Telugu Kathavahini 2004 - anilvaranasi/indianlanguages GitHub Wiki

స! (న ం న్‌గొని చ ౨. బే కి డొ! శ్‌ లం , ల్‌ శ్‌ రు రా | 2 వి జ శ +. శ్వ శీ లకే సన కనే! గ్గ గు! త | 1. షన / " కః ర్ల స ః. న. త్‌ భి ర్‌ మం 1 | క్ష | ట్ట " అనల మ నా ఐం 6 భ రం అడ్‌ గ యర స ప లఅంంయానాటు 9అలలోంం ఆటీ ,అల్సు), నే. గి వం... కు &/ గీ మ్మ /. లా , కతన ం! సగంశ(లూ ఆఅా౪ం కిట)

అ 2004”. యన్స్యత+9 మోట ంచ్చాళ్టు ల. వోటీ కథల

/ నంచాలకుడు. రన శం రారారా ప్రన్స్‌ 12380 రిజ్ష సక్‌ హైదలన్‌ పు

పా యవ. శ కా కాగ ళిక॥ = 2004 (2౧౧౧౦|౦౬/ 0/ 5౧0 ఈ/[0గ౮౭9౨) ఇం ౬61800 : జ 2004 ఈ ల (గ్రంధాలయ

ది0॥141%100౧ 110. 51 యా ర్య

స ఉ|| న, ఉ

, గిం. ఎఇ ఉతిలతి' (రై ౧౭9౦6౮౪6 4411055 నల షో గ్‌ ఖో. ౦౧౧౧౧౭౮ 50/౯ : ఒం 'ం4గ4' 52! తి

నొగంర౮౮066' & ౧౮0/5౧66 50౯: ఈంగ్ధోరి 0గ6౧166 ౪710౧1౧ 8ం0%1691 870) ౧5111౮1101 1-9-2863, ౪1ర2౧804' తరగా నాంర సర6౧3026 = 500 044. ఛళిక.[.5. 941 నిం/౦0౦౧0/65 : - 7401౧1 80067౧54 1-9-286/3, ౪10/2౧4986 ౧/69/2046 - 500 044. /15212060/8 600% 0696, 82౧ 54696 గ/౮6౧20264 & 016 82౧0౧69 [24౦682 800% 1104696, 0౧౧: 4గ/292012] 8౧01 8461 0౧౦౪౮ గ/66/౧2026 [18/6)/0064 800% గ0056, 504120 88226 గ౮/౮౦6086. [11౪06442 నిం0119[65, 66౪౭గ౦౧౧6 12/84/2612. /0696//౧౮: నగిషంగ2౧2 కగగళ 65840162, ౧౮616026 - 500 044 అ 706 ౧౧/6౮ 4౧: ౧11౧02 6/200165 - ౦01861 ని౧౧166, 1-16-79/3, 841 ౧192” 0౦|౦౧౫ 0006104012; 4౫41, 59064౧66/2026 - 500 015. గగం9: గం 100/౧ ౪8 $:10

న. ప. య న! ॥ య్‌ లో ము మ న గ శస | త్‌ టా ప. ప సట 1 న న. స. . ల. ల ప స్టా | త్త న. న | న. ను 1 స్వ. షం. పం ః ॥ న. “ టాం ళా (| న. సో న... యు ల. ం త్త... 1 న. మ వః సర 3,:న్లుళి సుర్‌ (న నస. స. సలల స కో - క న న - (| ప వ. ని స స య. న. / మ. న. యం యూ. వ; వ న. ను చా ౫; స |... న్‌ న! చ సా న షప న్‌ యన చ్‌ వర (2 టరు భి. లం 9 సం. న ను న్‌! 111 షష. న్న కాగా నశ ను ల స గన. * కా సు న స ు శో | య. ( ( (| జీ గ. హి శ క. ॥ స్త కంథవటిక నంవ ౦కట సు స. . తృరాది న బారా, న వా సంచిక (9265లో గా అలి (్రచురింవబడి బడిన ఫొటో)

'రంంటుగా నొలయగు కూదలు... నాకు జన్మనిచ్చిన నాలుగు మాసములకే - జనవరి 1945 - పరలోకమునకేతెంచిన నా తండ్రిగారి గురించిన వివరాలు అంతగా తెలియవు. వారికి సంబంధించిన కొన్ని పుస్తకాలు లభ్యం. అవి.... అ (10౫0ల 40 జం రిిళం3బ్యాా సరదా యజయకీలణ పళరీ, షెందిటీం9 1935; రట 1255; గం: ౧౦6 పైరీయంుకే, అ 1105066055 000 0యంషబాం06ఘ6! కముల్టుడం (య కడం. 1921): ము నం పే క01సకీల జడే కెంంకుంటిలం గు1101016. మం 3/- అ 3012211000 :10 20 మరండేలందం 9 ల00” ైలాసీం15; స2్టిలు - 430); దంల : ౧01 100ష101066. అ 1656 5జకరేషర 22ంాయం0క6రే11 మరి ₹ందేడే తలే (1936): 206 210065 0 మర, కెంగ కు” ; 1352 + 16 ౨283; పే106 : ౧౦౯ హరీయంంరే. ం అ 13టుం ఆరే సం గ మోేం- గ! మట షల కం 1938. ము. 300, 48004 యమః! గా. శం: 1938; మ. 9-0-0. అ 100ఫోట 0 పస3లంణంే28 ఓ2ా 1926; 222 వష్యల; 3. 5-8-0, అ వసుచరిత్రము : (శొంఠి భద్రాద్రి రామశాస్రిగారి పీఠికతో) ; వావిళ్ళ రామస్వామి . ' శాస్త్రులు అంద్‌ సన్స్‌ ; 1915 ; 512 పేజీలు; వెల : ఇవ్వలేదు. _ చనుచరిత్రమూ వుస్తకంలో రాసుకున్న వద్యం : , రవ క్ర శాప పెసలు ఒజ్యా ఆాన్ట్‌ టు రాణ ణా వమచరిత్తనముం , వం నె ల సెక ల యబాజుకలరిలి ని శ్యికవ్యా ఫ్రే ” శశ క్రిళుశ జంం 9 జాలక కుంల6 = ట్రం ా మళీ కు అట్ర,ఆగాతి నివి పాకల భా కళకు 4 జి, నం పోయి ౬కు యుక్షభాట దళపంన్ల న్న శ ఈ వేమన పద్యములు : రంగస్వామి మొదలియార్‌ అండ్‌ సన్స్‌ ; 1911 ; 94 పేజీలు . వెల : ఇవ్వలేదు. 7 అ వేమన రత్నములు : సరస్వతీ బుక్‌ డిపో, బెజవాడ ; 19382 ; 96 పేజీలు : వెల : రూ. 1-0-0. “

అ శబ్బ్ధార్థ చంద్రిక(అను)ఆంధ్ర నిఘంటువు ; మహంకాళి సుబ్బరాయనిచే వ్రాయబడినది; వావిళ్ళ' ; 1913 ; వెల : ఇవ్వలేదు. ఈ అప్పకవీయము : బ్రహ్మశ్రీ శతావధాని పురాణం సూర్యనారాయణ శాస్త్రుల వారిచే బరిష్ఫుతము ; వావిళ్ళ ; 1910 ; 800 పేజీలు ; వెల : ఇవ్వలేదు. అ కుమారసంభవము : వావిళ్ళ ; 1914 ; 272 పేజీలు ; వెల : 1-4-0. అ ఛీమేశ్వర పురాణము : వావిళ్ళ ; 1919 ; 142 పేజీలు ; వెల : ఇవ్వలేదు. అ నామలింగాను శాసనము (అను) అమరకోశము ; వావిళ్ళ; 1917 ; 896 పేజీలు వెల : ఇవ్వలేదు. అ మాలపల్లి (ఒకటవ భాగము) ; ఉన్నవ లక్ష్మీనారాయణ ; ఆంధ్ర గ్రంథమాల ; 1985; పేజీలు : 626 ; వెల : ఇవ్వలేదు. అ వేయిపడగలు : విశ్వనాథ సత్యనారాయణ ; రసతరంగిణీ గ్రంథమాల - 9; 14 డెమ్మీ సైజు ; 416 పేజీలు ; వెల : రు. 2-8-0. అ రాఘవ పాందవీయము (శతఘంటము వేంకట రంగశాప్రిగారి ఉపోద్దాతముతో) ; వావిళ్ళ ; 1910 ; 202 పేజీలు ; వెల : ఇవ్వలేదు. కామన పాంయియను” వ్పళంలో తవేతు లాను వాంటునా. ఈకల? న అ ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలు - 3౩; 1922, 1925, 1926. ఆయన స్వతహాగా కవి, రచయిత అని ఎరుక. 'ఆంధ్రపత్రిక నంవత్సరాది సంచికలలో అనేక విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. అందులో మూడు మాత్రం లభ్యాలు - మనుచరిత్ర విమర్శనము (1922) రామాయణ. నీతిసారము (1925) " సూరనార్యుని ప్రేమవర్దనలు (1926) “భారతి మాసపత్రికలో ఛందోబద్ధ కవిత్వం రాసిన దాఖలాలు ఉన్నవి. వాటిని సంపాదించే ప్రయత్నంలో ఉన్నాను. " “అసిధార అనే చారిత్రాత్మక నాటకం ్రాత ప్రతి లభ్యం. 'శ్రీమదాంజనేయ శతకము" 1935లో ప్రచురించారు. దానిని మరల ప్రచురించాలన్నది అస్మదీయ సంకల్పము. వీటిని బట్టీ ఆయన వ్యక్తిత్వాన్నీ సాహిత్యాభిరుచినీ అంచనా వేసుకోవడానికి కొంతలో కొంత వీలయింది. బాపట్లలో డిస్ట్రిక్ట్‌ కోర్టు వకీలుగా ప్రాక్టీసు చేశారట. “అజాతశత్రువు అని ఆయన్ని తెలిసిన వాళ్ళు నా చిన్నతనంలో అనేవాళ్ళు. బాపట్ల బార్‌ అసోసియేషన్‌ వారి గోల్డెన్‌ జూబ్లీ

సావనీర్‌లో ఆయన గురించి ఇలా ప్రచురించారు ; వ 1. ౪. నం002 £20+

  1. */. 058 20 ౪789 6 66 5[రలం601 1268 ఏ1 7271801256 5300228006 కం6 ఉంర002 ౧౦౦౬ 1116119 బు, 512. 7. వఉ00220 ఇం]6ే 250 1176 ం912హ66 2 2206 మ గ్లౌంుడం పిం8 026 946 102 913 160206 రం, 6 7259 8 8616 090156 206 255ఈ0ష260స/ $00640 0006100 56కి 4 €6ం001- మల్తుల్తమ 00స్స(266 కెగరికం 19 1614 లగు 7682 10 6 100ట సంచార! [68608 మెంంంు ౮100 11 60స2గటుం- ఒికంగ 00 మ లుంద్తం 6 ₹28 పేం01016 0! ంగ్షల్నుడ్రా సజ 007 0౧6 406 ఆ౦రేం4%64ే ం618 10 006 *08ి 11,

నా తండ్రిగారు 1940లో బాపట్లలో మాయాబజార్‌లో స్వంత యిల్లు నిర్మించారు. ఆ యింట్లోనే 1944లో పుట్టి పెరిగాను. ఎంతో యిష్టపడే ఆ యింటితో రుణానుబంధం తెంచుకోవాల్సి వచ్చింది - మారే కాలంలో పిల్లల భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా.

నా తండ్రిగారిది గుంటూరు జిల్లాలోని యడ్లపాడు. అక్కడ మాకు స్వంత పెంకుటిల్లు ఉండేది. ఆ యింటి. కెదురుగా, గుడి కట్టవద్దన్న ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో శిలాఫలకంలో ఆలయ ధర్మకర్తగా నా తండ్రిగారి పేరు చెక్కబడి ఉంది. దాన్ని బట్టి ఆయనకి దైవచింతన ఉందేదని తెలిసింది.

కలకలణం ఇంటీటం[ హీర వారు పాలిక క్గ్‌ల్ట్‌ నే క్‌

సంవత్సరాలు (1910-1985) నిండిన సందర్భంగా ౫16 ్టీ.. రిలదానాదారారారాదాదారాంారాదానాననిణరాండాణల టప సేలం ంంగాం[2ల6గా పంపించిన మెమెంటో ధ్రతిరూపం కర్ట్‌ ఖ్‌ ఇటా

,నా తండ్రిగారనే కాకుండా, ఆయనకున్న సాహిత్యాభిలాషను దృష్టిలో ఉంచుకుని, నాక్షు అత్యంత (ప్రియమైన కథాప్రక్రియలో, ఆయన స్మారకార్థం ఈ 'కథావాసొని” సంకలనాన్ని వెలువరిస్తున్నాను.

'రచన 'ఇంటింటి వత్రికలో 2003 సంవత్సరంలో ్రచురింపబడ్డ 101 కథల నుంచి వన్తువైవిధ్యం - మానవతా విలువలు” కొలమానంగా తీసుకుని 34 కథలతో శ్ర 'కథావాపాని-200%*ని పాఠకులకు అందిస్తున్నాను. ఈ కథల ఎంపికలో సహకరించిన వారు : ఒక ప్రముఖ కథారచయిత ; ఒక విమర్శకుడు ; “రచనలో నేను మెచ్చిన కథ” శీర్షికలో వారి దృష్టిలోని మంచి కథలను / మంచివి కావని తోచిన కథలను తెలియజెప్పిన ఎందరో పాఠకులు. వీరందరికీ కృతజ్ఞతాఖివందనాలు!

తెలుగు పాఠకలోకం ఈ ప్రయత్నాన్ని సమాదరిస్తుందనే ఆశాభావంతో...

భవదీయుడు 16 మే, 2004 వై.వి.యస్‌. ఆర్‌, శేషతల్ప్చ్పశాయి

ఇదీ 5న... శా శ్రీకాకుళే.... మహాక్షేతే.... వేటూరి సుందరరామమూర్తి........... 9 త పొగమంచు కాళీభట్ల వేణుగోపాల్‌.......... 15 శా ఆఫీస్‌ ఫోవియా తోలేటి జగన్నోహానరావు........... 19 శ గా॥ రవిశేఖర్‌ కళ్యాణ నుందరీ జగన్నాథ్‌........... 26 శా అదుగో ఆంజనేయుడు... కర్షపాలెం హనుమంతరావు........... 88 జాంబవంతుదెక్కడ? శా మల్లి నలీం.......... 89 శా మా కోడి కూయంది పొద్దెలా పొదుస్తది? చానాళివకోటి........... 4? శా కత్తిపడవలు క్లెవిగిరిధరరావు.......... 56 శా వేదనిధి ఉవద్రష్టసాయి.......... 59 ణా శృతి 'సుధారమ.......... 64 శా సంధ్యావందనం మాచిరాజు వెంకటరత్నం........... 68 శా మూదోతరం పొలెవు బుచ్చిరాజు........... 75 శా చుకృమ్మవారు ఛాయామల్లిక్‌.......... 79 శా ఊరుమ్మడి తల్లి ఎలక్ర్రాన్‌............ 84 ణా ఎన్‌డేంజర్డ్‌ స్పీషీస్‌ అరుణ నిష్టల.......... రం జా రెండు ప్రశ్చలే... ఎ. అవ్ఫల్నాయుడు........... 102 ణా సంగమం విజయలక్ష్మీ రామకృష్ణన్‌... 119

శా శ్రీ కనకమహాలక్ష్మీ అల్లం శేషగిరిరావు........... 127 హెయిర్‌ కటింగ్‌సెలూన్‌ శా పాద్యమి చంద్రుడు డా॥ ఎ. నుబ్బారావు............ 132 ణా స్వేచ్చ పవీయన్‌. నారాయణ.......... 151 శా ఇదీ హైటెక్‌ యుగం పులికంటి కృష్ణారెడ్డి .......... 167 శా నడవలేని నర్తకి జి రామకృృష్ణశాప్రి.......... 176 శా ఆక్రోశం కేసరి.......... 180 శా గోదానము - వృషోత్సర్గము దాః జొన్నలగద్ధ మార్చందేయటు ............ 186 శా రాజీ ఈగ ఇంద్రగంటి జానకీబాల.......... 191 శా పల్లవించిన పాట ఆదూరి వెంకట సీతారానుమూర్తి.......... 198 శా నాతిచరామి గంధం యాజ్ఞవల్ద్యుశర్డు.......... 208

  • కర్తవ్యం బివి రమణరావు.......... ల శా దగ్గా కెకె మీనన్‌.......... 226 జా “విధివంచితులు వసుంధర.......... 2832 శా కంప్యూటర్‌ 'కలి బోయ జంగయ్య........... 237 శా అంతా మిఖ్యే! బీనాదేవి.......... 240 శా వెలుతురు జలంధర.......... 2692 శా నీడ కాట్రగడ్డ దయానంద్‌.......... 260 షో

6 ల 72 (రచయిత నరకోత్త కట) ఒగళ

అ రేసూరి నుందీరరారుషవార్తి

ఆ... యీ శ్రీకాకుళంలో మహాక్షేత్రంలో నాటి మాట ఇది. తెలుగు నాటి మాట. విశేషించి వెలనాటి మాట. వెలదీ కోవెలది అయిన ఆటవెలది మాట ఇది. దైవరాయడా దేవవేశ్యాభుజంగుడు. పోనీ... ఆ దైవం రాయడా అంటే... రాసే రాత నుదుట. ఎదుట పడి అడగాలంటే కొబ్బరి కొట్టిన రాయి. ఉలుకా పలుకా రాయడికి కులుకు కూడబెట్టుకుని

కూనసానులతో కూచిపూడి ఆడమంటే మాత్రం విటరాయడూ... నటరాయడూ తెలుగు భర్త! , ఆనాదెప్పుడో రాయలవారికి నాలుగో జామున కల్లోకి కదిలివచ్చాడట. ఆముక్తమాల్యద లాసి తనకిమ్మన్నాడట. కులపతి వెంకన్నగారికిద్దామనుకున్నానే... ఇప్పుడెట్లా స్వామీ అంటే నాకన్న వెంకన్న ఎవరయ్యా రాయా - ఇంకా కన్ను తెరవలేదా అన్నాడట. ఆ రాయడి గుడి నీడలో వెలసిందో వాడ. ఆ వాడ సానివాడ. దానికి కొంత వారగా తేరగా దక్కిన మాన్యాల వారు, ధాన్యాలవారు, జారులు - పూజారులు అరుగులరిగేటట్లు తిష్టించేవారు. లేని కథలు సృష్టించే వారు నేతిగిలకలవారు నెత్తి పిలకలవారు, కలవారు - లేనివారు, వారూ - వీఠు కలిసి వెలసిన మున్నూరు గడప. రమారమిగా (అంటే... విష్ణువు అనుకునేరు! రమను రమించువాడు గనుక విష్ణువు. ఇత్యాది కాకులీయ సమాసాలు చేసి కర్మధారయకు నీళ్ళు వదిలేసి). తొన్నూరు నెగళ్ళవారు ఈ మట్టి దేవుళ్ళు సామాన్యులా! అటు మవిభోగి ఆంధ్ర విష్ణువుని, ఇటు ఏ భోగం లేని ఏక రాత్ర మల్లికార్జున, స్వామి వారిని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. ఇటు శుద్ధ వైదీకమూ వుంది. అటు వీర వైఖానసమూ ఉంది. ఉన్నదేదో వుంది. ఊరు పచ్చగా వుంది. ఊహలకు వెచ్చగా వుంది. అపోహలకూ, నచ్చుబాటుగా ఉండనే వుంది. అమరవాది అవధానులగారంటే... చుట్టపక్కాల్లోనే కాదు- చుట్టు పక్కల దివి సీమంతా 2222222222 శ్రూవ+7. బట్ట... =

పేరు. పేరుగన్న వైదికం, పేరుకున్న ఛాందసం ఉండాల్సినంత వుంది. ఒక్కగానొక్క కొడుకు. కాశీ వెళ్ళి వచ్చిన తల్లిని గన్న తాతగారితో, కాశీ దాకా వెళ్ళినవారు ఆ పకృనే వున్న రామేశ్వరం కూడా చూసివస్తే పోయేది కదా! అన్నంతటి లోకజ్ఞాని. ఈ మనుమడు. ఇంతకీ పేరు కాళి. కాశీపతిశాస్త్రికి పౌరోహిత్యం పట్టుబడ్డది, దానికితోడు స్కూలు చదువుతో నాలుగు ఇంగ్లీషు ముక్కలు కూడా పట్టుబడ్డాయి. దరఖాస్తులు, దస్తావేజులు, కోర్టు కాగితాలు చదివేపాటి, చదివి అర్ధం చెప్పేపాటి సులువూ పట్టుబడటంతో పట్టపగలంతా వాడి గిరాకీ పట్టపగ్గాల్లేకుండా పోయింది. వీటన్నిటికీ తోడు అతని రూపం సుందరం. గాత్రం సుమధురం. కాసుల పురుషోత్తమ కవిగారి 'అంధ్రనాయక శతకం” కంఠస్తం. ఆ పైన దయిత గోపాలంగారి శిష్యరికంతో వచ్చిన సక్కుబాయి పాటలు, తుంగల వారికీ మేలుబంతిగా అతని వన్నెకు వాసితెచ్చి పాలేళ్ళూ, పంటకాపులూ, వర్తకులూ - వస్తాదులూ కూడా అతన్ని మెచ్చేవరకూ - వెంబడించే వరకూ వచ్చింది. ఇప్పుడు కాశీప్రభ వెలిగిపోతూ ఉంది. తాత తండ్రుల మాన్యాలు - మన్ననలు, ధనాలు - కనకాలు సరేసరి. రెండు చేతులకి రాళ్ళ ఉంగరాలు అధవా నాలుగైనా ఉందేవి. ఏనాడో శ్రీనాథులవారు వారున్న నాటికే సూటిగా భవిష్యత్తును కూడా పరకాయించి చూసి అననే అన్నారు కదా! 'ధరియింవనేర్చిరి ధర్భు పట్టెడు వ్రేళ్ళ లీలమాణిక్యాంగుళీయకములు" అని - అందులోనూ దబ్బపండుకన్న నిమ్మపండల్లే హరి చందనపు ఉండల్లే బంగారు కొండల్లే నిగనిగలాడుతూ... వయస్సులో ఇప్పుడున్న వాళ్ళకీ - వెనకెప్పుడో వున్నవాళ్ళకీ కళ్ళకద్దుకునేటట్టు ముద్దుగా వుండేవాడు కాశి. అందరి కళ్ళూ తన మీద వాలుతుంటే... తన చూపులు కొంచెం పైగానో, కిందుగానో, గాలిలోనో, నీటిలోనో, తేలుతూనో - మునుగుతూనో ఉండేవి. ఒకనాటి వేసంగి మధ్యాహ్నవేళ కృష్ణలో జలకమాడి సంధ్యావందనం పూర్తిచేసుకుని అంగాస్త్రం రూడించుకుని వెనుదిరిగే వేళకు గట్టుదరి బుడగలు బుడగలై ఉడుకుతున్న కృష్ణవేణమ్మ నట్టువాంగం చూసి అట్టే నిలిచిపోయాడు కాశి. - . నాచుపాపలై - నీటినీడలై - ఏటిపాపలై కదులుతున్న చేపలూ... ముక్కుముట్టని, గొంతు దాటని, పొట్ట నిండని ఈ ఏటికూళ్ళ కోసం అలిసి అవిసె పువ్వుల్లా పడివున్న కొంగలు. ముక్కు మూరెడున్నా నీళ్ళు నోరెడైనా దొరకని వడగాడ్పులో ఏటి చేప నేసుకోబోయి ఏటిచాప నోట పరుచుకున్న కొంగల నోరంతా ఇసకసకాగా ఈ విడ్డూరాలు చూస్తూ మరచిన ఒడ్డు ఎక్కబోయాడు కాశి " ఇప్పుడా ఒద్దు ఒయ్యారంగా ఉంది, దానికి నడుమొచ్చి ఉయ్యాలలూగింది. జెంగచూపుల కళ్ళలో బేడిస కిలుక్కు మంది. ఆ పడుచు ఉతకబోయిన ఓణీ వఏరెత్తికెళ్ళింది. ఏరు మొల

  • దాటేసరికి వెతకబోయిన మోహినీ ఎదనెట్టే ఏటి కెదురీదసాగింది. ఈత ఆగదు - పాత అందదు. ఈ తపతపలకి కొంగ రెక్కల రెపరెపలు. కృష్ణవేణమ్మ నవ్విందా అన్నట్టుగా వుంది. మధ్యాహ్న దరిద్రంతో అలమటిస్తున్న ఆ ఇసక మేటలో....ఈ సౌందర్యలహరీ ప్రవాహం. చూడడానికి రెండు కళ్ళూ చాలకపోయె. పైటందని నీటి పాటందని చిన్నది చిక్కులో పడింది. క ధాతా 1౬11౬222

ఆ పాత కోసం పోగా పోగా పాతాళమే గతి అయ్యేటట్టు వుంది. అది లేకుండా ఊరు చేరాలంటే ఎట్టా? నీటి చీర కట్టు జారిందా నీతి కట్టు జారినంతపనాయె. ఏటి కోకతో ఎన్నాళ్ళుందేను? పాటిరేవు పడితే పరువేమయ్యేను? వరదొస్తే వరదంటి వయసు ఏ గట్టు చేరేను? తన గుట్టు తన లంకకే చేటు కదా? వణుకు పట్టిన మైతీగ ఏటి వాగల మీటు కెన్నాళ్ళు తాళేను - తాళం వేసేను? . ఇదంతా చూస్తున్న కాశీ ఒద్దెక్కలేక, ఎక్కకుండా వుండలేక బిక్కుమంటున్న చక్కంది చూసిన జాలి చూపు మింగలేక అంగాంగ సౌందర్య గంగకు సారెగా తన అంగవస్త్రం అందించాడు. అంగనామణి ఆ అంగవస్త్రాన్ని చెంగుగా వక్షోజాల మీద ఆచ్చాదన చేసుకుని ఆలింగనం చేసుకున్నంతగా ఏటి నీటి నిలువుటద్దాన కనపడేసరికి గంగవెర్రులెత్తినంత.... కామ కటాక్షం కలిగినంత... కౌగిలింత కల దాటి కట్టెదుటికి వచ్చినంత... ఆ కాంత తనకిచ్చి నంత... ఎంతెంతో ఆ వెచ్చనంతా.... వేడుకగా తోచి, వేదెక్కి పగటి కల కన్నాడు కాశీ. చూపు చుట్టరికం కలిపింది. అంగవస్త్రం కట్టుకుని నిలబడ్డ కన్నెగాలి నడుము పేదరికం తెలిపింది. మడుగుకు అడుగులొత్తుతూ మెత్తగా తూలుతూ, తుళ్ళుతూ ఆమె ఒద్దుకు రాబోయి ఆగింది. ఆమె చూపు పైట దారిని పడి మూగగా కళ్ళకు చేరి ముత్యమంత కన్నీటి బొట్టు రాళ్చింద. ఆ మూగచూపు కాశీ అయిదు ప్రాణాలనూ ఆచమ్యా అంటూ పీల్చింది. అంతే తనకు వచ్చీరాని ఈతతో నదికి అడ్డం పడ్డాడు కాశీ. నడిచాడో... పరుగు తీశాడో... పాకాడో... దేకాడో పడుచమ్మ పైట పట్టుకున్నాడు. అనామిక బొడ్డులోంచి ఓ నవ్వు పుట్టి పెదాల మీద కొచ్చి పూసింది. ముంగురుల తడి ముత్యాల తెర నించి ఆమె వెన్నెల నవ్వులు కాలే ఎందకు గొడుగేసి కాశీ గుండెకు వల వేశాయి. పైటనిచ్చిన పదుచువాడికి సిగ్గులు కృతజ్ఞత చెప్పాయి. చూపులు ఎరుపులై పిలవని పిలుపులై కాశీని కాములవారి గుడి తలుపులు తీసి రమ్మన్నాయి. ఇదంతా కాశీ మానసికం. కాదంటే స్వప్న జగత్తు. లేదా మదన మహత్తు. పైట నందుకుని తడిసి మోపెదైనదాన్ని పిండుకొనబోయి కాశీపతులవారి అంగవస్తాన్ని జారకుండా మునిపంట పొదిపి, చివళ్ళు చంకనెట్టుకుని వంగింది ఆ పడుచు - దోరగా అదో రకంగా కాశీ వంక చూస్తూ.... అద్దరినెందరున్నా - ఏటికిద్దరిని వీరిద్దరే. పైట చేతబట్టి తెచ్చిన కాశీ పునఃస్నానం చేయలేదు. అంగవస్తం ఎంగిలించిన అంగన దాన్ని నీట తడపనూ లేదు. అంటు అంటూ లేదు. అనుకున్నవారూ లేరు. వారిద్దరి మధ్య ఇంత జరిగినా మాట - మంచీ సుంతైనా లేదు. చేపల కోసం కొంగజపం సాగుతూనే వుంది. చేపట్టే వాడి కోసం కన్నెతనం కాగుతూనే వుంది. చేతికొచ్చిన అవకాశం అందంగా వుంది, అందుబాటులో వుంది. చదివిన ఛప్పన్న శాస్త్రాలూ, చెప్పుచ్చుక్కొట్టినా చెప్పిన మాట వినేటట్టు లేదు, అమరవాది వారి అబ్బాయి. అవునుమరి కొమ్మన్నగ్రారి మనుమడేగా! ఈ కొమ్మన్నగ్రారు గుంటూరి వారు కాదు. ఆ కొమ్మన్నగారి గుణాలన్నీ పుణికిపుచ్చుకొన్న వేదం వారి అంతేవాసులు, అమరవాది కొమ్మన్నశాప్రిగారికి సాక్షాత్తూ పౌత్రుడు మన కాశీపతిశాస్టి. వై కక] కాంట క

ఈ మహాయాజ్జీకులు, అపర యాజ్ఞువల్మ్యులు తిక్కశర్శగారు... అదే మన గుంటూరి కొమ్మన్నగారి పుత్రులు. దరిమిలా యజ్ఞం చేసి సోమయాజులై తండ్రిగారిని తృతీయం తర్వాత చతుర్ధ పురుషార్థానికి నడిపించి వుత్రుడుగా చేయవలసింది చేశారు. 'భారతాఖ్యమగు లేఖ్యంబైన యామ్నాయమున్‌ తెనిగించి భారతామృతము కర్ణపుటంబుల గ్రోలి ఆంధ్రావళి మోదముం బొరయనట్లుగ చేసిన ప్రాతభ్మరజీయులు - పునరపి అన్నట్లు గురు మానసపుత్రుల జాతకమూ... అదే మన కాశీపతి పితామహుల జాతకమూ. కామకోటికి వచ్చి ముక్తి కాంతానుగ్రహం కోసం, వాకిట నిలిచి వాటారి పోయింది. ఆ వంశాంకురమే కదా కాశీ. తాత పేరు నిలపవలసిన వాడాయెను. ఆ పేరు నిలపడానికి ఉన్న పేరు... అదే తన తండ్రిగారికున్న మంచిపేరు కృష్ణలో కలపడానికి ఇప్పుడీ అవకాశం, అనుకోకుండా, అందంగా, అందే విధంగా ఆడదై వచ్చింది.

నడి వేసంగి. మిట్ట మధ్యాహ్నం. అయితేనేమి కాకుళీయ కామ పరిషత్తులో వేళపాళ, ఎక్కువ తక్కువ, కులం గోత్రం - వేదం శాస్తం, మంచి చెడ్డలు, మట్టిగడ్డలు శృంగారానికి పాటించవలసిన పనిలేదని ఏనాడో తేల్చి వేశారు. అసలే దివి సీమ. అందులోనూ క్రీడాభిరామంగా వెలసింది శ్రీకాకుళం.

సురలే నరులట అచ్చట

సురుచిర నిమేష నేశత్రులు

నరులే సురలట నిచ్చలు

జరాభావ రసగాత్రులు

అంతా దివ్యమే... భవ్యమే!

ఇంతకీ ఎవరయ్యా ఆ యింతి? పులకలు పుట్టించే పూబంతి? ఈ నలరాజును వరించడానికి వలరాజు నదీతీరానికి పంపిన దమయంతి?

వచ్చే కాకుళపు తిరునాళ్ళకు - కట్ట కింద తిరునాళ్ళని కూడా పేరు = రైకల పందగ రేనాళ్ళకు ముందుగానే దిగుతారు వక్కలగడ్డ నించీ, మురమండ మేళం నించీ వేల్పూరు వాడల నించీ, తణుకు నించీ, తాడేపల్లి నించీ నంగిగడ్డ నించీ, కడప శివారు కోడూరు నించీ, గుంటూరు కట్టుకోళ్ళగూడెం నించీ, గుడివాడ నించీ - విశేషించి వికటకవిత్వాల రామలింగయ్యగారి తెనాల్యగ్రవారం నించీ, ఆనందగజపతుల సీమలో కటకం నించీ, విజయనగరం నించీ, మల్లెమొగ్గల వారు' మంచిగంధం వారు, మంగళంపొడు వారు, చుట్టాల సురభి వారు, పువ్వుల వారు, పూజల వారు - వారి వారి విద్యలతో వీరంగాలతో శ్రీకాకుళానికి తరలి వస్తారు.

అట్లా వచ్చి వన్నెల పందారాలు చేసి వారి వారి తావులకు మళ్ళే ఈ జనాభాలో ఒకరో యిద్దరో మేళాల 'వారో మేజువాణీల వారో కొన్నాళ్ళపాటు శ్రీకాకుళంలోనే వుండిపోవడం కద్దు. అందులో ఏటా ఒక్క కుటుంబం వారైనా నట్టువాంగం నేర్పులతోనో, భామాకలాపాల ఆట ఒడుపులతోనో సానివాడ కూనలకు విద్య నేర్చే పని మీద వుండడమూ కద్దు. వారిలో కొందరు కృష్ణలీలా విశేషాలను ఆకళింపు చేసుకుని అభినయంలో దిట్టలనిపించుకోవాలని పురాణేతిహాసాలు తెలిసిన పండితులను, తలపండితులను సగౌరవ లాంఛనాలతో వాడలో ౮౮-1౧ ౯222222222

ఆఅ వారి ఇళ్ళకు పిలిచి సత్మరించడమూ కద్దు. సాధన చేయడమూ కద్దు.

కద్దు కద్దు అంటూ కళ్ళ కద్దుకున్న కళలకు కాణాచి విజయనగరవాసిని భోగిని కాశీ పితామహులను ఆ విధంగా ఆశ్రయించినదై మనసు నిండుగా కృష్ణ మాయలూ, మర్మాలూ మనసు తీరగా గీతలూ - వేదాంతాలూ మనసు తీరని గారాలూ, శృంగారాలూ అన్నీ నేర్చినదే. నేర్చుకుంటున్నట్టు నేర్పుగా కొమ్మన్నగారి నీడను. తలను రసికతలను దాచుకున్నది. ప్రత్యక్ష గురుత్వమేమో శాస్త్రిగారిది... పైగా పడుచుదనం దోరగా పలకమారే వయసేమో.... ఆ కాంతను అయస్మాంతను, ప్రియస్వాంతను ఆసాంతం సొంతం చేసుకున్న వారై కృష్ణ కృష్ణ అనుకున్నంతలో నెల పొడిచి తొమ్మిదింట నెలవంక నవ్వులది ఓ వెలది పాప పుట్టింది. పుట్టింది పెరగడానికే అన్నట్టు పెరిగి పెద్దమనిషి అయింది. అటు తర్వాత కాశీరాజుగారి కొలువు పేరంటానికి భోగినిని రమ్మని గజపతుల నించి పిలుపు మేనాతో వచ్చింది. ఇటువంటి సందర్భాల్లో గుద్దు తల్లిని వెక్కిరిస్తుంది, అందుకనే ఆ కన్నప్రాపను, కన్నెపిల్లను తిరిగొస్తే సరే... లేదంటే దాని ముద్దూ, ముచ్చటా మీరే చూసుకోండి అంటూ కళ్ళంట నీళ్ళెట్టుకుని భోగిని వెళ్ళిపోయింది.

అందాల బరిణలో ముద్దమందారమా అన్నట్టుగా పైట కెదిగిన దీక్షితదుహిత “నాన్నగారూ” అంటూ కొమ్మన్నగారి ఇంట్లోను, ఇంటి పనుల్లోనూ తిరుగుతుంటే... ఓనాడు నట్టువాంగాల ఉయ్య్యూరుగాడు వచ్చి మాగూటి చిలకను, మా గువ్చోే ముడిపెట్టమన్నాడు. కాకపోతే నెమలి పాడితే వినాలని - కోకిల ఆడితే చూడాలని అనుకున్నట్టే అవుతుందని అన్నాడు.

వెళ్ళి” కొమ్మన్నగారి ఎర్ర నెత్తురు తెల్లమొగం వేసింది. తండ్రి బిడ్డగా ఇది బ్రాహ్మణి - తల్లి వరసగా సాని. మమకారానికి - వావీ వరసా లేవు. అప్పటికే ప్రాయపు సూర్యుడు పడవటికి చేరిన కొమ్మన్నగారికి వల్లమాలిన దుఃఖం వెల్లువై వచ్చింది. శాస్త్రిగారు జీవన్మృతులై బాప్పగంగలో వారికి సశరీర నిమజ్జనం జరిగింది. కాకుళేశుడి గుడి ధర్మకర్త రాజబంధువు అంకినీడు నాయుడు కొడుకుతో పెళ్ళీ పేరంటం అన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత రాజ బంధుత్వం రాబందుగా మారి కులం వారిలో రాజ బంధువుల్లో పిల్లలుండగా ఇదేమిటని, కథేమిటని కాకులై పొడిచి చిన్న అంకినీడుకు మళ్ళీ పెళ్ళి చేశారు. ,

బొమ్మల పెళ్ళిగా జరిగినా అమ్మను చేసి వెళ్ళాడు అంకినీడు కొడుకు. భోగిని కూతురు యామిని ఇప్పుడు తల్లి, తాళి పడ్డ చోట తల్లి కాలేదు యామిని. తను పుట్టినపుడు తల్లికి పురుడు పోసిన వాడ వదిన సామ్రాజ్యం తనకూ పురుడు పోసింది. యామిని కడుపున మళ్ళీ భోగిని పుట్టింది. ఎదిగిన పదారేళ్ళ కాలం ఇంటి పనులకే సరిపోయె. వంటలకూ, వార్పులకూ చేతులు కాలిపోయె. చాకిరేవులకీ కొలువాయె. ముద్దులూ లేవు, మురిపాలూ లేవు. మువ్వలూ లేవు - మువ్వగోపాల పదాలూ లేవు. ఇంటికొచ్చే పూట కాపరాల వారికి సపర్యలూ - సల్లాపాలు, సన్నజాజులూ - చాటు ముద్దులు - ఇలా గడిచిపోళూ వుంది.

సామ్రాజ్యం ఇంట్లో సందె పేరంటాలు సన్నగిల్లాయి. కొత్త నీరు వచ్చి పాత నీరు పల్చబడ్డట్టు అయింది. యామిని బతుకు ఎడారిలో ఎండమావి. ఒక వీసం వైర్గాగ్యం.... ఆమె చూపులోను, పలకరింపులోను. ఇపుడు ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఉన్మాదంగా' మారింది, పిచ్చి పాటలు! అంకినీడు బతకనీదు. చావనీడు. వాడు మోడు. నేను బీడు. బతుకు పొడు అనటం వెర్రిగా మౌన] ర

ాాాాా నవ్వడం. కంట్లో ఈత ముల్లు గుచ్చుకుని పువ్వు పూసిందని కొందరు - కంటి నలకను ఈత ముల్లుతో తీసుకుంటే ఏమవుతుందని కొందరు, దెప్పడంతో ఉన్న మతి కూడా పోయింది యామినికి. నంగిగడ్డలో నగరాజ కుమారి మంత్రం పెడితే యామినీ పూర్ణచంద్రికలు, పున్నములవుతాయని, వాడవారు, వరసవారు, చెప్పగా బండీ కట్టించారు. కాకుళం దాటగానే గుందేరు- అదొక వాగు. ఆ వాగులో అన్నీ గుండ్రాళ్ళే ఇసక పాలు తక్కువ. దాని రాకద, పోకడ అంతుబట్టదు, ఐండి కదిలే వేళకు దుక్కివాన కురిసింది. బండి కదిలి గుందేరు చేరేసరికి

  • అది నిండేరై కూర్చుంది. ఈ బండి నడివాగులో చిక్కుకుంది. వరదలో కొట్టుకు పోయిన యామిని జీవితపు ఆవలిగట్టుకు చేరింది. అంతా కథలాగా జరిగిపోయింది. ముదిసాని సామ్రాజ్యం కొంపలో చిన్న భోగిని చిరుదీపమై మిగిలింది. అందంతో అభిసారిక కావలసింది
  • పరువంతో పరిచారికగా మారింది. ఎవరు మెచ్చేను ఎత్తుబిడ్డ సామ్రాజ్యం తప్ప! ఇంట్లో ముసలిదాని వేధింపు పడలేక కాస్త గాలి పీల్చుకుందాం అనే వేళకు గుళ్ళో నైవేద్యం గంట మోగింది. అప్పుడు కృష్ణకు బయలుదేరింది చిన్న భోగిని. కాశీతో చూపుల సంభోగం అప్పుడే జరిగింది. ఆమె వరకు ఎండ వెన్నెలగా వుంది. ఆ వెన్నెల్లో గొడుగు పట్టేందుకు తగ్గవాడే ఒకడు, కడు చక్కనివాడు, మనసెక్కినవాడు - కాశీ దొరకనే దారికాడు. పరువాన్ని పరువంతో పుఠం పెడితే, అందాన్ని అందంతో రంగరిస్తే - వయస్సుని, వాంఛని వడబోత పెట్టుకుంటే, సిగ్గుని చిగురించే కోరికని చిత్రిక పట్టుకుంటే వడదెబ్బని వడపప్పుగా నమిలి మింగితే... పులకింతల పూనకంలో వలవంతల పానకం ముద్దుగా తాగితే ఈ దప్పి తీరేనా? ఎద నొప్పి జారేనా! అనుకున్నంతలో పైకి అనలేనంతలో అంగవస్త్రం అందుకుంటూ ఆమె చేతులు స్పృశించాడు కాశి. ఆమె నవ్వింది. నవ్వుతే నాదనిపించింది. మౌనంతో మనది అనిపించింది. ఈ చెయ్యి, అ చెయ్యి కలపడంతో, దులుపుకోడంతో, ఈ బంధం ఇప్పటిది కాదు అనిపించింది. ఈ రాసలీలకు ఆకాశంలో అగ్నిసాక్షి భూలోకంలో కృష్ణవేణమ్మ సాక్షి రతి స్పర్శ, రాగ స్పర్శ, రక్త స్పర్శ జ్ఞాతంగా అజ్ఞాతంగా జరిగిపోయాయి. “అవసర పరఠితావాణి అలంకార రహితాస్తు శోభతే, పఠితాం, అవసరగామీ నారీ భూషాహానిస్తు శోభతే పుంసాం” - ఇదే కదా ఆ కాకులేశుడి వైస్త మాయ! అట్టట్టా ముదిరిన చనువు మళ్ళీ నట్టేట ముంచింది. ఇద్దరినీ జలక్రీడలకు తార్చింది. లక్ష్మణకవిగారన్నట్టు జలముల నగ్ని! పైటా అంగాస్త్రం కూడబలుక్కున్నాయి అంగాంగాలు ఆదమరిచి పోయాయి. ఆడా, మగతనాలు అర్ధనారీశ్చరపురంలో గుడి కట్టుకున్నాయి. అప్పుడే స్వామివారికి నివేదన పూర్తయినట్టు సుదూరాన గుళ్ళో మళ్ళీ గంట మోగింది, మూడు తరాల అజ్ఞాత కథకు కృష్ణవేణిలో నిమజ్జనం జరిగింది. ఇంతకీ సానివాడలో ఒక సామెత ఇప్పటికీ మిగిలిపోయింది. శ్రీకాకుళే మవక్షేత్రే గుందేరే మహానది ఈత ముళల్లే ప్రాణనాని అంకినీదే అధోగతి, త ళా -104 2222222222

న 6 పొగమంచు అ శట్ల రేభుగోరళ్‌

జ్డాపకం రాని జ్ఞాపకంలా అతను నా ఎదురుగా నించున్నాడు... 'నీ ఆలోచనల్ని సానబెట్ట్‌ నా జ్ఞాపకాన్ని చెక్కు చూద్దాం అన్నట్టు... పొగలాగా నా ముందు... అతను...

“మీ జ్ఞాషకం లేదండీ మనం విడిపోయి యుగాలైనట్టుగా వుంది" అన్నాను...

“అయినా మనం కొన్ని యుగాలుగా కలుస్తూనే వున్నాం... నిన్ననే కిళ్ళీ కొట్టు కింద కుంటి కుక్కను కాల్లో తన్నినప్పుడు నేనెదురు వచ్చాను కదా....'

ఇలా యిన్న వేలసార్లు విడిపోయి జ్ఞాపకం రాని జ్ఞాపకంగా మిగల్దమెందుకో అనుకున్నా...

'అదే విచిత్రం... నా నించీ నువ్వు విడిపోయీ, నీ నించీ నే తోసీయబడి... మళ్ళీ కలవడం జరుగుతూనే వుంటుంది... కలిసిన ప్రతిసారీ నీకీ అలజడి తప్పదు....' అన్నాడు అతను - నా ఆలోచన విన్నట్టు...

“అలజడి కలిగించేందుకే నన్ను కలుస్తారా మీరు?” అడిగా.

“కాదు కాదు మనం కలిసినప్పుడు, మనం విడిపోయి వున్నాం. ఇంతవరకూ అన్న విషయ స్పృహ నీలో అలజడికి అసలు కారణం' అని మాయమై పోయాడతను...

శరీరంలో యేదో చాలా పెద్ద శకలం మాయమైన అనుభూతి.....

అది.... ఆ శకలం శరీరందా?

లోపలి అశరీర శకలమా?

గుండె మీద చెయ్యి వేసుకున్నా...

చొక్కా జేబిలో ఓ కాగితప్మడత చేతికి తగిలింది...

తాటాకు రంగు కాగితమది....

మడతలు మూడుగా వున్నాయి....

మూడు మడతలూ మెరుపు వెల్టుల్లో వున్నాయి...

ఆ మూడు మడతల మెరుపు మడతల కాగితాన్ని విష్పా....

ఇద్దరు సూర్యులుగా.... రెండు సంధ్యల నడుమ ఆకాశ భాషలో (వ్రాసుంది....

నిన్ను ఈ రోజూ, రేవూ మూడింటినీ కలివి ఈ పురాతనమైన నేలను గాయ పరుస్తున్నాను...

గాయపడిన నేల గతించిన ఆత్మల కాళ్ళతో ఎర్రటి కన్నీళ్ళు కారుస్తోంది.... 2121122222 11కంచు

ఆ విషయ స్పృహ నీకు ఖచ్చితంగా వుంది.... నీ దరిద్రపు ధ్యాన చింతనలో నీ అశాంతిని యింకొకళ్ళ నెప్పిగా అనువదించి ఈ అడవుల్ని నగ్నం చేస్తూ చీకటి పరిమళాలు పేలుస్తున్నావు.... ఉంటాను ఈ క్షణానికి సెలవు... మళ్ళీ నీ అలజడి నాకవసరమైనప్పుడు కలుసుకుందాం.... న స్మూటర్జార్చేసుకుని వేగంగా వెనక్కి తిరిగి చూడకుండా కదిలా.... రైల్వేస్టేషన్‌ రోడ్లో లెనిన్‌ మామిడిపళ్ళు కొంటూ కనిపించాడు... హమ్మయ్య - ధైర్యమొచ్చింది.... లెనిన్‌కు ఆ పాగమంచుగాడి గురించి చాలాసార్లు చెప్పా. చెప్పిన ప్రతిసారీ అస్సలు విననట్టే వుంటాడు... అసలు ఆ క్షణాన చెవిటి వాడిలా అయిపోతాడు.... స్కూటరాపి వెనక్కి చూసుకున్నా... ఆ పొగమంచు వాడు లేదు... లెనిన్ని భుజం తట్టి పిలిచా... “ఆ ఇంటికేనా... నువ్వూ తీసుకో బావున్నాయ్‌ బేనిషాంలు' అన్నాడు... “అదికాదు లెనిన్‌ వాడు మళ్ళీ కన్పీంచాడు' - భయంగా - అన్నాను. “డజను నూట నలభై చెబుతున్నాడు .... నువ్వో ఆరు తీసుకుంటావా? లెనిన్‌... సాయంకాలం ఆరున్నరైంది. ఆ పళ్ళ వాడు అయినకాడికి అమ్ముకుని వెళ్ళిపోవాలి... పక్కన పల్లెనించీ వస్తారు వాళ్ళు..... “అది కాదు లెనిన్‌ వాడూ...” మామిడిపళ్ళ బుట్టవాడు నావేపు ఆశగా చూట్టంతో పొగమంచు వాడి జ్ఞాపకం క్రమంగా కరిగిపోయింది.... “నూట నలభై యెందుకు లెనిన్‌... నిన్న మా బామ్మర్ది ఎనఖైకే తెచ్చాడు యింతకి ఒకటిన్నరెట్లున్నాయి. సైజులు...” వేసా విషం చుక్క లెనిన్‌ తల్లోకి... లెనిన్‌ నా వేపు అనుమానంగా చూసినట్టనిపించింది... “ఆం అయినా ఉదయం నించీ ఎండకెండి మగ్గిపోయాయి. రేపుదయాన్నే కూరలకొస్తాం కదా అప్పుడు పట్టకెళ్టాం రెండో విషపు చుక్క... “అంతేనంటావా? లెనిన్‌ కదలసాగాడు. తై డడ త్త తననన డన నతన న డన్‌ డడ క భళర-౬౧* ౯2122222 2222222222

ాాాాటాాాాాక

'సార్‌ సరిగ్గా పద్మూడు పళ్ళు మిగిలినయి... మీరు తీసుకుంటే నేను గంపెత్తుకు వెళ్ళిపోతాన్సార్‌.”

వాడి అసహాయత గుర్రపు కళ్ళెంలా చేతికందింది....

చేసేయ్‌ స్వారీ... అని వికటంగా నవ్వుకుని, నూరు రూపాయల్మి ఆ మిగిలిన పదమూడు పళ్ళూ కొని కదిలాము...

ఓ పదడుగులు వెళ్ళి స్కూటర్‌ స్లో చేసి ఆ పళ్ళవాడివేపు గర్వంగా చూద్దామని వెనక్కు తిరిగా...

గంపను చేత్తో పట్టుకుని వాడు... పళ్ళ వాడు కాదు... వాడే పొగమంచు వాడు -నా వేపు పళ్ళు తెరిచి నవ్వుతూ కనిపించాడు...

జేబీ తడుంకున్నా...

మూడు మెరుపు మడతల తాటాకు రంగు కాగితం జేబిలో లేదు...

కానీ వుంది....

జేబీలో కాదు.... ఎక్కడో దాని కింద యింకా లోపల లోతుల్లో...

మళ్ళీ ఓ మాటు భయంగా వెనక్కు చూసా....

పొగ మామిడిపళ్ళ మంచు వాడు బుట్టతో సహా మాయమయ్యాడు...

66

ఇంటికి....

వరండాలో సుభద్ర భద్రంగా....

టీపాయ్‌ మీద సన్నజాజుల కుప్ప నన్ను చూసి నవ్వింది...

“పూలు కొన్నావా?” - పళ్ళికిలిస్తూ అడిగా...

'ఆహా.... లేదు పూలమ్మనింటోకి పిల్చి దానికి మత్తుమందిచ్చి దొంగిలించా... కొన్నావాట కొన్నావా? ఈ రోజుల్లో మొగుడితో సహా అన్నీ కొనాల్సిందే.

లక్షన్నర కట్నం కసక్కున గుచ్చుకుంది... స్కూటర్‌ పోట్ల గిత్తలా కుమ్మదానికి సిద్ధంగా వున్నట్టన్సించింది...

సన్నజాజులు టీపాయ్‌ మీంచి విక వికా నవ్వాయి...

బట్టలు మార్చుకోబోతూందగా...

మళ్ళీ అందమైన భద్రకాళి ప్రత్యక్ష్యం...

ఆగు, అన్నట్టు చెయ్యెత్తి కాఫీ గ్లాసు చేతుల్లో కుక్కి “అప్పుడే బట్టలూడ దీసుకుని ఆ టీవీ ముందు కూలబడకు, లక్ష్మి దెలివరీ అయ్యిందిట కళ్యాణి నర్సింగ్లోం... వెళ్ళాలి”

హుకుంనామా...

'ఇహ్హి..హీ...* అనికిలించి, కాఫీ గ్లాసు పట్టుకుని సోఫాలో కూలబడ్డా...

టా 'మామిడి పళ్ళెంతా?' ఎంత తగలేసావన్నట్టదిగింది... “నూట నలభై డజను, ముందు నూట తొంభై అని చివర్కి నూట నలభై కిచ్చాడు గర్వంగా అన్నాా.. అని సుభద్ర మొహంలోకి చూశా... ఆశ్చర్యంగా... నా కళ్ళని నేనమ్మ లేనట్లు అక్కడ సుభద్ర స్థానంలో మంచు పొగవాడు... నవ్వుతూ... మంచు సుభద్ర పొగవాడు... మామిడి... భద్రంచు పొగవాడు... తల విదుల్చుకున్నా... తాళాల గుత్తి ఒళ్ళో పడితే మళ్ళీ తలెత్తి చూసా... పొగమంచు వాడెళ్ళిపోయాడు... సుభడ్రే... “పక్కింట్లో పాలు పోయించుకోమని చెప్పొస్తా... తాళాలు వేసెయ్‌... ఆ గ్రిల్లుకి పెద్దతాళం తగలేయ్‌.” ౦౪4 లక్ష్మికి బాబు; చిన్న ఎలక పిల్లలా వున్నాడు.... అయితేనేం... మొదట పాప, యిప్పుడు బాబు... మొహం నిండా ఆనందాన్నీ గర్వాన్నీ ఆవిష్కరించుకుని పడుకునుంది... సుభద్ర బాబుని సున్నితంగా తాకింది... 'ఆహాం యీహీయ మాటలు ఓ అయిదు నిముషాలపాటు సాగాయి... నే బైట నిలుచున్నా... మాటలు వినబడ్డున్నాయి... “కాదే భద్రం... మూడేళ్ళు దాటాయి కదా... యింకా ఎన్ని రోజులూ? యిద్దరూ టెస్ట్‌ చేయించుకోకూడదూ. ఈ నర్సింగ్లోంలో అన్నీ చేస్తారు...” “యింకా మూడేళ్ళే కదే లక్ష్మీ... మేమే ఆగాం...? ఎన్ని టెస్టులు... ఎంత అవమానం... ఎంత ఖేదం... ఇద్దర్లోనూ లోపముంది... కష్టమే... బ్లాక్ట్‌ ఫెలోపియన్‌ ట్యూల్స్‌.... డీ ఆండ్‌ సీ... స్పెర్మ్‌ కౌంట్‌ నాటెటాల్‌ సఫీషియంట్‌ ఫార్‌ ఇం్రెగ్నేషన్‌... చూద్దాం... చూద్దాం... బైటికొచ్చింది సుభద్ర... ఇద్దరం ఒకర్నొకరు ఓ మాటు చూసుకున్నాం... మా యిద్దరి మధ్యనించీ ఓ పొగమంచు రూపం నడచి వెళ్తూ... ఓ మాటు ఆగి వెనక్కి తిరిగి మళ్ళీ మాయమై.... మమల్ని జాలిగా చూసిందా ఆ రూపం...? లోకమంతా పొగమంచు... అ కై భరం-1ణ4 క్‌

ల్‌ ఇఇ

ఆఫిస్‌ ఫోబియా

అ రోలే) జగన్మోహానరాల్రి

కొందంకి బల్లులంటే భయం. కొందరికి పిల్లులంటే భయం. కొందరికి ఒంటరిగా

ఉండాలంటే భయం. కొందరికి పది మందిలోకీ రావాలంటే భయం. చీకటంటే భయం,

సళ్ళంటే భయం, నిప్పంటే భయం - ఇలా భయాలు వెయ్యి రకాలు, దీన్ని మనస్తత్వ శాస్త్రజ్ఞులు

ఫోబియా” అంటారుట. అందరికీ నవ్వులాటగా ఉన్నా ఆ ఫోబియా ఉన్నవాడి భయం వాడికే తెలుస్తుంది.

మా హనుమాన్లకి ఈ మధ్య అటువంటి ఫోబియా ఒకటి - 'ఆఖీస్‌ ఫోబియా” పట్టుకుంది.

కిందటి సంవత్సరం వాడి ఫాదర్‌ పోయారు. ఆయన పేర కొంత డబ్బు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉండిపోయింది. ఆయన మరణించిన విషయం తెలియజేస్తూ ఆ దబ్బు నామినీ అయిన తన పేరన ట్రాన్స్‌ఫర్‌ చెయ్యమని దరఖాస్తు పెట్టుకున్నాడు వాడు.

దానితో కథ మొదలైంది. "

“అయ్యా - మీరు మరణించినట్లు తెలిసి మేము చాలా విచారించితిమి. మీరు కోరిన విధముగా మీ పేరు మా రికార్డుల నుంచి తొలగించడమైనది....” అంటూ వారం రోజుల్లో జవాబు వచ్చింది.

“అయ్యా - మరణించినది నేను కాదు - మా తండ్రిగారు. నేను జీవించియే యున్నాను. ముందు ఉత్తరములో కోరినట్లుగా మరణించిన మా తండ్రిగారు పేరు మీ రికార్డుల నుంచి తొలగించి జీవించియున్న నా పేరు నమోదు చెయ్యవలసినదిగా కోరుచున్నాను...” అని వెంటనే జవాబు రాశాడు హనుమాన్సు.

పదిహేను రోజుల్లో జవాబు వచ్చింది. 'అయ్యా - మీరు మరణించలేదనియు, జీవించియే యున్నారనియు మీ ఉత్తరము ద్వారా తెలిసి మేము చాలా సంతసించితిమి. అయినను మా రికార్డులలో మీరు మరణించి యున్నారు కావున మీ పేరు నమోదు చేయలేమని తెలియజేయుటకు మిక్కిలి చింతించుచున్నాము. మీరు జీవించియే యున్నట్లు ధృవ పత్రము పంపినచో మా రికార్డు సరిచెయ్యగలము...!

వాడు బితికిన్నట్లు సరిఫికెట్‌ తీసుకోవడానికి ఇంకో ఆఫీసుకు వెళ్ళాల్సి వచ్చింది.

వాడు ఆఫీసులోకి వెళ్ళబోతుంటే గుమ్మం దగ్గర స్టూలు మీద, సర్మసులో కోతిలా కూర్చున్న ప్యూను వాడిని ఆపుచేస్తి, “నీ పనయిపోయింది' అన్నాడు నవ్వుతూ.

“నా పనైపోవడమేమిటి? నేనిదే రావడం”

“నిన్ను చూసి ఇంకోళ్ళనుకుని పారబడ్డా కావాల! నీ పనయిపోతుంది' అన్నాడు మళ్ళీ నవ్వుళూ.

గవర్నమెంటాఫీసుల్లో నవ్వలకీ, చిటపటలకీ వేరే అర్జాలుంటాయని తెలియని హనుమాన్లు సమాధానంగా తనూ నవ్వాడు. _

పను మళ్ళీ నవ్వాడు - “ఆఫీసుకు రావడం కొత్తనుకుంటాను

కొత్తే”

'ఫర్వాలే - పనయిపోతుంది అని మళ్ళీ నవ్వాడు.

వాడి నవ్వుకి ఆర్థం తెలియక తన వంతుగా హనూమాన్లు ఇంకోసారి నవ్వాడు. కొంచెంసేపు ఇద్దరూ దంత సౌందర్యం ప్రదర్శించాకా వాడినొక గెంటు గెంటి లోపలకు వెళ్ళాడు హనుమాన్సు.

అక్కడ ఎలుగుబంటి లాంటి సూపర్నెంటుగారొకరు, కుర్చీకే కాక గదిగే నిండుదనం ఇచ్చేలా కూర్చుని ఉన్నారు. ఆయనకి అప్లికేషను ఇచ్చి ఎదురుగా కూర్చున్నాడు మనవాడు. ఆయన కళ్ళజోడు సర్జుకుని, జాగ్రత్తగా అప్లికేషను చదివి, మనవాడినోసారి పరిశీలనగా చూసి, పాదాల కేసి ప్రత్యేకంగా చూసి, “నువ్వు బితికున్నావు. అలా అని సర్టిఫికెట్‌ కావాలన్నమాటి అన్నాడు (౮9-200 1222221112

వాలా టేబులు మీద మద్దెల వాయిస్తూ.

“అవును సార్‌.

'అ యబ్బాయికి కొత్త అన్నాడు గుమ్మం దగ్గర ప్యూను నవ్వుతూ.

'మన వ్యాఘేశ్వరుడు చూసుకుంటాడులే అని, 'వ్యాఘ్రం! ఈ అబ్బాయికేదో సర్టిఫికెట్‌ కావాలట - చూడు' అని వ్యాఘ్రేశ్వరుడికి అప్లికేషను ఇమ్మని చెయ్యి ఊపాడు సూపర్నెంటు.

హనుమాన్లు వ్యాఘ్రం దగ్గరకు వెళ్ళి అయిదు నిమిషాలు నుంచున్నా అది ఉలకలేదు, పలకలేదు, తలెత్తి చూడలేదు. వాడు కొంచెం దగ్గి వ్యాఘేశ్వరుడి కళ్ళకు కనబడేలా ఎదురుగా అప్లికేషను టేబులు మీద ఉంచాడు.

'పని చేసుకుంటుంటే డిస్టర్చు చెయ్యకు- టేకిటాఫ్‌' అని ఒకసారి గాండ్రించి, వాడి అప్లికేషను పక్మకు గెంటి, దాని మీద పేపరు వెయిట్‌తో ఓ మొట్టికాయ మొట్టింది వ్యాఘ్రం.

ఆ గాండ్రింపుకి హనుమాన్లు గజగజ లాడినా అవసరం వాడిది కాబట్టి ధైర్యం తెచ్చుకుని, సర్టిఫికేట్‌ ఇవాళిస్తారా?” అనడిగాడు.

వ్యాఘ్రం గుర్రు గుర్రుమంది కాని మాట్లాడలేదు.

కొంచెం అర్జెంటు - సాయంకాలం మళ్ళీ చమ్మంటారా?

“నన్ను డిస్టర్చు చెయ్యొద్దన్నాను కదా! దుర్‌... డుర్‌....'

మరి లాభం లేదని, మళ్ళీ సూపర్నెంటుగారి దగ్గరకెళ్ళి, "నేను బతికున్నట్లు సర్టిఫికేట్‌ ఇవాళే ఇస్తే సంతోషిస్తా సార్‌' అన్నాడు మనవాడు వినయంగా.

“అప్లికేషన్‌ ఇచ్చావా?

“ఇప్పుడే కదా ఇచ్చాను సార్‌?” అన్నాడు మనవాడు తెల్లబోయి.

“ఇప్పుడే ఇచ్చి ఇప్పుడే సర్టిఫికేట్‌ కావాలంటే ఎలా వస్తుందయ్యా! గర్భాదానం నాడే పిల్లాడు కావాలంటే ఎలా?

అక్కడున్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. హాలులో కొంచెం దూరంగా కూర్చున్న ఆడవాళ్ళు ఒక పక్కకు తిరిగి ముసిముసి నవ్వులు నవ్వారు.

శీపు రమ్మంటారా?” అన్నాడు హనుమాన్లు నీరసంగా.

“మళ్ళీ రేపంటాడు? కిందా మీదా తంటాలు పడాలి. తొమ్మిది నెల్లు ఆగాలి.... నే చెప్పేదాంట్లో తప్పేవైనా ఉంటే చెప్పు... నువ్వు చిన్నవాడివైనా లెంపలేసుకుని ఒప్పుకుంటాను. నే చెప్పేది రైటీనా?

రైటీ సార్‌

'మరైకే రేపే కావాలంటే ఎలారా నాయనా?

“ఆ యబ్బాయికంతా కొత్త. కంగారు పెట్టేస్తే ఎలా?” - అంది స్టూలు మీది కోతి సానుభూతి చూపిస్తూ.

“కంగారా? ఈ కాలం కుర్రాళ్ళు కంగారు పడతారా? నిక్కరు కట్టుకోడం రాదుగాని వాత్సాయన కామసూత్రాలు టకటక అప్ప చెప్పేసి నీకూ నాకూ పాఠాలు చెబుతారురా నారాయణా అంది ఎలుగుబంటి. తక ఊఊఊడేడేేేేేెేేేేెడడేత 2౩22222222 అభస్‌భీియా క 12ఊఊ2ఊఊఊఊ222222222ా-22కే

చా అంతా మళ్ళీ గొల్లున నవ్వారు.

వాడన్నదానికీ, ఆయన అంటున్నదానికీ సంబంధవేవిటో హనుమాన్లకి అర్ధం కాలేదు. వాడికేం చెయ్యాలో తోచలేదు. జూకి వెడితే అక్కడి జంతువులన్నీ ఆటపట్టిస్తున్నట్లు అనిపించింది మనవాడికి. ఎవరినైనా పలకరించడానికి భయపడుతూ కొంచెం సేపు కూర్చుని, ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి ఉండగా చెప్పాపెట్టకుండా బయటికి జారుకున్నాడు, రుమాలుతో మొహం తుడుచుకుంటూ.

నాలుగైదు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆఫీసుకి వెళ్ళాడు - పనివాడిది కదా!

“ఏంటి? ఎక్కడికల్లా తిన్నగా వొటల్లో కెల్లినట్టెల్లి పోతున్నావు?” - నారాయణ గుమ్మం దగ్గర అటకాయించాడు.

“పెసరట్టు తిందావని" అన్నాడు హనుమాన్లు పెంకెగా.

“ఆ పెసరట్టు నేను తినిపిస్తాగాని ఈయాల లోపల ఇనస్పెక్షను జరుగుతోంది. పబ్లికు డీలింగులు లేవు. బయటికి దయచెయ్యి' అన్నాడు నారాయణ పొగరుమోత్తనంగా.

'ఎప్పటిదాకా ఇనస్పెక్షన్‌?'

'ఆఫీసరుగారు చేసినంతవరకూ'

“ఎంతవరకూ చేస్తారు?”

'ఆయనిష్టవైనంత వరకూ”

'మళ్ళీ వారం వస్తా అని వాడికి టాటా చెప్పి, వారం పది రోజులు పోయాకా మళ్ళీ వెళ్ళాడు హనుమాన్లు. “బతికున్నానని రుజువు చేసుకోడానికి ఎన్ని అవస్థలు పడాల్సి వస్తోందిరా” అని నవ్వూ ఏడుపూ వచ్చింది వాడికి.

నెల రోజుల తర్వాత 'పుటవ్‌ చేశావన్నారు.

రెండో నెలలో ఆఫీసరుగారు కొర్రీ వేశారు.

మూడో నెలలో మళ్ళీ పుటప్‌ చేశారు కాని అఫీసరుగారు టూరులో వెళ్ళారు - సంతకం చెయ్యలేదు.

నాలుగో నెలలో మళ్ళీ పుటప్‌ చేశారు కాని ఫైలు కనిపించడం లేదు.

“ఏరా నారాయణా! ఈయనగారి ఫైలు చూశావా?” అన్నారు సూపర్నెంటుగారు.

నాకేం గుర్తు? ఆ రూంలో ఫైళ్ళు ఈ రూంలోనూ, ఈ రూంలో ఫైళ్ళూ ఆ రూంలోనూ పడదేడం తప్ప నాకేం తెలుస్తుంది?

'పోనీ ఆఫీసరుగారి రూంలో ఏవైనా ఉందేమో చూడరా బాబూ - పాపం ఈయనకి అర్జెంటుగా సర్టిఫికేట్‌ కావాలిట...”

“ఆయన బల్ల మీద కాగితం ముక్క లేదు - ఖాళీ ప్లేటులా ఉంది" అన్నాడు నారాయణ హనుమాన్లుకి పెసరట్టు గుర్తు చేస్తూ,

“'వ్యాఘ్రంని అడిగి చూడు” అని సలహా ఇచ్చారు సూపర్నింటుగారు.

'సార్‌ - నా ఫైలొచ్చిందా?” - భయపడుతూ, భయపడుతూ అడిగాడు హనుమాన్సు.

“ఎక్కణ్ణుంచి రావడం?”- వ్యాఘ్రం శాంతంగా అడిగింది.

క కధారాం-104 11ేేేతడేడాోాోోోాోోడే

ఆ

“ఆఫీసరుగారి దగ్గర్నుంచి

“ఆయనెప్పుడు పంపించాడు?” - పరమ శాంతంగా వచ్చింది ప్రశ్న

“తెలియదు.”

'శెలియకపోతే.... డైరీ నంబరు, డేటూ కనుక్కురా... నన్ను డిస్టర్బ్‌ చెయ్యకు....' గాండ్రు మంది వ్యాఘ్రం తలుపులు, కిటికీలు అన్నీ వణికేలా.

వీడికెప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు శాంతంగా ఉంటాడో, వీజ్జి పుట్టించిన దేవుడికైనా తెలియదురా బాబూ అనుకున్నాడు. ఆ డైరీ నంబరేవిటో, డేటేవిటో, ఎక్కడ కనుక్కోవాలో అర్ధం కాలేదు. ఎవర్ని అడగాలో తెలియలేదు. _

ఇదంతా చూసి మనవాడికి మండుకొచ్చి తిన్నగా ఆఫీసరుగారి రూంలోకి వెళ్ళి పోయాడు, అంతా చూస్తుండగా.

“నువ్వ బతికే ఉన్నావా? - అన్నారు ఆయన అంతా సానుభూతిగా విని.

“అలాగే అనిపిస్తోంది సార్‌.

ఆయన బెల్లు కొట్టి సూపర్నెంటుగారిని పిలిచారు - 'వాటీజిట్టండీ - ఈ కుర్రాడి గొడవేమిటి? బతికే ఉన్నానంటున్నాడు కదా"

సూపర్నాంటుగారికీ అలాగే అనిపిస్తోందిట కాని, “రూల్సు ఫాలో అవాలి కదా” అన్నారు.

'ఫాలో అవండి. సొంత ప్రాణాలవునో కాదో వెరిఫై చేయించారా?

“చేయించాం

'మరింక - వాటీజ్‌ అబ్జక్షనండీ?”

"ఫైలు కనిపించడం లేదు' అన్నారు సూపర్నెంటుగారు తాపీగా వెనక్కు జార్లబడి.

మరో అప్లికేషను ఇవ్వమన్నారు ఆఫీసరుగారు. కొత్త అప్లికేషను ఇచ్చాడు హనుమాను. నెల రోజుల్లో సర్టిఫికేట్‌ ఇంటి ఎద్రసుకు రిజిష్టర్డ్‌ పోస్టులో వచ్చి చేరింది. హనుమాన్లు విజయగర్వంతో కాలరెగరేశాడు. మన తడాఖా తెలిసింది వీళ్ళకి - ఇంటికి పంపించారు అని సంతోషించాడు. తొమ్మిది నెలలు ఆలస్యమైనా సర్టిఫికేట్‌ సంపాదించగలిగాడు కదా.

మర్నాడు మొదటి ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికేట్‌ ఇచ్చి డిపాజిట్టు తన పేర ట్రాన్స్‌ఫర్‌ చెయ్యమని అడిగాడు.

ఆ సూపర్నెంటుగారు ఎలుగుబంటిలా లేరు. ఖై రోజులుగా నిరాహారదీక్షలో ఉన్న ఎండు నక్కలా ఉన్నారు. వాణ్ణి కూర్చోబెట్టి, వాడి ఫైలు తెప్పించి చూసి, కళ్ళు చిట్లించి, చెయ్యి జాపి, కళ్ళకు మూడడుగుల దూరంలో ఆ కాగితం ఉంచి చదివి, ప్ప... ప్ప్‌.... ప్ప...” అని, కళ్లజోడు తీసి, కళ్ళకు మూడంగుళాల దూరంలో ఉంచి ఇంకోసారి చదివి, ప్ప... ప్ప్‌....” అని మళ్ళీ అని, 'ఇది పనికిరాదు నాయనా అన్నారు.

హనుమాన్లు గుండె జారిపోయింది.

“ఎందుకు పనికిరాదు సార్‌?”

“ఇందులో నువ్వు జూన్‌ నుంచి డిసెంబరు వరకూ - ఆరు నెలలు బతికున్నట్టుంది. మాకు నువ్వు మార్చిలో బతికున్నట్టు సర్టిఫికేట్‌ కావాలి. అది తీసుకురా. నీ పని వెంటనే తోడనే యడ లభీన్‌ రయి క

అయిపోతుంది అని ఫైలు బెట్‌ ట్రేలో విసిరేసి, వాడి సర్టిఫికేట్‌ వాడి మొహాన్నెసి కొట్టారు సూపర్నెంటుగారు.

“అంటే మార్చిలో చచ్చిపోయి, మళ్ళీ జూన్‌లో బతికొచ్చానంటారా?”

“ఏమో - నాకేం తెల్సు”

“మీరు కొంచెం ఆలోచించండి సార్‌' అన్నాడు హనుమాన్లు బతిమాలుతూ.

“ఏం? అలా ఎందుకు జరగకూడదు? వాతాపి కథ తెలుసా? వాడిని చంపేసి, కూరొండేసి, అతిథులకి పెట్టేవాడు వాడి అన్నగారు. అతిధుల పొట్టలోకి వాతాపి వెళ్ళి పోయాక, “వాతావీ! రా” అంటే వాడు పొట్ట చీల్చుకుని బతికి వచ్చేసేవాడు.'

“అది కథ సార్‌

“అది కథా? మన పురాణాల్లోనూ, వేదాల్లోనూ చెప్పినవన్నీ కట్టుకథలా? మన ఉపనిషత్తుల్లో చెప్పిందంతా అసత్యమా? నువ్వు చదివే బోడి ఇంగ్లీషు పుస్తకాలు సత్యాలా? శివుడు విఘ్నేశ్వరుడికి ఏనుగు తల తగిలించాడంటే కట్టు కథానూ, ఏనుగు తల తగిలించడవేవిటి అని వేళాకోళవూనా? అదే మీ డాక్టర్లు గుండెలు, కిడ్నీలు మారిస్తే “బెనండోయ్‌ - సైన్స్‌ ఎడ్వాన్సయిందండోయ్‌” అని గొప్పలా? ఏవిటి ఎడ్వాన్సయింది నా పిండాకూడు. ఇంక వెధవ కబుర్లు చెప్పకు....”

హనుమాన్లు పేలుదామనుకుంటే వాడికంటే ముందే ఆయన దూర్వాస మహామునిలా పేలేటప్పటికి వాడు చల్లారి పోయాడు. తన పిలకకీ, వాడి మోకాలుకీ ముడేసి ఆయన అలా తగవు పెట్టేసరికి ఏం చెయ్యాలో తోచక, ఆయన చెప్పిన పురాణ కథల్లో వసుదేవుడి కథ గుర్తుకు తెచ్చుకుని, ఆయన కాళ్ళు పట్టుకుని,'మీరు అపార్ధం చేసుకున్నారు నన్ను - అటువంటివి జరగవనలేదు' అన్నాడు.

ఆయన శాంతించి, “ఒప్పుకుంటున్నావా? అన్నారు.

ఆయన శాంతం చూసి, “ఎందుకు ఒప్పుకోనూ? అల్లాంటివి జరుగుతాయి సారో అన్నాదు హనుమాన్లు ఆశగా.

'అయితే వెళ్ళు - వెళ్ళి మాకు కావలసిన కాగితం పట్రా నాయనా అన్నారు ఆయన శాంతంగా, *

ఈ చేదు అనుభవం తర్వాత మనవాడి పరిస్థితి ఎలా తయారైందంటే ఆఫీసు కాంపౌండ్‌ గేటు దాటుతుండగానే మలేరియా వచ్చిన వాడిలా వణకడం మొదలు పెట్టేవాడు. ఆఫీసు గుమ్మం దగ్గరికి రాగానే చావబోయేవాడిలా కళ్ళు పెద్దవైపోయేవి. అడుగు తేలికై అడ్డదిడ్డంగా పడేవి. ఆఫీసరు దగ్గరకు చేరేటప్పటికి స్పృహ తప్పేవాడిలా అయిపోయేవాదు. ఎంత ప్రయత్నించినా నోట మాట వచ్చేది కాదు - అంటే మన వాడు క్లాసిక్‌ కేస్‌ ఆఫ్‌ ఆఫీసు ఫోబియా అయిపోయాడన్నమాట.

ఈ కథంతా చెప్పి, 'కథ మళ్ళీ మొదటి కొచ్చిందిరా' అని గొల్లుమన్నాడు వాడు. నేను వాణ్ణి ఓదార్చి, 'కంగారు పడకు - నేను వస్తానులే' అంటూ వాడి కూడా వెళ్ళాను. మనకిలాంటి ౩ కభారరని- 204 2222222

ఆ ఫోబియాలు, గీబియాలు లేవు.

గుమ్మం దగ్గర నారాయణని చూసీ చూడగానే, 'నారాయణా - బావున్నావా' అంటూ కౌగిలించుకుని, వాడి జేబులో పది రూపాయల నోటు తోసి, కుడిచేత్తో వాడి మెడ పట్టుకుని గెంటుకుంటూ వహోటలుకి తీసికెళ్ళి, కుడితి తొట్టెలో ముంచినట్లు సాంబారు ప్లేటులో వాణ్ణి ముంచి తీశాకా, ఈయన నోరు మెదపదే" అన్నాడు హనుమాన్లనుని చూపించి.

“వాడికిల్లాంటి విషయాల్లో అనుభవం లేదులే” అని, ఆఫీసులో అడుగు పెడుతూనే అందరికీ పెసరట్టు, ఉప్మా. స్వీటు తీసుకురమ్మని అందరికీ వినబడేలా నారాయణకి చెప్పి, అప్లికేషను ఫారానికి వంద రూపాయల నోటు పిన్నుతో గుచ్చి సూపర్నెంటుగారికి అందించాను నవ్వుతూ.

నా వెనకాలే నీడలా వెర్రి మొహం వేసుకు తిరుగుతున్న హనుమాన్లని వాళ్ళందరూ చూశారు కాని పాత విషయాలేవీ గుర్తులేనట్లు ప్రవర్తించారు.

ఏభై రూపాయల నోటు తగిలించి అప్లికేషను వ్యాఘేశ్వరుడికి అందిస్తూ, 'నారాయణా! మన వ్యాఘ్రంగారికి స్పెషల్‌ కోడి పలావు తీసుకురా అని పురమాయించాను.

“మీరెందుకు సార్‌ - నేనున్నాను కదా" అని నారాయణ కాళ్ళకు అడ్డం పడుతుంటే, “నువ్వాక్కడివీ ఏం కష్టపడతావు నారాయణా' అని వాడికి సానుభూతి చూపించి, వ్యాఘ్రం అందించిన ఫైలు తీసుకుని ఆఫీసరుగారికి నమస్కారం చేసి అందించాను.

ఆయన నన్నోసారి చూసి, ఫైలు పైకీ కిందికీ చూసి, సంతకం పెడుతూ, 'సూపర్నెంటుగారు అన్నీ సరిగా చూశారా?” అనడిగారు.

“ఈసారి అంతా ఓకే సార్‌ అన్నాను ఫైలు అందుకుంటూ.

రెండు ఆఫీసుల్లోనూ పని చకచకా అయిపోయింది.

థాంక్స్‌ గురూ - నీవల్ల గట్టెక్కాను. లెంపలేసుకుంటున్నాను - ఇంక జన్మలో ఏ ఆఫీసులోనూ అడుగు పెట్టను' అన్నాడు హనుమాన్లు ఆఫీసులోంచి బయటికి వస్తూంటే.

“గవర్నమెంటాఫీసులో అడుగు పెట్టకుండా పనులెలా అవుతాయి?”

“నీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను కాని.... అమ్మతోడు... ఇంక ఆఫీసులో...” అంటూ హనుమాన్లు అంటుంటే గేటు దగ్గర పడుకున్న కుక్క వాణ్ణి చూసి, 'భౌ.... భౌ...” అంటూ అరిచింది. హనుమాన్లు 'ఫో.... ఫో... అని కొట్టటోయాడు. అది మీదికి దూకి కరవబోయింది. నేను దానికి అడ్డంపడి, 'దూ... దూ....' అంటూ చెయ్యి చాపాను. కుక్క హనుమాన్లని వదిలేసి తోక ఊపుతూ కాళ్ళ కడ్డం పడుళూ నా వెంట రాసాగింది.

“నువ్వు రాకపోతే ఈ పనయ్యేది కాదు” అన్నాడు హనుమాన్లు మళ్ళీ.

“నువ్వు చేసిన తప్పేవిటో నీకు తెల్సిందా?

'ేను తప్పు చెయ్యడవేవిటి? నేనేం చేశాను?” - హనుమాన్లు తెల్లబోతూ అడిగాడు.

వీడీ జన్మకి బాగుపడడని నాకు అర్థవై పోయింది. నేను నవ్వి 'గుడ్‌బై అని కదిలాను.

హనుమాన్సుకేసి ఓసారి నిరసనగా చూసి నా వెంట పడింది కుక్క అ 2 ౪న ఫది =

౨ (6చంగత్రి +౨ట్టలనిలలి కథ

డా॥ రవి శేఖర్‌

అ పళ్యభ సుందరీ జగన్నాథ్‌

అయత పెద్ద కారు వేగం తగ్గింది. స్వంతంగానే నడుపుతున్న రామానుజంగారు సంభాషణ చటుక్కున ఆపారు. వెంటనే మా అందరికేసీ ముఖం తిప్పి మనస్సు నొచ్చుకుంటున్న చిరునవ్వుతో “అరెరె పెట్రోలు అయిపోయింది. క్షమించాలి మరి. నింపుకుని ఓ పది నిముషాల్లో వచ్చేస్తాను. అల్లాగే ఆ ప్రక్కనే వున్న ఆడిటర్‌ మహదేవన్‌గారిని లేపి మన ఓపెనింగ్‌ పూజ 9 1/2 గంటలకని జ్ఞాపకం చేసి వెంటనే వచ్చేస్తాను. ఆ మహనీయుడు పది గంటలవరకూ లేవడాయిరి. ఇంకా నయం, వీరి పాత యింటి దగ్గరే అగాం. ఎవ్వరైనా పరిచయస్తులు కనిపిస్తారేమో చూడండి కాలక్షేపానికొ అన్నారు నన్ను చూసి.

“మరే మరీ కొత్త రోడ్డయితే కాస్త ఎబ్బెట్టుగానే వుంటుంది మరి" అన్నాను నేను.

“బ్మద్రిగ్లో రావిచెట్టు నీడని ఎంచక్కా బెంచీలు, అందరూ కూచోండి, వం?” అంటూ కారు తలుపు తీశారు.

“అదిగో వెనక విశాలంగా ఖాళీస్థలం పారృల్లే పచ్చని చెట్లు అంటూ అందరం దిగేశాం సంతోషంగా - ఆయన భార్య సత్యభామా, నేనూ వాళ్ళ 18 ఏండ్ల అబ్బాయి రాఘవుడూ, వాళ్ళ పనిమనిషి రత్తాలూ, పురోహితులు రామశాస్ట్రిగారూను.

