు మగుడి వచ్చి ద్రోణున కంతయు. జెప్పి: రంత నర్జునుం డేకాంతంబ యొక్కనాం డాచార్యున కి ట్లనియె. 238 (ప్రతిపదార్హం: అనిన; విని; కురుకుమారులు; అందయు; మగుడి వచ్చి= తిరిగి వచ్చి; (ద్రోణునకు; అంతయున్‌; చెప్పిరి; అంతన్‌= అప్పుడు; అర్జ్హునుండు; ఏకాంతంబు+అ= రహస్యంగా; ఒక్కనాండు; ఆచార్యునకు= ద్రోణునితో; ఇట్టు+అనియె. తాత్సర్యం: అని ఏకలవ్యు డనగా విని, కురుకుమారు లంతా తిరిగివచ్చి దోణునికి ఆ సంగతినంతా చెప్పారు. ఆ పైన అర్జునుడు ఏకాంతంగా ఒకనాడు (దోణునితో ఈ విధంగా అన్నాడు. క. విలువిద్య నొరులు నీ క। గ్లలముగ లేకుండ నిన్నుః గణపుదు నని మున్‌ బలికితిరి:; నాక కా దీ : త్రిలోకముల కధికుం జూచితిమి యొక యెబుకున్‌. 239 ప్రతిపదార్హం: విలువిద్యన్‌= విలువిద్యలో; ఒరులు= ఇతరులు; నీకు; అగ్గలముగ= అధికంగా; లేకుండ, నిన్నున్‌; కణవుదున్‌= నేర్పుతాను; అని; మున్‌+ఇదివరకు; పలికితిరి; నాకు+అ= నాకే; కాదు? ఈ, త్రిలోకములకు= ముల్లోకాలకూ; అధికున్‌; ఒక; ఎటుకున్‌= ఒకఎరుకువాడిని; చూచితిమి. తశాత్సర్యం: విలువిద్యలో నీకంటె అధికులు లేనట్టుగా నేర్పుతా నని ఇదివరకు నాతో చెప్పారు. ఇప్పుడు నాకే కాదు, ఈ ముల్లోకాలకంటె అధికు డైన ఒక ఎరుకును చూచాము. క. నాకంటెను మీకంటెను । లోకములో నధికు6 దతిబలుండు ధనుర్వి ద్యాకౌశలమువ; నాతండు మీకుం బ్రియశిష్యుం డటె యమిథ్యావచనా! 240 ప్రతిపదార్థం: అమిథ్యా, వచనా= అసత్యంకాని మూట కలవోడా!; ఆతండు= ఆ ఎరుకువాడు; ధనుర్విద్యా, కౌశలమునన్‌= విలువిద్యలోని నేర్పులో; లోకములో: నాకంటెను; మీకంటెను; అధికుడు; అతి, బలుండు= ఎంతో బలశాలి; మీకున్‌; ప్రియ, శిష్యుండు: అటె= జబొనటకదా! తొత్సర్యం: అసత్యం కాని మాట గల ఆచార్యవర్యా! ఆ ఎరుకువాడు విలువిద్యా నైపుణ్యంలో నాకంటె, మీకంటె ఈ లోకంలో అధికుడు, మహాబలవంతుడు. అతడు మీకు ప్రియశిష్యు డట కదా! విశేషం: ఏకలవ్యుని విలువిద్యానైపుణ్యం అర్జునునికి ఆశ్చర్యజనకం, మాత్సర్యహేతువు కాగా, అతడు తాను ద్రోణాచార్య శిష్యుడి నన్న మాట పిడుగుపా ,ట్రైంది. కాగా, ఆచార్యుడు చెప్పినమాటకు, చేసిన పనికి ఎంత భేదం! అర్జునునిహృదయం తుకతుక లాడిపోయింది. అయినా అర్జునునివంటి సంస్కారసంపన్నుడు అంతటి గురుదేవుడిని ఏ మనగలడు? అట్లా అని ఏమీ అనకుండా ఎట్టా ఉండగలడు? అందుచేతనే 'అమిథ్యావచనా!' - అసత్యం కాని మాట కలవాడా! అని ఒక్కమాట అన్నాడు. ఆ మాటలోని ఎత్తిపొడుపు ఈటె పోటు వంటిది. కాగా, అలతి, అలతి పదాలతో అతి తీవ భావాలను ప్రకటించే నన్నయ పద్యాలలో ఇది ఒకటి.

ఆదిపర్వము - పంచమాశ్వాసము 515 నన్నయ సందర్బోచితంగా “అర్హవ్యక్తి' అనే శబ్దగుణాన్ని వాడి, అర్జునుని మనసులోని బాధను, అమర్దను, ఆసూయను వ్యక్తంచేసే శక్తి కల సర్వనామాలను, అవ్యయాలను, నిపాతాలను నిపుణంగా (ప్రయోగించి నాటకీయతను పోషించాడు. 'నాకంటె అధికుడు. మీకంటె అతిబలుడు అనటంలోనూ, 'మీక్షున్‌' ('ప్రియళిష్యుడు 'అటె' అనటంలోనూ గూఢమైన కోపంతోకూడిన అధిక్షేపం ఉన్నది. నిపాతాలనుసైతం కధాధ్వనికి వ్యంజకాలుగా వాడటం ఇక్కడి విశేషం. (సంపా.)

వ, అనినవినిద్రోణుం దదరిపడి 'వానిం జూతము ర'మ్మని యర్జునుం దోడ్కొని, యనవరతశరాసనాభ్యాసనిరతుం డయి యున్న యేకలవ్యుకడ కేంగిన, నెజింగి వాండు నెదురు పఅతెంచి ద్రోణునకు మొక్కి తన శరీరంబు సర్వస్వంబును నివేదించి, 'యేను మీ శిష్యుంద; మి మ్మారాధించి మీప్రసాదంబున నివ్విలువిద్యంగజచితి' నని కరంబులు మొగిచియున్నం జూచి, ద్రోణుం 'డట్లేని మాకు గురుదక్షిణ యి'మ్మనిన సంతసిల్లి వాండి ట్లనియె.241

(ప్రతిపదార్ధం: అనిన; విని; ద్రోణుండు; అదరిపడి; వానిన్‌: చూతము; రమ్ము; అని; అర్జునున్‌, తోడ్కొని; అనవరత,

శర+అసన+అభ్యాస, నిరతుండు+అయి= ఎడతెగని విలువిద్యయొక్క అభ్యాసంలో మిక్కిలి ఆసక్తి కలవాడై; ఉన్న; ఏకలవ్యు; కడకు;

ఎంగినన్‌= వెళ్లగా; ఎటీంగి=ఐ (వారి రాకను) తెలిసికొని; వాండున్‌= ఏకలవ్యుడు; ఎదురు, పజతెంచి= ఎదురుగా వచ్చి; (ద్రోణునకు;

(మొక్కి; తన, శరీరంబు; సర్వస్వంబును= మొత్తం సంపదను; నివేదించి= అర్చించి; ఏను; మీ, శిష్యుండ; మిమ్ము+ఆరాధించి=

సేవించి; మీ, ప్రసాదంబునన్‌= మీ అను([గ్రహం చేత; ఈ, విలువిద్యన్‌; కటచితిని=నేర్చుకొన్నాను; అని; కరంబులు; మొగిచి=

ముడిచి" ఉన్నన్‌; చూచి; ద్రోణుండు; అట్టు+ఏని= అలా అయినట్లయితే; గురుదక్షిణ; ఇము ఖై అనిన; సంతసిల్లి; వాడు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అనగా విని ద్రోణుడు అదిరిపడి అతడిని చూద్దాం రమ్మని అర్జునుడిని తీసికొని, నిరంతరం విలువిద్యను సాధన చేయటంలో మునిగి ఉన్న ఏకలవ్యునిదగ్గరకు వెళ్లాడు. వాళ్ళ రాకను ఏకలవ్యుడు తెలిసికొని, ఎదురు వచ్చి మ. (ద్రోణునికి నమస్కరించి, తన శరీరాన్ని, మొత్తం సంపదను ఆయనకు సమర్పించి, 'నేను మీ శిష్యుడిని మిమ్మల్ని సేవించి ఈ విలువిద్య నేర్చుకొన్నాను" అని చేతులు జోడించి నిలిచాడు. అతడిని చూచి (ద్రోణుడు 'అయితే వొ మ ం ఆబ్బ

నాకు గురుదక్షిణ ఇ” మ్మన్నాడు. అందుకు సంతోషించి ఏకలవ్యుడు ఇట్టా అన్నాడు.

క 'ఇది దేహం; బిది యర్థం; 1! బిది నా పరిజన సమూహ; మిన్నిటిలో నె య్యది మీ కిష్టము దానిన ।! ముద మొదవంగ విత్తు గొనుం దమోఘం' బనినన్‌. 242

ప్రతిపదార్థం: ఇది, దేహంబు, ఇది; అర్హంబు= ధనం; ఇది; నా, పరిజన, సమూహము= నా సేవకుల సమూహం; ఇన్నిటిలో న్‌;

ఎ+అది, మీకు; ఇష్టము; దానిన్‌+అ= దానినే; ముదము= సంతోషం; ఒదవంన్‌= కలిగేట్టుగా; ఇత్తున్‌; కొనుండు= తీసికొనండి; అమోఘంబుజ ఇది తప్పనిది - అంటే దీనికి తిరుగులేదు; అనినన్‌= అని అనగానే.

తాత్పర్యం: “ఇది నా దేహం, ఇది నా ధనం, ఇది నా సేవక సమూహం. వీటిలో మీ కేది ఇష్టమో దానిని తప్పకుండా

సంతోషంగా ఇస్తాను. తీసికొనండి. దీనికి తిరుగులేదు' అని అనగా.

విశేషం: అంతటిగురువు తానై వచ్చి గురుదక్షిణ కోరటమే కొండంత భాగ్యంగా భావించి, ఉన్న దంతా ఆయన ముందుంచిన

ఏకలవ్యుని ఉన్నతోన్నత గురుభక్తికి ఈపద్యం అద్దం వంటిది. అతనిమాటలలో సర్వార్పణభావంతోడి ముగ్రభక్తి మూర్తికట్టింది.

క, _ 'నెమ్మిని నీ దక్షిణహ । స్తమ్మున పెనున్రేలు దునిమి దక్షిణ యి; మ్మి ష్ట్ర మ్మిది నా'కనపుడు విన । యమ్మున వాం డిచ్చె దాని నాచార్యునకున్‌, 243

516 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్హం: నెమ్మిని= ప్రీతితో; నీ, దక్షిణ, హస్తమ్మున, పెను, (వ్రేలు= నీ కుడిచేతి బొటన (వ్రేలిని; తునిమి= కోసి? దక్షిణ ఇమ్ము; ఇది; నాకు; ఇష్టమ్ము; అనవుడు= అని అనగా; వాడు; వినయమ్మున, దానిన్‌: ఆచార్యునకున్‌ ఇచ్చె తాత్పర్యం: 'నీ కుడిచేతి బొటనవేలిని కోసి ప్రీతితో నాకు గురుదక్షిణగా ఇమ్ము. అది నా కిష్టం” అని ద్రోణు డనగానే ఏకలవ్యుడు వినయంతో దానిని ఆచార్యునికి ఇచ్చాడు. తే. దక్షిణాంగుష్ట మిచ్చిన దానం జేసి, బాణ సంధాన లాఘవ భంగ మయిన నెబుకు విలువిద్య కలిమికి హీనుం డయ్యె4 : బార్జునకును మనోరుజ పాసె నంత. 244 ప్రతిపదార్థం: దక్షిణ+అంగుష్టము= కుడిచేతి బొటనవేలిని; ఇచ్చిన; దానన్‌+చేసి=ఐ ఇచ్చినందువలన; బాణ, సంధాన, లాఘవ, భంగము బాణాన్ని కూర్చటంలోని నేర్చుకు లోపం; అయినన్‌; ఎజుక; విలువిద్య, కలిమికి= ధనుర్విద్య అనే సంపదకు; హీనుండు= లేనివాడు; అయ్యె; పొర్టునకును= అర్జునునికి; మనో, రుజజ మానసిక దుఃఖం; పొసెన్‌= తొలగింది; అంత, తాత్పర్యం: కుడిచేతిబొటన'వ్రేలిని ఇవ్వటంచేత బాణాన్ని కూర్చటంలో నేర్పు లోపించి ఏకలవ్యుడు విలువిద్యా సంపద కోల్పోయాడు. దానివలన అర్జునునికి దుఃఖం తొలగింది. క. “విలువిద్య నొరులు నీ క । గ్గలముగ లేకుండ నిన్ను. గఅపుదు' నని మున్‌ బలరిపు సుతునకుం బలికిన : సలు కప్పుడు గురుండు సేసె. బరమార్థముగన్‌. 245 ప్రతిపదార్థం: విలువిద్యన్‌; ఒరులు= ఇతరులు; నీకు, అగ్గలముగ= అధికంగా; లేకుండ; నిన్నున్‌; కజపుదున్‌= నేర్పుతాను; అని, మున్‌= పూర్వం; బల, రివు, సుతునకున్‌= బలుడనే రాక్షసుడికి శత్రువైన ఇంద్రుని కుమారునికి? పలికిన, పలుకు= చెప్పిన మాటను; అప్పుడు; గురుండు= ద్రోణుడు, పరమార్ధముగన్‌= సత్యంగా; చేసెన్‌. తాత్పర్యం: “విలువిద్యలో ఇతరులు నీకంటె అధికులు కాకుండా నీకు నేర్పుతా' నని, ఇదివరకు ద్రోణుడు అర్జునుని కిచ్చిన మాటను అప్పుడు నిజం చేశాడు. మత్తకోకిల, భూపనందను లివ్విధంబున భూరి శస్తమహాస్త్రవి ద్యోసదేశపరిగ్రహస్థితి నున్న నందజఖయందు వి ద్యోసదేశము దుల్య మైనను నుత్తమోత్తము. డయ్యె వి ద్యాపరిశ్రమకౌశలంబున దండితారి నరుం డిలన్‌. 246 (ప్రతిపదార్థం: భూప, నందనులు= రాకుమారులు; ఈ+విధంబున; భూరి, శస్త్ర మహా+అ(స్త్ర, విద్యా+ఉపదేశ, పరిగ్రహ, స్థితిన్‌= గొప్ప ఆయుధ విద్యయొక్క, గొప్ప అస్త్ర విద్య యొక్క బోధను (గ్రహించటం అనే స్థితిలో: ఉన్నన్‌; ఆందజ, అందు; విద్యా+ఉపదేశము= విద్యాబో ధన; తుల్యము= సమానం; అయినను; దండిత+అరి= శిక్షించబడిన శత్రువులు గలవాడు; నరుండు= అర్జునుడు; విద్యా, పరిశ్రమ, కౌళశలంబున= విద్యయొక్క అభ్యాసవు నేర్పుచేత; ఇలన్‌= భూమిలో; ఉత్తమ+ఉత్తముండు= ్రేష్టులలో శ్రేష్టుడు; అయ్యెన్‌. తాత్పర్యం: రాజకుమారులు (ద్రోణునివలన గొప్ప శస్తాస్త విద్యాబోధనను పొందటంలో అంతా సమానమే అయినా, అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్టు డయ్యాడు. విశేషం: మత్తకోకిలపాదంలో ర,స,జ,జ,భ,ర- అనే గణాలు వరుసగా ఉంటాయి. 11వ అక్షరం యతిస్టానం. ప్రాసనియమం ఉన్నది.

ఆదిపర్వము - పంచమాశ్వాసము 517 క అనిలాత్మజు బలమును న | ర్హును కార్ముక కౌశలంబు శూరగుణంబుల్‌ మనమున సహింపనోపక । వనరుచు ధృతరాష్త్రసుతులు వందిరి తమలోన్‌. 247 ప్రతిపదార్థం: అనిల+ఆత్మజు, బలమును= వాయుపు(త్రు డైన భీముని బలాన్ని; అర్జును, కార్ముక, కౌశలంబు= అర్జునుని విలువిద్యా నైపుణ్యం; శూర, గుణంబుల్‌= వీరలక్షణాలు; మనసున= మనసులో; సహింపన్‌+ఓపక= ఓర్వలేక; ధృతరాష్ట్ర సుతులు= కౌరవులు; వనరుచు= బాధపడుతూ; తమలోన్‌, వందిరి= దుఃఖించారు. తాత్పర్యం: భీమునిబలాన్ని, అర్జునుని విలువిద్యానైపుణ్యాన్ని, వీరలక్షణాలను చూచి సహించలేక కౌరవులు తమలో తాము ఎంతో దుఃఖాన్ని పొందారు. దోణు( డస్తవిద్యం దనశిష్యుల( బరీక్షించుట (సం.1-123-15) (6 ్ట గ్‌ వ అ క్కునూరుల ధను ర్విద్యా కౌశలం బెబుంగ వేండి యొక్కనాండు ద్రోణుండు కృత్రిమం బయిన భాసం బను పక్షి నొక్కవృక్ష శాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి, దాని నందజకుం జూపి “మీమీ ధనువులు బాణంబులు సంధించి నొ పంచిన యప్పడ యిప్పక్షి తలం దెగ నేయుం; డే నొకళ్ళొకళ్ళన పంచెద' నని ముందఖ ధర్మనందనుం బిలిచి 'యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు" మనిన నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్ననయ్యుధిష్టిరునకు ద్రోణుం డిట్లనియె. 248 ప్రతిపదార్థం: ఆ+కుమారుల; ధనుర్విద్యా, కౌళశలంబు= విలువిద్యలోని నేర్పు; ఎజటుంగ= తెలుసుకొనా లని; వేడి= కోరి; ఒక్కనాండు: 'బ్రోణుండు; కృత్రిమంబు+అయిన= కల్పించబడిన దైన; భాసంబు= (గ్రద్ద; అను; పక్షిన్‌: ఒక్క; వృక్ష శాఖా+అ[గ్రంబున= చెట్టు కొమ్మ చివరిలో; లక్ష్యంబుగా= గురిగా; రచియించి= కూర్చి; దానిన్‌; అందణకున్‌: చూపి, మీ; మీ; ధనువుల; బాణంబులు; సంధించి= ఎక్కుపెట్టి; నా, పంచిన, అప్పుడు+అజ= నేను ఆజ్ఞాపించిన సమయంలో; ఈ, పక్షి తలన్‌; తెగన్‌= తెగేట్టుగా; ఏయుండు= కొట్టండి; ఏన్‌= నేను, ఒకళ్లు+ఒకళ్ళన= ఒక్కొక్కరినీ; పంచెదన్‌= ఆజ్ఞాపిస్తాను; అని; ముందజ; ధర్మనందనున్‌: పిలిచి; ఈ, వృక్ష శాఖా+అగ్రంబునన్‌= ఈ చెట్టు కొమ్మ కొనలో; ఉన్న; పక్షిన్‌; ఇమ్ముగాన్‌= తగిన విధంగా; ఈక్షించి= చూచి, మత్‌+వచన+అనంతరంబున= నా మాట తర్వాత; శర, మోక్షణంబు= బాణాన్ని వదలటం, చేయుము; అనినన్‌; అతండును; వల్లై అని= సరే అని; గురు, వచనంబుజ= గురువుగారి మాటను; చేసి, ఉన్నన్‌; ఆ+యుధిష్టరునకుజ ఆ ధర్మరాజుతో; ద్రోణుండు; ఇట్టు+అనియె. తాత్సర్యం: ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొన గోరి ఒకనాడు (ద్రోణుడు, భాస మనే ఒక పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి, దానిని అందరికీ చూపి, నేను చెప్పినపుడు మీమీ ధనువులు ఎక్కుపెట్టి ఆ పక్షి తలను తెగగొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను' అని ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము" అనగా, అతడు సరే అని గురువుమాట ప్రకారం సిద్దంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు. తే. 'వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము । దెల్లముగ6 జూచితే మహీవల్లభుండ! యనిన నిమ్ముగం జూచితి ననిన, వెండి । యును గురుండు ధర్మజున కిట్టు లనియె. బ్రీతి. 249

518 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్హం: మహీ, వల్లభుండ= ఓ రాజా! వృక్ష, శాఖా+అ([గ్రమునన్‌= చెట్టు కొమ్మ చివరన; ఉన్న; పక్షి, శిరము పక్షితల; తెల్లముగన్‌= స్పష్టంగా: చూచితే= చూచావా? అనినన్‌; ఇమ్ముగా= చక్కగా; చూచితిని; అనిన; వెండియును:; గురుండు= రోణుడు; ప్రీతిన్‌; ధర్మరాజునకు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌. తాత్సర్యం: ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా" అని అడుగగా; చక్కగా చూచా నని అతడు చెప్పగా, మరల (ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. క. “జననుత! యా న్రూనిని న । న్నును మజి నీ బ్రాత్భ్మవరులనుం జూచితె నీ? వనవుడుం జూచితి నన్నిటి ; ననఘా! వృక్షమున నున్న యవ్విహగముతోన్‌. 250 ప్రతిపదార్హం: జన, నుత= జనులచేత పొగడబడే వాడా! ఓ ధర్మరాజా!; ఆ, (మ్రానిని; నన్నును; మజి; నీ భ్రాతృ, వరులనున్‌= నీయొక్క ఉత్తము లైన తమ్ములను; నీవు; చూచితె; అనవుడు= అని అనగా; అనఘా= పాపంలేనివాడా! ఓ ద్రోణాచార్యా!; వృక్షమునన్‌: ఉన్న; ఆ+విహగముతోన్‌= ఆ పక్షితోసహా; అన్నిటిన్‌; చూచితిన్‌. తాత్సర్యం: 'జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్తని చూశావా?” అని ద్రోణుడు అడుగగానే, పుణ్యాత్మా! చెట్టుమీద ఉన్న ఆ పక్షితోపాటు అన్నిటినీ చూచా'నని ధర్మరాజు అన్నాడు. వ. _ అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి 'నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు పాయు' మని యివ్విధంబున జ రే న జి దుర్యోధనాదు లైన ధార్తరాస్తులను భీమసేన నకుల సహదేవులను నానాదేశాగతు లైన రాజపుత్రులను గ్రనుంబున నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన, నందజి నిందించి, పురందరనందనుం బిలిచి వారి నడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్డునుం డి ట్లనియె. 251 ప్రతిపదార్థం: అనిన; విని; ద్రోణుండు; ధర్మజున్‌; పదరి= నిందించి; నీ, దృష్టి చెదరె; నీవు; దీనిన్‌. ఏయన్‌+ఓపవు= కొట్టలేవు; పాయుము= తప్పుకో; అని; ఈ+విధంబున; దుర్యోధన+ఆదులు+ఐన= దుర్యోధనుడు మొ న వారైన; ధార్తరాష్ట్రులను; నానా, దేశశఆగతులు+అయినజ= వివిధదేశాలనుండి వచ్చిన వా రైన; రాజ, పుత్రులను; (క్రమంబునన్‌= వరుసగా; అడిగిన; వారలు; ధర్మనందను, చెప్పినట్టు= ధర్మరాజు చెప్పినట్లే! చెప్పిన; అందజన్‌; నిందించి; పురందర, నందనున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడిని; పిలిచి; వారిన్‌ అడిగిన, అట్టు+అ; అడిగినన్‌; ఆచార్యునకున్‌; అర్జునుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అనగా విని ద్రోణుడు ధర్మరాజును నిందించి 'నీ దృష్టి చెదిరింది. నీవు దీనిని కొట్టలేవు. (ప్రక్కకు తప్పుకొమ్ము' అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమసేన నకుల సహదేవులను, వివిధదేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా, వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. (ద్రోణుడు అందరినీ నిందించి తర్వాత అర్జునుడిని పిలిచి వాళ్ళను అడిగినట్టే అడుగగా అత డిట్లా అన్నాడు. క. _ 'పక్షిశిరంబు దిరంబుగ । నీక్షించితి; నొండు గాన నెద్దియు' ననినన్‌ లక్షించి యేయు మని సూ ।; క్హేక్షణు గ్రోణుండు పనిచె నింద్రతనూజున్‌, 252 ప్రతిపదార్థం: పక్షి శిరంబు= పక్షితలను; తిరంబుగన్‌= చక్కగ; ఈక్షించితిన్‌= చూచాను; ఒండు= ఇతరం; ఎద్దియున్‌= ఏదీ కూడా; కానన్‌= చూడటం లేదు; అనిన్‌: లక్షించి= గురిపెట్టి; ఏయుము= కొట్టుము; అని; ద్రోణుండు; సూక్ష్మ+ఈక్షణున్‌= సునిశిత మైన దృష్టి గల; ఇంద్రతనూజున్‌= అర్జునుని; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు.

ఆదిసర్వము - పంచమాశ్వాసము ర్‌ం తాత్పర్యం: పక్షితలను చక్కగా చూచాను, ఇంకేదీ నాకు కనిపించటం లేదు” అని అర్జునుడు అనగా, (ద్రాణుడు “గురి చూచి కొట్టుము' అని సూక్ష్మదృష్టి గల అతనిని ఆజ్ఞాపించాడు. క. గురువచనానంతరమున : నరు దప్పుడు శరవిమోక్షణము సేయుండు. జె ఛ్రైరం బక్షిశిరము దెగి త। ద్ధరణీరుహశాఖనుండి ఛారుణి. బడియెన్‌. 253 ప్రచిపదార్దం: గురు, వచన+అనంతరమునన్‌= గురువు మాట తర్వాత; నరుండు= అర్జునుడు; అప్పుడు; శర, మోన్షణము= బాణాన్ని విడవటం; చేయుండున్‌= చేయగా; చెచ్చెరన్‌= తక్షణమే; పక్షి; శిరము పక్షితల; తెగి; తత్‌*ధరణీ, రుహ, శాఖ నుండిజ= ఆ చెట్టు కొమ్మనుండి; ధారుణిన్‌= భూమిమీద; పడియెన్‌. తాత్పర్యం: గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు, ఆ పక్షితల తత్‌క్షణమే తెగి చెట్టుకొమ్మనుండి నేలమీద పడింది. వ. ఇట్లశ్రమంబునం గృత్రిమ పక్షి తలం దెగనేసిన యర్జును నచలిత దృష్టికి లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె; నంత. 254 ప్రతిపదార్థం: ఇట్టు; అ(శ్రమంబునన్‌= సులువుగా; కృత్రిమ, పక్షి తలన్‌= కల్పించబడిన పక్షియొక్కతలను, తెగన్‌; ఏసిన= కొట్టిన అర్జును; అచలిత, దృష్టికి= చెదిరిపోని దృష్టికి; లక్ష్య, వేధిత్సంబునకు= గురిని కొట్టగలిగినందుకు; మెచ్చి; (బ్రోణుండు; అతనికి; ధనుర్వేద, రహస్యంబులు; ఉపదేశించెన్‌; అంతజ తర్వాత, తొత్పర్యం: ఈ విధంగా సులువుగా ఆ కల్పిత పక్షి తలను తెగగొట్టిన అర్జునుని నిశ్చల దృష్టికి, గురిని కొట్టే సామర్ధ్యానికి, ద్రోణుడు మెచ్చి అతనికి విలువిద్యా రహస్యాలు ఉపదేశించాడు. తర్వాత. అర్జునుండు ద్రోణుని మొసలినుండి విడిపించుట (సం.1-123-68) క. _ మానుగ రాజకునూరుల । తో నొక్కట నొక్కనాండు ద్రోణుండు గంగా స్నానార్ధ మరిగి యందు మ। హా నియమస్థుం వు నాడుచునున్నన్‌. 255 ప్రతిపదార్థం: మానుగ= ఒప్పుగ; రాజ, కుమారులతోన్‌; ఒక్కటన్‌= ఒకటిగా; ఒక్కనాండు; ద్రోణుండు; గంగా; స్నాన+అర్థము= గంగానదిలో స్నానం చేయటంకొరకు; అరిగి= వెళ్లి; అందు; మహా, నియమస్థుండు+అయి= గొప్పనియమం కలిగినవా డై; నీళ్లన్‌, అడుచున్‌= స్నానం చేస్తూ; ఉన్నన్‌= ఉండగా, (్‌ తాత్పర్యం: ఒకనాడు రాకుమారులందరితో కలిసి ద్రోణుడు గంగాస్నానం చేయటానికై వెళ్లి, ఎంతోనిష్టతో నీటిలో అ= ర స్నానం చేస్తుండగా. క. _ వెళఅచజవన నీరిలో నొ ; క్కెజగా నొక మొసలి చూడ్మికి నగోచర మై పఅతెంచి కుంభసంభవు । చిఖుదొడ వడి. బట్టికొనియె శిష్యులు బెదరన్‌, 256 ప్రతిపదార్థం: వెజచణవ= భయపడేట్టుగా; నీరిలోన్‌ ఒక్కెజగాన్‌= భయంకరంగా; ఒక; మొసలి; చూడ్కికిన్‌= చూడటానికి; అగోచరము+ఐ= కనిపించనిదై; పజతెంచి= వచ్చి; కుంభసంభవు, చిటుతొడజ= (ద్రోణునియొక్క పిక్కను; శిష్యులు; బెదరన్‌; వడిన్‌= వేగంగా' పట్టికొనియె.

520 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: నీళ్ళల్లో భయంకరంగా ఒక మొసలి కంటికి కనపడకుండా వచ్చి, శిష్యులంతా బెదిరేటట్టుగా (ద్రోణాచార్యుని పిక్కను వెంటనే పట్టుకొన్నది. క. దాని విడిపింప ద్రోణుండు , దా నపుడు సమర్థుం డయ్యు. దదయక పనిచెన్‌ 'వీని విడిపింపుం డని నృప । సూనుల శరసజ్యచాపశోభితకరులన్‌, 257 ప్రతిపదార్థం: దాని= ఆ మొసలిని; విడిపింప; బోణుండు; తాన్‌; అపుడు; సమర్భ్హుడు+అయ్యున్‌; తడయక= ఆలస్యం చేయకుండా; దీని; విడిపింపుండు; అని; శరు సజ్య, చాప, శోభిత, కరులన్‌= బాణాలచేత, అల్లెత్రాళ్లచేత కూడిన ధనుస్సులతో ప్రకాశిస్తున్న చేతులు కలవారిని; నృప, సూనుల= రాకుమారులను; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. తాత్పర్యం: ఆ మొసలిని విడిపించటానికి ద్రోణు డపుడు తాను సమర్దు డై కూడా ఆలస్యం లేకుండా దీనిని విడిపించం డని ధనుర్పాణాలు చేత ధరించి ఉన్న రాకుమారులను ఆజ్ఞాపించాడు. శా; దానిన్‌ నేరక యందజున్‌ వివశు లై తా రున్న నన్నీరిలో గానం గాని శరీరముం గల మహోగ్ర గ్రాహమున్‌ గోత్ర భి త్పూనుం డేను శరంబులన్‌ విపుల తేజుం దేసి శక్తిన్‌ మహా సేన ప్రఖ్యుయ ద్రోణుజింఘ విడిపించెన్‌ విక్రమం బొప్పంగన్‌. 258 (ప్రతిపదార్థం: దానిన్‌= ఆ మొసలిని విడిపించటం; నేరక= చేతకాక; అందటున్‌; వివశులు+ఐ= మ్రైమరచిన వాళ్ళయి; తారు= తాము; ఉన్నన్‌, ఆ+నీరిలోన్‌; కానన్‌+కాని= చూడటానికి సాధ్యపడని; శరీరమున్‌+కల; మహా+శఉ(గ్ర, (గ్రాహమున్‌= మిక్కిలి భయంకరం అయిన మొసలిని; విపుల, తేజుండు= ఎంతో పరాక్రమం కలవాడు; శక్తిన్‌= బలంలో; మహాసేన, ప్రఖ్యుండు= కుమారస్వామితో సమానుడు; గోత్ర, భిత్‌+సూనుండు= కొండలను చీల్చిన దేవేంద్రునియొక్క కుమారుడు; ఏను; శరంబులన్‌= అయిదు బాణాలతో; ఏసి= కొట్టి; విర్రమంబు= పరాక్రమం; ఒప్పంగన్‌= 'ప్రకాశించేటట్టు; (ద్రోణు, జంఘ= (రోణాచార్యునియొక్క పిక్కను; విడిపించెన్‌. తాత్పర్యం: ఆ రాకుమూరులంతా మొసలిని విడిపించటం చేతకాక దిక్కుతెలియనిస్టితిలో ఉండగా, మహాపరాక్రమశళాలి, శక్తిలో కుమారస్వామివంటివాడు, పర్వతాల రెక్కలు నరికిన దేవేంద్రునిపుత్రుడు అయిన అర్జునుడు, నీటిలో కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని అయిదు బాణాలతో కొట్టి ద్రోణాచార్యుని పిక్కను విడిపించాడు. వ అమ్మహోగ్రగ్రాహంబు పార్ధబాణపంచక విభిన్నదేహం బయి పంచత్వంబుంబొందినం జూచి, ద్రోణుండర్జును ధనుః కౌశలంబునకుందనయం దతిస్నేహంబునకు మెచ్చి, వీనిచే ద్రుపదుండు బంధుసహెతంబు పరాజితుం డగుననితనమనంబున సంతోషించి. వానికిననేక దివ్యబాణంబు లిచ్చె నని యర్జునుకొండుకనాంటి పరాక్రమ గుణసంపదలు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పె నని. 259 ప్రతిపదార్థం: ఆ+మహా+ఉ(గ్ర, (గ్రాహంబుజ ఆ గొప్ప భయంకరమయిన మొసలి; పార్ధ, బాణ, పంచక, విభిన్న, దేహంబు+అయి= అర్జ్హునునిబాణాలు అయిదింటిచేత చీల్చబడిన శరీరం కలదై; పంచత్వంబున్‌= మరణాన్ని; పొందినన్‌:, చూచి; ద్రోణుండు; అర్జును, ధను:+కౌశలంబునకున్‌= అర్జునుని విలువిద్యానైపుణ్యానికి; తనయందు, అతి, 'స్నేహంబునకు; మెచ్చి; వీనిచే;[ద్రుపదుండు; బంధు, సహితంబు= బంధువులతోసహా; పరాజితుండు= ఓడగొట్టబడినవాడు; అగున్‌; అని, తన, మనంబున, సంతోషించి; వానికిన్‌= ఆ అర్జునునికి; అనేక, దివ్య, బాణంబులుజ అనేక దేవతాసంబంధాలైన బాణాలు; ఇచ్చెన్‌; అని; అర్జును, కొండుకనాంటి= అర్జునుని

ఆదిపర్వము - సంచనూశ్వాసము 521 యొక్క చిన్ననాటి; పరాక్రమ, గుణ, సంపదలు= పరాక్రమంయొక్క, గుణాలయొక్క గొప్పలు, వైశంపాయనుండు; జనమేజయునకున్‌; చెప్పెన్‌; అని. తాత్సర్యం: 'ఆ అతిభయంకరమయిన మొసలి అర్జునుని అయిదుబాణాలచేత శరీరం చీలి మరణించింది. అది చూచి ద్రోణుడు అర్జునునివిలువిద్యానైపుణ్యానికి, తనపట్ల గల ప్రేమకు మెచ్చి, అతనిచేత ద్రుపదుడు బంధువులతో సహా ఓడిపోగల' డని సంతోషించి అనేక దివ్యబాణాలు అతని కిచ్చాడు - అని అర్జునుని చిన్ననాటి పరాక్రమ గుణవిశేషాలు వైశంపాయనుడు జనమేజయునికి చెప్పెనని. విశేషం: ద్రోణుడు ధృతరాష్ట్ర పాండురాజకుమారులకు విలువిద్య నేర్చటంలో కొంత స్వార్దం ఉన్నది. అది ద్రుపదుడిని తన శిష్యులచేత అవమానింప చేయటం. భీష్ముడు తన మనుమ లందరినీ శిష్యులుగా చేసిన మరుక్షణమే గురువుగా తన కోర్కెను తీర్చేవా శ్చెనరని వాళ్ళని ప్రశ్నించాడు. అర్జును డొక్కడే అనుకూలంగా స్పందించాడు. మొసలిని చంపి ద్రోణుడిని కాపాడటంతో విలువిద్యాభ్యాసం పూర్తి అయినట్టు వస్తుద్వని. అర్జునుడు ఏకైక వీరుడుగా ప్రకాశించాడు. (ద్రోణునికోర్కె తీరింది. ద్రుపదుడిని సపరివారంగా ఓడించ గలిగిన ఒక మహావీరుడిని తయారు చేయగలిగినందుకు ద్రోణుడు సంతోషించాడు. ఇది భావికధకు నాంది. పూర్వాపరసంబంధం కల కథాకధనళిల్పం. (సంపా)

ఆశ్వాసాంతము

క, _ వ్యసనవివర్దిత! మాన । వ్యసగోత్రపవిత్ర! విష్ణువర్థన నృప! స

ప్తసముద్రముద్రితాఖిల ; వసుధాజనగీతకీర్తి! వాసవమూర్తీ!. 260 ప్రతిపదార్హం: వ్యసన, వివర్టిత= వ్యసనాలచేత విడవబడినవాడా!; మానవ్యస, గోత్ర, పవిత్ర= మానవ్యసగో(త్రంలో పవిత్ర మైన వాడా! విష్ణు వర్షన, నృప= విష్ణువర్హన మహారాజు; సప్త సము(ద్ర, ముద్రిత+అఖిల, వసుధా, జన, గీత, కీర్తి= ఏడు సముద్రాలచేత గుర్తు వేయబడినటువంటి సమస్త భూప్రజలచేత పొగడబడిన కీర్తి కలవాడా! వానవ, మూర్తీ= ఇంద్రునివంటి రూపం కలవాడా!

ల ఓ అగ అణి అడ్యలటి

తాత్పర్యం: ఏ వ్యసనం లేనివాడా! మానవ్యస గోత్రంలో పవిత్రుడ వైనవాడా! విష్ణువర్షన మహారాజా! సప్త సము(ద్రాలచేత ముద్ర వేయబడిన సమస్తభూమండల(ప్రజలచేత పొగడబడిన కీర్తి కలవాడా! ఇం(ద్రునివంటి రూపం కలవాడా! విశేషం: రాజరాజనరేంద్రుడు మొదట వైయాషఘ్ర పాద గోత్రుడు. విష్ణువర్దనుని మానవ్యసగో(త్రుడైన హరిత పుత్రుడు పెంచుకొన్నందువలన మానవ్యసగోత్రు డైనాడు. వనమయూరం.

రాజకులశేఖర! పరంతప! వివేక । బ్రాజిత! జగద్వలయ భాసుర సముద్య

త్తేజ! నిరవద్య! యువతీమదన! వీరో ; గ్రాజి విజయా! త్రిభువనాంకుశ! నరేంద్రా. 261 ప్రతిపదార్థం: రాజ, కుల, శేఖరజ= రాజవంశమందు లేదా చంద్రవంశమందు ్రేష్టుడయిన వాడా!, పరంతప= శత్రువులను నాశనం చేసేవాడా! వివేక, (భ్రాజిత= విచక్షణజ్ఞానంచేత ప్రకాశింపచేయబడినవాడా!; జగత్‌+వలయ, భాసుర, సముద్యత్‌, తేజ= భూమండలంలో (ప్రకాశిస్తూ పెరుగుతున్న కాంతి కలవాడా! నిరవద్య= దోషం లేనివాడా!; యువతీ, మదన= యౌవనంలో ఉన్న స్రీలకు మన్మథుడైనవాడా!; వీర+ఉ(గ్ర+ఆబి, విజయా= వీరులతోడి భయంకరమయిన యుద్దంలో గెలుపు కలిగినవాడా!; 'త్రిభువన+అంకుశ= మూడులోకాలకు అంకుశం వంటివాడా! (ఇది రాజరాజు బిరుదం); నర+ఇం!ద్రా= మానవులకు (ప్రభు వైనవాడా- ఓ రాజరాజనరేం(ద్రా!

522 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: రాజవంశానికి లేదా చంద్రవంశానికి అలంకార మైన వాడా!, శత్రువులను నాశనం చేసేవాడా! వివేకం చేత ప్రకాశించేవాడా!, భూమండలంలో (ప్రకాశిస్తూ వృద్ది పొందుతున్న తేజస్సు కలవాడా!, యువతులకు మన శధుని వంటివాడా* వీరులతో భయంకర యుద్దంలో విజయం కలవాడా!, (త్రిభువనాంకుశ అనే బిరుదం కలవాడా! రాజరాజనరేంద్రా! విశేషం: ఇవి కూడా రాజరాజనరేంద్రుని గుణవిశేషాలు. ఆశ్వాసాంతంలో కృతివతి సంబోధనలు. వనమయూరపాదానికి భ, జ స్క్మన, గగ- అనే గణాలు వరుసగా ఉంటాయి. 9వ అక్షరం యతిస్తానం. ప్రాసనియతి ఉన్నది. గద్యము. ఇది సకల సుకవి జన వినుత నన్న్మయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ధృతరాష్ట్ర పాండురాజుల వివాహంబును, బాండురాజదిగ్విజయంబును, బాండవ ధార్తరాష్ట సంభవంబును, బాండు రాజునిర్యాణంబును, గృపద్రోణజన్మకథనంబును, గుమారాస్త్రవిద్యాగ్రహణంబును నన్నది పంచమాశ్వాసము. 262 తాత్పర్యం: ఇది, సకల సత్కవుల ప్రశంసలందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీమహాభారతంలో- ఆదిపర్వంలో- ధృతరాష్ట్ర పాండురాజుల వివాహం, పాండురాజు దిగ్విజయం, పాండవధార్తరా(ష్టుల జననం, పాండురాజు మరణం, కృపాచార్య (ద్రోణాచార్యుల పుట్టుకలను గూర్చి చెప్పటం, కురుకుమారులు అస్త్రవిద్యను అభ్యసించటం - అనే కథార్జాలు కల ఐదవ ఆశ్వాసం. ఆదిపర్వంలో పంచమాశ్వాసం సమాప్తం శతళమె దపా

శ్రీరస్తు మో శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము - షవ్రాశ్వాసము

శ్రీ జయవిభాసి! వినమ ; ద్రాజన్య కిరీటమణి విరాజిత పాదాం

భోజ! భువనైకసుందర | రాజాన్వయతిలక! రాజరాజనరేంద్రా! శ ప్రతిపదార్థం: రాజరాజనరేంద్రా!; శ్రీ= సంపదచేత; జయ= జయంచేత; విభాసి= (ప్రకాశించేవాడా; వినమత్‌+రాజన్య, కిరీట, మణి, విరాజిత, పాద+అంభోజ= వంగి నమస్కరిస్తున్న రాజులయొక్క కిరీటాలలో మణులవలన మిక్కిలిప్రకాశిస్తున్న పద్మాలవంటి పాదాలు గలవాడా!; భువన+ఏక. సుందర= లోకంలో నీకు నీవే సాటి అయిన అందగాడా!; రాజ+అన్సయ, తిలక= చంద్రవంశంలో (శ్రేష్టుడ వైనవాడా!

తాత్పర్యం: సంపదతో, విజయంతో వెలుగొందుతూ, వంగి నమస్కరిస్తున్న రాజుల కిరీటాలలోని మణుల

కాంతుల వలన ఎంతోప్రకాళించే పాదపద్మాలు కలిగి, లోకమంతటికీ అందగాడి వై, చం(ద్రవంశశ్రేష్టుడ వైన ఓ

రాజరాజనరేం(ద్రా!

విశేషం: ఆశ్యాసారంభ పద్యాన్ని శ్రీకారంతో (ప్రారంభించి, కృతిపతి గుణ విశేషాలు కొనియాడుతూ అతడిని సంబోధించి, కధ

మొదలుపెట్టటం, నన్నయ ఏర్పరచిన సంప్రదాయం. తర్వాతి తెలుగు కవులు చాలా మంది దీన్ని పాటించటం జరిగింది.

వ. అ క్కృథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె: నట్లు కృతాస్త్రశ స్తులయిన రాజకుమారుల విధ్యాకౌశలంబు వ్యాస గాంగేయ విదుర కృప శల్య శకుని సోమదత్తా దుల సమక్షంబునం జూప సమకట్టి యొక్కనాండు ద్రోణుండు ధృతర్యాష్తు కి ట్లనియె. 2

(ప్రతిపదార్థం: ఆ+కధకుండు= కధను చెప్పుతున్న ఆతడు- రౌమహర్షణి; శౌనక+ఆది, మహామునులకున్‌= శౌనకుడు మొదలయిన గొప్ప బుషులకు; చెప్పెన్‌; అట్టు= ఆ విధంగా; కృత+అస్త్ర, శస్తులు+అయిన= చేయబడిన (అంటే నేర్పబడిన) అస్త్రాలు, శస్తాలు కలవా రైన; రాజకుమారుల; విద్యా, కౌశలంబు= విద్యలోని నేర్పు; వ్యాస, గాంగేయ, విదుర, కృప, శల్య, శకుని, సోమదత్త+ఆదుల= వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు; శకుని, సోమదత్తుడు మొదలైన వాళ్ళయొక్క: సమక్షంబునన్‌= ఎదుట; చూప= చూపటానికి; సమకట్టి= పూనుకొని; ఒక్కనాండు= ఒక రోజు; ద్రోణుండు; ధృతరాహునకు; ఇట్టు+అనియె= ఈ విధంగా చెప్పాడు.

తాత్పర్యం; శౌనకుడు మొదలైన మహామునులకు మహాభారత కధను చెపుతున్న రౌమహర్షణి - 'ఆ విధంగా

శస్తాస్తవిద్యలు నేర్చుకొన్న కురు పాండవ రాకుమారుల విద్యా నైపుణ్యాన్ని- వ్యాసుడు, భీష్ముడు, విదురుడు,

కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైనపెద్దల ముందు (ప్రదర్శింపచేయాలనుకొన్న (ద్రోణాచార్యుడు- ధృతరాష్ష్రునితో ఇట్లా అన్నా' డని మళ్ళీ కధను (ప్రారంభించి చెప్పాడు.

52 శ్రీమదాంధ్ర మహాభారతము కుమారాస్త్రవిద్యాసందర్భనము (సం.1-124-1)

క. _ ఘోరాస్త్ర శస్త్ర విద్యల: నారూఢత మిగుల నిపుణు లైరి కుమారుల్‌ మీరలు వీరల విద్యా; పారము సను టెలటుగవలయు భవదీయ సభన్‌. 3

ప్రతిపదార్థం: కుమారుల్‌ (కౌరవులు, పాండవులు); ఘోర+అస్త్ర శస్త్ర విద్యలన్‌= భయంకరా లైన అస్త శస్త్ర విద్యలలో"

ఆరూఢతఃజ మీదికి ఎదుగుటచేత; మిగులజ= మిక్కిలి; నిపుణులు+ఐరి= నేర్పరు లయ్యారు; మీరలు= మీరు; భవదీయ సభన్‌= మీయొక్కసభలో; వీరల, విద్యా, పారము+చనుట= వీళ్ళయొక్క విద్యయొక్క ఆవలిఒడ్డును చేరటాన్ని - అంటే వీళ్ళు శస్తాస్త విద్య నంతటినీ నేర్చుకొని సాధించిన నైపుణ్యాన్ని; ఎణుంగవలయు=తెలిసికొనాలి.

తాత్సర్యం: భయంకరాలైన శస్తాస్త విద్యలను సమ(గ్రంగా అభ్యసించి, కారవులు, పాండవులు ఆ విద్యలలో

మిక్కిలి నేర్పరు లయ్యారు. మీరు సభలో వాళ్ళనేర్పును తెలిసికొనాలి.

వ అనిన నట్ల చేయుదు నని ధృతరాష్త్రుండు 'గుమారుల విద్యాసందర్శన రంగంబు రమ్యంబుగాః జేయింపు' మని విదురుం బంచిన, నతండును దాని శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయామంబును, నపాకృత వృక్ష గుల్మ వల్మీకంబును, నంగీకృత పూర్వోత్తరప్లవంబును సమీకృత నిమ్నోన్నత ప్రదేశంబును, దూరీకృత కంటక పాషాణ శల్య శకలంబును, విరజీకృత రజోధూసర స్థలంబును, విరచిత బహువిధ ప్రక్షాగారాంచిత మణిమయమంచ ప్రపంచంబును, నానాధ్వజ నవపల్లవ రంభాస్తంభమాలాలంకృత ద్వారతోరణంబును, బ్రతిదిశ నిర్వర్తిత శాంతిక బలివిధానంబునుంగాం జేయించినం, బంచాంగ శుద్ధదినశుభముహూర్తంబున ధృతరాస్తుండు గాంధారీపురస్కత దేవీశతపరివృతుం దై, వివిధభూషణ భూషితానేక విలాసినీనివహంబుతో. జనుదెంచి, విలంబిత కదంబక స్థూలముక్తాఫలదామ రమణీయం బై, యాబద్ధ మరకత వజ్ర వైడూర్య పద్మరాగ ప్రవాళ ప్రభాప్రకర వ్యతికర విరచితాపూర్వ సురచాపచారుగౌరవం ఖై, యతిమనోహరం బైన శాతకుంభమయ ప్రేక్షాగారంబున నున్న న!

ప్రతిపదార్థం: అనినన్‌= (ద్రోణాచార్యుడు ఆ విధంగా చెప్పగా? అట్టు+అ= ఆ విధంగానే; చేయుదున్‌+అని; ధృతరాషఘ్రుండు;

కుమారుల; విద్యా, సందర్భన, రంగంబు= విద్యలను చూపే ప్రదేశాన్ని; రమ్యంబు, కాన్‌= అందంగా ఉండేటట్లుగా; చేయింపుము; అని; విదురున్‌; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అతండును; దాని= ఆ ప్రదేశాన్ని - ఆ రంగస్థలాన్ని; శాస్త విహిత, ప్రమాణ+ఉపేత, వృత్త+ఆయామంబునున్‌= శాస్త్రంలో విధించబడిన కొలతలతో కూడుకొన్న చుట్టుకొలత, పొడవు కలదీ; అపాకృత, వృక్ష గుల్మ, వల్మీకంబును= తొలగించబడిన చెట్టు, పొదలు, పుట్టలు కలదీ; అంగీకృత, పూర్వ+ఉత్తర. ప్ల్రవంబును= అవయవాలుగా చేయబడిన -అంటే అవయవాల వలె అతుక్కొని రంగస్థల భాగాలుగా ఉండేటట్టు చేయబడిన- తూర్పు, ఉత్తర, దిక్కుల్లో వాటమైన పల్లపునేలలు కలదీ; సమీకృత, నిమ్న+ఉన్నత, ప్రదేశంబును= చదరం చేయబడిన పల్లాలూ, మిట్టప్రదేశాలూ కలదీ; దూరీకృత, కంటక, పాషాణ, శల్య, శకలంబును= దూరం చేయబడిన-అంటే తాలగించబడిన ముళ్ళూ, రాళ్ళూ, ఎముకముక్కలూ కలదీ; విరజీకృత, రజః+ధూసర, స్థ్టలంబును= దుమ్ము లేనిదిగా చేయబడిన దుమ్మునిండిన స్థలాలు కలదీ; విరచిత, బహు, విధ, పేక్షఅగార+అంచిత, మణిమయ, మంచ, ప్రపంచంబును= నిర్మించబడిన, అనేకవిధాలైన, చూడటం కోసమైన ఇండ్లయొక్క, అలంకరింపబడిన మణులతో నిండిన మంచెలయొక్క సమూహంతో కూడిందీ; నానాధ్వజ, నవ, పల్లవ, రంభా, స్తంభ మూలా+అలంకృత, ద్వార, తోరణంబునుజ పలువిధా లైన జెండాలతో, 'కొత్తచివుళ్ళతో, అరటిస్తంభాలతో, పూలమాలలతో అలంకరింపబడిన లోపలివాకిళ్ళూ. వెలుపలివాకిళ్ళూ. కలదీ; ప్రతిదిశ నిర్వర్తిత, శాంతిక, బలి, విధానంబునున్‌, కాన్‌= ప్రతిదిక్కులోను నెరవేర్పబడిన శాంతిని కలిగించే బలులతో కూడిన పూజావిధులు కలది అగునట్టుగా; చేయించినన్‌; పంచ+అంగ, శుద్ధ, దిన, శుభ, ముహూర్తంబున= పంచాంగాలచేత (తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలచేత) పవిత్రమైన శుభ

ఆదిపర్వము - షష్టాశ్వాసము 525 సమయంలో; ధృతరా(ష్రుండు; గాంధారీ, పురస్‌, కృత, దేవీ, శత, పరివృతుండు+ఐజ గాంధారి ముందుండేటట్టుగా చేయబడిన భార్యలు వందమందిచేత చుట్టబడినవాడై; వివిధ, భూషణ, భూషిత+అనేక, విలాసినీ, నివహంబుతోన్‌= పలు విధాలైన సొమ్ములతో అలంకరింపబడిన పెక్కుమంది స్త్రీల సమూహంతో; చనుదెంచి= వచ్చి; విలంబిత, కదంబ, స్థూల, ముక్తాఫల, దామ, రమణీయంబు+ఐజ= ద్రేలాడగట్టబడిన కడిమి మొగ్గలవలె పెద్ద వైన ముత్యాలయొక్కదండలచేత అందమైన దై ఆబద్ధ, మరకత, వజ్ర, వైడూర్య, పద్మరాగ, ప్రవాళ ప్రభా, ప్రకర, వ్యతికర, విరచిత+అపూర్వ, సుర, చాప, చారు, గౌరవంబు+ఐ= కట్టబడిన పచిలయొక్క, వజ్రాలయొక్క, వైడూర్యాలయొక్క, పద్మరాగాలయొక్క, పగడాలయొక్క, కాంతులసమూహం యొక్క పరస్పరం కూడికచేత నిర్మింపబడిన అరుదైన ఇంద్రధనుస్సు అందంయొక్క గొప్పదనం కలదై; అతిమనోహరంబు+అయిన= మిక్కిలి అంద మైన దైన; శాతకుంభమయ, ప్రేక్షణఅగారంబునన్‌= (ప్రదర్శన) చూడటంకొరకు బంగారుతో నిర్మించిన ఇంటిలో; ఉన్నణ ఉండగా. తాత్పర్యం: ఆ విధంగా (ద్రోణాచార్యుడు చెప్పగా, అట్టే చేస్తా నని ధృతరా(ుడు 'కురుకుమారుల శోస్తాస్త విద్యా ప్రదర్శనకు అందమైన రంగస్టలాన్ని సిద్ధంచేయించు' మని విదురుడిని ఆజ్ఞాపించాడు. విదురుడు శాస్త ప్రకారం చుట్టుకొలత, పొడవు ఉండేటట్టు, చెట్లను, పొదలను, పుట్టలను తీసివేయించి, అవయవాలవలె అంటి ఉండేటట్టు తూర్పుభాగంలో, ఉత్తరభాగంలో వాట మైన పల్లపుప్రదేశాలను ఏర్పాటుచేయించి, మిట్టపల్హాలను చదునుచేయించి, ముళ్ళను, రాళ్ళను, ఎముక ముక్కల్ని ఏరివేయించి, దుమ్మును అణగగొట్టించి, ప్రేక్షకులు కూర్చొని చూడటానికి పలువిధాలైన ఇండ్లను, మణులతో అలంకరించిన మంచెలను నిర్మింపజేశాడు. లోపలి వాకిళ్ళను, వెలుపలవాకిళ్ళను జెండాలతో, క్రొత్తచిగుళ్ళతో, అరటిస్తంభాలతో, పూలమాలలతో అలంకరింపజేసి, అన్నిదిక్కులలో శాంతిపూజలు జరిపించాడు. రంగస్టలాన్ని సర్వాంగసుందరంగా సిద్దంచేయించాడు. పంచాంగం ప్రకారం మంచిరోజున, శుభ ముహూర్తంలో ధృతరాష్ట్రుడు గాంధారీదేవి ముందునడుస్తుండగా వందమందిభార్యలతో, పలువిధా లైన సొమ్ములు అలంకరించుకొన్న పెక్కుమంది స్త్రీలతో వచ్చి, వ్రేలాడే కడిమిమొగ్గలవలె పెద్ద వైన ముత్యాలతో కూర్చిన దండలతో చూడముచ్చటయినదీ, అమర్చిన మరకత వజ వైడూర్య పద్మరాగ ్రవాళకాంతుల కలయికతో అపూర్వ మైన ఇంద్రధనుస్సు అందాన్ని మించినదీ, మనోహర మైనదీ, బంగారుతో నిర్మించిందీ అయిన ఇంటిలో - కురుకుమారాస్త్రవిద్యా ప్రదర్శనను లోపలకూర్చొని చూడటానికి నిర్మించిన ఇంటిలో - ఉండగా. విశేషం: అలం: ఉదాత్తం, ఉపమ, అంత్యానుప్రాసం. ఈ రంగస్టలంయొక్క అధునాతన రూపమే ఇప్పటి 'స్టేడియం'. తే. అందుంగరమొప్పి సుందరీబృ్బంద మఖిల ; రత్మరా జితకనకధరాధరేంద్ర

కందరాంతరమున నున్న సుందరామృ ; తాశనాంగనాబృ్బందంబు ననుకరించె. క్‌ ప్రతిపదార్హం: అందున్‌= ఆ ఇంటిలో (ఆ(్రేక్షాగారంలో); సుందరీ, బృందము= స్రీలయొక్కసమూహం; కరము= మిక్కిలి; ఒప్పి= తగినట్టుండి; అఖిల, రత్న, రాజిత, కనక, ధరాధర+ఇం[ద్ర, కందర+అంతరమునన్‌+ఉన్న= అన్నిరత్నాలతో (ప్రకాశింప జేయబడిన బంగారుపర్వత'శ్రేస్టమయుయొక్క - అంటే మేరుపర్వతంయొక్క - గుహలలోపల ఉన్న; సుందర+అమృత+ ఆశన+ అంగనా, బృందంబున్‌= అందమైన దేవతా'స్తీలసమూహాన్ని; అనుకరించె= పోలింది. తాత్సర్యం: ఆ ఇంట్లో ఉండే (ప్రీల సమూహం సకల రత్న కాంతులతో ప్రకాశించే మేరు పర్వత గుహలో ఉన్న సుందర దేవతాస్రీల సమూహాన్ని పోలి ఉన్నది. విశేషం: అలంకారం: ఉపమ. అమృతాన్ని ఆహారంగా కలవారు దేవతలు.

526 శ్రీమదాంధ్ర మహాభారతము తే. సుతులవిద్యాప్రవీణతం జూచువేడ్క; నెంతయును సంతసంబున. గుంతిదేవి రాజసన్నిధి గాంధారరాజపుత్రి । కెలన నుండె నున్మీలితనలిననేత్ర. 8 ప్రతిపదార్థం: ఉత్‌+మీలిత, నలిన, నేత్ర= విప్పారిన తామరలవంటి కన్నులు గలది; కుంతిదేవి; సుతుల= కొడుకులయొక్క విద్యా, ప్రవీణతన్‌= విద్యలోని నేర్పును; చూచు, వేడ్కన్‌=ఐ చూడాలనే కుతూహలంతో; ఎంతయున్‌= మిక్కిలి; సంతసంబునన్‌= సంతోషంతో: రాజ, సన్నిధి= రాజుదగ్గర; గాంధార, రాజ, పుత్రి, కెలనన్‌= గాంధారరాజుకూతు రైన గాంధారిప్రక్కన; ఉండెన్‌: తాత్పర్యం: వికసించిన తామరపూలవంటి కన్ను లున్న కుంతీదేవి, తన కుమారుల విద్యానైపుణ్యాన్ని చూడాలన్న కుతూహలంతో, ధృతరా(ష్ట్రునిదగ్గర గాంధారి ప్రక్కన ఎంతో సంతోషంతో ఉండింది. విశేషం: కొడుకులవిద్యానైపుణ్యాన్ని కళ్ళార చూడగోరే మాతృమూర్తి యొక్క మానసికస్టితికి - 'ఉన్మీలితనలిననేత్ర' అనే విశేషణం ఎంతో ఉచితంగా ఉన్నది. కళ్ళకు గంతలు కట్టుకొన్న గాంధారిప్రక్కన విప్పారిన కన్నులు గల కుంతి కూర్చోవటం విశేషం. తులనాత్మక సౌందర్యాన్ని వెలార్చే స్థిరచిత్ర మిది. వు మణియును. 7 తాత్పర్యం: ఇంకా. సీ. వ్యాసపురస్కృతావనిదేవ నివహంబుం | గృప శల్య శకుని గాంగేయ విదుర సోమదత్తాది భాసుర గురుబాంధవ ; మిత్ర్తవర్గంబు, నమేయ మంత్రి సామంత మండలేశ్వర సమూహంబును, । గాయక వైతాళికప్రవరులు. దమతమ నియమిత స్థానంబులం దోలి। నుండిరి; బోరన నులిసె భేరు; ఆ. _ లస్త్రదర్శనాగతాఖిల క్షత్రియ: వైశ్య శూద్ర వివిధవర్హజనుల కలకలంబు ప్రజయకాల సంక్షోభితాం : భోనిధి స్వనంబుం బోలెంజెలంగె. 8 ప్రతిపదార్థం: వ్యాస, పురస్‌+కృత+అవని, దేవ, నివహంబున్‌= వ్యాసుడు ముందుగా ఉండే భూసురుల - అంటే బ్రాహ్మణుల సమూహం; కృప, శల్య, శకుని, గాంగేయ, విదుర, సోమదత్త+ఆది, భాసుర, గురు, బాంధవ, మిత్ర, వర్షంబున్‌= కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన ప్రకాశించే గురువులయొక్క, బంధువులయొక్క మిత్రులయొక్క సమూహం; అమేయ, మంత్రి. సామంత, మండల+ఈశ్వర, సమూహంబును= అపరిమితమైన మం[త్రులయొక్క, సామంతులయొక్క, మండలాధిపతులయొక్క సమూహం; గాయక, వైతాళిక, ప్రవరులున్‌= '్రేష్టు లైన పాటలు పాడేవారు, వేకువనే రాజుల మేలుకొలిసేవారు; తమ, తమ; నియమిత, స్టానంబుల+అందు= నియమింపబడిన ప్రదేశాలలో; ఓలిన్‌= వరుసగా; ఉండిరి; భేరులు; బోరనన్‌; ఉలొసెజఐ మోగాయి; అస్త్ర దర్శన+ఆగత+అఖిల, క్షత్రియ, వైశ్య, శూద్ర, వివిధ, వర్ష జనుల, కలకలంబు= అ(స్తవిద్యాప్రదర్శనోత్సవాన్ని చూడటానికి వచ్చిన అందరు క్షత్రియులయొక్క, వైశ్య్ళులయొక్క, శూద్రులయొక్క, వివిధ జాతుల జనులయొక్క పెద్దశబ్దం;: ప్రళయకాల, సంక్షోభిత+అంభోనిధి, స్వనంబున్‌= ప్రళయకాలంచేత మిక్కిలికలతపెట్టబడిన సము(ద్రశబ్దాన్ని; పోలెన్‌= వలె; చెలంగ= ఒప్పారగా. తొత్సర్యం: వ్యాసమహర్షిని ముందుగా కల (బ్రాహ్మణ సమూహం, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భిష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన (ప్రముఖ గురు బంధు మి(త్రుల సమూహం, అపరిమిత మైన మంత్రిసామంత మండలాధిపతుల సమూహం, గాయక నైతాళికశ్రేష్టులు - ఎవరికి నియమించిన స్థానాలలో వాళ్ళు వరుసగా

ఆదిపర్వము - షష్టాశ్వాసము క్‌27 కూర్చున్నారు. భేరులు (మోగాయి. అ(స్త్రవిద్యా ప్రదర్శనోత్సవం చూడ వచ్చిన క్షత్రియ వైళ్య శూద్రాది వివిధజాతి జనుల కలకలం (ప్రళయ కాల సముద్రఘోషవలె ఉండింది.

విశేషం: అలం: ఉపమ.

న. అట్టియవసరంబున నాచార్యుండు శుక్షాంబరాభరణమాల్యానులేపన యజ్లోపవీతపలితకేశత్షక్తు శోభిత దేహుం డై రంగమధ్యంబున నశ్వత్చామసహితుం డై, విముక్తజలదజాలవియన్మధ్యంబున నంగారకసహితుం దైన యాదిత్యుండునుంబోలె నున్న నగణ్యభూసురవరేణ్యపుణ్యాహవాచనానంతరంబున. త్ర

ప్రతిపదార్హం: అట్టి; అవసరంబునన్‌= సమయాన; ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; శుక్ష+అంబర+ఆభరణ, మాల్య+

అనులేపన, యజ్ఞశ+ఉపవీత, పలిత, కేళ శ్మక్రు, శోభిత, దేహుండు+ఐ= తెల్లనివ(స్తాలతో, సొమ్ములతో, పూలదండలతో, గంధంతో, జందెంతో, నెరసిన వెండ్రుకలతో, గడ్డంతో, మీసంతో, ప్రకాశిస్తున్నదేహం కలవా డై; రంగ, మధ్యంబునన్‌; అశ్చత్థ్రామ, సహితుండు+ఐజ= అశ్చత్భామతో కూడినవా డ్రై; విముక్త జలద, జాల, వియత్‌+మధ్యంబునన్‌= విడువబడినమేఘాలసమూహం గల ఆకాశంయొక్క మధ్య ప్రదేశంలో; అంగారక, సహితుండు+ఐన= అంగారకునితో కూడుకొన్నవా డైన; ఆదిత్యుండునున్‌=పోలెన్‌= సూర్యునివలె; ఉన్నన్‌= ఉండగా; అగణ్య, భూసుర, వరేణ్య, పుణ్యాహవాచన+ అనంతరంబున= లెక్కకు మిక్కిలి అయిన

(బ్రాహ్మణశ్రేష్టులయొక్క పుణ్యాహవాచనానికి తర్వాత.

తాత్సర్యం: అటువంటి సమయంలో (ద్రోణాచార్యుడు - తెల్లని వస్త్రాలతో, సొమ్ములతో, పూలదండలతో,

గంధంతో, జందెంతో, నెరసిన వెండ్రుకలతో, గడ్డంతో, మీసంతో, ప్రకాశిస్తున్న దేహం కలవాడై - రంగమధ్యంలో

అశ్చత్చామతో కూడి, మేఘాలు వీడి నిర్మల మైన ఆకాశమధ్యంలో అంగారకగ్రహసహితు డై ప్రకాశించే సూర్యునివలె ఉన్నాడు, పెక్కుమంది (బ్రాహ్మణోత్తముల పుణ్యాహవాచనంతర్వాత.

విశేషం: అలం: ఉపమ. అంగారకసహితుం డైన యాదిత్యుండునుంబోలె - అనేచోట మూలం ఇట్లా ఉన్నది.

'సాంగారకఇవాంశుమాన్‌. సాంగారకః సభౌమః, అంశుమాన్‌ చంద్ర అని నీలకంఠీయం - చిత్రశాలాప్రతి, పుట 236. చూడు:

మహాభారతసంశోధిత ప్రతి. పు. 323. ధనుర్విద్యాభాస్కరుడైన ద్రోణాచార్యుని సూర్యునితోను, రాక్షసావేశపరు డైన అశ్చత్భామను అన్షిగ్రహ మైన అంగారకునితోను పోల్చటం ఎంతో ఉచితంగా ఉన్నది. తండ్రికొడుకు లిద్దరు ఆ రెండు[గ్రహాలవలె మహాతేజస్వులు, శా. _ద్రోణాచార్యుపిుంద నొప్పి దృధహస్తుల్‌, బద్ధగోధాంగుళీ

త్రాణుల్‌, మార్గణపూర్ణతూణులు, మహాధన్వుల్‌ కుమూరుల్‌ తను

త్రాణోపేతులు రంగమధ్యమున నంతన్‌ నిల్చి రుద్యద్గుణ

శ్రేశీరమ్యులు ధర్మజప్రముఖు లై జ్యేష్టానుపూర్వంబుగన్‌. 10 ప్రతిపదార్థం: దృఢ; హస్తుల్‌= బల మైన చేతులు కలవాళ్ళు; బద్ధ, గోధా+అంగుళీ, (త్రాణుల్‌= కట్టబడిన ఉడుముచర్మవు (వ్రేళ్ళకవచాలు కలవాళ్ళు; మార్గ్షణ, పూర్ణ తూణులు= బాణాలతో నిండిన అమ్ములపొదులు కలవాళ్ళు; మహా, ధన్వుల్‌= గొప్పధనుస్సులు కలవాళ్ళు; తను, (త్రాణ+ఉపేతుల్‌= కవచాలతో కూడినవాళ్ళు: ఉద్యత్‌+గుణ, ్రేణీ, రమ్యులు= ఉన్నతగుణాలవరుసతో మనోహర మైనవాళ్ళు; రాజకుమారుల్‌? దద్రోణ+ఆచార్యు, పియిందన్‌, ఒప్పి=ద్రోణాచార్యునివెనుక అందంగా; ధర్మజ, 'ప్రముఖులు+ఐ= ధర్మరాజును మొట్టమొదట కలవాళ్ళయి; జ్యేష్ట ఆనుపూర్చంబుగన్‌= పెద్దవాళ్ళు ముందు ఉండేటట్లుగా; అంతన్‌; రంగమధ్యంబునన్‌; నిల్ఫిరి.

528 శ్రీముదాంధ్ర మహాభారతము తాత్పర్యం: బలమైనహస్తాలు కలవాళ్ళు, అల్లెత్రాటిదెబ్బ తగులకుండా ఉడుముతోలుతో కుట్టిన కవచాలు (వ్రేళ్ళకు తొడుక్కొన్నవాళ్ళు, బాణాలు నిండుగా ఉండే అమ్ముల పాదులు కలవాళ్ళు, గొప్ప ధనుస్సులు, కవచాలు ధరించినవాళ్ళు, ఉన్నత గుణాలచేత రాణించేవాళ్ళు అయిన పాండవులు, కారవులు, (ద్రోణాచార్యుని వెనుక, ధర్మరాజు ప్రక్కన వయః'[క్రమాన్ని బట్టి వరుసగా రంగమధ్యంలో నిలిచారు. వ. అట్లు నిలిచి, రక్తచందనదిగ్థాంగులు రక్తమాల్యాంబరాభరణులు రక్తపతాకులు రక్తాంతలోచను టై

యాచార్యు ననుమతంబున. శ ప్రతిపదార్థం: అట్టుజ ఆవిధంగా; నిలిచి; రక్త చందన, దిగ్ర+అంగులు= ఎ(ర్రగంధంచేత పూయబడిన దేహాలు కలవాళ్ళు; రక్త మాల్య+అంబర+ఆభరణులు= ఎ(ర్రనిపూలదండలు, వ(స్తాలు, సొమ్ములు కలవాళ్ళు; రక్త పతాకులు= ఎ(ర్రనిజెండాలు కలవాళ్ళు; రక్త(అంత+లోచనులు+ఐ=ఐ ఎర్రని కొలకులు ఉండే. కన్నులు కలవాళ్ళయి; ఆచార్యు+అనుమతంబున= (ద్రోణాచార్యుని ఆజ్ఞచేత. తాత్పర్యం: ఆ విధంగా నిలబడి - ఎర్రగంధాన్ని దేహానికి పూసికొని, ఎర్రటి పూల దండలు, వ(స్తాలు, సొమ్ములు ధరించి, ఎర్ర జెండాలు చేత పట్టుకొని, ఎర్రబడ్డ కనుగొలకులతో ఉన్నవాళ్ళు - ద్రోణాచార్యుని ఆజ్ఞతో. విశేషం: రక్తవర్హం వీర రౌద్ర రస స్ఫోరకం. రసోచిత విభావ వర్ణనం ప్రసన్న కధా కవితలో ఒక శిల్పం. స్స్‌ అసిచర్మకౌశలం బమరంగం జూపెడు । వారును, దృథసౌష్టవంబు లొప్పం

దనుతమనామాంకితము లైన శరముల ; నేర్పడ లక్ష్యంబు లేయువారు,

హయ మదద్విరద రథారూఢ దక్షతం: బ్రకటించువారును, బ్రాసశక్తి

కుంత తోమర గదాకుశలత్వ మెఖింగించు । వారునుగా నిట్లు వసుధలోని ఆ. రాజసుతులతోడ రమణ బాండవధృత । రాష్ట్రసుతులు వృద్ధరాజులొద్దః

దద్దయును ముదమునం దమతమవిద్యలు । మెజసి రెల్లజనులు మెచ్చి పొగడ.

న _ ; న్‌= మనోహరంగా; ప్రతిపదార్థం: పాండవ, ధృతరాష్ట్ర సుతులు= పాండవులు, ధృతరాహునికుమా రులు - కౌరవులు; రమణ లోనినేరూను; వసుధలోని= భూమిలోని; రాజసుతులతోడ= రాకుమారులతో: అసి, చర్మ కశలంబుూ కత్తులలోని, డాలుల అమరంగన్‌= ఒప్పిదంగా; చూపెడు;? 'వారునుజ చూపుతున్నవాళ్ళూ; దృఢ, సౌష్టవంబులు+ఒప్పన్‌= బలం నిండు ఒప్పగా? తమ, తమ; నామ+అంకితములు+ఐన= పేర్లతో గుర్తులు వేయబడిన వైన; శరములన్‌= బాణాలతో; ఏర్పడ= వెరయ్యెటట్టు; లక్ష్యంబుల= గురిచేసి కొట్టదలచివాటిని; ఏయువారు= కొట్టేవాళ్ళు; హయ, మద, ద్విరద, రథధ+ఆరూఢ, దక్షతన్‌= గుజ్జాలను, మదవుటేనుగులను, రథాలను, ఎక్కటంలోని నేర్పును; (ప్రకటించువారును= ప్రదర్శించేవాళ్ళుః ప్రాస, శక్తి కుంత, తోమర, గదా, కుశలత్వముజ ఈటెలలో, శక్తులలో, బల్లేలలో, చిల్లకోలలలో, గదలలోనేర్పును _ అంటే వీటిని ప్రయోగించటంలోని నేర్పును: ఎజీగించువారును= తెలియజేసేవాళ్ళు; కాన్‌= అగునట్టు; ఇట్టు= ఈవిధంగా, తద్దయును= మిక్కిలి; ముదమున= సంతోషంతో తమ, తమ, విద్యలు; ఎల్ల, జనులు; మెచ్చి; పాగడ; వృద్ద, రాజుల+ఒద్ద= పెద్దరాజులదగ్గర: మెజసిరి= ప్రకాళించారు. తాత్సర్యం: పాండవులు, కౌరవులు చూడముచ్చటగా లోకంలోని రాకుమారులతో కూడి- కత్తి డాలు విన్యాసాలలో తాము గడించిన నేర్పును, తమ పేర్లు పొదిగిన బాణాలు వేసి లక్ష్యాన్ని ఛేదించటంలో సాధించిన సామర్ధ్యాన్ని, గుజ్ఞాలను, మదపుటేనుగులను, రథాలను, అధిరోహించటంలో ఆర్జించిన నైపుణ్యాన్ని, ఈటె మొదలైన

ఆదిపర్వము - షవ్యాశ్వాసము 529 ఆయుధాలను ్రయోగించటంలో తాము పొందిన కౌశలాన్ని ప్రజలంతా చూచి కొనియాడేటట్టు పెద్దరాజుల ఎదుట ప్రదర్శించారు.

భీముదుర్యోధనులు తమగదాకౌశలంబు సూపుట (సం.1-124-30)

వ. అంత ననంతబలపరాక్రము లగు భీమదుర్యోధను లుద్యద్గదాహస్తు అయి మహాముత్సరంబుతో నేక

శృంగసముత్తుంగతైలద్వయంబు ననుకరించుచు వశానిమిత్తక్రుద్దగంధసింధురంబులుంబోలె నొండు

రులం దాకి సవ్యాపసవ్యచిత్రమండలమార్గంబుల గదాకౌశలంబు మెజయునెడ. 13 ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; అనంత, బల, పరాక్రములు+అగు= అంతంలేని - అంటే అమితమైన బలపరా[్రమాలు కలవాళ్ళయిన; భీమదుర్యోధనులు; ఉద్యత్‌౪గదా, హస్తులు+అయి= ఎత్తబడిన గదలతో కూడిన చేతులు గలవాళ్ళయి; మహా, మత్సరంబుతోన్‌= మిక్కిలి క్రోధంతో; ఏక, శృంగ, సమ+జఉత్‌+తుంగ, శైల, ద్వయంబున్‌= ఒక్కశిఖరం ఉండే మిక్కిలి ఎత్తైన పర్వతాల జంటను; అనుకరించుచు= పోలుతూ; వళా, నిమిత్త, (క్రుద్ధ, గంధ, సింధురంబులున్‌+పోలెన్‌= ఆడ ఏనుగు కారణంగా కోపించిన మదపుటేనుగులవలె; ఒండొరులన్‌= ఒకరినొకరు; తాకి= ఎదుర్కొని; సవ్య+అపసవ్య, చిత్ర, మండల, మార్గంబుల= ఎడమనుండి కుడికి, కుడినుండి ఎడమవైపునకు, చిత్రమైనవలయాకారాలలోని (తిరిగే) పద్ధతులలో; గదా, కౌశలంబు= గదలోని నేర్పును - అంటే గదా యుద్దంలోని నేర్పును; మెజయు+ఎడ= ప్రదర్శించేసమయంలో. తాత్పర్యం: తర్వాత అంతులేని బలపరాక్రమాలు గల భీమదుర్యోధనులు, చేత గద లెత్తుకొని, మహా (క్రోధంతో ఒకే శిఖరం ఉన్న మిక్కిలి ఎత్తైన పర్వతాల జంటవలె, ఆడ ఏనుగు కారణంగా కోపించిన మదపు టేనుగుల జంట వలె, ఒకరి నొకరు తాకి, ఎడమనుండి కుడికి, కుడినుండి ఎడమకు, చిత్ర మైన వలయాకార పద్దతులలో తిరుగుతూ, గదాయుద్ద నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విశేషం: అలం: ఉపమ, చేత గదలు ధరించి, యుద్దానికి సిద్ధ మైన భీమదుర్యోధనులను ఒకే శిఖరం ఉన్న మిక్కిలి ఎత్తైన పర్వతాల జంటతో, ఆడఏనుగు కారణంగా కోపించి కలబడే మదపుటేనుగుల జంటతో పోల్బటంవలన వాళ్ళ ఉన్నతాకొరం, బలసమానతా, మాత్సర్యతీవ్రత చక్కగా వ్యక్తమౌతున్నాయి. మ. అవనీచక్రము పాదఘాతహతి నల్లాదంగ నత్యుగ్రబై

రవహుంకార రవంబునన్‌ వియదగారంబెల్ల భేదిల్లం బాం

డవకౌరన్యగదావిఘట్టన మకాండప్రోత్చ మై భావిపాం

డవకౌరవ్యరణాభిసూచన పటిష్టం బయ్యె ఘోరాకృతిన్‌. [4 ప్రతిపదార్థం: అవనీ, చక్రము= భూమండలం; పాద, ఘాత, హతిన్‌= పాదాలతొక్కిళ్ళదెబ్బలతో, అల్హాడంగన్‌= కదలగా; అతి+ఉ(గ్ర, భైరవ, హుంకార, రవంబునన్‌= మిక్కిలిపెద్ద దై భయంకర మైన హుంకారధ్వనిచేత; వియత్‌+అగారంబు+ ఎల్లా ఆకాశ మనే ఇల్లంతా; భేదిల్లన్‌= బ్రద్దలవగా; పాండవ, కౌరవ్య, గదా, విఘట్టనము= భీమదుర్యోధనుల గదలయొక్క తీవ్ర మై తాకిడి; అకాండ, (ప్ర+ఉత్హము+ఐ= అకాలంలో లెస్సగా పుట్టిందై; ఘోర+ఆకృతిన్‌= భయంకర మైన రూ పంతో; భావి, పాం లో కౌరవ్య, రణ+అభిసూచన, పటిష్టంబు+అయ్యె= ముందు జరగబోయే పాండవ కౌరవ యుద్దాన్ని ఇప్పటి కిప్లుడే సూచించటం సమర్థ మైన దయింది, తాత్పర్యం: కాళ్ళతొక్కుడు దెబ్బలతో భూమండలం చలించగా, మహాభయంకర హుంకార ధ్వనితో ఆకాశమనే

530 శ్రీమదాంధ్ర మహాభారతము

ఇల్లంతా (బ్రద్దలయ్యేటట్టు, భీమ దుర్యోధనుల గదల తాకిడి, అకొాలంలో ఏర్పడి, భయంకర రూపంతో మున్ముందు రాబోయే కురు పాండవ మహాసం(గ్రామాన్ని ఇప్పటి కిప్పుడే స్పష్టంగా సూచించే దయింది.

విశేషం: 'అత్యుగ్రభైరవము' - ఉగ్ర, భైరవశబ్దాలు రెండింటికీ భయంకరమైన అనే అర్జమే ప్రసిద్ధం. అందువలన ఇక్కడ 'అత్యుచ్చభైరవ' అనే పారాంతరమే మేల్తర మనిపిస్తుంది. కురుక్షేత్రయుద్దంలోని చివరిఘట్టం భీమదుర్యోధనుల గదాయుద్దం దానికి ఈ గదాయుడ్డ్ద ప్రదర్శనం వ్యంజకంగా ఉన్నది. ఇందొక వస్తుద్వనిశిల్పవిశేషం అంతేకాదు. ఓజోగుణం విభావయుద్దోద్రేకాన్ని ధ్వనింప చేస్తున్నది.

క. _ ఆరాజసుతులవిధ్యా। పారగపటుచేష్టితములం బరువది నగ్గాం ఛారీధృతరాష్తుల కతి। ధీరుండు విదురుండు సెప్పి తెలుపుచునుండెన్‌. 15

ప్రతిపదార్థం: ఆ రాజ, సుతుల= ఆ కురుపొండవరాకుమారుల యొక్క; విద్యా, పారగ, పటు, చేష్టితములన్‌= విద్యయొక్క

పరిణతిని సాధించటాన్ని తెలిపే సమర్జా లైన చేష్టలను (అంటే విద్యా ప్రదర్శనలను); అతి, ధీరుడు= గొప్పవిద్వాంసు డైన విదురుడు; పరువడిన్‌= వరుసగా; ఆ+గాంధారీ, ధృతరాష్టులకు; చెప్పి; తెలుపుచున్‌; ఉండెన్‌.

తాత్పర్యం: ఆ రాకుమారుల విద్యా పారంగత్వాన్ని తెలిపే ఆ విద్యా ప్రదర్శనలను గూర్చి విద్వాంసు డైన

విదురుడు వరుసగా ఆ గాంధారీ ధృతరాష్ట్రులకు తెలియచెప్పుతూ ఉన్నాడు.

ప. అంత భీమదుర్యోధనుల గదా కౌశలంబు సూచుజనుల పక్షపాత జనిత పరస్పర క్రోధ వచనంబులు విని ర్రోణుండు రంగ భంగ భయంబున నశ్వత్భామం బంచి వారి నిద్దల వారించి, వారాశియుం బోలె బోరన మైైోయుచున్న వాదిత్రశబ్దంబు లుడిపి, 'నా ప్రియశిష్యుండయిన యర్హును ధనుర్విద్యా కౌశలంబుం జూడుం' డనిన నయ్యాచార్యు వచనానంతరంబున,. 16

ప్రతిపదార్థం: అంత= అప్పుడు; భీమ, దుర్యోధనుల, గదా, కౌశలంబు= భీమదుర్యోధనులయొక్క గదా విద్యలోని నేర్పు; చూచు,

జనుల, పక్షపాత, జనిత పరస్పర, (క్రోధ, వచనంబులు= చూస్తున్నట్టి ప్రజలయొక్క పక్షప్రాతంవలన పుట్టిన ఒండారులకోప వాక్యాలు; విని; (ద్రోణుండు; రంగ భంగ, భయంబునన్‌= విద్యాప్రదర్శనరంగం చెడిపోతుం దనే భయంవలన' అశ్చత్చామన్‌: పంచి= పంపి, వారిన్‌+ఇద్దణ= భీమదుర్యోధను లిద్దరిని; వారించి= తొలగించి; వారాశియున్‌+పోలె= సముద్రంవలె; బోరు+అన; ట్రాయుచు+ ఉన్న, వాదిత్ర, శబ్దంబులు= వాద్యాలయొక్క ధ్వనులను; ఉడీపి= మాన్పించి; నా, (ప్రియ, శిష్యుండు+అయిన; అర్జును ధనుః+విద్యా, కౌశలంబున్‌= అర్జునుని యొక్క ధనుర్విద్యలోని నేర్పును; చూడుండు; అనినన్‌= అని అనగా; ఆ+అఆచార్యు, వచన+అనంతరంబునజ ఆ (ద్రోణాచార్యుని మాటలతర్వాత. తాత్పర్యం; అష తా వ్‌ సు భీమ దుర్యోధనుల గదా కౌశలం చూచే ప్రజలు, పక్షపాతంతో కోపావేశాలు పెంచుకొని, క్ష ద్రోణావారు ప్‌ టున్న మాటలు విని, అస్త్రవిద్యా ప్రదర్శనరంగం భగ్నమవుతుందన్న భయంతో, అశళతా క వాద్యధ్వని శ్‌ ని వ శ్చొనును పంపి, ఆ భీమదుర్యోధనులను తొలగించి, సముద్రఘోషవలె (మోగుతున్న తర్వాత. శ డైన అర్జునుని ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూడం” డని ప్రకటించిన విశేషల; ఆటలపోటీలలో పాలొనే వాళ్ళసంగ కేకలతో, మాటలతో పరస్పరం సం తి ఎట్టా ఉన్నా - ఆ పోటీలను చూచే'్రేక్షకులు పక్షాలు వహించటం అరుపులతో, (త ధాఎశాలు రెచ్చగొట్టుకొనటం, ఒక్కొక్కసారి ఆ పోటీలు పెద్ద పోట్టాటలుగా మారటం

ఆదిపర్వము - షష్టాశ్వాసము 531 లోకసహజమే. (ప్రస్తుతం భీమ దుర్యోధనుల గదా కౌశల ప్రదర్శనలో ఆ వాతావరణం ఏర్పడింది. రంగస్థలం రణభూమిగా మారే ప్రమాదం ఎర్పడింది. అందుచేతనే ఆచార్యుడు ఆ ప్రదర్శనను ఆపివేయించటం జరిగింది. కాగా, మానవహృదయంమీద ధ్వనిప్రభావం మెండు. వివిధ వాద్య ధ్వనులు వివిధ రసోద్దీపకాలు. అందుచేతనే (క్రోధావేశ (ప్రేరకాలైన వాద్యధ్వనులను ఆచార్యుడు ఆపివేయించాడు. తతం, ఆనద్దం, సుషిరం, ఘనం అనే వాద్యచతుష్టయానికి వాదిత్రనామం ఉన్నది.

ఉ. హారివిచిత్రపామకవచావృతు( డున్నతచాపచారుదీ ర్హోరుభుజుండు, భాస్వదసితోత్సలవర్డుండు, సేంద్రచాపశం పారుచిమేఘమో యనంగ బాందవమధ్యము. డొప్పి బద్ధతూ ణీరుండు రంగమధ్యమున నిల్సె జనంబులు దన్ను జూడంగన్‌. 47 ప్రతిపదార్థం: హారి, విచిత్ర హేమ, కవచ+అవృతుండు= మనోహర మై వింతవింత రంగులు గలదైన బంగారు కవచంతో కప్పబడినవాడు; ఉన్నత, చారు చాప, దీర్షశఉరు+భుజుండు= అందమైన ధనుస్సుతో పొడవైన, శ్రేష్ట మైన హస్తం కలవాడు; బద్ద, తూణీరుండు= కట్టబడిన అమ్ములపొదులు గలవాడు; భాస్వత్‌+అసిత+ఉత్పల, వర్గుండు= ప్రకాశిస్తున్న నల్లకలువ వన్నె కలవాడు; పొండవమధ్యముండు= పాండవులలో నడిమివా డైన అర్జునుడు; జనంబులు; తన్ను; చూడం6గన్‌= చూస్తుండగా; స+ఇం[ద్రశచాప, శంపా, రుచి, మేఘమో, అనగన్‌= ఇంద్రధనుస్సుతో. మెరుపుకాంతితో కూడుకొన్న మేఘమా అనేటట్టు; ఒప్పి= అందంగాఆమరి; రంగ మధ్యమున; నిల్చె. తాత్పర్యం: మినమిన లాడే నల్లకలువ వన్నెవాడు, పాండవులలో నడిమివాడు అయిన అర్జునుడు - మనోహర మై, వింతవింత రంగుల బంగారుకవచం తొడుక్కొని, దీర్హం, శ్రేష్టం అయిన తన హస్తానికి అంద మిచ్చిన ఎత్తైన ధనుస్సు ధరించి, అమ్ములపొదులు కట్టుకొని, జనులంతా తనను చూస్తుండగా - ఇం(ద్రధనుస్సుతో, మెరపుకాంతితో కూడిన మేఘమా అన్నట్టు రంగమధ్యంలో అందంగా నిలిచాడు. విశేషం: అలం: ఉత్రేక్ష పద్యంలో ప్రసాద విశిష్టమైన ఓజోగుణం ధీరోదాత్తుడైన అర్జునుని రూపవర్షనకు అనుగుణంగా ఉన్నది. క. నరునింద్రాత్మజ నింద్రా! వరజసఖున్‌ వీరు బాండవప్రవరు ధను ర్థరుంజూచి, చూపటెల్లం । బరమాద్దుతచిత్తు లగుచు6 బలికిరి తమలోన్‌, తి ప్రతిపదార్థం: నరున్‌; ఇంద్ర+ఆత్మజాన్‌= ఇంద్రునియొక్కకుమారుడైన వానిని; ఇంద్ర+అవరజ, సఖున్‌= ఇంద్రునితమ్ముడైన ఉపేంద్రునియొక్క - శ్రీకృష్ణునియొక్క స్నేహితుడిని; ఏీరున్‌= వీరుడైనవానిని, పాండవ, ప్రవరున్‌= పాండవులలో శ్రేష్టుడైనవాడిని; ధనుఃఖధరున్‌= ధనుస్సును ధరించినవాడిని; (అర్జునుడిని) చూచి; చూపఅు+ఎల్లన్‌= ప్రేక్షకు లంతా - చూచేవాళ్ళంతా; పరమ+అద్భుత, చిత్తులు+అగుచున్‌= మిక్కిలి ఆశ్చర్యంతో కూడిన మనస్సులు కలవాళ్ళయి; తమలోన్‌= తమలో తాము; పలికిరి= పలికారు, మాట్టాడుకొన్నారు. తాత్పర్యం: నరుడు, ఇంద్రతనయుడు, ఉపేంద్రు డైన శ్రీకృష్ణునిస్నేహితుడు, వీరుడు, పాండవ శ్రేష్టుడు, ధనుర్హరుడు అయిన అర్జునుడిని చూచి అమితాశ్చర్యంతో (ప్రేక్షకులు తమలో తాము ఇట్టా అనుకొన్నారు. తే. వీయెకృతహస్తు డఖిలాస్ర్రవిద్యలందు, । వీడ యగ్రగణ్యుయ ధర్మవిదులలోన, వీజె భరతవంశం బెల్ల వెలు(46 గుంతి। కడుపు చల్లగా. బుట్టిన ఘనభుజుందు. 19 ప్రతిపదార్హం: రీండె=ఐ ఇతడే; అభిల+అ'స్తు విద్యల+అందు= అన్ని అ'స్ర్రవిద్యలలో; కృత, హస్తుండు= నేర్పరి; వీండెఐ ఇతడే; ధర్మ విదులలోన= ధర్మం తెలిసినవారిలో; అగ్ర గణ్యుండు= మొదట లెక్కించదగినవాడు; ఫీండెఐ ఇతడే; భరత, వంశంబు+*ఎల= ఛా

532 శ్రీమదాంధ్ర మహాభారతము భరతునియొక్క వంశమంతా; వెలు(గన్‌= ప్రకాళించగా; కుంతి, కడుపు, చల్లగాన్‌; పుట్టిన; ఘన, భుజుండు= గొప్పహస్తాలు గలవాడు. తాత్పర్యం: ఇతడే (ఈఅర్జునుడే) అస్త్రవిద్య లన్నింటిలో నేర్చరి. ఇతడే ధర్మం తెలిసినవాళ్ళలో మొదట లెక్కపెట్ట తగినవాడు. ఇతడే భరతవంశాని కంతటికి కీర్తి వచ్చేటట్టు కుంతికడుపు చల్లగా పుట్టిన గొప్పభుజాలు కలవాడు. విశేషం: ధర్మవిదులలోన - అనేదానికి 'ధనుర్విదులలోన' అని, 'ఘనభుజుండు' - అనే దానికి ఘనయశుండు' అని పారాంతరా లున్నాయి. రంగస్థలంలో ప్రవేశించిన వీరు లందరిలో ప్రదర్శనకు పూర్వమే ప్రజల ప్రశంస లందుకొన్న వాడిగా అర్జునుని వర్షనలో అతని అత్యధిక వీరత్వం ధ్వనిస్తూ ఉన్నది. క. అని పలుకుజనులపలుకులు | విని గొంత యనంతహర్నవిస్తారితలో చన యై నందను నృపనం । దనసంఘములోనం జూచి తద్దయుం బొంగెన్‌. 20 ప్రతిపదార్థం: అని; పలుకు; జనుల, పలుకులు; విని; గొంతి= కుంతీదేవి; అనంత, హర్ష విస్తారిత, లోచన+ఐ= అంతులేని ఆనందంచేత విప్పారిన నేత్రాలు కలదై; నందను= కుమారుడిని - అర్జునుడిని; నృప, నందన సంఘములోనన్‌= రాజకుమారులయొక్క సమూహంలో: చూచి; తద్దయుజ= మిక్కిలి; పొంగెన్‌= సంతోషించింది. తాత్సర్యం: ఆ విధంగా పలికే జనుల పలుకులు విని, కుంతీదేవి అంతులేని ఆనందంతో విప్పారిన కళ్ళతో తన కుమారు డైన అర్జునుడిని రాకుమారుల సమూహంలో చూచి ఎంతో సంతోషించింది. క చారుమనస్పమృ్మదరస : పూరము వెలివేర్డునట్లు పొలంతికి విగళ ద్యూరిస్తనజనితపయో । ధారలు నానందబాప్పధారలు నొప్పెన్‌. 21 (ప్రతిపదార్హం: చారు, మనస్‌+సమ్మద, రస, పూరము= చక్కనిమనస్సులోని సంతోష మనే జలప్రవాహం; వెలివేర్చు+అట్టువ= బయల్పడేటట్టు; పొలంతికి=. స్త్రీకి - అంటే కుంతీదేవికి; విగళత్‌ఃభూరి, స్తన, జనిత, పయఃశ+ధారలున్‌= కారుతున్న పెద్దపాలిండ్లనుండి పుట్టిన పాలధారలును; అనంద, బాప్పు, ధారలున్‌= ఆనందంవల్ల కన్నీటి ధారలును; ఒప్పెన్‌= అమరినాయి - తగువిధంగా ఏర్పడినాయి. తాత్పర్యం: మనస్సులోని సంతోష జల ప్రవాహం వెలుపలికి వచ్చినట్టు కుంతీదేవిపాలిండ్తనుండి పాల ధారలు, కన్నులనుండి ఆనంద బాష్పు ధారలు బయటికి వచ్చాయి. విశేషం: అలం: ఉత్రేక్ష. కొడుకు గొప్పతనాన్ని లోకమంతా మెచ్చుకుంటే ఓ మాతృమూర్తి హృదయం ఎంతగా పులకిస్తుందో ఈ పద్యంలో చూడవచ్చును. లోకులందరి ఆనందం ఒకవైపు, తల్లిపాందే ఆనందం మరొకవైపు వర్లించి సామ్యపరిశీలనవలన కలిగే రమణీయభావచిత్రాన్ని పతితకు నన్నయ అరీదించాడు. కుంతి ఉద్విగ్నప్రవృత్తికలదిగా చిత్రించబడింది. వత్సలభావాన్ని సాతికభావాలతో వ్యక్తంచేయటం అందుకు సొక్ష్యం. పాలిండ్లనుండి పాలధారలు, కన్నులనుండి కన్నీటిధారలు రావటం వాత్సల్యరసాన్ని వ్యంజింపచేసే మాతృసహజమైన సాత్మికభావాభివ్యక్తులు. (సంపా వ. అయ్యర్దునుస్తుతివచనంబు లొక్కట జనసంఘంబువలన నెగసి వియత్తల విదళనం బయిన నమ్మహాధ్వని విని యదరిపడి ధృతరా్త్రుం 'డిది యేమి రభసం?' బని విదురు నడిగిన నాతం డి ట్లనియె. 22

ఆదిపర్వము - షష్టాశ్వాసము 533 ప్రతిపదార్థం: ఆ+అర్జును, స్తుతివచనంబులు= ఆ అర్జునునిగూర్చిన పాగడ్తలు; ఒక్కట= ఒక్కమారుగా: జన, సంఘంబువలనన్‌= జనసమూహంనుండి; ఎగసి=ఐ పైకి లేచి; వియత్‌*తల, విదళనంబు+అయినన్‌= ఆకాళప్రదేశాన్ని చీల్చేది కాగా; ఆ+మహా, ధ్వని= ఆ పెద్ద శబ్దాన్ని; విని; అదరిపడి= భయపడి; ధృతరా్ట్రుండు; ఇది; ఏమి, రభసంబు= ఇదేమి సంతోషం; అని, విదురున్‌+అడిగినన్‌= విదురుడిని అడుగగా; ఆతండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: ఆ అర్జునుడిని గూర్చిన పొగడ్తలు ఒక్కమారుగా జన సమూహం నుండి పైకి లేచి ఆకాళాన్ని (బ్రద్దలు చేసేట్టు ఉండగా, ఆ మహాధ్వనిని విని ధృతరా(ష్తుడు భయపడి “ఇదేమి సంతోషం” అని విదురుడిని అడిగాడు. విదురుడు అతనితో ఇట్టా అన్నాడు.

క. _ భూరిభుజుం డర్దునుండతి। శూరుండు దనయస్త్రవిద్యం జూపంగ రంగ

త్వారంభు( దయిన నతని న; వారితముగం బొగడుజనరవం బది యధిపా! 23 ప్రతిపదార్థం: అధిపాజ ఓరాజా!; ఇది; భూరి, భుజుండు= సపెద్దభుజాలు గలవాడు; అతి, శూరుండు= మిక్కిలి పరాక్రమవంతుడు

  • అయిన; అర్జునుండు; తన; అస్త విద్యన్‌: చూపంగ; రంగత్‌+*ప్రారంభుండు+అయినన్‌= ప్రకాశిస్తున్న ప్రారంభం కలవాడు కాగా; అతనిన్‌; అవారితముగన్‌= అడ్డులేకుండగా; పొగడు: జన, రవంబు= జనులయొక్కశబ్దం. తాత్పర్యం: ఓ రాజా! ఇది - గొప్పభుజాలు కలవాడు, మిక్కిలి పరాక్రమవంతుడు అయిన అర్జునుడు- తన అ(స్త్రవిద్యా పదర్భ్శనను, శోభాయమానంగా (ప్రారంభించగా, అతడిని ఎడతెరిపిలేకుండా ప్రశంసించే ప్రజల ధ్వని. విశేషం: 'రంగత్రారంభుడు' - అనే దానికి 'రంగప్రారంభుండు" అనే పారాంతరం ఉంది. క, _ అనవుడు ధృతరాస్తుండు దన।; మనమున సంతోషమంది మానుగ వీనుల్‌

గనిన ఫల మిపుడు గంటిన్‌ । వినం గంటినిం బాండు సుతుల విద్యా శక్తుల్‌, 24 ప్రతిపదార్థం: అనవుడు= అని విదురు డనగా; ధృతరాష్ట్రండు; తన, మనమున= తనయొక్క మనస్సులో; సంతోషము+అంది= సంతోషాన్ని పొంది; మానుగ= ఒప్పుగా; వీనుల్‌= చెవులు; కనిన= పొందిన; ఫలము+ఇప్పుడు; కంటిన్‌= పొందాను; పాండు, సుతుల, విద్యా శక్తుల్‌= పాండురాజుకొడుకుల విద్యలలోని సామర్ధ్యాలను; వినన్‌+కంటిని= వినగలిగాను. తాత్సర్యం: అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు, తన మనస్సులో సంతోషించి - చెవులున్న ఫలా న్నిప్పుడు పొందాను; పాండుకుమారుల విద్యాశక్తులను గూర్చి ఇప్పుడు వినగలిగాను' అన్నాడు. క. _ భూరినిజద్యుతితోదం బృ; థారణిసంభూతపాండవాగ్నిత్రితయం

బారంథ నస్మత్ములదురి । తోరుతరారణ్యదాహ మున్నతిం జేయున్‌, 25 ప్రతిపదార్థం: పృధా+అరణి, సంభూత, పాండవ+అన్లి, త్రితయంబు= కుంతి అనే అరణీలో పుట్టిన పాండవు లనే అగ్నులు మూడు; భూరి, నిజ, ద్యుతి, తోడన్‌= గొప్పదైన తమకాంతితో; ఆరంగన్‌= పూర్తిగా; అస్మత్‌+కుల, దురిత+ఉరుతర+ అరణ్య, దాహము= నా వంశంయొక్క పాపమనే మిక్కిలి పెద్ద అరణ్యాన్ని కాల్బటాన్ని; ఉన్నతిన్‌= గొప్పగా; చేయున్‌. తాత్పర్యం: కుంతి అనే అరణిలో పుట్టిన అగ్నులు మూడూ (అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు) తమ గొప్పకాంతితో నా వంశం యొక్క పాప మనే పెద్ద అరణ్యాన్ని పూర్తిగా దహించి వేయగలవు.

534 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: అలం: రూపకం కుంతికి పుట్టిన ముగ్గురు కొడుకులు త్రేతాగ్నులని, ఆ ముగ్గురు కురువంశంలో పుట్టిన పాపమనే అరణ్యాన్ని దహించివేస్తారని, అప్రయత్నంగా ధృతరాష్ష్రుడే అనటంలో - పాండవుల పరాక్రమం మాత్రమే కాక వాళ్ళి వ్యక్తిత్వాల పవిత్రత, అంతేకాక మున్ముందు మహాభారత సం(గ్రామంలో ఈ ముగ్గురే కౌరవులను హతమారుస్తారన్న భాపికదార్దం, 14వ పద్యంలోవలె వాచ్యంగా కాకుండ వ్యంగ్య రమణీయంగా ధ్వనిస్తున్నాయి. అర్జునుండు తనయసస్తవిద్యాకాశలంబు సూప్పుట (సం.1-125-18) వ అని పొగడుచుండ నర్జ్దునుం డాచార్యుననుమతంబున నస్తలాఘవవైచిత్ర్య ప్రకాశనపరుం డయి యెొల్లవారును జూచుచుండ. 26 ప్రతిపదార్థం; అని; పొగడుచు+ఉండన్‌= అర్జునుండు; ఆచార్యు+అనుమతంబునన్‌= (ద్రోణాచార్యునియొక్క అనుమతితో; అస్త్ర లాఘవ, వైచిత్ర్య, ప్రకాశన, పరుండు+అయి= అ(స్త్రవిద్యానైపుణ్యంలోని విచిత్రాన్ని (అనగా ఆశ్చర్యకరాలైన నానా విధ అస్త్ర విద్యా విన్యాసాలను) ప్రకటించటమే ్రధానమైనదానినిగా కలవా డై; ఎల్లవారును= అందరును; చూచుచు+ఉండ. తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు పొగడుతూ ఉండగా అర్జునుడు (ద్రోణాచార్యుని అనుమతితో, మంత్ర ప్రధానాలైన గొప్పగొప్ప అస్త్రాలను ప్రయోగించే విద్యలోగల అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించటంలో ఆసక్తికలవాడైై అక్కడున్న వాళ్ళందరూ చూస్తూ ఉండగా... చ్త్‌ సీ, ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు । వారుణాస్త్రమున దుర్వారజలము ననిలబాణంబున నధికానిలంబును । మేఘాస్తమున మహామేఘచయమను'. బుట్టించు, మజియును భూమిబాణంబున । భూప్రవిష్ణుం డగు, భూరిఘోర వైలబాణంబున శైలరూపము దాల్టు। వీరు డదృశ్యాస్త్రవిద్యపేర్మి. తే. దా నదృశ్యదేహుం డగు దత్‌క్షణంబ । హ్రస్వుండగు దీర్దుః డగు సూక్ష్ముం డగు రయంబు తోడ రధమధ్యగతుం డగు ధూర్గతుండు । నగు మహీతలగతుం డగు నద్భ్ధుతముగ. 27 ప్ర ॥ ధ్రతిపదార్థం: వీరుండు= వీరు డైన అర్జునుడు; అద్భుతముగ= ఆశ్చర్యకరంగా; ఆగ్నేయశరమునన్‌= అన్నిసంబంధ మైన ణా ల ద త; అతి, భీకర+అగ్నియు= మిక్కిలి భయంకర మైన నిప్పును; వరుణ+అ(స్తమునజ వరుణ సంబంధ మైన అస్త్రంచేత; +వార, = ఆగ వాయు బరమున్‌ ఆపటానికి సాధ్యం కాని నీటిని; అనిలబాణంబునన్‌= వాయు సంబంధ మైన బాణంచేత; అంటే వారస 4 చయ వ త రనిలంబునూ మిక్కిలిగాలిని; మేఘ+అ(స్తమున= మేఘ సంబంధమైన అ(్త్రంచేత; మహా, మేఘ, = పెద్దమేఘాల స ప్త ప్రిందిన ౭ యాల? సమూహాన్ని: పుట్టించు; మటియును; భూమి, బాణంబున; భూ, ప్రవిష్టుండు+అగు= భూమిలో పర్వత రూపాన్ని; తా న్‌ + ఘర, శైల, బాణంబున= పెద్దది, భయంకరమైనది అయిన పర్వతబాణంచేత; శ్రైల, రూసము= న్ని ల్చుణ; అదృశ్య+ అస్త్ర, విద్య, 'ేర్మిన్‌= అగుపించకుండ చేసే అ(స దేహుండు+అగున్‌= అగుపించని దే శై ౦డ చేసే అస్త్రవిద్యలోని అతిశయంచేత; తాను; అదృళ్య, = ఎం ప | వాడవుతాడు; దీరుడు, ఉగ. టో కలవాడౌతాడు; తత్‌+క్షణంబు+అ= ఆ నిమిషాననే; హ్రస్వుండు+అగు= పొట్టి మధ్య, గతుండు+అగు= రధంయొక. ల్‌! సూక్ష్ముండు+అగు= సన్నని వాడవుతాడు; రయంబుతోడజ వేగంతో; రధ, లై 6 మధ్యానికి వెళ్ళినవా డౌతాడు; ధూ, మహ్‌త ? ధూర్గతుండున్‌+అగు= నొగల నడుమ ఉన్సువా డవుతాడు; ల గతుండు+అగున్‌= భూమిమీద ఉన్నవా డౌతాడు. గ్‌ ల్మనా వు

ఆదిపర్వము - షష్టాశ్వాసము 535 తాత్పర్యం; వీరు డైన అర్జునుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు అగ్నేయాస్తంతో అతిభయంకర మైన అగ్నిని, వారుణాస్తంతో వారింప సాధ్యంగాని నీటిని, వాయవ్యాస్తంచేత విపరీత మైన గాలిని, మేఘాస్తంచేత మహామేఘ సమూహాన్నీ పుట్టించాడు. అంతేకాక భౌమా(స్తంచేత భూమిలో ప్రవేశించాడు. శ్రైలాస్తంచేత పర్వతరూపాన్ని పొందాడు. అదృశ్యాస్తంచేత అగుపడకుండా పోయాడు. అప్పటికప్పుడు పొట్టివా డయ్యాడు; పొడుగువా డయ్యాడు; సన్ననివా డయ్యాడు; మహావేగంగా రధమధ్యంలోకి వెళ్ళాడు; వెంటనే నాగలపై కూర్చున్నాడు; నేలమీద నిలిచాడు. విశేషం: 'ధూర్గతుండునగు' అనేదానికి 'తురగగతుం డు నగు' అనే పారాంతరం ఉన్నది.

న. మజియుం బాటెడుసింహవ్యాఘ్రువరాహాదిమృగంబుల ముఖంబులం దొక్కొకయ మ్మేసినట్ల యేనేసి యమ్మ్ము లతిలాఘనంబున నేసియు, రజ్జసమాలంబితం బయిన గోశ్చంగంబునం దేకవింశతిశరంబులు వరుసన నాట నేసియు, ని ట్లస్తవిద్యావైచిత్యంబు మెఅసి గదాఖడ్డాదివివిధాయుధదక్షతం జూపి యర్జునుండు జనుల కాళ్చర్యంబు సేయుచున్నంత6 గర్జుండును నిజవిద్యాకౌశలంబు మెోజియ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజుాస్పాలనంబు సేసిన. 28

ప్రతిపదార్దం: మజియున్‌?: పాటెడు సింహ వ్యాఘ్ర వరాహ+అది, మృగంబుల, ముఖంబుల+అందు= పరుగెత్తుతున్న

సింహం పెద్దపులి, పంది మొదలయిన జంతువులయొక్క నోళ్ళలో; ఒక్కొక్క; అమ్ము+ఏసినట్టు+అ= బాణాన్నివేసినవిధంగా;

ఎనేసి అమ్ములు= ఐదేసిబాణాలు; అతిలాఘవంబునన్‌= మిక్కిలిసులువుగా?. ఎసియు= వేసినతర్వాత; రజ్జు

సమ్‌+ఆలంబితంబు+అయినజ త్రాటికి చక్కగా వేలాడగట్టబడిన, గో, శృంగంబు+అందు= అవుకొమ్ములో; ఏకవింశతి,

శరంబులు= ఇరువైఒక్కబాణాలు; వరుసన; నాటన్‌*ఎసియున్‌= నాటుకొనేటట్టు వేసి; ఇట్టు+అస్త్ర విద్యా, వైవిత్యంబు=

ఈవిధంగా అస్త్రవిద్యలోని విచిత్రతను - అంటే అ(స్తవిద్యలోని ఆశ్చర్యకర మైన తన నైపుణ్యాన్ని. మెజసి= ప్రదర్శించి; గదా,

ఖడ+అది. వివధ+ఆయుధ, దక్షతన్‌= గద, కత్తి మొదలయిన పలువిధాల ఆయుదధాలలోని నేర్పును; చూపి; అర్జ్హునుండు; గ్‌

జనులకు+ఆళ్చర్యంబు+చేయుచు+ఉన్న+అంతన్‌= ప్రజలకు. ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా; కర్టుండును; నిజ విద్యా కౌశలంబు=

తనయొక్కవిద్యలోని నేర్పును; మెజయజ= ప్రదర్శింప; సమకట్టి= పూనుకొని; రంగ, ద్వారంబున; నిలిచి; భుజా+ఆస్సాలనంబు=

భుజం చరచటాన్ని; చేసిన= చేయగా

తాత్సర్యం: అంతేకాక పరుగెత్తుతున్న సింహం, పెద్దపులి, పంది మొదలయిన మృగాల నోళ్ళలో ఒక్కొక్క

బాణాన్ని వేసినట్టు ఐదేసి బాణాలను అతిసులభంగా వేసి, తర్వాత త్రాటికి వేలాడగట్టబడిన ఆవు కొమ్మున

.

నాటుకొనేటట్లు వరుసగా ఇరవయ్యొక్క బాణాలను వేశాడు. ఈ విధంగా తన అస్త్రవిద్యా విచిత్రాలను ప్రదర్శించి,

్‌.

గద. కతి మొదలయిన అనేక విధా లైన ఆయుధ విద్యల్లో తన కున్న నైపుణ్యాన్ని చూపి జనులను

ఆశ్చర్యపరవశులను చేస్తుండగా, కర్టుడు తన విద్యానైపుణ్యాన్ని ప్రదర్శింప పూనుకొని రంగద్యారంలో నిలిచి భుజం

చరచగా.

విశేషం: రంగసలంలో పరుగెత్తే సింహాలకు పెద్దపులులకు ప్రసక్తి ఎట్టని కొంతకు కొంత సందేహం కలగటం సహజం. రంగస్థలం

2 రంగస్ట్ర _ సువిశాలమైన భద్రతకు తగిన ఏర్పాట్లు చేసినప్పుడు ఆయామృగాలను ్రవేశపెట్టటం అసాధ్యం కాదు. కాని అవి లోహమయాలైన స్‌ బళ బి జ్‌ కృత్రిమజంతువులు అనే సూచన కొన్ని సంస్కృత భారత పాఠాలలో ఉన్నట్టు మహాభారత సంశోధితప్రతిలో పేర్కొనటం జరిగింది “భ్రమతశ్ళ వరాహ స్య లౌహస్యప్రముఖే సమమ్‌ పంచబాణానసంసక్తా సమ్మమోదైకబాణవల్‌, లౌహస్య అనటానికి (భ్రమరస్య కామస్య, సింహస్య అనేపారాలుకూడా ఉన్నాయి”. -శ్రీమదాంధ్రమహాభారత సంశ ధితప్రతి, పుట. 328

536 శ్రీమదాంధ్ర మహాభారతము ను. జనులెల్లం గడుసంభ్రమింపంగ నజస్రంబై భుజాస్పాలన

ధ్వని శైలప్రకరంబుపై( బడు మహాదంభోఆశబ్దంబొకో

యన వీతెంచినం బాండవుల్‌ సనిరి ద్రోణాచార్యు డాయన్‌, సుయో

ధను వేష్టించిరి తమ్ములందలును దద్ద్వారంబు వీక్షించుచున్‌. 29 ప్రతిపదార్హం: జనులు+ఎల్లన్‌= ప్రజలందరు; కడు= మిక్కిలి, సంభ్రమింప(గన్‌= భయపడగా; అజస్రంబు+ఐ= ఎడతెరపిలేని దై; భుజా+ఆస్సాలనధ్వని= భుజం చరచటంవలన కలిగినశబ్దం; శైల, ప్రకరంబు, 'సైన్‌= కొండల సమూహం మీద; పడు; మహా, దంభోళి, శబ్దంబు+ఒకోజ గొప్పవజ్రాయుధంయొక్కశబ్దమా; అన= అనేటట్టు, వీతెంచినన్‌= రాగా; పాండవులు; (ద్రోణాచార్యు డాయన్‌= (ద్రోణాచార్యుని సమీపించటానికి: చనిరి= వెళ్ళారు; తమ్ములు+అందరును= (దుర్యోధనుడి) తమ్ములందరు; తత్‌?ద్వ్యారంబు= ఆ వాకిలిని - అంటే ఆ శబ్దం వచ్చినవాకిలిని; వీక్షించుచున్‌= చూస్తూ: సుయోధను; వేష్టించిరి= దుర్యోధనుని చుట్టు చేరారు. తాత్పర్యం: ప్రజలంతా ఎంతో భయపడేటట్టు, ఎడతెరిపిలేనిదై భుజం చరచటంవలన పుట్టిన ఆ శబ్దం, పర్వత సమూహంపై పడే మహా వజ్రాయుధ శబ్దమా అనేటట్టు రాగా, పాండవులు (ద్రోణాచార్యునిగ్గరకు చేరారు. దుర్యోధనుని తమ్ములంతా శబ్దం వచ్చిన ఆ వాకిలి వైపు చూస్తూ దుర్యోధనుని చుట్టూ చేరారు. విశేషం: ఆ ధ్వని తీవ్రత కర్టుని హృదయ బాధా తీవ్రతను చక్కగా ధ్వనింపచేస్తున్నది. వ. అంత. 3౦ తాత్పర్యం: అప్పుడు.

కర్గుండు ప్రవేశించి అర్జును నధిక్షేసించుట (సం.1-126-2)

శా. సాలప్రాంశు నిజోజ్వలత్కృనచు శశ్వత్కుండలోద్ధాసితున్‌

బాలార్క ప్రతిమున్‌ శరాసన ధరున్‌ బద్దోగ్రని స్తింశు శౌ

ర్యాలంకారు సువర్హవర్డు ఘను గర్జాఖ్యున్‌ జగత్మర్హపూ

ర్థాలోలద్దుణుం జూచి చూపబు ప్రభూతాశ్చర్యు లై రచ్చటన్‌. 31 ప్రతిపదార్థం: అచ్చటన్‌; సాల, (ప్రాంశు= మద్దిచెట్టువలె పొడ వైనవాడిని; నిజ+ఉల్‌+జ్బలత్‌+కవచు= సహజమై మిక్కిలి (ప్రకాశిస్తున్న కవచం గలవాడిని: శశ్చత్‌+కుండల+ఉద్భాసితున్‌= శాశ్ళ్యతాలయిన కుండలాలతో గొప్పగా వెలుగుతున్నవాడిని; బాల+అర్క; ప్రతిమున్‌= బాలసూర్యుని పోలిన వాడిని; శర+ఆసన, ధరున్‌= ధనుస్సును ధరించినవాడిని; బద్ద+ఉగగ్ర, నిస్తీంశు= కట్టబడిన భయంకరమైన ఖడ్గం కలవాడిని; శౌర్య+అలంకారుణ శౌర్యమే అలంకారంగా కలవాడిని; సువర్ష్శ వర్జున్‌= బంగారువన్నెకలవాడిని; ఘనున్‌= గొప్పవాడిని; జగత్‌+కర్త, పూర్ష+ఆలోలత్‌+గుణున్‌= లోకంయొక్క చెవులలో నిండి, వ్యాపిస్తున్న గుణాలు కలవాడిని; కర్ణ+ఆఖ్యున్‌= కర్టు డనేపేరు కలవాడిని; చూచి; చూపజు= చూచేవారు; పప్రభూత+ఆశ్చర్యులు+ఐరి= మిక్కిలి ఆశ్చర్యం కలవాళ్ళయ్యారు. - తాత్పర్యం: మద్దిచెట్టువలె ఎంతో ఎత్తైనవాడు, సహజ కవచ కుండలాలతో చాలా ఎక్కువగా ప్రకాళించేవాడు, బాల సూర్యుడిని పోలినవాడు, ధనుస్సును ధరించినవాడు, మొలలో భయంకర మైన కత్తిని కట్టుకొన్నవాడు, శౌర్యమే అలంకారంగా కలవాడు, బంగారువన్నెవాడు, గొప్పవాడు, లోకం చెవులలో నిండి వ్యాపిస్తున్న మంచి గుణాలు కలవాడు అయిన కర్హుడిని చూచి (ప్రేక్షకు లంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 537 విశేషం: మహాభారతంలో ఇది ఒక (ప్రసిద్ద పద్యం: నన్నయ నాటకీయ రచనకు పతాకవంటిపద్యం. హస్తినాపుర రంగ మధ్యంలో (బ్రబజ్ర పద్యం: నిన్న క ట్‌ (ప్రేక్షకులు చూచిన కర్షునిమహనీయవ్యక్తిత్వాన్ని, దీప్తిని, విజ్బంభణాన్ని పారకుల కంటికి కట్టినట్టు (వ్రాసిన ఛాయాచి(త్రంవంటి పద్యం. ఇందులోని ఉదాత్తమనోహరైలి, శార్టూలవృత్తం కర్ణుని కౌన్నత్యవిజ్బంభణలకు చక్కని ఉద్దీపకాలు. నన్నయ 'ప్రసన్నకథాకవితలో స్ట్రిరచిత్ర వర్లనశిల్పానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. 17వపద్యంలోని అర్జునుని వర్షనకు ఇది దీటుగా నిలుస్తుంది. ప్రసాదమి(శ్రిత మైన ఓజోగుణం ఈ పద్యరచనలో విభావ విస్పోరకంగా రాణిస్తున్నది. వ. కర్ణుండును జనులనందల నదల్చి చొత్తెంచి, రంగమధ్యంబున నిలిచి, కలయంజూచి, కృషద్రోణాచార్యులకు నమస్కరించి, సజలజలధరధ్వానగంభీరవచనంబుల నర్జును నాక్షేపించి యి ట్లనియె, 32 ప్రతిపదార్థం: కర్టుండును; జనులన్‌; అందరన్‌?; అదల్సి= బెదిరి తొాలగిపోయేటట్లు చేసి; చొచ్చు+తెంచి= ప్రవేశించి; రంగమధ్యంబున; నిలిచి; కలయన్‌+చూచి= అంతటా చూచి; కృప, (ద్రోణ+ఆచార్యులకు; నమస్కరించి; సజల, జలధర, ధ్వాన, గంభీర, వచనంబులన్‌= నీటితో కూడిన మేఘంయొక్క ఉరుములవలె గంభీరా లైన మాటలచేత; అర్జునున్‌= అర్జునుణ్ణి; ఆక్షేపించి= అడ్డగించి; ఇట్టు+అనియె. తాత్పర్యం: కర్టుడుకూడా (ప్రజలంతా బెదిరి తొలగిపోయేటట్టు చేసి ప్రవేశించి, రంగ మధ్యంలో నిలిచి, అంతటా కలయచూచి కృషద్రోణాచార్యులకు నమస్కరించి, నీటితో కూడిన మేఘం ఉరిమినట్టు గంభీరంగా మౌట్టాడుతూ అర్జునుడిని అడ్డగించి ఈ విధంగా అన్నాడు. విశేషం: ఇది కర్షునిచల[ద్రూపవర్లన: నన్న్మయనాటకీయరచన. కర్షుడు జనులందరిని అదల్చి ప్రవేశించటం, రంగమధ్యంలో నిల్చి కలయచూడటం, కృషద్రోణాచార్యులకు నమస్కరించటం, అర్జునునికి అడ్డంగా నిలబడి గంభీరస్వరాన మాటాడటం- భావుకు డైన పాఠకుడు చలనచిత్రంలోవలె ఈ వచనంలో దర్శించవచ్చును. "=. క. _ నీవకడునేర్చుకాండవు। గా వలవదు; వీనిం గొన్ని గఐచితి మేమున్‌ నీవిద్యలెల్లం జూపుదు । మే వీరుల సూచి మేలుమే లని పొగడన్‌. 33 ప్రతిపదార్థం: నీవు+అ= నీవే; కడు= మిక్కిలి; నేర్పుకాండవుజ నేర్చినవాడివి: కావలవదు= కానక్కరలేదు; ఏమున్‌= మేముకూడ; వీనిన్‌= ఈ విద్యలను; కొన్ని= కొన్నింటిని; కజచితిమి= నేర్చుకొన్నాము; నీ, విద్యలు+ఎల్లన్‌= నీవు చూపించినవిద్యల నన్నింటిని: వీరులు+ఆ= వీరులైనవారే; చూచి; మేలు; మేలు; అని; పొగడన్‌; చూపుదుము+ఎ=ఐ చూపుతాంకదా! తాత్పర్యం: నీవే పెద్దనేర్పరివి కానక్కరలేదు. మేముగూడ ఈ విద్యలు కొన్ని నేర్చి ఉన్నాం. నీవు చూపిన అన్ని విద్యలు - ఈసామాన్యజనులు కాదు - వీరులైనవాళ్ళు కూడా చూచి మేలు మే లని పాగడేటట్టు చూపుతాం గదా! విశేషం: ఇది నన్నయ నాటకీయ సంభాషణ. కర్టునిస్త్వభావానికి అద్దంపట్టే సంభాషణ. స్వాతిశయంవైపు మొగ్గుతున్న అతని ఆత్మ విశ్వాసాన్ని, అర్జున మాత్సర్యంవైపు మొగ్గుతున్న అతని విద్యాస్పర్హను ధ్వనింపచేయటం ఇందులో చూడవచ్చు. అధిక్షేపోక్తికి ఇదొక చక్కని ఉదాహరణం. క. _ అనిన నినతసనయుపలుకులు । జనులకు విస్యయము, సవ్యసాచికి. గోపం బును సిగ్గును, మజి దుర్యో। ధనునకుం బ్రీతియును జేసిం దత్‌క్షణమాత్రన్‌. 34 ప్రతిపదార్థం: అనినన్‌= అనిఅనగా; ఇన తనయు, పలుకులు= సూర్యునికుమారు డైన కర్ణునిమాటలు; జనులకు; విస్మయము= క్రీ జ ఆశ్చర్యాన్ని; సవ్యసాచికిన్‌= అర్జునునికి; కోపంబును= కోపాన్ని; సిగ్గును; మజి= మరియు; దుర్యోధనునకున్‌; ట్రతియును= సంతోషాన్నీ; తత్‌+క్షణ, మాత్రన్‌= ఆనిమిషంలోనే' చేసెన్‌= కలుగజేసింది.

538 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: కర్షునిమాటలు ఆ క్షణాన ప్రజకు ఆశ్చర్యాన్నీ, అర్జునునికి కోపాన్నీ, సిగ్గునూ, దుర్యోధనునికి

సంతోషాన్నీ కలిగించాయి.

విశేషం: అలం: ఉల్లేఖం. కర్టుని భుజస్పాలనం భయాన్నీ, ఆకారం చూపరులకు అద్భుతాన్నీ కలిగించాయి అనుకోని విధంగా

అతడు అర్జునుని ధిక్కరించి పలికిన మాటలు వివిధ వ్యక్తులకు వివిధ భావాలు కలిగించాయి. ప్రజలకు అసంభవమైనది

సంభవమైనట్లు ఆశ్చర్యం కలిగించాయి. తనకు ఎవ్వరూ సాటిలేరని అనుకొంటున్న అర్జునునికి కోపాన్నీ, సిగ్గును కలిగించాయి. పాండవ మధ్యమునితో దీటైన వీరుడు తన వైపు లేడని నిరాశతో ఉన్న దుర్యోధనునికి సంతోషాన్నీ కలిగించాయి.

న. అంత ద్రోణుచేత ననుజ్ఞాతుం డయి కర్టుం డర్దునుచూపిన యస్త్రవిద్యావిశేషంబులెల్ల నశ్రమంబునం జూపినం జూచి, దుర్యోధనుండు దానుం దమ్ములును గర్జునిం గౌంగిలించుకొని 'నాతో బద్ధసఖ్యుండ వయి నాకును బాంధవులకును హితంబు సేసి నారాజ్యభోగంబులను నీవును నుపయోగింపు' మనిన 'నట్ల చేయుదు' నని కర్టుం డాతనితోడి యిష్టసఖిత్వంబున కొడంబడి, 'యిమ్మూంగిన రాజలోకంబును నీవును జూడం బార్జుతో ద్వంద్వయుద్ధంబు చేయవలయు' ననిన ధార్తరాష్ట్రమధ్యంబున నున్న యక్కర్ధుం జూచి పార్గుం డిట్లనియె. 35

ప్రతిపదార్థం: అంత=అప్పుడు; ద్రోణుచేతన్‌: అనుజ్ఞాతుండు+అయి= అనుమతింపబడినవా డై; కర్టుండు; అర్జును. చూపిన;

అస్త్ర విద్యా, విశేషంబులు+ఎల్లన్‌= అ(స్త్రవిద్యలోని (ప్రత్యేకతల నన్నింటిని; అశ్రమంబునన్‌= (శ్రమలేకుండ - సులభంగా; చూపినన్‌; చూచి; దుర్యోధనుండు; తానున్‌; తమ్ములును; కర్టునిన్‌, కౌంగిలించుకొని; నాతో (దుర్యోధనుడితో): బద్దసఖ్యుండవు+అయి= కట్టబడినస్నేహం కలవాడి వై; నాకును; బాంధవులకును; హితంబు+చేసి=ఐ మేలుచేసి? నా, రాజ్యభోగంబులను; నీవును; ఉపయోగింపుము= వినియోగించుకొమ్ము; అనినన్‌= అని అనగా; అట్టు+అ= అట్లే: చేయుదును; అని; కర్టుండు; ఆతనితోడవ దుర్యోధనునితో; ఇష్టసఖిత్వంబునకు= ఇష్టమైన స్నేహానికి; ఒడంబడి= ఒప్పుకొని; ఈ+మూగిన, రాజ, లోకంబును= ఈ చేరిన రాజుల సమూహమూ; నీవును; చూడన్‌= చూస్తుండగా; పార్టుతో= అర్జునునితో; ద్వంద్వ, యుద్దంబు; చేయవలయున్‌; అనిన; ధార్తరాష్ట్ర మధ్యంబునన్‌+ఉన్న= ధృతరాష్ట్రునికుమారు. లైన కౌరవులమధ్యన ఉండే; ఆ+కర్టున్‌; చూచి; పార్టుండు; ఇట్టు+అనియొ. తాత్పర్యం: అప్పుడు (ద్రోణుడు అనుమతించగా కర్టుడు, అర్జునుడు చూపిన అ'స్తవిద్యా విశేషాలన్నీ ఆతి సులభంగా చూపాడు. ఆది చూచి దుర్యోధనుడు - తాను, తమ్ములు కర్షుడిని కౌగిలించుకొని, “నాతో చెలిమి చేసి నాకు, బంధువులకు మేలు కూర్చి, నా రాజ్యభోగాలు నీవుగూడ అనుభవించు" మని అన్నాడు. కర్షుడు అట్లే అని ఆతనితో స్నేహంచేయటానికి సమ్మతించి, “ఇక్కడ చేరిన ఈ రాజసమూహం, నీవూ చూస్తుండగా అర్జునునితో ద్వంద్వయుద్దం చేయా' లని అన్నాడు. అప్పుడు కౌరవుల మధ్య ఉండే ఆ కర్గుడిని చూచి అర్జునుడు ఇట్టా అన్నాడు. విశేషం: 'నా రాజ్యభోగంబులను నీవును నుపయోగింపుము'”' = అనే దానికి 'నన్నుం గురురాజ్యం బేలించినా యైైశ్వర్యంబు.... అనే పాఠాంతరం కొన్నిప్రతులలో ఉన్నది. మూలం:- అహం చ కురురాష్టం చ యధేచ్చ ముపభుజ్యతామ్‌ (పి.పి.యస్‌ ప్రతి, పుట. 850) - శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత (ప్రతి, పుట. 330. క. _ పిలునంగయబడక సభలకు , బలిమిం జని పలుకు పాపభాగుల లోకం

బులకుం జనవేండి పలికెదు । పలువ! యెజుంగవు పరాత్మపరిమాణంబుల్‌. 36

ఆదిపర్వము - షష్టాశ్వాసము 539 ప్రతిపదార్థం: పిలువంగన్‌+పడకజ= పీలువబడకుండ - ఆహ్వానం లేకుండా; సభలకు; బలిమిన్‌= బలంతో; చనిజ= వెళ్ళి; పలుకు= మాటాడే; పాప, భాగుల, లోకంబులకున్‌=పాపం పొందినవాళ్ళలోకాలకు, చన= వెళ్ళటానికి, వేడి= కోరి; పలికదు= మాటాడు తున్నావు; పలువ= దుర్మార్గుడా? పర+ఆత్మ, పరిమాణంబుల్‌= ఎదుటివాళ్ళయొక్క, నీయొక్క కొలదులు; ఎజుంగవు= తెలియవు తాత్పర్యం: పిలుపు లేకుండానే సభలకు బలగర్వంతో వెళ్ళి, నోటికివచ్చినట్టు మాట్లాడే పాపాత్ములు వెళ్ళే లోకాలకు (నరకాలకు) పోవాలనుకొని మాట్లాడుతున్నావు. దుర్మార్గుడా! నీవు ఎదుటివాళ్ళకొలది, నీ కొలది తెలియనివాడవు.

క. _ అనిన విని పార్టునకు ని, ట్లనియె నినాత్మజుండు 'దుర్దలాశ్వాసక్షే పనిబంధమ్ములు వలుకక : ఘననిశితాస్త్రములం బలుకం గడుయము నాతోన్‌'. 37

ప్రతిపదార్థం: అనిన; విని; ఇన+ఆత్మజుండు= సూర్యునియొక్క కుమారు డైన కర్చుడు; పార్టునకున్‌= అర్జునునితో;

ఇట్టు+అనీయె; నాతోన్‌; దుర్‌+బల+ఆశ్వాస, క్షేప, నిబంధమ్ములు= బలహీనులను ఊరడించటంకోసం కాలంపుచ్చే మాటలు; పలుకక; ఘన, నిశిత+ఆ(స్తములన్‌= గొప్ప వాడిమైన బాణాలతో; పలుకన్‌= పలకటానికి; కడగుము= (ప్రయత్నించుము. తాత్పర్యం: అర్జునుని మాటలు విని కర్షుడు - 'బలహీనులను ఊరడించటానికి చెప్పే మాటలు మాని, గొప్ప పదునైన బాణాలతో మాట్ట్లాడుము' అని పలికాడు.

విశేషం; దుర్చలాశ్వాసక్షేనిబంధమ్ములు = అనే దానికి మూలం: “సంక్షేపైః దుర్చలాశ్వాపై: శరైః కధయ భారత” -(శ్రీిమదాం(ధ్ర

మహాభారతసంశోధిత ప్రతి, పుట, 330. 'చేతకానివారికి సంతోషం కలిగించే పాల్లుమాటలు కట్టిపెట్టి వాడిబాణాలతో సమాధానం

చెప్పుము" - అని పలికిన కర్టుని వాక్యంలో అత్యంత తిరస్కృతవాచ్యధ్వని ఉన్నది. బాణాలతో పలకటం - అనేది లక్ష్యార్హవిశేషం.

'అర్జునా! నీ వలెనేను వాచాశూరుడిని కాదు. కార్యహరుడిని. మాటలతో కాలం వ్యర్థం చేయక చేతనైతే యుద్దం చేయుము' అన్నది

కర్ణుని అధిక్షేపం,

క ఈ రంగభూమి యస్త్రవి । శారదు లగువారి కెల్ల సామాన్యముగా కారయ వీరికింజొర నగు । వీరికింగా దను విచారవిషయము గలదే?. 38

ప్రతిపదార్థం: ఆరయజ విచారిస్తే ఈ, రంగ, భూమి; అస్త్ర విశారదులు+అగు వారికి+ఎల్లజ అస్రాలలో నేర్పురులైనవారి

కందరికి; సామాన్యము, కాక= సమానం కాకుండా; వీరికిన్‌; చొరన్‌+అగు= ప్రవేశించవచ్చు; వీరికిన్‌; కాదు+అను= (ప్రవేశించకూడ దనే; విచార, విషయము= ఆలోచించదగిన అంశం; కలదే= ఉన్నదా?

తాత్పర్యం: విచారించి చూస్తే ఈ రంగభూమి అసస్త్రవిద్యావేత్త లందరికి సమానం గాకుండ- వీళ్ళకు ప్రవేశం

ఉన్నది, వీళ్ళకు ప్రవేశం లేదు అని విచారించవలసింది ఏమైనా ఉన్నదా?

వ. _ అని గర్వించి దుర్యోధనానుమతంబునం బార్జుతో ద్వంద్వయుద్ధంబు సేయంబూని రణసన్నద్దుం డయి రవితనయుండు రంగమధ్యంబున నున్నంత, నర్గునుండును నాచార్యభ్రాతృచోదితుం డై యుగాంఖ కాలానలుండునుంబోలిం బ్రతిఘటించి నిలిచిన.

ప్రతిపదార్థం; అని; గర్వించి; దుర్యోధన+అనుమతంబునన్‌= దుర్యోధనునియొక్క అనుమతితో: పార్భుతోజ అర్జునునిత

ద్వంద్వయుద్ధంబు= ఇద్దరు ఒకరితో ఒకరు చేసేయుద్ధం; చేయన్‌: పూని= ప్రయత్నించి: రణ, సన్నద్దుండు+అయి= చ

కోసం బాగా సిద్ధమైనవా డై; రవి, తనయుండు= సూర్యునియొక్కకుమారు డైన కర్షుడు; రంగమధ్యంబునన్‌; ఉన్న+అంతన;

అర్జునుండును; ఆచార్య, (భ్రాతృ చోదితుండు+ఐ= గురువులచేత, సోదరులచేత పురికొల్పబడినవాడై; యుగ+అంత, కాల+అనలుండునున్‌, పోలెన్‌= ప్రళయకాలంలోని అన్నివలె; ప్రతిఘటించి= ఎదిరించి; నిలిచిన,

540 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: అని కర్షుడు గర్వపడి దుర్యోధనుని అనుమతితో - అర్జునునితో ద్వంద్వయుద్దం చేయటానికి సిద్దమై రంగమధ్యంలో ఉండగా, గురువులచేత, సోదరులచేత (ప్రేరేపించబడినవా డై అర్జునుడు ప్రళభయకాలాన్ని వలె ఎదిరించి నిలునగా. విశేషం: కర్టుడు రంగప్రవేశం చేయగానే కురుకుమారులు రెండు వర్గాలుగా చీలిపోవనటం కళ్ళకు కట్టినట్టు అందరికి అగుపించింది. కర్ణునికి మిత్రుడు, గురువు, దైవం అన్నీ దుర్యోధనుడే, అర్జునునికి గురువులు, సోదరులు మార్గదర్శకులు. పాండవులకు పెద్దలున్నారు. దుర్యోధనుడు తనకు తానే పెద్ద, అర్జునునిది ధర్మనిర్ణ్మయం. కర్షునిది, దుర్యోధనునిది స్వయం నిర్ణయం. ఇకముందు కథలో ఈధోరణి ఇంతే. భావి కురుకుమార విభేద (క్రమానికి ఇది నాంది. కర్ణార్దునుల ద్వంద్వయుద్దము (సం.1-126-23)

ను. జనితామర్నణుం డంత బార్జుపయిం బర్జన్యాస్త్ర మక్కర్లుం డే

సె; నపారం బయి భూనభోంతరము. దజ్జీమూతయూధంబు గ

చనుం డాత్మద్యుతి విస్తరించె సుతుపై సంప్రీతచేతస్కుం డై. 40 ప్రతిపదార్థం: జనిత+అమర్హ్షణుండు= పుట్టబడినకోపం గలవాడు; ఆ+కర్ణుండు; అంతన్‌= అప్పుడు; పార్టు పయిన్‌= అర్జునునిమీది: పరన్య+అఆ(స్తము= మేఘా'స్తాన్ని; ఏసెన్‌= వేశాడు; తత్‌+జీమూత, యూధంబు= దానియొక్కమేఘాలసమూహం; అపారంబు+అయి=, హద్దు లేని దై భూ, నభః+అంతరమున్‌= భూమ్యాకాశాల మధ్య ప్రదేశాన్ని; కప్పినన్‌= కప్పివేయగా; బీభత్సుండు= అర్జునుడు; తత్‌+ధ్వాంత, తిరోహిత+అపఘనుండు+ఐ= ఆ చీకటిచేత మరుగుపడినదేహం కలవా డై; ఉండెన్‌; విరోచనుండు= సూర్యుడు; సంప్రీత, చేతస్కుండు+ఐ=ఐ మిక్కిలి ఆనందించిన మనస్సు కలవాడై; ఆత్మ, ద్యుతి= తన యొక్క కాంతిని; సుతుపై=ఐ కుమారుని (కర్ణుడి) మీద; విస్తరించెజ ప్రసరించాడు. తాత్పర్యం: కర్షుడు కోపంతో అర్జునునిమీద మేఘా'స్తాన్ని ప్రయోగించాడు. అంతులేని మేఘసమూహం భూమ్యాకాశ మధ్యప్రదేశాన్ని కప్పివేయగా అర్జునుడు ఆ చీకటిలో మరుగుపడిపోయాడు. సూర్యుడు సంతోషించి కుమారు డైన కర్ట్షునిమీద తన కాంతిని ప్రసరించాడు. విశేషం: తద్ద్వాంత తిరోహితాపఘను డై బీభత్సు డుండెన్‌ - అనేదానికి - తద్దాంతము వాయ వాయుశరముం బీభత్సు డేసెన్‌

  • అనేపారాంతర మున్నది. మూలం: మేఘచ్చాయోపగూఢస్తు తతోదృశ్యత పాండవ: సూర్యాతప పరిష్టుక్త కర్ణో2పే సమదృశ్యత. -క్రీమదాంధ్రమహాభారతసంశోధిత(ప్రతి. పుట. 331. వ. అయ్యవసరంబున దుర్యోధనుందొట్టి ధృతరాస్త్రందనులందణజు. గర్భువలన నుండిరి; భీష్యద్రోణకృప

పాండవులు పార్థువలన నుండి రంత. తే ప్రతిపదార్థం: ఆ+అవసరంబున= ఆ సమయాన; దుర్యోధనున్‌+తొట్టి= దుర్యోధనుడు మొదలుకొని, ధృతరాష్ట్ర నందనులు+ అందటున్‌; కర్టువలనన్‌= కర్ణునివైపు; ఉండిరి; భీష్మ, ద్రోణ, కృప, పాండవులు, పార్టువలనన్‌= అర్జునునివైపు; ఉండిరి; అంత. తాత్పర్యం: ఆ సమయంలో ఒకవైపు దుర్యోధనుడు మొదలు ధృతరాష్ట్రుని కొడుకులంతా కర్టుని పక్షంలో నిలిచారు. మరొకవైపు భీష్ముడు, ద్రోణుడు, పాండవులు అర్జునుని పక్షంలో నిలిచారు. అప్పుడు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము క్‌] క. _ రవిసుతపార్ణులఘోరా।; హవమునకును వెలఅచుచున్నయది కుంతి తదు గ్ధవఘనతరశరతిమిరౌ | ఘవృతాంగు. దనూజుం జూడం గానక వంతన్‌. 42 (ప్రతిపదార్థం: రవిసుత, పార్టుల, ఘఫోర+శఆహవమునకును= కర్ణార్డునులయొక్క భయంకర మైన యుద్దానికి; వెజచుచు+ఉన్న, అది కుంతి= భయపడుతున్నటువంటి కుంతీదేవి; తత్‌+ఉద్భవ, ఘనతర, శర, తిమిర+ఓఘ, వృత+అంగున్‌= దానినుండి పుట్టిన చాలాగొప్పదైన బాణంవలన కలిగిన చీకట్ల సమూహంచేత కప్పబడిన దేహం గలవాడిని; తనూజున్‌= కుమారుడిని, అర్జునుని; చూడన్‌*కానకన్‌= చూడలేక; వంతన్‌= దిగులుతో. తాత్పర్యం: కర్ణార్డునుల ద్వంద్వయుద్దం చూచి భయపడుతున్న కుంతి, కర్టునిపర్దన్యాస్తం (మేఘాస్తం) వలన కలిగిన చీకట్ట సమూహంచేత కప్పబడి అర్జునుడు అగుపించకపోగా అప్పుడు. క. _ ధృతి దటింగి మోహమూర్దా। న్విత యైనను సంభ్రమించి విదురుండు ప్రత్యా గతజీవ6 జేసి నప్పడ । యతిశీతల చందనోదకాసేకమునన్‌, 43 (ప్రతిపదార్ధం: ధృతి= ధైర్యం; తజిగి= తగ్గి; మోహ, మూర్చా+అన్విత+ఐనను= మోహంవలన, మూర్చతో కూడుకొన్నది కాగా; విదురుడు; సంభ్రమించి= త్వరపడి? అప్పుడు+అజ అప్పటికప్పుడే; అతి, శీతల, చందన+ఉదక+ఆసేకమునన్‌= మిక్కిలి చల్లని గంధపునీళ్లను చల్లటంచేత; (ప్రతి+ఆగత, జీవన్‌= మరలివచ్చిన ప్రాణం గలదాన్నిగా; చేసెన్‌: తాత్పర్యం: ధైర్యం తగ్గి, మోహంతో కుంతిదేవి మూర్చిల్లగా, విదురుడు వెంటనే చల్లని గంధపునీళ్లను చల్లి ఆమెకు ప్రాణం మళ్ళీ వచ్చేటట్టు చేశాడు. విశేషం: కుంతీదేవి పుత్రవాత్సల్యాన్ని వ్యక్తంచేయటంలో ప్రదర్శించే ఉద్విన్నప్రవృత్తిని ఈ సన్నివేశం మరొకసారి ధ్వనింప చేస్తున్నది. మూర్చ అన్నది సాత్షికభావం వంటిది. వాత్సల్యం హర్షంతో ఉప్పాంగితే పాలధారలు, ఆనందబాష్పాలు (21వ పద్యం); భయభావంతో ఉప్పాంగితే మూర్చిల్లటం - అనేవి ఆమె సాత్తికచేతనను వ్యక్తంచేస్తున్నాయి. వస్తుధ్వనిని రసధ్వనికి అంగంగా పోషించే కధాకధనళిల్ప మిది. (సంపాఎ జి గ్‌ నంత వ. అంత నర్జునుం దనిలబాణంబున నమ్మేఘపటలంబు పఅవనేసి యాదిత్యసమతేజుం డేయి యుందో అ నంద్వ విదురదర్శితు లైన యక్కర్ణార్డునులం జూచి కుంతి సంతసిల్లె; నపుడు ధర్మవిదుం దఖి శ స నకి ౦ యుద్ధసమాచారనిపుణుండు కృపాచార్యుం డయ్యిద్దజ నడువు నిలిచి కర్టున కి ట్లనియె. క లమమాం ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు: అర్జ్హునుండు; అనిల, బాణంబునన్‌= వాయవ్యాస్తంచేత; ఆ+మేఘ, పటలంబున్‌= ల్‌ మాం సమూహాన్ని; పజవన్‌+ఏసి= పారిపోయేటట్టు కొట్టి; ఆదిత్య, సమ, తేజుండు+అయి= సూర్యునితో సమాన మైన కాంట చంది! ఉండెన్‌; అంత= తర్వాత: విదుర, దర్శితులు+ఐనజ= విదురునిచేత చూపబడినవా రైన; ఆ+కర్ష+అర్జునుల మ నిపులు ండు= సంతసిల్లై= సంతోషించింది; అపుడు; ధర్మ, విదుండు= ధర్మం తెలిసినవాడు; అఖిల, ద్వంద్వ, యుద్ధ, సమా శ్‌ క్ష కరునకు; అన్ని దృ్వందృయుద్దాలను చక్కగా నడపటంలో నేర్పరి అయినవాడు; కృపాచార్యుండు; ఆ+ఇద్దజ, నడుము అం? ఇట్టు+అనియె.

ల సూర్వునివలె తాత్పర్యం; అప్పు డర్జునుడు వాయవ్యాస్తాన్ని ప్రయోగించి ఆ మేఘ సమూహాన్ని పారదోలి ధ రీ డు వెలుగుతూ నిలిచాడు. విదురుడు చూపిస్తే ఆ కర్గార్హునులను కుంతి చూచి సంతోషించింది. ధర్మజ్ఞల, ద్వంద్వయుద్దాలను చక్కగా నడపటంలో నిపుణుడు అయిన కృపాచార్యుడు ఆ కర్ణార్టు కర్ణునితో ఇట్టా అన్నాడు.

542 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: కర్ణార్టునులిద్దరికీ తల్లి కుంతి, వాళ్ళిద్దరి ద్వంద్వయుద్దం చూచి జనులంతా పొందే స్పందన ఒకయెత్తు; ఆ తల్లి పొందే స్పందన ఒకయెత్తు అని కధన శిల్పం చెపుతున్నది. కర్టుని మేఘా(స్తం వలన అర్జునుడు కప్పివేయబడటం చూచి ఓర్చుకోలేక మూర్చితురాలైంది. మబ్బులువీడినతరువాత అర్జ్హునుడినిచూచి ఆనందించింది. అర్జునుడు లోకానికి తెలిసిన కుంతికొడుకు, కర్టుడు తెలియనికొడుకు. ఇద్దరిని చూచి రెండుకన్నులతో సంతోషించటం సార్ధకం. ఈ సన్నివేశం భావికధలో పాండవులను కర్ణుడు చంపుతాడేమో అన్న భయంతో ఆమె అతడిని రహస్యంగా వరంకోరే ఘట్టానికి బీజప్రాయంగా భాసిస్తుంది. చ. కురుకులజుండు పొండునకుం గుంతికి. బుత్తుండు, రాజధర్మబం

ధురచరితుండు; నీవితనితోడ రణం బొనరించెదేని వి

స్తరముగ నీదునంశమును దల్లిని దండ్రిని జెప్పు; చెప్పెనన్‌

దొరయగుదేని నీ కెదిరి దోర్టలశక్తి నితండు సూపెడిన్‌. శతక ప్రతిపదార్థం: కురు, కులజుండు= కురువంశంలోపుట్టినవాడు; పాండునకున్‌= పొండురాజుకు; కుంతికిన్‌; పుత్రుండు; రాజ, ధర్మ బంధుర చరితుండు= రాజధర్మంచేత ఒప్పిన నడవడి కలవాడు; నీవు; ఇతనితోడ; రణంబు= యుద్దం; ఒనరించెదు+ఏని= చేసేటట్టయితే; విస్త్యముగ= వివరంగా: నీదు, వంశమును; తల్లిని; తండ్రిని; చెప్పు; చెప్పినన్‌= అట్లా చెప్పితే; దొర+అగుదువు+ఏని= సమానుడ వైతే, క్షత్రియుడవైతే' ఇతండు= ఈలఅర్హునుడు; నీకు+ఎదిరి= నీకు ఎదురు నిలిచి; దోః+బల, శక్తిన్‌= భుజ బల శక్తిని; చూపెదీన్‌= చూపగలడు. తాత్పర్యం: అర్జునుడు కురురాజ వంశంలో పుట్టినవాడు. పాండురాజుకు, కుంతీదేవికి పుత్రుడు. రాజధర్మంచేత ప్రకాశించే ప్రవర్తన కలవాడు. నీవు ఇతనితో యుద్దం చేయదలిస్తే నీ వంశాన్నీ, తల్లిదండ్రులనూ వివరంగా చెప్పుము. సమానుడ వైతే ఇతడు ని న్నెదిరించి భుజశక్తి చూపిస్తాడు. విశేషం: శబ్దశక్తిమూలధ్వనికి ఈ పద్యం అమూల్యోదాహరణం. "కృపాచార్యుడు పలికిన వాక్యాలలో 'కుల', 'రాజు', 'దొర'- అనే మూడు శబ్దాలు సాభిప్రాయాలు. కులమంటే వంశమనీ, వర్షమనీ రెండర్జాలున్నాయి. అర్జునుడు కురువంశానికీ, వాళ్ళకులానికీ (క్షత్రియవర్లం) చెందినవాడు; రాజశబ్దానికి రాజ్యంచేసేవాడనీ, క్షత్రియు డనీ అర్జా లేర్చడతాయి. వంశాన్ని తల్లిని తండ్రిని పేర్కొని నీవు దొరవు(క్షత్రియుడవు, రాజువు, సమానమైనవాడవు)గా నిరూపించుకొనుమని కృపాచార్యుడు కర్ణుడిని అడిగాడు. దొర శబ్దంలోని ప్రభువు అనే అర్జాన్ని (గ్రహించి దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యాధిపతిని చేస్తాడు. పరా[క్రమంలో అర్జునునితో కర్షుడు సమాన మని సూచించాడు. తల్లిదండ్రులు, కులం అనే అంశాలను శూరులపట్ట పట్టించుకొనకూడ దని వాదించాడు. “అనిలజి అని భీముడిని ఎత్తిపొడిచాడు. ఈ పద్యంలోని రమణీయ మైన వ్యంగ్యార్హమంతా 'దొర' అనే శబ్దప్రయోగంమీద ఆధారపడి ఉన్నది. ప్రభువనే అర్ధం వాచ్యంలో, సమానుడనే అర్ధం వ్యంగ్యంలో స్పురిస్తుంది. 'వివాహళ్ళ వివాదళ్ళ సమయోరేవ శోభతే” అనే న్యాయం ధ్వనిస్తుంది. భావికథకు అదే మూల మౌతుంది. కాబట్టి ఇది శబ్దశక్తిమూలద్వని. చమత్కార మేమంటే పరితకు కర్టుడి తల్లిదండ్రులసంగతి తెలుసు. సన్నివేశంలో ఉన్నవారికి తెలియదు కర్టునిస్థితి పరితలో సానుభూతిని రేకెత్తిస్తుంది. ఇది రసవిషయక మైన రహస్యం. (సంపా) వ. అనిన విని కర్ణుండు దనకులంబును దల్లిదందడ్రులను జెప్ప సిగ్గువడి తలవాంచి యున్నం జూచి

దుర్యోధనుండు గృపున కి ట్లనియె, డే6 (ప్రతిపదార్థం: అనిన; విని; కర్టుండు; తన, కులంబును; తల్లి, దండ్రులను; చెప్ప= చెప్పటానికి; సిగ్గు, పడి; తలవాంచి= తలను వంచి; ఉన్నన్‌; చూచి; దుర్యోధనుండు; కృపునకు; ఇట్టు+అనియె.

ఆదిపర్వము - షస్టాశ్వాసము 543 తాత్పర్యం: అనగా విని కర్షుడు తన కులాన్నిగురించి, తల్లిదండ్రులనుగురించి పెప్పటానికి సిగ్గుపడి, తలవంచుకొని ఉండగా చూచి దుర్యోధనుడు కృపాచార్యునితో ఈ విధంగా అన్నాడు. విశేషం: కర్టుడు తాను సూతనందనుడ ననీ, రాధేయుడ ననీ చెప్పటానికి సిగ్గుపడి ఊరుకొనటమే (ప్రకరణౌచిత్యం. ఆత డెవరి కొడుకో పరితకు తెలుసు. పెంచిన తండ్రిని తండ్రిగా చెప్పుకొనటం అవమానంగా భావించా డని తలంచటం ఉచితం కాదు. తనను పెంచిన తల్లిదండ్రులు వంశ గౌరవంలో కుంతీపొండురాజులతో సమానులు కారని చెప్పటం కర్ణునికి ఇష్టం లేదు. అందువలన సిగ్గుపడి ఊరుకొన్నాడు.

క. _ కులముగలవాండు, శౌర్యము । గలవాండును, నధికసేన గలవాడును, భూ

తలమున రాజనునామము ; విలసిల్లంగం దాల్చు మూఃడు విధముల పేర్షిన్‌. త ప్రతిపదార్థం: కులము, కలవాండు; శౌర్యము, కలవాండునున్‌= పరాక్రమం కలవాడును; అధిక, సేన, కలవాండును= ఎక్కువసేన కలవాడును' భూతలమున= భూమిమీద; పేర్మిన్‌= గొప్పగా? మూడు విధముల; రాజు+అను, నామముజ= రాజు అనే పేరును; విలసిల్లంగన్‌= ఒప్పుగా' తాల్చు= ధరిస్తాడు.

తాత్పర్యం: కుల మున్నవాడు, శౌర్య మున్నవాడ), అధిక సేనా బల మున్నవాడు భూమిమీద మూడు విధాల జ్‌, =,

రాజనే పేరు గొప్పగా పెట్టుకొంటున్నాడు.

విశేషం: కృపాచార్యుడు పేర్కొన్న 'దార' అనే పదానికి రూఢిలో ఉన్న అర్జ్రాలు చెప్పి కర్టుని దొరతనాన్ని నిలపటానికి దుర్యోధనుని

(ప్రయత్నం ఇది.

తే. రాజవరుందైన పార్థుతో రాజు గాని యీతండని సేయంణా దగందేని వీని నెల్లవారును జూడంగ నీక్షణంబ ; రాజు. జేసిద నే నంగరాజ్య మిచ్చి. 48

(ప్రతిపదార్హం: రాజ వరుండు+ఐన, పార్టుతో= రాజులలో (శ్రేష్టు డైన అర్జునునితో; రాజు, కాని, ఈతండు= రాజు కానట్టి ఈ

కర్ణుడు; అని= యుద్దం; చేయంగాన్‌= చేయటానికి; తగండు+ఏని= తగనివా డైతే; వీనిన్‌= ఈ కర్చుడిని; ఎల్ల, వారును=

అందరును" చూడంగన్‌; అంగరాజ్యము+ఇచ్చి: నేను; రాజున్‌+చేసెద= రాజుగా చేస్తాను.

తాత్పర్యం: రాజగ్రేష్టు డైన అర్జునునితో - రాజు కానట్టి ఈ కర్షుడు యుద్దం చేయటానికి తగని వాడైతే అందరూ

చూస్తుండగా ఇతనికి నేను అంగరాజ్య మిచ్చి రాజుగా చేస్తాను.

దుర్యోధనుడు కర్ణుని నంగరాజ్యమున కభిషిక్తుం జేయుట (సం.1-126-36)

వ. అని యప్పుడ భీష్మదృతరాష్తులకుం జెప్పి వారి యనుమతంబున మహా మహీసుర సహస్రంబునకు గోసహస్రాయుతంబు దానంబు సేసి 'యంగరాజ్యంబునకు వీ. దర్హుం డయ్యెడ'మను బ్రాహ్మాణవచనంబు వడసి, కర్టుం గాంచనపీరంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసిన గర్జుండును మణిమకుట కేయూర హారాది భూషణ భూషితుం డై సకల రాజ చిహ్నంబుల నొప్పి పరమ హర్షంబుతోడం గురుపతి కిట్లనియె. 49

ప్రతిపదార్థం; అని; అప్పుడు=ఐ అప్పటికప్పుడే; భీష్మ ధృతరాష్రులకున్‌; చెప్పి: వారి, అనుమతంబున= వారిఅనుమతితో;

మహామహిసుర, సహ్రంబునకు= ఉత్తములయిన బ్రాహ్మణులు వేయిమందికి; గో సహస్ర+అయుతంబు= గోవులువేయింటితో

య! శ్రీమదాంధ్ర మహాభారతము కూడినదైన; దానంబు; చేసి; అంగ, రాజ్యంబునకు; వీండు= ఈతడు - ఈ కర్ణుడు; అర్హు ౦డు+అయ్యెడమ= తగినవాడు అయ్యెడుగాక; ఆను; (బ్రాహ్మణ, వచనంబు= బ్రాహ్మణులయొక్క మాట; పడసి= పొంది; కర్దున్‌; కాంచన, పీరంబునన్‌= బంగారు సింహాసనంమీద; ఉనిచి= ఉంచి; అంగ, రాజ్యమునకు; అభిషిక్తున్‌; చేసిన్‌; కర్టుండును: మణి, మయ, మకుట. కేయూర, హార+అది, భూషణ, భూషితుండు+ఐజ= మణులతో నిండిన కిరీటం, భుజకీర్తులు, దండలు మొదలయిన సొమ్ములతో అలంకరింప బడిన వాడై; సకల, రాజ, చిహ్నంబులన్‌= అన్నివిధా లైన రాజలాంఛనాలతో - అంటే అన్ని విధా లైన రాచరికపు గుర్తులతో; ఒప్పి; పరమ, హర్షంబుతోడన్‌= మిక్కిలిసంతోషంతో; కురుపతికి= దుర్యోధనునికి; ఇట్టు+అనెను= ఈ విధంగా చెప్పాడు. తాత్పర్యం: దుర్యోధనుడు ఆ విధంగా పలికి, అప్పటి కప్పుడే భీష్మ ధృతరాప్ర్రలకు చెప్పి- వాళ్ళ అనుమతితో వేయి మంది (బ్రాహ్మణోత్తములకు గో దానా లిచ్చి, ఆ (బ్రాహ్మాణులచేత అంగరాజ్యానికి కర్టుడు అర్హు డయ్యెడు గాక అని ఆశీర్వదింపజేసి, బంగారు సింహాసంమీద కర్టుడిని కూర్చుండబెట్టి అంగరాజుగా అతడిని అభిపేకించాడు. కర్టుడు మణిమయ కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, అనేక విధా లైన ఆభరణాలతో, సకల రాజలాంఛనాలతో శోభిల్లి మహానందంతో దుర్యోధనునితో ఇట్లా అన్నాడు. విశేషం: దుర్యోధనుడు చేసిన ఈ మహోపకారమే కర్ణుని జీవితాన్నీ మహాభారతకధనూ మలుపు తిప్పింది. సూతసుతుడిని అంగరాజుగా మార్చింది. జీవితాంతం కృతజ్ఞతా భావబంధంతో కర్ణుడిని కొరవ పక్షానికి కట్టివేసింది. అర్జునునికి సమాను డైన విలుకాడు తన పక్షాన ఉన్నా డన్న ఆత్మవిశ్వాసాన్ని సుయోధనునిలో పెంచింది. క. బృహదబ్ధిమేఖలాఖిల। మహీతలక్షత్రవరసమక్షమున మహా

మహిమాన్వితుంగా నన్నును ; మహీశుంా జేసి తతిసమర్థత వెలయన్‌. 50 (ప్రతిపదార్థం: బృహత్‌=అబ్బి, మేభలా+అఖిల, మహీతల, క్షత్ర, వర, సమక్షమున= మహాసముద్రాన్ని మొలనూలుగా గల సమస్త భూమండలంలోని రాజశ్రేష్టులయొక్క ఎదుట; అతి, సమర్హత= మిక్కిలి నేర్పు; వెలయన్‌= ప్రకాళశించగా;? నన్నును; మహా, మహిమ+అన్వితుగా= మిక్కిలిగొప్పతనంతో కూడుకొన్నవాడినిగా; మహీ+-ఈశున్‌+కాన్‌= భూపతిని అగునట్టుగా - అంటే రాజగునట్టుగా; చేసితి= చేశావు. తాత్పర్యం: మహాసముద్రాన్ని మొలనూలుగా (ఒడ్డాణంగా) గల సమస్త భూమండలంలోని రాజశ్రేష్టుల సమక్షంలో మిక్కిలి నేర్పు మెరయ న న్నెంతో గౌరవించి రాజుగా చేశావు. క “దీనికి సదృశముగా మటి । యే నేమి యొనర్తు నీకు నిష్టం?' బనినన్‌

'మానుగ నాతోంజెలిమి మ । హీనుతముగం జేయు; మిదియ యిష్టము నాకున్‌.” క్‌1 ప్రతిపదార్థం: దీనికి= ఈ గొప్ప ఉపకారానికి; సదృశముగా= సమానంగా; మజీ= మరల; ఏను= నేను; ఏమి; ఇష్టంబు= ఇష్టమైన దానిని; ఒనర్హుజ చేస్తాను; అనినన్‌= అని అనగా; మానుగ= ఒప్పుగొ; నాతోన్‌; చెలిమి= స్నేహం; మహీ, నుతముగన్‌= లోకం కొనియాడేటట్టుగా; చేయుము; నాకున్‌; ఇదియ; ఇష్టము. తొత్సర్యం: “నీవు చేసిన ఈ మహోపకారానికి సమానంగా నేను నీ కిష్టమైంది ఏంచేయగలను'- అని కర్షు డడుగగా, 'లోకం కొనియాడేటట్టు నాతో స్నేహం చేయుము; ఇదే నా కిష్టం అని దుర్యోధను డన్నాడు. విశేషం; ఏ ముహూర్తంలో “నాతో చెలిమి మహీనుతముగా' చేయు మని దుర్యోధనుడు కర్దుడిని కోరాడో - ఏ ముహూర్తంలో కర్ణుడు దుర్యోధనునితో చెయ్యి కలిపాడో - వాళ్ళమైత్రి మహీనుతమే అయింది. మహాభారతంలో అతి ప్రధానపాత్ర

ఆదిపర్వము - షష్టాశ్వాసము ర్‌శీర్‌ నిర్వహించింది. కర్ణుని స్వామిభక్తి లోకం కొనియాడదగిందే. కాని, అది ఆంజనేయుని స్వామిభక్తి వంటిది కాదు. కర్ణునిస్వామిభక్తి కృతజ్ఞతారూపం. ఆంజనేయుని స్వామిభక్తి శ్రీరామ సుగుణ పరవళశతా రూపం; స్వార్ధ రహితం.

వ. అనిన విని దుర్యోధనున కెంతయు సంతోషంబుగాం గర్గుం దతనితోడి యిష్ట సఖిత్వంబున కొడంబడియె; నంత గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్షపరవశుం డయి సూతుండు రథంబు డిగ్గి కర్టునొద్దకుం బజతెంచినం గర్హుండును బిత్యగౌరపంబున సంభ్రమించి వానికి వినయవినమితోత్తమాంగుం డయిన. 52

వ్రతిపదార్హం: అనిన; విని; దుర్యోధనునకు; ఎంతయు= మిక్కిలి; సంతోషంబుగాన్‌; కర్టుండు; అతనితోడి; ఇష్ట సఖిత్వంబునకు= ఇష్టమైన స్నేహితుడుగా ఉండటానికి; ఒడంబడియెన్‌= ఒప్పుకొన్నాడు; అంతన్‌= అప్పుడు; కొడుకు, రాజ్య+ అభిషేక+ఉత్సవంబు; చూచి; సూతుండు= రధంనడిపేవాడు - అధిరథుడు - కర్చుడినిపెంచినతండ్రి; హర్ష పరవళుండు+అయి= సంతోషంతో మై మరచినవా డై; రథంబు, డిగ్గి= రధంనుండి దిగి; కర్ణు+ఒద్దకున్‌= కర్టునిదగ్గరకు; పజతెంచినన్‌= పరుగెత్తి రాగా; కర్ణుండును; పితృగౌరవంబున= తండ్రి మీది భక్తిచేత; సంభ్రమించి= వేగిరపడి; వానికిజఐ ఆ సూతునికి; వినయ, వినమిత+ఉత్తమ+అంగుండు= వినయంచేత (అడకువచేత) వంగినళిరస్సు కలవాడు: అయిన,

తాత్పర్యం: అని దుర్యోధను డనగా, ఎంతో సంతోషంతో కర్చు డాతనికి ప్రియమి(త్రుడుగా ఉండటానికి

అంగీకరించాడు. అప్పుడు కుమారుని అంగరాజ్యాభిషేకోత్సవాన్ని చూచి అధిరథుడు రథం దిగి పరుగుపరుగున

కర్ణుని దగ్గరకు రాగా, కర్షుడుకూడ తండ్రిమీది గౌరవంతో త్వరత్వరగా లేచి వినయంతో శిరస్సువంచి గో ళం

నమస్కరించాడు.

విశేషం: ఇది తండ్రికొడుకుల జీవితంలో ఒక రసోజ్జులమైన సన్నివేశం.

తే. కడంగి సూతుండు పుత్రకుం గౌంగిలించి । కొని తదీయమూర్థాఘ్రాణ మొనరం జేసి యంగరాజ్యాభిషేకార్థ మైన శిరముం। దడిపె వెండియు హర్షాకశ్రుతతుల నొప్పు 53

ప్రతిపదార్థం: సూతుండు= అతిరధుడు; కడం[= ప్రయత్నించి; పుత్రకున్‌= ప్రియకుమారుడిని; కౌగిలించుకొని; తదీయ,

మూర్హ+ఆ(ఘ్రాణము= అతనియొక్క తలను మూర్కొనటాన్ని; ఒనరన్‌= ఇంపుగా, 'ప్రియమార; చేసి; అంగ*రాజ్య? అభిషేక+ఆర్రము+ఐన= అంగరాజ్యానికి అభిషేకించటంచేత తడిసిం దైన; శిరమున్‌= తలను; వెండియు= మళ్ళీ; హర్షఅ్రు, తతులన్‌= ఆనంద బాప్ప సమూహాలచేత; ఒప్ప= అందంగా; తడీపె= తడిపాడు.

తాత్పర్యం: అధిరధుడు ప్రయత్నించి పుత్రుడిని కౌగిలించుకొని ప్రియమార అతని తలను మూర్కొని

అంగరాజ్యాభిషేకంచేత తడిసిన ఆతని తలను మళ్ళీ తన అనందా(శ్రువులచేత తడిపాడు.

ళ్‌

విశేషం: కర్షుడు తన కుమారుడే అయినా ఇప్పు డతడు అంగరాజు. ఇప్పుడు అతడిని ఇదివరకటివలె కాగిలించుకొనటం ఎట్లా? పైగా ఎవ రేమనుకొంటారో? అందుచేతనే కాబోలు 'కడగి' సూతు డాతడిని కౌగిలించు కొన్నా డని చెప్పటం,

5్‌శీ

వ. దానిం జూచి భీముండు గర్జుని సూతకుల సంభవుంగా నెజింగి నగుచు ని ట్లనియె. క్‌

ప్రతిపదార్హం: దానిన్‌+చూచి= అధిరధుడు కర్ణుడిని కౌగిలించుకొనటాన్ని చూచి; భీముండు; కర్గుని; సూత, కుల, సంభవున,

కాన్‌= సూతకులంలో (రధంనడిపేవారికులంలో) పుట్టినవాడినిగా; ఎజింగి= తెలిసికొని; నగుచు= నవ్వుతూ; ఇట్టు+అనియె.

ఆ కి తాత్పర్యం: అధిరధుడు కర్ణుడిని కౌగిలించుకొనటం గమనించి, అతడు సూత కులంలో పుట్టినవాడని తెలిసికొని, అవహేళనగా నవ్వుతూ ఈ విధంగా అన్నాడు.

క5్‌డ్తగ్ర శ్రీమదాంధ్ర మహాభారతము

క. _ నీదు కులమునకుందగంగం బ్ర; తోదము గొని రధము గడపం దొర(గుము నృపధ ర్మోదయుం డగు నర్జునుతో.। గాదనక రణంబు సేయరా నీ కగునే?. 55

(ప్రతిపదార్థం: నీదు, కులమునకున్‌; తగంగన్‌= తగినట్టు; ప్రతోదము, కొని= మునికోలను తీసికొని; రథము= రధాన్ని; గడపన్‌=

నడపటానికి; తొడగుము= పూనుకో; నీకు; నృప, ధర్మ+ఉదయుండు+అగు+అర్జునుతోన్‌= రాజ ధర్మంలో పుట్టినవా డైన

అర్జునునితో; కాదు+అనక= కాదనకుండ - తగుదు నని; రణంబు, చేయంగాజ యుద్దంచేయటం; అగునే= తగునా! తాత్పర్యం: నీ కులానికి తగ్గట్టు మునికోల పుచ్చుకొని నీవు రథం నడప ప్రయత్నించాలి గాని, రాజధర్మంలో జన్మించిన అర్జునునితో కాదనకుండా యుద్దంచేయటం నీకు తగునా!

వ మజియదియునుం గాక 56

తాత్పర్యం: ఇంకా, అంతేకాక.

తే. ఉత్తమ క్షత్రియ ప్రవరోపయోగ్య। మైన యంగరాజ్యంబు నీ కర్టమగునె? మంత్రపూత మై గురుయజమానభక్ష్య ; మగుపురోడాశ మది గుక్కకర్ణమగునె! 57

ప్రతిపదార్హం: ఉత్తమ, క్షత్రియ, ప్రవర+ఉపయోగ్యము+ఐన= ఉత్తమము డైన క్షత్రియ శ్రేష్టునిచేత అనుభవించదగిన దైన;

అంగరాజ్యంబు; నీకు+అర్హము+అగునె= నీకు తగినటువంటిది అవుతుందా; మంత్ర, పూతము+ఐ= మం(త్రంచేత పవిత్ర మై; గురు, యజమాన, భక్ష్యము+అగు= గొప్పయజ్ఞకర్త తినదగిన దైన, పురోడాశము= యజ్ఞంకొరకు చేసిన పిండివంట; కుక్కకు; అర్హము= తగింది; అగునె= బౌతుందా? (కాదని భావం.)

తాతృర్యం: ఉత్తమ క్షత్రియ ్రేష్టునిచేత అనుభవించ దగిం దైన అంగరాజ్యం నీకు అనుభవించ తగిం

దవుతుందా? గొప్పయజ్ఞకర్త భుజించదగిన యజ్ఞపుపిండివంట కుక్క తినటం తగునా!

విశేషం; అలం: దృష్టాంతం.

వ, _అవినం గర్జుండు వెల్లనయి యొద్దియుం జేయునది నేరక దీర్టోస్తనిశ్వాసవ్యాకులనిత వదనుం డయి యాకాశంబువలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె; నంత నంతర్విలులితుం దయిన యక్కర్ణుం జూచి బ్రాత్భపద్మవనమధ్యంబుననుండి దుర్య్వోధనమదాంధగంధసింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భఖీమున కి ట్లనియె. 58

ప్రతిపదార్థం: అనినన్‌౯ అని అనగా; కర్ట్ణుండు; వెల్లనయి= వెలవెలబోయి; ఎద్దియున్‌; చేయునది; నేరక= తెలియక; దీర్హ+ఉష్ష నిశ్వాస, వ్యాకులిత, వదనుండు+అయి= పొడవై వేడి అయిన నిట్టూర్పుచేత కలత చెందిన ముఖం కలవాడై: ఆకాశంబువలనన్‌= ఆకాళంవైపు; ఉన్న; ఆదిత్యున్‌= సూర్యుడిని; చూచుచు; మిన్నక+ఉండెన్‌= ఊరకున్నాడు; అంతన్‌= తర్వాత; అంత:+విలుతుండు+అయినజ లోలోపల (మనస్సులో) కలతచెందుతున్నవా డైన; ఆ+కర్ణున్‌ చూచి; భ్రాత పద్మ, వన, మధ్యంబుననుండిజ తమ్ములు అనే తామర వనం మధ్య నుండి; దుర్యోధన, మద+అంధ, గంధ, సింధురంబు= దుర్యోధను డనే మదంచేత కన్నులు కానని మదపుటేనుగు; వెలువడి= బయటకు నడచి; వచ్చి; కడు= మిక్కిలి; అలిగి= కోపించి; భీమునకు; ఇట్టు+అనియె,

తాత్పర్యం: భీముడు అట్టామాట్టాడగానే కర్షుడు వెలవెలపోయి, ఏమీ చేయటానికి తోచక పెద్ద వేడి నిట్టూర్వు

విడిచి, కలత చెందిన ముఖంతో ఆకాశాన ఉన్న ఆ సూర్యుని వైపు చూస్తూ ఊరకున్నాడు. మనసులో మిక్కిలి

ఆదిపర్వము - షష్టాశ్వానము 5డీ? కలత చెందుతున్న ఆ కర్టుడిని చూచి, తమ్ము లనే తామర వన మధ్యంనుండి దుర్యోధను డనే మదపుటేనుగు వెలుపలికి వచ్చి ఎంతో కోపంతో భీమునితో ఇట్లా అన్నాడు. ళం

విశేషం: అలం: రూపకం. తన కులాన్ని తండ్రిని, తల్లిని గురించి పదిమంది ఎదుట నిలద్‌సి అడిగినపుడు బదులు చెప్పలేక ఏమిచేయటానికీ దిక్కుతోచక బాధపడుతూ- అన్నీ తెలిసి, ఏమీ తెలియనట్టు నంగనాచివలె నింగిలో ఉన్న కర్మసాక్షివైపు చూచే కర్ణుని భంగిమలోని నాటకీయత, జొచిత్యం విశేషించి భావుకులకు రసానందహేతువులు. అట్టే తమ్ములనే తామరవనమధ్యం నుండి మదపుటేనుగువలె కన్నుమిన్నుకానక ముందుకు నడచివచ్చే దుర్యోధనుని భంగిమకూడా రూపకోచితం. (సంపా.) క అనిలజ! నీ కి ట్లని పః ల్మను దలపను నగునె? లేడి కడుపునం బులి పు

ట్టునె? యిట్టి దివ్య తేజం । బున వాం డధనూన్వయమునం బుట్టునె చెపునూ! కం (ప్రతిపదార్థం: అనిలజ= వాయువువల్ల పుట్టినవాడా! నీకు; ఇట్టు+అని; పల్కను= మాటాడటానికి; తలపను= ఆలోచించటానికి; అగునె= తగునా? లేడి, కడుపునన్‌; పులి; పుట్టునె; ఇట్టి; దివ్య తేజంబునవాండు= (్రేస్ట మైన కాంతి కలవాడు; అధమ+ అన్సయమునన్‌= నీచ మైన కులంలో; పుట్టునె; చెపుమూ! తాత్పర్యం: వాయువువల్ల పుట్టిన ఓ భీమా! ఇట్టా మాట్టాడటం, ఆలోచించటం నీకు తగునా? లేడి కడుపున పులి పుట్టుతుందా? ఇంత గొప్ప కాంతి కలవాడు నీచ కులంలో పుట్టుతాడా? విశేషం: భీముడిని 'అనిలజ' అని సంబోధించటంలో నీ పుట్టుక సంగతి ఏమిటనే ఎత్తిపొడుపు ద్వనిస్తున్నది. అలం: అర్జాంతరన్వాసం. సీ. శూరులజన్మంబు సురలజన్మంబును , నేటులజన్మంబు నెజలుంగ నగునె?

మొగివి దధీచియెమ్మునం బుట్టదయ్యెనే; వాసవాయుధ మైన వజ్ర నుదియు;

గాంగేయు6 డన మళథి కార్తికేయుం డన । నాగ్నేయు6 డన రౌధ్రుం డనగ శరవ

తోద్ధవుం డన గుహుం డుద్ధవిల్లండె? శర । స్తంబజన్నుండు గాండె ధర్మవిదుండు తే. గృపుడు? ఘటసంభవుయడు గాండె కీర్తిపరుండు । వరుండు ద్రోణుండు? విఫ్రులవలనం బుట్ట

రైరె సత్‌క్షత్రియుల్‌ ఘను లవనింగావణ? । గడ(గి మీ జన్మములు నిట్ల కావె వినం, 60 ప్రతిపదార్థం: శూరుల, జన్మంబు; సురల, జన్మంబునున్‌= దేవతలయొక్క పుట్టుకను; ఏజుల, జన్మంబున్‌= నదుల పుట్టుకను; ఎయి(న్‌?అగునె= తెలిసికొనటం సాధ్యమా! మొగిని= (క్రమంగా? వాసవ+అఆయుధము+ఐన= దేవేంద్రునియొక్క ఆయుధ మైన; వజ్రము; అదియు; దధీచి, ఎమ్మున= దధీచి ఎముకలో; పుట్టదు+అయ్యెనే= పుట్టలేదా?; గాంగేయు.డు+అన= గంగకొడ్తు కన; అగ్నేయుడు+అన= అన్ని కొడు కన; రౌద్రుండు+అన్‌= రుద్రుని కొడు కన; శరవణ+ఉద్భవుండు+అన= రెల్టుగడ్డిపొద పుట్టినవా డన; గుహుండుజ కుమారస్వామి; ఉద్భవిల్లండె= పుట్టలేదా; ధర్మవిదుండు= ధర్మాన్ని తెలిసినవాడు, కృపుండు= కృపాచార్యుడు; శర, స్తంబ, జన్ముండు= రెల్టుగంటలో పుట్టుక కలవాడు; కాడె; కీర్తిపరుండు= క్తీర్తగలవాడు; వరుండు= రుడు: ద్రోణుండు; ఘట, సంభవుండు= కుండలో పుట్టినవాడు; కాడె; అవనిన్‌= భూమిని; కావన్‌= కాపాడటానికి; కడంగి= త్‌ ఘనులు= గొప్పవారు; సత్‌+క్షత్రియుల్‌= ఉత్తములైనరాజులు; విప్రలవలనన్‌= బ్రాహ్మాణులవలన; పుట్టరు+ఐరె= పుట్టినవా కాలేదా" విన(గ; మీ, జన్మములున్‌= మీ యొక్క పుట్టుకలు కూడా; ఇట్టు, కావె= ఈ విధమైనవే కదా!

5్‌క్ష8 (మదాంధ్ర మహాభారతము తాత్పర్యం: శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలిసికొనటం సాధ్యమా? దేవేంద్రుని వజ్రాయుధం దధీచి ఎముకనుండి పుట్టలేదా? గంగ కొడుకుగా, కృత్తికల కొడుకుగా, అగ్ని కొడుకుగా, రుద్రునికాడుకుగా, రెల్లుపాదలలో జన్మకలవాడుగా కుమారస్వామి పుట్ట లేదా? ధర్మ మెరిగిన కృపాచార్యుడు రెల్టుగడ్డిగంటలో పుట్టలేదా? క్షీర్తిమంతుడు, (శ్రేష్టుడు అయిన (ద్రోణుడు కుండలో పుట్టలేదా? భూమిని కాపాడటానికై ఉత్తమ క్షత్రియులు బ్రాహ్మణులవలన పుట్టలేదా? విన్న దానిని బట్టి మీ పుట్టుకలు కూడ ఇట్టివే కదా! విశేషం: శూరులజన్మంబు సురలజన్మంబును నేలులజన్మంబు నెజుంగనగునె" - అనేదానికి మూలం:- “శూరాణాంచ నదీనాంచ దుర్విదాః ప్రభవాః కిల” (చిత్రకళాప్రతి) - శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట. 335. ; పెద్దలముందు మిత్రు డైన కర్షుడిని నిందించిన భీముడిని అధిక్షేపిస్తూ దుర్యోధనుడు పెద్దలందరి పుట్టుకతో కలిపి పాండవుల పుట్టుకలను గురించికూడా పేర్కొన్నాడు. మీరందరూ శూరు లైతే గూఢ జన్ము డైకూడా గొప్పవాడుగా కనపడుతున్న కర్చుడు శూరుడు కాకపోతాడా? అని తార్కికంగా మాట్లాడాడు. తెలియక, అభిమానంతో మాట్టాడుతున్న దుర్యోధనుని మాటలతో నిజం తెలిసిన పరితల మనస్సులు అభిమానిస్తాయి. కర్టుడిలోని విషాదాంతనాయకలక్షణాలలో ఇది ఒకటి. అన్ని మంచిగుణాలున్నా ఏదోఒక అనివార్యమైన లోపంవలన కర్ణుడు విషాదాంతం పొందుతూ పరితల సానుభూతిని పొందుతాడని వస్తుధ్వని. (సంపా)

వ. 'వానితోడి దేమి? దివ్య లక్షణ లక్షితుండును సహజ కవచ కుండల మండితుండును గాని ప్రకృతిపురుషుండు గాండు; తన బాహుబలంబున నీ యంగరాజ్యంబునక కాదు సకల మహీరాజ్యంబునకు నర్హుం డగు" ననుచున్నయంత నాదిత్యుం డస్తంగతుం డైన, నస్త్రసందర్శనరంగంబు వెలువడి దుర్యోధనుండు గర్జుం దోడ్కాని కరదీపికాసహస్రంబుతో నిజనుందిరంబున కరిగెణ బాండవులును భీష్మద్రోణవిదుర కృపాచార్యులతో నిజనివాసంబుల కరిగిరి. 61

(ప్రతిపదార్థం: వానితోడిది+ఏమి= వాటితో పనేమి? (అంటే ఆ జన్మలనుగురించి తర్కించి ఏంప్రయోజనం);: (కర్ణుడు) దివ్య, లక్షణ, లక్షితుండును= శ్రేష్టాలైనలక్షణాలచేత గుర్తింంబడేవాడును; సహజ, కవచ, కుండల, మండితుండును, గాని= సహాజా లైన కవచ కుండలాలచేత అలంకరింపబడినవాడుగాని; ప్రకృతిపురుషుండు, కాడు= సామాన్య మానవుడు కాడు: తన బాహుబలంబునన్‌= తనయొక్క బాహుబలంచేత; ఈ, అంగరాజ్యంబునక, కాదు= ఈ అంగరాజ్యానికి మాత్రమే కాదు; సకల, మహీ రాజ్యంబునకున్‌= మొత్తం ప్రపంచంయొక్క దొరతనానికి; అర్హుండు+అగున్‌= తగినవా డవును; అనుచు+ఉన్న, అంతన్‌= అని పలుకుతుండగా; ఆదిత్యుండు= సూర్యుడు; అస్తంగతుండు+ఐనన్‌= అస్తమించే కొండవైపు వెళ్ళినవా డు కాగా - అంటే అస్తమించగా; దుర్యోధనుండు; అస్త సందర్శన, రంగంబు= అ(స్త విద్యను చూపే ప్రదేశంనుండి; వెలువడి=జ బయటికి వచ్చి; కర్ణున్‌=ఐ కర్ణుడిని; తోడు+కొని= వెంటపెట్టుకొని; కర, దీపికా, సహస్రంబుతోజ దివ్విటీలు వెయ్యింటితో; నిజ, మందిరంబును= తనయొక్క ఇంటికి; అరిగెన్‌= వెళ్ళాడు. పాండవులును; భీష్మ, (ద్రోణ. విదుర, కృపాచార్యులతో; నిజ నివాసంబులకు= తమయొక్క ఇండ్లకు; అరిగిరి= వెళ్ళారు.

తాత్పర్యం: 'ఆ జన్మలతో ఏం పని? కర్ణుడు దివ్యలక్షణాలు కలవాడు. సహజ కవచకుండలాలు కలవాడు.

సామాన్యుడు కాదు. తన బాహుబలంచేత ఈ అంగరాజ్యాన్నే కాదు ఈ భూమండలా న్నంతా పరిపాలించగల

సమర్ధుడు" అని అంటూండగా, సూర్యు డస్తమించాడు. దుర్యోధనుడు అ'స్త్రవిద్యారంగాన్ని విడిచి కర్టుడిని వెంటబెట్టుకొని వెయ్యి దివ్విటీలు వెలుగుతుండగా తన ఇంటికి వెళ్ళాడు. పాండవులుకూడ భీష్మ ద్రోణ విదుర క్‌,

కృపాచార్యులతో కలిసి తమ తమ ఇండ్లకు వెళ్ళారు.

ఆదిపర్వము - షషాశ్వాసము క్‌త్త9

విశేషం: దుర్యోధనుని అధిక్షేపాలకు ఏఒక్కరుకూడా ప్రతిసమాధానం ఇచ్చినట్టు చెప్పకుండా ఉండటమే ప్రకరణౌచిత్యం. (ప్రతిభావంతుడైన నాటకకర్త ఒక రంగాన్ని అద్భుతంగా నిర్వహించినట్టు ఈ ముగింపు గోచరిస్తుంది. కర్టునిక్తీర్తి చివరకు జగజ్జేగేయమానంగా (ప్రకాశిస్తుంది. కాని, సూర్యుడు అస్తమించటంతో రంగం ముగుస్తుంది. సూర్యసుతుడైన కర్షుడు జగదత్ర్రసిద్దిని పొందుతాడు కాని విషాదాంతాన్ని చవిచూస్తాడు అని వస్తుధ్వని. వేయిదివిటీలతో వెలుగుతూ నిష్క్రమించిన దుర్యోధనుడు కర్ణుడిని స్నేహంవలన భావిచరిత్రలో వేయివిధాల వెలుగబోతున్నాడని వస్తుధ్వని. కాలాన్ని వస్తుధ్వనిగా వాడుకొనే శిల్పం అనల్పం. కాళిదాసాది మహాకవుల నాటకళిల్ప మర్మాలను నన్నయ తన రచనలో (ప్రవేశపెట్టి కథార్థ సంవిధానాన్ని చేశాడు. (సంపా. ఆ. కుండి యంత సహజ కుండల కవచాభి । రాముం గర్జ్హుం జూచి రవి సమాను€

బ్రత్యభిజ్ఞ నెజింగి ప్రధమ పుత్ర స్నేహ: మెబుక పదక యుండ నింతి యుండదె. 62 ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; కుంతి; సహజ, కుండల, కవచ+అభిరామున్‌= పుట్టుకతో వచ్చిన కుండలాలతో, కవచంతో మనోహర మైన వాడిని; రవి, సమానున్‌= సూర్యునితో సమాన మైన వాడిని; కర్ణున్‌ చూచి; ప్రతి+అభిజ్జన్‌= గుర్తుచేత; ఎటింగి=ఐ తెలుసుకొని; ఇంతి= స్త్రీ - కుంతీదేవి; ప్రధమ, పుత్ర స్నేహము= మొదటి కుమారునిమీది (ప్రేమ; ఎజుక, పడక, ఉండ= బయటపడకుండేటట్టు: ఉండె. తాత్పర్యం: అప్పుడు కుంతీదేవి సహజ కవచ కుండలాలచేత మనోహరు డ్రై సూర్య సమాను డైన కర్టుడిని చూచి, గుర్తుపట్టినా, ఆ మొదటి కొడుకు మీద తన కున్న (ప్రేమను బయట పడనీకుండా ఉండింది. విశేషం: కుమారాస్త్ర విద్యా సందర్శన ఘట్టంవలన కర్టుడు హస్తినాపురంలోనే సూతపుత్రుడుగా పెరిగి, దుర్యోధనునికి మి(త్రుడై, అంగరాజై ఉన్నాడని కుంతికి తెలిసింది. కాని, ఆమె నిజం బయటపెట్టక దాచి ఉంచింది. ఇది కర్ణుని జీవితం విషాదాంతం కావటానికి ప్రధానమైన శాపం అయింది. (సంపా. క వినుత ధనుర్విద్యావిదు । ఘను( గర్జు సహాయు. బడసి కౌరనవిభు6 దడ

ర్లునువలని భయము సెడి జొ ; మ్మునం జేయిడి నిద్రవోయె ముదితాత్ముం దై. 63 ప్రతిపదార్థం: వినుత, ధనుః+విద్యా, విదుజ పొగడబడిన విలువిద్యను తెలిసినవాడిని; ఘనున్‌= గొప్పవాడిని: కర్షు= కర్ణుడిని; సహాయున్‌= స్నేహితుడిని; బడసి= పొంది; కౌరవ, విభుండు= దుర్యోధనుడు; ముదిత+ఆత్ముండు+ఐ= సంతోషించిన మనస్సు కలవా డై; అర్హునువలని= అర్జ్హునునివలన; భయము, చెడి= భయంపోయి; ఉొమ్మునన్‌+చేయి+ఇడి= గుండెమీద చేయి వేసికొని; నిద్రపోయె. తాత్పర్యం: పొగడ దగిన విలువిద్యా నిపుణు డైన కర్టుడిని మిత్రుడిగా పొంది దుర్యోధనుడు సంతోషించి, అర్జునునివలన భయం లేకుండా గుండెమీద చెయ్యివేసికొని నిద్రపోయాడు. విశేషం: అర్జునునిక్‌ ప్రతివీరుడిగా కర్గుడిని నిలిపిన దుర్యోధనుని నైపుణ్యం ప్రశంసనీయంగా మిగిలింది ఈ రంగంచివర కురుకుమారులలో భీమదుర్యోధనుల పోరు. పెద్దలచేత వారించబడవచ్చునేమో కాని, కర్ణార్డునుల వైరంమాత్రం కాలం తీర్చవలసిందే అనే సూచన కధాంతంలో నన్నయ ధ్యనింపచేశాడు. (సంపా.

కౌరనపాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపదుం బట్టంజనుట (సం.1-127-1)

వ. అంతం బ్రభాతం బగుటయు సమయ నియమంబులు దీర్ది యాచార్యుండు శిష్యులనెల్ల రావించి “మీరు

నాకు గురుదక్షిణ యిం' దనిన నందలు మొక్కి యెదురనిలిచి 'మీకెద్ది యిష్టంబు సెప్పుం' డనిన విని

550 శ్రీమదాంధ్ర మహాభారతము 'యవివేక కారణ దారుణైశ్వర్యావలిప్తుం డైన ద్రుపదు నొడిచిపట్టి తెం; డిదియ నాకిష్టం బైన గురుదక్షిణ యని పంచిన. 64 ప్రతిపదార్థం: అంతన్‌= తర్వాత; ప్రభాతంబు+అగుటయు= తెల్లవారగా; సమయ, నియమంబులు= ఆయా సమయాలలో చేయవలసిన పనులు; తీర్చి= పూర్తిచేసికొని; ఆచార్యుండు= గురు వైన ద్రోణుడు; శిష్యులను+ఎల్ల= శిష్యులనందరినీ* రారించి మీరు" నాకు; గురుదక్షిణ; ఇండు= ఈయవలసింది: అనినన్‌; అందు; మొక్కి; ఎదుర, నిలిచి= ఎదుట నిలబడి; మీకు+ఎద్ది= మీకు ఏది; ఇష్టంబు; చెప్పుండు; అనిన; విని; అవివేక, కారణ, దారుణ+ఐశ్వర్య+అవలిప్తుండు+ఐన= అవివేకానికి కారణ మైన భయంకర మైన సంపదచేత గర్వించినవా డైన; ద్రుపదున్‌; ఒడిచి= ఓడించి; పట్టి; తెండు= తీసికొని రండు: ఇదియు; నాకు+ఇష్టంబు+ఐన; గురుదక్షిణ; అని; పంచిన ఆజ్ఞాపించగా. తాత్పర్యం: తెల్లవారగానే ఆయా సమయాలలో చేయవలసిన పనులు పూర్తిచేసికొని (ద్రోణాచార్యుడు శిష్యులను పిలిచి మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి" అన్నాడు. శిష్యు లందరు ఆయనకు (మొక్కి ఎదుట నిలబడి “వీ కేదై ఇష్టమో సెలవీయం” డని అడిగారు. అందుల కాయన 'అత్యధికసంపదచేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన 'ద్రుపదుడిని ఓడించి పట్టి తీసికొని రండి. ఇదే నా కిష్టమైన గురుదక్షిణ" అని ఆజ్ఞాపించాడు. కాగా. క. వల్లెయని రాజనందను : లెల్లను సమకట్టి, రథము లెక్కి దిశల్‌ భే దిల్లంగ గర్జిల్లి, నిశా। తోల్లసిత కృపాణ కార్డు కోద్యత కరు లై. 65 (ప్రతిపదార్థం: వల్లె, అని= సరే అని; రాజనందనులు+ఎల్లను= రాజకుమారులంతా; సమకట్టి= పూనుకొని; రధములు+ఎక్కి; దిశట్‌= దిక్కులు; భేదిల్లంగ= (బ్రద్దలయ్యేట్టు; గర్జిల్లి= సింహనాదం చేసి - పెద్ద యుద్ద ధ్వని చేసి; నిశాత+ఉల్లసిత; కృపాణ, కార్ముక+ఉద్యత, కరులు+ఐ= వాడియై ప్రకాశిస్తున్న కత్తులతో, విల్లులతో ఎత్తబడిన చేతులు కలవాళ్ళయి తాత్పర్యం: (ద్రోణుడు కోరిన గురుదక్షిణకు సరే అని రాజకుమారులంతా పూనుకొని రధా లెక్కి దిక్కులు పిక్కటిల్ల సింహనాదాలు చేసి, చేత ఖడ్డాలు, ధనుస్సులు ధరించి. ఉత్సాహము. 'ఏల దీని నెడయు. జేయ? నీ క్షణంబ యేంగి పాం చాలు బట్టి తెత్త మధిక శౌర్య లీల మెజయంగాం బోలు' ననుచు. బెరింగి రాజపుత్తు లెల్ల నరిగిపాం చాలుపురము ముట్టికొని రసంఖ్య బలసమేతు లై, 66 ప్రతిపదార్థం: రాజ, పుత్రులు+ఎల్లన్‌=ఐ రాజకుమారులంతా; దీనిన్‌= ఈ పనిని - అంటే [ద్రుపదుడిని ఓడించి పట్టితెచ్చేపనిని; ఎడయున్‌+చేయ= ఆలస్యంచేయటం; ఏల= ఎందులకు; ఈ క్షణంబు+అ= ఈ నిమిషంలోనే; ఏంగి= వెళ్ళి; పాంచాలున్‌+పట్టి= పాంచాల రాజైన (ద్రుపదుడిని పట్టుకొని; తెత్తము(తెచ్చుదము)= తీసుకొనివద్దాము; అధిక, శౌర్య, లీల= అధికళూరత్వంయొక్క విలాసం; మెజయంగాన్‌= ప్రదర్శించగా; పోలున్‌= తగును; అనుచున్‌; పెరింి= విజృంభించి; అరిగి= వెళ్ళి అసంఖ్య బల, సమేతులు+ఐజఐ లెక్కించ సాధ్యం గాని సైన్యంతో కూడుకొన్నవాళ్ళయి; పాంచాలు, పురము (ద్రుపదుని పట్టణాన్ని; ముట్టికొనిరి= ముట్టడించారు. తాత్పర్యం: రాజకుమారులంతా "ఈ పనికి ఆలస్యంచేయట మెందుకు?” అని ఈ క్షణమే వెళ్ళి ద్రుపదుడిని పట్టి తెద్దా మని, ఇది అధిక శౌర్య విలాసాన్ని ప్రదర్శించ దగిన సమయ మని, విజృంభించి అసంఖ్యాక సైన్యంతో వెళ్ళి 'ద్రుపదు పురాన్ని ముట్టడించారు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 551 విశేషం: ఉత్సాహం జాతివృత్తం. అందులో (ప్రతిచరణంలోనూ ఏడు సూర్యగణాలు, ఒక గురువు ఉంటాయి. అయిదవ గణం మొదటి అక్షరం యతి. ఉత్సాహం వీరరసస్టాయిభావం. ఆ పేరుతో వెలసిన వృత్తం ఇక్కడ కురుకుమారులు యుద్దోత్సాహాన్ని ప్రదర్శించే సందర్భంలో వాడబడింది. 'ఉత్సాహ స్సర్వకృత్యేషు సత్వరా మానసీక్రియా' అన్న భావప్రకాశోక్తికి అనుగుణంగా కురుకుమారుల వేగవంతమైన మానసికక్రియను ఈ వృత్తం ధ్వనింప చేస్తున్నది. కాబట్టి నన్న్మయ మొదటిసారిగా వాడిన ఉత్సాహ _"త్తాన్ని కధార్ణయోజనకు అనుగుణంగా నిర్వహించాడు. (సంపా,)

వ. పాండవులును రధంబు లెక్కిద్రోణుం బరివేష్టించి పిటుంద నరిగి; రంత నర్దునుం డాచార్యున కిట్లనియె. 67 ప్రతిపదార్హం: పాండవులును రధంబులు+ఎక్కి; ద్రోణున్‌; పరివేష్టించి= చుట్టువచ్చి; పిటుందన్‌= వెనుక; అరిగిరి= వెళ్ళారు; అంతన్‌= అప్పుడు; అర్జ్హునుండు; ఆచార్యునకు" ఇట్టు+అనియె. తాత్పర్యం: పాండవులుకూడ రధా లెక్కి ద్రోణుడిజ్హీి మధ్యలో ఉంచి చుట్టూ తాము గుమికూడి రక్షించుకొంటూ కౌరవుల వెనుకనే బయలుదేరి వెళ్ళారు. అప్పుడు అర్జునుడు ద్రోణునితో ఇట్లా అన్నాడు. క. వడిగొని కౌరవు లొండోరు6।; గడనంగ మును చనిరి; వారి గర్వము సూడం

గడిమిని ద్రుపదాధిపుతో.। బొడువ(గ6 దమ కలవియగునె భుజవీర్యమునన్‌. 68 ప్రతిపదార్హం: కౌరవులు" వడిగొని= వేగంగా; ఒండొరున్‌= ఒకరినొకరు; కడవ(గన్‌= మీరునట్టుగొ; మును, చనిరి= ముందు వెళ్ళారు; వారి గర్వము" చూడన్‌= చూడగా; భుజ వీర్యమున్‌= భుజశక్తిలోని; కడిమిని= అతిశయంతో:; (ద్రుపద+అధిపుతోన్‌= (ద్రుపదరాజుతో; పొడువంగన్‌= యుద్ధంచేయటానికి; తమకు+అలవి, అగునె= తమకు సాధ్యమవుతుందా? తాత్పర్యం: కౌరవులు వేగంగా ఒకరి నొకరు మీరి ముందుగా వెళ్ళారు గాని - వాళ్ళగర్వ్యం చూస్తే - భుజబలంలో (ద్రుపదరాజును అతిశయించి యుద్దం చేయటం వాళ్ళకు సాధ్యమా? విశేషం: ఇది ద్రుపదునిబలం ఏ పాటిదో తెలిసికొనాలని పార్టుడు సాగించిన సంభాషణ, ఉత్తమ వీరుడు శత్రుబలాన్ని అంచనా వేసుకోకుండా యుద్దానికి దిగడు. కౌరవులు తామే (ద్రుపదుడిని పట్టితెచ్చామన్న కీర్తి రావాలని, (ద్రోణుని మెప్పు పొందాలని, అవిచారంగా ఆవేశంతో ముందుకు దూకారు. అర్జునుడు అట్టా చేస్తాడా? దెబ్బతిని తిరిగి వస్తాడా? పైగా అస్త్రవిద్యాభ్యాసం తరువాత ఇదే తా నెదుర్కొనే ప్రథమ యుద్దం. అందులోనూ (ద్రుపదునితో. అందుకే ఇంత ఆలోచన. తన గురువును అంతటి అస్త్రవిద్యాచార్యుడిని తిరస్కరించిన ద్రుపదుడు అంత తక్కువవాడుగా ఉంటాడా? కాని ద్రుపదుని బలపరా[క్రమాల కాలదిని గూర్చి గురువుగారిని (ప్రత్యక్షంగా అడగటం ఎట్టాగ? అర్జునుడు జంకుతున్నా డనే భావన ఆయనకు వస్తుందేమో? అంతేకాదు, తన ఆత్మాభిమానం ఏమి కావాలి? అందుకే అర్జునుడు అంతనేర్పుగా దద్రోణునితో సంభాషణ ఆరంభించాడు; కౌరవుల స్వాతిశయాన్ని తొందరపాటును గూర్చి అనుకొంటున్నట్టు ఆరంభించాడు. క. _ అతగులచేధ్రుపదుండనవ। హితుం దై పట్టువడ నంతహీనుండె? శౌర్యో

న్నతుండధికధనుర్విద్యా। న్వితుండు భవత్సబఖుం డనంగ వినరొకొ వానిన్‌. 69 ప్రతిపదార్థం: ద్రుపదుడు; అనవహితుడు+ఐ= ఎచ్చరిక లేనివా డ్రై అతగులచే=జ ఎలహీనులచే; పట్టు పడన్‌: అంత హీనుండె= అంతతక్కువవాడా!; వానిన్‌= ఆ ద్రుపదుడిని: శౌర్య+ఉన్నతుండు= శూరత్వంచేత గొప్పవాడు; అధిక, ధనుః+విద్యా+ అన్వితుండు= గొప్ప ధనుర్విద్యతో కూడుకొన్నవాడు; భవత్‌సఖుండుజ మీయొక్కస్నేహితుడు; అనంగ= అని అంటుండగా; వినరు+ఒకొజఐ వినలేదా ఏమి? తాత్సర్యం: ఏమరుపాటున బలహీనులచేత పట్టువడటానికి 'ద్రుపదు డంత తక్కువవాడా? (ద్రుపదుడు గొప్ప శౌర్యవంతు డని, గొప్ప ధనుర్విద్యాసంపన్ను డని, మీ స్నేహితుడని వినలేదా ఏమి?

552 శ్రీనముదాంధ్ర మహాభారతము విశేషం: గురువుగారు మాత్రం తక్కువవారా! శిష్యుని శక్తిసామర్ద్యాలు ఆయనకు తెలియవా? పరీక్షకు ముందే శిష్యునికి స్‌ ్క్‌ ణు. ఇ్తనొబిధ్ద్యా న్‌ స్ట్‌ సమాధానాలు.శీభిపుతాడా? అందుకే (ద్రోణుని మౌనం. ప్రియశిష్యుని యుద్దనైపుణ్యాని కిది ప్రధమ పరిక్ష ఆ శిష్యుడే అన్నీ ఆలోచించుకోవాలి. అంచనా వేసుకోవాలి. యుద్దం చేయాలి. విజయం సాధించాలి. గురుదక్షిణ ఇవ్వాలి. వు అనుచుం బాంచాలుపురం బాసన్నంబు గా జనుదెంచునంతకు ముందజ చని దుర్యోధన యుయుత్సు దుశ్శాసనవికర్ణజలసంధాదు లైన ధార్తరాస్తు లనేక నృపకుమారసహితు లై పాంచాలుపురం బవరోధించినం బాంచాలపతి యలిగి యపారచతురంగబలసమేతుం దై కౌరవులం చాతి. 70 ప్రతిపదార్థం: అనుచున్‌; పాంచాలు, పురంబు= (ద్రుపదునియొక్క నగరం; ఆసన్నంబు, కాన్‌= దగ్గర అయ్యేటట్టు; చనుదెంచు+అంతకు= రాగా; ముందఆ, చని= ముందుగా వెళ్ళి; దుర్యోధన, యుయుత్సు, దుళ్ళాసన, వికర్ష, జలసంధ+ ఆదులు+ఐన= దుర్యోధనుడు, యుయుత్సడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, జలసంధుడు మొదలైన; ధార్తరా(ష్ట్రులు= ధృతరా(స్తునికుమారులు; అనేక, నృప, కుమార సహితులు+ఐ= పెక్కుమంది రాకుమారులతో కూడినవాళ్ళయి; పాంచాలు, పురంబు; అవరోధించినన్‌= అడ్డగించగొ; పాంచాల, పతి= పాంచాలరాజు - ద్రుపదుడు; అలిగి=ఐ కోపించి; అపార, చతురంగ, బల, సమేతుండు+ఐ= అంతులేని రధ గజ తురగ పదాతి సైన్యంతో కూడుకొన్నవాడై; కౌరవులన్‌; తాకి= ఎదుర్కొని. తాత్పర్యం: (ద్రుపదుని నగరం దగ్గరపడగా దుర్యోధనుడు, యుయుత్సుడు, దుళ్ళాసనుడు, జలసంధుడు మొదలైన ధృతరాసునికుమారులు, పెక్కుమంది రాకుమారులతో కలిసి, ఆ (ద్రుపదుని నగరాన్ని ముట్టడించగా, (ద్రుపదుడు కోపించి అంతులేని రథ గజ తురగ పదాతి సైన్యంతో కౌరవుల నెదుర్కొని. క. శరనికరసహస్రంబులం। బరువడి నందటిను గప్పె. బ్రావృడ్ధారా ధర మురుధారాజలముల । సరసిజములం గప్పునట్లు సంరంభమునన్‌. 71 ప్రతిపదార్థం: ప్రావృట్‌+ధారా, ధరము= వర్దాక్రాల మేఘం; ఉరు, ధారా, జలముల= పెద్ద ధార లైన నీళ్ళతో; సరసిజములన్‌= పద్మాలను; కప్పునట్టు; సంరంభమునన్‌= త్వరపడి; శర, నికర, సహ(స్రంబులన్‌= వేల బాణసమూహాలతో; పరువడి= వరుసగా; అందజను; కప్పెన్‌= కప్పాడు. తాత్పర్యం: వర్దాకాల మేఘం పెద్ద జల ధారలతో పద్మాలను కప్పివేసినట్టు (ద్రుపదుడు త్వరపడి బాణ సమూహాలు వేలకు వేలు వదలి వాళ్ళనందరినీ వరుసగా కప్పివేశాడు. విశేషం; అలం. ఉపమ. క, కలయనసిముసల దండం ; బులు గొని కాంపిల్యనగరమున జనులెల్లన్‌ వలిరేంగి యార్ది కౌరవ; బలసుభటులం బొడిచి రాజ బడలు వడంగన్‌. 72 ప్రతిపదార్థం: కాంపిల్య, నగరమున, జనులెల్లన్‌= కాంపిల్యనగరంలోని ప్రజలంతా; నలి= మిక్కిలి; రే(గ= విజృంభించి; ఆర్చి= సింహనాదాలు చేసి; కలయన్‌= అంతటా; అసి, ముసల, దండంబులు= కత్తులను, రోకళ్ళను, కర్రలను; కొని= చేతపట్టి; ఆబి= యుద్ధంలో; కౌరవ, బల, సుభటులన్‌= కౌరవ సైన్యంలోని మేటి వీరులను; బడలుపడంగన్‌= (శ్రమపడేటట్టుగా; పొడిచిరి= యుద్ధంచేశారు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 553 తాత్పర్యం: కాంపిల్యనగరంలోని ప్రజలంతా విజృంభించి సింహనాదాలు చేసి, కత్తులు, రోకళ్ళు, కర్రలు చేతపట్టి కౌరవసేనలోని మేటి వీరులందరు బడలికపాందేటట్లు యుద్దం చేశారు.

క. _ ధృతరాష్త్రకుమారకు లవ । హితు లై పాంచాలుమీంద నేసిరి సాంద్రా తతబాణప్రకరతిరో । హిత మై రవికిరణజాల మేర్ప్చదకుందన్‌. 73 ప్రతిపదార్హం: ధృతరాష్ట్ర కుమారులు= ధృతరాష్టునియొక్క 'ప్రియపుత్రులు; అవహితులు+ఐ=ఐ ఎచ్చరిక గలవాళ్ళయి సావధానులై; సాంద్ర+ఆతత, బాణ, ప్రకర. తిరోహితము+ఐ= దట్టములై అధికములైన బాణాల సమూహంచేత కప్పబడినదై; రవి, కిరణ, జాలము= సూర్యునియొక్క కిరణాల సమూహం; ఏర్పడక+ఉండన్‌= బయటపడకుండ ఉండేటట్టు గా; పాంచాలుమీ(దన్‌= ద్రుపదునిమీద; ఏసిరి=ఐ కొట్టారు. తాత్సర్యం: కౌరవులు సావధానులై సూర్య కిరణాలు కూడా బయల్పడకుండేటట్టు దట్టమై అధికమైన బాణ సమూహాన్ని (ద్రుపదునిమీద వేశారు. కు వారల శరములు నడుమన । వారించుచు నధిక లాఘవంబున వారిన్‌ ఘోర శర విద్ధ మర్ములం। గా రణమున సోమకుండు ఘనుం డై యేసెన్‌. ౮4 ప్రతిపదార్థం: సోమకుండు= ద్రుపదుడు; రణమున= యుద్ధంలో; ఘనుండు+ఐ= గొప్పవా డై- అధికుడై; వారల, శరములు= వాళ్ళయొక్క - కౌరవులయొక్కబాణాలు; నడుమనజ నడుమనే; వారించుచున్‌= తొలగిస్తూ: అధిక, లాఘవంబున= మిక్కిలి సులువుగా; వారిన్‌= వాళ్ళను; ఘోర, శర, విద్ధ, మర్ములన్‌+కా= భయంకరా లైన బాణాలచేత బాధింపబడిన ఆయువుపట్టు కలవాళ్ళను; ఏసెన్‌= కొట్టినాడు. తాత్పర్యం: యుద్దంలో (ద్రుపదుడు పెచ్చుపెరిగినవాడై కౌరవుల బాణాలను నడుమనే తొలగించి, అతిసులభంగా వారి ఆయువుపట్టు అదరేటట్టు భయంకరా లైన బాణాలతో కొట్టాడు. క. _ నానావిధ మార్గణముల। నానా మార్గముల నేసినం, గురువీరుల్‌ వానిం జూచి భయంపడి ; నానా తనుణా మనంబునన్‌ వగచి రనిన్‌. 75 (ప్రతిపదార్థం: నానావిధ, మార్గణముల= పలురకాలైన బాణాలచేత; నానామార్గములన్‌= పలువైపులనుండి; ఏసినన్‌= కొట్టగా; కురు వీరుల్‌= కౌరవవీరులు; అనిన్‌= యుద్దంలో; వానిన్‌= ఆ (ద్రుపదుడిని; చూచి; భయంపడి; నానాతనున్‌ాకా= అనేకవిధా లైన రూపాలు కలవాడినిగా; మనంబునన్‌= మనస్సులో; వగచిరి= తలచారు. తాత్పర్యం: పలు విధాలైన బాణాలచేత పలు వైపులనుండి కొట్టగా, కురువీరులు యుద్ధంలో ఆ ద్రుపదుడిని చూచి భయపడి, ఆతడిని నానా రూపాలు కలవాడినిగా మనస్సులో తలచారు. రులుంబోలె న. ఇట్లు పాంచాలుబాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశరనిహత సురారికుమా ర ఆల శ్ర వెజచణిచి పొాండవులయొద్దకుం బజతెంచినం జూచి, యర్జునుం డాచార్యధర్మజులకు నమస్కరించి ండు లిందయుండుం; డేనీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద' నని విజృంభించి, సంరంభంబున భీవ జీయం దనకు సేనాగ్రచరుండుగా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీసముద్రంబు ద జొచ్చిన. 76

క్‌5డ్ష (శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్హం: ఇట్టు; పాంచాలు, బాణ, వృష్టికి= [ద్రుపదునియొక్క బాణాల వానకు; నిలుపు+ఓపక= నిలువలేక; కురు, కుమారులు; కుమార, శర, నిహత, సుర+అరి, కుమారులున్‌+పోలె= కుమారస్వామియొక్క బాణాలతో కొట్టబడిన రాక్షస కుమారుల వలె; వెజచటీచి= భయపడి; పాండవుల, ఒద్దకున్‌= పాండవులదగ్గరకు; పజతెంచినన్‌= పరుగెత్తుకొనిరాగా" చూచి" అర్జ్హునుండు; ఆచార్య, ధర్మజులకు= (ద్రోణాచార్యునికి, ధర్మరాజుకు; నమస్కరించి; మీరలు; ఇందు+అ= ఇక్కడే ఉండుండు= ఉండండి; ఏను= నేను, ఈ క్షణంబు+అ= ఈ నిమిషాన్న; ఆ+పాంచాలున్‌= ఆ (ద్రుపదుడిని; పట్టి; తెచ్చెదను+అన విజృంభించి; సంరంభంబున= వేగిరపాటుతో; భీమసేనుండు; తనకు; సేనా+అగ్రచరుండు+కా= సేనయొక్క ముందుభాగాన వెళ్ళేవాడుగా; మాద్రేయులు= మాద్రి తనయులైన నకులసహదేవులు; రధ, చక్ర, రక్షకులుగా= రధంయొక్క చక్రాలను రక్షించేవాళ్ళుగా; (ద్రుపద, రాజ, వాహినీ, సము(ద్రంబుజ (ద్రుపదరాజుయొక్కసేన అనే సముద్రాన్ని; తజీయన్‌= సమీపించేటట్టు; చొచ్చిన= ప్రవేశించగా తాత్పర్యం: ద్రుపదుని బాణవర్షానికి నిలువలేక కౌరవులు కుమారస్వామి బాణాలచేత కొట్టబడిన రాక్షస కుమారులవలె భయపడి పాండవుల దగ్గరకు పరుగెత్తారు. అది చూచి అర్జునుడు ద్రోణ ధర్మరాజులకు నమస్కరించి “మీ రిక్కడే ఉండండి. నేను ఈక్షణాన్నే ద్రుపదుడిని పట్టి తెస్తా" నని సత్వరు డై భీమసేనుడు తన సైన్యానికి ముందు నడువగా, నకులసహదేవులు తన చక్ర రక్షకులు కాగా, (ద్రుపదుడి సైన్య మనే సముద్రాన్ని సమీపించాడు. విశేషం: అలం: ఉపమ, రూపకం. అర్జునుడు గురువైన ద్రోణునికి, పెద్దన్న అయిన ధర్మరాజుకు నమస్కరించటం గురుజనభక్తికి నిదర్శనం. అర్జునుడికి గురు వెంతటి దైవమో, అన్నకూడా అంతటి దైవం. భీమార్జునులు ద్రుపదునిసేనను దునునూడుట (సం.అను.1-78-40 పంక్తి క. _ కరిఘటలందాంకి భీముండు । కరటికటీ కుంభ దంత కర ముఖముల జ ర్దరితములం జేసి నిష్టుర ।; తరవజ్రనిపాతపటుగదాఘాతములన్‌. 77 ప్రతిపదార్థం: కరి, ఘటలన్‌= వీనుగుల సమూహాలను; తాంకి= ఎదుర్కొని; భీముండు; నిష్టురతర, వజ్ర, నిపాత పటు, గదా, ఘాతములన్‌= మిక్కిలి కఠినా లైన వజ్రాయుధంయొక్క దెబ్బలవలె బల మైన గదయొక్కదెబ్బలచేత; కరటి కటీ కుంభ, దంత, కరు ముఖముల= ఏనుగులయొక్కచెక్కిళ్ళను, కుంభస్టలాలను, దంతాలను, తాండాలను, ముఖాలను; జర్జిరితములన్‌+చేసె= పగులగొట్ట బడీనవాటినిగా చేశాడు. తాత్పర్యం: భీముడు ఏనుగుల సమూహాలను ఎదుర్కొని వజ్రపాతాలవంటి గదాఘాతాలచేత వాటి చెక్కిళ్ళను, కుంభస్టలాలను, దంతాలను, తొండాలను, ముఖాలను పగులగొట్టాడు. ఉ. _దారుణనమౌ వృకోదరు గదాకులిశాహతి నన్యవాహినీ వారణసంచయం బభినవ క్షతజారుణధార లొప్ప సం చారితధాతునిర్భరవిశాలశిలోచఛ్చయ సంచయాభమై వీరరణంబునం బడియె విక్షతహస్తిపవృక్షపంక్తితోన్‌, 78 ప్రతిపదార్థం: దారుణము+బౌ= భయంకరమైనట్టి; వృకశఉదరు, గదా కులిశ+ఆహతిన్‌= తోడేలు కడుపువంటి కడుపు కలవాడైన భీమునియొక్క గద అనే వజ్రాయుధంయొక్క దెబ్బచేత; అన్య, వాహినీ, వారణ, సంచయంబు= శత్రుసేనలోని ఏనుగులగుంపు; అభినవ క్షతజ+అరుణ, ధారలు+ఒప్ప= కొత్తనెత్తురుయొక్క ఎజ్జనిధారలు ఒప్పగా; సంచారిత, ధాతు, నిర్బ్యర,

ఆదిపర్వము - షష్టాశ్వాసము 555 విశాల, శిలా+ ఉచ్చయ, సంచయ+ఆభము+ఐ= సంచారం కలదై, గైరికధాతువులతో కూడిన సెలయేళ్ళతో విశాలమైన పర్వత సమూహం యొక్క కాంతి వంటి కాంతి గలదై; విక్షత, హస్తిప, వృక్ష, పంక్తితోన్‌= కొట్టబడిన మావటీళ్ళనేవృక్షాల సమూహంతో; వీర, రణంబునన్‌= వీరులయొక్కయుద్దంలో; పడియె= పడింది. తాత్పర్యం: భయంకరమైన వజ్రాయుధంవంటి భీముని గదా ఘాతంచేత శత్రుసైన్యంలోని ఏనుగులగుంపు- (క్రొత్త నెత్తుటి ధారలతో- గైరికాది ధాతువులతో కూడిన సెలయేళ్ళతో విశాల మైన సంచార పర్వత సమూహంవలె, కొట్టబడిన మావటీళనే వృక్షసమూహంతోకూడి ఆ యుద్దాన పడింది. విశేషం: అలం. ఉత్రేక్ష 'పర్భ్వతసమూహంవలె' అని ఉంటే ఉపమ అవుతుంది. కాని, 'సంచారపర్వతసమూహంవలె' అనే భావన దీన్ని ఉ(త్రేక్షగా మారుస్తున్నది.

చ. అనిలజుండుగ్రు. డై ద్రుపదుహస్తిఘటావళి నశ్వసంహతిన్‌ ఘనరధకోటి భగ్నములుగా సమరంబునం జేసి పేదదు రృనుజులం జంప నేల యని మానుగ గోపుండు గోగణంబులన్‌ గొనకొని రొప్పునట్టు లధికుం డెగిచెం బృధుదండహస్తుం డై. 79 ప్రతిపదార్హం: అనిలజుండు= వాయుదేవునికుమూరు డైన భీముడు; ఉ(గ్రుండు+ఐ= భయంకరమైనవా డై; సమరంబున= యుద్దంలో; (ద్రుపదు, హస్తి, ఘట+ఆవలిన్‌= (ద్రుపదునియొక్క ఏనుగుల సమూహాన్ని; అళ్ళ, సంహతిన్‌= గుర్రాల సమూహాన్ని; ఘన, రథ, కోటి= గొప్ప రథాల సమూహాన్ని; భగ్నములుగా= దెబ్బతిన్నవాటినిగా; చేసి; పేద, దుర్‌ +మనుజులన్‌= బలహీను లైన దుష్ట మానవులను; చంపన్‌+ఏల= చంపటం ఎందుకు అని; మానుగ= ఒప్పుగా; అధికుండు= గొప్పవాడు - భీముడు; పృధు, దండ, హస్తుండు+ఐ= పెద్దగద చేతిలో గలవా డై; గోపుడు= అవులకాపరి; గో, గణంబులన్‌= ఆవుల సమూహాలను; కొనకొని= పూని; రొప్పునట్టుల= అరచి తరిమినట్టుగా; ఎగిచెన్‌= తరిమాడు. క్స్‌ తాత్పర్యం: భీముడు భయంకరు డై యుద్ధంలో ద్రుపదుని గజాశ్వ రథ సమూహాలను భగ్నంచేసి, బలవానులైన దుష్ట మానవులను చంపటం ఎందుకులే అని గొల్లవాడు గోవుల మందను అరిచి తరిమినట్టు తరిమాడు. విశేషం: అలం. ఉపమ, భీమపరా[క్రమాన్ని వర్షించిన 77,78,709 పద్యాలు ఓజోగుణ రమణీయాలు. ప్రర్ధర, అంతం గౌంతేయు( డత్యాయతభుజుండు నరుం డల్గి పాంచాలు దంతి ధ్వాంతంబున్‌ వానివాహోత్తమతుహినతతిం దద్ధటోదారతారా సంతానంబున్‌ శరాంచూళయవిభవమునన్‌ శాంతి. బొందించి యుద్య 80 ద్యాంతారాతిప్రభుం డై తనరుచు వెలి(౧న్‌ దద్రణవ్యోమవీధిన్‌. ; తేయుండువ= ప్రతిపదార్థం: అంతన్‌= తర్వాత; అతి+ఆయత, భుజుండు= మిక్కిలి విశాలా లైన భుజాలు కలవాడు; తా. లనే = (దుప క కుంతీదేవి కుమారుడు' నరుండు= అర్జునుడు; అల్లి కోపించి; పాంచాలు, దంతి, ధ్వాంతంబున్‌= (ద్రుపదునియొ - ఎరా చీకటిని వాని, వాహ+ఉత్తమ, తుహిన, తతిన్‌= అతనియొక్క అశ్చశ్రేష్థా లనే మంచు సమూహాన్ని; తల్‌+భట? టు అనే = బౌ సంతానంబున్‌= అతనియొక్క భటులు అనే గొప్ప నక్షత్రాల సమూహాన్ని; శర+అంశు+ఉచ్చయ, విభనమున న కిరణాల సమూహంయొక్క సంపదచేత; శాంతిన్‌+పొందించి= అణగేటట్టు చేసి; తత్‌+రణ, వ్యోమ, వీధిన్‌= ఆ యుద్ధ

556 థ్రీమదాంధ్ర మహాభారతము ఆకాశమార్గంలో; ఉద్యత్‌+ధ్యాంత+అరాతి, (ప్రభుండు+ఐ= (ప్రకాశిస్తున్నసూర్యునికాంతి వంటి కాంతి గలవాడై; తనరుచు= ఒప్పుతూ; వెలిగెన్‌= (ప్రకాశించాడు. తాచ్చర్యం: తర్వాత విశాలా లైన భుజాలు కలవాడు, కుంతీ కుమారుడు అయిన అర్జునుడు ఆ(గ్రహించి (ద్రుపదుని ఏనుగుల సమూహ మనే చీకటిని, అశ్చ సమూహ మనే మంచును, సైనిక సమూహ మనే నక్షత్ర సముదాయాన్ని తన బాణా లనే కిరణ సంపదచేత అణగేటట్టు చేసి యుద్ధ మనే ఆకాశవీధిలో సూర్యుడివలె ప్రకాశించాడు. విశేషం: అలం. రూపకం. ్రద్రరావృత్తంలో (ప్రతిపాదంలోనూ మ, ర, భ, న, య, య, య అనే గణాలుంటాయి. 8, 15 అక్షరాలతో యతిమైత్రి. నన్నయ వాడిన ్రగ్రరావృత్త మిదే. “వీరస్య భుజదండానాం వర్షనే ప్రగ్రరాభవేత్‌” అని కాత్యాయనుడు చెప్పినట్టు అభినవగుప్తపాదులు పేర్కొన్నారు. అత్యాయతభుజుడైన అర్జునుని బాణ(ప్రయోగాన్ని సూర్యుని కర(కిరణ) ప్రయోగాలుగా రూపకం చేయటంతో ఛందశిల్పంతోపాటు అలంకార సార్ధక్యాన్ని కూడా నన్నయ ప్రదర్శించాడు. (సంపా) క. _ ఆతనింజూచి సహింపక। యాతతకార్ముకుండు ద్రుపదుననుజుండు శౌర్యో

పేతుండు సత్యజితుం దను । నాతండు థీరుండయి తాశె నతిరభసమునన్‌. 81 ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆ అర్జునుడిని; చూచి; సహింపక= ఓర్వలేక అతత, కార్ముకుండు= గొప్పవిల్లు కలవాడు; శౌర్య+ఉపేతుండు= శౌర్యంతో కూడుకొన్నవాడు; 'ద్రుపదు+అనుజుండు= (ద్రుపదుడిని అనుసరించి పుట్టినవాడు - తమ్ముడు; సత్యజితుండు; అను; అతడు: ధీరుండు+అయి= ధైర్యంగలవాడై; అతి రభసమునన్‌= మిక్కిలి అఆటోపంతో' తాణెన్‌= ఎదుర్కొన్నాడు. తాత్సర్యం: అర్జునుని విజ్బృంభణం చూచి ఓర్వలేక ద్రుపదునితమ్ముడు సత్యజితు డనేవాడు గొప్పవిల్టు చేపట్టి శౌర్యధైర్యాలు గలవా డై అమిత మైన ఆటోపంతో ఆతడిని ఎదుర్కొన్నాడు. క. కడంగి ద్రుపదానుజుయడ నె: వ్వడిం గవ్వడి నేసి నూలువాండిశరములం

గడు నలిగి వాని నన్నియు । నడుమన తునియంగ నేసి నరుం దస్త్రములన్‌. 62 ప్రతిపదార్థం: కడంగి= పూనుకొని; (ద్రుపద+అనుజుండు= (ద్రుపదునితమ్ముడు; నెల+వడిన్‌= నిండువేగంతో; నూజు, వాడి, శరములన్‌= వంద పదు నైన బాణాలచేత; కవ్వడిన్‌= అర్జునుడిని; ఏసె= కొట్టాడు; నరుండు= అర్జునుడు; కడున్‌= మిక్కిలి; అలిగి= కోపించి; వానిన్‌: అన్నియు; నడుమన్‌+అ= మధ్యలోనే; తునియంగన్‌= ముక్కలయ్యేటట్టు; ఏసె= కొట్టాడు. తాత్పర్యం: పూనుకొని ద్రుపదునితమ్ముడు మహావేగంగా వంద వాడి బాణాలతో అర్జునుడిని కొట్టాడు. అందుకు అర్జునుడు ఆ(గ్రహించి తన బాణాలతో నడుమనే వాటినన్నింటిని ముక్కలు చేశాడు. క. _ వివిధాస్తకోవిదుడు వా। సవి వానిరధంబు. బార్‌ప్టిసారధుల మహిం

గువలు వడ నేసి నుగ్రా।; హవమునకును వాండు విముఖు(డై చెడి పఅవన్‌. 83 ప్రతిపదార్థం: వివిధ+అ'స్త్ర కోవిదుండుజ అనేక విధా లైన అ(స్రాలను తెలిసినవాడు; వాసవి= ఇంద్రుని కొడు కైన అర్జునుడు; వాని, రధంబున్‌= అతనియొక్క రధాన్ని; పార్ష్మిసారధుల= వెనుక కాపలాకాసేవాళ్ళను సారధులను; వాండు= ఆ ద్రుపదునితమ్ముడు; ఉ(గ్ర+ఆహవమునకును= భయంకరమైనయుద్ధానికి; విముఖుండు+ఐ= పెడమొగంగలవా. డై చెడి= కనబడకుండ; పజవన్‌= పరుగెత్తిపోయేటట్టు; మహిన్‌= భూమిమీద; కువలుపడన్‌= కుప్పలుపడేట్టుగా; ఏసెన్‌= కొట్టాడు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 557 తాత్సర్యం: అనేక విధా లైన అస్త్రాలు తెలిసిన అర్జునుడు- (ద్రుపదుడి తమ్ముడు పెద్ద యుద్దానికి భయపడి పరుగెత్తిపోయేటట్టు - ఆతని రథాన్ని, సారథులను నేలమీద కుప్పలు పడేటట్టు కొట్టాడు.

వ. అంత. ౭4 తాత్పర్యం: ఆ పైన. క. _ శరమోక్షణవేగనిరం ।: తరమండలితోరుచాపదండుం దకాండో ద్ధురదందధరుండపోలెను । హరినందనుం దాథె ద్రుపదుం దత్యుద్ధతుం దై. 85 ప్రతిపదార్థం: శర మోక్షణ వేగ, నిరంతర, మండలిత+ఉరు, చాప, దండుండు= బాణాలను వదలటంలోని వేగంచేత ఎడతెగక వలయాకారంగా చేయబడిన గొప్పధనుస్సుయొక్క కర్రగలవాడు; (ద్రుపదుండు; అతి+ఉద్దతుండు+ఐ= మిక్కిలి గర్వించినవా డై; అకాండ+ఉద్దురు దండ, ధరుండు+అ, పోలెను= అకాలంలో విజ్బంభించిన యముడో అనేటట్టు; హరి, నందనున్‌= దేవేంద్రుని కుమారు డైన అర్జునుడిని; తాకె= ఎదుర్కొన్నాడు. తాత్పర్యం: వ్యవధి లేకుండ వేగంగా బాణాలు వదలటంవలన వలయాకారం పొందిన ధనుస్సుయొక్క కర్ర కలవా డైన (ద్రుపదుడు, మిక్కిలిగర్వంతో అకాలంలో విజృంభించిన యముడో అన్నట్టు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. విశేషం: అలం: ఉ'త్రేక్ష. చాపదండుండకాండోద్దుర...' అనేదానికి చాపదండునకాండోద్దుర...' అనేపాఠాంతర మున్నది. అట్టయితే ఆ విశేషణం అర్జునునకు అన్వయిస్తుంది. మ. పరమాస్రెకవిశారదుల్‌ బలయుతుల్‌ పొంచాలకౌంతేయు లొం డొరులన్‌ మార్కొని యేయునప్పుడు దదీయోగ్రాజిరంగంబు దు స్తర నీరంద్ర నిశాత సాయక తమసృంఛన్న మైనం బర 86 స్పరయుద్ధంబులు దక్కి యోధులు నిశాభబ్రాంతాత్సు లై రచ్చటన్‌. ం = అంతో ప్రతిపదార్థం: పరమ+అ'స్త్ర+ఏక, విశారదుల్‌= ఉత్తమా లైన అస్ర్రాలలో మిక్కిలిపండితులూ; బలయుతుల్‌ః ల కూడుకొన్నవాళ్ళు అయిన; పాంచాల, కౌంతేయులు= పాంచాల రాజైన (ద్రుపదుడు, కుంతీ తనయు జ క 1 ఒండు+ఒరులన్‌= ఒకరి నొకరు; మార్కొని= ఎదుర్కొని; ఏయు+అప్పుడు= బాణాలు ప్రయోగించేటప్పుడు; త యం కు జ జఅనన=ు రంగంబు= వాళ్ళయొక్క భయంకర మైన యుద్ధభూమి; దుః+తర, నీరంధ్ర, నిశాత, సాయక, తమస్‌+సంఛన్న లు దాటరానివి, దట్టమైనవి, వాడిఅయినవి అయిన బాణాలవలన కలిగిన చీకటిచేత కప్పబడగా; అచ్చటన్‌: యోదులూ భాంతి ని పరస్పర యుద్ధంబు= ఒకరితో నొకరు పోరాడటాలు; తక్కిజ= మాని; నిశా, (భ్రాంత+ఆత్ములు+ఐరి= రాత్రి అయిందేన పొందిన మనస్సులు కలవాళ్ళు అయ్యారు. కరు ఎదుర్కొని తాత్పర్యం: ఆస్ర్ర విద్యలో పండితులు, బలవంతులు అయిన (ద్రుపద పార్టులు, ఒకరి నొ న ర బాణాల బాణాలు ప్రయోగించుకొనేటప్పుడు- భయంకర మైన వాళ్ళ్యయుద్దభూమి, దాటరాని దట్ట మైన వా త్రపడారు ౦తిప * కప్పబడి చీక్రటిమయం కాగా, అచ్చటి వీరులు ఒకరితో ఒకరు పోరాడటం మాని రాత్రి అయిం దని (భ్రాంలఎడ్డా విశేషం; అలం. భ్రాంతిమంతం,.

558 శ్రీమదాంధ్ర నువోభారతము అర్జును(డు ద్రుపదుం బట్టి కట్టితెచ్చుట (సం.1-128-3)

వ. అట్టి మహాద్వంద్వయుద్ధంబున విజిగీషుం డయి పాంచాలుండు పాండవమధ్యముధనుర్మధ్యంబు భగ్నంబుగా నొక్కబాణంబున నేసి యార్దిన, నలిగి వాసవసుతుం డుద్యతాసిహస్తుం డయి శైలస్థలంబు మీందికి లంఘించుకొదమసింగంబునుంబోలె ద్రుపదురథంబుమీందికి లంఘించి వానిం బట్టికొనినం దత్సైన్యంబు హాహాకారంబు లెసంగ మహార్దవంబునుంబోలె మైోయుచుండె నంత. 87

ప్రతిపదార్హం; అట్టి; మహా, ద్వంద్వ. యుద్ధంబున; విజిగీషుండు+అయి= జయించా లన్నకోరిక మిక్కుటంగా కలవా డై;

పాంచాలుండు; పాండవ, మధ్యము, ధనుః+మధ్యంబు= పాండవులలో నడిమివా డైన అర్జునునియొక్క విల్హుయొక్క నడిమిభాగం; భగ్నంబు, కాన్‌= విరిగేటట్టుగా? ఒక్క, బాణంబునన్‌; ఏసి= కొట్టి; అర్చినన్‌= సింహనాదం చేయగా: వాసవ, సుతుండు= దేవేంద్రునియొక్క కుమారు డైన అర్జునుడు; అలిగి= కోపించి; ఉద్యత+లఅసి, హస్తుండు+అయి= ఎత్తబడిన కత్తిని చేతిలో కలవా డై; శైల, స్టలంబు, మీందికి=ఐ కొండ (ప్రదేశం మీదికి; లంఘించు= ఎగిరిదూకే; కొదమ, సింగంబునున్‌+పోలె= పిల్ల సింహంవలె; (ద్రుపదు రధంబు, మీందికి; లంఘించి= దూకి; వానిన్‌= ఆ (ద్రుపదుడిని: పట్టికొనినన్‌; తత్‌+సైన్యంబు= ఆతనియొక్కపైన్యం; హాహాకారములు; ఎసంగ= అతిశయించగా; మహా+అర్హవంబునున్‌+పోలె= మహాసము(ద్రంవలె;

(మైయుచు+జండెన్‌; అంత= అప్పుడు.

తాత్పర్యం: ఆ గొప్ప ద్వంద్వ యుద్ధంలో జయించాలన్నకోరిక మిక్కుటంగా కలవాడై ద్రుపదుడు, అర్జునుని విల్లు

నడిమి భాగం విరిగేటట్టు ఒక బాణం వేసి పెద్దగా అరచాడు. అందుకు అర్జునుడు ఆ(గ్రహించి, చేత కత్తి నెత్తుకొని

కొండమీదికి దూకే కొాదమసింహంవలె (ద్రుపదుని రథం మీదికి ఎగిరి దూకి ఆతడిని పట్టుకొన్నాడు. అప్పుడు ద్రుపదుని సైన్యం పెద్ద హాహాకారాలతో మహాసముద్రంవలె ఘోషిస్తూ ఉండింది.

విశేషం: అలం. ఉపమ.

క. _ ప్రక్షీణదర్పుద్రుపదుర ; థాక్షముతో. గట్టి తెచ్చి యర్జునుండు క్రియా దక్షుం డయి గురునకు గురు । దక్షిణగా నిచ్చి చేసి దత్సమ్మదమున్‌. 88

ప్రతిపదార్థం: అర్జ్హునుండు; క్రియా, దక్షుండు+అయిజ కార్యంలో సమర్హు డై - అంటే చేయవలసిన పనిని చేయటంలో సమర్భు డై; ప్రక్షీణ, దర్పు= మిక్కిలి తగ్గిపోయినగర్వం గలవాడిని; (ద్రుపదు= (ద్రుపదుడిని; రథ+అక్షముతోన్‌= రథచ(్రంతో; కట్టి, తెచ్చి; గురునకు= గురు వైన దద్రోణాచార్యునికి; గురుదక్షిణగాన్‌; ఇచ్చి; తత్‌+సమ్మదమున్‌= అతనియొక్క సంతోషాన్ని; చేసెన్‌= కలిగించాడు. తాత్పర్యం: అర్జునుడు కార్యసాధనసమర్హు డై గర్వం కోల్సోయిన (ద్రుపదుడిని రథచక్రానికి కట్టి తెచ్చి గురుదక్షిణగా ఇచ్చి (ద్రోణాచార్యుడిని సంతోషపెట్టాడు. విశేషం: అక్షరరమ్యతలో అనురణనను ధ్వనికి ఉపకరణంగా వాడే నన్నయ రచనాశిల్పంలో ఒక మెలకువ ఈ పద్యంలో ఉన్నది. పద్యంలో క్ష' ప్రాసాక్షరం. చివరి పాదం లోని 'గురుదక్షిణ' అనే పదం ఈ పద్యంలో ఆయువుపట్టు. గురుదక్షిణకు గౌరవాన్ని కలిగించే క్షకారప్రాస అనురణన సౌందర్యాన్ని కలిగిస్తున్నది. పూర్వార్హంలోని క్షకారప్రాస (ద్రుపదుని దైన్యాన్ని ధ్వనిస్తూంటే, ఉత్తరార్హంలోని క్షకారప్రాస అర్జునుని ప్రతాపాన్ని ధ్వనిస్తున్నది. 'గురుదక్షిణ' అంటే గురువుకొరకైనదక్షిణ, అనీ, గొప్పదైన దక్షిణ అనీ అర్థవైచిత్రి ఏర్పడి “గురునకు గురుదక్షిణ” తగినవిధంగా- కొండంతదేవుడికి కొండంతపత్రి నిచ్చినట్టు- ఇచ్చొడనే అర్ధం అనురణన సామర్థ్యంతో ఏర్పడుతున్నది. అందువలన ఈ పద్యంలో శబ్దశక్తిమూలక అనురణనధ్వని ఉన్నది. (సంపాం

ఆదిపర్వము - షష్టాశ్యాసము 559

వ. దగ్రోణుండును నర్జును చేసిన పరాక్రమంబునకు. బరమ హృష్ట హృదయుం డై ద్రుపదుం జూచి నగుచు ని

ట్లనియె. ౭89 (ప్రతిపదార్దం: (ద్రోణుండును; అర్జును, చేసిన; పరాక్రమంబునకున్‌; పరమ, హృష్ట హృదయుండు+ఐ= మిక్కిలి ఆనందించిన హృదయం కలవా డై' ద్రుపదున్‌+చూచి; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనియె, తాత్పర్యం: ద్రోణుడుకూడ అర్జ్హునునిపరా[క్రమం చూచి ఆనందించి నవ్వుతూ (ద్రుపదునితో ఇట్టా అన్నాడు. క. _ వీరెవ్వరయ్య? ద్రుపదమ ।: హారాజులె! యిట్లు కృపణు లయి పట్టువడన్‌

వీరికి వలసెనె? యహహ! మ; హారాజ్యమదాంధకార మది వాసెనొకో?. 90 ప్రథిపదార్ధం: వీరు+ఎవ్వరు+అయ్య; ద్రుపద, మహారాజులె; ఇట్టు; కృపణులు+అయి= దిక్కులేనివా రై; పట్టు+పడన్‌; వీరికి; వలసెన్‌= ఆవశ్యకమయిందా! అహహ; మహా, రాజ్య, మద+అంధకారము= గొప్ప రాజ్యగర్వంచేత కలిగిన (గ్రుడ్డితనం; అది; పాసెన్‌+ఒకో= తొలగిపోయిందా ఎమి? తాత్పర్యం: వీ రెవ్వ రయ్యా? ద్రుపద మహారాజులే! ఈ విధంగా దిక్కు లేక పట్టుపడవలసిన పరిస్థితి ఏర్పడిందే! అహహా! మహారాజ్యమదంచేత కలిగిన కన్ను గానని తనం తొలగిపోయిందా? విశేషం: వ్యంగ్యంగా అధిక్షేపించే వాక్యపద్దతికి ఈ పద్యం తెలుగులో హృద్యమైన ఉదాహరణగా నిలిచిపోయింది. (ద్రోణుని గూడఢాభిమానాన్ని ఈ పద్యం వ్యంగ్య సుందరంగా వ్యక్తం చేస్తున్నది. ద్రోణుడు అధిక్షేపంగా పలికేటప్పుడు అయ్య! మహారాజులె, వీరికి వలసెనె అదివాసెనొకో![- అనే మాట లనేప్పుడు ఒక వింత వెటకారం ధ్వనిస్తుంది. దానిని కాకువు అంటారు. ఆ కాకువులు పూర్వం (ద్రుపదుడు (ద్రోణుడిని అవమానించిన మాటల వరుసను స్ప్ఫురింపచేస్తూ వాటికి ప్రతిగా (బోణుడు అధిక్షేపిస్తున్నట్టు ధ్వని. మొదట (ద్రోణుడు తమ (ప్రాత స్నేహాన్ని జ్ఞాపకంచేస్తూ గుర్తించావా? అని ప్రశ్చించినప్పుడు, (ద్రుపదుడు తనకు తెలియదన్నాడు. దానికి ఎద్దేవగా ని వెవరయ్యా?” అని వ్యంగ్యంగా (ప్రశ్నించటం. మహారాజుతో పేద బాపడికి సంబంధం ఎట్టా కలుగుతుంది? అని ప్రశ్నించిన ద్రుపదుడిని 'ఇప్పుడు నా ఎదుట ఉన్నది ద్రుపద మహారాజులా?" అని వెటకారపు తిరుగుప్రళ్ళ. రాజ్యంపోయిన పేదవాడివి నీవు అని వ్యంగ్యమైన అధిక్షేపం. “ఈ విధంగా దిక్కులేకుండా పట్టుబడవలసి వచ్చిందా?'- అని అపహసించినప్పుడు పూర్వం తన దయనీయస్ట్రితిని చూచికూడా జాలిపడక 'మిత్రామిత్రత్వాలు రాజులకు కార్యవళంగా ఏర్పడతాయి" అన్న 'ద్రుపదునిమాటకు తిరుగుదెబ్బ వినపడుతుంది. ఐశ్వర్య గర్వంచేత (ద్రోణుని విలువ తెలిసికొనకుండ మాట్టాడిన (గ్రుడ్డితనం ఇప్పుడు తొలగిందా, “నీ ఐశ్చరం, నీ పరాక్రమం నా శిష్యుల అధీనం, నా దయాభిక్ష' అని తలపింపచేసి, తన జొన్నత్యాన్ని, అదృష్టాన్ని వ్యంగ్యంగా (ద్రోణుడు ధ్వనింపచేశాడు. (సంపా) ఆ. _ “ఇంక నైన మమ్ము నెటుగంగ నగునొక్కా!; యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు

విడిచిపుచ్చె గురుండు; విప్రుల యలుకయుం। దృణ హుతాశనంబు దీర్భమగునె?. 91 ప్రతిపదార్థం: ఇంకను+ఐన= ఇక ముందైన; మమ్మున్‌= మమ్ములను; ఎజుంగన్‌+అగున్‌+ఒక్కొ= గుర్తించుకోతగునుసుమా! అనుచున్‌; ఉల్లసంబులు+ఆడి= ఎగతాళి మాటలు మాటాడి; గురుడు= ద్రోణాచార్యుడు; ద్రుపదు; విడిచి, పుచ్చె= వదిలివేశాడు; విప్రల+అలుకయున్‌=_ బ్రాహ్మణులయొక్క కోపం; తృణ, హుతాశనంబు= గడ్డినిప్పు: దీర్హము+అగునె= ఎక్కువకాలం ఉంటుందా! తాత్పర్యం: 'ఇక ముందైనా మమ్మల్ని గుర్తుంచుకోగలరా?' అని ఎగతాళి చేసి ద్రోణుడు (ద్రుపదుడిని విడిచి పెట్టాడు. (బబ్రాహ్మణునికోపం, గడ్డినిప్పు ఎక్కువ కాలం ఉంటాయా?

560 శ్రీమదాంధ్ర మహాభారతము

విశేషం: అలం:. అర్జాంతరన్యాసం. ఇప్పటికైనా నన్నెప్పుడూ గుర్తుంచుకుంటావా?- అనే కాకువువలన కలిగే అధిక్షేపార్హం

ద్రుపదునికి గుండెలో ములుకువలె కలకాలం గుర్తుంటుంది. చేసిన స్నేహాన్ని మరిచేవారికి తగిన వాజ్మయాస్త్రం ద్రోణుని

అధిక్షేపోక్తి. భీమార్చునులు (ద్రుపదునితో యుద్దం చేసిన ఘట్టంలో దాదాపు (ప్రతిపద్యంలోనూ అలంకార ప్రయోగంచేశాడు నన్నయ. కథార్థాలను ప్రసన్నంచేయటానికి అర్జాలంకార (ప్రయోగంకూడా అర్థయోజన శిల్పంలో ఒకభాగం. (సంపా. ధృతరాష్ట్రుండు యుధిష్టిరుని యౌనరాజ్యాభిషిక్తునించేయుట (సం.1-79-191)

వ. ఇట్లు ద్రుపదుందు ద్రోణుచేత విముక్తుం డయ్యు. గోపపాశబద్ద్ధుం డయి యప్పరిభవంబునకుం బ్రతీకారంబు సేయ సమకట్టి బ్రాహ్మణోపాస్తి సేయుచుండె; నంత నిట ధృతరాష్తుండు యుధిష్టిరురాజ్యభార ధురంధరుంగా నెజింగి భీష్మవిదురులతో విచారించి యౌవరాజ్యాభిషిక్తుం జేసిన. 92

ప్రతిపదార్థం: ఇట్టు: ద్రుపదుండు; (దోణుచేత; విముక్తుండు+అయ్యున్‌= విడువబడినవా డైనా; కోప, పాశ, బద్దుండు+అయి= కోప మనే తాటిచేత కట్టబడినవా డై; ఆ+పరిభవంబునకున్‌= ఆ అవమానానికి; ప్రతీకారంబుజ తిరిగి అపకారం; చేయ; సమకట్టి= పూనుకొని; బ్రాహ్మాణ+ఉపాస్తి= (బ్రాహ్మాణులయొక్కసేవను; చేయచు+ఉండెను; అంతన్‌= తర్వాత; ఇట= హస్తినాపురాన; ధృతరా(మ్ష్రండు; యుధిష్టిరు; రాజ్య, భార, ధురంధరున్‌+కాన్‌= రాజ్యంయొక్కభారాన్ని వహించేసమర్హుడిగా; ఎటెంగి= తెలిసికొని; భీష్మ విదురులతో; విచారించి= ఆలోచించి; యౌవ, రాజ్య+అభిషిక్తున్‌= యౌవరాజ్యంలో అభిషేకింపబడినవానినిగా; చేసిన= చేయగా.

తాత్పర్యం: ఈ విధంగా (ద్రుపదుడు ద్రోణునిచేత విడిచిపెట్టబడినా- అతడు కోప మనే తాటితో కట్టబడినవా డై,

(ద్రోణుడు తనకు చేసిన అవమానానికి తిరిగి అపకారం చేయాలని బ్రాహ్మణులసేవ చేస్తున్నాడు. అట

హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు యౌవరాజ్యభారం వహించటానికి యుధిస్టిరుడు తగినవా డని, భీష్మ విదురులతో

విచారించి అతడిని యౌవరాజ్యాభిషిక్తుడిని చేయగా.

విశేషం: 'బ్రాహ్మాణోపాస్తి సేయుచుండె' - అనే దానికి బ్రాహ్మణోపాస్తిసేయుచు పురంబు సారనాల్లక యుండె' - “సీయుచుండె

ద్రోణుండు రాజకుమారసహితుం డై హస్తిపురంబునకు మగుడివచ్చె నంత' అనే పాఠాంతరా లున్నాయి. -శ్రీమదాం(ధ్ర

మహాభారతము సంశోధితప్రతి, పుట, 341. ద్రోణుడు తరువాత రాజకుమారసహితు డై హస్తిపురానికి తిరిగిరావటం విశేషంగాదు. కాని ద్రుపదుడు అవమానాన్ని భరించలేక (బ్రాహ్మణోపాస్తిచేస్తూ తనపురం సొరనాల్లకుండటం విశేషం.

చ. నలువురు దమ్ములున్‌ బలిమి నాలుగుదిక్కులు నోర్టి సర్వభూ తలమున రాజనందనులదర్ప మడంచుచు భూరినస్తురా సులు గొనివచ్చి యీంగొని విశుదధ్ధయశోనిధి యొప్పె ధర్మజుం డలఘుయ యౌవరాజ్యయుతుం డయ్యును బెంపున సార్వభౌము. డై. 93

ప్రతిపదార్థం: నలువురు, తమ్ములున్‌: బలిమి= బలంతో; నాలుగు, దిక్కులున్‌: ఓర్చి= ఓడించి; సర్ప, భూతలమునా మొత్తంభూమిమీద: రాజ, నందనుల, దర్చము= రాజకుమారులయొక్క గర్వాన్ని; అడంచుచు= అణచివేస్తూ; భూరి, వస్తు రాసులు= పెద్దవైన పదార్థరాసులను; కొనివచ్చి= తీసికొనివచ్చి; ఈన్‌= ఈయగా; కొని= తీసుకొని; విశుద్ధ, యశః+నిధి= స్వచృమైనకీర్తికి స్థాన మైనవాడు; అలఘుండు= తక్కువవాడుకానివాడు - అంటే గొప్పవాడు; ధర్మజుండు; యౌవ, రాజ్య, యుతుండు+అయ్యును= యౌవరాజ్యంతో కూడుకొన్నవాడే అయినప్పటికీ; పెంపున= గొప్పతనంచేత; సార్వభౌముండు+ఐ= సమస్తభూమిని పరిపాలించే రాజై ఒప్పెజఐ వెలిగాడు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 5్‌61 తాత్పర్యం: నలుగురుతమ్ములు తమ బలంతో నాలుగుదిక్కులు జయించి, భూమిమీది రాకుమారు లందరి పొగ రణచి, ఎంతోవిలు వైన పదార్థ రాసులను తెచ్చి ఇయ్యగా, వాటిని (గ్రహించి స్వచ్చమైన కీర్తితో గొప్ప వాడైన ధర్మరాజు యువరాజే అయినా చక్రవర్తివలె వెలిగాడు. నిశేషం; అలం: కావ్యలింగం. 'సమర్థనీయాస్యార్థస్య కావ్యలింగం సమర్ధనమ్‌'. ధర్మరాజు పదవిలో యువరాజైనా మహిమలో సార్వభౌముడు. తమ్ములు నలుదిక్కుల రాజులను జయించి సంపదలు తెచ్చి అతని అధీనం చేయటంవలన అతడు సార్వభౌము డనే భావం సమర్హనీయ మైనది. ఇక్కడ ధర్మజుని నాయకత్వంతోపాటు భీమాదుల అనునాయకత్వంకూడ వస్తుధ్యని. భీమాదుల వీరవృత్తాలన్నీ ధర్మజుని ధర్మవీర (ప్రవృత్తికి పోషకాలే. అంగిని పోషించే అంగా(అంగరసా)లే అని తాత్పర్యం. ధర్మజుడి వర్ణనం ('ప్రసాదగుణభూయిస్టమై ఉండటం సార్ధకం. (సంపా) వ, మణజియును. ం్ర( తాత్సర్యం: ఇంకా. క. బద్ధపరంపర నొప్పి మ । దోద్ధతగజరధతురంగయుద్ధముల గదా యుద్ధములం జూడ నెందు. బ్ర। సిద్ధుడు మధ్యముండ యను విశిష్టస్తవముల్‌. 95 ప్రతిపదార్హం: మద+ఉద్దత, గజ, రధ, తురంగ, యుద్దములజ= మదంచేత గర్వించిన ఏనుగులబలంతో, రధబలంతో, అశ్చబలంతో యుద్దాలు చేయటంలో; చూడన్‌= చూడగా; ఎందున్‌= దేనిలోనైనా; మధ్యముండు+అ= కుంతీపుత్రులలో నడిమివా డైన భీముడే; ప్రసిద్దుడు= పేరుకెక్కినవాడు; అను; విశిష్ట స్తవముల్‌= గొప్పపాగడ్తలు; బద్ధ పరంపరన్‌= కట్టబడ్డవరుసచేత; ఒప్పె. జ్‌ తాత్పర్యం: గజ రథా శ్వ యుద్దాలలో, గదాయుద్ధంలో- దేనిలోనైనా కుంతీపుత్రులలో నడిమి వాడైన భీముడే పేరు కెక్కిన వాడన్న పెద్దపొగడ్తలు పరంపరగా వ్యాపించాయి. చ. అనుపమ కార్డుకాది వివిధాయుధ విద్యలయందు. గోవిదుం డనంగ నజయ్యుం డై పరంగు నర్హునుం బోలంగ నన్యు లెందు లే రను జనఘోష ముచ్చరిత మయ్యె మరుచ్చలితోచ్చవీచి ని ర స్వన ముఖరాబ్ధి వేష్టిత విశాల మహీవలయాంతరంబునన్‌. 9 ప్రతిపదార్థం: అనుపమ, కార్ముక+అది, వివిధ+ఆయుధ, విద్యల+అందు= సాటిలేని ధనుస్సు మొదలుగా నానావిధాలైన ఆయుధ విద్యలలో; కోవిదుండు= పండితుడు; అనంగన్‌:; అజయ్యుండు+ఐ= గెలువసాధ్యంగానివా డై పరగు= ఒప్పునట్టై అర్జునున్‌; పోలంగన్‌; అన్యులు= ఇతరులు; ఎందు= ఎచ్చటను; లేరు; అను; జన, ఘోషము= జనులయొక్కధ్వని; మరు గ చలిత+ఉచ్చ, వీచి, నిస్వన, ముఖర+అబ్ది, వేష్టిత, విశాల, మహీ, వలయ+అంతరంబునన్‌= గాలిచేత ఎగురుతున్న ఎత్తె అలలయొక్క శబ్దంచేత ధ్వనిస్తున్న సము(ద్రాలచేత చుట్టబడిన విశాల భూమండలంయొక్క మధ్యప్రదేశంలో; ఉత్‌+ చరితము= మీది కెగసింది; అయ్యె. ష్‌ నితో తాత్పర్యం: ధనుర్విద్య మొదలుగా వివిధా లైన ఆయుధ విద్యలలో పండితు డ్రై అజేయు డైన అర్జును పోల్చటానికి ఇతరు లెక్కడా లేరనే జనఘోష భూమండలంలో అంతటా మీదికి ఎగసింది. విశేషం: ప్రసాదవిశిష్ట మైన ఓజోగుణం ఈ రచనలో అర్జునుడి అనంతకీర్తిని ధ్వనింపచేస్తున్నది. ధర్మజుడిని, అర్జునుడిని చంపకమాలలలో వర్షించటం, భీముడిని, కవలను కందపద్యాలలో వర్ణించటం నన్నయ ఛందళ్ళిల్పంద్వారా ప్రదర్శిస్తున్న పాత్రల

562 శ్రీమదాంధ్ర నుహాభారతము కీర్తుల తారతమ్యానుశీలనం, అక్షరరమ్యాలైన ఛందస్సులనుకూడా వ్యంజకాలుగా నిబంధించే నన్నయ రుచిరారసూక్తినిధిత్వం పాండవవర్షనంలో (ప్రాఢంగా ప్రదర్శించబడింది. (సంపా)

క్ర యము లమితశౌర్యు లరిన్ఫప ।; యము లమలచరితశ్రనిరతు లనంగా నత్యు త్తమభక్తి నన్నలకు విన; యము మెజయుచు నుండి రధికు లై బహుకళలన్‌. 97

ప్రతిపదార్థం: యములు= కవలు - నకులసహదేవులు; అమిత, శౌర్యులు= మిక్కిలిపరాక్రమంకలవాళ్ళు; అరి, నృప, యములు=

శత్రురాజాలకు యమధర్మరాజులవంటివాళ్ళు; అమల, చరిత్ర, నిరతులు= నిర్మల మైన నడవడిలో ఆసక్తిగలవాళ్ళు; అనంగాన్‌= అని చెప్పబడగా; బహుకళలన్‌= అనేక విద్యల్లో: అధికులైజ గొప్పవాళ్ళయి; అతి+ఉత్తమ, భక్తిన్‌= మిక్కిలి శ్రేష్ట మైన భక్తితో; అన్నలకు; వినయము; మెటియుచున్‌= చూపుతూ; ఉండిరి.

తాత్పర్యం: నకుల సహదేవులు - మిక్కిలి పరాక్రమం కలవాళ్ళు శత్రురాజులకు యమధర్మరాజువంటివాళ్ళు,

స్వచ్చ మైన నడవడి గలవాళ్ళు - అనే పేరు పొంది అనేక విద్యలలో ఆరితేరి అత్యుత్తమ భక్తితో అన్నలపట్ల

వినయం చూపుతున్నారు. భారద్వాజుం డర్జునునకు బ్రహ్మశిరోనామక దివ్యబాణం బొసంగుట (సం.అను.1-80-20 పంక్తి)

వ. ఇట్లుపాండుకుమారు లపారగుణంబుల నెల్లవారికి నారాధ్యు లయి పరంగుచున్న నందు ధనుర్విద్య నర్హును దృధముష్టిలాఘవ లక్ష్యవేధిత్వ దూరాపాత జితశ్రమత్వంబులకు నసిగదాశక్తితోమరాది ప్రహరణ ప్రవీణతకుం బరమహీపొల పరాజయోత్సాదన పరాక్రనుంబునకు6 దనవలని భక్తిస్నేహంబులకు మెచ్చి భారద్వాజుండు వానికి బ్రహ్య్మశిరం బను దివ్యబాణంబు సప్రయోగనివర్తనంబుగా నిచ్చి యిట్లనియె. 98

ప్రతిపదార్థం: ఇట్టు; పాండు, కుమారులు; అపార, గుణంబులన్‌= అంతులేని (మంచి) గుణాలతో; ఎల్లవారికిన్‌= అందరికీ; ఆరాధ్యులు+అయిజ పూజింపదగిన వాళ్ళయి; పరుగుచు+ఉన్నన్‌= ప్రవర్తిల్హుతుండగా; అందు; ధను:+విద్యన్‌= ధనుర్విద్యలో; అర్జును, దృఢ, ముష్టి లాఘవ, లక్ష్యవేధిత్త, దూర+ఆపాత, జిత, శ్రమత్వంబులకున్‌= అర్జ్హునునిరబక్క గట్టిపిడికిలికీ, వేగానికీ (నైపుణ్యానిక్సీ, గురిని కొట్టటానికీ, దూరప్రయోగానికీ, జయింపబడిన అలసట కలవాడవటానికీ? అసి, గదా, శక్తి తోమర+ఆది, ప్రహరణ, ్రవీణతకున్‌= కత్తి గద, బల్లెం, చిల్లకోల మొదలయిన వాటితో కొట్టటంలోని నేర్పుకు; పరు మహీపాల, పరాజయ+ఉత్పాదన, పరా(క్రమంబునకున్‌= శత్రురాజులకు అపజయాన్ని కలిగించేటి పరా(క్రమానికీ; తనవలనిభక్తి స్టేహంబులకు= తనపట్ల ఉండే భక్తిప్రేమలకు; మెచ్చి; భారద్యాజుండు= (ద్రోణుడు; వానికి; (బ్రహ్మశిరంబు+అను; దివ్య, బాణంబు= దేవతాసంబంధ మైన బాణాన్ని; సప్రయోగ, నివర్తంబుగాన్‌= (ప్రయోగ ఉపసంహారాలతో కూడినట్టుగా; ఇచ్చి; ఇట్టు+అనియె.

తాత్సర్యం; ఈ విధంగా పాండవులు అంతులేని మంచి గుణాలతో అందరికి పూజ్యా లై ప్రవర్తిల్చతుండగా-

వారిలో అర్జునునియొక్క పిడికిలిబిగువుకు, వేగానికి(నైపుణ్యానికి), గురి కొట్టే నేర్పుకు, దూరాన పడేటట్టు

ప్రయోగించే సామర్థ్యానికి, అలసటలేనితనానికి, కత్తి గద, బల్లెం, చిల్లకోల మొదలైన ఆయుధ విద్యలలో ఆర్జించుకొన్న ప్రావీణ్యానికి, శత్రురాజుల జయింపగల పరాక్రమానికి, తన పట్ట చూపుతున్న భక్తి (ప్రేమలకు మెచ్చి (ద్రోణాచార్యుడు బ్రహ్మశిర మనే పేరుగల దివ్యాస్తాన్ని 'ప్రయోగోపసంహారాలతో ఉపదేశించి ఇచ్చి ఇట్లా అన్నాడు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 563

ఉ. దీనినగస్తి నా-బరగు దివ్యమునీంద్రుండు దొల్లి ప్రీతితో భూనుత! యగ్శివేశు( డను భూరిమునీంద్రున కిచ్చె; వారలున్‌ మానుగ నాకు నిచ్చిరి; క్రమంబున నేనును నీకు నిచ్చితిన్‌; దీనికి నీవ యర్హుడవు తేజమునం గడుం బెద్ద గావునన్‌. 99

ప్రతిపదార్థం: భూనుత!1= భూమిపై పొగడబడేవాడా!; దీనిన్‌= ఈఅఆస్తాన్ని; తాల్లి= పూర్వం; అగస్త్రినాన్‌+పరగు= అగస్తి అనేపేరుతో ఒప్పే; దివ్యముని+ఇంద్రుండు= గొప్పమునిశ్రేష్టుడు; ్రీతితో= (ప్రేమతో; అగ్నివేశుండు+అను; భూరి, ముని+ఇంద్రునకు= గొప్ప ముని ్రేష్టునికి; ఇచ్చె; వారలున్‌; మానుగ= ఒప్పుగ; నాకున్‌; ఇచ్చిరి; నేనును; (క్రమంబున= వరుసగా; నీకున్‌; ఇచ్చితిన్‌; తేజంబునన్‌= పరాక్రమంతో; కడున్‌= మిక్కిలి; పెద్ద; కావునన్‌? దీనికి; నీవు+అ= నీవే; అర్హుండవు= తగినవాడివి.

తాత్పర్యం: లోకంలో పొగడ్త లందుకొన్న ఓ అర్జునా! అగస్తి మహాముని ఈ అస్త్రాన్ని ప్రేమతో అగ్నివేశునికి

ఇచ్చాడు. ఆయన నా కిచ్చాడు. నేను నీ కిచ్చాను. పరా[క్రమంలో గొప్పవాడివి కనుక దీనికి నీవే తగినవాడివి.

వ. దీని మానవులయందు. బ్రయోగింపకుండునది; యల్పతేజులయందు. బ్రయుక్తం బయి యిది జగంబులం గాల్టు: నిన్ను బాధించు నట్టి మానవులు గలిగిరేని ప్రయోగించునది; వారి నశ్రమంబున సాధించు' నని దాని మహిమ చెప్పి 'నీవు నీ బంధుసమక్షంబున నాకు గురుదక్షిణ యి; మిది యెయ్యది యనిన నాయుద్ధంబుసేయునపుడు నాతో నెన్నడుం బ్రతియుద్ధంబు సేయకుందు; మిదియ నాకు గురుదక్షిణ యనిన నర్హునుండు నల్లై యని యాచార్యునకు నమస్కరించి దాని కొడంబడియె; నంత దుర్యోధనుండు యుధిస్టిరుయౌవరాజ్యుభిషకంబునకు భీమార్దునయములపరాక్రమంబునకు మనంబున సహింపనోపక కర్ణశకునిదుశ్శాసనులతో మంతనం బుండి యి ట్లనియె. 100

ప్రతిపదార్థం: దీని= ఈ బ్రహ్మశిరోనామకాసస్తాన్ని; మానవుల+అందున్‌; (ప్రయోగింపక+ఉండునది; అల్ప, తేజులశఅందు= తక్కువశక్తి కలవారిమీద; ప్రయుక్తంబు+అయి= ప్రయోగింపబడినదై; ఇది, జగంబులన్‌= లోకాలను; కాల్చు: నిన్ను; బాధించు+అట్టి; మానవులు; కలిగిరి+ఏని= ఉన్నట్టయితే; ప్రయోగించునది; వారిన్‌; ఆశ్రమంబునన్‌= శ్రమలేకుండ - సులభంగా; సాధించున్‌= లోబరచుకొంటుంది; అని; దాని, మహిమజ= దాని ప్రభావాన్ని; చెప్పి; నీవు; నీ, బంధు, సమక్షంబున= నీయొక్క బంధువులఎదుట; నాకు; గురుదక్షిణ; ఇమ్ము; ఇది= ఈ గురుదక్షిణ; ఏ+అది= ఏది; అనిన; నా, యుద్దంబు, చేయు, అపుడు నేను యుద్ధం చేసేప్పుడు; నాతోన్‌; ఎన్నడున్‌= ఎప్పుడూ; ప్రతి, యుద్ధంబుఐ ఎదురుయుద్ధం:; చేయక+ఉండుము; ఇదియు= ఇదే; నాకు; గురుదక్షిణ; అనినన్‌; అర్జునుండు; వల్లె= సరే; అని; ఆచార్యునకు; నమస్కరించి; దానికి; ఒడంబడియెన్‌= అంగీకరించాడు. అంత= తరువాత; దుర్యోధనుండు; యుధిష్టిరు, యౌవరాజ్యాభిషేకంబునకు; భీమ+అర్జున, యముల, పరాక్రమంబునకు= భీమునియొక్క అర్జునునియొక్క, నకులసహదేవులయొక్క పరా[క్రమానికి; మనంబున; సహింపన్‌+ఓపకః= ఓర్వలేక; కర్ణ, శకుని, దుళ్ళాసనులతో; మంతనంబు+ఉండి= ఆలోచనచేస్తూ ఉండి; ఇట్టు+అనియె.