తూర్పు సముద్రం మీది నించి ఒక చల్లటి శీతగాలి విసిరింది - ఉదయపు లేత ఎండలో. మేమంతా మా పట్టు చీరల పవిటకొంగులు మెడలికి దగ్గరలా లాక్కున్నాం. రామశాస్త్రిగారు ఉత్తరీయం జారకుండా గట్టిగా కప్పుకున్నారు. _ .-

“వమండీ అమ్మా! ఇప్పుడు ఓపెన్‌ చేసే బ్రాంచ్‌ పేరు బాగా వుంది కదూ? - భామా నిల్చు! మీ యిద్దరూ బాల్య స్నేహితులు గదా! అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను” అని నన్ను చూస్తూ వెంటనే, “అసలా పేర్లు పెట్టిందే ఆవిడగారు కదా” అంది భామ.

“బేష్‌! ఇంకేం, లక్ష్మీకరంగా సాగుతుంది వ్యాపారం” అన్నారు తృప్తిగా నవ్వుతూ.

భామ అటూ యిటూ చూస్తూ “మద్రాసు ముఖం ఎంత మారిందో?!” అంది ఆశ్చర్యంగా తన బుగ్గ మీద వేలు వేసుకుని.

అవును, కాస్త దూరంలో పాత మేడలు పడగొట్టి ఎత్తు మేడలు కడుతున్నారు. ఆ కట్టడం కై కథాళరిని- 2004 2222222222

లాలా ంా పనివాళ్ళు స్నానాలు చేసి వచ్చి తడిగుడ్డలు కంకర బండ్ల మీదా, ఇటుక రాళ్ళ గుట్టల మీదా ఆరవేసుకుంటున్నారు. వాళ్ళ ఆడవాళ్ళు అక్కడికి అమ్మవచ్చిన పెరుగులూ, కాయగూరలూ కొనుక్కుంటున్నారు. పిల్లలు కుక్క పిల్లల చెవులు పట్టుకుని లాగుతున్నారు ఆటకి రమ్మని. రోడ్డుకి ఇంకో పక్క సైకిల్‌ రిక్షా స్టాండులో ఒక పడుచువాడు పక్మని వున్న టీ బంకులో టీ తాగివచ్చి రిక్షా సీటు కింద పెట్టె తెరిచి ఒక చిన్న అద్దమూ, కుంకుమా, విభూది తీసి బొట్టు పెట్టుకుని, ఆ పక్కనే వున్న పావుం పుట్టంత వినాయకుడి గుడికి తిరిగి దణ్ణం పెట్టాడు. వెంటనే తూర్ప్చుకి తిరిగి సూర్యుడికి కూడా దణ్ఞం పెట్టి, వెనక్కి తిరిగి వంగి రిక్షాకి కూడా మొక్కి దాని సైకిల్‌ మీద ఎక్కి రోడ్డు వెంటే వెళ్ళిపోయాడు - వాడి బళుకు తెరువుకి.

“ఇదే గదండీ మీ పాత యిల్లు?! బావుంది. ఎదురుంగా ఈ పార్కు అంటున్నారు రామశాస్త్రిగారు, మా పాత యిల్లు చూపిస్తూ.

తొమ్మిదేండ్ల క్రితంకంటె ఈ కాళీ స్థలం యింకా బాగ్రైంది. నేల చదునుగా వుంది. చెట్లన్నీ అలాగే వున్నాయి. కాని రోడ్డు మీది నుంచి సరాసరి పార్కుకి వెళ్ళడానికి వీలులేకుండా చిన్న చిన్న కొండరాళ్ళు అమర్చి వున్నాయి. వాటి పక్షనే రోడ్డు మీద బెంచీలున్నాయి ఎవరైనా కూచోదానికి. లోపలికి వెళ్ళాలంటే ఆ చిన్న క్రాస్‌రోడ్‌ తిరిగి వెళ్ళొచ్చు రిక్షాలు సైతం. ఆ గుబురు సీమ తుమ్మ చెట్ల కింద నేల అంతా సమతలంగా శుభ్రంగా తుడిచి వుంది. ఆ నీడలో చెట్టు కింద ఒక పెద్ద బెంచి వేసి వుంది. ఆ బెంచి మీద ఒక్క పెద్ద సిల్వర్‌ గంగాళం మూత పెట్టి ఉంది. దాని పక్కనే రెండు సిల్వర్‌ బకెట్లు మూతల మీద గరిట్లతో పెట్టి వున్నాయి. బెంచి మీదికి అటు పక్కగా వంగి ఒక ఆడమనిషి బెంచి మీద వున్న అరిటాకులు ముక్కలుగా కోస్తోంది. ఆ బెంచికి ఓ నాలుగడుగుల దూరంలో ఒక నడివయస్సు మగమనిషి ఒక పాత మాసిపోయిన తువ్వాలు కప్పుకుని చలికి ముడుచుకుని బెంచీని చూస్తూ కూచున్నాడు.

నా పక్శనే నుంచుని ఆ చెట్టుకేసే చూస్తున్న రామానుజంగారబ్బాయి రాఘవుడు, “ఈవిడ అప్పుడే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌ పార్లర్‌ పెట్టేసినట్టుందే” అన్నాడు వెటకారంగా.

అతని పక్కనే నుంచున్న వాళ్ళ పని మనిషి రత్తాలు వెంటనే, “అదా! అది మంగ లన్ని మా పేటలోనే వుంటుంది. మా కష్టజీవి అంటూంది.

అంతలో చెట్టు కింద గొంతుకగా కూచున్న పనిమనిషి “ఈయాళ దోసెలా సెల్లెమ్మా? ఈయాళ నాకు పని లేదు. ఈయాళ కాస్త అరువియ్యి రేపు సాయంత్రం కూలిలో తెచ్చిస్తా” అన్నాడు.

అరటి ఆకులు కోస్తున్న ఆడమనిషి వంగి పనిచేసుకుంటూనే ముఖం మాత్రం అతని పక్కగా తిప్పి, “అదేంటి అన్నా గట్టా అంటావు అంతగా ఆకలేస్తే కడుపునిండా తిను శెల్లెమ్మొద్ధ. దానికోసం అప్పు యెందుకు?” అంది.

ఆ తిప్పిన ముఖం చూడగానే ఎక్కడో ఆ ముఖం చూసిన స్ఫురణ వచ్చింది. అవును. అదే ముఖం! అదే నలుపు రంగు! కాని దవడలు కాస్త బిగి తగ్గాయి. ముఖం మెరుపు కాస్త తగ్గింది. మనిషి కాస్త వళ్ళు చేసింది. 2222222222 గాలరి బ్‌ కై

ఒక్కసారిగా జ్ఞాపకాలన్నీ కమ్ముకుని వచ్చేశాయి. మొదటిసారి ఆ పిల్లని నేను చూచింది చిటపటలాడే మండుటెండల్లో. ఇదిగో మేముండిన ఈ పాతమేడ పక్కనే ఇల్లు కడుతున్నారు, పై మిద్దె మీద. నేను చావిట్లో విశ్రాంతిగా వాలుకుర్చీలో కూచుని వున్నాను - ఎదురుగా మేడ కట్టే పనివాళ్ళని చూస్తూ. వాళ్ళల్లో ఈ నల్లపిల్ల - తలకి ఒక పాత ముతకగుడ్డ చుట్టుకుని, అదే గుడ్డ చుట్టుగుడ్డగా పెట్టుకుని దానిమీద ఆరు ఇటుక రాళ్ళు సుతారంగా అమర్చుకుంటూంది. ఆ పిల్ల చేతులు, ముఖము దుమ్ము కొట్టుకుని చెమటతో నిగనిగలాడుతున్నాయి. వెంటనే నిచ్చెన ఓ చేత్తో జాగ్రత్తగా పట్టుకుని నిదానంగా ఎక్కింది. పైన పరంజా మీద వున్న తాపీ పనివాడు మాత్రం ఆ పిల్లని లెక్కచెయ్యకుండా తాపీ చేత్తో పట్టుకుని కింద వున్న యింకో కూలిపిల్ల దానితో ఎకచెక్కాలాడుతున్నాడు, నవ్వుతూ.

“ఇదంతా మీ యింటాయనతో నేను చెబుతాగా” అన్నాడు.

“ఆయే సరే సూద్దాం! అందుకు ముందే మా ఇంటాయనతో ఆయన పనిచేసే చోటుకి ఇల్లుగళాళ్ళ ఫోన్లో నేను మాట్లాదతాగా” అంది ఆ పిల్ల వుక్రోషంతో.

దానికి ఆ తొపీ మనిష్కి “నువ్వు ఫోన్లో మాట్లాడినా సరే, రేడియోలో మాట్లాడినా సరే, నేను చెప్పేదేమో చెప్పేదే. అది ఖాయం” అని నవ్వుతూ అంతవరకూ నిచ్చెన మీద వున్న పిల్ల తల మీద నుంచి ఒక్కొక రాయే తీసుకుని సిమ్మెంటు అడుసు మీద అముర్చుతున్నాడు. అంతలోనే తీగ వుట్లల్లో గ్లాసుల్లో టీ వచ్చింది. అందరూ ఆ మట్టి చేతులతోనే టీ గ్లాసులు అందుకుని ఆవురు ఆవురుమంటూ తాగడం ఆరంభించారు. ఆ నల్లపిల్ల మాత్రం ఎవ్వరితోనూ ఎక్కువ కలుపు గోలుతనం లేకుండా ఒక్కతే గోడ నీడని కూచుని తాగుతూంది. అంతలో టి.వి.లో ఏదో మంచి ప్రోగ్రాం వస్తే దానిలో నేను నిమగ్శమైపోయాను.

కాసేపయ్యాక పనిమనిషి జగ్గయ్య వచ్చి పెద్దమ్మగారు పిలుస్తున్నారన్నాడు. నేను లేచేటప్పటికి ఎదురుగా పనివాళ్ళెవరూ లేరు. భోజనాలికి వెళ్ళేరుగావోల్ను, నేను కిందకి దిగుతూంటే ఇప్పుదా బెంచి వున్న చెట్టు కింద నుంచే రోడ్డు కడ్డంగా నడుస్తూ నాకేసి చూసింది ఆ నల్లపిల్ల, తల మీద గుడ్డ లేదు. కాళ్ళూ, చేతులు ముఖం శుభ్రంగా కడిగి నల్లగా నిగనిగలాడుతున్నాయి.

“కాస్త వుష్పు పెడతారండి అమ్మాయిగారూ” అంది అరవంలో చిరునవ్వుతో నాకేసి చూస్తూ.

నేను కూడా నవ్వ ముఖంతోనే కింద గుమ్మంలోకి రమ్మని జాడ చూపించాను. నేను క్లైనింగ్‌ టేబుల్‌ దగ్గరకి వెళ్ళి ఒక మోదుగాకులో ఇంత టేబుల్‌ సాల్ట్‌ వేసి దానిపైన యింకో ఆకులో పెద్ద ఆవకాయ ముక్కా మీద కాస్త వూటా వేశాను.

ఆవకాయ చూడంగానే ఆ పిల్ల ముఖం చాటంతయింది.

“తెలుగోళ్ళాండి" అడిగింది.

“అవును అన్నాను.

“మేం కూడా” అన్నది తృప్తిగా - “శానా ఏళ్ళయింది. ఈవూరు వచ్చేశాం” పొడిగిం చింది. ఆ ముక్కలల్లాగే మూటలో దాచుకుని ఊటతో చద్దన్నం తినేసింది. నాకు అప్రయత్నంగా కిటికీలోంచి కనిపించింది. అప్పట్నించి వేపుడు ముక్కలో, గోంగూర పచ్చడో ఏదో ఒకటి క భరూం-10౫ 2222222122

ప్రతిరోజూ అమ్మో, అత్రయ్యగారో,. పిన్నో పెడుతూవుండేవారు - పిల్చి మరీని. మేడ కట్టడం పని అయిపోయింది. ఆ అమ్మాయి కనబడం మానేసింది.

“అ మాటకొస్తే మంగ కొడుకు ఎంత మంచోడనుకున్నారూ” అంటూంది మిగతా వాళ్ళతో రత్తాలు నా పక్కకి నుంచుని. ఆ మాట చెవిన పడంగానే ముందర జరిగిన మరో విచిత్ర సంఘటన చటుక్కున కళ్ళకు కట్టినట్టెంది - అన్ని వివరాలతో.

ఒకనాడు మధ్యాహ్నం తిరగక ముందు ఒక పెద్దాయన చేతిలో ఒక సిల్వర్‌ టంబ్లర్‌ పట్టుకుని గాభరాగా మండువా లోపలి కొచ్చేశారు - అంగల మీద. అమ్మని చూచి, “అమ్మా అమ్మా మేం మీ పక్కకొత్త మేడలో కాపరానికి వచ్చాం. నేను ఇప్పుడే వచ్చా టైపింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లోనుంచి. వచ్చి చూస్తే అంట్లు కడిగి పెట్టయ్యంగానే మా పనిమనిషి సోషకొచ్చి పడిపోయింది. రెండు రోజులు అన్నం తినలేదట. మా అమ్మాయి వంటింటికి బీగాలు వేసుకుని ఆఫీసుకి వెళ్ళిపోయింది. కాపరాల వాళ్ళు ఎవ్వరూ లేరు. బయట ఏమీ లేదు తినడానికి. కాస్త దీనిలో వుప్పు వేసి మజ్జిగివ్వండి.” అంటూ టంబ్లర్‌ చేతికిచ్చాడు - అమ్మకి - “పాపం బీద మనిషా పొడిగించారు.

“అయ్యోయ్యో!” అంటూ అమ్మ ఆ టంబ్లర్‌తో వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఒక్క క్షణంలో ఒక సిల్వర్‌ గిన్నెలో కాస్త వేడి అన్నం మజ్జిగా కలిపి తెచ్చేసింది. “ఇదోండి, ఆ గ్లాసు ఏం సరిపోతుంది. పసిపిల్లా ఏవన్నానా? ఇదోండి. ఇది యివ్వండి. పొపం ఆ పనిమనిషికి” అంటూ టంబ్లరూ అన్నం గిన్నె రెండూ చేతికిచ్చింది ఆయనకి.

'థాంక్స్‌' అంటూనే బయటకు పరిగెత్తా డాయన. మేమంతా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయాం. కాసేపట్లో ఆ పెద్దాయన తిరిగి వచ్చేసాడు. కడిగిన సిల్వర్‌ గిన్నె అమ్మ చేతికిచ్చి, “పాపం కడుపు నిండా తాగేసిందండమ్మా, మనిషి కాస్త తెప్పరిల్లింది. నేనేమో అర్జెంటుగా ఈశ్వరుడి కోయిలకి వెళ్ళాలి. రేపు కుంభాభిషేకం. ఇవాళ ఏర్పాట్లు చేయాలి. కాపరాల వాళ్ళందరూ బయటకి వెళ్ళిపోయారు. అందువల్ల మా పనిమనిషిని మీ వరండాలో బయట పడుకోమన్నాను. మీకు ఇబ్బంది లేదుగదా! అది నిద్ర లేవగానే వెళ్లిపోతుంది” అన్నారు గబగబ.

“అదేమిటండీ అల్లా అన్నారు?! నిక్షేపంలా పడుకోనివ్వండి. మీరు మీ పనికి వెళ్ళండి అంది అమ్మ.

మధ్యాహ్నం భోజనాలయ్యాక నేను ఏమీ తోచక వరండాలో కొచ్చాను. నిమ్మళంగా కాళ్ళూ, చేతులూ ముఖమూ తన చీర చెంగుతో కప్పుకుని గోడకి తిరిగి ముడుచుకుని పడుక్కుని వుంది పనిమనిషి

అప్పుడే పక్కింటి కిటికీలోకొచ్చిన అత్తయ్యగారు “పాపం రెండు రోజుల్నించి అన్నం సరిగా లేదుట గదా దానిని లేపి విస్తట్లో ఓ ముద్ద పెట్టమ్మాయి” అన్నారు.

నేను లేపాను. నిమ్మళంగా ముసుగు తీసుకుని గోడ నానుకుని కూచుంది. అదే నల్లపిల్ల - పరిచయపు చిరునవ్వుతో. నేను కూడా పలకరింపుగా నవ్వు ముఖం పెట్టాను. చిన్నగా అప్రయత్నంగా “ఓసి నీయమ్మ కడుపు బంగారంగానూ... నువ్వటే పిల్లా?!” అన్నారు అత్తయ్యగారు ల్‌ో ౧.౧91 క

అందరి బదులు ఆశ్చర్యం చూపుతూ.

“ఇటికల పనులు సలువుగా చిక్కడం లేదండి అమ్మగారూ, అందుకనే ఇళ్ళ పని చేస్తావుండా నండి. పక్కయింట్లో అయ్యోరి కాడ చేస్తూ వుండానండి” - అంది మా ఆశ్చర్యానికి జవాబుగా

  • “అవునూ నువ్వు ఒక్కదానివే ఇలా కష్టపదుతున్నావు, ఇంట్లో ఎవరూ చేదోడు లేరా” అడిగింది వెనుక నించి అమ్మ.

“నాకు పెద్దోళ్ళు ఎవరూ లేరండి యింట్లో మా ఇంటాయన రోడ్దు దిమ్మకొట్టే ఇంజను 'డైవరుగా వుండేవోడండి. మా మంచోడండి. స్పేహితాలోళ్ళతో సేరి సుక్క నేర్సాడండి. అది బాగా ముదిరిబోయింది. గుర్రప్పందాలక్కూడా ఎల్లేవోడు. ఇంట్లో పెద్దోళ్ళ భయమూ లేకపోయె. ఓనాడు అట్టాగే సొరణ లేకుండా గుర్రాల కాడ నించి వస్తావుంటే వెనకపాటుగా లారీ వచ్చి గుద్దేసిపోయిందండి. ఆఖరికెవరో సూచి ఆస్పత్రిలో శేర్చారండి. 'ఇంతసేపయ్యాక తెస్తే మేం ఏం సెయ్యగల్డుమి' అని ఆళ్ళు అన్నారండి. అది గిట్టా ఆయన పోయారు. దగ్గరే డాక్టర్లు, ఎవ్వరైనా వుంటే ఏవైనా సూపిచ్చి వుందుం” అంది మబ్బు కప్పిన ముఖంతో.

“... పిల్లలెంతమంది?” అడిగింది అమ్మ.

“ఒక్క నలుసండి... మొగపిల్లోడు... తొమ్మిదేళ్ళు” అంది.

“నువ్వు రెండు దినాలు ఎందుకలా పస్తులు పద్దావు?” అడిగింది పిన్ని.

“పస్తులు కావండి అమ్మాగారూ... బువ్వ చాల్లేదు. పిల్లోడికి పెట్టేశాను. ఇప్పుదాడికి పరీచ్చలు” అంది.

“చదువుకున్నాడా?” అడిగాడు మా యింటి పనిమనిషి జగ్గయ్య - ఆఫీసుల్లో మగవారికి అన్నాలు యిచ్చి తెచ్చిన కేరియర్లు వెనక నూతి దగ్గర పదేసి, అప్పుడే మా వద్దకు వచ్చి, “ఏదైనా అంగట్లో పెడితే కాస్త జీతం వస్తుంది కదా. నీకింత కష్టంలో కాస్తంత ఆదరువయ్యేవాడు”

అన్నాడు.

“కష్టాలు ఎప్పుడూ వుండేయే గదాండి. డాక్టర్ని చెయ్యాలని నా అశండి” అంది.

ఒక్క క్షణం అందరం నిర్బాతపోయాం. జగ్గయ్య తెరచిన నోరు ముయ్యలేదు.

“ఇప్పుడేం చేస్తున్నాడు?” అంది పిన్ని

“ముల్లక్కాయలు కోస్తూ వుంటాడండి” అంది.

“ములక్కాయలా?1”” అన్నారందరూ.

“మరేనండి. మా పేటలో ముగ్గురు మగదిక్కులేని ముసలమ్మలుండారండి. చెట్టెక్కి ములక్కాయలు కోసి వాళ్ళకిస్తే వాళ్ళు అమ్ముకుంటారండి. బతికిపోతారు. నూరు కాయలు కోస్తే రూపాయిస్తారండి. ఏదో రోజుకి పొద్దుటేల ఒక మూడు రూపాయలు సంపాదిస్తాడు. - ఇస్మూలుకి ఎల్లకముందే” -

“పోనీలే వేజ్డీళ్ళకి చన్నీళ్ళు తోడు. ఏదో నీకు చేదోడు అంది అమ్మ తృప్తిగా.

“అలాగే కాస్త కడుపు పట్టుకుని పది క్లాసులు దాకా నెగ్గించావంటే ఏదో బంట్రోతు గిరీ కై కళా. క్‌]

లలోోోాోడసోోసోోలాాంం వస్తుంది” అన్నాడు జగ్గయ్య,

“అలా చెయ్యవే... అర్థం లేని ఆశలు పెట్టుకోకు...” అంది అత్తయ్య.

“కాదండి అమ్మగారూ ఆడు డాక్టరవ్వాలండి” పట్టుదలగా ఆమె,

“అదేం పిచ్చిపంతం. డబ్బు వచ్చేది చూడకుండా” అన్నాడు జగ్గయ్య.

“కాదయ్యా పిచ్చి కాదు. బాగా చదువుతాడు నా కొడుకు రవి. నేను కన్నుమూయక ముందు నా సెవులతో నేను ఆ ఒక్క మాట ఇనాలుండి” అంది.

“ఇదేం పిచ్చి” పిన్న అంది.

“అమ్మగారూ పిచ్చి కాదండి. డాక్టర్‌ రవిశేఖర్‌ వల్ల మా యమ్మ పాణం వచ్చింది. డా. రవిశేఖర్‌ వల్ల మా నాయన బతికాడు. డా. రవిశేఖరు నన్ను రచ్చించాడు... పాణం పోశాడు అన్న మాటలు నేనింటే సాలుండి. అదే పదేలు. వైద్యుడు విష్ణుమూర్తి అంటారు గదండి పెద్దోల్లు, డాక్టరే దగ్గరుంటే మా యింటోడు సచ్చిపోయి వుండడు గదా?!” అన్నది ఎక్కడో చూస్తూ.

ఈ జ్ఞాపకాలలో అద్దు వచ్చినట్టు “మంగ కొడుకు ఎంత మంచోడో తెలుసు నాండి అమ్మగారూ! ఏ ఏలప్టుడు లేపినా సరే పిలిసినా సరే, చెప్పిన పని కాదనడు. అదేం ఓపికో! ఎండాకాలాల్లో తాగే నీళ్ళు రెండు చేతులతో ప్లాస్టిక్‌ బిందెలు నింపుకుని తెచ్చి ఓపలేని అమ్మలకృలికి పోసేస్తాడు. ఉత్తరాలు, అర్జీలు అయ్యా రాసి పెడతాడు. ఎదురోళ్ళకి సేసే బుద్ధి మా ఎక్కువండి. అందుకే ఆ పరమేశ్వరయ్యగారు అంత సహాయం చేశారు.”

“ఆయనెవరు?” అడిగింది భామ్మగారు

“నీలకంఠేశ్వరుడి కోయిల పూజారిగారు. ఆయన వల్లనే కదా ఈ కుగ్రోడికి స్కాలర్‌ సిష్పాచ్చింది.

చెప్పింది రత్తాలు.

“అవును, ఆయనగారు బీదపిల్లలందరికీ వుచితంగా విద్యాదానం చేస్తున్నారని విన్నాను” అందుకున్నారు రామశాస్త్రిగారు.

“అట్టా సెప్పింది గిట్టా అందుకుంటాడండి మంగి కొడుకు. క్లాసులో ఫస్టు. అందుకని ఆ అయ్యోరు అక్కరపట్టి ఇంగ్లీషు స్కూల్లో ఏయించారు. ఆ కుర్రాడు ఆయన మాట దక్కించాడు. పది పన్నెండు క్లాసుల్లో ఫస్టు వచ్చేశాడు. అంటే ఆ రుణం మంగి వుంచుకోలేదు. తెల్లరగట్ల లేసెల్లి కోయిలంతా వూద్చేసుద్ది. పువ్వులు ఏరుద్ధి. అయ్యోరు యింటి పనంతా సిటికెలో సేసేసి పూజాసామాన్లు కడిగేసి మరీ తన పని సూసుకుంటాది”- వుత్సాహంగా చెప్పింది రత్తాలు.

“విచిత్రంగా వుందే వేలు వేలు తగ లెట్టినా మన పిల్లలికి శ్రద్ధలు లేవు” అంది నిరాశగా భామగారు.

“ఇమ్హడు ఎక్కడ ఏం చేస్తున్నాడు?” అని అడుగుతున్న రామశాస్ర్రిగారితో రత్తాలు, “ఉప్పుడికే వుందాడండి అయ్యగారూ!.... ఆయన పెద్దోళ్ళని పట్టారు. పరమేశ్వరయ్యోరు కోయిల అధికారుల్ని ఆళ్ళనీ, యేసుకుని పెద్ద పెద్ద మంత్రుల్ని సూసి, ముందు కాలేజీలో సేర్సియేసారండి. ఆరు మైక్‌] లశ |

చా నెల్ల నుంచి ఎల్తా వుండు. మంగ కష్టాలు గట్టెక్సినాయండి. అంటే పొద్దుటేల ఇడ్లీలు, దోసెలు అమ్ముద్దండి. నాలుగు కాసులు చూస్తా వుండాదిప్పుడు. పస్తులు లేవు” అంది తృప్తిగా.

అంతలో “ఆ బెంచీల మీద కూచుందాం పదండి. అక్కడ కాస్త చిలప చిలప ఎండ పడుతోంది" అన్నారు రామశాస్త్రిగారు.

వెంటనే రత్తాలు పరుగెత్తికెళ్ళి ఒక్క అంగలో ఆ బెంచీలు తన చెంగుతో తుడుస్తోంది. మేమందరం నిమ్మళంగా బెంచీల దగ్గరకి కదలబోతున్నాం. అంతలో మా పక్క నించి రోడ్డు మీద అతివేగంగా, తెల్లటి ఫాంటులో టక్‌ చేసుకున్న తెల్లని షర్టులో, ఓ పంతామ్మిదేళ్ళ కుర్రాడు అడ్డ రోడ్డు ఎక్కాడు, ఒక్క క్షణంలో. మొగిలిపూల వాసన గుష్పుమంది అతని వెనకే. ఏదో మొగిలి రేకులు పెట్టిన పెట్టెలో పెట్టారు కాబోలు అతని గుడ్డలనిపించింది మాకు. అద్దురోడ్డు మీద నుంచి సరాసరి సీమతుమ్మ చెట్టు కింద కాళీస్టలంలో కొచ్చాక బెంచీలు తుడిచి తల ఎత్తిన రత్తాలు, “వాదే అమ్మగారు మంగమ్మ కొడుకు” అంది.

మంగ బెంచికి ఒక అరగజం దూరంలో నిపుణంగా చటుక్కున సైకిలాపి స్టాండు వేశాడు. మంగ తలెత్తి ముఖం చాటంత చేసుకుని కొడుకు పక్క చూసింది - పలుకని ఆశీర్వాదంతో. ఆ కుర్రాడి పనుల్లో చురుకుదనం, నిబ్బరం కనిపించాయి. ఎక్కడా మొరటుదనం లేదు.

ఆ సైకిలు సీటుకి తాళ్ళతో కట్టివున్న సిల్వర్‌ మంచినీళ్ళ బెందెని చటుక్కు చటుక్కున విప్పి తల్లి బెంచి మీద పెట్టాడు. ఒక హేండిల్‌ బార్‌కి వేలాడుతున్న బకెట్‌ నిండా నీళ్ళూ, ఒక డజన్‌గావోల్ను కాళీ గ్లాసులూ వున్నాయి. అవి బెంచి వద్ద కిందగా పెట్టాడు. అతను తల ఎత్తేటప్పటికి సీమ తుమ్మచెట్టు మీద ఓ కాకి “కావు కావు” మని పలకరింపుగా అరిచింది. రవిశేఖర్‌ చిరునవ్వుతో తలెత్తి చూడబోయాడు. అతని తల మీద మూడు నాలుగు చుట్టలు చుట్టుకుని, బాగా విచ్చ పండిన సీమ తుమ్మకాయ పడ్డది- కాకి నోట్లోంచి గావోల్ను. చటుక్కున ఒకటందుకున్నాడు. గబగబ ఒలిచి, లోపల నల్లటి గింజలు గోరుతో ఎత్తిపారేశాడు. ఆ పప్పులన్నీ అరచేతిలో నిండా వేసుకుని టవలు కప్పుకూచున్న వ్యక్తి వద్దకి వెళ్ళి, “ఇదోండి మామయ్యా రెండు సీమచింత పప్పులు” అంటూ కాసిని పప్పులు రెండో చేత్తో అతనికి పెట్టాడు. ఆ వ్యక్తి కృతజ్ఞతతో, ఆతురతతో చలికి దాచుకున్న చెయ్య చాచి నవ్వు ముఖంతో అందుకున్నాడు.

ఒక అంగలో తల్లి దగ్గరకొచ్చి, “నోరు తెరువమ్మా” అన్నాడు. వంచిన తల పైకెత్తి నోరు తెరిచింది తల్లి. ఆమె నోట్లో మరికాసిని పోసాడు. మిగతావన్నీ తన నోట్లో పోసేసుకుని చిలిపిగా పైకి చూచి, “థాంక్యూ” అన్నాడు కాకిని,

కాకి మళ్ళీ కావుమంది.

వెంటనే సైకిలు స్టాండు తీస్తూ, “అమ్మా వెళ్ళి వస్తా అంటూ సైకిలు ఎక్కేశాడు. “మామయ్యా వెళ్ళి వస్తా లేటవుతోంది” అని ఆ వ్యక్తితో చెప్పి అడ్డరోడ్డు తిరిగి పెద్దరోద్డు ఎక్కాడు.

రెండో హేండిల్‌ బార్‌ నుంచి బరువైన పుస్తకాలు వేళ్ళాదుతున్నాయి.

రవిశేఖర్‌ కింగ్‌లా శరవేగంగా వెళుతున్నాడు మెడికల్‌ కాలేజీకి. అ రం-1004 మో న్‌్‌

డలు అడుగో ఆంజనేయుడు... జాంబవంతుదెక్కడ? ణో అ కర్లరాళం.హామీరమీంతరావ్రు

ఒక ప్రముఖ చిన్న పిల్లల మాసపత్రిక వాళ్ళు ఆ సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా గేయ కథల పోటీ నిర్వహిస్తున్నారు. సెలక్షన్‌ కమిటీలో నేనూ ఒక మెంబర్ని

దాదాపు మూడొందల ఎంట్రీలు వచ్చాయి. ముందు వడపోతలో ఒక వంద దాకా పోయినా ఇంకా రెందొందలున్నాయి.

పిల్లల కోసం ఇంతమంది రాసేవాళ్ళున్నారంటే సంతోషం కలిగింది. రచనలు పంపిన వాళ్ళల్లో లబ్బప్రతిష్టులూ వుండటం ఆనందం కలిగించింది. అన్నింటికంటే వింతగొలిపిన విషయమేమిటంటే అప్పుడే రాస్తున్న వాళ్ళలో కొంతమంది ఎంతో చురుకుగా రాసారు. నిజానికి ప్రముఖల రచనలకన్నా అవి ఎందులోనూ తీసిపోవు. కొన్నయితే మిగిలినవాటికన్నా బాగున్నాయి. సెలక్షను చాలా కష్టమయింది. మొత్తం మీద అందరం కలిసి కూర్చుని అన్ని కోణాల నుండి పరిశీలించి ఫైనల్‌గా ఒక పది రచనలని ఎంపిక చేశాము. వాటిలో ఒకటి, రెండు, మూడు బహుమతుల నిర్ణయం ఎడిటర్‌గారికే వదిలేశాము. మిగిలిన వాటిని మాత్రం సాధారణ ప్రచురణకి తీసుకోమని సలహా ఇచ్చాం. అట్లాంటి సాధారణ ప్రచురణకు అంగీకరింపబదిందే “చుక్‌... చుక్‌ రైలు.” గేయ రచయిత సి. ఆంజనేయులు, రిటైర్డ్‌ టీచర్‌, దేశాయిపేట.

దేశాయిపేట మా వూరికి దగ్గర్లోనే వుంది. మా ఊర్లో హైస్కూలున్నా దేశాయిపేట చదువు బాగుంటుందని మా నాన్న నన్ను ఎస్సెసల్సీలో అక్కడ చేర్చాడు. నా కెప్పుడూ ఫస్ట్‌ ర్యాంకే వస్తుండేది క్లాసులో. కృష్ణగాడికి రెండో ర్యాంక్‌. వాళ్ళన్నయ్య ఆంజనేయులు.

ఆంజనేయుల్ని చూస్తే మాకు ఎద్బెరింగ్‌గా వుండేది. ఆయన ప్రతిభ అలాంటిది. మాకు కొరుకుడు పడని లెక్కల్ని సులభ పద్ధతిలో ఎలా చేయాలో చెప్పేవాడు. సోషల్‌ సబ్జెక్టులో సంవత్సరాలూ, యుద్దాలూ లాంటివి గుర్తుపెట్టు కోవటం చాలా కష్టంగా వుండేది. అదే పనిగా బట్టీ పడుతుంటే, అలా చేయటం తప్పనీ, గుర్తుపెట్టుకోవటానికి ఉపాయాలున్నాయని చెప్పి చూపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు 'రిటెంక్షన్‌ ఆఫ్‌ మెవరీ వవరొ అనే సబ్జెక్టును పోస్టల్‌ ద్వారా చదువుతున్నారు. అందులో చెప్పిన చిట్కాలలో కొన్ని నలభై యేళ్ళ క్రితం ఆంజనేయులు చెప్పినవే. అతనేమీ కోర్సులు చదవలేదు. వాళ్ళ నాన్న ఒక మామూలు బడిపంతులు, వాళ్ళకంత స్తోమతూ లేదు.

కృష్ణగాడితో కంబైన్స్‌ స్టడీస్‌కని నేను వాళ్ళింటికి వెళుతుండేవాడిని. ఆంజనేయులు కింకా కత ఈసనో ఆంజనేయసు... శొంబనయనెక్కడ? |

చాలా విద్యలొచ్చు. పేపర్లను కత్తిరించి బొమ్మలు తయారుచేసేవాడు. రంగుపెన్సిళ్ళతో (బ్రహ్మాండంగా బొమ్మలు వేసేవాడు. ఎప్పుడూ ఏదో కొత్త పని చేయటంలో నిమగ్నమైవుందేవాడు. చేయటానికేమీ లేదనుకున్న రోజున కాగితమూ, కలమూ పట్టుకుని కూర్చొనేవాడు. కథలు రాసేవాడు. కవితలల్లి పాడి వినిపించేవాడు. మా స్కూలు యానివర్శరీకి మా కోసం ఒక హాస్యనాటిక రాసి స్వయంగా తనే దైరక్షన్‌ చేసి మెప్పించాడు. గ్రీన్‌ రూములో మాకు మేకప్‌ చేసింది కూడా ఆంజనేయులే. ఆ మేకప్‌ సామాను చాలావరకు స్వయంగా తయారు చేసుకున్నాడు.

“మా అన్నయ్య అమెరికాలో పుట్టివుంటే చాలా గొప్పవాడయి వుండేవాడు' అని అంటుందేవాడు క ం సంగతేమోగాని ఆంజనేయులు నిజంగా గొప్పవాడే. పెద్దయిన తరువాత అతను చాలా మంచిపేరు సంపాదించుకుంటాడు అనుకొనేవాళ్ళం. కానీ అతనికి చపలత్వ వుందేది. ఏ పనీ స్థిరంగా చేసేవాడు కాదు. చదువుకోవాల్సిన టైములో ఆదుతుండేవాడు. ఆటలాడు “కోవాల్సిన సమయంలో కవిత్వం రాస్తుండే వాడు. వూళ్ళోవాళ్ళెంత మెచ్చుకున్నా ఇంట్లో వాళ్ళచేత ఎప్పుడూ చివాట్లు తింటుందేవాడందుకే. కృష్ణకున్న స్థిమితంలో పాతిక వంతు ఆంజనేయులుకున్నా నిజంగా చాలా మంచి పేరు తెచ్చుకునేవాదే. -

నేను డిగ్రీ చదువులకని మా తాతగారి వూరు వెళ్ళిపోయిన తరువాత ఆంజనేయులు సంగతేమయిందో పట్టించుకోలేదు.

నేను విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు ఆంజనేయులు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వయస్సు అతనిలో అట్టే మార్పు తీసుకురాలేదు. కూర్చున్న పది నిముషాల్లో వంద విషయాల్ని గురించి మాట్లాడాడు. మనది నిజంగా లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా అన్న విషయం దగ్గర్నుండీ పారలల్‌ సినిమా దాకా అరకొరగా ఎన్నో అభిప్రాయాలు అడక్కుండానే చెప్పుకొచ్చాడు. అఖరికి జేబులో నుండి ఒక కవరు తీసి 'మీ పత్రిక్కి పనికొస్తుందేమో చూడు సుబ్బూ....”? అని ఇచ్చి వెళ్ళిపోయాడు.

నా పేరు సుబ్బారావు. చనువున్నవాళ్ళు 'సుబ్బూ' అనే పిలిచేవాళ్ళు. ఆంజనేయులికి హిపోక్రసీ అన్నది తెలీదు. అదే అతనిలో నాకు నచ్చే గుణం.

అతను ఇచ్చిన కథ “ఎడిటర్‌” గారికీ నచ్చింది.

ప్రచురింపబడిన తరువాత స్వయంగా నేనే అతని అద్రసుకు ఉత్తరం వ్రాశాను. ముందు ముందు ఇంకా మంచి కథలు వ్రాస్తుండమని సలహా కూడా ఇచ్చాను.

రెండు నెలల తరువాత ఒక నవల వంపించాడు. బాగుంది. కొద్ది మార్పులతో ప్రచురించటానికి అంగికారమయింది.

క్రమంగా ఆంజనేయులు 'రచయిత'గా మిగిలిన పత్రికలలో కూడా కనిపించటం మొదలు పెట్టాడు.

రేడియోలో అతను వ్రాసిన నాటికలు రావటం మొదలు పెట్టాయి.

కవి సమ్మేళనాలలో అక్కడక్కడా కనపడుతుండేవాడు.

ఒక నాటక పరిషత్తులో పోటీ నాటకాలు' ప్రదర్శిస్తున్నారు. “రివ్యూ కోసం పత్రిక తరపున క భరాం-10% 2112121222

లాలా 6ఐ నేనే పోతున్నాను. రెండో రోజున భుజానికి వేళాడే సంచితో ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయులు. నరసరావుపేట నుంచీ నాటకం తయారు చేసుకొచ్చాడు. అక్కడికి దగ్గర్లోని ఒక వూళ్ళో స్కూలు టీచరుగా పనిచేస్తున్నాడుట. నాటకం బాగా పండింది. ఆంజనేయులు మూగవాడి పాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకత్వం కూడా అతనిదే. రచన సంగతి సరేసరి.

స్పెషల్‌ జ్యూరీ అవార్డు ఆ సంవత్సరం ఆంజనేయులికే దక్కింది. 'అందుకేనన్న మాట ఈ మధ్య పత్రికలలో ఎక్కువగా కనిపించటంలేదు' అన్నాను- అతన్ని అభినందిస్తూ

చిన్నగా నవ్వాడు. 'సుబ్బూ!.... నువ్వొకసారి మా ఊరు రావాలి అన్నాడు.

“ఏమిటి విశేషం?”

“అఖిల భారత స్థాయిలో పాటల పోటీలు నిర్వహిస్తున్నాము. నువ్వూ ఒక జడ్జిగా వుంటే బాగుంటుంది.”

'అమ్మో.. పాటల గురించి నాకు ఏబీసీడీలు కూడా తెలీవన్నా..!”

మేమందరం ఆంజనేయుల్ని 'అన్నా! అనే పిలిచేవాళ్ళం కృష్ణతోపాటే.

“అలాంటివాళ్ళే నిజమైన జడ్జీలవుతారు. నవ్వు శ్రోతల తరపున జడ్జీవన్నమాట... నీ కెందుకూ.... నువు రా! అంటూ అడ్రసూ, డేటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆంజనేయులు నిజంగానే పాటల పోటీని భారీ ఎత్తున నిర్వహించాడు. అది చిన్న పల్లెటూరే అయినా ఆంజనేయులు అక్కడికి టీచరుగా వెళ్ళిన తరువాత ఊరి పరిస్థితుల్లో చాలా మార్పులు తెచ్చాడని చెప్పారు అక్కడి జనం, ముఖ్యంగా కుర్రాళ్ళల్లో అతనికి మించి ఫాలోయింగుంది. పెద్దవాళ్ళలో గౌరవమూ వుంది. పోరంబోకు తిరుగుళ్ళు తగ్గాయి అన్నారు వాళ్ళు. వూళ్ళో వాళ్ళ సహకారం లేకపోతే అంత కార్యక్రమం చేయటం సాధ్యం కాదు. మొత్తానికి నేను ఆ వూళ్ళో ఆంజనేయులు కొత్త అవతారం చూడగలిగాను - అప్పటిదాకా చూడని అవతారం... అదే... సోషల్‌ వర్మర్‌ అవతారం!

ఊళ్ళో ఉచిత వైద్యం చేస్తున్నాడు. వాళ్ళకు వైద్యం చేసేందుకు పుస్తకాలు చదువుతున్నాడు. రిజిస్టేషన్‌ లేకుండా వైద్యం చేయటం నేరం కదా అనడిగితే వెయ్యి రూపాయలు పెట్టి కొన్న కలకత్తా బ్రాండ్‌ 'ఆర్‌.ఎం.పి.' సర్టిఫికేట్‌ చూపించాడు. మొత్తానికి అతని ఆశయం మంచిదే. చిన్న చిన్న వైద్యాలే చేస్తున్నాడు ఉచితంగా. "కొద్దిగా కాంప్లికేటెడ్‌గా వున్నా టౌన్‌కి పొమ్మంటాను” అని చెప్పుకొచ్చాదాయన.

ఊళ్ళో ఒక చిన్న లైబ్రరీ కూడా పెట్టించాడు.

అన్నింటికన్నా ముఖ్యమైనది ఊరి సమస్యల్ని పరిష్కరించుకౌనే పద్ధతి. బోరింగులో నీళ్ళు రాకపోయినా, వీధి దీపాలు వెలక్కపోయినా, వినాయకచవితి, శ్రీరామనవమి లాంటి పండగలకి ఉత్సవాలు చేయాలన్నా పంచాయితీ బోర్డు వరండాలో కూర్చుని పబ్లిగ్గా అందరి ముందు చర్చించుకొనే అలవాటు చేయించాడు ఆంజనేయులు. ఆంజనేయులక్కడ ఒక్క టీచరే గాదు - ఊరి పెద్దల్లో ఒకడూ, ముఖ్యుల్లో ఒకడూ అయి కూర్చున్నాడు.

“ఇన్ని పనులు చెయ్యటానికి నీకు టైమెక్కడిదన్నా?” అనడిగాను ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో భోజనాల దగ్గర.

“ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. నువ్వైనా చెప్పు బాబూ! ఆరోగ్యం సంగతి చూసుకోవడ్దూ!?

అంది ఆంజనేయులు భార్య.

ఆవిడ కంప్లయింట్‌ సమంజసమయిందే అనిపించింది. కానీ, నేను అంజనేయులుకు చెప్పేటంతటివాడినా!

“ఇప్పుడంటే ఫరవాలేదు. ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చిన తరువాత కూడా ఇట్లాగే తిరుగుతానంటే ఎట్లా? అందామె.

“అప్పటి సంగతి చూద్దాంలేవే అని నవ్వి ఊరుకొన్నాడు ఆంజనేయులు.

అప్పటికీ ఆంజనేయులు భార్య గర్భంతో వుంది. అదీ ఆవిడ భయం!

అంజనేయులు ఇంట్లో లేనప్పుడు అందామె, 'నువ్వూ.. మాకు కృష్ణలాంటి వాడివే బాబూ! నీ దగ్గరకాకపోతే ఇంకెక్కడ చెప్పుకోవాలి. చెప్పుకొనేందుకింకెవరున్నారు కనక? నన్ను చేసుకున్నాడని ఆయన్ని వాళ్ళ వాళ్ళు వెలేసినంత పని చేశారు. ఎవరూ ఇటు వైపు రారు. మా వాళ్ళు మరీ మొరటు వాళ్ళు అని కళ్ళ నీళ్ళు పెట్టుకుందావిడ.

ఆంజనేయులు ఇంతకుముందు పనిచేసిన వూళ్ళోనే ఈ పెళ్ళి చేసుకున్నాడు. కులాంతర వివాహం. ఎవరు వారించినా వినకుండా చేసుకున్నాట్ట! ఆయన బ్రాహ్మడు. ఆవిడది షెడ్యూల్డ్‌ కులం. ఇరువైపుల పెద్దలకు ఈ వివాహం ఇష్టం లేకపోయింది. ఆ వూళ్ళో వాళ్ళ బాధపడలేకే ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు ఆంజనేయులు.

ఆంజనేయులు కులాంతర వివాహాలను గురించి కొన్ని కథలు రాశాడు. తను రాసిందే ఆచరించి చూపించాడు. రియల్లీ గ్రేటొ ఆంజనేయులు ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకొన్నానా క్షణంలో.

తరువాత నేను ఉద్యోగం మారి ఢిల్లీ వెళ్ళిపోవటం జరిగింది. అక్కడే దాదాపు మూడు దశాబ్బాలుండిపోయాను. పిల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్ళయిపోయారు. మధ్యమధ్యలో ఆంధ్రా వస్తున్నప్పుడు ఆంజనేయుల్ని గురించి వాకబు చేస్తుందేవాడిని. ఉద్యోగరీత్యా అతనెక్కదెక్కడో వుంటుండేవాదు. వచ్చిన ప్రతిసారీ ఏదో కొత్త అడ్రసు చెప్పేవాళ్ళు.

ఒకసారతన్ని మాచర్లలో పట్టుకోగలిగాను. మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లలు. పెద్దది పాప. సెకండ్‌ క్లాస్‌. రెండోవాడు యూ.కే.జీ. చాలా చురుకుగా వున్నారిద్దరూ. అచ్చు తండ్రి చురుకుతనమే. కదిలిస్తే చాలు ఇంగ్లీషులో రైమ్స్‌... తెలుగులో పద్యాలు గడగడ చదివేస్తున్నారు. పిల్లలిద్దర్నీ డాన్సు స్కూలులో చేర్చించారు.

“మైత్రికి పెయింటింగ్‌ కాంపిటీషన్లో టౌన్‌ మొత్తానికి ఫస్టాచ్చింది. ఇదిగో (ప్రైజ్‌. చిన్నాడు కూడా చిచ్చర పిడుగే! వీడికీ సీతారామరాజు ఫాన్సీ ్రెస్‌కి ప్రయిజొచ్చింది. సంగీతం కూదా నేర్పించాలని వుంది. క్లాసులో ఇద్దరూ ఫస్టే' అన్నాడాంజనేయులు. అక్కడ నేన్నుంతసేపూ మొగుడూ, పెళ్ళాలు తమ పిల్లల్ని గురించే మాట్లాడారు.

“నువ్వేమన్నా వేరే ఏక్టివిటీస్‌ చేస్తున్నావా అన్నా! అనడిగాను.

లోపలికెళ్ళి పెద్ద ఫొటో ఆల్బం, రెండు. పుస్తకాలు పట్టుకొచ్చాడు. ఆల్బం నిండా వాళ్ళ పిల్లల ఫొటోలే! రకరకాల భంగిమల్లో... రకరకాల చోట్ల తీసినవి.

వీళ్ళ కోసం ఫొటోగ్రఫీ నేర్చుకుంటున్నాను. ఈ ఫొటోలన్నీ నేను తీసినవే... బాగున్నాయా?” కతన డడ తేడా కై కళ - 204 క కక్‌ నాసల్‌

అనడిగాను. నిజంగా ఫొటోలు చాలా బాగా వచ్చాయి. ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ తీసిన స్థాయికేమాత్రం తగ్గవు అవి. ఆంజనేయులు చెయ్యి ఎందులో పడినా అంతే బంగారం! అందులో నుండి రెండు మంచివి ఏరి నాకిచ్చాడు. 'నీకు తెలిసిన పత్రికలలో బాగుంటే వేయించు" అన్నాడు. “పాటలు రాశాను కొన్ని. బాలల గేయాలు. గేయ కథలు వున్నాయనుకో. మా పిల్లలకు అర్ధమయ్యే భాషలో, వాళ్ళకు నోరు తిరగే రీతిలో బాణీ కట్టి రాసినవి. మైత్రీ! ఒక పాట పాడమ్మా!.... ఛుక్‌... ఛుక్‌... రైలూ వస్తుంది...” అంటూ అందించాడు. వెంటనే ఆ పాప ఆ పాటందుకుని దాదాపు అయిదు నిముషాలు అలాగే పాడుతూ పోయింది. మధ్య మధ్యలో చిన్నపిల్లాడు అక్కకు వంతగా గొంతు కలపటం...! “వీళ్ళు పాడిన పొటలన్నీ నేను రాసినవే. వీళ్ళ కోసమే రాశాను. వీటిని కేసెట్స్‌లోకి ఎక్కించాను. ఇందులో ఏమన్నా పనికొస్తాయేమో చూడు అంటూ కేసెట్స్ళూ, పుస్తకమూ అందించాడు. మొత్తానికి అక్కడ కూర్చున్న గంటసేపూ ఆంజనేయులు తన పిల్లల్ని గురించి తప్ప, ఇంకో విషయం "మాట్లాడలేదు. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున వేరే టాపిక్‌లోకి వెళితే ఆయన భార్య సవరించేది. వాళ్ళ ప్రపంచమంతా ప్రస్తుతం వాళ్ళిద్దరి పిల్లలతోనే నిండిపోయిందని తెలుస్తూనే వుంది. “తమ పిల్లలకు అందుబాటులో లేనిదేదీ ఊహించే స్థితిలో లేడు ఆంజనేయులు... అనిపించిం దాక్షణంలో. నాకు పరిచయమున్న ఒక పత్రికకు అతనిచ్చిన ఫొటోలు, గేయాలు పంపించాను. రెండూ ప్రచురించారు. మంచి రెస్పాన్సు కూడా వచ్చిందన్నారు.

'పెల్లల శీర్షికలకన్నా రెగ్యులర్‌గా కంట్రిబ్యూట్‌ చేయమని" ఎంకరేజింగ్‌గా సలహా ఇస్తూ ఆంజనేయులికి ఉత్తరం రాశాను.

కొన్నేళ్ళు ఆంజనేయులు రెగ్యులర్‌గా రచనలు పంపించాడట. 'మంచి క్వాలిటీ వుంటుంది. ప్యూర్‌ ఒరిజినల్స్‌!' అని మెచ్చుకున్నాడు ఎడిటర్‌గారొకసారి నేను కలిసినపుడు. కానీ ... ఈ మధ్యేవో కామిక్స్‌ పంపిస్తున్నాడు. అంత ఒరిజినల్‌గా లేవు. ఫరవాలేదనుకున్నవి ప్రచురిస్తున్నాం అన్నాడాయన. 'అంటే... ఆంజనేయులి. పిల్లలు హైస్కూలుకు వచ్చారన్నమాట...!' అని అనుకొన్నాను. “ఇంకా కొద్దికాలం పోతే ఇవీ రాయడు. చూస్తూ వుండండి... సస్పెన్స్‌, ైం, థిల్లర్‌ టైప్‌ నవల్లొస్తాయి' అన్నాను ఆ ఎడిటర్‌ మిత్రునితో.

మరో అయిదేళ్ళు తరువాత ఆ మిత్రుడు ఒక పెళ్ళి ఫంక్షన్‌లో కలిసాడు. ఆ మాటా, ఈ మాటా అయిన తరువాత టాపిక్‌ నవలల మీదకు మళ్ళింది.

“అన్నట్లు... మర్చిపోయా... మన ఆంజనేయులు నువ్వు చెప్పినట్లు ఆ మధ్య ఒక కైమ్‌ ధ్రిల్లర్‌ పట్టుకొచ్చాడు. అగాథ క్రిస్టీకి నకలులాగా వుందది. అతని దగ్గర్నుండీ రావాల్సిన నవల కాదది. వేస్తే పత్రికకూ, అతనిక్కూడా పేరు పోతుంది, చూస్తాలే అని పక్కన పెట్టేశాను అన్నాడు.

ఈ మలుపు నేనూహించిందే అయినా ప్రాణం వుసూరుమంది. ఆంజనేయులులో ఎంత టేలెంటుందీ! ఎంత వెర్సటాలిటీ వుండేదీ! ఏమయిందో ఆ ్రతిభంతా...! తతత

తరువాత కొంతకాలానికి ఆంధ్రా వైపొచ్చినప్పుడు ఆంజనేయుల్ని కలవాలనుకున్నా కానీ, పని వత్తిడి మీద కుదరక వెళ్ళిపోయాను.

అనుకోకుండా ఒక పెళ్ళిలో కృష్ణ కలిసాడు. చాలా ఏళ్ళ తరువాత కలుసుకోవటం. గంటలకొద్దీ మాట్లాడుకున్నా కబుర్లు తరగటం లేదు.

“ఇట్లా కాదు... ఒకసారి మా ఇంటికి రా!” అని బలవంతంగా ఇంటికి తీసుకు వచ్చాను ఆ మర్నాడు.

రాత్రి భోజనాలయిన తరువాత ఇద్దరం డాబా మీద కూర్చుని కబుర్లలో పద్దాం. టాపిక్‌ అటు తిరిగి ఇటు తిరిగి ఆంజనేయులు దగ్గరికి వచ్చి ఆగింది.

నేనే అన్నాను - “మీ అన్నయ్య నిజంగా ఎంత టేలెంటున్నవాడూ! సిన్సియర్‌. కులాంతర వివాహం చేసుకున్నాడని మీరందరూ అతన్ని దూరం చెయ్యటం ఏమీ బాగా లేదు. మీరందరూ వెలేసినంత పని చేస్తే ఆ లోటు పూడ్చుకోవటానికి అతను ఆ రోజుల్లో సొసైటీకి చేసిన సేవ... నిజంగా సూపర్స్‌! అట్లాంటివాడు పిల్లలు పుట్టేసరికి ఇంతకాలం తను సేన చేసిన సొసైటీని పూర్తిగా మర్చిపోయి... ఆ పిల్లల లోకంలోకి వెళ్ళిపోయాడు... ఎంత విచిత్రమైన మనిషో! .

కృష్ణ అందుకుని మిగిలిన భాగం పూర్తి చేశాడు... “అన్నయ్యంటే ఇంట్లో అందరికీ అభిమానంగానే వుందేది. వేరే కులం పిల్లని కాదన్నా చేసుకున్నాడని అమ్మా, నాన్న వాడిని వెలేయకపోతే ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కష్టమయ్యేవిరా!... పోనీ అక్కడన్నా స్థిరంగా వున్నాడా అంటే, అదీ లేదు. నువ్వు చెప్పిందీ నిజమే. పిల్లలే లోకంగా వుందేవాడు." పాళ్ళ మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు. వాళ్ళ కోసమే తను అంత కాలంగా పెంచుకున్న కెరీర్‌ని కాలదన్నుకున్నాడు. కానీ. చివరికేమయింది...”

“ఏమయిందీ?” నా మనసేదో కీడును శంకించింది.

“కూతురు తనలాగే వేరే కులం వాడిని కట్టుకుని అమెరికా వెళ్ళిపోయింది. సంబంధాల్లేవు. కొదుకికృడే వున్నాడు కానీ తండ్రి పొడ గిట్టదు... తాను కోరుకున్న కోర్సులో చేర్పించలేదని అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతే వెతికి తెచ్చుకున్నాడు. ఉన్నదంతా వాడి చదువుకు సమర్పించుకున్నాడు. వదిన చచ్చిపోయింది. అన్నయ్య చేతిలో చిల్లిగవ్వ లేదు. కొడుకూ, కోడలూ ఈసడించు కుంటున్నా అక్కడే వుండక తప్పదు, ఆఖరి శ్వాస దాకా అంటున్నాడు.

మరి ఈ మధ్య ఏదో గేయం పంపించాడు పోటీకి?” అన్నాను. వడి స్తంపే వుంటాడులే. కొడుకూ, కోడలూ ఇద్దరూ ఉద్యోగాలకు పోతున్నారుగా. పసిపిల్లల్ని

'ద పదేసి పోతున్నారు. మళ్ళీ ఆ పసివాళ్ళ కోసం ఏమన్నా పాటలు కదుతున్నాడేమో!

శాప వశాన తన శక్తి తెలీని హనుమంతునిలాంటివాడు ఆంజనేయులు. జాంబవంతుని ని విషయం తెలుసు కనుకనే రామాయణానికి హనుమంతుని యుక్తిగా ఉపయోగించు జంట గ సానుడ్తాలున్న అంజనేయల్ని ఉపయోగించుకోలేక పోవటం

సమాజం దౌ! 7 ప

మిత్రుడు అంజనేయల్ని గర ప్‌ అన్నాడు తరువాతెప్పుడో కలిసిన ఎడిటర్‌ కెైైడైఊజయెత=క2జైకక 2కు ఆష్‌

మల్లి అ నరం పనిపిల్లని చూసిపెట్టమని పది రోజులుగా మా ప్యూన్‌ ఓబులేసుని బ్రతిమాలుకుంటున్నా ఈ రోజు ఏ మూడ్‌లో ఉన్నాడో ఏమో “సాయంత్రం ఏడెనిమిది మద్దెలో పిల్సుకోనొస్తా సారూ అన్నాదు. ప్రమోషన్‌ మీద విజయవాడకు బదిలీ అయిన క్షణం నుంచీ నాకు తిప్పలు తప్పటం లేదు. పిల్లల చదువుల దృష్ట్వా హైద్రాబాద్‌ నుండి ఫ్యామిలీని మార్చటం వీలుకాదు కాబట్టి నేనాకృజ్జే పెట్టే బేడా సర్దుకుని - వాటితో పాటు వంట గిన్నెలూ - పొడులూ - పచ్చళ్ళూ పెట్టుకుని ప్రయాణమైనా. ప్రమోషన్‌ వచ్చినందుకు సంబరపడాలో - బదిలీ మీద పెళ్ళాం పిల్లలకు దూరంగా పరాయి వూరికి విసిరేయబడినందుకు బాధపడాలో అర్ధం కాని పరిస్థితి.... “దాల్లెండి బడాయి... విసిరేయబడటమా పాడా - మన విజీవాదేగా - కూతేస్తే వినఐదేంత దూరం” అంటూ హైద్రాబాద్‌లో స్టెనోగా పనిచేస్తున్న విజయవాడ అమ్మాయి రాజేశ్వరి వూరడించినా సుళ్ళు తిరుగుతూ దిగులు.... అటువంటి సమయంలో నాకు ధైర్యం చెప్పి, అన్ని విధాలా తోడుగా నిల్చింది స్టాలిన్‌ బాబు. లీలామహల్‌ థియేటర్‌ యజమానైనా - నిగర్వి స్నేహశీలి. కొన్నేళ్ళక్రితం ఏదో పనిమీద మా ఆఫీసుకొచ్చినపుడు పరిచయం. విజయవాడలో హోటల్లో రూం తీసుకుని రెండ్రోజులు అద్దె గదుల కోసం వెతికీ వెతికీ ఆ సాయంత్రం పల్మరిద్దామని స్టాలిన్‌ దగ్గర కెళ్ళా. ఆ క్షణం నుంచీ నన్ను వదిత్తే ఒట్టు. అతని కార్లోనే వూరంతా అద్దె ఇళ్ళ కోసం తిరగటం - వాళ్ళింట్లోనే భోజనం... నేను మొహమాటంతో సగమైపోయా. ఎన్ని ఇళ్ళు చూసినా స్టాలిన్‌కి ఒక్కటీ నచ్చలేదు. “మీరు ఆఫీసర్‌ కదా. ఇవేవీ మీకు తగినట్లు లేవు” అన్నాడు. ఓ వారం తిరిగాక “మరిచేపోయాను. మా థియేటర్‌ వెనుక గెస్ట్‌హొజ్‌ ఖాళీగా ఉంది. మీకు నచ్చుతుందేమో చూడండి” అన్నాడు. లీలామహల్‌ సినిమా హాలు వెనుక ఉన్న ఆ యింటిని చూశాను. అద్భుతంగా వుంది. బెడ్రూంకి అటాచ్ట్‌ బాత్‌రూం. వేడినీళ్ళ కోసం గీజర్‌ - పెద్ద హాలు... బెడ్రూంలో, హాల్లో ఎయిర్‌కండిషన్‌ మెషిన్లు, హాలుని ఆనుకుని విశాలమైన బాల్బనీ, దానిమీద ఉదారంగా వాలుతున్న వేపచెట్టు నీడ... వెంటనే మకాం అందులోకి మార్చేశాను. అతని పరపతి మీద గ్యాస్‌ సిలిండర్‌ ఇప్పించాడు. కిచెన్‌ కోసం వేరే గది లేదు కాబట్టి హాల్లోని ఓ మూలని కివెన్‌ కింద మార్చేసి - వంట సామానంతా సర్దేశా. నాకు హోటల్‌ భోజనం పడదు. అందునా విజయవాడ హోటళ్ళలోని కారాల్ని అస్సలు భరించలేను. అయినా

నా ఒక్కడి భోజనం వండుకోడం ఏం కష్టమని .... ఓ కుక్కర్‌లో అన్నం, మరో కుక్కర్‌లో పప్పు పెట్టేస్తే చాలు - అరగంటలో అన్నీ రెడీ - వేడి వేడి అన్నం - పోపేసిన టమోటా పప్పు - ఇంటి నుండి తెచ్చుకున్న పచ్చళ్ళూ - నెయ్యా ... ఎన్ని వందలు పెట్టినా - ఎంత గొప్ప హోటల్‌ కెళ్ళినా ఇంత చక్కటి, రుచికరమైన భోజనం దొరుకుతుందా?

అన్నీ బాగానే ఉన్నా అసలు సమస్య పనిమనిషి దగ్గరొచ్చింది. వంట చేసుకోటం వరకైతే బాగానే ఉంది కానీ అంట్లు తోమటం మాత్రం ఇబ్బందనిపించి, పనిమనిషి వేటలో పద్దాం. విజయవాడలో పనిమనుషులకు కొదవేం లేదు. కానీ ఎంతిస్తానని బ్రతిమాలుకున్నా నాకు మాత్రం ఒక్క పనిపిల్లా దొరకటం లేదు. ఓబులేశుని కారణమడిగా, “ఇల్లల్లో సేయడానికి ఎవరైనా వత్తారయ్యా- ఇది గెస్తోసు కదా - అందునా సినిమా టాకీసు లోపల ఉందాయె - మగోల్లు శానామంది తిరగతా వుంటారాయె. "అందుకని పనికి రాడానికి బయపద్దున్నారు సారూ” అన్నాడు.

“అంకేనా - ఇంకా ఏమైనా కారణాలున్నాయా?” అనుమానం తీరక అడిగాను.

కొద్దిసేపు నీళ్ళు నమిలి - చేతులు నలుపుకుని వంగి నంగిగా చెప్పాడు - “ఎవరైనా ఆడకూతురు ఇల్లల్లో ఉంటే ఇంత ఆలోసించరయ్యా - తమరొక్మరే కదా ఉండేది అందుకనీ...”

నా అనుమానం నిజమేనన్మాట - పనిపిల్ల కోసమని కాండక్ట్‌ సర్టిఫికేట్‌ ఎక్కడి నుంచి పట్రానూ? “నేను చాలా మంచోజ్జి ఓబులేశూ - నీకు తెల్సుకదా - పర్‌ఫెక్ట్‌ జెంటిల్మాన్‌ని” అందామనుకుని విరమించుకున్నా. మన కేరెక్టర్‌ గురించి మనమే చెప్పుకోవాల్సి రావటం - అందునా మన దగ్గర పనిచేసే ప్యూన్‌ దగ్గర చెప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడటం దారుణమనిపిం చింది. అధవా నేనలా చెప్పినా, “ప్పీరెలాటోళ్ళో నాకు తెల్సు సారూ - పనిపిల్లకు తెలీదుగా” అంటాడనిపించింది.

“నాకు కుర్ర పిల్లలే కావాలని నీకు చెప్పానా? పని చేయడానికి ఓపికున్న ముసల్దాన్ని తెచ్చినా పర్లేదు. నాక్మావాల్సింది కసువూద్చి, అంట్లు తోమిపెట్టి, కింది నుంచి రెండు బిందెల మంచినీళ్ళు తెచ్చివ్వగల పనిమనిషి” అన్నాను ఉక్రోషంగా.

నాక్మొద్దిగా కోపం వచ్చిందని ఓబులేశుకి అర్ధమైనట్టుంది. మరోమాట మాట్లాడకుండా “మరో వారం గడువులో పనిమడిసిని కుదర్సిపెడ్తా సారూ” అని వెళ్ళిపోయాడు.

ఈనోజతనికి దయ కలిగినట్లుంది.

బాల్మనీలో ఈజీ ఛెయిర్‌ వేసుకుని - వేపచెట్టు గాలిని ఆస్వాదిస్తూ ఓబులేశు కోసం ఎదురుచూస్తూ కూచున్నా లీలామహల్లో తెలుగులోకి డబ్‌ చేసిన ఇంగ్లీషు సినిమా “ఎనకొండి ఆడుతోంది. మొదటి ఆట ఇంటర్వెల్‌ సమయం - సిగరెట్లు కాల్చుకుంటూ బాతాఖానీ కొట్టుకుంటున్న కుర్రోళ్ళని గమనిస్తూ వాళ్ళ మధ్యలోంచి దారి చేసుకుంటూ కదుల్తున్న ఓబులేశుని చూశాను. అతని వెనకే నడుస్తున్న అమ్మాయి... సుమారు ఎత్తుగా ఉంది పుష్టిగా కనిపించింది. మెట్లెక్కుతున్నప్పుడు ఆ అమ్మాయిని నింపాదిగా ఎక్కడం గమనించి చాలా నెమ్మదైన పిల్లనుకున్నాను.

ఓబులేశునా ఎదురుగా నిలబడి, “సారూ! దీని పేరు మల్లి. అమ్మ లేదు. అయ్య రిచ్చా చై కథారలిని - 2004 2222222222

తొక్కుతాడు. ఏమేం పన్లు సేయాలో సెప్పి తీసుకొచ్చా. మీరాపీసుకెళల్లే లోపల వచ్చి పనంతా సేస్మావెల్తది. మల్లా పొద్దు గూకాకొచ్చి మీ బోయనాలయ్యినాక వెల్తది. నెలకు ఐదొందలు” గుక్క తిప్పుకోకుండా ఏకరువు పెట్టాడు.

అప్పుడు గమనించానా అమ్మాయి వైపు. కాటుక దిద్దిన వెడల్పాటి కళ్ళు - తీర్చిదిద్దినట్టు కాకున్నా చక్కటి ముక్కు - నిండైన గుండ్రటి పెదాలు - చామనచాయతో నిగారింపైన వళ్ళు... వీటన్నిటితోపాటు ఉబ్బెత్తుగా కన్పిస్తున్న పొట్ట.

“నీ ప్పేరేంటీ*" - ఏదో ఒకటి మాట్లాడాలని అడిగాను. తీరా అడిగాక గుర్తొచ్చింది ఇందాక ఒబులేశు చెప్పిన విషయం.

“మల్లీశ్వరి” అందా అమ్మాయి సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ. చాలా ధైర్యం గల పిల్ల అనుకున్నాను. ఇంకా నయం “ఓబులేశు సెప్పాడుగా మల్లని - మల్లా అడుగుతావేం” అని నిలదీయలేదు.

“ఎన్నో నెల?” అన్నాను వేపచెట్టు కొమ్మల్లోకి చూస్తూ.

“ఆరు”

ఓబులేశుకి నా మనసులో ఏముందో అర్ధమయి, “ఈ పిల్లని గేటు బైటికి వదిలి వస్తా సారూ. రేపుదయం వస్తది. నేను మల్గొచ్చి ఇవరంగా 'సెప్తొ అంటూ వేగంగా మల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు.

నాకు ఓబులేశు మీద పీకల్దాకా కోపం వచ్చింది. మల్లొస్తానన్నాడుగా. రాగానే ఈ వేపచెట్టు కొమ్మకు వేలాడదీయాలన్నంత కోపం.... పనిమనిషిని చూసిపెట్టమంటే మరో మూడ్జెల్లలో అమ్మ కాబోతున్న అమ్మాయిని పిల్చుకొచ్చాడు. బుద్దుందా అసలు? నా దసలే సుతిమెత్తని మనసు. నాకా అమ్మాయి పన్లు చేయటం అటుంచి నేన అన్ని పన్గూ చేసుకుని ఐదొందల జీతం నెల తిరగ్గానే ఆమె చేతిలో పెద్దానేమో! అంట్లు తోమడం సరే - ఈ మెట్లపైనుంచి నీళ్ళలా మోస్తుంది? పురుడొస్తే మరో పనిమనిషిని వెళుక్కోవాల్సిందేగా...

ఆలోచనల్లోనే ఓబులేశు వచ్చాడు.

“అసలేమిటీ నీ ఉద్దేశ్యం? ఆర్నెల్ల కడుపుతో ఉన్న పిల్లను తెచ్చి...” నేను మాట పూర్తి చేయకముందే, “శానా కోపంగా ఉందా సారూ - నాకు తెలుసు - బానంత కడుపేస్సుని పనేంసేస్తాదని కదా... కూటికి లేని పేదోల్లకు పనిసేయకుందా పూట గడవదు. మల్లి మంచి పిల్ల. మీరు ఉత్తినే డబ్బులిస్తానన్నా తీస్కోదు. పని సేస్తాది. మీకు పనిమడిసి అవుసరం కన్నా మల్లికి మీ అసోటి అయ్య అవుసరం ఎక్కువుందనిపించి తెచ్చినా. దానికి ఎక్కువ శముండదు. పూటకింత తిండి దొౌరుకుద్ది. నా మాటినుకోండి. దానికి పురుగొచ్చేలోపల మరో మడిసిని సూసిపెద్దా. అందాకా కాదనకండి. మీకు పున్నెమొస్తది. తల్లిలేని పిల్లూ అన్నాడు చేశులు జోడిస్తూ.

“తల్లిలేని పిల్లనా - నా బొంద - తల్లి కాబోతున్న పిల్లు అందామనుకుని. ఓబులేశు దీనంగా పెట్టిన మొహం చూసి మానుకున్నా ఉబికిన పొట్ట చూసిన కంగారులో గమనించలేదు కానీ మల్లికి పదిహేను పదహారేళ్ళకు మించి వయసుండదు.

“మరి మంచినీళ్ళో... మోయగలదా?” అన్నాను. ఈ కారణం చూసైనా వద్దని చెప్పామని...

ఈ

“మంచినీళ్ళే కదా సారూ. రెండ్రోజులకోపాలి వచ్చేది. నేను సేస్తాలెండి. మీకు నీల్లు మోసాకే ఆఫీసు కెల్తా” అన్నాడు. ఆ మాటతో మల్లి నా దగ్గర పనిమనిషిగా స్థిరపడింది.

అన్నం వండినా - పప్పు చేసినా - కూర చేసినా ఇద్దరికి సరిపడా చేయడం - నేను తినగా మిగిలింది మల్లికి పెట్టడం అలవాటు చేసుకున్నాను. కడుపుతో ఉన్న పిల్ల కదా .... ఇక్కడే కూచుని తినమంటే వినేది కాదు. ఇంటికి పట్టుకు పోయేది. మొగుడంటే ప్రాణమనుకుంటా. తనకొక్కదానికే సరిపడా ఉన్నా సగం భర్తకు పెట్టి సగమే తింటుందేమో... మొగుడి గురించి వివరాలడుగుదామంటే ముభావంగా తన పని తను చేసుకుపోవటం తప్ప మల్లి ఎక్కువ మాట్లాడేది కాదు,

ఓరోజు ఓబులేశునడిగా. “మల్లి ఎక్కువగా మాట్టాడదా? నిశ్శబ్దంగా పని చేసుకుపోతుంది

  • పల్మరించినా పొడిగా సమాధానం చెప్పి తప్పుకుంటుంది తప్ప మరో మాట మాట్లాడదు.”

“మల్లి మాటల పుట్ట సారూ! గలగలా మాటాడందే ఛనం ఉంట్లేదు.”

“మరి నా దగ్గర పలుకే బంగారంలా చేస్తుందే”

“మీరు పెద్దాపీసరు కదా సారూ - నేనే సెప్పినా - మాట పొల్లు పోతుందని నోటికి తాలం కప్ప బిగించమని”

“అడగటం మర్చిపోయాను - మల్లీ పెనిమిటి ఏం పని చేస్తాడూ?” ,

ఓబులేశు ఉదాసీనంగా మారిపోయాడు. “మల్లి మొగుడు దాన్నాొగ్గేసి ఎటో ఎల్లిపోయాడు సారూ. అయినా దాని పిచ్చిగాని పోలీసులకు సెప్తే కాపురాలు సక్కబడ్తాయా? నేనెంత నెత్తీ నోరు బాదుకుని సెప్పినా దాని తల కెక్కలా. సినిమాలు సూసి అందులో ఈరోయిన్‌ సేసినట్టు 'సేయడానికి పేదోల్లకు కుదుర్తుందా సారూ”

నాలో ఉత్సుకత. “అసలేం జరిగిందో వివరంగా చెప్పు అన్నాను.

“మల్లి పద్నాలుగేళ్ళకే పేమలో పడింది. ఇజీవాడలో ఓ పూట కూడైనా మానుకుంతారు కానీ సినీమాల కెల్లటం మాత్తరం మానుకోరు. సినిమా వోల్లకు రాజపోసకులు మావోల్లే సారూ. వాటి పెబావం కాకపోతే పధ్నాలుగేల్ల పచ్చి పిందెకి పేమేంటి? మల్లి వోల్లు ఏలూరు కాల్వ లాకుల దగ్గర గుడిశెల్లో ఉంటారు. ఆ కుర్రాడు మా ఇంటి దగ్గరోడు - బేవార్సు నాకొడుకు - బీడీలు కాల్సటం, జోబీలో నాల్రూపొలుంటే సినీమా సూట్టం... అదేవాడు సేసే పని. ఇద్దరికీ ఎలా కలిసిందో ఏమో పేమలో పద్దారు. ఇలా అనేకంటే మల్లి పేమలో పడిందంటే శానా రైటుగా ఉంటది.

“దానికి ఆడంటే పిచ్చి పేమ. తీరా కడుపొచ్చాక పెల్లి సేస్మోమంటే ఈలు కాదన్నాడు. మేమందరం సెప్పి సూసాం. ఇన్లే 'అదే సరదాపడి నా యంట పడిన్ది. దానికి కడుపొత్తే నేనేం సేయను? నేను మగాన్ని లచ్చమందితో తిరగతా. నాకు నస్తేనే మనువాడతా అన్నాడు. ఆడి బుద్ధి నాకు తెల్సు. ఆ ఎదవ నాకొడుక్కి కట్నం పైసలు కావాల.

“మల్లి గుడిసెలో ఏడుత్తా కూసుంటుందనుకున్నా. లేదు సారూ. అది సివంగి పిల్ల, ఓరోజు పొద్దుగూకేటేల ఆడివద్ద కొచ్చింది. ఆడి సొక్కా పట్టుకుని గుంజుకుంటూ, ఈడ్సుకుంటా పోలీసుల్కాడికి లాక్కెల్లింది. నాకు బయమేసి నేనూ తోడెల్లా అడ్ని వదలవే అంటే ఇనదు. క కథ్గారారొని - 2004 2222222222.

“ఈడు నన్ను మనువెలా ఆడదో సూస్తా అంది. అక్కడంతా రచ్చ. ఆడు కడుపు సేసి పెల్లికి పైసలద్దుతున్నాడని సెప్పింది. యుస్సై ఆడ్ని నాలుగు పీకి పెల్లి సేస్కుంటావా బొక్కలో తోయ మంటావా అని బెదరగొట్టి టేషన్‌లో ఆల్ల పెద్దాల్లని పిలిపించి పెల్లి సేశాడు. మా పేటలో అందరం దాని గుండె దయిర్యానికి నోటి మీద వేలేస్మున్నాం.

“పెల్లయితే సేసారుగాని సారూ కాపురం సేయించలేరుగా. ఆడు నాలుగు నెల్లు అలా అలా ఉండి సెప్పా పెట్టకుండా ఎటో ఎల్లిపోయాడు. ఇపుడది దాంతోపాటు దాని బిడ్డని కూడా పోసించుకోవాల” అన్నాడు.

మల్లి వాణ్ణి చొక్కా పట్టుకుని పోలీసుల దగ్గరకు లాక్కుపోయి నిల్బోబెట్టిందని ఓబులేశు చెప్పినపుడు నాకు భలే ముచ్చటేసింది. కానీ వాడు వదిలి పారిపోయాడని విన్నాక బాధనిపించింది.

మల్లి పెళ్ళి విషయం విన్నాక నాకా అమ్మాయంటే కుతూహలం పెరిగింది. అప్పటి నుండీ మెల్లగా మాటలు కలపటం ప్రారంభించాను. మొదట్లో కొద్దిగా పొడిగా మాట్లాడినా తర్వాత్తర్వాత చనువుగా మాట్లాడటం అలవాటైంది.

“టత్రదెక్కడున్నాడో తెలీదు. వస్తాడో రాడో తెలీదు. మరి బాబునో పాపనో కన్నాక ఏం చేద్దామనుకుంటున్నాను?” అని అడిగానోసారి.

“ఆదెక్మడికి పోతాడయ్యా - నన్నొగ్రేసి ఆదుండలేడు. ఆడికి నేనంటే పేనం. ఇసేకపట్నం దగ్గరున్నాడని మావోల్లు కబురు మోసుకొచ్చారు. మా సుట్టాలందరికీ సెప్పుంచా. ఆడు కన్సీయటం ఆలీసెం... తెచ్చి నా కాల్ల కాడ పడేస్తరు” అంది.

ఆ అమ్మాయిది అమాయకత్వమో - ప్రేమించిన వ్యక్తి మీదున్న అనంతమైన విశ్వాసమో లేక మూర్ధత్వమో నా కర్థం కాలేదు.

“నువ్వు బిడ్డను కనబోతున్నావని తెలిసి కూడా నిన్నాదిలేసి పోయినాడు మళ్ళా వస్తాడనుకోను. అతని కోసం ఎదురుచూడ్దం కంటే ఇక రాడనుకుని నీ జీవితాన్ని దానికనుగుణంగా మల్చుకోటం మేలు” అన్నాను. ,

“లేదయ్యా! నా నమ్మకం నిజమౌతది. ఆడు ఎర్రోడయ్యా. బెదురు గొడ్డు. నేను పోలీసుల్మాడికి లాక్కెల్లానని అలిగి ఎటో పోయాడు కానీ నా మీద పేమ లేక కాదు. ఆదడొస్తాడు. మీరు సూస్తుండండి. మీకాడికి లాక్కొచ్చి పరిసయం సేస్తా అంది నవ్వుతూ.

నవ్వినప్పుడు మల్లి మొహం మల్లెపువ్వులా విచ్చుకుంది.

వాడు తిరిగిరావాలని - మల్లి నమ్మకం వమ్ము కాకూడదని మనసారా కోరుకున్నా

పురుడింకా వారం రోజుల్లో వస్తుందనగా తనే వాళ్ళింటి దగ్గరుండే మరో అమ్మాయిని మాట్లాడి పెట్టింది.

  • అయ్య శానా మంచోరు. నేను తిరిగి పన్లోకొచ్చేవరకూ బాగా సూసుకోయే” అని మరీ మరీ ఆ పిల్లకు చెప్పి, "పెసవం ఐనాక ఈలైనంత తొరగా వచ్చేత్తానయ్యా” అంటూ వీడ్మోలు తీసుకుంది. మల్లి చేతిలో కొంత డబ్బు పెట్టి “ఆరోగ్యం జాగ్రత్త - నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అమ్మాయి ద్వారా కబురు పెట్టు. నాకు చాతనైంత సాయం చేస్తానూ అన్నాను.

మల్లి కళ్ళలో నీళ్ళు... “మా అయ్య తర్వాత అంత పేమగా సూస్కుంది మీరేనయ్యా” 2222 సహ

అంది.

వారం దాటాక మల్లికి పురుడొచ్చిందనీ - ఆడపిల్ల పుట్టిందనీ పనిపిల్ల కబురు మోసుకొచ్చింది.

ఓబులేసుతో చెప్పినపుడు, “సారూ! మా గుడిశెల్లోకి మీ అసొంటి గొప్పోల్లు రాలేరు. నేను మీ తరపున మల్లికి సెప్తాలెండి” అన్నాడు. నేనే పట్టుబట్టి ఓబులేసుని తోడుతీస్మాని మల్లిని చూద్దానికెళ్ళా. తనొక్కతే ఉందా సమయంలో. వాళ్ళ నాన్న రిక్షా వేసుకుని వెళ్ళాడట. నన్ను చూసి చాలా హదావిడి చేసింది. “కురిసీ తెస్తానయ్యా” అంటూ చెప్తున్నా వినకుండా బైటికెళ్ళింది. తిరిగొచ్చాక, “నువ్వు బాలింతరాలివి. ఇలా బైటికెళ్ళిపోతే ఎలా” అంటే, “పేదోల్లం. ఇయన్స్నీ ఆలోసిస్తూ కూసుంటే కూడెట్టా వత్తదయ్యా” అంది.

నెల తిరక్కుండానే పన్లోకొచ్చింది. ఓబులేసుతో “మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవచ్చుగా” అన్నాను.

“మీ కర్తం కాలేదా సారూ! పన్లోకొస్తే దానికి కదుపు నిండా కూడు దొరుకుద్ది. పిల్లదానికి పాలకు కరువుండదు. దాని కరుసుకు పదో పరకో అయ్యగారిత్తారాయె. అందుకని లగెత్తుకొచ్చింది” అన్నాదతను.

పిల్లను ఇంటి దగ్గరే వదిలి వచ్చేది. పక్కింటి అమ్మాయి చూస్కుంటుందని చెప్పింది. పిల్లకు ఆరో నెల వచ్చాక పన్లోకొస్తూ దాన్నీ ఎత్తుకొచ్చేది. హాల్లో వదిలేస్తే దానిపాటికది కాళ్ళూ,

... చేతులూ యదేచ్చగా ఆడిస్తూ హాయిగా ఆడుకునేది.

ఓరోజు ఉదయాన్నే మాములకంటే గంట ముందే వచ్చింది మల్లి. ఉదయిస్తున్న సూర్యబింబంలా వెలుగుతోందామె మొహం.

“అయ్యా! నేను సెప్పలేదా ఆదు తప్పకుండా వాొత్తాడని. నా నమ్మకం నిజమౌద్దని. ఇజీనగరంలో ఉండంట, మావోల్లు పిల్సుకు రాదానికెళ్ళారు. మా అయ్యతోపాటు ఓబులేసు బాబాయి కూడా ఎల్లాడ” అంది. మల్లిని అంత సంతోషంగా చూడలేదెప్పుడూ... మనస్ఫూర్తిగా సంతోషపద్దా.

మరునాటి నుంచీ మొగుడి గురించి వసపిట్టలా వాగడమే... ఫుల్‌స్టాప్‌లూ, కామాలు లేకుండా గంటల తరబడి అతని గురించే కబుర్లు... “ఆడా ఇజీనగరం నీల్లు పదక బక్కగా, జందా కొయ్యలాగైనాడు. తిండీ తివ్పల్లేక ఎలాగైపోనాడో? ఆడ్ని నూస్తే కడువు తరుక్కుపోతుందయ్యా, సినేమా ఈరోలా గుండేవోడు. మల్లీశ్వరి సినేమాలో ఎన్టీవోడిలా పొడవాటి గిరజాల జుట్టూ, వెడల్పాటి మొకం, కోరమీసం - సూట్టానికి ఏయి కల్లు సాలేవి కావు. అయ్య ఆడిక్కూడా రిచ్చా ఇప్పిత్తానంటే నేనే వద్దన్నా రెండు మూన్నెలయినా ఆడికి మంచి తిండి పెట్టి, సుకంగా ఉంచితేగానీ మల్లా మడిసి కాలేదు” అంది.