తాత్పర్య: “ఈ (బ్రహ్మశిరోనామకా'స్తాన్ని మానవులమీద (ప్రయోగించవద్దు. అల్స శక్తి గల వారి మీద ప్రయోగిస్తే

ఇది లోకాలనే మాడ్చివేస్తుంది. నిన్ను బాధించే మానవు లుంటే వాళ్ళమీద ప్రయోగించు. అతిసులభంగా ఇది

వాళ్ళను పడగొట్టగలుగుతుంది' - అని ఆ అ(స్త్రమహిమ తెలియజెప్పి - 'నీ బంధువు లందరి యెదుట నా కొక గురుదక్షిణ ఇమ్ము. అది ఏమంటే నేను యుద్ధం చేసేప్పుడు నీవు నాతో ఎదురు యుద్ధం చేయకుండటం' అని

56క్ష శ్రీమదాంధ్ర మహాభారతము 'ద్రోణాచార్యు డనగా విని అందుకు అర్జునుడు అంగీకరించాడు. తర్వాత దుర్యోధనుడు భీమా ర్జ్హున నకుల సహదేవుల పరాక్రమం చూచి ఓర్వలేక కర్ష శకుని దుశ్చాసనులతో ఆలోచన చేస్తూ ఇట్టా అన్నాడు. కణికనీతి (ఫం.1-81-10)

స్‌ 'ఆయుధవిద్యలయందు జితశ్రము । లనియును రణశూరు లనియు సంత

తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును ; భయమందుచుండుదు. బాండవులకు;

దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుం। జేసి రా; జే నేమి సేయువాండ?

వృపనీతి యెయ్యది? నిరతంబుగా మీర । నా కెజింగింపుండు నయముతోడి ఈ, ననిన వినియుం గణికుం డనువాండు, సౌబలు । నాప్తమంత్రి, నీతులందుం గరము

కుశలుం దైనవాండు కురుకులవల్లభు । నిష్టమునకు6 దగ౮గ నిట్టు లనియె. 101 ప్రతిపదార్థం: ఆయుధ, విద్యల+అందు; జితశ్రములు+అనియును; పండితులనీ: రణ, శూరులు+అనియు= యుద్దంలో శౌర్యంకలవా రనీ; సంతత+ఉత్సాహులు+అనియున్‌= _ ఎడతెగని ఉత్సాహం కలవారనీ; అతి+ఉద్దతులు= మిక్కిలిగర్వించినవాళ్ళు; అనియును; పాండవులకు, భయము+అందుచు+ఉండుదున్‌= భయపడుతుంటాను; దానిసైన్‌= దానికితోడు; రాజు= ధృతరాష్ట్ర మహారాజు; ధర్మజు; యువరాజున్‌+చేసె= యువరాజుగా చేశాడు; ఏమి, చేయు, వాడ; నృపనీతి= రాజనీతి; ఏ+అది= ఏది; మీరు+అ= మీరే? నయముతోడన్‌= (ప్రీతితో; నిరతంబుగా= నిత్యంగా; నాకు+ఎటింగింపుండు= నాకు తెలియచెప్పండి; అనిన; వినియున్‌; నీతుల+అందున్‌; కరము, కుశలుడు+ఐనవాడు= మిక్కిలి నేర్పరి ఐనవాడు; సౌబలు+అప్తు మంత్రి= సుబలుని కుమారు. డైన శకునియొక్క ప్రియమైనమంత్రి; కణికుండు+అనువాండు; కురు, కుల, వల్లభు+ ఇష్టమునకున్‌= కురువంశరా జైన దుర్యోధనుని కోరికకు; తగ(గన్‌= తగినట్టుగా; ఇట్టులు+అనియె= ఈవిధంగా అన్నాడు. తాత్పర్యం: 'ఆయుధ విద్యలలో పండితు లనీ, రణ శూరు లనీ, ఎడతెగని ఉత్సాహవంతు లనీ, మిక్కిలి గర్వించిన వాళ్ళనీ పాండవులకు భయపడుతుంటాను. దానికితోడు ధృతరాష్ట్ర మహారాజు, ధర్మరాజును యువరాజుగా చేశాడు. ఏంచేయాలో తోచటంలేదు. ప్రీతితో రాజనీతి నా కుపదేశించండి'- అని దుర్యోధను డనగా, నీతుల్లో నేర్పరి, శకునికి ప్రియమంతత్రి అయిన కణికుడు దుర్యోధనునికోరికకు తగినట్టు ఈ విధంగా చెప్పాడు. విశేషం: కణికుడు - అనే పేరుకు 'కిణింకుండు”, “గణికుండు' అనే పారాంతరా లున్నాయి. అంతేగాక సంస్క్టృతభారతం పిపియస్‌.శాస్రిప్రతి, 904 పుటలో “తతః కణింక మానాయ్య ధృతరా'ష్ల్రోబ్రవీదిదమ్‌” అని ఉంది. సంస్కృతభారతం చిత్రశాలాప్రతి, 244 పుటలో “కణికం మంత్రిణాం (శ్రేష్టం ధృతరాష్త్రోబ్రవీ ద్వచః” అని ఉన్నది. చూడు, -శ్రీమదాం[ధ్రమహాభారత సంకోధితప్రతి, పుట, 344. కణికుడు - కిణింకుడైనాం గిణికుడైనా - అతనిపేరు సంగతి ఎలా ఉన్నా పైన పేర్కొన్న సంస్కృతభారత ప్రతులనుబట్టి కణికుడిని. పిలిపించి ఉపదేశం పొందినవాడు ధృతరాష్తుడు. కాని నన్నయ భారతంలో కణికోపదేశాన్ని పొందింది దుర్యోధనుడు. ఇది పెద్దమార్పు. ఇది ఇట్టా ఉండగా భాండార్కరుప్రతిలో నన్నయభారతంలోని కణికనీతి ప్రక్షిప్త మనే అభిప్రాయం వ్యక్తంచేయబడినట్టు, తాము చూచిన తాళపత్రప్రతుల్లో ముద్రితప్రతుల్గో కణిక నీతి ఉన్నట్టు (శ్రీమదాంద్రమహాభారతసంశోధిత ప్రతిని సిద్దంచేసినవారు చెప్తున్నారు. “భాండార్కరు ప్రతిలో (అధ్యాయాలు 128, 129) కణికనీతి విడువబడింది, 574 పుటలోని జ్ఞాపిక చూడనవును. నన్నయ (కీశ1050) భారతంలో కణిక నీతి ప్రశంస లేదని భాండార్కరు నుడువుతున్నది. క్లేమేంద్రుని భారత మంజరిలో గూడ ఇది లేదని భాండార్కరు సంస్థవారు వ్రాస్తున్నారు. జావాప్రతి (క్రీశ 1000లో గూడ ఇది లేదని వారే చెప్తున్నారు. మూలభారతంమీద రచింపబడిన వ్యాఖ్యలలో కణికనీతి వ్యాఖ్యానింపబడలే దని

ఆదిపర్వము - షష్టాశ్వాసము 565 భాండార్కరుప్రతి తెలుపుచున్నది. శాంతిపర్వంలో శత్రుంజయునికి భరద్వాజునిచేత ఉపదేశించబడిన రాజనీతి సారాంశమే కణికనీతి అని వీరిమతం. కాని మేము చూచిన తాళపత్రప్రతులలోను, ముద్రితప్రతులలోను కణికనీతి కనబడుచున్నది. నన్న్మయభారతములో ఇది (ప్రక్షిష్త మనుటకు ఆధారమేమో తెలియదు. పర్వాను[క్రమణిక, పర్వసం[గ్రహములందు మాత్రం కణికనీతి ప్రశంస లేదు”. - శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుటలు-344, 345. తరువోజ,

ధరణీశు. డుద్యతదండుం దై యుచిత । దండవిధానంబు దప్పక ధర్మ

చరితులంగా మహీజనుల రక్షించి । సద్చత్తుం డగునది; సర్వవర్ధములు

నరుసన తనుతను వర్ణధర్మముల । వర్తిల్లుదురు గడవక దండభీతి

నరిమిత్రవర్ణితుం డై సమబుద్ధి; యగు మహీవల్లభు ననుశాసనమున. 102 ప్రతిపదార్దం:; ధరణి+-ఈశుండు= భూపతి, రాజు; ఉద్యత, దండుండు+ఐ= 'పైకెత్తబడిన రాజదండం గలవా డై; ఉచిత, దండ, విధానంబున్‌= తగిన దండనీతి పద్ధతిని; తప్పక; మహీ, జనుల= భూమిలోని ప్రజలను; ధర్మ, చరితులన్‌+కా= ధర్మమైన నడవడిక కలవాళ్ళనుగా; రక్షించి; సత్‌+వృత్తుండు+అగునది= మంచి నడవడిక కలవాండు కావాలి; దండనీతిన్‌= దండ నీతిలో; అరి, మిత్ర, వర్జితుండు+ఐజ శత్రువులు, మిత్రులు లేనివా డై సమ, బుద్ధి+అగు= సమాన మైన బుద్ధి కల వాడవుతాడు; మహీ, వల్లభు+అనుశాసనమున= రాజుయొక్క ఆజ్ఞచేత; సర్వ, వర్షములు= అన్నిజాతులు; వరుసన= (క్రమంగా; తమ, తమ, వర్ల ధర్మముల= తమ తమ జాతుల యొక్క ధర్మాలను; గడవక= దాటక; వర్తిల్లుదురు= ప్రవర్తిస్తారు. తాత్పర్యం: ప్రభువు ప్రబల మైన అధికారం గలవా డై తగిన దండనీతిని అవలంబించి, ప్రజలను ధర్మ మార్గాన నడిపించి, మంచి ప్రవర్తన గలవాడుగా ఉండాలి. దండనీతిలో స్వ పర భేదభావం లేకుండ సమ బుద్దితో ఉండే రాజుయొక్క ఆజ్ఞచేత అన్నిజాతులవాళ్ళూ తమ తమ జాతిధర్మాలను ఉల్లంఘించక (ప్రవర్తిస్తారు. విశేషం: ఉత్తమపాలనకు అధికార బలం ఒక్కటే ప్రభువుకు చాలదు. నిప్పక్షపాతం, సత్ర్రవర్తనం ప్రభుతకు పెద్ద బలాన్ని కూర్చే గుణాలు. ఇవికూడ (ప్రభువుకు ఉండాలి. తరువోజ లక్షణానికి అది. 5, 28, 145 పద్యాల విశేషవ్యాఖ్యలు చూడండి. క. గులుకొని కార్యాకార్యము లెలు(గక దుశ్టరితుండై యహితు6 డగు నేనిన్‌

మటివక గురు నైనను జను | లెటుగంగ శాసించునది మహీశుండు బుద్ధిన్‌. 103 ప్రతిపదార్థం: గులుకొని= ప్రయత్నించి; కార్య+అకార్యములు= చేయ దగిన పనులు, చేయకూడని పనులు; ఎజులగక; దుః+చరితుండు+ఐ= చెడు నడవడి కలవా డై; అహితుండు+అగున్‌+ఏనిన్‌= మేలుకోరేవాడు కాకుంటే; మహీ+ ఈ పయ భూపతి - రాజా; గురున్‌*ఐనను= గురువు నైనా: మజణవక= మరచిపోకుండా; బుద్ధిన్‌= తెలివితేటలతో - వివేకంత్‌ ; జనులు+ఎయి(గంగ= ప్రజల కందరికీ తెలిసేటట్టు; శాసించునది= శిక్షించవలసింది. తాత్పర్యం; ఇవి చేయదగిన పనులు, ఇని చేయగూడని పనులు- అని తెలిసికొనకుండ, చెడు నడవడి గలవా రే మేలుకోరేవాడు కాకుంటే- తండ్రి నైనా (లేదా గురువు నైనా) సరే విడిచిపెట్టక, వివేకంతో, ప్రజలందరి

వే, ఇట

తెలిసేటట్టు అతడిని ప్రభువు శిక్షించాలి. విశేషం: గురు. శబ్దానికి పాఠాంతరం సుతుశబ్దం ఉంది. మూలంలో దీనికి సరిపడే శ్లోకం కనిపించదు. -శ్రీమదారంద్ర మహాభారతసంకోధితప్రతి, పుట.345.

566 శ్రీమదాంధ్ర మహాభారతము క, _ ధీరమతియుతులతోడ । విచారము సేయునది మును, విచారితపూర్వ ప్రారబ్ధ మైన కార్యము । పారముం బొందును విఘాతపదదూరం బై. 104 ప్రతిపదార్హం: మును= ముందుగా; ధీర, మతి, యుతులతోడన్‌= గొప్ప బుద్ది గలవాళ్ళతో; విచారము= ఆలోచన; చేయునది= చేసేది; విచారిత, పూర్వ. (ప్ర+ఆరబ్ధము+ఐన, కార్యము= ముందుగా ఆలోచించబడిం దై గొప్పగా మొదలుపెట్టబడిన పని విఘాత, పద, దూరంబు+ఐ=ఐ చెడిపోవటం అనే మాటకు దూరమైనదై - అంటే చెడిపోకుండ; పారమున్‌+పొందును= తుదముట్టును - పూర్తి అవుతుంది. తాత్పర్యం: ఏ పని నైనా బుద్దిమంతులతో ముందుగా విచారించి చేయాలి. ముందుగా విచారించి చక్కగా ప్రారంభించిన పని చెడిపోకుండా సఫల మవుతుంది. క. _ జనపాలుండు మృదుకర్మం । బున నైనను గ్రూరకర్మమున నైనను నే ర్పున నుద్ధరించునది ద । ననపాయతం బొంది చేయునది ధర్మంబుల్‌, 105 (ప్రతిపదార్థం: జన, పాలు(ండు= (ప్రజలను పాలించేవాడు - రాజు; నేర్పున= నేర్పుతో; తన్ను= తనను; మృదు, కర్మంబునన్‌+ ఐనను= మెత్తని పనిచేతకాని; క్రూర, కర్మమునన్‌*ఐనను= భయంకర మైన పనిచేతగాని; ఉద్ధరించునది= రక్షించుకోవాలి; అనపాయతన్‌= (ప్రమాదం లేకుండటాన్ని; పొంది= కలిగి; ధర్మంబుల్‌? చేయునది చేయాలి. తాత్పర్యం: రాజు నేర్పుతో మెత్తని పనిచేత గాని, భయంకర మైన పనిచేత గాని మొదట తనను తాను రక్షించుకోవాలి. తనకు ప్రమాదం లేకుండ చూచుకొని రాజ ధర్మాలు నడపాలి, కు అమలినమతి నాత్మచ్చి । ద్రము లన్యు లెటుంగకుండ6 దా నన్య చ్చి ద్రము లిమ్ముగ నెటుంగుచు దే। శముం గాలము నెజింగి మిత్రసంపన్నుం డై. 106 ప్రతిపదార్థం: అమలినమతిన్‌= స్వచ్చమైన బుద్ధితో; ఆత్మ, ఛిద్రములు= తనయొక్క లోపాలు; అన్యులు= ఇతరులు; ఎజుంగకుండజ తెలిసికొనకుండా; తాను; అన్య, ఛి[ద్రములుజ ఇతరులయొక్క లోపాలు; ఇమ్ముగన్‌= అనుకూలంగా; ఎజుంగుచు= తెలిసికొంటూ; దేశమున్‌= దేశ పరిస్టితులను; కాలమున్‌= కాల పరిస్టితులను; ఎటింగి= తెలిసికొని; మిత్ర, సంపన్నుండు+ఐ= స్నేహితులయొక్క బలంకలవా డై. తాత్పర్యం: అచ్చపు బుద్ధితో తన లోపాలు ఇతరులు తెలిసికోకుండ ఇతరుల లోపాలను తాను తెలిసికొంటూ, దేశ కాల పరిస్థితులను ఎరిగి, మిత్ర బలం గల వా డ్రై రాజు తన రాజధర్మాలను నిర్వర్తించాలి. క. _ బలహీను లైనచో శ; త్రులం జెజచుట నీతి, యధిక దోర్వీర్య సుహృ ద్దలు లై నవారింజెబుపల । నలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీందన్‌. 107 ప్రతిపదార్హం: బల, హీనులు+ఐనచో= బలాన్ని కోల్పోయిన వాళ్ళయితే; శత్రులన్‌; చెజచుట= చంపటం; నీతి; అధిక, దోఃవీర్య, సుహృత్‌+బలులు+ఐన, వారిన్‌= ఎక్కువ బాహుబలం, మిత్ర బలం గలవాళ్ళయినవారిని చెటుపంగన్‌= చంపటం; అలవియె= సాధ్యమా; మీదన్‌= తర్వాత; అక్షేశు సాధ్యులు+అగుదురు+ఎ=ఐ (వారు) కష్టంలేకుండా - అంటే సులభంగా జయింపబడిన వాళ్ళవుతారా! తొత్ప్సర్యం:; బలహీను లైనపుడే శత్రువులను చంపటం రాజనీతి. వాళ్ళు అధిక బాహుబలం, మి(త్రబలం కూర్చు కొన్న తర్వాత వాళ్ళని చంపటం సాధ్యమా? జయించటం సులభమా?(కాదు అని భావం).

ఆదిపర్వము - షష్టాశ్వాసము 567

క. అలయక పరాత్మ కృత్యం । బులం బతి యెజుంగునది దూత ముఖమునం బరభూ

ముల వృత్తాంతము లెజుంగంగ6: బలుమలుం బుచ్చునది వివిధ పాషంద తతిన్‌. 108 ప్రతిపదార్థం: పతి= రాజు; అలయకః= విసుగుచెందక; దూత, ముఖమునన్‌= దూతవలన; పర+ఆత్మ, కృత్యంబులన్‌= తనయొక్క, శత్రువులయొక్క పనులను; ఎజుంగునది= తెలుసుకోవాలి; పర, భూముల, వృత్తాంతములు= శత్రుదేశాలయొక్క సమాచారాలు; ఎటుగంగన్‌= తెలిసికొనటానికి; వివిధ, పాషండ, తతిన్‌= పలువిధా లైన పాషండుల సమూహాన్ని; పలుమయున్‌= 'పెక్కుమారులు; పుచ్చునది= పంపించాలి. తాత్పర్యం: రాజు విసుగులేకుండా తన పనులను గురించి, శత్రువుల పనులను గురించి దూతలవలన తెలిసికొనాలి. శత్రు దేశ విషయాలను తెలిసికొనటానికి పలువిధా లైన పాషండుల సమూహాల్ని పంపాలి. విశేషం: శత్రువుల కృత్యాలనుగూర్చి దూతల వలన తెలిసికొనవలసిన అవసరం రాజులకు ఉన్నది. అంతే కాదు; తమ పనులను గూర్చి ప్రజ లేమనుకొంటున్నారో, తమ పనుల్రభావం దేశ ప్రజలమీద, శత్రువులమీద ఏ విధంగా ఉన్నదో మదింపువేసుకొనటం కూడ రాజులకు అవసరమే. పాషండు లంటే వేద బాహ్యులు. క. _ నానావిహార శైలో; ద్యాన సభా తీర్థ దేవతాగ్భహ మృగయా

స్థానముల కరుగునెడ మును : మానుగ శోధింపవలయు మానవసతికిన్‌. 109 ప్రతిపదార్థం: మానవ, పతికిన్‌= రాజుకు; నానా, విహార, శ్రైల+శఉద్యాన, సభా, తీర్ధ దేవతా, గృహ, మృగయా, స్టానములకు+ అరుగు+ఎడజ= పలువిధా లైన ్రీడాపర్వతాలకు, ఉద్యానవనాలకు, సభలకు, పుణ్యతీర్జాలకు, దేవాలయాలకు, వేటాడే ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు; మును= ముందుగా; మానుగజ తగు విధంగా; శోధింపవలయు= పరిశుద్ధంచేయాలి - అంటే ప్రభువుకు ప్రమాదం కలిగించే వ్యక్తులు, ఆయుధాలు దాగి ఉండకుండా పరిశీలించి, ఉంటే తొలగించి ఆయా స్థలాలను ప్రమాదరహితంగా శుద్దంచేయాలి. తాత్పర్యం: పలువిధా లైన (క్రీడాపర్సతాలకు, ఉద్యానవనాలకు, సభలకు, పుణ్యతీర్జ్థాలకు, దేవాలయాలకు, వేటాడే ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు - ప్రభువుకు (ప్రమాదాలు కలుగకుండ, ఆయా ప్రదేశాలను ముందుగా తగువిధంగా పరిశీలించి, ప్రమాదంకలిగించే వ్యక్తులు, ఆయుధాలు ఉంటే తాలగించి పరిశుద్దంగా ఉండేటట్టు చేయాలి. విశేషం: ఈ పద్దతులు ఈనాడుగూడ ఆచరణలో ఉన్నాయి. ఇవి ప్రభువుకు రక్షణ కల్పించటంలో భాగాలు. తే. వీరు నమ్మంగందగుదురు వీరు నమ్మం। దగరు నాకు నా వలవదు; తత్త్వబుద్ధి శం

నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు ; నాత్మరక్షాపరుం డగు నది విభుండు. శ (ప్రతిపదార్దం: విభుండు= రాజూ; నాకు; వీరు; నమ్మంగన్‌; తగుదురు; వీరు; నమ్మన్‌; తగరు; నా, వలవదు= అని అనవద్దు; తత్త్వ, బుద్దిన్‌= నిశ్చయబుద్దిచేత; ఎవ్వరిని= ఎవరినికూడా; విశ్శసింపక= నమ్మక; ఆత్మ, రక్షా, పరుండు+*అగునది= తన్ను తాను రక్షించుకోవటమే (ప్రధానంగా కలవాడు కావాలి. తాత్పర్యం: రాజైనవాడు 'నాకు వీరు నమ్మదగినవారు, వీరు నమ్మగూడనివారు' అని అనగూడదు. నిశ్చయబుద్ధి చేత ఎవ్వరినీ నమ్మకుండా తన రక్షణ తానే (ప్రధానంగా చూచుకోనాలి.

568 (ీముదాంధ్ర మహాభారతము గ్‌ ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్షయ తృమ్మునం జేయంగావలయు! దత్పరిరక్షణశక్తి నెల్ల కా ర్యమ్ములు సిద్ధి. బొందు బరమార్ధము; మంత్రవిభేద మైనం గా ర్యమ్ములు నిర్వహింపంగ బృహస్పతికైనను నేరంోలునే. 111 ప్రతిపదార్థం: ఇమ్ముగన్‌= బాగుగా; ఆత్మ, రక్ష తనయొక్కరక్షించుకోవటాన్ని; విధియించు, విధంబున= చేసికొన్నట్లే: మంత్ర, రక్ష రహస్యంయొక్క కాపాడటాన్ని; యత్నమ్మునన్‌= ప్రయత్నంతో; చేయగావలయున్‌; తత్‌+పరిరక్షణ, శక్తిన్‌= ఆ రహస్యాలోచనాన్ని రక్షించటంయొక్క బలంచేత; ఎల్ల, కార్యమ్ములు= అన్ని పనులు; సెద్దిన్‌+పొందున్‌= సఫలతను పొందుతాయి; పరమ+అర్ధము=. నిశ్చయం; మంత్ర విభేదము+ఐనన్‌= రహస్యంయొక్క వెల్లడిఅయితే, కార్యమ్ములు; నిర్వహింపం= జరపటానికి; బృహస్పతికి+ఐనను; నేరన్‌+పోలునే= సాధ్యమవుతుందా? తాత్పర్యం: ప్రభువు తనను తాను జాగ్రత్తగా రక్షించుకొన్నట్లే, తన రహస్యాలోచనాన్ని గూడ రక్షించుకోవాలి. రహస్యాలోచన వెల్లడి కాకుండ రక్షించుకొనే బలంచేతనే అన్ని పనులు ఫలవంతా లవుతాయి. రహస్యాలోచన వెల్లడి అయితే పనులను ఫలవంతం కావించటం ఆ బృహస్పతి కైనా సాధ్యంకాదు. (బుద్దిబలంలో బృహస్పతిని మించిన వాళ్ళులేరు కనుక అతనికికూడ సాధ్యం కా దనటం,) విశేషణ: అలం: అర్జాంతరన్యాసం. కు పలుమలు శపథంబులు నం । జలియును నభివాదనమును సామప్రెయభా షలు మిథ్యావినయంబులు6; గలయవి దుష్టస్వభావకాపురుషులకున్‌. 112 ప్రతిపదార్హం: దుష్టస్త్వభావ, కాపురుషులకున్‌= చెడుస్వభావం గల నీచ మానవులకు; పలుమటు; శపథంబులున్‌= ఒట్టుపెట్టుకోవటాలు; అంజలియును= చేతులు జోడించటాలు; అభివాదమును= నమస్కారాలు; సామ, ప్రియ, భాషలు= సామోపాయం (అనుకూల (ప్రవర్తన రూపమైన ఉపాయం), ఇంపైన మాటలు; మిథ్యా, వినయంబులు= కపటపు వినయాలు; కల, అవిజ ఉన్నాయి. తాత్పర్యం: చెడు స్వభావం గల నీచులు మాటిమాటికి ఒట్టుపెట్టుకుంటారు. చేతులు జోడిస్తారు. నమస్కారాలు చేస్తారు. సామోపాయంతో కూడిన ఇంపైన మాటలు మాట్టాడుతారు. కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. విశేషం: ఉపాయాలు - సామ, దాన, భేద, దండాలు-అనేవి నాలుగు. క, తన కిమ్మగు నంతకుదు | ర్థనుండిష్పుండపొలె నుండి సస్పమపోలెం దన కిమ్మగుడును గణచును ; ఘనదారుణకర్మగరళఘనదంష్టములన్‌. 113 ప్రతిపదార్థం: దుర్దనుండు= దుర్మార్గుడు; తనకు; ఇమ్ము+అగు+అంతకు= అనుకూలం అయ్యే వరకు; ఇపష్టుడు+ఆఅ, పోలెన్‌= ఇష్టమైనవాడివలె - మిదత్రుడివలె; ఉండి; తనకు; ఇమ్ము+అగుడును= అవకాశం లభించినంతనే; సర్పమ+పోలెన్‌= పామువలె; ఘన, దారుణ, కర్మ, గరళ, ఘన, దంష్టములన్‌= మిక్కిలి క్రూరా లయిన పనులు అనే విషంచే పెద్దవైన కోరలచేత; కజచును. తాత్పర్యం: దుర్మార్గుడు తనకు అనుకూల మయ్యేంతవరకు మిత్రుడివలె నటించి, అనుకూలత ఏర్పడిన వెంటనే పామువలె తన [క్రూర కృత్యా లనే కోరలతో కరుస్తాడు. విశేషం: అలం: ఉపమ.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 569

క. కడునలుకయుం గూర్మియు నే; రృడ నెజింగించునది వాని ఫలకాలమునన్‌

బిడుగును గాడ్పును జనులకు ।; బడుటయు వీచు టయు నెలుకపడియెడుభంగిన్‌. 114 (ప్రతిపదార్థం: కడున్‌= మిక్కుటమైన; అలుకయున్‌= కోపమూ; కూర్మియున్‌= స్నేహమూ; వాని, ఫల, కాలమునన్‌= వాటియొక్క ఫలంయొక్క సమయాన - అంటే ఆ రెండింటియొక్క అనుభ వకాలాన; పిడుగును; గాడ్పును= గాలియును; పడుటయు; వీచుటయున్‌: జనులకున్‌; ఎజుకపడియెడు; భంగిన్‌= తెలిసేటట్టుగా; ఏర్పడన్‌= స్పష్టమయ్యేట్టు; ఎజిగించునది= తెలియజేయాలి. తాత్పర్యం: పిడుగుపడటం, గాలివీచటం - అవి జరిగినపుడే జనులకు తెలిసినట్టు- మిక్కుటమైన కోపంగాని, స్నేహంగాని వాటి అనుభవ కాలానికే ఇతరులకు తెలియజేయాలి. విశేషం; అలం: (క్రమం; ఉపమ. క తజియగునంతకు రిపుం దన; యజకటం. బెట్టికొనియుండునది; దజీయగుడుం

జెజచునది జాతిమీదను ।! వజలంగ మృద్ధటము నెత్తి వైచిన భంగిన్‌. 115 ప్రతిపదార్థం: తటి= సమయం; అగునంతకు= వచ్చేవరకు; రిపున్‌= శత్రువును; తన, అజకటన్‌= తనయొక్క భుజం మీద; పెట్టుకొని; ఉండు నది= ఉండాలి; తతి, అగుడున్‌= సమయం వచ్చినపుడు; మృత్‌+ఘటమున్‌= మట్టికుండను; వజలంగ=ు ఒప్పుగా - ప్రకాశించేటట్టు: జాతిమీదను; ఎత్తివైచిన, భంగిన్‌= ఎత్తి పడవేసిన విధంగా; చెజచునది= నాశనమయ్యేటట్టు చేయాలి. తాత్పర్యం: తగిన సమయం వచ్చేవరకు శత్రువును భుజం మీదికి ఎక్కించుకొని మోస్తూ తగిన సమయం రాగానే మట్టికుండను రాతిమీద ఎత్తి కొట్టినట్టు అతడిని నాశనం చేయాలి. విశేషం; అలం. ఉపమ. ఈ పద్యం పెక్కు ప్రతుల్టో లేనట్టు శ్రీమదాంధ్రమహాభారత సంశకోధితప్రతి పుట, 348లో ఉన్నది. క. తనకపకారము మునుంజే। సిన జనుం డల్పుండని నమ్మి చేకొని యుండం

జన; దొకయించుక ముల్లయి । నను బాదతలమున నున్న నదవంగ నగునే. 116 ప్రతిపదార్థం: మును= ముందు - ఇదివరకు; తనకు; అపకారము; చేసిన; జనుండు; అల్పుండు+అనిః= తక్కువవా డని; నమ్మి; చేకొని= ఆదరించి; ఉండన్‌+చనదు= ఉండకూడదు; ఒక, ఇంచుక ఒకకొద్దిపాటి; ముల్టు+అయినను; పాద, తలమునన్‌= పాదప్రదేశంలో - అంటే పాదంలో; ఉన్నన్‌= ఉంటే; నడువ(గన్‌= నడవటానికి; అగునే= సాధ్యమవుతుందా? తాత్సర్యం: ఇంతకుముందు తనకు అపకారం చేసిన మానవుడు తక్కువవాడు కదా అని, ఆతడిని ఆదరించ కూడదు. ముల్టు చిన్నదే అయినా అది పాదంలో ఉంటే నడవటానికి సాధ్య మవుతుందా! విశేషం: అలం. అర్జాంతరన్యాసం. ఈ పద్యానికి పాఠాంతరంగా కొన్ని ప్రతుల్గో ఉన్న పద్యం: తన కపకారము చేసిన, జను డల్పుం డనుచు నమ్మి జడమతి యై చే, కొనంజన దించుక ముల్లయి, నను బద్దతులందు నున్న నడువంగ నగునే. - శ్రీమదాం[ద్ర మహాభారతసంశోధితప్రతి, పుట, 347. క. _ బాలుండని తలంచి రిపుతో। నేలిదమునం గలిసియునికి యిది కార్యమె? యు

త్మీలానలకణ మించుక। చాలదిె కాల్బంగ నుగ్రశైలాటవులన్‌. 117

570 శ్రీమదాం(ధ్ర మహాభారతము ప్రతిపదార్జం: బాలుండు+అని; తలంచి; రిపుతోన్‌=ఐ శత్రువుతో; ఏలిదమునన్‌= చులకన భావంతో; కలిసి, ఉనికి= కలిసిఉండటం; ఇది= ఇట్టుండటం; కార్యమె= చేయదగిన పనియా; ఉగ్ర, శైల+అటవులన్‌= భయంకరా లైన పర్వతాలలోని అడవులను; కాల్పంగన్‌= కాల్చ్బటానికి; ఉత్‌, కీలా+అనల, కణము= పెద్దమంట యొక్క నిప్పురవ్వ; ఇంచుక= కొంచెం; చాలదె= సరిపోదా, తాత్పర్యం; బాలుడు కదా అని చులకన భావం వహించి శత్రువుతో కలిసి ఉండకూడదు. భయంకరా లైన పర్వతారణ్యాలను కాల్చటానికి కనకనలాడే చిన్న నిప్పురవ్వ చాలదా! విశేషం: అలం. అర్జాంతరన్యాసం. క, _ మొనసి యపకారింగడ విడి; కొనియుండెడు కుమతి దీర్ణకుజశాఖాగ్రం బున నుండి నిద్రవోయెడు ;, మనుజునకు సమాన మగు. బ్రమత్తత్వమునన్‌. 118 ప్రతిపదార్థం: మొనసి=ఐ పూని; అసకారిన్‌= కీడుచేసినవాడిని; కడన్‌, ఇడికొని, ఉండెడు= దగ్గర ఉంచుకొని ఉండే; కుమతి= చెడుబుద్దికలవాడు - ఇట బుద్ధిలేని వాడని (గ్రహించ వచ్చు; ప్రమత్తత్వమునన్‌= ఏమరినవాడు కావటంలో; దీర్హ, కుజ, శాఖా+ అ(గ్రంబునన్‌+ఉండీ= ఎత్తైనచెట్టు యొక్క కొమ్మయొక్క చివరలో పరుండి; నిద్ర+పోయెడు; మనుజునకు; సమానము+అగున్‌. తాత్పర్యం: ప్రయత్నించి తన కపకారం చేసినవాడిని దగ్గర ఉంచుకొన్న బుద్దిహీనుడు ఏమరుపాటుతో ఎత్తైన చెట్టు కొమ్మ చివర ని(ద్రించేవాడితో సమానం. విశేషం: అలం: ఉపమ. చ తదయక సామభేదముల దానములన్‌ దయతోడ నమ్మణా నొడివియు సత్యమిచ్చియుం జనున్‌ జననాథ! కృతాపకారులం గడంగి వధింపంగాం గనుట కావ్యునముతం బది; గాన యెట్టులుం గడుకొని శత్రులం జెబుపంగాంచుట కార్యము రాజనీతిమైన్‌. 119 ప్రతిపదార్థం: జననాధ= ఓరాజా!; కృత+అపకారులన్‌= చేయబడిన అపకారాలు కలవాళ్ళను; తడయక= ఆలస్యంచేయక; సామ భేదముల= సామోపాయంచేత, భేదోపాయంచేత; దానములన్‌= దానాలచేత; దయతోడ; నమ శన్‌*కా= నమ్మకం కలిగేటట్టుగా; నొడివియు= మాట్టాడి; సత్యము+ఇచ్చియున్‌= ఒట్టుపెట్టకొని; కడంగి= ప్రయత్నించి; వధింపన్‌+*కాన్‌+ కనుటజ చంపబడేట్టు చూడటం - అంటే చంపటం; చనున్‌= తగును; ఇది; కావ్యు, మతంబు= శుక్రాచార్యునియొక్క అభిప్రాయం: కాన= కనుక; ఎట్టులున్‌= ఏ విధంగా నైనా; కడుకొని= ప్రయత్నించి; రాజనీతిమైన్‌= రాజనీతిచేత; శత్రువున్‌; చెలుపన్‌, కాంచుట= నశించేటట్టు చూడటం; కార్యము= చేయదగిన పని. తాత్పర్యం: ఓ రాజా! అపకారాలు చేసినవాళ్ళను- సామ దాన భేదో పాయాలచేత లేదా దయ చూపి నమ్మకం కలిగేట్టుగా మాట్లాడి లేదా ఒట్టుపెట్టకొని, నమ్మకం కలిగించి ఆలస్యం జరుగకుండ చంపాలి. ఇది శుక్రుని అభిప్రాయం. అందుచేత ఏ విధంగా నైనా రాజనీతితో శత్రువులను హతమారాలి. విశేషం: కావ్యుమతం బిది - అనే దానికీ కాప్యుమతం బిది, కార్య, మతం బిది, కావ్యమతం బిది అనే పారాంతరా లున్నాయి. - (శ్రీమదాం(ధ్రమహాభారతసంశోధితప్రతి, పుట, 348.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 5్‌71

వ. "కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మరక్షాసరుండ వయి దూరంబుసేసి దూషించునది' యనినం గణికుమతంబు విని దుర్యోధనుండు చింతాపరుం డై యొక్కనాండు ధృతరాష్తున కేకాంతంబున ని ట్లనియె. 120

ప్రతిపదార్థం: కావున; సర్వ, ప్రకారంబులన్‌= అన్నివిధాలచేత; అపకార, కారణులు+అయిన, వారిన్‌= అపకారాలు చేసిన వారిని; పరులన్‌+అయిన= శత్రువుల నైనా; బాంధవులన్‌+అయినన్‌; ఉపేక్షింపకజ అ(శ్రద్దచేయక; ఆత్మ, రక్షాపషరుండవు+అయి= నిన్ను నీవు రక్షించుకొనటంలో మనస్సు కలవాడవై; దూరంబు+చేసి= (వారిని) దూరంగా ఉంచి; దూషించునది= తిట్టాలి (ఇట చంపాలి అనేఅర్హం సమంజసం); అనినన్‌= అని అనగా: కణికు, మతంబు= కణికునియొక్క అభిప్రాయం; విని; దుర్యోధనుండు; చింతా, పరుండు+ఐ= దుఃఖం నిండిన మనస్సు కలవా డై; ఒక్కనాండు; ధృతరా్షునకు; ఏకాంతంబునన్‌= ఒంటరిగా ఉన్నప్పుడు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: 'అందుచేత అపకారాలు చేసినవాళ్ళు శత్రువు లైనా, బంధువు లైనా అ(శ్రద్రచేయకూడదు.

ఆత్మరక్షణకొరకు అన్నివిధాలా వాళ్ళను హతమార్చా' లని కణికుడు చెప్పగా విని, చింతా క్రాంతుడై దుర్యోధనుడు

ఒకనాడు ధృతరాష్ట్రుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనితో ఇట్లా అన్నాడు. దుర్యోధనుండు తండ్రితో దన మనోదు:ఖంబు( దెలుపుట (సం.1-129-10)

తే వీరులని పాండుసుతులకు వెజతు నేను; వెజచుటకుం దోదుగా నిప్పు విభుండ వీవు పాండవజ్యేష్టునకు. బ్రీతి బరమయౌవ । రాజ్య మిచ్చితి కురువృద్ధరాజులొద్ద. 121

ప్రతిపదార్థం: నేను; వీరులు+అని; పాండు, సుతులకు= పాండురాజుయొక్క కుమారులకు - పాండవులకు; వెటతు=

భయపడతాను; వెజచుటకున్‌; తోడు, కాన్‌= తోడయినట్టు; విభుండవు+-ఈవుజ రాజు వైన నీవు; కురు, వృద్ద, రాజుల+ఒద్ద= కురువంళపు పెద్దలయొక్క రాజులయొక్కఎదుట; ్రీతిన్‌= (ప్రేమతో; పాండవ, జ్యేష్టునకున్‌= పాండవులలో పెద్దవాడైనవానికి; పరమ, యౌవ, రాజ్యముజ= ప్రధానమైన యౌవరాజ్యాన్ని; ఇచ్చితివి= ఇచ్చావు.

తాత్పర్యం: పాండువులు వీరు లని నేను భయపడుతున్నాను. నేను భయపడటానికి తగ్గట్లే (ప్రభువైన నీవు

కురువంశపుపెద్దలయెదుట, రాజులయెదుట పాండవులలో పెద్దవాడైన ధర్మరాజును ప్రేమతో యువరాజుగా

చేశావు.

విశేషం: వ్యక్తిబలాన్ని అంతకంత పెంచేది అధికారం. పాండవులు మొదలే బలవంతులు. అందుకుతోడు యుధిస్టిరు డిప్పుడు

యువరాజైనాడు. ఆ యౌవరాజ్యాధికారం ఆతనికి ఎవరో ఇచ్చింది కాదు, రాజైన ధృతరా'్ట్రుడే స్వయంగా ఇచ్చొడు. "పైగా

చాటుమాటుగా ఏదో మాటవరుసకు ఇవ్వలేదు. పదిమందిఎదుట శా'స్తోక్తంగా కట్టబెట్టాడు. దాన్ని కాదనటం ఎట్టా? పాండవులను ఎదిరించటం ఎట్టా? అదే దుర్యోధనునిబాధ, భయం. అతనిమానసికస్టితిని తెలియపరిచేదే ఈ తేటగీతి.

వ. “దాననచేసి పార జానపద బ్రాహ్మణ ప్రధాన వరులు ధర్మజున కనురక్తు లయి, నిన్నును భీష్ముని నాదరింపక, ప్రజ్ఞాచక్షుందు రాజ్యరక్షణంబు సేయ సమర్భుండు గాండు, భీష్ముండు సమర్భుం డయ్యును ముందజి రాజ్యభార నివర్తనంబునందు€ గృతప్రతిజ్ఞుం దయ్యెం; గావునం బాండవజ్యేష్టుం డైన యుభథిప్టిరునకు

షేకంబు సేయుద; డు పరాక్రమవంతు లైన రాజ్యాభిషేకంబు సేయుద; మతండు తరుణుండయ్యును గుణవృద్ధుండు ధర్మశీలుం క్రమ' తమ్ములుగలవాడు రాజ్యప్రతిస్టితుం దయ్యెనేని వృద్ధులనమాత్యులబంధుమిత్రులను దొల్లింటికంటె

572 శ్రీమదాంధ్ర మవాభారతము

మిక్కిలిగా బూజార్దుల నెల్లం బూజించు( బితామహుండైన భీష్ముని సపుత్రకుండైన ధృతరాష్తుని నతిభక్తి

నభీష్టభోగానుభవపరులంగా సుఖంబున నునుచు, దీనికి విదురుండును నొడంబడునని యెప్పుడు. దమలో

విచారింతు రని వింటి గర్భరూలాయమానంబు లైన మూర్ధప్రకృతుల పలుకులు విననోపం బాండవుల

నిప్పురంబు వలనం బాయునట్లుగా. జేయవలయు; నేమి సేయుదు?' ననినం గొడుకునకు ధృతరాస్తుం డి

ట్లనియె. 122 ప్రతిపదార్థం: దాననచేసి= దానివలన - ధర్మరాజుకు యౌవరాజ్యం ఇచ్చినందువలన; పౌర, జానపద, బ్రాహ్మణ, ప్రధానవరులు= పట్టణ (ప్రజలు, పల ప్రజలు, (బ్రాహ్మణులు, మంత్రిశ్రేష్టులు; ధర్మజునకు; అనురక్తులు+అయి= అనురాగం - (ప్రేమ కలవా ళ్ళయి; నిన్నును; భీష్మునిన్‌: ఆదరింపక= లెక్కచేయక; ప్రజ్ఞాచక్షుండు= బుద్ధియే కన్నుగా కలవాడు - ధృతరాష్ట్రుడు; రాజ్య, రక్షణంబు, చేయ= రాజ్యాన్ని రక్షించటానికి; సమర్భుడు; కాడు; భీష్ముండు; సమర్భ్హుండు+అయ్యును; ముంద; రాజ్య, భార, నివర్తనంబు+అందు= రాజ్యభారంనుండి మరలటంలో; కృత, ప్రతిజ్ఞండు= చేయబడిన ప్రతిజ్ఞ కలవాడు" అయ్యెన్‌; కావునన్‌; పాండవ, జ్వేష్టుండు+ఐన= పాండవులలో పెద్దవాడైన; యుధిష్టిరునకు; రాజ్య+అభిషేకంబు; చేయుదము; అతండు; తరుణుండు+అయ్యును= యువకు డైనా; గుణ, వృద్దుండు= గుణంచేత పెద్దవాడు; ధర్మ, శీలుండు= ధర్మాన్నే స్వభావంగా కలవాడు; పరా[క్రమవంతులు+ఐన; తమ్ములు; కలవాడు; రాజ్య, ప్రతిస్టితుండు+అయ్యెన్‌+ఏని= రాజ్యంలో నిలుపబడినవా డయితే; వృద్దులన్‌= పెద్దలను; అమాత్యుల= మంత్రులను; బంధు, మిత్రులను; తాల్లింటికంటె= మునుపటికంటె; మిక్కిలిగాఐ= ఎక్కువగా; పూజా+ఆర్హులన్‌+ఎల్లన్‌=ఐ గౌరవానికి తగినవాళ్ళనందరినీ; పూజించున్‌= గౌరవిస్తాడు; పితామహుండు+ఐన= తాతగా రైన; భిష్ముని; స, పుత్రకుండు+ఐన= కుమారులు గల వాడైన; ధృతరాష్ర్రనిన్‌: అతి, భక్తిన్‌= మిక్కిలిభక్తితో: అభి+ఇష్ట భోగ+ అనుభవ, పరులన్‌+కా= కోరుకొన్న భోగాలను అనుభవించటంలో లగ్నమైన మనస్సులు గలవాళ్ళను; సుఖంబునన్‌= సుఖంతో; ఉనుచు= ఉంచుతాడు; దీనికి= ఈ విధంగా చేయటానికి; విదురుండునున్‌= విదురుడుకూడ; ఒడంబడును+అని= ఒప్పుకొంటాడని; ఎల్లప్పుడు; తమలో= తమలో తాము; విచారించుదురు= ఆలోచిస్తారు; అని; వింటిన్‌= విన్నాను: కర్ణ, శూలాయమానంబులు+ఐన= చెవులకు బల్లేలవంటి వైన; మూర, ప్రకృతుల, పలుకులు= మూర్ము లైన జనులయొక్క మాటలు; వినన్‌+ఓపన్‌= వినలేను; పాండవులన్‌; ఈ+పురంబువలనన్‌= ఈ నగరంనుండి; పాయు+అట్టు+కాన్‌= తాలగేటట్టుగొ; చేయవలయున్‌; ఏమి; చేయుదున్‌; అనినన్‌; కొడుకునకు; ధృతరా(్ర్రుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: “ధర్మరాజుకు యౌవరాజ్యం ఇవ్వటంవలన పట్టణ (ప్రజలు, పల్లె ప్రజలు, మంత్రి (శ్రేష్టులు అతనిపట్ట అనురాగంకలవా ళ్ళయి, నిన్ను, భీష్ముడిని లెక్కచేయక, ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని రక్షించలేడు. భీష్ముడు రాజ్యాన్ని రక్షించగలవాడే అయినా రాజ్యభారం స్వీకరించ నని ప్రతిజ్ఞచేసి ఉన్నాడు. అందుచేత ధర్మరాజునే రాజుగా చెద్దా మనీ, అతడు యువకు డైనా గుణవంతు డనీ, ధర్మాత్ము డనీ, పరాక్రమవంతు లైన తమ్ములు గలవా డన్సీ, అటువంటివాడిని రాజుగా చేస్తే మంత్రులను, బంధువులను మిత్రులను, గౌరవించదగినవాళ్ళందరినీ మునుపటికంటె ఎక్కువగా గౌరవిస్తా డనీ, తాతగా రైన భీష్ముడిని, పుత్రు లున్న ధృతరాహ్ర్రుడిని మిక్కిలిభక్తితో పూజిస్తా డనీ, వారి కిష్ట మైన భోగాలను అనుభవింపజేసి సుఖంగా ఉంచుతా డనీ, ఇందుకు విదురుడుకూడ అంగీకరిస్తాడనీ ఎప్పుడూ తమలో తాము అనుకొంటున్నారు. చెవులకు బల్లెములవలె తగిలే ఈ మూర్ధ జనుల మాటలను నేను వినలేను. పాండవులను ఈ పురం వదలి పోయేటట్టు చేయం' డని దుర్యోధను డనగా అతనితో ధృతరా్షుడు ఇట్టా అన్నాడు. చ. జనపతి యైనవానికి. బ్రచండమహాతుములాహవాంతరం

బున మృతింబొందియొండె, మళీ పుత్తులపై. దనరాజ్యభార మె

బల్లను నియమించి యేంగి గిరులం దప మొప్పంగం జేసి యొండెం గా,

కనిమిషలోకభోగసుఖ మందంగం బోలునె శాశ్వతంబుగన్‌. 123

ఆదిపర్వము - షష్టాశ్వాసము 573 ప్రతిపదార్థం: జనపతి+ఐన, వానికిన్‌= రాజైనవానికి; ప్రచండ, మహా, తుముల+ఆహవ+అంతరంబునన్‌= సహింప శక్యంగాని పెద్ద సంకుల యుద్దం యొక్క మధ్యంలో; మృతిన్‌= మరణాన్ని; పొంది; ఒండె= కాని; మతి= అట్టా కాక; పుత్రుల పైన్‌; తన, రాజ్య భారము+ఎల్లను= తనయొక్కరాజ్యంయొక్కభారాన్నంతను; నియమించి= ఏర్పాటుచేసి; ఏంగి=ఐ వెళ్ళి; గిరులన్‌= పర్వతాలలో; తపము= తపస్సు; ఒప్పన్‌+కన్‌= తగినట్టుగా; చేసి; ఒండెన్‌= కాని; కాక; శాశ్చతంబుగన్‌; అనిమిషు లోక, భోగ, సుఖము= స్వర్గలోకాన్ని అనుభవించటంలోని సుఖాన్ని; అందన్‌+*కన్‌= పొందటానికి; పోలునె= సాధ్యమగునా? తాత్పర్యం: రాజైనవాడు మహాయుద్దంలో మరణించి గాని, రాజ్యభారాన్ని కొడుకులకు అప్పగించి కొండలపై గొప్పతపస్సు చేసి గాని శాశ్వత మైన స్వర్గసుఖాన్ని పొందగలడేగాని, వేరే విధంగా దాన్ని పొందగలడా!

వ. రాజయ్యెడువాండు తన రాజ్యభారంబు దాన చూచి యరయవలయు; నేను షడంగసహితంబుగా వేదాధ్యయనంబు సేసియు నర్ధశాస్త్రంబునందు. గృతనిశ్చయుండ నయి బలంబు గలిగియు నంగవైకల్యంబునం బరచక్రంబులకుం బ్రతివ్యూహంబులు రచియింప నేరమింజేసి రాజ్యంబునకు. దగకున్న్య 124

(ప్రతిపదార్హం: రాజు+అయ్యెడు, వాండు; తన రాజ్య, భారంబు; తాను+అ= తానే; చూచి; అరయ, వలయున్‌= విచారించు

కోవాలి, ఏను= నేను; షట్‌ఃఅంగ, సహితంబుగా= ఆరు అంగాలతో కూడిన; వేద+అధ్యయనంబు= వేదాన్ని చదవటం;

చేసియున్‌; అర్హశాస్త్రంబు+అందు= ద్రవ్యనీతిశాస్త్రంలో; కృత, నిశ్చయుండను+అయి= నేర్వబడిన సిద్దాంతాలు కలవాడి నై; బలంబు:; కలిగియు; అంగ, వైకల్యంబునన్‌= అవయవంయొక్క లోపంచేత; పర, చక్రంబులకున్‌= శత్రువులయొక్క సైన్యాలకు;

(ప్రతివ్యూహంబులుః ఎదురు పన్నుగడలు; రచియింప, నేరమిన్‌+చేసి= కూర్చటానికి చేతకాకపోవటంవలన; రాజ్యంబునకున్‌;

తగక+ఉన్న.

తాత్పర్యం: రా జైనవాడు తన రాజ్యవిషయాలు తానే విచారించుకొనాలి. నేను ఆరు అంగాలతో కూడిన వేదాన్ని

చదివి నీతిశా'స్తాన్ని నేర్చుకొన్నా, అంధుడిని కావటంవలన శత్రు సైన్యాలకు ఎదురు వ్యూహాలు కూర్చలేనివాడి నై

రాజ్యపాలనకు తగని వాడను కావటంచేత.

విశేషం: షడంగాలు - శిక్ష, వ్యాకరణం, ఛందస్సు నిరుక్తం, జ్యోతిషం, కల్పం.

ఉ. లోకనుతుండు పాండు. డమలుందు మహాగుణరత్నపూర్హర త్నాకరుందత్యుదారనుతి నంధు(డ నైనను నన్ను రాజుగా జేకొని నాకు భక్తి. బనిసియుచు సర్వజగజ్జిగీషుం డై యీకురువంశరాజ్యభర మింతయు. దాల్టె బరాక్రమంబునన్‌. 125

ప్రతిపదార్హం: లోక నుతుండు= ప్రపంచంచేత కొనియాడబడినవాడు; అమలుండు= దోషంలేనివాడు - పవిత్రుడు; మహా, గుణ, రత్న పూర్ణ రత్న+ఆకరుండు= గొప్ప వైన మంచిగుణా లనే రత్నాలచేత నిండిన సము(ద్రునివంటివాడు:; పాొండుండు= పాండురాజు; అతి+ఉదారమతిన్‌= మిక్కిలి గొప్పమనస్సుతో; అంధుండను+ఐనను= [గ్రుడ్డివాడను అయినప్పటికీ; నన్ను; రాజాన్‌+*కొన్‌; చేకొని; నాకు; భక్తిన్‌= భక్తితో; పనిచేయుచు; సర్వ జగత్‌+జిగీషుండు+ఐ= మొత్తం (ప్రపంచాన్ని జయించగోరే వా డై పరాక్రమంబునన్‌; ఈ కురు, వంశ, రాజ్య, భరము+ఇంతయున్‌= ఈ కురు వంశ రాజ్య భారా న్నంతటినీ; తాల్చెన్‌= ధరించాడు.

5్‌7క్త్‌ శ్రీమదాంధ్ర మహాభారతము తాత్సర్యం: ప్రపంచ ప్రశంస అందుకొన్నవాడు, పవిత్రుడు, సద్గుణాలనే రత్నాలకు సముద్రునివంటివాడు అయిన పాండురాజు గొప్పమనస్సుతో, (గ్రుడ్డివాడి నైన నన్ను రాజుగా స్వీకరించి, భక్తితో సేవచేస్తూ, సర్వప్రపంచాన్ని జయింపగోరేవా డై పరాక్రమంతో ఈ కురు వంశ రాజ్య భారా న్నంతా వహించాడు. క _ పరచక్రపతులచేఖీ। కరుండై ధవరాసు లదిమి కప్పము గొని చె చ్రైరం దెచ్చియిచ్చి నన్నును । భరతకులశ్రేష్టుం డునిచె బహుయజ్ఞములన్‌. 126 ప్రతిపదార్థం: భరత, కుల, (్రేష్టుండు= భరతవంళంలో సేరు కెక్కిన వాడు; భికరుండు+ఐ= భయాన్ని కలిగించేవా డై; అదిమి= అణచి, ధన, రాసులు; పర, చక్ర, పతులచే= శత్రురాజ్యాలయొక్క రాజులచేత; కప్పము, కొని; చెర+చెరన్‌= వెంటనే; తెచ్చి, ఇచ్చి; నన్నును; బహు, యజ్ఞములన్‌= అనేకయజ్ఞాలలో; ఉనిచె= ఉండేట్టు చేశాడు - అంటే అనేక యజ్ఞాలు నాచేత చేయించాడు. తాత్పర్యం: భరతవంశశ్రేష్టు డైన పాండురాజు శత్రు భయంకరుడై శత్రువులను అణచి, కప్పం (గ్రహించి ధనరాసులు వెంటనే తెచ్చి ఇచ్చి, నా చేత అనేక యజ్ఞాలు చేయించాడు. వ. “'మఠియు వానికంటె గుణంబుల మిక్కిలి యయి జనంబులకు ననురక్తు లై పరగుచున్నపాండురాజు కుమారుల నెవ్విధంబునం బాపనేర్తు' నని దుణఖించిన ధృతరాస్తునకు దుర్యోధనుం డి ట్లనియె. 127 ప్రతిపదార్థం: మతజియు; వానికంటె= ఆ పాండురాజుకంటె; గుణంబుల= మంచిగుణాలలో; మిక్కిలి, అయి= ఎక్కువై; జనంబులకున్‌; అనురక్తులు+ఐ= అనురాగం - (ప్రేమ - కలవారై; పరగుచు+ఉన్న= ఒప్పుతున్న; పాండురాజ, కుమారులన్‌= పాండవులను; ఏవిధంబునన్‌; పాసనేర్తును= తొలగించగలను; అని; దుఃఖించిన; ధృతరాష్రనకు; దుర్యోధనుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: 'ఆ పాండురాజుకంటె గుణాలలో అధికు లై, ప్రజల(ప్రేమ గలిగి ప్రకాశిస్తున్న పాండవులను ఏవిధంగా తొలగించగల?” నని ధృతరా(ష్ట్రుడు దుఃఖించగా, దుర్యోధనుడు ఇట్లా అన్నాడు. సీ. _ పైతృకం బగు లక్ష్మి పాండుభూపతి మున్ను, తాల్చుటంజేసి తత్తవయుం డైన ధర్మజుం డిప్పుడు దాల్చిన, నాతని; తనయుండు మటి దానిందాల్చు; మంద నిప్పాటంబాండువంశేశుల నసునుతీ । రాజ్యూర్హులగుదురు; రాజ్యమునకు బరువడి మే మింత బాసిన మాపుత్ర । పొత్రవర్గంబును( బాయు; నింక ఆ నొరులంగొలిచి కుడువనోప మే; మట్లుగా । కుండ మమ్ముం జేయనోపుదేని పాండురాజుతొంటిభక్తియు నప్పాండు ।; తనయులందు దయయు! దలపకుండు. 128 (ప్రతిపదార్థం: పైతృకంబు+అగు, లక్ష్మి= పితరులనుండి వచ్చిం దైన సంపదను; పాండు, భూపతి= పాండురాజు; మున్ను= ముందు; తాల్చుటన్‌+చేసి= ధరించటంవలన; తలత్‌+తనయుండు+ఐన, ధర్మజుడు= ఆతనియొక్క కుమారుడైన ధర్మరాజు; ఇప్పుడు; తాల్చినన్‌= ధరిస్తే: ఆతని, తనయుండు= ఆతనియొక్క - ధర్మరాజుయొక్కకుమారుడు; మటీ= మళ్ళీ; దానిన్‌= ఆ సంపదను; తాల్చు= ధరిస్తాడు; మీందన్‌= తర్వాత; ఈ+పాటను= ఈవిధంగా; పాండు, వంశ+ఈశులు+అ= పాండు వంశ రాజులే; వసుమతి, రాజ్య+అర్జ్హ్హులు= భూమిదొరతనానికి తగినవారు; అగుదురు; రాజ్యమునకున్‌; పరువడి= (క్రమంగా; మేము, ఇంతన్‌= ఈ కొలది; పాసిన= దూర మైతే; మా, పుత్ర పౌత్ర, వర్గంబునున్‌= మాయొక్కకొడుకులయొక్క, మనుమలయొక్క సమూహం; పాయున్‌= దూరమవుతుంది; ఇంకన్‌= ఇకముందు; ఏము; ఒరులన్‌= ఇతరులను; కొలిచి= సేవించి; కుడువన్‌+ఓపము= తినటాన్ని, (త్రాగటాన్ని చేయలేము - అంటే బ్రతుకు గడపలేము - అట్టు; కాక+ఉండ; మమ్మున్‌!

ఆదిపర్వము - షస్టాశ్వాసము 575 చేయన్‌+ఓపుదు+ఏని= నీవు చేయగలిగితే; పాండురాజు, తొంటి, భక్తియున్‌= పాండురాజుయొక్క మునుపటి భక్తిని; ఆ+పాండు, తనయుల+అందు= ఆ పాండవులపట్ల; దయయున్‌; తలయక+ఉండు= ఆలోచించకుండా ఉండుము. తాత్పర్యం: వంశపారంపర్యంగా తాత తండ్రుల నుండి వచ్చే రాజ్యసంపదను ఇదివరకు పాండురాజు చేపట్టి ఉండటంచే ఇప్పుడు ధర్మరాజు చేపడితే, తరువాత అతని తనయుడు చేపడతాడు. ఈ విధంగా పాండురాజు వంశంవాళ్ళే రాజ్యార్హు లౌతారు. మేము రాజ్యాధికారానికి దూరమైతే (క్రమంగా మా కొడుకులు, మనుమలు దూరమౌతారు. ఇకముందు ఇతరులకు సేవలుచేసి మేము (బ్రదుకలేము. మాకు అటువంటిగతి పట్టకుండ నీవు చేయగలిగితే పాండురాజు నీ పట్ట ఇదివరకు చూపిన భక్తిని, పాండవులపట్ట నీ కున్న దయను మనస్సులో నిలుపవద్దు.

దుర్యోధనుండు పాండవులను వారణావతంబునకు( బంపు మని తండ్రితో. జెప్పుట (సం.1-130-8)

న. 'ఈరాజ్యంబు మొదలింటంగోలె భవదీయం బయినది; ప్రకృతిజనులు వశ్యులుగాకున్నను గ్రమాగతంబయి మాకు నప్రయత్మలభ్యంబగు6 దొల్లి పాండురాజు రా జై గుణంబులం బ్రజానురాగంబు వడయుటంజేసి యెల్లవార్లును ధర్మరాజురాజ్యంబ వలతురు; దాని నెజింగియ కాదె యేను నిత్యదాన సమ్మానంబులం బ్రకృతిజనంబులకు సంతోషంబు సేయుచునుండుదు; నిందుల దుష్టజనులపక్షపాతవచనంబు లుడుగు నంతకు నుపాయంబున గొంతినిం బాండవులను దదీయభృత్యామాత్యవర్గంబుతో వారణావతంబునకుం బుత్తము; మనకు రాజ్యంబు సుప్రతిష్టితం బైన మటి వార లిందులకు వత్తు రనిన దుర్యోధనునకు ధృతరాస్తుం డిట్లనియె. 129

ప్రతిపదార్హం:; ఈ, రాజ్యంబు; మెదలింటన్‌+కోలె= మొదటినుండి; భవదీయంబు+అయినది= నీదైనది; ప్రకృతి, జనులు= స్వామి, అమాత్య, సుహృత్‌కోశాదులకు సంబంధించిన(ప్రజలు; వశ్యులు+కాక+ఉన్నను= లోబడినవారు కాకపోయినా; (క్రమ+ఆగతంబు+అయి= వరుసగా వచ్చినదై; మాకున్‌; అప్రయత్న, లభ్యంబు= (శమపడకుండా దొరికింది; అగున్‌? తొల్లి= ఇదివరకు; పాండురాజు; రాజు+ఐ=; గుణంబులన్‌= మంచి గుణాలచేత; ప్రజా+అనురాగంబు= (ప్రజలయొక్క(ప్రేమ; పడయుటన్‌+చేసి= పొందటంవలన; ఎల్లవారునుజఐ అందరూ; ధర్మరాజు, రాజ్యంబు= ధర్మరాజుయొక్కరాజ్యాన్నే, వలచుదురు= కోరుకొంటారు; దానిన్‌; ఎతింగియ, కాదె= తెలిసీకొనేకదా; ఏను= నేను; నిత్య, దాన, సమ్మానంబులన్‌= ప్రతిదినం దానాల చేతను గౌరవాలచేతను; ప్రకృతి, జనంబులకు= స్వామి, అమాత్య, సుహృత్కోశాదులకుసంబంధించిన (ప్రజలకు; సంతోషంబు: చేయుచున్‌+ఉండుదున్‌: ఇందుల= ఇచ్చట; దుష్ట జనుల, పక్షపాత, వచనంబులు= చెడ్డజనులయొక్క పక్షపాతపు మాటలు; ఉడుగు+అంతకున్‌= మానునంతవరకు; ఉపాయంబునన్‌; కొంతిని; పాండవులను; తదీయ, భృత్య+అమాత్య, వర్గంబుతో= వారియొక్కసేవకులయొక్క, మంత్రులయొక్క సమూహంతో; వారణావతంబునకున్‌; పుచ్చుదము= పంపుదాము; మనకు; రాజ్యంబు= అధికారం; సుప్రతిస్టితంబు+ఐన= బాగుగా స్థిరపడగానే;: మటి= తర్వాత; వారలు; ఇందులకు= ఇక్కడికి; వచ్చుదురు; అనిన; దుర్యోధనునకు; ధృతరా(ఘ్రుండు; ఇట్టు+ఇనియె.

తాత్పర్యం: “ఈ రాజ్యం మొదటినుండి నీది. ఒకవేళ స్వామి అమాత్యసుహృత్కోశాదులకు సంబంధించినవాళ్ళు.

విధేయులు కాకున్నా, అప్రయత్నంగా రాజ్యం క్రమపద్ధతిలో మా చేతి కందుతుంది. ఇదివరకు పాండురాజు రాజై

తన గుణ గణాలచేత ప్రజానురాగం పొందిన కారణంగా అందరూ ధర్మరాజురాజ్యాన్ని కోరుకొంటున్నారు. దాన్ని

(గ్రహించేకదా నేను ప్రతిదినం దానాలచేత, సమ్మానాలచేత ప్రకృతి జనులను సంతోషపరుస్తున్నాను. ఇచ్చట

576 శ్రీమదాంధ్ర మహాభారతము చెడ్డవాళ్ళ పక్షపాతపుమాటలు ఆగిపోయేంతవరకు కుంతీదేవిని, పాండవులను, వారిసేవకులతో, అమాత్యులతో సహా ఉపాయంతో వారణావతం పంపుదాము. మనకు రాజ్యాధికారం స్రిరపడిన తర్వాత వా శ్చిక్కడికి వస్తారు" - అని దుర్యోధను డనగా అతనితో ధృతరా(స్త్రుడు ఇట్టా అన్నాడు. విశేషం: సప్తప్రకృతులు - స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం, తరువోజ, “ద నెల్లప్రొద్దు నా యెడ లోనందలంతు నీయభిప్రాయంబ; యిది దారుణంబు గాన వాకునకు. జుల్మన తేరనోప6 గడంది పాండవుల నేకత మెట్టు లనుప గా నగు? మజి దీని గాంగేయవిదురకలశజాశ్వత్థామ గౌతముల్‌ బుద్ధి గా నొడంబడుదురె? కాదయ్య!' యనిన గౌరవజ్యేష్టుండు ఘను. డిట్టు లనియె. 130 ప్రతిపదార్హం: ఏను= నేను; ఎల్ల ప్రొద్దు= అన్ని వేళల; నా, ఎడలోనన్‌= నాహృదయంలో: ఈఅభిప్రాయంబు+అ; తలంతున్‌= ఆలోచిస్తాను; ఇది; దారుణంబు= భయంకరమైనది; కాన= అగుటచేత; చుల్కన= సులువుగ; వాకునకున్‌= మాటకు; తేరన్‌+ఓపన్‌= తీసుకొనిరాలేను; కడంగి=ఐ పూని; పాండవులన్‌; ఏకతమ= ఒంటరిగా; ఎట్టుల= ఏ విధంగా; అనుపగాన్‌+అగు= పంపటానికి వీలగును; మజి; దీని; గాంగేయ, విదుర, కలశజ+అశ్చత్డ్రాము, గౌతముల్‌= భీష్ముడు, విదురుడు, (ద్రోణుడు, అళ్చత్భామ, కృపాచార్యుడు; బుద్ధిగాన్‌= మనస్ఫూర్తిగా: ఒడంబడుదురె= ఒప్పుకొంటారా; కాదు+అయ్య= సాధ్యంకాదయ్యా; అనినన్‌; కౌరవ, జ్యేష్టుండుజ కౌరవులలో పెద్దవా డైన దుర్యోధనుడు; ఘనుండు= అసాధ్యుడు; ఇట్టులు+అనియె. తాత్పర్యం: 'ఎప్పుడూ నా హృదయంలో ఈ అభిప్రాయమే ఉన్నది. ఇది ఘోర మైనది కనుక సులభంగా పైకి చెప్పలేకున్నాను. ఒంటరిగా పాండవులను పంపటానికి ఏ విధంగా వీలవుతుంది? మరి, దీనికి భీష్మ (ద్రోణ విదురా శృత్ధామ కృపులు మనఃపూర్వకంగా అంగీకరిస్తారా! సాధ్యం కాదు” - అని ధృతరాష్టు డనగా తండ్రితో దుర్యోధనుడు ఇట్లా అన్నాడు. విశేషం: ఇది ధృతరాష్ట్రుని ఆంతర్యాన్ని తెలిపే పద్యం. మొదటిపాదానికి - “ఏను నిక్కార్యంబ(బు) హృదయంబులోన నెప్పుడు. జింతుంతు నిది దారుణంబు” అనేపాఠాంతరం ఉంది. - శ్రీమదాం(రధ్రమహాభారతసంశోధితప్రతి, పుట, 352. ద్విపదపాదద్వయం తరువోజ ఏకపాదం. లక్షణానికి చూడు- అది. 2.151 వ, 'భవదనుజాగౌరవంబున గాంగేయాదులు దీనికి నొడంబడుదురు; వారు కౌరవులకెల్ల సము లై యుండియు కా నావారల; యెట్లనివ: నశ్వత్చామ నా కిష్టుం డగుట నన్ను. బాయకుండు; పుత్రస్నేహంబున ద్రోణుండును భారద్వాజునిభాగినేయునిం బాయనేరమింజేసి కృపాచార్యుండును నాయొద్దన యుందురు: మటి భీష్ముండు మధ్యస్థుం దగుటం బాండవులం బరిగ్రహింపండు; విదురుండు పాండవపక్షపాతి యయ్యును నొక్కరుండు నా కహితంబు సేయనోపండు; గావున నిక్కార్యంబున దోషంబు లేదు; వినిద్రకరణం బయిన నాహృదయశల్యంబు బాచి న న్నుద్ధరింపు' మని ధృతరాప్తు నెట్టకేలకు నొడంబటిచి దుర్యోధనుం డప్పుడు. 131 ప్రతిపదార్థం: భవత్‌+అనుజ్ఞా. గౌరవంబున= మీయొక్క ఆజ్ఞలోని గౌరవంచేత; గాంగేయ+ఆదులు= భీష్ముడు మొదలయిన వాళ్ళు; కౌరవులకు+ఎల్ల= కురువంశంవా ళ్ళందరికీ: సములు+ఐ= సమానమైన భావం కలవాళ్ళయి- అంటే కురువంశం వాళ్ళందరిపట్ట సమభావం కలవా ళ్ళయి; ఉండియు; నా, వారలు+అ= నావాళ్ళే! ఎట్టు; అనినన్‌; అళ్ళత్చామ;

ఆదిపర్వము - షష్టాశ్వాసము క్‌77 నాకు+ఇష్టుండు+అగుటన్‌= ప్రియమైనవాడు కావటంచేత; నన్నున్‌; పాయక+ఉండుజ వదలక ఉంటాడు; పుత్ర, స్నేహంబున= పుదత్రునిమీది (ప్రేమచేత; (ద్రోణుండును; భారద్వాజుని= ద్రోణుని; భాగినేయునిన్‌= చెల్లెలి భర్తను; పాయ, నేరమిన్‌+చేసి= వదలలేకుండటంచేత; కృపాచార్యుండును; నా, ఒద్దన= నా దగ్గరే; ఉందురు; మథీ; భీష్ముండు; మధ్యస్థుండు+అగుటన్‌= నడుమజండి రెండువైపుల వారికి పక్షపాతంలేక న్యాయం చెప్పేవాడు కావటంచేత; పాండవులన్‌; పరి[గ్రహింపండు= పియంతో తీసుకోడు- అంటే పాండవుల వైపు వెళ్ళడు; విదురుండు; పాండవ, పన్షపాతి= పాండవులపట్ట పక్షపాతం కలవాడు; అయ్యును; ఒక్కరుండు; నాకు; అహితంబు= కీడు; చేయన్‌ ఓపండు= చేయలేడు; కావునన్‌: ఈ+కార్యంబున= ఈ పనిలో - పాండవులను పంపే పనిలో; దోషంబు= లోపం; లేదు; వినిద్రకరణంబు+అయిన= నిద్రలేనట్టు చేసే దైన; నా హృదయ, శల్యంబు= నా గుండెలోని ముల్టును; పాచి= తొలగించి; నన్ను; ఉద్దరింపుము= పైకి తెమ్ము; అని; ధృతరాష్తున్‌; ఎట్టకేలకున్‌= చిట్టచివరికి; ఒడంబటీచి= ఒప్పించి; దుర్యోధనుండు; అప్పుడు. తాత్పర్యం: 'మీ ఆజ్ఞమీదిగౌరవంచేత భీష్ముడు, ద్రోణుడు మొదలయినవాళ్ళు దీనికి ఒప్పుకొంటారు. వాళ్ళు కురుపాండవులపట్ల సమభావం కలవాళ్ళీ అయినా నా వాళ్ళే, ఎట్లనగా: అశ్చత్థామ నాకు ఇష్టమైనవాడు. అందుచేత నన్ను వదలిపోడు. కొడుకు మీది ప్రేమచేత (ద్రోణుడు, చెల్లెలి భర్త అయిన ద్రోణుడిని వదలలేక కృపుడు నా వైపే ఉంటారు. భీష్ముడు మధ్యస్థుడు కనుక పాండవుల వైపు వెళ్ళడు. విదురుడు పాండవపక్షపాతియే. కాని ఆత డొక్కడు నాకు కీడు చేయలేడు. అందుచేత ఈ కార్యక్రమంలో ఏ లోపం లేదు. నాకు నిద్రలేకుండా చేసే ఈ గుండెలోని ముల్టును తొలగించి, నన్ను జీవితంలో పైకితీసికొని రమ్ము" - అని చిట్టచివరకు చృతరాష్రుడిని ఒప్పించి దుర్యోధనుడు. క నవలను గల మంత్రివరులం । బిలిచి పృధానందనులకు€ బ్రయముగ మీరి మ్ముల వారణావతంబును । వెలయం6గం బొగడుండు వారు విని తగుల నెదన్‌. 132 ప్రతిపదార్థం: వలను, కల= నేర్పుగల; మంత్రివరులన్‌= మంత్రిశ్రేష్టులను; పిలిచి; మీరు; పృధా, నందనులకున్‌= కుంతీదేవి యొక్కకొడుకులకు; ప్రియముగన్‌= ఇష్టమయ్యేటట్టు; వారు; విని; ఎడన్‌= మనస్సులో; తగులన్‌= ఆశపడేటట్టు; ఇమ్ముల= ఇంపుగా; వారణావతంబును; వెలయంగన్‌= ప్రకాశించేటట్టు - అంటే గొప్పగా; పాగడుండు= ('ప్రశంసించండి. తాత్చర్యం: నేర్పరులు, మంచివాళ్ళు అయిన మంత్రులను పిలిచి, “మీరు పాండవులు వినేటట్టు, విని వాళ్ళు ఆశపడేటట్టు, వారణావతాన్ని గొప్పగా పొగడండి.” వు అని పంచిన వారును వారణావతంబు ననవరతసురభికుసుమఫలభారన మ్రశాఖావిశాలతరువనరేఖాలం కృతం బనియును, వనజలకేళీకందుకమృగయాదివివిధవిహారహారిప్రదేశాభితోభితం బనియును, నవ సుధా ధౌతసొధసుధాకరనికరప్రభాపటలప్రధ్వంసితాసితపక్షదోషం బనియును, నిరస్తదోషానుషంగ మంగళ మహారత్నరాజివిరాజితవిపులవివణివీథీవిహసితాలకావిలాసం బనియును, మనోరనానేక సుఖానుభోగ భోగిమహాభాగజనసమృద్ధం బనియును, బుణ్యనదీప్రవాహశోభితం బనియును వర్ణించి యప్పురంబునంద పాండునందనుల జాతకౌతూహలచిత్తులం జేసి యున్నణ గొండొకకాలంబునకు ధృతరాస్త్రుండు దుర్యోధనదుష్టవచనప్రబోధితుం డయి యొక్కనాండు. 133 ప్రతిపదార్థం: అని; పంచిన= ఆజ్ఞాపించగా; వారును; వారణావతంబున్‌; అనవరత, సురభి, కుసుమ, ఫల, భార, నద్ర, శాఖా, విశాల తరు, వనరేఖా+అలంకృతంబు+అనియును= ఎల్లప్పుడు మంచివాసన గల పూలయొక్క, పండ్డయొక్క బరువుచేత వంగిన కొమ్మలచేత విశాల మైన చెట్టు ఉండేతోపులయొక్క వరుసలచేత అలంకరింపబడిందనీ; వన, జల, కేళీ, కందుక, మృగయా+అది,

578 (శ్రీమదాంధ్ర మవోభారతము వివిధ, విహార, హారి, (ప్రదేశ+అభిశోభితంబు+అనియును= ఉద్యానవనం, జలక్రీడ, చెండ్దాట, వేట మొదలయిన అనేకవిధా లైన (క్రీడలకు మనోహరాలైన ప్రదేశాలతో ఒప్పిందనీ; నవ, సుధా, ధౌత, సౌధ, సుధాకర, నికర, ప్రభాపటల, ప్రధ్వంసిత+అసిత, పక్ష, దోషంబు+అనియును= క్రొత్త దైన సున్నంచేత తెల్లగా చేయబడిన మేడలు అనే చంద్రుల సమూహంయొక్క కాంతిసమూహంచేత పూర్తిగా నశింపజేయబడిన కృష్ణపక్షంలోని రాత్రులు కలది అనీ; నిరస్త దోషా+అనుషంగ, మంగళ, మహత్‌, రత్న రాజి విరాజిత, విపుల, విపణి, వీధీ, విహసిత+అలకా, విలాసంబు+అనియును= తీసివేయబడిన దోషసంబంధం గల శుభాన్ని కూర్చే గొప్పరత్నాలయొక్క సమూహంచేత మిక్కిలి (ప్రకాశిస్తున్న విశాల మైన అంగడివీధులచేత ఎగతాళి చేయబడిన అలకాపట్టణంయొక్క శోభకలది అనీ; మనోరమా+ అనేక, సుఖ+అనుభోగ, భోగి, మహాభాగ, జన, సమృద్ధంబు+అనియును= మనోహరా లైన పెక్కుసుఖాలయొక్క అనుభవాలను అనుభవించేటి పుణ్యవంతు లయిన జనులచేత నిండినట్టిది అనీ; పుణ్య, నదీ, (ప్రవాహ, శోభితంబు+అనియును= పవిత్రా లైన నదులయొక్క (ప్రవాహాలతో (ప్రకాశించేది అనీ; వర్షించి; ఆ+పురంబు+అంద= ఆ నగరమందే: పాొండునందనుల;: జాత, కౌతూహల, చిత్తులన్‌+చేసి= పుట్టిన ఆశ కల మనస్సుకలవాళ్ళనుగా చేసి; ఉన్నన్‌: కొండొక, కాలంబునకు= కొద్దికాలానికి; ధృతరా(ష్ణ్రుండు; దుర్యోధన, దుష్ట వచన, ప్రబోధితుండు+అయి= దుర్యోధనునియొక్క చెడు మాటలచేత లెస్సగా తెలుపబడినవాడై; ఒక్కనాడు. తాత్పర్యం: అని ఆజ్ఞాపించగా- ఆ మంటత్రులు- వారణావతం ఎల్లప్పుడూ పూలబరువుచేత, పండ్లబరువుచేత వంగిన కొమ్మలుగల పెద్దచెట్టతో- ఉద్యానవనవిహారం, జలక్రీడ, చెండ్లాట, వేట మొదలైనపెక్కు[్రీడలకు తగిన మనోహర (ప్రదేశాలతో- కృష్ణ పక్ష రాత్రులను (చీకట్టను) తమ క్రొత్త సున్నపు పూత కాంతులలో పారద్రోలే చంద్రులవంటి పెద్ద మేడలతో- దోషం లేనివి, శుభాన్ని కూర్చేవి, అయిన గొప్ప రత్నాలతో అలకా నగర శోభనే అపహాస్యంచేసే పెద్ద అంగడి వీధులతో- అనేక భోగాలను అనుభవించే పుణ్యాత్ము లైన ప్రజలతో- పవిత్రనదీ (ప్రవాహాలతో ప్రకాశిస్తున్న దని, ఆ నగరంమీద పాండవులకు అమిత మైన కోరిక కలిగేటట్టు వర్షించారు. కొద్దికాలం తర్యాత ధృతరాష్ట్రుడు దుర్యోధనుని చెడుమాటలు మనస్సుకు పట్టినవా డై. విశేషం: అలం: రూసకం, ఉపమ, అంత్యానుప్రాసం, వృత్త్య్యనుప్రాసం. ధృతరాష్ల్రుండు పాండవులను వారణావతనగరంబునకు.౯ బోవం బనుచుట (సం.1-131-2)

చు పాండుకుమారులం జలువంబంచి సుహృన్నివనహంబు నొద్దన

ప్పాండు6 దలంచి నిర్ణళితబాప్పకరాళకపోలయుగ్ను డై

పాందుమహీశుకంటె నతిభక్తుల మిమ్మొకం దేను బంచెదం

బాండుయశోర్చులార! యిది పథ్యము కాంగం దలంపుం డాత్మలోన్‌. 134 ప్రతిపదార్థం: పాండు, కుమారులన్‌; పిలువన్‌; పంచి= ఆజ్ఞాపించి; సుహృత్‌+నివహంబు+ఒద్దన్‌= ఆప్తుల సమూహంయొక్క ఎదుట; ఆ+పాండున్‌= ఆ పాొండురాజును; తలంచి= గుర్తు చేసికొని; నిర్లళిత, బాప్పు, కరాళ, కపోల, యుగ్ముండు+ఐ= కారుతున్న కన్నీళ్ళ మిట్టపల్హాలైన చెక్కిళ్ళజంట కలవాడై; పాండు, మహి+-ఈశుకంటెన్‌= పొండురాజుకంటె; అతి, భక్తుల= మిక్కిలి భక్తి గలవాళ్ళయిన; మిమ్ము; ఏను= నేను; ఒకండు= ఒకదాన్ని; పంచెదన్‌= ఆజ్ఞాపిస్తాను;: పాండు, యశః+అర్జులార!= పాండురాజుయొక్క కీర్తిని కోరేవాళ్ళారా! లేదా తెల్లనికీర్తిని కోరీవాళ్ళారా!: ఆత్మలోన్‌? ఇది; పధ్యము, కాగన్‌= చేయదగింది అయినట్టుగా? తలంపుడు= ఆలోచించండి. తాత్పర్యం: పాండవులను పిలిపించి, ఆప్తు లందరి ఎదుట పాండురాజును స్మరించి కన్నీరు నింపుకొని, పాండురాజుకంటె ఎక్కువ భక్తిగలవా ళ్ళయిన మిమ శల్ని నే నొకటి ఆజ్ఞాపిస్తాను. పాండురాజుకీర్తిని కోరేవాళ్ళారా! ఇది చేయదగింది అని ఆలోచించండి. (లేదా నిర్మల కీర్తిని కోరే మీరు ఇది చేయదగింది అని ఆలోచించండి.)

ఆదిపర్వము - షష్టాశ్వాసము క్‌9 విశేషం: 'పాండు” శబ్దంలో శ్లేష ఉన్నది. తండ్రి కీర్తిని కోరీవాళ్ళు తండ్రి అడుగు జాడలలో నడుస్తారు. అందుచేత ధృతరా్తుడు

  • తండ్రి క్షీర్రిని కోరే ఓ పాండవులారా మీ తండ్రి నా పట్ల భక్తికలవాడు. మీరు కూడా నా పట్ల అతనికంటె ఎక్కువభక్తి కలవాళ్ళు.

మీతండ్రి అడుగు జాడలలో నడిచి నేను చెప్పినట్టు అతనివలె మీరుకూడ చేయం డనటం. పాండుయశోర్జులారా - అనేదాన్ని

తెల్లనికీర్తిని కోరేవాళ్ళారా అని అన్వ్నయిస్తే - పెద్దలమాట వినటం క్రీర్తికరం. కీర్తిని కోరీ ఓ పాండవులారా ఈ పెదతండ్రి చెప్పినట్టు చేయండి అనటం. కీర్తి వర్షం తెలుపు అని కవిసమయం,

క. _ విదితంబుగంబుణ్యామర ; నదీ సమీపమున వారణావత నగరం బది సర్వసుఖాస్పద నుని । వదలక వర్ణింతు రెల్లవారును దానిన్‌. 135

ప్రతిపదార్థం: పుణ్య+అమర, నదీ, సమీపమున= పవిత్రమైన గంగానది దగ్గర; వారణావత,, నగరంబు; అది; సర్వ, సుఖ+

అస్పదము+అని= అన్ని సుఖాలకు చోటు అని; ఎల్లవారును= అందరూ; దానిన్‌; వదలక; వర్షింతురు.

తాత్పర్యం: పవిత్రమైన గంగానదీ సమీపంలో వారణావత నగరం సర్వసుఖాలకు స్టాన మని అందరూ

(ప్రశంసిస్తారు.

క, _ మీరును గుంతియు సహపరి। వారమహామాత్య భృత్యవర్గులరై నా నారాజ్యలీలతోం జని ; సారమతిం జేయు. డందు సతతోత్సవముల్‌. 136

(ప్రతిపదార్థం: మీరును; కుంతియు; సహపరివారు మహా+అమాత్య, భృత్య, వర్గులరు+ఐ= పరివారంతోను, మహా

మంత్రులతోను, సేవకులసమూహాలతోను కూడినవాళ్ళయి; నానా, రాజ్య, లీలతోన్‌= పలువిధాలైన రాజ్యవిలాసంతో; చని= వెళ్ళి;

అందు; సారమతిన్‌= మేలిమిబుద్దితో: సతత+ఉత్సవముల్‌= ఎడతెగనిపండుగలను; చేయుడు.

తచాత్సర్యం: మీరూ, కుంతిదేవీ, పరివారంతో, అమాత్యులతో, 'సేవకులతో కూడి నానావిధ రాజ్య వైభవంతో

అక్కడకు వెళ్ళి హాయిగా పండుగలను చేసికొనండి.

వ. 'పశుపతి నివాసం బయిన యప్పుణ్యస్థానంబునం బాండుహితంబుగా నగణ్య గో పొరణ్యాది మహాదానంబుల బ్రాహ్మణసంతర్పణంబులు సేసి యందు గొందొకకాలం బుండి వచ్చునది' యని పంచిన వల్లె యని పాండవులు గాంధారీ ధృతరాస్తులకు మొక్కి వీడ్కొని, దుర్యోధనాదుల నందజిం బ్రయపూర్వకంబుగా సంభావించి, భీష్మద్రోణవిదురకృపాదులకు మ్రొక్కి యనేక వృద్ధ బ్రాహ్మణులకు నమస్కారంబు సేసి వారల వలన దీర్చాయురారోగ్యస్వస్తి చనంబులతో. బునర్దర్శనం బయ్యెడ మని వీవనలు సేకొనుచు జననీసహితంబుగా వారణావతంబునకు గమనోన్ముఖు లయినంత. 137

ప్రతిపదార్థం: పశుపతి, నివాసంబు+అయినః= శివునియొక్క ఉనికిపట్టయిన; ఆ+పుణ్య, స్టానంబునన్‌; పాండు, హితంబుగాన్‌=

పాండురాజుకు ఇష్టమయ్యేటట్టుగా; అగణ్య, గో హిరణ్య+అది, మహా, దానంబుల= లెక్క లే నన్ని గోవులు బంగారం మొదలైన మహాదానాలచేత; (బ్రాహ్మణ, సంతర్చణంబులు= బ్రాహ్మణులను బాగుగా తృప్తిపరచటం; చేసి; అందున్‌= ఆ వారణావ నగరంలో; కొండొక, కాలంబు= కొద్దికాలం; ఉండి; వచ్చునది; అని; పంచిన= ఆజ్ఞాపించగా; వల్లె, అని= సరే అని; పా అడు గాంధారీ, ధృతరా్రులకు; మొక్కి= నమస్కరించి; వీడ్కొని= 'సెలవుతీసికొని; దుర్యోధన+ఆదులన్‌= దురో ధనం

మొదలయినవాళ్ళను; అందరన్‌= అందరిని; ప్రియ, పూర్వకంబుగా= సంతోష పూర్వకంగా; సంభావించి= సమ్మానించి; భీష్మ

(ద్రోణ, విదుర కృప+ఆదులకు= భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపుడు మొదలయినవారికి; (మొక్కి; అనేక వృద్ధ,

(బ్రాహ్మణులకు; నమస్కారంబు, చేసి; వారలవలన; దీర్హ+ఆయు:+ఆరోగ్య, స్వస్తి వచనంబులతోన్‌= నిడుపైన - అంటే ఎక్కువైన

560 శ్రీమదాంధ్ర మహాభారతము

  • ఆయుష్యం, ఆరోగ్యం, శుభం కలుగుతుం దనే మాటలతో; పునః+దర్శనంబు= మరలచూడటం; అయ్యెడమ+అని= అగునుగాక అని; దీవనలు; చేకొనుచు; జననీ, సహితంబుగా= తల్లితోకూడ; వారణావతంబునకు; గమన+ఉన్ముఖులు+అయిన= పోవటానికి పూనుకొన్నవాళ్ళు కాగా; అంత= తర్వాత. తాత్పర్యం: శివుని నివాసస్టాన మైన ఆ పవిత్ర స్థలంలో పాండురాజుకు ప్రీతిగా అనేక గో దానాలు; సువర్ల దానాలు మొదలయిన మహా దానాలు చేసి (బ్రాహ్మణులను తృప్తి పరుస్తూ కొద్దికాలం ఉండి తిరిగిరం' డని ఆజ్ఞాపించగా, పాండవులు అందుకు అంగీకరించి గాంధారీ ధృతరా(ష్ట్రలకు మొక్కి, వారి దగ్గర సెలవు తీసికొని దుర్యోధనాదులందరిని సంతోషపూర్వకంగా సమ్మానించి, పెక్కుమంది వృద్దబ్రాహ్మాణులకు నమస్కారాలు చేసి వారివలన దీర్హఆయురారోగ్యశుభాలు కలిగేట్టు ఆశీర్వచనాలు పొంది, తల్లితోకూడ వారణావతానికి పోవటానికి పూనుకోగా - తరువాత. విశేషం: భిష్మద్రోణవిదురాదులకు (మొక్కి - అనేదానికి “విదుర సోమదత్త బాహ్లిక కురువృద్దులకున్‌ (ద్రోణకృపాచార్యాది (బ్రాహ్మాణసమూహంబునకు బబ్రియపూర్వకంబుగా (మొక్కి” - విదురసోమదత్తబాహ్హికకురువృద్దులకు ద్రోణకృపాచార్యాశ్చత్థామాది (బ్రాహ్మాణసమూహంబునకు ప్రియపూర్వకంబుగా నమస్కరించి - అనే పారాంతరా లున్నాయి. - శ్రీమదాంద్రమహాభారత సంశోధితప్రతి, పుట, 354. దుర్యోధనుండు లాక్షాగృహనిర్మాణమునకై పురోచనుని వారణావతంబునకు( బంపుట (సం.1-132-2)

క. _ తనవగచినకార్యము దొర । కొనుటకు ధృతరాష్త్రపుత్రకుండు పొంగి, పురో

చనుం బిలిపించి రహస్యం । బున వానికి. గరమునెయ్యమున ని ట్లనియెన్‌. 138 ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర పుత్రకుండు= ధృతరాష్ట్రనియొక్క ప్రియపుత్రుడు - దుర్యోధనుడు; తనవగచిన, కార్యము= తనయొక్కతలచినపని; దొరకొనుటకు= ఈడేరటానికి - ఫలించినందుకు; పొంగి= సంతోషించి; పురోచనున్‌; పిలిపించి; రహస్యంబున= గోప్యంగా; వానికిన్‌; కరము= మిక్కిలి; నెయ్యమునన్‌= స్నేహంతో; ఇట్టు+అనియెన్‌. తాత్పర్యం: దుర్యోధనుడు తాను తలంచినపని ఫలించినందుకు సంతోషించి, పురోచనుడిని పిలిపించి రహస్యంగా ఆతనితో మిక్కిలి స్నేహంగా ఇట్టా అన్నాడు. తరలము,

అలఘుతేజుల వారణావతమన్సురంబునం బాండవే

యులంబ్రియంబున నుండంబంచె గుజోన్నతుండు కురుప్రభుం;

దలయ కిప్పుడు నీవు మున్‌ చని యందు వారికి నుండంగా

వనిలయముల్‌ రచియింపు నీదగునేర్పు. జూతము చెచ్చెరన్‌. 139 ప్రతిపదార్థం: గుణ+ఉన్నతుండు= మంచిగుణాలచేత గొప్పవా డైన; కురు, ప్రభుండు= కురురాజు - ధృతరాష్ష్రడు. అలఘు, తేజులు= తక్కువకానికాంతి గలవా ళ్ళయిన; పాండవేయులన్‌= పాండవులను; వారణావతము+అన్‌+వుదంబునన్‌; 'ప్రియంబునన్‌= ప్రేమతో; ఉండన్‌= ఉండటానికి; పంచె= ఆజ్ఞాపించాడు; అలయక= విసుగుకోకుండ' నీవు, మున్‌= ముందు; చని= వెళ్ళి; అందు= అక్కడ - అంటే వారణావతంలో; వారికిన్‌= పాండవులకు; ఉండ(గా= ఉండటానికి" నిలయముల్‌= ఇండ్లు; చెర+చెరన్‌= వెంటనే; రచియింప్పుజ నిరి శ్రంచు; నీది+అగు; నేర్పున్‌* చూచుదము.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 581 తాత్సర్యం: గొప్పగుణవంతు డైన ధృతరా(ష్టమహారాజు తేజోవంతులైన పాండవులను ప్రేమతో వారణావత మనే నగరంలో నివసించటానికి ఆజ్ఞాపించాడు. నీవు విసుగుకోకుండ వెంటనే వాళ్ళకు అక్కడ ఇండ్డు నిర్మించుము. ని నేర్పు చూద్దాం. విశేషం: తరలంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న భ,ర, స, జ, జ, గ అనే గణాలుంటాయి. 12వ అక్షరం యతి.

వ, _ నాకుం బరమవిశ్వాసివి నీ వొక్కరుండవ: యిది యనన్యవిషయం బయిన కార్యంబు; కావున నీన దీనిం జేయవలయు; వాయుజవంబు లయిన వేసదంబులం బూనిన యరదం బెక్కి నేయ చని వారణావతంబున లాక్షాసర్జకరసమిశ్రం బై ఘృతతైలార్థం బయిన మృత్తికాపుంజంబున నొక్క చతుశ్శాల విశాలంబుగా నాయుధశాల సమీపంబున మనోహరంబుగా నవిరళసుధాధవళతంబుగా నిర్మించి యందు. బాందవుల నునిచి వార లేముజి నమ్మి కొండొకకాలం బుండ, నిన్నారు లెటుంగకుండ నిమ్మయినయవసరంబునం దదహద్వారంబునందు ఘోరానలంబు దరికొలిపి పగజి పంచత్వం బెటింగి రమ్ము 140

ప్రతిపదార్థం: నాకున్‌; పరమవిశ్వాసివి= మిక్కిలి నమ్మదగినవాడివి, నీవు+ఒక్కరుండవు+అజ= నీవొక్కడివే; ఇది; అనన్య, విషయంబు+అయిన= ఇతరులకు గోచరం కాని దైన; కార్యంబు= పని; కావున; నీవు+అజ= నీవే; దీనిన్‌:; చేయవలయు; వాయు, జవంబులు+అయిన= గాలివేగంతో సమానమైన వేగం గలవైన; వేసడంబులన్‌= కంచరగాడిదలను; పూనిన= తాల్చిన; అరదంబు= రధం; ఎక్కి; నేడు+అ= ఈ రోజే; చని= వెళ్ళి; వారణావతంబున; లాక్షా, సర్జక, రస, మిశ్రంబు+ఐ= లక్క, మద్దిచెట్టబంక కలిసిందై; ఘృత, తైల+ఆ(రంబు+అయిన= నెయ్యితోను, నూనెతోను తడిసిం దైన; మృత్తికా, పుంజంబునన్‌= మట్టికుప్పచేత; ఒక్క, చతుశ్శాల= ఒక నాలుగిండ్ల భవంతిని; విశాలంబుగాన్‌:; ఆయుధశాల, సమీపంబున= ఆయుధా లుండే మేడకు దగ్గర; మనోహరంబుగా= మనస్సును ఆకర్షించేటట్టు; అవిరళ, సుధా, ధవళితంబుగా= దట్టమైన సున్నంచే తెల్లగా చేయబడిందిగా; నిర్మించి; అందున్‌; పాండవులను" ఉనిచి= ఉంచి; వారలు; ఏమటి= (అజా(గ్రత్తగా) మరచి; నమ్మి; కొండొక, కాలంబు= కొద్దికాలం; ఉండజ= ఉండగా; ఇమ్ము+అయిన= అనుకూలమయిన; అవసరంబునన్‌= సమయంలో: తత్‌+గృహం. ద్వారంబు అంధుజ ఆ యింటి యొక్కవాకిట్టో, ఘోర+అనలంబు= భయంకరమైన నిప్పును; దరికొలిపి= మండించి; పగజ, పంచత్వంబు= శత్రువులయొక్క చావును; ఎజీంగ= తెలిసికొని; రమ్ము. తాత్పర్యం: నీన్లు నాకు మిక్కిలి నమ్మదగినవాడివి. ఇది ఇతరులకు సాధ్యం కాని పని. అందుచేత నీవే చేయాలి. వాయువేగంతో సమానమైన వేగం కలిగిన కంచరగాడిదలు పూనిన రధం ఎక్కి ఈ రోజే వారణావతం వెళ్ళి అక్కడ లక్క, మద్దిబంక కలిపిన నేతితో నూనెతో తడిసిన మట్టితో ఒక నాలుగిండ్హ భవంతిని ఆయుధశాల దగ్గర మనోహరంగా దట్టమైన సున్నంకొట్టి తెల్లగా నిర్మించి, అందులో పాండవులను ఉంచి, వాళ్ళు ఏమరుపొటున నమ్మి కొంతకాలం ఉన్న తర్వాత, ఆ యింటి వాకిటికి నిప్పుపెట్టి శత్రువు లైన పాండవుల చావును తెలిసికొని రమ్ము

క, _ ఈకార్య సిద్ధి యగుడును నీ కతమున నఖిల ధారుణీ రాజ్యము నా కేకాధిష్టిత మగు నిది; నీకును నిత్యోపభోగనిలయమ కాదే. శ41

ప్రతిపదార్థం: ఈకార్యసిద్ది= ఈ పనియొక్క సఫలత; అగుడును= అయితే; నీ కతమునన్‌= నీ కారణాన; అఖిల, ధారుణీ

రాజ్యము= మొత్తం భూమిమీద అధికారం; నాకు, ఏక+అధిష్టితము= ఒకనిచేతనే పొందబడింది; అగున్‌: ఇది' నీకును: నిత్య+ఉపభోగ, నిలయమ= శాళశ్ళతమైన సుఖాలకు స్టాన౦ం; కాదే= కాదా.

582 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్సర్యం: ఈ పని సఫల మైతే నీ కారణంగా సమస్త రాజ్యాధికారం నా చేతికి వస్తుంది. ఈ విదంగా జరిగితే

నీవు శాశ్వత సుఖాలను అనుభవించవచ్చునుగదా!

వారణావతప్రస్టానము - విదురోపదేశము (సం.1-133-4)

వ. _ అని పంచినం బురోచనుం డతి త్వరితగతి నరిగి దుర్యోధను కఅపిన రూపున వారణావతంబున లాక్షా గృహంబు రచియించుచుండె; నిట యుధిషప్టిరభీమార్దునయములుం గ్రముంబునం దొల్లి షోడశపంచదశ చతుర్దశత్రయోదశవర్వజాతు లయి శతశృంగంబుననుండి హస్తిపురంబునకు వచ్చి యందు6 గోరవులం గలసి యస్త్రవిద్యలం గణఖచుచుం బదమూడేం డ్లుండి, యపుడు ధృతరాస్తు నియోగంబున వారణావతం బునకు జననీసహితంబుగాం బోవ సనుకట్టి మహాజవసత్తసమేతంబు లయిన హయంబులం బూనిన రథంబు లెక్కిధనుర్ధరు లయి హస్తిపురంబు వెలువడు నపు డప్పురంబునం గల బ్రాహ్మణక్షత్రియప్రముఖానేక జనంబులు శోకసంతప్తహృదయు లయి. 142

ప్రతిపదార్థం: అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; పురోచనుండు; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలి వేగంతో గూడిన విధంగా; అరిగి= వెళ్ళి దుర్యోధను, కజపిన, రూపున= దుర్యోధనునియొక్క చెప్పినవిధంగా - అంటే దుర్యోధనుడు. చెప్పినట్టుగా; వారణావతంబున; లాక్షాగృహంబు= లక్కఇల్టు; రచియించుచు+ఉండెన్‌= నిర్మిస్తూ ఉన్నాడు; ఇట; యుధిస్టిర భఖీమ+అర్జున, యములున్‌= ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులసహదేవులు; క్రమంబునన్‌= వరుసగా; తొల్లి= పూర్వం; షోడశ, పంచదశ, చతుర్దశ, (తయోదశ, వర్ష జాతులు+అయి= పదహారు, పదిహేను, పధ్నాలుగు, పదమూడు సంవత్సరాల పుట్నక కల వాళ్ళయి శతశ్చంగంబుననుండి= శతశృంగ పర్వతంనుండి; హస్తి పురంబునకు= హస్తినాపురానికి; వచ్చి; అందున్‌= ఆ హస్తినాపురంలో; కౌరవులన్‌+కలసి= కౌరవులతో కలిసి; అ(స్రవిద్యలన్‌; కఅచుచున్‌= నేర్చుకొంటూ; పదమూడు+ఎండ్డు+ఉండి; అప్పుడు, ధృతరాష్త్రు, నియోగంబున= ధృతరాహునియొక్క ఆజ్ఞచేత, వారణావతంబునకు; జననీ, సహితంబుగాన్‌= తల్లితోకూడ, పోవ= పోవటానికి; సమకట్టి= పూనుకొని, మహా, జవ, సత్వ, సమేతంబులు+అయిన= గొప్పవేగంతో, బలంతో కూడుకొనిన వైన; హయంబులన్‌= గుజ్ఞాలను; పూనిన, రధంబుల్యు ఎక్కి; ధనుః+ధరులు+అయి= విండ్లను చేపట్టినవాళ్ళయి: హస్తి పురంబు; వెలువడునపుడు; ఆ+పురంబునన్‌; కల= ఉన్న: బ్రాహ్మణ క్షత్రియ, ప్రముఖ+అనేక, జనంబులు= (బ్రాహ్మణులు; క్షత్రియులు మొదలయిన పెక్కుమంది ప్రజలు; శోకసంతప్తు హృదయులు+అయి= దుఃఖంచేత మిక్కిలి కాల్ప్బబడిన మనస్సులు కలవాళ్ళయి. తాత్పర్యం: అని ఆజ్ఞాపించగా, పురోచనుడు మిక్కిలి వేగంగా వెళ్ళి దుర్యోధనుడు చెప్పినట్టు వారణావతంలో లక్కఇల్టు నిర్మిస్తూ ఉన్నాడు. ఇక్కడ (క్రమంగా పదహారు, పదిహేను, పద్నాలుగు, పదమూడు సంవత్సరాల వయస్సు కల ధర్మజ భీమా ర్హున నకుల సహదేవులు శతశ్ళంగ పర్వతంనుండి హస్తినకు వచ్చి, కౌరవులతో కలిసి అస్త్రవిద్యలు నేర్చుకొంటూ పదమూడేండ్డు ఉండి, ధృతరాష్ట్రుని ఆజ్ఞప్రకారం తల్లితోకూడ వారణావతానికి పోవ సమకట్టి, గొప్పవేగం, బలం గల గుర్రాలు పూనిన రధా లెక్కి, చేత ధనుస్సులు ధరించి, హస్తిపురం వెలువడేటప్పుడు ఆ పురంలోని బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలయినవాళ్ళంతా దుఃఖంతో.

విశేషం: వారణావతానికి వెళ్ళేనాటికి ధర్మరాజు వయస్సు 29 సంవత్సరాలు - భీమునిది 28 సంవత్సరాలు - అర్జునునిది 27

సంవత్సరాలు - నకులసహదేవులది (కవలు) 26 సంవత్సరాలు.

సీ. 'ఇప్పాండుపుత్తుల నేలకో ధృతరాస్తుం। డేకత మనుపంగ నిచ్చగించె; నిది యధర్మం బని యెజింగి గాంగేయాదు । లేల వారింపరో యెజు6/గరొక్కొ పెతృపితామహులచే భృతపూర్వమై క్రమూ । గత మైన రాజ్యంబు6 గరము నెమ్మి. బాండుసుతజ్యేష్టు భరతకులశ్రేష్టు । ధర్మజు.బూన్వక ధర్ము వుడిపి

ఆదిపర్వము - షష్టాశ్వాసము 583

ఆ. యేల వృద్ధరాజు లెడసేసిరో; పార్థుం। డరుగు నెడక మనము నరిగి యతని యున్నచోన ప్రీతి నుండుద; మిం దుంద । నేల? యనుచు. బౌరు లెల్లం దెరలి. 143

ప్రతిపదార్థం; పౌరులు+ఎల్లన్‌= హస్తినాపుర (ప్రజ లంతా; ఈ+పొండు, పుత్రులన్‌= ఈ పాండురాజ కుమారులను; పాండవులను; ఏల+ఒకో=ఐ ఎందుచేతనోగదా!; ధృతరా(ష్ట్రుండు; ఏకతమ= ఒంటరులను చేసి, వేరుచేసి, ప్రత్యేకంగా; అనుపంగన్‌= పంపటానికి; ఇచ్చగించెన్‌=ఐ ఇష్టపడ్డాడు' ఇది; అధర్మంబు; అని; ఎటింగి=ఐ తెలిసి; గాంగేయ+ఆదులుజ= భీష్ముడు మొదలయినవాళ్ళు; ఏల= ఎందుచేత; వారింపరో= అడ్డగించరో; ఎజుంగరు+ఒక్కొ= వారికి తెలియదేమొ! పితృ, పితామహులచే= తండ్రితాతలచేత; భృత, పూర్వము+ఐ= ముందు భరింపబడిన దై; (క్రమ+ఆగతము+ఐన= వరుసగా వచ్చే దైన; రాజ్యంబున్‌; కరము= మిక్కిలి; నెమ్మిన్‌= ప్రీతితో; పాండు, సుత, జ్యేష్టు= పాండురాజ కుమారులలో పెద్దవాణ్ణి: భరతకుల, శ్రేష్టుజఐ భరతునియొక్క వంశంలో శశ్రేష్టుని; ధర్మజున్‌= ధర్మరాజును; పూన్సక= వహించేట్టు చేయక; ధర్మువు+ఉడిపి= ధర్మాన్ని తొలగించి; వృద్ద రాజులు; ఏల; ఎడ= దూరము; చేసిరో; పార్టండు= పృధ - అంటే కుంతీతనయు డైన ధర్మరాజు; అరుగు+ఎడకు+అజ= వెళ్ళేచోటికే) మనమున్‌= మనంకూడ; అరిగి; అతని, ఉన్న, చోన= అతనియొక్క ఉన్నచోటనే; ట్రీతిన్‌, ఉండుదము; ఇందు= ఈ హస్తినలో; ఉండన్‌+ఏల= ఉండట మెందుకు? అనుచు; తెరలి= కదలి. తాత్పర్యం: “ఈ పాండవులను ఎందుచేతనో ధృతరాష్ట్రుడు తన ఆలోచనతో హస్తిననుండి ఒంటరులుగా చేసి పంపివేయాలనుకొన్నాడు. ఇది అధర్మ మని తెలిసి కూడా భీష్ముడు మొదలయినవాళ్ళు ఎందుచేత అడ్డగించలేదో? తండ్రి తాతలనుండి వరుసగా వచ్చిన రాజ్యాన్ని - పాండుపుత్రులలో పెద్దవాడు, భరతవంళశంలో శ్రేష్టుడు అయిన ధర్మరాజు ధరించేటట్లు చేయక, ధర్మం తప్పి ఎందుచేత వృద్ధరాజులు ఆతడిని దూరం చేశారో? ధర్మరాజు వెళ్ళే చోటికే మనంగూడ వెళ్ళుదాము. అతడున్న చోటనే మనం గూడ ప్రీతితో ఉందాం. ఈ హస్తినలో ఉండట మెందుకు అని పౌరులంతా బయలుదేరారు.

వ. తన పిలుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్జి 'పితృవచనంబు సేయకునికి ధర్మ విరుద్ధంబు గావున వారణావతంబునకుం బోయివచ్చెద' మని యందఖం గ్రమ్మఖించి, చనుచున్న ధర్మనందను పిజుంద నొక్కింతనేల యరిగి, విదురుం డొరులు వినియును నెజటుంగరాని వచనంబుల బహుప్రకారవచనరచనా విశారదుం దైన యుధిష్టిరున కెల్ల కార్యంబులు గఖపి, కొడుకులం గౌంగిలించుకొని, కుంతీదేవికి మొక్కి పాండురాజుం దలంచి బాష్పపూరితనయనుం డై క్రమ్మఖీచనియె; నిట కుంతియు ధర్మరాజు దాయ వచ్చియి ట్లనియె. 144

ప్రతిపదార్థం: తన, పిజుందన్‌= తనవెంట; వచ్చు; వారిన్‌; ప్రియ, పూర్వకంబునన్‌= స్నేహం మొదలుగా - అంటే స్నేహంగొ; ఊరార్చిజ ఊరడించి; పితృ వచనంబు= తం(డ్రియొక్కమాట; చేయక+ఉనికి= పాటించకుండటం; ధర్మ, విరుద్ధంబు= ధర్మానికి వ్యతిరేకం; కావున; వారణావతంబునకున్‌; పోయి, వచ్చెదము; అని; అందరన్‌; (క్రమ్మరించి= మరలించి; చనుచు+ఉన్న= వెళ్ళుతున్న; ధర్మనందను, పీఅుందన్‌= ధర్మరాజుయొక్కవెనుక; ఒక్కింత, నేల, అరిగి= కొద్దిదూరం వెళ్ళి: విదురుండు; ఒరులు= ఇతరులు; వినియును; ఎజుంగరాని= తెలిసికొనటానికి సాధ్యంగాని; వచనంబుల= మాటలతో; బహు, (ప్రకార, వచన, రచనా, విశారదుండు+ఐన= పలువిధా లైన మాటలను కూర్చటంలో పండితు డైన; యుధిస్టిరునకు ధర్మరాజుకు; ని కార్యంబులు= అన్ని చేయదగ్గ పనులను; కజపి= బోధించి; కొడుకులన్‌; కౌగిలించుకొని; కుంతీదేవికి; (మొక్కి. పాండురాజున: తలంచి= గుర్తుచేసికొని; బాప్పు, పూరిత, నయనుండు+ఐ= కన్నీళ్ళతో నిండిన కన్నులు కలవా డై; (క్రమ శజీ= మరలి; చనియెన్‌= వెళ్ళాడు; ఇట; కుంతియు; ధర్మరాజు డాయ, వచ్చి= ధర్మరాజు సమీపానికి వచ్చి: ఇట్టు+అనియె.

ర584 శ్రీమదాంధ్ర మహాభారతము చాత్సర్యం: తన వెంట వచ్చేవాళ్ళను స్నేహపూర్వకంగా ఓదార్చి 'తండ్రిమాట పాటించకపోవటం ధర్మవిరుద్ద మని, అందుచేత వారణావతం పోయివస్తా' మని చెప్పి వాళ్ళందరినీ వెనుకకు పంపి వెళ్ళుతున్న ధర్మరాజువెంబడి- విదురుడు కొద్దిదూరం వెళ్ళి, ఇతరులు విన్నా వాళ్ళకు అర్హంగాని మాటలతో మాటనేర్సరి అయిన ధర్మరాజుకు వారణావతాన చేయదగిన పనులన్నింటిని బోధించి, పాండవులను కౌగిలించుకొని, కుంతీదేవికి మొక్కి, పాండురాజును స్మరించి కన్నీళ్ళు నించి, వెనుదిరిగి వెళ్ళాడు. తరువాత కుంతీదేవి ధర్మరాజుకు దగ్గరగా వచ్చి ఇలా అన్నది.

తే. విదురుండేతెంచి యొరులకు వినియు నెలుంగం। గానియ ట్లుండంబలికి నిన్‌ గజపె బుద్ది; నట్ల చేయుదు నంటి నీ; వతని మతము ।; సెప్పనగునేని యెటుంగంగం జెప్పు మయ్య]! 145

(ప్రతిపదార్హం: విదురుండు; ఏతెంచి= వచ్చి; ఒరులకు= ఇతరులకు; వినియున్‌= విని కూడ; ఎయుంగన్‌+కొని= అర్హంకాని;

అట్టు+ఉండన్‌; పలికి; బుద్దిన్‌=ఐ తెలివిని - సలహాను; నిన్‌+కజపె=ఐ నీకు చెప్పాడు; నీవు; అట్ల= ఆ విధంగానే; చేయుదున్‌"

అంటి= అన్నావు; అతని, మతము= అతనియొక్క (విదురునియొక్క) అభిప్రాయం; చెప్పన్‌+అగున్‌+ఏని= చెప్పదగిందైతే; నీవు" ఎయుగంగన్‌= తెలిసేటట్టు; చెప్పుము+అయ్యజ= చెప్పుము నాయనా!

తాత్పర్యం: విదురుడు వచ్చి ఇతరులు విన్నా అర్ధంకాని విధంగా నీకు సలహా చెప్పాడు. నీవు కూడ చెప్పినట్టుగానే

చేస్తా నని ఆతనితో అన్నావు. చెప్పదగిం దైతే అతని అభిప్రాయం నాకు తెలియ జెప్పుము.

వ. అనిన నగుచు ధర్మృతనయుందు విదురునచనంబుల అభిప్రాయంబులు దల్లి కి ట్లని చెప్పె, 146

తాత్పర్యం: అనగా ధర్మరాజు నవ్వుతూ విదురునిమాటలలోని తాత్పర్యాన్ని తల్లికి ఈ విధంగా చెప్పాడు.

ఆ. _ ఎల్లకార్యగతులు నెటుంగుదు; రయినను , నెటుంగం జెప్పవలయు నెటింగినంత; పనియులేక మిమ్ముంబనిచిన కురుపతి । హితుండపొలె మీంద నెగ్గు సేయు. 1147

ప్రతిపదార్థం: ఎల్ల, కార్య, గతులున్‌= అన్ని పనుల విధాలు; ఎటుంగుదురు= మీకు తెలియును; అయినను" ఎతీం(గిన+అంత=

తెలిసినంతవరకు; ఎణుంగన్‌+చెప్పవలయున్‌= తెలియచెప్పాలి; పనియు, లేక= ఎ పనిగూడ లేకుండ; మిమ్ము, పనిచిన= పంపిన; కురు పతి= ధృతరా(్తుడు; హితుడపోలె= మేలు చేసేవాని వలె ఉండి; మీదన్‌= తర్వాత; ఎగ్గు= కీడు; చేయు.

తాత్పర్యం: చేయ దగిన పనుల పద్ధతు లన్నింటిని మీ రెరుగుదురు. అయినా నాకు తెలిసినంతవరకు మీకు

తెలియచెప్పాలి. ఏ పనీ లేకుండా మిమ్ములను వారణావతం పంపించే ధృతరా(ష్ట్రుడు మీకు మేలు చేసేవాడివలె

ఉండి తర్వాత కీడు చేస్తాడు.

వ. "కావున మీర లేమఅక విషాగ్నులవలన నప్రమత్తుల రై యెలుక గలిగి యుండునది' యని బుద్ధిగణపి మణఖియు '“దుర్యోధనుచేసిడు దుస్కెయ లిమ్ముగా నెజింగి వానికిం బ్రతీకారంబు సెప్పి పుత్తెంచెద ననియె' నని చెప్పిన విని, విదురుబుద్ధికి. దమవలని నెయ్యంబునకు సంతసిల్లుచు నిట్లు బాందవులు! గతిపయ ప్రయాణంబుల వారణావతంబున కరుగునంత. 148

ప్రతిపదార్థం; కావున; మీరలు, ఏమటక= ఏమరుపాటు లేక; విష+అగ్నులవలనన్‌= విషంవలనను; అగన్నివలనను

అ(ప్రమత్తులరు+ఐ= ఏమరుపాటు లేనివాళ్ళయి; ఎజుక= తెలివి; కలిగి ఉండునది; అని; బుద్ది కజపి= సలహా చెప్పి; మజియు*

ఆదిపర్వము - షష్టాశ్యాసము 585 దుర్యోధను చేసెడు, దుష్కియలు= దుర్యోధనునియొక్క చేస్తున్న చెడ్డ పనులు - అంటే దుర్యోధనునిచెడ్డపనులు; ఎటింగి= తెలిసికొని; వానికిన్‌= ఆ చెడ్డ పనులకు; పప్రతీకారంబు= విరుగుడు; చెప్పి; పుత్తెంచెదన్‌= పంపిస్తాను; అనియెన్‌; అని; చెప్పిన= ధర్మరాజు చెప్పగా" విని; విదురు, బుద్దికిన్‌= విదురునియొక్క సలహాకు; తమ, వలని= తమవైపు ఉన్న" నెయ్యంబునకు= స్నేహానికి. సంతసిల్ద్లుచు= సంతోషిస్తూ: ఇట్టు: పాండవులున్‌; కతిపయ, ప్రయాణంబుల= కొన్నిప్రయాణాలచేత; వారణావతంబునకు+శఅరుగు+అంత= వారణావతానికి వెళ్ళినతర్వాత. తాత్పర్యం: 'అందుచేత మీరు ఏమరుపాటు లేకుండా విషంవల్ల, అగ్నివల్ల కలిగే ప్రమాదాల విషయంలో జాగరూకు లై ఉండం డని సలహాచెప్పి, దుర్యోధనుడు చేసే చెడుపనులు తెలిసికొని, ఆ చెడుపనులకు విరుగుడులుకూడ చెప్పి పంపిస్తా నని విదురు డన్నా” డని ధర్మరాజు చెప్పుగా - కుంతీదేవి, పాండవులు విదురుడు చెప్పినసలహాకు అతనికి తమపట్ట ఉండే స్నేహ భావానికి సంతోషిస్తూ కొన్నిరోజులు ప్రయాణంచేసి వారణావతానికి చేరుకొన్న తర్వాత.

పాండవులు జననీసహితంబుగా వారణానతంబు( జేరుట (సం.1-134-1)

స్‌ వారణావతమునవా దెల్లంబాండవా । గమనంబు విని సంతసమున. బెరింగి

కరమొప్పం గరిరధతురగబలాథ్యు లై; యెదురు వచ్చిరి మహాముదముతోడగ

గలయంగ గృహముల గలువడములు గడు - విలసెల్లె నంబరతలము గప్పి

మలయజమృగమదావిలసలిలంబుల । నిమ్ముగా నార్టీకృతమ్ము లయిన తే... యంగళుల నొప్పెంగర్బూరరంగవల్లు ।; లంగనలు గయిసేసి యుత్తుంగహర్య

తలము లెక్కిరి తత్పురీవిలసనంబు6। జూచు పాండుకుమారుల( జూచువేడ్క, 149 ప్రతిపదార్థం: పాండవ+ఆగమనంబు= పాండవులయొక్కరాక' విని; వారణావతమున; వారు+ఎల్లన్‌= వారణావతంలోని జనులంతా" సంతసమునన్‌= సంతోషంతో; పెరిగి= ఉబ్బి; కరము= మిక్కిలి, ఒప్పన్‌= అందంగా; కరి, రధ, తురగ, బల+ఆఢ్యులు+ఐ= ఎనుగులతో, రధాలతో, గుర్రాలతో, సైన్యంతో కూడినవాళ్ళయి: మహాముదముతోడన్‌= మహాసంతోషంతో: ఎదురు. వచ్చిరి; కలయంగ= అంతటా; గృహములన్‌= ఇండ్లలో; కలువడములు= ధ్వజస్తంబాలకు కట్టే బంగారుకలువ పూదండలు; అంబర, తలము= ఆకాశంయొక్క క్రిందిభాగాన్ని; కప్పి; కడు= మిక్కిలి; విలసిల్లైన్‌= ప్రకాశించాయి; మలయజ, మృగమద+ఆవిల, సలిలంబులన్‌= మంచిగంధంతోను కస్తూరితోను, కలిసిననీటిచేత; ఇమ్ముగాన్‌= _ ఇంపుగా” ఆర్టీకృతమ్ములు+అయినజ తడుపబడినవి అయిన' అంగళులన్‌= రాజవీధులందు; కర్పూరరంగవల్లులు= కర్పూరపుపొడితో వేసిన ముగ్గులు; ఒప్పెన్‌= ్రకాశించాయి; అంగనలు= స్త్రీలు కయిసేసి=ఐ అలంకరించి; తత్‌+పురీ విలసనంబున్‌= ఆ పట్టణంయొక్కశోభను; చూచు; పాండుకుమారులన్‌= పాండవులను; చూచు; వేడ్క= కుతూహలంతో: ఉత్తుంగ= ఎత్తైన" హర్మ్యం తలములు= మేడలమీది సమ(ప్రదేశాలు; ఎక్కిరి. | తాత్పర్యం: పాండవుల రాకను గురించి విని వారణావతంలోని ప్రజలంతా ఎంతో ఆనందించి చతురంగ జలాలతో వారికి ఎదురేగారు. ఇండ్ల ధ్వజ స్తంభాలకు కట్టిన బంగారు కలువ పూదండలు ఆకాళాన్ని కప్పి మిక్కిలి 'ప్రకాశించాయి. మంచిగంధం, కస్తూరి కలిపిన నీటితో తడిసిన రాజమార్గాలలో కర్పూరపు ముగ్గులు కళకళ లాడాయి. ఆడవాళ్ళు అలంకరించుకొని ఆ నగరశోభను చూస్తున్నపాండవులను చూడటానికి మేడ లెక్కారు. వ. _ పాండుకుమారులు ననేకభూసురాశీర్వాదనాదాభినందితు లై ఫాల్గునమాసంబున శుక్షపక్షమున

నష్టమియు రోహిణినాడు వారణావతంబు సొచ్చి సర్వాలంకారసుందరం బయిన రాజమందిరంబున నున్న

586 శ్రీమదాంధ్ర మహాభారతము

కొన్ని దినంబులకుం బురోచనుండు దనచేసినచతుశ్శాల సకలజననయనాభిరామం బైన దానిం జూపినం

జూచి పాండుసుతులు సంతసిల్లి, పురోచనశిల్పాచార్యులం, బూజించి పుణ్యాహరవపురస్సరంబుగా గృహ

ప్రవేశంబు సేసి; రంతం బరాబభిప్రాయమాయోపాయ ప్రయోగవిదుం డైన ధర్మతనయుండు దాని

కృత్రిమరమణీయత నుపలక్షించి యల్లన భీమున కి ట్లనియె. 150 ప్రతిపదార్హం: పాండుకుమారులున్‌; అనేక భూసుర+ఆశీర్యాదన+అభినందితులు+ఐ= పెక్కుమంది బ్రాహ్మణులయొక్క ఆశీర్వాద ధ్వనులచేత కొనియాడబడినవాళ్ళయి; ఫాల్లున, మాసంబున; శుక్షపక్షమున; అష్టమియు; రోహిణినాడు వారణావతంబు; చాొచ్చి=ఐ ప్రవేశించి; సర్వ+అలంకార, సుందరంబు+అయిన= అన్నిఅలంకారాలచేత అందమైన దైన; రాజమందిరంబునన్‌; ఉన్న= ఉండగా; కొన్ని, దినంబులకున్‌; పురోచనుండు; తన, చేసిన= తనయొక్క చేసిన - అంటే తాను నిర్మించిన; చతుశ్శాల= నాలుగిండ్ల భవంతి; సకల, జన, నయన+అభిరామంబు+ఐన= అందరు ప్రజలయొక్క కన్నులకు ఇంపు గొలిపేది అయిన; దానిన్‌; చూపినన్‌; చూచి; పాండుసుతులు= పాండురాజుయొక్క కుమారులు; సంతసిల్లిః సంతోషించి; పురోచన; శిల్చ+ఆచార్యులన్‌= పురోచను డనే పేరు గల శిల్పాచార్యులను; పూజించి; పుణ్యాహ, రవ, పురస్పరంబుగా= పుణ్యాహ ధ్వని మున్నుగా; గృహ, ప్రవేశంబు; చేసిరి; అంతన్‌; పర+అభిప్రాయ, మాయ+ఉపాయ, ప్రయోగ, విదుండు+ఐన= ఇతరుల అభిప్రాయాలను, కపటోపాయ ప్రయోగాలను ఎరిగిన వాడైన; ధర్మతనయుండు; దాని= ఆ చతుశ్శాలయొక్క, కృత్రిమ, రమణీయతను= సహజంగాని కేవలం కల్ప్సింపబడిన దైన అందాన్ని; ఉపలక్షించిజ చూచి; అల్లన= మెల్లగా; భిమునకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: పాండవులు పెక్కుమంది (బ్రాహ్మాణుల ఆశీర్వచనాలు పొంది ఫాల్గుణ శుద్ద అష్టమి రోహిణీ నక్షత్రం ఉన్నరోజు వారణావతంలో ప్రవేశించి, అన్నివిధాల అందమైన రాజమందిరంలో ఉంటూజఉండగా, పురోచనుడు తాను నిర్మించిన మహా మనోహర మైన చతుశ్శాలను చూపించాడు. పాండవులు సంతోషించి, పురోచనుడిని సమ్మానించి, పుణ్యాహవచనాలతో అందు ప్రవేశించారు. ఇతరుల అభిప్రాయాలను, మాయోపాయప్రయోగాలను ఎరిగిన ధర్మరాజు ఆ చతుళ్ళ్చాల కృత్రిమ రమణీయత చూచి మెల్లగా భీమునితో ఇట్టా అన్నాడు. విశేషం: పుణ్యాహవాచనము - శుభంకలగటానికి పుణ్యాహమనే శబ్దాన్ని మూడుమారులు చెప్పే శుభకర్మం. అష్టమియు రోహిణి నాడు - అనే దానికి సిద్దార్ధి సంవత్సర ఫాల్లున శుద్ద అష్టమి రోహిణియందు అనే ఒకపారాంతరం గూడ ఉన్నది -శీమదాం(ధ్రమహా భారతసంశోధితప్రతి, పుట, 358. క _ ఈ గృహ కుద్యంబులు లా ; క్షా గర్థము లాజ్య తైల గంధులు మటీ శ

స్తాగార సమీపము మా । యాగృ్భహ మగు నిది యవశ్య మాగ్నేయం బై. 151 ప్రతిపదార్హం: ఈ, గృహ, కుడ్యంబులు= ఈ యింటియొక్క గోడలు; లాక్టా, గర్భములు= లక్కను లోపల కలిగినట్టివి; ఆజ్య, తైల, గంధులు= నేతియొక్కయు, నూనెయొక్కయు, వాసన గలవి; మటి= అంతేగాక; శస్త్ర+అగార, సమీపము= ఆయుధాలుండేచోటికి దగ్గరగా ఉన్నది; అవశ్యము= తప్పక, ఆగ్నేయంబు+ఐ= అస్టిచే దహింప దగిందై ఇది; మాయా గృహము+అగున్‌= మోసపుటిల్లుగా ఉన్నుది. తాత్పర్యం: ఈ యింటిగోడల్లో లక్క ఉన్నది. ఇవి నేతివాసన, నూనెవాసన కలిగి ఉన్నాయి. అంతే గొక ఇది ఆయుధా లుండే చోటికి దగ్గరగా ఉన్నది. తప్పక ఇది నిప్తుచేత తగులబడే మోసపుటిల్టు, క, _ దీని తెజంగెటింగినట్ల మ । హానిపుణుండు విదురు( డురువిషాగ్ములవలనన్‌

మానుగ నేమఅకుం డని । తాను బ్రబోధించె నేకతమ నను. బ్రీతిన్‌. 152

ఆదిపర్వము - షష్టాశ్వాసము 587 ప్రతిపదార్థం: దీని, తెజంగు= ఈ యింటియొక్కపద్దతి; ఎతిగినట్టు+అ= తెలిసినట్టే) మహానిపుణుండు= గొప్పనేర్చరి; విదురుండు: ఉరు, విష+అగ్నులవలనన్‌= పెద్ద విషంవలన, అగ్నివలన; ఏమఆకుండు+అని= మైమరచి ఉండ వద్దని; మానుగజ ఒప్పుగా; తాను; ఎకతమ= ఒంటరిగా; నను; టప్రీతిన్‌= ప్రేమతో; (ప్రబోధించెన్‌= ఉపదేశించాడు. తాత్పర్యం: ఈ యింటి విషయం తనకు తెలిసినట్టే మహామేధావి అయిన విదురుడు విషం, నిప్పు విషయాలలో ఎమరి ఉండ వద్దని ఎవ్వరూ లేకుండ చూచి ఒంటరిపాటున నాకు హెచ్చరిక చేశాడు.

న. కావున మన మిందు విశ్వసించియుండవలవ; దవశ్యం బగ్నిభయం బగు' ననిన విని భీముం డి ట్లనియె. 153

ప్రతిపదార్ధం: కావున; మనము; ఇందు= ఈయింటిలో; విశ్చసించి= నమ్మి; ఉండవలదు= ఉండకూడదు; అవశ్వంబు= తప్పక;

అగ్ని. భయంబు+అగున్‌= నిప్పువలన భయం కలుగుతుంది; అనిన; విని; బీముండు: ఇట్టు+అనియె.

తాత్పర్యం: కాబట్టి, మనం ఈ యింట్లో నమ్మి ఉండకూడదు; తప్పక ఈ యింట అగ్నిభయం కలుగుతుంది

అని ధర్మరాజు పలుకగా విని భీముడు ఈ విధంగా అన్నాడు,

ఆ. 'ఇట్టిదేని మనకు నిం దుందంా నేల?। యరిగి ముందు నున్నయంద యుండి, యెజింగి దీనితోన యిప్పురోచను. గాల్చి। పోద' మనిన ధర్మపుత్రుం డనియె. 154

ప్రతిపదార్హం: ఇట్టిది+ఏని= ఇటువంటిదైతే; మనకు; ఇందు= ఈయింటిలో; ఉండగాన్‌+ఏల= ఉండట మెందుకు; అరిగి= వెళ్ళి;

ముందు+ఉన్న+అందు+అ= ఇదివరకు ఉన్నచోటనే; ఉండి; ఎజింగి=ఐ తెలిసి; ఈ+పురోచనున్‌; దీనితోన= ఈ యింటితోకూడ; కాల్చి; పోవుదము; అనిన; ధర్మపుత్రుండు= ధర్మరాజు; అనియె= ఇ ట్లన్నాడు.

తాత్పర్యం: “ఇటువంటి దైతే ఈయింట్లో మనం ఉండట మెందుకు? ఇదివర కున్న ఇంట్లోనే ఉందాము. ఈ

యింటితో పురోచనుడినిగూడ దహించి పోదాము” అని భీము డనగా అతనితో ధర్మరాజు ఇట్టా అన్నాడు.

క. _ ఎటింితిమి దీని తెజ గే; మజ కెలటుంనియట్లు గూఢమతి నుండుద మిం దఅముం బురోచనుకృతకము । నెణి నేర్పడునంతకును వినీతాత్ముల మై. 155

(ప్రతిపదార్ధం: దీని తెజంగు= ఈ యింటి పద్దతి; ఎజింగితిమి= తెలిసికొన్నాము; ఏమటజక= పరాకులేకుండ; ఎజు(గని+అట్టుణ

తెలియనట్టు; పురోచను, కృతకము= పురోచనునిచేత చేయబడినది - అంటే పురోచనునిమోసం; నెటిన్‌= పూర్తిగా: ఏర్పడు+

లా క్ట నష అంతకును= బయటపడేంతవరకు; వినీత+ఆత్ములము+ఐ= ని(గ్రహించిన మనస్సులు కలవారమై; గూఢ మతిన్‌= రహస్యమైన తలంపుతో; ఇందణఅముజ ఇంతమందిమి; ఉండుదము.

తాత్పర్యం: మనం ఈ యింటి సంగతి తెలిసికొన్నాము. పరాకు లేకుండా ఏమీ తెలియనట్లే పురోచనుడిమోసం

పూర్తిగా బయటపడేవరకు మనస్సును నిగ్రహించుకొని రహస్యమైన ఆలోచనతో అందరం ఇందే ఉందాము.

వ. ఇప్పాపగృహప్రకారంబు మన మెళుంగుట పురోచనుం డెజింగెనేని దుర్యోధనునియోగంబు విఫలం బగునట్లు గాకుండ శీఘ్రకారుల మై దీని దహించిన నక్కడ భీష్మువిదురులు విని కోపించినం గురుకుల సముద్ర క్షోభం బగు; మఖి దాహభయంబున మన మొండుగడకుం బోయిన నెజింగి మనయంతరంబ రోయుచు నద్దురాత్ముండు దుర్యోధనుండు వెండియు మన కపాయంబు సేయు నె ట్లనిన, 156

588 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: ఈ+పాప్క గృహ, (ప్రకారంబు= ఈ పాప మైన ఇంటి విధం; మనము; ఎయుంగుట; పురోచనుండు; ఎటింగెన్‌+ఏని= తెలిసికొన్నట్టయితే; దుర్యోధను, నియోగంబు= దుర్యోధనునియొక్కలఆజ్ఞ; విఫలంబు* అగును, వ్యర్థమవుతుంది' అట్టు కాకశఉండ; శీఘ్ర, కారులము+ఐ= త్వరపడి చేసే వాళ్ళమై; దీని= ఈ యింటిని; దహించినన్‌= కాల్ఫివేస్తే, అక్కడ= హస్తినలో; భీష్మ విదురులు; విని; కోపించినన్‌= కురు, కుల, సముద్ర క్షోభంబు+అగు= కురువంశ మనే సముద్రంలో గగ్గోలు కలుగుతుంది; మజి= అట్టుగాక; దాహ, భయంబునన్‌= కొల్పువలని భయంచేతు మనము; ఒండు, కడకున్‌= ఇంకొకచోటికి; పోయినన్‌; ఎటింగి= తెలిసికొని; మన, అంతరంబు+అ= మనయొక్కమణజుగునే - అంటే మనం దాగిఉండే చోటునే; రోయుచున్‌=ఐ వెదకుతూ; ఆ+దురాత్ముండు= ఆ దుర్మార్షుడు; దుర్యోధనుడు; వెండియు= మరల; మనకు; అపాయంబుజ కీడును; చేయును; ఎట్టు+అనిన్‌. తాత్పర్యం: ఈ పాపపు ఇంటి సంగతి మనకు తెలిసినట్టు పురోచనుడికి తెలిస్తే దుర్యోధనుని ఆజ్ఞ విఫలమవుతుంది. అట్టా కాకుండా మనం తొందరపడి ఈ యింటిని దహించివేస్తే అక్కడ హస్తినలో భీష్మవిదురులు ఇది విని కోపిస్తే, కురువంశ మనే మహాసముద్రంలో సంక్షోభం కలుగుతుంది. అట్లా కాక ఇల్టు కాలుతుం దనే భయంచేత వేరొక చోటికి వెళ్తే ఆ దుర్మార్గ డైన దుర్యోధనుడు మనం దాగిన చోటునే వెదకుతూ మళ్లీ మనకు కీడు చేస్తాడు. అది ఎట్టా గంటే. సీ. 'రాజ్యపదస్థుం డరాజ్యపదస్థులం। బక్షబలాధ్యు డపక్షబలుల

విపులార్థవంతుండు విగతార్థసార్థుల। నవసరం బెటింగి వాం డశ్రమమున

దూష్యులం దుదిదాంక దూషించు మనల న । న్నిష్టురునకు నది నీతిగాదె!

కావున నొరు లెటుంగకయుండం గడు నమ్మి। నట్టుల యుండుద' మని దినంబు తే లెల్ల వేటలాడుచు రాత్రులెల్ల నుద్య।; తాయతాయుధహస్తు లై యనుదినంబు

నప్పురోచను వంచించి యనఘు లుండి! రప్రమాదు లై పొందడవు లప్పురమున,. 157 ప్రతిపదార్థం: రాజ్యపదస్టుండు= రాజ్యస్థానంలో ఉన్నవాడు - అంటే రాజ్యాధికారంలో ఉన్నవాడు; అరాజ్య, పదస్ఫులన్‌= రాజ్యాధికారంలో లేనివాళ్ళను; పక్షబల+ఆఢ్యుండు= సహాయబలం కలవాడు; అపక్ష, బలుల= సహాయబలం లేనివాళ్ళను; విపుల+ అర్ధవంతుండు= ఎక్కువ డబ్బున్న వాడు; విగత+అర్హసార్భుల= కోల్పోయిన ధనం గలవాళ్ళను; అవసరంబు= సమయం; ఎటింగి= తెలుసుకొని; అశ్రమమున; వాడు= ఆ దుర్యోధనుడు; మనలన్‌; దూష్యులన్‌= నిందింప దగిన వాళ్ళను - (ఇట చెరుప దగినవాళ్ళనని భావించాలి); తుది, తాకన్‌= చివరివరకు; దూషించు= నిందిస్తాడు - చెరుస్తాడు; ఆ+నిష్టురునకు= ఆ కక్రూరుడికి; అది; నీతి; కాదె= కాదా! కావునన్‌: ఒరులు=ఇతరులు, ఎజుంగక+ఉండన్‌= తెలిసికొనకుండ; నమ్మినట్టుల= నమ్మినట్లే; ఉండుదము; అని; దినంబులు+ఎల్ల= పగటిపూటలం దెల్ల; వేటలు+ఆడుచు; రాత్రులు+ఎల్లన్‌; ఉద్యత+ఆయత+ఆయుధ, హస్తులు+ఐ= ఎత్తబడిన గొప్ప ఆయుధాలు కల చేతులు కలవాళ్ళయి అప్రమాదు లై= ఏమరుపాటు లేనివాళ్ళయి అనుదినంబు= ప్రతిదినం; ఆ+పురోచను; వంచించి= మోసగించి; ఆ+పురమున= ఆ వారణావత నగరంలో; అనఘులు= పాపంలేనివాళ్ళు - పుణ్యాత్ములు; పాండవులు; ఉండిరి. తాత్పర్యం: రాజ్యాధికారంలో ఉన్నవాడు, సహాయబలం కలవాడు, గొప్పసంపద కలవాడు అయిన దుర్యోధనుడు

  • రాజ్యాధికారం, సహాయబలం లేక సంపద కోల్పోయిన మనలను సమయం చూచి తుదముట్ట చెరచటానికి (ప్రయత్నిస్తాడు. ఆ దుర్మార్షడికి అది నీతి, అందుచేత ఇతరులు తెలిసికొనకుండ నమ్మినట్టే ఉందాము అని- పుణ్యాత్ము లైన పాండవులు ప్రతిదినం పగలెల్ల వేటాడుతూ, రాత్రులలో ఆయుధాలు చేత ధరించి అఫ్రమత్తు లై ఆ వారణావతంలో ఉన్నారు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 589 విశేషం: విగతార్హసార్థుల - అనేదానికి విగతార్థవంతుల, విగతార్థసాధుల అనే పాఠాంతరా లున్నాయి. హస్తినాపురం వదలి బయటికి వచ్చిన పాండవులస్టితి, హస్తినాపురంలో రాజైన ధృతరాష్ట్రుని సంతతిస్టితి ధర్మజుని వాక్యాలలో నిరూపిత మయ్యాయి. పాండవులకు హస్తినలోని బందుగుల బలం దూరమైనది. రాజ్యాధికారం, బంధువులబలగం, అపారసంపద దుర్యోధనాదులకు దక్కాయి. పాండవులు ఏకాకులు నిస్సహాయులు అయ్యారు. ఇక (క్రమంగా వాళ్ళకు (ద్రుపదునితో బంధుత్వం, కృష్ణునితో చెలిమి ఏర్పడితేకాని కౌారవులకంటె బలంలోనూ, బలగంలోనూ, సంపదలోనూ అధికులు కారు.

లాక్షాగృహదహనము (సల.1-135-1)

వ. అట హస్తిపురంబున విదురుండు దుర్యోధనుదుర్మంత్రంబంతయు నిమ్ముగా నెజింగి, కడువిశ్వాసి నొక్క ఖనకు నతి కుశలుం బాండవుల పాలికిం బుత్తెంచిన, వాండయను వచ్చి రహస్యంబునం బాందవులం గని తన్ను నమ్మునట్లుగా విదురుసాభిజ్ఞానవచనంబు లెజింగించి 'యీకృష్ణ్టచతుర్దశినాంటిరాత్రి పురోచనుండు లక్కయింట దహనంబు దరికొల్పుం గావున నిందుండి మీకు వెలువడిపోవునట్టియుపాయంబు మారాజు నియోగంబునం జేయవచ్చితి' నని చెప్పి, లక్కయిల్లు వెలునడునట్లుగా నొక్కబిలంబు నెవ్వరు నెబుంగకుండం జేసి, వారల కెజింగించిన భీముండు దాని నిమ్ముగా శోధించి యెజింగి యుండు నంత.

152

(ప్రతిపదార్థం: అట; హస్తిపురంబున; విదురుండు; దుర్యోధను, దుర్మం(త్రంబు+*అంతయును= దుర్యోధనునియొక్క చెడ్డఆలోచన అంత; ఇమ్ముగాన్‌= స్పష్టంగా; ఎజింగి; కడు, విశ్వాసిన్‌= మిక్కిలి నమ్మదగినవాడిని; అతికుశలున్‌= మిక్కిలి నేర్పు గల వాడిని; పాొండవులపాలికిన్‌=ఐ పాండవుల దగ్గరకు; పుచ్చు+తెంచిన= పంపించగా; వాడును; వచ్చి; రహస్యంబునన్‌= చాటుగా; పాండవులన్‌: కని= చూచి; తన్ను, నమ్మునట్లుగ: విదురు, స+అభిజ్ఞాన, వచనంబులు= విదురునియొక్కగుర్తుతో కూడిన మాటలు; ఎజింగించి= తెలిపి; ఈ, కృష్ణు చతుర్హళినాటి, రాత్రి; పురోచనుండు; లక్కయింట; దహనంబు= నిప్పు; దరికొల్పున్‌= మండిస్తాడు; కావునన్‌: ఇందుండి= ఈ యింటి నుండి; మీకు; వెలువడి, పోవునట్టి= బయటపడిపోవునట్టి, ఉపాయంబు; మా, రాజు, నియోగంబునన్‌= మౌ దొర అయిన విదురునియొక్క అజ్ఞచేత; చేయ, వచ్చితిని? అని; చెప్పి; లక్క, ఇల్టు వెలువడునట్టుగాన్‌= లక్కయింటినుండి బయటికిపోయి ఉండేటట్టుగా?; ఒక్క; బిలంబున్‌= సొరంగాన్ని; ఎవ్వరున్‌; ఎటుంగకుండన్‌= తెలుసుకోకుండ; చేసి; వారలకు= పాండవులకు; ఎజింగించిన= తెలియజేయగా; భీముండు; దానిన్‌= ఆ సొరంగాన్ని; ఇమ్ముగా= పూర్తిగా: శోధించి= పరిశీలించి; ఎటింగి=ఐ తెలిసికొని; ఉండునంత= ఉన్నతర్వాత. తాత్పర్యం: హస్తినాపురంలో విదురుడు దుర్యోధనుని దురాలోచన నంతటిని స్పష్టంగా తెలిసికొని, మిక్కిలి విశ్వాసపాత్రుడు, నేర్పరి అయిన ఒక ఖనకుడిని పిలిచి, పాండవుల దగ్గరకు పంపించగా, వాడు పాండవులను రహస్యంగా కలిసి, విదురుడు తనను గుర్తించటానికి చెప్పిన మాటలు చెప్పి, 'రానున్న కృష్ణపక్ష చతుర్హశి నాటి రాత్రి పురోచను డీ లక్కయింటిని తగులబెడతాడు. అందుచేత ఈ యింటి నుండి మీరు బయటపడి వెళ్ళటానికి తగిన మార్గం విదురుని ఆజ్ఞమేరకు నెరవేర్చటానికి వచ్చా" నని, అక్కయింటినుండి బయటికి ఒక రహస్యపు సొరంగాన్ని ఎవ్వరికీ తెలియకుండా త్రవ్వి పాండవులకు తెలియజేయగా, దాన్ని భీముడు పూర్తిగా పరిశీలించి తెలిసికొన్నాడు. తర్యాత.

విశేషం: ఈ కృష్ణ చతుర్దశి - ఇది రౌద్రి సంవత్సర భాద్రపద బహుళ చతుర్దశి అని భారతకూలంకషవ్యాఖ్య.

-శ్రీమదాం(ధ్రమహాభారత సంశోధితప్రతి పుట, 361.

590 శ్రీమదాంధ్ర మహాభారతము

క. _ ధనదానములను బ్రియభో । జనదానములను విశిష్టసద్విజతతులం దనుపుచు నుండంగం దత్స్పుర ।; మున షణ్మాసములు భరతముఖ్యుల కరిగెన్‌. 159

ప్రతిపదార్హం: ధన, దానములన్‌= ధన దానాలచేత; ప్రియ, భోజన, దానములను= ప్రియ మైన భోజన దానాలచేతను; విళిష్ట

సల్‌+ద్విజ, తతులన్‌= గొప్పవా రైన మంచి(బ్రాహ్మాణులను; తనుపుచున్‌= తృప్ర్తిపరుస్తూ: ఉండంగన్‌; తత్‌+పురమున= ఆ నగరాన వారణావతనగరాన; భరత. ముఖ్యులకు= భరతవంశంలో ముఖ్యు లైన పొండవులకు; షట్‌+మాసములు= ఆరునెలలు: అరిగెన్‌=ఐ గడిచాయి.

తాత్పర్యం: ధన దానాలచేత, ఇష్టమైన భోజన దానాలచేత బ్రాహ్మాణ సమూహాలను తృప్తిపరుస్తుండగానే

వారణావతంటో పాండవులకు ఆరు నెలలు గడిచాయి.

వ. ఆ కృష్ణచతుర్హశినాండు కుంతీదేవి యప్పురంబునం గల బ్రాహ్మణ పుణ్యాంగనా జనంబుల కెల్ల నిష్టాన్న పాన దానంబులం దుష్టి చేసి దేవపూజ గావించి యున్నెడం, బురోచనుపంపిన నిషాదవనిత సపుత్రయైన బహువిధవన్యమూలఫలంబులు దెచ్చి యిచ్చుచుం గుంతీదేవిం బాయక సేవించి పాండవ కృత్యంబులు నిత్యంబును నెటింగించు చుండెడు నది. నాటిరాత్రి యుత్సవంబునం గాలచోదిత యై తానునుం దన యేవురు కొడుకులు నధిక మధుపాన మదంబున మెయి యెటుంగక లక్కయింటి పక్కంబున నిద్రవోయిన, నర్ధరాత్రంబునప్పుడు భీముండు మేల్కని పురోచనుకంటె ముందజం దాన యుత్సహించి వానిశయనగృ్భృహద్వారంబున ఘోరానలంబు దరికొలిపి, చెచ్చెరం దల్లిని నన్ననుం దమ్ములను బిలంబులోని కనిచి. యాయుధాగారంబుతోడన లాక్షాగారంబు హుతాశనున కశనంబు సేని, ఖనకునకుం దమకుశలగమనం బెజింగించి, బిలప్రవిప్తుం డయి కుంతిని ధర్మార్దుననకులసహదేవులను బిలంబు వెలువరించి తోడ్కొని చనునప్పుడు. 160

ప్రతిపదార్థం: ఆ, కృష్ణు చతుర్హశినాండు; కుంతీదేవి: ఆ+పురంబునన్‌+కల= ఆ వారణావతనగరంలో ఉన్న; (బ్రాహ్మాణ, పుణ్యాంగనా, జనంబులకు+ఎల్లన్‌= (బ్రాహ్మాణముత్తైదువులకందరికి; ఇష్ట+అన్న పాన దానంబులన్‌; తుష్టిశచేసి= తృప్తిపెట్టి; దేవపూజ; కావించి; ఉన్న+ఎడన్‌= ఉన్నసమయాన; పురోచను, పంపిన, నిషాద, వనిత= పురోచనునియొక్క పంపిన బోయసస్తీ - అంటే పురోచనుడు పంపిన బోయస్తీ; సపుత్ర+ఐనవ= కొడుకులతో కూడింది కాగా" బహు విధ, వన్య, మూల, ఫలంబులు= అనేకవిధాలైన, అడవిలో పుట్టిన వైన వేళ్ళను. పండ్లను: తెచ్చి; ఇచ్చుచున్‌; కుంతీదేవిన్‌. పాయకజ వదలక: సేవించి; పాండవ, కృత్యంబులు= పాండవులయొక్క పనులు; నిత్యంబును= ప్రతిదినమును ఎజీంగించుచున్‌= తెలియజేస్తూ: ఉండెడు+అది= ఉన్నట్టిది; నాటి, రాత్రి= ఆ కృష్ణచతుర్షశి నాటి రాత్రి; ఉత్సవంబునన్‌= పందుగలో. కాల, చోదిత+ఐ= మృత్యువుచేత 'ప్రేరేపింపబడిం ద్వై తానునున్‌; తన, ఏవురు కొడుకులున్‌: అధిక మధుపాన మదడంబువ= ఎక్కువ కల్గుయొక్క తాగుడుచేత కలిగిన మత్తుచేత; మెయి= దేహం; ఎజుంగక= తెలియక; లక్కయింటి, పక్కంబున= లక్కయింటిప్రక్క; నిద్రపోయినన్‌; అర్హరాత్రంబు+అప్పుడు; భీముండు; మేల్కని; పురోచనుకంటె ముందజన్‌; తాను+అ= తానే; ఉత్సహించి= పూనుకొని; వాని, శయన, గృహ, ద్వారంబునజ వాడియొక్క పడకటింటివాకిట్టో: ఘఫోర+అనలంబు= భయంకరమైనలఅగ్నిని; దరికొలిపి= మండించి; చెరశచెరన్‌= వెనువెంటనే; తల్లినిన్‌ అన్ననున్‌; తమ్ములను; బిలంబులోకి= ఫారంగంలోనికి; అనిచి= పంపి; ఆయుధ+అగారంబుతోడన= ఆయుధాలయొక్కఇంటితోసహా లాక్షా+అగారంటబు= లక్కయిల్లు: హుత+అశనునకు= అన్నిహోత్రునికి; అశనంబు+చేసి= ఆహారంగా చేసి; ఖనకునకున్‌; తమ, కుశల గమనంబు= తమయొక్కక్షేమంగా వెళ్లటం; ఎలింగించి= తెలియజేసి; బిల, ప్రవిష్టుండు+అయి= సొరంగంలో ్రవెశించిన వాడై; కుంతిని; ధర్మ+అర్జునః నకుల, సహదేవులను; బిలంబు, వెలువరించి= సారంగంనుండి బయల్పడేటట్టు చేసి తోడ్కొని చనునప్పుడు= వెళ్ళేటప్పుడు.

ఆదిసర్వము - షష్టాశ్వాసము 591 తాత్పర్యం: ఆ కృష్ణచతుర్దశినాడు కుంతీదేవి వారణావతనగరంలో ఉండే బ్రాహ్మణముత్రైదువుల కందరికి ఇష్టమైన భోజనం తృప్తిగా పెట్టి, దేవపూజ చేసింది. పురోచనుడు పంపిన బోయ్తీ కొడుకులు గలది కనుక అడవిలోని అనేకవిధాలైన మూలాలు, ఫలాలు తెచ్చి యిస్తూ కుంతిదేవిని వదలక సేవిస్తూ, పాండవులు చేసే పనులు ప్రతిదినం ఆ పురోచనుడికి తెలియజేస్తూ ఉన్నది. చావు మూడిం దై ఆ బోయెత తాను, తన కొడుకులు ఆ కృష్ణపక్షచతుర్దశి నాటిరాత్రి పండుగలో పెల్టుగా కల్గు (త్రాగి మత్తెక్కి మైమరచి ఆ లక్కయింటిప్రక్క నిదురించగా, భీముడు పురోచనుడికంటె ముందు తానే పూనుకొని వాడి పడకింటి వాకిటికి పెద్ద నిప్పు అంటించాడు. వెంటనే తల్లిని, అన్నను, తమ్ములను ఆ సౌరంగంలోకి పంపి, ఆయుధా లున్న ఆ యింటితోకూడ లక్కయింటిని తగులబెట్టాడు. విదురుడు పంపిన ఖనకుడికి తాము క్షేమంగా వెళ్ళటాన్ని తెలియచేశాడు. సారంగంలో ప్రవేశించి, కుంతిని ధర్మా ర్టున నకుల సహదేవులను ఆ సౌరంగంనుండి బయల్పడేటట్టు చేసి తోడ్కొని వెళ్ళేటప్పుడు. విశేషం: 'వనితసపుత్రయ్రైన'- అనేదానికి 'వనితతనయేవురుపుత్రులుం దానును' అనే పారాంతరా లున్నాయి. శ్రీమదాంధ్ర మహాభారతసంశోధితప్రతి, పుట. 361. ఆ బోయవనితకు కూడ కుంతీదేవికి వలె ఐదుగురు కొడుకులుండటం విశేషం. వాళ్ళు కుంతిని ఆమెపుత్రులను గమనిస్తూ నిత్యం రహస్య సమాచారాన్ని అందించటానికి నియుక్తు లైనా రన్నమాట. న్నీ _ కడునిద్రంగానక తొడరుచు వడిగొని |; నడనంగ నేరక తతయుచున్న

నెఠింగి, చెచ్చెరం దల్లి నజకట నిడి, ధర్మ; సుతవిజయులం దనవితతబాహు

యమకంబు నెక్కించి, యముల నుత్సంగంబు : లెక్కించుకొని భీము డక్కజముగ

నరిగెడు రయమునం దరులు సాల్పడి మొగ్గ; బదఘట్టనంబులం జదిసి జాలు ఆ. నుఖుము గాంగ నిట్లు నెజయంగ సత్వంబు । మెలసి రాతి రెల్ల నుణక పవన

తనయుః దడరిగెం బవలు సనినట్లు చీకంటి, యనక ముండ్లు గండ్లు ననక తెరలి. 161 ప్రతిపదార్థం: కడు, నిద్రన్‌= ఎక్కువ నిద్రచేత; కానకజ చూడలేక; తాడరుచు= తొట్రుపడుతూ; వడిగొని= వేగాన్ని పొంది; నడవంగనేరకజ= నడవలేక; తడయుచు+ఉన్నన్‌= అఆలస్యంచేస్తున్న: ఎటింగి= తెలిసికొని; భీముండు; చెర+చెరన్‌= వేగమే: తల్లిన్‌ అఅకటన్‌= మూపుమీద' ఇడి= ఉంచి; ధర్మసుత, విజయులన్‌= ధర్మరాజును. అర్జునుని; తన. వితత, బాహు, యమళంబున్‌= తనయొక్క విశాల మైన బాహువుల (భుజాల) యొక్కజంటను; ఎక్కించి; యములన్‌= కవలను - నకుల సహదేవులను; ఉత్సంగంబులు= ఒడులు - తొడలపైభాగొలు; ఎక్కించుకొని; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; అరిగెడు= వెళ్ళునట్టి; రయంబునన్‌= వేగంచేత; తరులు= చెట్టు సాలు+పడి= వరుసగా; (మొగ్గన్‌= పడగా; పద, ఘట్టనంబులన్‌= పాదాల తొక్కిళ్ళచేత" చదిసి= నలిగి: జాలు= రాళ్ళు; నుజుము= పొడి? కాగన్‌= కాగా; ఇట్టుూ ఈ విధంగా; సత్త్యంబు= బలం: నెజయంగ= నిండుగ; మెజసి= చూపి; రాతిరి+ఎల్లన్‌= రాత్రినంతటిని; ఉజక= లెక్కచేయక; చీకటి; అనక; ముండ్డు, గండ్డున్‌= ముళ్ళు, పగుళ్ళు; అనక= అని అనకుండ; తెరలి= కదిలి; పవలు= పగటిపూట; చనినట్టుఐ పోయినట్టు; పవన, తనయుండు= వాయుదేవునియొక్కకుమారు డైన భీముడు" అరిగెన్‌= వెళ్ళాడు. తాత్పర్యం: మిక్కుట మైన నిద్రతో తొట్రుపడుతూ, వడివడిగా నడవలేని తల్లిని మూపుమీద, ధర్మజా ర్ఫునులను భుజాలమీద, నకుల సహదేవులను ఒడులలో ఎత్తుకొని, భీముడు తన గమన వేగంవలన వృక్షాలు వరుసగా పడేటట్టు, పాదాల త్రొక్కిళ్ళచేత నలిగి రాళ్ళు పొడి అయ్యేటట్టు తన బలం చూవి, రాత్రిని లెక్కచేయకుండా, చీకటి అని అనుకోకుండా, ముండ్దు పగుళ్ళు అని చూడకుండా, పగటిపూట నడిచినట్టు నడిచి వెళ్ళాడు.

592 (శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: 'గండ్లు' అనేదానికి 'గుండ్డు' అనే పారాంతరం ఉంది. గుండ్డు అంటే రాళ్ళు. వన ఇట వారణావతంబున. 162 తాత్పర్యం: ఇక ఇక్కడ వారణావతనగరంలో. చ. అనుపసమనిత్యసత్యరతు లై వినయాన్వితు లైన పాందునం దనులకు ధర్మమూర్తులకు ధర్ము వెటుంగక యిట్టు లెగ్గు సే సిన ధృతరాష్ట్రడాధము నశేషసుహృత్పుతబంధుదాహసూ చనమయి లక్కయి ల్లతికృశానుశిఖాహతిం గ్రాణె (గ్రక్కునన్‌. 163 (ప్రతిపదార్థం: అనుపమ, నిత్య, సత్య, రతులు+ఐ= సాటిలేని నిత్య మైన సత్యంపై ఆసక్తిగలవా రై; వినయ+అన్వితులు+ఐన= అణకువతో కూడినవా రైన; పాండు, నందనులకు= పొండురాజుయొక్క కుమారులకు - పొండవులకు; ధర్మమూర్తులకు= ధర్మంయొక్క ఆకార మైనవారికి; ధర్మువు+ఎయింగన్‌= ధర్మాన్ని తెలియక; ఇట్టులు= ఈ విధంగా; ఎగ్గు= కీడు; చేసిన; ధృతరా(ష్టజ+అధమున్‌= ధృతరా(స్తునికుమారు డైన నీచుడిని; అశేష సుహృత్‌+సుత, బంధు, దాహ, సూచనము+అయి= మొత్తంమిత్రులయొక్క, కొడుకులయొక్క, బంధువులయొక్క కాలటాన్ని సూచించేటి దై; లక్క, ఇల్టు; అతి, కృశాను, శిఖాహతిన్‌= అధిక మైన అగ్బిజ్యాలలయొక్క దెబ్బచేత; [గ్రక్కునన్‌= వెంటనే; క్రాలౌ= కాలింది. తాత్పర్యం: సత్యంమీద ఆసక్తి కలవాళ్ళు, వినయవంతులు, ధర్మస్వరూపులు అయిన పాండునందనులకు, ధర్మం తప్పి ఈ విధంగా కీడుచేసిన నీచ దుర్యోధనుని మిత్రులు, పుత్రులు, బంధువులు కాలటాన్ని సూచించే దై- లక్కయిల్డు అధిక మైన అగ్నిజ్యాలలచేత కాలిపోయింది. విశేషం: అలం: ఉశ్రేక్ష. “అత్యుత్కటై: పుణ్యపాపైః ఇహైవఫల ముచ్యతే” అన్నట్టు ధర్మమార్గవర్తులైన పాండవులను సజీవదహనం చేయాలని సంకల్పించిన దుర్యోధనుని దురాలోచన. కాని అతడు ఈ జీవితకాలంలోనే బంధు మిత్ర సంతతితో నశించిపోవటం తథ్యమని లక్కయింటి మంట ధ్వనింపచేసింది. వ, తదనంతరంబ ప్రభాత సమయం బగుడును. 164 ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబ= తర్వాత; ప్రభాత, సమయంబు= తెల్లవారటం; అగుడును= కాగా; తాత్పర్యం: ఆ తరువాత తెల్లవారగా. షు. చ. అతిదురితక్రియాభిరతు. డైన పురోచనుతోన భస్మసా తృత మయి చెడ్డ తద్విపులగేహము. దత్‌క్షణదస్ధ మైనయా కృతక విభూతి జాతుష నికేతనమున్‌ మటి శస్త్ర వేశ్ళమున్‌ ధృతి సెడి చూడంా నరుంగుదెంచి జనుల్‌ గడు సంభ్రమంబుతోన్‌, 165 (ప్రతిపదార్థం: అతి, దురిత, [క్రియా+అభిరతుడు+ఐన= మిక్కిలిపాపకార్యంలో ఆసక్తిగలవా డైన; పురోచనుతోన= పురోచనునితోసహా; భస్మ సాత్కృతము+అయి= బూడిదచేయబడిన దై; చెడ్డజ చెడినట్టి; తత్‌+విపుల, గేహమున్‌= ఆ విశాల మైన ఇంటిని; తత్‌; క్షణ, ద్ధము+ఐన= అక్షణాననే కాలిపోయిందైన: కృతక, విభూతి, జాతుషు నికేతనమున్‌= కృత్రిమ మైన వైభవంగల దైన లక్కయింటిని; మథీజ మరియు; శస్త్ర వేశ్మమున్‌= ఆయుధాలయొక్క ఇంటిని; ధృతి+చెడి= సంతోషాన్ని కోల్పోయి; జనుల్‌ చూడంగాన్‌= చూడటానికి; అరుగుదెంచి= వచ్చి; కడు, సంభ్రమంబుతోన్‌= మిక్కిలివేగిరపాటుతో.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 593

తాత్సర్యం: పాపపు పనులు చేయటంలో ఆసక్తి కల ఆ పురోచనునితోసహా కాలిపోయి బూడిద అయిన ఆ కృత్రిమశోభ గల లక్కయింటిని, ఆయుధాగారాన్ని సంతోషాన్ని కోల్పోయి చూడటానికి జనులు, మిక్కిలి వేగిరపాటుతో. మధ్యాక్కర.

ప్రో వైన భస్మంబు వాయం ద్రోచి య బ్బూదిలో నడంగి

యేవురు గొడుకులతోడ నం దొక్క యింతి యత్యుగ్ర

పావకదర్ధ యై యున్నంజూచి, యప్పారులు దాని

భావించి కుండియు సుతులు నని శోకపరవశు లగుచు. 166 ప్రతిపదార్థం: ప్రోవు+ఐన= కుప్పగా పడ్డ; భస్మంబు= బూడిదను; పాయన్‌+(త్రోచి= తొలగేటట్టుగా (త్రోసి; ఆ+బూదిలోన్‌= ఆ బూడిదలో: అడంగి; ఏవురు, కొడుకులతోడన్‌= ఐదుగురు కొడుకులతో కూడ; అందు+ఒక్క; ఇంతి= ఆడది: అతి+ఉ[గ్ర, పావక, దగ్ధ+ఐ= మిక్కిలి భయంకర మైన అగ్నిచేత కాల్సబడిం దై; ఉన్నన్‌; చూచి; ఆాపౌరులు; దాని= ఆ స్రీని; కుంతియు; సుతులున్‌+అని= కుమారు లని - అంటే పాండవులని" భావించి; కోక, పరవళులు= దుఃఖంతో మైమరచినవారు - అనగా అమిత దుఃఖం పొందినవారు; అగుచు. తాత్పర్యం: కుప్పగా ఉండే బూడిదను తొలగ (బోసి అందులో అయిదుగురు కొడుకులతోసహా కాలిపడి ౬ండే స్త్రీని చూచి- వాళ్ళే కుంతీ, పాండవు లని భావించి పౌరులు పెద్ద దుఃఖంతో. విశేషం: మధ్యాక్కరచరణంలో [క్రమంగా 2 ఇంద్ర - 1 సూర్య - 2 ఇంద్ర - 1 సూర్యగణాలు ఉంటాయి. నన్నయ అయిదవగణం మొదటి అక్షరంతో యతిమైత్రి చేశాడు. (ప్రాసఉన్నది. కోపం, పశ్చాత్తాపం దుఃఖం, ప్రబోధం, ్రార్ధనం, అధిక్షేపం, విస్మయం, నింద, స్తుతి, ఉత్సాహం, మొదలైన భావాలను వర్షించేటప్పుడు ఈ వృత్తం సాధారణంగా ప్రయోగింపబడుతుంది. ఇక్కడ దుఃఖభావ వ్యంజకంగా మధ్యాక్కరను నన్నయ రచించాడు. (సంపాం మ. “బలవంతుల్‌ భరతాన్వయస్థితికరుల్‌ భాస్వద్దుజావీర్యని

ర్థళతారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్‌ పాండవే

యులు నిష్కారణ మిట్లు వచ్చి ధృతరాష్రోపాయమాయోత్థిత

జ్వలనజ్వాలల. గ్రాంగిరే యనుచు సంజాతార్లు లై రెంతయున్‌. 167 ప్రతిపదార్థం: బలవంతుల్‌: భరత+అన్వయ, స్థితి, కరుల్‌= భరతవంశానికి నిలుకడను కూర్చేవాళ్ళు: భాస్వత్‌+భుజా, వీర్య నిర్దరిత+అరాతులు= ప్రకాశిస్తున్న భుజాలయొక్క బలంచేత చీల్చబడిన శత్రువులు కలవాళ్ళు; భూరి భూ, భర మహా, ధౌరేయకుల్‌= గొప్ప దైన భూమియొక్క భారాన్ని గొప్పగా మోసేవాళ్ళు;: పాండవేయులు= పాండవులు; నిష్కారణము+అ= కారణంలేకుండానే; ఇట్టు: వచ్చి; ధృతరాష్టశఉపాయ, మాయ+జిత్చిత, జ్వలన, జ్వాలలన్‌= ధృతరాష్ర్రునియొక్క ఉపాయ మైన మోసంచేత పైకిలేచిన నిప్పుమంటలలో; క్రాంగిరే=ఐ కాలిపోయారు కదా; అనుచు; ఎంతయున్‌= మిక్కిలి: సంజాత+ఆర్తులు+ఐరి= పుట్టిన దుఃఖం కలవా ళృ్ళయ్యారు. తాత్సర్యం: 'బలవంతులు, భరతవంశం నిలిపేవాళ్ళు, భుజ బలంచేత శత్రువులను సంహరించినవాళ్ళు, భూభారాన్ని వహించగలవాళ్ళు అయిన పాండవులు- ఏ కారణం లేకుండా- ఈ విధంగా ధృతరా'్ర్రుని కపటోపాయంతో పైకెగిసిన నిప్పుమంటల్లో మాడిపోయారు గదా!" అని మిక్కిలి దుఃఖించారు.

5్‌9డ్త (శ్రీమదాంధ్ర మహాభారతము వ. అంత విదుర ప్రేషితుం డయిన ఖనకుండు పౌరులం గలసి భస్తంబు వాయం ద్రోచువాండపొలె నెవ్వరు

నెలుంగకుండ( దనచేసిన బిలంబు ద్వారంబు గప్పి లక్కయింట నొక్కనిషాదవనిత యేవురుగొడుకులతో

దచ్ధ యగుట యొతింది గజపురంబునకుం జని తద్వృత్తాంతంబును బాండవుల కుశలగమనంబును

విదురునకుం జెప్పె; నిట వారణావతమ్మునవా రెల్ల నిట్టిదారుణంబు దుర్యోధనకారితంబకా నెథిండది శోకించి,

కుంతీపాందవులపంచత్వంబు ధృతరాష్తునకుం జెప్పి పుచ్చిన. 168 ప్రతిపదార్హం: అంత; విదుర, (స్రేషతుండు+అయిన= విదురునిచేత పంపబడినవా డైన; ఖనకుండుజ (త్రవ్వేవాడు; పౌరులన్‌= ఆ నగరప్రజలను; కలిసి; భస్మంబు= బూడిదను; పాయన్‌+*(త్రోచు, వాడ, పోలెన్‌= తొలగత్రోసేవానివలె; తన, చేసిన, బిలంబు, ద్వారంబు= తనయొక్క చేసిన సొరంగంయొక్క వాకిలిని; కప్పి; లక్క, ఇంటన్‌; ఒక్క; నిషాద, వనిత= బోయకాంత; ఏవురు, కొడుకులతో= ఐదుగురు కొడుకులతో; దగ్ధ+అగుట= కాలిపోయిం దవటం; ఎజింగి= తెలిసికొని; గజ, పురంబునకున్‌= హస్తినాపురానికి; చనిజ వెళ్ళి; తత్‌శవృత్తాంతంబును= ఆ విషయాన్ని; పాండవుల, కుశల, గమనంబును= పాండవులయొక్క క్షేమంగా వెళ్ళటాన్ని; విదురునకున్‌; చెప్పెన్‌: ఇట= ఇక్కడ; వారణావతమ్మునవారు+ఎల్లన్‌= వారణావతాన ఉన్నవాళ్ళంతా; ఇట్టి, దారుణంబు= ఈ విధమైన ఘోరం; దుర్యోధనకారితంబు+అ, కాన్‌= దుర్యోధనునియొక్కచేష్టయే అని; ఎజింగి= తెలిసికొని= శోకించి= దుఃఖించి; కుంతీ, పొండవుల, పంచత్వంబు= కుంతి యొక్క, పొండవులయొక్క మరణం; ధృతరా్ష్రునకున్‌; చెప్పి, పుచ్చిన= చెప్పిపంపగా. తాత్సర్యం: విదురుడు పంపిన ఆ ఖనకుడు వారణావత నగర (ప్రజలతో కలిసి బూడిదను ఆవలికి తోసేవాడిలా ప్రవర్తించి, ఇతరు లెవ్వరు చూడకుండ తాను (త్రవ్విన సొరంగ ద్వారాన్ని కప్పివేశాడు. లక్కయింట కాలిపోయింది బోయెత, ఆమె ఐదుగురు కొడుకులు అని తెలిసికొని హస్తినాపురానికి వెళ్ళి ఆ విషయాన్నీ, పాండవులు క్షేమంగా అక్కడనుండి వెళ్ళటాన్నీ విదురునికి చెప్పాడు. వారణావత ప్రజలంతా- ఈ ఘోరకృత్యం దుర్యోధనుడు చేసిందే- అని దుఃఖించి కుంతీ పాండవుల మరణ వార్తను ధృతరాష్ట్రునికి చెప్పి పంపారు.

పాండవులు లక్కయింట. జచ్చి రని ధృతరాష్ట్రుండు దుఃఖించుట (సం.1-137-10)

ట్‌. బాధిత శత్రు వర్గు లగు పొండుకుమారుల దుఃఖవార్త మ

ర్య్యాధము లైన సౌబల దివాధిపసూనులయొద్ద నప్పు దు

ర్యోధనుం డాదిగాంగ సుతు లున్న సభన్‌ విని దుఖితాత్ము. దై

యాధృతరాష్తుం డావజచిన ట్లజుచెన్‌ వివిధప్రలాపుండై. 169 ప్రతిపదార్థం: ఆ. ధృతరాష్షుండు; మర్త్య+అధములు+ఐన= మానవుల్లో తక్కువవా రైన - నీచులైన; సౌబల, దిన+అధిప సూనుల+ఒద్దన్‌= శకుని కర్టుల దగ్గర; దుర్యోధనుండు+ఆది, కాగ= దుర్యోధనుడు మొదలుగా; సుతులు= కొడుకులు; ఉన్న సభన్‌= సభలో బాధిత, శత్రు, వర్షులు+అగు= బాధింపబడిన శత్రువుల సమూహం కలవాళ్ళయిన; పాండు, కుమారుల, దుఃఖ, వార్త= పొండవులయొక్క దుఃఖసమాచారం - అంటే పాండవుల మరణవార్త; విని, దుఃఖిత+ఆత్ముండు+ఐ= బాధింపబడిన మనస్సుకలవా డై; వివిధ, ప్రలాపుండు+ఐ= అనేకవిధా లైన ఏడ్వటాన్ని కలవాడై ఆవు+అఆచినట్టు; అజుచెన్‌ తాత్పర్యం: దుర్యోధనుడు మొదలగు కొడుకు లున్నసభలో, నీచులైన శకుని కర్షుల ఎదుట, పాండవుల మరణవార్త విని, మిక్కిలి బాధ పడుతూ, అనేక విధాల దుఃఖిస్తూ ధృతరాష్ట్రుడు ఆవు అరచినట్టు అరచాడు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 595 విశేషం: అలం: ఉపమ. పరమదారుణమైన ఈ సంఘటన వెనుక తన పుత్రుని మాయోపాయం ఉందని తెలిసి ఏడ్చినా,

మై త్తు స్ట తెలియక ఏడ్చినా- నిజంగా ఏడ్చినా, అబద్దంగా ఏడ్చినా - మొత్తానికి ధృతరాష్ట్రుడు, అందరిముందు అంతపెద్దగా ఏడ్పాడట -

'అవటీచినట్లఅచి' ఏడ్పాడట. సుబలుని తనయుడు సౌబలుడు - శకుని. దినాధిపుడు - పగటికిరాజు - సూర్యుడు.

సూర్యసూనుడు. - సూర్యుని కుమారుడు - కర్చుడు. వీరితో దుర్యోధనుడిని కలిపి మర్య్యాధములనటం సార్ధకం.

సహృదయసంవాదం కలిగించే విశేషణం.

వ. మజీయు గాంధారిం దొట్టి దేవీజనులయాక్రందనధ్వను లంతఃశురంబున నెగసె; భీష్మాదికురువృద్ధులును విఫ్రులుం బౌరులును శోకాక్రాంతు లయిరి; విదురుండు పొందవులకుశలస్థితి యెఠింగియు నెబుంగనియ ట్లందజం గలిసి దుఖితుండపోలె నుండె; నంత ధృతరాస్తుండు గొడుకులుం దానును బాంధవులును గుంతీపాండవుల కుదకదానంబు సేసి సంస్కారాదిపరలోకక్రియలు గంగాతీరంబునం జేయ సమకట్టించి తగువారి బ్రాహ్మణుల నపారధనంబులతోడం బుచ్చిన. 170

ప్రతిపదార్థం: మజియు; గాంధారిన్‌+తొట్టి= గాంధారి మొదలుగా; దేవీ, జనుల+ఆక్రందన, ధ్వనులు= అంతఃపుర (స్త్రీల ఎడుపుశబ్దాలు; అంతఃపురంబునన్‌; ఎగసెజఐు పైకిలేచాయి; భీష్మ+ఆది, కురు, వృద్దులును= భీష్ముడు మొద లైన కురువంశపు పెద్దలును; విఫ్రులున్‌= (బ్రాహ్మాణులును, పౌరులును; శోక+ఆగక్రాంతులు= దుఃఖంచేత ఆ(క్రమింపబడినవాళ్ళు; అయిరి; విదురుండు; పాండవుల, కుశలస్థితి= పాండవులయొక్క క్షేమంగా ఉండే స్థితిని; ఎతింగియు; ఎజుంగని+అట్టు; అందజన్‌+ కలిసి= అందరితోకూడి: దుఃఖితుండను పోలెను= దుఃఖించినవానివలె: ఉండెన్‌: అంత; ధృతరా(మ్స్రండు: కొడుకులున్‌: తానును; బాంధవులును; కుంతీ, పాండవులకు; ఉదక, దానంబు+చేసి= నీటిని వదలి; సంస్కార+అది, పరలోక, క్రియలు= దహనం మొదలైన పరలోకానికి సంబంధించిన అంత్యక్రియలు; గంగా, తీరంబునన్‌; చేయజ చేయటానికి; సమకట్టించి= ఏర్పాటుచేయించి; తగువారి= తగినట్టివాళ్ళను; (బ్రాహ్మాణులన్‌; అపొర, ధనంబులతోడన్‌= అంతులేని ధనాలతో; పుచ్చిన= పంపగా;

తాత్పర్యం; అంతేగాక గాంధారీదేవి మొదలయిన అంతఃపుర కాంతల ఏడుపు ధ్వనులు పెల్లుబికాయి. భిష్ముడు

మొదలైన కురువంశపు పెద్దలు దుఃఖించారు. విదురుడు, పాండవులు క్షేమంగా ఉన్నా రని తెలిసినా

అందరితోపాటు తానుకూడ దుఃఖించేవానివలె ఉన్నాడు. ధృతరాష్షుడు, కొడుకులు, తాను, బంధువులు, కుంతీదేవికి, పాండవులకు నీళ్ళు వదలి, పరలోక (క్రియలు గంగాతీరాన జరిపించటానికి ఏర్పాట్లు చేయించి యోగ్యులైన బ్రాహ్మణులకు అంతులేని ధనా లిచ్చి పంపగా.

క. మతింబాండుకుమారులపం। చత విని దుర్యోధనుండు సంతసపడియెన్‌; హితుందయిన పురోచను పం। చత కెంతయు జాతదుఖచంచలు! డయ్యెన్‌. శేాశే

ప్రతిపదార్థం: దుర్యోధనుండు; పాండుకుమారుల, పంచత= పాండవులయొక్కమరణం; విని; మతిన్‌= మనస్సులో;

ఎంతసపడియెన్‌= సంతోషించాడు; హితుండు+అయిన= మేలుకోరే వాడయిన; పురోచను, పంచతకు= పురోచనునియొక్క మరణానికి; ఎంతయు; జాత, దుఃఖచంచలుండు+అయ్యెన్‌= పుట్టబడిన దుఃఖంచేత చలించినవాడు అయ్యాడు.

ప ని తాత్పర్యం: దుర్యోధనుడు పాండవుల మరణానికి సంతోషించాడు. తన మేలు. కోరేవా డైన పురోచను మరణానికి మాత్రం ఎంతో దుఃఖించాడు. విశేషం: పురోచనుడిని ముందుగా కాల్బటంవలన పాండవులు తప్పించుకొన్నారన్నవార్త రహస్యంగా ఉండగలిగింది.

596 శ్రీమదాంధ్ర మహాభారతము పాండవులు వారణావతముననుండి దక్షిణదిశగా నడచుట (సం.1-137-17)

న. అట పాండవులును భాగీరథి లంఘించి దక్షిణాభిముఖు లయి మారుతమార్తాండమరీచిగోచరంబు గాని గహనంబున నరుగుచు నధికక్షుత్పిపాసాపరవశు లయి నడవనోపకయున్న నెప్పటియట్ల యందణ నెత్తికొని వాయుతనయుండు వాయువేగంబునం జని సాయాహ్నంబున నొక్కవటమహీజాతశీతల శిలాతలంబున నునిచి దాని యగ్రవిటపం బెక్కి నీరారయుచున్నంత ననతి దూరంబున. 172

ప్రతిపదార్థం; అట; పాండవులును; భాగీరధి, లంఘించి= గంగను దాటి; దక్షిణ+అభిముఖులు+అయి= దక్షిణానికి ఎదురుగా ముఖాలు గలవాళ్ళయి; మారుత, మార్తాండ, మరీచి, గోచరంబు, కాని= గాలికిని, సూర్యునికాంతికిని చారరాని; గహనంబునన్‌= అడవిలో; అరుగుచున్‌= వెళ్ళుతూ, అధిక క్షుత్‌+పిపానా, పరవశులు+అయి= మిక్కిలి ఆకలిదప్పులకు లోనైన వాళ్ళయి; నడవన్‌+ఓపక= నడవలేక; ఉన్నన్‌; ఎప్పటి, అట్ట= ఎప్పటిమాదిరిగానే; అందణన్‌; ఎత్తికొని; వాయు, తనయుండుజ వాయుదేవునియొక్క కుమారుడు; వాయు, వేగంబునన్‌; చని; సాయ+అహ్నంబునన్‌= సాయంకాలాన; ఒక్క, వట, మహీజాత, శీతల, శిలా, తలంబునన్‌= ఒక మగర్రిచెట్టయొక్క చల్లని రాతి (ప్రదేశంలో; ఉనిచి= ఉంచి; దాని= ఆ మర్రియొక్క; అగ్ర, విటపంబు= చివరి కొమ్మ: ఎక్కి; నీరు+అరయుచు+ఉన్న+అంతన్‌= నీటిని వెిదకుతుండగా; అనతి, దూరంబున= ఎక్కువ కాని దూరాన - అంటే కొద్ది దూరాన.

తాత్పర్యం: పాండవులు గంగానదిని దాటి దక్షిణం వైపు సాగి, గాలి, సూర్యకిరణాలు చొరరాని దట్ట మైన అడవిలో

నడిచివెళ్ళుతూ, ఎక్కువ ఆకలి దప్పులకు లోనైన వాళ్ళయి నడవలేకపోగా భీమసేనుడు ఎప్పటివలె తక్కినవాళ్ళను

ఎత్తుకొని వాయువేగాన వెళ్ళి సాయంకాలానికి ఒక మజ్జి చెట్టు (క్రింద ఉండే చల్లని రాతిప్రదేశాన ఉంచి, ఆ

మజ్జిచెట్టు చివరికొమ్మనెక్కి నీళ్ళకొరకు వెదకుతుండగా కొంతదూరంలో.

మ. ప్రమదాపొది పయఃప్రపూర్ణ మిది యౌం బద్మాకరం బంచు6 ద

తృ్మమలామోదసుగంధ మారుతము వీ(కన్‌ ము న్నెతింగించినన్‌

రమణం బిల్టె సరోవరం బనిలజున్‌ రాజీవ రాజీ వస

తృమదాళివ్రజ చక్రవాక బక హంస క్రౌంచ నాదంబులన్‌, 173 ప్రతిపదార్థం: ప్రమద+ఆపాది, పయః ప్రపూర్ణ్వము= సంతోషాన్ని కలిగించే నీటితో నిండింది; పద్మ+ఆకరంబు= పద్మాలకు స్థానమైనది - కొలను; ఇది+బౌన్‌; అంచున్‌; తత్‌కమల+ఆమోద, సుగంధ, మారుతము= ఆ కొలనులోని తామరలయొక్క దూరంగా వ్యాపించే మంచి వాసనచే మంచి వాసన గలదైన గాలి; వీకన్‌= ఉత్సాహంతో; మున్ను+ఎఆింగించినన్‌= ముందుగా తెలియజేయగా; రాజీవ, రాజీ, వసత్‌సమద+అళి, (వ్రజ, చక్రవాక బక, హంస, (క్రౌంచ, నాదంబులన్‌= కమలాలయొక్క సమూహంలో ఉన్నట్టి మదించిన తుమ్మెదల సమూహంయొక్క, చ(క్రవాక పక్షులయొక్క, కొంగలయొక్క, క్రౌంచ పక్షులయొక్క ధ్వనులచేత, సరోవరంబు; రమణన్‌= ప్రీతితో: అనిలజున్‌= వాయుపుత్రుడైన భీముడిని; పిల్చె=ఐ పిలిచింది. తాత్పర్యం: ఆహ్లాదాన్ని కలిగించే నీటితో నిండినదీ, పద్మాలకు నెలవైనదీ అని, తామరపూల మంచి వాసనతో కలిసి వీస్తున్న గాలి ముందుగా పరిచయం చేస్తుండగా- కమలాలలో దాగిన మదించిన తుమ్మెదల గుంపులు, చక్రవాకపక్షులు, కొంగలు, క్రాంచపక్షులు చేసే ధ్వనులతో సరోవరం వాయుపుత్రుడైన భీముడిని పిలిచింది.

ఆదిపర్వము - షస్టాశ్వాసము 597 విశేషం: ఈ పద్యరచనలో సమాధి అనే గుణం ఉన్నది. 'రాజీవరాజీవ' అనేచోట యమకం. కథాప్రసన్సతకు భంగం కలిగించే టై దై. (నన్న విసృతి లేక అక్షరరమ్యం, మనోహరం అయిన సరోవర వరన మిది, సరోవరం (వనితవలె) భీముడిని ఆహ్వానిస్తున్న దనే వర్ణనం భావికధలో హిడింబ పవనసుతుడిని తనంతట తాను కోరుకొనే కధార్జాన్ని సూచిస్తున్నది. భావికధార్హ ధ్వనిని ఇందులో నన్నయ నిబంధించాడు. (సంపా) వ. _ఆదిక్కునకాక్షణంబయరిగి య క్కొలను గని యందుగ్భతావగాహుం డై కడుపునిండ నీళ్ళు ద్రావి యచ్చిద్ర కమల పత్ర పుటికల నీళ్ళు గొని భీముండు గ్రమ్మలీ వచ్చునంత. 174 ప్రతిపదార్ధ్హం: ఆ, దిక్కునకు; ఆ, క్షణంబ= ఆ నిమిషాన్నే; అరిగిఐ వెళ్ళి; ఆ+కొలను; కని= చూచి; అందున్‌? కృత+ అవగాహుండు+ఐ= చేయబడిన స్నానం గలవా డై; కడుపునిండ; నీళ్ళు; త్రావి; అచ్చిద్ర, కమల, పత్ర పుటికల= చినగని తామరాకు దొప్పలలో; నీళ్ళు; కొని= తీసికొని; భీముండు; (క్రమ్మథణి= మరలి; వచ్చు+అంత= వచ్చేటప్పుడు. తాత్పర్యం: ఆ వైపు వెంటనే వెళ్ళి ఆ సరోవరాన్ని చూచి, అందులో స్నానం చేసి, కడుపునిండా నీళ్ళుత్రాగి, చినగని తామరాకు దొప్పలలో నీళ్ళు నింపుకొని భీముడు తిరిగివచ్చేటప్పుడు. క. _ ధరణీదిశా ప్రసారిత। గురుకరనికరంబు లుడిచికొని దీర్టనిరం తరగతి భిన్నుడపోలెను । హరిదశ్వుండు విశ్రమించె నస్తాద్రిదరిన్‌, 175 ప్రతిపదార్థం: హరిదశ్వుండు= సూర్యుడు: దీర్హ, నిరంతర, గతి= నిడుపైన ఎడతెగనినడకచేత; భిన్నుడపోలెను= అలసిపోయిన వాడా అనేటట్టు; ధరణీ, దిశా, ప్రసారిత, గురు, కర, నికరంబులు= భూమిలోను, దిక్కులలోను చాపబడిన గొప్పకిరణాలయొక్క లేదా చేతులయొక్క సమూహాలు; ఉడిచికొని= అణచుకొని (ముడుచుకొని); అస్త+అద్రి, దరిన్‌= అస్తమించే పర్వత గుహలో; మిశ్రమించెన్‌=ఐ పరుండినాడు. తాత్పర్యం: సూర్యుడు తన సుదీర్హమైప ఎడతెగని నడకచేత అలసిపోయినాడా అన్నట్లు- భూమిమీద దిక్కులలో చాచిన తన కిరణా లనే చేతులను ముడుచుకొని అస్త గిరి గుహలో వి(శ్రమించాడు. విశేషం: అలం. ఉ'ర్రేక్ష హరిదశ్వుడు - పచ్చనికాంతిగల గుర్రాలు కలవాడు - సూర్యుడు. కరము - అనేశబ్దానికి కిరణం, చేయి అనే రెండు అర్జాలు ఉన్నాయి, ఉ. అంబురుహాప్తుండస్తశిఖరాంతరితుం డగుడున్‌ సమస్త జీ వంబులు నెల్లచో నిజనివాసము. బొందునెడం దమిస్రపుం జంబులపోలె వెల్వడియె శైలవిశాలగుహాలినుండి నా గంబులయూధముల్‌ సరసఘాసపరిగ్రహణోత్సుకంబు లై. 176 ప్రతిపదార్థం: అంబురుహ+అస్తండు= తామరలకు చుట్ట మైన సూర్వుడు; అస్తు శిఖర+అంతరితుండు+అగుడున్‌= అస్తపర్వతంయొక్క శిఖరంచేత మరుగుపరుపబడినవాడు కాగా; సమస్త, జీవంబులున్‌= అన్ని[ప్రాణులు; ఎల్లచో= అన్నిచొట్లు నిజ నివాసమున్‌= తమయొక్క నివాసస్థలాలను; పొందు+ఎడన్‌= పొందునట్టి సమయాన; నాగంబుల, యూధముల్‌= ఏనుగుల గుంపులు సరస, ఘాస, పరిగ్రహణ+ఉత్సుకంబులు+ఐజ= రుచితో కూడిన గడ్డిని ప్రియమార పుచ్చుకోవాలన్న ఉత్సాహంగల వై; తమిస్రత, పుంజంబుల, పోలె= చీకట్ల గుంపులవలె; తైల విశాల, గుహా+ఆలినుండి= కొండలలోని గుహల సమూహంనుండి; వెల్సడియె=ఐ బయటికి వచ్చాయి.

598 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: సూర్యాస్తమయం కాగానే అన్ని ప్రాణులు తమ తమనివాసస్టానాలకు పోతుండగా, ఏనుగుల

గుంపులు పచ్చిగడ్డిని ప్రియమార భుజించాలన్న ఉత్సాహంతో చీకట్ట గుంపులవలె కాండల గుహల నుండి

వెలుపలికి వచ్చాయి.

విశేషం: అలం. ఉపమ. గుహలు వెలువడుతున్న ఏనుగులగుంపును వర్షించే ఈ రచనలో ఆరోహావరోహ(క్రమస్సూర్తి కల సమాధి

అనే శబ్దగుణం సార్దకంగా పోషించబడింది. (సంపా

భీముడు నిదితు లైన జననీసోదరులను జూచి చింతిల్లుట (సం.1-138-14)

వ. భీమసేనుండును దద్వటవృక్షంబుక్రింద నధికపథిశ్రాంతు లై పయి పుట్టంబులు పజచుకొని తమ బాహుదండంబులు దలగడలుగా నిద్రితు లయియున్న సహోదరులం దల్లినిం జూచి పరమదుఃఖితుం డై యాత్మగతంబున. 177

ప్రతిపదార్థం: భీమసేనుండును; తత్‌+వట, వృక్షంబుక్రిందన్‌= ఆ మజ్టిచెట్టుక్రింద; అధిక, పథిశ్రాంతులు+ఐ= ఎక్కువ

దారినడక వలన బడలినవాళ్ళయి; పయి, పుట్టంబులు= 'పైగుడ్డలు; పజచుకొని; తమ; బాహు, దండంబులు= చేతులు; తలగడలుగా= దిండ్లుగా; నిద్రితులు+అయి= నిద్రపోయినవాళ్ళయి; ఉన్న; సహా+ఉదరులన్‌= తోబుట్టువులను; తల్లినిన్‌; చూచి; పరమ+దుఃఖితుండు+ఐ= మిక్కిలిదుఃఖించినవా డై ఆత్మ గతంబున= తనమనస్సులో.

తాత్పర్యం: ఎక్కువ దారినడక వలన బడలిక పొందిన వాళ్ళయి పై గుడ్డలు పరచుకొని చేతులు దిండ్లుగా

పెట్టుకొని ఆ మజ్జేచెట్టు క్రింద నిద్రించే సోదరులను, తల్లిని చూచి భీమసేనుడు మిక్కిలి దుఃఖించి తన

మనస్సులో.

కు _ త్రిభువనసామ్రాజ్యశీ । ప్రభుః దగు ధర్మాత్మజుండు ప్రాకృతజనున ట్లభిరూక్షతలంబున ని । ట్లభిభూతుం డగునె నిద్ర నతిఖిన్నుం డై. 178

ప్రతిపదార్థం: త్రిభువన, సామ్రాజ్య. ప్రభుండు+అగు= ముల్లోకాలసా(మ్రాజ్యలక్ష్మికి. ప్రభు వైన; ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు; ప్రాకృతజను+అట్టు= సామాన్యమానవునివలె; ఇట్టు; అభిరూక్షతలంబునన్‌= మిక్కిలికరిన మైన ప్రదేశానః అతి ఖిన్నుండు+ఐ= మిక్కిలి దుఃఖం పొందిన వా డై ని'ద్రన్‌= నిద్రలో; అభిభూతుండు+అగునె= తోసిపుచ్చ బడిన వాడ య్యాడుగదా; తాత్పర్యం: ముల్లోకాలకు ప్రభు వైన ధర్మరాజు సామాన్య మానవునివలె ఈ విధంగా మిగుల దుఃఖం పొంది, కరినమైన ఈ నేలమీద ని(ద్రించటమా!

విశేషం: అలం: విషమం.

సీ, కుంతిభోజాధిపుకూంతురు వసుదేవు। చెలియలు మటియు విచిత్రవీర్యు కోడలు కౌరవకులవిభూషణు. డైన । పాండునుహాదేవి పరమధర్మ పరు లైన కొడుకులం బడసినయది పుష్ప; సుకుమారతరమూర్తి శుచిపరార్థ్య శయనతలంబున శయనించియును నిద్ర; వోవనియది దప్పి. బొంది కటికి

ఆ. నేలంగండ్లు లొత్త నిద్రవోయిన యది; : తల్లికంటె నిద్రం దగిలి సుతులు వాలుమృగములున్న వన మని వగవక । మణచియుండి; రేమి మాడ్కి యొక్కొ! 179

ప్రతిపదార్థం: కుంతిభోజ+అధిపు, కూతురు= కుంతిభోజు డనే పేరు గల రాజుయొక్కకూతురు; వసుదేవు, చెలియలు'

మఠియు; విచిత్రవీర్యు, కోడలు; కౌరవకుల విభూషణు6డు+ఐన= కౌరవ వంశానికి అలంకారం వంటి వాడ్రైనన పాండు

ఆదిపర్వము - షష్టాశ్వాసము 599 మహాదేవి= పాండురాజుయొక్క పట్టపురాణి; పరమ, ధర్మపరులు+ఐన= మిక్కిలిధర్మాత్ము లైన; కొడుకులన్‌; పడసిన+అదిః= కన్నట్టిది; పుష్పు, సుకుమారతర, మూత్తి= పూవుకంటె సుకుమార మైన శరీరం కలది; శుచి, పరార్ష్య, శయన, తలంబున= పరిశుద్దత ముఖ్య మైన పడకమీద; శయనించియును= పడుకొనికూడ; నిద్ర+పోవని+అది= నిద్రపోనిది; దప్పిపాంది= దాహంవేసి; కటికివేలన్‌= ఆచ్చాదనం లేని కరినమైన నేలమీద' గుండ్లులు+ఒత్త= రాళ్ళు ఒత్తుకొంటూ ఉండగా; నిద్ర, పోయిన+అది= “ద్రపోయింది; తల్లి కంటె; నిద్రన్‌*తగిలి= నిద్రలో చిక్కుకొని; సుతులు= కొడుకులు; వాలు, మృగములు+ఉన్నవ= డ్రూర మృగా లుండే వనము+అని= అడవి అని" వగవకజ విచారించక; మరచి+ఉండిరి; ఏమి, మాడ్కి+ఒక్కొజ ఏవిధమో కదా. తాత్పర్యం: కుంతిభోజునికూతురు, వసుదేవునిచెల్లెలు, విచిత్రవీర్యునికోడలు, పాండురాజు పట్టపురాణి, పరమ ధర్మాత్ము లైన కొడుకుల కన్న తల్లి, పూవుకంటె సుకుమార మైన శరీరం కలది, పరిశుభ్రమైన పడకమీద పరుండికూడ నిద్రపోవనిది - అయిన కుంతిదేవి, అలసిపోయి కటికి నేల మీద రాళ్ళాత్తుకొంటున్నా నిద్రపోయింది. తల్లికంటె గాఢంగా నిద్రలో ఉన్న కొడుకులు ఇది క్రూర మృగా లుండే అడవి అని గూడ ఆలోచించకుండా నిద్రపోతున్నారు. ఇ దేమి చిత్రమో కదా! విశేషం: అలం: విషమం.

వ. వీరికి నిద్రాభంగంబు సేయనోపం దమకుం దార మేల్మొని నీళ్ళు ద్రావుదురుగాక!' యని యక్కనులపత్ర

పుటికల నీ ఇృమ్ముగా సంగ్రహించి వెండియుం దనమనంబున. 180 (ప్రతిపదార్హం: వీరికి; నిద్రా భంగంబు= నిద్రను చెరచటం; చేయన్‌+ఓపన్‌= చేయలేను; తమకున్‌+తారు+అ= తమకు తామే: మేలుకొని; నీళ్ళు; (త్రావుదురు+కాన్‌; అని; ఆ+కమల, పత్ర, పుటికల= ఆ తామరాకుదొప్పల్లో: నీళ్ళు+ఇమ్ముగా= నీళ్ళు తగురీతిగా; సం(గ్రహించిజ కుదించిఉంచి; వెండియున్‌= మరల; తన, మనంబున= తనమనస్సులో. తాత్పర్యం: “వీళ్ళకు నిద్రాభంగం చేయలేను; వీళ్ళు తమంత తామే మేల్కొని నీళ్ళు తాగుతారులే' అని నీళ్ళను తగు విధంగా తామరాకు దొప్పల్లో భద్రపరచి మళ్ళీ తన మనస్సులో. క. _ ఖలుండై ధృతరాష్తుండు పు; తులు దానునుగూడి మమ్ము దూరస్థులంగా

నిలు వెలువరించి లాక్షా। నిలయంబున నునిచెం బాపనిస్టితబుద్ధిన్‌, 181 ప్రతిపదార్థం: ధృతరాసుండు; ఖలుండు+ఐ= దుర్మార్గ డై పుత్రులున్‌; తానును; కూడి= కలిసి; మమ్ము; దూరస్థులన్‌+కొన్‌= దూరంగా ఉండేవాళ్ళు; అగునట్టుగా; ఇలు, వెలువరించి= ఇంటినుండి బయటికి పంపి; పాపనిష్టిత, బుద్దిన్‌= పాపంలో ఉంచబడిన బుద్దితో; లాక్షాా నిలయంబునన్‌= లక్కయింటిలో; ఉనిచెన్‌= ఉంచాడు. తాత్సర్యం: ధృతరాష్ట్రుడు దుర్మార్గు డ్రై కొడుకులూ, తానూ కలిని మమ్ములను దూరం చేయటాని కె ఇంటినుండి బయటికి పంపి దుర్చుద్దితో లక్కయింట్లో ఉంచాడు. క కులపాంసను లై యహితం ; బులు సేయుచునుండుచుట్టములం బొందక యి

మ్ముల నుండు వా6డ పుణ్యుండు | వెలయ(గ గ్రామస్థితైకవృక్షమపోలెన్‌. 182 ప్రతిపదార్థం: కుల, పాంసనులు+ఐ= వంశనాశనం చేసే వాళ్ళయి; అహితంబులు=ఐ అపకారాలు; చేయుచున్‌+ఉండు; చుట్టములన్‌; పొందక= చేరక; వెలయంగ= ఒప్పుగ; (గ్రామస్టిత+ఏకవృక్షమపోలెన్‌= గ్రామంలో ఉండే ఒకే ఒక చెట్టువలె; ఇమ్ములన్‌= అనుకూల స్టానాల్గో; ఉండు, వాండు+అ= ఉండేటివాడే? పుణ్యుండు.

600 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: వంశ నాశనం చేసే వాళ్ళయి, అపకారం చేసే దుర్మార్లు లైన చుట్టాల చెంత చేరకుండా- (గ్రామంలోని

ఏకైక వృక్షంలా (అది అందరి ఆదరాన్ని పొంది శ్లేమంగా ఉంటుంది) తన కనుకూల మైన స్తానంలో ఉండే వాడే

క!

పుణ్యాత్ముడు.

విశేషం: అలం. ఉపమ. నన్నయ కవితలో రుచిరార్డసూక్తి,

కు పరహితఫలనంతులు సు । స్థిరమూలాన్వితు లపాపదీరతులు పర స్పరసంశ్రయమున జీవిం । తురు మనుజులు వనములోని ద్రుమములపోొలెన్‌. 183

ప్రతిపదార్థం: పరహిత, ఫలవంతులుజ= ఇతరుల మేలునే ఫలంగా కలవాళ్ళు (ఇతరుల మేలు కొరకు ఫలాలను కలిగినవి - అని వృక్షపర మైన అర్ధం); సుస్టిర మూల+అన్వితులు= మిక్కిలి స్థిర మైన మూలధనంతోకూడినవాళ్ళు (మిక్కిలి స్థిరమైన వేళ్ళతో కూడినవి- అని వృక్షపరమైన అర్థం); అపాప, థీ, రతులు= పాపబుద్దిలో ఆసక్రిలేనివాళ్ళు (పాపబుద్ధిలేనివి - అని వృక్షపరమైనఅర్థం); మనుజులు; వనములోని= అడవిలోని; ద్రుమములపోలెన్‌= వృక్షాలవలె; పరస్పర, సంశ్రయమున= ఒండొరుల ఆశయంచేత, జీవిస్తారు.

తాత్సర్యం: ఇతరుల మేలు కోరుతూ, సుస్టిర మైన మూలధనం గలిగి, పాపబుద్ధి లేని మానవులు- అడవిలో

ఒకదానితో ఒకటి కలిసి పెనగి ఉండే వృక్షాలవలె కలిసిమెలిసి జీవిస్తారు.

విశేషం: అలం. శ్లేష ఉపమ. ఫలశబ్దానికి 'బల' అనేపారాంతరం ఉన్నది. అలాగే 'అపాపధీరతులు' అనే దానికి 'అపారధీయుతులు”

,. 'అపారధీమతులు', 'అపారధిక్కృతులో అనే పారాంతరా లున్నాయి. -శ్రీమదాం'ద్రమహాభారతసంశోధిత ప్రతి, పుట, 368.

వ. అని ధృతరాషస్తుబాంధనంబు నిందించుచు నిబిడాంధకారనీరంధ్రంబు లయిన దిశలు సూచి యున్నంత, జన రభసంబు దవ్వుల వీతెంచిన ముందటం బురంబు గలుగవలయాు, వీరలు మేల్కొనునంతకు నే నిచ్చోట నేమరకుండవలయు నని. 184

ప్రతిపదార్థం: అని; ధృతరాష్టు, బాంధవంబు= ధృతరా(ష్టునియొక్క బంధుత్వాన్ని; నిందించుచు; నిబిడ+అంధకార, నీరంద్రంబులు+ఆయినజ= దట్టమైన చీకటిచేత నిండి సందులేని వైన; దిశలు; చూచి; ఉన్నశఅంత= ఉన్నతర్వాత; జన, రభసంబు= జనులసందడి; దవ్వుల, వీతెంచిన= దూరంనుండి విన రాగా; ముందటన్‌; పురంబు; కలుగవలయు= ఉండాలి; వీరలు; మేలుకొనునంతకున్‌= మేలుకొనేవరకు; ఏన్‌= నేను; ఈశ+చోటన్‌; ఏమరక+ఉండవలయున్‌= పరాకు లేక ఉండాలి; అని. తాత్పర్యం: అని ధృతరాష్షునితో ఉన్న బంధుత్వాన్ని నిందిస్తూ, పూర్తిగా చీకటి పడిన తర్వాత దూరంనుండి జనుల సందడి వినిపించగా, ముందువైపు పట్టణ మొకటి ఉన్నదని తెలిసికొని, అయినా తల్లీ, సోదరులూ మేల్కొనేవరకు జా(గ్రత్తగా ఉండాలి అని.

క _ ఆకాననాంతరంబునం; బ్రాకటభుజవిక్రముండు పాందనవజ్రి ప్రాకారుండు జాగరమున ;। శోకమనస్కు. డయి పవనసూనుం డుండెన్‌. 185

ప్రతిపదార్థం: ఆ, కానన+అంతరంబునన్‌= ఆ అడవినడుమ; ప్రాకట; భుజ, విక్రముండు= ప్రసిద్ధ మైన భుజపరాక్రమం

కలవాడు; పాండవ, వజ్ర, ప్రాకారుండు= పాండవులకు వజ్ర ప్రహరిగోడ అయినవాడు; పవన సూనుండు= వాయుదేవునియొక్క కుమారుడు; భీముడు; శోకమనస్కుండు+అయి= దుఃఖమొందిన మనస్సు కల వా డయి; జాగరమున= మెలకువతో; ఉండెన్‌.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 601 తాత్పర్యం: ఆ అడవిమధ్య, ప్రసిద్ద మైన బాహుపరాక్రమం కలవాడు, పాండవులకు వజప్రహరిగోడవంటివాడు అయిన భీముడు దుఃఖంతోకూడిన మనస్సుతో మెలకువగా ఉన్నాడు.

వ. _తతృమీపంబున బాలసాలతరుషండమండపంబుననుండి హిడింబు. డను నొక్కరాక్షసుండు వారి దవ్వులం జూచి మైవెంచి రూక్షకేశంబులు విద్రిచి యావులించి నీల్లి 'నీరసవన్యమృగమాంసఖాదనజాతనిర్వేదన పరుండ నయి పెద్దకాలంబునకు మానవమాంసం బాస్వాదింపంగంటి' నని తన చెలియలి హిడింబ యనుదానిం బిలిచి యి ట్లనియె. 186

ప్రతిపదార్థం: తత్‌+సమీపంబున= దానికి దగ్గరగా; బాల, సాల, తరు, షండ, మండపంబునన్‌= లేత వైన మద్దిచెట్ట సమూహ మనే మండపంలో; ఉండి; హిడింబుండు+అను; ఒక్క. రాక్షసుండు; వారి= వాళ్ళను - ఆంటే పాండవులను, కుంతిని: దవ్వులన్‌= దూరాన; చూచి; మై+శపెంచి= శరీరాన్ని పెద్దదిగా చేసి; రూక్ష్మ, కేశంబులు= కజకువెండ్రుకలను; విద్రిచి= విదిల్చి; ఆవులించి; నీల్లి= ఒడలు విరిచికొని; నీరస వన్య, మృగ, మాంస, ఖాదన, జాత, నిర్వేదన, పరుండను+అయి= రుచి లేని అడవి జంతువుల మాంసాన్ని తినటంచేత కలిగిన రోత (ప్రధానంగా కల వాడి వై; పెద్ద, కాలంబునకు= చాలాకాలానికి; మానవ, మాంసంబు= మనుష్యులయొక్క మాంసాన్ని; ఆస్వాదింపన్‌+*కంటిని+అని= రుచి చూడ గలిగా నని; తన, చెలియలి= తనయొక్క చెల్లెలిని; హిడింబ; అను, దానిన్‌; పిలిచి; ఇట్టు+అనియె.

తాత్పర్యం: అడవి మధ్య పాండవు లుండే ప్రదేశానికి దగ్గరగా లేత మద్దిచెట్ట నడుమ హిడింబు డనే రాక్షసు

డొకడు. వాళ్లను చూచి మేను పెంచి, తన కరకు వెండ్రుకలు విదిలించి, ఆవులించి, నీల్లి, రుచిలేని అడవి

జంతువుల మాంసం తిని తిని రోత పుట్టిన తనకు చాలా కాలం తర్వాత మానవ మాంసం రుచి చూచే అవకాశం కలిగిం దని చెల్లెలు హిడింబను పిలిచి ఇట్టా అన్నాడు.

విశేషం: అలం: స్వభావోక్తి 'బాల సాల తరు షండ మండపంబున' అనే దానికి బాల రసాల తరు షండ మండిత మంటపంబున

  • బాల రసాల తరు షండ మధ్య మండపంబున - ఇత్యాది పారాంతరాలు ఉన్నాయి. -శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత ప్రతి,

పుట, 369.

ఉ. ఇందుల కిమ్మెయిన్‌ మనుజు లెన్నండు వత్తురె? వత్తురేని యా నందము. బొంది నిర్ణయమునన్‌ శయనింతురె? యిట్లు వంటయిల్‌ కుందెలు సొచ్చె: వేగ చని కోమలి! వారలం జంపి తెచ్చినా కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మాంస ఖండముల్‌. 187

ప్రతిపదార్థం: కోమలి= సుకుమారమైనదానా! ఇందులకు= ఇక్కడికి; ఈ+మెయిన్‌= ఈవిధంగా; మనుజులు; ఎన్నండు= ఎప్పుడైన; వచ్చుదురె; వచ్చుదురు+ఏీని= ఒకవేళ వచ్చినప్పటికీ: ఆనందమున్‌; పొంది: నిర్భయమునన్‌= భయంలేకుండ: శయనించుదురె= పడుకొంటారా!; ఇట్టుజఐ ఈవిధంగా; వంటయిల్‌=వంట ఇంటిలో; కుందెలు; చొచ్చె= ప్రవేశించింది; వేగజు వేగంగా; చని= వెళ్ళి; వారలన్‌? చంపి; రస+ఉత్కట, మానవ, మాంస, ఖండముల్‌= రుచిలో అధిక మైన మానవులయొక్క మాంసపుముక్కలను; నాకు+ఒందగ= నాకు ఒప్పేటట్టు; వండి; పెట్టుము. లా చకమము

తాత్పర్యం: 'ఇక్కడికి ఈ విధంగా మానవులు ఎప్పు డైనా వస్తారా! ఒకవేళ వస్తేతళన్షకుల.. వ

నిద్రిస్తారా! కుందేలు వంటింట్లోకి వచ్చింది. వెంటనే వెళ్ళి వాళ్ళను చంపి మిక్కిజ్లీ రోీగ్గేల్ట్‌ మానవమాం సింది.

చక్కగా నాకు వండిపెట్టు' మని హిడింబుడు చెల్లెలితో చెప్పాడు, [| థీ శ లో ఖ్‌ , స మైనము

602 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం; వంటయిల్‌ కుందెలు సొచ్చె - జాతీయం - అవసరమైనది తానై స్వాధీనమయిం దనటం,. నన్నయగారి పాత్రోచిత సంభాషణరచనకు ఈ పద్యం చక్కని ఉదాహరణం. హిడింబ భీమసేనునింజూచి మోహించుట (సం.1-139-1)

వ. అని పంచిన నదియును నతి త్వరితగతిం జని, ముందఖజ వారల దాయ శంకించి, యొక్క వృక్షంబు

మలయువునం గొండొక ప్రొ ద్దుండి. 188 ప్రతిపదార్థం: అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అదియును= ఆ హిడింబకూడ; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలి వేగంగా" చని= వెళ్ళి; ముందఆ; వారల: డాయః= సమీపించటానికి; శంకించి= వెనుకాడి; ఒక్క; వృక్షంబు, మలజువునన్‌= చెట్టయొక్కచాటున; కొండు+ఒక, ప్రాద్దు+ఉండి= కొంతసేపు ఉండి; తాత్సర్యం: అని హిడింబుడు ఆజ్ఞాపించగా హిడింబ మిక్కిలి త్వరగా వెళ్ళి ముందుగా వాళ్ళను సమీపించటానికి జంకి ఒక చెట్టుచాటున కొంతసేపు ఉండి. ను. వనజాతాయతనేత్రు నున్నతబృహద్వక్షుస్థలున్‌ సంహసం

హననుం బాండవసింహమున్‌ హృదయజన్నాకారు నుద్యన్మహా

శనికల్పస్థిరబాహు. జూచుచు మనోజాతాగ్నిసంజాతవే

దన యై రాక్షసి కామరూపధర మర్తస్త్రీస్వరూపంబుతోన్‌. 189 ప్రతిపదార్థం: వనజ+ఆయత, నేత్రున్‌= పద్మాలవలె విశాల మైన నేత్రాలు కలవానిని; ఉన్నత, బృహత్‌, వక్షస్‌+స్టలున్‌= ఎత్తైన విశాల మైన రొమ్ము గలవానిని; సింహసంహననున్‌= సింహంవంటి చక్కనినడుము కలవాడిని; హృదయ జన్మ+ఆకారున్‌= మనస్సునుండి పుట్టిన వా డైన మన్మధునిఆకారంవంటి ఆకారం కలవాడిని; ఉద్యత్‌+మహత్‌+అశని, కల్ప, స్టిరబాహున్‌= 'ప్రకాశించేగొప్పవజ్రాయుధంతో సమాన మై దృఢ మైన చేతులుగలవాడిని; పాండవ, సింహమున్‌= పాండవులలో ్రేష్టుడిని - భీముణ్ణి: చూచుచు; రాక్షసి=ఐ హిడింబ) మనో జాత+అన్ని, సంజాత, వేదన, ఐ= మన్మథాస్టివలన పుట్టిన బాధ కల దై; కామ, రూప, ధర= ఇచ్చ వచ్చిన రూపాన్ని ధరించేది - రాక్షసి హిడింబ; మర్త్య స్రీ స్వరూపంబుతోన్‌= మానవకాంత రూపంతో. తాత్పర్యం: పద్మాలవలె విశాల మైన నేత్రాలు, ఎత్తై విశాల మైన వక్షస్టలం, సింహంవంటి సన్నని నడుంతో కూడిన చక్కని శరీరం, మన్మధునివంటి అందం, వజ్రాయుధం వంటి దృఢ మైన బాహువులు కల భీమసేనుడిని హిడింబ చూచి, మోహించి, కామరూపం ధరించి, మానవ కాంతరూపంతో. విశేషం: అలం: ఉపమ. ఈఘట్టంలో హిడింబను ఆకర్షించిన భీమసేనుని రూపవర్లనకు మత్తేభవృత్తం, ఉదొత్తరమణీయశైలి

ము య

ఎంతో ఉచితంగా ఉన్నాయి. మాధుర్యంతో, ఓజస్సుతో కూడిన ఈ రచన హిడింబకు, మనోహరుడు, మహావీరు డయిన భీమునికి తగినట్టున్నది. క. _ వితత బహురత్నరుచిశో । భతభూషణములు వెలుంగ, బెడంగగు నవపు

ప్పెతజంగమలతక్రియ ను । న్నతకుచ సనుదెంచెం బవననందను డాయన్‌. 190 ప్రతిపదార్థం: ఉన్నత కుచ= ఎత్తైన రొమ్ములు కలిగింది - హిడింబ; వితత, బహు, రళ్న, రుచి, శోభిత, భూషణములు= గొప్పు వై అనేకా లైన రత్నాలకాంతులచేత ప్రకాశిస్తున్న సొమ్ములు; వెలుంగ= ప్రకాశించగా, నవ, పుప్పిత, జంగమ, లత, 'క్రియన్‌= (క్రొత్తగా పుప్పించిన నడతీగవలె; పవన నందను= వాయుపుత్రు డైన భీమసేనుడిని; డాయన్‌= సమీపించటానికి; చనుదెంచె= వచ్చింది.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 603 తాత్తర్యం: హిడింబ బహు రత్స కాంతులతో శోభిల్లే సొమ్ములు ధరించి, క్రొత్తగా పుష్పించిన నడ తీవ వలె వ్‌ న్నే ల్ల శ్ర క్‌త్త ్పు

భీమసేనుని దగ్గరకు వచ్చింది. విశేషం: అలం. ఉపమ. ఉన్నత బృహద్వక్షస్టలు డైన భీమునికి ద్మీబైన నాయిక ఉన్నతకుచ అయిన హిడింబ అని చమత్కారం. పూలు విరగ బూసిన జంగమ లత పవనతనయుడిని సమీపించిం దనటంలో భావుక మైన సౌందర్యం ఉన్నది. పూలతీవెయొక్క యౌవన సౌగంధ్యాన్ని గాలి వహిస్తా డని వస్తుధ్వని, క. రమణి నిజబ్రాత్భనియో ।; గము( దలంపక యపుడు భీము. గబిసె; బతిస్నే

హమ కామినులకు బలవం । తము; పెజనెయ్యములు వేయు. దత్సదృశములే? 191 ప్రతిపదార్థం: రమణి= ఆ కాంత; నిజ, (భ్రాతృ, నియోగమున్‌= తన అన్నయొక్కఆజ్ఞను;: తలపక= ఆలోచించక - మరచి; అపుడు; భీమున్‌; కదిసెన్‌= చేరుకొన్నది; కామినులకు= కాంతలకు; పతిస్నేహము+అ= భర్తమీది (ప్రేమే; బలవంతము= బలమైనది; పెజ నెయ్యములు= తక్కిన (ప్రేమలు; వేయున్‌= వెయ్యి అయినా, తత్‌+సదృశములె= దానితో సమానాలా? తాత్పర్యం: హిడింబ తన అన్న ఆజ్ఞను మరచి భీముడిని కూడుకొన్నది. కాంతలకు భర్ర మీది స్నేహమే బలమైనది. తక్కిన స్నేహాలు వెయ్యి అయినా దానితో సమానాలు కావు. విశేషం: అలం. అర్జాంతరన్యాసం. వ. ఇట్లు మన్మధవ్యధాశిథిలితమానమానస యయి తనయొద్దకు వచ్చుదానిం బవమానసూనుం

డవమానపూర్వకంబున 'నీ వెందులదాన? వింతప్రొ ద్దిందుల కేల వచ్చి? తెటవోయె? దెడ గలిగి పొ' మ్మనిన

విని హిడింబ యి ట్లనియె. 192 ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మన్మథ వ్యధా, శిథిలిత, మాన మానస+అయి= మన్మథబాధచే పోగొట్టబడ్డ అభిమానంగల మనస్సుగలదై; తన, ఒద్దకు= తనదగ్గరికి; వచ్చు. దానిన్‌= వస్తున్న హిడింబను; పవమాన, సూనుండు= వాయుదేవునియొక్క కుమారుడు; అవమాన పూర్వకంబున= అవమానం ముందు కలిగేట్టుగా; నీవు; ఎందుల, దానవు= ఎక్కడి దానివి; ఇంత. (ప్రొద్దు= ఇంత, పొద్దు పోయినతర్వాత - అంటే ఇంతరాత్రివేళ; ఇందులకు= ఇక్కడికి; ఏల, వచ్చితి= ఎందుకు వచ్చావు; ఎట+పోయెదు= ఎక్కడికి పోతున్నావు; ఎడ, కలిగి= దూరంగా; పొమ్ము+అనిన; విని; హిడింబ; ఇట్టు+అనియె. తాత్పర్యం: మన్మధబాధచేత అభిమానాన్ని కోల్పోయి తన దగ్గరకు వచ్చే హిడింబను చూచి భీముడు అవమానపూర్వకంగా “నీవు ఎక్కడిదానవు, ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు; దూరంగా తొ లగిపో' అని అనగా హిడింబ అతనితో ఇట్టా అన్నది. క జననుత! యేను హిడింబుం । డను రక్కసుచెలియలం బ్రయంబున నినుం జూ

చినయప్పటంగోలెను గడు; మనోభవనిపీద్యమానమానస నయితిన్‌. 193 ప్రతిపదార్థం: జన, నుత= ప్రజలచేత కొనియాడబడేవాడా!; ఏను= నేను; హిడింబుండు+అను, రక్కసు చెలియలన్‌= రాక్షసునియొక్క చెల్లెలిని; ప్రియంబున= ప్రేమతో; నినున్‌: చూచిన+అప్పటన్‌, కోలెను= చూచినప్పటినుండి' కడు= మిక్కిలి, మనోభవ, నిపీడ్యమాన మానసను+అయితిన్‌= మన్మధునిచేత ఎక్కువగా బాధింపబడే మనస్సు గల దానిని అయ్యాను తొత్సర్యరి; జనులచేత కొనియాడబడేవాడా! నేను హిడింబు డనే రాక్షసుడి చెల్లెలిని, నిన్ను చూచింది మొదలు మన్మధబాధకు గురిఅయ్యాను.

60 శ్రీమదాంధ్ర మహాభారతము క. _ నాకుంబతి వయిన నిన్నుం; జేకొని మాయన్న యెగ్గుసేయక కాచున్‌;

నాకు మటి నీవ పతివి గు। ణాకర! యి జ్ఞన్మమున మహాస్నేహమునన్‌. శ94 ప్రతిపదార్థం: నాకున్‌; పతివి= _భర్తవు; అయిన; మా+అన్న; నిన్నున్‌*చేకొని= నిన్ను తీసికొని - అంటే నిన్ను తనవానినిగా భావించి; ఎగ్గుశచేయక= కీడుచేయక; కాచున్‌= రక్షిస్తాడు; గుణ+ఆకర= మంచిగుణాలకు స్థాన మైనవాడా!: ఈ+జన్మమున; మహా, స్నేహమునన్‌= మిక్కిలి (ప్రేమ చేత; నీవు+అ= నీవే; నాకు; మథీ; పతివి= భర్తవు. తాత్పర్యం: నీవు నాకు భర్త వైతే మా అన్న నిన్ను తన వాడినిగా స్వీకరిస్తాడు. కీడుచేయకుండా నిన్ను కాపాడతాడు. అమిత (ప్రేమచేత ఈ జన్మలో నువ్వే నాకు భర్తవు.

విశేషం: హిడింబ జన్మచే రాక్షస వనిత. కాని, ఉత్తమ మానవలక్షణాలతో కూడుకొన్న పతివ్రత. హాస్యానికైనా అబద్దం పలకదు.

ఆమె భీముడిని చూచింది. మన్మధభావానికి గురిఅయింది. అయినా, ఆమె భీముడిని కామంతో చంచల దృష్టితో చూడలేదు.

అతడే ఆమెకు జన్మంతా భర్తగా ఉండాలని భావించింది. అతనికొరకు తన అన్నను వదలివేయటానికికూడా వెనుకాడలేదు. జననాంతర సౌహృదాల జాగృతివలన భీముడిని భర్తగా కోరిన ఉత్తమఇల్లాలు హిడింబ. పాండవులకు (ప్రధమ సంతతిని ప్రసాదించబోయే ఆ పాత్రను నన్నయ ఉదాత్తంగా పోషించాడు.

చ. ఉండు సురేంద్రు నైన బలియుండు హిడింబుయ వానిబారికిన్‌ వెలవననివారలుం గలం? వీరలు ముంద రెజబుంగ రక్కటా! యెళింగిరయేని యిట్లు దమయిండులనుండిన యట్లు మెచ్చకే మజి శయనింతురే; కడు€ బ్రమాదము సేసిరి బుద్ధిహీను లై 195

ప్రతిపదార్హం: బలియుండు= బలవంతు డైనవాడు; హిడింబుండు; సుర+ఇం[ద్రున్‌+ఐన= దేవేంద్రుడి నైనా; ఉజండు= లెక్కపెట్టడు; వాని, బారికిన్‌= వాని హింసకు; వెజవని, వారలున్‌= భయపడనివారు; కలరె= ఉన్నారా! వీరలు= వీరు; అక్కటా= అయ్యో! ముందర+ఎఆయుంగరు; ఎజిగిర+ఏని= తెలిసికొని ఉంటే; ఇట్ట్లు= ఈవిధంగా; తమ, ఇండులన్‌= తమయొక్క ఇండ్లలో; ఉండిన+అట్టు; మెచ్చక+ఏ= లెక్కచేయకే; మథీ; శయనించుదురె= పడుకొంటారా; కడు, బుద్ది, హీనులు+ఐ= చాలాబుద్దిలేనివా రై: కడు= మిక్కిలి; ప్రమాదము= పొరపాటు; చేసిరి.

తాత్పర్యం: హిడింబుడు బలవంతుడు. దేవేంద్రుడినికూడా లెక్కపెట్టడు. అతనిదెబ్బకు భయపడనివాళ్ళు లేరు.

అయ్యో! వీళ్ళకు ముందుగా తెలియదు. తెలిసి ఉంటే ఈ విధంగా తమ ఇండ్లలో ఉన్నట్టు ఇతడిని

లెక్కచేయకుండా ఇట్టా పడుకొంటారా! బుద్ది హీను లై పెద్ద పొరపాటు చేశారు. ళం లు అ 6

విశేషం: 'ఉలడు సురేంద్రు నైన' అనే దానికి ఉలుకు సురేంద్రుండైన' అనే పాఠాంతర ఉంది.

న. “ఇది హెడింబువనంబు; దీనిం జొచ్చి వెలువడుట జముకుత్తుక జొచ్చి వెలువడునట్ల; యాతం డింతకు వచ్చు: వీరితోడి దేమి; నీవు నాకు6 బతి వై ప్రాణంబు రక్షించుకొని నావలన నిష్టోపభోగంబు లందు; మేనును గామచారిణిని; నీకిష్టం బైన చోటికి నిన్ను. దోడ్కొనిపోవనేర్తు' ననిన దానికి భీముం డిట్లనియె. 196

ప్రతిపదార్థం: ఇది; హిడింబు, వనంబు= హిడింబునియొక్క అడవి; దీనిన్‌+చొచ్చి= దీనిలో ప్రవేశించి; వెలువడుట=

బయటపడటం; జము, కుత్తుకన్‌= యముడియొక్క గొంతులో; చొచ్చి= ప్రవేశించి; వెలువడునట్టు+అ=ఐ బయటికి వచ్చినట్టే; ఆతండు= హిడింబుండు; ఇంతకు= ఇంతలో; వచ్చు; వీరితోడిది+ఏమి= వీళ్ళతో ఏం పని; నీవు; నాకున్‌; పతివిశఐ= భర్త వై;

ఆదిపర్వము - షష్టాశ్వాసము 605 ప్రాణంబు; రక్షించుకొని; నావలనన్‌; ఇష్టణఉపభోగంబులు+అందుము= ఇష్ట మైన సుఖాలు అనుభవించుము; ఏనును= నేనుకూడ; కామ, చారిణిని= ఇచ్చ వచ్చిన చోటికి పోయేదాన్ని; నీకు+ఇష్టంబు+ఐన, చోటికి; నిన్నున్‌+తోడ్కొని; పోవనేర్తున్‌; అనిన; దానికి; భిముండు+ఇట్టు+అనియె. తాత్సర్యం: “ఇది హిడింబాసురుడి అడవి. దీంట్లో ప్రవేశించి బయటికి పోవటం యముడి కుత్తుకలో ప్రవేళించి బయటపడటమే. ఇప్పుడే హిడింబుడు రాబోతున్నాడు. తక్కినవాళ్ళసంగతి మన కెందుకు? నీవు నాకు భర్త వై ప్రాణాలు రక్షించుకొని నా వలన కోరినసుఖాలు అనుభవించుము. నేను కోరిన చోటికి పోగల దాన్ని. నీ కిష్టమైన చోటికి నిన్ను తీసికొని పోతాను" అని అనగా హిడింబతో భీముడు ఇట్లా అన్నాడు. విశేషం: అలం. ఉపమ.

క. _ వినుబేల! యెట్టికష్టుడు6। దన పురుష గుణంబు సెడంం దల్లిని-దోయి ట్టినవారి విడిచి రాగం । బునం జపల స్త్రీ సుఖంబుం బొందునె చెపుమా. 197 ప్రతిపదార్థం: విను= వినుము; బేల= అమాయికురాలా; ఎట్టి, కష్టుండున్‌= ఎటువంటి నీచు డైన; తన, పురుష గుణంబు+చెడంగన్‌= తన పురుష లక్షణం చెడిపోయేటట్టు; తల్లిని; తోన్‌+పుట్టినవారి; విడిచి; రాగంబునన్‌= మోహంచేత; చపల, (స్తీ సుఖంబున్‌= నిలుకడలేని స్రీవలనిసుఖాన్ని; పొందునె; చెపుమూ; తాత్పర్యం: అమాయకురాలా! ఎంతటి నీచు డైనా తన పురుష లక్షణం పోగొట్టుకొని- తల్లిని, తోబుట్టువులను వదలి మోహంలో పడి చంచలమైన స్త్రీ సుఖాన్ని పొందుతాడా! చెప్పుము. విశేషం: 'బేల[, చపల స్త్రీ సుఖంబు' అనే రెండు శబ్దప్రయోగాల శక్తివలన ప్రతీయమానమయ్యే ధ్వని ఈ పద్యంలో ప్రాణం, వనంలో ప్రవేశించి సుఖంగా నిద్రిస్తున్న ధర్మజాదులను బుద్ధిీహీనులనుగా భావించే హిడింబ, భీమునికి అమాయకురాలుగా అనిపించింది. మనసులో మెరసిన మదనభావానికి బానిస అయి అప్పులను వదలుకొనే లక్షణం చపల ప్రీలకు సహజం. ఆమె భర్త మీద కూడ చపల ప్రణయమే కలిగిఉంటుం దని భీముని వ్యాఖ్య. అందువలన ఇకపై హిడింబ తాను బేల కాదనీ, చపల కాదనీ మాటలతో, చేతలతో నిరూపించుకొని తన గాఢమైన (ప్రేమను చాటుకొంటుంది. భీముడు తాను (ప్రొఢుడ ననీ, బంధుట్రీకి కలవాడ ననీ చెప్పుకొన్నాడు. హిడింబాభీముల (ప్రవృత్తులు విరుద్దాలని భీముని భావనం. (సంపా. వ. అనిన విని హిడింబ వీరినందల రక్షించుట నీకుం బ్రియం బేని య ప్పురుషాదుండు రాకుండ ముంద వీరి నెత్తుకొని పోయెద; వీరలం బ్రబోధింపు' మనిన భీముం డి ట్లనియె. 198 ప్రతిపదార్థం: అనిన; విని; హిడింబ; వీరిన్‌+అందజ; రక్షించుట: నీకున్‌; ప్రియంబు+ఏని= ఇష్టమైతే: ఆ+పురుషాదుండు= ఆ మనుష్యులను తినేవాడు- ఆ రాక్షసుడు; రాకుండ; ముంద= ముందుగానే; వీరిన్‌; ఎత్తికొని; పోయెద; వీరలన్‌+ప్రబోధింపుము= వీరిని మేల్కొలుపుము; అనిన; భీముండు+ఇట్టు+అనియె. తాత్పర్యం: 'వీరి నెత్తికొని పోయెద' అనిన విని హిడింబ భీమునితో 'వీళ్ళందరిని రక్షించటం నీ కిష్ట మైతే నరమాంస భక్షకు డైన ఆ రాక్షసుడు రాకముందే వీళ్ళను మేల్కొలుపుము” అనగా భీముడు ఇట్లా అన్నాడు. విశేషం: సతికి తోబుట్టువుకోరికకంటె కట్టుకొన్నవాడి ఇష్టమే ఎక్కువ అని వ్యంగ్యంగా హిడింబ చెప్పింది. తే. అధికవీరుండు రక్కసుం డరుగుదెంచు | నని మనంబున భయనుంది వనజనేత్ర! వీరిసుఖస్టుప్తు లై యున్నవారి నిద్ర। సెడ(గ బోధింప నోప; నాకడిమి వినుము. 199

606 శ్రీమదాంధ్ర నమువోభారతము ప్రతిపదార్థం: వనజ, నేత్ర= పద్మాలవంటి కన్నులు కలదానా! అధిక, వీరుండు= మేటివీరుడు; రక్కసుండు; అరుగుదెంచున్‌+అని= వస్తా డని; మనంబున; భయము+అంది; సుఖ, సుప్త్పులు+ఐ+ఉన్నవారి= సుఖంగా నిద్రిస్తున్న వాళ్ళయిన వాళ్ళని; వీరి= వీళ్ళని; నిద్ర+చెడంగ= నిద్ర చెడిపోయ్యేటట్టు; బోధింపన్‌+ఓప= మేల్కొలుపలేను; నా, కడిమి= నాయొక్కబలం; వినుము. తాత్సర్యం: పద్మాలవంటి కన్నులు కలదానా! మేటి వీరుడైన ఒక రాక్షసుడు వస్తున్నా డని సుఖంగా నిద్రిస్తున్న వీళ్ళను నిద్ర చెడిపోయ్యే టట్టు మేల్కొలుపలేను. నా బలాన్నిగూర్చి వినుము. విశేషం: 'కన్యా వరయతే రూపం” అనే న్యాయంతో భీముడిని మనోహరరూపాన్ని చూచి అతడిని వలచింది హిడింబ. పరుల అధిక్యాన్ని తన యెదుట కీర్తిస్తే సహించలేని ఆత్మాభిమానం గల మహావీరుడు భీముడు. అయితే అతడు స్వభావంచేత ఉద్దతుడు. తన పరాక్రమాదులను తానే కీర్రిచుకొనబోతున్నాడు. అతని మాటలవలన భీమునికి రూపానికి అనువైన పొరుషంకూడా ఉన్నదని హిడింబకు తెలుస్తుంది. (సంపాం ఉ. క్రచ్చణ నొక్కరక్కసుండ కాండు సురాసురులెల్ల నొక్కటై

వచ్చిన నీవ చూడగ నవార్యబలోన్నతింజేసి వారలన్‌

వ్రచ్ది వధింతుంగాక; యిటు వచ్చి శ్రుంపడియున్న నిచ్చట

వ్యెచ్చగువీరి దైన సుఖనిద్రకు భంగము సేయనేర్తునే. 200 ప్రతిపదార్హం: క్రచ్చు+అజన్‌= మాంద్యము - మెల్లదనం - తొలగేటట్టుగా - అంటే వేగంగా; ఒక్క, రక్కసుండు+అ, కాండు= ఒక్కరాక్షసుడు మాత్రమే కాదు; సుర+అసురులు+ఎల్లన్‌= దేవతలు, రాక్షసులు అందరు; ఒక్కటి+ఐ= ఏకమై; వచ్చినన్‌; ఈవు+అ= నీవే; చూడంగన్‌= చూస్తుండగా; అవార్య, బల+ఉన్నతిన్‌+చేసిఐ అడ్డుకొన సాధ్యం కాని బలంయొక్క ఆధిక్యంతో; వారలన్‌; వ్రచ్చి= చీల్చి; వధింతున్‌*కాకజ= చంపుతాను కాని; ఇటు, వచ్చి= ఈ విధంగా వచ్చి; (శమంపడి= అలసట పొంది; ఉన్నన్‌; ఇచ్చటన్‌; మెచ్చు+అగు= మెచ్చుకోదగిం దైన; వీరిది+శఅగు; సుఖ, నిద్రకు; భంగము= ఆటంకం; చేయనేర్చుదునే= కలిగిస్తానా! తాత్పర్యం: వేగంతో ఒక్క రాక్షసుడే కాదు దేవ దానవు లంతా ఏకమై వచ్చినా, నీవు చూస్తుండగా అపార బలంతో వాళ్ళను చీల్చి చంపుతాను కాని, ఈ విధంగా వచ్చి అలసటచెంది సుఖంగా నిద్రించే వీళ్ళనిద్రకు భంగం కలిగించగలనా? విశేషం; పర పరాక్రమ వర్షనంవలన ఏర్పడిన సాహంకార క్రోధంతో ఆత్మ ప్రశంసా రూపమైన (ప్రతాపోక్తులు పలకటం భీమపాత్రకు సహజం. (క్రోధభావోన్నిద్రమైన ఉత్సాహభావాన్ని దీస్తరసత్వం కల ఉజ్జాలవాక్యాలలో వ్యక్తంచేసిన భీముడి మాటలను కాంతిగుణంలో ప్రకాశింపచేయటం నన్నయ రుచిరార్థసూక్తినిధిత్స లక్షణం. (సంపా.) వ. 'పెక్కులు పలుకక యారక్కసురా. బనుపు" మని భీమసేనుండు విబృంభించి పలుకుచున్నంత నట

హిడింబుండు హిడింబ మసలుటకు మహాక్రోధానలపజ్వలితచిత్తుం డయి. 201 ప్రతిపదార్థం: పెక్కులు+పలుకకజ ఎక్కువమాట లాడక; ఆ, రక్కసు రాన్‌+పనుపుము= ఆరాక్షసుడిని వచ్చేట్టు పంపుము; అని; భీమసేనుండు; విజృంభించి; పలుకుచు+ఉన్న+అంతన్‌; అట; హిడింబుండు; హిడింబ; మసలుటకు= ఆలస్యం చేయటానికి; మహా+క్రోధ+అనల, జ్వలిత, చిత్తుండు+అయి= మిక్కిలికోప మనే నిప్పుచేత మండుతున్న మనస్సుకలవా డై.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 607 తాత్పర్యం: 'ఎక్కువగా మాట్లాడక ఆ రాక్షసుడిని ఇక్కడికి పంపు" మని భీమసేనుడు పెచ్చుపెరిగి పలుకుతుండగా- అక్కడ హిడింబుడు, హిడింబ ఆలస్యం చేసినందుకు మిక్కిలి కోపించి. సీ కాలమేఘంబునుబోలె విశాల మై; నీల మై దేహంబు గ్రాలుచుండ

ఘనతటిల్లతలయ ట్లెనిమిది దంస్త్రలు । మెజవంగం బండులు6 గొలికి పెలుచ

నతిరోషలోహితాయతవృత్తనేత్రముల్‌ । దిరుగంగ6 బెట్టుచు. బరుషకేశ

జాలంబు గాడ్పున6 దూలంగం గాలోప ; మాను డై చనుదెంచి మానుషాదు+ ఆ. డనుజం జూచి 'కష్టమునుజులం గూడి నా । పనుపు సేయకుండ. జనునె నీకు?

ననుచు నుదరిపలుక విని హిడింబయుం గడు । వెజిచి భీమసేను మలజువు సొచ్చై. 202 (ప్రతిపదార్థం: కాల, మేఘంబును+పోలె= నల్లని మేఘంవలె; విశాలము+ఐ; నీలము+ఐ= నీలిరంగు గల దై; దేహంబు; 'క్రాలుచు+ఉండ= ఒప్పుతూ. ఉండగా; ఘన, తటిత్‌+లతల+అట్టు= మేఘంలోని మెరపుతీవలవలె; ఎనిమిది, దం(ష్టలు= ఎనిమిదికోరలు; మెజవంగన్‌= ప్రకాశిస్తుండగా; పెలుచన్‌= గట్టిగా? పండులు; కొటికి; అతి, రోష లోహిత+ఆయత, వృత్త నేత్రముల్‌= మిక్కిలికోపంతో ఎజ్జనై, నిడుపు లై గుండ్రని వైన కన్నులు; తిరుగంగన్‌+పెట్టుచున్‌= తిప్పుతూ; పరుష కేశ జాలంబు= బిరుసైన వెండ్రుకల సమూహం; గాడ్పునన్‌= గాలిచేత; తూలంగన్‌= కదలగా; కాల+ఉపమానుండు+ఐ= యమునితో పోల్చదగినవా డై; చనుదెంచి= వచ్చి; మానుషాదుండుజ మానవ మాంసం తినేవాడు - రాక్షసుడు; అనుజన్‌= తోబుట్టువును - చెల్లెలిని; చూచి; కష్ట మనుజులన్‌+కూడి= నీచు లైన మానవులతో కూడి; నా, పనుపు+చేయకుండన్‌= నాయొక్కఆజ్ఞను పాటించ కుండటం: నీకున్‌: చనునె= తగునా; అనుచున్‌; ఉదరి= పైకెగసి; పలుక; విని; హిడింబయున్‌? కడు= మిక్కిలి; వెజచి= భయపడి; భీమసేను, మజవు+చొచ్చె=ఐ భీమునిచాటుకు వెళ్ళింది. తాత్పర్యం: నల్లని మబ్బు వంటి పెద్దదేహంతో, మేఘంలోని మెరపు తీగలవంటి ఎనిమిది కోరలతో, గట్టిగా పండ్డుకొరికి, కోపంతో ఎర్రబడి, నిడుపు లై, గుండ్రని వైన కళ్ళు తిప్పుతూ, బిరుసువెండ్రుకలు గాలికి కదులుతూ ఉండగా- యముడివంటిరాక్షసుడు హిడింబుడు వచ్చి, చెల్లెలిని చూచి, 'నీవు నీచు లైన మానవులతో కలిసి నా ఆజ్ఞ ్రోసిపుచ్చటం తగునా?” అని గద్దించి పలుకగా హిడింబ మిక్కిలి భయపడి భీముడిచాటుకు వెళ్ళింది. విశేషం: అలం: ఉపమ, అన్నిచోట్లను ప్రాసయతులున్న సీసం.

భీమసేనహిడింబాసురుల యుద్దము (సం.1-141-15)

వ. అంత, 203 తాత్పర్యం: అప్పుడు. ఉ. పన్నగవైరి విక్రముండు పాండవ సింహము దానిం జూచి “మీ

యన్నను నన్ను. జూదుము భయంపడకుందును' యంచు, వానిన

త్యున్నతి. దాశి 'రాక్షస! వధోచిత! నీ బల గర్వ మేదంగా

నిన్ను వధించి యివ్వనము నెట్టన చేసిద నిర్భయంబుగన్‌'. 204 (ప్రతిపదార్థం: పన్నగవైరి, విక్రముంఢడు= పాములకు శత్రు వైన గరుడునివంటి పరాక్రమం కలవాడు; పాండవ సింహము= పాండవులలో శ్రేష్టుడు - భీముడు; దానిన్‌= ఆ హిడింబను; చూచి; మీ, అన్నను; నన్నున్‌; చూడుము; భయంపడక+ఉండుమ;

608 శ్రీమదాంధ్ర మహాభారతము అంచు= అనుచు; వానిన్‌= ఆ హిడింబాసురుడిని; అతి+ఉన్నతిన్‌= పెద్దఎత్తున; తాంకి= ఎదుర్కొని; రాక్షస; వధశిఉచిత= చంప ల ద్రంల్తై గని; రాక్షస

దగిన వాడా! నీ, బల, గర్వము+ఏదగాన్‌= నీయొక్క బలంయొక్క పొగరు నళించేటట్టుగొ; నిన్ను; వధించి; ఈ+వనము= ఈ అడవిని; నెట్టనజ= తప్పనిసరిగా; నిర+భయంబుగన్‌= భయంలేని దానినిగా; చేసెద= చేస్తాను. తాత్సర్యం: గరుత్మంతునివంటి పరాక్రమం కల భీముడు, ఆ హిడింబతో - “మీ అన్నను, నన్ను చూడుము. భయపడకుము” అని పలికి ఆ హిడింబాసురుడిని పెద్దఎత్తున ఎదుర్కొని “రాక్షసా! నీవు చంప దగిన వాడివి: నీ బల గర్వం నళించేటట్టు నిన్ను చంపి ఈ అడవిని తప్పక భయం లేని దాన్నిగా చేస్తాను" అన్నాడు. విశేషం: హిడింబునికి భయపడి భీముని అండజేరింది హిడింబ. భీముడి బాధ్యత పెరిగింది. తన బలానికీ హిడింబుడి బలానికీ గల భేదాన్ని చూడటానికి ఆమెను అక్కడే నిలవబడు మన్నాడు భిముడు. “తాలగిపొమ్ము' నుండి భయపడకుండా నిలిచిచూడు' అన్నంతవరకు మాట మారింది. ఆ మార్పుకు అభిమానమే కారణం కాని భీమునికి ఆమెపట్ట కలిగిన వలపు కాదు. ఏమైనా వైముఖ్యంనుండి సౌముఖ్యంవరకు దిగేటట్టు భీముడిని ఆకట్టుకొనగలిగింది హిడింబ. (సంపా.) క. 'చక్కనగు మనిన రక్కసుం: డక్కజముగం బెరింగి 'యియ్యయగు నిప్పుడు, నీ

యుక్కును జీరముం జూచెదం । జిక్కక నిలు మనుచు. గడు విజృంభించి వడిన్‌. 205 (ప్రతిపదార్థం; చక్కనగుము= చక్కగా నిలువు; అనిన; రక్కసుండు; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; పెరిగి= విజృంభించి; ఇయ్య+అగున్‌= అంగీకార మవుతుంది; ఇప్పుడు; నీ+ఉక్కును= నీయొక్కబలాన్ని; బీరమున్‌= పరాక్రమాన్ని; చూచెదన్‌;: చిక్కకవ= వెనుదీయక; నిలుము; అనుచున్‌; కడు= మిక్కిలి; విబృంభించి= పెచ్చుపెరిగి? వడిన్‌= వేగంగా. తాత్సర్యం: 'చక్కగా నిలువు' మనగానే రాక్షసుడు ఆశ్చర్యకరంగా విజృంభించి, సరే అని, నీ బల పరాక్రమాలను చూస్తాను గాక! వెనుదీయక నిలబడు” అని పెచ్చుపెరిగి వేగంగా. క. _ చేసమరికొంచుం బొడువం గ: డాసినం దద్భుజముతోన డగ్గణంగ జయో

ద్ధాసియయి పట్టికొనియె మ । హాసత్తుండు భీమసేను( డమ్మనుజాదున్‌. 206 ప్రతిపదార్థం: చే, సమరికొంచున్‌= చేయి చరుచుకొంటూ, పొడువంగ= కొట్టటానికి; డాసినన్‌= సమీపించగా; మహాసత్తుండు= మిక్కిలి బలం గలవాడు; భీమసేనుడు; జయ+ఉత్‌+భాసి+అయి= విజయంతో మిక్కిలి ప్రకాశించేవా డై; ఆ+మనుజాదున్‌= ఆ రాక్షసుడిని; తత్‌+భుజముతోన డగ్గఅ6గజ ఆ భుజంతోగూడ దగ్గరగా; పట్టికొనియె. తాత్పర్యం: చేయి చరచి కొట్టటానికి మీదికి రాగా, మహాబలవంతు డైన భీముడు గెలుపు పొంది వెలిగేవా డై ఆ రాక్షసుణ్ణి వాడి చేతితోసహా దగ్గరగా పట్టుకొన్నాడు. క. 'నిరుపద్రవసుఖనిద్రా। నిరతాచ్మకు లయిన వీరినిద్రకు నప్మ

ఛచ్చరణభుజఘాతశబ్దం । బరుదుగ విఘ్నంబు సేయు' నని వగచి మదిన్‌. 207 ప్రతిపదార్థం: నిర్‌+ఉపద్రవ, సుఖ, నిద్రా, నిరత+ఆత్మకులు+అయిన= హానిలేని సుఖ మైన నిద్రలో తగిలిన మనస్సు కలవా ళ్ళయిన; వీరి, నిద్రకున్‌; అస్మత్‌+చరణ, భుజ, ఘాత, శబ్దంబు= మాయొక్కకాళ్ళయొక్క చేతులయొక్క దెబ్బలధ్వని; అరుదుగ= ఆశ్చర్యంగా; విఘ్నుంబు+చేయును+అని= ఆటంకం కలిగిస్తుం దని; మదిన్‌= మనస్సులో; వగచి= బాధపడి. తాత్పర్యం: భంగం లేని సుఖనిద్రలో ఉండే వీళ్ళనిద్రకు, తమ కాళ్ళ చేతుల దెబ్బల ధ్వని ఆటంకం కలిగిస్తుం దని మనసులో బాధపడి.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 609

క. _ వడముడి యారక్కసు న। య్యెడ కష్టధనుఃప్రమాణ మెడ గలుగంగ నె

వ్వడి నీడ్డె నల్పమ్భుగమును । విడువక గజవైరి యీద్దువిధమున. బెలుచన్‌. 208 ప్రతిపదార్హం: వడముడి= భీముడు; ఆ, రక్కసున్‌: ఆ+ఎడకు= ఆ ప్రదేశానికి; అష్ట ధనుః, ప్రమాణము= ఎనిమిది విండ్రకొలత; ఎడ+కలుగం= దూరం ఉండేటట్టు; నెజ+వడిన్‌=ఐ మిక్కిలి వేగంతో; ఈద్చెన్‌; గజనవైరి= ఏనుగుల శత్రు వైన సింహం; అల్ప, మృగమును= చిన్నజంతువును; విడువక; పెలుచన్‌= గట్టిగా: ఈడ్పు, విధమునన్‌. తాత్పర్యం: భీము డా రాక్షసుడిని - సింహం చిన్న జంతువును వదలక గట్టిగా ఈడ్చేటట్లు- ఆ ప్రదేశానికి ఎనిమిది ధనుస్సుల కొలత గల దూరానికి మిక్కిలి వేగంగా ఈడ్చాడు. విశేషం: అలం. ఉపమ. వ. అట్టియెడ. 209 తాత్పర్యం: అటువంటి సమయంలో. చ. చరణహతిన్‌ మహాతరులు సాల్వడి జర్జరితంబు లై మహిం

దొరంగ6గ నిట్టు లొండొరులతోడ మదోద్ధతషప్టహాయన

ద్విరదములట్లు ఘోరరణవీరులు సేసిరి మల్లయుద్ధ ము

ద్ధురబలు లై సమీరణసుతుందు హిడింబుండు తద్వనంబునన్‌. 210 ప్రతిపదార్థం: ఘోర, రణ, వీరుల్లుఐ భయంకర మైన యుద్ధవీరులు; సమీరణ, సుతుండు= వాయుదేవునియొక్క కుమారుడు

  • భీముడు; హిడింబుండు; చరణ, హతిన్‌= కాళ్ళయొక్క త్రాక్కిడిచేత; మహా, తరులు= పెద్దచెట్టు చాలు+పడి= వరుసగా పడి; జర్జరితంబులు+ఐ= విరిగిన వై: మహిన్‌+తొరగంగన్‌= భూమిమీద పడగా; ఒండు+ఒరులతోడ= ఒకరితో నొకరు: ఇట్టులు= ఈ విధంగా; మద+ఉద్ధత, షష్టి హాయన, ద్విరదముల+అట్టు= మదంచేత గర్వించిన అరవయ్యేండ్ల మదపుటేనుగులవలె; ఉద్దుర, బలులు+ఐ= ఎక్కు వైన బలంగలవా ళ్ళయి; తత్‌+వనంబునన్‌= ఆ అడవిలో: మల్లయుద్ధము; చేసిరి. తాత్పర్యం: భయంకర యుద్ధవీరు లైన భీమ హిడింబులు- తమ కాళ్ళ తొక్కిడికి వరుసగా పెద్దపెద్ద వృక్షాలు విరిగి నేల కొరిగేటట్టు, అరవయ్యేండ్ల మదపుటేనుగులవలె ఆ అడవిలో ఒకరితోఒకరు మల్లయుద్దం చేశారు. విశేషం: అలం. ఉసమ. క భూరిపదఘాతజాత ధ । రారేణుప్రకరధూసరశరీరకు లై

వారిద్ధలు నొప్పిరి నీ; హారచ్చన్నంబు లయిన యద్రులపోలెన్‌. 211 ప్రతిపదార్థం: భూరి, పద, ఘాత, జాత, ధరా, రేణు, ప్రకర, ధూసర, శరిరకులు+ఐ= గొప్పవైన కాళ్ళయొక్క తా క్కిళ్ళవలన పుట్టిన భూమియొక్క దుమ్ము కణాల సమూహంచేత బూడిదరంగు గల దేహం కలవా ళ్ళయి; వారు+ఇద్దణున్‌= భీమ హిడింబు లిద్దరు; నీహార, చృన్నంబులు+అయిన= మంచుచేత కప్పబడ్డ వైన, ఆద్రుల, పోలెన్‌= పర్వతాలవలె; ఒప్పిరి.

హా! ల్‌ కూ

తాత్పర్యం: గొప్ప వైన కాళ్ళ తొక్కిళ్ళచేత పుట్టిన దుమ్ము కప్పి, బూడిద రంగు దేహాలు కలవా ళ్ళయి ఖీమ హిడింబు లిద్దరు మంచుచేత కప్పబడిన కొండలవలె ఉన్నారు. విశేషం: అలం. ఉపమ.

610 శ్రీమదాంధ్ర మహాభారతము

క్త ఆరాక్షసుండు భీము న । పారభుజాబంధనమున బంధించి మహా ఛీరధ్వని రోదోంతర । పూరిత మగునట్లు గాంగ బొబ్బడి యార్టెన్‌. 212

ప్రతిపదార్థం: ఆ, రాక్షసుండు; భీమున్‌; అపార, భుజా, బంధనమునజ= అంతులేని చేతుల బిగింపుచేత; బంధించి; మహాధీర,

ధ్వని= గొప్ప ధీరునియొక్క ధ్వని - గొప్పధైర్యంతో కూడినశబ్దం; రోదోంతర, పూరితము+అగునట్టుశకాంగ= భూమ్యాకాశాల నడుమ నిండింది అయ్యేట్టుగా? బొబ్బ+ఇడి= సింహనాదం చేసి; ఆర్బెన్‌= అరచాడు.

తాత్పర్యం: ఆ రాక్షసుడు భీముడిని గట్టిగా చేతులతో బంధించి గొప్ప ధీరునివలె భూమ్యాకాశాల మధ్య భాగ

మంతా నిండేట్టు పెద్దగా సింహనాదం చేసి అరచాడు.

న. అమ్మహాధ్వని విని కుంతియు€ గొడుకులును మేల్మని, తమసమీపంబున నతిమానుషం బయిన రూపసౌందర్యములతో నున్న హిడింబం జూచి, *'యిది వనదేవతయో సురకన్యయో' యనుచు విషయంబంది; రంతం గుంతి శాంతవచనంబుల “నీ వెందులదాన? విట కేల వచ్చి” తని యడిగిన నదియి ట్లనియె. 213

(ప్రతిపదార్థం: ఆ+మహాధ్వని= ఆ పెద్దశబ్దం; విని; కుంతియున్‌; కొడుకులున్‌; మేలు+కని; తమ, సమీపంబునన్‌; అతి,

మానుషంబు+అయిన= మానవులను అతి(క్రమించిం దైన - అంటే మానవులకు లేనట్టిదైన; రూప, సౌందర్యములతోన్‌=

ఆకారంతో, అందంతో; ఉన్న; హిడింబన్‌; చూచి; ఇది; వన, దేవతయో; సుర, కన్యయోజ= దేవతాకాంతయో; అనుచు; విస్మయంబు+అందిరి= ఆశ్చర్యపడ్డారు: అంతన్‌= తరువాత; కుంతి; శాంత, వచనంబుల= మెల్లనిమాటలతో; నీవు, ఎందుల, దానవు= నీవు ఎక్కడిదానివి; ఇటకు+ఏల= ఇక్కడికి ఎందులకు; వచ్చితివి+అని - వచ్చా వని; అడిగినన్‌? అది; ఇట్టు+అనియె, తాత్పర్యం: ఆ పెద్దబ్దం విని కుంతీదేవీ, కొడుకులూ మేల్కొని తమ సమీపంలో మానవాతీత మైన రూప సౌందర్యాలతో ఉన్న హిడింబను చూచి, ఇది వనదేవతో లేక దేవకాంతో అని ఆశ్చర్యపడ్డారు. తర్వాత కుంతి మెల్లని మాటలతో “నీవు ఎక్కడి దానివి? ఇక్కడి కేల వచ్చావు?" అని అడుగగా ఆమెతో ఆ హిడింబ ఇట్లా చెప్పింది. సీ. నీలజీమూతంబులీల నాక్షేపించి । నల్ల నై తోతెంచు నల్లగ్భహము

గల హిడింబుం డను బలితంపురక్కసు । చెలియల; నాతండు వెలయ మీకు

రోయక యహితంబు సేయ నన్‌ బంచినం। జినుదెంచి, యేను మీ తనయునందు.

బతిబుద్ధిం దాల్చి యుద్ధతమన్మధార్త నై; మసలితి; మసలిన నసుర వచ్చి

తే. యలిగి, మీతోడ నన్నును గలలయంబట్టి | మ్రింగ నున్న నయ్యసురతోడం గడంగి మల్లయుద్ధంబు సేయుచు నల్లచోట : నున్నవాండు మీసుతుండు దర్వ్పోన్నతుండు. 214

ప్రతిపదార్థం: నీల, జీమూతంబు, లీలన్‌= నల్లనిమేఘంయొక్కవిలాసాన్ని; ఆక్షేపించి= (త్రోసిపుచ్చి, నల్లన+ఐ; తోతెంచు=

కనిపించేటి; అల్ల, గృహము ఆ యిల్లు; కల; హిడింబుండు+అను; బలితంవు, రక్కసు, చెలియలన్‌=ఐ బలవంతు డైన రాక్షసుని యొక్క చెల్లెలిని; ఆతండు; వెలయజ= ప్రకాశించగా; రోయక= విడువక; మీకు; అహితంబు+చేయజ= కీడుచేయటానికి; నన్‌= నన్ను(హిడింబను); పంచినన్‌= ఆజ్ఞాపించగా; ఏను= నేను; మీ, తనయునందు= మీ కుమారుని మీద; పతి, బుద్దిన్‌= భర్త అనే మనస్సును; తాల్చి= ధరించి; ఉద్ధ్దత, మన్మథ+ ఆర్తను+ఐ= మిక్కిలి మన్మథ బాధను పొందినదా న్నై; మసలితి= ఆలస్యంచేశాను; మసలినన్‌= ఆలస్యం చేయగా; అసురజ రాక్షసుడు; వచ్చి; అలిగి= కోపించి; మీతోడ; నన్నును; కలయన్‌+పట్టి:

ఆదిపర్వము - షష్టాశ్వాసము 611

(మింగన్‌+ఉన్నన్‌= (మింగబోతుండగా; ఆ, అసురతోడన్‌; కడంగి=ఐ పూనుకొని; మల్ల, యుద్దంబు; చేయుచు;

దర్చ+ఉన్నతుండు= గర్భంలో అధికు డైన వాడు; మీ సుతుండు= మీ కుమారుడు; అల్ల, చోటన్‌= ఆ ప్రదేశానః ఉన్నవాండు=

ఉన్నాడు.

తాత్పర్యం: మేఘకాంతిని మించిన నల్లదనంతో కన్పట్టే ఆ యిల్టు గల హిడింబు డనే రాక్షసుడి చెల్లెలిని. అతడు

మీకు కీడు చెయ్య మని నన్ను పంపిస్తే, నేను మీ కుమారుడిని భర్తగా భావించి మన్మథబాధ పొంది ఆలస్యం

చేయటంచేత, అతడు వచ్చి కోపించి మీతో పాటు నన్ను గూడ (మ్రింగ బోయాడు. అప్పుడు గర్వాధికు డైన మీ కుమారుడు పూనుకొని అతనితో మల్లయుద్ధం చేస్తూ అదిగో అక్కడ ఉన్నాడు.

విశేషం: అన్నిచోట్ట ప్రాస నియతి గల సీసం. ప్రసొదగుణంగల రచనలో- ప్రసన్నంగా మాట్టాడిన హిడింబ మాటలు రచించటం,

ఒక్కగుక్కలో ఎంతోకధను చెప్పుతున్న స్పూర్తిని సీసపద్యరచనలో కలిగించటం నన్నయ కథాకథనళిల్పం. హిడింబ మాటలు

పొల్టులేనివి, సార్ధకమైనవి, సాభిప్రాయమైనవి. 'మీ తనయునందు పతిబుద్ధి తాల్చి, ఉద్దతమన్మథార్తనై మసలితిని' అన్న వాక్యం ఆమె సంభాషణలో ఆయువుపట్టు. అదే కుంతిమనసును ఆకట్టుకొన్న సమ్మోహనాస్త్రం. 'మీ సుతుడు దర్చోన్నతుండు' అనేమాట కోడలు అత్తతో అనదగిన ఆప్యాయపు అభివ్యక్తి రాబోయే కథను వస్తుధ్వనితో ప్రసన్నంచేశాడు నన్నయ. (సంపా.)

వ, 'నన్నును మిమ్మును రక్షించి యా రక్కసు నుక్కడంగ నశ్రమంబున నిప్పుడు చంపుం జూడుం' డనిన నందణు లేచి యుద్ధతులై మల్లయుద్ధంబు సేయుచున్న భీమహిడింబులంజూచి; రంత నచ్చోటికిం జని యర్హునుండు భీమసేనున కి ట్లనియె. 215

ప్రతిపదార్థం: నన్నును; మిమ్మును: రక్షించి; ఆ, రక్కసు+ఉక్కు+అడంగన్‌= ఆ రాక్షసుడి బలం నశించేటట్లు; ఆశ్రమంబునన్‌=

సులువుగా; ఇప్పుడు; చంపున్‌; చూడుండు+అనినన్‌; అందణు; లేచి; ఉద్ధతులు+ఐ= గర్వించినవాళ్షై; మల్ల, యుద్దంబు; చేయుచు+ఉన్న; భీమ, హిడింబులన్‌; చూచిరి; అంతన్‌= అప్పుడు; అర్జునుండు; ఆ+చోటికిన్‌; చని= వెళ్ళి; భీమసేనునకు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: 'నన్నూ మిమ్మల్ని రక్షించి ఆ రాక్షసుడిని ఇప్పుడు సులభంగా చంపగలడు. చూడండి” అని అనగా-

అందరూ లేచి, గర్వించి మల్లయుద్ధం చేసే ఆ భీమ హిడింబులను చూచారు. అప్పుడు అర్జునుడు వాళ్ళు యుద్ధం

చేసే చోటికి పోయి భీమునితో ఇట్టా అన్నాడు.

విశేషం: “నన్నూ మిమ్మూ రక్షించి" అనటంలో కలుపుగోలుతనాన్ని, ఆత్మీయతనూ; “ఆ రాక్షసుడు' అని అన్నను పేర్కొనటంలో

పుట్టింటి సంబంధాన్ని త్రెంచుకొని అత్తవారింటిలో కలిసిపోయిన ఆప్యాయతను అద్భుతంగా ప్రదర్శించింది హిడింబ.

ఉ. తూర్పరుణంబుగా. దొడంగె దుష్టనిశాచరవేళక యయ్యెడున్‌ మార్పును కాలయాపన మమర్పక యప్పిశితాశిం బట్టి పా లార్బ్చ( నేల నావుడు బలాధ్యుండు భీముండు మల్లవిద్యనే ర్వేర్పడ(గా హిడింబు బలహీనపరాక్రముం జేసి. జెచ్చెరన్‌. 216

ప్రతిపదార్థం: తూర్పు+అరుణంబు+కాన్‌+తొడలౌజ తూర్పుదిక్కు ఎర్రపడటం మొద లైంది; దుష్ట నిశా చర,

వేళ+అయ్యెడున్‌= దుర్మార్గు లైన రాక్షసుల వేళ అవుతున్నది; కాల, యాపనము+అమర్చక= ఆలస్యం చేయక; ఆ+పిశితాళిన్‌*పట్టి= ఆరాక్షసుడిని పట్టి; మార్చుము= చంపుము; పాలార్చ(గన్‌+ఏల= ఉపేక్షించటం ఎందుకు?: నావుడు= అని అనగా; బల+ఆఢ్యుండు= బలంతో కూడినవాడు; భీముండు; మల్ల, విద్య, నేర్పు+ఏర్పడంగా= మల్లవిద్యలో ని నైపుణ్యం

612 (శ్రిమదాంధ్ర మహాభారతము ప్రకాశించేటట్టు: హిడింబు= హిడింబాసురుడిని; చెర+చెరన్‌= వెంటనే; బలహీన, పరాక్రమున్‌= బలం నళించిన పరాక్రమం కలవాణ్ణేగా; చేసెన్‌: | తాత్సర్యం: “తూర్పు ఎ(ర్రబడుతున్నది. దుష్టరాక్షసులకు అనుకూల సమయం ఆసన్నమౌతున్నది. ఆలస్యం చేయక ఆ రాక్షసుడిని చంపుము” అని అర్జును డనగా తన మల్ల యుద్ధ నైపుణ్యం మెరయగా భీముడు హిడింబాసురుడిని బలహీనుడిని చేశాడు. విశేషం: సంధ్యాసమయం రాక్షసుల కనుకూల మట! పూర్వ సంధ్యా సమయంలో రౌద్రముహూర్తం వస్తుందట! అప్పుడు రాక్షసు లెక్కువ శక్తిమంతు లవుతారట! 'పురస్సంరజ్యతే ప్రాచీ । పూర్వాసంధ్యా ప్రవర్తతే రౌద్రే ముహూర్తే రక్షాంసి భవంతి బలవంతి చ." -శ్రిమదాం[ధ్రమహాభారతసంకోధితప్రతి, పుట, 376. క. వడినసురవాత ముక్కున। మడుగక రక్తప్రవాహ మొలుకుచు నుండన్‌ గడకాలు వట్టి వానివి।; మడవక పవనజుండు నూణు మాలులు వీచెన్‌. 217 ప్రతిపదార్థం; వడిన్‌= వేగంగా; అసుర, వాత= రాక్షసునియొక్కనోట; ముక్కునన్‌; ఉడుగక= ఆగక; రక్త ప్రవాహము; ఒలుకుచున్‌, ఉండన్‌= కారుతూ ఉండగా; పవనజుండు= వాయుపుత్రు డైన భీముడు; కడ, కాలు, పట్టి= కాలి చివరి భాగం పట్టుకొని; వానిని= ఆ హిడింబాసురుడిని; మడవక=వెనుకాడక; నూజు, మాజులు; వీచెన్‌= విసిరాడు (గిరగిరత్రిప్పాడు). తాత్పర్యం: హిడింబాసురుడి నోట, ముక్కున ఆగకుండా నెత్తురు ధారలు కారుతూ ఉండగా, భీముడు అతడి కడకాలుపట్టి గాలిలోకి ఎత్తి గిరగిరా వందసార్జు త్రిప్పాడు. విశేషం: విసరటం పవనగుణం. హిడింబుడి కడకాలు పట్టి అతడిని వంగనీయక అతివేంగా నూరుమారులు విసరిన భీముడిని పవనజు డని సంబోధించటం ఎంతో ఉచితంగా ఉన్నది. ఆ. లావుసెడంగనిట్లు వీపంగం బడి గత । చేష్టు. డయిన యసురం జిక్కం బట్టి నేలంబెట్టి వాని కోలెమ్ము బ్రల్లన । విణిచి నడుము ద్రుంచి వీచి వైచె. 218 ప్రతిపదార్థం: లావు+చెడంగన్‌= బలం నశించేటట్టు; ఇట్టు= ఈవిధంగా; వీవంగన్‌*పడి= విసరబడి; గత, చేష్టుండు+అయిన= పోయినచేష్టలు కలవా డైన; అసురన్‌= రాక్షసుడిని; చిక్కన్‌+పట్టి= బిగియపట్టి; నేలన్‌+పెట్టి= నేలమీద పెట్టి; వాని, కోలెమ్ముజ వాడి వెన్నెముకను; ప్రల్లు+అన= ఫళ్ళుమనేటట్టు; విజిచి; నడుము; (త్రుంచి; వీచి, వైచెజఐ విసరివేశాడు. తాత్సర్యం: బలం కక్రుంగేటట్టు ఈ విధంగా విసరటంచేత అవయవాల కదలికలు కోల్పోయిన హిడింబుడిని బిగియబట్టి నేలమీద పెట్టి అతడి వెన్నెముక విరిచి, నడుము (త్రుంచి విసరివేశాడు. విశేషం: అలతి అలతి పదాలతో కూడిన ఈ ఆటవెలది ఆ హిడింబుడి (ప్రాణాలతో భీము డాడుకొన్న అతిభయంకర మైన తీరును అద్దంలోవలె పారకునికి (ప్రదర్శిస్తున్నది. వ అట్టి చిత్ర వధం జూచి చిశ్రీయమాణచిత్తు లై భీనుసేను పరాక్రనుంబు వొగడుచు నందలటు హిడింబానుగమ్యమాను లై చని; ర ట్లరుగునెడ భీముండు హిడింబ రాక కొడంబడక 'రాక్షసులు వైరంబు€ దలంచి మాయలు సయుదురు కావున నీవు మాతోడ రావలవదు; నిన్ను విశ్వసింపము; నీవును మీయన్న

ఆదిసర్వము - షష్టాశ్వాసము 613

వోయిన తెరువున పొ' మ్మనిన నది భయంపడి పడవడ వడంకుచున్న దానిం జూచి కరుణారసార్థచిత్తుం

డయి ధర్మరాజు భీమున కి ట్లనియె. 219 ప్రతిపదార్థం: అట్టి, చిత్ర, వధన్‌= చిత్రమైన చంపటాన్ని; చూచి; చిత్రీయమాణ, చిత్తులు+ఐ= ఆశ్చర్యపడుతున్న మనస్సు కలవా ళృయి; భీమసేను, పరాక్రమంబు; పొగడుచున్‌?; అందటు; హిడింబ+అనుగమ్యమానులు+ఐ= హిడింబచేత వెంబడింపబడినవా ళ్ళృయి; చనిరి; అట్లుఅరుగు+ఎడ= ఆ విధంగా వెళ్ళేటప్పుడు; భీముండు; హిడింబ, రాకకు+ఒడంబడక= హిడింబ రావటానికి ఇష్టపడక; రాక్షసులు; వైరంబున్‌; తలంచి; మాయలు; చేయుదురు; కావున; నీవు; మాతోడ; రా, వలవదు= రావద్దు; నిన్ను; విశ్శసింపము= నమ్మము; నీవును; మీ+అన్న+పోయిన; తెరువున= మార్గాన; పొమ్ము+అనినన్‌= పొమ్మని అనగా (అన్నపోయినమార్గం మరణమే); అది=ఐ ఆ హిడింబ; భయంపడి; వడవడ, వడంకుచు+ఉన్ను; దానిన్‌*చూచి; కరుణా, రస+ఆర్ట, చిత్తుండు+అయి= దయారసంచేత; తడిసిన మనస్సుకలవా డై; ధర్మరాజు; భీమునకు+ఇట్టు+అనియె= భీమునితో ఈవిధంగా తాత్పర్యం: ఆ విధంగా హిడింబుడిని చిత్రవధ చేయటం చూచి ఆళ్ళర్యపడి, భిమునిపరాక్రమాన్ని పొగుడుతూ, హిడింబ తమ వెంట రాగా, అందరూ ఆతనిదగ్గరకు వెళ్ళారు. భీముడు హిడింబ రాకకు ఇష్టపడక “రాక్షసులు పగబట్టి మాయలు చేస్తారు. అందుచేత నీవు మాతో రావద్దు. నీవుకూడ మీ అన్న చచ్చినట్లే చావు' మని అనగా, ఆ రాక్షసి భయపడి వడవడ వడకుతుండటం చూచి దయతో ధర్మరాజు భీమునితో ఇట్లా అన్నాడు. తే. వధకు నర్హుడై వచ్చినవానిం జంపి తదియు ధర్మువ; యిది చాల నబల; దీని

కలుగంజన; దాత్మరక్షకు నర్గలంబు । ధర్మ రక్షయ యుత్తను ధార్మికులకు. 220 ప్రతిపదార్థం: వధకున్‌+*అర్హుండు+ఐ= చంపబడటానికి తగినవా డై; వచ్చినవానిన్‌; చంపితివి= చంపావు; అదియు; ధర్మువు+అజ= ధర్మమే; ఇది= ఈ హిడింబ; చాల; అబల= బలం లేనిది - ఆడది; దీనికి+అఆలుగన్‌= దీనిమీద కోపపడటం; చనదు= కూడదు; ఉత్తమ, ధార్మికులకు= ఉత్తము లైన ధర్మాత్ములకు; ధర్మ, రక్షయ= ధర్మాన్ని రక్షించటమే: ఆత్మరక్షకున్‌= తనరక్షణం కంటె; అగ్గలంబు= అధికం. తాత్పర్యం: చంపదగినవాడిని చంపావు. అది ధర్మమే. ఈ హిడింబ అబల. దీని మీద కోపపడ కూడదు. ఉత్తము లైన ధర్మాత్ములకు ఆత్మరక్షణకంటె ధర్మరక్షణమే ఉత్తమం. విశేషం: నన్నయ రుచిరార్థసూక్తినిధిలో ఇదొక సూక్తిరత్నం. సమస్యను విశ్లేషించి నిర్ణయించటంలో ధర్మజాని వివేకం అపూర్వం. హిడింబను రక్షించటం ధర్మరక్షణం; శిక్షించటం ఆత్మరక్షణానికి సంబంధించింది. ఆత్మరక్షణకొరకు చూడక ధర్మరక్షణచేయటం ఉత్తమధార్శ్మికుల కర్రవ్యమని ధర్మజుని తీర్పు. క. _ ఆపదయైనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయుం. బరమార్ధము; ధ

ర్యాపాయమ ధార్మికులకు । నాపద జన్మాంతరమున ననుగత మగుటన్‌. 221 ప్రతిపదార్థం: ఆపద+ఐనను= ప్రమాదం కలిగినా ధర్మువు+ఆ= ధర్మాన్నే: (ప్రాపుగ= అధారంగొ; రక్షింప, వలయున్‌; పరమ+అర్ధము= సత్యం; జన్మ+అంతరమునన్‌= ఇంకొక పుట్టుకలోకూడ; అనుగతము+అగుటన్‌= వెంబడించేది కావటంవలన; ధార్మికులకు= ధర్మం ఆచరించేవారికి?; ధర్మ+అపాయము= ధర్మం చెడటమే; ఆపద. తాత్పర్యం: తనకు ఆపద కలిగినా ధర్మాత్ములు ధర్మాన్నే రక్షించాలి. ఇది నిజం. ఎందుచేత నంటే ఇంకొక జన్మలో కూడ వెంటవచ్చేది కానటంచేత ధర్మం చెడిపోవటమే ధర్మాత్ములకు నిజమైన ఆపద,

614 శ్రీమదాంధ్ర మహాభారతము

విశేషం: ధర్మ(ప్రబోధానికి, ధర్మసూక్ష్మవివరణకు కథాగమనంలో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నన్నయ దాన్ని జారవిడువడు.

కథాఫ్రసన్నతకు భంగం లేకుండా, సూటిగా, సులభ శైలిలో, రమణీయంగా ధర్మాన్నిగూర్చి చెప్పి ఆవలి కధను కొనసాగించటం

ఆయన పద్దతి.

వ 'వీనియందు రాక్షసభావం బుపలక్షింపవలవదు; మాకు నాత్మీయబుద్ధియ యుండు" ననిన హిడింబ ధర్మరాజునకుం గుంతీదేవికి మొక్కి యేకాంతంబునం గుంతి కి ట్లనియె: *నవ్వా! సర్వప్రాణులకు సామాన్యంబయ్యును మనోజరాగంబు వనితల కసహ్యం బయి విశేషంబయి యుండు; నేను వృకోదరునిమిత్తంబు మదనబాణబాధిత నయి నాచుట్టంబులను జెలులను విడిచితి; నాయిష్టంబు మీరు గావింపనినాం డిప్పుడ ప్రాణంబులు విడుతు; నన్ను రక్షించిన మీకు నిష్టంబులయినవాని నెల్లం దలంచి చేయుదు; నిమ్ముగానియెడ మిమ్మందల నెత్తికొని మీమెచ్చినచోటికి. బోవనేర్తు: నాపలుకులు నమ్ము నది; యేనతీతానాగతవర్తమానంబు లెల్లను దెల్లంబుగా నెజుంగుదు; వలయునేని యనాగతంబు సెప్పెద వినుందు: ముందట నొక్క సరోవరంబును నొక్కననస్పతియునుం గల; వవి రెండును శాలిహోత్రుం డనుమహామునిచేతం దపఃప్రభావంబునం బడయంబడినయవి; యక్కొలనినీళ్ళు ద్రావినవారికి నెన్నండును నాకలియును నీరువట్టును లే; వవ్వనస్పతియు శీతవాతాతపవర్షంబులవలన రక్షించు; మీర లందున్నమీ కడకు గృష్టద్విపాయనుండు వచ్చి మీకు హితోపదేశంబు సేయు' నని చెప్పిన. 222

ప్రతిపదార్థం: దీని+అందు= ఈ హిడింబపట్ట; రాక్షస, భావంబు; ఉపలక్షింపవలవదు= చూడవద్దు; మాకు; ఆత్మీయ, బుద్ధియు+అ= బంధు వనే తలంపే; ఉండున్‌; అనిన; హిడింబ; ధర్మరాజునకున్‌; కుంతీదేవికి; (మ్రొక్కి; ఏకాంతంబునన్‌= ఒంటరిగా; కుంతికి; ఇట్టు+అనియెన్‌; అవ్వాజ అమ్మా? సర్వ, ప్రాణులకు; సామాన్యంబు+అయ్యును; మనోజ రాగంబు= మన్మధువలని కోరిక; వనితలకు= స్త్రీలకు; అసహ్యంబు+అయి= ఎక్కువైనదై; ఉండు; నేను; వృక+ఉదరు, నిమిత్తంబు= భిమునికారణంగా, మదన, బాణ, బాధితను+అయి= మన్మధునియొక్కబాణాలచేత బాధింపబడిన దాన నై నా, చుట్టంబులనున్‌; చెలులను= స్నేహితులను; విడిచితి; నాశఇష్టంబు= నాయొక్కకోరికను; మీరు; కావింపనినాండు= తీర్చని రోజు; ఇప్పుడ= ఇప్పటికిప్పుడే; ప్రాణంబులు; విడుచుదు; నన్ను; రక్షించిన; మీకున్‌; ఇష్టంబులు+అయిన, వానిని+ఎల్లన్‌= మీకిష్ట మైన వాటి నన్నింటిని; తలంచి= ఆలోచించి; చేయుదున్‌; ఇమ్ము, కొని+ఎడ= అనుకూలం కాని దైన చోట; మిమ్ము+అందణన్‌; ఎత్తికొని; మీ మెచ్చిన, చోటికిన్‌ పోవ, నేర్తుజ పోగలను: నా, పలుకులు; నమ్మునది; ఏన్‌= నేను; అతీత+అనాగత, వర్తమానంబులు+ఎల్లను= భూత భవిష్య ద్వర్తమానాల నన్నింటిని; తెల్లంబుగొన్‌= స్పష్టంగా; ఎజుంగుదు; వలయున్‌+ఏని= అవసర మైతే; అనాగతంబు= రాబోయేదాన్ని; చెప్పెద; వినుండు; ముందటన్‌; ఒక్క, సరోవరంబును; ఒక్క, వనస్పతియున్‌= ఒక్కచెట్టు;: కలవు; అవి, రెండును; శాలిహోత్రుండు+అను; మహామునిచేతన్‌; తపఃప్రభావంబునన్‌; పడయన్‌+పడిన+అవి= పొందబడినవి; ఆ+కొలని, నీళ్ళు; (త్రావిన, వారికిన్‌; ఎన్నండును; ఆకలియును; నీరు, పట్టును= దప్పికయు: లేవు; ఆ+వనస్పతియు= ఆ చెట్టుకూడ; శీత+వాత+ఆపత, వర్షంబులవలన= చలి, గాలి, ఎండ, వానలనుండి; రక్షించు; మీరలు; అందు+ఉన్న; మీ, కడకున్‌; కృష్ణద్పెపాయనుండు= వేదవ్యాసమహర్షి వచ్చి; మీకు; హిత+ఉపదేశంబు= మేలును కలిగించేమాటలు; చేయునుజు చెప్తాడు, అని; చెప్పిన.

తాత్సర్యం: “ఈ హిడింబను రాక్షసిగా చూడవద్దు. మాకు ఈమె పట్ట బంధు భావమే ఉన్నది" అని ధర్మరాజు

అనగా - హిడింబ, ధర్మజానికి, కుంతీదేవికి మొైక్కి ఏకాంతంలో కుంతితో 'అమ్మా! సర్వప్రాణులకు కామవాంఛ

సమానమే. అయినా స్త్రీల విషయంలో ఇది ఓర్చుకొనరాని దై ఉంటుంది. నేను భిమునిమీద మనసుపడి బంధువులను, స్నేహితులను వదలుకొన్నాను. నా కోరికను మీరు తీర్చకుంటే ప్రాణాలు విడుస్తాను. నన్ను రక్షిస్తే మీ కిష్టమైన వాటిని చేస్తాను. మీకు మార్గం అనుకూలంగా లేనప్పుడు మీరు కోరిన చోట్లకు మిమ్మల్ని ఎత్తుకొని

ఆదిపర్వము - షష్టాశ్వాసము 615 పోయి చేర్చగలను. భూత భవిష్య ద్వర్తమానాలను ఎరిగి చెప్పగలను. ఇప్పుడు రాబోయేదాన్ని గురించి చెప్తాను. వినండి. ముందర కొంత దూరాన ఒక సరోవరం, ఒక వృక్షం ఉన్నాయి. అవి రెండూ శాలిహో(త్రు డనే మహాముని తపః (ప్రభావంచేత ఏర్పడ్డాయి. ఆ సరోవరంలోని నీళ్ళు త్రాగితే ఆకలిదప్పు లుండవు. ఆ చెట్టు - చలి, గాలి, ఎండ, వానలనుండి రక్షించగలదు. మీ రక్కడ ఉండగా కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు మేలుకలిగేమాటలు చెప్తాడు” - అని చెప్పుగా,

క. _ విని కుంతియు. బాండవులును।; మనమున విసయముపడి సమంజసభానం

బున దాని దివ్యవనితయ । యని తద్దయు నాదరించి రప్పుడు కరుణన్‌. 223 (ప్రతిపదార్దం: విని; కుంతియున్‌; పాండవులును; మనమున; విస్మయముపడి= ఆశ్చర్యపడి; సమంజస, భావంబున= మంచి అభిప్రాయంతో; దాని= ఆ హిడింబను; దివ్యవనితయ+అని= దేవతాస్త్రీ అని; అప్పుడు; కరుణన్‌= దయతో; తద్దయు= మిక్కిలి; ఆదరించిరి. తాత్పర్యం: హిడంబ మాటలు విని కుంతీదేవి, పాండవులు ఆళ్ళర్యపడి మంచి అభిప్రాయంతో అమెను దేవతా కాంతగా భావించి మిక్కిలి దయతో ఆదరించారు. వ. అంత దాని వినయంబునకు ననాగతం బెజటుంగుటకు సంతసిల్లి కుంతి భీమున కి ట్లనియె. 224 ప్రతిపదార్థం: అంత= తరువాత; దాని; వినయంబునకున్‌= ఆ హిడింబయొక్క అణకువకు; అనాగతంబు+ఎఆుంగుటకువ= రాబోయేదాన్ని తెలిసికొనగలగటానికి; సంతసిల్లి= సంతోషించి; కుంతి; భీమునకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: ఆ తరువాత, హిడింబయొక్క అణకువకు, భవిష్యత్తును తెలిసికొనగలిగిన వివేకానికి సంతోషించి, కుంతీదేవి భిమునితో ఈ విధంగా అన్నది.

భీముడు తల్లియనుమతంబున హిడింబను బరి[గ్రహించుట (సం.1-143-1)

క. _ అన్న యిది ధర్మువని మీ। యన్నను నన్నును నతిప్రియంబున నెదలో

మన్నించి, యేమి వనిచినం। గ్రన్నన మా పనుపు సేయం గడం(గయుము బుద్ధిన్‌. 225 ప్రతిపదార్థం: అన్న నాయనా భీమసేనా! ఇది; ధర్మువు+అని; మీ, అన్నను= మీ అన్న అయిన ధర్మరాజును; నన్నును; అతిఫప్రియంబునన్‌= మిక్కిలి ప్రీతితో; ఎదలో=ఐ మనస్సులో; మన్నించి= గౌరవించి: ఏమి+పనిచినన్‌= ఏమి ఆజ్ఞాపించినా; క్రన్నన= వెంటనే; మా, పసుపు+చేయన్‌= మాయొక్కఆజ్ఞ చేయటానికి; బుద్ధిన్‌= ఇష్టపడి; కడగుము= పూనుకొమ్ము. తాత్పర్యం: నాయనా! భీమసేనా! మీ అన్న ధర్మరాజునూ, నన్నూ, గౌరవించి, మేము ఏమి ఆజ్ఞాపించినా ఆది ధర్మ మని తలచి, వెంటనే చేయుము. విశేషం: 'అన్న' - వాత్సల్యపూరిత మైన సంబోధన, 'బుద్దిన్‌ అనే దానికి 'భక్తిన్‌ అనేపారాంతరం కూడ ఉన్నది. క. _ ఇదిపరమ సాథ్వి, దీనిని; మది నొండుగందలంప వలదు! మానుంగ6 బుత్రా

భ్యుదయ మగు బాండు హితముగ । నిది కార్యం బని పరిగ్రహాంపుము నెమ్మిన్‌. 226 ప్రతిపదార్థం: ఇది= ఈ హిడింబ; పరమసాధ్విజఐ ఉత్తమ పతివ్రత; మదిన్‌= మనస్సులో; దీనిన: ఒండుగ= వేరొక విధంగా; తలయవలదు= భావించవద్దు; మానుంగన్‌= ఒప్పుగా; పాండు, హితముగన్‌= పాండురాజుకు మేలు కలిగేటట్టు: పుత్ర+

616 శ్రీమదాంధ్ర మహాభారతము

అభ్యుదయము+అగున్‌= పుష్రుడు పుట్టటం జరుగుతుంది; నెమ్మిన్‌= సంతోషంతో; ఇది; కార్యంబు+అని= చేయదగిన పని అని;

పరి(గ్రహింపుము= చేపట్టుము.

తాత్పర్యం: ఈ హిడింబ ఉత్తమ పతివ్రత. మనస్సులో దీన్ని గురించి వేరొక విధంగా భావించ వద్దు.

పాండురాజుకు కూడ మేలుకలిగేటట్టు పుత్రుడు పుడతాడు. ఇది చేయ దగిన పని అనే తలంపుతో దీనిని

చేపట్టుము.

విశేషం: వంశంలో పుత్రపొత్రాభివృద్ది పితృదేవతలకు హితమైనది. అందుచేతనే కుంతి పాండుహితంగా పుత్రాభ్యుదయం

అవుతుం దనటం.

న. అని భీమసేను నొడంబఖచి హిడింబ కనురాగంబుగాం జెప్పి 'నీవు శుచి వయి యుత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునకు మనకభ్రుయంబు సేయుము; పగళ్లెల్లను మీ యిష్టంబున విహరించి రాత్రులు మాయొద్దన యుండు నది యని నియమించిన భీముండును “బుత్రజన్మం బగునంతకు దీని మీవచనంబునం బరిగ్రపొంచెద' నని వారల సమక్షంబున సమయంబు సేసె; నంత బాండవులు జననీసహితంబు శాలిహోత్రునాశ్రమంబునకుం జని ప్రభాతసమయంబున నక్కొలనం గృతస్నాను లయి సంధ్యావందనం బులు దీర్చి శాలిహోత్రుచేతం బూజితు లయి తద్వనస్పతి చ్ధాయా శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్వి పాసు లై సుఖం బున్నంత.227

ప్రతిపదార్హం: అని; భీమసేనున్‌; ఒడంబజచి= ఒప్పించి; హిడింబకు; అనురాగంబుగాన్‌= (ప్రేమగా; చెప్పి; నీవు; శుచివి+అయి=

పరిశుద్ధురా ల వై; ఉత్తమ, (స్రీగుణంబులు+తాల్చి= ఉత్తమ స్రీయొక్కలక్షణాలను కలిగి; భీమునకు; మనః॥ప్రియంబు= మనస్సుకు

సంతోషాన్ని; చేయుము; పగళ్ళు+ఎల్లను; మీ, ఇష్టంబున= మీయొక్క ఇష్టంవచ్చినట్టు; విహరించి= తిరిగి; రాత్రులు; మా+ఒద్దన= మాదగ్గరే; ఉండునది; అని; నియమించిన= కట్టడి చేయగా? భీముండును, పుత్ర, జన్మంబు+అగు+అంతకు= కొడుకు పుట్టేవరకు; దీని= ఈ హిడింబను; మీ వచనంబునన్‌= మీయొక్కమాటచేత; పరి(గ్రహించెదను+అని= చేపడతా నని. తాచ్చర్యం: అని భీమసేనుడిని ఒప్పించి, హిడింబకు ప్రియంగా జెప్పి 'నీవు పరిశుద్దురాల వై ఉత్తమ ్త్రీగుణాలతో భీముడిని సంతోషపెట్టుము. పగలు మీ ఇష్టం వచ్చిన చోట తిరిగి రాత్రులు మా దగ్గర ఉండండి" అని నియమించగా భీముడుకూడ "కొడుకు పుట్టే వరకు హిడింబను మీ మాట ప్రకారం చేపడతా' నన్నాడు. తరువాత పాండవులు తల్లితో కలిసి శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ప్రొద్దున్నే అక్కడి కొలనులో స్నానంచేసి సంధ్యావందనాలు తీర్చుకొని, శాలిహోత్రునిచేత గౌరవింపబడ్డారు. అక్కడి చెట్టు నీడయొక్క చల్లదనంలో విశ్రాంతి తీసికొని, ఆకలిదప్పికలు తీరి సుఖంగా ఉన్నారు.

పాండవులకు వ్యాసుండు హితోపదేశము సేయుట (సం.1-144-7)

ఉ. పుణ్యతపోమయుండు మునిపూజ్యుయ బ్రహ్మసమప్రభుండు బ్ర హ్మణ్యుండు ప్రావృషేణ్యజలదాసితవర్జు. డశేషకిల్లిషా రణ్యదవానలుం డగు పరాశరనందను. డేగుదెంచె. ద త్పుఖచయస్వరూపమును బోలె. గరంబు మనోముదంబుగన్‌. 228

ప్రతిపదార్థం: పుణ్యతపఃశమయుండుజ పవిత్ర మైన తపస్సు నిండుగా గలవాడు; ముని, పూజ్యుండు= మునులచేత పూజింప

దగినవాడు; బ్రహ్మసమప్రభుండు= బ్రహ్మదేవునితేజస్సుతో సమాన మైన తేజస్సు కలవాడు; (బ్రహ్మణ్యుండు= బ్రాహ్మణులకు హితు డైన వాడు? ప్రావృషేణ్య, జలద+అసిత, వర్జుండు= వర్షాకాలంలోని మేఘంవలె నల్లనైన రంగు కలవాడు: అశేష, కిల్చిష+అరణ్య, దవానలుండు+అఆగు= సర్వపాపాలు అనే అడవికి కార్చిచ్చువంటి వా డైన; పరాశర, నందనుండు= పరాశరుని

ఆదిపర్వము - షష్టాశ్వాసము 617 యొక్క కుమారుడు; తత్‌+పుణ్య, చయ, స్వరూపమును+పోలెన్‌= ఆ కుంతీపాండవులయొక్క పుణ్యసమూహం యొక్క ఆకారంవలె; కరంబు= మిక్కిలి; మనః+ముదంబుగన్‌= మనస్సుకు సంతోషం కలిగేటట్టు: ఏగుదెంచెన్‌= వచ్చాడు. తాత్పర్యం: పవిత్రమైన తపస్సు నిండుగా కలవాడు, మునులచేత పూజింపదగినవాడు; (బ్రహ్మదేవునితో సమాన మైనతేజస్సు కలవాడు, బ్రాహ్మణులకు హితు డైనవాడు, వర్దాకాల మేఘం వంటి రంగు కలవాడు, సర్వపాపాలను హరించేవాడు అయిన వ్యాసుడు, ఆ కుంతీ పాండవులయొక్క పుణ్య స్వరూపంవలె, వాళ్ళ మనస్సులకు ఆనందం కలిగేటట్టుగా వచ్చాడు.

క్‌. నిశేషం: అలం: ఉపమ, రూపకం. వ. ఇట్లు వచ్చిన వేదవ్యాస మునీంద్రునకు నందజు నతిభక్తి నమస్కరించి యాస నార్జ్వాది విధులం బూజించి

యున్నవారలం గరుణార్థద్భష్టిం జూచి కృష్ణద్వైపాయనుం డి ట్లనియె. 229 ప్రతిపదార్థం: ఇట్టు; వచ్చిన; వేదవ్యాస, ముని+ఇంద్రునకున్‌= వేదవ్యాసముని'శ్రేష్టునికి; అందయజున్‌; అతి, భక్తి నమస్కరించి, ఆసన+అర్హ్య+అది, విధులన్‌= ఆసనం, అర్హ్యం మొదలైన ఏర్పాట్లతో; పూజించి; ఉన్న; వారలన్‌; కరుణా+ఆ|ర్ర, దృష్టిన్‌= దయచేత తడి మైన చూపుతో; చూచి: కృష్ణద్వైపాయనుండు; ఇట్టు+అనియె. తాత్పర్య: ఈ విధంగా వచ్చిన ముని'శ్రీష్టుడైన వేదవ్యాసునికి అందరూ భక్తితో నమస్కరించి, ఆసనం అర్హ్యం మొదలైన ఉపచారాలతో పూజించి, ఉండగా, వాళ్ళందరినీ దయార్దదృష్టితో చూచి, వ్యాసుడు ఈ విధంగా అన్నాడు. పద్మకము.

కొడుకు పల్కువిని కూడదు నాక దురాత్ముండై

కదంగి మీకు నపకారము సేసి ధరిత్రి వె

ల్వడంగయంచెం గదుయటాపనుతిన్‌ ధృతరాస్తు( డె

య్యెడల దుర్దనుల నేమణీ నమ్మగం బోలునే. 230 ప్రతిపదార్ధం: ధృతరాష్ట్రుండు; కొడుకు, పల్కు= కొడుకుయొక్కమాట; విని; కూడదు= తగదు; నాక= అని అనక; దురాత్ముండు+ఐ= చెడుమనస్సు కలవా డై కడంి= పూని; మీకు; అపకారము, చేసి; ధరిత్రి= భూమి (రాజ్యంయొక్కపొలిమేరలను); వెలువడంగన్‌= దాటిపోయేటట్టు; కడున్‌+పాపమతిన్‌= మిక్కిలిచెడుబుద్దితో: పంచెన్‌= పంపించాడు; ఏ+*ఎడల= ఎచ్చటైనా; దుర్జనులన్‌= దుర్మార్గులను; ఏమటథి; నమ్మగన్‌+పోలునే= నమ్మవచ్చునా! తాత్పర్యం: ధృతరాష్ట్రుడు కొడుకుమాట విని, ఇది తగ దని చెప్పక దుర్మార్లుడై మీకు అపకారం చేసి మిమ్మల్ని రాజ్యంనుండి వెళ్ళగొట్టాడు. దుర్మార్గులను ఎక్కడైనా ఎప్పుడైనా నమ్మకూడదు. విశేషం: అలం: అర్జాంతరన్యాసం, పద్మకవృత్తంలోని ్రతిపాదంలోనూ వరుసగా న, భ జ, జగ - అనే గణాలుంటాయి. లాక్షణికులు 11వ అక్షరం యతిస్ట్రానంగా పేర్కొన్నారు. కాని, నన్నయ 8వ అక్షరాన్ని యతిగా నిలిపాడు. ఆం(ధ్రమహాభారత మంతటిలో నన్నయ మాత్రమే- ఒక్కసారి మాత్రమే- వాడిన విశేషవృత్తాల్లో ఇదొకటి కావటం విశేషం, ఇదికాక, రథోద్ధతం, మణిభూషణం, దండకం అనేవి ఈకోవకు చెందుతాయి. (సంపా. వ. దీని నెజింగి మీకు హితోపదేశంబు సేయ వచ్చితి; నిఖిల ధర్మవిదుల రయిన వినీతుల రయిన మీకు

బాంధవవియోజనం బయిన యీ కర్మంబు పురాకృతంబు; దీనికి శోకింపవలవదు; కొండొకకాలంబునకు

618 శ్రీమదాంధ్ర నుహాభారతము మీరును బాంధవులం గలసి యెప్పటియట్ల రాజ్యంబు సేయుదు; రిది శాలిహోత్రుతపఃప్రభావంబున నైన కొలను; దీని జలంబు లువయోగించినవారికి బుభుక్షాపిపాసలు లే; వివ్వనస్పతియును శీతవాతాతపవర్షంబులవలన రక్షించు; నిం దొరు లెటుంగకుండం గార్యార్థుల రై కఠిపయదినంబు లుండి యేకచక్రపురంబున కేంగి యందు బ్రాహ్మణభావంబున బ్రాహ్మణగోష్టి నుండి నారాక ప్రతీక్షించియుండు నది' యని కఐపి తనకు వినయావనతులయి కృతాంజలు లయిన మనుమల దీవించి కౌంగిలించుకొని, బాప్పపూరితనయన యయి మ్రైొక్కియున్న కోడలి నూరార్జి, “నీకొడుకు ధర్మనిత్యుం; డీ యుధిస్టిరుండు నారాయణభుజంబులంబోని తననలువురుదమ్ములబలంబున సర్వపార్దివుల శాసించి సార్వభౌముం డై రాజసూయాశ్వమేధాదిక్రతువులు సేసి పితృపైతామహం బైన రాజ్యలక్ష్మి నసుభవించుచుం గురుకులంబునెల్లం బవిత్రంబు సేయు, నని శోకోపశమనంబుం జేసి; హిడింబం జూచి 'దీనిపేరు కమలపాలిక యిది భీమునకు వశనర్తిని యయి పరిచరించి మహాసత్తుం డయిన కొడుకుం గాంచు; నాతండు మిమ్మందథణ నాపద్విషయంబున నుద్ధరించు' నని చెప్పి మునివరుండు తిరోహితుం డైన. 231 (ప్రతిపదార్థం: దీనిన: ఎజీంగి= తెలిసికొని; మీకు; హిత+ఉపదేశంబు+చేయ= మేలును కూర్చే మాటలు చెప్పటానికి; వచ్చితి; నిఖిల, ధర్మ, విదులరు+అయి= అన్నిధర్మాలు తెలిసికొన్న వాళ్ళయిన; మీకు; బాంధవవియోజనంబుశ+అయిన= బంధువులకు దూరమైన; ఈ, కర్మంబు; పురాకృతంబు= గతజన్మంలో చేయబడింది; దీనికి; శోకింప, వలవదు= దుఃఖింప నక్కరలేదు; కొండొకకాలంబునకుజ= కొంతకాలానికి; మీరును; బాంధవులన్‌+కలిసి; ఎప్పటి+అట్ల= ఎప్పుటివలెనే; రాజ్యంబు+చేయుదురు; ఇది; శాలిహోత్రు, తపః, ప్రభావంబునన్‌+ఐన= శాలిహోత్రు డనే మహామునియొక్క తపస్సుయొక్కమహితచేత ఏర్పడిన; కొలను; దీని, జలంబులు; ఉపయోగించినవారికి; బుభుక్షా, పిపాసలుజ ఆకలిదప్పులు; లేవు; ఈ+వనస్పతియును= ఈ చెట్టుకూడ; శీత, వాత+ఆతప, వర్షంబులవలన= చలి, గాలి, ఎండ, వానలనుండి; రక్షించున్‌= కాపాడుతుంది; ఇందు= ఇక్కడ; ఒరులు= ఇతరులు; ఎజుంగక+ఉండన్‌= తెలుసుకొనకుండ; కార్య+అర్జులరు+ఐ= (ప్రయోజనాన్ని కోరే వాళ్ళయి; కతిపయ దినంబులు= కొన్నిరోజులు; ఉండి; ఏకచ(క్ర, పురంబునకు= ఏకచ(డక్ర మనే పేరుగల పట్టణానికి; ఏంగి= వెళ్ళి; అందు= ఆ పట్టణంలో; 'బ్రాహ్మాణభావంబున= బ్రాహ్మాణులయొక్కపద్దతిలో; బ్రాహ్మణులగొస్టిన్‌+ఉండి= బ్రాహ్మణులయొక్క సభలో ఉండి; నా, రాక, (ప్రతీక్షించి= నా యొక్క రాకకు ఎదురుచూచి; ఉండు నది; అని, కజపి= బోధించి; తనకు; వినయ+అవనతులు+అయి= వినయంతో వంగినవా రై: కృత+అంజలులు+అయిన= చేయబడిన చేతులజోడింపు కలవాళ్ళయిన - అంటే చేతులు జోడించి నమస్కరించిన; మనుమల; దీవించి; కౌయగిలించుకొని; బాప్పు, పూరిత, నయన+అయి= కన్నీటిచే నిండిన కళ్ళు కలదై; (మొక్కి+ఉన్న; కోడలిన్‌; ఊరార్చి= ఓదార్చి; నీ, కొడుకు; ఈ, యుధిస్టిరుండు; ధర్మ, నిత్యుండు= ఎడతెగని ధర్మం కలవాడు; నారాయణ, భుజంబులన్‌+పోని= (శ్రీమహావిష్టువుయొక్క చేతులవంటి; తన, నలువురుశతమ్ముల, బలంబున= తనయొక్కనలువురు తమ్ములయొక్క బలంచేత; సర్వపార్చివులజ అందరు రాజులను; శాసించి= ఆజ్ఞాపించి; సార్వభౌముండు+ఐజ సమస్త భూమండలాన్ని ఏలువాడై; రాజసూయ+అశ్వమేధ+ఆది, క్రతువులు+చేసి= రాజసూయం, అళ్ళమేధం మొదలయిన యాగాలు చేసి; పితృపైతామహంబు+ఐన= తండ్రి తాతలకు సంబంధించిం దైన; రాజ్యలక్ష్మిన్‌= రాజ్యసంపదను; అనుభవించుచున్‌; కురు, కులంబును+ఎల్లన్‌= కురువంశా న్నంతటినీ; పవి(త్రంబు+చేయున్‌; అని; శోక+ఉపళశమనంబున్‌+చేసి= దుఃఖం తగ్గేటట్టు చేసి; హిడింబన్‌+చూచి; దీని, పేరు; కమలపాలిక; ఇది; భీమునకు; వళవర్తిని+అయి= లొంగిందై; పరిచరించి= సేవచేసి; మహా, సత్తుండు+అయిన= మిక్కిలి బలం గల వాడయిన; కొడుకున్‌; కాంచున్‌= పొందుతుంది; ఆతండు; మిమ్ము+అందజన్‌; ఆపత్‌+విషయంబునన్‌= (ప్రమాదానికి సంబంధించిన సందర్భంలో; ఉద్ధరించున్‌= మీది కెత్తుతాడు- అంటే రక్షిస్తాడు; అని; చెప్పి, ముని, వరుండు= మునిశ్రేష్టుడు; తిరోహితుండు+ఐన= అగుపించకుండాపోయిన వాడు కాగా - అంటే ఆంతర్జాన మందినవాడు కాగా.

ఆదిపర్వము - షస్టాశ్వాసము 619 తాత్సర్యం: 'ఆ విషయాన్ని తెలిసికొని మీకు హితోపదేశం చేయాలనివచ్చాను. అన్నిధర్మాలు తెలిసినవాళ్ళు, వినయవంతులు అయిన మీకు బంధువులతో ఎడబాటు కలగటం పూర్వజన్మకృతం. దీనికి దుఃఖించవద్దు. కొంతకాలానికి మీరు కూడా బంధువులతో కలిసి ఎప్పుటివలె రాజ్యం చేస్తారు. ఇది శాలిహో(త్రమహాముని తపః 'ప్రభావంచేత ఏర్పడిన సరోవరం. దీని నీళ్ళు (త్రాగినవాళ్ళకు ఆకలిదప్పు లుండవు. ఈ చెట్టుకూడ చలి, గాలి, ఎండ, వానలనుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇక్కడ ఇతరులకు కన్ప్సించకుండ మీ పని నెరవేరేవరకు కొన్ని రోజు లుండి, తరువాత ఏకచక్ర పురానికి పోయి, అక్కడ (బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణులతో కలిసి ఉండి నా రాక కోసం ఎదురుచూడం' డని బోధించాడు, తనకు శిరస్సువంచి నమస్కరించి, చేతులు జోడించి నిలిచిన మనుమలను దీవించి కౌగిలించుకొని, కన్నీరు కారుస్తున్న కోడలు కుంతిని ఓదార్చి, నీకొడుకు యుధిస్టిరుడు ధర్మాత్ముడు. అతడు నారాయణుని భుజాలవంటి నలువురు తమ్ముల బలంచేత రాజు లందరిని శాసించి సార్వభౌముడు చేసే, రాజసూయాశ్వ మేధాది యాగాలు చేసి తాత తండ్రుల రాజ్యం ఏల గలుగుతాడు. కురు వంశా న్నంతటిని పవిత్రం చేశాడు" అని వారి శోకాన్ని ఉపళమింపచేశాడు. హిడింబను చూచి 'దీని పేరు కమలపాలిక. ఇది భీమునికి వళ మై సేవ చేసి మహాబలవంతు డైన కొడుకును కంటుంది. అతడు మిమ్మల్నందరినీ ఆపత్సమయంలో రక్షిస్తాడు" అని చెప్పి వ్యాసమహర్షి అదృశ్య మయ్యాడు.

క. _ అమ్మునివరు కజిపిన మా, గ్లమ్మునం బాండవులు విగతకల్మసు లవిషా

దమ్మునం సుఖముండిరి విన; యమ్మొప్పంగ శాలిహోత్రునాశ్రమభూమిన్‌. 232 ప్రతిపదార్థం: ఆ+ముని, వరు, కజపిన, మార్గమ్మునన్‌= ఆ ముని'శ్రేష్టు డైన వ్యాసమహర్షి బోధించిన పద్దతిలో: పాండవులు; విగత, కల్మషులు= పోయినపాపంకలవాళ్ళు - అంటే పుణ్యాత్ములు; వినయమ్ము+ఒప్పంగన్‌= వినయం ప్రకాశించగా: శాలిహోత్రు+ ఆశ్రమ, భూమిన్‌= శాలిహోత్రునియొక్క ఆశ్రమప్రదేశంలో; అవిషాదమ్మున= దుఃఖంలేకుండా; సుఖము+ఉండిరి= సుఖంగా ఉన్నారు. తాత్పర్యం: ఆ ముని(శ్రేష్టు డైన వ్యాసమహర్షి బోధించిన విధంగా పుణ్యాత్ము లైన పాండవులు వినయంతో శాలిహోత్రుని ఆశ్రమంలో దుఃఖం లేకుండా సుఖంగా ఉన్నారు. ను అంత. 233 తాత్పర్యం: ఆ సమయంలో. చ. పవనతనూజుం డక్కనులపాలికచేత వినీతుం డై మహా

నర్హవవృతభూమిలోం గల వనంబుల హంసబలాకసారసా

రవరుచిరాపగావరసరఃపులినంబులం బర్వతంబులన్‌

వివిధవిహారుం దై యనుభవించె నభీష్టమనోజభోగముల్‌, 234 (ప్రతిపదార్థం: పవన, తనూజుండు= వాయుదేవునికుమారు. డైన భీముడు; ఆ+కమలపాలికచేత= ఆ హిడింబచేత; వినీతుండు+ఐ= నడిపించబడినవా డై; మహా+అర్షవ, వృత, భూమిలోన్‌= పెద్దసముద్రాలచే చుట్టబడిన భూమిలో; కల= ఉన్న; వనంబులజ అడవులలో; హంస, బలాక్క సారస+ఆరవ, రుచిర+అపగా వర సరః+పులినంబులన్‌= హంసలయొక్క,

620 శ్రీమదాంధ్ర మహాభారతము కొంగలయొక్క, బెగ్గురుపక్షులయొక్క ధ్వనులచేత మనోహరా లైన నదులయొక్క, (్రేష్టాలైన కొలనులయొక్క ఇసుకతిన్నెలలో; పర్వతంబులన్‌= కొండలలో; వివిధ, విహారుండు+ఐ= పలువిధా లైన విహారాలు కలవా డై; అభీష్ట మనోజ, భోగముల్‌= మనస్సునకిం పైన మన్మధసుఖాలను; అనుభవించెన్‌. తొత్ప్సర్యం: హిడింబ తనను అనుసరించిరాగా భీముడు భూమండలాన అనేకవనాలలో, హంసలు, కొంగలు, బెగ్గురుపన్షులు మొదలయినవాటి ధ్వ్యనులచేత మనోహరా లైన నదులయొక్క, కొలనులయొక్క ఇసుకతిన్నెలలో, పర్వతాలలో అనేకవిధాల విహరించి మనసు కింపయిన మన్మధ సుఖాలను అనుభవించాడు. విశేషం: ఇందులో కమలపాలికాభీిముల ప్రణయవిహారా లనే మనోహరసన్నివేశాలను మస్పణమైన పదరచనతో నన్నయ వర్షించి శ్రేషమనే గుణాన్ని పోషించారు. శృంగారరసస్ఫోరకమైన అక్షరరమ్యతతో రచనను అలంకరించాడు. (సంపా. హిడింబయందు ఘటోత్కచుండు పుట్టుట (సం.1-143-27) చ. నరవరుం డైన భీమువలనం బ్రభవించె హిడింబకున్‌ సుతుం డురుతర భీమ రూపుండు ఘటోత్కచ నాము6డు విస్సుర ద్ధయం కర వదనంబు శంకునిభకర్ణములున్‌ వికృతాక్షులుం బయో ధరవరనర్హమున్‌ వికటదారుణదంస్థలు నొప్పచుండ(గన్‌. 235 ప్రతిపదార్థం: నర, వరుండు+ఐన= మానవులలో శ్రేష్టు డైన; భీమువలనన్‌; హిడింబకున్‌; విస్పురత్‌+భయంకర, వదనంబు= (ప్రకాశిస్తున్న భయంకర మైన ముఖం; శంకు, నిభ, కర్ణములున్‌= మోడువంటిచెవులు; వికృత+అక్షులున్‌= వికార మైన కన్నులును; పయోధర, వర్క, వర్షమున్‌= మేఘంయొక్క (శ్రేష్ట మైన రంగు; వికట, దారుణ, దం[ష్టలున్‌= హెచ్చుతగ్గు లై భయంకరా లైన కోరలు; ఒప్పుచు+ఉండంగన్‌= ప్రకాళిస్తుండగా; ఉరుతర, భీమ, రూపుండుజ మిక్కిలి గొప్ప దైన భయంకర మైన రూపంకలవాడు; ఘటోత్కచ నాముండు= ఘటోత్కచు డనే పేరు కలవాడు; సుతుండు= కుమారుడు; ప్రభవించె= పుట్టాడు. తాత్పర్య: భీమ హిడింబులకు భయంకర మైన ముఖం, మోడువంటిచెవులు, వికారా లైన కన్నులు, నల్లనిరంగు, హెచ్చుతగ్గు లై భయంకరా లైన కోరలు, భతి గొలిపే పెద్ద దేహం కల ఘటోత్కచ నామధేయుడు కుమారు డొకడు పుట్టాడు. విశేషం: శంకు నిభ కర్ల్షములున్‌ - అనేదానికి శంఖ నిభ కర్షములున్‌ అనే పాఠాంతరం ఉన్నది. మూలంలో '“శంకుకర్ణం విభీషణమ్‌” అని ఉంది +4శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట. 382 వ ఇట్లు సద్యోగర్ధంబునం గామరూపధరుం డై ఘటోత్మచుండు పుట్టి తత్‌క్షణంబ నవయౌవనుందును వనేకాస్త్రశస్త్ర కుశలుండును నపరిమిత రాక్షస పిశాచ బలపరివృతుందును నై తల్లిదండ్రులకు గుంతీదేవికి మొక్కిన, నగ్రనందనుం దడగుట నందజును గరంబు గారవంబునం గొనియాడం గొన్నిదినంబు లుండి, యొక్కనాం డంజలిపుటఘటితమస్తకుం డయి 'రాక్షసపిశాచబలంబులతోడ నాయిమ్ముల నుందెదం; బని గలయప్పుడు నన్ను దలంచునది; యక్షణంబ వత్తునని యందజిచేత ననుజ్ఞాతుం డై తల్లిం దోడ్కొని యుత్తరాభిముఖుం డయి యరిగె; నిట పాండవులును శాలిహోత్రునొద్ద ననేకధర్శశాస్త్రనీతిశాస్త్రంబు లభ్యసించి యమ్మునివరు వీడ్కొని చని విదర్ధమత్స్యత్రిగర్తకీచకవిషయంబులు గడచి యేకచక్రం బను నగ్రహారంబు గని. 236

ఆదిపర్వము - షష్టాశ్యాసము 621 (ప్రతిపదార్హల: ఇట్టు; సద్యః+గర్భంబునన్‌= అప్పటి కప్పుడు కలిగిన కడుపున; కామ, రూప, ధరుండు+ఐ= ఇచ్చవచ్చిన రూపాన్ని ధరించేవా డై; ఘటోత్కచుండు; పుట్టి; తత్‌+క్షణంబ= ఆ నిమిషాన్నే; నవు యౌవనుండును= (క్రొత్తగా ఏర్పడిన యౌవనం కలవాడును; అనేక+అస్త, శస్త్ర కుళశలుండునున్‌= పలువిధా లైన అస్త్రాలలో, ళస్తాలలో నేర్పుకలవాడును; అపరిమిత, రాక్షస, పిశాచ, బల, పరివృతుండునున్‌+ఐ= అంతులేని రాక్షసపిశాచబలంచేత చుట్టబడినవాడును అయి; తల్లి; తండ్రులకున్‌; కుంతీదేవికి; (మొక్కినన్‌; అగ్ర, నందనుండు+అగుటన్‌= పెద్దకొడుకు కావటంచేత; అందటును; కరంబు= మిక్కిలి; గౌరవంబునన్‌; కొనియాడన్‌; కొన్ని, దినంబులు+ఉండి; ఒక్కనాండు; అంజలి, పుట, ఘటిత, మస్తకుండు+*అయిజ= దొప్పవంటి చేమోడ్పుచే కూడిన తల కల వాడై; రాక్షస, పిశాచ, బలంబులతోడన్‌?: ఆ+ఇమ్ములన్‌= ఆ ప్రదేశాలలో; ఉండెదన్‌; పని, కల+అప్పుడు=. పని ఉండే సమయంలో; నన్నున్‌; తలంచునది; ఆ+క్షణంబు+అ= ఆ నిమిషాననే; వచ్చుదును+అని; అందజిచేతన్‌; అనుజ్ఞాతుండు+ఐ= అనుమతింపబడిన వా డై; తల్లిన్‌+త్తోడ్కొని; ఉత్తర+ఆభిముఖుండు+అయి= ఉత్తరానికి ఎదురుగాముఖం కలవా డై - అంటే ఉత్తరంవైపు తిరిగినవా డై; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట; పాండువులును; శాలిహోత్రు+ఒద్దన్‌= శాలిహోత్రునిదగ్గర; అనేక, ధర్మ, శాస్త్ర నీతి, శాస్త్రంబులు; అభ్యసించి= నేర్చుకొని; ఆ+ముని, వరు= ఆ ముని'శ్రేష్టుడిని; వీడ్కొని= వదలి; చని= వెళ్ళి; విదర్భ, మత్స్య, త్రిగర్త కీచక, విషయంబులు= విదర్భ మత్స్య, త్రిగర్త, కీచకదేశాలు; కడచి; ఏక, చ(క్రంబు+అను+అ[గ్రహారంబు; కని= చూచి. తాత్పర్యం: ఈ విధంగా అప్పటికప్పుడు కలిగిన గర్భంలో తనకు ఇచ్చ వచ్చిన రూపాన్ని ధరించగల వాడైన ఘటోత్కచుడు పుట్టి, తత్‌క్షణమే నవయౌవనం, వివిధశాస్తాలలో నైపుణ్యం కలవా డై, అపరిమిత రాక్షస పిశాచ బలంతో కూడి తల్లిదండ్రులకు, కుంతీదేవికి నమస్కరించాడు. ఘటోత్కచుడు మొదట పుట్టిన కుమారుకావటంవలన అతడిని అందరు ఆదరించగా- అతడు కొన్ని దినా లుండి, ఒకనాడు అందరికీ నమస్కరించి- 'నేను రాక్షస పిశాచ బలాలతో ఆయా్రదేశాలలో ఉంటాను. అవసర మైనపుడు నన్ను తలిస్తే ఆ క్షణాన్నే వస్తా" నన్నాడు. తరువాత అందరి అనుమతిని పొంది తల్లిని వెంటతీసికొని ఉత్తర దిశగా వెళ్ళాడు. ఇట పాండవులు కూడ శాలిహోత్రునిదగ్గర అనేక ధర్మశాస్త్రాలు నీతిశాస్తాలు అభ్యసించి, ఆయన దగ్గర సెలవు, తీసికొని విదర్భ, మత్స్య, త్రిగర్హ కీచక దేశాలు దాటి ఏకచక్ర మనే అ(గ్రహారాన్ని చూచి. విశేషం: నాయిమ్ముల - నాకు ఇష్టమైనట్టు - అనుకూలమైనట్లు అనిగూడ అన్వయించటానికి అవకాశం ఉన్నది. 'ఏకచ(క్రం బను నగ్రహారంబు" - ఏకచక్రాపురము అనిమూలం. 'ఏకచక్రామ్‌ గతా స్తేతు' - చిత్రశాలాప్రతి, ఘటోత్కచజన్మము చైత్రబహుళ అష్టమి. +శ్రీమదాం[ధ్రమహాభారతసంకోధిత ప్రతి, పుట. 383.

పాండవులేకచ[క్రపురంబున విప్రగృహంబున నుండుట (సం.1-145-1) క. _ లలితజటాజినకుశన । ల్మలధరు లై వేద మొప్పంగా జదువుచు ని మ్ముల బ్రహ్మచారివృత్తిని; వెలయ6గ నం దుండి రొక్కనిప్రగృహమునన్‌. 237

ప్రతిపదార్థం: లలిత, జటా+అజిన, కుశ వల్కల, ధరులు+ఐ= చక్కనిజడలను, జింకతోళ్ళను, దర్భలను, నారచీరలను కట్టినవారై; వేదము; ఒప్పంగాన్‌= తగువిధంగా; చదువుచున్‌: ఇమ్ముల= సుఖంగా; (బ్రహ్మచారి, వృత్తిని= (బ్రహ్మచారియొక్క నడవడితో; వెలయణగన్‌= ప్రకాశించేటట్టు; ఒక్క, విప్ర, గృహమునన్‌= ఒక (బ్రాహ్మణుని ఇంటిలో; అందు= ఆ ఏకచ[క్రపురంలో; ఉండిరి. తాత్సర్యం: (పాండవులు) చక్కనిజడలతో, జింకతోళ్ళతో, దర్భలతో, నారబీరలతో వేదపఠనం చేస్తూ బ్రహ్మచర్యవృత్తి నవలంబించి సుఖంగా ఆ ఏకచ'క్రపురాన ఒకబ్రాహ్మణుని ఇంట్లో ఉన్నారు.

622 (శ్రీమదాంధ్ర మహాభారతము క. ధృతిం జదువుచు భిక్షార్ధము | ప్రతిగృహమున కరుగుచున్న భవ్యుల మౌన

వ్రతులం దృస్తులం జేసిరి; సతతము నందుల గృహస్థ సద్విజులు దయన్‌, 238 ప్రతిపదార్హం: ధృతిన్‌, చదువుచు= సంతోషంతో చదువుతూ; భిక్ష+అర్హము= భిక్షకోసం; ప్రతిగృహమునకు= ఇంటింటికి; అరుగుచు+ఉన్నజ వెళ్ళుతున్న; భవ్యుల= మంచివాళ్ళను; మౌన, వ్రతులన్‌= మాటాడక ఉండే (వ్రతాన్ని అవలంబించిన వాళ్ళను; అందుల, గృహస్థ, సత్‌+ద్విజులు= ఏకచక్రపురంలోని గృహస్టు లైన మంచి బ్రాహ్మణులు; దయన్‌= దయతో; సతతము= ఎల్లప్పుడు; తృప్తులన్‌+చేసిరి= తృప్తి పొందిన వారినిగా చేశారు.

తాత్పర్యం: సంతోషంతో చదువుతూ భిక్షకోసం ప్రతిగృహానికి వెళ్ళుతున్న మౌనవ్రతులు, మంచివాళ్ళు అయిన

పాండవులను ఏకచ(క్రపురంలోని స ద్ర్రాహ్మణ గృహస్ట్హులు దయతో ఎల్లప్పుడు తృప్తిపరచారు.

క. “జలజప్రియతేజుల వీ। రల థీరుల ధరణివలయరాజ్యశ్రీయో

గ్యుల ని ట్లేలొకొ భిక్షా। శులం జేసి విధాత్భం డంచు శోకింప జనుల్‌. 239 ప్రతిపదార్హం: జలజ, ప్రియ, తేజుల= నీటినుండి పుట్టిన దైన పద్మానికి ప్రియు డైన సూర్యునివంటి కాంతి కలవాళ్ళను; ధీరుల; ధరణి, వలయ, రాజ్యథీ, యోగ్యులన్‌= భూమండలంయొక్క రాజ్యలక్ష్మికి తగినవాళ్ళను; వీరల= వీళ్ళను; విధాతృండు=

(బ్రహ్మదేవుడు; ఏల+ఒకొజు ఎందుచేతనో; ఇట్టు= ఈవిధంగా; భిక్ష/అశులన్‌= భిక్షాన్నం తినేవాళ్ళుగా; చేసె; అంచు= అంటూ;

జనుల్‌; శోకింప= విచారింపగా,

తాత్సర్యం: సూర్యతేజులు, దీరులు, భూమండల రాజ్యలక్ష్మికి తగిన వాళ్ళు అయిన వీళ్ళను (పాండవులను)

(బ్రహ్మదేవుడు ఎందుచేత భిక్షాన్నం తినేవాళ్ళనుగా చేశాడో కదా?!” అని జనులంతా దుఃఖఖించగా.

క _ పరమాన్నభక్ష్యభిక్షా। పరిపూర్హతరంబు లయిన పాత్రము లయ్యే వురు నిత్యంబు నివేదిం । తురు దల్లికిం గరముభక్తితో వినయమునన్‌. 240

ప్రతిపదార్థం: ఆ+ఏవురు= ఆ ఐదుగురు; నిత్యము= ప్రతిదినం: కరము= మిక్కిలి; భక్తితో; వినయమునన్‌= వినయంతో;

పరమ+అన్న, భక్ష్య, భిక్ష పరిపూర్ణతరంబులు+అయిన= పాయసంచేతను, పిండివంటలచేతను, అన్నంచేతను పూర్తిగా నిండిన వైన; పాత్రములు; తల్లికిన్‌= కుంతీదేవికి; నివేదించుదురు= సమర్పిస్తారు, ఇస్తారు.

తాత్పర్యం: పాండవు లైదుగురు ప్రతిదినం మిక్కిలి భక్తి వినయాలతో పాయసం, పిండివంటలు, అన్నం నిండిన

పాత్రలను తెచ్చి తల్లికి అందజేస్తారు.

న, కుంతియు దాని రెండుభాగంబులు సేసి యం దొక్క భాగంబు భీమునకుం బెట్టి, తక్కిన భాగంబు గడను కొడుకులుం దానును గుడుచుచు నిట్లు ప్రచన్ను లై యేకచక్రపురంబున నున్నంత, నొక్కనాండు ధర్మార్దునయములు భిక్షార్ధం బరిగిన నిట కుంతియు భీముండును దమ విడిసిన విప్రగృహంబున నున్నంత, నం దొక్కపెట్ట యార్తధ్వని యెగసిన విని కుంతీదేవి యెంతయు సంతాపించి భీమున కిట్లనియె.. 241

ప్రతిపదార్థం: కుంతియు; దాని= ఆ ఆహారాన్ని; రెండు, భాగంబులు+చేసి; అందు+ఒక్క, భాగంబు; భీమునకున్‌+పెట్టి:

తక్కినభాగంబు; కడమకొడుకులున్‌= తక్కినకొడుకులును; తానును; కుడుచుచున్‌= తింటూ; ఇట్టు; ప్రచ్చన్నులు+ఐ= కప్పబడినవాళ్ళయి. అంటే మారువేషాలలో ఉన్న వాళ్ళయి; ఏక, చక్ర, పురంబునన్‌; ఉన్న+అంతన్‌= ఉండగా? ఒక్కనాండు; ధర్మ+అర్జ్హునశయములు= ధర్మరాజు, అర్జునుడు, నకులసహదేవులు; భిక్షా+అర్ధంబు= భిక్షకోసం; అరిగినన్‌=వెళ్ళగా? ఇట;

ఆదిపర్వము - షష్టాశ్వాసము 623 కుంతియు, భీముండును; తమ విడిసిన, విప్ర, గృహంబునన్‌= తమయొక్కవిడిది చేసిన (బ్రాహ్మణ గృహంలో, అంటే తా ముండే (బ్రాహ్మాణులఇంటిలో; ఉన్న+అంతన్‌= ఉండగా; అందు= ఆ యింటిలో; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; ఆర్త ధ్వని= ఏడుపుళిబ్దం; ఎగసిన= పైకి లేవగా; విని; కుంతీదేవి; ఎంతయు= మిక్కిలి; సంతాపించి= దుఃఖించి; భీమునకు+ఇట్టు+అనియె. తాత్సర్యం: కుంతీదేవి ఆ ఆహారాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగం భీమునికి పెట్టి, తక్కిన భాగాన్ని తాను, తక్కినకొడుకులు తింటూ మారువేషంలో కాలం గడుపుతుండగా, ఒకనాడు ధర్మార్జ్డున నకులసహదేవులు భిక్షకు వెళ్ళిన సమయంలో తానూ భీముడూ ఇంట్లో ఉండగా, తా ముండే ఆ బ్రాహ్మణ గృహంలో ఒక్కసారిగా పెద్ద ఏడుపు వినిపించింది. అది విని కుంతీదేవి ఎంతో బాధపడి భీమునితో ఇట్లా అన్నది. తే. ఇందు సుఖ ముండితిమి యొరు లెజుంగకుండ ; నేలొకో యిప్ప డీ విప్రు నింట నార్త

రవము వీతెంచె? దీని నారసి యెలుంగ |; వలయు దత్రృతీకారంబు నలయుం జేయ. 242

(ప్రతిపదార్దం: ఒరులు+ఎటు(గక+ఉండజ ఇతరులకు తెలియకుండ; ఇందు; సుఖము+ఉండితిమి= సుఖంగా ఉన్నాం;

ఇప్పుడు+ఈ, వి'ప్రుని+ఇంటన్‌= ఇప్పు డీ బ్రాహ్మణుని ఇంట్లో; ఆర్త రవము= ఏడుపుర్వని; ఏల+ఒకో=ఐ ఎందుచేతనోకదా!

వీతెంచె=ఐ వ్యాపించింది; దీనిన్‌*ఆరసి=ఐ దీన్ని విచారించి; ఎజుంగవలయున్‌= తెలిసికోవాలి; తత్‌+ప్రతీకారంబు= దానికి మారుచేతను; చేయ, వలయున్‌.

తాత్పర్యం: ఇతరు లెవ్వరికీ తెలియకుండ ఇక్కడ సుఖంగా ఉన్నాం. ఎందుచేతనో ఇప్తు డీ (బ్రాహ్మణుని ఇంట్లో

ఏడుపు ధ్వని వినవస్తున్నది. దీన్ని విచారించి తెలిసికొని తాలగించాలి.

వ. పరమోపకారి యైన యీ బ్రాహ్మణునకు నేమి ప్రియము సేయ సమకూరునో యని చింతించుచున్నచో నిప్పు డెద్ది యేనియు నొక్క దుస్తరం బయిన దుఃఖం జీ గృహస్ఫున కయ్యెంగావలయు; నా మనంబు మలమల మజఖింగెడుం గావున దీనిం దలంి వీరికి మనవ్రియంబు సేయవలయు. 243

ప్రతిపదార్థం: పరమ+ఉపకారి+ఐన= మిక్కిలిఉపకారం చేసినవాడైన; ఈ, (బ్రాహ్మాణునకున్‌; ఏమి, (ప్రియము= ఏమిఇష్టం; చేయ; సమకూరునో= కలుగుతుందో; అని; చింతించుచు+ఉన్నచోన్‌= ఆలోచిస్తూ ఉండగా; ఇప్పుడు; ఎద్ది+వనియున్‌= ఏదోఒక; దుస్తరంబు+అయిన= దాటరాని దైన; దుఃఖంబు; ఈ, గృహస్టునకు; అయ్యెన్‌+కావలయు= అయి ఉండాలి; నా, మనంబు= నాయొక్క మనస్సు; మలమల; మటిలౌడున్‌= కాగుతున్నది - తపిస్తున్నది; కావున; దీనిన: తలంగి=ఐ తొలగించి; వీరికి; మనఃప్రియంబు= మనస్సుకు సంతోషాన్ని; చేయవలయు.

తాత్సర్యం; మనకు మహోపకారం చేసిన ఈ బ్రాహ్మణునికి ఏదైనా ఇష్ట మైనది చేయాలని ఆలోచిస్తుండగా ఇప్పు

డేదో దాట శక్యంకాని కష్టం ఈ యింటి యజమానికి కలిగినట్టున్నది. నా మనస్సు చాలా బాధపడుతున్నది.

అందుచేత ఆ కష్టాన్ని తీర్చి వీరికి మనస్సంతోషాన్ని కలిగించాలి.

క. _ కృత మెలుంగుట పుణ్యము; స। వృతి దానికి సమముసేంత మధ్యము; మథి త తృతమున కగ్గలముగ స; తృతిసేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్‌. 244

ప్రతిపదార్థం: కృతబుద్దులకున్‌= చేయబడినబుద్ధిగలవాళ్ళకు - అంటే పండితులకు: కృతము= చేయబడినదాన్ని; ఎటుంగుట=

తెలిసికొనటం; పుణ్యము; సత్‌+మతి= మంచిబుద్దితో; దానికిజ చేసినమేలుకు; సమము= సమానమైనాదాన్ని - (ప్రత్యుపకారాన్ని; చేంత= చేయటం; మధ్యము= మధ్యమమార్షం; మటీ= అంతేకాక; తత్‌+కృతమునకున్‌= ఆ చేయబడినదానికంటె; అగ్గలముగవ= అధికంగా; సత్‌+కృతి= మంచిపని, ప్రత్యుపకారం; చేయుట; ఉత్తమంబు.

624 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: బుద్దిమంతు లైనవాళ్ళు ఎదుటివాళ్ళు చేసిన ఉపకారాన్ని గుర్తించటమే గొప్ప పుణ్యకార్యం. మంచిబుద్ధితో దానికి సమాన మైన ప్రత్యుపకారం చేయటం మధ్యమ మార్గం. అట్టాకాక చేసిన ఉపకారం కంటె ఎక్కువగా ప్రత్యుపకారం చేయటం ఉత్తమపద్దతి. విశేషం: నన్న్మయ నానారుచిరార్థసూక్తి కిది ఒక చక్కని ఉదాహరణం. న. అనిన విని భీమసేనుం డి ట్లనియె. 245 తాత్సర్యఆ: అని కుంతీదేవి పలుకగా భీముడు విని ఈ విధంగా అన్నాడు. ఆ. ఎటింగి నాకుంజెప్పు, మిది యేమి? యెవ్వరి। వలవ నింతమయ్యె? వగవ నేల? యెంత కడింది యైన నిది యేను వీరి యీ; విప్రునకుం బ్రియంబు విస్తరింతు. 246 ప్రతిపదార్హం: ఇది; ఏమి; ఎవ్వరివలనన్‌; ఇంత+అయ్యె= ఇంత జరిగింది - అంటే ఇంతదు;ఃఖం కలిగింది; ఎజి6గ= తెలిసికొని; నాకున్‌+చెప్పుము; వగవన్‌+ఏల= దుఃఖించట మెందుకు? ఎంత, కడిది+ఐనన్‌= ఎంతకష్టమైన దైనా; ఇది; ఏను= నేను; తీర్చి; ఈ, వి(ఫ్రనకున్‌= ఈబ్రాహ్మణునికి; ప్రియంబు= సంతోషాన్ని: విస్తరించుదు= అధికం చేస్తాను. తాత్పర్యం: ఇ దేమి దుఃఖం? ఎవరివలన ఇంత జరిగింది? తెలిసికొని నాతో చెప్పుము. దుఃఖించటం ఎందుకు? ఇది ఎంత కష్ట మైన దైనా నేను దీన్ని తీర్చి ఈ (బ్రాహ్మణునికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తాను. వ లఅనినం గుంతి యట్ల చేయుదు నని చని దుఖుపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దన బాంధవులు విన ని ట్లనియె. 247 (ప్రతిపదార్థం: అనినన్‌; కుంతి; అట్టు ఆ విధంగానే; చేయుదున్‌+అని; చని= వెళ్ళి; దుఃఖపరవశులు+అయి= దుఃఖానికి పూర్తిగా లొంగిపోయినవాళ్ళయి - అంటే పూర్తిగా దుఃఖంలో మునిగిపోయినవా ళ్ళయి; పరిదేవనంబు= ఏడుపు; చేయుచు+ఉన్న; వారలన్‌; చూచి; అడుగనేరక= అడుగలేక; మిన్నకశఉన్న+అంత= ఊరకున్న తర్వాత; (బ్రాహ్మణుండు; తన; బాంధవులు; వినన్‌= వినేటట్టుగా; ఇట్టు+అనియె. తాత్పర్యం: అని భీము డనగా కుంతి అట్టాగే చేస్తా నని వెళ్ళి, పూర్తిగా దుఃఖంలో మునిగి ఏడుస్తున్న వాళ్ళను చూచి ఏమీ ఆడగలేక ఊరకుండగా (బ్రాహ్మణుడు తనబంధువులు వినేటట్టుగా ఇట్లా అన్నాడు. బకున కాహారముగా( బోవుటనుగూర్చి బ్రాహ్మాణకుటుంబము విచారించుట (సం.1-145-20) క. నలసారము సంసార మ, ఖీలదుఖావహము భయనికేతన మతిచం చలము పరాధీనం బం । దుల జీవన మేల నమ్ముదురు తత్వ్వవిదుల్‌. 248 ప్రతిపదార్థం: సంసారము; నలసారము= గడ్డియొక్కసారంవంటి సారంగలది - అంటే నిస్సారమైనది; దుఃఖ+ఆవహము= దుఃఖాన్ని కలిగించేటువంటిది; భయ, నికేతనముజ భయానికి ఇల్టు అయినట్టిది; అతి, చంచలముజ= మిక్కిలిచలించేటువంటిది - స్థిరత్వం లేనట్టిది; పర+అధీనంబు= ఇతరులకు లొంగినట్టిది; తత్త్యవిదుల్‌= నిజాన్ని తెలిసికొన్న వారు - అంటే పండితులు; ఇందుల, జీవనము= సంసారంలోని (బ్రతుకును; ఏల; నమ్ముదురు. తాత్సర్యం: సంసారం గడ్డివలె నిస్సార మైనది; దుఃఖాన్ని కలిగించేది; భయానికి స్టానమైనది; మిక్కిలి చంచలమైనది; ఇతరులకు లొంగేది; పండితు లైనవాళ్ళు ఈ సంసార జీవనం సత్యమైన దని ఎట్టా నమ్ముతారు?

ఆదిపర్వము - షష్టాశ్వాసము 625 విశేషం: కధాప్రసన్నతకు భంగంలేకుండ, సందర్పోచితంగా మానవునికి వెలుగు నిచ్చే నన్నయ నానారుచిరార్థసూక్తులలో ఇది ఒకటి. నలసారము - నలస్యతృణస్యసారఇవసారోయస్యసః - భా.కూ. -శ్రీమదాంద్రమహాభారతసంళోధితప్రతి, పుట. 386 క. _ ఆదిని సంయోగవియో , గాదిద్వంద్వములు దేహి యగు వానికి సం

సాదిల్లక తక్కవు పూ । ర్వోదయ కర్మమున నెట్టి యోగికి నయినన్‌. 249 ప్రతిపదార్థం: ఎట్టి, యోగికిన+అయినన్‌= ఎట్లాంటి యోగాభ్యాసంచేసే వాని కైనా లేదా ఎట్లాంటి అదృష్టవంతుని కైనా; పూర్వ+ఉదయ,' కర్మమునన్‌= పూర్వజన్మంలోని కర్మవలన; అదిని= మొదట; సంయోగ, వియోగ+అఆది, ద్వందృములు= కలవటం, విడిపోవటం* మొదలయిన జంటలు; దేహి+అగువానికి= దేహంగలవా డైన వానికి - అంటే ప్రతిమనుజునికి; సంపాదిల్లకజు కలుగక; తక్కవు= తప్పవు. తాత్పర్యం: ఎంత యోగి కైనా- ఏ మానవుడికైనా- పూర్వజన్మకర్మవలన కలవటం, విడిపోవటం ద్వంద్వాలను అనుభవించటం తప్పుదు. విశేషం: మానవ జీవిత తత్త్వాన్ని తెలిపే నన్నయ రుచిరార్థ సూక్తులలో ఇది ఒకటి. తరువోజ.

ఏనును బ్రజలును నీధర్మసతియు నే యుపాయంబున నిబ్బారి. గదవం

గానేర్తు? మెయ్యది గర్భ? మిందుండ€ గా దేగుదమ యొండు గడకని ముంద

రే నెంత సెప్పిన నెన్నండు వినద యిది; యిట్టిదారుణ మిమ్మెయిం జేయం

గా నున్నవిధి యేల కదవంగ నిచ్చు గర్మవిపాకంబు గదవంగ లావె. 250 ప్రతిపదార్థం: ఏనును; ప్రజలును= బిడ్డలును; ఈ, ధర్మ, సతియున్‌= ఈధర్మపత్నీ - అంటే ఈ నా భార్యా! ఏ+ఉపాయంబునన్‌= ఏ ఉపాయంచేత; ఈ+బారిన్‌= ఈ ఆపదను; కడవంగా= దాటగా; నేర్తుము(నేర్చుదుము); ఏ+అది= ఏది; కర్ణము= చేయదగింది; ఇందు+ఉండన్‌+*కాదు= ఇక్కడ ఉండకూడదు; ఒండు+కడకుజ వేరాకచోటికి; ఏగుదముః= వెళ్ళుదాము; అని; ముందర+ఏను+ఎంత+చెప్పినన్‌= ముందుగా నే నెంతచెప్పినా? ఇది= ఈమె (భార్య); ఎన్నండు; వినద= వినలేదు; ఇట్టి దారుణము= ఇంతటిఘోరాన్ని; ఈ+మెయిన్‌= ఈవిధంగా; చేయన్‌+కాన్‌+ఉన్న= చేయటానికై ఉంటే? విధి= (బ్రహ్మః వీల; కడవంగనిచ్చున్‌= పోనిస్తాడు; కర్మ, విపాకంబు= కర్మఫలం; కడవంగః= తప్పించుకోవటానికి; లావె= సాధ్యమా? తాత్సర్యం: నేను, బిడ్డలు, నా భార్య ఏ ఉపాయంచేత ఈ ఆపదను దాటగలం? ఏం చేయాలో తోచకుండా ఉన్నది. ఇక్కడ ఉండకూడదు, వేరొకచోటికి వెడదా మని ముందుగా నే నెంత చెప్పినా నా భార్య వినలేదు. ఇంతటి

గి తి ఘోరాన్ని ఈ విధంగా చేయబోతున్న (బ్రహ్మ మమ్మల్ని ఎందుకు పోనిస్తాడు? కర్మఫలం తప్పించుకోవటం సాధ్యమా! విశేషం: అలం: అర్జాంతరన్యాసం. తరువోజకు 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం, మళ్ళీ ౩ ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి. 1-8-7 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. ప్రొసనియతి ఉన్నది. 102వ పద్యం చూడండి. సీ. మంత్రయుక్తంబుగా మత్పరిణీత యై: ధకృచారిణి యగు దానివినయ

వతి. బ్రజావతి ననువ్రత నెట్టు లసురకు । భక్ష్యంబ వగు మని పనుపనేర్తు?

ధర్మాభివృద్ధిగా. దగు వరునకు నీగ । నిల్లద బ్రహ్మచే నిడ౮యిడిన

యిక్కన్య యతిబాల యిం దుద్ధవం బగు । దౌహిత్రలాభంబు దలు6గ నెట్లు

626 శ్రీమదాంధ్ర మహాభారతము ఆ. దీనింబుత్తు? మఠి మదీయ పిండోదక ; నిధిందనూజుంగులము నిస్తరించు

వానిం బితృగణంబువలని బుణంబుం బా। చిన మహోపకారిం జిలటుతవాని. 251 ప్రతిపదార్థం: మందత్రయుక్తంబుగాజ మంత్రంతో కూడుకొన్నదిగా; మత్‌+పరిణీత+ఐన= నాచే వివాహమాడబడిన; ధర్మ, చారిణి+అగు, దాని= ధర్మంలో నడిచేదానిని; వినయవతిన్‌= వినయవంతురా లైన దానిని; అనువ్రతన్‌= అనుసరించి నడచుకొనేదానిని; ఎట్టుల= ఏ విధంగా; అసురకుజ రాక్షసునికి, భక్ష్యంబవు+అగుము+అని= తినదగిన దానివి కమ్ము అని; పనుప, నేర్తుఐ పంపించగలను; ధర్మ+అభివృద్రిగాన్‌= ధర్మం ఎక్కువగా పెరిగేటట్లు; తగు, వరునకు= తగిన మగనికి, ఈగన్‌= ఇవ్వటానికి; బ్రహ్మచే= (బ్రహ్మదేవునిచేత; ఇల్లడ= అడిగినప్పుడు ఇమ్మని ఉంచిన వస్తువుగా; ఇడంగన్‌+పడిన= ఉంచబడిన; ఈ+కన్య; అతిబాలజ= చాలా చిన్నది; ఇందు+ఉద్భవంబు+అగు= దీనిద్వారా కలిగేటి; దౌహిత్ర, లాభంబు= కూతురికొడుకు - మనమడు పుట్టటం; తలుంగన్‌= తొలగిపోయేటట్టు; ఎట్టు= ఏ విధంగా; దీనిన్‌=ఐ ఈ కూతురిని; పుత్తు= పంపిస్తాను: మఠీ= అంతేకాక; మదీయ, పిండ+ఉదక, నిధిన్‌= నాయొక్క పితృదేవతల కిచ్చే అన్నపుముద్దలకు, నీళ్లకు స్టానమైనవాడిని; తనూజాన్‌= శరీరంనుండి జన్మించినవాడిని - కుమారుడిని; కులము, నిస్తరించువానిన్‌= వంశాన్ని తరింపజేసేవాడిని; పితృగణంబువలని, బుణంబున్‌*పాచిన, మహా+ఉపకారిన్‌= పితృదేవతలయొక్క సమూహంనుండి బుణాన్ని తొలగించి గొప్ప ఉపకారం చేసినవాణ్ణి; చిజుతవానిని= చిన్నవాడిని; తాత్పర్యం: వేదమం(త్రపూర్వకంగా వివాహమాడి నాతోగూడ ధర్మమార్గాన చరిస్తూ వినయవతి అయి నన్ననుసరించి నడుచుకొనే భార్యను రాక్షసునికి ఆహారం క మ శని ఎలా పంపగలను? ధర్మం అభివృద్ధి చెందేటట్టు తగిన వరుడి కిచ్చి వివాహం చేయటానికి నా దగ్గర (బ్రహ్మదేవుడు ఇల్లడగా ఉంచిన ఈ కన్యను నా కూతురిని- దౌహిత్రుడు నాకు లేకుండాపోయేటట్టు రాక్షసునికి ఆహారంగా ఎట్లా పంపగలను? అంతే కాదు, నా పితృదేవతలకు పిండోదకా లిచ్చే కుమారుడిని, వంశాన్ని తరింపజేసేవాడిని, పితృదేవతల బుణం తీర్చే మహోపకారిని, ఈ చిన్నవాడిని. ఆ. ఎట్టుసూచిచూచియిది పాప మనకయ । య్యసుర వాతం ద్రోతు నదయవృత్తి;

నరిగి యేన యిప్పు డసురకు నాహార । మగుదు వీరింబుచ్చ నగునె నాకు. 252 ప్రతిపదార్థం; ఎట్టు= ఏవిధంగా; చూచి, చూచి; ఇది; పాపము+శఅనక; ఆ+అసురవాతన్‌= ఆ రాక్షసునినోట; అదయ, వృత్తిన్‌= దయలేనినడవడికతో - అంటే (క్రూరంగా; (త్రోతున్‌= తోస్తాను; ఏన= నేనే; అరిగి= వెళ్ళి ఇప్పుడు+అ= ఇప్పుడే? అసురకు= రాక్షసునికి; ఆహారము+అగుదు= ఆహారం అవుతాను; నాకు; వీరిన్‌; పుచ్చన్‌+అగునె= పంపతగునా! తాత్సర్యం: ఏ విధంగా చూచి చూచి ఇది పాప మని అనక ఈ చిన్నవాడిని (క్రూరంగా ఆ రాక్షసునినోట తోస్తాను? నేనే వెళ్ళి ఇప్పుడే ఆ రాక్షసునికి ఆహార మవుతాను. వీళ్ళను నేను పంపదగునా? వ. అని యాత్మపరిత్యాగంబునందుం గృతనిశ్చ్రయుం డై యున్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి యి ట్లనియె. 253 (ప్రతిపదార్థం: అని; ఆత్మ, పరిత్యాగంబునందున్‌= తనను తాను అర్పించుకోవటంలో; కృత, నిశ్చయుండు+ఐ= చేయబడిన నిర్ణయం కలవా డై; ఉన్న; బ్రాహ్మాణున్‌+చూచి; బ్రాహ్మణి= బ్రాహ్మణునిభార్య; ఇట్టు+అనియె. తాత్పర్యం: అని తననుతాను అర్చించుకోవటానికి నిర్ణయించుకొన్న బ్రాహ్మణుడిని చూచి ఆ బ్రాహ్మణుని భార్య ఈ విధంగా అన్నది.

ఆదిసర్వము - షష్టాశ్వాసము 627

క, _ మనుజులకు నెవ్విధంబున । ననతిక్రనముణీయ మైన యాపద్విషయం బున సంతాపింపంగం జన । దని యెజింగియు నగునె యెట్టు లని శోకింపన్‌, 2654

ప్రతిపదార్ధల: మనుజాలకు; ఏ+విధంబునన్‌= ఏవిధంగా నైనా; న+అతిక్రమణీయము+ఐన= దాటరాని దైన; ఆపత్‌+

విషయంబునజ ఆపద విషయంలో; సంతాపింపంగన్‌+చనదు+అని= దుఃఖించ కూడ దని; ఎజింగియున్‌= తెలిసియు; ఎట్టులు+ అని= ఎట్టా అని; శోకింపన్‌= దుఃఖించగా; అగునెజ తగునా!

తాత్పర్యం: మానవులకు ఏవిధంగాను దాటరాని దైన ఆపద విషయంలో శోకించ గూడ దని తెలిసికూడ, ఎట్టా

అని శోకించవచ్చా? (కూడ దని భావం)

న. ఆ రక్కసున కే నశనం బయ్యెద; మీరు వగవకుండుందు; భార్యయందు బడయంబడు నపత్యంబు నాయందు మున్న పడసితి; రేనును బుణవిముక్త నయితిం; బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు సేయవలయు; మఠి యట్లుంగాక. 255

'ప్రతిపదార్హం: ఆ, రక్కసునకు= ఆ రాక్షసునికి; ఏను+అశనంబు+అయ్యెద= నేను ఆహార మవుతాను; మీరు;

వగవక+శఉండుండు= దుఃఖించకండి; భార్య+అందున్‌; పడయన్‌+పడు+అపత్యంబు= పొందబడే సంతానం; నా+అందు; మున్న

ముందే; పడసితిరి= పొందారు; ఏనును= నేనుకూడ; బుణ, విముక్తను+అయితిన్‌= బుణాన్ని తీర్చుకొన్న దాన నయ్యాను; ప్రాణ, వియోగంబు+చేసి+అయినను= (ప్రాణాలు వదలి అయినా; భార్య; పతికి= భర్తకు; హితంబు+చేయవలయు= మేలు చేయాలి; అట్టున్‌+*కాక,

తొత్సర్యం: ఆ రాక్షసునికి నేను ఆహార మవుతాను. మీరు దుఃఖించకండి. భార్యద్వారా పాందవలసిన సంతానాన్ని

నాయందు ఇదివరకే పొందారు. నేను నా బుణం తీర్చుకొన్నాను. ప్రాణాలు వదలి అయినా భార్య భర్తకు

మేలుచేయాలి. అట్ట్లాకాక-

ఆ. పురుషుకంటె మున్ను పరలోక మేంగిన। సతియ నోంచినదియు సతులలోన!। బురుషహీన యైనం బరమపతివ్రత ; యయ్యు జగముచేతం బ్రయ్యయిడదె. 256

ప్రతిపదార్థం: పురుషుకంటె, మున్ను= భర్తకంటి ముందుగా; పరలోకము+ఏంగిన, సతియు= పరలోకానికి పోయిన భార్యయే;

సతులలోనన్‌= పతివ్రతలలో; నోచినదియు= పుణ్యంకలది; పురుష హీన+ఐనన్‌=_ భర్తను కోల్ప్సోయిం. దైతే; పరమ, పతివ్రత+ఆయ్యు; జగముచేతన్‌= లోకంచేత; ప్రయ్యన్‌+పడదె= నిందను పొందదా!

తాత్పర్యం: భర్తకంటె ముందు మరణించిన భార్యే పతివ్రతలలో మిక్కిలి పుణ్యాత్మురాలు. పరమపతివ్రత

అయినా భర్త లేని ప్రీ లోకంచేత నింద పొందుతుంది గదా!

ఆ. పడిన యామిషంబు పక్షు లపేక్షించు । నట్లు పురుషహీనయయిన యువతి. జూచి యెల్లవారు. జులుక నపేక్షింతు : రిదియుంబాప మనక హీనమతులు. 257

ప్రతిపదార్థం: పడిన+ఆమిషంబు= [క్రింద పడిన మాంసపుముక్కను; పక్షులు+అపేక్షించునట్టు= పక్షులు కోరేవిధంగా: పురుషు

హీన+అయిన, యువతిన్‌+చూచి= భర్తలేని స్త్రీ ని చూచి; ఎల్లవారున్‌= అందరు; హీనమతులు= నీచమైన బుద్ధికలవాళ్ళు; ఇదియున్‌; పాపము+అనక; చులుకన్‌= తేలికగా; అపేక్షింతురు= కోరుకుంటారు.

628 శ్రీమదాంధ్ర మహాభారతము తొత్సర్యం: క్రిందపడిన మాంసపుముక్కను పక్షులు కోరే విధంగా భర్తను కోల్పోయిన స్త్రీని చూచి నీచులు ఇది పాప మని కూడ అనుకోక తేలికగా ఆమెను కోరతారు. విశేషం: అలం. ఉపమ. ఆ సతి విముక్తయయినం బతికిం బునర్జార । సంగ్రహంబు సేంత శాస్తమతము; పతి విముక్తు-దయిన సతి కన్యపురుషసం గ్రహముసేంత లోకగర్హితంబు. 258 ప్రతిపదార్హం; సతి, విముక్త+అయినన్‌= భార్య విడువబడిన దైతే - అంటే భార్య మరణిస్తే) పతికిన్‌= భర్తకు; పునః+దార, సం([గ్రహంబు*చేత= మరల భార్యను చేపట్టటం; శాస్త్ర మతము= శాస్తంయొక్క పద్దతి; పతి, విముక్తుండు+అయిన= భర్త విడువబడ్డ వా డయితే - అంటే భర్త మరణిస్తే; పతికి=ఐ భార్యకు; అన్య, పురుష, సం([గ్రహము+చేత= మరొక భర్తను చేపట్టటం; లోక, గర్హితంబు= లోకంచేత నిందింపబడింది. తాత్పర్యం: భార్య మరణిస్తే భర్త మరొక భార్యను స్వీకరించటం శాస్త సమ్మతమే. భర్త మరణిస్తే భార్య మరొక భర్తను స్వీకరించటం లోకంచేత నిందించబడింది. వు "కావున నేను భవ ద్విహీన నయి యొక్క నిమేషం బేనియు జీవింపనేర; నేర్చితినేనియు ని క్కుమూరుల రక్షింపనేర; నె ట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్జించునట్లు కులాచారసద్భశులుగానివా రిక్కన్యం బ్రార్జించినం దత్ర్రతీకారంబుసేయను నిక్కుమూరునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు; మత్సరోక్షంబునం బునర్జారపరిగ్రహంబు సేసి గృహస్థధర్మంబును నగ్నిహోత్రంబునుం బుత్తులను రక్షించునది' యనుచు మరణవ్యవసాయంబునం దున్న తల్లిని దండ్రిం జూచి కూంతు రి ట్లనియె. 259 ప్రతిపదార్థం: కావున; నేను; భవత్‌+విహీనను+అయి= మీయొక్కలేకుండటాన్ని గలదాన నై - అంటే మీరు లేనిదాని నై; ఒక్కనిమేషంబు+వీనియు= ఒక నిమిషమైనా; జీవింపనేర= (బ్రతుకలేను; నేర్చితిన్‌+ఏనియు= ఒకవేళ (బ్రతుకనేర్చినా; ఈ+కుమారుల= ఈ బిడ్డలను; రక్షింపనేరన్‌= కాపాడలేను; ఎట్టు+అనిన; శూద్రులు; వేద, శ్రుతిన్‌= వేదాన్ని వినటాన్ని; 'ప్రార్థించిన+అట్టుజ కోరినట్టు; కుల+ఆచార, సదృశులు, కాని, వారు= కులంయొక్క ఆచారానికి సరిపోలనివాళ్ళు; ఈ+కన్యన్‌; ప్రార్హించినన్‌= కోరితే; తత్‌+ప్రతీకారంబు+చేయను= దానికి పరిహారం చేయటానికి; ఈ+కుమారుని+అందు; గుణ+ఆధానంబు+చేయను= గుణాలు ఉంచటాన్ని చేయటానికి - మంచిగుణాలు కలిగించటానికి; నా, కొలంది+కాదు= నాకు సాధ్యం కాదు; మత్‌+పరోక్షంబునన్‌= నేను లేనప్పుడు - నేను చనిపోయింతర్వాత; పునః+దార, పరి[గ్రహంబు+చేసి= మళ్ళీ భార్యను చేపట్టి; గృహస్ట్ర, ధర్మంబునుజ గృహస్టునియొక్క ధర్మాన్ని ల భార్యను పరి(గ్రహించి ధర్మార్ధకామాలను నడుపుతూ, వేదపారం, వైశ్సదేవాదిహోమం, అతిథిపూజ, పితృతర్పణం, భూతబలి అనే పంచయజ్ఞాలు చేయటం; అగ్నిహోత్రంబునున్‌; పుత్రులను; రక్షించునది; అనుచు; మరణ, వ్యవసాయంబు+అందు+ఉన్నజ చనిపోయే ప్రయత్నంలో ఉన్న; తల్లిని; తండడ్రిన్‌+చూచి; కూతురు; ఇట్టు+అనియె. తాత్పర్యం: “కావున నేను మీరు లేకుండ ఒక్క నిమిషమైనా జీవించలేను. ఒకవేళ జీవించినా ఈ బిడ్డలను రక్షించలేను. ఎట్లంటే వేదాధికారం లేని శూద్రులు వేదం వినటాన్ని కోరినట్టు, కులాచారానికి సరిపోనివాళ్ళు ఈ కన్యను కోరితే దానికి ప్రతీకారం చేయటానికికాని, ఈ కుమారునికి మంచిగుణాలు అలవడేటట్టు తగినళిక్షణ ఇవ్వటానికి కాని- నాకు శక్తి లేదు. నేను మరణించినా మీరు మరొక భార్యను చేపట్టి గృహస్టు ఆచరించవలసిన

ఆదిపర్వము - షష్టాశ్వాసము 629 ధర్మాన్ని, అగ్నిహోత్రాన్ని, పుత్రులను రక్షించండి" అని చనిపోయే ప్రయత్నంలో ఉన్న తల్లిని, తండ్రిని చూచి కూతురు ఈ విధంగా అన్నది.

ఆ. జలసి యెంతకాల ముండిన నేను మీ; దానంగాన, యొరుల ధనమ; నన్ను నెన్నడయయిన నొరుల కిచ్చుచో నసురకు । భోజనముగ నిచ్చి పుచ్చుం డిపుడ. 260 ప్రతిపదార్థం: ఒలసి= కలిసి, ఎంతకాలము+ఉండినన్‌: ఏను= నేను; మీ, దానన్‌; కాను+అజ కాదు; ఒరుల, ధనము+అ= ఇతరులయొక్క సొమ్మునే; నన్నున్‌; ఎన్నడు+అయినన్‌= ఏ రోజైనా? ఒరులకు= ఇతరులకు; ఇచ్చుచోన్‌= ఇవ్వవలసిఉండగా, ఇపుడు+ఆ= ఇప్పుడే; అసురకు= రాక్షసునికి; భోజనముగన్‌= ఆహారంగా; ఇచ్చి పుచ్చుడు= ఇచ్చిపంపండి. తాత్పర్యం: ఎంతకాలం మీతో కలిసి ఉన్నా నేను మీ దాన్ని కాను. ఇతరుల సొమ్మునే. ఎప్పుడైనా నన్ను ఇతరుల కివ్వటం తప్పనప్పుడు ఇప్పుడే ఈ రాక్షసునికి ఆహారంగా ఇచ్చి పంపండి. తే. తండ్రిచేయు తిలోదక దాన విధులు । పొందు. బరలోకగత యైన పుత్రియందు6 బుక్రి చేసిన విధులు దత్పురుషుం గాని । తల్లిదంద్రుల( బొందవు ధర్మయిక్తి, 261 ప్రతిపదార్థం: తండ్రి, చేయు; తిల+ఉదక, దాన, విధులు= నువ్వులు, నీళ్ళువదలటంవంటి తర్పణ(్రియలు; పర, లోకగత+ఐన= స్వర్గలోకానికి వెళ్ళిందైన: పుత్రి+అందున్‌; పొందున్‌= చేరుతాయి; పుత్రి= కూతురు; చేసిన; విధులు= కర్మలు: తత్‌+పురుషున్‌+కాని= దానియొక్క భర్తనే కాని; తల్లి తండ్రులన్‌: ధర్మయుక్తి= ధర్మం'ప్రకారం; పాందవు= చేరవు. తాత్పర్యం: తండ్రి వదలే నువ్వులు, నీళ్ళు మరణించిన కూతురికి చెందుతాయి కాని, కూతురు చేసే కర్మలు ధర్మప్రకారం ఆమె భర్తకే కాని తల్లిదండ్రులకు చెందవు. విశేషం: సందర్భం వచ్చినపు డంతా నన్నయ సంక్షిప్తంగా వైదికవిధులు వివరిస్తాడు. వ. 'మీకు నాయం దయ్యెడు దౌహిత్ర లాభంబునకంటె మీరిద్దలు జీవించిన ననేక పుత్ర పాత్ర లాభం బగు; దానంజేసి కులంబు నిలుచుం గావున నన్నుం బుచ్లుం' డనినం గూంతయం గౌంగిలించుకొని యేడ్డుచున్న వారల కన్నీళ్ళు దుడుచుచు. 262 ప్రతిపదార్థం: మీకు; నా+అందు+అయ్యెడు= నాయందు కలిగే. దౌహిత్ర, లాభంబునకంటె= మనుమని పుట్టుకకంటె; మీరు+ఇద్దజు; జీవించినన్‌= (బ్రదికిఉంటే; అనేక, పుత్ర, పొత్ర, లాభంబు+అగు= పెక్కుమందికుమారులు, మనుమలు కలగటం జరుగుతుంది; దానన్‌+చేసి= దానివలన; కులంబుజ వంశం; నిలుచున్‌: కావున; నన్నున్‌; వుచ్చుండు+అనినన్‌= పంపండి అని అనగా; కూంతున్‌; కాయిలించుకొని; ఏడ్చుచు+ఉన్న; వారల కన్నీళ్ళు తుడుచుచు. తాత్పర్యం: “మీకు నాయందు మనుమడు పుట్టటం అనే లాభంకంటె, మీరిద్దరు బ్రతికి ఉంటే పెక్కుమంది కుమారులు, మనుమలు పుట్టుతారు. వారివలన వంశం నిలుస్తుంది. అందుచేత నన్ను రాక్షసునికి ఆహారంగా పంపరిడని పలికిన కూతురిని కౌగిలించుకొని ఏడుస్తున్న తల్లిదండ్రుల కన్నీళ్ళు తుడుస్తూ, తే. బాలకుం డొకకొండుక కోల చేతం। బట్టికొని యేన రక్కసు6 గిట్టి చంపి చులుక వత్తు మీ రేద్వంగా వలవ, దనుచుం। గలయ నూరార్జె. దన తొక్కుణులుకు లొప్పు 263

630 శ్రీమదాంధ్ర మహాభారతము (ప్రతిపదార్థం: బాలకుండుజ చిన్నపిల్లవాడు; ఒక, కొండుక, కోల= ఒక చిన్నక(ర్రను; చేతన్‌+పట్టికొని; ఏన= నేను; రక్కసున్‌; కిట్టి= సమీపించి; చంపి; చులుకజ సులువుగ; వత్తుజ వస్తాను; మీరు+ఏడ్వంగా, వలవదు+అనుచున్‌= మీరు ఏడ్వ వ ద్దంటూ, తన తొక్కున్‌, పలుకులు= అవ్యక్తపు మాటలు - అంటే వచ్చీరాని మాటలు; ఒప్ప: కలయన్‌= అందరినీ చేరి; ఊరార్చెన్‌= ఓదార్చాడు. తాత్సర్యం: చిన్నపిల్లవాడు ఒక చిన్న కజ్జను చేత పట్టుకొని నేనే ఆ రాక్షసుడిదగ్గరకు వెళ్ళి చంపి సులువుగా తిరిగివస్తాను; మీరు ఏడ్వవద్దు” అని వచ్చీరాని మాటలతో అందరినీ చేరి ఓదార్చాడు. విశేషం: తొక్కుపలుకులు - అనేదానికి ముద్దుపలుకులు, తొట్రుపలుకులు, తొత్తుపలుకులు - అనేపారాంతరాలున్నాయి. -శ్రీమదాం(ధ్రమహాభారతసంశోధితప్రతి, పుట. 389, కుమారా'స్త్రవిద్యాప్రదర్శనఘట్టంలో వలె నన్న్మయ నాటకీయత ఈతేటగీతితో తాండవించింది. చిన్న కర్ర చేతపట్టుకొని, తడబడే అడుగులతో, వచ్చీరానిమాటలతో అందరినీ చేరి ఓదార్చే ఆ బాలకుడిని భావుకు డైన ప్రతిపారకుడు చూడగలడు. పై పద్యంలో అన్నీ ప్రాసయతులే. వ. వాని యవ్యక్త నచనంబులు విని యందటు నే డ్చుడిగిన, నయ్యవసరంబునం గుంతీదేవి వారల

డాయంబోయి. 264 ప్రతిపదార్థం: వాని, అవ్యక్త వచనంబులు= ఆ బాలకునియొక్క స్పష్టతలేని మాటలు - వచ్చీరాని మాటలు; విని; అందయున్‌; ఏడ్పు+ఉడిగిన= ఏడుపు మానగా?; ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన; కుంతీదేవి; వారల, డాయన్‌+పోయి= వారలదగ్గరకు వెళ్ళి. తాత్పర్యం: ఆ బాలకుని వచ్చీరాని మాటలు విని అందరూ ఏడ్పుమానగా, కుంతీదేవి వాళ్ళదగ్గరకు వెళ్ళి.

"మ

క. “ఇది యేమి తెలంగు? దీనికి; మొద లెయ్యది. నాకు దెల్లముగం జెప్పుండు తీ

ర్లైదొ నని విగతాసులం దన ; మృదు వచన ప్రశ్న మను నమృతమున నెత్తెన్‌. 265 ప్రతిపదార్థం: ఇది; ఏమి, తెఅంగు= ఏమి పద్దతి; దీనికి; మొదలు= కారణం; ఏ+అది=ఏది: నాకున్‌: తెల్లముగన్‌= స్పష్టంగా; చెప్పుడు; తీర్చెదన్‌+అని= తొలగిస్తా నని; విగత+అసులన్‌= పోయినప్రాణాలు కలవాళ్ళను; తన, మృదు, వచన, ప్రశ్నము+అను= తనయొక్క మెత్తనైన మాటలతో కూడిన (ప్రశ్న అనే; అమృతమునన్‌= అమృతంచేత; ఎత్తెన్‌=ఐ పైకెత్తింది - అంటే బ్రతికించింది. తాత్పర్యం: “ఇది ఏమిటి? దీనికి కారణ మేమి? నాకు స్పష్టంగా చెప్పండి. నే నీ ఆపదను తొలగిస్తాను అని తన మృదు వైన మాటలతో కూడిన ప్రశ్న అనే అమృతంతో వాళ్ళను బ్రతికించింది. విశేషం: అలం. రూపకం. వ ఇట్లడిగినం గుంతీదేవికి నవ్విప్రుం డిట్లనియె. 266 తాత్పర్యం: ఈ విధంగా అడిగిన కుంతీదేవికి ఆ బ్రాహ్మణుడు ఇట్టా అన్నాడు.

కుంతీదేవికి బ్రాహ్మాణుండు తనదుఃఖకారణంబును దెలుపుట (సం.1-148-1)

సీ పనేమి సెప్పుదు దీని నెవ్వరికిని; మానుషంబున దీర్చరాని దాని;

నయినను జెప్పెదం బ్రయహితవచన! యీ : ప్రోలికి నామడనేల నల్ల

యమునానదీ గహ్వరమున బకుం డను । రక్కసుం డుండి వా6 డక్కజముగ

నిందుల కాంపులనందజం దొల్లి యి। ల్వరుస మ్రింగుచు నున్న: బరమసాధు

ఆదిపర్వము - షష్టాశ్వాసము ఈ31

అ లగు ధరామరేంద్రు లగణిత జస హోము / దానవిధులం జేసి నానివబనః

గ్రనుము నడసి యొక్కసమయంబుం జేసిరి; , యొనర దానితెలంగు వినుము తల్లి! 267 ప్రతిసదాొర్ధం: మానుషంబునన్‌= మానవప్రయత్నంచేత; ఏ+వారికిని= ఎవరికికూడా; తీర్చరాని, దానిన్‌= తీర్చటానికి సాధ్యంకానిదానిని; దీనిన్‌; ఏను= నేను; ఏమి+చెప్పుదుఐ ఏమని చెప్పగలను? అయినను; ప్రియ, హిత, వచనజ వినటానికి ఇంపై మేలుచేసేమాటలు గలదానా! చెప్పెదను; ఈ్రోలికిన్‌= ఈపట్టణానికి?; ఆమడ, నేలన్‌= ఆమడ దూరంలో; అల్ల, యమునా, నద, గహ్వ్యరమునజ ఆ యమునానది దగ్గర కొండ గుహలో; బకుండు+అను; రక్కసుండు+ఉండి= రాక్షసుడుఉండి; వాడు+అక్కజముగన్‌= వాడు ఆళ్ళర్యకరంగా; ఇందుల కాపులన్‌+అందణన్‌= ఈపట్టణంలో కాపురముండే వాళ్ళనందరిని; చొల్లి= ఇదివరకు; ఇల్‌+వరుసజ ఇంటివరుసన; (మింగుచున్‌+ఉన్నన్‌; పరము, సాధులు+అగు= మిక్కిలి మంచివా ళ్ళృయిన; ధరా+అమర+ఇంద్రులజ భూసుర- అంటే బ్రాహ్మాణశ్రేష్టులు; అగణిత, జప, హోమ, దాన, విధులన్‌*చేసి=ఐ లెక్కింపసాధ్యంగాని జపాలు, హోమాలు, దానాలు అనేకర్మలను చేసి; వాని, వలనన్‌; ('క్రమము+పడసి= మార్గాన్ని పొంది; ఒక్క సమయంబున్‌= ఒక ఏర్పాటును; చేసిరి; తల్లి; ఒనర= ఒప్పుగా; దాని, తెజగు= దానియొక్కవిధం; వినుము. తాత్పర్యం: మానవ ప్రయత్నంచేత ఎవ్వరికీ తీర్చ సొధ్యంగాని ఆపదను గురించి ఏమని చెప్పగలను? ప్రియంగా, హితంగా మాట్లాడే ఓ తల్లీ! ఈ పట్టణానికి ఆమడ దూరాన యమునానదీ తీరాన ఉండే అడవిలో బకు డనే రాక్షసు డున్నాడు. వా డీ పట్టణవాసులను ఇంటివరుసగా మింగుతుండగా పరమ సాధువులైన (బ్రాహ్మణ శ్రేష్టులు లెక్కకు మిక్కిలిగా జప హోమ దాన సత్కర్మలు చేసి అతనితో ఒకఏర్పాటు చేసికొన్నారు. అది నీకు చెప్పుతాను విను. స, నిత్యంబు నిలువరున నొక్కనూనిసి రెండెనుపోతులం బూన్చిన శకటంబున నవరిమితభక్ష్యపిశిత

మిశ్రాన్నంబు నించికొవి పోయిన దానిని వానిని నయ్యెనుపోతులను భక్షించుచు. 268 ప్రతిపదార్థం: నిత్యంబున్‌= ప్రతిదినం, ఇలువరుసన్‌; ఒక్క, మానిసి= ఒక్కమనిషి రెండు+ఎనుపోతులన్‌= రెండు దున్నపోతులను; పూన్చినజ కట్టిన; శకటంబునన్‌= బండిలో; అపరిమిత, భక్ష్య, పిశిత, మిశ్రాఅన్నంబు= అంతులేని తినుబండారాలతో మాంసంతో కలిపిన అన్నం; నించికొని= నింపుకొని; పోయినణ పోతే; దానినిజ ఆ అన్నాన్ని; వానిని; ఆ+ఎనుపోతులను; భక్షించును, తాత్సర్యం: ప్రతిదినం ఇంటివరుసన ఒక మనిషి రెండు దున్నపోతులను కట్టిన బండిలో అపరిమిత మైన తినుబండారాలు, మాంసంతో కలిపిన అన్నాన్ని నింపుకొని వెళ్ళితే, వాడు ఆ అన్నాన్నీ, మనిషినీ, ఆ దున్నపోతులనూ తింటూ. ఈ. మనుజభక్షుండివియ తనకు నప్పనముగా । నొరులనలనిబాధ నొరయకుండ

దీనింగాచుచుండు నీనాంటిరాజును : దలయం డసుర నోర్వ బలిమిలేమి, 269 ప్రతిపదార్దం: మనుజ, భక్షుండుః మానవులను తినేవాడు - రాక్షసుడు; ఇదియజ ఇదే; తనకున్‌: అప్పనముకాన్‌= కానుకగా; ఒరుల, వలని, బాధన్‌= ఇతరులనలన కలిగేబాధ; ఒరయక+ఉండ= కలుగకుండ; దీని= ఈపట్టణాన్ని; కాచుచుండున్‌= రక్షిస్తోఉన్నాడు: ఈ, నాటి, రాజును ఈ దేశపు రాజుకూడ; అసురన్‌= రాక్షసుడిని; ఓర్వన్‌= అణచటానికీ; బలిమిలేమి= బలంలేకుండటంచేత; తలపడ దీన్నిగురించి ఆలోచించడు, తాత్సర్యం: రాక్షసుడు ఇదే తనకు కానుకగా భావించి, ఇతరులవలన ఈ పట్టణానికి బాధ కలగకుండ రక్షిస్తూ ఉన్నాడు. ఈ దేశ 'ప్రభువుకూడ రాక్షసుడిని చంపగలశక్తి లేని వా డవటంచేత దీన్ని గురించి ఆలోచించడు.

632 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: అప్పనము - అనేదానికి జీవితము, వర్తనము, వేతనము, జీవనము అనేపారాంతరా లున్నాయి. -శ్రీమదాంద్ర మహాభారత సంశోధిత'ప్రతి, పుట. 290. పై పద్యంలో అన్నీ ప్రాసయతులే. ఉ. పోలంగ ధర్మశీలుండయి భూరిబలాధికు. డైన ధారుణీ పాలకు రక్ష ము న్వడసి భార్యను బుత్తుల నర్ధయుక్తితో నోలివ మేలుగాం బడసి యూళ్ళను నున్నది యట్లుగాని నాం డేల గృహస్థవృత్తి సుఖమేంగి వనంబున నున్మి కష్టమే. 270 ప్రతిపదార్థం: పోలంగ= ఒప్పుగ; ధర్మ, శీలుండు+అయి= ధర్మం స్వభావంగా కలవాడై; భూరి, బల+అధికుండు+ఐన= పెద్దబలంచేత గొప్పవా డైన; ధారుణీ, పాలకు, రక్ష= భూమిని ఏలే రాజుయొక్క అండ; మున్‌+పడసి= ముందుగా పొంది; భార్యను, పుత్రులన్‌; అర్థ, యిక్తితో= ధనంయొక్కకూడికతో - అంటే ధనంకలిగి; ఓలినజ వరుసగా; మేలుగాన్‌; పడసి= పొంది; ఊళ్ళను+ఉన్నది= ఊళ్ళలో కాపురమున్నట్టిది (తగినపద్దత్రి; అట్టు+కాని, నాండు; ఏల=ఎందులకు? గృహస్థ, వృత్తి= గృహస్థ్రధర్మం; సుఖమె= సుఖమా! ఏంగి= వెళ్ళి; వనంబునన్‌= అడవిలో; ఉనికిజఐ ఉండటం; కష్టమే= కష్టమా! తాత్పర్యం: ధర్మాత్ముడు, బలవంతుడు ఆయిన రాజుయొక్క రక్షణ పొందిన తర్వాత వివాహమాడి, పిల్లలను కని, ధనం సంపాదించి, ఊళ్ళలో కాపురముండాలి కాని, అది లేని నాడు గృహస్ట్రవృత్తి ఎందుకు? అది సుఖాన్ని ఇయ్యగలదా! వెళ్ళి అడవిలో ఉండటం కష్టమా! అదే సుఖం గదా! విశేషం:. సందర్భోచితంగా ఈ పద్యం రాజధర్మాన్ని చెప్పుతున్నది. క. _ అరియని విఫ్రులచేతను, ధరణీశులు పోకళయును మొదలుగాం గొన రె న్వరు నిప్పాపుండు మానిసి । నరిగొనియెడు భక్షణార్థి యై విఫ్రులచేన్‌. 271 ప్రతిపదార్థం: ధరణి+ఈశులు= భూమీకిప్రభువులు - రాజులు; ఎవ్వరున్‌= ఎవరుకూడ; విఫ్రులచేతను= (బ్రాహ్మాణులచేత; అరి+అని= కప్పమని; పోకయును, మొదలుగాన్‌= వక్కనుకూడ; కొనరు= తీసికొనరు; ఈ+పాపుండు= ఈ పాపాత్ముడైన రాక్షసుడు; భక్షణ+అర్జి+ఐ= తిండికోరినవా డై; విఫ్రులచేన్‌= బబ్రాహ్మణులచేత; మానిసిన్‌= మనిషిని; అరిగొనియెడు= కప్పంగా తీసికొంటున్నాడు. తాత్పర్యం: రాజులు బ్రాహ్మణులనుండి పోకచెక్కను కూడా కప్పంగా తీసికొనరు. కాని ఈ పాపాత్ముడైన రాక్షసుడు తిండికొరకు వి(ప్రులనుండి మనిషినే కప్పంగా తీసికొంటున్నాడు. విశేషం: పోకయు అనేదానికి రూకయు, రూకయు అనే పారాంతరా లున్నాయి. -1భ్రీమదాం(ధ్రమహాభారతసంశోధిత ప్రతి, పుట. 391 వ. . 'పెద్దకాలంబునకు నీ యిలువరుస నేడు మాకు వచ్చె; ని చ్చిలుత వాని నా రాక్షసునకు భక్ష్యంబుగాం బుచ్చనోప; నేన పోయెద' నని దుణించి పలికిన బ్రాహ్మణునకుం గుంతి యిట్లనియె; “నయ్యా! దీనికి సంతాపింపవలవ; దీయాపద దలంగునట్టి యుపాయంబు గంటి; నీకుం గొడు కొక్కరుండ; వాండును గడుబాలుండు; బలిగొనపోవ నర్హుండు గాండు; నా కేవురుగొడుకులు గలరు; వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్ధంబుగా బలిగొని పోయెడు' ననిన దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యి ట్లనియె. . 272 ప్రతిపదార్థం: పెద్దకాలంబునకున్‌= చాలాకాలానికి; ఈ+ఇలు, వరుస; నేండు= ఈ రోజు; మాకు; వచ్చెన్‌: ఈ+చిటుత, వానిన్‌=ఐ ఈ చిన్నవాడిని; ఆ రాక్షసునకు; భక్ష్యంబు+కాన్‌= ఆహారంగా; పుచ్చన్‌+ఓపన్‌= పంపలేను; నేను+అ= నేనే; పోయెదను+అని; దుఃఖించి, పలికిన; బ్రాహ్మణునకున్‌; కుంతి; ఇట్టు+అనియెన్‌; అయ్యా; దీనికి; సంతాపింప, వలవదు=

ఆదిపర్వము - షష్టాశ్వాసము 633 దుఃఖించవద్దు; ఈ+ఆపద, తలంగునట్టి= తాలగిపోయేటి; ఉపాయంబు+కంటి= ఉపాయాన్ని కనుగొన్నాను; నీకున్‌; కొడుకు; ఒక్కరుండు+అ= ఒక్కడే; వాడును; కడు= మిక్కిలి; బాలుండు= పసివాడు; బలికొనిపోవన్‌= ఆహారం తీసికొనిపోవటానికి; అర్హుండు= తగినవాడు; కాండు; నాకు+ఏవురు, కొడుకులు= నాకు ఐదుగురు కొడుకులు; కలరు; వారలలోన్‌= ఒక్కరుండు; ఆ రక్కసునకు; భవత్‌+అర్హంబుగాజ మీ కోసం; బలి, కొని, పోయెడున్‌= కప్పం తీసికొనివెళ్ళగలడు; అనిన; దాన్గిన్‌= ఆ మాటను; వినన్‌*ఓడి= వినలేక; బ్రాహ్మాణుండు; చెవులు; మూసికొని; ఇట్టు+అనియె. తాత్పర్యం: “చాలా కాలానికి ఈ యింటి వరుస నేడు మా యింటికి వచ్చింది. ఈ పసిబాలుడిని రాక్షసునికి ఆహారంగా పంపలేను. నేను పోతాను' అని బ్రాహ్మణుడు దుఃఖంతో పలుకగా, కుంతి “అయ్యా! దీనికి దుఃఖించవద్దు. ఈ ఆపద తొలగే ఉపాయం నేను ఆలోచించాను. నీకు ఒక్కడే కొడుకు. వాడు పసివాడు. బకుడికి బలితీసుకొనిపోవటానికి అర్హుడు కాడు. నాకు ఐదుగురు కొడుకులు. వాళ్ళలో ఒకడు మీకు బదులుగా ఈ బలి తీసికొని వెళ్ళగలడు' అని అంటూనే బ్రాహ్మణుడు ఆ మాటలు వినలేక చెవులు మూసికొని ఆమెతోఇట్లా అన్నాడు. మధ్యాక్కర,

అతిథి యై వచ్చిన బ్రాహ్మణున్‌ జీవితార్థి నై నాకు

హితముగా రక్కసువాత. ద్రోవ నే నె ట్లాడంబడుదు?

మతి నవమానింపం గా దనిన విస్రమరణంబు దలంచు

॥ 273

టతిపాతకము; పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద. ప్రతిపదార్థం: అతిధి+ఐ, వచ్చిన; బ్రాహ్మణున్‌? జీవిత+అర్థిని-ఐ= (బ్రతుకు కోరుకొన్నవాడి నై; నాకు, హితముగా= నాకు మేలుకలిగేటట్టుగా; రక్కసు, వాతన్‌= రాక్షసుడి నోటిలో; (త్రోవన్‌= త్రోయటానికి; ఏను= నేను; ఎట్టు ఏవిధంగా: ఒడంబడుదు= ఒప్పుకొంటాను; మతిన్‌= మనస్సులో; అవమానింపన్‌+కాదు+అనిన= అవమానించతగదు. అనగా; విప్ర, మరణంబు= (బ్రాహ్మణునియొక్క చావును; తలంచుట, అతి, పాతకము= మహాపాపం; పాతకములలో= పాపాలలో; (బ్రహ్మహత్యయు+అ= (బ్రాహ్మణుడినిచంపటమే; పెద్దజ సెద్దపాపం. తాత్పర్యం: అతిధిగా వచ్చిన (బ్రాహ్మణుడిని, నా జీవితాన్ని నిలుపుకొనే కోరికతో- నాకు మేలు కలిగేటట్టుగొ- రాక్షసునిబారిన పడవేయటానికి నే నెట్టా అంగీకరిస్తాను? అసలు (బ్రాహ్మాణులను అవమానించే సంకల్పమే పాపమైతే విప్రుని మరణాన్ని సంకల్పించటం మరెంత పాపమో! పాతకా లన్నింటిలో బ్రాహ్మణ హత్య మహా పాపం. (పెద్దది). విశేషం: మధ్యాక్కర లక్షణం చూడు. ఆది. 6.166. ఇది ధార్మికసూక్తి, క ధృతి సెడి వేండెడువానిని । నతిథిని నభ్యాగతుని భయస్సుని శరణా

గతు6 జంప6గ నొడంుడు దు ర్మతి కిహముం బరముం గలదె మదిం బరికింపన్‌. 274 (ప్రతిపదార్థం: ధృతి+చెడిజఐ ధైర్యంపోయి; వేండెడు, వానిని= ప్రార్ధించేవాడిని; అతిథిని; అభి+ఆగతుని= భోజననమయానికి వచ్చిన అతిధిని; భయస్టుని= భయపడేవాడిని; శరణ+ఆగతున్‌= శరణుకోరి వచ్చినవాడిని; చంపంగన్‌? ఒడ, పు ఇష్టప 1 దుర్‌+మతికి= చెడ్డబుద్ధికలవాడికి; మదిన్‌= మనస్సులో; పరికింపన్‌=ఆలోచిస్తే; ఇహమున్‌+పరమున్‌= ఇహలోకపరలో కసుఖ౦; కలదె= కలదా! (లేదని భావం). తాత్సర్యం: ధైర్యాన్ని కోల్పోయి ్రార్థించేవాడిని, అతిథిని, అభ్యాగతుడిని, భయపడేవాడిని, శరణు కోరి వచ్చిన వాడిని చంపాలనుకొనే దుర్మార్గునికి ఇహలోక పరలోక సుఖ ముంటుందా! (ఉండదు).

634 శ్రీమదాంధ్ర మహాభారతము

విశేషం: ఇది ధార్మికసూక్తి,

న. 'మజి యాత్మఘాతంబు మహాపాతకంబు; దాని కెట్లొాడంబడి తంటేని యది యనతిక్రమణీయం బయి యప్రతీకారం బయి యొరులచేతం జేయంబడుటంజేసి నాకుం బాతకంబు లేదు; దానిం జేసినవానికి మహాపాతకం బగుం గావున బ్రాహృ్మణహింస కే నొడంబడ నోప' ననినం గుంతి యి ట్లనియె. 275

ప్రతిపదార్థం: మతి; ఆత్మ ఘాతంబు= తనను తాను చంపుకోవటం; మహా, పాతకంబు= మిక్కిలిపాపం; దానికి ఎట్టు+ఒడంబడితివి+అంటి+ఏని= ఏ విధంగా అంగీకరించావు అని అంటా వేమో; అది; న+అతిక్రమణీయంబు+అయి= దాటంాని దై అప్రతీకారంబు+అయి= మారుసేత లేనిదై; ఒరులచేతన్‌+*చేయన్‌+పడుటన్‌+చేసి=ఐ ఇతరులచేత శేయబడటంవలన; నాకున్‌; పాతకంబు= పాపం; లేదు; దానిన్‌+*చేసిన, వానికి; మహా, పాతకంబు= మిక్కిలిపాపం; అగున్‌; కావున; బ్రాహ్మణ, హింసకు= (బ్రాహ్మాణమరణానికి; ఏన్‌= నేను; ఒడంబడన్‌+ఓపన్‌= ఇష్టపడలేను; అనినన్‌; కుంతి; ఇట్టు+అనియె.

తాత్పర్యం: 'తనను తాను చంపుకొనటం (ఆత్మహత్య) మహాపాపం కదా! దాని కెట్టా అంగీకరించా వని

అంటావేమో- అది దాటరాని ద్రై మారుచేయటానికి వీలులేని దై, ఇతరులచేత చేయబడుతున్నది కనుక నాకు

పాపం లేదు. దానిని చేసినవాళ్ళకే మహాపాపం కనుక నేను బ్రాహ్మాణహింసకు (అంటే మీ కుమారుడిని బకుడికి ఆహారంగా పంపటానికి) ఇష్టపడలే" నని పలుకగా కుంతి ఇట్టా అన్నది. బకుని. జంప భీముని. బంపుటకు. గుంతి నిశ్చయించుట (సం.1-149-13)

క. ఏనునుదీనిన తలంచి మ। హీనుత! విప్రవధ యెద సహింపక మజీి నా సూను సమర్పించితి; మ : త్వూను వధింపంగ రక్కసునకు వశంబే? 276

ప్రతిపదార్థం: మహీ, నుత= లోకంచేత కొనియాడబడేవాడా!; ఏనును= నేనుకూడ; దీనిన్‌+అ= దీన్నే; తలంచి= ఆలోచించి; విప్ర, న!

వధ= (బ్రాహ్మాణునియొక్కచంపటాన్ని - అంటే బ్రాహ్మాణుడినిచంపటాన్ని; ఎద, సహించకజ మనస్సులో ఓర్వకః మథిః నా,

సూనుజ=ు నాయొక్కకుమారుడిని; సమర్చించితి= ఇచ్చాను; మత్‌+సూను, వధింపంగజ నాయొక్కకుమారుడిని చంపటం;

రక్కసునకుజ రాక్షసుడికి; వశంబె= సాధ్యమా? (కాదని భావం).

తాత్సర్యం: నేను గూడ దీన్నే ఆలోచించి (బ్రాహ్మాణ వధను సహింపక నా కుమారుణ్ణి బకాసురుడికి

అర్పిస్తానన్నాను. నా కుమారుడిని చంపటం ఆ రాక్షసుడికి సాధ్యం కాదు.

క ఖలు నసుర నోర్వ నోపెడు । బలయుతులా నెజింగి కొదుకుం బనిచెదం గా; కి మ్ముల శతపుత్తులు గల ధ। న్యుల కైన ననిష్ణుండగు తనూజుండు గలండే? 277

అనో

ప్రతిపదార్థం: ఖలున్‌+అసురన్‌+ఓర్వన్‌+ఓపెడు= దుర్మార్లు డైన రాక్షసుడినిచంపగలిగిన; బలయుతుగాన్‌= బలంతోకూడుకొన్న

వానిగా: ఎజింగి= తెలిసికొని; కొడుకున్‌; పనిచెదన్‌= పంపుతున్నాను; కాక= అట్టా కాక; ఇమ్ముల= సుఖంగా; శత, పుత్రులు=

నూరుమంది. కొడుకులు; కలః= ఉన్నట్టీ; ధన్యులకు+ఐనన్‌= పుణ్యాత్ముల కైనా; అనిష్టుండు+అగు= ఇష్టంకాని వాడైన; తనూజాండు= పుత్రుడు; కలండే= ఉన్నాడా? (ఉండ డని భావం),

తాత్పర్యం: దుర్మార్లు డైన రాక్షసుడిని చంపగల బలవంతు డని తెలిసే నా కుమారుడిని పంపుతున్నాను. కాకుంటే వందమంది కొడుకు లున్నవాళ్ళ కయినా ఇష్టంకాని కొడుకు ఉంటాడా?

ఆదిపర్వము - షష్టాశ్వాసము 635 వ. 'ఈతనిచేతం దొల్లియుం బెక్కం ద్రసురులు నిహతు లయిరి' వీడు మహాబలసంపన్నుండు మంత్రసిద్దుం; డని భీముం బిలిచి 'యీ బ్రాహ్మణునాపదం దల(గి నాకు మనఃప్రెయంబు సేయు'మనిన వల్లె యని భీముం డారక్కసు6. జంపం బూనె; బ్రాహ్మణుండును దనబంధువర్గంబుతో సంతసిల్లె; నంత ధర్మార్దుననకుల సహదేవులు వచ్చి పరమహర్షపరిపూర్జుం డై యున్న పవనతనయునాకారం బుపలక్షించి విస్కితులగుచుండ ధక్మతనయుం డల్లనం దల్లికి ని ట్లనియె. 278 ప్రతిపదార్థం: ఈతనిచేతన్‌; తొల్లియున్‌= ఇదివరకుకూడ; పెక్కండ్రు+అసురులు= పెక్కుమంది రాక్షసులు; నిహతులు+ అయిరి= చంపబడినవా ళ్ళయ్యారు; వీండు; మహాబల, సంపన్నుండు= మిక్కిలి బలసంపద కలవాడు; మంత్రసిద్దుండు= మంత్రసిద్ది కలవాడు; అని; భీమున్‌; పిలిచి; ఈ, బ్రాహ్మణుని; ఆపదన్‌; తలంగి= తొలగించి; నాకు; మనఃప్రియంబు= మనస్సుకు సంతోషం; చేయుము; అనిన; వల్లె+అని= సరే అని; భీముండు; ఆ, రక్కసున్‌; చంపన్‌+పూనె= చంపటానికి పూనుకొన్నాడు; (బ్రాహ్మణుండును; తన, బంధు, వర్గంబుతో= తనయొక్క బంధువుల సమూహంతో; సంతసిల్లైన్‌= సంతోషించాడు; అంత= తర్వాత; ధర్మ+అర్జున, నకుల, సహదేవులు; వచ్చి; పరమ, హర్ష పరిపూర్ణుండు+ఐ= మిక్కిలిసంతోషంతో నిండినవా డై; ఉన్న; పవన, తనయు+ఆకారంబు= వాయుపుత్రు డైన భీమునియొక్కరూపాన్ని; ఉపలక్షించి= చూచి; విస్మితులు+అగుచు+ఉండ= ఆశ్చర్యం పొందినవా రవుతుంటే; ధర్మతనయుండు= ధర్మరాజు; అల్లనన్‌= మెల్లగా; తల్లికిన్‌, ఇట్టు+అనియె. తాత్సర్యం; 'ఇతడు ఇదివరకుకూడ పెక్కుమంది రాక్షసులను చంపాడు. ఇతడు మహాబలవంతుడు. మంత్రసిద్ధి కలవాడు” అని భీముడిని పిలిచి 'ఈ బ్రాహ్మణుని ఆపద తీర్చి నా మనసుకు సంతోషాన్ని కూర్చు'మనగా సరే అని భీముడు ఆ రాక్షసుడిని చంపటానికి పూనుకొన్నాడు. (బ్రాహ్మాణుడుకూడ తనబంధువులతో కలిసి సంతోషించాడు. తరువాత ధర్మరాజు, అర్జునుడు, నకులసహదేవులు వచ్చి మహానందంతో ఉండే భీముని రూపాన్ని చూచి ఆశ్చర్యపడుతుండగా ధర్మరాజు మెల్లగా తల్లితో ఇట్లా అన్నాడు. చ నరనుతకీర్తియీ యనిలనందనుం దెవ్వరితోడనేని భీ కరసమరంబు సేయ సమకట్టినయట్లు మహానురాగ ని ర్థరమున నున్నవా6 డితనిభావము సూదడంగ వేజు; వీని సు స్థిరబలు మీరు పంచితిరొ? చెచ్చెరం దాన యుపక్రమించెనో? 279 ప్రతిపదార్థం: నర, సుత, క్రీర్తి మనుష్యులచేత పొగడబడిన కీర్తిగలవాడు; ఈ+అనిల, నందనుండు= ఈవాయుపుత్రుడు - భీముడు; ఎవ్వరితోడన్‌*ఏని= ఎవ్వరితో నైనా? భీకర, సమరంబు+చేయ= భయంకర మైన యుద్ధం చేయటానికి; సమకట్టిన+అట్టు= పూనుకొన్నట్టు: మహా+ అనురాగ, నిర్భరమునన్‌+ఉన్నవాండు= గొప్పసంతోషంచేత నిండిన ట్లున్నాడు; ఇతని, భావము+చూడంగ= ఇతనియొక్క స్ట్రితిని చూస్తే; వేటు మార్పుగా ఉన్నది; సుస్టిరబలు= మిక్కిలి నిలకడగల బలంగలవాడీని; వీని= ఈ భీముడిని; మీరు; పంచితిరొ= ఆజ్ఞాపించారా; చెర+చెరన్‌= వెంటనే; తాను+అజఐ తనంతట తానే; ఉప(క్రమించెనో= పూనుకొన్నాడో! తాత్పర్యం: భీముడు ఎవరితోనో భయంకర యుద్దం చేయటానికి పూనుకొన్నట్టు మహాసంతోషంగా ఉన్నాడు ఇతని స్థితి చూస్తే ఎప్పటిలాగ లేదు. ఈ భీముడిని మీరు ఆజ్ఞాపించారా? లేక తనంతట తానే యుద్దాని పూనుకొన్నాడా? వ. అని యడిగిన ధర్మతనయునకుం గుంతీదేవి 'యీ యేకచక్రపురంబున బ్రాహ్మణుల బకాసురుండు బాధించు టయు. దమ విడిసిన యింటిబ్రాహ్మణుని కైన యాపదయు, దానిం దీర్పం బవనతనయు బ్రాహ్మణార్థంబుగా. దనసమర్సించుటయుం జెప్పిన విని ధర్మజుండు దుఃఖించి 'యిది యేమి సాహసంబు

636 శ్రీమదాంధ్ర మహాభారతము

సేసితి? రొడ్గకొడుకులకుంగా. దమకొడుకుల విడుచు దుర్చుద్ధులునుం గలరె; యిదిలోకాచారవిరుద్ధంబు;

మణి భీమసేనుయ మీకు విడువందగియెడు కొడుకే? 280 (ప్రతిపదార్థం: అని; అడిగిన; ధర్మతనయునకున్‌; కుంతీదేవి; ఈ+ఏకచ(క్ర పురంబున, బ్రాహ్మణుల= ఈ ఏకచ(క్రపురంలోని (బ్రాహ్మణులను; బక+అసురుండు; బాధించుటయున్‌; తమ, విడిసిన=ఐ తమయొక్కవిడిది చేసిన; ఇంటి= ఇంటిలోని: (బ్రాహ్మణునికి+ఐన= (బ్రాహ్మణునికి కలిగిన) ఆపదయు, దానిన్‌+తీర్చన్‌= దానిని తీర్చటానికి; పవన, తనయు= వాయుదేవునీయొక్కకుమారు. డైన భీముడిని; బ్రాహ్మణ+అర్థంబుగాన్‌= బ్రాహ్మణునికొాఅకు; తన, సమర్పించుటయున్‌= తనయొక్కఇవ్వటం - అంటే తా నివ్వటం; చెప్పిన; విని; ధర్మజుండు; దుఃఖించి; ఇది+ఏమి; సాహసంబు+చేసితిరి; ఒడ్డ, కొడుకులకున్‌+కాన్‌= ఇతరులయొక్క కొడుకులకొరకు; తమ, కొడుకుల; విడుచు= వదిలే; దుర్‌+బుద్దులునున్‌= చెడుబుద్ది కలవారుకూడ; కలరె= ఉన్నారా? ఇది; లోక+ఆచార, విరుద్దంబు= లోకంయొక్కపద్ధతికి వ్యతిరేక మైనది; మణి= అంతేకాక; భిమసేనుండు; మీకున్‌; విడువన్‌+తగియెడి; కొడుకే. (విడువదగిన కొడుకు కాడని భావం). తాత్పర్యం: అని అడిగిన ధర్మరాజుకు కుంతీదేవి ఏకచ(క్రపురంలోని (బ్రాహ్మణులను బకాసురుడు బాధించటాన్నీ, తాము విడిది ఉన్న ఇంటి బ్రాహ్మణునికి కలిగిన ఆపదను, దాన్ని తీర్చటానికి బ్రాహ్మణునికొరకు తాను భీముడిని పంపటాన్నీ చెప్పగా విని ధర్మరాజు దుఃఖించి - “ఇదేమి సాహసం, ఇతరుల కొడుకులను రక్షించటానికి తమ కొడుకులను కోల్పోయే దుర్చుద్దులు ఉన్నారా! ఇది లోకపద్దతికి విరుద్దం. అంతే కాదు, భీమసేనుడు మీకు విడువదగిన కుమారుడా? సీ. ఇతని విక్రమ మాశ్రయించియ కాదె య । య్యెడ లక్కయిల్లు వెల్వడంగం గంటి;

మడవిలో నిబ్రావశాత్ముల మై యున్న; మననిద్రం జెటుపం గా దని హిడింబు

నెడగల్గం గొనిపోయి యెక్కటి సంపిన | దండితశత్రుం డీతంద కాండె!:

యితనిబల్నిన కాదె యెంతయు ఖీతు లై: ధృతరాష్త్రనందనుల్‌ ధృతియుం దటింగి ఆ. నిద్రలేక తమకు నిలుచు నుపాయంబు । లొండుదక్కి వెదకుచున్నవారు;

బలియు నిట్టిభీము బ్రాహ్మణార్థమ్ముగా | నసురవాతంద్రోతు రవ్వ! యిట్లు. 281 ప్రతిపదార్థం: ఇతని, వ(క్రమము+ఆశ్రయించియ, కాదె= ఇతనిపరాశ్రమాన్ని ఆధారం చేసికొనేకదా? ఆ+ఎడ= ఆ చోట; లక్క+ఇల్టు; వెలువడన్‌+కంటిమి= లక్కయింటి నుండి బయటపడ గలిగాము; అడవిలో; ని[ద్రా+అవశ+ ఆత్ములము+ఐ= నిద్రలో స్వాధీనం లేని దేహాలు గలవారమై; ఉన్న; మన, ని'ద్రన్‌; చెటుపన్‌+కాదు+అని= చెడగొట్టికూడ దని; హిడింబున్‌; ఎడ+కలుగన్‌= దూరముండేటట్టుగా - అంటే దూరంగా; కొనిపోయి= తీసికొని పోయి; ఎక్కటి= ఒక్కడుగా; చంపిన; దండిత, శత్రుండు= దండింపబడిన శత్రువులు కలవాడు; ఈతండు+అ, కాడె= ఇతడే కదా! ఇతని, బల్మిన, కాదె= ఇతనిబలంచేతనే కదా; ఎంతయు= ఎంతేని - అంటే మిక్కిలి; భితులు+ఐ= భయపడినవా రై; ధృతరాష్టనందనుల్‌= ధృతరా(్ర్రునియొక్క కుమారులు

  • కౌరవులు; ధృతియున్‌+తలిగి= ధైర్యం తగ్గి? నిద్రలేక; తమకు; నిలుచు+ఉపాయంబులు+ఒండు+తక్కి= నిలబడునట్టి ఉపాయాలు ఇతరాలు లేక; వెదకుచు+ఉన్నవారు; బలియున్‌= బలవంతు డైన వాడిని; ఇట్టి భిము= ఇటువంటి భీముడిని; (బ్రాహ్మాణ+అర్హంబుగాన్‌= (బ్రాహ్మణునికోసం; అసుర, వాతన్‌= రాక్షసునినోట; అవ్వ= అమ్మా; ఇట్టు; త్రోతుర= తోస్తారా! తాత్పర్యం: ఇతని పరాక్రమాన్ని ఆశ్రయించే కదా అక్కడ లక్కయింటినుండి బయటపడగలిగాము. మనం మైమరచి నిద్రించేటప్పుడు మన నిద్రకు భంగం కలగకూడ దని, హిడింబాసురుడిని దూరంగా తీసికొనిపోయి ఒంటరిగా చంపిన వా డిత డేకదా! ఇతని బలం చూచే గదా భయపడి కౌరవులు ని(ద్రలేక తమకు నిలిచే ఉపాయాలు- అంటే (బ్రతికిబట్టకట్టే ఉపాయాలు- వెదకుతున్నారు. అమ్మా! అట్టాంటి బలవంతు డైన భీముడిని బ్రాహ్మణునికోసం బకాసురుని నోట్లో ఇట్లా తోస్తారా!

ఆదిపర్వము = షష్టాశ్వాసము 637

వు 'అక్కట! దుఖాతిశయంబున మతిభ్రమణం బయ్యెం గా కేమి"? యనినం గొడుకునకుంగుంతి యిట్లనియె. 282 ప్రతిపదార్థం: అక్కట; దుఃఖ+అతిశయంబున= దుఃఖంయొక్క ఎక్కువచేత; మతి, (భ్రమణంబు+అయ్యెన్‌+కాక+ఏమి= బుద్ధి తిరుగుడుపడటం జరిగిందా ఏమి - అంటే చిత్తచాంచల్యం ఏర్పడిందా ఏమి? అనిన; కొడుకునకున్‌; కుంతి; ఇట్టు+అనియె. తాత్పర్యం: “అయ్యో! దుఃఖం అమితంగా ఏర్పడటంవలన మతిభ్రమణం జరిగిందా ఏమి?" అని అనగా ధర్మరాజుతో కుంతీదేవి ఈ విధంగా పలికింది. ఆ. భ్రమవిమోహలోభభయపరిభూత నై; కొడుకు విడువ నంత వెడంగ నయ్య!

యేను భీముశక్తి యెటుంగక పంచిన | దానం గాను; వినుము వీనిశక్తి. 283 ప్రతిపదార్హం: (భ్రమ, విమోహ, లోభ, భయ, పరిభూతను+ఐ= భ్రాంతిచేత, మిక్కిలిమోహంచేత, ఆశచేత, భయంచేత, పీడింపబడినదాన నై; కొడుకు= కొడుకును; విడువన్‌= వదలిపెట్టటానికి; అంత, వెడగను+అయ్య= అంత వెజ్లిదాన్నటయ్యా! ఏనుజ నేను; భీము, శక్తి భీమునియొక్కశక్తి; ఎజుగంక; పంచినదానను= ఆజ్ఞాపించినదానిని; కాను= కాదు; వీని, శక్తి: వినుము, తాత్చర్యం; భ్రాంతికి, మోహానికి, ఆశకు, భయానికి వశమై కొడుకును పోగొట్టుకొనటానికి నే నంత వెజ్డీదా న్నటయ్యా! భీమునిశ్తి తెలియక నేనీ పని అప్పగించలేదు. ఇతనిశక్తి వినుము. తే... వీండు పుట్టిన పదియగునాండు పెలుచం। బడియె నా చేత నుండి య ప్పర్వతమునం।

బడినవడిం జేసి బాలకు నొడలు చాంకి; యచటి రాలెల్లం బెల్లు నుగ్గయ్యెంజూవె. 284 ప్రతిపదార్థం: వీయ= ఈ భీముడు; పుట్టిన; పది+అగు, నాండు= పదవరోజు; నాచేతన్‌+ఉండి; ఆ+పర్వ్పతమునన్‌= ఆ కొండమీద; పెలుచన్‌= గట్టిగా? పడియె; పడిన, వడిన్‌+చేసి=ఐ పడినవేగంచేత; బాలకు+ఒడలు+తాంకి= బాలకునియొక్కశరీరం తగిలి; అచటి; రాలు+ఎల్లన్‌= రాళ్ళన్నీ; పెల్టు= అధికంగా; నుగ్గు+అయ్యెన్‌+చూవె= పొడి ఆయ్యాయి సుమా! చాత్సర్యం: ఈ భీముడు పుట్టిన పదవరోజు నా చేతినుండి జారి ఆ పర్వతంమీద గట్టిగా పడ్డాడు. వేగంతో పడ్డ వాడిశరీరం తగిలి అక్కడి రాళ్ళన్నీ పొడి అయ్యాయి సుమా! వు అట్టి వజ్రకాయుండు వజ్రధరు నయిన నోర్వనోపు నట్టి సమర్భుండు; రక్కసు నశ్రమంబునం జంపి యిందుల

బ్రాహ్మణులబాధ యుడుచుం; బవనతనయు నుద్దేశించి సంతాపింపనలవదు; మనకు సుఖనివాసంబు

సేసి పరమోపకారి యైన యాబ్రాహ్మణునకుం బ్రత్యుపకారంబు సేయ సమకూరె. 285 (ప్రతిపదార్థం: అట్టి; వజ్రకాయుండు= వజ్రంవంటి దేహం కలవాడు; వజ్రధరున్‌+అయినన్‌= వజ్రాయుధాన్ని ధరించిన దేవేంద్రుడిని అయినా; ఓర్వన్‌+ఓపునట్టి, సమర్భ్హుండు= జయించగలిగినట్టి శక్తికలవాడు; రక్కసున్‌= రాక్షసుడిని; అ(శ్రమంబునన్‌= శ్రమలేకుండ - సులువుగా; చంపి; ఇందుల= ఈ ఏకచ(క్రపురంలోని; (బ్రాహ్మణుల, బాధ, ఉడుచున్‌= పొగొట్టుతాడు; పవన, తనయున్‌* ఉద్దేశించి= భీముడిని గురించి; సంతాసింప, వలవదు= దిగులుపడవద్దు; మనకు; సుఖ, నివాసంబు+చేసి= సుఖమైనజనికిగురించి; పరమ+ఉపకారి+ఐ= మిక్కిలి మేలుచేసేవా డైన; ఆ, (బ్రాహ్మణునకు; (ప్రతి+ఉపకారంబు= బదులుమేలు; చేయ= చేయటానికి; సమకూరె= (అవకాళం) లభించింది. తాత్పర్యం: ఆ విధంగా వజ్రంవంటి దేహం గల భీముడు వజ్రాయుధు డైన దేవేంద్రుడి నైనా జయించగల సమర్హుడు. రాక్షసుడిని సులభంగా చంపి ఈ ఊరి (బ్రాహ్మణుల బాధ తీర్చగలడు. అతడిని గురించి దిగులుపడ నక్కరలేదు. మనం సుఖంగా ఉండటానికి తగిన నివాసాన్ని కూర్చి మిక్కిలి ఉపకారం చేసిన ఈ (బ్రాహ్మణునికి (ప్రత్యుపకారం చేయటానికి తగిన అవకాశం లభించింది.

638 శ్రీమదాంధ్ర మహాభారతము కుంతి ధర్మజునకు( బరదు:ఖనినారణము పరనుపుణ్యం బని తెలుపుట (సం.1-150-20)

సీ. ఉత్తమక్షత్రియుం డొరులదుఃఖంబులు । దలంగంగం బుట్టిన ధర్మశీలుం

డలయక మృత్యుభయం బైనచో విస్రుం। గాచి సత్పుణ్యలోకములు వదయు;

ధన్యుండై క్షత్రియు దయం గాచి బుధలోక । కీర్తనీయంబగు కీర్తి వడయు;

వైశ్యశూద్రులం గాచి వసుధాతలస్థిత | సర్వప్రజానురంజనము వడయు; ఆ. వనఘ! సన్మనీంద్రుం డయిన వేదవ్యాసు । వలన దీని నిక్కువముగ వింటి;

బ్రాహ్మణులకుం బ్రియము పాయక చేయంగ. | గాన్నచూవె పుణ్యకర్మఫలము. 266 ప్రతిపదార్థం: ఉత్తమ, క్షత్రియుండు; ఒరుల, దుఃఖంబులు= ఇతరులయొక్కదుఃఖాలను; తలగంగన్‌= తాలగించటానికి; పుట్టిన; ధర్మ శీలుండుజు ధర్మాన్నే స్వభావంగా కలవాడు; అలయక= ఆలస్యం చేయక; మృత్యు, భయంబు+ఐనచో= మృత్యువువలన భయం కలిగితే; విఫ్రన్‌= (బ్రాహ్మణుడిని; కాచి= రక్షించి, సత్‌+పుణ్య, లోకములు= మంచిపుణ్యలోకాలను; పడయు= పొందుతాడు; ధన్యుండు+ఐ= పుణ్యవంతు డై; క్షత్రియు; దయన్‌+కాచి= దయతో రక్షించి; బుధ, లోక, క్తీరనీయంబు+అగు= పండితులయొక్క సమూహంచేత పొగడదగిం దైన; కీర్తిశపడయు= కీర్తిని పొందుతాడు; వైళ్య+శూద్రులన్‌+కాచి= వైళ్యులను, శూద్రులను రక్షించి; వసుధా, తల, స్థిత, సర్వ, ప్రజల+అనురంజనము+పడయు= భూమండలంలో ఉన్న ప్రజలందరియొక్క అనురాగాన్ని పొందుతాడు; దీని= ఈవిషయాన్ని; అనఘః= పాపంలేనివాడా - పుణ్యాత్మాః సత్‌+ముని+ఇంద్రుండు+అయిన= గొప్పమునుల్లో (శ్రేష్టు డైన; వేదవ్యాసువలన; నిక్కువముగ= నిజంగా; వింటి; 'బ్రాహ్మాణులకున్‌; ప్రియము= ఇష్టమైనది; పాయక, చేయంగన్‌*+కాన్స, చూవెజఐ తప్పకచూడటమే సుమా; పుణ్య, కర్మ ఫలము= పవిత్రాలైన పనులు చేయటంవలన పొందేఫలం - మహాపుణ్యం. తాత్సర్యం: ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దుఃఖాలు తొలగించటానికి పుట్టిన ధర్మశీలుడు, ఆలస్యం చేయక మృత్యుభయం కలిగిన (బ్రాహ్మణుడిని కాపాడితే ఆతడు పుణ్యలోకాలు పొందుతాడు. ధన్యుడై క్షత్రియుడిని దయతో రక్షిస్తే పండితులచేత ప్రశంసించదగిన కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూద్రులను రక్షిస్తే భూమండలంలో (ప్రజ లందరి అనురాగాన్ని పొందుతాడు. ఈ విషయం ముని(శ్రేషుడైన వేదవ్యాసుడు చెప్పితే విన్నాను. (బ్రాహ్మణులకు ఇష్టమైనది తప్పక చేయచూడటమే సుమా మహాపుణ్యఫలం. క. జననుత! బ్రాహ్మణకార్యము । సనం జేసిన బ్రాహ్మణప్రసాదంబున నీ

కును నీతమ్ములకును నగు । ననవరతశ్రీసుఖాయురైశ్వర్యంబుల్‌. 287 ప్రతిపదార్థం: జన, నుత= జనులచేత కొనియాడబడేవాడా!: బ్రాహ్మణ. కార్యము; చనన్‌+చేసిన= జరిగేటట్టు చేసిన; బ్రాహ్మణ, 'ప్రసాదంబున= (బ్రాహ్మాణులయొక్క అను(గ్రహంచేత; నీకును; నీ, తమ్ములకును; అనవరత, శీ, సుఖ, ఆయుః+ఐళ్చర్యంబుల్‌= ఎడతెగని సంపద, సుఖం, ఆయువు, ప్రభుత; అగున్‌= కలుగుతాయి. తాత్పర్యం: బ్రాహ్మాణకార్యం పూర్తిచేస్తే వారి అనుగ్రహంవలన నీకు, నీ తమ్ములకు అంతులేని సంపద, సుఖం, ఆయువు, ప్రభుత కలుగుతాయి.

| సంతసిల్లి తానును

వ. అనిన విని ధర్మతనయుండు గుంతీదేవి కారుణ్యబుద్ధికి బ్రాహ్మణభక్తికి ధర్మనిత్యతకు సంతసిల్లి

భీమసేను నియోగించె; నంత భీముం డవ్విఫ్రున కి ట్లనియె. 288

ఆదిపర్వము - షవ్యాశ్వాసము 639 ప్రతిపదార్హం: అనిన; విని; ధర్మతనయుండు; కుంతీదేవి, కారుణ్య, బుద్ధికి= కుంతీదేవియొక్క దయతోకూడిన మనసుకు; (బ్రాహ్మణభక్తికి= బ్రాహ్మణులపట్ట భక్తికి; ధర్మ, నిత్యతకు= ధర్మంయొక్క ఎడతెగనితనానికి - అంటే ఎల్లప్పుడూ; ధర్మాన్ని ఆచరించటానికి; సంతసీల్లి= సంతోషించి; తానును; భీమసేను; నియోగించెన్‌= ఆజ్ఞాపించాడు; అంత; భిముండు; ఆ+విపఫ్రనకు= ఆ బ్రాహ్మణునికి; ఇట్టు+అనియె. తాత్చర్యం: అని చెప్పగా విని ధర్మరాజు కుంతీదేవియొక్క దయాగర్రబుద్ధికి, (బ్రాహ్మాణభక్తికి; ధర్మాచరణానికి సంతోషించి తానుకూడ భీమసేనుడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు భీమసేనుడు బ్రాహ్మణునితో ఇట్టా అన్నాడు. విశేషం: తల్లిగా కుంతీదేవి కొడుకులను దిద్దితీరుస్తున్న ఉదాత్తవైఖరిని తెలిపే రెండవ సన్నివేశ మిది. అన్నంపెట్టి కొడుకులను పోషించటంలోకూడ ఆమె తీర్చరితనం గోచరించింది. ధర్మాన్ని బోధించి, దానిని ఆచరించే పద్దతిలోకూడ, తాను ఆచరిస్తూ కొడుకుల మొదటిగురువైన తల్లిగా తెలియచెప్పే నేర్చరితనం ప్రదర్శించింది. ధర్మరాజుకుసైతం వివేకం కలిగించే ధర్మబోధ చేసింది. ఆ తెలివిడి వేదవ్యాసులవలన కలిగిం దని (ప్రామాణికభావం కలిగించింది. భీముడిని ధర్మాచరణశీలునిగా మలచింది. బుద్ధికక్తినీ, బాహుబలాన్నీ ధర్మశక్తికి అనుకూలంగా ఎలా రూపొందించాలో తెలిసిన వివేకమూర్తి పాండవ మాతృమూర్తి.

ఆ. కడుపునిండం గుడువం గానమి రేయెల్లం। గన్నువొందకున్నం గరము దస్పి

యున్ననాండ; నాకు నోపుదురేని యా । హారత్బప్తి సేయు. డట్టు లయిన. 289 (ప్రతిపదార్హం: కడుపు, నిండన్‌; కుడువన్‌+కానమి= తినటానికి లేకుండటంచేత - అంటే కడుపునిండా తిండి లేకుండటంచేత; రేయి+ఎల్లన్‌= రాత్రి అంతా? కన్ను+పాందక+ఉన్నన్‌= కన్ను మూయకుండటంవలన- అంటే నిద్రలేకపోవటంచేత; కరము= మిక్కిలి; డస్పి+ఉన్నవాండజ అలసిఉన్నాను; ఓపుదురు+ఏని= చేయ గలిగితే; నాకు; ఆహార, తృప్తిచేయుండు= ఆహారంచేత తృప్తి చేయండి; అట్టులు+అయిన. తాత్పర్యం: కడుపునిండ తిండి లేకుండటంచేత రాత్రి పూర్తిగా నిద్రలేదు. అందుచేత మిక్కిలి డస్సి ఉన్నాను. పెట్టగలిగితే నాకు ఆహారం తృప్తిగా పెట్టండి. అ ట్లయితే. ఆ. “బలము పెద్ద గలిగి పాపిష్టు రక్కసు6। జంపి యిప్పురమున జనుల కెల్ల

హర్ష మే నొనర్లు' ననవుడు విప్రండు । దాను జుట్టములును దత్‌క్షణంబ 290 ప్రతిపదార్థం: బలము; పెద్ద+కలిగిజ ఎక్కువగా పొంది; పాపిష్టు, రక్కసున్‌= పాపి అయిన రాక్షసుని; చంపి, ఈ+పురమున; జనులకు+ఎల్ల; హర్షము= సంతోషం; ఏను= నేను; ఒనర్హున్‌= చేస్తాను; అనవుడు= అని అనగా విని; విప్రుడు= బ్రాహ్మణుడు; తానున్‌; చుట్టములును; తత్‌క్షణంబ= అప్పటి కప్పుడే, తాత్ప్సర్యం: 'బలం ఎక్కువగా పొంది ఆ పాపాత్ము డైన రక్కసుడిని చంపి, ఈ పురజనులందరికి సంతోషాన్ని కలిగిస్తా' నని అనగా- (బ్రాహ్మణుడు, తాను, చుట్టాలు అప్పటికప్పుడే. తరలము.

పలుదెఖంగుల పిండివంటలు బప్పుంగూడును నేతికుం

డలు గుడంబు దధిప్రపూర్ణఘటంబులుం గొనివచ్చి యీ

నలఘుసత్తుండు మారుతాత్మజుం డన్నిటన్‌ గతఖేదుం డై

బలము గల్లి కడంగె నప్పుడు బ్రాహ్మణార్థము సేయంగన్‌. 291 ప్రతిపదార్థం: పలు+తెరంగులజ అనేకవిధా లైన; పిండి, వంటలున్‌; పప్పున్‌? కూడును; నేతి, కుండలు; గుడంబు= బెల్లం; దధి, ప్రపూర్ణ ఘటంబులున్‌= పెరుగుతో పూర్తిగా నిండినకుండలు; ఈన్‌= ఈయగా; అలఘ, సత్తుడు= తక్కువకానిబలం కలవాడు

640 శ్రీమదాం(ధ్ర మహాభారతము

  • మహాబలవంతుడు; మారుత+ఆత్మజుండుజ వాయుతనయు డైన భీముడు; అన్నిటన్‌= అన్నింటిచేత; గత, ఖేదుడు+ఐ=

పోయిన బడలిక కల వాడై; బలము+కలిగి; అప్పుడు; (బ్రాహ్మాణ+అర్హము+చేయంగన్‌= బ్రాహ్మణునియొక్క పని చెయ్యటానికి;

కడంగెన్‌= పూనుకొన్నాడు.

తాత్పర్యం: అనేకవిధా లైన పిండివంటలు, పప్పు, కూడు, నేతికుండలు, బెల్లం, పెరుగు నిండిన కుండలు

తీసుకొనివచ్చి ఇస్తే - వాటి నన్నింటిని భక్షించి బలవంతు డైన భీముడు బడలిక తీరి బ్రాహ్మణుని ఆపద

తీర్చటానికి, బకాసురునిమీదికి వెళ్ళటానికి పూనుకొన్నాడు.

విశేషం: నన్నయ ఈ ఆశ్వాసంలో రెండు తరలవృత్తాలను వాడాడు. ఒకటి దుర్యోధనుడు పురోచనుని లక్కయిల్లు కట్టటానికి

పంపిన ఘట్టంలో ఉన్నది (ఆది. 6.139). రెండోది ఇది. బ్రాహ్మాణార్హము అనేమాట (బ్రాహ్మాణులకారకు చేసే ఏ పనికైనా వర్తించే

అర్ధంలో నన్న్మయచేత వాడబడింది. కాని, అది ఇప్పుడు అర్ధపరిణామం పొంది బ్రాహ్మాణులఇంట అబ్లీకానికి భోక్తగా ఒప్పుకొని చేసే పనికే రూఢి కెక్కింది. భీము(డు బకాసురుని. జంసపంబోవుట (సం.1-151-1)

వ ఇట్లు భీమసేనుం డిష్టాన్నోసభోగంబునం దృప్తుం డయి భక్ష్యాన్నపూర్ణం బయిన శకటంబు నెక్కి దక్షిణాభిముఖుం డయి బకాసురుం దగున్నచోటికిం జని యార్థశుష్కకళేబరదుర్గంధనిందితం బయిన బకస్థానంబు దాయక యెడగలిగి యమునాతీరంబున శకటంబు నిలిపి యారక్కసుం బిలుచుచు వానివచ్చునంతకు మిన్నకుండ నేల యని కాళ్ళుసేతులుం గడిగికొని యాచమించి యాశకటంబుపయి కూడు గుడుచుచుండె; నట బకాసురుండును. 292

ప్రతిపదార్థం: ఇట్టు; భీమసేనుండు; ఇష్ట+అన్న+ఉపభోగంబునన్‌= ఇష్టమైన ఆహారాన్ని భుజించటంచేత; తృప్పుండు+అయి= తృప్తిపొందినవా డయిన; భక్ష్య+అన్న, పూర్షంబు+అయిన= పిండివంటలతో, అన్నంతో నిండిన దైన; శకటంబున్‌= బండిని; ఎక్కి; దక్షిణ+అభిముఖుండు+అయి= దక్షిణదిశకు ఎదురుగా ముఖం కలవా డై; బకాసురుండు= ఉన్న; చోటికిన్‌; చని= వెళ్ళి; ఆర్ష, శుష్క, కళేబర, దుర్గంధ, నిందితంబు+అయిన= పచ్చివి, ఎండినవి అయిన పీనుగుల దుర్వాసనచేత దూషింపబడిం దైన; బక్క స్థానంబు= బకాసురుడియొక్కచోటు - ఉన్నచోటు; డాయక= సమీపించక; ఎడ+కలిగి= దూరంగా ఉండి; యమునా తీరంబున= యమునానదియొక్క ఒడ్డు దగ్గర; శకటంబు= బండి; నిలిపి; ఆ, రక్కసున్‌= ఆ రాక్షసుడిని; పిలుస్తూ; వాని; వచ్చు+అంతకుజ వాడియొక్క రాక వరకు; మిన్నక+ఉండన్‌+ఏల+అని= ఊరకుండటం ఎందుల కని; కాళ్ళు+చేతులు; కడిగికొని; ఆచమించిజ= ఆచమనం చేసి; ఆ. శకటంబుపయి= ఆ బండిమీద ఉండే; కూడు= అన్నం: కుడుచుచు+ఉండెన్‌= తింటూ ఉన్నాడు; అట= అక్కడ; బకాసురుండును.

తాత్పర్యం: ఈ విధంగా భీమసేనుడు ఇష్టమైన ఆహారాన్ని భుజించి, తృప్తినొంది, పిండివంటలతో, అన్నంతో

నిండిన బండి నెక్కి దక్షిణదిశగా బకాసురు డుండే చోటికి వెళ్ళి, పచ్చివి, ఎండినవి అయిన పీనుగుల కంపు కొట్టే

బకాసురుని నివాసస్ట్రానాన్ని సమీపించక యమునానదీ తీరాన్నే బండి నిలిపి, ఆ రాక్షసుడిని పిలుస్తూ వాడు వచ్చేవరకు ఊరకుండటం ఎందు కని కాళ్ళుచేతులు కడుక్కొని ఆచమనం చేసి బండి మీది కూడు తినసాగాడు. అట బకాసురుడును.

ఆ. 'ప్రొద్దునేండు పెద్దపోయె నిత్యము నిట । తెచ్చియిచ్చుబలియు. దెచ్చి యీంగ నొల్ల కెలుంగులిచ్చుచున్నవా( డమ్మను । జాధముండు మెచ్చంచయ్య' ననుచు. 293

ఆదిపర్వము - షష్టాశ్వాసము 6క1

ప్రతిపదార్ధం: నేండు= ఈరోజు; ప్రొద్దుజఐ కాలం; పెద్ద+పోయె= ఎక్కువ గడిచింది; నిత్యమున్‌= ప్రతిదినం; ఇట; తెచ్చి*ఇచ్చు; బలియున్‌= (ఆహారరూపమైన) కానుక; తెచ్చి+ఈంగన్‌+ఒల్లకజ తెచ్చి ఇవ్వటానికి ఇష్టపడక; ఆ+మనుజ+అధముండు= ఆ నీచమానవుడు; ఎలుంగులు+ఇచ్చుచు+ఉన్నవాండు= పిలుపు ఇస్తున్నాడు; - అంటే పిలుస్తున్నాడు; మెచ్చడు+అయ్యెన్‌+ అనుచు= నన్ను లెక్కపెట్టలే దంటూ. తాత్పర్యం: 'ఈ రోజు ప్రొద్దు పోయింది. ప్రతిదినం ఇక్కడికి తెచ్చి యిచ్చే బలిని తెచ్చి ఇవ్వటం ఇష్టపడక, ఆ నీచమానవుడు నన్ను లెక్కపెట్టక పిలుస్తున్నాడు" అని, ఆ. అలిగి యౌడుగజచి యాంటి పెలుచన : నిలువనోప కసుర నింగి దాక

బెరింగి యరుగు దెంచె భీమరూపంబుతో । నుగ్రభంగి భీముండున్న దెసకు. 294 (ప్రతిపదార్థం: అసుర= రాక్షసుడు; అలిగి= కోపించి; బౌడు+కజుచి= పెదవి బిగబట్టి; ఆకటి, పెలుచన= ఆకలియొక్క అతిశయంతో; నిలువన్‌+ఓపక= నిలువలేక; నింగి+తాకన్‌= ఆకాశమంటేటట్టు; పెరిగి= విజృంభించి; భీమ, రూపంబుతో= భయంకర మైన ఆకారంతో; ఉగ్ర, భంగి అధికమైన కోపంగల వైఖరితో; భీముండు+ఉన్న, దెసకు= భీము డుండే దిక్కుకు; అరుగుదెంచె= వచ్చాడు. తొచ్చర్యం: బకాసురుడు కోపించి, అధిక మైన ఆకలికి తాళలేక ఆకాశం ఎత్తున విజ్బంభించి భయంకర మైన ఆకారంతో భయంకర మైన విధంగా భీము డుండే దిక్కుకు వచ్చాడు. సీ చనుదెంచి ముందట శకటంబుపైనుండి ।: యోడక కుడుచుచు నున్న భీము

దవ్వులం జూచి “నిత్యము నాకు నియమించి | కొనివచ్చు కూ డేల కుడిచె దీవు?

గడుం గ్రొవ్వి, రేకచక్రంబునవారల ।; కే నింత యెల్లిద మేల యైతి?

నని డాయ వచ్చి యయ్యనిలనందనువీంపుం బిడికిటం బొడిచిన, బెదర కసుర ఆ, వలను సూడ కొండు వగవనక యెొప్పటి ।; యట్లు కుడుచుచున్న నలిగి బకుండు

“వీని బాగు సూడ వే'అంచు డాసిన । తరువుం బెటికి కొనుచు. దాశుం దెంచె. 295 ప్రతిపదార్థం: చనుదెంచిఐ వచ్చి; ముందట; శకటంబు పైన్‌+ఉండి= బండిమీదనుండి; ఓడక= భయపడక; కుడుచుచు+ఉన్న= అహారం తింటున్న; భీము; దవ్వులన్‌= దూరంగా; చూచి; నిత్యము= ప్రతిదినం; నాకు; నియమించుకొనివచ్చు= ఏర్పాటుచేసుకొని వచ్చే; కూడు+ఏల= అన్నాన్ని ఎందుచేత; ఈవు= నీవు; కుడిచెదు= తింటున్నావు; కడున్‌+క్రావ్విరి= మిక్కిలి పొగరుపట్టినారు; ఏక, చక్రంబున, వారలకుజ ఏకచ[క్రపురంలో ఉండేవాళ్ళకు; ఏను= నేను; ఇంత+ఎల్లిదము= ఇంత చులకన; ఏల+ఐతిని; అని; డాయ, వచ్చిజ దగ్గరగా వచ్చి; ఆ+అనిల, నందను, వీపున్‌= ఆ భీమునియొక్క వీపును; పిడికిటన్‌+పొడిచిన= పిడికిటితో పొడవగా; బెదరకజ భయపడక, అసుర, వలను+చూడకజ ఆ రాక్షసునివైపు చూడకుండ; ఒండు, వగవక= వేరేమీ ఆలోచించకుండ; ఎప్పటి+అట్టు; కుడుచుచు+ఉన్నన్‌= తింటూఉండగా; బకుండు, అలిగి= కోపించి; వీని, బాగు+చూడ+వేజబు+అం౦ంచు= వీడివిధం చూస్తే వేరుగా ఉన్నదని; డాసిన, తరువున్‌= దగ్గరగా ఉండే చెట్టును; పెటీకికొనుచున్‌? తాకుదెంచె= దగ్గరకు వచ్చాడు. తాత్పర్యం; వచ్చి, తనను చూచి భయపడక, బండిమీద ఉండి ఆహారం తింటున్న భీమసేనుడిని- దూరాన్నుంగి చూచి 'ప్రతిదినం నాకై తెచ్చే అన్నాన్ని నీ వేల తింటున్నా" వనీ, 'ఏకచక్రపురవాసులు పాగరుపట్టారు. వాళ్ళకు నెందువలన ఇంత చులకన అయ్యాను?' అని, సమీపించి, భీముడివీపున పిడికిట పొడిచాడు. భీముడు బెదరక, ఆ రాక్షసుడివైపు కూడ చూడకుండ, వేరేమీ ఆలోచించక, ఎప్పటివలె అన్నం తింటుండగా బకుడు కోపించి, వీడి తీరు వేరుగా ఉన్న దని పక్కనుండే చెట్టును పెరికికొని భీమునిదగ్గరకు వచ్చాడు.

642 (శ్రీమదాంధ్ర మహాభారతము

విశేషం: వీని బాగు - అనే దానికి వీనిబాస, వీనిలావు, వీనిభంగి - అనే పాఠాంతరా లున్నాయి. -(శ్రీమదాం[ధ్రమహాభారత

సంశోధితప్రతి, పుట. 397.

వ, అంతకు ముందథఖ భీమసేనుం డంత కూడునుం గుడిచి యనంత బల సమేతుం డై యంతకాకారంబున మల్లసఅణచుకొని యార్టుచు. 296

ప్రతిపదార్థం: అంతకు; ముందజ; భీమసేనుండు; అంత, కూడునున్‌= మొత్తంఆహారాన్ని; కుడిచి= తిని; అనంత, బల,

సమేతుండు+ఐ= అంతులేనిబలంతో కూడుకొన్నవా డై; అంతక+ఆకారంబున= యమధర్మరాజుయొక్కరూపంతో; మల్ల, చజఅచుకొని= భుజంతట్టుకొని; ఆర్బుచు= అరుస్తూ,

తాత్పర్యం: అంతకు ముందు భీమసేనుడు మొత్తం ఆహారాన్ని తిని మిక్కిలి బలవంతు డై

యమధర్మరాజురూపం దాల్చి భుజం తట్టి అరుస్తూ,

ఉ. ఇంచుకయేని పాపమున కెన్నడు రోయక యొల్లవారి బా ధించి మనుష్యమాంసములు దించును గ్రొవ్వితి; వాని నెల్లంగ్ర క్కించెద, నీమదాంధ్య ముడిగించెద, నిప్పడ కాలుప్రొలి కే గించెదం జక్కనై నిలుము గిట్టి రణంబున రాక్షసాధమా! 2097

ప్రతిపదార్థం: రాక్షస+అధమా![= రాక్షసులలో నీచుడైనవాడా! ఎన్నడు= ఎప్పుడుకూడ; పాపమునకు; ఇంచుక+ఏని= కొద్దిగా కూడ; రోయక= రోతచెందక; ఎల్లవారి= అందరినీ; బాధించి; మనుష్య, మాంసములు; తినుచును; క్రొవ్వితివి= పాగరెక్కావు; వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నింటిని; [క్రక్కించెద; నీ మద+ఆంధ్యముజ= నీపొగరుయొక్క (గ్రుడ్డితనం; ఉడిగించెదన్‌= పోగొట్టుతాను; ఇప్పుడు= ఇప్పటికిప్పుడే: కాలు+ప్రోలికి+ఏగించెదన్‌= యమధర్మరాజుయొక్క పట్టణానికి పంపిస్తాను; కిట్టి= సమీపించి; రణంబునజ యుద్దంలో; చక్కన+ఐ= సరిగా; నిలుము,

తాత్పర్యం: నీచ రాక్షసా! ఎన్నడూ పాపానికి కొంచె మైనా వెనుకాడక, అందరినీ బాధించి మనుష్యుల మాంసాలు

తిని పొగరెక్కావు. వాటి నన్నింటిని (క్రక్కిస్తా. క్రొవ్వెక్కటంచేత కలిగిన నీ కన్నుగాననితనాన్ని అణచివేస్తాను. ఇప్పటి

కిప్పుడే నిన్ను యమపురికి పంపిస్తా. యుద్దానికి సిద్ధ మై నిలబడుము. భీమసేనుడు బకాసురుం జంపుట (సం.1-151-15)

వ. అనుచు సమీరణసుతుండు దన సమీపంబున నున్న విశాలసాలవృక్షంబు వెజికికొని రక్కసుపై వైచిన వాండును దనచేతివృక్షంబున దాని భగ్నంబుం జేసి; నిట్లిరువురు నొక్కనడి వృక్షయుద్ధంబు సేసి యాసన్న మహీరుహంబులు సమసిన మల్లయుద్ధసన్నద్దు లై. 298

(ప్రతిపదార్థం: అనుచు; సమీరణ, సుతుండు= వాయుపుత్రు డైన భీముడు; తన, సమీపంబునన్‌+ఉన్న; విశాల, సాల, వృక్షంబు=

పెద్ద మద్ది చెట్టును; పెజికికొని; రక్కసు, పై= రాక్షసుని మీద; వైచిన= వేయగా; వాండును; తన, చేతి, వృక్షంబున= తన చేతిలోని

చెట్టు చేత; దాని= ఆ పెద్దమద్దిచెట్టును; భగ్నంబున్‌*చేసెన్‌= విరుగకొట్టాడు; ఇట్టు+ఇరువురున్‌; ఒక్క, వడి= ఒక్కవేగంలో; వృక్ష, యుద్దంబు+చేసి= చెట్టతో యుద్దం చేసి; ఆసన్న, మహీరుహంబులు= దగ్గరుండే చెట్టు: సమసిన= నళింపగా; మల్ల, యుద్ధ, సన్నద్దులు+ఐ= మల్లయుద్దానికి పూనుకొన్నవా ళ్ళయి.

తాత్పర్యం: అని అంటూ, వాయుపుత్రు డైన భీముడు తనకు సమీపాన ఉన్న ఒక పెద్ద మద్ది చెట్టును పెరికి

రాక్షసుడిమీద వేయగా- వాడు తనచేతిలో ఉండే చెట్టుతో దాన్ని విరుగగొట్టాడు. ఈ విధంగా ఇద్దరూ చెట్లతో

యుద్ధం చేసి చుట్టుప్రక్కల ఉండే చెట్లన్నీ నళించగా మల్లయుద్దానికి పూనుకొన్నారు.

ఆదిపర్వము - షష్టాశ్వాసము 6డ3

చ. పరువడినొండొరుం బెనంగిపట్టుచు. ద్రోచుచు నీడ్దుచుం బర

స్వరజయకాంక్షు లైన బక పాండవవీరుల పాదఘట్టనన్‌

ధరణితలంబు గ్రక్కదలె6 దన్నికటద్రుమవల్లు లెల్ల జ

ర్టరితము లయ్యె, నిష్టురవిశాలశిలల్‌ నుటుమయ్యె నయ్యెడన్‌, 299 ప్రతిపదార్థం: పరువడిన్‌= క్రమంగా; ఒండు+ఒరున్‌= ఒకరితో నొకరు; పెనంగి= కలియబడి; పట్టుచున్‌= పట్టుకొంటూ; (తోచుచున్‌= తోసుకొంటూ; ఈడ్చుచున్‌; పరస్పర, జయ, కాంక్షులు+ఐన= ఒకరినొకరు జయించాలన్న కోరిక కలవాళ్ళయిన; బక్క పాండవ వీరుల, పాద, ఘట్టనన్‌= వీరు లైన బక భీములయొక్క పాదాలయొక్క తొక్కిడిచేత; ఆ+ఎడన్‌= ఆ (ప్రదేశాన; ధరణి, తలంబు= భూభాగం; (క్రక్కదలెన్‌= మిక్కిలి చలించింది; తత్‌+ నికట, ద్రుమ, వల్గులు+ఎల్ల= దానికి సమీపంలో ఉండేచెట్టు; తీగలు అన్నీ; జర్దరితములు+అయ్యె= శిధిలమయ్యాయి- చెల్లాచెదరయ్యాయి; నిష్టుర విశాల, శిలల్‌= కఠినా లైన పెద్దబండలు; నుజుము+అయ్యెన్‌= పిండి అయ్యాయి. తాత్పర్యం; (క్రమంగా భీమ బకాసురులు ఒకరితో ఒకరు కలియబడి పట్టుకొంటూ, (త్రోసుకొంటూ, ఈడ్పు కొంటూ విజయం సాధించా లని మల్లయుద్దం చేస్తుంటే, అక్కడి భూభాగం ఎక్కువగా చలించింది. (ప్రక్కల ఉండే అన్నిచెట్టూ, తీగెలు, చెల్లాచెద రయ్యాయి. కరినా లైన పెద్దబండలు కూడా పిండి అయ్యాయి.

! స్‌ మ! యణ

ఉ. ఇద్దజఖ హుంకృృతిధ్వనులు నిద్దజ భూరి భుజారవయున

య్యిద్దజముప్టిఘాతజనితేరితదారుణనిస్వనంబు న

య్యిద్ధణపాదఘట్టితమహీరవమున్‌ విని చూపఖెల్లనుం

దద్దయు భీతి నచ్చటికి-దా రెదగల్లంగ బాటీ రొక్కందై. 300 ప్రతిపదార్హం: ఇద్దజ, హుంకృతి, ధ్వనులున్‌= భీమబకాసురులిద్దరియొక్క హుంకారశబ్దాలు; ఇద్దట, భూరి, భుజా, రవంబున్‌= అ యిద్దరియొక్క పెద్దభుజాలు తట్టేచప్పుడు; ఆ+ఇద్దజ, ముష్టి ఘాత, జనిత+ఈరిత, దారుణ, నిస్వనంబున్‌= ఆ యిద్దరియొక్క పిడికిటిపోట్లనుండి పుట్టి త్రోయబడిన భయంకరమైన శబ్దం; ఆ+ఇద్దఆ, పాద, ఘట్టిత, మహీ, రవమున్‌= ఆ యిద్దరియొక్క పాదాలచే త్రొక్కబడిన భూమియొక్కశబ్దం; విని; చూపయి+ఎల్లనున్‌= చూచేవాళ్ళంతా; తద్దయు; భీతిన్‌= మిక్కిలిభయంతో; తారు= తాము; ఒక్కడు+ఐ= ఒక్కటై; అచ్చటికిన్‌: ఎడ, కలుంగగన్‌= దూరమవునట్టుగా - దూరంగా; పాఠీరి= పరుగెత్తారు. (ప్రతిపదార్ధం: భీమ బకాసురు లిద్దరియొక్క హుంకారాలు, భుజాల చప్పుడు, పిడికిటిపోట్ట ధ్వని, కాళ్ళ తొక్కిళ్ళచేత భూమినుండి పుట్టిన శబ్దం విని చూచేవాళ్ళంతా మిక్కిలి భయపడి ఒక్కటిగా అక్కడినుండి పరుగెత్తారు. విశేషం: వీరరసోచితంగా ఓజోగుణప్రధానమైన ఈ పద్యంలో - ద్విత్వాక్షర ప్రాస, ద్విత్వాక్షరాలు, విశేషించి మహాప్రాణాక్షరాలు- భీమ బకాసురుల ద్వంద్వయుద్దాన్ని - అందులోనూ మల్లయుద్ద శబ్దాల్ని అద్భుతంగా ధ్వనింప చేసేవిగా ఉన్నాయి. అక్షర్త రమ్యమైన నన్నయ శైలికి ఇదొక చక్కని ఉదాహరణ, వ, ఇట్లుభీమ బకాసురు లాసురంబునం బెనంగి మల్లయుద్ధంబు సేయునెడ. 301 ప్రతిపదార్థం: ఇట్టు; భీమ, బక+అసురులు+ఆసురంబునన్‌= భీముడు, బకాసురుడు అసురకృత్యం చేత; పెనంగి= కలియబడి; మల్ల యుద్ధంబు+చేయు+ఎడ= మల్లయుద్ధం చేసేసమయాన. తాత్పర్యం: ఈ విధంగా భీమబకాసురులు రాక్షసంగా కలియబడి మల్లయుద్ధం చేసే సమయాన,

6డీడ శ్రీమదాంధ్ర మహాభారతము క, _ కడంగి వృకోదరుండసురం | బడంగా ధర వైచి వామపాదంబున జే డ్వడ వానిజొమ్ముందాంచెం । గడుకొని యసురయును లేచి కడునుద్ధతుం డై. 302 ప్రతిపదార్థం: కడంగ= పూనుకొని; వృక+ఉదరుండు= తోడేలుకడుపువంటి కడుపుకలవాడు - భీముడు: అసురన్‌= రాక్షసుడిని; పడగా= పడేటట్టు; ధర, వైచి=ఐ భూమిమీద పడవేసి; వామ, పాదంబునన్‌= ఎడమకాలితో; వాని, జొమ్మున్‌= అతనియొక్కఎదను; తాచెన్‌= తన్నాడు; కడుకొని= పూనుకొని; అసురయును= రాక్షసుడుకూడ; లేచి; కడు+ఉద్దతుండు+ఐ= మిక్కిలి విజ్బంభించినవా డై. తాత్పర్యం: ప్రయత్నించి భీముడు బకాసురుడిని నేలమీద పడవేసి, అతని ఎదను ఎడమకాలితో తన్నాడు. వాడు కూడా ప్రయత్నించి, లేచి, మిక్కిలి విజృంభించి, క. _ అనిలసుతుంబట్టికొని పె; లైన త్రోచి కడంగి కనకశైలనికుంజం బునుబోని వానివక్షముం। దనదృ్భఢతరముప్టి- బొడిచెం దద్దయు నలుకన్‌. 303 ప్రతిపదార్థం: అనిలసుతున్‌= వాయుపుత్రుడైన భీముడిని; పట్టికొని; పెల్చన్‌= గట్టిగా; (తోచి; కడంగి=ఐ పూని; కనక, శైల, నికుంజంబును+పోని= బంగారుకొండలోని పొదరింటిని పోలిన; వాని, వక్షమున్‌= భీమునియొక్కరామ్మును; తద్దయున్‌= మిక్కిలి; అలుకన్‌= కోపంతో; తన, దృఢ, తర, ముష్టిన్‌= తనయొక్క మిక్కిలి గట్టి పిడికిలితో; పొడిచెన్‌. తాత్పర్యం: భీముడిని గట్టిగా పట్టుకొని నెట్టి, మేరుపర్సతంమీది పొదరింటిని పోలిన అతని ఎదను అమిత మైన కోపంతో గట్టిగా తన పిడికిలితో పొడిచాడు. విశేషం; అలం: ఉపమ. కనకైలనికుంజంబునుబోని - అనేదానికి శైలోఛ్రాయంబునుంబోని - అనేపారాంతరం ఉంది. మూలం: వ్యాత్తా ననేన ఘోరేణ లంబజొహ్వేన రక్షసా తేనాభి ద్రుత్య భీమేన భీమో మూర్షి సమాహితః, -శ్రీమదాంధ్రమహాభారత సంశోధితప్రతి, పుట, 398. వ. _భీముండును వాని హీనసత్తుంగా నెజింగి సుర హస్తి హస్తానుకారంబు లైన సవ్య దక్షిణ హస్తంబుల న మ్మనుజ కంటకు కటి కంర ప్రదేశంబులు వట్టికొని. 304 (ప్రతిపదార్థం: భిముండును; వాని= ఆ బకాసురుణ్ణి; హీన, సత్తున్‌+కాన్‌= నశించినబలం కలవాడినిగా; ఎటీంగి=ఐ తెలుసుకొని; సుర, హస్తి హస్త+అనుకారంబులు+ఐన= ఐరావతంయొక్క తాండాలను పోలిన వైన; సవ్య, దక్షిణ, హస్తంబులన్‌= ఎడమ కుడి చేతులతో, ఆ+మనుజ, కంటకు, కటి, కంర, ప్రదేశంబులు+పట్టికొని= మానవులకు శత్రు వైన ఆ బకాసురుడి నడుము, గొంతు, పట్టుకొని. తాచ్స్చర్యం: భీముడుకూడ- ఆ బకాసురుడు బలహీనుడు కావటాన్ని గమనించి, ఐరావతంయొక్క తొండాలవంటి బలమైన తన ఎడమ కుడి చేతులతో వాడి నడుమూ, గొంతూ, పట్టుకొని. ఉ. దారుణ జానుదండమున దండధర ప్రతిముండు భీకరా కారుండు వానివీపు విలుగంబొడిచెం బిశితంబుతో నవ ద్వారములన్‌ మహారుధిరధారలు బోరన నొల్కినమూంస పం కారుణవారిఘోరనదు లై పఅవన్‌ విపినాంతరంబునన్‌. 305 ప్రతిపదార్థం: భీకర+ఆకారుండు= భయంకర మైన రూపం కలవాడు; దండ, ధర, ప్రతిముండు= యమధర్మరాజుతో సమానమైనవాడు - అయిన భీముడు; దారుణ, జాను, దండమునజ= కరిన మైన తన మోకాలనే దండంతో; పిశితంబుతో=

ఆదిపర్వము - షష్టాశ్వాసము 645 మాంసంతో; నవ, ద్వారంబులన్‌= తొమ్మిదిమార్షాలనుండి; మహా, రుధిర, ధారలు= పెద్ద నెత్తుటి ధారలు; బోరనన్‌+ఒల్కి= బోరన చింది; విపిన+అంతరంబునన్‌= అడవి మధ్యభాగంలో; మాంస, పంక+అరుణ, వారి, ఘోర, నదులు+ఐ= మాంసమనే బురదతో ఎజ్జని నీటితో భయంకరా లైన నదులై; పజవన్‌= పారగా; వాని, వీపుఐ ఆ బకాసురునియొక్క వీపు; విలుగన్‌= విరిగేటట్టు; పొడిచెన్‌. తాత్పర్యం: భీముడు దండధరునివలె - అంటే యమునివలె- భయంకరాకారుడై, మహాకరినమైన తన మోకాలనే దండంతో- బకాసురుని నవద్యారాలనుండి మాంసంతో కూడిన నెత్తుటి ధారలు ఉరవడిగా వెలికివచ్చి, అడవి మధ్యలో - మాంసం అనే బురదతో, ఎర్రని నీటితో భయంకరాలైన నదులవలె ('ప్రవహించేటట్టు - ఆ రాక్షసుడి వీపు విరిగేలా పొడిచాడు. విశేషం: నవద్వారములు-నేత్రాలు-2, శోత్రాలు-2. నాసారం(ధ్రాలు-2, ముఖరం(్రం-1, మలమూత్ర విసర్జన రంధ్రాలు-2. అలం: రూపకం, ఉపమ, అతిశయోక్తి. (శ్రవ్యకావ్యంలో స్టిరరూపవర్షణ కంటే, చలద్రూపవర్లన చాల కష్టం, అయినా పారకుని దృష్టిని విశేషంగా ఆకర్షించేది, అతడిని అధికంగా రసపరవశుడిని చేసేది - చల(ద్రూపవర్లనమే. ఈ సన్నివేశంలో నన్నయ మల్లయుద్ధం చేస్తున్న భీమ బకాసురుల చలద్రూపాలను మనకళ్ళకు కట్టినట్లు మనోహరంగా చిత్రించాడు. ఆ యిద్దరి యుద్దాన్ని చూస్తున్న అనుభూతని కలిగించాడు. కాగా, అలంకారాన్ని ప్రయోగించి వస్తువును, రసాన్ని ధ్వనింప చెయ్యటం ఒక గొప్ప కవితా శిల్పం. ఈ పద్యంలో నన్నయ - భీముని మోకాటిని యమదండంతో రూపించి, భీముడిని యమధర్మరాజుతో పోల్చి- బకాసురుని పాలిటికి భీముడు సాక్షాత్తు యముడే అని, ఆ రాక్షసునికి మరణం తప్పదని ద్వనింపచేశాడు. అట్టాగే భీముని దెబ్బకు బకాసురుని నవరం(ధ్రాల నుండి మాంసంతో కూడిన నెత్తురు ఏరులై పొరిందన్న అతిశయోక్తితో- భయానక బీభత్స రసస్ఫూర్తి కలిగించాడు. విశేషించి- 297వ పద్యంలో భీముడు ప్రతిజ్ఞ చేసినట్టు - బకాసురుడు ఇన్నాళ్ళూ తిన్న మానవ మాంసాన్నీ, త్రాగిన రక్తాన్నీ క్రక్కించి నట్టుంది - ఈ పద్యవర్షన. అంతేకాదు హిండిబబకాసురుల వధలలో శత్రువును వెన్నువిరిచి చంపే మల్లవిద్యను భీముడు సమంగా ప్రదర్శించటం గమనార్హం. ఇటువంటి సంవాదశిల్పపూర్వాపరసంవిధానంతో నన్నయ ప్రసన్నకధాకలి తార్థయుక్తిని సాధించటం ఇందులోని విశేషం.

వ. ఇట్లు బకాసురుండు భీముచేత నిహతుం దయి విగతజీవితుం డగుచుండి యజచిన నమ్మహాధ్వని విని వాని బాంధవు లైన రక్కసులు పెక్కండ్రు పజతెంచిన వారలం జూచి భీముం డి ట్లనియె. 306 (ప్రతిపదార్థం: ఇట్లు: బకాసురుండు; భీముచేత, నిహతుండు+అయి= చంపబడినవా డై; విగతజీవితుండు+అగుచు+ఉండి= కోల్పోయిన [ప్రాణం కలవాడవుతూ; అఅచినన్‌: ఆ+మహా, ద్వని= ఆపెద్దశబ్దాన్ని: విని, బాంధవులు+ఐన= వాడియొక్కబంధువు లయిన; రక్కసులు= రాక్షసులు; పెక్కండ్రు= చాలమంది; పజతెంచిన= రాగా; వారలన్‌*చూచి; భీముండు, ఇట్టు+అనియె. తాత్పర్యం: బకాసురుడు భీమునిచేత హతుడై (ప్రాణం పోయేటప్పుడు పెద్దగా అరవగా; ఆ ధ్వని విని అతనీబంధువు లైన పెక్కుమంది రాక్షసులు పరుగెత్తుకొని రాగా వారిని చూచి భిము డిట్లా అన్నాడు. తే. 'ఇంక నెన్నండు రక్కసు లిద్దురాత్ము। నట్లు మనుజులం దినకుండు4 డడరి మనుజ భక్షణము సేసితిరయేని బకుని యట్లు; చత్తురని రక్కసుల కెల్లం జాటె వినంగ 307 ప్రతిపదార్థం: ఇంకన్‌+ఎన్నండు= ఇంకెప్పుడుకూడ; రక్కసులు; ఈ దురాత్ము+అట్టుఐ= ఈ దుర్మార్గుడివలె; మనుజులన్‌: తినక+ఉండుండు; అడరి= పూనుకొని; మనుజ, భక్షణము+చేసితిర+ఏని= మానవులను తినటంచేస్తే - అంటే మానవులను తింటే; బకుని+అట్టు; చత్తురు(చచ్చుదురు)+అని, రక్కసులు+ఎల్లన్‌= రాక్షసులందరు: వినంగ= వినేటట్టు; చాటె= (ప్రకటించాడు. తాత్పర్యం: 'ఇంకెప్పుడు మీరు ఈ దుర్మార్గనివలె మానవులను తినవద్దు. తింటే ఈ బకాసురుడివలె మీకు కూడ చావుతప్ప' దని ఆ రాక్షసు లందరు వినేటట్టు భీముడు ప్రకటించాడు. వ, అంత నారాక్షసులు భీతు లై భీము సేసిన సమయంబున కొడంబడి నాంటంగోలె నేకచక్రనివాసులకు నుపద్రనంబుం చేయనోడి; రట్లు భీముందు బకాసురుం జంపి వానిం జంపుట జగద్విదితంబుగా€

646 శ్రీనుదాంధ్ర మవాభారతము దత్మళేబరం జీద్దుకొని వచ్చి నగర ద్వార సమీపంబున వైచి, యందుల విప్రులకు సంతోషంబు సేసి, నిజ నివాసంబునకుం జని త దృత్తాంతం బంతయు. దల్లికి సహోదరులకుం జెప్పి యున్నంత. 308 ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; ఆ, రాక్షసులు; భితులు+ఐ= భయపడినవారై; భీము, చేసిన, సమయంబునకు= భిముని యొక్క చేసిన నియమానికి; ఒడంబడి= ఒప్పుకొని; నాంటన్‌కోలెన్‌= ఆ రోజునుండి; ఏకచ(్ర, నివాసులకున్‌= ఏకచ(క్రపురంలో కాపుర ముండేవారికి; ఉపద్రవంబున్‌= హాని; చేయన్‌+ఓడిరి= చేయటానికి భయపడ్డారు; అట్టు; భీముండు; బకాసురున్‌; చంపి; వానిన్‌; చంపుట; జగత్‌+విదితంబు+కాన్‌= (ప్రపంచాని కంతటికీ తెలిసేటట్టు: తత్‌కళేబరంబు= అతని యొక్క శవాన్ని; ఈడ్చుకొని, వచ్చి; నగర, ద్వార, సమీపంబున= నగరంయొక్క ద్వారం దగ్గర; వైచి= పడవేసి; అందుల, వి(ప్రులకు= అందుండే (బ్రాహ్మణులకు; సంతోషంబు+చేసి; నిజ, నివాసంబునకున్‌+చని= తా నుండే ఇంటికి వెళ్ళి; తత్‌వృత్తాంతంబు+ అంతయున్‌= ఆ విషయా న్నంతటినీ; తల్లికి సహ+ఉదరులకున్‌= తల్లికి, తోబుట్టువులకు: చెప్పి+ఉన్న+అంత. తాత్సర్యం: అప్పుడు రాక్షసులు భయపడి భీముడు చేసిన నియమానికి అంగీకరించారు. ఆ రోజునుండి ఏక చక్ర పురవాసులకు కీడు చేయటానికి భయపడ్డారు. బకాసురవధ లోకాని కంతటికి తెలిసేటట్టు భీముడు ఆ రాక్షసుని శవాన్ని ఈడ్చుకొనివచ్చి ఏకచక్ర నగర ద్వారం దగ్గర పడవేసి, ఆ నగరంలోని బ్రాహ్మణుల కెల్ల సంతోషం కలిగించి, తన ఇంటికి వెళ్ళి తల్లికి, సోదరులకు జరిగిన వృత్తాంతం చెప్పాడు. అప్పుడు. ఉ వీండొక మంత్రసిద్ధుం డగు విప్రు; దసాధ్య బలున్‌ బకాసురున్‌ నేండనింజంపెనట్టె! యితనిం జని చూతము యంచు. జెచ్చెరం బోండిగ వేత్రకీయమున భూసురు లాదిగ వచ్చిచూచి ర వ్వాండిమగంటిమిన్‌ వెలయువాని వృకోదరు నెల్లవారలున్‌. 309 ప్రతిపదార్హం: వీండు+ఒక, మంటత్రసిద్దుడు+అగు, విప్రుడు= వీడొకమం[త్రంచేత ఫలాన్ని పొందినవాడైన (బ్రాహ్మణుడు; అసాధ్యబలున్‌=ఐ జయించటానికి శక్యంగాని బలం కల వాడిని; బకాసురున్‌; నేండు: అనిన్‌= యుద్దంలో; అట్టె; చంపెన్‌; చని= వెళ్ళి ఇతనిన్‌; చూచుదము+అ+అంచున్‌= చూద్దామా అంటూ; చెర+చెరన్‌= త్వరత్వరగా; వేత్రకీయమున= ఏకచ(క్రపురంలో; భూసురులు+ఆదిగ= (బ్రాహ్మణులు మొదలుగా; ఎల్లవారలున్‌= అందరును; ఆ+వాడిమగంటిమిన్‌, వెలయువాని, వృకశఉదరున్‌= ఆ తీక్షణమైన పౌరుషంచేత (ప్రకాళించేవా డైన భీముడిని; పోండిగజ ఒప్పుగా; వచ్చి; చూచిరి. తాత్సర్యం: 'వీ డొక మంత్రసిద్ధి గల (బ్రాహ్మణుడు. జయించ సాధ్యంగాని బలవంతు డైన బకాసురుడిని ఈరోజు యుద్ధంలో సులువుగా చంపాడు. వెళ్ళి చూద్దాం" అని ఏకచ(క్రపురంలో (బ్రాహ్మణులు మొదలుగా అందరూ త్వరత్వరగా వచ్చి తీక్షణమైన పౌరుషంచేత (ప్రకాశించే భీముడిని చూచారు. విశేషణ: నేత్రకీయము - అనేది ఏకచశ్రాపురానికి సంజ్ఞ, ఇచట భారతకూలంకషంలో ఇట్లా ఉంది. 'వేత్రకీయమున - ఏక చక్రాపురమున - అద్య(ప్రభృతి స్వప్యంతే వేత్రకీయ నివాసినః” -శ్రీమదాం(ధ్రమహాభారతసంశోధితప్రతి, పుట. 399. బకాసురవధకు నాయకునివంటివాడు భీముడు. హిడింబుడిని కారడవిలో చంపి ఆత్మీయు లైన అన్నదమ్ముల కుంతీహిడింబల ప్రశంసల నందుకొన్నాడు. అది ఆత్మరక్షణకోసం చేసిన రాక్షససంహారం. బకాసురవధ పరహితార్హ మై కృతజ్ఞతాభావంతో ఏకచ(క్రపురవాసులకు పాండవులుచేసిన (ప్రత్యుపకారం. అందువలన కార్యసాధకు డైన భీమునికి ప్రజలప్రశంస. క. _ అవియిట్లు పాండునృపనం । దనుల చరిత్రంబు సెప్పెందా వైశంపా యనుండు జనమేజయున కని । జనవినుతచరిత్రపాత్ర! సౌజన్యనిధీ! 310 ప్రతిపదార్థం: జన, వినుత, చరిత్ర, పాత్ర= జనులచేత పొగడబడిన నడవడికి స్టాన మైన వాడా! సౌజన్య నిధీ= మంచితనానికి ఉనికిపట్టయినవాడా - రాజరాజనరేందద్రా! అని; ఇట్టు; పాండు, నృప నందనుల, చరిత్రంబు= పాండురాజుయొక్కకొడుకుల కధను; వైశంపాయనుడు; తా= తాను; జనమేజయునకు; చెప్పెన్‌; అని -

ఆదిపర్వము - షష్టాశ్వాసనము రత్త? తాత్పర్యం: జనులచే క్షీర్తింపబడిన చరిత్ర కలిగి, మంచితనానికి నిధి వైన ఓరాజరాజనరేంద్రా! ఈవిధంగా పాండవులచరిత్రను వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు - అని సూతుడు శానకాదిమహామునులకు చెప్పాడు. విశేషం: చరిత్ర అంటే కథ అనీ, శీలం అనీ అర్జాలున్నాయి. ఇక్కడ రెండర్జాలూ సార్ధకాలే. కధాపరంగా, సంఘటనలపరంగా, మనస్తత్వాలపరంగా- మహాభారతంలో ఈ ఆరవ ఆళ్వాసానికి ఒక (ప్రత్యేకత ఉన్నది; ప్రాధాన్యం ఉన్నది. నన్నయ నాటకీయ రచనకు నిలువెత్తు నిదర్శనంవలె నిలిచి, కురుకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనతో ఆరంభమైన ఈ ఆశ్వాసంలో - భీమ దుర్యోధనుల గదాయుద్ధ ఘట్టంలో - కురు పాండవ విభేదాలు అందరి ముందు ఒక్కసారిగా గుప్పు మన్నాయి. కర్ణుని రంగప్రవేశంతో, అతని అంగరాజ్యాభిషేకంతో అవి ఘనీభవించాయి. అందరు చూచి ఆనందించవలసిన అస్త్ర విద్యా ప్రదర్శన - మున్ముందు. రానున్న మహాభారత సం(గ్రామానికి నాందివలె మారింది. అర్జాంతరంగా ముగిసింది. అంతబలవంతుడైన (ద్రుపదుడిని అట్టాపట్టి, కట్టితెచ్చి, గురుదక్షిణగా (ద్రోణునికి ఇవ్వటంలో - అర్జునుని అద్వితీయ సామర్థ్య సౌశీల్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ధర్మజుని యౌవరాజ్యాభిషేకం, అతని నలుగురు తమ్ముల దిగ్సిజయ యాత్ర, పాండవుల మీద - ప్రత్యేకించి ధర్మరాజు మీద - పెల్లుబికిన ప్రజానురాగం - పాండవుల నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించాయి. (ప్రతినాయకుడైన దుర్యోధనుడు-పాండవులకు వ్యతిరేకంగా తన సహాయులతో సొగించిన దురాలోచన, పాండవుల (ప్రాణాలు తీయాలని జరిపించిన లాక్షాగృహదహనం-అతని దుర్మార్గప్రవృత్తిని ప్రస్ఫుటం చేశాయి. దుద్యోధనుడు తండ్రితో తన మనో దుఃఖాన్ని వెళ్ళబోసుకొనే ఘట్టం - కురుపాండవ కధాగతిని ప్రభావితం చేసే-ధృతరాష్ట్ర మహారాజు మనస్తత్వాన్ని వ్యక్తంచేసింది. లాక్షాగృహదహనం నుండి పాండవులు (ప్రాణాలతో బయట పడటం- ధర్మ విజయానికి, అధర్మపరాజయానికి, మొత్తం మహాభారత సందేశానికి చక్కని సంకేతమై నిలిచింది. లాక్షాగృహదహనం తరువాతి కధ అంతా భీమనాయకంగానే సాగింది. హిడింబాసుర బకాసురులవధలు భీముని బలపరాక్రమాలకు విజయ. పతాకాలు. తల్లి శాసనాన్ని, అన్నుగారి నిర్దేశాన్ని అనుసరించి, ఇద్దరి గురుత్వాన్ని శిరసావహించి- పాండవపక్షాన ప్రవర్తిల్లే ప్రబల (క్రియాశక్తి భీముడు, హిడింబను ఆతడు వివాహమాడటం ఇందుకొక నిదర్శనం. హైడింబా భీమసేనుల వివాహ ఫలమే - మాయాయుద్ద నిపుణుడు మహాశక్తి సంపన్నుడు అయిన ఘటోత్కచుని జననం. అతని జననం పాండవ పక్షానికి పెద్దబలం. పాండవ పక్షాన జ్ఞానశక్తి వ్యాసుడు; ఇచ్చాశక్తి కుంతి; ధార్మికళ్తి ధర్మరాజు; క్రియాశక్తులు భీమార్జునులు; రక్షాశక్తులు నకుల సహదేవులు. ఆరవ ఆశ్వాసకధ అసక్తి కరమైన కధ; మున్ముందు రానున్న మలుపులను సూచించే కధ. ఆశ్వాసాంతము

క, _ మలహారినాథ! విలస చకుక్యకులతిలక! రాజసర్వజ్ఞ! రిపు

ప్రళకయప్రతాప! పరన్ఫప । లలనాననకమల హరిణలాంఛనమూర్తీ! 311 ప్రతిపదార్థం: మలహారి, నాధ= మలహారిదేశానికి. ప్రభు వైన వాడా! విలసత్‌+చళుక్య, కుల, తిలక=. ప్రకాశిస్తున్న చాళుక్యవంశానికి అలంకారమైనవాడా[ రాజ, సర్పజ్ఞ= రాజులలో శివునివంటివాడా!; రిపు, ప్రలయ, ప్రతాప శత్రువులకు నాళనం కలిగించేటి (ప్రతాపంకలవాడా!; పర, నృప, లలనా+ ఆనన, కమల, హరిణ, లాంఛన, మూర్తీ= శత్రువులయొక్క'్రీలముఖౌ లనే పద్మాలకు చం1ద్రునివంటి ఆకారం గలవాడా! తాత్పర్యం: మలహారిదేశప్రభూ! చాళుక్యవంశాలంకారా! రాజులందరిలో శివునివంటివాడా! శతురాజ నశింపజేసే పరాక్రమం కలవాడా! శత్రువులయొక్క (స్త్రీల ముఖా లనే పద్మాలు ముడుచుకొని పోయేటట్టు చెన చంద్రుని వంటివాడా! విశేషం: ఇవి ఆశ్వాసాంతంలో కృతిపతి అయిన రాజరాజనరేంద్రుడిని ప్రశంసిస్తూ చేసే సంబోధనలు. మాలిని.

ప్రణమ దఖిల ధాత్రీ పాల కాలోల చూడా మణిగణకిరణశ్రీమండితాంఘ్రీ! నరేంద్రా

గ్రణి! నిఖిలమహీరక్షామణీ! రాజనారా ।; యణ! విమలమతీ! శీతాంశువంశప్రకాశీ! 312

648 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: ప్రణమత్‌+అఖిల, ధాత్రీ, పాలక+ఆలోల, చూడామణి, గణ, కిరణత్రీ, మండిత+అం(ఘ్రీ= నమస్కరిస్తున్న అఆందరురాజులయొక్క కదలుతున్న శిరోరత్నాల సమూహాల కాంతులయొక్క సంపదచేత అలంకరింపబడిన పాదాలు కలవాడా!; నరేంద్ర+అగ్రణి= రాజులలో శ్రేష్టుడా!: నిఖిల, మహీ, రక్షా, మణీ= సమస్త భూమండలాన్ని రక్షించే మణి వంటివాడా!; రాజనారాయణ]!; విమల, మతీ= నిర్మలమైనబుద్రికలవాడా![; శీత+అంశు, వంశ, ప్రకాశీ= చల్లని కిరణాలు కలవా డైన చంద్రుని వంశాన్ని (ప్రకాశింప చేసేవాడా! తాత్పర్యం: నమస్కరిస్తున్న రాజులందరి చలించేశిరోరత్నసమూహాల కాంతి సంపదచేత అలంకరించబడిన పాదాలుకలవాడా! రాజ(శ్రేష్టా! సమస్తభూమండలాన్ని రక్షించేవాడా! రాజనారాయణా! నిర్మలమైన బుద్దికలవాడా! చం(ద్రవంశాన్ని ప్రకాశింపజేసేవాడా! - ఓ రాజరాజనరేంద్రా! విశేషం: మాలిని వృత్తపాదంలో వరుసగా న, న, మ, య, య గణాలుంటాయి. 9వ అక్షరం యతిస్టానం. గద్యము. ఇది సకలసుకవిజనవినముత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదివర్వంబునం గుమారాస్త్రవిద్యా సందర్శనంబును, ద్రుపదగ్రహణమోక్షణంబును, దుర్యోధనుదుర్మంత్రంబును, వారణావత యాత్రయు, జతుగృహదాహంబును, విదురోపదిష్టద్వారంబునం బాండవాపక్రమణంబును, హిడింబు వధథయును, హిడింబావివాహంబును, వ్యాససందర్శనంబును, ఘటోత్కచసంభవంబును, విప్రగృహంబున నజ్ఞాతచర్యయును, బకాసురవధయును నన్నది షష్టాశ్వాసము. ౩13 తాత్పర్యం: ఇది, సకల సత్కవుల (ప్రశంస లందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీ మహాభారతంలో - ఆదిపర్వంలో - కురుకుమారుల అస్త్ర విద్యా ప్రదర్భ్శనాన్ని చూడటం, ద్రుపదరాజును యుద్దంలో బంధించి విడిచి పెట్టటం, దుర్యోధనుని దురాలోచనం, పాండవులు వారణావతానికి వెళ్ళటం, లక్కయింటిని తగులపెట్టటం, విదురుడు ఉపదేశించిన మార్గాన పాండవులు బయటపడటం, హిడింబాసురుడిని సంహరించటం, భీమసేనుడు హిడింబను వివాహమాడటం, వ్యాసమహర్షిదర్శన మివ్వటం, ఘటోత్కచుడు జన్మించటం, పాండవులు (బ్రాహ్మణుని ఇంట అజ్ఞాతంగా మెలగటం, బకాసురుడిని హతమార్చటం-అనే అంశాలు కలది ఆరవ ఆళ్వ్యాసం, ఆదిపర్వంలో షష్టాశ్వాసం సమాప్తం శరముడోషుల

శ్రీరస్తు చ్‌ శ్రీమదాంధ్ర మహాభారతము జి అలన్‌ ఆలి జి ఆదిపర్వము - సప్త్రమాశ్వాసము 'శ్రీరాజరాజ! వీర శ్రీరమణీరమ్య! గంధసింధుర హయ శి క్షారూడి దక్ష! ధక్షమ । ఖారిదయాలబ్ధ సుస్థిరెశ్వర్యపదా! శ

(ప్రతిపదార్హం: గ్రీరాజరాజ!; వీర, శీ. రమణీ, రమ్య!= వీరలక్ష్మి అనే కాంతకు మనోహరుడ వైనవాడా!; గంధ, సింధుర, హయ,

శిక్షా+ఆరూఢి, దక్షణ మదపుటేనుగులను, గుట్టాలను శిక్షించటంలోను, ఎక్కటంలోను సమర్జ్హుడ వైనవాడా!; దక్ష మఖ+అరి,

దయా, లబ్ద, సుస్థిరశఐళ్చర్య, పదా[= దక్షుడి యజ్ఞానికి శత్రు వైన శివుడి దయతో పొందబడిన శాశ్ళత మైన ఐళ్చర్య స్థానం - అనగా రాజ్య పదవి కలవాడా!

తాత్పర్యం: ఓ రాజరాజనరేంద్రా! వీరలక్ష్మి అనే కాంతకు మనోహరుడ వైనవాడా! మదపుటేనుగులను, గుజ్జ్ఞాలను

శిక్షించటంలోను, అధిరోహించటంలోను సమర్భుడవైనవాడా! దక్షయజ్ఞానికి శత్రు వైన శివుని దయతో పొందిన

శాళ్ళుత రాజ్య పదవి కలవాడా! ధృష్టద్యుమ్న (ద్రాపదుల యుత్స్పత్తి వృత్తాంతము (సం.1-153-1)

న. అ కృథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పి: నట్లు పాండవులు విప్రవేషంబున నేకచక్రపురంబునందు వేదాధ్యయనంబు సేయుచు విప్రగృహంబున నున్న కొన్నిదినంబులకు నొక్కబ్రాహ్మణుందు ద్రుపదు పురంబుననుండి చనుదెంచి విశ్రమార్థి యైన, నాగ్భృహస్థుందు వాని నభ్యాగతపూజల సంతుష్టుం జేసి యున్నంతం గుంతీదేవి గొడుకులుం దాను నవ్విఫ్రు నతిప్రీతి నుపాసించి 'యయ్యా! మీర లెందుండి వచ్చితి? రే దేశంబులు రన్యుంబు? లెందుల రాజులు గుణవంతు? లని యడిగిన' న వ్వస్రుం డి ట్లనియె. 2

ప్రతిపదార్థం: ఆ+కథకుండు= మహాభారత కధను చెప్పే ఆ ఉఊ(గ్రశ్రవసుడు; శౌనక+ ఆది, మహామునులకున్‌= శౌనకుడు మొదలై

న మహర్షులకు; చెప్పెన్‌; ఆట్ట్లు= ఆవిధంగా; పాండవులు; విప్ర వేషంబునన్‌= (బ్రాహ్మణవేషంతో: ఏకచ([క్రపురంబునందు; వేద+

అధ్యయనంబు+చేయుచు= వేదాన్ని గురుముఖంగా చదువుకొంటూ; విప్ర గృహంబునన్‌= (బ్రాహ్మణుని ఇంట్లో; ఉన్న= ఉండగా; కొన్ని, దినంబులకున్‌; ఒక్క, బ్రాహ్మణుండు; (ద్రుపదు, పురంబుననుండిజ= (ద్రుపదునియొక్క పట్టణంనుండి; చనుదెంచి= వచ్చి: విశ్రమ+అర్హి, ఐనన్‌=ఐ విశ్రాంతిని కోరినవాడు కాగా; ఆ గృహస్టుండు= పాండవు లున్న ఆ యింటి యజమాని; వానిన్‌= ఆ (బ్రాహ్మాణుడిని; అభ్యాగత పూజలన్‌= అభ్యాగతులకు చేసే పూజలతో; సంతుష్టున్‌= తృప్తి పొందిన వాడినిగా; చేసి; ఉన్నంతన్‌:; కొడుకులున్‌; తానున్‌; కుంతీదేవి; ఆ+వి'ఫ్రున్‌= వచ్చి ఉన్న అ (బ్రాహ్మణుడిని; అతిప్రీతిన్‌=ఐ మిక్కిలి ప్రేమతో' ఉపాసించి= సేవించి; అయ్యా; మీరలు; ఎందుండి; వచ్చితిరి; ఏ దేశంబులు; రమ్యంబులు= అందమైనవి; ఎందుల రాజులు= ఏ దేశాలలోని రాజులు; గుణవంతులు= మంచి గుణాలు కలవారు" అని; అడిగిన; ఆ+విఫ్రుండు= ఆ బ్రాహ్మణుడు; ఇట్టు+ అనియె.

తాత్పర్యం: మహాభారతకధను చెప్పుతున్న ఉ(గ్రశ్రవసుడు, శౌనకాది మహామునులకు- భీముడు బకాసురుడిని వధించేవరకు జరిగినకధను వివరించాడు. ఆ విధంగా పొండవులు (బ్రాహ్మణవేషాలతో ఏకచ[క్రపురంలో

650 శ్రీమదాంధ్ర ముహాభారతను

వేదాధ్యయనం చేస్తూ ఒక (బ్రాహ్మణుని యింట్లో ఉండగా, కొన్ని రోజుల తర్వాత ఒక (బ్రాహ్మణుడు (ద్రుపదరాజు

పట్టణంనుండి వచ్చి విశ్రాంతి కోరగా, పాండవు లున్న ఇంటి యజమాని అతడిని అభ్యాగత పూజలతో

తృప్తిపరచాడు. ఆ సమయంలో కుంతీదేవి - కొడుకులు, తాను ప్రీతితో ఆ బ్రాహ్మణుడిని సేవించి, 'అయ్యా!

మీరు ఎక్కడినుండి వచ్చారు? ఏ దేశాలు అంద మైనవి? ఏ దేశాల రాజులు గుణవంతులు?' అని అడుగగా ఆ

(బ్రాహ్మణుడు ఇట్టా అన్నాడు.

చ. సొలయక యొల్లదేశములు( జూచితి; నందు. బ్రసిద్ధు లైన రా జుల సుచరిత్ర సంపదలు. జూచితి; నా ద్రుపదేశుదేశముం బొలుపున నొండు దేశములు పోల్పంగ నెవ్వియు లేవు; సద్దుణం బులం బరు లెవ్వరున్‌ ద్రుపదు€ బోలంగ లేరు ధరాతలంబునన్‌. 3

ప్రతిపదార్థం: సాలయక= అలసట చెందక; ఎల్ల, దేశములున్‌; చూచితిన్‌; అందున్‌; ప్రసిద్దులు+ఐన; రాజుల) సుచరిత్ర,

సంపదలున్‌= మంచి నడవడి అనే సంపదలను; చూచితిన్‌; ధరాతలంబునన్‌= భూమిమీద; ఆ, ద్రుపద+-ఈశు, దేశమున్‌= ఆ

(ద్రుపదరాజుయొక్క దేశమును; పొలుపునన్‌= అందంలో; పోల్పలంన్‌= పోల్చటానికి; ఒండు, దేశములు= ఇతర దేశాలు; ఎవ్వియు;

లేవు; సద్గుణంబులన్‌; పరులు= ఇతరులు; ఎవ్వరున్‌; ద్రుపదున్‌; పోలంగలేరు=ఐ సరిపోలలేరు.

తాత్పర్యం: అలసట చెందకుండా నేను అన్నిదేశాలను చూచాను. వాటిలో ప్రసిద్దు లైన రాజుల మంచి నడవడి

అనే సంపదలూ చూచాను. ఈ భూమిమీద అందంలో ఆ దద్రుపదరాజుదేశంతో పోల్చటానికి ఇతర దేశా లేవీ లేవు,

సద్గుణాలలో ఇతరు లెవ్వరూ ఆ (ద్రుపదుడిని సరిపోలలేరు.

వ. “ఆ ధ్రుపదుండు దనకూంతు నగ్నికుండ సముద్ధవ యైనదాని నయోనిజ నగణ్యపుణ్యలావణ్యగుణసమన్విత ననురూపు. డైన రాజపుత్రునకు వివాహంబు సేయంగానక, స్వయంవరంబు రచియించుచున్నవా౮ డనినం, గుంతియు ధర్మతనయుండును విస్యితు లై 'యది యేమి కారణంబున నయోనిజ యయ్యు? నక్కన్య నెవ్విధంబున ద్రుపదుండు వదసె? దీని సవిస్తరంబుగా. జెప్పు' మనిన నవ్విస్రుండు వారలకిట్లనియె. 4

ప్రతిపదార్థం: ఆ, ద్రుపదుండు; తన, కూతున్‌= తన పుత్రికను; అగ్ని, కుండ, సముద్భవ, ఐన, దానిన్‌= అగ్నిగుండం నుండి గొప్పుగా జన్మించిన దానిని; అయోనిజన్‌= (ప్రీమర్మావయవంనుండి పుట్టని దానిని; అగణ్య, పుణ్య, లావణ్య, గుణ, సమన్వితన్‌= లెక్కించటానికి సాధ్యం కాని పుణ్యంతో, కాంతితో, గుణంతో కూడుకొన్న దానిని; అనురూపుండు+ఐన= తగినవాడైన; రాజపుత్రునకు; వివాహంబు, చేయన్‌+కానకజ= పెళ్ళిచేయటం సాధ్యం కాక; స్వ్తయంవరంబు: రచియించుచున్న వాండు= రూపొందిస్తున్నాడు; అనినన్‌= అని ఆ బ్రాహ్మణుడు చెప్పగా; కుంతియు; ధర్మతనయుండును= ధర్మరాజూ; విస్మితులు+ఐ= ఆశ్చర్యపడినవాళ్ళయి; అది= (ద్రౌపది; ఏమి, కారణంబునన్‌; అయోనిజ; అయ్యెన్‌; ఆ+కన్యన్‌; ఏ+విధంబునన్‌; (ద్రుపదుండు; పడసె= పొందినాడు; దీని= ఈ వృత్తాంతాన్ని; సవిస్తరంబుగాన్‌= విపులంగా; చెప్పుము; అనిన; ఆ+విప్రుండు= ఆ బ్రాహ్మణుడు; వారలకు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: 'అగ్నిగుండంనుండి ఆవిర్భవించిందీ, మానవకాంతకు జన్మించనిదీ, అపార మైన పుణ్యంతో,

కాంతితో, గుణంతో కూడుకొన్నదీ అయిన తన పుత్రిక (ద్రౌపదికి వివాహం చేయాలనుకొన్న (ద్రుపదునికి తగిన

రాకుమారుడు దొరకలేదు; అందుకే ఆయన స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు" అని ఆ (బ్రాహ్మణుడు చెప్పగా, కుంతీ ధర్మరాజులు ఆశ్చర్యపడి 'ఆ ద్రౌపది ఏ కారణంచేత మానవకాంతకు జన్మించని దైనది? ద్రుపదుడు

ఆమెను ఏ విధంగా కూతురుగా పొందాడు? ఈ వృత్తాంతం విపులంగా చెప్పండి" ఆని అడుగగా, ఆ

(బ్రాహ్మణుడు వాళ్ళతో ఇట్టా అన్నాడు.

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 651 సీ. ఆది భరద్వాజుందను ముని కలశంబు । నం దుద్ధనవించిన యనఘమూర్తి ర్రోణుండు మటి పృషతున కుద్ధవించిన । ద్రుపదుండు నొక్కటం దొడంగి యిష్ట సఖు లయి వేదముల్‌ సదివి, ధనుర్వేద । మగ్నివేశులతోడ నర్ధిం గఅచి చని, ద్రుపదుండు పాంచాలభూములకు రా । జైన, భారద్వాజు. డతని కడకు

ఆ. నరిగి, వానిచేతనవమానితుం దయి। హస్తెపురికి వచ్చి యఖిలకురుకు మారవరుల నెల్ల మానుగా శస్త్రకో । విదులం జేసి లోకవిదితయశుండు. క్‌

ప్రతిపదార్థం: ఆదిన్‌= మొదట; భరద్వాజుండు; అను; ముని, కలళంబునందు= మునియొక్క కుండయందు; ఉద్భవించిన= పుట్టిన; అనఘమూర్తి= పాపరహితు6 డైనవాడు; ద్రోణుండు; మజి= మజియు; పృషతునకు; ఉద్భవించిన పుట్టిన; (ద్రుపదుండున్‌: ఒక్కటన్‌= ఒకచోట; తొ “౧౧= పూనుకొని; ఇష్ట సఖులు+అయి= 'ప్రియస్నేహితులై; వేదముల్‌? చదివి; ధనుర్వేదము; అగ్టివేశులతోడన్‌= అగ్నివేశు డనే ముని దగ్గర; అర్ధిన్‌= కోరి; కజుచి= నేర్చుకొని; చని= వెళ్ళి; ద్రుపదుండు; పాంచాల భూములకు; రాజు+ఐనన్‌; భారద్యాజుండు= భరద్వాజుని కుమారు డైన టోణుడు; అతని, కడకున్‌= ఆ (ద్రుపదుని దగ్గరకు; అరిగి=ఐ వెళ్ళి: వానిచేతన్‌, అవమానితుండు+అయి= అవమానింపబడిన వా డై; హస్తి పురికిన్‌; వచ్చి; అఖిల, కురు, కుమార, వరులన్‌+ఎల్లన్‌= కురు కుమార ్రేష్టుల నందరిని; లోక, విదిత, యశుండు= (ప్రపంచాని కంతటికి తెలియబడిన కీర్తికలవాడు - ద్రోణుడు; మానుగా= ఒప్పుగా; శస్త్ర, కోవిదులన్‌= శస్త్ర విద్యలో మిక్కిలి నేర్పరులనుగా; చేసె.

తాత్పర్యం: భరద్వాజ మహర్షి కలశంనుండి పుట్టిన పుణ్యాత్ముడు ద్రోణుడు, పృషతుని పుత్రు డైన ద్రుపదుడు-

ఒకచోట ఉండి ప్రియ స్నేహితు లై, వేదాలను చదివారు. తరువాత ధనుర్వేదాన్ని అగ్నివేశుని దగ్గర అభ్యసించారు.

(ద్రుపదుడు పాంచాలదేశానికి ప్రభువు కాగా, ద్రోణుడు అతని దగ్గరకు వెళ్ళి అవమానం పొందాడు. ప్రపంచ (ప్రసిద్ధ

మైన కీర్తి గల ఆ (ద్రోణుడు హస్తినాపురానికి వచ్చి, కురుకుమారుల నందరిని శస్త్ర విద్యలో ఎంతో నేర్చరులుగా

తీర్చిదిద్దాడు. .

వ. ఇట్లు దనవలన విలువిద్య గజచిన పాండవ కౌరవ కుమారులం జూచి ద్రోణుండు 'నా కవమానంబు సేసిన య ప్పాంచాలు నోడించి పట్టికొని తెం; డిదియ నాకు గురుదక్షిణ యగు' నని పంచిన, వల్లె యని యందలు నా ద్రుపదుపయిం బోయి, వానిచేత నిర్జితు లయిన, నర్దునుండు ద్రుపదుతోద మహాయుద్ధంబు సేసి, వానిం బట్టికొని వచ్చి ద్రోణున కొప్పించిన నతండును. 6

ప్రతిపదార్థం: ఇట్లు: తనవలన; విలువిద్య, కఅచిన= నేర్చుకొన్న; పాండవ, కౌరవ, కుమారులన్‌; చూచి: ద్రోణుండు; నాకు;

అవమానంబు; చేసిన; ఆ+పాంచాలున్‌= పాంచాల దేశ రాజైన ద్రుపదుడిని; ఓడించి, పట్టికొని; తెండు; ఇదియ; నాకు; గురుదక్షిణ, అగున్‌; అని; పంచిన= పంపగా; వల్లె అని= సరే అని; అందయున్‌: ఆ; (ద్రుపదు; పయిన్‌; పోయి; వానిచేత; నిర్ణితులు+అయినన్‌= ఓడింప బడినవాళ్ళు కాగా; అర్హునుండు; ద్రుపదుతోడ; మహాయుద్దంబు; చేసి, వానిన్‌, పట్టికొని:ః వచ్చి;

(ద్రోణునకు; ఒప్పించినన్‌= అప్పగించగా; అతండును.

తాత్పర్యం: ఈ విధంగా తనవలన విద్య నేర్చుకొన్న కురు పాండవ కుమారులను చూచి (ద్రోణుడు- నన్ను

అవమానించిన (ద్రుపదుడిని ఓడించి, పట్టుకొని రండి. ఇదే నాకు గురుదక్షిణ" అని పంపగా, సరే అని, అందరు

ఆ (ద్రుపదునిమీదికి దండెత్తిపోయి ఓడిపోయారు. అర్జునుడు అతనితో మహాయుద్దం చేసి, అతడిని పట్టుకొని

వచ్చి (ద్రోణునికి అప్పగించాడు. అప్పుడు ఆ (ద్రోణుడు.

652 శ్రీమదాంధ్ర నువాభారతము

విశేషం: కౌరవులు మాత్రమే ముందు వెళ్లి ఓడినట్టు పూర్వకథ. ఇక్కడ అర్జునుడు తప్ప తక్కిన వాళ్ళంతా ఓడిన ట్టున్నది.

ఆ ఉల్లసంబు లాడి యోడకు పొమ్మని; ద్రుపదు విడిచి పుచ్చె; ద్రోణుచేత నట్లు విడువం బడి తదవమాన తస్తుం డై; పృషతనందనుండు పెద్ద యలిగి 7

ప్రతిపదార్థం: ఉల్లసంబులు+ఆడి= దెప్పిపొడుపుమాటలు మాట్టాడి; ఓడకు= భయపడవద్దు; పొమ్ము; అని, (ద్రుపదు; విడిచి;

పుచ్చెజు విడిచిపెట్టాడు; పృషత, నందనుండు= పృషతునియొక్క కుమారుడు; ద్రోణుచేతన్‌; అట్టు; విడువబడి; తత్‌+అవమాన, తప్పుండు+ఐ= ఆ అవమానంచేత బాధింపబడిన వా డై; పెద్ద, అలిగి= మిక్కిలి కోపించి.

తాత్పర్యం: దెప్పి పొడుపుమాటలు మాట్లాడి, అవమానించి, భయపడవద్దు పొమ్మని ద్రుపదుడిని విడిచిపెట్టాడు.

ద్రుపదుడు ఆ విధంగా విడువబడి, ఆ అవమానంతో బాధపడి, మిక్కిలి కోపించి.

వ. రణరంగంబున ద్రోణు నధియించునట్టి కొడుకును, నర్జునునకు దేవి యగునట్టి కూంయనుం బడయుదు నని బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణులనివాసంబులకుం జని, నిత్యంబును బ్రాహ్మణోపాస్తి సేయుచు, నొక్కనాండు గంగాకూలంబునందు వానప్రస్థవృత్తి నున్న యాజోపయాజు లనువారి నిద్దజ ననవరత వ్రత వ్యాసక్తులం గాశ్వపగోత్రులం గని వారికి నమస్కరించి, యందు గొండుక యయ్యును దపోమహిమ నెవ్వరికంటెం బెద్దయైన వాని నుపయాజు నుపాసించి యి ట్లనియె. 8

ప్రతిపదార్థం: రణ, రంగంబున= యుద్ధభూమిలో; (ద్రోణు, వధియించునట్టి= (ద్రోణుడిని చంపునట్టి; కొడుకునున్‌; అర్జునునకు;

దేవి యగునట్టి; కూతునున్‌, పడయుదున్‌+అని= పొందుతాను అని; బ్రహ్మ విదులు+అయిన= (బ్రహ్మజ్ఞాన సంపన్ను లైన;

(బ్రాహ్మణుల, నివాసంబులకున్‌= (బ్రాహ్మణు లుండే స్థలాలకు; చని= వెళ్ళి; నిత్యంబునుజ ప్రతిదినము; బ్రాహ్మణ+ఉపాస్తేి=

(బ్రాహ్మాణసేవ; చేయుచున్‌; ఒక్కనాండు; గంగా, కూలంబునందు= గంగా తీరంలో; వానప్రస్థ, వృత్తిన్‌= వానప్రస్థాశ్రమ జీవనంలో;

ఉన్న: యాజ+ఉపయాజులు; అను; వారిన్‌? ఇద్దజన్‌ః: అనవరత, (వ్రత, వ్యాసక్తులన్‌= సర్వదా [వ్రతంలో మిక్కిలిఆసక్తి గలవాళ్ళను;

కాశ్యప, గోత్రులన్‌: కనిజ చూచి; వారికి; నమస్కరించి; అందున్‌; కొండుక, అయ్యునుజ చిన్నవాడైనా; తపోమహిమన్‌; ఎవ్వరికంటెన్‌= ఇతరులందరికంటె; పెద్ద, ఐన, వానిన్‌= గొప్ప వాడైన వాడిని; ఉపయాజాన్‌; ఉపాసించి= పూజించి; ఇట్టు+అనియె. తాత్పర్యం; యుద్ధరంగంలో (ద్రోణుడిని చంపగల పుత్రుడిని, అర్జునునికి భార్య కాగల పుత్రికను పొందా లని

(ద్రుపదుడు బ్రహ్మ జ్ఞాన సంపన్ను లైన (బ్రాహ్మణు లున్న ప్రదేశాలకు వెళ్ళి, ప్రతిదినం బ్రాహ్మణసేవ

చేయసాగాడు. అతడు ఒకనాడు గంగాతీరంలో వానప్రస్థ ఆశ్రమ జీవితం గడుపుతున్న యాజ, ఉపయాజు లనే

ఇద్దరిని చూచాడు. వాళ్ళు కాశ్యపగోత్రులు; సర్వదా (వ్రతాచరణంలో మిక్కిలి ఆసక్తి కలవాళ్ళు. వాళ్ళకు నమస్కరించి, వాళ్ళలో చిన్న వా డైనా, తపోమహిమలో అందరికంటె పెద్దవా డైన ఉపయాజిని పూజించి, అతడు ఇట్టా అన్నాడు,

విశేషం: తనను ఓడించి పట్టి తెచ్చిన అర్జునునిపై శాశ్చత[్రోధం పెట్టుకోకుండా, అతని పరాక్రమాన్ని మనసారా మెచ్చుకొన్న

(ద్రుపదుని సహృదయత, అంతటి వీరకిశోరుడిని తన అల్డుడిగా చేసికొనా లన్న తలంపు (ప్రశంసింప దగినవే!

ఆళ్ళర్యకరమైనవే!చతుర్విధ - ఆ(శ్రమాలు: 1. (బ్రహ్మచర్యం 2. గార్హస్ట్యం 3. వానప్రస్థం 4 సన్న్యాసం.

క. మునినాథ! నాకు సత్చుత। జననం బగునట్టి క్రతువు సద్విధిం గావిం చినం గృతకృత్యుండ నగుదుం;; గొను మిచ్చెద నీకు లక్ష గోధేనువులన్‌. 9

ఆదిపర్వము - సప్తమాశ్వానము 653 ప్రతిపదార్థం: మునినాథ!= ముని్రేష్యా; నాకు; సత్‌+సుత, జననంబు+అగు= మంచి కుమారుడిని కలిగించే; (క్రతువున్‌= యజ్ఞాన్ని; సత్‌*విధిన్‌= శాస్త్రంలో చెప్పిన పద్దతి (ప్రకారం; కావించిన; కృత, కృత్యుండన్‌= నెరవేరిన కోరిక కలవాడను; ఆఅగుదున్‌; నీకు; లక్ష గో, ధేనువులన్‌= లక్ష ఆవులను, లేగలతో కూడిన పాడిఆవులను; ఇచ్చెద; కొనుము= తీసికొనుము. తాత్పర్యం: ఓ ముని (శ్రేష్టి! నాకు మంచి కుమారుడిని ప్రసాదించే యజ్ఞాన్ని జరిపిస్తే ధన్యుడ నౌతాను. నీకు లక్ష అవులను, లేగదూడలతో కూడిన పాడి ఆవులను ఇస్తాను, తీసికొమ్ము. విశేషం: 'గోధేనువులన్‌ అనే చోట 'గో ధనచయమునొ అనే పాఠాంతరం ఉంది. గో శబ్దానికున్న నానార్జాలలో ఆవు, ఎద్దు అనేవి ప్రకృతానికి సంబంధించినవి. వాటిలోను 'ఆవు' అనే అర్ధమే ఎక్కువ ఉచితంగా ఉన్నది. ధేనువు అంటే లేగదూడకు పాలు కుడిపే ఆవు.

వ. అనిన నుపయాజుం 'డే నిట్టి ఫలంబు నపేక్షింప; నెవ్వరేని ఫలార్భు లగుదు రందుల కేంగు" మనిన ద్రుపదుండు

వెండియు వానిన యొక్కసంవత్సరం బారాధించిన నమ్ముని వాని కి ట్లనియె. 10 ప్రతిపదార్థం: అనినన్‌: ఉపయాజుండు; ఏన్‌= నేను; ఇట్టి= ఈవిధమైన; ఫలంబున్‌; అపేక్షింపన్‌= కోరుకొనను; ఎవ్వరు+ఏని= ఎవరైనా; ఫల+అర్జులు+అగుదురు= ఫలం కోరుకొనే వారున్నట్టితే: అందులకు= అక్కడకు; ఏంగుము= వెళ్ళుము; అనిన; బ్రుపదుండు; వెండియు= మరల; వానిన్‌*అ= ఆ ఉపయాజినే; ఒక్క; సంవత్సరంబు; ఆరాధించినన్‌= సేవించగా; ఆ+ముని; వానికి=ఐ ద్రుపదునికి; ఇట్టు+అనియె. తాత్సర్యం: అని ద్రుపదుడు పల్కగా, ఉపయాజుడు నేను అట్టాంటి ఫలాన్ని ఆశించను. ఎవరైనా (ప్రతిఫలం

జ్‌,

ఆశించే వాళ్ళుంటే అక్కడికి వెళ్లుము" అన్నాడు. ద్రుపదుడు మళ్ళీ ఒక సంవత్సరం ఆ మునినే సేవించగా, అతడు (ద్రుపదునితో ఇట్టా అన్నాడు. విశేషం: కార్యార్థి ఎదుటివారితత్త్యం తెలిసికొనకుండా 'ఉపకారం చేస్తే ప్రతిఫలం ఇస్తా'నని పలకటం అవివేకం. అల్పులు అందుకు సంతోషిస్తారేమో కాని, మహాత్ములు దాన్ని మెచ్చరు. అంతేకాక దాన్ని అవినయంగా, అవినీతిగా అహంకారంగా కూడా పరిగణిస్తారు. = తే. అనఘచరితుండు మాయన్న వనములోనం

జనుచు నొక్కనాం డొక్కపం డొనరం గాంచి

కొనియె శుచి యగు శుచియుంగా దని యెటుంగం

బడని భూమి తలంబుపై6 బడిన దాని. శ్ర ప్రతిపదార్థం: అనఘ, చరితుండు= పాపరహిత మైన నడవడి కల వాడు; మా, అన్న (యాజుడు); వనములోనన్‌= అడవియందు; చనుచున్‌= వెళ్ళుతూ; ఒక్కనాండు; శుచి, అగు= శుభ్రమైనది; శుచియున్‌+కాదు= శుభ్రమైనది కాదు; అని; ఎయుంగన్‌+*పడని= తెలియని; భూమి, తలంబు, పైన్‌= భూప్రదేశంమీద; పడిన దాని; ఒక్క, పండు; ఒనరన్‌= ఒప్పుగ, కాంచి= చూచి? కొనియె= తీసికొన్నాడు. తాత్సర్యం: పాప రహిత మైన నడవడి గల మా అన్న యాజుడు అడవిలో వెళ్తూ ఒకనాడు “ఇది శుభ్ర మైనది, కాదు' అని తెలియని నేలమీద పడిన ఒక పండును చూచి, దాన్ని తీసికొన్నాడు. విశేషం: ప్రై పద్యంలో అన్నీ ప్రాసయతులే.

654 శ్రీమదాంధ్ర మహాభారతము వ. 'ఫలార్ధి యయినవాండు తత్పలానుబంధంబు లయిన దోషంబులు పరికింపండు గావున నమ్మునివరుండు నీ కభిమతంబు సేయుం బొ మ్మనిన ద్రుపదుం డరిగి, సంహితాధ్యయనాది పంచమహాయజ్ఞంబులు సేయుచు, శిలోంఛవృత్తి భైక్షసంపాదిత కుటుంబభారుం డై ఘోరతపోవృత్తి నున్న యాజుం గని, నమస్కరించి యి ట్లనియె. 12 ప్రతిపదార్హం: ఫల+అర్జి, అయినవాండు= ఫలాన్ని కోరుకొనేవాడు; తత్‌+ఫల+అనుబంధంబులు+అయిన=జ ఆ ఫలానికి సంబంధించిన; దోషంబులు; పరికింపండుజ లెక్కపెట్టడు; కావున; ఆ+ముని, వరుండు= ఆ ముని'శ్రీష్టుడు; నీకు; అభిమతంబు= ఇష్టమైనది; చేయున్‌, పొమ్ము+అనిన; (ద్రుపదుండు; అరిగి= వెళ్ళి; సంహితా+అధ్యయన+ఆది= వేదాన్ని అధ్యయనం చేయటం మొదలైన; పంచ; మహాయజ్ఞంబులు; చేయుచు; శిల+ఉంఛ, వృత్తి ఖైక్షు సంపాదిత, కుటుంబ, భారుండు+ఐ= పైరుకోసిన తరువాత మళ్ళయందు జారిపడిన వెన్ను, గింజలు మొదలగు వాటిని ఏరికొనే జీవనోపాయంచేత, భిక్షా సంబంధంగా- అనగా బిచ్చమెత్తి సంపాదించబడిన దానిచేత కుటుంబ భారాన్ని వహించిన వా డై; ఘోర, తపో, వృత్తిన్‌+ఉన్న= భయంకరమైన తపస్సు చేస్తున్న; యాజాన్‌; కని= చూచి, నమస్కరించి; ఇట్టు+అనియె. తాత్పర్యం: ఫలాన్ని కోరేవాడు దానికి సంబంధించిన దోషాలను లెక్కపెట్టడు. అందువలన ఆ ముని(శ్రేష్టుడు నీవు కోరిన దానిని చేస్తాడు, వెళ్ళుము" అని చెప్పగా, (ద్రుపదుడు యాజుని వద్దకు వెళ్ళాడు. అతడు వేదాధ్యయనం మొదలైన పంచమహాయజ్ఞాలు చేసేవాడు. పైరు కోసిన తర్వాత మళ్లలో జారిపడిన వెన్నులు, గింజలు మొదలైన వాటిని ఏరుకొనే జీవనోపాయంచేత, బిచ్చమెత్తి సంపాదించిన దానిచేత- కుటుంబభారాన్ని వహిస్తూ భయంకర మైన తపస్సు చేస్తున్నాడు. అతడిని చూచి ద్రుపదుడు నమస్కరించి ఇట్టా అన్నాడు. విశేషం: పంచమహాయజ్ఞాలు: (1) దేవయజ్ఞం (దేవతలతృప్తికాఅకు అగ్నిహోత్రంలో హవిస్సులు వేసి హోమం చేయటం) (2) పితృయజ్ఞం (పితృదేవతలతృప్తికొజకు స్వధాకారంతో తర్చణం చేసి, (బ్రాహ్మణులకు భోజనం పెట్టటం) (3) భూత యజ్ఞం (వైశ్వదేవం చేసిన తర్వాత బహిర్దేశంలో భూతాలతృప్తికొఅకు బలి యివ్వటం) (4) మనుష్య యజ్ఞం (యధాశక్తిగా అతిధులకు అన్నం పెట్టటం) (5) బ్రహ్మయజ్ఞం (వేదాధ్యయనం - ఒక బుక్కును గాని, యజుస్సును గాని, సామాన్ని గాని, శక్తి కొద్దీ నిత్యం అభ్యసించటం,). క, _ మునినాథ! నాకు సత్చుత। జననం బగునట్టి క్రతువు సద్విధి గావిం చినం గృతకృత్యుండ నగుదుం । గొను మిచ్చెద నీకు లక్ష గో ధేనువులన్‌. 13 ప్రతిసదార్థం: తాత్పర్యం: (ప్రతిపదార్హ, తాత్పర్యాలకొరకు తొమ్మిదవ పద్యం చూడండి), విశేషం: యాజుడు ఫలార్థి అని ముందే ఆయన తమ్ముడు చెప్పాడు. కనుక ద్రుపదుడు 'లక్ష గోధేనువులను ప్రతిఫలంగా ఇస్తాను" అనటంలో తప్పు లేదు. నన్నయ 9వ పద్యాన్నే యథాతధంగా మరల వాడుకొన్నాడు. న, అవి ప్రార్ధించి వెండియు నా ద్రుపదుండు యాజున కి ట్లనియె. 14 ప్రతిపదార్థం: అని; ప్రార్ధించి; వెండియున్‌= మరల; ఆ (ద్రుపదుండు; యాజునకు; ఇట్టు+అనియె. తాత్సర్యం: అని వేడికొని మరల ఆ ద్రుపదుడు యాజునితో ఈ విధంగా అన్నాడు. క. _ భారతవంశాచార్యుడు। భారద్వాజుండు నా కపాయము సేసెన్‌ ఘోరాజి నతని నోర్టు న । పొర పరాక్రమ సుపుత్తుంబదయంగ వలయున్‌, 15

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 655 ప్రతిపదార్హం: భారతవంశ+ఆచార్యుండు= భరతునికి సంబంధించిన వంశానికి గురువు; భారద్వాజుండు= భరద్వాజుని పుత్రు డైన ద్రోణుడు; నాకు; అపాయము కీడు; చేసెన్‌; అతనిన్‌; ఘఫోర+ఆజిన్‌= భయంకర మైన యుద్దంలో; ఓర్చు= ఓడించే, అపార, పరా॥క్రమున్‌= అంతులేని పరాక్రమం కలవాడిని; సుపుత్రున్‌= మంచి కుమారుడిని; పడయంగవలయున్‌= పొందవలెను. తాత్పర్యం: భరతవంశానికి గురువు, భరద్వాజునికి పుత్రుడు అయిన (ద్రోణుడు, నాకు హాని చేశాడు. అతడిని మహాయుద్ధంలో ఓడించే మంచిపుత్రుడిని పొందాలి.

క. _షడరత్నిధనుర్ధరుండె। య్యెడ నజితుండు గాన వాని హీనుంగాం జే యుండు నాకు6 జతుర్వర్గము ।; వదడయుట యని పృషతసుతుండు ప్రార్ధించె మునిన్‌. 16

(ప్రతిపదార్థం: షట్‌+అరత్ని, ధనుః+ధరుడు= చిటికెన (వ్రేలు చాచిన ఆరు పిడిమూరల ధనుస్సును ధరించినవాడు, ద్రోణుడు;

ఎయ్యెడన్‌= ఎక్కడ కూడ; అబితుండు, కాన= జయించబడనివాడు కావున; వాని; హీనుంగాన్‌, తక్కువైన వాడినిగా; చేయుండు=

చేసినచో; నాకున్‌; చతుర్వర్గము= ధర్మార్థ కామమోక్షాలు; పడయుటజ పొందుట; అని; పృషత, సుతుండు; పృషతునికుమారు డైన

(ద్రుపదుడు; మునిన్‌= యాజుని; ్రార్థించె.

తాత్పర్యం: “ఆరుమూరల పొడ వైన ధనుస్సును ధరించిన (ద్రోణుడు ఎక్కడకూడ జయింపబడని వాడు కనుక,

అట్టాంటివాడిని తక్కువ చేస్తే, ధర్మార్ధ కామ మోక్టా లైన నాలుగు పురుషార్థాలు నేను పొందినట్లే అని ద్రుపదుడు

యాజుని ప్రార్ధించాడు.

వ. అయ్యాజుండును యాజకత్వంబున కొడంబడి 'నీకోర్మికిం దగినయట్టి కొదుకునుం గూంతురుం బుట్టుదు; రోడకుండుమని యజ్లోపకరణద్రవ్యంబులు సమకట్టికొని, యథావిధి నుపయాజుండు సహాయుండుగా సౌత్రామణి మయిన కోకిలాదేవి పత్నిగా ద్రుపదుం బుత్రకామేప్తి సేయించిన, నందు మంత్రాహుతులం దృప్తుం డయిన యగ్నిదేవువలన. 17

వ్రతిపదార్హం: ఆ+యాజుండును; యాజకత్వంబును= యజ్ఞం చేయించే యాజ్జికుడుగా ఉండటానికి; ఒడంబడి= ఒప్పుకొని; నీ,

కోర్కికిన్‌; తగిన, అట్టి; కొడుకునున్‌: కూతురున్‌; పుట్టుదురు; ఓడకుండుము= భయపడవద్దు: అని; యజ్ఞ+ఉపకరణ,

(ద్రవ్యంబులుజ యజ్ఞసాధనములను, పదార్థములను; సమకట్టికొని= సిద్దం చేసికొని; యధావిధిన్‌= శాస్త్ర పద్ధతి ప్రకారం:

ఉపయాజుండు (తమ్ముడు); సహాయుండుగా; సౌత్రామణి, అయిన, కోకిలాదేవి (ద్రుపదుని భార్య); పత్నిగా యజ్ఞాది ధర్మ

కార్య నిర్వహణంలో భర్తను అనుసరించే భార్యగా; (ద్రుపదున్‌? పుత్రకామ+ఇష్టి= పుత్రులను కోరి చేసే యజ్ఞాన్ని; చేయించినన్‌, అందు; మందత్ర+ఆహుతులన్‌= మంత్రాలచేత, (వ్రేల్ళిన హోమద్రవ్యాల చేత; తృప్పుండు= తృప్తిపొందిన వాడు; అయిన; అగ్నిదేవువలన,

తాత్పర్యం: ఆ యాజుడు యజ్ఞం చేయించే యాజ్జికుడుగా ఉండటానికి అంగీకరించి, 'నీ కోరికకు తగిన కొడుకు,

కూతురు జన్మిస్తారు; భయపడవద్దు' అని- యజ్ఞసాధనాలను, పదార్దాలను సిద్దం చేసికొని, తమ్ముడు

ఉపయాజుడు సహాయుడుగా, (ద్రుపదుని భార్య కోకిలాదేవి ధర్మపల్నిగా, (ద్రుపదునిచేత శాస్త్రోక్తంగా యజ్ఞం చేయించాడు. మంత్రాలతో ఆహుతులుగా (వ్రేల్ఫిన పదార్థాలతో తృప్తి పొందిన అగ్నిదేవునివలన.

విశేషం: భార్య అనగా భరింపబడేది. జాయ సంతానాన్ని కూర్చేది. గృహిణి గృహాన్ని, నిర్వహించేది. రాజులకు పెక్కుమంది

భార్యలున్నా, యజ్ఞాలవంటి ధర్మకార్యాలలో భర్తను అనుసరించే వ్యక్తిని, పత్ని, ధర్మపత్ని అని వ్యవహరిస్తారు. పుత్రకామేష్టి:

పుత్రులను కోరి చేసే యజ్ఞం. పూర్వం దశరధమహారాజు ఈ యజ్ఞం చేశాడు.

656 శ్రీమదాంధ్ర ముహాభారతము క. _ జ్వాలాభిలాంగుండు కర । వాల బృహచ్చాపధరుండు వరవర్మ కిరీ

టాలంకారుండు వహ్నాియ । పోలె రథారూఢుం డొక్క పుత్తుండు పుట్టెన్‌. 18 ప్రతిపదార్హం: జ్వాలా+ఆభీల+అంగుండు= మంటవలె భయంకర మైన శరీరం కలవాడు; కరవాల, బృహత్‌+చాప, ధరుండు= ఖడ్డాన్ని, పెద్ద ధనుస్సును, ధరించినవాడు; వర, వర్మ, కిరి ట+అలంకారు6ండు= (శ్రేష్టమైన కవచంచేత, కిరీటంచేత అలంకరింప బడినవాడు; రథ+ఆరూఢుండు= రథాన్ని ఎక్కిఉన్నవాడు; వహ్నియ పోలె= అన్నిహోత్రునివలె; ఒక్క, పుత్రుండు; పుట్టెన్‌. తాత్సర్యం: అన్నిజ్యాలవలె భయంకర మైన శరీరం కలవాడు, ఖడ్లాన్నీ, పెద్ద ధనుస్సును ధరించినవాడు, (శ్రేష్ట మైన కవచంతో కిరీటంతో అలంకరింపబడినవాడు, రథాన్ని అధిరోహించినవాడు అయిన ఒక పుత్రుడు అగ్నిహో(త్రుని వలె ఉదయించాడు. విశేషం; అలం: ఉపమ. వ మభియు. 19 తాత్సర్యం: ఇంకా. తరలము.

కుల పవిత్ర, సితేతరోత్పల కోమ లామల వర్ణ, యు

త్పలసుగంధి, లసన్మహోత్ప్సలపత్రనేత్ర యరాళకుం

తల విభాసిని, దివ్యతేజను. దాల్చి యొక్కకుమారి ద

జ్ఞలనకుండమునందు. బుట్టె బ్రసన్నమూర్తి ముదంబుతోన్‌. 20 ప్రతిపదార్థం; కుల, పవిత్ర= వంశాన్ని పవిత్రం చేసేది? సిత+ఇతర+ఉత్పల, కోమల+అమల వర్ష= తెల్లదికాని కలువ వలె సుకుమారమూ స్వచ్చమూ అయిన రంగు కలది - అనగా నల్లకలువవంటి శరీరవర్షం కలది; ఉత్పల, సుగంధి= కలువవంటి సువాసన కలది; లసత్‌+మహా+ ఉత్పల, పత్ర, వేత్ర= ప్రకాశించే పెద్ద కలువ రేకుల వంటి నేత్రాలు కలది; అరాళ. కుంతల, విభాసిని= వంకరలు తిరిగిన వెండ్రుకలతో వెలిగేది; దివ్య, తేజమున్‌= దివ్యకాంతిని; తాల్చి= ధరించి; ప్రసన్నమూర్తి= హాయిని గొలుపు ఆకారం కలది; ముదంబుతోన్‌= సంతోషంతో; ఒక్క, కుమారి= ఒక కన్య, తత్‌+జ్వలన, కుండము+అందున్‌= ఆ అన్నికుండంలోనుండి; వుట్టెన్‌. తాత్సర్యం; వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్షం కలది, కలువ గంధం వంటి సుగంధం కలది, కళకళలాడే పెద్ద కలువ రేకుల వంటి కన్నులు కలది, వంకరలు తిరిగిన వెండ్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించింది, మనోహర మైన ఆకారం కలది అయిన ఒకకన్య సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది. విశేషం: అలం: ఉపమ. నన్నయ తరల వృత్తాన్ని ఆది సభా పర్వాలలో ప్రతి ఆశ్వాసంలోనూ కనీసం ఒకటి రచించాడు. ఆదిపర్వంలోని చతుర్హ, పంచమ, అష్టమాశ్వాలలో ఒక్కొకటి చొప్పున మిగిలిన వాటిల్లో రెండు చొప్పున వాడాడు. సభాపర్వంలో (ప్రధమాశ్వాసంలో మూడు, ద్వితీయాశ్వాసంలో అయిదు. వాడాడు. ఆరణ్యపర్భంలో ద్వితీయాశ్వాసంలో తప్ప (ప్రధమ తృతీయాళ్వాసాలలో రెండేసి రచించాడు. నన్నయ అభిమాన విశేష వృత్తాలలో ఇది ఒకటి. లక్షణం ఇదివరలో చెప్పబడింది. (చూడు అది.3-142) (సంపా) వ. ఇట్లు పుట్టిన యక్కొడుకునకుం గూంతునకు ధృష్టద్యుమ్నుండును గృష్టయు నను నామంబు లాకాశవాణి జన

విదితంబుగా నుచ్చరించె; నట్లు ద్రుపదుండు లబ్ధ సంతానుం డయి, సంతసిల్లి యాజునకు యధోక్త దక్షిణ

ఆదిపర్వము - సప్త్రమాశ్వాసము 657 లిచ్చి, బ్రాహ్మణులం బూజించి, ధృష్టద్యుమ్నుని ధనుర్వేదపారగుం జేయించి యున్నంత, నక్కన్య యిపుడు వివాహసమయప్రాప్త యయిన. 21 (ప్రతిపదార్థం: ఇట్లు; పుట్టిన; ఆ+కొడుకునకున్‌; కూతునకు; ధృష్టద్యుమ్నుండును; కృష్ణయున్‌? అను; నామంబులు; ఆకాశవాణి; జన, విదితంబుగాన్‌= జనులకు తెలిసేటట్టుగా; ఉచ్చరించెన్‌= పలికెను; అట్టు; (ద్రుపదుండు; లబ్బ, సంతానుండు+అయి= పొందిన సంతానం కలవాడై; సంతసిల్లి= సంతోషించి; యాజునకు; యథా+ఉక్త దక్షిణలు= చెప్పిన ప్రకారం దక్షిణ లిచ్చి; (బ్రాహ్మాణులన్‌ పూజించి; ధృష్టద్యుమ్నుని; ధనుర్వేద పారగున్‌= ధనుర్వేదముయొక్క ఆవలి ఒడ్డు చేరిన వాడినిగా - అనగా ధనుర్వేదాన్ని పూర్తిగా నేర్చిన వాడినిగా; చేయించి; ఉన్నంతన్‌; ఆ+కన్య= ఆ కృష్ణు ఇపుడు; వివాహ, సమయ, ప్రాప్త అయిన= వివాహసమయం సమీపించింది కాగా. తాత్పర్యం: ఈ విధంగా పుట్టిన కుమారునికి, కూతురికి - ధృష్టద్యుమ్నుడు, కృష్ణ అనే పేర్లను ప్రజలందరికీ తెలిసే విధంగా ఆకాశవాణి పలికింది. ఆ విధంగా (ద్రుపదుడు సంతానం పొంది, సంతోషించి, యాజునికి చెప్పిన 'ప్రకారం దక్షిణ లిచ్చి, బ్రాహ్మణులను పూజించాడు. ధృష్టద్యుమ్నుడిని ధనుర్వేదపారంగతుడిని చేయించాడు. ఇప్పుడు ఆ కన్యకు వివాహసమయం సమీపించగా. (ద్రాపదీనినాహప్రయత్నము (అమూలకము)

ఉ. మానితు లైన పాందవకుమారులుం గుంతియు లక్కయింట ను

గ్రానలదగ్గు లై రని ధరామరముఖ్యు లెజింగి చెప్పణగా

నా నరనాయకుండు విని యాతత శోకమహానలజ్వల

న్మానసుం డయ్యె బంధుజనమంత్రిపురోహిత విప్రసన్నిధిన్‌, 22 ప్రతిపదార్థం: మానితులు+ఐన= గౌరవింపబడినవా రైన, పాండవ కుమారులున్‌= పాండవులూ; కుంతియు; లక్క, ఇంటన్‌: ఉగ్ర+అనల దగ్భులు+ఐరి+అని= భయంకర మైన అగ్నిచేత కాలిపోయారని; బంధు, జన, మంత్రి, పురోహిత విప్ర, సన్నిధిన్‌= బంధుజనులయొక్క, మంత్రులయొక్క, పురోహితులయొక్క, బ్రాహ్మాణులయొక్క ఎదుట; ధరా+అమర ముఖ్యులు= (బ్రాహ్మణ 'శ్రేష్టులు; ఎజింగి= తెలిసికొని; చెప్పంగాన్‌. ఆ, నర నాయకుండు= ఆ రాజు - ద్రుపదుడు; విని; ఆతత, శోక, మహా+ అనల, జ్యులత్‌+మానసుండు+అయ్యెన్‌= మిక్కుటమైన దుఃఖ మనెడి గొప్ప అస్లిచేత దహింప బడుతున్న మనస్సు కల వా డయ్యాడు. తాత్చర్యం; గొప్పవా ళ్ళయిన పాండవులు, కుంతి లక్కయింట్లో భయంకర మైన అగ్నికి ఆహుతి అయ్యా రని- బంధువుల, మంత్రుల, పురోహితుల, బ్రాహ్మణుల సమక్షంలో (బ్రాహ్మణ్రేష్టులు చెప్పగా, విని (ద్రుపదుడు అధికదుఃఖ మనే అన్నిచే దహింప బడుతున్న మనస్సు కల వా డయ్యాడు. విశేషం: అలం: రూపకం. జృలత్‌+మానసుడు= జృలన్మానసుడు - అనునాసికసంధి. న. మఖియును 23 తాత్సర్యం: అంతటితో ఆగక.

658 శ్రీమదాంధ్ర నుహాభారతము

సీ, 'ఇంద్రసమానున కిందీవరశ్యామ ; సుందరాంగున కింద్రనందనునకు దేవింగాం బ్రీతితో దీని నీంగాంచితి ।; నని యున్నచో విధాత్భనకు నిట్లు పాడియే విఘ్న మాపాదింప; నమ్మహా । ధ్వరమునం బుట్టిన సరసిజాక్షి నే నెట్టు లొరులకు నీ నేర్తు నని దుఖ్లు | పరవశుండయి యున్న ధరణిపతికిం

ఆ దత్పురోహితుండు దా నిట్టులనియె 'న । ప్పాండవులనుగుజిచి బహువిధంబు లగు నిమిత్తములు నయంబునం జూచితి; । నెగ్గు లేదు; వారి కెల్ల లగ్గు. 24

ప్రతిపదార్థం: ఇంద్ర, సమానునకు= ఇంద్రునితో సమానమైనవానికి; ఇందీవర, శ్యామసుందర+ అంగునకు= నల్లకలువవలె నల్ల

నై అంద మైన శరీరం కలవానికి; ఇంద్ర, నందనునకు= ఇంద్రుని కుమారు డైన అర్జునునికి; ప్రీతితో ప్రేమతో; దీనిన్‌= ఈ

కృష్ణను; దేవిగాన్‌= భార్యగా; ఈన్‌+కాంచితిన్‌= ఇవ్వగలిగాను; అని; ఉన్నచో; విధాతృనకున్‌= (బ్రహ్మదేవునికి; ఇట్టు విఘ్నము=

చెజుపు; ఆపాదింపన్‌= కలిగించుట; పాడియే=ఐ న్యాయమా; ఆ+మహా+అధ్వరమునన్‌= ఆ మహాయజ్ఞంలో; పుట్టిన; సరసిజ+అక్షిన్‌= సరస్సునుండి పుట్టిన పద్మమువంటి కన్నులు కలదానిని; ఏన్‌= నేను; ఎట్టుల=ఐ ఏ విధంగా; ఒరులకున్‌= ఇతరులకు; ఈ, నేర్తును= ఇవ్వగలను; అని; దుఃఖ, పరవళుండు+అయి= దుఃఖానికి పూర్తిగా లొంగిపోయినవా డై - అనగా మిక్కిలిదుఃఖం పొందిన వా డై; ఉన్న; ధరణి, పతికిన్‌= భూపతికి - (ద్రుపదరాజుకు; తత్‌౪పురోహితుండు= అతని పురోహితుడు; తాన్‌= తాను; ఇట్టుల+అనియెన్‌; ఆ+పాండవులను; గుజీచి= గురించి; బహువిధంబులు+అగు=. పెక్కు విధాలైన; నిమిత్తములు= శకునాలు, నయంబునన్‌= నేర్పుగా; చూచితిన్‌; వారికి; ఎగ్గు= కీడు; లేదు; ఎల్ల= అంతయు; లగ్గు= మేలు. తాత్పర్యం: “ఇంద్రునితో సమానుడు, నల్లకలువవలె నల్లని అంద మైన శరీరం కలవాడు. ఇంద్రుని కుమారుడు అయిన అర్జునునికి (పేమతో కృష్ణను భార్యగా ఇవ్వా లని ఉండగా, (బ్రహ్మదేవుడు ఈ విధంగా చెరుపు చేయటం న్యాయమా? ఆ మహాయజ్ఞంలో పుట్టిన (ద్రౌపదిని ఏ విధంగా ఇతరులకు ఇవ్వగలను?” అని ద్రుపదుడు దుఃఖంలో మునిగిపోయాడు. అప్పు డతని పురోహితుడు ఇట్టా అన్నాడు - 'ఆ పాండవులనుగురించి అనేక విధా లైన శుభ శకునాలను నిపుణంగా చూచాను. వారికి కీడు లేదు. అంతా మేలే".

విశేషం: అర్జునుడు ఇందీవరశ్యాముడు. అగ్నినుండి పుట్టిన కృష్ణకూడ 'సెతేతరోత్పల కోమలామలవర్ల' - (ఉత్పల ప'్రనేత్ర,

ఉత్పలసుగంధి కూడ). అర్జునుని కొరకే ద్రౌపది పుట్టింది కనుక ఇద్దరిలో ఈ రూపసామ్యం ఒక విశేషం.

వ. తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బద్బశ్యుం దై యుండిన, నతనిం గానక శజబీదేవి శోకింపం బోయిన నుపశ్రుతిం జేసి బృహస్పతి దానికి దేవేంచ్రాగమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం; గావున నేను నుపశ్రుతిం జూచితి; నిది దప్పదు; పాండవులు పరలోకగతులు గారు; పరమానందంబున నున్నవారు; వార లెందుండియు నిందులకు వత్తురు; నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు; మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం” బనినం బురోహితువచనంబునంజేసి, యూఖడి ద్రుపదుండు నేంటికి డెబ్బదియేనగు దివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాండు స్వయంవరం బని ఘోషింపం బంచి. 25

ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; దేవేంద్రుండు; కొండు+ఒక, కాలంబు= కొంత కాలం; అదృశ్యుండు+ఐ= అగుపడనివా డై

ఉండినన్‌; అతనిన్‌; కానకజఐ చూడక; శచీదేవి; శోకింపన్‌+పోయినన్‌= దుఃఖించపోగా; ఉప(శ్రుతిన్‌*చేసి= శుభాశుభ సూచక మైన

ఆదిపర్వను - సప్తనూశ్వాసము 659 ఇతరుల సంభాషణ ధ్వనిని వినటంచేత; బృహస్పతి; దానికి= ఆ శచీదేవికి; దేవేంద్రశ+ఆగమనంబుజ దేవేంద్రునియొక్క రాకను; చెప్పెను+అని; వేదంబుల= వేదాలలో; వినంబడున్‌;? కావున; నేనున్‌; ఉప[శ్రుతిన్‌; చూచితిన్‌; ఇది; తప్పదు; పాండవులు; పరలోకగతులు, కారు= స్వర్గలోకానికి వెళ్ళినవారు కారు-అనగా మరణించలేదు; పరమ+ఆనందంబునన్‌= మిక్కిలి సంతోషంతో, ఉన్న, వారు; వారలు; ఎందు+ఉండియున్‌= ఎక్కడ ఉన్నా; ఇందులకు= ఇక్కడికి; వత్తురు=వచ్చుదురు; నీవును; సు, చిత్తుండవు+అయి= కలతలేని మంచి మనస్సు కలవాడవై; స్వయంవరంబు: ఈ+పురంబున; ఘోషింపన్‌= చాటించటానికి; పంపుము; ఇది=ఐ ఈ స్వయంవరం; కన్యా, దానంబునందు; రాజులకు; శాస్త్ర చోదితంబు= శాస్త్రంచేత చెప్పబడింది; అనినన్‌; పురోహితు, వచనంబునన్‌+చేసి=ఐ పురోహితుని యొక్క మాటలతో; ఊఆడి= ఓదార్పునాంది; ద్రుపదుండు; నేటికి, డెబ్బది, ఏను+అగు= డెబ్బది డ్రైదవది అగు; దివసంబునన్‌= రోజున; పొష మాసంబున= పుష్యమాసంలో; శుక్త, పక్షంబునన్‌; అష్టమియు; రోహిణి నాడు= రోహిణీనక్షత్ర మున్ననాడు; స్వయంవరంబు+అని; ఘోషింపన్‌= చాటించటానికి; పంచి= ఆజ్ఞాపించి. తాత్పర్యం: పూర్వం దేవేంద్రుడు కొంతకాలం కనబడకపోగా, శచీదేవి శోకించిం దనీ, శుభసూచక మైన ఇతరుల సంభాషణనుబట్టి బృహస్పతి ఆమెకు దేవేంద్రుని రాకను గురించి చెప్పా డనీ వేదాలవలన తెలుస్తున్నది. కనుక నేనుకూడ అట్టాంటి శుభశకునాలే చూచాను. ఇది తప్పదు. పాండవులు మరణించలేదు. పరమానందంతో ఉన్నారు. వా ళ్ళేక్కడున్నా ఇక్కడికి వస్తారు. నీవు నిర్మల మైన మనస్సుతో ఈ పట్టణంలో స్వయంవరాన్ని చాటించటానికి ఆజ్ఞాపించుము. స్వయంవరం కన్యాదానంలో రాజులకు శాస్త్ర విహితమే”- ఈ విధంగా చెప్పిన పురోహితుని మాటలతో ఊరటచెంది, (ద్రుపదుడు- ఈ నాటినుండి డెబ్బె ఐదవరోజు పుష్యమాస, శుక్త పక్ష అష్టమి, రోహిణీ నక్షత్రం ఉన్నరోజు స్వయంవరం జరుగుతుం దని చాటించటానికి ఆజ్ఞాపించాడు. విశేషం: కొన్ని ప్రతులలో 'అష్టమి"కి బదులు పంచమి అని ఉన్నది. ఉపశ్రుతి అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా శుభాశుభసూచకమైన ఇతరుల సంభాషణం వినటం. ఇది శకునం. దీన్ని బట్టి భవిష్యత్తులో జరుగబోయే శుభాళుభాలను శాకునికులు చెప్పుతారు.

క. _ ఎవ్వరికిని మోపెట్టను; దివ్వను శక్యంబు గాని దృఢకార్ముకమున్‌

దవ్వై దినమున దిరిగెడు : నవ్విలసత్క్మనకమత్వయంత్రముం జేసిన్‌. 26 (ప్రతిపదార్హం: ఎవ్వరికిని; మోపెట్టను= ఎక్కు పెట్టటానికి; తివును= లాగటానికి; శక్యంబు+కాని= సాధ్యం కాని; దృఢ, కార్ముకమున్‌= బలమైన ధనుస్సును; దవ్వు+ఐ= దూరమై; దివమునన్‌= ఆకాశంలో; తిరిగెడు= తిరుగునట్టి; ఆ+విలసత్‌+కనక, మత్స్యయం[త్రమున్‌= ప్రకాశించే బంగారుచేపతో కూడిన యంత్రాన్ని; చేసెన్‌= రూపొందించాడు. తాత్పర్యం: ఎక్కుపెట్టటానికి కాని, లాగటానికి కాని ఎవ్వరికీ సాధ్యం కాని ఒక బలమైన ధనుస్సును, దూరంగా ఆకాశంలో తిరిగే (ప్రకాశవంత మైన బంగారు మత్స్య యంత్రాన్ని రూపొందించాడు. క, _ 'ధరణింగల రాజులెల్లను । బురుడున గాంపిల్య నగరమున కరిగెద రొం

డొరులం గడవంగ, నని భూ । సురవరు. డెజింగించెం బృషతసుతుకథయెల్లన్‌. 27 ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిమీద; కల= ఉన్న; రాజులు+ఎల్లన్‌= రాజులంతా; పురుడునన్‌= సమానంగా; కాంపిల్య నగరమునకు (ఇది ద్రుపదుపురం); ఒండొరులన్‌+కడవంగన్‌= ఒకరికంటె ముందుగా మరొకరు; అరిగెదరు= వెళ్ళుతారు: అని; భూసుర, వరుండు= బ్రాహ్మణ శ్రేష్టుడు; పృషత, సుతు, కథ, ఎల్లన్‌= ద్రుపదుడి కథ అంతా; ఎజి(గించెన్‌= చెప్పాడు. తాత్పర్యం: “భూమిమీద ఉన్న రాజులంతా ఒకరికొకరు (ముందు వెళ్ళా లని) పోటీపడుతూ [ద్రుపదుని కాంపిల్య నగరానికి వెళ్లుతున్నా' రని ఆ (బ్రాహ్మణశ్రేష్టుడు (ద్రుపదుని కథ అంతా చెప్పాడు.

660 శ్రీమదాంధ్ర మహాభారతము న, దాని వివి పాండునందను లందులకుం బోననున్నం గొడుకుల యభిప్రాయం బెణింది కుంతీదేవి యి

ట్లనియె. 28 ప్రతిపదార్హం: దాని= ఆ వృత్తాంతమును; విని; పాండునందనులు; అందులకున్‌= కాంపిల్యనగరానికి; పోవన్‌+ఉన్నన్‌= పోవలె నని ఉండగా; కొడుకుల; అభిప్రాయంబు; ఎటింగి; కుంతీదేవి; ఇట్టు+అనియె. తాత్సర్యం: ఆ వృత్తాంతాన్ని విని పాండవులు కాంపిల్యనగరానికి పోవా లనే అభిప్రాయంతో ఉండగా, దానిని (గ్రహించి కుంతీదేవి వాళ్ళతో ఈ విధంగా అన్నది.