“మీ వద్దకు తెద్దామనే ఉందయ్యా కానీ ఆడు సిగ్గుపడ్డున్నాడు. మీరు తిడతారని ఆడి బయం. రేపెలాగూ ఆదోరమే కదా. పొద్దునేల పిల్సుకాత్తా. ఆద్నేమీ అనమాకండయ్యా,

_బాదపడతాడు. నేనది సూళ్ళేను. ఆదు మంచోదేనయ్యా, ఏది మంచో ఏది సెడో తెలీని అమాయకుడు. అద్ని నేనెపుడో సెమించేశా. మీరూ ఆడి మనసుకు దెబ్బతగిలేలా ఏమీ అనకం డయ్యా మల్లిని బాగా సూస్మోరా అనండి. సాలు. ఆడ్ని గ్యానంతో బతకమని ఆసీరెదించండి. మై కధల - 2004 తతత]

చాలు” అందో రోజు.

మల్లికి అతని మీదున్న (ప్రేమకు చాలా ముచ్చటేసింది. అంత గొప్ప ప్రేమను పొంది ఆమె భర్త అదృష్టవంతుడు. అతన్ని తప్పకుండా చూడాలన్న కుతూహలం నాలో....

మరునాడు మల్లి అతన్ని పిల్చుకొచ్చింది. “అయ్య శానా మంచోరు. నువ్వు లేకుండా పోయినా ఇన్నీ నెల్లూ నాకూ, నీ బిడ్డకూ కడుపు కింత కూడు దొరికిందంటే ఈ అయ్య సలవే” అంటూ అతనితో కల్సి నా కాళ్ళకు మొక్కింది.

నేనెక్కడ తొందరపడి అతన్ని తిడ్తానోనని అతని కూడా కూడా తిరిగింది. అవకాశం దొరికినపుడల్లా, 'ఏమీ అనకండి అంటూ సైగలు చేసింది. నేనింత చదువు చదివినా, అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా అతనితో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో నాకు తెలీదన్నట్లు మల్లి నాకు పాఠం చెప్పటం గుర్తొచ్చి, “మల్లి మంచి అమ్మాయి. నువ్వంటే ప్రాణం. అంతగా ప్రేమించే భార్య దౌారకటం నీ అదృష్టం. మల్లిని బాగా చూస్కో" అన్నాను. మల్లి చెప్పమన్న మాట కాకుందా మరో మూడు వాక్యాలు ఎక్కువగా మాట్లాడినందుకు మల్లి ఏమంటుందోనని ఆ అమ్మాయి వైపు చూశాను. సంతృప్తిగా, హాయిగా నవ్వుతూ కన్పించింది. సంతోషమేనా అన్నట్లు కళ్ళిగరేశాను. చాలా సంతోషం అన్నట్లూ తనూ కళ్ళు తిప్పింది.

నేను ట్రాన్స్‌ఫర్‌ మీద విజయవాడ వచ్చి ఓ సంవత్సరం పూర్తవబోతున్న దృష్ట్యా మరలా హైద్రాబాద్‌కు మార్చించుకునే ప్రయత్నాల్లో పడ్డాను.

మల్లి మరలా కడుపుతో ఉంది. మూడో నెల. “ఈసారి మగపిల్లాన్ని కనిస్తానయ్యా. ఆడికి మగపిల్లల మీద శానా బేమ. ఆడి కొడుకే ఆదెక్కదెకీ పోకండా కట్టడి సేస్కుంటాడు” అంది ఉదారంగా పర్చుకునే వెన్నెల్లా నవ్వుతూ.

మల్లి నాతో అలా అన్న వారానికే ఆమె భర్త ఇల్లొదిలేసి మరలా పరారైనాడు. మల్లి ఓబులేసుని తోడు తీస్కెళ్ళి పోలీసులకి కంప్లెయింట్‌ ఇచ్చొచ్చింది.

గలగలా మాట్లాడే మల్లి కొన్ని రోజులు మూగపోయింది. నేను సముదాయించాను.

“ఇప్పటికైనా వాడెలాంటివాడో అర్ధం చేసుకో. నీకు తగిన భర్త కాడు. మీలో మారు మనువులుంటాయని నువ్వోసారి చెప్పావుగా. మంచి కుర్రాణ్జి చూసి పెళ్ళి చేస్కో నీ జీవితం, నీ పిల్లల జీవితం బాగుపడ్డ్తుంది” అంటూ నచ్చజెప్పటానికి ప్రయత్నించాను.

“మా కులపోల్లలో నా అంత సొగసైన పిల్ల మరొకతి లేదయ్యా... నిజం... మావోల్లందరూ ఇదేమాట అనుకుంటారు. నేనిపుడు 'వూ' అనాలే కానీ నన్ను మనువాట్టానికి శానామంది కురోల్లు తయారుగా ఉన్నారు. నాకెవరూ వొద్దయ్యా నాకు ఆడంటేనే ఇష్టం. ఆడు వొత్తాడు. తప్పకుండా వొత్తాడు. నన్ను, పిల్లల్ని వాదిలి ఆడుండలేదు. నేనాడి కోసం ఎదురు సూస్తానయ్యా” అంది.

నాకు హైద్రాబాద్‌కి బదిలీ అయ్యింది. కన్నీళ్ళు పెట్టుకుంటున్న మల్లిని బుజ్జగించి - నా స్థానంలో వచ్చి చేరినతనికి మల్లిని పరిచయం చేసి - విజయవాడ పనిమీద వచ్చినపుడల్లా తనను వచ్చి చూస్తానని మాటిచ్చి బయళ్దేరాను.

ఓరోజు ఓబులేసు నుంచి ఉత్తరం వచ్చింది. మల్లికి మగపిల్లాడట. తల్లీ పిల్లాడు క్షేమంగా కైతే డే బల్లి ౩

ఈల తా ఉన్నారని, మల్లి నన్ను తల్చుకోని క్షణం లేదని రాశాడు. మల్లి కోరుకున్నట్లే ఆమెకు మగపిల్లాడు పుట్టినందుకు సంతోషించినా, మల్లి ఎవరికోసమైతే మగపిల్లాడు కావాలనుకుందో అతనే దూరమైనందుకు బాథపడ్డాను. ఉత్తరం అందుకున్న మూడు వారాలకు విజయవాడ వెళ్ళీ పని పడింది. ఓబులేసుకి నేనొ స్తున్నట్లు కబురు పంపాను. విజయవాడలో నా ఆఫీసు పనులన్నీ ముగించుకున్నాక ఓబులేసుతో పాటు మల్లిని చూద్దానికెళ్ళాను. మనిషి బాగా చిక్కింది. నన్ను చూడగానే వెల్లువెత్తిన ఉత్సాహంతో దగ్గర కొచ్చింది. ఆమె మొహంలో అద్భుతమైన వెలుగు.... నన్ను చూసినందుకనుకున్నాను. కాదు. ఆమె భర్త ఆచూకీ తెల్సిందట. అందుకు. “ఆడెక్కడున్నాడో తెల్సా అయ్యా మీ వూల్లోనే... ఐదరాబాదులో... మావోల్లంతా పిచ్చోల్లలా ఇశాకపట్నం, ఇజీనగరం, సికాకులం ఎతుకుతా ఉంటే ఆడు కుసాల్‌గా ఐదరాబాదులో ఉన్నాడట. మీది శానా పెద్దూరట కదా. ఆద్ని ఎతికి పట్రాడానికి మా అయ్య పోయాడు. నేను సెప్పాకదా. ఆడొత్తాడసీ” అంది. గుడిశెలో మల్లితోపాటు ఇపుడు ఇద్దరు పిల్లలున్నారు. మల్లి చేతిలో కొద్దిగా డబ్బులుంచి తిరుగు ప్రయాణమైనా. వచ్చేముందు మల్లి, “ఆడు రాంగానే ఓబులేసు బాబాయికి సెప్పి మీకు కారుడు రాయిత్తా అంది, హైద్రాబాద్‌ తిరిగొచ్చిన నెల రోజులకు ఓబులేసు నించి ఉత్తరం వచ్చింది. ఎన్ని రోజులు వెతికినా మల్లి మొగుడు దొరకలేదనీ - కానీ అక్కడే ఉన్నాడని మాత్రం రూఢిగా తెల్సిందనీ - మల్లి చాలా దిగులు పెట్టుకుందనీ - ఆరోగ్యం కూడా బావుండటం లేదనీ దాని సారాంశం. మల్లిని తల్చుకుంటే బాధనిపించింది. పిచ్చి పిల్ల... అతను దొరికితే బావుండు.... మల్లి కళ్ళలో మరలా వెలుగొస్తుంది... అతనెక్కడున్నా తనకు దూరంగా, తననొదిలి ఉండలేడన్న మల్లి నమ్మకం బతకాలన్న కోరిక నాలో.... ఓరోజు పనుండి హయత్‌నగర్‌ వెళ్ళాను. తిరిగొచ్చేప్పుడు ఇడ్షీ దోశెలు అమ్ముతున్న బండి దగ్గర ప్లేట్లు కడుగుతూ కన్పించాడు. అతనా కాదా అని అనుమానమొచ్చి మరలా పరిశీలనగా చూశాను. అతనే... మల్లి భర్త... గడ్డం మాసిపోయి - కళ్ళు లోతుకు పోయి - దీనంగా ఉన్నాడు. నన్ను చూస్తే మరలా గుడారం మార్చేస్తాడనుకుని, అతనికి కన్చించకుండా జాగ్రత్తపడి వచ్చేశాను. ఓబులేసుకు ఉత్తరం రాయడానికి కూచున్నాను. దివ్యంగా వెలుగుతున్న మల్లి మొహం కన్పించింది. మల్లి చాలా సంతోష పద్దుంది. అతన్ని ఆ అమ్మాయికి పట్టివ్వటంలో నా వంతు సహకారం ఉన్నందుకు మరీ అనందపద్దుందనిపించింది. ఆ వెంటనే నా కళ్ళ ముందు మరో చిత్రం మెదిలింది. గుడిశెలో దీనంగా మల్లి - ఆమె చుట్టూ చేరి ఆకలంటూ నడుస్తున్న ముగ్గురు పిల్లలు - ఏ మద్రాసుకో పారి పోయిన ఆమె భర్త... మరలా అతని కోసం వెతుకులాట... అంతా వలయంలా కన్పించి భయమేసింది. ఉత్తరాన్ని చింపేశాను.

ఆమె భర్త కన్పించినా తెలియబర్చనందుకు మల్లి నన్ను క్షమిస్తుందో లేదో నాకు తెలియదు గాని అతని ఆచూకి తెల్పితే నన్ను నేను క్షమించుకోలేననిపించింది. తి క కారం -204 2 22

మా కోడి కూయంది ఒల్లి పొదెలా పొడుస్తది? (నో అవి అ ఛ౮ శికోస ధనమ్మది అసలు 'టౌను' కాదు.

కాపురానికొచ్చే సరికి 'టౌను' మొఖమూ చూసెరుగదు.

మారుమూల పల్లె నుంచి టౌనుకొచ్చి ఏడేళ్ళప్పుడే గడచిపోయింది.

ఆరేళ్ళు కట్టుకున్నోడితో “పల్లౌనే ఉండింది.

మగడు 'మల్లన్ను కాటికాపరి.

పొద్దు పొడుపుతో - 'కాటికాదకు పోయెటోడు.

పొద్దు వాలుతుంటే - గుడిసేపుకు వచ్చిటోదు.

"ఉన్న ఊరు అంత పెద్దది గాదు గనుక - మనిషెవడన్నపోతే - ఊరికే తెల్సి పోయేడిది. లేదా కాడు పేర్చేటందుకో. గొయ్య తవ్వెటందుకో ముందస్తుగ - కబురొచ్చెడిది. ఆనకనే తప్పేట్లు మోగేయి. అక్కడ ఉన్నంతకాలం గింజు గిరిబీ దండి గనే దొరికెడివి. కోమటికొట్టు అవసరం అంతగ ఉందెడిది కాదు. బతుకు ఒడు దుడుకు లేక - భరోసాగ గడచిపోయెడిది. 222222 హా కసీ హీడుంది రొద్దె రానుస్టన! ౩

అయితే - 'టౌనుల ఉండెడి కాటికాపరోడు అకస్మాత్తుగ పోవడం - మిగిలినోడు తాగి తగలడుతున్న శవం పక్క తొంగొనడం - వానికిని మండుకొనడం. మేలుకొని - అంటుకున్న మంట నార్పెటందుకు పరుగెత్తడం. “'ాలికది ఇంకా మండడం - అక్కడున్న మరో ఇద్దరు వాడ్ని బలిమిన కింద పడేసి మట్టిన బొలిపడం పోయి తప్పి అక్కడే పడడం, ఇది ఏడ చెప్పాల్నో తోచక ఆ ఇద్దరూ ఎల్లిపోవడంతో. లేచే స్థితిలేక అట్టనే పడి ఉండదం. మత్తు దిగినాక కేకలు పెట్టడం. రాత్రిపూట గనుక ఇనిపించుకునేటోడు లేకపోవడంతో - అకృడే మిగిలిపోయాడట. పొద్దుటే - కాలినోక్ళ అస్థికల కోసమొచ్చినోళ్ళకు - అదోరకమైన మూలుగు వినపడడం - వారిళ్ళు - పొద్దు పొడిచినా దయ్యాలు శ్మశానం వదలక తిరుగుతున్నయనుకొని - భయంతో కంగారుగా పారిపోయె - ట్రాఫిక్‌ పోలీసుతో చెప్పడం - అతగాడు - పోలీసు స్టేషనుకు ఎమర్జెన్సీ మెసేజ్‌ ఇవ్వడం. దయ్యాలని చెప్పాడు గనుక బందోబస్తుగ - ఓ వ్యాను నిండా పోలీసు - హుటాహుటిన అక్కడికి చేరుకొని క్రిందకు దిగడం. భయం భయంగ - తలా ఒక దిక్కుకు నడవడం. కాల్చిన శవాలు శుభ్రంగ కాలి కనపడడం - కాల్చినోడే అరకొరగ "కాలి దయ్యంలా మూల్గుతుండడం గమనించి ధైర్యంగా, సామూహి కంగా అక్కడికెళ్ళి పరిశీలించి ఆ శాల్తీ దయ్యం కాదని నిర్దారణకొచ్చి ('ప్రభుత్వాసు పత్రికి తరలించడంతో - వీరి డ్యూటీ పూర్తవడం, అక్కడ - వాడు రెండు రోజులు తీసుకొని 'హరిమనడంతో - టౌనున పోయినోళ్ళను కాల్చెటోడు దొరకని పరిస్థితులు ఏర్పడింది. ఇక్కడి శవాన్నేమో ఏదో - కులపోళ్ళు కమ్మినయ్‌. శవాల కాడ మిగిలిన చిదుగులేరి - వాడి మట్టుకు కాల్చి “మమ” అనిపించి ఎటోడటు వెళ్ళిపోయారు. దాంతో శ్మశానం అనాథయింది. అప్పుడు హుటాహుటిన ఊళ్ళ మీద పడి వెతుకులాడినారు - కాటికాపరి కోసం. ఆ ఎతుకులాటన 'మల్లన్న దొరకడం. వప్పుకొని - టౌనుకు రావడం జరిగింది. ఇది జరిగి ఏవడేళ్ళయింది. “మల్లన్న ఈడ డ్యూటీలో చేరినాక. ఏడాది తిరగకుండానే శృశానాన పెను మార్పులు చోటు చేసుకున్నవి. మన ప్రభుత్వపోళ్ళు చచ్చినోళ్ళ సౌకర్యార్థం (బ్రతికినోళ్ళకిక చేసేదేమి మిగలనట్టు) కట్టెల ఖర్చుకంటే కారు చవకగ - శవాల్ని తగలెబ్టేందుకు కరెంటుతో నడచే ఓ మిషన్ను కొనేందుకు క భర - 204 11ేెఊఊఊైత222ేేతేేడే్‌ే్‌ో

  • మున్సిపాలిటీలకు పర్మిషనిచ్చిందట. (దాన్ని ఎక్కడ దేబిరించి అప్పు తెచ్చినారో) పర్మిషనొచ్చాక ఆగడమెందుకని మిషను తెచ్చి వెంటనే బిగించేసినారు. దాన్ని ఆడించెటందుకూ, ఓ మనిషినీ వేసినారు. ఈ మిషన్లు 'ఈదికు కొత్తగ రావడం మూలానా దాన్ని నడపడంలో మెళుకువలు అంతగా పట్టు చిక్కకపోవడం మూలానా, దీనికితోడు నడిపెటందుకొచ్చి నోడు 'బాసు తెల్సినా తెలీకున్నా “శవం” కనపడితే చాలు. భయం భయంగ, దూరం దూరంగ వెనకడుగు మీద ఉండి భారమంతా మల్లన్న వైపే వేసెటోడు.

ఏతావాతా 'కరెంటుతో కంటే కట్టెలే బాగు” అన్న భావనను వాడు జనాలలో (బ్రతికున్న) నెల తిరగకుండానే అనిపించాడు. తగలెట్టే సమయానికి - కరెంటు పోయిందనో - 'ఫీజు కొట్టేసిందనో - కరెంటోళ్ళను పట్టుకురమ్మనో వేధించడం. అది వచ్చాక శవాల్ని మిషను దాకా వాళ్ళతోనే మోయించడం. లోనకెక్కించడంతో సవా - భయం భయంగ చూస్తూ చేయించేవాడు. సరిగ్గా సమాధానం చెప్పేటోడు కాదు. 'వస్తున్న పద' అని గంటలు గడిపి సైకిలు పైన వచ్చేటోడు. శవాన్ని తీసుకొచ్చినోళ్ళకు అసలేం చేయాలో తోచక - ఏమీ చేయలేక 'మల్లన్నతో ఏడి, ఎప్పుడొస్తాడు. ఇంకా రాదేం? అసలొస్తాడా? అంటూ వేదించడం - రోడ్డేపు చూడడం - కోప్పడడం, దిగమింగు కొనడం, జుత్తు పీక్కొనడం. శవం దగ్గర వడవడం కూడా మానుకొని అయోమయాన పడిపోవడం నిత్యకృత్యమైంది.

ఇదిట్ట కుదరదని మల్లన్నే చారవచేసి మిషను ఆడించే సిచొలను గమనించి, ధైర్యంచేసి ఆడించడం మొదలెట్టాక టొను కొంత ఊపిరి పీల్చుకున్నది.

ఈ కాలగమనాన - దనమ్మకు ఇద్దరు 'పోరళ్ళు' కల్గినారు. ఇంకా పుట్టుకొనివస్తే - అందరూ చావాల్నొస్తదని - తెలివిగనే ఆపరేషను (పిల్లలు పుట్టుకు రాకుందా) చేయించుకున్నది. ఇంటికీ - వంటికీ సుఖం దొరికింది.

దనమ్మకు గుట్టుగ బతకడమంటే “ఇష్టం.”

'ఎల్లాపొ మనిషి గాదు. తన మగడేందో పోరళ్ళేందో అంతే!

ఎంత అవసరమనిపిస్తేనో - గడప దాటెడిది.

పోరళ్ళు పెరుగుతున్నరు. “వాళ్ళను చదివించింతే బాగు అనుకున్నది ఒకనాడు. అనుకున్నాక ఆగలే. గవర్నమెంటు బడిలోకి తోలింది. ఒంటరిగ ఉండే సమయాన రెండు ఇళ్ళలో 'బట్టలు'తికే పని వప్పుకుంది. పోరళ్ళ 'సాదర్లకు పనికొస్తయన్నదే.

కాలం 'కుదురూగనే నడుస్తుందది.

మల్లన్నకు “ఏడున్నా! వాని పని మొఖమేందో, వాడేందో తప్ప మరో ధ్యాసే ఉండదు.

౦౦+

కాలం నడకన ఏడాది గడచింది.

ఆ దినం - పోరళ్ళను నిద్రపుచ్చి మల్లన్న కోసం ఎదురు చూస్తున్నది. వచ్చెడి వేళ తప్పింది.

. రోజుటి కంటె రాత్రి గడిచింది. 'సందు మలుపు దనక పోయొద్దునా?” అనిపించి లేచింది. నడచింది. మలుపుకొచ్చి పార జూచింది. బజారు సందడిగ లేదు. నిద్రేళ్ళ దాటింది గదా! ఎవరో లగెత్తుకుంటా వస్తున్నట్టనిపించింది. దాపుకొచ్చేసరికి కనుకున్నది. వస్తున్నది శవం 2 73 హాయంచే వొస్ట లాదుడ్రని!

ముందు దప్పుకొట్టే జోగులు. వీడికిటేం పని - ఆ పరుగేంటి? అనుకుంటుండగనే ఎదురుగ గస పెడుతూ నిలబది, గబుక్కున దనమ్మ చెయ్యి పట్టుకుండు. కోపంగ జూసి విదిలించి కొట్టింది. మనిషి తాగి ఉన్నాడు. దనమ్మ కనుగుడ్లెరుపుకు మళ్ళినవి. మళ్ళీ జోగులు దనమ్మ చేయిని పట్టుకొని 'దనమ్మా బేగి పోదాం పది అన్నాడు గుంజుకుపోతూ. నిలదొక్కుకొని 'ఏడికి! ఏందిది?” అన్నది పెద్దగ కసురుకుంటూ. “మల్లన్న తానకు పోదాం పద* అన్నడు. అంతకు మాలిన తొందర కనపడింది వాడిలో. “వాడు రాడా? పని వదలలేదా? లేక వానికేమయిన అయిందా? అంది, వాజణ్ణే చూస్తూ. “నిన్ను రమ్మంటున్నగద! నా మాటిను' అని రెక్కపుచ్చుకుని గబగబ రోడెక్కిచ్చిండు. ఇంతలో చిన్నబ్బ రిక్ష వచ్చి ఆగింది. జోగులు దనమ్మను దాన్లోకి ఎక్కించిండు- “అదేదో అయింది? అన్న అనుమానం మెదిలింది దనమ్మకు. “ఏమయిందిరా? చెప్పి చావరేం?” అంది - రిక్ష ఎక్కి తొక్కుతూనే ఉన్నాడు చిన్నద్బ. ఇద్దట్లో ఎవడూ మాట చెప్పడంలే. 'భయం' మెదిలింది దనమ్మకు. విసురుగ నడచిన రిక్షాను శ్మశానం మొగిన ఆపిండు. ఆపుతూనే 'దిగు” అన్నాడు. పరుగున లోనకి నడిచిండు. జోగులూ కలిసిందు. చెమటలు కారుతున్నయ్‌. ఎగరొప్పుతున్నాడు. ఇద్దరూ లోనకు నడచినారు - శ్మశానం పెద్ద గోడ పక్మన. మల్లన్న సోయిదప్పి పడి కనిపించిందు. అబక్కుమన్నది దనమ్మ గుండె! “ఓరి దేవుడో! ఇదేందిరో!” అంటూ రెండంగలలో మల్లన్నను చేరి వానిపై పడింది. మల్లన్న నోటెంట - 'నురగ' కారి కనిపించింది. 'ఏందయ్యా ఇదీ! ఏమయింది నా వోనికి? అంది గుండెలు బాదుకుంటూ- సమాధి వెనక నుంచి మట్టయ్య వచ్చిండు - 'పురుగు ముట్టిందే, పసరు పోసిన -తిరుగుతదిలే. లొల్లి చెయ్యకు అన్నడు. నింపాదిగ ఆకు చుట్టను - కొరకసంటించుకుంటూ. ఈద అంతా 'అగ్గే గదా! ఈడ పురుగు ముట్లటమేంది? వాటికీ చావంటే 'ఫికరొ గద! అన్నదు, జోగులు అనుమానంగ నెత్తి గోక్కుని. వానికీ భయంగున్నట్టుంది. ఎజ్జటి కనుగుడ్లలో నీరు నిండి కనిపించింది. 'అట్టా సూత్తారేమయ్యా, పెద్దాసుపత్రి కాడకు తీస్కుపోదాం. రిక్షా తీస్కురండి అంది ధనమ్మ లబలబలాడుతూ,. జోగులు మళ్ళీ లగెత్తిందు. నాలు నిముషాలలో రిక్షాతో వచ్చిండు. ఈలోపు మల్లన్న ఒళ్ళు చల్లబడడం మొదలయింది. గాలి ఆగింది - బిగుసుకున్నాడు. ఆసుపత్రికి మోసుకుపోయే పని తప్పింది. మట్టయ్య చేతనున్న కొరివిని పారేసి మల్లన్న 'నాడొ చూసిందు. పెదవి విరచి లేచిండు. 2౭23222 డడక కైకథరూం- 204 కేక్‌

( జీ 4 0.౫6.2..20వ. 4) కా //

పట్టుకున్న చేతిని వదిలిండు. అది కట్టె లెక్క జరిగింది.

అపరాత్రయింది. కరంటు 'బగ్గుమంటున్నది.

మిషనాడిచ్చెటోడికోసం - లగెత్తిండు 'జోగులు”

“ఇప్పుడేంది పొద్దుటే అని గదిమిందు వాడు - కళ్ళు నులుముకుంటూ.

“మన మల్లన్న అన్నాక - గుణుస్తా వచ్చిండు. సంగతి తెల్సుకున్నాడు.

పొద్దు పొడవకముందే మల్లన్నను “బూడిద చేసి గుడిసేపు మళ్ళింది ధనమ్మ.

పోరళ్ళింక నిద్రలోనే ఉన్నారు. అంతా “కల' లెఖనయింది. కంట్ల తదారడంలే. పోరళ్ళు లేవగానే - '“అయ్యేడి? అంటరు గదో' అనిపించగనే - గుండె చెరవయింది.

'నోట్లు పైట చెంగు పెట్టుకుని ఏడుస్తా కూకున్నది.

పొద్దు పొదుస్తందగ - ఆశమ్మ, పోశమ్మలు జమయిను.

జరిగింది తెల్సుకొని కళ్ళోత్తుకున్నరు.

“బిడ్డా! ఎంత కట్టమొచ్చి పడ్డదే' అని ముక్కులు చీదుకున్నరు -

పోరళ్ళను భుజానేసుకొని 'కూసేపు' మోసినారు -

బిక్క చచ్చి - వాళ్ళు బెదురు చూపులు చూస్తుంటే - బొంగుండలు కొనిపిచ్చినారు.

“యేళ్ళ మించుదంటే - ఎవని తోవన వారు పోయినారు -

పోరళ్ళను పెట్టుకొని ఒంటరిగ మిగిలింది దనమ్మ.

“అయ్య! ఊరికిపోయిండా? అనడిగినాదు పెద్దోదప్పుడు.

“ఎందుకేడుస్తుండవు?” నీ కాకలిగనేదా?' అన్నట్టుగ చూసింది పోరి - గుండె పగిలింది దనమ్మకు.

ఇద్దర్ని వళ్ళో కూకుందబెట్టుకొని బావురుమన్నది -

రెండు దినాలయినంక - సర్దుకుని ఇంత ఉడకేసి - పెట్టి పోరళ్ళను బడికి తోలింది -

పగలు - వప్పుకున్న బట్టలుతుకుడు పనికిపోయింది - గుండె పదిలపరచుకొని! ఎంత ఏడ్చినా మిగిలెడిది ఏడుపే తప్ప - దోవ కనపడదాయె! పోయిన మల్లన్న రాడు గద!

పనికాడ - రానియ్యలే. పైగా “కాటి కాపరోని పెళ్ళానివట గద!” గా ముక్క చెప్పకనే - పనిలోకొస్తివి గద! “అమ్మో! ఇక ఇటు రాకు + అని గయ్యమని లేచి - తలుపు లేసుకున్నరు. అయ్యో పాపం మగడు పోయిండన్న కనికరం పిసిరంత చూపలే. కాటికాపరోడు మనిషి కాడా? దయ్యామా? అనెడిది తలకెక్కక పాయె. గుడిసె తానకొస్తే - కూకోబుద్ది కాదాయె. - నిలబడనూ లేకుండె.

“ఇట్టయితే పోరళ్ళనేం జెయ్యాల?' అనుకున్నది! అంత గుండె కోతనా.

పొద్దుటే పోరళ్ళకు ఇంతపెట్టి - “బళ్ళకు' తోలి - శృశానానికే పోయింది - ,

ఆడ మిషను నడిపెటోడిని - కలిసి ' నా 'మగని” పనిక్కడున్నది కద- వాని పని ఈ పొద్దునుంచి నేనే జేస్త - చెయ్యాల - లేకుంటే ఆకలితో మేం చావాల్సొస్తది' అన్నది.

నా కెరకలే! అని 'అయినా ఈడ ఆడోళ్ళు పనికిరారు అన్నడు.

దనమ్మకు అడవిని పడ్డట్టయింది. గుబులు పెరిగి ఏడుపొచ్చింది. మల్లన్న యాదికొచ్చి 22222222 రూకో టీ హాయంసి రొద్ద౮ రొదుగ్రని! క్ష్‌

అ పెద్దంగ ఏడ్చింది. ఏడుస్తనే పనిమొఖాన జొరబడింది. మాపటేళ దనక చేసింది. గుడిసెకు మళ్ళింది. న 'మున్సిపాలిటీ వోరిళ్ళు గద! మల్లన్నను పనిలో బెట్టుకున్నది. ఊరి నుంచి పట్టుకొచ్చినది. గాదికే పోయి అడగాల! గట్టయితేనే - నెలకింత మగని నౌకరాస్తది!? అనుకొని పొద్దుట శృశానాన, పని, అరసు కొని - మున్సిపాలిటీ ఆఫీసుకు చేరింది. మనం పోయినప్పుడల్ల అది తెరచి ఉండదు గద! ఉన్నా చదువుకున్న బాబులు - పనికొచ్చెటేళ్ళంటే - పొద్దు నడినెత్తి కొస్తది గద! ఆఫీసు ముందు - వారగ కూకున్నది. మల్లన్న గుర్తులోకొచ్చిండు. అసలా పనికి ఇంతకాలమెట్టుండదో? అరె! శవాలు వరసాగ వస్తనే ఉంటయి. వాటిని మిషను తానకు చేర్చుడు. కానా నుంచి లోనకు నెట్టుడు. మూతేసుడు. బూడిదయెనంక - ఎవనోడిది, వానికిచ్చుడు

  • ఈలోపు ఓ పక్క వేడి కమురు కంపు - మద్దె మద్దెన కరంటు పోవుడు. వళ్ళంత గుబగుబ గుంటది. పొద్దుట ఆకలీ అవుతది - కాని ముద్ద నోట దిగదు. వాకర, నెట్టిన శవాలు తల నుంచి వదలవు - ఇది ఒక్క దినం, పనిన - అంతుబట్టై! జీపొచ్చింది - ఆగింది. దర్జాగ దిగిండు కమిషనరుబాబు. లేచి, మొక్కేసింది దనమ్మ. ఆయన ముందు దిగి నడుస్తున్న చప్రాసి, ఏయ్‌! ఛ, లే - లే - ప్రక్కకు అని దోమల్ని అదిలించినట్టుగ చేతిని విసిరిండు. అయినా కమిషనరుబాబు దనమ్మ నొకమారు - చూసిండు. 'మురికిగ ఉందిగాని. మంచి పోరే అనుకున్నడు. పల్లె పట్టు అందాల బిగువంటే పాపం ఈయనకు 'మాలావు” మురిపెమట. లోనకెళ్తూ గేటు గుమస్తాతో - 'చాన్ని లోనికంపు అని లోన దూరిందు. ఈల ఊపిండు దనమ్మను చూస్తూ - పది నిముషాలాగినాక, దనమ్మ తాన కొచ్చిన గేటు గుమస్తా “నిన్ను లోపలి కంపు తాగానీ, రాంగనేే నా మామూలు నాకిచ్చి పోవాల అన్నడు. వాని వాలకం జూస్తే 'వాడు చస్తే - కాటికొస్తే - మామూలిచ్చినా తిప్పలు పెట్టాలి అనిపించింది దనమ్మకు. 'అయ్యా! నా తానేముంది
  • మీ వోళ్ళి వళ్ళన్న పోతే రా! శుభ్రంగా కాల్చిపెడతా! అన్నది. ఈ మాట విని - బిక్క చచ్చి బెదిరిపోయిండు. ఉలికిపాటుగ గేటు చేరిందు. 'పోరి బాగానే ఉండది' అను కున్నడు కంళ్ళ చిడంగనే - ఇప్పుడు అటు చూద్దామంటేనే ఒళ్ళు వణికింది. ఇంతలో 'బెల్లు మోగింది. లోనకు తొంగి చూసిండు - ఆనక బయటకు తల మలిపి - దనమ్మను పిలిచి - లోన కంపిండు,. లోన క్షడుగుపెట్టి దండమెదుతున్న దనమ్మను ఆపాదమస్తకం చూస్తూ - “ఏం? ఏంటీ? ఏం పని?” అనడిగాడు. “అయ్యా! నేను మల్లన్న పెళ్ళాన్ని” అంది కొద్దిగా వంగి. 'మల్లన్నా? ఆడెనడు?' అన్నాడు ఆవిడనే చూస్తూ, 'కాటి' మిషను కాడ పనిచేసేటోడికి - సాయంగ ఉందెటోడు. అది రాకముందే - కాట్లు పో ౭౭౭౭

ాాాలాలాలాాాలాలాడూా కాల్చెటందుకు పల్లె నుంచి పిలిపించి పెట్టుకున్నరు. వారం దినాలకు ముందు కాటికాదనే పనిజేత్తూ - పురుగు ముట్టి ఊపిరి" డిసిందు. ఇది నిబద్ది. కాల్బ్చేటోద్ని కనుక్కోండి చెప్తడు.

“అయితే? అన్నడు ఇంకొంచెం దగ్గరకు రమ్మనమని.

“అయ్యా! నౌకరి చేస్తా చస్తే వాని కుటుంబం (బ్రతుకు తెరువు కోసం ఎన్నో కొన్ని పైసలిత్తరట! “గవి వస్తయి. నీ పోరళ్ళకు పర్లేదు.” అని ఇప్పటికి చెప్పినోడు లేడు. మా కిద్దరు పోరళ్ళున్నారు. మావోడు కష్టం జేసిటోడు గాదో - వాడు చేసెడిది కష్టం కాదో. కష్టపడెటోళ్ళకు సంఘాలున్నయంట. వాటిల్ల వీడు లేదో. నాకు తెల్టు. వాడు పోయిండు. నేనూ పోరళ్ళం రోడ్డున పడ్డాం. 'రికాగ సంపాదనొచ్చేందుకు. సంఘ పోళ్ళం గాదు గద! పార్టీల్ల తిరిగినోళ్ళము గాదు. రెక్కాడితే డొక్కాదెటోళ్ళం? అని మళ్ళీ మొక్కేసి, 'అయ్యా! తమరు పైకం ఇప్పించినా - ఇప్పించకున్నా, చేసెడిదే ముంది. అయినా ఊర్కె ఇచ్చెడి పైసలపైన నాకు ఆశ లేదు.”

“మరి అన్నడు మొఖం చిట్లించి.

“నా మగడు చేసెడి పని నేను జేస్తన్ను గా జీతం నా కిప్పించండి. బతుకుతం' అన్నది నీళ్ళు నిండిన కళ్ళను గబుక్కున పైట చెరగుతో వత్తుకొని -

కాటికాడ నువ్వా? అన్నడు కళ్ళింత చేసి

“అవును సామి నేనే! నా పని మొఖం చూసుకొనండి' అంది.

“నువ్వు ఆడదానివి. 'ఆడి పనికిరావు. అన్నాడు -

'ఆడది మనిషి కాదంటారా సామీ! పని చేయలేదా? ఆ ఫికరు 'తమకొద్దు. పని నచ్చకుంటే తీసేయరి. పని చేయకుండ జీతం తీసుకునేటందుకూ, లంచాలు అడిగేటందుకూ నేను గవర్నమెంటు ఉద్యోగిని కాదు గద! అన్నది.

వీపున ఎవరో చాచి చరిచినట్టనిపించింది కమిషనరుగార్మి దనమ్మ వయస్సూ, అరకొరగా కనిపిస్తున్న వంపులూ, 'దప్‌ని మాయమైపోయినాయి. కాలుతున్న శవం అకస్మాత్తుగ లేచి ఎదురుగ నిలబడ్డంతో భయమైంది. వెంటనే కుర్చీ నుంచి లేచి బెల్లు మోగిస్తూ పో, పో, వీలుపడదు. పో అన్నాడు చిరాకుగ చేయి విదిలిస్తూ.

గేటు బంట్రోతు 'బేగి' లోనకొచ్చి, దనమ్మను 'పద, బైటికి పద! అన్నడు గదిమి.

దనమ్మ! వాణ్ణి లెజ్ఞ చేయక - “ఆగు! అని అరచి - 'పోతా సామీ! పోతా! కానీ. నేను ఆడనే పని జేస్త' కాటికాడ మల్లన్న పెళ్ళాన్నంటే బయటి కష్టం చేద్దామన్నా పని చేయడంలే - నేను పనిలోకే పోతన్న. నాకు జీతం పంపాలి. నెలాగాక. జీతం అంపకుంటే, నా పోరళ్ళను వెంటేసుకొని వచ్చి అక్కడే పస్తులుంట! మిషనకు అడ్డంగా పోరళ్ళను పండబెడత. సామీ! నేను తమర్షి సాయమడగడంలే! అప్పడగడంలే! ప్రభుత్వమూ, కంపెనీలూ, చచ్చాక ఇచ్చేయీ అడగడంలే! నా మగడి పనిని నేను జేస్తసంటున్నా. చేసిన పనికి పైసలియ్యమంటున్న ఆంగ అని మళ్ళీ మొక్కేసి వెనక్కి మళ్ళింది.

కమిషనరుగార్కి దిగ చెమటలు పోసినయి -

కుర్చీలో - ఏదోలాగయి చతికిల పడ్డాడు. రెండు గ్లాసుల చల్లటి నీళ్ళు త్రాగాడు - అప్పుడు - ఛైర్మన్‌కు ఫోను కలిపాడు. జరిగింది చెప్పాడు - 212222222౯ కోసి హూయంది తొద్దెో వాదుస్తని కై

పనిలోకి వస్తదేమో చూడు. వస్తే కాదనకండి గొడవవుతది. ఆనక చూసుకుందాం అని పెట్టేశాడు. - దనమ్మ శ్శ్మశానాన 'నౌకరీ' చేస్తూనే ఉంది. 'పనిచేయకు' అని ఎవ్వరూ అనలేదు. 'చెయ్య'మని చెప్పినోడూ లేడు. ఈ ఉద్యోగానికి సంబంధించిన ఏ 'కబురూ' రాలేదు. కాలం దొర్లుతున్నుది. దనమ్మ మల్లన్న కంటే కూడా మెళుకువగ పనిచేస్తున్నది. మిషను నడిపెటోడు సంతృప్తిగ ఉన్నడు. అయితే - ఇక రేపు జీతాలిస్తారనగా ఓ 'కరణపాయని శవమొచ్చింది. బంధువు లంతగా రాలేదో, ఇతర దేశాలలో ఉన్నారో తెలీదు గాని, నల్లురే వచ్చారు. 'కాల్బమని - చెప్పి. పైకం కట్టి, రశీదు పుచ్చుకొని వెళ్ళిపోయారు నిర్వికారంగా. “ఇదేం చుట్టరికాలో” అనుకుంది దనమ్మ. ముసలయ్య శవాన్ని చూస్తే జాలనిపించింది. కరంటు రాగానే, 'ఇక లోపలికి నెడదాం” అన్నాడు మిషనతను. “సరేనని తోడు పట్టింది. “లోపలికి పూర్తిగ నెట్టి 'లాక్‌' చెయ్యి' అని స్విచ్‌ దగ్గర కెళ్ళాడు. దనమ్మ ఎంతలో బయటికొస్తదో తెల్సు గనక దాని ప్రకారం స్విచ్‌ నొక్కాడు - దనమ్మకు లోన ఏం జరిగిందో తెలీదు గానీ - బయటకు రాలేకపోయింది. ఆ శవంతో పాటు 'మాడిపోనూ పోయింది - మిషనాడించెటోడికి జరిగింది అర్ధమయ్యే సరికి ఏం మిగలలేదు - గజగజ వణుక్కుంటూ జరిగింది మున్సిపాలిటీకి తెలిపాడు. పోలీసులూ అంబులెన్సూ వచ్చింది - దనమ్మను తీసుకెళ్ళారు. ఓ వారం దినాలు జరిగాక - .వైర్మన్‌గారి మనిషాకడు, మషనోడికి సాయంగ ఉండదేం దుకు వచ్చి చేరాడు. తద ధనమ్మల పోరళ్ళేమయ్యారో తెలీదు. వారి జాడ కోసం పట్టించుకున్న వారూ 6౦౮6 న్యాయానికివి చాలా అన్యాయమైన చావులు! ఎక్కడో పల్లెపట్టునున్న మల్లన్నను బతిమాలి, బామాలి, తీసుకొనివచ్చిన మున్సిపాలిటీ - చచ్చిపోయిందాకా పని చేయించుకుందే తప్ప పట్టించుకొనలేదు - కారణం తెలీదు. పార్టీల పరంగా - మల్లన్నకు ఏ పార్టీతో సంబంధం లేదు గనక, ఏ పార్టీ - ఇతన్ని చూడలేదు. ఇతనికి సహకారమూ చేయలేదు. ఏ పార్టీతో - ఏ కొంచెం సంబంధం ఉన్నా వాళ్ళ జండానైనా తెచ్చి కప్పి డప్పులతో సాగనంపేవారు - ఉన్నోళ్ళకసలిది పట్టలేదు. తగలెట్టడం ఆగితే గదా వాళ్ళకు తెలిసేది. దనమ్మ - మల్లన్నల చావు - మేధావుల దాకా వెళ్ళలేదు. ఆ అవకాశమూ లేదు. కార్మిక, కర్షక సంఘాలు నిజానికి ఇలాంటి వాటిని పట్టించుకోవాలి. కష్టజీవులమంటారు గనుక - మల్లన్న దనమ్మలు తమ కష్టాన్నే నమ్ముకొని - బుషుల్లా బ్రతికినోళ్ళు గనుక - మరి, వారూ రాలేరు. ఈ సంఘాలలో సభ్యుడు గాదు కావచ్చు. ఇక, మధ్య - దిగువ మధ్యతరగతి వారికి, వారి 'స్వంత చావును చూసుకొనే తీరికా, ఆసరా లేక త్రిశంకుస్వర్గాన లటకాయించుకుంటొరు గనుక - అక్కడికింతే. “అదేం” తమకు క కథళరన- 2004 డెత్‌

ాాాాాంంూ చుట్టుకొంటుందోనని భయపడి దూరంగా జరిగి ఉంటారు. గుబులుతో వేడెక్కి బిచ్చానికీ రోడ్డుపైకి ఎగేసుకొనివచ్చే - మహిళా మండలులకు - దనమ్మ దృష్టిలోకెందుకు రాలేదో అర్ధం గాదు. వారి కదలిక బొత్తిగ కనిపించలేదు. బహుశా ఈ సమాజ స్త్రీ జనోద్ధరణ ఎలా చెయ్యాలా? అన్న చర్చలలో నిమగ్నమై ఉండొచ్చు -

ఇకపోతే దళిత సంఘాలు, అతి చిన్న విషయాలకే చాలా ఘట్టీగా కరుస్తూన్నట్టు అరవడం

  • వింటుంటాం. మరి ఈ దంపతుల దయనీయపు చావూ, పసివాళ్ళు అనాథలవడం, వీరి దృష్టి పథాన ఎందుకు పడలేదో తెలీదు. వీరి కేకలు, ఎక్కడా వినిపించలేదు.

(ప్రభుత్వపరంగా ఇచ్చే ఎక్స్‌గ్రేషియా రాలేదు. కారణం నౌకరీ చేస్తున్నట్టుగ రికార్డు ఆధారాలు

లేక కావచ్చు.

పిలిపించి పనిచ్చిన మున్సిపాలిటీ పాలిత వర్గమూ - అక్కడ కార్మికులు కూడా మల్లన్న అక్కడ పనిచేసినట్టు - ధృవపరచి సాయం చేయలేకపోయింది - అక్కడ అలాటి పోస్టింగ్‌ లేదని మఠ్తీ ఖరాఖండిగ చెప్పడం జరిగింది - ఇందరు తెల్సిన వాళ్ళకు కాకుండా పోయిన మల్లన్న దనమ్మలు ఎవరికి ఎలా తెలిసినట్టు?

మల్లన్న చేసింది చచ్చినోళ్ళను కాల్చ్బ డమో, పూద్చడమో.

అతనెంత శుభ్రంగా కాల్చినా, పూడ్చినా శవాలనే గద!

శవాలంటే చచ్చాక వచ్చేవే గదా!

మరి వాళ్ళు ఇతన్ని. గుర్తుపట్టలేరు గద!

ఇక (బ్రతికున్న వాళ్ళేమో - పోయిన వాళ్ళనకృడే వదిలేసి, బాధగా, వెళ్తుంటారు గద. ఎవర్ని ఎవరూ అక్కడ పట్టించుకోలేరు గద.

కనుక -

మల్లన్నను కాల్చగ మిగిలిన చితుకులతో కాలవాల్సొచ్చింది -

మిషన్న చిక్కుకొని దనమ్మా బూడిదయింది -

ఇన్ని - 'లేబుల్సులో ఉన్న ఈ నిరంతర జనసేవకులు - మల్లన్న దనమ్మలకు “'మనిషిగ, తోటి 'మనిషిగి గుర్తించలేక పోయారేం!

వారంఛా తాము లేంది జరిగే - 'సేవి ఆగిపోతుందనుకొని ఆరాటపడేవాళ్ళే గదా! చివరిమాట:

ఈ దేశాన నూటికి 70% మంది మనుషులకు ఇట్టాటి ఏ 'నేవా' సంఘాలతో అను బంధ సంబంధాలుండవు. చివరకు రాజకీయాల వాళ్ళతో కూడాను మరి. బొడ్డుకు 'మసి” రాసుకొని నిరంతర “సేవను న్యాయమనుకొనే సంఘాల వాళ్ళు ఇందర్ని వదిలేసాకు వార్ని వారు ఉద్దరించు కొంటారా? మల్లన్న 'మన మనిషి అని ఇందులో తోటి మనిషీగ ఎవరనుకున్నా వారి (గతి లాగుందేది కాదు గద!

మరి ఈ మనుషులు అనలు మల్లన్నను తోటి మనిషిగ ఎందుకు భావించలేక పోయారు?

  • ఆలోచించండి తమ సంఘపు 'గిరొన లేకుండదం మూలాననా?

అ 2322222222 కాకీ హొయంది వొద్దా రాదుట్రి ౩

(ల లా కతి పడవలు

అనాలో అ 39. సెరిధీరీరార్ర

యౌనెప్పుడొస్తుందా, పడవల పందేలెప్పుడెప్పుడు పెట్టుకుందామాని బళ్ళో కొచ్చినప్పట్నుంచీ కిటికీలోంచీ మబ్బుల్ని చూస్తా, మద్దె మద్దెన పక్కనున్న బాచిగాడితో, ఎనక బెంచీ రాంబాబు గాడితో గుసుగుసలాదతా వుంటే, “నిన్న సైకిలు మీంచి పడ్డప్పుడు మీ మామ నిన్నిడుసుకున్నా డంటగా అంటూ రామాంజనీలుగాదు ఎనక బెంచీ లోంచి, ఎకసెక్కంగా గిల్లి మరీ అడిగాడు.

“అరేయ్‌ పొట్టోదా... నన్నెవడిడుసుకుంటాడు. నాకేవన్నా దెబ్బల్తగిలాయా పాడా. సైకిలేండి లొంకర్లు పోయిందని, మడ్డుగార్రేక్కు సొట్ట పడిందని మా మావేడుస్తువుంటే, డొక్కు సైకిల్తెచ్చి నాకిచ్చినందుకు మమ్మా నాన్న మా మావనే తెగిడుసుకున్నారు.”

నేనట్లా చెబుతుండగానే, మా సైన్సయ్య వారు - “పొట్టపొడిస్తే అక్షరమ్ముక్క లేదు.... గాడిద.... పాఠం చెబుతుంటే ఒకటే మాటలు... పక్క చూపులు. పైగా వినే వాళ్లను చెడగొట్టడం. పిరీడు అయ్యే వరకు బెంచీ ఎక్కి నిల్చో అనొక్క ఉరుమురిమారు.

బెంచీ ఎక్కడం మనకేమీ కొత్త కాదు గానీ, మబ్బులు కనిపించవనే బెంగ.

పొలాల కవతల నుంచి దుమ్ము రేపు కొస్తూ గాలివాన.

స్కూలొదిలిపెట్టాక ఇళ్ళకు పరిగెత్తే మూడో క్లాసు పిల్లల్లాగున్నాయి మబ్బులు.

గాలికి కిటికీ తలుపులు అప్పుడే నిద్ర లేచిన కోడిపుంజు రెక్కల్లా టపటపా కొట్టుకుంటున్నాయి.

“బెంచీ ఎక్కించినా నీకు సిగ్గు లేదురా...” అని, రామాంజనీలును కిటికీ తలుపులు మూసేయమని చెప్పారు మేష్టరుగారు.

తలుపులందక వాడెగురుతా వుంటే - కిటికీ రెక్కలు దొరికినట్టే దారికి తప్పించుకుని క కథారారాని - 2004 22222222222222222్ష్షేేేేేడేే*=

లాడాలి టపటప కొట్టుకుంటుంటే. పొట్టోడు జారిపోతున్న చడ్డీని ఒక చేత్తో పైకెగలాక్కుంటూ అదాటున ఎగురుతా వుంటే భలే నవ్వొచ్చింది. నేనుగానీ వాడి పక్క నుంటే, గబుక్కున వాడి చడ్జీని కిందకు లాగేసుందును. మేష్టరుగారు పాఠం చెబుతూ, మిగతా పిల్లలు పాఠం వింటూ రామాంజనీలు ఎవ్వారం ఎవ్వరూ చూడ్డంలేదని, “కిటికీ నేనెయ్యనా మేస్టారు” అంటే - పక్కన ఉరుము లేని పిడుగు పడ్డట్టు ఒక్కసారిగా అందరూ నా వైపు చూసి, క్రిష్టాష్టముప్పుడు వుట్టి కొట్టదానికెగిరినట్టు ఎగురుతున్న పొట్టోడిని చూసి ముందు మేష్టరుగారు, తర్వాత నేను, మిగిలిన మా క్లాసు పిల్లలు ఒహటే నవ్వులు. ఆఖర్న రామాంజనీలు - అందరూ తన్ను చూసి నవ్వుతున్నారని తెలిసి, సిగ్గుతో వంకర్లు పోతూ నవ్వేశాడు. గాలి ఇంకాస్త పెరిగి, చినుకులు పరిగెత్తుకుంటూ మా క్లాసులోకి రాబోయి, మేష్టరుగారిని చూసి అడక్కుండా లోపలి కొస్తే బాగోదని తటపటాయించి, తొంగి తొంగి చూస్తుండేసరికి - కిటికీ దగ్గరగా బెంచీల చివర్లోలో కూచున్న వాళ్ళంతా .... కొంచెం కొంచెంగా జరుక్కుంటూ బల్ల రెండో కొసన కూచున్న వాళ్ళను నెట్టడం, వాళ్ళు కాళ్ళను నేలకు తన్ని పెట్టి, కిటికీ వైపు వాళ్ళను కిటికీ వైపుకే తిరిగి నెట్టడం... క్లాసు రూమంతా వాన నీళ్ళలో కాయితప్పడవలా వూగుతోంది. వానలో చప్పగా తడుస్తున్న గంటను, క్లాసు రూము పైకప్పును, ఎదురుగా వున్న మమ్మల్ని చేతికున్న వాచీని మార్చి మార్చి చూసుకుని, “గోల చేయకుండా కూర్చోండి. లెక్కల మాష్టరొచ్చే వరకు. బయటకెవరన్నా కదిలారా వానలో గోదకుర్చీ వేయిస్తానని చెప్పి సైన్సయ్య వారెళ్ళి పోయారు. పైకప్పు కన్నాల్లోంచి బొట్లు బొట్లుగా పడుతున్న వాన నీళ్ళను దోసిళ్ళలో పట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళం చల్లుకుంటూ ఉంటే, పొట్టోడు బల్లెక్కి కిటికీ తలుపులు బార్లా తెరిచేశాడు. కాంతమందిమి కిటికీ దగ్గరకెళ్ళి పోయి, నీళ్ళనాపాటున పట్టుకుని చల్లు కోవడం మొదలెట్టాం. ముందు బెంచీల్లో కూచున్న వాళ్ళు నోటు బుక్కుల్లోంచీ మధ్య పేజీలు చింపుకుని పడవలు చేసుకుంటున్నారు. ఎనక బెంచీల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటా అరుస్తున్నారు. ప్యూను సీనివాసులు నెత్తి మీద మూడు మడతల గోనెపట్టా కప్పుకుని పరుగెత్తు కెళ్ళి పోయి ఇంటి బెల్లు కొట్టేశాడు. 'జైహిందో' అనుకుంటూ అందరం ఇళ్ళకు ఒహటే పరుగు. తొందర తొందరగా ఎల్లిపోయి మా ఇంటి ముందు సైడుకాలవలో పడవ లొదిలి, మిగిలిన పదనల్ని తుక్ళురేగ్గొట్టాలని నేనందరికంటే ముందు ఉరుకుతా ఉంటే - బాచిగాడు, రాంబాబు నా వెనకాతలే పరిగెత్తారు. వానలో జుట్టు తడిస్తే జలుబొస్తుందని, జలుబుతో జొరమొస్తుందనీ - అమ్మా నాన్న కంగారు పడతారని నా భయం. మొన్నాక రోజు మా మామ సైకిలు తొక్కుతూ, నడి రోడ్డు మీద ఢామ్మని పడితే - సైకిలేండిలు వొంగి పోయిందని, మడ్డుగారుకు సొట్ట పడిందని మామ నన్ను తిడతా వుంటే - నేను రోడ్దు మీద పడ్డప్పుడు, నా పక్క నుంచీ ట్రాక్టరెళ్లిందని తెలిసి - 2త2తత2త2222242తేతైతత2త22్త కర్త రదహం కై

తా “సైకిలేండిలు ఇరిగిపోతే పొయ్యింది లెద్దు. పిల్లోడికేమీ కాలేదు. లేచినేల మంచిదైందని” ఇంటెల్లపాదీ నన్ను చూసి ఆనందించారు. మరిప్పుడు జుట్టు తడుపుకుని, వాల్లంతా నాన్సుకుని జలుబు తెచ్చేసుకొంటే అంతా దుఃఖమైపోరూ - సంకలో పుస్తకాలు తప్పించి చుట్టూ తల మీద కప్పుకోడానికేదీ కనిపించలేదు. తడిసిన చాక్కాలోంచి నీళ్ళు చిన్నగా పుస్తకాలకు కూడా అంటుతున్నై.

రాంబాబు మైనం కాగితం పుస్తకాల సంచీని, బాచిగాడేమో రేకు పుస్తకాల పెట్టెను నెత్తి మీదెట్టుకుని అలుపు తీర్చు కుంటూ నడుస్తుంటే, తల మీద పుస్తకాలెట్టుకుని నేనూ వాళ్ళ పక్కనే నడుస్తున్నా

రోడ్డులన్నీ నీళ్ళలో దాక్కున్నాయి.

సైడు కాల్వల్లోని వాన్నీళ్ళు పొంగి, మా పడవల కోసం తొంగి తొంగి చూస్తున్నాయి.

ఎక్కడెక్కడి మబ్బులో పడవల పందేలు చూడ్డానికి గుంపులు గుంపులుగా కూడి మా వూరి మీద కాస్తున్నాయి.

ఉరుమొచ్చినప్పుడల్లా “అర్జున... అర్జునా" అనుకుంటూ, గాలి గట్టిగా కొట్టినప్పుడు వొంటి కంటుకుపోయిన టెర్లిన్‌ చాక్కా చలి పెడుతుంటే గజగజ వాణుక్కుంటూ ఇంకాస్త తడిసి ముద్ద ఇంటికి చేరేసరికి, మా ఇంటి ముందటి చుట్టిళ్ళు తలంటు పోసుకుని సాంబ్రాణి పొగేసు కుంటున్నట్టనిపించింది. వసారా చూరులోంచి పడుతున్న వాన నీటి కింద బాక్కె నలు, బిందెలూ పెట్టి పంచలో మంచాలేసుక్కూర్చుని, వీధిలోకి దిగులుగా చూస్తున్నారు అమ్మా, నాన్న వానొస్తే పన్లోిల్లే పన్లేదని హాయిగా, బొజ్జోక ఎందుకట్లా దిగులుగా కూర్చుంటారో!

“నన్ను చూడండోచ్‌... ఇంతోన పద్దా జుట్టు తడవకుందా వొచ్చేసానోచ్‌” అని స్టయిల్‌ కొడ్తూ తడిసిన పుస్తకాల్ని తెరిచి, పడవల్చేసుకోడానికి కాయితాల కోసమెతుకుతా వుంటే- “౬ర్నీ బొక్కులన్నీ తడుపు కొచ్చేసావా... ఇయ్యన్నీ మల్లీ ఎట్టా కొంటాంరా” అని నాన్ను “గుడ్డలన్నీ తదుపుకుంటా రాకపోతే వాన తగ్గిందాక ఐల్లోనే కూచుని రావొచ్చు కదరా... ఇప్పుడేమి కడతావు... అయిగో నీ గుడ్డలన్నీ బయట తీగ మీదొ అని అమ్మ.... కొట్టినంత పన్చేసారు.

“నేను తడవ లేదు... నా జుట్టు చూడండి” అంటూ ఎంత మొత్తుకుంటున్నా వినిపించు కోకుండా తడిసిన పుస్తకాల్ని జాగరత్తగా చుట్టింటి పాయ్యి దగ్గర పొంత కానించి ఆరబెట్టి, “జట్టు తడిస్తే మొక్క మొలవ్వురా... జలుబొస్తే మాత్రేసుకోవొచ్చు. బొక్కులు తడిసి సిరిగిపోతే మల్లా ఏడ కొంటాంరా కొడకా... ఇట్టాగైతే నీకు చదువెట్లా వాస్తదిరా కొడకా” అంటూ నాన్న ఒకటే తిట్లు.

పడవ చేసుకోడానికి పొడి కాయితం దొరక్క నేనేడుస్తా వుంటే, “జలుబని మూలిగినప్పుడు చెబ్లా నీ పని అంటూ నా చొక్కా లాగు ఇప్పేసి చీరకొంగుతో అమ్మ తల తుదుస్తా వుంటే - కరెంటు స్థంభం పక్క పొగాకు బేర్నీ గోడ చాటు నుంచీ రాంబాబు, బొచిగాడు, రామాంజనీలు జిల్లాయిలే అని ఎక్కిరిస్తా “కత్తి పడవల్చేసుకొచ్చాం... పందేనికి సై సై” అంటూ ఒహటే సైగలు.

అ ౩ ౮౮౮-104 1111111 ోహఃహ్షోాాో్‌్‌

ాాలాలాలలాాలాడూ వేదనిథి అ నిరద్రస్ట నాయి సాయం సంధ్యాసమయం. పగలంతా తన ప్రతాపం చూపించిన ప్రతాపుడు పళ్చిమాద్రి లోకి వెళుతున్నాడు. పొద్దుట అతని రూపం ఎలా మెరిసిపోతూ లేత ఎరుపు, రంగుతో కనిపించిందో, పొద్దు వాలినప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. పక్షులు తమ గూళ్ళకేసి గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. ఉదయం గూళ్ళ నుంచి బయలుదేరినపుడు ఎటువంటి ఉత్సాహంతో ఎగిరాయో అంతే ఉత్సాహంతో తిరుగు ముఖం పడుతున్నాయి. అటువేపు నడిచి వస్తున్న శంభుడుగారు ఆ సూర్యుడి కేసి చూశారు. ఎగురుతున్న ఆ వక్షుల కేసి చూశారు. సైకిలు, కట్ట పంచె, అక్కడక్కడ అతుకులుపడ్డ లాల్చీ, కాళ్ళకు బాగా అరిగిపోయి రింగులు తెగిపోయిన చెప్పులు, ముడతలు పడ్డ నుదురు, నెరిసి పోయిన నాలుగైదు రోమాలు గల పిలక - శంభుడుగారి ఆకారాన్ని చూపెడుతున్నాయి. ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు. ఆద్యంతాలు, ప్రతిరోజూ ఈ ప్రకృతి లో ఒక్కలా వుండవు. కానీ దేని పని అదీ చేసుకుపోతూ వుంటుంది. సముద్రపు కెరటాలు రోజంతా తీరం చేరడం, వెనక్కి వెళ్ళడం చేస్తుంటాయి.

చెట్లు తలలూపుతూ చల్లని గాలిని అందిస్తుంటాయి.

నది ప్రవాహం ఆగదు.

పక్షుల కిలకిలా రావాలు.

పశువులు మేతకు వెళ్ళడం, తిరిగి రావడం.

అలాగే పక్షులు -

అలాగే సూర్య చంద్రులు.

కానీ... మనిషి జీవితం యాంత్రికంగా ప్రారంభమై యాంత్రికంగా ముగిసినా అది అందరికీ ఒకేలా వుండదు.

ఆలోచిస్తూ నడుస్తున్నారు శంభుడుగారు. చీకటి పొరలు క్రమ్ముకు వస్తున్నాయి. కళ్ళజోడు సరిచేసుకుని, అటుకేసి వస్తున్న ఒక వ్యక్తిని చూసి, “బాబూ? ఇక్కడ వేదనిథిగారి ఆశ్రమం ఒక్కడుందో తెలుసా” అడిగారు.

“ఎందుకు తెలీదండి.... అదిగో ఆ దట్టమైన చెట్ల మధ్య పెద్ద పర్ణశాల కనిపిస్తుందా... ఈ రోడ్డుకి కుడివేపు చూడండి. చుట్టూ పొలాలు కనిపిస్తున్నాయా. ఆ పర్ణశాలే వేదనిథి ఆశ్రమం” - కాస్త వివరంగానే చెప్పాడు ఆ వ్యక్తి.

“అంటే మరో పదిహేను నిమిషాల నడక అనుకున్నాడు శంభుడుగారు.

చీకటి పడింది.... పర్ణశాల ప్రాంగణంలో విద్యుద్దీపాలు వెలగడం కని పించిందచాయనకు. ఎంతో అందంగా, ప్రశాంతంగా వుందా వాతావరణం. పొలం కట్ట మీది నుంచి వచ్చే చల్లని గాలి ఆయనకు ఉపశమనం కలిగిస్తూంది. పట్టణ పొలిమేరల్లో ఇంత ప్రశాంతత ఆయన చూసి ఎరుగడు.

అలా నడుస్తూ నడుస్తూ వేదనిథి ఆశ్రమం దగ్గరికి వచ్చిన ఆయనకు అక్కడ శ్రావ్యమైన కంఠంతో శ్రీ విష్ణు సహస్రనామ పఠనం వినిపించింది.

ముగ్ధుడై నిలబడిపోయారాయన. 'ఆవా! ఎంతటి ఆధ్యాత్మిక వాతావరణం ఈ ప్రదేశంలో కనిపిస్తూందో. అందుకే వేదనిథి ఆశ్రమం గురించి చాలామంది చెప్పుకుంటూ వుంటారు అనుకుంటూ ఆశ్రమంలోకి అదుగు బెట్టారాయన.

సుమారు ఇరవై సంవత్సరాలు వయసుగల ఇద్దరు చక్కటి ముఖ వర్చస్సుగల యువకులు శంభుడుగారిని ఆపారు.

“మీరు...” వారు అదుగుతుందగా,

“నా పేరు శంభుడు... గోదావరీ తీర గ్రామమైన ధవళేశ్వరంలో పౌరోహిత్యం చేసి, వృద్ధాప్యం వల్ల వృత్తి చేయలేక, వేదనిధిగారి ఆశ్రమం గురించి విని ఇక్కడికి వచ్చాను. నేను....” అని ఇంకా ఏదో చెప్పబోతుండగా “రండి...” అని పిలిచి పర్దశాల ప్రాంగణంలో వున్న ఒక చిన్న చెరువు దగ్గరికి ఆయన్ను తీసుకు వెళ్ళి వారి పాదాలను కడిగి ఆశ్రమంలోనికి తీసుకువెళ్ళారు.

అక్కడే ఒక మెత్తటి తివాచీ మీద వారిని కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళిన అ ఇద్దరూ పది నిమిషాల తర్వాత బయటికి వచ్చి, “వేదనిధిగారు రమ్మన్నారు, వెళ్ళండి” అన్నారు. కైకభరరం-2004 22౩2 కోడ్‌

డలం

శంభుడుగారు అక్కడే వున్న ఒక గదిలోనికి వెళ్ళారు. ఆ గదిలో శ్రీ సత్యనారాయణస్వామి వారి నిలువెత్తు పటం ఆయన దృష్టిని ఆకట్టుకుంది. సన్నగా విష్ణు సహస్ర నామం వినబడు తూంది - సుగంధ పరిమళాలు వీస్తున్న ఆ గదిలో ఏదో ఒక దివ్యశక్తి ఆయనకు కనిపించింది.

అప్రయత్నంగా అక్కడే వున్న వేదనిథిగారికీ, శ్రీ సత్యనారాయణ స్వామి వారికీ చేతులు జోడించి నమస్కరించి, సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన కళ్ళమ్మట నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి.

వేదనిధి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు.

కానీ ఎందుకు ఆ కన్నీళ్ళని అడగ లేదు.

'అది భక్తా, ఆర్హా లేక ఏళ్ళతరబడి గుండెల్లో దాచుకున్న బాధల బడబాగ్ని ఒక్కసారి రగిలిన ఆవేదనా....” అని ఆలోచించారు వేదనిధిగారు.

ఒక్కసారి తీక్షణంగా శంభుడిగారి కేసి చూశారు.

అంతే....

వేదనిథిగారి కళ్ళలో తళుక్కున ఏదో మెరిసింది.

మరోసారి శంభుడిగారికేసి చూశారు వేదనిధిగారు.

౦6

గోదావరీ తీర (గ్రామాల్లో ప్రసిద్ధి చెందిన ధవళేశ్వరంలో శంభుడిగారి పూర్వీకులు వేదపండితులు. క్రమేపీ వాళ్ళు పౌరోహిత్యం చేస్తూ జీవనం గడిపేవారు. తరానికీ తరానిక్తీ మధ్య జీవన విధానంలో మార్పులు రావడం మూలాన, పూజాపునస్మారాల మీద (శ్రద్ధ వున్నా చక్కగా చేసే సమయం లేక, సమయం వున్నా శ్రద్ధలేక దైవకార్యాలు మునుపటిలా జరగడం తగ్గుతూ వచ్చాయి.

ఏటా శ్రావణ మాసం పుట్టిం దగ్గర్నుంచీ శంభుడుగారు తీరికలేకుండా పూజలలో వుండేవారు. ఊళ్ళో పెద్ద మనుషులందరూ ఆయన వాక్‌శుద్ధి కోసం ఆయనతో పూజలు చేయించుకునేవారు. వినాయకచవితి, దేవీ నవరాత్రులు, దీపావళి, సంక్రాంతి అంటూ, జంధ్యాల పండుగ నుండీ అన్నిటికీ శంభుడిగారిని పిలిచేవారు, ఊళ్ళో మిగిలిన పురోహితులు కూడా, “శంభుడి దశ జరుగుతూంది” అని అసూయ పడేవారు.

కానీ.... క్రమేపీ ఆధ్యాత్మిక భావం సన్నగిల్లుతూ పూజ, పండగ ఒక ఆనవాయితీగా మారడంతో పౌరోహిత్యం కొంచెం తగ్గుముఖం పట్టింది. దానికి తోడు, తరాలు మారడంతో, యువతరం పురోహితుల విలువను కూడా గుర్తించలేక పోయింది.

వేదం వెలవెల బోయింది.

టివిలు, టేప్‌ రికార్దర్‌లు, టేపులు, ఇంటర్‌నెట్లు రావడంతో మంత్రం, శ్లోకం కూడా యంత్రం ద్వారా బయట పడడం మొదలైంది.

అంతే - టేపు వేసుకుని పూజలు చేయడం (ప్రారంభం అయింది.

శంభుడిగారి హయాం.... బాగా తగ్గింది. ఆయనకు అయిదుగురు సంతానం. “నా ఇంట్లో, నాలుగు వేదాలు, నా పుత్రులు. పంచమవేదం నా కూతురు వాహిని” అనేవారాయన. 2222222222 సే్గ =

శంభుడుగారు పౌరోహిత్యం చేస్తున్న రోజుల్లోనే నీలకంఠుడు, సాంబమూర్తి, విశ్వనాథం శంభుడిగారి కొడుకులు ఇంగ్లీషు చదువులు చదువుకోవాలని రాజమండ్రి వచ్చి డిగ్రీలు సంపాదించుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఢిల్లీ, చెన్నైలలో వుంటున్నారు. కూతురు వాహిని పెళ్ళై అమెరికాలో స్థిరపడింది భర్తతో.

ఆఖరివాడు.... తన వృత్తి కుంటుపడినప్పుడు పుట్టాడు ఆలస్యంగా.

అన్నలలా ఆంగ్లవిద్య మీద ఆసక్తి లేదతనికి. శంభుడుగారు, సత్యన్నారాయణమూర్తి అని పేరు పెట్టుకున్నారతనికి.

ఎందరు చెప్పినా వినకుండా తను వేదమే చదువుతానని పట్టుపట్టిన సత్యాన్ని తండ్రి అభినందించినా, భవిష్యత్తు బాగుండదేమో... (ప్రజలలో వేదానికి పట్టు వుండదేమో అనే భావం వుండేది.

“నాన్నా... కోట్లు గడించినా ఉదర పోషణకే.”

“ఈ పొట్టకు కావలసిన నాలుగు మెతుకులు దొరక్కసోదు. వేదాన్ని బ్రతికించడానికి నా జీవితాన్ని ఓక సమిధగా అర్చిస్తారు. అందులోనే నాకు తృప్తి వుంది” అన్నాడు సత్యం.

సత్యం మాటలకు శంభుడుగారు సంతోషించినా వేదం చదవడం వల్ల లాభం లేదని వారించారు. తల్లి కూడా వద్దని చెప్పింది- కష్ట్సీ అన్నలందరూ చదువుకుని ఉద్యోగాలు

చేస్తున్నారు, మీ అక్క అమెరికాలో వుంది....నువ్వు వేదం వేదం అనుకుంటూ కూర్చొంటే జీవితం గడవడం కష్టమవుతుందిరా” అని ఎంత చెప్పినా వినలేదు సత్యం.

ఒక రాత్రప్పుడు 10 సం. వయసులో తాను వేదం వెంట వెళుతున్నానని, వెతికినా దొరకనని ఒక చీటీ రాసి పెట్టి ఇల్లు విడిచిపెట్టి రైలెక్కి కంచి మఠానికి వచ్చాడు. అక్కడ పది సంవత్సరాల వేదాధ్యయనం చేసి స్వాముల ఆశీస్సులతో పుణ్యక్షేత్రాలు ఎన్నో తిరిగి, దేశాటనం చేసి ఒకరోజు అన్నవరం సత్యన్నారాయణస్వామి వారి సన్నిధిలో, పూజలు జరుగుతుంటే (ఢ్రావ్యమైన కంఠంతో స్వచ్ళమైన ఉచ్చ్భారణతో మంత్రపుష్పం చెప్తున్న సత్యాన్ని చౌదరిగారు చూశారు. సత్యంలో ఏదో ప్రత్యేకత, చైతన్యం ఆయన్ను ఆకర్షించింది. చౌదరిగారు ప్రముఖ వ్యాపారవేత్త, కోటీశ్వరుడు. ఇద్దరు పిల్లల తండ్రి. అరవయ్యో పడిలో పడి ఆధ్యాత్మికమే మనసుకు శాంతిని కలిగిస్తుందని దేవాలయ దర్శనం, సత్పురుషుల దర్శనం చేసుకునేవారు. వారిలాగే వారి శ్రీమతి. చక్కటి కుటుంబం వారిది.

ఆ సాయంత్రం అన్నవరం కోవెల మెట్లు దిగిన చౌదరిగారు, ఆయన భార్య మెట్లు దిగుతున్న సత్యం దగ్గరికి వచ్చి నమస్కరించారు.

“మీరు వయసులో నాకన్నా చిన్న వారైనా వేద పండితులు. సరస్వతీ దేవి మీ నాలుక మీద నాట్యం చేస్తున్నది. మీ మొహంలోని తేజస్సును చూస్తుంటే నాలో ఏదో విద్యుత్తు ప్రవహిస్తూంది. మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి మా గృహాన్ని పావనంచెయ్యా”లని ప్రాధేయ పడ్డారు.

సత్యం కాసేపు శూన్యం కేసీ, ఒకసారి చౌదరిగారి మొహంలోకి సూటిగా చూసి, “అలాగే పదండి” అని చెప్పడంతో చౌదరి దంపతుల ఆనందానికి అవధుళ్లేకపోయింది. కై కకరళం- ఓం డక

చెన్నైలో మహాబలిపురం వెళ్ళేదారిలో వున్న తన రాజమహల్‌ వంటి బంగళాకు సత్యాన్ని తీసుకువెళ్ళి వారం రోజుల పాటు తనివితీరా తన ఆధ్యాత్మిక భావాలను సత్యంతో పంచు కున్నారు.

చివరగా చౌదరిగారు సత్యంతో -

“స్వామీ! నాకు కోట్లున్నాయి. కంపెనీలున్నాయి. పనివాళ్ళున్నారు.... వీటన్నిటినీ అనుభవించడానికి ఆ వయసున్న నా పిల్లలున్నారు. ఈ ముసలితనం తరుముకు వచ్చిన దశలో నాకు వాటికన్నా అధ్యాత్మిక అమృతం ఆనందాన్నిస్తుంది. ఈ బంగళా ప్రక్మనే వున్న నా తోటలో ఒక పర్దశాల ఏర్పాటు చేస్తాను. సకల వసతులు కల్పిస్తాను. మీతో రోజూ కొంతసేపు ఆధ్యాత్మిక చర్చలు చేసుకుంటాను - మీరు క్షేత్రాటన చేస్తే నేనూ వస్తాను. వేదం నేర్చుకునే వారుంటే మీ దగ్గరికి పంపిస్తాను.

“రూపాయి విలువ మారినా వేదం విలువ మారదు. మనిషి విలువ మారినా మంత్రం విలువ మారదు. ఈ మహాిబలిపుర శిల్పాలను చెక్కిన పల్లవుల నాటి శిల్చులను ఎవరూ మరచి పోలేరు. ఆ శిల్పులచే చెక్కించిన పల్లవ రాజులను మరిచిపోలేరు. కాలక్రమేణా ఈ శిల్పాలు శిథిలాలుగా మారుతున్నా మళ్ళీ వాటిని రక్షించుకోవాలనే తపన ప్రభుత్వానికి వుంది. అలాగే మరుగున పదుతున్న మన అమూల్య నిధి అయిన వేదాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది. స్వామీ.... మీరే వేదనిథి” అని ఒక్కసారి చెమ్మగిల్లిన కళ్ళతో అర్ధత నిండిన కంఠంతో, “నా కోరిక మన్నించరూ” అని చిన్నవాదైనా సత్యనారాయణమూర్తి పాదాలకు చౌదరిగారు నమస్కరిస్తూ వుంటే ఆయన శ్రీమతి కూడా నమస్మరించారు.

సత్యంగారు అంగీకరించారు. ఆ విధంగా అక్కడ వేదనిధి” ఆథమం వెలసి ఐదు సంవత్సరాలైంది.

ఛం 6

శంభుడిగారికేసి చూస్తున్న వేదనిథిని శంభుడుగారు కూడా తీక్షణంగా చూశారు. మరుక్షణం వేదనిథిగారు తండ్రి గారికి పాదాభివందనం చేస్తుండగా చౌదరిగారు చిన్నబుట్టలో అరటి పళ్ళు, పాలు ఒక గిన్నెలో పట్టుకుని మెల్లగా అక్కడికి వచ్చి, ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య పోయారు. తను పాదాభివందనం చేసిన వేదనిథిగారు మరొకరికి పాదాభివందనం చేస్తున్నా రంటే ఆయన ఎంతటి మహాత్ముడో అనుకుని తను కూడా పళ్ళూ, ఫలాలలను అక్కడబెట్టి శంభుడిగారికి నమస్కరించారు.

“వేదం... చదివితే భవిష్యత్తు వుండదని ఈయన భావించారు... వేదాన్ని బ్రతికించాలని మీరు భావించారు. కానీ ఎంత కాదన్నా వేదాన్ని వెతుక్కునే మీరిద్దరూ వచ్చారు. అదే వేదంలోని దివ్యత్వం....” అన్నారు వేదనిథిగారు. వయో భేదం లేకుందా చౌదరిగారు - శంభుడుగారు మరోసారి వేదనిథిగారికి చేతులు జోడించారు. పర్ణశాలలో విద్యుద్ధీపాల వెలుతుర్లో శ్రీ సత్యన్నారాయణస్వామి మూర్తి కళకళలాడుతూంది.

న! డాడ్‌

శృతి అ సుధారీకు “తెలుగు వెలుగు' పత్రికాఫీసుకి చేరుకుని నేరుగా తన గదిలోకి వెళ్ళి, కుర్చీలో కూర్చుని " విశ్రాంతిగా తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఆ పత్రిక సంపాదకుడు అనంతశర్మ రెండు అంతస్థులని ఎక్కడానికి ఇప్పటికీ లిస్ట్‌ ఉపయోగించరాయన. కానీ గత రెండు మాసాలుగా ఆయనకి ఎందుకో గుందెలో గుబులుగా, దిగులు దిగులుగా ఉంటూంది. గత పాతిక సంవత్సరాలనుంచి పత్రిక సాధించిన విజయాల్నీ ఆ విజయం వెనక ఉన్న తన నిరంతర శ్రమనీ - ఆ (శ్రమ ఎప్పుడూ 'తమ” అన్పించకుండా తనకి ప్రతి సంచిక తర్వాతా దొరికే ప్రోత్సాహాన్నీ - ఎప్పట్లాగే ఓ సినిమా రీలులా కళ్ళ ముందు సమీక్షించుకుని ఆత్మ విశ్వాసాన్ని సమీకరించుకున్నారాయన. కానీ రెండేళ్ళుగా పత్రికలో వస్తున్న మార్పు, రెండు నెలలుగా మరింత ఎక్కువై ఆయన అంతరాత్మ తీర్పు కోరుతోంది. గుండెల్లో వెలితి. పత్రిక లేటెస్టు ఇష్యూ చేతిలో తీసుకున్నారాయన.

'సంపాదకీయరో తర్వాత ఆయన ప్రతివారం రాసే “నీలి మేఘాలూ - గాలి కెరటాలూ" శీర్షిక, ఓసారలా చూసి పేజీ తిప్పారు. మొదటి రాత్రి ముచ్చట్లు” శీర్షిక. శృతిమించిన శృంగారం. తర్వాతి పేజీల్లో ఓ అర్ధం పర్థంలేని చెత్త కథ - ఓ భయంకర హింసని వర్ణించే యదార్థ గాథ. అతడు మానకూడదని పట్టుదలతో నడిపిస్తున్న 'కవితావనం” యువకవుల కవితలు- ఓ రెండు పేజీల కథ తను ఎంపిక చేసింది. స్రీలకని ఓ శీర్షిక - ఫరవాలేదు సుమారుగానే ఉంది. చివరగా సినిమా వార్తలు - అసహ్యంగా, జుగుష్పాకరంగా-భారంగా నిట్టూర్భారాయన,

క్రితం వారం రవీంద్రతో జరిగిన సంభాషణ - వాగ్వాదం లాంటిదే గుర్తొచ్చింది. భుజంగరావుగారు ఈ పత్రిక మొదలుపెట్టిన ఆరు నెల్లకి రవీంద్ర పుట్టాడు. వంగ కవీంద్రుడి మీదున్న అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నారాయన. భుజంగరావుగారు ఏడాది క్రితం మరణించారు. రవీంద్ర పత్రిక బాధ్యతలు పూర్తిగా తీసుకున్నాడు. 'మన పత్రిక ముసలివాళ్ళు క :ధ౮రంి-2004 కాక్‌ ె్‌్‌్‌్‌్‌డ్‌డ్‌డ్‌్‌్య్‌ా

తప్ప ఎవరూ చదవడం లేదంకుల్‌. అమ్మకాలు పడిపోతున్నాయి. పత్రిక నిలబడాలా వద్దా. పాఠకుల అభిరుచులు మారాయి - ఇవే మాటల్ని మార్చి మార్చి చెప్తుంటాడు. తను సంపాదకుడు కనుక తన మాటల్ని పూర్తిగా త్రోసిపుచ్చలేడు. ఒక ప్రముఖ(?) రచయిత సీరియల్‌ పత్రికలో వేయడం మీద ఈ చర్చ జరిగింది. అనేకరకాలైన బూతు వర్ణనలూ, భయంకరమైన హింసా ఉన్న ఆ నవల చదివి ఆయనకి రెండ్రోజులు మతిపోయినట్టుగా, ఆలోచనలు స్టంభించినట్టుగా అన్పింఛింది. అదే ప్రచురిస్తే పత్రిక అమ్మకాలు తప్పక పెరుగు తాయని రవీంద్ర వాదన.

అతడి మాటలో నిజం ఎంతో బేరీజు వేయలేకపోతున్నారాయన. ఈ పత్రికని తన బిడ్డలా పెంచాడు. అప్పట్లో 'కెలుగు వెలుగు” పత్రికంటే చదువుకున్న ప్రతివారూ చదివే పత్రిక అన్పించేలా చేసారు తనూ, సారధీ, వెంకట్రమణా, భావనారాయణా - భుజంగరావు గారు తమందర్నీ ఓ కుటుంబంలో వాళ్ళనుగానే చూసేవారు. పత్రిక ఊపందుకుంది. “ఆధునికత అప్పట్లో విమర్శలకి గురైనా - ముడివేసుకుని కొంగు కప్పుకున్న వనిత, వాలు జదేసుకుని ఓ పక్కగా కొంగు వేసుకుని పుస్తకాలు పట్టుకుని వీథిలో నడిచినట్టుగానే ఉందేది. నిజమే. తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. మార్చు జీవితానికీ - జీవన గమనానికీ అత్యంత అవసరం. కానీ బలుపుకీ, వాపుకీ మధ్య తేడాని గుర్తించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదా?

ఆయన ఆలోచనలు ఎంతకీ తెగదం లేదు. పత్రికని వదలాలంటే మనసు రాదు. తన ఒక్కగానొక్క బిడ్డ వాణి, ఎక్కడో ఢిల్లీలో ఉంది. సైంటిస్ట్‌. తన రీసెర్చ్‌ పూర్తయ్యేవరకు పెళ్లి వద్దుట. ఎప్పుడో నాల్రోజులు వచ్చి, తనని పసివాడిని చేసి తిరిగి వెళ్ళిపోతుంది. పత్రికే తన బిడ్డలా చూసుకుంటున్నాడు. సాహితీ ప్రపంచంలో తనని తానే మరచిపోతున్నాడు.