పాండవులు పాంచాలపురంబునకు బయలుదేరుట. (సం.1-156-2)

క, _ కడుంయెద్దకాలముండితి। మొడండి; యిం దెంతకాల మున్నను మనక

య్యొడు లాభ మేమి? మజి యె ప్పుడు నుచితమె యొరుల యిండ్ల పొత్తున నుండన్‌? 29 ప్రతిపదార్థం: కడున్‌= చాల; పెద్ద, కాలము= ఎక్కువ కాలం; ఒడంబడి= ఇష్టపడి; ఉండితిమి; ఇందు+ఎంతకాలము+ ఉన్నను; మనకు; అయ్యెడు= కలిగెడు; లాభము+ఏమి; మటి; ఎప్పుడున్‌; ఒరుల= ఇతరుల; ఇండ, పొత్తునన్‌= ఇండ్లల్లో కలిసిన; ఉండన్‌; ఉచితమె= తగునా? తాత్పర్యం: ఏకచ(క్రపురంలోని ఈ (బ్రాహ్మణుని ఇంట్లో చాలా యెక్కువకాలం ఎట్టాగో ఉన్నాం. ఇక్కడ ఎంత కాల మున్నా మనకు కలిగే లాభ మే ముంది? అంతేకాక ఎప్పుడూ ఇతరుల యిండ్లలో కలిసి ఉండటం ఉచితం కాదుకదా! వ. _దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును, బాంచాలపతి పరమధార్మికుండనియును వింటిమి; మఠి

యట్లుం గాక. 30 ప్రతిపదార్థం: దక్షిణ, పాంచాలంబు= దక్షిణ పాంచాలదేశం; కరంబు= మిక్కిలి; రమ్యంబు+అనియును= అందమైన దనీ, పాంచాల, పతి= పొంచాలరాజు; పరమ, ధార్మికుండు+అనియును= మిక్కిలిధర్మబుద్ధికలవా డనీ; వింటిమి; మతి; అట్టున్‌+ కాక. తాత్పర్యం: దక్షిణపాంచాలదేశం ఎంతో అందమైనదనీ, పాంచాలాన్ని పాలించే రాజు మిక్కిలి ధర్మబుద్ధి కలవాడనిన్నీ విన్నాము; అంతేకాక. క. అడుగకయు విప్రవరులకు । నడరంగ నద్దేశమున గృహస్సులు భక్తిం

గుడువంగం బెట్టుదు రెప్పుడుం। గడు హృద్యము లయిన మోదకంబులతోడన్‌, 31 ప్రతిపదార్థం: ఆ+దేశమున= ఆ పాంచాలదేశంలో; గృహస్టులు= ఇంటి యజమానులు; అడరంగన్‌= ఒప్పుగ; విప్ర, వరులకు= (బ్రాహ్మణ శ్రేష్టులకు; అడుగకయు= అడుగకుండానే; భక్తిన్‌= భక్తితో; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; కడు= మిక్కిలి, హృద్యములు+అయిన= ఇంపైన; మోదకములతోడన్‌= కుడుములతో; కుడువగన్‌= తినటానికి (భోజనం); పెట్టుదురు. తాత్పర్యం: ఆ పాంచాలదేశంలో గృహస్థులు బ్రాహ్మణ'్రేష్టులకు అడుగకుండానే భక్తితో, మనోహరా లైన మోదకాలతో ఎప్పుడూ భోజనం పెడుతూ ఉంటారు.

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 661

వ. 'అందులకుం బోవుది మనినం గొడుకులెల్ల వల్లె యని 'మీ పంచిన విధంబ చేయం గలవారి మని

యొడంబడి తమయున్న యింటిబ్రాహ్మణునకుం జెప్పి వీడ్యొని. 32 ప్రతిపదార్హం: అందులకున్‌= ఆ పాంచాలదేశానికి; పోవుదము+అనినన్‌; కొడుకులు+ఎల్ల= కొడుకులంతా; వల్లె, అని= సరే అని; మీ, పంచిన, విధంబు+అ= మీరు ఆజ్ఞాపించినట్టే; చేయన్‌+కలవారము+అని; ఒడంబడి; తమ, ఉన్న= తామున్న; ఇంటి, (బ్రాహ్మణునకున్‌; చెప్పి; వీడ్కొనిజ సెలవు తీసుకొని. తాత్పర్యం; పాంచాలపురానికి వెళ్తుదా మని కుంతి అనగానే కొడుకులంతా సరే అని “మీరు చెప్పినట్లే చేస్తా' మని ఒప్పుకొని, తా మున్న యింటి బ్రాహ్మణునికి చెప్పి అతనిదగ్గర సెలవు తీసికొని.

పాండవులు (ద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట (సం.1-157-1)

చ. ఉరు సరనసీ వనంబులు మహోగ్రనగంబులు నేజులున్‌ సుదు

స్తరవిపినంబులుం గడచి ధన్యులు పొండుకుమారకుల్‌ నిరం

తరగతి నేగుచుం గనిరి ధర్మసమేతు. బతామహుం దమో

హరు హరిమూర్తి నార్తిహరు నాదిమునీంద్రు. బరాశరాత్మజున్‌. 33 ప్రతిపదార్థం: ఉరు, సరసీవనంబులుజ పెద్ద సరస్సుల సమూహాలు; మహా+ఉ(గ్ర నగంబులున్‌= మిక్కిలి భయంకరా లైన పర్వతాలు; ఏటులున్‌= నదులు; సు, దుస్తర, విపినంబులున్‌= దాటటానికి చాల కష్టమైన అడవులు; కడచి= దాటి; ధన్యులు= పుణ్యవంతు లైన; పాండుకుమారకుల్‌= పాండురాజుకుమారులు; నిరంతర, గతిన్‌= ఎడతెగని ప్రయాణంతో; ఏంగుచున్‌= వెళ్ళుతూ; ధర్మ, సమేతున్‌= ధర్మంతో కూడుకొన్నవాడిని - అనగా ధర్మాత్ముడిని; పితామహుని= తాతను; తమోహరున్‌= అజ్ఞానాన్ని తొలగించేవాడిని; హరిమూర్తిన్‌= విష్ణుస్వరూపుని; ఆర్రి హరున్‌= దుఃఖాన్ని తొలగించే వాడిని; అది, మునీం(ద్రున్‌= తాలి ముని (శ్రేష్టుడిని; పరాశరశఆత్మజున్‌= పరాశరునియొక్క కుమారుడిని- వేదవ్వాసుడిని; కనిరి= చూచారు. తాత్పర్యం: పెద్ద సరస్సుల సమూహాలను, భయంకర మైన పర్వతాలను, నదులను- దాటడానికి చాలా కష్ట మైన అడవులను దాటి- పుణ్యాత్ము లైన పాండవులు నిరంతర ప్రయాణం చేస్తూ- ధర్మాత్ముడు, పితామహుడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు, విష్ణు స్వరూపుడు, దుఃఖాన్ని హరించేవాడు, ఆది మునీంద్రుడు, పరాశర పుత్రుడు అయిన వ్యాస మహర్షిని దర్శించారు. వ. కని వినయమ్మున నమ్మునీంద్రునకు నందలు నమస్మారంబు సేసిన వారలం జూచి కరుణారస పూరితాంతః

కరణుం డయి వ్యాసభట్టారకుం డి ట్లనియె. 34 (ప్రతిపదార్థం: కని= చూచి; వినయమ్మునన్‌; ఆ+మునీం[ద్రునకున్‌= ఆ వ్యాసమహర్డికి; ఆందటు; నమస్కారంబు; చేసిన వారలన్‌; చూచి; కరుణా, రస, పూరిత+అంతఃకరణుండు+అయి= దయారసంతో నిండిన మనస్సుకలవా డైవ్యా సభట్టారకుం ? ఇట్టు+అనియె.

వ కరుణా

తాత్పర్యం: పాండవులు వ్యాసమహర్షిని చూచి ఆశ్చర్యపడి ఆయనకు నమస్కరించగా, ఆ మునీంద్రుడు రసంతో నిండిన హృదయంతో వాళ్ళను చూచి ఈ విధంగా అన్నాడు.

662 శ్రీమదాంధ్ర మహాభారతము క. _ ధర్మసుతుండున్నచోటను , ధర్మువునకు హాని గలదె ధారుణి; నైనన్‌

ధర్మువ తాత్సర్యముగా । నిర్మలమతి నెగడునది వినీతాత్ముల గై. 35 ప్రతిపదార్ధం: ధర్మసుతుండు= ధర్మరాజు; ఉన్న, చోటను; ధర్మువునకు; హాని; కలదె; ధారుణిన్‌= భూమిమీద; అయినన్‌” ధర్మువు+అ= ధర్మమే; తాత్పర్యముగా; నిర్మలమతిన్‌= మలినం లేని మనస్సుతో; వినీత+ఆత్ములరు+ఐ= వినయవంతు లై; నెగడునది= నడుచుకోండి. తాత్పర్యం: ధర్మరాజు ఉన్నచోట ధర్మానికి హాని ఉంటుందా? (ఉండదని భావం). అయినప్పటికీ ధర్మమే (ప్రధానంగా, నిర్మల మైన మనస్సుతో వినయవంతు లై మెలగండి. సీ. తానొక్కమునికన్య దనకర్మనశమునం। బతి. బడయంగ నోపక యుపేత

దౌర్భాగ్య యై ఘఫోరతప మొనరించిన ; దానికి శివుండు ప్రత్యక్ష మయ్యు,

*“వేండుము వర' మన్న వేడ్కృతో. బతిదాన । మని యేనుమాజు లయ్యబల వేండె;

'నళ్లేని నీకు దేహాంతరంబునం బతు ; లగుదు రేవురు పరమార్ధ మనియు ఆ. హరుయ కరుణ నిచ్చె; నది యిప్ణు పాంచాల ; పతికి. గృష్ట యనంగం బంకజాక్షి

యుద్ధవిల్లి పెరుంగుచున్నది; తత్స్వయం ; వరము సేయుచున్నవాండు నేండు. 36 ప్రతిపదార్థం: తాను; ఒక్క మునికన్య; తన, కర్మవశమునన్‌= తన పూర్వజన్మ కర్మవలన; పతిన్‌= భర్తను; పడయంగన్‌+ఓపకజ= పొందలేక; ఉపేత, దౌర్భాగ్య, ఐ= కూడుకొన్న దురదృష్టం కలదై - అనగా దురదృష్టవంతురాలై; ఘోర, తపముజ= కరినమైన తపస్సు; ఒనరించిన= చేయగా; దానికి, శివుండు; ప్రత్యక్షము+అయ్యు= అగుపించి; వేడుము" వరము; అన్న= అని అనగా; వేడ్కతోన్‌= సంతోషంతో; పతి, దానము+అని= భర్తను దానం చేయండని; ఏను+మారులు= ఐదుసారులు; ఆ+అబల= ఆ కాంత; వేడెన్‌= (ప్రార్హించింది; అట్టు+ఏని= అట్టయితే; నీకు; దేహాంతరంబునన్‌= మరొక దేహాన్ని పొందినపుడు - అనగా మరొక జన్మలో; ఏవురు= ఐదుగురు; పతులు+అగుదురు= భర్తలు జౌతారు; పరమార్థము+అనియు= సత్యము అని; హరుండు= శివుడు; కరుణన్‌= దయతో; ఇచ్చెన్‌= వరం ఇచ్చాడు; అది= ఆ మునికన్య; ఇప్లు= ఇప్పుడు; పద్మజ+అక్షి - పద్మాల వంటి కన్నులు కలది; కృష్ణ అనంగన్‌= కృష్ణ అనే పేరుతో; పాంచాల, పతికిన్‌= పాంచాలరాజుకు; ఉద్భవిల్లి= పుట్టి; పెరుగుచు+ఉన్నది; తత్‌+స్వయంవరము= ఆమెయొక్క స్వయంవరం; నేడయ= ఈ రోజు; చేయుచు+ఉన్న, వాండు=.. చేస్తున్నాడు, లేదా, ప్రకటిస్తున్నాడు. తాత్పర్యం: ఒక మునికన్య తన పూర్వజన్మ కర్మవశళాత్తు భర్తను పొందలేక దురదృష్టవంతురా లై కరోర మైన తపస్సు చేయగా, ఆమెకు శివుడు (ప్రత్యక్షమై వరం కోరుకో మన్నాడు. అప్పు డామె సంతోషంతో పతిదాన మిమ్మని ఐదుసార్హు అడిగింది. శివుడు దయతో - “అట్టయితే నీకు మరుసటిజన్మలో భర్తలు ఐదుగురు అవుతారు, ఇది సత్య" మని వర మిచ్చాడు. ఆ కన్య ఇప్పుడు కృష్ణ అనే పేరుతో పాంచాలరాజు కూతురుగా పుట్టి పెరుగుతూ ఉన్నది. (ద్రుపదుడు ఆమె స్వయంవరాన్ని ఈ రోజు జరుపుతున్నాడు. విశేషం: హరుడు- (ప్రళయకాలంలో సర్వాన్నీ హరించేవాడు, భక్తుల పీడను హరించే వాడు- శివుడు. 'చేయుచున్నవాండు నేండు" అనేదానికి .చేయుచున్నవాండు వాండు' అనే పారాంతరం ఉన్నది. ఇదే సముచితంగా కనపడుతున్నది ఎందువలననంటే పాండవులు ఈ మాట విన్నతరువాత కొన్నిరోజులు రాత్రింబవళ్ళు ప్రయాణంచేసి (ద్రుపదుని నగరానికి వెళ్ళినట్టు చెప్పబడింది.

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 663 వ. 'మీరు ద్రుపదపురంబునకుం జక్కనరుగునది; యందు మీకు ల గ్గగు' నని చెప్పి కృష్ణద్వైపాయనుం దరిగినం బాండునందనులు జననీసహితం బనవరతంబు రాత్రులుం బగళ్ళును బయనంబు వోవువా రొక్కనాం డర్ధరాత్రంబున గంగయందు సోమశ్రవం బను తీర్థంబున స్నానార్జు లై, యర్హునుండు ప్రకాశార్థంబును రక్షణార్థంబునుంగా నొక్కకొజివి సేత బట్టుకొని ముందఖణం బోవ, నందఖు నరుగునెడ, నంగారపర్జుం డను గంధర్వుం డంగనాసహితంబు గంగకు నంతప్రొద్దు జలక్రీడార్ధంబు వచ్చిన, వాం డప్పాండవుల పాదధ్వని విని యలిగి, విల్లుగొని గుణధ్వనిం జేసి వారి కి ట్లనియె. 37 ప్రతిపదార్థం: మీరు; ద్రుపదు, పురంబునకున్‌; చక్కన్‌; అరుగునది= వెళ్ళండి; అందు; మీకు; లగ్గు= మేలు; అగును; అని; చెప్పి; కృష్ణద్యైపాయనుండు; అరిగినన్‌= వెళ్ళగా; పాండు, నందనులు; జననీ, సహితంబుజ= తల్లితో కలిసి; అనవరతంబు= ఎడతెగ కుండ; రాత్రులున్‌, పగళ్ళును, పయనంబు పోవువారు= (ప్రయాణం చేసేవాళ్ళు; ఒక్క, నాండు, అర్హరాత్రంబున= నడిరేయిలో; గంగ, అందు= గంగానదిలోని; సోమశ్రవంబు, అనుతీర్ధంబున; స్నాన+అర్జులైజ స్నానాన్ని చేయగోరిన వాళ్ళయి; అర్జునుండు; (ప్రకాశ+అర్ధంబును= వెలుగు కొరకూ; రక్షణ=అర్హంబునున్‌+కాన్‌= రక్షణ కొరకూ; ఒక్క; కొజవి= మండుచున్న కొయ్య; చేతన్‌; పట్టుకొని, ముందజన్‌; పోవన్‌; ఆందటున్‌; అరుగునెడన్‌= వెళ్ళుతూ ఉండగా; అంగారపర్డుడు+ అను; గంధర్వుండు; అంగనా, సహితంబు= భార్యలతో గూడి; గంగకున్‌: అంతపప్రాద్దుజ అంత రాత్రి సమయంలో; జల క్రీడా+అర్హంబు= జల|క్రీడకొరకు; వచ్చిన వాడు; ఆ+పొండవుల; పాదధ్వని; విని; అలిగి= కోపించి; విల్లు: కొని= తీసికొని; గుణధ్వనిన్‌= అల్లెత్రాడును లాగిన శబ్దం; చేసి; వారికి; ఇట్టు+అనియె. తాత్సర్యం: 'మీరు ద్రుపదుపురానికి చక్కగా వెళ్లండి. అక్కడ మీకు మేలు కలుగుతుంది" అని చెప్పి వ్యాసుడు వెళ్లగా- పాండవులు తల్లితోకూడి రాత్రింబగళ్లు ఎడతెగకుండ ప్రయాణం చేశారు. ఒకనాటి అర్ధరాత్రి గంగానదిలో- సోమ(శ్రవ మనే తీర్ధంలో- స్నానం చెయ్యాలని అనుకొన్నారు. అర్జునుడు వెలుగుకొరకు, రక్షణకారకు ఒక కొరవిని చేత బట్టుకొని ముందు పోతూ ఉండగా, అందరూ అతనివెంట వెళ్తూ ఉన్నారు. అప్పుడు అంగారపర్జుడు అనే గంధర్వుడు తన భార్యలతో కూడి ఆ రాత్రివేళ జలక్రీడ లాడటానికి గంగానదికి వచ్చాడు. ఆ పాండవుల పాదర్వని విని కోపించి ధనుస్సు చేతబట్టి, అల్లెత్రాటి శబ్దం చేసి, వాళ్ళతో ఇట్టా అన్నాడు. క. _ ఇల నర్ధరాత్రమును, సం ; ధ్యలు రెండును, భూత యక్ష దానవ గంధ ర్వులు గ్రుమ్మరియెడు ప్రొద్దులు; ।; వలయ6గ నిం దననిచరులు వెజతురు నడవన్‌. 38 ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిమీద; అర్హ, రాత్రమును= నడిరేయి; సంధ్యలు, రెండును, భూత, యక్ష దానవ, గంధర్వులు, (క్రుమ్మరియెడు= తిరిగెడు; ప్రొద్దులు= వేళలు; వెలయంగన్‌= ఒప్పగా; ఇందు= ఈ వేళలలో: అవని, చరులు= భూమిమీద నడి వారు - అనగా మానవులు; నడవన్‌, వెజతురు= తిరగటానికి భయపడతారు. తాత్పర్యం: ఈ భూమిమీద అర్హరాత్రిససుయంలో, ఉదయసాయంసంధ్యలలో భూతాలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు తిరుగుతూ ఉంటారు. కనుక ఆ వేళలలో మానవులు తిరగటానికి భయపడతారు. స యంవరకు విశేషం: సంధ్య: రాత్రింబవళ్ల సంధికాలం. (ప్రాతస్సంధ్య: సూర్యోదయానికి ముందు మూడుగడియలనుండి సూర్యోదయం, గల కాలం. సాయంసంధ్య: సూర్యాస్తమయానికిముందు మూడుగడియల నుండి సూర్యాస్తమయంవరకు గల కాలం.

6ళక్ష శ్రీమదాంధ్ర నుహాభారతము అర్జును( డంగారపర్హుని జయించుట (సం.1-158-9)

వ. 'ఇ వ్వేళయందుం గ్రుమ్మరియెడువారి నెంత బలవంతుల నైనను రాజుల నయినను నిగ్రహింతుము; నన్ను డాయకుం; డెడగలిగి పొం; డే నంగారపర్డ్హుం డను గంధర్వుండం గుబేరుసఖుండ: నెప్పుడు నిందు విహరించుచుండుదు; న న్నెలుంగరె! యి వ్వనంబును గంగాతీరంబును నంగారపర్దంబులు నా జగద్విదితం బులు; దీని మానవులు సొర నోడుదు' రనిన వాని కర్టునుం డి ట్లనియె. 39

ప్రతిపదార్థం: ఈ+వేళల+అందున్‌= ఈ సమయాలలో; క్రుమ్మరియెడు, వారిన్‌= తిరిగేవాళ్ళని; ఎంత, బలవంతులన్‌+ఐనను; రాజులన్‌*అయినను; ని(గ్రహించుదుము= పడత్రోయగలం; నన్ను; డాయకుండు= సమీపించకండి; ఎడ, గలిగి, పొండు= తాలగి దూరంగా పొండి; ఏన్‌=నేను; అంగారపర్టుండు; అను, గంధర్వుండన్‌; కుబేర, సఖుండన్‌= కుబేరునికి స్నేహితుడిని; ఎప్పుడున్‌; ఇందు= ఇక్కడ; విహరించుచుండుదున్‌; నన్ను; ఎజుంగరె= తెలియరా? ఈ, వనంబును= ఈ అడవీ; గంగాతీరంబును; అంగారపర్హంబులునా= అంగారపర్జుడి వని; జగత్‌+విదితంబులు= ప్రపంచానికి తెలియబడినవి; దీని; మానవులు; చారన్‌= ప్రవేశించటానికి; ఓడుదురు= భయపడతారు; అనిన; వానికి; అర్జునుండు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: ఈ సమయాలలో తిరిగేవాళ్ళు ఎంత బలవంతు లైనా, రాజు లైనా వాళ్ళను పడద్రోయగలం; నా

దగ్గరికి రాకండి; దూరంగా తాలగిపొండి. నేను అంగారపర్హు డనే గంధర్వుడిని. కుబేరుడి మి(త్రుడిని. ఎప్పుడూ

ఇక్కడ విహరిస్తుంటాను. నన్ను గురించి తెలియదా? ఈ అడవి, గంగాతీరం అంగారపర్జుడి వని ప్రపంచ ప్రసిద్ది పొందాయి. ఈ ప్రాంతంలో ప్రవేశించటానికి మానవులు భయపడతారు అని పల్కగా, అతనితో అర్జునుడు ఇట్టా అన్నాడు.

క, _ వడురేయి సంధ్యలందును । నదవంగ నోడుదు రశక్తనరు లొరులు; భయం పడుదుమె యే మెయ్యెడ నె; ప్పుడు నడతుమ యథికశక్తి పురుషుల మగుటన్‌. 40

ప్రతిపదార్హం: ఆశక్తి నరులు= బలహీను లైన మానవులు; ఒరులు= ఇతరులు; నడురేయి; సంధ్యల+అందును; నడవంగన్‌;

ఓడుదురు; ఏము= మేము; భయంపడుదుమె; అధిక, శక్తి పురుషులము+అగుటన్‌= మిక్కిలి శక్తి కల మగవార మవటంచేత; ఏ+ ఎడన్‌= ఎక్కడ నైనా; ఎప్పుడున్‌= ఎప్పుడైనా; నడతుము+అ= నడుచుదుమ= నడుస్తాము.

తాత్పర్యం: బలహీను లైన ఇతర మానవులు అర్హరాత్రి, సంధ్యాసమయాలలో నడవటానికి భయపడతారు. మేము

భయపడతామా? మహాశక్తి కల వీరులం కావటంచేత ఎక్కడైనా, ఎప్పుడైనా సంచరిస్తూ ఉంటాము.

క అడవులు నేటులు నివి నీ। పడసిన యవి యట్టై; పుణ్య భాగీరథి యి ప్పుడమిం గల జనుల కెల్లను । నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే?. శ్రే

ప్రతిపదార్హం: అడవులున్‌; ఏఆులున్‌; ఇవి; నీ, పడసిన, అవి, అట్టె= నీవు సంపాదించినట్టివా ఏమి?; పుణ్య, భాగీరధి= పవిత్ర

మైన గంగ; ఈ+పుడమిన్‌= ఈ భూమియందు; కలజ= ఉన్న; జనులకు+ఎల్లను; ఎడపకవ ఎల్లప్పుడు; 'సేవ్యంబు+అ, కాకడ సేవింప దగినది కాక; ఇది; నీ యదియే.

తాత్పర్యం: అడవులు, నదులు, నీవు సంపాదించినవా ఏమి? పవిత్ర గంగానది భూమిమీది జనులందరికి తప్పక

సేవింపదగినదే. ఇది నీదా?

నిశేషం: అడవులు, నదులు, పర్వతాలు, సముద్రాలు ఏ మానవుడూ భూమిమీదికి తెచ్చినవి కావు. అవి ప్రకృతి ప్రసాదించినవి,

అందరు సమానంగా అనుభవించవలసినవి. ఇది ఈ నాటి సామ్యవాదానికి పునాది భావన. భగీరథుడి ప్రయత్నంచేత గంగ ఈ

లోకానికి తీసికొనిరాబడింది కనుక దానికి భాగీరథి అని పేరు,

ఆదిపర్వము - సప్రమాశ్వాసము 66క్‌ సీ. హైమవతోత్తుంగ హేమశ్చంగంబున । నుండి భూమికి వచ్చి యుదధిం గూడె గంగనా; మూండు దెజంగుల నదియు; మం ; చాకిని నా సత్సధంబునందు సురసిద్ధముని వియచ్చర సేవ్య యయ్యె; న య్యధమలోకంబునయందు భోగ వతి యన నొప్పె నున్నతి; నిట్లు త్రిభువన । పావని యైన యిప్పరమ మూర్తిం

ఆ, బార్వతీశమకుటబంధబంధురతరా । వాస గంగ నాడ వచ్చి నీవు వలవ దనిన నుడుగువారము గాము; నీ; విఘవచనములకు వెజతు మెట్లు?. 42

ప్రతిపదార్హం: హైమవత+ఉత్తుంగ, హేమ, శృంగంబున నుండి= హిమవత్పర్సతముయొక్క ఎత్తైన బంగారు శిఖరం నుండి;

భూమికి వచ్చి; గంగనా= గంగ అను పేరుతో; ఉదధిన్‌= సముద్రమును; కూడె= కలిసెను; అదియు, మూడు; తెజంగులన్‌= మూడు మార్గాలలో; సత్‌+పథంబు+అందు= నక్షత్ర మార్గంలో - అనగా ఆకాశంలో; మందాకినినా= మందాకిని అనే పేరుతో; సుర, సిద్ద ముని, వియత్‌+చర, సేవ్య, అయ్యెన్‌=ఐ సురలు, సిద్దులు, మునులు మొదలైన ఆకాశ సంచారులకు సేవింపదగిన దయ్యెను; అధమ, లోకంబున, అందు= పాతాళలోకంలో; భోగవతి, అనన్‌= భోగవతి అనే పేరుతో; ఒప్పెన్‌; ఇట్లు; ఉన్నతిన్‌= గొప్పగ; త్రిభువన, పావని, ఐన= మూడు లోకాలను పవిత్రం చేసే దైన; ఈ+పరమమూర్తి= ఈ పవిత్రమూర్తి; పార్వతీ+ఈశ, మకుట, బంధ, బంధురతర+ఆవాస= పార్వతీపతి యైన శివుని జటాజూటంలో మిక్కిలి ఒప్పైన స్థానం గల దైన; గంగన్‌= గంగయందు; ఆడవచ్చి= స్నానం చేయవచ్చి; నీవు; వలవదు+అనినన్‌= వద్దనిన; ఉడుగువారము= మానుకొనేవారం: కాము; నీ విఘ్న వచనములకు= నీ ఆటంకపు మాటలకు; వెజచుదుము, ఎట్టు= ఎట్టా భయపడతాము? (భయపడ మని భావం. తాత్పర్యం: హిమాలయంలోని ఎత్తైన బంగారు శిఖరం నుండి భూమికి వచ్చి, గంగ అనే పేరుతో సముద్రంలో కలిసింది. అది మూడు మార్గాలలో సాగింది. ఆకాశమార్గంలో మందాకిని అనే పేరుతో దేవతలు, సిద్దులు, మునులు మొదలైన ఆకాశసంచారులకు సేవించదగింది అయింది. పాతాళ లోకంలో 'భోగవతి' అనే పేరుతో ఉన్నది. ఈ విధంగా మూడులోకాలను గొప్పగా పవిత్రం చేసే ఈ పుణ్యమూర్తి శివుని జటాజూటంలో ఉచితస్టానం గలది- అయిన ఈ గంగలో స్నానంచేయటానికి వచ్చి, నీవు వద్ద న్నంత మాత్రాన మానుకొనే వాళ్ళం కాము. నీ అడ్డుమాటలకు ఎట్లా భయపడతాము?

వ. అనుచు నిజి జననీ బ్రాత్య సహితుం డయి గంగాభిషేకార్థంబు చనుదెంచు న య్యర్థునునిపయి నంగారపర్గుం దతివిశిత సాయకంబులేసిన, నర్హునుం దలిగి తనచేతికొణవి విదిర్ది యయ్యమ్ములు దన్నుం దాశకుండం గాచి కొని వాని కి ట్లనియె. 43

ః (జ్‌. ప్రతిపదార్హం: అనుచు; నిజ, జననీ, (భ్రాతృ సహితుండు+అయి= తన తల్లితో, తోబుట్టువులతో కూడినవాదై; గంగాశ అభివ అర్ధము= గంగలో స్నానం చేయటం కొరకు, చనుదెంచు= వచ్చు; ఆ+అర్జునుని, పయిన్‌= ఆ అర్జునునిమీద: అంగా రప అతి నిశిత, సాయకంబులుజ మిక్కిలి వాడి మైన బాణాలను; ఏసినన్‌= వేయగా; అర్జ్హునుండు:; అలిగి= కోపించి; తన, చల, కొజవి; విదిర్చి= విదిలించి; ఆ+అమ్ములు= ఆ బాణాలు; తన్నున్‌; తాకకుండన్‌; కాచికొని= కాపొడుకొని.

న ద తాత్సర్యం: అని పల్కుతూ, తన తల్లితో, అన్నదము శైలతో గంగాస్నానం చేయటానికి వస్తున్న ఆ అర్జునునిమీ అంగారపర్డుడు మిక్కిలి వాడిబాణాలు వేయగా, అర్జునుడు కోపించి, తన చేతి కొరవి విదిల్చి, ఆ బాణాలు తనను తాకకుండా కాపొడుకొని, అతనితో ఇట్టా అన్నాడు.

666 (శ్రీమదాంధ్ర మహాభారతము

ఆ. _ వెడంగ! యిట్టి పాటి వెజపించుటలును నూ । యలును నేమి సేయు నస్త్రవిదులం

బెక్కులయ్యు నీ బజిభీషికల్‌ నులువులు ; విరియునట్టు లిందు విరియుం జూవె. ట్తేత ప్రతిపదార్హం: వెడగ!= వెజ్హివాడా!;: ఇట్టి, పాటి= ఈ మాత్రపు; వెజపించుటలునుజ బెదిరింపులు; మాయలును; అస్త్ర, విదులన్‌= అస్త్ర రహస్యాలు తెలిసిన వాళ్ళను; ఏమి, చేయు; పెక్కులు+అయ్యు; నీ, బిభీషికల్‌= నీయొక్కబడాయిమాటలు; నుజువులు= నీటిపైనురుగులు; విరియునట్టుల= చెదరిపోయేటట్టు; ఇందు; విరియున్‌= చెదరిపోతాయి; చూవెజఐ చూడుము, తాత్పర్యం: వెజ్టీవాడా! ఈ మాత్రపు బెదిరింపులు, మాయలు అస్త్రవేత్తలను ఏమి చేయగలవు? నీ బెదిరింపులు ఎన్నైనా అవి నురుగులవలె చెదరినట్టు చెదరిపోతాయి, చూడు. విశేషం: అలం: ఉపమ. సీ. అగ్నిదేవుండు బృహస్పతి కిచ్చె ము, । న్నృతండు భరద్వాజు.డనంగం బరంగు

ముని కిచ్చె, నమ్మహాముని భార్గవున కిచ్చె, । భార్గవుండును గుంభభవున కిచ్చె,

నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె ని; య్యనలాస్త్ర మని దాని నమ్మహోగ్ర

గంధర్వుపై వైచె ఘను. డింద్రసుతు. దంతం; దద్రథం బప్పుడ దద్ర మయిన, ఆ. నగ్నిదాహభితి నంగారపర్జుందు ; బమ్మరిల్లి నేలం బడిన, వానిం

గొప్పు వట్టి యీడ్డికొని వచ్చె ధర్మజు , కడకు నింద్రసుతుండు కడిమి మెజసి, తర్‌ (ప్రతిపదార్థం: ఈ+అనల+అ(స్తము= ఈ ఆగ్నేయాస్త్రం; అన్నిదేవుండు; మున్ను= పూర్వం; బృహస్పతికి+ఇచ్చె; అతడు; భరద్వ్యాజుండు; ఆనంగన్‌; పరగు= ఒప్పునట్టి; మునికి+ఇచ్చెన్‌; ఆశ+మహాముని; భార్గవునకు= పరశురామునికి; ఇచ్చె; భార్గవుం డును; కుంభ; భవునకు= కుండనుండి పుట్టినవానికి - (ద్రోణునికి; ఇచ్చెన్‌: ఆ+మహాత్ముండును; నాకు; అతి, దయన్‌; ఇచ్చెన్‌! అని; దానిన్‌; ఆ+మహా+ఉ(గ్ర, గంధర్వు, పై= మహాభయంకరు డైన ఆ గంధర్వునిమీద; ఘనుండు; ఇంద్ర, సుతుండు= ఇంద్రుని కుమారు డైన అర్జునుడు; వైచెఐ వేశాడు. అంతన్‌; తత్‌+రధంబు= అతని యొక్క (అంగారపర్జుడియొక్క) రథము; అప్పుడు+ అ= అప్పటికప్పుడే, దగ్రము+అయినన్‌= తగులబడగా కాగా; అస్టి, దాహ; ఖితిన్‌= నిప్పు కాల్పువలన భయంతో; అంగార పర్డుండు; బమ్మరిల్లి= దిమ్మతిరిగి; నేల, పడిన; వానిన్‌; కొప్పు, పట్టి= జుట్టు పట్టి; ఇంద్ర, సుతుండు= అర్జ్హునుండు; కడిమి=

ళా యలు ల లు జ

పరాశ్రమం; మెజసి; ధర్మజు, కడకున్‌= ధర్మరాజు దగ్గరకు; ఈద్చికొని; వచ్చె. తాత్ప్సర్యర: “ఈ ఆగ్నేయా(స్తాన్ని పూర్వం అగ్నిదేవుడు బృహస్పతి కిచ్చాడు. అతడు భరద్వాజముని కిచ్చాడు. ఆ ముని పరశురామునికి, అతడు (ద్రోణుని, ఆ మహాత్ముడు అతిదయతో నాకు ఇవ్వటం జరిగింది" అని మహావీరు డైన అర్జునుడు దానిని ఆ భయంకరు డైన గంధర్వుని మీద (ప్రయోగించాడు. తత్‌క్షణమే అతని రధం దగ్ధమై పోగా, నిప్పుకాల్పువల్ల కలిగిన భయంతో అతడు దిమ్మతిరిగి నేలమీద పడిపోయాడు. అర్జునుడు తన పరాక్రమం (ప్రకాశించగా, అతడిని జుట్టుపట్టి ధర్మరాజు దగ్గరికి ఈడ్చుకొని వచ్చాడు. క వాని మనోవల్లభ కుం । భీనసి యనునది గరంబు భీతి 'నశేషో

ర్వీనాథులార! దయం బతి । దానము నా కిండు మీకు ధర్హువు పెరుంగున్‌,” తట (ప్రతిపదార్థం: వాని, మనో, వల్లభజ ఆ అంగారపర్డుని (ప్రాణేశ్వరి- భార్య; కుంభీనసి; అనునది; కరంబు, భీతిన్‌= మిక్కిలి భయంతో: అశేషూజఉర్వీనాధులార[!= సమస్త భూమికి ప్రభువులారా!; దయన్‌! పతిదానము; నాకు+ఇండు; మీకు; ధర్మువు= ధర్మం; పెరుంగున్‌,

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 667 తాత్పర్యం: ఆ అంగారపర్జునిభార్య కుంభీనసి మిక్కిలిభయంతో - “ఈ సమస్త భూమికి ప్రభువులారా! దయతో నాకు పతిదానం చేయండి. మీకు ధర్మం పెరుగుతుంది". విశేషం: అప్పటికి పాండవులు (బ్రాహ్మాణవేషాలలోనే ఉన్నారు. కుంభీనసి వాళ్ళను 'అశేషోర్వీనాథులారా!? అని సంబోధించటం ఆశ్చర్యకరంగా ఉన్నా- అంగారపర్డుడు పాండవులను ముందే గుర్తించినట్టు చెప్పాడు కదా (చూ.ప 57, వ:58). అందువలన (బ్రాహ్మాణవేషధారులై వచ్చిన వాళ్ళు పాండవులని కుంభీనసికి భర్త ముందే చెప్పాడేమో. అందువలననే అమె అట్లా అన్నదేమో, కాగా, కుంభీనసి ప్రార్ధనను మన్నించి 'గంధర్వా! కురువంశ (ప్రభువు ధర్మరాజు కరుణతో నిన్ను విడువు మన్నాడు. ఇక భయపడకు” మని కూడా అర్జునుడు అన్నాడు.

క అని యజచుచున్న దానికి; ననఘుండు గరుణించి పాండవాగ్రజుం డయ్య

ర్హునుం జూచి 'వీని విడువుము ।; యని నోడినవాని హీను నపగతశౌర్యున్‌.” 47 (ప్రతిపదార్హం: అని; అజచుచు+ఉన్నజ= ఏడ్చుచున్న; దానికిన్‌; అనఘుడు= పాపరహితుడు; పాండవ+అ(గ్రజుండు= పాండవులం దు ముందు పుట్టినవాడు - ధర్మరాజు; కరుణించి= దయతలచి; ఆ+అర్జునున్‌? చూచి; అనిన్‌= యుద్దంలో ఓడినవాడిని; హీనున్‌= (క్రుంగిపోయిన వాడిని; అపగత, శౌర్యున్‌= పోయిన శౌర్యం కలవాడిని; వీనిన్‌= ఈ అంగారపర్డుడిని; విడువుము. తాత్పర్యం: అని ఆ|క్రోశిస్తున్న కుంభీనసిపట్ల పుణ్యాత్ముడు, పాండవా([గ్రజుడు అయిన ధర్మరాజు దయతలచి, అర్జునుడిని చూచి, యుద్దంలో ఓడినవాడు, క్రుంగిపోయినవాడు, శౌర్యం కోల్పోయినవాడు అయిన ఈ అంగారపర్జుడిని విడిచిపెట్టుము. ఆ, అనిన నరుండు వల్లె యని వాని కనియె 'గం ; ధర్వ! నిన్ను గరుణ ధర్మరాజు

కురుకులేశ్వరుం డశరణశరణ్యుండు ; విడువ బనిచె నింక వెలనకుండు." 48 ప్రతిపదార్థం: అనిన; నరుండు= అర్జునుడు; వల్లె, అని= సరే అని; వానికి+అనియె= అంగారపర్డునితో ఇట్టా అన్నాడు; గంధర్వ!; నిన్ను; కురుకుల+ఈశ్చరుండు= కురువంశ ప్రభువు; అ, శరణ, శరణ్యుండు= శరణులేనివారికి శరణు పొందతగినవాడు; ధర్మరాజు; కరుణన్‌= దయతో; విడువన్‌; పనిచెన్‌=లజ్ఞాసించాడు; ఇంక; వెజవకజ భయపడక; ఉండు. తాత్పర్యం: అని పల్కగా, అర్జునుడు సరే అని అంగారపర్జునితో ఇట్టా అన్నాడు - ఓ గంధర్వుడా! కురువంశ

9, ప్రభువు, శరణులేని వారికి శరణు పొందదగినవాడు అయిన ధర్మరాజు దయతో నిన్ను విడువటానికి ఆజ్ఞాపిం చాడు. ఇక భయపడకుము.” | 49

వ. అని వాని నాశ్వాసించి విడిచిన నట్లు నిర్దితుం దై యర్జునున కంగారపర్డుం డి ట్లనియె ప్రతిపదార్థం: అని, వానిన్‌; ఆశ్వాసించి= ఓదార్చి; విడిచినన్‌; అట్టు; నిర్జితుండు+ఐ= ఓడింపబడినవా డై; అర్జునునకు; అంగార పర్దుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అని అంగారపర్హుడిని ఓదార్చి విడుదల చేయగా, ఓడిపోయిన అంగారపర్డుడు అర్జునునితో ఈ విధంగా అన్నాడు.

668 (శ్రీమదాంధ్ర మహాభారతను అంగొరపర్గుం డర్జునునితో సఖ్యము సేయుట (సం.1-158-35)

మ. అనినీచేతంబరాజితుండ నయి నా యంగారపర్హత్వ మిం కను దాల్వన్‌ మది నంత నిర్లజుండనే; గర్వం బడంగన్‌ రణం బున మున్నోడియు€ బూర్వనామమున బెంపున్‌ గర్వముం దాల్చువా6 డనఘా! సత్సృభలందు మెచ్చయిడునే హాసాస్పదీభూతుం డై. 50

ప్రతిపదార్థం: ఆనఘా!= పాపరహితుడా! ఓ అర్జ్హునుడా!; అనిన్‌= యుద్దంలో; నీచేతన్‌; పరాజితుండను+అయి= ఓడింపబడిన వాడి నై నా అంగారపర్షత్వము= అంగారపర్జు డనే నా పేరును, ఇంకను; తాల్చన్‌= ధరించుటకు; మదిన్‌= మనస్సునందు; అంత; నిర్ణజుడనే= సిగ్గులేని వాడనా; గర్భంబు+అడంగన్‌; రణంబున; మున్ను= ముందు; ఓడియున్‌; పూర్వనామమునన్‌= మొదటి పేరుతో; పెంపున్‌= గొప్పతనాన్ని; గర్భమున్‌; తాల్భువాండు= ధరించువాడు; హాస+ఆస్పదీ, భూతుండు+ఐజు ఎగతాళికి ఉనికి పట్టయిన వా డై; సత్‌*సభల; అందు; మెచ్చన్‌+పడునే= గౌరవింపబడతాడా, కీర్తింపబడతాడా! (పడడని భావం).

తాత్పర్యం: పుణ్యాత్మా! అర్జునా! యుద్ధంలో నీ చేతిలో ఓడిపోయి, ఇంకా అంగారపర్హు డనే పేరు ధరించటానికి

నే నంత సిగ్గు లేనివాడినా? మొదట యుద్దంలో గర్వం అణగిపోయేవిధంగా ఓడిపోయికూడా- మొదటిపేరుతోనే

గొప్పదనాన్నీ, గర్వాన్నీ పొందేవాడు సజ్జనుల సభలలో ఎగతాళికి గురౌతాడు కాని, మెప్పు పొందగలడా?

వ. నీ యాగ్నేయాస్తంబున దర్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేక రత్పనిచిత్రితం బైన రథంబు వడసి, యిది మొదలుగాం జత్రరథుండ నయ్యెద; నీ పరాక్రమంబునకు మెచ్చితి; నీతోడి సఖ్యంబు నా కభిమతం బయిన యది; నాతపంబునం బడయంబడిన చాక్షుషి యనువిద్య నీ కిచ్చెద; దీనిం దొల్లి మనువువలన సోముండు వడసె; సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసి; నాతనివలన నేను. బడసితి; నెవ్వండేని మూండులోకంబులుం జూడ నిచ్చగించు నాతండు దనయిచ్చకుం దగ నివ్విద్యపెంపున సర్వస్వంబునుం జూచు; నేము దీనన చేసికాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపంబడక జీవించెద; మిది కాపురుషప్రాప్తం బై ఫలియింపదు; నీవు తాపత్యవంశవర్ధనుండవు, మహాపురుషుండవు; నీకు సఫలం బగు; నీ దివ్యవిద్యంగొను మిచ్చెద; దీని. గొనునప్పడు షణ్మాసవ్రతంబు సేయవలయు; నీవు నాకు నాగ్నేయాస్తం బిచ్చునది; మఠి మహాజనసత్తంబులు6 గామగమనంబులు నయిన గంధర్వహయంబుల మీకేవురకుం జెలు నూజటేసి యిచ్చెద. ల్‌1

ప్రతిపదార్థం: నీ, ఆన్నేయ+అస్తంబున; దశ్ర, రథుండను+అయ్యును= కాలిపోయిన రథం కలవాడనయినా; గంధర్వ, మాయన్‌=

గంధర్వమాయచేత, అనేక, రత్న, విచిత్రితంబు+ఐన= వివిధ రత్నాలచేత ఆశ్చర్యకరమైన; రథంబు; పడసి= పొంది; ఇది, మొదలుగా; చిత్రరథుండన్‌; అయ్యెద; నీ, పరాక్రమంబునకు; మెచ్చితి; నీతోడి; సఖ్యంబు= స్నేహం; నాకు, అభిమతంబు; అయిన, అది= ఇష్టమైనది; నా తపంబునన్‌; పడయన్‌+పడిన= పొందబడిన; చాక్షుషి అను; విద్య; నీకు; ఇచ్చెద; దీనిన్‌; తొల్లి= పూర్వం; మనువు వలన; సోముండు= చంద్రుడు; పడసె= పొందెను; సోముని వలన; గంధర్వ, పతి, అయిన= గంధర్వరా జైన; విశ్వావసుండు; పడసెన్‌= పొందినాడు; అతనివలన; నేను; పడసితిని; ఎవ్వండేని; మూడు, లోకంబులున్‌; చూడన్‌; ఇచ్చగించున్‌= కోరుకొనునో; అతండు; తన, ఇచ్చకున్‌= తన కోరికకు; తగన్‌= తగినట్టు; ఈ+విద్య, పెంపున= ఈ విద్యయొక్క మహిమచేత; సర్వస్వం బును= మొత్తాన్నీ? చూచున్‌; ఏము= మేము; దీనన, చేసి= దీనివలననే; కాదె; మానవులకు; విశేషులము+ఐ= (శ్రేష్టుల మై; వేల్పుల చేత; శాసింపన్‌+పడక= ఆజ్ఞాపించబడక; జీవించెదము; ఇది; కాపురుషు 'ప్రాప్తంబు+ఐ= చెడుమానవులకు లభించినచో; ఫలియింపదు= ఫలవంతం కాదు; నీవు, తాపత్య, వంశ వర్దనుండవు= తపతికి సంబంధించిన వంశాన్ని

ఆదిపర్వము - పప్తమాశ్వాసము 669 పెంపుచేసేవాడవు; మహాపురుషుండవు; నీకు; సఫలంబు+అగున్‌; ఫలముతో కూడినది అగును; ఈ, దివ్య, విద్యన్‌; కొనుము= తీసికొనుము; ఇచ్చెద, దీనిన్‌; కొనునప్పుడు; షట్‌ొమాస, (వ్రతంబు= ఆరునెలల (వ్రతం; చేయవలయు; నీవు, నాకున్‌, అన్నేయ+అ'్త్రంబు, ఇచ్చునది; మటీ= అంతేగాక; మహా, జవ, సత్యంబులున్‌= మిక్కిలి వేగం, బలం కలవీ; కామ, గమనంబులున్‌= కోరిన చోటికి వెళ్ళగలవీ; అయిన; గంధర్వ, హయంబులన్‌= గంధర్వజాతిగుర్రాలను; మీకు+ఏవురకున్‌= మీ అయిదుగురికి; చెటు, నూజు+ ఏసి=ఐ ఒక్కొక్కరికి వందవంతున; ఇచ్చెదజ ఇస్తాను. తాత్పర్యం: నీ ఆగ్నేయాస్త్రంవలన దర్రరథుడిని అయినప్పటికి, గంధర్వమహిమతో వివిధ రత్నాలచేత విచిత్రమైన రధాన్ని పొంది, ఇది మొదలు '“చిత్రరథుడు' అనే పేరు కలవాడ నౌతాను. నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చెయ్యా లని కోరుతున్నాను. నేను తపస్సుచేత సాధించిన చాక్షుషీ విద్యను నీ కిస్తాను. దీనిని పూర్వం మనువునుండి చంద్రుడు, అతడినుండి గంధర్వరా జైన విశ్వావసుడు పొందారు. అతడినుండి నేను పొందాను. మూడులోకాలూ చూడగోరేవాడు తనకోరికకు తగినట్టు ఈ విద్యా ప్రభావంచేత సర్వం చూడగలడు. మేము ఈ విద్యవలననే గదా మానవులకంటె ్రేష్టుల మై, దేవతలచే ఆజ్ఞాపింపబడక జీవిస్తున్నాము. ఈ విద్య దుర్మార్గులకు లభిస్తే ఫలించదు. నీవు తపతికి సంబంధించిన వంశాన్ని వర్టిల్ల జేసేవాడివి. నీ కిది సఫలమవుతుంది. ఈ దివ్య విద్యను నీ కిస్తాను. తీసికొమ్ము. దీనిని [గ్రహించే సమయంలో ఆరు నెలలు వ్రతం చేయాలి. నీవు నాకు ఆగ్నేయాసస్తాన్ని ఇవ్వు. నేను ఇంకా మీ అయిదుగురికి మహావేగం, బలం గల గంధర్వజాతి గుర్రాలను ఒక్కొక్కరికి వంద ఇస్తాను. సీ. _ వృత్రుపై గీర్వాణ విభుం డల్లి వజ్రంబు । వైచిన నది వాని వజ్ర కఠిన

పటు మస్తకంబునం బడి పాతరయమునం । బదివ్రయ్యలైనం దద్ధాగచయము

క్రనుమున బ్రాహ్మణ క్షత్ర విట్టూద్రుల।; యందు వేదంబులు నాయుధములు

హలము శుశ్రాషయు నయ్యె వజ్రంబులు ।; వాహంబులందు జవంబు నయ్యె తే, నట్టి జవమున నభిమతం బగుచు నున్న; యట్టి హయసమూహం బయ్యె యవనిపతుల

కఖిల భుననముల్‌ రక్షించునపుడు సకల ; సాధనములలో నుత్తమసాధనంబు. 52 ప్రతిపదార్థం: వృత్రు, పై= వృత్రుడనే రాక్షసుని మీద; గీర్వాణవిభుండువ దేవతలరాజు, దేవేంద్రుడు; అట్లి= కోపించి; వద్రంబు= వజ్రాయుధం; వైచినన్‌= వేయగా; అది, వాని, వజ్ర, కరిన, పటు, మస్తకంబునన్‌= అతనియొక్క వజ్రంవలె గట్టిదైన పెద్ద తలమీద; పడి; పాత రయమునన్‌= పడిన వేగంచేత; అది= ఆ వజ్రాయుధం; పది, 'వ్రయ్యలు+ఐనన్‌= పది ముక్కలు కాగా; తత్‌+భాగు చయము= ఆ ముక్కల సమూహం; (క్రమమున= వరుసగా; బ్రాహ్మణ, క్షత్ర విట్‌ శూద్రుల, అందు; వేదంబులున్‌! ఆయుధములు; హలముజ నాగలి; శుశ్రూషయున్‌= "సీవయు; అయ్యె; వజ్రంబులు; వాహంబుల+అందు= గుర్రాలలో జవంబు= వేగం; అయ్యెన్‌; అట్టి; జవమునన్‌= వేగంచేత; అభిమతంబు+అగుచున్‌+ఉన్నజ ఇష్టమౌతున్ను, అట్టి? హయ, సమూహము= గుర్రాల సమూహం; అవని, పతులకు= భూపతులకు - రాజులకు; అఖిల, భువనముల్‌= అన్ని లోకాలు; రక్షించునపుడు, సకల, సాధనములలోన్‌; ఉత్తమ, సాధనము; అయ్యె. తాత్పర్యం: వృత్రు డనే రాక్షసునిమీద దేవేంద్రుడు కోపించి వజ్రాయుధం వేయగా, అది వజ్రం వలె కఠిన మైన అతని పెద్ద తల మీద పడి, పతన వేగంతో పది ముక్కలైంది. ఆ ముక్కల సమూహం వరుసగొ బ్రాహ్మణులలో వేద శక్తిగా, క్షత్రియులలో ఆయుధ శక్తిగా, వైళ్యులలో నాగలి శక్తిగా, శూద్రులలో సేవాశక్తిగా, గుర్రాలలో వేగంగా రూపొందింది. ఆ విధమైన వేగం కారణంగా రాజులకు ఇష్టమౌతున్న గుర్రాల సమూహం వాళ్ళ లోకాలన్నింటిని రక్షించటానికి ఉపయోగించే సాధనాలలో ఉత్తమసాధనం అయింది.

670 (శ్రీమదాం(్ర మహాభారతము న. అనిన వాని కర్టునుండి ట్లనియె. 5్‌3 తాత్పర్యం: అని అనగా అంగారపర్జ్హునితో అర్జునుడు ఈ విధంగా అన్నాడు. ఆ. _ ఎంతమిత్రు లైన నెన్నండు నొరులచే, విద్యయును జయంబు విత్తచయము గొనంగ నొల్ల; నాకుంగూర్తేని యనలాస్త। మనఫఘ! నీవు గొనుము, హయము లిమ్ము 54 (ప్రతిపదార్థం: ఎంత, మిత్రులు+ఐనన్‌= ఎంత స్నేహితు లైనను; ఎన్నండున్‌; ఒరులచే= ఇతరులచేత; విద్యయును, జయంబు; విత్త చయము= ధనసమూహం; కొనలన్‌= తీసికొనుటకు; ఒల్ల= ఇష్టపడను; నాకున్‌; కూర్తు+ఏని= మిదత్రుడ వైతే: అనఘ]= పాపరహితుడా! అనల+అ(స్త్రము= ఆగ్నేయాస్త్రం; నీవు; కొనుము= తీసికొనుము; హయములు= గుర్రాలు; ఇమ్ము. తాత్పర్యం: ఎంత స్ప్నేహితు లైనా ఇతరులనుండి విద్యను, విజయాన్ని, ధన సమూహాన్ని స్వీకరించటానికి ఎప్పుడూ నే నిష్టపడను. కాని, నీవు నాకు ఇవ్వదలచుకొంటే, ఓ పుణ్యాత్మా! ఈ ఆగ్నేయాస్తాన్ని తీసికొని ఆ గుజ్ఞాలను న. 'నీతోడ సఖ్యంబు జేసిద; ముఖి మమ్ము బరమధార్షికులం బరమబ్రహ్మణ్యుల నేమి కారణంబున నుదరి పలికి? తనిన గంధర్వుం డి ట్లనియె. 55 (ప్రతిపదార్థం: నీతోడః; సఖ్యంబు= స్నేహం; చేసెద; మటథి; మమ్మున్‌: పరమ, ధార్మికులను= మహాధర్మబుద్దికలవాళ్ళను; పరమ, (బ్రహ్మణ్యులన్‌= మిక్కిలిగా (బ్రాహ్మాణహితం కోరేవాళ్ళను; ఏమి, కారణంబునన్‌; ఉదరి= అదిరించి; పలికితి= మాటాడితివి; అనిన; గంధర్వుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: 'నీతో స్నేహం చేస్తాను. అయితే మిక్కిలిగా మేము (బ్రాహ్మాణహితం కోరేవాళ్ళం. మహాధర్మబుద్ధి కలవాళ్ళం. ఎందుచేత మమ్మల్ని అధిక్షేపించి మాట్లాడావు?” అని ప్రశ్నించగా, గంధర్వుడు ఇట్లా అన్నాడు. క. _ విమలములయి లోకత్రిత।; యమునం బ్రవర్తిల్లు మీ మహాగుణములు ని త్యము విందు నారదప్రము । ఖ మునీశ్వర సిద్ధసాధ్య గణములవలనన్‌. 56 ప్రతిపదార్థం: విమలములు+అయి= సవిత్రాలైు లోక; త్రితయమునన్‌= ముల్గోకాలలో; ప్రవర్తిల్లు= నడచు; మీ, మహా, గుణములు; నారద, ప్రముఖ, ముని+-ఈళ్చర, సిద్ధ, సాధ్య, గణముల వలనన్‌= నారదుడు మొదలైన ప్రసిద్ధ మునీశ్చరుల, సిద్ధుల, సాధ్యుల సమూహాలచే; నిత్యము ప్రతిదినం; విందు వింటాను. తాత్పర్యం: పవిత్రా లై ముల్లోకాలలో వ్యాపించిన మీ గొప్ప గుణాలు నారదుడు మొదలైన మునీశ్చరులు, సిద్ధ లా ల! సాధ్య సమూహాలు చెప్పగా ప్రతిదినం వింటూ ఉంటాను. క. మేరు నగోత్తంస మీ , భారధురంధరుల మిమ్ముం బాండవుల గుతో దారుల ధీరుల నెఖుంగని; నా రెవ్వరు గలరె భరతవంశోత్తములన్‌. 5్‌7 ప్రతిపదార్ధం: మేరు, నగ+ఉత్తంస, మహీ, భార ధురంధరుల= మేరుసర్వతాన్ని సిగబంతిగా గల భూమండలంభారాన్ని వహించిన; మిమ్మున్‌! పాండవుల; గుణ+ఉదారుల= గుణంచేత గొప్పవారైనవాళ్ళను; ధీరులన్‌; భరతవంశ++ఉత్తములన్‌= భరతనంళ (్రేష్టులను; ఎయుంగని, వారు= తెలియనివాళ్ళు; ఎవ్వరున్‌+కలరె= ఎవరైన ఉన్నారా?

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 671 తాత్పర్యం: మేరుపర్వతాన్ని సిగబంతిగా గల భూమండల భారాన్ని వహించినవాళ్ళు, సద్గుణాలచేత గొప్పవాళ్ళు, ధీరులు, భరతవంశశ్రేష్టులు అయిన మిమ్మల్ని- పాండవులను- తెలియని వాళ్ళెవరైనా ఉన్నారా?

వ. ఏను మిమ్ము నెటింగియు, మీకు నగ్నిపరిగ్రహంబును, బ్రాహ్మణసంగ్రహంబును లేమింజేసి పరుసంబులు పలికితి; మజియును. 58 ప్రతిపదార్థం: ఏనుజ నేను; మిమ్మున్‌; ఎజింగియు; మీకున్‌, అగ్ని, పరి[గ్రహంబును= అస్షిహోత్ర స్వీకారం; బ్రాహ్మణ, సం[గ్రహంబును= బ్రాహ్మణుడిని (గ్రహించటం; లేమిన్‌+చేసి= లేకుండటంవలన; పరుసంబులు= కరినాలైన మాటలు; పలికితి; మతియును. తాత్పర్యం: నాకు మీరు తెలిసినా, మీకు అగ్నిహోత్రం, బ్రాహ్మణుడు లేనందువలన కఠినంగా మాట్లాడాను. అంతేకాక, ఉ _ ఇంతుల గోష్టి నున్న్మయత. డెంత వివేకము గల్లెనేని య త్యంత మదా భిభూతుండగు; ధర్మువు దప్పు( బ్రియం బెటుంగ/ దే నెంత వివేకి నయ్యును సహింపక యింతులయొద్ద. బల్ఫితిన్‌; వింతయె? కాము శక్తి యుడివింపంగ శక్యమె యెట్టివారికిన్‌!, 59 ప్రతిపదార్థం: ఇంతుల, గోస్టిన్‌= ్రీలతో సల్దాపాలాడుతూ; ఉన్న; అతండు; ఎంత; వివేకము; కలిగెన్‌+ఏని; అత్యంత, మద+అభిభూతుడు+అగు= ఎంతో ఎక్కు వైన మదంచేత తిరస్కరింపబడిన వా డౌతాడు- అనగా మిక్కిలి దురభిమానంతో కూడుకొన్న వా డౌతాడు; ధర్మువు, తప్పు= ధర్మాన్ని తప్పుతాడు; ప్రియంబు+ఎయుంగండు= ప్రీతిగా మెలగటం తెలియడు; ఏన్‌= నేను; ఎంత; వివేకిన్‌+అయ్యును= వివేకం కలవాడ నైనా; సహింపక= ఓర్చ్సులేక; ఇంతుల, ఒద్దన్‌= భార్యల ఎదుట: పల్కితిన్‌= ఆ విధంగా మాట్టాడాను; వింతయె?= ఇది ఆళ్ళర్యమా?; కాము, శక్తి మన్మథునియొక్క శక్తిని; ఉడివింపంగ= మాన్పించటం, అనగా లేకుండ చేయటం; ఎట్టివారికిన్‌; శక్యమె= సాధ్యమా? తాత్పర్యం: ్రీల గోస్టిలో ఉండేవాడు ఎంత వివేకి అయినా, అహంకారపూరితు డౌతాడు. ధర్మం తప్పి వ్యవహరిస్తాడు. ప్రియంగా వ్యవహరించలేడు. నేను వివేకంగలవాడినే అయినా నిగ్రహం కోల్పోయి, భార్యల యెదుట ఆ విధంగా మీతో మాట్టాడాను. ఇది అసహజం కాదు గదా! మన్మథునిశక్తిని అణచటం ఎంతవారికైనా సాధ్యమా? విశేషం: అలం: అర్భాంతరన్యాసం. ్రీలయెదుట స్వాతిశయభావం పెంచుకొని ఇతరులతో వ్యవహరించటం పురుష సహజం, క, _ సుర గరుడ విషోరగయ , క్ష రాక్షస పిశాచ, భూత గంధర్వులు నో పరు ధిక్కరింప బ్రాహ్మణ : పురస్కృతులం బుణ్యమతుల భూతల పతులన్‌. 60 ప్రతిపదార్థం: బ్రాహ్మణ, పురస్కృతులన్‌= (బ్రాహ్మణుడిని ముందుంచుకొన్న వాళ్ళను; పుణ్య, మతుల= పవిత్రమైన మనస్సుకల వాళ్ళను; భూతల, పతులన్‌= రాజులను; సుర, గరుడ, విష+ఉరగ, యక్ష రాక్షస, పిశాచ, భూత, గంధర్వులు= దేవతలు, గరుడులు, నాగులు, యక్షులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, గంధర్వులు; ధిక్కరింప= తిరస్కరించటానికి; ఓపరు= చాలరు. తాత్పర్యం: బ్రాహ్మణుడిని ముందుంచుకొన్న పవిత్రహృదయు లైన రాజులను- సురలు కొని, గరుడులు కాని, నాగులు కాని, యక్ష రాక్షస పిశాచ భూత గంధర్వులు కాని ధిక్కరించ లేరు.

672 శ్రీమదాంధ్ర మహాభారతము అంగారపర్డుండు సాండవులకు( బురోహితుని. బురస్కరింపు. డని చెప్పుట (సం.1-159-17)

సీ. అనవద్యు వేదవేదాంగ విశారదు। జప హోమ యజ్ఞ ప్రశస్తు సత్య

వచను విస్రోత్తము వర్ణ చతుష్టయ । సొధన సఖు సదాచారు సూరి

సీవ్యు- బురోహితుం జేసిన భూపతి । యేలు నుర్వీతలం బెల్ల; నిందు.

బరలోకమునం బుణ్యపరుల లోకంబులు ।; వడయు; జయస్వర్గఫలము సూవె ఆ. రాజ్య మదియు నుర్వరాసుర విరహితు6 : డయిన పతికి: గేవలాభిజాత్య

శౌర్యమహిమం బడయ సమకూరునయ్య తా । పత్య! నిత్యసత్యభాషణుండ!. 61

॥ ప్రతిపదార్థం: తాపత్య= తపతికి సంబంధించిన వంశంవాడా!: నిత్య, సత్య, భాషణుండ= ఎల్లప్పుడు సత్యాన్ని మాటాడే వాడా!;

అనవద్యు= ఏ లోపమూ లేని వాడిని; వేద, వేదాంగ; విశారదు= వేదాలలో, వేదాంగాలైన జ్యోతిష వ్యాకరణాది శా(స్తాలలో విద్వాంసుడిని; జప, హోమ, యజ్ఞప్రశస్తు= జపంచేత, హోమంచేత, యజ్ఞంచేత (ప్రసిద్దుడైన వాడిని; విప్ర+ఉత్తము= బ్రాహ్మణ (శ్రేష్టుని; వర్శ చతుష్టయ సాధన, సఖు= ధర్మార్ధ కామమోనక్షాలను సాధించటంలో మిద్రుడైన వాడిని; సదాచారు= మంచి నడవడిగల వాడిని; పూరి, సేవ్యున్‌= పండితులచేత సేవింపబడే వాడిని; పురోహితున్‌; చేసిన; భూపతి= రాజు; ఇందున్‌= ఈ లోకాన; ఉర్వీ, తలంబు+ఎల్లన్‌= భూమండలాన్ని అంతా; ఏలున్‌= పాలిస్తాడు; పరలోకమునన్‌; పుణ్యపరుల= పుణ్యాత్ముల; లోకంబులు; పడయు= పొందుతాడు; రాజ్యము, జయ, స్వర్గ, ఫలము= జయాన్నీ, స్వర్గాన్నీ, ఫలంగా గలిగినట్టిది; సూవె= సుమా; అదియున్‌= ఆ ఫలం; ఉర్వరా, సుర, విరహితుండు= భూసురుడు - అనగా బ్రాహ్మణుడు లేని వాడికి; కేవల+ఆభిజాత్య; శౌర్య, మహిమన్‌= కేవలం వంశంయొక్క, పరాక్రఘుంయొక్క గొప్పతనంచేత; పడయన్‌, సమకూరును+అయ్య= పొందటం సాధ్యమగునా? (సాధ్యం కాదని భావం)

తాత్పర్యం: తపతికి సంబంధించిన వంశంలో జన్మించినవాడా! నిత్య సత్య భాషీ! అర్జునా! ఏ లోపం లేనివాడిని,

వేద వేదాంగాలలో పండితుడిని, జప హోమ యజ్ఞాలు చేయటంచేత ప్రసిద్దు డైన వాడిని, సత్యభాషిని, బ్రాహ్మాణ

(శ్రేష్టుని, ధర్మార్ధ కామమోక్ష సాధనలో మిత్రుడిని, మంచినడవడిక గల వాడిని పురోహితుడిగా చేసికొన్న రాజు, ఈ

లోకంలో భూమండలమంతా పరిపాలిస్తాడు; పరలోకంలో పుణ్యగతులు పొందుతాడు; జయం, స్వర్గం రాజ్యం

వలన లభిస్తాయి. (బ్రాహ్మణుడు లేకుండా రాజుకు కేవలం వంశ పరాక్రమాల గొప్పదనంచేతనే అటువంటి ఫలాన్ని పొందటం రాజుకు సాధ్యం కాదు.

విశేషం: ఈ పద్యం రాజ్యవ్యవస్టలో పురోహితుని ప్రాధాన్యాన్నీ, అతని యోగ్యతలను వివరిస్తుంది.

వ. మీరు ధర్మానిలశక్రాశ్వినులవరంబునం బాండురాజునకుం గుంతీమాద్రులకుం బుట్టినవారలు ధర్మవిదులరు; వేదవేదాంగ ధనుర్వేదపారగుం డయిన భారద్వాజు శిష్యుల; రఖిలలోకహితులరుం గావునం బురోహిత రహితుల రై యుండం దగదు. 62

ప్రతిపదార్థం: మీరు; ధర్మ+అనిల, శక్రశఅశ్వినుల, వరంబునన్‌= యమధర్మరాజు, వాయుదేవుడు, దేవేంద్రుడు, అశ్వినీదేవతలు = వీరి వరంవలన; పాండురాజునకున్‌, కుంతీ, మాద్రులకున్‌, పుట్టినవారలు; ధర్మ, విదులరు= ధర్మం తెలిసినవాళ్ళు; వేద వేద+అంగ, ధనుర్వేద, పారగుండు+అయినవ= వేద వేదాంగ ధనుర్వేదాల యెక్క ఆవలి ఒడ్డు చేరిన వాడైన - అనగా వేద వేదాంగ ధనుర్వేదాలను పూర్తిగా నేర్చిన వా డైన; భారద్వాజు; శిష్యులరు= భరద్వాజుని కుమారుడైన ద్రోణునియొక్క శిష్యులు: అఖిల, లోకహితులరున్‌= అన్ని లోకాల మేలు కోరేవాళ్ళు.

ఆదిపర్వము - సస్తమాశ్వానము ౮73 తాత్పర్యం: మీరు యమ, వాయు, దేవేంద్ర, అళ్వినీదేవతల వరాలతో పాండురాజుకు, కుంతీమాద్రులకు జన్మించినవాళ్ళు. ధర్మం తెలిసినవాళ్ళు. వేదవేదాంగధనుర్వేదాలను పూర్తిగా తెలిసిన ద్రోణాచార్యుని శిష్యులు. అన్ని లోకాలమేలు కోరేవాళ్ళు. అందుచేత -పురోహితుడు లేకుండా ఉండటం తగదు. విశేషం: వేదాలు నాలుగు: బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. వేదాంగాలు ఆరు: శిక్ష (కర్త-పాణిని), వ్యాకరణం (కర్త-పాణిని), ఛందం (కర్త-సింగళముని), నిరుక్తం (కర్తాంయాస్కుడు), జ్యోతిషం (కర్తలు-అదిత్యాదులు), కల్పం (కర్తలు- ఆశ్వలాయన, కాత్యాయన, ఆపస్తంబాదులు). ఉపవేదాలు నాలుగు; ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, అర్హవేదం,

ఆ. పాండుపుత్ర! నీవు బ్రహ్మచర్యస్థుండ । వగుటం జేసి మన్మథార్తు నన్ను

నొడిచి తిందు రాత్రి యుద్ధంబు సేసి; కా; మోపభోగ నిరతుం డోటు వనదందె?. 63 (ప్రతిపదార్ధ్హం: పాండు, పుత్ర్త= పాండురాజకుమారా! నీవు; (బ్రహ్మచర్యస్టుండవు+అగుటన్‌+చేసి= (బ్రహ్మచర్యఆశ్రమంలో ఉన్నవాడవు కనుక; ఇందు= ఇక్కడ; రాత్రి, యుద్దంబు; చేసి; మన్మథ+ఆర్హున్‌, మన్మథునిచేత పీ డితు డనైన; నన్ను; ఒడిచితివి= ఓడించావు; కామ+ఉపభోగ, నిరతుండు= కామసుఖానుభవాలలో, మిక్కిలిఆసక్తిగొన్నవాడు; ఓటు, పడడె= ఓడిపోడా? తాత్పర్యం: పాండుకుమారా! ఓ అర్జునా! నీవు బ్రహ్మచర్యంలో ఉన్నవాడివి కానటంచేత మన్మథపీడితుడ నైన నన్ను ఇక్కడ రాత్రి యుద్దం చేసి ఓడించావు. కామ సుఖా నుభవంలో నిమగ్నుడైనవాడు ఓడీపోడా? విశేషం; అలం: అర్జాంతరన్యాసం, వ. మటజియుం గామ ప్రవృత్తుం డయ్యును మహీపతి మహీసుర వర పురస్సరుం డగు నేని యెల్ల యుద్ధంబుల

శత్రుల జయించు. 64 ప్రతిపదార్హం: మతజియున్‌= అంతేకాక; కామ(్రవృత్తుండు+శఅయ్యును= కామమునందు ప్రవర్తిల్లే వాడైనా; మహీపతి= రాజు; మహీసుర, వర, పురస్‌+సరుండు+ఆగున్‌+ఏని= (బ్రాహ్మాణ(్రేష్టుని ముందుంచుకొన్నవా డైతే; ఎల్ల, యుద్ధంబుల= అన్ని యుద్దాలలో; శత్రుల; జయించు. తాత్పర్యం: అంతేకాక రాజు కామభోగాలలో ప్రవర్రిల్లే వా డైనా, పురోహితుడిని ముందుంచుకొంటే, అన్ని యుద్దాలలో శత్రువులను జయించగలడు. ఉ. వేదము వేదియుం గలుగు విప్రవన వరేణ్యు డగణ్య పుణ్య సం

పాది పురోహితుం దయినం బాపము పొందునె భూపతిం

బ్రతాపోదయ! కాన మీదగు గుణోన్నతికిం దగ ధర్యతత్త్వ సం

వేదింబురస్కరింపుండు పవిత్రచరిత్రు మహీసురోత్తమున్‌. 65 (ప్రతిపదార్థం: ప్రతాప+ఉదయ!= ఓ పరాక్రమశాలీ! అర్జునా; వేదము; వేదియున్‌= యజ్ఞవేదికయు; కలుగు; విప్ర, వేలం (బ్రాహ్మణ శ్రేష్టుడు; అగణ్య, పుణ్య, సంపాది= లెక్కకు మిక్కిలియైన పుణ్యాలను సంపాదించినవాడు; పురోహితుండు+అయి క భూపత్తీన్‌= రాజును; పాపము; పొందునె= అంటునా; కాన= అందుచేత; మీది+అగు; గుణ+ఉన్నతికిన్‌= గుణాల గొప్పతనా న ; తగన్‌= తగినట్టు ధర్మ, తత్వ, సంవేదిన్‌= ధర్మతత్తాన్ని బాగా తెలిసిన వాడిని; పవిత్ర, చరిత్రు= పుణ్య ప్రవర్తన కలవాడిని; మరా, సుర+ఉత్తమున్‌= (బ్రాహ్మణ శ్రేష్టుడిని; పురస్కరింపుండు= ముం దిడు కొనండి - అనగా పురోహితునిగా చేసికొనండి.

67క్ష శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: పరాశక్రమశాలీ! ఓ అర్జునా! వేదం, యజ్ఞవేదిక కల (బ్రాహ్మాణ్రేష్టుడు, అత్యధిక పుణ్యాన్ని సంపాదించిన వాడు- పురోహితు డైతే, ఇక రాజుకు పాపం అంటుతుందా? అందుచేత మీ గుణాల గొప్పదనానికి తగినట్టు ధర్మతత్త్వాన్ని బాగా తెలిసినవాడు, పవిత్ర మైన నడవడిక కలవాడు అయిన (బ్రాహ్మణ శ్రేష్టుడిని మీ పురోహితునిగా చేసికొనండి. తే. అనిన వానికి నర్దునుం దనియె 'మమ్ము; ననఘ! తాపత్యు లని పల్కితతిముదమున

నేము కౌంశేయులము మజి యెట్లు సెప్పు; మయ్య తపతి కపత్యుల మైన తెజంగు.” 66 ప్రతిపదార్థం: అనిన; వానికిన్‌; అర్జ్హునుండు; అనియె; అనఘ!= పాప రహితుడా! ముదమున= సంతోషంతో మమ్మున్‌' తాపత్యులు+అని= తపతిసంతతివా రని; పల్కితి= పలికితివి; ఏము= మేము; కౌంతేయులము= కుంతీపుత్రులం; తపతికి; అపత్యులము+ఐన= సంతతివార మైన; తెజంగు= విధం; మథి, ఎట్టు; 'సెప్పుము+అయ్య, తాత్పర్యం: అని పల్కగా ఆ గంధర్వునితో అర్జునుడు ఇట్లా అన్నాడు: 'పుణ్యాత్మా! నీవు సంతోషంతో మమ్మల్ని “'తపతిసంతతివారు' అని పేర్కొన్నావు. మేము కుంతీపుత్రులం. మరి యే విధంగా మేము తపతి సంతతి వార మయ్యామో తెలియచెప్పవలసింది.”

ఖే తపతీసంవరణోపాఖ్యానము (సం.1-160-3)

వ అనిన నర్హునునకు నంగారపర్డుం డిట్లనియె. 67 తాత్సర్యం; అని పలికిన అర్జునునితో అంగారపర్హుడు ఈవిధంగా అన్నాడు. సీ. ఆదిత్యునకుంబుత్రి యనఘ సావిత్రికిని; ననుజ యుత్తమ లక్షణామలాంగి

తపతి; యకృన్యక ధవళాయతేక్షణ ।; యౌవనసంప్రాప్త యైన, దానిం

జూచి యక్కన్యక సురుచిరగుణముల । కనుగుణుం డగు నిర్మలాభిజాత్యుం

బతి నెవ్విధంబునం బడయుదునో యని , తలంచుచు నున్న యత్తపనుగుజిచి ఆ. _ భక్తిందపము సేసెం బ్రభుండజామీఢనం ; దనుండు భరతకులుండు ధర్మవిదుండు

సర్వగుణయుతుండు సంవరణుం దను , వాండు కృతజపోపవాసవిధుల. 68 ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా; ఓ అర్జునా; ఆదిత్యునకున్‌= సూర్యునికి; పుత్రి= కూతురు; సావిత్రికినిన్‌; అనుజ= అనుసరించి జన్మించినది - అనగా చెల్లెలు; ఉత్తమ, లక్షణ+అమల+అంగి= (శ్రేస్టమైన లక్షణాలతో కూడిన నిర్మల మైన శరీరం కలది; తపతి; అనన్‌= అనునట్టి; కన్యక; ధవళ+ఆయత+ఈక్షణ= తెల్లని విశాలాలైన కన్నులు కలది; యౌవన, సం(ప్రాప్తు ఐన, దానిన్‌=ఐ యౌవనం వచ్చిన దానిని- యౌావనవతి అయినదానిని; చూచి; ఆ+కన్యక= ఆ తపతియొక్క; సురుచిర గుణములకు ఒప్పిదమైన గుణాలకు- అనగా మంచిగుణాలకు; అనుగుణుండు+అగు= తగినగుణాలు కలవా డైన; నిర్మల+ అభిజాత్యున్‌= స్మచ్చమైన వంశం కలవాడిని; పతిన్‌= భర్తను; ఏ+విధంబునన్‌; పడయుదునోజ పొందుతానో; అని; తలచుచున్‌+ఉన్న= నచ్చ ట్‌ ల ఆలోచిస్తున్న; ఆ+తపను. గుటిచి=ఐ ఆ సూర్యుడినిగూర్చి; ప్రభుండుజఐ రాజు) అజామీఢ, నందనుండు= అజామీఢుని యొక్క కుమారుడు; భరత, కులుండు= భరత వంశపువాడు; ధర్మ, విదుడు= ధర్మం తెలిసినవాడు, సర, గుణయుతుండువ అన్ని మంచిగుణాలతో కూడుకొన్నవాడు అయిన; సంవరణుండు+అను, వాండు; కృత, జప+ఉపవాస, విధుల= చేయబడిన జపం, ఉనవాసం మొదలైన నియమాలచేత; భక్తిన్‌= భక్తితో; తపము; చేసెన్‌.

అదిపర్వను - సప్తమాశ్వానసము 675 తాత్పర్యం: సూర్యునికి కూతురు, సావిత్రికి చెల్లెలు, ఉత్తమ లక్షణాలు, నిర్మల శరీరం, తెల్లని విశాల నేత్రాలు కలది యౌవనవతి అయిన తపతి అనే కన్యకను చూచి- ఆమె ఉత్తమ గుణాలకు తగిన గుణాలు కలవాడు, మంచివంశం కలవాడు అయిన భర్తను ఏ విధంగా పొందుతానా అని సూర్యుడు ఆలోచిస్తుండగా- ఆ సూర్యుడినిగూర్చి- (ప్రభువు, అజామీఢుని పుత్రుడు, భరతవంశంవాడు, ధర్మం తెలిసినవాడు, సర్వసద్గుణాలతో కూడుకొన్నవాడు అయిన సంవరణుడు- జపం, ఉపవాసం, మొదలైన నియమాలతో భక్తితో తపస్సు చేశాడు. విశేషం: బుక్షకుని కుమారుని పేరు కూడ సంవరణుడే.

చ. “గగనమునందు నెందు నధిక ప్రభ నేను వెలుంగునట్టు లి

జ్ఞగతిం బ్రసిద్ధుండై వెలుగు సంవరణుండ మదీయ పుత్రికిం

దగుపతి; వీని కిచ్చైద ముదంబున నీలలితాంగి' నంచు మా

నుగ నెడ నిశ్చ్రయించెం దపనుండు దదీయతపఃప్రసన్నుండై, 69 ప్రతిపదార్థం: గగనమునందున్‌= ఆకాళంలో; ఎందున్‌= ఎక్కడనైనా; ఏను= నేను; అధిక, ప్రభన్‌= మిక్కిలికాంతితో; వెలుంగు నట్టుల' ఈ+జగతిన్‌= ఈ (ప్రపంచంలో; ప్రసిద్దుండు+ఐ= వెలుంగు; సంవరణుండు+అ= సంవరణుండే; మదీయ; పుత్రికిన్‌= నాయొక్క పుత్రికకు; తగు పతి= తగిన భర్త; ముదంబునన్‌= సంతోషంతో: ఈ, లలిత+అంగిన్‌= ఈ సుకుమారమైన శరీరం కలదానిని; వీనికిశఇచ్చెద' అనుచు; తపనుండు= సూర్యుడు; తదీయ" తపః ్రసన్నుండు+ఐ= ఆ సంవరణునియొక్క తపస్సునకు సంతోషించిన వాడై; మానుగజ ఒప్పుగా;? ఎడన్‌= హృదయంలో; నిశ్చయించెను= నిర్ణయించుకొన్నాడు. తాత్పర్యం: “ఆకాశంలో అధిక కాంతితో నేను వెలుగుతున్నట్టే ఈ (ప్రపంచంలో సంవరణుడు (ప్రసిద్దు డై వెలుగుతున్నాడు. కనుక ఇతడే నా పుత్రికకు తగిన భర్త. ఈ సుకుమారిని సంతోషంతో ఇతని కిస్తాను” అని సంవరుణుని తపస్సుకు సంతోషించిన సూర్యుడు తన మనస్సులో చక్కగా నిశ్చయించుకొన్నాడు. న. అంత నొక్కనాండు సంవరణుండు మృగయావినోదార్ధి యయి వనంబునం బరిభ్రమించి అధికక్షుత్పిపాసా

పీడిత పతిత తురంగుం డయి యేకతంబ పాదచారి యై చని యొక్కపర్వతవనోద్దేశంబునందు. 70 ప్రతిపదార్థం: అంతన్‌; ఒక్కనాండు సంవరణుండు; మృగయా, వినోద+అర్థ్రి, అయి= వేటకొరకు' వనంబునన్‌= అడవిలో; పరిభ్రమించి= తిరిగి అధిక, క్షుత్‌*పిపాసా, పీడిత, పతిత, తురంగుండు+అయి= మిక్కిలి ఆకలిచేత, దప్పికచేత పీడింపబడి పడిపోయిన గుణ్ణం కలవా డై ఏకతంబ= ఒంటరిగా; పాదచారి+ఐ= కాలినడకతో; చని= వెళ్ళి; ఒక్క, పర్వత, వన+ఉత్‌+ దేశంబునందు= ఒక పర్వతంయొక్క అరణ్యంలోని ఎత్తైన ప్రదేశంలో తాత్చర్యం: తర్వాత ఒకనాడు సంవరణుడు వేటకై అడవికి వెళ్ళాడు. తిరిగి తిరిగి అధికమైన ఆకలిదప్త్పులతో తన గుర్రం పడిపోగా, తాను ఒంటరిగా కాలినడకతో వెళ్లి ఒక కొండ అడవిలోని ఎత్తైన (ప్రదేశంలో. క. _ కనియెనొక కన్యంగోమలిం। గనక ప్రభ విజ శరీర కాంతి నుపాంతం

స 71

బున వృక్షలతావలిం గాం; చనమయముగం జేయుచున్న చంద్రనిభాస్యన్‌.

స ర ప్రతిపదార్థం: ఒక కన్యన్‌: కోమలిన్‌= సుకుమారిని' కనక ప్రభ, నిజ శరీర కాంతిన్‌= బంగారు కాంతితో సమానమైన తన శరర కాంతిచేత, ఉపాంతంబున= సమీపంలోని; వృక్ష లత+ఆవలిన్‌= చెట్ల, తీవల సమూహాన్ని; కాంచన మయముగన్‌= బంగా మయంగా, చేస్తున్న; చంద్ర, నిభ+ఆస్యన్‌= చంద్రునితో సమాన మైన ముఖం కలిగినటువంటి దానిని" కనియెన్‌= చూచాడు.

676 శ్రీమదాంధ్ర మహాభారతము తొత్సర్యం: సుకుమారి, బంగారుకాంతివంటి తన శరీరకాంతితో (ప్రక్క నున్న చెట్లను, తీవలను బంగారుమయం చేస్తున్నట్టిది, చంద్రునివంటి అందమైన ముఖం కలది అయిన ఒక కన్యను చూచాడు. విశేషం: అలం: ఉపమ, తద్గుణం. సంవరణుండు తపతిం జూచి మోహించుట (సం.1-160-25)

వ. కనీయనిమిషలోచనుం డయి మనంబున ని ట్లని వితర్మించె. 72 ప్రతిపదార్థం: కని= చూచి; అనిమిష లోచనుండు+అయి= రెప్పవాల్బని కన్నులు కలవాడై; మనంబునన్‌= మనస్సునందు; ఇట్టు+అని; వితర్కించె= ఊహించాడు. తాత్పర్యం: చూచి కనురెప్పపాటు కూడా లేని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మనస్సులో ఈవిధంగా భావించాడు. సీ. త్రిభువనలక్ష్మి యేతెంచి యేకాంత మి ; ట్లేలొకో యున్నది యిన్వనమున,

గగనమణిప్రభ గగనంబునం దుండి ।; యవనీతల ప్రాప్త మయ్యె నొక్కొ

శంభుండు లావణ్యసద్గుణసముదాయ । మింద యిమ్ముగ సంగ్రహించె నొక్కొ

దీని యంగములం బొందిన యివ్విభూషణ । శ్రీ యేమి పుణ్యంబు. జేసి నొక్కొ ఆ. యమరకవ్యయొక్కొయక్షకన్యక యొక్కొ। సెద్ధకన్య యొక్కొ శ్రీ సమృద్ధి

సర్వలక్షణ ప్రశస్తాంగి యిది దివ్య। కన్య యగు ననంతకాంతిపేర్మి 73 ప్రతిపదార్థం: త్రిభువన లక్ష్మి= మూడులోకాలలక్ష్మి; ఏతెంచి= వచ్చి; ఏకాంతము= ఒంటరిగా? ఈ వనమున= ఈ అడవిలో; ఇట్టు+ఏల+ఒకో; ఉన్నది; గగనమణి'ప్రభ= సూర్యునియొక్కకాంతి; గగనంబు+అందు+ఉండి= ఆకాశంనుండి; అవనీతల, (ప్రాప్రము+అయ్యెన్‌ఒక్కొ= భూతలంమీదికి వచ్చినదా!; శంభుండు= (బ్రహ్మదేవుడు; లావణ్య, సద్గుణ సముదాయము= సౌందర్యం యొక్క మంచిగుణాల సమూహం; ఇందు+అజ= దీని యందే; ఇమ్ముగ= ఒప్పుగ; సం(గ్రహించెన్‌, ఒక్కొజ కూర్చినాడా; దీనిఐ ఈ కన్యకయొక్క; అంగంబులన్‌= అవయవాలను; ఈ+విభూషణ, (శ్రీజ ఈ అలంకారాల శోభ; ఎమి; పుణ్యంబున్‌; చేసెన్‌ ఒక్కొ; అమర, కన్య, ఒక్కొజదేవతాకన్యయా!; యక్ష్మ కన్యక, ఒక్కొ; సిద్ధ, కన్య, ఒక్కొ; శ్రీ సమృద్ధి, సర్వ, లక్షణ ప్రశస్త+అంగి= శోభచే నిండి, అన్ని శుభలక్షణాలచేత ప్రశంసింప తగిన శరీరం కలది; అనంత కాంతి పేర్మిన్‌= అంతం లేని కాంతియొక్క అతిశయంచేత; ఇది; దివ్య, కన్య, అగున్‌. తొత్పర్యం: త్రిలోకలక్ష్మి ఒంటరిగా ఈ వనంలో ఈ విధంగా ఎందు కున్నదో! సూర్యకాంతి ఆకాశంనుండి భూమిమీదికి అవతరించిందో! బ్రహ్మదేవుడు సౌందర్య సద్గుణాల సముదాయాన్ని ఈమెలోనే సమకూర్చాడేమో! ఈమె అవయవాలను పొందిన ఈ అలంకారాల శోభ యే పుణ్యం చేసిందో! ఈమె దేవకన్యో, యక్షకన్యో, సిద్దకన్యో! శోభా సమృద్ధితో అపార మైన కాంతితో, సకల శుభ లక్షణాలతో ్రశంసింప దగిన శరీరం గల ఈమె ఒక దివ్యకన్యే అయి ఉంటుంది. విశేషం; అలం: ఉ(త్రేక్ష. సంవరణుని హృదయంలో అభిలాష జనించటానికి కారణ మైన తపతినిగురించి ఉ్రేక్షలో వర్షించిన ఈ పద్యరచనలోని మాధుర్య మనే శబ్దగుణం రసపోషకం. (సంపాం చ. నెణికురులున్‌ విలోలసితనేశత్రయుగంబును నొప్పులొల్కునా

తెఖయును దీని యాననము తెల్వి కరంబు మనోహరంబు; నా

యెజింగిన యంతనుండి సతి నిట్టిలతా లలితాంగిం జూచి యే

నెలుంగ; సురేంద్రకన్యకలు నిట్టిర రూపవిలాససంపదన్‌. లశ

ఆదిపర్వము - సప్త్రమాశ్వానము 677 ప్రతిపదార్థం: నెటి, కురులున్‌= అందమైన జుట్టు; విలోల, సిత, నేత్ర యుగంబునున్‌= చలిస్తున్న తెల్లని కన్నుల జంట; ఒప్పులు+ఒల్కు, వా తెజయును= అందాలు చిందే పెదవీ; దీని, ఆననము, తెల్వి= దీని ముఖకాంతి; కరంబు= మిక్కిలి; మనోహరంబు= మనస్సును దోచుకొనునట్టిది; నా ఎజింగిన, అంత నుండి= నేను పుట్టి బుద్ది ఎటిగినప్పటి నుండి; ఇట్టి; లతా, లలిత+అంగిన్‌= తీవవలె సుకుమార మైన శరీరం కల దానిని; సతిన్‌= కాంతను; ఏన్‌= నేను; చూచి; ఎఆుంగన్‌; రూప విలాస, సంపదన్‌= అందంయొక్క, శృంగార కళా విశేషం యొక్క ఆధిక్యంలో; సురశఇం(ద్రకన్యకలున్‌= దేవేంద్రునియొక్క కన్యకలైనా; ఇట్టిరే=ఐ ఇట్టివారా? తాత్పర్యం: ఈమె అందమైన కేశపాశం, చలించే తెల్లని కన్నుల జంట, ఒప్పు లొలికే పెదవి, ముఖకాంతి ఎంతో మనోహరంగా ఉన్నాయి. నేను పుట్టి బుద్ధి యెజిగిననాటినుండి- తీవవలె ఇంత సుకుమార మైన (స్త్రీని చూడలేదు. అందంలో, శృంగార కళా విశేషంలో దేవతా కన్యలలో నైనా ఇట్టాంటి వాళ్ళున్నారా? విశేషం: అలం: ఉదాత్తం. ఈ పద్యంలోకూడ అభిలాషను ధ్వనింపచేసే మాధుర్యగుణం పోషింపబడింది. (సంపాం వ. అని వితర్మించుచు మదనకర్కశమార్గణలక్షీభూతచేతస్కుం దయి తదీయ గుణమయపాశబద్ధుండునుం

బోలెం గదలనేరక తన్నివేశితచేతనుండునుంబోలె. ద న్నెణుంగక తద్రూపామృతపానంబున నవిమిషత్వం

బునం బొందిన తన నయనంబుల దానియంద నిలిపి సంవరణుం డక్కన్యక కి ట్లనియె. 75 ప్రతిపదార్థం: అని, వితర్కించుచు= ఊహిస్తూ; మదన, కర్కశ, మార్గణ, లక్షీభూత, చేతస్కుండు+అయి= మన్మథునియొక్క కరకైనబాణాలకు గురిచేయబడిన మనస్సు కల వాడై; తదీయ గుణమయ, పాశ బద్దుండునున్‌+పోలెన్‌= దానియొక్క గుణాలనెడి 'త్రాళ్ళచేత కట్టివేయబడినవానివలె; కదలనేరక; తజ్‌*నివేశిత, చేతనుండునున్‌+పోలెన్‌= దానియందు ఉంచబడిన చైతన్యం కలవానివలె; తన్ను+ఎయింగకజ తన్ను తాను మరచి; తత్‌+రూప+ అమృత, పానంబునన్‌= దానియొక్క రూపమనెడి అమృతాన్ని (త్రాగటంచేత; అనిమిషత్వంబునన్‌= రెప్పపాటు లేమిని, అనగా దేవతొత్వమును; పొందిన; తన, నయనంబులు= తన కన్నులు; దాని; అందు+అ=జ ఆ తపతియందే; నిలిపి; సంవరణుండు; ఆ+కన్యకకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అని ఊహిస్తూ తనమనస్సు మన్మధబాణాలకు గురికాగా, సంవరణుడు అమె గుణా లనే త్రాళ్ళతో కట్టివేయబడ్డవానివలె కదలలేక, తన చైతన్యానంతా ఆమెలో ఉంచినట్టు తనను తాను మరచి, ఆమె రూప మనే అమృతాన్ని త్రాగడంచేత రెప్పపాటు లేని కళ్ళను అమెసైనే నిలిపి, ఆ కన్యతో ఇట్టా అన్నాడు. విశేషం: అలం: రూపకం. ఇది చక్షుష్రీతి అనే మన్మథావస్థ ఆ. ఎఖుంగం జెప్పు మబల! యెవ్వరి దాన; వి; ట్లేల యున్నదాన వేకతంబ;

క్రూర వన మృగములు గ్రుమ్మరుచున్న యీ ; విజన విషమ శైల విపిన భూమి. 76 (ప్రతిపదార్థం: అబల)= ఓ కాంత!; ఎవ్వరిదానవు; ఎయుింగన్‌+చెప్పుము, (క్రూర వన, మృగములు, (క్రుమ్మరుచు+ ఉన్న (క్రూరమైన అడవిమృగాలు తిరుగుతున్న; ఈ, విజన, విషమ, శైల, విపిన, భూమి= ఈ మనుష్యులు లేని ఎగుడు దిగుడు పర్వతారణ్య ప్రదేశంలో; ఇట్టు+ఏల; ఏకతంబు+అ= ఒంటరిగా; ఉన్నదానవు.

లో,

తాత్పర్యం: ఓ కాంతా! నీ వెవరో వివరంగా చెప్పుము. క్రూరమైన అడవిమృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతం మనుష్యులు లేని ఎగుడుదిగుడు పర్వతారణ్య ప్రదేశంలో ఈ విధంగా ఒంటరిగా ఎందు కున్నావు? క. అని పలుకుచున్న వృపనం । దనునకు మఖుమాట యీక తామరసనిభా

నన మేఘమధ్యసౌదా ; మనివోలె నడంగె దృష్టిమార్గము గడవన్‌. ౮77

678 శ్రీమదాంధ్ర నుహాభారతము (ప్రతిపదార్దం: అని, పలుకుచు; ఉన్న; నృప, నందనునకుజ రాజకుమారునికి; మజణుమాట= సమాధానం ఈకజ ఇవ్వకుండా; తామరస, నిభ+ఆనన= పద్మంవంటి ముఖం కల ఆ తపతి; మేఘ, మధ్య, సౌదామని, పోలెన్‌= మేఘాలమధ్య మెరుపు తీగవలె; దృష్టిమార్గము= చూపు (ప్రసరించే త్రోవ; కడవన్‌= దాటి; అడంగె= మాయమయింది.

తాత్పర్యం: అని మాట్టాడుతున్న రాజకుమారునికి బదులు చెప్పకుండా పద్మంవంటి ముఖం కల ఆ తపతి

మేఘాల మధ్య మెరపుతీగవలె కంటికి కన్పించకుండా మాయమై పోయింది.

విశేషం: అలం: ఉపమ.

న. ఇ ట్లద్భశ్యం బయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుం డయి మహీతలంబు పయిం బడి ప్రలాపెంచుచున్న నాతని నభినవన యౌవన విభ్రమోద్ధాసెతు నంగజాకారుం జూచి తపతి తానును మదన బాణ బాధిత యై, తన రూపంబుం జూపి మధుర వచనంబుల “నిట్లేల మోహగతుండ వయి?' తని పలికిన, దానికి సంవరణుం డి ట్లనియె. 78

ప్రతిపదార్హం: ఇట్టు+అదృశ్యంబు+అయిన= ఈ విధంగా అగుపడకుండ పోయిన; ఆ+కన్యకన్‌; కానక; మానవపతి= రాజు;

(సంవరణుడు); మాన, రహితుండు+అయిజ= అభిమానాన్ని కోల్ప్సోయినవాడై; మహీతలంబు, పయిన్‌+పడి=ఐ నేలమీదపడి;

(ప్రలాపించుచున్న= ఏడ్చుచుండగా; అతనిన్‌= ఆ సంవరణుడిని; అభినవ యౌవన వి[్రమ+ఉద్భాసితున్‌= సరిక్రొత్త యౌవన

విలాసంచేత లెస్సగా ప్రకాళించేవాడిని; అంగజ+శఆకారున్‌= మన్మధునివంటి ఆకారం కలవాడిని; చూచి; తపతి; తానును; మదన

బాణ బాధిత, ఐ= మన్మధ బాణాలచేత బాధింపబడినదైై తన, రూపంబున్‌; చూపి; మధుర, వచనంబులన్‌= తీయని మాటలతో; ఇట్టు+ఏల; మోహ, గతుండవు= మోహాన్ని పొందినవాడవు; అయితి= అయితివి; అని పలికిన; దానికి; సంవరణుండు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: ఈ విధంగా ఆమె అదృశ్య మై పోగా, సంవరణుడు ఆమెను కనుగొనలేక అభిమానాన్ని కోల్పోయి,

నేలమీద పడి దుఃఖించాడు. నవయౌవనవిలాసంతో (ప్రకాశించేవాడు, మన్మథాకారుడు అయిన అతడిని చూచి తపతి తానుకూడ మన్మథబాణాలచేత బాధింపబడిం దై, అతనియెదుట నిలిచి, తీయని మాటలతో “ఈ విధంగా ఎందుకు మోహం పొందావు?” అని అడుగగా ఆమెతో సంవరణుడు ఇట్లా అన్నాడు.

చ. ధరణి నతిప్రతాపబలదర్పములన్‌ విన నేన పెద్ద నె వ్వరికిని మున్‌ భయంపడని వాండ; భయార్తు(డ నైతి నిస్ణు; పం కరుహదళాయతాక్షి! దయం గావుము నన్ను భవన్నిమిత్త దు ర్థరతర పంచబాణహతి. బంచత. బొందకయుండు నట్లుగన్‌, 79

ప్రతిపదార్థం: వినన్‌= వినగా; ధరణిన్‌= భూమిమీద; అతి, ప్రతాప, బల, దర్చములన్‌= గొప్ప పరాక్రమంచేత, బలంచేత, గర్వం

చేత; నేను+అ పెద్దన్‌= నేనే పెద్దను; మున్‌= ఇదివరకు; ఎవ్వరికిని, భయంపడని వాండ; ఇప్టుజ ఇప్పుడు; భయ+ఆర్హుండన్‌*ఐతి= భయంచేత దుఃఖాన్ని పొందిన వాడ నైనాను; పంకరుహ, దళ+ఆయత+అక్షి=పద్మపత్రాలవంటి విశాలా లయిన కన్నులు కలదానా; భవత్‌+నిమిత్త దుర్భరతర, పంచబాణ, హతిన్‌= నీ కారణంగా భరింప సాధ్యం కాని మన్మధునియొక్క దెబ్బచే: పంచతన్‌= మరణాన్ని, పొందక; ఉండునట్టుగన్‌; నన్ను; దయన్‌= దయతో; కావుముజ కాపాడుము,

తాత్పర్యం: గొప్ప బల గర్వ పరా[క్రమాలలో ఈ భూమిమీద నేనే గొప్పవాడిని. ఇంతవరకు ఎవ్వరికీ భయపడని వాడిని. కాని, ఇప్పుడు భయంతో బాధితుడ నయ్యాను. ఓ పద్మాక్షీ! నీ కారణంగా భరింపరాని మన్మథునిదెబ్బతో మరణం పొందకుండ, దయతో నన్ను రక్షించుము.

ఆదిపర్వము - సప్తమాశ్వానము 679

వ. 'నన్ను గాంధర్వవివాహంబున వరియింపు' మనిన సంనరణునకు. దపతి యి ట్లనియె. 80

తాత్పర్యం: “నన్ను గాంధర్వ వివాహపద్దతిలో పెండ్డి చేసికొను" మని అడుగగా, సంవరణునితో తపతి ఈ విధంగా

పలికింది.

విశేషం: గాంధర్వ వివాహం:- వధూవరులు పరస్పరం (శ్రేమించుకొని పెద్దలతో అవసరం లేకుండ రహస్యంగా, అమం(త్రకంగా

చేసికొనే వివాహం. వివాహాలు ఎనిమిది విధాలు. (1) (బ్రాహ్మం (2) దైవం (3) ఆర్జం (4) ప్రాజాపత్యం (5) రాక్షసం (6) ఆసురం

(7) గాంధర్వం (8) పైశాచం. (వివరాలకు చూడు: ఆది. 455)

క. _ భువనైక దీపకుం డగు, సవిత్భనకుం దనూజ: మజియు సావిత్రికి నే నవరజ, నవినయ వర్ణిత; ; నవనీశ్వర! వినుము తపతి యను సురకన్యన్‌. 81

ప్రతిపదార్హం: అవని+ఈశ్వరజ= భూపతీ! సంవరణ మహారాజా! వినుము; ఏన్‌= నేను; భువన+ఏక్క దీపకుండు, అగు= లోకాన్ని

అంతటిని వెలిగించేవా డైన; సవితృనకున్‌= సూర్యునికి; తనూజ= కూతురిని; మజియు; సావిత్రికి; అవరజన్‌= తోబుట్టువును - చెల్లెలిని; అవినయ, వర్టితన్‌= అవినయంచేత విడువబడినదానిని - అనగా గర్వంలేని దానిని; తపతి అను; సురకన్యన్‌= దేవ కన్యను.

తాత్సర్యం: ఓ రాజా! విను. నేను లోకాన్ని వెలిగించే సూర్యుని కూతురిని. సావిత్రికి చెల్లెలిని. గర్వం లేని దానిని.

తపతి అనే పేరుగల దేవకన్యను.

వ. 'నాయందు నీకుం బ్రియంబు గలదేని మదీయ జనకు నడుగుము; న న్నిచ్చు; నింతులకు స్వాతంత్ర్యంబు లేమి నీ వెటుంగుదువు గాదె! కావున ననవరత జప నియమ ప్రజిపాతంబుల నాదిత్యు నారాధింపు' మని చెప్పి తపతి యాదిత్యమండలంబున కరిగి; నంత సంవరణుండు మూర్ధాగతుం డయి పడియున్న నాతని యమాత్యుండు వచ్చి శీతలపరిషేచనంబు సేసిన మూర్ణదేఖి యమ్మహీపతి మహాభక్తి నప్పర్వతంబున నుండి సూర్యు నారాధించుచు. 82

ప్రతిపదార్థం: నాయందు: నీకున్‌; ప్రియంబు= ్రేమః కలదు+ఏని; మదీయ, జనకున్‌= నాయొక్క తండ్రిని; అడుగుము;

నన్ను+ఇచ్చున్‌= నన్ను నీ కిచ్చి వివాహం చేస్తాడు; ఇంతులకు= స్త్రీలకు; స్వాతంత్ర్యంబు, లేమి= స్వేచ్చలేకుండుట; నీవు; ఎయుంగుదువుకాదె; కావునన్‌; అనవరత, జప, నియమ, '్రణిపాతంబులన్‌= ఎడతెగని జపాలచేత నియమాలచేత నమస్కారాలచేత; ఆదిత్యునిజ సూర్యుడిని; ఆరాధింపుము= సేవింపుము; అని; చెప్పే; తపతి; ఆదిత్య, మండలమునకుజ సూర్యమండలానికి; అరిగెన్‌= వెళ్ళింది; అంత; తరువాత; సంవరణుండు; మూర్చా, గతుండు+అయి= మూర్చపోయిన వారై పడియున్నన్‌: ఆతని; అమాత్యుండు= మంత్రి; వచ్చి; శీతల, పరిషేవనంబు, చేసిన= చల్లనినీళ్ళు చల్లగా? మూ ర్చ; ఇ ఆ+మహీపతి= ఆ రాజా, (సంవరణుండు); మహాభక్తిన్‌= మిక్కిలిభక్తితో: ఆ+పర్వతంబునన్‌= ఆ కొండమీద; ఉండి; సూర్యుల ఆరాధించుచు= సేవిస్తూ. నీకు తాత్పర్యం: 'నాపై నీకు ప్రేమ ఉంటే, మా తండ్రిని అడుగుము; న న్నిస్తాడు. ్రీలకు స్వాతంత్ర్యం లే దని న తెలుసుకదా! కనుక నిరంతర జపాలతో, నియమాలతో, నమస్కారాలతో సూర్యుడిని ఆరాధించుము అని ప వ ర ల్ల తపతి సూర్యమండలానికి వెళ్ళిపోయింది. తరువాత సంవరణుడు మూర్చ పడి ఉండగా, అతనిమంత్రి వచ్చి చల్ల నీటితో మూర్చతేర్చాడు. ఆ మహారాజు ఆ పర్వతంమీదనే ఉండి, మహాభక్తితో సూర్యుడిని ఆరాధించాడు.

680 శ్రీమదాంధ్ర నుహవాభారతము వసిష్టుండు తపతిని. గొనితెచ్చి సంనరణునకు వివాహంబు సేయించుట (సం.1-162-12)

చ. ప్రతిహతరాగ కోపభయుం. బంకరుహప్రభవప్రభావు దూ

రితదురితున్‌ మునీశ్వరవరిష్టు వసిష్టుహామునిం బురో

హితు నతిభక్తితోం దలంచె; నిష్ట మెటింగి వసిష్టుండున్‌ సమా

హితమతి నేంగుదెంచి కనియెం బ్రభు సంవరణుం బ్రియంబునన్‌. 83 ప్రతిపదార్థం: ప్రతిహత, రాగ, కోప, భయున్‌= నిరోధింపబడిన రాగం, కోపం, భయం కలవాడూ; పంకరుహ, ప్రభవ 'ప్రభావుజ పద్మంనుండి పుట్టిన బ్రహ్మదేవుని వంటి మహిమ కలవాడూ; దూరిత దురితున్‌= దూరం చేయబడిన పాపం కలవాడూ - అనగా ఏ పాపమూ చేయని వాడూ; ముని+ఈశ్చర, వరిష్టు= ముని(్రేష్టులలో ఉత్తముడైన వాడూ అయిన; వసిష్ట మహామునిన్‌: పురోహితున్‌; అతి, భక్తితోన్‌; తలంచెన్‌; ఇష్టము+ఎజింగి= అతని కోరికను తెలిసికొని; వసిష్టుండున్‌: సమాహిత, మతిన్‌= (ప్రసన్నమైన మనస్సుతో; ఏంగుదెంచి= వచ్చి; (ప్రభు, సంవరణున్‌= రాజైన సంవరణుడిని; ప్రియంబునన్‌= (ప్రేమతో; కనియెన్‌= చూచాడు. తాత్సద్యల: రాగం, కోపం, భయం లేనివాడు, (బ్రహ్మదేవునితో సమానమైన ప్రభావం గలవాడు, పాపరహితుడు, మునీశ్చర (శ్రేష్టుడు, తమ పురోహితుడు అయిన వసిష్టమహామునిని సంవరణుడు మిక్కిలిభక్తితో స్మరించాడు. అతని కోరికను తెలిసికొని, ఆ మహాముని ప్రసన్నమైన మనస్సుతో వచ్చి, ఆ (ప్రభువును ప్రేమతో దర్శించాడు. వ. ఇట్లు దలంచిన పండ్రెం డగు దివసంబునకు వచ్చి వసిష్టుం డవిరత వ్రతోపవాస కృశీభూత శరీరుం డయి

యున్న సంవరణుం జూచి యాతండు తపనసుత యయిన తపతియందు బద్ధానురాగుం దడగుట తన

యోగద్భష్ట నెజింగి, 84 ప్రతిపదార్థం: ఇట్టు; తలంచిన; పండ్రైెండు+అగు; దివసంబునకుజ రోజునకు; వచ్చి; వసిష్టుండు; అవిరత, (వ్రత+జఉపవాస, కృశీభూత, శరీరుండు+అయి= ఎడతెగని (వ్రతోసవాసాలచేత బక్కచిక్కిన దేహం కలవా డై; ఉన్న, సంవరణున్‌; చూచి; ఆతండు; తపన, సుత, అయిన= సూర్యుని కూతు రైన; తపతి, అందు; బద్ధ+అనురాగుండు+అగుట= కట్టివయబడిన (ప్రేమ కలవా డగుటను; తన; యోగదృష్టిన్‌; ఎటింగి= తెలిసికొని. తాత్సర్యం: ఈ విధంగా సంవరణుడు తలచుకొన్న పన్నెండవ రోజున వసిష్టుడు వచ్చి, ఎడతెగని (వ్రతోపవాసాలతో కృశించి ఉన్న అతడిని చూచి, అతడు సూర్యపుత్రిక అయిన తపతిపై గాఢమైన (ప్రేమ కలిగి ఉన్నా డని తన యోగ దృష్టితో తెలిసికొని. చ. జగదభివంద్యు.డాక్షణమ సమ్మతి సంపరణ ప్రయోజనం

బొగి నొనరింపంగా నయుతయోజనముల్‌ చని లోకలోచనుం

డగు దిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న

త్యగణితవేదమంత్రముల నమ్మునినాథు. డతిఫ్రియంబునన్‌. 85 ప్రతిపదార్థం: జగత్‌+అభివంద్యుండు= లోకంచేత నమస్కరింపదగినవాడు - వసిష్టుడు; ఆ, క్షణము+అ= అప్పటికప్పుడే; సమ్మతిన్‌= అంగీకారంతో; సంవరణ ప్రయోజనంబుజ సంవరణునియొక్క పని; ఒగిన్‌= క్రమంగా; ఒనరింపంాన్‌= చేయటానికి; అయుత, యోజనముల్‌= పదివేల ఆమడలదూరం; చని= వెళ్ళి; లోక, లోచనుండు+అగు= లోకాలకు కన్నైన వాడగు; దిన, నాధున్‌= పగటికి ప్రభు వైన వాడిని; ఆతత, సహస్రకరున్‌= విస్తార మైన వేయికిరణాలు కల వాడిని; కని= చూచి;

ఆదిపర్వము - సప్తమాశ్వానము 681 ఆ+మునినాధుండు= ఆ మునిశ్రేష్టు డైన వసిష్టుడు; అతి+ప్రియంబునన్‌= మిక్కిలి ప్రీతితో; అతి+అగణిత, వేదమం(త్రములన్‌= లెక్కలేనన్ని వేదమంత్రాలతో; సంస్తుతించెన్‌= స్తోత్రం చేశాడు. తాత్పర్యం: జగత్పూజ్యుడైన వసిష్టముహాముని అప్పటికప్పుడే సంవరణుని కోర్కె తీర్చటానికి అంగీకరించి పదివేల ఆమడలు పయనించి, లోకాలకు కన్నైనవాడు, పగటికి ప్రభువు, విస్తారమైన వేయి కిరణాలు కలవాడు అయిన సూర్యుడిని చూచి మిక్కిలి ప్రీతితో అనేక వేద మంత్రాలతో స్తోత్రం చేశాడు.

వ. _సూర్యుండును నసిషముహాముని నతిగొరవంబున సంభావించి 'భవదాగమన ప్రయోజనంబు సెప్పు మనిన

వసిష్ణుం డిట్లనియె. 86 ('ప్రతిపదార్ధం: సూర్యుండును; వసిష్టమహామునిన్‌; అతి, గౌరవంబున; సంభావించి= పూజించి; భవత్‌+ఆగమన, 'ప్రయోజనంబు= మీరు వచ్చిన పని; చెప్ప్తుము+అనిన; వసిష్టుండు; ఇట్టు+అనియె, తాత్పర్యం: సూర్యుడుకూడ వసిష్టమహర్షిని మిక్కిలి మర్యాదతో పూజించి 'మీ రాకకు కారణ మేమి? చెప్పండని వసిష్టుడిని అడిగాడు. సీ, 'అలఘుండు పారవకులశేఖరుండు సం । వరుణు6 డన్వాం దనవరత తీర్తి

విదితుందు ధర్షార్ధవిదుండు నీ పుత్రికి, : నగణిత గుణముల దగు వరుండు

గావున నతనికి దేవిగాందపతి నీ; వలయు గూయలంగన్నఫలము దగిన

వరులకు సద్ధర్మచరితుల కీ. గాన్స;। కాదె!” నావుడు సూర్యు. డొదరించి ఆ. 'వరుండు రాజవంశకరుండు సంవరణుండ ।; యనుగుణుండు దీని' కని కరంబు

గారసమున నిచ్చి యా బుషితోదంబు | త్తెంచెం దసతిం గురుకులాంచితునకు. 87 ప్రతిపదార్థం: అలఘుండు= తక్కువవాడు కానివాడు - అనగా గొప్పవాడు; పౌరవ, కులశేఖరుండు= పూరువుయొక్క వంశానికి శిరోభూషణ మైనవాడు; సంవరణుండు; అన్‌వాడుజ అనేవాడు; అనవరత, కీర్తి విదితుండు= ఎల్లప్పుడు కీర్తిచేత తెలియబడిన వాడు - అనగా కీర్తిచేత ప్రసిద్దుడు; ధర్మ+అర్ధం విదుండు= ధర్మార్జ్రాలను తెలిసినవాడు: నీ, పుత్రికిన్‌ అగణిత, గుణములన్‌ లెక్కలేనన్ని సుగుణాలచేత; తగు, వరుండు= తగిన భర్త కావునన్‌; తపతిన్‌, అతనికి; దేవికాన్‌= భార్యగా; ఈవలయు ; కూతులన్‌; కన్ను ఫలము; తగిన, వరులకు, సత్‌ధర్మ, చరితులకు= చక్కని ధర్మంతో కూడిన నడవడి కలవారికి; ఈన్‌+ కాన్ను+అ; కాదె= ఇవ్వుగలగటమే కదా!; నావుడు= అని ఆనగా; సూర్యుండు; ఆదరించి; దీనికి= ఈ తపతికి; వరుండు: రాజు వంశకరుండు= సంతానంవలన చంద్రవంశాన్ని నిలిపేవాడు; సంవరణుండు+అవ= సంవరణుడే; అనుగుణుండు= తగిన గుణాలు కలవాడు; అని; కరంబుజ మిక్కిలి; గారవమునవ= (ప్రేమతో; తపతిెన్‌; కురు, కుల+అంచితునకు= కురుకులంచేత పూజింపబ! వానికి? ఇచ్చి; ఆ బుషితోడన్‌= ఆ బుషివెంట; పుత్తెంచెన్‌= పంపాడు.

ఆభ్యకె, తాత్పర్యం: “గొప్పవాడు, పూరువుయొక్క వంశానికి శిరోభూషణమైనవాడు, ఎల్లప్పుడు క్తీర్తిచేత ప్రసిద్దుడు, ధర్మార్జాలు తెలిసినవాడు అయిన సంవరణుడు అనేక సద్గుణాలచేత నీ పుత్రికకు తగిన వరుడు. కనుక అతనికి భార్యగా తపతిని ఇవ్వాలి. కుమార్తెలను కన్నందుకు ఫలం-ధర్మబద్ధమైన నడవడిగల తగిన వరులకు శ ట్‌,

ఇన్వగలగటమే కదా!” అని పల్కగా, సూర్యుడు వసిష్టునిమాట ఆదరించి, 'చంద్రవంశాన్ని నిలొప వాడైన

682 శ్రీమదాంధ్ర మహాభారతము

సంవరణుడే ఈమెకు తగిన వరుడని- మిక్కిలిప్రీతితో, కురుకులంచేత పూజింపబడే అతనికి తపతి నిచ్చి ఆ

బుషివెంట సాగనంపాడు.

వ. ఇ ట్లొక్కనిమిషంబున మున్నూటయటువదినాలుగు యోజనంబులు పఅచు నాదిత్యురథంబుతో నశ్రమంబున నరిగి, తపనదత్త యయిన తపతిం దోడ్కొని వచ్చి, వసిష్టుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు సేయించె64 గావున మహాత్ము లయిన పురోహితులం బడసిన రాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం; బిట్లు సంవరణుండు దపతి వివాహం బయి. 88

ప్రతిపదార్హం: ఇట్టు+ఒక్క, నిమిషంబున; మున్నూట అరువది నాలుగు యోజనంబులు; పజణచు= పరుగెత్తు; ఆదిత్యు రథంబుతోన్‌= సూర్యునియొక్క రధంతో; అశ్రమంబునన్‌= (శ్రమలేకుండా, అరిగి= వెళ్ళి, తపన దత్త అయిన= సూర్యునిచే ఇవ్వబడిన దైన; తపతిన్‌, తోడ్కొనివచ్చి; వసిష్టుండు; విధివంతంబుగా= శా'స్త్రపద్దతిగా?: సంవరణునకున్‌, తపతిన్‌: వివాహంబు; చేయించెన్‌= కావున; మహత్‌+ఆత్ములు+ఐనజ= పురోహితులన్‌; పడసిన= పొందిన; రాజులకు; అభీష్టంబులు+అయిన= కోరబడినవైన; శుభంబులు+అగుట; నిశ్చయంబు; ఇట్టు; సంవరణుండు; తపతిన్‌; వివాహంబు+అయి.

తాత్పర్యం: ఈ విధంగా, నిమిషానికి మూడువందల అరవై నాలుగు ఆమడలు పరుగెత్తే సూర్యుని రధంతోపాటు

శ్రమలేకుండ వెళ్ళి, అత డిచ్చిన తపతిని తనవెంట తీసికొనివచ్చి, వసిష్టుడు శాస్త్రోక్తంగా తపతీ సంవరణులకు

వివాహం జరిపించాడు. అందుచేత మహాత్ము లైన పురోహితులను పొందిన రాజులకు కోరుకొన్న శుభాలు కలగటం నిశ్చయం. -ఈ విధంగా సంవరణుడు తపతిని వివాహం చేసికొని.

క _ ఆతరుణియందుంజేతో। జాత సుఖప్రీతి. దగిలి శైలాటవులన్‌ వీతన్ఫపకార్యధర్మ । వ్రాతుం డయి పదియురెండువర్షము లుండెన్‌. 89

(ప్రతిపదార్థం: ఆ, తరుణియందున్‌= ఆకాంతయందు; చేతోజాత, సుఖట్రీతిన్‌= మన్మధ సుఖట్రీతితో; తగిలి= తగులుకొని,

ఆసక్తి కలిగి; వీత, నృపకార్య ధర్మనవ్రాతుండు+అయి= వదలిన రాచకార్య ధర్మ సమూహం కలవాడై; శైల+అటవులన్‌=

కొండలందు, అడవులందు; పదియు, రెండు, వర్షములు= పండ్రైెండేడ్డు; ఉండెన్‌.

తాత్పర్యం: మన్మధ సుఖ ప్రీతితో ఆ తపతితోనే కాపురం చేస్తూ రాచకార్యాలను, ధర్మాలను వదలి పన్నెండేళ్లు

కొండలలో, అడవులలో ఉండిపోయాడు.

వ. 'దానం జేసి మహీతలంబున కనావృష్టి యయిన నెజింగి వసిష్టుండు శాంతికపాష్టికవిధు లొనరించి, సంవరణుం దోడ్కొని హస్తిపురంబున కరిగిన నఖిలప్రజకు ననురాగం బయ్యె, ననావ్ఫప్టి దోషంబునుం బాసె; నంత సంవరణునకు6 దపతికిం దాపత్యుం దై వంశకరుండు కురుండు పుట్టె: నది మొదలుగా మీరును దాపత్యుల రయితి' రని గంధర్వుండు చెప్పిన నర్దునుండు వెండియు ని ట్లనియె. 90

ప్రతిపదార్థం: దానన్‌+చేసి= అందువలన; మహీ, తలంబునకు= భూమండలానికి; అనావృష్టి అయినన్‌= వానలేమి ఏర్పడగా; ఎటీంగి; వసిష్ణుండు; శాంతిక, పౌష్టిక, విధులు= శాంతికములు, పౌష్టికములు అయిన వేదకర్మలను; ఒనరించిజ= చేసి, సంవరణున్‌; తోడ్కొని; హస్తిపురంబునకు; అరిగినన్‌= వెళ్ళగా? అఖిల, (ప్రజలకున్‌; అనురాగంబు+*అయ్యెన్‌= ప్రీతికలిగింది; అనావృష్టి దోషంబునున్‌= వానలేమి లోపంకూడ; పాసెన్‌= తొలగింది; అంత; సంవరణునకున్‌: తపతికిన్‌: తాపత్యుండు+ఐ= తపతి కుమారు డై; వంశకరుండు= సంతానంవలన వంశాన్ని నిలిపేవాడేకాక వంశానికి పేరు తెచ్చే వాడు; కురుండు; పుట్టెన్‌: అది మొదలుగా; మీరును; తాపత్యులరు= తపతి సంతానమైన వారు; అయితిరి; అని; గంధర్వుండు; చెప్పినన్‌:; అర్జునుండు; వెండియున్‌; ఇట్టు+అనియె.

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 683 తాత్పర్యం: “దాని వలన భూమండలంలో అనావృష్టి ఏర్పడగా, అది తెలిసికొని వసిష్టుడు శాంతిక, పౌష్టిక, వైదిక (క్రియలు చేసి, సంవరణుడిని తన వెంట పిలిచికొని హస్తినాపురానికి వెళ్ళాడు. (ప్రజలంతా ఆనందించారు. అనావృష్టి తొలగింది. తరువాత సంవరుణునికి, తపతికి వంశకర్త అయిన కురుడు పుట్టాడు. అప్పటినుండి మీరు కూడా తాపత్యు లయ్యారు, అని గంధర్వుడు చెప్పగా, అర్జునుడు మరల ఇట్టా అన్నాడు. విశేషం: హిమకరుందొట్టి పూరుభరతేశ కురుప్రభు పాండుభూపతుల్‌ క్రమమున వంశకర్తలనంగా మహినొప్పిన' (1.14) చంద్ర వంశంలోని వంశకర్తల చరిత్రలు పాండవుల చరి(త్రకంటె ముందు చెప్పటం మహాభారతంలో కాల(క్రమంలో చెప్పేకధాకథనశిల్పం,. భరతుని తరువాత కురుమహారాజు జననం చెప్పి ఉండవలసింది. కాని, అంగారపర్జునికధలో పాండవులు - కౌరవులనేకాదు, తాపత్యులు అనికూడా వాళ్ళు పిలువబడతారనే అంశం చెప్పవలసివచ్చినప్పుడు కురుజన్మవృత్తాంతం చెప్పటం జరిగింది. ఇది కార్యకారణ సంబద్ధమైన కధాకధన పద్దతి. చంద్రవంశంలోని రాజులను వంశకర్తల పేర్లతో (అంటే వారి సంతానమని) పిలిచే పద్దతి ఉన్నది. అంటే - పాండవులను పౌరవులనీ, భారతులనీ, కౌరవులనీ పిలుస్తారు. ఇంతేకాక- వంశకర్తల భార్యల పేర్లతో (వారి సంతానమని) పిలిచే సంప్రదాయంకూడా ఉన్నది. అటువంటి విశిష్ట గౌరవం ఇద్దరు ముగ్గురికి మాత్రమే దక్కింది. అందులో ముఖ్యులు తపతి, కుంతి, సత్యవతి. పాండవులను 'తాపత్యు' లనీ అంగారపర్డుడు కావాలనే పేర్కొన్నాడు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు మేము తాపత్యుల మెట్టయ్యాం?” అన్న ప్రశ్నతో తపతీసంవరణోపాఖ్యానం అంతా చెప్పాడు. అయితే ఈకధ వంశకథ మాత్రమే కాదు; మరేవంశకర్త జీవితంలోనూ కనపడని పురోహిత మాహాత్స్వాన్ని చెప్పేకథ. సంవరణమహారాజువలె పాండవులు కూడా పురోహిత పురస్సరులై ఉండాలని అంగారపర్డుని హితబోధ. పురోహితునివలన హితం కలిగిన వంశకర్త కద విన్న తరువాత. ఆ పురోహితుడైన వసిష్టుని మహత్త్వాన్ని గురించి అర్జునుడు తెలిసికొనగోరటం సహజం. ఒక కథలోనుండి మరాక కథ సహజంగా ఉద్భవించే కథాకధన శిల్పం ఇది. నన్నయగారి ప్రసన్నకధాకవితార్థయుక్తిని అత్యంత సహజంగా ఆవిష్కరించిన కధార్థాలు ఈ ఘట్టంలో ఉన్నాయి. (సంపా.)

క. _ నుతముగ నస్త్మత్కుల భూ ; పతులకు నాద్యులకు6 బుణ్యభాగులకు€ బురో

హితుండయిన వసిష్టు మహా । త్మతం జెప్పము వినంగవలతు మది నేర్పడంగన్‌. 91 ప్రతిపదార్థం: నుతముగన్‌= కొనియాడదగినట్టుగా: అస్మత్‌*కుల, భూపతులకున్‌= నా(మా)యొక్కవంశమందలిరాజులకు; ఆద్యులకున్‌= మొదటివారలకు; పుణ్యభాగులకున్‌= పుణ్యవంతులకు; వురోహితుడు+అయిన, వసిష్టు, మహా+ఆత్మతన్‌= వసిష్టుని యొక్క మహిమను; మదిన్‌= మనస్సునందు; ఏర్పడంగన్‌= స్పష్టమయ్యేటట్లు; చెప్పుము; వినగ; వలతున్‌= కోరుకొంటాను. | తాత్పర్యం: మా వంశంలో మొదటివారు, పుణ్యాత్ములు అయిన ప్రభువులకు పురోహితుడుగా ప్రశంసలందుకొన్న వసిష్టులవారి మహిమను మనసుకు వచ్చే విధంగా స్పష్టంగా వినా లని ఉన్నది; తెలియజేయండి. వ. అనిన గంధర్వుం ది ట్లనియె. 92 తాత్పర్యం: అని అనగా గంధర్వుడైన అంగారపర్జుడు ఈ విధంగా అన్నాడు. క. ధృతి నెవ్వని నేని పురో; హితుగా బుణ్యమునం బడసి యిక్ష్వాకుకులో

దితు లైన పతులు రాజ్యో; న్నతి నొప్పం జేసి రుర్వి నానాక్రతువుల్‌. 93 ప్రతిపదార్థం: ఇక్వాకు, కుల+ఉదితులు+అయిన= ఇక్షాకువంశంలో జన్మించిన; పతులు= రాజులు; ధృతిన్‌= సంతోషంతో; ఎవ్వనిన్‌+ఏని; పురోహితుగాన్‌; పుణ్యమునన్‌? పడసి= పొంది; ఉర్విన్‌= భూమిమీద; రాజ్య+ఉన్నతిన్‌= రాజ్యముయొక్క గొప్పతనం; ఒప్పన్‌= ప్రకాశింపగా; నానా, (క్రతువుల్‌= అనేకవిధా లైన యజ్ఞాలు: చేసిరి.

68% శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: ఇక్షాకువంశంరాజులు పుణ్యవశంచేత ఎవరిని పురోహితునిగా పొంది, రాజ్యగౌరవం ప్రకాశించగా, భూమిమీద పెక్కువిధా లైన యజ్ఞాలు చేశారో. క. బలమజటికామక్రోధం। బులు రెండు జయింపండి తపోవీర్య బలం

బులంజేసి చేయునవి ని; చ్చలు నెవ్వనియేని పాద సంవాహంబుల్‌. ప్ర4 ప్రతిపదార్థం: నిచ్చలున్‌= ఎల్లప్పుడు; ఎవ్వని+ఏని; పొద, సంవాహంబుల్‌= పాదాలు ఒత్తుటలు; బలము+అటథీ= బలం నశించి; కామ, క్రోధంబులు; రెండు; జయింపన్‌+పడి; తపోవీర్య బలంబులన్‌+చేసి= తపముయొక్క (ప్రభావాతిశయంవలన; చేయునవి. తాత్సర్యం: ఎల్లప్పుడు ఎవరి పాద సంవాహనం చేస్తే కామకక్రోధాలు రెండూ బలహీనాలై జయింపబడి, తపస్పుయొక్క 'ప్రభావాతిశయాలచేత చేసే పను లౌతాయో. విశేషం; తపశ్ళక్తియొక్క బలంచేత, కామకక్రోధాలు బలహీనమై జయింపబడి నిత్యం ఎవ్వరి పాదసంవాహాలను చేస్తాయో - అంటే ఎవరికి అధీనాలు అవుతాయో అనికూడా చెప్పవచ్చును. సీ, 'శమహీనుం డైన విశ్వామిత్రు చేసిన ।; యపకారనునం జేసి యాత్మసుతులు

యమసదనంబున కరిగిన, వారలం। దనతపోవీర్య సత్వముల పేర్షిం

గ్రమ్మజింపంగ శక్తి కలిగియు, వేల న । య్యంబుధి గడవనియట్ల శాంతు6

డయి యెవ్వంేని కృతాంతకుం గడవంగ ; నొల్లండ, యట్టి యత్యుగ్రతేజు ఆ. డగు వసిష్టముని మహాత్మతం జెప్పనా యలవియయ్య! యనిన నవ్వసిష్ట

గాధిసుతుల కేమికారణంబున నిట్టి; వైర మయ్యె నెలుంగ వలతు దీని. 95 ప్రతిపదార్థం: శమ, హీనుండు+ఐన= శాంతం లేనివా డైన; విశ్వామిత్రు, చేసిన= విశ్వామిత్రుడు చేసిన; అపకారమునన్‌+చేసి= అపకారంనలన; ఆత్మసుతులు= తన కుమారులు; యమ, సదనంబునకు= యముని ఇంటికి; అరిగిన= వెళ్ళగా, వారలన్‌; తన; తపోవీర్య, సత్య్యముల, పేర్మిన్‌= తన తపస్సు యొక్క (ప్రభావ బలాల అతిశయంతో: క్రమ్మజణింపంగన్‌= మరలించటానికి; శక్తి కలిగియు; వేలన్‌= చెలియలికట్టను; ఆ+అంబుధి= ఆ సముద్రం; కడవని, అట్టు+అజ= దాటనివిధంగానే, శాంతుండు+అయి; ఎవ్వడు+ఏని; కృత+అంతకున్‌= యమధర్మరాజును; కడవంగన్‌= దాటివెళ్ళటానికి; ఒల్లండు+అ= ఇష్టపడడో; అట్టి; అతి+ఉ(గ్రః తేజుండ= మిక్కిలి భయంకర మైన తేజస్సు గలవాడు; అగు; వసిష్టముని; మహత్‌+ఆత్మతన్‌= మహానుభావతను; చెప్పన్‌= చెప్పటానికి; నా, అలవి, అయ్య!= నాకు సాధ్య మౌతుందటయ్యా!; అనినన్‌; ఆ+వసిష్ట గాధిసుతులకుఐ ఆ వసిష్ట విశ్వామిత్రులకు; ఏమి, కారణంబునన్‌: ఇట్టి, వైరము+అయ్యెన్‌; దీని; ఎజు6గ, వలతు= తెలిసికొనగోరుతున్నాను. తాత్పర్యం: శాంతస్వభావం లేని విశ్వామిత్రుడు చేసిన ఆసకారంవలన, తన కుమారులు యమలోకానికి వెళ్లగా, వాళ్ళను తన తపఃప్రభావంతో మరలించటానికి సమర్భు డై ఉండికూడ, చెలియలికట్టను సము(ద్రం దాటనట్టే, శాంతు డై యమధర్మరాజును అతి(క్రమించటానికి ఎవరు ఇష్టపడలేదో - అట్టాంటి మహాభయంకర మైన తేజస్సు కల వసిష్టమహాముని మహిమను చెప్పటం నా తరమా?" అని గంధర్వుడు పల్కగా, “ఆ వసిష్ట విశ్వామిత్రులకు ఏ ఏ కారణంచేత ఇటువంటి వైరం ఏర్పడిందో వినగోరుతున్నాను”. విశేషం: అలం: ఉపమ.

ఆదిపర్వము - సష్తమాశ్వానము 685 అంగారపర్హుండు అర్జునునకు వసిష్టుముహిమ చెప్పుట (సం.1-165-2)

వ. చెప్పుమని యర్హునుం డడిగిన గంధర్వుం డి ట్లని చెప్పెం దొల్లి కన్యాకుబ్దంబున గాధిపుత్తుండు విశ్వామిత్రుం డనురాజు నిరమిత్రంబుగా ధాత్రి నేలుచు, నొక్కనాయ మృగయార్థం బరిగి, యపారబలసమేతుం డయి ఘోరారణ్యంబునం గ్రుమ్మరి, వడంబడి కడు డస్సి నసిషునాశ్రమం బాశ్రయించిన, నమ్మునివరుండు విశ్వామిత్రు నతిప్రీతిం బూజించి, వానికిని వానిసేనకు నభిమతంబు లైన యాహారంబులు గురియ నందిని యను తన హోమధేనువుం బంచిన, నదియు. 96

(ప్రతిపదార్హం: చెప్పుము+అని; అర్జునుండు; అడిగిన; గంధర్వుండు; ఇట్టు+అని; ఇెప్పెన్‌; తొల్లి= పూర్వం; కన్యాకుజ్జంబున; గాధిపుత్తుండు= గాధియొక్క కుమారుడు; విశ్వామిత్రుండు+అను; రాజు; నిర్‌+అమి(త్రంబుగా= శత్రువులు లేకుండ; ధాత్రిన్‌= భూమిని; ఏలుచున్‌= పాలిస్తూ: ఒక్కనాండు; మృగయా+అర్హంబు= వేటకొరకు; అరిగి=ఐ వెళ్ళి; అపార, బల, సమేతుండు+అయి= అంతులేని సైన్యంతో కూడిన వా డై; ఘఫోరశిఅరణ్యంబునన్‌= భయంకర మైన అడవియందు; [క్రుమ్మరి= తిరిగి; వడన్‌+పడి= తాపం పొంది; కడు, డస్పి= మిక్కిలి అలసి; వసిష్టు+ఆశ్రమంబు= వసిష్టునియొక్క ఆశ్రమాన్ని; ఆశ్రయించినన్‌= విశ్రాంతి కొరకు చేరగా? ఆ+ముని, వరుండు= ఆ ముని (శ్రేష్టుడు; విశ్వామిత్రున్‌; అతి, ప్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; పూజించి, వానికిని; వాని, శఛశనకున్‌; అభిమతంబులు+ఐన= ఇష్టములైన, అఆహారంబులు; కురియ= వర్ణింప; నందిని; అను; తన, హోమ, ధేనువున్‌; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అదియు.

తాత్సర్యం: చెప్పవలసిం దని అర్జునుడు అడుగగా, గంధర్వుడు ఈ విధంగా చెప్పాడు: పూర్వం కన్నా $కుబ్బంలో ॥

గాధికుమారుడు, విశ్వామిత్రుడు అనే రాజు, శత్రువులు లేకుండా భూమిని పరిపాలిరచాడు. అతడు ఒకనాడు

4 వేటకొరకు అపార మైన సైన్యంతో వెళ్ళి భయంకర మైన అరణ్యంలో తిరిగి, తాపం పొంది, మిక్కిలి అలన, విశ్రాంతికొరకు వసిష్టుని ఆశ్రమం చేరాడు. ఆ ముని'శ్రేష్టుడు విశ్వామిత్రుడిని మిక్కిలిప్రేమతో పూజించి, అతనికీ అతనిసేనకూ ఇష్టమైన ఆహారపదార్థాలు సమృద్దిగా అందజేయటానికి 'నందిని' అనే తన హోమధేనువును ఆజ్ఞాపించాడు. అప్పు డది.

క. ఘృత నదులును, నోదన ప । ర్వతములు, దధి కుల్యములు, నవారిత రసపూ రిత బహువిధోపదంశో । న్నత పుంజంబులును దత్‌క్షణంబునం గురిసెన్‌. 97

ప్రతిపదార్థం: ఘృత, నదులునున్‌= నేతి నదులూ; ఓదన పర్వతములు= అన్నపు కొండలూ; దధి కుల్యములున్‌= పెరుగు

కాలువలూ; అవారిత, రసపూరిత, బహువిధ, ఉపదంశ+ఉన్నత, పుంజములును= అపుటకు సాధ్యం కాని రసంతో నిండిన అనేకవిధా లైన ఊరుగాయలయొక్క గొప్పరాసులూ; తత్‌+క్షణంబునన్‌= ఆ క్షణంలోనే; కురిసెన్‌.

తాత్పర్యం: నేతి నదులను, అన్నపు కొండలను, పెరుగు కాల్వలను, ఎడతెరపి లేని రసంతో నిండిన అనేక విధా

లైన గొప్ప ఊరుగాయల రాసులను అప్పటి కప్పుడే వర్షించింది.

ల

వ ఇట్లు చతుర్విధాహారంబుల నందణం దృస్తులం జేసి యున్నయా నందినిం జూచి విశ్వామిత్రుండు విష్యితుం డయి యాత్మగతంబున, 98

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చతుర్విధ+ఆహారంబులన్‌= నాలుగురకాలైన ఆహారపదార్జాలతో; అందజన్‌; తృప్తులన్‌+చేసి;

ఉన్న అ, నందినిన్‌; చూచి; విశ్వామి[త్రుండు; విస్మితుండు+అయి= ఆళ్ళర్యపడిన వాడై ఆత్మ, గతంబునజ మనస్సులో ॥

686 (శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: ఈ విధంగా భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యా లనే నాలుగు విధా లైన ఆహార పదార్జాలతో అందరిని తృప్తిపరచి ఉన్న ఆ నందినీ ధేనువును చూచి విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి, తన మనస్సులో. మధ్యాక్కర.

న్ఫుదు రోమములును, శంకునిభ కర్ణముల్‌, మెత్తని వలుంద

పొదుగును, నిడుదచన్నులును, గుటుచలై పొలుచు కొమ్ములును,

సదమలశరదిందుశంఖనిభ మైన చాయయుం గలుగు

మొద విది నిధి చేరినట్లు చేరె నిమ్మునికిం బుణ్యమున. 99 ప్రతిపదార్హం: మృదురోమములును= మృదు వైన వెండ్రుకలూ; శంకు, నిభ; కర్షముల్‌= బాణా(గ్రాలతో సమాన మైన చెవులూ; మెత్తని, వలుద, పొదుగూ= మెత్తని పాదుగును; నిడుద, చన్నులును= పొడ వైన చన్నులూ, కుజుచలు+ఐ= పొట్టివై: పొలుచు= ఒప్పు; కొమ్ములూ; సత్‌+అమల, శరత్‌+ఇందు, శంఖ, నిభము+ఐన= నిర్మలమైన శరత్కాల చం(ద్రునితో, శంఖంతో సమాన మైన; చాయయున్‌= రంగును; కలుగు; మొదవు= పాడి ఆవు; ఇది; నిధి= ధనపు పాతర; చేరినట్టు: పుణ్యమున; -ఈ+మునికిన్‌= ఈ వసిష్టుహామునికి; చేరెన్‌. తాత్సర్యథ: మెత్తని వెండ్రుకలు, బాణా(గ్రాలవంటి చెవులు, మెత్తని పెద్దపొదుగు, పొడవైన చన్నులు, ఒప్పిద మయిన పొట్టి కొమ్ములు, నిర్మలమైన శరత్కాల చంద్రునితో, శంఖంతో సమాన మైన రంగు కల ఈ పాడిఆవు పెన్నిధి చేరినట్టు పుణ్యంవలన ఈ వసిష్టమహామునిని చేరింది. విశేషం: అలం: ఉపమ. చంద్రునిలో మచ్చ ఉంటుంది. హోమధేనువు నందిని రంగు ఏమాత్రం మచ్చలేని తెలుపు - అని తెలపటానికి సదమల శరదిందు శంఖనిభ మైన చాయ అనటం జరిగింది. నన్నయ ఈ అళ్వాసంలో అయిదు మధ్యాక్కరలను వాడొడు. అందులో ఇది మొదటిది. ఆదిపర్వంలో ఎక్కువ సంఖ్యలో మధ్యాక్కరలు వాడిన ఆశ్వాసం ఇదే, (సంపాం వ. అని పెద్దయుంబ్రొద్దు చింతించి తత్‌పరిగ్రహకుతూహలహృదయుం దయి విశ్వామిత్రుందు

వసిష్టున కి ట్లనియె. 100 ప్రతిపదార్ధం:అని; పెద్దయున్‌+ప్రొద్దు= చాలాసేపు; చింతించి= ఆలోచించి; తత్‌+పరి[గ్రహ, కుతూహల, హృదయుండు+అయి= దానిని తీసికొనటంలో ఉబలాటపడే హృదయం కలవాడై; విశ్వామిత్రుండు; వసిష్టునకు, ఇట్టు+అనియె. తాత్పర్యం: అని చాలసేపు ఆలోచించి ఆ ఆవును తీసికొనాలనే ఉబలాటపడే హృదయంతో విశ్వామి(షత్రుడు వసిష్టునితో ఈ విధంగా అన్నాడు. తే. దీనికంటెను నొప్పెడి వాని నొక్క; లక్ష మొదవుల నిచ్చైద నక్షయముగ

రాజ్యమయిన నిచ్చెద జగత్స్పూజ్య! నాకు । నిమ్ము నీ హోమధేనువు నెమ్మితోద. 101 ప్రతిపదార్థం: జగత్‌+పూబ్య!= లోకంచేత పూజింపదగిన వాడా! దీని కంటెను; ఒప్పెడి, వానిన్‌=ఐ బాగున్న వాటిని; ఒక్క, లక్ష మొదవులన్‌= పాడి ఆవులను; అక్షయముగ= తరుగకుండ; ఇచ్చెదన్‌; రాజ్యము+అయినన్‌; ఇచ్చెద; నాకున్‌; నీ, హోమధేనువు; నెమ్మితోడ= ప్రీతితో; ఇమ్ము తాత్పర్యం: (ప్రపంచంచేత పూజలు పొందదగిన ఓ వసిష్టమహర్షీ! దీనికంటె బాగున్న ఒక లక్ష పాడిఆవులను, తరుగులేకుండా నీ కిస్తాను. రాజ్య మైనా ఇస్తాను. ప్రీతితో నీ హోమధేనువును నా కిమ్ము.

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 687

చ. అనిన వసిష్టుండి ట్లనియె: 'నంత ధనంబును నట్టి రాజ్యముం

గొననగు నయ్య యిశ్చిడిపికుట్జికి? నీ కిది యేల? యేను దీ

నన పిచృదేవతాతిథిజనంబులం దృప్తులం జేయుచుండుదున్‌;

జననుత! దీనిం బ్రోచుటయ చాలు. దపస్వుల కేల సంపదల్‌?." 102 ప్రతిపదార్థం: అనిన; వసిష్టుడు; ఇట్టు+అనియెన్‌; ఈ+చిడిపి; కుట్ణికి= ఈ చిన్న ఆవునకు; అంత; ధనంబునున్‌; అట్టి, రాజ్యమున్‌; కొనన్‌+అగునయ్య= తీసికొనవచ్చునా; నీకు, ఇది; ఏల? ఏను; దీనన్‌+అ= ఈ ఆవుచేతనే; పితృదేవతా+అతిథి, జనంబులన్‌= పితృదేవతలను; అతిధులను; తృప్తులన్‌= తృప్తి పొందినవారిగా; చేయుచు+ఉండుదున్‌; జన. నుత[= జనులచే పొగడబడువాడా!; దీనిన్‌; ప్రోచుటయు+అ= కాపాడుటయే; చాలున్‌; తపస్వులకు= బుషులకు; సంపదల్‌; ఏల? తాత్పర్యం: పై విధంగా విశ్వామిత్రుడు పలుకగా, వసిష్టుడు ఇట్టా అన్నాడు - “ఈ చిన్ని అవుకై అంత ఎక్కువ ధనాన్ని, అంత గొప్ప రాజ్యాన్ని తీసికొనవచ్చునా? నీకు ఇది యెందుకు? నేను దీనిచేతనే పితృదేవతలను, అతిథి జనులను తృప్తిపరుస్తూ ఉంటాను. ప్రజలచేత పొగడబడే ఓ విశ్వామిత్రా! ఈ ఆవును ఒక్కదానిని కాపాడుకొంటే చాలు; బుషులకు సంపద లెందుకు? విశేషం: అలం: ఆర్జాంతరన్యాసం. వన. దీని నొరున కీం గా' దనిన నలిగి విశ్వామిత్రుందు 'నేను క్షత్రియుండ నిగ్రహానుగ్రహ సమర్హుండ, నీవు

బ్రాహ్మణుండవు శాంతుందడ; వేమి సేయ నోపుదు? దీనికి లక్షమొదవుల నీయబోయిన నొల్లన యిమ్మొదవు

నవశ్యంబును బలిమి నైనం బరిగ్రహింతు' నని నందినిం బట్టికొనం బంచినం బలుకక వసిష్టుండు

చూచుచుండె. 103 (ప్రతిపదార్థం: దీనిని; ఒరునకు= ఇతరునికి; ఈన్‌+కాదు= ఇచ్చుటకు వీలేకాదు; అనినన్‌; అలిగి= కోపించి; విశ్వామి(త్రండు; నేను; క్షత్రియుండ; నిగ్రహ+అనుగ్రహ, సమర్హుండజ= శిక్షించుటకు, దయచూపుటకు శక్తి కలవాడను; నీవు; బ్రాహ్మాణుండవు; శాంతుండవు= శాంత గుణం కలవాడవు; ఏమి; చేయన్‌+ఓపుదుజ ఏమి చేయగలవు; దీనికి; లక్ష మొదవులన్‌= ఒక లక్ష పొడి ఆవులను; ఈన్‌+పోయినన్‌= ఇవ్వబోగా; ఒల్లవు+అజ= ఇష్టపడ వైతివి; ఈ+మొదవున్‌= ఈ పాడిఆవును - నందినీ ధేనువును; అవశ్యంబును= తప్పక; బలిమిన్‌*ఐనన్‌= బలవంతంగా నైనాసరే; పరి[గ్రహింతున్‌= తీసుకొని పోతాను; అని; నందినిన్‌, పట్టికొనన్‌; పంచినన్‌= ఆజ్ఞాపించగా: పలుకక: వసిష్టుండు; చూచుచు+ఉండె, తాత్పర్యం: 'దీనిని మరొకరికి ఇవ్వటానికి వీలు కాదు' అనగా విశ్వామిత్రుడు కోపించి, 'నేను క్షత్రియుడను. శిక్షించటానికి, దయచూపటానికి సమర్జుడను. నీవు (బ్రాహ్మాణుడవు, శాంతుడవు, ఏమి చేయగలవు? దీనికి బదులుగా లక్ష పాడి ఆవులను ఇవ్వబోతే వద్దన్నావు. ఈ ఆవును బలత్కారంగా నైనా తప్పక (గ్రహిస్తాను” అని నందినిని పట్టుకొనేందుకు ఆజ్ఞాపించగా, వసిష్టుడు మారు మాటాడక చూస్తూ ఉండిపోయాడు. ఆ. పరులవలన బాధ పొరయకుండ(గ సాధు । జనుల ధనము గాచు జనవిభుండు

కరుణ తప్పి తాన హరియించువాం డగు । నేని సాధులోక మేమి సేయు?. 104 ప్రతిపదార్థం: పరులవలనజ ఇతరులవలన; బాధ; పారయక+ఉండంగ= కలుగకుండ: సాధుజనుల: ధనము; కాచు= కొపాడు; జనవిభుండు= రాజు; కరుణ, తప్పి దయలేక; తాను+అ= తానే; హరియించువాండు+అగున్‌+ఏని= అపహరించే వా డైతే; సాధు, లోకము= సాధువుల సమూహం; ఏమి; చేయు.

688 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్సర్యం: ఇతరులవలన బాధ కలుగకుండ, సాధుజనుల ధనాన్ని కాపాడవలసిన (ప్రభువే దయ తప్పి, తాను

అపహరించేవా డైతే, సాధు జనుల సమూహం ఏం చేయగలదు?

వ. ఇట్లు విశ్వామిత్రుండు వసిష్టు హోమధేనువుం బట్టికొనం బంచిన పట్టీక జనులవలని కశాదండ తాదనంబులం బీడింపం బడి యణచుచు వసిషునొద్దకు వచ్చి యి ట్లనియె. 105

ప్రతిపదార్థం: ఇట్టు; విశ్వామిత్రుండు; వసిష్టు, హోమధేనువున్‌; పట్టికొనన్‌: పంచినన్‌= పంపగా; అది, పట్టు+ఈక= పట్టువడక'

జనులవలని; కశా, దండ, తాడనంబులన్‌= కొరడాలయొక్క, కజలయొక్క దెబ్బలతో, పీడింపన్‌+పడి= బాధింపబడి; అజచుచు; వసిష్టు+ఒద్దకు= వసిష్టుని దగ్గరకు; వచ్చి; ఇట్టు+అనియె,

తాత్పర్యఠి: ఈ విధంగా విశ్వామిత్రుడు, వసిష్టుని హోమధేనువును పట్టుకొనేందుకు తన సైనికులను పంపగా,

అది పట్టువడక, వాళ్ళ కొరడాల, కర్రల దెబ్బలచేత బాధింపబడి అరుస్తూ వసిష్టుని దగ్గరికి వచ్చి ఇట్టా పలికింది.

క. 'నన్నేలయుపేక్షించితి?; రిన్నరుల కధర్మపరుల కిచ్చితిరే? వి ద్వన్నాథ! యిబియు ధర్మువె?' |; యన్నను విని పలుకకుండె నమ్ముని యంతన్‌. 106

ప్రతిపదార్థం: విద్వత్‌?నాథ!= పండితులకు ్రభువైనవాడా - ఓ వసిష్టాగ నన్ను+ఏల; ఉపేక్షించితిరి= నా సంగతి ఎందుకు

పట్టించు కొనకుండ ఉన్నారు; అధర్మపరులకున్‌= అధర్మమే ప్రధానంగా కలవాళ్ళకు; ఈ+నరులకున్‌; ఇచ్చితిరి+ఏ; ఇదియు; ధర్మువు+ఎ= ధర్మమా; అన్నను= అని నందిని అనగా; విని; ఆ+ముని= ఆ వసిష్ట మహాముని; పలుకక+జఉండెన్‌; అంతన్‌= తరువాత.

తాత్పర్యం: పండితులకు ప్రభు వైన ఓ వసిష్ట మహామునీ! మీరు న న్నెందుకు విడిచారు? అధర్మపరు లైన ఈ

నరులకు ఎందు కిచ్చారు? ఇది ధర్మమా? అని పల్కగా, ఆ ముని మౌనంగానే ఉండిపోయాడు. తరువాత.

వ తదీయాభిప్రాయం బెణింగి నందినియుందన వత్సంబు. బట్టికొన వచ్చిన జనుల కలిగి చిందఅరేంగి నిదాఘ సమయ మధ్యందిన దినకరమూర్తియుం బోలె దుర్నిరీక్ష్య యయి, యంగవిక్షేపంబున నంగారవృష్టెం గురియుచు, వాలంబున శబరులను, శకృన్యూత్రంబుల శక యవన పుండ్ర పుళింద ద్రవిళ సింహళులను, ఫేనంబున దరదబర్దరులను బుట్టించిన. 107

ప్రతివదార్థం: తదీయ+అభిప్రాయంబు= అతని యొక్క అభిప్రాయాన్ని; ఎఅింగి= తెలిసికొని; నందినియు; తన వత్సంబున్‌= తన దూడను; పట్టికొన, వచ్చిన; జనులకు; అలిగి= కోపించి: చిందజరేగి= ఆవేశంతో చెలరేగి; నిదాఘ, సమయ, మధ్యందిన, దినకరమూర్తియున్‌+పోలెన్‌= వేసవి కాలంలోని మధ్యాహ్న సూర్యుని ఆకారం వలె; దుర్నిరీక్ష్య+అయి= చూడ సాధ్యం గాని దై; అంగ, విక్షేపంబునన్‌= దేహాన్ని విదిలించటంచేత; అంగార వృష్టిన్‌= నిప్పుల వానను; కురియుచు; వాలంబున= తోకచేత, శబరులను; శకృత్‌+మూత్రంబుల= పేడచేత; పంచితంచేత; శక, యవన, పుండ్ర పుళింద, (ద్రవిళ, సింహళులను; ఫీనంబునన్‌= నురుగుచేత; దరద; బర్చరులను; పుట్టించిన.

తాత్సర్యం: వసిష్టుని అభిప్రాయాన్ని తెలిసికొని నందినికూడ, తన దూడను పట్టుకొనటానికి వచ్చిన జనులను

చూచి కోపించి ఆవేశంలో చెలరేగి, వేసవికాలంలోని మధ్యాహ్న సూర్యునివలె తేరిపార చూడరానిదై, దేహాన్ని విదిల్చి

నిప్పులవాన కురిపిస్తూ, తోకనుండి శబరులను, మలమూత్రాలనుండి శక, యవన, పుం(డ్ర, పుళింద, (ద్రవిడ, సింహళులను, నురుగునుండి దరద బర్చరులను పుట్టించగా.

ఆదిపర్వము - సప్రమాశ్వాసము 689

క. _నలిరేంగి కడంగి తద్దల । ములు విశ్వామిత్రు సైన్యముల కేను మడుం గులు పెరింగి మూండుయోజన । ములు వాజంగ నెగిచె నొక్కమొగిం బ్రతిబలమున్‌. 108

ప్రతిపదార్హం: నలిరేగిజఐ విజృంభించి; కడంగ= పూని; తత్‌+బలములు= ఆ సైన్యములు - శబర, శక యవన, పుండ్ర, పుళింద;

(ద్రవిళు సింహళ సైన్యములు; విశ్వ్యామిదత్రు, సైన్యములకు= విశ్వామిత్రునియొక్క సేనలకు; ఏను, మడుంగులు= అయిదురెట్టు;

పెరిగి; ప్రతిబలమున్‌= శత్రుసైన్యాన్ని - అనగా విశ్వామి[త్రుని సైన్యాన్ని; ఒక్కమొగిన్‌* ఒక్క పూనికతో; మూడు, యోజనముల్‌=

మూడు అమడలు; పాఆంగన్‌= పరుగెత్తేటట్టు; ఎగిచెన్‌= తరిమెను.

చాత్సర్యం: నందినినుండి పుట్టిన ఆ సైన్యాలు చెలరేగి, విశ్వామిత్రుని సైన్యాలకంటె అయిదు రెట్టు అధిక మై,

శత్రుసైన్యాన్ని ఒక్కఊపున మూడామడలు పరుగెత్తే విధంగా తరిమివేశాయి.

వ. అట్టి బ్రహ్మతేజో జనితం బయిన ప్రభానంబుం జూచి విశ్వామితశ్రుండు విలక్షముఖుం దై క్షాత్రబలంబు నిందించి, యెల్ల బలంబులకు మిక్కిలి తపోబలంబ యని. 109

(ప్రతిపదార్థం: అట్టి; బ్రహ్మతేజః+జనితంబు+అయిన= (బ్రాహ్మణుని తేజస్సునుండి పుట్టిన దైన; ప్రభావంబున్‌= మహిమను;

చూచి; విశ్యామిత్రుండు; విలక్ష్మ ముఖుండు+ఐ= సిగ్గుపడిన ముఖం కలవా డై క్షాత్ర, బలంబు= క్షత్రియబలాన్ని; నిందించి; ఎల్ల

బలంబులకు= అన్ని బలాలకు; మిక్కిలి= ఎక్కువైనది; తపః:+బలంబు+అ= తపోబలమే; అని.

తాత్పర్యం: అట్టి బ్రాహ్మణ తేజస్సునుండి పుట్టిన మహిమను చూచి, విశ్వామిత్రుడు సిగ్గుపడి, క్షత్రియ బలాన్ని

నిందించి, అన్ని బలాలకంటె ఎక్కువైనది తపోబలమే అని,

చు పొలుపగు రాజ్యసంపదుపభోగములెల్లం దృణంబుగా మదిం దలంచి, విరక్తుం డై విడిచి, దారుణశ్రైలవనాంతరంబులన్‌ వెలయం దపంబు సేసి, గుణవిశ్రుతుం దై పడసెన్‌ మహాతపో బలమున సర్వసంపదలు బ్రహ్మబుషిత్వము దివ్యశక్తియున్‌. 110

ప్రతిపదార్థం: పొలుపు+అగు= స్థిరమైన; రాజ్య, సంపత్‌+ఉపభోగములు= రాజ్యసంపదవలని భోగానుభవాలు; ఎల్లన్‌= అన్నింటిని; తృణంబుగాన్‌= ఒక్క గడ్డిపరకగా; మదిన్‌= తలచి; విరక్తుడు+ఐ= వైరాగ్యభావం పొందినవా డై; విడిచి; దారుణ, శైల, వన+అంతరంబులన్‌= భయంకర మైన కొండల, అడవుల మధ్య; వెలయన్‌= ఒప్పునట్టు: తపంబు చేసి, గుణ, విశ్రుతుండు+ఐ= గుణాలచే ప్రసిద్దుడై; మహా, తపోబలమున= గొప్ప తప శ్ళక్తిచేత, సర్వ, సంపదలు; బ్రహ్మ, బుషిత్వము= బ్రహ్మర్షి అగుటను: దివ్య, శక్తియున్‌=-దేవతాసంబంధ మైన మహిమను; పడసెన్‌= పొందెను.

తాత్పర్యం: స్థిరమైన రాజ్యసంపదతో అనుభవించే భోగా లన్నిటిని గడ్డిపరకగా భావించి, విరక్తి చెంది, వాటి

త ఇ ఒది 9 నన్నింటిని విడిచి, భయంకర మైన కొండల అడవుల మధ్యకు వెళ్లి గొప్ప తపస్సు చేసి, సద్గుణాలతో ప్రసిద్దు డై తపోమహిమ వలన సర్వసంపదలను, బ్రహ్మర్షిత్వాన్ని, దివ్యశక్తిని పొందాడు.

వ. ఆ విశ్వామిత్రుం డిక్ష్వాకు కుల సంభవుం డైన కల్మాషపాదుం దను రాజునకు యాజకత్వం బపీక్షించి తత్పురోహితుం డైన వసిష్టుతో బద్ధవైరుం దయి, తదపకారంబు రోయుచున్నంత, నొక్కనాం కల్మాషపాదుండు వేట పోయి, రమ్యా రణ్య భ్రమణ ఖిన్నుం డయి, విశ్రమార్ధంబు వసెష్టాత్రమంబునకుం జినువాయ దన కభిముఖుం డయి వచ్చవాని వసిష్టు పుత్తుం బుత్ర శతాగ్రజూ నధికతపశ్శక్తియుక్తు శ్వా

690 ్రీమదాం(ధ్ర ముహాభారతము యనుమహామునిం గది, తెరువు దొలంగు మని రాజాభిమానంబున మెచ్చక పలికిన, నమ్మునిపరుం డి ట్లనియె. 111

ప్రతిపదార్హం: ఆ, విశ్వామిత్రుండు; ఇక్ష్వాకు, కుల, సంభవుండు+అయిన= ఇక్షాకువంశంలో; జన్మించినవా డైన; కల్మాష పాదుండు+అను; రాజునకు; యాజకత్వంబు= యజ్ఞం చేయించే వా డగుటను; అపేక్షించి= కోరి; తత్‌+పురోహితుండుజ అతని యొక్క పురోహితుడు; అయిన, వసిష్టుతో; బద్ధవైరుండు+ఐ= కట్టుబడిన వైరం గలవా డై - అనగా మనస్సున తీవ్రంగా నిలిచిన పగ కల వా డై; తత్‌అపకారంబు= ఆ వసిష్టునికి కీడును; రోయుచు= వెదకుతూ; ఉన్నంతన్‌= ఉండగా; ఒక్కనాండు; కల్మాషపాదుండు; వేటకు పోయి; రమ్య+అరణ్య, భ్రమణ, ఖిన్నుండు+అయి= అంద మైన అడవులలో తిరుగటంచేత బడలిక నొందిన వాడై; విశ్రమ+అర్హంబు= విశ్రాంతికొరకు; వసిష్టశ ఆశ్రమంబునకున్‌= వసిష్టునియొక్క ఆశ్రమానికి; చనువాండు= వెళ్ళునటువంటి వాడు; తనకు+అభిముఖుండు+అయి= తనకు ఎదురై; వచ్చు, వాని= వస్తున్న వాడిని; వసిష్టు, పుత్రున్‌; పుత్ర, శత+అ(గ్రజున్‌= పుత్రులు నూజుగురియందు పెద్దవాడిని: అధిక తపస్‌+శక్తి యుక్తు= మిక్కిలి తపోబలంతో కూడుకొన్న వాడిని" శక్తి అను; మహా, మునిన్‌; కని= చూచి; తెరువు= మార్గం; తొలంగుము+అని; తప్పుకొమ్మని; రాజ+అభిమానమున= రాజగర్వంతో, మెచ్చకజ లక్ష్యపెట్టక; పలికినన్‌; ఆ+ముని వరుండు= ఆ ముని(్రేష్టుడు (శక్తి; ఇట్టు+అనియె. తాత్సర్యం: ఆ విశ్వామిత్రుడు ఇక్షాకువంశంలో జన్మించిన కల్మాషపాదు డనే రాజుకు యాజకుడు కావాలని కోరి, అతని పురోహితు డైన వసిష్టునితో తీవ్ర వైరం కలవాడై, అతనికి అపకారం చెయ్యా లని ఆలోచిస్తుండగా, ఒకనాడు కల్మాషపాదుడు వేటకు పోయి, అంద మైన అడవులలో తిరిగి, అలసి, ఆ అలసట తీర్చుకోటానికి వసిష్టుని ఆశ్రమానికి వెళ్తూ తనకు ఎదురుగా వస్తున్న వసిష్టపుపత్రుడిని చూచాడు. అతడు నూరుమంది పుత్రులలో పెద్దవాడు; అధిక తపళ్ళక్తి కలవాడు; శక్తి అనే పేరు గలవాడు, మహాముని. అతడిని చూచి కల్మషపాదుడు రాజగర్వంతో (తోవనుండి తప్పుకొమ్మని అతడిని లక్ష్యపెట్టకుండా పలికాడు. అప్పుడు ఆ ముని'(శ్రేష్టుడు ఇట్టా అన్నాడు.

ఆ. ఎట్టి రాజులును మహీసురోత్తము లెదు | రరుగుదెంచు నప్పు డధికభక్తిం దెరలి ప్రైెయము వలికి తెరువిత్తు రిట్టిద : ధర్వు వీవు దీని: దలంప వెట్టు? 112

ప్రతిపదార్థం: ఎట్టి రాజులును; మహీసుర+ఉత్తములు= (బ్రాహ్మణోత్తములు; ఎదురు+అరుగుదెంచునప్పుడు; అధిక భక్తిన్‌=

మిక్కిలి భక్తితో; తెరలి= తొలగి; ప్రియము= ఇంపైన మాటను; పలికి; తెరువుఐ మార్గము; ఇత్తురు(ఇచ్చుదురు)= ఇస్తారు; ఇట్టిది+అ; ధర్మువు= ధర్మం; నీవు; దీనిన్‌; తలయవు+ఎట్టు= ఎందుచేత దీనిని ఆలోచించవు.

తాత్పర్యం: ఎంత గొప్ప రాజు లైనా బ్రాహ్మణు లెదురుగా వచ్చినప్పుడు, మిక్కిలి భక్తితో తాము (ప్రక్కకు తాలగి,

ప్రియంగా మాటాడి, దారి యిస్తారు. ఇది ధర్మం. దీనినిగురించి నీ వెందుకు ఆలోచించటం లేదు?

శక్తిముహాముని కల్మాషపొదుని శపీియించుట (సం.1-166-7)

వ. 'ఏను ధర్మపథంబున నున్నవాండ; నేల తొలంగుదు? ననిన నలిగి కల్మాషపాదుండు దనచేతి కశకోల నమ్మునీంధ్రుని వ్రేసిన, నవమానితుం డయి కోపారుణిత నయనంబుల నతనిం జూచి 'నీవు రాక్షస భావంబున నకారణంబ నాకు నికారంబు సేసితి కావున రాక్షసుండ వయి మనుష్యపిశితం బశనంబుగా నుండు" నని శాపం బిచ్చినం గల్మాషపాదుం డమ్మహామునివరు వసిష్టతనయుంగా నెణింగి 'నాకు శాపవ్యపాయంబు ప్రసాదింప వలయు' నని ప్రార్ధించుచున్న నచ్చోటికి విశ్వామిత్రుండు వచ్చి వారలు దన్నెబుంగకుండ నంతర్హితుం డయి కల్మాషపొదు నంతర్గతుం డయి యుండ, నొక్కరక్కసుం గింకరుం డను

ఆదిపర్వము - సప్త్రమాశ్వానము 691 వానిం బంచిన వాండు విశ్వామిత్రు నాదేశంబునను శక్తి శాపంబుననుం జేసి కల్మాషపాదునంతరాత్మ నావేశించి యున్నంత. 4113

ప్రతిపదార్థం: ఏను= నేను; ధర్మ, పథంబునన్‌= ధర్మమార్గంలో; ఉన్న; వాండన్‌; ఏల; తాలంగుదును; అనినన్‌; అలిగి= కోపించి; కల్మాషపాదుండు; తనచేతి; కళకోలన్‌= కొరడా కర్రచేత; ఆ+మునీంద్రుని; (వ్రేసినన్‌= కొట్టగా; అవమానితుండు+ అయి= అవమానింపబడిన వాడై; కోప+అరుణిత, నయనంబులన్‌= కోపంచేత ఎర్రవిగా చేయబడిన కన్నులతో; అతనిన్‌; చూచి, నీవు; రాక్షస భావంబునన్‌= రాక్షస బుద్దిచేత; అకారణంబ= కారణం లేకుండానే; నాకు; నికారంబు= అవమానం; చేసితిజఐ చేసితివి; కావున; రాక్షసుండవు+అయి; మనుష్య, పిశితంబు= మానవ మాంసం; అశనంబుగాన్‌= ఆహారంగా; ఉండుము+అని; శాపంబు; ఇచ్చినన్‌, కల్మాషపాదుండు; ఆ+మహా, మునివరు; వసిష్ట తనయున్‌+కాన్‌= వసిష్టునియొక్క కుమారునిగా; ఎజింగి=ఐ తెలిసికొని; నాకు; శాప, వ్యపాయంబు= శాపముయొక్క తాలగింపును; (ప్రసాదింపవలయును+అని= దయతో ఇవ్వవలసిందని;

(ప్రార్హించుచున్నన్‌: ఆ+చోటికి; విశ్వామిత్రుండు; వచ్చి; వారలు; తన్ను+ఎజుంగకుండన్‌; అంతర్హితుండు+అయి=. చాటున

నున్నవా డై; కల్మాషపాదు; అంతర్గతుండు+అయి= కల్మాషపాదునీ లోపల చేరి; ఉండన్‌= ఉండుటకు, ఒక్క; రక్కసున్‌=

ఒక్కరాక్షసుడిని; కింకరుండు; అను, వానిన్‌; పంచిన= ఆజ్ఞాసించగా; వాడు; విశ్వామిత్రు; ఆదేశంబునను= ఆజ్జచేత; శ్త్తి శాపంబుననున్‌*+చేసి= శక్తియొక్క శాపంవలన; కల్మాషపాదు, అంతరాత్మన్‌= కల్మాషపాదునియొక్క మనస్సును; ఆవేళించి= ప్రవేశించి; ఉన్న+ఆంత,.

తాత్పర్యం: 'నేను ధర్మమార్గంలో ఉన్నాను, ఎందుకు తొలగుతాను” అని పల్కగా కోపించి కల్మాషపాదుడు తన

చేతి కొరడా కర్రతో ఆ మునీశ్వరుడిని కొట్టాడు. ఆ విధంగా అవమానింపబడిన ఆ ముని, కోపంతో ఎరుపెక్కిన

కళ్ళతో అతడిని చూచి 'నీవు రాక్షసబుద్దితో అకారణంగా నన్ను అవమానించావు. కనుక రాక్షసుడ వై నరమాంసం ఆహారంగా జీవించు' మని శాపమిచ్చాడు. అప్పుడు కల్మాషపాదుడు అతడిని వసిష్టుని కుమారునిగా గుర్తించి

“శాపవిమోచనం ప్రసాదించండి” అని ప్రార్ధిస్తూ ఉండగా- విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి, కనబడకుండ దాగి

కల్మాషపాదుని మనస్సులో చేరవలసిందని కింకరు డనే రాక్షసుడిని ఆజ్ఞాపించాడు. వాడు విశ్వామిత్రుని ఆజ్ఞతో,

శక్తిశాపంతో కల్మాషపాదుని అంతరాత్మలో ప్రవేశించాడు. ఆ పరిస్థితిలో.

తే. రాక్షసావిష్టుం దైనప్లు రాజ్యలీల । విడిచి త న్నెబుంగక, తదావేశరహితుం దైన యప్పుడు రాచకార్యంబులందు। బద్ధబుద్ధి మై కల్మాషపాదుం డుండె. 114

ప్రతిపదార్థం: కల్మాషపాదుండు; రాక్షస+ఆవిష్టుండు= రాక్షసునిచేత అవేశింపబడినవాడు; అయినస్థు; రాజ్యలీల= రాజ్య

విలాసాలను' విడిచి; తన్ను+ఎజుంగక= తనను తాను తెలియక; తత్‌*అవేశ రహితుండు+అయిన, అప్పుడు= ఆ రాక్షసుడు ఆవేశించనప్పుడు; రాచకార్యంబులందు; బద్ద, బుద్దీ+ఐ= కట్టుబడిన బుద్దికలవా డై; ఉండెన్‌.

తాత్పర్యం: కల్మాషపాదుడు- రాక్షసుడు తన్నావేశించినప్పుడు రాజ్యవ్యవహారాలు విచారించక తనను తాను

మరచి, ఆవేశించనప్పుడు రాజ్యవ్యవహారాలు చూస్తూ ఉండేవాడు.

వ. అ కల్మాషపాదు నొక్యనాం దొక్కబ్రాహ్మణుం దధిక క్షుధార్తుం దయి వచ్చి సమాంసంబయిన భోజనం బడిగిన నిచ్చి, పోయిన వాం డంతఈఃవురంబున నుండి మణచి యర్థరాత్రంబునప్పడు దలంచికొని తన బానసంబు వానిం బిలిచి 'యేనొక్కభ్రాహ్మణునకుం గుడువ నిచ్చి వచ్చి మజచియుండదితిం; జెచ్చెర నవ్విప్రునకు మాంసంబుతో. గుడువంబెట్టుి' మని పంచిన, వాండు నింతప్రొద్దు మాంసంబు వడయనేర ననిన నప్పు

692 శ్రీమదాంధ్ర మహాభారతము

డారాజు రాక్షసాధిస్టెతుం డగుటం చేసి 'మనుష్యమాంసంబుతోనయినం గుడువం బెట్టు' మనిన

సూపకారుండు వధ్యస్థానంబునకు. జని మనుష్యమాసంబు దెచ్చి యిమ్ముగా వండి పెట్టిన, నవ్విప్రుండు దన

దివ్యదృప్టిం జూచి దాని మానవమాంసంబుగా నెటింగి కడు నలిగి. 115 ప్రతిపదార్థం: ఆ, కల్మాషపాదున్‌; ఒక్కనాండు; ఒక్క, బ్రాహ్మణుండు; అధిక= మిక్కిలి; క్షుధా+ఆర్తుండు+అయి= ఆకలిచేత పీడింపబడిన వాం డ్రై వచ్చి; సమాంసంబు+అయిన= మాంసంతో కూడిన; భోజనంబు; అడిగినన్‌; ఇచ్చి= పెట్టుతా నని మాట ఇచ్చి; పోయిన, వాండు; అంతఃపురంబునన్‌; ఉండి; మజుచి; అర్హ, రాశత్రంబు, అప్పుడు; తలంచి, కొని; తన; బానసంబు, వానిన్‌=ఐ వంటవాణ్ణై పిలిచి; ఏను= నేను; ఒక్క (బ్రాహ్మాణునకున్‌; కుడువన్‌= తినుటకు; ఇచ్చి, వచ్చి; మజచి+ఉండితిన్‌= మరచి పోయాను, చెచ్చెరన్‌= వెంటనే? ఆ+వి(ప్రనకు= ఆ బ్రాహ్మణునికి; మాంసంబుతోన్‌; కుడువన్‌+పెట్టుము+అని; పంచినజ ఆజ్ఞాపించగా; వాండున్‌; ఇంత (ప్రొద్దు; మాంసంబు; పడయ, నేరన్‌= పొందలేను; అనినన్‌; అప్పుడు; ఆ రాజు; రాక్షస+ అధిప్టితుండు= రాక్షసునిచేత ఆవేశింపబడినవాడు; అగుటన్‌+చేసి; మనుష్య, మాంసంబుతోన్‌; అయినన్‌; కుడువన్‌; పెట్టుము+ అనిన; సూపకారుండు= వంటవాడు; వధ్యస్థానంబునకున్‌= చంపునట్టి స్థలానికి; చని= వెళ్ళి మనుష్య, మాంసంబు; తెచ్చి; ఇమ్ముగా= ఇంపుగా; వండిపెట్టినన్‌; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; తన; దివ్య; దృష్టిన్‌; చూచి; దాని; మానవ, మాంసంబుగాన్‌; ఎఆీ౦ంగి= తెలిసికొని; కడు= మిక్కిలి; అలిగి= కోపించి. తాత్సర్యం: ఒకనాడు ఆ కల్మాషపాదుని దగ్గరకు ఒక (బ్రాహ్మణుడు మిక్కిలి ఆకలితో బాధపడుతూ వచ్చాడు. మాంసాహారం కావా లని అడిగాడు. అతడు సరే అని మాట ఇచ్చి అంతఃపురానికి వెళ్ళి మరచిపోయాడు. అర్దరాత్రి "సమయంలో గుర్తుకు వచ్చి, వంటవాడిని పిలిచి, 'నే నొక బ్రాహ్మణునికి భోజనం పెడతా నని చెప్పి వచ్చి మరచి పోయాను. వెంటనే అతనికి మాంసంతో భోజనం పెట్టు' మని ఆజ్ఞాపించాడు. వాడు ఆ అర్ధరాత్రి పూట మాంసాన్ని సంపాదించ లే నని అన్నాడు. అప్పు డా రాజా రాక్షసునిచేత ఆవేశింపబడినవాడు కావటంచేత 'నరమాంసంతో నైనా అతనికి భోజనం పెట్ట మని పల్కగా, ఆ వంటవాడు వధ్యస్టానానికి వెళ్లి మనుష్యమాంసం తెచ్చి, రుచిగా వండిపెట్టాడు. ఆ (బ్రాహ్మణుడు దివ్యదృష్టితో అది మానవ మాంస మని తెలిసికొని, మిక్కిలి కోపించి. క. _ 'తివిరియభోజ్యం బగు మా। నవ మాంసముతోడ భోజనము పెట్టిన వాం

డవు నీవు మనుష్యాదుండ | వవు' నుని వాండిచ్చె శాప మన్మరపతికిన్‌, 116 ప్రతిపదార్థం: తివిరి= పూని; అభోజ్యంబు+అగు= తినగూడని దైన; మానవ, మాంసముతోడ; భోజనము; పెట్టినవాండవు; నీవు; మనుష్యాదుండవు+అగుము+అని= మనుష్య మాంసం తినేవాడి వగు మని - అనగా రాక్షసుడవు కమ్మని; ఆ+నరపతికిన్‌= ఆ రాజుకు; వాండు; శాపము; ఇచ్చి. తాత్పర్యం: 'తినగూడని నరమాంసంతో నాకు భోజనం పెట్టావు. నీవు మనుష్యమాంసం తినే రాక్షసుడవు అగుదువు గాక!" అని ఆ (బ్రాహ్మణుడు రా జైన కల్మాషపాదుడిని శపించాడు. వ. ఇట్లు బ్రాహ్మణ శ్నాఫ్రంబునం గల్మాషపాదుండు మానుష భావంబు విడిచి, రాక్షసుం డై శక్తి యొద్దకు వచ్చి, 'నీ

కారణంబున నిట్టి శాప వ్యాపారంబు సంభవించి; దీని ఫలంబు ముందఖ నీవ యనుభవింపు' మని శక్తి నపగత

ప్రాణుం జేసి, విశ్వామిత్రుచేతం బ్రచోదితుం డయి పదంపడి వసిష్టపుత్తుల నందణ వధియించిన. 117 ప్రతిపదార్థం: ఇట్టు, బ్రాహ్మణ, శాపంబునన్‌; కల్మాషసాదుండు, మానుష భావంబు= మనుష్యత్వమును; విడిచి; రాక్షసుండు+ఐ; శక్తి ఒద్దకు; వచ్చి; నీ కారణంబునన్‌; ఇట్టి; శాప వ్యాపొరంబు= శాపం కలిగేపని; సంభవించె= ఎర్చడింది; దీని, ఫలంబు;

ఆదిపర్వము - సవ్తమాశ్వానము 693 ముందఅ; నీవు+అ; అనుభవింపుము; అని; శక్తిన్‌=ఐ శక్తి మహామునిని; అపగత, ప్రాణున్‌+చేసిజ పోయిన ప్రాణం కలవాడీనిగా చేసి

  • అనగా చంపి; విశ్వామిత్రుచేతన్‌; ప్రచోదితుండు+అయి= పురికొల్పబడినవా డై; పద౦ంపడి; పిమ్మట; వసిష్ట పు'త్రులన్‌;? అంద; వధియించిన= చంపగా. తాత్పర్యం: ఈ విధంగా (బ్రాహ్మాణశాపంచేత కల్మాషపాదుడు మనుష్యత్యాన్ని విడిచి, రాక్షసు డై శక్తి మహాముని దగ్గరికి వచ్చి, 'నీ కారణంగా ఈ శాప వ్యవహారం ఏర్పడింది. దీని ఫలం నీవే మొదట అనుభవించు” మని అతడిని చంపేశాడు. తరువాత విశ్వామిత్రుని (ప్రేరణతో వసిష్టుని పుత్రు లందరినీ వధించాడు.

వుత్తశోకమున వసిష్టుండు ఆత్మహత్యకు( బ్రయత్నించుట (సం.1-166-40)

త సుతుల రాక్షస నిహతులం జూచి పరమ । యోగధరుం డయ్యుం బుత్ర వియోగశోక

భరము దాల్టె వసిష్టుం డదపారభూరి । ధరణిభరము నగేంద్రుండు దాల్దునట్లు. 118 ప్రతిపదార్థం: రాక్షస, నిహతులన్‌= రాక్షసునిచేత చంపబడినవాళ్ళను; సుతులజ= పుత్రులను; చూచి; వసిష్టుండు; పరమ, యోగ; ధరుడు+అయ్యున్‌= ఉత్తమమైన యోగశక్తిని ధరించేవాడే అయినా; అపార భూరి, ధరణి, భరము= అంతులేని గొప్ప భూభారాన్ని; నగ+ఇం(ద్రుండు= పర్వతాలకు రాజైన హిమవంతుడు; తాల్చునట్టు= ధరించునట్టు; పుత్ర వియోగ, కోకు భరము= కొడుకుల ఎడబాటువలన కలిగిన దుఃఖంయొక్క భారాన్ని; తాల్చె=జ ధరించాడు. తాత్ప్చర్యం: వసిష్టుడు గొప్ప యోగశక్తి కలవాడే అయినా- రాక్షసునిచేత చచ్చిన తన కొడుకులను చూచి, పర్వత రా జైన హిమవంతుడు అంతులేని గొప్పభూభారాన్ని ధరించినట్టు, పుత్రుల ఎడబాటువలన కలిగిన దుఃఖ భారాన్ని వహించాడు. విశేషం; అలం: ఉపమ. 'నగేంద్రుండు' అనే చోట 'ధరణి భర మురగేంద్రుండు' అని పెక్కు ప్రతులలో: 'ధరణి భరము నాగేంద్రుండు” అని కొన్ని ప్రతులలో పారాంతరా లున్నాయి. ఉరగేంద్రుడు, నాగేంద్రుడు అంటే ఆదిశేపుడు. అతడు భూభారం వహించేవాడే. పర్వతానికి 'ధరణీ ధరం” అనే పేరుంది గనుక నగేంద్రు డైన హిమవంతుడు కూడ భూభారం నహించేవాడే! చ. అమిత వివృద్ధ శోక వినశాచ్మకుం దై మది నాళచ్మఘాతదో

షమును దలంప కెంతయు విషాదమునన్‌ బలవద్దవాగ్నిమ

ధ్యము వడి. జొచ్చినన్‌ బృహదుదగ్రశిఖానల మాక్షణంబ యు

పము చెడి శీత మయ్యె మునినాథున కుగ్రతపంబుపెంపునన్‌. 119 ప్రతిపదార్థం: అమిత, వివృద్ధ, క్టోక్త వివశ+ఆత్మకుండు+ఐ= మిక్కిలి ఎక్కు వైన దుఃఖంచేత పరవళ మైన మనస్సుకల వా డై; మదిన్‌= మనస్సునందు; ఆత్మ, ఘాత, దోషమును= ఆత్మహత్య అనే పాపాన్ని; తలంపక; ఎంతయు= మిక్కిలి? విషాదమునన్‌= దుఃఖంచేత; బలవత్‌+దవ+అగ్ని, మధ్యము= అధికమైన కార్చిచ్చునడుమ; వడిన్‌= వేగమే; చొచ్చినన్‌= ప్రవేశించగా: బృవా త్‌+ ఉద(గ్ర, శిభా+అనలము= పెద్ద భయంకర మైన మంటలు కల అగ్ని; మునినాధునకున్‌= ముని'శ్రేష్టు డైన ఆ వసిష్టునకు; ఉగ్ర, తపంబు పెంపునన్‌= గొప్ప తపస్సుయొక్క అతిశయంచేత; ఆ క్షణంబు+అ= అప్పటికప్పుడే; ఉప్ణము= వేడి; చెడి= పోయి శీతము= చల్లనిది; అయ్యెన్‌. తాత్చర్యం: మిక్కిలి ఎక్కు వైన దుఃఖంతో మనస్సు స్వాధీనం తప్పి, ఆత్మహత్య పాప మని కూడ భావించక, అమిత మైన బాధతో పెద్ద కార్చిచ్చులోకి వడిగా ప్రవేశించాడు. అయితే, మునిగశ్రేష్టు డైన ఆ వసిష్టుని తపోమహిమచేత ఆ కార్చిచ్చు వేడిని కోల్పోయి చల్లబడింది.

694 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: శోకభావ తీవ్రతచేత వసిష్టుడు ఆత్మహత్య చేసికొనటానికి చేసే ప్రయత్నాలను అయిదింటిని - పంచప్రాణాలు తీసికొనే యత్నాలకు వ్యంజకాలుగా - నన్నయ రచించాడు. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క ప్రయత్నం ఒక్కొక్క ఘటనగా రాణిస్తుంది. ఘటనాచిత్రణంలో శ్లేష అనే గుణం శోభిస్తుంది. బహుపదాలు ఏకపదవద్భావం పొందే మసృణ మైన రచనను శ్లేషమని అంటారు. (ప్రసాదం కంటె విలక్షణంగా ఉండే ఇటువంటి రచనను 119 నుండి 128వ పద్యంవరకు శ్లేషగుణసుందరంగా రచించి సంఘట నౌచిత్యాన్న పాటించాడు నన్నయ. (సంపా,) ఉ. పంబిన శోక భారమున౦ బ్రాణవిమోక్షముం గోరి కంఠ దే శంబున రాయి గట్టికొని సన్మునినాథుండు నిశ్చితాత్ముం దై యంబుధిం జొచ్చినం గడు భయంపడి వార్ధిలసత్తరంగ హ స్తంబుల నెత్తిపట్టె నుచితస్టెతిం దీరముం జేర నమ్మునిన్‌. 120 ప్రతిపదార్హం: పంబిన= మిక్కుటమైన; శోకభారమునన్‌= దుఃఖముయొక్క బరువుచేత; సత్‌+ముని, నాథుడు= గొప్ప ముని'శ్రేష్టు జైన ఆ వసిష్టుడు; నిళశ్చిత+ఆత్ముండు+ఐ=ఐ నిర్ణయించుకొన్న మనస్సు కలవాడై; ప్రాణ, విమోక్షమున్‌= (ప్రాణమును వదలుటను; కోరి; కంరదేశంబున= మెడలో; రాయి, కట్టికొని; అంబుధిన్‌=ఐ సముద్రంలో; చొచ్చినన్‌= (ప్రవేశింపగా; వారి= సముద్రం; కడు= మిక్కిలి, భయంపడి; ఆ+మునిన్‌; ఉచిత, స్టితిన్‌= తగినట్టుగ; తీరమున్‌= గట్టును; చేరన్‌= చేరునట్టుగ; లసత్‌, తరంగ, హస్తంబులన్‌= ప్రకాశిస్తున్న అలలుఅనెడి చేతులతో; ఎత్తి పట్టెన్‌. తాత్చర్యం: మిక్కుట మైన దుఃఖభారంతో మునిశ్రేష్టు డైన వసిష్టుడు ఎలాగైనా ప్రాణం విడువా లని నిశ్చయించు కొని, మెడకు రాయికట్టుకొని సము[ద్రంలో దూకగా- ఆ సము(ద్రుడే భయపడి, ప్రకాశించే తన అల లనే చేతులతో ఎత్తిపట్టి తగువిధంగా ఆయనను ఒడ్డుకు చేర్చాడు. విశేషం; అలం: రూపకం. చ సుతశతవర్ణితాశ్రమము చూడ6గ నోపక మేరుపర్వతో న్నతప్పథుశ్చంగ మెక్కిపడినన్‌, మునివల్లభుదేహబంధ మ క్షత మయి తూలసంచయనికాశత నొప్పె; ననంత సంతత వ్రతనియమప్రభావు లగు వారల. బొందునె దేహదుఃఖముల్‌. 121 ప్రతిపదార్థం: సుత, శత, వర్చిత+ఆశ్రమము= కొడుకులు నూజుమందిచేత విడువబడిన ఆశ్రమాన్ని; చూడంగన్‌+ఓపక= చూడటానికి ఇష్టపడక; మేరుపర్వత+ఉన్నత, పృధు, శృంగము+ఎక్కి= మేరుపర్వతపు ఎత్తైన విశాలశిఖరాన్ని ఎక్కి; పడినన్‌; మునివల్లభు, దేహబంధముజ మునినాథు డైన వసిష్టుని శరీరముయొక్క కూర్పు; అక్షతము+అయి= గాయం కానిది అయి; తూల, సంచయ, నికాశతన్‌= దూదిమూటయొక్క సమానత్వంతో; ఒప్పెన్‌; అనంత, సంతత, (వ్రత, నియమ, ప్రభావులు+అగు= అంతులేని ఎడతెగని వ్రతనియమాలయొక్కప్రభావం కలవాళ్ళయిన; వారలన్‌; దేహ, దుఃఖముల్‌= శరీర సంబంధ మైన దుఃఖాలు; పొందునె= కలుగుతాయా? (కలుగవు అనిభావం). తాత్పర్యం: నూరుమంది కొడుకులు మరణించటంతో శూన్య మైన తన ఆ(శ్రమాన్ని చూడలేక ముని'శ్రేష్టు డైన వసిష్టుడు మేరుపర్వతపు ఎత్తైనశిఖరం ఎక్కి క్రిందికి దూకగా, అతని దేహం దూది మూట వలె గాయపడ లేదు. ఎల్లప్పుడు అంతులేని వ్రతనియమాల (ప్రభావం కలవాళ్ళను దేహకష్టాలు దరిచేరవుకదా! విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఉపను.

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 695

మధ్యాక్కర.

వదలక మరణార్ది యగుచు మునినాథవరుండు దా నొక్క

నది నుదగ్రగ్రాహవకి. బ్రవేశించినను ముని నంట

నది యోడి శతవిధంబులం బరిద్రుతయయి స్థలం బయిన

నది యాదిగా6(గ శతద్రునామ యై యన్నది యొప్పి, 122 ప్రతిపదార్హం: వదలక; మరణ+అర్హి= చావును కోరినవాడు; అగుచున్‌, మునినాథ, వరుండు= ముని'శ్రేష్టులలో ఉత్తముడు; తాన్‌= తాను; ఉద[గ్ర, గ్రాహవతిన్‌= మిక్కిలి భయంకరమైన మొసళ్ళు కలదానిని; ఒక్క, నదిన్‌: ప్రవేశించినను; అది= ఆ నది; మునిన్‌= వసిష్టుని; అంటన్‌= తాకుటకు; ఓడి=ఐ భయపడి; శతవిధంబులన్‌= నూజుమార్లాల; పరిద్రుత, అయి= పారినదై; స్టలంబు+అయ్యినన్‌= మెరక కాగా; అది, ఆదికాంగన్‌= అది మొదలుగా; ఆ+నది; శతద్రు, నామ+ఐ= శతద్రువు అనే పేరు కలదై; ఒప్పెన్‌.

తాత్పర్యం: ముని్రేష్టులలో ఉత్తము డైన వసిష్టుడు మరణించాలన్న కోరికను ఇంకా వదలకుండా మహా

భయంకర మైన మొసళ్ళున్న ఒక నదిలో ప్రవేశించాడు. ఆ నది ఆయనను తాకటానికి భయపడి, నూరు

మార్గాలలో (ప్రవహించి మెరక అయిపోయింది. అప్పటినుండి ఆ నది శతద్రువు అనే పేరుతో ప్రసిద్ది చెందింది. మధ్యాక్కర.

ఘన పొశములం జేసి యెల్ల యంగముల్‌ గలలయ బంధించి

కొని యొక్కనదిం జొచ్చి మునింగినను వంతం గూరి యన్నదియుః

దన దివ్యశక్తి నప్పాశముల విడిచి తన్మునినాథు6

బనుగొనం దీరంబు చేరం బెట్టి విపాశనాంబరగె. 123 ప్రతిపదార్హం: ఘన, పాశములన్‌+చేసి=ఐ గొప్ప (త్రాళ్ళచేత; ఎల్ల అంగముల్‌= అన్ని అవయవాలను; కలయన్‌= ఒకటిగా చేర్చి; బంధించికొని= కట్టివేసికొని; ఒక్కనదిన్‌; చొచ్చి= (ప్రవేశించి; మునింగినన్‌; ఆ+శనదియున్‌= ఆ నదిగూడ; వంతన్‌+కూరి= దుఃఖాన్ని పొంది; తన దివ్య, శక్తిన్‌= తనయొక్క ఆశ్చర్యకర మైన శక్తిచేత; ఆ+పాశములజ= ఆ త్రాళ్ళను; విడిచి= విడిపించి; తత్‌+ మునినాధున్‌= ఆ ముని'్రేష్టుడిని; పనుగొనన్‌= చక్కనగునట్టు: తీరంబు; చేరన్‌= చేరునట్టు, పెట్టి: విపాశ నాన్‌= విపాశ

(పాశములు లేనిది) అనే పేరుతో; పరగెన్‌= ఒప్పింది.

తాత్చర్యం: వసిష్టుడు పెద్దత్రాళ్ళతో తన అవయవాలన్నిటిని ఒకటిగా చేర్చి కట్టుకొని ఒక నదిలో మునిగాడు. ఆ

నదికూడ మిక్కిలి దుఃఖించి తన దివ్యశక్తితో ఆతని కట్టను విప్పి, ఒడ్డుచేర్చి, తాను 'విపాళ అనే పేరుతో ప్రసిద్ది

చెందింది.

వ. ఇట్లు పెక్కువిధంబుల నాత్మపరిత్యాగంబునందు! గృతనిశ్చయుం డయ్యును నప్తాప్త మరణుం డయి వసిష్టుండు నిజాశ్రమంబునకు వచ్చవాయ దన పిలుంద వచ్చు కోడలి నదృశ్యంతి యను దాని శక్తిభార్య నప్పు డెటింగి, దాని యుదరంబుననుండి షడంగాలంకృత వేదధ్వని గరంబు మధురం బై వీతెంచిన విని విస్మితుం డయి. 124

ప్రతిపదార్థం: ఇట్లు; పెక్కు విధంబులన్‌; ఆత్మ; పరిత్యాగంబునందున్‌= దేహాన్ని విడుచుటయందు, కృత నిశ్చయుండు=

చేయబడిన నిశ్చయం కలవాడు; అయ్యును; అప్రాప్త మరణుండు+అయి= పాందబడని చావుకలవా డై వసిష్టుండు; నిజ+

696 శ్రీమదాంధ్ర మహాభారతను

ఆశ్రమంబునకు= తనయొక్క ఆశ్రమానికి; వచ్చువాడు= వచ్చునటువంటి వాడు; తన; పిలుంద= వెనుక; వచ్చు; కోడలిన్‌;

అదృశ్యంతి; అనుదాని; శక్తి భార్యన్‌= శక్తి మహామునియొక్క భార్యను; అప్పుడు; ఎజింగిజఐ చూచి; దాని; ఉదరంబుననుండీ=

కడుపులో నుండి; షడంగ+అలంకృత, వేద, ద్వని= ఆరు అంగములచేత అలంకరింపబడిన వేదంయొక్క ఉచ్చారణ ధ్వని; కరంబు= మిక్కిలి; మధురంబు+ఐ= వినసొంపై: వీతెంచిన= రాగా; విని; విస్మితుండు+అఆయి= ఆశ్చర్యపడిన వా డై. తాత్పర్యం: ఈ విధంగా వసిష్టుడు ఆత్మహత్య చేసికొనా లని పెక్కుమార్గాలలో దృఢంగా ప్రయత్నించినా, మరణం పొందలేక తన ఆ(శ్రమానికి తిరిగివస్తూ తన వెనుకనే వస్తున్న తన కోడలిని గమనించాడు. ఆమె శక్తి మహాముని భార్య. ఆమె పేరు అదృశ్యంతి. ఆమె గర్భంనుండి షడంగాలతో అలంకృత మైన వేద ధ్వని మిక్కిలి మనోహరంగా వినిపించసాగింది. దానిని విని వసిష్టుడు ఆశ్చర్యపడి.

విశేషం: షడంగాలు: అనుద్రుతం, ద్రుతం, అఘువు, గురువు, ఫ్లుతం, కాకపాదం.

తే. శక్తి చదువును బోలె సువ్యక్త మగుచు । వీనులకు నిది యమృతోపమాన మయ్యె వేదనాదంబు; దీని పుణ్యోదరమున । నున్నవాండు సుతుండు విద్వన్నుతుండు. 125

ప్రతిపదార్థం: శక్తి చదువును+పోలె= శక్తిమహాముని చదువువలె; సువ్యక్తము= మిక్కిలి స్పష్టమైనది; అగుచు; ఇది; వేద,

నాదంబు= వేద ధ్వని; వీనులకున్‌= చెవులకు; అమృత+ఉసమానము+అయ్యె= అమృతమువంటి దయింది; దీని= ఈ

అదృశ్యంతి యొక్క; పుణ్య+ఉదరమునన్‌= పవిత్రమైన గర్భంలో; విద్వత్‌*+నుతుండు= విద్యాంసులచేత పొగడబడినవాడు;

సుతుండు= కుమారుడు; ఉన్నవాడు.

తాత్పర్యం: శక్తిమహాముని చదివినట్టు మిక్కిలి స్పష్టమై ఈ వేదనాదం చెవులకు అమృతంవలె వినిపిస్తున్నది.

ఈమె పుణ్యగర్భంలో విద్వాంసులచేత పొగడబడే కుమారుడు ఉన్నాడు.

విశేషం: అలం: ఉపమ.

వ. '“అనవరత వేదాధ్యయనశీలుం డయిన శక్తిచదువు వినుచుం బండ్రెండేండులు గర్జంబునుండి సకల వేదంబులు ధరియించినవాం డీ పాత్రుముఖంబు చూచి యేను గృతార్థుండ నగుదు' నని వసిష్టుండు మరణ వ్యవసాయ నివృత్తుం డై నిజాశ్రమంబున నుండునంత; నొక్కనాండు రాక్షస రూప ధరుం డై రౌద్రాకారంబున వచ్చు కల్మాషపాదుం జూచి యదృశ్యంతి వెజచిన దాని నోడకుండు మని మునివరుండు హుంకారంబున రాక్షసు వారించి, వానిపయి మంత్రపూతంబు లైన కమందడలుజలంబు లొలికిన. 126

ప్రతిపదార్థం: అనవరత= వేద+అధ్యయన, శీలుండు+అయిన= ఎల్లప్పుడు వేదాలను పఠించటమే స్వభావం గా గలవా డైనా; శక్తి చదువు= శక్తి మహామునియొక్క చదువు; వినుచున్‌; పండ్రైెండు+ఏడులున్‌; గర్భంబునుండి= కడుపులో ఉండి; సకల, వేదంబులు; ధరియించిన వాండు; ఈ; పౌత్రు, ముఖంబు; ఈ మనుమడియొక్క ముఖాన్ని; చూచి; ఏనుజ నేను; కృతార్ణుండను= తీరిన కోరిక కలవాడను; అగుదును+అని; వసిషుండు, మరణ, వ్యవసాయ, నివృత్తుండు+ఐ= చావుకొరకు చేసే 'ప్రయత్నంనుండి వెనుదిరిగిన వా డై - అనగా ఆత్మహత్యా ప్రయత్నాన్ని మాని; నిజ+ఆశ్రమంబునన్‌= తన ఆశ్రమంలో; ఉండునంతన్‌= ఉండగా; ఒక్కనాండు: రాక్షస, రూప, ధరుండు+ఐ= రాక్షస రూపాన్ని ధరించిన వా డై; రౌద్ర+ఆకారంబున= భయంకర మైన రూపంతో; వచ్చు; కల్మాషపాదున్‌: చూచి; అదృశ్యంతి (వసిష్టుడి కోడలు); వెజచిన= భయపడిన; దానిన్‌; ఓడక+ఉండుము+అని= భయపడకుండు మని; మునివరుండు= ముని'శ్రేష్టు డైన వసిష్టుడు; హుంకారంబున= హుం అనే పెద్ద ధ్వనితో, రాక్షసు; వారించి= ఆపి; వానిపై, మంత్ర, పూతంబులు+ఐన= మంత్రాలచేత పవిత్రా లైన, కమండలు, జలంబులు; ఒలికిన= చల్లగా.

ఆదిపర్వము - సప్తమాశ్వానము 697 తాత్సర్యం: 'ఎల్లప్పుడు వేదాలు చదవటమే స్వభావంగా గల శక్తియొక్క చదువు వింటూ పన్నెండు సంవత్సరాలు గర్భంలో ఉండి అన్ని వేదాలు నేర్చుకొన్న ఈ మనుమడి ముఖం చూచి నేను కృతార్జుడ నౌతాను' అని వసిష్టుడు ఆత్మహత్యాప్రయత్నం మాని, తన ఆశ్రమంలో ఉండిపోయాడు. ఒకనాడు కల్మాషపాదుడు రాక్షస రూపాన్ని ధరించి, రాగా అతడిని చూచి అదృశ్యంతి భయపడింది. వసిష్టుడు ఆమెను భయపడ వద్దని చెప్పి, తన హుంకారంతో ఆ రాక్షసుడిని నిలిపి, మంత్రపూతమైన కమండలజలాన్ని అతనిపై చల్చాడు.

వసిష్టునలన( గల్మాషసాదుండు శాపవిముక్తి. జెందుట (సం.1-168-5)

క, _ భూపాలకుండు బ్రాహ్మణ: శాపంబున బదియురెండుసంవత్సరముల్‌

పాపమతి నుండి రాక్షస ; రూపము చెడి యపుడు నునుజ రూపము. దాల్టెన్‌. 127 ప్రతిపదార్థం: భూపాలకుండు= రాజైన కల్మాషపాదుడు; (బ్రాహ్మణ, శాపంబునన్‌= (బ్రాహ్మాణశాపంచేత: పదియు, రెండు, సంవత్సరముల్‌= పం'డ్రైండేళ్ళు: పాప, మతిన్‌= పాపపుబుద్దితో; ఉండి: అప్పుడు: రాక్షస, రూపము; చెడి= కోల్పోయి; మనుజ, రూపమున్‌; తాల్బెన్‌. తాత్పర్యం; కల్మాషపాదమహారాజు (బ్రాహ్మణ శాపం వలన పన్నెండేళ్లు పాపబుద్దితో ఉండి, అప్పుడు రాక్షస రూపాన్ని వదలి, మానవరూపాన్ని పొందాడు. వ. ఇట్లు శాప విముక్తుం డై కల్మాషపాదుండు వసిష్టునకు నమస్కరించి ముకుళిత కర కమలుం డై 'మునీంద్రా!

నీ ప్రసాదంబున శాపంబువలనం బాసి కృతార్థుండ నయితి' ననిన వానికి వసెష్టుం డిట్లనియె. 128 ప్రతిపదార్హం: ఇట్టు; శాప, విముక్తుండు+అయి= శాపంచేత విముక్తి పొందిన వాడై; కల్మాషపాదుండు; వసిష్టునకు, నమస్కరించి; ముకుళిత కర, కమలుండు+ఐ= మోడ్పుగా చేయబడిన కమలాలవంటి చేతులు కలవాడై; ముని+ఇరద్రా!= ముని'్రేష్టా! నీ, ప్రసాదంబున= నీ దయచేత; శాపంబు వలనన్‌= శాపంనుండి; పాసి= విముక్తినొంది: కృత+అర్జ్హుండను= నెరవేరిన కోరిక కలవాడను; అయితిన్‌; అనిన; వానికి; వసిష్టుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం; ఈ విధంగా శాపవిముక్తి పొంది కల్మాషపాదుడు వసిష్టునికి నమస్కరించి, వేతులు జోడించి, 'ముని'శ్రేష్టా! నీ దయవలన శాప విముక్తి పొంది కృతార్జుడ నయ్యాను" అని పల్కగా, అతనితో వసిష్టుడు ఇట్టా అన్నాడు. చ. గుణముల నొప్పి బ్రాహ్మణులకుం గడుభక్తుండ వై సమస్త ధా

రుణి ప్రజ గూర్ప్చంగా విగతరోషుండ వై సుఖ ముండు మింక బ్రా

ర వి

హ్మణుల కవజ్ఞ సేయక శమంబును చేకొను; మింద్రుః డైన బ్రా

హ్మణుల కవజ్ఞ సేసి యవమానముం బొందు. బ్రతాపహీనుం డై. 129 ప్రతిపదార్థం: గుణములన్‌= మంచిగుణాలచేత; ఒప్పి; 'బ్రాహ్మణులకున్‌, కడు= మిక్కిలి; భక్తుడవు+ఐ: సమస్తు ధారుణీ, ప్రజ= మొత్తం భూమియందలి ప్రజలు; కూర్చంగా= (ప్రేమింపగా? విగత, రోషుండవు+ఐ= పోయిన కోపం కలవాడ వై: సుఖము+ ఉండుము= సుఖంగా ఉండుము; ఇంకన్‌; (బ్రాహ్మణులకు; అవజ్ఞ= అవమానం; చేయక; శమంబును= శాంతిని; చేకొనుము= పొందుము; ఇంద్రుండు+అయినన్‌: (బ్రాహ్మణులకు; అవజ్ఞ= అవమానం; చేసి; ప్రతాప, పీనుండు+ఐ= పరా[క్రమాన్ని కోల్సోయినవా డై; అవమానమున్‌; పొందున్‌.

698 శ్రీమదాంధ్ర ముహాభారతము తాత్పర్యం: మంచి గుణాలతో (బ్రాహ్మణ భక్తుడ వై, భూమిమీద (ప్రజలందరికీ ఇష్టుడ వై కోపం లేకుండా, సుఖంగా జీవించుము. బ్రాహ్మణులను అవమానించక శాంతిని పొందుము. (బ్రాహ్మణులకు అవమానం చేస్తే, ఇం(ద్రు డైనా పరాక్రమ హీను డై అవమానం పొందగలడు. విశేషం: అలం: అర్జాంతరన్యాసం. వన. అని కజిపిన నట్లచేయుదు నని యమ్మహీపతి వసిష్టుం దోడ్కొని, యయోధ్యాపురంబున కరిగి, సకల ప్రజానురాగకరుం దడయి యమ్మునివరు నతిభక్తిం బూజించుచు€ దొల్లి రాక్షసుం డయి మదయంతీ సహితంబు వనంబునం గ్రుమ్మరియెడి కాలం బొక్క బ్రాహ్మణ మిథునంబు బుతుకాలప్రవృత్తి నున్నం గని యాం కంటి పెలుచన నందు బ్రాహ్మణుం బట్టికొని భక్షించిన, నతిదుణిత యై యాబ్రాహ్మణభార్య పరమ పతివ్రత యాంగిరసి యనునది పురుషవియోగంబునం బుత్రార్ణంబయిన నిజప్రయత్నంబు విఫలం బగుటకు శోకించి, 'వనితాసంభోగంబున నీవును నా పురుషునట్లు పంచత్వంబునుం బొందు మని శాపంబిచ్చి, వసిష్టువలన నీకు బుత్రలాభం బగు నని చెప్పి, యగ్నిప్రవేశంబు సేసినం, బదంపడి వీని నంతయు మదయంతి వలన నెజింగినవా6 డై, తనకు. బుత్రోత్సాదన సామర్థ్యంబు లేమిం దలంచి కల్మాషపాదుండు పుత్రార్ధి యయి వసిష్ణుని కి ట్లనియె. 130 ప్రతిపదార్థం: అని; కజపినన్‌= బోధించగా; అట్టు; చేయుదును+అని; ఆ+మహీ, పతి= ఆ రాజు (కల్మాషపాదుడు); వసిష్టున్‌; తోడ్కొని= వెంటపెట్టుకొని; అయోధ్యాపురంబునకు; అరిగిజు వెళ్ళి; సకల, ప్రజా+అనురాగ, కరుండు+అయి= అందరు ప్రజలకు (ప్రేమను కలిగించువా డై; ఆ+ముని, వరున్‌= ఆ మునిశ్రేష్టుడైన వసిష్టుడిని; అతి, భక్తిన్‌్‌ పూజించుచున్‌; తొల్లి= పూర్వం; రాక్షసుండు+అయి; మదయంతీ, సహితంబు= మదయంతితో కూడి; వనంబునన్‌= అడవియందు; (క్రుమ్మరియెడి; కాలంబు= తిరుగుచుండెడి కాలాన; ఒక్క; బ్రాహ్మణ. మిథునంబు= (బ్రాహ్మణ దంపతుల జంట; బుతుకాల, ప్రవృత్తిన్‌= కామకేళియందు: ఉన్నన్‌= ఉండగా; కని= చూచి; ఆకంటి, పెలుచనన్‌= ఆకలియొక్క అతిశయంచేత; అందు= ఆ జంటలో, బ్రాహ్మణున్‌; పట్టికొని; భక్షించినన్‌; ఆ, (బ్రాహ్మణ, భార్య; పరమ, పతివ్రత; ఆంగిరసి; అనునది; అతి, దుఃఖితశఐజ= మిక్కిలి దుఃఖించిన దై; పురుషు వియోగంబునన్‌; భర్తను కోల్పోవటంచేత; పుత్ర+అర్థంబు+అయిన= పుత్రుని కొరకైన; నిజ, ప్రయత్నంబు= తన యొక్క ప్రయత్నం; విఫలంబు+అగుటకు= ఫలము లేని దగుటకు; శోకించి= దుఃఖించి; వనితా, సంభోగమున= స్త్రీతో రమించేటప్పుడు; నీవును; నా, పురుషున్‌+అట్ల= నా భర్తవలె; పంచత్వంబునున్‌= మరణమును; పొందుము+అని; శాపంబు+ఇచ్చి; వసిష్టునివలన; నీకున్‌; పుత్ర లాభంబు; అగును+అని= చెప్పి; అగ్ని, ప్రవేశంబు= నిప్పులో దూకుట; చేసిన్‌; పదంపడి= పిమ్మట; దీనిన్‌+అంతయు= ఈ జరిగినదాని నంతయు; మదయంతి వలనన్‌= తనభార్య యైన మదయంతివలన; ఎతింగినవాడై; తనకున్‌; పుత్ర+ఉత్స్పాదన, సామర్థ్యంబు లేమిన్‌= కొడుకును పుట్టించే శక్తి లేకుండుటను; తలంచి; కల్మాష పాదుండు; పుత్ర+అర్ధి, అయి= పుత్రుడిని కోరిన వా డై; వసిష్టునకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అని వసిష్టుడు బోధింపగా, ఆ విధంగానే చేస్తా నని ఆ రాజు వసిష్టుడిని వెంటబెట్టుకొని అయోధ్యా నగరానికి వెళ్లి, ప్రజలందరికి ఇప్పు డై ఆ ముని ్రేష్టుల్సి అతిభక్తితో పూజించసాగాడు. పూర్వం తాను రాక్షసుడై, తన భార్య మదయంతితో కూడి అడవిలో తిరిగే కాలంలో ఒక బ్రాహ్మణ దంపతుల జంట కామకేళిలో ఉండటం చూచి, అధికమైన ఆకలితో (బ్రాహ్మణుడిని పట్టుకొని భక్షింపగా, అతనిభార్య పరమపతి[వ్రత 'ఆంగిరసి' మిక్కిలి దుఃఖించి, భర్తను కోల్పోవటంవలన కొడుకు పుట్టా లన్న తనకోరిక విఫలమైన దని శోకించి, 'స్తీతో రమించినప్పుడు నీవుకూడ నా భర్త వలె అకాలమరణం పొందుతావు" అని శపించి 'వసిష్టునివలన నీకు పుత్రలాభం

ఆదిపర్వము - సప్త్రమాశ్వాసము 699 కలుగుతుంది” అని చెప్పి అగ్నిప్రవేశం చేసింది. తరువాత ఈ విషయమంతా మదయంతి ద్వారా తెలిసికొని, తనకు పుత్రులను పొందే యోగ్యత లేదని ఆలోచించి, కల్మాషపాదుడు పుత్రుని కోరి వసిష్టునితో ఇట్టా అన్నాడు.

వసిష్టప్రసాదంబున గల్మాషపాదుండు పుత్త్రవంతు. డగుట (సం.1-168-11)

క మనుకుల పవిత్రుం బుత్రకు । నినసన్నిభ! నాకుం బడయు; మే నట్లయినన్‌

మునినాధ! నీ ప్రసాదం ।; బున బతరులనలన బుణవిముక్తుండ నగుదున్‌. 131 (ప్రతిపదార్థం: మను, కుల, సవిత్రున్‌= మనువువంశాన్ని పరిశుద్ధం చేసేవాడిని; పుత్రకున్‌= చక్కని కుమారుడిని; ఇన, సన్నిభున్‌= సూర్యుడితో సమాన మైనవాడిని; నాకున్‌; పడయుము= పొందుము; ఏను; అట్టు+అయినన్‌; మునినాథా[!= ఓ ముని శ్రేష్టాః నీ 'ప్రసాదంబునన్‌= నీదయచేత; పితరులవలనన్‌= పితృదేవతలవలన; బుణ, విముక్తుండన్‌= అప్పునుండి విడువబడిన వాడను; అగుదున్‌= కొతాను. తాత్పర్యం: ఓ వసిష్టమహర్షీ మనువువంశాన్ని పవిత్రంచేసేవాడు, సూర్యునితో సమానమైనవాడు అయిన సుపుత్రుడిని నాకు కలిగించుము. నేను ఆ విధంగా నీ దయతో పితృదేవతల బుణంనుండి విముక్తుడ నౌతాను. వ. _ అని తన భార్యయైన మదయంతి యనుదానిని బుతుమతి సమర్పించిన, నదియు వసిష్టు ప్రసాదంబున

గర్జిణి యయి పండ్రెండేండులు గర్థంబు మోచి వేసరి, యొక్క యత్మశకలంబున నుదరభేదనంబు. జేసిన

నక్ష్మకుం డను రాజర్షి పుట్టె నట యద్భశ్యంతికిం బరాశరుం డుదయించి వసిష్ట నిర్మిత జాతకర్మాదికుం

డయి పెరుంగుచు నొక్కనాండు రాక్షసభక్షణంబునం దన జనకు పంచత్వంబు దల్లివలన విని కోపదహన

దందహ్యమానహృదయుం డయి 'తపోమహత్త్వంబున నఖిల లోక సంహారంబు సేయుదు' నని యున్న

మనుమని వారించి వసిష్టుం డి ట్లనియె. 132 ప్రతిపదార్థం: అని; తన; భార్య, ఐన; మదయంతి; అను, దానిని; బుతుమతి= రజస్వల యైన దానిని; సమర్పించినన్‌= ఈయగా; అదియు; వసిష్టు, ప్రసాదంబున= వసిష్టుని దయచేత; గర్భిణి; అయి; పండ్రైండు+ఏడులు= పం(డ్రెండు సంవత్సరాలు; గర్భంబు; మోచి; వేసరి= విసుగుచెంది; ఒక్క, అశ్మ, శకలంబునన్‌= రాతిముక్కచేత; ఉదర భేదనంబునున్‌= కడుపు చీల్చుటను; చేసినన్‌; అశళ్ళ్మకుండు; అను; రాజర్షి; పుట్టిన; అట; అదృశ్యంతికిన్‌; పరాశరుండు; ఉదయించి పుట్టి? వసిష్ట నిర్మిత, జాతకర్మ+ ఆదికుండు+అయి= వసిష్టునిచేత చేయబడిన జాతకర్మం మొదలైనవి కలవాడై పెరుగుతూ; ఒక్కనాండు; రాక్షస, భక్షణంబునన్‌= రాక్షసుడు తినటంచేళ; తన, జనకు, పంచత్వంబు= తన తండ్రియొక్క మరణం; తల్లివలన, విని; కోప, దహన, దందహ్యమాన హృదయుండు+అయి= కోప మనే అన్నీచేత మిక్కిలిగా కాల్పబడుతున్న మనస్సు కలవా డై తపో మహత్ష్యంబునన్‌= తపస్సు యొక్క మహిమచేత; అఖిల లోక; సంహారంబు= అన్ని లోకాలను చంపటం; చేయుదును; అని; ఉన్న; మనుమని; వారించి= ఆపి; వసిష్టుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అని రజస్వల అయిన తన భార్య మదయంతిని వసిష్టునికి సమర్పించగా ఆమె అతని అనుగ్రహంతో గర్భిణి అయి, పన్నెండేళ్లు గర్భం మోసి విసిగి, ఒక రాతిముక్కతో కడుపు చీల్చుకొనగా, అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు. అక్కడ అదృశ్యంతికి (శక్తి భార్యకు) పరాశరుడు జన్మించాడు. అతనికి వసిష్టుడు జాతకర్మాదులు జరిపించాడు. అతడు పెరుగుతూ, “రాక్షసుడు భక్షించటం చేత తన తండ్రి మరణించా డని ఒకనాడు తల్లిద్వారా తెలిసికొని, కోపాగ్టితో మండుతున్న హృదయం కలవాడై తన తపోమహిమతో అభిలలోకాలను నాశనం చేస్తా నని పూనుకొనగా అతడిని ఆపి, వసిష్టమహాముని ఇట్టా అన్నాడు.

700 శ్రీమదాంధ్ర మహాభారతము

సీ. వినవయ్య! కృతవీర్యుం దను జనపతి దొల్లి; భృగు వంశ యాజ్యం దై పెక్కుక్రతువు లొనరించి, యగణిత ధనదానముల వారి.€। దృస్తులం గావించి దివికి జనిన, నతనివంశమున నా రతిధనలుబ్ధు బై! కృతవీర్యు ధనమెల్లం గ్లప్తి సేసి కొని డాంచియున్నవా రని భార్గవుల నెల్లం। బలికిన భార్గవుల్‌ భయము వొంది,

తే. కొంద అర్ధము వారిక కూర్చి యిచ్చి;। రవనిసురవంశ్యులకు నిచ్చి రందు6 గొంద, టెవ్వరికి నీక తమ తమ యిండగ్లం బాతి । కొని సుఖం బుండి రధము లై కొంద అందు. 133

ప్రతిపదార్హం: వినవయ్య; కృతవీర్యుండు; అను, జన, పతి= రాజు; తాల్లి= పూర్వం; భృగు, వంశ) యాజ్యుండు+ఐ= భృగువంశం

వారిని యాజ్యులుగా = అనగా యజ్ఞం చేయించే యాజ్జికులుగా కలవా డై; పెక్కు, (క్రతువులు= అనేక యజ్ఞాలు; ఒనరించి= చేసి; అగణిత, ధన, దానముల= లెక్కలేనన్ని ధనదానాలచేత; వారిన్‌; తృప్త్పులన్‌+కావించి= తృప్తినాందిన వారినిగా చేసి; దివికిన్‌= స్వర్గానికి; చనినన్‌= వెళ్ళగా; అతని, వంశము వారు; అతి ధనలుబ్బులు+ఐ= మిక్కిలిగా ధనమునందు ఆశకలవారై; కృతవీర్యు, ధనము+ఎల్లన్‌= కృతవీర్యునియొక్క ధనాన్ని అంతా; క్షస్తి చేసికొని= ఏర్పాటు చేసికొని; డాచి, ఉన్నవారు= దాచుకొని ఉన్నారు; అని; భార్గవులన్‌+ఎల్లన్‌= భృగువంశం వారి నందరిని; పలికినన్‌; భార్గవుల్‌= ఆ భృగువంశ (బ్రాహ్మణులు; భయము; పొంది; కొందరు; అర్థము= ధనాన్ని, వారికి+అ= వారికే; కూర్చి= ఒకటిగా చేర్చి; ఇచ్చిరి; అందున్‌; కొందజు; అవని, సుర, వంశ్యులకున్‌=

('బ్రాహ్మాణ వంశాన పుట్టిన వారికి; ఇచ్చిరి; అందు; కొందజు; ఎవ్వరికిన్‌, ఈకజ ఇవ్వక; అధములు+ఐ= నీచులై తమతమ

ఇండ్లన్‌; పాతికొని; సుఖంబు+ఉండిరి= తమ తమ ఇళ్ళలో పాతిపెట్టుకొని సుఖంగా ఉన్నారు.

తాత్పర్యం: వినవయ్యా! పూర్వం కృతవీర్యు డనే రాజు భృగువంశ బ్రాహ్మణులను యాజ్జికులుగా పొంది, పెక్కు

యాగాలు చేసి, లెక్కలేనన్ని ధన దానాలచే వాళ్ళను తృప్తిపరచి స్వర్గానికి వెళ్ళాడు. అతనివంశంవాళ్ళు ధన

లోభంతో 'కృతవీర్యుని ధనాన్నంతా భృగువంశ బ్రాహ్మణులు సం[గ్రహించి దాచుకొని ఉన్నారు” అని పలుకగా, ఆ

(బ్రాహ్మణులు కొందరు భయపడి తమ దగ్గర ఉన్న ధనాన్ని ఒకచోట చేర్చి వాళ్ళకే ఇచ్చారు. మరికొందరు తమ

ధనాన్ని వేర్వేరు బ్రాహ్మణ వంశాల వాళ్ళకు ఇచ్చారు. ఇంక కొందరు తమ ఇళ్లలో పొతిపెట్టుకొన్నారు.

న. అంత నా క్షత్తియు లొక్క భార్గవుని యిల్లు గ్రొచ్చి యనంతం బయిన యర్థంబు గని యలిగి, రాజధన వంచకులై రని భార్గవుల నెల్ల నిగ్రహించి, గర్ధంబుల నున్న యక్థకులు మొదలుగా వధించిన, వెజచి భార్గవుల భార్యలెల్ల హివవంతంబునకుం బాటిన; నం దొక్క భృగుపత్ని భయంపడి తన యూరుదేశంబున గర్జంబు ధరియించిన, నెటింగి క్షత్రియులు దాని భేదింప సమకట్టి వచ్చిన నంతకు ముందల. 134

ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; ఆ క్షత్రియులు; ఒక్క; భార్గవుని, ఇల్టు= భృగువంశ బ్రాహ్మణుని ఇల్టు; క్రొచ్చి= త్రవ్వి;

అనంతంబు+అయినజ= అంతం లేనిదైన; అనగా అత్యధిక మైన; అర్థంబున్‌= ధనాన్ని; కని= చూచి; అలిగి= కోపించి; రాజ, ధనవంచకులు+ఐరి+అని= రాజుయొక్క ధనాన్ని అపహరించిన వాళ్ళు అయ్యారని; అని; భార్ల్గవులన్‌+ఎల్లన్‌= భృగువంశ

(బ్రాహ్మణుల నంతా; ని(గ్రహించి= పడదోసి; గర్భంబులన్‌+ఉన్నజ కడుపులోఉన్న; అర్భకులు=. బాలురు; మొదలుగా;

వధియించిన= చంపిన; వెజచి= భయపడి, భార్గవుల; భార్యలు+ఎల్ల= భార్యలందరు:; హిమవంతంబునకున్‌= హిమాలయ

పర్వతానికి; పాఠినన్‌= పరుగెత్తగా; అందు+ఒక్క; భృగుపత్ని= భృగువంశపు బ్రాహ్మణుని భార్య; భయంపడి, తన; ఊరు, దేశంబునజ తొడయందు; గర్భంబు; ధరియించినన్‌; ఎజింగి=ఐ తెలిసికొని; క్షత్రియులు; దాని; భేదింప= చీల్చుటకు; సమకట్టి= పూనుకొని; వచ్చినన్‌= రాగా; అంతకు; ముందట

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 701 తాత్సర్యం: తర్వాత ఆ క్షత్రియులు ఒక భృగువంశ బ్రాహ్మణుని ఇల్టు (త్రవ్వి అత్యధికమైన ధనం చూచి, కోపించి, రాజధనం వంచనతో (గహించా రని ఆ భగువంశ బ్రాహ్మణుల నందరిని పడదోసి, కడుపులో ఉన్న బాలురు

౮ (బ్రాన్మూ (గ్ర న్న మొదలుగా అందరినీ చంపగా, వాళ్ళ భార్యలంతా భయపడి హిమాలయానికి పరుగెత్తారు. వాళ్ళలో ఒక (బ్రాహ్మణునిభార్య తన తాడలో గర్భాన్ని ధరించగా, క్షత్రియులు అది తెలిసికొని దానిని కూడ విచ్చిన్నం చేయా లని రాగా, అంతకు ముందే.

భార్గవుండైన బౌర్వునిజననము (సం.1-169-20) క. _ భువనోపప్లవసమయో ; ద్ధవ భానునిభప్రభావిభాసితుం దేయి భా ర్ల్గవుండూరు దేశమున ను। ద్ధవించె మహి వెలుంగుచుండం బ్రభ నౌర్వుం డనన్‌. 135 ప్రతిపదార్థం: భువన+ఉపప్టవ, సమయ+ఉద్భవ, భాను, నిభ, ప్రభా, విభాసితుండు+అయి= లోకాలయొక్క ప్రళయకాలమందు పుట్టిన సూర్యునితో సమానమైన కాంతిచేత ్రకాశించేవా డై; భార్గవుండు= భృగువంశంవాడు; ఊరు, దేశమునన్‌= తాడయందు; బౌర్వుండు+అనన్‌= బౌర్వుడనే పేరుతో; ప్రభన్‌= కాంతితో; మహి=భూమిమీద; వెలుగుచుండన్‌= (ప్రకాశించేటట్టుగా; ఉద్భవించెన్‌= పుట్టెను. తాత్పర్యం: ప్రళయకాల సూర్యునివంటి కాంతితో భృగువంశంవాడూ తొడనుండి పుట్టి జొర్వుడనే పేరుతో లోక ప్రసిద్దుడయ్యాడు. ము. అమితౌజుం డగు వానిం జూచి కృతవీర్యాన్నూయజ క్షత్రియా ధములెల్లన్‌ హతదృష్టు లై కృపణతం దత్వర్వతారణ్యదే శములం గ్రుమ్మరుచుండి రంధు లయి; నిశ్శంకం బతిక్రూరక ర్మములం దుద్యతు లైన వారికి నశర్మప్రాప్తి గాకుండునే. 136 ప్రతిపదార్థం: అమిత+ఓజుండు+అగు= మిక్కిలి తేజస్సు కలవాడైన; వానిన్‌= ఆ జౌర్వుని; చూచి; కృతవీర్య+ఆమ్నాయజు, క్షత్రియ+అధములు+ఎల్లన్‌= కృతవీర్యుని వంశంలో పుట్టిన నీచులైన క్షత్రియులంతా; హత; దృష్టులు+ఐ= కొట్టబడిన చూపులు కలవాళ్ళయి; అనగా నాశమైన దృష్టి కలవాళ్ళయి; అంధులు+అయి= (గ్రుడ్డివాళ్ళయి: కృపణతన్‌= దీనత్వంతో; తత్‌+పర్వత, అరణ్య, దేశములన్‌= ఆ కొండలయొక్క, అడవులయొక్క ప్రదేశాలలో; క్రుమ్మరుచుండిరి= తిరుగుతూ ఉన్నారు; నిళ్ళంకంబు= జంకులేకుండ; ఆతి, (క్రూర, కర్మము లందు= మిక్కిలి దుర్మార్గపు పనులలో; ఉద్యతులు+ఐన, వారికి= (ప్రయత్నం కలవాళ్ళకి; అశర్మ్రాప్తి= సంతోషం కానిదానిని పొందటం - అనగా దుఃఖాన్ని పొందటం; కాకుండునే=ఐ జరుగకుండునా. తాత్పర్యం: అమిత మైన తేజస్సు కల ఆ జౌర్వుడిని చూచిన వెంటనే, కృతవీర్యుని వంశంలో పుట్టిన క్షత్రియాధము లంతా దృష్టి కోల్పోయి, (గ్రుడ్డివా ళ్ళయి దైన్యంతో ఆ పర్పతారణ్య (ప్రదేశాలలో తిరుగుతూ ఉండిపోయారు. జంకు లేకుండ పరమ దుర్మార్గపుపనులు చేయటానికి ప్రయత్నించేవాళ్ళకు దుఃఖం (ప్రాప్తించకుండా ఉంటుందా? ను విశేషం; అలం: అర్జాంతరన్యాసం. వో టర్‌ తు (గ3ిఠాల జ్య గ్‌ శాం” స్తాన ఎ. (40 జం...మ్‌.1ళ్తూ) / తం య మూలలా యయ హత స 2నెదన్న ననన

702 (శ్రీముదాంధ్ర మహాభారతము

వ, అట్లా క్షత్రియులందలు నంధు లై భృగుపత్నియొద్దకు వచ్చి, మాకు దృషప్టదానంబు. బ్రసాదింపవలయు నని వేండిన నది వారల కి ట్లనియె. 137

ప్రతిపదార్థం: అట్టు: ఆ క్షత్రియులు; అందయున్‌, అంధు లై= (గ్రుడ్డివాళ్ళయి; భృగుపత్ని; ఒద్దకు; వచ్చి; మాకు; దృష్టి:

దానంబున్‌; పప్రసాదింపవలయును; అని; వేడినన్‌; ప్రార్జింపగా; అది; వారలకు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: ఆ విధంగా ఆ క్షత్రియులంతా (గ్రుడ్డివాళ్ళయి భృగు భార్య వద్దకు వచ్చి 'మాకు చూపు మరల

ప్రసాదించు మని వేడుకోగా ఆమె వాళ్ళతో ఇట్లా అన్నది.

మధ్యాక్కర.

ఏను మీ దృష్టులు గొన్నదానం గా; నిక్కుమారుండు భానుతేజుండు మీచేం దనగురులు పరిభూతు లయిన దానికి నలిగి మ్‌ పాపబుద్ధికిం దగ నిట్లు సేసె; వీని మీ రెటుంగరె భార్గవకులము వెలింగించువాని. 138

(ప్రతిపదార్థం: ఏను= నేను; మీ; దృష్టులు=ఐ మీ చూపులను; కొన్న, దానన్‌= తీసికొన్న దానను - అనగా మీకు లేకుండ చేసిన

దానను; కాన్‌= కాను; ఈ+కుమారుండు; భాను, తేజుండు= సూర్యునితో సమానమైన తేజస్సుకలవాడు; మీచేన్‌= మీ చేత: తన,

గురులు= తన తండ్రి తాతలు; పరిభూతులు= అవమానింపబడినవాళ్ళు; అయిన; దానికిన్‌; అలిగి= కోపించి; మీ; పాప బుద్ధికిన్‌; తగన్‌= తగినట్టు; ఇట్టు; చేసె; భార్గవ, కులము; వెలితించువాని; వీని; మీరు+ఎయులగరే.

తాత్పర్యం: మీ చూపులను నేను పోగొట్టలేదు. ఈ కుమారుడు సూర్యసమానమైన తేజస్సు కలవాడు. తన తండ్రి

తాతలను మీరు అవమానించా రని కోపించి, మీ పాపబుద్దికి తగినట్టు ఇట్టా చేశాడు. భార్గవకులాన్ని ('ప్రకాశింపజేసే

వీడిని మీ రెరుగరా?

వ. “ఇక్కునూరుండు నూలు సంవత్సరములు నా యూరు గర్భంబున నుండి సకల వేదవేచాంగంబులు నేర్చిన వాండు, మహాతపోనిదిి; మీకుం గరుణించు నితనిం బ్రార్ధింపుం' డనిన, నాక్షత్రియులు నతిభక్తు లై యౌర్వుం బ్రార్ధించి తత్ప్రసాదంబున దృష్టులు వడసి చని; రంత నౌర్వుండు దన పితృబంధుజనులెల్ల నొక్కటం బరలోక గతు లగుటకు దుఖించి సకలలోక ప్రళయార్దంబుగా ఘఫోరతపంబు సేయందొడంగిన. 139

ప్రతిపదార్థం: ఈ+కుమారుండు; నూజు; సంవత్సరములు: నా; ఊరు; గర్భంబునన్‌= నా తాడయందు; ఉండి; సకల, వేద,

వేద+అంగంబులు= అన్ని వేదములు; వేద వేదాంగములు: నేర్చిన వాండు; మహా; తపోనిధి=ఐ గొప్ప తపస్సునకు స్టానమైనవాడు; మీకున్‌; కరుణించున్‌, ఇతనిన్‌; (ప్రార్ధింపుండు; అనినన్‌, ఆ; క్షత్రియులున్‌: అతి, భక్తులు+ఐ; జౌర్వున్‌; ప్రార్జించి; తత్‌+

'ప్రసాదంబున= అతనియొక్క దయచేత; దృష్టులు= చూపులు; పడసి= పొంది; చనిరి= వెళ్ళారు; అంతన్‌; జొర్వుండు; తన, పితృ

బంధుజనులు+ఎల్లన్‌= తన తండ్రులు; బంధువులు అందరు; ఒక్కటన్‌= ఒక్కటిగా, ఒక్కసారిగా; పరలోక, గతులు+అగుటకు=

మరొకలోకానికి వెళ్ళినవారగుటకు; - అనగా మరణించినందుకు; దుఃఖించి; సకలలోక; 'ప్రళయ+ అర్థంబుగా= అన్ని లోకాల నాశనం కొరకు; ఘోర, తపంబు= భయంకర మైన తపస్సు; చేయన్‌+తొడంగిన= చేయటానికి పూనుకొన,

తాత్పర్యం: “ఈ కుమారుడు వందసంవత్సరాలు నా ఊరువులో ఉండి వేద వేదాంగా లన్నిటిని నేర్చాడు;

మహాతపోనిధి. ఇతడిని ప్రార్ధించండి. మిమ్ములను కరుణిస్తాడు" అని పల్కగా, ఆ క్షత్రియులు మిక్కిలి భక్తి కలవా

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 703 ళ్ళయి జౌర్వుని ప్రార్జించి, అతని దయతో తిరిగి దృష్టిని పొంది వెళ్లిపోయారు. తర్వాత జౌర్వుడు తన తండ్రులు, బంధువులు అందరు ఒక్కసారిగా మరణించినందుకు దుఃఖించి, లోకాలన్నింటిని నాశనం చేసేందుకు భయంకర మైన తపస్సు చేయ పూనుకొన్నాడు.

చ. అతని తపంబు పెంపునం జరాచరసంభృత మైన విష్టప త్రితయము భీతింబొందిన, ధృతిం బితృ్చలోకనివాసు లైన త చ్చిత్భవరు లెల్ల వచ్చి కడు6 బ్రీతి నపాక్కత గర్వు నౌర్వున ప్రతిమ తపోవిభాసెం గని పల్మిరి తద్దయు శాంతచిత్తు లై. 140

ప్రతిపదార్థం: అతని, తపంబు, పెంపునన్‌= ఆ కౌర్వుని తపస్సుయొక్క ఆధిక్యంచేత; చర+అచర, సంభృతము+అయిన= కదలిక కలవాటితో, కదలికలేని వాటితో నిండిన; విష్టప త్రితయము= లోకాలు మూడు; భీతిన్‌= భయాన్ని; పొందిన; ధృతిన్‌= సంతోషంతో; పితృలోక; నివాసులు+ఐన= పితృలోకంలో ఉన్నవా ళ్ళయిన; తత్‌+పితృ, వరులు+ఎల్ల= అతనియొక్క ఉత్తము లైన తండ్రులంతా, వచ్చి; కడున్‌= మిక్కిలి, ప్రీతిన్‌ఐ (ప్రేమతో; అపాకృత, గర్వున్‌= తొలగింపబడిన గర్వం కలవాడిని; ఆప్రతిమ; తపః+విభాసీన్‌= సాటిలేని తపస్సుచే ప్రకాశించేవాడిని; బౌర్వున్‌; కని= చూచి; తద్దయు= మిక్కిలి; శాంతచిత్తులు+ఐ= శాంతంతో కూడిన మనస్సుకలవాళ్ళయి; పలికిరి.

తాత్సర్యం: ఆ జౌర్వుని తీవ్రతపస్సుకు చరాచరాలతో కూడిన ముల్లోకాలు భితిచెందగా, పితృ లోక వాసు లైన

అతని తాతతం(డ్రులంతా సంతోషంతో వచ్చి మిక్కిలిప్రేమతో - గర్వం లేనివాడు, సాటిలేని తపస్సుతో

(ప్రకాశించేవాడు అయిన జౌర్వుడిని చూచి మిక్కిలి శాంత చిత్తు లై ఈ విధంగా పలికారు.

పితృదేనతలు బౌర్వుని శాంతచిత్తుని. జేయుట. (సం.1-170-14)

వ. 'అయ్యా! నీ తపో మహత్త్వంబుం జూచి లోకంబు లెల భయంపడియెడు; లోకానుగ్రహంబుగా నీరోషంబు విడువుము; మే మసమర్థుల మై క్షత్రియులచేత వధియింపం బడిన వారము గాము: ధనలుబ్ధుల మయి ధనంబు చాంచినవారము గాము; ధనము వలసినం గుబేరుండు దాన మాకు దెచ్చి యిచ్చుం; దపో మహత్త్వంబున మాకు నాయువు గడుంబెద్దయైన నిర్వేదించి మనుష్యలోకంబున నుండ నొల్లక యాత్మఘాతంబునం బుణ్యలోకంబులు లేమిం జేసి దానిం బరిహరించి యా క్షత్రియులతో వైరం బమర్చికొని తన్నిమిత్తంబున దేహంబులు విడిచితిమి; భార్గవులతేజంబు నొరులు పరిభవింప నోపుదురె? కావున నీవు దీనికింగా సర్వజనోపద్రవంబు సేయవల; దిది మాకభీష్టం' బనిన నౌర్వుండు వారల కిట్లనియె.. 141

ప్రతిపదార్థం: అయ్యా; నీ, తపః+మహత్ష్యంబున్‌= నీ తపస్సుయొక్క గొప్పతనాన్ని; చూచి; లోకంబులు+ఎల్ల; భయంపడియెడు;

లోక+అను[గ్రహంబుగా= లోకాలకు మేలు కలిగేటట్టుగా; నీ, రోషంబు= నీ కోపాన్ని; విడువుము: మేము; అసమర్భులము+ఐ= శక్తిలేని వారమై; క్షత్రియులచేత; వధియింపన్‌+పడిన వారము, కాము= చంపబడినవాళ్ళం కాము; ధన, లుబ్బులము+అయి= ధనమునందు మిక్కిలి ఆళ కలవాళ్ళ మై" ధనంబు; దాచిన వారము కాము; ధనము; వలసినన్‌= అవసరమైతే: కుబేరుడు; తాన్‌+అజ తానే; మాకున్‌; తెచ్చి ఇచ్చున్‌; తపః+మహత్ష్యంబునన్‌= తపస్సుయొక్క మహిమచేత; మాకున్‌: ఆయువు= ఆయుష్యం; కడున్‌= మిక్కిలి; పెద్ద, ఐన= ఎక్కువ కాగా; నిర్వేదించి= విరక్తి చెంది; మనుష్య, లోకంబునన్‌; ఉండన్‌; ఒల్లకజ ఇష్టపడక; ఆత్మ, ఘాతంబునన్‌= ఆత్మహత్యవలన; పుణ్యలోకంబులు; లేమిన్‌చేసి= లేకుండటంనలన; దానిన్‌= ఆత్మహత్యను; పరిహరించి= వదలి; ఆ, క్షత్రియులతో; వైరంబు; అమర్చికొని= ఏర్పాటు చేసికొని; తత్‌నిమిత్తంబున= ఆ కారణంగా;

70% శ్రీమదాంధ్ర మహాభారతము దేహంబులు; విడిచితిమి; భార్గవుల= భృగువంశబ్రాహ్మణులయొక్క; తేజంబున్‌= కాంతిని; పరాక్రమాన్ని; ఒరులు= ఇతరులు; పరిభవింపన్‌+ఓపుదురే=ఐ అవమానింపగలరా; కావున; నీవు; దీనికిన్‌+కా= దీనికొరకని; సర్వ, జన+ఉప(ద్రవంబు= అందరు ప్రజలకు హాని; చేయ, వలదు= చేయవద్దు; ఇది; మాకు; అభీష్టంబు= కోరిక; అనినన్‌; కౌర్వుండు; వారలకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: 'నాయనా! నీ తపోమహిమ చూచి లోకాలన్నీ భయపడుతున్నాయి. లోకాలకు మేలు కలిగే విధంగా నీ కోపాన్ని వదలిపెట్టుము. మేము అసమర్హుల మై క్షత్రియులచేత వధించబడ లేదు. ధనం మీది పేరాసతో ధనాన్ని దాచలేదు. మాకు ధనం అవసరమైతే, కుబేరుడు తానే తెచ్చి యిస్తాడు. తపోమహిమతో మాకు ఆయుష్యం మిక్కిలియెక్కువ కాగా విరక్తి చెంది, మానవలోకంలో ఉండటానికి ఇష్టం లేకు ఆత్మహత్య చేసికొంటే పుణ్య లోకాలు రా వని, దాన్ని వదలి, ఆ క్షత్రియులతో వైరం తెచ్చుకొన్నాం. ఆ కారణంగా దేహాలు విడిచాం. భృగువంశ , బ్రాహ్మణుల తేజస్సును ఇతరులు పరాభవించగలరా? కనుక దీనికై నీవు ప్రజలందరికి హాని చేయ వద్దు. ఇది మా కోరిక అని పల్కగా, కౌర్వుడు వాళ్ళతో ఇట్లా అన్నాడు. మత్తకోకిలము. మానితం బగు నా తపోమహిమం ద్రిలోక పరాభవం బేను జేయంగ బూని చేసితి నిట్టి దొక్క ప్రతిజ్ఞ మున్‌; దీని నెట్టులు గ్రమ్మజింతు మదీయ భాషిత మెన్నండు న్నేని మోఘము గాదు దిస్థరణీరవీందు లెటుంగంగన్‌. 142 ప్రతిపదార్థం: మానితంబు+అగు= పూజింపబడినదయిన:; నా, తపోమహిమన్‌= నా తపస్సుయొక్క గొప్పతనంచేత; ఏను= నేను; త్రిలోక పరాభవంబు= ముల్లోకాల నాశనాన్ని; చేయంగన్‌; పూని; మున్‌= పూర్వము; ఇట్టిది; ఒక్క; ప్రతిజ్ఞ; చేసితిన్‌; దీనిన్‌; ఎట్టులు= ఏ విధంగా; (క్రమ్మరింతున్‌= మరలిస్తాను; దిక్‌+ధరణీ, రవి+ఇందులు= దిక్కులు, భూమి, సూర్యుడు, చంద్రుడు; ఎయుంగంగన్‌; మదీయ, భాషితము= నాదైన మాట; ఎన్నండున్‌+ఏని= ఎన్నడైనా; మోఘము= వ్యర్థం; కాదు తాత్పర్యం: ప్రశస్త మైన నా తపోమహిమతో ముల్టోకాలను నాశనం చేస్తా నని పూర్వం నే నొక ప్రతిజ్ఞ చేశాను. దీనిని ఏ విధంగా మరలిస్తాను. దిక్కులు, భూమి, సూర్యచంద్రులు సాక్షులుగా నా మాట ఎన్నడూ వ్యర్థం కాదు. క మతి మజచి యనిస్తీర్ణ। ప్రతిజ్ఞ దగు వాని కోపపటుదహన మని ర్ల్గత మయి వడి నరణి సము । త్థిత దహనమ పోలె నాత్మదేహము నేర్దున్‌. 143 ప్రతిపదార్థం: మతిన్‌=మనస్సునందు; మటచి; అనిస్తీర్ణ ప్రతిజ్ఞుడు= దొటబడని (ప్రతిజ్ఞ కలవాడు; అగు, వాని, కోప, పటు, దహనము= అయిన వ్యక్తియొక్క కోపం అనెడి గొప్ప అగ్ని; అనిర్గతము+అయి= బయటికి వెలువడని దై; అరణి, సమ్‌+ఉచ్టిత, దహనము పోలెన్‌= అరణియందు పుట్టిన నిప్పువలె; వడిన్‌= వేగమే; ఆత్మదేహమున్‌= తన శరీరాన్ని; ఎర్చ్బున్‌= కాల్చును. తాత్పర్యం: మరచిపోయి, తన ప్రతిజ్ఞను నెరవేర్చుకొననివాడి కోపాగ్ని వెలుపలికి రానిదై, ఆరణిలో పుట్టిన అగ్నివలె వెంటనే అతని శరీరాన్ని కాల్ఫివేస్తుంది. విశేషం: అలం: ఉపమ. క్ర అలయక నిమిత్తజంబగు ; నలుకను క్షమియించి శాంతు.€ డగు పురుషుం డి మ్ముల రక్షింపంగ నోపునె; పొలుపుగ ధర్మార్ధ్థకామములు సమములుగన్‌ 144

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 705 ప్రతిపదార్హం: అలయకజ= (శ్రమపడక; నిమిత్తజంబు+అగు, అలుకను= కారణంవలన పుట్టిన దైన కోపాన్ని; క్షమించి= ఓర్చి; శాంతుడు+అగు= పురుషుండు; పొలుపుగా= చక్కగా? ధర్మ+అర్ధ, కామములు; సమములుగన్‌= సమానాలుగా; ఇమ్ముల= తగినట్టుగా; రక్షింప(గన్‌+ఓపునె= రక్షింప కలుగునా. తాత్పర్యం: ఒక కారణంవలన కలిగిన కోపాన్ని తీర్చుకొనటానికి శ్రమపడక, సహించి శాంతు డైన మానవుడు ధర్మార్ధకామాలను చక్కగా, సమానంగా రక్షించగలడా? తే. పాపులైక్షత్రియాధముల్‌ భార్గవులకు । నట్లు హింస గావించు నాందార్తనాద

మూరుగర్ధగతుందనై యుండి వినిన ; నాయ కోప మసహ్య మై నన్ను! బొందె. 145 ప్రతిపదార్థం: పాపులు+ఐజ=. దుర్మార్లు లై; క్షత్రియ+అధముల్‌=. నీచు లైన క్షత్రియులు; భార్గవులకున్‌= భృగువంశ

(బ్రాహ్మణులకు; అట్టు; హింస; కావించునాండు= చేసే రోజు; ఆర్తనాదము= దుఃఖ ధ్వని; ఊరు, గర్భ, గతుండను+ఐ=

తాడలోపల ఉన్నవాడ నై; ఉండి; వినిన, నాండు+అ= వినిన రోజే; కోపము; అసహ్యము+ఐ= ఓర్వరాని దై; నన్ను; పొందె.

తాత్పర్యం: దుర్మార్లు లై, నీచు లైన క్షత్రియులు- భృగువంశ బ్రాహ్మణులను ఆ విధంగా హింసించే నాడు, వాళ్ళ దుఃఖ ధ్వనిని నేను తొడలోపల ఉండి విన్నప్పుడే నాకు సహించరాని కోపం కలిగింది.

తే. ఎలుక గలండేని మటీ శక్తుండేని యన్యు। లన్యులకు హింస గావించునపుడు దానిం బూని వారింపకున్న నప్పురుషుం దేంగు । హింస చేసినవారల యేంగుగతికి. 146

ప్రతిపదార్థం: ఎలుక= జ్ఞానం; కలండు+ఏని= ఉన్నవాడైతే; అన్యులు= ఇతరులు; అన్యులకు= ఇతరులకు; హింస, కావించు

నపుడు" దానిన్‌= ఆ హింసను; పూని= (ప్రయత్నించి; వారింపక+ఉన్నన్‌= ఆపకున్నట్టయితే; ఆ+పురుషుండు; ఏంగుక వెళ్ళును; హింస; చేసిన వారల; ఏంగు, గతికి వెళ్ళే మార్గానికి (చోటుకు) (నరకానికి అని భావం).

తాత్పర్యం: జ్ఞానవంతుడు, సమర్ధుడు అయినవాడు- ఒకరు మరొకరిని హింసించే సమయంలో ప్రయత్నించి

ఆహింసను నివారించకుంటే, అతడుకూడ ఆ హింస చేసినవాళ్ళగతినే (నరకాన్నే) పొందుతాడు,

విశేషం: నన్నయ రుచిరార్థసూక్తి,

వ. 'కావున లోకంబులయందు సామర్థ్యంబు గలిగి పాప ప్రతిషేధంబు సేయని వారల నుద్దేశించి యలిగితి; నేనును మీ వచనం బతిక్రమింప నోడుదు; నఖిలలోకదహనోద్యతం బయిన నాకోపదహనంబు నిగ్భహీతం బయిన నన్ను దహించు; నేమి సేయు వాండ? మీరు సర్వలోకహితులరు; నాకును లోకంబులకును హితం బగునట్లుగా నుపదేశింపు6 డనిన నౌర్వునకుం బితరు లి ట్లనిరి. 147

ప్రతిపదార్థం: కావున; లోకంబుల, అందు; సామర్థ్యంబు; కలిగి; పాప, ప్రతిషేధంబు= పాపాన్ని ఆపటాన్ని; చేయని వారలన్‌;

ఉద్దేశించి; అలిగితిని= కోపించాను; ఏనునుజ నేనుకూడ; మీ, వచనంబు= మీ మాట; అతిక్రమింపన్‌= దాటుటకు: ఓడుదును= భయపడతాను; అఖిల, లోక, దహన+ఉద్యతంబు+అయిన= అన్ని లోకాలను కాల్చటానికి పూనుకొన్న; నా, కోప, దహనంబుూ న అ

నా కోప మనే నిప్పు; నిగృహీతంబు+అయినజ= నివారింపబడిన దైతే; నన్ను+అ= నన్నే; దహించున్‌= కాల్చును; ఎమి;

వాండ; మీరు; సర్వలోక; హితులరు= అన్ని లోకాలకు మేలు కోరేవారు; నాకును; లోకంబులకును; హితంబు+ అగునట్టుగౌన=

మేలు కలిగేటట్టుగా: ఉపదేశింపుండు: అనినన్‌: జౌర్వునకున్‌; పితరులు; ఇట్టు+ అనిరి,

౯706 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: 'అందుచేత లోకాలలో- సామర్థ్యం ఉండి, పాపాన్ని ఆపటానికి ప్రయత్నం- చేయనివాళ్ళను ఉద్దేశించి

కోపం వహించాను. నేను మీ మాట దాటటానికి భయపడతాను. లోకాలన్నింటిని దహించటానికి పూనుకొన్న నా

కోపాగ్నిని ఆపితే, అది నన్నే దహిస్తుంది. ఇప్పు డేం చేయాలి? నాకూ, ఈ లోకాలకూ మేలు కలిగే విధంగా ఉపదేశించండి” అని పల్కగా బౌర్వునితో పితృదేవతలు ఇట్టా అన్నారు.

ఆ. జలములంద యుండు సర్వలోకంబులు । గాన నీ మహోగ్ర కలుష వహ్ని జలథిలోన విడిచి సత్యప్రతిజ్ఞుండ ; వగుము; జలధి జలము నది దహించు. 148

(ప్రతిపదార్థం: సర్వ, లోకంబులు; జలముల+అంద= నీటియందే; ఉండు; కాన= కనుక; నీ, మహా+ఉ(గ్ర కలుషవహ్ష్ని= నీయొక్క

మిక్కిలి భయంకర మైన కోపమనే అగ్నిని; జలధిలోన= సము(ద్రంలో;విడిచి; సత్య, ప్రతిజ్ఞండవు= సత్య మైన ప్రతిజ్ఞ కలవాడవు;

అగుము; అది= ఆ కోపాన్ని; జలధి, జలమున్‌= సము(ద్రపునీటిని; దహించు.

తాత్పర్యం: అన్నిలోకాలూ నీటిలోనే ఉంటాయి. కనుక మహాభయంకర మైన నీ కోపాస్షిని సముద్రంలో

విడిచిపెట్టి, నీ (ప్రతిజ్ఞను నెరవేర్చుకో. అది సముద్రంలోని నీటిని దహిస్తుంది.

వ. "అనిని నొర్వుండు పితృదేపతాదేశంబునం దన కోపానలంబు సముద్రంబులో వైచిన, నది యౌర్వానలంబు నా నశ్వముఖంబున నజ్దజలంబులం ద్రావుచుండు; నిది వేదంబులయందు వినంబడియెడు కథ గావున నీవును నౌర్వునట్ల ధర్మవిదుండవు భువనపరిభావి యైన యీ క్రోధంబు విడువు' మనిన వసిష్టు వచనంబు నం బరాశరుండు గోపం బుపసంహరించి రాక్షసవినాశార్జంబుగా సత్రయాగంబు సేయం గడంగిన. 149

ప్రతిపదార్థం: అనినన్‌, జౌర్వుండు; పితృదేవతా+ఆదేశంబునన్‌= పితృదేవతలయొక్క ఆజ్ఞచేత; తన, కోప+అనలంబుః= కోపమనే అగ్నిని; సముద్రంబులో; వైచినన్‌; అది; జౌర్వ+అనలంబు; నాన్‌= జౌర్వాన్టి అనే పేరుతో; అశ్చముఖంబునన్‌= గుర్రపు ముఖంతో; అబ్బి, జలంబులన్‌; సముద్రపు నీటిని; త్రావుచు; ఉండున్‌; ఇది; వేదంబుల; అందు; వినంబడియెడు; కథ; కావున; నీవును; బౌర్వు, అట్ట= జౌర్వునివలె; ధర్మ; విదుండవు= ధర్మాన్ని తెలిసినవాడవు; భువన, పరిభావి, ఐన= లోకములను నశింపచేసేది ఐన; ఈ, (క్రోధంబు= ఈ కోపాన్ని; విడువుము+అనిన; వసిష్టు, వచనంబునన్‌; పరాశరుండు' కోపంబు; ఉపసంహరించి= మరలించి; రాక్షస; వినాశ+అర్ధంబుగా= రాక్షసులచావుకొరకు; సత్రయాగంబు; చేయన్‌; కడంగిన= పూనుకొనగా.

తాత్సర్యం: అని పల్కగా, జౌర్వుడు పితృదేవతల ఆజ్ఞ (ప్రకారం తన కోపాగ్నిని సముద్రంలో వేయగా, అది

బౌర్వాన్ని అనే పేరుతో గుర్రపుముఖంతో సము(ద్రపునీటిని త్రాగుతూ ఉంటుంది. ఇది వేదాలలో వినిపించే కథ.

“నీవుకూడ జౌర్వునివలె ధర్మం తెలిసినవాడవు కనుక లోకాలను నళింప జేసే ఈ కోపాన్ని విడిచిపెట్టుము” అని

పల్కగా, వసిష్టునిమాటప్రకారం పరాశరుడు కోపాన్ని ఉపసంహరించి, రాక్షస వినాశం కొరకు సత్రయాగం చేయా

లని పూనుకొన్నాడు. పరాశరుడు రాక్షసవినాశార్థంబు సత్రయాగంబు సేయుట (సం.1-172-2)

తే. శక్తిరాక్షసనిహతు€.డై చనిన శోక ।; దహనహతుం డై వసిష్టుండు దానిం దలంచి

కడు. బ్రశాంతాత్ముం దయ్యు రాక్షసవినాశ ।; మొలసి మనుమని వారింపకుండె నంత, 150

ఆదిపర్వము = సప్త్రమాశ్వానము 707 ప్రతిపదార్హం: శక్తి= శక్తిమహాముని; రాక్షస, నిహతుండు+ఐ= రాక్షసునిచేత చంపబడినవాడై; చనిన= చనిపోగా; వసిష్టుండు; (ప్రశాంత+ఆత్ముండు+అయ్యు= శాంత మైన మనస్సు కలవాడే అయినా; దానిన్‌? తలంచి; శోక దహన, హతుండు+ఐ= శోక మనే అన్టిచేత మనస్సు చెడినవాడై; రాక్షస, వినాశము= రాక్షసులయొక్కచావు; ఒలసి= కాంక్షించి; మనుమని; వారింపకజ= ఆపక; ఉండెన్‌; అంత. తాత్పర్యం: శక్తి మహాముని రాక్షస నిహతు డై గతింపగా, వసిష్టుడు శాంత మైన మనస్సు కలవాడే అయినప్పటికీ, దానిని తలచుకొని దుఃఖాగ్నితో మనస్సు చెడినవా డై, తన మనుమ డైన పరాశరుడు రాక్షస వినాశనార్హం చేసే యాగప్రయత్నాన్ని నివారించలేదు.

క ఘోరాకారులు కృతహా। హారవులు సబాలవృద్దు లయి పడిరి దురా

చారులు రాక్షసులు ముని; ప్రారబ్ధాధ్వరసమిద్ధపావకశిఖలన్‌, 151 ప్రతిపదార్హం: ఘోర+ఆకారులు=ఐ భయంకర మైన రూపం కలవాళ్ళు; కృత, హా, హా, రవులు= చేయబడిన హాహా అనేధ్వని కలవాళ్ళు; దుర్‌+ఆచారులు= చెడుప్రవర్తన కలవాళ్ళు; రాక్షసులు; స, బాల, వృద్దులు+అయి= బాలురతో, ముసలి వాండ్రతో కూడినవాళ్ళ; ముని ప్ర+ఆరబ్ద+అధ్వర, సమిద్ధ, పావక, శిఖలన్‌= పరాశరమునిచేత గొప్పగా (ప్రారంభించబడిన యజ్ఞమునందలి మండుతున్న అగ్నిజ్వాలలో; పడిరి. తాచ్చర్యం: దుర్మార్లు లైన రాక్షసులు, భయంకర మైన హాహాకారాలతో, బాలురతో వృద్దులతో సహా పరాశరుడు (ప్రారంభించిన యాగంలో- మండుతున్న అగ్నిజ్యాలలలో పడిపోయారు. వ. ఇట్లు పరాశరుండు గావించు సత్తయాగంబున నైన రాక్షసకులప్రళజయంబుం జూచి పులస్తృపులహక్రతువులు

మహామునిసంఘంబులతో వసిష్టాశ్రమంబునకు వచ్చి. 152 (ప్రతిపదార్థం: ఇట్టు; పరాశరుండు; కావించు= చేయు, సత్ర యాగంబునన్‌+ఐన= సత్రయాగంలో జరిగిన; రాక్షస, కుల, 'ప్రళయంబు= రాక్షసవంశ నాళనాన్ని; చూచి; పులస్త్య, పులహ, (క్రతువులు; మహాముని, సంఘంబులతో= మహామునుల సమూహాలతో; వసిష్టశ+ఆ(శ్రమంబునకుజ వసిష్టునియొక్క ఆశ్రమానికి; వచ్చి. తాత్సర్యం: ఈ విధంగా పరాశరుడు చేసే సత్త్రయాగంలో జరిగిన రాక్షస నాళనాన్ని చూచి- పులస్త్యుడు, పులహుడు, (క్రతువు మహర్షులసమూహంతో వసిష్టాశ్రమానికి వచ్చి. విశేషం: పులస్త్యుడు, పులహుడు; క్రతువు-బ్రహ్మమానసపుత్రులు. క. _ అగ్నిహతిం జేసి మానవ ; భుగినహము మరణబాధం బొందించుచు మూం

డగ్నులయొద్దను నాలవ । యగ్నియనన్‌ వెలుంగుచున్న యమ్మునినాథున్‌. 153 (ప్రతిపదార్థం: అగ్ని హతిన్‌చేసిజఐ అగ్నిలో పడటంచేత; మానవ భుక్‌నివహము= మానవులను తినే రాక్షసుల సమూ హాన్ని; మరణబాధన్‌; పొందించుచు; మూండు అగ్నుల ఒద్దనుజఐ దగ్గర; నాలవ అగ్ని అనన్‌= నాల్గవ అనగ్నియో అన్నట్టుగా; వెలుంగుచు+ఉన్న= ప్రకాశిస్తున్న; ఆ+ముని నాధున్‌= ఆ మునిశశ్రేష్టు డైన పరాశరుడిని. తాత్పర్యం: మానవులను భక్షించే రాక్షస సమూహాన్ని అగ్నిలో పడే టట్టు చేయటం ద్వారా, వాళ్ళకు మరణబాధ కలిగిస్తూ, మూడుగ్నులదగ్గర నాల్లవఅగ్నివలె ఉన్న ఆ ముని'శ్రేష్టుడిని.

708 శ్రీమదాంధ్ర మహాభారతము

విశేషం: అలం: ఉతత్రేక్ష. త్రేతాగ్నులు: ఆహవనీయం, దక్షిణాగ్ల, గార్హపత్యం - ఇవి మూడు యజ్ఞవేదికి (క్రమంగా తూర్పు,

దక్షిణం, పడమర - ఈ దిక్కులలో ఉంటాయి.

క. పరమ తపోనిలయు దినే; శ్వరదీప్తి సహస్రతేజు శాక్తేయు€. బరా శరుంగని యందలుం బ్రార్థిం । చిరి రాక్షస మారణంబు సేయకు మనుచున్‌. 154

ప్రతిపదార్థం: పరమ, తపః+నిలయున్‌= గొప్ప తపస్సుకు ఉనికిషట్టైనవాడిని; దిన+ఈశ్చర, దీప్తి సహస్ర, తేజుజఐ పగటి ప్రభు

వైన సూర్యునికాంతికి వేయిరెట్టుకాంతి కలవాడిని - అనగా వేయిమందిసూర్యులవలె ప్రకాశించేవాణ్ణి: శాక్రేయున్‌=. శక్తి మహామునియొక్క పు(త్రని; పరాశరున్‌; కని= చూచి; అందున్‌; రాక్షస, మారణంబు= రాక్షసులను చంపటాన్ని; చేయకుము; అనుచున్‌; ప్రార్థించిరి.

తాత్సర్యం: మహాతపస్పంపన్నుడు, వెయ్యిమంది సూర్యుల కాంతితో ('ప్రకాశించేవాడు, శక్తిమహాముని కుమారుడు

అయిన పరాశరుడిని చూచి, రాక్షససంహారం మానండని అందరు (ప్రార్ధించారు.

వ. 'పరాశరుండును బులస్వాదిమహామునిప్రార్థితుం డై రాక్షససత్రయాగం బుపసంహరించి, తన్ని యోగంబున నయ్యగ్ని హోమవదుత్తరపార్శ్యంబున వైచిన, నదియును బర్వంబుల నందు వృక్షలతా గుల్మ శిలాభక్షణంబు సేయుచుండె' నని యిట్లు గంధర్వుండు తాపత్యవసిష్టార్వోపాఖ్యానంబు చెప్పిన విని యర్జునుండు వాని కి ట్లనియె. 155

ప్రతిపదార్థం: పరాశరుండును; పులస్త్య+ఆది, మహాముని, (ప్రార్ధితుండు+ఐ= పులస్త్యుడు మొదలైన మహామునులచేత ప్రార్ధింప

బడినవా డై; రాక్షస, సత్రయాగంబు; ఉపసంహరించి= ఆపి; తత్‌+నియోగంబునన్‌= వారిఆజ్ఞదేత; ఆ+అగ్లి; హిమవత్‌+ ఉత్తర, పార్య్యంబున= హిమాలయపర్వతం యొక్క ఉత్తరపు ప్రక్క; వైచినన్‌= వేయగా: అదియును; పర్వంబుల, అందు= పర్వదినాలలో

ఆ ఉత్తరపు ప్రక్కన; వృక్ష, లతా, గుల్మ, శిలా, భక్షణంబు= చెట్లను, తీవలను, పొదలను, రాళ్ళను తినుటను; చేయుచు+

ఉండెన్‌+అని; ఇట్టు; గంధర్వుండు; తాపత్య, వసిష్ట+కార్య+ఉపాఖ్యానంబు= తాపత్యులయొక్క వసిష్టుని యొక్క, జార్వుని

యొక్క కధను; చెప్పిన; విని; అర్జునుండు; వానికి? ఇట్టు+అనియె.

తాత్పర్యం: 'పరాశరుడుకూడ- పులస్త్యుడు మొదలైన మహామునులు ప్రార్ధించగా రాక్షసవినాశం కొరకు చేసే ఆ

సదత్రయాగాన్ని ఆపి, ఆ మునుల ఆజ్ఞతో ఆ యాగా్టిని హిమాలయానికి ఉత్తరంవైపు వేయగా, అది పర్వదినాలలో

చెట్లను, తీగలను పొదలను, శిలలను భక్షిస్తూ ఉండింది" అని గంధర్వుడు తాపత్య - వసిష్ట - కౌర్వుల కథను చెప్పగా విని, అర్జునుడు అతనితో ఇట్లా అన్నాడు.

ఉ. మాకునతి ప్ర్రియుండవు సమస్త విదుందవు చెప్పముయ్య! యీ లోకములోని వర్తనములుం దగువారి నెటుంగు; దెవ్వనం బ్రాకటధర్మతత్వవిదు బ్రాహ్మణముఖ్యుం బురోహితుండుగాం జేకొనువార? మట్టి బుధసేవితుం గానంగ మాకు నెం దగున్‌? 156

ప్రతిపదార్థం: మాకున్‌; అతి, (ప్రియుండవు= మిక్కిలి ఇష్టమైనవాడవు; సమస్త విదుండవు= అన్నీ తెలిసినవాడవు;

చెప్పుము+అయ్య; ఈ లోకములోని, వర్తనములున్‌= ఈ లోకమందలి నడవడులను; తగువారిన్‌=ఐ తగినవారిని; ఎజుంగుదు= తెలియుదువు; ఎవ్వనిన్‌: ప్రాకట, ధర్మ, తత్య్యవిదు= (ప్రసిద్ధంగా ధర్మతత్త్వాన్ని తెలిసినవాడిని; బ్రాహ్మణ, ముఖ్యున్‌=

(బ్రాహ్మణులలో (శ్రేష్ట డైన వాడిని; పురోహితుండు, కాన్‌= పురోహితు డయ్యేటట్టు; చేకొనువారము= [గ్రహించగలవారం; అట్టి;

బుధ, సేవితున్‌= పండితులచే పూజింపబడే వాడిని; మాకు; కానంగజ చూచుట; ఎందు+అగున్‌= ఎచ్చట జరుగుతుంది?

ఆదిపర్వము - సప్రమాశ్వాసము 709 తాత్పర్యం: మాకు మిక్కిలి ఇష్టమైనవాడవు, అన్నింటిని తెలిసినవాడవు, అంతేకాదు ఈ లోకవ్యవహారాలను, తగిన వ్యక్తులను తెలిసినవాడవు. ధర్మతత్త్యం బాగా తెలిసినవాడు, (బ్రాహ్మణ(్రేష్టుడు అయిన వీ వ్యక్తిని పురోహితునిగా మేము. స్వీకరించాలో, పండితులచే పూజింపబడే అట్టివ్యక్తి మాకు ఎక్కడ. లభిస్తాడో తెల్పకోరుతాను.

వ. అనిన గంధర్వుండు పెద్దయుంబ్రొద్దు విచారించి 'యిచ్చోటికిం గుఅంగట నుత్కచం బను పుణ్య తీర్చంబునం దపంబు సేయుచున్నవాని ధౌమ్యుం డను బ్రాహ్మణుని. బురోహితుంగాం బ్రార్జింపుం; డమ్మహాత్ముండు మీకు బురోహితుం దైన సర్వార్దసిద్ధి యగు" ననిన సంతసెల్లి వానికి నాగ్నేయాస్తంబు విధ్యుక్తంబుగా నిచ్చి, 'మాకు నీ యిచ్చిన హయంబుల నీయంద సంగ్రహించి యుండుము; ప్రయోజనంబు గలనాండు గొనిపోయెద' మని గంధర్వు వీడ్కొని పాండవులు భాగీరథి నుత్తరించి యుత్య్మచం బను పుణ్యతీర్జంబున కరిగి యందు. 157

ప్రతిపదార్థం: అనిన; గంధర్వుండు; పెద్దయున్‌+ప్రొద్దు= చాలసేపు; విచారించి= ఆలోచించి; ఈ+చోటికిన్‌; కుఅంగటన్‌= సమీపాన; ఉత్‌+*కచంబు; అను; పుణ్య, తీర్ణంబునన్‌; తపంబు; చేయుచు; ఉన్నవాని; ధౌమ్యుండు; అను' (బ్రాహ్మణునిన్‌; పురోహితున్‌+కాన్‌=పురోహితుడయ్యేటట్టుగా; ప్రార్థింపుండు; ఆ+మహాత్ముండు; మీకున్‌; పురోహితుండు+ఐన; సర్వ్య+అర్హ, సిద్ది= అన్ని ప్రయోజనాలు సమకూరటం; అగున్‌=ఐ జరుగును; అనిన; సంతసిల్లి; వానికీన్‌; ఆగ్నేయ+అ(స్తంబు: విధి+ఉక్తంబుగాన్‌= నియమం ప్రకారం; ఇచ్చి; మాకు; నీ ఇచ్చిన) హయంబుల= గు(ర్రాలను; నీ అందు+అ= నీ దగ్గరే; సం(గ్రహించి= దాచి; ఉండుము; ప్రయోజనంబు, కలనాండు= అవసరమేర్చడిన రోజు; కొని పోయెదము; అని గంధర్వు; వీడ్కొని; పాండవులు; భాగీరథిన్‌= గంగను; ఉత్తరించి= దాటి; ఉత్కచంబు= అను; పుణ్యతీర్దంబునకు; అరిగి= వెళ్ళి; అందు.

చాత్ప్సర్యం: అని పల్కగా, గంధర్వుడు చాలసేపు ఆలోచించి “ఇక్కడికి సమీపంలో ఉత్కచం అనే పుణ్యతీర్థం

ఉన్నది. అక్కడ తపస్సు చేసికొంటున్న ధౌమ్యు డనే (బ్రాహ్మణుడిని పురోహితునిగా ప్రార్టించండి. ఆ మహాత్ముడు

మీకు పురోహితు డైతే అన్ని ప్రయోజనాలు సిద్దిస్తా' యని తెల్పగా, సంతోషించి, అఆనికి ఆగ్నేయాస్రాన్ని యథావిధిగా ఇచ్చి, 'మాకు నీ విచ్చిన గుజ్టాలను నీ దగ్గరే ఉంచుము. అవసరమైనప్పుడు తిసికొంటాము' అని ఆ గంధర్వుడిని వీడ్కొాని, పాండవులు గంగానదిని దాటి. ఉత్కచ మనే పుణ్యతీర్చానికి వెళ్లి, అక్కడ. పాండవులు ధౌమ్యుని. బురోహితు(గా వరియించుట. (సం.1-174-6)

ఉ. _ వీత సమస్త దోషుం డయి వేద్యం దపం బొనరించుచున్నవి

ఖ్యాతు బురోహితప్రవరుంగా వరియించిరి భక్తితో జగ

త్పూతచరిత్రు సాధుజనపూజితు ధార్మికు ధౌమ్యు దేవల

బ్రాత్యవరున్‌ మహాత్తు హితభాషణు భూసురపంశభూషణున్‌. 158 ప్రతిపదార్థం: వీత, సమస్త దోషుండు+అయి= పోయిన ఎల్లపాపాలు కలవాడై; వేడ్కన్‌= కుతూహలంతో, తపంబు; ఒనరిం చుచు+ఉన్నజ చేస్తూఉన్న; విఖ్యాతున్‌= ప్రసిద్దుడిని; జగత్‌+పూత, చరిద్రున్‌= లోకాలలో పవిత్రమైన నడవడీ కలవాడిని; సాధుజన, పూబితున్‌= సజ్జనులచేత పూజింపబడిన వాడిని; ధార్మికుఐ ధర్మం చేసేవాడిని; మహాత్ము= మహాత్ము డైన వాడిని; హిత, భాషణుజ ఉపకారం చేసే మాటలు కలవాడిని; భూసుర వంశ భూషబున్‌= (బ్రాహ్మాణవంశానికి అలంకొారమైనవాడిని; దేవల, (భ్రాత, వరున్‌= దేవలుని తోబుట్టువులలో శ్రేష్టు డైనవాడిని; ధౌమ్యు= ధౌమ్యుని; పురోహిత, ప్రవరున్‌+కాన్‌= పురోహిత (్రేష్టునిగా; భక్తితో; వరియించిరి= కోరారు

710 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: పాపరహితుడు, కుతూహలంతో తపస్సు చేస్తున్నవాడు, ప్రసిద్దుడు, లోకంలో పవిత్ర మైన చరిత్ర

కలవాడు, సజ్జనులచేత పూజింపబడేవాడు, ధార్మికుడు, మహాత్ముడు, మేలు కలిగించే మాటలు పలికేవాడు,

(బ్రాహ్మణవంశానికి అలంకార మైనవాడు, దేవలుని తోబుట్టువులలో శ్రేష్టుడు అయిన ధౌమ్యుడిని తమకు

పురోహిత్రేష్టునిగా పాండవులు స్వీకరించారు.

వ. ధౌమ్యుండును వారినతిప్రీతిం బూజించి పురోహితత్వంబుం బరిగ్రహించె; నట్లు తేజోరూపబుద్ధ్ది విభవంబుల బృహస్పతిసద్భశుం డై వేదవేదాంగవిదుం దైన ధౌమ్యుం బురోహితుంగా. బడసి, పాండు నందను లశేషమహీరాజ్యంబు వడసినంతయ సంతసిల్లి, తత్కతస్వస్త్రయను లయి, జననీ సహితంబు దక్షిణ పాంచాలంబున కరుగువారు ముందజ ధ్రుపదుపురంబునకు6. బోయెడు బ్రాహ్మణులం గని 'మీ రెందులకుం బోయెద?' రని యడిగిన వా రిట్లనిరి. 159

(ప్రతిపదార్హం; ధౌమ్యుండును; వారిని; అతి, ప్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; పూజించి" పురోహితత్వంబున్‌; పరి[గ్రహించెన్‌= చేకొని (గ్రహించాడు; అట్టు; తేజః, రూప, బుద్ది, విభవంబుల= తేజస్సుచేతను, రూపంచేతను, బుద్దిచేతను, గొప్పతనంచేతను" బృహస్పతి, సదృశుండు+ఐ= బృహస్పతితో సమాన మైనవాడై; వేద, వేద+అంగ, విదుండు+ఐన= వేదాలను, వేదాంగాలను తెలిసిన వా డైన; ధౌమ్యున్‌; పురోహితున్‌+కాన్‌=ఐ పురోహితునిగా; పడసీ= పొంది; పాండునందనులు; అశేష మహీ, రాజ్యంబు= మొత్తంభూమి మీద అధికారాన్నిఅంతయు; పడసిన, అంతియ= పొందినంతగా; సంతసిల్లి; తత్‌+*కృత, స్వస్తి+అయనులు+అయి= అతనిచేత చేయబడిన ఆశీర్వాదం కలవా ళ్ళయి; జననీ, సహితంబు= తల్లితో కలిసి; దక్షిణ, పాంచాలంబునకు; అరుగువారు= వెళ్ళీ వాళ్ళు; ముందర; (ద్రుపదు; పురంబునకున్‌; పోయెడు; (బ్రాహ్మణులన్‌+కని= (బ్రాహ్మణులను చూచి; మీరు; ఎందులకున్‌= ఎక్కడికి; పోయెదరు+అని; అడిగిన; వారు; ఇట్టు+అనిరి,

తాత్పర్యం: ధౌమ్యుడుకూడ వాళ్ళను మిక్కిలిప్రేమతో పూజించి, పురోహితత్వాన్ని స్వీకరించాడు. ఆ విధంగా

తేజస్సు చేత, రూపంచేత, బుద్దిచేత, గొప్పదనంచేత, బృహస్పతితో సమానుడైై, వేదవేదాంగాలను పూర్తిగా తెలిసిన

ధౌమ్యుడిని పురోహితునిగా పొంది, పాండవులు సమస్తభూమండలరాజ్యాన్ని పొందినంతగా సంతోషించి, ధౌమ్యుని ఆశీర్వచనం పొంది తల్లితోకూడ దక్షిణపాంచాలదేశానికి వెళ్ళుతూ, తమకు ముందు (ద్రుపదుని నగరానికి వెళ్లే

(బ్రాహ్మణులను చూచి, “మీ రెక్కడికి వెళ్లుతున్నారు' అని అడుగగా, వా రిట్లా అన్నారు.

సీ. యజ్ఞసేన ప్రభు యజ్ఞమహావేదిం। గవచశరాసనఖద్దబాణ రథయుక్తుండై మహారథుండు ధృష్టద్యుమ్ను.। డన నుదయించిన, నతనితోడ నొక్కటం బుట్టిన యక్మన్యకను కృష్ణ । నసితోత్సల శ్యామలామలాంగి మెలుపునుం బోలెను వలు నుత్పలగంధి ।; బంధుర తను సౌరభంబు గలుగు

ఆ. దాని ద్రుపదరాజుతనయం దదీయ స్వ। యం వరోత్సవంబు నపుడు చూడం గనినవారు దృష్‌ట్లుగనిన ఫలం బెల్లం; గనినవారు పరమకౌతుకమున. 160

ప్రతిపదార్థం: యజ్ఞసేన, ప్రభు, యజ్ఞమహావేదిన్‌= ద్రుపదమహారాజుయొక్క యజ్ఞమునందలి గొప్పవేదియందు; కవచ, శర+

ఆసన, ఖడ్గ బాణ, రధ, యుక్తుండు+ఐ=ఐ కవచంతో, ధనుస్సుతో, ఖడ్గంతో, బాణాలతో, రధంతో కూడినవాడై; మహారధుండు; ధృష్టద్యుమ్నుండు; అనన్‌; ఉదయించినన్‌= పుట్టగా: అతనితోడన్‌; ఒక్కటన్‌; ఏకకాలంలో; పుట్టిన; ఆ+కన్యకను; కృష్ణన్‌= కృష్ణ అను పేరు కలదానిని, అసిత+ఉత్పల, శ్యామల+అమల+అంగి= నల్లకలువవలె నల్లని నిర్మల మైన దేహం కలదానిని;

ఆదిపర్వము = సప్తమాశ్వాసము ల్లాక్షైక్ష మెజుపునున్‌+పోలెను=ఐ మెజుపువలె; వజలు= (ప్రకాళించే; ఉత్పల, గంధి= కలువ పూవు వాసనవంటి వాసనకలదానిని; బంధుర, తను సౌరభంబు, కలుగు, దానిని= గాఢమైన మేని సువాసన కలదానిని; ద్రుపదరాజ తనయన్‌= (ద్రుపదరాజుయొక్క పుత్రికను; తదీయ, స్వయంవర+ఉత్సవంబు, అపుడు= ఆమె స్వయంవరంయొక్క ఉత్సవమునందు; పరమ, కౌతుకమున= మిక్కిలి ఆసక్తితో; చూడన్‌+కనిన, వారు= చూడగలిగిన వారు; దృష్‌ట్టు, కనిన= కన్నులను(చూపులను) పొందిన; ఫలంబు+ఎల్లన్‌= ఫ€తాన్ని అంతా; కనిన, వారు= పొందినవారు.

తాత్పర్యం: ద్రుపదమహారాజు యజ్ఞమహావేదికనుండి కవచంతో, ధనుస్సుతో, ఖడ్గంతో, బాణాలతో, రథంతో

మహారధు డైన ధృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. అతనితోపాటు “కృష్ణు అనే పేరు కల కూతురుకూడ జన్మించింది.

ఆమె నల్లకలువలవలె నల్లని నిర్మల మైన దేహం కలది. మెజుపుతీగవలె (ప్రకాశిస్తూ నల్లకలువ గంధం వంటి మనోహరమైన శరీర సుగంధం కలది. కనుక అటువంటి ఆ (ద్రౌపదిని మిక్కిలి కుతూహలంతో స్వయంవరోత్సవ సమయంలో చూడగలిగినవాళ్ళే కన్ను లున్న ఫలం పొందినవారు.

నిశేషం: అలం: ఉపమ. మహారథుడు:- పదకొండువేలమంది విలుకాండ్రతో యుద్ధంచేయగల యోధుడు. మరొకవిధంగా =

“తనను సారధిని, గుర్రాలను కాపాడుకొంటూ పోరాడే యోధుడు మహారధుడు' అని కొందరు అంటారు.

వ. అట్టి మహోత్సవంబు చూడ ద్రుపదు పురంబునకుం బోయెద; మందులకు నుత్సవ దర్శనోత్సుకు లై దర్శనీయులుం దరుణులును నపార భూరి దక్షిణ యజ్ఞకరులును ననేకశస్త్రాస్తవిదులును నయిన నానా దేశాధిపతులు నింతకు. జనుదెంతు; రనంతధనంబును బ్రాహ్మణులకు వా రిత్తు; రట్టె మీరును వారిం జూడ వచ్చెదరేని యొక్కటంబోదము రండు. 161

ప్రతిపదార్థం: అట్టి; మహత్‌+ఉత్సవంబు; చూడ; ద్రుపదు; పురంబునకున్‌; పోయెదము; అందులకున్‌: ఉత్సవ, దర్శన+ ఉత్సుకులు+ఐ= స్వయంవరోత్సవాన్ని చూచుటయందు ఉత్సాహం కలిగినవాళ్ళు; దర్శనీయులున్‌= చూడదగిన వాళ్ళూ; తరుణులునున్‌= యౌవనంలో ఉన్నవాళ్ళూ; అపార భూరి, దక్షిణ, యజ్ఞకరులునున్‌= అంతులేని అధిక మైన దక్షిణలతో యజ్ఞాలు చేసేవాళ్ళూ; అనేక శస్తశఅ(స్త్ర, విదులునున్‌= "పెక్కు మంత్రరహిత మంత్రసహిత బాణవిద్యలు తెలిసినవాళ్ళూ; అయిన; నానా, దేశ+అధిపతులున్‌= వివిధ దేశాలరాజులు; ఇంతకున్‌= ఇప్పటికే; చనుదెంచుదురు= వచ్చిఉంటారు; అనంత, ధనంబును= అంతులేని డబ్బును; (బ్రాహ్మణులకు; వారు+ఇచ్చుదురు; అట్టె; మీరునున్‌; వారిన్‌; చూడ; వచ్చెదరు+వీని; ఒక్కటన్‌= ఒకటిగా; కలిసి; పోదము; రండు.

తాత్పర్యం: అటువంటి స్వయంవర మహోత్సవాన్ని చూడటానికి ద్రుపదునినగరానికి మేము వెళ్తున్నాము. ఆ

ఉత్సవం చూడాలన్న కుతూహలంతో చూడముచ్చటైనవాళ్ళు, యౌవనంలో ఉన్నవాళ్ళు, అంతులేని

గొప్పదక్షిణలతో యజ్ఞాలు చేసినవాళ్ళు, అనేక శస్తాస్రాలు తెలిసినవాళ్ళు అయిన వివిధ దేశాల రాజులు ఈ

పాటికి అక్కడికి వచ్చిఉంటారు. వాళ్ళు బ్రాహ్మణులకు అపారమైన ధనాన్ని ఇస్తారట. మెరుకూడ వాళ్ళను

చూడడానికి వచ్చేట్టయితే, కలిసిపోదాం రండి.

క. మీయందీ కృష్ణునుదం।; సాయతభుజుం జూచి తాన హర్షముతోడం దోయజముఖి వరియించును । మా యెటింగినకార్య మిది సమంజసబుద్ధిన్‌. 162

ప్రతిపదార్థం: మీ ఆందు; ఈ; కృష్ణున్‌= ఈ నల్లని వాడిని; ఉదంస+ఆయత, భుజున్‌= గొప్ప భుజశిఖరాలు కల నిడుపైన

బాహువులు కల వాడిని; చూచి" తోయజ, ముఖిజ నీటినుండి పుట్టిన పద్మాలవంటి ముఖం కలది - (ద్రౌపది; తాను+అ= తనంతట తానే, వరియించును; ఇది సమంజస, బుద్ధిన్‌= మిక్కిలి ఒప్పుతున్న బుద్దితో, మా ఎఆింగిన కార్యము.

712 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: మీలో నల్లనివాడు, గొప్ప భుజ శిఖరాలతో కూడిన నిడుపైన చేతులు కలవాడు అయిన ఇతడిని

చూచి, (ద్రౌపది తనంతట తానే వరిస్తుంది. ఇది మా మనస్సుకు తోచిన సమంజస మైన కార్యం.

విశేషం: విప్రుల మాటలలో ఉపశ్రుతివంటి శుభశకునం భావికధార్జాన్ని ధ్వనింపచేస్తున్నది.. (ఉప[శ్రుతినిగురించి చూడు. అది.

7.24,25).

వ. అని మాటలాడుచు వచ్చు బ్రాహ్మణులతోడం బాండవులు ద్రుపదుపురంబున కరుగు వా రెదుర. 163

ప్రతిపదార్థం; అని; మాటలాడుచు; వచ్చు; (బ్రాహ్మణులతో, పాండవులు; దద్రుపదు; పురంబునకు, అరుగువారు= వెళ్ళేవాళ్ళు;

ఎదుర= ఎదుట.

చాత్సర్యం: అని మాట్లాడుకొంటూ వచ్చే బ్రాహ్మణులతో కలిసి పాండవులు (ద్రుపదునిపట్టణానికి వెళ్లుతూ

ఎదుట,

క. కృష్ణమృగాజినధరు దరు । శోష్ణద్యుతితేజుం బంకజోద్ధవసదృశుం గృష్టద్వైపాయను గత ; తృష్టామయుం గాంచి రరుగుదెంచు నుహాత్తున్‌. 164

ప్రతిపదార్థం: కృష్ణు మృగ+అజిన; ధరున్‌= నల్లని ఇర్రితోలు వ(స్త్రంగా కట్టుకొన్న వాడిని; తరుణ+ఉష్ణ ద్యుతి, తేజున్‌=

మధ్యాహ్న సూర్యునివంటి కాంతి కల వాడిని; పంకజ+ఉద్భవ, సదృశున్‌= పద్మమునుండి పుట్టిన బ్రహ్మతో సమానుడైన వాడిని; గత, తృష్టా మయున్‌= పోయిన ఆళ కల వాడిని; అరుగుదెంచు= వస్తున్న; మహాత్మున్‌= మహానుభావుడిని; కృష్ణద్యైపాయను= వేద వ్యాసుడిని; కాంచిరిఐ చూచిరి.

తాత్పర్యం: నల్లని జింకచర్మం ధరించినవాడు, మధ్యాహ్న సూర్యునివంటి కాంతికలవాడు, పద్మంనుండి పుట్టిన

(బ్రహ్మదేవునితో సమానమైనవాడు అయిన వేదవ్యాసుడు, తమకు ఎదురు వస్తుండగా పాండవులు ఏ ఆశాలేని ఆ

మహానుభావుడిని చూచారు.

విశేషం: అలం: ఉపమ.

న. కని వినయమ్మున న మ్మునీంద్రునకు నందఠటు నమస్కరించి కృతాంజులు లై యున్న వారికి ప్యృాదయానందంబుగా సత్యవతీనందనుం డాగామి శుభంబు లావేదించి చనినం బాండవులును గతిపషయ దినంబులకు ద్రుపదుపురంబు సొచ్చి నాలుగు సముద్రంబులుం బోలె ఘూర్లిల్లి మోయుచుం బురంబు నాలుగుదిక్కుల విడిసియున్న నానాదేశాగత మహీనాధుల బహువిధ స్కంధావారంబులం జూచుచుం జని, యొక్కకుంభకారగృహంబున విడిసి, త మ్మెవ్వరు నెలుంగకుండ బ్రాహ్మణవృత్తి నుండు నంతం బాంచాలపతి పార్గువకు గూంతు నీ సమకట్టి పాండవుల నన్వేషించి యెందునుం గానక. 165

ప్రతిపదార్థం: కని=ఐ చూచి; వినయమ్మునన్‌; ఆ+మునీంద్రునకున్‌= ఆముని'శ్రేష్టు డైన వేదవ్యాసునకు; అందరున్‌: నమస్కరించి;

కృత+అంజలులు+ఐ= చేతులు జోడించిన వాళ్ళయి; ఉన్న; వారికి; హృదయ+శఆనందంబుగాజ మనస్సుకు సంతోషం కలిగేటట్టు; సత్యవతీ నందనుండు= సత్యవతియొక్క కుమారుడు; ఆగామి శుభంబులుజ రానున్న శుభాలను; ఆవేదించి= తెలిపి; చనినన్‌= వెళ్ళగా; పాండవులును; కతిపయ, దినంబులకు= కొన్ని రోజులకు; దద్రుపదుపురంబు; చొచ్చిజ (ప్రవేశించి; నాలుగు, సముద్రంబులున్‌+పోలె; ఘూర్షిల్లి= కలతనాంది; మైయుచున్‌, పురంబు; నాలుగు దిక్కుల; విడిసి; ఉన్న= విడిది చేసి ఉన్న; నానా, దేశ+ఆగత, మహీనాథుల= వివిధ దేశాలనుండి వచ్చిన రాజులయొక్క; బహువిధ; స్కంధావారంబులన్‌= అనేక విధాలైన

ఆదిపర్వము - సప్రమాశ్వాసము 713 సైన్యం విడిదిచేసిన చోట్లను; చూచుచున్‌; కని= వెళ్ళి; ఒక్క; కుంభకార గృహంబున= కుమ్మరిఇంటియందు; విడిసి= విడిది చేసి; తమ్ము+ఎవ్వరున్‌= తమను ఎవ్వరుకూడ; ఎజుంగ కుండ, (బ్రాహ్మణ, వృత్తిన్‌; ఉండునంతన్‌; పాంచాలపతి= పాంచాల దేశపు రాజు - ద్రుపదుడు: పార్టునకున్‌= అర్జునకు; కూతున్‌= పుత్రికను; ఈన్‌= ఇచ్చుటకు; సమకట్టి= పూనుకొని; పాండవులన్‌; అన్వేషించి= వెదకి; ఎందునన్‌= ఎక్కడ కూడ; కానక= చూడక, తాత్పర్యం: చూచి, వినయంతో ఆ వేదవ్యాసునికి అందరు నమస్కరించి, చేతులు జోడించి, నిలువగా- వాళ్ళకు సంతోషం కలిగే విధంగా ఆ సత్యవతీనందనుడైన వ్యాసుడు రానున్న శుభాలనుగురించి తెలిపి వెళ్ళాడు. తర్వాత పాండవులు కొద్దిరోజులలో ద్రుపదుని నగరానికి చేరి, నగరం నాలుగుదిక్కుల నాలుగు సముద్రాలవలె ఘూర్షిస్తూ, వివిధ దేశాలనుండి వచ్చిన రాజుల బహువిధసైన్యాలు విడిదిచేసిన స్థావరాలను చూస్తూ, నగరంలో ప్రవేశించి, ఒక కుమ్మరి ఇంట్లో విడిది చేసి, ఎవరూ గుర్తించకుండా బ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు. పాంచాలరాజు అర్జునునికి తన కుమార్తె నివ్వా లని ప్రయత్నించి, పాండవులకొరకు వెదకి, వాళ్ళను ఎక్కడా కనుగొనలేక. విశేషం: అలం: ఉపమ.

(ద్రౌపదీస్వయంవరము (సం.1-176-11) సీ. వైహాయసం బైన నర మత్స్యయంత్రంబు , ని వ్విల్లు మోపిట్టి యెవ్వందేను

శరముల నేయు నశ్రమమున నత(డ నా। తనయకు వరు దగు ధర్మయుక్తి

నని చాటం బంచిన సాఘోషణము విని | యుర్వీశులెల్ల నొందొరులం గడవం

గడువేడ్కందొడి పూసికట్టి విభూతితోం।; దమతమచిహ్నముల్‌ దనరి యెజుక ఆ. _ పడగ వేణువేజ పన్ని భూతలము గ్ర, క్కదల సైన్యపాదఘట్టనమునం

బొలుచు ద్రుపదరాజపుత్తీస్తయంవర । రంగమునకుం జనిరి రమణ తోద. 166 ప్రతిపదార్థం: వైహయసంబు+పన= ఆకాశంలో ఉన్నట్టిదైన; వరు మత్స్యయం'త్రంబున్‌= శ్రేస్ట్రమైన మత్స్యయంత్రాన్ని; ఈ+ విల్లు; మోపెట్టి= ఎక్కుపెట్టి; ఎవ్వండు; ఏను, శరముల= ఐదు బాణాలతో; అశమమునన్‌= (శమ పడకుండా - అనగా సులభంగా; ఏయున్‌= కొట్టునో; అతండు+అ= అతడే; నా, తనయకు= నాకూతురికి; ధర్మయ్యుక్తిన్‌= ధర్మంతోడి కూడికతో అనగా ధర్మ బద్దంగా; వరుండు= మగడు; అగున్‌; అని; చాటన్‌, పంచినన్‌= చాటింపువేయం డని ఆజ్ఞాపించగా; ఆఘోషణాము= ఆ చాటింపు, విని; ఉర్వీ+ఈశులు= భూపతులు, రాజులు; ఎల్లన్‌= అందరు; ఒండొరులన్‌= ఒకరి నొకరు; కడవన్‌= మీరునట్టు: కడు= మిక్కిలి; వేడ్కన్‌= సంతోషంతో; తొడి= సొమ్ములు ధరించి; పూసి= మైపూతలు పూసి; కట్టి; (మంచి) వస్త్రాలు కట్టి; విభూతితోన్‌= సంపదతో; తమ తమ చిహ్నముల్‌= తమ తమ గుర్హులతో (ధ్వజములు మొ ) తనరి= ఒప్పి; ఎజుకపడంగ= తెలిసేటట్టు; వేలువేజు= విడివిడిగా? పన్ని= సిద్ధపడి; సైన్య పాద, ఘట్టమునన్‌= సైన్యాలయొక్క కాలి(బ్రొక్కుడుచేత; భూతలము= భూమి; (క్రక్కదల (కదల+కదల)= మిక్కిలి చలించగా; పొలుచు= ఒప్తునట్టి; ద్రుపదరాజ పుత్రీ స్వయంవర; రంగమునకున్‌= [ద్రాపదియొక్క స్వయం వర స్థానానికి; రమణతోడ= ప్రీతిగా; చనిరి= వెళ్ళారు. తాత్పర్యం; “అకాశంలో కట్టిన మత్స్యయంత్రాన్ని ఈ విల్లు ఎక్కుపెట్టి ఐదు బాణాలతో ఎవడు పడగొడతాడో అతడే ధర్మప్రకారం నా పుత్రికకు భర్త అవుతాడు" అని ద్రుపదుడు చాటింపు శేయగా, ఆ చాటింపు విని రాజులంతా ఒకరికంటె ముందు మరొకరుగా ఎంతో సంతోషంతో ఆభరణాలు ధరించి, మైపూతలు పూసికొని, మంచి వస్త్రాలు కట్టుకొని, ఐశ్యర్యంతో తమ తమ ధ్వజాలు మొదలైన చిహ్నాలు స్పష్టంగా కనబడే విధంగా సిద్ధమై, సైన్యాల కాళ్ల తాకిడికి భూతలం కంపించగా, (ద్రౌపదీ స్వయంవర మండపానికి ప్రీతితో వెళ్ళారు.

క. శ్రీమదాంధ్ర మహాభారతము వ. అదియును బురంబు పూర్వోత్తరదిగ్భాగంబునం జందనోదకసంసిక్త సమీకృతస్టలం బయి, యగాధోన్నత వరిఖాప్రాకారంబులను విశాల ద్వార తోరణంబులను గైలాన శైల విలాసాపహాసి భాసుర గగనతలోల్లేఖిశిఖర రమ్యహర్త్యతలంబులను బహుప్రకారంబు లైన సారువులనుం జేసి యొప్పచున్న నందు యథాస్థానంబుల నానాదేశాధిపతుల నుండంబంచి ద్రుపదుండు వారల నెల్లం బూజించెం: బరమబ్రహ్యణ్యు లగు బ్రాహ్మణులతోడం గలసియున్న పాందవులును బ్రాహ్మణసమూహంబులో నుండి పాంచాలరాజు సమృద్ధినిం జూచి సంతసిల్లి రంత. 167 ప్రతిపదార్హం: అదియును= ఆ (ద్రౌపదీ స్వయంవర రంగం; పురంబు, పూర్వ+ఉత్తర దిక్‌భాగంబునన్‌= పట్టణంయొక్క ఈశాన్య దిక్కున ఉన్న ప్రదేశంలో; చందన+ఉదక, సంసిక్త సమీకృత, స్టలంబు+అయి= మంచి గంధపు నీటిచే తడుపబడి చదరంగా చేయబడిన స్టలం కలదై; అగాధ+ఉన్నత, పరిఖా, (ప్రాకారంబులను= లోత్మైన అగడ్తలతో, ఎత్తైన (ప్రహరులతో; విశాల ద్వార, తోరణంబులను= పెద్దవైన వెలుపలి వాకిళ్ళతో, తోరణాలతో; కైలాస, శైల, విలాస+అపహాసి, భాసుర గగనతల+ఉల్లేఖ; శిఖర, రమ్య, హర్మ్య, తలంబులను= కైలాసపర్వతం యొక్క చక్కదనాన్ని ఎగతాళి చేసేటట్టు ప్రకాశిస్తూ ఆకాళశప్రదేశాన్ని తాకుతున్న కొనలచేత, అంద మైన మేడల ప్రదేశాలతో; సారువులనున్‌చేసి=ఐ మంచెలతో:; ఒప్పుచున్నన్‌= వెలుగుతుండగా' అందు; యధా, స్టానంబుల= ఆయా(ప్రదేశాలలో; నానా, దేశ+అధిపతులన్‌= వివిధ దేశాల రాజులను; ఉండన్‌+*పంచి= ఉండునట్టుగా నియమించి; (ద్రుపదుండు; వారలన్‌; ఎల్లన్‌, పూజించెన్‌ పరమ బ్రహ్మణ్యులు+అగు= మిక్కిలిగ (బ్రాహ్మణత్వము కలిగియున్న వాళ్ళయిన; (బ్రాహ్మాణులతోడన్‌, కలిసి, ఉన్న, పాండవులును; (బ్రాహ్మాణ సమూహంబులోన్‌; ఉండి; పాంచాలరాజు, సమృద్ధినిన్‌= ద్రుపదునియొక్క గొప్పఐళ్యర్యాన్ని, చూచి; సంతసిల్లిరి; అంత, తాత్సర్యం: ఆ (ద్రౌపదీ స్వయంవర రంగం నగరానికి ఈశాన్య దిక్కున, మంచి గంధపు నీటితో తడుపబడి చదరంగా చేయబడిన స్థలం కలదై, లోతైన అగడ్తలతో, ఎత్తైన (ప్రాకారాలతో, విశాలా లైన ద్వారాలతో, వెలుపలి వాకిళ్లతో, కైలాస పర్వత సౌందర్యాన్ని ఎగతాళిచేసే విధంగా ప్రకాశిస్తూ, ఆకాశా న్నంటే శిఖరాలు కల అందమైన సౌధ (ప్రదేశాలతో, అనేకవిధా లైన మంచెలతో అమరి ఉండగా, అందులో వివిధ దేశాల రాజులకు ఆయా ప్రదేశాలలో విడిది కల్పించి, (ద్రుపదుడు వాళ్ళందరిని పూజించాడు. ఉత్తమ (బ్రాహ్మణులతో కలిసి ఉన్న పాండవులు, ఆ (బ్రాహ్మణ సమూహంలో ఉంటూనే, పాంచాలరాజు ఐళ్యర్యాతిశయాన్ని చూచి, సంతోషించారు. తరువాత. విశేషం: అలం: ఉపమ. అంత్యానుప్రాసం. సీ. ధవళవిభూషణ దామానులేపనా। మలినాంగి సితపుష్పమాల చేతం గొని పుష్పసాయకు కుసుమేతరం బైన ; యాఅగు సాయకం బనంగ జనులు ధవళాక్షి రంగమధ్యంబునం దనుమధ్య । దా నొప్పి పాంచాలతనయ యున్న భూసురప్రవరుల పుణ్యాహఘోషంబు । విలసిల్లె నాశీర్వివృద్ధితోడ ఆ. ధ్రుపదపతి పురోహితుండును గృతపరి । స్తరణు6 డై ప్రయోగదక్షుం డగ్ని ముఖము సేసి వేల్వ మొనసి వివాహోప । కరణ వస్తుచయము గాచియుండె. 168 ప్రతిపదార్థం: ధవళ, విభూషణ, దామ+అనులేపన+అమలిన+అంగి= తెల్లని ఆభరణాలను, మాలలను మైపూతను కల నిర్మల మైన దేహం కలది; ధవళ+అక్షి=ఐ తెల్లని కన్నులు కలది; తను, మధ్య= సన్నని నడుం కలది; పాంచాల తనయజ పాంచాల రాజు కూతురు అయిన (ద్రౌపది; సిత, పుష్పమాల= తెల్లని పూలదండను; చేతన్‌+కొని= చేతిలో ధరించి; జనులు" పుష్ప, సాయకు,

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 7215 కుసుమ+ఇతరంబు+ఐన= పూవులను బాణాలుగా గల మన్మథునియొక్క పూవులకంటె ఇతరమైన; ఆజు+అగు, సాయకంబు+ అనంగ= ఆరవ బాణమా అని అనగ్యా; రంగమధ్యంబునన్‌= స్వయంవర రంగం మధ్యలో; తాన్‌; ఒప్పి= ప్రకాశించి; ఉన్న ఉండగా; భూసుర, ప్రవరుల, పుణ్యాహఘోషంబు= (బ్రాహ్మణశ్రేష్టులయొక్క పుణ్యాహము అనే ధ్వని; ఆశీ:+వివృద్రితోడ= ఆశీర్వాదాల అతిశయంతో; విలసిల్లెన్‌= ఒప్పెను; ప్రయోగ దక్షుండు= వైదికకర్మలు చేయించటంలో సమర్హుడు; ద్రుపద పురోహితుండును; కృత, పరిస్తరణుండు+ఐ= చేయబడిన పరిస్తరణం కలవాడై - అనగా అన్నిచుట్టును దర్భల సమూహాన్ని, అలంకరించిన వాడై; అగ్జిముఖము= అగ్నియొక్క హోమారంభం; చేసి" వివాహ+ఉపకరణ, వస్తు చయము= పెండ్తికి సాధనాలైన వస్తువుల సమూహాన్ని, వేల్వ= హోమం చేయటానికి; మొనసి= పూని: కాచి, ఉండె= వేచిఉన్నాడు. తాత్పర్యం: పాంచాలరాజతనయ (ద్రౌపది - అందమైన సన్నని నడుముతో, తెల్లని కళ్ళతో, అలంకరించుకొన్న తెల్లని ఆభరణాలతో, పూలదండతో, మైపూతతో, నిర్మల దేహ కాంతితో, తెల్లటి పూదండ ఒకటి చేత ధరించి ప్రజలంతా తననుచూసి “ఈమె మన్మథుని అయిదు పూల భాణాలకంటే వేరైన ఆరవ పూభాణమా అని అనుకొంటుండగా- స్వయంవర రంగ మధ్యంలో నిలిచి ఉన్నది. (బ్రాహ్మణ శ్రేష్టుల పుణ్యాహధ్వని, ఆశీర్చచనాలు అతిశయిల్దాయి. వైదిక కర్మలు చేయించటంలో చాలా సమర్జుడైన ద్రుపద పురోహితుడు అగ్నిచుట్టూ దర్భలు అలంకరించి, హోమారంభంచేసి, వివాహానికి తగిన వస్తు సమూహాన్ని హోమం చేయటానికి సిద్దమై వేచి ఉన్నాడు. విశేషం: అలం: ఉశత్రేక్ష న. అట్టి యవసరంబున బోరన మోయు జనులయుథివును వాదిత్రనాదంబును వారించి ధృష్టద్యుమ్నుండు

మూఃగినరాజలోకంబు నెల్లం జూచి యగ్నిసమీసంబున గంధపుప్పధూపదీపార్చితం బైన విల్లును నమ్ములను

వైహాయసం బైన లక్ష్యంబును వారలకుం జూపి యి ట్లనియె, 169 (ప్రతిపదార్థం: అట్టి, అవసరంబున= అట్టి సమయంలో; బోరన; ('మైోయు; జనుల, ఉలివును= జనులు మాట్లాడుకొనే మాటల సవ్వడిని; వాదిత్రనాదంబును= వాద్యాల ధ్వనిని వారించిఐ ఆపి; ధృష్టద్యుమ్నుండు; మూంగిన= కూడిఉన్న;ు రాజ, లోకంబున్‌+ఎల్లన్‌= రాజుల సమూహాన్నంతా; చూచి; అగన్షి, సమీపంబున= అన్నిహోత్రం దగ్గర; గంధ, పుష్ప ధూప, దీప+అర్చితంబు+అయిన= గంధంచేత, పూవులచేత, ధూపంచేత, దీపంచేత పూజింపబడిన దైన; విల్లును: అమ్ములను= బాణాలను; వైహాయసంబు+ఐన= ఆకాశాన ఉన్నట్టి దైన: లక్ష్యంబును= గురి యైన మత్స్యయంత్రాన్ని; వారలకున్‌; చూపి. ఇట్టు+అనియె. తాత్పర్యత: ఆ సమయంలో హోరు మనే ప్రజలధ్వనినీ, వాద్యాలధ్వనినీ ఆపి, ధృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన రాజ సమూహాన్నంతా చూచి, అగ్నిహోత్రం దగ్గర గంధ పుష్ప ధూప దీపాలతో పూజింపబడిన ధనుస్సును, బాణాలను, ఆకాశంలో ఉన్న మత్స్యయంత్రాన్ని వాళ్ళకు చూపి, ఈ విధంగా పలికాడు. తరువోజ.

ఈ విల్లు మోపెట్టి యేను బాణముల । నీ యంత్రమత్స్వంబు నేసిన వాండ

భావజప్రతిముం డిబ్బాలకుం దగిన । పతి; యిది మునిశక్తి- బదసిన విద్య;

గావున మీ రిప్ణుగావింపుం డిదియ : ఘనతర కార్ముక కౌశలోన్నతియు

లావును గలవారలకు నవసరము ; లలితయశంబు6 గల్యాణంబు బడయ. 170 ప్రతిపదార్థం: ఈ, విల్లు; మోపెట్టి= ఎక్కుపెట్టి; ఏను, బాణములన్‌= ఐదుబాణాలచేత; ఈ, యంత్ర, మత్స్యంబున్‌= ఈ యంత్రంలోని చేపను; ఏసిన, వాండు+అజ కొట్టినవాడే; భావజ, (ప్రతిముండు= మన్మధుని పోలినవాడు; ఈ, బాలకున్‌= ఈ

726 శ్రీమదాంధ్ర మవాభారతము

కన్యకు - (ద్రౌపదికి; తగిన, పతి=తగిన మగడు; ఇది= ఈ మత్స్యయంత్రం; ముని, శక్తిన్‌= బుషియొక్క శక్తిచేత; పడసిన=

పొందిన; విద్య; కావున; మీరు; ఇప్పు; కావింపుడు= 'ప్రయత్నింపుడు; ఘనతర, కార్ముక, కాశల+ఉన్నతియు= మిక్కిలి గొప్పదైన

ధనుస్సునందలి నైపుణ్యంయొక్క అతిశయాన్ని; లావును= బలమును; కలవారలకున్‌; ఇదియు+అ= ఇదే, లలిత యశంబున్‌= చక్కని కీర్తిని; కళళ్యాణంబున్‌= శుభాన్ని, వివాహాన్ని; పడయన్‌= పొందటానికి; అవసరము= (తగిన) సమయం.

తాత్పర్యం: ఈ విల్లును ఎక్కుపెట్టి, ఐదు బాణాలతో ఈ యం(త్రంలోని మత్య్యాన్ని కొట్టినవాడే ఈ కన్యకు

తగిన మన్మథ సమాను డైన భర్త ఈ మత్స్య యంత్రం మునిశక్తితో పొందిన విద్య. కనుక ఇప్పుడు మీరు

(ప్రయత్నించండి. విలువిద్యలో గొప్పసామర్ష్యం, బలం కలవాళ్ళు చక్కనిక్తీర్తిని, కల్యాణాన్ని పొందటానికి ఇదే సరైన

సమయం.

న. అని ధృష్టద్యుమ్నుండు మూంగిన రాజపుత్తులకు నెల్ల నెణుంగం జెప్పి, ద్రుపదరాజపుత్రిం జూచి 'యఖిలజలధి వేలావలయవలయిత మహీతలంబునం గల రాజనందను లెల్ల నీస్వయంవరంబునకు వచ్చినవారు; వీరలం జూడు' మని దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ ప్రముఖు లయిన ధృతరాష్టనందనుల నూర్వురం, దత్సమీ పంబున నున్న కర్ణాశ్వత్థామ సోమదత్త భూరిత్రవక్షుతసేనాదులను, బుత్తభ్రాత్భృసమేతు లయి యున్న శల్య విరాట జరాసంధ గాంధారపతులను, నక్రూర సారణ సాత్యకి సాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ కృతన ర్మా నిరుద్ధ యుయుధాన ప్రముఖులైన యదువృష్టి భోజాంధకవరులను, సుమిత్ర సుకుమార సుశర్మ సుదక్షిణ సుషేణ సేనాబిందు చంద్రసేన సనుద్రసే నౌశీనర చేకితాన శిశుపాల శ్రేనిమ జ్ఞనమేజయ జయద్రథ బృహద్రథ సత్యవ్రత చిత్రాంగద శుభాంగద భగీరధ భగదత్త పౌండ్రకవాసుదేవ వత్సరాజ ప్రభృతు లయిన నానాదేశాధీశులను వేదధ్వని సనాథం బై యొప్పచున్న బ్రాహ్మణసమూహంబునుం జూపి. 171

ప్రతిపదార్హం: అని; ధృష్టద్యుమ్నుండు; మూంగిన= చేరిన; రాజ, పుత్రులకున్‌+ఎల్లన్‌= రాజకుమారులందరికి; ఎజుంగన్‌+చెప్పి; 'ద్రుపదరాజ, పుత్రిన్‌+చూచి= ద్రౌపదిని చూచి; అఖిల, జలధి, వేలా, వలయ, వలయిత, మహీతలంబునన్‌+కల= అన్ని సముద్రాల చెలియలికట్టలు అనే వలయంచేత చుట్టబడిన భూటప్రదేశంలో; కల, రాజ, నందనులు+ఎల్ల= రాజకుమారులందరు; నీ, స్వయం వరమునకు; వచ్చినవారు; వీరలన్‌, చూడుము+అని; దుర్యోధన, దుశ్ళాసన, దుర్ముఖ, (ప్రముఖులు+అయిన= దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్ముఖుడు మొదలైన: ధృతరాష్ట్ర నరీదనుల= ధృతరాష్ట్రుని కుమారుల; నూజువురన్‌= నూరుమందినీ: తచ్‌+సమీపంబునన్‌= అక్కడికి దగ్గరగా నున్న; కర్ష+అశ్వత్హామ, సోమదత్త భూరి(శ్రవస్‌, (శ్రుతసేన; ఆదులను= మొదలగువారినీ; పుత్ర, భ్రాత్మ సమేతులు+అయి ఉన్న= కొడుకులతో, తోబుట్టువులతో, కూడిఉన్న; శల్య, విరాట, జరాసంధ, గాంధార పతులనున్‌; ఆక్రూర, సారణ, సాత్యకి, సాంబ, సంకర్షణ, (ప్రద్యుమ్న. కృష్ణ కృతవర్మ+అనిరుద్ద,, యుయుధాన: ప్రముఖులు+ అయిన= మొదలైన; యదు, వృష్టి భోజ+అంధక, వరులనుజ యదు, వృష్టి భోజ అంధక వంశ శ్రేష్టులనూ; సుమిత్ర, సుకుమార, సుశర్మ, సుదక్షిణ, సుషేణ, సేనాబిందు, చంద్రసేన, సముద్రసేన, బౌశీనర, చేకితాన, శిశుపాల, (శ్రేణి మత్‌+జనమేజయ, జయ(ద్రధ బృహ(ద్రధ, సత్యవ్రత, చిత్రాంగద, శుభాంగద, భగీరథ, భగదత్త పౌండ్రకవాసుదేవ, వత్సరాజ, (ప్రభృతులు+అయిన= మొదలగు వారైన; నానా, దేశ+అధీశులను= వివిధదేశాల రాజులనూ; వేద, ధ్వని, సనాధంబు+ఐజ= వేద ధ్వనులతో కూడినదై! ఒప్త్పుచున్న= ప్రకాశిస్తున్న; బ్రాహ్మాణ, సమూహంబునున్‌= (బ్రాహ్మణులయొక్క సమూహాన్నీ; చూపి.

తాత్పర్యం: అని ధృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన రాజపుత్రుల కందరికి తెలియజెప్పాడు, (ద్రౌపదిని చూచి, “సమస్త

భూమండలంలో కల రాజకుమారులంతా నీ స్వయంవరానికి వచ్చారు. వీళ్ళను చూడు'మని- దుర్యోధనుడు,

దుశ్ళాసనుడు మొదలైన ధృతరా(ష్టకుమారులు నూరుగురినీ- ఆ సమీపంలోనే ఉన్న కర్షుడు, అశ్వత్థామ,

ఆదిపర్వము - సప్తమాశ్వానము 727 సోమదత్తాదులనూ, కొడుకులతో సోదరులతో కూడి ఉన్న శల్య, విరాటాదులనూ- అక్రూరుడు, సారణుడు, సాత్యకి మొదలైన యదు వృష్టి భోజ అంధక వంశ (్రేష్టులనూ- సుమిత్రుడు, సుకుమారుడు మొదలైన వివిధ దేశాల రాజులనూ, వేద ధ్వనితో ప్రకాశిస్తున్న (బ్రాహ్మణ సమూహాన్నీ చూపి. విశేషం: స్వయంవరం - క్షత్రియకన్యలు వివిధదేశాలనుండి వచ్చిచేరిన రాజకుమారుల సభలో, స్వయంగా తమ కిష్టమైన వరుని వరించే ఉత్సవం,

రాజపుత్రులు మత్స్యయం(త్రమును ఖేదింపంబోయి భంగపడుట. (సం.1-177-22)

ఆ. _ 'ఇందు లక్ష్య మెవ్వం దేసి నాతని వరి । యింపు నెమ్మితోడ నిందువదన!'

యనిన రాజపుత్తు లవ్విల్లు మోపెట్టి; యేయంగడంగి కదలి రెల్లవారు. 172 ప్రతిపదార్థం: ఇందు, వదన= చంద్రునివంటిముఖం కలదానా! ఇందు= వీరందరిలో; లక్ష్యము= గురి అయిన మత్స్యయంత్రాన్ని; ఎవ్వండు; ఏసెన్‌= కొట్టాడో; అతని; నెమ్మితోడన్‌= (ప్రేమతో; వరియింపు= వరింపుము; అనిన, రాజ, పుత్రులు; ఎల్లవారు= అందరు ఆ+విల్లు; మోపెట్టి= ఎక్కుపెట్టి; ఏయన్‌= కొట్టటానికి; కడంగి= పూనుకొని; కదలిరి= ముందుకు సాగారు. తాత్పర్యం: 'చంద్రునివంటి ముఖం కల ఓ (ద్రౌపదీ! వీరిలో మత్స్యయంత్రాన్ని కొట్టినవాడిని (ప్రేమతో వరించుము" అని పల్కగా రాజకుమారులంతా ఆ విల్లు ఎక్కుపెట్టి కొట్టటానికి పూనుకొని కదిలారు. సీ. అమ్మహోత్సవము నెయ్యమ్మునం జూదంగ. దివిరి యేతెంచిన దివిజ ఖచర

గరుడ గంధర్వ కిన్నరుల విమానముల్‌। విలసిల్లె నంబర తలమునందు/

బణవవీణావేణురణితానుసార మై । రసగీతరవ మెల్ల దెసల నెసంగె;

బోరన వివిధ తూర్యారవంబులు మహా । వననిధి ధ్వానంబు ననుకరించె; ఆ. _ దివ్యమాల్యములయు దివ్యానులేపన ।; ములయు సౌరభంబు వెలయ. దాల్చి

రంగమథధ్యజనులకుం గడు తనుపుగాం, జేరి వీచె దివ్య మారుతంబు. 173 ప్రతిపదార్దం: ఆ+మహోత్సవము; నెయ్యమ్మునన్‌= ప్రీతితో: చూడంగన్‌: తివిరి= కోరి: ఏతెంచిన; దివిజ, ఖఇచర, గరుడ, గంధర్వ, కిన్నరుల విమానముల్‌?; అంబరతలంబునందున్‌= ఆకాశ ప్రదేశంలో; విలసిల్లైన్‌= ప్రకాశించాయి; పణవ, వీణా, వేణు, రణిత+ అనుసారము+ఐ= మద్దెలల, వీణల, పిల్లన[గ్రోవుల ధ్వనిని అనుసరించిన దై; రస, గీత, రవము= ఆనందాన్ని కలిగింఊ సంగీతద్వని; ఎల్ల దెసలన్‌= అన్నిదిక్కుల; ఎసలెన్‌= వ్యాపించెను; బోరన: వివిధ తూర్య+ఆరవంబులు= అనేక విధా లైన వాద్యాల ద్వనులు; మహా, వన, నిధి ధ్వానంబున్‌= మహాసముద్రము యొక్క ధ్వనిని; అనుకరించె= పోలెన్‌: దివ్య, మాల్యములయు= మం , పూలదండలయొక్క; దివ్య+అనులేపనములయు= మంచి పూతల యొక్క - అనగా గంధం మొదలైన మైపూత (ద్రవ్యాలయొక్క: సౌరభంబు= సువాసన; వెలయన్‌= ఒప్పగా; తాల్చి= ధరించి; రంగ, మధ్య, జనులకున్‌= స్వయంవర రంగం మధ్యాన ఉన్న జనులకు; కడు= మిక్కిలి; తనుపుగాన్‌= తృప్తిగా; దివ్య, మారుతంబు= మంచి గాలి; జేరి; వీచెన్‌. తాత్పర్యం; దేవతలు, ఆకాశసంచారులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు ఆ ద్రౌపదీ స్వయంవర మహోత్స వాన్ని చూడగోరి ప్రీతితో రాగా, వాళ్ళవిమానాలు ఆకాశంలో ్రకాశించాయి. మద్దెలల, వీణల, పిల్లన(గ్రోవుల ధ్వనిని అనుసరిస్తూ రసమయ సంగీత ధ్వని అన్నిదిక్కుల వ్యాపించింది. అనేకవిధాలైన వాద్యాల ధృనులహోరు మహాసముద్ర ధ్వనిని పోలి ఉండింది. మంచిపూదండలు, గంధం వంటి మంచి మైపూతలు మొదలైనవాటి సువాసనతో కూడిన మంచిగాలి, స్వయంవర రంగ మధ్యంలో ఉన్న జనులకు తృప్తి కలిగేవిధంగా వీచింది. విళషం: ఉపమ

718 శ్రీమదాంధ్ర నుహాభారతము చ. అవిరళ భస్మ మధ్యమున నగ్నికణంబుల పోలె బ్రాహ్మణ

ప్రవరులలోన నేర్చడక పాందవు లేవురు నున్న. జూచి యా

దవ వృషభుండు కృష్ణుండు ముదంబున వారి నెజింగి, పార్భుం డీ

యువతింబరిగ్రహించు ననియుం దలంచెన్‌ హృదయంబులోపలన్‌. 174 ప్రతిపదార్థం: అవిరళ భస్మ, మధ్యమునన్‌= దట్టమైన బూడిద నడుమ; అగ్ని కణంబుల, పోలె=ఐ నిప్పు ముక్కల వలె; బ్రాహ్మణ ప్రవరులలోన్‌= (బ్రాహ్మణ(్రేష్టులలో; పాండవులు+ఏవురున్‌= పాండవు లైదుగురూ; ఏర్పడక= తెలియరాక; ఉన్నన్‌' చూచి; యాదవ, వృషభుండు= యాదవులలో (శ్రేష్టుడు; కృష్ణుండు; ముదంబున= సంతోషంతో; వారిన్‌; ఎజింగి: పార్టుండు= అర్జునుడు; ఈ, యువతిన్‌= ఈ కన్యను - (ద్రౌపదిని; పరి[గ్రహించున్‌= చేపట్టును; అనియున్‌; హృదయంబులోపలన్‌; తలయెన్‌. తాత్పర్యం: దట్టమైన బూడిద నడుమ నిప్పు కణాలవలె (బ్రాహ్మణ (శ్రేష్టుల మధ్య పాండవు లైదుగురూ స్పష్టంగా తెలియరాకుండా ఉండటం చూచి, ఆ యాదవ (్రేష్టు డైన శ్రీకృష్ణుడు సంతోషంతో వాళ్ళను గుర్తించి, అర్జునుడు ఈ (ద్రౌపదిని చేపట్టగలడని కూడ మనస్సులో అనుకొన్నాడు. విశేషం: అలం: ఉపమ. సత్త్వగుణ (ప్రధానులు, పవిత్రులు అయిన బ్రాహ్మణశ్రేష్టుల సమూహాన్ని భస్మానికి, సత్త్యరజోగుణ (ప్రధానులు (బ్రాహ్మణ వేషాలతో (బ్రాహ్మణులమధ్యలో ఉన్న పాండవులను అగ్నికణాలతో పోల్చటం అర్ధవంతంగా మనోహరంగా ఉన్నది. పాండవులను నివురుకప్పిన నిప్పుకణాలుగా వర్షించటం రుచిరార్హసూక్తిమత్వం. బ్రాహ్మణవేషాలు తాలగి నిజరూపాలు వెలువడే సమయం వచ్చిందని రంగమధ్యంలోని గాలి ధ్వనిస్తున్నది. నివురుకప్పిన నిప్పులనుసైతం గుర్తింపగలిగిన శ్రీకృష్ణుని దివ్యప్రతిభ ఇందులో గమ్యమానం. “ఏర్పడక పాండవు లేవురు నున్నన్‌-చూచి' అన్నప్పుడు ఉండగా చూచి, అనిన్నీ, ఉన్నప్పటికీ గమనింపకలిగి (తెలిసికొని చూచి) అనిన్నీ చెప్పుకొనేటట్టు రచించటం నన్నయ సూక్తిప్రయోగనైపుణ్యం. త్రీకృష్ణాదులు మత్స్యయం(త్ర భేదనంలో పాల్గొనకపోవటానికి కారణం ధ్వనిమయం చేసి కథను ప్రసన్నంచేశాడు నన్నయ. (సంపాం) న. అంత నా రాజనందనులు దధ్రుపదరాజనందనం జూచి కందర్సబాణబాధితు లయి తమ్మును దమ

సామర్థ్యమ్ము నెటుంగక యర్ధిత్వంబున నవ్విల్లు మోపెట్టం బోయి. 175 ప్రతిపదార్థం: అంతన్‌, ఆ రాజనందనులు= ఆ రాజకుమారులు; (ద్రుపదరాజ, నందనన్‌= (ద్రుపదరాజుయొక్క కూతురైన (ద్రౌపదిని; చూచి; కందర్భ, బాణ, బాధితులు+అయి= మన్మథునిబాణాలచేత బాధింపబడినవాళ్ళయి; తమ్మును; తమ, సామర్థ్యం బును; ఎలుంగక; అర్థిత్వంబునన్‌= ఆశచేత; ఆ+విల్టు; మోపెట్టన్‌+పోయి= ఎక్కుపెట్టపోయి. తాత్సర్యం: తరువాత ఆ రాజకుమారులు (ద్రౌపదిని చూచి మన్మథబాణ పీడితులై తమను, తమ పరా(క్రమాన్ని అంచనా, వేసుకోలేక ఆశతో ఆ విల్లును ఎక్కుపెట్టటానికి పోయి. క. వడినౌడుగజచి, వలకేల్‌। నిడుచన గనయమునం బెనంచి, నల్లి, బలం బే

ర్వడ విల్లు వంపనోపక । యుడిగిరి నృపసుతులు గొంద జొయ్యన లజ్జన్‌. 176 ప్రతిపదార్థం: నృప, సుతులు= రాజపుత్రులు; కొందరు; వడిన్‌= వేగమే; బొడు, కజచి=ఐ పెదవిని పళ్ళతో బిగబట్టి; వలకేల్‌= కుడిచేతిని; నిడుచన= పొడవగునట్టు;: గనయమునన్‌= వింటికొప్పునందు; పెనచి= చుట్టి; నీల్షి= ఒళ్ళువిరుచుకొని; బలంబు; ఏర్పడన్‌= బైటపడగా; విల్లు: వంపన్‌+ఓపక= వంచలేక; ఒయ్యన= తిన్నగా; లజ్జన్‌= సిగ్గుచేత; ఉడిగిరి= ప్రయత్నాన్ని మానుకొన్నారు.

ఆదిపర్వము - సప్తమాశ్వాసము రాం తాత్సర్యం: రాజకుమారులు కొందరు వేగంగా తమసెదవిని పళ్ళతో బిగబట్టి, కుడిచేతిని చాచి, వింటికొప్పును పట్టి, నీల్లి తమబలం బైటపడగా, ఆ వింటిని వంచలేక సిగ్గుపడి ఆ ప్రయ్నతం మెల్లగా మానుకొన్నారు. క బలవంతుల బలమజంగా ।; మలువక మ్రానానిపాట మాయాధను వి

మ్ములం జేసిన మోపెట్టంగం। గొలందియె యని డాయ రైరి కోందలు దానిన్‌, శ77

ప్రతిపదార్థం: కొందరు; బలవంతులు; బలము; అజ(గా= నళించేటట్టు; మలువక= వంపక; (మ్రాన్‌+మ్రాని పాట= (మ్రాకులలో పెద్ద మూకువలె; మాయా, ధనువు; ఇమ్ములన్‌= చక్కగా; చేసిన; మోపెట్టంగన్‌= ఎక్కుపెట్టటకు; క్‌ లదియె= సాధ్యమా; అని; దానిన్‌= ఆ ధనుస్సును; డాయరు+అయిరిజ= దగ్గరకే పోక పోయారు.

తాత్పర్యం: 'బలవంతుల బలం అణగేవిధంగా దానిని వంచకి 'మ్రూనులలో పెద్దమ్రానువలె ఉన్న ఈ మాయా

ధనుస్సును ఈ విధంగా చేస్తే ఎవరు ఎక్కుపెట్టగలరు?' అని కొందరు రాకుమారులు దాని దగ్గరకే పోలేదు.

ము. 'ఇదియెట్లున్‌ సమకూర దెవ్వరికి; ము న్నీ విల్లు మోపెట్టం బో

లదు; మోపెట్టియు నంతరిక్షమున నా లక్ష్యంబు భేదింపంగా

నది బ్రహ్మాదుల కైన నిం దలవిగా' దంచున్‌ విచారించి ని

ర్మదు లై కొందణురాజు లేంగిరి నిజక్షామార్గముల్‌ చూచుచున్‌. 178 ప్రతిపదార్థం: ఇది= ఈ (ద్రౌపది; ఎట్టున్‌= ఏ విధంగా కూడ; ఎవ్వరికి; సమకూరదు= లభించదు; మున్ను= ముందు; ఈ, విల్లు;

మోపెట్టన్‌= ఎక్కుపెట్టటానికి: పోలదు= సాధ్యంకాదు; మోపెట్టియున్‌= ఎక్కుపెట్టినప్పటికిని; అంతరిక్షమున= ఆకాశంలో: ఆ,

లక్ష్యంబు= ఆ గురిని - మత్స్యయంశత్రాన్ని; భేదింపగాన్‌= కొట్టటం; అది; బ్రహ్మ+ఆదులకు+ఐన= (బ్రహ్మ మొదలైన వాళ్ళకు

కూడ; ఇందు; అలవి, కాదు= సాధ్యం కాదు; అంచున్‌= అని అంటూ: విచారించి= ఆలోచించి; కొందజు, రాజులు; నిర్మదులు+ ఐ= మదంలేని వాళ్ళయి; నిజ, క్ష్మా మార్గముల్‌= తమ భూముల త్రోవలు - అనగా తమ ఊరిత్రోవలు: చూచుచున్‌: ఏంగిరి= వెళ్ళిరి.

తాత్పర్యం: “ఈ (ద్రౌపది యే విధంగా కూడ ఎవ్వరికీ లభించదు. మొదట ఈ విల్లు ఎక్కుపెట్టటమే సాధ్యం

కాదు. ఎక్కుపెట్టినా, ఆకాశంలోని ఆ మత్స్యయంత్రాన్ని భేదించటం బ్రహ్మాదుల కైనా అలవికాదు' అని

ఆలోచించి కొందరు రాజులు గర్వం వదలి తమ ఊరి దారి పట్టారు.

విశేషం: భూవలయంలో ఉన్న రాజులంతా మూగిన సభ అది. అందులో చాలమంది విల్టును ఎత్తే శక్తిలేక ఓటువడ్డారు. వాళ్ళంతా

ఆ విల్లైత్తటం, ఆపైన మత్స్యయంత్రాన్ని భేదించటం సాధ్యమయ్యే పని కాదనీ, (ద్రౌపదిస్తయంవరం సఫలం కాదనీ భావించి తమ

తమ దేశాలకు తిరిగిపోయారు. ఈ వర్ణనం మత్స్యయంత్రాన్ని భేదించే అర్జునుని. అర్జునుని సామర్జ్యాతిశయాన్ని మరింత

(ప్రకాశింపచేసేదిగా ఉన్నది.

అర్జునుడు నుత్యయందత్రంబుం దెగ నేయుట (సం.1-179-4)

వ. ఇట్లు రాజపుత్తు లవ్విల్లు మోపెట్ట నోపక నివృత్తు లయిరి; మజి యదు వృష్టి భోజాంధకులు కృష్ణానుమతంబున సజ్య కర్మంబునం దనారంభు లయి మిన్నకుండి; రంత శిశుపాల జరాసంధ శల్యకర్దులు దర్పితు లై తము తమ లావులు మెజసి క్రమంబున నలువురు మాష యవ ముద్గ రోమ మాత్రంబులు దక్క గొనయం బెక్కించియు మోపెట్ట నశక్యంబయిన నుక్కుసెడి స్రుక్కిన; వారలం జూచి యగ్రజు ననుమతంబున విప్రసభ వెలునడి విజయుండు ధనుస్సమీపంబున కరిగిన, నాతని యుత్సాహంబున కచ్చెరువడి కొందలు బ్రాహ్మణులు దమలో ని ట్లనిరి. 179

70 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: ఇట్లు; రాజపుత్రులు; ఆ+విల్లు: మోపెట్టన్‌+ఓపక= ఎక్కుపెట్టలేక; నివృత్తులు+ఐరి= వెనుదిరిగి పోయారు' మజీ= యదు; వృష్టి భోజ+అంధకులు; కృష్ణ+ఆనుమతంబునః= కృష్ణుని అభి(ప్రాయాన్ని అనుసరించి; సజ్య, కర్మంబునందు= ఎక్కు పెట్టే పనియందు; అనారంభులు+ఐ= ఆరంభం చేయని వా ళ్ళయి- అనగా ప్రయత్నం చేయనివాళ్ళయి' మిన్నక+ఉండిరి= ఊరకున్నారు; అంత; శిశుపాల, జరాసంధ, శల్య, కర్ణులు; దర్పితులు+ఐ= గర్వంతో కూడుకొన్నవారై; తమ తమ లావులు= తమతమ బలాలు; మెజసి; క్రమంబునః= వరుసగా; నలువురు; మాష యవ, ముద్ద, రోమ, మాత్రంబులు= మినుపగింజ యవగింజ, పెసరగింజ, వెండ్రుకల అంత మాత్రములు; తక్క= తక్కువగా, (మిగులునట్టుగా); గొనయంబు= అల్లెత్రాటిని; ఎక్కించియు; మోపెట్టన్‌= ఎక్కుపెట్టుటకు; అశక్యంబు+అయినన్‌= సాధ్యం కాకపోగా; ఉక్కు, చెడి= బలం లేక; స్రుక్కిన= సోలగా; వారలన్‌: చూచి; అ(గ్రజు, అనుమతంబున= అన్న మైన ధర్మరాజుయొక్క సమ్మతిచేత; విప్రసభ= (బ్రాహ్మణుల సభనుండి; వెలువడి; విజయుండు= అర్జునుడు, దధనుస్‌+సమీపంబునకు అరిగినన్‌= వెళ్లగా; అతని ఉత్సాహంబునకు; అచ్చెరువు, పడి= ఆశ్చర్యపడి; కొందరు, బ్రాహ్మణులు; తమలోన్‌; ఇట్టు+లనిరి. తాత్పర్యం: ఈ విధంగా రాజకుమారులు ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేక వెనుదిరిగి పోయారు. యదువృష్లి భోజాంధకులు శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని అనుసరించి ధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలేదు. శిశుపాల, జరాసంధ, శల్య, కర్టులు గర్వితు లై తమ తమ బలాలు వెల్లడి కాగా- క్రమంగా మినుపగింజ, యవగింజ, 'పెసరగింజ, వెండ్రుక - అంతమా(త్రం తక్కువగా అల్లెత్రాటిని ఎక్కించి కూడ, ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేక బలం చెడి సోలిపోయారు. వాళ్ళను చూచి అర్జునుడు తన అన్న ధర్మరాజు అనుమతిని పాంది (బ్రాహ్మాణసభ నుండి వెలువడి ధనుస్సు దగ్గరికి వెళ్లగా, అతని ఉత్సాహానికి ఆశ్చర్యపడి కొందరు (బ్రాహ్మణులు తమలో ఇట్టా మాట్టాడుకొన్నారు. విశేషం: అలం: (క్రమము. మత్స్యయంత్రం భేదించలేని రాజులను నన్నయ నాల్లువిధాలుగా వర్గీకరించి వర్షించాడు. 1. విల్డు నెత్తటానికి ప్రయత్నించి విఫలు లైనవారు. 2. విల్లు నెత్తటం, మత్స్యయంత్రం కొట్టటం సాధ్యం కాదని భావించి పోటీ మానుకొని ఇండ్లకు పోయినవారు. 3. ఆ పోటీలో పాల్గొనాలని వచ్చి పోటీలో పాల్గొనక నిర్లిప్పలుగా ఉండిపోయినవారు. 4. పోటీలో పాల్గొన్నా అల్లెత్రాటిని ఎక్కించేవరకు వచ్చి కొద్దిలో తప్పినవారు. ఈ నాలుగువర్గాల రాజకుమారులందరి (ప్రయత్నాలు ముగిసిన తరువాత (బ్రాహ్మాణవర్గంలో నుండి విజయుడు లేచి విల్లును సమీపించాడు. అర్జునుడిని ఈ సమయంలో 'విజయుడు'” అని పేర్కొనటం (ఆతని విజయాన్ని సూచిస్తూ) ఎంతో ఉచితంగా ఉన్నది. ఉ. ఇమ్మనుజేంద్రనందను లహీన బలుల్‌ దృఢదీర్హ బాహువీ

ర్యమ్ముల వార లోపర శరాసన కర్మమునం; దయుక్త ద

ర్వమ్మున నిప్పు నవ్వు పణుపన్‌ సమకట్టె నితండు విప్రవం

శమ్మున వారినెల్లం దనశక్తి యెబుంగక దుర్విదగ్గు. దై. 180 ప్రతిపదార్థం: ఈ+మనుజ+ఇంద్ర, నందనులు= ఈ రాజశ్రేష్టుల కుమారులు; ధృఢ, దీర్హు బాహు, వీర్యముల= దృడఢాలై పొడవైన బాహువుల పరాశక్రమాలందు; అహీన, బలుల్‌= తక్కువగాని బలం కలవారు; వారలు; శర+ఆసన, కర్మమునందు= ధనుస్సు యొక్క పనియందు; అనగా ధనుస్సును ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని కొట్టేపనిలో; ఓపరు+అ= చేతగాని వా రైరికదా; ఇప్పుడు ఇతండు; అయుక్త, దర్పమునన్‌= తగని గర్వంచేత; తన శక్తి ఎజుంగక; దుర్విదగ్దుండు+ఐజ= అవివేకి అయి; విప్ర, వంశంబున వారిన్‌+ఎల్లన్‌= (బ్రాహ్మాణవంశంలోని వారినందరిని; నవ్వుపయుపన్‌= నవ్వుల పాలయ్యేటట్ట్లు చేయటానికి; సమకట్టెన్‌= పూనుకొన్నాడు.

ఆదిపర్వము - సప్తమాశ్వానము 721 తాత్పర్యం: ఈ మహారాజకుమారులు దృఢాలైనవి, పొడవైన బాహువుల పరా[క్రమంలో ఏమాత్రం తక్కువ కాని బలంకలవాళ్ళు. వాళ్ళే ఈ విల్లును ఎక్కుపెట్టి కొట్టలేక పోయారు. ఇప్పు డితడు అనుచిత మైన గర్వంతో, తన శక్తి యెంతో తెలుసుకోలేక, అవివేకి అయి (బ్రాహ్మాణవంశంవాళ్ళనంతా నవ్వులపాలు చేయటానికి పూనుకొన్నాడు. క. _ అనువారు, నందు6గొందలఖు | 'ఘనుం డీతండు; వరికంటెం గార్డుక విద్యం

దనరిన వాండయి దీనికి, మొనసెంగా; కన్యుండిట్లు మొనయం గలండే! 181 (ప్రతిపదార్థం: అనువారున్‌; అందున్‌=ఐ వారిలో; కొందజు; ఈతండు; ఘనుండు; కార్ముక; విద్యన్‌= విలువిద్యలో; వీరికంటెన్‌, తనరినవాండు+ఐ= ఒప్పినవా డై; దీనికి= ఈ పనికి, మొనసెన్‌+*కాకజ పూనుకొన్నాడు కాని; అన్యుండు= ఇతరుడు; ఇట్టు; మొనయన్‌+కలండు+ఏ= పూనుకొనగలడా, తాత్పర్యం: అని పలుకుతూ ఉండగా, అందులో కొందరు 'ఇతడు గొప్పవాడు. వీళ్ళకంటె విలువిద్యలో నేర్పు కలవా డై ఈ పనికి పూనుకొన్నాడు కాని సామాన్యుడు ఈ విధంగా పూనుకొనగలడా?'

మ. అమితోత్సాహుండు దీర్చ బాహు పరిఘుం డత్యంతతేజస్వి స

ద్విమలాచారుండు విప్రభక్తిపరుం డీ విఫ్రుండు విప్రప్రసా

దమునన్‌ విప్రుల కెల్ల సంతసముగాం దత్మర్మసంసిద్ధి ను

త్తముం డై పొందెడు మంచు నుండిరి దయన్‌ ధాత్రీసురుల్‌ ప్రీతు లై. 122 ప్రతిపదార్థం: అమిత+ఉత్సాహుండు= అపరిమితమైన ఉత్సాహం కలవాడు; దీర్హ బాహు, పరిఘుండు= పొడవైన ఇనుప గుదియల వంటి బాహువులు కలవాడు; అత్యంత, తేజస్వి= మిక్కిలి తేజస్సు కలవాడు; సత్‌+విమల, ఆచారుండుజ=శ్రేషస్టమూ, నిర్మలమూ అయిన నడవడి కలవాడు; విప్ర, భక్తిపరుండు= (బాహ్మాణభక్తి ప్రధానంగా కలవాడు; ఈ, విప్రుండు; విప్ర, 'ప్రసాదమునన్‌= (బ్రాహ్మణుల అనుగ్రహంవలన; (బ్రాహ్మణులందరికి; సంతసముగాన్‌= సంతోషమయ్యేటట్టు; తత్‌+కర్మ; సంసిద్ధిన్‌= ఆ కార్యంయొక్క నెజవేరుటను; ఉత్తముండు+ఐ; పొందెడుమ= పొందుగాక; అంచున్‌= అని పలుకుతూ; ధాత్రీ; సురుల్‌= బ్రాహ్మణులు; ప్రీతులు+ఐ= సంతోషించినవా ళ్ళయి, దయన్‌= దయతో; ఉండిరి. తాత్పర్యం; అపరిమిత మైన ఉత్సాహం కలవాడు, దీర్హ మైన ఇనుప గుదియల వంటి బాహువులు కలవాడు, మిక్కిలి తేజస్సు కలవాడు, (శ్రేష్టము, నిర్మలము అయిన నడవడి కలవాడు, బ్రాహ్మాణభక్తి కలవాడు అయిన ఈ (బ్రాహ్మణుడు- బ్రాహ్మణుల అను(గ్రహంచేత బ్రాహ్మణులందరికి సంతోషం కలిగేవిధంగా కార్యసిద్ధి పొందుగాక! అని బ్రాహ్మణులు సంతోషించినవాళ్ళయి అర్జునునిపట్ట దయతో ఉన్నారు. విశేషం: అర్జునుడు ధనువుదగ్గరికి పోతున్న సమయంలో (బ్రాహ్మాణవర్గంవాళ్ళు అతడినిగురించి భావించిన పద్దతులను మూడురకాలుగా ఒక క్రమంలో చిత్రించటం నన్నయ కథాకధనశిల్పం. ఒకరకంవాళ్ళు భయస్టులు. మహాపరాక్రమవంతు లైన రాకుమారులే ఎక్కుపెట్టలేని విల్లును చేపట్టి మత్స్యయంత్రాన్ని కొట్టటానికి యత్నించి విఫలుడై బ్రాహ్మాణవర్లాన్ని నవ్వులపాలు చేయటానికి పూనుకొన్నాడని వాళ్ళు భావించారు. రెండవ రకంవాళ్ళు వివేచనాపరులు. రాకుమారులకంటె బలవంతుడై ఉండబట్టే ప్రయత్నిస్తున్నాడని భావించారు. మూడవ రకంవాళ్ళు విజ్ఞులు. విజయుని రూప తేజ బలాదులను గణించి విజయం తధ్యమని నిశ్చయించినవారు. ఈ (బ్రాహ్మాణవర్గాలవారి వ్యాఖ్యలు అర్జునుని సామర్థ్యాన్ని విజయాన్ని ప్రకాశింపచేసే వస్తుధ్వని విశేషాలు. క్షత్రియులు మాట్లాడకుండా ఉండటంకూడా ఇందులో ఒక విశేయే. బ్రాహ్మాణహృదయం బయటపడినట్టుగా క్షత్రియ హృదయం బయటపడదు. బహుశః కొందరు క్షత్రియులు ఆశ్చర్యచకితులై అర్జునుని వైపు అలా చూస్తూ ఉన్నారేమో - ఇతడు ఏం చేస్తాడో చూద్దామని. మరికొందరు అతని ప్రయత్నాన్ని ఉపేక్షించి ఉరకున్నారేమో. మొత్తానికి క్షత్రియులు మాట్టాడలేదు.

722 శ్రీమదాంధ్ర మహాభారతము వ. అంత న య్యర్లునుందు న వ్వింటి సమీపంబునకు వచ్చి గురువులం దలంచి నమస్కారంబు సేసి, ధనువునకు. బ్రదక్షిణంబుం జేసి మొక్కి, దాని నెత్తికొని పూర్వ పరిచితం బైన విల్లు మోపెట్టిన ట్లశ్రమంబున మోపెట్టి, జను లాశ్చర్యంబునం బొందుచుండ, నేనమ్ముల న మృత్స్వయంత్రంబు నాక్షణంబ యురుల నేసినం జూచి బ్రాహ్మాణ క్షత్రియ ప్రముఖు లయిన జనులెల్ల విస్మితు లయి. 183 ప్రతిపదార్థం: అంతన్‌; ఆ+అర్జునుండున్‌; ఆ+వింటి; సమీపంబునకు; వచ్చి; గురువులన్‌; తలంచి; నమస్కారంబు; చేసి, ధనువునకున్‌; (ప్రదక్షిణంబున్‌; చేసి; (మొక్కి; దానిన్‌, ఎత్తికొని; పూర్వ, పరిచితంబు+ఐన= ఇంతకు ముందే అలవాటుపడిన; విల్టు; మోపెట్టిన+అట్టు= ఎక్కుపెట్టినట్టు: అ(శ్రమంబున= (శ్రమలేకుండ, సులభంగా; మోపెట్టి= ఎక్కుపెట్టి; జనులు= ఆశ్చర్యంబునన్‌; పొందుచుండన్‌; ఏను+అమ్ములన్‌= ఐదుబాణాలచేత; ఆ+మత్స్య యంత్రంబున్‌; ఆ, క్షణంబ; ఉరులన్‌= పడేటట్టు; ఏసినన్‌= కొట్టగా; చూచి; (బ్రాహ్మణ, క్షత్రియ, 'ప్రముఖులు+ఐన; జనులు+ఎల్లు విస్మితులు+అయి= ఆళశ్చర్యపడినవాళ్ళయి. తాత్సర్యం: తరువాత అర్జునుడు ఆ ధనుస్సు దగ్గరికి వచ్చి, గురువులను స్మరించుకొని నమస్కారం చేసి, ధనుస్సుకు ప్రదక్షిణనమస్కారాలు చేసి, దాన్ని ఎత్తుకొని, అలవా బైన ధనుస్సును సంధించినట్టు సులభంగా సంధించి, (ప్రజలంతా ఆళ్ళర్యపడుతుండగా, ఐదు బాణాలతో ఆ మత్స్యయంత్రాన్ని ఒక్క క్షణంలోనే పడగొట్టాడు. అది చూచి బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన జనులంతా ఆళ్ళర్యపరవశులయ్యారు. విశేషం: అర్జునుడు విల్లును ఎక్కుపెట్టటానికి ముందు గురువులను స్మరించి నమస్కరించటం, విల్లుకు ప్రదక్షిణం చేసి (మొైక్కటం - అనేవి ధనుర్వేద విద్యను పవిత్రభావంతో ఉపాసించే మేటి వీరుని లక్షణాలు. గర్వితులైనవారికి విల్లు వశం కాలేదు. మత్స్యయంత్రం ఒక బుషి కల్పించిన విద్య అని ధృష్టద్యుమ్నుడు చెప్పనే చెప్పాడు. విద్యను గౌరవించటం విద్వాంసునికే తెలుసు అని అర్జునుని పాత్రను చిత్రించటం - ఇక్కడ విశేషం. విద్య వినయవంతులకే 'ప్రసన్నమౌతుం దనే సత్యంకూడ ఇక్కడ స్పష్టమౌతున్నది. మత్స్య యంత్రభేదనం వంటి మహత్తరవిషయాన్ని నన్నయ చిన్న వచనంలో చెప్పి ముగించాడు. అర్జునుని ప్రశంసించిన వాక్యాలను వృత్తాలలో నిబంధించాడు. మత్స్యయం(త్రం కొట్టిన అర్జునునికి అది ఒక గొప్ప ప్రదర్శన కాదు. కాని, ఆసభలో ఉన్నవాళ్ళ కంతా అది ఒక అద్భుతం, అవలీలగా ్రదర్శితమైన జగదేకవీరుడు అర్జునుని వీరరసాన్ని వచనంలోనూ, దానినుండి పుట్టిన అద్భుతాన్ని పద్యాలలోనూ రచించటం నన్నయగారి సార్ధక ఛందః[ప్రయోగ శిల్పం. చ. ఫలపవనాంబుభోజన శుభవ్రతవృత్తులం జేసి చూడ దు ర్ధలతను లయ్యు బ్రాహ్మణు లపారతపోబలసంపదన్‌ మహా బలయుతు; లట్టి వారలకు భవ్యుల కెందు నసాధ్య మెద్దియుం గలదె? చరాచరాఖిలజగంబులం బెద్దల కారె సద్దిజుల్‌, 184 (ప్రతిపదార్థం: (బ్రాహ్మణుల: ఫల, పవన+అంబు, భో జన, శుభ, (వ్రత, వృత్తులన్‌+చేసి= పండ్డు, గాలి, నీరు భక్షించటంచేత, పుణ్యాలయిన (వ్రతాలను చేయటంచేత; చూడన్‌= చూడటానికి; దుర్చల తనులు+ అయ్యు= బలహీన మైన శరీరం కలవారు అయినప్పటికీ; అపార, తపః+బల, సంపదన్‌= అమిత మైన తపోబలంయొక్క అతిశయంచేత; మహా, బల, యుతులు= గొప్ప బలంతో కూడినవారు; అట్టి, వారలకు; భవ్యులకుజఐ మహనీయులకు; ఎందున్‌; అసాధ్యము= సాధ్యం కానిది; ఎద్దియున్‌; కలదె: సత్‌+ద్విజుల్‌=ఐ ఉత్తము లైన (బ్రాహ్మణులు; చర+అచర+అఖిల, జగంబులన్‌= కదలునవి, కదలనివి అయిన అన్ని లోకాలలో; పెద్దలు+అ, కారె= పెద్దలే కదా. తొత్సర్యం: (బ్రాహ్మణులు ఫలాలను, గాలిని, నీటిని భక్షించటంచేత, పుణ్య(వ్రతాలు చేయటంచేత, చూడటానికి బలహీన మైన దేహం కలవా ళ్ళయినా, అపార తపో బల సంపదచేత వాళ్ళు మహాబలవంతులు. అటువంటి మహనీయులకు ఎక్కడా అసాధ్య మైనది ఏదీ లేదు. సమస్త చరాచర లోకాలలో సద్ర్రాహ్మణులే గొప్పవాళ్ళు గదా!

ఆదిపర్వము - సప్త్రమాశ్వాసము 723

నిశేషం; అలం: అర్జాంతరన్యాసం. క. _ నిమిషాంతరముననిట్ల। శ్రృుమున మర్వులకు నేయ సమకూరునె యు

త్తముం డీతండు బ్రాహ్మణ రూ । పమున సురేశ్వరుండొ హరుండొ భానుందొ గుహుందో! 185 ప్రతిపదార్థం: నిమిష+అంతరమునన్‌= క్షణం లోపల; ఇట్టు: అశ్రమమునన్‌= అనాయాసంగా; మర్ష్యులకున్‌= మానవులకు; ఎయన్‌= మత్స్యయంత్రాన్ని పడవేయటం; సమకూరునె= సాధ్యమౌతుందా; ఈతండు; ఉత్తముండు; బ్రాహ్మణ రూపమున; సుర+ఈళ్వరుండొ= దేవేంద్రుడో; హరుండొఐ శివుడో; భానుండొఐ సూర్యుడో; గుహుండో= కుమారస్వామియో. తాత్పర్యం: క్షణ కాలంలోపలనే ఈ విధంగా అనాయాసంగా మత్స్యయంత్రాన్ని కొట్టటం మానవులకు సాధ్యమౌతుందా? ఉత్తము డైన ఇతడు (బ్రాహ్మాణరూపంలో ఉన్న దేవేంద్రుడో! శివుడో! సూర్యుడో! కుమారస్వామియో! విశేషం: అలం: ఉ'త్రేక్ష: ఉల్లేఖం. క. _ అని ధరణి నుండి పొగడెడు। జనుల నిరంతరరవంబు, జలధరమార్షం

బున నుండి పొగడు దివ్యుల।; యనవరతరనంబు నొక్కం దయి కడు నొప్పెన్‌. 186 ప్రతిపదార్థం: అని; ధరణిన్‌*ఉండి= భూమిమీద ఉండి; పొగడెడు, జనుల, నిరంతర, రవంబు= పాగడునట్టి మనుష్యులయొక్క ఎడతెగని శబ్దం; జలధర, మార్గంబున నుండి= మేఘమార్గము - అనగా ఆకాశమార్గంనుండి; పొగడు, దివ్యుల ఆనవరత, రవంబున్‌= పొగడునటువంటి దేవతలయొక్క ఎడతెగనిశబ్దం; ఒక్కండు+అయిజ= ఒకటి అయి; కడున్‌=ఐ మిక్కిలి; ఒప్పెన్‌. తాత్సర్యం: అని భూమిమీద ఉండి పొగడే జనుల ఎడతెగని ధ్వని, ఆకాశంనుండి పొగడే దేవతల ఎడతెగని ధ్వని కలిసి మిక్కిలి అనువుగా ఆమరాయి. విశేషం: ఇటు నేలమీదనుండి పాగడే జనాల సవ్వడి, అటు ఆకాశంనుండి పాగడే దేవతల సవ్వడి సమంగా ఏర్పడి అర్జునుని (ప్రశంస భూనభోంతరాళలలో వ్యాపించిందని భావనామయంగా వర్షించాడు నన్నయ. ఈ పద్యరచనానిర్దారణంలోని సమత అనే గుణం ఈ వస్తుగుణాన్ని రమణీయంగా పోషిస్తున్నది. అద్భుతం ఆశళ్చర్యభావంయొక్క ఉత్కట దళ. అది వాచికంగా వ్యక్త మైన మూడు దశలను మూడు పద్యాలలో నన్నయ చిత్రించటం గమనార్హం. రాబోయే పద్యంలో చేష్టాత్మక మైన ఆశ్చర్యాన్ని వరించటం శిల్పం. (సంపా క, _ చెలగి సురదుందుభి స్వన। ములు ముదమున భూసురోత్తములు పయిపుట్టం

బులు వీచివీచి యార్టిరి। వెలయంగ నరుమీదం బుష్పవృష్టియుం గురిసెన్‌, 187 ప్రతిపదార్థం; సుర, దుందుభి, స్వనములు= దేవతలయొక్కభేరులధ్వనులు; చెలగలౌన్‌= మోగాయి; భూసుర+ఉత్తముల్‌= (బ్రాహ్మణ (శ్రేష్టులు; ముదమున= సంతోషంతో; పయి; పుట్టంబులుజ మీది వ(స్తాలు - అనగా ఉత్తరీయాలు; వీచి, వీచి, ఆర్భిరి= అరచారు; వెలయ(గజ ఒప్పగా; నరుమీదన్‌= అర్జునుని మీద; పుష్ఫవృష్టియు= పూలవానకూడ; కురిసెన్‌. తాత్పర్యం: అప్పుడు దేవతల భేరీ ధ్వనులు (మోగాయి. (బ్రాహ్మణోత్తములు తమ ఉత్తరీయాలను పదే పదే వీచుతూ పెద్దగా కేకలు వేశారు. అర్జునునిమీద పూలవాన అందంగా కురిసింది. విశేషం: అంతమందిలో తమవాడు గెలిచా డని ఆనందాతిశయంతో (బ్రాహ్మాణులు ఉత్తరీయాలను పదేపదే వీచుతూ పెద్దగా కేకలు వేయటం ఎంతో సహజంగా నాటకదృళ్యంగా కళ్ళకు కట్టినట్టున్నది.

72 శ్రీమదాంధ్ర మహాభారతము వ. అ య్యవసరంబున ధర్మనందనుండు నకులసహదేవానుగమ్యమానుం డయి నిజనివాసంబునకుం జనియె;

నిట ధృష్టద్యుమ్ను సహితుం డయి యజ్ఞసేనుండు మహాసేనతో నర్జునునకు సహాయుండుగా నరిగి; నంత. 188 ప్రతిపదార్హం: ఆ+అవసరంబున= ఆ సమయంలో; ధర్మనందనుండు; నకుల, సహదేవ+అనుగమ్యమానుండు+ అయి= నకుల సహదేవులచే వెంబడింప బడినవా డై; నిజ, నివాసంబునకున్‌= తనఇంటికి; చనియెన్‌= వెళ్ళాడు; ఇట; ధృష్టద్యుమ్ను, సహితుండు+ అయిజ ధృష్టద్యుమ్నునితో కూడి; యజ్ఞసేనుండుజ (ద్రుపదుడు; మహా, సేనతోన్‌= గొప్ప సైన్యంతో; అర్జునునకు; సహాయుం డుగాన్‌; అరిగెన్‌= వెళ్ళాడు; అంత, తాత్సర్యం: ఆ సమయంలో ధర్మరాజు నకులసహదేవులు వెంటరాగా తమ యింటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ధృష్టద్యుమ్నునితో కూడి ద్రుపదుడు గొప్పసేనతో అర్జునునికి సహాయుడుగా వెళ్ళాడు. అప్పుడు.

ద్రౌపది యర్జునుని వరించుట (సం.1-179-22)

సీ ధరణీశనందనుల్‌ ద నృతిప్రీతితోం: జూచుచు నుండంగ సుందరాంగి

తోయజ దళ నేత్ర ద్రుపదరాజాత్మజ |; కమనీయ గజ రాజ గమనలీలం

జనుదెంచి సురరాజసన్నిభు నభినవ | యౌవనోద్దాసితు నసితరత్న

రుచిరాంగు నంగజరూపు ధనంజయు.; దనచేతి సితపుష్పదామకమునం ఆ. బొోల(తి ముదముతోడం బూజించె; నట్టియు । తృవముం జూచి దాని సైంప కపుడు

కౌరవేంద్రుండాదిగా. గల భూపతు । లెల్ల నలిగి కలయ నేపు రేంగి. 189 (ప్రతిపదార్థం: ధరణి+ఈశ్య నందనుల్‌= రాజకుమారులు; తన్ను= తనను; అతి, ప్రీతితోన్‌; చూచుచున్‌; ఉండంగ; సుందర+ అంగి= అంద మైన శరీరం కలది; తోయజ, దళ, నేత్ర= తామర రేకుల వంటి కన్నులు కలది. ద్రుపదరాజ+ఆత్మజజ= (ద్రుపదరాజుయొక్కకూతురు; (ద్రౌపది; కమనీయ, గజరాజ, గమన, లీలన్‌= మనోహర మైన ఏనుగు్రేసుయొక్క నడక వంటి విలాసంతో; చనుదెంచి= వచ్చి; సురరాజ, సన్నిభున్‌= దేవేంద్రునితో సమానుడైన వాడిని; అభినవ యౌవన+ఉద్భాసితున్‌= క్రొత్త యౌవనంచే ప్రకాళించే కాంతికల దేహం కలవాడిని; అంగజ, రూపున్‌= మన్మథుని వంటి రూపం కలవాడిని; ధనంజయున్‌= అర్జునుడిని; తన చేతి, సిత, పుష్పు, దామకమునన్‌=ఐ తనచేతిలో ఉన్న తెల్లనిపూలదండచేత; పాలంతిః అ కొంత; ముదముతోడన్‌= సంతోషంతో; పూజించెన్‌; అట్టి, ఉత్సవమున్‌; చూచి; దానిన్‌; సైపకజ ఓర్వక; అపుడు; కౌరవ+ఇంద్రుండు= దుర్యోధనుడు; ఆదికాన్‌+కల= మొదలుగా కల; భూపతులు= రాజులు; ఎల్లన్‌= అందరు; అలిగి= కోపించి; కలయన్‌= అంతటను; ఏపురే6గి= విజృంభించి. తాత్పర్యం: రాజకుమారులంతా తనను మిక్కిలి ప్రీతితో చూస్తూ ఉండగా- అందమైనశరీరంకలది, తామరరేకుల వంటి కన్నులు కలది అయిన (ద్రౌపది, మనోహర మైన మదపుటేనుగు నడకవంటి నడకతో విలాసంగా వచ్చి- దేవేంద్రునితో సమానమైనవాడు, నూత్నయౌవనంతో ్రకాశించేవాడు, ఇం(ద్రనీలంవంటి కాంతిగల దేహం కలవాడు, మన్మధునివంటి రూపం కలవాడు అయిన అర్జునుడిని తన చేతి తెల్లని పూలదండతో పూజించింది. అటువంటి ఉత్సవాన్ని చూచి ఓర్వలేక, అప్పుడు దుర్యోధనుడు మొదలైనరాజులంతా కోపించి అంతటా విజృంభించారు. విశేషం: రాజకుమారులంతా (ద్రపదియందు అందమైన ఆకారాన్నీ, తామరరేకులవంటి కన్నులనూ, మదేభ గమనంవంటి నడకహొయలనూ కన్నార్పకుండా చూచారు. అంతటి సౌందర్యరాశి అర్జునునికి అంకిత మైపోతున్నదే అని వారి అసూయ. ఆమె సౌందర్యం. దాని ఫలితం తరువాతి పద్యంలో నన్నయ చెప్పబోతున్నాడు. దానికి హేతువును కల్పించుకొన్నా డిక్కడ. ఇది

ఆదిపర్వము - సప్త్రమాశ్వానము 725 (ప్రసన్నకధాకలితార్హయ్యుక్తి. రాజకుమారు లంతా ద్రౌపదిని చూస్తుండగా, ఆమెమాత్రం అర్జునుడినే ఏకాగ్రతతో చూస్తున్నది. అతడు మొదట దేవేంద్రునితో సమాను డైనవాడుగా కనిపించాడట! ఈ 'సురరాజసన్నిభుడు" అనే విశేషణం రమణీయార్ధ వ్యంజకం. వస్తుధ్వనిపోషకం. అర్జునుడు ఇంద్రుని వరంవలన పుట్టినవాడన్నది ఒక అర్దం, రాబోయే కథలో పంచేంద్రియోపాఖ్యానంలో చెప్పబోయే కధార్థాలలో ఇంద్రత్వభావనం పరిత ఇక్కడ అనుసంధించుకొనవలసివస్తుంది. పూర్వాపర కావ్యార్థభావనవలన అర్జునుడుగా ఉన్న ఇం(ద్రుడు నిజానికి అయిదురూపాలకు (ప్రతినిధి. అందువలననే ఆంతగా ఆసక్తితో చూస్తున్న (ద్రౌపదియందు అర్జునుని మనసు మన్మథాయత్ర మైనట్టు నన్నయ వర్షించాడు. ఇది కధాశిల్పరహస్యం. 213వ పద్యంలో ఈ రహస్యం గమనించవచ్చును. ఇంద్రత్వమే కాక, యౌవనం, కాంతి, రూపం అనే గుణాలను (ద్రౌపది అర్జునునిలో చూచి అఆని మెడలో దండవేసింది. 'కన్యా వరయతే రూపం”. (సంపా.)

మత్తకోకిలము. ఏల రాంబనిచెన్‌ మహీశుల నెల్ల? జుట్టముపోలె ము న్నేల సత్కృతింజేపి నిందఖ? కిమ్మహారధు లుండంా నేల కన్యక నిచ్చె విఫప్రున కిందు నేడు శకుండు పాం చాలుంి డిప్పుడ వీని నిర్ణతసత్త్వుం జేయుద మూజిలోన్‌. 190

ప్రతిపదార్హం: మహీ+ఈశులన్‌+ఎల్లన్‌= రాజులందరిని; ఏల; రాన్‌*పనిచెన్‌= రప్పించాడు?; చుట్టము, పోలె=ఐ చుట్టంవలె; మున్నుజ= ముందు; ఇందణకు; ఏల; సత్కృతిన్‌= సమ్మానం; చేసెన్‌; ఈ+మహారధులు+ఉండగాన్‌= ఇంతమంది మహావీరు లుండగా; నేండు; వీల; ఇందు; విప్రునకుజ బ్రాహ్మణునికి; కన్యకన్‌: ఇచ్చె; పాంచాలుండు= ద్రుపదుడు; శరుండు= మోసగాడు; ఇప్టు= ఇప్పటి కిప్పుడే; వీని= ఈ (ద్రుపదుడిని; అజిలోన్‌= యుద్ధంలో; నిర్ల్ణత, సత్త్యున్‌= కోల్పోయిన బలం కలవాణ్ణిగా; చేయుదము.

తాత్సర్యల: రాజు లందరినీ ఎందుకు రప్పించాడు? చుట్టంవలె ఇందరికి ముందుగా ఎందుకు సమ్మానం చేశాడు?

ఈ మహావీరులంతా ఉండగా ఈనాడు ఇక్కడ ఒక (బ్రాహ్మణుడికి కన్యకను ఎందు కిచ్చాడు? (ద్రుపదుడు

మోసగాడు. ఇప్పుడే యుద్దంలో ఇతని బలాన్ని అణిచివేద్దాం.

య

క. తనవిద్య పేర్మి నృపనం । దనం బడసెను విసు; డితని తప్పే? కడుదు ర్దనుం డీ ద్రుపదుండు నృపతుల। ననయంబున మెచ్చండయ్యె నతిగర్వితుంై. 191

(ప్రతిపదార్థం: విఫ్రండు= బ్రాహ్మణుడు; తన, విద్య, పేర్మి= తన విద్యయొక్క గొప్పతనంచేత; నృప, నందనన్‌= రాజు కూతు

రైన (ద్రౌపదిని; పడసెను= పొందాడు; ఇతని తప్త్పు+ఏజ ఇతని తప్పే మున్నది; ఈ, ద్రుపదుండు; దుర్షనుండు= దుర్మార్గుడు; అతి

గర్వితుండు+ఐజ=ఐ మిక్కిలి గర్వించినవాడై; నృపతులన్‌= రాజులను; అనయంబునవ= ఏమాత్రం: మెచ్చండు+అయ్యెన్‌.

తాత్పర్యం: ఈ (బ్రాహ్మణుడు తన విద్యా బలంతో ద్రౌపదిని పొందాడు. ఇతని తప్పు ఏ మున్నది? ద్రుపదుడు

దుర్మార్గుడు. అతడు అతిగర్వంతో రాజులను ఏమాత్రం లెక్కపెట్టలేదు.

న!

వ. 'ఏమిదోషంబు సేసియు బ్రాహ్మణుండు వధ్యుండు గాడు; మన రాజ్యంబును నర్థంబును బ్రాహ్మణార్థంబ; కావున న వ్విస్రుతోడి దేమి?” యని ద్రుపదుపయి నెత్తుదెంచిన, ద్రుపదుండును కడుఖీతుం డై బ్రాహ్మణుల మబభువు సొచ్చె; నిట్లు శరణాగతుం డయిన ద్రుపదు నోడకుండు మని బ్రాహ్మణులు దమ తమ దండాజినంబు లెత్తికొని ప్రతిబలంబులపయి వీచుచున్నంత, వారలం జూచి నగుచు నర్హునుం డి ట్లనియె. 192

726 ఖ్రినుదొంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: ఏమి, దోషంబు; చేసియు; (బ్రాహ్మణుండు; వధ్యుండు= చంపదగినవాడు; కాదు; మన, రాజ్యంబునున్‌; అర్ధంబును= సంపదయు; బ్రాహ్మణ+అర్హంబ= బ్రాహ్మణుల కొరకే; కావునన్‌; ఆ+వి(ఫ్రుతోడిది+శఏమి= ఆ బ్రాహ్మణునితో మన కేమి; అని, (ద్రుపదు, పయిన్‌= (ద్రుపదునిమీద; ఎత్తుదెంచిన= దండెత్తి రాగా; ద్రుపదుండును; కడు= మిక్కిలి; భీతుండు+ఐజ= భయపడినవాడై; (బ్రాహ్మణుల, మజువు= (బ్రాహ్మణులచాటున; చొచ్చెన్‌= చేరెను; ఇట్టు) శరణ+ఆగతుండు+అయిన= శరణుకోరి వచ్చిన; (ద్రుపదున్‌; ఓడకుండుము+అని= భయపడ వద్దని; (బ్రాహ్మణులు; తమతమ; దండ+అజినంబులు= చేతికజ్జలను, (యోగదండములు మొదలైనవి) జింక చర్మములను; ఎత్తికొని; ప్రతిబలంబులపయి= శత్రుసేనలమీద; వీచుచు+ ఉన్నంత= వీచుచుండగా; వారలన్‌+*చూచి; నగుచు= నవ్వుతూ; అర్జునుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: 'ఏ తప్పు చేసినా బ్రాహ్మణుడు చంపదగినవాడు కాదు. మనరాజ్యం, సంపద బ్రాహ్మణులకొరకే. కనుక ఈ (బ్రాహ్మణునితో మన కేమి పని? అని (ద్రుపదుడిమీదికి దండెత్తి రాగా, అతడు మిక్కిలి భయపడి, (బ్రాహ్మణుల చాటున చేరాడు. ఈ విధంగా శరణుకోరి వచ్చిన ద్రుపదునికి అభయమిచ్చి బ్రాహ్మణులు తమ తమ దండాలను, జింకచర్మాలను ఎత్తుకొని శత్రుసేనలమీద వీచుతుండగా వారిని చూచి నవ్వుతూ అర్జునుడు ఇట్టా అన్నాడు. విశేషం: దుర్యోధనుడి దురహంకారం, కులాహంకారం, కుత్సితనీతి, అధర్మప్రవృత్తి ఈ సన్నివేశంలో బైటపడ్డాయి, మత్స్యయంత్రం కొట్టిన (బ్రాహ్మణుడు అవధ్యుడు కాబట్టి అతడిని వదిలిపెట్టటం న్యాయం అన్నాడు. క్షత్రియు లుండగా బ్రాహ్మణుడికి అవకాశం కలిగించి రాజకులానికి అవమానం కలిగించిన (ద్రుపదుడిపై ఆ(గ్రహించాడు. పూర్వాపరాలను గాని, స్వపరసామర్జ్యాలను గాని ఆలోచించని దుర్విదగ్దుడు దుర్యోధనుడు. కన్యను గెలుచుకొన్నవాడు రాజలోకం తిరుగబడితే వారిని జయించి తన యోగ్యతను నిరూపించుకోవటం స్వయంవరరాజధర్మం. దుర్యోధనుడు సమర్భు డైతే బ్రాహ్మణుడి(అర్జునుడి)తో తలపడాలి. ఆ ధర్మం అతడు పాటించలేదు. ద్రుపదుడు బ్రాహ్మణుల నా(్యశ్రయించటం సందర్భోచితం. అర్జునుడు తన యోగ్యతను నిరూపించుకొనాలని వీరసూచనంకూడా అది. అర్జునుడు దానిని పసికట్టాడు. బ్రాహ్మణులు దండాలతో విబృంభిస్తే వారిని వారించాడు. భీముడితో కలిసి రంగంలో నిలువబడి తన యోగ్యతను నిరూపించుకొనే ప్రయత్నంచేయటానికి పూర్వరంగం కలిగించాడు దుర్యోధనుడు. స్వయంవరసభలోకూడ దుర్యోధనుడు తనవర్గంతో కూడి, ప్రతినాయకప్రవృత్తిని ప్రదర్శించటం వస్తుధ్వనికి పరోక్ష పోషకం. (సంపా) క. కడంగి మదీయాస్తము లని। యెడు పటుమంత్రముల నిప్పు డీ నృపురిపుల

వృ్కడింది విషాహుల దర్పం । బుడిగించెదం దొలంగి చూచుచుండుండు మీరల్‌. 193 ప్రతిపదార్థం: కడంగిఐ పూని; మదీయ+అ(్త్రములు= నా బాణాలు; అనియెడు; పటు, మంత్రములన్‌= గొప్పు మంత్రాలచేత; ఇప్పుడు; ఈ, నృపు, రిపులు+అన్‌= ఈ రాజుయొక్కశత్రువులను - అనగా (ద్రుపదుడి శత్రువులు అనే; కడిది విష+అహుల, దర్పంబు= పెద్ద విషసర్పాల గర్వాన్ని; ఉడిగించెదన్‌= అణచెదను; మీరల్‌= మీరు; తాలంగి= ప్రక్కకు తొలగి; చూచుచు+ ఉండుడు. తాత్పర్యం: పూనుకొని, నా అ(స్తాలనే గొప్పమంత్రాలతో ఇప్పు డీ ద్రుపదుని శత్రువు లనే పెద్ద విష సర్పాల గర్వం అణచివేస్తాను. మీరు ప్రక్కకు తాలగి చూస్తూ ఉండండి. విశేషం; అలం: రూపకం. అలంకారం వస్తుద్వనికి పోషణం కావటానికి ఈ పద్యం రమణీయోదాహరణం. దుర్యోధనాదులు దుష్టసర్సాలు, అవి కాటువేయటానికి పూనుకొన్నాయి. అవి కాటువేయకుండా మంత్రగానివలె వాటిని నిర్వీర్యం చేస్తానని సూచించాడు అర్జునుడు. “ప్రతివీరులను చంపకుండా భంగపాటుకు గురిచేస్తాను చూడండి" అని వస్తుధ్వని. విషసర్ఫోపమానం దుర్యోధనాదుల కుటిలస్వభావానికీ, (క్రూరత్వానికీ వ్యంజకం,

ఆదిపర్వము - సప్తమాశ్వానము 727 అర్జునుండు కర్షునితో యుద్ధంబు సేసి జయించుట (సం.1-181-3)

వ. అని తానును భీమసేనుండును గడంగి రిపు బలంబుపయి నపరిమిత శరంబు లేసి; భీమసేనుండు నొక్క

వృక్షంబు వెటికికొని దంద హస్తుం డయిన దండధరుండునుంబోలె నర్జునునకు సహాయుం డయి నిలిచె;

నంత న య్యిద్దర మహా సంరంభంబు6 జూచి విస్కితు డై కృష్ణుండు బలదేవున కి ట్లనియె. 194 ప్రతిపదార్హం: అని; తానును; భీమసేనుండును; కడంగి= పూనుకొని; రిపు, బలంబుపయిన్‌= శత్రుసైన్యంమీద; అపరిమిత, శరంబులు= లెక్కలేనన్ని బాణాలు; ఏసె= వేశాడు; భీమసేనుండున్‌; ఒక్క, వృక్షంబు; పెజికి కొని; దండ, హస్తుండు+అయిన దండమును చేతియందు కలవా డైన; దండధరుండునున్‌+*పోలెన్‌= యమధర్మరాజువలె; అర్జునునకు; సహాయుండు+అయి= నిలిచెన్‌; అంతన్‌; ఆ+ఇద్రర; మహా, సంరంభంబున్‌= గొప్ప విజ్బంభణాన్ని చూచి; కృష్ణుండు; విస్మితుండు+ఐ= ఆశ్చర్యపడిన వాడై బలదేవునకు= బలరామునకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అర్జునుడు ఆ విధంగా పల్కి, తానూ భీమసేనుడూ పూనుకొని శత్రుసైన్యంమీద లెక్కలేనన్ని బాణాలు వేశాడు. భీమసేనుడు ఒక పెద్దచెట్టును పెకలించుకొని, దండాయుధాన్ని ధరించిన యమధర్మరాజువలె అర్జునునికి సహాయుడుగా నిలిచాడు. అప్పుడు వాళ్ళిద్దరి మహావిజృంభణం చూచి కృష్ణుడు ఆళ్ళర్యపడి బలరామునితో ఇట్టా అన్నాడు. సీ, 'తాలాభ మగు ఐల్లు దాల్చి విరోధుల । నెగచుచున్నవాం డింద్రతనయు

డాతని కెలన మహావ్ఫక్షహస్తుండై ।; యున్నవీరుండు వృకోదరుండు;

యంత్రంబు నరు డేసి నప్పడు పోయిన ।; యగ్గౌరవర్జుండు యమతనూజు4

డాతనితోడన యరిగిన యిరువురు। గవల వా రర్మ ప్రకాశ తేజు ఆ. లనిన 'లక్కయింట నగ్నిదాహంబున । నెట్లు బ్రదికి రొక్కొ! యిమ్మహాత్ము

లెట్టి పుణ్యదినమొ యేవురం జూచితి; మనుచు సంతసిల్లె హలధరుండు. 195 ప్రతిపదార్థం: తాల+ఆభము= తాటిచెట్టు వంటిది; అగు; విల్లు: తాల్చి; విరోధులన్‌: ఎగచుచున్‌= తోలుచు; ఉన్నవాడు; ఇంద్ర, తనయుండు= ఇంద్రుని కుమారు డైన అర్జునుడు; ఆతని; కెలన= ప్రక్కన; మహా, వృక్ష హస్తుండు+ఐ= గొప్ప చెట్టును చేత కల వాడై; ఉన్న; వీరుండు; వృకోదరుండు= భీముడు; యం(త్రంబుజ= మత్స్యయం(త్రమును; నరుండు== అర్జునుడు; ఏసిన+అప్పుడు= కొట్టినప్పుడు; పోయిన; ఆ, గౌర, వర్గుండు= ఆ పసుపు పచ్చని వన్నె కలవాడు; యమ, తనూజుండు= యముని పుత్రు డైన ధర్మరాజు; ఆతని తోడన= అతని వెంట; అరిగిన= వెళ్ళిన; ఇరువురున్‌= ఇద్దరును; కవలవారు= నకుల సహదేవులు; అర్క, (ప్రకాశతేజాలు= సూర్యకాంతివంటి తేజస్సు కలవాళ్ళు; అనిన; లక్క, ఇంటన్‌; అని, దాహంబునన్‌= నిప్పు మంటనుండి; ఈ, మహాత్ములు; ఎట్టు: బ్రదికిరి+ఒక్కొ; ఎట్టి, పుణ్యదినమొ; ఏవురన్‌=ఐ ఐదుగురిని; చూచితిమి:; అనుచు; హలధరుండు= నాగలిని ధరించినవాడు - బలరాముడు; సంతసిల్లె= సంతోషించాడు. తాత్పర్యం: “తాటిచెట్టువంటి పెద్దవిల్లు ధరించి, శత్రువులను తరుముతున్నవాడు అర్జునుడు. అతని ప్రక్కనే గొప్ప వృక్షాన్ని చే పట్టి ఉన్న వీరుడు భీముడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టగానే సభనుండి వెళ్లిపోయిన ఆ పసుపు పచ్చని వన్నెవాడు ధర్మరాజు. అతని వెంట వెళ్ళిన సూర్యసమానతేజు లిద్దరు నకుల సహదేవులు" అని (శ్రీకృష్ణుడు చెప్పగా, 'లక్కయింటిలో నిప్పుమంటనుండి వీ రెట్టా బ్రతికారో! ఈ ఐదుగురిని చూచాము. ఇది ఎంత సుదినం! అని బలరాముడు సంతోషించాడు.

728 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: వృకోదరుడు - వృక (తోడేలు) ప్రమాణమైన ఉదరం కలవాడు. ను అంత 196 తాత్పర్యం: అప్పుడు. క, _ కురుపతి సూడ(గం గర్జుండు। నరుందాథెను; శల్యుం డనిల నందనుం దాథెన్‌

సరభసమున; విససయ మం । దిరి ధరణీదేవ మనుజదేవప్రవరుల్‌. 197 ప్రతిపదార్హం: కురుపతి= దుర్యోధనుడు; చూడంగన్‌: కర్షుండు; నరున్‌= అర్జునుని, తాకెనుజఐ ఎదుర్కొనెను; సరభసమునన్‌= వేగిరపాటుతో కూడినట్టుగ; శల్యుండు; అనిల; నందనున్‌= వాయుదేవు కుమారు డైన భీముని; తాణెన్‌= ఎదుర్కొన్నాడు; ధరణీ, దేవ, మనుజ, దేవ, (ప్రవరుల్‌= (బ్రాహ్మణ(శ్రేష్టులు, మానవ(్రేష్టులు, దేవతా(శ్రేష్టులు; విస్మయము+ అందిరి= ఆశ్చర్యాన్ని పొందారు. తాత్పర్యం: కురుపతి అయిన దుర్యోధనుడు చూస్తూ ఉండగా కర్షుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే వేగంగా శల్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు. అది చూచి బ్రాహ్మణ, మానవ, దేవతా (శ్రేష్టులు ఆశ్చర్యపడ్డారు. శా. _కర్టుండున్‌ విజయుండు నొండొరుల జుల్కం దాశకి, చాపంబు లా

కర్ణాంతం బగుచుండగా దిగిచి యుగ్రక్రోధు లై యేసి; రా

పూర్ణంబయ్యెం దదీయ బాణతతి నంభోభృత్పధం బెల్ల; నా

జ్‌ =,

స్తేర్షం బయ్యె ధరిత్రి యెల్ల; నవిసెన్‌ దిక్టక్ర మెల్లన్‌ వడిన్‌, 198 ప్రతిపదార్థం: కర్టుండున్‌, విజయుండున్‌= కర్షుడును అర్జునుడును; ఒండొరులన్‌= ఒకరినొకరు: చుల్కన్‌= సులభంగా; తాంకి= ఎదుర్కొని, చాపంబులుజ ధనుస్సులను; ఆకర్ష+అంతంబు= చెవి కొనవరకు పోవునవి; అగుచు+శఉండగా; తిగిచి= లాగి; ఉగ్ర, 'క్రోధులు+ఐ= భయంకర మైన కోపం కలవా ళ్ళయి; ఏసిరి= బాణాలను వేశారు; తదీయ, బాణతతిన్‌= వారియొక్క బాణాల సమూహంచేత; వడిన్‌= వెంటనే; అంభో, భృత్‌+పధంబు+ఎల్లన్‌= నీటిని ధరించిన మేఘాలయొక్క మార్గమంతా - అనగా ఆకాశమంతా; ఆపూర్ణంబు= నిండినది; అయ్యెన్‌: ధరిత్రి, ఎల్లన్‌= భూమి అంతా; ఆస్తీర్షంబు+అయ్యె= పరచబడింది అయింది; దిక్‌+చ(క్రముజ దిక్కుల సమూహం, ఎల్లన్‌= అంతయు; వడిన్‌= వేగంగా; అవిసెన్‌= పగిలెను. తాత్సర్యం: కర్ణార్దునులు ఒకరినాకరు సులభంగా ఎదుర్కొని, ధనుస్సులను ఆకర్ణాంతం లాగి, భయంరక మైన కోపంతో పరస్పరం బాణప్రయోగం చేసికొన్నారు. వాళ్ళ బాణలసమూహంతో భూమీ, ఆకాశం నిండిపోయాయి. దిక్కులు పగిలిపోయాయి. క వీరుందగు నరుని యేయు న: పార శరావలుల నడుమ వారింపంగా

నేరక యే టుడిగి మహా । శూరుండు రాధేయుం డింద్రజున కి ట్లనియెన్‌. 4199 ప్రతిపదార్థం: వీరుండు+అగు; నరుని, ఏయు, అపార, శర+ఆవళులజ అర్జునునియొక్క వేయునటువంటి అనంతా లైన బాణాల సమూహాలను; నడుమ; వారింపంగ= ఆపటానికి; నేరక= చేతకాక; మహాశూరుండు; రాదేయుండు= కర్ణుడు; ఏటు+ఉడిగి= బాణాలు వేయటం మాని; ఇం[ద్రజునకు= అర్జునునకు; ఇట్టు+ అనియెన్‌. తాత్పర్యం: వీరు డైన అర్జునుడు వేసే అంతులేని బాణపరంపరను నడుమ అడ్డుకొనలేక, మహాశూరు డైన కర్ణుడు బాణప్రయోగం మాని ఇంద్రునికుమారు డైన అర్జునునితో ఇట్లా అన్నాడు.

ఆదిపర్వము - సప్తమాశ్వానము 729

విశేషం: నరుని యేయు - నరునియొక్క ఏయు - అనగా, నరుడు ఏయు. ఇక్కడ ్రథమకు షష్టి వచ్చింది. క. _ నాయెదురం జకృనై యని; సేయంగ భార్ల్గవునకును శచీవరునకుం గౌం

తేయుం డగు విజయునకుం గా ; కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్‌. 200 (ప్రతివదార్ధ్హం: నా ఎదురన్‌; చక్కన+ఐ=ఐ చక్కగా నిలబడి; అని= యుద్దం; చేయంగా; భార్గవునకును= పరశురామునికి; శలీవరునకున్‌= శచీదేవి భర్త యైన దేవేంద్రునికి; కౌంతేయుండు= కుంతికొడుకు అయిన; విజయునకున్‌= అర్జునునికి; కాక్క ఆయత, భుజ, శక్తిన్‌= అధికమైన భుజబలంచేత; ధరణిన్‌= భూమియందు; ఒరులకు= ఇతరులకు; అలవియె= సాధ్యమా! (కాదని భావం). తాత్పర్యం: నా యెదుట చక్కగా నిలిచి, యుద్దంచేయటానికి పరశురామునికి, దేవేంద్రునికి, కుంతి కొడు కైన అర్జునునికి మాత్రమే సాధ్యమవుతుంది కాని, గొప్పభుజశక్తితో న న్నెదుర్కొనటానికి ఈ భూమిమీద ఇతరులకు సాధ్య మవుతుందా? క. _ నీ వప్రాకృతబలుండవు;। నీ విక్రమమునకు విల్లునేర్పునకు మహీ

దేవకులోత్తమ! మెచ్చితి:। నావుడు బార్జుండు గర్జునకు ని ట్లనియెన్‌. 201 ప్రతిపదార్థం: నీవు+అప్రాకృత, బలుండవు= నీవు సామాన్యంకాని బలం కలవాడవు; మహీదేవ, కుల+ఉత్తమ= (బ్రాహ్మణ కులంలో (శ్రేష్టుడా; నీ విక్రమమునకు= నీ పరాక్రమానికి; విల్టు, నేర్పునకుజ విలువిద్యావైపుణ్యానికి; మెచ్చితి; నావుడున్‌= అని అనగా; పార్టుండు= అర్జునుండు; కర్టునకున్‌, ఇట్టు+అనియె. తాత్సర్యం: 'ఓ (బ్రాహ్మణశ్రేష్టా! నీవు అసాధారణ మైన బలం కలిగి ఉన్నావు. నీ పరాక్రమానికి, విలువిద్యా నైపుణ్యానికి మెచ్చాను" అని పల్కగా అర్జునుడు కర్షునితో ఇట్లా అన్నాడు. మధ్యాక్కర.

ఏను నీ చెప్పిన వారిలోపల నెవ్వండం గాను;

గాని నే సర్వశస్తాస్త్రవిద్యలం గడు బ్రసిద్ధుండ;

భూనుత బ్రహ్మతేజోధికుండ; నిన్ను బోరిలో నోర్వం

గా నున్న వీరుండ; నొండు దక్కిలోంగక చక్కనిలుము. 202 ప్రతిపదార్హం: ఏను=నేను; నీ, చెప్పిన, వారిలోపలన్‌= నీయొక్క చెప్పినవారియందు - అనగా నీవు చెప్పినవారిలో" ఎవ్వండన్‌; కాను; కాని; నేజనేను; సర్వ, శస్ర+అస్త్ర, విద్యలన్‌= అన్ని శస్తాస్రవిద్యలందు; కడున్‌= మిక్కిలి; (ప్రసిద్దుండ. భూనుత, 'బ్రహ్మతేజః+అధికుండ= భూమియందు. పొగడబడిన (బ్రహ్మతేజస్సుచేత గొప్పవాడను; నిన్నున్‌; పోరిలోన్‌= యుద్ధంలో; ఓర్వన్‌+కాన్‌+*ఉన్నజ ఓడించటానికి సిద్దంగా ఉన్న; వీరుండన్‌: ఒండు= ఇతరములు; తక్కి= విడిచి; లోగకజ వెనుదీయక; చక్క; నిలుముజ గట్టిగా ఎదురుగా నిలబడుము. తాత్పర్యం: నేను నీవు చెప్పినవాళ్ళలో ఎవ్వడినీ కాను. కాని అన్ని శస్తాస్త విద్యలలో మిక్కిలి ప్రసిద్దుడిని. లోకం కొనియాడే బ్రహ్మతేజస్సుతో గొప్పవాడిని. నిన్ను యుద్ధంలో ఓడించటానికి సిద్ధంగా ఉన్న వీరుడిని. తక్కిన మాటలు కట్టిపెట్టి గట్టిగా నిలబడు.

730 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: 'కాని నే - అనే దానికి బదులు కానీన అని అర్జునుడు కర్ణుడిని సంబోధించినట్టు కొన్ని ప్రతులలో ఉన్న పారం సరైందిగా తోచదు. కన్యాపుత్రుడు కానీనుడు. కర్షుడు కన్యాపుత్రుడే అయినా అప్పటి కావిషయం అర్జునిడికి తెలియదు. అందు చేత అతడు కర్టుడిని 'కానీన” అని సంబోధించటం అసంబద్దం. "కాని, నే' అనే ప్రస్తుతపాఠమే అన్నివిధాల ఉత్తమమైనది. మరొక విశేషం: 'ఏను నీ చెప్పినవారిలోపల నెవ్వండ 6గాను' అని నిశ్చయార్థంలో అంటే సందర్భోచితంగా అర్జునుడు మాట్టాడిన ట్లవుతుందే కాని, అబద్ధం పలికినదోషం కలుగుతుంది. అందువలన నానారుచిరార్థ సూక్తి నిపుణుడైన నన్న్మయ ఆవాక్యాన్ని ప్రశ్నార్ధకంగా, కాకువులో ఉచ్చరించటానికి వీలుగా కూడ నిబంధించాడు. అప్పుడు కర్ణుడు చెప్పినవారిలో అర్జునుడు ఎవ్వడు కాడు? అందరూ అవుతాడు - ముగ్గురు కలిసినా వారితో సమానుడౌతాడు అనే అర్హచమత్కారం ఏర్పడుతుంది. 'కాని, నే సర్వశస్తాస్త్రవిద్యలం గడు (బ్రసిద్దుండ'- అనే అర్జునుని వాక్యంలో- "కాని, నేను పైన నీవు చెప్పిన అందరియొక్క శస్తాస్త్రవిద్యలలో ఎంతో ప్రసిద్దిపాందాను" అనే అర్ధం కాకువులోనే సిద్దిస్తుంది. అసత్యదోషం నివారితమవుతుంది. 'నిన్నుం బోరిలో నోర్వంగా నున్న వీరుండన్‌' అని పలికినప్పుడు 'నిన్ను యుద్దంలో ఓడించటానికే ఇంకా బ్రతికి ఉన్నాను, అదే నాజీవిత లక్ష్యం" అని అర్జునుడు వ్యంగ్యంగా చెప్పినట్టు భావించటానికి వీలుంది. మధ్యాక్కర మాటనేర్చరితనానికి వాడటం ఛందళ్ళిల్పం. అర్జునుడు తన ఉనికిని గూఢంగా నిబంధించి వాజ్మయ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టు చిత్రించాడు నన్నయ. (సంపా,) వ. అనిన విని కర్ట్ణుండు బ్రహ్మతేజం బదేయం బని విజయుతోడియుద్ధం బొల్లక క్రమ్మణియె; మటిశల్య భీమసేనులు

పెనంగి మల్లయుద్ధంబు సేయునెడ భీముండు భీమబలంబునం బట్టుకొని శల్యుం ద్రెళ్ళవైచిన. 203 (ప్రతిపదార్థం; అనిన; విని; కర్టుండు; (బ్రహ్మతేజంబు; అజేయంబు= జయింప సాధ్యం కానిది; అని; విజయుతోడి= అర్జునునితో; యుద్దంబు+ఒల్లక= యుద్దం చేయటానికి ఇష్టపడక; 'శ్రమ్మజియె= వెనుదిరిగాడు; మటి, శల్య, భీమసేనులు; పెనంగి= కలెయబడి; మల్లయుద్ధంబు; చేయు, ఎడ= చేసేటప్పుడు; భీముండు; భీమ, బలంబునన్‌= భయంకర మైన బలంచేత; శల్యున్‌; పట్టుకొని; త్రెళ్ళవైచిన= పడవేయగా. తాత్సర్యం: అని అర్జునుడు పల్కగా, కర్ణుడు విని (బ్రాహ్మణతేజస్సును జయించటం సాధ్యం కా దని, అర్జునునితో యుద్ధం చేయటానికి ఇష్టపడక వెనుదిరిగి వెళ్ళాడు. శల్య భీమసేనులు కలియబడి మల్లయుద్ధం చేశారు. అప్పుడు భీముడు భయంకర మైన బలంతో శల్యుడిని పట్టుకొని పడవేశాడు. ఆ. _ సెల్లుండట్లు నేల ద్రెళ్ళ చెచ్చెర లేచి; యొడలు దుడిచికొనుచు నొయ్యం జనియె;

వానింజూచి నగుచు మానుగా విప్రులు ।; భూరిసత్తు భీము బొగడి రంత. 204

నె

ప్రతిపదార్థం: సెల్టుండు= శల్యుడు; అట్టు; నేల= భూమిమీద; (త్రైళ్ళి=ఐ పడి; చెచ్చెరజ బిరబిరా; లేచి; ఒడలు= దేహాన్ని; తుడిచి కొనుచున్‌? ఒయ్యన్‌= తిన్నగా; చనియె= వెళ్ళాడు; వానిన్‌; చూచి; విప్రులు; నగుచున్‌; మానుగా= ఒప్పుగా; భూరి, సత్తు, భీమున్‌= గొప్ప బలవంతు డైన భీముడిని; అంత= అప్పుడు; పొగడిరి. తాత్పర్యం: శల్యు డా విధంగా నేలపై పడి వెంటనే లేచి, శరీరం తుడుచుకొంటూ, తిన్నగా వెళ్ళి పోయాడు. అతడిని చూచి బ్రాహ్మణులు నవ్వుతూ మహాబలవంతు డైన భీముడిని గొప్పగా ప్రశంసించారు. ఆ. _ పరశురాముం డొండె హరు6 డొండె నరు డొండె। గాక యొరులు గలరె కర్టు నోర్వ!

బలిమి భీముం డొండె బలదేవు డొండె గా । కొరులు నరులు శల్యు నోర్వం గలరె! 205 (ప్రతిపదార్థం: పరశురాముండు; ఒండె= కాని; హరుండు= శివుడు; ఒండెజు కాని; నరుండు= అర్జునుడు; జఒండె= కాని; కాక= తప్ప; కర్షున్‌+ఓర్వవ= కర్ణుని ఓడించటానికి; ఒరులు= ఇతరులు; కలరె=ఐ కలరా!; బలిమిన్‌=ఐ బలంచేత; భీముండు; ఒండె= కాని;

ఆదిపర్వము - సపష్తమాశ్వాసము 731 బలదేవుండు= బలరాముడు; ఒండెన్‌= కాని; కాక; ఒరులు= ఇతరులు; నరులు= మానవులు; శల్యున్‌+ఓర్వన్‌, కలరె= శల్యుడిని ఓడించ కలరా! (లేరని భావం) తాత్పర్యం: పరశురాముడో, శివుడో, అర్జ్హునుడో కాక ఇతరులు కర్టుడిని ఓడించగలరా? బలంలో భీముడో, బలరాముడో కాక తక్కిన మానవులు శల్యుడిని ఓడించగలరా?

వ. 'వీ రెవ్వరో యెం దుండుదురో యెటుంగవలయు' నని దుర్యోధనాదు లయిన రాజపుత్తు లెల్ల విస్మితు లయి

యున్న వారలం జూచి కృష్ణుం డిట్లనియె. 206 ప్రతిపదార్థం: వీరు; ఎవ్వరో; ఎందు+ఉండుదురో; ఎజుంగవలయును; అని; దుర్యోధన+ఆదులు+అయిన= దుర్యోధనుడు మొదలైన; రాజ, పుత్రులు+ఎల్ల= రాజకుమారులంతా; విస్మితులు+అయి= ఆశ్చర్యపడినవారై, ఉన్న; వారలన్‌; చూచి; కృష్ణుండు; ఇట్టు+శఅనియె. తాత్పర్యం: 'వీళ్ళెవరో, ఎక్కడ ఉంటారో తెలిసికొనాలి" అని దుర్యోధనుడు మొదలైన రాకుమారు లంతా ఆశ్చర్యంతో ఉండగా, వాళ్ళను చూచి కృష్ణుడు ఈవిధంగా అన్నాడు. చు పరులకు దుష్మరంబయిన భాసుర కార్యము సేసి, తత్వయం

  • వరమునంబత్నిగా బదసి వారిరుహాయత నేతశ్రంగృష్ట నీ

ధరణిసురాన్వయోత్తముండు ధర్మవిధిం; జెపుండయ్య యింకనె

వ్వరికిని జన్నె వీని ననవద్యపరాక్రము నాక్రమింపంగన్‌. 207 ప్రతిపదార్థం: పరులకున్‌= ఇతరులకు (శత్రువులకు అని దుర్యోధనపరమైన చమత్కారార్థం); దుష్కరంబు+అయిన= చేయటానికి అలివి గానిదైన; భాసుర, కార్యము= గొప్పపని; చేసి; ఈ; ధరణి, సుర+అన్వ్నయ+ఉత్తముండు= ఈ బ్రాహ్మణ వంశ మందలి శ్రేష్టుడు; తత్‌+స్వయంవరంబునన్‌= ఆ స్వయం వరంలో; వారిరుహ+ఆయత, నేత్ర= పద్మాలవంటి విశాలాలైన కన్నులు కలదానిని; కృష్ణన్‌= (ద్రౌపదిని: ధర్మవిధిన్‌= ధర్మం'ప్రకారం; పత్నిగాన్‌= భార్యగా; పడసె= పొందాడు: ఇంకన్‌: వీనిన్‌: అనవద్య, పరా[్రమున్‌= సాటిలేని పరాక్రమం కలవాడిని; ఆక్రమింపన్‌+కన్‌= జయించటానికి; ఎవ్వరికిని= ఎవరికైనా; చన్న= సాధ్యమా; చెపుడు+అయ్యా. తాత్పర్యం: ఇతరులు చేయటానికి సాధ్యం కాని గొప్పపని చేసి ఈ (బ్రాహ్మాణ(్రేష్పుడు ఆ స్వయంవరంలో పద్మాల వంటికన్నులు కల ద్రౌపదిని ధర్మమార్గంలో భార్యగా పొందాడు. ఈ సాటిలేనిపరాక్రమ శాలిని జయించటం ఇక ఎవరికి సాధ్యమో చెప్పండి. విశేషం: మహాభారతంలో శ్రీకృష్ణుడు పారకులకు మొట్టమొదట కన్పించేది ఈ ఫఘట్టంలోనే. ఆయన మహనీయవ్యక్తిత్వం, సర్వజ్ఞత, చతురత అద్దంలోవలె మొదట అగుపించేదికూడ ఈ ఘట్టంలోనే. శ్రీకృష్ణుడు-బ్రాహ్మణవేషాల్లో (బ్రాహ్మాణులమధ్య కూర్చున్న పాండవులను మొదట కనిపెట్టాడు. (ద్రౌపదిని గెలుచుకొనగల అర్జునుని ధనుర్విద్యాకాశలాన్ని కూడ దర్శించాడు. ఎంతో దూరదృష్టితో యదు, వృష్టి భోజ, అంధక వంశాల వీరులు పోటీలో పాల్గొనకుండా తప్పించాడు. పాండవులందరిని బలరామునికి పరిచయంచేశాడు. అసూయాద్వేషాలతో పాండవుల ఉనికిపట్టు కనిపట్టాలని ఆరాటపడే దుర్యోధనాది రాకుమారు లందరి (ప్రయత్నాన్ని విరమింపజేశాడు. అర్జునుని సామార్ధ్యాన్ని అతి చతురంగా శ్ఞాఘించి, అన్యుల అసమర్హతను అవహేళన చేశాడు. కథాకథనశిల్పం ఆ మహాసభలో శ్రీకృష్ణుని పురుషోత్తమత్వాన్ని అద్భుతంగా ధ్వనింపచేసింది. న. ' వలన దుదుంగుం డని వారించిన; నట్లు కృష్ణుచేత నివారితులయి రాజపుత్రులు దమతమదేశంబులకుం

జని; రంత భీమార్డునులు బ్రాహ్మణపరివృతు లయి ధ్రుపదరాజపుత్రిన్‌ దోడ్కొని వచ్చునంత. 208

732 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్హం; వలవదు= వద్దు; ఉడుంగుండు= మానుడు; అని; వారించినన్‌= ఆపగా, అట్టు; కృష్ణుచేత; నివారితులు+అయి= ఆపబడినవా ళృయి; రాజపుత్రులు; తమతమ, దేశంబులకున్‌; చనిరి; అంత; భీమ+అర్జ్హునులు; బ్రాహ్మణ, పరివృతులు+అయిజ= (బ్రాహ్మణులచేత చుట్టబడినవాళ్ళయి; [ద్రుపదరాజ పుత్రిన్‌= (ద్రౌపదిని; తోడ్కొని; వచ్చునంత. తాత్పర్యం: “వద్దు. వాళ్ళెవరో తెలుసుకొనే ప్రయత్నం మానండి” అని శ్రీకృష్ణుడు ఆ రాకుమారులందరిని ఆపగా, వాళ్ళు తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళారు. అప్పుడు భీమార్జునులు బ్రాహ్మణులు చుట్టూ గుమికూడి రాగా (ద్రౌపదిని తమతో తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు. సీ. 'ఉత్సవ సందర్శనోత్సుకు లై పోయి । కడుం బెద్ద ప్రొ ద్దయ్యెం గొడుకు లేల

మసలిరొ? కౌరవుల్‌ విసువక వైరంబు । గావించు పాపస్వభావు; లెజింగి

క్రందునం జంపిరో? యందుల కేవురు ; లీలతో నొక్కట నేల యరిగి?

రవ్యయుం డయిన వేదవ్యాసు వచనంబు ; నిక్కంబుగాకుండు నొక్కొ? వేల్పు ఆ. లార!|భూసురేశులార! మీ శరణంబ । కాని యొందుగతియు. గాన; నాకు

శరణ మగుండు; సుతులం గరుణతో రక్షింపుం । డనుచు. గుంతి వగచి వనరుచుండె. 209 (ప్రతిపదార్థం: ఉత్సవ, సందర్భన+ఉత్సుకులు+ఐ= స్వయంవరోత్సవాన్ని చూడగోరినవాళ్ళయి; కొడుకులు; పోయి; కడున్‌= మిక్కిలి; పెద్ద, (ప్రొద్దు= ఎక్కువసేపు; అయ్యెన్‌; ఏల= ఎందుచేత; మసలిరొ= ఆలస్యం చేశారో; విసువక= విసుగు లేకుండ, వైరంబు: కావించు; పాపస్వభావులు= దుర్మార్గపుబుద్ది కలవాళ్ళు; కౌరవుల్‌! ఎజింగి= తెలిసికొని; క్రందునన్‌= సందడిలో; చంపిరో; అందులకు; ఏవురు= ఐదుగురు; లీలతోన్‌= విలాసంగా; ఒక్కటన్‌= ఒక్కటిగా; ఏల= ఎందుచేత; అరిగిరిఐ వెళ్లారు; అవ్యయుండు+అయిన= నాశము లేని వా డైన; వేదవ్యాసు, వచనంబు= వేదవ్యాసునిమాట; నిక్కంబు= నిజము; కాక+ఉండున్‌"? ఒక్కొ= కాకుండునా?; వేల్పులార= దేవతలార; భూసుర+-ఈశులార= (బ్రాహ్మణోత్తములారా; మీ, శరణంబు= మీశరణమే; కాని; ఒండుజ వేరొక; గతియున్‌= మార్గమును; కాన; నాకు; శరణము+అగుండు; సుతులన్‌= కొడుకులను; కరుణతో; రక్షింపుడు; అనుచున్‌; కుంతి; వగచి= విచారించి; వనరుచు+ఉండెజఐ ఏడుస్తూ ఉండెను. తాత్పర్యం: కొడుకులు స్వయంవరోత్సవాన్ని చూడబోయి చాల సేపైనది. ఇంకాతిరిగి రాక యెందుకు ఆలస్యం చేశారో? విసుగులేని వైరం పూనిన పాప స్వభావు లైన కౌరవులు వీరిని గుర్తించి ఆ సందడిలో చంపేశారేమో?! విలాసంగా అక్కడికి ఐదురుగు ఒకేసారి యెందుకు వెళ్ళారు? అవ్యయుడైన వేదవ్యాసుని మాట సత్యం కాకుండా ఉంటుందా? దేవతలారా! బ్రాహ్మణోత్తములారా! మీరే నాకు దిక్కు. వేరే మార్గ మేదీ లేదు. నన్ను రక్షించండి. నా కుమారులను దయతో కాపాడండి” అని కుంతి విచారించి, దుఃఖిస్తూ ఉండింది. విశేషం: చిన్నప్పటినుండి దుర్యోధనాదులు భీమాదులపై పగబూని ఉన్నారు. ఒంటరిగా ఒక్కొక్కరిని (ముందుగా భీముడిని) చంపేయత్నంచేసి విఫలు లయ్యారు. ఆ తరువాత పాండవులందరినీ ఒక్కుమ్మడిగా చంపాలని యత్నించి లాక్షాగ్భహాన్ని కల్పించారు. అందువలన కౌరవులు విసుగులేని వైరం సాగించేవాళ్ళని కుంతి పేర్కొన్నది. పాండవులంతా ఒక్కసారి ఒక్కచోట దొరికితే కౌరవులు చంపేస్తారేమో అనే భయం ఈ ఘట్టంలో కుంతికి కలగటం సహజర. దేవతలనూ, బ్రాహ్మణులనూ శరణు కోరింది. శరణుకోరినవారిని రక్షించటం వారి ధర్మమనే భక్తివిశాసాలు కల తల్లి ఆమె.

అర్హునుండు ద్రౌపదిం దెచ్చి తల్లికి నివేదించుట (సం.1-182-1)

వ. అట్టి యవసరంబున. చల్లియొద్దకు ధర్శరాజును గవలవారు మున్న వచ్చియున్నం దదనంతరం౦ంబ

భీమార్జునులు ద్రౌపదీసహితు లయి చనుదెంచి మ్రొక్కి 'మే మొక్క భిక్ష దెచ్చితి' మని తల్లికి నివేదించిన,

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 733 నెలుంగక యప్పటి యట్ల కా వగచి కుంతీదేవి సంతసిల్లి దాని 'మీ రేవురు నుపయోగింపుం డని కొడుకుల నియోగించి, భువన త్రయ రాజ్య లక్షియుం బోలె నున్న యక్మన్నియం జూచి లజ్జించి, యధర్మభీత యయి ధర్మతనయున కి ట్లనియె. 210

(ప్రతిపదార్థం: అట్టి; అవసరంబునన్‌= సమయాన; తల్లి, ఒద్దకు= తల్లి దగ్గరకు; ధర్మరాజును; కవలవారు= నకుల సహదేవులు; మున్ను, వచ్చి=ఐ ముందుగానే వచ్చి; ఉన్నన్‌; తత్‌+అనంతరంబు+అ= ఆ తరువాత, భీమ=అర్జ్హునులు; (ద్రౌపదీ, సహితులు+అయి; చనుదెంచి= వచ్చి: మొక్కి; మేము+ఒక్క; భిక్ష తెచ్చితిమి+అని; తల్లికి; నివేదించినన్‌= తెలుపగా; ఎజుంగక; ఎప్పటి, అట్ట కాజు ఎప్పటినలె అయినట్టు; వగచి= తలచి; కుంతీదేవి; సంతసిల్లి: దాని; మీరు; ఏవురున్‌= ఐదుగురును; ఉపయోగింపుండుజ వినియోగించుకొనండి, అనుభవించండి; అని; కొడుకుల; నియోగించి= నియమించి; భువన, త్రయ, రాజ్య, లక్ష్మియున్‌: పోలెన్‌= లోకములు మూడింటియొక్క రాజ్యలక్ష్మివలె; ఉన్న; ఆ+కన్నియన్‌: చూచి; లజ్జించి= సిగ్గుపడి; ఆధర్మ: భీత+అయి= అధర్మానికి భయపడిన దై; ధర్మ తనయునకు; ఇట్టు+ఇనియె. చాత్చర్యం: అటువంటి సమయంలో ధర్మరాజు, నకులసహదేవులు తల్లి దగ్గరికి ముందుగానే వచ్చి-ఉండగా; తర్వాత భీమార్జునులు ద్రౌపదితో కూడా వచ్చి నమస్కరించి 'మే మొక భిక్ష తెచ్చాము” అని తల్లికి నివేదించారు. ఆమె ఆ భిక్షనుగూర్చి తెలియక ఎప్పటివంటిదానిగానే భావించి, సంతసించి, “దానిని మీ రైదుగురు ఉపయోగించండి" అని కొడుకులను ఆజ్ఞాపించింది. అయితే, ముల్లోకాల రాజ్యలక్ష్మివలె ఉన్న ఆ కన్యను (ద్రౌపదిని) చూచి, సిగ్గుపడి, అధర్మానికి భయపడి ధర్మరాజుతో ఇట్లా పలికింది. సీ. 'ఈ తన్విందోడ్కొని నీ తమ్ములిరువురు ఫ్రీతి నేతెంచి 'యీ భిక్ష యొప్పం గొను' మని నాకు జెప్పినను 'నేవురు నుప । యోగింపుల డంటి; నాయుక్తి దొల్లి యన్ఫృత మెన్నందు6గా దనఘ! మీ రెప్పుడు । మద్వచనాతిక్రనుంబు సేయ; రిది లోకమున లేని యది; యేమి సేయంగ : నగు?' నని చింతాకులాత్మ యైనం తే. _దల్లినూరార్జి, వాసవతనయుం జూచి 'పార్ధ! నీచేతం బడయంగం బడిన దీని నగ్నిసన్నిధిం బాణిగ్రహంబు నీవ, చేయు' మన ధర్మజునకును జిష్టు.దనియె. 211 ప్రతిపదార్థం: ఈ, తన్విన్‌= ఈ కాంతను; తోడ్కొని; నీతమ్ములు; ఇరువురు; ప్రీతిన్‌= సంతోషంతో; ఏతెంచి? వచ్చి; ఈ, భిక్ష ఒప్పన్‌= ఒప్పుగా? కొనుము+అని= గ్రహింపు మని; నాకున్‌) చెప్పినను; ఏవురున్‌= ఐదుగురును; ఉపయోగింపుండు; అంటి= అని అన్నాను; నా, ఉీక్తిజ నా మాట; తాల్లి= పూర్వం; ఎన్నండును; అనృతము= అబద్ధం; కాదు= కాలేదు; అనఘ పాపరహితుడా - ఓ ధర్మజా! మీరు; ఎప్పుడు; మత్‌+వచన+అతి(క్రమంబు= నా మాట దాటుటను; చేయరు; ఇది=ఐ ఈ పద్దతి; లోకాన; లేని; అది; ఏమి; చేయంగన్‌; అగును; అని; చింతా+ఆకుల+ఆత్మ+ఐనన్‌= చింతచేత కలత నొందిన మనస్సు కలది కాగా; తల్లిన్‌; ఊరార్చి= ఓదార్చి; వాసవ. తనయున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడిని; చూచి; పార్టా!= అర్జునా; నీచేతన్‌; పడయంగన్‌+ పడిన= పొందబడిన; దీనిన్‌= ఈ స్త్రీని; అన్ని; సన్నిధిన్‌= అగ్ని ఎదుట; నీవ= నీవే: పాణిగ్రహంబు, చేయుముజ పెళ్ళాడుము; అనః= అని అనగా; ధర్మరాజునకును? జిష్షుండుజ అర్జునుడు; అనియె= ఇట్లా అన్నాడు. తాత్పర్యం: “ఈ కాంతను తోడ్కొని నీ తమ్ములిద్దరు సంతోషంతో వచ్చి ఈ భిక్ష (గ్రహించు మని నాతో చెప్పగా, “'మ్పీరైదుగురు ఉపయోగించండి' అని అన్నాను. నా మాట ఇంతవరకు ఎన్నడు అసత్యం కాలేదు. ధర్మజా! మీ రెప్పుడు నా మాట జవదాటరు. కాని, యిది లోకవిరుద్ధం. ఏం చేద్దాం' అని చింతతో కలతచెందిన తల్లిని ఓదార్చి,

734 (శ్రీమదాంధ్ర నముహాభారతము

అర్జునుని వైపు చూచి “అర్జునా! నీవు సంపాదించిన ఈమెను అగ్నిసన్నిధిలో నీవే వివాహం చేసికొమ్ము' అని

పల్కగా ధర్మజునితో అర్జునుడు ఇట్లా అన్నాడు.

న. 'పెద్దవాం డుండం గొండుక వానికి వివాహం బగుట ధర్మ విరుద్ధంబు గావున వీని నగ్రమహిషింగాం బరిగ్రహింపుము; మా నలువుర యనుమతంబును నిట్టిది యనుచున్న యవసరంబున విధిప్రేరణ నశంబున. 212

ప్రతిపదార్థం: పెద్దవాడు; ఉండన్‌; కొండుకవానికి= చిన్నవానికి; వివాహంబు+అగుట= పెండ్లి అగుట; ధర్మ, విరుద్దంబు=

కావున; దీనిన్‌, అగ్ర, మహిషీన్‌, కాన్‌= సెద్దభార్యగా; పరి(గ్రహింపుము; మా నలువుర; అనుమతంబునున్‌= సమ్మతికూడ; ఇట్టిద= ఇదే; అనుచు+ఉన్న; అవసరంబున= సమయాన; విధి, ప్రేరణ, వళశంబున= విధిప్రేరణచేత.

చాత్సర్యం: "పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లి కావటం ధర్మవిరుద్దం. అందుచేత ఈమెను పెద్దభార్యగా నీవు

పరి[గ్రహించుము. మా నలువురికి సమ్మత మైనది కూడ ఇదే! అని అంటున్న సమయంలో విధిప్రేరణతో.

ఉ. ఆలలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండుభూ పాల తనూజపంచకము పంచశరాహతి. బొందె నొక్కతన్‌ బాలికం దొల్లి యవురకు భామినింగా సృజియించి యున్నయ య్యాలరి బ్రహ్మ చెయ్రి పరమార్ధముగా కది యేల యొండగున్‌. 213

ప్రతిపదార్హం: ఆ, లలిత+అంగి= అందు= ఆ అందమైనశరీరం కల దద్రౌపదియందు, హృదయంబులు= మనస్సులు; దృష్టులు= చూపులు; నిల్పి, పాండుభూపాల, తనూజ, పంచకము= పాండురాజు కొడుకు లైదుగురి సమూహం; పంచ, శర+ఆహతిన్‌= ఐదుబాణాలు కలవాడైన మన్మథునియొక్క దెబ్బను; పొందెన్‌; ఒక్కతన్‌, బాలికన్‌= ఒక కన్యకను; తొల్లి= పూర్వం; ఏవురకు= ఐదుగురికి; భామినిన్‌+కా= భార్యగా; సృజియించి; ఉన్న; ఆ+ఆలరి, (బ్రహ్మ, చెయ్ది= ఆ తుంటరిఅయిన బ్రహ్మయొక్కచేష్ట: అది; పరమ+అర్హము= సత్యము కాక; ఒండు= ఇతరం; ఏల, అగున్‌= ఎందుకు కౌతుంది? తాత్పర్యం: ఆ అందమైనశరీరం కల (ద్రౌపదిమీద పాండురాజు కుమారు లైదుగురు తమ మనస్సులను, చూపులను నిల్పి మన్మధ బాధ పొందారు. ఒక కన్యకను ఐదుగురికి భార్యగా భావించి ముందే సృష్టించి ఉన్ల తుంటరిబ్రహ్మచేసిన పని సత్యంకాక, వేరొక విధంగా ఎలా అవుతుంది? విశేషం: పాండుభూపాల తనూజ 'పంచకం'- అనే ప్రయోగంలో సమాహారరూప మైన 'పంచకం' అనే శబ్దానికి వ్యంగ్యార్హస్ఫూర్తి ఉన్నది. ద్రాపదిపట్ట పాండవులకు ఉండే ఏకతాభావాని కిది సూచన. పంచేంద్రోపాఖ్యానంలో చెప్పబడబోయే ఎకైకతత్వాని కిది ధ్వని. ద్రాపదియందు పాండవులు అయిదుగురు ఒక్కసారి మన్మధభావం పొందారని చెప్పటం సాభిప్రాయం. ఆపైన (ద్రౌపదికూడ పాండవులందరియందు అనురక్తురా లౌతుంది. ఇది చిత్రమైన సన్నివేశం. భార్యాభర్తల నడుమ ఉదయించే రతిభావం, అనురాగం, జననాంతర సొహృదరూపం కాని తాత్కాలికం కాదని ఇందులో ధ్వనింపబడింది. అంతేకాదు - మచ్స్యయం(త్రం భేదించినతరువాత ద్రౌపది మన్మథునివంటి అర్జునుని మెడను కల్యాణమాలతో అలంకరించినట్టు కవి చెప్పినా వారిరువురి మనస్సులలో మౌర వికారం కలిగినట్టు చెప్పక, ఇక్కడ అందరికీ ఒకేసారి మన్మధభావం ఉదయ మైనదని వరించడం నన్నయ కధాకధనశిల్పం. (సంపా.)

వ. ఇట్లు పాంచాలియందు బద్ధానురాగు లయియున్న తమ యేవుర యభిప్రాయం బెటింగి వేద వ్యాస వచనంబులుం దలంచి ధర్మతనయుండు దమ్ముల కి ట్లనియె. 214

ఆదిపర్వము - సస్తమాశ్వాసము 735

(ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; పాంచాలి; అందు; బద్ద+అనురాగులు+అయి= తగులుకొన్న (ప్రేమకలవా ళ్ళయి; ఉన్న, తమ, ఏవుర= తమ ఐదుగురి; అభిప్రాయంబు; ఎజింగి=ఐ తెలిసికొని; వేదవ్యాస, వచనంబులున్‌; తలంచి; ధర్మతనయుండు; తమ్ములకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: ఈ విధంగా (ద్రాపదియందు అనురక్తు లై ఉన్న తమ అయిదుగురి అభిప్రాయం తెలిసికొని, వేదవ్యాసుని మాటలు తలచి, ధర్మరాజు తమ్ములతో ఈ విధంగా అన్నాడు. కు గురువచనస్థితి మనకే। గురకును నిది పత్నిగా. దగుం గావున ని

త్తరుణిని బరిగ్రహైంతము । తిరముగ; గురువచన మొండుదెజం గేల యగున్‌. 215 ప్రతిపదార్థం: గురు, వచన, స్టితి= పెద్దవారియొక్కమాట ఉండటంచేత; మనకు+ఏగురకునున్‌= మన ఐదుగురికిని; ఇది= ఈ (ద్రొపది; పత్ని= భార్య; కాన్‌, తగున్‌= కాదగును; కావునన్‌: ఈ+తరుణిని= ఈ కాంతను, తిరముగా= స్థిరంగా; పరి[గ్రహించుదము= పెండ్లాడుదాం; గురు, వచనముజ పెద్దవారిమాట; ఒండు, తెజంగు= వేరు విధంగా; ఏల, ఆగున్‌. తాత్పర్యం: పెద్దల మాట ప్రకారం మన ఐదుగురికి ఈమె భార్య కాదగును. కనుక ఈమెను నిశ్చితంగా మనం వివాహం చేసుకొందాము. పెద్దలమాట వ్యర్థం కాదు గదా! న. అని పలుకుచున్న్మయవసరంబున. 216 తాత్పర్యం: అని అంటున్న సమయంలో.

శీకృష్ణ బలరాములు ధర్మరాజాదుల( జూడవచ్చుట. (సం.1-183-2)

శా. _రాజత్కీర్తులు వచ్చి కాంచి రనఘుల్‌ రాముండు గృష్టుండు న

య్యాజామీధు నజాతశత్రు నృపలోకారాధ్యు నుద్యద్దుణ

భ్రాజిష్టుం దమ మేనయత్త కొడుకున్‌ బాలార్కతుల్యోజ్ట్వల

త్తేజున్‌ బ్రాత్భచతుష్మనుధ్యగతుం గౌంతేయాగ్రజూన్‌ ధర్మజున్‌, 217 ప్రతిపదార్థం: రాజత్‌+కీర్తులు= (ప్రకాశిస్తున్న కీర్తికలవాళ్ళు;: అనఘుల్‌= పాపం లేనివాళ్ళు; రాముండు= బలరాముడు; కృష్ణుండున్‌? వచ్చి; ఆ+ఆజామీఢున్‌= ఆ అజామీఢుని వంశంలో పుట్టినవాడిని; అజాతళత్రున్‌= పుట్టబడని శత్రువులు కల వాడిని; నృప, లోక+ఆరాధ్యున్‌= రాజసమూహంచేత సేవింపదగిన వాడిని; ఉద్యత్‌+గుణ, (భ్రాబిష్టున్‌= ఉన్నత మైన గుణాలచేత (ప్రకాశించేవాడిని; తమ, మేనయత్త కొడుకున్‌: బాల+అర్క, తుల్య+ఉత్‌+జ్బలత్‌+తేబాన్‌= బాలసూర్యునితో సమానంగా (ప్రకాశిస్తున్న తేజస్సు కలవాడిని; (భ్రాతృ, చతుష్క, మధ్య, గతున్‌= తమ్ములు నలుగురిమధ్య ఉన్నవాడిని; కౌంతేయ+అ(గ్రజున్‌= కుంతికొడుకులలో పెద్దవాడిని; ధర్మజున్‌; కాంచిరి= చూచారు. తాత్పర్యం: (ప్రకాశిస్తున్న క్తీర్తి కలవాళ్ళు, పాపంలేనివాళ్ళు అయిన బలరామకృష్ణులు వచ్చి- అజామీఢుని వంశంలో పుట్టినవాడు, శత్రువులు లేనివాడు, రాజసమూహం సేవింప తగినవాడు, ఉన్నతగుణాలతో వెలిగేవాడు, తమ మేనత్తకొడుకు, బాలసూర్యునితో సమానమైన ఉజ్జులతేజస్సు కలవాడు, తమ్ములు నలుగురి మధ్యలో ఉన్నవాడు, కుంతికొడుకులలో పెద్దవాడు అయిన ధర్మజుడిని చూచారు. విశేషం: మహాభారతంలో ఇది (శ్రీకృష్ణపాండవుల (ప్రధమసమావేశం. నన్నయగారి వస్తుద్వని శిల్పానికి ఇది ఉత్తమ ఉదాహరణం. ఇది ఒక అపూర్వ ప్రథమ సమావేశం. శ్రీకృష్ణుడు పాండవులను చూచాడని వర్షించలేదు నన్నయ. నలుగురుతమ్ముల నడుమ నున్న

736 శ్రీమదాంధ్ర మహాభారతము ధర్మరాజును చూచినట్టు వర్షించాడు. అంతేకాదు (బ్రాహ్మణ వేషధారిగా కాక 'నృపలోకారాధ్యుడి'గా దర్శించినట్లు వర్షించటం సాభిప్రాయం. శ్రీకృష్ణకృపాకటాక్షాలతో ధర్మజుడు రాజసూయయాగాదులు నిర్వహించి సకల రాజలోక పూజితుడౌతాడన వస్తుధ్వని. 'బాలార్కతు ల్యోజ్జలతేజు' డనటం మరొక విశేషం. ఇక్కడినుండి ధర్మరాజు జీవితంలో ఉజ్జుల అధ్యాయం మొదలౌతున్న దని భావం. ముందుపద్యం (213)లో పాండవ పంచకం అనే సమాసం వ్యక్తులుగా వారైదుగురైనా తత్త్యంలో ఒకరే అని ధ్వనింపజేస్తున్నది. అందువలననే నాయికగా (ద్రౌపది ఒక్కతే. మహాభారతంలో నాయకులు పాండవులు, అందులోనూ ప్రధానుడు ధర్మరాజు. భీమాదులు అను నాయకులు, అనునాయకులంటే స్వీయప్రయోజనం లేకుండా ప్రధాన నాయక కార్యమే తమ కార్యాలుగా భావించే అద్వైత చిత్తవృత్తులు కలవారు. (శ్రీకృష్ణుడు పాండవులకు దైవం వంటి మిత్రుడు, గురువు బంధువు. అందువలన మహాభారతంలో కృష్ణుడు ఉపనాయకుడు. స్వీయప్రయోజనంతోపాటు నాయక (ప్రయోజనాన్ని కూడా సాధించిపెట్టేవాడు ఉపనాయకుడు. ఒక్కొకసారి నాయకునికంటె ఉపనాయకుడు మహిమాన్వితుడు కావచ్చును. ఇటువంటి సందర్భమే ధర్మరాజుకు సిద్దించింది. దానివలన ధర్మజుడు ఉభయార్హసిద్ది అయ్యాడు. శ్రీకృష్ణుడు, పాండవులు (ద్రౌపది కుంతి - అనే పాత్రలు పాండవపక్షంలో ఇక ముందుకధలో (ప్రధానపాత్రలు నిర్వహించబోతున్నా రన్న అర్జాన్ని ధద్వనిమయం చేశాడు నన్నయ. (సంపాం వ. కని త మ్మైటీంగించి యతిస్నేహంబున నయ్యథధిష్టిరునకుం గుంతీదేవికి మొక్కి భీమార్దుననకుల సహదేవులం గౌంగిలించుకొని, పరమసమ్మదరసపూరితహృదయు లై యున్న వారల కుశలం బడిగి ధర్మరా జిట్లనియె. 218 ప్రతిపదార్థం: కని= చూచి; తమ్ము+ఎటిగించి= తమను పరిచయం చేసికొని; అతి, 'స్నేహంబునన్‌; ఆ యుధిష్టురునకున్‌, కుంతీదేవికి; మొక్కి; భీమ+ అర్జున, నకుల, సహదేవులన్‌; కౌంగిలించుకొని; పరమ, సమ్మద, రస, పూరిత, హృదయులు+ఐ= మిక్కిలి ఆనంద మనే రసంచేత నిండిన హృదయాలు కలవాళ్ళయి; ఉన్న; వారల; కుశలంబు= క్షేమం; అడిగి; ధర్మరాజు; ఇట్టు+ అనియె. తాత్సర్యం: చూచి తమను పరిచయం చేసికొని మిక్కిలిప్రేమతో ధర్మజునికి, కుంతీదేవికి నమస్కరించి, భీమార్జున నకుల సహదేవులను కౌగిలించుకొని పరమానందంతో నిండిన హృదయాలతో ఉన్న వాళ్ళను కుశల మడిగి ధర్మరాజు ఇట్టా అన్నాడు. కః, బఒవ్వమింగౌరవులకుంగడు | దవ్వయి మటీి విప్రవేషధారుల మయి మ మ్మైెవ్వరు నెటుంగకుండంగ | నివ్విధమున నున్న నెట్టు లెటింగితి రీరల్‌, 219 ప్రతిపదార్థం: ఒవ్వమిన్‌= విరోధంచేత; కౌరవులకున్‌; కడున్‌= మిక్కిలి; దవ్వు+అయి= దూరమై; మి; విప్ర, వేషు ధారులము+ అయి= బ్రాహ్మణవేషాలను ధరించినవాళ్ళమై; మమ్ము+ఎవ్వరున్‌: ఎయింగకు ఉండంగన్‌= తెలియకుండగ: ఈ, విధమునన్‌: ఉన్నన్‌; ఈరల్‌= మీరు; ఎట్టులు= ఏవిధంగా; ఎఅింగితిరి= గుర్తించినారు? తాత్పర్యం: విరోధంతో కౌరవులకు మేము దూరమై, (బ్రాహ్మణ వేషాలు ధరించి, మమ్మల్ని ఎవ్వరూ గుర్తించకుండ ఈ విధంగా ఉండే, మీ రెట్టా తెలిసికొన్నారు? వు అనిన నగుచు వాసుదేవుం డి ట్లనియె. 220 తాత్పర్యం; అని ధర్మరాజు అనగా (శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. ఉ. అంబుజమిత్రుందంబుదచయాంతరితుం డగుడుం దదీయ తే జంబు జగజ్జనంబులకు శక్యమె కప్పంగ; మీరు గూఢభా వంబున నున్న మీదగు నవారితతేజము భూజనప్రసి ద్ధంబగుం గాక; దానిం బిహితంబుగ నెవ్వరుం జేయనేర్లురే. 221

ఆదిపర్వము - సస్తమాశ్వాసము 737 ప్రతిపదార్థం: అంబుజ, మి(త్రుండు= నీటినుండి పుట్టిన పద్మాలకు స్నేహితు డైన సూర్యుడు; అంబుద, చయ, అంతరితుండు= మేఘ సమూహంచేత కప్పబడినవాడు; ఆగుడున్‌= కాగా? తదీయ, తేజంబు= ఆతనియొక్క తేజస్సు; జగత్‌+ జనంబులకున్‌= లోకంలోని మానవులకు; కప్పంగ= అగుపడకుండ చేయుట; శక్యమే= సాధ్యమా; మీరు; గూఢ, భావంబునన్‌= రహస్య మైన విధంగా; ఉన్నన్‌; మీది+అగున్‌; అవారిత, తేజము= అడ్డగింప సాధ్యం కాని తేజస్సు: భూ, జన, ప్రసిద్ధంబు= భూమి యందలి జనులకు తెలిసినదే; అగున్‌, కాక; దానిన్‌; పిహితంబుగన్‌= కప్పబడిన దానినిగా; ఎవ్వరున్‌= ఎవరైనను; చేయ; నేర్తురే. తాత్పర్యం; సూర్యుడిని మేఘసమూహం కప్పినొఅతని తేజస్సును లోకంలోని జనులకు కనిపించకుండ చేయటం సాధ్యమా? అట్లాగే మీరు రహస్యంగా మారువేషంలో ఉన్నా, అడ్డగించ సాధ్యం కాని మీ తేజస్సు లోకంలోని (ప్రజలకు ప్రసిద్ధమే. దానిని అగుపడకుండ ఎవ్వరు చేయగలరు? విశేషం: అలం: దృష్టాంతం. పాండవులు ఎన్నో కష్టా లనుభవించి, చివరకు గొప్పుగా (ద్రౌపదిని గెల్బుకొని మహానందంతో ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు మొదటిసారిగా కలిసి చేసిన ఈ ప్రశంస, వారి ఆనందాన్ని అంతకు అంత పెంచటమే గాక వారి హృదయాలను గట్టిగా తన వశం చేసుకోగలదు.

పాండవుల వంశాదికము నెటీంగి ర మ్ముని ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం బనుచుట (సం.1-184-3)

వ. 'సకలరాజసమక్షంబున నిట్టి యతిమానుషం బయిన యద్దుతకర్మం బర్జునునక కా కన్యులకుం జేయ శక్యంబె? యని యెజింగితిమి; మీపరాక్రమంబ మిమ్ము నెటింగించె; నధర్మనిరతు లగు ధృతరాష్ట్ర దుర్యోధనులు సేసిన లాక్షాగారదాహప్రయోగంబువలన విముక్తుల రయితి; రింక మీకు లగ్గగు' నని చెప్పి బలదేవసహితుం డయి వాసుదేవుం డరిగిన; నిట ద్రుపదుండు దన కూంతునకు వరుం దైన వాం డెవ్వండో యేవంశంబునవాండో వానిచరితం బెట్టిదో యెఖింగి రమ్మని ధృష్టద్యుమ్నుం బనిచిన, నతండు భీమార్జున ద్రౌపదుల పిబుందన వచ్చి తన్నొజు లెబుంగకుండ నక్కుంభకారగ్భృహంబున నుండి యంత వృత్తాంతంబు నెజింగిపోయి ద్రుపదున కి ట్లనియె. 222

ప్రతిపదార్థం: సకల, రాజ సమక్షంబునన్‌= అందరు రాజుల ఎదుట; ఇట్టి; అతిమానుషంబు+ఐన= మానవులకు సాధ్యంకాని

దైన; అద్భుత కర్మంబు= ఆశ్చర్యకరమైన పని; అర్జునునకు+అ, కాక అర్జునునకు తప్ప; అన్యులకున్‌= ఇతరులకు; చేయ; శక్యంబె= సాధ్యమా; అని; ఎజింగితిమిజ తెలిసికొంటిమి; మీ; పరాక్రమంబు+అ; మిమ్మున్‌+ఎజింగించెన్‌; అధర్మ, నిరతులు+ అగు= అధర్మంలో ఇష్టంకలవాళ్ళయిన; ధృతరాష్ట్ర దుర్యోధనులు; చేసిన: లాక్షా+అగార,. దాహ, ప్రయోగంబు వలన= లక్కయింటిని తగులబెట్టే ప్రయత్నంనుండి; విముక్తులరు+అయితిరి= తప్పించుకొన్న వా ళ్ళయితిరి; ఇంక; మీకు; లగ్గు= మేలు; అగున్‌? అని; చెప్పి: బలదేవ, సహితుండు+అయి= బలరామునితో కూడి; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; అరిగినన్‌= వెళ్లగా, ఇటీ,

'ద్రుపదుండు; తన; కూతునకు; వరుండు+ఐన వాండు= భర్త ఆయిన; ఎవ్వడో; ఏ వంశంబున వాండో; వాని; చరితంబు; ఎట్టిదో;

ఎజింగి= తెలుసుకొని, రమ్ము+అని; ధృష్టద్యుమ్నుం; పనిచినన్‌= పంపగా; అతండు; భీమ+అర్జున, (ద్రౌపదుల; పియుందన్‌+ అ=

వెనుక; వచ్చి; తన్ను= తనను; ఒరులు= ఇతరులు; ఎయుంగక+ఉండన్‌= తెలియకుండ; ఆ+కుంభకొర, గృహంబునన్‌= ఆ

కుండలు చేసేవాని ఇంట్లో; ఉండి; అంత, వృత్తాంతంబున్‌= విషయము అంతా; ఎటింగి; పోయి; (ద్రుపదునకు; ఇట్టు+అనియె.

తాత్సర్యం; “అందరు రాజులముందు మానవులకు అసాధ్య మైన ఇటువంటిఅద్భుతకార్యం చేయటం అర్జునునికి కాక ఇతరులకు సాధ్యమా? అని తెలిసికొన్నాము. మీ పరాక్రమమే మిమ్మల్ని తెలియపరచింది. అధర్మంలో ఆసక్తి కలవా ళ్ళయిన ధృతరాష్ట్ర దుర్యోధనులు చేసిన లాక్షాగృహ దహనంనుండి తప్పించుకొన్నారు. ఇక మీకు మేలు కలుగుతుంది" అని చెప్పి బలరామునితోగూడి శ్రీకృష్ణుడు వెళ్లిపోయాడు. ఇక్కడ ద్రుపదుడు తన పుత్రికకు భర్త

738 శ్రీమదాంధ్ర మహాభారతము అయినవాడు ఎవ్వడో? ఏ వంశంవాడో:; అతనిచరిత్ర ఎటువంటిదో? తెలిసికొని రమ్మని ధృష్టద్యుమ్నుడిని పంపాడు. అతడు భీమార్జునద్రౌపదుల వెనుకనే వచ్చి, ఇతరులు తనను చూడకుండ, ఆ కుమ్మరివాని యింట్లో ఉండి, వృత్తాంత మంతా (గ్రహించి, వెళ్ళి 'ద్రుపదునితో ఈ విధంగా చెప్పాడు. సీ _ అయ్యిద్దణును గృష్ట న ట్లొప్పం దోడ్కొని ; చని యొక్కముదుసలి సాని కపుడు

మైొక్కి యక్కృన్యను మొక్కించి మజియొక్క; గౌరవర్డుండు పంప6 గడంకతోడ

నలువురు భూసురనాథగ్భహంబుల । కరిగి భైక్షము దెచ్చి యంతగూడు

నొగిన యయ్యవ్వకు నొప్పించియున్న న ।; య్యవ్వ యు ద్రౌపది నర్జింబిలిచి అ. బలివిధానములకు బ్రహ్మణాతిథులకు । నన్నకాంక్షు లైన యధ్వగులకు

నగ్రమిందు. బుచ్చి యయ్యగ్రశేషంబుం। జెలువ రెండు పాళ్ళు సేయు మొనర. 223 ప్రతిపదార్థం: ఆ+ఇద్దణును; కృష్ణన్‌= (ద్రౌపదిని; అట్టు; ఒప్పన్‌, తోడ్కొని; చని; ఒక్క; ముదుసలి, సానికి= ఒక ముసలి అవ్వకు; అపుడు; మొక్కి; ఆ+కన్యను; (మొక్కించి; మథి, ఒక్క= ఇంకొక; గౌరవర్జుడు= తెల్లని వన్నెగలవాడు; పంపన్‌= ఆజ్ఞాపింపగా; కడకతోడన్‌= ప్రయత్నంతో; నలువురు; భూసుర నాధ, గృహంబులకు= (బ్రాహ్మణ ్రేష్టుల ఇండ్లకు; అరిగి= వెళ్ళి. ఖైక్తము= భిక్షాసమూహం; తెచ్చి; అంత; కూడున్‌= అంత అన్నమును; ఒగిన్‌= (క్రమముగ; ఆ+అవ్వకున్‌; ఒప్పించి= అప్పగించి; ఉన్నన్‌; ఆ+అవ్వయు; (ద్రౌపదిన్‌? అర్థిన్‌= ప్రీతితో; పిలిచి; చెలువ= సుందరీ; బలి విధానములకుజ= బలులు వేయుటకు; బ్రాహ్మణ+ ఆతిధులకున్‌= (బ్రాహ్మణు లైన అతిధులకు; అన్న, కాంక్షులు+ఐన= అన్నమును కోరేవా ళృయిన; అధ్వగులకున్‌= బాటసారులకు; ఇందున్‌= దీనిలో; అ([గ్రము= అధికభాగం; పుచ్చి= (గ్రహించి; ఆ+అ(గ్రశేషంబున్‌= అగ్రభాగం పోగా మిగిలిన దానిని; రెండు, పాళ్ళు; ఒనరన్‌= ఒప్పుగ; చేయుము. తాత్సర్యం: 'ఆ యిద్దరు (భీమార్జునులు) (ద్రౌపదిని ఆ విధంగా తమవెంట పిలిచికొని పోయి, ఒక ముసలి అవ్వకు నమస్కరించారు. ఆ కన్యచేతకూడా (మొక్కించారు. ఇంకొక తెల్లనివాడు ఆజ్ఞాపించగా పూనికతో తక్కిన నలుగురు, బ్రాహ్మణ (శ్రేస్టుల గృహాలకు వెళ్ళి భిక్రాసమూహాన్ని తెచ్చి, ఆ ఆహారాన్నంతా ఆ అవ్వకు అప్పగించారు. ఆ అవ్వ ద్రౌపదిని ఆప్యాయంగా పిలిచి, 'సుందరి! ఇందులో అ(గ్రభాగం బలివిధానాలకు, (బ్రాహ్మాణాతిధులకు, అన్నం కోరి వచ్చే బాటసారులకు వేరుగా ఉంచి, మిగిలినదాన్ని రెండు భాగాలు చేయు” మని చెప్పింది. విశేషం: భిక్షాన్నంలో కూడ అన్యులకు అ(గ్రభాగం సమర్పించే ఆర్జసం(ప్రదాయం అమోఘం. కోడలుగా ఇంట్లో అడుగుబెట్టిన 'ద్రొపదికి అత్తగారైన కుంతి తనయింటి ఆచారవ్యవహారాలను, సంస్కృతివిశేషాలను తెలియచెప్పి, వాటి బాధ్యతలను ఆమెకు అనుభవ మయ్యేటట్టు బోధించటం ఉత్తమ గృహస్థాశ్రమ ధర్మం. అత్తాకోడళ్ళు ఒక వంశంలో సాగే అవిచ్చిన్న సంప్రదాయాన్ని పోషించే ధర్మకర్త లనే భారతీయసం'ప్రదాయంకూడా ఇందులో రమణీయంగా చిత్రించబడింది. క వెడందయురంబును నన్నున । కడుపును దృధకఠినతనువు(. గల యాతని కిం

దడర నొకపాలు వెట్టుము । వడి; నాగాయుతబలంబువా. డత. దబలా! 224 ప్రతిపదార్హం: అబలా= ఓకాంతా!: వెడద, ఉరంబునున్‌= విశాలమైన రొమ్మును; అన్నువ, కడుపును= సన్నని కడుపును; ధృఢ, కరిన, తనువున్‌= దృఢమైన కరినమైన దేహమును; కల, ఆతనికిన్‌; అందున్‌+అడర= ఇందులో ఒప్పుగా, ఒక, పాలు= ఒక భాగం; వడిజ= వేగమే; పెట్టుము; అతడు; నాగశణఅయుత; బలంబువాడుజ ఏనుగులు పదివేలబలం కలవాడు.

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 739 తాత్పర్యం: విశాల మైన రొమ్ము, సన్నని కడుపు, దృఢము కఠినము అయిన దేహం కల ఇతనికి ఓ కాంతా! వెంటనే ఒక భాగం ఆహారం పెట్టు. అతడు పదివేల యేనుగుల బలం కలవాడు. విశేషం: 'అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది'- అని సామెత. అంటే ఊరినుండి వచ్చిన బిడ్డలకయ్యే ఆకలిని ముందుగా గమనించి అన్నంపెట్టి ఆనందపెట్టేది తల్లి, ఊరినుండి ఏమి సంపాదించి తెచ్చాడో ముందుగా మగని వీపుమీది మూటను గమనించేది భార్య అని దీనిభావం. ఇల్బాలుగా బాధ్యతలు నిర్వహించటంలో (ద్రౌపది తల్లిమనసుకూడా పెంచుకొన్నదని చెప్పటం ఇందులో ధ్వని. బిడ్డలు పెక్కుమంది ఉన్నప్పుడు తల్లి వివేకవతి అయి వారివారి అవసరాలను గుర్తించి ఆహారం పెట్టటం ధర్మం. భీమునికి భిక్షలో సగం పెట్టటానికి హేతువునుకూడ కుంతి చెప్పింది. అది పక్షపాతం కాదని తెలియచెప్పింది. పాండవులకు థీమునిబలమే పెద్దరక్ష అని వస్తుధ్వని. (సంపా.)

న. 'మజియు రెండగుపా లన్నలువురకుం బెట్టి తద్దుక్తశేషం బేనును నీవు నుపయోగింత' మని పంచినం గృష్టయు నయ్యవ్వ పంచినరూపున నందఅకుం గుడువం బెట్టి, తానును గుడిచి, దర్భపూరులు విద్రిచి యందజకు వేజువేల శయనమ్మ్ము లిమ్ముగా రచియించి, వానిపయి వారల కృష్ణాజనంబులు పసజిచి సుఖశయను లై యున్న వారిపాదంబులకు నుపధానభూత యై శయనించి. 225

ప్రతిపదార్థం: మజియు; రెండు+అగు, పాలు= రెండవ భాగం; ఆ, నలువురకున్‌; పెట్టి; తత్‌+భుక్త శేషంబు= వారిచే తినబడగా మిగిలిన దానిని; ఏనును= నేనును; నీవున్‌; ఉపయోగింతము; అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; కృష్ణయున్‌= (ద్రౌపదియు; ఆ+అవ్వ; పంచిన= ఆజ్ఞాపించిన; రూపునన్‌= తీరున; అందరకున్‌; కుడువన్‌+పెట్టి= తినటానికి పెట్టి; తానును, కుడిచి; దర్భపూరులు= దర్భపోచలు; విద్రిచి= విదిలించి; అందకు; వేజువేజ;: శయనమ్ములు= పడకలు; ఇమ్ముగా= ప్రీతిగా: రచియించి= ఏర్పాటు చేసి వాని, పయిజ= వాటిమీద; వారల; కృష్ణ+అజినంబులు= వాళ్ళనైనా జింకచర్మాలు; పటజచి; సుఖశయనులు+ఐ= సుఖంగా పడుకొన్నవా ళ్ళయి; ఉన్న; వారి, పాదంబులకున్‌; ఉపధాన, భూత+ఐ= దిండువంటి దై; శయనించి= పడుకొని.

తాత్పర్యం: 'రెండవభాగం అన్నం ఆ నలుగురికి పెట్టి, వాళ్ళు తినగా మిగిలిన దానిని నేను, నీవు ఉపయోగిద్దా'

మని ఆజ్ఞాపించగా (ద్రౌపది ఆమె చెప్పినట్లే అందరికీ అన్నం పెట్టి, తాను తిన్నది. దర్భ గడ్డిపోచలు విదిలించి,

న!

అందరికీ వేరువేరుగా పడకలు (ప్రీతితో వేసి, వాటిమీద జింకచర్మాలు పరచింది. వాళ్ళు సుఖంగా పడుకొన్న

తర్వాత, వాళ్ళపాదాలకు దిండువలె తాను పడుకొన్నది.

ఆ కఅకు దర్భపూరి పజపులు; భిక్షాన్న, మశన; మట్టివారి నతిముదమున నాదరించెం బ్రీతి; నాదిగర్జేశ్వరి ; యయ్యు నేవగింపదయ్యెం గృష్ట, 226

ప్రతిపదార్థల: కజకు, దర్భపూరి, పజపులు= కరినమైన దర్భగడ్డి పజుపులు; భిక్ష*అన్నము= బిచ్చమెత్తుకొని తెచ్చిన అన్నం,

అశనము= ఆహారం; అట్టివారిన్‌; కృష్ణ= (ద్రౌపది; ఆది గర్భ+-ఈశ్వరి= మొదటినుండి - గర్భంలో ఉన్నప్పటినుండి సంపద కలది; అయ్యున్‌' అతి, ముదమునన్‌= మిక్కిలి సంతోషంతో; ప్రేతిన్‌= ప్రేమతో, ఆదరించెను; ఏవగింపదు+అయ్యెన్‌= అసహ్యపడ దయ్యెను.

తాత్పర్యం; దర్భగడ్డి పరుపులు; భిక్షాన్నం ఆహారం - వీటిని ఆగర్భ్రీమంతురా లైనా (ద్రౌపది మిక్కిలి

సంతోషంతో, ప్రేమతో ఆదరించింది కాని, ఏవగించుకొనలేదు.

క కడనసములుం గోలలు. గ । ప్పడములు వీరలధనంబు పరికింపంగ నె కృడి దేశికు లని వగవక । మడవక తను మధ్య నిందుమనమున నుండెన్‌. 227

740 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: కడవసములున్‌= జింకచర్మాలూ; కోలలున్‌= దండాలూ; కప్పడములు= చినిగిన గుడ్డలూ; వీరల, ధనంబు; పరికింపంగన్‌= ఆలోచించగా; ఎక్కడి, దేశికులుజ ఎక్కడి పెద్దలు - అనగా ఏమి భర్తలు; అని; వగవక= దుఃఖించక; మడవక= ఏవగించకు తనుమధ్య= సన్నని నడుము కల (ద్రౌపది: నిండుమనమునన్‌: ఉండెన్‌. తాత్పర్యం: జింకచర్మాలు, దండాలు, చినిగిన గుడ్డలు - వీళ్ళ ధనాలు. ఆలోచిస్తే వీళ్ళేం భర్తలు? అని దుఃఖించక, అసహ్యపడక (ద్రౌపది నిండుమనస్సుతో ఉన్నది. సీ. “అంత నయ్యేవురు నయ్యయికధ లొప్పం। జెప్పచు మథి రథసింధురాశ్వ

విషయంబులును, సమవిషమ మహావ్యూహ : నిర్దేదనోపాయనిపుణవిధులు,

నాయుధవిద్యారహస్య ప్రయుక్తులు.। బలికిరి; పలికినబాసం జూడ

నత్యుత్తమక్షత్రియాన్వయు లగుదురు; । చరితం జూడ(గ విప్రజాతు లగుదు; ఆ. రెజబుంగగరాదు వారి; నీరెండు జాతుల । వారకాని, కారు వైశ్య శూద్ర

హీనజాతు' లనిన నెంతయు సంతస । మందెం బృషతపుత్తుం డాత్మలోన, 228 ప్రతిపదార్థం: అంతన్‌! ఆ+ఏవురున్‌= ఆ ఐదుగురు; అయ్యయి, కధలు= ఆయా కధలు; ఒప్పన్‌, చెప్పుచు; మథి; రధ, సింధుర+అశ్చ విషయంబులును= రథముల, ఏనుగుల, గుర్రాల సంగతులూ; సమ, విషము, మహావ్యూహ, నిర్భీదన+ఉపాయ, నిపుణ, విధులున్‌= సమములు, విషముములు అయిన మహాయుద్ద వ్యూహాలను భేదించునట్టి ఉపాయాలయొక్క నిపుణ మైన పద్దతులూ; ఆయుధ, విద్యా, రహస్య, ప్రియ+ఉక్తులున్‌= ఆయుధవిద్యయందలి రహస్యప్రయోగాలూ; పలికిరి; పలికిన, బాసన్‌= మాటాడిన మాటతీరును; చూడన్‌; అత్యుత్తమ, క్షత్రియ+అన్వయులు= మిక్కిలి (శ్రష్టమయిన రాజ వంశం కలవాళ్ళు; అగుదురు; చరితన్‌= నడతను, చూడంగ; విప్ర, జాతులు= (బ్రాహ్మాణజాతికలవారు; అగుదురు; వారిన్‌= వారలను ఎజుంగరాదు= తెలియటం సాధ్యపడదు; ఈరెండుజాతులనారు+అ= ఈ రెండుజాతులకు చెందినవారే; కాని; వైశ్య, శూద్ర, హీన, జాతులు, కారు; అనినన్‌; పృషత, పుత్రుండు= పృషతుని కుమారు డైన (ద్రుపదుడు; ఆత్మలోన= మనస్సులో; ఎంతయు= ఎంతో; సంతసము; అందెన్‌. తాత్ప్సర్యల: 'అప్పుడు ఆ ఐదుగురు ఆ యా కథలు చెప్పుకొంటూ రధాలు, ఏనుగులు, గు(ర్రాలు - వీటికి సంబంధించిన విషయాలు, సమ విషమాలైన మహాయుద్ధవ్యూహాలను భేదించే ఉపాయాలలో నిపుణమైన పద్దతులు, ఆయుధాల రహస్యప్రయోగాలు మాట్టాడుకొన్నారు. మాటాడిన మాటలు చూస్తే వాళ్ళు మిక్కిలి '్రేష్ట మైన రాజవంశంవాళ్ళుగా ఉన్నారు. (ప్రవర్తన చూస్తే బ్రాహ్మాణజాతివాళ్ళనిపిస్తుంది. వా ఖ్ళెవరో స్పష్టంగా తెలిసి కొనటం సాధ్యపడదు కాని, వాళ్ళు ఈ రెండుజాతులవాళ్ళే! వైశ్య, శూద్ర, హీనజాతులవాళ్ళు మాత్రం కాదు” అని తెల్పగా, ద్రుపదుడు మనస్సులో మిక్కిలి ఆనందం పొందాడు. విశేషం: (ద్రౌపదికి స్వయంవరం ప్రకటించిన (ద్రుపదుడు ఆశించింది ఒకటి- అయింది ఇంకొకటి. అర్జునుడు లేదా ఏ రాకుమారుడో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టగలడని ఆశిస్తే- ఒక బ్రాహ్మణుడు దాన్ని కొట్టాడు; ఆమెను చేపట్టాడు. ఒక మహారాజ పుత్రి పేద బ్రాహ్మణుని వెంట జీవితం పంచుకొనటానికి వెళ్ళింది. ఎంత చిత్రమైన మలుపు! సహజంగానే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్ల- వెళ్ళినచోట ఎలా ఉందో- అల్బుడు ఏలాంటివాడో- తెలిసికొనటానికి పరోక్షంగా లేదా (ప్రత్యక్షంగా (ప్రయత్నిస్తారు. అటువంటప్పుడు ముక్కూ మొగం తెలియని ఒక బ్రాహ్మణుని వెంట ఎక్కడికో వెళ్ళిన తన కూతురి స్థితిగతులు తెలిసికొనాలని (ద్రుపదుడు తహతహలాడటంలో ఆశ్చర్య మేముంది? అందుకే ఆ మహారాజు మొదట కొడుకును పంపాడు, పిల్లనిచ్చిన వాళ్ళు తమను పరిశీలిస్తున్నారని తెలిస్తే అత్తింటివాళ్ళు ఆ(గ్రహించే అవకాశం ఉన్నది. అందుకే ధృష్టద్యుమ్నుడు రహస్యంగా విషయం సేకరించి వచ్చాడు. మాటలు చూస్తే వాళ్ళు రాకుమారులని, ప్రవర్తన చూస్తే బ్రాహ్మణులని, ఇతర జాతుల

ఆదిపర్వము - సప్త్రమాశ్వాసము గడ్షగ వాళ్ళు ఏ మాత్రం కారని చెప్పాడు. అంతమాత్రాన తండ్రి ఉత్కంర ఆగుతుందా? వాళ్ళెవరో వివరంగా తెలియాలికదా. అందుకే

(ద్రుపదుడు మళ్ళీ తన పురోహితుడిసి పంపాడు. మహాభారతంలో చిత్రమైన మలుపులతో సహజమనోహరంగా సాగిన కథా కథన

మిది.

వ. వెండియు వారల నిమ్ముగా నెటుంగవేండి తనపురోహితుం బుత్తెంచినం, బురోహితుండును బ్రాహ్మణ సమూహంబుతోడ వచ్చి పాండవులం గని ధర్మరాజు నియోగంబున భీమసేనుచేత నర్ధ్వాదివిధుల నర్దితుం డయియి ట్లనియె. 229

ప్రతిపదార్థం: వెండియు= మజియు; వారలన్‌? ఇమ్ముగాన్‌= చక్కగా; ఎఆుంగ= తెలియ; వేడి= ప్రార్ధించి, తన పురోహితున్‌;

పుత్తెంచినన్‌= పంపగా; పురోహితుండును; (బ్రాహ్మణ, సమూహముతోడ, వచ్చి; పాండవులన్‌; కని= చూచి; ధర్మరాజు; నియోగంబునన్‌= ఆజ్ఞచే; భీమసేనుచేతన్‌; అర్హ్య+అది, విధులన్‌= అర్హ్యం మొదలైన పూజాపద్దతులచేత; అర్చితుండు+అయి= పూజింపబడినవా డై; ఇట్టు+అనియె.

తాత్పర్యం: ఇంకా వాళ్ళవిషయం చక్కగా తెలిసికొని రమ్మని (ప్రార్ధించి తన పురోహితుడిని పంపగా, అతడు

(బ్రాహ్మణ సమూహంతో వచ్చి పాండవులను చూచి- ధర్మరాజు ఆజ్ఞాపించగా భీమసేనుడు ఇచ్చిన అర్జ్వాది

పూజలు అందుకొని, ఇట్టా అన్నాడు.

ఉ. మీకులగోత్ర నామములు మిమ్మును నెమ్మి నెలుంగవేండి చిం తాకులుం దైనవాండు ద్రుపదాధిపు.; డాతనికిం బ్రియంబుగా నా కెటింగింపు డింతయు; ఘనంబుగ నద్ధుతయంత్ర మత్స్యమున్‌ వీకున నట్టు లేసిన సువిక్రము నాతండు గోరు జూడంగన్‌. 2306

ప్రతిపదార్థం: మీ, కుల, గోత్ర, నామములన్‌: మిమ్మును; నెమ్మిన్‌=ఐ ప్రీతితో; ఎలుంగజ= తెలియ; వేడి= కుతూహలపడి;

(ద్రుపద+అధిపుడు= (ద్రుపద మహారాజు; చింత+ఆకులుండు+ఐనవాండు= చింతచేత కలతచెందినవాడైనాడు; అతనికిన్‌; ప్రియంబుగాన్‌; ఇంతయు; నాకు+ఎతిగింపుడు; ఘనంబుగన్‌= గొప్పగా; అద్భుత, యంత్ర మత్స్యమున్‌= ఆళ్ళర్యకర మైన మత్స్యయంత్రాన్ని; వీకునన్‌= పరాక్రమమంతో; అట్టుల= ఆ విధంగా; ఏసిన= కొట్టిన: సువిక్రమున్‌= మంచిపరాక్రమం కల వాడిని; ఆతడు; చూడ౦గన్‌; కోరున్‌. తాత్పర్యం: మీ కులం, గోత్రం, పేర్లు మిమ్మల్నిగురించి ట్రీతితో తెలిసికొనాలని ద్రుపదమహారాజు చింతిస్తున్నాడు. అయనకు సంతోషం కలిగే విధంగా అంతా నాకు తెలియజేయండి. ఆశ్చర్యకర మైన ఆ మత్స్యయంత్రాన్ని తన పరాక్రమంతో ఆ విధంగా పడగొట్టిన మహావీరుడిని అతడు చూడగోరుతున్నాడు. వ. అనిన విని నగుచు ధర్మతనయుండు ద్రుపద పురోహితున కి ట్లనియె. 231 ప్రతిపదార్థం: అనిన, విని; నగుచు= నవ్వుతూ; ధర్మతనయుండు= ధర్మరాజు; (ద్రుపద, పురోహితునకు; ఇట్టు+అనియె. తాత్సర్యం; అనగా విని నవ్వుతూ ధర్మరాజు (ద్రుపద పురోహితునితో ఈ విధంగా అన్నాడు. క, _ ఇవ్వైహాయసలక్ష్యం , బివ్విలు మోపెట్టి నెట్టనేసిన వీరుం

డివ్వనితకు వరుండగు నని; నెవ్వగ మీరాజు చులక నియమము సేసెన్‌, 232 (ప్రతిపదొర్హం: ఈ+వైహాయస, లక్ష్యంబు= ఈ ఆకాశమందలి, గుటిని; ఈ+విల్డు= ఈ ధనుస్సును; మోపెట్టి= ఎక్కుపెట్టి; నెట్టన్‌= (క్రమముగ; ఏసిన= కొట్టిన; వీరుండు; ఈ+వనితకు; ఈ (ద్రౌపదికి; వరుండుఐ మగడు; అగున్‌; అని; నెవ్వగ= నిండైన ఆలోచనతో; మీ, రాజు, చులక నియమముజ సులువైన ఏర్పాటు; చేసెన్‌.

742 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్చర్యం: “ఈ ఆకాశ మత్స్యయంత్రాన్ని, ఈ విల్లు ఎక్కుపెట్టి కొట్టిన వీరుడు ఈ వనితకు భర్త అవుతాడు'-

అని మీ (ద్రుపదమహారాజు ఎంతో ఆలోచించి సులువైన నియమం చేశాడు,

తే. అతని నియమించి నట్ల యయ్యంత్ర మేసి; యీతం డిక్కన్యంబడసె నుర్వీశు లొద్ద; నేల మమ్ముందా నెటింగెడు? నెటింగి యేమి । సేయువాండింక మీపతి సెప్పుమయ్యు! 233

ప్రతిపదార్థం: అతని, నియమించిన+అట్టు+అ= అతనియొక్క నియమించినట్టుగ - అనగా అతడు చెప్పినట్టు ఆ+యం(త్రము; ఏసి= పడగొట్టి; ఈతండు; ఉర్వి+ఈశుల+ఒద్దన్‌= రాజుల ఎదుట; ఈ=కన్యన్‌, పడసెన్‌= పొందాడు: మీ, పతి= మీరాజు; ఏల' మమ్మున్‌; తాన్‌= తాను, ఎటిలెడున్‌= తెలియగోరుతున్నాడు; ఇంక; ఎఆింగి= తెలిసికొని; ఏమి, చేయువాండు; చెప్తుము+అయ్య. తాత్పర్యం: అతడు చెప్పినట్లే ఆమత్స్యయంతత్రాన్ని పడగొట్టి ఇత డీ కన్యను రాజు లందరి సమక్షంలో పొందాడు. ఇక మీ రాజు మమ్మల్ని తెలిసికొనటం యెందుకు? తెలిసికొని ఏం చేస్తాడు? చెప్పండి.

క. _ బలహీనుం డైన వానికి, నలవియె? మోపెట్టి తివియ న క్కార్ముకముం; గులహీనున కకృతాస్తున కలవియె? యా లక్ష్య మేయ నశ్రనలీలన్‌. 234

ప్రతిపదార్థం: బలహీనుండు+ఐన, వానికిన్‌; ఆ+కార్ముకము=జ ఆ విల్లును; మోపెట్టి= ఎక్కుపెట్టి; తివియన్‌= లాగుట;

అలవియె= శక్యమా; కులహీనునకు= కులంతక్కువవానికి; అకృత+అ|స్తునకున్‌= నేర్వబడని అస్త్రములు కలవానికి- అంటే అస్త్రవిద్య తెలియనివానికి?; ఆ, లక్ష్యము= ఆ గుజీని; అ(శ్రమలీలన్‌= (శ్రమలేని విలాసంతో; ఏయన్‌= కొట్టటం; అలవియే= సాధ్యమా!

తాత్పర్యం: ఆ విల్లును ఎక్కుపెట్టి లాగటం బలహీను డైనవానికి సాధ్యమౌతుందా? కులహీనుడికి, అస్త్రవిద్య

నేర్వనివాడికి ఆ లక్ష్యాన్ని (మత్స్యయంతత్రాన్ని)ి అనాయాసంగా కొట్టటం సాధ్య మౌతుందా?

పొండవులు ద్రుపదమహారాజు గృహంబునకు. బోవుట (సం.1-185-25)

వ. 'మీ రాజు మనోరథంబు సఫలం బయ్యె వగవ నేల?” యనిన ధర్మరాజుసలుకు విని పురోహితుండు వోయి ద్రుపదున కెజింగించిన; ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం జూచి “చాతుర్వర్ధ్వోచితంబు లయిన రధంబులు గొనిపోయి వారలం దోడొని ర' మ్మని పంచిన వాండును నాక్షణంబ పాండువుల పాలికి వచ్చి 'యీరథంబు లెక్కి మారాజునొద్దకు రం' డనినం బాందవులు రాజయోగ్యంబు లయి రత్సాంచితంబు లయిన కాంచన రథంబు లెక్కి కుంతీదేవిని, ద్రౌపదిని నొక్కరధం బెక్కించి తోడ్కొని ధృష్టద్యుమ్నుతో ద్రుపదరాజ నివేశంబున కరుగుదెంచునంత ధ్రుపదుండును వారల కనేకవిధంబు లైన వస్తువు లతిప్రీతిం బుత్తెంచినం బరార్థ్యంబు లైన యొండువస్తువులం బరిగ్రహింపక సాంగ్రామికంబు లైన యసిచర్మకార్ముకబాణతూణీరరధవరూధ వాజివారణ నివహంబులం బరిగ్రహించి తనయొద్దకు వచ్చువారి. 235

(ప్రతిపదార్థం: మీ, రాజు; మనోరథంబు= కోరిక; సఫలంబు+అయ్యె; వగవన్‌+ఏల= చింతించటం ఎందుకు; అనిన; ధర్మరాజు;

పలుకు; విని; పురోహితుండు; పోయి; ('ద్రుపదునకు; ఎజింగించిన; (ద్రుపగుండు; ధృష్టద్యుమ్నున్‌; చూచి; చాతుర్వర్ష్య+

ఉచితంబులు= నాలుగుజాతులవారికి తగినవి; అయిన; రధంబులు; కొనిపోయి; వారలన్‌; తోడ్కొని; రమ్ము+అని; పంచిన=

ఆజ్ఞాపింపగా; వాడునున్‌= ఆ ధృష్టద్యుమ్నుడుకూడా; ఆ, క్షణంబు+అ; పాండవుల, పాలికిఐ పాండవుల దగ్గరకు; వచ్చి; ఈ;

రధంబులు*+ఎక్కి; మా; రాజు; ఒద్దకు; రండు; అనినన్‌; పాండవులు; రాజ యోగ్యంబులు+అయి= రాజులకు తగిన వై; రత్న+

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 743 అంచితంబులు+అయిన= రత్నములచేత ఒప్పుచున్న వైన; కాంచన, రథంబులు= బంగారు తేరులు; ఎక్కి; కుంతీదేవిని; (ద్రౌపదిని; ఒక్క, రథంబు; ఎక్కించి; తోడ్కొని; ధృష్టద్యుమ్నుతో; (ద్రుపదరాజ, నివేశంబునకు= ద్రుపదమహారాజుయొక్క నివాసానికి; అరుదెంచున్‌*అంత= వస్తుండగా; (ద్రుపదుండును; వారలకు; అనేక, విధంబులు+ఐనః అనేకరకాలైన; వస్తువులు= కానుకలైన పదార్దాలు; అతి, ప్రీతిన్‌= ఆమితమైన సంతోషంతో; పుత్తెంచినన్‌= పంపగా; పరార్థ్యంబులు+ఐన= శ్రేష్టము లైన; ఒండు, వస్తువులన్‌= ఇతర వస్తువులను; పరి[గ్రహింపక= తీసుకొనక; సాం([గ్రామికంబులు+ఐనజ= యుద్దానికి సంబంధించిన వైన; అసి, చర్మ, కార్ముక, బాణ, తూణీర, రథ, వరూధ, వాజి, వారణ, నివహంబులన్‌= కత్తులయొక్క, డాలులయొక్క, విండ్లయొక్క, బాణాలయొక్క; అమ్ములపొదులయొక్క; రధాలయొక్క, రథముమీదికప్ప్తులయొక్క, గుర్రాలయొక్క, ఏనుగులయొక్క సమూహాలను; పరి[గ్రహించి= తీసుకొని; తన ఒద్దకు; వచ్చువారి. తాత్పర్యం: 'మీ రాజుకోరిక సఫలమైనది. విచారించటం ఎందుకు?" అని ధర్మరాజు పల్కగా విని, పురోహితుడు వెళ్ళి (ద్రుపదునికి తెలియజేశాడు. అతడు ధృష్టద్యుమ్నుడిని చూచి, 'నాలుగుజాతులవాళ్ళకు ఉచితా లైన రథాలను తీసుకొనివెళ్ళి, వాళ్ళను తోడ్కొని ర మ్మని ఆజ్ఞాపించాడు. అతడు తక్షణమే పాండవులదగ్గరికి వెళ్ళి, “ఈ రథా లెక్కి మా రాజు దగ్గరికి రండి” అని పల్కగా, వాళ్ళు రత్నాలు పొదిగినవి, రాజులకు తగినవి అయిన బంగారు రథా లెక్కి కుంతీదేవిని, ద్రౌపదిని ఒక రధంలో కూర్చోబెట్టి తోడ్కొని ధృష్టద్యుమ్నునితో గూడి ద్రుపదమహారాజు ఇంటికి వచ్చారు. అప్పుడు ద్రుపదుడు వాళ్ళకు అనేకవిధా లైన వస్తువులను మిక్కిలి ప్రేమతో పంపాడు. వాటిలో (శ్రేష్టాలైన ఇతర వస్తువులను పరి[గ్రహించక, యుద్దసంబంధా లైన కత్తులు, డాలులు, ధనుస్సులు, బాణాలు, అమ్ముల పాదులు, రథాలు, రథంమీదికప్పులు, గుర్రాలు, ఏనుగులు - వీటి సమూహాలను మాత్రమే స్వీకరించారు. ఈ విధంగా స్వీకరించి తనదగ్గరకు వస్తున్న పాండవులను. విశేషం: ధర్మరాజు గంభీరుడు; వాగ్మి; కార్యచతురుడు అని ఈ ఘట్టం నిరూపిస్తున్నది. తననుగురించి సొటివాడైన (ద్రుపదరాజుకే చెప్పుతాడు కాని ఇతరులకు చెప్పని ఆత్మాభిమాని, 'మీరాజు పెద్దగా ఆలోచించి ఈ చిన్న నియమాన్ని పెట్టా'డని తన జొన్నత్యాన్ని తెలిపాడు; నియమమే ముఖ్యమన్నాడు కాని (ద్రుపదుడు ఇతర వివరాలను (ప్రకటించలేద కదా. నియమం ప్రకారం ద్రౌపదిని గెలుచుకొన్న తరువాత వివరాలనుగురించి విచారించి దుఃఖించటం ఎందుకని పలికి వివేకాన్ని ప్రదర్శించాడు.

అంతటి బలపరా(క్రమాలను 'ప్రదర్శించినవాళ్ళు సామాన్యులు కారని తెలిసికొనటం సులభమేకదా? అని విజ్ఞతను ప్రదర్శించాడు; చివరకు ముక్తాయింపుగా 'మీ రాజు మనోరధం సఫలం అయ్యింది. ఇంకా చింతించడం దేనికి?" అని అన్నాడు. ఈవాక్యం ధర్మరాజు వచోనైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నది. పైకి చూస్తే అనుకొన్నట్టుగా మత్స్యయం'త్రం భేదించి కన్యను వివాహమాడ గలిగిన వరుడు దొరికాడు. (ద్రుపదుని కోరిక తీరిందని భావం. లోనారసి చూస్తే 'అర్జునునికే ద్రౌపది నిద్దామని ద్రుపదుని మనోరధంకదా! అది తీరింది. ఇంకా విచార మెందుకు?” అని రమణీయార్హం. ఈ రెండర్జాలలో ధర్మజుని అంతరార్జాన్ని తెలుసుకుందా మని (ద్రుపదుడు రథాలను పంపాడు, వివిధ వస్తువులను కానుకలుగా పంపాడు. ధర్మజుడు తాము బ్రాహ్మణులం కామని, సుక్షత్రియులమని తమ చర్యల ద్వారా వ్యక్తం చేశాడు. వస్తుధ్యని సహజంగా పండిన కథాళిల్పక్షేత్రం ఈఘట్టం. (సంపా) సీ. అజినోత్తరీయుల నతి సంభృత బ్రహ్మ। తేజుల సముదితాదిత్యసముల

నాజానులంబి మహాబాహుపరిఘుల ; నత్యున్నతాంసుల నతివిశాల

వక్షుల నవిరళవ్యాయామ ధృధ కఠి; నాంగుల వృషభాక్షు లయిన వారి.

బాండుకునూరుల భరతవంశేశులం। జూచి సుతభ్రాత్భ సుహృదమాత్య ఆ. _ బంధుజనులతోదం బరమవిద్వన్మహీ |; సురగణంబుతోడ సోమకుండు

గరము సంతసిల్లై ఘనుల నత్యుత్తమ ; క్షత్రవంశవరులం గా నెజింగి. 236

డడ శ్రీమదాంధ్ర మహాభారతము (ప్రతిపదార్హం: అజిన+ఉత్తరీయులన్‌= జింకచర్మం పైగుడ్డగా కలవాళ్ళను; అతి, సంభృత, (బ్రహ్మ, తేజుల= మిక్కిలిగా భరించబడిన (బ్రహ్మతేజస్సు కలవాళ్ళను; సముదిత+ఆదిత్య, సములన్‌= ఉదయించిన సూర్యుడితో సమానమైనవాళ్ళను; ఆజాను, లంబి, మహాబాహు, పరిఘులన్‌= మోకాలివరకు ద్రేలాడుతున్న ఇనుపగుదియలవంటి పెద్దబాహువులు కలవాళ్ళను: అతి+ ఉన్నత+అంసులన్‌= మిక్కిలి ఎత్తైన భుజశిఖరాలు కలవాళ్ళను; అతి, విశాల, వక్షులన్‌=ఐ మిక్కిలి వెడ ల్పయిన రొమ్ములు కల వాళ్ళను; అవిరళ వ్యాయామ, దృఢ, కరిన+అంగుల= ఎడతెగని వ్యాయామంచేత గట్టిపడి కరినా లైన అవయవాలు కలవాళ్ళను; వృషభ+అక్షులు+అయిన, వారిన్‌= ఆబోతు కన్నులవంటి కన్నులు కలవాళ్ళను; భరత వంశ+ఈశులన్‌= భరత వంశ రాజులను; ఘనులన్‌= గొప్పవాళ్ళను, పాండు, కుమారుల; చూచి; సోమకుండు= (ద్రుపదుడు; అతి+ఉత్తమ, క్షత్ర, వంశ, వరులన్‌కాన్‌= మిక్కిలి శ్రేష్టమైన క్షత్రియవంశమందు. పుట్టిన (శ్రేష్టులుగా; ఎజింగి= తెలిసికొని; సుత; భ్రాతృ; సుహృత్‌+అమాత్య, బంధుజనుల తోడన్‌= కొడుకులతో, తమ్ములతో, స్నేహితులతో, మంత్రులతో బంధువులతో; పరమ, విద్వత్‌+మహీసుర, గణంబుతోడ= గొప్పవిద్వాంసు లైన (బ్రాహ్మణులసమూహంతో; కరము= మిక్కిలి; సంతసిల్లై= సంతోషించాడు. తాత్సర్యం: జింకచర్మం ఉత్తరీయంగా కలవాళ్ళు అత్యధిక మైన (బ్రహ్మతేజస్సు కలవాళ్ళు, ఉదయించిన సూర్యుడితో సమాను లైనవాళ్ళు, మోకాలివరకు (వ్రేలాడే ఇనుపగడియలవంటి చేతులు కలవాళ్ళు, మిక్కిలి యెత్తైన భుజశిఖరాలు కలవాళ్ళు, అతివిశాలమైన వక్షస్థలం కలవాళ్ళు, ఎడతెగని వ్యాయామంతో గట్టిపడి, కరిన మైన అవయవాలు కలవాళ్ళు, ఆబోతుకన్నులవంటి కన్నులు కలవాళ్ళు, భరతవంశరాజులు ఘనులు అయిన పాండుకుమారులను చూచి, వాళ్ళు అత్యుత్త మక్షత్రియ వంశ ్రేష్టులని తెలిసికొని- పుత్రులతో, తమ్ములతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, మహావిద్వాంసులైన బ్రాహ్మాణ సమూహాలతో కలిసి ద్రుపదుడు మిక్కిలి సంతోషించాడు.

వ. 'మఖియుం దనయొద్దకు వచ్చి యశంకితు లయి క్షత్రియోచితంబు లైన మహార్దాసనంబుల నున్నవారల రాజపుత్తులంగా నెలింగియు, సంశయాపనోదనపరుం డై ధర్మతనయునకు ద్రుపదుం డి ట్లనియె 'నయ్యా! మీరు క్షత్రియులరో బ్రాహ్మణులరో మాయావు లయి క్రుమ్మరుచున్న మంత్రసిద్ధులరో కాక కృష్ణాపరిగ్రహ ణార్థంబు దివంబుననుండి వచ్చిన దివ్యులరో యెలుంగము; మాకు సందేహం బయి యున్నయది; మీ కలరూ పెజింగి కాని యిక్కన్య వివాహంబు సేయనేర' మనిన ధ్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె.237

(ప్రతిపదార్థం: మజియున్‌; తన, ఒద్దకు; వచ్చి; అశంకితులుశఅయి= జంకులేని వాళ్ళయి; క్షత్రియ+ఉచితంబులు+ఐన=

రాజులకు తగిన; మహా+అర్హ+ఆసనంబులన్‌= ఉత్తమా లైన ఆసనములందు; ఉన్న, వారల; రాజపుత్రులన్‌, కాన్‌; ఎతీంగియు,

సంశయ+ అపనోదన, పరుండు+ఐ= సందేహాన్ని తీర్చుకొనటమే (ప్రధానంగా కలవా డై ధర్మ తనయునకు= ధర్మరాజునకు;

(ద్రుపదుండు; ఇట్టు+అనియెన్‌; అయ్యా; మీరు; క్షత్రియులరో; బ్రాహ్మాణులరో; మాయావులు+అయి= మాయచేయువా ళ్ళయి;

(క్రుమ్మరుచున్న= తిరుగుచున్న; మంత్ర, సిద్దులరో; కాక; కృష్ణా. పరిగ్రహణ+అర్ధ్థంబు= కృష్ణను (ద్రౌపదిని) పెండ్లాడటం కొరకు;

దివంబున నుండిజ స్వర్గం నుండి; వచ్చిన; దివ్యులరో= దేవతలో; ఎజుంగము; మాకు; సందేహంబు+అయి; ఉన్న, అది; మీ,

కలరూపుజ మీ నిజరూపం; ఎజింగి, కాని; ఈ+కన్య, వివాహంబు; చేయనేరము; అనిన; ద్రుపదునకు, ధర్మతనయుండు: ఇట్టు+అనియె.

తాత్పర్యం: అంతేకాక, తన దగ్గరికివచ్చి జంకులేక క్షత్రియులకు తగిన ఉన్నతాసనాలపై కూర్చొన్న పొండవులను-

రాజపుత్రులుగా తెలిసికొన్నప్పటికి, సందేహం తీర్చుకొనా లని (ద్రుపదుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు- 'అయ్యా!

మీరు క్షత్రియులా? బ్రాహ్మణులా? మాయావు లై తిరుగుతున్న మంత్రసిద్దులా? లేక (ద్రౌపదిని వివాహా మాడటానికి దేవలోకంనుండి దిగివచ్చిన దేవతలా? తెలియదు. మాకు సందేహంగా ఉన్నది. మీ నిజస్టితి తెలిసికొని కాని ఈ కన్యకు వివాహం చేయలేము” అని (ద్రుపదుడు పల్కగా అతనితో ధర్మరాజు ఇట్టా అన్నాడు.

ఆదిపర్వము - సప్తమాశ్వానము ౯శ్మీ5్‌

క క్షత్రియులము, పాండుప్రియ । పుత్తుల; మే నగ్రజూండ, భూనుతులు మరు

త్వుత్రార్డునయము లమల చ । రిత్రులు నలువురును వీ రరిందము టెందున్‌. 238 ప్రతిపదార్థం: క్షత్రియులము; పాండు, (ప్రియపుత్రులము; ఏన్‌=నేను; అగ్రజుండ= ముందు పుట్టినవాడను; భూ, నుతులుూ భూమియందు కొనియాడ బడినవాళ్ళు; మరుత్‌*పుత్ర+అర్జును యములు= వాయుపుత్రు డైన భీముడు, అర్జునుడు, కవ లైన నకుల సహదేవులు; వీరు; నలువురును; అమల, చరిత్రులు= నిర్మలమైన నడవడి కలవాళ్ళు; ఎందున్‌; అరిందములు= శత్రువులను జయించేవాళ్ళు. తాత్పర్యం: మేము క్షత్రియులం. పాండురాజు ప్రియపుత్రులం. నేను పెద్దవాడను. లోకంకొనియాడే భిమార్జున నకుల సహదేవు లైన వీళ్ళు నలుగురు నిర్మల మైన నడవడి కలవాళ్ళు. ఎక్కడైనా శత్రువులను జయించగలవాళ్ళు. వ. 'వీరు కుంతీమహాదేవు' లని తన్నునుం దమ్ములనుం దల్లిని నెజింగించిన, ద్రుపదుం డతిహర్షరసావేశ

పరవశుం డయి పెద్దయుంబ్రొద్దునకు. దెలిసి, యానందజలభరితనయనుం డగుచు 'నా పుణ్యంబున

లాక్షాగృహదాహంబువలన విముక్తుల రయితి' రని సంతసిల్లి తద్భుత్తాంతం బంతయు ధర్మ్శ్మతనయునివలన

విని, ధృతరాష్ట్ర దుర్యోధనుల నిందించి, సామప్రియభాషణంబుల నభీష్టసత్కారంబులను వారిం బూజించి,

యొక్కనాండు పుత్రమిత్రామాత్యబాంధవబ్రాహ్మణపరివృతుం డయి ద్రుపదుండు సుఖాసీను లయి యున్న

పాండవుల కి ట్లనియె. 239 ప్రతిపదార్థం: వీరు; కుంతిమహదేవులు; అని; తన్నునున్‌; తమ్ములనున్‌: తల్లినిన్‌; ఎజింగించిన: ద్రుపదుండు; ఆతి, హర్ష రస+అవేశ, పరవశుండు+అయి= మిక్కిలి ఆనంద రసముయొక్క కూడికచే మైమరచినవాడై; పెద్దయున్‌+ప్రొద్దునకున్‌: తెలిసి, ఆనంద, జల, భరిత, నయనుండు+అగుచు= సంతోషంచేత కలిగిన కన్నీటితో నిండిన కన్నులు కలవాడౌతూ:; నా; పుణ్యంబున= నా అదృష్టంవలన; లాక్షా? గృహ, దాహంబువలన; విముక్తులరు= బయటపడిన వారు; అయితిరి; అని; సంతసిల్లి; తత్‌ఇవృత్తాంతంబు= ఆ కథ; అంతయు; ధర్మతనయునివలన; విని; ధృతరాష్ట్ర దుర్యోధనుల; నిందించి; సామ, ప్రియ భాషణంబులన్‌= మంచి ఇష్ట మైన మాటలతో; అభీష్ట సత్కారంబులను= మిక్కిలి ప్రియాలైన సమ్మానాలచేత:; వారిన్‌; పూజించి; ఒక్కనాండు; పుత్ర మిత్ర+అమాత్య, బాంధవ, బ్రాహ్మణ, పరివృతుండు+అయి= పుత్రులతో, మిత్రులతో, మంటత్రులతో, బంధువులతో, (బ్రాహ్మణులతో చుట్టబడినవాడై; ద్రుపదుండు; సుఖ+ఆసీనులు+అయి= సుఖంగా కూర్చున్న వాళ్ళయి; ఉన్న; పాండవులకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: “వీరు కుంతీమహాదేవులు' అని తనను, తమ్ములను, తల్లిని తెలియజేయగా- (ద్రుపదుడు- అత్యధిక

లా

సంతోష రసావేశంలో మైమరచి, చాలాసేపటికి తెలిసి, ఆనందబాష్పాలతో నిండిన కళ్ళతో 'నా పుణ్యం వలన లాక్షాగృహదహనంనుండి మీరు తప్పించుకొన్నారు' అని సంతోషించి, ఆ కథనంతా ధర్మరాజువలన విని, ధృతరాష్ట్ర దుర్యోధనులను నిందించి, ఇంపైన మాటలతో, ఇష్ట మైన సమ్మానాలతో వాళ్ళను పూజించాడు. తరువాత ఒకరోజు పుత్రులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, బ్రాహ్మణులతో కూడి (ద్రుపదుడు సుఖాసీను లై ఉన్న పాండవులతో ఇట్లా అన్నాడు. క. సుత్రామపుత్తుం దభిజన । పాత్రుండు, విచిత్ర వీర్యుపాత్రుండు, శుభచా

రిత్రుం డీ విజయుండు మ | త్పుత్రికి వరుం డయ్యె నెట్టి పుణ్యోదయమో! 240

746 (శ్రీమదాంధ్ర మహాభారతము

ప్రతిపదార్హం: సుత్రామ, పుత్తుడు= ఇంద్రునియొక్క కుమారుడు; అభిజన, పా(త్రుండు= వంశానికి తగినవాడు; విచిత్రవీర్యు,

పౌత్రుండు= విచిత్రవీర్యుని మనుమడు; శుభ, చారిత్రుండు= మంచి నడవడి కలవాడు; ఈ, విజయుండు= ఈ అర్జునుడు;

మత్‌+ పుత్రికి= నాయొక్క కూతురికి; వరుండు+అయ్యెన్‌= భర్త అయ్యాడు; ఎట్టి పుణ్య+ఉదయమో= పుణ్యముయొక్క అతిశయమో.

తాత్పర్యం; ఇం(ద్రునీ కుమారుడు, జన్మించిన వంశానికి తగినవాడు, విచిత్రవీర్యుని మనుమడు, మంచినడవడి

కలవాడు అయిన ఈ అర్జునుడు నా కుమార్తెకు భర్త అయ్యాడు. నా భాగ్య మేమన గలను?

వ. “స్వయంవర లబ్ధ్బయయిన యి క్కన్యక నర్జునుండు ధర్మవిధిం బాణిగ్రహణంబు సేయువా౮ దనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లవియె: 'నది యె? ట్లేను వివాహం బైన బదంపడి భీమసేనుండు వివాహం బయిన మథి యర్జునుండు వివాహం బగు.ంగాక! ముందరర్జునునకు. బాణిగ్రహణంబు సేయ నె ట్లగు?' ననిన ద్రుపదుండు ధర్మతనయున కి ట్లనియె. 241

(ప్రతిపదార్హం: స్వయంవర, లబ్బశఅయిన= స్వయంవరమునందు పొందబడిన దైన, ఈ+కన్యకన్‌;: అర్జ్హునుండు; ధర్మవిధిన్‌=

ధర్మ(ప్రకారంగా; పాణి[గ్రహణంబు, చేయువాండు= పెండ్డిచేసికొంటాడు; అనిన; (ద్రుపదునకు; ధర్మతనయుండు;

ఇట్టు+శఅనియెన్‌; అది; ఎట్టు: ఏను= నేను; వివాహంబు+ఐనన్‌= పెళ్ళి చేసికొంటే; పదంపడి= తరువాత; భీమసేనుండు; వివాహంబు+అయిన; మథి; అర్జ్హునుండు; వివాహంబు+అగున్‌+కాక; ముందర; అర్జునునకున్‌; పాణిగ్రహణంబు= పెండ్లి; చేయన్‌= చేయుట; ఎట్టు+ అగున్‌; అనిన; ద్రుపదుండు; ధర్మతనయునకు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: 'స్వయంవరంలో లభించిన ఈ కన్యకను అర్జునుడు ధర్మ పద్దతిలో వివాహం చేసికొంటాడు” అని

(ద్రుపదుడు పల్కగా; ధర్మరాజు ఇట్లా అన్నాడు - 'అ దెలా వీలవుతుంది? నేను పెళ్లాడిన తర్వాత భీమసేనుడు

పెళ్ళాడతాడు. తరువాత అర్జునుడు. ముందుగానే అర్జునుడు పెళ్ళాడటం ఎట్టా జరుతుంది?” అనగా ద్రుపదుడు

ధర్మరాజుతో ఇట్టా అన్నాడు.

తే. “అట్ల యగునేని యిక్కన్య నభిమతముగ । వసుమతీనాథ! నీవ వివాహ మగుము; ధర్మమార్గ మెవ్వరికిని దప్ప నగునె?” ; యనిన నాతని కనియె ధర్మాత్మజుండు. 242

ప్రతిపదార్థం: అట్టు+అ; అగున్‌+ఏని; ఈ+కన్యన్‌; వసుమతీనాధ= ఓ రాజా;+ నీవు+అజ నీవే; అభిమతముగ= ఇష్టముగొ;

వివహము+అగుము= పెండ్లిచేసుకో; ధర్మ, మార్గము; ఎవ్వరికి= ఎవ్వరికైనను; తప్పన్‌+అగునె= తప్పవచ్చునా; అనినన్‌= ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు, అతనికి; అనియె.

తాత్పర్యం: 'అట్టయితే ఓ రాజా! నీ ఇష్టప్రకారం ఈ కన్యను నీవే వివాహం చేసికొమ్ము. ధర్మమార్గం ఎవరూ

తప్పరాదు కదా!” అని ద్రుపదుడు చెప్పగా, ధర్మరాజు అతనితో ఇట్టా అన్నాడు.

వ, 'పన కా, దిక్కన్యక నే మేవురము వివాహం బయ్యెద; మస్మన్మాత్భ నియోగం బిట్టిద; యది మాకు నలంఘనీయం' బనిన విని విస్మితుం డై ద్రుపదుం డి ట్లనియె. 243

చేసుకొంటాము; అస్మత్‌+మాతృ, నియోగంబు+ఇట్టిది+అజ మాతల్లి ఆజ్ఞ ఇట్టిదై ఉన్నది; అది; మాకున్‌; అలంఘనీయంబు=

దాటరానిది; అనిన; విని; విస్మితుండు+ఐ= ఆశ్చ్ళర్యపడినవా జై: ద్రుపదుండు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: "నేనే కాదు, ఈ కన్యను మే మైదుగురం వివాహం చేసికొంటాము. ఇదే మా తల్లి ఆజ్హ అది మాకు

దాటరానిది' అనగా విని ద్రుపదుడు ఆశ్చర్యపడి ఇట్టా అన్నాడు.

క. _ ఒక్కపురుషునకు భార్యలు । పెక్కం డ్రగు టెందు6. గలదు; పెక్కండ్రకు నా లొక్కత యగు టే యుగముల : నెక్కథలను వినియు నెజు౮గ మెవ్వరివలనన్‌. 244

ప్రతిపదార్థం: ఒక్క, పురుషునకు; భార్యలు; పెక్కండ్రు; అగుట; ఎందున్‌;? కలదు; పెక్కుండ్రకున్‌; ఆలు= భార్య; ఒక్కత;

అగుట; ఏయుగములన్‌; ఏ+కథలను; ఎవ్వరి వలనన్‌? వినియున్‌; ఎజుగము,.

తాత్సర్యం: ఒక్కమగవాడికి పెక్కుమంది భార్య లుండటం ఎక్కడైనా ఉన్నది. కాని పెక్కుమందిమగవాళ్ళికి

ఒక్కతే భార్య కావటం ఏ యుగాలలోను, ఏ కధలలోను ఎవ్వరివలనా విని ఎరుగం.

వ. నీవు లౌకిక వైదిక ధర్మస్వరూప విదుండవు ధర్మాత్మజుందవు; నీ పలుకులు ధర్మవిరుద్ధంబులు నా నోడుదు;ః మయినను లోకంబున నిది యశ్రుతపూర్వంబు; దీని నింక నీవును నేనును గుంతీదేవియును ధృష్టద్యుమ్నుండును విచారించి యెొల్లి నిశ్హయింత' మని. 245

ప్రతిపదార్థం: నీవు; లౌకిక, వైదిక, ధర్మ, స్వరూప, విదుండవు= లోకసంబంధమైన, వేదసంబంధమైన, ధర్మస్వరూపాన్ని తెలిసిన వాడవు; ధర్మ+ఆత్మజుండవు; ధర్మదేవతయొక్క కుమారుడవు; నీ, పలుకులు; ధర్మ విరుద్దంబులు= ధర్మానికి వ్యతిరేకమైనవి; నాన్‌= అని అనటానికి: ఓడుదుము= భయపడతాము; అయినను; లోకంబునన్‌ః ఇది; అశ్రుత, పూర్వంబు= మున్నెన్నడు వినబడనట్టిది; దీనిన్‌; ఇంక; నీవును; నేనును; కుంతీదేవియును; ధృష్టద్యుమ్నుండును; విచారించి; ఎల్లి= రేపు; నిశ్చయించుదము; అని.

తాత్పర్యం: 'నీవు లోక సంబంధ మైన, వేద సంబంధ మైన ధర్మస్వరూపం తెలిసినవాడవు. ధర్ముని కుమారుడవు.

నీ మాటలు ధర్మవిరుద్దాలని అనటానికి వెనుకాడుతాము. అయినా ఇది లోకంలో ముం దెన్నడు విననట్టిది. దినిని

గురించి నీవు, నేను, కుంతిదేవి, ధృష్టద్యుమ్నుడు మరింత అలోచించి రేపు నిర్ణయిద్దాం' అని. వ్యాసమహాముని ద్రుపదునియొద్దకు వచ్చుట (సం.1-186-38)

ఉ. ఈహితకార్యసిద్ధి యిది యెట్లొకొ తా సమకూరు నంచు సం దేహము. బొంది సోమక యుథధిష్టిరు లున్నం దదీయ ధర్శ్మసం దేహ నివృత్తి పొంటెం జనుదెంచెం బరాశరసూనుం డాత్మతే జోహృతసూర్యతేజుం డగుచున్‌ దిశలెల్ల వెలుంగుచుండ(గన్‌. 246

ప్రతిపదార్ధం: ఈహిత, కార్యసిద్ది= కోరుకొన్న కార్యం నెజవేరటం; ఇది; ఎట్టు+ఒకొ; తా తాను; సమకూరున్‌= నెఆవేరుతుంది; యు ఆగ కా.

అనుచు; సందేహమున్‌: పొంది; సోమక; యుధిస్టిరులు= (ద్రుపద, ధర్మజులు; ఉన్నన్‌; తదీయ; ధర్మ, సందేహ, నివృత్తి పొంటెన్‌= వాళ్ళయొక్క ధర్మసందేహాన్ని నివారించటంకొరకు; పరాశర సూనుండు= పరాశరుని కుమారు డైన వ్యాసుడు; ఆత్మ తేజోహృత, సూర్యతేజుండుజ తన తేజస్సుచేత అణచబడిన సూర్యతేజస్సు కలవాడు; అగుచున్‌; దిశలు+ఎల్ల; వెలుంగుచుండంగన్‌; చనుదెంచెన్‌= వచ్చాడు.

తాత్సర్యం: కోరుకొన్న కార్యం నెరవేరటం ఎట్లా అని (ద్రుపద ధర్మజులు సందేహపడుతూ ఉండగా, వాళ్ళ ధర్మ

సందేహాన్ని నివారించటానికై వ్యాసమహాముని- సూర్యతేజస్సును అణచే తన తేజస్సుతో దిక్కులన్నీ

వెలుగుతుండగా అక్కడికి వచ్చాడు.

7డ్ష8ి (శీమదాంధ్ర మహాభారతము

విశేషణ: అలం: ఉపమ. కొజకు - అనే అర్ధంలో నన్నయనా డున్న 'పొంటెన్‌' అనే చతుర్చీవిభక్తిప్రత్యయం ఈనాటి తెలుగుభాషలో

లేదు.

వ ఇట్లు వచ్చిన కృష్ణద్వైపాయనునకు. గుంతీదేవియుం బాండవులును బాంచాలుండు నతిభక్తి మొక్కి యమ్మహామునిం గాంచనమణిమయోచ్చాసనంబున నునిచి యర్హ్యపాద్యాదివిధులం బూజించి యున్న వారల కుశలం బడిగి హిత మధుర సత్య సంభాషణామృత రసప్రవాహ సందోహంబున నందజం బరమానంద హృదయులం జేసేయున్న యమ్మునీంద్రునకు ముకుళితకరకమలుండయి ద్రుపదుం డి ట్లవియె. 247

ప్రతిపదార్థం: ఇట్టు: వచ్చిన; కృష్ణద్వైపాయనునకున్‌; కుంతీదేవియున్‌; పాండవులును; పాంచాలుండున్‌= (ద్రుపదుడును; అతి, భక్తి (మొక్కి; ఆ+శమహామునిన్‌; కాంచన, మణిమయ+ఉచ్చ+ఆసనంబునన్‌= బంగారుతో, మణులతో చేయబడిన ఎత్తైన ఆసనంమీద; ఉనిచి= కూర్చుండబెట్టి; అర్హ్య, పాద్య+ఆది, విధులన్‌= అర్హ్యం, పాద్యం మొదలైన పూజాపద్దతులచేత; పూజించి; ఉన్న; వారల, కుశలంబు; అడిగి; హిత, మధుర, సత్య, సంభాషణ+అమృత, రస, ప్రవాహ, సందోహంబునన్‌= మేలు చేయునది, మనస్సునకు హాయి కొలుపునది, సత్యమైనది అయిన సంభాషణ అనెడి అమృతరస ్రవాహాల సమూహాలచేత; అందజన్‌: పరమ+ఆనంద, హృదయులన్‌= మిక్కిలి ఆనందించిన మనస్సులు కలవాళ్ళనుగా; చేసి; ఉన్న; ఆ+మునీంద్రునకు; ముకుళిత, కర, కమలుండు+అయి= ముడిచిన కమలముల వంటి చేతులు కలవాడై; ద్రుపదుండు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: ఈ విధంగా వచ్చిన వేదవ్యాసునికి కుంతీదేవి, పాండవులు, ద్రుపదుడు మిక్కిలి భక్తితో

నమస్కరించారు. బంగారుతో, మణులతో చేసిన ఎత్తైన ఆసనంమీద ఆ మహామునిని కూర్చుండబెట్టారు.

అర్హ్యపాద్యాదు లిచ్చి పూజించారు. ఆ మహాముని వాళ్ళను కుశల మడిగి, మనస్సుకు హాయి కలిగించే, సత్య సంభాషణ అనే అమృతరస ప్రవాహ సమూహంతో అందరు పరమానంద హృదయు లయ్యేట్టు చేశాడు. అప్పుడు

(ద్రుపదుడు తన కరకమలాలను జోడించి ఇట్టా అన్నాడు.

క. _ తనపలుకు లోక మెల్లను । గొనియాడంగం దగిన లోకగురుం డీ యమనం దనుండే మేవురమును నీ; తనుమధ్య వివాహ మయ్యెదము నని పలికెన్‌. 248

ప్రతిపదార్థం: తన, పలుకు; లోకము+ఎల్లను; కొనియాడంగన్‌; తగిన; లోకగురుండుజ లోకానికి ఆచార్యుడు; ఈ, యమ

నందనుండు= ఈ ధర్మరాజు; ఏము=మేము; ఏవురమును= ఐదుగురము; ఈ, తనుమధ్యన్‌= ఈ సన్నని నడుము కల దానిని

  • (ద్రొపదిని; వివాహము, అయ్యెదము; అని, పలికెన్‌.

తాత్పర్యం: లోకమంతా మెచ్చుకొనదగిన మాట కలవాడు, లోకగురుడు అయిన ఈ ధర్మరాజు మే

మైదుగురమూ ఈ (ద్రౌపదిని వివాహం చేసికొంటాము' అని అన్నాడు.

క. _ మీరెజబుంగనట్టి లోకా; చారము గలదయ్య? తొల్లి చన్న మహాత్ముల్‌ ఛీరమతు లిట్లు సేసిన వా రెవ్వరు6 గలరె యాప్తవచనానుమతిన్‌. 249

ప్రతిపదార్థం: మీరు; ఎజుంగని అట్టి; లోక+ఆచారము; కలదయ్య?; తొల్లి= పూర్వం; చన్నజ= గతించిన; మహాత్ముల్‌= పెద్దలు;

ధీర, మతులుజు గొప్పబుద్దికలవారు; ఆప్తు వచన+అనుమతిన్‌= పెద్దల మాటల సమ శ్రతిచేత; ఇట్టు; చేసినవారు; ఎవ్వరున్‌; కలరె? తాత్పర్యం: మీకు తెలియని లోకాచారం లేదు. పూర్వం గతించిన మహాత్ములు, ధీరమతులు ఎవరైనా పెద్దల సమ్మతితో ఇట్టా చేసినవారు ఉన్నారా?

ఆదిపర్వము - సప్తమాశ్వాసము ౯శ్తం

క. _ వినములముతి యన్యులకు విష। యమె ధర్మాధర్మనిరయము సేయంగ ది

వ్యమునీంద్ర! దీని సువిచా । రము సేయుము ధర్శ్మసంకరము గాకుండన్‌,. 2560 ప్రతిపదార్థం: దివ్య, ముని+ఇందద్ర; విమలమతి= నిర్మలమైన బుద్ది కలవాడా! ధర్మ+అధర్మ, నిర్ణయము= ధర్మాధర్మములను గూర్చిన నిర్ణయం; చేయంగన్‌; అన్యులకు= ఇతరులకు; విషయమెజ సాధ్యమా?; ధర్మ, సంకరముజ= ఇది ధర్మం, ఇది కాదు అని తెలియని సంకటస్థితి; కాక, ఉండన్‌= ఏర్పడకుండ ఉండేటట్టు; దీని; సువిచారముజ చక్కని విమర్శ; చేయుము. తాత్పర్యం: దివ్యమునీం(ద్రా! నిర్మలమైన బుద్ది కలవాడా! ధర్మాధర్మనిర్ణయం చేయటం ఇతరు లెవ్వరికీ సాధ్యం కాదు. ధర్మసంకరం ఏర్పడకుండా మీరే దీనిని ఆలోచించండి. విశేషం: ద్రుపదుడు వ్యాసునితో ఇట్లా అనటం ధర్మరాజు ధార్మికతను శంకించి కాదు, చిన్నచూపు చూచీ కాదు. విచిత్రము, అసహజము, అ(శ్రుతపూర్వము అయిన ఆచారాన్ని జీర్లించుకోలేక. ధర్మరాజు ధార్మికతను ముందే మనసార అంగీకరించాడు [ద్రుపదుడు (చూ.వ.245). కాని ధర్మరాజు చెప్పేది - ఏ ఆడపిల్ల తండ్రి అయినా అన్ని విధాల ఆలోచించి, మనస్పూర్తిగా చేయవలసిన పని. అంతేకాదు - ధార్మిక దృష్టితో చూస్తే ఇది సామాన్యమైన విషయం కాదు. లోకధర్మానికి, వ్యక్తిధర్మానికి ఏర్పడిన సంఘర్షణ. అందువలన ఈ విషయంలో సువిచారం చాలా అవసరం. అందుకే ద్రుపదుడు ధర్మజుని ధార్మికతమీద ఎంతగౌరవం ఉన్నా త్వరపడి నిర్ణయం తీసికొనక, నీవూ, నేనూ, కుంతిదేవీ, ధృష్టద్యుమ్నుడూ విచారించి రేపు నిర్ణయిద్దాం' అన్నాడు. ఇంతలో అర్థించకుండానే విజ్ఞాన సంపద్విఖ్యాతుడు, సంయమి'ప్రకరసంభావ్యానుభావుడు వేదవ్యాస మహామునీం[ద్రుడు వచ్చాడు. (ద్రుపదుడు తన మనస్సును ఊగిసలాడించే అనుమానాన్ని ఆయన ముందుంచాడు. అంతే. వ. అనిన నా ద్రుపదునకుం గృష్టద్వైపాయను సమక్షంబున ధర్మజుం డి ట్లనియె. 25] ప్రతిపదార్థం: అనినన్‌; ఆ, (ద్రుపదునకున్‌; కృష్ణద్వైపాయను, సమక్షంబున= వ్యాసుని ఎదుట; ధర్మజుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అని అనగా ఆ ద్రుపదునితో వ్యాసుని ఎదుట ధర్మరాజు ఈ విధంగా పలికాడు. చ. నగియును బొంకునందు వచనంబు నధర్మువునందు. జిత్తముం

దగులదు నాకు నెన్నండును: ధర్ము వవశ్యము; నట్ల కావునన్‌

నగనక మాకు నేవురకు వారిజలోచనం గృష్ణ నీ దగుం

దగ దను నీ విచారములు దక్కివివాహ మొనర్పు మొప్పు(గన్‌. 252 ప్రతిపదార్థం: నగియును= నవ్వుటాల కైనా; బొంకునందు= అసత్యమునందు: వచనంబున్‌= మాటా; అధర్మువు నందున్‌ అధర్మమునందు: చిత్తమున్‌= మనస్సు: నాకున్‌: ఎన్నడును; తగులదు; అవళ్యమున్‌= తప్పక; ధర్మువుజ ధర్మము: అట్టు కావునన్‌: వగవక= విచారించక, మాకున్‌: ఏవురకు= ఐదుగురకు; వారిజ, లోచనన్‌= నీటినుండి పుట్టిన పద్మముల వంటి కన్నులు కలదానిని; కృష్ణన్‌= (ద్రౌపదిని; ఈన్‌*తగున్‌: తగదు+అను; నీ, విచారములు= నీ ఆలోచనలు; తక్కి= మాని; ఒప్పుంగన్‌= చక్కగా; వివాహము+ఒనర్పుముజ పెండ్లి చేయుము. తాత్సర్యం: నవ్వులాట కైనా నా మాట అసత్యంలో, నా మనస్సు అధర్మంలో ఎన్నడూ తగులుకొనదు. ధర్మం ఆ విధంగానే ఉన్నది. అందువలన పద్మాలవంటి కన్నులు కల ద్రౌపదిని “ఇవ్వదగును, ఇవ్వకూడదు" అని ఆలోచించడం చూనుకొని, బాధపడకుండా, మా ఐదుగురికి ఇచ్చి వివాహం జరిపించుము.

750 శ్రీమదాంధ్ర మహాభారతము వు మజియుం దొల్లి గౌతమి యయిన జటిల యను బుషికూంతురు తపప్రభావంబున నేడ్వురు బుషులకు చొక్కజియ భార్య యయ్యె ననియును, దాక్షాయణి యను మునికన్యక యేకనామంబున! బ్రచేతసు లనంబరంగిన పదుంద్రకు నొక్కకియ భార్యయయ్యె ననియును గధల వినంబడు; మఖి యట్లుం గాక. 253 ప్రతిపదార్థం: మజియున్‌; తొల్లి= పూర్వం; గౌతమి+అయిన= గౌతముని వంశంలో పుట్టిన దైన; జటిల; అను; బుషి కూంతురు; తపః 'ప్రభావంబునన్‌; ఏడ్వురు= ఏడుగురు; బుషులకున్‌; ఒక్కతియ; భార్య; అయ్యెన్‌; అనియును'* దాక్షాయణి; అను; మునికన్యక; ఏక, నామంబునన్‌= ఒకే పేరున; ప్రచేతసులు; అనన్‌; పరంగిన= ఒప్పిన; పదుం(డ్రకున్‌= పదిమందికి; ఒక్కతియ: భార్య; అయ్యెన్‌+అనియును; కధల, వినంబడు; మతి; అట్టున్‌+కాక. చాత్సర్యం: అంతేగాక పూర్వం గౌతముని వంశంలో పుట్టిన జటిల అనే బుషికూతురు తన తపఃప్రభావంచేత ఏడు గురుబుషులకు ఒక్కతే భార్య అయిం దనీ, దాక్షాయణి అనే ముని కన్యక ఒకే పేరుతో ప్రచేతసు లనబడే పదిమందికి భార్య అయిం దనీ కథలలో వినబడుతూ ఉన్నది. అంతేకాక ఇంకా. విశేషం: “గౌతమి యయిన జటిల యను బుషి కూతురు" అనే దానికి బదులు 'గౌతముం డయిన జటిలుం డను బుషి కూతురు' అని కొన్ని ప్రతులలో పాఠాంతరం ఉన్నది. ఆ. 'గురులలోనంబరమగ్నురువు దల్లియ; యట్టి ; తల్లి వచనమును, విధాత్యకృతము నన్యధాకరింప నలవియ?' యనిన నం । దొజకు నిట్టు లనియె ద్రుపదవిభుండు. 254 ప్రతిపదార్థం: గురులలోనన్‌; తల్లియు; పరమ, గురువు= (శ్రేష్ట మైన గురువు; అట్టి; తల్లి, వచనమును= తల్లిమాటను, విధాత, కృతమున్‌= (బ్రహ్మదేవునిచేత చేయబడినదానిని; అన్యధాకరింపన్‌= వేరుగా చేయటం; అలవియే= సొధ్యమా?; అనినన్‌; ద్రుపద విభుండు= (ద్రుపదరాజు; అందొజకున్‌= అందరికి; ఇట్టులు+అనియె. తాత్సర్యఠ: గురువులలో తల్లి ఉత్తమగురువు. అటువంటి తల్లిమాటను, (బ్రహ్మ చేసిన పనిని మార్పుచేయటం సాధ్యమా? అని ధర్మజుడు పల్కగా, అందరితో ద్రుపదరాజు ఇట్లా అన్నాడు. విశేషం: యువకుడైన ధర్మరాజు - వయోవృద్దు, జ్ఞానవృద్దు, మహా తపస్వి, అన్నింటిని మించి తమ శ్రేయోభిలాషి అయిన - వ్యాసుని ముందు - తన మాటను తాను సమర్థించుకొన్నాడు. తాను చెప్పిన దానికి కొన్ని ఉదాహరణలు కూడ చూపాడు. వ. 'ధర్మసూక్ష్మత నిర్ణయింప మన కశక్యంబు; త్రిలోకవంద్యుండు త్రికాలప్రవర్తనవిజ్ఞాననిధి యీ కృష్ణద్వైపాయ నుండు విచారించి యెద్ది యాన తిచ్చె నదియ యిప్పుడు కర్తవ్యం' బనిన విని యమ్మునివరుండు ద్రుపదున కి ట్లనియె. 255 ప్రతిపదార్థం: ధర్మ, సూక్ష్మత= ధర్మంలోని రహస్యాన్ని; నిర్హయింప; మనకు; అశక్యంబు= అసాధ్యం; ఆలోక, వంద్యుండు= మూడులోకాలచే నమస్కరించ తగినవాడు; (త్రికాల, ప్రవర్తన, విజ్ఞాన నిధి= మూడుకాలాలలో ప్రవర్తిల్లే విజ్ఞానానికి నిధి అయిన వాడు; ఈ; కృష్ణదైెపాయనుండు; విచారించి; ఎద్ది; ఆనతి+ఇచ్చెన్‌; అదియ; ఇప్పుడు; కర్తవ్యంబు= చేయదగినది; అనిన; విని" ఆ+మునివరుండు= ఆమునిశ్రేష్టుడు - వ్యాసుడు; ద్రుపదునకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: 'ధర్మసూక్ష్మాన్ని నిర్ణయించటం మనకు సాధ్యం కాదు. ముల్లోకాలచే నమస్కరించ దగినవాడు, మూడుకాలాలో (ప్రవర్తిల్లే విజ్ఞానానికి నిధి అయిన ఈ వేదవ్యాసుడు ఆలోచించి ఏది ఆజ్ఞాపిస్తే అదే ఇప్పుడు చేయదగింది* అని పల్కగా విని, ఆ ముని(శ్రేష్టుడు (ద్రుపదునితో ఇట్టా అన్నాడు.

ఆదిపర్వము - సప్రమాశ్వాసము 751 విశేషం: సంశయగగ్రస్తు డైన ద్రుపదుడు ఒకవైపు, నిశ్చితిధర్మబుద్ది అయిన ధర్మరాజు మరొకవైపు తమతమ వాదాలను పేర్కొన్న తరువాత, ద్రుపదుడు నిర్ణయాధికారాన్ని వ్యాసమహామునికి అప్పగించాడు. ఇక వ్యాసుడు చెప్పిందే ధర్మం, తీర్పు. సీ. “ధర్మతత్తజ్ఞం డీ ధర్మతనూజుండు । ధర్మమార్గం బేల తప్పణలుకు?

దేవతామూర్తి యిద్దేవి మాధవి యేల । తా నెబుంగక యన్ఫతంబు వలుకు? వీరలపలుకులు వేల్పుల మతమును । నొక్కండ కావున నొండు దక్కి, యీ యేవురకు. గూంతు నిచ్చి వివాహంబుం। గావింపు; మథి దీని కల తెఅంగు

ఆ. వినగ విష్టమేని విను' మని ధ్రుపదు చే, యూంది యింటిలోని కొనర నరిగి, తానునతండు నేకతమ యుండి, వాని కం! తయును జెప్పందొడంగి ధర్మవిదుండు. 256

ప్రతిపదార్థం: ధర్మ, తత్త్యజ్ఞుడు= ధర్మతత్త్యమును తెలిసినవాడు; ఈ, ధర్మతనూజుండు= ఈ ధర్మరాజు; ఏల; ధర్మమార్గంబు; తప్పన్‌; పలుకు; దేవతా, మూర్తిః ఈ+దేవి; మాధవి= కుంతి; ఏల; తాన్‌= తాను; ఎజుంగక; అన్నతంబు= అసత్యం; పలుకు; వీరల, పలుకులు; వేల్పుల, మతమునున్‌= దేవతల అభిప్రాయం కూడ; ఒక్కండు+అ= ఒకటే; కావునన్‌; ఒండు= ఇతర విచారము; తక్కి=ఐ మాని; ఈ, ఏవురకున్‌= ఈ ఐదుగురికి; కూతున్‌+ఇచ్చి= వివాహంబున్‌; కావింపు; మణి; దీని; కలతెజంగు= యథార్థము వినగన్‌; ఇష్టము+ఏని; వినుము+అని; (ద్రుపదు; చేయి= (ద్రుపదునియొక్క చేతిని; ఊంది= పట్టుకొని; ఇంటిలోనికి; ఒనరన్‌= ఒప్పుగా; అరిగి= వెళ్ళి; తానున్‌; అతండున్‌; ఏకతమ= ఒంటరిగా; ఉండి; వానికి; అంతయును; ధర్మవిదుండు= ధర్మము నెతింగిన వ్యాసుడు; చెప్పన్‌+తొడగెజుచెప్పటానిక ప్రారంభించాడు.

తాత్పర్యం: “ఈ ధర్మరాజు ధర్మతత్త్యం తెలిసినవాడు. ధర్మమార్గం తప్పి ఎందుకు మాట్టాడుతాడు?

దేవతామూర్తి అయిన ఈ కుంతీదేవి తెలియక ఎందుకు అసత్యం పలుకుతుంది? వీళ్ళమాటలు, దేవతల

అభిప్రాయం ఒక్కటే. అందువలన వేరే ఆలోచన మాని, ఈ ఐదుగురికి నీ కుమార్తె నిచ్చి వివాహం చెయ్యి. దీని యథార్థస్థితి వినటం నీకిష్టమైతే వినుము' అని (ద్రుపదుని చేయి పట్టుకొని ఇంటిలోపలికి పిలిచికొని వెళ్ళి, ధర్మం తెలిసిన వ్యాసుడు ఏకాంతంగా అతనికి విషయమంతా చెప్ప నారంభించాడు.

విశేషం; కుంతీధర్మజుల అభిప్రాయాలూ, దేవతల అభి[ప్రాయాలూ ఒకటే అని వేదవ్యాసుడు చెప్పాడు. లౌకికు లైన వీళ్ళ

మాటలలో దేవతల సంకల్పాలు ఎట్లా ప్రతిఫలిస్తున్నాయో వివరించటమే వ్యాసుడు చేయవలసిన పని. అది దేవరహస్యం.

అందువలననే ఆ ఏకాంతభాషణం, ఆ దివ్యదృష్టిప్రసాదం, వీటి అవసరం లేకుండానే విషయాన్ని (గ్రహించిన దార్శనికుడు ధర్మజుడు. ప్రత్యక్షప్రమాణంతో అనుమానం తీర్చుకొన్నవాడు ద్రుపదుడు. (ద్రుపదునకు వేదవ్యాసుండు ఇంద్రసేనయను పతివ్రత కథ సెప్పుట (సం.1-100-60)

వ. ఇది తొల్లి నాలాయని యైన యింద్రసేీన యనంబర6గిన పరమ పతివ్రత; మౌద్దల్యుం డను మహామునికి భార్య యయి, కర్మవశంబున నమ్మునిం గుస్టవ్యాధి బాధిత త్వ గస్థిఖూత కష్ట శరీరు వయోవృద్ధు నలిపలితధరు దుర్గంధవదను దుఃఖజీవు నతికోపను విశీర్భమాణనఖత్వచుం బరమభక్తి నారాధించి, తదుచ్చిష్టంబు కుడుచుచున్న నొక్కనాయ. 257

ప్రతిపదార్థం: ఇది, తొల్లి= పూర్వం; నాలాయని+ఐన; ఇంద్రసేన; అనన్‌; పరంగిన= ఒప్పిన; పరమః పతివ్రత; మౌద్గల్యుండు+

అను; మహా, మునికి; భార్య, అయి; కర్మవశంబునన్‌= చేసినకర్మ కారణంగా; కుష్టు వ్యాధి, బాధిత, త్వక్‌+అస్ట్రి భూత, కష్ట శరీరు= కుష్టరోగంచేత బాధింవబడిన దై చర్మం ఎముకలు మాత్రమే అయి బాధతో కూడిన శరీరం కలవాడిని: వయోవృద్దు=

752 శ్రీమదాంధ్ర నముహాభారతము వయస్సుచేత వృద్దుడైన వాడిని; వలి, పలితధరు= ముడుతలను నెఆసిన వెండ్రుకలను ధరించిన వాడిని; దుర్గంధ, వదనున్‌= చెడువాసనతో కూడుకొన్న ముఖం కలవాడిని; దుఃఖజీవున్‌= దుఃఖంతో జీవించేవాడిని; అతి, కోపను= మిక్కిలి కోపం కలవాడిని విశిర్యమాణ, నఖ, త్వచున్‌= ఊడిపోతున్న గోళ్ళు, చర్మం కలవాడిని; ఆ+మునిన్‌; పరమ, భక్తిన్‌; ఆరాధించి= సేవించి; తత్‌+ ఉచ్చిష్టంబు= అతని ఎంగిలి - అనగా అతడు తినగా మిగిలింది; కుడుచుచు= తింటూ; ఉన్నన్‌; ఒక్కనాండు. తాత్పర్యం: ఈమె పూర్వం నాలాయని అనే పరమపతివ్రత, పేరు ఇంద్రసేన. ఈమె మౌద్గల్యుడు అనే మహామునికి భార్య అయింది. అతడు ముసలివాడు, కుస్టరోగ పీడితుడై చర్మం ఎముకలు మాత్రమే మిగిలినవాడు. బాధతో కూడిన శరీరం కలవాడు. చర్మపు ముడుతలు, నెరసిన వెండ్రుకలు ఉన్నవాడు. దుర్వాసనతో కూడిన ముఖం కలవాడు. దుఃఖంతో జీవించే వాడు, మిక్కిలి కోపం కలవాడు, ఊడిపోతున్న గోళ్లు, చర్మం కలవాడు; అటువంటి ఆ మునిని ఆమె కర్మవశంతో, పరమభక్తితో సేవించింది. ఒకనాడు అతడు తిని విడిచిన యెంగిలి అన్నం తింటూ ఉండగా,

విశేషం: ఈ నాలాయన్యుపాఖ్యానం భండార్కర్‌ ప్రతి, నీలకంరప్రతి, వావిళ్ల ప్రతి మొదలైన సంస్కృత భారత ప్రతులలో

మూల([గ్రంథ భాగంలో లేదు. నీలకంఠీయవ్యాఖ్యలో మాత్రం దీనిప్రశంస ఉన్నది. అందులో దీనికి 'నారాయణ్యుపాఖ్యానం' అనే

పేరు కనిపిస్తున్నది.

తే. కుడుచునెడ వాని పెనువ్రేలు కూటిలోనం। దునిసి పడియున్న వ్రేల్‌ వుచ్చి తోయజాక్షి యేవగింపక యుచ్చిష్ట మిష్టలీలం; దగిలి కుడుచుచున్నంత నత్తరుణిం జూచి. 258

ప్రతిపదార్దం: కుడుచు, ఎడ= తినునప్పుడు; వాని=ఐ ఆ మునియొక్క; పెను (వ్రేలు= పెద్దవ్రేలు; కూటిలోన; తునిసి= తునిగి;

పడి; ఉన్న; తోయజాక్షి= నీటినుండి పుట్టిన కమలాలవంటి కన్నులు కల ఆ ఇంద్రసేన; (వ్రైల్‌= వ్రేలిని; పుచ్చి= తీసివేసి; ఏవగింపకజ అసహ్యపడకుండ; ఉచ్చిష్టము= ఎంగిలి అన్నాన్ని; ఇష్ట లీలన్‌= ఇష్టమైన పద్దతిగా, సంతోషంగా; తగిలి= ఆసక్తితో; కుడుచుచు= తినుచు; ఉన్నంతన్‌; ఆ+తరుణిన్‌= ఆ కాంతను; చూచి,

తాత్పర్యం: తింటూ ఉండగా, అతని బొటనవ్రేలు కూటిలో తునిగి పడి ఉండటం చూచి, పద్మాలవంటి కన్నులు

కల ఆ ఇంద్రసేన ఆ వ్రేలిని తీసివేసి, అసహ్యపడక ఆ ఎంగిలి అన్నాన్ని మిక్కిలి ప్రీతితో తినసాగింది. అప్పు

డామెను చూచి.

వ. _దానిదయిన పతిభక్తి గుణంబునకు మెచ్చి మౌద్గల్యుండు ప్రసన్నుం డయి “నీ కెద్ది యిష్టంబు వేండు మిచ్రెద' ననిన నది యి ట్లనియె: 'మునీంద్రా! నాకుం గామోపభోగేచ్చ పెద్ద గలదు; నీవునుం దపశ్శక్తి- గామరూప ధరుండ వయి యీ జబీభత్సంబగు రూపం బుడిగి, మనోహరం బయిన రూపంబునం బంచధా విభక్తుండ వయి నన్ను రమియించి కామభోగంబులం దనుపు' మనిన నమ్ముని దాని కిష్టంబైనవిధంబున నేను దేహంబులు దాల్చి నుర్త్య దేవ లోకంబులయందు బ్రహ్మర్షి దేవర్షి పూజితుం డై సూర్యరథం బెక్కి చని యాకాశగంగాజలంబుల నాప్తుతదేహుం డయి శీతాంశునంశుజాలంబుల వసియించి మేరుకైలాసంబుల యందు. గ్రీడించుచు ననేకస్థానంబుల ననేకసహస్రవర్షంబులు నాలాయని యైన యింద్రసేన నుపభోగించి తృస్తుం డై, మౌద్గల్యుండు దాని విడిచి ఘఫోరతపంబు సేసి బ్రహ్మమయుం డై బ్రహ్మలోకం బునకు6 జనిన; నది కామభోగములందు( దనియక కాలవశంబున శరీరము విడిచి కాశిరా జను రాజర్నికిం

ఆదిపర్వము - సష్తమాశ్వాసము ౯753 బుట్టి పెరుగుచుం గన్యాత్వమునం బెద్దకాలం బుండి తన దౌర్భాగ్యంబునకు నిర్వేదించి, పతిం గోరి పశుపతి నుద్దేశించి యుగ్రతపంబు సేయుచున్నంత. 259 ప్రతిపదార్హం: దానిది+అయిన; పతిభక్తి గుణంబునకు; మెచ్చి; మౌద్గల్యుండు; (ప్రసన్నుండు+అయి= దయతలచినవా డైై నీకు; ఎద్ది; ఇష్టంబో; వేడుము; ఇచ్చెదన్‌; అనినన్‌; అది; ఇట్టు+అనియె; ముని+ఇం(ద్ర= ముని'శ్రేస్ట; నాకున్‌: కామ+ఉపభోగ+ఇచ్చ= కామాన్ని అనుభవించటంలో కోరిక; పెద్ద, కలదు; నీవునున్‌: తపః+శక్తిన్‌; కామరూప, ధరుండవు+అయి= ఇష్టమైన రూపాన్ని ధరించినవాడవై; ఈ, బీభత్సంబు+అగు= ఈ అసహ్యమైన; రూపంబు; ఉడిగి= మాని; మనోహరంబు+అయిన; రూపంబునన్‌; పంచధా, విభక్తుండవు+అయి= ఐదు విధాలుగా విభాగం పొందిన వాడ వై; నన్ను; రమియించి; కామ భోగం బులన్‌; తనుపుముజ= తృప్తిపొందింపుము; అనినన్‌; ఆ+ముని; దానికి; ఇష్టంబు+ఐన, విధంబునన్‌; ఏను=ఐదు; దేహంబులు; తాల్చి= ధరించి; మర్య్య, దేవ. లోకంబుల, అందు=మనుష్యలోకంలో; దేవలోకంలో; (బ్రహ్మర్షి దేవర్షి పూజితుండు+ఐ= (బ్రహ్మర్జులచేత, దేవర్షుల చేత పూజింపబడిన వాడై; సూర్య, రథంబు+ఎక్కి; చని= వెళ్ళి; ఆకాశ, గంగా, జలంబులన్‌; ఆప్హుతదేహుండు+అయి= తడిసిన శరీరం కలిగినవాడయి, అంటే స్నానం చేసినవాడయి; శీత+అంశు+అంళు, జాలంబుల= చల్లని కిరణాలు గల చంద్రుని కిరణ సమూహాలలో; వసియించి= నివసించి; మేరు; కైలాసంబుల, అందున్‌; (క్రీడించుచున్‌; అనేక; స్టానంబులన్‌; అనేక సహస్ర, వర్షంబులు= అనేక వేల సంవత్సరాలు; నాలాయని; ఐన; ఇంద్రసేనన్‌; ఉపభోగించి= అనుభవించి, తృప్తుండు+ఐ= తృప్తి పొందినవా డై; మౌద్గల్యుండు; దాని; విడిచి; ఘోర తపంబు; చేసి; బ్రహ్మమయుండు+ఐ= (బ్రహ్మత్వాన్ని పొందినవాడై; బ్రహ్మ, లోకంబునకున్‌; చనినన్‌= వెళ్ళగా; అది= ఇంద్రసేన; కామభోగంబులన్‌; తనియక= తృప్తిపొందక; కాలవశంబున; శరీరంబు; విడిచి; కాశిరాజు+ అను, రాజ+బుపషికిన్‌; పుట్టి; పెరుగుచున్‌; కన్యాత్తమున; పెద్దకాలంబు= చాలకాలం; ఉండి; తన, దౌర్భాగ్యంబునకు= తన యొక్క దురదృష్టానికి; నిర్వేదించి= నిరాశచెంది; పతిన్‌= భర్తను; కోరి; పశుపతిని= శివుడిని; ఉద్దేశించి; ఉ(గ్ర తపంబు= భయంకర మైన తపస్సు; చేయుచు+ఉన్నంత= చేస్తూఉండగా. తాత్పర్యం: ఆమె పతి భక్తి గుణానికి మెచ్చి మౌద్గల్యుడు దయతో నీ కేది ఇష్టమో కోరుకో. ఇస్తాను" అన్నాడు. ఆమె, 'మునీంద్రా! నాకు కామాన్ని అనుభవించాలన్న కోరిక మిక్కిలిగా ఉన్నది. నీవు తపశ్శక్తితో కోరిన రూపాన్ని ధరించి, ఈ అసహ్య మైన రూపాన్ని వదలి, మనోహరమైన రూపంతో ఐదు విధాలుగా విభాగం పొంది నాతో రమించు. కామభోగాలతో నన్ను తృప్తి పరుచుము'" అని కోరగా ఆ మహాముని ఆమెకు ఇష్టమైన విధంగా ఐదుదేహాలు ధరించాడు. మానవలోకంలో, దేవలోకంలో (బ్రహ్మర్హులు, దేవర్షులు తనను పూజించగా, సూర్యరధాన్ని ఎక్కి, ఆకాశ గంగలో స్నానం చేసి, చంద్రుని కిరణ సమూహంలో నివసించి, మేరు కైలాస పర్వతాలలో క్రీడిస్తూ అనేకచో ట్ల అనేక వేల సంవత్సరాలు నాలాయని అయిన ఇంద్రసేనను అనుభవించి, తృప్తిపడ్డాడు. తరువాత ఆమెను విడిచి, గొప్పతపస్సు చేసి బ్రహ్మత్వాన్ని పొంది, (బ్రహ్మలోకానికి వెళ్లాడు. కాని ఆమె ఆ కామభోగాలతో తృప్తిపడక కాలవశాన శరీరం వదలి, కాళిరాజు అనే రాజర్డికి పుత్రికగా జన్మించింది. కన్యగానే చాలాకాలం ఉండి, తన దౌర్భాగ్యానికి బాధపడి, భర్తకారకు శివుడిని గూర్చి భయంకరమైన తపస్సు చేస్తుండగా. తే. _దానికడకుం బ్రత్యేకంబ ధర్మవాయు ; వాసవాశ్వినుల్‌ ప్రీతు లై వచ్చి దాని

నాత్మ దేహాంశజులకు దేహాంతరమున. బత్నిగాం గోరి రధిక సౌాభాగ్యయుక్తి. 260 ప్రతిపదార్థం: దాని, కడకున్‌= దానిదగ్గరకు; ప్రత్యేకంబు+అ= వేరువేరుగా; ధర్మ, వాయు, వాసవ+ఆళ్వినుల్‌= యముడును, వాయువును, ఇంద్రుడును అశ్వినీదేవతలును; ప్రీతులు+ఐ= సంతోషంపొందినవాళ్ళయి;. వచ్చి; దానిన్‌; ఆత్మ,

754 శ్రీమదాంధ్ర మహాభారతము

దేహ+అంశజులకుఐ తమదేహాలయొక్క అంశాలవలన పుట్టినవాళ్ళకు; దేహాంతరమునన్‌= మరాకజన్మలో; అధిక సౌభాగ్య,

యుక్తిజ ఎక్కువ అందముయొక్క పొందికచేత; పత్నిన్‌+కాన్‌= భార్య అయ్యేటట్టు; కోరిరి= కోరారు.

తాత్పర్యం: ఆమె దగ్గరకు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు సంతోషంతో వేర్వేరుగా వచ్చి,

జన్మాంతరంలో తమ తమ అంశలతో పుట్టే వాళ్ళకు అధిక సౌందర్యంతో ఆమె భార్య కావా లని కోరారు.

వ. అదియును గొండొకకాలంబు జలానిలాహార యై, కొండొకకాలంబు నిరాహార యై, కొండొకకాలం బేక పాదంబున నిల్చి, కొండొకకాలంబు పంచాగ్నిమధ్యంబున నుండి యత్యుగ్రతపంబు సేసిన నీశ్వరుండు ప్రసన్నుం డయి వరంబు వేండు మనిన, నక్కన్యక 'నాకుం బతిదానంబు. బ్రసాదింపు”' మని యర్జిత్వంబున నేనుమాలులు వేండినం గరుణించి యీశ్వరుండు 'నీకు దేహాంతరంబున నేవురుపతు లగుదు” రనిన నది యిట్లనియె. 261

(ప్రతిపదార్హం: అదియును= ఆ ఇంద్రసేనయు; కొండొకకాలంబు= కొంతకాలం; జల+అనిల+ఆహార+ఐ= నీటిని, గాలిని,

ఆహారంగా కలదై, కొండొకకాలంబు; నిరాహార+ఐ= ఆహారం లేనిదై; కొండొకకాలంబు; ఏక, పాదంబునన్‌= ఒకే పాదంతో: నిల్చి;

కొండొకకాలంబు; పంచ+అగ్ని, మధ్యంబునన్‌= అయిదు అగ్నులనడుమ; ఉండి; అతి+ఉ(గ, తపంబు= మిక్కిలి భయంకర మైన తపస్సు; చేసినన్‌; ఈళశ్చరుండు; ప్రసన్నుండు+అయి= (ప్రత్యక్ష మైనవాడై; వరంబు; వేడుము+అనినన్‌; ఆ+కన్యక; నాకున్‌; పతిదానంబున్‌; ప్రసాదింపుము+అని= ఇమ్ము అని; అర్జిత్సంబునన్‌= కోరికచేత; ఏను, మాజులు= ఐదుసార్జు; వేడినన్‌=

(ప్రార్హింపగా, కరుణించి; ఈశ్వరుండు; నీకు; దేహ+అంతరంబునన్‌= మరొక దేహమునందు - అనగా మరుసటిజన్మలో; ఏవురువ=

ఐదుగురు; పతులు భర్తలు; అగుదురు; అనినన్‌; అది; ఇట్టు+అనియె.

తాత్పర్యం: తరువాత ఆమె కొంతకాలం నీరు, గాలి ఆహారంగా, కొంతకాలం ఆహారమే లేకుండ, కొంతకాలం

ఒకే పాదంమీద నిల్చి, కొంతకాలం ఐదు అగ్నులమధ్యలో ఉండి, మహాభయంకర మైన తపస్సు చేసింది.

ఈశ్చరుడు (ప్రత్యక్ష మై వరం కోరు కొమ్మనగా, ఆ కన్యక 'నాకు పతిదానం ఇ'మ్మని ప్రబలమైన కోరికతో ఐదు సార్టు అడిగింది. ఈశ్శరుడు కరుణించి “నీకు మరొక జన్మలో ఐదుగురు భర్త లౌతా'రని అనగా - ఆమె ఇట్టా అన్నది.

ఆ. సతికి నొక్కరుండ పతిగాక యెందును : బతులు పలువు రవుట కతల గలదె? లోకనాథ! యిట్టి లోకవిరుద్ధంపు ।; వరము నదయ నమరవరద! యొల్ల. 262

ప్రతిపదార్థం: సతికిన్‌= (స్త్రీకి ఒక్కరుండ= ఒక్కడే; పతి=ఐ భర్త; కాక, ఎందును= ఎచ్చటనైన; పతులు; పలువురు= అనేకులు;

అవుట; కతలన్‌= కధలందు; కలదె; లోకనాధ!= లోకాలకు '్రభువైనవాడా; అమర, వరద= దేవతలకు వరము లిచ్చేవాడా! ఓ

పరమేశ్చరా; ఇట్టి; లోకవిరుద్దంపు వరము; పడయన్‌= పొందటానికి; ఒల్ల= ఇష్టపడను.

తాత్పర్యం: స్త్రీకి భర్త ఒక్కడే కాని, పెక్కుమంది భర్తలు కావటం కథలలో ఎక్కడైనా ఉన్నదా? పరమేశ్వరా!

ఇటువంటి లోకవిరుద్ద మైన వరం పొందటానికి నేను ఇష్టపడను,

వ. అనిన దానికి రుద్రుం డిట్లనియె. 263

తొత్ప్సర్యరి: అనగా ఆమెతో ఈశ్వరుడు ఈ విధంగా అన్నాడు.

ఆదివర్వము - సప్తమాశ్వానము ౯755

క నావచనంబుననీక, య్యేవురు పతులందు ధర్మువెడపక యుండుం గావున నిట్టి వరం బిం । దీవర దళనేత్ర! యిచ్చితిని దయతోన్‌. 264

సతిసదార్లం: నా, వచనంబునన్‌= నా మాటచేత; నీకు; ఆ+ఏవురు, పతులందు= ఆ ఐదుగురు భర్తలందు; ధర్మువు= ధర్మం;

6 థ్‌ శ్రి శ్ర

ఎడపకజ తొలగక; ఉండున్‌; కావునన్‌; ఇందీవర, దళ, నేత్ర= నల్లకలువరేకులవంటి కన్నులు కలదానా! ఇట్టి వరంబు;

దయతోడన్‌; ఇచ్చితిని.

తాత్పర్యం: నల్ల కలువ రేకులవంటి కన్నులు కల ఓ కన్యకా! నా మాటవలన నీకు ఆ ఐదుగురు భర్తలలో ధర్మం

తప్పకుండ ఉంటుంది. అందువల్లనే దయతో నేను నీ కీ వర మిచ్చాను.

వ. 'అనిన నది యట్లేని నయ్యేవురు పతులయందును బ్రత్యేకసంగమంబునను నాకు గౌమారంబును బతిశుత్రూషాసిద్ధియు. గామభోగేచఛ్చయు సౌభాగ్యంబునుం బ్రసాదింప వలయు" ననిన రుద్రుండు దాని కోరిన వరంబు లెల్ల నిచ్చి, గంగాతీరంబున నున్న యింద్రు నాయొద్దకుం దోడ్కొని రమ్మని పంచిన వల్లె యని.265

ప్రతిపదార్హల: అనినన్‌, అది; అట్టు+అని; ఆ+ఏవురుజ అ ఐదుగురు; పతుల, అందును= భర్తలందును; ప్రత్యేక, సంగమంబునను= ఒక్కొక్కరితోడి కలయికయందును; నాకున్‌; కౌమారంబును= కన్యాత్యమును; పతి, శుశ్రూషా, సిద్ధియున్‌= పతిసేవా భాగ్యము; కామ, భో గ+ఇచ్చయుజ కామాన్ని అనుభవించే కోరిక; సౌభాగ్యంబును= ముత్తైదువతనము? (ప్రసాదింప వలయున్‌= అను(గహించవలయును; అనిన; రుద్రుండు= శివుడు; దాని, కోరిన వరంబులు+ఎల్లన్‌= అమె (యొక్క) కోరిన వరాలన్నింటిని; ఇచ్చి; గంగా, తీరంబునన్‌; ఉన్న; ఇంద్రు; నా, ఒద్దకున్‌; తోడ్కొని, రమ్ము+అని; పంచినజ ఆజ్ఞాపించగా;: వల్లె, అని= సరే అని.