తిరిగీ ఆలోచనలతడిని ముసురుకున్నాయి. ఇప్పుడు రాస్తున్న రచయితల్లో స్పందన ఉంది. సృజనాత్మకతా ఉంది. తపన ఉంది. కానీ వాటిని సాన పెట్టాలి. వెన్ను తట్టి వెనుక మేమున్నామనే పత్రికలు తగ్గిపోతున్నాయి. టి.వీ., కంప్యూటర్‌, ఇంటర్‌నెట్‌ వచ్చాక పత్రికలు చదివే వాళ్ళు తగ్గిపోయారు. కానీ ఎంతమాత్రం తగ్గారు? చదివే వాళ్ళు ఇప్పటికీ చదువు తున్నారు. అభిరుచులు పూర్తిగా మారాయనీ అనుకోలేము. మంచి కథల్ని ఆద రించే పాఠకులు ఎప్పటికీ ఉంటారు.

(సార్‌ ఉత్తరాలు అంటూ పావని పది ఉత్తరాలు తెచ్చింది. ఆమె చిరునవ్వు కళ్ళలో ప్రతిఫలించడాన్ని చూస్తూ ఉత్తరాలందుకున్నారు. ముందు అన్ని ఉత్తరాలూ చదివేవారు. ఇప్పుడు కొన్ని సెలెక్టు చేసి ఇమ్మన్నారు పావనితో. ఓ రెండు ఉత్తరాలు పత్రికలో కథల్ని సమీక్షిస్తూ విమర్శనాత్మకంగా ఉన్నాయి. ఓ రెండు పత్రిక స్థాయి పడిపోతుందని గోల పెడు తున్నాయి. ఓ మూడు వెరైటీ శీర్షికలూ, కథలూ కావాలంటున్నాయి. ఓ ఉత్తరం ఆయన శీర్చికని చదివి పొందిన అనుభూతిని పంచుకూంటూంది. మరో ఉత్తరం ఓ శీర్షికలో దొర్లిన పొరపాటుని గురించి. ఇంత శ్రద్ధగా పత్రికలు చదివేవాళ్ళున్నారన్నమాట అన్న తృప్తి ఎప్పట్లాగే కలిగింది ఆయనకి. క్‌ స్త

ఈ చివరగా తన పేరుతో వచ్చిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నారు. తన పేరుతో సాహితీ మిత్రులు మాత్రమే రాస్తారు మామూలుగా. అందుకే చివరగా విప్పి విశదంగా చదువు కుంటారు. ఫ్రమ్‌ అద్రెస్‌లో 'శృతి' అనుంది. ఉత్తరం చదువుతుంటే ఆయన కళ్లలో నీళ్ళు నిండుకోసాగాయి. ప్రియమైన అనంతశర్మగారికి, నమస్తే. మీరు పాతికేళ్ళ క్రితం రాసిన 'వన్నెట్లో వెన్నముద్దలు” నవల చదివాను. చదివి నంతసేపూ నవలలో లీనమయ్యాను. అదో అందమైన లోకం. సమస్యలకీ, దబ్బు - విలువలకీ భేషజాలకీ, హిపోక్రసీకి స్థలం లేదందులో. స్వచ్చమైన మనుషులు సృష్టికి ప్రతిసృష్టి అన్పించేలా తాము ప్రాణంగా నమ్ముకున్న కళల్ని ఆవిష్కరిస్తో బత కడం! అలాంటి లోకంలోకి ఏ విమా నమో నన్ను తీసుకెళ్ళకూడదూ! మీ కథనం, సంభాషణలూ, ప్రకృతి వర్ణనలూ - అన్నిటినీ మించిన వాతా వరణం నవలలో.... మీకు ఉత్తరం రాయాలంటే చిన్న దాన్ని. ముందు హెసిసేట్‌ చేసాను. కానీ మేం ఓ గ్రూపు ఉన్నాం స్నేహితులం. నేను కవితలు రాస్తాను. ఓ ఇద్దరు చక్కటి లభిత సంగీతం పాడతారు. ఓ నేస్తం నర్తకి. ఒకతను గిటారు వాయిస్తాడు. ఒకామె ప్రకృతి చిత్రాలు వేస్తుంది. కానీ ఆ ప్రపంచంలోంచి మమ్మల్ని మా అమ్మా నాన్నలు బయటకి లాక్కొచ్చి పడేస్తారు. ర్యాంకులూ, మార్ములూ, కాంపిటీషన్‌ - ఇదీ జీవితం. మాష్టారూ - మీ నవల్లో మాధురిలా నేనూ కవితా మాధురిలో స్నానమాడాలనుంది. మీ నవల్లోని పాత్రలతో మమ్మల్ని ఐడెంటిఫై చేసుకుని ఆనందిస్తున్నాము. కానీ సార్‌, మీరేమనుకోనంటే ఒక్కమాట. మన తెలుగు వెలుగు” పత్రిక పేరుకు తగినట్టు సాహితీకాంతు లతో మా హృదయాల్లో వెలుగు నింపుతుండేది. మా పత్రిక - ఇది సాహితీ వేదిక - ఇంట్లో అందరం కలిసి చదవగలిగే పుస్తకం అనుకునేవాళ్ళం. మా నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. కొంచెం శ్రద్ధ వహించండి మా కోసం - మాలాంటి ఎందరో పాఠకుల కోసం. వెన్నెల్లో వెన్నముద్దలు” తర్వాత మీరెన్నో నవలలు రాసారు. మాకు ఈ నవల ఎంతగానో నచ్చింది. మీ అభిమాని శృతి. ఎప్పుడో కాలేజీ ప్రాంగణాన్ని వదలిన రోజుల్లో ఉ(ద్రేకపడి రాసిన నవల ఇప్పుడీ అమ్మాయిని అలరించింది! యవ్వనంలో ఉత్సాహంలో స్వచ్చత ఆ నవలలో ఉంది కాబోలు! ప్రోత్సాహం వల్ల అభినందనల వల్లా ప్రతి కళాకారుడికీ కలిగే తృప్తీ. ఆనందం ఆయన్ని ఆవరించాయి. ఆయన గతంలోకి - గతం నుంచి వర్తమానంలోకీ ఆలోచిస్తూండిపోయారు. ఆ అమ్మాయి చివరగా రాసిన మాటలు తిరిగీ అతడిలో కలవరాన్ని రేపాయి. నమ్మకాన్ని వమ్ము చేయడం-తన అంతరాత్మ ముందు ఖాళీ పాత్రతో సిగ్గులేకుండా ఎలా నిలబడతాడు? ఈ పత్రికలో సంపాదకుడిగా తన పేరు అచ్చవుతుంది. అందులోనే అనంతమైన బూతుకథ కై శ థ్‌. నాకిని - 2004 2222222222

న ౮ అచ్చవబోతూంది. (దానికి శృంగారం అన్న ముసుగు. వినూత్న ప్రయోగం-సస్సెన్స్‌ వగైరా ఆభరణాలూ,).

వేడి కాఫీ వచ్చింది. కాఫీ తాగుతూ వచ్చే సంచికకి 'నీలి మేఘాలూ - గాలి కెరటాలూ' శీర్షికకి రాయసాగారు. వేసవి తాపం - మల్లెలూ - మామిడిపండ్లూ - యవ్వనం - యువతీ యువకుల సరదాలూ - ఇలా రాస్తూ - చివరిగా. “అలా నల్లటి తార్రోడ్డు మీద నీలిరంగు సెల్వారు కమీజు మీద దుపట్టా ఎగురుతూంటే నీలి మేఘంలా జీవితాల్ని శృతిస్తూ వెళ్ళే ఆ అమ్మాయి మండుటెండల్ని మలయమారుతాల్ని చేస్తుంది.” ఇంతకీ ఎవరామె... అమ్మో! ఆశ! చెప్పను” - ఇలా ముగించాడు. అరె! చివర ఈ పేరా ఏంటీ. అతికిందా అసలు? మళ్ళీ చదివారు. అసందర్భంగా లేదు. పాటని వెన్నంటిన రాగంలా అందులో ఇమీడిపోయింది.

రవీంద్ర వచ్చాడు. "కొత్త సీరియల్‌ విషయం....” నసుగుతున్నాడు. ఈసారి అతడిని చూస్తే నవ్వొచ్చింది. వాళ్ళ నాన్నతో కలిసి పనిచేసిన తనని ఎదిరించి మాట్లాడనూ లేడు. 'రెంద్రోజుల్లో చెబుతా బాబూ” నవ్వుతూ అన్నారు. ముఖ్యమైన కాగితాలు చూసేసి రెండో రోజు రాజీనామా పత్రాన్ని రవీంద్ర చేతిలో పెట్టారు. ఆయన చేతులు వణుకుతున్నాయి. కళ్ళకు నీటిపొర. ఏమంటున్నాడు రవీంద్ర-“మీరు లేకుండా పత్రికని ఊహించలేమంకులొ' (పెదవుల పైనుంచా హృదయం నుంచా?) *వదో కమర్షియల్‌గా నిలద్రొక్కుకోవాలని తప్పించి - మిమ్మల్ని ఏ విధంగానైనా బాధపెడితే సారీ అంకుల్‌”

ఈసారి నెమ్మదిగా జవాబిచ్చారాయన-*చూడు బాబూ, మేము విలువలనుకున్నవి అఖి వృద్ధి నిరోధకాలైతే - మనసులో జరిగే యుద్దానికి ముసలి శరీరం తట్టుకోలేక పోతూంది. తప్పుకోక తప్పడం లేదు. విష్‌ యూ ఆల్‌ ది బెస్ట్‌.”

! తర్వాత సోమవారం ఎప్పట్లా తయారై వెళ్తున్న అనంతశర్మగారిని ఆదరంగా అడిగారాయన భార్య - “పత్రికాఫీసులో మానేసారు కదండీ. ఇంట్లో ఉంటారనుకున్నా. వంట ఆలస్యమైంది మరి.”

“ఫరవాలేదులేవోయ్‌. ఓ అరగంట ఆలస్యమైనా చేరుకోవాల్సిన చోటుకి చేరుకుంటున్నా, నెమ్మదిగానే కానీ”, అన్నారాయన.

నింపాదిగా బయల్దేరి, 'వీణాధరి” పత్రికాఫీసు ముందు ఆగారు. ఆయనకి తెలుగు వెలుగు" మొదలెట్టిన రోజులు గొర్హొచ్చాయి. చిన్న ఆఫీసు. తక్కువ స్టాఫూ. చందాల్లో నడుస్తున్న చిన్ని పత్రిక.

చిరునవ్వుతో సారధి ఎదురొచ్చాడు - “ఎప్పటికైనా నీవిక్కడికే వస్తాననే నమ్మకం నాకుందోయ్‌” అంటూ.

గుండెల్లో మళ్ళీ ఏదో నిండుకుంటూంది. అరవైలో ఇరవై పరిమళిస్తోంది. కర్తవ్యం పిలుస్తోంది. బీణాధరి” కళ్ళ ముందు సాహితీ తల్లిలా అగుపిస్తోంది. జీవితాన్ని శృతించుకున్న ఆత్మవిశ్వాసం ఆనందామృతమై ఎందరో సాహితీ ప్రియులకి పంచి పెట్టబోతోంది!

అ

222222 సక క

(08 0 సంధ్యావందనం అ 5+నిరొగో శెంకటరత్నం నలా ఆచమ్య, కేశవాయ స్వాహా, నారాయణయ స్వాహా, మాధవాయ స్వాహా. అంటూ ఆచమనంతో మొదలు పెట్టి శాస్త్రోక్తంగా సంధ్యావందనం పూర్తిచేయందే నేను ఎక్కడికీ కదలటానికి వీలులేదు. అది నాన్న శాసనం. శ్రీశైలంలో పుట్టి పెరిగిన నాన్నకు మన ఆచార వ్యవహారాలల్లో కానీ మన సంస్కృతీ, సాంప్రదాయం పాటించడంలో చాలా నిష్ట ఎక్కువ. పేరుకి ఓ చిన్న పోస్ట్‌ మాస్టర్‌ ఉద్యోగం అయిన్మా మన శాస్త్రాలన్నీ ఆయనకు కొట్టిన పిండి. పురాణాల గురించి కానీ, జాతకాలు, నక్షత్రాలు దగ్గర నుంచి వాస్తు గురించి కానీ నాన్నకు తెలిసిన విజ్ఞానానికి పిహెచ్‌డి డిగ్రీ యిట్టే యివ్వచ్చు. నాన్నకు తెలిసిన విజ్ఞానాన్ని గురించి ఆలోచించినప్పుడల్లా నాకు చాలా గర్వంగా ఉండేది. అలాంటి గొప్ప పందితుని యింట్లో కొడుకుగా పుట్టినందుకు భగవంతునికి చాలాసార్లు కృతజ్ఞతలు మనసులోనే చెప్పుకున్నాను. ఆయన ఆచారాలు, జన్మ జన్మాంతరాలుగా పాటించాలనీ, నా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు బోధించి మన సంస్కృతిని నిలబెట్టాలనే ధృధమైన ఆశయం నాలో పాతుకుపోయింది. ఆచారాలనేవి ఒక్కొక్క యిళ్ళల్లో తాతల దగ్గర నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి కొడుకు నుంచి మనవడికి వంశపారంపర హక్కులా దగ్గరుండి పట్టు పట్టి నేర్పిస్తేనే కానీ రావు. స్మూళ్ళల్లో ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్‌ పాఠాలయితే చెబుతారు కానీ, యిలాంటి మన సంస్కృతికి సంబంధించిన విషయాలు మనమే చేయి కట్టి బాధ్యత వహిస్తేనే కానీ తరతరాలుగా అందించ లేము. నాన్నకున్న విజ్ఞానాన్ని ప్రపంచానికంతా చాటలేకపోయినా, కనీసం నా ఒక్కకుటుంబంలో జన్మ జన్మాంతరాలుగా చాటాలనేది నా అభిప్రాయం. శ్రీశైలంలో నేను పుట్టాను, పెరిగాను. శివాలయానికి వెళ్ళటం, దైవభక్తి ఆచార నియమాలకు కట్టుబడి ఉండడం ఒకళ్ళు ఇదేశించింది కాదు. బడికెళ్ళి చదువుకున్నట్లుగానే అవీ అలవాటు పడ్డాయి. అలాంటి నా జీవితంలో కాలక్రమేణా కొన్ని మార్పులొచ్చాయి. పరమపద సోపానపటం లో పాముల్ని తప్పించుకొన్ని చిన్న చిన్న నిచ్చెన్లు ఎక్కి పైకి వచ్చినట్లు నేనూ పైకి వచ్చాను. శ్రీశైలంలో హైస్కూల్‌లో ఫస్ట్‌ క్లాసులో ప్యాసు కావటం, కర్నూల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరి అది కూడా ఫస్ట్‌క్లాసులో పూర్తిచేయటం క్షణికంలో జరిగాయి. నాలుగు సంవత్సరాలు యింత త్వరగా జరిగి పోతాయని ఎప్పుడూ ఊహించలేదు. అమెరికా వచ్చే అవకాశం రావటం కై కథొరాతొని-2004 కైతే

ఊహ కందని స్వప్నం చేతికి చిక్కినట్లయింది. శరీరం శ్రీశైలంలో వున్న జీవన సదుపాయాలకు అలవాటుపద్డా, మనస్సుకి బాహ్య ప్రపంచంలో ఉండే అనుభూతుల్ని చవిచూడాలనే కాంక్ష విజ్ఞానోపాసన, ఆర్దికంగా కూడా పైకి అభివృద్ధి పొందవచ్చనే ఆశతో యిల్లు వదలి అమెరికాకు " వెళ్ళటానికి నిశ్చయించుకొన్నాను. ఈ విధంగా తల్లిదం(డ్రులకు కూడా ఆర్థిక సహాయం చేయచ్చనే అలోచన నా మనసులోని వాంఛను దృఢపరిచింది. ప్రవరాఖ్యుడు కాళ్ళకు లేహ్యం (వ్రాసుకొని ప్రపంచమంతా తిరిగినట్లు ఒక్కసారి నేను శ్రీశైలం నుంచి సన్నీవేల్‌, కాలిఫోర్నియాకు వచ్చి పడ్డాను. న్‌ మొదట్లో రెండు మూడు రోజులు ఇబ్బందిపద్దా, నెమ్మదిగా కావాల్సిన సదుపాయాలన్నీ

దొరికాయి. ఇద్దరు తెలుగు వాళ్ళు దొరకటం మనసుకి శాంతి నిచ్చింది. శ్రీశైలం కొండల నుంచి కాలిఫోర్నియా శిఖరాలు చూస్తుంటే విధివిలాసం చాలా వింతగా అనిపించేది. నాకు యిలాంటి అదృష్టాన్నీ అవకాశాన్నీ కలిగించింది దేవుడే అయినా, దీనికి మూల కారణం నాన్నే అయివుంటాడు. ఆయనకున్న భక్తి, భగవంతుని మీద వున్న నమ్మకం, నాకూ, మా కుటుంబానికి ఉజ్వలమైన భవిష్యత్తు కలుగచేస్తాయి. ఆర్ధికంగా స్థిరపడడం, ఉద్యోగంలో పైకి రావటం, కొత్త జీవితం, కొత్త ప్రపంచంలో వున్నా నా ఆచారాలలో ఎలాంటి మార్పు రాలేదు.

రెండేళ్ళ తర్వాత ఇండియా వెళ్ళి శ్రీలత అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. ఆచార వ్యవహారాలల్లో అడుగు తప్పని నాకు, అమ్మా, నాన్న ఈ పెళ్ళి స్థిరపెట్టారు. శ్రీలత చాలా మంచిది. సాంప్రదాయమయిన కుటుంబంలో పెరగటమే కాకుండా చాలా నెమ్మదయిన మనిషి నా అర్జాంగిగా నన్ను అర్ధం చేసుకొని మసలటంలో ఎలాంటి అయిష్టతను చూపించ లేదు. మా యిద్దరి మనసులు బాగా కలిసాయి. “వుయ్‌ ఆర్‌ మేద్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌" అని అనుకునేవాళ్ళం. మా ఇంట్లో నేను ఒక్కడ్ణే అయినా, శ్రీలత యింట్లో పదిమంది పిల్లలు. అందువల్ల సద్దుకపోవటం బాగా అలవాటు శ్రీలతకు. సన్నివేల్‌కు వచ్చిన కొద్ది రోజులకే చిన్న బ్యాంక్‌ ఉద్యోగం తెచ్చు కోగలిగింది. అమెరికా వచ్చే ముందు, వచ్చిన కొత్తల్లో తప్పకుండా ఇండియా తిరిగి పోతాననే ఆలోచన, రోజులు గడిచేకొద్దీ క్షీణించుకుపోయింది. యిద్దరం అనుకునేవాళ్ళం. మనతోపాటు ఈ దేశంలో ఎందరో భారతీయులున్నారు. ఆ మాటకొస్తే తెలుగు వాళ్ళు, అందులో బ్రాహ్మలు కూడా వున్నారు. అందువల్ల యిక్కడ స్థిరపడి పోవటంలో తప్పేమీ లేదనిపించింది. మన యింట్లో మన ఆచార వ్యవహారాలన్నీ తూచా తప్పకుండా పాటించుకున్నా బయట ఎవరికీ అభ్యంతరం లేదు. ఓ విధంగా ఆలోచిస్తే చిన్నప్పటి శ్రీశైలం జీవితానికి యిప్పటి సన్నివేల్‌ జీవితానికి పెద్ద తేడా లేదు. మాసిపోయిన గిన్నెకు, మెరుగు పెట్టిన గిన్నెకు తేడా కనబడ్డా అడుగున గిన్నై ఒకటే. దాని రూపం ఒకటే. అది చేయబడ్డ లోహం ఒకటే.

మూదేళ్ళు దాంపత్య జీవితం గడిపిన తర్వాత శ్రీకి అమ్మాయి పుట్టింది. నేనూ, శ్రీ ఎంతగానో ఆలోచించాం ఏం పేరు పెట్టాలని? చివరికి మా యిద్దరికీ నచ్చిన పేరు సంధ్య. నిజమే చిన్నప్పటి నుంచీ రోజూ సంధ్యావందనం చేసే నాకు సంధ్య అనే పేరు నా శరీరంలో రక్తంలా ప్రవహిస్తుంది. సంధ్యా సమయంలోనే కాకుండా, రోజంతా నా జీవితంలో, శ్రీలత జీవితంలో వెన్నెల కురిపించింది సంధ్య. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంధ్య పెరిగి

ఈ పెద్దదవుతున్నది. యిలాంటి అదృష్టాన్ని భగవంతుడు మాకివ్వటానికి కారణం అనాదిగా మేం ఆచరిస్తున్న సాంఘిక సిద్ధాంతమన్న నమ్మకం నాలో ధృధమయింది. యిలాంటి సమయంలో ఒక దుర్హటన జరిగింది. శ్రీలతకు బ్లీడింగ్‌ ప్రాబమయి బిడ్డ సంచి ఆపరేషన్‌ చేసి తీయాల్సి వచ్చింది. మొదట్లో కొన్నాళ్ళు బలహీనత పడ్డా కాలక్రమేణా శక్తిని కోలుకుంది. సంధ్య వల్ల నా జీవితం సంబరపద్డ్దా, శ్రీలతకు మరి పిల్లలు పుట్టరనే ఆలోచన నా మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నది. చిన్నప్పటినుంచి నాలో ధృవ పడిన ఆచార వ్యవహారాలన్నీ నాన్న నాకు చెప్పినట్లు, నేను నా కాడుక్కి నా మనవలకు చెబుతామనే ఆలోచన సఫలం కాదేమోననే సంకోచం నా మనస్సులో కలుక్కుమంటున్నది. మా యింటికి యిరువైపులా యిద్దరు అమెరికన్‌ ఫామిలీలు వున్నారు. వాళ్ళకూ సంధ్య వయస్సు చిన్న పిల్లలున్నారు. సంధ్య పుట్టిన తర్వాత శ్రీలతకు ఇరుగు పొరిగింటి వారి పిల్లలకు సంబంధించిన మాటలు ఎక్కువయ్యాయి. అంతకు ముందు అమెరికా మధ్యలో అన్ని సదుపాయాలు అనుభవిస్తున్నా యింట్లో చిన్న ఇండియాలా వుంచాము. యిప్పుడు ఆ గోప్యం పటా పంచలమయింది. నా పేరు మల్లికార్డునశాస్త్రి. నన్ను 'మాల్‌ అని పిలుస్తారు, షాపింగ్‌ మాల్స్‌కి వెళ్ళడం అలవాటయిన మనుష్యులందరూ. శ్రీలతను శ్రీ అని పిలవమని నేర్చాను. మా పేర్లు ఎలా ఖూనీ చేసినా సంధ్య పేరు చిన్నప్పటినుంచీ పట్టుపట్టి ఇరుగు పొరుగు దగ్గరనుంచి స్మూల్లో టీచర్ల చేత కూడా 'సంధ్యో అని పిలవటం నేర్పాము. ప్రక్కింటి పిల్లలతో సంధ్య ఆడుకోవడం, స్విమ్మింగ్‌ దగ్గర నించి ఐస్‌ స్కేటింగ్‌ వరకూ కలసి వెళ్ళడం జరుగుతున్నది. ఒక్కొక్కసారి వాళ్ళ యిళ్ళల్లో భోజనం కూడా చేస్తుంది. మాంసాహారం మేము తినమని, సంధ్యకు పెట్టవద్దని గట్టిగా చెప్పాము. కానీ ఆచార వ్యవహారాలు ఎలా వున్నా ప్రొటీన్‌ తినటం వల్ల శరీరానికి మంచి శక్తి వస్తుందని ్రక్కింటివాళ్ళు మాతో చెప్పటం మొదలెట్టారు. శ్రీలత పనులలో వున్నా ప్రక్కవాళ్ళే సంధ్యను వాళ్ళ పిల్లలతో కలిపి బయటకు తీసుకెళ్ళడం చాలా సదుపాయంగా, సహాయంగా వున్నది. ఆ మాటకొస్తే సంధ్య మా యింట్లో ఎంత టైం గడిపిందో, ప్రక్క యిళ్ళల్లో కూడా అంతే టెం గడిపింది కిమ్‌, బెట్సీలతో కలిసి. రోజులు మారుతున్నాయి. 15 సం.లు యిట్టే గడిచి పోయాయి. శ్రీశైలంలో ముఖ్యంగా నా యింట్లో చాలా మార్చులు వచ్చాయి. ఆరోగ్యం సరిగ్గాలేక తల్లిదండ్రులిద్దరూ స్వర్గస్థులయ్యారు. నా పేరుకి శ్రీశైలానికి వున్న సంబంధం తప్ప మిగతా అనుబంధాలన్నీ సన్నబడ్డాయి. సంధ్యకు హైస్కూల్‌ పూర్తయి బెర్మిలీలో సీటు వచ్చింది. నేనూ, శ్రీలత యింట్లో మిగిలిపోయాము. అప్పుడప్పుడు సంధ్య యింటి కొచ్చినప్పుడల్లా కొత్త మార్పులు కనబడుతున్నాయి. బాగా ఇండివిద్యువాలిటీ పెరిగింది. దానికి కాన్ని ఆలోచనలు, అభిప్రాయాలు అలవరచుకొంది. హిందూఇజమ్‌, క్రిస్టియానిటీ, ఇస్లామ్‌ అనేవి మానవులు ఏర్పరచిన సరిహద్దులు, మనుష్యులంతా ఒకటే, అన్ని మతాలు బోధించేది ఒకటే అని వాదిస్తున్నద్రి. కాదని నేను అనలేదు. అయినా జీవితం గాలిపటం లాంటిది. దాన్ని తాడు లేకుండా విసిరేస్తే ఎక్కడికో వెళ్ళి ఏ కొండల మీదనో, చెట్ల మీదనో విరుక్కుంటుంది. అందుకని తాడు కడితే ఆకాశంలో ఎగిరినప్పుడు చూసి ఆనందిచ్చవచ్చు. మరలా నెమ్మదిగా నేల మీదకు తీసుకు కై కథారని- 204 2222322222

ాలాలాలాలాాడడడడాలు రావచ్చు. అది ఎగిరే విధానాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టచ్చు. అందుకని కులమతాలు మనుష్యుల్ని ఒక మార్గంలో వుంచటానికి కానీ, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవటానికి కాదని నా అభిప్రాయాన్ని సంధ్యతో వెలిబుచ్చాను.

“దాడీ! మీరు చాలా వోల్డ్‌ ఫ్యాషన్‌” అని సంధ్య నాకు తిరిగి సమాధానమిచ్చింది.

నిజంగా చిన్నప్పుడు నాన్న నాకు చెప్పినట్లే సంధ్యకు మన పురాణాల గురించి, సంస్కృతిని గురించి ఎన్నో చెప్పాను. కానీ యిలాంటి లిబరల్‌ ఆలోచనలు రావటానికి కారణం. మా యిల్లు కాదు. చుట్టూ వున్న పరిసరాలు. మన యింట్లో మన నాగరికత గురించి పిల్లలకు ఎంతగా అంటకట్టదలచినా, అవి అందరికీ అభ్యసించవు. యింట్లో కన్నా బయటవున్న స్నేహితుల ప్రోద్బలం ఎక్కువగా వుంటుంది.

“గ్రాడ్షీ! యువార్‌ 'ఫ్రాజన్‌ ఇన్‌ టైం” అని అంది సంధ్య నన్ను చూసి. “ఇండియాలో కూడా చాలా మార్చులు వస్తున్నాయి. ఆ మాట కొస్తే శ్రీశైలం గుడిలో పూజలు, పునస్మారాలలో మార్పులేమీ లేవేమో కానీ, దేవుడి మీద భక్తి మారలేదేమో కానీ, ఆ గుడి దాటి బయటికి వచ్చిన తర్వాత మనుష్యుల ఆలోచనలలో, వాళ్ళు చేసే పనులలో మార్పు రాలేదంటరా?మీరు ఇండియాలో వున్నప్పటికన్నా యిష్పుడు ఎందరో బ్రాహ్మణులు మాంసం తింటం లేదా? ఆల్మహాల్‌ త్రాగటం లేదా? ఆ మాటకొస్తే మన ఫుడ్‌ వోబిట్స్‌ చాలా చెడ్డవి. మనం ఎక్సర్‌సైజ్‌ చేయం. కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువ తింటాం. అందువల్ల మన వాళ్ళకు గుండె జబ్బులు, దయాబెటిస్‌ ఎక్కువగా వుంటాయి. చూడు! తాతయ్య, నాయనమ్మ చిన్న వయసులోనే డయాబిటీస్‌ వల్ల చనిపోయారు” అని మన నాగరికత మీద, ఆరోగ్య వ్యవహారాల మీద తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబితే నాకూ నిజమేననిపించింది.

“గ్రోజూ పరిగెత్తి వ్యాయామం చేస్తే కానీ మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ తగ్గదు. రెడ్‌వైన్‌ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనని శాస్త్రజ్ఞులు చెప్పారు. అందువల్ల మీరు కూడా తీసుకుంటే తప్పేమీ లేదు” అని నాకు చెప్పింది.

నేను సంధ్య మాట విని నా పద్ధతుల్ని మార్చుకోవాలో లేక వాటిని శిలాశాసనాలుగా నమ్మి మొండిగా వుండాలో తెలియని సందిగ్ధంలో పడ్డాను. సంధ్య ప్రోద్బలం వల్ల బ్లడ్‌ టెస్ట్‌లు చేయించాను. గుందె జబ్బుకు తగిన పరీక్షలన్నీ చాలా ఎక్కువగా వున్నాయి. ఈ వయస్సులో నా బ్లడ్‌ టెస్ట్‌లు అంత చెడ్డగా వుండటానికి కారణం నా జీవన విధానమేనని నిరూపించింది. నన్నూ, శ్రీని ప్రోద్చలం పెట్టి తనతో పాటు మమ్మల్ని కూడా పరుగెత్తించటం మొదలెట్టించింది. అమెరికాకు వచ్చిన కొత్తలో చీరెలు వదిలి ప్యాంట్స్‌ వేసుకోవటానికి సిగ్గుపడిన శ్రీలత, యిప్పుడు నాతో కలిసి పొట్టి లాగులు వేసుకొని పార్మ్‌లో పరిగెత్తటం మొదలెట్టింది. యిప్పుడు నేను ఒక గ్లాసు రెడ్‌వైన్‌ తీసుకోవడం మొదలెట్టాను.

ఆరోగ్యం మహాభాగ్యం అని అన్నారు కానీ, ఆ ఆరోగ్యం ఏం చేస్తే సవ్యంగా వుంటుందో అనేది చాలామందికి తెలిసినా, ఆచరణలో పెట్టేది చాలా కొద్ది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదని సంధ్య అభిప్రాయం.

చిన్నప్పుడు నాన్న మన ఆచారాల గురించి ఉపదేశిస్తే యిప్పుడు సంధ్య మన ఆరోగ్యం కతత డక కాక్‌ సంథ్యంషు

2 గురించి ఉపోద్దాతం మిస్తున్నది. నాన్న ఏం చేయమంటే అది చేసేవాణ్ణి. యిప్పుడు సంధ్య ఏం చెబితే అలాగే నేనూ, శ్రీలత పాటిస్తున్నాం. మా యిద్దరికీ వ్యక్తిత్వం లేక కాదు. ఆ చెప్పేది . ఎవరో కాదు. మా అమ్మాయే కదా! యిన్నాళ్ళు మన ఆచార వ్యవహారాల్లో మార్పులేని జీవితాన్ని నడుపుతున్న నేనూ, శ్రీలత యిష్పుడా సంధ్య సందేశం వల్ల కొత్త మార్పుల్ని జీవితంలోకి తీసుకొచ్చాం. అప్పుడు నాన్నకూ, అమ్మకు ఆరోగ్యం గురించి భోదించి శ్రీశైలం కొండల మీద రోజూ పరిగెత్తిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుపడి యింకా కొన్నాళ్ళు జీవించి వుందేవారేమోననిపించింది.

ఈ మధ్య మా యింట్లో కార్బోహైడ్రేట్స్‌ పూర్తిగా తగ్గించివేసింది సంధ్య. రోజూ అన్నం వుడకందే గడవని మా యింట్లో గోధుమలు తప్ప బియ్యం లేవు. వేపుడులో వడియాల దగ్గర నుంచి కూరల దాకా రుచిగా తినే మా యింట్లో వుడక పెట్టిన పదార్దాలు తప్ప నూనె కనపడి తేనే గొప్ప. ఆవకాయ లాంటి వూరగాయలన్నిటికీ స్వస్తి చెప్పింది - ఉప్పు ఎక్కువగా వుంటే బ్లడ్‌ 'ప్రషర్‌కు మంచిది కాదని రెగ్యులర్‌ మిల్మ్‌తో గడ్డ పెరుగు చేసుకునే శ్రీలత చేత స్మిమ్మ్‌డ్‌ మిల్మ్‌తో మజ్జిగ నీళ్ళు చేయిస్తున్నది సంధ్య

సంధ్య ఆధ్వర్యంలో వచ్చిన ఈ మార్పులు బాగా కనిపించినా, నా దైనందిక జీవితంలో పెద్ద మార్పు లేదు. రోజూ ప్రొద్దునే లేచి సంధ్యావందనం చేయటం తప్పనిసరి! ఆ తర్వాత యిదివరకు ఏ ఉష్మా లేక పూరీ తిని వెళ్ళిన నేను యిప్పుడు ఏ క్యాంటిలోప్‌ లేక హనీడ్యూ లాంటి పళ్ళు తిని పనికి వెళ్తున్నాను.

సంధ్య బయట మాంసం తింటుంది. ప్రొటీన్‌ తింటే ఆరోగ్యానికి మంచిదని వాదన. చిన్నప్పటినుంచి అమెరికన్‌ ఫ్రండ్స్‌తో తిరిగినందువల్ల వచ్చిన అలవాట్లు. అందుకు నేనూ, శ్రీలత అంగీకరించపోయినా, కాలేజీకి వెళ్ళిన తర్వాత మా ప్రమేయమేమి లేదన్నట్లు ప్రవర్తించింది. ఈ దేశంలో చిన్నప్పటినుంచీ విద్యాలయాలలో బోధించేది ఒకటే గదా! యిది నీ జీవితం! నీ భవిష్యత్తు గురించి నీవే నిర్ణయం చేసుకోవాలి. నీ జీవితం మీద యింకెవరికీ హక్కు లేదు - చివరికి నీ తల్లిదండ్రులకు కూడా! చిన్నప్పుడే గట్టిగా చెప్పని నేను, 25 సంవత్సరాలు వస్తున్న సంధ్యకు మన ఆచారాలు, సంప్రదాయాల గురించి చెప్పి ఒప్పించే స్థోమత నాక్షూ, శ్రీలతకు లేకపోయింది. ఆచార వ్యవహారాలల్లో విభిన్నమైన అభిప్రాయాలు వున్నా ఆరోగ్యం గురించి సంధ్య చేస్తున్న వుపదేశం సవ్యంగానే అనిపిస్తుంది.

సంధ్యకు 25 సం.లు వచ్చే లోపలే పెళ్ళి చేయాలనుకున్నాం. నేనూ, శ్రీలత. సంధ్యకు వ్యక్తిత్వం ఎక్కువయ్యే కొద్దీ మేం చూసిన సంబంధాలు తనకు యిష్టం లేదని చెప్పింది. తన జీవిత భాగస్వామిని తనంత తానే ఎన్నుకుంటే కానీ యిప్పుడు సంసార జీవితం సరిగ్గా ఉండటం లేదు. అందువల్ల తనకు నచ్చినవాడు దొరికినప్పుడు తానే మాతో చెబుతానన్నది. “దాడీ నువ్వు యిలా ఇండియా వెళ్లి అలా మమ్మీనీ పెళ్ళి చేసుకుని వచ్చినట్లు ఈ కాలంలో జరగటం అసంభవం” అని సంధ్య నాతో అంటే ఒక్క తరంలోనే వచ్చిన ఈ మార్పుల్ని ఎలా అవగాహన చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. సంధ్య పెళ్ళి విషయం నాకూ, శ్రీకి గుందెల మీద కుంపటిలా అయింది.

ఈ మధ్య మా వూళ్ళో యిద్దరు భారతీయుల అమ్మాయిలు అమెరికా తెల్ల అబ్బాయిల్ని 2 భారరని- 2004 కైతె కో

ఆఅ చేసుకోవటం జరిగింది. ఎర్రగా, బుర్రగా కుర్రవాడున్నా తర్వాత పిల్లలు, వాళ్ళ పెంపకం, అందులో వుండే సమస్యలు సంధ్యకు వివరంగా చెప్పాలి. సంధ్య దృష్టిలో యివన్నీ చాలా చిన్న విషయాలు. మనసులు కలిసి మనుష్యులు దగ్గరికి చేరగలిగితే పిల్లల పెంపకం పెద్ద లెక్క కాదు అని సంధ్య అభిప్రాయం. అయినా మా మనశ్శాంతి కోసం ఇండియన్‌ అబ్బాయినే తప్పకుండా పెళ్ళిచేసుకుంటాననే మాటిచ్చింది. అదే నాకూ, శ్రీలతకు, వెన్నెల వర్షంలా, గంధం పరిమళంలా మనసుకి ఎంతో హాయిని కలిగించింది.

కాలేజీ చదువుల్లో ఎలాంటి ఆటంకం రాకుండా చదువుకుంటోంది. ప్రవర్తనలో, మర్యాదగా మసలటంలో మేం వేలెత్తి చూపాల్సిన పనిలేదు. అలాంటి సంధ్య నాకూ, శ్రీకి నచ్చిన వరుణ్ణే చేసుకుం టుందనే నమ్మకం కుదిరింది. అనాదిగా వస్తున్న సనాతన ధర్మాల్ని తూ.చా. తప్పకుందా ఆచరిస్తున్న నేను, నా నాన్న చిన్నప్పుడు రంగరించి పోసిన మన ఆచార వ్యవహారాలన్నింటినీ కనీసం నా మనవళ్ళకైనా నేర్పించవచ్చనుకున్నాను. సంధ్య భారతీయుజ్జే చేసుకుంటానంటే మాకు పది ఏనుగుల ధైర్యం వచ్చింది.

కాలేజీ అయిన తర్వాత సంధ్య లాస్‌ఏంజిల్స్‌లో ఉద్యోగంలో చేరింది. ఈ మధ్య పనిచేసే చోట ఒక తెలుగు అబ్బాయి కలిసాడు, చాలా మంచివాడని చెప్పింది. ఆ మాటకే నాకూ, శ్రీలతకు మనసులో ఆనందపు పన్నీరు కురిసింది. "పెళ్ళి" అనే పేరుతో మా యిద్దరి ఉబలాటం పెరిగింది. వివరాలు ఎంతగా తెలుసుకోవాలన్నా నిజంగా ఏదైనా నిర్ణయానికొస్తే చెబుతానన్నది సంధ్య. అందుకని మేం కూడా వూరుకొన్నాం. అమెరికాలో పుట్టి పెరిగిన సంధ్యకు భారతీయుడే కాకుండా తెలుగు అబ్బాయి దొరికాడంటే మాకు అంతకన్నా కావాల్సిందే ముంది.

ఆరు నెలలు జరిగాయి. సంధ్య శ్రీలతకు ఫోను చేసింది. తను పెళ్ళి గురించి నిశ్చయం చేసుకున్నానని. తన మనసుకి నచ్చిన మనిషి తనకు అన్నివిధాలా నచ్చిన భర్త దొరికాడని. ఈ తొమ్మిది నెలల్లో యిద్దరూ ఒకరినొకరు చాలాసార్లు కలుసుకున్నారని, యిద్దరి ఆలోచనలు, అలవాట్లు బాగా కలిసిపోయాయని చెప్పింది. అబ్బాయి తండ్రి ఒంగోలులో పెద్ద డాక్టరట. 'శుభస్య శీఘ్రం) అని అనుకున్నాం. పేరేంటి అని శ్రీలత అడిగితే, “అంత తొందరపడకు. ఈసారి వచ్చేటప్పుడు యింటికి తీసుకొస్తాను” అని చెప్పింది సంధ్య. నాకూ, శ్రీలతకు కుతూహలం ఎంత ఎక్కువయినా సంధ్య మాటను వ్యతిరేకించలేక వుండిపోయాం. సంధ్య పెళ్ళయితే మా భారం తొలిగిపోతుంది. అందులో తెలుగు పిల్లవాడే దొరికాడంటే, నేనూ త్రీ పూర్వజన్మలో చేసిన పుణ్యం అని అనుకొన్నాం. దేముడి మీద భక్తితో వుంటే దేముడు అందర్నీ చల్లగా చూస్తాడు. అది యిప్పుడు నిజమయింది.

ఆ రోజు వచ్చింది. సంధ్య, ఆ అబ్బాయి యింటి కొచ్చారు. మా యిద్దరి కళ్ళూ ఆ అబ్బాయి మీదే నిలిచాయి. అందంగా వున్నాడు. పచ్చని పసిమి కాకపోయినా తెల్లగా వున్నట్లే అనిపిస్తాడు. సంధ్య కన్నా నాలుగు అంగుళాల పొడుగు. సూది ముక్కు నెత్తి నిందా నల్లని వెంట్రుకలు. నాకు నచ్చాడు. శ్రీలత వైపు చూసాను. తనకూ నచ్చినట్లు కనులతోనే అంగీకారాన్ని తెలిపింది. సంధ్య యిలాంటి చక్కని అబ్బాయిని ఎన్నుకోగలిగి నందుకు మనసులోనే గర్వపడ్డాను.

సంధ్య వచ్చి నన్నూ శ్రీలతను కౌగిలించుకుంది. 2111111112 సధ్ళోదీసం క

“యిదిగో! యిన్నాళ్ళనుంచీ చెబుతున్నానే! ఈ అబ్బాయి. పేరు 'వందనం' ” అని అన్నది కనులు నేల వైపు చూస్తూ.

శ్రీలతకు ఎలా అనిపించిందో కానీ నాకు ఎలక్టిక్‌ షాక్‌ తగిలినట్లనిపించింది. శరీరమంతా ఒక్కసారి కదిలిపోయింది. మనస్సంతా స్థంభించకపోయింది.

“అంటే? అని వూరుకున్నాను. |

“అవును, క్రిష్టియన్‌! చెప్పానుగా యిదివరకే! కులం కన్నా గుణం ముఖ్యమని. నా మనసుకి తగ్గ మనిషి కావాలని. అమెరికాలో పుట్టీ పెరిగిన నాకు కులం కన్నా మనిషి నడవడిక ముఖ్యం” అని నిక్కచ్చిగా చెప్పిన సంధ్య వైపు నిర్దాంతపడి చూస్తూ ఉండిపోయాను.

పరమపద సోపానపటంలో పైకి ఎక్కి వస్తున్న నేను చివరలో పెద్ద పాము నోట్లో పడి క్రిందకు జారిపోయినట్లనిపించింది. యిన్నాళ్ళూ నాకు వేరే మతం మీద ఎలాంటి ద్వేషం, అసహ్యం లేవు. నిజంగా వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. నా మతం హిందూ మతం. అది తప్ప యితర మతాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. ఈనాడు నా నాన్న చెప్పిన ఆచార వ్యవహారాలన్నిటికి విభిన్నంగా సంధ్య నాకు ఈ సమస్య తెచ్చిపెట్టింది.

ఈ దేశం ఎందుకొచ్చాను? ఇండియాలోనే వుంటే యింత ఘోరం జరిగేదేనా? జన్నాం తరాలుగా నాన్న చెప్పిన మన ఆచారాలను పొటించాలనుకున్న నాకు భగవంతుడు ఒక ప్రహరీ గోడ కట్టి నా ఆలోచనలన్నిటినీ బంధించి వేసాడు. లోతుగా పరిశీలిస్తే దేముణ్జి నమ్ముకున్నందుకు నాకు దేముడు ఏం మేలు చేసాడు? అమ్మా నాన్నల అనురాగం వదిలి చదువు కోసం 16వ ఏటనే వేరే వూరు తరిమాడు. 50 ఏళ్ళు దాటీ దాటగానే తల్లిదంగ్రులిద్దర్నీ నాకు దూరం చేసి శాశ్వతంగా తన దగ్గరకు చేర్చుకున్నాడు. కొడుకులు కావాలనుకున్న నాకు ఒక్కగానొక్క కూతుర్ని యిచ్చాడు. కూతురు తప్పుడు దోవలో తిరుగుతుంటే అమెరికా లోనైనా, నాలుగు దెబ్బలు కొట్టి వైతన్యం తెచ్చిఉండేవాణ్ణి. అలాంటిది చదువులో, ఆటలలో మంచితనం, నడవడికలో చాలా సవ్యంగా పెరిగిన సంధ్యలో తప్పుపట్టటానికి ఏమీ దొరకలేదు. కానీ ఏంటంటే పెద్దయ్యే కొద్దీ తన స్వంత వ్యక్తిత్వాన్ని అలవరచుకొంది. అది ఈ దేశపు వాతావరణంలో పుట్టి పెరిగిన చాలా మంది అలవరచుకునేదేను. ఈ వయస్సులో సంధ్యకు చెప్పినా తన అభిప్రాయాల్ని మార్చలేను.

చిన్నప్పుడు నాన్ననా వ్యక్తిత్వాన్ని మార్చాడు తన మాటలతో. నాకు అప్పుడు స్వంత అభిప్రాయాలు, ఆలోచనలు లేవు. నాన్న చెప్పిందే వేదం. యిప్పుడు సంధ్య తన శక్తితో నా ఆలోచనలన్నిటినీ మార్చి వేస్తున్నది. నా అలవాట్లను చాలా మార్చింది. రక్తానుబంధం వల్ల అప్పుడు నాన్న మాటలు ఎలా విన్నానో యిష్పుడు సంధ్య మాటలు కూడా అలాగే వింటున్నాను.

యిన్నాళ్ళూ నాకున్న ఒక్క అలవాటు - రోజూ సంధ్యావందనం చేయటం. ఈనాడు భగవంతుడు యిలా కలిపాడు. అమెరికాలో పుట్టి పెరిగిన సంధ్యకు ఇండియాలో పుట్టి పెరిగిన వందనం దొరకటం చాలా వింతగా వుంది. శ్రీలత వైపు చూసి ఏం మాట్లాడాలో తెలియక, కనులు ఒక్క క్షణం మూసుకొని వందనం వైపు చేయి జాపాను.

నా సంధ్యావందనం” పూర్తయింది. అ క మ... 2232322222

మూదోతరం

అ రాలవు శుబ్చిరాణో

పంచాంగం దేముడు చదువుకున్నది చిన్న చదువే అయినా, చదువుల్లో విలువలు

తెలిసినవాడు కాబట్టి, కొడుకు నరేష్‌బాబుని పెద్ద చదువులు చదివించాడు. ఫలితంగా ఓ

దళితుడి కొడుకు కలక్టరై, అంచెలంచలుగా అధికారాలు పొంది రాష్ట్ర ప్రభుత్వంలో సెక్రటరీ

అయ్యాడు. కొడుకు కుటుంబంతో బాటు తానూ గునుపూడి నుంచి హైద్రాబాదుకి మకాం మార్చాడు పంచాంగం దేముడు.

ఇంత ప్రగతిని సాధించగలిగినందుకు ఓ ప్రక్క సంతోషంగా ఉన్నప్పటికీ, 'కత్తి మీది సాము'లాంటి నరేష్‌ జీవితం నేర్పిన పాఠాల్హో, ఎన్నో వింత విషయాలు నేర్చుకున్నాడు దేముడు. జీవితం అంటే ఫౌంటెన్ల క్రింద కూర్చుని రంగు చేపల్ని చూస్తూ ఆనందించడం మాత్రమే కాదనీ, అడుగడుగునా కంటక ప్రాయమైన అడ్డంకుల్ని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడం దుష్కరమనీ (గ్రహించాడు.

నరేష్‌బాబు అటు ఉద్యోగంలోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ బాధ్యతల తరంగాల మధ్య జీవిత సాగరాన్ని ఎలా ఈదుకొస్తున్నాడో దిన దినమూ గమనిస్తున్నాడు దేముడు. రాష్ట్ర ప్రభుత్వపు సెక్రటేరియట్‌లో మంత్రుల దగ్గర సెక్రటరీగా పనిచేయడం ఏమంత సులభ సాధ్యమైన పని కాదు. కేవలం ప్రజా క్షేమమే ధ్యేయంగా త్యాగాలు చేసిన పూర్వపు నాయకుల విషయం వేరు. నేటి రాజకీయ నాయకుల్లో చాలామందికి తమ పార్టీ ఎప్పుడు వీగిపోతుందో, తామెప్పుడు కుర్చీ దిగిపోవాల్సీ' వస్తుందోనన్న దిగులుతో, అధికారంలో ఉన్న కొద్ది రోజుల్లోనే ఇల్లు చకృబెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకేమీ పట్టవు. దాన్ని సాధించడానికి నరేష్‌బాబు వంటి వారిని అడ్డం చేసుకుని అడ్డమైన పనులూ చేస్తూ ఉంటారు. అలాంటి అవకతవకల పనులన్నీ కిమ్మనకుండా చేయాలి. లేకపోతే ఉద్యోగానికి నీళ్ళు వదులు కోవాలి. ఉన్నత విద్యలనభ్యసించామన్న అభిమానాన్ని వెనక్కి నెట్టి, వివేకహీనుల ఎదుట చేతులు కట్టుకు నుంచుని సేవలందించాలి. ఓసారి ఓ మినిష్టరుగారి వరంగల్లు కేంపుకి తను ఏర్పాటు చేసిన కారు డోరు సరిగ్గా పడలేదని, నరేష్‌కి సంవత్సరం పాటు ఇంక్రిమెంటు ఆపు చేశాడాయన.

ఇక ఇంటి విషయానికొస్తే, కోడలు పెద్ద సొసైటీ లేడీ! ఎప్పుడూ క్లబ్బులు, పార్టీలూ అంటూ తిరుగుతూంటుంది. మనుమరాలు కళ్యాణి, లలితకళల్లో డిగ్రీ చేసి భరతనాట్యంలో బాగా పేరు తెచ్చుకుంది. ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లోనే కాక విదేశాల్లో కూడా నృత్య ప్రదర్శనలిచ్చి ఇండియాకి కల్చరల్‌ ఎంబాసిడర్‌ అని పేరు తెచ్చుకుంది. తల్లీ కూతురూ, సంవత్సరంలో ముప్పాతిక భాగం పైగా విదేశాల్లోనే ఉంటారు. న్యూయార్భులో డాన్సు స్కూలు పెట్టారు. ఎప్పుడైనా ఇండియా మీదుగా ఆస్టేలియా వెళ్తూ, ఓ రోజు హైద్రాబాదులో ఆగి అందర్నీ చూసి వెళ్తారు. వచ్చిన ఖ్యాతి నిలబెట్టుకోడానికీ, శరీర సౌష్టవాన్ని పోషించుకోవడానికీ అడ్డంవచ్చే సంసార లంపటంలో చిక్కుకోవడం ఇష్టంలేక కళ్యాణి పెళ్ళి చేసుకోలేదు.

మనుమడు విక్రమ్‌ విషయం చెప్పనే అక్కర్లేదు. కాలేజీలో ఈవ్‌ టీజింగ్‌ కేసుల్లో ఒకటి రెండు సార్లు ఇరుక్కుని జైలు దాకా వస్తే తప్పించి హైద్రాబాదు నుంచి “ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌"కి మార్చించాడు నరేష్‌ అక్కడ డిగ్రీ పూర్తయిందనేటప్పటికి విక్రమ్‌కి కేంద్రంలో ఓ చిన్న మినిష్టరుగారి అమ్మాయితో పరిచయం ప్రేమగా మారి పెళ్ళి వరకూ దారి తీసింది.

హైసొసైటీలో కులాలు, కట్నాల ప్రసక్తి ఉండదు. అత్తవారే విక్రమ్‌ని సంవత్సరం పాటు స్పెషలైజేషన్‌ పేరుతో లండను పంపించారు. జరిగిందేదో జరిగిందని నమాధానపడి, విదేశాల్నుంచి తిరిగివచ్చిన విక్రమ్‌ని మంచి ఉద్యోగంలో స్థిరపరిచే ప్రయత్నం చేయబోయాడు నరేష్‌ అందుకు విక్రమ్‌ ససేమిరా ఒప్పుకోలేదు. పదిమంది దగర తల వంచి నౌకరి చేసే

౧

అగత్యం తనకి లేదన్నాడు. రాజకీయంగా అటు అత్తవారి మద్దతుని, రాష్ట్ర రాజధానిలో తండ్రి వైై౭2ఊఊత3తడ22222కకకైడకడకతడతతతతైతతా క భారాం- 2004 232౩కి 2222222222

న ౮ పలుకుబడిని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో చేరతానన్నాడు. నరేష్‌ కొడుకు విషయంలో అంతకంటే ఎక్కువ జోక్యం కలుగచేసుకోలేదు. చేసి ప్రయోజనం లేదని అతనికి తెలుసు. ఈ తరం పిల్లలకి పెద్దల ఇప్పాయిష్టాలతో ప్రమేయం లేదు.

ఇవన్నీ తన కళ్ళ ముందే జరుగుతుంటే పంచాగం దేముడికి చిత్రంగా అనిపించేది. మనిషి జీవితంలో పైకి కనపదేదీ, నిజంగా వాడనుభవించేదీ ఎంత విరుద్ధంగా ఉండగలవో అని ఆశ్చర్యపడేవాడు. వెనుకబడిన కులంలో పుట్టి, బాగా చదువుకుని, ప్రభుత్వంలో పెద్ద ఆఫీస్రై, ఎంతో ప్రగతిని సాధించిన ధీరుడు నరేష్‌బాబు. సామాన్య ప్రజానీకం దృష్టిలో అతనిది తిరుగులేని జీవితం. ఇంటి నిందా నౌకర్లు, చాకర్లు. కుమార్తె అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన మహిళ. కొడుకు విదేశాలు తిరిగి వచ్చాడు. మినిష్టరుగారి అల్లుడు. ఇంతకంటే జీవితంలో ఎవరైనా ఆశించేది ఏముంటుంది? కానీ, నరేష్‌, వ్యక్తిగతంగా అంత ఆనందంగానూ ఉంటున్నాడా? లేక ఈ బెన్నత్యం అంతా నేతి బీరకాయేనా?' అతని జీవితంలో వెలితిని ఎవరు పూడుస్తారు? చివరికి మిగిలేది అసంతృప్తి అయితే ఇంత సాధనకి అర్ధం ఏమిటి? దేముడు మాత్రం ఈ పరిస్థితులకి (ప్రత్యక్షసాక్షిగా ఉండడం తప్ప, ఏం చేయగలడు? తన చేతుల్లో ఏముంది?

ఎలక్షన్లాచ్చాయి.

పంచాంగం దేముడి మనుమడు విక్రమ్‌ గునుపూడి వెనుకబడిన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. తానుగా అక్కడ పుట్టి పెరక్కపోతే తక్కువేమి? “మా తాతది మీ వూరే! కనుక నేను మీవాడి"నన్నాడు. “మా తండ్రి కలెక్టరుగా మీ ప్రాంతాలని అభివృద్ధి చేశాడు కనుక మీరు నాకు ఓటు వేయండి” అని చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నాడు. ప్రసిద్ధ నర్తకి చెల్లెలు కళ్యాణి చేత నాట్య ప్రదర్శనలిప్పించి, పార్టీకి ఫండులు సంపాదించి పెట్టాడు. రాజకీయంగా అత్తవారి అండ ఉండనే ఉంది. ఒకప్పుడు తనతో స్నేహంగా ఉంటూ, ఎంతటి ఘోరకృత్యానికైనా వెనుదీయని కత్తుల్లాంటి మనుషులు కొందరు స్వార్థపరత్వంతో “మేమున్నాం” అంటూ ముందు కొచ్చారు. ఇన్ని బలగాలు వెనకేసుకొచ్చి ప్రచారం చేసిన విక్రమ్‌ని విజయలక్ష్మి 'చాసోహం” అంటూ వరించింది. విక్రమ్‌ విజయపరంపరకిది ప్రధమ సోపానం.

ఎం.ఎల్‌ ఏగా హైద్రాబాదు చేరిన మూడు నెలల్లో పోష్‌ ఏరియాలో ఓ భవంతి కొనేశాడు విక్రమ్‌. ముప్ఫై సంవత్సరాలు ప్రభుత్వంలో సర్వీసు చేస్తూ నరేష్‌బాబు సాధించలేని ఘనవిజయం ఇది. అధికారంతోబాటు, వందిమాగధులూ, బంధుజనులూ ఇబ్బడి ముబ్బడిగా రాసాగారు. ధన కనకాలు కుంభవృష్టిగా ధార కట్టసాగాయి. విక్రమ్‌కి నిముషం తీరిక ఉండడం లేదు. భార్య సంగతి సరే సరి. ఎవరి దారిన వారు వస్తారు. ఎవరి దారిన వారు వెళ్తారు. ఎవరి పనులు వాళ్ళవి. ఒక దగ్గర కూర్చోవడం, కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం, అభిమానం, ఆదరం అంటూ ఏమీ లేవు. ఇవన్నీ చూస్తుంటే దేముడికి ఆ ఇల్లొక సత్రంలా అనిపించేది. చిత్రమేమిటంటే, దేనికీ లోటు లేదు. ఏది కావాలన్నా నిముషంలో వచ్చి పడుతుంది. కాని దేముడికి మాత్రం ఏదో తెలియని లోటు. అది ఇదమిద్ధమని చెప్పలేడు.

ఇంట్లో తనని పలకరించేవాళ్ళు లేక, తన ఉనికిని గమనించేవారు లేక, కాలక్షేపం కోసం, ఉభయ సంధ్యలూ వాహ్యాళికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు దేముడు. ఇల్లు వదిలి అలా 22212222 మానాలు ౩

నడుస్తూ పోతే, పెద్ద పెద్ద బంగ్లాలు దాటి, ఆ మవోనగరపు మురికివాడల్లోకి పోతుందా రోడ్డు. పరిసరాల్ని పరిశీలించుకుంటూ, నదవగలిగినంత దూరం నడిచి తిరిగి ఇల్లు చేరుకుంటూ ఉంటాడు అతను. ఆ సమయంలో దేముడు గమనించేవి రకరకాల జీవితాలు. మేడల్లో నివసించే ధనవంతులు. ఆ మేడల నీడల్లో బ్రతికే దౌర్భాగ్య జీవులు, పేవుమెంటు పైనే పురుటాలయి, భావి భారత పౌరుని గని మురిసిపోతున్న పేదరాలు, ఎత్తెన ప్రహరీ గోడల నానుకుని, రెండు రేకులడ్డం పెట్టుకుని, తరతరాలుగా జీవించేస్తున్న ఆగర్భ దరిద్రులు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఏ సదుపాయాలూ లేకుండానే తమ వంశాన్ని తామరతంపరగా పెంచుతున్న నికృష్ట జీవితాలు

  • ఇలా ఎన్నో చూసినకొద్దీ హృదయం తరుక్కుపయేది దేముడికి. అనన్నీ చూస్తుంటే, చిన్నప్పటి తన పల్లె ఎంతో నయం అనిపించేది. ఎంతో అభివృద్ధిని సాధించాననే తన అభిప్రాయం ఎంత అబద్ధమో అంతు చిక్కేది కాదు. ఏ ఒక్కరో, ఏ మూలనో ఏదో కొంత పురోగమిస్తే, అంతటితో సరా? దేశంలో ఇంకెందరు క్రింది మెట్లలో పుట్టుకొస్తున్నారో! ఎవరు గమనిస్తున్నారు? దీనిని నివారించే మార్థాలు ఎవరు అన్వేషిస్తున్నారు? కటిక దరిద్రుడిని, కోటీశ్వరుడిని చేశామనీ, ఈ సమాజంలో అట్టడుగు పొరల్లోకి అణచివేయబడిన వారిని ఉద్ధరించి, దేశపరిపాలనే వారికి అప్పజెప్పాలనీ, కలలుగన్న మహాత్ములేరీ? ఎవరి స్వార్ధం వారు చూసుకుంటే వీరిని పట్టించుకునే దెవరు? ఏ ఒక్కరో పూనుకుంటే సాధ్యమయ్యే కార్యమేనా ఇది? - ఇలాంటి ఆలోచనలతో దేముడికి పిచ్చెత్తినట్టయ్యేది. "

అతనలా రోజూ గమనించే వారిలో, ఒక యువకుడూ, అతని భార్య నిండు చూలాలూ ఎందుకో ఎక్కువగా అతని నాకర్షించారు. పాపం అతడు ప్రతిరోజూ, తోపుడు బండి నిందా బరువులు నింపుకుని ఒక ప్రక్క నుంచి మరొక ప్రక్కకు చేరవేస్తూ ఉంటాడు. నడవలేని పరిస్థితిలో కూడా అతని భార్య అతనికి బండి లాగడంలో సహాయం చేస్తూ ఉంటుంది. ఆఅ దృశ్యం చూస్తుంటే దేముడికి గుండెల్లోంచి బాధ వచ్చేది.

ఒకనాడు ఉండబట్టలేక, వారి నాపు జేసి వివరాలడిగాడు దేముడు.

“ఏం బాబూ! ఆడకూతురునీ స్థితిలో అంత కష్టపెడుతున్నావు?”

“ఏం చెయ్యమంటారు బాబూ! రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. రోజంతా ఇలా కష్టపడితే గాని పూట గడవదు.”

“ఎక్కడుంటారు మీరు?”

“అదుగో ఆ భవంతి పప్రహారీగోడ నానుకుని వ్రేలాడగట్టిన ప్లాస్టిక్‌ గుడ్డ క్రింద మా నివాసం.”

“చ్రాస్తుంటే చదువుకున్నవాడిలా ఉన్నావు. ఉద్యోగం ఏదైనా చెయ్యొచ్చు గదా!” __ “చదువుకేం బాబూ! బి.య్యే. దాకా చదివాను. కాని కేవలం డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలాొచ్చే రోజులా ఇవి? మిగిలిన అర్హతలేవీ నాకు లేవాయె”

“అసలే వూరు మీది?”

“గృనుపూడి.”

“ఎవరబ్బాయివి?” .

“ఆచారిగారి మనవడిని" అ కళా -10 1౬112221

చుక్కమ్మ వారు

అ ఛాయాముర్లి్‌

మా ఊరి చుక్కమ్మ సంబరాలకి రమ్మంటూ, ఏదో స్నేహధర్మంగా వివేకిని ఆహ్వానించడం నిజంగా బుద్ధి తక్కువై పోయింది. గుడి పూజారి ఎంత మాటనే సొడూ.... 'విశ్వాస్‌ బాబూ! సీకున్న భక్తి ప్రపత్తుల్లో వెయ్యో వంతైనా లేని యీ నాస్తికుడితో నీకు పొత్తెలా కుదిరిందయ్యా? 222౭222222 సకన్యుంట క

గొప్ప నేస్తమే దొరికాడు నీకు! అని పది మందిలోనూ నిలదీసి, ఎద్దేవా చేసాడు కదా! మరి, ధర్మకర్తగారైతే, “ఈ నాస్తికుణ్జి వెంటనే ఊరి బయటకు తరమండి' అని గద్దించాడు కూడానూ!.... “వివేక్‌ తరఫున నేను క్షమాపణ చెప్తానని ఎలాగోలా సర్దుబాటు చేసి, అతడిని క్షేమంగా తిరుగు బస్సు ఎక్కించి వచ్చేను. 6 శి -... అదేమి చిత్రమోగాని భిన్న ధృవాల్లా ఉండే మా యిద్దరి అభిప్రాయాలకీ ఎప్పుడూ చుక్కెదురే అయినా, మా స్నేహానికి అదే పునాదిగా ఉంటూ వస్తోంది.... కాలేజీ రోజుల్లో “భక్తి మార్గం - జ్ఞానపథం” అనే అంశం మీద యిద్దరం చెరో పక్షానా చేరి డిబేట్లో పాల్గొన్నాం. జ్ఞానాన్ని ప్రశంసించిన వివేక్‌కి మొదటి బహుమతీ.... భక్తిని సమర్థించిన నాకు ద్వితీయ బహుమతీ వచ్చేయి. “నీ అభిప్రాయంతో నేనెప్పుడూ ఏకీభవించలేను. అయినా, నీ వాదనలో వ్యక్తమయ్యే విశ్వాసానికి ముగ్భుణ్ణయ్యాను' అన్నాడు వివేక్‌. "నేనూ అంతే!.... నీ వాదన నా కెప్పుడూ అర్థం కాదు. అయినా నీ నిజాయితీని మాత్రం శంకించలేను అన్నాను నేను.... అప్పట్నించీ మేమిద్దరం మంచి మిత్రులం... ౦ ఈ అసలిదంతా నేను మా చుకృన్మువారి కోవెల పుట్టుపూర్వోత్తరాల గురించీ... “రాక పోకల స్వామి” గురించీ మా వివేక్‌తో ప్రస్తావించడం వలన వచ్చింది. కేవలం గుడి మీది శిల్చవైభవాన్నీీ జాతరలోని జానపద నృత్యరీతులనీ, అక్కడి అంగళ్ళలోని హస్త కళలనీ.... మన పర్యాటక శాఖ వారి పద్ధతిలో... 'ఆలా అలా చూపించి వదిలేస్తే తీరిపోయేది. అలా కాక ఏదో పెద్ద “దేవాదాయ శాఖాధికారిలా ఆ విషయం మీద మరీ లోతుకి వెళ్ళేసరికి... వివేక్‌ చేత అర్థంకాని పాఠాలు చెప్పించుకోవలసి వచ్చింది. ..... ఎప్పటిలాగే! 664 ....ఓ రెండు శతాబ్దాల క్రిందట ఈ ప్రాంతంలో కేవలం ఒక గుట్ట ఉండేదిట... సమీపంలోని ఓ కుగ్రామంలో శివాలయ పూజారిగారింట ఓ బాలుడు.... పేరు 'శివానందుడు'.... జన్మించాడుట... జ్ఞానం తెలిసిననాటినుంచీ తనకు ఎదురైన స్వాముల నెందరినో, “నేను ఎక్కడి నుంచి వచ్చాను?... నేను తిరిగి ఎక్కడికి వెళతాను?” అని రెండే ప్రశ్నలు అడిగేవాడట, అందుకు కొందరు స్వాములు మౌనం పాటించే వారు.... మరి కొందరు స్వాములు చెప్పిన జవాబులతో శివానందుడు సమాధానపదే వాడు కాదుట... అలా కొన్నేళ్ళు గడిచేక, ఏమి స్ఫురించిందో ఏమోగాని, ఒక మునిమాపువేళలో యిల్లు వదిలి ఎటో వెళ్ళి పోయాడట.... అతడి కోసం గాలించిన వాళ్ళకి మర్నాటి సాయంత్రం ఈ గుట్ట మీది చెట్టు నీడలో పద్మాసనం వేసుకుని, ఎదురుగా ఉన్న బండరాతి మీద స్ఫుటంగా కనబడుతున్న బొట్టంత చుక్కనే తదేక దీక్షతో చూస్తూ. కనిపించాడట. తనవాళ్ళ బలవంతం మీద అప్పటికి అక్కడి నించి కదిలి యింటికి వెళ్ళిపోయినా, మర్చాటి నుంచీ ఉదయాస్తమానాల్లో గుట్ట నెక్కి ఆ చుక్ననే తీక్షంంగా చూస్తూ ఉండేవాడట. ఒక్కోసారి నిద్రాహారాలు మర్చిపోయి అక్కడే ఉండిపోతే, ఎవరో ఒకరు ఒకటి రెండు పళ్ళు అక్కడ పెట్టి పోయేవారట.... తిన్న రోజు తినేవాఢు, లేనిరోజు ఏ పక్షులో, ౩ కథారరంి- 1004 హెయ్‌

లాట ఉదతలో తినిపోయేవి. .... జీవి *రాక- పోకిలకు సంబంధించిన తన సందేవోనికి గుర్తుగా అతని పేరు రాకపోకల స్వామిగా కాలక్రమేణా స్థిరపడిపోయింది... అతదూ ఆ గుట్ట మీదే స్థిరపడిపోయేడు.

ఒకనాటి అర్థరాత్రి ఈ గుట్ట మీది నుండి మబ్బులు లేని ఆకాశంలోకి ఏదో ఒక మెరుపు తీగ దూసుకుపోవడం చూసిన కొందరు మర్నాటి ఉదయం గుట్ట మీదకి వెళ్ళి చూస్తే ఇంకేముంది!?.... రాకపోకల స్వామి అంతర్భ్థానమయ్యాడు!.... అతడు ఎప్పుడూ చూస్తూ ఉండే చుక్క స్థానంలో ఆ బండరాతికి.... అద్భుతంగా చిల్లుపడి పోయి.... ఈ వైపు నుండి ఆ వైపుకి రంధ్రం ఏర్పడిపోయింది!

....ఆ రాత్రి రాకపోకల స్వామికి అంతర్నేత్రం తెరుచుకుందనీ - ఆ మూడో కంటి చూపు నిలిచిన చోట శిల కరిగి రంధ్రమేర్పడిందనీ... ప్రజలంతా గ్రహించారు. జ్ఞాననేత్రం తెరుచుకున్న స్వామికి తన రాకపోకల రహస్యం అవగతమై, తాను ఎక్కడి నుండి వచ్చాడో ఆ దివ్యలోకాలకే 'ఖేచర గమనం” తో పయనమై పోయాడనీ పెద్దలు నిశ్చయించారు.

౨౦౦

స్వామివారు మోక్షం పొందిన చోట గుడి కట్టాలనే తలంపు రాగానే... “ఎవరికి గుడి కట్టాలి?...స్వామికా?.... లేక చుక్క(మ్మ)కా!” అనే సందేహం కలిగినపుడు, స్వామిగారి తండ్రిగారైన శివాలయ పూజారిగారు, “చుక్కమ్మ వారికే గుడి కట్టాలని ఆదేశించారు. ఆ నాటి నుంచీ పూజారిగారి వంశీయులే ఈ చుక్కమ్మవారి గుడికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే మరి “రాక పోకల స్వామి" వారిని ప్రజలు మరచిపోయినట్టేనా అంటే అదేం కాదు... స్వామివారు గుట్ట నెక్కిన దారిలోని శిలల మీద వారి పాదముద్రలని గుర్తించి, శిల్పుల చేత చక్కగా చెక్కించారు. ఆ మార్గానికి అనుకునే ప్రస్తుతపు మెట్ల దారిని నిర్మింపడేసి... మెట్టు మెట్టుకీ స్వామివారి 'పాద ముద్రల పూజు చేసుకునే వీలు కల్పించారు. జాతర సమయాల్లో చుకృమ్మవారి దర్శనం చేసుకోలేనివారు స్వామివారి పాద ముద్రలకే పూజాదికాలు జరిపించి, దగ్గర్లో ఉండే హుండీల్లో తమ తమ కానుకలు సమర్పించుకుంటారు. అయితే నిలువుదోపిడీ యిచ్చుకునేవారు మాత్రం విధిగా గుట్టనెక్కి చుక్కమ్మ వారికే సమర్పించుకోవాలన్న నియమం ఉంది. గుట్టనెక్కలేనివారికి సవారీ కుర్చీ సదుపాయం కల్పించారు.

అసలు.... చుకృమ్మ వారంటే సొక్షాత్తూ ఆ పరమశివుడి ఫాలనేశ్రానికి ప్రతీక అనీ.... రాక పోకల స్వామి అంతర్నేతశ్రానికి దర్శన మిచ్చేక, ప్రజల మనోఖీష్టాలు తీర్చేందుకై అలా వెలిసి ఉండిపోయారనీ... ఒక ప్రథ ఉంది. ఆ మధ్య వచ్చిన స్థల పురాణ పుస్తకంలో ఈ మహాత్యాన్ని కూడా జోడించారు.

64

....ఈ యదార్థగాథనంతా యథాతథంగా నేనెంతో ఉత్సాహంగా వినిపిస్తే వివేక్‌ అంటాడూ, “రాముణ్ణి అడవులకి సాగనంపి, పాదుకలకి పట్టాభిషేకం చేసిన అయోధ్యకీ, మీ ఊరికీ తేడా ఏముంది?... మీ స్వామీజీ అడుగు జాడలు పూజిస్తున్నారు సరే, ఆయన అన్వేషిస్తూ వెళ్ళిన గమ్యం మాటేమిటి?.... పుస్తకాన్ని పూజించినంత మాత్రాన చదువు రాదు కదా!..... మీ 2222

చుక్కమ్మవారొక 'రాతి-చిల్లు' తప్ప మరేం కాదు కాని, ఆ స్థానంలో మీ స్వామివారు తన దృష్టిని కేంద్రీకరించిన బిందువుని... అదే.... ఆత్మస్థానాన్ని.... మర్చిపోయారు మీరు!.... అందుకే మీరు చేసే పూజలూ, భజనలూ అన్నీ వ్యర్థం! అనేసాడు ఏమాత్రం మంచీ - మర్యాద లేకుండా.

అది విన్న నాకే ఎంతో కష్టంగా అనిపిస్తే, మరి వంద ఎకరాల గుడి మానానికి భుక్త అయిన వంశపారంపర్య ధర్మకర్తగారు ఆగ్రహోదగ్రులవడం సహజమే కదా!

న

వివేక్‌ని బస్సెక్కిస్తూ, “జ్ఞానమూ, భక్తీ వేర్వేరు అనుకోవడం అజ్ఞానమని రాజాజీగారు చెప్పలేదా! భక్తిని వెక్కిరిస్తే, జ్ఞానాన్ని నిరాదరించినట్టేకదా!” అన్నాను.

“బస్సు బయళల్టేరదానికింకా అరగంట టైముంది కానీ... ఇలా వచ్చి కూచో!... నీతో కాస్త మాట్లాడాలి" అన్నాడు.

నేను వచ్చి కూచోగానే, కాసేపు మౌనంగా ఉన్నాక 'ఆదిశంకరుల కాలానికి బౌద్దం తన మూలతత్వానికి దూరంగా... నిరీశ్వర వాదమై ప్రజలలో పాపభీతి లేకుండా చేసి వారిని బ్రష్టు పట్టించడంతో.... వారి ప్రవర్తనను అదుపు చెయ్యదానికి వారిలో మూఢ భక్తినీ... తద్వారా దైవభీతినీ.... పెంపొందించడమే మార్గమని గ్రహించిన శంకరాచార్యులు నాటి గ్రామదేవతలెంద రికో తన తపశ్శక్తిచేత మహిమలు కల్పించారని ఒక అభిసప్రాయం ఉంది.... అందుచేత ఈ విగ్రహాలూ, మహిమలూ కేవలం పొమర జనం కోసమే గాని, ఎంతోకొంత విద్యాగంధం అబ్బిన సంస్మారవంతులకు కాదు" అన్నాడు వివేక్‌.

“అయితే భక్తులందరూ పామరులనే అంటావా?” అన్నాను.

“అలాగని ఎవరన్నారు... భక్తులలో స్థాయీ భేదాలున్నాయి. ఆర్హుడూ, అర్ధార్టీ, జిజ్ఞాసువూ, జ్ఞానీ అని నాలుగు రకాల భక్తులున్నారు.... బాధానివృత్తి కోసం అర్హుడూ, ఈప్పిల్‌ ఫలం కోసం అర్జార్థీ భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. జిజ్ఞాసువు కుతూహలం కొద్దీ సాధకుడౌతాడు. అధ్యాత్మికుడైన జ్ఞాని మాత్రం దైవమే మూలకారణమన్న గ్రహింపు కలిగి ఉంటాడు... వీరిలో భగవంతుడికి మొక్కుకునే ఆర్హుడూ, అర్భార్థీ పామర భక్తులే కదా!” అన్నాడు వివేక్‌.

'నీ సిద్ధాంతం ప్రకారం చుక్కమ్మవారిని పూజించే మేమంతా పామరులమే అయితే మరి నీ మాటేమిటి?.... నువ్వు నాస్తికుడివే కదా! అన్నాను కొద్దిగా ఆవేశపడి.

చిన్నగా నవ్వాడు వాడు.... 'మన అస్తిత్వం అవగాహనలో ఉన్నప్పుడు నాస్తిక భావనకు ఆస్కారమే లేదు..... నేను బహుశా జిజ్ఞాసువును కావచ్చు.... నాకింకా ఎన్నో సందేహాలు మిగిలిపోయేయి.... జ్ఞాతకూ, జ్లేయానికీ మధ్య అభేదం సిద్ధించినప్పుడే జ్ఞానోదయం కలిగి... జిజ్ఞాసువు జ్ఞానిగా రూపాొందుతాడు."

'నీ మాటలు ఎప్పట్లాగే నాకు అర్ధం కావల్లేదు కానీ.... ఒక్కమాట చెప్పు!.... భక్తీ ఆధ్యాత్మికతా ఒకటి కాదా?” అన్నాను అయోమయంగా. |

కావనే అనిపిస్తోందిక్‌ సాలోచనగా అన్నాడు వివేక్‌... 'పరిణామ క్రమంలో మానవుడు యింకా పరిపక్వత చెంది అధిమానవుడు కావాలని శ్రీ అరవిందులు అనేవారు. అధిమానవుడికి (౮0-104 1౨2 డో

సంబంధింనదే 'అధి-ఆత్మ' ..... మానవులలో పాపాత్ములూ - పుణ్యా త్ములూ ఉంటారుగానీ.... అధిమానవులందరూ ఆధి-ఆత్ములే!.... వారిదే ఆధ్యాత్మికత!..... సద్గుణ, దుర్గుణాలనే సగుణ ద్వయానికి అతీతులైన ఆ అధ్యాత్ములు ఆ నిర్గుణ పరబ్రమ్మానికి అత్యంత సన్నిహితులు ... 'తస్వైవహంి, 'త్వవైవహం', 'త్వమేవహం' అనే భావనల సోపాన త్రయంలో ఉండే భక్తులూ..... 'సోహం' అన్న (గ్రహింపు కలిగి ముక్తులైన ఆధ్యాత్ములూ.... ఒక్కటి ఎలా అవుతారు?” - ఎదురు ప్రశ్నించాడు వివేక్‌. పిల్లి అంటేనే అర్ధం తెలియనివాడికి, “మార్జాలం” - 'బిడాలం'” అని బోధపరచినట్టయింది నాకు. తెల్లబోయిన మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ... గుటక మింగి ఏదో చెప్పబోయిన నాకు... అప్పటికే వచ్చి కూచున్న దదైవర్‌ బస్సు హారన్‌ మోగించడం వీనుల విందుగా అనిపించింది. ౦64 ఇదంతా జరిగి యిప్పటికి ఏడాదవు తోంది. ఈమధ్యనే మా చుక్కన్ము వారి గుడి యాజమాన్యం వారు ఒక కొత్త వ్రత దీక్షని (ప్రవేశపెట్టారు. దాని ప్రకారం పురుష భక్తులు ఆకుపచ్చని దుస్తులు ధరించి, 'రా-పో” స్వాములుగానూ... ప్రీ భక్తులు ఎర్రని దుస్తులు ధరించి, “చుక్కమ్మలుగానూ వ్యవహరింపబడతారు. మహాశివరాత్రికి 11 రోజుల ముందు (ప్రారంభమయ్యే ఏకాదశ రాత్ర దీక్షలో 'బ్రహ్మచర్యం - శాకాహారం - సత్యవ్రతం” నియమాలు. శివరాత్రి నాటి చుక్కమ్మ జాతరలో ఈ దీక్షాపరులకి గుట్ట మీది గుడిలో ప్రత్యేక ప్రవేశాలూ - సామూహిక పూజలూ ఉంటాయి. ఆనాడు వారు హుండీలో యథాశక్తి... మహాభక్తులైతే వెయ్యిన్నూటపదార్లు, హీన భక్తులైతే నూటపదార్లు వెయ్యాలి. (దంపతులైతే చెరి అర్భా వెయ్యవచ్చును). దీక్ష ముగిసి, గుట్ట దిగిన రోజునే భక్తులు తమ మూడు నియమాలనీ ఒకసారి ఉల్లంఘించి, సామాన్య ప్రజానీకంతో కలిసిపోవలసి ఉంటుంది. అందుకు తగిన ఏర్పాట్లు గుడి యాజమాన్యం వారే చేస్తారు. (మరే దేవుడి దీక్షలోనూ లేని ఈ ప్రత్యేక సౌకర్యం వలన చుకృమ్మవారి దీక్షాపరులు ఏటికేడు యిబ్బడి ముబ్బడిగా పెరగగలరనీ.... తద్వారా “దేవా దాయం' పొంగి పొర్లగలదనీ ధర్మకర్తల అంచనా!). .... ఏకారణం చేతనైనా మహాశివరాత్రి దీక్ష తీసుకోలేనివారి కోసం మాస శివరాక్రులు ఉండనే ఉన్నాయి కదా!, వ ధర్మకర్తగారి దయ వలన నేనిప్పుడు రాక పోకల స్వామి మఠ, నిర్మాణ సంఘ కార్యదర్శిని అయ్యాను కానీ.... అనాడు వివేక్‌ వేసిన ప్రశ్నలూ - అతడు వ్యక్తపరచిన అభిప్రాయాలూ యీ నాటికీ నా మనసును అపుడపుడూ కలవరపరుస్తూనే ఉంటాయి... ఏ రాత్రయినా ఆ విధంగా నిద్ర చెడిపోతే.... చుక్కమ్మవారి 'నిద్రా-కవచి స్తోత్రాన్ని చదువుకుని వోయిగా నిద్రపోతుంటాను నేను. అ క్ష్‌ సక ఛొక్త క

డి తల్లి

అ ఎలక్ట్రాన్‌

ఏట ఒడ్డున తమ పొలంలో గట్టుకి ఒకింత దూరంలో ఉన్న రెండు గదుల పెంకుటింటి ముందు వసారాలో వాలు కుర్చీలో కూర్చుని, మామిడితోపు వెనుక నించి అప్పుడే ఆకాశంలోకి ప్రసరిస్తున్న ఉదయ కిరణాల్ని చూస్తున్న శ్రీనివాసు, సైకిల్‌ బెల్‌ చప్పుడు విని తల తిప్పి చూశాడు. ఓబులేశు సైకిలు స్టాండ్‌ వేసి, వసారా పక్క మెట్ల మీద నుంచి పైకి వచ్చి, దారిలో అయ్యరు హోటల్లో కట్టించిన యిడ్లీల పొట్లాన్నీ నింపు కొచ్చిన కాఫీ మ్లాస్మ్‌నీ ఆ రోజు వార్తాపత్రికని, పక్కనే ఉన్న బల్ల మీద ఉంచి, “దండాలయ్యా” అన్నాడు. ఆ తర్వాత ఓబులేశు లోపలికి వెళ్ళి ఓ చిన్న స్టీలు గ్లాసు తీసుకువచ్చి, అందులో కాఫీ నింపి శ్రీనివాసు కందించాడు.

శ్రీనివాసు కాఫీ త్రాగే వరకూ ఆగి, “ఈ మాట విన్నారా శ్రీనివాసబాబూ?!” అన్నాడు ఓబులేశు.

“నిన్న రాత్రి నువ్వు ఖాళీ కారియర్‌ యింటికి పట్టుకుపోయిన తర్వాత, ఓ అరగంట ఏదో పుస్తకం చదివి పడుకున్నాను. అర సీసాడు నాటు సారా లాగించి తోడు పడుకొన్న నాడే

స్వామి, అరగంట క్రితమే లేచి తూర్చు వార పంటకాల్వలో మట్టి తియ్యడానికి పారా, పలుగూ పట్టుకొని పోయాడు. ఈ లోపుగా ఏ మాట, ఎవరి ద్వారా వినగలను?” - శ్రీనివాసు చిన్నగా నవ్వుతూ అన్నాడు.

“సానివాడలో నిన్న రాత్రి రెండింటికి నీలవేణి కన్ను మూసిందయ్యా!” అన్నాడు ఓబులేశు.

శ్రీనివాసు ఓ క్షణం స్తబ్బుడైపోయాడు.

“ఆమె అంత రాత్రివేళ పోయినట్టు నీకెలా తెలిసింది? రాత్రి నీ యింటికి వెళ్ళకుండా ఆ వాడలో ఎక్కడైనా కాని పక్క వేశావేమిటి?!! ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. లేనిపోని రోగాలాచ్చాయంటే ఆరోగ్యం దెబ్బతింటుంది” అన్నాడు మందలింపుగా, స్తబ్ధితలోంచి తేరుకుంటూ.

ఆ మాటలకి ఓబులేశు నొచ్చుకోలేదు.

“మీరు ఆవలిస్తే పేగులు లెక్కడ్తారయ్యా! క్రితం ఏడు మరిదమ్మ సంబరాల ఆఖరి రోజున సాముగరిడీ తిప్పినప్పుడు, నా కండబలం చూసిన గడసాని కనకం కన్ను గీటిందయ్యా! అప్పట్నుంచీ దాని గడపలో నెలకోసారి అడుగు పెడద్తున్నానయ్యా! మీ దగ్గిర దాపరికమెం దుకు?” అన్నాడు ఓబులేశు కాస్త చనువుగా, చారవగా.

“అందుకే అంటున్నాను, నేరుగా అఘోరిస్తున్నావా లేక జాగ్రత్తలేమైనా తీసుకొంటున్నావా అని?” శ్రీనివాసు కాస్త స్వరం హెచ్చించి అన్నాడు.

“రోగ నిరోధకానికి పనికొచ్చే వాటిని వాడుతున్నానయ్యగారూ! అవి వాడితే ఎయిడ్స్‌ లాంటి మహమ్మారి వ్యాధులు కూదా రావని తెగ సందేశాలిచ్చేస్తున్నారు కదా సార్‌?!”

“దౌర్భాగ్యమేమిటంటే, కుటుంబ నియంత్రణకి ఉపయోగించే ఈ సాధనాన్ని సుఖరోగ నివారణ సాధనంగా ప్రభుత్వాలూ, తయారీ కంపెనీలూ ప్రకటనల హోరు పెంచేయడం మూలాన, నీలాంటి వాళ్ళు ఈ రెండో అంశానికే ప్రాముఖ్యత యిచ్చేస్తున్నారు! నీకిప్పటికే ముగ్గురు పిల్లలు. నాలుగో కానుపుకి నీ భార్యని పుట్టింటికి పంపించి, రాసలీలల్లో ములిగి తేలితున్నావన్నమాట! ఓబులేశూ, నువ్వు రోగం రాకుండా చూసుకుంటున్నావేమో కాని దేశానికి జనాభా రోగాన్ని పెంచేస్తున్నావన్నమాట మరిచిపోకు! అయినా నీ కిదేం బుద్ది ఓబులేశూ?”

“నాకు కట్టబెట్టిన ఆడది చూపులకి చీపురు పుల్లలా ఉన్నా అది పెట్టే నస సంగతి నాకు తెలుసు ఆ దేముడికి తెలుసు. కనకం పొందులో నా తీరని కోరికలు తీరుతున్నాయి అయ్య గారూ!” - ఓబులేశు తన ప్రవర్తనకి కారణం చూపుతూ సమర్ధించుకోబోయాదు.

“యిదే విధంగా ఆలోచించి, కట్టుకొన్న స్త్రీ కూడా పక్కదారులు చూసుకొంటే సమర్ధించే ధైర్యముందా నీకు?” - శ్రీనివాసు అన్యమనస్కంగా అన్నాడు.

ఓబులేసు సమాధానమివ్వకుండా నేల చూపులు చూడసాగాడు.

నీలవేణి మరణవార్త విన్న తర్వాత ఓబులేశుతో ఏవో మాటలు మాట్లాడుతున్నా, శ్రీనివాసు హృదయంలో సుడిగుండాలు తిరుగుతున్నాయి. ఉన్నట్టుండి కుర్చీలోంచి లేచి, “ఓబులేశూ, స్వామిని పిల” అన్నాడు. = దోరుర్ముపీ ల్లి కై

ఓబులేశు రెండు చేతులు చూపుడు వేళ్ళనీ పెదాల మధ్య బిగించి ఊళ వేశాడు. దూరంగా ఉన్న స్వామి పార విడిచి పరుగెత్తుకొంటూ వచ్చాడు.

“స్వామీ, దక్షిణం వైపు ఎండిపోయి ఉన్న రెండు తుమ్మవెట్లనీ నరికించి, వెంటనే పుల్లల్ని ఏటి వంపులో ఉన్న శ్శశానానికి చేర్చించే ఏర్పాట్లు చెయ్యి. అక్కడ యిద్దరు మనుష్యులతో సిద్ధంగా ఉండు. మరో నలుగురు మనుషుల్ని సానివాడలో నీలవేణి యింటి దగ్గరకు పంపించు. ఓబులేశూ, నువ్వు సైకిలు మీద నీలవేణి యింటికి త్వరగా వెళ్ళి, ఆమె పెంపుడు కూతుళ్ళతో నే నక్కడికి వస్తున్నానని కబురు చెప్పు. ఆ తర్వాత మా పురోహితుడు అవధాని యింటికి వెళ్ళి, (శ్రాద్ధకర్మలు చేసే బ్రాహ్మలతో నీలవేణి యింటికి వెంటనే రమ్మని చెప్పు” - దూరంగా పైకి లేస్తున్న సూర్యుడి వెలుతుర్లో నీడలు కనిపిస్తున్న చెట్ల కేసి చూస్తూ శ్రీనివాసు అన్న మాటలకు ఓబులేశు, స్వామి విస్తుపోయారు.

ఓబులేశు తేరుకొని, “అయ్యగారూ, తమరు?” అని అర్దాంతరంగా ఆగిపోయాడు.

“వెళ్ళండి, వెళ్ళి చెప్పిన పనులు చెయ్యండి. స్వామీ, ఈ యిడ్లీల పొట్టాం నువ్వు పట్టుకు పోయి తిను. ఓబులేశూ, నువ్వక్కడికి పోయి ఏర్పాట్లు చేస్తూ ఉండు. నేనో గంటలోగా అక్కడికి వస్తానూ అన్నాడు శ్రీనివాసు కాస్త తీవ్రంగా.

ఓబులేశు వసారాలో ఉన్న మోటారు సైకిల్ని కిందకు దింపి న్ధాండ్‌ వేశాడు. అటు పైన తన సైకిల్ని తీసుకొని ఊళ్ళోకి వెళ్ళాడు.

శ్రీనివాసు ఓ అరగంట సేపు కళ్ళు మూసుకొని, రాబోయే తుపానునెలా ఎదుర్మోవాలా అని ఆలోచిస్తు కూర్చుండిపోయాడు. ఆ తర్వాత లేచి బట్టలు మార్చుకుని, మోటారు సైకిలు మీద సానివాడ చేరుకొని నీలవేణి యింటి గుమ్మం దగ్గర ఆగాడు.

శ్రీనివాసు సానివాడ చేరుకొనే సరికి ఊరంతా ముక్కు మీద వేలేసుకౌంది. దారినపోయే దానయ్యలు గుమిగూడారు. నీలవేణి పెంపుడు కూతుళ్ళు శ్రీనివాసుని చూస్తోనే అయోమయ స్థితిలో పడిపోయారు. నీలవేణి యింటి అరుగు మీద కూర్చున్న ఆ వాడ స్త్రీలందరూ లేచి నమస్కారం చేసి, క్రిందకు దిగారు.

నీలవేణి పార్థివ శరీరం చాప మీద పడుకోపెట్టబడి ఉంది. తల దగ్గర దీపం మిణుకు మిణుకుమంటూ వెలుగుతోంది. మహానిద్రలో ఉన్న ఆ మంజిక ప్రశాంత వదనంలో అరవై అయిదేళ్ళ అనుభవాల విషాద ఛాయలు శాశ్వతంగా మరుగునపడి పోయాయి. శ్రీనివాసు మోకాళ్ళ మీద వంగి, ఆమె పాదాలపై శిరస్సు నుంచి పాదాభివందనం చేశాడు.

ఓబులేశు అరుగు కింద చేతులు కట్టుకొని నిల్చున్నాడు.

అవధాని అరుగెక్కి శ్రీనివాసు పక్కగా నిల్చుని, “శ్రీనివాసూ, నువ్వు బాగా ఆలోచించే ఈ కార్యక్రమం తలపెట్టావనుకుం టాను. అయిన వారూ, కాని వారూ ఏ విధంగా స్పందిస్తారో ఆలోచించావా?” అని నెమ్మదిగా అన్నాడు.

“ఈ కర్మ కాండలు చేయించడానికి ముందస్తుగా మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, నా సంగతి తర్వాత ఆలోచిద్దురుగాని!” - శ్రీనివాసు తగ్గు స్వరంలోనే అన్నా, ఆ మాటల్లో తీవ్రత ఉంది.

క భారం 204 కక్ష

అవధాని సమాధానం చెప్పడానికి తటపటాయించి మౌనంగా ఉండిపోయాదు.

శ్రీనివాసే మళ్ళీ అన్నాడు ; *ఈ యింట్లో ఓ పూజ గది ఉంది. అందులో లేని దేవతల పటాలు లేవు! యిలాంటి జీవితాలు గడుపుతూ కూడా కర్మఫలమని సమాధానపర్చుకొంటూ, మన ధర్మాల మీద విశ్వాసం పోగొట్టుకోలేదు వీళ్ళు! అయినా అవధానిగారూ, అనాథ (్రేత సంస్మారమంతటి పుణ్యం మరాహటి లేదని శాస్త్రాలే చెబుతున్నాయి కదా?”

అవధాని లౌక్యుడు. నాలుగు రాళ్ళు వదులుకొనే మూర్చుడు కాదు.

“నువ్వన్న మాట నిజమే కాని, నీలవేణి అనాధ కాదు! చాలా ధనం సంపాదించింది. కర్మకాండలు జరిపించడానికి నా కభ్యంతరంలేదు కాని, నువ్వే స్వయంగా నడుం బిగించడం చాలా మందికి అభ్యంతరకరంగా ఉండొచ్చు. నీ మీద బురద జల్లడానికి ప్రయత్నాలు జరగవచ్చు. నేను భయపడేదీ, ఆలోచించేదీ నీ గురించే!” అన్నాడు.

“డబ్బంటే ఉండొచ్చు. కాని 'నా' అంటూ కన్నీరు కార్చే ఓ తండ్రి కాని, భర్త కాని, కొరివి పెట్టే కొడుకు కాని లేని వీళ్ళు వాస్తవానికి అనాధలే. సరే, యిప్పుడీ వాదనలన్నీ ఎందుకు కాని, శాస్రోక్తంగా కర్మకాండలన్నీ నా చేత జరిపించండి. మీ మీద ఈగ వాలని వ్వకుండా చూసే బాధ్యత నాది. నా విషయం గురించి మీరు పట్టించుకోవద్దు.”

ఓబులేశుతో తగ్గు స్వరంలో మాట్లాడుతోన్న కనకం, అరుగు మీద జరుగుతున్న సంభాషణ వైపు ఓ చెవి పారేసి మరీ వింటోంది. కనకం ఒక్క క్షణం ఆలోచించి అరుగు మెట్లెక్కింది. శ్రీనివాసు దగ్గరగా వెళ్ళి, “అయ్యగారూ, మీరిద్దరూ ఓసారి ఈ యింటి పూజ గది చూస్తే బావుంటుంది! అవధానిగారి అనుమానాలు తీరిపోతాయి!” అంది వినయంగా. 'సరే పది అన్నట్లుగా చూసిన శ్రీనివాసునీ, అవధానినీ యింటి లోపలి పూజా గృహంలోకి తీసుకెళ్ళింది కనకం.

దేవతల పటాల మధ్యలో శ్రీనివాసు తండ్రి మాధవరావు పటం. మంచిగంధపు చెక్కలతో చెక్కిన పువ్వుల దండతో అలంకృతమైంది. శ్రీనివాసూ, అవధానీ యిద్దరూ ఆశ్చర్యపోయారు. “ఈ కార్యక్రమం ధైర్యంగా జరిపించే శక్తి నివ్వు అని మౌనంగా తండ్రి పటానికి నమస్కరించి, బయటకు దారి తీశాడు శ్రీనివాసు.

అప్పటికి శ్రీనివాసు తమ్ముడు ప్రసాదూ, మరికొంతమంది స్నేహితులూ అక్కడికి చేరు కొన్నారు. ప్రసాద్‌ అన్న దగ్గరగా వెళ్ళి “ఊరంతా ఈ వార్త గుప్పుమంది. యింటి దగ్గర అమ్మ నిప్పులు చెరుగుతోంది. ఒంటికాలు మీద నిల్చుని రంకెలు వేస్తోంది. నిన్ను ఉన్న పళంగా వచ్చెయ్యమనీ, లేకపోతే తనేం చేస్తుందో 'తనకే తెలియదనీ హెచ్చరించమని చెప్పింది” అని అప్పజెప్పినట్లన్నాడు.

“ఆస్తిలో వాటా యివ్వనంటుంది, అంతకంటే ఏం చేస్తుంది?! నా మూలాన నువ్వూ నష్టపడ్డం ఎందుకు? యింటికి పోయి స్నేహితులతో ఉండు. ఏం జరిగేదీ నేనింటికొచ్చిన తర్వాత చూసుకొంటాను” అన్నాడు శ్రీనివాసు నిశ్చలంగా,

అన్నకి తోడుగా ఉండాలని ప్రసాద్‌ కనిపించినా, 'తగుదువమ్మా అని మీ అన్నగారి వెనుక వెడ్తే, మీ అమ్మగారు మొండి చెయ్యి చూపించవచ్చు. సంతులేని ఆవిడ మేనత్త ౩న“ నకల క

దగ్గర్నుంచి సర్వహక్కులతోనూ సంక్రమించిన ఆస్తిని మీ అక్క చెల్లెళ్ళు ఎగరేసుకుపోతారు! ఏదో అంటీ ముట్టనట్టుగా కబురు చెప్పి వచ్చెయండి" అన్న భార్య హెచ్చరిక మనసులో వెన్నాడుతోండగా, శ్రీనివాసు ఆ మాట అనవడం తడవు వచ్చిన స్నేహితులతో తిరిగి వెళ్ళిపోయాడు.

అవధాని ఆధ్వర్యంలో శ్రీనివాసు నిప్పుకుండ తీసుకొని వెళ్ళగా, నీలవేణి అంతిమ యాత్ర దర్జాగా సాగింది. యిళ్ళలోంచి బయటకు వచ్చిన జనాలు విడ్డూరంగా చూస్తూ ఉండి పోయారే కాని, శ్రీనివాసుతో ఒక్కడుగు కలిపి ఎవ్వరూ వెయ్యలేదు. వాళ్ళతో సానివాడను రాత్రి ముసుగులో దర్శించే ఘనులు లేకపోలేదు.

ఏటి ఒడ్డున నీలవేణి శరీరానికి దహనకాండలు జరిపి, శ్రీనివాసు యిల్లు చేరేసరికి మధ్యాహ్నం రెండు దాటింది. శ్రీనివాసుతో బాటు ఓబులేశూ, అవధానీ కూడా వెళ్ళారు. అవధానికి మనసులో .భయం భయంగా ఉన్నా, శ్రీనివాసుకి లేని భయం తనకెందుకని సర్ది చెప్పుకున్నాడు.

శ్రీనివాసు ముందు హాల్లోకి అడుగు పెట్టేసరికి, తల్లి సుందరమ్మ అందరి ముందూ ఏదో ఏకరువు పెద్దోంది. వాళ్ళలో ప్రసాద్‌ స్నేహితులూ, శ్రీనివాసు స్నేహితులూ, బంధువులూ వున్నారు. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకొంది, శ్రీనివాసు (ప్రవేశంతో.

ఓ పాత కాలపు కర్ర కుర్చీలో కూర్చున్న సుందరమ్మ ఆగ్రహంతో వణికిపోతూ, “బ్రతి కుండగా ఆ సాని దాన్నుంచుకొని మీ నాన్న సహమూ, యిప్పుదు దాని తల కింద కొరివి పెట్టి నువ్వు పూర్తిగానూ ఈ వంశ గౌరవాన్ని నట్టేట్లో ముంచేశారు! యింకా ఏం మిగిలిందని ఈ యింట్లో అడుగు పెట్టావ్‌?!” అని గట్టిగా అరిచింది.

తన తల్లి అందరి ముందూ పంచాయతీ పెడ్తోందని (గ్రహించిన శ్రీనివాసు ఆ క్షణంలో ఓ తెగింపుకు వచ్చేశాడు.

“సుందరమ్మగారు మీ అందరి ముందూ ఓ ప్రశ్న వేశారు. దానికి నేను సమాధానం చెప్పేవరకూ మీరెవరూ యిక్కణ్ణుంచి కదలడానికి వీల్లేదు. ఓబులేశూ, వోలు తలుపులు

ఓబులేశు హాలు తలుపు మూసి గడియ వేశాడు.

“చూశారా, చూశారా? నన్ను పేరు పెట్టి...”

తల్లి సుందరమ్మ మాటల్ని మధ్యలోనే ఆపుచేశాడు శ్రీనివాసు - “సరే “అమ్మా” అనే అంటాను. కాని నా సమాధానం వినేవరకూ నోరెత్తకు. అమ్మా అని పిలిపించుకొనే అర్హత కూడదా నీ కెందుకు లేదో, యిలకా ఏం మిగిలిందని ఈ యింట్లో నే నడుగు పెట్టకూడదో- రెండింటికీ సమాధానం దొరుకుతుంది!”

శ్రీనివాసు చాలా తీవ్ర స్వరంలో అన్న మాటలు విని సుందరమ్మ కంగు తింది. ఏదో అనబోయింది కాని, ఆ మాటలు గొంతులోనే ఉండిపో యాయి. ప్రసాద్‌ వింతగా అన్న వైపు చూస్తూ ఉండిపోయాడు.

“మాకు ఊహ తెలిసినప్పుట్నుంచి ఈ యింట్లో నీ మాటొక్కటే చెల్లుతుందనీ, అందరూ £ెైై౭ఊత=ైైాాా22౯ ౯౯ ధారంంి- 2004 222 డక్‌

నీ కనుసన్నల్లోనే మెలగాలని గ్రహించక తప్పలేదు. అధికారపూర్వకమైన ఓరకమైన అహం భావంతో ప్రవర్తించే నీ తీరు చాలాసార్లు మా మనస్సుల్ని కష్టపెట్టినా “తల్లి అనే గౌరవంతో మౌనంగా ఉండక తప్పలేదు. నీ దాష్టికాన్ని నాన్నగారు ఎందుకు సహించారో, ఎందుకు మౌనంగా ఉండిపోయారో నా కర్థం కాని విషయంగానే ఉండిపోయింది.

“మీ స్కూలు నిర్వహించే విహార యాత్రలలో పాల్గొనండి. కొత్త స్థలాలు చూడ్డం, సంగతులు తెలియడం, అనుభవాలు సంపొదించడం జరుగుతుందని నాన్నగారు ప్రోత్సహించినప్పుడు, నువ్వు కాదనే దానివి. “చిన్న క్లాసుల్లో అంత ఖరీదైన పెన్ను ఎందుకు, పారేసుకుంటా'రని నాన్నగారు సలహా యిచ్చినపుడు “వాళ్ళకేం తక్కువొచ్చిందని? ఎత్తుగా ఆలోచించలేని మనుషులు అని నువ్వు ఎద్దేవా చేసి, ఖరీదైన కలాల్ని కొనివ్వడం, వారం రోజులు తిరక్కుండానే వాటిని పోగొట్టుకొన్నప్పుడు, “మీ నోటి ఉసురే తగిలిందని నువ్వు నాన్నగారి మీద విరుచుకు పడడం - యిలాంటి ఎన్నో చెరగని ముద్రల్ని మా మనసుల మీద వేశావు.

“నేను ఆరో క్లాసు చదువుతోన్నప్పుడు ఓ అట్లతద్ది రాత్రి, అందరూ పడుకొన్న తర్వాత మెల్లిగా లేచి వెళ్లి నా స్నేహితులు గుంపుతో చేరి ఊరి వీధుల్లో తిరిగాను. గుమ్మాల దగ్గర పల్లేరు కాయలు జల్లడం-తలుపుల మీద తట్టడం-యింటి వాళ్ళు తలుపులు తీసి పల్లేరు కాయల మీద అడుగులు వేసి కుయ్యోమనడం - పిల్లలు దూరంగా పరుగెత్తి సంతోషంతో చప్పట్లు కొట్టడం - ఈ చిలిపి పనులు లేనిదే అట్లతద్ది రాణించదని అందరికీ తెలుసు. ఆ రాత్రి నీలవేణి యింటి దగ్గర చేసిన ఈ రకం అల్లరిలో నేను కాలు జారి మెట్ల మీద నుంచి పడి పోయాను. వళ్ళంతా పల్లేరు కాయలు గుచ్చుకొన్నాయి. నుదుటి మీద చర్మం చిట్లి రక్తం కారడం మొదలుపెట్టింది.

“తలుపు తీసిన నీలవేణి, 'అయ్యో, పడిపోయావా బాబూ అంటూ నన్నెత్తుకొని లోపలికి తీసుకువెళ్ళింది. స్నేహితులనందర్నీ లోపలికి పిలిచింది. నన్ను ఉయ్యాల బల్ల మీద కూర్చో పెట్టి, గుచ్చుకొన్న పల్లేరు కాయల్ని ఒకటొకటిగా తీసింది. నుదుటి మీద గాయాన్ని నీళ్ళతో కడిగి పట్టి వేసింది. 'రాభ్రి పూట ఎక్కడెక్కడ తిరిగారో? గాలి దెయ్యాలు పట్టుకొంటే ప్రమాదం కదూ? అందరూ పూజ గదిలోకి వెళ్ళి దణ్ణం పెట్టుకోండి అని మా అందరి చేతా దణ్జాలు పెట్టించింది. అందరి నొసట్లకీ వీభూతి రాసి, తలో తొక్కుడు లడ్డూ చేతిలో పెట్టి, “జాగ్రత్తగా ఆదుకోండి అని మా గుంపుని సాగనంపింది.

“తెల్లవారి యిల్లు చేరినప్పుడు రాత్రి బయటకు వెళ్ళినందుకూ, దెబ్బలు తగిలించుకొని వచ్చినందుకూ నువ్వు చేసిన గొడవా, పిల్లల సరదాలని సమర్ధించబోయిన నాన్నగారి మీద గొంతు చించుకున్న తీరూ ఈ రోజు వరకూ నేను మరిచిపోలేదు. ఆ రోజున నా మనసులో నిన్నూ నీలవేణిని బేరీజు వేసుకోక తప్పలేదు. నువ్వు జన్మనిచ్చిన తల్లివే కావొచ్చు. ఆ భావనతో బహుశా ఓ రక్షణాత్మకమైన అధికారాన్నే చెలాయించావు కాని, ్రేమని పంచి యివ్వలేదు. నీలవేణి వేశ్యే కావచ్చు. కాని ఆమెలో ఓ తల్లి హృదయముంది.

“దాంపత్య జీవితానికి సంబంధించిన విశ్లేషణల్ని పుస్తకాల్లో చదివితే సబబుగా ఉంటుంది కాని, కన్న సంతానం తల్లిదండ్రుల ఎదుట ఈ విశ్లేషణల్ని కొనసాగిస్తే అది సభ్యతగా తతత జౌ చోరుమ్మపి శి జె

ఉండదు. కాని సమయం, సందర్భం వచ్చాయి కాబట్టీ చెప్పక తప్పటల్లేదు.

“వివాహానికి పూర్వమూ లేదా భాగస్వామిని మృత్యువు కాటేసినప్పుడు ప్రీ పురుషులు అక్రమ సంబంధాల వైపు పరుగులు తీశారంటే, అది కుతూహలంతో కూడిన తొందర వల్ల కావచ్చు. లేదా దాంపత్య జీవితంలో లభించిన సుఖం కోసం మనసు మళ్ళీ మళ్ళీ పరు గులు తీయడం వల్ల కావచ్చు. కానైతే, సంఘం ఆమోదించిన వైవాహిక బంధంలో ఉన్న స్త్రీ పురుషులు పెడదారులు పట్టడానికి కారణాలనేకం ఉండొచ్చు. అయిష్టంగా జరిగిన వివా హం - శృంగారపరమైన అసంతృస్తి - వ్యక్తిత్వ ప్రదర్శనలో తీవ్రమైన అభిప్రాయభేదాలు. యివి అక్రమ సంబంధాలకి పరుగులు తీయించనూ వచ్చు, విడాకులకి దారి తీయనూ వచ్చు. కాని నాన్నగారి విషయంలో జరిగిందేమిటి?

“మీ దాంవత్యబంధంలోని యితరమైన అపశ్ళతులు నాకు తెలియవు కాని, నాకు తెలిసినదీ, తెలుపబడ్డదీ అయిన కారణం విను. అయిదు సంవత్సరాల (క్రితం అప్పటికి శ్రీనగర్‌లో ఉన్న నాకు నాన్నగారో ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరంలోని సారాంశం చెప్తా విను.

“అంతకు పూర్వం పదిహేను సంవత్సరాల క్రితం - అంటే నేను కొత్తగా ఉద్యోగంలో చేరి మద్రాసులో ఉన్నప్పుడు, యిక్కడ మనింటికి నాన్నగారి ఆహ్వానం మీద అత్తయ్య లిద్దరూ వాళ్ళ భర్తలతో, పిల్లలతో ఓ వారం రోజులు సరదాగా గడపడానికి వచ్చారు. నిన్నడగకుండా పిల్చినందుకు నాన్నగారినీ, వచ్చినందుకు వాళ్ళనీ నువ్వు చాలా అవమానపరిచావు. వాళ్ళు వచ్చిన మర్నాడే తిరిగి వెళ్ళిపోయారు.

“మా పట్ల నువ్వ నిర్టాక్షిణ్యంగా ప్రవర్తించినా, “తల్లి అనడానికి హక్కుంది" అని సర్దుకుపోయే నాన్నగారు తన తోబుట్టువుల్నీ బావగార్లనీ నువ్వు అవమానించడంతో చాలా తీవ్రమైన మనోక్షోభకి గురయ్యారు. ఆ విరక్తిలో ఏటిగట్టుకి వెళ్లి వరద నీటిలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొనే సమయంలో (ప్రేమించిన వ్యక్తి మోసం చేసి పారిపోగా, మారుటి తల్లి బలవంతంగా పడుపు వృత్తిలోకి నెట్టగా, ఆ వృత్తి చేసి చేసి అలిసిపోయి, జీవితం మీద విరక్తి పొందిన నీలవేణి కూదా ఏటి గట్టున అదే ప్రయత్నంలో ఉండి, ఒకరి నొకరు కలుసు కోవడం కేవలం యాదృచ్చికం. యిద్దరూ ఆ ప్రయత్నం నుంచి విరమించుకొన్నారు. అటుపైన ఆధ్యాత్మిక చింతనతో, శాంతి ప్రవచనాలతో మనసులు కుదుటపరుచుకున్నారు.

“నాన్నగారి ప్రోద్భలంతో యిరువురు పేద బాలికలను పెంచసాగింది. వాళ్ళని స్కూల్లో చేర్చించింది. వాళ్ల జీవితాలకో వెలుగు బాట చూపించడానికి కంకణం కట్టుకొంది. నాన్న గారికీ, నీలవేణికి ఏ విధమైన శారీరక "సంబంధమూ లేదు. యింట్లో నీ ఉరుముల్ని, ఊరి వాళ్ళ నొసటి వెక్కిరింతల్నీ చిరునవ్వుతో స్వీకరించడం నేర్చుకొన్నారు నాన్నగారు. ఎవరికీ తెలపని ఈ నిజాన్ని నాన్నగారు నాకా ఉత్తరం వ్రాసి తెలియజేశారు. ఆ ఉత్తరం నా కందిన అయిదో రోజునే నాన్నగారు పోవడం, నేను రావడం జరిగింది. ఈ అయిదు సంవత్సరాలూ ఈ విషయాన్ని నేనెవరితోనూ చెప్పలేదు.

“ధన మదం, అహంకారం, అధికారం - ఈ మూడు నీ మనసుకి పొరలు కమ్మేశాయి. నలత తడైడడైతడడైైతైతడడడడడడడ్‌్న పడా టు22ఒ2ఒ2ఒ2ేె =

నాన్నగారిని వటి ఒడ్డుకు తరిమింది నువ్వు! నాన్నగారు నిత్యమూ నీలవేణి సాన్నిధ్యాన్ని

కోరుకోవడానికి కారణమూ నువ్వే! మనం నాన్నగారి ఫొటో ఈ హాల్లో ఆ గోడకి వ్రేలాదదీశాం.

కాని నీలవేణి నాన్నగారి ఫొటోని పూజామందిరంలో ఉంచుకొని పూజించింది! ఆమె వ్యక్తిత్వం

నీ కన్న చాలా ఉన్నతమైనది. అందుకే ఆమెకి తల కొరివి పెట్టడం ఓ పుత్ర ధర్మంగా, ఓ

అదృష్టంగా భావిస్తున్నాను. యిక మీరందరూ ఏ కొరివితో తల గోక్కున్నా నాకు లెక్కలేదు!” అందరూ మౌనంగా ఉండి పోయారు.

“మరోమాట - స్వేచ్చ, నాగరికతల పేరిట జరిగే వ్యభిచారానికి నేను భాష్యం చెప్పలేను కాని, పొట్టకూటికి ఆ సానివాడల్లో మహానగరాల మురికి కూపాల్లో పడుపు వృత్తి సొగించే ప్రతి ప్రీ కథా ఒక దీనగాథే! ప్రతి స్రీ జీవితమూ ఓ నరకమే! దీనికి బాధ్యులెవరూ అంటే మన సమాజమే! గత తరం పెద్దమనుషులకి వాళ్ళు వెలయాలులైతే, మన తరం వాళ్ళకి వాళ్ళు ఊరుమ్మడి తల్లులు! ఒక్క నీలవేణి విషయంలోనే కాదు, యిక ముందు ఆ వాడలో ఏ వారకాంత మరణించినా, ఆమె అంతిమ యాత్ర విషయంలో నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. మీరూ నడుం కట్టండి!”

మళ్ళీ అంతా నిశ్శబ్దం. ఈ మాటు ఓబులేశు నోరు విప్పాడు

“అయ్యగారు మా బాగా సెలవిచ్చారు”

“సుశీలా, బట్టలు సర్దు. మరో పదిహేను రోజులు సెలవు పొడిగించమని మా ఆఫీసుకి బెంగుళూరు ఫోన్‌ చేశాను. పన్నెండో రోజు వరకూ నీలవేణి యింట్లో ఉండి అన్ని ఏర్పాట్లు చెయ్యాలి: ఆమె పెంపుడు కూతుళ్ళని - సారీ - నా చెల్లెళ్ళని వాస్టల్లో చేర్పించాలి. ఓబులేశూ, ఆటో పిలు” అన్నాడు శ్రీనివాసు.

అందరూ తననే గమనిస్తున్నారని సుందరమ్మ గ్రహించింది. ఆమె ముఖంలో యిప్పుడు అధికార దర్చం లేదు. కంటి చూపుల్లో ఆగ్రహం లేదు. కుర్చీలోంచి లేచి, “సుజీలా, నా బట్టలు కూడా సర్దు. మీతో బాటు నేనూ నీలవేణి యింటికి వచ్చి, దగ్గిరుండి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. అవధానీ, పన్నెండో రోజున పెద్ద కర్మ ఘనంగా జరగాలి. శీనూ, నీలవేణి కూతుళ్ళు హాస్టల్లో ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళు నా దగ్గరే ఉంటారు. దేశమంతటి సంగతీ నేను చెప్పలేను కాని, ప్రస్తుతానికి మన ఊరికి సంబంధించి నంతవరకూ ఏ అడదీ పొట్టకూటికి పడుపువృత్తిలోకి దిగకుందా ఉండేందుకూ, పతితులకు పునరావాసం కల్పించేటం దుకూ నా శాయశక్తులా పని చేస్తాను. ఏ ఆస్తులైతే నా మనసుకి పొరల్ని క్రమ్మాయో వాటిని ఈ విషయమై సద్వినియోగం చేస్తాను” అంది ఓ ధృధనిశ్చయంతో.

ఆ ఉదయం మామిడి తోపుల వెనక వెలుగు రేఖల్ని చూసిన శ్రీనివాసు, యిప్పుడు తల్లి సుందరమ్మ నేశ్రాల్లోంచి వెలువడుతున్న మాతృకిరణాలను చూడసాగాడు.

అ

(పేరేద్రైతే కానీండి, ఆ ఊరొకృవ్లుడు చాంతాళ్ళకీ, నీల్యుక్సీ సాన్గులకీ (్రనిద్ధి. యిప్పటికీ

ఆ ఊరి శివార్లలో ఉన్న ఏటి వంవులో రెండు సమాధులు వక్ష వక్ళనే ఉన్నాయి. ఒకటి నీలవేణిది. మరొకటి సుందరమ్మది. -రచయిత)

ైై2ైతతతతనతత22డైతఊై2ఊఊఊఊతడతడడడాడయైఊతత్తై

కేడి దరి తిక

ఎన్‌డేంజర్ల్‌ స్పీషీస్‌ (ఆ

అ లరఖ నిస్టం

ఎనిమిదేళ్ళ అనిల్‌ చేతిలో నేషనల్‌ జాగ్రఫిక్‌ పుస్తకం ఉంది. అందరూ ఇంట్లో “బాబు అని పిలుస్తారు. కళ్ళు యాంత్రికంగా చూస్తున్నాయి. చేతులు పేజీలు తిరగేస్తున్నాయిగానీ మనసెక్కడో ఉంది.

అక్కడే కూర్చుని చూస్తున్న సావిత్రమ్మ ఒక పేజీ వైపు చూస్తూ, “ఏమిటిరా ఇది?” అని అడిగింది.

బాబు ఇరియో - మోట్‌ పిల్లి (౫౦౫10౪ ౧౪ - జపాన్‌లో దారికే అరుదైన పిల్లి) ఫొటో చూస్తూ దాని వివరాలు క్రింద చదివి, “ఇది పిల్లి మామ్మా. ఇవి జపాన్‌లో ఇరవైయ్యో ముప్పైయ్యో ఉన్నాయట. ఇంక ఇవి దొరకవు. ఈ జపాన్‌ పిల్లులు ఇక చచ్చి పోతాయట” - ఎన్‌డేంజర్డ్‌గా ప్రకటించిన ఆ ఇరియోమోట్‌ పిల్లి గురించి తనకర్థ మైనదేదో మామ్మకి చెప్పాడు.

సావిత్రమ్మ బాబు చేతిలో పుస్తకం తీసి చూస్తూ “అయ్యో! పిల్లులకే కరువు వస్తోందా?” అని ఆశ్చర్యపడింది. ఆమెకి తోచక బాబు గదిలోకి వచ్చింది. బాబు పరిస్థితీ అలాగే ఉంది. హోమ్‌ వర్క్‌ అయిపోయింది. గది నిందా కామిక్‌ పుస్తకాలు, బొమ్మలూ, పజిల్స్‌ పరిచి ఉన్నాయి.

“చదువుకో” అని వెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోయింది మామ్మ

అయిదు దాటుతోంది సాయంత్రం. కాస్సేపు టి.వి. కార్టూన్స్‌ చూసి కట్టేసాడు. అతడి దృష్టి ఫోన్‌ మీద పడింది. నెమ్మదిగా లేచి వెళ్ళి తల్లి నెంబర్‌ డయల్‌ చేసాడు. చాలాసేపు ఎంగేజ్డ్‌ టోన్‌. ఆ తరువాత పలికింది సుధ. తల్లి కంఠం వింటూ అలా ఉండిపోయాడు. అవతల నుంచి మళ్లీ అదే తీయని స్వరం.

“మమ్మీ” - బాబు గొంతు పెగిలింది.

బాబు గొంతుక వింటూనే సుధ స్వరంలో ఆదుర్ధా, ఆప్యాయతా మిళితమై, “ఏమిటి నాన్నా? జాగ్రత్తగా వచ్చావా స్కూలు నించి అని అడిగింది.

“ఊ” అన్నాడు బాబు,

“పాలు తాగావా? టిఫిన్‌ తిన్నావా?” - సుధ అడుగుతోంది.

సమాధానం చెప్పలేదు బాబు.

“బాబూ - మళ్ళీ పిలిచింది.

“మమ్మీ! ఐ వాంట్‌ యూ” - బాబు కళ్ళలో సన్నని నీటి తెర కదలాడింది.

సుధకి గుండెల్లో పదునైన కత్తితో చీరినట్లయింది - ఆ దీనస్వరం వింటూంటే. ,

“చూడు నాన్నా! నేను వీలయినంత తొందర్లో వస్తాను. అన్నట్లు నీకు నేను కొత్త కామిక్‌ బుక్స్‌ 'టిన్‌ టిన్‌ కొన్నాను. చూసుకొన్నావా? నీకా సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ నచ్చిందా?” - వీలయినంతగా మైకభళళు-204 క్‌] 22 డడడ2డం22డంఊ22డ222ఊఊఊఊ42ఊఊ2ఊ222ఊ2ఒఓఒ2222333చెాడ్డడ్ల

మనసుని అదుపులో పెట్టుకొంటూ అతి మెత్తని స్వరంతో అడుగుతున్న తల్లికి, “నో” అని అరచి చెప్పాలనిపించింది బాబుకి. ఇంకేం చెప్పకుండా ఫోన్‌ పెట్టేశాడు.

సుధ చేతిలోంచి జారిపోబోతున్న ఫోన్‌ని అలర్జ్‌ అయి జాగ్రత్తగా పెట్టింది. సన్నని సూదులతో తలంతా ఎవరో పొడుస్తున్నట్లు ఒంట్లో సత్తువంతా జారిపోతున్నట్లనిపించింది. డైరీ తీసి చూసింది. ఇవాళ రాత్రి సెట్‌కి బెంగుళూరు వెళ్ళాలి. నిన్న రాజ్రే టూర్‌ నించి వచ్చింది. ఈ ప్రయాణం తప్పనిసరి. వారం రోజులు ఐ.టి. టైనింగ్‌. ఫోన్‌ మళ్ళీ మైగడంతో నిస్సత్తువగా ఉన్నా ఎటండ్‌ అయింది.

పబ్లిక్‌ సెక్టార్‌లో సీనియర్‌ ఆఫీసర్‌ పదవిలో ఉన్న సుధ జీవితం అందరికీ ఒక అట్రాక్షన్‌. భర్త రవీంద్ర ప్రయివేట్‌ ఫర్మ్‌లో డివిజనల్‌ మేనేజర్‌. అందమైన కొడుకు బాబు. మొన్ననే మామగారు కాలధర్మం చెందగా ఒంటరిగా ఉండలేవు అంటూ తీసుకువచ్చిన అత్తగారు, పోష్‌ లొకాలిటీలో అధునాతనమైన ఇల్లు, పనివాళ్ళు, మార్కెట్‌లో ఏ కొత్త కారు వచ్చినా పాతది అమ్మేసి ఆ కొత్తది కొనుక్కునేంత ఆర్థిక స్తోమత. వీటన్నింటి మధ్యా తీరిక చిక్కని కాలం పరిగెడుకూంటే వాటి పాదాల క్రింద నొక్కుకుపోయే హ్యూమన్‌ రిలేషన్స్‌ ఎవరికీ కనిపించటం లేదు. అందరి నోటా ఒకటే మాట. ఆ ఇంట్లో వాళ్లు అదృష్టవంతులు!

రవీంద్ర అర్జంటు పని చూసుకొని మిగిలినవి మరునాటికి వాయిదా వేసి ఆదరాబాదరగా రాత్రి ఏడు గంటలకి ఇంటికి వచ్చాడు. ఆరున్నర గంటల ప్రాంతంలో పనిపిల్ల మల్లి ఫోన్‌ చేసింది. పెద్దమ్మగారు తోటపని చేస్తూంటే దెబ్బ తగిలిందని, డాక్టరుని పిలిచాననీ మందులూ, వగైరాలూ ఇప్పించాననీ. చేతికి కట్టుతో పక్కనే టేబిల్‌ మీద రకరకాల మాత్రల స్టిప్‌లతో తెల్లని పక్క మీద సన్నని సావిత్రమ్మ తలగడకి ఆనుకొని కూర్చుంది. కొడుకుని చూస్తూనే సరిగ్గా లేచి కూర్చుంటూ, “కంగారేం లేదులే! పెద్ద దెబ్బ తగల్లేదు” అంటూ ఆవిడ చెప్పే అబద్దాన్ని చేతికట్టు నిర్మాహమాటంగా బయటపెడుతోంది.

“ఏమిటమ్మా ఇది? పెద్ద వయసు. చెప్పలేను. చూడలేను. మొన్నటికి మొన్న కాలు జారి పడిపోయావు. ఇపుడా మొక్కలు నువ్వు చూడకపోతేనేం? ఈ వయస్సులో దెబ్బలు తగలకూడదం టారు. హాయిగా బోలెడు వేదాంతపు పుస్తకాలు తెచ్చాను. చదువుకోవచ్చుగా” - ఎంత సౌమ్యంగా చెబుదామన్నా తల్లికి దెబ్బ తగిలిందన్న ఆదుర్దాయో, లేక ఏమన్నా విషమిస్తే కనిపెట్టుకు చూడడం కష్టమనో ఏ భావం పైకి ప్రకటించకపోయినా అతడి స్వరంలో చిరాకు తొంగి చూస్తోంది. తప్పు చేసినదానిలా తల వంచుకుందామె. తల్లి ఏం బదులు చెప్పకపోవడంతో, “సుధ వచ్చిందా? బాబు ఏడీ కనబడడంలేదు” (ప్రశ్న అడుగుతూనే, “టేక్‌ రెస్ట్‌. కదలకు. మందులు రెగ్యులర్‌గా వేసుకో! మొక్కల పని రాముడు చూస్తాడు. నువ్వు వెళ్ళకు” - లేచి బాబుని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు.

ఇంచుమించు రోజంతా దేవుడి మీద శ్లోకాలు మౌనంగా లోపల చదువుకుంటూ తోట పనీ, ఇంటి పనీ చేసుకునే అలవాటున్న సావిత్రమ్మకి కొడుకు ఈనాటికి రామాయణం చదువుకో పనిచేయకు' అని చెప్పటం మనస్సులో కలుక్కుమంది. ఏ మనిషి ఎలా ప్రవర్తించాలో ఇంకొకరు బోధిస్తూ ఉండాలా? మనిషి తనకి నచ్చినట్లుగా సంఘానికి ఏ ఇబ్బందీ లేకుండా బ్రతకలేదేమో! కతత డెడ్‌ సరబ్‌ సక్‌ వై

చదరంగం బల్ల మీద పావులని 'నీ స్థానం ఇది, నీ ఐలం ఇది” అంటూ పావులని కదిపే వారిలా సంఘం అందరి పొజిషనూ నిర్ణయిస్తుందేమో! లేకపోతే ఎంత పదవి ఉన్నా ఎవరూ తమ తమ గదులలోనించి తమంత తాము బయటపడలేక తమ ఉనికి ఉందా లేదా అనిపించేలా ఉంటారేమో! ఒక వయసు దాటేసరికి వారికి ఆటోమేటిక్‌గా పారమార్ధిక చింతన ఎలా వచ్చేస్తుందనుకున్నారు వాళ్ళు? అది నిరంతరం ్రాక్టీసుతో ఆలవడే విద్య. అందరూ బయటికి ప్రదర్శిస్తూ పూజలు, వ్రతాలూ, మడులు చేయలేకపోవచ్చు. అరుదుగా గుడికి వెడుతుంది తను. తను పుట్టింది మొక్కలలో. పెరిగింది పనిపాటలలో. పనిచేస్తూంటే పొరపాటు వలన దెబ్బలు తగలవచ్చు. అంతమాత్రంచేత ముసలి వయసు పేరిట విశ్రాంతి ముసుగులో ఎంతకాలం దాగి ఉండడం? శరీరానికి పని, మనసుకు ధ్యానం, వ్యాయామం అని తను బాల్యంలోనే నేర్చుకుంది.

సుధ కంఠస్వరం హాలులో వినిపించేసరికి 'కోడలు వచ్చింది" అనుకుంది ఆమె. వెనక్కి వాలుతూ, “ఏం ఉద్యోగాలో? ఇద్దరికీ సరియైన రెస్ట్‌ లేదు. దానికితోడు రోజుకి రోజులు ఇద్దరూ టూర్లకి వెడతారు. బోలెడు సంపాదన. సుఖమన్నది అరుదు" అనుకుంది ఆమె.

సాయంత్రం బాబు చేసిన ఫోన్‌ కాల్‌ సుధ మనసులో తుపాను రేపింది. వచ్చేటపుడు బొమ్మల షాపులో స్టఫ్‌డ్‌ మంకీ, ఏరోప్లేన్‌ కొని తెచ్చింది.

“బాబూ, ఇవేమిటో చూడు ఇది నీ ్రెండొ” - మంకీని బాబు దగ్గరగా పెడుతూ అంది సుధ. బాబు తల్లి మెడ చుట్టూ చేతులు వేస్తూ ఆమె భుజం మీద తల వాల్చాడు సోఫాలో. తెచ్చిన వస్తువులు చూడనే లేదు. బాబు మనసులో దిగులు తెలుస్తోంది. టూర్స్‌ తప్పడం లేదు. ఛాలెంజింగ్‌ జాబ్‌ అది. వాడి కోసం ఎంతో కష్టపడి ఇంతవరకూ ఎదిగిన కెరీర్‌ని ఎలా వదిలేసుకోవడం? చూస్తూంటే బాబు పెద్దవాడవుతాడు. కానీ తన ఉద్యోగం, పోయిన కాలం, పదవీ తిరిగివస్తాయా? ఒక్క వారం రోజులు సెలవు పెట్టి హాలీడేకి వెడదామంటే తన పనీ, భర్త పనీ, బాబు పరీక్షలు, స్కూలు ఎక్కడా పొంతన లేదు. బాబు ఒళ్ళు వెచ్చగా తగిలినట్లయింది.

“ఏమిటి నాన్నా? ఒళ్ళు వేడిగా ఉందేమిటి? జ్వరం వచ్చిందా?” - నుదిటి మీద చేయి వేసి చూసింది. కొద్దిగా వేడిగా ఉంది.

అక్కడే మరో సోఫాలో కూర్చుని ఆఫీసు కాగితాలు చూస్తున్న రవీంద్ర, “డాక్టరుతో మాట్లాడి ఇపుడే మందు వేసాను - కళ్ళతోటి తమ గదిలోకి రమ్మన్నట్లుగా సౌంజ్ఞ చేసాడు, తను లేచి వెడుతూ,

“బాబూ! నీకిష్టమైన ఏరోప్లేన్‌! చూడిది” - పాకెట్‌ విప్పి ఇచ్చింది.

బాబు కీ ఇచ్చి వాటిని చూస్తున్నాడు.

“నీ బెంగుళూరు ప్రయాణం రాత్రి అనుకుంటాను" - రవీంద్ర అడిగాడు సుధ రాగానే.

“అవును. బట్టలు ప్రొద్దున్నే పాక్‌ చేసాను. సమయానికి వాడికి జ్వరం” - ముఫ్ఫై ఏళ్ళు దాటిపోయినా డిసిప్లిన్‌ పాటిస్తూ శరీరాన్ని నియంత్రణలో ఉంచుకున్న సుధ అందానికి మరింత మెరుగుతెస్తోంది ఆ ఆకృతి.

కళ్ళజోడు తీసి మంచం పైన పెడుతూ అన్నాడు రవీంద్ర, “వై డోంట్‌ యూ కేన్సిల్‌ ఇటొ, నన నతతతతకతడడడడడడడడ్తడడడడడడడడడేడడడడడడడడైడతడడ క కభాతహని- 2004 కకక డక

న అ

“క్రేన్సిలొ ఆశ్చర్యంగా అడిగింది సుధ, “ఆఫీసు మొత్తం మీద ఆరుగురిని ఎన్నిక చేసారు”

  • అంత గొప్ప విషయం భర్త బుర్రకి ఎలా ఎక్మలేదా అన్నట్లు చూసింది.

“మ్సేవి. బాబుకి అలా ఉంటే ఎలా వెళ్తావు?”

“అదేమిటి అలా అంటారు? మీరు, అమ్మ, మల్లి, డాక్టరుగారూ ఇంతమంది చూస్తున్నారు. నేను ట్రయినింగ్‌ మానేసి ప్రత్యేకం' ఏం చేస్తానూ? ఈ కాస్త జ్వరమూ రేపటికి తగ్గదూ? అలా అని నా మటుకు నాకు బాధగా లేదా? తప్పదు వెళ్ళడం”.

రవీంద్రకు చెప్పలేని కోపం వస్తున్నా అదుపులో పెట్టుకుంటూ సుధ వైపే చూధసాగాడు.

“మీరు రెండు రోజులు సెలవు పెట్టండి” - ఒడిస్సీ సూట్‌కేసులో తనతో తెచ్చిన ఆఫీసు ఫైలు ఒక అరలో సర్దుతూ అన్నది సుధ.

“నీక్రాక్షర్హికే పదవి ఉంది. ఆఫీసుంది. ఉద్యోగం చేస్తున్నావు. అవునా? ఫామిలీ ఉందన్న సంగతి మర్చిపోయావా?”-అతడి గొంతులో షార్చ్‌నెస్‌.

“అంటే? మీకు లేదా ఫామిలీ? రెస్పాన్సిబిలిటీ మీకు లేదా? ఇది తప్పని ప్రయాణం. ఈ సంగతి నెల క్రితమే చెప్పాను.”

“సుధా!? బాధ్యతలు, హక్కులు గురించి మాట్లాడకు. బాబుకి జ్వరం. అమ్మకి దెబ్బ తగిలింది.....” - ఇంకా ఏదో అనబోతున్నాడు రవీంద్ర.

సుధకి సాయంత్రం పనిపిల్ల మల్లి చేసిన ఫోన్‌ జ్ఞాపకం వచ్చింది. బాబు విషయంలో పడి అత్తగారి సంగతి మర్చిపోయింది. వెంటనే హడావుడిగా, “ఎక్స్‌ క్యూజ్‌ మీ అంటూ అత్తగారి గదిలోకి వెళ్ళి పరామర్శించింది.

“అసలు మీకు తోట పని చేయాల్సిన అవసరం ఏమిటి రాముడుండగా” అంటూ సున్నితంగా మందలించింది. పౌరాణిక గ్రంథాలు ఎక్కడ కూర్చుని ఎలా చదువుకుంటూ కాలక్షేపం చేయచ్చో సలహా ఇచ్చింది. మొక్కలు చూడకపోయినా పెరుగుతాయి అని హామి ఇచ్చింది. ఆరోగ్యం ఈ వయసులో ఎలా కాపాడుకోవాలో బ్రీఫ్‌గా లెక్చర్‌ ఇచ్చింది. ఆ తర్వాత రవీంద్ర వద్దకు వచ్చింది.

“అయాం సారీ! ఈసారికి బాబునీ, అమ్మనీ చూసే పూచీ మీదే! ఈ లాస్ట్‌ మినిట్‌లో నేను ప్రయాణం కాన్సిల్‌ చేసుకోవడం పడదు. ఈ ట్రయినింగ్‌ నా విధి నిర్వహణకు చాలా అవసరం”

  • నెమ్మదిగానే అంటున్నా ఆ పట్టుదల చూస్తూంటే ఒళ్ళు మండింది రవీంద్రకి

“ఆడపిల్లకి పెళ్ళిచేసుకున్నాకా ఇల్లు చూసుకునే విధి నిర్వహణ కూదా ఉంటుంది. మర్చిపోకు”

  • కోపంలో తెలియకుండానే స్వర స్థాయి మించుతోంది. అసలు సుధ మగవారితో సమంగా ట్రయినింగ్‌కీ, టూర్లకీ వెళ్ళి మంచిపని చేసి పేరు తెచ్చుకోవడం, ప్రమోషన్లతో అతి చిన్న వయసులోనే పెద్ద పదవి పొందటం అన్న విషయం నచ్చటం లేదు ఈ మధ్య రవీంద్రకి అది బాహాటంగా ఒప్పుకోలేదు.

“అంటే మగవాళ్ళకి ఇల్లు చూసుకునే విధి నిర్వహణ అజ్జర్లేదా? అది ఇద్దరికీ సమానంగా ఉంది. ఎన్నిసార్లు మీరు టూర్లు వెళ్ళలేదూ? నేను ఆపానా? ఇలాంటి పరిస్టితి ఇదివరకు రాలేదా? నేను చూడలేదా?” విసురుగా అంది సుధ.

“స్తధా” ఎర్రబడ్డ మొహంలో ఏదో వాదించబోయాడు. మధ్యలో పిట్ట కూత కూసినట్లు త్‌ో జనన ప వడ2డడడ2వనన22నననలడన?నాడడడడన2డడనన

ఈల క కాలింగ్‌బెల్‌ మోత వినగానే ఇద్దరూ ఆగి చూసారు. ఆవేశంలో గొంతుక పెంచి మాట్లాడుతున్న వారి అభిప్రాయాలు అటు బాబుకీ, సావిత్రమ్మకీ, పనివారికీ వినిపిస్తున్నాయి.

మల్లి తలుపు తీసింది. ఎదురుగా ఆఫీసు కారు (డైవర్‌ వచ్చి తను వచ్చినట్లుగా సుధకి తెలియజేశాడు, ఎయిర్‌ పోర్ట్‌కి వెళ్లేందుకు.

సుధ వంటగదిలోకి వెళ్ళి ఒక గ్లాసు నిండా మజ్జిగ తెచ్చుకుని బాబుకి దగ్గరగా కూర్చుంది.

తను ఎంత అర్జంటుగా వెళ్ళాలో వెళ్ళకపోతే వచ్చే అనర్జాలేమిటో అన్నీ వివరంగా చెప్పింది. బెంగుళూరు నుంచి రోజూ ఫోన్‌ చేస్తాననీ, వచ్చేటపుడు కంప్యూటర్‌ గేమ్స్‌ పుస్తకాలు తెస్తానని చెబుతూంటే ఒళ్ళు తెలియని కోపం వస్తోంది రవీంద్రకి.

రెండు మూడు నెలల క్రితం ఇలాంటిదే గొడవ వచ్చి ఉద్యోగం మానేయమనీ, డబ్బుకి మనకి ఏ లోటూ లేదని చెప్పాడు తను. అంతా విన్నాక, “ఆ పని మీరే ఎందుకుచేయకూడదూ?” అని అడిగి ఒక్క క్షణం (మ్రాన్సడిపోయేలా చేసింది సుధ.

“చూడండి. ఆడపిల్లలు ఉద్యోగం చేసేది ఏదో తమ మేకప్‌ సామగ్రి ఖర్చుకీ, బంగారు నగలకీ, లేదా ఇంట్లో ఖర్చులకి వేడినీళ్ళకి చన్నీళ్ళనీ అని అనుకుంటారు మీరు. వాళ్ళకీ వ్యక్తిత్వమూ, అస్తిత్వమూ, కెరీర్‌ ఉంటాయనీ - అది ప్రాణంగా చూసుకోవాలనీ ఉంటుంది. ఆ సంగతి మగవాళ్ళు తెలుసుకోవాలి, ఏవో ఇలాంటి చికాకులు వస్తాయి. పోతాయి. దానికోసం ఎమ్‌. బి.ఏ., చదివిన నేను ఆ చదువు వృధా చేస్తూ ఇటు దేశానికీ, అటు నాకూ పనికిరాకుండా ఇంట్లో ఖైదీలా కూర్చోలేను నేను”.

“అయితే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు?” - అడిగాక తనెంత తొందర పడిందీ అర్ధం అయింది.

“నేను మిమ్మల్ని ప్రాధేయపడి అడగలేదే! మీరే ఆ ప్రపోజల్‌ నా వద్దకు తెచ్చారు. జ్ఞాపకం తెచ్చుకోండి! నేను నిర్ణయించుకోవడానికి ఆరు నెలలు కావాలన్నాను. ఆరు నెలలు కాదు జీవితాంతం ఓపికగా ఎదురు చూస్తాననీ అన్నారు. అపుడే నేను చెప్పాను - నాకు నా కెరీర్‌ ఇష్టమనీ, వదలుకోలేను అని! ఇల్లు మనిద్దరిదీ! బాధలు. సుఖాలూ కూడా ఇద్దరివే! నేను సాధ్యమైనంతగా ఇంటినీ, బాబునీ జాగ్రత్తగానే చూస్తాను. నేను బాధ్యత తప్పించుకోవాలని

ఎప్పుడూ అనుకోను. మనిద్దరి మధ్య సహకారం ఉంటే తప్ప మనశ్శాంతితో బతకలేం.”

పనివాళ్ళకి జాగ్రత్తలు, బాబు గురించి తీసుకోవలసిన శ్రద్ధ అవసరాల గురించి చేయాల్సిన పనుల గురించి చెప్పి బయలు దేరింది సుధ. బాబుని దగ్గరగా తీసుకుని అలా జ్వరంలో వదలి వెళ్తున్నందుకు సారీ చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.

“నేను వెళ్ళనా మరొ అని అడిగితే బాబు తల ఊపాడు.

న

వేళ వైష్ణవ ఏకాదశి. చేతికి దెబ్బ తగిలి మాని మామూలుగా అయింది సావిత్రమ్మకి. ఆ వేళ గుడికి వెళ్ళాలని ముందే అనుకుంది. గుడిలోనే దేవుడున్నాడా అంటారు కొడుకు, కోడలు. అయితే అది సమూహంలో కలసి ఉంటూనే ఇంటి విషయాలూ, తన విషయాలూ కాస్సేపయినా మర్చిపోయి కొంత సమయం అంటూ 'తనకీ, దేవుడి దగ్గర వెచ్చించుకునేదీ - డె డ్తడ్తడడడడడడడడతడడడడడడడడడడతడడడడడడడడడడతతతడడడ క ళరాం-20 211

పాటాలు అది మానసికంగా అన్ని ఒత్తిడులనూ దూరం చేస్తుందని శ్రాస్తోక్తంగా తెలియకపోయినా 'గుడికి వెళ్ళాం అని అనుకోవడంలో ఒక తృప్తి ఉంది మనిషికి. *నా బాధలు మౌనంగా వినే ఒక మహాశక్తి ఉందనీ, అది విపత్తుల నుండి కాపాడుతోం'దని విశ్వసించడం వల్ల గూడా మనిషి ఆనందం పొందే దారులలో ఒకటి.

రాముడు రాలేదు. మల్లి సినిమా చూస్తోంది టి.వి.లో. ఇపుడిపుడే బాబు రాడు. గుడి కట్టేయకుందా వెళ్ళి వచ్చేయాలి. తన గది తలుపులు దగ్గరగా వేసి వీధి తలుపు లేసి, దగ్గరగా ఇంటర్నల్‌ లాక్‌ పడేలా వేసి బయలుదేరింది. పర్సులో కొంత డబ్బు, ఆ మధ్య కొడుకు తెచ్చిన మూడు కొత్త చీరలు గుడి దగ్గర దానం చేయాలని బయలుదేరింది. రోడ్డు వారగా నడుస్తున్న ఆమె ముఖంలో పంజరంలోంచి తప్పించుకున్న చిలకలా సంతోషం కళ్ళలో ప్రతిఫలిస్తోంది. “ఎంత? అరగంటలో వచ్చేయచ్చు. రెండో కంటి వాడికి తెలియదు” అనుకుంది ఆమె. అయితే ఆమె గుడికి బయలు దేరిన సంగతి అందరికీ తెలిసింది.

రోడ్డుకి అడ్డంగా పరిగెట్టిన కుక్క పిల్లని తప్పించటంలో ఎదురు మలుపులో రాంగ్‌ సైడులో నడుస్తున్న సావిత్రమ్మను ఎదురుగా వచ్చే కారు ఎంత బ్రేక్‌ వేసినా వచ్చి డాష్‌ ఇచ్చింది. అనుకోని ఈ సంఘటనకు పక్కకి తప్పుకోబోయి ఎదురు దెబ్బ తగిలి రాళ్ళ మీద పడి పోయింది సావిత్రమ్మ. రోడ్దు మీద ఆవిడని గుర్తుపట్టినవాళ్ళు కొంతమంది ఆవిడను ఎటెండ్‌ అయితే, మరెవరో ఇంటికి పరిగెట్టాటరు కబురు చెప్పదానికి.

౨06

స్ఫూలు బెల్‌ కొట్టగానే అందరూ హడావిడిగా బయటకు పరిగెట్టారు. బాబూ, శంకరం, రాహూల్‌, ప్రశాంత్‌ కలసి వస్తున్నారు.

“మా అమ్మ నా కోసం జంతికలు చేయిస్తానని చెప్పింది - శంకరం చెప్పాడు కళ్ళలో మెరుపులు మెరుస్తూంటే.

“మా అమ్మ కూడా చేయిస్తుంది జంతికలు” - బాబు అబద్ధం చెప్పాడు. నిజానికి అన్నిరకాల కేక్‌లూ, ఐస్‌క్రీమ్‌లూ అమ్మ తెస్తుంది గానీ ఈ జంతికలు అమ్మ ఇంట్లో చేయించదు. (ఫెండ్స్‌ తెచ్చుకునే చేగోడీలూ, పాలకాయలూ చాకొలేట్‌ కేక్‌ కంటే బాబుకి ఇష్టం. కానీ అమ్మ ఎవరినీ ఏమీ అడగకూదదంటుంది.

“నేనూ మా అమ్మ ఎల్లుండి ఊరుకి వెళ్తున్నాం - పెళ్ళికి” - శంకరం కొత్త న్యూస్‌ ఏస్‌ కార్డులా బయటపెట్టాడు. అందరూ *ఏ ఊరూ? ఏ ఊరూ?” అంటూ అడిగారు.

“ఎన్నైయే” గర్వంగా చెప్పాడు. నలుగురి బాచ్‌లో ఎపుడూ ఇలాంటి ఘన కార్యాలు చేయడంలో శంకరం ఫస్ట్‌. మమ్మీ, డాడీతో కలిసి జూకి వెళ్ళడం, పిల్లల సినిమాకి వెళ్ళడం. ఒకటేమిటి శంకరం చేష్టలన్నీ బాబుకి అద్భుతంగా ఉంటాయి.

“మా మమ్మీ కూడా నన్ను బెంగుళూరు తీసుకువెళ్తుంది” - శంకరానికి తీసిపోకూడదనే భయం బాబు చేత అలా మాట్లాడింపచేస్తోంది.

అదో పెద్ద జోక్‌లా నవ్వాడు శంకరం. పక్కనున్న ప్రశాంత్‌తో, “చూడరా వీడి అబద్ధాలు! అనిల్‌కి జ్వరం వస్తే నా కుద్యోగం ఉందని బెంగుళూరు వెళ్ళిపోయిందిగా వీళ్ళ మమ్మీ” 1222222222 ఎ౧సుబ్సభ క

అందరూ ఆ మాటలకి నవ్వారు.

ఒకే లొకాలిటీలో ఉంటున్న బాబు ఇంటి విషయాలు మిగతా కుటుంబాలకి ఎంతో ఆసక్తి. మల్లి స్నేహితులు మిగతా వారింట పనివాళ్ళు కావటం వల్ల వీళ్ళింటి ఏ కబురు అయినా సరే వార్తలా అందరికీ తెలిసిపోతుంది. క్రితంసారి బాబుకి వచ్చిన జ్బరం సుధ ఆశించినట్లుగా మరునాడు తగ్గలేదు సరిగదా తీవ్రమై వారం రోజులు పట్టింది తగ్గేందుకు. అదే టైమ్‌లో సుధ ట్రయినింగ్‌ ముఖ్యమని బెంగుళూరు వెళ్ళిపోవడం అక్కడి వారి గాసిప్‌కి హెడ్‌లైన్స్‌ అయింది. కించిత్తు తల్లి ప్రేమ లేకుండా ఎలా ఉంటారీ తల్లులు? అలాంటి వారికీ పెళ్ళీ పిల్లలూ ఎలతదుకూ?” అని ఆశ్చర్యపోతూ వాళ్ళు తమ పిల్లల్ని ఒక్క క్షణం కూడా ఎలా వదలి ఉండలేదో కథలు క్రింద చెప్పుకున్నారు ఆ వీధి వాళ్ళు.

అందరూ అలా నవ్వేసరికి బాబుకి ఉక్రోషం వచ్చింది - “అన్నీ అబద్దాలు. మా మమ్మీకి నేనంటే ఎంతో ఇష్టం” - కోపంగా, గట్టిగా అన్నాడు.

“పో పో అనిల్‌! అన్నీ కోతలు! మేం నమ్మం” - శంకరం కొట్టి పారేశాడు. బాబు మాటలు నమ్మబోయే మిగతా ఇద్దరూ ఆ మాటలు విని మానేసారు.

“మా మమ్మీ నన్నెప్రుడూ వదిలి ఎక్కడికీ వెళ్ళదు” అంటూ ఒకడంటే, మరాకడూ అదే వాక్యం వల్లెవేయసాగాడు. ఆ క్షణంలో అమ్మ మీద బాబుకి వచ్చిన కోపం డిస్‌ప్లేస్‌మెంట్‌ పొంది శంకరం వైపుగా ప్రసరించింది. అంతే? బలం అంతా ఉపయోగించి ఒక తోపు తోసాడు. పక్శనే ప్లేగ్రౌండ్‌లో నున్న ఉయ్యాలకి సపోర్ట్‌గా కట్టిన ఇనుప రాడ్‌ బాగా మోపుగా శంకరం తలకు తగిలింది. బొటబొటా రక్తం కారి తెల్లటి షర్ట్‌ని ఎర్రబర్చింది. శంకరం ఏడుపుకి దిక్కులు అదిరిపోయాయి. బిత్తరపోయిన బాబు చూస్తూండి పోయాడు. పిల్లలు అందరూ పోగయ్యారు. ట్రిన్స్‌పాల్‌కె రిపోర్ట్‌ అందింది.

దాక్టర్ని పిలిచి శంకరాన్ని చూపించడం, బాబుని సస్పెన్నన్‌లో ఉంచి ప్రశ్నించడం, తల 'ప్రాణం తోకకి వచ్చింది ప్రిన్సిపాల్‌కి. అసలే ఒంట్లో బాగులేని బి.పి. మనిషాయే - కోపంతో ఆమె సుధ నెంబరు డయల్‌ చేసి విసుగ్గా వవరాలు చెప్పి మరునాడు తనని కలుసుకోమనీ, బాబు ప్రవర్తనకి సంజాయిషీ ఇవ్వాలని కోరిందావిడ.

“నిశ్శబ్దంగా ఒకడూ చదువుకోవడమో లేదా ఆడుకోవడమో అంతేగానీ పేచీలూ మొండి పట్టుదలలూ లేవు. అల్లరి చిల్లరగా తోటి పిల్లలను కొట్టి ఏడిపించడం అసలే ఎరుగడు. అలాంటిది వీధి చివర నున్న లాయర్‌ శ్రీనివాస్‌గారి అబ్బాయి శంకరాన్ని అంతలా గాయపరచడమా? అసలేం జరిగింది” సుధకి అయోమయంగా అనిపించింది. కానీ బాబు మనసులో పడుతున్న అవేదనకి ఆ సంఘటన కేవలం ఎస్‌బర్గ్‌ టిప్‌ అనీ ఆమెకి గ్రహింపుకి రాలేదు. బాబు చిన్నవాడయినప్పటికీ తనంటే అమ్మకి ఇష్టమవునా కాదా అని చాలా పరీక్షలే పెట్టాడు. చాలా వాటిల్లో బాబు లెక్క ప్రకారం ఆమె ఓడిపోయింది. మాటలలో, చేతలలో, భావనలో అన్నింటినీ ఏకం చేస్తూ, “నేను నీ వెనకే ఉన్నాను బాబూ! నీకు ఎటువంటి కష్టమూ రానీయను. నేను నీ దగ్గరగా, నీ మనస్సులా, నీడలా నిన్ను చూస్తున్నాను. నీకు భయం లేదు. నీవు హాయిగా నిశ్చింతగా ఎదగవచ్చు” అన్నట్లు ఆమె ఎపుడూ బిప్పలేదు. ఆమె మనసులో ధర - 2004 2222222222

(పేమ ఉన్నా బాబుకి అది కనపడనంతవరకూ బాబుకి అది అనవసరం. అందరి ఎదుటా అవమానం జరిగినదానికన్నా అమ్మ జ్వరంలో తనని వదిలేసి వెళ్ళిపోయిందనే నిజం-బాబు భరించలేకపోతున్నాడు.

పైపై మెట్లు అధిరోహిస్తూ కెరీర్‌లో రాకెట్‌లో దూసుకుపోయే సుధ ఇంటి మీద దృష్టి ఉన్నా, బాబుని నిశ్శబ్దంగా (పేమించే సుధ సహాస్రాక్షి కాదు. బాబు మనసులో చెలరేగే తుపాను తెలుసు కోలేకపోతోంది.

“ఏం న్యూసెన్సు ఇది* - విసుక్కుంటూ ఫైలులోనున్న కాగితాలు చూడపోయింది. అపుడే రవీంద్ర నుంచి ఫోన్‌ - అత్తగారికి ఏక్సిడెంట్‌ అయిందనీ, తను వస్తున్నాననీ రెడీగా పర్మిషన్‌ తీసుకొని ఉండమనీ!

౦4

కారులో మౌనంగా (డ్రైవ్‌ చేస్తున్న రవీంద్ర మనసులో ఆలోచనల కడలి అలలను రేపుతోంది. ఎపుడు చూసినా ఏవో చికాకులు, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉపద్రవంలా ముంచుకు వచ్చి తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసే ఈ అదృశ్య హస్తం ఎవరిది? బాబు శంకరాన్ని రక్తం వచ్చేట్లు కొట్టడం ఏమిటి? ఎందుకిలా జరిగింది? బాబుకి ప్రత్యేక (శ్రద్ధ ఇద్దరూ చూపిస్తున్నారా? వాడితో కావలసినంత సేపు గడుపుతున్నారా? వాడు ఎదిగే సమయంలో వాడి భయాలు, సంతోషాలు, వాడి స్థాయికి దిగి పంచుకుంటున్నారా? వాడికి ఆనందం కలిగించే విషయాలేమిటి? తెలుసుకుంటున్నారా? చిన్న చిన్న విషాదాలను ఎలా తట్టుకోవాలో నేర్పిస్తున్నారా? వాడికి కావలసినంత చదువు చెప్పించే డబ్బు ఇద్దరూ సంపాదిస్తున్నారుగానీ వాడికి జ్ఞానం ప్రసాదించే చదువు..... జీవనం అనే చదువు చెబుతున్నారా? తమ ఇద్దరి అహం మధ్య పసివాడు నలిగిపోతున్నాదని ఎపుడయినా ఆలోచించారా? సుధ ఒకర్తీ మానసికంగా దగ్గర అయ్యే ప్రయత్నం ఎపుడూ చేయలేదేమో! సంఘంలో నలుగురిలో వాడి ఉనికి ఒక వెన్నెల కిరణంలా కురవ వలసిందిపోయి తోటి పిల్లాడిని గాయపరిచేంత ఎగ్రిసివ్‌నెస్‌ ఎలా ఇంత బాల్యంలో వాడికి అలవడేలా చేసారు? బాబు చూస్తే అలా! అమ్మ సరేసరి! పాత అభిప్రాయాలు మార్చుకోలేదు. కొత్తవి ఆహ్వానించలేదు. ఎక్కడయినా దైవ ప్రార్ధన చేయవచ్చునే? ఆ గుడిలో ఏం ఉంది? తను కొన్న పుస్తకాలు నాలుగేళ్ళు వరసగా చదివినా కొరుకుడు పడనంత వేదాంతం నిండి ఉంది. అయినా ఆ చెట్టు అనీ, పుట్ట అనీ తిరుగుతుంది. లేదా ఆమె సంతానంగా ఆమెకు మానసికంగా దగ్గర కాకపోయేసరికి ఆమె తన దృష్టి వేరే మళ్ళించుకోవడానికి తపిస్తోందా? మెటీరియలిస్టిక్‌ ప్రపంచంలో పడి, ఆఫీసు టూర్లు, పార్టీలు - వీటి మధ్య తాము కూడా మఠి సుఖమూ, సంతోషమూ పొందటం లేదే! వలయంలా ఉన్న ఈ జీవితంలో అసలైన తృప్తిని ప్రసాదించే బిందువు ఏది? ఎక్కడ తప్పటడుగు వేసామో చెప్పలేనంత దూరం వచ్చేసామా? సరిదిద్దుకునే

వీలు అసలు లేదా? భావి తరాన్ని పాత తరాన్ని హింసించే ఈ నాగరికత తమకి మటుకు ఎంత ఉపయోగిస్తోంది?

నర్సింగ్‌ హోమ్‌ రావడంతో ఆలోచనలు ఆపి సుధ వైపు చూసాడు.

సుధ అత్తగారి వద్దకు వెళ్ళి మానంగా చేయి అందుకుంది. సుధ చేతి వెచ్చని స్పర్శ చల్లగా కతా యోనౌ డ్‌ నదిలట్లనన్‌ క

ఉన్నా సావిత్రమ్మ చేతికి అమ్మ చేతి ఓదార్చు ఉన్నంత హాయి. ఒక్క క్షణంలో ఒళ్ళు జలదరించి నట్లయి, ఆ క్షణం, ఆ (ప్రమమయమయిన క్షణం శాశ్వతం అవాలని దురాశగా కోరుకుంది. మరీ బలమైనవి కావుగానీ ఓ మోస్తరు గాయాలు తగిలాయి కాళ్ళకి. “అసలేమయిందంటే....” బలహీనమైన _ గొంతులో తన సమర్ధన మొదలుపెట్టింది సావిత్రమ్మ “న్సవ్వు రెస్ట్‌ తీసుకో, అట్టే మాట్లాడకు” అందామనుకున్న రవీంద్ర ఆ మాటలు నోట పలుకలేనంత నీరసంగా, అన్పించినట్లయి మంచం ్రక్మనే ఉన్న స్టూలు మీద కూర్చుని తల్లి కాళ్ళ గాయాల కట్ల వైపు నిస్తేజంగా చూస్తూండి పోయాడు. మధ్యలో బాబు వైపు చూసింది సుధ. కళ్ళ నిండా భయంతో చిన్నారి మొహం ముడుచుకుపోయి తల్లిదండ్రులు ఏం తిడతారో అని హడలిపోతూ మల్లి చేయిపట్టుకుని నిలబడ్డ బాబుని రమ్మని తల ఊపి పిలిచింది. నెమ్మదిగా బాబు తల్లి దగ్గరగా నిలబడ్డాడు. ఆ మెత్తని చీర కుచ్చిళ్ళు అమ్మ రాసుకునే పరిమళం అలవాటయిన అమ్మ వాతావరణం సావిత్రమ్మను మైమరపించినట్లే ఒక్కక్షణం బాబుకి ఏదో అభయ హస్తం చాటున నిలబడ్డ అనుభూతి కలిగింది. డాక్టర్‌ రావడంతో వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్‌ నుంచి ఉలిక్కిపడి అందరూ ఎలర్ట్‌ అయారు. న సుధ ఆలోచిస్తోంది. ఏం జీవితాలివి? మనశ్శాంతి ప్రసాదించమని డబ్బూ, హోదా కీర్తిప్రతి ష్టలు ఎన్నుంటే ఏం? మనిషికి ఏం సహాయం చేస్తాయి? గత అయిదేళ్ళుగా గాడి తప్పుతున్న కుటుంబం ఏ దారిలో పయనిస్తోంది? బాబు వచ్చే టైముకి ఇంట్లోనే ఉంది ఇల్లుని, బాబుని కనిపెట్టుకుని చూస్తే అపుడు వాడి ముఖం వికసిస్తుందా? మార్చింగ్‌ సెషన్‌లో చదివే బాబు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తను ఎనిమిదికి వచ్చేసరికి వంటరి క్రిందే లెబ్బ. తనింట్లో ఆ సమయంలో ఉంటే వాడికి కావల్సినట్లుగా హాయిగా ఉంచగలుగుతుందా వాతా వరణం? దానికి తను ఉద్యోగం మానేయడం తప్ప మరో గత్యంతరం లేదు. పరిణామక్రమంలో ఏదైనా నూతన సృష్టి జరగాలంటే ముందుగా లయ తప్పదు. ఈ ఇంట్లో హార్మోనీ సృష్టించాలంటే తన వంతు కెరీర్‌ నాశనమవ్వాలి. జీవితంలో ఒకే ఒక్క కోణం అయిన కెరీర్‌ కోసం జీవితం అంతా నాశనం చేసుకునే మూర్చరాలు కాదు తను. విత్తు భూమిలో సమాధి అయితే తప్ప మొక్క మొలకెత్తదనీ తెలుసు. అలా కాకపోతే బాబు ఈ (ప్రేమరాహిత్యంలో పెరిగి పెద్దయి తను కూడా తన అత్తగారిలా వృద్ధాప్యంలో కొడుకు కోడలు (ప్రేమ కోసం అలమటించే సమయంలో బాబు మనసులో ఇపుడు తన (ప్రేమ నాటుకుంటే తప్ప తిరిగి వాడు తమకు (ప్రేమను ఏం పతిబింబించగలడు? తన అవసరం మరి దగ్గరగా కావలసినది బాబుకి ఇపుడే! ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. వాడు పెరుగుతుంటే వాడి ప్రపంచమూ, చదువూ, (ఫఫెండ్‌ సర్కిల్‌ పెరుగుతాయి. తమ మధ్య బాంధవ్యం కూడా తల్లీ కొడుకూ బాంధవ్యం పునాది మీద, చక్కని స్నేహ పరిమళం తమ మధ్య వికసించాలంటే తనూ కొంత ఇవ్వాలి. 'తనేనా త్యాగం చేసేది? రవీంద్రకేం ఇందులో బాధ్యత లేదా? చటుక్కున తర్భం తలెత్తింది. వెంటనే ఇంగిత జ్ఞానం మేలుకొంది. ఇలా వంతులు వేసుకునే ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. కై కా ఛాహని 2004 2222222222 తతడతతడ2ఊ22డ2డ2డ2డ

అతడు ఏం చేస్తేనేం? చేయకపోతేనేం? తను తల్లిగా, కోడలుగా, ఒక మనసున్న మనిషిగా తను చేయాల్సిన ప్రయత్నం చేయాలి. అవును.... అందుకోసం తను ఉద్యోగం మానేయ క్కరలేదు కూడా! రెందేళ్ళు సెలవు పెడుతుంది. అవసరం అయితే ఇంకా.... తనకున్న అర్హత, అనుభవంతో కావాలంటే మరో మంచి ఉద్యోగం చూసుకోగలదు. ఈ విధంగా తనేం త్యాగం చేయటం లేదు. తన కొడుకు కోసం, తన కొడుకు అంటే తనకున్న (ప్రేమ కోసం, వాడి మొహంలో చిరునవ్వు కోసం, వాడి సరియైన మానసిక ఎదుగుదల కోసం ఇదంతా చేస్తోంది. తన ఖాళీ టైములో తను చదవాలనుకున్నా ఎంతో చదువు చదువుకోగలదు. సాత్వికురాలై అత్తగారి సమక్షంలో ఆవిడ అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోగలదు. రవీంద్రకు మరింత దగ్గర కాగలదు.

సరిగ్గా రవీంద్ర కూడా ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ అలాగే ఆలోచిస్తున్నాడు. రేపో ఎల్లుండో డైరక్టర్‌గా రాబోయే ప్రమోషన్‌ని అంగీకరించకూడదు అనుకుంటున్నాడు. ఇపుడున్న బాధ్యతలు చాలు, అదనపు హోదా, అదనపు జీతం, అదనపు బాధ్యతలు అక్కరలేదు. సాటి సుధకి, అమ్మకీ, బాబుకీ టైము వెచ్చించనపుడు, ఒక నిర్దుష్టమైన గమ్యం గానీ, మజిలీ అంటూ లేకుండా ఈ జీవితంలో ఈ పరుగులేమిటి? ఏం సాధించడానికి? తను హాయిగా, మనసారా నవ్వి ఎన్ని రోజులయింది? ఫామిలీ అంతా కలిసి భోజనం చేసి ఎన్ని రోజులయింది? తనూ సుధ హక్కులు, బాధ్యతలు అంటూ వాదించుకోకుండా (ప్రేమగా కబుర్లు చెప్పుకుని ఎన్ని ఏళ్ళు అయింది? మనిషి ఆటవిక స్థాయి నుండి వికసించిన మనస్సు గల మనిషి తనకేమిటి కావాలో మిగకా వారికేమిటి ఇవ్వగలడో, తను వారి వద్ద నుండి ఏం పొందగలడో స్పష్టంగా తెలిసి కూడా ఈ ఎండమావుల వెంట దేనికో తెలియని ఈ వెతుకులాట?

అందరికీ కావలసిన తృప్తి, మనశ్శాంతి తన మనస్సు నుందే సృష్టించుకోగలిగిన సత్తా ఉండికూడా దేనికో తెలియని ఈ బానిసత్వం ఎక్కడికి దారి తీస్తుంది? చాలా పెద్ద పదవి సి.ఎమ్‌.డి. పోస్ట్‌, అంతులేని ధనం, హోదా - ఇంకా ఇంకా ఈ కోరిక అలా బిందువు లేకుండా విస్తరించిపోతూనే ఉంటుంది తనలో. కారట్‌ కట్టిన గాడిద ఎపుడూ ముందే ఉంటుందని తెలుసుకోలేని గాడిదల్లాంటి వారు తమ లాంటి మూర్చులు. నో! ఇప్పటికి జరిగినది చాలు. రెక్కాడితేగాని డొక్కాడని వారి కెలాగూ ఉద్యోగాలు తప్పవు. కానీ తమ లాంటి డబ్బున్న వాళ్ళకి కూదా ఆ పరుగు పందెం దేనికి? సంఘసేవ వేరే చేయక్కర లేదు. బాబు లాంటి తెలివైన కుర్రాళ్ళని చాకుల్లా చురుకైనవాళ్ళుగ చేసి సంఘానికి అందిస్తే చాలు. వాడు ఒక మానసిక రోగిలా మారి సంఘాన్ని ఇబ్బంది పెట్టి, తను ఇబ్బంది పడకపోతే అంతే చాలు. ఒక నిశ్చయానికి వచ్చాక అతడి గుండెలు తేలిక పడ్దాయి.

మరునాడు కాఫీ తాగుతూ సుధ తన నిర్ణయం వెలిబుచ్చేసరికి ఆశ్చర్యపోయాడు రవీంద్ర. వెంటనే తన మనస్సులో జరిగిన అల్లకల్లోలం చెప్పి తను రాత్రి ఏం ఆలోచించాడో చెప్పాడు.

చాలా రోజులు - కాదు.... కాదు.... చాలా ఏళ్ళ తరువాత రాత్రి డిన్నర్‌ టైమ్‌లో కబుర్లు చెబతూ ్రుళ్ళుతూ నవ్వుతున్న ఆ కుటుంబాన్ని ఆనందపు వెన్నెల వెలుగులు ముంచెత్తాయి.

. అ

1113131311₹13్ట2్ట్ట్ట2122222ేేేేేేేోేో్‌్‌= నబ బ్రనత్‌ క

రెండు ప్రశ్చలే... అ ౮. లర్భంనాయుడు

శరీరమ్మీద లారీ దెబ్బల్లా - చినుకులు, మూడు రోజులుగా! ప్రతిపక్షాలను సస్పెండ్‌ జేసిన అసెంబ్లీలా - క్లాసుల్ని సస్పెండ్‌ చేసిన కాలేజీలు, పంజరాలను మూసేసిన కాన్వెంట్‌లు. రోడ్ల మీద అక్కడక్కడా, వొక కాలు పోయిన ధర్మదేవతల్లా రిక్షాలు...!