తాత్పర్యం: అని పల్కగా ఆమె 'అట్టైతేే ఆ అయిదుగురు భర్తలలో ఒక్కొక్కరితో కలయిక ఉన్నప్పటికి నాకు

కన్యాత్వం, పతొసేవాభాగ్యం, కామాన్ని అనుభవించా లనే కోరిక ముత్తైదువతనం అను(గ్రహించ వలసిం” దని

కోరగా, శివుడు ఆమె కోరిన వరా లన్నీ ఇచ్చి, గంగాతీరంలో ఉన్న ఇంద్రుడిని నాదగ్గరికి తోడ్కొని రమ్మని పంపాడు. ఆమె సరే అని.

క. దక్షాధ్వరమథనునకుం బ్ర। దక్షిణపూర్వముగ మొక్కి తతయక చని ప ద్మేక్షణ సహస్రచక్షుం బ్ర। తీక్షించుచు నుండె సురనదీతీరమునన్‌. 266

ప్రతిపదార్థం: పద్మ+-ఈక్షణ= పద్మాలవంటికన్నులు కలది - ఆ కాశీరాజు కూతురు; దక్ష+అధ్వర, మధనునకున్‌= దక్షయజ్ఞాన్ని

చెడగొట్టిన శివునికి? (ప్రదక్షిణ, పూర్వముగన్‌= ప్రదక్షిణ ముందుగా చేసి; మొక్కి; తడయక= ఆలస్యం చేయక; చని= వెళ్ళి, సురనదీ, తీరమునన్‌= గంగానదిఒడ్డున, సహస్ర, చక్తున్‌= వేయికన్నులు కలవాడైన ఇంద్రుని; కొరకు; ప్రతీక్షించుచున్‌= ఎదురు చూస్తూ ఉండెన్‌.

తాత్పర్యం: పద్మాలవంటి కన్నులు కల ఆ కాశీరాజు కూతురు శివునికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి వెంటనే

గంగాతీరానికి వెళ్ళి ఇంద్రనిరాకకై యెదురుచూస్తూ ఉండింది.

(ద్రుపదునకు వ్యాసుండు సంచేంద్రోపాఖ్యానంబు సెప్పుట (సం.1-189-1) స చేసి వు అట వైనస్వతుండును నైమిశారణ్యంబున సత్రయాగ దీక్షితుం డయి ప్రాణిహింస సేయకుందుటం కి మానవు లప్రొప్తమరణు లయి వర్తించుచున్న దాని సహింపనోపక యింద్రాది దేవతలందటు బ్రహ్మపాలి

756 శ్రీమదాంధ్ర మహాభారతము జని 'భట్టారకా! మర్తు లమర్సు లయి వర్తిల్లువా రయిన వారికిని మాకును విశేషం బెద్ది?యని దుఃఖించిన నయ్యమరుల కమరజ్యేష్టుం డి ట్లనియె. 267

(ప్రతిపదార్థం: అట. వైవస్వంతుండును= యముడును; వైమిశశఅరణ్యంబున; సత్రయాగ దీక్షితుండు+అయి, సత్రయాగంలో

దీక్షపూనినవాడై; (ప్రాణి హింస= ప్రాణులను చంపటం; చేయక+ఉండుటన్‌+చేసి= చేయకుండటంచేత; మానవులు; అ్రాప్తు

మరణులు+అయి= సొందబడని చావుకలవా ళ్ళయి = అనగా చావులేనివాళ్ళయి; వర్తించుచు+ఉన్న;దాని; సహింపన్‌+ఓపక= ఓర్భుకొనలేక; ఇం(ద్ర+ఆది, దేవతలు+అందరు= ఇంద్రుడు మొదలైన దేవతలంతా; (బ్రహ్మపాలికిన్‌= (బ్రహ్మ దగ్గరకు; చని= వెళ్ళి; భట్టారకా= ఓ మహామునీ!; మర్ష్యులు= చావుకలవాళ్ళు య మనుష్యులు; అమర్యులు+అయి= చావులేని వాళ్ళయి; వర్తిల్లు

వారు+ఐనజ జీవించే వా ళ్ళయితే; వారికిని; మాకును; విశేషంబు= భేదం; ఎద్ది; అని; దుఃఖించినన్‌; ఆ+అమరులకుజఐ ఆ

దేవతలకు; అమర, జ్యేష్టుండు= దేవతలందరిలో పెద్దవాడైనవాడ (బ్రహ్మ; ఇట్టు+అనియె.

తాత్పర్యం: అక్కడ యముడు నైమిశారణ్యంలో సత్ర యాగ దీక్ష వహించి, (ప్రాణి హింస మానివేయటంవలన

మానవులు మరణం లేనివా ళ్ళయి జీవించసాగారు. దానిని ఓర్వలేక ఇంద్రుడు మొదలైన దేవతలంతా

బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ' మహామునీ! మృతి చెందే మానవులు మృతిలేనివాళ్ళయి జీవిస్తే వాళ్ళకూ మాకూ భేద మేమిటి?” అని దుఃఖించగా వాళ్ళతో బ్రహ్మ ఇట్లా అన్నాడు.

క. _ ఎంతకుంగృతకార్యుం డగు । నంతకుం డీ రంతకును భయం బందక ని శ్రింతమున మండు దాతం । డంతము నొందించు. దొంటియట్టుల నరులన్‌, 268

(ప్రతిపదార్థం: అంతకుండు= యముడు; ఎంతకున్‌= ఎప్పటికి; కృత, కార్యుండు= చేయబడిన సత్ర యాగ కార్యం కలవాడు;

అగున్‌= అగునో; ఈరు= మీరు; ఆంతకును= అంతవరకు; భయంబు+అందక, నిశ్చింతమునన్‌= చింతలేనివిధంగా; ఉండుడు;

ఆతండు= ఆ యముడు; తాంటి, అట్టులు+అ= మునుపటివలెనే; నరులన్‌; అంతమున్‌+ఒందించున్‌= చంపును.

తాత్సర్యం: యముని సత్రయాగం ఎప్పటికి పూర్తి అవుతుందో అప్పటివరకు మీరు భయపడకుండ నిశ్చింతగా

ఉండండి. అతడు మునుపటివలెనే మానవులను అంత మొందిస్తాడు,

క, ఆవైవస్వతు వీర్యము; మీ వీర్యము. దాల్చి సూర్యమితతేజులు దా రేవు రుదయింతు రాతని । కావించు విధానమునకు. గారణ మగుచున్‌. 269

ప్రతిపదార్థం: ఆ, వైవస్వతు, వీర్యము= ఆ యమునియొక్క తేజస్సును; మీ, వీర్యమున్‌= మీ తేజస్సును; తాల్చి= ధరించి:

సూర్య, మిత, తేజులు= సూర్యుని అంతటి తేజస్సు కలవాళ్ళు; తారుజ తాము; ఎవురు= ఐదుగురు, ఆతని, కావించు, విధానమునకున్‌= ఆ యముడు చేసే పనికి; కారణము+అగుచున్‌; ఉదయింతురు= పుట్టుతారు.

తాత్పర్యం: ఆ యముని తేజస్సు, మీ తేజస్సు ధరించి, సూర్యునంతటి తేజస్సు కలవాళ్ళు అయిదుగురు.

యముడు చేసే పనికి సాధనంగా జన్మిస్తారు.

వ. అనిన నమరపతి పురోగము లయిన యమరు లెల్ల నమరాపగాసమీపంబునకుం జనునప్పడు, తత్సలిల మధ్యంబున నొక్క కన్యక యేద్దుచున్న, దాని కన్నీళ్ళు కనకకమలంబు లయినం జూచి వేల్పులుం దానును విషయం బంది, యింద్రుం డక్కన్యకయొద్దకుం జని 'యేడెద వెందుల దాన? వని యడిగిన నది యింధ్రున కిట్లనియె. 270

ఆదిపర్వము - సప్తమాశ్వాసము 757 ప్రతివదార్థం: అనినన్‌; అమరపతి, వురోగములు+అయిన= దేవేంద్రుడు ముందు నడచువాడుగా కోలవాళ్ళయిన; అమరులు+ఎల్లన్‌= దేవతలంతా? అమర+అపగా, సమీపంబునకున్‌= దేవనది మైన గంగానది దగ్గరకు; చనునప్తుడు= వెళ్ళునప్పుడు; తత్‌+సలిల, మధ్యంబునన్‌= ఆ నీళ్ళ నడుమ) ఒక్క; కన్యక: ఏడ్చుచు+ఉన్ను; దాని; కన్నీళ్ళు; కనక్క కమలంబులు+అయినన్‌= బంగారు తొమరలు కాగా; చూచి; వేల్పులున్‌= దేవతలును; తానును; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; ఇంద్రుండు; ఆ+కన్యక, ఒద్దకున్‌; చని= వెళ్ళి; ఏడ్చెదవు; ఎందులదానవు= ఎక్కడిదానవు; అని; అడిగినన్‌; అది; ఇంద్రునకు; ఇట్టు+అనియె. తాత్పర్యం; అని (బ్రహ్మదేవుడు పల్కగా, దేవతలంతా వెనుదిరిగి, దేవేంద్రుడు ముందు నడువగా గంగానది దగ్గరకు వెళ్ళారు. ఆ సమయంలో ఆ నీటి మధ్యలో ఒక కన్య యేడుస్తుండగా, ఆమె కన్నీళ్లు బంగారుతామరలు కావటం చూచి, దేవతలూ, ఇంద్రుడు ఆళ్ళర్యపడ్డారు. ఆ కన్య దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు? ఏ ప్రదేశానికి చెందిన దానవు? అని అడుగగా ఆమె ఇంద్రునితో ఇట్టా పలికింది.

ఆ. 'నాదు రోదనంబు, నన్ను నెటుంగంగ ।; వలతయేని యమరవల్లభుండ! నా పెజబుంద రమ్ము నావుడు నప్పుడ । వ్వనిత పజ్ఞి నరిగె వాసవుండు. 271

ప్రతిపదార్థం: నాదు, రోదనంబున్‌= నా ఏడ్పును; నన్నున్‌; ఎయుగంగ; వలతు+అ, ఏీని=ఐ కోరుదువేని; అమర, వల్లభుండ=

దేవతల రాజైన ఓ దేవేంద్రా!; నా పిలుంద= నా వెంట; రమ్ము; నావుడున్‌= అని అనగా; వాసవుండుజ దేవేంద్రుడు; అప్పుడు; ఆ+ వనిత, పజ్జన్‌= ఆ కన్యవెంబడి; అరిగెజఐ వెళ్ళాడు,

తాత్సర్యం: “దేవేంద్రా! నా దుఃఖాన్నిగురించి, నన్నుగురించి తెలిసికొనా లనుకుంటే, నా వెంట రమ్ము!” అని ఆ

కన్య చెప్పగా, దేవేంద్రుడు ఆమెను అనుసరించి వెళ్ళాడు,

వ. ఇ ట్లక్కన్యక పిబుంద నరుగువాండు ముందఅ హెమవదచలకందరారచితరత్న వేదికాతలంబున సింహాసనా సీనుం డయి తరుణరూపంబున నొక్కతరుణితో జూదం బాడుచున్న యాదిదేవుం గని తరుణుండ కా వగచి సురపతి కరం బలిగి యి ట్లనియె. 272

(ప్రతిపదార్థం: ఇట్టు ఆ+కన్యక; పిలుందన్‌=ఐ వెంట; అరుగువాండు= వెళ్ళీ దేవేంద్రుడు; ముందఅ; హీిమవల్‌+అచల, కందరా,

రచిత, రత్న, , వేదికా, తలంబున= హిమాలయపర్వతముయొక్క గుహయందు రూపొందింపబడిన రత్నపుటరుగుమీద;

సింహాసన+ ఆసనుండు+అయి= సింహాసనంమీద కూర్చున్నవాడై; తరుణ, రూపంబునన్‌= యౌవనంలో ఉన్న వాని రూపమున; ఒక్క; తరుణితోన్‌= యౌవనంలో ఉన్న కాంతతో; జాదంబు+ఆడుచు+ఉన్న; ఆదిదేవున్‌= శివుడిని; కని= చూచి; తరుణుండు, కొజయౌవనంలో ఉన్నవాడిగానే; వగచి= తలచి; సుర, పతి= దేవేంద్రుడు; కరంబు= మిక్కిలి; అలిగి= కోపించి; ఇట్టు+అనియె. తాత్సర్యం:; ఈ విధంగా ఆ కన్యకవెంట వెళ్తూ దేవేంద్రుడు- ఎదుట హిమాలయ పర్వతపు గుహలో నిర్మించబడిన రత్నపుటరుగుమీద సింహాసనంపై కూర్చొని యువకునిరూపంలో ఒక యువతితో జూదమాడుతున్న పరమేశ్వరు డిని చూచి, అతడిని సాధారణ యువకుడిగానే భావించి దేవేంద్రుడు మిక్కిలి కోపించి ఇట్టా అన్నాడు.

.

మ. అమితస్థావరజంగమం బయిన బ్రహ్మాండంబు దా నింతయున్‌ మమతాగోచర మీత్రిలోకములు నస్మద్దాహువజ్రానుపా ల్యము; లే నింద్రుండ; నిట్టి న న్నుణక లీలన్‌ జూదమాడంగ ను త్తమసింహాసన మెక్క నీకు జనునే దర్శించి నాముందటన్‌. 273

758 శ్రీమదాంధ్ర మహాభారతము

(ప్రతిపదార్థం: అమిత, న్ధావర, జంగమంబు+అయిన= అంతులేని స్టావరాలు (కదలిక లేనివి, జంగమాలు (కదలిక కలవి)

కలదైన; బ్రహ్మాండంబు; తాన్‌; ఇంతయున్‌; మమతా గోచరము= నాదిగా అగుపించునట్టి; ఈ, (త్రిలోకములున్‌; అస్మత్‌+బాహు

వజ్ర+ఆనుపాల్యములు= నాయొక్కచేతిలోని వజ్రాయుధంచే పాలించదగినవి; ఏన్‌= నేను; ఇంద్రుండన్‌; ఇట్టి; నన్ను; ఉఅక= లెక్కపెట్టక; దర్పించి= గర్వించి; నా ముందటన్‌= నా ఎదుట; ఉత్తమ, సింహాసనము; ఎక్క= ఎక్కటం; లీలన్‌= విలాసంగా" జూదము+ఆడంగన్‌=ఐ జూదమాడటం; నీకున్‌+*చనునేజ= నీకు తగునా!

తాత్పర్యం: అంతులేని స్థావర జంగమాలతో నిండిన ఈ (బ్రహ్మాండమంతా నాది. ఈ మూడులోకాలు నా చేతి

వజ్రాయుధంతో పాలించబడుతూ ఉన్నాయి. నేను దేవేంద్రుడిని. ఇటువంటి నన్ను లెక్కపెట్టక, గర్వించి నా

యెదుట విలాసంగా జూదమాడటం, పెద్దసింహాసన మెక్కటం నీకు తగునా?

న. అనిన రుద్రుం డలిగి రౌద్రాకారంబున వానిం జూచి 'మదీయ క్రీడారసభంగంబుం జేసిన యిద్దుర్మదుం బట్టి తె' మ్మని య కృన్యకం బంచిన నప్పుడు దానికరస్పర్శనంబున విచేస్టితుం డయి మహీతలంబుపయిం బడిన యయ్యింద్రునకు రుద్రుం డి ట్లనియె. 274

(ప్రతిపదార్హం: అనిన; రుద్రుండు= శివుడు; అలిగి= కోపించి; రౌద్ర+ఆకారంబున= భయంకర మైన రూపంతో: వానిన్‌= ఆ

దేవేంద్రుడిని; చూచి; మదీయ; క్రీడా, రస, భంగంబున్‌= నా యొక్క ఆటయందలి ఆనందానికి ఆటంకం; చేసిన= కలిగించిన;

ఈ+దుర్మదున్‌= ఈ పొగరుబోతును; పట్టితెమ్ము+అని; ఆ+కన్యకన్‌; పంచినన్‌= పంపగా; అప్పుడు; దాని, కర, స్పర్శనంబున= ఆమె చేతి తాకిడిచేత; విచేష్టితుండు+అయి= చేష్టలు కోల్పోయినవా డై: మహీతలంబు, పయిన్‌= నేల మీద; పడిన; ఆ+ఇం(ద్రునకు; రుద్రుండు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: అని దేవేంద్రుడు పల్కగా శివుడు కోపించి, భయంకర మైన ఆకారంతో అతడిని చూచి 'నా ఆటలోని

ఆనందాన్ని ఆటంకపరచిన ఈ పొగరుబోతును పట్టి తెమ్మని ఆ కన్యకను పంపగా, అప్పు డామె చేతి స్పర్శతో

చేష్టలు లేని వాడై నేలమీద పడిన ఇంద్రునితో శివుడు ఇట్లా అన్నాడు.

క. 'గర్వించి పలికి, తగు, నీ; గర్వము భుజవీర్యమును బ్రకాశంబుగ నీ పర్వతవివరము దెర్టి వి। గుర్వింపుము చూతి' మనిన గోత్రభిదుండున్‌. 275

ప్రతిపదార్థం: గర్వించి; పలికితి= పలికితివి; అగు= అట్టే అగుగాక; నీ, గర్భము: భుజ, వీర్యమును= బాహుబలమును; ప్రకాశం

బుగన్‌= వెల్లడి అయ్యేటట్టు: ఈ, పర్వత, వివరము= ఈపర్వతంయొక్కరం[ద్రం; తెర్చి; విగుర్వింపుము=. విరువుము; చూచుదము; అనిన; గో(త్రభిదుండున్‌= పర్వతాలయొక్కరెక్కలను విరిచిన దేవేంద్రుడును.

తాత్పర్యం: “గర్వంతో మాట్టాడావు. నీ గర్వం, బాహుబలం వెల్లడి అయ్యేటట్టు ఈ పర్వ్పతరంధ్రాన్ని తెరచి,

విరువుము చూద్దాం” అని శివుడు పల్కగా, దేవేంద్రుడు.

విశేషం: 'వివరము' అనే పదానికి బదులు కొన్నిప్రతులలో ఉన్న శిఖరము” అనే పాఠాంతరం మేల్తర మనిపిస్తుంది. 'తెర్చి' అనే

దానికి 'తీర్చి' అనే పాఠాంతరం ఉంది. వివరాన్ని విరవటం కంటె శిఖరాన్ని విరవటం సమంజసం. శిఖరం బెత్తి విగుర్వింపుము

అనే పొఠం అన్నిటికంటె స్పష్టార్థాన్ని కలిగిఉన్నది. కాని శివు డున్నది గుహలో కనుక ఇక్కడ “వివరము' అనే పాఠాన్నే (గ్రహించటం జరిగింది.

ఆదిపర్వము - సప్తమాశ్వానము 759 సీ. హరువచనమున నా గిరిరాజవివరంబు । గరములం బట్టి చెచ్చెర దినేశ చండమయూఖముల్‌ రెండు విధంబు లై; యుండంగం దెర్ది యాఖండలుండు దనయట్టివారల ఘనశరీరుల నందు ; నలువుర నన్యుల వెలయ: జూచి, 'యే నిట్టు లేలొకో యేనుప్రకారంబు । లయితి నిం? దనుచు విషయము. బొంది

ఆఅ. యున్నంజూచి హరుండు గ్రన్న నయ్యింద్రుల । నేవురను మహానుభావ మెసంగ మనుజయోనిం బుట్టు. డని పంచె గీర్వాణ, హితము సేయుపొంటె మతిం దలంచి. 276

(ప్రతిపదార్థం: హరు, వచనమునన్‌= శివునియొక్కమాటచేత; ఆ, గిరి, రాజు, వివరంబు= ఆ పర్వత ్రేస్టంయొక్క రంధ్రమును,

కరములన్‌+పట్టి= చేతులతో పట్టుకొని; చెచ్చెర= వేగమే; దిన+-ఈశ చండ, మయూఖముల్‌= సూర్యునియొక్క వేడికిరణాలు;

రెండు; విధంబులు+ఐ, ఉండంగన్‌; తెర్చి; ఆఖండలుండు= దేవేంద్రుడు; తన, అట్టి, వారల; ఘన, శరీరులన్‌= గొప్పళరీరాలు కలవారిని, నలువురన్‌; అన్యులన్‌= ఇతరులను; అందు= ఆ రంధ్రమునందు, వెలయన్‌= మెరయగా, చూచి; ఏను= నేను; ఇట్టుల: ఏల+ఒకో=ఐ ఎందుచేతనో; ఏను, ప్రకారంబులు= అయిదు విధాలు; ఇందు; అయితిన్‌:; అనుచు; విస్మయమున్‌= ఆశ్చర్యాన్ని; పొంది; ఉన్నన్‌, చూచి; హరుడు= శివుడు; క్రన్నన్‌= వెంటనే; ఆ=ఇంద్రులన్‌: ఏవురను= ఐదుగురను; మహా+ అనుభావము= గొప్ప వ్యక్తిత్వము; ఎసంగ= అతిశయించగా; మనుజ, యోనిన్‌=ఐ మానవ్రీ యందు; పుట్టుడు; అని; గీర్వాణ, హితము= దేవతలకు మేలు; చేయు, పాొంటె= చేయుటకొరకు; మతిన్‌= బుద్దియందు; తలంచి; పంచెన్‌= ఆజ్ఞాపించాడు.

తాత్పర్యం: శివుని మాటప్రకారం దేవేంద్రుడు ఆ పర్వత రంధ్రాన్ని రెండు చేతులతో పట్టుకొని సూర్యుని కిరణాలు రెండు పాయ లైనట్టుగా తెరచి, ఆ రంధ్రంలో తనవలె గొప్పశరీరం కలవాళ్ళు వరో నలుగురు వెలుగుతుండటం చూచి, ' నే నెందుకు అయిదువిధాలుగా అయ్యా" నని ఆశ్చర్యపడగా, శివుడు వెంటనే ఆ ఇంద్రు లైదుగురిని దేవతల మేలు కోరి, 'మానవ (స్త్రీ యందు మహానుభావులుగా జన్మించండి' అని ఆజ్ఞాపించాడు.

వ. 'వారలుధర్మానిల శక్రాశ్వినులు దమకు నాధారకర్తలుగా ధర్మజు భీమార్జున నకుల సహదేవు లనంగాంబుట్టిరి; కమలభవప్రముఖ నిఖిలసురగణ ప్రార్ధితుం డయి నారాయణు సితాసిత కేశ ద్వయంబు బలదేవ వాసుదేవు లై దేవహితార్థం బుద్ధవించిన; నందు వాసుదేవుండు వారలకుం గార్యసహాయుం డయ్యెః నయ్యింద్రుల కేవురకును నేకపత్నిగాం దపంబుసేసి శ్రీమూర్తి యయిన యాజ్ఞసేనియజ్ఞవేదిం బుట్టె: నమ్మవేని వీ్‌రల పూర్వదేహంబుల జూడు మని కృష్ణద్వైపాయనుండు ద్రుపదునకు దివ్యదృష్టి యిచ్చి చూపిన. 277

ప్రతిపదార్థం: వారలు, ధర్మ+అనిల, శక్ర+అశ్వినులు= యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అల్వినీ దేవతలు; తమకున్‌;

ఆధార, కర్తలుగా; ధర్మజ, భీమ+అర్జున, నకుల, సహదేవులు; అనన్‌+కాన్‌=ఐ అనే పేరులతో; పుట్టిరి; కమలభవ, ప్రముఖ. నిఖిల, సురగణ, ప్రార్థితుండు+అయి= పద్మంనుండి జన్మించిన (బ్రహ్మ మొదలైన అందరు దేవతల సమూహంచేత (ప్రార్హింపబడినవా డ్రై నారాయణు, సిత+అసీత, కేశ ద్వయంబు= విష్ణుమూర్తి యొక్క తెల్లని, నల్లని వెండ్రుకల జంట; బలదేవ, వాసుదేవులు+ఐ= బలరామ శ్రీకృష్ణు లై, దేవ, హిత+అర్థంబుజ దేవతల మేలు కొరకు; ఉద్భవించినన్‌= పుట్టగా; అందు; వాసుదేవుండు= (శ్రీకృష్ణుడు: వారలకున్‌; కార్య, సహాయుండు= కార్యాలందు సొయం చేసేవాడు; అయ్యెన్‌: ఆ+ఇంద్రులకు; ఏవురకునున్‌= ఐదుగురకును; ఎకపత్నిగాన్‌ఐ ఒకే భార్యగా; తపంబు; చేసి; శ్రీమూర్తి అయిన= లక్ష్మీదేవి ఆకార మైన; యాజ్ఞసేని= (ద్రౌపది, యజ్ఞ వేదిన్‌; వుట్టై; నమ్మవు+ఎని; వీరల, పూర్వ, దేహంబులన్‌; చూడుము+అని; కృష్ణ ద్వైపాయనుండు; ద్రుపదునకు; దివ్య, దృష్టి ఇచ్చి; చూపి.

తాత్పర్యం: ఆ అయిదుగురు ఇంద్రులు యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు ఆధార కర్తలుగా ధర్మజ భీమార్జున నకుల సహదేవులు అనే పేర్లతో జన్మించారు. బ్రహ్మాదిదేవత లంతా 'ప్రార్ధింపగా విష్ణుమూర్తి

760 శ్రీమదాంధ్ర మహాభారతము

యొక్క తెల్లని నల్లని వెండ్రుకల జంట, దేవతల మేలుకొరకు బలరామ కృష్ణులుగా అవతరించారు వారిలో

(శ్రీకృష్ణుడు ఆ అయిదుగురికి వాళ్ళపనులలో సాయంచేసేవా డయ్యాడు. ఆ అయిదుగురు ఇంద్రులకు ఒకే

భార్యగా తపస్సు చేసి లక్ష్మీ స్వరూపురాలైన యాజ్ఞసేని (ద్రౌపది) యజ్ఞవేదిలో జన్మించింది. నీకు నమ్మకం

లేకుంటే వీళ్ళ పూర్వదేహాలు చూడు” అని వ్యాసుడు ద్రుపదునికి దివ్యదృష్టి నిచ్చి చూపాడు.

ఉ చారు మణిప్రభా పటల జాల విచిత్ర కిరీట మాలికా భారములన్‌ సముద్యదినపావక వర్ధములన్‌ సువర్ధకే యూర విభూషణావళుల నొప్పుచునున్న తదీయదేహముల్‌ ధీరుండు సూచెం దాకసమదీర్షతం బొల్టినవాని నేనిటిన్‌. 278

(ప్రతిపదార్థం: చారు, మణి, ప్రభా, పటల, జాల, విచిత్ర, కిరీట, మాలికా, భారములన్‌= అంద మైన రత్నాల కాంతి సమూహాల వలలచే మిక్కిలి చిత్రమైన రంగులు కల కిరీటాలయొక్క, దండలయొక్క బరువులచేత; సముద్యత్‌+ఇన, పావక వర్షములన్‌= లెస్సగా (ప్రకాశించే సూర్యునియొక్క, అగ్నియొక్క రూపాలచేత; సువర్ష్మ కేయూర, విభూషణ+ఆవళులన్‌= బంగారు సందె కడియంవంటి ఆభరణస మూహాలచేత; ఒప్పుచున్‌+ఉన్న; తదీయ, దేహముల్‌= వారియొక్క శరీరాలు; తాళ, సమ, దీర్హతన్‌= తాటిచెట్టుతో సమాన మైన పొడవుతో; పాల్చిన, వానిన్‌= ఒప్పిన వాటిని; ఏనిటిన్‌= ఐదింటిని; ధీరుడు ధైర్యశాలి ద్రుపదుడు; చూచెన్‌.

తాత్సర్యం; అంద మైన రత్న కాంతి సమూహాల వలలచే మిక్కిలి చిత్రమైన రంగులు కల కిరీటాల, దండల

భారాలతో, లెస్సగా (ప్రకాశించే సూర్యునివంటి, అగ్నివంటి రూపాలతో, బంగారు సందెకడియాలవంటి

ఆభరణాలతో ఒప్పుతూ, తాటిచెట్టంత పొడ వైన వాళ్ళ దేహా లైదింటిని ద్రుపదుడు చూచాడు.

వ. మభఖీియు సకల లావణ్యమూర్తి యై వారల కేవురకు. బత్నిగాం దపంబు సేసిన యక్కన్యక పూర్వదేహంబును జూచి విస్మితుం డయి హర్షించి యున్న ద్రుపదునకు వెండియుం గృష్టద్వైసాయనుం డి ట్లనియెం 'దొల్లి నితంతుం డను రాజర్నికొడుకు లనంతబలపరాక్రములు సాల్వేయ శూరసేన శ్రుతసేన బిందుసారాతి సారులను వా రేవురుం బరస్పరస్నేహవినయంబుల నతిప్రసిద్దు లయి పెరు/గుచు నౌశీనరపతి కన్యక నజిత యను దాని స్వయం వరంబున6 బడసి వివాహం బయి. 279

(ప్రతిపదార్థం: మజియు; సకల, లావణ్య, మూర్తి+ఐ= సమస్త సౌందర్యంయొక్క స్వరూపమై; వారలకు; ఏవురకున్‌=ఐదుగురకు; పత్ని, కాన్‌= భార్య అగుటకు; తపంబు; చేసిన; ఆ+కన్యక; పూర్వ, దేహంబును= ఆ కన్యకయొక్క (తొలుతటి ఇంద్రసేన, ఇప్పటి కృష్ణు మొదటి శరీరాన్ని; చూచి; విస్మితుండు+అయి= ఆళ్ళర్యపడినవా డై; హర్షించి= సంతోషించి; ఉన్న; (ద్రుపదునకు; వెండియున్‌= మరల; కృష్ణద్వైిపాయనుండు= వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌; తొల్లి= పూర్వం; నితంతుండు+అను; రాజర్షి కొడుకులు; ఆనంత, బల, పరాక్రములు= అంతులేని బలం, పరాక్రమం కలవారు; సాల్వేయ, శూరసేన, శ్రుతసేన, బిందుసార+ అతిసారులు; అనువారు; ఏవురున్‌= ఐదుగురును; పరస్పర, స్నేహ, వినయంబులన్‌= ఒకరిమీద మరొకరికి కల ్రేము, వినయాలతో; అతి, ప్రసిద్దులు; అయి; పెరుగుచు; కాశినరపతి, కన్యకన్‌; అజిత; అను, దాని; స్వయంవరంబునన్‌; పడసిః= పొంది; వివాహంబు+అయి.

తాత్పర్యం: అంతేగాక, సమస్త సౌందర్యం రూపుదాల్ఫిం దై ఆ అయిదుగురికి భార్య కావటానికి తపస్సు చేసిన

ఆ కన్యయొక్క మొదటి దేహాన్ని చూచి ఆశ్చర్యపడి, సంతోషించి ఉన్న (ద్రుపదునితో మరల వ్యాసుడు ఇట్టా

ఆదిపర్వము - సప్తమాశ్వానము గగ్రక్ష అన్నాడు - పూర్వం నితంతు డనే రాజర్షి కుమారులు సాల్వేయ, శూరసేన, శ్రుతసేన, బిందుసార, అతిసారు లైదుగురు అంతులేని బలపరాక్రమాలు కలవాళ్ళు. వాళ్ళు పరస్పరం (ప్రేమ, వినయం కలిగి మహాప్రసిద్దు లై పెరుగుతూ జౌశీనరపతి పుత్రికను స్వయంవరంలో పొంది వివాహమాడారు.

విశేషం: 'నితంతుడు" అనే పేరుకు బదులు కొన్ని ప్రతులలో సితతంతుడు, శిలావంతుడు అనే పేర్చు ఉన్నాయి. అట్లే

బిందుసారుడికి బదులుగా తిందుసారుడు, అతిసారునికి బదులుగా అ(ద్రిసారుడు అనే పారాలు శ్రీ పిపి.యస్‌.శాస్త్రి గారి

సంస్కృత భారత(ప్రతిలో ఉన్నాయి.

క. _ కాంతి విశేషవిలాసా। నంత శ్రీ-దనరు నజితయం దనఘులు నై తంతువు లేవురు బడసిరి ।; సంతానము వేజువేజ సత్కుల మెసంగన్‌ 280

ప్రతిపదార్థం: కాంతి. విశేష విలాస+అనంత; ్రీన్‌= అధికకాంతియొక్క విలాసముయొక్క అంతులేని సంపదతో, తనరు=

ఒప్పు; అజిత; అందు; అనఘులు= పాపరహితు లైనవాళ్ళు; నైతంతువులు= నితంతుని కుమారులు; ఏవురున్‌= ఐదుగురును, సత్‌+కులము=' మంచివంశం; ఎసంగన్‌= వృద్దిపొందగా, వేలు, వేజ; సంతానము; పడసిరి= పొందారు.

తాత్సర్యం: అధికకాంతి, విలాసాలు- అనే అంతులేని సంపదతో ప్రకాశించే ఆ అజితయందు., పుణ్యాత్ము లైన

నితంతుని కుమారు లైదుగురు మంచి వంశం వృద్ది పొందేటట్టుగా విడివిడిగా సంతానాన్ని పొందారు.

వ. 'తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవుం గావున బాండవుల కేవురకు ద్రపదిం గ్రమంబునం బాణిగ్రహణంబు సేయింపు; మిది మన చేసినయది గాదు; దైవాథధిప్టితం' బని ద్రుపదు నొడంబజచి కుంతియుం బాండవులు నున్న చోటికి ద్రుపద సహితుం డయి కృష్ణద్వైపాయనుండు వచ్చి యుధథిష్టిరున కి ట్లనియె. 281

ప్రతిపదార్థం: తాల్లింటి= పూర్వపు; మహా+ఆత్ముల, అందునున్‌; ఇట్టి; చరితంబులు; కలవు; కావునన్‌; పాండవులకు; ఏవురకు= ఐదుగురికి, (ద్రొపదిన్‌; (క్రమంబునన్‌= వరుసగా; పాణి, (గ్రహణంబు= వివాహం; చేయింపుము; ఇది; మన, చేసిన, అది= మనం చేసింది; కాదు; దైవ+అధిస్టితము= దైవము నాశ్రయించింది - అనగా దేవునిచేత చేయబడింది; అని; ద్రుపదున్‌: ఒడంబజచి= ఒప్పించి; కుంతియున్‌; పాండవులున్‌; ఉన్న; చోటికి; ద్రుపద, . సహితుండు+అయిజు (ద్రుపదునితో కూడినవాడై: కృష్ణ ద్వైపాయనుండు= వ్యాసుడు; వచ్చి; యుధిష్టురునకు= ధర్మరాజుతో; ఇట్లు+ అనియె.

తాత్సర్యం: 'పూర్వపు మహాత్ములలోకూడ ఇటువంటి చరిత్ర లున్నాయి. అందువలన పొండవు లైదుగురికి

(ద్రౌపది నిచ్చి వరుసగా వివాహం జరిపించుము, ఇది మనం చేసింది కాదు, దైవనిర్మయం” అని ద్రుపదుడిని

ఒప్పించి వ్యాసుడు అతనితో కూడ కుంతీపాండవు లున్నచోటికి వెళ్లి ధర్మరాజుతో ఇట్టా అన్నాడు.

ద్రౌపదీ వివాహ మహోత్సవము (1-190-5)

ఈ _ నేం పుణ్యదినము నెమ్మితో రోహిణీ, యుక్తు-డయి శశాంకుం డున్నవాండు; మంత్రవంతముగం గ్రమంబున నేవురుం; బెండ్లియగుండు కృష్ణం బ్రీతితోడ. 282

(ప్రతిపదార్థం: నేండు; పుణ్య; దినము; నెమ్మితో= (ప్రేమతో; శశాంకుండు= కుందేలును గుర్తుగా కల చంద్రుడు; రో హిణీ,

యుక్తుడు+అయిజ= రోహిణీ నక్షత్రంతో కూడి; ఉన్నవాడు; మంత్రవంతముగన్‌= మంత్రాలతో: ఏవురున్‌= ఐదుగురూ;

ప్రేతితోడ= సంతోషంతో; కృష్ణన్‌= (ద్రౌపదిని; (క్రమంబుగన్‌= వరుసగా, పెండ్లి అగుడు= పెండ్లి చేసికొనండి.

762 శ్రీమదాంధ్ర నుహాభారతము

తాత్పర్యం: ఈ రోజు పుణ్యదినం. చంద్రుడు (ప్రేమతో రోహిణీనక్షత్రాన్ని కూడి ఉన్నాడు. మంత్రయుక్తంగా మీ

రైదుగురు సంతోషంగా (ద్రౌపదిని వరుసగా వివాహం చేసికొనండి.

విశేషం: వ్యాసమహర్షి (ద్రుపదరాజుకు (ద్రౌపదీ పాండవుల పుట్టుక వెనుక ఉన్న దివ్య రహస్యాలు తెలియచెప్పాడు. వాటిని

దర్శించటానికి అవసరమైన దివ్యదృష్టిని అను(గ్రహించాడు. ఇదివరలో కూడ ఇటువంటిది ఉన్నదని ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఆ

కన్వాదాత మనస్సును ఆవరించిన అనుమూన తిమిరాన్ని పూర్తిగా తొలగించాడు, “గతం నశోచామి కృతం స్మరామి" అన్నట్టు

కర్తవ్యాన్ని నిర్ణయించాడు. (ద్రౌపదీ వివాహానికి ఆటంకమే లేని రాచ బాటవేశాడు. ధర్మజుని తీర్చే వ్యాసుని తీర్పుకావటం, ధర్మజుని స్థాయి మరో మెట్టు ఈ ఘట్టంలో పెరగటం విశేషం.

వ. అని నిశ్చయించి పంచినం బాంచాలపతియును గరం బనురాగంబునం బురం బష్టశోభనంబు సేయించి, ,సమారబ్ధవివాహమహోత్సవుం డయ్యె; నంత నిరంతర క్రముకకదళీస్తంభ శుంభత్సంభృత నవామ్రాశ్వత్థ పల్లవ మాలాలంకృత ద్వారతోరణంబులను, జందనోదక సంసిక్త ప్రాంగణ రంగవల్లీ కృత కర్పూరమౌక్తిక ప్రకరంబులను, గౌతుకోత్సవమంగళశ్చంగార వారాంగనా ప్రవర్తమాన స్వనియోగకృత్యంబులను, నుత్సవ సందర్శనాగతానేకరాజన్య సుహృద్దాంధవనబ్రాహృ్మణ సంకులంబుననుం జేసి యొప్పుచున్న ద్రుపదరాజ మందిరంబునం బూర్వోత్తర దిగ్భాగంబున విచిత్రనేత్ర వితత వితాన ముక్త మౌక్తిక కుసుమ మాలాలంబనాభి రామంబును, సమీచ్‌న చీనాంశుక విరచితస్తంభ వేష్టనంబును, బ్రత్యగ్ర పల్లవ శాల్యక్షతాంచిత కాంచన పూర్ణ కలశోపశోభితంబును, లాజాజ్య సంపూర్ణ సౌవర్హ పాత్ర నవసౌరభ బహువిధ పుష్ప సమిత్కుశాళ్మ శమ్యాభిరమ్యంబును, నవగోమయ శ్యామ మరకత మణి ప్రభాపటల విలిప్త హిరణ్మయ వేదీమధ్య సమిద్ద్ధాగ్ని కుండమండితంబును, సర్వాలంకార సుందరంబు నయిన వివాహమంటపంబునకుం జని నిజ పురోహితుం డయిన ధౌమ్యుం దాదిగా ననేకవిద్వన్మహీసుర నివహంబుతో. గరం బొప్పి, 283

ప్రతిపదార్హం: అని; నిశ్చయించి; పంచినన్స్‌= ఆజ్ఞాపించగా; పాంచాల, పతియును= ద్రుపదుడును; కరంబు= మిక్కిలి;

అనురాగంబునన్‌= ప్రీతితో; పురంబు; అష్టథోభనంబు= ఎనిమిది విధాల నముంగళాలంకారం; చేయించి; సమారబ్ద, వివాహ, మహా+ ఉత్సవుండు= చక్కగా ఆరంభింపబడిన వివహమహోత్సవం కలవాడు; అయ్యెన్‌; అంత; నిరంతర, (క్రముక కదళిస్తంభ, శుంభత్‌+సంభృత, నవ+ఆ(మ్ర+అశ్చత్చ, పల్లవ, మాల+అలంకృత, ద్వారతోరణంబులను= ఎడతెగని పోకల అరటుల స్తంభాలందు ప్రకాశిస్తూ నిండుగా భరించబడిన (క్రొత్త మామిడి, రావి చివుళ్ళ దండల చేత అలంకరింపబడిన లోపలి వెలుపలి ద్వారాలచేత; చందన+ఉదక, సంసిక్త ప్రాంగణ, రంగవల్లీకృత, కర్పూర, మౌక్తిక, 'ప్రకరంబులను= మంచిగంధపు నీటిచేత చక్కగా తడుపబడిన ముంగిళ్ళయందు ముగ్గులుగా చేయబడిన పచ్చ కర్చూరాలయొక్క,. ముత్యాలయొక్క సమూహాలచేత; కాతుక+ఉత్సవ, మంగళ, శృంగార, వారశఅంగనా, 'ప్రవర్య్యమాన, స్వనియోగ, కృత్యంబులను= వివాహమహోత్సవంకారకైన మంగళాలంకారాలు కల వేళ్య్ళలచే చేయబడుతున్న, తమకు నియమింపబడిన పనులచేత; ఉత్సవ, సందర్శన+ఆగత+అనేక, రాజన్య, సుహృత్‌+బాంధవ, బ్రాహ్మణ, సంకులంబునున్‌+చేసి= వివాహమహోత్సవాన్ని చూడటానికి వచ్చిన పెక్కుమంది రాజులతో, మిత్రులతో, బంధువులతో, బ్రాహ్మణులతో క్రిక్కిరియటంచేత; ఒప్పుచు+ఉన్న ద్రుపదరాజ, మందిరంబునన్‌= ('ద్రుపదరాజుయొక్క ఇంటియందు; పూర్వ+ఉత్తర, దిక్‌భాగంబున= ఈశాన్యదిక్కునందు; విచిత్ర, నేత్ర, వితత, వితాన, ముక్త, మౌక్తిక, కుసుమ, మాల+ఆలంబన+అభిరామంబును= రంగురంగుల వస్తాలయొక్క విశాలాలైన మేల్కట్లనుండి క్రిందికి విడువబడిన ముత్యాలయొక్క పూలయొక్క దండలు (వ్రేలాడటంచేత మనోహరమైనదీ; సమీచీన, చీన+అంశుక, విరచిత, స్తంభ, వేష్టంబును= చక్కని పట్టు వస్తాలచేత కల్పించబడిన స్తంభపు చుట్టు కలదీ: ('ప్రత్యగ్ర, పల్లవ, శాలి+అక్షత+అంచిత, కాంచన, పూర్ణ కలశ+ఉపశోభితంబును= (క్రొత్త చిగుళ్ళచేత, వరి అక్షతలచేత ఒప్పుచున్న బంగారు పూర్ణకలశాలచేత (ప్రకాశిస్తున్నదీ;

ఆదిపర్వము - సప్త్రమాశ్వాసము 763 లాజ+ఆజ్య, సంపూర్ణ, సౌవర్ష్మ పాత్ర, నవ, సౌరభ, బహువిధ, పుప్పు, సమిత్‌కుళ+అళ్ళ్మ, శమ్యూ, అభిరమ్యంబును= 'పేలాలతో, నేతితో నిండిన బంగారు పాత్రలచేత, క్రొత్త వాసనలతో, దర్భలచేత, సన్నెకల్టుచేత, యజ్ఞపాత్రల చేత మనోహర మైనదీ; నవ, గోమయ, శ్యామ, మరకత మణి, ప్రభా, పటల, విలిప్తు హిరణ్మయ, వేదీ, మధ్య, సమిద్ద+అన్ని కుండ, మండితంబును= క్రొత్త ఆవుపేడవలె నల్లని మరకత మణుల కాంతి సమూహంచేత అలుక బడిన బంగారు పెండ్లి అరుగు నడుమ మండుతున్న హోమగుండంచేత అలంకరింపబడినదీ; సర్వ+అలంకార, సుందరంబును= అన్ని అలంకారాలచేత అందమైనదీ అయిన, వివాహ మంటపంబునకున్‌; చని= వెళ్ళి; నిజ, పురోహితుండు+అయిన= తమయొక్క పురోహితు డైన, దౌమ్యుండు+ఆది. కాన్‌+అనేక, విద్వత్‌మహీసుర నివహంబుతోన్‌= ధౌమ్యుడు మొదలైన పెక్కుమందిపండితు లగు బ్రాహ్మాణులసమూహంతో; కరంబు= మిక్కిలి; ఒప్పి. తాత్పర్యం: అని నిర్ణయించి వ్యాసమహర్షి ఆజ్ఞాపించగా, (ద్రుపదరాజు కూడ మిక్కిలి ప్రీతితో పురానికి ఎనిమిది విధా లైన మంగళాలంకారాలు చేయించి వివాహమహోత్సవాన్ని చక్కగా ప్రారంభించాడు. అప్పుడు ఎడతెగని పోక, అరటి స్తంభాలతో నిండుగా ధరించిన క్రొత్త మామిడి, రావి చివుళ్ల దండలతో అలంకరించబడిన లోపలి వెలుపలి ద్వారాలతోను, మంచిగంధపునీటితో చక్కగా తడుపబడిన ముంగిళ్లలో ముగ్గులుగా చేయబడిన పచ్చకర్పూరాల, ముత్యాల సమూహాలతో, వివహమహోత్సవంకొరకు కావించుకొన్న మంగళాలంకారాలు కల వేశ్యలు చేస్తున్న నియమితకార్యాలతో, వివహమహోత్సవం చూడవచ్చిన పెక్కుమంది రాజులతో, మిత్రులతో, బంధువులతో, (బ్రాహ్మణులతో క్రిక్కిరిసి శోభిల్లుతున్న (ద్రుపదునిఇంటిలో- ఈశాన్య దిక్కున- రంగు రంగుల వస్త్రాలతో నిర్మించబడిన విశాల మైన మేల్కట్టనుండి క్రిందికి విడువబడిన ముత్యాల పూలదండలు (వ్రేలాడటంచేత మనోహర మైనదీ, చక్కని పట్టువస్త్రాలతో కల్పింపబడిన స్తంభపుచుట్టు కలదీ, క్రొత్తచివుళ్ల్తతో, బియ్యపు అక్షతలతో ఒప్పుతున్న బంగారుపూర్లకలశాలతో ప్రకాశిస్తున్నదీ, 'పిలాలతో నేతితో నిండిన బంగారు పాత్రలతో, క్రొత్త వాసనలతో కూడిన పెక్కు విధా లైన పువ్వులతో సమిధలతో, దర్భలతో, సన్నెకల్టుతో, యజ్ఞపాత్రలతో మనోహర మైనదీ, అప్పుడే పెట్టిన ఆవుపేడవలె నల్లని మరకత మణుల కాంతి సమూహంతో అలుకబడిన బంగారు వివాహ వేదిక నడుమ మండుతున్న హోమకుండంచేత అలంకరింపబడినదీ, అన్ని అలం కారాలతో అందమైనదీ అయిన కల్యాణ మంటపానికి వెళ్లి తమ పురోహితు డైన ధౌమ్యుడు మొదలైన పెక్కు మంది పండిత బ్రాహ్మాణసమూహంతో మిక్కిలి ఒప్పి. సీ అనఘులు కృతమంగళాభిషేకులు, ధృత ।; సముచిత వేష ప్రశస్త రత్న

భూషణుల్‌, కౌరవపుంగవు లేవురు ; నేతెంచి; రంతం బూర్జేందువదన

యధికవిదర్ధ పుణ్యాంగనా విరచిత । లలిత ప్రసాధనాలంకృతాంగి

కమలాక్షి కమునీయకాంతాసహస్రంబు : తో6 జనుదెంచె నాద్రుపదతనయ; ఆ. _ భూరిభూసురేంద్ర పుణ్యాహరవమును। మంగళ ప్రగీత మధుర రవము

వివిధ తూర్యవేణు వీణారవంబును । విస్తరిల్లె దిశల విభవయుక్తి, 284 ప్రతిపదార్థం: అనఘులు= పాపంలేనివారు; కృత, మంగళ+అభిషేకులు= చేయబడిన మంగళస్నానం కలవారు; ధృత, సముచిత, వేష ప్రశస్త రత్న, భూషణుల్‌= ధరించబడిన తగిన వేషాలు, ప్రసిద్దా లైన రత్నాభరణాలు కలవారు; కౌరవ, పుంగవులు కురువంశంలో పుట్టినవారిలో (శ్రేష్టు లైన పాండవులు; ఏవురున్‌= ఐదుగురు; ఏతెంచిరి= వచ్చారు; అంతన్‌; పూర్ణ+ ఇందు, వదన=

౯ద్రక్ష శ్రీమదాంధ్ర మహాభారతము నిండు చంద్రుని వంటి ముఖం కలది; అధిక, విదగ్ధ, పుణ్యాంగనా, విరచిత, లలిత, ప్రసాధన+అలంకృత+ అంగి= మిక్కిలి నేర్చరు లైన ముత్తైదువులచేత కూర్చబడిన అంద మైన అలంకారాలచేత అలంకరింపబడిన అవయవాలు కలది; కమల+అక్షి= కమలాలవంటి కన్నులు కలది; ఆ, (ద్రుపద, తనయ= ఆ (ద్రౌపది; కమనీయ, కాంతా, సహ(స్రంబుతోన్‌= అందమైన స్త్రీలు వేయిమందితో; చనుదెంచెన్‌=ఐ వచ్చెను; భూరి, భూసుర+ఇంద్ర, పుణ్యాహధ్వని; బ్రాహ్మాణథ్రేష్టుల పుణ్యాహవచనాల అధికమైన ద్వని; మంగళ, ప్రగీత, మధుర, రవము= మంగళగానాలయొక్క మధురమైన ధ్వని; వివిధ, తూర్య, వేణు, వీణా, రవంబును= వివిధాలైన వాద్యాలయొక్క, పిల్లన[గ్రోవులయొక్క, వీణలయొక్క ధ్వని; విభవ, యుక్తి= వైభవంతో: దిశల: విస్తరిల్లై= వ్యాపించాయి. తాత్పర్యం: పుణ్యాత్ములు, మంగళస్నానం చేసినవాళ్ళు, తగినవేషం, ప్రసిద్ద మైన రత్నాభరణాలు ధరించినవాళ్ళు, కురువంశ (శ్రేష్టులు అయిన పాండవులు అయిదుగురు వచ్చారు. అప్పుడు నిండు చంద్రుని వంటి ముఖం కలది, మిక్కిలి నేర్పురు లైన ముత్తైదువులచేత అలంకరించబడిన అవయవాలు కలది, కమలాలవంటి కన్నుల కలది అయిన (ద్రాపది అంద మైన స్త్రీలు వేయిమందితో కలిసి వచ్చింది. పెక్కుమంది (బ్రాహ్మణ(శ్రేష్టుల పుణ్యాహ ధ్వని, మంగళ గీతాల మధుర ధ్వని, పిల్లన[గ్రోవుల, వీణల వివిధ వాద్యాల ధ్వని- మహావైభవంతో దిక్కులకు వ్యాపించాయి.

క. _ వితత ప్రదక్షిణా వ । ర్తిత దీప్త శిఖానలమున ధృతి వేల్చెంబురో హితు.డగు ధౌమ్యుడు బుధ స। మృతుండు వివాహ ప్రయుక్త మంత్రాహుతులన్‌. 285

(ప్రతిపదార్థం: బుధ, సమ్మతుండు= పండితులకు ఇష్టమైనవాడు; పురోహితుండు; అగు; ధౌమ్యుడు; వివాహ; (ప్రయుక్త మం[త్ర+

ఆహుతులన్‌= పెండ్లికొారకు చేయవలసిన మం(త్రపూర్వకా లైన ఆహుతులను; ధృతిన్‌= సంతోషంతో; వితత, ప్రదక్షిణ+ ఆవర్తిత,

దీప్త శిఖా+అనలమునః= విస్తరిల్లి ప్రదక్షిణంగా చుట్టు తిరిగిన వై మండు మంటలు కల అగ్నియందు; వేల్చెన్‌= దహనమయ్యేటట్టు చేశాడు.

తాత్పర్యం: పండితులకు ఇష్టమైనవాడు, పురోహితుడు అయిన ధౌమ్యుడు వివాహ సమయంలో చేయవలసిన

మంత్రపూర్వకా లైన ఆహుతులను- విస్తరిల్లి ప్రదక్షిణంగా చుట్టు తిరిగి మండే మంటలున్న అగ్నిహోత్రంలో దహన

మయ్యేటట్టు వేశాడు. ళా

విశేషం; వేదధర్మోద్దరణ మహాభారత రచనా లక్ష్యాలలో ప్రధానమైనది కనుక వైదికాంశాలు, వేదోక్త క్రియాకలాపాలు కధలో

ఎక్కడ వచ్చినా నన్నయ విశేషించి (ప్రవర్తిస్తాడు. వేదోక్తంగా సాగిన ద్రౌపదీపాండవుల వివాహ వైభవ విపుల వర్తన అట్లాంటిదే.

వ. ఇట్లు వేల్చి ముందల ధర్మపుత్రునకు ద్రుపదరాజుపుత్రిం బాణిగ్రహణంబు సేయించి, తొల్లి యేవురకు వివాహంబు సేయునప్పుడు కన్యాత్వంబు దూషితంబు గాకుండ నీశ్వరమువరంబునం గౌమారంబు వడసిన యక్కృన్యకం గ్రమంబున భీమార్జున నకుల సహదేవులకుం బాణిగ్రహణంబు సేయించిన. 286

ప్రతిపదార్థం: ఇట్టు: వేల్చి= ఆహుతిచేసి; ధర్మపుత్రునకు; ద్రుపదరాజు, పుత్రిన్‌=ఐ (ద్రౌపదిని; పాణిగ్రహణంబు= వివాహం"

చేయించి; తొల్లి= పూర్వం; ఏవురకుజ ఐదుగురకు; వివాహంబు; చేయునప్పుడు; కన్యాత్వంబు; దూషితంబు, కాకుండన్‌= చెడకుండ; ఈళ్చరు, వరంబునన్‌: కౌమారంబు= కన్యాత్వం; పడసిన= పొందిన; ఆ+కన్యకన్‌; క్రమంబున; భీమ+అర్జ్హున; నకుల సహదేవులకున్‌; పాణి[గ్రహణంబు= వివాహం; చేయించిన.

తాత్పర్యం: ఈ విధంగా ఆహుతి చేసి, మొదట ధర్మజునికి ద్రౌపది నిచ్చి వివాహం చేయించాడు. అయిదుగురిని

వివాహం చేసికొన్నా కన్యాత్వం చెడకుండ ఈశ్వరునివలన పూర్వం వనం పొందిప (ద్రౌపది మళ్ళీ కన్యాత్వం

“పొందగా, ఆమెను వరుసగా భిమార్జున నకుల సహదేవులకిచ్చి వివాహం చేయించాడు. అప్పుడు.

ఆదిపర్వము - సప్తమాశ్వానము 765 తే. జనుల ఆశీరవంబును జదలం దివురు। దేవ దుందుభినాదంబు దివ్యగంధ మందగంధవహామోదమానకుసుము । వృష్టియును మహాముదముతో విస్తరిల్లె, 287 ప్రతిపదార్హం: జనుల, ఆశీరవంబును= జనులయొక్క ఆశీర్వాద ధ్వని; చదలన్‌= ఆకాశమున; తివురు= (మోగునట్టి; దేవ, దుందుభి, నాదంబు= దేవతల భేరులయొక్క ధ్వని; దివ్య, గంధ, మంద, గంధనహ+ఆమోదమాన, కుసుమ, వృష్టియును= మంచివాసన కల మెల్లని గాలిచే పరిమళిస్తున్న పూలవానా? మహా, ముదముతో= మిక్కిలి సంతోషంతో; విస్తరిల్లై= అతిశయించాయి. తాత్పర్యం: జనుల ఆశీర్వాద ధ్వని, ఆకాళంలో (మోగే దేవతల భేరుల ధ్వని, మంచివాసన కల మందమారుతంతో పరిమళించే పూలవాన మిక్కిలి సంతోషంతో అతిశయించాయి. న. అని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పె నని. 258 తాత్పర్యం: అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడని. ఆశ్వాసాంతము క. _ విద్యావిలాస! పార్థివ । విద్యాధర! నిఖిలరాజవిద్యానిధి! శీ తద్యుతి విశచచయశః ప్రస । రద్యోతిత సర్వలోక! రాజమహేంద్రా!. 289 ప్రతిపదార్థం: విద్యా,విలాస= విద్యలచేత ప్రకాశించేవాడా! పార్టిన, విద్యాధర= రాజులలో విద్యాధరు డైన జీమూతవాహనుని వంటివాడా! - అనగా మహాదాతా అని భావం; నిఖిల, రాజవిద్యా నిధి= అన్ని రాజవిద్యలకు నిధితైనవాడా! శీత, ద్యుతి, విశద, యశః, ప్రసర, ద్యోతిత, సర్వలోక= చల్లనికాంతి కల చంద్రుని వలె తెల్లనిక్షీర్షియిక్క వ్యాప్తిచేత (ప్రకాశింప చేయబడిన అన్ని లోకాలు కలవాడా! రాజమహేంద్రా= ఓ రాజరాజ నరేంద్రా! తాత్ప్సర్యఆ: విద్యలలో (ప్రకాశించే వాడా! రాజులలో విద్యాధరు డైన జీమూతవాహనుని వంటివాడా! అన్ని రాజవిద్యలకు నిధి వైనవాడా! చం(ద్రునివలె తెల్లని క్రీర్తియొక్క వ్యాప్తితో అన్నిలోకాలను ప్రకాశింప చేసిన వాడా! ఓ రాజరాజ నరేంధదద్రా! స్వాగతము. రాజరాజ! గుణరాజిత! రాజ । త్తేజ! రాజకులదీప! విశిష్టాం భోజమిత్ర! నృపపూజిత పాదాం , భోజ! భూవినుత! పుణ్యవరేణ్యా! 290 ప్రతిపదార్థం: రాజరాజ! గుణ, రాజిత= మంచి గుణాలచేత ్రకాశించేవాడా!; రాజత్‌+తేజ= ప్రకాశించే పరాక్రమం కలవాడా! రాజ, కుల, దీప= రాజవంళంలో దీపమువంటివాడా!; విశిష్టశఅంభోజ, మిత్ర= సదాచార సంపన్నులు అనే కమలాలకు సూర్యుడి వంటివాడా![ నృప, పూజిత, పాద+అంభోజ= రాజులచేత పూజింపబడిన పద్మాలవంటి పాదాలు కలవాడా! భూ. వినుత= లోకంచేత కొనియాడబడేవాడా!: పుణ్య, వరేణ్యా= పుణ్యాత్ములలో ్రేష్టుడా! తాత్పర్యం: రాజరాజ! మంచిగుణాలతో ప్రకాళించేవాడా! ప్రకాశించే పరాక్రమం కలవాడా! రాజవంశంలో దీపం వంటివాడా! సదాచార సంపన్నులు అనే కమలాలకు సూర్యుని వంటివాడా! రాజుల పూజలందుకొన్న పాదపద్మాలు కలవాడా! లోకప్రశంసపొందినవాడా! పుణ్మాత్ములలో (శ్రేష్టుడా!

766 శ్రీమదాంధ్ర మహాభారతను విశేషం: ఈ వృత్తంలోని ప్రతిపాదంలో వరుసగా ర, న, భ, గగ అనే గణాలుంటాయి. 7వ అక్షరం యతిమైత్రి స్టానం. గద్యము.

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రజీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున ధృష్టద్యున్ను

ద్రౌపదీ సంభవ కథనంబును, గృష్టద్వైపాయన సందర్శనంబును, గంగాతీరంబున నంగారపర్జు నర్జునుండు

జయించుటయు6 దాపత్య పసిష్టార్వోపాఖ్యానంబును, ద్రౌపదీస్తయంవరంబును, బంచేంద్రోపాఖ్యా

నంబును, ద్రౌపదీ వివాహంబును నన్నది సప్త్రమాశ్వాసము. తాత్పర్యం: ఇది, సకలసత్కవుల (ప్రశంస లందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీ మహాభారతంలో మొదటిదైన ఆదిపర్వంలో - ధృష్టద్యుమ్న (ద్రాపదుల జన్మనుగూర్చి చెప్పటం, వేదవ్యాసమహామునీంద్రులను దర్శించటం, గంగా తీరంలో అంగారపర్జ్లుడిని అర్జునుడు జయించటం, తపతీ సంవరణ, వసిష్ట జార్వుల కథాకథనం, (ద్రౌపదీ స్వయంవరం, పంచేంద్రోపాఖ్యానం, (ద్రౌపదీ వివాహం - అనే అంశాలు కల ఏడవ ఆశ్వాసం.

ఆదిపర్వంలో సప్తమాశ్వాసం సమాప్తం తహ చస్పుల

శ్రీరస్తు ట్‌ శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము

శ్రీవిభవనిత్యనిలయ! ద । యా వర్ధిత ధారుణీ సురాన్వయ! వేంగీ

భూవల్లభ! నిఖిల జగ । త్పావన శుభచరిత! భావ భవ నిభ సుభగా! శ ప్రతిపదార్హం: శ్రీ, విభవ. నిత్య నిలయజ= ఐశ్వర్యాతిశయానికి శాళ్టత స్థాన మైనవాడా! ; దయా, వర్దిత, ధారుణీసుర+అన్వ్నయజ దయతో వృద్ధిపొందించబడిన (బ్రాహ్మణవంశాలు కలవాడా!; వేంగీ, భూ, వల్లభ= వేంగీదేశపురాజా!;: నిఖిల, జగత్‌+పావన, శుభ, చరిత= లోకాలన్నింటినీ పవిత్రం చేసే శుభమైన నడవడి కలవాడా!; భావభవ, నిభ, సుభగాజ మన్మథునితో సమాన మైన సౌందర్యం కలవాడా! తాత్పర్యం: ఐశ్చర్యాతిశయానికి శాశ్వత స్థాన మైనవాడా! దయతో వృద్ధిపొందించిన (బ్రాహ్మణ వంశాలు కలవాడా! వేంగీ దేశ ప్రభూ! లోకా లన్నింటినీ పవిత్రం చేసే శుభ చరిత్ర కలవాడా! మన్మథునితో సమాన మైన సౌందర్యం కలవాడా! విశేషం: భావభవుడు- భావంలో పుట్టేవాడు మన్మథుడు. ఇది రాజరాజుయొక్క ప్రశంసా పూర్వకమైన ఆశ్వాసారంభ పద్యం.

పాండవులు ద్రుపదరాజు పురంబున నిష్టోపభోగంబు లనుభవించుచు సుఖం బుండుట (సం. 1-190-25)

వ. అ క్కృథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు పాండవు లేవురకుం బాంచాలిం బరమోత్సవంబున

వివాహంబు సేయించి ద్రుపదుం డయ్యేవురకు వేబువేణ యనర్హ్య మణి ఖచితంబు లైన యాభరణంబులను

నపరిమితయు టైన యతధ్థ రాసులను, సావర్హంబు లయిన శయ్యానన వరికరంబులను,

నూజేసిభద్రగజింబులను, నూటజేసి కాంచనరథంబులను, వేయేసికాంభోజహయంబులను, పదివేవురేసి

వరవస్తాభరణభూపషితు లగు చాసదాసీజనంబులను, నూజేసివేలు పాండిమొదవులను నగ్శిస్రాక్షికంబుగా

నరణం బిచ్చిన. 2 ప్రతిపదార్థం: ఆ+కథకుండు= ఆ కథను చెప్పేవాడు-ఉగ్రశ్రవసుడు; శౌనక+ఆది, మహామునులకున్‌= శౌనకుడు మొదలైన మహామునులకు; చెప్పెన్‌; అట్టు: పాండవులు+ఏవురకున్‌= పాండవులు ఐదుగురకు; పాంచాలిన్‌= (ద్రౌపదిని; పరమ+ఉత్సవంబున= మహావైభవంగా; వివాహంబు; చేయించి; (ద్రుపదుండు; ఆ+ఏవురకు; వేజువేజ; అనర్హ్య, మణి, ఖచితంబులు. ఐన= వెలలేని రత్నాలు పాదగబడినవైన; ఆభరణంబులనున్‌; అపరిమితంబులు+ఐన; అర్హ, రాసులను= ధనరాసులను; సౌవర్షంబులు+అయిన= బంగారంతో చేయబడిన; శయ్యా+ఆసన, పరికరంబులను= పాన్పులు, పీటలు, ఇతర వస్తువులు; నూజు+ఏస్తి భద్రగజంబులను= నుదపుటేనుగులను; నూజు+ఏసి; కాంచన, రధంబులను= బంగారు రథాలను; వేయి+ఏసి; కాంభోజ, హృయంబులను= కాంభోజి దేశపు గుర్రాలను; పదివేవురు+*ఏసి= పదివేల మంది వంతున; వర, వస్త్ర+అభరణ, భూషితులు+అగు= (శ్రేష్టా లైన వస్త్రాలతో సొమ్ములతో అలంకరించబడినవాళ్ళయిన; దాస, దాసీ, జనంబులును; నూజు+ఏసి; వేలుఐ లక్షవంతున పొడి, మొదవులనున్‌= పాడి ఆవులను; అగ్ని, సాక్షికంబుగాన్‌= అగ్నిసాక్షిగా? అరణంబు= అల్టుడికి, కూతురికి ఇచ్చే సొమ్ముగా; ఇచ్చిన.

768 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: ఆ కథను చెప్పే ఉగ్రశ్రవసుడు, శౌనకుడు మొద లైన మహామునులకు చెప్పాడు: ఆ విధంగా పాండవులు అయిదుగురికి (ద్రౌపదిని ఇచ్చి మహావైభవంగా వివాహం చేయించి, (ద్రుపదుడు ఆ అయిదుగురికి వేరువేరుగా ఎంతో విలువైన మణులు పొదిగిన ఆభరణాలను, బంగారంతో చేసిన పానుపులను, పీటలను, ఇతర వస్తువులను, నూరేసి మదపుటేనుగులను, నూరేసి బంగారు రధాలను, వేయేసి కాంభోజ దేశపు గు(ర్రాలను, శ్రేష్ట మైన వ(స్త్రాలతో అలంకరించిన పదివేల మంది దాసదాసీ జనాలను, లక్ష పాడి ఆవులను, అరణంగా ఇచ్చాడు. క. చతురుదధివలయ నిఖిల : క్షితి శతలసామ్రాజ్యలక్ష్మికిని మూలం బై

సతి యాజ్ఞసేని పతులకు ।; నతిముద మొనరించెం దుల్యమగు శుశ్రూషన్‌. 3 (ప్రతిపదార్థం: చతుః+ఉదధి, వలయ, నిఖిల, క్షితి, తల, సామ్రాజ్యలక్ష్మికిని= నాలుగుసము[ద్రాలు చుట్టుకొని ఉన్న సమస్త భూమండలంయొక్క సా(మ్రాజ్యాధికార సంపదకు; మూలంబు+ఐ= కారణమై; సతి, యాజ్దసేని= పతివ్రత అయిన (ద్రౌపది; తుల్యము+అగు= సమాన మైన; శుగ్రూషన్‌= సేవతో; పతులకుజ భర్తలకు; అతి, ముదము= మిక్కిలి సంతోషాన్ని; ఒనరించెన్‌= కలిగించింది. తాచత్సర్యం: నాలుగు సముద్రాలు చుట్టుకొని ఉన్న సమస్త భూమండల సా(మ్రాజ్యాధికార సంపదకు కారణమై పతివ్రత (ద్రౌపది, సమానంగాసేవ చేసి భర్తలందరికీ మిక్కిలి సంతోషాన్ని కలిగించింది. సీ. _ కోడలి యుత్తమ గుణముల కెంతయు । సంతుష్టచిత్త యై కుంతిదేవి

“లలితాంగి! హరియందు లక్ష్మిని, మజి చంద్రు । నందు రోహిణి, నింద్రునందు శచిని

నవ్వసిష్టమునీంద్రునం దరుంధతి. బోలి । సుందరి! నీపతులందు. జ్రీతిం

బతిభక్తి యొప్ప నపత్యంబు. బడయుము; । గురు వృద్ధబాంధవాతుర విశిష్ట ఆ. జనుల నతిథిజనుల సతతంబుం బూజంపు, । మన్నదానమున ధరామరేంద్ర

వరులం దనుపు, మఖిలవసుమతీప్రజ కెల్లం।; గరుణ గలుగుమమ్మ కమలనేత్ర! తే (ప్రతిపదార్థం: కోడలి, ఉత్తమ, గుణములకున్‌, ఎంతయు, సంతుష్టచిత్త ఐ, కుంతిదేవి; లలిత+అంగి= సుకుమారమైన శరిరంకలదానా!, హరియందు= విష్ణుమూర్తియందు:;: లక్ష్మిని; మథఠి; చంద్రుని, అందు; రోహిణిన్‌; ఇంద్రుని, అందు; శచినిన్‌= శవీదేవిని, ఆ+వసిషస్టముని+ఇంద్రు, అందు; అరుంధతిన్‌; పోలి; సుందరి; నీ పతుల, అందున్‌; ప్రీతిన్‌= (క్రేమతో; పతి, భక్తి; ఒప్పన్‌; అపత్యంబున్‌= సంతానాన్ని; పడయుముజ= పొందుము; గురు, వృద్ద, బాంధవ+ఆతుర, విశిష్టజనులన్‌= గురువులను, వృద్ధులను, బంధువులను, రోగులను, పూజ్యులను; అతిథిజనులన్‌; సతతంబున్‌= ఎల్లప్పుడు; పూజింపుము; అన్న, దానమునన్‌, ధర+అమర+ఇం(ద్ర, వరులన్‌= బ్రాహ్మణ (శ్రేష్టులను; తనుపుము= తృప్తిపరచుము; కమల, నేత్ర= పద్మాలవంటి కన్నులు కలదానా!; అఖిల, వసుమతీ, ప్రజకు+ఎల్లన్‌= సమస్త భూమండలం మీది ప్రజ లందరికీ; కరుణ= దయ; కలుగుము+అమ్మ= కలిగి ఉండుము తల్లీ! తాత్పర్యం: కుంతీదేవి, కోడలి ఉత్తమగుణాలకు ఎంతో సంతోషించి, “ద్రౌపదీ! విష్ణుమూర్తిసై లక్ష్మీదేవివలె, చంద్రునీమీద రోహిణీదేవి వలె, ఇం(ద్రునీమీద శచీదేవివలె, వసిష్టునిపై అరుంధతివలె నీ భర్తల మీది (ప్రేమతో పతిభక్తి ప్రకాశించగా సంతానాన్ని పొందుము. గురువులను, వృద్దులను, బంధువులను, రోగులను, పూజ్యులను, అతిధులను అన్నివేళలా పూజించుము. అన్నదానంతో శ్రేష్ట లైన బ్రాహ్మణులను తృప్తిపెట్టుము. భూమిమీది (ప్రజలందరిపట్ట దయ కలిగి ఉండుము.

ఆదిపర్వము - అష్టమాళశ్వాసము 769 టి. పూని పరాక్రమం బెసంగ భూతలనాథుల నోర్జి, వరు లై యీ నవ ఖండ మండితమహీతల మేలుచు, నీపతుల్‌ పయో జానన! రాజసూయమనఖ సూదిగ నధ్వరపంక్తి సేయుచో మానుగం బత్ని వీ వగుము మానితధర్మవిధానయుక్తితోన్‌. క్‌ ప్రతిపదార్హం: పయోజ+ఆనన= నీటినుండి పుట్టిన పద్మంవంటి ముఖం కలదానా! నీ, పతుల్‌? పూని; పరాక్రమంబు; ఎసంగన్‌= అతిశయించగా; భూతలనాధులన్‌= రాజులను; ఓర్చిజఐ జయించి; వీరులు+ఐ; ఈ, నవ ఖండ, మండిత, మహీతలము= ఈ తొమ్మిది దీవులతో అలంకరించబడిన భూమండలాన్ని; ఏలుచు; రాజసూయ, మఖము+ఆదిగన్‌= రాజసూయ యాగం మొదలైన; అధ్వర, పంక్తి= యాగాల సమూహం; చేయుచో; ఈవు= నీవు; మానిత, ధర్మ, విధానయుక్తితోన్‌= గౌరవించబడిన ధర్మపద్ధతియొక్క కూడికతో; మానుగన్‌= ఒప్పుగా; పత్నివి= యజ్ఞంవంటి ధర్మకార్య సంబంధం కల భార్యవు; అగుము. తాత్పర్యం; పద్మంవంటి ముఖం కల ఓ (ద్రౌపదీ! నీ భర్తలు పూనికతో, పరాక్రమాతిశయంతో రాజులను జయించి, వీరు లై, ఈ తొమ్మిది దీవులతో అలంకరింపబడిన భూమండలాన్ని పరిపాలిస్తూ రాజసూయ యాగం మొద లైన అనేక యాగాలు చేసేటప్పుడు, నీవు వాళ్ళ ధర్మపత్నిగా ఉండుము. విశేషం: నవఖండాలు- భరత, ఇంద్ర, పురు, గభస్తి నాగ, తామ్ర, వారుణ, సౌమ్య, గంధర్వ ఖండాలు, జాయ, దార, కళత్రం, పల్ని- మొదలైనవి 'భార్య'కు పర్యాయపదాలే అయినా యజ్ఞంవంటిధర్మకార్యాలలో భర్తప్రక్కన కూర్చుండి పాలుపంచుకొనే భార్యనే ప్రత్యేకించి పత్ని' అనటం ఉన్నది. తన పుత్రులు రాజసూయం చేయా లనేభానన ఆ రాజమాత అయిన కుంతీదేవి హృదయంలో ఇంతముందుగా మోసులెత్తింది. పాండవుల భవిష్యదుజ్ఞల జీవితాన్నిగురించి ఆకాశవాణి, దేవతలు, వ్యాసాది మహర్షులు చెప్పిన వాక్యాలు ఆమె ఆళలకు, ఆశయాలకు ఆలంబనాలై ఉంటాయి. ఆ రాజసూయం మహాభారతకధనే మలుపు తిప్పింది. క, _ '“ఇందీవరలోచన! నీ; యం దే నభినందితాత్మ నైనట్టులు నీ నందనులయందు. బౌత్రుల ।; యందును నభినంద్య వగుమ' యని దీవించెన్‌. 6 ప్రతిపదార్థం: ఇందీవర, లోచన= నల్లకలువలవంటి కన్నులు కలదానా!; ఏను= నేను; నీయందు; అభినందిత+ఆత్మను= సంతోషించిన మనస్సు కలదానిని; ఐన; అట్టలు; నీ, నందనుల, అందున్‌= నీ కుమారులలో; పౌత్రుల, అందున్‌= మనుమలలో; అభినంద్యవుజ సంతోషించదగినదానివి; అగుమ; అని; దీవించెన్‌. తాత్పర్యం: 'నల్ల కలువల వంటి కన్నులు కల ఓ (ద్రౌపదీ! నేను నిన్ను పొంది సంతోషించినట్టే నీవు కూడా నీ కొడుకులను, మనుమలను పొంది సంతోషించు” అని దీవించింది. విశేషం: " నీవు సంతోషించ దగిన యోగ్యు లైన కొడుకులు, మనుమలు నీకు కలుగుదురు గాక1- అని కుంతీదేవి దీవన. ఏ స్త్రీమూర్తి కైనా జీవితంలో ఇది గొప్ప దీవనే. న. అట వాసుదేవుండు ద్రౌపదిని బాండవులేవురు వివాహం బగుట విని సంతసిల్లి, వారేవురకు వజ్ర వైదూర్య మరకత మౌక్తిక విభూషణంబులును, నానాదేశవిచిత్రవ స్రంబులును, ననేకకరితురంగరథరత్న 7 శిబికావిలాసినీనివహంబులుం బుత్తెంచిన. ; విని; సంతసిల్లి; ప్రతిపదార్హం: అట; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; ద్రొపదిని; పాండవులు; ఏవురు= ఐదుగురు; వివాహంబు+అగుట; విని; సంతసిల్లి వారు+ఎవురకు; వ్ర, వైడూర్య, మరకత, మౌక్తిక, విభూషణంబులును; నానాదేశ, విచిత్ర, వస్త్రంబులునున్‌; అనేక కరి, తురంగ,

770 శ్రీమదాంధ్ర మహాభారతము

రథ, రత్న, శిబికా, విలాసినీ, నివహంబులున్‌= పెక్కుఏనుగుల, గుర్రాల, రథాల, రత్నాల, పల్లకీల, వేశ్యల సమూహాలను; పుత్తెంచిన=

పంపిన.

తాత్చర్యం: పాండవులైదుగురు (ద్రౌపదిని వివాహమాడటం విని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు సంతోషించాడు.

ఆ అయిదుగురికీ వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, ముత్యాలు పొదిగిన ఆభరణాలను, వివిధ దేశాలకు

సంబంధించిన చిత్ర విచిత్రా లైన వస్త్రాలను, ఎన్నో ఏనుగుల, గు(ర్రాల, రథాల, రత్నాల, పల్లకీల, వేశ్వల సమూహాలను

పంపించాడు.

చ. విలసిత రాజ్యలీలం బరవీర భయంకరు లై గుణంబులన్‌ వెలయుచుం బాండవుల్‌ విదితవిక్రము లుండుట శేసి దేవతా దులవలనన్‌ భయంబు ద్రుపదుం డెటుంగందడ; తదీయదేశముల్‌ దలరక యొప్పె రోగ భయ తస్కర డామర వర్ణితంబు లై. 8

ప్రతిపదార్థం: విలసిత, రాజ్య, లీలన్‌= ప్రకాశిస్తున్న రాజ్యాధికార విలాసంతో; పర, వీర, భయంకరులు+ఐ= శత్రువీరులకు భయాన్ని కలిగించేవా ళ్ళయి; గుణంబులన్‌= మంచిగుణాలతో; వెలయుచున్‌= ఒప్పుతూ(ప్రకాళిస్తూ; విదిత, విక్రములు= ప్రసిద్ధ మైన పరాక్రమం కలవాళ్ళు; పాండవుల్‌? ఉండుటన్‌+చేసి; ద్రుపదుండు; దేవతా+ఆదుల, వలనన్‌= దేవతలు మొద లైన వారివలనకూడా; భయంబు; ఎజుంగండు+అ=ఐ పొందలేదు; తదీయ, దేశముల్‌= అతనియొక్క దేశాలు; రోగ, భయ, తస్కర, డామర, వర్ణితంబులు+ఐజ= రోగభయంచేత, దొంగలచేత, కొల్లగొట్టుటలచేత విడువబడినవై - అంటే రోగం, దొంగలు, కొల్లగొట్టటాలు లేనివై; తలరక= కలతపొందక; ఒప్పె.

తాత్పర్యం: వెలుగుతున్న రాజ్యాధికార విలాసంతో, శత్రువీరులకు భయం కలిగించేవాళ్ళయి, సుగుణాలతో

(ప్రకాశిస్తూ, మహాపరా(క్రమశాలులైన పాండవులు ఉండటంవలన (ద్రుపదుకి దేవతలవలనకూడా భయంలే కుండా

ఉన్నది. ఆతని దేశాలు - రోగాలు, దొంగలు, కొల్లగొట్టటాలు లేని వై కలత లేక సుఖంగా ఉన్నాయి.

చారులనలన పాండవుల యభ్యుదయమును విని దుర్యోధనుండు నిర్వేదించుట. (సం. 1-191-1)

వ ఇట్లు పాండవులు ద్రుపదుపురంబున నఖిలరాజ్యవిభవసమన్వితు లయి యొక్క సంవత్సరం బుండునంత నంతయు నెజింగి దుర్యోధనగూఢచారు లరిగి కర్ణదుశ్మాసనసౌబలసోమదత్తపరివృతుం డయి యున్న దుర్యోధనునకు మొక్కి యి ట్లనిరి. ఎ" 9

ప్రతిపదార్థం: ఇట్టు: పాండవులు; (ద్రుపదు, పురమునన్‌; అఖిల, రాజ్య, విభవ, సమన్వితులు+అయి= సమస్తరాజ్యవైభవంతో

కూడుకొన్నవాళ్ళయి: ఒక్క, సంవత్సరంబు; ఉండునంతన్‌; అంతయున్‌; ఎటింగి=ఐ తెలిసికొని; దుర్యోధన; గూఢ+చారులుజు దుర్యోధనునివేగులవాళ్ళు; అరిగి= వెళ్ళి; కర్ణ దుశ్శాసన, సౌబల, సోమదత్త, పరివృతుండు+అయి= కర్ణ దుశ్చాసన శకుని సోమదత్తులచే కొలువబడిన వాడై ; ఉన్న; దుర్యోధనునకు; మొక్కి; ఇట్టు+అనిరి.

చాత్ప్సర్యం: ఈ విధంగా పాండవులు (ద్రుపదునినగరంలో సమస్త రాజ్య వైభవంతో ఒక్క సంవత్సరం ఉండగా

విషయాన్నంతా తెలిసికొని దుర్యోధనునివేగులవాళ్ళు, హస్తినాపురానికి వెళ్ళి, కర్ణ దుశ్ళాసన శకుని సోమదత్తులు

చుట్టూ చేరి ఉండగా, కొలువున్న దుర్యోధనునికి (మొక్కి ఇట్టా అన్నారు.

ఆదిసర్వము - అష్టమాశ్వాసము 771

సీ. కర్ణశల్యులు మొదల్‌గాం గల భూపతు ; లత్యంత బలవంతు లస్త్రవేదు

లుద్ధతుల్‌ మోపెట్టనోపని చాప మ : శ్రమమున మోపెట్టి, చదలం దిరుగు

నయ్యంత్ర మేసి, మీయందణముందర : గృష్టం దోడ్కొని యొక్క కృష్ణ వర్డుం

డెక్కటి రణములో నేపునం గానీను । నోడించి జయలీల నున్న యాత ఆ. డర్జునుండు; మభీిమహాబాహుబలమున ।; శల్యుం ద్రెళ్ళ వైచి శత్రువరుల

నెల్లం దల్లడిల్ల నెగచిన యాతండు । భీమసేను. డమితభీమబలుండు. 10 ప్రతిపదార్హం: కర్ణ శల్యులు, మొదల్‌, కాన్‌+*కల; భూపతులు= రాజులు; అత్యంత, బలవంతులు; అస్త్ర, వేదులు= అస్త్రవిద్యను ఎరిగినవాళ్ళు; ఉద్దతుల్‌= గర్వించినవాళ్ళు; మోపెట్టన్‌= ఎక్కుపెట్టటానికి; ఓపని= సాధ్యంకాని; చాపము= ధనుస్సును; ఆ(శ్రమమున= సులువుగా; మోపెట్టి= ఎక్కుపెట్టి; చదలన్‌= ఆకాశంలో; తిరుగు; ఆ+యం(త్రము= ఆ మత్స్యయంతత్రాన్ని; ఏసి= కొట్టి; మీ, ఆందజ, ముందరన్‌; కృష్ణన్‌= (ద్రౌపదిని; తోడ్కొని; ఎక్కటి, రణములోన్‌= ద్వంద్వయుద్ధంలో; ఏీపునన్‌= పరాక్రమంతో; కానీనున్‌= కన్యాపుత్రుడు అయిన కర్చుడిని; ఓడించి, జయ, లీలన్‌= జయముయొక్కవిలాసంతో: ఉన్న, ఆతండు; ఒక్క, కృష్ణవర్దుండు= నల్లటికాంతికలవాడు; అర్జ్హునుండు; మటథి; మవాి, బాహు, బలమునన్‌: శల్యున్‌: త్రెళ్ళ. వైచి= పడవేసి; శత్రు, వరులన్‌= మేట శత్రువు లందరిని; తల్లడిల్లన్‌; ఎగచిన= తరిమిన; ఆతండు; అమిత, భీమ, బలుండు= అంతులేనిభయంకరమైన బలం కలవాడు; భీమసేనుండు. తాత్పర్యం: మహాబలవంతులు, అస్త్రవిద్యావేత్తలు, గర్వితులు అయిన-కర్షుడు, శల్యుడు మొదలైన రాజులంతా ఎక్కుపెట్ట లేని ధనుస్సును సులభంగా ఎక్కుపెట్టి, ఆకాశంలో తిరిగే మత్స్యయంత్రాన్ని కొట్టి, అందరిఎదుట ద్రాపదిన్మిచేపట్టి, ద్వంద్వయుద్దంలో తన పరాక్రమం ప్రకాశించేటట్టు కర్టుడిని ఓడించి విజయ విలాసంతో ఉన్న ఆ నల్లటివాడు-అర్జునుడు. గొప్ప భుజ బలంతో శల్యుడిని పడవేసి, మేటిశత్రువు లందరినీ తల్లడిల్లదేసి తరిమిన, ఆ మహాభయంకర మైన బలం గలవాడు భీముడు. చ. '“అనిమొన నట్లు దాంకిన మహారథులన్‌ ధృతరాష్త్రరాజనం

దనుల బలాధ్యులన్‌ దళితదర్పులం జేసినవారు ధర్మనం

దనయము లుగ్రనీరు' లని తద్విధమంతయు నేర్పడంగం జె

ప్పెన విని కౌరవప్రభుండుం బెల్కుణి తద్దయు దుఃఖితాత్ముం దై. శ్ర ప్రతిపదార్థం: అని, మొనన్‌= యుద్ధంమొదట; అట్టు; తాంకిన= ఎదుర్కొన్న; మహారథులన్‌; బల+ఆఢ్యులన్‌= బలవంతులను; ధృతరాష్ట్రరాజ, నందనులన్‌= ధృతరాష్ట్రమహారాజు కుమారులను; దళిత, దర్చులన్‌= ఇండింపబడిన గర్వంకలవాళ్ళనుగా- అంటే అణచివేయబడిన గర్వం కలవాళ్ళనుగా; చేసినవాళ్ళు; ఉ(గ్రవీరులు= భయంకర మైన పరాక్రమం కలవాళ్ళు; ధర్మనందన, యములు= ధర్మరాజు, కవ లైన నకులసహదేవులు; అని; తత్‌*విధము= ఆ విధం; అంతయున్‌; ఏర్పడంగన్‌= స్పష్టం అయ్యేటట్టు; చెప్పిన; విని; కౌరవ, ('ప్రభుండున్‌= దుర్యోధనుడు; పెల్కుజి= వెలవెలపోయి;తద్దయు= మిక్కిలి; దుఃఖిత+ఆత్ముండు+ఐ= దుఃఖించిన మనస్సు కలవా డై తాత్సర్యం: యుద్ధ (ప్రారంభంలో ఆ విధంగా ఎదుర్కొని మహారథులూ, బలవంచులూ అయిన ధృతరాష్ట్ర మహారాజు కుమారుల గర్వాన్ని అణచినవాళ్ళు-ధర్మజ నకుల సహదేవు లనీ - ఆ విషయాన్నంతా స్పష్టంగా చెప్పగా విని, దుర్యోధనుడు వెలవెలబోయి మిక్కిలి దుఃఖించాడు. న

772 శ్రీమదాంధ్ర నుహాభారతము విశేషం: ఈ వివరాలు (ద్రౌపదిస్తయంవరఘట్టంలో చెప్పకుండ ఇక్కడ చారులచేత చెప్పించటంవలన పునరుక్తిదోషం కలుగకుండ విశేష వృత్తాంతాన్ని ప్రతిపాదించి కథాంశాలకు ఉత్కంఠ నాపాదించటం జరిగింది. ఈ వివరణ లేకపోతే ధర్మరాజు, నకులసహదేవులు సభను వీడి ఎందుకు ముందుగానే వెళ్ళారో, భీము డొక్కడే సభలో ఎందుకు ఆగాడో తెలియదు. ఇప్పుడు స్వయంవరఘట్టంలో పాండవులు కూడబలుకుకొని కార్యాన్ని సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించినట్టు స్పష్టమవుతున్నది. వ. 'అక్కట! పురోచనుం డొక్కరుండ లక్కయింట దగ్గుం డయ్యెం గా కేమి; దైవానుకూల్యంబు లేక మానుషం

బెంతయయ్యు నేమి సేయు6 బాందవు లేమి దైవసంపన్నులైరో యని వగచి, యీ యవసరంబున ద్రుపదు

భేదించి పాండవుల నుత్సాదింపస వలయు నె ట్లనిన. 12 ప్రతిపదార్థం: అక్కట; పురోచనుండు; ఒక్కరుండ; లక్కయింట; దగ్హుండు+అయ్యెన్‌= కాలిపోయాడు; కాక+ఏమి= కాబోలు; దైవ+ఆనుకూల్యంబు= దైవముయొక్కతోడ్పాటు; లేక; మానుషంబు= మానవప్రయత్నం; ఎంత, అయ్యున్‌; ఏమి, చేయున్‌; పాండవులు; ఏమి; దైవసంపన్నులు+ఐరో= దైవ బల సంపదతో కూడినవాళ్ళు ఆయ్యారో; అని; వగచి= విచారించి; ఈ, ఆవసరంబున= ఈసమయంలో; (ద్రుపదు, భేదించి= ద్రుపదుడిని వేరుచేసి; పాండవులన్‌; ఉత్సాదింపవలయున్‌= పెకలించాలి; ఎట్టు+అనిన. తాత్పర్యం: “అయ్యో! పురోచనుడు ఒక్కడే లక్కఇంటిలో మాడిపోయాడు కాబోలు. దైవం అనుకూలించకుంటే మానవప్రయత్నం ఎంత ఉన్నా ప్రయోజనం ఏమిటి? పాండవులు ఎంత దైవ బల సంపన్నులో గదా! అని చింతించి, ఈ సమయంలో (ద్రుపదుడిని వేరు చేసి పాండవులను పెకలించి వేయాలి. ఎట్టాగంటే. విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఉఊ యాదవనవృషప్టిెభోజవరులందలుం బాండవపక్షపాతు; ల

చ్చేదివిభుండు వారలన చేకొనువాండగు; వీరలెల్ల నా

త్మోదయనవ్ఫద్ధి పొంటెను దదున్నతిం గోరుదు; రట్లు గావునన్‌

భేదము సేయ(గావలయు. బెల్బ్ట యందలు( గూడకుండ(గన్‌, 13 ప్రతిపదార్థం: యాదవ, వృష్ణి భోజ, వరులు= యాదవ, వృష్టి భోజ(కుల)'శ్రేష్టులు; పాండవపక్షపాతులు; ఆ+చేది, విభుండు= ఆ చేది రా జైన శిశుపాలుడూ; వారలన్‌+అ= వారినే; చేకొనువాండు= చేపట్టేవాడు- అంటే వారి పక్షాన్నే (గ్రహించేవాడు: అగు; వీరలు+ఎల్లన్‌= వీళ్ళంతా: ఆత్మ+ఉదయ. వృద్దిపొంటెను= తమ అభ్యుదయం యొక్క అభివృద్దికంటే: తత్‌+ఉన్నతిన్‌= ఆ పాండవులయొక్క అభివృద్దిని; కోరుదురు; అట్టు; కావునన్‌; అందఆజు; కూడక+ఉండంగన్‌= కలియకుండా ఉండేటట్లు; పెల్చన= వెంటనే; భేదముజ= వేర్పాటు; చేయగావలయున్‌. తాత్పర్యం: యాదవ వృష్టి భోజ కుల (శ్రేష్టులంతా పాండవ పక్షపాతులు. ఆ చేది రా జైన శిశుపాలుడుకూడా వాళ్ళ పక్షం వహించేవాడే. వీళ్ళంతా తమ అభ్యుదయం కంటె పాండవుల అభివృద్ధినే కోరుతారు. అందువలన వీళ్ళంతా ఒకటి కాకుండా భేదం కల్పించాలి. విశేషం: పాండవులకు పెదతండ్రి కొడుకు లైన దుర్యోధనాదులు శత్రువు లయ్యారు. ద్రుపదరాజు పుత్రికను వివాహంచేసికొనటంవలన, పాండవులకు బంధువర్గం ఏర్పడింది. ఈ సంగతి వ్యాసు ఢిదివరకే సూచించాడు. పాండవ మిత్రులూ, బంధువులూ వారివారి స్వార్దాలకంటె పాండవుల అభ్యుదయాన్నే కోళుతారు. కౌరవపక్షం దానికి విరుద్దం. వారికి స్వార్ధమే లక్ష్యం. ఈ సంగతి తెలిసికొన్న

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 773 దుర్యోధనుడు పాండవ బలాన్ని అంచనావేసి, భయపడి, వాళ్ళపట్ల భేదోపాయాన్ని ప్రయోగించాలని యోచించాడు. కణికుడు బోధించిన శుక్ర నీతి ప్రకారం శత్రువుల పట్ట భేదోపాయాన్ని ప్రయోగించటానికి దుర్యోధనుడు ప్రయత్నం చేస్తున్నాడు. (కణికనీతి. చూడు; ఆది. 6. 119, 120).

వ. అని దుర్యోధనుండు పాందవ పాంచాల విభేదనోపాయంబు. జింతించుచుండె; నంత విదురుండు పాండవాభ్యుదయంబును బాంచాలీస్వ్తయంవరంబును దుర్యోధనాదులు భగ్నదర్పు లగుటయు విని సంతసెల్లి, పాండవులు ద్రుపదరాజపుత్రిం బెండ్లి యై ద్రుపదుపురంబున సుఖంబున్న వారని ధృతరాష్త్రునకుం జెప్పిన నతం డి ట్లనియె. 14

ప్రతిపదార్థం: అని; దుర్యోధనుండు; పాండవ, పాంచాల, విభేదన+ఉపాయంబున్‌= పాండవులను ద్రుపదుడిని వేరుపరచే ఉపాయాన్ని; చింతించుచుండెన్‌= ఆలోచిస్తూ ఉన్నాడు; అంత; విదురుండు; పాండవ+అభ్యుదయంబును; పాంచాలీ, స్త్వయంవరంబును; దుర్యోధన+ఆదులు= దుర్యోధనుడు మొదలైనవాళ్ళు; భభ, దర్పులుజ పోయినగర్వం కలవాళ్ళు; అగుటయు; విని; సంతసిల్లి; పాండవులు; ద్రుపదరాజ, పుత్రిన్‌; పెండ్లి*ఐ; ద్రుపదు, పురంబున; సుఖంబు+ఉన్నవారు; అని; ధృతరా్ష్రునకున్‌; చెప్పినన్‌; అఆతండు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: అని దుర్యోధనుడు పాండవులను ద్రుపదుడినుండి వేరుచేసే ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో

విదురుడు పాండవుల అభ్యుదయాన్ని, (ద్రౌపదీ స్వయంవరాన్నీ, దుర్యోధనుడు భంగపడటాన్ని విని సంతోషించి,

పాండవులు (ద్రాపదిని పెండ్లిచేసికొని ద్రుపదుడినినగరంలో సుఖంగా ఉన్నా రని ధృతరా'్త్రునికి చెప్పగా, అతడు ఇట్టా అన్నాడు.

ఆ. యజ్ఞసేనుకూంతు నభిజాత నాతని ; యజ్ఞవేది నుదిత యయినదాని ననఘ విధి వివాహ మయి పాండునందనుల్‌ | మిగుల మిత్ర బల సమ్మ ద్ధు లయిరి. 15

ప్రతిపదార్ధం: యజ్ఞసేనుకూతున్‌= ద్రుపదుని కూతురిని; అభిజాతన్‌= ఉతమవంశం కలదానిని; అతని; యజ్ఞవేదిన్‌=

తనియజ్ఞవేదికలో; = నో

ను ల 'నెకలోం స్తత అయిన, దానిన్‌= పుట్టిన దానిని; అనఘ, విధి= దోషం లేని పద్దతిలో: వివాహము+అయి; పాండు, ఫ్‌ ల; (ఆ , బల, సమృద్దులు= మి(త్రబలంతో నిండినవాళ్ళు; అయిరి.

తాతుర్యం: ప

ఫృర్యం: యజ్ఞవేదికలో పుట్టి, ఉత్తమ వంశం కల (ద్రౌపదిని చక్కగా వివాహ మాడటంవలన పాండవులు మిక్కిలి మిత్ర బలాన్ని పొందారు.

విశేషం? గృహస్స స

షం: గృహస్థ ధర్మంలో ఉత్తమ వంశంలో పుట్టి గుణవతి అయిన వధువుకుండే ప్రాధాన్యం ధృతరాష్ట్రుని మాటలలో ద్వనిస్తున్నది.

క. కొడుకుల యభ్యుదయము విని । కడు సంతస మయ్యె నిపుడు; కౌరనకుల మే రడ వెలింగె నెల్లరాజుల ; నొడిచిన భుజవీర్యమున మహోత్సాహమునన్‌. 16

ప్రతిపదార్థం: కొడుకుల, అభ్యుదయము= కొడుకులఅభివృద్దినిగురించి; విని; కడు= మిక్కిలి; సంతసము+అయ్యెన్‌; ఇపుడు;

కౌరవకులము; ఎల్ల, రాజులన్‌; ఒడిచిన= ఓడించిన' భుజ, వీర్యమున= బాహుబలంతో; మహత్‌+ఉత్సాహమునన్‌= గొప్పఉత్సాహంతో; ఎర్చడ= స్పష్టంగా; వెలిలెన్‌,

౯77క్లీ శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: పాండవుల అభివృద్దినిగూర్చి వినటంవలన ఎంతో సంతోషం కలిగింది. ఇప్పుడు కౌరవ వంశం రాజులందరినీ ఓడించిన భుజ బలంతో, మహోత్సాహంతో-బాగా (ప్రకాశించింది. వ. అని విదురునకు మనపయంబుగాం బలికి, యంతఃపురంబునకుం జని యంతస్తాపం బేర్చడకుండ

మండునంత6 గర్హ దుర్యోధనులు ధృతరాష్తు పాలికిం జని యి ట్లనిరి. 17 ప్రతిపదార్థం: అని; విదురునకు; మనః, ప్రియంబుగాన్‌= మనసుకు సంతోషం కలిగేటట్టు; పలికి; అంతఃపురంబునకున్‌; చని= వెళ్ళి అంతస్‌+తాపము= లోపలిదుః:ఖం-అంటే మనస్సులోని దుఃఖం; ఏర్పడకుండన్‌= బయటపడకుండా; ఉండున్‌; అంతన్‌; కర్ణదుర్యోధనులు; ధృతరాష్ట్ర, పాలికిన్‌= ధృతరాుని దగ్గరకు; చని= వెళ్ళి; ఇట్టు+అనిరి. తాత్చర్యం: అని విదురుని మనస్సుకు సంతోషిం కలిగేటట్టు పలికి, అంతఃపురానికి వెళ్ళి, తన మనస్సులోని దుఃఖం బయటపడకుండా ఉండగా - కర్షదుర్యోధనులు, ధృతరాునిదగ్గరకు వెళ్ళి ఇట్లా అన్నారు.

దుర్యోధనుడు తండ్రితో. బాండవపాంచాలవిభఖేదనోపాయంబు నాలోచించుట. (సం. 1-192-25)

క. రేయును బగలును విదురుడు : నీయొద్దన యునికిజేసి నేరము పలుకన్‌

మాయిష్టం బెజిండింపంగ ।; ధీయుత! యెడం గంటి మిన్ని దివసంబులకున్‌. 18 ప్రతిపదార్థం: రేయును; పగలును; విదురుడు; నీ, ఒద్దనజ నీ ప్రక్కనే; ఉనికిన్‌*చేసి= ఉండటంచేత; పలుకన్‌ నేరముజ చెప్పలేకపోయాము; ధీయుత= బుద్ది బలంతో కూడిన వాడా!; ఇన్ని, దివసంబులకున్‌= ఇన్ని రోజులకు; మా, ఇష్టంబు= మా కోరిక; ఎటిగింపగ; ఎడన్‌= అవకాశాన్ని; కంటిమి= పొందాము. తాత్పర్యం: రాత్రీ పగలూ విదురుడు నీ వద్దనే ఉండటంచేత మామనస్సులోని మాట చెప్పలేక పోయాము. మేధావీ! మా కోరిక తెలపటానికి ఇన్ని రోజులకు అవకాశం ఏర్పడింది. క, _ విదురుండు పాండవ హితుం దని ।; మొదలన యెటిండియును నతి విమోహంబున న

వ్విదురు నచనంబ నిలుపుదు ; హృదయంబున; నతడు పెద్దయిష్టుండు మీకున్‌. 19 ప్రతిపదార్థం: విదురుండు; పాండవ, హితుండు= పాండవుల మేలు కోరేవాడు; అని; మొదలన= మొదటనే: ఎటింగియును; అతి, విమోహంబునన్‌= మిక్కిలి అజ్ఞానంచేత; ఆ+విదురు, వచనంబు+అ= ఆ విదురునియొక్కమాటే ; హృదయంబునన్‌; నిలుపుదు= నిలుపుకొంటావు; అతడు; మీకున్‌; పెద్ద= మిక్కిలి; ఇప్టుండు. తాత్పర్యం: విదురుడు పాండవుల మేలు కోరే వా డని మొదటనే తెలిసికూడా మిక్కిలి అజ్ఞానంతో ఆ విదురుడి మాటే మనస్సులో నిలుపుకొంటావు. అతడు మీకు బాగా ఇష్ట మైన వాడు. విశేషం: ఈ మాటలు ధృతరాష్ష్రుడిని వ్యంగ్యంగా నిష్టురమాడుతున్నట్టున్నాయి. మనసును విరిచే మాటలు ఇట్టాగే ఉంటాయి. వ. _ అనిన వారలకు ధృతరాస్తుం డి ట్లనియె. 20 తాత్పర్యం: అని అనగా వారితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వానము 775 సీ. “పలుకులం జెయ్వులం బాందవులకుం బ్రీతి ।; గలయట్ల యుండుదుణాని నాదు హృదయంబు విదురున కెన్నండు నెజింగింప; । నేను మీతలంచిన యివ్విధంబ తలంచుచు నుండుదు; దైవసంపద గల । వారల బాండవవరుల నేమి సేయంగ నగు? నెద్దిచెప్పుం డిష్టం బింక?' , ననిన విచిత్రవీర్యాత్మజునకు

ఆ. దుష్టచేష్టితుండు దుర్యోధనుం డిట్టు ; లనియెం 'జత్తదింపు మవనినాథ! పాందురాజసుతులం బాంచాలపతియొద్ద ।; నుండకుండ జేయు టుచిత మిపుడు.” 21

(ప్రతిపదార్హం: పలుకులన్‌= మాటలలో; చెయ్వులన్‌= చేతలలో; పాండవులకున్‌; ప్రీతి; కల, అట్టు+అ= ఉన్నట్టే; ఉండుదున్‌+కాని; నాదు, హృదయంబు; విదురునకున్‌; ఎన్నండున్‌; ఎటింగింపన్‌; ఏను= నేను; మీ, తలంచిన, ఈ+విధంబు+అ= మీరు ఆలోచించినట్లే; తలంయయచున్‌=ఆలోచిస్తూ: ఉండుదున్‌; దైవ, సంపద; కల; వారలన్‌; పాండవ, వరులన్‌= ఉత్తము లైన పాండవులను; ఏమి; చేయంగన్‌: అగున్‌: ఇంకన్‌; ఎద్ది= ఏది; ఇష్టంబు; చెప్పుండు; అనినన్‌; విచిత్రవీర్య+ఆత్మజునకు= విచిత్రవీర్యుని కుమారుడైన ధృతరాహ్ష్ట్రనికి; దుష్ట, చేష్టితుండు= చెడ్డపనులు చేసేవాడు; దుర్యోధనుండు; ఇట్టులు; అనియెన్‌; అవనినాథా=ఐ మహారాజా!; చిత్తగింపుముజ= దయతో వినుము; పాండురాజుకుమారు లైన పాండవులను; పాంచాలపతి, ఒద్దన్‌= ద్రుపదునిదగ్గర; ఉండకుండన్‌; చేయుట; ఇపుడు; ఉచితము, తాత్పర్యం: 'మాటలలో, చేతలలో పాండవులపట్ట ప్రీతి ఉన్నట్లే ఉంటాను. కాని, నా మనస్సును విదురునికి ఎన్నడూ తెలియనీయలేదు. మీ అభిప్రాయమే నా అభిప్రాయం. పాండవులు దైవబలం కలవాళ్ళు. ఏం చేయగలం? ఇక మీకు ఏది ఇష్టమో చెప్పండి" అని ధృతరాష్ట్రుడు అనగా దుర్మార్గపు పనులు చేసే దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు: 'మహారాజా! చిత్తగించండి. పాండవులను పాంచాలరాజు దగ్గర ఉండకుండా చేయటం ఇప్పుడు ఉచితమైన పని. విశేషం: ఇది ధృతరా(్ష్రునిస్వభావాన్ని వ్యక్తంచేసే సీసం. బహిరంగంగా పాండవట్రీతి, అంతరంగంలో పాండవద్వేషం ఆతని స్వభావం. అందులో తండ్రికొడుకులు బింబ ప్రతిబింబాలు. ఆలోచన కొడుకుది; ఆచరణ తండ్రిది. ”

వ. అది యెట్లనినం బుత్ర మిత్ర బాంధవ బలసంపన్నుం డైన ద్రుపదునొద్దం బాండవు లుండువా రైన వారలం గృష్టబలదేవులుయదువృష్టిభోజాంధకవర్గములతో వచ్చి కూడిన నెవ్వరు సాధింపనోపరు; గావున నెడసేయక ద్రుపదుండు పాండవుల విడుచునట్లుగా భేదింత; మొండె, వలనుగలవారలం బంచి కౌంతేయమాద్రేయులను దమలో విరక్తు లగునట్లుగాం జేయింత; మొండె, నతిలలితప్రమదాజనంబులం బ్రత్యేకంబ యేవురకుం ప్రయోగించి ద్రౌపదివలన విరక్తి: బుట్టింత; మొండె, నేవురకు నొక్కడియ యా లగుట కష్టం బని ద్రోవది+ బాండవులవలన విగతస్నేహం గావింత; మొండె, నుపాంశుప్రయోగంబుల భీము వభియించి తక్కినవారల బలహీనులం జేయుదము. 22

ప్రతిపదార్థం: అది; ఎట్టు+అనినన్‌; పుత్తమిత్ర బాంధవ, బల, సంపన్నుండు+ఐన= పుత్రులతో, "స్నేహితులతో, బంధువులతో,

బలంతో నిండినవా డైన; [ద్రుపదు, ఒద్దన్‌; పాండవులు; ఉండువారు+ఐన; వారలన్‌; కష్ణ బలదేవులు; యదు, వృష్టి భోజ+ఆంధక, వర్గములతో; వచ్చి; కూడినన్‌; ఎవ్వరు; సాధింపన్‌+ఓపరు= జయించలేరు; కావునన్‌; ఎడచేయకః= ఆలస్యం చేయక; (ద్రుపదుండు; పాండవుల; విడుచునట్టుగా; భేదింతము= చీలిక కలిగింతము; ఒండె= కానియెడల; వలను, కలవారలన్‌= నేర్చుకలవాళ్ళను; పంచి= పంపి; కౌంతేయ, మా(ద్రేయులను= కుంతికొడుకులను, మాద్రికొడుకులను; తమలో; విరక్తులు+అగునట్టుకాన్‌= (ప్రేమలేనివాళ్ళు అయ్యేటట్టుగా; చేయింతము; ఒండెన్‌= కాదేని; అతి, లలిత, ప్రమదా, జనంబులన్‌= మిక్కిలి అంద మైన (స్త్రీలను; ఏవురకున్‌=

776 శ్రీమదాంధ్ర మహాభారతము ఐదుగురకు; ప్రయోగించి; ద్రాపదివలన; విరక్తిన్‌= ఏవగింపు; పుట్టింతము, ఒండెన్‌= కాదేని; ఏవురకున్‌= ఐదుగురికి" ఒక్కతియు+అ ఆలు+అగుట; కష్టంబు+అన్సి ద్రోవదిన్‌; పాండవులవలన; విగత, స్నేహన్‌= తొలగిన(ప్రేమకలదానినిగా; కావింతము, ఒండెన్‌= కాదేని; ఉపాంశు, ప్రయోగంబుల= రహస్యా లైన మందత్రతంత్రాలచేత; భీము; వధియించి; తక్కిన వారల" బల, హీనులన్‌; చేయుదము. తాత్సర్యం: అది ఎట్టాగంటే, పుత్ర మిత్ర బంధు బలం సమృద్దిగా కల (ద్రుపదుని దగ్గర పాండవు లుండి, వాళ్ళకుతోడుగా శ్రీకృష్ణ బలరాములు యదువృష్టి భో జాంధక వర్గాలతో వచ్చి చేరితే ఇక వాళ్ళను జయించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందువలన ఆలస్యం చేయక (ద్రుపదుడు పాండవులను వదిలేటట్టుగా చీలిక కలిగిద్దాం. లేకుంటే, నేర్పరు లైన వాళ్ళను పంపి కుంతికొడుకులకు, మాద్రికొడుకులకు తమలో తాము ప్రేమ లేని వాళ్ళయ్యేటట్టు చేద్దాం. అట్టా కాకుంటే, మిక్కిలి అందగత్తె లైన ఆడవాళ్ళను పొండవు లైదుగురి పై ప్రయోగించి, ('ద్రాపదిపట్ట్ల ఏవగింపు పుట్టిద్దాం. కాకుంటే, ఐదుగురికి ఒక్కతె భార్య కావటం కష్టం అని (ద్రౌపదిని పాండవులమీద ప్రేమలేనిది అయ్యేటట్టుగా చేద్దాం. లేకుంటే చాటుమాటు మంత్ర తంత్రాలు నడిపి భీముడిని చంపి మిగిలినవాళ్ళను బలహీనులుగా "చేద్దాం. - విశేషణ: సామదానాలు ఫలించనప్పుడు భేదోపాయాన్ని ప్రయోగించటం రాజనీతి. అవసరాన్నిపట్టి దుర్యోధనుడు ముందుగానే 'ప్రయోగిస్తున్నాడు. ఇందులో ఆరురకాల భేదోపాయాలను తండ్రిముందు (ప్రతిపాదిస్తున్నాడు. అవి 1. బంధువులబలగం కూడి ఒక కూటమిగా ఏర్పడకుండ చూడటం. 2, పాండవులకూ వారి బంధువులలో ముఖ్యుడైన ద్రుపదునికీ నడుమ భేదం కలిగించటం. 3. బంధువుల మధ్య భేదోపాయం పనిచేయకపోతే అన్నదమ్ముల మధ్య సవతితల్లుల బిడ్డలనే భావంతో కౌంతేయులు,మాద్రేయులు అనే భేదం కలిగించటం. 4. ద్రాపదికంటె అందగత్తైెలను పాండవుల మీద (ప్రయోగించి భర్తలకు భార్యపట్ట మక్కువలేకుండా చేయటం. క్‌, పంచభరృక అయిన ద్రౌపదికి భర్తలపై భేద భావం కలిగించటం. 6. పాండవబల మూలస్తంభంగా భావించబడే భీముడిని వధించి వాళ్ళను నిర్విర్యులను చేయటం. ఇవి దుర్యోధనుని దుర్విదగ్రత దుర్మార్గ ప్రవృత్తి (ప్రతిఫలించే ప్రతిపాదనలు. (సంపా) ఆ. _ గాడ్పుచూలి పెిలుందుం గాపంగ నర్జును ; నోర్వ నమరు లైన నోప రాజి;

నతండు నిహతు దగుడు నశ్రమంబునం । బార్జు నొక్కరుండ కర్గుం డోర్వ నోపు. 23 (ప్రతిపదార్థం: గొడ్పు, చూలి= వాయుతనయుడు- భీముడు; పిజు6దున్‌= వెనకభాగాన్ని; కావంగన్‌= క్లాపాడగా; ఆజిన్‌= యుద్దంలో; అర్జునున్‌; ఓర్వన్‌= జయించటానికి; అమరులు+ఐనన్‌= దేవతలైనా; ఓపరు= చాలరు; అతండు= ఆ భీముడు; నిహతుండు= చంపబడినవాడు; అగుడున్‌= కాగా; పార్టున్‌= అర్జునుణ్ణి; కర్షుండు; ఒక్కరుండ; అశ్రమంబునన్‌= సులభంగా; ఓర్వన్‌+ఓపు= జయించగలడు. తాత్పర్యం: వాయుపుత్రు డైన భీముడు సహాయంగా వెనుక నిలిస్తే - అర్జునుడిని యుద్దంలో జయించటం ఆ దేవతల కైనా సాధ్యం కాదు. భీముడిని చంపితే అర్జునుడిని కర్టు డొక్కడే అనాయాసంగా జయించగలడు. విశేషం: దుర్యోధనుని అంచనాలో పాండవబలానికి పెట్టనికోట భీమసేనుడు. అతడు అండగా నిలిస్తేనే అర్జునుని పరా(క్రమం దేవతలకుకూడా అసాధ్యమౌతుంట. భీముడు లేకపోతే అర్జునుడు కర్షునికి అసాధ్యుడు కాడని అతని వాదం. వాస్తవానికి అది నిజం కాదు. మత్స్యయంత్ర సభలో అర్జునునిచేతిలో ఓడిపోయిన కర్ణుడిని సమర్థించుకొనే కుంటిసొకు ఇది. దుర్విదగ్దులవాదం ఇట్లాగే ఉంటుంది. వ. 'ఈ యుపాయంబులలో నెయ్యది యుచితంబును నపగత దోషంబును నవీర్చ సూత్రంబును నగు నట్టి

దానిం జెచ్చెర ననుష్టించు నది' యనిన గర్జుం డి ట్లనియె. 24

ఆదిసర్వము - అష్టనూశ్వానము 777 ప్రతిపదార్థం: ఈ, ఉపాయంబులలోన్‌; ఏ+అది; ఉచితంబును= తగినదీ; అపగత, దోషంబునున్‌=పోయినదోషం కలది- అంటే లోపం లేనిది; అదీర్హ, సూ(త్రంబునున్‌= ఆలస్యంలేకుండా చేయదగిందీ; అగున్‌; అట్టి; దానిన్‌; చెచ్చెరన్‌= వేగమే; అనుష్టించునది; అనినన్‌; కర్టుండు; ఇట్టు+అనియె= ఇట్టా అన్నాడు. తాత్పర్యం: ఈ ఉపాయాలలో ఏది యోగ్యమవుతుందో, ఏది దోషం(లోపం)లేకుండా ఉంటుందో, చాలకాలం పట్టకుండా స్వల్పకాలంలోనే సతృ్ఫలితాల నిస్తుందో అటువంటిదానిని వెంటనే ఆచరించవలసింది” అని దుర్యోభను డనగా, కర్ణుడు -ఈ విధంగా పలికాడు. విశేషం: చతుర్విధోపాయాలను (ప్రయోగించేటప్పుడు తీసికొనవలసిన జాగ్రత్తలు మూడింటిని ఇందులో సూచించటం జరిగింది. సీ. ఆర్యవృత్తుండు రాజాన్వయసమ్మతుం ;: డభిమతసంబంధు6 డయినవాండు

గుణవంతు లగుచున్న కొడుకులు గలవాండు । పాంచాలుం డేల యప్పాందుసుతుల వినయసంపన్నుల విడుచువాం దగు?; మటీ । పాండునందను లేక పత్నియంద కరమనురక్తులు గావునం దనులోన ; నేల భేదిల్లుదు?; రెన్నం డయ్యు ఆ. _ నొక్కసతికిం బతులు పెక్కంద్రు రగు టిది । సతులకోర్మిగాన యతివ కృష్ణ సుందరాంగి వారియం దేల యపరక్త ।; యగు మనోముదంబు. దగులు6 గాక. 25 ప్రతిపదార్థం: ఆర్య, వృత్తుండు= మంచినడవడి కలవాడు; రాజ+అన్వ్నయ, సమ్మతుండు= రాజవంశాలకు ఇష్టమైనవాడు; అభిమత, సంబంధుండు= ఇష్ట మైన చుట్టరికం కలవాడు; అయినవాండు; గుణవంతులు+అగుచు+ఉన్న; కొడుకులు; కలవాడు; పాంచాలుండు= ద్రుపదుడు; ఏల; ఆ+శపాండు, సుతుల= ఆ పాండురాజు కుమారు లైన పాండవులను; వినయ, సంపన్నుల= అణకువ మిక్కిలిగా కలవాళ్ళను; విడుచువాండు; అగు; మథి; పాండు నందనులు= పాండవులు; ఏక, పత్ని. అందు+అజ= ఒక “భార్యమీదనే: కరముజ= మిక్కిలి; అనురక్తులు= (పేమ కలవాళ్ళు; కావునన్‌; తమలోనన్‌; ఏల; భేదిల్టుదురు= విరోధం వహిస్తారు; ఎన్నడు+అయ్యున్‌= ఎప్పుడైనా; ఒక్క, సతికిన్‌= ఒక్క స్తీకి; పతులు= భర్తలు; పెక్కండ్రురు= పెక్కుమంది; అగుట; ఇది; సతుల, కోర్కి= స్త్రీల కోరిక; కాన; సుందర+అంగి= అంద మైన దేహం కలది; అతివ= స్తీ; కృష్ణః (ద్రౌపది; వారి, అందు; ఏల" అపరక్ర= ప్రేమలేనిది; అగు; మనః, ముదంబున్‌= మనస్సులోని సంతోషంతో; తగులున్‌, కాక= (ప్రేమించునుకదా! తాత్సర్యం: మంచి నడవడి కలవాడు, రాజ వంశాలకు ఇష్ట మైనవాడు; ప్రియ మైన బంధు బలం కలవాడు; గుణవంతు లైన కొడుకులు కలవాడు అయిన ద్రుపదుడు, వినయ సంపన్ను లైన ఆ పాండవులను ఎందువలన వదలివేస్తాడు? అంతేకాదు, పాండవులంతా ఒకే భార్యమీద మిక్కిలి ప్రేమ కలవాళ్ళు. అందువలన వాళ్ళమధ్య ఎందుకు వైరం ఏర్పడుతుంది? కొగా, ఎప్పుడైనా స్త్రీలు, పెక్కుమంది భర్తలను కోరుకొంటారు. అందువలన అందగత్తె (ద్రౌపది పాండవులను మనసారా 'ప్రేమిస్తుందే కాని తిరస్కరిస్తుందా? నిశేషల; అలంకారం - కావ్యలింగం, దుర్యోధనుడు ప్రతిపాదించిన భేదోపాయాలన్నీ సఫలాలు కావని కర్టుడు సహేతుకంగా పేర్కొన్నాడు. వ. మథఖి భీమసేనుండు దొల్లి మీ చేసిన యుపాంశువధల నేమి యయ్యె? నింకను నట్ల కావున నీ యుపాయప్రయోగంబు లన్నియు నుడిగి యిప్పుడ పాండవులయందు విక్రమంబు ప్రయోగించుట కార్యంబు. 26

778 శ్రీమదాంధ్ర నుహాభారతము

ప్రతిపదార్థం: మజి; భీమసేనుండు; తొల్లి= ఇంతకుముందు; మీ, చేసిన మీయొక్కచేసిన- మీరు చేసిన; ఉపాంశు, వధలన్‌= రహస్య హత్యా ప్రయత్నాలచేత; ఏమి, అయ్యెన్‌: ఇంకను, అట్ట= ఇకముందుకూడా అంతే; కావునన్‌; ఈ, ఉపాయ, ప్రయోగంబులు; అన్నియున్‌; ఉడిగి= మాని; ఇప్పుడు+అ; పాండవుల; అందు; విక్రమంబుజ పరా(క్రమం; ('ప్రయోగించుట; కార్యంబు= చేయదగిన పని. తాత్పర్యం: అంతే కాదు. ఇదివరకు మీరు చేసిన రహస్య హత్యా ప్రయత్నాలతో భీముడు ఏ మయ్యాడు? ఇక ముందు కూడా అంతే. అందువలన ఈ ఉపాయాలు మాని ఇప్పుడు పాండవులమీద పరా[క్రమం (ప్రయోగించటమే మన కర్తవ్యం.

చ ఘన మగు విక్రనుంబునన కాదె జగత్రితయంబు. బాకశా

సమండు జయించె; భూతలము సర్వము మున్‌ భరతుండు విక్రముం

బునవ జయించ్వా నిక్రముము భూరి యశస్రియు లైన రాజనం

దనులకు సర్వసాధనము, ధర్మువు శత్రు నిబర్హణంబులన్‌. 27 ప్రతిపదార్థం: పాకశాసనుండు= దేవేంద్రుడు; జగత్‌+త్రితయంబున్‌= లోకాలు మూడింటిని; ఘనము+అగు= గొప్ప దైన; వి(క్రమంబునన, కాదెజ పరాాక్రమంచేతనేకదా!; జయించె; భరతుండు; భూతలము; సర్వము= భూమండలాన్నంతా; మున్‌= మునుపు; విక్రమంబునన= పరాశక్రమంచేతనే; జయించె; భూరి, యశః, ప్రియులు+ఐన= గొప్ప కీర్తి మీద ఇష్టంకలవాళ్ళు అయిన; రాజనందనులకు= రాజకుమారులకు; విక్రమము= పరా(క్రమమే; సర్వసాధనము= అన్నింటిని సాధించేది; శత్రు, నిబర్హణంబులన్‌= శత్రువధలు చేయటంలో; ధర్మువు= ధర్మం. " తాత్పర్యం: దేవేంద్రుడు ముల్లోకాలను గొప్ప పరాక్రమం చేతనే కదా జయించాడు. భరతుడు భూమండలాన్నంతా పూర్వం జయించింది పరాక్రమంచేతనే కదా! గొప్పకీర్తిని కోరుకొనే రాజకుమారులకు పరాక్రమమే సర్వసాధనం; శత్రు వధలలో ధర్మం.

విశేషం: అలంకారం- అర్జాంతరన్యాసం. పాకశాసనుడు- వృత్రాసురుని సోదరు డైన పాకాసురుడిని చంపినవాడు. దేవేంద్రుడు.

కర్ణుడు వీరుడు. దుర్యోధన ధృతరాష్టులవలె కపటికాడు. సామ దాన భేదోపాయాలు విఫలమైన తరువాత దండోపాయం

(ప్రయోగించాలి రాజనీతిప్రకారం. దుర్యోధనుడు (ప్రయోగించ తలచుకొన్న భేదోపాయం ఫలవంతం కాదని కర్ణుడు నిరూపించి

ప్రతాప ప్రదర్శకమైన యుద్ధమే (దండొపాయం) శరణ్యమని పేర్కొన్నాడు, యుద్ధమే వీరధర్మ మని (ప్రతిపాదించాడు.

వ. 'కావునం జతురంగ బల సాధనసన్నద్ధుల మయి యుద్ధంబునం బాంచాలు భంజించి పాండవుల నొండుగడ మంధనీక తోడ్కొనితెత్త మనినం గర్జుపలుకు లాకర్ణించి ధృతరాస్తుం “డిది యకార్యం బగు; నయినను మతిమంతులతో విచారించి చేయుద మని భీష్మద్రోణవిదురశల్యకృృపాశ్వత్థామసోమదత్తాదులం జిలువంబంచి యంతయు నెటింగించిన భీష్ముండు దుర్యోధనుం జూచి యి ట్లనియె. 28

(ప్రతిపదార్థం: కావునన్‌; చతురంగబల, సాధన, సన్నద్దులము+అయి= రధ గజ తురగ పదాతి బలాలతో, యుద్ద్ధఫరికరాలతో సిద్ధ మై; యుద్ధంబునన్‌; పాంచాలు= (ద్రుపదుని; భంజించి= ఓడించి; పాండవులన్‌; ఒండు, కడన్‌= మరొకచోట; ఉండనీక; తోడ్కొని; తెత్తము; అనినన్‌; కర్షు: పలుకులు; ఆకర్షించి= విని; ధృతరా(ష్ట్రుండు; ఇది; అకార్యంబు+అగున్‌= చేయతగని పని అవుతుంది; అయినను; మతిమంతులతో= బుద్ధిబలం కలవారితో;: విచారించి= ఆలోచించి; చేయుదము; అని; భీష్మ, (ద్రోణ విదుర. శల్య, కృప+అళ్చత్భామ, సోమదత్త+ఆదులన్‌= భీష్ముడు, ద్రోణుడుమొద లైన వారిని; పిలువన్‌+పంచి= పిలిపించి; అంతయున్‌; ఎజింగించిన; భీష్ముండు; దుర్యోధనున్‌; చూచి, ఇట్టు+అనియె.

తాత్పర్యం: 'అందువలన చతురంగబలాలతో, యుద్దపరికరాలతో సిద్ద మై వెళ్ళి, యుద్ధంలో ('ద్రుపదుడిని ఓడించి,

పాండవులను వేరొకచోట ఉండనీయక వెంటతీసికొని వద్దాం' అని కర్ణుడు అనగా- అతనిమాటలు విని ధృతరాష్ట్రుడు,

“ఇది చేయ తగని పని. అయినా బుద్ధిబలం గలవాళ్ళతో ఆలోచించి చేద్దాం' అని- భీషు శైడు, (ద్రోణుడు, విదురుడు

మొదలైనవాళ్ళను పిలిపించి జరిగిన దంతా చెప్పాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడీని చూచి ఇట్లా అన్నాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము లాళ్లాం్ర విశేషం; మహాభారతంలో మహావీరుడు కర్డుడు చేసిన యుద్ద (ప్రతిపాదనలలో ఇదొకటి, కర్టుడు చేసే యుద్ద ప్రతి పాదనలను దుర్యోధనుడు అంగీకరిస్తాడు. అందుకు ప్రధాన కారణం - పాండవులను పరిమార్చాలన్న ద్వేషం. కాని కర్టుని యుద్రప్రతి పాదనలకు ప్రధాన కారణం - పార్భుడిని యుద్దంలో ఓడించి, అతడిని మించిన వీరుడని కీర్తి గడించాలన్న ఆశయం. ధృతరా(ఘ్ట్రుడు కర్షదుర్యోధనుల ప్రతిపాదనలు విన్నాడు. దుర్యోధనునిది కుటిల భేదోపాయ ్రతిపాదన. కర్టునిది వీరోచిత యుద్ద ప్రతిపాదన, అయితే దుర్యోధనుని ప్రతిపాదనను కర్షుడే ఖండించాడు. ఇబ్బంది లేదు. ఇక మిగిలింది కర్ణుని యుద్ధ ప్రతిపాదన. పుత్ర మమకార పీడితుడు, లోభ గుణ పూరితుడు అయిన ధృతరాష్ర్రునికి నాసటి కళ్ళు లేవుగాని-కడుపు నిండా కళ్ళే ఆవృద్ధ రాజు లోతైన ఆలోచన కల వ్యక్తి అందుకే యుద్ద ప్రతిపాదన వినగానే ఇదేమి దుర్చుద్ది అని కొడుకును, కర్షుడిని ఖు థి లూ గస్తీ 1 ఈ ఫభ ళం గట్టిగా మందలించ లేదు; ప్రతిపాదనను తక్షణమే పూర్తిగా తిరస్కరించలేదు. 'మతిమంతులతో విచారించి చేయుదము' అన్నాడు. భీష్మద్రోణ విదురాదులను పిలిపించాడు. యుద్ద (ప్రతిపాదన కార్యరూపం దాల్చి, సఫలం కావాలంటే భీష్మద్రోణ విదురాదుల సహకారం కావాలి. భీష్మ (ద్రోణులకు (ద్రుపదుడు ఇష్టుడు కాదు. అందుకు ఎవరి కారణం వారికి ఉన్నది. కాబట్టీ భీష్మ ద్రోణులు అంగీకరిస్తే యుద్ద ప్రతిపాదన బాగా సఫలమౌతుంది. కొడుకులకు గొప్పగా లాభిస్తుంది. లేకుంటే ఆ పెద్దలే కర్షదుర్యోధనులకు బుద్ది చెపుతారు. తాను అప్రియంగా మాట్లాడవలసిన అవసరం తప్పుతుంది. ఆ దుడుకు యువకుల అసంతృప్తిని, ఆ(గ్రహాన్ని

ఆ పెద్దలే పంచుకాంటారు.

మత్తకోకిల. ధీరు లౌ ధృతరాష్త్రపాండు అతి ప్రశస్త గుణుల్‌ ప్రసి ద్ధోరుకీర్తులు; నాకు నిద్దటు నొక్కరూప; తలంపంగా వీరు వారను నట్టిబుద్ధివిభేద మెన్నడు లేదు గాం ధారిపుత్రశతంబునందు! బృథాతనూజులయందునున్‌. 29

ప్రతిపదార్థం: ధీరులు+బౌ= ధైర్యవంతు లైన; ధృతరాష్ట్ర, పాండులు; అతి, ప్రశస్త, గుణుల్‌= మిక్కిలి శ్రేష్టము లైన గుణాలు

కలవారు; ప్రసిద్ధ+ఉరు, క్షీర్తులు= ప్రసిద్ధ మైన గొప్ప కీర్తి కలవారు; ఇద్దజున్‌; నాకున్‌, ఒక్కరూపు+అ= ఒక్కవిధమే; గాంధారి, పుత్ర శతంబు, అందున్‌= గాంధారియొక్క కొడుకులు నూరుగురి లో; పృధా, తనూజాల, అందునున్‌= కుంతీదేవికొడుకులలో; వీరు; వారు; అనునట్టి; బుద్ది, విభేదము= బుద్ధిలో భేద భావం; ఎన్నడు; లేదు.

తాత్సర్యం:; ధైర్యవంతులు, మిక్కిలి (శ్రేష్టమైన గుణాలు కలవాళ్ళు, ప్రసిద్ధ మైన గొపు క్తీర్తి కలవాళ్ళు అయిన

ధృతరాష్ట్ర పాండురాజు లిద్దరూ నా కొక్కటే. గాంధారి కొడుకులలో, కుంతి కొడుకులలో వీళ్ళు వాళ్ళు అ

భేదభావం నాకెన్నడూ లేదు.

విశేషం: వృత్తలక్షణానికి చూడు: ఆది. 1.153 విశేషం.

భీష్మద్రోణులు దుర్యోధనునకు బుద్ది సెప్పుట (సం - 1-195-1)

వ. అ ప్పాండవులతోడి విగ్రహంబుసేంత కెన్నండును నొడంబడనేర6 బితృపైతామహం బయిన రాజ్యంబునకు నీయట్ల వారు నర్హులు; గావున వారికీ నర్థరాణ్యం బిచ్చిన నీకును నీ బాంధవులకును లోకంబులకును ్రరుం బగు; నట్లు గానినాం డపకీర్తి యగు ర్తి నిలుపుటయ కాదె రాజులకు జన్మఫలంబు.

; జస లేను; ప్రతిపదార్థం: ఆ+పాండవులతోడి; విగ్రహంబు, చేతకు= యుద్ధంచేయటానికి; ఎన్నండును; ఒడంబడనేరన్‌= సమ్మతింఛ ళ్‌ పితృ, పైతామహంబు+అయిన= తండ్రితాతలకు సంబంధించిన; రాజ్యంబునకు; మీ, అట్ట వారున్‌; అర్హులు; కావున; వారల గ అర్హ రాజ్యంబు; ఇచ్చిన; నీకును; నీ, బాంధవులకును; లోకంబులకును; ప్రియంబు= సంతోషం; అగున్‌; అట్టు, కాని, నాడ; అపకీర్తి; అగున్‌; కీర్తి నిలుపుటయకాదె; రాజులకు; జన్మ ఫలము.

780 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: ఆ పాండవులతో యుద్దం చేయటానికి నేను ఎన్నడూ సమ్మతించను. తండ్రితాతల రాజ్యానికి మీవలెనే

వాళ్ళు అర్హులు. కాబట్టి వాళ్ళకు సగం రాజ్యం ఇస్తే నీకూ, నీ చుట్టాలకూ, లోకాలకూ సంతోషం కలుగుతుంది.

అట్లా కాకపోతే అపకీర్తి కలుగుతుంది. కీర్తి నిలపటమే రాజులకు జన్మఫలం.

ఆ. కీర్తిలేని వానికిని జీవనంబు ని । రర్జకంబ చూవె! యపనిమీంద నిత్య మయిన ధనము నిర్మల కీర్తియ; ।; యతి కీర్తి వదయు టశ్రనుంబె? 31

(ప్రతిపదార్థం: కీర్తిలేనివానికిని; జీవనంబు= (బ్రదుకు; నిరర్హకంబజ వ్యర్థమే; చూవె=ఐ సుమా; అవనిమీంద= భూమిమీద;

నిత్యము+అయిన= శాశ్వత మైన; ధనము; నిర్మల; క్తీర్తఅ= స్వచ్చమైన కీర్తి మాత్రమే; అట్టి; కీర్తి పడయుట= పొందుట" అశ్రమంబె=

సులభమా?

తాత్పర్యం: కీర్తి లేనివాని బ్రతుకు వ్యర్థమే. భూమిమీద శాశ్వత మైన ధనం స్వచ్చమైన కీర్త. అట్లాంటి కీర్తిని

పొందటం సులభమా?

విశేషం: నన్నయ రుచిరార్దసూక్తులలో కీర్తిని గూర్చిన సూక్తి ఇది.

క. _ ఇలంగీర్తియెంత కాలము : గలిగి ప్రవర్తిలై నంతకాలంబును ని త్యుల కారె కీర్తి గల పు । ణ్యులు; కీర్తివిహీను6 డెందునుం బూజ్యుండే 32

ప్రతిపదార్థం: ఇలను= భూమిమీద; కీర్తి ఎంతకాలము; కలిగి; 'ప్రవర్తిల్లైన్‌= ఉంటుందో; అంత, కాలంబును; కీర్తి కల, పుణ్యులు=

కీర్తి గల పుణ్యాత్ములు: నిత్యులు= శాశ్చుతంగా ఉండేవాళ్ళు; కారె?; కీర్తి విహీనుండు= కీర్తిలేనివాడు; ఎందునున్‌= ఎక్కడైనా; పూజ్యుండే= పూజింపతగినవాడా? (కాడని భావం).

తాత్సర్యం: లోకంలో కీర్తి ఎంత కాలం నిలిచి ఉంటుందో, క్షీర్తిమంతు లైన పుణ్యాత్ములు అంత కాలం జీవించి

ఉంటారు. కీర్తి లేనివాడు ఎక్కడైనా పూజార్హు డవుతాడా?

వ. 'కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు గావున, నపకీర్తి పరిహరించి, కీర్తింబ్రతిప్టించి, పైతృకం బగు రాజ్యంబు పాండవుల కిచ్చి, వారితోడ బద్ధప్రణయుండ వయి కీర్తి నిలుపు' మనిన భీష్ముపలుకులకు సంతసిల్లి ద్రోణుండు దుర్యోధనున కి ట్లనియె. 33

ప్రతిపదార్థం: క్షీర్తియున్‌; అపకీర్తియు; జనులకు; స్వర్గ, నరక, నిమిత్తంబులు= స్వర్గానికి, నరకానికి కారణాలు; కావున; అపకీర్తిన్‌=

చెడ్డపేరును; పరిహరించి= వదలి; కీర్తిన్‌= మంచిపేరును; ప్రతిష్టించి= నిలుపుకొని; 'పైతృకంబు+అగు= తండ్రివలన వచ్చిన దైన: రాజ్యంబు; పాండవులకు+ఇచ్చి; వారితోడ; బద్ద, ప్రణయుండవు+అయి= చేయబడిన స్నేహం కలవాడ వై; కీర్తి నిలుపుము; అనిన; భిష్ము, పలుకులకు; సంతసిల్లి; ద్రోణుండు; దుర్యోధనునకు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: "కీర్తి మానవులకు స్వర్గ కారణం. అపకీర్తి నరక కారణం. అందువలన అపకీర్తిని వదలి కీర్తిని

నిలుపుకొమ్ము. వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యం పాండవుల కిచ్చి వాళ్ళతో స్నేహంగా ఉండి కీర్తిని నిలుపుము'

అని భీష్ముడు అనగా, ఆయన మాటలకు సంతసిల్లి (ద్రోణుడు దుర్యోధనునితో ఇట్లా అన్నాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 781

చ. బహుగుణ ముత్తమోత్తమము పథ్యము ధర్వము సాధుసమ్మతం

బహితి బలప్రమాధివిపులార్థ్ణయుతం బగుటన్‌ భవత్పితా

మహువచనంబుం జేకొనముము; మానుగ వారలతోడ నీవు వి

గ్రహ మొనరింప నేమిటికిం గౌొరవసౌబలకర్ణశిక్షలన్‌. 3౩4 ప్రతిపదార్థం: బహు, గుణము= అనేకవిధాల మంచి దైనది; ఉత్తమ+ఉత్తమము= మహా శ్రేష్ట మైనది; పథ్యము మేలు చేసేది; ధర్మ్య్యము= ధర్మ మైనది; సాధు, సమ శ్రతంబు= సజ్జనులకు ఇష్ట మైనది; అహిత, బల, (ప్రమాధి= శత్రుబలాన్ని చంపటానికి తగినది; విపుల+అర్ధ, యుతంబు= అధిక మైన ప్రయోజనంతో కూడినది; అగుటన్‌; భవత్‌*పితామహు, వచనంబు= నీ తాత అయిన భిష్మునిమాటను; మానుగజ చక్కగా; చేకొనుము= (గ్రహించుము. నీవు; కౌరవ, సౌబల, కర్ణ, శిక్షలన్‌= కౌరవులయొక్క, శకునియొక్క, కర్ణునియొక్క ఉపదేశాలతో: వారలతోడ= పాండవులతో; విగ్రహము= యుద్ధం; ఒనరింపన్‌= చేయటం ఏమిటికిన్‌= ఎందుకు? తాత్పర్యం: నీ తాత భీష్ముని మాట అనేక విధాల మంచిది, మిక్కిలి (శ్రేష్టమైనది. మేలు చేసేది. ధర్మమైనది.

న్స్‌

సజ్జనులకు ఇష్టమైనది, శత్రు బలాన్ని అణచేది. అధిక మైన లాభం కలది, అందువలన ఆయన మాట స్వకరించుము. కౌరవులు, శకుని, కర్టుడు చెప్పే మాటలు విని నీవు పాండవులతో యుద్దం చేయటం ఎందుకు? విశేషం: కౌరవ శబ్దాన్ని దుర్యోధనుని గురించిన సంబోధనగా కూడా (గ్రహించవచ్చు. భీష్ముని వాక్యాలు నిర్దేశాత్మకంగా, సూటిగా ఉన్నాయి. (ద్రోణుని మాటలు నిషేధాత్మకమార్గంలో నడిచాయి. ఉభయుల స్వభావాలు వాళ్ళ మాటలలో (ప్రతిఫలించాయి. మ. _ విలసద్ధర్మవిశుద్ధవృత్తులు వయోవృద్ధుల కుశాగ్రీయబు

ద్ధులు మధ్యస్థులు కార్యనిరయసమర్థుల్‌ మానమాత్సర్యదూ

రులు నాం జాలినవారిపల్ములకు బైరుద్ధ్యంబు గావించున

జ్ఞులు భూనాథున కాస్తులున్‌ సఖులు నై శోషింతు రత్యంతమున్‌. 3క్‌ (ప్రతిపదార్హం: విలసత్‌*ధర్మ, విశుద్ద, వృత్తులు= (ప్రకాశించేటటువంటి ధర్మంతో పరిశుద్ద మైన నడవడి గలవాళ్ళు; వయోవృద్దుల్‌= వయస్సులో పెద్దవాళ్ళు ; కుశాగ్రీయ, బుద్దులు= దర్భకొనలవంటి పదు నైనబుద్దికలవాళ్ళు: మధ్యస్థులు= పక్షపాతం లేనివాళు కార్య, నిర్ణయ, సమర్భుల్‌= చేయ దగిన పనిని నిర్ణయించటంలో నిపుణులు; మాన, మాత్సర్య, దూరులు= కోపానికి, మాతు . దూర మ్రైనవాళ్ళు; నాన్‌+చాలిన= అని అనదగిన; వారి; పల్కులకు; వైరుద్ద్యంబు= విరోధాన్ని; కావించు; అజ్ఞలు= అవి లు భూనాధునకు= రాజుకు; ఆస్తులున్‌= చుట్టాలూ; సఖులున్‌+ఐ= స్నేహితు లై; అత్యంతమున్‌= మిక్కిలి; శోషింతురు= చెడగొడతారు. తాత్పర్యం: ధార్మికులు, వృద్దులు, బుద్ధిబలం కలవాళ్ళు, పక్షపాతం లేనివాళ్ళు, చేయ దగిన దానిని నిర్ణయించటంలో సమర్భు లైనవాళ్ళు, కోపం, మాత్సర్యం లేనివారు అని చెప్పదగినవాళ్ళ మాటలను కాదనే అవివేకులు- రాజుకు అప్పులు, స్నేహితు లై అతడిని చెడగొడతారు. విశేషం: మతిమంతుల మాటలను కాదనే అవివేకులను ప్రభువు స్నేహితులుగా గౌరవించరాదని ధ్వని. చ. తనరుచు దైవయుక్తి మెయి ధర్హువు సత్యము దప్పకున్నయ

య్యనఘుల పైతృకం బయిన యంశము మిన్నక వజ్రపాణి కై

ననుగొనంబోలునయ్య కురునందన! పాండుతనూజు లున్న వా

రని విని వారికిం దగు ప్రియం బొనరింపక యున్మి ధర్మువే? 36

782 శ్రీమదాంధ్ర మహాభారతను (ప్రతిపదార్థం: దైవయుక్తిమెయిన్‌= దైవయోగంచేత: తనరుచు= ఒప్పుతూ; ధర్మువు, సత్యమున్‌: తప్పక+ఉన్న: ఆ+అనఘుల= ఆ పాపరహితు లైన పాండవులయొక్క; పైతృకంబు+అయినజ తండ్రి దైన; అంశముజ= భాగం; మిన్నక= ఊరక; కొనన్‌= తీసికొనటానికి; వజ్రపాణికి+ఐనను= దేవేంద్రుని కైనా; పోలును+అయ్య= సాధ్య మగునా? కురునందన= కురువంశ కుమారా! ఓ దుర్యోధనా!; పాండు, తనూజులు= పాండవులు; ఉన్న, వారు+అని= సుఖంగా ఉన్నా రని; విని; వారికిన్‌; తగు; ప్రియంబు= సంతోషకర మైన పని; ఒనరింపక= చేయక; ఉనికి= ఉండటం; ధర్మువే= ధర్మమా? (కాదని భావం). తాత్పర్యం: దైవయోగంవలన వెలుగుతూ- ధర్మాన్ని, సత్యాన్ని తప్పుని పుణ్యాత్ము లైన పాండవుల తండ్రి భాగాన్ని ఊరకే తీసికొనటం ఆ వజ్రాయుధు డైన దేవేం[ద్రునికి కూడా సాధ్యం కాదు. దుర్యోధనా! పాండవులు సుఖంగా జీవించి ఉన్నా రని విని, వాళ్ళకు సంతోష కర మైన పని చేయకుండటం ధర్మమా? విశేషం: పాండవులకు వచ్చే రాజ్యభాగాన్ని నిష్కారణంగా అపహరించటానికి దేవేంద్రుని కైనా సాధ్యంకాదని చెప్పటంలో (ద్రోణుని సత్యప్రతిపాదనం ఎంత కనపడుతున్నదో నిర్మాగమోటంకూడా అంతే స్పష్ట మౌతున్నది, పాండవులను చంపటానికి యత్నించికూడా, వాళ్ళు (బ్రతికారని తెలిసినప్పుడు గౌరవించకుండా ఉండటం అధర్మమని ముఖం మీద (గ్రుద్దినట్టు విప్ర స్వాభావికంగా చెప్పారు. వ. 'వారితో విగ్రహిాంచుట కార్యంబు గాదు; 'కావునం బాండవద్రుపదధృష్టద్యున్నుకుంతీద్రౌాపదులకు6

బ్రయపూర్వకంబున నుచితభూషణాంబరావళులు వేజు వేఐ యిచ్చిపుచ్చి, పాండవుల నిందులకు.

అగి ట్య ను! ఆస

దోడ్కొనివచ్చువారుగా దుశ్యాసనవికర్హప్రభృతులసమకట్టి పంపు' మనిన ద్రోణుపలుకు లవకర్ణించి కర్టుం డి

టనియె. 37 (ప్రతిపదార్థం: వారితో; విగ్రహించుట= యుద్ధంచేయటం; కార్యంబు= చేయదగిన పని; కాదు; కావునన్‌; పాండవ, (ద్రుపద, ధృష్టద్యుమ్ను, కుంతీ, (ద్రాపదులకున్‌; ప్రియ, పూర్వకంబునన్‌= స్నేహపూర్వకంగా? ఉచిత, భూషణ+అంబర+ఆవళులు= తగినసొమ్ములయొక్క, వస్తాలయొక్క: సమూహాలను; వేయు, వేజ; ఇచ్చి, పుచ్చి= ఇచ్చిపంపి; పాండవులన్‌; ఇందులకున్‌; తోడ్కొనివచ్చువారుగా= పిలుచుకొనివచ్చేవాళ్ళుగా; దుశ్శాసన, వికర్ష, ప్రభృతులజ= దుశ్శాసనుడు, వికర్షుడు మొదలైనవాళ్ళని; సమకట్టి= సిద్ధంచేసి; పంపుము; అనిన; (ద్రోణు, పలుకులు; అవకర్షించి= పెడ చెనిని పెట్టి; కర్చుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: 'పాండవులతో యుద్ధం చేయటం తగని పని. అందువలన పాండవులకు, (ద్రుపదునికి, ధృష్ట ద్యుమ్నుడికి, కుంతీదేవికి, ద్రౌపదికి స్నేహపూర్వకంగా తగిన సొమ్ములను, వస్త్రాలను వేర్వేర ఇచ్చి పంపి, పాండవులను ఇక్కడికి పిలిచికొని రావటానికి దుశ్ళాసనుడు, వికర్టుడు మొదలైనవాళ్ళని సిద్ధంచేసి పంపుము” అని అనగా (ద్రోణుని మాటలు 'పెడచెవిని పెట్టి కర్షుడు ఇట్టా అన్నాడు.

ల! ల.

విశేషం: భీష్మద్రోణులు చేసిన తొలి సంధి ప్రయత్నం ఇది. భీష్ముడు అర్ధరాజ్యప్రతిపాదనను కూడా మొదటిసారి ఈ ఘట్టంలోనే చేశాడు. భీష్మడు కీర్తి అపకీర్తులను నిరూపించి వ్యంగ్యంగా పాండవ కౌరవ తారతమ్యానుశీలనం చేశాడు. ద్రోణుడు భీష్ముడిని సమర్థించి శకుని కర్షుల బోధలను అధిక్షేసించి, పాండవపరా(క్రమాన్ని కీర్తించి వాస్తవాలను వాచ్యం చేశాడు. దుర్యోధనుడు కర్థ్ణాదుల చెప్పుడు మాటలవలన చెడిపోతున్నట్టు ద్రోణుడు చెప్పటంతో కర్టుడు కోపగించి అధిక్షేపిస్తూ వాదానికి దిగాడు. తే. ముదుసళులు దన కిమ్ముగాం జదివికొంద్రు । గాక పతులకు హిత మగు కర్ణ మేల

యొలసి చెప్పదు? రహితుం గలపి కొనుట । ధర్ము వని; రిది నయ విరుద్ధంబు గాదె? 38 ప్రతిపదార్థం: ముదుసళులు= ముసలి వారు; తమకున్‌; ఇమ్ముగాన్‌= అనుకూలంగా; చదివికొండ్రు, కాకజు చెప్పుదురుగాని; పతులకుజ రాజులకు; హితము+అగు= మేలగు; కర్టంబు= కార్యం; ఏల; ఒలసి= పూనుకొని; చెప్పుదురు; అహితులన్‌= మేలుకోరనివారిని- శత్రువులను; కలిపికొనుట: ధర్మువు; అనిరి; ఇది; నయ, విరుద్దంబు= న్యాయానికి విరుద్ధ మైనది; కాదె.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 783 తాత్పర్యం: ముసలివాళ్ళు తమకు అనుకూలంగా ఉండేటట్టు చెప్పుతారు కాని రాజులకు మేలు కలిగేటట్టు చెప్పరు. శత్రువు లైన పాండవులను చేర్చుకోవటం ధర్మం అన్నారు. ఇది న్యాయ విరుద్దం కాదా? విశేషం: భీష్మాదులకు కర్ణాదులకు వాదుపెట్టే ఈ సన్నివేశాన్ని ధృతరా(్ర్రుడే (సం)కల్పించాడు. ఇరువర్గాల విభిన్నమతాలకు సంఘర్షణ గమ్యమానమౌతుంది ఇక్కడ. ధార్తరా(ష్త్రులకు పాండవు లహితులని కర్షుడు బహిర్గతంగా ప్రకటించాడు. భిష్మాదులు మనసులో ఒకటిపెట్టుకొని పైకి మరొకటి మాట్లాడే అహితులైన అమాత్యులవంటివాళ్ళని వ్యాఖ్యానించాడు. దుర్యోధనుడిని మెప్పించే ప్రియమే ధర్మమని వాదించి తన మి(త్రత్వాన్ని ప్రకటించుకొంటున్నాడు కరుడు. నిందకు ప్రతినింద ఈ వాక్య సముదాయం.

వ. “మంత్రులు దను తమ బుద్ధి దోషంబుల నెట్లునుం బలుకుదురు. వారల సాధుత్వంబును నసాధుత్వంబును నెలుంగవలయు; నెట్లనినం దొల్లి నితంతు వను మగధరాజు వికలేంద్రియవర్లుం దయి శ్వాసమాత్రంబ తక్కి రాజ్యతంత్రంబునం దసమర్థుం డై యున్న నాతనిమంత్రి యేకప్రధానుం డయి రాజ్యతంత్రం బెల్లం దనవశంబ యగుటంజేసి వాని నవమానించి తదీయరాజ్యవిభవం బెల్లం జేకొనియె; వాండును విక్రమహీనుం డయి మాకుం జూడ నహితంబు' లనిన నలిగి వానికి ద్రోణుం డి టనియె. 39

ప్రతిపదార్థం: మంత్రులు; తమతమ, బుద్ధి, దోషంబులన్‌= తమతమ మనస్సులలోఉండే కల్మషాలను; ఎట్టునున్‌= ఎట్టయినా; పలుకుదురు; వారల; సాధుత్వంబును= మంచితనాన్ని; అసాధుత్వంబును= చెడుతనాన్ని; ఎజుంగవలయున్‌= తెలిసికొనాలి; ఎట్టు; అనినన్‌: తొల్లిఐ పూర్వం; నితంతువు+అను; మగధరాజు; వికల+ఇంద్రియ, వర్షండు+అయి= చెడిన ఇం(ద్రియాల సమూహం కలవా డై శ్వాస, మాత్రంబు= ఊపిరిమాత్రమే; తక్కి= మిగిలి; రాజ్య, తంత్రంబు, అందు= రాజ్యపరిపాలనలో; అసమర్జ్హుండు+ఐ= నేర్పులేని వాడై; ఉన్నన్‌= ఉండగా; అతని: మంత్రి; ఏక ప్రధానుండు+అయి= ఒక్కడే ముఖ్యుడై: రాజ్య, తంత్రంబు+ఎల్లన్‌= రాజ్య పాలన అంతా? తన, వశంబ; ఆగుటన్‌+చేసి; వానిన్‌= ఆ నితంతుమహారాజును; అవమానించి; తదీయ; రాజ్య, విభవంబు+ఎల్లన్‌= “రాజ్య సంపద నంతా; చేకొనియె; వాడును; విక్రమ, హీనుండు+ఆయిజ పరా[క్రమం లేనివా డై: రాజ్యంబు; కోల్పడియెన్‌= కోల్పోయెను; కావున; మంత్రులు; హితులపోలెన్‌+ఉండి= మేలుకోరేవాళ్ళ వలె కనిపించి; అహితంబు= కీడు; ఆచరింతురు= చేస్తారు; మీ, ఇద్దణ, పలుకులు; మాకున్‌; చూడన్‌: అహితంబులు= కీడు చేసేవి; అనిన; ద్రోణుండు; అలిగ్గి= కోపించి; వానికి= కర్టుణికి(కర్చుడితో); ఇట్టు+అఆనియె.

తాత్పర్యం: “మంత్రులు తమమనస్సులో కల్మషం ఉంచుకొని ఏదో విధంగా మాట్లాడుతారు. వాళ్ళ మంచితనాన్ని,

చెడ్డతనాన్ని తరచి తెలుసుకోవాలి. పూర్వం నితంతువు అనే మగధరాజు-శక్తి సన్నగిల్లి, ఇంద్రియాలు చెడి,

ఊపిరిమాత్రమే మిగిలి రాజ్యపాలనలో అసమర్హు డై ఉండగా, అతని మంత్రి తా నొక్కడే ప్రాధాన్యం వహించి, రాజ్య పాలన నంతా తన వశం చేసికొని, నితంతు మహారాజును (త్రోసిపుచ్చి, అతని రాజ్య సంపద నంతా (గ్రహించాడు.

ఆ రాజు పరాక్రమ హీను డై రాజ్యాన్నే కోల్పోయాడు. ఈ విధంగా మంత్రులు మేలుకోరేవాళ్ళవలెనే ఉండి,

కీడు చేస్తారు. మీ ఇద్దరి మాటలూ మాకు కీడు చేసేటటువంటివి' అని అనగా, (ద్రోణుడు కోపించి, కర్షుణితో

ఇట్టా అన్నాడు.

విశేషం: భీష్మద్రోణులు కర్ణుని యుద్ద ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. పైగా భీష్ముడు అర్ధ రాజ్య ప్రతిపాదన చేశాడు.

దాన్ని (ద్రోణుడు బలపరిచాడు... విశేషించి - పాండవులను, (ద్రుపద ధృష్టద్యుమ్ను కుంతీ దద్రాపదులను విలువైన కానుకలిచ్చి

గౌరవించండని అంటున్నాడు. కయ్యానికి కాలుదువ్వే కర్టుని భావావేశ ప్రవాహానికి పెద్దబండ అడ్డుపడ్డది. అతని భావావేశం ప్రక్కకు తిరుగక తప్పదు. అందుకే అతడు తన కనుకూలమైన నీతులవైపు మళ్ళాడు. భీష్మ ద్రోణుల మీద విరుచుకు పడ్డాడు. వాళ్ళే చిత్తశుద్ధిని, విశ్చసనీయతను ధృతరాష్ట్ర దుర్యోధనులు శంకించేటట్టు నేర్పుగా నీతులను సమన్వయించాడు.

784 శ్రీమదాంధ్ర మహాభారతము క. ఉడుగక యే మహితముం బలి । కెడు వారము; నీవు హితవు క్రియ గొనణగా బ

ల్కెడు వాండవు; మాకంటెను ; గడు హితుండవు నీవ కావె కౌరవ్యులకున్‌. 40 ప్రతిపదార్హం: ఉడుగకజ మానక; మేము; అహితమున్‌= మేలుకాని దానిని; పలికెడు, వారము; నీవు; హితవు; క్రియ కొనంగాన్‌= ఫలించేటట్టు: పల్కెడువాండవు; కౌరవ్యులకున్‌= కౌరవులకు; మాకంటెను; నీవ, కావె= నీవే కదా; కడు, హితుండవు= మిక్కిలి మేలుకోరేవాడివి. తాత్పర్యం: మేము చెడు చెప్పేవాళ్ళమా? నీవు హితం చెప్పేవాడివా? కౌరవులకు మా కంటె నీవే హితుడవా? విశేషం: కాకువుతో చేసే అధిక్షేపోక్తికి ఈ పద్యం చక్కని ఉదాహరణం. కర్షుని అధిక్షేపానికి ద్రోణుని ప్రత్యాఖ్యానం. కు నీకణపుల నిక్కురుకుల । మాకులతం బొందు టేమి యాశ్చర్యము? సౌ

మ్యాక్చతులు గానివారల । వాకులు శిక్షలు నుపద్రవంబుల కావే! శ (ప్రతిపదార్ధం: నీ, కటపులన్‌= నీ బోధనలవలన; ఈ+కురు, కులము; ఆకులతన్‌= కలతను; పొందుట; ఎమి; ఆశ్చర్యము; సౌమ్య+ఆకృతులు= శాంత మైన ఆకారం కలవాళ్ళు; కాని, వారల, వాకులు, శిక్షలున్‌= కానట్టివారలయొక్క మాటలు, ఉపదేశాలు; ఉపద్రవంబులు+అ, కావే=ఐ హానికరాలే కదా! తాత్సర్యం: నీ ఉపదేశాలవలన ఈ కురుకులం కలత పొందటం ఆశ్చర్యం కాదు. శాంత మైన అకారం లేని వాళ్ళ మాటలు, ఉపదేశాలు కీడునే కలిగిస్తాయి కదా! విశేషణ: అలంకారం:- అర్జాంతరన్వాసం. వ అనుచున్న సమయంబున నయ్యిద్దణ వారించి విదురుండు ధృతరాష్తున కి ట్లనియె. త2 ప్రతిపదార్థం: అనుచు+ఉన్న, సమయంబునన్‌; ఆ+ఇద్దజ= ఆ ('ద్రోణకర్ణులను; వారించి= ఆపి; విదురుండు; ధృతరాష్షునకు; ఇట్టు+అనియె. తాత్సర్యం: అని అంటూ ఉన్న సమయంలో ఆ ద్రోణ కర్ణుల నిద్దరినీ ఆపి, విదురుడు ధృతరాస్ర్రునితో ఈ విధంగా అన్నాడు. లే జి సీ. ధర్మార్థవిత్తముల్‌ తథ్యవాదులు వయో । వృద్ధులు మధ్యస్థవిమలమతులు

ద్రోణగాంగేయులు దురితవిదూరులు । ని న్నెద్దిగణపిరి నెమ్మితోడ

చానిన చేయుట ధర్మువు; వారల । కంటె హితుల్‌ నీకుం గలరె యొరులు;

దుర్యోధనుండును దుశ్నాసనుండును । గర్జుండు శకునియు6 గరము బాలు; ఆ. రెజుంగ రిదియు ధర్ము విది యధర్శ్మం బని; । యట్టివారిపలుకు లాచరించి

వినక పాండుసుతుల వేగ రావించి వా । రలకుం బ్రీతి నర్ధరాజ్య మిమ్ము 43 ప్రతిపదార్థం: ధర్మ+అర్థ, విత్తముల్‌= ధర్మమును, అర్ధమును తెలిసినవాళ్ళలో (్రేష్టులు: తథ్య, వాదులు= నిజం చెప్పేవాళ్ళు; వయోవృద్దులు=ఐ వయస్సులో పెద్దవారు; మధ్యస్థ, విమల, మతులు= పక్షపాతం లేని నిర్మల మైన బుద్దికలవాళ్ళు: దురిత, విదూరులు= పాపానికి దూర మైనవాళ్ళు; ద్రోణ, గాంగేయులు= (ోణభీష్ములు: నిన్ను; నెమ్మితోడ= (ప్రేమతో; ఎద్ది; కజపిరి= బోధించారో; దానిన్‌+అజ దానినే; చేయుట; ధర్మువు; వారలకంటె; హితుల్‌= మేలుకోరేవాళ్ళు; నీకున్‌; ఒరులు= ఇతరులు; కలరె= కలరా?

ఆదిపర్వము - అష్టమాశ్వానను 7855 దుర్యోధనుండును; దుళ్ళాసనుండును; కర్టుండు; శకునియున్‌; కరము= మిక్కిలి; బాలురు= అజ్ఞానులు; ఇదియు, ధర్మువు= ఇది ధర్మం; ఇది, అధర్మంబు; అని; ఎజుంగరు; అట్టివారి, పలుకులు; ఆదరించి; వినక; పాండుసుతులన్‌; వేగ= వేగమే; రావించి= రప్పించి; ప్రీతిన్‌= (ప్రేమతో; అర్హ రాజ్యము; ఇమ్ము. తాత్పర్యం: ధర్మార్జాలను తెలిసినవాళ్ళలో (శ్రేష్టులు, సత్యం చెప్పేవాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు, పక్షపాతం లేని నిర్మల బుద్ధి కలవాళ్ళు, పుణ్యాత్ములు అయిన (ద్రోణ భీషు శలు నీ కేది ఉపదేశించారో దానిని చేయటమే ధర్మం. ఆ యిద్దరి కంటె నీ మేలు కోరేవాళ్ళు ఇం కెవ రున్నారు? దుర్యోధనుడు, దుళ్ళాసనుడు, కర్డుడు, శకుని చాలా అవివేకులు. ఇది ధర్మ మనీ, ఇది అధర్మ మనీ వాళ్ళకు తెలియదు. అట్టాంటివాళ్ళమాటలు వినక పాండవులను

వెంటనే రప్పించి ప్రేమతో అర్హరాజ్యాన్ని ఇమ్ము. విశేష: ధర్మార్థవిత్తముల్‌- అనేసమాసంలో 'అర్హ' శబ్దానికి ప్రయోజనం అనే అర్జాన్ని (గ్రహించాలి. (ద్రోణ, భీష్ములు ధర్మాన్నే కాక నీకు ఏది ప్రయోజనకరమో అదికూడా తెలిసినవా ళృని భావం. విదురుడి వాక్యాలను తర్కబద్దంగా నిబంధించటం ఇక్కడ గమనింపదగిన విశేషం. పాత్ర ఒక అంళంమీద దీర్హసంభాషణం చేసేటప్పుడు నన్నయ తర్కశళాస్త్రసంబంధా లైన అంశాలను పొందుపరచటం సహజంగా కనపడుతుంది. ప్రమాణాది షోడళపదార్జాలు న్యాయశాస్త్రం పరిశీలించేవి. (ప్రమాణ ప్రమేయ సంశయ (ప్రయోజన దృష్టాంత సిద్దాంతావయవ తర్క నిర్ణయవాద జల్పవితండాహేత్వాభాసచ్చల జాతి ని(గ్రహస్థ్రానానాం తత్త్యృజ్ఞానా న్నిశ్రేయసాధిగమ:” అని న్యాయసూత్రం. ఈ పద్యంలో యథార్ధ జ్ఞానాన్ని కలిగించే (ద్రోణ గాంగేయుల వాక్యాలు (ప్రమాణాలు. కర్ణాదుల వాక్యాలు అప్రమాణాలు. పాండవులను రావించి అర్హరాజ్యం ఇమ శ్రైనటం యధార్హజ్ఞాన విషయ మైన 'ప్రమేయం.(సంపా.) మ. తమకుం దార యజేయు లెవ్వరికి దోర్దర్చంబునన్‌; దానిపై శమితారాతి బలుండు వారలకు. బాంచాల ప్రభుం డిప్లు సు ట్టము దానయ్యె4 దదాత్మజుండయిన ధృష్టద్యుమ్నుడున్‌ వారితో సమవీర్యుం డొడంగూడె నిష్ట సఖుం డై సంబంధ బంధంబునన్‌. శశ జయింపసాధ్యంకానివాళ్ళు; దానిపై; శమిత+అరాతి, బలుండు= అణగించబడిన శత్రుబలం కలవాడు; పాంచాల, ప్రభుండు= పాంచాలరా జైన ద్రుపదుడు; ఇపుడు; వారలకున్‌? తాను; చుట్టము; అయ్యెన్‌; తత్‌+ఆత్మజుండు+అయిన= అతనికుమారు డైన; ధృష్టద్యుమ్నుడున్‌; వారితో; సమ, వీర్యుండు= సమాన మైన బలం కలవాడు; సంబంధ, బంధంబునన్‌= బంధుత్వ మనే కట్టుచేత; ఇష్ట సఖుండు+ఐ= అస్తు డైన స్నేహితు డై ఒడన్‌+కూడెన్‌= చేరాడు. తాత్పర్యం; పాండవులు తమంతట తామే ఎవరికీ జయింప శక్యం కాని వాళ్ళు. మీదుమిక్కిలి శత్రువు అందరినీ అణచిన మహాబలవంత్తు డైన పాంచాలరాజు వాళ్ళకు ఇప్పుడు చుట్టం. అతని కుమారుడు ధృష్టద్యుమ్నుడు ఉ [న పాండవులతో సమాన మైన పరాక్రమం కలవాడు, బాంధవ్య బంధంవలన ఇష్ట మిత్రు డై వాళ్ళతో చేరాడు. మ, బలదేవాచ్యుతసాత్యకుల్‌ దమకు నొప్పన్‌ మిత్రులుం గూర్చు మం త్రులుంగా దైవము మానుషంబుం గల నిత్యుల్‌, నీకు దుర్యోధనా దులకంటెం గడుభక్తు లెంతయు వినీతుల్‌, వీరు లప్పాందుపు న ్ష్‌ 45 త్తులు నీపుక్తుల కారె! వారిం దగునే దూరస్థులం జేయంగన్‌.

786 శ్రీమదాంధ్ర మహాభారతను (ప్రతిపదార్థం: బలదేవ+ఆచ్యుత, సాత్యకుల్‌= బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి; తమకున్‌= పాండవులకు" కూర్చు= ప్రియ మైన; మంటత్రులున్‌+కా; దైవము= దైవబలం; మానుషంబున్‌= మానవబలం; కల= కలిగిన; నిత్యుల్‌= నిలుకడకలవాళ్ళు:; నీకు; దుర్యోధన+ఆదులకంటెన్‌= దుర్యోధనుడు మొదలైనవాళ్ళకంటె; కడు= మిక్కిలి; భక్తులు: ఎంతయు; వినీతులు= వినయం కలవాళ్ళు; వీరులు; ఆ+పొండు,పుత్రులు; నీ, పుత్రులు; కారె?; వారిన్‌; దూరస్టులన్‌= దూరంగా ఉన్నవాళ్ళగా: చేయంగన్‌; తగునె తాత్పర్యం: బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి పాండవులకు మిత్రులు, ప్రియమండత్రులు. ఆ విధంగా దైవ బలం మానవ బలం కూడి, నిలుకడ కలిగి, నీ పట్ట దుజ్యోధనాదులకంటె భక్తి వినయాలు కల పాండవ వీరులు నీకు పుత్రులు కారా? వాళ్ళని దూరం చేయటం తగునా? విశేషం: “పాండుపుత్రులు నీ పుత్రులు కారె? వారి తగునే దూరస్టులన్‌ చేయగన్‌” అని ధృతరాహ్త్రుని హృదయంలో పాండవులపట్ల ఉన్న అనుమానాలను తొలగించి సంశయమును తొలగించ యత్నించాడు విదురుడు. సంశయనివారణ మనే ఈ అంశం 4క్ష, 45 పద్యాలలో వ్యాపించి ఉన్నది. అందువలన ఈ రెండింటిని మత్తేభవిక్రీడితాలుగా రచించి ఛందళ్ళిల్పాన్నికూడా నన్నయ పాటించాడు. ధార్తరాష్ట్రల కెంత బలగం ఉందో అంతకంటె మిన్న అయిన బలగం కలిగి, దైవ మానుష శక్తులతో ఒప్పారే పాండవులు ఆదరణీయులని చెప్పి, బలవన్నిరాకరణం భంగపాటుకు దారితీస్తుందని విదురుడు వ్యంగ్యంగా హెచ్చరించాడు. వస్తుస్వభావాన్ని స్సుటంగా వ్యక్తంచేసే రుటిత్యర్హప్రతిపత్తిహేతుత్వం ఉండటంచేత 44, 45 పద్యాలలో అర్ధవ్యక్తి అనే గుణం సార్ధకంగా పోషింపబడింది.(సంపా,) ఉ. ఆహవభూమిలోనం బరమార్ధము పార్ధుండు వైరివాహినీ

వ్యూహము వ్రచ్చుచోట మఘవుందును వానికి మార్మ్కొనంగ ను

తాహముసేయం డన్న; లఘుసారు లధీరు లసాహసుల్‌ నిరు

త్చాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా! శం (ప్రతిపదార్థం: మానవ+ఈశ్వరా!= ధృతరాష్ట్రమహారాజా! ఆహవ, భూమిలోనన్‌= యుద్ధరంగంలో; పరమ+అర్హము= పరమ(ప్రయోజనంకొరకు- అంటే శత్రువుల అంతు తేల్చటంకొరకు; పార్టుండు= అర్జునుడు; వైరి, వాహినీ, వ్యూహము= శత్రుసైన్యంయొక్క మొగ్గరాన్ని; 'వ్రచ్చుచోట= చీల్చేచోట; మఘవుండును= దేవేంద్రుడుకూడా; వానికిన్‌; మార్కొనంగన్‌= ఎదుర్కొనటానికి; ఉత్సాహము; చేయడు; అన్న= అని అనగా; లఘు, సారులు= తక్కువ బలం కలవాళ్ళు; అధీరులు= ధైర్యం లేని వాళ్ళు; అసాహసుల్‌= తెగింపులేనివాళ్ళు; నిరుత్సాహులు= ఉత్సాహంలేనివాళ్ళు; (ద్రోహులు+ఐ= కీడు చేసేతలంపు కలవాళ్ళయి వెదిరి= ఎదిరించి; చత్తురొ; మందురొ -(మనుదురా)= బతుకుతారో? తాత్పర్యం: ఓ ధృతరాష్ట్రమహారాజా! యుద్ధ భూమిలో శోత్రు వీరుల అంతు తేల్చటానికి పార్టుడు శత్రుసేనావ్యూహాన్ని చీల్చేచోట దేవేంద్రుడుకూడా అతడిని ఎదుర్కోటానికి పూనుకోలేడు. ఇక పెద్దబలం, ధైర్యం, సాహసం, ఉత్సాహం లేనివాళ్ళు ద్రోహబుద్దితో ఎదుర్కొని చస్తారో, (బ్రతుకుతారో నీవే ఆలోచించుకొమ్ము. విశేషం: విదురుడు పాండవులను పిలిపించి వాళ్ళకు అర్హరాజ్య మిచ్చి కుమారుల నడుమ శాంతిసౌఖ్యాలు కలిగించటం మంచిదని చెప్పటంతోనే ఆగలేదు, దుర్యోధనుని దుష్టవరిత్రంవలన లోకానికి హాని కలుగుతుందని, అతడు పుట్టిననాటినుండి చెప్పుతున్న విషయాన్ని జ్ఞాపకం చేని, ఇప్పటి అతని వర్తనమే జన నాశనానికి కారణం కావచ్చునని హెచ్చరించాడు. దానికి దృష్టాంతంగా ఈ పద్యం చెప్పాడు. (ప్రతిపాదించదలచుకొన్న విషయాన్ని సమర్థించటానికై ప్రసిద్దమైన దృష్టాంతం చూపించటం న్యాయ ప్రయోగ విషయం. అర్జునుని పరాక్రమాన్ని ఎదుర్కొనటానికి ఇంద్రుడే వెనకాడతాడనీ, ఇక దుర్యోధనాదులు బలహీనులనీ, అధీరులనీ, అసాహసు లనీ, నిరుత్సాహు లనీ, ద్రోహు లనీ, వాళ్ళు అర్జును నెదిరించి చావటం తథ్యమనీ హెచ్చరిస్తాడు. (ద్రౌపదీస్తయంవరంలో కర్ణదుర్యోధనాదుల వర్తనాలను గమనిస్తే పై విశేషణాలు వాళ్ళ నుద్దేశించినవే అని తెలుస్తుంది. (సంపా)

ఆదిపర్వము - అష్టనూశ్వావము 787

ఊఉ ఆయతబాహుం డాతనికి నగ్రజుం డగ్రణి పోరులందు నా

గాయుతసత్తుం డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీము(దడ

వ్వాయుజసవ్యసాచుల నవార్యబలోన్నతిం బోలుచున్న మా

ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్‌ సమరాంతరంబునన్‌- త ప్రతిపదార్థం: ఆతనికిన్‌* ఆఅర్జునునికి; అగ్రజుండు= అన్న; భిముండు; ఆయత, బాహుండు= పొడవైన చేతులుకలవాడు; పోరులందు= యుద్దాలలో; అ(గ్రణి= ముందుండేవాడు; నాగ+అయుత, సత్తుండు= పదివేలఏనుగుల బల మంతటి బలం కలవాడు; ఉద్దత యుగ+అంత, కృత+అంత, నిభుండు= విబ్బంభించిన ప్రళయకాల యమునితో సమాన మైనవాడు; ఆ+వాయుజ, సవ్యసాచులన్‌= ఆ భీమార్జునులను; అవార్య, బల+ఉన్నతిన్‌= అడ్డగింపరాని బలాతిశయంతో; పోలుచు+ఉన్న: మాద్రేయులు= నకులసహదేవులు; దేవు సముల్‌= దేవతలతో సమాన మైనవాళ్ళు; సమరశఅంతరంబునన్‌= యుద్ద మధ్యంలో; ఎవ్వరికి; అజేయులు= జయించటానికి సాధ్యం కానివాళ్ళు.

తాత్పర్యం: ఆ అర్జునుని అన్న భీముడు మహావీరుడు. యుద్ద రంగంలో ముందుండేవాడు. వెయ్యి ఏనుగుల

బలం కలవాడు. విజృంభిస్తే ప్రళయకాల యమునితో సమాన మైనవాడు. ఆ భీమార్జునులను బలాధిక్యంలో

పోలుతూ, దేవతలతో సమాను లైన నకులసహదేవులను కూడా యుద్ధమధ్యంలో జయించటం ఎవ్వరికీ సాధ్యం కాదు.

నందరినీ మట్టుపెట్టే ఖిమపరా(క్రమాన్ని ఉదాహరిస్తున్నప్పుడు భావికథార్థాలు స్ఫురించి వస్తుద్వని రాణిస్తుంది. ఇందులోకూడ

'దృష్టాంతం' అనే అంగం పోషింపబడింది. యుద్దవీరు లైన అర్జున భీముల చైతన్యమూర్తులను వీరరసోజ్బుల మైన కాంతి అనే

గుణంతో 46,47 పద్యాలను ఉత్పలమాలావృత్తాలలో రచించటం రచనాశిల్పం. దృష్టాంత మనే అంగాన్ని ప్రదర్శిస్తున్న పద్యాలు

రెండింటి ఛందస్పామ్యం, గుణసామ్యం సార్ధకం. రసపోషకం. (సంపా

క. తమ్ములయట్టుల తనకు వ । శేమ్మయి ధర్మువును ధృతియు సత్యముం గారు ణ్యమ్మును నొప్పంగ బేర్మి ని । జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే! 48

ప్రతొదార్ధం: తమ్ముల, అట్బలా తమ్ములవలె; తనకు; ధర్మువును; ధృతియు= ధైర్యం; సత్యమున్‌; కారుణ్యమ్మునున్‌= దయా;

శ+అయి= స్వాధీనమై; ఒప్పంగన్‌; నిజమ్ముగ; పేర్మి= గొప్పదనంతో; మను= ఉండేటటువంటి; ధర్మజునకు; అసాధ్యము= పొందలేనిది; కలదే?= ఉన్నదా? (లేదని భావం),

ఛాత్సర్యం: తమ్ములవలె తనకు ధర్మం, ధైర్యం, సత్యం, దయ వశ మై గొప్పగా జీవించే ఆ ధర్మరాజుకు అసాధ్య

మైనది ఏముంది?

విశేషం: సద్గుణప్రధాను డైన ధర్మరాజు వ్యక్తిత్వాన్ని ప్రసాదగుణబంధురంగా చిత్రించటం సార్ధకం.(సంపా.)

వ. “వారల బలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల; యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్చుద్ధులుం గలరె? నీపుణ్యమ్మున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రతికిరి:; నీయందు బురోచనదిస్ధం బయిన దుర్యశుపంకంబుంబాండవానుగ్రహజిలంబులం జేసి కడిగికొనుము; దుర్యోధనాపరాధంబున నఖిలమహిప్రజకు నపాయం బగు నని తొల్లియు నీకుం జెప్పితి; నట్లు గాకుండ రక్షింపు' మనిన విని ధృతరాస్తుండు విదురున కి ట్లనియె. 49

788 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్హం: వారల; బల, పరాక్రమంబులు; ఎల్లవారికి= అందరికి; దృష్ట పూర్వంబులు+అ= ముందుచూడబడినవే; అట్టివారితోడ; విగ్రహంబు, చేయు= యుద్దం చేసే; దుర్చుద్దులున్‌; కలరె; నీ, పుణ్యమ్మునన్‌; ఆ+మహాత్ములు; జననీసహితంబు= తల్లితోకూడా; లక్కయింట; బ్రతికిరి; నీ, అందున్‌; పురోచన, దిగ్రంబు+అయినజ పురోచనునిచే పూయబడిన; దుర (యశః పంకంబున్‌= అపకీర్తి అనే బురదను; పాండవ+అను[గ్రహ, జలంబులన్‌*+చేసి=ఐ పాండవులమీద దయచూపటం అనే నీళ్ళతో; కడిగికొనుము' దుర్యోధన+అపరాధంబునన్‌= దుర్యోధనుడితప్పువలన; అఖిల, మహీ, (ప్రజకున్‌= సమస్త్రభూమండలంమీదిప్రజలకు' అపాయంబు; అగును; అని; తొల్లియుజ ఇదివరకు కూడా; నీకున్‌; చెప్పితిన్‌; అట్టుకాకుండ; రక్షింపుము; అనిన; విని; ధృతరా్రుండు; విదురునకు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: 'వాళ్ళబలపరా[క్రమాలు అందరూ ఇదివరకు చూచినవే. అట్ట్లాంటివాళ్ళతో యుద్దం చేసే దుర్చుద్దు

లు లు

లున్నారా? నీ పుణ్యంవలన ఆ మహాత్ములు లక్కయింట్లో తల్లితోకూడా (బ్రతికారు. పురోచనునివలన నీ కంటిన

అపకీర్తి అనే బురదను, పాండవులపట్ట దయ చూపటం అనే నీళ్ళతో కడుక్కో. దుర్యోధనుడు చేసే తప్పువలన

లోకంలోని ప్రజలందరికీ అపాయం కలుగుతుం దని ఇంతకు ముందే నీకు చెప్పాను. అట్టా కాకుండా రక్షించు" లా

అనగా విని ధృతరా్ట్రుడు విదురునితో ఇట్టా అన్నాడు.

నిశ్రేషల: అలం: రూపకం. పాండవుల పరాక్రమాలు “దృష్టపూర్వములే' అని చెప్పి, ప్రసిద్ధ మైన దృష్పాంతాలుగా పరిగణించాడు.

ఆ తరువాత పొండవులను గౌరవిస్తే లాక్షాగహదహనంవలన ఏర్పడిన అపకీర్తిని మాపుకానవచ్చునని ' ప్రయోజనం” చూపించాడు.

ఆపైన దుర్యోధనుడు చేసే పాపంవనలన భూప్రజలకు అపాయంరాకుండా చూడుమని సిద్దాంతీకరించాడు. ఈవిధంగా ఆరువిధాల

తర్కశా/స్త్ర, న్యాయశా(స్తాంశాలను (ప్రయోగించి వాదకుశలునిగా విదురుడిని నన్మయ దిద్దితీర్చాడు.(సంపా.)

క. _ నీవును భీష్ముడు ద్రోణుండు | భూ వినుత విశుద్ధ ధర్మబుద్ధుల రగుటన్‌ మీ వచనమున కవజ్ఞత । గౌావింపంగ నంత కార్యగతి మూఢుందనే? కం

ప్రతిపదార్దం: నీవును; భీష్ముడు; ద్రోణుండు; భూ వినుత; విశుద్ధ ధర్మ, బుద్ధులరు+అగుటన్‌= భూమిమీద పొగడబడిన పరిశుద్ద

మైన ధర్మబుద్ది కలవాళ్ళు అవటంచేత; మీ, వచనమునకున్‌= మీమాటకు; అవజ్ఞత= త్రోసిపుచ్చటం; కావింప(గన్‌; అంత, కార్యగతి, మూఢుడనే=ఐ అంత, పని వైనం తెలియని అవివేకినా?

తాత్సర్యం: నీవు, భీష్మద్రోణులు లోక ప్రశంసలందుకొన్న ధర్మబుద్ధి కలవాళ్ళు మీ మాటను త్రోసిపుచ్చుతానా?

అంత పని వైనం తెలియని అవివేకినా?

విశేషం: విదురుని తర్కబద్ధ మైన వాదం ఫలించింది. వక్రబుద్ధి అయిన ధృతరాష్ట్రుడు సవ్యమైన నిర్ణయం తీసికొనక తప్పలేదు.

పొండవులను దోడ్లేర ధృతరా్ట్రుండు విదురుని. బంచుట. (సం. 1-198-3)

వ. 'మీపంచినవిధంబున నప్పాండవుల కర్ధరాజ్యం బిచ్చెద' నని భీష్మనిదురద్రోణాదు లయిన బాంధవప్రధాను లయు దుర్యోధనాదు లయిన పుత్తులయు సమక్షంబున నిశ్చయించి, యప్పుడ పాండవులం దోడ్లేర విదురుం బంచిన, నాతండును ధృతరాస్తుశాసనంబున ర్రుపదుపురంబునకుం జని, పుత్రభ్రాత్చపరివృతుం డై యున్న ద్రుపదుని వాసుదేవసహితు లైయున్నపాండవులనుం గాంచి ధృతరాష్తుండు పుత్తెంచిన వివిధరత్నభూషణాదుల వేణువేఖ యిచ్చి తానును వారిచేత. బ్రతిపూజతుం డై కేశవపాండవసమక్షంబున విదురుండు ద్రుపదున కి ట్లనియె. 5్‌1

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 789 ప్రతిపదార్హం: మీ, పంచిన, విధంబునన్‌= మీరు ఆజ్ఞాపించినపద్దతిలో; ఆ+పాండవులకు; అర్హ, రాజ్యంబు; ఇచ్చెదను+అని;-భీష్మ విదుర, ద్రోణ+ఆదులు+అయిన= భీష్ముడు, విదురుడు, (ద్రోణుడు మొదలైన; బాంధవ, ప్రధానులయు= బంధువులయొక్క, మంత్రులయొక్క: దుర్యోధన+ఆదులు+అయిన= దుర్యోధనుడు మొదలగువా ళృ్ళయిన; పుత్రులయు; సమక్షంబున= ఎదుట; నిశ్చయించి; అప్పుడు+అ; పాండవులన్‌; తోడ్తేర= తీసికొనిరావటానికి; విదురున్‌; పంచినన్‌= పంపగా; ఆతండును; ధృతరా్త్రు, శాసనంబున= ధృతరాష్త్రుని యొక్క ఆజ్జ్ఞచేత; ('ద్రుపదు, పురంబునకున్‌; చని= వెళ్ళి; పుత్ర, భ్రాతు పరివృతుండు+ఐ= కాడుకులచే, తోబుట్టువులచే చుట్టబడినవా డై; ఉన్న; ద్రుపదుని; వాసుదేవ, సహితులు+ఐ= శ్రీకృష్ణునితోకూడినవాళ్ళయి; ఉన్న; పాండవులనున్‌; కాంచి= చూచి; ధృతరా్ట్రుండు; పుత్తెంచిన= పంపిన; వివిధ, రత్న, భూషణ+ఆదుల= నానావిధా లైన రత్నాలు, సొమ్ములు మొదలైనవాటిని; వేజువేజ; ఇచ్చి; తానును; వారిచేతన్‌; ప్రతి, పూజితుండు+ఐ=ఐ మారుగా పూజింపబడినవాడై; కేశవ, పాండవ, సమక్షంబున= శ్రీకృష్ణునియొక్క, పాండవులయొక్క ఎదుట; విదురుండు; (ద్రుపదునకు; ఇట్టు+అనియె. తొత్సర్యం: 'మీరు ఆజ్ఞాపించిన విధంగా ఆ పాండవులకు సగ భాగం రాజ్యం ఇస్తాను" అని భీష్ముడు, “ద్రోణుడు, విదురుడు మొదలైన బంధువులు మంట్రులు, దుర్యోధనుడు మొదలైన పుత్రులు ఉన్నప్పుడు అందరిఎదుట నిర్ణయించి, పాండవులను పిలుచుకొని రావటానికి విదురుడిని పంపాడు, విదురుడు ధృతరాష్రుని ఆజ్ఞప్రకారం (ద్రుపదుని పురానికి వెళ్ళి - కొడుకులతో తోబుట్టువులతో కూడిఉన్న (ద్రుపదుడిని, శ్రీకృషునితో కూడిఉన్హు పాండవులను చూచి, ధృతరాష్ట్రుడు పంపిన వివిధరత్నాలను, ఆభరణాలను ఎవరి కీయవలసినవి వాళ్ళ కిచ్చి, తానుకూడా వాళ్ళచేత పూజితు డై శ్రీకృష్ణపాండవులయెదుట దద్రుపదునితో ఇట్టా అన్నాడు.

మ. అభిజాతుందవు ధర్మశీలుందవు నీయం దైన సంబంధ మిం

దభిరమ్యం బనురూప మిష్ణ మని సౌహార్థంబునన్‌ జాహ్నవీ

ప్రభవుండున్‌ ధృతరాష్తుండుం గృపుండుం గుంభప్రోద్ధవుండున్‌ యశో

విభవాలంకృత! సంతసంబు వడి రుర్వీవంద్యు లిష్టంబునన్‌. 52 ప్రతిపదార్థం: యశః+విభవ+అలంకృత= కీర్తితో, ఐశ్చర్యంతో అలంకరింపబడినవాడా!; అభిజాతుండవు=జ మంచి వంశం కల వాడవు; ధర్మ, శీలుండవు= ధర్మ స్వభావం కలవాడవు; నీ, అందు+ఐన, సంబంధముజ నీతో ఏర్పడిన బంధుత్వం; ఇందు; అభిరమ్యంబు= మనోహరం; అనురూపము= తగినది; ఇష్టము; అని; సౌహార్దంబునన్‌= స్నేహభావంతో: జాహ్నవీ, (ప్రభవుండున్‌= గంగాదేవికి జన్మించినవాడు- భీష్ముడు; ధృతరాష్ట్రుండున్‌; కృపుండున్‌; కుంభ, (ప్ర+ఉద్భవుండున్‌= కుండనుంచి పుట్టినవాడు- (ద్రోణుడు కూడా; ఉర్వీ వంద్యులు= భూమిలో పాగడ దగిన వాళ్ళు; ఇష్టంబునన్‌= ప్రీతితో; సంతసంబు, పడిరి= సంతోషాన్ని పొందారు, తొత్పర్యం: కీర్తి ఐశ్చర్యం అలంకారాలుగా కల ఓ ద్రుపద మహారాజా! నీవు మంచివంశం కలవాడ వని, ధర్మస్వభావం కలవాడ వని, నీతో ఏర్పడిన బంధుత్వం మనోహరమైన దని, తగిన దని, ఇష్ట మైన దని- లోకం కొనియాడదగిన భీష్మ ధృతరాష్ట్ర, కృప, ద్రోణులు స్నేహభావంతో సంతోషించారు. " ఉ. తల్లియు. బుత్తులేవురు నుదాత్తమతుల్‌ దమయొద్ద వాసినం

దల్లడమంది యందలును దద్దయు దుఖిత చిత్తు లైరి, నీ

యల్లుర( బాండుపుత్తులం జ్రియంబునం జూడ(గం గోరుచున్న వా

రెల్ల జనంబులుం గురుకులేశ్వరు. డాదిగ బంధుపర్గమున్‌. 53

790 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: ఉదాత్త, మతుల్‌= గొప్పబుద్దికలవాళ్ళు; తల్లియున్‌; పుత్రులు+ఏవురును= కొడుకులు ఐదుగురుకూడా; తమ, ఒద్ద, పాసినన్‌= తమదగ్గరనుంచి వెళ్ళగా; తల్లడము+అంది= చలించి; అందజును; తద్దయు= మిక్కిలి; దుఃఖిత చిత్తులు= దుఃఖపడిన మనస్సు కలవాళ్ళు; అయిరి; కురు, కుల+-ఈశ్చరుండు= కురువంశప్రభు వైన ధృతరా(ఘ్ట్రుడు; ఆదిగ= మొదలుగా; బంధు, వర్గమువ్‌= బంధువుల సమూహం; ఎల్ల, జనంబులున్‌= ప్రజలంతా; నీ, అల్టురన్‌; పాండు, పుత్రులన్‌; ప్రియంబునన్‌; చూడ(/న్‌; కోరుచు+ఉన్నవారు. తాత్పర్యం: గొప్ప బుద్ది కలవాళ్ళయిన కుంతీదేవి, పాండవులు తమ దగ్గరనుండి వెళ్ళటంవలన చలించి అంతా ఎంతోదుఃఖించారు. కురువంశప్రభు వైన ధృతరాష్ట్రుడు మొదలుకొని సమస్త బంధు వర్షం, సకల ప్రజలు నీ అల్టు నైన పాండవులను ప్రియమార చూడకోరుతున్నారు. విశేషం: విదురుడు వెళ్ళిన పని అంతసులభ మైనది కాదు - లక్కఇంటిలో పాండవులను తగులబెట్టిన కౌరవులవద్దకు మళ్ళీ పాండవులను పంపండని అడగటం, వాళ్ళను వెంటపిలుచుకొనిరావటం. దానికి ద్రుపదుని అనుమతి కావాలి, అందువలననే విదురుడు చాలా నేర్పుగా మొదట (ద్రుపదుడిని పొగడాడు. పాండవుల అభ్యుదయానికి, మీతో ఏర్పడినబాంధవ్యానికి హస్తినలో అంతా ఆనందిస్తున్నా రనీ, పాండవులను ప్రియమార చూడగోరుతున్నా రనీ, వాళ్ళను పంపవలసిన దనీ, ఎంతో చాకచక్యంగా ద్రుపదుడిని అడుగుతున్నాడు. కు గురుగుణయుతు లగు కొడుకులం ; గురుకులము వెలుంగ నయిన కోడలిం గృష్టం

బరమపతిప్రత గొంతిని ।; గరుణను రాం బనిచె రాజు గజపురమునకున్‌. 54 ప్రతిపదార్థం: గురు, గుణ, యుతులు+అగుః= గొప్పగుణాలతో కూడుకొన్నవా ళ్ళయిన; కొడుకులన్‌; కురు, కులము= కురువంశం; వెలుంగన్‌*అయిన; కోడలిన్‌; కృష్ణన్‌= (ద్రౌపదిని; పరమ, పతివ్రత; గొంతిని; రాజు= ధృతరాష్త్రమహారాజు; గజ పురమునకున్‌= హస్తినాపురానికి; కరుణన్‌= దయతో; రాన్‌+పనిచెన్‌= పిలుచుకొనిరమ్మని పంపాడు. తాత్పర్యం; గొప్పగుణాలతో కూడుకొన్న కొడుకులను, కురువంశం వెలిగేటట్టుగా కోడలైన (ద్రౌపదిని, పరమపతి(వ్రత అయిన కుంతిని దయతో ధృతరాష్ట్రమహారాజు హస్తినాపురానికి పిలుచుకొని రమ్మన్నాడు. న. 'నీచేత ననుజ్ఞాతు లై కాని వీరలు రా నేరరు గావున వీరలం బుత్తెంచు నది' యనిన విదురునకు ధ్రుపదుం

డి టనియె. కక్‌ ప్రతిపదార్హం: నీచేతన్‌; అనుజ్ఞాతులు+ఐ=ఐ అనుమతింపబడినవా ళ్ళయి; కాని; వీరలు; రానేరరు; కావున; వీరలన్‌; పుత్తెంచునది= పంపునది;అనిన; విదురునకు; (ద్రుపదుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: నీ అనుమతి లభిస్తేనే పాండవులు రాగలరు అందుచేత వీళ్ళను మీరు పంపండి' అని అనగా విదురునితో (ద్రుపదుడు ఇట్టా అన్నాడు. చ. రవినిభతేజుం దైన ధృతరాష్తుడు పంప౮గ నీవు కార్యగౌ

రవమున వచ్చినప్పుడ తిరంబుగ వీరికి నిష్టసిద్ధి దా

నవు టది యేమి సందియమె; యంబుజనాభుండు నీవుం బాండవ

ప్రవరుల కెల్లప్రొద్దును శుభంబ తలంతురుకాదె నెమ్మితోన్‌. 5్‌6

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 791 (ప్రతిపదార్థం: రవి, నిభ, తేజుండు+ఐన= సూర్యునితోసమాన మైన తేజస్సు కలవా డైన; ధృతరా్ష్రుండు; పంపంగ; నీవు; కార్య, గౌరవమునన్‌= పనియొక్కగొప్పతనంవలన ; వచ్చినప్పుడు+ఆ; తిరంబుగ= స్ట్రిరంగా; వీరికిన్‌? ఇష్ట సిద్ది= ఇష్టమైనది లభించటం: తాన్‌; అవుట; అది; ఏమి; సందియమె; అంబుజనాభుండు= శ్రీకృష్ణుడు; నీవున్‌; పాండవ, ప్రవరులకున్‌= (శ్రేష్టు లైన పాండవులకు; ఎల్ల, (ప్రొద్దును= ఎల్లప్పుడుకూడా; నెమ్మితోన్‌= స్నేహంతో; శుభంబ; తలంతురు; కాదె. తాత్పర్యం: సూర్యునితో సమాన మైన తేజస్సు కల ధృతరాష్ట్రుడు పంపగా, గొప్ప పని బూని నీవు రాగా, పాండవులకు ఇష్టమైనది లభిస్తుం దనటంలో సందేహం లేదు. శ్రీకృష్ణుడు, నీవు, ఉత్తము లైన పాండవులకు ఎల్లప్పుడూ స్నేహంతో శుభమే కోరుతారు కదా! విశేషం; ఇక్కడ (ద్రుపదుడుకూడా ఎంతో నేర్పుగా మాట్టాడాడు. పాండవుల యోగక్షేమాలు చూచేబాధ్యతను పరోక్షంగా విదురునికి అప్పుగించాడు. శ్రీకృష్ణుడినికూడా విదురునితో చేర్చాడు. క. _ నీవును ద్రోణుండును వసు : దేవతనూజుండు భీష్మదృతరాస్తులు స ద్ధానమున నెద్ది సేయం । గా వగచితి రది హితంబ కా కొం దగునే? 57 ప్రతిపదార్హం: నీవును; ద్రోణుండును; వసుదేవ, తనూజుండు= శ్రీకృష్ణుడుకూడా; భీష్మ ధృతరాష్ష్రులు: సత్‌+భావమునన్‌= మంచిఉద్దేశంతో; ఎది; చేయంగా; వగచితిరి= తలంచారో; అది; హితంబు+అ, కాకజ మేలుచేసేదికాకుండా; ఒండు= మరొకటి; అగునే= బౌతుందా? (కాదని భావం). తాత్పర్యం: నీవు, (ద్రోణుడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధృతరా్ష్రుడు మంచి ఉద్దేశంతో ఏది చేయ తలచారో అది పాండవులకు మేలే అవుతుంది కాని మరొకటి కాదు. వ. అనిన వాసుదేవుం డి ట్లనియె. 58 తొత్సర్యల: అని అనగా శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. క. _ ఎవ్వరును నేమి సేయుదు , రివ్విదురుండు పాండవులకు హిత మొనరింపన్‌ నెవ్వగ నొండు దలంపకుం€ డివ్వీరుల కగు నభిష్ట మిది మొదలుంగాన్‌. ర్‌ం ప్రతిపదార్థం: ఈ+విదురు(డు; పాండవులకు; హితము= మేలు; ఒనరింపన్‌= చేస్తుండగా; ఎవ్వరున్‌; ఏమి; చేయుదురు; నెజ+వగన్‌= మిక్కిలి విచారంతో; ఒండు= వేరొకటి; తలంపకుండు; ఈ+వీరులకు= ఈవీరు లైన పాండవులకు; ఇది, మొదలుంగాన్‌; అభీష్టము= కోరుకొన్నది; అగున్‌, తాత్సర్యర; ఈ విదురుడు పాండవులకు మేలు చేసేవా డై ఉండగా- వాళ్ళను ఎవరు ఏమి చేయగలరు? అతిగా విచారించి వేరొక విధంగా మీరు ఆలోచించ వద్దు. ఇది మొదలుగా పాండవులకు కోరుకొన్నది సిద్దిస్తుంది. విశేషం: ఇక కృష్ణుడుమూత్రం తక్కువవాడా? ఆయన పాండవుల(శ్రేయోబాధ్యతను, అభీష్టసిద్దిని మొత్తం విదురునికి అప్పజెప్పాడు. విదురుడు సొమాన్యవ్యక్తి కాదు. పరమధార్శికుడు. గొప్పతాత్మ్వికుడు. విశేషించి, హస్తినాపురరాజ్యవ్యవహారాలలో ('ప్రముఖపొత్ర నిర్వహించే మంత్రిసత్తముడు. వ. అనిన నందటకు ధర్మనందనుం డి ట్లనియె. 60 తాత్పర్యం: అని అనగా అందరితో ధర్మరాజు ఇట్టా అన్నాడు.

792 - శ్రీమదాంధ్ర మహాభారతము

కు కురు ముఖ్యులు ధృతరాష్ట్రవి । దుర భీష్ములు గురులు మాకు; ద్రుపద ప్రభుండున్‌ గురుండు; మురాంతకుండు జగ । ద్గురు6 డిందజఖ మతమునను నగున్‌ శుభయుక్తుల్‌. 61

(ప్రతిపదార్థం: కురు, ముఖ్యులు= కురువంశశ్రేష్టులు; ధృతరాష్ట్ర, విదుర, భీష్ములు; మాకున్‌; గురులు; 'ద్రుపదప్రభుండున్‌' గురుండు;

మురాంతకుడు= మురుడు అనే రాక్షసుడిని సంహరించిన శ్రీకృష్ణుడు; జగత్‌+గురుండు; ఇంద; మతమునను= సమ్మతిన; శుభ,

యుక్తుల్‌= శుభంతోడి కూడికలు; అగున్‌.

తాత్పర్యం: కురు వంశ (శ్రేష్టు లైన ధృతరాష్ట్ర విదుర భీష్ములు మాకు పెద్దలు. (ద్రుపద మహారాజు కూడా మాకు

అట్టాగే పెద్ద. శ్రీకృష్ణుడు లోకాని కంతా పెద్ద. వీళ్ళందరిసమ్మతివలన మాకు శుభాలే కలుగుతాయి.

పాండవులు హస్తిపురంబునకు వచ్చుట (సం - 1-199-10)

వ. _ అని యుధిప్టిరుండు వారి యనుమతంబు వడసి, తమ్ములు దానును హస్తిపురంబునకు€ బోవ నిశ్చయించి, ద్రుపదు వీడ్కొని ప్రయాజతోన్నుఖుం డయ్యె; నిట్లు విదురుండు పాండవుల. బాంచాలిని గుంతీదేవినిం దోడ్కొని వాసుదేవ ధృష్టద్యుమ్ను లపరిమిత సేనాసమన్వితు లై తోడ రాగా వచ్చునంత, వారలరాక విని ధృతరాష్తుండు వికర్ణ చిత్రసీన ద్రోణ కృపాచార్యుల నెదురు పుత్తెంచినం, దత్పైన్యసమేతు లయి మహోత్సవంబుతోంబాండవులు గజపురప్రవేశంబు సేయునప్పుడు వారలం జూచి. 62

ప్రతిపదార్థం: అని; యుధిస్టిరుండు; వారి; అనుమతంబు= అనుమతి; పడసి= పొంది; తమ్ములు" తానును" హస్తిపురంబునకున్‌: పోవ; నిశ్చయించి; (ద్రుపదు, వీడ్కొని= (ద్రుపదునిదగ్గర సెలవు తీసికొని; ప్రయాణ+ఉన్ముఖుండు= పప్రయాణంవైపు ఎత్తినముఖం కలవాడు- అంటే ప్రయాణానికి పూనుకొన్నవాడు; అయ్యెన్‌; ఇట్టు; విదురుండు; పాండవులన్‌; పాంచాలిని; కుంతీదేవినిన్‌; తోడ్కొని; వాసుదేవ; ధృష్టద్యుమ్నులు; అపరిమిత, సేనా, సమన్వితులు+ఐ= అంతులేని సైన్యంతో కూడినవాళ్ళయి; తోడ రాగా; వచ్చునంత= వస్తూ ఉండగా; వారల, రాక; విని; ధృతరా్షండు; వికర్ష చిత్రసేన, ద్రోణ, కృపాచార్యులన్‌; ఎదురు; పుత్తెంచినన్‌= పంపగా; తత్‌+సైన్య, సమేతులు+అయి= ఆసైన్యంతో కూడినవా ళ్ళయి; మహా+శఉత్సవంబుతో; పాండవులు; గజపుర, ప్రవేశంబు, చేయునప్పుడు= హస్తినాపురంలో ప్రవేశించేటప్పుడు; వారలన్‌+చూచి.

తాత్పర్యం: అని ధర్మరాజు వాళ్ళ అనుమతి పొంది, తమ్ములు, తాను హస్తినాపురం వెళ్ళా లని నిశ్చయించాడు,

(ద్రుపదునిదగ్గర సెలవు తీసుకొని ప్రయాణానికి పూనుకొన్నాడు. ఈ విధంగా విదురుడు పాండవులను, (ద్రౌపదిని,

కుంతిని తోడ్కొని, శ్రీకృష్ణ ధృష్టద్యుమ్నులు అంతులేనిసైన్యంతో వెంటరాగా, హస్తినాపురానికి వస్తుండగా, వాళ్ళరాక

విని ధృతరా(ష్ట్రుడు, వికర్ణ చిత్రసేన, ద్రోణ, కృపాచార్యులను ఎదురు పంపగా, సైన్యసమేతు లై పాండవులు మహోత్సవంతో హస్తినాపురం ప్రవేశించేటప్పుడు వాళ్ళను చూచి.

విశేషం: అపారసైన్యం పాండవుల అపాయనివారకం, ఐశ్వర్యప్రదర్శకం. వాసుదేవ ధృష్టద్యుమ్నులు పాండవుల కేర్పడిన నిజమైన

అండదండలు.

సీ. _ పుర జను లెల్లను గర మనురక్తు లై । 'ధర్మస్వరూపుం డీ ధర్మతనయుం డనుజులు. దానును జనుదెంచెం బాండుభూ । జనపతి జీవించి మనలం గావ బ్రీతితోం దా నిప్పు డేతెంచె; మే లయ్యె; నిమ్మహాత్ములకు దైవమ్ము. బురుష కారంబు€ గలుగంగ ధారుణీరాజ్యంబు । వాయునే యాపదల్‌ వాయు(ాక;

ఆదిపర్వము - అష్టమాశ్వానసము 793

ఆ. దాన హోమ జప విధానముల్‌ మన కివి; గలవయేని ధరణివలయరాజ్య మింద యుండి ధర్మనందనుం డొనరించు ; చుండు. గావుతమ యఖందితముగ. 63

ప్రతిపదార్హల: పుర, జనులు+ఎల్లను; కరము= మిక్కిలి; అనురక్తులు+ఐజ= (ప్రేమ కల వా ళ్ళయి; ధర్మ," స్వరూపుండు; ఈ, ధర శతనయుండు; అనుజులున్‌= తమ్ములుకూడా; తానును; చనుదెంచెన్‌= వచ్చాడు; పాండుభూజనవపతి= పారిడురాజు; జీవించి; మనలన్‌: కావన్‌= కాపాడటానికి; ప్రీతితోన్‌; తాన్‌: ఇప్పుడు; ఏతెంచె= వచ్చాడు; మేలు+అయ్యెన్‌; ఈ+మహత్‌+ఆత్ములకున్‌; దైవము శన్‌= దైవబలం; పురుషకారంబున్‌= మానవబలం; కలుగంగజ ఉండగా; ధారుణీ, రాజ్యంబు; పాయునే= తొలగునా; ఆపదల్‌:; పాయున్‌1కాక= తాలగిపోవును కాని; మనకు; దాన, హోమ, జప, విధానముల్‌= దానాలు; హోమాలు, జపాలు చేయటాలు; ఇవి; కలవ, ఏని= ఉన్నట్టయితే; ధర్మనందనుండు= ధర్మరాజు; ఇందు+అ, ఉండి= ఈహస్తినాపురంలోనే ఉండి; అఖండితముగ= అవిచ్చిన్నంగా: ధరణివలయరాజ్యము= భూమండలపాలనం; ఒనరించుచు; ఉండున్‌; కావుచమ= అగుగాక, తాత్పర్యం: నగరంలోని జనులంతా పాండవులను చూచి మిక్కిలి (ప్రేమతో ఇట్టా అనుకొన్నారు: 'ధర్మస్వరూపు డైన ధర్మరాజు తమ్ములతోకూడా ఇక్కడికి వచ్చాడు. పాండురాజే మళ్ళీ బ్రతికి మనలను కాపాడటానికి పతితో తాను ఇపుడు వచ్చిన ట్టున్నది. మనకు మే లైనది. మహాత్ము లైన ఈ పాండవులకు దైవబలం, మానవబలం ఉండటంవలన ఆపదలు తొలగుతాయి కాని రాజ్యం తాలగిపోతుందా? మనం చేసిన దాన హోమ జపాల పుణ్యమే ఉన్నట్రైతే ఈ ధర్మరాజు ఈ హస్తినాపురిలోనే ఉండి అవిచ్చిన్నంగా భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండుగాక విశేషం; పాండవులు హస్తినాపురంలో ప్రవేశించేటప్పుడూ, ఏ కారణంవలన నైనా హస్తినాపురి వదలిపోవలసివచ్చినపుడూ ప్రజలు వారిపట్ల (ప్రదర్శించే ఆదరాభిమానాలను వాచికంగా, ఆంగికంగా, సాత్షికంగా ప్రదర్శించినట్టు వర్షించటం నన్నయరచనలో కానవచ్చే సంవాదరచనాశిల్పం. పాండవులే హస్తినాపురానికి పాండురాజుతరువాత పరిపాలించ తగిన వాళ్ళని, ప్రజాభిప్రాయం. రాజ్యంలో పాండవులకు ఉన్న ప్రజానురాగానికి ఇది పెద్దతార్కాణం. దుర్యోధనాదులకు ఇటువంటి ప్రజాదరణ లేదు. ఈ సీసపద్యంలో అన్నీ ప్రాసయతులే.(సంపా.)

వ. అని పౌరులెల్ల దీవించుచుంద. బౌరవకులనందను లయిన పాండునందనులు వచ్చి, భీష్మద్భతరాష్ర్రాది కురువృద్ధులకు మ్రొక్కి సకలజనానురాగం బొనరించుచు దుర్యోధనాదులతో. గలని యెప్పటియట్ల రాజ్యవిద్యావినోదంబుల నేనునంవత్సరంబు లుండు నంత, నొక్కనాండు ధృతరాష్రండు భీష్మవిదురద్రోణదుర్యోధనాదుల సమక్షంబునం బాండవుల కి ట్లనియె. 64

(ప్రతిపదార్థం: అని; పౌరులు+ఎల్ల; దీవిచుచు+ఉండన్‌; పౌరవ, కుల, నందనులు+అయిన= పూరు వంశ కుమారు లైన; పాండు, నందనులు= పాండురాజుపుత్రులు; వచ్చి; భీష్మ ధృతరాష్ట్రశఆది= భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన; కురు, వృద్దులకు= కురువంశంలోని పెద్దలకు; (మొక్కి; సకల, జన+అనురాగంబుజ ఎల్ల జనులకు సంతోషం; ఒనరించుచు= కలిగిస్తూ; దుర్యోధన+ఆదులతో= దుర్యోధనుడు మొదలైన వాళ్ళతో; కలిసి" ఎప్పటి అట్ల: రాజ్య విద్యా, వినోదంబులన్‌= రాజ్యానికి, విద్యకు సంబంధించిన వేడుకలతో; ఏను, సంవత్సరంబులు= ఐదు సంవత్సరాలు; ఉండునంతన్‌= ఉండగా; ఒక్కనాండు: ధృతరామ్షండు; భీష్మ విదుర, (ద్రోణ, దుర్యోధన+ఆదుల, సమక్షంబునన్‌= భీష్ముడు, విదురుడు, (ద్రోణుడు, దుర్యోధనుడు మొద లైనవారి ఎదుట; సాండవులకు+ఇట్టు+అనియె.

తాత్సర్యం: అని హస్తినాపుర పౌరులంతా ఆశీర్వదిస్తుండగా పూరువంశరాజకుమారులు పాండవులు వచ్చి

కురువంశపుపెద్ద లైన భీష్ముడు, ధృతరాహ్ర్రుడు మొద లైన వాళ్ళకి నమస్కరించి, సకల జనులకు సంతోషం కలిగిస్తూ

దుర్యోధనాదులతో కలిసి, ఎప్పటివలె రాజ్యవిషయాలకు, విద్యావిషయాలకు సంబంధించిన వినోదాలతో ఐదుసంవత్సరాలు గడుపగా, ఒక రోజు ధృతరాష్ష్రుడు, భీష్మ విదుర ద్రోణ దుర్యోధనాదుల సమక్షంలో పాండవులతో ఇట్లా అన్నాడు.

79శ్త శ్రీమదాంధ్ర మహాభారతము విశేషల: రాజ్యవిద్యావినోదాలు- అనేచోట రాజ్యానికి, విద్యకు సంబంధించిన వినోదాలనే గాక రాజ్యవిద్యకు సంబంధించిన వినోదాలని కూడా చెప్పుకోవచ్చు. రాజ్యవిద్య అంటే రాజనీతి. ఆ. సర్వలోక కర్మసాక్షి యీకృష్ణుండు ; సాక్షి గాంగ మీకు సకల వృద్ధ రాజు లొద్ద నర్ధ రాజ్య మిచ్చితి. బాండు । రాజ విభవ మెల్ల రమణ. గొనుండు. 65 ప్రతిపదార్హం: సర్వలోక, కర్మసాక్షి= సర్వజనులయొక్క కర్మములకు సాక్షి అయినవాడు; ఈ, కృష్ణుండు; సాక్షి, కాగ: మీకు; సకల, వృద్ద, రాజుల+ఒద్దన్‌= ఆందరుపెద్దలయొక్క, రాజులయొక్క ఎదుట; అర్జరాజ్యము; ఇచ్చితిన్‌; పాండురాజ, విభవము+ఎల్ల= పాండురాజుయొక్క ఐశ్చర్యాన్నంతా; రమణన్‌= సంతోషంతో; కొనుండు= తీసికొనండి. తాత్పర్యం: సర్వ జనుల కర్మసాక్షి అయిన ఈ కృష్ణుడు సాక్షిగా, అందరుపెద్దల ఎదుట, రాజులఎదుట మీకు అర్హరాజ్యం ఇచ్చాను. పాండురాజు ఐశ్వర్యమంతా సంతోషంతో స్వీకరించండి. విశేషం: ఇదివరకు (అంటే లాక్షాగృహదహనానికిముందు) ధర్మరాజును యువరాజుగా అభిషేకించింది అర్హరాజ్యానికి కాదు. ఇప్పుడు ధర్మరాజును అభిషేకించేది మాత్రం అర్ధరాజ్యానికి. దానిలో మీ తండ్రి పాండురాజుకు సంబంధించిన సగభాగానికి అనే సూచన కూడా ఉన్నది. వ. అని ధర్మరాజు నభిషిక్తుం జేసి. 66 తాత్సర్యం: అని పలికి ధర్మరాజును రాజుగా అభిషేకించి. క. _ 'నెమ్మిం జని ఖాండవప్ర। స్థమ్ము నివాసమ్ము. జేసి తద్దయు ననురా గ మ్మైసంగ నుండు€ దందు. ది । రమ్ముగ' నని పనిచెం బాండురాజాత్మజులన్‌. 67 ప్రతిపదార్థం: నెమ్మిన్‌= సంతోషంతో: చనిజ వెళ్ళి; ఖాండవప్రస్థమ్ము: నివాసమ్మున్‌+చేసి= నివసించేచోటుగా చేసికొని; తద్దయున్‌= మిక్కిలి; అనురాగమ్ముజ= స్నేహం; ఎసంగన్‌=పెంపొంద; అందున్‌; తిరము శ్రైగన్‌= స్థిరంగా; ఉండుండు; అని; పాండురాజ+ ఆత శజూలన్‌= పాండురాజుయొక్క కుమారులను; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. తాత్సర్యం: సంతోషంగా వెళ్ళి ఖాండవటప్రస్థాన్ని రాజధానిగా చేసికొని స్నేహం పెంపొందేటట్టు అక్కడ స్థిరంగా ఉండండి" అని పాండవులను ఆజ్ఞాపించాడు. వ. పాండవులును ధృతరాష్తు శాసనంబునను భీష్మాదుల యనుమతంబునను వాసుదేవ సహితు లయి ఖాండవప్రస్థమ్మునకుం జని రంత. 68 ప్రతిపదార్థం: పాండవులను; ధృతరాష్ట్ర, శాస్షనంబునను= ధృతరా(స్ట్రునియొక్క ఆజ్ఞవలన; భీష్మ+ఆదుల, అనుమతంబుననుజ= భీష్ముడు మొద లైన వాళ్ళయొక్క అంగీకారంతో; వాసుదేవ, సహితులు+అయి= శ్రీ కృష్ణునితో కూడినవా ళ్ళయి; ఖాండవ(ప్రస్టమ్మునకున్‌; చనిరిఐ వెళ్ళారు; అంత= తర్వాత. తాత్పర్యం: ధృతరాష్షుని ఆజ్ఞతో, భీిష్మాదుల అంగీకారంతో పాండవులు వాసుదేవునితో కలిసి ఖాండవ్రస్తానికి వెళ్ళారు. ఆ తరువాత.

ఆదిపర్వము - అష్టమాశ్వానను 795 విశ్వకర్మ యింద్రప్రస్తపట్టణమును నిర్మించుట (సం- 1-199-28) క హరి యింద్రు. దలంచి, నింద్రుండు । కరమనురాగమున విశ్వకర్మను బనిచెన్‌ “'సురపురమున కెన యగు పుర । మరుదుగ నిర్మింపు ముర్వి' నని కడుం బ్రీతిన్‌. 69 ప్రతిపదార్థం; హరి= శ్రీకృష్ణుడు; ఇం(ద్రున్‌; తలంెన్‌; ఇంద్రుండు; కరము= మిక్కిలి; అనురాగమున= (ప్రేమతో; సుర, వురమునకు= దేవత లనగర మైన అమరావతికి; ఎన, అగు= సాటి అయిన; పురము; ఉర్విన్‌= భూమిమీద; అరుదుగ= ఆశ్చర్యకరంగా; నిర్మింపుము; అని; కడున్‌, ట్రీతిన్‌= మిక్కిలి ప్రీతితో; విశ్శకర్మను; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. తాత్పర్యం: శ్రీకృష్ణుడు ఇంద్రుడిని తలవగా ఇం(ద్రుడు 'అమరావతికి దీటైన పట్టణాన్ని భూమిమీద ఆశ్చర్యకరంగా నిర్మించు" మని (ప్రియమార దేవశిల్పి విశ్శకర్మను ఆజ్ఞాపించాడు. విశేషం: ఒకరు తలచారు, మరొకరు ఆజ్ఞాపించారు. పని చకచక జరిగిపోవాలనే వారి ఆకాంక్ష లఘుబహుళ మైన కందవద్యపు ఉత్తరార్డంలోని (ద్రుతగతి అక్షరరమ్యంగా ధ్వనింపచేస్తున్నది. (సంపా) సీ. ద్వైపాయనుండును ధౌమ్యుండు నాదిగా ।; భూసురుల్‌ సూత్రవిన్యాస మమర జేసి, శాంతికవిధుల్‌ సేయంగ, సుప్రశ; స్తం బైన రమ్యదేశంబునంద్రు, వాసవాదిష్టు. డై వసుధకు నేతెంచి । పేర్మితో నవ్విశ్వకర్మ పురము నిర్మించె; నదియును నిరుపమలీలలం ; దనరి యింద్రప్రస్థ మనంగ నింద్రు ఆ. పురముతోః గుబేరుపురముతో వరుణేంద్రు ।; పురవరంబుతోడ నురగరాజు పురవిభూతితోడ నురువిలాసంబుల ; సరి యనంగ నొప్పు ధరణిమీంద, 70 ప్రతిపదార్థం: ద్వైపాయనుండును= వ్యాసుడూ; ధౌమ్యుండున్‌= పాండవపురోహితు డైన ధౌమ్యుడూ; ఆదిగా= మొదలుగా; భూసురుల్‌= బ్రాహ్మణులు; సూత్రవిన్యాసము= దారంతో కొలవటాన్ని; అమరన్‌= ఒప్పుగా; చేసి; శాంతిక, విధుల్‌= (గ్రహాశాంతా కలిగించేటటువంటికర్మలు; చేయంగ: సుప్రశస్తంబు+ఐన= మిక్కిలి(్రేస్ట మైన: రమ్య, దేశంబు, అందు అందమైన వదేళంల ఆ+విళ్ళ్శకర్మ వాసవ+ఆదిష్టుడు+ఐ= దేవేంద్రునివలన ఆజ్ఞాపించబడినవా డై; వసుధకున్‌= భూమికి; ఏతెంచి= వచ్చి; పేరి [న్‌ గొప్పగా; పురము; నిర్మించెన్‌; అదియును; నిరుపమ, లీలలన్‌= సాటిలేని విలాసాలచేత; తనరి= ఒప్పి; ఇంద్రప్రస్థము; అనంయగనో అనుపేరుతో; ఇందు, పురముతోన్‌= ఇంద్రుని రాజధానితో; కుబేరు, పురముతోః= కుబేరునిరాజధానితో గ వరుణ+ఇంద్రు. పుర, వరంబుతోడన్‌= వరుణరాజుయొక్క (శ్రేష్ట మైన రాజధానితో; ఉరగ, రాజ, పుర, విభూతితోడన్‌= నాగరాజాయొక్క రాజధాని సంపదతో; ఉరు, విలాసంబుల= గొప్పవిలాసాలచేత; సరి; అనంగన్‌?; ధరణిమీద= భూమిమీద; ఒప్పెన్‌= వెలిగింది. తాత్సర్యం: వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన (బ్రాహ్మణులు కొలతలు ఏర్పరచి, శాంతికర్మలు చేసిన తరువాత, 'శ్రేస్టమై, అందమైన ప్రదేశంలో, ఇంద్రునిఆదేశానుసారం విశ్వకర్మ భూలోకానికి వచ్చి సాటి లేని విలాసాలతో వెలిగే, ఇంద్రప్రస్థం అనే పేరు గల మహానగరాన్ని నిర్మించాడు. అది ఇంద్ర కుబేర వరుణ నాగరాజుల రాజధానులతో సరిపోలి ప్రకాశించింది. విశేషం: ఇంద్రుని రాజధాని అమరావతి. కుబేరుని రాజధాని అలకాపట్టణం. వరుణునిరాజధాని (శ్రద్దావతి. నాగరాజు రాజధాని భోగవతి,

796 . శ్రీమదాంధ్ర మహాభారతము ఉ. ఇమ్ముగ విశ్వకర్మ రచియించినకాంచన హర్త్వ్య తుంగ శృం

గమ్ముల రశ్మిరేఖలు ప్రకాశము లైకడుంబర్వితత్సమీ .

  • పమ్మునం బాబుచున్న ఘన పంక్తులయం దచిరద్యుతి ప్రతా

నమ్ములం గ్రేణి సేయుచు ననారతమున్‌ విలసిల్లు. దత్స్పురిన్‌. 71 (ప్రతిపదార్థం: తత్‌+పురిన్‌= ఆ ఇం(ద్రప్రస్తపురంలో; ఇమ్ముగ= ఇంపుగా; విశ్వకర్మ; రచియించిన= నిర్మించిన; కాంచన, హర్మ్య, తుంగ, శృంగమ్ముల, రశ్ళి రేఖలు= బంగారుమేడల ఎత్తైన శిఖరాల కాంతి వరుసలు; 'ప్రకాశములు+ఐ= వెలువడిన వై; కడున్‌= మిక్కిలి; పర్వి= వ్యాపించి; తత్‌+సమీపమ్మునన్‌= ఆశిఖరాలదగ్గర; పాటుచు+ఉన్న= పోతూఉన్న; ఘన, పంక్తుల, అందు= మేఘ సమూహాల్లో అచిర, ద్యుతి, ప్రతానమ్ములన్‌= మెరుపుల సమూహాలను; క్రేణి, చేయుచున్‌= గేలి చేస్తూ; అనారతమున్‌= ఎల్లప్పుడు; విలసిల్లున్‌= ఒప్పి ఉంటాయి. తాత్పర్యం: ఆ ఇంద్రప్రస్థ నగరంలో విశ్వకర్మ ప్రియమార నిర్మించిన బంగారు మేడల ఎత్తైన శిఖరాల కాంతి రేఖలు విశేషంగా వ్యాపించి, వాటి సమీపాన పోతున్న మేఘాలలోని మెరపుతీగలను ఎగతాళిచేస్తూ (ప్రకాశిస్తున్నాయి. విశేషం: అలం: అతిశయోక్తి ఉపమ. చ. అలఘుతరంబు లై తుహిన హారి సుధారుచి నిందురోచిరా

కులశశికాంతవేది పృథుకుంజగళ జ్ఞలనిర్షరంబులన్‌

విలసిత జాహ్నవీ విమలవీచి విలోల లసత్ప్సతాకలం

బొలుపగు.€ దత్పురీభవనముల్‌ హిమశైలనము. బోలి యున్నతిన్‌. 72 ప్రతిపదార్ధ్హల: తుహిన, హారి, సుధారుచిన్‌= మంచువలె మనోహర మైన సున్నపుకాంతిచేత; ఇందు, రోచిః:+ఆకుల, శళికాంత; వేది, పృథు, కుంజ, గళలత్‌+జల, నిర్మరంబులన్‌= చంద్రుని కిరణాలచే కలత నొందిన (కరగిన) చం(ద్ర కాంత మణుల తిన్నైలు కల పెద్ద పొదరిండ్లనుండి జాలువారుతున్న నీటి'ప్రవాహాలచేత; విలసిత, జూహ్నవీ, విమల, వీచి, విలోల, లసత్‌+పతాకలన్‌= మెరుస్తున్న గంగానదియొక్క నిర్మలా లైన తరంగాలవలె చలిస్తూ (ప్రకాశించే జెండాలచేత; తత్‌+పురీ, భవనముల్‌= ఆ పట్టణంలోని మేడలు; అలఘుతరంబులు+ఐ= మిక్కిలి గొప్పవై; ఉన్నతిన్‌= ఎత్తులో; హిమశైలమున్‌= హిమాలయపర్వతాన్ని; పోలి; పొలుపు+అగున్‌= ఒప్పి ఉంటాయి. | తాత్పర్యం: మంచువలె మనోహర మైన సున్నపుకాంతిచేతా, చంద్రుని కిరణాలచే కరిగిన చంద్ర కాంత మణుల అరుగులు గలపెద్ద పాదరిండ్ల నుండి జాలువారే నీటిప్రవాహాలచేతా, గంగానది నిర్మల తరంగాలవలె చలిస్తూ ప్రకాశించే జెండాలచేతానూ, ఆ ఇం(ద్రప్రస్థపురంలోని ఎత్తైన పెద్ద మేడలు హిమాలయ పర్వతాన్ని పోలి వెలుగుతున్నాయి. విశేషం: అలం: ఉపమ. ఆపట్టణంలోని మేడలు ఎంత పెద్దవో, ఎంత ఎత్తైనవో ఈ పద్యం ధ్వనింపచేస్తున్నది. కావ్యాలలో కధావసరాన్నిబట్టి అప్టాదశపర్హన లుంటాయి. వాటిలో పురవర్షనకు ఒజ్జబంతిగా నన్నయ అలంకార సుందరంగా ఇంద్రప్రస్థ పుర వర్లనం చేశాడు. కావ్యేతిహాస నిర్మాణంలో కావ్య స్పృహను వెలార్చే రచనా శిల్బంలో ఇదోకవిశేషం,(సంపా.) చ. వననిధిలోని రత్నములు వాసుకిమూర్థజరత్నసంఘముల్‌

గొనంగ నవశ్యమున్‌ జనులకున్‌ సమకూరదు గాన నెప్పుడుం

గొనుండు పరార్థ్యరత్నములు గోరినవానిన యిత్తుమ న్తెజం

గువం బచరింతు రంగడులం గోమటు లప్పరి నిద్ధరత్నముల్‌. 73

ఆదిపర్వము - అష్టమాశ్వాసము గంగా

ప్రతిపదార్థం: ఆ+పురిన్‌= ఆ పట్టణంలో; కోమటులు; వన, నిధి, లోని, రత్నములు= సముద్రంలో ఉన్నరత్నాలూ; వాసుకి, మూర్చజ, రత్న, సంఘముల్‌= వాసుకియొక్క శిరస్సులో పుట్టినరత్నాల సమూహాలూ; కొనంగన్‌= కొనటానికి; జనులక్షున్‌; అవశ్యమున్‌= తప్పక; సమకూరదు, కానన్‌= లభించదు కనుక; పరార్థ్య, రత్నములు= (శ్రేస్టము లైన రత్నాలను; కోరిన, వానిన్‌+ఆ= కోరిన వాటి నన్నిటిని; ఇత్తుము; ఎప్పుడున్‌; కొనుండు; అన్‌+*తెజంగునన్‌= అనేవిధంగా:; అంగడుల; ఇద్ద, రత్నముల్‌= కాంతి గల రత్నాలను; పచరింతురు= (అంగళ్ళలో అమ్మటానికి) అమర్చిపెడతారు. తాత్పర్యం: సముద్రంలోని రత్నాలను, వాసుకిశిరస్సు మీది రత్నాలను కొనటం జనులకు సాధ్యం కాదు కాబట్టి, “మీరు కోరిన ్రేస్టరత్నాలన్నింటినీ మీకు ఇస్తాము, ఎప్పుడైనా కొనండి' అన్నట్టు ఆ పట్టణంలోని కోమట్టు కాంతిమంతా లైన రత్నాలను ఆంగళ్ళలో అమ్మటానికి అమరుస్తారు. విశేషం: అలం: ఉత్రేక్ష - చారుర్వర్య్యాన్ని ఉదాత్తంగా వర్షించటం పురవర్షనంలో ఒక అంళం. అందులో వైశ్యుల వర్షన మిది. స్స్‌ వలరాజుసచివులవడువున బెడంగగు ।; కర్మశస్తనములం గరమువాండి

చూడ్కుల నతిరాగసురుచిరాధరముల । మదవిలాసాలసమందగతుల

వక్రాలకంబుల వలుందపిజుందుల । దర్చగద్దదభాషితములం జేసి

జనులచిత్తములకు సంక్షోభ మొనరించు ; కామినీజనములు గలిగి, సకల తే. కామభోగములకు సదేకాంతగ్భహముం ; బోలి పొలిచియు, ధర్మార్ధములకు నిదియ

యాస్పదంబు నా వర్గత్రయావిరుద్ధు । లైన జనుల కెంతయు నొప్పు నప్పురంబు. 74 (ప్రతిపదార్థం: వలరాజు, సచివుల, వడువున= మన్మథునిసహాయులవలె; బెడయగ+అగు= అంద మైన; కర్కశ స్తనములన్‌= కరినము లైన చన్నులచేతను; కరము, వాడి, చూడ్కులన్‌= మిక్కిలి పదునైన చూపుల చేతను; అతి, రాగ, సురుచిరశఅధరములన్‌= మిడిల్‌ ఎగర్రనైన, మనోహరా లైన పెదవుల చేతను; మద, విలాస+అలస, మంద, గతుల= మదంయొక్కజఒయ్యారంతో: సోమరితనం న కూడిన మెల్లని నడకలచేతను; వక్ర+అలకంబుల= వంకరలు తిరిగిన ముంగురుల కోతను; వలుద, పిజుందులన్‌= లా వై పిరుదులచేతను; దర్చ, గద్గద, భాషితములన్‌+చేసి= గర్భంతో తడబడుతున్న మాటల చేతను; జనుల, చిత్తములకు= 'ప్రజలమనస్సులకు; సంక్షోభము+ఒనరించు= కలత కలిగించే; కామినీ, జనములు= స్త్రీ జనాలు; కలిగి; సకల, కామ, భోగములమూ అన్ని విధా లైన కామభోగాలు అనుభవించటానికి; సత్‌*ఏకాంత, గృహమున్‌= మంచి రహస్య గృహాన్ని; పోలి; పాలిచియు= ఒప్పా! ఉన్నప్పటికి; ధర్మ+అర్హములకున్‌= ధర్మానిక్షీ అర్హానికీ; ఇదియు+అ= ఈ పట్టణమే; ఆస్పదంబు=జ ఉనికిపట్టు; నావ అని అనేటట్టు; వర్షత్రయ+అవిరుద్దులు+ఐన= ధర్మార్ధకామాలు మూడింటికీ విరోధులు కొని -అంటే ఆ మూడుపురుషార్జాలలో ఆసక్తి కలవా శృయిన; జనులకు; ఆ+పురంబుజ ఆ ఇం(ద్రప్రస్టపురం; ఎంతయున్‌= మిక్కిలి; ఒప్పున్‌, తాత్సర్యం: మన్మథునికి సహాయంచేసేవాళ్ళవలె-అందమై, కఠినాలైనస్తనాలచేతా, పదు నైన చూపులచేతా, ఎ(ర్రనై మనోహరా లైన పెదవులచేతా, మదంయొక్క ఒయ్యారంతో మెల్ల నైన నడకలచేతా, పెద్ద పిరుదులచేతా, గర్వంతో తడబడే మాటలచేతా, జనుల మనస్సులను కలవరపరిచే (స్త్రీలను కలిగి, కామభోగాలన్నిటికీ ఏకాంతమందిరంవలె ఉండి, 'ధర్మార్జాలకు ఇదే స్టానం' అన్నట్టు, ధర్మార్థకామాలు మూడింటిలోనూ ఆసక్తు లైనవాళ్ళకు ఆ ఇం(ద్రప్రస్థపురం ఎంతో తగి ఉన్నది. విశేషం: అలం: ఉపమ, ఉ్రేక్ష. పురవర్షనంలో వేశ్యావర్లనం ఒక అంశం. ధర్మమూర్తి అయిన ధర్మరాజుయొక్క ముఖ్యపట్టణమైన ఇం(ద్రప్రస్తపురంలో నన్నయ 'కామినీజన' వర్ణనం చేశాడు. కామినీశబ్దానికి వేళ్య అనే అర్ధం రూఢిలో ఏర్పడిందేకాని వస్తుతః అది

798 శ్రీమదాంధ్ర మహాభారతము (స్రీవాచకమే. ప్రియసంగమంలో మిక్కిలి ఆసక్తిగల ఆడుది అనే అర్జవిశేషం కలది. ఆ పురకామినులు విలాససంపదచేత మారవికారాలు కలిగించేవాళ్ళయినా ధర్మార్హకామసాధకులైన ఆ పౌరజనుల ధార్మికప్రవృత్తికి విరుద్దులు కారని వర్షించి నన్నయ జాచిత్యాన్ని పాటించాడు. 'కామినీజనములు' అనేసమాసం రుచిరార్థసూక్తి.(సంపా.) క. _ శరనిధినినాదనిభ మగు ; పురఘోషముం గీడుపజిచి పొలుపగుం గర మ

ప్వురి బ్రహ్మపురి మహీసుర । వరవేదాధ్యయనరవన మవార్యం బగుచున్‌. 75 ప్రతిపదార్థం: ఆ+పురి, బ్రహ్మ, పురి= ఆ ఇంద్రప్రస్టంలోని బ్రాహ్మాణపురంలో; మహీసుర, వర, వేద+అధ్యయన, రవము= (బ్రాహ్మాణశ్రష్టులయొక్క వేదం చదివే ధ్వని; అవార్యంబు+అగుచున్‌= అడ్డగింపరానిదై; శరనిధి, నినాద, నిభము+అగు= సముద్ర ధ్వనితో సమాన మైన; పుర, ఘఫోషమున్‌= పట్టణ ధ్వనిని; కీడు, పఠిచి= అణచివేసి; కరము= మిక్కిలి; పాలుపు+అగున్‌= ఒప్పును. తాత్పర్యం: ఆ ఇంద్రప్రస్థంలోని బ్రాహ్మణపురంలో బ్రాహ్మణ శ్రేష్టుల వేదాధ్యయన ధ్వని, ఆపటానికి సాధ్యం కానిదై. సము(ద్ర ధ్వనితో సమాన మైన ఆ పట్టణ ధ్వనిని మించి మిక్కుటంగా వినిపిస్తూ ఉంటుంది. విశేషం: అలం: పర్యాయోక్తం, ఉపమ. పురధ్వనికంటె వేదధ్వని మించిందని చెప్పటంవలన పురజనులలో అందరికంటె (బ్రాహ శైణులకు అధిక గౌరవం లభిస్తున్నదని పర్యాయంగా చెప్పినట్టయింది. నిరంతరం యజ్ఞయాగాదులు జరుగుతున్నాయనికూడ చెప్పవచ్చును. వేదాధ్యయనపరులైన (బ్రాహ్మణులను వర్షించటం పురవర్షనలోని చాతుర్వర్ష్య వర్షనలో ఒకటి. చ. పరిఘజలంబులం దమల పంకరుహోత్ప్సలకైరవాదిసుం

దర కుసుమంబులున్‌ ఘనపధంబున నుజ్వలతారకా నిరం

చతర కుసుమంబులున్‌ వెలయు. దత్పురవప్రము పాదపీఠికా

శిరముల కొప్ప నర్జనలు సేసిన పువ్వుల యవ్విధంబునన్‌. 76 ప్రతిపదార్థం: పరిఘ, జలంబులందు= అగడ్తనీళ్ళలో; అమల, పంకరుహ+ఉత్ప్సల, కైరవ+లఅది, సుందర, కుసుమంబులున్‌= నిర్మల మైన పద్మాలు, నల్లకలువలు, తెల్లకలువలు, మొద లైన అందమైనపూలూ; ఘన, పథంబునన్‌ః ఆకాశంలో; ఉజ్వల, తారకా. నిరంతర, కుసుమంబులున్‌= బాగా్రకాళించే నక్షత్రాలనే దట్టమైన పూలూ; తత్‌+పుర, వప్రము, పాదపీరికా, శిరములకు= ఆ పట్టణముయొక్క (ప్రాకార పాద పీరానికి, శిరస్సుకు; ఒప్పన్‌; అర్భనలుజ పూజలు; చేసిన; పువ్వుల, ఆ+విధంబునన్‌= పువ్వులా అన్నట్టు; వెలయున్‌= ప్రకాశిస్తున్నాయి. తాత్సర్యల: అగడ్త నిళ్ళల్లో ఉన్న పద్మాలు, నల్లకలువలు, తెల్లకలువలు మొదలైన అందమైన పూలు, ఆకాశంలో బాగా'ప్రకాళించే నక్షత్రా లనే దట్ట మైన పూలు, ఆ పట్టణంయొక్క (ప్రాకారపాదపీఠానికి, శిరస్సుకు పూజచేసిన పువ్వులా అన్నట్టు ప్రకాశిస్తున్నాయి. విశేషం: అలం: ఉత్రేక్షు క్రమం. ఆ పట్టణ (ప్రాకారాలు ఆకాశాన్ని అంటేటంత ఎత్తైన వని ధ్వని. ఎత్తైనకోటను, లోతైనఅగడ్తల వైభవాన్ని వర్ణించటం పురవర్షనాంశంలో ఒకటి. చ. తనుము నదంచుచున్‌ వెలుంగగుతత్పురగోపురశాతకుంభకుం

భముల విచిశ్రసన్మణిగభస్తినితానములన్‌ విచిత్రవ

ర్హములగు వాత్మవాహముల నమ్మక పల్మజు. జూచి యన్యవా

హము లని సంశయప్రణిహితాత్ముం డగున్‌ హరిదశ్వుం డెప్పడున్‌. 77

ఆదిపర్వము - అష్టమాశ్వానము 799 (ప్రతిపదార్ధం: తమమున్‌= చీకటిని; అడంచుచున్‌; వెలుంగు; తత్‌+*పుర గోపుర, శాతకుంభ, కుంభముల, విచిత్ర, సత్‌+మణి, గభస్తీ, వితానములన్‌= ఆ పుర ద్వారగోపురాల యొక్క బంగారు కలశాల చిత్రవిచిత్రా లైన మంచి మణుల కాంతుల సమూహాలచేత; విచిత్ర, వర్షములు+అగు= నానావిధా లైన రంగులు కల వైన; ఆత్మవాహముల= తన గుర్రాలను; నమ్మక; పల్మలయున్‌= అనేకసార్జు; చూచి; అన్య, వాహములు+అని= ఇతరా లైన గుర్రాలని; హరిదశ్వుడు= పచ్చనిగు(ర్రాలు గల సూర్యుడు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; సంశయ, ్రణిహిత+ఆత్ముండు= సందేహంలోఉంచబడిన మనస్సు కలవాడు; అగున్‌. తాత్పర్యం: చీకటిని అణచివేస్తూ వెలుగుతున్న ఆ ఇం(ద్రప్రస్థపుర ద్వార గోపురాలమీది బంగారుకలశాలకు పొదిగిన చిత్రవిచిత్రా లైన రత్నకాంతుల సమూహం వలన తన గుర్రాల రంగు నానావిధాలుగా మారిపోగా, పసుపుపచ్చ గుర్రాలు గల సూర్యుడు, అనేక పర్యాయాలు తన గుర్రాలను చూచుకొని, అవి తన గుర్రాలని నమ్మక, వేరే గుర్రాలని ఎప్పుడూ సంధేహపడుతుంటాడు. విశేషం: అలం: అతిశయోక్తి సందేహం. ఆ పట్టణ ద్వార గోపురాలు అంతఎత్తు ఉన్న విని ధ్వని. చ సరళ తమాల తాల హరిచందన చంపక నారికేళ కే సర కదలీ లనంగ పనస క్రముకార్హున కేతకీలతా గరుఘనసార సాల సహకార మహీరుహరాజ రాజి సుం దర నవనందనావకులం దత్పురబాహ్యము లొప్పు. జూడంగన్‌. ౯8 ప్రతిపదార్థం: తత్‌+పుర, బాహ్యములు= ఆ పట్టణంయొక్క వెలుపలిప్రదేశాలు; 'చూడగన్‌: సరళ తమాల, తాల, హరిచందన, చంపక, నారికేళ కేసర, కదలీ, లవంగ, పనస, (క్రముక+అర్జ్హున, కేతకీలతా+*అగరు, ఘనసార, సాల, సహకార, మహీరుహ, రాజ, రాజ, సుందర, నవ, నందన+ ఆవళులన్‌= తెల్లతెగడ, చీకటి, తాటి, మంచిగంధం, సంపెంగ, కొబ్బరి, కేసర, అరటి, లవంగ, పనస, పోక, ఏరుమద్ది, మొగలి, అగరు, పచ్చకర్పూరం, మద్ది, మామిడి- శ్రేష్ట మైన వృక్షాల వరుసలతో అంద మైన క్రొత్త ఉద్యాన వనాల సమూహాలచే; ఒప్పున్‌. తాత్సర్యం: ఆ ఇం(ద్రప్రస్థంయొక్క వెలుపలి (ప్రదేశాలు తెల్లతెగడ, తాటి, మామిడి మొదలైన చెట్లవరుసలతో అందమైన క్రొత్త ఉద్యాన వనాలతో చూడముచ్చటగా ఉంటాయి. మ. అనిలం బప్పురి. బౌరచిత్తముల కత్యానంద మొందంగ నం దిని యన్నేటితరంగలం బెనంగుచున్‌ దివ్యద్రుమాకీర్ణ నం దనసందోహము. దూఖుచున్‌ వికచకేతక్యాదినానాలతాం తనవామోదము. బొందుచున్‌ సుడియు నిత్యంబుం గరం బిప్ట మై. 79 (ప్రతిపదార్హం: ఆ+పురిన్‌= ఆ ఇంద్రప్రస్థపురంలో; అనిలంబు= గాలి; పౌర, చిత్త్రములకు= ఆవురంలో నివసించే జనులమనస్సులక శ జ అత్యానందము= మహానందం; ఒందంగన్‌= కలిగేటట్టు: నందిని; అన్‌= అనేటటువంటి; ఏటి, తరంగలన్‌= ఏటిఅలలత్‌ ; పెనంగుచున్‌= కూడుచు; దివ్య, ద్రుమ+ఆకీర్ల, నందన, సందోహమున్‌= శ్రేష్టము లైన వృక్షాలచే దట్ట మైన ఉద్యాన వనాల సమూవాన్ని; తూయుచున్‌= చొచ్చుతూ; .వికచ, కేతకీ+అది, నానా, లతాంత, నవ+ఆమోదమున్‌= వికసించిన మొగలిపున్వమొదలుగా గల వివిధా లైన పుష్పాలయొక్క క్రొత్తసువాసనను; పొందుచున్‌; కరంబు= మిక్కిలి; ఇష్టము+ఐ; నిత్యంబున్‌; సుడియు= స్తుంది.

800 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: ఆ ఇం(ద్రప్రస్థపురంలోని గాలి పొరజనుల మనస్సులకు మహానందం కలిగేటట్టు నందిని అనే నది అలలమీదుగా వచ్చి, (్రేష్టాలైన వృక్షాలచే దట్ట మైన ఉద్యానవనాలలో దూరి, వికసించిన మొగలిపూలు మొదలైన వివిధ పుష్పాల క్రాత్త వాసనలను సమకూర్చుకొని మిక్కిలి ప్రియంగా వీస్తుంది.

విశేషం: నది అలలమీదుగా, ఉద్యానవనాలమధ్యగా రావటంవలన ఆ గొలికి చల్లదనం, పూల సువాసనలను ([గ్రహించటంవలన పరిమళం, సమకూరి అది ఆ పురజనులకు హాయిని గొలుపుతూ ఉన్నది. పురవర్లనాన్ని మందమలయానిలప్రశస్తితో ముగించటం ఒక కౌచిత్యం. సుగంధయుతమైన గాలి ఆ పట్టణజీవితంలోని ఉత్తమవాసనలను ధ్వనింపచేస్తుంది.

ఈ ఇంద్రప్రస్థ పుర వర్షన తరువాతి కవులకావ్యాలలోని పుర వర్షనలకు మార్గదర్శకం అయ్యేటట్టుగా నడిచింది కావ్యంలో అష్టాదశవర్షన లుండటం లక్షణం. ఆ వర్షనలలో పురవర్షనం ఒకటి. కావ్యలక్షణవిశిష్ట మైన ఇతిహాసాన్ని (కావ్యేతిహాసాన్ని) నన్నయ రచిస్తున్నాడు కాబట్టి ఈ పురవర్షనం కావ్యేతిహాసంలో కావ్య స్వభావాన్ని పెంచే ఒక రమణీయమైన అంశం. (సంపా) వ. _ఇట్టియింద్రప్రన్సపురంబున నింద్రవిలానంబుతో వ్యాసవాసుదేవానుమతుం డై ధర్మతనయుండు

ధామ్యవురస్వరమహీసురప్రవరవేదఘోషంబులు, సకలజనాశీర్వాదనాదంబులు, మృదుమధుర

మంగళ సంగీత రవంబులు, వివిధతూర్యధ్వనులు నతిసమృద్ధంబు లై యెసంగ వర్గచతుష్టయంబునుం బోని

యనుజవర్గ్షంబుతో శుభముహూర్తంబునం బురప్రవేశంబు సేసి సర్వప్రకృతిజనానురాగకరుం దయి. 80 ప్రతిపదార్థం: ఇట్టి; ఇంద్రప్రస్త్ర పురంబునన్‌; ఇంద్ర, విలాసంబుతో= ఇంద్రునియొక్క విలాసం వంటి విలాసంతో; వ్యాస, వాసుదేవ+అనుమతుండు+ఐ= వ్యాసునితో, శ్రీకృష్ణునితో అనుమతి పాందినవా డై; ధర్మతనయుండు; ధౌమ్య, పురస్సర, మహీసుర, (ప్రవర, వేదఘోషంబులు= ధౌమ్యుడుమొద లైన (బ్రాహ్మణ శ్రష్టలయొక్కవేదధ్వనులూ; సకల,జన+ఆశీర్వాద, నాదంబులును= ప్రజలందరియొక్క ఆశీర్వ్యాదశబ్దాలూ; మృదు, మధుర, మంగళ, సంగీత, రవంబులు= సున్నితాలూ, మనోహరాలూ, శుభంకరాలూ అయిన సంగీతనాదాలూ; వివిధ, తూర్య, ధ్వనులున్‌= అనేకవిధా లైన వాద్యధ్వనులూ; అతి, సమృద్దంబులు+ఐ= మిక్కిలిగా నిండిన వై ఎసంగజ= అతిశయించగా; వర్ష చతుష్టయంబునున్‌+పోని= ధర్మార్హకామమోక్షాలు అనే నాలుగుపురుషార్దాలను పోలిన; అనుజ, వర్గంబుతో= తమ్ముల సమూహంతో: పుర, ప్రవేశంబు; చేసి; సర్వ, (ప్రకృతి, జన+అనురాగ, కరుండు+అయి= సామాన్యజనులందరికీ సంతోషం కలిగించేవా డై. తాత్పర్యం: ఈవిధమైన ఇంద్రప్రస్థ పురంలో దేవేంద్రునివలె విలాసంతో, వ్యాస, శ్రీకృష్ణుల అనుమతితో ధౌమ్యుడుమొద లైన (బ్రాహ్మణ శ్రేష్టుల వేద ధ్వనులు, సకల జనుల ఆశీర్వాద శబ్టాలు, మృదు, మధుర, శుభ, సంగీతనాదాలు, వివిధ వాద్య ధ్వనులు మిక్కిలి అతిశయించగా, నాలుగు విధాలైన పురుషార్దాలను పోలిన నలుగురు తమ్ములతో పురప్రవేశం చేసి ప్రజలందరికీ ఆనందం కలిగించేవాడై. చ. అనుజులు నల్వురుం దనకు నత్యనురాగమునన్‌ వధేయు లై

తనరుచు నుండ వేదవిహితం బగు యజ్ఞమపొోలె సర్వపా

వనశుభమూర్తి యై భువనవంద్యుండు ధర్మపరుండు ధర్మనం

దనుండు ధరాధిరాజ్యము ముదంబునం జేయుచునుండె. బేర్మితోన్‌. 81 ప్రతిపదార్థం: అనుజులు= తమ్ములు; నల్వురున్‌; తనకున్‌; అతి+అనురాగమునన్‌= మిక్కిలి(ప్రేమతో; విధేయులు+ఐ= లొంగినవా ళ్ళయి; తనరుచున్‌= ఒప్పుతూ; ఉండ= ఉండగా; వేద, విహితంబు+అగు= వేదముచే విధింపబడిన దైన; యజ్ఞమపోలె; సర్స, పావన, శుభమూర్తి+ఐ= సమస్తాన్ని పవిత్రం చేసే శుభకర మైన ఆకారం కలవా డై; భువనవంద్యుండు= లోకాలచే

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 801 నమస్కరించతగినవాడు; ధర్మపరుండు= ధర్మమే ప్రధానంగా కలవాడు; ధర్మనందనుండు; ధరా+అధిరాజ్యము= భూమండల పరిపాలనం; ముదంబునన్‌= సంతోషంతో: పేర్మితోన్‌= గొప్పతనంతో; చేయుచున్‌; ఉండెను. తాత్సర్యం: తమ్ములు నలుగురు ఎంతో ప్రేమతో తనకు విధేయు లై వెలుగుతుండగా, వేదం విధించిన యజ్ఞం వలె సమస్తాన్నీ పవిత్రం చేసే శుభకర మైన ఆకారం కలవాడై లోకాలచే నమస్కరించ దగినవాడు, ధర్మమే ప్రధానంగా కలవాడు అయిన ధర్మరాజు సంతోషంతో గొప్పగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. విశేషం: అలం: ఉత్రేక్ష రాజ్యపాలనాన్ని ధర్మరాజు పవిత్ర మైన యజ్ఞంగా భావించాడు. నలువురు తమ్ములు నలువురు బుత్విక్కులు. సీ. అనఘు వేదాధ్యయనాసక్తు నారభ్య।; మాణమహాధ్వరు మనుచరిత్రు

సర్వవర్జాశ్రమసంరక్షణక్షము :; సత్యసంధాను నజాతశత్రు భరతవంశోత్తము. బ్రభు ధర్మనందను । రాజుఠగాం బడసి సురాజ యయ్యె వసుధ; యధిష్టానవతి యయ్యె మథి లక్ష్మి । బంధుమంతం బయ్యె బరమధర్య ఆ. _ మన్నరేంద్రునందు నాపూర్ణతరశర ; దైందవాతపంబునందు. జ్రీతి సమము కా సమస్తజనులచిత్తంబు లా ।; నందరసభరంబు నొందం దాల్టె. 82 (ప్రతిపదార్హం: అనఘుజ= పాపంలేనివాడిని; వేద+అధ్యయన+ఆసక్తున్‌= వేదాన్ని చదువుకోవటంలో ఆసక్తికలవాడిని; ఆరభ్యమాణ, మహా+అధ్వరు= ఆరంభం కానున్న గొప్పయజ్ఞాలు కలవాడిని; మనుచరిత్రు= వైవస్వతమనువుయొక్క చరిత్రవంటి చరిత్రకలవాడిని; సర్వ, వర్ణాశ్రమ, సంరక్షణ, క్షము= అన్నివర్ధాలను, ఆ(శ్రమాలను సంరక్షించటంలో సమర్హుడైన వాడిని; సత్యసంధానున్‌= ఆడితప్పనివాడిని; అజాతశత్రున్‌= పుట్టబడనిశత్రువులు కలవాడిని- అంటే శత్రువులు లేనివాడిని; భరతవంశ+ఉత్తమున్‌= భరతవంశంలో (్రేష్టుడిని; ప్రభు; ధర్మనందనున్‌= ధర్మరాజును; రాజున్‌+కాన్‌; పడసి= పొంది; వసుధ= భూమి; సురాజ అయ్యె= మంచిరాజును కలిగినది అయింది; మతి; లక్ష్మి; అధిష్టానవతి= ఆ(క్రమించుకొన్నభర్త కలది; అయ్యె; పరమధర్మము; బందుమంతంబు= బంధువు కలది; అయ్యెన్‌; ఆ+నర+ఇంద్రు, అందున్‌= ఆరాజులోను; అవూర్జతర, శరత్‌+ఐందవ+ఆతపంబునందున్‌= మిక్కిలి నిండైన శరత్కాలంలోని చం(ద్రసంబంధ మైన కాంతిలోను; ప్రీతి; సమమకా= సమానం కాగా; సమస్త, జనుల, చిత్తంబులు= అందరు ప్రజల మనస్సులు; ఆనందరస, భరంబున్‌= సంతోషాతిశయాన్ని; ఒందన్‌= కలిగేటట్టు; తాల్చెన్‌= ధరించాయి. తాత్పర్యం: పుణ్యాత్ముడు, వేదాన్ని చదువుకోవటంలో ఆసక్తి కలవాడు, గొప్పయజ్ఞాలు ప్రారంభించేవాడు, మనువు వంటి ధార్మిక మైన నడవడి కలవాడు, అన్నివర్ణాలను ఆశ్రమాలను రక్షించే సమర్ధత కలవాడు, ఆడి తప్పునివాడు, శత్రువులు లేనివాడు, భరతవంశశ్రేష్టుడు అయిన ధర్మరాజును రాజుగా పొంది- భూమండలం మంచిరాజును కలది అయింది. లక్ష్మి స్థిర మైన భర్త కలది అయింది. ధర్మం మంచి బంధువు కలది అయింది. జనులు శరత్కాల పూర్షచంద్రుని వెన్నెల్లోను, ఆ ధర్మరాజులో సమానమైన ప్రీతికలవాళ్ళయి సంతోషిస్తూ ఉన్నారు. విశేషం: వర్షాలు నాలుగు- బ్రాహ్మణ, క్షత్రియ, వైళ్య, ఛూద్రులు ఆశ్రమాలు నాలుగు- బ్రహ్మచర్య, గార్హస్ట్రః వానప్రస్థ, సన్న్యాసాలు. అలం: ప్రహర్షణం, తుల్యయోగిత. పై పద్యంలో వర్లించినవన్నీ ధీరోదత్తనాయక లక్షణాలు | తం గ్రంథాలు ల క్క క. ధరణిప్రజ ధర్మసుతు సు ; స్థిరనిర్మలధర్మచరిత! జేసి రుజాత ఖో ల్‌ ౮” ను. న స్మరపరరాష్ట్రవిబాధల( ; బొరయక సంతతసమృద్దిం బొందె విభూతిన్‌.. (40 ౫6... ,......త3 రాటం అఆ 9 గ్‌ స నై టౌత్రార్షగ్థా నో షీ ళీ హూ కే జో

802 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: ధరణిఫ్రజ= భూమిమీదిజనులు; ధర్మసుతు, సుస్థిర, నిర్మల, ధర్మ, చరితన్‌+చేసి= ధర్మరాజుయొక్క మిక్కిలి స్టిరమైై, స్వచ్చమైన ధర్మం గల నడవడితో; రుజా, తస్కర, పరరాష్ట్ర, విబాధలన్‌= రోగాలవలన, దొంగలవలన, శత్రుదేశాలవలన విశేష మైన బాధలు; పొరయకః= పొందక; విభూతిన్‌= ఐశ్వర్యంతో; సంతత, సమృద్దిన్‌= ఎడతెగని సంపూర్ణ్షతను; పాందె. తాత్పర్యం: ధర్మరాజు మిక్కిలి స్థిర మై స్వచ్చ మైన ధర్మ (ప్రవర్తన కలవాడుకోవటంచేత ప్రజలు రోగాలవలన దొంగలవలన, శత్రుదేశాలవలన బాధలు లేక ఎడతెగని సంపదలు సమృద్దిగా పొందారు. క, _ శవరిరి తద్దేశంబున ।; ననవరతము యజనయాజనాధ్యయనాధ్యా

పనదానములుం బ్రతిగ్రహ । మును నను షట్కర్మములను భూసురవంశ్యుల్‌. 84 ప్రతిపదార్థం: భూసుర, ముఖ్యుల్‌= ఉత్తము లైన బ్రాహ్మణులు; తత్‌+దేశంబునన్‌= ఆదేశంలో; అనవరతము= ఎల్లప్పుడు" యజన, యాజన+అధ్యయన+అధ్యాపన, దానములున్‌= యజ్ఞం చేయటం, చేయించటం, వేదం చదవటం, చదివించటం దానం చేయటం; ప్రతిగ్రహమును= దానం పుచ్చుకోవటం; అను; షట్‌+కర్మములను= ఆరుకర్మ(ము)లచేత; తనరిరి= ఒప్పారు. తాత్పర్యం: ఆ దేశంలోని బ్రాహ్మణోత్తములు యజ్ఞంచేయటం, చేయించటం, వేదం చదవటం, చదివించటం, దానం చేయటం, పుచ్చుకోవటం, అనే ఆరు కర్మలను ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉన్నారు. క. పంబ యజనాధ్యయన దా । నంబుల వర్తిల్లె బ్రాహ్మణప్రియ మయి ధ

ర్వం బయి క్షత్రియవైశ్యకు । లం బవిరతపుణ్యకర్మలాలస మగుచున్‌. 85 (ప్రతిపదార్దం: క్షత్రియ, వైశ్య, కులంబు; పంబి= వృద్ది పొంది; బ్రాహ్మణ, ప్రియము+అయి= (బ్రాహ్మణులు ఇష్ట మైన వాళ్ళుగా కల దై; ధర్మ్య్యంబు+అయి= ధర్మంనుండి తాలగని దై; అవిరత, పుణ్యకర్మ, లాలసము+అగుచున్‌= ఎడతెగని పుణ్యకార్యాల్లో ప్రీతి కలది అవుతూ; యజన+అధ్యయన, దానంబుల= యజ్ఞం చేయటంలోను, వేదం చదవటంలోను, దానం చేయటంలోను; వర్తిల్లై= ఉన్నది. తాత్పర్యం: క్షత్రియులు, వైశ్యులు వృద్దిపాంది, బ్రాహ్మణభక్తి గలవా రై ధర్మమార్గం తప్పక, ఎల్లప్పుడు పుణ్యకార్యాల్లో ప్రీతి కలిగి, యజ్ఞాలు చేస్తూ, వేదాలు చద్దువుతూ, దానాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు. క. _ పరమద్విజశుశ్రూషా । పరు లయి శూద్రాదు లవనిం బరగిరి ధర్మ

స్థిరమతు లయి ధర్మజు ధర్మరాజ్య మభివృద్ధి. బొందె మహిమాన్విత మై. 86 (ప్రతిపదార్థం: శూద్ర+ఆదులు= శూద్రులు మొదలైన వాళ్ళు; పరమ, ద్విజ, శుశ్రూషా, పరులు+అయి= కేవలంటబ్రాహ్మణులకు సేవచేయటంలో మిక్కిలి కోరిక కలవాళ్ళయి; ధర్మ, స్థిర, మతులు+అయిజ ధర్మంమీద నిలకడ గల బుద్దిగలవా ళృయి; పరగిరి= (ప్రవర్తిల్లారు; ధర్మజు, ధర్మరాజ్యము: మహిమ+అన్వితము+ఐ= గొప్పతనంతో కూడినదై: అభివృద్దిన్‌; పొందె. తాత్పర్యం: శూద్రులు మొద లైనవాళ్ళు కేవలం బ్రాహ్మణులకు సేవ చేయటంలో ఎంతో ఆసక్తి కలవాళ్ళయి; ధర్మంమీద స్ట మైన బుద్దికలవాళ్ళయి నడుచుకొన్నారు. ధర్మజుని ధర్మరాజ్యం గొప్పగా అభివృద్ది పొందింది. విశేషం: రాజధానిలోనే కాక రాజ్యమంతటాకూడా చాతుర్వర్ల్య ప్రజలు వర్షాశ్రమ ధర్మాలతో ధర్మం తప్పక (బ్రాహ్మణ భక్తితో వర్తిల్లుతున్నారని చెప్పి, 'యధారాజా తధా ప్రజా' అనే సూక్తి సార్ధక మైనట్టు ధ్వనింపచేశాడు నన్నయ.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 803

న. అంత, 87 తాత్సర్యం: అట్లా ఉండగా. క. 'నారదు(డు వచ్చు( దద్వచ । నారంభుల రగుంయయ మీర' లని కఅపి మహో

దారుడు వారల వీడ్మోని ; నారాయణు. డరిగెం దత్‌క్షణమ తనపురికిన్‌. 88 ప్రతిపదార్థం: నారదుండు; వచ్చున్‌; మీరలు; తత్‌+వచన+ఆరంభులరు= అతనిమాట ప్రకారం చేసేవాళ్ళు; అగుండు; అని; కజపి= బోధించి; మహా+ఉదారుండు= మిక్కిలిగొప్పవాడు; నారాయణుండు= శ్రీకృష్ణుడు; వారల; వీడ్కొని; తత్‌*క్షణము+అ= వెంటనే; తన, పురికిన్‌= తననగరానికి- ద్యారకానగరానికి; అరిగెన్‌= వెళ్ళాడు. తాత్పర్యం: “మీ దగ్గరకు నారదుడు వస్తాడు. ఆతడు చెప్పిన విధంగా మీరు నడుచుకోండి' అని పాండవులకు చెప్పి మహాత్ముడైన శ్రీకృష్ణుడు వెంటనే ద్వారకానగరానికి వెళ్ళాడు. వ. _ పాండవులును పరాక్రమ, ప్రణయ, వశీకృతాఖిలరాజన్యు లయి సుఖం బుండు నంత నొక్కనాయ. 89 ప్రతిపదార్థం: పాండవులును; పరాక్రమ, (ప్రణయ, వళీకృత+అఖిల, రాజన్యులు+అయి= పరా[క్రమంచేత; స్నేహంచేత; స్వాధీనులుగా చేసికొనబడిన ఎల్ల రాజులు కలవా ళ్ళయి - అనగా పరా(క్రమంచేత. స్నేహంచేత రాజులందరినీ తమవశం చేసికొని; సుఖంబు+ఉండు, అంతన్‌= సుఖంగా ఉండగా; ఒక్కనాండు. తాత్పర్యం: పాండవులు తమ పరా(క్రమంతో, స్నేహంతో రాజులందరినీ తమ వంశం చేసికొని సుఖంగా ఉండగా, ఒకనాడు.

నారదుండు పాండవులసాలికి వచ్చుట ( సం- 1-200-8)

తరలము.

ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్రయీ

శివకరుండు హితోపదేశము సేయంగాం గడువేడ్కతో

దివిజవంద్యుండు బ్రీతితోం జనుదెంచె నారదుల డంబుజో

ద్ధవతనూజుండు భానుతేజుడు పాండవేయులపాలికిన్‌. 90 (ప్రతిపదార్థం; 'ప్రవిమల+ఆగమ, తత్త్వ వేదిజఐు పరిశుద్ధము లైన వేదాలయొక్క తత్తాన్ని తెలిసినవాడు; తపః ప్రభాసి= తపస్పుచే ప్రకాశించేవాడు; జగత్‌+త్రయీ శివకరుండు= లోకాలు మూడిటికీ మేలుచేసేవాడు; దివిజ, వంద్యుండు= దేవతలచే పూజింప దగినవాడు; భాను, తేజుండు= సూర్యునితో సమాన మైన తేజస్సు కలవాడు; అంబుజ+ఉద్భవ, తనూజుండు= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవునికుమారుడు; నారదుండు: హిత+ఉపదేశము; చేయంగాన్‌= చేయటానికి; కడు. వేడ్కతో= మిక్కిలిసంతోషంతో:; పాండవేయుల, పాలికిన్‌= పాండవులదగ్గరకు; ప్రీతితో= ప్రేమతో; చనుదెంచె= వచ్చాడు. తొత్పర్యం: పవి(త్రాలైన వేదాలతత్త్యం తెలిసినవాడు, తపస్సుచేత ప్రకాశించే వాడు, ముల్లోకాలకు శుభం చేకూర్చేవాడు, దేవతలచేత పూజించదగినవాడు, సూర్యునితో సమాన మైన తేజస్సు కలవాడు, (బ్రహ్మదేవునిపుత్రుడు అయిన నారదుడు హితాన్ని ఉపదేశించటానికి మిక్కిలి సంతోషంతో పాండవుల దగ్గరకు వచ్చాడు. విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది. 1.21 విశేషం.

804 త్రీనుదాంధ్ర మహాభారతము మానిని.

తమ్ములుం దానును ధర్మతనూజుండు తత్‌క్షణనంభృతసంభబ్రముం డై

యమ్మునినాథవరేణ్యునకున్‌ వినయమ్మున మొక్కి సమున్నతపీ

ఠమ్మున నుంచి యథావిధి వూజ లొడంబడం జేసి మునీశ్వర నె

య్యమ్మున నీ విట వచ్చుటంజేసి కృతార్జుల మైతిమి యిందఅమున్‌. 91 ప్రతిపదార్థం: ధర్మతనూజుండు= ధర్మరాజు; తమ్ములున్‌; తానును; తత్‌+క్షణ, సంభృత, సంభ్రముండు+ఐ= ఆ క్షణంలో చక్కగా భరింపబడిన ఆదరం కలవాడై: ఆ+ముని, నాధ, వరేణ్యునకున్‌= ఆ బుషి (్రేష్టు డైన నారదునకు; వినయమ్మున; (మొక్కి; సమున్నత, పీరమ్మున= మిక్కిలిఎత్తైన పీఠంపై; ఉంచి= కూర్చుండబెట్టి: యధావిధి, పూజలు; ఒడంబడన్‌= అంగీకరించేటట్టు; చేసి; ముని+ఈశ్చరజ ముని(శ్రేష్టా; నెయ్యమ్మున= స్నేహంతో; నీవు; ఇట; వచ్చుటన్‌+చేసి= రావటంవలన; ఇందఅమున్‌= ఇంతమందిమి; కృతార్జులము+ఐతిమి= ఈడేరిన కోరిక కలవార మయ్యాము.

తాత్పర్యం: ధర్మరాజు తమ్ములతో కూడ అమిత మైన ఆదరభావంతో ఆ బుషి(్రేష్టు డైన నారదునికి వినయంగా

మొక్కి, మిక్కిలి ఎత్తైనపీఠంమీద కూర్చుండబెట్టి, యధావిధి పూజలు చేసి 'మునీశ్వరా! మీరు స్నేహంతో ఇక్కడికి

రావటంవలన మేమంతా కృతార్చులం అయ్యాం" అన్నాడు.