బస్‌ కాంప్లెక్స్‌ నుంచి బయటకు రావాలంటే - ముంగాలి లోతు వైతరణి దాటాలి. ముంగాలి లోతు నీళ్ళల్లో - అక్కడక్కడా కాళ్ళకు తారు పూసిన రాళ్ళు తగుల్తాయి. ఆ రాళ్ళతోనే, టెండరు వృక్షానికి కాచిన *బిల్స్‌' దులిపేసుకున్నాడు కాంట్రాక్టరు సత్తిబాబు.

ఆ వైతరణి దాటించి, లోపలకు తీసుకెళ్ళకపోతే దబ్బులివ్వనంటాడు - సత్యవరం షావుకారి. ఎలా యివ్వవో చూస్తానంటాడు రిక్షావాలా! రిక్షాలో నిండుగా కిరాణా సామాన్ల మూటలు, వాటి మధ్యలో ఉప్పు మూటలా షావుకారీ! జీవితాంతం కూడేసిన సంపదల్లో వైతరణి ముందు ఆగిపోయినట్టు - ఆగిపోయేడు రోడ్డు మీద.

*....బేరం - కాంప్లెక్స్‌ లోపుకి గాదు....”

“కాంప్లెక్స్‌కి అనంతే - లోనకి గాదేటి?”

“.... అయితిది కాంప్లెక్సేటి?” ఉప్పు మూట ఉక్రోషంతో రిక్షా దిగి, ప్రశ్నించింది.

ఎదురుగా, హోటల్‌ వరండా నించి యీ దృశ్యాన్ని చూసి, విజిల్‌ ఊదేదు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శంకరనారాయణ.

“....బేగా, కళాసోల్ని పిల్చి దింపించుకో. అవతల ట్రాపిక్కోడు బిగిలూత్తండు...”

“....యికృద్నించయితే, కళాసోడు - డబల్‌ ఛార్జీ అడుగుతాడు...”

“....అయితే, నా కెంతిస్తావ్‌ లోనకెళ్ళడంకి....?”

“....లోనకే గాదేటీ బేరమాడేను....?”

మళ్ళీ విజిల్‌ శబ్బమయ్యింది. గభాలున, రిక్షాను కాంప్లెక్స్‌ మెయిన్‌ గేటు నుంచి, వెనుకకు తిప్పి -

“...సామాన్లు దింపుతావా? ఎనక్కి వొద్దు కెళిపోమంతావా? బేగి తేల్చు. ఆ పక్క బిగిలూ, యీ పక్క చినుకులూ జేగి తేల్చు...” ఫెడల్సు మీద పాదాల్ని నొక్కి అడిగేడు రిక్షావాలా.

“....వోసె, వోసేటీ అన్నేయిం? వొట్టు కెళ్ళిపోతావా...? యేటీ దోతరిఫీ...?” బొజ్జ వూపుకుంటూ, తుండుగుడ్డతో తల తడవకుండా కప్పుకుంటూ, కేకలు వేసాడు షావుకారి.... కాాత౭జడజె=జజై క భరూం- ౬౧4 2౬1౬222222

రిక్షా దిగి!

విజిల్‌ నోట్లో పెట్టుకొని - శంకరనారాయణ వొచ్చేసాడు.

“...ఏంటి - రోడ్డు మీదనే బిజినెస్‌ పెట్టేసావేటి...?” అని, షావుకార్ని కసురుకున్నాడు.

తల మీది తుండుగుడ్డని సర్దుకొని -

*....సూడండి సార్‌. సామాన్గొట్టుకు పోతాడట. కాంప్తెక్సుకి అనంతే - యిక్కడిదాకేనట. లోనకి రాడట...” ఫిర్యాదు జేసాడు షావుకారి.

“....సిన్నపాటి 'సెరువు అయిపోయింది సినుకులకి. లోనకెళ్ళటమంతే - రిక్సాకి దేమేజి....! అయినా, బేరం లోపలికి అనన్లేదు...” రిక్షావాలా తన రీజనింగ్‌ తను చెప్పేడు.

“...మరా, తిరకాసు కబుర్లే వొద్దు...”

“యేటి, తిరకాసేటి...? కళాసోడ్డబ్బులు మిగుల్సుకోడంకి... నీ యెత్తులు....”

*...యిలగయితే - నేను యాపారం సేయక్మర్తే....”

“...అలగయితే, నీను రిక్షా తొక్కక్షర్షే...”

లాఠీ కర్రని రిక్షా హేండిల్‌ మీద కొట్టి, నోటిలో విజిల్‌ నోపొలి గట్టిగా ఊది, కోపగించిన మొహంతో -

“...యిలరైతే - నేనూ డూటీ చెయ్యక్షల్లే. ట్రాఫిక్కు.. టేక్‌ జేస్సి యిద్దరూ బాగొతమాడతార్రా. తియ్యరొరేయ్‌ రిక్షా. పోరా, పోరొరే సావుకారీ....” కేకలేసి, పిప్పీ, పిప్పీల్‌మని విజిల్‌ వూదేడు మళ్ళీ శంకరనారాయణ.

రిక్షావార్ని - షావుకారి బ్రతిమాలసాగేడు. ఇంతలో, యెటునుంచి వొచ్చేరో, లేదా నలువైపుల నుంచీ వొచ్చేరో - ప్లే కార్టుల్తో, ఎర్ర జెండాల్తో.... జనం...! గుంపులు, గుంపులుగా చేరారు. ఒకాయన ముందుకొచ్చి - 'సామ్రాజ్యవాది' దిష్టిబొమ్మను ప్రదర్శించి - “సామ్రాజ్యవాదం నశించాలి, దేశాన్ని తాకట్టు బెడితే సహించడం, సహించం...” అని నినాదమిచ్చేడు. మరొకాయన

  • ఆ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టేడు. ఆ తర్వాత సమూహాన్ని ఉద్దేశించి కాసేపు మాట్లాడి, మళ్ళీ నినాదాలిచ్చేడు.

“ప్రపంచ బ్యాంక్‌ జీతగాడు - ముఖ్యమంత్రి మోసగాడు...”

“పెంచిన విద్యుత్‌ ఛార్జీలు - తగ్గించాలి, తగ్గించాలి.”

“ఇదేమీ రాజ్యం, యిదేమి రాజ్యం - ధరలను పెంచే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం...”

కాంప్లెక్స్‌ యెదురుగా - ట్రాఫిక్‌ బందయ్యింది. నినాదాల గుంపు రాను రాను పెరుగుతోంది. విజిలూది, వూది ఫలితం లేక ట్రాఫిక్‌ శంకరనారాయణ - అక్కడ్నించి తప్పుకున్నాడు. బస్సులు నడవనీయరని తెలుసుకున్నాక - కాంప్లెక్స్‌లోపలున్న జనాలూ చేరసాగేరు.

ఇదంతా చూస్తూ, పొత్తి కమీజూ, పొందూరు పంచే - యిసుమంతైనా తడవకుండా కాపాడుకుంటూ వచ్చిన ఎర్రన్నాయుడు, చిరాకుపడుతూ -

*“..మా నం... కొడుకుని, కారు గొనరా అన్నాను. ఇన్నాడు గాదు. గవరమెంట్‌ కారుని వోడుకోవచ్చు. సొంతంగా మళ్ళా యేల... అనీసినాడు. ఆడికి పనికొచ్చినట్టుగ - బులెట్‌ బండి కొనుక్కుండు. ఇప్పుడు సూడండి, యెలాగ చిక్కిపోనామో. ఆటోలు, బస్సులు, అన్నీ బంద్‌...! 2=2222222222222222222”సు ౮న క

ఎలాగ...? మా నం.... కొడు...” అని మళ్ళీ తన పుత్రుని తిట్టుకున్నాడు.

అతని చేతి బ్యాగ్‌ మోసే వ్యక్తిగానీ, అతనికి గొడుగు పట్టే వ్యక్తిగానీ, అతని ఖర్చంతా భరించే వ్యక్తిగానీ, అతని మీదనే ఆశలన్నీ పెట్టుకున్న వ్యక్తిగానీ - యెవ్వరూ .... ప్రతిస్పందించ లేదు.

“....ఆఖరికి - అయిద్రాబాదెల్తన్నపుడు మా నం.... కొడుక్కి సెప్పేను - రేపెళ్లుండి పట్న మెళ్ళాలనీను! పోనీ, ఆ (గ్రామీణ బ్యాంకు సెర్మేన్‌ గోడికయినా 'సెప్పురా కారు పంపమని... అనన్నాను. మరి, ఆడు సెప్పలేదో... చెప్పినా, ఆ గ్రామీణ బ్యాంక్‌ చేర్మేన్నం.. కొడుకే పంపలేదో... తరాత తేలుత్తాను. గానిపుడు సూడండి, సిక్కు..” అని కాంప్లెక్స్‌లోంచి, బయటి కొచ్చి, వో హోటల్‌ ముందు నిల్బాని, తనకొచ్చిన యిబ్బందులకు కారకులను బండగా తిట్టి, ఆందోళనా మేఘాల సమూహాన్ని అసహనంగా చూసేడు ఎర్రన్నాయుడు. ఈసారి గూడా, అతని వెనుకనున్న వ్యక్తులు స్పందించలేదు.

ఎర్రన్నాయుడికి చిరాగ్గా వుంది. నోటికొచ్చినట్టు తిట్టడమే గాక, చేతికొచ్చినట్టు.... యెవరినైనా కొట్టాలన్పిస్తోంది. ఇంటి దగ్గరగానీ - యీ చిరాకుంటే యిద్దరు, ముగ్గుర్ని కొట్టేసున్ను ఇప్పుడయినా - గొడుగు పట్టిన వాడిని కొట్టొచ్చు, వాడేమీ అనడు. చేతిబ్యాగ్‌ మోసినోడ్ని కొట్టాచ్చు. వాడూ యేమనడు. మిగిలిన యిద్దర్నీ - యిప్పుడు గాదు, వాళ్ళ పని నెరవేర్చిన తర్వాత కొడితే బాగుంటుంది. జెను, యీ యిద్దర్నీ అప్పుడే కొట్టాల. వీద్ది యీ ప్యాంటూ, షర్టూ, సర్టిఫికేట్లతో - నిల్చున్న యీ నం... కొడుకుని మాత్రం కొట్టకుండా వొదలగూడదు. కొట్టాల... ముందు, యిీడి పని నెరవేర్చాల... ఆ తరాత కొట్టాల!

“....బెనారే జగదీశ్చర్రావూ, ఎన్ని గంటలిలాగ పాతుకు పోతాం. ఆ జంక్షను కెళ్ళి - టేక్సీ నం....కొడుకునేనా పిలరా నవ్మీ....” అనాపేసాడు ఎర్రంనాయుడు.

జగదీశ్వర్రావు జంకుతూ -

“....అవి గూడా బందనుకుంటాను...” అని, బదులిచ్చేడు... వినయంగా.

ఆ వినయానికి ఎర్రన్నాయుడు ముచ్చటపడి, ఆందోళన కారులవేపోసారి చూసి -

“....అడ్డుసుడిగా రేట్లు పెంచిత్తే - అయిపోద్ద్టిరో మీ పని అనన్నాను.... మా నం...కొడుక్కి కరంటు తిన్నగివ్వలేరుగాని, రేట్లు పెంచిత్తే పల్లకుంతారేటి....? పొలిటికల్‌ లీడర్నా కొడుకులు = బిజినెస్‌ జేత్తంద్రా, లాభనస్టాలంతారు? పోలిటిక్స్‌ - అనాది మనాదోళ్ళ గురించి ఆలోచించటం మానేసింది. కదరా... జగదీశో...” అని ప్రశ్నించేడు, మరోసారి వినయపూర్వక జవాబు కోసం.

“....అనాది మనాది గురించి ఆలోచించే - పోలిటిక్స్‌ యీ దివాళా స్థితిని తెచ్చింది. అన్నిటికీ సబ్సిడీలు, రాయితీలు... గవర్నమెంట్‌ దగ్గర నిధులన్నీ వాటికే ఖర్చయిపోయేయి...” సఫారీ డ్రెస్సులో, చేత ట్రీఫ్‌కేస్‌తో నిల్చున్ను వ్యక్తి బదులిచ్చేడు. సఫారీ... మెడలో బంగారు గొలుసూ, బ్రీఫ్‌కేసు చేతి మణికట్టుకి గొలుస్తూ, వేళ్ళకు ఉంగరాలూ... పచ్చగా, పసుపు పచ్చగా మెరుస్తున్నాయి.

ఈ నం... కొడుకెవుడన్నట్టుగా - చూసేరు నాయుడుగారు.

*...తయారీ ఖర్చుకంటే - తక్కువ ధరకు పంపిణీ జేస్తే, యే సంస్థయినా నష్టపోదా? కాళకడాా హో ౫222222222

నాయి నష్చాలు పూడ్చుకోవాలంటే - యీ చర్యలు తీసుకోక తప్పదు గవర్నమెంటుకి...” అని, వివరణ కూడా యిచ్చేడు మెడలో గొలుసు సవరించుకుంటూ సఫారీ వ్యక్తి.

ఆ భోగట్టా - విద్యుత్‌ శాఖ మంత్రీ చెప్పేడు. షాక్‌ గొట్టించిన ట్రాన్స్‌కో గూడా చెప్పింది. ఇంతకీ ఎంత నష్టం..? ఎప్పట్నించీ నష్టం? ఎందుకు నష్టమొస్తోంది...? రేట్లు పెంచీడ మొక్కటే నష్టాల్ని పూద్చటానికి మార్గమా...?” చేతుల్ని ప్రశ్నల కొడవళ్ళు జేసాడు, సఫారీ పక్శనే నిల్చున్న తెల్ల కమీజు వ్యక్తి.

ఎర్రన్నాయుడు - కొడవళ్ళ వైపు చూసేడుగానీ - యీ నం.... కొడుకెవుడని అనుకోలేదు.

ఈలోగా, హోటల్‌ వారు గ్రహించినట్టుంది - నాయుడుగారికి నమస్కరించి, వో కుర్చీ వేసారు. పాత్తి దుస్తుల్ని సవరించుకుని, పొగరుగా కూర్చొని - సఫారీని కొడవళ్ళకి సమాధానం చెప్పు - అన్నట్టుగా చూసేరు.

“౨998-99 సంవత్సరానికి, 1930.64 కోట్ల లోటు! 1997 నుంచీ నష్టాల్లో నడుస్తోంది. గత సంవత్సరానికి 2916 కోట్లకి చేరిందని విద్యుత్‌ బోర్టు నివేదించింది. టెక్నికల్‌ పరంగా, వాణిజ్యపరంగా, పంపిణీ పరంగా నష్టాలొస్తున్నాయి. ఇవిగాక, అడ్రమ కనెక్షన్ల వలనా, మీటర్లను తిరగకుండా చెయ్యడం వలనా....”

సఫారీ మెదడులో... ట్రాన్స్‌కో నివేదికల గణాంకాలు యింకెన్నోో వున్నాయి.

“సరి, సరి ఆగండి. విద్యుత్‌ మంత్రి ప్రకటించినట్టు - టెక్నికల్‌ పరంగా, వాజిజ్య పరంగా నష్టాన్ని వాక శాతం తగ్గించినా 169 కోట్ల ఆదాయం పెరిగితే - మరా విధానం గురించి ఆలోచించకుండా.... ధరలెందుకు తారాజువ్వలు జేసారు?” - కొడవలి కరకరలాడింది.

ఎర్రన్నాయుడి కిందులో యేమి బోధపడిందోగానీ -

“....ఏట్లోకి మోటారెట్టి నీటిని లాగేసినట్టుగ.... తిన్నగ లైనుకి వైరులెల్టేసి కరెంటు లాగేసిన లం...కొడుకు లెందరున్నారో? లేబర్‌ కోలనీలున్నాయంతే - ఆటికి మీటర్లున్నాయేటి...? పొలాలంట బోర్‌ పంపులు యెన్నిటికి మీటర్లున్నాయి....? ఏవి...?” సవాల్‌ విసిరేడు.

ఆ సవాల్‌ చురుక్కునుని తగిలిందేమో, యీ చర్చను వింటూ నిల్చున్న లేబర్‌ కోలనీ వ్యక్తి, చేతిలోని బీడీని పూరాగా దమ్ము లాగి, పారేసి -

“...అయితేటి...? అన్ని వొందల కోట్లూ - లేబరు కోలనీ వోళ్ళ వల్లనే నష్టమొస్తుందా? మీటర్లకి - సెక్రమద్దేసి తిరక్కుండా సేస్సిన మిల్లులెన్ని లేవు, మిసన్లెన్ని లేవు? పేక్టరీలెన్ని లేవు? లాడ్జింగ్‌ లెన్ని లేవు? ఓసోసే.... మనకాడా వాద్దొద్దు - అద్దు సుడి వోదనకయితే... తొలిసూరు

మనం...ఆం అసలకి - లైన్ల మీద యెంత కరంటు పోతన్నాది, టాన్సుఫారాలకాడ తగల బడీదెంతా...? ఇవన్నీ లెక్కెయ్యండివోయ్‌....? లేబరోడూ, రైతోడూ....అనాది! అసలకి, లేబరోడూ, రైతోడూ వున్న పల్లెటూరికి కరెంటే వుండదు...” మొహం కందగడ్డలా చేనుకు మాట్లాడేడు! అతడు మాట్లాడినంతసేపూ - కాళ్లు యెగుడూ, దిగుడుగా వేస్తూ ఊగుతుందేవాడు. మాట ఆగితేగానీ, కాళ్ళ కదలిక ఆగలేదు.

పొత్తి దుస్తుల ఎర్రంనాయుడికి కోపమొచ్చింది. తన్నుదునా - నం... కొడుకుని అని క్షణకాలం చూసేడు. గానీ, వాడి కాళ్ళ కదలిక, తన కాళ్ళ కదలిక కంటే స్పీడ్‌ అని గుర్తించి, తగ్గేడు. 2222222222 ర్రన్నరే. క

అంతలో, వాడి ఆఖరి మాటలు గూడా తనకి నచ్చేయి. రైతోదున్న పల్లెటూరికి కరెంటే వుండదన్న సత్యాన్ని చెప్పినవాడు గనక, మెప్పుకోలుగా చూసేడతన్ని

ఈలోగా ట్రీఫ్‌కేస్‌ గొంతు సర్ఫుకొని -

“.....వొకప్రక్క పంపిణీ నష్టాలు, మరోప్రక్క కొన్ని సెక్షన్స్‌కి యిచ్చే రాయితీల వలనా నష్టాలు పెరుగుతున్నాయి...” అని, యింకా, యేదో వివరించబోయేడు ఈలోగా,

“*... ఆ రాయితీలని - మనలాంటి వాళ్ళ మీద పడేస్తాది ప్రభుత్వం. మనం చచ్చినట్టుగ, పెంచిన రేట్లని భరించాలి. కరెంట్‌ వాడకం మానుకోలేము, రాయితీలనా.... పొందలేము....” దవడలు చప్పరించి, నిరసన తెలియజేసాడో, ఎంటర్‌ప్రైజెస్‌ ఏజన్సీదారుడు.

“... ఎవుళి రాబడికి తగినట్టుగ ఆళ్ళకి పన్నులూ, కర్సులూ పడవేటి?”

“అందరికొకలాగే యెలగకుదుర్తాది?” ఎగుడు దిగుడు కాళ్ళవాడు, యెదురు తగిలేదు. ఎంటర్‌(పైజ్‌వారు, యే మాత్రము తగ్గకుండా, యెంతో తెలివిగా -

*... ఎవరి జుత్తుకి వాళ్ళు నూనె ఖర్చు భరిస్తారు గానీ, మరో తల మాసిన వాడి ఖర్చు భరించరు గదా....” జవాబిచ్చేరు.

అందుకు ఆ యొగుడు, దిగుడు కాళ్ళ వాడు, కాసేపు ఎంటర్‌'పైజుని కళ్ళారా నవ్వుతూ చూసి, చుట్టూరా వున్న జనాన్నీ అదే మోముతో చూసి -

*...జుత్తు వొత్తు గున్నోడికి నూనె కర్సవదేటి. బోడిగుండుకీ - అదే కర్పంతెలాగ....? వోసే...! వోసన నూనె సోకుకిి, వోసా మాత్రం కర్సెట్టుకోరేటి?” అని ఎడమ అరచేతి మీద, కుడిచేతి మడమతో చప్పట్లు చరిచి, ప్రశ్నించేడు.

ఎర్రంనాయుడి కిదంతా - చూడముచ్చటగా వుంది. వాళ్ళ చర్చ సాగుతూనే వుంది, యిటువేపు జగదీశ్వర్రావు తండ్రి -

“...ఇది యింతబేగి తేల్చుగావాల? అవతల ఆళుగానీ యెళిపోతే కస్టిమే....” ఎర్రంనాయుడి వేపు చూస్తూ మాట్లాడేడు.

“మరేటి జేస్తాం? పోనీ టేక్సీయేనా సూడ్రా అంతే - అవీ బందే అంటండు. దగ్గిరా, దాపా.... నదకకి?....” బదులిచ్చేడు ఎర్రంనాయుడు.

అటువేపు చర్చల మించి... ధర్నా నినాదాలు. ఎవరో పాట పాడుతున్నారు. చినుకుల మేఘం పూర్తిగా తెరిపిచ్చి, ఎండ యెక్కింది.

“...పిలక ఆడి చేతి కిచ్చేసి, కాళ్ళు బట్టుకు బతిమాల్తే లాభమేటి? ఆడ్నిగ్రాదు - నిన్ను దన్నాల్రా జగదీశుగే. ఎందుకూ, సదువుకున్నావు, సదువు. ఆయువుపట్టు అవతలోడికిచ్చేసి - మరింకేటి దెబ్బలాడగలవు....?” జగదీశ్వర్రావుని, తిట్టేడు నాయుడు.

“.... దెబ్బలాటకైతే ఆడు మాత్రం ఆయువుపట్టు యిచ్చెత్తదేటి....? బతకడానికనిగానీ! మరందికే, నీలాటోడి శరణు గోరేడు....” - ఎర్రంనాయుడికి గొడుగు పట్టిన వాడు కల్పించుకు నచ్చజెప్పేదు.

సరస్వతీ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి - తన సర్టిఫికేట్లిచ్చేసాడు జగదీశ్వర్రావు. టీచర్‌ ఉద్యోగం. జీతం మూడు వేలు. క్లాసులో పాఠాలు చెప్పటమే గాక - కరస్పాండెంట్‌ చెప్పే పనులన్నీ - క పడా ్షేేేోోోోోోోో్షోోోోోోో =

జగదీశ్వర్రావు డ్యూటీలో భాగమే. సర్టిఫికేట్స్‌ యివ్వకుండా చేరితే రెండు వేలు, యిస్తే మూడు వేలు జీతం! ఎంచుకోమన్నారు. జగదీశ్వర్రావు.... రెండోదో యెంచుకున్నాడు. ఆయువు పట్టు యిచ్చేశాడు.

జగదీశ్వరరావు తండ్రికి - ఎర్రంనాయుడి మాటల్లో యింకేదో గుర్తొచ్చింది. తమ ఆయువు పట్లను.... యెంత అమాయకంగా.... నిన్నటి ఘటన....

చుట్టూ, పత్తి పంట నిండిన పొలం. మధ్యలో బండి దోవ... కంకరతో వేసారు. ఆ దోవకి కొసలో.... పెంకుటిల్లు. పెంకుటింటి చుట్టూ, రకరకాల పూల మొక్కలు. పెంకుటింటికి యెడమ వేపు.... కొద్ది దూరంలో ఆవుల సాల. దానికి ఆనుకొని అవతలివేపు వో కుటీరం. అందులో - నాలుగు నీల్‌కమల్‌ కుర్చీలు, వో వాలు కుర్చీ, వొక సింగిల్‌ కాట్‌ బెడ్‌ - కలర్‌ టీవీ వున్నాయి. కుటీరానికి ఎదురుగా, మరో సాల. అందులో ట్రాక్టరొకటి, వొక హీరో హోందా మోటార్‌ సైకిలూ, రెండు హీరో సైకిల్లూ, గాలిలేని ట్యూబులూ, వొక టైరూ, టూల్‌బాక్స్‌.... పడి వున్నాయి.

కుటీరంలోని టీవీలో - “అన్నదాత అడ్వర్దయిజుమెంట్‌ - పాలం నిండుగా పూచిన పొద్దు తిరుగుడు పూలు - ట్రాక్టరు పైన నవ్వులు పూచే రైతూ - యింటికి వొస్తోన్న పంటలక్ష్మీ... కన్పించేయి. నీల్‌కమల్‌ కుర్చీల్లోని వాళ్ళు కళ్ళప్పగించేరు. వాలు కుర్చీలో కూర్చున్న శ్యామలరావు, పక్కనే స్టూలు మీది ఫోనందుకొని, యెవరికో డయల్‌ చేస్తున్నాడు. కుర్చీల్లోనివారు - ఆ ఊరి విఎఓ తర్షాడ సుందర్రావు, కర్షక పరిషత్‌ సభ్యుడు గులిపిల్లి తిరుపతినాయుడు, వాటర్‌ కమిటీ సభ్యుడు దన్నాన పోలినాయుడూ!

ఆ సమయంలో, ఆ రోజు, అక్కడికి ఎర్రంనాయుడి వెనకాల, జగదీశ్వరరావు తండ్రీ జగదీశ్వర్రావూ గూడా వెళ్ళేరు. ఎర్రంనాయుడ్ని చూసి, విఎఓ తప్ప అందరూ, నమస్కరించి లేచి నిల్చున్నారు. శ్యామలరావు, ఫోన్‌ పెట్టేస్తూ - తన కుర్చీ పక్కనే వున్న సింగిల్‌ కాట్‌ బెడ్‌ మీద కూర్చోమని ఆఫర్‌ చేసాడు.

ఎర్రంనాయుదడు - బెడ్‌ మీద విరామంగా చేరబద్దాడు. అప్పుడు, నిల్చున్న వాళ్ళంతా కూర్చున్నారు మళ్ళీ. మరి కుర్చీల్లేవు. జగదీశ్వర్రావు తండ్రి, ఆ కుటీరంలో వొక వారగా పేర్చిన టేకు కలప దిమ్మల మీద కూర్చున్నాడు. జగదీశ్వర్రావు.. తండ్రితోపాటు అక్కడ కూర్చోలేక, మరో ఆసనం లేకా - కొమ్మలన్నిటా యేవేవో పెద్ద పెద్ద పక్షులు కన్పిస్తే జడుసుకొని తల్లి రెక్కల మీద వాలిన పిల్ల పక్షిలా - తండ్రికి దగ్గరగా నిల్చున్నాడు.

“....బాబు వొచ్చేసినారేటి?” శ్యామలరావు కాస్తా ప్రాంతీయ యాసను - ఎర్రంనాయుడి కోసం వొలికిస్తూ, మాట్లాడేడు.

*...దుబాయి గావాల యొళ్ళేడు? వొత్తాడు. రాకండా - అక్కడాట వుండి పోతాడేటి. దుబాయి - అతగాడి అత్తగారి వూరేటి?” బదులిచ్చేడు వాటర్‌ కమిటీ మెంబర్‌ దన్నాన పోలినాయుడు ....వర్రంనాయుడికి బదులుగా.

*... అత్తగారయికే మట్టుగు వుండిపోతారేటి?” విఎఓ యెదరు ప్రశ్న వేసాడు.

*...ఇల్లరికమెళ్ళినం...కాడుకు వుండదేటి?” బెడ్‌ మీద నుంచి, కాస్తా లేచి, ప్రశ్నించేడు ఎర్రంనాయుడు. 22==222222222222222222222223ంస ౪

“.....బాబు అంటే నా వుద్దేశం.... మన విశ్వంబాబుగారని...” శ్యామలరావు, కల్పించుకున్నాడు. ఎర్రంనాయుడికీ, విఎఓకీ ఉప్పూ, నిప్పూలా వుంటుందని తెలుసు. విఏఓ ఇళ్ళరిక మొచ్చినవాడు గూడా. అందుకని, ఇద్దరి సంభాషణనీ తుంచేందుకు ప్రయత్నించేడు.

అయితే - యీ సంభాషణలే ప్రధాన కాలక్షేపాలయిన మిగిలిన వాళ్ళు - శ్యామలరావు ప్రయత్నాన్ని పట్టించుకోలేదు.

*..... అన్న అంటే ఎన్టీవోడూ, బాబంటే సెంద్రబాబూ, అమ్మ అంటే - యిందిరమ్మా గేపకమొత్తారెవుళికేనా....” కర్షక పరిషత్‌ సభ్యుడు గులిపల్లి తిరుపతినాయుడు, తన రాజకీయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేడు.

“.....వోసే, యివేటి కొత్తగొచ్చిన మాటలేటి? అంతక ముందరకి యెళ్తే తాత అంటే గాంధీ తాత గ్యాపకం వొచ్చీవోడు గాదేటి?” ఎదురు ప్రశ్నను వేసాడు వాటర్‌ కమిటీ మెంబర్‌.

శ్యామలరావు - వీళ్ళందర్నీ భరించడం నేర్చుకున్నాడు. గంటలు, గంటల కాలం.... వీళ్ళు గతం మీద వృధా చర్చ చేయటం - వర్తమానాన్నించి పారిపోవటానికే అని కొద్దినాళ్ళకే (్రహించేడు. పెద్దరికం కోసం - వీళ్ళు దేన్నయినా త్యాగం చెయ్యగలరని గూడా, వీరికి అదో బలహీనత అని గూడా [గ్రహించేడు. వీరిలోని యీ బలహీనతయే - తనకు ప్రవేశాన్ని కల్పించిందా .... యీ ప్రాంతంలోకి...? అని తర్మించుకున్నాడు శ్యామలరావు. స్థిరకరణయి పోయి, యిక మీదకు యెొగిరేందుకు - అక్కడ తన రెక్కల బలం చాలలేదు. డెల్టా భూముల్లో పంటల మిగులుతో - పెద్ద, పెద్ద వ్యాపారాలకి యెగిరే శక్తిగల రాబందులు అక్కడ! వాటితో తను పోటీ....! సిన్మా రియలెస్టేట్‌ ఫైనాన్స్‌, పత్రికలు, పచ్చళ్ళు... వొకటేంవిటి.... అన్ని రంగాల్లో - రాబందుల రెక్కల చప్పుడు. తన రెక్కల కింకా బలం గావాలి. తను రాబందుగావాల్సే వుందింకా...! ఛఛా.... ఉపమానం బాగులేదు... ఛఛా....!

శ్యామలరావుకి.... అప్పటి దాకా వున్న (ప్రశాంతత చెదిరిపోయింది... వాలు కుర్చీలో అసహనంగా కదిలేడు. ఆ కుటీరానికి కనుచూపు దూరాన - రోడ్డు మీద - వారన్‌ మోగించు కుంటూ.... పోతోన్న వాహనాల శబ్దం! కుటీరం ముందరి పెంకుటింటి పెరట్లోంచి.... యేవో తాలింపు వాసనలు! కుటీరం - యెదురుగా ప్రత్తి పంట పొలంలో - ఆవు దూడలు... అడ్డ దిడ్డంగా పరుగుదీస్తూ, అంబా.... అంబా.... అని అరుస్తున్నాయి. రోడ్డు మీది శబ్దం, వంటింటి

తాలింపు వాసన, ఆవు దూడ రంకె... అంతరంగంలోని రాబందుల రెక్క... వాక్కసారిగా విదిలించుకోదల్చి - కుర్చీలోంచి లేవబోయేడు. పొలం నుండి దిగాలుగా తిరిగొచ్చిన తమ్ముడు ప్రతాపరావూ, అతని వెంట నలుగురు కూలీలు - కన్సించేరు.

“...యేంవర్రా? పొలం వాదిలేసి - యింటి కొచ్చేరేంరా...?” చిరాకంతా ధ్వనించిన స్వరంతో ప్రశ్నించేడు శ్యామలరావు.

ప్రతావపరావొకసారి - అన్నగారి చుట్టూ చేరిన వారిని చూసి, ఈసడింపుగా -

“..... వీళ్ళు బాగుపడరూ, మనల్ని బాగుపడనీరు. డబ్బూ, ధనం తీస్మొచ్చి - యీ మారు మూల నేల మీద బోసీ సేవు. అక్కడ యెలా వుండేవాళ్ళం? ఇక్కడ వనవాసానికొచ్చినోళ్ళ లాగున్నాం....” అన్నకు బదులిచ్చేడు. తై. క కభరంి- 1004 డడ కేక్‌ 2222222222

సం)

“.... అంటే, మేమంతా వనవాసులమన్నమాట?” విఎఓ, కాస్త నిష్టూర స్వరంతో ప్రశ్నించేడు. "

“...నేను మీతో మాట్లాడలేదు...” విసురుగా బదులిచ్చి, తాలింపు వాసనల వంటింటికి నడిచేడు విసురుగా ప్రతాపరావు.

“....మీవోడు రామన్న వెనకనే వొచ్చిన లక్ష్మణసోంవి....” కర్షక పరిషత్‌ మెంబర్‌ తిరుపతినాయుడు, హాస్యమాడేడు.

*....అన్నకి తోడుగా వాస్తే ఫర్తేదు. శూర్చణఖ, ముక్కూ చెవుల దాకా వొస్తేనే తంటా....” విఎఓ వూరుకోలేదు.

“....రామలక్ష్మణులు, యెవరో తగిలేస్తే అయోధ్య వొదిలే సొచ్చేరు గాని, మేము అలా రాలేదండీ. అయినా, రామ లక్ష్మణులు - హిందూ ధర్మాన్ని రక్షించేరు రాక్షసుల హతమార్చి.....” శ్యామలరావు కింకేదో చెప్పాలని వుంది. ఈ సందర్భంతో - దేన్నో జతపర్చి .... లోపలి ఆక్రోశాన్ని చల్లార్చు కోవాలనుంది.

“ఆర్య, అనార్య తెగల మధ్య రగిలిన సంఘర్షణలకు - కావ్యరూపం రామాయణం. గెలిచిన తెగల వారు తమ ఘనకీర్తిని చాటేట్టు కావ్యాన్ని పొడిగించుకున్నారు....” ఊరుకోలేక, గొంతు విప్పి బదులిచ్చేడు జగదీశ్వరరావు.

శ్యామలరావు - ఆలోచనల్లోంచి, ఆశ్చర్యంగా చూసేడు.

“...మావోడే... పెద్దకొడుకు...” జగదీశ్చర్రావు తండ్రి, శ్యామలరావు చూపుకి బదులిచ్చేడు.

“...అలా అని - యీ మధ్యనే యేదో పుస్తకంలో చదివేను...” సాధ్యమైనంత వినయంగా చెప్పేడు జగదీశ్వరరావు.

ఈలోగా వంటింటి వేపు వెళ్ళిన 'ప్రతాపరావు, యేదో నెమరువేస్తూ వొచ్చేడు, ఆయన వెనకాల వదిన శోభమ్మ - బాలక్రిష్ణుని వెంటేసుకొచ్చే యశోదమ్మలా వొచ్చింది. ఆమె, వొస్తూనే

  • శ్యామలరావు చుట్టూ చేరిన వారందరి వేపూ - చులకనగా చూసింది. జగదీశ్వర్రావు తండ్రి గభాల్న కూచున్న చోటు నించి లేచి నిల్చున్నాడు. శల్లి పక్షి రెక్క మీది పిల్ల పక్షిలా - జగదీశ్వర్రావుకీ లేవక తప్పింది కాదు. కర్షక పరిషత్తూ, వాటర్‌ కమిటీ సభ్యులు - శోభమ్మ మీద కళ్ళ నొది లేసారు. వివఓ చురచురా చూడసాగేడు, ఆడవారితో వ్యవహారాలు చర్చించటం అతనికి నచ్చదు. ఎర్రంనాయుడు మాత్రం, చేరబడినవాడు కాస్తా లేచి, శోభమ్మని చూసి -

“*... నీ మరిది నిన్ను దింపేడేటి యుద్ధంకి? ఇంతకీ, అన్నతోటి యుద్ధమా, అతగాని చుట్టూ... చేరినోళితోటా...?” అని హాస్యమాడేడు.

శోభమ్మ, కాస్తా తగ్గింది. ఎర్రంనాయుడి నోరెటువంటిదో ఆమెకీ తెల్సు. అదీగాక, శ్యామలరావు కంటే లౌక్యమైనదామె.

“....ఎవరో యెగదోస్తే తగవుకి దిగిపోయే దాననా, పెదనాయనా. కూతురి సంగతి నీకు తెలవదా..?” అంటూ వగలు బోయింది.

ఎర్రంనాయుడికి మరిక, కూతురి సంరక్షణ - తన బాధ్యతెంది. దాంతో -

*...యేటి? యేటింతకీ నీ మరిది గోస?” అనడిగేదు. కో సనగ క

“....ఐంధువర్గ్షమూ, బలగమూ.... ఎవరున్నారంటాడు నాయనా...” అనాపేసింది. ఇంకా వగలు బోతూ -

“....అక్కడ సంపాదించింది - యిక్కడ బుగ్గిలో పోసీడమేలా అంటాడు”

కర్షక పరిషత్‌ మెంబరు - నాలుకను అంగుటికి అంటించి - 'చ్చాచ్చొ' కొట్టేడు. అతని వేపు, ఆత్మీయంగా చూసింది శోభమ్మ. ఎందుకో, అప్పుడే, కుర్చీలోంచి లేచి శ్యామలరావు వంటింటి వేపు నడిచేడు. శోభమ్మ - అదేపనిగా వెల్లవేస్తోన్న టీవీ గొంతు నొక్కేసి - ఖాలీ అయిన శ్యామలరావు కుర్చీలో కూర్చోబోతూ, ఆగింది. ఆమెని చూస్తూ -

“.... అవునమ్మా, మీ పడమట కాసి వున్న సంపాదన - యీ తూర్పు కాసి యేటుంతాది...?” అనన్నాడు చ్చా, చ్చా కొట్టిన కర్షక్షుదే.

బోధపడలేదు శోభమ్మకి.

“....సంపాదనొదులుకోని వచ్చినోళ్ళని... మిమ్మళ్నే సూసినాను. యేంవలపింటి పన్దేసి

శోభమ్మకి - అతనేం మాట్లాడుతున్నాడో, పొగుడుతున్నాడో, తెగుడుతున్నాడో అర్ధం గాలేదు.

“...పోని, యెనక్కెళిపోదురంతే - యెంత పోస్సేరో, యిక్కడి బుగ్గిల....? ఇక్కడాటోళ్ళం వి, యీ నేల బుగ్గి నెత్తినేసుకున్నోళ్ళంవి... మాంచే సూడు.... యెలగున్నాయయో... చ్చా చ్చా....” అని మళ్ళీ చొచ్చా కొట్టేడు.

అప్పుడు మళ్ళీ అతణ్ణి చూసింది శోభమ్మ. అప్పుడు, కుర్చీలో కూర్చుంది, విచారంగా..... ముడిచి మూల పెట్టిన తడిసిన గొడుగులా! ఆ తర్వాత.

“.... అయితే, యిదే ధర్మమా?” అని ప్రశ్నించింది.

యేదో - యెవరికీ బోధపడలే. అందరూ ఆమెనే చూసేరు. “చెరువ దిగువ పొలాలు మనవయితే - చెరువు మనది కాదా?” దీర్ధంగా విస్తుబోతూ ప్రశ్నించింది.

“.... జిరాయితీ చెరువయికే... హక్కు మనదే....” వాటర్‌ కమిటీ మెంబరు బదులిచ్చేడు.

“....జిరాయితీ అయినంత మాత్రాన - యేం జెయ్యటాని కయినా హక్కుంటుందనుకోకు...” విఎఓ అద్దు తగిలేడు. తగుదునమ్మా - అంటూ, మగవాళ్ళ మధ్యకొచ్చి, మాట్లాడే శోభమ్మ మీద అసహనంతో వున్నాడు విఎఓ. .._ “అంటే యేంవిటో...?” కళ్ళ నిండుగా ప్రశ్న వేసింది విపఓకి. విఎఓ ఆ చూపుకి నిరసనగా, కుర్చీలోంచి లేచి పోయి-

*....జిరాయితీ చెరువు అయినా - సాగునీటికే తప్పా, చేపల పెంపకానికి రూల్స్‌ వొప్పుకోవు...” బదులిచ్చేడు విఎఓ

“....మరదే. ఎప్పటివో చట్టాలు! ఆ చట్టాలు - ఈ మట్టి మీద వాళ్ళనీ ఉద్ధరించలేదు. ఇటు పరాయి మట్టి నుండొచ్చి ఉద్ధరించబోయే వారినీ వొప్పుకోవు...” అని యెక్కడలేని నిష్టూ రాన్నీ వాలికించి పలికేడు శ్యామలరావు. ఆ తర్వాత, విఎఓ. ఖాలీ జేసిన కుర్చీలో కూర్చున్నాడు

  • శోభమ్మ తన కుర్చీ భాలీ జెయ్యలేదు గనక,

విఎఓ..... కూర్చోవటానికి కుర్చీ లేదు. వెళ్ళిపోవటానికి - మాటలు తెగలేదు. కై భరు-౬0* ౯222222222

న

“...బావగారు నిల్చునే వున్నారు....” అంది శోభమ్మ.

అప్పుడు శ్యామలరావు, కుర్చీలోంచి లేచి -,

“రండి, రండి కూర్చోండి” అని ఆహ్వానించేడు. భర్త, లేచి నిల్ఫోవడంతో యిక తప్పక -

....టీ పంపించాల్నా....?” అంటూ లేచింది శోభమ్మ.

శ్యామలరావు, ఆ కుర్చీలో కూర్చుంటూ -

“.... రండి బాబూ రండి. మా నేలకి నీరు లేదు, పైరు లేదు. మా జనాలకి పనుల్లేవు, పెట్టుబడి పెట్టి మీరు బతకండీ, మా జనాలని బతికించడంటే వొచ్చేం. విశ్వనాధంగారిని నమ్మి వొచ్చేం. మమ్మల్ని - యే దశరథుడో, కైకేయో తగిలేస్తే..... అరణ్యవాసానికి రాలేదు....” అనన్నాడు శ్యామలరావు.

రెండు చ్చా, చ్చోలు కొట్టేడు మళ్ళీ కర్షక పరిషత్‌ సభ్యుడు. ఆయన్ని అనుమానంగా చూస్తూ, టీ పంపిస్తానన్చెప్పి, అక్కడ్నించి కదిలింది శోభమ్మ.

ఎర్రంనాయుడు, తలగడాని పక్కకి తోసేసి, సర్గుకు కూర్చొని -

“....నాకు బోధపదనిదొకటే...! మా వోళ్ళూ - తిడతను మా నం...కొడుకుని. మీరూ తిడతను. మావోడివల్ల - యిరు పక్షాల వారూ నష్టపోతంద్రా....?” అని ప్రశ్నించి చుట్ట వెలిగించి, పొగ పీల్చి వొదిలేక -

“4... మీకు బోధ పడిందా, నా ప్రశ్న అదన్నమాటగొ అనడిగేడు.

“రాజకీయాల్లో వున్నోళ్ళకివి తప్పవు. మంచీ మొయ్యాల, చెడ్డా మొయ్యాల, మంచంతా మనదీ, చెద్దంతా అప్పోజిష నోళిదీ అంటే - సబువా?” రూలింగిచ్చేడు విఎఓ.

“...అయితే, మా నం... కొడుకు- ఊరికి చేసిన మంచేటి? చెడ్డేటి? చెప్పు...” చుట్ట ఎర్రగా కాల్చి; అడిగేడు ఎర్రంనాయుడు.

“నేనెందుకు చెప్పాల...? నన్నదుగుతావెందుకు....?”

“మంచీ, చెడ్డా రెండూ మొయ్యాలన్నందుకు...”

“లోక తీరవా సెప్పాడు లెద్దు, యియ్యేవో...” విద్యా కమిటీ మెంబరు సర్దిచెప్పబోయేడు.

*.లోక తీరవ గాదది - మీ తీరవా...” తగువుకి దిగేడు ఎర్రంనాయుడు. విఎఓది వొక వర్గం, విశ్చంబాబుదొక వర్గం! ఆ గ్రామం ఆదిలో పంచాయితీరాజ్‌ యేర్చడిన్నాడు - ఏక వర్గంగా వుండేది. విఎఓ తాత - అక్కంనాయుడు ఆనాడు ఏకగ్రీవంగా యెన్నికైనాడు. రెండు దఫాలు గ్రామ సర్పంచ్‌ పదవి అతన్టే. ఆ రోజుల్లో గ్రామానికి రోడ్లూ వీధి లైట్లూ, పాఠశాల, వొకటొకటిగా - కొత్త కొత్త సంస్థలూ, ఉద్యోగులూ, పద్ధతులూ - వొచ్చేయి. మన ఊరూ, మన అభివృద్ధి, మన కట్టుబాటు - అనే సమిష్టి భావజాలమ్మీద బతుక్కొచ్చిన (గ్రామం లోకి - తర్వాత్తర్వాత - కొత్త ప్రపంచం, కొత్త విజ్ఞానం, కొత్త పథకాలూ, కొత్త ద్వారాలూ - కొత్త దారులూ ప్రవేశించాయి! కొత్తలో కొందరూ, పాతలో కొందరూ.... "విభజనగా మిగిలింది గ్రామం.

గ్రామానికి ఆనించిన నదీ, గ్రామ సంబంధ భూములూ, గ్రామ సంబంధ వృత్తులూ, గ్రామానికి చుట్టూగల తోటలూ, గ్రామం తూర్పు దిక్కు ఆలయం.... గమనించలేనంత నెమ్మదిగా 22 రేక

నత పరిణామం చెందాయి. తోటలు - ఎస్‌సి, బీ.సి.. కోలనసీలయినయి. భూములు, వ్యాపార పంటలతో, మార్మె ట్లోకి నడిచి, చేతులు మారేయి. తట్ట, బుట్ట, కుందా మండ, నక్కూ నాగలీ, ఆసర సాల, సంతతోడి, చాకలి, మంగలి, మేదరి, కుమ్మరి, కమ్మరి..... వృత్తులు యంత్రాల మధ్య యిరుక్కుపోసాగేయి.

ఈలోగా లబ్టి పొందిన వారిదొక వర్గంగా లబ్టి పొందని వారిదొక వర్గంగా - గ్రామ సమిష్టి భావజాలం చీలింది. రాజకీయమైంది. అక్కంనాయుడి కర్ధమయ్యేలోగా - (గ్రామంలో ప్రతిపక్షం యేర్చడి పోయింది. ఆ గ్రామంలో _“యేకగ్రీవం” పద్ధతి చెరిగిపోయి - ఎన్నికలు ప్రవేశించాయి. ఎన్నికలు ్రవేశించేక - గ్రామం.... వార్డులయ్యింది. ప్రజలు ఓటర్లయినారు.

ఈ సందర్భంలోనే - ఆ ప్రాంత రిజర్వుడు అసెంబ్లీ స్థానానికి - రెండు కోటల మధ్య పోటీ ఆరంభం! ఈ ప్రాంత గ్రామాలన్నీ - యేదో వొక కోట వేపు నిల్పోటం, గ్రామం ఏకంగా లేకపోతే - గ్రామంలో వర్ణాలు యేదో వొక కోటకు సంబంధ వర్గం గావటం!

అక్కంనాయుడుని - ఎర్రంనాయుడి తండ్రి ఓడించేదు. ఎర్రంనాయుడి తండ్రిని విఎఓ తండ్రి ఓడించేదు. విఎఓ తండ్రిని - ఎర్రంనాయుడు ఓడించాడు. ఎర్రంనాయుడ్ని గానీ, ఎర్రంనాయుడి కొడుకు విశ్వనాథంనాయుద్నిగ్రానీ - విఎఓగానీ, వివఓ కొడుకులుగానీ ఓడించలేక పోయేరు. కక్షలు పెంచుకున్నారు తప్పా - కారణాలర్ధం కాలేదు. ఆ రకంగా, విఎఓ వర్గానికీ, విశ్వనాథం వర్గానికీ ఉప్పూ..., నిప్పూ...లా వుంది!

ఇదంతా, యింత వివరంగా నేపధ్యమంతా, తెలీకపోయినా - శ్యామలరావుకి, యీ వర్గాల విషయం తెల్సు. సాధ్యమైనంతగా - యీ వైరుధ్యాల్ని బతకనియ్యటం, బలహీనమైన వర్గానికి ప్రచ్ళన్నంగా సహకరించటం, బలమైన వర్గానికి ప్రత్యక్ష మద్దతివ్వటం, రాజీలు కుదర్చటం, రాజెయ్యటం - రెంటికీ తన వద్ద అవకాశాన్ని వుంచుకోవటం - శ్యాలమరావు యొత్తుగడ. కొన్నాళ్ళకి రెండు వర్ణాలంతరించి - తన వర్గం ఆధిపత్యంలోకి రావటం - అతని ఆకాంక్ష!

“...వాలి, సుగ్రీవుల తగువు తీర్చి - శ్రీరామచంద్రుడు నింద మోసాడు....” శ్యామలరావు వేపు చూస్తూ, పలికేడు వాటర్‌ కమిటీ మెంబర్‌...

“.... కతలూ, కయ్యాలూ.... అలగుంచండీ. ఆపండీ. చెరువు సంగతి చెప్పండి....” అడిగేడు శ్యామలరావు.

“....చెరువు దిగవ భూమంతా మీ సొంతం జేస్మోండి. సెంటు జాగా, పరాయోళికి లేకుందా చేస్కోండి. అపుడు, ఆ చెరువుల మీరు చేప పిల్లలే పెంచుకుంతారో, పాంవు పిల్లలే పెంచుకుంతారో - మీ యిస్టం. అడిగినోళెవులుండరు....” సలహా యిచ్చేడు వాటర్‌ కమిటీ మెంబరు.

“...నా భూంవీ, నా యిష్టం - అని నల్లమందు పండిస్తానంటే - వాల్లదు! గవర్శమెంటొప్పు కోదు....” చెప్పబోయేడు విఎ౬ఓ!

“...యే గవర్నమెంటు...? స్టేటా...? సెంటరా...? రెండింటిలా - బాబుకి పవరుంది. కదండీ...” అని, ఎర్రంనాయుద్ని కదిపేడు శ్యామలరావు. = $థారాహిని- ఓ004 కడ కా

డాటా ఎర్రంనాయుడికి ప్రతిపక్షం విఎఓ గావటంతో - రెచ్చిపోయి, దున్నేయాలనుంది. మంచ మ్మీద కాళ్ళు బారజాపి-

*....స్యేమల్రావో, సేతావాతాలేనోళికన్నీ ఆటంకాలే. మనకేటి, యేటి సెప్పు అద్దు....?” అని, అద్దులేదన్నాడు.

“...వాసే, మెరువుకింద భూంవంతా కొనీసేవు గదా బావ్‌? అదిగో ఆ గంటేదోళ్ళ మడిసెక్కలు మిగిల్నాయి? మరెవురివి మిగిల్నాయి....?” అడిగేడు తిరపతినాయుడు.

జగదీషూ, జగదీష్‌ తండ్రి గతుక్కుమన్నారు. "

“...మావి మాధ్రం - పూరాగా యొక్కడున్నాయి? పంటల యెటా ముటీ వొచ్చీ, అప్పుల పాలయిపోయీ, పంట చాలక, బతుక్కి యీ మట్టి వొదిలేసి, మా బాగార్లు విజీవోడ ముఠా పన్లు కెళిపోనారు. ఆళ్ళ మడిసెక్కలు నిరుటి దాక, నీనే కౌలుకి జేసినాను. నిరుడు, బాగుర్లుకేటో అవుసిరమయి, తనకా యెట్టుకొని, దబ్బీయ్యిమన్నారు. నాకాదెక్కడిది డబ్బు? నా బతుకు - పోసిన సమురుకీ, కాలిన వాత్తికీ సమానంగా వుంది. ఇదిగీ సేమ(ల్రావు బావ్‌ నడిగితే - తనకాకి గాదు, అమ్మకాని కడిగేడు. మావోళొప్పుకోలేదు. అప్పుడు గాదా, ఎర్రంనాయుడ్ని బతిమిలాడి, తనకా యొట్నాం! అలగ, మా బాగార్హు మడిసెక్కలు - ఎర్రంనాయుడి బావ్‌ కాడున్నాయ. మా మడిసెక్కలు రెండే - మా దగ్గిటున్నాయి” వివరణిచ్చేడు జగదీశ్వరరావు తండ్రి.

“...మీ బాగార్హు విజ్‌వోడ నిండి రాడమూ, మడిసెక్కల తనకా యిడిపించడమూ, మనకి జంరూవతి రిజర్వోయిరు పూర్తవడమూ - “అసిరమ్మ తల్లి పిల్లల్ని కాయిడమూ - జరిగే పన్లా....?” ప్రశ్చించేడు, వాటర్‌ కమిటీ మెంబర్‌.

“..మరలాంటపుడు - తనఖా విడిపించలేనపుడలా వుంచేసే బదులు - అమ్మేయవొచ్చు గదా...?” శ్యామలరావు తమ్ముడు ప్రభాకరరావు అడిగేడు.

“పుట్టినూరిల బుగ్గవాలంతే - ఆ మడిసెక్కలుండాల....” జగదీశ్వరరావు తండ్రి-తన ఆకాంక్షయో, బాగారుల ఆకాంక్షయో - తెలీని స్వరంలో పలికేడు.

కాసేపు అందరూ నిశ్శబ్దంగా వుండిపోయేరు. తర్వాత, వివఓ చేయి ఊపుతూ -

“...వీళ్ళకి ఉమ్మడిగా 'కొత్త మెరక భూముంది. అయితే, అది వర కట్టాలి, పల్లం జెయ్యాలి. అదిగాని అలాగ సాగుభూమి జేసుకుంతే - యీ చెరువు దిగువు చెక్కలమ్మీసినా బతికీగల్రు. వీడి బాగార్లు - విజయవాడ వెళ్ళిపోనూ అక్యర్లేదు. ఇంకా అదృష్టం కలిసొచ్చి - ఆ జంరూవతి రిజర్వాయర్‌ నీరే గానొచ్చిందా - మరీ గంటేడోళ్ళ నాపలేం! ఏదాదికొక యెకరం కొనగట్రు! తిరిగి, శ్యామలరావు దొర భూముల్ని కొనీగల్రు...” అరచేతిలో వైకుంఠాన్ని చూపేడు.

ఆ అరచేతుల వేపు చూడకుండానే -

“...మెరకని వరకట్టి పల్లం జెయ్యదానికి మదుపేదీ...? ఆ వొత్తాదన్న జంజావోతి, వొచ్చేసరికి

  • మా తాత్తండ్రుల తరం గడిసిపోయిది - మునిమనవల తరానికొస్తే మటుగు, మా.... భూములు మిగుల్తాయేటి అపుడికి? ఇదిగాదా - నోట్ల కట్టల్లోటి, మిసన్ల తోటి, కొత్త కొత్త యితనాల్లోటి.... పడమటి జిల్లాల నిండొచ్చినారా - యీ దొరలు ఈళ్ళదీ యవసాయం! డే సు త్రీశ్న్హ ౩

ఈళకే... యికీ భూంవులు....” నిష్ణూరమో, నిజమో, స్పష్టంగాని స్వరంలో పలికేడు జగదీషు తండ్రి.

“నాను - పెట్టుబడేదీ...? బాగార్లా - విజయవాడెళ్ళి పోనారు; యీడికి యిదిగో యీ కొడుకు చదువూ, యింకా కూతురి పెళ్ళీ, యీటికి తోడు - యింటి కర్సులూ - యెక్కడ తెస్తాడు...? ఇప్పటికే అప్పుల మీద బండి యీడుస్తండు” - నాొచ్చుకుంటూ, నాలుకతో చాచ్చో కొట్టేడు కర్షక పరిషత్‌ కమిటీ మెంబర్‌. =

“...మరందుకే, తెలివైన పని చెయ్యాల! నష్టాలొచ్చిన కంపెనీలమ్మీసి, ఆ డబ్బుతోటి - మరొక యాపారంలోకి గవర్నెంటే దిగతంది! మనం దానికంటా - గనమా....?” వాటర్‌ కమిటీ మెంబర్‌ ప్రశ్చించేడు.

“.....గవర్శమెంటే దిగి అమ్ముతుందో, వారల్ట్డు బేంకు అమ్మించుతంతో - అది, నీకూ, నాకూ బోధపడని రాజకీయం....” బదులిచ్చేడు విఏవో!

రాజకీయమనేసరికి - తన స్వంత ఆస్తి మీద దాడిలా ఫీలయి, ఎర్రంనాయుడు, చిరాగ్గా కదిలేడు. శ్యామలరావు అంతకంటే చిరాగ్గా -

“...బాబూ, రాజకీయాలూసెత్తకండీ! భూంవి సంగతీ, ఆ చెరువు సంగతీ చూద్దురూ...” కసురుకున్నట్టు పలికేడు.

క్షణకాలం అందరూ మౌనం. ఆ తర్వాత ఎర్రంనాయుడు- *...నా కాడకి యీ గంటేడోడు రోజూ పారొస్తండు. దబ్బు కావాలట. కొడుక్కి - అక్కడెక్కడో అన్నామలైల బియ్యిడీ అన్పించీస్తే

  • యేడాత్తిరిగే సరికి - టీచరయిపోతాడని ....గోస! ఆ చెరువు దిగువు మడిసెక్క తనకా యిడుకో మంటండు. ఈళ్ళ బాగార్లది నిరుడు తనకా పట్టుకున్నాను కదా అని గావోసు! గాని, మా పరిస్థితి - యిీడికి తెల్టు. మా నం... కొడుకు - వొక్కాలు అయిద్రాబాదుల, మరొక్కాళు ఢిల్లీల ఏస్తండు. యిక్కడాడికి పాదం నిలకంటంది. ఇక్కడి భూముల మీది రాబడిని పట్నం లెడతాడు. ఏటేటో యాపారాలంతాడు! యేటి? ఈనోగా, ఎలక్సనొచ్చి యెళ్ళిందంటే - యిక్కడి భూంవులు అమ్ముతుంటాడు! యేటి? అయితవి అమ్మాసినా - యీటికి బదులక్కడ పట్నాల్లంట

కూడేస్తండు! అదల గుంచండి. అసల బోగట్టా వేటంటే - మా యింటిల ఆడి మాట తప్ప మరొకళ్చి సెల్లదు. ఆడికంట సిన్నోడు - పెద్దోడుగానీ కాళు రెండూ ఢిల్లీ వెడితే - వొదిలేసిన అయిద్రాబాద్‌ల యీడు కాళ్ళెడుదుమని సూత్తండు. ఆ పెద్దోడలగ పోవాలని... ఎదురు సూత్తండు. మిగిల్నోలిద్దరాడపిల్లలు...! ఆశెంతసేపూ - భూంవులొద్దు, పుట్టలొద్దు - బంగారం, డబ్బూ, యివ్వండర్రో, యివ్వండంటారు. అందుకని, భూంవులు మరొద్దనీసేడు - మా నం... కొడుకు! అకడికీ, యీ గంటేడోడికి చెప్పేను - వారే, కమ్మాదారకి చెప్పుదుంలేరా అని! మరంచేత, అదిగా చెరువు దిగువు భూంవి నువ్వు కొనుక్కోవయ్యా - శ్యేమభ్రావో! ఆం! ఏటి? ఒరే, గంటేడోడా - నువ్వూ మీ బాగార్లూ - ఆ డబ్బుతోటి - కొత్త మెరక వరకట్టుకోండిరా....! ఏం వో, మీ తలరాత మారిపోయి, జెంజావోతి రిజరోయిరయిపోద్దేంవో యీ మద్దెన! ఏటి? అలగసెయ్యిరా....” అని, అటు శ్యామలరావూ, యిటు గంటేడ వారూ - యిరువురూ లబ్ది పొందుతారన్నట్టుగా నిర్ణయాన్ని వెల్లడించేడు ఎర్రంనాయుడు....!

కోలో

లాడ

“.... మరీ, గంటేడోడా, విజీవోడ మీ బాగార్లుకి కవురెట్నావురా...?” అడిగేడు ఎర్రంనాయుడు.

నినాదాలు, పాటల్తో ధర్నా జేసిన జనాల మీద లాఠీఛార్జీ జరిగేక - జనం చెల్లా చెదురయ్యేక, మరి కాస్సేపటికి - ఆటోరిక్షా కిరాయికి దొరికింది. జగదీశు, ఆటోని కిరాయికి మాట్లాడి తెచ్చేడు. ఆటో సరస్వతీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వేపు పోతోంది. రోడ్దు మీద అక్కడక్కడా వాహనాలు తిరుగుతున్నాయి. వర్షపు చినుకులు తెరిపిచ్చి - యెక్కిన ఎండ తీవ్రంగా వుంది. బంగాళాఖాతం మీదుగా రావాల్సిన యానగాలి రావటం లేదు. ఉక్కబోతగా ఉంది.

“....కవురెట్నాను.... యీ రాత్రికో, రేప్పొద్దుటికో, వాత్తారు...” బదులిచ్చేడు గంటేడోడు.

*... బెన్రోరె జగదీశో - అన్నామలైల బియ్యిడీ అయిపోతే - టీచరువై పోతావా....?” జగదీషుని ప్రశ్నించేడు ఎర్రంనాయుడు. ఆయనకు, యెప్పుడూ యొవర్నో వొకర్షి - తిట్టడం, కొట్టడం లేదా కనీసం ప్రశ్నించడం యిష్టం!

జగదీష్‌కి జవాబు దొరకలే!

“...కడిగిన మొహంవుంతే మంచిదిగదా....” ఎర్రంనాయుడి సంచీ మోసిన వ్యక్తి ఐదులిచ్చేడు.

*...కొనవ్రా కంప్యూటర్‌ సదువు సదవనేదేంరా...?”

జగదీశ్‌కి - జవాబు దొరకలే....!

*...తలకి తగ్గ తలపాగా యెట్టుకోటం మంచిదిగదా?” అంత చదువుకి, వీడికి అర్హత లేదు సుమా అన్నట్టు జవాబిచ్చేడు, మళ్ళీ సంచీ మోసే వ్యక్తి!

*...జెనుగానారే - ఆ సొసైటీ వోడుగానీ, సర్టిఫికేట్లు యివ్వనని తీర్మానించుక్కూకుంటే - యేటి జేస్తావురా...?”

జగదీష్‌కి భయం పట్టుకుంది. గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. జగదీష్‌ తండ్రి ఆతి వినయంగా, ఆతి దీనంగా -

“మరందుకే గదా, తంవరి శరణుజొచ్చేం....” అన్నాడు.

జగదీష్‌కిదంతా, గమ్యమెరుకగాని - (ప్రయాణంలా వుంది. ఇంటిలో ఖర్చులకీ, తన బిఇడీ ఖర్చుకీ, అంతవరకూ వున్న అప్పులకీ = చెరువు దిగువ భూమి అమ్మకానికి తండ్రి సిద్ధం కావటం, తను.... యింతో, అంతో ఆదాయమొచ్చే నౌకరీ వొదిలి బియ్యిడీకి వెళ్ళడం - సొసైటీ వారు సర్టిఫికెట్లని తిరిగివ్వటానికి - మూడు నెలల జీతంగానడిగితేనో...? చెరువు దిగువ భూమి.... పంటనిచ్చే భూమి, అది పోయి - కొత్త మెరక సాగుజేస్తే... పంట రాకపోతే,

  • నో...? తనకి.... బియ్యిడీ అయ్యేక టీచర్‌ పోస్ట్‌ రాకపోతేనో....? ప్రశ్నల బండరాళ్ళు గుండెల్లో...

“....సూద్దుం. ఈ సాసైటీ నం... కొడుకుల్లోని వాకడు - మా చిన్నోడికి కూతుర్నిస్తానని, కట్నం వెంతడిగితే అంతిస్తాననీ.... కవల్లైదతండు! మనం.... అనువులూ, మినువులూ అన్లేదు. అన్దానికి - మా యిద్దరు నం....కౌడుకులు - మన చెయ్యి దాటిపోనారు గదా....” అలా దాటిపోవడం తనకానందదాయకమన్నట్టుగా, అనువులూ మినువులూ అనకపోవటం తన స్టేటస్‌ సింబల్‌గా - వ్యక్తపరచి, ఆగిన ఆటో లోంచి దిగేడు ఎర్రంనాయుడు.

ఈ బంధుత్వం - తమకెలా వికటిస్తుందోనని, భయపడ్డాడు జగదీష్‌ తండ్రి. మళ్ళీ చేతులు 122 బభ్ళ్లాక్‌

జోడించేడు. ఎర్రంనాయుడు - పంచె సర్దుకుని, కండువా సరిజేసుకొని, రెండు అడుగులు, సొసైటీ వారి ముఖద్వారం వేపు నడిచేక, వెనక దిరిగి చూసేరు. రెండు అడుగుల దూరంలో గంటేడోడూ, జగదీశూ కన్పించేరు. వాళ్ళతోనే నడుస్తోన్న గొడుగు పట్టే వ్యక్తిని చూసేడు. గొడుగు వ్యక్తి - ఘబాల్న అంగలు వేసి, గొడుగు ఎత్తి పట్టేడు ఎర్రంనాయుడికి. ఆ రెండు అడుగుల దూరం నిలబెట్టుకుంటూ - చేతులు జోడించేడు గంటేడోడు.

“...మనం అనువులో మినువులో తేల్సలేదని - యీడు నీలగలేడు మనకాడ! పిలక మన సేతిలుంది. ఏటి, భయ పడకండి...” అభయమిచ్చి, ముందుకు అడుగులేసాడు ఎర్రంనాయుడు.

-బంధుత్వాలూ, రాచకీయాలూ, పంటలూ, రాబడులూ, వ్యాపారాలూ మాట్లాడుకుని, కాఫీ, టీల మర్యాదలు స్వీకరించి - బయల్దేరి బయటకు అడుగెయ్యబోతూ, జగదీశ్‌ సర్టిఫికేట్ల సమస్య గురించి ముచ్చటించేరు ఎర్రంనాయుడుగారు! సౌసైటీవారు - తమకి కొన్ని నియమ నిబంధనలున్నాయనీ; దాని ప్రకారంవే.... సొసైటీ నడుస్తుందనీ, గానీ తమ లాంటి పెద్దల కోసం-నియమాల్ని సడలించి, సర్టిఫికేట్లిచ్చేస్తాం) అయితే నియమం ప్రకారం కట్టాల్సిన మూడు నెలల జీతాన్ని - సగానికి తగ్గిస్తాం) అది చెల్లించి సర్టిఫికేట్లు తీసుకుపొమ్మనందని చెప్పేరు.

ఎర్రంనాయుడుగారు సంతోషించేరు. ఆనందంగా, వారి నుంచి, వీడ్కోలు తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో- ఆటోలో - విషయాన్ని చెప్పేరు గంటేదవారికి! వారికి ఏడ్వాలో, నవ్వాలో..... బోధపడలే!

  • 6069 -

రాత్రివేళ. దాదాపుగా వీధి అంతా నిద్రలో వుంది. వీధి దీపాలు గూడా వెలగటం లేదు. గంటేడ వారింట్లో, వొక మూలన కిరోసిన్‌ దీపం.... భయం భయంగా కాల్తోంది. ఇంటి ముంజూరు వీధి గడపలో మంచమ్మీద - విజయవాడ నిండొచ్చిన సూరన్నాయుడు, నిద్ర రాక దొర్లుతున్నాడు. ఆ ప్రక్కనే మరో మంచమ్మీద అతని కొడుకు కామేశం.... యెన్నెన్నో ప్రశ్నలో మనసంతా... కోళ్ళు దువ్విన పెంట కాగా.... కూర్చొని - ప్రక్శనే వున్న జగదీశ్‌ వేపు చూస్తూ... నిట్టూర్చేడు. వీరికి, ఎదురుగా ముందరి గడపలో - జగదీష్‌ తండ్రి నేల మీద పల్చటి కోక వొకటి పరచుకొని, చారబడి, యింటి వాసాలు లెక్కబెడ్డున్నాడు. ఆ యింటి యిల్లాలు, పనుల్లోంచి తెమిలి, పెనిమిటి ప్రక్కగా, ఎడమ వేపు మరో కోకగుడ్డ పరచుకొని, యింట్లోని దీపం దగ్గరకు వెళ్ళి, దాన్ని ఆర్చివేయటానికి చేత్తో గాధి విసరబోతూ, ఆగి -

“...బెనో, దీపం అనిపీసీదా....?” అని భర్తకు కేకేసింది.

భర్తకా ప్రశ్న కంటే - సాయంత్రం విజయవాడ నిండొచ్చిన తన అన్నదమ్ముడూ, వాని కొడుకూ వేసిన -

“...విజీవోడల మరి బతుకు లేదు, వొచ్చీద్దు మనుకుంతన్నాం. తనకా యిడిపించుకోడాన్ని .... దాచుకున్న కాణీ పరకా సిద్ధం చేసి యిక బయలెళ్ళుతున్నాం - నీ కవురందింది! అయితే, తీరాగా అమ్మీడమా...? మరి మమ్మల్ని యీ ఊరు రావొద్దంతావా...? ఎపుడికేనా యీ మట్టిల బుగ్గవుదుమనుకున్నాను, మరది వొల్లగాదంతావా? పుట్టిన సోట గాక, యెక్కడ మట్టిలోనో బుగ్గి గమ్మంతావా?” ప్రశ్నలు.... మళ్ళీ మళ్ళీ విన్పిస్తున్నాయి. క :ధరహం-1004 222౩2౩2222

డాయ

ఆయనకెక్కడలేని దుఃఖం కుమ్మేసింది. ఆ యింట్లో, అదే గడపలో, అదే చోట, చిన్ననాడు, తనూ తన అన్నదమ్ముడూ.... నిద్రబోయే ముందు చెప్పుకున్న... పేదరాశి పెద్దమ్మ కథలూ, రాజుల కథలూ, సాహస గాధలూ గుర్తొచ్చేయి. తమ గ్రామమొక స్వరాజ్యంలా - తాము రాజపుత్రుల్లా, తమ భూముల్లో పంటల్లో..... తమ సుందర భవ్య జీవితాన్ని... కలవరించుకున్న ఘటనలు గుర్తొచ్చేయి. పంట భూంవులేగాక, పశుల సంపదా - లేమి తెలియని .... బాల్యమది! ఏంవయ్యిందో, యొదిగే వయసొచ్చేసరికి - పశు సంపద తరిగింది. పంట భూమి తరి గింది. అప్పుల భారం పడింది. అప్పటిదాకా నడిపించుకొచ్చిన - కుటుంబ రథాన్ని అక్కదొదిలేసి, తండ్రి కనుమూసేదు. కుటుంబ రథం.... రవ్వంత కదపటానికి - తన వొంట్లోని యెన్ని నరాలు తెగిపోయినాయో, యెంత రక్తం కరిగిపోయిందో! అయినా, కరువు.... కరువు... పంటక్తీ, యింటికీ, చేతికీ, కడుపుకీ దూరం పెరిగిపోడం. కుటుంబం పెరగడం, అన్నతమ్ముడు.... విజయవాడ వెళ్ళిపోవటం... తనకింకా ... యింకా.... అలివిగాని కుటుంబ రథం మోత....

కుమిలి, కుమిలి వాక్కసారి... భోరున విలపించేదు. ఆ దుఃఖపు విస్పోటనం... ఆ యిల్లాలికి విన్చించింది. ఆందోళనగా దీపపు బుడ్డీ పట్టుకొని, భర్త దగ్గరకు వొచ్చి, ఆయన మొహంలోకి చూసింది! ఆయన... కన్నీటి ధారల్తో, శరీరమంతా వణుకుతో, యేడ్చుని నొక్కిపట్టే విఫలయత్నంతో - వొక్క బాణం కాదు, ఒంటి నిండా బాణాలు గుచ్చుకున్న క్రౌంచ పక్షిలా వున్నాడు. ఆ యిల్లాలికి భయం వేసింది. ఆయనకు దగ్గరగా వచ్చి -

“...బెనో.... యేంవీ?, యేటీ...” అని ప్రశ్చించి, దీపం దగ్గరగా తెచ్చింది. ఆయన దుః ఖవు ఊరింతంట్నీ వొదిలి ఆ దీపాన్ని ఆర్బేసొడు. అక్కడ చిమ్మ చీకటి ఆవరించింది.

ఎదుటి వీధి గడపలో మంచమ్మీద కూర్చొని, ఆలోచనల్లో పడిన జగదీశుకీ, కామేశానికీ - యిక్కడ కూచోటానికి మనస్మరించలే! నిట్టూరుస్తూ, లేచి ఊరికి ఉత్తరం వేపు గల నాగావలి నది వేపు నడిచేరు. దోవ పొడుగునా - యెవరూ గొంతు విప్పి, యేంవీ మాట్లాడలేదు. నదిలో నీరు వొక పాయగా, ఆ చివరెక్కడో ప్రవహిస్తోంది. ఇసుక తిన్నె మీద చతికిలబడ్డ్దారిద్దరూ!

“... మా నాయినకి అక్కడుండడం యిష్టం లేదు. ఎపుడూ, పుట్టినూరో, పుట్టిన మట్టో - అంటాడు. దానికి తగ్గట్టు - మాకూ కూలి పన్లు తగ్గిపోనాయి. ఇంటిల్ల పాదిమి కూలి జేసినా . - తిండికీ, బట్టకీ, రోగాలూ, రొప్పులుకీ, సిన్మాలూ సర్దాలకి గాదు - ఆటికే సాల్టు. పిల్లలకి సదువు లేదు. ఊరెళిపోతే - జన్మభూమంటగ్రు, స్కీములంటన్రు, యేదో దారి దొరకదా? ఎలిపోదుం అంటాడదెప్పుడు! మేమిద్దరం ముఠా కలాసిలుం గదా - మా కలాసి పని అమ్ముకుంటే కొనడానికి రడీగున్నారు - మాలాగే, యే వూర్నిండో యెలిపోవొచ్చిన యెందరో! ఆళ్ళ కెవళికో అమ్మకం జేస్సి, చిల్లర మల్లర అప్పులు తీర్చేసి - మిగిలిన డబ్బుతోటి - తనకా యెొట్టిన మడిసెక్కల్ని యిడి పించుకొని బతుకుదామని ఆశగ” లో గొంతులో, గుండెల్లోంచి పలికేడు కామేశం!

నది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. గాలి, ఆగి ఆగి వస్తోంది. ఒద్దు మీది, రెల్లు పొదల్లోంచి.... నక్కలు ఊళ వేస్తూ గోల ఆరంభించేయి.

*... మా నాయిన ఆశ అదీ! తీరా.... పెదనాయన యిలా చెప్పేడు. దాంతోటి కోపం 21₹2₹2ా”””ెెాంందుతనరుక

వొచ్చి తగువుకి దిగేడు. లేకపోతే దిగడు. పెదనాయనంటే - మా నాయనకి గొప్ప గౌరవం” కామేశమే, మళ్ళీ వివరణిచ్చేడు.

జగదీష్‌కి - నిన్నటి నించీ జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి. శ్యామలరావు దొర యింటికి వెళ్ళటం, రామలక్ష్మణుల కథ నిండీ, చివరికి అటుతిరిగిటుతిరిగి - తమ చెరువు కింది భూముల అమ్మకం వరకూ పెద్దల నిర్ణయాలు, యీ రోజు పొద్దున్న ఎర్రంనాయుడితో కలిసి ప్రయాణం, విద్యుత్‌ ఛార్జీల పెంపుకి వ్యతిరేక ధర్నా, సర్టిఫికేట్ల కోసం తన యాతన, కాంప్లెక్స్‌లో రిక్షావాడూ, షావుకారీ ఘర్షణా.... యెక్కడా, ఘర్షణ తప్పా, సఖ్యత కన్పించలేదు. వ్యక్తుల మధ్య, వ్యక్తులకీ సంస్థలకీ మధ్య, సంస్థలకీ సంస్థలకీ మధ్య..... దేశాల మధ్య... యెక్కడా ఘర్షణే! ఎందుకిలా...? ఈ ఘర్షణకు కారకం.... ఆర్థికమా, మానసికమా, రాచకీయమా?

అదే విషయాన్ని అడిగేడు కామేశానికి.

“.... కామేశం, బతుకిలా, యింత కర్కశంగా, దుర్మార్గంగా, దుర్భరంగా, వుంటోదని, యిదివరకే యెరుకలో కొచ్చింది. గానీ, యీ ఘర్షణ అనేదానికి కారణాలు గానీ, దానికి తరణోపాయాలు గానీ - తెలీటం లేదు. చూసేవా, మీ నాయనా, మా నాయనా మధ్య గూడా సఖ్యత స్తానంలోకి ఘర్షణ చోటు జేసుకుంది. నీకేయయినా బోధపడ్తోందా?” ప్రశ్నించేడు.

నిట్టూర్చేడు కామేశం! అతనికి, ప్రవాస జీవితం లాంటి తన జీవితంలో పరిమిత బంధాల మధ్య.... ఘర్షణా, కాసేపు తర్వాత సఖ్యతా, కాసేపటికే ఘర్షణా... రోజువారీ అనుభవం! గానీ, జగదీళ్‌ ప్రశ్న అంతకు మించిన అనుభవం గురించి!

యేమీ బదులివ్వక, కూచోటమూ సాధ్యంగాక లేచేడు కామేశం! ఇద్దరూ, యింటి వేపు నడిచేరు.

౨౦౧

తెల్లవారేక, కాఫీ, టీల వేల - శ్యామలరావు నించి కబురొచ్చింది. ఎర్రంనాయుడు అక్కడే వున్నాడట! రాతకోతలు పూర్తి చేద్దాం - రమ్మని కబురు!

జగదీశు తండ్రి - అన్నతమ్ముడి కోసం చూస్తే...... లేదు. కామేశం మాత్రం జగదీశుతోనే కన్పిస్తున్నాడు. ఆందోళనగా, వీధీ, ఊరూరంతా వెదికేసాడు. ఎక్కడా కనబడలేదు.

“చిన్నాయన. యేడ్రా...?” అడిగేడు జగదీష్‌ని ఆందోళనగా ఆయన.

“నదికి స్నానంకిగాని వెళ్ళాడో...?” కామేశం బదులిచ్చి, నది వేపు వెళ్ళేడు. వెంట, జగదీశూ....!

నది దగ్గర వెదికేరు, ఎక్కడా జాడ లేదు. ఏమయ్యేదన్న ఆందోళనతో తిరగొస్తుంటే -

“.....ముఠా కెళిపోయిన గంటేడ ముసిలోడా....? ఏరు దాటి, అటు అవతల కేసి, యెళ్తందు. యిందాక చూసేను...” చెప్పాడొకాయన!

జగదీశుక్సీ, కామేశుకీ.... ఆయన ఎటు వేపు, ఎందుకెళ్ళాడో .... ప్రశ్నలు....! రెండు ప్రశ్చార్థకాల్లా నిల్చున్నారు! - ఛి చై కథ? - 204]

సంగమం అ 95ళయలబ్ల్ష్మీ రొమీక్యర్టన్‌ మండు వేసవి. మధ్యాహ్నం ఒంటి గంటయింది.

ప్రసాద్‌ లంచికి వెళ్ళడానికి బయలుదేరాడు.

“కింద క్యాంటీన్‌లో భోంచేస్తే పోదటండీ. ఈ ఎండలో నడుచుకుంటూ ఆ శ్రీస్టార్‌ హోటలుకెళ్ళి అక్కడ రెస్టారెంటులో తింటేగాని తృప్తిగా ఉండదా మీకు” అన్నాడు సహోద్యోగి.

“చిన్నప్పుడు మా అమ్మ డబ్బాలో చపాతీ, కూర, పై గిన్నెలో కాస్త పెరుగన్నం పెట్టి ఇచ్చేది. పుస్తకాల మూటతో పాటు, లంచి బాక్సును కూడ మోసుకుంటూ బస్సులో పడి స్కూలు కెళ్ళేవాళ్డి. పెద్దయ్యాక ఇంటి నుంచి లంచ్‌ బాక్సు తెచ్చుకోడం అన్నా హోటల్‌ నుంచి క్యారియర్‌ తెప్పించుకోడం అన్నా చిరాకు నాకు. బెంగపడకండి. ఎండలో నేను మాడిపోను. సరేనా జవాబిచ్చాడు ప్రసాద్‌.

ఎయిర్‌కండిషన్ట్‌ ఆఫీసు తలుపు నెమ్మదిగా తెరచి, మళ్ళీ భద్రంగా మూసి మెట్లు దిగుతున్నాడు. ఆఫీసు ముందుగా ఒక ఆటో రిక్షా ఆగింది. ద్రయివర్‌కు డబ్బులిస్తున్న స్రీ వంక చూచి చకితు డయ్యాడు. మెట్టు మీదే నిల్చిపోయాడు.

అమె మెట్లెక్కుతూ ప్రసాద్‌ను చూసి, “నువ్వేనా? -మీరు - ప్రసాదా” అంది.

“అనూరాధవా” అన్నాడు బదులుగా.

“నిన్ను చూద్దామనే వచ్చాను. ఎవరో చెప్పారు నువ్వీ ఆఫీసులో పనిచేస్తున్నానని అంది.

“నేను లంచికి వెళుతున్నాను. పద భోంచేస్తూ మాట్లాడుకుందాం” అన్నా ప్రసాద్‌.

“సరే పద మంది.

“దగ్గరే నడుస్తావా. మళ్ళీ ఆటో పిలవమంటావా?”

“నడ్రవగలను, కానీ నేను విజయవాడ వచ్చి పదిహేనేళ్ళయింది. సిటీ ఎంతగానో మారి పోయింది. ఇక్కడే పుట్టీ పెరిగిన నాక్కూడ దార్లు తెలియకుండా పోయాయి. అందుకే ఆటోలో తిరగదంో అంది అనూరాధ,

ప్రసాద్‌ భోంచేస్తూ అడిగాడు - “ఎప్పుడూ రావడం అమెరికా నుంచి? వచ్చి ఆటోల్లో 2222222222

తిరుగుతున్నావేంటి?”

“నాన్న చీరాల వెళ్ళారు పొద్దుట. 'ఎండలో తిరగవద్దు - సాయంత్రం ఎటైనా వెళ్తే టాక్సీ తెప్పించుకో. నే రాత్రి పొద్దుపోయిగాని రాను” అన్నారు. నాన్న వెళ్ళాక అమ్మతో నా స్పేహితురాలు దాక్టర్‌ రమాదేవిని చూసివస్తానని చెప్పి ఇటు వచ్చాను.”

“పోనీ అటే వెళ్ళకపోయావూ. నీ (ఫ్రెండ్‌ కారిచ్చి పంపించేది” అన్నాడు ప్రసాద్‌.

“నిన్ను చూడ్డానికి వెళ్తున్నానని చెప్తే రమా కూడా వద్దంటుంది.”

“అయితే. ఈ అబద్దాల అలవాటు ఇంకా పోలేదన్నమాట నీకు.”

అనూరాధ నవ్వుతూ, “నేనెప్పుడో చెప్పానా. అబద్దాలకు సున్నం పూస్తే న్యూట్రల్‌ అయిపోతాయి. ఇహ తప్పు చేసినట్లు కాదు” అంది.

అనూరాధ నెమ్మదిగా ఆరాలు తియ్యడం మొదలు పెట్టింది.

ప్రసాద్‌ భోంచేస్తూ బదులు చెప్తున్నాడు.

“సాయంత్రం నువ్వింటికెళ్ళేటప్పుడు నేనూ వస్తాను మీ ఇంటికి. అందరినీ చూడాలని ఉంది” అన్నది.

“ఏమా చొరవ! ఫరవాలేదు. అమెరికా నీళ్ళు ఒంటబట్టాయి' అనుకున్నాడు. “అందరినీ అన్న ఆమె మాటకు చిన్నగా, చిలిపిగా నవ్వుకున్నాడు ఆమె చూడకుండా.

“మరి నా పనయ్యేంతవరకూ ఎక్కడుంటావ్‌? ఇంక రెండు మూడు గంటల పనుంది నాకు ఆఫీసులో అన్నాడు.

“నువ్వే చెప్పు సలహా” అంది ఆమె.

ఒక క్షణం ఆలోచించి, “మా ఆఫీసులో కాన్ఫరెన్సు రూముంది. ఖాళీగానే ఉంది. ఈ మధ్యాహ్నం మీటింగ్సు ఏమీ లేవు. ఆ రూములో పేపర్లు పత్రికలు కూడా ఉంటాయి. అక్కడుండు. నేను కాస్త త్వరగా తెమలడానికి టై చేస్తాను. అట్లాగే మా ఇంటికి వద్దువుగాని” అన్నాడు ప్రసాద్‌.

ఆఫీసు నుంచి బయలురేముందు. రోజూ తనతో స్కూటర్‌ మీద వచ్చే కుర్రాడు డేవిడ్‌ను పిలిచి, “వీరు మా ఇంటికి వస్తున్నారు. ఆటోలో వెళ్తాం. నువ్వు స్కూటర్‌ ఇంటికి తీసుకురా అని తాళాలిచ్చాడు.

“బంధువులాండి” అన్నాడు డేవిడ్‌ అనూరాధను చూస్తూ.

“సీకెందుకయ్యా. నేను నీకన్నా పెద్దవాణ్సి. మాటా, మర్యాదా నేర్చుకో” అన్నాడు.

చక్కని కుర్రాడు, పాపం సిగ్గుపడి పోయాడు.

'ప్రసాదేమీ మారలేదు. సాయం చెయ్యడానికి ముందుకు దూకుతాడు. కానీ, మాటలతో చురకలు పెట్టడం హాబీ. అవిదెవరోగాని, ఎట్లా వేగుతుందో ఈ మనిషితో' అనుకుంది అనూరాధ.

అయిదయింది. మండిపోయే సూర్యుడు మండిపోతూనే ఉన్నాడు. ప్రసాద్‌ ఆటోరిక్షా పిలిచాడు. సిటీ పెరిగే కొద్దీ, ఊళ్ళో రోడ్లు మరింతగా ఎత్తుపల్లాలు సంతరించుకుంటాయి. వాహనాల్లో తిరిగేవారిని రోడ్డు తన వంపులతో కుదేసి కులుక్కుంటుంది.

దారిలో “ఇంట్లో ఎవరెవరున్నారు?” అనడిగింది. కై థ్థొఛాఫోని - 2004 మేడే

యు

ప్రసాద్‌ ఇంకో పక్కకు చూస్తూ, “సరోజిని ఉంది. మధ్యాహ్నం నే లేకపోయినా అన్నం తింటుంది. కానీ నేనింటికెళ్ళీవరకు పాలు మాత్రం తాగదు” అన్నాడు.

“కూతురు కాబోలు, అదేమిటి - అంత పాతకాలం పేరు పెట్టుకున్నారు" అనుకుంది.

నాగార్జునా కాంప్లెక్సు దగ్గర ఆగింది ఆటో. అనూరాధ దిగి బెరుకు బెరుగ్గా చూసింది. ఆటో చప్పుడుకు ఇంట్లోంచి బయటకొచ్చిన నాగమ్మ ప్రసాద్‌తో వచ్చిన అనూరాధను చూసి “ఎవరబ్బా' అనుకుంది.

ఇంటి ముందు వరండాలో ఓ పేము కుర్చీలో భయం లేకుండా దిండు మీద కూర్చుని చోద్యం చూస్తోందొక పిల్లి కూన. ప్రసాద్‌ పిల్లిని జోకొట్టి, “పాలు తాగావా” అన్నాడు. పిల్లి పిల్ల కిందకు దూకి ప్రసాద్‌ పక్కనే నిలబడింది.

నాగమ్మ, “అదెందుకు తాగుతుంది? ఏవన్నా చెప్పండి. కుక్క కున్న విశ్వాసం పిల్లి కుండదు. పక్కింటి రాజుగారి కుక్కపిల్ల ఆయన్ని గేటులో చూడగానే పరుగెత్తి కెళ్ళి ఆయన వెనక తోకాడించుకుంటూ తిరిగి వస్తుంది. ఈ సరోజినమ్మ - మన బంగరు బొమ్మ, నువ్వొచ్చి మాట్లాడించే వరకు గుర్రుమని కూడా అనదు. పెద్ద రాజకుమార్తె. కుర్చీ లెక్కి కూర్చోడం తెలుసు అని గ్లాసులో పాలు దాని గిన్నెలో పోసింది.

అనూరాధ షాకు తిన్నది. ఇంట్లో ఎవరెవరంటే - సరోజినన్నాడేంటి అనుకుంది. పిల్లి సేవ అయ్యాక అనూరాధను చూస్తూ నాగమ్మ, “బాబుకు మజ్జిగలో నిమ్మకాయ పిండి, ఒక కల్లు ఉప్పు వేసి కలిపి ఫ్రిజ్‌లో ఉంచుతానండీ. మీక్కూడా మజ్జిగిమ్మంటారా, టీ పెట్టనా?” అనడిగింది.

“నాకూ మజ్జిగే ఇవ్వు” అంది అనూరాధ.

నాగమ్మ ఆ రోజు వచ్చిన పోస్టు తెచ్చి ప్రసాదు కిచ్చింది. ఉత్తరాలు చదివి, గ్లాసు కింద పెట్టి, “నాగమ్మా, మేము వాకింగుకి వెళ్ళి వస్తాం. ఈమె అనురాధగారు. అమెరికా నుంచి వచ్చారు. ఏం టిఫిను చేస్తావో మరి” అన్నాడు ప్రసాద్‌.

నాగమ్మ కంగారుపడిపోతూ, “అయ్యో నాకేం వచ్చండీ - చెప్పి చేయించడానికి అమ్మయినా లేకపోయె - ఏదో తంటాలు పడతాలెండి. త్వరగా రండి. వేడిగా తింటేనే రుచి” అన్నది.

ప్రసాద్‌ లేచి, *పద అట్లాగే అరగంట తిరిగి వద్దాం. పక్కనే ఇంకో బిల్దింగ్‌ కడుతున్నారు. చూపిస్తాను” అన్నాడు.

“ఇంట్లో చెప్పిరావూ” అంది అనూరాధ సందేహంగా.

“ఇంట్లో ఎవరూ లేరు చెప్పడానికి”

“ఏం ఊరెళ్ళరా?” అంది.

“అసలు ఉంటేగా, ఊరెళ్ళడానికీ, సినిమా కెళ్ళడానికీ” అన్నాడు.

అనూరాధ కర్థం కాలేదు.

నడుస్తూ వాళ్ళ కాంప్లెక్సులోని సౌకర్యాలు, పక్కన కడుతున్న కట్టడం వివరాలు చెప్తున్నాడు ప్రసాద్‌. ఆమె కేమీ వినబడడం లేదు. పాముకుబుసం విడిచినట్టు గతం పొరలు పొరలుగా రాలిపోతోంది.

న

ప్రసాద్‌, అనూరాధ కాలేజీలో-క్షాసుమేట్సు. (ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుందామను కున్నారు. ప్రసాద్‌ ఆ సంగతి తల్లితో చెప్పాడు. ఆమె మండిపడ్డది. తన అన్న కూతురు సరళ తప్ప ఇంకో ఆడపిల్ల తనింటికి కోడలిగా రాగూడదన్నది. ప్రసాద్‌ ససేమిరా అన్నాడు. మర్నాడు అతని తల్లి కొడుక్కు తెలియకుండా అనూరాధ ఇంటికెళ్ళి మేనరికం ఎప్పటినుంచో అనుకున్నదేనని, వాళ్ళకి తాను మాట కూదా ఇచ్చినట్లు, కొడుక్కు కూడ సరళంటే ఇష్టమే ఉండేది - అనూరాధను చూసేవరకూ - అని నచ్చజెప్పింది.

అనూరాధ తండ్రి రుద్రుడైపోయాడు. కూతుర్ని పిలిచి ప్రసాదును మరి చూడకూడదని శాసించాడు. ఎవరో అమెరికా నుంచి ఆడపిల్లలను చూడ్డానికి ఆంధ్ర దేశం వచ్చిన పెళ్ళికొడుకుని పట్టుకొచ్చి నెల తిరక్కుండా కూకురి పెళ్ళి జరిపించాడు. తనను చూసేవరకూ మేనమామ కూతురంటే ప్రసాదు కిష్టమేనని, ఆ అమ్మాయి కూడా ఆశలు పెంచుకుందని విని ఖిన్నురాలైంది అనూరాధ. ఇంకొకరి మనిషిని దొంగిలించలేక తండ్రి తెచ్చిన సంబంధానికి ఒప్పుకుంది.

అమెరికా వెళ్ళిపోయింది. రెందేళ్ళకు కొడుకు పుట్టాడు. క్రమంగా భార్యా భర్తలకు పడకుండా పోయింది. భర్త పెడదారి పట్టాడు. విదాకులు తీసుకుంటానని తండ్రికి రాసింది. డైవోర్స్‌ తీసుకుంటే మళ్ళీ తన గడప తొక్కద్దని రాశాడు తండ్రి. కొడుకుని పెంచుకుంటూ చికాగోలో ఒక హాస్పిటల్‌ ఫార్మసీలో ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది అనూరాధ. కిందటి నెల్లో ఢిల్లీలో అమెరికన్‌ సహకారంతో హాస్పటిల్‌ మేనేజ్‌మెంట్‌ మీద ఇంటర్నేషనల్‌ వర్క్‌షాపు జరిగింది. అనూరాధ పనిచేసే వాస్పిటల్‌ వాళ్ళు అనూరాధను ఫార్మసీ ప్రతినిధిగా ఖర్చులు పెట్టుకు పంపారు.

కొడుకును వెంట తీసుకువచ్చింది. ఇండియాలో అడుగు పెట్టగానే ఇంటి మీద మనసు పోయింది అనూరాధకు. రాత్రంతా నిద్ర రాలేదు. అర్ధరాత్రి తండ్రికి ఉత్తరం రాసింది. “మీరు పిలిస్తే తప్ప ఇంటికి వచ్చి చూడకూడదన్న బెట్టు నాకు లేదు. నన్నూ నా కొడుకును చూడ్డానికి మీరిష్టపడికే నా హోటల్‌కు ఫోన్‌ చెయ్యండి. సమయానికి నేను లేకపోతే మెసేజ్‌ వదలండి” అని రాసి, ఉత్తరం కొరియర్‌ మెయిల్లో పంపించింది.

ఏనాడో కోపం తగ్గినా, కూతురి అడ్రసు కూడా తెలియని నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంగా రోజులు వెళ్ళ బుచ్చుతున్నారు అనూరాధ తల్లిదండ్రులు. వాళ్ళకు కూతురి జాబు పూలవానే అయింది. తండ్రి స్వయానా ఢిల్లీ వెళ్ళి కూతుర్ని మనుమణ్జి వెంటబెట్టుకుని ఆగ్రా, జైపూర్‌ చూపించి ఇంటికి తీసుకువచ్చాడు.

466

అరగంట వాకింగులో ప్రసాద్‌ చూపిస్తున్న ఇళ్ళలో ఏమాత్రం ఆసక్తి కనబరచని అనూరాధను చూసి, 'ఎందుకీమె నన్ను వెతుక్కుంటూ వచ్చింది" అనుకున్నాడు ప్రసాద్‌.

ఇల్లు చేరారు.

వాకిట్లోనే స్వాగతం పలికింది నాగమ్మ. “వచ్చారా, రండి రండి. ముఖాలు కడుక్కుని రండి టిఫిన్‌ తీసుకుందురుగాని అంది.

ప్రసాద్‌, అనూరాధ డైనింగ్‌ టేబిల్‌ దగ్గరకు చేరారు. వేడి వేడి పునుగులు, పచ్చడితో మై కభరని- 2004 కడ హో

డు ప్లేట్లలో పెట్టింది. గ్లాసులో ఐస్‌వాటర్‌ పోసింది.

ప్రసాద్‌ కూర్చుంటూ, తృప్తిగా, “దొరుకునా ఇటువంటి టిఫిను” అని రాగం తీశాడు.

అనూరాధ నవ్వుకున్నది. “భోజన ప్రియత్వం పోలేదు' అనుకుంది. కాలేజీ రోజుల్లో ఏ హోటల్‌ ఏ రోడ్డులో వుందో, ఏ అయిటమ్‌ ఏ హోటల్లో బాగుంటుందో - అందరూ ్రసాద్‌నే అడిగేవారు. అనూరాధకు తెలిసిన మనిషినే మళ్ళీ తెలుసుకుంటున్నట్లుంది. ఏదో దుఃఖం, ఎంతో దుఃఖం. ఎంత మింగినా, మిగిలి మిగిలి పొంగిపోయే దుఃఖం గొంతులో సుళ్ళు తిరి గింది. పట్టలేక అడిగింది.

“అంటే నువ్వు పెళ్ళి చేసుకోనే లేదా?”

ప్రసాద్‌కు ఇటువంటిదేదో వస్తుందని తెలుసు. తేలిగ్గా నవ్వేస్తూ, “లేదు, ఎట్లా చేసుకోను? సౌత్‌ ఇండియాలో అమ్మాయిలందరికీ ఒకటే కోరిక. పెళ్ళయి అత్తవారిటికెళ్ళడమంటే 'హైదరాబాద్‌లోనో, మద్రాసులోనో, బెంగుళూరులోనో బతకడం, బందరు, ఏలూరు, నెల్లూరు లాంటి ఊళ్ళలో స్థిరపడ్డానికి ఇష్టపడరు. ఇంకో మెట్టు పైవాళ్ళకు పెళ్ళికొడుకంటే, అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో వచ్చినవాళ్ళే. ఇంక నాకెట్లా పెళ్ళవుతుంది?”

“అమ్మా, అమ్మా నన్ను నమ్మండి. ఎన్ని సంబంధాలో వచ్చాయి ప్రసాద్‌ బాబుకు, అమ్మగారెంతో చెప్పారు. అందరి దగ్గర ఏద్చేవారు. బాబుదే వద్దంటే వద్దని మొండి పట్టుదల” అంది నాగమ్మ.

అనూరాధ చిరాగ్గా, “ఏమిటీ నీ కారణం? నువ్వేదో పెద్ద దేవదాసు ననుకున్నావా” అంది.

ప్రసాద్‌ అనూరాధ వంక ధైర్యంగా చూస్తూ, “సరే విను. నాకు తెలియకుండా మీ ఇంటికెళ్ళి, నేను నిన్ను చూశాక మనసు మార్చుకున్నానని కట్టు కథ చెప్పి నమ్మించిన అమ్మ మీద కోపం, నిన్ను చూద్దామని కబురంపితే నువ్వు రానన్నావని నీ మీద కోపం - నన్ను నిర్చలుణ్జిగా చేశాయి. నిరుత్సాహం, అశక్తత నన్ను చుట్టుముట్టాయి. అమ్మను ఎదిరించి పెళ్ళాడవచ్చు. నాన్న పోయాక పిల్లలే ప్రాణంగా పెంచిన అమ్మకు మా మీద అనురాగమే కాదు. అధికారం కూడా ఏర్పడ్డాయి. ఆమె కిష్టంలేని కోడలు ఇంటికి వస్తే, ఆ అమ్మాయి జీవితం అశాంతి పాలు కాక తప్పదు. నేను దూరమైతే అమ్మను ఎవరు చూసుకుంటారు? నీ పెళ్ళి అయిపోయిందని తెలిసిన తర్వాత, నా పెళ్ళికి తొందర చెయ్యడం మొదలు పెట్టింది అమ్మ. “నీకు నచ్చని అమ్మా యిని నేను చేసుకోలేదు. నాకు నచ్చని అమ్మాయిని చేసుకోమని నన్ను నిర్భంధపెట్టకు” అని చెప్పేశాను. అమ్మ ఏడ్చింది. నేను ఏడవలేదు. అదే తేడా. అప్పట్లో అమ్మ మీద నాకు జాలి కూదా కలగలేదు”

“అంటే, నీ ఒంటరి జీవితం నీ తల్లికి విధించిన శిక్షనుకున్నావా?” అంది అనూరాధ జుగుష్పతో.

"= నాగమ్మకు నచ్చలేదు వాళ్ళ ధోరణి. గబుక్కున లోపలకు వెళ్ళి ప్లేటులో జామపళ్ళు పట్టుకొచ్చింది. “చెట్టుక్కాసిన కాయలు బాబూ, తీసుకోండి” అంది.

ప్రసాద్‌కు కోపం వచ్చింది. “చెట్టుక్కాక పుట్టక్కాస్తాయా కాయలు? శబరి మాతల్లిలాగా ఎప్పుడూ ఆ పండు కావాలొ, ఈ కాయ కావాలా అని ఏమిటి నీ గోల” అని విసుక్కున్నాడు. 2222222222 సంగము

నాగమ్మ రోషపడిపోయి, “ఆ శబరి మాలక్షికి. నాకూ సాపత్యమేమిటి బాబూ? శబరమ్మ తల్లి కాయలు కోసి కూరలు వండిందా, పిండి రుబ్బి గారెలు కాల్చిందా, పాలు కాచి పాయసం చేసిందా? ఓ బాదం ఆకులో కాసిని రేగుపళ్ళో, నేరేడు పళ్ళో పెట్టి రాములారంతటి సామినే మెప్పించింది. నాకు మిగిలిన మెప్పేమిటి బాబూ - మిగిలిందల్లా నా కోసం ఎదురు చూసే అంట్ల గిన్నెలూ, నా అరిగిపోయిన చేతులూ తప్ప” అంది నాగమ్మ.

అనూరాధ మార్చి మార్చి చూసింది వాళ్ళిద్దరినీ. వాళ్ళ మాటలూ, ఆ మాటల్లోని అర్జాలూ, అర్జ్థాలకు రంగులు పులిమే అలుకలు, ఆపేక్షలూ, ఆవేదనలూ -- “వీళ్ళూ మనుషులంటే! ఈ గడ్డ విడిచిపెట్టి ఎక్కడో బతుకుతూ ఎంత కోల్పోయాను" అనుకుంది. ఆమె ఈ లోకంలోకి రావడానికి కాసేపు పట్టింది.

“జెనూ, మీ సిస్టర్‌ ఎక్కడుందిపుడు” అనడిగింది.

“చాలామందమ్మాయిలలాగే సుశీల కూడా అడ్హ్రేలియా కెళ్ళింది పెళ్ళి చేసుకుని. డిగ్రీ వచ్చాక కంప్యూటర్‌ క్లాసులు తీసుకుంది. అక్కడ కలిశాడాబ్బాయి. “మన కులం కాదు. మనకొద్దు” అంది అమ్మ. “కులం ఆరా తీసి ఆపైన స్పేహం పెంచుకోలేదు నేను. అయినా, మనకన్నా పెద్ద కులమే” అంది సుశీల. అమ్మ గొంతు పెంచి, "పెద్దయితే ఎవడి కావాలి. మన కులం గొడ్డు పోయిందా? తగిన పెళ్ళికాడుకే దొరకదా నీకు” అందమ్మ. ఆఖరుకు సుశీల బ్రహ్మాస్త్రం ప్రయోగిం చింది.

“అమ్మా, నేను అన్నయ్యను కాను. నీ మెప్పు కోసం నా బతుకు బలి చేసుకోవడానికి” అంది. అంతే ఆ సాయంత్రానికే అమ్మకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. అదే మొదటి ఎటాక్‌. హాస్పిటల్లో పెట్టాము. రెండు వారాల తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. సుశీల సంతోషం పట్టలేక పోయింది. అమ్మ కోలుకున్నదన్న సంతోషం కంటే, కోలుకోకపోతే అందుకు తాను బాధ్యురాలన్న నింద తప్పినందుకు ఎక్కువ సంతోషించింది.

“అప్పుడే వచ్చింది నాగమ్మ ఇంటి పనికి. నాగమ్మ భర్త మా ఆఫీసులో ప్యూన్‌గా ఉందేవాడు. పిల్లల్లేరు వాళ్ళకి. ఇట్లాగే ఎండాకాలం పనుందని పొరుగూరెళ్ళాడు. పదిమంది బంధువులనూ చూసివచ్చాడు. రోడ్డు మీద బస్సు కోసం నిలబడ్డాడు. నీడగా కూర్చోడానికేమీ లేదా పల్లెటూర్లో పక్కన సోడా షాపు లేదు. ఏముంది - వడదెబ్బకు పోయాడు. ఏ అండా లేని నాగమ్మ అమ్మకు తోడైంది. అమ్మ దగ్గర కూర్చుని మా ఇంటి వంటలన్నీ నేర్చింది. మొదట్లో స్నేహంగానే ఉండేవారు. చివరి రోజుల్లో నిష్కారణంగా తప్పుపట్టేది నాగమ్మను.”

అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది అనూరాధకు.

“ఫ్రసాద్‌ నేనాక సంగతడుగుతాను. నేను ఇందాకటి నుంచి నీ గురించి అన్ని అజలు అడిగాను కదా, నా సంగతి నువ్వొక్కటీ అడగ లేదేం” అంది.

ప్రసాద్‌ నవ్వుతూ, “నువ్వడిగావు, నేను చెప్పాను. నేను అడగలేదు, నువ్వు చెప్పలేదు. అందువల్ల నీకు వచ్చిన లాభమేమిటి, నాకు కలిగిన నష్టమేమిటి?” అన్నాడు.

“నువ్వు ఏమీ మారలేదనుకున్నాను కానీ ప్రసాద్‌, పూర్వం నీకు-లాభనష్పాల బేరీజు వేయడం తెలీదు. ఆ విద్య కొత్తగా నేర్చుకున్నావు” - నిష్టూరమాడింది. కై కథారాహ్‌ని - 2004 22222ైడతతఊతతతత2224242424ఓ2ఓ2ఓ€2€242422ేేేే

ాాలాటడాాడి డేవిడ్‌ వచ్చాడు. స్కూటర్‌ నిలబెట్టి తాళాలు ప్రసాద్‌ కిస్తూ, “రేపుదయం ఆఫీసు కెళ్తారా సార్‌” అనడిగాడు, అనూరాధ కేసి అనుమానంగా చూస్తూ.

“ఆం సరిగ్గా ఎనిమిదింటికి రా” అన్నాడు ప్రసాద్‌, .

“ఆమె ఎవరబ్బా' అన్న ఆలోచన డేవిడ్‌ తల్లో తొలుస్తూనే వుంది.

డేవిడ్‌ వెళ్ళిపోయాక అనూరాధ, “నువ్వదగకపోయినా నేను చెప్తాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కష్టం, సుఖం నీతో చెప్పుకుందామనేగా” అంది.

“అదేం నీ స్నేహితురాలు రమాదేవితో చెప్పుకోలేదా” అన్నాడు ప్రసాద్‌.

“ఎందుకు చెప్పుకోలేదు. చెప్పుకున్నాను. ఆమె కన్నా నువ్వు నాకు దగ్గరి ఫ్రెండుననుకుంటు న్నావా ఏమిటీ? ఆమె సలవాలు, సానుభూతి చాలక నిన్ను చూద్దానికి వచ్చాను. పిలవని పేరంటం. పద బయట కూర్చుని మాట్లాడుకుందాం” అంది అక్కడ నాగమ్మ ఉన్నదనే ఉద్దేశ్యంతో.

నాగమ్మ కర్ధమైంది.

“వద్దమ్మా బయట వేడికి వేడి, దుమ్ముకు దుమ్ము. నేవెళ్ళి కాస్త ఊడ్చి నీళ్ళు చల్లి వస్తాను. చల్లబడ్డాక బయట కూర్చుందురుగాని” అంటూ అక్కడ నుంచి తప్పుకుంది.

అనూరాధ తన కథంతా వివరించింది.

ప్రసాద్‌ కలవరపడ్డాడు.

“న్సవ్వేదో అమెరికాలో సుఖంగా ఉన్నావనుకున్నాను. ఇంత దుఃఖమా, నీ జీవితంలో అనూ” అన్నాడు.

“అనూ!” మర్చిపోయిన పాత పిలుపు! ఆమె మనసు శాంతితో, సంతృప్తితో నిండిపోయింది. తేరుకుని, “బాగుంది, నువ్వు నన్ను జాలి తలుస్తున్నావా ప్రసాద్‌? నాకేమయ్యా కరదీపిక లాంటి కొడుకున్నాడు. ఖాళీ జీవితం నీదిగా చేసుకున్న నిన్ను నేను జాలి పడాలి” అంది.

“నీ కొడుకు - అదే భరత్‌ను చూడాలనుంది అనూ. ఒకసారి వస్తాను మీ ఇంటికి. మీ నాన్నగారు భరత్‌ ముందు అరుస్తారేమో నా మీద. కాస్త ముందుగా చెప్పు” అన్నాడు ప్రసాద్‌.

“ఊంహూల నేనేం చెప్పను. మా నాన్న నీకన్నా చాలా పెద్ద. అరవన్‌ీ. అరిస్తేనే. మా ముందు? నువ్వరవలా దేవిడ్‌ను నా ముందు అంటూ నవ్వింది.

ప్రసాద్‌ కూడా హాయిగా నవ్వాడు.

నవ్వాపుకుని అన్నాడు, “నీకూ, మాకు తేడా ఇప్పుడు తెలిసింది అనూ. నీ దుఃఖానికి కారకులైనది మేము ముగ్గురం. మీ నాన్న, నేను, నీ కొడుకు తండ్రి - మా ఎవరి మీదా ఇనుమంత కోపం గాని, కక్షగాని నువ్వు పెంచుకోలేదు. మనసా, వాచా ఎవరినీ నిందించలేదు. నేనూ, మా అన్మ అహానికి, ఆగ్రహానికి లొంగిపోయాను. మా సుఖానికి, మా మనశ్శాంతికి మేమే నీళ్ళు వదులుకున్నాం. అమ్మకు మరణంతో విముక్తి కలిగింది. నాకు నీ రాకతో, నీ మాటతో, న్‌ చూపుతో, నీ నవ్వుతో విముక్తి కలిగించావు” అన్నాడు, నిజమైన కృతజ్ఞతతో.

“సరేగాని, మీ మదర్‌ పోయి ఎన్నాళ్ళయింది? ఎట్లా పోయారు?”

“అమ్మ పోయి రెండేళ్ళయింది. ఓనాడు గుండె మీద చెయ్యేసి, ఏంటో నొప్పిగా ఉందిరా" కకక కక క] స్సు కై

అంది. నా కర్మక్షాలి ఆ రోజు రాష్ట్ర వ్యాస్తంగా బంద్‌. టాక్సీలు తిరగలేదు. ఇప్పుడే వస్తానంటూ బయట కెళ్ళిన నాగమ్మ ఎవరినో బతిమాలి ఆటో తీసుకు వచ్చేసరిక గంటయింది.

“ట్రాఫిక్‌ లేని వీధులు చూసుకుని, సందులూ, గొందులూ తిరిగి వాస్పిటల్‌ చేరేటప్పటికి ఇంకో గంట పట్టింది. అమ్మ ఆరు గంటలే ఉంది హాస్పిటల్లో. “వెంటనే తీసుకువస్తే ఎట్లా ఉండేదో - చాలా లేటయింది. ఐయామ్‌ సారీ” అన్నాడు డాక్టర్‌.

“అమ్మ పోయాక నాగమ్మ అమ్మ చార్జి తీసుకుంది. నేనింట్లో ఉందేదే నాలుగ్గంటలు. "కాఫీ పెట్టనా, కాజాలు తింటావా, కారప్పూస కావాలా” అంటూ ప్రాణాలు తోడేస్తుంది. కొత్తలో ఓ రోజు, “ఏంటమ్మా, నాక్కావాలంటే నేనడగనూ, విసిగించకు” అన్నాను, అమ్మ పోయిందని మర్చిపోయి. నాగమ్మ తెల్లబోయింది. ఆమె ముఖంలో వెన్నెల కురిసింది. నా ఎదుట కళ్ళు తుడుచుకోను ఇష్టంలేక అవతలకు వెళ్ళిపోయింది.

“నా పనులు స్వయంగా చూడలేని నిస్సత్తువ ఒకవైపు, నెమ్మదిగా తన స్థానం నాగమ్మ ఆక్రమిస్తోందన్న భయం మరోవైపు - తనకూ, నాగమ్మకూ మధ్య కష్టపడి గోడ కట్టుకుంది అమ్మ. ఆ గోద ఎప్పుడు పడిపోయిందో తెలియదు. అమ్మ పోయి నాగమ్మ మిగిలిందో, నాగమ్మను తరిమేసి మళ్ళీ అమ్మ వచ్చిందో: - ఒక్కోసారి అయోమయంగా ఉంటుంది. నువ్వూ నాగమ్మా ధన్యజీవులు అనూరాధా” అన్నాడు.

“నేనొక్క వరమడగనా?” అంది అనూరాధ సంభాషణ తప్పిస్తూ.

“వరాలడగడానికి గుడి కెళ్ళు. నేనేం దేవుణ్ణి కాను” అన్నాడు ప్రసాద్‌.

అనూరాధ నవ్వి, “చూడు భరత్‌ చికాగోలో వాడి స్కూల్లో ఆర్మెస్త్రాలో వయోలిన్‌ వాయిస్తాడు. ఎట్లాగూ ఇక్కడకు వచ్చాం కదాని మన రాగాలు కాస్త తెలుస్తాయని, వయొలిన్‌ పాఠాలకు ఏర్పాటు చెయ్యమని నాన్నకు చెప్పాను. రేడియో స్టేషనులో పనిచేవారట రిటైరయ్యారట - పురుషోత్తంగారు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడు. కొత్తలో కింద కూర్చుని వాయించటం నచ్చలేదుగాని, ఇప్పుడు అలవాటైంది. అమ్మమ్మ దగ్గర గారాలు పోతున్నాడు - ఏటేటా వస్తాడట కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి. నాకూ ఏటా సెలవు దొరకదు. ప్రతి ఏదాది రెండు టికెట్లంటే

  • ఖర్చూ ఎక్కువే. వాడు వస్తాడు వచ్చే సమ్మర్లో కూడా. మధ్య మధ్య నువ్వు కాస్త చూస్తుండు. మాటా, మర్యాదా నేర్పించు. సరేనా” అంది.

ప్రసాద్‌ ఆనందావేశంతో అవాక్కయ్యాడు.

ఆ తర్వాత వారం రోజులకే అనూరాధ ప్రయాణమైంది.

భరత్‌ ఇంకా సెలవులున్నాయని తాతగారింట్లోనే ఉండిపోయాడు. రైలు కదిలింది ధిల్లీకి అనూరాధ కనుమరుగైంది.

భరత్‌ తాతగారి వెనకాల ప్రసాద్‌ చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు.

నిన్న కరిగి నేటితో కలిసిపోయింది. తెల్లబోయిన నేడు క్షణం పాటు స్తంభించి పోయింది. తేరుకున్న తర్వాత నిన్నా నేడూ చేతిలో చెయ్యేసుకుని ముందుకు సాగాయి.

నో క ధర - 1004 23232122 ే

డా (రచయిత చిట్టచిలతి కథ) శ్రీ కనకమహాలక్ష్మి జూ కా హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌ అ లల్ల శేషగిరిరావ్రి ఆదివారం. , ఉదయం తొమ్మిదిన్నర కావస్తోంది. ఎండా కాలం. మెల్లిమెల్లిగా వాతావరణం వేడెక్కుతోంది. నేను కనకమవోలక్షి పాయిర్ర్‌ కటింగ్‌ నెలూన్‌లో క్రాపింగు చెయ్యించుకుంటున్నాను. సత్తిరాజు కటింగ్‌ చేస్తున్నాడు. ఆ 'సేలూన్‌కి సోల్‌ ప్రొప్రయిటరూ, ఓనరూ, వర్మరూ కూడా 11ోోెేెెెెెడి€ిేేేే + కనకముహోంక్మే శాయిర్‌ కోటింగ్‌ సెలూన్‌ వ

తనొకృడే.

నాకు ఐదు సంవత్సరాల నుంచి సత్రిరాజుతో పరిచయం. నేను రిటైరయి ఆ కాలనీలో స్థిరపడిన దగ్గర నుంచి సత్తిరాజు సెలూన్‌కే వెళ్తుంటాను. నాకు ఆ సెలూనే అచ్చొచ్చిందో లేక సత్తిరాజో అచ్చాచ్చాడో సరిగ్గా చెప్పలేను గాని, సత్తిరాజుతో క్రాఫింగ్‌ చెయ్యించుకుంటేనే గాని నాకు తృప్తి ఉండదు. అది మీరు నా సెంటిమెంటు అనుకున్నా ఫరవాలేదు. నాకు అరవై సంవత్సరాలు దాటాయి. సత్తిరాజుకి బహుశా ఏభై ఉండొచ్చు. సత్తిరాజు జుత్తూ, మీసాలూ అక్కడక్కడా నెరుస్తున్నాయి.

ఇంతకీ సత్తిరాజు అంత ఎందుకు నచ్చాడు?! - ఈ సందేహం మీకు తలెత్తడం సహజం. సమంజసం కూడానూ - పాఠకులకి ఈ సందేహం నివృత్తి చెయ్యడం నా కర్తవ్యం. సత్తిరాజు మంచి మాటకారి. గొప్ప కాన్వర్‌సేషనలిస్ట్‌. కటింగ్‌ చేస్తూ కార్గిల్‌ రణక్షేతంలో బోఫోర్స్‌ శతఘ్నుల గర్జనల నుంచి, ఊర్లో జరుగుతున్న (పేమ పురాణాల వరకూ, చాలా ్రిల్లింగానూ, ఆసక్తిదాయకంగానూ చెప్పుకుపోగలడు.

ఇక నేనంటారా? - ముందే చెప్పానుగా ర్షిట్రైర్రప్రోయానని. పనీ పాటూ లేదు. అందులో నేనొక గొప్ప బాతాఖానీ రాయుడ్ని ఎవడైనా పరిచయస్తుడు రోడ్డు మీద ఖర్మ జారి తారసపడితే వాడు చచ్చాడన్నమాటే! గంటల కొద్దీ రోడ్దు మీద బాతాఖానీ. మీతో చెప్పకేంగానీ, నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా నన్ను నా సహోద్యోగులు, మిత్రులు, అల్లంత దూరంలో చూసి “ఒరేయ్‌! - వీడొస్తున్నాద్రా బాబు. తగులుకుంటే మరొదలడు” అని పక్క సందుల్లోకి తప్పుకునేవోరు. ఇప్పుడు ఆ పాత స్నేహితులు లేరు. నాలాగే రిటైరయిపోయి. అక్కడక్కడా చెదిరిపోయారు. ఈ వయస్సులో కొత్త స్నేహితులు ఎలానూ దొరకరు - అదిగో! అటువంటి కిష్ట పరిస్థితుల్లో నేను కొట్టుమిట్టాడుతున్నప్రుడు ఈ సత్తిరాజు నాకు తగిలాడు - శహభాష్‌! బాతాఖానీలో నాకు తగిన ఉజ్జీ!

అందుకే 'సత్తిరాజంటే నాకు మహా ఇష్టం - గాని పాపం! సత్తిరాజు నష్టజాతకుడండీ. 'సెలూన్‌కి బేరాలు పెద్దగా ఉండవు.

ఆ!.... ఇంతకీ ఈ కథలో ప్రథాన వేదిక - ఈ సెలూన్‌ గూర్చి చెప్పడం మరచిపోయాను. ఈ కథంతా ఈ సెలూన్‌లోనే జరిగింది. ఈ సెలూన్‌ పేరు 'కనకమవాోలక్ష్మీ హెయిర్‌ కటింగ్‌

  • సెలూన్‌ చేపల బజారు ఉంది కదా! - ఆ పక్కనే మజ్టిచెట్టు ఉంది - దాని నీడలోనే ఈ సెలూన్‌ ఉంది. చెట్టు కింద కస్టమర్స్‌ కూర్చోడానికి పొడవాటి బల్ల వేసి ఉంటుంది. దానికి చారేసిన బోర్డు మీద “జెంట్స్‌ హెయిర్‌ కటింగ్‌ స్పెషలిస్ట్‌ - బొంబాయి. హెయిర్‌ స్టైల్స్‌” కిందన “మాస్టర్‌ సత్తిరాజూ అనే పేరుంటుంది.

అయితే మాటల సందర్భంలో సత్తిరాజు బొంబాయి వెళ్ళినట్లు ఎప్పుడూ నాతో చెప్పలేదు. ఒకసారి నేనే అడిగాను - “నువ్వు బొంబాయిలో ట్రెయినింగ్‌ అయ్యావా?” అని. కొంటెగా చిరునవ్వు నవ్వి జవాబు దాటేశాడు. ఇది ఆ సెలూన్‌ తాలూక బెట్‌వర్డ్‌ ఎప్పియరెన్స్‌.

ఇక - లోపలికి వెళ్ళి చూద్దాం రండి. జాగ్రత్తగా లోపలికి అడుగు పెట్టండి. కొంచెం ఇరుకుగా ఉంటుంది. చెక్కలతో చేసి టిన్ను రేకులు వీగించి ఉంది. చూసారు కదూ! - ఇదిగో, క భరాు-2బ 2122123212

లో మాసిపోయి, జిడ్డోడుతూ పగుళ్ళు తేరిన అద్దం. దానికి ఎదురుగా కనీసం అర్ధ శతాబ్దం చూసిన, పీచు రేగిపోయి, పిగిలిపోయి కీచుపెడుతున్న కుంటి రివాల్వింగ్‌ చెయిర్‌. స్టాండ్‌ మీద పాత కత్తెర్లూ, అక్కడక్కడా పళ్ళు రాలిపోయిన దువ్వెనలు. రెండు పాత బీరు సీసాల నిండా నీళ్ళు. కటింగ్‌ చేసేటపుడు కస్టమర్‌ని కప్పడానికి మరకలు తేరి, మాసిపోయిన దుప్పటి

  • అదిగో ఆ కొక్ళేనికి తగిలించుంది. ఆ మూలన కత్తిరించిన వెంట్రుకల కుప్ప!..... ఇదండీ! ఇది 'కనకమవాలక్ష్మీ హెయిర్‌ కటింగ్‌ నెలూనొ ఇంటీరియర్‌. ఇంతకీ ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, దీన్ని సెలూన్‌ అని పిలిచే ఐదులు హెయిర్‌ కటింగ్‌ బడ్డీ అని పిలిస్తే బాగుంటుందని చెప్పదానికే.....

కుర్చీలో ఎత్తు పల్లాలు సర్దుకుంటూ కూర్చున్నాను.

పగిలిపోయి, ధూళి పట్టిన అద్దంలో నా (ప్రతిబింబంతో పాటు, వెనకాల జుత్తు కత్తిరిస్తున్న సత్తిరాజు కూడా కనిపిస్తున్నాడు. కత్తిరించిన జుత్తు ముఖం మీది నుంచి గుప్పెల గుప్పెలగా జారుతూ ఒళ్ళో పడుతోంది. చిరాకు చిరాగ్లా ఉంది. నేనే సత్తిరాజుని సంభాషణలోకి దించాను.

“సత్తిరాజూ.... ఈ రోజు ఆదివారం కదా?..:. 'ఎలాగుందయ్యా బేరం?”

“సారూ, చూస్తున్నారు కదా. మీదే మొదటిది. బహుశా ఈ రోజుకి ఆఖరిది కూడా మీదేనేమో!

  • ఎక్కడ పడితే అక్కడ షోకు షోకు సెలూన్లు ఎయిర్‌ కండిషన్‌ సెలూన్లు ఉంటే ఇక్కడికి ఎవరొస్తారు సార్‌? బడ్డీ కొట్టు - ఏదో పాత ఖాతా కాబట్టి మీరొస్తున్నారు గాని... ఏంటిసార్‌ ఉక్క పెదుతుందేంటి. ఉండండి” అంటూ మెడ దగ్గర బిగుతుగా ఉన్న దుప్పటిని ఒసులు చేసి, చెమట్లు పడుతున్న తన మోచేతి మీద అంటుకున్న వెంట్రుకల్ని దువ్వెనతో గీరి, కత్తెర మీద కొట్టి దులుపుతుండగా ఆ బడ్డీలోకి ఓ అమ్మాయి వచ్చింది. పదమూదేళ్ళు ఉంటాయనుకుంటాను. మాసిపోయిన స్కూలు యూనిఫారంలో, ఉంది.

అద్దంలోనుంచి ఆ పిల్లను చూస్తూనే సత్రిరాజు....

“ఏంటీ ఈ రోజు ఆదివారం కదా! - స్కూలు ఉందేమిటి?”

“ప్రయివేటు క్లాసు” అంది నిర్లక్ష్యంగా స్కూలు బేగు కింద పెడుతూ. నల్లగా పొడవుగా చలాకీగా ఉంది.

మూలనున్న చీపురుకట్ట తీసి బడ్డీ తుడుస్తోంది.

“ఆ.....ఆ.... జాగ్రత్త... జూగ్రత.... బాబు కూర్చున్నారు. కళ్ళు కనిపించడంలేదేంటి.... వెంట్రుకలు ఎగుర్తున్నాయి.” "

ఆ మాటలు తనకి కాదన్నట్లు తన పని తను చేసుకొంటోంది. బడ్జీలో పేరుకుపోయిన చెత్తని, ధూళిని, మూలనున్న వెంట్రుకల కుప్పని, చీపురుతో ఎత్తి బడ్డీ బయట పారేసి చీపుర్ని దులిపి మూలన చారేసింది.

“ఈ సీసాల్లో నీరు పారబోసి, బైట కొళాయిలో కొత్త నీరు నింపుకురా” -

బల్ల మీద రెండు సీసాలు తీసి బడ్డీ బయట పారబోసి, ముఖం మీద జుత్తుని చిరాగ్గా మోచేత్తో ఎగదోసుకుంటూ, తిరిగి నీళ్ళు నింపడానికి బడ్డీ దిగి కొళాయి దగ్గరకి వెళ్ళింది. ఇదంతా నేను అద్దంలో నుంచి చూస్తూ సత్తిరాజు కత్తెర శబ్దం వింటున్నాను. 2222222222 ఈ మనో కాజల్‌ కటంగ్‌ సెట్‌ పై

ాాా

“సారూ - చెంపలు కొద్దిగా తగ్గించమంటారా....”

“కొద్దిగా తగ్గించు.... షేవింగ్‌ కూడా చేసెయ్యి”

“రైట్‌ సార్‌” అంటూ చెంపల్ని వత్తి, ఒంటి మీద కప్పిన దుప్పటిని మెల్లగా తీసి, వెంట్రుకల్ని దులిపి, తిరిగి దాన్ని కప్పాడు.

కప్‌ సబ్బుని, బ్రష్‌తో గిలకొట్టి గెడ్దానికి ఎక్కిస్తున్నాడు.

నీళ్ళకి వెళ్ళిన పిల్ల తిరిగి వచ్చి, సీసాల్ని బల్ల మీద పెట్టి, స్కూలు బేగు భుజానికి తగిలించుకొని, అద్దంలో సబ్బు నిండిన నా ముఖాన్ని చూస్తూ నిల్చుంది. అలా చూస్తున్న దాన్ని సత్తిరాజు కొంచెం చిరాగ్గా చూస్తూ, రేజరి తీసి అరిచేతి మీద కొడుతున్నాడు.

అంతవరకు నిల్చుని ఓపిక పట్టిన అమ్మాయి కస్సున లేచింది.

“ఎంతసేపు ఇలా నిల్చుండమంటావు?”

“ఏంటి కావాలే?”

“ఏటి - కెలీదేటి - నా డబ్బులు సంగతి ఏంటి చేశావ్‌?”

“నిన్న ఇచ్చాను కదవే!....”

“ఏటిచ్చావ్‌ - పది రూపాయలిచ్చాప్‌..... మిగతా ఇరవై సంగతేంటి”

“ఇస్తానులేయే.... నువ్వెళ్ళు, నువ్వెళ్ళు” అంటూ గసిరాడు సత్తిరాజు.

“బాకీ డబ్బులడిగితే గసురుతావేంటి.... తాగడానికి డబ్బులు తీసుకున్నప్పుడు కాళ్ళా, వేళ్ళాపడటం... డబ్బులడిగితే రోసం వచ్చి గసరడం?...”

అలా ఆ పిల్ల కస్సుమంటుంటే, సిగ్గుతో నా కళ్ళలోకి చూడకుండానే షేవింగ్‌ చేస్తున్నాడు సత్తిరాజు.

పిల్ల గబగబా బడ్డీ దిగిపోయి పెద్ద నోరు పెట్టుకుంటూ, రోడ్డు మీద నిలబడిపోయి, “నాకు సాయంకాలంలోగా నా బాకీ డబ్బులూ, ఒడ్జీ ఇవ్వకపోయావా చూసుకో.... నా సంగతి నీకు తెలీదు... నేను మంచిదాన్నికాదు -”

“ఏంటి చేస్తావేంటే... ఎల్లెల్లూ

“ఏంటి చేస్తానా?....” అంటూ ఒక్క ఊపున బడ్డీ దగ్గరకొచ్చి; చేతుల్లో తాటిస్తూ -

“సాయంకాలం నీ బడ్డీ లేచిపోద్ది జాగ్రత్త....టెంటు ఎగిరిపోద్ది... నువ్వూ, నీ డొక్కు బడ్డీ... సాయంకాలం నా డబ్బులు నాకియ్యకపోయావా నీ డొక్కు బిడ్డీకి అగ్గెట్టేస్తాను.... జాగర్త. ఏటనుకుంటున్నావో... ఖబద్దారొ అంటూ పెద్దగా నోరెట్టి అరుసుకుంటూ వెళ్ళిపోయింది.

దారినపోయేవాళ్ళు ఒకరిద్దరు ఆగిపోయి ఆ గోల వింటున్నారు. ఆ అరుపులకి షేవింగ్‌ ఆపేసి, నిశ్చేష్టడైపోయిన సత్తిరాజుని చూస్తుంటే జాలేసింది. పనిపిల్లకి అంత పొగరా? - డబ్బు అప్పిస్తే మాత్రం - వేలుడంత లేదు. గుంటముందడకి ఇంత అహంకారమా?.... అంటూ మనస్సులో బాధపడ్డాను.

“ఏంటి సత్తిరాజూ! మరీ పనిపిల్లల దగ్గర అంత అలుసై పోతున్నావ్‌. పనిమనుషుల దగ్గర అప్పులు చెయ్యడమేమిటి?... చూడు నిన్ను రోడ్డు మీద నిలబెట్టేసింది... అరే బాబూ! ఎంత గొంతుకయ్యా దానిది. ఆ పనిగుంట డబ్బు, దాని మొహాన కొట్టి రేపటి నుంచి పనిలోకి తై కళంకం - 2004 కేడి

న 2 రావద్దని చెప్పు” అంటూ కాస్తంత కటువుగానే సత్తిరాజుని మందలించాను.

సత్తిరాజు ఉన్నపళంగా ఫకాలున నవ్వాడు.

నేను సానుభూతితో ఓదార్చబోతుంటే నవ్వుతున్నాడేంటి చెప్మా!

“అది పనిపిల్ల కాదు సార్‌... నా కూతురు”

“వాట్‌ - నీ కూతురా... మరి అలా తిడతాదేమటి?”

“దాని మాట తీరే అంతసార్‌... దాన్తో రోజూ ఇదో ఫార్సు.”

“నీ క్తూతురైతే..... మరి దాని బాకీ డబ్బులు కక్కమంటా దేమిటి?”

“ఓ[...అదా” సత్తిరాజు షేవింగు అపి, మసగబారిన అద్దంలో నుంచి నా ముఖంలోకి చూస్తూ వికావికలై తెరలు తెరలుగా నవ్వుతున్నాడు.

“ఎందుకు సత్తిరాజు అలా నవ్వుతావ్‌?”

“సార్లూ! - అది, దాని మేనమామలు, పిన్నమ్మలు అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బుల్ని కూడబెట్తాది సార్‌. దానికి తోడు బజారు చేసేటపుడు, అణా పరకా నొక్మేస్తాది సార్‌. అలా డబ్బులు కూడేసి నాకు అర్జంటుగా డబ్బులు కావలసి వస్తే - అదే సార్‌ మీకు చెప్పకేం గాని - మందుకి డబ్బులు కావలిసొస్తే అది కూడబెట్టుకున్నదాంట్లో నాకు డబ్బులు అప్పు ఇస్తుంటాది. దానికి వడ్డీ కూడా కడ్దాది సార్‌. గొప్ప తెలివైంది. లెక్కల్లో ఫస్టు. వచ్చే సంవత్సరం టెన్త్‌ పరీక్షకి వెళ్తాది.... సార్‌ అప్పు ఇచ్చిన దగ్గర నుంచి తీరుస్తావా లేదా అని పీకల మీద కూర్చుంటుంది ౨ పని సలప నివ్వదు - అని చెబుతూ షేవింగ్‌ చేస్తున్నాడు.

“ఎంత కూతురయితే మాత్రం... అంత మాట దురుసు పనికిరాదయ్యా!” అంటూ చిరాకు పడ్డాను.

“దాని మాటతీరే అంత సార్‌ - చెప్పాను కదా! మా అమ్మ కూడా అంతే సార్‌, దాంట్లోనూ, దీంట్లోనూ మిగిల్చి నాకు అప్పులిచ్చి, తీర్చమని రోడ్దు ఎక్కిపోయేది.... మా అమ్మ చచ్చిపోయిన మూడు నెలలకే ఇది కడుపులో పద్డాది. అందుకే మా అమ్మ పేరే 'కనకమవాలక్ష్యి” అని నా కూతురికి కూడా పెట్టుకున్నాను. ఈ బడ్డీకి కూడా కనకమహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నాను సార్‌. ఇదొకర్తే నా సంతానం.... చూశారు కదా ఇంతలా నా మీద కేకలేసుకుంటూ లేచిందా! నేను గాని టెంకి ఇంటికి రాకపోయినా, తిండి తినకుండా ఎక్కడైనా ఉండిపోయినా బెంగెట్టుకొని బేజారెత్తిపోయి, వడ్చుకుంటూ నా కోసం ఊరు ఊరంతా తిరుగుతాది. నేనంటే దానికి అంత ప్రేమ సార్‌.... నేనంటే దానికి ప్రాణం సార్‌...”

క్షణం సేపు నిశ్శబ్దం.

“మా అమ్మ చచ్చిపోయి నా మీద భ్రమ తీరక, నా కూతురిగా పుట్టింది సారొ

గొంతు బొంగురు పోతోంది.

అప్రయత్నంగా కళ్ళు తుడుచుకొంటూ సత్తిరాజు అద్దంలో నుంచి శూన్యంలోకి చూస్తున్నాడు.

  • తన కూతురిలో తల్లిని చూస్తున్నాదు. “

  • ఎక్సడో నృష్టాస్సష్టంగా కోయిల కూత వినిపిస్తోంది.

అ 2222222222 శ్రీ కనకమహాల్లో హౌయిర్‌ $టంన్‌ సెయాన్‌ 2

పాద్యమి చంద్రుడు ప్చ్‌ అమ్మకి ఈ వేళ కూడా జ్వరం వచ్చింది” అంటున్న సరళ మాటలు మగత నిద్రపోతున్న రాఘవకి లీలగా వినిపించేయి.

“వారంలో బక్కరోజు ఎలాగో తీరికచేసుకుని ఇంటికి వస్తాను. ఆ ఒక్కరోజు నేను ఎన్ని పనులు చక్కపెట్టగలను? నువ్వు, ఆమెని డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయేవా?” అన్నాడు బాలాజీ రవ్వంత అసహనంగా,

“డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాం వస్తారా? అని అడిగేను, ఆవిడ ఇష్టం చూపించలేదు. బలవంతంగా ఆవిదని తీసుకెళ్ళలేనుగాగొ అంటూ సరళ చెప్పిన సగం నిజం రాఘవని ఆశ్చర్యపరచక పోయినా, మగత నిద్ర చెడకొట్టింది. మెైత౭తత౭త౭తతడెతత౭తడెై ఊఊ కైకథారరగ-2004 122౩౩22222

డాయ సరళ ఎంత బాగా అబద్ధమాడింది!

“మిమ్మల్ని నేను డాక్టర్‌ దగ్గరకి తీసుకెళ్ళలేదేమని ఆయన నన్ను తప్పుపడతారు, వెళదామా?” అంటూ మొక్కుబడిగా సరళ అత్తగారిని ముందర రోజు అడగడం జ్ఞాపకానికి వచ్చింది రాఘవకి. అత్తగారి ఆరోగ్యం మీద ఆసక్తిగాని, జ్వరం తగ్గించడానికి చేసే ప్రయత్చంలో ఉత్సాహం కాని లేకపోతే, ఆత్మగౌరవం ఉన్న ఏ వ్యక్తి అయినా ఎలా స్పందిస్తారో అదే విధంగా సరళ అత్తగారు మానస రియాక్ట్‌ అయింది.

“వద్దులే అమ్మా, ఈ చిన్న జ్వరానికి డాక్టర్‌ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? అతను ఇదని, అదని టెస్ట్‌ లంటాడు, ఖరీదైన మందులు రాస్తాడు. క్రోసిన్‌ మాత్ర ఉంది, వేసుకుంటాను. ఇంకొన్నాళ్ళు చూసి జ్వరం తగ్గకపోతే వెళ్దాంలే” అంది మానస.

సరళ ఇంకేమీ రెట్టించలేదు. మానస మాటలలో జీవితం అంటే ఉన్న నిర్లిప్తత రాఘవకి వినిపించింది. ఏమనుకుందో, ఏమో, కాస్సేపయాక, “అత్తయ్యా, డాక్టర్‌ దగ్గరికి వెళ్ళలేదని విసుక్కుంటారు, అంది సరళ.

“మరేమీ పరవాలేదు, వాడికి నే చెబుతాను", అంది మానస.

ఆ సంభాషణ అంతటితో ముగిసింది.

“అమ్మకి నిజంగా ఇబ్బందిగా ఉంటే దాక్టర్‌ దగ్గరికి వెళ్ళడానికి సంకోచిస్తుందా? అమ్మ చెప్పినట్లు మరికొన్ని రోజులు పరిశీలిద్దాం. మరీ అంత జ్వరం లేదుగా, అంటూ సమస్యని ప్రక్కకి నెట్టేశాడు బాలాజీ. 'సమస్య ఉంటే దానికి పరిష్మారం, దాని పర్యవసానం ఏమిటి?” అన్న (ప్రశ్నకి మెదడు ఇచ్చిన సమాధానం రుచించక, తల్లి ఆరోగ్యం గురించి వచ్చిన అనుమానాన్ని పీక పిసికి నిద్రలోనికి జారబోయేదు బాలాజీ. "

క్రింద పోర్షన్‌లో జరిగే సంభాషణ, పై పోర్షన్‌లో ఉన్న రాఘవకి స్పష్టంగా వినిపిస్తుంది - అందులో రాజ్రుళ్ళు మరీను, నిశ్శబ్దంలోంచి మాటలు చాకులా దూసుకు వస్తాయి. గత పదిహేనేళ్ళుగా దిగువ పోర్షన్‌లో జరిగే మార్పులు తను గమనిస్తూనే ఉన్నాడు. కూతురు - వనజకి పెళ్ళికి ముందు, చాలాకాలం క్రితం కొన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ టెలివిజన్‌ తనలాగే ముసలిదయి, ఇహ చిత్రాలు ప్రదర్శించనని మొరాయించడంతో, తనకి, క్రింద జరిగే సంఘటనలు, వాటి వెనుక ఉన్న కరుడు కట్టిన నిజాలు, సోప్‌ ఆపెరాలో నడిచే సంఘటనలలా కనిపిస్తాయి.

జీవితం ఒక బంతి ఆట లాంటిదే. బంతి కోసం పరిగెడుతుంటే కలిగే ఆవేశం, మనల్ని విచిత్రమైన దశలలోనికి తీసుకెళ్తుంది. బైట నుంచి ఆ బంతి ఆట చూసే వ్యక్తులకి ఆటగాళ్ళు చేసే ఫొల్స్‌ వగైరా స్పష్టంగా కనిపిస్తాయి. క్రింద పోర్షన్స్‌లో జరిగే జీవితపు పరుగు అటకి తను ఒక (ప్రేక్షకుడు. క్రింద పోర్షన్‌లో ఉన్న ఆ మూడు పాత్రలు తనలో ఆసక్తినీ రేకెత్తిస్తాయి. ఆ పాత్రలలో అక్కడక్కడ పిరికితనం, కుటిలత్వం చూసినపుడు తనకి రవ్వంత అబ్బురం కణ*గుతుంది. తనేమీ వాళ్ళని బేరీజు వేయకపోయినా, మంచి చెడు విచక్షణ తెలిసిన వ్యక్తుళు ఏమిటి ఇలా చేసేరనిపిస్తుంది. రామాయణంలో రాముని పిరికితనం, కృష్ణావతారంలో కృష్ణుని కుటిలత్వం పుష్కలంగా జీర్ణించుకుని, ఈనాడు తమ జీవిత విధానాన్ని మలచుకుంటున్న (ప్రజ అంతకన్నా భిన్నంగా ఏం ఆలోచించగలదు అనిపిస్తుంది. మనమంతా మానవులం, నిశితంగా .పరిశీలిస్తే

ప్రతీ మనిషికీ విలక్షణాలుంటాయి అని జ్ఞాపకానికి వచ్చి, తిరిగి ఆసక్తితో వాళ్ళని గమనిస్తాడు. “రేపు ఆ చీటీ పాట ఉంది. ఇంకెవ్వడూ కాంపిటీషన్‌కి రాకపోతే చీటీ పాడేస్తాను. ఇక్కడ కొంత నష్టం వచ్చినా, మా ఆఫీసులో కొందరు నూటికి నాలుగు రూపాయలు వడ్డీతో అప్పులిస్తున్నారు. అక్కడ పెడితే డబ్బు త్వరగా పెరుగుతుంది” అన్నాడు బాలాజీ. వినబడలేదు కాని సరళ బాలాజీని బలంగా, దగ్గరగా హత్తుకుని ఉంటుంది. తీయని ముద్దు ఇచ్చి ఉంటుంది! అంత మంచి వార్త విన్నాక సరళ ఆమాత్రమైనా చేయకపోతే ఎలా?! రాత్రి చీకటి, చీకటి ఆలోచనల్ని కడుపునిందా ఆరగించుకుంటూ, ఇంకా ఆకలి తీరలేదంటోంది. రాఘవకి నిద్ర రావడంలేదు. పగలేమీ పని కాని, ఇంకేరకమైన వ్యాయామం కాని లేకపోవడంతో, రాఘవ శరీరం విశ్రాంతిని కోరడం లేదు. దానికి తోడు వృద్ధాప్యం ఆలోచనల రొద ఎక్కువై, రాఘవని మేల్మొలిపి ఉంచేయి. పదిహేనేళ్ళ క్రితం, మానస ఆమె భర్త, కొడుకుతో క్రింద పోర్షన్‌లో నివసించడానికి వచ్చింది. ఆమె కనిపించినపుడు, సభ్యత కాదని తెలిసినా, ఆమెని గమనించేవాడు. తీసీ తీయని పాపిడి, అదుపులో ఉండకుండా ఎగిరే ముంగురులు, పావలా కాసంత ఎర్రని కుంకుమ బొట్టు, గుండ్రపుటి మొహం, చిన్న మొహం మీద అమర్చినట్లు నాశిక, మాత్రం కనిపించింది ఒకరోజు. సుతిమెత్తని మాటలు నోటి నుంచి వెలువడగానే, రవ్వంత గాలికే ఎగిరిపోయి మాయమయేంత మెత్తని ధ్వని! నిజానికి తను చెవులు రిక్కించి వింటేకాని ఆమె మాటలు సాంతం వినిపించేవి కావు. మానస కుటుంబం క్రింద పోర్షన్‌లో దిగిన నాలుగు వారాల తరువాత ఒకరోజు, మానస రిక్షా ఎక్కబోతుండగా ఆమెని సాంతం తను చూసేడు, కాని ఆ చూడడం కేవలం అర నిమిషం మాత్రమే. ఇంట్లోంచి, బైటికి వచ్చి రిక్షా ఎక్కే ముందున్న కాస్త వ్యవధిలో, మానసలో కొట్టిచ్చిన ప్రత్యేకత ఒకటి తనకి ఆనాడు గోచరించింది. ఆవేళ మానస చీర కట్టిన తీరు తనని ఆనందంలో ముంచెత్తింది. కుమిలి విసినకర్ర మడతలులా కుచ్చెళ్ళని పేర్చిన తీరు ఒక వింత. రిక్షాలోనికి ఎక్కబోతున్నపుడు తెల్లని కాలి మడమలని అంటిపెట్టుకుని అటూ ఇటూ కదులుతున్న పట్టీలు, వాటి మువ్వల శబ్దం ఎందుకో తనని వివశుడిని చేసింది. ఆ రోజు తరువాత తిరిగి మానసని చూడడానికి చాలాకాలం పట్టింది. ఆ రోజు! మేడ మెట్లు దిగి తను బైటికి వెళ్ళబోతుంటే, “క్షమించాలి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. మా అబ్బాయికి ఒంట్లో నలతగా ఉంది, జ్వరం ఎక్కువగా కాస్తోంది. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళాలి. వాడిని ఒంటరిగా వదిలి రిక్షా కోసం నేను వెళ్ళలేను. మీరు ఒక రిక్షాని ఇక్కడికి పంపగలరా?”, అనడిగింది మానస. 'కంగారు పదుతోంది మానసి, అనుకుంటూ త్వరత్వరగా రెండడుగులు వేసి ఒక రిక్షాని పంపేడు తను. మానస ఇంటిలో మామూలు పరిస్థితి నెలకొందని ఆ రాత్రి మానస భర్తతో కులాసొగా మాటలాడుతున్న మాటలు తెలియచెప్పేయి. రోజులు దొర్లుకుంటూ ఐదేళ్ళు గడిచేయి. ఆ ఐదేళ్ళలో తన శరీరంలో చాలా మార్పులు వచ్చేయి. వ్యాహ్యాళికి వెళ్ళడానికి శరీరం ఇష్టపడడంలేదు. ధైర్యం చేసి తిరగడానికి వెళ్తే, తరిగి వచ్చేక కాళ్ళ నొప్పులు, రాత్రంతా నిద్ర పోనిచ్చేవి కావు. ఆ ఐదేళ్ళలో, అర నిమిషం పాటు మానసని అప్పుదప్పుడు చూడడం తప్ప ఆమెతో పరిచయం అవ్వలేదు. మానస మాటలు, లిప్తపాటు లీలగా కనిపించే ఆమె శరీరాకృతి 2 కధారూంి-2004 క్‌ డెడ్‌ =2తఊచ222222222222222242ఊ2242222424ఊ2ఊ22224224ఊఊ4ఊఊ24242242ఊ22222222222

లాం తప్ప మానస గురించి తెలిసే అవకాశం కాని, అవసరం కాని కలగలేదు. ఆమె గురించి తనేమీ ప్రత్యేకంగా ఆలోచించినట్లు కూడ జ్ఞాపకానికి రావడం లేదు. ఐనప్పటికి, చలికాలం రాత్రుళ్ళలో బైటకి వస్తే చుట్టూ ముసురుకునే పొగమంచులా తను, తనకి తెలియకుండానే ఆమె గురించి ఆలోచించే వాదేమో! గతం అంతా మసక మసకగా ఉంది. మొట్టమొదటిసారి ఆమెని చూసినపుడు ఆమె వయస్సు బహుశా ముప్పయి ఐదు దరిదాపులలో ఉంటుందేమో.

ఆమె కొడుకు బాలాజీకి పదమూడు, ఆమె భర్త నారాయణకి నలభై ఉంటాయేమో. లా డిగ్రీ పుచ్చుకున్న తను ఏనాడూ కోర్టుకి వెళ్ళలేదు. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తిలో భూముల్ని అమ్ముకుంటూ వచ్చిన పైకంతో జీవితాన్ని వెళ్ళదీయసాగాడు. న్యాయస్థానంలో జరుగుతున్న వితండ పోకడలు తనకి నచ్చక కోర్టు దరిదాపులకి వెళ్ళేవాడు కాడు. మానస క్రింది పోర్షన్‌లోనికి వచ్చిన దాదాపు పదేళ్ళకి కూతురు వనజకి పెళ్ళి చేసేడు. వనజ పెళ్ళి సమయానికి శృంగవరపు కోట దగ్గిర పదిహేనెకరాల భూమి, పాడుపడిపోవడానికి సిద్ధంగా వున్న ఒక పెంకుటిల్లు ఉండేవి. వనజ పెళ్ళయ్యేసరికి నాలుగెకరాల భూమి, ఇల్లు తరిగేయి. అయితేనేం, వనజ లక్షణంగా అత్తవారింటికి వెళ్ళింది. వనజ పెళ్ళి చేసేక, మిగిలిన ఆ పదకొండు ఎకరాలని అమ్మి, వచ్చిన డబ్బుని బ్యాంక్‌లో జమ చేసి, దాని మీద వచ్చే వడ్డీతో రోజులు దొర్లించ సాగేడు. వనజ బాలాజీ ఒకే ఈడు వారు కావడంతో, బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుతున్న వనజ సెలవులకి ఇంటికి వచ్చినపుడు, వారిద్దరి మధ్యా స్నేహం పెరిగింది. కాని మానస ఇంటికి తను వెళ్ళడం కాని, మానస తనున్న పోర్షన్‌లో అడుగు పెట్టడంకాని ఎప్పుడూ జరగలేదు. తన ఉనికి మానసకి తెలిసి ఉండాలి, మానస గురించి తనకి పరోక్షంగా చాలా తెలుసు. దీనికి కారణం ఊరికి దూరంగా ఉన్న ఆ బిల్జింగ్‌ రాత్రయ్యేసరికి నిశ్శబ్దం పేరుకుంటుంది. నాలుగు పోర్షన్లు ఉన్న ఆ బిల్దింగ్‌లో ఒకరి పోర్షన్‌లో వెలువడే మాటలు, మిగతా మూడు పోర్టన్ల వారికి వినిపిస్తాయి. యాదృచ్చికంగా వినపడే మాటలు బట్టి మానస ఇష్టా అయిష్టాలు, ఆ కుంటుంబ ఆర్థిక పరిస్థితి తనకి అవగాహన అయ్యేది. ఆర్ధికంగా ఇతరుల మీద ఆధారపడి జీవితాన్ని వెళ్ళదీయడం చాలా కష్టమైన పని. రూపాయ విలువ తగ్గుతున్నా, బ్యాంక్‌లో ఉంచిన - పైకం మీద వడ్డీ తరుగుతున్నా క్లుప్తంగా తను బ్రతకబట్టి రోజులు బాగానే వెళ్ళేయి. తను ఒంటరి మనిషి పెద్ద ఖర్చులేముంటాయి కనుక? మొదట్లో, అద్దెకి దిగినపుడు ఇంటి అద్దె ఆరు వందలు, క్రమేణా అది పెరిగి వెయ్యి రూపాయలయింది. ఇదే తన పెద్ద ఖర్చు!

వనజ, అల్లుడు రామం అన్యోన్యంగానే కనిపించేవారు. పెళ్ళయిన చాలాకాలం వరకు, అల్లునికి డబ్బు మీద ఆశ లేదనుకునేవాడు తను. కాని ఒకసారి పుట్టింటికి వచ్చిన వనజ, “ఆయనకి చాలా ఫైనాన్స్‌ కంపెనీలు బాగా తెలుసును. నువ్వు బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్‌గా ఉంచినపుడు చాలా తక్కువ వడ్డీ వస్తోంది. బ్యాంక్‌లో ఉంచే కంటే ఆయన ఆ డబ్బు ఇస్తే నీకు నెలసరి ఆదాయం ద్విగుణీకృతం అవుతుంది నాన్నా” అంది.

“ఇది నీకు వచ్చిన అలోచనా? లేక అల్లునికి వచ్చిన ఆలోచనా?” అడిగేడు తను. వనజ అరక్షణం తడబడింది. “ఆలోచన నాదే నాన్నాా కాని ఆయన దానిని సమర్థించేరు", అంది తేరుకుని. “ఈమారు డిపాజిట్‌ మెచ్యూర్‌ అయినప్పుడు చూద్దాంలే, అని వనజ ప్రతిపాదనకి ననున నానా? 12 శశి చంట్రుదుకై 1ఒఒఒ2ఒ2222===22222221

సమాధానం వాయిదా వేసేడు తను. తన నిరాశక్తి చూసి వనజ నిరుత్సాహపడడం తను గమనించేడు. మరో సంవత్సరం గడిచేక, అల్లుడు, వనజ కలిసివచ్చినపుడు ఫైనాన్స్‌ కంపెనీలలో డబ్బు పెట్టడం గురించి చర్చ తిరిగి మొదలయింది.

“జేపు బ్యాంక్‌కి వెళ్ళి వాకబు చేస్తే కాని మెచ్యూర్‌ ఎప్పుడవుతుందో తెలియదు. మీరు ఇంకా నాలుగు రోజులు ఉంటారుగా చూద్దాం,” అన్నాడు తను. అ రోజు రాత్రి “మీ నాన్నకి నా మీద, నే చేసే బిజినెస్‌ మీద నమ్మకం ఉన్నట్లు లేదు. అనవసరంగా ఇక్కడికి వచ్చి వెలితి పద్దాను, అంటూ మధనపదడ్డాడు రామం, భార్యతో.

“అబ్బే! అలాంటిదేమీ కాదు. ఆయన చాలా జాగ్రత్త మనిషి. రేపు ఆయనతో నేను మాటలాడతాను. అనవసర ఆలోచనల్ని మెదడులోనికి రానీయకండి” అంది వనజ.

తనకి వనజ పరిస్థితి అర్ధమైంది. అల్లునికి త్వరత్వరగా లక్షలు గడించేద్దామన్న కోరిక. వనజ భర్ర కోరిక తీర్చాలన్న తపన తనకి స్పష్టంగా కనిపించింది. తనతో జరిగే సంభాషణలో, అల్లుడు తన దగ్గర ఎంత డబ్బు ఉందో అని ఆరా తీయడానికి చేసిన ప్రయత్నం చూసి తనకి నవ్వు వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ నిద్ర లోనికి ఒరిగేడు.

మర్నాడు ఉదయం బ్యాంక్‌కి వెళ్ళి ఒక లక్ష రూపాయలు తీసుకువచ్చి అల్లుని చేతిలో పెట్టి, “ఇప్పటికి ఇంతే సమకూరింది. ఇది నీ కంపెనీలో పెట్టు. తరువాత మరికొంచెం పెట్టడం గురించి ఆలోచిద్దాం” అన్నాడు తను. అల్నుని మొహం పూర్తిగా వికసించకపోయినా ఒక మోస్తరు తృప్తితో కదిలి వెళ్ళేడు.

అది జరిగి మూడేళ్ళయినా, దాని మీద వడ్డీ గురించి కాని, అసలు గురించి కాని అల్లుడు, వనజ ఏమీ ప్రస్తావించలేదు. రోజులు గడుస్తుంటే, ఒకరోజు వనజ వచ్చి -

“ఏమిటో మీరు ఇక్కడ ఒంటరిగా, మేము నీకు దూరంగా ఉండడం ఏమీ బాగులేదు నాన్నా ఒక్కసారి నిన్ను చూడాలంటే ఆరేడు వందల రూపాయల ఖర్చు. అదీకాక నీ మనవడి చదువుకి బ్రేక్‌ ఆయనకి ఇబ్బంది. గతంలో ఆయన దగ్గర డబ్బు ఉంచిన వాళ్ళు ఇళ్ళు కొనుక్కున్నారు. ఇంటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్లు ఆయన చాకచక్యం, సమర్థత మీద నీకు నమ్మకం లేదు. నువ్వు ఇంకా ఎక్కువ ఆయన ఫైనాన్స్‌ కంపెనీలో పెదితే బాగుండేది నాన్నా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఎప్పటికైనా నువ్వు మా దగ్గరికి వస్తావని ఆయన నమ్మకం. అద్దె ఇచ్చుకుంటూ ఇక్కడ ఉండేకంటే, మాతో కలిసి ఉండవచ్చుగా”, అంటూ వివరించకుండా, కత్తెరలో పోకచెక్క లాంటి తన పరిస్థితిని వివరించింది వనజ.

“నా గురించి నీకు అంతా తెలుసు. స్వతంత్రంగా (బ్రతికిన మనిషిని. ఊరికి కాస్త దూరంగా ఇక్కడ ఉన్న ప్రశాంతత పట్నంలో ఉండదు. నాకూ వయస్సు వచ్చేస్తోంది, త్వరలోనే మీ దగ్గరికి వచ్చేస్తానేమో” అన్నాడు తను. వనజ ఇంకేమీ రెట్టించకుండా మౌనం వహించింది.

తనేమైనా చేస్తే వనజ జీవితం మెరుగవుతుందా? అని రాత్రంతా తెగ ఆలోచించేడు తను. వనజ ఆనందం కోసం మరికొంత డబ్బు ఇవ్వవచ్చు. కాని అది పరిస్పితిని మెరుగు పరచదు సరికదా ఇంకా పాడుచేస్తుంది. కొందరు వ్యక్తులకి డబ్బు అంటే అదొక రకమైన దాహం. ఎంత డబ్బు వచ్చినా ఆ దాహం తీరదు. అల్లుడు బహుశా ఆ కోవకి చెందిన వాడులా కనిపిస్తోంది. క భవ - 10% 1222222222

న ౨ ఇంకా, ఇంకా అంటూ వనజ మీద వత్తిడి తెస్తాడు అల్లుడు. క్రమేణా తన దగ్గర ఉన్న దబ్బు హరించుకుపోతుంది. “తోటకూరనాడే ఆపవలిసింది" అన్న సామెతలోలా అల్లుని ఊహలకి మొదట్లోనే గండి పెట్టాలి. లాభం లేదు, ఆ దారి మంచిది కాదు అని అర్ధమైంది తనకి. వనజ అన్నట్లు అద్దె ఇస్తూ ఇక్కడ ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ ఉందేకంటే, వచ్చిన వడ్డీ దబ్బు, అల్లుని ఆర్జనకి చన్నీళ్ళకి వేడి నీళ్ళకి తోడుగా జతపరిచినట్లు కలిపి అల్లుని దగ్గరే ఉంటూ మనవడితో ఆడుకుంటూ రోజులు ముగించేయవచ్చు. తన తదనంతరం మిగిలిన డబ్బు వాళ్ళకే చెందుతుంది అనుకుంటూ రెండవ మార్గం గురించి, దానిలో ఉన్న బాగోగులు పరిశీలించేదు. వ్యాపారానికి కావలసినంత డబ్బు ఉండి కూడా తనకి దానిని ఇవ్వలేదని అల్లునికి అంతర్లీనంగా బాధ, కోపం ఉండవచ్చు. అది సహజమే. తను డబ్బు ఇవ్వడానికి వెనుకంజ వేయడం అల్లుని అహం మీద దెబ్బ తీసింది. ఎదురుగా కనపడుతుంటే ద్వందర్థాలతో తన మీద మాటలు విసరవచ్చు. తనేమీ తిరుగు సమాధానం చెప్పకపోతే, ఇవేమీ చేయలేక వనజ మీద ఆ కోపం చూపించే అవకాశం ఉంది. జరుగుతుందని నిర్ధారణగా చెప్పలేం కాని జరిగే అవకాశం ఉంది. ఒకసారి అల్లుని పంచన చేరేక పరిస్థితులు బాగుండకపోతే, తను బైటపడడం కష్టం. ఎలాగూ వాళ్ళకే చెందుతుంది కదా అని, ముందరే అంతా అల్లుని చేతిలో పెట్టవచ్చు. ఆ డబ్బుని ఎంత బాగా ఉపయోగిస్తాడో చెప్పడం కష్టం. అల్లునికి తను పాలు ఇచ్చె అవు లాంటి వాడు. ఇహ ఈ ఆవు పాలు ఇవ్వదని తెలిసిననాడు, అల్లుని ధోరణి ఎలా ఉంటుందో, తన మీద ఎంత విసుగుకుంటాడో అన్న అనుమానం తనకి ఉంది. అప్పుడు తన గతేమిటి? లాభం లేదు, ఆ దారీ అంత మంచిది కాదు. ప్రశ్న మళ్ళీ మొదటికి వచ్చి నిలుచుంది. ఇప్పుడు ఏం చేయాలి? అంటూ రాత్రంతా మధనపడి, వనజ వెళ్ళిపోతుంటే, ఏభై వేలు చేతిలో పెట్టి, 'పిల్లవానిని కాన్వెంట్‌లో వేసేవుగా, తెగ ఖర్చు ఉంటుంది, దీనిని వాడు. మనవడితో ఆడుకుంటూ రోజులు గడిపేయాలని నాకూ ఉంది. త్వరలో ఇక్కడ అన్నీ చక్కబెట్టి వచ్చేస్తాను", అన్నాడు తను.

భర్త కోసం చాలా కష్టాలనైనా భరించగల మనుష్యులలో వనజ ఒకర్తి. భర్త నడుపుతున్న ఫైనాన్స్‌ కంపెనీ మీద, భర్త మీద పూర్తి నమ్మకం లేకపోయినా, భర్తని, భర్తకి లేని తెలివితేటల్ని వెనకేసుకొస్తుంది వనజ. భర్త చెప్పినదే వేదం అని నమ్మే చాలామంది మధ్యతరగతి స్రీలలో వనజ ఒకర్తి. పట్టువదలని విక్రమార్భునిలా, “ఆలోచించు నాన్నా నువ్వూ మాతో ఉంటే అందరికీ బాగుంటుంది” అంటూ రిక్షా ఎక్కింది. అల్లునికి డబ్బు ఇవ్వకుండా, వనజ కాపురం బాగుపడుతుందా? అని ఆలోచిస్తూ గింజుకున్న రాఘవకి నిద్ర పట్టడం తెలియలేదు.

“ఏమిటి అత్తయ్యా, నన్ను లేపలేకపోయేరా? నేను కాఫీకి డికాక్షన్‌ వేసే దానిని కదా?” అంటూ అత్తగారి మీద విసుగుకుంటున్న సరళ మాటలు రాఘవని మేల్మొలిపేయి.

“నువ్వు గాఢంగా నిద్రపోతుంటే లేపడమెందుకని నేనే ఫిల్టర్‌ వేసేను, అంది మానస. ప్రతీరోజూ ఫిల్దర్‌ వేసి పాలు కాచేక లేపితే కాని లేవని సరళ, బాలాజీ ఉన్న ఒక్కరోజు భర్త కన్నా ముందర లేచి, ఫిల్టర్‌ కాఫీ భర్తకి అందిస్తుంది. కాని ఈ వేళ కాస్త తారుమారయింది, అనుకున్నాడు రాఘవ. బాలాజీ ఉన్న ఒక్కరోజు, ఆయాస పడుతూ, ఆపసోపాలు పడుతూ, తతత కడ కకక డడ కట సంట్టుదుకై

ఇంటి పనంతా తానే చేసి, అత్తగారికి కష్టం కలుగకుండా చూస్తున్నట్లు బాలాజీకి అభిప్రాయం కలగచేస్తుంది సరళ. అది చూసిన బాలాజీకి భార్య, తల్లిని చాలా బాగా చూస్తున్నట్లునిపిస్తుంది. చాకచక్యంగా సరళ, మానస మెత్తని స్వభావంని బాగా వాడుకుంటుంది అనుకున్నాడు రాఘవ.

"క్రింద నడుస్తున్న భాగోతం సంగతి నా కెందుకు, నా కాఫీ మాటేమిటి?” అన్న ఆత్మారాముడి ఆర్తనాదం విని పరుపు మీద నుంచి లేచేడు రాఘవ.

ఖాళీ సీసాలో గాలి జొారపడకుండా ఉంచడం ఎంత కష్టమో, ఆలోచించగలిగే మెదడులోనికి ఆలోచనలు ్రవేశించకుండా చూడడం అంతే కష్టం, కాఫీతో శరీరంలోనికి ప్రవేశించిన కెఫీన్‌ కల్టించిన ఉత్తేజం రాఘవని కాస్సేపు ఊపింది. గదిలో పచార్లు చేయడం. మొదలు పెట్టేడు. అతికష్టం మీద పది నిమిషాలు నడిచేటప్పటికి, కాళ్ళలోనికి ఎక్కడలేని నిస్సత్తువ ఆవహిం చింది. మోకాలి చిప్ప మీద పాత దెబ్బ, కీళ్ళ నొప్పులు రావడంతో ఉన్న ఉత్సాహాన్ని కబళించడంతో ఉస్సురంటూ వాలు కుర్చీలో చతికిలిపడ్డాడు. వెంటనే కళ్ళు మూతలు పడ్డాయి.

“పేపర్‌, అంటూ పేపర్‌ కుర్రాడు వచ్చి అరవడంతో తెలివి వచ్చి గుమ్మం వరకు మెల్లిగా నడిచి వచ్చి పేపరందుకుంటుంటే క్రింద బాల్కనీలో చీర ఆరవేస్తున్న మానస కనిపించింది. గంధపు రంగు పువ్వుల వెంకటగిరి చీర ఉదయపు సూర్యకాంతిలో బంగారం రంగుని ధరించడానికి ఉబలాటపడ్తోంది. జుత్తు ఇంకా దువ్వుకున్నట్లు లేదు, తల మీద జుత్తు గాలిలో కదులుతూ నుదుటని తచ్చాడుతున్న ముంగురులతో పోటీగా ఎగురుతోంది. ఈవేళ ఆదివారం కదూ, ఖచ్చితంగా మానస తలంటుకుని ఉంటుంది, అందుకే ఆ జుత్తు అంత మనోహరంగా ఎగురుతోంది అనుకునేలోగా మానస మాయమైంది. చేతిలో పేఫరుతో లోపలికి వస్తుంటే గోడ గడియారం తొమ్మిది గంటలు కొట్టింది. అంటే తను దాదాపు గంటన్నరసేపు నిద్రపోయేడన్న మాట. తనకి ఈ మధ్య నిద్ర ఎక్కువయింది. ఉదయం ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట నిద్ర కావలసి వస్తోంది. కాల మహిమ కాదు, అరవై మూడేళ్ళ వయస్సు మహిమ అనుకుని నవ్వుకున్నాడు.

అరవై మూడేళ్ళు! జీవితంలో ఏమీ సాధించకుండా సాగిన అరవై మూడేళ్ళు! పూర్తిగ ఖాలీగా వెళ్ళిన అరవై మూడేళ్ళు! ఆస్థి ధర్మమా అని చదువంటే ప్రత్యేకమైన ఆసక్తి కలుగలేదు. పెద్ద కోరికలూ ఉద్భవించలేదు. చిన్న ఊరిలో పెరగడం వలన లోకజ్ఞానం అంతంత మాత్రం. యంత్రికంగా వెళ్ళిన జీవితం. చాలామంది జీవితాలూ యాంట్రికమే! కాని తనది మరీను, విజయనగరంలో డిగ్రీ, విశాఖపట్నంలో లా కోర్సు పూర్తిచేసేడు. ఎవరితోనీ స్నేహం అవలేదు, ఎవరికీ దగ్గరవలేదు. ఇంటిలో ఆప్యాయతకి కొరవ లేకపోయినా, ఏమిటో గతంలోనికి తరచి చూస్తే ఏ సంఘటనా ప్రత్యేకంగా జ్ఞాపకానికి రావడం లేదు. మూడేళ్ళ వైవాహిక జీవితం కాన్పులో విశాలి మరణంతో ముగిసింది. అది జరిగి, అబ్బో! చాలా ఏళ్ళయింది అనుకుంటూ పేపర్‌ చదవనారంభించేడు రాఘవ. అరగంట గడిచేసరికి మొదటి పేజీ నుంచి ఆఖరు పేజీ వరకు ఉన్న వార్తలు ఒక్కసారి చదవడం పూర్తయింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం, తాము గద్దె ఎక్కితే తెగ పొడిచేస్తామని ప్రగల్భాలు పలకడం, మా తాతలు నేశులు తాగేరు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు, మా తాత ఈ దేశానికి తెగ సేవ చేసేడు అందుచేత . '2222ఊ222222222డ2డైడై2ైతై౭ డడ డడ డడ డడ డడ క 5౧-104 23222222 2222222నననన222డనడడడడ2222222222222222డ22222222న222222222222222222222222222డడడడడ22డ22డ2డఊ24-222222222

నాకు పదవి కట్టపెట్టండి, లేదా నా భర్త అకస్మాత్తుగా చనిపోయేడు అందుచే ఆయన పట్టం నాకు కట్టపెట్టండి అంటూ నినాదాలు!! మెల్లిగా మరోసారి పేజీలు తిప్పసాగేడు రాఘవ. నాల్గవ పేజీలో ఒకవార్త రాఘవని ఆకర్షించింది. ఎక్కడో ఒక యూనివర్శిటీలో ప్రొఫెసర్లు, తమ తరువాత తమ పిల్లలకి ప్రాఫెసర్ల ఉద్యోగాలు ఇవ్వాలని నిరాహారదీక్ష ప్రారంభించేరు.