విశేషం: వృత్తలక్షణానికి చూడు: ఆది. 4.20 విశేషం. మానినీ వృత్తాన్ని నన్న్మయ ఆదిపర్వంలో రెండుసార్హు తిక్కన (ప్రీపర్వంలో

రెండుసార్హు వాడారు.

వ. “మాపుణ్యంబునంజేసి భవద్దర్శనంబు సంభవించె' నని పరమప్రీతహ్యృదయు లై పలికి, పరమభక్తిం బాంచాలి మైైొక్కించి యున్నంత, నందఅ నాశీర్వచనంబుల నభినందించి వారల కుశలం బడిగి నారదుండు ద్రౌవదిం బోవం బనిచి, వారేవురకు నేకాంతంబున ని ట్లనియె. 92

ప్రతిపదార్హం: మా, పుణ్యంబునన్‌+చేసి=ఐ మా పుణ్యం వలన; భవత్‌+దర్శనంబు= మీ దర్శనం; సంభవించెను= కలిగింది, అని;

పరమ, ప్రీత, హృదయులు+ఐ= మిక్కిలి సంతోషించిన హృదయం కలవా ళ్ళయి; పలికి పరమ, భక్తిన్‌; పాంచాలి= (ద్రౌపదిని;

(యొక్కించి; ఉన్నంతన్‌: అందజన్‌; ఆశీర్వచనంబులన్‌; అభినందించి= కొనియాడి; వారల; కుశలంబు+అడిగి; నారదుండు:;

ద్రొపదిన్‌: పోవన్‌+పనిచి= వెళ్ళవలసిం దని ఆజ్ఞాపించి; వారు+ఏవురకున్‌= పాండవు లైదుగురికి; ఏకాంతంబునన్‌= రహస్యంగా;

ఇట్టు+అనియె,

తాత్పర్యం: 'మా పుణ్యం వలన మీ దర్శనం మాకు లభించింది" అని పాండవులు మిక్కిలి సంతోషంతో పలికి,

మహాభక్తితో (ద్రాపదిచేత ఆ మహర్షికి (మొైక్కించారు. నారదమహర్షి అందరినీ ఆశీర్వదించి, కొనియాడి, కుశల

మడిగి, (ద్రౌపదిని పొమ్మని పాండవు లైదుగురితో రహస్యంగా ఇట్టా అన్నాడు.

సీ. నర్వధర్శజ్ఞుల రుర్వీశవపూజ్యుల । రన్యోన్యనిత్యసాహార్దయుతుల రగణితగుణయుక్తి. బోగడంగ6 దగువార , లిట్సి మీకేవుర కివుడు ద్రుపద సుత యొక్కతియ ధర్యమతి ధర్మపత్ని యై । నది; యీక్రమంబు లోకాగమంబు లందు విరుద్ధ; మీసుందరికారణం । బున మీకు వివ్రీతి వుట్టకుండ

ఆ. నుండవలయుం; బ్రియనహోదరుల్‌ దొల్లి నుం । దోపసుందు లొక్కయువతి కడరి విగ్రపొాంచి యనురవీరులు దమలోనం । బొడిచి మృత్యునిలయమునకు. జనిరి. 93

ఆదిపర్వము - అష్టమూశ్వాసము 805

(ప్రతిపదార్హం: సర్వ, ధర్మజ్ఞులరు= అన్నిధర్మాలు తెలిసినవాళ్ళు; ఉర్వి+ఈశ, పూజ్యులరు= రాజులచే పూజింపతగినవాళ్ళు; అన్యోన్య,

నిత్య, సౌవోర్హయుతులరు= పరస్పరం శాశ్వత మైన స్నేహంతో కూడినవాళ్ళు; అగణిత, గుణ, య్యుక్తిన్‌= లెక్కలేనన్ని గుణాల కూడికచే;

పొగడంగన్‌, తగు, వారలు; ఇట్టి; మీకు; ఏవురకు= ఐదుగురికి; ఇపుడు; ద్రుపద, సుత= (ద్రుపదరాజుకూతురు; ఒక్కతియ; ధర్మ మతి= ధర్మబుద్దితో; ధర్మ, పత్ని; ఐనది; ఈ, క్రమంబు= ఈపద్దతి; లోక+ఆగమంబుల+అందు= లోకంలో, శాస్త్రంలో; విరుద్ధము;

ఈ, సుందరి, కారణంబున; మీకు; విప్రీతి= విరోధం; పుట్టకుండ; ఉండవలయున్‌; తొల్లి= పూర్వం; అసుర, వీరులు= రాక్షసవీరులు;

ప్రియ, సహోదరుల్‌= 'ప్రేమగలఅన్నదమ్ములు; సుంద+ఉపసుందులు; ఒక్క, యువతికి= ఒక్క్త్రీకోసం; అడరి= అతిశయించి;

తమలోన; వి[గ్రహించి= కలహించి" పొడిచి= కొట్టుకొని; మృత్యు, నిలయమునకున్‌= యమునిఇంటికి; చనిరి=ఐ వెళ్ళారు. తాత్పర్యం: మీరు అన్నిధర్మాలు తెలిసినవాళ్ళు. రాజులచే పూజింపదగినవాళ్ళు. ఒకరిపై ఒకరు శాశ్వత స్నేహం కలవాళ్ళు. లెక్క లేనన్ని మంచి గుణాలు కలవాళ్ళు. కొనియాడ దగిన వాళ్ళు. ఇట్టాంటి మీ అయిదుగురికి ఇప్పుడు ద్రౌపది ఒక్కతే భార్య అయింది. ఈ పద్దతి లోకవిరుద్దం, శాస్త్రవిరుద్దం. ఈ అందగత్తె కారణంగా మీలో మీకు విరోధం పుట్టకూడదు. పూర్వం (ప్రేమ గల అన్నదమ్ములు, సుందోపసుందులు అనే రాక్షస వీరులు, ఒక సస్త్రీకోసం కలహించి కొట్టుకొని మృతిచెందారు.

క అనిన నది యెట్టు లని యమ ।; తనయుండు గడ్మున్సేద్మతోడం ద న్నడిగిన నా తనికి. దదీయానుజులకు ; నినసన్నిభు. దమ్మునీంద్రు. డి ట్లని చెప్పెన్‌. 94

_ . ప్రతిపదార్థం; అనినన్‌; ఆది; ఎట్టుల+అని; యమ, తనయుండు= యమునికుమారు డైన ధర్మరాజు; కడు= మిక్కిలి; వేడ్కతోడన్‌= కుతూహలంతో; తన్ను+అడిగినన్‌; ఆతనికిన్‌; తదీయ, అనుజులకు= అతని తమ్ములకు; ఇన, సన్నిభుండు= సూర్యునితో సమాన మైనవాడు; ఆ+మునీంద్రుండు= ఆ ముని'శ్రేష్టు డైన నారదుడు; ఇట్టు+అని; చెప్పెన్‌.

తాత్పర్యం: అని నారదుడు చెప్పగా ధర్మరాజు మిక్కిలి కుతూహలంతో అది ఎట్లని అడుగగా, అతనికి, అతని

= త్రమ్ములకు సూర్యసమాను డైన నారదమునీంద్రుడు ఇట్లా చెప్పాడు. ౯ సుందోపసుందోపాఖ్యానము (సం. 1-201-1)

వ. వట్ట న తుం దన వారణ శిపువంశంబున నికుంభుం డనువానికిసుంధోపసుందు లన నిద్దబుగొడుకులు కరిగి యులైనివఘకో + సర్వంబునుం బడయంగా దని యేకనిశ్చయు టై, వింధ్యాచలంబున జలాశ ఏగ్థహతేంద్రింు యించి లం బెల్లంబంచాగ్నిమధ్యంబున నిలిచి, వానకాలంబును శీతకాలంబును

, మఖియు వాయుభక్షులు నేకపాదస్థితులు నూర్ధ్యబాహులు నధోముఖులును

నై పెద్దకాలంబు తపంబు సేసిన. 935

ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; దితి, పుత్తుండు+ఐనజ దితియొక్క కుమారుడైన; హిరణ్యకశిపు, వంశంబున; నికుంభుండు; అను వానికి; సుంద+ఉపసుందులు; అనన్‌; ఇద్దజు; కొడుకులు; పుట్టి: నియత+ఆత్ములు+అయి= నిగ్రహించబడిన మనస్సు కలవా రై) తపంబునన, కాని= తపముచేతకాని; సర్వంబునున్‌; పడయన్‌*కాదు+అని= పొందటం సాధ్యపడ దని; ఏక, నిశ్చయులు+ఐ= ఒకే నిర్ణయం కలవా ళ్ళయి; వింధ్య+అచలంబునకు= వింధ్యపర్వతానికి; అరిగి= వెళ్ళి; నిగృహీత+ఇంద్రియులు+ఐ= అదుపులో పెట్టబడిన ఇంద్రియాలు కలవా ళ్ళయి; నిదాఘకాలంబు+ఎల్లన్‌= ఎండకాలమంతా; పంచ+అస్టి, మధ్యంబున= అయిదుఅగ్నులమధ్య; నిలిచి; వాన కాలంబును; శీత, కాలంబును; జల+అశయంబుల= నీటి మడుగులలో; వసియించి, మతీయు; వాయు” భక్షులున్‌= గాలిని తిన్నవాళ్ళు' ఏక, పాద, స్టితులున్‌= ఒంటికాలిమీద నిలబడేవాళ్ళు;: ఊర్హ్వ: బాహులును= మీదికి ఎత్తిన చేతులు కలవాళ్ళూ; అధో ముఖులును= వంచినముఖాలు కలవాళ్ళూ; అయి; పెద్ద, కాలంబు= చాలాకాలం; తపంబు; చేసిన

806 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: పూర్వం దితి కుమారు డైన హిరణ్యకశిపునివంశంలో నికుంభుడు అనే వానికి సుందోపసుందు లనే

ఇద్దరు కుమారులు జన్మించారు. వాళ్ళు నిగ్రహంతో కూడిన మనస్సు కలవాళ్ళయి-తపస్సుచేతగాని సర్వాన్ని

పాందటం సాధ్యం కాదని ఒకే నిర్ణయం కలవాళ్ళయి, వింధ్యపర్వతానికి వెళ్ళారు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని వేసవికాలంలో అయిదుఅగ్నులమధ్య; వర్దాక్రాలంలో, చలికాలంలో నీటిమడుగులలో ఉండి, గాలిని భక్షిస్తూ ఒంటికాలిమీద నిలబడి, చేతులు పైకెత్తి తలలు వంచి చాలాకాలం తపస్సు చేయగా.

సీ. _వారిదారుణతపోవహ్నిదాహంబున । వింధ్యాద్రిదరుల నావిర్ధవించి, యుత్యుచ్చ మయి ధూమ మాకాశమెల్లను ।; గప్పిన, నమరులు గరము వెఅచి, రత్మంబులను వధూరత్నంబులను జేసి ।; తత్తపోవివ్నవిధాననిరతు లయి ప్రబోధింవంగ నలవిగాకున్నణ దో ।; యజుగర్జుపాలికి నరిగి యనుర

ఆ. వరులతవము.€ జెబువవలయు నావుడు. గమ । లాననుండు త్రిభువనార్ద్హితుండు సురహితంబుపొంటె నుందోవనుందుల । కడకు వచ్చె వరము కరుణ నీంగ. 96

ప్రతిపదార్థం: వారి, దారుణ, తపః+వహ్ని, దాహంబున= ఆ సుందోపసుందులయొక్క భయంకర మైన తపస్సు అనే అన్నియొక్క

కాల్చటం చేత; వింధ్య+అద్రి, దరులన్‌= వింధ్యపరతంయొక్క గుహలలో: ధూమము= పొగ; ఆవిర్భవించి= పుట్టి; అతి+ఉచ్చము+అయి=

మిక్కిలిగా పైకి వ్యాపించినదై; ఆకాశము+ఎల్లను; కప్పినన్‌; అఆమరులు= దేవతలు; కరము= మిక్కిలి; వెజచి= భయపడి; *

రత్నములను= రత్నాలచేతా? వధూ, రత్నంబులను+చేసి= ఉత్తమస్త్రీలచేతా; తత్‌+తపః+విఘ్న, విధాన, నిరతులు+అయి=

వారితపస్సుకు ఆటంకం కలిగించటంలో మిక్కుట మైన కోరికగలవాళ్ళయి; 'ప్రబోధింపంగన్‌= మేలుకొలుపటానికి; అలవి, కాకున్నన్‌= సాధ్యం కాకపోగా; తోయజ, గర్భు, పాలికిన్‌= బ్రహ్మదేవునిదగ్గరకు; అరిగి= వెళ్ళి; అసుర, వరుల, తపమున్‌= రాక్షస(శ్రేష్పు లైన

ఆ సుందోపసుందులతపస్సును; చెజుపవలయు, నావుడున్‌= చెడగొట్టా లని అనగా; త్రిభువన+అర్చితుండు= ముల్గోకాలచే

పూజింపబడినవాడు; కమల+ఆసనుండ్రు= పద్మాన్ని పీరంగా కల (బ్రహ్మదేవుడు; సుర, హితంబు, పొంటె= దేవతలకు మేలు

చేయటంకోసం; కరుణన్‌= దయతో; వరము: ఈంగ= ఇవ్వటానికి; సుంద+ఉపసుందుల, కడకు; వచ్చె.

తాత్సర్యం: వాళ్ళ భయంకరమైన తపస్సు అనే అగ్ని కాల్బటంచేత వింధ్య పర్వత గుహలలో పొగ పుట్టి, ఎంతో

పైకెగసి, ఆకాశం అంతా కప్పగా, దేవతలు భయపడ్డారు, రత్నాలచేతా, అంద మైన'స్తీలచేతా వాళ్ళతపస్సుకు విఘ్నం

కలిగించాలని ప్రయత్నించారు, విఫలు ళ్ళయి (బ్రహ్మదేవునిదగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుల తపస్సు చెడగొట్టా లని అనగా- ముల్టోకాలచే పూజింపబడినవాడు, పద్మం పీరంగా కలవాడు అయిన ఆ (బ్రహ్మదేవుడు దేవతలకు మేలు చేయాలని, దయతో వరం ఇవ్వటానికి సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు.

వ. ఇట్లు పితామహుండు సుందోపసుందులతపంబునకు మెచ్చి సన్నిహితుం డయి 'మీకిష్టం బైన వరం బిచ్చెద వేయం'దనిన వారలు వారిజాసనునకు ముకు౪తకరకమలు లయి 'దేవా! మాయిష్టంబు దయసేయ మీకిష్టం బేని, మాకు గామరూపత్వంబును గామగమనత్వంబును సకలమాయావిత్వంబును నన్యులచేత నవధ్యత్వంబును నమరత్వంబునుం బ్రసాదింపుం' దనిన. 897

ప్రతిపదార్థం: ఇట్లు; పితామహుండు= (బ్రహ్మదేవుడు; సుంద+ఉపసుందుల, తపంబునకు; మెచ్చి; సన్నిహితుండు+అయి= ఎదుట

నిలిచినవా డై; మీకు+ఇష్టంబు+ఐన; వరంబు; ఇచ్చెద; వేడుండు" అనిన' వారలు; వారిజ+ఆసనునకు= నీటినుండి పుట్టినపద్మాన్ని పీరంగా గల ఆ (బ్రహ్మదేవునికి; ముకుళిత, కర కమలులు+అయిజ ముడిచిన కమలాలవంటిచేతులుకలవా ళ్ళయి; దేవా! మా,

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 807 ఇష్టంబు= మాకోరిక; దయ, చేయ; మీకు+ఇష్టంబు, ఏని; మాకున్‌; కామరూపత్తంబును= కోరినరూపాన్ని కలిగి ఉండటాన్ని; కామగమనత్త్వంబును= కోరిన విధంగా వెళ్ళ గలగటాన్ని; సకల, మాయావిత్వంబును= అన్ని మాయలు కలిగిఉండటాన్ని; అన్యులచేత= ఇతరులచేత; అవధ్యత్వంబునున్‌= చంపబడకుండటాన్ని; అమరత్సంబునున్‌= చావులేకుండటాన్ని; ప్రసాదింపుండు= అను(గ్రహించండి; అనిన. తాత్పర్యం: ఈ విధంగా (బ్రహ్మదేవుడు సుందోపసుందుల తపస్సుకు మెచ్చి; వాళ్ళకు ప్రత్యక్ష మై, “మీకు ఇష్ట మైన వరం ఇస్తాను. వేడండి' అనగా, వాళ్ళు చేతులు జోడించి, 'మా కోర్కె తీర్చటానికి మీకు ఇష్టం ఉన్నట్టయితే, కోరినరూపం కలిగి ఉండటాన్ని, కోరిన విధంగా వెళ్ళగలగటాన్ని, అన్ని మాయలు కలిగి ఉండటాన్ని,ఇతరులచేత చావు లేకుండటాన్ని, అసలు చావే లేకుండటాన్ని అను[గ్రహించం” డని కోరారు.

ఆ. కమలభవుండు వారి కమరత్వ మొక్కటి ; దక్కం గోర్ములెల్ల నక్కజముగం

గరుణ నిచ్చె, నిట్లు సరసిజగర్భుచే ।; వరము వడసి యసుర వరులు పెజిగి. 98 ప్రతిపదార్హం: కమలభవుండు= పద్మంనుండి పుట్టినవాడు- (బ్రహ్మ; వారికి; అమరత్వము= చావులేకుండటం; ఒక్కటి; తక్కన్‌= తప్ప; కోర్కులు+ఎల్లన్‌; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; కరుణన్‌= దయతో; ఇచ్బిన్‌; ఇట్టు; సరసిజ, గర్భుచే= సరస్సునుంచి పుట్టినపద్మం పుట్టుకస్టానంగా కలవా డైన (బ్రహ్మదేవునీచే; వరము; పడసి= పొంది; అసుర వరులు= రాక్షస (శ్రేష్టులైన సుందోపసుందులు; పెటీగి= విజృంభించి. - తాత్సర్యం: బ్రహ్మదేవుడు వాళ్ళకు “చావు లేకుండటం' అనే వరం ఒక్కటి తప్ప తక్కినవాటి నన్నింటిని దయతో అను([గ్రహించాడు. ఆ విధంగా వాళ్ళు బ్రహ్మవలన వరాలు పొంది చెలరేగి. కు అనువమరాజ్యవిభూతిం ; దనరి జగద్విజయకాంక్ష దైత్యులకు ముదం

బొనరంగ నకాలకౌముది ।; యను నుత్సవ మొవ్పం జేని రగణితబలు లై. 99 ప్రతిపదార్థం: అనుపమ, రాజ్య, విభూతిన్‌= సాటి లేని రాజ్యవైభవంతో: తనరి= ఒప్పి; జగత్‌+విజయకాంక్షజ లోకాన్ని జయించా లనే కోరికచేత; దైత్యులకు= రాక్షసులకు; ముదంబుజ= సంతోషం; ఒనర(గన్‌= కలిగేటట్టు; అకాలకౌముది; అను ఉత్సవము; ఒప్పన్‌; చేసి; అగణిత, బలులు+ఐ= లెక్కలేనంతబలం కలవా ళృ్ళయి. తాత్పర్యం; సాటిలేని రాజ్య వైభవంతో వెలిగి, లోకాన్ని జయించా లనే కోరికతో, రాక్షసులకు ఆనందం కలిగేటట్టు అకాలకౌముది అనే ఉత్సవాన్ని చేని, లెక్కింప సాధ్యం కానంత బలం కలవాళ్ళయి.

ఏ కౌముది అనే విశేషం ల్‌ న్ని ఆవ్టయుబపౌర్లమినాడు లేదా కార్తికపౌర్ణమినాడు జరుపుతారు. ప్రజలంతా ఈ ఉత్సవంతో సు

సం ల 0 దులు దినిని ఇతరకాలంలో చేయటంవలన ఇది 'అకాలకౌముదిఉత్సవం' క. సురగరుడోరగకిన్నర ; పురములు వడిం జూఅకొనుచు భూలోకమునం

బర(గిన రాజర్నినమహీ ।; సురవరులకు బాధసేయుచును గర్వమునన్‌. 100 ప్రతిపదార్థం: గర్వమునన్‌; సుర, గరుడ+ఉరగ, కిన్నర, పురములు; వడిన్‌= వేగమే;చూఆకొనుచు= కొల్లకొట్టుతూ; భూలోకమునన్‌; పరంణినజ ఒప్పిన; రాజ+బుషి మహీసుర, వరులకు= రాజులకు, బుషులకు, 'బ్రాహ్మాణ్రేష్టులకు; బాధ, చేయుచును. తాత్సర్యం: ఆ సుందోపసుందులు గర్వించి దేవతలయొక్క, గరుడులయొక్క, నాగులయొక్క, కిన్నరులయొక్క, పురాలను వేగంగా కొల్లగొట్టుతూ; భూలోకంలోని రాజులను, బుషులను, (బ్రాహ్మాణశ్రేష్టులను బాధిస్తూ,

808 శ్రీమదాంధ్ర మహాభారతము

క. _ ద్విజవరవినిర్మితము లగు ; యజనస్వాధ్యాయకవ్యహవ్యతపోదా నజపంబులం బితృదేవత ; లజస్రమును దృప్తు లగుదు రని కడునలుకన్‌. 101

(ప్రతిపదార్థం: ద్విజ, వర, వినిర్మితములు+అగు= (బ్రాహ్మణశ్రేష్టులచే చేయబడిన వైన; యజన, స్వాధ్యాయ, కవ్య, హవ్య, తపః,

దాన, జపంబులన్‌= యజ్ఞాలచేతా, వేదాధ్యయనాలచేతా, (శ్రాద్దాలచేత, హోమాలచేతా, తపస్సులచేతా, దానాలచేతా, జపాలచేతా;

పితృదేవతలు; అజ్రమును= ఎల్లప్పుడూ; తృప్తులు+అగుదురు+అని= తృప్తిపొందినవాళ్ళవుతా రని, కడు= మిక్కిలి; అలుకన్‌= కోపంతో.

తాత్పర్యం: (బ్రాహ్మణోత్తములు చేసిన యజ్ఞాలచేతా, వేదాధ్యయనాలచేతా, శ్రాద్దాలచేతా, హోమాలచేతా,

తపస్సులచేతా, దానాలచేతా, జపాలచేతా, పితృదేవతలు ఎల్లప్పుడూ తృప్తిపొందుతున్నారని కోపించి.

వ. పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మంబులకు విఘ్నంబులు సేయుచు, సింహవ్యాఘ్రగజరూపధరు లై వనంబులం దిరుగుచు, మునిపల్లియలు సొచ్చి మునులకు. బ్రాణభయంబు సేయు చున్న వారలక్రూరకర్మంబులకు వెఅిచి వేల్పులును మునులును బురాణముని యైన బ్రహ్మపాొలికిం జని కృతాంజలు లయి జగంబులకు సుందోపసుందులు సేయు నుపద్రవంబులు సెప్పిన విని విశ్వగురుండు విస్మితుం డయి వార లన్యులచేత వధ్యులు గారు గావున పరస్పరయుద్ధంబునం బంచత్వంబు6 బొందవలయు నని విచారించి, విశ్వకర్మ రావించి 'రూపలావణ్యవతి యైన యొక్కయువతి సృజియింపు' మని పంచిన బ్రసాదం బని మైక్కి యప్పడు.

102

ప్రతిపదార్థం: పుణ్యవంతుల; నిత్య, నైమిత్తిక, కర్మంబులకు= ప్రతిరోజుచేసే (బ్రహ్మయజ్ఞం మొదలైన కర్మలకు, కారణం ఏర్పడటంవలన (గ్రహణంమొదలైన వాటిలో చేసే కర్మలకు; విఘ్నంబులు= ఆటంకాలు; చేయుచు= కలిగిస్తూ: సింహ, వ్యాఘ్ర, గజ, రూప, ధరులు+ఐ= సింహం, పెద్దపులి, ఏనుగు రూపాలను ధరించినవాళ్ళయి; వనంబులన్‌= అడవులలో; తిరుగుచు; ముని, పల్లియలు; చొచ్చి= ప్రవేశించి; మునులకు; ప్రాణభయంబు; చేయుచు+ఉన్నజ కలిగిస్తూ ఉండగా; వారల; (క్రూర, కర్మంబులకు; వెజచి= భయపడి; వేల్పులును, మునులును; పురాణ, ముని+ఐన= పురాతనముని అయిన; బ్రహ్మ, పాలికిన్‌= బ్రహ్మదగ్గరికి; చని= వెళ్ళి; కృత+అంజలులు+అయి= చేయబడిన కైమోడ్పుకలవాళ్ళయి- అంటే నమస్కరించి; జగంబులకు; సుంద+ఉపసుందులు; చేయు; ఉపద్రవంబులు= కలిగించే కష్టాలు: చెప్పిన; విని; విశ్చ, గురుండు= విశ్వానికి పెద్ద అయిన బ్రహ్మదేవుడు; విస్మితుండు+అయిజ= ఆశ్చర్యపడినవా డై; వారలు; అన్యులచేత= ఇతరులచేత; వధ్యులుకారు= చంపబఢరు; కావున; పరస్పర, యుద్దంబునన్‌= ఒకరితో ఒకరు చేసే యుద్దంలో; పంచత్వంబున్‌= మృతిని; పొందవలయున్‌; అని, విచారించి; విశ్చకర్మ; రావించి; రూప, లావణ్యవతి+ఐన= అంద మైన రూపం, కాంతి కల; ఒక్క; యువతి= ప్తీని; సృజియింపుము+అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; ప్రసాదంబు+అని= మీరు దయతో అప్పగించినపని చేస్తా నని; (మొైొక్కి=ఐ నమస్కరించి; అప్పుడు.

తాత్పర్యం: పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మలకు ఆటంకాలు కలిగిస్తూ సింహం, పెద్దపులి, ఏనుగు రూపాలు

ధరించి అడవులలో తిరుగుతూ, మునిపల్లెలలో (ప్రవేశించి మునులకు ప్రాణభయం కూడ కలిగిస్తూ ఉండగా,

మునులంతా (బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి లోకాలకు సుందోపసుందులు కలిగించే ఉపద్రవాలనుగూర్చి చెప్పారు.

(బ్రహ్మ మునులు చెప్పింది విని, ఆళ్ళర్యపడి, వాళ్ళు ఇతరులచేత చావ రని, ఒకరితో మరొకరు యుద్ధంచేసి మాత్రమే

మరణించా లని ఆలోచించి, విశ్వకర్మను పిలిపించి 'అందం, కాంతి గల ఒక'స్త్రీని సృజింపు' మని ఆజ్ఞాపించాడు,

అతడు మహాప్రసాదం అని (బ్రహ్మకు (మొక్కి, అప్పుడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 809

పృథ్వి. తిలాణుమణికోటి నంవుటితదివ్యదేహంబుతో.

దిలోత్తమ యనంగ నొక్కయువతీలలామంబు ను

తృ్పలాక్షి నొనరించె నర్వగుణభాసిరూవక్రియా

కలావిదుండు విశ్వకర్మ తనకౌశలం బేర్పడన్‌. 103 ప్రతిపదార్థం: సర్వగుణ, భాసి, రూప, (క్రియా, కలా, విదుండు= అన్నిగుణాలచే ప్రకాశించే రూపాన్ని చేసే కళను ఎరిగినవాడు; విశ్వకర్మ; తన, కౌళశలంబు= తననేర్పు; ఏర్పడన్‌= తెలిసేటట్టు: తిల+అణు, మణి, కోటి సంఘటిత, దివ్య, దేహంబుతోన్‌= నువ్వులవలె సూక్ష్మము లైన మణుల సమూహంతో కూర్చబడిన ఉత్తమదేహంతో; తిలోత్తమ; అనంగన్‌; ఒక్క; యువతీ, లలామంబున్‌= ఉత్తమ'్త్రీని; ఉత్పల+అక్షిన్‌= నల్లకలువలవంటి కన్నులు కలదానిని; సృజియించెన్‌.

తాత్పర్యం: సర్వగుణాలతో ప్రకాశించే రూపాన్ని చేసే కళను ఎరిగిన విశ్శకర్మ, తన నేర్పు ప్రకాశించగా, నువ్వులవలె'

సూక్ష్మాలైన రత్నాలు కూర్చి చక్కటిదేహం గల తిలోత్తమ అనే ఉత్తమ'స్తీని, నల్లకలువలవంటి కన్నులు కలదానిని

సృజించాడు.

విశేషం: వృత్తలక్షణానికి చూడు: అది. 2,165 విశేషం.

వ. అదియును సురేంద్రప్రముఖ బృందారక మునిబృ్బంద పరివృతుం డై యున్న పరమేస్టికిం బరమభక్తిం బ్రణమిల్లి పనియేమి యని ముందట నిలిచిన, నరవిందసంభవుం దాసుందరిం జూచి 'సుందోపసుందు లను దైత్యులు దర్పితు లయి జగంబుల కహితంబులు సేయుచు వింధ్యాచలకందరంబున నున్నవారు; వార లిద్దరు నీకారణంబునం దమలో నొండొరులతో. బొడిచి దండధరుపురంబున కరుగునట్లుగాం జేయు' మని పంచిన వల్లె యని. 104

ప్రతిపదార్ధం: అదియును; సుర+ఇం[ద్ర, ప్రముఖ, బృందారక్త, ముని, బృంద, పరివృతుండు+ఐ= దేవేంద్రుడు మొదలుగా గల

దేవతలయొక్క, మునులయొక్కసమూహంచే చుట్టబడినవా డై; ఉన్న; పరమేస్టికిన్‌= బ్రహ్మదేవునికి; పరమ, భక్తిన్‌= మిక్కిలిభక్తితో; ప్రణమిల్లి= నమస్కరించి; పని; వీమి?; అని; ముందట; నిలిచినన్‌; అరవింద, సంభవుండు= పద్మంనుండి పుట్టినవా డైన బ్రహ్మ:

ఆ, సుందరిన్‌= ఆ అందగత్తెను; చూచి; సుంద+ఉపసుందులు; అను; దైత్యులు= రాక్షసులు; దర్చితులు+అయి= గర్వించినవా

ళ్ళయి; జగంబులకు; అహితంబువ కీడు; చేయుచు; వింధ్య+అచల, కందరంబున= వింధ్యపర్వతగుహలో; ఉన్నవారు;

వారలు+ఇద్దజు; నీ, కారణంబునన్‌; తమలోన్‌; ఒండు+ఒరులతో= ఒకరితో ఒకరు; పొడిచి= కొట్టాడుకొని; దండధరు, పురంబునకు= యమలోకానికి; అరుగునట్లుగాన్‌= వెళ్ళునట్టుగా; చేయుము+అని; పంచిన= ఆజ్ఞాపించిన; వల్లె అని= సరే అని. తాత్సర్యం: దేవేంద్రుడు మొదలైన దేవతల సమూహాలూ, మునుల సమూహాలూ, కొలుస్తూఉన్న (బ్రహ్మదేవునికి ఆ తిలోత్తమ మహాభక్తితో నమస్కరించి, 'పని ఏమి?" అని ఎదుట నిలిచింది. (బ్రహ్మదేవుడు ఆ అందగత్తెను చూచి, సుందుడు, ఉపసుందుడు అనే రాక్షసు లిద్దరు పొగరెక్కి లోకాలకు కీడుచేస్తూ వింధ్యపర్వత గుహలో ఉన్నారు. వాళ్ళిద్దరు నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేటట్టుగా చేయు” మని ఆజ్ఞాపించాడు. తిలోత్తమ “అట్లాగే' అని. ళా

సీ, అబ్ద్బజు వీద్కోని యది దేవసభకుం బ్ర; దక్షిణం బొనరించె6 దత్‌క్షణంబ తద్రూపసౌందర్యదర్శనలోలుం డై ; యజుండు నాలుగుదిక్కులందు6 దనకు గావించుకొనియె ముఖంబులు; మజిరెండు । కన్నులం జూచినం గాదు తృప్తి యని సురేంద్రుండు సహస్రాక్షుం డయ్యె; న ; య్యమరులు కామమోహాంధు లైరి;

810 శ్రీమదాంధ్ర మహాభారతము ఆ. ముదిత యిట్లు సర్వమోహిని యై మర్వ । భువనమునకు మెలు(గుం బోలె నొప్పి

యరుగుదెంచె సుందరాంగి వింధ్యాచల । విపినదేశ మెల్ల వెలుంగుచుండ. 105 ప్రతిపదార్థం: అది; అబ్బజు= పద్మంనుండి పుట్టినబ్రహ్మదేవుడిని; వీడ్కొని; దేవసభకున్‌; ప్రదక్షిణంబు; ఒనరించెన్‌= చేసింది; తత్‌+క్షణంబ; తత్‌+రూప, సౌందర్య, దర్శన, లోలుండు+ఐ= దానిరూపంయొక్క చక్కదనాన్ని చూడటంలో ఆసకుడె; అజుండు= (బ్రహ్మదేవుడు; తనకు; నాలుగు, దిక్కుల+అందున్‌; ముఖములు; కావించుకొనియె; మణి; రెండు; కన్నులన్‌; చూచినన్‌; తృప్తి కాదు, అని; సురశఇం(ద్రుండు= దేవేంద్రుడు; సహ్ర+అక్షుడు+అయ్యెన్‌= వేయికన్నులు కలవాడు అయ్యాడు: ఆ+అమరులు= ఆ దేవతలు; కామ, మోహ+అంధులు+ఐరి= మన్మధమోహంచేత (గ్రుడ్డివాళ్ళు అయ్యారు; ముదిత= ఆ స్త్రీ; ఇట్టు; సర్వ, మోహిని+ఐ= అందరినీ మోహింపచేసే దై; మర్త్య, భువనమునకు= మనుష్యలోకానికి; మెటుంగన్‌+పోలెన్‌= మెరుపుతీగవలె; ఒప్పి; సుందర+అంగి= అంద మైన శరీరం గల ఆ తిలోత్తమ; వింధ్య+అచల, విపిన, దేశము+ఎల్ల= వింధ్యపర్వతంయొక్క అరణ్య'ప్రాంతమంతా; వెలుగుచుండ; అరుగుదెంచె= వచ్చింది. తాత్పర్యం: తిలోత్తమ బ్రహ్మదగ్గర సెలవు తీసికొని దేవసభకు ప్రదక్షిణం చేసింది. అప్పుడు బ్రహ్మ దానిసౌందర్యాన్ని చూడటానికి తనకు నాలుగుదిక్కులలో ముఖాలు కల్పించుకొని చతుర్ముఖుడు అయ్యాడు. దేవేంద్రుడు తన రెండుకళ్ళతో చూస్తే తృప్తి కలుగ దని వేయి కళ్ళ వా డయ్యాడు. దేవతలు కామ మోహితు లయ్యారు. ఈ విధంగా తిలోత్తమ అందరినీ మోహింపజేసి, మానవలోకానికి మెరుపుతీగవలె ప్రకాశిస్తూ, వింధ్య పర్వత అరణ్య ప్రాంతం అంతా వెలుగుతుండగా వచ్చింది. విశేషం: అలం: కావ్యలింగం. ఉపమ. క అమ్ముదితం జూచి యన్నయు. । దమ్ముండు నొక్కట మనోజతాడితు లె రా

గమ్మున నన్యోన్యస్నే; హమ్ములు చెడి దృష్‌ట్లు నిలిపి రయ్యువతిపయిన్‌. 106 (ప్రతిపదార్థం: ఆ+ముదితన్‌= ఆకాంతను; చూచి; అన్నయున్‌; తమ్ముడున్‌; ఒక్కట= ఒకేసమయంలో; మనోజ, తాడితులు+ఐ= మన్మథుడిచే కొట్టబడినవా ళ్ళయి; రాగమ్మునన్‌= అనురాగంతో; అన్యోన్య, 'స్నేహమ్ములు= ఒకరిమీద మరొకరికి గల స్నేహాలు; చెడి; ఆ+అతివ, పయిన్‌= ఆ స్రీమీద; దృష్‌ట్లు= చూపులు; నిలిపిరి, తాత్పర్యం: సుందోపసుందులు ఆ తిలోత్తమను చూచి, ఒక్కసారిగా మన్మధపీడితు లై, పరస్పర స్నేహాన్ని వదలి, అనురాగంతో ఆమె మీద చూపులు నిలిపారు. క. _ ఘను లయ్యిరువురు నేకా ।; సనభోజనయాననిలయశయనక్రియలం

దనరెడువా రేకస్తీ । వినిహితకాను లయి రపుడు విధినియమమునన్‌. 107 (ప్రతిపదార్థం: ఘనులు= బలవంతు లైన; ఆ+ఇరువురున్‌= ఆ సుందోపసుందు లిద్దరూ; ఏక+ఆసన, భోజన, యాన నిలయ, శయన, క్రియలన్‌= ఒకే ఆసనంచేత, భోజనంచేత, వాహనంచేత, గృహంచేత, పడకచేత, పనిచేత; తనరెడు, వారు= ఒప్పేవాళ్ళు; అపుడు; విధి, నియమమునన్‌= దైవనిర్ణయంచేత; ఏకస్త్రీ వినిహిత, కాములు+అయిరి= ఒకే స్త్రీ మీద(ఉంచబడిన) కామం కలవాళ్ళు అయ్యారు. తాత్సర్యం: ఒకే ఆసనంమీద కూర్చొంటూ, ఒకే ఆహారం భుజిస్తూ ఒకే వాహనం ఎక్కుతూ, ఒకే ఇంట్లో ఉంటూ, ఒకేపడకమీద పడుకొంటూ, ఒకే పని చేస్తూ ఒకటిగా ఉన్న బలవంతులు ఆ సుందోపసుందు లిద్దరూ దైవనిర్ణ్మయంవలన ఒకే స్త్రీని కామించారు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 811

క. ఇది నావల్లభ యిది నా। హృదయేశ్వరి యనుచు గోరి యిరువురు మదనో

నృ్మదు లయి పరిగ్రహించిరి ; తదీయ కమనీయ సవ్య దక్షిణ కరముల్‌, 108 (ప్రతిపదార్థం: ఇది; నా, వల్లభ= నా భార్య; ఇది; నా హృదయ+-ఈశ్చరి= నా హృదయానికి రాణి - నా భార్య; అనుచున్‌; కోరి; ఇరువురు; మదన+ఉన్మదులు+అయి= మన్మధునిచేత మిక్కిలిమదించినవాళ్ళయి; తదీయ, కమనీయ, సవ్య, దక్షిణ, కరముల్‌= అమెయొక్క చక్కని యెడమ కుడి చేతులు; పరి([గ్రహించిరి= పట్టుకొన్నారు. తాత్సర్యం; 'వాళ్ళిద్దరు మన్మథునివలన మిక్కిలి మదించినవాళ్ళయి “ఇదినా భార్య, “ఇదినా భార్య" అని ఆమె ఎడమ కుడి చేతులను పట్టుకొన్నారు. వ ఇట్లు పట్టుకొని. 109 తాత్పర్యం: ఈ విధంగా ఆమె రెండు చేతులనూ పట్టుకొని. క. “సుందరి! మాయిద్దణలో ; నిం దెవ్వరి వలతు చెప్పు మీ' వనవుడుం బూ

ర్టేందుముఖి వారి కను 'మీ । యం దెవ్వయ వొడిచి యొదుచు నతనిన వలతున్‌." 110 ప్రతిపదార్థం: సుందరి; మా, ఇద్దజలోన్‌: ఇందు; ఎవ్వరి; వలతు= కోరుతావో: ఈవు= నీవు; చెప్పుము; అనవుడున్‌= అని సుందోపసుందు లడుగగా; పూర్ష్ణశఇందు, ముఖి= పూర్ణ్షచంద్రునివంటి ముఖం కలది; వారికి; అను; మీయందు; ఎవ్వండు; పొడిచి= పోరాడి; ఒడుచున్‌= గెలుస్తాడో; అతనిన్‌+అ= అతనినే; వలతున్‌= కోరుతాను. తాత్పర్యం: 'సుందరీ! మా ఇద్దరిలో నీవు ఎవ్వరిని కోరుతావో చెప్పు మని సుందోపసుందు లడుగగా మీలో మీరు యుద్దం చేసి ఎవడు గెలుస్తారో అతడినే కోరుతాను. అని తిలోత్తమ చెప్పింది. విశేషం: కొన్ని'ప్రతుల్లో ఈ పద్యం లేదు. దీని స్టానంలో ఈ(క్రిందివచనం ఉన్నది - నీ వెవ్వరివల'తనిన, అది రూప సౌందర్యంబుల మీరొక్కరూప, కావున మిమ్మొకళ్ళ గోరనేర, మీలో పొడిచినవాని వలతు'ననిన. (శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి పు.500)

సుందోపసుందు లొండొరులతో( బోరి చచ్చుట.

క అనవుడు నిద్దణుం దమలోం । బొనుపడ కొండొరులతోడ భుజబలు లలుకన్‌

ఘనవజ్రితనులు దాంకిరి । తనరంగ నటం గొండ గొండం దాంకినభంగిన్‌. శశ! ప్రతిపదార్థం: అనవుడున్‌= అని తిలోత్తమ చెప్పగా; ఇద్దజున్‌; సానుపడకజ ఉడుగక; తమలోన్‌; ఒండొరులతోడ; అలుకన్‌= కోపంతో; భుజ, బలులు= భుజబలం కలవాళ్ళు; ఘన, వజ, తనులు= గొప్పవజ్రంవంటి (అంటే వజ్రంవలె కరిన మైన) శరీరం కలవాళ్ళు; తనరంగన్‌= విజృంభించి; అటన్‌= అక్కడ; కొండ; కొండన్‌: తాంకిన, భంగిన్‌= ఎదుర్కొన్న విధంగా; తాకీరి= (ఒకరిని ఒకరు) ఎదుర్కొన్నారు. తాత్పర్యం: అని తిలోత్తమ చెప్పగా ఇద్దరూ తగ్గక భుజబలం కలవారు, వజ్రంవంటి శరీరం కలవాళ్ళు అయిన సుందోపసుందులు తమలో తాము కోపంతో విజ్బంభించి, కొండను కొండ ఎదుర్కొన్నట్లుగా ఒకరి నొకరు ఎదుర్కొన్నారు. విశేషం: అలం: ఉపమ.

812 శ్రీమదాంధ్ర నుహాభారతము క వివరీతమతిని నుందుండు । నువసుందుండు. దాంకి పొడిచి రొండొరుతోడం

గుపితాత్ము లయి తిలోత్తమ ; నెవమున దృఢముష్టివూతనిర్దాతములన్‌. 112 (ప్రతిపదార్ధ్హం: విపరీత, మతిని= విరుద్ధ మైన బుద్దిచేత; సుందుండున్‌: ఉపసుందుండున్‌; తిలోత్తమ, నెపమునన్‌= తిలోత్తమ కారణంగా; కుపిత+అత్ములు+అయిజ కోపంతో కూడిన మనస్సు కలవాళ్ళయి; దృఢ, ముష్టి ఘాత, నిర్దా తములన్‌= పిడుగులవంటి గట్టి పిడికిటి పోట్ట చేత; ఒండు+ఒరుతోడన్‌= ఒకరిని ఒకరు; తాకి= ఎదుర్కొని; పొడిచిరి. తాత్పర్యం: తిలోత్తమ కారణంగా సుందోపసుందులు వ్యతిరేక బుద్దితో కోపాత్ము లై పిడుగుల వంటి గట్టి పిడికిటి పోట్లతో ఒకరినొకరు పొడుచుకాన్నారు.

లా

కు అన్యోన్యప్రియభాషణు | లన్యోన్యహితైషు లసుర లన్యులపోలెన్‌

మన్యుపరిప్రేరితు లై ।! యన్యోన్యాభివాతి. జనిరి యమవురమునకున్‌. 113 ప్రతిపదార్హం: అన్యోన్య, ప్రియ, భాషణులు= పరస్పరం సంతోషకరా లైన మాటలు కలవాళ్ళు; అన్యోన్య హితైషులు= పరస్పరం మేలుకోరేవాళ్ళు; అసురలు= రాక్షసులు; అన్యుల, పోలెన్‌= పరాయివాళ్ళవలె; మన్యు, పరి(ప్రేరితులు+ఐ= కోపంచేత మిక్కిలి (ప్రేరేపించ బడినవాళ్ళయి; అన్యోన్య+అభిహతిన్‌= ఒకరిని ఒకరు కొట్టుకొనటంచేత; యమ, పురమునకున్‌: చనిరి= వెళ్ళారు. తాత్పర్యం; ఒకరితో ఒకరు సంతోష కరంగా మాట్లాడేవాళ్ళు, ఒకరి మేలు ఒకరు కోరేవాళ్ళు అయిన ఆ రాక్షసులు పరాయివాళ్ళువలె కోపంతో రెచ్చిపోయి, ఒకరినాకరు కొట్టుకొని చనిపోయారు. విశేషం: పద్యంలోని అన్యోన్య శబ్ద పునరావృత్తి, నకార, యకార సంయోగం సుందోపసుందుల అన్యోన్యత ఎంతటిదో తెలియజేసేదిగా ఉన్నది. అభిహతిలోకూడా- అంటే కొట్టుకోవటంలో కూడా కనిపించే అన్యోన్యత చాలా చమత్కార మైనది. క. ఇంతుల నిమిత్తమున ధృతి । మంతులు. బొందుదురు భేదమతి గావున మీ

రింతయు నెజింది యొండులు । చింతింపక నమయ మిందు సేయుండు బుద్దిన్‌. 114 ప్రతిపదార్హం: ఇంతుల, నిమిత్తమున= (ప్రీల కారణంగా; ధృతి, మంతులున్‌= ధైర్యంకలవాళ్ళుకూడా; భేద, మతి= విరోధబుద్ధిని; పొందుదురు; కావునన్‌; మీరు; ఇంతయున్‌= ఇది అంతా; ఎఅింగి= తెలిసి; ఒండులు= ఇతరములు; చింతింపకజు ఆలోచించక; సమయము ఏర్పాటు; బుద్దిన్‌= మనఃపూర్వకంగా; ఇందు; చేయుడు. తాత్పర్యం: ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం పొందుతారు. కాబట్టి దీనిని అంతా తెలిసి, ఇతర ఆలోచనలు చేయకుండా బుద్దిపూర్వకంగా ఒక ఏర్పాటు చేసికొనండి.

నారదడ్రేరితు అయి పాండవులు సమయము సేయుట (సం. 1-204-27)

సీ అనిన నారదమహామునివల్కు చేకొని ।; దమలో నొడంబడి విమలబుద్ధి

నేవురయందును ద్రోవది ప్రీతితో । నొక్కొక్కయింట దా నొక్కయేండు

క్రమమున నుండను; గమలాక్షి యెవ్వరి ।; యింట దా నుండె నయ్యింటివలనం

బెజవారు చనకుండ; నెలుంగక చనిరేని ; వెలయంగం బండ్రెండునెలలు తీర్ధ ఆ. సేవన సేయుచును విశేషవ్రతంబులు : ధీరవృత్తి. జలుపవువారు గాను

సన్మునీంద్రునొద్ద నమయంబు సేసిరి । రాజనుతులు పాండురాజసుతులు,. 115

ఆదిపర్వము - అష్టమాశ్వానసము 813

(ప్రతిపదార్హం: అనిన= అని చెప్పిన; నారదమహాముని; పల్కు= మాట; చేకాని= (గ్రహించి -అనగా అంగీకరించి; రాజ, నుతులు= రాజులచే కొనియాడబడేనాళ్ళు; పాండురాజసుతులు= పాండురాజుయొక్క కుమారులు- పాండవులు; విమల, బుద్దిన్‌= నిర్మల మైన మనస్సుతో, ఒడంబడి= ఒప్పుకొని; ఏవుర, అందును= పాండవులు అయిదుగురిపట్ల; ద్రోవది; ప్రీతితోన్‌= (ప్రేమతో; తాన్‌= తాను; ఒక్కొక్క, ఇంటన్‌; ఒక్క, ఏండు= ఒక సంవత్సరం; (క్రమమునన్‌= వరుసగా; ఉండను ఉండటానికి; కమల+అక్షి= పద్మాలవంటి కన్నులుకలది- (ద్రౌపది; ఎవ్వరి, ఇంటన్‌; తాన్‌, ఉండెన్‌)్‌ ఆ+ఇంటివలనన్‌= ఆ ఇంటివైపు; పెజవారు= ఇతరులు; చనకు౦డన్‌= వెళ్ళకుండా; ఎజు(గకజ తెలియక; చనిరి+ఏని= వెళ్ళినట్టయితే; వెలయంగ= ఒప్పుగా; పండ్రెండు నెలలు; తీర్థసేవ; చేయుచును; విశేష (వ్రతంబులు; ధీర, వృత్తిన్‌= ధైర్యంతో; చలుపువారుగాను= చేసేవాళ్ళుగా; సత్‌+ముని+ఇంద్రు, ఒద్ద= నారదమహామునిఎదుట; సమయంబు= (ప్రతిజ్ఞ; చేసిరి.

తాత్పర్యం: రాజులందరి ప్రశంసలందుకొనే పాండవులు నారదమహాముని చెప్పిన మాటను (గ్రహించి, ఆరమరికలు

లేని మనస్సుతో ఒప్పుకొనినారు. పాండవులైదుగురిపట్ల (ద్రౌపది (ప్రేమతో ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క. సంవత్సరం

(క్రమంగా ఉండటానికీ, [ద్రౌపది ఉన్న ఇంటివైపు ఇతరులు వెళ్ళకుండా ఉండటానికీ, ఒకవేళ ఎవరైనా తెలియక

వెళ్ళితే, అతడు పన్నెండునెలలు తీర్ణయా(త్రలు, విశేషవ్రతాలు చేయటానికీ అంగీకరించారు. ఆ మేరకు ఆ

మహర్షిఎదుట ప్రతిజ్ఞచేశారు.

విశేషం: కలసిఉన్నవారి నడుమ కలహాలు కల్పించటం కలహభోజను డైన నారదుని స్వభావం. కాని, ఇక్కడ పాండవులమధ్య

(ద్రౌపది కారణంగా ఎప్పుడూ కలహాలు ఏర్పడకుండ నారదమహర్షి (ప్రయత్నించటం ఒక పెద్ద (ప్రత్యేకత, నారదమహర్షి ప్రయత్నం

పాండవుల దైవాను(గ్రహానికి పరోక్ష చిహ్నం.

వ. ఇట్లు హితోపదేశంబు సేసి నారదుం దరిగినం బాండవులు దమ చేసినసమయస్థితిం దప్పక సలుపుచు సుఖం బుండ గొండొకకాలంబున కొక్కనాం డొక్కబ్రాహ్మణుండు మ్రుచ్చులచేతం దనహోమధేనువు గోల్పడి వచ్చి యాక్రోశించిన, నశ్రుతపూర్వం బయిన యయ్యాక్రోశంబు విని విస్మితుం దయి విజయుండు విస్రుల కయిన బాధ దీర్పక యుపేక్షించుట పాతకం బని యప్పుడ యవ్విఫ్రు రావించి యిది యేమి కారణం? బని యడిగిన నర్జునునకు విఫ్రుం డి టనియె. 116

ప్రతిపదార్థం: ఇట్టు; హిత+ఉపదేశంబు, చేసి= మేలు కలిగించే మూటలు చెప్పి; నారదుండు; అరిగినన్‌= వెళ్ళగా పాండవులు:

తమ, చేసిన; సమయ, స్ట్రితిన్‌= ప్రతిజ్ఞా విధాన్ని; తప్పక: సలుపుచు; సుఖంబు+ఉండన్‌; కాండు+ఒక కాలంబు రుం కంర

కాలానికి; ఒక్కనాండు; ఒక్క, బ్రాహ్మణుండు; ('ముచ్చులచేతన్‌= దొంగలచేత; తన, పోమధేనువు; కోలు+ప క్‌ స్ట్‌ వ

వచ్చి; ఆక్రోశించినన్‌= ఏద్వగాః అశ్రుతపూర్వంబు+అయిన=ా ఇదివరకు వినబడని దైన; ఆ+అఆ(క్రోశంబు= ఆ ఏ పున నః

విజయుండు= అర్జునుడు; విస్మితుండు+అయి= ఆశ్చర్యపడినవా డై; విప్రులకు+అయిన= బ్రాహ్మణులకు కలిగిన: బాధ, క

ఉపేక్షించుట= ఊరకుండటం; పాతకంబు=అని; అప్పుడు+అ= అప్పటి కప్పుడే; ఆ+విఫ్రు; రావించి; ఇది; ఎమి; కారణంబు; అణ;

అడిగినన్‌; అర్జునునకు; విఫ్రుండు; ఇట్టు+అనియె.

తాత్సర్యం: ఈ విధంగా హితోపదేశం చేసి నారదుడు వెళ్ళగా పాండవులు తమ ప్రతిజ్ఞను తప్పక పాలిస్తూ సుఖంగా

ఉన్నారు. కొంతకాలంతర్వాత ఒకనాడు ఒక బ్రాహ్మణుడు తన హోమ ధేనువును దొంగలచే పోగట్టోని వై

ఏడ్వగా, అర్జునుడు పూర్వం ఎప్పుడూ వినని ఆ ఏడ్పు విని, ఆశ్చర్యపడి, బ్రాహ్మాణులకు ఏర్పడిన బాధ తర్భ పాపం వస్తుం దని, ఆ బ్రాహ్మణుని దుఃఖ కారణాన్ని అడుగగా, అతడు ఇట్లా అన్నాడు. విశేషం: అథశ్రుత పూర్వం బయిన అనే దానికి కొన్ని ప్రతులలో శ్రుత పూర్వం బయిన అనే పారాంతరం కూడా ఉన్నది.

814 శ్రీమదాంధ్ర మహాభారతము క. యమతనయు ధర్మరాజ్యము ।: తమరాజ్యమ యని మహాముదంబున విప్రో

త్తము లున్నచోటనే బ । న్నమువడి కోల్పడితి గోధనము మ్రుచ్లులచేన్‌, 117 ప్రతిపదార్థం: యమతనయు= ధర్మరాజుయొక్క; ధర్మరాజ్యము; తమ; రాజ్యమ; అని; మహా, ముదంబున= మిక్కిలిసంతోషంతో; విప్ర+ఉత్తములు= (బ్రాహ్మణ(శ్రేష్టులు; ఉన్నచోటనే; బన్నము+పడి= ఆపదపాంది; ('ముచ్చులచేన్‌= దొంగలచేత; గోధనము; తాత్పర్యం; ధర్మజుని ధర్మసామ్రాజ్యం తమ రాజ్యమే అని బ్రాహ్మణోత్తములు మహానందంతో ఉన్నచోటనే ఆపదనొంది, దొంగలచేత గోధనాన్ని నేను కోల్పోయాను. న్స్‌ “వదలక మ్రుచ్చుల వధియించి నాహోమ । ధేనువుం ర్రమ్మజం దెచ్చియిమ్ము

జననుత! దానివత్సంబు నిన్నటంగోలె ; నుడుగక యజచుచునున్నయదియ;

బలుకుల కెడ లేదు; బాణాసనము గొని చనుదెమ్ము నాతోడం జట్ట' ననిన

ద్రౌపదీసహితు. డై ధర్మరాజాయుధా । గారంబునం దున్నం గార్ముకంబు6 ఆ. బుచ్చికొనంగం దనకుయబోలమి యెజిండియు । విస్రునార్తరవము వినంగ నోప

కర్ణునుందు నిజశరాసనగ్రహణార్థ | మాయుధాలయమున కరిగి నపుడు. 118 ప్రతిపదార్థం: జననుత= ప్రజలచే క్రీర్తిపబడేవాడా! ఓఅర్జునా.;: వదలక; ('మ్రుచ్చులజ దొంగలను; వధియించి= చంపి; నా, హోమధేనువున్‌: (క్రమ్మజ= మరల; తెచ్చిఇమ్ము; దాని, వత్సంబు= దానిదూడ; నిన్నటన్‌+కోలెన్‌= నిన్నటినుండి; ఉడుగక= ఆపక; అజచుచున్‌+ఉన్న, అది+అ= అరుస్తూఉన్నది; పలుకులకు మాటలకు; ఎడలేదు= అవకాశంలేదు; చట్టన్‌= శీఘ్రమే; బాణ+ఆసనము= ధనుస్సు; కొని= తీసికొని; నాతోడన్‌: చనుదెమ్ము= రమ్ము; అనిన; ధర్మరాజు; ద్రౌపదీసహితుండు+ఐ= (ద్రౌపదీదేవితో కూడినవా డై ఆయుధ+అగారము+అందు= ఆయుధా లున్న ఇంటిలో; ఉన్నన్‌; కార్ముకంబు= ధనుస్సు; పుచ్చుకొనంగన్‌= తీసికొనటం; తనకున్‌; పోలమి= సరికాకుండటం: ఎటీగియు= తెలిసికూడా; అర్జ్హునుండు; విప్ర+ఆర్తరవము= 'బ్రాహ్మణుడియొక్క ఎడు; వినలన్‌+ఓపకజ వినలేక; నిజజ తనయొక్క; శర+ఆసన, [గ్రహణ+అర్హముజ ధనుస్సును తీసికొనటం కొరకు; ఆయుధ+ఆలయమునకు= ఆయుధా లున్న ఇంటికి; అపుడు; అరిగెన్‌= వెళ్ళాడు. తాత్సర్యం: “'జనులచే క్షీర్తింపబడే ఓ అర్జునా! దొంగలను వదలక వధించి, నా హోమదథేనువును తెచ్చి మళ్ళీ తెచ్చి నాకు ఇమ్ము. దానిదూడ నిన్నటినుండి అట్టాగే అరుస్తూ ఉన్నది. మాటలకు వ్యవధి లేదు. వెంటనే ధనుస్సు తీసికొని నావెంట రమ్ము' అని ఆ బ్రాహ్మణుడు అనగా ధర్మరాజు (ద్రౌపదితో కూడి ఆయుధాలఇంట్లో ఉన్నాడనీ,అక్కడికివెళ్ళి ధనుస్సును తీసికొనటం తప్పనీ తెలిసికూడా, అర్జునుడు విఫ్రునిఏడ్పు వినలేక తన ధనుస్సును తీసికొనటానికి ఆయుధా లున్న ఆ ఇంటికి అప్పుడు వెళ్ళాడు. క, 'ధరజీసురవరులకుం గడు : సెరగై నెడ నెతింది యెడయుం జేయుదురె మహా

పురుషు లని నరుండు విలుగొని ; యరిగిను మ్రుచ్చులపిటుంద నవ్విఫ్రుపనిన్‌. 119 ప్రతిపదార్హం:; మహాపురుషులు; ధరణీ, సుర, వరులకుజ (బ్రాహ్మణోత్తములకు; కడు= మిక్కిలి; సెరగు+ఐన= ఆపద కలిగిన; ఎడన్‌= చోటును, సమయాన్ని; ఎజిలి= తెలిసి; ఎడయున్‌+చేయుదురె=ఐ తొలగుతారా- అంటే ముఖం తప్పించి వెళ్తారా; అని; నరుండు= అర్జునుడు; విలు= విల్లు; కొని= తీసికొని; ఆ+విఫ్రు, పనిన్‌= ఆ బ్రాహ్మణునియొక్క పనిమీద; ('మ్రుచ్చుల పిజుందన్‌= చొంగలవెంబడించి; అరిగెను= వెళ్ళాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 815 తాత్పర్యం: 'బ్రాహ్మణోత్తములకు ఆపద ఏర్పడిన సంగతి తెలిసి మహాపురుషులు మొహం తప్పించి వెళ్తారా? అని అర్జునుడు ధనుస్సు తీసికొని ఆ విప్రుని పనిమీద దొంగలవెంట పడ్డాడు. విశేషం: ఉత్తమక్షత్రియులకు తమకు సంబంధించిన ధర్మంకంటె సంఘానికి సంబంధించిన ధర్మం ఆవళ్య కర్తవ్యం. ఒక్కొకసారి వ్యక్తి(స్వీయ)ధర్మానికి ఆపదవాటిల్లినా సామాజికధర్మాన్ని మాత్రం తప్పకుండ నిర్వర్తించాలి. పాండవులు చేసికొన్న నియమాన్ని అనుసరించి ద్రౌపది ఎవరి ఇంటిలో ఉంటుందో ఆ యింటికి మిగిలినవాళ్ళు వెళ్ళకూడదు. ఇది జరిగినప్పుడు ద్రౌపది ధర్మరాజుతో కలిసి ఉన్నది. అతడు ఆమెతో కలిసి ఆయుధాగారంలో ఉన్నాడు. అది ధర్మజు ఇల్లు కాదు. ఆయుధాగారం పాండవులందరు ఉపయోగించతగినదే. అందువలన, అర్జునుడు (ద్రాపది ఉన్న అచోటికి పోవటం అధర్మం అనటానికీ వీలు లేదు. కాని, (ద్రౌపది ధర్మజునితో కలిసి ఉన్న ఏ ఇంటిలో నైనా ప్రవేశించకూడదని నియమాన్ని వ్యాఖ్యానించుకొంటే అది తప్పు అవుతుంది. అయితే, ఈ ధర్మాదర్శ విచారం చేయటానికీ, ధర్మరాజుకు ముందుగా తెలియపరచి (ద్రౌపదితో కలిసి అతడు ఆవలకు పోయినతరువాత ఆయుధాగారంలోని విల్లును తీసికొనిపోవటానిక్షీ వ్యవధానం లేదు. ధర్మనిర్వహణంలో తనకు కలిగే కష్టంకంటె సమాజానికి కలిగే నష్టాన్ని పరిగణించి ప్రవర్తించే ధర్మవీరుడు అర్జునుడు. అట్లా ప్రవర్తించటం ఉత్తమ వీర లక్షణం.

వ ఇట్లరిగి యర్జునుం డతివీరు లయిన చోరుల వధియించి, బ్రాహ్మణునకు గోధనంబు నిచ్చి క్రమ్మజి వచ్చి ధర్మజునకు మ్రొక్కి 'లోకంబులమర్యాదలు విచారించి రక్షించుచున్న మనయందు మర్యాదాభంగం బయ్యె నను నింతకంటె దుర్యశం బొండెద్దియు లేదు గావున నాకు ద్వాదశమాసికప్రతంబు సలుపవలయు' నని పోవ సమకట్టి యున్న నర్జునునకు యుథిష్లిరుం డి ట్లనియె. 120

ప్రతిపదార్థం: ఇట్లు+ఆరిగి= ఈవిధంగా వెళ్ళి; అర్జునుండు; అతి, వీరులు+అయిన:; చోరుల= దొంగల; వధియించి; బ్రాహ్మణునకు; గోధనంబున్‌; ఇచ్చి; క్రమ్మథి= తిరిగి; వచ్చి; ధర్మజునకు; మొక్కి; లోకంబుల, మర్యాదలు= లోక నియమాలు: విచారించి; రక్షించుచు+ఉన్న; మనయందు; మర్యాదా, భంగంబు= నియమభంగం; అయ్యెన్‌; అను; ఇంతకంటె; దుర్‌ాయశంబు= అపకీర్తి; ఒండు= మరొకటి; ఎద్దియు, లేదు; కావున; నాకు; ద్వాదశమాసికవ్రతంబు= పండ్రెండు నెలల వ్రతం; సలుపవలయున్‌= చేయాలి; అని; పోవ; సమకట్టి= పూని; ఉన్నన్‌= ఉండగా; అర్జునునకు; యుధిస్టిరుండు= ధర్మరాజా; ఇట్టు+అనియె.

తాత్పర్యం: ఈవిధంగా వెళ్ళి అర్జునుడు అతివీరు లైన ఆ దొంగలను చంపి, బ్రాహ్మణునికి గోధనాన్ని ఇచ్చి,

తిరిగి వచ్చి, ధర్మజునికి మొక్కి- 'లోక నియమాలను విచారించి రక్షిస్తున్న మనలోనే నియమభంగం జరిగిందన్న

అపకీర్తికి మించింది మరొకటి లేదు. అందువలన నేను ద్వాదశ మాసిక వ్రతాన్ని చేయాలి" అని వెళ్ళ పూనగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. | ఆ. క్రూర కర్ములయ్యు గో బ్రాహ్మణుల కగు । బాధ లుడుచుజనులం బాహచయము

లెట్టియెడలం బొంద వింద్రనందన! నీకు ; సమయభంగభీతి జనంగ నేల? 121 ప్రతిపదార్థం: ఇంద్రనందన= ఇంద్రుని కుమారుడ వైన ఓ అర్జునా! క్రూర, కర్ములు+అయ్యు= పొపపు పనులు చేసిన వారైనా; గో, బ్రాహ్మాణులకు+అగు= ఆవులకు, బ్రాహ్మణులకు కలిగే; బాధలు; ఉడుచు= పోగొట్టే; జనులన్‌; పాప, చయములు= పాపం సమూహాలు; ఎట్టి, ఎడలన్‌= ఎటువంటి చోట్లలో గూడా; పొందవు; నీకు; సమయ, భంగ, భీతిన్‌= నియమం చెడింది అనే భయంత్‌; చన(గన్‌= వెళ్ళటం; ఏల= ఎందుకు?

8కే6 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: అర్జునా! ఎంత దుర్మార్లు లైనా ఆవులకు, బ్రాహ్మణులకు కలిగిన బాధలను తొలగించే జనులను పాపాలు ఎటువంటి చోట్ట కూడా పొందవు. అట్టాంటప్పుడు నీవు నియమ భంగం అయిందన్న భయంతో పోవటం ఎందుకు? విశేషం: రెండు ధర్మాలకు సంఘర్షణ ఏర్పడినప్పుడు ధర్మసూక్ష్మాన్ని అనుసరించటం లోకధర్మం. (ద్రౌపది ధర్మజునితో కూడి ఎ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లోకి మిగిలిన పాండవులు వెళ్ళకూడదని నియమం. ఆ నియమం తప్పినట్టు అర్జునుడు భావించి, 'ప్రాయశ్చిత్తాన్ని చేసికొనటానికి అన్నను అనుమతి కోరాడు. దర్శజుడు (బ్రాహ్మాణబాధను తొలగించే సందర్భంలో ఎటువంటిచోట్లకూడా పాపాలుపొందవనే ధర్మసూక్ష్మాన్ని ప్రతిపాదించాడు. అది ఆపద్దర్మ మౌతుందనీ, ప్రజలు దానిని నిందించే అవకాశం ఉంటుందనీ అర్జునుడు భావించాడు. వ. 'మభియట్లుంగాక తస్కరవధోపేక్షల నశ్వమేధ భ్రూణహత్యల ఫలం బగు నని వేదంబులయందు వినంబడు6 దస్మరుల వధియించి బ్రాహ్మణహితంబు చేసినవాండవు; నీకు సమయోల్లంఘనప్రాయశ్చిత్తంబు సేయ నేల? యనిన నర్హునుం డి ట్లనియె. 122 ప్రతిపదార్హం: మథి; అట్టున్‌+కాక; తస్కర, వధ+ఉపేక్షలన్‌= దొంగలను చంపటంవలన, వదలివేయటంవలన; అశ్వమేధ; (భ్రూణ హత్యల, ఫలంబు= అశ్చమేధయాగం చేయటంవలన; పసిబిడ్డను చంపటంవలన కలిగేఫలం; అగును+అని* వేదంబుల, అందు; వినన్‌+పడన్‌; తస్కరుల= దొంగలను; వధియించి= చంసి; (బ్రాహ్మణ, హితంబు= (బ్రాహ్మణునికి మేలు; చేసినవాడవు; నీవు; సమయశ+ఉల్లంఘన, ప్రాయశ్చిత్తంబు= నియమాన్ని తప్పి నడుచుకొన్న పాపాన్ని పోగొట్టుకోవటానికి చేసే పని; చేయన్‌+ఏల; అనినన్‌; అర్జునుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: “అంతేకాక దొంగలను చంపటంవలన అశ్చమేధం చేసినంత పుణ్యఫలం, వాళ్ళను వదలి వేస్తే (కడుపులోని)పసిబిడ్తను చంపినంతపాపఫలం కలుగుతుం దని వేదాలవలన వింటున్నాం. దొంగలను చంపి (బ్రాహ్మణుడికి మేలు చేసిన నీవు నియమం తప్పి నడుచుకొన్నందుకు చేసికొనే ప్రాయశ్చిత్తాన్ని చేసికొనటం ఎందుకు? అని ధర్మజుడు అనగా అర్జునుడు ఆతడితో ఇట్టా అన్నాడు. విశేషం: అలం: 'క్రమాలంకారం. ఒకవేళ అర్జునుడు చేసింది పాపమని (గ్రహించి దానికి 'ప్రాయళ్ళిత్తం వచేసికొనటానికే ద్వ్యాదశమాస(వ్రతం పాటించేటట్టయితే తస్కరవధవలన అశ్చమేధయాగం చేసిన పుణ్యం వస్తుందనీ, ఆ పుణ్య[ప్రభావంవలన పాప(ప్రాయశ్చిత్తం అవసరంలేదనీ ధర్మజుడి ప్రతిపాదన, పుణ్యప్రాప్తి పాపప్రాయళ్ళిత్తానికి ప్రత్యామ్నాయం కాదని అర్జునుడి అభిప్రాయం. క్ర భూజనపరివాదం బ । వ్యాజంబునం బరిహరింపనలయును నమనకున్‌ వ్యాజమున ధర్మలోపం ।; బాజిజయా! పరిహరింతురయ్య మహాత్ముల్‌. 123 ప్రతిపదార్హం: ఆజి, జయా= యుద్ధంలో జయించేవాడా! ఓధర్మరాజా!; అవ్యాజంబునన్‌= కారణం లేక పోయినా; భూజన; పరివాదంబుజ భూమిలోని 'ప్రజలవలన కలిగేనిందను; మనకున్‌; పరిహరింపవలయును= తొలగించాలి; మహాతు శైలు; వ్యాజమునన్‌= సాకుతో; ధర్మ, లోపంబు= ధర్మం తప్పటాన్ని; పరిహరింతురు+అయ్యజ (తోసిపుచ్చుతారా! తాత్పర్యం: యుద్ధంలో జయించే ఓధర్మరాజా! అకారణంగా భూజనులవలన కలిగిన నింద నైనా మనం తొలగించాలి. ఆటువంటప్పుడు ఏదో సాకు పెట్టి మహాత్ము లైనవాళ్ళు ధర్మం తప్పటాన్ని (తోసిపుచ్చుతారా! నిశేషం: నన్నయ రుచిరార్థసూక్తి అనదగిన సుభాషితం. ఏ కారణం లేకుండానే రాజులకు ఒక్కొక్కసారి నిందలు వస్తూ ఉంటాయి. కారణం లేదుకదా అని దానిని నిర్లక్ష్యం చేయకుండా ఆ నిందను తొలగించుకొనటానికి ప్రయత్నించటం రాజధర్మం, మరి ఇక్కడ

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 827

'ఏదో ఒక సాకు చెప్పి నియమాన్ని పాటించామని పాండవులు సమర్హించుకొన్నారు' అని సహేతుకంగా ప్రజలు విమర్శించటానికి

పాలకులు అవకాశం కలిగించటం సమర్థనీయం కాదని అర్జునుడు పేర్కొని, నిర్మల ధర్మ కర్మ దీక్షాపరత్యంత్రు డనిపించుకొన్నాడు.

ధర్మజుడు అతని మాటను కాదనలేకపోయాడు. సమయభంగకారణమున నర్జునుండు తీర్ణయాత్రకుం జనుట (సం- 1-206-12)

న. 'కావున వ్రతదానంబు నా కనుగ్రహింప వలయు' నని మొక్కి యర్జునుం డగ్రజు వీడ్కొని గురుజనానుమతుం డై యఖిలవేదవేదాంగపారగు లైన బ్రాహ్మణులు ననేకశాస్త్రవిదు లయి వివిధకథాకథనదక్షు లయిన పొరాణికులును దనకు సహాయులుగా నరిగి సకలతీర్థసీవచేయుచు నయ్యైతీర్ధంబులందు. 124

ప్రతిపదార్థం: కావున (వ్రతదానంబు= ద్వాదశమాసికవ్రతం అనే దానాన్ని; నాకు; అను[గ్రహింపవలయును= ఇవ్వాలి; అని; మొక్కి;

అర్జ్హునుండు; అ(గ్రజు, వీడ్కొాని= అన్నదగ్గర సెలవు తీసికొని; గురుజన+అఆనుమతుం డై= పెద్దలచే అనుమతించబడినవాడు+ఐ= అఖిల, వేద, వేద+అంగ, పారగులు+ఐన= అన్నివేదాలను, వేదాంగాలను తుదముట్ట చదివిన; (బ్రాహ్మణులున్‌; అనేక, శాస్త్ర, విదులు+అయిజ= పెక్కుశాస్తాలు తెలిసినవా ళ్ళయి; వివిధ, కధా, కథన, దక్షులు+అయిన= అనేకవిధా లైన కథలను చెప్పటంలో సమర్హు లైన; పౌరాణికులును; తనకు; సహాయులుకాన్‌; అరిగి; సకలతీర్థసేవ; చేయుచు; అయ్ర్యైతీర్హముల; అందు= ఆయాతీర్జ్థాలలో: తాత్సర్యం: 'ఆందుచేత నాకు ద్వాదశ మాసిక(వ్రత దానాన్ని అనుగ్రహించండి" అని నమస్కరించి అర్జునుడు అన్నదగ్గర సెలవుతీసికొని, పెద్దలందరి అనుమతి పొంది, అన్నివేదాలు, వేదాంగాలు తుదముట్ట చదివిన (బ్రాహ్మణులూ, పెక్కుశా'స్తాలు తెలిసి అనేక విధా లైన కథలు చెప్పటంలో సమర్హు లైన పౌరాణికులూ తనకు తో డై రాగా ఆ యాతిర్జాలు సేవిస్తూ, ఆ. _ ధరణిసురుల గురుల బరమయోగుల మహా, భాగు లయిన యట్టి భాగవతుల

రాజవంశవరుండు పూజించుచును వారి ; వలన బుణ్యకథలు వెలయ వినుచు. 125 ప్రతిపదార్థం: రాజవంశవరుండు= చంద్రవంశశ్రేష్టు డైన అర్జునుడు; ధరణిసురుల= బ్రాహ్మణులను; గురులన్‌= పెద్దలను; పరమయోగుల; మహాభాగులు+అయిన, అట్టి= గొప్పవా రైన; భాగవతుల= పుణ్యాత్ములను; పూజించుచును; వారివలనన్‌= పుణ్యకధలు; వెలయజ= ఒప్పుగ; వినుచు. తాత్పర్యం: చంద్రవంశశ్రేష్టు డైన అర్జునుడు (బ్రాహ్మణులను, పెద్దలను, పరమయోగులను, గొప్పపుణ్యాత్ములను పూజిస్తూ వారివలన పుణ్యకథలు వింటూ. క. గంగాధర పింగజటా : సంగమ మంగళ విశాల చటుల తరంగన్‌

గంగానది సేవించెను ; గంగాద్వారమున విగతకల్మషు6 డగుచున్‌. 126 ప్రతిపదార్థం: గంగాధర, పింగ, జటా, సంగమ, మంగళ, విశాల, చటుల, తరంగన్‌= శివునియొక్క గోరోచనపువర్లం గల జటలతో కలియటంచేత మంగళరాలై విశాలాలై చలించే అలలు కలదానిని; గంగానది; గంగా, ద్వారమున= గంగానదియొక్క ద్వారప్రదేశంలో; విగత, కల్మషుండు+అగుచున్‌= తొలగిన పాపాలు కలవా డవుతూ; సేవించెను. తొత్సర్యం: శివుని గోరోచనపురంగు జటలతో కలవటంవలన మంగళకరాలై, విశాలాలై చలించేఅలలుగల గంగానదిని, గంగాద్యారంలో అర్జునుడు తన పాపాలు తాలగిపోయేటట్టు సేవించాడు. విశేషం: అలం: వృత్త్యనుప్రాసం. గంగాతరంగనాదసౌందర్యాన్ని బిందుపూర్వక గకారంతో ధ్వనింపచేయటం అక్షరరమ్యత.

వ. అందు నిత్యంబును గంగాస్నానంబు సేసి తత్తీరంబున హోమంబు సేయుచు వాసవసుతుండు మహీసురవరసహితుం డయి కొన్ని దివసంబులు వసియించి, యొక్కనాండు ప్రభాతంబ విధిపూర్వకంబునం గృతాభిషేకుం డయి దేవర్షిపితృతర్పణంబులు సేసి. 127

ప్రతిపదార్హం: అందు;వాసవ, సుతుండు= దేవేంద్రునికుమారు డైన అర్జునుడు; నిత్యంబును= ప్రతిదినమూ గంగా, స్నానంబు" ఠా

చేసి; తత్‌+తీరంబునవ= ఆ గంగానదిఒడ్డున; హోమంబు; చేయుచు; మహీసుర, వర, సహితుండు+అయి= (బ్రాహ్మణోత్తములతో

కూడినవా డై; కొన్ని, దివసంబులు= కొన్నిరోజులు; వసియించి= ఉండి; ఒక్కనాండు' ప్రభాతంబు+అ= వేకువనే విధిపూర్వకంబునన్‌=

నియమ్రకారం; కృత+అభిషేనుండు+అయి= చేయబడినస్నానం కలవాడై -అంటే స్నానంచేసి; దేవ+బుషి పిత తర్చణంబులు చేసి= దేవతలకు, బుషులకు, పితృదేవతలకు తర్పణాలు చేసి.

తాత్సర్యం: దానిలో అర్జునుడు ప్రతిదినం గంగాస్నానంచేసి, గంగఒడ్డున హోమం చేస్తూ (బ్రాహ్మణ్రేష్టులతో కూడి,

కొన్నిరోజులు గడిపి, ఒకనాడు వేకువనే లేచి, నియమం ప్రకారం స్నానం చేసి, దేవ, బుషి పితృతర్పణాలు చేసి.

ఉలూచి యర్జునుని. గామించుట (సం. 1-206-12) న్‌. వేల్వంగ సమకట్టి వెలువడ నున్న న య్యింద్రనందను రుచిరేంద్రనీల సుందరశ్యామాంగు సురరాజకరికరా । కారమహాబాహు. గజ్టిం జూచి నలినాక్షి యం దొక్కనాగకన్యక కామ । పరవశ యై వానిం బట్టి తిగిచి కొని నాగపురమునకును జని నిజరమ్య ; హర్ష్యంబునందు నెయ్యమున నునిచె; ఆ. నందు నగ్ని తొంటియట్టు లభ్యర్టితం ; బయి వెలుంగుచున్న నర్దునుండు హోమకార్య మొప్ప నొనరించి యప్పు డ । య్యింతి. జూచి నగుచు నిట్టు లనియె. 128 ప్రతిపదార్థం: వేల్వంగ= హోమం చేయటానికి; సమకట్టి= పూనుకొని; వెలువడన్‌+ఉన్న= వెలుపలికి రానున్న; ఆ+ఇంద్ర, నందను= ఇంద్రునికుమారు డైన అర్జునుడిని; రుచిర+ఇంద్రనీల, సుందర, శ్యామ+అంగు= కాంతిమంత మైన ఇంద్రనీలమణివలె అంద మైననల్లనిశరీరం కలవాడిని; సుర, రాజ, కరి, కర+ఆకార, మహాబాహున్‌= దేవతలరా జైన దేవేంద్రునివనుగుతొండంవంటి గొప్పబాహువులు కలవాడిని; కజ్జిన్‌= నల్లనివా డైన అర్జునుడిని; చూచి; అందు; ఒక్క; నలిన+అక్షి= పద్మంవంటి కన్నులు కలది; నాగకన్యక; కామ,పరవశ+ఐ= కామానికి మిక్కిలి లొంగిపోయిన దై; వానిన్‌= ఆ అర్జునుడిని; పట్టి; తిగిచికొని= లాగికొని; నాగపురమునకును; చని= వెళ్ళి; నిజ, రమ్య, హర్మ్యంబు, అందు= అంద మైన తన మేడలో; నెయ్యమునన్‌= స్నేహంతో; ఉనిచెన్‌= ఉంచింది; అందున్‌; అన్ని; తొంటి, అట్టుల= పూర్వంవలెనే; అభి+అర్చితంబు+అయి= పూజింపబడిన దై; వెలుంగుచున్నన్‌' అర్జునుండు; హోమకార్యము; ఒప్పన్‌; ఒనరించి= చేసి; అప్పుడ; ఆ+ఇంతిన్‌= ఆ నాగకన్యను; చూచి; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టులు+అనియె. తాత్పర్యం: హోమం చేయపూని వెలుపలికి వచ్చిన ఆ పార్టుడిని, ఇంద్రనీలంవలె అంద మైన నల్లటిశరీరంగలవాడిని, ఐరావతంతొండంవంటి పెద్దబాహువులు కలవాడిని చూచి, కమలాలవంటి కన్నులు కల నాగకన్యక, కామపరవశ అయి అతడిని పట్టి లాక్కొని నాగపురానికి వెళ్ళి అంద మైన తన మేడలో (ప్రేమతో ఉంచంది. అక్కడ వెలుగుతున్న అట 9, అగ్నిలో అర్జునుడు హోమకార్యం జరిపి, ఆ నాగకన్యను చూచి నవ్వుతూ ఇట్టా అన్నాడు. విశేషం: అలం: ఉపమ.

ఆదిపర్వము - అష్టమాళశ్వాసము 819

క. 'తామరసనేశ్ర! నీ పే, రేమీ? యెవ్వరితనూజ? వి ట్లేల మహా

వ్యామోహిత వై?" తనవుడు. గోమలి సురరాజపుత్ర్తకున కి ట్లనియెన్‌. 129 ప్రతిపదార్థం: తామరసనేత్ర= తామరలవంటి కన్నులు కలదానా!; సీపేరు; ఏమీ?; ఎవ్వరి, తనూజవు= ఎవ్వరికూతురివి; ఇట్టు; ఏల; మహత్‌, వ్యామోహితవు+ఐతి= మిక్కిలివలపు కొన్నదానివి అయ్యావు; అనవుడున్‌= అని అనగా; కోమలి= సుకుమారి- ఆ నాగకన్యక; సురరాజ, పుత్రకునకు= దేవేంద్రునికుమారునికి (అర్జునునికి); ఇట్టు= అనియెన్‌. తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా! నీపే లేమి? నీ వెవ్వరి కూతురివి? ఈ విధంగా ఎందుకు ఇంత వలపు గొన్నదానివి అయ్యావు? అని అనగా ఆ నాగకన్యక అర్జునునితో ఇట్లా అన్నది. వ. ఏ నులూచి యను నాగకన్యక; వైరావతకులసంభవుం డయిన కౌరవ్యుకూంతుర; నిన్నుం జూచి

మనోజబాణబాధిత నయితి; నామనోరథంబు సల్తుపుము. 130 ప్రతిపదార్థం: ఏను= నేను; ఉలూచి; అను; నాగకన్యకను; ఐరావత, కుల, సంభవుండు+అయిన= ఐరావతవంశంలో పుట్టినవా డైన; కౌరవ్యుకూతుర; నిన్నున్‌; చూచి; మనోజ, బాణ, బాధితను+అయితి= మన్మథబాణాలచేత బాధింపబడినదాన నయ్యాను; నా; మనోరథంబుజ కోరిక సలుపుము= ఈడేర్భుము, తాత్పర్యం: నేను ఉలూచి అనే నాగకన్యకను. ఐరావత వంశంలో పుట్టిన కారవ్యునికూతురిని. నిన్ను చూచి వలచాను. నా కోరిక తీర్చుము. విశేషం: ఐరావతము- కద్రువకుమారులలో ఒకడు. అతనివంశంలో పుట్టినకొరవ్యునికూతురు ఉలూచి. ఉలూచికి ఉలూపి అనే పారాంతరం అనేకప్రతులలో ఉన్నది. క. వీ గుణములు దొల్లియు నా , గీగీతములందు విని తగిలి యిపుడు మనో

రాగమునం జూడ గంటిని

| భాగీరథియందు నిన్ను బరహితచరితా! 131

(ప్రతిపదార్థం: పరహిత, చరితా= ఇతరులకు మేలు చేసే నడవడి కలవాడా! నీ, గుణములు; తొల్లియు= ఇదివరకే, నాగీ, గీతముల+అందు= నాగకన్యకలపాటలలో; విని; తగిలి= ఆసక్తి కలిగి; ఇపుడు; మనోరాగమునన్‌= (ప్రేమతో; నిన్నున్‌; భాగీరధి, అందు; చూడన్‌+కంటిని= చూడకలిగాను. తొత్సర్యం: ఇతరులకు మేలు చేసే నడవడి కల ఓ అర్జునా! ఇదివరకే నీ గుణాలు నాగకన్యకల పాటలలో విని ఆసక్తి గొన్నాను. ఇపుడు (ప్రేమతో నిన్ను గంగానదిలో చూడగలిగాను. విశేషం: పరహితచరితా! అనే సంబోధనలో- ఇతరులమేలుకోరి నడుచుకొనే నీవు ఇవుడు నామేలు కోరి నాకోరిక మన్నింపుము అనే ఉలూచి హృదయం చక్కగా వ్యక్తమవుతున్నది. పార్టునిఈ తీర్ణయాత్రలకు కారణంకూడా పరహితచరితమే కదా! భగీరధుడు భూమిమీదికి తీసికొనిరావటంవలన గంగకు భాగీరధి అనే పేరు వచ్చింది. వ, అనిన దాని కర్టునుం డి ట్లనియె. 132 తాత్సర్యం: అని పలికిన ఉలూచితో అర్జునుడు ఇట్టా అన్నాడు.

820 శ్రీమదాంధ్ర నుహాభారతము

మధ్యాక్కర, ద్వాదశమాసికవ్రతము నలుపుదు. దరుణి! మాయన్న యాదేశమునం జేసి నర్వతీర్థము లాడుచు బ్రవ్మా వాదులనంగతి బ్రవ్మాచర్యనువ్రతుండ నై యుండి నీదుమనోరథ మెట్లు నలువంగనేర్తు నే నివుడు? 133

ప్రతిపదార్థం: తరుణి!= ఓకాంతా!; మా, అన్న; ఆదేశమునన్‌+చేసి= ఆజ్ఞతో; ద్యాదశమాసికవ్రతము; సలుపుదున్‌= చేస్తాను;

సర్వతీర్హములు+ఆడుచు= అన్నిపుణ్యాతీర్థాలలో స్నానం చేస్తూ; (బ్రహ్మవాదుల, సంగతి= వేదవిదులయినవారితో కలిసి; (బ్రహ్మచర్య, సు(వ్రతుండను+ఐ= బ్రహ్మచర్యవ్రతం ఆచరిస్తూ: ఉండి; నేను; ఇపుడు; నీదు; మనోరధము= నీకోరిక; ఎట్టు: సలుపంగనేర్తు= తీర్చగలను?

తాత్పర్యం: ఓ కాంతా! మా అన్నగారి ఆజ్ఞతో ద్వాదశమాసికవ్రతం చేస్తూ, అన్ని పుణ్యతీర్దాలలో స్నానమాడుతూ,

వేదవిదు లైన (బ్రాహ్మణోత్తములతో కలిసి బ్రహ్మచర్య(వ్రతాన్ని సలుపుతూఉండగా, నేను ఇపుడు నీ కోర్కెను ఎట్టా

తీర్చగలను?

విశేషం: వృత్తలక్షణానికి చూడు. అది. 2.183 విశేషం.

వ అనిన నవనతానన యయి నాగకన్యక యర్హునుం జూచి 'ద్రుపదరాజపుత్త్రియందు మీచేసిన సమయంబును, భవత్తీర్ధాగమననిమిత్తంబును వ్రతంబును నెటుంగనిదానం గాను; సర్వతీర్థసేవనంబును సర్వప్రతంబులు సలుపుటయును సర్వదానధర్మక్రియలును బ్రాణదానంబుతో సమానంబులు గావు; నామనోరధంబు విఫలం బయిన మనోజానలంబునం బ్రాణపరిత్యాగం బగుం గావున నన్ను రక్షింపుము; దీన నీకు వ్రతభంగంబు గా' దనిన నర్జునుండు దానిమనోరధంబు సలిపి యారాత్రి నాగభువనంబున వసియించి నాగకన్యకయందు సద్యోగర్ధంబున నిరావంతుం డను కొడుకుం బడసి, నాగలోకంబు వెలువడి యాదిత్యోదయంబుతోడన గంగాద్వారంబునకు వచ్చి, తద్చృత్తాంతం బంతయు. దనసహాయు లయిన విఫ్రులకుం జెప్పి, వారలకు హృదయానందంబు సేయుచు. 134

(ప్రతిపదార్హం: అనినన్‌= అని అర్జునుడు చెప్పగా; అవనత+ఆనన, అయి= వంచిన ముఖం కల దై; నాగకన్యక; అర్జునున్‌; చూచి; 'ద్రుపదరాజ, పుత్రి అందు= (ద్రపదియందు; మీ, చేసిన= మీయొక్కచేసిన- అంటే మీరు చేసిన; సమయంబును= ప్రతిజ్ఞను; భవత్‌+తీర్ద+ఆగమన, నిమిత్తంబును= మీ తీర్ణయా(త్రాకారణాన్ని; వ్రతంబునున్‌; ఎజుంగనిదానన్‌; కాను; సర్వ, తీర్ధ, పేవనంబును= అన్నితీర్ధాలను సేవించటం; సర్వ, (వ్రతంబులు; సలుపుటయును; సర్వ, దాన, ధర్మ, క్రియలును; ప్రాణదానంబుతో; సమానంబులు; కావు; నా, మనోరధంబు= నాకోరిక; విఫలంబు+అయిన= నెరవేరకుంటే? మనోజ+అనలంబునన్‌= మన్మధాస్టిలో; ప్రాణ, పరిత్యాగంబు+అగున్‌= (ప్రాణం వదలటం జరుగుతుంది; కావున; నన్ను; రక్షింపుము; దీనజ దీనివలన; నీకు; వ్రత, భంగంబు; కాదు; అనినన్‌; అర్జ్హునుండు; దాని= ఆ ఉలూచియొక్క; మనోరధంబు= కోరిక; సలిపి= తీర్చి; ఆ రాత్రి; నాగభువనంబున= నాగలోకంలో; వసియించి; నాగకన్యక, అందు; సద్యో, గర్భంబునన్‌= అప్పటికప్పుడు కలిగిన గర్భంలో; ఇరావంతుండు+అను; కొడుకున్‌; పడసి= పొంది; నాగలోకంబు; వెలువడి; ఆదిత్య+ఉదయంబుతోడన= సూర్యోదయంతోనే; గంగాద్వారంబునకు; వచ్చి: తత్‌+వృత్తాంతంబు= ఆ సంగతి; అంతయున్‌; తన; సహాయులు+అయినజ తోడుగా ఉన్న; విఫ్రలకున్‌= (బ్రాహ్మణులకు; చెప్పి; వారలకు; హృదయ+ఇనందంబు; చేయుచు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 821 తాచ్సర్యం: అని అర్జునుడు చెప్పగా ఉలూచి తలవంచి అర్జునుడిని చూచి- ద్రౌపది విషయంలో మీరు చేసిన ప్రతిజ్ఞ మీ తీర్ణయా[(త్రకారణం, మీ (వ్రతం తెలియని దాన్ని కాను. అన్ని తీర్జాలు సేవించటం, అన్ని (వ్రతాలు సలపటం, అన్ని దానాలు, ధర్మకర్మలు చేయటం, ప్రాణదానంతో సమానం కావు. నా కోర్కె నెరవేరకుంటే మన్మథాగ్లిలో (ప్రాణం వదలటం జరుగుతుంది. కాబట్టి నన్ను రక్షించు. దీనివలన నీకు వ్రతభంగం కాదు" అనగా అర్జునుడు ఉలూచికోరిక తీర్చి ఆ రాత్రి నాగలోకంలో గడిపి, ఆమెయందు సద్యోగర్భంలో ఇరావంతుడు అనే కొడుకును పొంది, సూర్యోదయంకాగనే గంగాద్వారానికి వచ్చి, జరిగినవృత్తాంత మంతా తనకు తోడుగా ఉన్న (బ్రాహ్మణులకు చెప్పి, వాళ్ళకు హృదయానందం కలిగిస్తూ,

క వితతయశుం దరిగి హినుప । ర్వతపార్శ్వంబున నగస్త్రృవటమును నత్యు

-- న్నతభృగుతుంగముం జూచుచు : ధృతి నేంగి హిరణ్యబిందుతీర్ధంబునకున్‌ 135 ప్రతిపదార్థం: వితత, యశుండు= విశాల మైన క్రీర్తికలవాడు- అర్జునుడు; అరిగి= వెళ్ళి; హిమపర్వత, పార్వంబునన్‌= హిమాలయపర్వతంప్రక్కన; అగస్య్యవటమునున్‌ (పుణ్యక్షేత్రం); అతి+ఉన్నత, భృగుతుంగమున్‌= మిక్కిలిఎత్త్రైన భృగుతుంగక్షేత్రాన్ని; చూచుచు; ధృతిన్‌= సంతోషంతో; హిరణ్య బిందు తీర్ధంబునకున్‌; ఏంగిఐ వెళ్ళి.

చొత్సర్యం: విశాలమైన క్తీర్తి గల అర్జునుడు హిమాలయం ప్రక్కన ఉన్న ఆగస్త్య వట క్షేత్రాన్ని, మిక్కిలి ఎత్తైన

భృగు తుంగ క్షేత్రాన్ని చూస్తూ సంతోషంతో హిరణ్య బిందు తీర్చానికి వెళ్ళి.

వ. అందును గోదాన భూదాన పొరణ్యదానంబు లాదిగా. బెక్కుదానంబులు సీని, యజ్ఞార్థంబుగా భూసురోత్తములకు గోసహస్రంబు లిచ్చి, ప్రార్దేశంబున కరిగి నైమిశారణ్యంబునందు జగన్నాభునారాయణు నారాధించి యుత్ప్సలినియు. గౌశికియు నందయు నవరనందయు గయయు గంగయు గంగాసాగరసంగమంబును జూచుచు.

  • 136 ప్రతిపదార్థం: అందును ఆ హిరణ్యబిందుతీర్థంలో; గోదాన, భూదాన, హిరణ్యదానంబులు= ఆవులను దానంచేయటం, భూములను దా నంచయటం, బంగారాన్ని దానంచేయటం; ఆదిగాన్‌= మొదలుగా; పెక్కు, దానంబులు; చేసి; యజ్ఞ+౭అర్థంబుగాజ యజ్ఞంకొ రకు; భూసుర+ఉత్తములకు= (బ్రాహ్మణోత్తములకు; గోసహ(్రంబులు= వేలకొద్దిఆవులు; ఇచ్చి; (ప్రాక్‌+దేశంబునకుజ క్రౌశికియు; నందయిన; అపరనందయు; గయయు; గంగయు; గంగాసాగరసంగమంబును= గంగానది సముద్రంలో కలిసేచోటును; చూచుచు.

; ఆ హిర। తాత్పర్యం: ఆ వా ల బిందు తీర్థంలో గోదాన, భూదాన, సువర్హ దానాది అనేక దానాలు చేసి, యజ్ఞం కొరకు (బ్రాహ్మాణోత్తములకు లాది ఆవులను ఇచ్చి, తూర్పుదేశానికి పోయి నైమిశారణ్యంలోని జగన్నాథుడిని ఆరాధించి ఉత్సలిని, కౌశిక, నంద, అపరనంద, గయ, గంగ, గంగాసాగరసంగమస్థలం మొదలైన ప్రదేశాలను చూస్తూ.

క. ఏలావనరమ్యము లగు ; వేలావనములను బవనవిచలవ్వీచ్‌ లాలితసముద్రవిద్రుమ । మాలాపులినస్థలముల మసలుచు లీలన్‌. 137

822 శ్రీమదాంధ్ర మహాభారతము

(ప్రతిపదార్థం; ఏలా, వన, రమ్యములు+అగు= ఏలకి తీగల తోటలచే అందము లైన; వేలా, వననములను= సము(ద్రతీరపు అడవులలో,

పవన, విచలత్‌+వీచీ, లాలిత, సముద్ర, విద్రుమ, మాలా, పులిన, స్థలములః= గాలిచే కదులుతున్న అలలచే ఊగించబడిన

సముద్రంయొక్క పగడపుచెట్ట వరుసలతో కూడిన ఇసుక తిన్నె లున్న(ప్రదేశాలలో; లీలన్‌= విలాసంగా; మసలుచు= తిరుగుతూ. తాత్సర్యం: ఏలకి తీగల తోటలతో అందంగా ఉన్న సముద్రతీర వనాలతో, గాలికి కదలే అలలు ఊగించే పగడపు చెట్లవరుసలతో కూడిన ఇసుకతిన్నె లున్న ప్రదేశాలలో విలాసంగా తిరుగుతూ.

వ కళింగవిషయంబు సొచ్చు నంత. దోడిబ్రాహ్మణులు కొందలు కళింగద్వారంబునం గ్రమ్మటి యుత్తరకురుదేశంబులకుం జనిన; నందుం గతిపయబ్రాహ్మణసహాయుం డయి పార్గుం డరిగి పూర్వసముద్రతీరంబున బురుషోత్తమదేవరకు నమస్కరించి మహేంద్రపర్వతంబు చూచుచు. 138

(ప్రతిపదార్థం: కళింగ, విషయంబు= కళింగదేశం; చొచ్చునంతన్‌= ప్రవేశించగానే; తోడి బ్రాహ్మణులు, కొందలు; కళింగద్వారంబునన్‌:

(క్రమ్మథి= మరలి; ఉత్తర, కురుదేశంబులకున్‌; చనినన్‌= వెళ్ళగా; అందున్‌; కతిపయ (బ్రాహ్మణ, సహాయుండు+అయి= కొద్దిమంది

(బ్రాహ్మణుల సహాయం కలవాడై; పార్టుండు; అరిగి= వెళ్ళి; పూర్వ, సముద్ర, తీరంబునన్‌= తూర్పు సముద్ర తీరంలో

పురుషోత్తమదేవరకు= జగన్నాధస్వామికి; నమస్కరించి; మహేర్రిదపర్వతంబు; చూచుచు.

తాత్పర్యం: కళింగదేశంలో ప్రవేశించగానే అర్జునుని వెంట వచ్చిన బ్రాహ్మణులలో కొందరు కళింగదేశ ద్వారంనుండి

తిరిగి ఉత్తర కురు దేశాలకు వెళ్ళారు. మిగిలినవాళ్ళసాయంతో పార్టుడు తూర్పుసముద్రతీరంలోఉన్న

జగన్నాధస్వామిని సేవించి, మహేం(ద్రపర్వతం చూస్తూ,

సీ, దక్షిణగంగ నాం దద్దయు నొప్పిన । గోదావరియు, జగదాది యైన భీమేశ్వరంబును, బెడంగగుచున్న శ్రీ ; పర్వతంబును జూచి, యుర్విలోన నవఘ మై శిష్టాగ్రహారభూయిష్ట మై । ధరణీసురోత్తమాధ్వరవిధాన పుణ్యసమృద్ధ మై పొలుచు వేంగీదేశ । విభవంబుం జూచుచు విభుండు దక్షి

తే. ణాంబురాశితీరంబున కరిగి, దురిత । హారి యైన కావేరీమహాసముద్ర సంగమంబున భూసురేశ్వరుల కభిమ । తార్థదానంబు జేసె కృతార్ణుం డగుచు. 139

ప్రతిపదార్థం: విభుండు= ప్రభువు-అర్జునుడు; దక్షిణగంగ; నాన్‌= అన్నట్టు; తద్దయున్‌= మిక్కిలి; ఒప్పిన; గోదావరియు; జగత్‌+ఆది, ఐన= లోకానికి మొద లైన; భీమేశ్వరంబును; బెడంు+అగుచు+ఉన్న= మనోహర మైన; శ్రీపర్వతంబును; చూచి; ఉర్విలోనన్‌= భూమిలో; అనఘము+ఐ = పవిత్ర మై; శిష్టశఅ(గ్రహార, భూయిష్టము+ఐజ సదాచారసంపన్నులయొక్క అ(గ్రహారాలతో నిండిన దై; ధరణీసుర+ఉత్తమ+అధ్వర, విధాన, పుణ్య, సమృద్దము+ఐ= బ్రాహ్మణోత్తములయొక్క యజ్ఞకార్యాలచే కలిగే పుణ్యంతో నిండినదై; పొలుచు= ఒప్పు; వేంగీదేశ, విభవంబున్‌= వేంగీదేశంయొక్క వైభవాన్ని; చూచుచు; దక్షిణ+అంబురాశి, తీరంబునకు= దక్షిణ సముద్ర తీరానికి; అరిగి= వెళ్ళి దురిత, హారి+ఐన= పాపాన్ని పోగొట్టే దైన; కావేరీ మహాసముద్ర సంగమంబునజ కావేరీనది సముద్రంలో కలిసే చోట; భూసుర+ఈశ్చరులకు= బ్రాహ్మణ (శ్రేష్టులకు; అభిమత+అర్హ, దానంబున్‌౫చేసి= కోరుకొన్న వాటిని దానం ఇచ్చి; కృత+అర్భ్హుడు+అగుచు= ధన్యు డై

తాత్పర్యం: అర్జునుడు దక్షిణ గంగ అని (ప్రసిద్ది పొందిన గోదావరీనదిని, లోకానికే మొదలు అనిపించుకొన్న

భీమేశ్వరాన్ని, మనోహర మైన శ్రీశైలాన్ని చూచి, పవిత్ర మై, 'శ్రోత్రియుల అ(గ్రహారాలకు నిలయ మై, బ్రాహ్మణోత్తముల

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 823 యజ్ఞ కార్యాల పుణ్యఫలంతో నిండిన దై వెలసి ఉన్న వేంగీ దేశ వైభవాన్ని చూస్తూ దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి, పాపాలను పోగొట్టే కావేరీ సముద్ర సంగమంలో బ్రాహ్మణ(శ్రేష్టులకు ఇష్ట మైన దానాలన్నీ ఇచ్చి ధన్యు డయ్యాడు. విశేషం: మనోహర మైన ఈ వేంగీ దేశ వర్షనం స్వీయదేశాభిమూనంతో నన్నయ తెలుగుభారతంలో చాప్పించిందే. ఇది అమూలకం. గోదావరి ప్రశంస మాత్రం పి.పి.యస్‌శాస్త్రిగారి ప్రతిలో ఉన్నది.

అర్జ్హునుండు చిత్రాంగదను నివాహం బగుట (సం- 1-207-14)

వ. పదుమూందగుమాసంబున మణిపూరపురంబునకుం జని, యం దున్న రాజుంజిత్రవాహనుం గని, వానిచేతం బూజితుం డయి, తత్పుత్రిం జిత్రాంగద యనుదాని వివాహంబుగా నపేక్షించిన, నయ్యర్గునునభిప్రాయం బాప్తులవలన నెజింగి చిత్రవాహనుం డర్జునున కి ట్లనియె. 140

ప్రతిపదార్థం: పదుమూండు+అగు; మాసంబున; మణిపూర, పురంబునకున్‌; చని= వెళ్ళి; అందు+ఉన్న: రాజున్‌: చిత్రవాహనున్‌:

కని= చూచి; వానిచేతన్‌; పూజితుండు+అయి= పూజింపబడినవా€ డై; తత్‌+పుత్రిన్‌= ఆతని కుమార్తెను; చిత్రాంగద; అను; దాని; వివాహంబు, కాన్‌= పెండ్లిచేసికొనటానికి; అపేక్షించినన్‌= కోరగా; ఆ+అర్హును; అభిప్రాయంబు; ఆప్త్పులవలనన్‌; ఎజింగి;చిత్రవాహనుండు; అర్జునునకు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: అర్జునుడు పదమూడవ మాసంలో మణిపూర మనే నగరానికి వెళ్లాడు. ఆ దేశపు రాజైన చిత్రవాహనుడిని

చూచాడు, అతని గౌరవం పొందాడు. అతని కూతురైన చిత్రాంగదను (ప్రేమించాడు. వివాహంచేసికొనాలని

అనుకొన్నాడు. ఆతని అభిప్రాయాన్ని ఆప్తులవలన తెలిసికొన్న చిత్రవాహనుడు అర్జునునితో ఈ విధంగా అన్నాడు.

క. , ధన్యుండ నైతి నీకీ; కన్యక నీగాంచి; యైనం గలతెఅయ జగ న్మాన్య! యెజింగింపవలయు; న । నన్యమనస్కుండ వయి దయన్‌ విను మనఘా।! 141

ప్రతిపదార్హం: జగత్‌+మాన్య= లోకంచే పూజింపబడేవాడా! నీకు; ఈ, కన్యకన్‌; ఈన్‌+కాంచి= ఈయగలిగి; ధన్యుండను+ఐతిని;

ఐనన్‌; కల, తెజంగు= ఉన్నసంగతి; ఎజిగింపవలయున్‌= తెలపాలి; అనఘా= పాపరహితుడా!; అనన్యమనస్కుండవు+అయి= మరొకదానిలో మనస్సు లేనివాడవై; దయన్‌= దయతో; వినుము. తొత్సర్యం: అర్జునా! నీకు ఈ కన్యకను ఇవ్వగలిగి ధన్యుడ నయ్యాను. అయినా ఉన్న సంగతి చెప్పాలి. పుణ్యాత్మా! సావధానంగా దయతో వినుము. కు మా కులమునందు. దొల్లి ప్ర; భాకరుం. డను రాజవరు( డపశ్యము దనకున్‌

లేకున్న నుమేశ్వరునకుం ; బ్రాకటముగ భక్తితో దపం బొనరించెన్‌. 142 (ప్రతిపదార్థం: న పూర్వం; మా, కులమునందు; ప్రభాకరుండు+అను; రాజ, వరుండు= రాజగ్రేష్టుడు; తనకున్‌: అపత్యము= సంతానం; లేకున్నన: 'ప్రాకుముగ= ప్రసిద్ధంగా; ఉమ+ఈశ్చరునకున్‌= ఉమాదేవి భర్త అయిన పరమేశ్చరుడినిగూర్చి: భక్తితోన్‌; తపంబు' ఒనరించెన్‌= చేశాడు.

తాత్పర్యం: పూర్వం మా వంశంలో ప్రభాకరుడు అనే రాజశ్రేష్టడు తనకు సంతానం లేకపోవటంవలన

పరమేశ్వరుడినిగూర్చి భక్తితో తపస్సు చేశాడు.

ప. _ పరమేశ్వరుండును వానికిం గరుణించి నీకు నొక్కపుత్తుం డుద్ధవించు; నీకులంబున వారికెల్ల సంతానం బిట్ల యగు నని వరం బిచ్చిన; నదిమొదలుగా మావంశంబునవారికెల్ల నొక్కొక్కపుత్రుండ కా జవ్మించుచు నచ్చిన నిప్పుడు నాకు నిక్కన్యక పుట్టె; నేను దీనిం బుత్తీకరణంబునం బెనిచితి. 143

ప్రతిపదార్థం: పరమ+ఈశ్చరుండును; వానికిన్‌= ఆ ప్రభాకరుకి; కరుణించి; నీకున్‌; ఒక్క, పుత్రుండు" ఉద్భవించు= పుట్టుతాడు;

నీ, కులంబునవారికి+ఎల్ల= నీ వంశంలోని వాళ్ళందరికీ; ఇట్ట్లు+ఆఅ; సంతానంబు; అగున్‌; అని; వరంబు; ఇచ్చినన్‌; అదిమొదలుగా; మా, వంశంబునవారికి+ ఎల్లన్‌; ఒక్కొక్కపు'్రుండు+అ, కా=ఐ ఒక్కొక్కకొడుకు; జన్మించుచు వచ్చినన్‌; ఇప్పుడు; నాకున్‌; ఈ+కన్యక' పుట్టె; నేను; దీనిన్‌; పుత్రీకరణంబునన్‌= పుత్రికగా; పెనిచితి= పెంచాను.

తాత్సర్యం: పరమేశ్చరుడు ఆ 'ప్రభాకరుడిని అనుగ్రహించి, “నీ కొక కొడుకు పుడతాడు. నీ వంశంలోని వాళ్ళందరికీ

ఇట్లాగే సంతానం కలుగుతుంది (అంటే ఒక్కొక్కకొడుకుమా(త్రమే పుట్టటరంు' అని వరం ఇచ్చాడు. అది మొదలుగా

మా వంశంలోనివాళ్ళందరికీ ఒక్కొక్క కొడుకే జన్మిస్తూ వచ్చాడు. ఇప్పుడు నా కీ కన్యక పుట్టింది. నేను ఈ కన్యకను వంశం నిలిపే దానినిగా పెంచాను. విశేషం: ఏ కుమారికి పుట్టినపుత్తుడు తనకు పుత్రుడు కావా లని తండ్రి తలుస్తాడో ఆ కుమారికి పుత్రిక అనే సంజ్ఞ ఉన్నది. పుత్తీకరణంబునం' అనేదానికి పుత్రాకారంబున అనే పారాంతరం కూడా ఉన్నది. మొత్తంమీద చిత్రాంగద కుమారుడు (దౌహిత్రుడు) తన వంశకరుడు కావాలని చిత్రవాహనుని అభిమతం. తే. ఇందుం బుట్టినసుతుండు మా కిందువంశ్య! । వంశవిస్తారకుండు గావలయు; నిదియ యీలతాంగికి నుంకు; వి ట్లీగనోపు । దేని పెండిలియగుమ యీయింతి. బ్రీతి. 144 ప్రతిపదార్థం: ఇందున్‌= ఈ చిత్రాంగదకు; పుట్టిన; సుతుండు= కుమారుడు; మాకు; ఇందువంశ్య= చంద్రవంశానికి చెందినవాడా! ఓఅర్జ్హునా!; వంశ, విస్తారకుండు= వంశాన్ని వృద్దిచేసేవాడు; కావలయున్‌; ఇదియ: ఈ,లత+అంగికిన్‌= ఈ సుకుమారికి; ఉంకువ= శుల్కం; ఇట్లు ఈంగన్‌= ఇవ్వటానికి; ఓపుదు+ఏని= చాలుదువేని; ఈ, ఇంతిన్‌= ఈ కాంతను; '్రీతి= (ప్రేమతో; పెండిలి, అగుము+అజ పెండ్దాడుము, తాత్పర్యం: అర్జునా! ఈ చిత్రాంగదకు పుట్టిన కుమారుడు మా వంశం నిలిపేవాడు కావాలి. ఇదే నీవు ఈ కన్యకు ఇవ్వవలసిన శుల్కం. ఇట్లా ఇవ్వగలిగితే ప్రేమతో ఆమెను పెళ్ళి చేసికొమ్ము. వ. అనిన నర్దునుండు చిత్రవాహను వచనంబున కొడంబడి చిత్రాంగద వివాహం బై. 145 తాత్పర్యం: అని అనగా అర్జునుడు చిత్రవాహనుని మాటకు ఒప్పుకొని చిత్రాంగదను పెండ్డాడి. ఉఊ అంగజరాజ్యలక్ష్మి పొడవైనదియొక్కొయనంగ నొప్పు చి త్రాంగదయందు. బార్జుయ మహాప్రజయప్రవణాంతరంగు. డై యంగజభోగసంగమున నమ్మణిపూరపురిన్‌ సమస్తలో కాంగణరంగసంగతవిహారయశోంగదు6 డుండె లీలతోన్‌. 146 ప్రతిపదార్థం: అంగజ, రాజ్యలక్ష్మి= మన్మథునియొక్కరాజ్యలక్ష్మి; పొడవు+ఐనది, ఒక్కొ రూపుతాల్ళిందా; అనంగన్‌; ఒప్పు” చిత్రాంగద, అందున్‌; సమస్త లోక*+అంగణ, రంగ, సంగత, విహార యశోంగదుండు= అన్నిలోకాల ముంగిళ్ళు అనే రంగస్టలాలలో

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 825 కూడుకొన్న విహారం కల కీర్తిగలవాడు- అంటే అన్నిలోకాలలో వ్యాపించిన కీర్తి కలవాడు; పార్టుండు; మహా, ప్రణయ, ('ప్రవణ+అంతరంగుండు+ఐ= మిక్కిలిప్రేమలో ఆసక్తి కల మనస్సు కలవాడై; అంగజ, భోగ, సంగమునన్‌= మన్మథభోగాలతో కూడి; లీలతోన్‌= విలాసంగా? ఆ+శమణిపూర, పురిన్‌; ఉండె. తాత్సర్యం: మన్మథుని రాజ్యలక్ష్మి రూపు తాల్చిందా అన్నట్టు మహాసౌందర్యవతి ఆయిన చిత్రాంగద మీద తగులుకొన్న మనస్సుతో, మన్మథభోగా లనుభవిస్తూ, కీర్తిమంతు డైన పార్టుడు మణిపూరపురంలో విలాసంతో ఉన్నాడు. విశేషం: అలం; ఉ(త్రేక్ష. మన్మధరాజ్యలక్ష్మివంటి ఆ చిత్రాంగదమీద తనివి. తీరక ఆలలు అలలుగా పెల్లుబికిన పార్టుని శృంగారభావం- ప్రాసస్టానంలోనే గాక పద్యమంతటా (ప్రయోగించబడిన బిందుపూర్చక 'గికారంతో చక్కగా వ్యక్తంచచేయబడింది. అక్షరరమ్య మైన నన్నయపద్యాలలో ఇది ఒకటి.

అర్జునుండు పంచతీర్హంబులం దప్సరసలను శాసవిముక్తల నొనరించుట (సం. 1-208-2)

వ. ఇట్లుండి యొక్కనాండు తపోధనబ్రాహ్మణసమేతుం డై తత్స్పమీపంబున సముద్రతీరతీర్ధంబులు చూచుచుం జని సౌభద్రం బను తీర్ధంబుం గని యందు స్నానంబు సేయ సమకట్టిన నర్హునుం జిచి యందుల మును లి ట్లనిరి. శ47

(ప్రతిపదార్థం: ఇట్టు+ఉండి; ఒక్కనాండు; తపోధన(బ్రాహ్మణ, సమేతుండు+ఐ= తపస్సే ధనంగా కల (బ్రాహ్మణులతో కూడుకొన్నవా

డై; తత్‌+సమీపంబున= ఆ మణిపూర పురానికి దగ్గర: సముద్రతీర, తీర్రంబులు; చూచుచున్‌; చని= వెళ్ళి: సౌభద్రంబు+అమ;

తీర్థంబున్‌; కని= చూచి; అందు; స్నానంబుచేయ; సమకట్టినన్‌= పూనుకోగా; అర్జునున్‌; చూచి; అందుల= అందున్న; మునులు; ఇట్టు+అనిరి.

తాత్సర్యం: ఈ విధంగా ఉన్న అర్జునుడు ఒకనాడు తపోధను లైన బ్రాహ్మణులతో కలిసి ఆ మణిపూరపురానికి

దగ్గరగా ఉన్న సము(ద్ర తీర తీర్చాలను చూస్తూ సౌభద్ర తీర్చాన్ని దర్శించాడు. అందులో స్నానంచేయటానికి పూనుకోగా,

అక్కడ ఉన్న మునులు అతనితో ఇట్టా అన్నారు.

తరలము. ఇది సొరంగ నసాధ్య మెన్వరి కిందువంశనరేణ్య! వి విదియ కా దివియేనుతీర్ధము లీసముద్రతటంబునన్‌

విదితముల్‌ దురితాపహంబులు వీని నెన్నయడు నాదనో

డుదురు సన్మును లిందు. గోల్మొసళుల్‌ గొనున్‌ వడిం జొచ్చినన్‌, 148 ప్రతిపదార్థం: ఇందు, వంశ, వరేణ్య= చంద్రవంశ్రేష్టుడా! ఓఒఅర్జ్హునా!; ఇది= ఈతిర్థం; చారంగన్‌= (ప్రవేశించటానికి; ఎవ్వరికి; అసాధ్యము; వినుము; ఇదియ, కాదు= ఇది ఒక్కటే కాదు; ఇవి; ఏను, తీర్ణముల్‌= అయిదు తీర్చాలు; సముద్ర, తటంబునన్‌=

ఈ సముద్రతీరాన; విదితముల్‌= ప్రసిద్దాలు; దురితశఅపహంబులు= పాపాన్ని పోగొట్టేవి; సత్‌శమునులుజ మహామునులు; వీనిన్‌=

వీటిలో; ఎన్నండున్‌; ఆడన్‌= స్నానమాడటానికి; ఓడుదురు= భయపడతారు; ఇందున్‌! చొచ్చినన్‌= ప్రవేశిస్తే వడిన్‌= వెంటనే:

కోల్‌*మొసళుల్‌= పెద్ద మొసళ్ళు; కొనున్‌= పట్టుకొంటాయి.

826 శ్రీమదాంధ్ర మహాభారతము

తాత్పర్యం: చంద్రవంశశ్రేష్టా! ఓ అర్జునా! ఈ తీర్చాన్ని ప్రవేశించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. వినుము. ఇదే కాదు.

ఈ సముద్రతీరాన ప్రసిద్దాలు, పాపహరాలు అయిన అయిదుతీర్జాలు ఉన్నాయి. మహామునులుకూడా వీటిలో

స్నానం చేయటానికి భయపడతారు. దీనిలో (ప్రవేశిస్తే వెంటనే పెద్ద మొసళ్ళు పట్టుకొంటాయి.

విశేషం: వృత్తలక్షణానికి చూడు: అది. 1.21 విశేషం.

వ. 'సౌభద్ర పొలోమ కారంధమ ప్రసన్న భారద్వాజంబు లను నామంబుల దక్షిణసముద్ర తీరంబునం బ్రసిద్దంబు లయిన యిప్పంచతీర్థంబు లిప్పుడు నూజేండ్లంగోలె నుగ్రగ్రాహగహీతంబు లయి దుర్దనగ్భహీతంబు లయిన రాజులవిభవంబులుంబోలె సాధుజనవర్షితంబు లయి యుండు" ననిన విని విజయుం “డశేషతీర్దసేవార్డి నయి వచ్చిన నాకు నీతీర్జంబు లాడకునికి పౌరుషంబు గా' దని యందు. 149

ప్రతిపదార్హం: సౌభద్ర, పౌలోమ, కారంధమ, ప్రసన్న. భరద్వాజంబులు; అను; నామంబుల; దక్షిణ సముద్రతీరంబునన్‌;

'ప్రసిద్దంబులు+అయిన; ఈ+పంచ, తీర్ణంబులు= ఈ అయిదు తీర్చాలు; ఇప్పుడు; నూటేండ్లన్‌+కోలెన్‌= నూరుసంవత్సరాలనుండి;

ఉ(గ్ర, (గ్రాహ, గృహీతంబులు+అయి= భయంకరా లైన మొసళ్ళచే (గ్రహింపబడిన వై; దుర్దన, గృహీతంబులు+అయిన= దుర్మార్గులచే

(గ్రహింపబడిన; రాజుల, విభవంబులున్‌+పోలె= రాజుల ఐశ్చర్యాలవలె; సాధుజన, వర్టితంబులు+అయి= మునీశ్చరులచేత

విడువబడిన వై; ఉండున్‌; అనిన; విని; విజయుండు; అశేష తీర్థసేవా+లఅర్జిన్‌+అయి= అన్ని తీర్చాలు సేవించా లన్న కోరిక కలవాడి

నై వచ్చిన; నాకున్‌; ఈ, తీర్థంబులు; ఆడక+ఉనికి= స్నానమాడకుండటం; పౌరుషంబు, కాదు; అని; అందు.

తాత్పర్యం: 'సౌభద్ర, పౌలోమ, కారంధమ, ప్రసన్న, భరద్వాజంబులు అనే పేర దక్షిణసముద్రతీరంలో 'ప్రసిద్దా

లైన ఈ అయిదు తీర్చాలను నూరేండ్లనుండి భయంకరా లైన మొసళ్ళు ఆ(క్రమించాయి. దుర్మార్గులవశం అయిన

రాజుల ఐశ్చర్యాలవలె ఇవి మునీశ్చరులచేత విడువబడి ఉన్నాయి' -అనగా విని అర్జునుడు, 'అన్నితీర్జాలు సేవించగోరిన నాకు ఈ తీర్థాలలో స్నానం చేయకుండా ఉండటం పౌరుషం కాదు' అని.

విశేషం; అలం: ఉపమ.

క _ సాహసికుం డైనరుండవ । గాహము సేయుటయు జలము గ్రక్కదల మహా గ్రాహము జీభత్తు బృహ । ద్ధాహుబలుం బట్టికొనియెం బఅతెంచి వడిన్‌, 150

ప్రతిపదార్ధం: నరుండు= అర్జునుడు; సాహసికుండు+ఐ= సాహసంకలవా డై; అవగాహము= స్నానం; చేయుటయు;

మహా(గ్రాహము= పెద్దమొసలి; జలముజ నీరు; కదల+కదలజ= మిక్కిలి కలత చెందగా; వడిన్‌= వేగంగా; పజతెంచి= పరుగెత్తి వచ్చి; బృహత్‌+బాహుబలున్‌= గొప్పభుజబలం కలవాడిని; బీభత్సు= అర్జునుడిని; పట్టికొనియెన్‌.

తాత్పర్యం: అర్జునుడు సాహసించి స్నానం చేయటానికి నీటిలో మునుగగా, పెద్దమొసలి ఒకటి నీరంతా కలత

చెందేటట్టు వేగంగా పరుగెత్తి వచ్చి అతడిని పట్టుకొన్నది.

ఆ. దాని నశ్రమమునం దజ్ఞలాశయము వె । ల్వడంగ వైచె నరుండు బాహుశక్తి; నదియు దత్‌క్షణంబ యభినవ యౌవనో । ద్ధాసమాన దివ్యభామ యయ్యె, 151

(ప్రతిపదార్హం: నరుండు= అర్జునుడు; బాహుశక్తిన్‌= భుజ బలంతో; దానిన్‌= ఆ మొసలిని; అశ్రమమునన్‌= సులువుగా;

తణ్‌*జల+ఆశయముజ= ఆ మడుగునుండి; వెల్వడంగ= బయట పడేటట్టు; వైచె; అదియున్‌= ఆ మొసలికూడా; తల్‌+క్షణంబు+అ=

ఆ క్షణమే; అభినవ, యౌవన+జఉద్భాసమాన, దివ్యభామజ కొత్తయౌవనంతో ప్రకాశిస్తున్న దివ్యస్త్రీ: అయ్యె.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 827 తాత్పర్యం: అర్జునుడు తన భుజ బలంతో ఆ మొసలిని సులభంగా మడుగునుండి బయట పడేటట్టు విసిరాడు. అది వెంటనే నూత్షయౌవనంతో ప్రకాళించే దివ్యకాంత అయింది.

ఉ. ఆ లలితాంగిం జూచి నరుం దద్దుత మంది 'మృగాయతాక్షి! యి ట్లేల జలేచరత్వమున నిజ్జ్ఞలధిన్‌ వసియించి? తిప్పు డి ట్లేల సు రూప భామ వయి? తెందులదానవు నీవు? నావుడున్‌ బాలిక పాండుపుత్తునకుం బార్జున కిట్లనియెం బ్రయంబునన్‌, 152 ప్రతిపదార్హం: నరుండు= అర్జునుడు; ఆ, లలిత+అంగిన్‌= ఆ అంద మైన శరీరం కలదానిని; చూచి; అద్భుతము+అంది= ఆశ్చర్యపడి; మృగ+ఆయత+అక్షి= లేడి కన్నుల వంటివిశాల మైన కన్నులు కలదానా!? ఇట్లు; ఏల; జలేచరత్వమునన్‌= నీటిలో తిరిగే ప్రాణివి- మొసలివి కావటంవలన; ఈ+జలధిన్‌= ఈ మడుగులో; వసియించితి= ఉన్నావు; ఇప్పుడు: ఇట్లు; ఏల; సు, రూప, భామవు+అయితి= అంద మైన కాంతవు అయ్యావు; నీవు; ఎందుల, దానవు= ఎక్కడిదానవు; నావుడున్‌= అని అనగా; బాలిక= ఆ కాంత; పాండుపుత్రునకున్‌: పార్టునకు; ప్రియంబునన్‌= ప్రీతితో; ఇట్టు+అనియెన్‌. తాత్సర్యం: అంద మైన ఆ కాంతను చూచి అర్జునుడు ఆశ్చర్యపడి 'నీ వేల మొసలి వై ఈ విధంగా మడుగులో ఉన్నావు? ఇప్పుడు ఈ విధంగా ఎందుకు అందాలభామ వయ్యావు? ఎక్కడి దానవు?" అని అడుగగా ఆమె అర్జునునితో ఇట్లా అన్నది. వ. “ఏను వంద యను నప్పరసం గుబేరుననుంగ; నాసఖులు సౌరభేయియు సమీచియు బుద్ధుదయు లతయు ననువారలు నలువురు నాయట్ల యత్తీర్దంబులం దున్నవారలు; వారిని శాపవిముక్తలం జేసి రక్షింపు' మనిన దానికి నర్జునుం డి ట్లనియె. 153 ప్రతిపదార్థం: ఏను; వంద;అను; అప్పరసన్‌; కుబేరు, అనుంగన్‌= కుబేరునియొక్క చెలిని; నా సఖులు= నా 'స్నేహితురాండ్రు; సౌరభేయియు: సమీచియు, బుద్చుదయు; లతయున్‌; అనువారలు; నలువురు; నాయట్ల; ఆ తీర్ణంబులందు; ఉన్నవారలు; వారిని; శాపవిముక్తలన్‌; చేసి; రక్షింపుము; అనిన; దానికిన్‌; అర్హునుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: 'నా పేరు వంద. కుబేరునిస్నేహితురాలిని. నా స్నేహితురాండ్రు సౌరభేయి, సమీచి, బుద్బుద, లత అనేవాళ్ళు నలుగురూ నావలె ఆ తీర్చాలలో ఉన్నారు. వాళ్ళనికూడా శాపవిముక్తలను చేసి రక్షించుము” అని అనగా ఆమెతో అర్జునుడు ఇట్లా అన్నాడు. విశేషం: వంద అనేదానికి అనేకప్రతులలో నంద అనే పాఠాంతరం ఉన్నది. భాండార్కరుప్రతిఅధస్సూచికలో వర్షా వర్చా, వృందా, వర్దా వందా, విందా, నందా అనేవిధంగా అనేకపాఠా లున్నాయి. మూలభారతం వావిళ్ళవారి తెలుగు లిపి ప్రతిలో 'అహం చ సౌరభేయీచ, సమీచీ బుద్చుదాలతా” అని ఉన్నది. క. 'వనజాక్షి! యేమికారణ మున నుగ్రగ్రాహరూపములు దాల్చితి రీ? రని యడిగిన వేడుక నా ; తని కది యి ట్లనుచు. జెప్పెం దద్విధమెల్లన్‌. 154 ప్రతిపదార్థం: వనజ+లఅక్షి=ఐ పద్మాలవంటి కన్నులుకలదానా! ఈరు= మీరు; ఏమి, కారణమునన్‌; ఉ(గ్ర, (గ్రాహ, రూపములు= భయంకరాలైన మొసళ్ళ రూపాలు; దాల్చితిరి; అని; అడిగిన; అది, కేడుకన్‌= సంతోషంతో, ఆతనికి" ఇట్టు+అనుచున్‌; తత్‌*విధము+ఎల్లన్‌= ఆ విధమంతా; చెప్పె.

828 శ్రీమదాంధ్ర మహాభారతను

తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులు కల దానా! ఏ కారణంవలన మీరు భయంకరా లైన ఈ మొసళ్ళ రూపాలు

తాల్చారు?” అని అడుగగా, ఆమె సంతోషంతో ఆ విధమంతా చెప్పింది.

వ. వినవయ్య! యే మేవురము నఖిలలోకపాలపురంబులు చూచుచు భూలోకంబునకు వచ్చి యొక్క వనంబునం దుగ్రతపంబు సేయుచున్నవాని నత్యంతశాంతు నేకాంతచారి నగ్నికల్పు నొక్కబ్రాహ్మణుం గని వానితపంబునకు విఘ్నంబు సేయ సమకట్టి, 155

ప్రతిపదార్థం: వినవయ్య॥!: ఏము= మేము; ఏవురమున్‌= అయిదుగురం; అఖిల, లోకపాల, పురంబులు= అందరు దిక్సాలకుల

పట్టణాలు; చూచుచు; భూలోకంబునకు; వచ్చి; ఒక్క, వనంబునందు; ఉ(గ్ర, తపంబు= భయంకర మైన తపస్సు; చేయుచు+ఉన్న, వానిన్‌: అత్యంత, శాంతున్‌= మిక్కిలిశాంతం కలవాడిని; ఏకాంతచారిన్‌= ఒంటరిగా ఉన్నవాడిని; అగ్నికల్పున్‌= అగ్నిదేవునితో సమాన మైన వాడిని; ఒక్క, (బ్రాహ్మణునిన్‌? కని= చూచి; వాని; తపంబునకు, విఘ్నంబు, చేయన్‌; సమకట్టి= పూనుకొని. తాత్పర్యం: మే మైదుగురం దిక్పాలకు లందరి పట్టణాలు చూస్తూ, భూలోకానికి వచ్చాము, ఒక అడవిలో ఒంటరిగా కూర్చుండి భయంకర మైన తపస్సు చేస్తూ మిక్కిలిశాంతంగా, అన్నిదేవునితో సమానంగా ఉన్న ఒక (బ్రాహ్మణుడిని చూచి అతని తపస్సు చెడగొట్ట పూనుకొని.

విశేషం: ఆ బ్రాహ్మణుడు అత్యంతశాంతుడు, అన్నికల్పుడు అని చెప్పటం పరస్పం' విరుద్దంగా భాసించినా- కాని అతడు సహజంగా

అత్యంతశాంతు డనీ, ఆగ్రహిస్తే అన్నితో సమాను డనీ, ఇక్కడ (గ్రహించాలి అనిహోత్రుడు పవిత్రతకు పెట్టింది పేరు కాబట్టి

అన్షికల్పు డనటంలో ఆ బ్రాహ్మణుని పవిత్రత కూడా వ్యక్తమవుతుంది.

క. వేడుక నమ్ముని ముందటం | బాడితి మాడితిమి; పెక్కుపరిహాసంబుల్‌ రూఢిగం బలికితి; మెట్లుం ; జూదండు మావలను; నీరసుం డన నుందెన్‌. 156

ప్రతిపదార్థం: వేడుకన్‌= వినోదంగా; ఆ, ముని, ముందటన్‌; పాడితిమి; ఆడితిమి; పెక్కు, పరిహాసంబుల్‌; రూఢిగన్‌= ప్రసిద్దంగా;

పలికితిమి; ఎట్టున్‌; మావలను= మావైపు; చూడడు; నీరసుండు+అనన్‌= అనురాగం లేనివాడు అన్నట్టు; ఉండెన్‌. తాత్పర్యం: మేము వినోదంగా ఆ ముని ముందట పొడాము, ఆడాము. అనేక పరిహాసాలు పలికాము. ఆయన

ఏ విధంగా కూడా మా వైపు చూడక అనురాగం లేని వానివలె ఉన్నాడు.

క. ధృతిహీనులచిత్తము ల । ట్లతివలయం దేల తగులు నత్యంతద్భథ వ్రతుల మనంబులు వారల । మతులం దృణస్తైణములు సమంబుల కావే. 157

(ప్రతిపదార్థం: దృతి, హీనుల, చిత్తముల+అట్ల= ధైర్యం లేనివాళ్ళ మనస్సులవలె; అత్యంత, దృఢవ్రతుల, మనంబులు= మిక్కిలి

దృఢ మైన (వ్రతం కలవాళ్ళ మనస్సులు; అతివల, అందుజ= స్త్రీలలో; ఏల; తగులున్‌= తగుల్కొంటాయి; వారల, మతులన్‌=

మిక్కిలి దృఢవ్రతు లైనవారి మనస్సులలో; తృణ (్రైెణములు= గడ్డి (ప్రీలసమూహం; సమంబులు+అ= సమానములే' కావె= కదా! తాత్పర్యం: మనోనిగ్రహం కలవాళ్ళమనస్సులు, నిగ్రహం లేనివాళ్ళ మనస్సులవలె (స్త్రీల విషయంలో ఎందుకు తగులుకొంటాయి? ని(గ్రహ పరుల దృష్టిలో స్త్రీలు, గడ్డిపరకలు సమానములే కదా!

వ. ఏమురాగకారణవికారంబులుగావించిన నవి దనకుం గోపకారణంబు లయిన నతికుపెతుం దయి బ్రాహ్మణుందు మమ్మేవురను మహాగ్రాహంబులుగా శపియించిన నమ్మునివరునకు ముకుళితహస్తల మై యి ట్లంటిమి.158

ఆదివర్వము - అష్టమాశ్వాసము 829 ప్రతిపదార్థం: ఏము= మేము; రాగ, కారణ, వికారంబులు= అనురాగాన్ని కలిగించే పనులు; కావించినన్‌; అవి; తనకున్‌; కోప, కారణంబులు+అయినన్‌= కోపాన్ని కలిగించినవి కాగా; అతి, కుపితుండు+అయి= మిక్కిలికోపం కలవా డై; బ్రాహ్మణుండు; మమ్ము+ఏవురను= మా అయిదుగురిని; మహా, [గ్రాహంబులు, కాజ పెద్ద మొసళ్ళు అయ్యేటట్టు; శపియించినన్‌; ఆ+మునివరునకు= ఆ మునిశ్రేష్టునికి:; ముకుళిత, హస్తలము+ఐ= చేతులు జోడించినవాళ్ళ మై- అంటే నమస్కరించి; ఇట్టు+అంటిమి. తాత్సర్యం: మేము అనురాగాన్ని రేకెత్తించే చిలిపి చేష్టలు చేయగా- అవి, అతనికి కోపం తెప్పించాయి. ఆ బ్రాహ్మణుడు బాగా కోపించి మా అయిదుగురిని పెద్ద మొసళ్ళు కండని శపించాడు. అప్పుడు మేము చేతులు జోడించి ఈ విధంగా అన్నాం.

చ. అలుగుదురయ్య విఫ్రులు? మహాపురుషుల్‌ పరుషాపరాధముల్‌ దలింగెడువారు ధర్మువులు దప్పక సల్పెడువారు సత్యముల్‌ పలికెడువారు; వారల కపాయము డెందములం దలంచు మూ ర్భులకు విధాతృచెయ్వున నగున్‌ దురితంబులు దుర్యశంబులున్‌. 159

ప్రతిపదార్థం: మహాపురుషులుజ ఎంతోగొప్పవాళ్ళు; పరుషశఅపరాధముల్‌= కదిన మైన మాటలను; తప్పులను; తలిలగెడువారుజ= తాలగించేవాళ్ళు- అంటే కరినంగా మాట్టాడనివాళ్ళు. తప్పులను చేయనివాళ్ళు; ధర్మువులు= ధర్మాలను; తప్పక; సలొపెడువారు= ఆచరించేవాళ్ళు; సత్యముల్‌? పలికెడువారు, అయిన; విఫ్రులు= బ్రాహ్మణులు; అలుగుదురు+అయ్య= కోపపడతారా?: వారలకు= అట్లాంటి (బ్రాహ్మాణులకు; అపాయము= హాని; డెందముల న్‌=మ నస్సులలో; తలంచు= ఆలోచనచేసే; మూర్చులకు= బుద్దిలేనివాళ్ళతు? విధాత, చెయ్వునన్‌= (బ్రహ్మదేవుని చేష్ట్రలన- అంటే బ్రహ్మదేవునివలన; దురితంబులు= పాపాలు; దురాయళంబులున= అపకీర్తులు- అంటే చెడ్డపేరు; అగున్‌= కలుగుతుంది.

తాత్పర్యం: ఎంతో గొప్పవాళ్ళు; కఠినంగా మాట్టాడనివాళ్ళు, తప్పులు చేయనివాళ్ళు, ధర్మంగా నడుచుకొనేవాళ్ళు,

సత్యాలు పలికేవాళ్ళు అయిన (బ్రాహ్మణులు కోపపడటం తగునా? అట్లాంటి (బ్రాహ్మణులకు హాని తలపెట్టే మూర్చులు

(బ్రహ్మదేవునివలన పాపాలు, అపకీర్తులు పొందుతారు.

విశేషం: అలుగుదురయ్య విప్రులు అని ప్రారంభించి సంస్కృత భాషా సంప్రదాయానుసారంగా విశేష్యం తరువాత పెక్కువిశేషణాలను

ప్రయోగించటం భావతీవ్రతను పెంచటానికి బాగా దోహదం చేసింది.

వ. 'కావున మాచేసిన యజ్ఞానంబు సహించి మాకు శాపమోక్షంబుంబ్రసాదింపు'మనిన నవ్విప్రుండును గరుణించి “యెవ్వండేని మీచేతగ్భహీతుం డయి మీయున్నజలాశయంబు మిమ్ము వెలువరించు నాతండ మీకు శాపమోక్షకారణుం డగు' ననిన. 160

ప్రతిపదార్థం: కావున; మా, చేసిన= మా యొక్కచేసిన- అంటే మేముచేసిన; అజ్జానంబు= తెలివితక్కువతనాన్ని! సహించి= ఓర్చుకొని; మాకు; శాప, మోక్షంబున్‌= శాపం తొలగటాన్ని; ప్రసాదింపుము= అను(గ్రహింపుము- ఇమ్ము అనినన్‌= అని అనగా ఆ+విప్రుండును=ఐ అ బ్రాహ్మణుడుకూడా; కరుణించి= దయతలచి; ఎవ్వండు+ఏని= ఎవడైతే; మీచేత: గృహీతుండు+ అయి పట్టకొనబడినవా డై; మీ, ఉన్నజ మీయొక్కఉన్న- అంటే మీరున్న; జల+ఆశయంబు= మడుగునుండి: మిమ్ము; వెలువరించు న్‌ బయటకు వేయునో; ఆతండు+అ= అతడే; మీకు; శాప మోక్ష కారణు౦డు= శాపాన్ని తొలగించటానికి కారణ మైనవా డు; అగున; అనిన,

830 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్సర్యం: “అందువలన మా తెలివితక్కువతనాన్ని సహించి, మాకు శాప విమోచనాన్ని 'ప్రసాదించండి' అని అడుగగా, ఆ (బ్రాహ్మణుడు కూడా దయతలచి, “మీరు పట్టుకుంటే ఎవడు మిమ్మల్ని మీ మడుగునుండి బయట పడవేస్తాడో వాడే మీ శాపవిమోచనానికి కారకుడు అవుతాడు" అనగా. సీ. అట్టిమహాబాహుం డత్యంతబలు. డెవ్వం । దగునొక్కొ! యనుచు నే మరుగుదెంచు వారము త్రైలోక్యవర్తి నంబుజిభవ । ప్రభవు నారదు గని భక్తితోడ మ్రొక్కిన మమ్ము నమ్ముని చూచి 'యి ట్లేల । వగం బొంది కందినవార?' లనియు నడిగి మావృత్తాంతమంతయు మాచేత ; విని, 'విప్రనలుకయు విధికృతంబుం ఆ. గ్రమ్మజీంప లావె! కావున దక్షిణ । జలధితీరమునం బ్రశస్త పంచ తీర్థములకు నేంగి ధృతి నందు నూజేండు ; లుండు. డట్లు మీర లుండు నంత." 161 ప్రతిపదార్థం: అట్టి; మహా, బాహుండు= పెద్దచేతులు గలవాడు; అత్యంత, బలుండు= మిక్కిలిబలంకలవాడు; ఎవ్వండు+అగున్‌+ఒక్కొా= ఎవడై ఉన్నాడో; అనుచున్‌= అని అనుకొంటూ; ఏము= మేము; అరుగుదెంచువారము= వస్తున్నవాళ్ళము; (తైలోక్యవర్తిన్‌= మూడులోకాలు తిరిగేవాడిని; అంబుజభవ, ప్రభవు= పద్మంనుండిజన్మించిన (బ్రహ్మదేవుడికి పుట్టినవానిని; నారదున్‌' కని= చూచి; భక్తితోడ: మొక్కిన; మమ్మున్‌= మమ్ములను; ఆ+ముని; చూచి; ఇట్టు; ఏల; వగన్‌= దుఃఖాన్ని; పొంది; కందినవారలు= నలుపెక్కినవారు; అనియున్‌= అనికూడా; అడిగి; మా, వృత్తాంతము+అంతయు; మాచేత; విని; విప్రు అలుకయు= 'బ్రాహ్మణునియొక్క కోపాన్ని; విధి, కృతంబున్‌= (బ్రహ్మ చేసిన పనిని; క్రమ్మజణింప= మరల్చటానికి; లావె= సాధ్యమా (కాదనిభావం); కావున; దక్షిణ; జలధి, తీరమునన్‌= దక్షిణసము(ద్రతీరంలో:; ప్రశస్త, పంచ, తీర్థములకున్‌= ప్రసిద్దిపాందిన అయిదు నీటి మడుగులకు; ఏం= వెళ్ళి: ధృతిన్‌= ధైర్యంతో: అందు ఆ మడుగులలో; నూజు+ఏండులు= వందసంవత్సరాలు; ఉండుడు; అట్టు; మీరలు; ఉండు, అంతజ= ఉండగా. తాత్పర్యం: అట్లాంటి (మాచేతపట్టుబడి మమ్మల్ని మడుగులనుండి బయట పడవేయ గలిగిన) గొప్ప చేతులు కలవాడు, మిక్కిలి బలం కలవాడు, ఎవడా? అని అనుకొంటూ వస్తున్న మేము, ముల్లోకాలలో సంచరించే, (బ్రహ్మపుత్రుడు నారదుడిని చూచి, భక్తితో నమస్కరించాము. ఆ మహాముని మమ్మల్ని చూచి, 'ఇట్లా ఎందుకు దుఃఖంతో నల్ల బడ్డా?” రని అడిగాడు. మా వృత్తాంతమంతా చెప్పగా విని, (బ్రాహ్మణుల కోపం, బ్రహ్మదేవునిచేష్ట మరలింప సాధ్యం కాని” వని, “దక్షిణ సము(ద్ర తీరంలో ప్రసిద్ధికెక్కిన అయిదు నీటి మడుగులకు వెళ్ళి, వాటిలో ధైర్యంగా నూరుసంవత్సరాలు ఉండండి; అట్లా మీరు ఉండగా. క. '“జననుతుండు పాండుతనయుండు । ధనంజయుః డశేషతీర్థదర్శనకాంక్షం జనుదెంచి మీకు దయ నమ్మ్ముని చెప్పినయట్ల శాపమోక్షము సేయున్‌.” 162 (ప్రచిపదార్ధ్హం: జన, నుతుండు= (ప్రజలచే కొనియాడబడేవాడు; పాండు, తనయుండు= పాండురాజుకుమారుడు; ధనంజయుండు= అర్జునుడు; అశేష తీర్థ దర్శన, కాంక్షన్‌= అన్ని పుణ్యతీర్చాలను చూడా లనే కోరికతో; చనుదెంచి= వచ్చి; ఆ+ముని; చెప్పిన; అట్ట= చెప్పినట్లే: దయన్‌= దయతో: మీకు;శాప, మోక్షము= శాపాన్ని తొలగించటం; చేయున్‌. తాత్పర్యం: ప్రజల ప్రశంస లందుకొన్నవాడు, పాండురాజుకుమారుడు అయిన అర్జునుడు అన్ని పుణ్యతీర్జాలను చూడా లన్న కోరికతో వస్తాడు. ఆ ముని చెప్పినట్టే దయతో మీకు శాపవిమోచనాన్ని కలిగిస్తాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 931 న. “అనిన నన్నారదువచనంబులు విని వచ్చి మహోగ్రగ్రాహముల మై భవదాగమనంబు ప్రతీక్షించుచు నిప్పంచతీర్థంబుల నుండి నేడునీకారణంబునం గృతార్భుల మయితి' మనిన నర్దునముండును గరుణాయత్తచిత్తుం డయి వంద చెప్పినయన్నలువురకు శాపమోక్షణంబు సేసిన, నమరకన్యక లతిహర్షంబున నమరేంద్రనందను దీవించి దేవలోకంబున కరిగి; రదిమొదలుగా నిప్పంచతీర్థంబులు నారీతీర్థంబులు నాంబరగె; నర్దునుండును గ్రమ్మజి మణిపూరపురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చిత్రాంగదయందు బభ్రునాహనుం డను పుత్తుం బడసి చిత్రవాహనునకు వంశకరుంగా నిచ్చి, వాని వీడ్కొని గోకర్టంబు.జూచుచు.బశ్చిమసముద్రపార్వంబునం బ్రభాసం బను తీర్ధంబునకుం జని, యందులకు ద్వారవతి పురంబు కుణంగలి యని విని. 163 (ప్రతిపదార్థం: అనినన్‌; ఆ+నారదు, వచనంబులు= ఆ నారదుని మాటలు: విని; వచ్చి; మహా+ఉ(గ్ర, గ్రాహములము+ఐజఐ మిక్కిలి భయంకరమైన మొసళ్ళ మై; భవత్‌+ఆగమనంబు= మీ యొక్కరాకను; ప్రతీక్షించుచున్‌= ఎదురుచూస్తూ: ఈ+పంచతీర్థంబులన్‌; ఉండి; నేడు; నీ, కారణంబునన్‌; కృత+అర్భులము= తీరిన కోరిక కలవాళ్ళం; అయితిమి; అనినన్‌= అని అనగా; అర్జ్హునుండును; కరుణా+ఆయత్ర, చిత్తుండు+అయి= దయతో కూడిన మనస్సు కలవా డై) వంద, చెప్పిన, ఆ+నలువురకు; శాప, మోక్షణంబు= శాపంనుండి విడిపించటాన్ని; చేసినన్‌; అమర, కన్యకలు= దేవకన్యకలు; అతి, హర్షంబునన్‌= మిక్కిలి సంతోషంతో; అమర+ఇం(ద్ర, నందను= దేవేంద్రునికువూరు డైన అర్జునుడిని; దీవించి; దేవలోకంబునకు; అరిగిరి= వెళ్ళారు; అదిమొదలుగాన్‌; ఈ+పంచతీర్థంబులు; నారీ, తీర్థంబులునాన్‌= నారీ తీర్చా లని; పరలౌన్‌= ఒప్పిఉన్నాయి. అర్జ్హునుండును; (క్రమ్మజి= తిరిగి; మణిపూర, పురంబునకు; వచ్చి: రాజ్యలీల; సుఖంబు+ఉండి; చిత్రాంగద, అందు; బభ్రువాహనుండు+అను:; పుత్రున్‌: పడసి= పొంది: చిత్రవాహనునకు: వంశకరున్‌*కాన్‌= వంశంచేసేవాడినిగా- అంటే వంశంవృద్దిచేసేవాడినిగా; ఇచ్చి; వాని= ఆ చిత్రవాహనుడిని; వీడ్కొని; గోకర్షంబున్‌= గోకర్ణతీర్జాన్ని; చూచుచున్‌: పళ్చిమ, సముద్ర, పార్ట్వంబునన్‌= పడమటి సముద్రం ప్రక్కన; ప్రభాసంబు+అను; తీర్ణంబునకున్‌; చని= వెళ్ళి; అందులకు= అక్కడికి; ద్వారవతి, పురంబు; కుజంగలి= దగ్గర; అని; విని. తాత్పర్యం: 'అని చెప్పిన ఆ నారదునిమాటలు విని వచ్చి, మిక్కిలి భయంకర మైన మొసళ్ళ మై, మీ రాకకోసం ఎదురుచూస్తూ, నేడు నీ వలన కోరిక తీరినవాళ్ళం అయ్యాము'- అని అనగా అర్జునుడు కూడా వంద అడిగినట్టు ఆ నలుగురికి దయతో శాపవిమోచనం కావించాడు. ఆ దేవకన్యకలు ఎంతో సంతోషించి, దేవేం్యద్రతనయు డైన అర్జునుడిని ఆశీర్వదించి దేవలోకానికి వెళ్ళారు. ఆ నాటినుండి ఆ పంచ తీర్చాలకు నారీతీర్జా లనే పేరు కలిగింది. అర్జ్హునుడుకూడా మణిపూరపురానికి తిరిగి వచ్చి రాజ్యభోగా లనుభవిస్తూ చిత్రాంగదయందు బభ్రువాహను డనే కుమారుడిని పొంది, ఆ బాలుడిని చిత్రవాహనునికి వంశకరునిగా- అంటే వంశం నిలిపేవాడిగా ఇచ్చి, అక్కడినుండి బయలుదేరి గోకర్ల తీర్జాన్ని చూస్తూ పడమటి సము(ద్రం ప్రక్కన ప్రభాస తీర్థానికి వెళ్ళి, అక్కడికి ద్వారవతి దగ్గర, అని విని. విశేషం: చిత్రవాహనుడు కోరినట్టు (చూడు. 144 పద్యం) చిత్రాంగదకు పుట్టిన బభ్రువాహనుడిని (దౌహిత్రుడిని) వంశకరునిగా అర్జునుడు అతనికి ఇవ్వటం జరిగింది. సీ. 'అందుల కేండి యే నిందీవరశ్యాము । నరవిందనాభు నంబురుహనేత్రు సన్నిత్రుం జూచి నాజన్యంబు సఫలంబు | సేయుదు నఘములు వాయుపొంటిె; నదియునుంగాక, మున్‌ గదు డనువానిచే । వింటి. దిలోత్తమకంటె రూప వతియట్టై సద్గుణాన్వితయట్టె నాకట్టి । భద్రేభగమన సుభద్రం జూచు

ఆ. వేడుకయును గలదు; విష్ణుభట్టారకు ।; దయ నభిష్టసిద్ధి దనరు" ననుచు

దద్ద సంతసిల్లి తద్ద్వారకాపురి । కరుగ నిశ్హయించె నర్జునుండు. 164 'ప్రతిపదార్హం: అందులకు= ఆ ద్వారవతికి; ఏంగిఐ వెళ్ళి, ఏన్‌= నేను; ఇందీవర శ్యామున్‌= నల్లకలువవంటి నల్లనిరంగు కలవాడిని; అరవింద, నాభున్‌= పద్మాన్ని బొడ్డుగా కలవాడిని; అంబురుహ, నేత్రున్‌= పద్మాలవంటి కన్నులు కలవాడిని; సత్‌+మి(త్రున్‌= మంచిస్నేహితుడిని; చూచి; నా, జన్మంబు; సఫలంబు; చేయుచున్‌; అఘములు= పొపాలు; పాయుపొంటెన్‌= పోగొట్టుకోవటంకొరకు; ఆదియునున్‌+*కాక; మున్‌= పూర్వం; గదుండు+అనువానిచే; వింటిన్‌; (సుభద్ర) తిలోత్తమకంటె; రూపవతి, అట్టె= అంద మైన దట; సద్గుణ+అన్విత, అట్టె= మంచిగుణాలతో కూడుకొన్న దట; నాకు; అట్టి; భద్రశఇభ, గమన= మదపుటేనుగువంటి నడక కల దైన- అంటే అందమైననడకగల; సుభ(ద్రన్‌; చూచు; వేడుకయును= కుతూహలంకూడా; కలదు; విష్ణుభట్టారకు, దయన్‌= శ్రీ కృష్ణునియొక్క దయచేత; అభీష్ట సిద్ది= కోరిన కోరిక నెరవేరటం; తనరున్‌= ఒప్పును(కలుగుతుంది); అనుచున్‌; తద్ద= మిక్కిలి; సంతసిల్లి; అర్హునుండు; తత్‌+ద్వారకాపురికి= ఆ ద్వారకా నగరానికి; అరుగజ వెళ్ళటానికి; నిశ్చయించె. తాత్పర్యం: అక్కడికివెళ్ళి నల్లకలువవంటి నల్లనిశరీరం కలవాడు, పద్మాన్ని బొడ్డుగా కలవాడు, పద శ్రంవంటి కన్నులు కలవాడు నాకు మంచిస్నేహితుడు అయిన శ్రీకృషుడిని చూచి, జన్మ సఫలత పొందేటట్టు, పాపాలు పోగొట్టుకొంటా ననీ- ఇదివరకు గదుడు అనేవాడు చెప్పగా తిలోత్తమకంటె రూపవతి, సుగుణాలరాశి అని విన్న ఆ అందమైన నడక గల సుభద్రను చూచేవేడుక కూడ కల దనీ- శ్రీకృష్ణునిదయతో తన కోరికకూడా (సుభద్రను చేపట్టాలన్నకోరిక) నెరవేరుతుం దనీ- ఎంతో సంతోషించి అర్జునుడు ఆ ద్వారకానగరానికి వెళ్ళాలని నిశ్చయించాడు. విశేషం: అలం; ఉపమ. నాలుగు సీసపాదాలలో మాత్రమే (ప్రాసయతులు పాటించబడటం విశేషం. వ. మజియు నప్పురంబునం ద న్నొరు లెబుంగకుండ వలయు ననియు, యాదవులు యతుల కతిభక్తు

లనియును మనంబునం దలంచి కృతకయతివేషధరుం డయి. 165 ప్రతిపదార్థం: మజియున్‌: ఆ+పురంబునన్‌= ఆ ద్వారవతీ నగరంలో; తన్ను; ఒరులు= ఇతరులు; ఎలుంగకుండవలయున్‌:; అనియు; యాదవులు; యతులకు= సన్యాసులకు; అతిభక్తులు;: అనియును; మనంబునన్‌; తలంచి; కృతక, యతి, వేష తాత్పర్యం: అంతేకాక ఆ ద్వారవతీ నగరంలో తన్ను ఇతరులు తెలిసికొనకుండా ఉండా లని, యాదవులు సన్న్యాసులపట్ట మిక్కిలి భక్తి గలవా ళ్ళని- ఆలోచించి, కపట సన్న్యాసి వేషాన్ని ధరించి. క. పరమబ్రహ్మణ్యు జగద్గురు | గరుడధ్వజు ననంతగుణు నేకాగ్ర

స్థెరమతి యై నిజహృదయాం : తరసుస్థితుం జేసె భక్తి. దలంచుచు నుండెన్‌. 166 (ప్రతిపదార్థం: పరమబ్రహ్మణ్యున్‌= మిక్కిలిగా బ్రాహ్మణులమేలు కోరేవాడిని; జగత్‌+గురు= లోకాని కంతకూ గురు డైన వాడిని; గరుడ, ధ్వజున్‌= గరుత్మంతుడిని రధకేతనంగా కలవాడిని; అనంత, గుణున్‌= అంతులేని సుగుణాలు కలవాడిని; ఏక+అ(గ్ర, స్టిరమతి+ఐ= ఒకదాని పైనే స్థిరమైన బుద్ధికలవాడై, నిజ, హృదయ+ అంతర, సుస్థితున్‌+చేసి= తన మనస్సులో చక్కగా ఉన్నవాడినిగా చేసి; భక్తిన్‌= భక్తితో; తలంచుచున్‌; ఉండెన్‌. తాత్పర్యం: మిక్కిలిగా (బ్రాహ్మాణులమేలుకోరేవాడు, లోకాని కంతకూ గురుడైన వాడు, గరుత శ్రంతునిని ధ్వజంగా కలవాడు, అంతు లేని సుగుణాలు కలవాడు అయిన శ్రీకృష్ణుడిని ఏకా(గ్రచిత్తుడై మనస్సులో నిలిపి భక్తితో ధ్యానించాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 833

క, _ నరునునికి యెటింగి కృష్ణుడు । తిరముగ దయతో బ్రభాసతీర్ధమునకు నొ

క్కరుండ చనుదెంచె; సర్వే । శ్వరుం డెప్పుడు భక్తులకు. బ్రసన్నుండ కాయే. 167 ప్రతిపదార్థం: నరు, ఉనికి= అర్జునుడు ఉండటాన్ని; ఎజింగి= తెలిసికొని; కృష్ణుండు; తిరముగ= స్ట్రిరంగా; దయతోన్‌; ఒక్కరుండు+అ= ఒక్కడే; ప్రభాసతీర్హమునకు; చనుదెంచె= వచ్చాడు; సర్వ+ఈశ్చరుండు= సర్వమునకు ప్రభు వైన భగవంతుడు; ఎప్పుడు= ఎల్లప్పుడు; భక్తులకున్‌; ప్రసన్నుండు+అ, కాడే=ఐ అను(గ్రహించేవాడే కదా! తాత్పర్యం: అర్జును డున్నా డని తెలిసికొని దయతో శ్రీకృష్ణుడు తా నొక్కడే ప్రభాస తీర్చానికి వచ్చాడు. భగవంతుడు ఎల్లప్పుడు భక్తులకు ప్రసన్నుడే గదా! విశేషం: అలం: అర్జాంతరన్యాసం.

అర్జునుండు ద్వారకానగరంబునకు( జనుట (సం. 1-210-4)

వు ఇట్లు దనకడకు వచ్చిన యాదిదేవునకు దేవకీనందనునకు నతిసంభ్రమంబున నమస్కరించి పురందర

నందనుం డానందజలభరిత నయనుం డయి యి ట్లనియె. 168 (ప్రతిపదార్థం: ఇట్లు; తన, కడకు; వచ్చిన; ఆదిదేవునకు= శ్రీమహావిష్ణువుకు; దేవకీ, నందనునకు= దేవకీదేవియొక్క కుమారునికి- అంటే శ్రీకృష్ణునికి; అతి, సంభ్రమంబున= మిక్కిలివేగిరపాటుతో; నమస్కరించి; పురందర, నందనుండు= దేవేంద్రునికుమారుడు- అర్జునుడు; ఆనంద, జల, భరిత, నయనుండు+అయి= ఆనందబాష్పాలతో నిండిన కన్నులు కలవా డై; ఇట్టు+అనియె. తాత్పర్యం: ఈ విధంగా తన దగ్గరకు వచ్చిన శ్రీమహావిష్ణువు, దేవకీదేవి తనయుడు అయిన శ్రీకృష్ణునికి ఎంతో వేగిరపాటుతో నమస్కరించి అర్జునుడు ఆనంద బాష్పాలు నిండిన కన్నులతో ఇట్టా అన్నాడు. ఉ. ద్వాదశమాసికవ్రతము ధర్షవిధిం జలుపంగ నేంది గం

గాదిమహానదీహిమవదాదిమహాగిరిదర్శనంబు మీ

పాదపయోజదర్శనముం బన్నుగం జేయుటంేసి పూర్వసం

పాదితసర్వపాపములు. బాసె భృశంబుగ నాకు నచ్యుతా! 169 (ప్రతిపదార్థం; అచ్యుతాజ శ్రీకృష్ణా! ద్వాదశ మాసిక, వ్రతము= పం(డ్రెండు నెలల వ్రతము; ధర్మ, విధిన్‌= ధర్మపద్ధతిగా; చలుపంగన్‌= చేయటానికి; ఏంగిఐ వెళ్ళి; గంగా+ఆది, మహా, నదీ, హిమవత్‌*ఆది, మహా, గిరి, దర్శనంబు= గంగ మొద లైన మహానదులయొక్క; హిమాలయం మొదలైన మహాపర్వతాలయొక్క దర్శనం; మీ, పాద. పయోజ, దర్శనమున్‌= మీ పాదపద్మాలయొక్క దర్శనాన్ని; పన్నుగన్‌= క్రమంగా; చేయుటన్‌+చేసి= చేయటంవలన; నాకు; పూర్వ, సంపాదిత, సర్వ, పాపములు= ఇదివరకు సంపాదించుకొన్న అన్నిపాపాలు; భృశంబుగజ అధికంగా- అంటే పూర్తిగా; పాసె= తొలగిపోయాయి, తాత్సర్యం: శ్రీకృష్ణా! ద్వాదశ మాసిక (వ్రతాన్ని ధర్మపద్దతిగా ఆచరించటం కోసం వెళ్ళి గంగ మొద లైన మహానదుల దర్శనం, హిమాలయం మొద లైన మహాపర్వతాల దర్శనం, మీ పాదపద్మాల దర్శనం చేయటంవలన నాకు పూర్వ పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. విశేషం: 'ద్వాదళమాసికవ్రతము'ను గురించి పళ్ళి పూర్ణప్రజ్ఞాచార్యులు ఈవిధంగా వివరించారు. “సంస్కృతభారతమున ఫ్‌ ద్రౌపద్యా వ స్పమాసీన మన్యోన్యం యోభిదర్శయేత్‌, సనోద్వాదశవర్షాణి (బ్రహ్మచారీ వనే వసేత్‌ - ఈ విధముగా పం(డైండేళ్ళు

834 శ్రీమదాంధ్ర మహాభారతము (వ్రతము సలుపవలెనని యుండంగా నన్నయభట్టారకుండు 'ద్వాదశమాసికవ్రతము'అని సంవత్సరపదమునకు మాసమని అర్ధముచెప్పుట మీమాంసాద్యనుసారముగా నని యెటుంగునది. మీమాంసాశాస్త్రమందు సహ(్రసంవత్సరవ్రతము మనుష్యులకెట్టు సాధ్యమగునని విచారించి యొకపక్షంబున సంవత్సరశబ్దము మాసపర్యాయ మని చెప్పండడినది. దానికి (శ్రుతిప్రమాణముకలదు- 'యో మాస స్పంవత్సరః' (శ్రీమదాం(ధ్రమహాభారతము- ఆదిపర్యము-లఘుటీక). ద్వాదశమాసికవ్రతం [ప్రాయశ్చిత్తరూప మైన వ్రతం. సకల తీర్థ స్నానాలవలన పూర్వం చేసిన పాపాలు తొలగిపోతాయని సామాను లైన తైర్జికుల అభిప్రాయం. కాని, అర్జునుడు నారాయణభక్తుడు. గంగాస్నానం చేయటంవలననే కాక ఆ గంగ పుట్టినచోటైన నారాయణపాదపద్మాలను దర్శించినప్పుడే పూర్వ(జన్మ) పాపాలన్నీ పోయి నిర్వాణం సిద్దిస్తుందని అర్జునుని (ప్రొఢోక్తి. అందుకే చివరి క్షేత్రం ద్వారవతి కావటం విశేషం. ప్రౌఢోక్తిమూల మైన వస్తుధ్వని గమ్యమానం. అర్ధవ్యక్తి అనే శబ్దగుణాన్ని ఈ రచనలో సార్హకంగా ప్రయోగించాడు నన్నయ.

వ. అనిన విని వగుచు నబ్ద్బనాభుం డర్జును నతిస్నేహంబునం గౌంగిలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి, యాతనితీర్ధాభిగమననిమిత్తంబును సుభద్రయందు బద్ధానురాగుం డగుటయు నువలక్షించి, ద్వారకాపురంబునకుం దోడ్యొని యరిగి, 170

ప్రతిపదార్హం: అనిన; విని; నగుచున్‌= నవ్వుతూ; అబ్బనాభుండు= పద్మనాభు డైన శ్రీకృష్ణుడు; అర్జునున్‌; అతి, స్నేహంబున;

కౌయిలించుకొని; ఎల్లవారల, కుళలంబును= అందరి క్షేమాన్ని; అడిగి; ఆతని; తీర్ధాఅభిగమన, నిమిత్తంబును= తీర్ణయా(త్రలకు వెళ్ళటానికి కల కారణాన్ని; సుభద్ర, అందు; బద్ద+అనురాగుండు+అగుటయున్‌= తగులుకొన్న 'థేమకలవాడు కావటమూ; ఉపలక్షించి= గమనించి; ద్వారకా, నగరంబునకున్‌; తోడ్కొని; అరిగి= వెళ్ళి.

తాత్సర్యం: అర్జ్హునునిమాటలు విని శ్రీకృష్ణుడు నవ్వుతూ అతడిని గాఢంగా కౌగిలించుకొని, ఇం(ద్రప్రస్టంలో అందరి

కుశలం అడిగి, అతడు తీర్హయాత్రలు చేయటానికి గల కారణాన్నీ, సుభద్ర పై అతని కున్న అనురాగాన్నీ తెలిసికొని

ద్వారకానగరానికి పిలిచికొని వెళ్ళి.

విశేషం: ఆ జగన్నాటకసూత్రధారి శ్రీకృష్ణుని నవ్వులో, కౌగిలింతలో అర్జ్హునునిరాకవలన, అతనిభక్తి స్నేహాలవలన కలిగిన ఆనందం

ఉన్నది. సుభద్రను చేపట్టాలన్న అతని అంతర్యాన్నిగూర్చిన అవగాహనం ఉన్నది. అది సఫలం చేస్తానన్న సూచనకూడ ఉన్నది.

ఉ. బ్రాజితశాతకుంభగృ్భహపంక్తులం బుప్పితవల్లివేల్లితో ర్వీజవనావ్ఫతిన్‌ విమలవిద్రుమవజ్రినిచిత్రవేదికా రాజిం గరంబు రమ్య మగు రైవతకాచలకందరంబునన్‌ రాజకులైకసుందరు. బురందరనందను నుంచి లీలతోన్‌. 171

ప్రతిపదార్థం: (భ్రాజిత, శాతకుంభ, గృహ, పంక్తులన్‌= ప్రకాశిస్తున్న బంగారుమేడలసమూహాలచేతా; పుష్పిత, వల్లి, వేల్లిత+ఉర్వీజ, వన+ఆవృతిన్‌= పూసినతీగలచే చుట్టబడిన చెట్టు కల పెంపుడువనాలు చుట్టబడటంచేతను; విమల, విద్రుమ, వజ, విచిత్ర, వేదికా, రాజిన్‌= నిర్మలా లైన పగడాలచేతా, వజ్రాలచేతా, వింత లైన అరుగుల సమూహంచేతా; కరంబుజ మిక్కిలి; రమ్యము+అగు= అంద మైన; రైవతక+అచల, కందరంబునన్‌= రైవతక మనే పేరు కల పర్వతంయొక్కగుహలో; రాజ, కుల+ఏక, సుందరున్‌= రాజవంశాని కంతటికీ అందగా డైన వాడిని; పురందర, నందనున్‌= దేవేంద్ర తనయుడిని- అర్జునుడిని; ఉంచి; లీలతోన్‌= విలాసంతో. తాత్పర్యం: మెరుస్తున్న బంగారు మేడల సమూహాలు, పూసినతీగలు 'పెనవేసికొన్న చెట్టతో కూడిన ఉద్యానవనాలు చుట్టూ ఉండగా నిర్మలా లైన పగడాలతో, వజ్రాలతో, చిత్ర విచిత్రా లైన అరుగులతో ఎంతో అంద మైన రైవత కొద్రి గుహలో రాజ వంశాని కంతా అందగా డైన అర్జునుడిని ఉంచి- విలాసంతో.

ఆదిసర్వము - అష్టమాశ్వాసము 835 విశేషం: ఇందులో శ్లేష అనే గుణం సందర్పోచితంగా పోషింపబడింది. రమణీయ మైన అర్హఘటనతోకూడిన మసృణత్వం ఇందులో సార్దకం. రాజకులైకసుందరుడు- అన్నప్పుడు రాజంటే క్షత్రియుడు, రాజు, చంద్రు డనే అర్జాలు చెప్పుకొనవచ్చు. అంటే అర్జునుడు చంద్రునివంశంలో అందమైనవాడు, పైపెచ్చు పురందరనందనుడు. అతని యోగ్యతకు తగిన స్థలం రైవతకాద్రి. బంగారుమేడలు, తోటలు, అరుగులు మొదలైనవి రాజభోగాల చిహ్నాలు. రమణీయసన్నివేశాన్ని అక్షరరమ్యంగా, బహుపదాలు ఏకపదవద్భావం పొందినట్టుగా చేసిన రచన శేషు అది ఇందులో అనువుగా అందగించింది. (సంపా.) కు శ్రీపతి గడునెయ్యంబున । నాపోవక పార్టునొద్ద నారాత్రి ప్రియా

లాపముల. దగిలి యుండెను । దీపమణుల్‌ వెలుగ భువనదీపుండు దానున్‌. 172 ప్రతిపదార్హం: భువనదీపుండు= లోకాలను వెలిగించేవాడు; తానున్‌= తానూ; శ్రీపతి= శ్రీకృష్ణుడు; కడు= మిక్కిలి; నెయ్యంబునన్‌= స్నేహంచేత; ఆపు+ఓవక= తనివితీరక; పార్టు, ఒద్దన్‌= అర్జునునిదగ్గర; ఆ, రాత్రి; దీప, మణుల్‌= మణిదీపాలు; వెలుంగు ప్రియ+ఆలాపములన్‌= ఇష్ట మైన సంభాషణలతో; తగిలి; ఉండెను.

తాత్సర్యం: ఆ రాత్రి మణిదీపాలు వెలుగుతుండగా శ్రీకృష్ణుడు 'స్నేహాతిశయంతో తనివి తీరక అర్జునునితో ఇష్ట

మైన సంభాషణలతో గడిపాడు.

న. ఇట్లు పరమపురుషు లయిన నరనారాయణులు దమ పూర్వజన్మ సహావాసంబున య ట్లప్పుడు సరమానందంబునం బరస్పరప్రెయమధురసంభాషణంబుల నొక్కటనుండి యారాత్రి సలిపి; రంతంబ్రభాతంబ వాసుదేవుండు వాసవనందను నంద యుండం బంచి కాంచనరథారూఢుం డయి పురంబునకుం జని పారజనప్రధానసమక్షంబున రైవతకమహోత్సవంబు ఘోషింపం బంచిన, 173

ప్రతిపదార్థం: ఇట్టు;: పరమపురుషులు+అయిన; నర, నారాయణులు= అర్జునుడు, శ్రీ కృష్ణుడు; తమ, పూర్వజన్మ, సహవాసంబునజ=

తాము పూర్వజన్మలో కూడిఉండటంవలన (బదరికాశమంలో ఇద్దరూ తపస్సుచేశారు); అట్టు: అప్పుడు; పరమ+ఆనందంబునన్‌; అష ఇడ్లి ళం

పరస్పర, (ప్రియ, మధుర, సంభాషణంబులన్‌= ఒకరితో ఒకరు ఇంపైన తీయని మాటలతో; ఒక్కటన్‌+*ఉండి= ఒకటిగా ఉండి;

ఆ రాత్రి; సలిపిరి=ఐ గడిపారు. అంతన్‌= తరువాత; ప్రభాతంబు+అ= వేకువనే; వాసుదేవుండు=శ్రీకృష్ణుడు; వాసవ, నందనున్‌=

దేవేంద్రతనయుడిని- అర్జునుడిని; అందు+అ= అక్కడే; ఉండన్‌; పంచి= నియోగించి; కాంచన, రథ+ఆరూఢుండు+అయి=

బంగారు రధాన్ని ఎక్కినవా డై; పురంబునకున్‌; చని= వెళ్ళి; పౌరజన, ప్రధాన, సమక్షంబున= పురజనులయొక్క, మం(త్రులయొక్క ఎదుట; రైవతక, మహా+ఉత్సవంబు; ఘోషింపన్‌= చాటటానికి; పంచినజ ఆజాపించగా ్జా! ం తృర్వం; పరమ ష్ష

తొత్పర్యం: ఈ విధంగా పరమ పురుషు లైన అర్జునుడు, శ్రీకృష్ణుడు తాము పూర్వజన శలో నరనారాయణులుగా

బదరికాశ్రమంలో తపస్సు చేస్తూ సహవాసంచేశారు కనుక- మహానందంతో, పరస్పరం ఇంపైన తీయని మాటలతో

ఆఅ రాత్రి గడిపారు. వేకువనే శ్రీకృష్ణుడు అర్జునుడిని అక్కడే ఉండవలసిం దని చెప్పి, తాను బంగారు రథం ఎక్కి ద్వారకాపురానికి వెళ్ళి, పుఠరజనుల, మంత్రుల సమక్షంలో రైవతక మహోత్సవాన్ని చాటించటానికి ఆజ్ఞాపించాడు.

చ. పొలపుగంబూసి కట్టి తొడిభూరివిభూతిప్రకాశితంబుగాం గలయః/గ6 దత్పురీజనులు కాంస్యమృదంగముకుందవేణుకా హలపటహధ్వనుల్‌ చెలంగ నాటలు. బాటలు నొప్పి నెల్లవా రలు6 జని చేసి రర్జనలు రైవతకాద్రికి నుతృవంబుతోన్‌. [74

836 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: తత్‌+పురీ, జనులు= ఆ ద్వ్యారకానగర (ప్రజలు; ఎల్లవారలున్‌= అందరూ; పాలుపుగన్‌= అందంగా; పూసి= మైపూతలు పూసుకొని; కట్టి= వ(స్త్రాలు కట్టి; తాడి= సొమ్ములు ధరించి; భూరి, విభూతి= గొప్పసంపద; ప్రకాశితంబు, కాన్‌= ప్రకటమయ్యేటట్టుగా' కలయంగన్‌= కూడగా; కాంస్య, మృదంగ, ముకుంద, వేణు, కాహళ, పటహ, ధ్వనుల్‌= కంచుతాళాలయొక్క, మృదంగాలయొక్క, ముకుంద వాద్య విశేషాలయొక్క, పిల్లన([గ్రోవులయొక్క, కాహళవాద్యాలయొక్క, తప్పెటలయొక్కశబ్దాలు; చెలంగన్‌= వ్యాపించగా; ఆటలున్‌, పాటలున్‌; ఒప్ప; రైవతక+అద్రికిన్‌; ఉత్సవంబుతోన్‌; చని= వెళ్ళి; అర్భనలు= పూజలు: చేసిరి. చాత్సర్యం: ఆ ద్వారకానగర ప్రజ లంతా- అందంగా, మైపూతలు పూసికొని, మంచివ(స్తాలు కట్టుకొని, సొమ్ములు అలంకరించుకొని ఐశ్వర్యమంతా (ప్రకటమయ్యేటట్టు కలిసి బయలుదేరారు. వివిధ వాద్యాల ధ్వనులు చెలరేగగా ఆటలతో పాటలతో రైవతకా!ద్రికి ఊరేగింపుగా వెళ్ళి అక్కడ పూజలు చేశారు. విశేషం: అలం: స్వభావోక్తి పృధక్‌పదత్వంతోకూడిన మాధుర్యగుణం జనుల హృదయోల్హాసాన్ని ధ్వనింపచేస్తున్నది. చ. గురు కుచ యుగ్మముల్‌ గదలం గ్రొమ్ముడులందుల పుష్పముల్‌ పయిం

దొరంగ నిదాఘబందువితతుల్‌ చెదరన్‌ మదిరామదంబునన్‌

బరవశ లయ్యు నింపెసంగం బాడుచు. దాళను గూడ మెట్టుచుం

దరుణియ లొప్ప నాడిరి ముదంబునం దమ్ము జనాలి మెచ్చంగన్‌. 175 ప్రతిపదార్థం: తరుణియలు= యౌవనవతులు; జన+ఆలి= జనసమూహం; ముదంబునన్‌= సంతోషంతో; మెచ్చంగన్‌= మెచ్చుకోగా; గురు, కుచ, యుగ్మముల్‌= 'పెద్దపాలిండ్లజంటలు; కదలన్‌; (క్రాత్తణముడులందుల; పుష్పముల్‌; పయిన్‌+తొరంగజ మీదికి జారగా; నిదాఘబిందు, వితతుల్‌= చెమట బిందువుల సమూహాలు; చెదరన్‌; మదిరా, మదంబునన్‌= మద్యం త్రాగటంవలన కలిగిన మదంచేత; పరవశలు+అయ్యున్‌= 'మైమరచినవా ళ్ళయి కూడా: ఇంపు+ఎసంగన్‌=ఐ ఆనందం అధికం అయ్యేటట్టు" పాడుచు" తాళము కూడ, మెట్టుచున్‌= తాళానికి తగినట్టు అడుగులు వేస్తూ: ఒప్పన్‌; ఆడిరి=ఐ నాట్యం చేశారు. తాత్పర్యం: యౌవనంలో ఉన్న ఆడవాళ్ళు, జనసమూహం సంతోషంతో తమను చూచి మెచ్చగా- పెద్ద చన్నుల జంటలు కదలగా, (క్రొత్తగా ముడిచిన కొప్పులలోని పూలు మీదికి జారగా, చెమటబిందువులు చెదరగా, మద్యపాన మదంచేత మైమరిచినా ఇంపార పాడుతూ, తాళానికి సరిగా అడుగులు వేస్తూ నాట్యం చేశారు. విశేషం: అలం: స్వభావోక్తి. రచనలో ఉదారత అనే గుణం పోషింపబడటంవలన ఈ పద్యం రసవత్తరంగా ఉన్నది. మదిరాపానంచేత పరవళలై ఉన్నా, కొప్పు లూడేటట్టు, కుచాలు కదిలేటట్టు, చెమటబిందువులు చిందేటట్టు నాట్యంచేస్తున్నా తాళం తప్పకుండా ఆడుతూ, శ్రుతులు తప్పకుండా పాడుతున్న తరుణుల నాట్యం అగ్రామ్యత్వానికీ, నృత్యత్పదవద్భావానికీ (వికటత్వం) రూపుకట్టటంతో 'ఉదారత' రక్తికట్టింది. (గ్రామ్యత్వం ప్రదర్శించబడవలసినచోట మదిరాపానమత్త లైన యువతులు అ(గ్రామ్యత్యాన్ని సందర్భోచితంగా నాట్యంలో (ప్రదర్శించే ఈ సన్నివేశవర్ల్షనం ఉదారతకు ఉత్తమోదాహరణం. (సంపా) సీ. సారణ సత్య కాక్రూర విదూరథ । సాంబ సంకర్షణ శంబరారి

భాను సుషే ణోగ్రసేన శైనే యాని । రుద్ధ హార్దిక్య గ దోద్ధవాది

యాదవు లధికప్రమోదు లై యొక్కటం । దరుణులు. దారును గరికరేణు

హయశిబికారూఢు లయి తదుత్సవమున । కరిగిరి; మజి జగద్దురుండు గృష్టుం ఆ. డింద్రలీలతో నుపేంద్రుండు రుక్మిణీ । దేవి మొదలుగాంగ దేవు లెల్ల

నొప్పుతోడ రాంగ నప్పర్వతమునకు. ; జనియె సకలజనులు6 దనకు నెరంగ. 176

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 837

(ప్రతిపదార్థం: సారణ, సత్యక+అట్రూర, విదూరధ, సాంబ, సంకర్షణ, శంబర+అరి, భాను, సుషేణ, ఉగ్రసేన, శైనేయ, అనిరుద్ధ, హార్దిక, గద, ఉద్ధవ, ఆది= మొదలైన; యాదవులు; అధిక, ('ప్రమోదులు+ఐ= మిక్కిలి ఆనందించినవా ళ్ళయి; ఒక్కటన్‌= ఒకటిగా; తరుణులు= భార్యలు; తారును= తామూ; కరి, కరేణు, హయ, శిబికా+ఆరూఢులు+అయి= ఏనుగులను, ఆడయేనుగులను; గు(ర్రాలను, పల్లకీలను ఎక్కినవా ళ్ళయి; తత్‌+ఉత్సవములకు= ఆ రైవతకాద్రి మహోత్సవానికి; అరిగిరి= వెళ్ళారు; మటి; జగత్‌+గురుండు= లోకానికంతటికి గురు డైన వాడు- కృష్ణుడు; ఇంద్ర, లీలతోన్‌= దేవేంద్రుని (వంటి వైభవంతో; ఉపేంద్రుండు= శ్రీకృష్ణుడు; రుక్మిణీదేవి; మొదలుగాగ= మొద లైన; దేవులు+ఎల్లన్‌= భార్యలంతా; ఒప్పుతోడవ అందంగా; రాగన్‌= వెంటరాగా; సకల, జనులు; తనకున్‌= శ్రీకృష్ణునికి; ఎరంగ= నమస్కరించగా; ఆ+పర్వతమునకున్‌= ఆ రైవతకపర్వతానికి; చనియె= వెళ్ళాడు. తాత్పర్యం: సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, ఉ(గ్రసేనుడు, గదుడు, ఉద్ధవుడు మొద లైన యాదవులంతా మహానందంగా భార్యలతో కూడి- ఏనుగులను, ఆడ ఏనుగులను, గుర్రాలను, పల్లకీలను అధిరోహించి ఆ ఉత్సవానికి వెళ్ళారు. జగద్గురు డైన శ్రీకృష్ణుడు కూడ రుక్మిణి మొద లైన భార్యలంతా వెంట రాగా, జనులంతా తనకు నమస్కరించగా దేవేంద్ర వైభవంతో ఆ రైవతకాద్రికి వెళ్ళాడు. వ. ఇట్లరిగి జనార్దనుండు ధనంజయుం దలంచి, తత్సమీపగతుం డై తోడ్కొని, యాతనికి న ప్పర్వత రమణీయ

ప్రదేశంబులం జూపుచు విహరించి, యిద్ధజు నొక్కనవిమలమణివేదికయం దభిమతసంభాషణంబుల నుండు

నంత. 177 ప్రతిపదార్హం: ఇట్టు+అరిగి= ఈ విధంగా వెళ్ళి జనార్హనుండు= శ్రీకృష్ణుడు; ధనంజయున్‌= అర్జునుడిని; తలంచి; తత్‌+సమీప, గతుండు+ఐ= అతనిదగ్గరకు వెళ్ళిన వా డై తోడ్కొని= అతనిని వెంటతీసికొని; ఆతనికిన్‌: ఆ+పర్వత, రమణీయ, ప్రదేశంబులన్‌= ఆపర్వతమందలి అంద మైన చోట్లను; చూపుచు; విహరించి; ఇద్దజున్‌; ఒక్క; విమల, మణి, వేదిక అందు= నిర్మలము లైన మణులతో నిర్మించిన అరుగు మీద; అభిమత, సంభాషణంబులన్‌= ఇష్టము లైన సంభాషణలలో; ఉండు, ఆంత= ఉండగా. తాత్పర్యం: ఈ విధంగా వెళ్ళి శ్రీకృష్ణుడు అర్జునునిగూర్చి ఆలోచించి, ఆతనిదగ్గరకు వెళ్ళి, అతడిని వెంటబెట్టుకొని, ఆ పర్వతమందలి అందమైన ప్రదేశాలను చూపుతూ విహరించాడు. తరువాత ఇద్దరూ నిర్మల మణులతో నిర్మిత మైన ఒక అరుగుమీద కూర్చుండి ఇష్టాగోష్టి సలుపుతుండగా. చ. క్వణదణుకింకిణీకలితకాంచనకాంచికలాపమున్‌ రణ

నృణికలనూపురంబులు సమధ్వని నొప్ప(గ భక్తిం బాదచా

రిణి యయి కన్యకాజనపరీత సుభద్ర తదద్రిపూజన

జం, ద

ప్రణతులు సేసె నింద్రసుతుం బార్జు నిజేశ్వరు(గాం దలంచుచున్‌. 178 (ప్రతిపదార్థం: కృణత్‌+అణు, కింకిణీ, కలిత, కాంచన, కాంచి, కలాపమున్‌= మైయుచున్న చిరుగజ్జెలతో కూడిన బంగారుమొలనూళ్ళ సమూహాన్ని; రణత్‌+మణి, కల, నూపురంబులు= ధ్వనిస్తూ మణులచే మనోహరా లైన అందెలూ; సమ, ధ్వనిన్‌; ఒప్పంగ; భక్తిన్‌= భక్తితో; పాదచారిణి, అయి= కాలినడకన వెళ్ళిన దై; కన్యకా జన పరీత= పెళ్ళికాని ఆడపిల్లలతో చుట్టబడిన దైన; సుభద్ర; ఇంద్ర సుతున్‌= దేవేంద్రునియొక్క కుమారుడిని; పార్టున్‌= పృధ (కుంతీదేవి)పుత్రు డైన అర్జునుడిని; నిజ+ఈశ్వరున్‌+కాన్‌= తనభర్త అయ్యేటట్లు తలంచుచున్‌; తత్‌+ళద్రి పూజన, ప్రణతులు= ఆ రైవతకపర్వతాన్ని పూజించటాన్ని (మొక్కటాన్ని; చేసె. తొత్సర్యం: (మోగుతున్న చిరుగజ్టెలతో కూడిన బంగారు మొలనూళ్ళ సమూహం, మణులచేత మనోహరా లై (మోగుతున్న అందెలు సమాన ధ్వనితో ఒప్పుతుండగా, కన్యకాజనం తనచుట్టూ రాగా, సుభద్ర అర్జునుడిని భర్తగా తన మనస్సులో తలచి భక్తితో కాలినడకన తిరిగి ఆరైవతకాద్రికి పూజలూ, నమస్కారాలూ చేసింది.

938 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషణ: నన్నయ అక్షరరమ్యతకు ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణం. అర్జునునిమనస్సును ఆకర్షించి అతనిలోఅనురాగాన్ని పెంచిన సుభద్ర కాంచీ కలాప కింకిణీ ధ్వనులు, మణి నూపుర ధ్వనులు- పదాల కూర్పులో '“ణ కార పునరావృత్తిలో చక్కగా ధ్వనిస్తున్నాయి. ఈ పద్యంలో సమాధి అనే గుణం సమగ్రంగా పోషింపబడింది. సుభద్ర తన మొలను గల గజ్జెలూ కాలిఅందెలూ సమంగా మైోగుతూ ఉండగా నడచివచ్చి అర్జునుడు తనకు భర్త కావాలని గాఢంగా భావిస్తూ (సమాధి) రైవతకాద్రిని పూజించి నమస్కరించింది. పద్యంకూడా సుభద్రవలెనే నడిచింది. మొదటి రెండుచరణాల్లో నాయిక నడక సాబగు. ఆ తరువాత ఆగి పూజించి నమస్కరించిన విశ్రాంతి సౌందర్యం పద్యగతిలో అవరోహ(క్రమంలో చిత్రించటం గమనార్హం. దానివలన నాయిక మనోభీష్టంలో(త్వరగా అర్జునుడు భర్తకావాలన్న తీవ్రమైన ఆకాంక్ష) అర్ధదర్శనం కావటం గమనిస్తే నన్నయగారి సమాధిగుణపద్యరచనకు ఈ పద్యం సార్ధకోదాహరణం. (సంపా

ఉ. దాని సుభద్రగా నెటింగి తత్‌క్షణజాతమనోజసంచల న్మానసు డైన యవ్విజయు మానుగ జూచి 'మునీంద్ర! నీకు జ న్నే నలినాక్షులందు మది నిల్చంగ నంచును మందహాసగ ర్థాననుం డై రధాంగధరు. డాతని కి ట్లనియెం బ్రియంబునన్‌. 179

ప్రతిపదార్థం: దాని; సుభద్రన్‌+కాన్‌; ఎతింి; తత్‌+క్షణ, జాత, మనోజ, సంచలత్‌+మానసుండు+ఐన= ఆ క్షణంలో పుట్టిన మన్మధునిచే చలింపచేయబడిన మనస్సుకలవా డైన; ఆ+విజయు= ఆ అర్జునుణ్ణి; మానుగన్‌= మనోహరంగా, చూచి" ముని+ఇం(ద్రజ ముని'శ్రేష్టా!; నలిన+అక్షుల+అందు= పద్మాలవంటి కన్నులుకలవా రైన స్త్రీలపై; మది= మనస్సును; నిల్పంగ; నీకున్‌” చన్నే= తగునా; అంచునుజ అని అంటూ; రధ+అంగ, ధరుండు= చ'క్రాన్నిధరించేవాడు- శ్రీకృష్ణుడు; మందహాస గర్భ+ఆననుండుశఐవ= చిరునవ్వు నిండిన ముఖం కలవా డై: ఆతనికి=ఐ అర్జునునికి; ప్రియంబునన్‌= ప్రీతిగా; ఇట్టు+అనియెన్‌. చాత్సర్యం: ఆమె సుభ(ద్ర అని తెలిసికొని, ఆ క్షణమే పుట్టిన మన్మధునిచే చలింపచేయబడిన మనస్సు కలవా డైన ఆ విజయుడిని, శ్రీకృష్ణుడు మనోహరంగా చూచి, 'మునీంద్రా! స్త్రీల మీద మనసు నిలపటం నీకు తగునా? అని చిరునవ్వు నిండిన ముఖంతో అతనితో ప్రియమార ఇలా అన్నాడు. విశేషం: ఈసందర్భంలో శ్రీకృష్ణునిసరసపుచూపులో మాటలో, చిరునవ్వులో ఎంతో ఆనందం ఉన్నది; కొంత కొంటెతనం కూడ ఉన్నది. మునివేషంలో ఉన్న అర్జునుడు సుభద్రను చూచినంతనే మన్మధావేశాన్ని 'ప్రదర్శించబోవటం సందర్భొచిత్యం కాదు, పాత్రాచిత్యంకూడా కాదు. పైపెచ్చు జగద్దురువైన శ్రీకృష్ణుడి సన్నిధానంలో ఆవిధంగా బైటపడటం అనుదాత్తం దానిని తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడిని పరుషంగా మందలించవలసిన తరుణ మది కాని, అతనిపై గల అపారమైన అనురాగంవలన నవ్వుతూ వ్యంగ్యంగా హెచ్చరించాడు. అంటే పరుషార్థప్రకటనం చేయవలసినచోట అపారుష్యాన్ని ప్రదర్శించా డన్నమాట. ఇదే సౌకుమార్య మనే గుణం. సౌకుమార్యం శ్రీకృష్ణుడి వాక్కులో అజరరత్వంగా, ఆసక్తికరంగా అనుసంధింపబడింది. (సంపా.)

వ. నీవు సుభద్రయందు బద్ధానురాగుండ వగుట తొల్లియు నే నెలుంగుదు; నోడకుండుము; నీ కోర్క్మి వసుదేవ దేవకీ దేవులకుం జెప్పి సఫలంబు సేయుదు' నని యర్హునునకు హృాదయానందంబుగాం బలికి, యప్పుడ వడిగల చారుల రావించి ద్వారవతియం దర్హునుం దున్న వా డనుకుశలవార్త ధర్మజున కెజింగింప నింద్రప్రస్థ పురంబునకురి బుచ్చియున్నంత; నచ్చటికి వచ్చి బలదేవాది యాదవు లతిభక్తులై యతియకా వగచియర్జునునకు నమస్కరించి యాతనివలన సర్వతీర్థంబులు. దత్సవాఫలంబులును విని సంతసిల్లి యి వ్వర్వాకాలంబు మాయంద యుండి చాతుర్మాస్యంబు సేసి మమ్ముం గృతార్భులం జేయుం డని ప్రార్థించి పార్థుం దోడ్మ్కొని చని, వానికి నన్నపానాది విధులం బరిచరింప సుభద్రం బంచి, కన్యాపురంబునందు నివాసంబు సేసిన. 180

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 839 ప్రతిపదార్హం: నీవు; సుభద్ర, అందు; బద్ధ+అనురాగుండవు= కట్టివయబడిన (ప్రేమకలవాడవు- అంటే సుభద్రను (ప్రేమించినవాడవు; అగుట; తొల్లియు= ఇదివరకుకూడా; నేను; ఎజుంగుదున్‌; ఓడక+ఉండుము= భయపడకుము; నీ, కోర్కి; వసుదేవ, దేవకీదేవులకున్‌= వసుదేవునికి, దేవకీదేవికి; చెప్పి; సఫలంబు; చేయుదును+అని; అర్జునునకు; హృదయ+ఆనందంబుకాన్‌= మనస్సుకు సంతోషం కలిగేటట్టుగా; పలికి; అప్పుడు+అ= అప్పటికప్పుడే; వడిగల= వేగంగల; చారుల= వేగులవారిని? రావించి; ద్వారవతి, అందు; అర్జ్హునుండు+ఉన్నవాడు; అను; కుశలవార్తః ధర్మజునకు; ఎరింగింపన్‌= తెలపటానికి; ఇం[ద్రప్రస్థ్ర, పురంబునకు; పుచ్చి= పంపి; ఉన్న+అంతన్‌; బలదేవ+అఆది, యాదవులు= బలరాముడు మొద లైన యాదవులు; అచ్చటికి; వచ్చి; అతి, భక్తులు+ఐ= మిక్కిలిభక్తికలవా ళృయి; యతియ, కా, వగచి= ముని అని తలచి; అర్హునునకు; వమస్కరించి; ఆతనివలన; సర్వ, తీర్థంబులున్‌= అన్నిపుణ్యతీర్జాలు; తత్‌+సేవా, ఫలంబులునుజ వాటిని సేవించటంవలన కలిగే ఫలాలు; విని; సంతసిల్లి; ఈ+వర్జాకాలంబు; మా, అంద, ఉండి= మాదగ్గరే ఉండి: చాతుర్మాస్యంబు= యతులు నాలుగు నెలలు చేసే వ్రతాన్ని; చేసి; మమ్మున్‌? కృత+అర్జులన్‌= నెరవేరిన కోరిక కలవాళ్ళనుగా; చేయుండు+అని; ప్రార్ధించి; పార్టున్‌= అర్జునుని; తోడ్కొని= వెంటతీసుకొని; చని= వెళ్ళి; వానికిన్‌; అన్న, పాన+ఆది, విధులన్‌= అన్నం, పానం మొదలైనవాటి ఏర్పాట్లలో; పరిచరింప= సేవ చేయటానికి; సుభద్రన్‌; పంచి= నియమించి; కన్నా, పురము, అందు= కన్యలయొక్క అంతఃపురంలో; నివాసంబు= ఉనికి; చేసినః= ఏర్పాటుచేయగా. చాత్సర్యం: 'నీకు సుభద్రమీద అనురాగం ఉన్నసంగతి నాకు ఇదివరకే తెలుసు. భయపడకుము. నీ కోర్కె వసుదేవునికి, దేవకీదేవికి చెప్పి సఫలం చేస్తాను అని అర్జునునిమనస్సుకు ఆనందం కలిగేటట్టుగా పలికాడు. అప్పటి కప్పుడే వడి గల వేగులవాళ్ళను పిలిచి ద్వారవతిలో అర్జునుడు ఉన్నా డన్న కుళలవార్తను ధర్మరాజుకు తెలియజేయటానికి ఇంద్రప్రస్థపురానికి పంపాడు. కృష్ణుడు అక్కడ ఉండగానే బలరాముడు మొద లైన

యాదవులంతా అక్కడికి వచ్చారు. అతిభక్తు లై అర్జునుడిని యతిగా భావించి, ఆయనకు నమస్కరించారు. ఆయనవలన పుణ్యతీర్థవిశేషాలు, వాటిని సేవించటంవలన కలిగే ఫలాలు విని సంతోషించి, -ఈవర్షాకాలంలో ఇక్కడే ఉండి చాతుర్మాస్యవ్రతం జరిపి మమ్ములను కృతార్ణులను చేయండి' అని ప్రార్ధించి, అర్జునుడిని తోడ్కొని వెళ్ళి, ఆయనను అన్నపానాదులలో సేవ చేయటానికి సుభద్రను నియోగించి, కన్యాంతఃపురంలోనే ఆయన ఉండటానికి ఏర్పాటు చేయగా. విశేషం: చాతుర్మాస్యం- ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధం మొదలు కార్తీక శుద్ధం వరకు నాలుగు నెలలు చేసే వ్రతం. ఈ వర్షాకాలంలో యతులు తీర్థయాత్రలు సాగించకుండా ఒక్కచోటనే ఉండి ఈ వ్రతం ఆచరిస్తారు. అర్జునుండు యతిరూపంబున కన్యాపురంబున నుండుట (సం- అను 1-114-64 పంక్తి

క, అందు ధృతిమందరుండు పు; రందర నందనుండు దనకు రమణి గుణశీ

సుందరి సుభద్ర నెయ్యం । బొంద(గం బరిచర్య సేయుచుండంగ నుందెన్‌. 181 ప్రతిపదార్థం: అందు= ఆ కన్యాంతఃపురంలో; ధృతి, మందరుండు= ధైర్యంలో మందరపర్వతంవంటివాడు: పురందర, నందనుండు= చేనేంద్రునికుమారు డైన అర్జునుడు; తనకు; రమణి= అందమైనది; గుణశ్రీ, సుందరి= సుగుణాల సంపదచేత మనోహర మైనది; సుభ(ద్ర; నెయ్యంబు+ఒందంగన్‌= (ప్రేమతో; పరిచర్య= సేవ; చేయుచు+ఉండంగన్‌; ఉండెన్‌: తాత్పర్యం: ధైర్యంలో మందర పర్వతం వంటి వా డైన అర్జునుడు- రూపవతి, గుణవతి అయిన సుభద్ర తనకు సేవచేస్తూ ఉండగా ఆ కన్యాంతఃపురంలో ఉన్నాడు. కు ధీరుండయ యతి రూపంబున । నార(గ నిందున్నయాతం డర్జునుం డని స

త్యారుక్షిణులకు జెప్పె ము । రారాతి రహస్యమున ననంత ప్రీతిన్‌, 182

940 శ్రీమదాంధ్ర ముహాభారతము ప్రతిపదార్థం: ముర+అరాతి= మురుడు అనే రాక్షసునికి శత్రు వైనవాడు- శ్రీకృష్ణుడు; అనంత, ప్రీతిన్‌= మిక్కిలిసంతోషంతో; సత్యా రుక్మిణులకున్‌= సత్యభామకు, రుక్కిణీదేవికి; ధీరుండు= ధైర్యవంతుడు; యతి, రూపంబునన్‌; ఆరంగన్‌= ఒప్పుగా" ఇందు+ఉన్ను ఆతండు, అర్జునుండు; అని; రహస్యమునన్‌; చెప్పె. తాత్పర్యం: శ్రీకృష్ణుడు మహాసంతోషంతో- “ఇక్కడ యతివేషంలో ఉన్న ధీరుడు అర్జునుడు" అని సత్యభామకు, రుక్మిణీదేవికి రహస్యంగా చెప్పాడు. చ. అలయక నాయడు నాటికి లతాంగి యపూర్వము లైన భోజనం బులు గడుభక్తిం బెట్టుచు, నపూర్వము లైన వపుర్విలాసయు క్తులు వెలయించుచున్‌, ముదముతో. బెనిచెన్‌ మజి నాండునాంటి క గల ముగుచుండ నెయ్యమును గామవికారము సవ్యసాచికిన్‌. 183 ౧ ప్రతిపదార్థం: లతా+అంగి=ఐ లతవంటి సుకుమార మైన శరీరంకలది- సుభద్ర; అలయక= విసుగులేకుండా; నాండు, నాంటికి= ఛా ఏరోజు కారోజా; అపూర్వములు+ఐన= ముందులేని వైన- అంటే (క్రొత్త వైన; భోజనంబులు; కడు, భక్తిన్‌= మిక్కిలిభక్తితో; పెట్టుచున్‌* అపూర్వములు+ఐనవ్న సరిక్రొత్త వైన; వపుః+శవిలాస, యుక్తులు= శరీర విలాసాల కూడికలు- అంటే అందాల హొయలు; వెలయించుచున్‌= (ప్రకటిస్తూ మజథి; సవ్యసాచికిన్‌= అర్జునునికి; నెయ్యమును= "స్నేహాన్ని; కామ, వికారము= శృంగారభావాన్నీ; నాయడు, నాంటికిన్‌= నానాటికి; అగ్గలము+అగుచుండన్‌= ఎక్కు వగుచుండగా; ముదముతోన్‌= సంతోషంతో; పెనిచెన్‌= పెంచింది. తాత్సర్యం: సుందరాంగి సుభద్ర విసుగులేకుండా ఏరోజు కారోజు సరి(క్రొత్తభోజనాలు భక్తితో పెట్టుతూ, తన శరీరంలో సరిక్రాత్తఅందాలు ప్రదర్శిస్తూ ఏరోజు కారోజు అర్జునునిలో స్నేహాన్నీ, శృంగార భావాన్నీ పెంచింది. విశేషం: సుభద్ర సహజ తనూవిలాసాలను (ప్రదర్శిస్తూ మునిసేవ చేస్తున్నది. ప్రతిదిన (ప్రవర్హమాన మౌతున్న ఆమె యౌవనం రోజురోజుకూ అర్జునునికి ఆసక్తిని పెంచుతున్నది. ఇది మధురమైన సన్నివేశం, మధురభావము(ద్రితం. అందువలననే నన్నయ మాధుర్య మనే గుణాన్ని పద్యరచనలో ప్రపంచించి ్రాఢిని ప్రదర్శించాడు. ఈ మాధుర్యాన్నే రాబోయే రెండుపద్యాలలో వరుసగా పోషించటం శిల్పం. (సంపా) వ. మజియును, 184 తాత్సర్యం: అంతేకాకుండా. సీ. అలినీలకుంతలుం డనియును హరినీల ।; సమవర్గుం డనియు నాజానులంబి తాయతస్థిరబాహు6 డనియును రక్తాంత ।; నలినదళాకారనయను. డనియు నుత్తుంగఘనవిశాలోరస్కు! డనియును । గవ్వడి యనియును గరము వేడ్క వివ్వచ్చు నెప్పుడు వినియెడునది; దన । వినినట్ల యతిః జూచి, 'వీయ విజయు! ఆ. డొక్కొ' యనుచు సంశయోపేతచిత్త యై ; యుండి యుండ నోప కొక్కనాండు భోజనానసానమున నున్న యమ్ముని । కిందువదన ప్రీతి నిట్టు లనియె. 185 ప్రతిపదార్ధం: అలి, నీల, కుంతలుండు+అనియును= తుమ్మెదవలె నల్లనివెండ్రుకలు కలవా డని; హరినీల,సమ వర్షుండు+అనియున్‌= వన ఇం(ద్రనీలమణితో సమాన మైన రంగుకలవా డని; ఆజాను లంబిత+ఆయత, స్థిర, బాహుండు+అనియును= మోకాళ్ళ దాకా వేలాడుతున్న పొడ వైన, బల మైన బాహువులు కలవా డని; రక్త+అంత, నలిన, దళ+ ఆకార, నయనుండు+అనియున్‌= ఎ(ర్రనికొలకులు

ఆదిపర్వము - అష్టమూశ్వాసము 8క1 కలిగి తామరరేకులవంటి ఆకారం గల కన్నులు కలవా డని; ఉత్తుంగ, ఘన, విశాల+ఉరస్కుడు+అనియును= మిక్కిలి ఎత్తై, కరినం, విశాల మైన వక్షస్థలం కల వా డని; కవ+వడి= రెండుచేతుల వడిగలవాడు; అనియును; కరము, వేడృ= మిక్కిలి కుతూహలంతో; వివ్వచ్చున్‌= అర్జునునినిగూర్చి; ఎప్పుడు; వినియెడు, అది= వినునట్టి సుభద్ర; తన, వినిన+అఆట్ల= తాను విన్నవిధంగానే; యతిన్‌; చూచి; వీడు; విజయుండు+ఒక్కొ, అనుచు అర్జ్హునుడో ఏమో అని; సంశయ+ఉపేత, చిత్త+ఐ= అనుమానంతో కూడుకొన్న మనసు కల దై; ఉండి; ఉండన్‌+ఓపక= ఉండలేక; ఒక్కనాండు; భోజన+అవసానమునన్‌= భోజనం చివర; ఉన్న: ఆ+మునికి; ఇందు, వదన= చంద్రబింబంవంటి ముఖం కలది- సుభద్ర; ద్రీతిన్‌= (ప్రేమతో: ఇట్టుల+అనియె. తాత్పర్యం: తుమ్మెదవలె నల్లని జుట్టు కల వా డని; ఇంద్రనీలపు రంగు వా డని, మోకాలివరకు (వ్రేలాడే పాడ వైన, బల మైన బాహువులు కల వాడని, ఎ(్రని కొలకులతో తామరరేకులవంటి కళ్ళు కల వా డని, ఎంతోఎత్తె కఠినం, విశాలం అయిన వక్షస్థలం కల వా డని, రెండుచేతుల వడి కల వాడని- మిక్కిలి కుతూహలంతో అర్జునునిగూర్చి ఎప్పుడూ వినే సుభద్ర, తాను విన్నవిధంగానే ఆ యతిని చూచి, ఇతడు విజయుడో ఏమో అని అనుమానించి, ఉండలేక ఒకనాడు భోజనం చివర ఆ మునితో ప్రియమార ఇట్లా అన్నది. విశేషం: అలం: ఉసమ, సందేహం, రసానుకూలంగా అలంకారాన్ని ధ్వనిమయంగా నిర్వహించాడు నన్నయ. విశేషం ఏమంటే ఉపమాలంకారంతో మొదలై అది మధ్యలో వదలిపెట్టబడి సందేహాలంకారంతో పద్యాన్ని ముగించటం ఇందులోని శిల్పం. అర్జునుని పోలికలు యతిలో కనపడుతున్నాయి. అతడే అర్జును డేమో అని మనస్సు సంశయిస్తున్నది. కాని, నిశ్చయంగా తెలియకపోయినప్పుడు ఆ భావంలో రమించటం ఉచితం కాదు. రతిభావపోషణ కనువైన విభావస్ఫూర్తి యతిరూపంలో కనపడుతున్నా బింబమని (భ్రమించి ప్రతిబింబాన్ని రమిస్తే రసభంగ మౌతుందన్న సందేహంతో ఆమె సముచితంగా ఆగినట్టు వర్షించటం రసధ్వనిశిల్పం. సుభద్రాహృదయగత మధుర భావాన్ని మాధుర్య గుణ ముద్రిత మైన పద్యరచనలో ప్రదర్శించటం నన్నయ రసవద్దుణపోషణకు నిదర్భనం. (సంపా,) వ. మునీంద్రా! నీ యాడని తీర్ధంబులుం జూడని వురంబులు నెలుంగని రాజ కులంబును లే వని విచారింతు. 186 ప్రతిపదార్థం: ముని+ఇంద్రా= ముని్రేష్టా!; నీ, ఆడని= నీ యొక్కస్నానం చేయని- అనగా నీవు స్నానమాడని; తీర్థంబులున్‌; చూడని; పురంబులున్‌; ఎజుంగని; రాజకులంబును; లేవు+అని; విచారింతు= అనుకొంటాను. తాత్పర్యం: మునివరా! నీవు స్నానం చేయని పుణ్యతీర్జాలూ, చూడని పట్టణాలూ, తెలియని రాజవంశాలూ లేవని అనుకొంటాను. ( సీ, 'అమరావతికి నెనయనఃగ నివ్వసుమతిం, బరంగు నింద్రప్రస్థపురవరంబు చూచితిరే? పాండుసుతు లందు సుఖ మున్న । వార మాయత్త యంభోరుహాక్షి కుంతీమహాదేవి కుశలయే? యమ్మహా । వీరు6 డర్హునుండు జితారి త్‌ర్థ గమనోత్సుకుం డయ్యెం గ్రన్మథి వచ్చెనే? ; యెబుంగుదురేని నా కెలుంగం జెప్పుం ఆ. _డనిన నేన చూవె యయ్యర్జునుండ; నీ । యొద్ద నివ్వధమున నున్నవాండ6 దరుణి! నీకు నాకు ధరణీధరుం డను । జలజభవుండు సేసె సంగమంబు. 187 ప్రతిపదార్థం: అమరావతికిన్‌= (దేవేంద్రుడిరాజధాని) అమరావతీనగరానికి; ఎన= సాటి; అనంగన్‌: ఈ+వసుమతిన్‌= ఈ భూమిమీద; పరంగు= ఒప్పు; ఇంద్రప్రస్థ, పుర, వరంబు= ఇంద్రప్రస్థం అనేపేరు గల పురశ్రేష్టాన్ని- అంటే గొప్ప దైన ఇం(ద్రప్రస్తపురాన్ని; చూచితిరే; పాండు సుతులు” అందు; సుఖము+ఉన్నవారె= సుఖంగా ఉన్నారా; మా, అత్త: అంభోరుహ+అక్షి= పద్మాలవంటి కన్నులు

842 శ్రీమదాంధ్ర మహాభారతము కలది; కుంతీమహాదేవి; కుశలయేజ= క్షేమంగా ఉన్నదా?: ఆ+మహావీరుండు; జిత+అరి= జయింపబడిన శత్రువులు కలవాడు, అంటే శత్రువులను జయించినవాడు; అర్జునుడు; తీర్ధ, గమన+ఉత్సుకుండు= తీరయా(త్రలకు వెళ్ళటంలో ఉత్సాహం కలవాడు: అయ్యెన్‌; ('క్రమ్మటి= తిరిగి; వచ్చెనే; ఎజుగుదురు+ఏని; నాకు; ఎజుంగన్‌; చెప్పుడు; అనిన, తరుణి= ఓ కాంతా!" నేను+అ= నేనే; చూవె= సుమా; ఆ+అర్జునుండ; నీ, ఒద్దన్‌= నీ దగ్గర; ఈ+విధమునన్‌; ఉన్నవాండన్‌? నీకు; నాకు; ధరణీ, ధరుండు+అను= భూమిని ధరించినవాడు- శ్రీకృష్ణుడు అనే; జలజభవుండు= (బ్రహ్మదేవుడు పద్మంనుండి పుట్టినవాడు); సంగమంబు= కలయిక; చేసె=ఐ ఏర్పాటు చేశాడు. తాత్పర్యం: 'దేవేంద్రునిరాజధాని అమరావతితో సమాన మని ఈ భూమి మీద పేరుపొందిన ఇంద్రప్రస్థ పుర (శ్రేష్టాన్ని మీరు చూచారా? అందు పాండవులు సుఖంగా ఉన్నారా? మా అత్త కుంతీదేవి కుశలమా? ఆ మహావీరుడు, శత్రువులను జయించిన వాడు అయిన అర్జునుడు తీర్ణయా[త్రలకు వెళ్ళా లన్న ఉత్సాహంతో ఉండేవాడే - ఆయన తీర్ణయాత్రలనుండి తిరిగి వచ్చాడా? తెలిసిన ట్రైతే నాకు చెప్పండి" అని సుభద్ర అడుగగా, 'ఓ కాంతా! నేనే అర్జునుడను; ఈ విధంగా నీవద్ద ఉన్నాను. శ్రీకృష్ణుడు అనే (బ్రహ్మ నిన్నూ నన్నూ కలిపాడు”. విశేషం: పృధక్‌పదత్వం, ఉక్తివైచిత్ర్య్యం అనే లక్షణాలు గల మాధుర్యగుణవద్రచనకు ఈ పద్యం హృద్యమైన ఉదాహరణం. రూపసొమ్యం గల యతి అర్జును డేమో అని ఆమె అనుమానం. కాని, ఆ విషయం సూటిగా అడగటానికి వీలులేదు. అందువలన చేపకొరకు గాలంవేస్తున్నట్టు సంభాషణ సాగించింది. తీరయాత్రలమీద ఆసక్తిగల ఆ అర్జునుడు తిరిగి ఇం(ద్రప్రస్థపురం చేరాడా? అని చివరి ప్రశ్ళ. చేరితే ఈ యతి అర్జునుడు కాడు. చేరకపోతే యతి ఎవరో తెలుస్తుంది - మాటనేర్పరితనం గల సుభద్ర ఉక్తిచమత్కారంతో సత్యం బైటపెట్టించింది. అందుకే అర్జునుడు మరేమీ చెప్పక తన ఉనికిని బయటపెట్టుకొన్నాడు. సుభద్రార్దునుల మధురాభిలాషల మధురాభివ్యక్తికి మాధుర్యగుణం మధుర సాధన మైనది. (సంపా) వ. 'బ్రాహ్మంబు మొదలుగా. గల యెనిమిది వివాహంబుల యందును గాంధర్వ రాక్షసంబులు క్షత్రియులకు నుత్తమ వివాహంబులు గావున నిది గాంధర్వ వివాహంబున కవసరం' బనిన సుభద్ర లజ్జ్ఞావనత వదన యయి. 188 ప్రతిపదార్థం: (బ్రాహ్మంబు; మొదలుగాన్‌, కల; ఎనిమిది; వివాహంబుల; అందును; గాంధర్వ, రాక్షసంబులు; క్షత్రియులకున్‌; ఉత్తమ, వివాహంబులు; కావునన్‌; ఇది; గాంధర్వ, వివాహంబునకు; అవసరంబు= సమయము; అనిన; సుభద్ర; లజ్ఞా+అవనత వదన, అయి= సిగ్గచేత వంచుకొన్న ముఖం కల దై. తాత్పర్యం: '(బ్రాహ్మము మొదలైన ఎనిమిది రకాల వివాహాలలో గాంధర్వ రాక్షసాలు క్షత్రియులకు ఉత్తమ వివాహాలు కాబట్టి ఇది గాంధర్వ వివాహానికి సమయం" అనగానే సుభద్ర సిగ్గుతో తలవంచుకొని, విశేషం: ఎనిమిది రకాల వివాహాలు- (బ్రాహ్మము, దైవము, ఆర్షము, (ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, 'పైశాచము. వివరాలకు చూడు (ఆది. 4-55). తే. 'నన్నునీ నర్హులెల్ల నిం దున్నవారు;। వార యెజింది చేయుదురు వివాహ" మనుచు వనజనేత్ర యంతఃపురంబునకుం జనియె; । నరిగెం దన లతాగ్భహమున కర్దునుండు. 189 ప్రతిపదార్హం: నన్నున్‌; ఈన్‌= ఇవ్వటానికి; అర్హులు+ఎల్లన్‌; ఇందు+ ఉన్నవారు; వారు+అజ వారే; ఎఆింతి; చేయుదురు; వివాహము; అనుచు; వనజ, నేత్ర= పద్మాలవంటికన్నులు కలది- సుభద్ర; అంతఃపురంబునకున్‌; చనియెన్‌= వెళ్ళింది; అర్జునుండు; తన; లతా, గృహమునకు= తీగెలతో నిర్మించిన ఇంటికి- పొదరింటికి; అరిగెన్‌= వెళ్ళాడు.

ఆదివర్వము - అష్టమాశ్వాసము 843 తాత్పర్యం: “నన్ను ఇవ్వటానికి అర్హు లైన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళే తెలిసికొని వివాహం చేస్తా" రంటూ సుభద్ర అంతఃపురానికి వెళ్ళింది. తరువాత అర్జునుడు తన పాదరింటికి వెళ్ళాడు. విశేషం: శ్రీకృష్ణుడే సుభద్రార్హునుల వివాహ వ్యూహాన్ని రచించాడని తెలిసిన తరువాత సుభద్ర తనంత తాను గాంధర్వ వివాహానికి ఒడబడటం ఉచితం కాదు. సూత్రధారుడు అయిన కృష్ణుడే సమయాన్ని గమనించి సముచిత విధంగా సమర్పించ నున్నాడని సన్నివేశం దధ్వనింపచేస్తున్నది. అంతరంగంలో ఇష్టమే కాని ఈ అంతర్జ్నాటక మెందుకో తెలిసిన తరువాతనే వివాహంకావటం ఇరువురికీ మంచిది అన్న భావాన్ని వ్యంగ్యంగా సూచించిన వివేకవతి, లజ్ఞ్జావతి సుభద్ర. అర్జునునికి రహస్యం చెప్పి తనకు చెప్పకుండా ఉంచిన పెద్దలే తనను ఇస్తారులే, అంతవరకు నాకు తెలిసిందని నేనే ఎందుకు బైటపడాలి? అన్న గూఢాభిమానంకూడా ఆమె మాటలలో ప్రతీయమాన మౌతున్నది. పైపెచ్చు ఆ మాటలు తేటగీతి పూర్వార్హంలో సమతను ప్రదర్శించటం, ఉత్తరార్థంలో వాళ్ళచర్యలు సమంగా రెండుచరణాలలో వర్షింపబడటంవలన పద్య రచనలో సమత అనే గుణం శోభిస్తున్నది. (సంపా.)

న. అయ్యిరువురయన్యోన్యప్రణజయంబులు దనదివ్యజ్ఞానంబునం జేసి దివ్యపురుషుండు పురుషోత్తముం దెటింగి, యర్హునునకు భోజనవిధు లమర్చ రుక్షిణీదేవిం బంచి, యొక్కనాం దేకాంతంబున దేవకీ వసుదేవప్రద్యుమ్న సాంబసంకర్షణసారణసాత్యకులకు నర్జును స్థితియును నాతనియందు సుభద్రనెయ్యంబును నెటింగించి, తమతాొల్లింటి విచారంబున కనుగుణం బగుటకు సంతసిల్లి, బలదేవాదు లెటుంగకుండ సుభద్రార్దునుల వివాహంబు సేయ సమకట్టి, తమనిశ్హయం బయ్యిరువురకుం జెప్పి, పశుపతిపూజా మహోత్సవవ్యాజంబున నఖిలయాదవభోజాంధకవృప్టివరులతో నంతర్త్వీపంబునకుం జని. 190

ప్రతిపదార్థం: ఆ+ఇరువుర= ఆ సుభద్రార్దనులయొక్క:; అన్యోన్య, ప్రణయంబులు= పరస్పర(ప్రేమలు; తన, దివ్యజ్ఞానంబునన్‌+చేసి;

దివ్య, పురుషుండు; పురుష+ఉత్తముండు= పురుషులలో క్రేష్టుడు- శ్రీకృష్ణుడు; ఎటింగి= తెలిసికొని; అర్జునునకు; భోజన, విధులు; అమర్చ; రుక్కిణీదేవిన్‌: పంచి= పంపి; ఒక్కనాండు; ఏకాంతంబున; దేవకీ, వసుదేవ, ప్రద్యుమ్న, సాంబ, సంకర్షణ, సారణ, సాత్యకులకున్‌; అర్జును, స్థితియును= అర్జునునిఉనికిని; ఆతని, అందు; సుభద్ర, నెయ్యంబును= సుభద్రయొక్కస్నేహాన్ని; ఎజింగించిజ తెలిపి; తమ; తొల్లింటి= పూర్వపు; విచారంబునకు= ఆలోచనకు; అనుగుణంబు= తగినది; అగుటకు; సంతసిల్లి; బలదేవ+ఆదులు= బలరాముడు మొదలైనవాళ్ళు: ఎజుంగకుండ; సుభద్రా+అర్జునుల:; వివాహంబు; చేయ; సమకట్టి= పూనుకొని; తమ, నిశ్చయంబు; ఆ+ఇరువురకున్‌: చెప్పి; పశుపతి, పూజా, మహత్‌+ఉత్సవ, వ్యాజంబునన్‌= శివ పూజా మహోత్సవం నెపంతో; అఖిల, యాదవ, భోజ+అంధక, వృష్టి వరులతోన్‌= యాదవ, భోజ, అంధక, వృష్టి వంశ (శ్రేష్టులందరితో; అంతర్‌+ద్వీపంబునకున్‌= లోపలిద్వీపానికి; చనిజ= వెళ్ళి.

తాత్పర్యం: ఆ సుభద్రార్దునుల పరస్పరానురాగాలు తన దివ్యజ్ఞానంతో శ్రీకృష్ణుడు తెలిసికొని, అర్జునునికి భోజనవిధులు అమర్చటానికి రుక్మిణీదేవిని పంపి, ఏకాంతంలో దేవకీ వసుదేవ ప్రద్యుమ్న సాంబ సంకర్షణ సారణ సాత్యకులకు అర్జునునిఉనికిని, ఆతనిపై సుభద్రకున్న (ప్రేమను తెలియచేశాడు. మొదటి నుండి తమకున్న ఆలోచనకు అది అనుకూలమే కనుక సంతోషించాడు. బలరాముడు మొదలైనవాళ్ళకు తెలియకుండా సుభద్రార్జునుల వివాహం చేయటానికి నిశ్చయించాడు. తమనిశ్చయాన్ని ఆ ఇద్దరికి చెప్పాడు. శివపూజామహోత్సవం నెపంతో అఖిల యాదవ భోజాంధక వృష్టి వంశ శ్రేష్టులతో ఆంతర ద్వీపానికి వెళ్ళి.

క. అం దమరబృ్బందవంద్యున ; కిందుకళాభరణునకు నుమేశ్వరునకు నా

నందం బొందంగ నందలి ।; నందకధరు. డుత్సవం బొనర్పంగం బంచెన్‌. 191

రక్షక శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: నందక, ధరుడు= నందకం అనే పేరు కల ఇడ్లాన్ని ధరించినవాడు- విష్ణుమూర్తి- కృష్ణుడు; అందు= ఆంతర ద్వీపంలో; అమర, బృంద, వంద్యునకు= దేవతాసమూహానికి పూజ్యు డైనవానికి; ఇందు, కళా+ఆభరణునకున్‌= చంద్రకళ ఆభరణంగా కలవానికి; ఉమా+ఈశ్వరునకున్‌= ఉమాదేవి భర్తకు; ఆనందంబు; ఒందంగన్‌= కలిగేటట్టు; ఉత్సవంబు; ఒనర్పంన్‌= చేయటానికి; అందటన్‌; పంచెన్‌= ఆజ్ఞాపించాడు. తాత్పర్యం: 'ఆంతర ద్వీపంలో దేవతలందరికీ పూజ్యుడు, చంద్రశేఖరుడు ఉమాపతి అయిన పరమేశ్వరునికి ప్రీతిగా ఉత్సవం చేయండి” అని శ్రీకృష్ణుడు అందరినీ ఆజ్ఞాపించాడు. కు తగంగ వివాహం బెన్నం : దగునొకొ, యెన్నండు సంగమావాప్తియు మా కగునొాకొ యని యెడం గోరుచు | నొగి నిట యుండిరి సుభద్రయును విజయుండున్‌. 192 (ప్రతిపదార్హం: తగంగ= తగురీతిగా; వివాహంబు; ఎన్నండు; అగున్‌+ఒకొజ అవుతుందోకదా!; ఎన్నండు; సమాగమ+అవాప్తియు= కలయిక లభించటం; మాకు; అగున్‌+ఒకొ= కలుతుందోకదా!; అని; ఎడన్‌= హృదయంలో; కోరుచున్‌: సుభద్రయును; విజయుండున్‌; ఒగిన్‌= (క్రమంగా; ఇట= ద్యారవతిలో; ఉండిరి. తాత్పర్యం: 'తగురీతిగా వివాహం ఎన్నడు జరుగుతుందో! మాకు సమాగమ - అవకాశం ఎన్నడు లభిస్తుందో! అని హృదయంలో కోరుకొంటూ సుభద్రార్జునులు ద్వారకలో ఉన్నారు. విశేషం: నాయికానాయకులలో రతిభావం దేదీప్యమానంగా (ఉజ్జ్వలంగా) ధ్వనింపచేయటంలో నన్నయ 'కాంతి' అనే గుణాన్ని కమనీయంగా పోషించాడు. (సంపా,) కు హరి దలంచె సుభద్ర పురం । దరు దలంచె ధనంజయుండు; దదయక వార య్యిరువురం బెండిలి సేయంగ ; వరదులు తద్ద్వారవతికి వచ్చిరి ప్రీతిన్‌. 193 ప్రతిపదార్థం: సుభద్ర; హరిన్‌= శ్రీకృష్ణుడిని; తలం; ధనంజయుండు= అర్జునుడు; పురందరున్‌= దేవేంద్రుడిని; తలంె; వరదులు= వరా లిచ్చేవారు; వారు= ఆ శ్రీకృష్ణదేవేంద్రులు; తడయకజ ఆలస్యంచేయక; ఆ+ఇరువురన్‌=ఐ ఆ ఇద్దరిని; పెండిలి= పెండ్లి; చేయంగ= చేయటానికి; ప్రీతిన్‌= (ప్రేమతో; తత్‌+ద్వారవతికి= ఆ ద్వారకానగరానికి; వచ్చిరి. తాత్పర్యం: సుభద్ర మనస్సులో శ్రీకృష్ణుడిని తలచుకొన్నది. అర్జునుడు దేవేంద్రుడిని తలచుకొన్నాడు. వరాలిచ్చే వాళ్ళిద్దరు వెంటనే వాళ్ళపెండ్రి చేయటానికి ప్రీతితో ద్వారవతీ నగరానికి (ద్వారకానగరానికి) వచ్చారు. విశేషం: ఈ పద్యంలో నాయికానాయకుల సంకల్పాలలోనూ, ఇం(ద్రోపేంద్రుల ఆగమనంలోనూ, పద్యనిర్మాణంలోనూ సమతాగుణం సార్టకం. (సంపాం డా అర్జునుండు సుభద్రను వివాహంబగుట (సం- అను. 1-144-270పలక్తి వ. ఇట్లు వాసుదేవుండు వసుదేవాక్రూరసారణసాంబసాత్యకిసహితంబుగా నంతర్త్వీపంబుననుండి వచ్చిన యనంతరంబ యమరావతినుండి యమరసిద్ధసాధ్యమునిగణపరివృతుం డై యమరేంద్రుండు వచ్చె; నంత బృహస్పతి యిచ్చిన యుత్తమలగ్నంబున నగ్నియమనిర్భతి వరుణవాయుధనదేశానాదిసురవరులు, నత్రిభృగు నారదనసిష్టవామదేవ ప్రభృతిమహామునులును సదస్యులుగా6 గశ్యపప్రజాపతి హోమకర్తగా, నరుంధతియు శచియు సత్యభామయురుక్షిణియు నప్పరోగణంబులతోదం బురం ధ్రీకార్యంబులు నిర్వహింప సుభద్రార్డునుల వివాహమహోత్సవం బతిరమ్యం బయ్యె నంత, 194

ఆదిపర్వము - అష్టమాశ్వాసము త్‌45 (ప్రతిపదార్హం: ఇట్టు; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; వసుదేవ+అ(క్రూర, సారణ, సాంబ, సాత్యకి, సహితంబుగాన్‌= వసుదేవుడు, అ(క్రూరుడు మొదలైన వాళ్ళతోకూడి; అంతర్‌+ద్వీపంబునుండి; వచ్చిన; అనంతరంబు+అ= తరువాత; అమరావతినుండి; అమర, సిద్ద సాధ్య, ముని, గణ, పరివృతుండు+ఐజఐ దేవతలతో, సిద్దులతో, సాధ్యులతో, మునిసమూహాలతో చుట్టబడిన వా డై; అమర+ఇం(ద్రుండు= దేవేంద్రుడు; వచ్చెన్‌; అంత; బృహస్పతి; ఇచ్చిన; ఉత్తమ, లగ్నంబునన్‌; అగి, యమ, నిర్భతి, వరుణ, వాయు, ధనద+-ఈశాన+అది, సుర, వరులున్‌= అగ్నిదేవుడు, కుబేరుడు, ఈశానుడు (అష్టదిక్పాలకులు) మొద లైన దేవతాగ్రేష్టులూ; అత్రి, భృగు, నారద, వసిస్ట్ర వామదేవ, ప్రభృతి, మహామునులును= అత్రి, భృగువు, నారదుడు, వసిష్ణుడు, వామదేవుడు మొద లైన మహామునులూ; సదస్యులుగాన్‌= సభలోని సభ్యులుగా; కశ్యప, ప్రజాపతి; హోమకర్తగాన్‌= హోమం చేసేవాడుగా: అర్హుంధతియు, శచియు, సత్యభామ, రుక్మిణియును; అప్పరః:+గణంబులతోడన్‌= అప్పరసలసమూహాలతో; పురంధ్రీ, కార్యంబులు= ముత్తైదువులు చేయదగినపనులు; నిర్వహింప; సుభద్రా+అర్జునుల, వివాహ, మహా+ఉత్సవంబు; అతి, రమ్యంబు= ఎంతోచూడముచ్చు టైనది; అయ్యెన్‌; అంత= అప్పుడు. తాచ్చర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడు వసుదేవ అ(క్రూర సారణ సాంబ సాత్యకులతో ఆంతర ద్వీపంనుండి వచ్చిన తర్వాత దేవేంద్రుడు అమర సిద్ద సాధ్య ముని సమూహాలతో అమరావతినుండి వచ్చాడు. బృహస్పతి పెట్టిన ఉత్తమ లగ్నంలో అష్టదిక్పాలకులు మొద లైన దేవతా'్రేష్టులు, అత్రి భృగు నారదాది మహామునులు సదస్యులుగా, కశ్యప ప్రజాపతి హోమ కర్తగా, అరుంధతీ శచీ సత్యభామా రుక్మిణులు అప్సరసల సాయంతో ముత్తైదువులు చేసే పనులన్నీ నిర్వహించగా, సుభద్రార్జునుల వివాహం చూడముచ్చటగా జరిగింది. అప్పుడు. తరువోజ. అనిమిషప్రభుండు నిజాత్మజు ననఘు । నర్హునుం బ్రీతితో నభిషిక్తు. జేసి మనుజేంద్రుం గాంచనమణిమయోత్తుంగ ।; మకుటవిభూషణమస్తకుం జేసి యనుపమకేయూరహారాదిభూష । ణాభిశోభితు. జేసి యప్పు దానంద జనితాంబుకణికార్థచక్షుస్సహస్ర : జలరుహంబులు దాల్టె సమ్మదం బెసంగ. 195 (ప్రతిపదార్థం: అనిమిష ప్రభుండు= దేవేంద్రుడు; నిజ+ఆత్మజున్‌= తనకుమారుడిని; అనఘున్‌= పాపరహితుడిని; అర్జునున్‌: (ప్రీతితోన్‌; అభిషిన్టున్‌*చేసి=ఐ అభిషేకింపబడినవాడినిగా చేసి- అంటే అభిషేకించి; మనుజ+ఇంద్రున్‌= రాజును; కాంచన, మణిమయశ+ఉత్తుంగ, మకుట, విభూషణ, మస్తకున్‌= బంగారంతో, మణులతో నిర్మించిన కిరీటంచేత అలంకరింపబడిన శిరస్సుకలవాడినిగా; చేసి; అనుపమ, కేయూర, హార+అది, భూషణ+అభిశోభితున్‌= సాటిలేని బాహుపురులు, హారాలు మొద లైన ఆభరణాలచే ప్రకాశించేవాడినిగా; చేసి; అప్పుడు; అనంద, జనిత+అంబు, కణికశ ఆర్ష, చక్షున్‌+సహట్ర, జల, రుహంబులు= ఆనందంనుండి పుట్టిన నీటి బిందువులచే తడిసిన పద్మాలవంటి కళ్ళు వేయింటిని; సమ్మదంబు= సంతోషం; ఎసంా అతిశయించగా; తాల్చె= ధరించాడు. తాత్పర్యం: దేవేంద్రుడు- తన కుమారుడు, పుణ్యాత్ముడు అయిన అర్జునుడిని అభిషేకించి(మంగళ స్నానం చేయించి), బంగారంతో మణులతో రూపొందించిన కిరీటాన్ని శిరస్సుపై అలంకరించి, సాటిలేని బాహుపురులు, హారాలుమొద లైన ఆభరణాలు- అలంకరించి ఆనంద బాష్పాల చేత తడిసిన పద్మాల వంటి కళ్ళువేయింటిని సంతోషం అతిశయిల్లగా ధరించాడు. విశేషం: అలం: రూపకం. అనిమిషులు అంటే రెప్పపాటులేనివారు-దేవతలు, వృత్రలక్షణానికి చూడు; అది. 2-150 విశేషం. ఈ పద్యంలో ఓజోగుణంతోకూడికొన్న ప్రసాదగుణం సన్నివేశగత మైన ఉదాత్తతను ప్రసన్నంగా పోషిస్తున్నది. (సంపాం

846 శ్రీమదాంధ్ర మహాభారతము

మాలిని, నరునకు దయ ని ట్లానంద మొందించి యింద్రుం డరిగె దివికి దివ్యానంతరత్నాంశుజాల స్పురితసురవిమానంబుల్‌ నభోభాగ మెల్ల న్మైరసి వెలుంగుచుండన్‌ నిర్జరశ్రేణితోదన్‌. 196

ప్రతిపదార్హం: ఇం(ద్రుండు; నరునకు= అర్జునునికి; ఇట్టు' ఆనందము; ఒందించి= కూర్చి; దివ్య+అనంత, రత్నశ+అంశు, జూల

స్పురిత, సుర, విమానంబుల్‌= (శ్రేస్టము లైన అంతులేని రత్న కిరణాల సమూహంతో ప్రకాశిస్తున్న దేవతా విమానాలు" నభో, భాగము+ఎల్లన్‌= ఆకాశమంతటా; మెరసి= బయల్పడి; వెలుంగుచు+ఉండన్‌' నిర్జర శ్రేణితోడన్‌= దేవతల సమూహంతో; దివికి= స్వర్గానికి; అరిగె= వెళ్ళాడు.

తాత్సర్యం: దేవేంద్రుడు అర్జునునికి ఇట్లా ఆనందం కలిగించి- 'శ్రేష్టా లైన అనంత రత్న కిరణ సమూహంతో

ప్రకాశించే దేవతావిమానాలు ఆకాశమంతా వెలుగుతుండగా దేవతలతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళాడు.

ళా

విశేషం: వృత్తలక్షణానికి చూడు. అది. 2-81 విశేషం.

వ. ఇట్లు నారాయణుండు నిజారంభంబు సఫలం బగుటకు సంతసిల్లి, సంప్రాపమనోరథుం డయిన యప్పార్దుం గౌంగిలించుకొని, 'యక్షయబాణతూణీరబాణాసనసనాధం బయి పవనజవనహయంబులం బూద్ధిన యక్కాంచనరధం బెక్కి సుభద్రం దోడ్కొని యింద్రప్రస్టపురంబున కరుగు' మని పంచి, యనంతరం బంతర్త్వీపంబున కరిగిన. 197

(ప్రతిపదార్థం: ఇట్టు; నారాయణుండు; నిజ+ఆరంభంబు= తనప్రయత్నం; సఫలంబు+అగుటకు; సంతసిల్లి: సంప్రాప్త;

మనోరధుండు+అయిన= పొందబడిన కోరిక గల వా డైన; ఆ+పార్భున్‌= ఆ అర్జునుడిని; కౌంగిలించుకొని: అక్షయ బాణ తూణీర

బాణ+ఆసన, సనాధంబు+అయి= తరుగని బాణాల అమ్ముల పాొదితో, ధనుస్సుతోకూడిన దై; పవన జవన హయంబులన్‌= వాయువేగం గల గుర్రాలను; పూన్ఫిన= కట్టిన; ఆ+కాంచన, రదంబు= ఆ బంగారు రధాన్ని; ఎక్కి; సుభద్రన్‌; తోడ్కొని; ఇంద్రప్రస్ట, పురంబునకు; అరుగుము= వెళ్ళుము; అని; పంచి= పంపి; అనంతరంబు= తరువాత, అంతర్‌+ద్వీపంబునకు; అరిగినజ వెళ్ళగా. తాత్పర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడు తన (ప్రయత్నం సఫలం అయినందుకు సంతోషించి కోరిక నెరవేరిన అర్జునుడిని

కౌగిలించుకొని, 'తరుగని బాణాల అమ్ములపాొదితో, ధనుస్సుతో కూడి, వాయువేగం గల గుర్రాలు పూన్చిన ఆ

బంగారు రధం ఎక్కి సుభద్రతో ఇంద్రప్రస్థ పురానికి వెళ్ళు' మని పంపి, తరువాత తాను కూడ ఆంతర ద్వీపానికి

వెళ్ళగా.

క్ర హరి పంచిన మార్గంబునం । గురువిభుండు సుభద్ర దోడుకొని చనునెడం ద త్పురిపరిరక్షకు లతిఖీ । కరులు పృథుశ్రవసు డాదిగా6 గల వ్‌రుల్‌. 198

ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణుడు; పంచిన= పంపిన; మార్గంబునన్‌; కురు, విభుండు= కురువంశరాజు అర్జునుడు; సుభద్రన్‌;

తోడుకొని; చను, ఎడన్‌= వెళ్ళేటప్పుడు; తత్‌+పుర, పరిరక్షములు= ఆ పట్టణానికి కాపలా ఉండేవాళ్ళు, అతి, భీకరులు= మిక్కిలిగా భయాన్ని కలిగించేవాళ్ళు; పృధుశ్రవసుడు+ఆదిగాన్‌+కల= పృధుశ్రవసుడు మొదలైన; వీరుల్‌.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము రడ? తాత్పర్యం: శ్రీకృష్ణుడు పంపిన మార్గంలో అర్జునుడు సుభద్రను తోడ్కొని వెళ్ళుతుండగా, ఆ పట్టణానికి కాపలా ఉన్న పృధు(శ్రవసుడు మొదలైన భయంకర వీరులు. ఉ. 'వీరుండు వండు పొండవుండు వృష్టికులోత్తము లైన సీరిదై త్యారు లెటుంగకుండ6ంగ మహారథు€ డై తరుణిన్‌ సుభద్ర నం భోరుహనేత్రం దోడ్కొనుచు! బోయెడి; నీతని. బోవనిచ్చినన్‌ థీరుండు మాధవుండు బలదేవుండు నల్గుదు' రంచు నడ్డ మై. 199 ప్రతిపదార్థం: వీండు= ఇతడు; పాండవుండు= పాండురాజుకుమారుడు; వీరుండు; వృష్టి కుల+ఉత్రములు+ఐన= వృష్ణివంశశ్రేష్టు లైన; సీరి, దైత్య+అరులు= బలరామ శ్రీకృష్ణులు: ఎఆుంగక+ఉండంగ; మహారథుండు+ఐజ= గొప్ప రధం మీద కూర్చున్న వా డై; తరుణిన్‌= కాంతను; సుభద్రన్‌?; అంభోరుహ, నేత్రన్‌= పద్మాలవంటి కళ్ళు కలదానిని; తోడ్కొనుచున్‌? పోయెడిన్‌= పోతున్నాడు; ఈతనిన్‌' పోవనిచ్చినన్‌; ధీరుండు; మాధవుండు= శ్రీకృష్ణుడు: బలదేవుండున్‌; అల్లుదురు+అంచున్‌= కోపపడతా రని; అడ్డమై= అడ్డగించి. తాత్పర్యం: ఇతడు పాండవవీరుడు వృష్టికుల(్రేష్టు లైన బలరామశ్రీకృష్ణులకు తెలియకుండా పెద్ద రథాన్ని ఎక్కి పద్మాలవంటి కన్నులు గల సుభద్రాకాంతను తోడ్కొని పోతున్నాడు. ఇతడిని వదలితే ధీరులు శ్రీకృష్ణుడు, బలరాముడు కోపపడతా రని అడ్డగించి. విశేషం: “వీరుడు వీడు” అనే ప్రశంసాత్మక వాక్యంతో (ప్రారంభ మయ్యే ఈ పద్యంలో అర్జునుడి వీరకృత్యం భటులచేత వితర్కింపబడింది. ఇది అర్హవైమల్యాన్ని వ్యక్తంచేసే (ప్రసాదగుణవిశిష్ట రచన. (సంపా,) క. _ వీకంబఅతెంచి నలుగడం। దాంశకినం గడు నలిగి ఘఫోరతరశరహతి న మ్యూశకలు విరియంగ నర్జును. ।; దాకరమున నేసి నుగ్రుం డయి రణభూమిన్‌. 200 ప్రతిపదార్హం: వీంకన్‌= పరాక్రమంతో; పజతెంచి= పరుగెత్తివచ్చి; నలుగడన్‌= నాలుగువైపుల; తొకినన్‌= ఎదుర్కోగా: అర్జునుండు; కడున్‌+అలిగి= మిక్కిలికోపించి; ఉగ్రుండు+అయి= భయంకరు డై; రణ, భూమిన్‌= యుద్ధరంగంలో; ఘోరతర, శర+ఆహతిన్‌= మిక్కిలి భయంకరా లైన బాణాల దెబ్బలచే; ఆ+మూంకలు= ఆ సేనలు; విరియంగన్‌= చెల్హాచెదరయ్యేటట్టు; ఆంకరమునన్‌= కోపంతో; ఏసెన్‌= కొట్టాడు. తాత్పర్యం: పరాక్రమంతో పరుగెత్తి వచ్చి నలువైపుల ముట్టడించగా అర్జునుడు భయంకరు డై యుద్దరంగంలో మిక్కిలి తీవ్రా లైన బాణాలతో ఆ సేనలు చెల్లాచెద రయ్యేటట్టు కోపంతో కొట్టాడు. చ. హరితనయుండు పార్టుడు రయంబున నందఅ నాహవక్రియా విరతులం జేసి యప్పురమువీధుల వేదుల రమ్యహర్త్యగో పురములం దద్గిరీంద్రమణిభూముల భూరితటాకపంకజా కరనవనందనావళులం గాండమయంబులం.. జేసి నీసునన్‌. 201 ప్రతిపదార్థం: హరి తనయుండు= దేవేంద్రునికుమారుడు; పార్టుండు= అర్జునుడు; రయంబునన్‌= వేగంగా: అందజన్‌= ఆ సైనికులందరినీ; ఆహవ, (క్రియా, విరతులన్‌+చేసి= యుద్ధపు పనినుండి విరమించుకొన్నవాళ్ళనుగా చేసి; ఈసునన్‌= కోపంతో, ఆ+పురము= ఆ పట్టణంయొక్క; వీధుల; వేదుల=ఐ అరుగుల; రమ్య హర్మ్య, గోపురములన్‌= అందము లైన మేడల గోపురాలను తత్‌+గిరి+ఇంద్రమణి, భూముల= ఆ పర్వత(శ్రేష్టం యొక్క రత్నాల నేలలను; భూరి, తటాక పంకజ+ఆకర, నవ, నందన+ఆవళులన్‌=

848 శ్రీమదాంధ్ర మహాభారతము పెద్దచెరువులయొక్క, పద్మాలకు నిలయా లైన సరస్సులయొక్క, కొత్తఉద్యానవనాలయొక్క సమూహాలను; కాండమయంబులన్‌= బాణాలతో నిండినవాటినిగా; చేసెన్‌. తాత్చర్యం: దేవేంద్రునితనయు డైన అర్జునుడు వెంటనే ఆ సైనికులు యుద్దం విరమించుకొనేటట్టు చేసి, ఆ కోపంతో ఆ పట్టణంలోని వీధులను, అరుగులను, అందా లైన మేడల గోపురాలను, ఆ మహాపర్వతంయొక్క రత్నాల నేలలను, పెద్ద చెరువులను, సరస్సులను, ఉద్యానవనాలను బాణాలతో నింపాడు. విశేషం: అర్జునుని యుద్దక్రీడ రమణీయం. ద్వారవతీ నగర రక్షకులను, యాదవసైన్యాలను అంతమొందించటం ఆయన లక్ష్యం కాదు- తనకు అడ్డు రాకుండా చెల్లాచెదరు. చేయటం, మళ్ళీ విజృంభించకుండా తన శక్తి సామర్థ్యాలు చూపి చతికిల పడేటట్టు చేయటం ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ద్వారవతి వీధులను, అరుగులను, మేడల గోపురాలను పర్వతప్రదేశాలను, చెరువులను, సరస్సులను, ఉద్యానవనాలను తన బాణాలతో నింపాడు. అడుగు ముందుకు వేస్తారేమో - జా(గ్రత్త!- అన్నట్టు - భాషతో కాకి బాణాలతో హెచ్చరించి వెళ్ళాడు. అందువలన నన్నయ ఈ పద్యంలో శుద్దఓజస్సును పోషించకుండ ప్రసాదగుణయుక్ష మైన ఓజస్సునే ప్రదర్శించాడు. రసోదంచితగుణవ(ద్రచన కిది ఉదాహరణం. ఈవిధంగా సుభద్రావివాహఘట్టంలో నన్నయ దశగుణాలను ఆవిష్కరించే రచనను చేసి తన శైలియొక్క ప్రత్యేకతను ప్రదర్శించాడు. (సంపా.) క. అమరేంద్రసుతుండు దనకుం । గమలాక్షి సుభద్ర రథము. గడపంగ ననిలో

నమిత యదుసైన్యముల న । శ్రముమున నోడించి లబ్ధ జయు. డయి యరిగిన్‌. 202 ప్రతిపదార్హం: అమర+ఇం(ద్ర, సుతుండు= దేవేంద్రునియొక్కకుమారుడు- అర్జునుడు; తనకున్‌; కమల+అక్షిజ పద్మాలవంటి కన్నులు కలది; సుభద్ర; రథమున్‌; కడపంగన్‌= నడపగా; అనిలో= యుద్దంలో; అమిత, యదు, సైన్యములన్‌= పరిమితి లేని యాదవసైన్యాలను; అశ్రమమునన్‌= సులభంగా; ఓడించి; లబ్బ, జయు6ండు+అయి= జయాన్ని పొందిన వా డై- అంటే జయాన్ని పొంది; అరిగెన్‌= వెళ్ళాడు. తాత్పర్యం: ఇంద్ర తనయు డైన అర్జునుడు తనకు సుభద్ర రధం నడుపగా - యుద్దంలో అపరిమితాలైన యాదవసైన్యాలను సులభంగా ఓడించి విజయాన్ని పొంది వెళ్ళాడు. వ. అంత సభాపాలుండు ప్రబల జలధర ధ్వాన గంభీరభేరీధ్వనిచే నర్దునుపరాక్రమం బెటింగించిన దాని విని

యంతర్త్వీపంబున నున్న బలదేవాదియాదవులందలు నాక్షణంబ పురంబునకు వచ్చి సభాసీను లయి.203 ప్రతిపదార్థం: అంత= తరువాత; సభాపాలుండు; ప్రబల, జలధర, ధ్యాన, గంభీర, ఖేర్‌, ధ్వనిచేన్‌= గొప్ప మేఘ ధ్వనివంటి గంభీర మైన నగారా మైోతచేత; అర్జును, పరాక్రమంబు; ఎతింగించిన= తెలుపగా: దాని; విని; అంతర్‌*ద్వీపంబునన్‌; ఉన్న; బలదేవ+ఆది, యాదవులు+అందబున్‌= బలరాముడు మొద లైన యాదవు లంతా; ఆ, క్షణంబు+అ; పురంబునకు= ద్వారవతీపురానికి; వచ్చి; సభా+ఆసీనులు+అయి= సభలో కూర్చున్నవా ళ్ళయి. తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా విజయాన్ని సాదించి వెళ్ళిన తరువాత - సభాపాలుడు పెద్ద మేఘధ్వనివంటి గంభీర మైన నగారామైోతతో అర్జ్హునునిపరాక్రమం తెలుపగా, అది విని, అంతర్జ్వ్వీపంలో ఉన్న బలరాముడు మొద లైన యాదవులంతా అప్పటి కప్పుడే ద్వారవతీ పురానికి వచ్చి సభ చేసి. క. యాదవుల నొాదరింపక ।; యాదవిః దోడ్కొని కిరీటి యరిగెను గంభీ

రోదథధిం గరముల నీందం । గాదనక కడంగె నధిక గర్వోద్ధతుం డై 204 పతిపదారం: కిరీటి=ఐ అర్హునుడు; యాదవులన్‌; ఆదరింపక= లెక్కపెట్టక; యాదవిన్‌= యాదవకాంతను; తోడ్కొని అరిగెను= (8 గనే జై గ్రా లు గ్రా వెళ్ళాడు; గంభీర+ఉదధిన్‌= లోతైన మహాసముద్రాన్ని; కరములన్‌= చేతులతో; ఈందన్‌+కాదు+అనక= ఈదటం సాధ్యం కాదనకుండా; అధిక, గర్వ+ఉద్ధతుండు+ఐ= మిక్కిలిగర్వంతో విజ్బంభించినవా డై; కడంగెన్‌= పూనుకొన్నాడు.

ఆదిసర్వము - అష్టమాశ్వాసము తడ తాత్సర్యం: యాదవులను లెక్కపెట్టక అర్జునుడు యాదవకాంతను తోడ్కొని వెళ్ళాడు. లోతైన మహాసముద్రాన్ని చేతులతో ఈదటం సాధ్యంకాదని తెలిసికొనకుండా గర్వాతిశయంతో విజృంభించి ఈ పనికి పూనుకొన్నాడు. మత్తకోకిల. ఏల పార్టుపరాక్రమంబు సహింప? నాతనినాహవ వ్యాలు నిప్పుడ పట్టి తెత్తము; వాతధూతదవానల జ్వాలకున్‌ వనరాశివేల కసంఖ్యయాదవసేనకున్‌ దేలిపోవక చక్కనయ్యెడు భీరు లెవ్వరు పోరిలోన్‌, . 205 (ప్రతిపదార్థం: పార్టు, పరాక్రమంబు= అర్జునునియొక్క పరాక్రమాన్ని; సహింపన్‌; ఏలజ ఎందుకు? ఆహవ, వ్యాలున్‌= యుద్ధంలో సొగరుపట్టిన ఏనుగువంటివాడిని; ఆతనిన్‌; ఇప్పుడు; పట్టితెచ్చుదుము: వాత, ధూత, దవానల, జ్యాలకున్‌= గాలిచే కదలింపబడిన దావాగ్షీజ్వాలకు; వనరాళశి, వేలకు= సము(ద్రం, ఉప్పెనకు; అసంఖ్య, యాదవ, సేనకున్‌= అంతులేని యాదవ సైన్యానికి; పోరిలోన్‌= యుద్దంలో; తేలిపోవక= తొలగిపోక; చక్కన+అయ్యెడు= ఎదుట నిలువగల; ధీరులు= ధైర్యవంతులు; ఎవ్వరు? తాత్పర్యం: అర్జ్హునునిపరాక్రమాన్ని సహించటం ఎందుకు? యుద్దంలో మదించిన ఏనుగువంటి అతడిని పట్టుకొని తీసికొనివద్దాము. గాలిచే రగుల్కొన్న దావాస్టి జ్వాలకు, సముద్రపుటుప్పెనకు, అంతులేని యాదవసైన్యానికి యుద్దంలో తాలగిపోకుండా ఎదురు నిలువ గలిగిన ధైర్యవంతు లెవరు? విశేషం: అలం: దీపకం, ఉపమ. వృత్తలక్షణాలకు చూడు: అది. 1.153 విశేషం. వ. _ అని విజృంభించి వలయసమయ సముద్ధూత వారాశియుంబోలె ఘూర్దిల్లుచున్న యాదవవీరుల వారించి వాసుదేవుం జూచి, బలదేవుం డి ట్లనియె. 206 (ప్రతిపదార్ధం: అని, విజృంభించి; విలయ, సమయ, సముద్తూత, వారాశియున్‌+పోలె= (ప్రళయకాలంలో మిక్కిలి వృద్దిపొందింపబడిన యణ ఖు సము([ద్రంవలె; ఘూర్షిల్దుదు+ఉన్నజ తిరుగుడుపడుతున్న; యాదవ, వీరుల; వారించి= అడ్డగించి; వాసుదేవున్‌= శ్రీకృష్ణుణ్మి చూచి; బలదేవుండు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అని విజృంభించి ప్రళయకాలంలో పొంగిన మహాసముద్రం వలె తిరుగుడు పడుతున్న యాదవ వీరులను ఆపి, శ్రీకృష్ణునితో బలరాముడు ఇట్లా అన్నాడు. విశేషం: అలం; ఉపమ. క. _ 'నీ వెటుంగకుండ గర్వము । తో విజయుండు దా సుభద్రం దోడ్మొని బలిమిం బోవ(గ నంతసమర్థుందె?' ; నావుడుం గృష్పుండు రామునకు ని ట్లనియెన్‌. 207 ప్రతిపదార్థం: నీవు+ఎయుగకుండ= నీకు తెలియకుండానే: విజయుండు= అర్జునుడు; గర్వముతో: తా= తాను; బలిమిన్‌= బలవంతంగా; సుభద్రన్‌; తోడ్కొని; పోవంగన్‌; అంత, సమర్భ్థుడు+ఎ=ఐ అంత మొనగాడా?, నావుడున్‌= అనిఅనగా; రామునకున= బలరామునికి; కృష్ణుండు; ఇట్టు+అనియెన్‌. జ 0త తాత్పర్యం: “నీకు తెలియకుండానే అర్జునుడు గర్వంతో బలవంతంగా సుభద్రను తోడ్కొని పోవటానికి అ సమర్జ్భుడా!' అని అనగా బలరామునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. విశేషం: గూఢ మైన అధిక్షేప చతురోక్తికి ఇది చక్కని ఉదాహరణ.

850 శ్రీమదాంధ్ర మహాభారతము

న్‌ భరతకులాగ్రణి పొండవసింహంబు । సర్వధర్శ్మజ్ఞుం డాసవ్యసాచి దనమేనమటజందలి ధవళాక్షిం దోడ్మ్కొని । చనియె; నాతని కది చనదె చెపుండ! యప్పార్థుపిుంద మీ రరుగంగ వాం డంత ।; యశ్రమసాధ్యుడ యాహవమున? నఖిలాస్త్రవిదుండు ద్రోణాచార్యశిష్యుండు । జితకాశి యని వానిం జెప్ప వినరె?

ఆ. వలవ దుడుగుం డనిన వామను పలుకను । వేలం గడవదయ్యె వృష్టిభోజు యాదవాంబురాశి యట ధనంజయుం డవి । జేయు. డభిమతార్థసిద్ధి బొంది. 208

ప్రతిపదార్థం: భరత, కుల+అ(గ్రణి= భరతవంశశ్రేష్టుడు; పాండవ, సింహంబు= పాండవ(్రేష్టుడు; సర్వ, ధర గ్రజ్తుండు= అన్నిధర్మాలు తెలిసినవాడు; సవ్యసాచి= అర్జునుడు; తన, మేనమజదలి; ధవళ+లఅక్షిన్‌= తెల్లని కన్నులు కలదానిని- అంటే అందమైన కన్నులు కల దానిని; తోడ్కొని; చనియెన్‌; ఆతనికి; అది; చనదె= తగదా; చెపుండ= చెప్పండి; ఆ+పార్చు, పిజుంద= ఆ అర్జునునివెనుక; మీరు+అరుగంగ= మీరు వెళ్ళగా- అంటే దండెత్తి వెళ్ళగా; వాడు; ఆహవమునన్‌= యుద్దంలో; అంత, అ(శ్రమ, సాధ్యుండు+ఎ= అంత సులభంగా లొంగేవాడా; వానిన్‌; అఖిల+అస్త్ర, విదుండు= అన్ని అస్రాలు తెలిసినవాడు" (ద్రోణ+ఆచార్య శిష్యుండు; జితకాళి= యుద్దంలో జయించి (ప్రకాశించేవొడు; అని; చెప్ప; వినరె; వలవదు= వద్దు, ఉడుగుండు= (మీప్రయత్నం) మానుకోండి; అనిన; వామను, పలుకు= శ్రీకృష్ణునియొక్కమాట; అను; వేలన్‌= చెలియలికట్టను: వృష్టి భోజ, యాదవ+అంబు రాశి= వృష్టి భోజ, యాదవ వంశాల వా ళ్ళనే సముద్రం; గడవదు+అయ్యె= దాటదాయెను; అవిజేయుండు= జయింపసాధ్యం కానివాడు; ధనంజయుండు= అర్జునుడు; అభిమత+అర్హ, సిద్ధిన్‌= ఇష్ట మైన కోరిక సఫలం కావటాన్ని; పొంది.

తాత్పర్యం: “భరత వంశ శ్రేష్టుడు, పాండవ శ్రేష్టుడు, సర్వధర్మాలు తెలిసిన వాడూ అయిన అర్జునుడు తన

మేనమరదలిని తోడ్కొని వెళ్ళటం తగదా? చెప్పండి. మీరు అతడిని వెంబడించి దండెత్తితే యుద్దంలో అఆ

“డంత సులభ సాధ్యుడా? అతడు అన్ని అ(స్రాలు తెలిసినవా డనీ, అంతటి (ద్రోణాచార్యశిష్యు డనీ, యుద్దంలో జయించి ప్రకాశించే వా డనీ, మీరు వినలేదా?'- అని శ్రీకృష్ణు డన్నాడు. శ్రీకృష్ణుని మాట అనే చెలియలికట్టను వృష్టి భోజ యాదవ వంశాలవా రనే సముద్రం దాటలేక పోయింది. అజేయుడైన జయింపసాధ్యం కాని అర్జునుడు తాను కోరిన దానిని పొందాడు.

విశేషం: అలం: రూపకం. యాదవులమీద శ్రీకృష్ణుని పట్టు, వ్యూహరచనలో ఆయన నేర్చు, మాటల చాకచక్యం ఈ ఘట్టంలో

స్పష్టం.

అర్జునుండు సుభద్రాసహిచుందై యింద్రఫ్రస్టపురంబునకు( జనుట (సం- 1-213-13)

వ. ఇ ట్లింద్రప్రస్థపురంబున కభిముఖుం డై యానర్తకదేశంబులకుం జని, యందు ముందణ ముకుందప్రేషితు లయిన దాశార్దనీరులతో నగణ్యారణ్యంబులు గడచుచు6 బుణ్యతీర్థంబుల నాడుచు నానాజనపదంబుల విహరించుచు వచ్చి యింద్రప్రస్థపురసమీపంబున. 209

ప్రతిపదార్హం: ఇట్టు+ఇ౦ద్రప్రప్ట, పురంబునకు; అభిముఖుండు+ఐ= ఎదురు ముఖం కల వాడై- అంటే ఇంద్రప్రస్టపురంవైపు పయనించిన వాడ్టై; ఆనర్తక, దేశంబులకున్‌; చని= వెళ్ళి; అందు; ముంద; ముకుంద, గ్రేషితులు+అయిన= శ్రీకృష్ణునిచే పంపబడిన వాళ్ళయిన; దాశార్హ్హ, వీరులతోన్‌= దశార్హునివంశానికి సంబంధించిన వీరులతో; అగణ్య+అరణ్యంబులు= లెక్కించటానికి సాధ్యం కానన్ని అడవులు; గడచుచున్‌= దాటుతూ; పుణ్య, తీర్ధంబులన్‌; ఆడుచు= స్నానమాడుతూ; నానా జనపదంబుల= అనేక గ్రామాలలో; విహరించుచు; వచ్చి; ఇం(ద్రప్రస్త, పుర. సమీపంబున.

ఆదిపర్వము - అస్టమాశ్వాసము 851 తాత్పర్యం: ఈ విధంగా ఇంద్రప్రస్థపురం వైపు పయనించి, ఆనర్రకదేశాలకు వెళ్ళి, అక్కడ శ్రీకృష్ణుడు పంపిన దశార్హవంశ వీరులతో కలిసి లెక్కించసాధ్యంకానన్ని అడవులను దాటుతూ, పుణ్యతీర్జాలలో స్నానమాడుతూ అనేక (గ్రామాలలో విహరిస్తూ వచ్చి, ఇంద్రప్రస్థ పురానికి. సమీపంలో.

ఆ, ఘనభుజుండు నరుండు దనతొజఖ్జుపట్టుల । విశ్రమించి భువనవిశ్రుతుండు

మతిం దలంచి యాత్మహిత మగు నట్లుగా ; నిష్టమున సుభద్ర కిట్టు లనియె. 210 ప్రతిపదార్థం: ఘన, భుజుండు= దృఢ మైన భుజాలు కలవాడు; భువన, విశ్రుతుండు= (ప్రపంచమంతటా ప్రసిద్ధి కెక్కినవాడు; నరుండు; తన, తాజ్జుపట్టుల= తన ఆవులమంద లున్నచోట; విశ్రమించి అలసట తీర్చికొని; మతిన్‌= మనస్సులో; తలంచి= ఆలోచించి; ఆత్మహితము+అగునట్టుగాన్‌= తనకు మేలు కలిగేటట్టుగా; సుభద్రకు; ఇష్టమున= ్రీతితో; ఇట్టులు+అనియె, తాత్పర్యం: బల మైన భుజాలు కలవాడు, (ప్రపంచంలో ప్రసిద్ధికెక్కినవాడు అయిన అర్జునుడు తన ఆవులమంద లున్నచోట విశ్రమించి, తనకు మేలు కలిగేటట్టుగా ఆలోచించి ప్రియమార సుభద్రతో ఇట్లా అన్నాడు. విశేషం: తాజ్టుపట్టు అంటే ఆలమంద. ఆలమందలు సామాన్యంగా ఊరి పొలిమేరలలో ఉంటాయి. అర్జునుడు తన'తొజ్టుపట్టుల' విశ్రమించా డనగా ఇంద్రప్రస్థ పట్టణపు పాలిమేరలకు చేరి విశ్రమించా డని భావం, ఇక మిగిలింది ఇంద్రప్రస్థపుర ప్రవేశమే. మూలంలో పి.పి.యస్‌.శాస్రిగారి ప్రతిలో “క్రోశమాత్రేపురస్యాసీత్‌ గోష్టం పార్థస్యశోభనం” అని ఉన్నది.

వ. “మన మివ్విధంబునం జనునప్పుడు నిన్ను జూచి ద్రుపదరాజపుత్రి యప్రియంబులు వలుకునో; యప్పరమను పతివ్రతపలుకు నిక్కునం బగుం గావున, నీవేకతంబ గోపాలబాలికలతో ముందల నరిగి యక్కోనులిం గమ” మని పనిచిన సుభద్రయు నిజేశ్వరుపంచిన మార్గంబున నింద్రప్రస్థపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మొక్కిన. 211

పతిపదార్హం: మనము; ఈ ; ప

తురు వయం “ఎధంబునన్‌, చను, అప్పుడు= వెళ్ళేటప్పుడు; నిన్నున్‌; చూచి; ద్రుపద, రాజ, పుత్రి= ద్రుపదరాజుయొక్క

ం ట్‌ ల రన మైన మాటలు; పలుకునో= అంటుందో ఏమో; ఆ+పరమ, పతి(వ్రత, పలుకు; నిక్కువంబు=

కోమలిన్‌ వున; బవు; ఎకతంబ= ఒక్కదానివే, ప్రత్యేకంగా; గోపాల, బాలికలతో= గొల్లపిల్లలతో; ముందణన్‌; అరిగి= వెళ్ళి; ఆ+ కా అ ణ లా

కా ఆ న్‌ు (ద్రౌపదిని; కనుము= చూడుము; అని; పనిచిన= ఆజ్ఞాపించగా; సుభద్రయు; నిజ+ఈళశ్వరు,

0 9 ౯ న

ర్గంబు, తన భర్త ఆజ్ఞాపించిన విధంగా; ఇంద్రప్రస్థ పురంబునకున్‌; పోయి; కుంతీదేవికి; (ద్రౌపదికి; మొక్కిన.

తాత్సర్యల: 'మనం ఈ విధంగా కలిసి వెళ్ళితే నిన్ను చూచి (ద్రౌపది పరుష వాక్యాలు పలుకుతుం దేమో! ఆ

పరమ పతి(వ్రత పలుకు నిజ మవుతుంది. అందువలన నీవు (ప్రత్యేకంగా గోప బాలికలతో కలిసి ముందుగా వెళ్ళి

ఆమెను చూడుము' అని ఆజ్ఞాపించగా - సుభద్ర తన భర్త ఆజ్ఞాపించిన విధంగానే ఇంద్రప్రస్త పురానికి వెళ్ళి కుంతీదేవికి, (ద్రౌపదికి 'మైక్కగా.

విశేషం: సామాన్యంగా ఏ ఇల్హాలుకూడా తన మగడు మరొక కాంతను వెంటబెట్లుకొని రావటాన్ని సహించదు కదా! అందువలననే

స! అర్జునుడు సుభద్రకు ఆ ఉపాయం చెప్పాడు. దక్షిణనాయకులకు ఈ దూరదృష్టి ఉపాయజ్ఞత ఉండక తప్పదు. కొన్ని భారతప్రతులలో 'కని యడుగులం బడు మని" అర్జునుడు సుభద్రకు చెప్పినట్టు కూడా ఉన్నది.

852 త్రీనుదాంధ్ర నుహాభారతము తే “పంకజాక్షి! నీపతి ప్రతిపక్షవీర । విజయుం డయ్యెడు; నీవును వీరపుత్ర జనని వగు” మని దీవించె సంతసంబు । తోడ వసుదేవపుత్రి నాద్రుపదపుత్రి. 212 ప్రతిపదార్హం: పంకజ+అక్షి= పద్మాలవంటి కన్నులు కలదానా! నీ, పతి= నీయొక్కభర్త; (ప్రతిపక్ష వీర విజయుండు= శత్రుపక్షవీరులను జయించేవాడు; అయ్యెడు= అగుగాక! నీవును= నీవుకూడా; వీర, పుత్ర జననివి= వీరు డైన పుత్రునికి తల్లివి- అనగా వీరమాతవు కమ్ము; అని; ఆ, (ద్రుపద, పుత్రి ఆ (ద్రుపదరాజు కూతురు- ద్రౌపది; వసుదేవ పుత్రిన్‌= వసుదేవుని కూతురైన సుభద్రను; సంతసంబుతోడ; దీవించె. తాత్పర్యం: పద్మాలవంటి అంద మైన కన్నులు కలదానా! నీ భర్త శత్రుపక్ష వీర విజయుడు అగు గాక! నీవు కూడా వీరమాతవు అగుదువు గాక! అని ఆ (ద్రౌపది సంతోషంతో సుభద్రను దీవించింది. విశేషం: విజయుడు అనే పదం ఈ సందర్భంలో విశేషార్జాన్ని సాధించింది. నీ భర్త శత్రు పక్షవీరులను జయించే వా డగు గాక- అనే అర్ధంలో (ద్రౌపది ఆ పదాన్ని ప్రయోగించినా, అర్జునునికి విజయుడు అనే పేరు ఉండటం వలన- నీ భర్త శత్రుపక్ష వీరులను జయించే అర్జును డగుగాక అనే అర్ధంకూడా ఇక్కడ విశేషించి వ్యక్త మవుతున్నది. 'అప్పరమ పతి(వ్రత పలుకు నిక్కువం బగు” అని అర్జునుడు అంతకు ముందే సుభద్రతో అన్నట్టు- (ద్రొపది తెలిసి పలికినా, తెలియక పలికినా సుభద్రకు విజయుడే భర్త అయ్యాడు. అంటేకాక 'వీరపు.త్ర జననీ వగుము' అని దీవించింది. మున్ముందు ఆమె అభిమన్యునివంటి వీరాగ్రేసరుణ్ణి కని వీరమాత ళా జౌతుంది. ఇది భావికథార్హ వ్యంజకమైన పతాకస్టానం. వు ఇట్లు ద్రోవదిచేత దీవనలు సేకొని కుంతీదేవియొద్ద సుభద్ర యున్నంత; నట యర్దునుండును నసంఖ్యాకదాశార్దసైన్యసమేతుం డై యనేకబ్రాహ్మణాశీర్వాదంబు లెసంగ నింద్రప్రస్థపురంబుం బ్రవేశంబుసేసి ధౌమ్యునకు ధర్మరాజునకు భీమునకుం గుంతీదేవికి మొక్కి తనకు మొక్కిన కవలం గౌ(గిలించుకొని పరమానందంబున నుండు నంత. 213 ప్రతిపదార్థం: ఇట్టు; (ద్రోవదిచేత; దీవెనలు; చేకొని; కుంతీదేవి, ఒద్ద; సుభద్ర; ఉన్నంతన్‌; అట; అర్జునుండును: అసంఖ్యాత, దాశార్హ సైన్య, సమేతుండు+ఐ= లెక్కింప సాధ్యంకాని దాశార్దసైన్యంతో కూడుకొన్న వా డై; అనేక, 'బ్రాహ్మాణ+ఆశీర్వాదంబులు: ఎసంగన్‌= ఆతిశయిల్లగా; ఇంద్రప్రస్టః పురంబున్‌; ప్రవేశంబు; చేసి; ధామ్యునకు; ధర్మరాజునకు; భీమునకున్‌; కుంతీదేవికి; (మొక్కి; తనకు; మొక్కిన; కవలన్‌= నకులసహదేవులను; కౌంగిలించుకొని; పరమ+ఆనందంబునన్‌; ఉండు, అంత. తాత్పర్యం: ఈ విధంగా సుభద్ర (ద్రౌపదిచేత దీవెనలు పొంది కుంతీదేవి దగ్గర ఉండగా, అర్జునుడు అపరిమిత జ మైన దాశార్హసైన్యంతో, పెక్కుమంది బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో ఇంద్రప్రస్థపురంలో ప్రవేశించి తమ పురోహితు డైన ధౌమ్యునికి, అన్న లైన ధర్మజ భీములకు, తల్లి కుంతీదేవికి (మొక్కి, తనకు మొక్కిన తమ్ములు నకుల సహదేవులను కౌగిలించుకొని పరమానందంతో ఉండగా. క్ర చిలియలు మఅజందియు. జనియి। మమ్ముల నింద్రప్రస్థనగరమున నభిమతబం ధులయొద్ద నున్నవా రని । జలశయనుండు విని కరంబు సంతుష్టుం దై, 214 ప్రతిపదార్థం: చెైలియలు= చెల్లెలు; మజందియున్‌; చని= వెళ్ళి; ఇమ్ములన్‌= సుఖంగా; ఇం(ద్రప్రస్ట, నగరమునన్‌; అభిమత, బంధుల, ఒద్దన్‌= ఇష్ట మైన బంధువులదగ్గర; ఉన్నవారు; అని; జల, శయనుండు= నీటిమీద పవళించేవాడు- శ్రీమహావిష్ణువు- శ్రీకృష్ణుడు; విని; కరంబు= మిక్కిలి; సంతుష్టుండు+ఐ= సంతోషం పొందినవా డై, తాత్పర్యం: చెల్లెలు సుభద్ర, మరది అర్జునుడు ఇంద్రప్రస్థ పురానికి వెళ్ళి, సుఖంగా ఇష్టమైన బంధువులతో కలిసి ఉన్నా రని విని- శ్రీకృష్ణుడు సంతోషించినవాడై.

ఆదిపర్వము - అష్టమాశ్వానము 853 శ్రీకృష్ణబలదేవాదులు పాండవులకు. గౌనుకలు తెచ్చియిచ్చుట. (సం. 1-213-23) సీ. బలదేన సాత్యకి ప్రద్యున్ను వసుదేవు । లాదిగా బెరసిన యాదవాగ్ర గణ్యులుం దాను నగణ్యమహావస్తు । వాహనంబులు గొని వాసుదేవుం దనుజకు నరణమీ నర్జితోం జనుదెంచె; । హరి రాక యెజింగి ధర్మాత్మజుండు గరము గారవమునం గవలను గృష్టున । కెదురు పుత్తెంచిన నింద్రలీల ఆ. నిందువంశవిభు( డుపేంద్రు డింద్రప్రస్థ ; పురము సొచ్చె నతివిభూతి మెఅసి యనుజవనరులతోడ నంత. బ్రత్వుద్దతుం । డై యుధిష్టిరుండు హర్ష మెసంగ. 215 (ప్రతిపదార్థం: వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; అనుజకున్‌= చెల్లెలికి. సుభద్రకు; అరణము= ఆడపడుచులకు అత్తవారింటికి పంపినపుడు ఇచ్చే ధనం, ఇచ్చే కానుకలను; -ఈన్‌= ఇవ్వటానికి; అగణ్య, మహా, వస్తు వాహనంబులు= లెక్కింపసాధ్యం కానన్ని గొప్పవస్తువులు, వాహనాలు; కొనిజఐ తీసుకొని; బలదేవ, సాత్యకి, (ప్రద్యుమ్న, వసుదేవులు+ఆదిగా= బలరాముడు, సాత్యకి, (ప్రద్యుమ్నుడు, వసుదేవుడు మొదలుగా; బెరసిన= కూడిన; యాదవ+అ(గ్రగణ్యులు= యాదవ్రేష్టులు; తాను; అర్థితోన్‌= వేడ్కతో; చనుదెంచె= వచ్చాడు; ఇందువంశ విభుండు= చం(ద్రవంశపురాజు; ధర్మ+ఆత్మజుండు= ధర్మునియొక్కకుమారుడు- ధర్మరాజు; హరి, రాక= శ్రీకృష్ణునిరాక; ఎఆింగి= తెలుసుకొని; కరము= మిక్కిలి; గారవమునన్‌; ఇంద్రలీలన్‌= దేవేంద్రునివలె; కవలను= నకుల సహదేవులను; కృష్ణునకు; ఎదురు, పుత్తెంచినన్‌= ఎదురు పంపగా; ఉపేంద్రుండు= శ్రీకృష్ణుడు; ఇంద్రప్రస్థ, పురము; చొచ్చెన్‌= ప్రవేశించాడు; అంతన్‌= అప్పుడు; యుధిష్టిరుండు= ధర్మరాజు; అతి, విభూతి= మిక్కిలి ఐళ్ళర్యంతో; మెలసి= ప్రకాశించి; అనుజ, వరులతోడః= ్రేష్టు లైన తమ్ములతో కూడా; ప్రతి+ఉద్గతుండు+ఐ= ఎదురేగినవా డై; హర్షము= సంతోషం; ఎసంగ= అతిశయిల్లగా. తాత్పర్యం: శ్రీకృష్ణుడు చెల్లెలికి అరణంగా ఇవ్వటానికి లెక్కింప సాధ్యం కానన్ని గొప్ప వస్తువులను, వాహనాలను తీసికొని - బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, వసుదేవుడు మొద లైన యాదవకులశ్రేష్టులతో కలిసి ఎంతో సంతో పంచో వచ్చాడు. చంద్రవంశ ప్రభు వైన ధర్మరాజు శ్రీకృష్ణునిరాక తెలిసికొని మిక్కిలి గౌరవంతో, దేవేంద్ర విలాసం , నకుల సహదేవులను ఎదురు పంపగా, ఆయన ఇంద్రప్రస్థ పురంలో ప్రవేశించాడు. అప్పుడు యుధిస్టిరుడు (్రేష్టు లైన తమ్ములతో తాను కూడా ఎదురేగి ఆనందాతిశయంతో. వ, వసుదేవాది యాదవవృద్ధుల కెల్ల మొక్కి బలదేవ వాసుదేవ సాత్యకి సారణ ప్రద్యున్నూదుల నుచితప్రెయ పూర్వకంబున సత్భతులం జేసిన, 216 ప్రతిపదార్జం; వసుదేవ+ఆది= వసుదేవుడుమొద లైన; యాదవ, వృద్దులకు+ఎల్ల; మొక్కి; బలదేవవాసుదేవ, సాత్యకి, సారణ, (ప్రద్యుమ్న+ఆదులన్‌= బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి, సారణుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వారిని; ఉచిత, ప్రియ, పూర్వకంబున= (ప్రేమతో తగినరీతిగా; సత్కృతులన్‌+చేసిన= సమ్మానించగా. తాత్సర్యం: వసుదేవుడు మొదలైన యాదవవృద్దులకు నమస్కరించి- వాసుదేవుడు, సాత్యకి, సారణుడు, ప్రద్యుమ్నుడు మొదలైనవాళ్ళను 'ప్రియమార గౌరవింపగా, ఉ. ఆనకదుందుభిప్రభృతియాదవులుం గురుముఖ్యులున్‌ మృదం గానకదుందుభుల్‌ సెలంగ నత్యనురాగముతో నిరంతర శ్రీనుతు లొప్ప నుత్సవము సేసిరి సప్తదినంబు లిష్టస మ్మానములన్‌ మహీసురసమాజసమీహితపూజనంబులన్‌, 217

(ప్రతిపదార్థం: ఆనకదుందుభి= వసుదేవుడు; ప్రభృతి= మొదలైన; యాదవులున్‌; కురు, ముఖ్యులున్‌= కురువంశ్రేష్టులు; మృదంగ+ఆనక్క దుందుభుల్‌, చెలగన్‌= మద్దెలలు, తప్పెటలు, భేరులు, మోగుతుండగా; నిరంతరశ్రీ నుతులు= ఎడతెగనిసంపద పొగడ్తలు; ఒప్పున్‌; ఇష్ట సమ్మానములన్‌= ఇష్టము లైన గౌరవాలచేత(బంధువులకు); మహీసుర, సమాజ, సమీహిత, పూజనంబులన్‌= (బ్రాహ్మణ సమూహంచే కోరబడిన పూజలచేత; అతి+అనురాగముతో= మిక్కిలిట్రీతితో' సప్తు దినంబులు= ఏడురోజులు, ఉత్సవము; చేసిరి. తాత్సర్యం: వసుదేవుడు మొద లైన యాదవులు, కురువంశ (ప్రముఖులు- మద్దెలలు, తప్పెటలు, నగారాలు (మైగుతుండగా - అంతులేని సంపద, స్తోత్రాలు శోభిల్లగా- బంధువులను గౌరవించి, 'బ్రాహ్మాణ సమూహాన్ని కోరుకొన్న విధంగా పూజించి ఎంతో ప్రీతితో ఏడు రోజులు పండుగ చేశారు. విశేషం: వసుదేవుడు దేవామీఢునికి, మారిషకు పుట్టిన కుమారుడు. ఇతడు పుట్టేటప్పుడు ఆకాశంలో దుందుభులు మోగాయి అందువలన ఇతనికి ఆనకదుందుభి అనే పేరుకూడా కలిగింది. వసుదేవునికి రోహిణియందు బలరాముడు గదుడు, సారణుడు మొదలైనవాళ్ళు జన్మించారు. దేవకియందు కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రుడు, సంకర్షణుడు, శ్రీకృష్ణుడు మొదలైనవాళ్ళు జన్మించారు. వ. అంత. 218 తాత్పర్యం: అప్పుడు. క. _ నిరుపమపరార్థ్వరుచిసుం! దరరత్నానకులశోభితము లగువానిన్‌ వరదుండు సహస్రసంఖ్యా । భరణంబులం బార్జునకు సుభద్రకు నిచ్చెన్‌. 219 ప్రతిపదార్థం: వరదుండు= వరాలను ఇచ్చేవాడు- శ్రీకృష్ణుడు; నిరుపమ, పరార్థ్య, రుచి, సుందర రత్న+ఆవళుల= సాటిలేని ఉత్తమకాంతిచే అంద మైన రత్న సమూహాలతో; శోభితములు+అగు, వానిన్‌= (ప్రకాశిస్తున్న వాటిని; సహ(్రసంఖ్య+ఆభరణంబులన్‌= వేయి సొమ్ములను; పార్టునకువ అర్జునునికి; సుభద్రకున్‌; ఇచ్చెన్‌. తాత్పర్యం: శ్రీకృష్ణుడు - సాటిలేని (్రేష్టమైన కాంతితో, అందమైన రత్నసమూహాలతో ప్రకాశించే వెయ్యి ఆభరణాలను అర్జునునికి, సుభద్రకు ఇచ్చాడు. వ, మటియును. 220 తాత్సర్యం: అంతేకాక. సీ. అవిరళక్షరితదానార్థగండస్థల : గజిసహస్రంబును, గనకరత్న రచిత మై తురగసారథిసహితం బైన ; రథసహస్రంబును, రమ్యభూష ణాలంకృతస్తీసహస్రంబుం గాంచన । శిజకాసహస్రంబు! జిత్రలలిత గతి నొప్పు నేనూబుగాడిదలను, సింధు । బాహ్లికకాంభోజపారసీక ఆ. జాత మైన తురగశతసహస్రము, లక్ష । గోధనంబు, నధికఘోరవీర దర్పయుక్తు లైన దశలక్షదాశార్హ । వరుల నరణ మిచ్చె వామనుండు., 2241 ప్రతిపదార్థం: అవిరళ క్షరిత, దాన+ఆగర్ట, గండస్టల, గజ్క సహ(స్రంబును= ఎడతెగకుండా కారుతున్న మదజలంతో తడిసిన వెక్కిళ్ళు గల ఏనుగులు వేయింటిని; కనక, రత్న, రచితము+ఐ= బంగారంతో, రత్నాలతో నిర్మింపబడి; తురగ, సారధి

ఆదిసర్వము - అష్టమాశ్వాసము 855 సహితంబు+ఐనజ= గు(ర్రాలతో, సారథితో కూడుకొన్న; రథ, సహ(్రంబును= రథాలు వెయ్యింటిని; రమ్య, భూషణ+అలంకృత, ప్రీ సహస్రంబున్‌= అందమైన ఆభరణాలచే అలంకరింపబడిన (స్త్రీలను వెయ్యిమందిని; కాంచన, శిబికాా సహస్రంబును= బంగారుపల్లకీలు వెయ్యింటిని; చిత్ర, లలిత, గతిన్‌= చిత్రమూ, మనోహరమూ అయిన నడకతో; ఒప్పు; ఏనూయి, గాడిదలను= ఐదువందల గాడిదలను; సింధు, బాహ్లిక, కాంభోజ, పారసీక, జాతము+ఐనజ= సింధు బాహ్లిక కాంభోజ పారసీక దేశాలలో పుట్టిన; తురగ, శత, సహ(స్రము= గుర్రాలు నూరువేలను; లక్ష గోధనంబున్‌; అధిక, ఘోర, వీరు దర్స, యుక్తులు+ఐన= మిక్కిలిభయంకరమైన వీరగర్వంచే కూడుకొన్న; దశ, లక్ష దాశార్హ వరులన్‌= పది లక్షలమంది దాశార్హ, వీర శ్రేష్టులను; వామనుండు= శ్రీకృష్ణుడు: అరణము+ఇచ్చెను= అత్తవారింటికి పంపిన ఆడపడుచుకు ఇచ్చే కానుకగా ఇచ్చాడు. తాత్పర్యం: ఎడతెగకుండా కారుతున్న మదజలంచేత తడిసిన చెక్కిళ్ళు గల ఏనుగులు వెయ్యింటిని, బంగారుతో రత్నాలతో రూపొంది, గుర్రాలతో సారథితో కూడుకొన్న రథాలు వెయ్యింటిని, అందమైన ఆభరణాలతో అలంకరించిన స్త్రీలను వెయ్యిమందిని, బంగారు పల్లకీలను వెయ్యింటిని, చిత్రమై అందమైన నడకతో ఒప్పే గాడిదలు అయిదు వందలను, సింధు బాహ్హిక కాంభోజ పారసీక దేశాలలో పుట్టిన గుర్రాలను నూరు వేలను, ఆవులు ఒక లక్షను, మహాభయంకర మైన వీర గర్వం కల దాశార్హవీరులను పది లక్షల మందిని- శ్రీకృష్ణుడు అరణంగా ఇచ్చాడు. క. క్రనుమునను గొంతిదేవిని; యమనందను భీము. గవల నాద్రౌపది ను

త్తమరత్నాభరణాదుల । నమరంగ వేర్వేల నెయ్యుం డయి పూజించెన్‌. 222 ప్రతిపదార్థం: (కమమునను= వరుసగా; కొంతిదేవిని;ి యమ, నందనుజ ధర్మరాజును; భీమున్‌; కవలన్‌= నకుల సహదేవులను;

ఆ, ద్రౌపదిన్‌: ఉత్తమ, రత్న+ఆభరణాదులన్‌= (శ్రేష్టము లైన రత్నాభరణాలతో; వేరు+వేర: నెయ్యుడు+అయి= స్నేహితు డై;

ఆమరంగజ= ఒప్పుగా? పూజించెన్‌.

తాత్పర్యం: (క్రమంగా కుంతిదేవిని, ధర్మరాజును, భీముడిని, కవలలను, (ద్రౌపదిని (శ్రేష్టా లైన రత్నాభరణాలతో

వేరువేరుగా పూబించాడు.

వ. మజలియు బలదేవాదియాదవముఖ్యు లెల్ల సుభద్రార్డునులం బూజించి, పాండవులచేతం బ్రతిపూజతు లై ద్వారనతికిం జని; రుపేంద్రుం డింద్రనందనుతోడి యిష్టవినోదంబుల నింద్రప్రస్టపురంబున నుండె నంత.223 రం: ; ;

ప్రతిపదార్థం వలయు: బలదేవ+ఆది; యాదవ, ముఖ్యులు+ఎల్ల= బలరాముడు మొద లైన యాదవ ప్రముఖులంతా;

సుభేద్రాశఅష్ట ఏల * పొలం పాండవులచేతన్‌; (ప్రతిపూజితులు+ఐ= ఎదురు పూజింపబడినవా ళ్ళయి; ద్వారవతికిన్‌: చనిరి=

వెళ్ళారు; ఉఎం( ౦డు= వ్రుకృష్ణుడు; ఇం(ద్ర, నందనుతోడ్పి= అర్జునునితో; ఇష్ట వినోదంబులన్‌; ఇంద్రప్రస్థ పురంబునన్‌; ఉండెన్‌; అంత.

తొత్చర్యం; బలరాముడు మొద లైన యాదవ ప్రముఖులంతా సుభద్రార్దునులను పూజించి, పాండవులచేత బదులు

పూజలు అందుకొని ద్యారవతికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు అర్జునునితో కలిసి ఇంద్రప్రస్థంలో ఇష్ట వినోదాలలో ఉన్నాడు.

తరువాత,

856 శ్రీమదాంధ్ర మహాభారతము అభిమన్యు ప్రభృతుల జననము (సం- 1-213-58)

ఉ. ధన్యుల కా సుభద్రకు శతక్రతు పుత్తున కుద్ధవించె స

మ్మాన్య యశుండు పుత్తుం డభిమన్యుండు వైన్యనిభుం డనన్యసా

నూన్యపరాక్రమప్రబలమాన్యుండు పుణ్యచరిత్రుం. డన్యరా

జన్యభయంకరుండు రణశౌర్యుండు పాండవనంశకర్త యై. 224 ప్రతిపదార్హం: ధన్యులకు= పుణ్యవంతులకు; ఆ,సుభద్రకు; శత(క్రతు, పుత్రునకు= దేవేంద్రుని కుమారునకు- అర్జునునకు; సమ్మాన్య, యశుండు= మిక్కిలి పూజింప తగిన క్తీర్తి కలవాడు; వైన్య, నిభుండు= పృదుచక్రవర్తితో సమాన మైనవాడు; అనన్య సామాన్య, పరాక్రమ, (ప్రబల, మాన్యుండు= ఇతరు లెవ్వరికీ లేని పరా(క్రమాధిక్యంచేత గౌరవించదగినవాడు; పుణ్య, చరిత్రుండు= పవిత్ర మైన నడవడిక కలవాడు; అన్య, రాజన్య, భయంకరుండు= ఇతర రాజులకు భయాన్ని కలిగించేవాడు; రణ, శౌర్యుండు= యుద్ధంలో శూరత్వం కలవాడు; పుత్రుండు; అభిమన్యుండు; పాండవ, వంశ, కర్తశఐ= పాండవ వంశాన్ని నిలిపేవాడై; ఉద్భవించెజ జన్మించాడు. తాత్సర్యం: పుణ్యవంతు లైన సుభద్రార్దునులకు- మిక్కిలి పూజింపదగిన కీర్తి కలవాడు, పృథుచక్రవర్తితో సమాన మైనవాడు, ఇతరు లెవ్వరికీ లేని పరా(క్రమాధిక్యంచేత గారవించదగినవాడు, పవి(త్ర మైన నడవడిక కలవాడు, ఇతర రాజులకు భయాన్ని కలిగించేవాడు, యుద్ధంలో శౌర్యం కలవాడు అయిన కుమారుడు- పాండవ వంశం నిలిపే వాడై జన్మించాడు. విశేషం: అభిమన్యుడు సుభద్రార్జునులకు పుట్టిన కొడుకు. అతడు పుట్టినప్పుడు ఆకాశవాణులు పలుకలేదు. దేవతలు పూలవానలు కురిపించలేదు. అయితే, అతని జీవితంలో (క్రమంగా ఆవిష్కృత మయ్యేవీ, భావికధాసూచకాలూ అయిన సార్ధక విశేషణాలు నన్నయ వాడి ప్రసన్న కథాకలితార్హయోజనం సాధించాడు. అతడు పుట్టుకతోనే పృథుచక్రవర్తి వంటివాడు- పరాక్రమవంతుడు, పుణ్యచరిత్రుడు, శత్రుభయంకరుడు, వంశకర్త- అనే విశేషణాలు అభిమన్యుని జీవితచరిత్రకు సూచకాలు. సుభద్రార్జునులు నిజంగా ధన్యులు! చ. సుతజననోత్సవంబున విశుద్ధయశుందు యుధిష్టిరుండు సం

భృతహృదయప్రమోదు డయి పెంపున నిచ్చె సువర్ణభూషణ

ప్రతతులు గోధనాయుతము బ్రాహ్మణముఖ్యులకున్‌ నిరంతర

వ్రతులకు వేదవేదులకు వారిజసంభవునట్టివారికిన్‌. 225 ప్రతిపదార్థం: సుత, జనన+ఉత్సవంబున= కుమారుడు పుట్టినపుడు చేసే పండుగలో; విశుద్ధ యశుండు= స్వచ్చమైన కీర్తి కలవాడు; యుధిస్టిరుండు;? సంభృత, హృదయ, ప్రమోదుండు+అయిజ= నిండిన హృదయానందం కలవాడై వారిజ, సంభవు, అట్టివారికిన్‌= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవునివంటివారికి; వేద, వేదులకు= వేదాలు తెలిసినవారికి- అంటే వేదపండితులకు; నిరంతర, (వ్రతులకు= ఎల్లప్పుడు (వ్రతాలు చేసేవారికి; బ్రాహ్మణ, ముఖ్యులకున్‌= (బ్రాహ్మణ ్రేష్టులకు; సువర్హ, భూషణ, ప్రతతులు= బంగారు ఆభరణాల సమూహాలు; గోధన+అయుతముజ= గో ధనం పదివేలు- అంటే పదివేల గోవులు; పెంపునన్‌= సమృద్ధిగా; ఇచ్చె. తాత్పర్యం; అభిమన్యుడు పుట్టినపుడు జరిపిన పండుగలో స్వచ్చ మైన క్షీర్తి గల ధర శరాజు- మహానందంతో (బ్రహ్మదేవునివంటివాళ్ళు వేదవేత్త లైనవాళ్ళు, ఎల్లప్పుడు (వ్రతాలు చేసేవాళ్ళు అయిన బ్రాహ్మణ శ్రేష్టులకు బంగారు ఆభరణాలు, పదివేల గోవులు సమృద్దిగా ఇచ్చాడు, వ. ఇ ట్లుదయించిన యభిమన్యుండు దల్లిదంద్రులకు సకల జనులకు నానందం బొనరించుచు ధౌమ్య నిర్మిత

జాతకర్మ చౌలోపనయనుం డయి పెరుంగుచు. 226

ఆదిపర్వము = అష్టమాశ్వానము 857 ప్రతిపదార్థం: ఇట్టు+ఉదయించిన; అభిమన్యుండు; తల్లిదండ్రులకు; సకల, జనులకున్‌: ఆనందంబు; ఒనరించుచు= కూర్చుచు; ధౌమ్య, నిర్మిత, జాతకర్మ, చౌల+ఉపనయనుండు= పురోహితు డైన ధౌమ్యునిచే చేయబడిన, జాతకర్మ, ఉపనయనం కలవాడు; అయి; పెరుగుచు. చతాచ్చర్యం: అట్టా జన్మించన అభిమన్యుడు తల్లిదండ్రులకూ, జనులకు ఆనందం కలిగిస్తూ, ధౌమ్యుడు జాతకర్మను, ఉపనయనాన్నీ చేయగా, పెరుగుతూ. విశేషం: జాతకర్మ, చౌలం, ఉపనయనం- షోడశకర్మలలోనివి. జాతకర్మ- పుట్టినప్పుడు చేసే క్రియ; చౌలం- జుట్టుపెట్టి తలవెంట్రుకలు తీయటం; ఉపనయనం- వేదవిద్యాభ్యాస యోగ్యతను కలిగించే సంస్కారం. మత్తకోకిల.

ఆదింగోలెను గృష్టుచే దయ నావృతుం డయి ధౌమ్యుతో

వేద మంగయుతంబుగాం జదివెన్‌; ధనంజయుతో ధను

ర్వేద మిమ్ముగ నభ్వసించెం బ్రవీరవైరిపతాకినీ

భేదమార్గము లెల్ల నేద్దై నభేద్యవిక్రముసంపదన్‌. 227 ప్రతిపదార్థం: అదిన్‌+కోలెను= మొదటినుండి; కృష్ణుచే; దయన్‌= దయతో; ఆవృతుండు+అయి= చుట్టబడినవా డై; ధౌమ్యుతో; వేదము: అంగ, యుతంబుగాన్‌= అంగాలతోకూడా; చదివెన్‌: ధనంజయుతో= అర్జునునితో; ఇమ్ముగన్‌= విరివిగా; ధనుర్వేదము; అభ్యసించెన్‌= నేర్చుకొన్నాడు; అభేద్య, విక్రమ, సంపదన్‌= ఓడింప సాధ్యంకాని పరాక్రమం అనే సంపదచే; ప్రవీర, వైరి, పతాకినీ, భేద, మార్గములు+ఎల్ల= మిక్కిలిశూరు లైన శత్రువుల సైన్యాలను భేదించే విధాలన్నింటినీ; నేర్చె. తాత్పర్యం: మొదటినుండి అభిమన్యుడు - శ్రీకృష్ణుని దయ నిండుగా కలిగి పాండవపురోహితుడైన ధౌమ్యునిదగ్గర ఆరు అంగాలతోకూడా వేదవిద్యను చదివాడు. తండ్రి అర్జ్హునునిదగ్గర విరివిగా ధనుర్వేదాన్ని అభ్యసించాడు. అభేద్య మైన పరా(క్రమ సంపదతో (ప్రబల శత్రుసైన్యాలను భేదించే విధాలన్నింటినీ నేర్చుకొన్నాడు. విశేషం: వేదాంగాలు- శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. మత్తకోకిల వృత్తలక్షణం.చూడు. ఆది. 1153 విశీషం. అభిమన్యుడు "కృష్ణునిదయనావృతుడై' పెరిగెనని చెప్పటం సార్ధకం. సారమతు లైనవాళ్ళు అభిమన్యు మరణానంతరం అతని సంతానాన్ని రక్షించటంలో చూపించే దయ ఇక్కడ వస్తుధ్వని, వ, _ అంత ధ్రుపదరాజనందనయుం గ్రముంబునం బాందురాజనందనులవలనం బ్రతివింధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి

శతానీక శ్రుతసేను లనువారిం బంచోపపాండవులను సుపుత్తులం బడసిన. 228 ప్రతిపదార్థం: అంత= తరువాత; ద్రుపదరాజ, నందనయున్‌= [ద్రుపదరాజుకూతురుకూడా- అంటే (ద్రౌపదికూడా; క్రమంబునన్‌= వరుసగా; పాండురాజ, నందనులవలనన్‌= పాండురాజుకుమారులవలన- పాండవులవలన; ప్రతివింధ్య, శ్రుతసోమ, శ్రుతకీర్తి శతానీక, శ్రుతసేనులు+అను, వారిన్‌; పంచ+ఉపపాండవులు+అను= ఐదుగురు ఉపపాండవులు అనే; సుపుత్రులన్‌= మంచికుమారులను; పడసీనజ పొందగా. తొత్సర్యం: తరువాత (ద్రౌపది కూడ వరుసగా పాండవులవలన అయిదుగురు ఉపపాండవులు అనే సుపుత్రులను పొందింది. ఆ అయిదుగురు - ప్రతివింధ్య, (శ్రుతసోమ, శ్రుతకీర్తి, శతానీక, శ్రుతసేనులు.

858 శ్రీమదాంధ్ర మహాభారతము విశేషం: ఉపపాండవులు- ప్రతివింధ్యుడు (ద్రౌపదికి ధర్మరాజువలన జన్మించినవాడు; (శ్రుతసోముడు భీమునివలన జని శైంచినవాడు, శ్రుతకీర్తి అర్హనునివలన జన్మించినవాడు; శతానీకుడు నకులునివలన జన్మించినవాడు; శ్రుతసేనుడు సహదేవునివలన జన్మించినవాడు క సుతవంతు లయి విశుద్ధ । శ్రతనయవంతు లయి పాండుసుతు లతులగుణా

న్వితులు జగజ్జిన నుత వి ; శ్రుతులు మహారాజ్యలీల సుఖ మున్నంతన్‌, 229 ప్రతిపదార్థం: పాండు, సుతులు= పాండురాజు కుమారులు- పాండవులు; సుతవంతులు+అయి= కొడుకులను కలిగినవా ళ్ళయి; విశుద్ద, శ్రుత, నయవంతులు+అయి= నిర్మల మైన విద్య, నీతి కలవాళ్ళయి; అతుల, గుణ+అన్వితులు= సాటి లేని సద్గుణాలతో కూడినవాళ్ళు; జగత్‌+జన, నుత, విశ్రుతులు= లోకంలోని జనులచే పాగడబడిన ప్రసిద్ధులు; మహా, రాజ్యలీల= మహారాజ్యవిలాసంతో; సుఖము+ఉన్నంతన్‌= సుఖంగా ఉండగా. తాత్పర్యం: పాండవులు కొడుకులను పాంది, నిర్మల మైన విద్య, నీతి కలవా ళ్ళయి, సాటిలేని సద్గుణాలతో, 'ప్రపంచ (ప్రజల ప్రశంసలు అందుకొన్న (ప్రసిద్దులై మహారాజ్య విలాసంతో సుఖంగా ఉండగా. చ. ఉరుతర దావపావక శిఖోత్కలిత శ్వసనంబులున్‌, సితే

తరగతి తీవ్రతిర్మ కరధాము సహస్రములున్‌, బహుప్రవా

హరహితనిమ్మగాతతులు నైై కడుదీర్షము లై, నిదాఘవా

సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దారుణంబు లై, 230 ప్రతిపదార్థం: నిదాఘ, వాసరములు= వేసవి కాలపు పగళ్ళు; ఉరుతర, దావ, పావక శిఖా+ఉత్కలిత, శృసనంబులున్‌= మిక్కిలిగొప్ప వైన కార్చిచ్చు మంటలతో కూడిన గాడ్పులు కలవీ; సిత+ఇతర, గతి తీవ్ర, తిగ్మ కర, ధామ, సహ(్రములున్‌= నిప్పులవలె తీక్ష్‌ణము లై సూర్య కిరణ కాంతులు వేయి కలవీ; బహు, ప్రవాహ, రహిత నిమ్నగా, తతులును+ఐ= గొప్ప ప్రవాహాలు లేని నదుల సమూహాలు కలవై; కడు, దీర్ధములు+ఐ= మిక్కిలి పొడవైన వై; దారుణంబులు+ఐ= భయంకరాలైన; సర్వ జీవులకు= అన్ని(ప్రాణులకు; అసహ్యములు+అయ్యెను= ఓర్చుకొనటానికి సాధ్యం కానివి అయ్యాయి. తాత్పర్యం: వేసవిలో పగటి పూటలు మహాతీవ్రా లైన కార్చిచ్చుమంటలతో కూడిన గాడ్పులతో నిప్పువలె తీక్ష్మా లైన సూర్య సహస్ర కిరణకాంతులతో, ప్రవాహాలు పెద్దగా లేని నదులసమూహాలతో - మిక్కిలిపొడ వైనవి, భయంకరాలైనవి, (ప్రాణులన్నింటికీ ఓర్చుకొనటానికి సాధ్యం కానివి అయ్యాయి. విశేషం: వేసవిలో పగటిపూట ప్రొద్దెక్కువ. అందువలన వేసవిలో పగళ్ళు దీర్జా లనటం. వర్ణనం స్వభావోక్తి సుందరం. ఓజోగుణభరితం. వ. అట్టి ఘర్మ దివసంబులు సహింప నోప కర్టునుం డొక్కనాండు కృష్ణున కి ట్లనియె. 231 ప్రతిపదార్థం: అట్టి; ఘర్మ, దివసంబులు= వేసవి కాలపు పగళ్ళు; సహింపన్‌+ఓపక= ఓర్చుకొనలేక; అర్జ్హునుండు; ఒక్కనాండు; కృష్ణునకు" ఇట్టు+అనియె తాత్ప్సర్యఆ: అటువంటి వేసవి కాలపు ఎండలకు తట్టుకొనలేక అర్జునుడు శ్రీకృష్ణునితో ఇట్టా అన్నాడు. చ. జలరుహనాభ! రమ్యగిరిసానువనంబుల వేంటటలాడుచున్‌

జలుపుద మీనిదాఘదివసంబుల నీవును నేను నువ్మిష

న్నలిన రజస్సుగంధి యమునాహ్రద తుంగ తరంగ సంగతా

నిలశిశిరస్థలాంతరవినిర్మితనిర్మలహర్వ్యరేఖలన్‌. 232

ఆదిపర్వము - అష్టనూశ్వానము 859 ప్రతిపదార్థం: జలరుహ, నాభ= పద్మనాభా![- ఓకృష్ణా!; నీవును; నేనున్‌; రమ్య, గిరి, సాను, వనంబుల= మనోహరా లైన కొండచరియలలోని అడవులలో; వేటలాడుచున్‌; ఉన్మిషత్‌+నలిన, రజన్‌+సుగంధి, యమునా, హద, తుంగ, తరంగ, సంగత+అనిల, శిశిర, స్టల+అంతర, వినిర్మిత, నిర్మల, హర్మ్యరేఖలన్‌= వికసిస్తున్న పద్మాలయొక్క పరాగంచే మంచివాసన కల యమునానది మడుగుయొక్క ఎత్తైన అలలతో కూడిన గాలులచేత చల్ల నైన ప్రదేశాల మధ్య గొప్పగా కట్టబడిన పరిశుద్ధ మైన మేడలయొక్క వరుసలలో; ఈ, నిదాఘ, దివసంబుల= ఈ వేసవి రోజులను; చలుపుదము= గడుపుదాము. తాత్పర్యం: శ్రీకృష్ణా! నీవూ, నేనూ మనోహరా లైన కొండచరియలలోని అడవులలో వేటాడుతూ, వికసిస్తున్న పద్మ పరాగంతో మంచివాసన గల యమునా నది మడుగుయొక్క ఎత్తైన అలల మీద గాలులచే చల్ల నైన ప్రదేశాల మధ్య, గొప్పగా నిర్మించబడి నిర్మలంగాఉన్న మేడల వరుసలలో ఈ వేసవి రోజులు గడుపుదాము. నిశ్లేషం: వేసవివేడినుండి తప్పించి శీతలపవనసుఖాల నిచ్చే పర్వతసానువులలో కట్టబడిన మేడలపై యమునానదిపైనుండి వచ్చే గాలులను అనుభవిద్దామని అర్జునుడు కృష్ణుడితో చెప్పుతున్నప్పుడు ఆయా వస్తువులవలన కలిగే సుఖాలను ధ్వనింపచేసే అక్షరరమ్యతను సంతరించటం మొదట గమనింపతగింది. ఆ గాలులనూ, ఆ మేడలనూ మనసులో రూపుకట్టేటట్టు వర్షించటంలో నన్నయ సమాధి అనే గుణాన్ని సాధించి ఆరోహ(క్రమంలో పద్యరచనచేసి భావనాసుందరంగా శ్రోత అనుభవించేటట్టు చేయటం తరువాత తెలియదగింది. అక్షరరమ్యమైన నన్నయశైలికి అద్దం పట్టే పద్యాల్లో ఇదొకటి. (సంపా.)

వ. అని పురందరనందనుండు గోవిందు ననుమతంబు వడసి మిత్రామాత్యభృత్యసమేతు లయి యిద్దబు వరిగి యథారుచి ప్రదేశంబుల విహరించుచు నొక్కనాండు ఖాండవవనసమీపంబున నొక్కచందనలతాభవన చంద్రకాంతవేదికయందు మందశీతలనురభిమారుతం బనుభవించుచు నిష్టకథావినోదంబుల నుండునంత. 233

'ప్రతిపదార్హం: అని; పురందర, నందనుండు= దేవేంద్రునికుమారుడు- అర్జునుడు; గోవిందు, అనుమతంబు= శ్రీకృష్ణునియొక్కసమ్మతిని; పడసి= పొంది; మిత్ర+అమాత్య, భృత్య, సమేతులు+అయిజ=ు స్నేహితులతో, మంత్రులతో, సవకులతో కూడుకొన్నవా ళ్ళయి; ఇద్దజున్‌: అరిగివ వెళ్ళి: యధారుచి, ప్రదేశంబుల= ఇష్ట మైనచోట్ట; విహరించుచున్‌; ఒక్కనాండు; ఖాండవ, వన, సమీపంబునన్‌; ఒక్క; చందన, లతా, భవన, చంద్రకాంత, వేదిక, అందు= మంచిగంధపు తీవల ఇంటిలోని చలువరాతి తిన్నెపై: మంద, శీతల, సురభి, మారుతంబు= మెల్లగా వీచేది, చల్లనిది, సువాసన కలది అయిన గాలిని; అనుభవించుచున్‌; ఇష్ట కధా, వినోదంబులన్‌= ఇష్టము లైన కధలతో, వినోదాలతో; ఉండు, అంత= ఉండగా.

తాత్సర్యం: అని అర్జునుడు శ్రీకృష్ణునిఅనుమతి పొంది స్నేహితులతో, మంత్రులతో, సేవకులతో కూడి వెళ్ళి,

ఇద్దరు(కృష్ణార్హునులు) ఇష్ట మైన చోట్ల విహరిస్తూ ఒక రోజు ఖాండవ వనానికి దగ్గరగా ఒక మంచి గంధపు

తీగెల ఇంటిలోని చలువరాతి అరుగు మీద కూర్చుండి- మెల్లగా వీచేది, చల్లనిది, సువాసన కలది అయిన గాలిని అనుభవిస్తూ ఇష్ట కథలతో వినోదిస్తూ ఉండగా. అన్నిదేవుండు ఖాండవసమీసమున విహరించుచున్న కృష్ణార్ణునులకడకు వచ్చుట. (సం- 1-214-29)

మాలిని.

అసితపథుండు విఫ్రుం డై మహాశ్రాంతలీలన్‌

మసృణకపిలకేశశత్తు లొప్పంగం దేజం

బెసంగ ముదముతో నయ్యిద్ధజన్‌ డాయవచ్చెన్‌

వసునిభు లగు వారిన్‌ వాసవిన్‌ వాసుదేవున్‌. 234

860 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: అసిత, పథుడు= తెల్లదికాని మార్గంకలవాడు- అస్నిదేవుడు: విప్రుండు+ఐ=ఐ బ్రాహ్మణు డై మహా శ్రాంత, లీలన్‌= మెక్కిలి బడలిక పొందిన వాని విధంగా; మసృణ, కపిల, కేశ శృశ్రులు= నును పైన గోరోజనం వంటి రంగు గల వెండ్రుకలు, మిసాలు; ఒప్పంగన్‌; తేజంబు= కాంఛి; ఎసయడ= అతిశయిల్లగా; వసు, నిభులు+అగు, వారిన్‌ వసువులు అనే దేవతలతో సమాన మైనవాళ్ళను; వాసవిన్‌= వాసవుని(దేవేంద్రుడి)కుమారుడిని- అర్జునుడిని; వాసుదేవున్‌= శ్రీకృష్ణుడిని; ఆ+ఇద్దణన్‌; ముదముతో= సంతోషంతో; డాయవచ్చెన్‌= సమీపించాడు. తాత్సర్యం: ఎంతో (ప్రకాళిస్తూ వసువులతో సమాను లైన ఆ కృష్ణార్దునులదగ్గరకు అగ్నిదేవుడు (బ్రాహ్మాణరూపంలో మిక్కిలి బడలిక పొందినవాడివలె, నును పై గోరోజనం రంగు గల వెండ్రుకలతో, మీసాలతో సంతోషంగా వచ్చాడు విశేషం: వృత్తలక్షణానికి చూడు: అది. 2.81 విశేషం. వ. వారునవ్విఫ్రు నతిభక్తిం బూజించిన, వారలకు నవ్విప్తుం డి ట్లనియె. 235 (ప్రతిపదార్థం: వారున్‌= ఆ శ్రీకృష్ణార్దునులుకూడా: ఆ+విఫ్రన్‌= ఆ (బ్రాహ్మణుడిని; అతి, భక్తిన్‌= మిక్కిలిభక్తితో పూజించిన; వారలకున్‌; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; ఇట్టు+అనియె. తాత్పర్యం: ఆ కృష్ణార్జునులు ఆ (బ్రాహ్మణుడిని ఎంతో భక్తితో పూజించారు. ఆ (బ్రాహ్మణుడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు. క. ఏనమితభోజనుండ న । వొనాగ్నిబలుండ నాకు నిష్టాన్నము స మ్మూనముగం బెట్టు. డోపుదు : రేని సుతృస్తుండ నగుదు నేన ట్లయినన్‌. 236 ప్రతిపదార్థం: ఏను= నేను; అమిత, భోజనుండన్‌= పరిమితి లేకుండా భోజనం చేసేవాడిని; అహీన+అగ్ని, బలుండజ= మిక్కిలి జరరాన్ని- అంటే ఆకలి కలవాడిని; ఓపుదురు+ఏని= చేత నైైనవా ళృయితే- అంటే మీ చేతనైతే: నాకు: ఇష్ట+అన్నము= ఇష్ట సన ఆహారం; సమ్మానముగన్‌= గౌరవంగా; పెట్టుండు; అట్టు+అయినన్‌; నేను; సుతృస్తుండన్‌= బాగుగా తృప్తిపొందినవాడిని" అగుదు తాత్పర్యం: నేను అమితంగా భోజనం చేసేవాడిని. మిక్కిలి ఆకలి గలవాడిని. మీకు చేతనైతే నాకు ఇష్టమైన అన్నం గౌరవంగా పెట్టండి. నేను బాగా తృప్తి పొందుతాను. - విశేషం: (బ్రాహ్మణుడికీ, అన్నికీ అన్వయించే విశేషణాలను చతురంగా వాడటం ఈ పద్యంలోని రుచిరార్థ సూక్తి నైపుణ్యం వ! 'వషీ ళ్‌ (బ్రాహ్మణుడు అమిత భోజనుడు, అగ్ని సర్వభక్షకుడు. (బ్రాహ్మణుడు అహీన మైన జరరాగ్ని కలవాడు. అగ్ని అనంత మైన దవానత్త కలవాడు. ఈ రెండు గుణాలూ అస్షిలోని ఖాండవదహనశక్తికి వ్యంజకాలు. (బ్రాహ్మణు డగ్నివంటివాడనీ, అతని కోర్కె తీ యజ్ఞ (క్రియ టల / ౪ గెర్చటం జ్ఞ క్రియవంటి దనీ ధ్వని. వ. అనిన 'నీ కెద్దిభోజనం బిష్టంబు, దానిన పెట్టెద' మడుగు; మనిన వారికి నవ్విప్రుం డిట్లనియె. 237 ప్రతిపదార్థం: అనిన; నీకు; ఎద్ది, భోజనంబు= ఎ భోజనం; ఇష్టంబు; దానిన్‌+అజ దానినే; పెట్టైదము: అడుగుము; అనిన; వారికిన్‌: ఆ+విఫ్రుండు= ఆ బ్రాహ్మణుడు; ఇట్టు+అనియె, ఇ క్‌ 4 జి =, తాత్పర్యం: అనగా, నీక్సు ఏ భోజనం ఇష్టమో దానినే పెడతాము అడుగుము' అని అనగా వారితో ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా అన్నాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 8961 ఆ. అగ్ని నేను; నాకు నాహార మయ్యింద్రు । ఖాందవంబు; దీనిం గాల్ప్బం గడంగి యెగువం బడితి ముంద రింద్రుపంచిన మహా ; దారుణాంబుధరశతంబుచేత. 238 (ప్రతిపదార్థం: ఏను= నేను; అగ్నిన్‌= అగ్నిదేవుడిని; నాకున్‌; ఆహారము; ఆ+ఇంద్రు, ఖాండవంబు= ఆ దేవేంద్రునియొక్కఖాండవ వనం; దీనిన్‌; కాల్పన్‌; కడంగి= పూనుకొని; ముందర= ఇదివరకు; ఇం(ద్రు, పంచిన= ఇంద్రుడు పంపిన; మహా, దారుణ+అంబుధర, శతంబుచేత= మిక్కిలి భయంకరాలైన మేఘాలు నూరింటిచేత; ఎగువన్‌+పడితి= తరుమబడ్డాను. తాత్పర్యం: నేను అగ్నిదేవుడిని; నాకు ఆహారం ఆ దేవేంద్రునిఖాండవ వనం. ఇదివరకు దీనిని కాల్చటానికి పూనుకొన్నాను. ఇంద్రుడు మహా భయంకరా లైన వంద మేఘాలను పంపొడు. అవి నన్ను తరిమివేశాయి. న. తక్షకుం డను పన్నగేంద్రుం డింద్రున కిష్ట్టఖుం డయి ఖాందవంబునం దుండుటంజేసి వీని నమృతంబు రక్షించున ట్లతిప్రయత్నంబున నింద్రుండు రక్షించుకొనియుందు; నది నిమిత్తంబుగా సర్వసత్త్వంబులు నిందు సుఖం బుండు; మీరు మహాసత్తుల రఖిలాస్త్రవిదుల; రమరేంద్రుండు గొవించువివఘూతంబులు మీయస్ర్రబలంబున వారింపనోపుదు; రేనును దీని ననాకులంబున నుపయోగించి కృతార్థుండ నగుదు.239 ప్రతిపదార్థం: తక్షకుండు; అను; పన్నగ+ఇం(ద్రుండు= నాగరాజు; ఇంద్రునకు= దేవేంద్రునికి; ఇష్ట సఖుండు+అయి= ప్రియమి(త్రు డై; ఖాండవంబు, అందు; ఉండుటన్‌+చేసి= ఉండటంచేత; దీనిన్‌; అమృతంబు; రక్షించు, అట్టు; అతి, ప్రయత్నంబునన్‌: ఇం(ద్రుండు; రక్షించుకొని; ఉండున్‌; అది; నిమిత్త్రంబుగా= కారణంగా; సర్వ, సత్త్యంబులున్‌= అన్నిప్రాణులు; ఇందు; సుఖంబు+ఉండు; మీరు; మహా, సత్తులరు= మిక్కిలి బలం కలవాళ్ళు; అభిల+అస్త్ర, విదులరు= అన్ని అ(స్తాలు తెలిసినవాళ్ళు; అమర+ఇంద్రుండుః దేవేంద్రుడు; కావించు; విఘాతంబులు= ఆటంకాలు; మీ, అస్త్ర, బలరిబున= మీయొక్కఅ(స్తాలబలంచేత; వారింపన్‌*ఓపుదురు= తొలగించగలరు; ఏనును= నేనుకూడా; దీనిన్‌= ఈ ఖాండవ వనాన్ని; అనాకులంబునన్‌= అడ్డులేకుండా; ఉపయోగించి; వినియోగించి, ఆరగించి, కృత+అర్జుండన్‌= నెరవేరిన కోరిక కలవాడను; అగుదు. తాత్సర్యం: తక్షకుడు అనే నాగరాజు దేవేం(ద్రునికి ప్రియ మి(త్రుడై, ఈ ఖాండవంలో ఉండటంవలన దీన్ని అమృతాన్ని రక్షిస్తున్నట్టు అతి ('ప్రయత్నంతో' ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ కారణంవలన అన్ని ప్రాణులు ఈ వనంలో సుఖంగా ఉంటాయి. మీరు మహాబలవంతులు, అన్ని అస్త్రాలు తెలిసినవాళ్ళు. దేవేంద్రుడు కలిగించే ఆటంకాలను మీ అస్త్ర బలంచేత తొలగించగలరు. నేను ఈ ఖాండవాన్ని అడ్డులేకుండా భుజించి (దహించి) కృతార్జుడి నవుతాను. క. _ అని యగ్శిదేవుం దయ్య : ర్థునదామోదరుల శౌర్యశోభితులం బ్రియం బున బ్రార్దించెను బలసూ । దనరక్షితఖాందవప్రదాహోత్సుకుం దై. 240 ప్రతిపదార్థం: అని; బలసూదన, రక్షిత, ఖాండవ, ప్రదాహ+ఉత్సుకుండు+ఐ= దేవేంద్రునిచేత రక్షింపబడిన దైన ఖాండవవనాన్ని లెస్సగా దహించటంలో ఉత్సాహం కలవా డై; శార్య, కోభితులన్‌= పరా(క్రమంచేత ప్రకాశించే వాళ్ళను; ఆ+అర్జ్హున, దామోదరుల= ఆ అర్జునుడిని, శ్రీకృష్ణుడిని; ప్రియంబున; ప్రార్ధించెను. తాత్సర్యం: అని దేవేంద్రుడు రక్షించే ఖాండవవనాన్ని బాగా దహించాలన్న ఉత్సాహం కల అగ్నిదేవుడు పరాక్రమంతో ప్రకాశించే కృష్ణార్జునులను ప్రీతితో ప్రార్థించాడు.

862 శ్రీమదాంధ్ర మహాభారతము

వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 2441

తాత్సర్యం: అనగా విని జనమేజయుడు వైశంపాయనునితో ఇట్లా అన్నాడు.

ఆ. “ఏమి కారణమున నింద్రుఖాండన మగ్ని। దేవు. డట్లు గాల్వం దివిరె? దీని విప్రముఖ్య నాకు వినంగ వేడుకయయ్య్యె; । నెలుంగం జెప్పుమయ్య యిదియు' ననిన. 242

(ప్రతిపదార్హం: ఏమి; కారణమునన్‌; ఇంద్రు, ఖాండవము= ఇంద్రునియొక్క ఖాండవ వనాన్ని; అన్నిదేవుండు; అట్టు; కాల్పన్‌: తివిరె= న!

(ప్రయత్నించాడు; విషప్రముఖ్య= ఓ (బ్రాహ్మణ (శ్రేష్టా!- వైశంపాయన మహర్షీ; నాకు; దీని; వినంగ; వేడుక, అయ్యెన్‌= కుతూహలం

కలిగింది; ఇదియున్‌= ఈ విషయం కూడా; ఎయింగన్‌, చెప్పుము+అయ్య= తెలియచెప్పవయ్యా; అనిన.

తాత్పర్యం: 'ఓ వైశంపాయన మహర్షీ! ఏ కారణంచేత ఇంద్రునిఖాండవ వనాన్ని అగ్నిదేవుడు ఆ విధంగా కాల్బ

'ప్రయత్నించాడో వినా లని నాకు కుతూహలంగా ఉన్నది. తెలిసేటట్లు చెప్పండి" అన్నాడు.

శ్వేతకి యనురాజర్షి వృత్తాంతము. (సం- 1-215-11 (అను 1-18)

వ. జనమేజయునకు వైశంపాయనుం డి ట్లని చెప్పెం దొల్లి శ్వేతకి యనురాజర్ని ఘృతసంపూర్ణదక్షిణానేకాధ్వరుం డయి శతవార్షికసత్రయాగంబు సేయ సమకట్టి బుత్విజులం బ్రార్ధించిన, బుత్విజులు “నేము నిరంతర క్షేశంబున కోపము; నీవనవరతయజనశీలుండవు; నీకు నీశ్వరుంద యాజకత్వంబు సేయనోపుంగాని, యొరులోప'రనివిసివి పలికిన, నాతండును గైలాసంబున కరిగి, కైలాసవాసు నిఖిలలోకవంద్యునిందుశేఖురు నీశ్వరు నుద్దేశించి యుగ్రతపంబు సేసినం బరమేశ్వరుండు ప్రత్యక్షం బయి వాని కి ట్లనియె. 243

(ప్రతిపదార్హం: జనమేజయునకు; వైశంపాయనుండు; ఇట్టు+అని; చెప్పన్‌; తాల్లి= పూర్వం; శ్వేతకి; అను; రాజ+బుషి ఘృత

సంపూర్ణ దక్షిణా+అనేక+అధ్వరుండు+అయి= నేతితో నిండిన, దక్షిణలతో కూడిన అనేకయజ్ఞాలు కల వా డై; శత, వార్షిక,

సత్రయాగంబు= నూరుసంవత్సరాల సత్రయాగం; చేయ; సమకట్టి= పూనుకొని; బుత్విజులన్‌= యజ్ఞంచేయించే (బ్రాహ్మణులను; ప్రార్హించిన: బుత్విజులున్‌; ఏముజ= మేము; నిరంతర, క్రేశంబునకు= ఎడతెగని కష్టానికి; ఓపము= ఓర్చుకోలేము; నీవు; అనవరత, |!

యజన, శీలుండవువా ఎల్లప్పుడు యజ్ఞం చేసే స్వభావం కలవాడవు; నీకున్‌; ఈశ్చరుండు+అ= శివుడే; యాజకత్త్వంబు= యజ్ఞం

చేయించే పని; చేయన్‌+ఓపున్‌+కాని= చేయకలడు కాని; ఒరులు= ఇతరులు; ఓపరు+అని= చేయ లే రని; విసివి; పలికినన్‌;

ఆతండును= ఆ శ్వేతకియు; కైలాసంబునకు;: అరిగి= వెళ్ళి; కైలాస, వాసు= కైలాసంలో నివసించేవాడిని; నిఖిల, లోక, వంద్యున్‌= అన్నిలోకాలకు పూజ్యా డైనవాడిని; ఇందు, శేఖరున్‌= చంద్రుని సిగదండగా కలవాడిని; ఈశ్చరున్‌= శివుడిని; ఉద్దేశించి= గురించి; ఉ(గ్ర, తపంబు= భయంకర మైన తపస్సు; చేసినన్‌; పరమ+-ఈశ్చరుండు; (ప్రత్యక్షంబు+అయి; వానికి; ఇట్టు+అనియె.

స

తాత్పర్యం: జనమేజయునికి వైశంపాయనుడు ఈ విధంగా చెప్పాడు- పూర్వం శ్వేతకి అనే రోజర్షి సమృద్ధిగా

నేతితో దక్షిణలతో అనేక యజ్ఞాలు చేసి, నూరుసంవత్సరాలు చేసే సత్రయాగాన్ని కూడా చేయటానికి పూనుకొన్నడు.

ఆ యాగం చేయించే బ్రాహ్మణులను ప్రార్థించగా, వాళ్ళు - మేము ఎడతెగని శ్రమకు ఓర్వలేము. నీవు ఎల్లప్పుడు

యజ్ఞం చేసే స్వభావం కలవాడిని. ఈశ్వరుడే నీ యజ్ఞానికి బుత్విక్కుగా ఉండి దాన్ని చేయించ కలడు కాని

ఇతరులకు అది సాధ్యంకాదు'- అని విసుగు కొని అన్నందు వలన శ్వేతకి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కైలాసవాసుడు, సకలలోక పూజ్యుడు, చంద్రశేఖరుడు అయిన శివుడిని గూర్చి భయంకర తపస్సుచేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎతనితో ఇట్టా అన్నాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 863

క. *శ్వేతకి! నీతపమున కేం బ్రితాత్ముండ నయితి; నీకుం బ్రియ మెయ్యది వి ఖ్యాతముగ విత్తు దావిన; ।; యాతతమతి! వేంయు' మనిన నన్నరపతియున్‌. 244

(ప్రతిపదార్థం: శ్వేతకి; నీ, తపమునకు; ఏన్‌= నేను; ప్రీఈ+ఆత్ముండన్‌= తృప్తి పొందిన మనస్సు కలవాడను? అయితి; సికున్‌;

ప్రియము ఇష్టమైనది? ఎయ్యది= ఏది; దొనిన్‌*అ; అతత, మతిః నిండుమనస్సుతో; విఖ్యాతముగన్‌= ప్రసిద్ధంగా; ఇత్తుః ఇస్తాను;

వేడుము= కోరుకొమ్ము; అనినన్‌: ఆ+నరసతియున్‌= ఆ రాజు(శ్చేతకి)కూడా.

తాత్పర్యం: *ఓ శ్వేతకీ! నీ తపస్సుకు నేను తృప్తిపొందాను. నీ కేది ఇష్టమో దానినే నిండు మనస్సుతో గొప్పగా

ఇస్తాను. కోరుకొమ్ము”' అని అనగా ఆ శ్వేతకి,

వ. “దేవా! నీప్రసాదంబున శతవార్షికసత్రయాగంబు చేనిద; నోకు నీవు బుత్విజుందవు గావలయు'నని ప్రార్ధించినం గరుణించి 'యాజకత్వంబు బ్రాహ్మణులకు ఐథిదృష్టం బగుటంజేసి దాని నొరులకుంజేయంగాదు గావున, నింక నీవు బ్రహ్మాచర్యంబునం బండ్రెండేండ్లు నిరంతరఘృతథారంజేసి హుతాశనుం దృప్తుం జేయు' మనిన వాయన బరమేశ్వరుపంచిన విధంబున నగ్ని తర్పణంబు సేసిన సంతుష్టుం ద్రైయీశ్వరుండు వాని పాలికి వచ్చి యప్వుడ దుర్వాసు రానించి. 245

ప్రతిపదార్థం: దేవా! నీ, ప్రసాదంబున= నీ అనుగ్రహంచేత; శత, వార్షిక, సత్రయాగంబు= నూరు సంవత్సరాల సోత్రయాగాన్ని;

చేసెద; నాకు; నీవు; బుత్పిజుండవు= యజ్ఞంచేయించేవాడవు; కావలయును; అని; (ప్రార్టించినన్‌: కరుణించి= దయతలచి; యాజకత్త్వంబు= యజ్ఞం చేయించే పని; (బ్రాహ్మణులకు; విధి, దృష్టంబు= శాస్త్రింలో చూడబడింది- అంటే శాన్త్రంచేత చెప్పబడింది; అగుటన్‌+చేసి; దానిన్‌: ఒరులకున్‌= ఇతరులకు; చేయన్‌కాదు= చేయకూడదు; కావునన్‌: ఇంక; నీవు; బ్రహ్మ చర్యంబునన్‌= బ్రహ్మచర్వ్యవ్రతంచేత; పండ్రైండు+ఏండ్డ్లు: నిరంతర, ఘృత, ధారన్‌చేసి= ఎడతెగని నేతిధారతో; హుతాకునున్‌= అగ్నిదేవుడిని; తృప్పున్‌= తృప్తిపొందినవాడినిగా; చేయుము; అనిన; వాడును= ఆ శ్వేతకికూడా; పరమేశ్చరు, పంచిన, విధమునన్‌= శివునియొక్క ఆజ్ఞాపించిన విధంగా- అంటే శివుడు చెప్పినట్టు: అష్ట, తర్చణంబు= అస్లితృష్తి; చేసిన; ఈళ్చరుండు; సంతుష్టుండు+వ= బాగా తృప్తి పొందిన వా డై వాని, పాలికిజఐ ఆ శ్వేతకి చగ్గరకు; వచ్చి; అప్పుడు+ఆ; దుర్వాసు; రావించిఐ రప్పించి. తొత్పర్యథిః 'దేవా! నీ దయవలన మారుసంవత్సరాల సత్రయాగం చేస్తాను. నీవు నాకు బుత్విజుడివి కొవాలి"

  • అని ప్రార్థించగా- పరమేశ్వరుడు, 'యజ్ఞం చేయించే పని శాస్త్రంలో బ్రాహ్మణులకు చెప్పబడింది. ఇతరులు యాజకత్వం వహించకూడదు. అందుచేత నీవు (బబ్రహ్మచర్యవ్రతం పూని పండ్రెండేళ్ళు ఎడతెగని నేతి ధారతో అగ్జిదేవుడిని తృప్తిపొందించుము” అన్నాడు. ఆ శ్వేతకికూడా పరమేశ్వరుడు ఆజ్ఞాపించిన విధంగా అగ్లిదేవునికి తృప్తికావించగా, ఈశ్చరుడుకూడా తృష్తిపాంది, శ్వేతకి దగ్గరకు వచ్చి, దుర్వాసుని రప్పించి, క. 'ఈళం దనవరతయజన ; ప్రీతుం; డీతనికి దురితభీతునకు మనః

ఫ్రీతిగ నార్విజ్యమ్ము మ । హాతేజోధికుంద]! చేయు' మని దయ బంచెన్‌. 246 ప్రతిపదార్హం: ఈతడు; అనవరత, యజన, ప్రీతుండు= ఎడతెగక యజ్ఞాలు చేయటంలో (ప్రీతికలవాడు; దురిత, భీతునకు= పాపాలకు భయపడేవానికి; ఈతనికి= ఈ శ్వేతకికి; మనఃప్రీతిగన్‌= మనస్సుకు సంతోషం కలిగేటట్టు: మహా, తేజ;:+అధికుండ[= గొప్పతేజస్సుచేత అధికుడ వైనవాడా; ఆరిబ్యమ్ముజ యాజకత్వం: చేయుము; అని; దయన్‌= దయతో పంచెన్‌= ఆజ్ఞాపించాడు.

6డీ శ్రీమదాంధ్ర నుహాభారతము

తాత్సర్యల: “ఈ శ్వేతకి ఎడతెగకుండ యజ్ఞాలు చేయటంలో 'ప్రీతికలవాడు. పాపభీతి కలవాడు. ఇతనిమనస్సుకు

సంతోషం కలిగేటట్టు గొప్పతేజస్సుచే అధికుడ వైన ఓ దుర్వాసమహర్షీ! యజ్ఞం చేయించుము” అని దయతో శివుడు

ఆజ్ఞాపించాడు.

వ. _ శ్వేతకియుందనకు దుర్వాసుండు బుషిగణంబులతో బుత్విజుండుగా నభిమతం బయిన సత్రయాగంబుసేసె; నట్లాశ్వేతకి చేసిన నిరంతరఘృతధారాకారణంబున నగ్నిదేవుండు దన కగ్నిమాంద్యంబును దేజోహీనతయు దప్పియు నైనం బితామహుపాలికిం జని తనశరీరస్థితి చెప్పినం బితామహుండును దాని నపరిమితఘృతోప యోగంబున నయిన మహావ్యాధింగా నెజీింది యగ్నిదేవున కి ట్లనియె. 247

ప్రతిపదార్థం: శ్వేతకియున్‌:; తనకు; దుర్వాసుండు; బుషి గణంబులతో= బుషులసమూహాలతో; బుత్విజుండుగాన్‌= యజ్ఞం

చేయించేవాడుగా; అభిమతంబు+అయిన= ఇష్ట మైన; సత్రయాగంబు; చేసెన్‌; అట్టు; ఆ, శ్వేతకి; చేసిన; నిరంతర, ఘృత, ధారా, కారణంబునన్‌= ఎడతెరపిలేని నేతి ధార కారణంగా; అస్టిదేవుండు; తనకు; అగ్ని, మాంద్యంబును= జీర్ణశక్తి తగ్గటమూ'" తేజుకినతయుః= కాంతి పోవటమూ; దప్పియున్‌= దప్పికా; ఐనన్‌= కలుగగా; పితామహు, పాలికిన్‌= బ్రహ్మదేవునిదగ్గరకు; చని= వెళ్ళి; తన, శరీర, స్థితి, చెప్పినన్‌; పితామహుండును= బ్రహ్మదేవుకూడా; దానిన్‌; అపరిమిత, ఘృత+ఉపయోగంబునన్‌= మిక్కిలి ఎక్కువగా శతిని ఉపయోగించటంవలన; అయిన; మహా, వ్యాధిన్‌*కాన్‌= పెద్దజబ్బుగా; ఎఆీంగి; అన్నిదేవునకు" ఇట్టు+అనియె. తాత్పర్యం; శ్వేతకికూడా బుషుల సమూహాలతో దుర్వాసుడు తనకు బుత్విజుడు (యజ్ఞంచేయించేవాడు) కాగా, తన కిష్ట మైన సత్రయాగాన్ని చేశాడు. ఆ విధంగా శ్వేతకి చేసిన యాగంలోని ఎడతెరిపిలేని నేతి ధార కారణంగా అగ్నిదేవునికి జీర్లశక్తి తగ్గింది, కాంతి సన్నగిల్లింది, దప్పిక ఎక్కువైంది. ఆయన (బ్రహ్మదేవునిదగ్గరకు వెళ్ళాడు. తన శరీర స్థితిని చెప్పుకొన్నాడు. బ్రహ్మదేవుడు అది నేతిని అపరిమితంగా ఉపయోగించటంవలన కలిగిన మహా వ్యాధిగా

(గ్రహించి అన్నిదేవునితో ఇట్లా అన్నాడు.

క. 'ఈవ్యాధి యొంటం దీఅదు; । దివ్యౌషధయుక్త మైన దివిజపనంబున్‌ హవ్యాశన! భక్షింపు; మ । హావ్యాధి శమంబు దాన నగు నీ' కనినన్‌. 248

ప్రతిపదార్హం: ఈ, వ్యాధి; ఒంటన్‌= మరొకదానిచేత; తీఅదు; హవ్య+అశన= దేవతలకు ఈయదగిన అన్నాన్ని ఆహారంగా కలవాడా-

అన్నిహోత్రా!: దివ్య+బొషధ, యుక్తము+ఐన= దేవలోకసంబంధ మైన మందు చెట్లతో కూడిన; దివిజ, వనంబున్‌= దేవతావనాన్ని; భక్షింపు; దానన్‌= దానివలన; నీకు; మహా, వ్యాధి, శమంబు= గొప్పజబ్బు తగ్గటం; అగున్‌= జరుగుతుంది; అనినన్‌= అని అనగా తాత్సర్యం: “ఈ వ్యాధి మరొక దానిచేత తీరదు. అన్నిహోత్రా! దివ్యౌషధాలతో కూడిన దేవతావనాన్ని భక్షించు. దానివలన నీ మహావ్యాధి పోతుం'" దని అనగా. క చని ఖూండవంబుం గాల్బంగ ।! మొనసి మహాహస్తియూథముల. బోని ఘనా

ఘనములచే బాధితు6 డయి |; వనజజుకడ కరిగి హపవ్యవాహనుం డనియెన్‌. 249 ప్రతిపదార్థం: చని వెళ్ళి; ఖాండవంబున్‌; కాల్చంగ; మొనసి= పూని మహా హస్తి యూధములన్‌+పోని= గొప్ప ఏనుగు గుంపులను పోలిన; ఘనా, ఘనములచే= వర్షించే మేఘాలతో; బాధితుండు+అయి= బాధింపబడినవా డై; హవ్యవాహనుండు= దేవతలకు ఇవ్వదగిన అన్నాన్ని మోసేవాడు- అగ్నిహోత్రుడు; వనజజు, కడకు= నీటినుండి పుట్టిన పద్మంనుండి జన్మించిన బ్రహ్మదేవునిదగ్గరకు; అరిగి= వెళ్ళి; అనియెన్‌.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 865 తాత్పర్యం: అగ్నిహోత్రుడు ఖాండవవనాన్ని దహించటానికి పూనుకొన్నాడు. పెద్ద ఏనుగు గుంపులవంటి వర్షించే మేఘాలు బాధించగా ఆయన (బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఇట్టా- అన్నాడు.

వ. 'ఏను మీయానతిచ్చినవిధంబున ఖాందవం బుపయోగింపం బోయి, తద్రక్షకులు గావించువిఘాతంబులు వారింపనేరక యేడుమాజులు విఫలప్రయత్నుండ నైతి; నింక నెద్దియుపాయంబు? నాకు నెవ్విధంబున ఖాండవభక్షణంబు దొరకొను?' నని దుఃఖించిన యతనిం జూచి కమలభవుండు కరుణించి, భావికార్యం బప్పుడుదలంచియుం'గొంతకాలంబునకు నరనారాయణులను నాదిమునులు నరలోకంబున దేవహితార్థం బర్జునవాసుదేవు లయి జన్మించి యాఖాందవసమీపంబున విహరింతురు; వారు భవత్రార్థితు లై తమ యస్ర్రబలంబున నఖిలవిఘృ్నంబుల నపనయించి నిరాకులంబున నీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతు" రనిన, నగ్నిదేవుండు గరంబు సంతసిల్లి, కమలజువచనం బవలంబంబుగా. బెద్దకాలం బుండి, తద్వచనమార్గంబున నప్పుడు కృష్ణార్దునులం గని ఖాండనదహనార్థంబు ప్రార్థించిన నగ్నిదేవున కర్టునుం డి ట్లనియె. 250

ప్రతిపదార్థం: ఏను= నేను; మీ, ఆనతి+ఇచ్చిన, విధంబున= మీయొక్కఆజ్ఞ ఇచ్చినవిధంగా- అంటే మీరు ఆజ్ఞాపించినట్టుగా;

ఖాండవంబు; ఉపయోగింపన్‌; పోయి; తత్‌+రక్షకులు= దాన్ని రక్షించేవాళ్ళు; కావించు; విఘాతంబులుజ ఆటంకాలు; వారింపవ= నివారించటానికి; నేరక= చేతగాక; ఏడు, మాలులు; విఫల, ప్రయత్నుండన్‌= నెరవేరనిప్రయత్నం కలవాడిని; ఐతిన్‌; ఇంకన్‌; ఎదీ; ఉపాయంబు; నాకున్‌; ఏ+విధంబున; ఖాండవ, భక్షణంబు= ఖాండవవనాన్ని తినటం; దొరకొనున్‌= లభిస్తుంది; అని; దుఃఖించిన; అతనిన్‌; చూచి; కమల, భవుండు= పద్మంనుడి పుట్టినవాడు- బ్రహ్మదేవుడు; కరుణించి= దయతలచి; భావి, కార్యంబు= మున్ముందు జరిగేపని; అప్పుడు; తలంచియున్‌? కొంత, కాలంబునకు;నర, నారాయణులు; అను; ఆది, మునులు; నర, లోకంబున= మానవలోకంలో; దేవ, హిత+అర్థంబు= దేవతలమేలుకోసం; అర్జున, వాసుదేవులు+అయి; జన్మించి; ఆ, ఖాండవ, సమీపం౦ంబున= ఆ ఖాండవ వనందగ్గర; విహరించుదురు; వారు; భవత్‌+(ప్రార్ధితులు+ఐ= నీచే ప్రార్ధింప బడినవాళ్ళయి; తమ, అస్త్ర, బలంబునన్‌; అఖిల, విఘ్నంబులన్‌= అన్నిఆటంకాలను; అపనయించి= తొలగించి; నిర్‌+ఆకులంబున= నిరాటంకంగా; నీకు; ఖాండవ+ఉపయోగంబు= ఖాండవవనాన్ని ఉపయోగించటాన్ని- అంటే ఖాండవవనాన్ని దహించటాన్ని; ప్రసాదించుదురు= దయతో కలుగజేస్తారు; అనిన్‌; అగ్నిదేవుండు; కరంబు= మిక్కిలి; సంతసిల్లి: కమలజు, వచనంబు= పద్మంనుండి పుట్టినబ్రహ్మదేవునిమాట; అవలంబంబుగాన్‌= ఊతగా; పెద్ద, కాలంబు= చాలాకాలం; ఉండి, తత్‌*వచన, మార్గంబునన్‌= అతనియొక్క మాటప్రకారం; అప్పుడు; కృష్ణ+అర్జునులన్‌; కని= చూచి; ఖాండవ, దహన+అర్థంబు= ఖాండవ వనాన్ని కాల్బటంకోసం; (ప్రార్ధించినన్‌: అన్లదేవునకు' అర్జునుండు; ఇట్టు+అనియె.

తాత్పర్యం: 'నేను మీరు ఆజ్ఞాపించిన విధంగా ఖాండవవనాన్ని దహించబోయాను. దాన్ని రక్షించేవాళ్ళు కల్పించిన ఆటంకాలు నివారించలేక పోయాను. ఏడుసార్లు నా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక నాకు ఉపాయ మేది? ఏ విధంగా ఖాండవ వనాన్ని దహిస్తాను?' అని దుఃఖించగా, అతడిని చూచి (బ్రహ్మదేవుడు దయతలచి, మున్ముందు జరుగ వలసిన పనిని తలచి- “కొంతకాలానికి ఆది మును లైన నర నారాయణులు మానవలోకంలో దేవతల మేలుకోరి అర్జునుడుగా కృష్ణుడుగా జన్మిస్తారు. ఆ ఖాండవ వనం దగ్గర విహరిస్తారు. వాళ్ళను నీవు ప్రార్ధిస్తే తమ అ(స్తాల బలంతో అన్నిఆటంకాలు తొలగించి, నీవు ఖాండవవనాన్ని దహించేటట్లు చేస్తారు" అని అనగా- అగ్నిదేవుడు ఎంతో సంతోషించి, బ్రహ్మదేవునిమాట ఆధారంగా చాలాకాలం ఉండి ఆయన మాట ప్రకారం అప్పుడు కృష్ణార్దునులను చూచి ఖాండవవనాన్ని కాల్చటం కోసం ప్రార్ధించగా, అగ్నిదేవునితో అర్జునుడు ఇట్టా అన్నాడు.

866 శ్రీమదాంధ్ర మహాభారతను అగ్నిదేవుండు కృష్ణార్దునులకు( జక్రకార్ముకాదు లొసంగుట. (సం- 1-215-12)

సీ. వారణహస్తానుకారంబు లగు వారి । భారలు గురియు దుర్వారఘోర తరవారివాహప్రకరములు వారింప | సురనినహంబుతో సురగణేశు నైన నోర్వ సుశక్త మైన మహాదివ్య । శరసంచయము నా కపరిమితంబు గల; దట్టిసాయకావలికి నాదగు భుజ | బలశీఘ్రసంభానములకు. దగిన

ఆ. ధనువు సర్వవహనఘనరథాశ్వములుం గృ । ష్టునకు నాయుధములు ననఘ! యిపుడు లేమిం జేసి చూవె యీమహాకార్యంబు ; గదడంగకున్నవార మెడదయుం జేసి. 251

(ప్రతిపదార్థం: అనఘః= పాపరహితుడా[! వారణ, హస్త+అనుకారంబులు+అగు= ఏనుగుతాండాన్ని పోలినవైన* వారి, ధారలు= నీటిధారలు; కురియు; దుర్‌*వార, ఘఫోరతర, వారి, వాహ, ప్రకరములు= నివారింప సాధ్యం కాని మిక్కిలి భయంకరా లైన మేఘాల సమూహాలను; వారింప= అడ్డగించటానికి; సుర, నివహంబుతో= దేవతల సమూహంతో; సుర, గణ+ఈశున్‌+ఐనన్‌= దేవతా సమూహాల రాజు నైనా- అంటే దేవేంద్రుడినైనా? ఓర్వ= ఓడింప; సుశక్తము+ఐన= మంచి సమర్ధవంత మైన; మహా, దివ్య, శర సంచయముజ= గొప్ప దేవతా సంబంధాలైన అస్త్రాల సమూహం; నాకు; అపరిమితంబు= లెక్కలేనంత; కలదు" అట్టి; సాయక+ఆవలికిన్‌= బాణాల సమూహానికి; నాదిశఅగు; భుజ, బల, శీఫ్రు, సంధానములకున్‌= బాహుబలానికి, వేగంగా బాణాలను వింటి నారిలో కూర్చటానికి; తగిన; ధనువు; సర్వ, వహన, ఘన, రథ+అశ్వములున్‌= అన్నింటిని మోయగల గొప్పరథం, గుర్రాలూ; కృష్ణునకున్‌; ఆయుధములు; ఇపుడు; లేమిన్‌+చేసి= లేకుండటంచేత;చూవె; ఈ, మహా, కార్యంబు; ఎడయున్‌+చేసి=ఐ ఆలస్యంచేసి; కడగక+ఉన్న, వారము= పూనుకొనకున్నాము.

తాత్పర్యం: పుణ్యాత్మా! అన్నిహోత్రా! ఏనుగు తాండ మంతటి నీటిధారలను కురిసే దుర్వారా లైన మహా భయంకర

మేఘసమూహాల్ని తొలగించటానికి, దేవతాసమూహంతో కూడిన దేవేంద్రుడి నైనా ఓడించటానికి - సమర్దాలైన

ఉుటా దివ్యాస్త్సమూహం నాదగ్గర లెక్కలేనంత ఉన్నది. అట్టాంటి అస్త్ర సమూహానికి, నా భుజ బలానికి, వేగంగా బాణాలను వింటిలో సంధించే నేర్పుకు తగిన ధనుస్సు- అన్నింటిని మోయగల గొప్పరధం, గుర్రాలు- శ్రీకృష్ణునికి ఆయుధాలు- ఇప్పుడు లేవు. అందువలననే సుమా ఆలస్యంచేసి ఈ మహాకార్యానికి పూనుకొనకుండా ఉన్నాం.

వ. అనిన నగ్నిదేవుండును నప్పుడ వరుణుం దలంచి వానిం దనకు సన్నిహితుం జేసికొని 'తొల్లి నీకు సోముం డిచ్చిన బ్రహ్మనిర్మితకార్ముకంబు, నక్షయతూణీరయుగళంబును, గంధర్వజహయంబులం బూన్చిన రధంబు నియ్యతిరథుం డయిన యర్జునున కిమ్ము; మటి చక్రంబును గదయును వాసుదేవున కి" మ్మని పంచిన.252

ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జును డనగా; అగ్నిదేవుండును; అప్పుడు+అ= అప్పటికప్పుడే; వరుణున్‌; తలంచి; వానిన్‌; తనకు" సన్నిహితున్‌= దగ్గరకు వచ్చినవాడినిగా; చేసికొని; తొల్లి= పూర్వం; నీకు; సోముండు+ఇచ్చిన; (బ్రహ్మ, నిర్మిత, కార్ముకంబున్‌= బ్రహ్మచే రూపొందించబడిన ధనుస్సును; అక్షయ, తూణీర యుగళంబును= తరుగు లేని బాణాలు గల అమ్ములపాదుల జంటను; గంధర్వజ, హయంబులన్‌= గంధర్వలోకంలో పుట్టిన గుర్రాలను; పూన్చిన= కట్టిన; రథంబున్‌; ఈ+అతి, రధుండు= పెక్కుమంది విలుకాండ్రతో పోరాడే మహావీరుడు; అయిన; అర్జునునికి; ఇమ్ము; మథి; చక్రంబును; గదయును; వాసుదేవునకు= శ్రీకృష్ణునకు" ఇమ్ము; అని; పంచిన= ఆజ్ఞాపించగా;

తాత్పర్యం: అని అర్జునుడు చెప్పగా అగ్నిదేవుడు అప్పటికప్పుడే వరుణుని స్మరించాడు. తన దగ్గరకు రప్పించాడు.

'పూర్త్యం నీకు సోము డిచ్చిన బ్రహ్మనిర్మిత మైన ధనుస్సును, తరుగు లేని బాణాలు కల అమ్ముల సొదుల జంటను,

ఆదిపర్వము - అష్టమాశ్వానము 867 గంధర్వలోకంలో పుట్టిన గుర్రాలను కట్టిన రథాన్ని అతిరథు డైన ఈ అర్జునునికి - చక్రాన్ని, గదను శ్రీకృష్ణుడి కిమ్ము" అని ఆజ్ఞాపించగా. ను. అమరాహీంద్రవియచ్చరాదుల కజేయం బప్రధృష్యం బభే

ధ్యము వజ్రస్థిరమన్యసాధనభిదాదక్షంబు నై సర్వలో

కమనోజ్ఞం బయి దివ్య మై వెలుంగు నగ్గాండీవ మన్‌ చాపర

త్నము నిచ్చెన్‌ వరుణుండు పార్థునకు నుద్యద్విక్రమోద్దాసికిన్‌. 253 ప్రతిపదార్థం: వరుణుండు; ఉద్యత్‌+విక్రమ+ఉత్‌+భాసికిన్‌= వృద్ది పొందుతున్న పరాశక్రమంచేత గొప్పగా ప్రకాశించేవానికి; పార్టునకున్‌= అర్జునునికి; అమర+అహి+ఇంద్ర, వియత్‌+చర+ఆదులకు= దేవతలు, నాగరాజులు, గంధర్వులు మొదలైనవాళ్ళకు; అజేయంబు= జయింప సాధ్యం కానిది; ఆఫ్రధృష్యంబు= త్రోసిపుచ్చటానికి సాధ్యంకానిది; అభేద్యము= చీల్చటానికి సాధ్యం కానిది; వజ్రస్టిరము= వజ్రంవలె గట్టిది; అన్యం సాధన, భిదా, దక్షంబును+ఐ= ఇతరము లైన ఆయుధాలను భేదించటంలో సమర్ధ మైన దై; సర్వ, లోక, మనోజ్ఞంబు+ఐ= అన్నిలోకాలకు మనోహర మైన దై; దివ్యమై= దేవతాసంబంధ మైన దై వెలుగు; ఆ+గాండీవము; అను; చాప, రత్నమును= శ్రేష్ట మైన ధనుస్సును; ఇచ్చెన్‌,

తాత్చర్యం: వరుణుడు, వృద్దిపాందె పరా(క్రమంతో (ప్రకాశిస్తున్న అర్జునునికి- దేవతలు, నాగరాజులు, గంధర్వులు

మొదలైనవాళ్ళకు జయించ శక్యంకానిదీ, (త్రోసిపుచ్చ వీలుకానిదీ, భేదించ సాధ్యంకానిదీ, వజ్రంవలె కఠిన మైనదీ,

ఇతర ఆయుధాలను నాశనంచెయ్యటంలో సమర్థ మైనదీ, అన్ని లోకాలకు మనోహర మైనదీ, దివ్యమైనదీ - అయి వెలుగుతున్న ఆ గాండీవం అనే ఉత్తమ ధనుస్సును ఇచ్చాడు.

విశేషం: సమాసఘటితం, సంధిబంధురం అయిన నన్నయరచన, ఓజోగుణవిశిష్టమై ఇక్కడ గాండీవంయొక్క కొన్నత్యాన్నీ

దృడత్వాన్నీ భీకరత్వాన్నీ స్ఫురింపచేసేదిగా ఉన్నది.

న. మజియుం బ్రతిపక్ష సంక్షయకరంబు లయిన యక్షయబాణంబులు గల తూణీరంబులును, వివిధాయుధభరితం ఖై, సింహలాంగూలకపిధ్వజవిరాజమానంబై, మవాంబుధరధ్వానబంధురంటై, మనోవాయువేగ సితవాహవాహ్యమానం బై, రణితరమణీయమణికింకిణీకలాపాలంకృతం బై. సకలదిగ్విజయాధిష్టానంబై యొప్పుచున్న దివ్యరథంబు నర్జునున కిచ్చి సహస్రకరసహస్రదుస్సహమహఃపటలభాసురం బగుచు దేవదైత్యదానవయక్షరాక్షసపిశాచోరగప్రశమనంబయి వెలుంగుచున్న సుదర్శనం బను చక్రంబును గౌమోదకి యను గదయును నారాయణున కిచ్చె; నట్లు సంప్రాప్తదివ్యచాపరథాయుధు లయి యువ్న నరనారాయణులం జూచి యగ్నిదేవుం డి ట్లనియె. 254

ప్రతిపదార్థం: మజియున్‌; ప్రతిపక్ష సంక్షయ, కరంబులు+అయిన= శత్రువులను నాశనం చేసేటటువంటి వైన; అక్షయ,

బాణంబులు కల, తూణీరంబులును= అమ్ములపొదులూ; వివిధ+ఆయుధ, భరితంబు+ఐ= నానావిధా లైన ఆయుధాలతో నిండి; సింహ లాంగూల, కపి, ధ్వజ విరాజమానంబు+ఐ= సింహపు తోకవంటి (తోకగల)కోతిగుర్తు కల జెండాచే (ప్రకాశించేటటువంటి దై; మహాశఅంబుధర, ధ్వాన, బంధురంబు+ఐ= గొప్పమేఘంయొక్క ధ్వనిలాంటి ధ్వనితో నిండిన దై; మనో, వాయు, వేగ, సిత, వాహ, వాహ్యమానంబు+ఐ= మనస్సుయొక్క గాలియొక్క వేగంవంటి వేగం కల తెల్లనిగుర్రాలచే లాగబడుతున్న దై రణీత, రమణీయ. మణి, కింకిణీ, కలాప+అలంకృతంబు+ఐ= ధ్వనిస్తున్న అందా లైన రత్నాల చిరుగంటల సమూహాలచే అలంకరింపబడిన దై. సకల, దిక్‌+విజయ+అధిష్టానంబు+ఐ= అన్ని దిక్కులను జయించటానికి స్థాన మై; ఒప్పుచు+ఉన్న= (ప్రకాశిస్తున్న: దివ్య,

రధంబున్‌= దేవతా సంబంధమైన రథాన్ని; అర్హునునకు+ఇచ్చి; సహస్రకర, సహస్ర, దుస్‌+సహ, మహణుటల, భాసురంబు= వేయికిరణాలు గల సూర్యులు వేయిమందివంటీ ఓర్వరాని గొప్పకాంతులచే ప్రకాళించేది; అగుచు; దేవ, దైత్య, దానవ యక్ష రాక్షస, పిశాచ+ఉరగ, (ప్రశమనంబు+అయి= దేవతలను, దైత్యులను, దానవులను, యక్షులను, రాక్షసులను, పిశాచాలను నాగులను అణగింపచేయునట్టి దై వెలుంగుచు+ఉన్న; సుదర్శనంబు; అను; చక్రంబును; కౌమోదకి; అను; గదయును; నారాయణునకు= శ్రీ కృష్ణునికి; ఇచ్బెన్‌: అట్టువ ఆవిధంగా; సంప్రాప్త దివ్య, చాప, రధ+శ+ఆయుధులు+అయి= పొందిన దివ్యధనుస్సును రధాన్ని, ఆయుధాలను కలవా రై; ఉన్న; నర, నారాయణులన్‌= అర్జునశ్రీకృష్ణులను; చూచి; అగ్నిదేవుండు; ఇట్టు+అనియె తాత్పర్యం; అంతేకాక శత్రువులను నాశనంచేసేటటువంటివి, తరుగని బాణాలు కల అమ్ముల పొదులను, వివిధాయుధాలతో నిండి, సింహపుతోకవంటి తోక కల కోతిగుర్తున్న జెండాతో ప్రకాశిస్తూ గొప్ప మేఘ ధ్వనివంటి ధ్వని కలిగి, మనోవేగ, వాయువేగాలవంటి వేగం కల తెల్లటిగు(ర్రాలు లాగుతుండగా, (మోగుతున్న అందాల రత్నపు చిరుగంటల సమూహాలతో అలంకరించబడి, అన్ని దిక్కులను జయించటానికి స్టాన మై ప్రకాశిస్తున్న దివ్యరధాన్ని అర్జునుని కిచ్చాడు. వేయిసూర్యులవలె ఓర్వరాని గొప్ప కాంతులతో ప్రకాశింస్తూ, దేవ దైత్య, దానవ, యక్ష రాక్షస, పిశాచ, నాగులను అణగింపచేసే సుదర్శనచక్రాన్ని, కౌమోదకి అనే గదను శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆ విధంగా దివ్య ధనుస్సును, రథాన్ని, ఆయుధాలను పొంది ఉన్న అర్జున శ్రీకృష్ణులను చూచి అగ్నిదేవుడు ఇట్టా అన్నాడు. విశేషం: దైత్యులు- కశ్యపునికి దితియందు పుట్టినవాళ్ళు. దానవులు- కశ్యపునికి దనువునందు జన్మించినవాళ్ళు. క. ఘనభుజ! యిది గాండీవం । బనంబర(గిన ధనువు దీని నస్త్రావలి పె

ల్దన తాంకి భగ్నమగు న । త్యనుపమవజ్రాభిహతశిలావలి వోలెన్‌. 255 ప్రతివదార్హం: ఘన, భుజక= గొప్పభుజాలు కలవాడా!- ఓ అర్జునా; ఇది; గాండీవంబు+అనన్‌; పరంణగిన= ఒప్పిన; ధనువు; దినిని; అస్త్ర+ఆవలి= మంత్ర సహిత బాణాల సమూహం; పెల్చనన్‌= గట్టిగా? తాంకి; అతి+అనుపమ, వజ+అభిహత, శిలా+ఆవలి= మిక్కిలిసాటి లేని వజ్రాయుధంచేత కొట్టబడిన రాళ్ళ సమూహంవలె; భగ్నము+అగున్‌= ముక్క లై పోతుంది. తాత్పర్యం: ఉన్నత భుజాలు కల ఓ అర్జునా! ఇది గాండీవం అనే ధనుస్సు. మంత్ర సహిత బాణ సమూహాలుసైతం దీన్ని తాకి వజ్రాయుధంచేత కొట్టబడిన రాళ్ళవలె ముక్కలవుతాయి. విశేషం: అలం: ఉపమ. క. ఈ రథ మప్రతిహతము, సః మీరజవోపేతహయసమేతము; వీనిన్‌

భూరిబలు. డెక్కి సోముండు । ధీరుం డయి తొల్లి యెల్లదిక్కుల నొడిచెన్‌. 256 (ప్రతిపదార్థం: ఈ, రధము; అప్రతిహతము= ఎదురు లేనిది; సమీర, జవ+ఉపేత, హయ, సమేతము= వాయువేగంతో కూడుకొన్న గుర్రాలతో కూడీనది; తొల్లి= పూర్వం; దీనిన్‌; భూరి, బలుండు= గొప్ప బలం కలవాడు; సోముండు; ఎక్కి; ధీరుండు+అయి= ధైర్యవంతు డై; ఎల్ల, దిక్కులన్‌; ఒడిచెన్‌= ఓడించాడు. తాత్పర్యం: ఈ రధం ఎదురులేనిది. వాయు వేగం కల గుర్రాలతో కూడుకొన్నది. పూర్వం దీన్ని మహాబలు డైన సోముడు ఎక్కి అన్నిదిక్కులు జయించాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 869 క. ఈచక్రము మధుసూదన! । నీచేత విముక్త మగుచు నీరిపులం ద్రియా మాచరులం జంపి క్రమ్మల । నీచేతికి వచ్చు దేవనిర్మితశక్తిన్‌. 257 (ప్రతిపదార్ధల; మధు, సూదన= మధువు అనే రాక్షసుడిని సంహరించినవాడా!- శ్రీకృష్ణా? ఈచ॥్రము; నీచేత, విముక్తము= విడువబడినది; అగుచు; నీ, రిపులన్‌= నీ శత్రువులను; (త్రియామా, చరులన్‌= ర్యాత్రులలో తిరిగేవాళ్ళను- రాక్షసులను; చంపి; దేవ, నిర్మిత, శక్తిన్‌= దేవతలచే కూర్చబడిన శక్తిచేత; (క్రమ్మఅ= మరల; నీచేతికి; వచ్చు. తాత్సర్యం: శ్రీకృష్ణా! ఈ చక్రాన్ని నీవు ప్రయోగిస్తే నీ శత్రువు లైన రాక్షసులను సంహరించి, దేవతలు కూర్చిన శక్తితో మళ్ళీ నీ చేతికి వచ్చి చేరుతుంది. కృష్ణార్ణును లగ్నిహోత్రునిచే ఖాండవంబు దహింపం జేయుట (సం- 1-216-28) వ. అని తత్ర్రభావప్రకారంబు చెప్పిన గృష్టార్దునులు సంతసిల్లి, సన్నద్ధు లయి రధం బెక్కి యగ్నిదేవుం జూచి “సురాసురపరివృతుండయి సురపతి వచ్చినను జయింతు' మింక శంకింపక ఖాండదవదహనార్థం బుపక్రమింపు మనిన నగ్నిదేవుండు హర్షించి తైజసంబయిన రూపంబు ధరియించి. 258 ప్రతిపదార్థం: అని; తత్‌+ప్రభావ ప్రకారంబు= వాటియొక్క (ప్రభావ విధం; చెప్పినన్‌? కృష్ణ+అర్జ్హునులు: సంతసిల్లి; సన్నద్దులు+అయి= పూనుకొని; రధంబు+ఎక్కి; అగ్నిదేవున్‌? చూచి; సుర+అసుర, పరివృతుండు+అయి= దేవన దానవులచేత చుట్టబడిన వాడైసుర, పతి= దేవేంద్రుడు; వచ్చినను; జయింతుము; ఇంక; శంకింపకజ అనుమానించక; ఖాండవదహన+అర్హంబు= ఖాండవవనాన్ని దహించటంకొరకు; ఉప(క్రమింపుము= ప్రారంభించుము; అనినన్‌= అని అనగా; అగన్షిదేవుండు; హర్షించి= సంతోషించి; తైజసంబు+అయిన= కాంతిమంత మైన; రూపంబు; ధరియించి. తాత్పర్యం: అని వాటి యొక్క ప్రభావాన్ని గూర్చి చెప్పగా - కృష్ణార్జునులు సంతోషించి, పూని రధం ఎక్కి, అగ్నిదేవుడిని చూచ దేవేంద్రుడు దేవదానవులతో కలిసి దండెత్తి వచ్చినా జయిస్తాము. ఇంక సంకోచించవద్దు. ఖాండవవనాన్ని హించటానికి 'ప్రారంభించుము" అని అనగా అగ్నిదేవుడు సంతోషించి కాంతిమంత మైన రూపం ధరించి. చ పెడిలి సువర్రప పె న్న క్‌ ర్వతము పెక్కుదెజంగుల వ్రయ్యునట్టు ల ప్పుడు వివిధప్రకారముల భూరిశిఖావలి ఖాండవపంబు న ల్లడం గడుయర్వంగాం బెజింగి కాల్పందచాడంగె హుతాశనుండు సే డృడ6(గ వనంబులోని మృగపక్షిభుజంగమభూతసంఘముల్‌, 259 ప్రతిపదార్హం: సువర్శ పర్వృతము= బంగారుకొండ(మేరువు); పెడిలి= పెట్టి: పెక్కు, తెజంగుల= అనేకవిధాల; వ్రయ్యునట్టుల= ముక్కలయ్యేటట్టు; అప్పుడు; హుతాశనుండు= అగ్నిహోత్రుడు; భూరి, శిఖా+ఆవలి= పెద్ద మంటల సమూహం; వివిధ, ప్రకారముల= అనేకవిధాల;: ఖాండవంబు, నల్లడన్‌= ఖాండవ వనంలో నాలుగు వైపుల; కడున్‌= మిక్కిలి; పర్వగాన్‌= వ్యాపించగా; 'పెజీగి= విజృంభించి; వనంబులోని; మృగ, పక్షి భుజంగమ, భూత, సంఘముల్‌= మృగాలయొక్క, పక్షులయొక్క, పాములయొక్క, ప్రాణులయొక్క సమూహాలు; చేడ్పడంగన్‌= బాధపడేటట్టు; కాల్పన్‌= కాల్చటానికి; తొడంగెఎ పూనుకొన్నాడు. ' తాత్పర్యం: మేరుపర్వతం పెట్టి పెక్కువిధాల ముక్కలయ్యేటట్టు అగ్నిహోత్రుడు తనయొక్క పెద్ద మంటల సమూహం అనేక విధాల ఖాండవవనంలో వ్యాపించగా విజృంభించాడు. మృగాల పక్షుల పాముల (ప్రాణులసమూహాలు బాధపడేటట్టు కాల్చ్బటానికి పూనుకొన్నాడు. విశేషం: అలం: ఉత్రేక్ష

870 శ్రీమదాంధ్ర మహాభారతము వ. అంత. 260 తాత్పర్యం: అప్పుడు. సీ, చక్రధరుం డయ్యు జలరుహనాభుండు । గాండీవధరుం డయ్యుం బాండవుండు

నుండి రవ్వనమున కుభయపార్య్వంబులం | దొల్లింటి యట్టులు పెల్లు రేంగి

యనలంబు నార్పంగ నార్జ్హుచు6 బఅతెంచి ।; వనరక్షకులు పార్టు సునిశితాస్త్ర

భారల నపగతదర్పు లై యరిగిరి ।; యమసదనంబున కమితబలులు; ఆ. శిఖభియు నుగ్రదీర్టజిహ్వలు సాచియు। ద్ధురసమీరణంబు తోడు సేసి

కొని యుగాంతకాల కుపితానలాకారు. ।; డయ్యె ఖాందవమున కద్దుతముగ 26+ ప్రతిపదార్థం: ఆ+వనమునకు= ఆ ఖాండవవనానికి; ఉభయ, పార్వంబులన్‌= రెండువైపుల: చక్ర, ధరుండు+అయ్యు= చక్రాయుధాన్ని ధరించిన వాడై; జలరుహనాభుండు=పద్మం నాభిలో కలవాడు- శ్రీకృష్ణుడు; గాండీవ, ధరుండు+అయ్యున్‌= గాండీవాన్ని ధరించిన వా డై; పాండవుండు= అర్జునుడు; ఉండిరి; తొల్లింటి, అట్టులు= పూర్వంవలె; పెల్టురేగి= విజృంభించి; అమితబలులు= మిక్కిలి బలం కలవాళ్ళు; వన, రక్షకులు= ఆ ఖాండవవనాన్ని రక్షించేవాళ్ళు; అనలంబున్‌= నిప్పును; ఆర్బంగన్‌= ఆర్పటానికి; ఆర్బుచున్‌= అరచుచు; పఅతెంచి= పరిగెత్తుకొనివచ్చి; పార్టు సునిశిత+అస్త్ర,ధారలన్‌= అర్జ్హునునియొక్క మిక్కిలి వాడి అయిన బాణాల వర్షంచే; అపగత, దర్చ్పులు+ఐ= కోల్పోయిన గర్వం కలవా ళ్ళయి; యమ, సదనంబునకు= యమునిఇంటికి; అరిగిరి= వెళ్ళారు- అనగా మరణించారు; శిఖ్చియున్‌= అగ్నిదేవుడుకూడా; ఉగ్ర, దీర్హ జిహ్వాలు= భయంకరాలు దీర్హాలు అయిన నాలుకలు; చాచి; ఉద్దుర, సమీరణంబుజ విజృంభించిన గాలిని; తోడు, చేసికొని; ఖాండవమునకు; అద్భుతముగజ= ఆశ్చర్యకరంగా" యుగాంత, కాల, కుపిత+అనల+ఆకారుండు= ప్రళయకాలంలో కోపంతో ఉన్న అన్నివంటి ఆకారం కలవాడు; అయ్యె, తాత్పర్యం: ఆ ఖాండవవనానికి రెండువైపుల- చక్రాయుధాన్ని ధరించి శ్రీకృష్ణుడు, గాండీవాన్ని ధరించి అర్జునుడు నిలబడ్డారు. అంతకుముందువలె అమితబలు లైన ఖాండవ వన రక్షకులు నిప్పు నార్సటానికి అరుస్తూ పరుగెత్తుకొని వచ్చారు. అర్జునుని వాడి బాణాలవర్షంవల్ల గర్వాన్ని కోలో ఎయి మరణించారు. అగ్నిదేవుడు భయంకరా లైన పొడవైన నాలుకలు చాచి, విజృంభించిన గాలిని తోడుచేసికొని ఆ ఖాండవానికి ప్రళయకాలాగ్ని వంటి వా డయ్యాడు. ను. ఘనధూమధ్వజ దహ్యమాన లవలీ కర్పూర తక్కోల చం

దన కాలాగరు సల్లకీతరుల యుద్యద్ధూమధూపానువా

సన నొప్పెన్‌ సురభీకృతంబు లగుచున్‌ సంక్రీడమానామృతా

శనవిద్యాధరసద్విమానవితతుల్‌ సావిత్రవర్శంబునన్‌. 262 ప్రతిపదార్హం: ఘన, ధూమ, ధ్వజ, దహ్యమాన, లవలీ కర్పూర, తక్కోల, చందన కాలాగరు, సల్లకీ, తరుల= గొప్పవాడు పొగను జెండాగా కలవాడు అయిన అగ్నిహోత్రునిచేత కాల్బబడుతున్న లవలి తీవలు, కర్పూరాలు, తక్కోలాలు, మంచిగంధాలు, నల్లఅగరులు అందుగులు అనే వృక్షాలయొక్క; ఉద్యత్‌+ధూమ, ధూప+అను వాసనన్‌= మీది కెగుస్తూ ఉన్న పొగ అనే ధూపాన్ని అనుసరించిన వాసనచేత; సావిత్ర, వర్మంబునన్‌= సూర్యుని దైన మార్గంలో- అంటే ఆకాశమంతటా; సం క్రీడమాన+అమృత+అశన, విద్యాధర, సజ్‌+విమాన, వితతుల్‌= విహరిస్తున్న దేవతలయొక్క, విద్యాధరులయొక్క ఉత్తమా లైన విమానాల సమూహాలు; సురభి కృతంబులు+అగుచున్‌= మంచివాసన కలవిగా చేయబడిన వై ఒప్పెన్‌.

ఆదిపర్వము - అష్టమాశ్వానము 871 తాత్పర్యం: బాగా విజృంభించిన అగ్జ్నిహోత్రుడు కాల్చే లవలీతీగలు, కర్పూరాలు, తక్కోలాలు, మంచిగంధాలు, నల్లఅగరులు, అందుగులు అనే వృక్షాలనుండి మీది కెగుస్తున్న పొగ అనే ధూపాన్ని అనుసరించిన వాసనచేత- ఆకాశమందంతటా విహరించే దేవతలయొక్క, విద్యాధరులయొక్క ఉత్తమ విమానాలు మంచి వాసనతో ('ప్రకాశించాయి. విశేషం: అలంకారం- రూపకం, అతిశయోక్తి, అగ్జిహోత్రునిమహాభయంకరవిజ్బృంభణం పద్యంలో ఓజోగుణవిళిష్టంగా ప్రకాళిస్తున్నది. చ. జ్వలనశిఖాలియున్‌ విజయుసద్విశిఖాలియు జుట్టుముట్టినం

దలరి భయాకులంబు లగు తద్వనజీవులయార్తనాద మం దులియుచు నొక్కపెట్ట దివి నుద్దత మయ్యె నమందమందరా చలపరివర్తనప్రసభసంక్షుభితార్హవఘోషఘోర మై. 263 ప్రతిపదార్థం: జ్వలన, శిఖా+ఆలియున్‌= అగ్నిహోత్రునియొక్క మంటల సమూహం; విజయు, సత్‌*విశిఖ+ఆలియున్‌= అర్హునునియొక్క మేలిమి బాణాల సమూహం; చుట్టు, ముట్టినన్‌; తలరి= కలత నొంది; భయ+ఆకులంబులు+అగు= భయంతో చెదరిన వైన; తత్‌+వన, జీవుల, ఆర్తనాదము= ఆ ఖాండవవనంలోని ప్రాణులయొక్క ఏడుపు; అందు; ఉలియుచున్‌= (మైగుతూ; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; అమంద, మందర+అచల, పరివర్తన, (ప్రసభ, సంక్షుభిత+అర్హవ, ఘోష ఘోరము+ఐ= తక్కువ కాని మందరపరతరయొక్క తిరగుడువలన బలవంతంగా కలతనొాందింపబడిన సము(ద్రంయొక్క శబ్దంవలె భయంకర మై; దివిన్‌= ఆకాశంలో; ఉద్గతము+అయ్యెన్‌= మీదికి లేచింది. తాత్పర్యం: అగ్నిహోత్రుని మంటల సమూహం, అర్జునుని మేలిమి బాణాల సమూహం చుట్టుముట్టగా, ఆ ఖాండవవనంలో కలతనొంది భయంతో చెల్దాచెద రైన ప్రాణుల ఏడ్పు ధ్వని- ఎంతోపెద్ద మందరపర్వతం తిరగటంవలన కలతనాందిన మహా సముద్ర ధ్వనివలె భయంకరమై ఒక్కసారిగా ఆకాశంలో మీదికి ఎగసింది. విశేషం: అలం: ఉపమ. నన్నయ రచనలో అక్షరరమ్యత కిది చక్కని ఉదాహరణ. శిఖాలి, విశిఖాలి చుట్టుముట్టినవైనం లకారప్రాసలో సూచించబడింది. చివరి పంక్తిలోని పరుష స్టిరాక్షర సంయోజనంతో సంక్షోభం దధ్వనింపచేయబడింది. బ్తి క. నెగయుడు నెగసి పిటుందం । దగిలెడు మిడుంగుటులచేత దర్ధచ్ధద మై గగనమున బజివ నోపక ; ఖగనివహము వహ్నాియంద కడువడి. బడియెన్‌. 264 ప్రతిపదార్హం: నెగయుడున్‌= ఎగురగానే; ఎగసిజు మ్సీదిక్తి లేచి; పిజుందన్‌; వెంటనే; తగిలెడు, మిడుగుజులచేతడ= తాకుతున్న నిప్పు రవులచేత; దగ్ధ ఛదము+ఐ= కాల్చబడిన రెక్కలుకల దై: గగనమునన్‌= ఆకాశంలో; పటవన్‌+ఓపక= పరుగెత్తలేక; ఖగ, నివహము= పక్షులసమూహం; వహ్ని, అందు+అ= నిప్పులలోనే; కడు, వడిన్‌= మిక్కిలివేగంగా; పడియెన్‌. తాత్పర్యం: అక్కడి పక్షులు తప్పించుకొని వెళ్ళాలని మీదికి ఎగురగానే, వాటిని వెంబడించి తాకే నిప్పురవ్వలచే రెక్కలు కాలి ఆకాశానికి ఎగురలేక అగ్నిలోనే పడ్డాయి. నిశేషం: అలం; స్వభావోక్తి లఘుబహుళమైన ఈకందం పక్షుల సత్వరగతినీ, పతనాన్నీ అక్షరరమ్యంగా సూచిస్తున్నది. క. _ తనతేజోజాలము ప ! ర్విన దర్ధము లగు ననేకవిధదేహుల దే హనికాయంబుల బహువిధ : తనువులు గలవాండవోలె దహనుం డొప్పెన్‌. 265

872 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్హం: తన, తేజ:శజాలము= తనయొక్క కాంతుల సమూహం; పర్విన= వ్యాపెంచగా" దగ్రములు+అగు= కాలిపోతున్న అనేక, విధ, దేహుల, దేహ, నికాయంబులజ= పెక్కువిధా లైన ప్రాణులయొక్క దేహాల సమూహాలచేత; దహనుండు= అన్నిహోత్రుడు బహువిధ, తనువులు, కలవాడు+అ, పోలెన్‌= అనేకవిధా లైన దేహాలు కలవానివలె; ఒప్పెన్‌= ప్రకాశించాడు. తాత్పర్యం: తన కాంతి సమూహం వ్యాపించగా కాలిపోతున్న అనేకవిధా లైన (ప్రాణుల దేహ సమూహాలతో అగ్నిదేవుడు అనేక విధా లైన దేహాలు కలవానివలె ప్రకాశించాడు. విశేషం: అలం: ఉపమ. చ. అమితకృశానుదరద్ధ మగు నయ్యమరేంద్రువనంబులోని యు త్తమసలిలాశయావళుల తప్తజలంబులయం దపేతజీ వము లయి తేలుచుండె వరవారిచరంబులు వారిపక్షులుం; గమరె నశేషకోకనదకైరవపంక్తులు వైవలంబులున్‌. 266 ప్రతిపదార్థం: అమిత, కృశాను, దగ్రము+అగు= అంతులేని అస్నిచేత కాల్బబడిన దగు; ఆ+అమర+ఇంద్రు వనంబులోని= ఆ దేవేంద్రునియొక్క ఉద్యానంలోని; ఉత్తమ, సలిల+ఆశయ+ఆవళుల= శ్రేష్టము లైన నీటిమడుగుల సమూహాలయొక్క; తప్త జలంబుల, అందు= కాగిననీటిలో; వర, వారి, చరంబులు= (శ్రేష్టము లైన నీటిలోచరించే ప్రాణులు; వారి, పక్షులున్‌= నీటిపక్షులూ; అపేత, జీవములు+అయిజ= పోయిన ప్రాణాలు కలవై; తేలుచు+ఉండె; అశేష కోకనద కైరవపంక్తులు= అన్ని ఎర్రకలువల, తెల్లకలువల సమూహాలు; శైవలంబులున్‌= నాచుతీగలు; కమరెన్‌= మాడిపోయాయి. తాత్పర్యం: అపరిమితంగా విజృంభించిన అగ్నిచేత కాల్బబడిన ఆ ఖాండవవనంలోని శ్రేష్టా లైన నీటిమడుగుల కాగిన నీటిలో - జలచరాలు, నీటి పక్షులు చచ్చి తేలాడుతూ ఉన్నాయి. ఎర్రకలువలు, తెల్లకలువలు, నాచుతీగలు లా మాడిపోయాయి. విశేషం: మహాష్రమాదకర మైన అన్నిహో(్రని విజ్బంభణాన్ని ఈ పద్యం చక్కగా (ప్రకటం కావిస్తూ ఉన్నది. సరోవరాలను వర్తించే లం ఈ పద్యంలో అంతస్ట్రాల, నాదాక్షరాల పునరావృత్తి అక్షరరమ్యతను వ్యక్తీకరిస్తున్నది. క. అలుగుల పడి ఖాండవమునం । గల యాశీవిషమహోరగము లెల్ల విషా గ్నులు గ్రక్కుచు నత్యుగ్రా ; నలబహులజ్వాలలందు నాశము వొందెన్‌. 267 ప్రతిపదార్థం: అలుగులపడి= బాధపడి; ఖాండవమునన్‌; కల; ఆశీ, విష మహా+ఉరగములు+ఎల= ముఖంలో విషం కల 'ెద్దపాములన్నీ; విష+అగ్నులు= విష మనే నిప్తులను; 'క్రక్కుచున్‌; అతి+ఉ(గ్ర+అనల, బహుల, జ్వాలల, అందు= మిక్కిలి భయంకర మైన అన్నియొక్క పెక్కుమంటలలో; నాశము; పొందెన్‌. తాత్పర్యం: ఖభాండవవనంలో నివసించే పెద్ద పాములన్నీ బాధపడి విష మనే నిప్పులు క్రక్కుతూ మహాభయంకర మైన అగ్నియొక్క అనేకజ్వాలలలో పడి నశించిపోయాయి. న. అంత దేవత లెల్ల మహావహిశిఖాహతికి వెలచి దేవేంద్రుపాలికిం బోయి ఖాండవంబున కైనయకాండ ప్రకయంబు సెప్పిన వినియదరిపడి యింధ్రుండు తక్షకరక్షణాపేక్ష ననేకధారాధరనివహంబుతో నతిత్వరితగతి ఖాండవంబునకు వచ్చి హుతాశనుమీంద మహావారిధారలు గురియించిన. 2698

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 873 ప్రతిపదార్హం: అంత= అప్పుడు; దేవతలు+ఎల్ల; మహా, వహ్ని, శిఖా, హతికి= గొప్పునిప్తుమంటలదెబ్బకు; వెజచి= భయపడి; దేవేండద్రు, పాలికిన్‌= దేవేంద్రునిదగ్గరకు; పోయి; ఖాండవంబునకు+ఐన= ఖాండవవనానికి జరిగిన; అకాండ, (ప్రళయంబు= అకాల వినాశం; చెప్పిన; విని; అదరిపడి; ఇంద్రుండు: తక్షక, రక్షణ+అపేక్షన్‌= తక్షకుడిని కాపాడా లన్న కోరికతో; అనేక, ధారాధర, నివహంబుతోన్‌= పెక్కు మేఘాల సమూహంతో; అతి, త్వరిత, గతి= మిక్కిలివేగంగా; ఖాండవంబునకు; వచ్చి; హుతాశనుమీద= అగ్నిహోత్రునిమీద; మహా, వారి, ధారలు= పెద్దనీటిధారలు; కురియించిన. తాత్పర్యం: అప్పుడు దేవతలంతా ఆ గొప్ప నిప్పు మంటల దెబ్బకు భయపడి, దేవేంద్రునిదగ్గరకు వెళ్ళారు. ఖాండవవనానికి జరిగిన అకాల వినాశాన్ని గూర్చి చెప్పారు. అది విని దేవేంద్రుడు అదిరిపడ్డాడు. తక్షకుణ్లీ కాపాడా లన్న కోరికతో అనేక మేఘాలను వెంట పెట్టుకొని, వేగంగా వచ్చి, అగ్నిహోత్రని మీద పెద్ద నీటి ధారలు కురిపించాడు. విశేషం: తక్షణుడు కద్రువ పుత్రుడు. పాము. ఉదంకుని కుండలాలు అపహరించింది, పరీక్షిత్తును కాటువేసి చంపిందీ ఇతడే. జనమే జయునిసర్పయాగంలో అగ్నిలో పడకుండా ఇతడు దేవేంద్రుడిని శరణువేడి, అతని సింహాసనాన్ని కౌగిలించుకొన్నాడు. కడకు అస్తీకునిఅనుగ్రహంవలన అన్నిలో పడకుండా (బ్రతికాడు.

క. ఆ వారిధార లెల్ల మ । హావహ్నిశిఖాహతంబు లయి శుష్మను లై

లావటి నడుమున యడంగుటం । బావకు పయి నొక్కచినుకుం బడదయ్యె వడిన్‌. 269 ప్రతిపదార్హం: ఆ, వారి, ధారలు+ఎల్ల= ఆ నీటి ధార లన్నీ; మహా, వహ్ని, శిఖా, హతంబులు+అయి= గొప్పఅన్షియొక్క మంటలచే కొట్టబడినవై; శుష్కములు+ఐ= ఎండిపోయిన వై; లావుశఅతి= బలం చెడి; నడుమన్‌+అ= నడుమనే; అడంగుటన్‌= నాశనం కావటంచేత; పావకు, పయిన్‌= అగ్నిహోత్రునిమీద: ఒక్క, చినుకున్‌; వడిన్‌= వేగంగా: పడదు+అయ్యె. తాత్పర్యం; ఆ నీటిధార లన్నీ గొప్ప నిప్పు మంటల చేత కొట్టబడి, ఎండి. బలం చెడి, నడుమనే నాశనం కావటంవలన అన్నిహోత్రునిమీద ఒక్కచిను కైనా వేగంగా పడలేదు. కు ఉలుముచు మెలుముచుం బిడుగులు । వఅలంగ నలుగడలం బడ నవారితవృష్టుల్‌

గులుకొని కురియంగం బంచెను ।; మజియును నయ్యనలుమీంద మఘవుం డలుకన్‌. 270 ప్రతిపదార్థం: మఘవుండు= దేవేంద్రుడు; అలుకన్‌= కోపంతో; ఉలుముచు; మెటుముచున్‌; పిడుగులు; వజల(గన్‌= ప్రకాశిస్తూ; నలుగడలన్‌= నాలుగువైపుల; పడన్‌= పడేటట్టుగా; మణియును; ఆ+అనలుమీద= ఆ అగ్నిహోత్రునిమీద; గుజుకొని= (ప్రయత్నించి; అవారిత, వృష్టుల్‌= అడ్డగింప సాధ్యంకాని వానలు; కురియంగన్‌; పంచెను= ఆజ్ఞాపించాడు. తొత్పర్యం: ఉరుముతూ, మెరుస్తూ నాలుగువైపుల పిడుగులు పడేటట్టు - అడ్డగించ సాధ్యంకాని వానలు - మళ్ళీ ఆ అన్నిహోత్రునిమీద ప్రయత్నించి కురవండని దేవేంద్రుడు కోపంతో మేఘాలను ఆజ్ఞాపించాడు. క. _ పాండుసుతుం డంత నానా ।; కాండసహస్రముల నేసి ఘనముగం జేసిన్‌.

ఖాండవగ్భృహము నఖండా ।; ఖండలధారలకు దూఖజం గాకుండంగన్‌. 271 ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; పాండు, సుతుండు= పాండురాజు కుమారు డైన అర్జునుడు; అఖండ+ఆఖండల, ధారలకు= ఎడతెగని దేవేంద్రుని వర్షధారలకు; దూజన్‌+కాకుండంగన్‌= దూరుటకు వీలులేకుండా; నానా, కాండసహ(స్రములన్‌= అనేకవిధా లైన బాణాలు వేలకొద్దిగా; ఏసి= వేసి; ఖాండవ, గృహమున్‌= ఖాండవవనానికి ఇంటిని; ఘనముగన్‌= గొప్పగా: చేసెన్‌= నిర్మించాడు.

874 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: అప్పుడు అర్హునుడు దేవేంద్రుడు కురిపించే వర్షధారలు దూరటానికి వీలులేకుండా అనేక విధా లైన బాణాలు వేలకు వేలు ప్రయోగించి ఖాండవవనానికి గొప్పగా ఇల్లు కట్టాడు. వ, ఇట్లు కావించిన. 272 తాత్సర్యం: ఈ విధంగా చేయగా. తే. దాని వెల్వదనేరక తద్వనంబు । జీవులెల్లను బావకశిఖలం జేసి దగ్గు లగుచున్నం దక్షకతనయు డశ్వ । సేనుం డను భుజంగమ మగ్నిశిఖల కపుడు. 273 ప్రతిపదార్థం: దాని= ఆ గృహాన్ని; వెలువడనేరక= దాటి బయటకు రాలేక; తత్‌*వనంబు, జీవులు+ఎల్లను= ఆ వనంలోని ప్రాణు లన్నీ; పావక, శిఖలన్‌+చేసి= నిప్పుమంటలవలన; దగ్గులు+అగుచు+ఉన్నన్‌= కాలిపోతుండగా; తక్షక, తనయుండు= తక్షకుని యొక్కకుమారుడు; అశ్చసేనుండు;? అను; భుజంగమము= పాము; అగ్ని; శిఖలకు= నిప్తుమంటలకు; అపుడు. తాత్సర్యం: అర్జునుడు నిర్మించిన ఆ ఇంటిని దాటి బయటికి రాలేక, ఆ వనంలోని (ప్రాణులన్నీ నిప్తు మంటలవలన కాలిపోతుండగా, తక్షకునికుమారు డైన అశ్చసేనుడు అనే పాము ఆ నిప్పుమంటలకు అప్పుడు. ఆ. వెజచి తల్లి దోంకం గజపించుకొని దివిం। బఐచువాని జూచి పార్గుం డలిగి వాని తల్లి శిరము తోన తత్పుచ్చంబు । దునిసి యగ్నిశిఖలం దొరంగ నేసె. 274 ప్రతిపదార్థం: వెజచి= భయపడి; తల్లిన్‌; తోకన్‌; కజపించుకొని; దివిన్‌= ఆకాశంలో; పజచు, వానిన్‌= పరుగెత్తేవాడిని; చూచి; పార్టుండు= అర్జునుడు; అలిగి కోపించి; వాని; తల్లి; శిరముతోన; తత్‌+పుచ్చంబు= అతనియొక్కతోక తునిసి= తెగి అన్ని, శిఖలన్‌= నిప్తుమంటలలో; తారగన్‌= పడేటట్టు; ఏసె= కొట్టాడు. తాత్పర్యం: భయపడి తల్లిని తన తోకలో కరపించుకొని ఆకాశంలో పరుగెత్తే ఆ అశ్వ సేనుడిని అర్జునుడు చూచాడు. కోపపడ్డాడు. తల్లి తలతోకూడా అతనితోక తెగి నిప్టుమంటలలో పడేటట్టు కొట్టాడు. వ. వెండియు నశ్వసేను నేయసమకట్టిన యప్పార్గునకు. దత్‌క్షణంబ మోహిని యను మాయ గావించి యమరేంద్రుం డశ్వసేను విడిపించి యందుం దక్షకుండు దగ్భుం డయ్యెను కా వగచి కడు నలిగి. 275 ప్రతిపదార్థం: వెండియున్‌= మరల; అశ్వసేనున్‌; ఏయ= కొట్టటానికి; సమకట్టిన= పూనుకోగా; ఆశ+పార్టునకున్‌= ఆ అర్జునునికి; తత్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; మోహిని; అను; మాయ ; కావించి= చేసి; అమర+ఇం(ద్రుండు= దేవేంద్రుడు; అళ్చసేను" విడిపించి; అందున్‌= ఆ ఖాండవవనంలో; తక్షకుండు; దగ్దుండు+అయ్యెను కా వగచి= కాలిపోయా డని తలచి; కడున్‌= మిక్కిలి; అలిగి= కోపించి. తాత్పర్యం: మళ్ళీ అశ్చసేనుడిని కొట్టటానికి పూనుకోగా, దేవేంద్రుడు వెంటనే అర్జునునికి మోహిని అనే మాయ కావించి, అశ్వసేనుడిని విడిపించి, ఖాండవంలో తక్షకుడు కాలిపోయాడేమో అని భావించి మహాకోపంతో.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 875 ఇంద్రుండు కృష్ణార్దునులతో( బోరుట. (సం- 1-218-13) ఉ. ఆ నరుమీంద ఘోరనిశితాశని వైచె నఖండచండ రుం రూనిలజర్జరీకృతమహాజలధారలతో నిరంతరా నూన పయోధరప్రకర ముద్ధుత మై హరిదంతరంబులన్‌ భానుపథంబు నొక్కమొగిం బర్వి భయంకరలీలం గప్పంగన్‌. 276 ప్రతిపదార్హం: అఖండ, చండ, రుంరు+అనిల, జర్జరీకృత, మహా, జల, ధారలతో= తక్కువకాని భయంకరమైన గాలివానచే చెదరగొట్టబడిన పెద్ద నీటిధారలతో; నిరంతర+అనూన, పయోధర, (ప్రకరము= ఎడతెగనట్టి వెలితిలేని నీటిని ధరించే మేఘాల సమూహం-' అంటే ఎడతెగని నిండజైనమేఘాల సమూహం; ఉద్ధతము+ఐ= విజ్బంభించి; హరిత్‌ఖఅంతరంబులన్‌= దిక్కుల మధ్యభాగాలను; భాను, పధంబున్‌= సూర్యునిమారాన్ని- అంటే ఆకాశాన్ని; ఒక్క. మొగిన్‌= ఒక్కసారిగా? పర్వి= పరుగెత్తి; భయంకరలీలన్‌= భయం కలిగించే విధంగా; కప్పంగన్‌= కప్పివేయగా; ఆ, నరు, మీందన్‌= ఆ అర్జ్హునునిమీద; ఘోర, నిశిత+అశళని= భయంకర మైన వజ్రాయుధాన్ని; వైచెన్‌= వేశాడు. తాత్పర్యం: తక్కువ కానిది, భయంకర మైనది అయిన గాలివానచేత చెదరగొట్టబడిన పెద్ద నీటిధారలతో- ఎడతెగని పెద్ద మేఘాల సమూహం విజృంభించి- ఒక్కసారిగా పరుగెత్తి దిక్కుల మధ్యప్రదేశాలను ఆకాళాన్ని కప్పివేయగా- దేవేంద్రుడు ఆ అర్జ్హునునిమీద భయంకర మైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. య అ న్నవవారివాహ నివహమ్ములం జూచి భయప్రపన్నుః డై యున్నహుతాశనున్‌ విజయు. డోడకు మంచును మారుతాస్తమ త్యున్నతచిత్తుం దేసి; నధియున్‌ విరియించె రయంబుతో సము తృన్నసమీరణాహతి నపార పయోద కదంబకంబులన్‌. 277 ప్రతిపదార్థం: ఆ+నవ, వారివాహ, నివహమ్ములన్‌= ఆ కొత్తమేఘాల సమూహాలను; చూచి; భయ, ప్రపన్నుండు+ఐ= భయంచే శరణువేడిన వాడై; ఉన్న; హుతాశనున్‌= అగ్లిహో(త్రుడిని; అతి+ఉన్నత, చిత్తుండు= మిక్కిలి గొప్ప థధైన మనస్సు కలవాడు; విజయుండు= అర్జునుడు: ఓడకుము= భయపడకుము: అనుచును; మారుత+అస్త్రము= వాయవ్వా'స్తాన్ని; ఏసెన్‌= ప్రయోగించాడు; అదియున్‌= ఆ వాయవ్యాస్త్రం; సముత్పన్న, సమీరణ+ఆహతిన్‌= అప్పటికప్పుడు. గొప్పగా పుట్టిన గాలిదెబ్బచే: అపార, పయోద,కదంబకంబులన్‌= అంతులేని మేఘాలగుంపులను; రయంబుతో= వేగంతో; విరియించెన్‌= చెదరగొట్టింది. తాత్పర్యం: ఆ క్రొత్త మేఘాల సమూహాలను చూచి, భయపడి శరణువేడిన అగ్నిహో(త్రుడిని చూచి, అర్జునుడు పెద్దమనస్సుతో- భయపడవద్దని చెప్పి, వాయవ్యాసస్తాన్ని ప్రయోగించాడు. ఆ వాయన్యాస్త్రం అప్పటికప్పుడు పుట్టిన గాలి దెబ్బచే అంతులేని ఆ మేఘాల గుంపులను వెంటనే చెదరగొట్టింది. విశేషం: ఇక్కడ అర్జునుని విజయు డనటంలో మున్ముందు అతడు సాధించబోయే విజయంకూడా ధ్వనింపచేయబడింది. వ అంత. 278 తాత్సర్యం: అప్పుడు.

876 శ్రీనముదాంధ్ర మహాభారతము స్‌. _ బలవైరి కృష్ణుపై బార్జుపైం గడునల్లి । పంచిన గలయంగం బన్ని కడంది సురగరుడోరగాసురసిద్ధగంధర్వు । లార్టుచు. దాంకి యుగ్రాహవంబు సేసిన నమరులం జెచ్చెరం బార్జుండు । భంజించెం దనదివ్యబాణశక్తిం జక్రధరుండును జక్రబలంబున : గరుడోరగాసురఖచరవరుల6 ఆ. దత్‌క్షణంబ విగతదర్పుల. జేసి: న । య్యిద్దణకు సురాసురేశు లెల్ల భీతు లగుట చూచి పెద్దయు విస్మిత ; హృదయు. డదయ్యె సురగణేశ్వరుండు. 279 ప్రతిపదార్థం: బలవైరి= దేవేంద్రుడు; కృష్ణు, పైన్‌; పార్టు, పైన్‌; కడు= మిక్కిలి; అలిగి= కోపించి; పంచినన్‌= ఆజ్ఞాపించగా సుర గరుడ+ఉరగ+శఅసుర, సిద్ద, గంధర్వులు; కలయంగన్‌= కలిసి; పన్ని= యుద్దం చేయటానికి వ్యూహం తీర్చి; కడంగి=ఐ పూని ఆర్భుచున్‌= అరుసూూ; తాంకి= ఎదుర్కొని; ఉ(గ్ర+ఆహవంబు= భయంకర మైన యుద్దం; చేసినన్‌; పార్టుండు= అర్జునుడు" తన దివ్య, బాణ, శక్తిన్‌= తనయొక్క దివ్యమైన బాణాల శక్తిచేత; అమరులన్‌= దేవతలను; చెచ్చెరన్‌= తత్‌క్షణమే; భంజించెన్‌= ఓడించాడు; చ(క్ర, ధరుండును= శ్రీకృష్ణుడుకూడా; చక్ర, బలంబున= చక్రాయుధంయొక్క బలంచేత; గరుడ+ఉరగ+అసుర ఖచర, వరులన్‌= శ్రేష్ట లైన గరుడులను, నాగులను, అసురులను, ఆకాశసంచారులను; విగత, దర్పులన్‌= కోల్పోయిన గర్వం కలవాళ్ళనుగా; చేసెన్‌; ఆ+ఇద్దణకు= ఆ కృష్ణార్దునులకు; సుర+అసుర+-ఈశులు+ఎల్ల= దేవదైత్సనాయకులంతా; భీతులు+అగుట= భయం పొందినవాళ్ళు కావటం; చూచి; సుర, గణ+ఈశ్వరుండు= దేవతా సమూహాల ప్రభువు- దేవేంద్రుడు" పెద్దయు విస్మిత హృదయుండు= ఆశ్చర్యం పొందిన మనస్సు కలవాడు; అయ్యె. తాత్పర్యం: దేవేంద్రుడు కృష్ణార్జునులపై మిక్కిలి కోపించి ఆజ్ఞాపించగా- సురలు, గరుడులు, నాగులు, అసురులు, సిద్దులు, గంధర్వులు ఏకమై వ్యూహం తీర్చి, పూనికతో అరుస్తూ ఎదుర్కొని భయంకర యుద్దం చేశారు. అర్జునుడు తన దివ్య బాణాల శక్తిచేత దేవతలను తత్‌క్షణమే ఓడించాడు. శ్రీకృష్ణుడుకూడా తన చక్రాబలంతో గరుడులకు, నాగులకు, అసురులకు, ఆకాశ సంచారులకు గర్వభంగం కావించాడు. ఆ కృష్ణార్దునులకు దేవ దైత్య నాయకు లంతా భయపడటం చూచి, దేవేంద్రుడు ఆళ్ళర్యపడ్డాడు. (ప్రతిపదార్థం: మతియును= అంతేగాక; వారల= కృష్ణార్దునులయొక్క; బల, పరాక్రమంబులు; ఎజుంగ, వేండి= తెలిసికొనాలనుకొని; శక్రుండు= దేవేంద్రుడు; శిలా, వర్ణంబున్‌= రాళ్ళవానను; కురియించిన. చాత్సర్యం: అంతేకాక కృష్ణార్జునుల బలపరా(క్రమాలను తెలిసికొనగోరి ఇం[ద్రుడు రాళ్ళవాన కురిపించగా. క. _ నిశితశరవర్షమున ను । గ్రశిలావర్షమ్ముం జిత్రగతి నస్తకలా కుశలుండు నరు డశ్రమమునం 1 బ్రశాంతిం జొందించె నమరపతి వెరంగందన్‌, 281 ప్రతిపదార్థం: అస్త్ర, కలా, కుశలుండు= బాణ ప్రయోగ కళలో నేర్పరి అయినవాడు, నరుండు= అర్జునుడు; నిశిత శర వర్షమునన్‌= వాడి అయిన బాణ వర్షంచేత; చిత్ర, గతిన్‌= ఆశ్చర్యకర మైన విధంగా; ఉగ్ర, శిలా, వర్మమ్మున్‌= భయంకర మైన రాళ్ళవానను; అమర, పతి= దేవేంద్రుడు; వెరంగు+అందన్‌= ఆశ్చర్యంపొందగా; అశ్రమమునన్‌= శ్రమలేకుండా- సులువుగా; ప్రశాంతిన్‌+పొందించెన్‌= అణగిపోయేటట్టు చేశాడు తాత్పర్యం: బాణ ప్రయోగకళలో నిపుణు డైన అర్జునుడు, వాడి అయిన తన బాణాల వర్షంతో ఆశ్చర్యకరంగా, భయంకర మైన ఆ రాళ్ళవానను దేవేంద్రుడు కూడ ఆశ్చర్యపడేటట్టు అవలీలగా అణగించాడు.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 877 కు కొడుకుభుజవిక్రనుమునకుం ।: గదుసంతసపడియు. దృప్తిగానక చల మే ర్వడంగ హుతాశను నార్పం । గడంగి మహారౌద్రభంగిం గౌశికుండు వడిన్‌. 282 (ప్రతిపదార్హల: కౌశికుండు= దేవేంద్రుడు; కొడుకు; భుజపరా[క్రమానికి; కడు= మిక్కిలి; సంతసపడియున్‌= సంతోషంపొంది కూడా; తృప్తి, కానక= తృప్తిలేక; చలము= కోపం; ఏర్పడంగ= బయలుపడేటట్టు; హుతాళనున్‌= అగ్నిహో(త్రుడిని; ఆర్బన్‌; కడంగి= పూనుకొని; మహా, రౌద్ర, భంగిన్‌= మిక్కిలిభయంకర మైన విధంగా; వడిన్‌= వేగమే. తాత్పర్యం: దేవేంద్రుడు తన కుమారు డైన అర్జునుని భుజబల పరాశక్రమం చూచి, మిక్కిలి సంతోషించి, తృప్తిపొాందక కోపంతో అన్నిహో(త్రుడిని ఆర్పివేయటానికి పూనుకొని మహా భయంకరంగా వేగమే. చ. అరుదుగ దివ్యరత్ననివహంబులం జేసి వెలుంగుచున్న మం దరశిఖరంబు నెత్తికొని తద్దహనార్హు లడంగునట్లుగాం దెరలంగ వైచినం దపనతేజుండు పాండుసుతుండు దానిజ ర్టరితము సేసె వజ్రమయశాతశిలీముఖచండధారలన్‌. 283 ప్రతిపదార్థం: అరుదుగ= ఆశ్చర్యం కలిగేటట్టు: దివ్య, రత్న, నివహంబులన్‌+చేసి= క్రేషా లైన రత్న సమూహాలతో; వెలుంగుచు+ఉన్న; మందర, శిఖరంబున్‌= మందరపర్వతంయొక్క శిఖరాన్ని; ఎత్తికొని; తత్‌*దహన+అర్చులు= ఆ అగ్నిహోత్రునిమంటలు; అడంగు, అట్టుగాన్‌= అణగిపోయేటట్టుగా: తెరలంగ= కలతనొందేటట్టుగా; వైచినన్‌; తపన, తేజుండువా సూర్యునివంటి కాంతి కలవాడు; పాండు, సుతుండుజ పాండురాజు కుమారుడు- అర్జునుడు; దాని= ఆ మందరపర్వత శిఖరాన్ని? వజ్రమయశాత, శిలీముఖ, చండ, ధారలన్‌= వజ్రాయుధంవలె వాడి అయిన బాణాల భయంకర వర్షాలచేత; జర్జరితము= శిథిలం; చేసె. తాత్పర్యం: ఆశ్చర్యకరంగా దివ్య రత్న సమూహాలతో వెలుగుతున్న మందరపర్వత శిఖరాన్ని ఎత్తి దేవేంద్రుడు అగ్నిహోత్రునిమంటలు అణిగేటట్టు వేయగా, సూర్యునివంటి కాంతిమంతు డైన అర్జునుడు వజ్రాయుధంవలె వాడి అయిన తన బాణ వర్షాలతో దాన్ని ముక్కలు చేశాడు. కు ధరణీధరుచక్రమునకు€ ; బురుహూతతనూజుబాణముల కనిలో నె వ్వరు మార్కొననోపరు సుర ; గరుదోరగసిద్ధసాధ్యగణములలోనన్‌. 284 ప్రతిపదార్హల: ధరణీధరు, చ(క్రమునకున్‌= భూమిని ధరించినవా డైన శ్రీకృష్ణుని చక్రాయుధానికి; పురుహూత, తనూజ, బాణములకుజ= దేవేంద్రునికుమారు డైన అర్జునునియొక్క బాణాలకు; అనిలోన్‌= యుద్దంలో; సుర, గరుడ+ఉరగ, సిద్ద సాధ్య, గణములలోనన్‌= దేవతలయొక్క, గరుడులయొక్క, నాగులయొక్క, సిద్దులయొక్క, సాధ్యులయొక్క సమూహాలలో; ఎవ్వరు= ఎవరుకూడా; మార్కొనన్‌+ఓపరుజ= ఎదుర్కోలేరు. తొత్సర్యం: శ్రీకృష్ణునిచక్రాయుధాన్ని, అర్జ్హునునిబాణాలను, యుద్ధంలో దేవ గరుడ నాగ సిద్ధ సాధ్యులసమూహాలలో ఎవ్వరు కూడా ఎదుర్కొనలేరు. విశేషం: ధరణీధరుడు- భూమిని ధరించినవాడు- శ్రీమహావిష్ణువు- ఇక్కడ అతని అవతార మైన శ్రీకృష్ణుడు. పురుహాతు డనగా- యజ్ఞాలలో (ప్రచుర మైన పిలుపుకల్వాడు; పురు వను రక్కసుడిని చంపినవాడు- దేవేంద్రుడు.

878 శ్రీమదాంధ్ర మహాభారతము వ. అంత నొక్కయశరీరవాణి పాకశాసనున కి ట్లనియె. 285 ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; ఒక్క; అశరీరవాణి= శరీరం లేకయే ఆకాశంనుండి పుట్టే మాటలధ్వని- ఆకాశవాణి; పాకశాసనునకు= దేవేంద్రునితో; ఇట్టు+అనియె. తాత్పర్యం: అప్పుడు ఒక ఆకాశవాణి ఇంద్రునితో ఇట్టా అన్నది. నిశేషం: పాకశాసనుడు- వృత్రాసురుని సోదరు డైన పొకాసురుడిని చంపినవాడు- దేవేంద్రుడు. కు పరమమును లయిన తొల్లిటి 1 నరనారాయణులు కృష్ణనామంబుల ను

ర్వర నుదయించిరి; నీక । య్యిరువుర పేర్మియును వింతయే దివిజేంద్రా! 286 ప్రతిపదార్హం: దివిజ+ఇంద్రా!= దేవేంద్రా! పరమ, మునులు; అయిన; నర, నారాయణులు; కృష్ణ నామంబులన్‌= కృష్ణులు అనే "పేర్లతో: ఉర్వరన్‌= భూమియందు(పై): ఉదయించిరి= పుట్టారు; నీకు; ఆ+ఇరువుర= ఆ ఇద్దరియొక్క* పేర్మియును= గొప్పతనం; వింతయే= ఆశ్చర్యకరమా? " తాత్సర్యం: దేవేంద్రా! పరమ మును లైన నరనారాయణులు కృష్ణు లనే పేర భూమిమీద పుట్టారు. ఆ ఇద్దరి గొప్పతనం నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదా? ల్‌ న్‌ విశేషం: శ్రీకృష్ణునికే గాక అర్జునునికి కూడా కృష్ణుడు అనేపేరు ఉన్నది. శ్లో అర్జున: ఫల్లునః పార్హః కిరీటీ శ్వేతవాహనః బీభత్సో విజయ: కృష్ణు స్సవ్యసాచీ ధనంజయః । అని అర్జునుని పేర్చు చ. అలఘులు కృష్ణపార్ణులు మహాత్ములు యాదవకౌరవాన్వయం

బులు వెలుంగించుచున్న నృపపూజ్యులు: వీరల నీకు నోర్వణగా

నలవియె? వీరు దొల్లియు సురాసుర యుద్ధమునాండు దైత్యులన్‌

వెలయంగ నోర్జియున్న రణవీరులు గావుట ము న్నెబుంగవే? 287 ప్రతిపదార్థం: కృష్ణ, పార్టులు= కృష్ణార్దునులు; అలఘులు= తక్కువకాని వాళ్ళు- అంటే గొప్పవాళ్ళు , మహా+ఆత్ములు' యాదవ, కారవ+అన్స్నయంబులు= యాదవ కౌరవ వంశాలు; వెలుంగించుచు+ఉన్న; నృప, పూజ్యులు= పూజించ దగిన రాజులు; పీరల; నీకున్‌; ఓర్వగాన్‌= ఓడించటానికి; అలవియె= సాధ్యమా?; వీరు; తొల్లియు= పూర్వంకూడా; సుర+అసుర, యుద్దము నాండు= దేవ దానవ యుద్ద సమయంలో; దైత్యులన్‌= రాక్షసులను; వెలయంగ= గొప్పగా; ఓర్చి, ఉన్న= ఓడించిఉన్న; రణ పీరులు= యుద్దవీరులు; కావుట= కావటం; మున్ను= ఇదివరకు; ఎయుంగవే. తాత్పర్యం: కృష్ణార్జునులు గొప్పవాళ్ళు, మహాత్ములు, యాదవ కౌరవ వంశాలను వెలిగించే పూజ్య ప్రభువులు. వీళ్ళను ఓడించటం నీకు సాధ్యమా. పూర్వం దేవ దానవ యుద్ధంలో రాక్షసులను వీళ్ళు ఓడించటం ఇదివరకు నీకు తెలియదా? వ, నీయిష్టసఖుం డయిన తక్షకుం డిందుండక ముందరన కురుక్షేత్రంబున కరిగి ఖాండవప్రళజయంబునకు( దప్పె;

ఖాండవం బగ్నిచేత దద్ధం బగు నని తొల్లి బ్రహ్మావచనంబు గలుగుటం జేసి యిది హుతాశనున కశనం బయ్యె;

నింక దీనికి వగవం బనిలే; దనిన దాని విని సురపతి సురగణంబులతో మరలిన. 288

ఆదిపర్వము - అష్టమాశ్వానము 879 ప్రతిపదార్హం: నీ, ఇష్ట సఖుండు+అయిన= నీకు మిక్కిలిఇష్టమైన స్నేహితు డైన; తక్షకుండు; ఇందు= ఇక్కడ; ఉండక; ముందరన= ముందుగానే, కురుక్షేత్రంబునకు; అరిగి= వెళ్ళి; ఖాండవ, ప్రళయంబునకున్‌= ఖాండవవనంలోని (ప్రమాదానికి; తప్పెజ= దూరమయినాడు; ఖాండవంబు; అన్షిచేత; దగ్ధంబు+అగును= కాలిపోతుంది; అని; తొల్లి= పూర్వం; బ్రహ్మ, వచనంబు= (బ్రహ్మదేవునిమాట; కలుగుటన్‌*+చేసి= ఉండటంచేత; ఇది; హుతాశనునకుజఐ అగ్నిహోత్రుడికి; అశనంబు= ఆహారం; అయ్యెన్‌; ఇంక; దీనికి; వగవన్‌= చింతింప; పనిలేదు; అనిన; దాని; విని; సుర, పతి=ఐ దేవతలరాజు- దేవేంద్రుడు; సుర, గణంబులతో= దేవతా సమూహాలతో; మరలిన= తిరిగి వెళ్ళగా. తాత్పర్యం: “నీ ప్రియమి(త్రు డైన తక్షకుడు ఇక్కడ లేడు. ముందుగానే కురుక్షేత్రానికి వెళ్ళి ఈ ఖాండవ దహనంవలన కలిగే (ప్రమాదాన్ని తప్పించుకొన్నాడు. అగ్నిచే ఖాండవం కాలిపోతుం దని పూర్వమే (బ్రహ్మ చెప్పాడు. అందుచేత ఇది అగ్నిహో(త్రునికి ఆహార మైనది. ఇక దీనికి దుఖింపనక్కర లేదు” అని చెప్పగా విని దేవేంద్రుడు దేవతా సమూహాలతో తిరిగి వెళ్ళగా.

క. బలయుతులు మనుజసింహులు । నలిం గృష్టార్దునులు సింహనాదముల వియ త్తలమును దిక్కులు బధిరం । బులుగాం జేసిరి త్రిలోకములు భయ మందన్‌. 289 ప్రతిపదార్థం: బల, యుతులు= బలంతో కూడినవాళ్ళు- అంటే బలవంతులు; మనుజ, సింహులు= మానవ'క్రేష్టులు; కృష్ణ+అర్జునులు; నలిన్‌= అతిశయంగా; సింహనాదములజ= సింహనాదాలచేత; వియత్‌+తలమును= అకాశంయొక్క (క్రిందిభాగం; దిక్కులు; త్రిలోకములు= మూడులోకాలు; భయము+అందన్‌= భయపడగా; బధిరంబులు+కాన్‌= చెవిటివి అయ్యేటట్టుగా; చేసిరి. తాత్పర్యం: బలవంతులు, మానవ(శ్రేష్టులు అయిన కృష్ణార్దునులు ముల్లోకాలు భయపడేటట్టుగా ఆకాశం, దిక్కులు చెవిటి వయ్యేటట్టుగా పెద్ద సింహనాదాలు చేశారు. న. అట్టియవసరంబున నముచి యను దనుజుననుజుండు మయుం డను వాండు ఖాండనంబు వెలువడనేరక తక్షకుగృహంబునం బరిభ్రమించుచున్నంతం ద న్నగ్ని చుట్టుముట్టిన నచ్యుతుండును జంప వచ్చిన నతిభీతుం డై యర్జునుమలువు సొచ్చిన. 290 ప్రతిపదార్థం: అట్టి; అవసరంబున= సమయమున; నముచి; అను; దనుజు, అనుజుండు= రాక్షసుడిని అనుసరించి పుట్టినవాడు- అనగాతమ్ముడు; మయుండు; అనువాడు; ఖాండవంబు; వెలువడ, నేరక= ఖాండవ వనం నుండి బయటికి రాలేక; తక్షకు, గృహంబునన్‌; పరిభ్రమించుచు= అంతటా తిరుగుతూ; ఉన్న+అంతన్‌; తన్ను= తనను; అగ్ని; చుట్టుముట్టినన్‌?; అచ్యుతుండును= శ్రీకృష్ణుడుకూడా; చంపవచ్చినన్‌; అతి, భీతుండు+ఐ= మిక్కిలిభయపడినవా డై; అర్జును, మజువు= అర్జునునిచాటు; చొచ్చిన. తాత్పర్యం: అట్లాంటి సమయంలో నముచి అనే రాక్షసునితమ్ముడు, మయుడు అనేవాడు ఖాండవ వనం నుండి బయటపడలేక తక్షకునిఇంట్లో దిక్కుతోచక తిరుగుతూ, తనను అగి చుట్టుముట్టగా, శ్రీకృష్ణుడు చంపటానికి రాగా, మిక్కిలి భయపడి అర్జునునిచాటు చొచ్చాడు. క శరణాగతరక్షణత , త్పరుండు ధనంజయుడు మయునిప్రాణము గాచెం; గరుణను శరణాగతులగు : పురుషుల రక్షించునంత పుణ్యము గలదే. 291 ప్రతిపదార్థం: శరణ+ఆగత, రక్షణ, తత్‌+పరుండు= శరణుకోరి వచ్చిన వాళ్ళను రక్షించటంలోమనస్సు కలవాడు; ధనంజయు:డు= అర్జునుండు; మయుని; ప్రాణము; కాచెన్‌= కాపాడాడు; కరుణను= దయతో; శరణ+ఆగతులు+అగు= శరణుకోరి వచ్చిన వాళ్ళయిన; పురుషుల; రక్షించు, అంతః రక్షించేటంతటి: పుణ్యము; కలదే= వేరే ఉన్నదా? (లేదని భావం).

880 శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: శరణు కోరి వచ్చిన వాళ్ళను రక్షించటంలో మనస్సు కల అర్జునుడు మయుని(ప్రాణాలు కాపాడాడు. శరణుకోరినవాళ్ళను దయతో రక్షించటంవంటి పుణ్యం ఇంకొకటి కలదా! (లేదనిభావం). విశేషం: అలంకారం- ఆర్జాంతరన్యాసం. నానారుచిరార్థసూక్తినిధి అయిన నన్నయ కవితలో 'శరణాగతరక్షణ మహాపుణ్యకార్యమ' ని ప్రవచించిన ఈసూక్తి ఒక మేలిమిరత్నం. తే. మయుండు నశ్వసేనుండును మందపాల ; సుతులు నలుగురు శార్‌జ్లకు లతులదావ దాహభీతి కయ్యార్వురు€ దప్పి రన్య । జీవులెల్ల నం దపగతజీవు లైరి. 292 (ప్రతిపదార్హం: మయుడున్‌: అశ్వసేనుండును; మందపాల, సుతులు= మందపాలునియొక్క కుమారులు; శార్‌జ్లకులు" నలువురు" ఆ+ఆర్వురు= ఆ ఆరుగురు; అతుల, దావ, దాహ, భీతికి= సాటిలేని కార్చిచ్చువలన కలిగే భయానికి; తప్పిరి; అన్య, జీవులు+ఎల్లన్‌= తక్కినప్రాణులన్నీ; అందు; అపగత, జీవులు+ఐరి= ప్రాణాలు కోల్పోయారు. తాత్సర్యం: మయుడు, అశ్వ సేనుడు, మందపాలునికుమారులు శార్‌జ్లకు లనేవాళ్ళు నలుగురు-మొత్తం ఆరుమంది ఆ దావాన్షినుండి తప్పించుకొన్నారు. తక్కిన (ప్రాణులన్నీ ఆ దావాన్షిలో మరణించాయి. మందపాలోపాఖ్యానము (సం- 1-220-1) వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 293 తాత్పర్యం: అని చెప్పగా విని జనమేజయుడు వైశంపాయనునితో ఇట్లా అన్నాడు. క. మయభుజగమోక్షణము ని ; రృయముగ నెజింగితి; నెలుంగ నా కర్పిత్వం బయినది నలుగురుశార్‌జ్ఞికు ।; లయు మోక్షణ మెట్లు నిర్మలజ్ఞాననిధీ! 294 ప్రతిపదార్థం: నిర్మల, జ్ఞాన. నిధీ= అచ్చపు జ్ఞానానికి స్టానమైనవాడా! ఓ వైశంపాయనమహర్షీ; మయ, భుజగ, మోక్షణము= మయునియొక్క, పామైన అశ్చసేనునియొక్క విముక్తి- అంటే మయుడు, అళ్ళసేనుడు ఆ దావాగ్నినుండి తప్పించుకొని బయటపడిన విధం; నిర్ణ్మయముగన్‌= నిశ్చయంగా- అంటే పూర్తిగా? ఎజింగితిన్‌= తెలిసికొన్నాను; నలుగురు, శార్‌జ్లకులయు, మోక్షణము= నలుగురు శార్‌బ్లకులు తప్పించుకోవటం; ఎట్టు=ఐ ఏ విధంగా జరిగిందో; నాకు; ఎజుంగ= తెలుసుకోవటానికి; అర్థిత్వంబు+అయినది= కోరిక కలిగింది. తాత్సర్యం: నిర్మల జ్ఞానానికి నిధివంటి ఓ వైశంపాయనమహర్షీ! మయుడు, అశ్చసేనుడు ఆ దావార్నినుండి తప్పించుకొన్నవిధం పూర్తిగా తెలిసికొన్నాన్లు మందపాలుడికుమారు లైన నలుగురు శార్‌జ్షకు లెట్టా తప్పించుకొన్నారో తెలిసికొనాలన్న కోరిక కలిగింది. వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 296 తొత్ప్సర్యం: అని అడుగగా వైశంపాయనుడు జనమేజయునితో ఈ విధంగా అన్నాడు. క జనపాల! మందపాలుం । డనుమునిముఖ్యుండు దొల్లి యత్యుగ్రతపం బొనరించె బ్రహ్మచర్యం । బున దివ్యసహస్రవర్న్షములు నైస్టికుం దై. 296 ప్రతిపదార్థం: జనపాలః= జనులను పాలించేవాడా! ఓజనమేజయమహారాజా!; తాల్లి= పూర్వం మందపొలుండు; అను; ముని, ముఖ్యుండు= ప్రసిద్దు డైనముని; (బ్రహ్మచర్యంబున= బ్రహ్మచర్యవ్రతాన్ని అవలంబిస్తూ; దివ్య, సహస్ర, వర్షములుజ వెయ్యి దేవతా

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 8581 సంవత్సరాలు; నైస్టికుండు+ఐ= నిష్టకలవా డై- అంటే స్థిర మైన బుద్ది కలవా డై; అతి+ఉ(గ్ర, తపంబు= మిక్కిలి భయంకర మైన తపస్సును; ఒనరించె= చేశాడు. తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా! పూర్వం మందపాలు డనే మహాముని (బ్రహ్మచర్య(వ్రతాన్ని అవలంబించి వెయ్యి దేవతా సంవత్సరాలు నిష్టతో భయంకర మైన తపస్సు చేశాడు.

క. _ అమ్ముని యోగాభ్యాసవ । శమ్మున దేహంబు విడిచి చని పుణ్యులలో

కమ్ములు సొరం గానక వడిం: ద్రిమ్మరి దేవతల. గాంచి ధృతి ని ట్లనియెన్‌, 297 (ప్రతిపదార్థం: ఆ+ముని= ఆ మందపాలమహాముని; యోగ+అభ్యాస, వశమ్మున= యోగాభ్యాసంచేత; దేహంబు; విడిచి; చని; పుణ్యుల, లోకమ్ములు= పుణ్యం చేసికొన్నవాళ్ళు ఉండేలోకాలు- దివ్యలోకాలు; చారన్‌+కానకజ ్రవేశించలేక; వడిన్‌= వేగమే; (త్రిమ్మరి= వెనుదిరిగి; దేవతలన్‌; కాంచి= చూచి; ధృతిన్‌= ధైర్యంతో; ఇట్టు+అనియెన్‌. తాత్పర్యం: ఆ మందపాలమహాముని యోగాభ్యాసంచేత శరీరం విడిచి వెళ్ళి, పుణ్యలోకాలను ప్రవేశించలేక, వెంటనే వెనుదిరిగి దేవతలతో ధైర్యంగా ఇట్టా అన్నాడు. న. _ 'నాకుంబుణ్యలోకంబులు లేకుండ నేనేమి దుష్కతంబు ససితి? ననిన నమ్మునీంద్రునకు దేవత లిట్లనిరి.298 (ప్రతిపదార్ధం: నాకున్‌; పుణ్య. లోకంబులు; లేకుండ; నేను; ఏమి; దుష్కృతంబు= పాపం; చేసితిన్‌; అనినన్‌; ఆ+ముని+ఇంద్రునకు= ఆ మునిశ్రేష్టునికి; దేవతలు; ఇట్టు+అనిరి.

తాత్పర్యం: 'నాకు పుణ్యలోకాలు లేకుండ పోవటానికి నే నేమి పాపం చేశాను?” అని ఆనగా ఆ ముని'(శ్రేష్టునితో

దేవతలు ఇలా అన్నారు.

కు. _ఎంతతపం బొనరించియు ; సంతానము లేనివారు సద్గతి బొందం గాంతురె? నీతప మేటికి ; సంతానమువడయు మరిగి సన్మునినాథా! 299

ప్రతిపదార్థం: సత్‌+ముని, నాధా!= పూజింపదగినముని'శ్రేష్టా; ఎంత; తపంబు; ఒనరించియు= చేసినా; సంతానము; లేని; వారు;

సత్‌+గతిన్‌= మోక్షాన్ని; పొందన్‌+కాంతురె= పొాందగలరా?; నీ, తపము= నీ తపస్సు; ఏటికి=ఐ ఎందుకు; అరిగి= వెళ్ళి; సంతానము; పడయుము= పొందుము.

తాత్పర్యం: పూజింప తగిన ఓ మునీశ్చరా! ఎంత తపస్సు చేసినా సంతానం లేనివాళ్ళు మోక్షాన్ని పొందకలరా?

నీ తపస్సెందుకు? వెళ్ళి సంతానాన్ని పొందుము.

వ, అనిన విని మందపాలుండు మర్వలోకంబునకుం దిరిగివచ్చి 'నాకుం జెచ్చెరం బెక్కంద్రుపుత్తుల నెవ్విధంబునం బడయనగునో' యని చింతించి, పక్షులయందు వేగంబ యపత్యంబు పెద్దయగుటం జూచి, తామను శార్‌బ్లకుం డై, జరిత యను లావుక పెంటియందు రమియించి, దానివలన జరితారి సారిసృక్కస్తంబమిత్ర ద్రోణు లనువారల నలువురం గొడుకులం బరమబ్రమ్మావిదులం బడసి, వారల ఖాండవంబునం బెట్టి , తనపూర్వభార్య యైన లపితయుం దానును విహరించుచు నొక్కనాండు ఖాండవదహనోద్యతుం డై వచ్చుచున్న యగ్నిభట్టారకుం గని, యగ్నిసూక్తంబుల స్తుతియించి యి ట్లనియె. 300

ప్రతిపదార్థం: అనిన; విని; మందపాలుండు; మర్య్య, లోకంబునకున్‌= మానవలోకానికి; తిరిగివచ్చి: నాకున్‌? చెచ్చెరన్‌= వేగమే:

పెక్కండ్రు; పుత్రులన్‌; ఏ, విధంబునన్‌; పడయన్‌= పొందటానికి; అగునో= సాధ్యపడునో; అని; చింతించి; పక్షుల, అందు; వేగంబ;

892 శ్రీమదాంధ్ర మహాభారతము అపత్యంబు= సంతానం; పెద్ద, అఆగుటన్‌= ఎక్కువకావటాన్ని; చూచి; తానును; శార్‌జ్లకుండు+ఐ= శార్‌జ్ఞకపక్షి (లావుకపక్షి రూపం దాల్చిన వాడై జరిత; అను; లావుక, పెంటి యందు= ఆడు లావుక పక్షియందు; రమియించి= సంభోగించి' దానివలన' జరితారి, సారిసృక్క, స్తంబమిత్ర, బోణులు; అనువారల; నలువురన్‌; కొడుకులన్‌; పరమ, బ్రహ్మ, విదులన్‌= గొప్పబ్రహ్మజ్ఞానం కలవాళ్ళను; పడసి= పొంది; వారల; ఖాండవంబునన్‌; పెట్టి; తన, పూర్వ, భార్య+ఐన= తన మొదటి భార్య అయిన; లపితయున్‌; తానును; విహరించుచున్‌; ఒకనాండు; ఖాండవ, దహన+ఉద్యతుండు+ఐ= ఖాండవవనాన్ని కాల్చటానికి పూనుకొన్నవా డ్రై; వచ్చుచు+ఉన్న, అగ్నిభట్టారకున్‌= అన్నిహో(త్రుడిని; కని= చూచి; అన్ని, సూక్తంబులజ అగ్నిని స్తుతించే వేదమంత్రాలతో: స్తుతియించి= స్తోత్రంచేసి లు పొగడి; ఇట్టు+అనియె. తాత్సర్యం: దేవతలు ఆ విధంగా చెప్పగా విని, మందపాలుడు మానవలోకానికి తిరిగివచ్చాడు. త్వరగా తాను పుత్రులను పొందటం ఏవిధంగా సాధ్యమౌతుందో ఆలోచించాడు. పక్షులలో సంతానం చాలాఎక్కువ కావటం చూచి, తాను మగ లావుక పక్షి రూపం తాల్చాడు. ఆడులావుకపక్షి అయిన జరితతో సంభోగించాడు. జరితారి, సారిసృక్క, స్తంబమి(త్ర, 'బ్రోణు లనే నలుగురు కొడుకులను- గొప్ప బ్రహ్మ జ్ఞానం కలవాళ్ళను కన్నాడు. వాళ్ళను ఖాండవ వనంలోఉంచి తాను తన మొదటి భార్య అయిన లపితతో కలిసి విహరిస్తూ ఒక రోజు ఖాండవవనాన్ని కాల్ఫే ప్రయత్నంతో వస్తున్న అగ్నిహోత్రుడిని చూచి, అగ్నిసూక్తాలతో ఆయనను స్తోత్రం చేసి ఇట్టా అన్నాడు. విశేషం: కధాప్రసన్నతను దృష్టిలో ఉంచుకొని నన్నయ ఇక్కడ మూలంలోని అగ్నిస్తోత్రాత్మకా లైన శ్లోకాలను అనువదించక వదిలాడు. క. _ నీవఖిలధర్శ్మమూర్తివి;। నాపీర్యప్రభవు లయిన నలువురుసుతులన్‌ లావుకలం గరుణం గావుము । పావక! భువనోపకారపర్యాప్తమతీ! 301 ప్రతిపదార్థం: భువన+ఉపకార= లోకానికి ఉపకారం చేయటంలో పర్యాప్తమతీ[= శక్తిమంత మైన మనస్సుకలవాడా!; పావక[= ౬ అగ్నిహోత్రా!; నీవు; అఖిల, ధర్మ మూర్తివి= సర్వధర్మస్వరూపుడవు; నా, వీర్య, 'ప్రభవులు+అయినజ= నా వీర్యంనుండి పుట్టిన వా ళ్ళయిన; నలువురు, సుతులన్‌= నలుగురు కుమారులను; లావుకలన్‌= లావుక పిట్టలను; కరుణన్‌= దయతో; కావుము= కాపాడుము. తాత్పర్యం: లోకానికి ఉపకారం చేయటంలో శక్తిమంత మైన మనస్సు గలవాడా! ఓ అన్నిహోత్రా! నీవు పరిపూర్ణ ధర్మమూర్తివి. నా వీర్యంనుండి పుట్టిన నలుగురు కుమారులు లావుకపిట్టలను దయతో రక్షించుము. న. అనిన నమ్మందపాలుప్రార్ధనంజేసి యానలువురుశార్‌జ్ఞకులను నగ్శిదేవుండు రక్షించువా. డయ్యె; నంత నిట. 302 తాత్సర్యం: అనగా, ఆ మందపాలుని (ప్రార్ధనవలన ఆ నలుగురు శార్‌జ్లకులను అగ్నిదేవుడు రక్షించాడు, ఇక ఇక్కడ. క్ర తనయుల నజాతపక్షుల । ననలశిఖాభీతిచంచలాత్తుల నెటయుం జననేరనిబాలకులను ; జననియు వీక్షించి శోకసంతాపిత యై. 303 ప్రతిపదార్థం: అజాత, పక్షులన్‌= మొలవని రెక్కలు కలవాళ్ళను; అనల, శిఖా, భీతి, చంచల+అత్ములన్‌= అన్నిజ్వాలలవలన కలిగే భయంవలన కంపించే హృదయాలు కలవాళ్ళను; ఎటయున్‌= ఎక్కడికీ; చననేరని= వెళ్ళలేని; బాలకులను= చిన్నపిల్లలను, రా తనయులన్‌= కుమారులను; జననియు= తల్లికూడా; వీక్షించి= చూచి; కోక, సంతాపిత+ఐ= దుఃఖంచేత మిక్కిలితాపం పొందిన దై తొచ్చర్యం: రెక్కలు మొలవనివాళ్ళు, నిప్పుమంటలు చూచి భయంచేత చలించే మనస్సు కలవాళ్ళు, ఎక్కడికీ వెళ్ళ లేని వాళ్ళు, పసివాళ్ళు అయిన కుమారులను చూచి తల్లి కూడా మిక్కిలి దుఃఖించింది.

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 883 క. _ వీరలం దోడ్కొనిపోవంగ : నేరను బాలకులం బెట్టి నర్భయబుద్ధిన్‌ వీరలతండ్రిక్రియం జన : నేరను; విధికృతము గడవనేరంగ లావే. 304 ప్రతిపదార్ధం: వీరలన్‌; తోడ్కొని= వెంటపెట్టుకొని; పోవంగ, నేరను= పోలేను; వీరల, తండ్రి, క్రియన్‌= వీళ్ళతండ్రివలె; బాలకులన్‌= పసివాళ్ళను; పెట్టి= ఇక్కడే వదలిపెట్టి; నిర్దయ, బుద్ధిన్‌= దయలేని మనస్సుతో; చన నేరను= వెళ్ళలేను; విధికృతము= (బ్రహ్మచే చేయబడింది; గడవనేరంగ= దాట కలగటం; లావే= అశక్యమేకదా! తాత్పర్యం: వీళ్ళను వెంటపెట్టుకొని పోలేను. వీళ్ళతం(డ్రివలె దయమాలి ఇక్కడే విడిచి పోలేను. విధికృతం తప్పించుకోవటం ఎవరికి సాధ్యం? విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 'విధికృతము గడవనేరంగ లావే నన్న్మయ నానారుచిరార్థసూక్తులలో ఇది ఒకటి. చ. ఇది ప్రకయాగ్నినోలె దెసలెల్లను గప్పంగ విస్పులింగముల్‌ వదలక వాయుసారథిజవంబునం దా నిట వచ్చె నేమి సే యుదు సుతులార! యీబజలము నొయ్యన పోయి చారుందు దీనింగ ప్పెద ఘనపొంసుజాలముల భీమశిఖావపళి దాళకుండంగన్‌. 305 ప్రతిపదార్హం: సుతులార[!= కుమారులారా!; ఇది; (ప్రళయ+అగ్ని, పోలె=ఐ ప్రళభయకాలంలోని అగ్నివలె; విస్ఫులింగముల్‌= నిప్తుకణాలు; వదలక; దెసలు+ఎల్లనుజ దిక్కులన్నింటా; కప్పంగవ= కప్పివేయగా; వాయు, సారథి= గాలిని సారథిగా కలవాడు- అగ్నిదేవుడు; జవంబునన్‌= వేగంగా; తాన్‌= తాను; ఇట= ఇటువైపు; వచ్చెన్‌? ఏమి; చేయుదు; ఈ, బిలమున్‌= ఈ రంధ్రాన్ని; ఒయ్యన= చక్కగా? పోయి; చొరుండు+అ= ప్రవేశించండి; భీమ, శిఖాశఆవళి= భయంకరా లైన మంటల సమూహాలు; తొంకకుండంగన్‌= తగులకుండా; ఘన, పాంసు, జాలముల= గొప్ప దుమ్ము కణాల సమూహాలచే- అంటే పెద్దదుమ్ముచేత; దీనిన్‌= ఈ రంధ్రాన్ని; కప్పెద= కప్పివేస్తాను. తాత్పర్యం; పుత్తు ప్ర ష్‌ ॥ వ డీ ఏం రం? నన నిప్పు కణాలు దిక్కు లన్నింటినీ కప్పగా అగ్నిదేవుడు వేగంగా ఇటు వైపు వచ్చా . ? తిన్నగా మీరు ఈ బొరియలో ప్రవేశించండి. భయంకరా లైన మంటలు తాకకుండా పెద్ద దుమ్ముతో నేను ఈ బౌరియను కప్పివేస్తాను. చ కొడుకుల బ్రహ్మవిత్తములం గోరి సతి: నయట్టుల వీరి నల్వురం బడసితి; నిమ్మహాత్ముల నపాయము నొందకయుండం బెంచుచున్‌ నడపుమట డపుమటంచు నన్ను మునినాథుయ మీజనకుండు పంచియి ప్పుడ యెటయేనిం బోయె హుతభుక్తళోయంబు దలంప కక్కటా! 306 ప్రతిపదార్థం: ముని, నాథుండు= మునీంద్రు డైన మందపాలుడు; మీ, జైనకుండు= మీ తండ్రి; కోరిన, అట్టులు+ఆ= కోరుకొన్నట్టే: (బ్రహ్మవిత్తములన్‌= బ్రహ్మజ్ఞానం కలవాళ్ళలో 'శ్రేష్టులను; కొడుకుల; వీరి; నల్వురన్‌: పడసితిన్‌= పొందాను; ఈ+మహాత్ములన్‌! అపాయము; ఒందక, ఉండన్‌= పొందకుండా; పెంచుచున్‌; నడపుము; ఆటంచు; నన్ను; పంచి= ఆజ్ఞాపించి; హుతభుక్‌+*ప్రళయంబు= అగ్నిప్రమాదాన్ని; తలంపక; అక్కటా; ఇప్పుడు+అ= ఇప్పుడే- అంటే ఈ ప్రమాదపరిస్థితు లేర్పడిన సమయంలో; ఎట, ఏనిన్‌= ఎక్కడికో; పోయె= వెళ్ళాడు. ళ్‌

శ్రీమదా

రడ శ్రీమదాంధ్ర మహాభారతము తాత్పర్యం: మునీశ్వరు డైన మీ తండ్రి కోరుకొన్నట్టు బ్రహ్మజ్ఞానం కలవాళ్ళను నలుగురు కొడుకులను కన్నాను. “ఈ మహాతు శ్చైలకు అపాయం కలుగకుండా పెంచు' అనిన న్నాజ్ఞాపించి, అన్ని'ప్రమాదాన్ని తలపక, ఈ (ప్రమాదపరిస్థితు లేర్పడి నప్పుడు ఎక్కడికో వెళ్ళాడు. వ అని దుఖిత మై యున్న తల్లిం జూచి యగ్రతనయుం డైన జరితారి యి ట్లనియె. 307 తాత్పర్యం: అని దుఃఖిచే తల్లిని చూచి పెద్దకొడుకైన జరితారి ఇట్టా అన్నాడు. తే బిలము సొచ్చితిమేని నం దెలుక చంపు; । నింద యుండితిమేనిం దా నేర్చు నగ్వి

యెలుకచేం జచ్చుకంటె నీజ్వలనశిఖలం | గ్రాంగి పుణ్యలోకంబులం గాంతు మేము. 308 వ్రతిపదార్హం: బిలము= రం(ధ్రం; చొచ్చితిమి+ఏనిన్‌= (ప్రవేశిస్తే) అందు; ఎలుక, చంపున్‌: ఇందు+అ= ఇక్కడే; ఉండితిమి+ఏనిన్‌= ఉంటిమా; అగ్ని; తాన్‌= తాను; ఏర్చున్‌= కాలుస్తాడు; ఎలుకచేన్‌= ఎలుకచేత; చచ్చుకంటెన్‌= చావటంకంటె; మేము; ఈ, జ్వలన, శిఖలన్‌= ఈ అస్నిహోత్రునిమంటలలో; శ్రాంగి= మాడి; మేము; పుణ్యలోకంబులన్‌; కాంతుము= పొందుతాము. తాత్సర్యం: కలుగులోకి దూరితిమా అందులో ఎలుక మమ్మల్ని చంపేస్తుంది. ఇక్కడే ఉన్నామా అగ్నిదేవుడు కాలుసాడు. ఎలుకచేత చావటం కంటె అన్నిజ్యాలలోపడి మాడి పుణ్యలోకాలకు పోవటం మాకు మేలు.

వాలి

వ. మఖియు మాంసపిందంబుల మయియున్న మాకు బిలప్రవేశంబున మూషకభయంబు నియతం; బజింద

యుండిన నగ్నిభయంబు సంశయితం బె ట్లనిన. 309 వ్రతిపదార్హం: మతియు; మాంస, పిండంబులము= మాంసపు ముద్దలం; అయి; ఉన్న; మాకు, బిల, ప్రవేశంబున= రందధ్రప్రవేశంలో; నిప్పువలనిభయం; సంశయితంబుజ అనుమానింపదగింది; ఎట్టు+అనిన, తాత్పర్యం: అంతేకాక మేము మాంసంముద్దల మై ఉన్నందున నేల బొరియలో ప్రవేశిస్తే ఎలుకవలన (ప్రమాదం తప్పదు. ఇక్కడే ఉంటే అగ్జిభయం అనుమానాస్పదం. ఎట్టా అంటే. క, జ్వలనంబు వాయువశమున. । దొలంగుడు జీవనము మాకు దొరకొనుం గృష్రం

బుల సంశయయుతకార్యం । బులు గర్తవ్యములు; నియతములు వర్ట్యమ్ముల్‌, 3౩10 ప్రతిపదార్హం: జ్వలనంబు= మంట: వాయు, వశమునన్‌= గాలికి లొంగటంవలన; తొలంగుడు= తొలగిపోతే; మాకు; జీవనము= బ్రతుకు; దొరకొనున్‌= కలుగుతుంది; కృచ్చంబుల= బాధలలో; సంశయ, యుత, కార్యంబులు= అనుమానంతో కూడుకొన్న పనులు- అంటే బాధ కలిగితే కలుగవచ్చు లేకుంటే తప్పిపోవచ్చు అనేపనులు; కర్తవ్యములు= చేయదగినవి; నియతములు= తప్పనివి- అంటే బాధ తప్పక కలుగుతుంది అని తోచే పనులు; వర్ష్యమ్ముల్‌= విడువదగినవి. తాత్పర్యం: మంట గాలి వశాన తొలగిపోతే మేము (బ్రతుకుతాము. కష్టసమయాలలో బాధ కలిగితే కలుగవచ్చు లేకుంటే తప్పిపోవచ్చు అని అనిపించే పనులు చేయతగినవి. బాధ తప్పదు అని అనిపించే పనులు విడువదగినవి. విశేషం: కష్టస్టముయాలలో కరదీపికవలె మానవునికి ఉపయోగించే ఈ సూక్తి నానారుచిరార్థసూక్తినిధి అయిన నన్నయ కవితలో ఒక మేలిమి రత్నం.

ఆదిపర్వము - అస్టమాశ్వానము 8585 వ. కావున నీవు మెచ్చినచోటికింబోవనోపము; మావలని మోహంబు విడిచి యరుగు; మేము దహనక్షేశంబునం బొందినను నీవు జీనించి పుత్తులం బడయనోపుదువు; నీపుణ్యవశంబున మాకు నగ్నిభయంబు దొలంగెనేని నీవు మాయొద్దకు వచ్చి యెప్పటియట్ల రక్షింతు' వని కొడుకు లెల్ల మొక్కినం జూచి, జరితయు బాప్పపూరితనయన యై యాసన్నతరుగుల్మగహనదహనమహోత్సాహుం డయి వచ్చు హవ్యవాహనుం జూచి, ప్రాణభయంబున గగనంబున కెగసి చనె నంత. ప11 ప్రతిపదార్థం: కావున; నీవు, మెచ్చిన= నీ కిష్ట మైన; చోటికి; పోవన్‌+ఓపము= పోలేము; మావలని, మోహంబు= మా మీద మమకారం వదలి; అరుగుముజ వెళ్ళుము; ఏము= మేము; దహనక్షేశంబునన్‌= కాలుట అనే కష్టంలో; పొందినను= కలిగినా- అంటే మేము కాలిపోయినా; నీవు; జీవించి; పుత్రులన్‌? పడయన్‌+ఓపుదువు= పొందగలుగుతావు; నీ, పుణ్య, వళశంబున= నీ పుణ్యంకారణంగా; మాకున్‌; అస్బాభయంబు= అగ్జివలన భయం; తొలంగెన్‌+ఏని= తాలగిపోతే; నీవు; మా, ఒద్దకు; వచ్చి; ఎప్పటి, అట్ల రక్షింతువు; అని; కొడుకులు+ఎల్ల; మొైక్కినన్‌, చూచి; జరితయు; బాష్ప, పూరిత, నయన+ఐ= కన్నీటిచే నిండిన కన్నులు గలదై: ఆసన్న, తరు, గుల్మ, గహన, దహన, మహా+ఉత్సాహుండు+అయి= దగ్గరగా ఉన్న చెట్లను, పాదలను, అడవులను దహించటంలో మిక్కిలి ఉత్సాహం కలవాడై వచ్చు; హవ్య, వాహనున్‌= అన్నిహో(త్రుడిని; చూచి; ప్రాణభయంబున; గగనంబునకు= ఆకాశానికి; ఎగసిజ ఎగిరి; చనెన్‌= వెళ్ళింది; అంత. తాత్పర్యం: 'అందువలన మేము నీవు చెప్పినట్టు బిలంలోకి వెళ్ళం. నీవు మా మీద మమకారాన్ని వదలి వెళ్ళు. మేము కాలిపోయినా నీవు జీవించి మళ్ళీ పుత్రులను పొందగలవు. నీ పుణ్యంవలన మాకు అగ్నిభయం తొలగిపోతే నీవు మా వద్దకు వచ్చి ఎప్పటిలాగా రక్షిస్తావు' అని కొడుకు లంతా (మొక్కగా, వాళ్ళను చూచి జరిత కన్నీరు నిండిన కన్నులు కలదై, ప్రక్క నున్న చెట్లను, పొదలను, ఆడవులను దహించటానికి ఉత్సాహంతో వస్తున్న అగ్నిహో(త్రుడిని చూచి ప్రాణభయంతో ఆకాశానికి ఎగిరి వెళ్ళింది. క నలుగురు నాలుగు వేద । మ్యులమంత్రము లొప్ప బ్రహ్మముఖములు వోలెన్‌ వెలయంగ సంస్తుతించుచు । నలఘులు మా కభయ మభయ మని రయ్యనలున్‌. 312 రం: న్‌ ప్రతిపడా క అలములు- చమురు కానివాళ్ళు- అంటే గొప్పవాళ్ళు; నలుగురు; నాలుగువేదమ్ముల; మం(త్రములు; ఒప్పుజ గ్ర /- లు, డా బా న ల ఖ (బ్రహ్మదేవునియొక్క నాలుగు ముఖాలవలె; వెలయంగ= ప్రకాశించగా: సంస్తుతించుచుజ గొప్పుగా స్తోత్రంచెస్తూ ఆ+ అనలున్‌= ఆ అగిదేవుడిని; మాక్షు;ు అభయము; అభయము; అనిరి. తొతరం: మహాత్యు లెన నీ షీ గ కంచే శైలి! శార్‌జ్లకులు నలుగురూ (బ్రహ్మదేవుని నాలుగు ముఖాలవలె నాలుగు వేదాల మంత్రాలతో గా సు ప్పుగా న్తత్రం చెస్తూ మాకు అభయం ఇ మ్మని అన్నిహోత్రుడిని ప్రార్థించారు. విశేషం; అలం: ఉపమ. ॥ దే! డు వ లగ్నిడెవుం నప్పు మందపాలుస్రార్ధనం దలంచి యన్నలువురు శార్‌జ్లకులు నున్న వృక్షంబు భక్షింపక పరి చి బోని ప జరితయు దానిం జూచి సంతసిల్లి కొడుకులయొద్దకు వచ్చి సుఖం బుండె; నంత వక్కడ మందపాలుండు పురందరువనంబు దహనుచేత దర్ధం బగుట యెథింగి, యం దున్న జరితను బుత్తులం దలంచి యతిదుణనితుం డయి లపిత కి ట్లనియె. 313

886 శ్రీమదాంధ్ర మహాభారతము ప్రతిపదార్థం: అగ్లిదేవుండు: అప్పుడు; మందపాలు, ప్రార్ధనన్‌; తలంచి; ఆ+నలువురు; శార్‌జ్లకులు; ఉన్న; వృక్షంబు" భక్షింపక; పరిహరించిన= వదలివేయగా; జరితయు; దానిన్‌= తనకొడుకులను అసి భక్షింపక వదలివేయటం; చూచి; సంతసిల్లి; కొడుకుల, ఒద్దకు; వచ్చి; సుఖంబు+ఉండెన్‌: అంతన్‌= అప్పుడు; అక్కడ; మందపాలుండు; పురందరు, వనంబుజ దేవేంద్రునియొక్కతోట- భాండవం; దహనుచేత= అగ్లిదేవునిచేత; దర్చంబు= కాలిపోయింది; అగుట; ఎజీ౦గి=ఐ తెలిసికొని; అందు+ఉన్నజ= ఆ ఖాండవవనంలో ఉన్న; జరితను; పుత్రులన్‌: తలంచి; అతి, దుఃఖితుండు= మిక్కిలిదుఃఖం పొందినవాడు, అయి; లపితకు; ఇట్టు+అనియె. తాత్పర్యం: అస్లిదేవుడు మందపాలు ని(ప్రార్థనను గుర్తు తెచ్చుకొని ఆ నలుగురు శార్‌జ్లకులున్న చెట్టును భక్షించకుండా వదలివేయగా, జరిత దానిని చూచి సంతోషపడి, కొడుకుల దగ్గరకు వచ్చి సుఖంగా ఉన్నది. అప్పుడు మందపాలుడు దేవేంద్రునివనం ఖాండవం అగ్నిదేవునిచేత కాల్చబడినట్టు తెలిసికొని, దానిలో ఉన్న తన భార్యా పుత్రులను తలచి మిక్కిలి దుఃఖించి, తన మొదటి భార్య అయిన లపితతో ఇట్టా అన్నాడు. క. తరుణుల నజాతపక్షులం : జరణంబులు లేనివారి శార్‌ళ్లేయుల న ల్వుర నొక్కతె యెట దోడ్కొని ; యరుగంగా నేర్డు జరిత యాపద గడవన్‌. 314 ప్రతిపదార్థం: తరుణులన్‌= చిన్నవారిని; అజాత, పక్షులన్‌= పుట్టని రెక్కలు కలవారిని; చరణంబులు= కాళ్ళు; లేని, వారి; చా శార్‌జ్లేయుల, నల్వురన్‌; జరిత; ఒక్కతె; ఆపద; గడవన్‌= దాటునట్టు; ఎట= ఎక్కడికి; తోడ్కొని; అరుగంగా= వెళ్ళటానికి; నేర్చు. తాత్పర్యం: చిన్నవాళ్ళు, రెక్కలు రానివాళ్ళు, కాళ్ళు రాని వాళ్ళు అయిన శార్‌ల్లేయులు నలుగురిని జరిత ఒక్కతే న సికొని వెళ్ళగలదు? ఆపద గడచేటట్టు ఎక్కడికి తీసి ళ్ళగల క. మఖజచునొకొ! మఖజవకుండియు : నెబుంగక యుందునొకొ! యనలు. డెజింియు నెడనే మబునొకొ! పుత్తులం గావక । గుజుకొని; నమ్మంగ నగునె క్రూరాత్మకులన్‌. 3415 ప్రతిపదార్థం: అనలుండు= అన్నిహోత్రుడు; మజచున్‌+ఒకొజ నా ప్రార్థనను మజచి పోవునో ఏమో; మజణవకుండియున్‌; ఎయింకు ఉండున్‌+ఒకొఐ వీరు నా పుత్రులు శార్‌బ్లకు లని తెలిసికొనలేక పోవునేమో!; ఎతీగియు= తెలిసికొనికూడా; ఎడన్‌=ఐ సమయం వచ్చినపుడు; గుజుకొని= యత్నించి; పుత్రులన్‌; కావకజు రక్షించక; ఏమలున్‌+ఒకొ= మోసంచేయునేమో; ('కూర+ఆత్మకులన్‌= క్రూర మైన మనస్సు గలవాళ్ళను- అంటే దుర్మార్గులను; నమ్మంగన్‌+అగునె= నమ్మతగునా! తాత్పర్యం: అగ్నిహోత్రుడు నా ప్రార్ధనను మరచిపోతాడేమో? ఒకవేళ మరవకపోయినా నా పుత్రు లైన శార్‌జ్ఞకులను గుర్తించలేక పోతాడేమో! లేదా గుర్తించినా సమయం వచ్చినపుడు (ప్రయత్నించి రక్షించక మోసగిస్తా డేమో, దుర్మార్గులను నమ్మతగదుకదా! విశేషం: సర్వాన్లి దహించి బాధించే స్వభావం కలవాడు కావటం వలన అనలుడు 'క్రూరాత్మకుడని అనటం. తనయుల క్షేమాన్నిగూర్చిన తండ్రి హృదయాందోళన ప్రతిఫలించే పద్యం ఇది. వు అనిన విని లపిత యిట్లనియె. 316 తాత్పర్యం: అతని మాటలు విని లపిత ఇట్టా అన్నది. క. నాయొద్దన ప్రొర్దించిన ;: వాయుసఖుం డపుడు నీకు వరదుం డయి శార్‌ జ్లేయుల నలువురం గాతును : ధీయుత! యని పలికె మజచితే మునినాధా! 317

ఆదిపర్వము - అష్టమాశ్వానము 887 ప్రతిపదార్థం: ముని, నాథా!= మునీళ్వరా!; నా, ఒద్దన= నా దగ్గర; ప్రార్ధించిన; వాయు, సఖుండు= గాలిదేవునియొక్క స్నేహితుడు- అగ్లిదేవుడు; అపుడు; నీకు; వరదుండు+అయి= వరాన్ని ఇచ్చే వా డై; శార్‌ళ్లేయుల; నలువురన్‌; కాచుదును= రక్షిస్తాను; ధీయుత!= ఓ బుద్దిమంతుడా; అని; పలికె; మటుచితే=ఐ మరచిపోయావా? తాత్పర్యం: మునీశ్చరా! నా ఎదుట నీవు (ప్రార్థించినప్పుడు ఆ అగ్నిదేవుడు శార్‌ళ్లేయులు నలుగురిని రక్షిస్తా నని పలికిన సంగతి మరచిపోయావా!

వ. “అలికి నెయ్యుండ వయి దానియోగక్షేమం బరయం దలంచి; తది వులు గటయేనియుం బజచుం గా కేమి యయ్యెడు; వగవకుండు” మనిన మందపాలుండు మందస్మితవదనుం డగుచు “వసిష్టు నట్టి పురుషు నైన నరుంధతియట్టి భార్య యైనను నిర్నిమిత్తంబున స్తీవిషయంబునందు సంశయింపకుంద' దిది స్త్రీలకు నైజంబ యని పలికి లపిత వీడ్య్కొని, ఖాండదవంబునకు వచ్చి పుత్తసహిత యయి కుశలిని యయి యున్న జరితం జూచి సంతుప్పుడైనిజేచ్చనరిగె; నగ్నిదేవుండు నిట్లు నిర్విఘ్నంబున ఖాందవవనౌషధంబు లుపయోగించివిగతరోగుం డయి కృష్ణార్దునుల దీవించి చనియె; నంత. 318

ప్రతిపదార్హం: ఆలికి= భార్యకు; నెయ్యుండవు+అయి= స్నేహితుడ వై; దాని= ఆ జరితయొక్క; యోగ, క్షేమంబు; ఆరయన్‌ః=

విచారింప; తలంచితి= తలచావు; అది; పులుంగు= పక్షి; ఎట, ఏనియున్‌= ఎక్కడి కైనా; పఆచున్‌+*కాక= పరుగెత్తగలదు; ఏమి, అయ్యెడు= (దానికి) ఏమవుతుంది; వగవక+శఉండుముజ= విచారింపకుము; అనిన; మందపాలుండు; మంద, స్మిత, వదనుండు= చిరునవ్వుతో కూడినముఖం కలవాడు; అగుచు; వసిష్ణు, అట్టి; పురుషుని+ఐనన్‌; అరుంధతి, అట్టి; భార్య; అయినను; నిరణనిమిత్తంబున= కారణంలేకయే; (స్తీ విషయంబు, అందు; సంశయింపక= అనుమానింపక; ఉండదు; ఇది; స్రీలకు; నైజంబజ= సహజమే; అని; పలికి; లపిత; వీడ్కొని; ఖాండవంబునకు; వచ్చి: పుత్ర సహిత, అయి= కొడుకులతో కూడిన దై; కుళలిని, అయిజ క్షేమం కలదై; ఉన్న; జరితన్‌; చూచి; సంతుష్టండు+ఐ= తృప్తిపొందినవాడై; నిజ+ఇచ్చన్‌= తన ఇచ్చవచ్చినట్టు; ఆరిగెన్‌= వెళ్ళాడు; ల జ న! ల!

అన్నిదేవుండున్‌= అగ్నిదేవుడుకూడా: ఇట్టు; నిర్‌+విఘ్నంబున= అడ్డులేకుండా; ఖాండవ, వన+బౌషధంబులు= ఖాండవవనంలోని (వృక్షసంబంధాలైన) మందులు; ఉపయోగించి; విగత, రోగుండు+అయి= పోయిన రోగం కల వాడై కృష్ణ+అర్జునుల; దీవించి; చనియెన్‌= వెళ్ళాడు; అంత. జె తాతర?౦: *భార్వ మీది గ్రేమతో

టాల్‌ ట్‌ న్‌ నీవు దాని యోగక్షేమాలు విచారిస్తున్నావు. అది(జరిత)పక్షి. ఎక్కడి కైనా పరుగెత్తగలదు. దాని కేమీ కాదు. చింతించకు" క “వసిషునివంటిపురుషుడిని అని లపిత అనగా మందపాలుడు చిరునవ్వుతో,

ఆఎయంఅయినా హా! నర రము నిఅయినా అరుంధతి వంటి భార్య కూడా స్త్రీ విషయంలో అనుమానించకుండా ఉండదు. జమె'- అ ఇం వ వా లఎతను వదలి, ఖాండవానికి వచ్చి కొడుకులతో కూడి క్షేమంగా ఉన్న జరితను 0౮, షం

ద్ర న ఇష్ట ప్‌ో చోటికి వెళ్ళాడు. అగ్నిదేవుడుకూడా ఏ ఆటంకం లేకుండా ఖాండవవనంలోని మందులను ఉపయోగించి, రోగం తాలగిపోగా కృష్ణార్దునులను దీవించి వెళ్ళాడు. విశేషం: యోగక్షేమాలు- యోగం అంటే ఇంతకు ముందు లేని భాగ్యం కలగటం; క్షేమం అంటే కలిగినది చెడకుండా ఉండటం. అరుంధతీవసిష్టులు ఆదర్శదంపతులు. అట్టిదంపతులలో కూడా స్త్రీ విషయంలో భార్య భర్తను శంకిస్తుం దని అభిప్రాయం. లోకంలో అన్య ్రీయోగక్షేమాలలో భర్త ఆసక్తి చూపటాన్ని ఏ భార్యకూడా సహించదు. అది స్త్రీ సహజం.

శ్రీమదాంధ్ర మహాభారతము 888 ఇంద్రుం డర్జునునకు నాన్నేయ వారుణ వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చుట. (సం- 1-225-7)

క అతిమానుష మత్యద్దుత : నుతిదుష్కర మయిన కేశవార్డునకృతి గో

పతి చూచి మెచ్చి సురపరి । వృతుం దయి చనుదెంచె. గృష్టవిజయులకడకున్‌. 319 పతిపదారం: ఆతి మానుషముజ= మానవులకు మించింది- మానవాతీతం; అతి+అద్భుతముజ మిక్కిలి ఆశ్చర్యకరమైనది; అత్తి వ్‌ రమ= మిక్కిలి కష్టమైనది; అయిన; కేశవ+అర్జ్హున, కృతి= కృష్ణార్జునులు చేసినపని; గోపతి= స్వర్గాధిపతి- దేవేంద్రుడు; న్‌్‌ మెచ్చి; సుర, పరివృతుండు+అయి= దేవతలచే చుట్టబడినవా డై- అంటే దేవతలు చుట్టు చేరి రాగా; కృష్ణ విజయుల, కడకున్‌= కృష్ణార్జునుల దగ్గరకు; చనుదెంచెన్‌= వచ్చాడు.

తాతర;9: మానవులు చేయలేనిది, మిక్కిలి ఆశ్చర్యకర మైనది, మహోత్కృష్ట మైనది అయిన కృష్ణార్జునుల ఘన

క అనఘులు నరనారాయణు । లన నాదియుగంబునన్‌ సురాసురనుతుల

. య్యును నపుడు మనుజు లగుటను । వినయంబున మొక్కి రమరవిభునకు నంతన్‌. 3౩20 సతిపదార్లం: అనఘులు= పాపంచేయనివాళ్ళు- పుణ్యాత్ములు; ఆది, యుగంబునన్‌= తొలియుగంలో; నర, నారాయణులు;

న సుర+శఅసుర నుతులు+అయ్యును= దేవతలచేత, దేవతలు కానివాళ్ళచేత(రాక్షసులచేత) స్తుతింపబడినవాళ్ళయి. కూడా;

అపు డు: మనుజులు+అగుటను= మానవులు కావటంవలన; అమర, విభునకు= దేవేంద్రునికి; వినయంబున; మొక్కిరి- అంతన్‌=

తరువాత.

తాత్సర్యం: పుణ్యాత్ములు, తాలియుగంలో నర నారాయణులుగా (ప్రసిద్రిపొంది, దేవదానవులచేత స్తుతింపబడిన

వా ళ్ళయినా, అపుడు మానవులు కావటంవలన కృష్ణార్జునులు దేవేంద్రునికి వినయంతో (మొక్కారు.

వ. ఇంద్రుండు నుపేంద్రార్డునుల నతిస్నహంబునం గౌంగిలించుకొని యర్జునునకు నాగ్నేయవారుణ వాయవ్యాదిదివ్యబాణంబు లిచ్చి, “వీని కెప్పుడు నిష్టసఖుంద వయి యుండు” మని కృష్ణుం బ్రార్జించి, దివ్యవిమానారూఢుం డయి దివిజాప్పరోగణసేవితుం డయి దివంబున కరిగె;నిట వాసుదేవార్డునులు మయుం దోడ్కొని మగిడి యింద్రప్రస్థపురంబునకు వచ్చి, ధర్మరాజునకు మొక్కి, ఖాందవదహనప్రకారంబు సెప్పి మయుం జూపి సుఖం బుండి రని. 321

ప్రతిపదార్థం: ఇంద్రుండున్‌= ఇంద్రుడుకూడా; ఉపేంద్ర+అర్జునులన్‌= కృష్ణార్దునులను; అతి, స్నేహంబునన్‌; కౌగిలించుకొని; ఠఉ

అర్హునునకున్‌; ఆగ్నేయ, వారుణ, వాయవ్య+ఆది= ఆగ్నేయం(అస్టిసంబంధంకలది), వారుణం(వరుణసంబంధంకలది)

జు

వాయవ్యం (వాయుసంబంధం కలది); మొదలైన, దివ్య, బాణంబులు= దేవతాసంబంధా లైన బాణాలు; ఇచ్చి; వీనికి= ఈ అర్జునునికి;

ఎప్పుడు= ఎల్లప్పుడు; ఇష్ట సఖుండవు+అయి= ప్రియమి(త్రుడ వై; ఉండుము; అని; కృష్ణున్‌; ప్రార్టించి; దివ్య, విమాన+ ఆరూఢుండు+అయి=

దేవతాసంబంధ మైన విమానాన్ని ఎక్కిన వాడై; దివిజశఅప్పుర:+గణ, సేవితుండు+అయి= దేవతలయొక్క, అప్పరసలయొక్క సమూహంచేత కొలువ బడినవాడై; దివంబునకు= స్వర్గానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట; వాసుదేవ+అర్జునులు= కృష్ణార్జునులు; మయున్‌; తోడ్కొని= వెంటబెట్టుకొని; మగిడి= తిరిగి; ఇంద్రప్రస్థ, పురంబునకు వచ్చి; ధర్మరాజునకు; మొక్కి; ఖాండవ, దహన, 'ప్రకారంబు= ఖాండవవనం కాలిపోయిన విధం; చెప్పి; మయున్‌; చూపి; సుఖంబు; ఉండిరి; అని.

తాత్సర్యం: ఇంద్రుడుకూడా కృష్ణార్డునులను మిక్కిలి'ప్రేమతో కౌగిలించుకొని- అర్జునునికి ఆగ్నేయం, వారుణం, వాయవ్యం మొదలైన దివ్యాస్తా లిచ్చి, 'నీవు ఈ అర్జునునికి ఎల్లప్పుడూ ప్రియమి(త్రుడ వై ఉండు' మని శ్రీకృష్ణుడిని

ఆదిపర్వము - అష్టమాశ్వాసము 889 ప్రార్షించి, దివ్యవిమానం ఎక్కి, దేవతలు, అప్సరసలు తనను సేవిస్తుండగా స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ కృష్ణార్దునులుకూడా మయుడిని వెంటబెట్టుకొని మళ్ళీ ఇం(ద్రప్రస్టానికి వచ్చి, ధర్మరాజుకు (మొక్కి, ఖాండవం కాలిపోయిన విధం చెప్పి, మయుడిని పరిచయం చేసి సుఖంగా ఉన్నారు- అని.

క. జనమేజయజనపాలున । కనఘచరిత్రునకు బ్రీతుం డయి వైశంపా యను దాదిపర్వకథ 'యె । ల్లను నిమ్ముగం జెప్పి నని విలాసమహేంద్రా! 322 ప్రతిపదార్థం: జనమేజయ, జనపాలునకు= జనమేజయరాజుకు: అనఘ, చరిత్రునకున్‌= పాపంలేని నడవడి కలవానికి; వైళశంపాయనుండు:; ప్రీతుండు+అయి= సంతోషించినవాడై, ఆది, పర్వ, కథ, ఎల్లను= ఆదిపర్వ కథ అంతా; ఇమ్ముగన్‌= ఇంపుగా; చెప్పెన్‌; అని; విలాస, మహేంద్రా= విలాసంలో దేవేంద్రునివంటివాడా- రాజరాజనరేం(ద్రా! తాత్పర్యం: విలాసంలో దేవేంద్రునివంటివాడవైన రాజరాజనరేంద్రా!- పుణ్యచరిదత్రుడైన జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు ప్రీతితో ఆదిపర్వకథ అంతా ఇంపుగా చెప్పాడు- అని సూతుడు శానకాది మహామునులకు చెప్పాడు. ఆశ్వాసాంతము క. అభిమానమహార్థవ! హరి । నిభ విభవ విభాసమాన! నిరవద్యరవి ప్రభ! రాజమనోహర! వై ; రభయంకరశౌర్య! నృపవరేణ్యశరణ్యా! 323 (ప్రతిపదార్థం: అభిమాన, మహా+అర్హవజ= అభిమానానికి సము(ద్రునివంటివాడా! (ఆంటే-గొప్పుఅభిమానం కలవాడా: హరి, నిభ, విభవ, విభాసమాన= ఇంద్రునివంటిఐళ్చర్యంచేత ప్రకాశించేవాడా!; నిరవద్య= తక్కువతనం లేనివాడా!; రవి, ప్రభూ సూర్యునితేజస్సువంటి తేజస్సు కలవాడా!; రాజ, మనోహర= చంద్రునివలె అందమైనవాడా! వైరి, భయంకర, శౌర్య= శత్రువులకు భయాన్ని కలిగించే పరాక్రమం కలవాడా!; నృప, వరేణ్య, శరణ్యా= రాజగ్రేష్టులకు శరణు పొందదగినవాడా! తాత్పర్యం: అభిమానానికి సము(ద్రునివంటివాడా! ఇంద్రునితో సమానమైన ఐళ్చర్యంతో (ప్రకాశించే వాడా! తక్కువతనం లేనివాడా! సూర్యునివంటి తేజస్సు కలవాడా! చంద్రునివలె అందమైన వాడా! శత్రువులకు భయం కలిగించే పరాక్రమం కలవాడా! రాజ(శ్రేష్టులకు శరణు పొంద తగిన వాడా! అని ప్రశంసాపూర్వకంగా నన్నయ మహాకవి ఆశ్వాసాంతంలో రాజరాజనరేంద్రుడిని సంబోధిస్తున్నాడు. మత్తకోకిల. రాజభూషణ! నిత్యసత్య! సరస్వతీవిలసన్ముఖాం భోజ! రాజమనోజ! భూజనపూజ్యమాన! మహాయతో రాజహంస పయోజినీవనరమ్యు దిజ్న్ముఖ! విక్రమో ద్వేజితాహిత! విష్ణుసన్నిభ! విష్ణువర్ధనభూపతీ! 3౩24 ప్రతిపదార్థం: రాజ, భూషణ= రాజులకు అలంకార మైనవాడా!; నిత్య, సత్య= శాశ్ళత సత్యాన్ని కలవాడొ!; సరస్వతీ, విలసత్‌+ముఖ+అంభోజ= సరస్వతీదేవిచేత ప్రకాశించే పద్మంవంటి ముఖంకలవాడా! (అంటే విద్యా తేజస్సుతో ప్రకాశించే ముఖం కలవాడా); రాజ, మనోజజ= రాజులలో మన్మధునివంటివాడా!; భూ, జన, పూజ్యమాన= భూమిలోని జనులచేత పూజింపదగినవాడా!; మహా, యశో, రాజహంస, పయోజినీ, వన, రమ్య, దిక్‌+ముఖ= గొప్పకీర్తి అనే రాజహంసకు పద్మవన మైన చక్కనిదిగ్భాగాలు కలవాడా! (అంటే- దిక్కులలో వ్యాపించిన గొప్పకీర్తి కలవాడా!) విక్రమ+ఉద్వేజిత+అహిత= పరా[క్రమంచేత భయపెట్టబడీన శత్రువులు కలవాడా!; విష్ణు సన్నిభ= విష్ణుమూర్తితో సమానమైనవాడా; విష్ణువర్హన, భూపతీ!= విష్ణువర్ధనమహారాబా!

తాత్పర్యం: రాజులకు అలంకార మైనవాడా! ఎల్లప్పుడు సత్యం చెప్పేవాడా! విద్యా తేజస్సుతో ప్రకాశించే పద శ్రంవంటి ముఖం కలవాడా! రాజులలో మన్మథునివంటివాడా! భూమిమీద (ప్రజలచేత పూజించదగినవాడా! దిక్కులన్నిటా వ్యాపించిన గొప్పకీర్తి కలవాడా! పరాక్రమంచేత భయపెట్టబడిన శత్రువులు కలవాడా! విష్ణుమూర్తితో సమానమైనవాడా! విష్ణువర్షనమహారాజా! గద్యము. ఇది సకలనుకవిజనవినుత నన్నయభట్టప్రజణీతం ఖైన శ్రీమహాభారతంబునం దాదివర్వంబున విదురాగమునంబును, గృష్టసందర్శనంబును, రాజ్యార్ధలాభంబును, ఖాండవప్రస్థనివాసంబును, సుందోపసుందోపాఖ్యానంబును, నారదువచనంబున ద్రౌపదియందు సమయక్రియయు, నర్జునుతీర్జాభి గమనంబును, నులూచిసమాగమంబును, జత్రాంగదయందు బభ్రువాహనుజన్మంబును, ద్వారకాగమనంబును, వాసుదేవానుమతుం డయి యర్తునుండు సుభద్ర వివాహం బగుటయు, సుభద్రాహరణంబును, హరణహారికయు, నభిమన్యుసంభవంబును, గాండీవదివ్యరధాశ్వలాభంబును, ఖాండవదహనంబును, నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును, మందపాలోపాఖ్యానంబును నన్నది సర్వంబును నష్టమాశ్వాసము. 325 శ్రీమహాభారతమునందలి యాదిపర్వము సమాప్తము. తాత్పర్యం: ఇది ఉత్తమకవులందరిచేత స్తుతింపబడిన నన్నయభట్టు అనే పేరు గల కవిచేత రచింపబడిన శ్రీమహాభారత మనే (గ్రంధంలో మొదటిదైన ఆదిపర్వంలో- విదురునిరాక, శ్రీకృష్ణుడు పాండవులను దర్శించటం, అర్హరాజ్యం పాండవులకు లభించటం, ఖాండవప్రస్థంలో పాండవులు నివసించటం, సుందోపసుందుల ఉపాఖ్యానం, నారదునిమాటల ననుసరించి పాండవులు (ద్రాపదియందు నియమాన్ని పాటించటం, అర్జునుడు తీరయా్య(త్రలకు పోవటం, అర్జునుడు ఉలూచిని కూడటం, చిత్రాంగద బ(భ్రువాహనునికి జన్మమివ్వటం, అర్జునుడు ద్యారకానగరాన్సికి రావటం; వాసుదేవునిఅంగీకారంతో అర్జునుడు సుభద్రను పెండ్డాడటం, సుభద్రను తనతో తీసికానిపోవటం, సుభద్రకు యాదవముఖ్యులు అరణాలను అందించటం, అభిమన్యుడు జన్మించటం, గాండీవం దివ్యరథం దివ్యాశ్వాలూ అర్జునుడికి లభించటం, ఖాండవవనాన్ని దహించటం, అగ్నిభయంనుండి మయుడిని అశ్వసేనుడిని రక్షించటం, మందపాలునికథ- మొత్తం ఎనిమిదవ ఆశ్వాసం. ఆదిపర్వంలో అష్టమాశ్యాసం సమాప్తం, శ్రీమహాభారతంలో ఆదిపర్వం ముగిసీంది. 640 పాట్దాజు క సయ మం స నం ంంంంనే చ్చ న్‌ స్య దాటడం 600 90న" త్‌ అర్య డాయ

] శ్రీమదాం (ధ మహాభారతము సంపుటము -- 1 ఆదిపర్వము రెండవ భాగము (5,6, 7,8 ఆశ్వాసములు) గద్యపద్య ప్రథమపాదసూచి

క క లన

పద్యము - పుట పద్యము - పుట పద్యము - పుట అ అంత నయ్యేవురు నయ్యయి - 740 అక్కథకుండు శౌనకాది - 767

అంత నర్జునుం డనిల - 54 ఆక్కన్యకయు నట్టి - 128

అంగజరా జ్యలక్మీ- 624 అంత నాకత్రియులొక్క - 700 అక్కశ్యపుండును జనుదెంచి - 475 అంగములలోన - 423 అంత నాదిత్యుండు - 430 అక్కుమారుల భనుర్విద్యా - 517 అంత - 425 అంత నారాక్షసులు - 645 అక్కుమారులు వాని - 513 అంత - 536 అంత నారాజనందనులు - 718 అగ్నిదేవుం డప్పుడు - 885 అంత - 557 అంత నాక్కయశరీరవాణి - 878 అగ్లిదేవుండు బృహస్పుతి - 666 అంత - 607 అంత నొక్కనాండు - 675 అగ్ని నేను నాకు నావార - 851 అంత - 619 అంత భీమదుర్యోధనుల - 530 అగ్ని హతిం జేసి మానవ - 707 అంత - 726 అంత విదురద్రేషితుండైన - 594 అట పాండువులును - 596 అంత - 803 అంత సభాపాలుండు - 848 అట వాసుదేవుండు - 769 అంత - 854 అం దమరబృదవంద్యున - 843 అట వైవస్వతుండును - 755 అంత - 870 అందు గరమొప్పి సుందరీ - 525 అట హస్తివురంబున - 589 అంత - 875 అందు ధృతిమందరుండు - 839 అట్టి కృపాచార్యురావించి - 497 అంతం గౌంతేయుండు - 555 అందు నిత్యంబును - 818 అట్టి ఘర్మదివసంబులు - 858 అంత. గృష్లదై వపాయనుండు -486 అందును గోదాన భూదాన - 820. అట్టి చిత్రవధం జూచి - 612 అంతం బ్రభాతం బగుటయు - 549 అందులకుం బోవుదమనినన్‌ -661 అట్టి బ్రహ్మతేజోజనితం బయిన-689 అంతకు ముందట - 642 అందుల కేంగి యేనిందివర - 831 ఇజిమహాద్వందయుద్ధంబున -558 అంత దాని వినయంబునకు - 615 అంబుజమిత్రుం డంబుద - 736 అట్టి మహాబాహుం డత్యంత - 830 అంత దేవతలెల్ల - 872 అంబురువాస్తుం డస్త - 597 అట్టి మహోత్సవంబు చూడ - 7షము అంత ద్రుపదరాజనందన - 857 అక్కట దుఃఖాతిశయంబున - 637 _ అట్టి యవసరంబున - 503 అంత ద్రోణుచేత - 538 అక్కటవురోచనుం డొకకుండ - 772 అట్రి యవసరంబున - 527 అంతనట - 474 అక్కథకుండు శౌనకాది - 419 అట్టి యవసరంబున - 7215 అంత ననంతబల - 529 అక్కధకుండు శానకాది - 523 అట్టి యవసరంబున - 732 అంత నయ్యడధ్డునుండు నవ్వింటి - 722 అక్కథకుండు శానకాది - 649 అట్టి యవసరంబున - 879

2 అట్టి యెడ - 609 అని గాంధారిం బదరి - 462 అనిన నీకెద్ది భోజనం - 860 అట్టి వజ్రకాయుండు - 63/7 అని తత్రభావస్రకారంబు - 869 అనిన నుపయాజాండే నిట్టి - 653 అట్టి వ్యుషితాశ్వుండు - 453 అని తనభార్యయైన - 699 అనిన నార్వుండు - 706 అట్లయగునేని యిక్కన్య - 746 అని తన్ను నిందించి - 44 అనిన రుద్రుం డలిగి - 758 అట్లా కృత్రియులందలు - 702 అని తమలో విచారించి - 491 అనిన వసిష్ట - 687 అట్లు నిలిచి రక్త్షచందన - 528 అని తానును భీమ - 727 అనిన వాని కర్టునుం - 670 అడవులు నేజులు నివి - 664 అని దుఃఖించి - 449 అనిన వానికి నర్జునుం - 674 " అడుగకయు విప్ర - 660 అని దుఃభితయై - 884 అనిన వారలకు - 774 అతగులచే ద్రుపదుండు నవ - 551 _ అని దుర్యోధనుండు - 773 అనిన వారిపలుకులు - 424 అతని నియమించినట్ల - 742 అని ధరణి నుండి - 723 అనిన వాసుదేవుం - 791 అతని తపంబు - 703 అని ధర్మరాజు నభిపిక్తుం - 794 అనిన విని కర్ట్ణుండు - 542 ఆఅతిథియై వచ్చిన - 633 అని ధృతరాష్త్రుబాంధవంబు - 600 _ అనిన విని కర్ట్డుండు - 730 అతిదురితక్రియాభి - 592 అని ధృష్టద్యుమ్నుండు - 716 అనిన విని కురుకుమారు - 514 అతిమానుష మత్యద్భుత - 888 అనినం గర్జుండు - 546 అనిన విని జనమేజయుండు - 494 అతిరౌద్రాకారలీలా - 435 అనినం గుంతి యట్లు - 624 అనిన విని జనమేజయుండు - 8962 అతులన్రతాపలీలా - 434 అనిన గంధర్వుం డిట్లనియె - 683 అనిన విని జనమేజయుండు - 880 అతులబలప్రతాప - 452 అనిన గంధర్వుండు - 709 అనిన విని దుర్యోధనున - ర545 ఆది కారణంబుగా - శత? అనిన దాని కర్టునుం - 819 అనిన విని ద్రోణుం డదదరి - 515 అదియును గొండొక - 754 అనిన దానికి రుద్రుం - 754 అనిన విని ద్రోణుండు - 518 అదియును బురంయబు - 714 అనిన నందజకు - 791 అనిన విని ధర్మతనయుండు = 638 అదియును సురేంద్ర - 8609 అనిన నగుచు ధర్మతనయుండు-5864 అనిన విని నగుచు - 741 అధికవీరుండు రక్కసు6 - 605 అనిన నగుచు వాసుదేవుం - 736 అనిన విని నగుచు - 834 అనఘచరితుండు - 653 అనిన నగ్నిదేవుండును - 866 అనిన విని నరుల - 447 అనఘుడు కృతమంగళాభి - 763 అనిన నట్లు చేయుదునని - 524 అనిన విని పార్థునకు - 539 అనఘులు నరనారాయణు - 898 అనిన నది యట్లేని - 7556 అనిన విని భీమసేనుండు - 624 అనఘు వేదాధ్యయనాసక్తు - 801 అనిన నది యెట్టులని - 805 అనిన విని మందపాలుండు - 881 అనపత్యుండనై - 450 అనిన నన్నారదు - 831 అనిన విని లపిత - 886 ఆనవద్యు వేదవేదాంగ - 672 అనిన నమరపతి - 756 అనిన విని సూర్యుండు - 4209 అనవరతము - 499 అనిన నమ్మందపాలు - 392 అనిన విని హీడింబ - 605 అనవరత వేదాధ్యయన - 696 అనిన నరుండు వల్లైయని - 667 అని నియోగింవినం గుంతియుం-458 అనవుడు ధృతరాష్ట్రుండు - 533 అనిన నర్జునునకు - 674 అని నియోగించినం ంతియు.-469 అనవుడు నిద్దటు - 811 అనిన నర్దునుండు - 824 అని నిశ్చయించి గొంతిని - శృశ4 అని కజపిన నట్ల - 698 అనిన నవనతొనన - 820 అని నిశ్చయించి ద్రుపదు - 507 అనికుమారుల నెల్లం జూపి - 508 అనిన నాద్రుపదునకు - 7409 అని నిశ్చయించి పంచినం - 762 అని కేలు మొగివి - 428 అనిన నారద మహాముని - 812 అని నీచత6 బరాజితుండ - 668 అని గర్వించి - 539 అనిన నినతనయు చ ర5్‌37 అని పంచినం బురోచనుం - 582

తె లా పద్యము -- పుట పద్యము - పుట పద్యము - పుట

అని పంచిన నదియును - 602 అని వాని నాశ్వాసించి - 667 అమ్మంత్రము. దనదగు - శ27

అని పంచిన వారును - 577 అని విజృంభించి - 849 అమ్మవాధ్వని విని - 610

అని పనిచిన నెప్పటియట్లు - 463 అని వితర్కించుచు - 677 అమ్మహోగ్రగ్రాహంబు - 520 అని పరశురాముచేత - 500 అని వైశంపాయనుండు -765 అమ్మహోత్సవము - 717

అని పలికి యప్పుడ - 473 అనుచు6 బాంచాలుపురం - 552 అమ్ముదితం జూచి - 495

అని పలుకుచున్న - 735 అనుచు నిజజననీ - 665 అమ్ముదితం జూచి - 810

అని పలుకుచున్న నృప - 677 అనుచున్న సమయంబున - 784 అమ్ముని యొక్క నాండభి - 498 అని పలుకుజనుల - 532 అనుచు సమీరణసుతుండు - 642 అమ్ముని యోగాభ్యాస - 8891 అని పాపబుద్రియందు - 490 అనుజాలు నల్వురుం - 800 అమ్మునివరు కటజిపిన - 619

అని పుత్రముఖావలోకన = ట్వీట్‌ 7 అనుపమకార్ముకాది - 561 అయినను నానేర్చువిధంబున - ? అని పురందరనందనుండు - 859 అనుపమనిత్యసత్య - 592 అయ్యగర్జునుతోడి విద్యా - 509 అని పెద్దయుంబ్రొద్దు - 686 అనుపమరాజ్యవిభూతిన్‌ - 607 అయ్యర్జునుస్తుతి - 532

అని పొగడుచుండ - 534 అనువారు నందు. గొందటు - 721 అయ్యవసరంబున - తర9

అని పౌరులెల్ల దీవించు - 793 అన్ను యిది ధర్మువని - 615 అయ్యవసరంబున - 540

అని ప్రార్ధించి వెండియు - 654 అన్నవవారివాహనివహ - 875 అయ్యవసరంబున - 724

అని భీమసేను - 616 అన్యోన్య ప్రియభాషణు - 912 అయ్యాజుండును - 555

అని మాటలాడుచు - 712 అపు త్రస్యగతిర్నాస్తి - 448 అయ్యా నీతపోమహత్త్వంబు - 703 అనిమిషప్రభుండు - 845 అప్పాండవులతోడి - 779 అయ్యిద్ధలును గృష్ణ, - 736

అని మొననట్టు దాంకిన - 771 అబ్ద్బజా వీడ్కొని _ ౭809 అయ్యిరువురు యన్యోన్య - 843 అని యగ్నిదేవుం డయ్యర్హున - 861 అభిజాతుండవు - 789 అరిగి మహేంద్రాచలమున - 499 అని యడిగిన - 860 అభిమానమవార్హవ - 889 ఆరియని వివ్రులచేతను - 532 అని యడిగిన ధర్మ - 635 అమరగణంబులోన - 469 అరుదుగ దివ్యరత్న - 877

అని యడిగిన్నవైశంపాయనుం - 494 అమరావగాసుతు - 420 అలఘుండు పౌరవ - 681

అని యప్పుడ భీష్మ - 543 అమరావతికి నెన - 841 అలమఘుతరంబులై - 7965

అని యజచుచున్న - 667 అమరాహీందద్రవియచ్చరాదుల -867 అలఘుతేజుల - 580 అని యాత్మపరిత్యాగంబునందు-626 అమరేంద్రసుతుండు - 848 అలఘుబలుండు - 492 అని యిట్లు పాండున్సప - 646 అమలాచారపవిత్ర - 420 అలఘులు కృష్ణపార్థులు - 878 అని యుధిష్టిరుండు - 792 అమలినమతినాత్మ - 566 అలయక ధర్మశాన్హ్రముల - 457 అనిలం బవ్వురి - 799 అమవస గావున - 447 ఆలయక నాండునాంటికి - 840 అనిలజ నీకిట్లని - 547 అమితకృశాను దర్ధమగు - 872 అలయక నిమిత్తజంబగు - 70% అనిలజు6 డుగ్రుండై - 555 అమితపరాక్రమంబును - ? అలయక పరాత్మ - 567 అనిలజు పుట్టిన దివసము - 463 అమితవివృద్ధశోక - 693 అలిగి యౌడుగజవి - ర41 అనిలసుతుం డంతన - 491 అమితస్థావరజంగమం _ 757 అలినీలకుంతలుం - 840 అనిలసుతు. బట్టికొని - 644 అమితోత్సాహుండు - 721 అలుగుదురయ్య - 829 అనిలాత్మజు బలమును - ర్‌17 అమితాజుండగు వాని - 701 అలుగుల పడీ ఖాండవమునం -672 అని వగచుచు - 473 అమూల్యమణి - 445 అవనీచక్రముపాద - 529

త్తే పద్యము - పుట పద్యము - పుట పద్యము - పుట అవిరళక్షురితదానా(ర్ర - 854 ఆ లలితాంగి. జూచి - 827 ఇట్లరిగి వనంబులో - 512 అవిరళభస్మమధ్యమున - 718 ఆ లలితాంగియందు - 734 ఇట్లశ్రమంబున - 519 అవిరళవిషఫణి - 492 అలికి నెయ్యుండవయి - 887 ఇట్లింద్రప్రస్ట్థపురంబున - 850 అసిచర్మ కౌశలం - 528 ఆ వారిధారలెల్ల - 873 ఇట్టుండి యొక్కనాండు - 825 అసితపథుండు విస్రుం డై- 8659 ఆ విశ్వామిత్రుం డిజ్వాకు - 689 ఇట్లు కావించిన - 874 అన్హ్రవిద్యలు గజవి -508 ఆ వైవస్వతు వీర్యము - 756 ఇట్లు చతుర్విధాహారంబుల - 685 ఆ ఆసన్న పలితు ననఘు - 505 ఇట్టు దనకడకు వచ్చిన - 833 ఆ కల్మాషపాదు = 691 ఆహవభూమిలోన - 786 ఇట్లు దనయిష్టంబు - 509 ఆ కాననాంతరంబున - 600 ఇ ఇట్లు దనవలన విలువిద్య - 5651 ఆ కృష్ణవతుర్దశినాండు - 590 ఇంక నెన్నండు రక్కసు - 645 ఇట్టుదయించిన - 856 ద వ అగ్నేయశరమున - 534 ఇంకనైన మమ్ము నెలుంగంగ - 559 “టి వ్‌! రవం ॥ 'స జూ ఇ ౧0 జా ఆతనిం జూచి సహింపక - 556 ఇంచుకయేని పాపమున - 642 ట్లు న! డు బోలువేత 560 ఎ త్న 0 న ఆతని యజ్ఞంబున - 453 ఇంతులగోష్టి నున్న - 671 ట్టు (& (| ఆతని యన్హవిద్యా - 510 ఇట్లు ర్రోవదిచేత - 852 స్త్రువద్యా ఇంతుల నిమిత్తమున - 812 నారాయణుండు _ 846 ఆ తనూజుల - 465 ఇట్లు ణుంటు - ఇందీవరలోచన - 769 ఇట్లు పట్టుకొని - 811 ఆ తరుణి కటాచేక్షణ - 495 ల బి ఇందుం బుట్టిన సుతుండు - 824 ఇట్లు పరమపురుషు - 835 _ పురుషు - ఆ తరుణియందు - 682 ఇందుల క్రిమైయిన్‌ _ 601 న్‌ ఆదిం గోలెను గృష్టువే - 857 ఖై ఇట్లు పరాశరుండు - 707 ఇందు లక్ష్య మెవ్వండేసె - 717 ఇట్లు పాంచాలియందు - 734 ఆ దిక్కున కాక్షణంబ - 59/7 ఇందు సుఖ ముండితిమి - 623 ఇట్లు పాంచాలు బాణవృష్టికి - 553 అఆదిత్యునకు6 బుటత్రి - 674 దిని సంయోగవియోగ -_ 625 ఇంద్రసమానున - 656 ఇట్లు పాండవులు ద్రుపదు - 770 అదిని సం ఇం(ద్రియార్ధంబులం _ జీడ్తీప ఇట్టు పాండుకుమారు లపార - 502 ఆది భరద్వాజాండను ముని - 651 దురో[ధనుండుద్యవిల్లుడను _ 464. *ంథండు నుపింద్రార్జునుల - 888 ఇట్లు పాండురాజు - 436 ఆ దుర్యిధనుండుద్భవిల్టు ఇక్కుమారుండు 702 ఇట్టు పితామహుండు - 806 ఆ ద్రుపదుండు దనకూంతు - 6550 ఇట్లు పుట్టిన - 656 అనకదుందుభి ప్రభృతి - 853 ఇక్కుమారునకెందు - 426 ట్‌ పా ఇట్టు పుత్రోదయంబున: - 461 ఆ నరుమీంద ఘోరనిశితాశని -875 ఇట వాండవ కారవు - ర512 ట వారణావత న - 592 ఇట్టు పెక్కు విధంబుల - 695 పదయైనను ధర్మువ - 613 ఇట వాంణాఎలంబుని - జ అఎంయయై ఇట్టిదేని మనకు - 587 ఇట్లు బకాసురుండు భీము - 645 ఆ పవనజు నతిఘన - 491 ముంపు. 00 ఇట్లు బ్రహ్మోత్తరంబుగా - 421 ల ల ఇట్టియిం ఒా ఆయతబాహుం డాతనికి - 787 ట్ర యింద్రస్రస్థ ఇట్లు బ్రాహ్మణశాపంబునం - 692 ఆ యముగర్వమున్‌ - 421 ఇట్లక్కన్యక పీయింద - 757 ఇట్లు భీమ బకాసురు - 643 ఆయుధవిద్యలయందు - 564 ఇట్లడిగినం గుంతీదేవికి - 630 ఇట్లు భీమసేనుం డిష్టాన్న - 640 ఆ రాక్షసుండు భీము - 610 ఇట్లదృశ్యంబయిన - 678 ఇట్లు రాజపుత్రు లవ్విల్టు - 719 ఆ రాజసుకుల విద్యా - 530 ఇట్లరిగి జనార్టనుండు - 837 ఇట్లు రాజ్యంబు సేయుచు - 4122 ఆర్యవృత్తుండు - 777 ఇట్లరిగి యర్జునుండతి - 815 ఇట్లు వచ్చిన కృష్ణ - 748

క్‌ పద్యము - పుట పద్యము - పుట పద్యము - పుట

"ఇట్లు వచ్చిన వేదవ్యాస -617 ఇమ్ముగ విశ్వకర్మ -7906 ఉఉల్లసంబులాడి-652 ఇట్లు వసునివహంబుతో - 432 ఇలం గీర్తి యెంతకాలము - 780 జో

ఇట్లు వాసుదేవుండు - 844 ఇల నర్ధరాత్రమును - 663 ఊర్చితులు యుధిస్టిర - 474 ఇట్లు విశ్వామిత్రుండు - 688 ఇవ్వేళలలయందు. - 6564 బు

ఇట్లు వేల్చి ముందజ - 764 ఇవ్యైహాయసలక్ష్యం - 741 బుతుమతివయిన - 454 ఇట్టు శతశ్చంగంబున - 446 ఈ ఎ

ఇట్లు శాపవిముక్తుండై - 697

ఇట్లు సద్యోగర్భంబునం - 620 ఈకార్యసిద్ధి యగుడును - 581 ఎంతరుం టి. ఇట్లు సర్వభూత - 477 ఈకులము వివర్ధింపగ - 422 ఎ మరుతన - క

ఇట్లు హీతోపదేశంబు - 813 ఈగ్భహకుడ్యంబులు - 586 దుండి వచ్చితిందుల _ కక ఇట్లేకోత్తరశతపుత్రులం - 465 ఈచ(క్రము మధుసూదన - 869 ప రాజులును - 690

ఇట్లేసి యబ్బాణంబులు - 439 ఈతం డనవరతయజన - 863 న్‌ విష కులంబున _ 442 ఇట్ట్‌ాక్క నిమిషంబున - 682 ఈతనిచేతం దొల్లియు! = 635 ళ్‌ సం మూవి _ 626

ఇతని విక్రమ - 636 ఈతన్విం దోడ్కొని - 733 ఎట్టు సూ వం 677 ఇది తొల్లి నాలాయనియైన - 751 ఈదేవియును బతితోడన - 485 వ

ఇది దేహంబిది యర్ధంబిది - 515 ఈబాలు నెత్తికొని - 431 ఎం. ర37

ఇది నావల్లభ - 911 ఈయుపాయంబులలో - 776 కుంజము 624

ఇది పరమసాధ్వి - 615 ఈరంగభూమియన్త, - 539 ఎటీంగి నాక్కుం ప

ఇది ప్రళయాగ్ని - 683 ఈరథ మస్రతిహతము - 868 ఎబుకగలందిని - స

ఇది యాదిగా 'సతులెన్నండు - 455 ఈరాజ్యంబు మొదలింటంగోలె - 575 ఎల్ల కార్యగతులు ను రక్తి

ఇది యెట్లున్‌ సమకూర - 719 ఈ వంశము విచ్చేదము - 422 ఎవ్వరికిని మోపెట్టను - 79 ఇది యేమి తెఅంగు - 630 ఈ విల్లు మోవెట్టియేను - 715 బ్లవ్వరును నేమి సెయుదు -

ఇది సకల సుకవిజన - 522 ఈవ్యాధియొంటం దీజదు - 864 అ క్‌ 746

ఇది సకల సుకవిజన - 648 ఈహితకార్యసిద్ధి - 747 ఏనకా దిక్కన్యక - |

ఇది సకల సుకవిజన - 766 ఉ ఏ నమితభోజనుండ - 86

ఇది సకల సుకవిజన - 690 ఉడుగకయేమహితముం - 784 ఏను ధర్మవథంబున - 690 కక ఇది సారంగ నసాధ్య - 825 ఉత్తమక్షత్రియస్రవరోప - 546 ఏను ద్రోణుం డనువాండ - ఇది హిడింబువనంబు - 604 ఉత్తమకత్రియుం - 638 ఏను నీచెప్పిన - 729 , ఇద్దజహుంకృతి ధ్వనులు - 643 ఉత్సవ సందర్శనోత్సుకులై - 732 ఏనును దినిన తలంచి - 63 ఇనసమతేజులై - 44౦ ఉపాంశువధం జేసి - 489 ఏనును బ్రజలును - 625 ఇప్పాండుపుత్రుల నేలకో - 562 ఉరుతరదావపావక - 856 వీను భారద్వాజుండ - వ ర ఇప్పాపగృహప్రకారంబు - 587 ఉరుశార్జూలభభయంబునం - 467 ఏను మంత్రశక్తి యెటు6 న్‌ ఇమ్మనుజేంద్రనందను - 720 ఉరుసరసీవనంబులు - 661 ఏను మిమ్ము నెజీంగియు - ఇమ్మాంసపేశి - 461 ఉటిండు సురేంద్రునైన - 604 ఏను మీ దృష్టులు - 5 ఇమ్ముగ నాత్మరక్ష - 568 ఉయుముచు మెజుముచుం - 873 ఏను మీయానతిచ్చిన -

6 పద్యము -- పుట పద్యము - పుట పద్యము - పుట ఏ నులూచియను - 919 కమనీయలీల నొక్కట - 484 కురుకులజాండుపాండునకు - కశ2 ఏను వందయను - 827 కమలభవుండు వారి - 807 కురుకులవిభుండగు - 460 / నెల్లప్రొద్దు నాయెడలోనం - 576 కన్మనిలతాంత ములకు ఒం జ్వీ/ర్‌ కురుపతి సూడంగ - 728 ఏ నేమి సెప్పుదు - 630 కరిఘటలందాంకి భీముండు - 554 కురుముఖ్యులు ధృతరాష్ట్ర - 792 ఏమి కారణమున - 862 కర్షళల్యులు మొదల్‌ - 771 కురువంశనిస్తారకులం - 479 కర్ణుండున్‌ విజయుండు - 728 క ఏమి దోషంబు - 725 కర్ణుండును జనుల నందజ - 537 కపవిలీసిలేత - 656 ఏము రాగకారణ - 828 కర్మబంధనములు - 491 కులపాంసనులై - 599 ఏల దీని నెడయుం - 550 కటకుదర్చపూరి - 739 కులము గలవాండు - 543 ఏల పార్డు పరాశక్రమంబు - 849 కలధనమెల్లముందజ - 500 కులమునకు నఖిల - 466 ఏల యమ్ముని నాకు నిచ్చ - 430 కలయ నసి మసల దండం - 552 కులమును రూపము శీలము -_ 4255 ఏల రాంబనివెన్‌ - 725 కళింగవిషయంబు - 822 కూడి జలక్రీడలాడుచో - 468 ఏలావనరమ్యము - 821 కవలవారు సూర్యేందు - 474 కృత మెఅుంగుట పుణ్యము - 623 జఒ కాంతివోషవిలాస - 761 కృపుండు ద్రోణుండు - శరత ఒక్కపురుషునకు - 747 కాదేని నాకు నీ పుణ్యమూర్తి - 453 కృష్ణమృగాజినధరు - 712 ఒలసి యెంతకాల - 629 కామవ్యామోహితుండయి - 442 కొడుకుం ద్రిలోకవిజయుం _ 467 ఒవ్వమిం గౌరవులకు - 736 కాలమేఘంబును బోలె - 607 కొడుకు పల్కు విని - 617 జా కావున జతురంగబల - 778 కొడుకు భుజవిక్రమమునకు _ ప్ర77 కావున ధృతరా(ునకు - 423 కౌరస కేత్రజ - 450 కావున నిప్పుడ - 466 కొడుకుల నిందల కిల్లడ - తం క కావున నీవు మెచ్చిన - 685 కొడుకుల బ్రహ్మ విత్తములం - 383 కడంగి ద్రుపదానుజుండు - 556 కావున నేను భవద్విహీన - 628 కొడుకుల యభ్యుదయము - 7793 కడంగి మదీయా న్హ్రముల - 726 కావున మన మిందు - 587 కొలంది యెజుంగ కిట్టి - 501 కడంగి వృకోదరుండు - 644 కావున మా చేసిన - 8209 కోడలి యుత్తమ గుణముల - 768 కడంగి సూతుండు - 545 కావున మీర లేమఅక - 584 కోరిన కోర్కికిం దగంగం -_ 472 కడవసములుం గోలలు - 739 కావున లోకంబులయందు - 705 క్రబ్బణ నొక్కరక్కసుండు _ 606 కడు. బెద్దకాలముండితి - 660 కావున ప్రతదానంబు - 817 (క్రూరకర్ములయ్యు - 815 కడునలుకయుం గూర్మియు - 569 కొలేన సర్వద్రకారంబుల - 571 'క్రూరాకారుల జగదప - 155 కడునిద్రం గానక - 591 (0దముకావము డెందము - 478. క్రూర్రులు విలుప్తధర్మా - 487 కడుపునిండం గుడువ - 639 ట్రిం 780 కృణదణు కింకిణీ - 837 కని తమ్మెటింగించి - 736 కుంతి భోజాధిపు కూంతురు -_ 508 క్ష కని యనిమిషలోచనుండయి - 6576 బ్రతి యంత సహజ _ నం క కృత్రియులము పాండు'ప్రీయ -_ 745 కనియె నొక కన్య - 675 కుంతియు నమ్మునివరు -_ 427 ఖు కని వినయమ్మున - 661 కుంతియును దాని - 622 ఖలు నసురనోర్వనోపెడు - 634 కని వినయమ్మున - 712 కుడుచునెడవాని - 752 ఖలుండై ధృతరాష్ల్రుండు -_ 500

7 పద్యము -పుట పద్యము - పుకు పద్యము - పుట గ చారుమణి ప్రభాపటల - 760 తదనంతరంబ - 592 గంగాధర పింగజటా - 817 చారుమనస్సమ్మద = 532 తదీయాభీిప్రాయం బెటింగి - 688 గగనమునందు నెందు - 675 చారుసువర్లహాసి జ డ్తీ7/ తనకపకారము మును - 569 గర్వించి పలికి - 758 చెప్పుమని యర్టునుం - 685 తన కీవ్మగునంతకు - 568 స _ - 81 గాడు చూలిపిలుందుం - 776 చెలంగె సురదుందుఖి - 723 తనతే బాము కీ జ యా క్ర మె _ు గటుపునెడ నేయునెడ _ 488 చెలియలు మజందియుం. - 852 తనపలుకు ల్లి గు న్‌ ల నాపి _ 697 చేసమరికొంచుం బొడువంగ - 608 తనపిజుందన వచ్చు - 583 ల్‌ ప్రే ల్‌ జ తనభార్వ్యకు రాధకు - 432 గురుకుచయుగ్ముముల - 836 తనయుల నజాతపక్షుల - 682 గురుగుణయుతులగు - 790 జగదభివంద్యు. డాక్షణము - 680 తనరిరి తద్దేశంబున _- 6802 గురులలోనం బరమ - 750 జననుత బ్రాహ్మణకార్యము - 638 [్వ్య్వ్వ దెవయుక్తిమెయి - 781 గురువచనస్థితి - 735 జననుత యామ్రానిని - 518 తనవగవిన కార్యము _ 580 గురువచనానంతరమున - 519 జననుత యేను - 603 తనవిద్య పిర్మి నృపనందన - 725 గుటుకొని కార్యాకార్యము - 565 జననుతుండు పాండు - 830 తనసుతులు పాండుసుతులని -487 ఫు జనపతి పనుపంగ - 492 తమకుం దార యజేయు - 785 ఘనధూమధ్వజదహ్యమాన - 870 వొగపతియైనవానికి - 572 తమము నడంచుచున్‌ - 798 ఘనపాశములంజేసి - 695 బన్వూల మందపాలుం - 880 తమ్ముల యట్టుల తనకు - 787 డు మృదు - 566 ఘనభుజ యిదిగాండీవం - 868 టు క్‌ న 889 తమ్ములుం దానును - 804 జ్‌ జు జ లుణ - న ఘనభుజుండు నరుండు - 851 తరుణుల నజాతపక్షులం - 886 జనమేజయునకు వైళంపాయ - 852, నంతకు 6పు = 569 ఘనభుజుండు రాధయను - 432 క4౦ నమగు వి జనితామ్నర్దణు. డంత - త ల్లి యుం బుత్రులేవురు _ 789 ఘు 'క్రమంబున - 778 జనుల యాశీరవంబును - 765 తా నొక్క మునికన్య - 662 ఘను లయి్యిరువురు - 810 చ్చు ఆల యు ్భ జలజిప్రీయతేజుల - 622 తాలాభమగు విల్లుదాల్చి - 727 ఘోరాకారులు కృతహాహా - 707 జలములంద యుండు - 706 తిలాణుమణికోటి - 809 ఘోరాస్త్రశస్త్రవిద్యల - 524 జలరుహనాభ - 858 తివిరి యభోజ్యంబగు - 692 చ జ్వలనంబువాయు - 884 తూర్చరుణంబుగా౬ దొడలో - 5121 చందనతమాలతరులందు - 476 జ్వలనశిఖాలియున్‌ - 871 తేజితబాణహస్తు - 513 చక్కనగుమనిన రక్కసు - 608 జ్వాలాభీలాంగుండు - 6556 తొల్లించి మవాత్ములయందును - 761 చక్రధరుండయ్యు - ౭౪70 త తొల్లిదితిపుత్తుండైన - 8055 చతురుదధివలయ - 7658 తండ్రిచేయు తిలోదక దాన - 629. తొల్లీ దేవేంద్రుండు - 658 చని ఖాండవంబు. గాల్బంగ - 864 తక్షకుండను పన్నగేంద్రుం _ 861 తొల్లి యగస్త్యమహామునీం ద్రుండు నా చనుదెంచి ముందట - 641 తగంగ వివాహం - 844 త్రిదశాధినాథ సదృశుండు క్‌ చనుదెంచి శరద్వంతుండు - 496 తడయక సామభేదముల - 570 త్రిభువనలక్మి యేతెంచి క్‌ -ర్‌ చరణహతిన్‌ మహాతరులు - 609 తత్సమీపంబున - 601 త్రిభువనసామ్రాజ్యశ్రీ

8 పద్యము -పుట పద్యము -పుట పద్యము - పుట దో కహానాశుబుతోడన = 446. వృతరాద్తు నెయ్యమన _ ఇ దక్షాధ్వరమథనునకు - 755 ర్రోణాచార్వ్యు పేటుంద నొప్పి - 527 ధృధిం జదువుచు భికార్ణము - 622 దక్షిణగంగ నాందద్దయు - 822 ద్రోణుండును నర్జును చేసిన - 559 _ ధృతి దటింగ మోహ మూర్చా - 541 దకిణపాంచాలంబు - 660 ద్వాదళశమాసిక వ్రతము - 820 ధృతి నెవ్వనినేని - 683 దక్షిణాంగుష్ట మిచ్చిన - 516 ద్వాదశమాసిక వ్రతము - 633 ధృతిసెడి వేండెడువానిని - 633 దొనంజేసి మహీతలంబున - 682 ద్విజవర వినిర్మితములగు - 808 ధృతిహీనుల చిత్తముల - 826 దానంజేసి విగతజీవుండై - 478 ద్వైప్రాయనుండును ధామ్యుండు-795 ధౌమ్యుండును వారి నతి సీతిం - 710 దొననచేసి పొరజానపద - 571 థ ధ్వజినీపాతభరంబునం - 434 దానములం దపంబుల - 449 న ధన దానములను బ్రియ - 590 దానింజూచి దారిద్రంబున - 506 ధనపతితో దరిద్రునకు - 501 నగియును బొంకునందు - 74ం దొానింజూచి పాండురాజు - 467 నడురేయి సంధ్యలందును - 664 దానింజూచి భీముండు - 545 ధనపతుల బాలురు - 506 నన్ను గాంధర్వ వివాహంబున - 673 దానికడకుం బ్రత్యేకంబ - 753 కక ర నన్ను నీ నర్చులెల్ల - 642 ల _

దానిదయినపతిభక్తి - 752 ధన్యుండదైతి నీకీ కన్యక _ 823 నన్నును మిమ్మును రక్షించి - 6౬1 దాని ధృతరాష్ట్రండు - 487 ధన్యుల కా సుభద్రకు - 856 నన్నేల యుపేక్షించితి - 683 దానిన్‌ నేరక యందటన్‌ - 520 ధరణిం గల రాజాలెల్లను - 659 నరనుతక్తీర్తి యాయనిల - 635 దాని న్రమమున . 926 ధరణి నతిప్రతాపబల - 678 నరవరుండైన భీము - 620

దాని నెజీంగి పరాశర - 461 ॥

దాని నెలింగి శరద్వంతుండు- 495 కరలిప్రజ ధర్మసుతు - 801 నరు. డన్త శస్త్ర విద్యా - 509 చాని విడిపింప ద్రోణుండు - 520 ధరణిసురుల గురుల - 817 నరునకు దయ నిట్టానంద - 846 దాని విని పాండునందను - 660 ధరణీదిశా ప్రసారిత - 597 నరు నింధ్రాత్మజా నింద్రా - 53 దాని వెల్వడ నేరక - 874 ధరణీధరు చక్రమునకు - 877 నరునునికి యెజింగి - 833

దాని సహింప నోపక _- 489 ధరణీరాజ్యవిభూతియు - 481 నరసారము సంసార - 624

దాని సుభద్రంగా నెటింగి - 838 ధరణీశ నందనుల్‌ - 724 నలిరేంగి కడంగి తద్చల - 680 దారుణజూనుదండమున -_ 644 ధరణీశుండుద్యతదండుండై - 565 నలువురుదమ్ములున్‌ - 560

దారుణమౌ వృకోదరు - 554 ధరణీసురవరులకు - 8ష4 నలుగురు నాలుగువేదమ్ముల - 386

దీనికంటెను నొప్పెడివాని - 666 ధరణీసురు లాదిగ - 460 నాకంటెను మీకంటెను -_ కక్ష్య

దీనికి సదృశముగా - ర్‌4శ ధర్మతత్త్వజ్ఞుండీ ధర్మతనూజుండు -751 _ నాకుం బరమవిశ్వాసివి - 581

దీని తెజలౌటింగినట్ల - 686 ధర్మసుతుం డున్నచోటను - 662 నాకుం బతివయిన నిన్నుం - 604

దీని నగస్తి నాంబరగు - 563 ధర్మసూక్మత నిర్ణయింప - 750 నాకుం బుణ్యలోకంబులు - 88

దీని నెలింగి మీకు హీతోప - 617 ధర్మార్ధవిత్తముల్‌ - 734 నాకెడ యిమ్ము లెమ్ము - 479 దీని నొరునకీం గాదనిన - 687 ధవళవిభూషణ - 7శ నాదు రోదనంబు నన్ను -_ 757 దీని బాణ పరంపరం జేసి - 504 ధిరమతియుతులతోడ - 566 నానాద్రవ్యనిరంతర - 47

దీని మానవులయందు - 563 ధీరుండు యతిరూపంబున - 839 _నానావిధమార్గణముల - 553 దీనియందు రాక్షసభావంబు - 6514 ఠీరులౌ ధృతరాష్త్ర పాండు - 770 నానావిధశరశరధుల - 503

దేవా నీ ప్రసాదంబున - 863 ధృతరావ్హ్ర కుమారకు - 553 నానావిహార్షతెలోద్యాన - 567

9 ... పద్య్వము-పుటు పద్య్వము-పటు పద్యము-పుటు నాయందునీకుంబ్రియంబు -679 ల... పాండవులును రథంబు లెక్కి - 551 నాయెదురం జక్కనై - 729 పాండుకుమారులం బిలువ - 578 నాయొద్దన ప్రార్ధించిన - 886 పంకజాక్షి నీపతి ప్రతిపక - 852 పాండుకుమారులు ననేక - 585 పంబినశోకభారమున - 694 పాండుపుత్ర నీవు - 673 నారదుండు వచ్చుందద్వచ - 803 ర్త నా వచనంబున _ 755 పంబియజనాధ్యయనదానం - 802 ప్రాండ్తురాజును బరమోత్సవంబునం-472 నా వచనమున నపత్యముం - 473 పక్షిశిరంబు దిరంబుగ - 518 పాండుసుతుం డంత - 873 నిత్యంబు నిలువరుస - 631 పడినయామిషంబు - 627 పాపులై కత్రియాధముల్‌ - 705 నిమిషాంతరమున .. 723 పగఅంగని సైతురేనియు - 441 పాయక వీళటియందును - 510 పతి నియోగించిన దానిం - 456 _ నిరుపద్రవ సుఖనిద్రా - 608 దాజణం పిలువంగం బడక - 538 పతియు లేక జీవించు - 453 ణతపోమయుండు - 616 నిరుపమ పరార్ధ్యరువి - 854 పుణ్య పదుమూండగు మాసంబున - 823 వంతుల నిత్వనెమిత్తిక - 808 నిశితశర వర్షమున - 876 పుణ్యవం' గ్మరెయిల్త నీ నికు?.రుకుల _ 784 పన్నగవైరి విక్రముండు - 607 పుత్రుండు నీకుదయించు - 468 కలపుల నిక్కురుకుల - పరచశ్రపతులచే - 574 పురజనులెల్లను - 792 నీగుణములు దొళ్లియు - 819 పు పరమతపోనిలయు - 708 షవిశేషవివేకా - 506 నీచేత ననుజ్ఞాతులై - 790 పురు జ్డాతుల్త పరమద్విజళశుత్రూషా - 802 పురుషుకంటె మున్ను - 627 నీతోడ సఖ్యంబుం జేసెద - 670 క షు పరమబ్రహ్మణ్యు - 832 పురుషులచే ధర్మస్థితి - 4556 నీదు కులమునకు6 దగంగ - 546 పరమమునులయిన - 878 పరాక్రమం బెసంగ - 769 నీయిష్టసఖుండయిన = 878 పూని ఈ పరమాన్న భక్ష్య భికా - 622 పెకు?.లు వలుకక - 606 నీయాగ్నేయాన్త్రంబున - 668 పదమూ 2 గ్ర స్త్‌ పరమా స్తైకవిశారదుల్‌ - 557 డిలి సువర్ల్రపర్వతము - 869 నీయిష్టసఖుండయిన - 878 పెడిలి సువర్ణపర్వ ట్ర పరమేశ్వరుండును వానికిం - 824 పెదకాలంబునకు నీయిలు - 632 నీరిలోనం దోయ తారక - 503 ద్ర పరమోపకారిర్షైున - 623 ండుండంగొండుకవానికి - 734 నీలజీమూతంబులీల - 610 ్ట్‌ వెద్దవా పరశురాముం డొండెహరు - 730 కంబగులక్మి - 574 నీవ కడునేర్చుకాండవు - 537 వి పరహితఫలవంతులు - 600 పొలుపగు రాజ్యసంవదుప - 689 నీవఖిలధర్మమూర్తివి - 882 ర్త పరాశరుండును బులస్త్యాది - 708 ప్రాలుపుగం బూసీకట్టి - 835 నీ వర్రాకృతబలుండవు - 729 పరిఘజలంబులం - 798 పోలల ధర్మశీలుండయి = 632 నీవును ద్రోణుండును - 791 పరులకు దుష్కరంబయిన - 731 ర్రక్షీణదర్పు ద్రుపదు - 556 నీవును భీష్ముండు ద్రోణుండ - 788 పరువలన బాధ _ 687 అమదఖిల ధాత్రీ - 647 నీవు లౌకిక వైదిక ధర్మ - 747 ప “ద టె రుపడి నొండొరుం బెనంగి - 643 ప్రతిహతరాగకోవభయు - 6580 నీవు సుభద్రయందు - 838 పఅపనోపకయున్న - 440 స్రమదాపాదివయః ప్రపూర్ణ - 596 నీవెబుంగకుండ గర్వము - 849 పలుకులం జెయ్వుల - 775 ప్రవిమలాగమతత్త వేది - 803 నుతముగ నస్మత్కుల - 683 పలుదెజంగుల పిండివంటలు - 639 ప్రొద్దు నేండు వెద్దవోయె - 640 నెగయుడు నెగసి పిబుందం - 871 పలుమజు శపథంబులు - 568 ప్రొవైన భస్మంబు వాయ - 593 నెమ్మిం జని ఖాండవస్షస్థమ్ము - 794 పవనతనూజుం డక్కమల - 619 ఒలు నెమ్మిన నీ దక్షిణహస్తమ్మున - 515 పశుపతినివాసంబయిన - 579 య నెజీకురులున్‌ విలోలసిత - 676 పాండవులును ధృతరాష్ట్ర - 794 ఫలవవనాంబు భోజన - 722 నేండు పుణ్యదినము - 761 పాండవులును బరాక్రమ - 803 ఫలార్థియయినవాండు - 654

10 బి భూరినిజద్యుతితోడ - 533 మరియు. 'బ్రతిపక సంకయ - 867 బద్ధపరంపర నొప్పె - 561 భూరిపదఘాతజాతధరా - 609 మరియు గదా కార్ముక - దష బలదేవసాత్యకి ప్రద్యుమ్న - 853 భూరిభుజుండర్జునుండతి - 533 మరియు గాంధారిందొట్టి _- 5956 బలదేవాచ్యుత సాత్యకుల్‌ - 785 (భ్రమవిమోహలోభభయ - 637 మరియు దుర్యోధన - 464 బలమథీ కామకక్రోధంబులు - 684 భ్రాజితశాతకుంభగ్భహ - 834 మరియు ననంతరంబ - 498 బలము పెద్ద గలిగి - 639 మ మరియు ననేకవినోదంబుల - 4386 బలయుతులు మనుజసింహులు - ౭౪79 మండితగుణసంపద _ 437 మరియు నప్పాండురాజు - 437 బలవంతుల్‌ భరతాన్వ్నయస్థితి -693 మంత్రయుక్తంబుగా - 625 మరియు నప్పురంబునం - 832 బలవంతుల బలమఅలూా - 719 ఆ మజీియును - 508 క ౭76 మంత్రులు దమతమబుద్ధి - 733 మటీయును _ 526 బలవైరి కృష్ణువైం బార్జువై -8 మతిం దలయయంగ సంసారం - 486 బలహీనుండైనవానికి - 742 మజీయును - 561 బలహీనులైనవో శత్రుల - 566 మతిం బాండుకువూరుల - 595 మజియును - 657 యూ మతిమజచి యవి స్తీర్ద - 704 బహుగుణముత్తమోత్తమము - 781 మథియును - 840 త మనదుర్యోధను జన్మంబున6- 465 మజియును _ 854 బాధితశత్రువర్గులగు - 594 మనమివ్విధంబునం - ౪51 బాలకుం డొక కొండుక - 629 మనసిజరాగంబున _ ఉరి మళయును నొకనాండెవ్వరు - 493 బాలుండని తలంచి 6పుతో - 569 మనుకులపవిత్రుయబుత్రకు - 699 మ్యయును వారల బల - 876 బిలము సొచ్చితిమేని - 684 మనుజభక్షుం డిదియ _ 631 నొక్కనాండు - 4ం2 బృహదబ్ధిమేఖలాఖిల - 544 మనుజులకు నెవ్విధంబున - 627 మతియు బలదేవాది - 855 న్‌ా మొదలుగాంగల - 842 మనుమల న్నెల్లంజూపి - 508 పము రట్టు పరంబున శ్త్రత్త -త్త70 భరతకులస్రసూతులరు - 504 వ ల మటియు మాంసపిండంబుల - 884

  • 880 | భరతకులశ్రేష్టండ వయి - 451 మజమునొకొ మజవకుండియు _౪86 ళు మ)గౌపభయం - 480 భరతకులాగ్రణి - 850 మజీ భీమసేనుండు దొల్లి _ 777 మథతియు రెండగు - 730 భర్తచేత నియోగింపం బడక - 456 మజీ యట్లుంగాక - 816 మతియు వానికంటె - 574 భవత్రసాదంబున - 452 మజటీ యట్లుంగాక రాజులకు - 502 మటీయు వారలకాచార్యుండైన - 4ం7 భవదనుజ్ఞాగారవంబున - 576 మజి యదింయునుంగాక _ ర4ర్ర మటేయు సకలలావణ్య - 760 భాననిభండుపాండుజనపాలుండు -494 మఠి యాత్మఘాతంబు - 634 మలహారినాథ - 647 భారతవంశావార్యుండు - 654 మటియు _ 656 మాకు నతిప్రియుండవు _ 708 భీమసేనుండును దద్వట - 598 మటియుం గల వస్తువులెలను _ మాకులమునందుం దొల్లి _ ౩2౩ భీముండును వాని మగట్లిను -4క4ర్‌.. మ్రూనితంబగు నాతపోమహిమం _704 వాని వానసత్తుంగా -644 మజటీయుం దనయొద్దకువన్సి - 744. మ్రానితులెన పాండవ భువనైకదిపకుండగు - 679 మజీయుం దొల్లి గౌతమి - 750 మానుగరాజకుమారు - 557 భువనోషప్లవ సమయోద్భవ - 701 మజియుం బాటెడు - 535 మాపుణగంబునం జో లతో - 59 భూజనపరివాదం - 816 మటీయుం గామస్రవ్నత్తుండయ్యు - 673 కు చ ందయ్యకు ర భూపనందను లివ్విధంబున _ 516 మరియు. దనకు ధృతరాష్ట్రం =వ్మీపర్రి మీకులగో త్రనామములు - 7త్తక భూపాలకుండు బ్రాహ్మణ - 697 మరియు6 దిర్యగ్యోనులయందు - 455 మీపంచిన విధంబున - 783

11 లా వపదయు-పట పద్యము -పుళు పద్యము -పుట పద్యము - పుకు మీయందీికృష్ణ్తును - "42 రాజయ్యెడువాండు - 573 వారలు ధర్మానిలశక్రాశ్వినులు - 759 మీరాజుమనోరథంబు - 7412 రాజరాజు గుణరాజిత - 765 వారితో విగ్రహించుట - 782 మీరు ద్రుపదుపురంబునకుం -663 రాజవరుండైన పార్టుతో - 543 వారిదారుణతపోవహ్నా - 8606 మీరుధర్మానిలశక్రాశ్వినుల - 672 రాజ్యపదస్థుండ - 588 వారు నవ్విఫ్రునతిభక్తిం - 860 మీరును గుంతియు - 579 రేయును బగలును - 774 వాసవనందనుండు గుడువం - 510 మీరెటుంగనట్టి లోకాచారము - 7485 ల వాసవసన్నిభుండు - 438 ముదుసళులు దమకిమ్ముగా - 782 లలితజటాజినకుళ - 621 వితత ప్రదక్షిణావర్తిత - 764 ముదుసళులు దమకిమ్ముగా - 782 అలితహయద్విపంబుల - 435 వితతబహురత్నరుచి - 602 మునినాధ నాకు సత్సుత - 652 లలితాంగి యల్లలోకంబులు - 458 వితతయశుం డరిగి - 221 మునినాథ నాకు సత్సుత - 654 లావుసెడంగ నిట్టువీవంగ - 612 విదితంబుగం బుణ్యామర - 579 మునిసహ(స్రపరివృతులయి - 483 లోకనుతుండు పాండుండ - 573 విదితముగ నీకు వరమిచ్చెద - 454 మునీంద్రా నీయాడనిత్సీర్టంబు - 841 వ విదురుండు పాండవహితుండని - 774 మృ గంబులమైయున్న మమ్ము-440 వందురి వగచుచున్న - 432 విదురుండేతెంచియొరులకు - 584 మృగశాపభయమున ఆ త్తే /త్వ వడముడియారక్కసు _- 609 విద్యావిలాసపార్ధివ = 765 మృదురోమములును = 686 వడిగొని కౌరవులొండొరు - 551 వినయమున ద్రోణురూవు - 512 మేరునగోత్తంస మహీ - 670 వడి నసురవాత ముక్కున - 612 వినవయ్య కృృతవీర్యుండను - 700 మొనసి యపకారిం గడనిడి - 570 వడి నాడుగజచివలకేల్‌ _ 718 వినవయ్య గౌతముండన - 4194 యు వదలక మరణార్ధి యగుచు - 695 వినవయ్య యేమేవురము - 828 యజ్ఞసేనప్రభు యజమా - వదలక (మ్రుచ్చుల - 814 విని కుంతియు6బాండవులును -615 జా అజా యజ్ఞసేనుకూంతు + భజ ం వధకు నర్హుండై వచ్చిన - 613 విని రోయుతీయగ గ్యాళ్లం - 508 ప ఈ గు జూ న! యతిసంఘంబుల సంగ టం వనజాక్షి యేమికారణమున _ 827 వినుం డే హిరణ్యధన్వుం - 513 యదుకుల విమలవయుః వనజాతాయతనే[తు విను కార్తవీర్యుకంటెను - 470 మతనయు ధర్మరాజ్యము - 814 తు - 602 య రన వననిధిలోని రత్నములు - 796 వినుతధనుర్విద్యావిదు - ర549 యము లమితశార్యు లరిన్సప - 562 వలనుగ వినుతయళుండుపాండు - 436 యాదవకులవిభుండగు - 426 లనుగలమంత్రివరులం - 577 షభోజవరు వలరాజు సచివుల _- 797 విను టేల యెట్టికష్టుండు - 605 యాదవవృష్టిభ్‌ జవరు - 772 వలవ విపరీతమతిని సుందుండు - 812 యాదవుల నాదరింపక - 848 లవ దుడుంగుండని - 731 వ విమలమతి యన్యులకు - 749 ర న్లాయని రాజనందను - 550 వసుడే విమలములయి లోకత్రిత - 670 రణరంగంబున (ద్రోణు - 652 సుదేవాదియాదవ - 853 శ్‌ తో విలసద్ధర్మవిశుద్ధవృత్తులు - 781 రమణినిజ'భ్రాత్చనియోగము - 603 వానిత్‌ డిదేమిదివ్య - 548 ఇ శ్‌ డెన - 790 వానిమనోవల్లభకుం _ 66 విలసిత రాజ్యలల - 770 రవినిభతేజాందై వానియవ న్గాముం - 666 విలువిద్యం గజుచుచుండిరి - 493 రవిసుతపార్ధుల - 541 [ీక్షవచనంబులు - 630 విలువిద్య నొరులు - 514 రాక్షసాొవిష్టుండైనప్టు - 691 వారణ హస్తానుకారంబు - 866 విలువిద్య నొరులు - 516 రాజకుల శేఖర - 521 వారణావతమున - 585 వివిధాన్త కోవిదుండు - 556 రాజత్కీర్తులు వచ్చి - 735 వారల బలపరాక్రమంబు - 787 వీంకం బటితెంచి నలుగడ - 847 రాజభూషణ నిత్యసత్య - 889 వారల శరములు నడుమన - 553 వీండువుట్టినపదియగునాండు - 637

12 నానన న న నా న పద్యము -పుట పద్యము -పుట వా పుట సవిశేషముగ ధనుర్వేద - శం7 వీంె కృతహస్తుండఖిలా స్త్ర 521 వాన త క 836 సత్వకా - వీండొక మం త్రసిద్దుండగవిసు - 646 శక్తి చదువునుబోలె - 696 ణ ఎత్యకా | వీతసమస దోషుండయి - 709 శక్తి రాక్షస నిహతుండై - ల శా సాహసీకుండైననరుండ - 826 వీరలం దోడ్కొనిపోవంగ - 883 శతశ్చంగ నగేంద్రము - సుందరి మాయిద్దజలో క యు అ

  • కృత? తశ్చంగ నిలయులగు - 460 వీర లతిలలితమృదులా - 44 వ శ సం మ సుతజననోత్సవంబున - 856 వీరలు దైవశక్తిం బ్రభవించిన ఒత్త శమహీనుండై ఏ వ్ర సుతవంతులయి వికుద్ధ - 858 వీరికి నిద్రాభుగము సేయనోప - 599 శరణాగతరక్షణ - 87 సుతశత వర్ణితాశ్రమము -_ 694 వీరుండగునరుని - 728 శరనికరసహస్రంబుల - 552 సుతుండు సభస్వదంశమున _ 463 వీరుండు పొండుమహీపతి - 466 శరనిధి నినాద - 798 సుతుల రాకసనిహతుల -_ 603 వీరుండు వీండు పాండవుండు - 847 ౮్యనిధిపరివృత విశ్వం - 436 సుతుల విద్యాప్రవీణత - 526 వీరు కుంతీమహాదేవులని - 745 శరమోకణవేగ నిరంతర - 557 సుత్రామపుత్రుం డభిజన - 745 వీరు నమ్మంగం దగుదురు - 567 శా(త్రవ జైత్రతేజమున - 459 'సురగరుడ విషోరగ - 671 వీరులని పాండుసుతులకు - 571 రుల జన్మంబు - 547 సురగరుడోరగ కిన్నర - 807 శూ స వీ రెవ్వరయ్య (ద్రుపద - 559 శ్రీజయవిభాసి వినమ - 523 సురల వరసప్రసాదమున - 482 వీరెవ్వరో యెందుండుదురో - 731 శనాధమూరి విబుధ - 419 సూర్యుండును నీకు దుర్వాసుం - 429 శ న్‌ా! వృక్షశాఖాగ్రమున నున్న - 517 శ్రీపతి గడు నెయ్యంబున - 835 సూర్యుండును వసిష్టమహాముని -68 వృత్రువై గీర్వాణవిభుం డల్లి - 659. వీర శ్రీరమణీ - 649 సెల్టుం డట్టు నేలద్రెళ్ళి - 730 వెండియు నశ్వసీనునేయ - 874 శ్రీవిభవ నిత్యనిలయ - 767 గాలయక యెల్లిదేశములు - 650
  • కే ద్ర పౌలోమకారంధమ -_ వెండియు వారల నిమ్ముగా - 741 శ్వేతకి నీతపమునకేం - 863 న భ(్ర లి నాం ంధ 526 వెడంగ యిట్టిపాటి - 666 శ్వేతకియుం దనకు - 864 స్థిరపొరుషుండు 'త్తరుం - 469 వెడంద యురంబును - 738 ష స్వయంవరలబ్ధ యయిన - 746 వ - 519 జ వెజవి తల్లిందోంక - 874 స హరిం దలె సుభద్ర - 644 వెలయంగం బితృమేధ - 486 కలరాజసమక్షంబున - 737 హరితనయుండు పార్టుండు _ 347 సకలరాజుస, జూ యు వేండు చెంతయు. - 507 మ్‌ నా సతికి నొక్కరుండపతిగాక - 754 హరి పంచిన మార్గంబున - 846 వదుక నమ్ముని - 828 'సతివిముక్త యయినం బతికి - 626 హరిపరాక్రమ యేను - 4పం్ర వేడుక నొక్కరుండు - 490 న్‌ (| హరి యింద్రుం దలథె - 795 సద్వినుత చరిత్రుండు - 497 వేదంబుల్‌ చదివించె - 496 ప _ సమశీల శ్రుతయుతులకు _ 50 హరువచనమున - 759 వేదంబులందుం బ్రవీణుండై -425 ౫ ల యుతుడయ చ లంచ హారివిచిత్రహిమకవచా - 53 వేదము వేదియుం గలుగు - 673 సముండై ఫిలయ్యన్నము- 493 హ్ఞైమవతోత్తుంగహీమ - 665 వేల్వంగ సమకట్టి - 818 సరళతమాలతాల - 799 యమక నజర్యాన్న వైవాయసంబైన వరమత్స్య - 713 సర్వధర్మజ్ఞులరుర్వీశ - 804 త్పరయ్‌ టై వ్‌ టి సర్వలోక కర్మసాక్షి - 794 “చ ల వ్యసనవివ ర్లితమాన = 521 సర్వ గై! / గ జ మ సప స పుట్టు - స్త త్‌ సట... వ్యాసపురస్కృతావని - 526 సలలితమైన పుట్టు - 430 సై తస €౬ అన్ని | స్యోజు |] స్త టు /1 లాం 600 ఫరో న్యా

లు... య్‌ ల మటు ప నె ల హా | న. కంల శాం 1. వ ాాం.. బి66 గఆ.: 200.00 నీ మ స. . య ర జో " ॥ = [| ॥ న టి. న్న ర వ. || గ్‌ ను స ల మానక. .. న / న హన ం సంగణక గ్‌ * న తు దంట మట నము టం! టన. వ జైల 7 క భజ యయా శ హా గ ల ఇ న ఆ స కే వౌ , జ సక స మ చయాక తం . న టు. ” న్‌ వ షె ల లా . 4 కష | య. గ్‌ + అళి వ్ర. మున “అజంత అ 2 అజాత, " స ౬ కళ్ళ బ్ర ప్రో నాలాల వం లం. లంత న న కం ఆ కబ్‌ చలం అట టరు. ఆ క క్ట (త నీ కం సం నా. క గ్‌ శె ఇక శ. ల ఖ్శ శి కళ్ళి గె క్‌జీ శా లే (' ము 3? ళా . జు | జ ఖా ఈక శీ ్‌్‌ భ్‌ ట్రై ఇ ర! ల ఎాళు త ల జ స యని తా. లు టు టో ఆతా జ్యే ట్లు |

  • లం లా. / లే ఆ త (౧ న ; (వ న లు! . నట ర రస ము. క ణం. ఇక. అక్కల్‌" నా! జ. న | నే ల క శ ! “కకు .. న ఎంట శ (ర అవటు రు క రీ చై జా 4 ఎఎ కలా! ల వా క ణో తల శే = 1. న కం న! భభ ల. సప. య తనకు నీ నం రే. స. సో ట్ట య న. ౫; ఖో గ్‌ ్ట! గ్నే వ ఖ్‌ స్ట రబడ. గ జ. వలే ర్ని టీ |. | స + శే స! గస (రచ / గ ః॥ “వ. హ్‌ట్టీ | య టీ ళో స స గ ళు, | నం సయ? మలక = బీ లో అ కోంలాశలా .. ఎం ం న స మ , స్ట్‌ ౫. వ కం! త కు హం శా" ౪00 రగా ళల? గన |. + స" | ల న. వ. . . + ' క న న నం... ములు టంట యు ముటయ ముం యు 1లటుమంుటుడు టయ యనుట... గ న. ద కు. ఇ గచ) గలం, ఖం మ. బా వ్య క్‌ ల న స. 1 న. 11. నట్‌ టా వ? న. |. మై . న్‌జ గా నన $ గ్ల గాడీ ఓం టిం ంంఈణోళి ఇళ్ళ సట్‌ టల టై కా క యా య న. నన లననునపటనానన | ల త్‌ రాగాల న. ః క | , తనన 1 ల లాలన న