“ప్రొఫెసర్ల పిల్లలకి క్వాలిఫికేషన్స్‌ లేకుందా ఉద్యోగాలు ఇవ్వడమేమిటి? ఎవరైనా నవ్విపోతారు. దేశంలో చదువంతా నాశనమౌతుంది. ఈ ప్రాఫెసర్లనందరినీ వెంఠనే డిస్మిస్‌ చేసేయండి", అన్నాడు ఆ రాష్ట్ర ఎద్యుకేషన్‌ మినిస్టర్‌. అగ్నిలో ఆజ్యం పోసినట్లు వివాదం రాజుకుంది. ఒక్క హిస్టరీ ప్రొఫెసర్‌, “నీ తండ్రి చనిపోయేదని నీకు ఉద్యోగం ఇచ్చేరు. అప్పుడు సీ క్వాలిఫికేషన్‌ చూసి నీకు మంత్రి పదవి అంటకట్టేరా? అలాగే మా పిల్లలూ మెల్లిగా నేర్చుకుంటారు,” అన్నాడు.

ఒక్కసారి రాజకీయనాయకునికి నోట మాట రాలేదు. అవును మరి, ఎలక్షన్లో గెలవకుండా ఆరు నెలల పాటు, తండ్రి చనిపోయేక తను మంత్రినయేనన్నది జ్ఞాపకం వచ్చి ఏం చెప్పాలో తెలియక చిత్తరువల్లే ఉండిపోయాడు కాస్సేపు.

“అది రాజ్యాంగంలో రాసి పెట్టి ఉంది. మీది. చదువుల సంగతి - అదెలా సాధ్యం?” అని తిరిగి పప్రశ్నించేడు మంత్రి,

“మాది కేవలం చదువులకే పరిమితం. మీది అన్ని విభాగాలకి సంబంధించినది. ఇహ రాజ్యాంగం అంటారా? దానిని సవరిస్తే సరిపోతుంది” అన్నాడు ప్రొఫెసర్‌.

“అదెలా సాధ్యం?”

“ఎందుకు సాధ్యం కాదు? మీకు అండదండలు మీ కులం ప్రజలే అంటూ మీరు నాయకులవలేదా? మా కులం మనుష్యులకి అండదండలు ఉన్నాయి, మార్చండి రాజ్యాంగాన్ని” అంటూ దూసుకువచ్చేడు ప్రొఫెసర్‌.

విసుగుగా పేజీ తిప్పేడు రాఘవ. అవును రాజకీయ నాయకత్వం వంశపారంపర్యం అయినపుడు ఉద్యోగాలు వంశ పారంపర్యం చేయండి అన్నది విచిత్రమైన కోరికా? రాజకీయ నాయకులు ప్రజలకి ఎంత సేవ చేస్తున్నారు, పాఠం చెప్పని ప్రొఫెసర్లు అంతే సేన చేయగలరు! అనుకుంటుంటే పనిమనిషి వచ్చి, “అయ్యా! మానస అమ్మగారు, మీరు చదవడం పూర్తయితే పేపరు ఇమ్మన్నారండీ,” అంటూ నిలబడింది. పేపరు మడత పెట్టి, దానిని పనిమనిషికి అందిచ్చేడు. రాఘవ, మానసల మధ్య ఒకే ఒక లింక్‌ ఈ పేపర్‌. రాఘవ పేపర్‌ చదవడం పూర్తయ్యేక, పనిమనిషి పట్టుకెళ్ళి దానిని మానస కిచ్చి, సరిగ్గా ఒక గంట గడిచేక దానిని తీసుకువస్తుంది. కాకతాళీయంగా మొదలైన ఈ సీన్‌ గత మూడేళ్ళుగా నడుస్తూనే ఉంది. మొట్టమొదటిసారి, పేపర్‌ కావాలని అభ్యర్థిస్తూ మానస పంపిన చీటీ ఇంకా తన దగ్గరే ఉంది, గుండ్రపుటి అక్షరాలతో క్లుప్తంగా కుదించి లాసిన రెండే రెండు వాక్యాలు తనని అకర్షించేయి. మానస భర్త అకస్మాత్తుగా బస్‌ ప్రయాణంలో మరణించిన రెండు సంవత్సరాలకి కాబోలు ఆ చీటీని పంపింది. ఆ కాలంలోనే మానసకి పనిచేసే నర్సమ్మ తనకీ పనిచేస్తానంటే, రవ్వంత నిరాసక్తతతో పనిలోనికి పెట్టుకున్నాను. బాలాజీకి ఇంకా ఏమీ ఉద్యోగం దొరకలేదు, ఉద్యోగ 2222222222 కచ్య కు చంచ్తుడు క

అవకాశాలు తెలిపే పేపరవసరమయింది. నష్టపరిహారం, ఇన్సూరెన్స్‌ నుంచి వచ్చిన పైకంతో మానస ఇల్లు క్లుప్తంగా నడిపేది కాబోలు. ఏక్సిడెంట్‌ అవక ముందు, మానస భర్త ఉంటున్న స్లాట్‌ కొన్నాడని తెలిసింది. బాలాజీకి బేంక్‌లో ఉద్యోగం రాని దశలో, మానస చిన్నపిల్లల స్కూల్లో పనిచేసందని నర్సమ్మ తనకి ఒకసారి చెప్పింది. .

“ఆ అమ్మగారికి ఒంట్లో నలతగా ఉందండి, మీ దగ్గర జౌరానికి మాత్రలు ఉన్నాయేటండి?” అంటూ నర్సమ్మ ఎదురుగా నిలబడింది.

“ఇవి పని చేస్తాయో లేదో, అంటూ నాలుగు క్రోసిన్‌ మాత్రలు అందిచ్చి, “జ్వరం ఎక్కువగా ఉందా?” అనడిగేడు.

“లేదండి, కాని ఈ మధ్య అమ్మగారికి తరచూ జొరం వస్తోంది", అంటూ నర్సమ్మ వెళ్ళిపోబోయింది.

మానసకి ఒంట్లో బాగులేదని తనకి తెలియదు. కాని రాథ్రిళ్ళు మానస దగ్గు తనకి తరచూ వినిపిస్తోంది.

“దాక్టర్‌ దగ్గరకి వెళ్ళలేదా?” అనడిగేడు రాఘవ.

“ఆ యమ్మ డాక్టర్‌ దగ్గరికి ఎప్పుడెళ్ళేరు కనుక? అదే తగ్గిపోతుందంటారు", అని వెళ్ళిపోయింది నర్సమ్మ.

కొడుకు, కోడలు దూరంగా కాపురానికి వెళ్ళాక మానస ఒంటరిదయింది - రాక్రుళ్ళు మానస దగ్గు శబ్దం ఎక్కువగా వినిపించినపుడు, “రేపు వెళ్ళి ఆమెని దాక్టర్‌ దగ్గరికి వెళ్ళమని చెప్పాలి”, అనుకుంటూ పదిహేను రోజులు గడిచేయి. చెప్పలేక కాదు, కాని చెబితే ఏమనుకుంటుందోనని వెనుకంజ వేసేడు.

“అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోనారు, ఒకసారి వస్తారా?”, అంటూ నర్సమ్మ వచ్చింది, ఒక సాయంకాలం. గబగబ బట్టలు వేసుకుని క్రిందకి దిగాడు రాఘవ. మంచానికి బల్లిలా అంటుకుని ఉంది ఒక స్రీ. కళ్ళు తెరచి మాటలాడడానికి శక్తి లేక మూలుగుతోంది ఆ స్రీ. ఆ స్హ్రీ నుదుటని చేయి వేసి చూస్తే, నుదురు వెచ్చగా తగిలింది రాఘవ చేతికి.

“నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్‌ని తీసుకువస్తాను”, అంటూ బాగ్గా పరిచయమున్న డాక్టర్‌ సంపత్‌ ఇంటి వేపు నడిచేడు రాఘవ. అరగంట తరువాత డాక్టర్‌ సంపత్‌ వచ్చేసరికి నిద్రలోనే ఆయాసపదుతోంది మానస. ఆమెని పరీక్షించిన డాక్టర్‌ సంపత్‌, “ఈమె చాలా వీక్‌గా ఉంది. ఊపిరితిత్తుల ఎక్స్‌రే, రక్తపరీక్ష చేస్తే కాని నిర్ధారణగా ఏమీ చెప్పలేను. ముందు బలానికి మందు రాసిస్తాను. భయపడడానికి ఏమీ లేదు”, అంటూ మందులు రాసి వెళ్ళిపోయేడు.

దాదాపు అపస్మారక దశలో ఉన్న మానసకి బలవంతంగా పళ్ళరసం, టానిక్‌లు తాగించేకగాని ఆమెకి ఇంటిలో నడిచే శక్తి రాలేదు.

“అనవసరంగా మీకు ఇబ్బంది కలిగింది”, అంటూ పదే పదే మథనపడుతున్న మానసకి ఏం చెప్పాలో తెలియలేదు రాఘవకి.

“ఆయన రెండు రాత్రుళ్ళు ఇక్కడే పడుకున్నారు", అంటూ వివరించింది పనిమనిషి కృతజ్ఞతా పూర్వకంగా రెండు చేతులు జోడించి,రాఘవకి నమస్కరించింది మానస.

క కథా వారని - 2 004 22222222ఊ2ఊడతైతతైతైఊఊడేడేడడఊఊఊఊఊఊఊ2ఊ2ఊఊఊ2ఊఊఊఊ222ఊ2ెడే

“దానిదేముంది, మనిషికి మనిషి సాయం కష్టాలలో ఉన్నపుడే కదా! మీరు తయారయితే, ఎక్స్‌రే, బడ్‌ టెస్ట్‌లు ఈవేళ ముగిద్దాం” అన్నాడు రాఘవ. "

“అవన్నీ ఇప్పుడు ఎందుకు? నేను కోలుకున్నాను”, అంటూ దాటవేయబోయింది మానస. కాని రాఘవ ఊరుకోకపోవడంతో, మానసకి రెండు పరీక్షలు జరిగేయి.

“ఇది టి.బి. ప్రారంభ దశ. టాబ్లెట్లు రాసి ఇస్తాను. దీనికి ముఖ్యమైన మందు బలమైన ఆహారం. రెండు నెలల్లో మీరు మళ్ళీ మామూలవుతారు”, అంటూ మందులు రాసి ఇచ్చేడు దాక్టర్‌ సంపత్‌.

మందులు వేసుకుంటున్నా, రాత్రుళ్ళు దగ్గు తగ్గడానికి దాదాపు ఇరవై రోజులు పట్టింది. రెండు నెలల తరువాత కాని మానస కళ్ళలో పూర్తి కళ రాలేదు.

“మీరు ఇహ టాబ్లెట్లు మానేసి, టానిక్‌లు రెండు నెలలు వాడండి”, అంటూ కొత్త టానిక్‌లు రాసేడు దాక్టర్‌ సంపత్‌,

“ఈ జబ్బుకి ట్రీట్‌మెంట్‌ ఆరంభమైనప్పటినుంచి, అడపా తడపా మీరు డబ్బు ఖర్చు పెట్టేరు. చాలా థాంక్స్‌. ఆ డబ్బు ఇవ్వగలను కాని, ఆ సహాయం విలువ తీర్చలేను. దయచేసి మీరు నా గురించి ఎంత ఖర్చుపెట్టారో చెప్పంది, అంటూ రాఘవని అడిగింది మనాస్స;

“దానిదేముంది? చిన్న చిన్న ఖర్చులు” అంటున్న రాఘవని ఆపి, “ఎంత ఖర్చు పెట్టారో చెప్పకపోతే నన్ను అవమానిం చినట్లేో" అంది మానస.

సుమారు ఐదు వందలు ఖర్చుపెట్టానని రాఘవ చెప్పక తప్పలేదు.

“ఇదిగో మూడు వందలు. మిగతా రెండు వందలు త్వరలో తీరుస్తాను, అంది మానస. ఆ మూడు వందలు ఇచ్చేక మానస మొహంలో ఒకరకమైన శాంతి చోటుచేసుకున్నట్లనిపించింది రాఘవకి.

మానస మామూలవడానికి ఐదు నెలలు పట్టింది. ఆ కాలంలో ఒకే ఒక్కసారి బాలాజీ భార్యా సమేతుడై వచ్చి రెండు రోజులుండి వెళ్ళిపోయేడు. జబ్బుపడి కోలుకుంటున్నా ఇంటిలో పనంతా మానసదే. మానసకి వచ్చిన జబ్బు తీవ్రత తెలియకో, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం అనవసరమనో ఏమో కాని సరళ ఏమీ కల్పించుకోలేదు.

“అమ్మా, నీకు పెన్సన్‌ వస్తుంది. కాని అది నీకు చాలదు. అయినా ఎలాగో సర్దుకుంటూ ఇక్కడే అవస్థపదతావు. ఈ ప్లేట్‌ అమ్మేసేయ్‌. నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నీకు తోడు అవసరం, నాతో వచ్చేసేయ్‌. సరళ తల్లిదండ్రులకి ఆమె ఒక్కర్తే కదా, అందుకు వాళ్ళు మాతో ఉంటున్నారు. అలాగే నువ్వు కూడా ఉంటావు. ఈ స్లేట్‌ అమ్మగా వచ్చిన డబ్బు, నాకు బ్యాంక్‌ ఇచ్చే లోన్‌తో కలిపితే మంచి ఇల్లు కట్టుకోవచ్చు” అన్నాడు.

“నవ్వు చెప్పినది అంతా నిజం, రావాలనే ఉంది. కాని రాలేను. నా శరీరంలో ఇంకా సత్తువ కాస్త మిగిలి ఉంది. నేను ఒక గది వాడుకుంటూ, ఒక గదిని అద్దెకి ఇద్దామను కుంటున్నాను. అలా కొన్నాళ్ళు గడవనీ, తరువాత నువ్వు చెప్పినట్లు చేయడం గురించి ఆలోచిస్తాను,” అంది మానస.

“నవ్వు ఎవ్వరు చెప్పినా వినవు. అయిన్నా ఆలోచించు మరోసారి” అంటూ మౌనం వహించేడు డక రసల శంటుదుక్ష

(౭ క బాలాజీ.

బాలాజీ వెళ్ళిపోయిన నాలుగు రోజులకి, “బాలాజీతో మీరు వెళ్ళి ఉంటే, అన్ని విధాలా మీకు బాగుండేదేమో” అంటూ బాలాజీ ప్రతిపాదనని తిరిగతోదేడు రాఘవ.

“*ఫ్రతివాదన బాగుంది, దూరం నుంచి ఇంకా బాగుంటుంది. కాని దానిలో దిగేక గతుకలు అవగాహనకి వస్తాయి. బాలాజీ దగ్గరికి వెళ్ళి ఉండడం నాకు వాంఛనీయమే, అనందదాయకమే, కాని అక్కడికి వెళ్ళేక నాకు విశ్రాంతి దొరకదు. మా వియ్యపురాలు నా కంటే ఏమీ ఆరోగ్యవంతురాలు కాదు. సరళ గురించి నాకు బాగా తెలుసు. అక్కడికి వెళ్తే ఇంటి పనంతా. నా మీదే పడుతుంది. ఈ ప్లేట్‌ అమ్మేసి అక్కడికి వెళ్తే, నా పని సరి, అంది మానస బరువుగా.

“ఇక్కడ సహాయం మీకు అవసరమైతే ఎవరు చేస్తారు?” అనడిగేదు రాఘవ.

“ఇప్పుడు ఏం జరిగింది? మీరు వచ్చి సహాయం చేయలేదా? మీరు నిజంగా నన్ను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళమంటారా?” అంది శుష్కించిన కళ్ళతో పరీక్షగా రాఘవ వేపు చూస్తూ.

“మానవ జీవితాలు నీటి బుడగలవంటివి అంటారు. అవి ఎప్పుడు పగులుతాయో చెప్పలేం. సహాయం చేద్దామని ఉన్నా కాలం అనుకూలించకపోవచ్చు. మీకంటూ ఉన్న వ్యక్తులు దగ్గరికి వెళ్తే మీకు అవసరమయినంత కాలం ఆధారం ఉంటుందేమో - ఆలోచించండి మరోసారి, అన్నాడు రాఘవ,

“గతంలో నా గురించి నేను పట్టించుకోలేదు. ఈ మధ్య వచ్చిన జబ్బు నయమయేక, ఎందుకో జీవించాలన్న కోరిక ఉద్భవిస్తోంది. మున్ముందు కాలం నన్ను ఎలాంటి మెలికలు తిప్పుతుందో చూద్దాం” అంటూ సంభాషణ ఆపింది మానస.

బాలాజీ దగ్గరికి వెళ్ళడం గురించి ఎంత ఆలోచిస్తోందో తెలియదు కాని మానస దాని గురించి మళ్ళీ ప్రస్థావించలేదు.

మూడు నెలలు గడిచేయి.

యథాప్రకారం పనిమనిషి వచ్చి, “మీరు పేపర్‌ చదవడం పూర్తయితే మిమ్మల్ని అడిగి పేపరు తెమ్మన్నారు, అంటూ యథాఫ్రకారంగా నిలుచుంది. పేపర్‌ అందిచ్చేడు రాఘవ.

అరగంట గడిచింది.

“ఏమిటి ఈవేళ పేపర్‌ చదవకుండా నాకు ఇచ్చేసేరు?” అంటూ చేతిలో స్టీల్‌గ్లాసుతో వచ్చి తలుపు దగ్గర నిలుచుంది.

మానస అలా మీదకి రావడం అదే మొదటిసారి. ఏం మాట్లాడాలో తెలియక ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు రాఘవ. సీతాకాలం ఉదయం ఎండ ఇంకా (ప్రజ్బరిల్లలేదు. సూర్యుడు మెల్లగా తన కిరణాలతో మానసని ముద్దుపెట్టుకుంటున్నాడు. గంధపు రంగు చీర మీద పడిన కిరణాలు, చీరకి అంటుకుని, వెలుతురుని కరిగించుకుంటున్నాయి.

“లోపలికి రమ్మనరా?”, అంటూ లోపలికి వచ్చింది మానస. కాలు ఎత్తి, గుమ్మం దాటి క్రిందకి ఆన్బినప్పుడు పట్టీలకున్న మువ్వల శబ్దం లీలగా గదంతా వ్యాపించింది. తెల్లని పాదాలకి సీలం రంగు హవాయి చెప్పులు రాఘవ మసక కళ్ళక్‌ కనిపించేయి.

“నే అడిగిన దానికి సమాధానం ఇవ్వలేదు”, అంటూ గ్లాసందించిం్తద్రి మానస.

2 భ౮ం-104 2122222222

“లోపలికి రమ్మని చెప్పేలోగా మీరు లోపలికి ్రవేశించేరు, ఇదేమిటి?” అంటూ గ్లాసందుకున్నాడు రాఘవ.

“నే కాచుకున్న కాఫీ కాస్త ఎక్కువయితే తెచ్చేను, ఇంతకీ పేపర్‌ ఎందుకు చదవలేదు?” అనడిగింది మానస.

రాఘవ కాస్సేపు తటపటాయించి, “ఈ మధ్య కాలంలో పేపర్‌ చదవడం కష్టమవుతోంది, అక్షరాలు సరిగ్గా ఆనడం లేదు. కేటరాక్ట్‌ కాబోలు. ఈ వయస్సులో ఇది సామాన్యమే, అన్నాడు.

“వ్వీరు కాఫీ తాగుతూ ఉండండి, పేపర్‌ నే చదివి వినిపిస్తాను”, అంటూ పేపర్‌ చదవడం మొదలు పెట్టింది. (శ్రావ్యమైన కంఠంతో, స్వచ్చమైన ఉచ్చారణతో మానస పేపర్‌ చదువు తుంటే, ఆ కంఠం వింటుంటే రాఘవ మనస్సు ఆనందంతో గంతులు వేసింది.

ఆరగంట గడిచేక పేపర్‌ మడత పెట్టి కుర్చీ మీద ఉంచింది. పేపర్‌ విప్పకుండా ఉన్నప్పుడు ఎలా మడతలు ఉంటాయో అలాగే మడతలు పెట్టింది. పేపర్‌ విప్పి చదివేరా? అనిపించేలా ఉన్న పేపర్‌ని, దానిని సర్ది ఉంచిన మానసని పరీక్షగా చూసేదు-రాఘవ. ఈమె ఏ పని చేసినా విశిష్టంగా ఉంటుంది, అనుకున్నాడు రాఘవ.

“ఏదో ఆలోచనలో పడ్డారు, నే వెళ్ళి కాస్త ఉదకేసుకోవాలి” అంటూ రాఘవకి అందిచ్చిన కాఫీ గ్లాసుతో లేవబోయింది మానస.

“ఈ కడుపు బాధ లేకపోతే ఈ లోకం ఎంత భిన్నంగా ఉండేదో! అరగంట ఆలస్యంగా వండుకుంటే వచ్చే పెద్ద నష్టమేమీ లేదు” అంటూ కడుపు మీద కొట్టుకున్నాడు రాఘవ.

నీటికి అద్దుగా కట్టిన డామ్‌ ఒక్కసారి తెగితే బయటపడే ప్రవాహంలా, నోరు విప్పి పగలపడి నవ్వసాగింది మానస. కంఠనాళం ఉబ్బింది, రక్తం మొహంలోనికి తన్నుకు వచ్చింది. ఉదయిస్తున్నపుడు సూర్యుడు ఆకాశం మీదకి క్రమంగా, త్వరితంగా విస్తరింపడేసే అరుణవర్జంలా మానస మొహం లోనికి రక్తం తన్నుకు వచ్చింది. గంధపు రంగు చీర, మీదని తెల్లని శరీరం, అరుణవర్ణం దాల్చిన మొహం! వింత రంగుల కలయిక! ఆశ్చర్యం ముప్పిరికొనగా నోరు వెళ్ళపెట్టేడు రాఘవ. పైటచెంగుని నోటికి అడ్డంగా పెట్టుకుని, తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూ, కుర్చీలో చతికిలపడి, తమాయించుకోవదానికి ప్రయత్నిస్తోంది మానస. _

గతంలో మానసని తను చాలాసార్లు చూసేడు. కాని ఈ మానస వింతగా కనిపిస్తోంది. ఏభై ఏళ్ళు పైబడ్డ ఈ మానస లోంచి, నిబిడీకృతమై దాగుకుని ఉన్న టీనేజర్‌ బైటకి తన్నుకువస్తూ కేరింతలు కొడుతోంది.

ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ చిత్తురువల్లే ఉండిపోయేడు రాఘవ.

“ఏమిటి అలా చూస్తున్నారు?”, అంటూ మామూలు మనిషైంది మానస.

*కవేళ కొత్త మానసగార్ని చూసేను”, అన్నాడు రాఘవ.

విచిత్రంగా చూసింది మానస.

“ఇమ్మా, పని అయిపోయింది, నే వెళ్ళేదా?”, అంటూ పనిమనిషి వచ్చి అడగగానే,

“ఈ గ్లాసులు కడిగేసి వెళ్ళిపో,” అంటూ పనిమనిషికి పురమాయించి లేచింది మానస. 222222222111ఊఊఊఊఊఊఊ2ఊ22ఊఊ2222222ేసుబ శంట్రుదుకై

మానస వెళ్ళేక పరధ్యానంగా పేపరందుకున్నాడు రాఘవ.

మసక మసకగా అక్షరాలు, అందులో కుడి కన్ను దృష్టి మాద్యం మరీను. మనుష్యులతో మసలడానికి ఇబ్బంది లేదు కాని, చదవడం అసంభవం అనిపించింది రాఘవకి. ఇంకెన్నాళ్ళు ఆగాలో? కంటికి ఆపరేషన్‌ కంటి పొర బాగా ముదిరితే కాని చేయనన్నాడు దాక్టర్‌. కళ్ళ పరిస్థితి ఇంకా పూర్తిగా దిగజారలేదు. ఆపరేషన్‌ అయి, ఒక కన్ను మామూలయేంత వరకు దినకృత్యాలు సవ్యంగా చేసుకోవడానికి తనకి సహాయం కావాలి. ఈ సమయంలో తను కూతురు దగ్గరకి వెళ్తే ఆపరేషన్‌ జరిగేవరకు అక్కడే ఉండవచ్చు, అనిపించినా వెన్వెంటనే కూతురు, అల్లునితో నడిచిన గతం ఆ ఆశని తృంచింది. జీవితంలో మొట్టమొదటిసారి రాఘవకి రేపటి గురించి వ్యాకులత మొదలయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. పరిస్టితి ఇంకా హీనస్టితికి రావడానికి వ్యవధి ఉందని ఆ సమస్యని మెదడులోంచి వెనక్కి నెట్ట ప్రయత్నించినా వీలవక మధనపడసాగేడు రాఘవ. ఆలోచనలు మెదడుని కొరికేస్తుంటే వంట వండుకోవడానికి తగినంత ఉత్సాహం లేక, ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం ఉదకేసుకుని, ఆవకాయ, పెరుగుతో భోజనం కానిచ్చి నిద్రకి ఉపక్రమించేడు రాఘవ.

ప్రతీరోజూ ఉదయం సుమారు పది గంటలకి మానస కాఫీ కప్పుతో వచ్చి కూర్చుని పేపర్‌ చదివి వినిపించడం మామూలయింది. చిక్కని చక్కని కాఫీ అంటే ఇష్టపడే రాఘవకి ఉదయపు పూట మానస కోసం ఎదురు చూడడం ఒక కొత్త అనుభూతి. రోజు త్వరితంగా గడిచిపోవడానికి అది ఎంతో ఉపకరించడంతో మధ్యాహ్నం తిండి తిని కాసేపు నిద్రపోతే పగలు గడిచిపోయినట్లే, అయితే సాయంకాలం, దృష్టి సరిగ్గా అమరకపోవడంతో, చాలా అసహనంగా వెళ్లోంది. సాయం కాలం కూడా మానస వచ్చి కాస్సేపు కూర్చుని కబుర్లు చెబితే బాగుండునని చాలాసార్లు అనిపించినా, ఛ! ఆమెని ఎలా అడగను? అన్న ప్రశ్న దానిని చంపి రాఘవని నిరాశతో ఉంచుతోంది.

సాయంకాలం, యథాప్రకారం చీకటిని తోడు తెచ్చుకుని, రాఘవ చుట్టూ నిస్సహాయతని, ఒంటరితనాన్ని పూర్తిగా కప్పేసింది. వోల్టేజ్‌ తక్కువగా ఉండడంతో గదిలో బల్స్‌ కాంతివిహీనంగా ఉంది, దానికితోడు కంటి పొర కాంతిని ఇంకాస్త వడకడుతోంది. కాస్సేపు నడిస్తే, ఏకాంతం బాధ తగ్గుతుందేమోనని, బాల్మనీలోనికి వచ్చి నిలుచున్నాడు. ఎదురుగా, చిక్కని చీకటిలో దూరంగా లైట్ల వెలుతురు, ఆకాశంలో దూరంగా ఉన్న నక్షత్రాలూ మినుక్‌ మినుక్‌ మని వెలుగుతున్నాయి. వరద నీళ్ళలో ఛాతీ వరకు నీళ్ళు వచ్చి, నీటి మట్టం పెరుగుతుంటే, ఉక్కిరి బిక్కిరి అయినట్లు, ఎదురుగా ఉన్న చీకటి బంకమన్నులా శరీరమంతా అంటుకుని భయాన్ని కలిగిస్తోంది. ఒక్కసారి రాఘవ మెదడులోనికి, 'నేను ఎందుకు టబ్రతికిఉన్నాను?” అన్న ప్రశ్న ఉద్భవించింది. బైట వాతావరణ (ప్రభావమేమో, మెదడుని కుదిపిన ఆ ప్రశ్న ప్రభావమేమో కాని శరీరమంతా గగుర్పొడిచింది. దాని గురించి ఆలోచించేలోగా క్రింద మానస పోర్చన్‌ నుంచి మాటలు మందంగా వినిపించసాగేయి. ,

“ఎన్నాళ్ళమ్మా? మీ ఇంటికి వచ్చి లేదనిపించుకుంటూ వెళ్ళడం ఇది నాల్లవసారి”, అంది ఒక కంఠం. దానికి జవాబు ఏమీ వినపడలేదు రాఘవకి. చై కథారిని- 2004 మైతే

లాయి

“మీరు ఏదో ఒకటి చేసి తొందరలో నా బాకీ తీర్చేయాలి. నేను పిల్లలుకలవాడిని, చిల్లర పద్దుల మీద ఆధారపడి వ్యాపారం చేస్తున్నవాడిని. ఇలా అయికే నేను చాలా ఇబ్బందులలో పడతాను. మీరు ఆలోచించండి”, అన్నాడు. మాటలు బట్టి, ఆ కంఠం ఇంటికి సరుకులు వేసే షావుకారిదని తెలిసింది రాఘవకి.

“మా అబ్బాయికి రాసేను, త్వరలో డబ్బు వస్తుంది. మీ బాకీ తీర్చేస్తాను. అది రాకపోతే, ఈ ఇంటిలో ఒక గదిని అద్దెకిచ్చి అయినా మీ బాకీ తీర్చేస్తాను, నన్ను నమ్మండి” అన్న మానస అభ్యర్థన వినిపించగానే రాఘవలో ఒక్కసారి విషాదం ముప్పిరికాంది.

మానసకి డబ్బు ఇబ్బంది ఉందని చూచాయగా తెలిసినా, పరిస్థితి ఇంత విషమంగా ఉందని ఈషణ్మాత్రం తనకి తెలియదు. స్వతంత్రంగా, ఇంకొకరి ప్రమేయం లేకుండా అలవాటు పడ్డ మానసకి, ఆఖరికి ఇంటిలో ఒక గది పరాయి వ్యక్తికి అద్దెకిచ్చేంత కటకటగా ఉందా? ఆ సంగతి తనతో మానస ఒక్కసారి అయినా ప్రస్తావించలేదు, అనుకుంటుంటే, 'మానస తన ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించడానికి తను ఆమెకి ఏమౌతొడు కనుక? అదొక్కటే కాదు, తనకీ ఈ మధ్య నెలసరి ఆదాయం కురచయింది. బాంక్‌ ఇంటరెస్ట్‌ తగ్గించడంతో తనకీ అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బంది ఎదురవుతోంది. ఈ సంగతి ఆమెకి తను చెప్పేడా? మానసతో తనకి కేవలం పరిచయం, మహా అయితే గాఢ పరిచయం, స్నేహం, అంతే. కష్ట సుఖాలు పంచుకోతగినంత చనువు ఎక్కడుంది?”, అని రాఘవ మానసని సమర్ధించబోతుంటే, చటుక్కున, మానస సూచించిన పరిష్కారం మనసులోనికి వచ్చింది. 'మానసకి ఒక మంచి అద్దె మనిషిని చూసి పెట్టాలి. ఇంతకీ ఒక గది అద్దెకివ్వడానికి ఎంత అద్దె కావాలంటుందో!, అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. వెంఠనే క్రిందకి వెళ్ళి వివరాలు కనుక్కుందామనిపించినా, కాళ్ళ నొప్పులు, దానికి జతగా దృష్టి మాంద్యం అన్న సంగతి జ్ఞాపకానికి వచ్చి ఆ ప్రయత్సం విరమించేడు రాఘవ.

ఉదయం తెల్లవారేలోగా మానస గది అద్దెకివ్వడం గురించి అలా ఆలోచిస్తూనే ఉన్నాడు. వైవిధ్యం లేని ఆలోచనలు, కొలిక్కిరాని ఆలోచనలు, ఎంతకీ తెగని ఆలోచనలు రాఘవ మెదడుని వేదెక్కించి నిద్రని దూరం చేసేయి. బహుశా రాత్రి రెండు గంటలయిందేమో! మానస పోర్షన్‌లోంచి మళ్ళీ దగ్గు శబ్దం వినిపించింది. క్రిందకి వెళ్ళి ఏమైనా సహాయం కావాలేమో కనుక్కుందామని పించినా, అంత రాత్రి వెళ్ళడానికి శక్తి లేక, పరుపు మీద అటూ, ఇటూ అసహనంగా కదిలేడు రాఘవ. ఫలితంగా నిద్ర నుంచి లేచేసరికి బాగా ఆలస్యమైంది.

“ఏమిటి ఈవేళ ఇంత ఆలస్యంగా లేచేరు? ఆ కళ్ళేమిటి బాగా తాగేసి నిద్రపోని వాని కళ్ళలా ఉన్నాయి, ఏమైందేమిటి? జ్వరం కాని వచ్చిందా?, అంటూ “ప్రశ్నల వర్షం కురిపిస్తూ కాఫీ గ్లాసుతో వచ్చి కుర్చీలో కూర్చుంది మానస.

“రాత్రి దగ్గు వలన మీకూ నిద్ర పట్టలేదేమో”, అన్నాడు రాఘవ.

“నా దగ్గు వలన మీకు నిద్ర కరువయిందా? సారీ, అంటూ నొచ్చుకుంది మానస.

“మ్సీక్షు సహాయం అవసరమయితే నా దగ్గర తీసుకోవచ్చు కదా? ఆ షావుకారుతో అలా అన్ని మాటలు అనిపించు కోవాలా?” అన్నాడు రాఘవ. 2222222222 పలు ఎంప్ససుక్త

మానస తల వంచుకుంది, బహుశా లీలగా కంటిలో తిరిగిన కంటి తడిని కప్పిపుచ్చు కోవడానికేమో! రాఘవ ఏమీ రెట్టించకుండా కాఫీ త్రాగడం ముగించి, “నాకు తెలిసిన ఒక చిన్న కుటుంబం అద్దె కోసం తిరుగుతున్నారు. వాళ్ళకి కావలిసనది ఒక గది మాత్రమే. తాత్మాలికంగా మీరు గదిని వాళ్ళకి అద్దెకిస్తానంటే కబురుపెడతాను. మీకు ఆ గదికి ఎంత అద్దె కావాలి? షరతులేమిటి? ఆసలింతకీ గది అద్దె కిస్తారా?”, అంటూ కాఫీ కప్పు క్రింద ఉంచేడు రాఘవ.

“షావుకారుతో ఆ మాట అన్నాను కాని, దాని గురించి ఏమీ ఆలోచించలేదు. మీరంటున్న కుటుంబానికి ఇక్కడ సదుపాయంగా ఉంటుందో, లేదో? నాలుగు వందలు అద్ది ఎక్కువంటారా? తాత్మాలికంగా అంటున్నారు కాబట్టి నచ్చకపోతే ఇంకో చోటు చూసుకుంటారు. మా అబ్బాయి దగ్గర నుంచి డబ్బు వస్తే తరువాత అద్దెకి ఇవ్వనవసరంలేదు”, అంది మానస.

“అయితే వాళ్ళకి కబురుపెడతాను”, అన్నాడు రాఘవ. ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

రెండు నెలలు గడిచేయి, ఆ రెండు నెలలో రెండు కుటుంబాలు అద్దెకి దిగి, ఖాళీ చేసి వెళ్ళేరు.

“మీకు ఎవ్వరూ నచ్చడం లేదు. అద్దెకు ఉందేవాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలో చెప్పేయండి. అద్దెకి ఇచ్చి అశాంతితో బ్రతకడమెందుకు” అనడిగేడు రాఘవ.

“నేను ఎలాంటి మనుష్యులతోనైనా బ్రతికేయగలను. నో ప్రాబ్లెమ్‌. కాని ఆ వచ్చిన వాళ్ళే ఏమిటో బాగా లేరు. మొదట యువదంపతులు ఒకర్ని చూసి ఇంకొకరు ఒకే ముసి ముసి నవ్వులు. స్నానాల గదిలోనికి ఒకరుండగా ఇంకొకరు జొరపడడం, నేను కనిపించగానే ముకుళిం చుకుపోవడం, రా్రుళ్ళు బాగా గొడవ. అబ్బ! తెగ ఇబ్బందిగా ఉండేది. ఇహ రెండవ కుటుంబం, ఎప్పుడూ కీచులాటే. అయినదానికి, కానిదానికి తగువే. అది భరించలేక తలనొప్పి వచ్చేది అంటూ తల పట్టుకుని, “ఇంటిలో అద్దెకి ఉన్న వ్యక్తులు నాతో కలివిడిగా ఉండాలి. నాతో కబుర్లు చెప్పాలి, నే చెప్పే కబుర్లు ఉత్సాహంగా వినాలి. అవసరం పడితే నాకు సహాయం చేయాలి, అలాగే నా అవసరం పొందాలి, సూక్ష్మంగా చెప్పాలంటే మీలా ఉండాలి", అంది మానస గలగలా పదాలని బైటకి గుప్పించి చేతులు ఊపుతూ.

ఒక్కసారి రాఘవ మనస్సు వశం తప్పింది.

“నాలా ఉండడం మాబేమోకాని, గత రెండు నెలలుగా మీరు మేడ మీదకి రావడం బాగా తగ్గింది. మా అమ్మాయి ఉన్నప్పుడు, ఆమె పెళ్ళికి ముందర, ఈ పోర్షన్‌ అద్దెకి తీసుకున్నాను. ఇప్పుడు ఇంత పోర్షన్‌ నాకు అనవసరం. తక్కువ అద్దె ఉన్నచోటుకి మారిపోవచ్చు. కాని ఎక్కడికో వెళ్ళిపోతే నాకు సహాయం చేస్తున్న ఒకే ఒక వ్యక్తికి దూరమవుతాను, అది నాకు ఇష్టం లేదు. ఖర్చు తగ్గించడానికి, అన్నీ పరిష్కారం చేసుకుని మా అమ్మాయి దగ్గరికీ వెళ్ళిపోవచ్చు”, అన్నాడు రాఘవ.

“ఖర్చు తగ్గించడానికి ఇంకో మార్గం "ఉంది", అంది మానస.

“ఏమిటది?” అనడిగేడు రాఘవ.

“ఈ పోర్షన్‌ ఖాళీ చేసి నా పోర్షన్‌లో ఉన్న ఒక గదిలోనికి మీ సామాన్లు స్టీోయడమే", క భరూం-1౧4 222222

అంది మానస ఉత్సాహంగా.

“అది నాకు ఆనందదాయకమే. కాని ఆ నిర్ణయం తీసుకునే ముందు, బాంక్‌ నుంచి వడ్డీ పైకం తక్కువ అవడంతో, ఖర్చు తగ్గించడానికి చిన్న పోర్షన్‌లోనికి మారుతున్నానని మా అమ్మాయికి తెలియచెప్పాలి. దానికి వచ్చిన సమాధానం బట్టే నా నిర్ణయం మారుతుంది. అద్దెకి దిగే నిర్ణయం తీసుకుంటే రెండు నెలలు అద్దె అద్వాన్స్‌ ఇస్తాను. ఇతర ఖర్చులు సగం సగం పంచుకుందాం. చటుక్కున ఇల్లు ఖాళీ చేయమని అడగడానికి వీలులేదు”, అన్నాడు రాఘవ.

“మరి మీ భోజనం సంగతేమిటి? ఆ గదిలో వంట వండడానికి వీలులేదు”, అంది మానస కళ్ళు పెద్దవి చేసి చేతులు అటూ ఇటూ ఊపుతూ.

“దాని సంగతి తరువాత ఆలోచించవచ్చు, ముందు మా అమ్మాయి ఏమంటుందో చూడదనివ్వండి”, అన్నాడు రాఘవ.

ఇద్దరూ ఆలోచనలో పద్దారు.

“మనకి ఈ జీవితం మీద ఇంత తీపి ఎందుకో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఆశించడానికి ఏమీ లేకపోయినా, సాధించవలసింది ఏమీ కనిపించకపోయినా, జ్వరం వస్తే డాక్టర్‌ దగ్గరికి పరిగెడతాం. కాలికి చిన్న దెబ్బ తగిలితే, అది పెరిగి గేంగరీన్‌గా మారి చావుకు దారి తీస్తుందేమోనని భయపడతాం, మందుల షాపుకి వెళతాం, అంది మానస నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. మానస వేపు విచిత్రంగా చూసేడు రాఘవ. అడ్డున్న కంటి పారని దాటి మానసని పరీక్షగా చూడాలని ఉంధి రాఘవకి, కాని అది సాధ్యపడలేదు. నిన్న తనకి వచ్చిన ఆలోచన ఈవిడకి ఈవేళ రావడం ఎంత యాదృచ్చికం!

“మనకి తెలియకుండా ఏదో ఒక ఆశ మనలో దాగుకుని ఉంటుందేమో, అదే మనల్ని బ్రతికించి ఉంచుతుంది కాబోలు,” అని, “ఇలాంటి ఆలోచనలు ఆవేదనకే దారితీస్తాయి కాని శాంతి నివ్వవు, పేపర్‌ చదవండి. కాంగ్రెస్‌ వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళని, ఇతర పార్టీల వాళ్ళు కొంగైస్‌ పార్టీని తిట్టుకోవడాలు వదిలేసి మిగతా అంశాలు చదవండి", అన్నాడు రాఘవ.

(శావ్యమైన కంఠంతో పేపరు చదవడం మొదలు పెట్టింది మానస.

౨06

ఏప్పుడు తెల్లవారుతుందా? వనజ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం సంగతి మానసకి చెబుదామా? అని తహతహతో ఉన్న రాఘవకి కోడికూత వినిపించింది. పరుపు మీద నుంచి లేచి, కాఫీకి డికాక్షన్‌ వేసి పాలవాని కోసం ఎదురు చూస్తూ ఆలోచనలో పద్డ్దాడు.

కూతురు దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని ఎదురుచూస్తున్న రాఘవకి అల్లుడు రాసిన ఉత్తరం చూసి ఆశ్చర్యమేసింది. మసక మసకగా కనిపిస్తున్న అక్షరాలని పోల్చి చదివేక ఇంకా ఆశ్చర్యం కలిగింది. తను ప్రారంభించిన ఫైనాన్స్‌ కంపెనీ చాలా అభివృద్ధి చెందిందని, కాంట్రాక్ట్‌ పద్ధతి మీద ప్లాట్స్‌ కడుతున్నానని, తనతో ఆఫీసులో పనిచేస్తున్న వనజ బిజీగా ఉందడం వలన తను జవాబు రాస్తున్నాడుట. ఖర్చు తగ్గించడానికి చిన్న ఇంటిలోకి మారదాన్ని తను వనజ సమర్థిస్తున్నామని, కొత్త తడ్రసు తెలియపరచవలసిందని రాసేడు. కాటరాక్ట్‌ సమస్య గురించి ప్రస్తావించకుండా, “అనాడు మీరు ఫైనాన్స్‌ కంపెనీలో డబ్బు పెట్టి ఉంటే ఈనాడు ఈ ఇరకాట తతత 22 రక్యటి సంపుడుకై

(తల్లి (| పరిస్థితి వచ్చేది కాదు” అంటూ ముగించేదు.

“నీళ్ళ పాలు పోస్తున్నావు”, అంటూ పాలవాని దగ్గర పాలు పోయించుకుంటూ వాస్తవంలోనికి వచ్చేడు రాఘవ.

“మీ మొహం ఎందుకో వెలిగిపోతోంది, బాంక్‌ ఇంటరెస్ట్‌ రేట్‌ పెంచిందా?” అంటూ కాఫీ కప్పు అందించి, పేపరందుకుంది మానస.

“మా అల్లుడు, నేను చిన్న పోర్షన్‌లోనికి మారడాన్ని సమర్ధిస్తూ ఉత్తరం రాసేదు. నా కేటరాక్ట్‌ గురించి ప్రస్తావించలేదు", అంటూ కాఫీ చప్పరించేడు రాఘవ.

“నిజం, అంటూ బుగ్గ మీద చేయి వేసుకుంది మానస.

“పది గంటలకి బాంక్‌కి వెళ్ళి మీకు ఇవ్వవలసిన అడ్వాన్సు పట్టుకువస్తాను. ఇల్లు ఖాలీ చేస్తున్నానని ఇంటి యజమానికి చెప్పేయాలి. కావలసిన సామాన్లని సర్దాలి. మీ ఇంటిలో నేను అద్దెకి దిగేముందు, తరువాత ఘర్షణలకి దారి తీయకుండా ఉండడానికి అన్నీ సవిస్తరంగా ముందరే మాటలాడుకోవాలి”, అన్నాడు రాఘవ.

సూర్యరళ్ళి మానస మొహం మీద పదుతుందో ఏమో కాని, మానస మొహం వెలుగుతో నిండిపోయి ఉంది.

ధం చి

“రేపు మీ అబ్బాయి వస్తున్నాడు, నేను ఈ ఇంటిలో అద్దెకి ఉంటున్నానని బాలాజీ గ్రహించగానే ఎలా రియాక్ట్‌ అవుతాడో చెప్పలేం. వాళ్ళ వయస్సులు ఏమైనా ఒక సీ ఒక పురుషుడు-ఒక ఇంటిలో నివశించడం ఈ లోకం హర్షించదు. వాళ్ళకి ఉన్న ఇబ్బందులు కాని, ఎలాంటి పరిస్థితులలో అలా జరిగిందో అని కాని ఆరా తీయదు, అది దానికి అనవసరం. ఓ దేశంలో భార్యా భర్తలు కాని, ఒక స్తీ ఒక పురుషుడు ఒకే ఇంటిలో ఒంటరిగా సంచరిస్తే, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయమంటుంది. రేపు బాలాజీ వచ్చి, మిమ్మల్ని బలవంతపెట్టి తనతో తీసుకెళ్తానంటే అతనితో వెళ్ళిపొండి. మానసా. ఎందుకంటే, ఇప్పుడు నా తోడు, నా సహాయం చూసి అతని మాట ఇప్పుడు వినకపోతే, రేపు మీకు నా సహాయం లేనపుడు, బాలాజీకి మీ మాట మీద విలువ ఉండదు. మీ గురించి పట్టించుకోడు. నా సహాయం ఎంతకాలం మీకు ఉంటుందో కాలమే చెప్పగలదు. గత ఆరు నెలలుగా మీరు నాకు ఎంతో తోడుగా నిలిచేరు. జీవిత అసుర సంధ్యలో అనుకోకుండా లభించిన తోడది. నేను చాలా అదృష్టవంతుడిని. ఇలాంటి తోడు ఉంటుందని కూడా ఎప్పుడూ నా ఊహలోనికి రాలేదు. ఈ కాస్త తోడు కూడా లభించని (ప్రజలు కోకొల్లలు. ఒక కంటికి చూపు సరి అయింది కదా, త్వరలో రెంవడదీ మామూలవు తుంది అంటూ ఆగేడు రాఘవ.

కంటి నిండా నీళ్ళతో, వర్షించబోయే మేఘంలా ఉన్న మానసని చూస్తే రాఘవ గుండె ద్రవించింది. రాఘవ మళ్ళీ మొదలుపెట్టబోతుంటే, “ఇంకేమీ చెప్పవద్దు”, అంది మానస,

“లేదు మానసగారూ, నన్ను చెప్పనీయండి. మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు కలగకపోవచ్చు. హైద్రాబాదులో నాకో స్నేహితుడు ఉన్నాడు. అతని కొదుకు బెంగుళూరులో పనిచేస్తుంటే, కొడుకుని చూడడానికి వెళ్ళేడు. త్వరితంగా పరిగెడుతున్న రైలు బెంగుళూరుకి ఇరవై కిలోమీటర్లు క కథాంహస-2004 12 ఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊ2222ే

న € దరిదాపులలో చేరేసరికి, కాస్సేపు నడక నడిచి, ఆగిపోయింది. దూరంగా బెంగుళూరు కనిపిస్తోంది. రైలు బయలుడదేకేలా లేదు. రైలు దిగి ప్రక్మనే ఉన్న రోడ్డు మీదకి వస్తే, బస్‌లో బెంగుళూర్‌ చేరవచ్చు. కాని ఆ స్నేహితునికి దారి సరిగ్గా తెలియదు. అదీకాక, స్నేహితుని కొడుకు స్టేషన్‌లో నిరీక్షిస్తున్నాడు. గంటన్నర తర్వాత రైలు బయలుదేరిందని, ఆ గంటన్నర నిరీక్షణ తనకి తెగ విసుగు కలిగించిందని, తన జీవితం నడక ఆ రైలు ప్రయాణంలాగే ఉందంటూ రాసేడు. జీవితపు రైలు ప్రయాణంలోంచి దిగిపోలేం, చివర్న దిగడం తప్పదు. మధ్యలో ఇరకాటం లేకుండా ప్రయాణం ముగిస్తే చాలు. ఆ స్నేహితుని రాత మీకు అర్ధమయ్యే ఉంటుంది”, అంటూ ముగించేడు రాఘవ. మానస వెంటనే ఏమీ సమాధానమీయలేదు. కాస్సేపాలోచించి, “ఈ లోకం ఎవరి గురించీ లిప్తపాటు కూదా పట్టించు కోదు. జీవించాలన్న కోరిక ఉంటే, మనం తీవ్రమైన కస్టాలని కూడా భరిస్తూ బ్రతికి ఉంటాం. లేకపోతే భయం వలన చావకుండా బ్రతికి ఉంచుతుంది. జీవితంలో ఎంతకాలం బ్రతికేం? అన్నది ముఖ్యం కాదు. ఎలా బ్రతికేం, ఎందుకు టబ్రతికేం? అన్నదే నాకు ముఖ్యం. కొంతమంది అన్నింటి మీదా ఆసక్తి చంపుకుని కూడా, నాకేం, బాగానే బ్రతుకుతున్నాను,, అనుకుంటారు. అదే వాళ్ళకి ఆనందమైతే సంతోషమే. కాని రుద్దుకుని తెచ్చుకున్న ఆసందం కాకూడదు. రేపు బాలాజీ వచ్చి, నాతో వచ్చేయ్‌” అని పిలిస్తే, దానిలోనే ఆనందం ఉందని నే వెళ్ళిపోవచ్చు. కాని నిజం నాకు తెలుసు. నిన్న స్నానం చేసేటప్పుడు సబ్బు బుడగలని చూసేను. పెద్ద బుడగలు, కొన్ని చిన్న బుడగలు కలిసేక పేలిపోతున్నాయి. చిన్న బుడగలూ, పెద్ద బుడగలూ ఒకేలా పేలిపోతున్నాయి. రెండు చిన్న బుడగలు కలిసి పెద్దవైనపుడు కాస్సేపు రంగులతో మెరుస్తూ అందంగా కనిపించేయి. నాకు మానసికంగా ఒక తోడు కావాలి, అది లభించినపుడు దానిని వదిలేయడం అవివేకం. తెలియని రేపు గురించి ఊహించుకునే భయం గురించి, ఈ రోజుని బలి చేసుకోవడం ఎలాంటిదంటే ఒరిస్సా రాష్ట్రంలో ఒక తండ్రి భవిష్యత్తు బాగుండాలని స్వంత కొడుకుని బలి ఇవ్వడంలాంటిదే. నేను అలాంటి వ్యక్తిని కాను. “అది చెయ్యి, “ఇది చెయ్యి అని వేధించకుండా ఉన్న ఒక తోడు కావాలి. నే చెప్పే మాటలు విని, పరిహసించకుండా నవ్వే వ్యక్తి కావాలి. ఏళ్ళు పైబడుతుంటే, ఉదయం లేస్తే 'ఈ రోజు ఆనందంగా వెళ్తుందంటూ జీవితాన్ని వెళ్ళదీసే ఆశావాది తోడు కావాలి. జీవితంలో ఒక వెలితి ఉందని, అది పూద్చే వ్యక్తి తటస్థపడి అది పూడిస్తే కాని ఆ వెలితి మనకి ఉందని తెలియదు. అదే జీవితంలో ఒక విచిత్రం. నాకు ఆ తోడు దొరికింది, చానిని వదులుకోవడం అవివేకం”, అంది మానస, ఆనందంగా మానస వేపు చూసేడు రాఘవ. కాస్సేపు ఆలోచించి, “మీరు చెప్పిన దానితో ఏకీభవిస్తాను. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు. తోడుతో జీవిత ప్రయాణం సాఫీగా సాగాలంటే, అన్నీ మీకు నచ్చినట్లే జరగాలనుకుంటే ఎదుట వ్యక్తి బానిస అయిపోతాడు. అది అతని వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది, దానితో ఆనందాన్ని కూదా. రేపు బాలాజీ వచ్చేక ఏమౌతుందో చూద్దాం”, అన్నాడు రాఘవ. ప! చైతన తైతడడడఊఊఊజఊఊజఊజ*ఊఊఉఊతడ ననా ననన

(్ర్లి “

“నే చెప్పలేదా మానసా, జీవితం చాలా విచిత్రమైనదని, అది ఎలాంటి మలుపులు తిప్పుతుందో ఊహించలేం”, అన్నాడు రాఘవ.

మానస ఏమీ మాటలాడలేదు. విచారంతో కూరుకు పోయిన మానస కళ్లు కాంతివిహీనంగా ఉన్నాయి. ఒంటరిగా ఉన్నపుడు ఏడ్చింది కాబోలు, కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ముక్కుపుటాలు అదురుతున్నాయి, చెవులు ఎర్రపద్డాయి. మాటలాడడానికి ప్రయత్నం చేస్తున్నా మానస నోటి నుంచి మాటలు బైటకి రావడం లేదు.

“నేను నీ పరిస్థితి అర్థం చేసుకోగలను. బహుశా ఈ ప్లేట్‌ అమ్మేస్తావేమో, కొత్త ప్రదేశానికి మారడానికి నాకు కాస్త వ్యవధి కావాలి” అంటూ మానసని సముదాయించబోయేదు రాఘవ, ఈ లోకంలో లేనట్లు, మానస శూన్యంలోనికి చూస్తోంది.

“దీనిలో అంతగా బాధపడడానికి ఏమీ లేదు. చాలాకాలం తరువాత మీ కోడలు శల్లి కాబోతోంది. ఆమెకి నీ సహాయం కావాలంటూ బాలాజీ వచ్చేడు. నువ్వు వెళ్ళకుండా ఉండడం ఎలా సాధ్యం? అవసరం వచ్చినపుడే కదా మనిషి మనిషి సాయం కావాలొ, అన్నాడు రాఘవ.

“సరళ పురుడు అయ్యేక తిరిగి వస్తాను. బహుశా ఆరు నెలలు పట్టవచ్చు. ఈ ప్లేట్‌ అమ్మే ప్రసక్తే లేదు. నే తిరిగి వచ్చేంతవరకు ఈ ప్లేట్‌ ఆలనా, పాలనా మీదే. నన్ను నమ్మండి, అంది మానస.

రాఘవ సన్నగ్రా నవ్వేడు.

44

మానస బాలాజీతో వెళ్ళి రెండు గంటలయింది. పేపర్‌ కుర్రాడు తెచ్చిన పేపర్‌ అలాగే పడి ఉంది. పాలవాడు టేబిల్‌ మీదున్న గిన్నెలో పాలు పోసి గంట పైనే అయింది. లేచి కాఫీ కాచుకుందామని కాని, పేపర్‌ చదువుదామనికాని రాఘవకి లేదు. మెదడంతా మొద్దుబారింది. రాత్రంతా నిద్ర రాకపోవడంతో కళ్ళు మండుతున్నాయి.

“నన్ను నమ్మండి, ఆరు నెలలలో వచ్చేస్తాను”, అంటూ వెళ్ళింది మానస, వెళ్ళిపోయింది మానస. జీవితకాలంలో ఆరు నెలలు పెద్ద ఎక్కునేమీ కాదు, కాని తన పరిస్థితిలో అది చాలా దీర్టూలం. మానస తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తుందన్న దాంట్లో తనకి ఎంతో నమ్మకం ఉంది, కాని వస్తుందన్న దాంట్లోనే నమ్మకం లేదు. తను గీచిన గీత దాటనంత వరకే వ్యక్తి స్వతంత్రాన్ని సమాజం భరిస్తుంది. పాపం మానసః! తను తిరిగి రాగలననే వెళ్ళింది.

చుట్టూ కలయచూసేడు రాఘవ. బాలాజీ, మానస సామాన్లనన్నింటినీ ఒక గదిలో చేర్చి ఆ గదికి తాళం వేయడంతో, మానస ఆ ఇంటిలో నివళించిందన్న దానికి ఆధారాలు ఏమీ కనిపించడం లేదు. ఉదయమే, కడిగిన ముత్యంలా కాఫీ గ్లాసుతో మానస కనిపించడం, పేపరు చదివి వినిపించడం నిజంగా జరిగేయా? లేక తన భ్రమా? ఒకవేళ మానస తిరిగి వస్తే తనని చూస్తుందా? లేక ఖాళీ జాగాని చూస్తుందా? ,

“ఈ వయస్సులో ఆరు నెలల్ల నిరీక్షణ! అది మరణ శిక్ష లాంటిదే!” అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రాఘవః

. అ క భంరం- 104 ౬11౬222222

లాయి స్వేచ్చ అ 3.ఎన్‌, నారాయఖభ సాయంత్రం ఆరు గంటలు అవ్వబోతుంది. పడమటి ఆకాశం ఎర్రబడుతున్న వేళ.... పార్కులో జనం పరీవశంగా పరవళ్ళు తొక్కుతున్న వేళ. పిల్లలు కేరింతలు కొడుతూ పచ్చటి గడ్డి మీద ఆనందంగా ఆడుకుంటున్న వేళ... “ఎక్స్యూజ్‌మి! మీకేమైనా కంపెనీ యివ్వగులుగుతానా నేనుగొ ఓ పొద పక్కగా కూర్చున్న అతడు చటుక్కున తలెత్తాడు, ఆ తీయని కంఠం వింటూనే. ఎదురుగ్గా అందమైన అమ్మాయి. సన్నగా పొడుగ్గా పందిరికి పొకిన లతలా వున్నది. ఎర్రగా వున్నది. విశాలమైన కళ్ళు. కానదేరిన ముక్కు పొడువైన జడను ముందుకు వేసుకొని బుగ్గలు సొట్టలు పడేలా నోరు తెరుచుకొని నిలుచొని వున్నది. “అంటే?” అన్నాడు విచిత్రంగా ఆ అమ్మాయినే చూస్తూ. - “మీరు వందు వ్‌ వున్నాను... కాసేపు కాలక్షేపం చేద్దామా అని?” ॥ | ఒక్కసారి పైనుంచి క్రిందకు ఆ అమ్మాయిని చూచాడు అతడు. చక్కని రూపం. ఒక చేతిని భుజానికి తగిలించి వున్న వ్యానిటీ బ్యాగ్‌ మీద, మరో చేతిని నడుం మీద వేసుకొని వయ్యారంగా వున్నది. | వాలుగా కూర్చొని పుస్తకం చదువుకుంటున్న అతడు నిటారుగా కూర్చుంటూ, “ఓకే! కూర్చోండి!” అన్నాడు. “గంటకు రెండు వందలవుతుంది!కో ఆ అమ్మాయి వంక సూటిగా చూచాడు అతడు. “ఒట్టి మాటలకేనా? | ౧ ఆ అమ్మాయి అశడి వంక యిబ్బందిగా చూచింది. అతడు నవ్వి “ఓకే! యిస్తాను....! అన్నాడు. | ఆ అమ్మాయి అతడి పక్కగా ఆ పొద వెనకగా కూర్చున్నది. కూర్చుంటూ కాస్త అతడి వైపుకు వాలింది. ॥ “ప్పీ పేర్స?” సంశయంగా అతడి వంక చూచింది. . అతడు నవ్వాడు - “ఒకే! మీకు మీ పేరు చెప్పటం ఇష్టం వుండదు... అందంగా వున్నారు 21111111 స కే

తా

కాబట్టి మేనక అంటాను.... నా పేరు సత్‌లిత్‌ ఆనందమూర్తి - అంటే సచ్చితానందమూర్తి అని!” " | ' అతడి మాటలకు ఆ అమ్మాయి విచిత్రంగా చూచింది.

“కాలక్షేపం అంటే ఎలాంటి కాలక్షేపం చేద్దామని!”

“మీకు యిష్టం లేకపోతే చెప్పండి నేను వెళ్ళిపోతాను-నన్ను ఇబ్బందికరమైన ప్రశ్నలతో ఖంగారు పెట్టవద్దు!” నుదురు ముడి వేస్తూ అన్నది మేనక.

“ఓకే..... ఓకే!.... ఇలాంటివి నాకు కొత్తగ అపొలజిటిక్‌గా అన్నాడు సచ్చితా నందమూర్తి. “మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు!

ఆమె రెండు మోకాళ్ళ మీద తల ఆనించి అటూ యిటూ ఊపుతూ, “నాకూ కొత్తే” అన్నది చిన్నగా. 2

“కొత్తే అవ్వవచ్చుకాని ఏ మాత్రం అవగాహన లేకుండా ఇక్కడకు వచ్చి పరాయి మొగవాడిని కాలక్షేపం చేద్దామా అంటూ ఆహ్వానించరు గదా! ఓకే..... సరే..... మిమ్మల్ని ముట్టుకోవచ్చా?”

ఆమె భయం భయంగా తల ఊపింది.

“ముద్దులు పెట్టుకోవచ్చా?” .

ఆమె ముఖం ఎరగా కందింది. “చెంపల వరకూ?” గొణుగుతున్నట్లుగా అన్నది తల వంచుకొని.

“ఏ విషయాలైనా మాట్లాడవచ్చా?”

“అసభ్యకరంకానివి” ఆమె కళ్ళు మూసుకుంటూ అన్నది.

“డబ్బు సంపాదనే ముఖ్యమైనప్పుడు ఎందుకీ ఆంక్షలు?” సీరియస్‌గా అన్నాడు. “ఓకే! నేను మిమ్మల్ని మాటల్లో బెట్టి డబ్బులు ఎగగొట్టి మోసం చేయాలనేది నా అభిమతం కాదుగొ అంటూనే కాస్త పక్కకు వంగి, జేబులోనుంచి పర్సు తీసి రెండు వందల రూపాయల నోట్లు బయటకు లాగి మేనకకు యిచ్చాడు. “ఇప్పుడు (్రీగా మాట్లాడుకుందాం!” అని చేతి గడియారం వంక చూస్తూ, “మీరు నా దగ్గర కూర్చొని అయిదు నిముషాలయింది.... మళ్ళీ ఏడు గంట లకు మన కాలపరిమితి ముగుస్తుందిగ్‌ అన్నాడు.

మేనక లెంపలు తడవటం గమనించాడు అతడు.

“బీ ఫ్రీగ సచ్చితానందమూర్తి ఆమె చేతి మీద చేయి వేసి నొక్కాడు. అప్పుడు ఆమె చేతి కంపనం ఆమె అబద్ధం చెప్పటంలేదని అర్థం చెప్పింది. ఆ అమ్మాయికి నిజంగానే ఇలాంటి వ్యవహారం కొత్త అయి వుండవచ్చు!

“నేను ఓ పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూ టివ్‌గా పనిచేస్తున్నాను. నా భార్య పుట్టింటికి వెళ్ళింది... బోరు కొడుతుంటే ఇక్క దకు వచ్చాను.... నా అద్భస్టం అన్నట్లుగా మీరు పరిచయమయ్యారు.... మీకు అభ్యంతరం లేకపోతే మా యింటికి వెళ్లాం... ఈ రోడ్డు మీదే సెకంద్‌ లెఫ్ట్‌ తిరిగితే రైట్‌సైడ్‌ నాలుగో యిల్లు మాది.... నడక దూరం.... ఓకే! నేను మీతో మీ కిష్టంలేని విధంగా ప్రవర్తించను - ప్రామిస్‌!”

మేనక తల అడ్డంగా వూపింది. “నాకు ఇళ్ళకు వెళ్లడం ఇష్టం లేదు.... మన్నించండి!” కైఖారహింి-2004 2222222 డడ

ఈ అన్నది రిలాక్స్‌ అవుతున్నట్లుగా కొద్దిగా వెనక్కు వాలి.

“ఇక్కడ మనని ఎవరైనా చూస్తే మీకు ఇబ్బందిగా వుండదా?”

“మీకున్నదా?”

“మా ఆవిడ చూస్తేనే నా కొంపలంటుకుంటాయిగాని - ఆవిడ ఊళ్ళో లేదన్నానుగదా!”

“నాకు పెళ్ళి కాలేదు కాబట్టి భర్తను గురించిన భయం లేదు. నాకు ఊహ తెలియకముందే మా నాన్న పోయాడు.... తోడబుట్టిన వారు లేరు.... మా అమ్మకు నా గురించి ఎవరు ఎంత చెడుగా చెప్పి నా పట్టించుకోదు!” అన్నది హాయిగా నవ్వేస్తూ.

“అంటే మీరు స్వేచ్చగా ఎంత ఎత్తుకైనా ఎగరగలిగే గువ్వలాంటి వారన్న మాట!” నవ్వాడు సచ్చితానందమూర్తి.

“క్ర విధంగా!”

ఆ మాట అంటున్న ఆమెను చూస్తుంటే - ఆమె మరీ అమాయకురాలేం కాదు అనిపించిది అతడికి.

“మీరేం చేస్తుంటారు?”

“బియస్సీ ఫైనల్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ రాయాలి!”

“మీకు పాకెట్‌ మనీ ఇంట్లో ఇవ్వరా?”

మేనక మాట్లాడలేదు.

“మీ హాబీస్‌ ఏమిటి?” అన్నాడు ఆ అమ్మాయి మొఖంలోనే తాదాష్యంగా చూస్తూ, “రోజూనా....... లేక ఎప్పుడైనా వస్తుంటారా పార్కుకు?”

ఆ అమ్మాయి రోషంగా అతడి వంక చూచింది.

“ఓకే సారీ.... నాన్న లేరన్నారు..... మీకు అన్నలూ, అక్కలూ లేరు.... మీ అమ్మగారు ఉద్యోగమైనా చేస్తుండాలి.... లేదా మీరు మంచి స్థితిమంతులైనా అయి వుండాలి!”

“రెండూ కాదు!

అతడు నిట్టూర్చు విడుస్తున్నట్లుగా మూలిగాడు. ఆమె పరిస్థితి అర్థమయినపుడు - ఏదో విధంగా డబ్బు సంపాదించాలి.... తల్లీ కూతుళ్ళ పొట్టలు నింపుకోవటానికే గాకుండా ఆమె చదువుకి కూడా కావాలి.

“ఒకే! కాఫీగాని.... కూల్‌్రింక్స్‌గాని శ్రాగుదామా?..... అంతకు మించి హాట్‌ డ్రింక్స్‌ నాకు

వుండదు! అన్నాడు ఓరగా చూస్తూ.

నానా వం నాకు అభ్యంతరం లేదు!” అన్నది పేలవపు నవ్వుతో మేనక.

“ఇద్దరం కలిసి వెళ్ళి త్రాగటానికేం అభ్యంతరం లేదు గదా!” అన్నాడు లేచి గూడలెగరేస్తూ సచ్చితానందమూర్తి.

అతడు తనను ఆట పట్టిస్తున్నాడని అర్ధమయింది మేనకకు. మనస్సుకు కష్టమేసినా మెదలకుండా వూరుకున్నది. తనూ లేచి అతడితోపాటు ఆ పార్కు గేటు దగ్గరున్న కూల్‌డ్రింక్స్‌ పార్లర్‌ దగ్గరకు నడిచింది.

“రెండు ఐస్‌క్రీంలు తీసుకువెళ్ళి ఆ చెట్టు క్రింద కూర్చొని తిందాం! ఓకే!” అన్నాడు అక్కడకు హన్‌ క

వెళ్ళింతరువాత అతడు.

అంగీకారంగా తల ఊపింది మేనక. టైం చూచుకున్నాడు సచ్చితానందమూర్తి. సరిగ్గా ఆరు గంటల నలభై అయిదు నిముషాలయింది. అంటే తనిచ్చిన డబ్బుకు ఇంకో పావుగంటే వుంటుంది తన దగ్గర మేనక!

త్వరత్వరగా రెండు కష్టులు తీసుకొని వెనక్కు వచ్చాడు. వస్తూ - లైటు స్థంభం పక్కగా చెట్టు నీడలో నిలుచున్న మేనక చేయెత్తి రెండు వేళ్ళూ *విి ఆకారంలో పెట్టి విజయం సాధించినట్లుగా దూరంగా వున్న మరో అమ్మాయికి సైగ చేస్తుం డడం గమనించాడు. “అంటే యు వీళ్ళు చాలామంది వున్నారన్ననూట! అనుకున్నాడు.

ఐస్‌క్రీం కప్పు ఆ అమ్మాయికి ఇస్తూ, చెట్టు క్రింద గడ్డిలో కూర్చొని, “రేపూ నాకు కంపెనీ ఇవ్వగలరా?” అన్నాదు.

“ప్రయత్నిస్తాను!”

“ప్రయత్నించడం కాదు..... తప్పకుండా రావాలి..... మీరు నాకు నచ్చారు .... మా ఆవిడ వచ్చిందాకా రోజూ నాకు మీతో ఓ గంట కాలక్షేపం చేయాలని వున్నది...... మీకు ఎన్ని ఎంగేజిమెంట్లు వున్నా కాన్సిల్‌ చేసుకురావాలి.... రోజుకు నేను ఐదు వందలు ఇస్తానుకొ

మేనక కళ్ళు తళుక్కున మెరిసినయి.

-తను వచ్చే నెలలో అనుకున్నట్లుగా సిమ్లూ 'వెళ్ళగలదు!

66

సరిగ్గా ఆరు అయ్యేటప్పటికి సచ్చితానందమూర్తి ఆ పార్కుకు వచ్చి నిన్న కూర్చున్న పొద పక్మనే కూర్చున్నాడు - గేటు వంక ఆత్రంగా చూస్తూ,

మేనక వచ్చింది. నీలి ఆకాశంలో తెల్లటి మబ్బుల మీద నుంచి గులాబీ పూలను అతడి ముందు క్రుమ్మరిస్తున్నట్లుగా వచ్చింది. తెల్లటి చుడీదారు మీద గులాబీ పూల ప్రింటు. రెండు జడలేసుకున్నది. పలచటి తెల్లటి చున్నీని మెడ చుట్టూ చుట్టి క్రిందకు వదిలేసింది.

వస్తూనే “హాయ్‌!” అన్నది.

“ఓకే... రావేమోనని భయపడ్డాను!” అన్నాడు.

“ఎందుకనుకున్నారు అలా అని?” చిరునవ్వు చిందిస్తుంటే బుగ్గల్లో సొట్టలు పడినయి.

ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగాడు. “ఎందుకో అలా అనిపించింది .... ఓకే.... నా ఆలోచన తప్పు అవ్వవచ్చు - కానీ ఒక్కటి నిజం.... మనిషికి కోరికలంటూ లేకపోతే దేంవుణ్జి తలుచుకోడు.... ఈ రోజున నేనిక్కడకు బయజచ్చేరుతూ, నువ్వు తప్పకుండా రావాలని దేంవుడికి దజ్ఞం పెట్టుకున్నాను!”

“నేను రోజూ లేస్తూనే ఆ పని చేస్తాను! కించత్‌ గర్వం పొడ చూపింది ఆ మాటల్లో

“పార్కులో బాగా డబ్బున్న మనుష్యులు దొరకాలనా?”

ఆమె ముఖం కందగడ్డలా అయింది అవమానంతో. ముక్కు పుటాలు అదరసాగినాయి.

అది గమనించి అతడు త్వరత్వరగా అన్నాడు. “ఒకే! టేకిట్‌ ఈజీ! నిన్ను బాధపెట్టాలని అలా అనలేదు..... ఓ ఉదాహరణగా చెప్పాను.... ప్రతిరోజూ ప్రశాంతంగా గడపాలనుకోవటం . క పో డే

డాయ గూడా ఒక కోరికే”

మేనక మాట్లాడలేదు. కానీ ఆమె ఓ విషయాన్ని గమనించింది. నిన్న “మీరు అంటూ మన్నిరెచిన అతడు ఈ రోజున “నవ్వు అంటున్నాడు. తన మీద గౌరవం పలచబడుతున్నదన్న మాట!

అయినా ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పటానికేనా అతడు తనకు ఇంత డబ్బు ఇస్తున్నది. కారణం ఏమై వుంటుంది? అతడుగాని ఇంట్లో నరకం అనుభవించడం లేదు కదా? లేక భార్య కురూపేమో! పుట్టింటికి వెళ్ళిందీ అని చెబుతున్నాడు.... నిజంగా పుట్టింటికి వెళ్ళిందా - లేక స్వేచ్చగా తిరుగుతూ ఆనందాన్ని పొందుతున్నదా? అలా అనుకుందామనుకున్నా ఇతడూ డబ్బున్న అందగాడే గదా....ఏంవో.... ఒక కంటికి అందమైనదే మరో కంటికి అసహ్యమవ్వవచ్చు!

“కకే! ఓకే! ఇవ్వాళ ఏ విషయం మీద మాట్లాడుకుంటూ కాలక్షేపం చేద్దాం!” అన్నాడు ఆ అమ్మాయి మృదువైన చేతి మీద తన చేయి వేసి నిమురుతూ.

ఆమెకు నవ్వు వస్తోంది. పళ్ళ బిగువున బిగపట్టుకున్నది. ఇతడిలో ఏదో మానసిక రుగ్శత వున్నది. అతడిని ఒక ఆట పట్టించాలనుకున్నది క్షణం. కానీ ఈ రోజు అయిదొందలు యిస్తానన్నాడు. ఇంకా ఇవ్వనే లేదు. తనేమైనా నోరు జారితే కోపమొచ్చి వెళ్ళిపోయాడంటే నష్ట పోయేది తనే. ముభావంగా కూర్చున్నది. .

“ఓకే. మేనక! మనం బిజినెస్‌లోకి దిగేముందు నీ డబ్బు నీ కివ్వటం నాకు భావ్యం కదా! అంటూ పర్కు తీశాడు.

ఆమె ఉలిక్కిపడింది - అతడు తనని చదివేస్తున్నాడా అన్నట్లుగా. “ఫరవాలేదు .... ఫరవాలేదు!” అన్నది తడబడుతూ.

ఆమె చేతికి దబ్బు యిస్తుండగా ధైర్యం చేసింది తను అనుకున్న ప్రశ్న వేయటానికి. “అసలు దేంవుడు వున్నాడంటారా?” అన్నది అంతకు ముందు వదిలేసిన విషయంలోకి తిరిగి వెళుతూ.

“అకాశంలో నక్షత్రాలున్నాయి. రాత్రి పూట స్పష్టంగా కనబడతాయి. పగలు సూర్యుడు వస్తాడు. ఒక్క నక్షత్రమూ కనబడడదు..... అప్పుడు ఆకాశంలో నక్షత్రాల్లేవనా నీ ఉద్దేశ్యం!”

మెడ వంచి తలను మోకాలి మీద పెట్టుకొని ఓరగా అతడి వంకే కన్నార్పకుండా చూస్తూ వుండిపోయింది మేనక.

“అలాగే - మన తెలివి తక్కువతనం వలన దేంవుడిని చూడలేక దేంవుడు లేడు అనుకోవటం ఎంత అవివేకం?”

అతడు చదువుకున్న మహాజ్ఞాని అయినా అవ్వాలి - లేదా జీవితంలో ఘోరంగా దెబ్బతిని తన తల్లి లాగా సైకో అయినా అయి వుండాలి!

“ఓకే! మనం కనబడని దేంవుడిని గురించి మాట్లాడడం మానేద్దాం..... నువ్వు ఇలా పార్యుల్లో నా లాంటి పిచ్చి వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బును ఏం చేద్దామని! మీ అమ్మ కిస్తావా?”

మరోసారి ఉలిక్కిపడింది మేనక. ఇత్మడిలో తను గ్రహించలేక పోతున్న శక్తి ఏదో వున్నది. తను ఏది అనుకుంటే అదే అతడూ మాట్లాడుతున్నాడు. అతడి ముందు తను సాధ్యమయినంత వరకూ అతడిని గురించిన ఎలాంటి అభిప్రాయాలు మనస్సులో ఊహించకుండా వుండడం - 222 సజ క

మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మాట్లాడడం .... మంచిది అనిపించింది.

“ఓకే! చెప్పటం ఇష్టం లేదా - ఈ డబ్బు ఎలా ఖర్చుపెట్టేది?”

“రేపు సమ్మర్‌ వెకేషన్స్‌లో మా ఫ్రెండ్సంతా సిమ్లూ వెళ్ళాలనుకుంటున్నారు.... అమ్మనడిగికే తన దగ్గర లేవన్నది.... ఆమె చాలా మొండి మనిషి... అప్పుడు ఓ స్నేహితురాలు సలహా యిచ్చింది.... ఇలా పార్కుల్లో కాలక్షేపం చేస్తే ఎంత కావాలన్నా దొరుకుతుందని.... తనకు డబ్బు అవసరమొచ్చినప్పుడు ఇలాగే చేస్తుంటుందట!” మేనక చెప్పినట్లు కొత్త అవ్వడంతో మనస్సు విప్పి నిజాల్నే సచ్చితానందమూర్తి ముందు పరిచింది.

అతడు తృప్తిగా ఆ అమ్మాయి వంక చూచాడు. “ఐ లైక్‌ యూ మేనకా! నీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను.... ఎంత కావాల్సివస్తుంది మీ ట్రిప్పుకి?”

“కనీసం పది వేలు.... ఆపైన ఎంత ఎక్కువ వుంటే అంత మంచిది... అక్కడ ప్రతీదీ ఖరీదట గదా!”

  • “అక్కడా ఇలాగే పార్ములుంటాయి - భయం దేనికి?” సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు సచ్చితానందమూర్తి.

అతడి మాటలు ఆమె గుండెల్లో శూలాల్లా గుచ్చుకున్నయి. విలవిల లాడింది. మొఖం నల్లబడి వాడి వాలిపోయింది!

“ఓకే! ఓకే! లీవిట్‌..... ఈ రోజు మన గంటకు ఇంకొక్క అయిదు నిముషాలే వున్నది.... రేపు ఆలోచిద్దాం ఆ విషయం మీద! అన్నాడు సచ్చితానందమూర్తి మాట తప్పిస్తూ - ఆ అమ్మాయి తన మాటలకు బాధపడుతున్నదని గ్రహించి.

“రేప్పు నాకు రావటానికి వీలుపడదు అన్నది మొఖం ముడుచుకుంటూ.

“అదేం? నా మీద కోపమా?” చాలా బాధగా అన్నాడు.

“మీ మీద నాకు కోపం దేనికి? నా ఆప్త మిత్రురాలి పుట్టిన. రోజు... నేను వెళ్ళకపోతే అది ఊరుకోదు!”

“౬కే! ఎన్నింటికి వెళ్ళాలి అక్కడకు?”

“అందరినీ ఆరింటికల్లా రమ్మనమని చెప్పింది.... నేనయితే అక్కడ ఏర్పాట్లు చూడడానికి ఓ అరగంట ముందే వెళ్ళాలి!”

“వద్దు మేనకా!” ఆమె చేతిని బలంగా నొక్కుతూ అన్నాడు. *నా కెందుకో రేపు నీకు రెండు వేలు యివ్వాలని పిస్తోంది... ఆరూ, ఏడు మధ్య నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ ఇక్కడ వుండాలి .... సారీ! ఆ సమయంలో నిన్ను చూడక పోతే నా మనస్సంతా శూన్యమయి నేను బాధపడతాను... రెండు రోజుల్లోనే నన్ను నువ్వు పూర్తిగా లొంగదీసుకున్నావు!

అతడి మాటలకు మేనక శిలాప్రతిమే అయింది. గంటకు రెండు వేలా? అతదు పిచ్చివాదే

  • అనుమానం లేదు!

  • ఆమె గుండె దడదడలాడసాగింది!

ప

సాయంత్రం ఆరు గంటలకు ఇంకా అయిదు నిముషాలుందనగా సచ్చితానందమూర్తి

క కథారహిని- 2004 12౭౫2222

టాడా

పార్కుకు వచ్చి తను రోజూ కూర్చుండే పొద దగ్గర కూర్చున్నాడు. ఈ రోజు మేనక వస్తుందా?

రాదా? చాలా ఆత్రంగా వున్నది అతడి మనస్సు. టైం గడుస్తున్నకొద్దీ ఆతురత పెరిగిపోతోంది.

సరిగ్గా ఆరు గంటలప్పుడు గేటు వంకే చూస్తున్న అతడి కళ్ళు కాంతివంతమయినయి. మేనక లోపలకు వస్తోంది. దివి నుండి భువికి దిగి వస్తున్న దేవతలా - పూర్తిగా తెల్లని

చీరలో.... హిమాలయాలల్లోనుంచి ఉరవళ్ళు పరవళ్ళతో దూకుతున్న నీటి ప్రవాహంలా... వచ్చి ముభావంగా కూర్చున్నది.

“మీ స్పేహితురాలు బాగా తిట్టిందన్నమాట!?”

ఊహ తెలిసీ తెలియని పిల్లలా అమాయకంగా - అవునన్నట్లుగా తలను పైకీ క్రిందకూ ఊపింది మేనక.

“ఏం చెప్పావ్‌?”

“సిమ్లా టూర్‌ సంగతి గుర్తు చేశాను .... వెళ్ళకపోతే నేను రెండు వేలు నష్టపోతానని చెప్పాను.... దాని సలహా మీదే నేను పార్కుకు వస్తుండడంతో అది కాదనలేకపోయింది!”

బాధగా చూచాడు సచ్చితానందమూర్తి ఆ అమ్మాయి వంక.

“బేబీ?” అన్నాడు ఆప్యాయంగా. “నీ మనస్సు కష్టపెట్టాను గదూగొ

మేనక అతడి వంక విచిత్రంగా చూచింది. ఆ పైన నిన్న 'నువ్వులో నుంచి ఈ రోజు 'బేపోలోకి మారటం గుర్తించింది. రేపు 'ఒసేయి అంటాడేమో! _ “=. “మనం సాయంత్రం పూట కలిసే ఈ క్షణాలకు ముగింపు వచ్చేస్తోంది.... ఎల్లుండి ఉదయాన నా భార్య ఊరు నుంచి వస్తున్నట్లుగా రాత్రి ఫోను చేసి చెప్పింది!

దిగులుగా అతడి వంక చూచింది మేనక. దూరంగా కూర్చొని ఏవో పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పి ఎక్కువ దబ్బులిచ్చే అతడి వలన తన ఆశ పూర్తిగా నెరవేరదన్నమాట! -

“నీ సిమ్లా ప్రయాణం ఇబ్బందుల్లో పడుతుందా? ఓకే... ఓకే... రేపు ఎలాగూ కలుస్తాం కదా .... ఆఖరి రోజు కాబట్టి - మరిచిపోయాను - ముందు ఈ రోజు డబ్బులివ్వనీ!” అంటూ పై జేబులోనే పెట్టుకున్న నాలుగు అయిదు వందల రూపాయిల నోట్లు తీసి ఆమెకిచ్చాడు. “రేపు ఆఖరు రోజు అన్నాను గదా... ఇప్పటివరకూ నీకు రెండు వేల ఏడు వందలు ఇచ్చాను.... ఇంకో ఏడు వేల మూడు వందలు రేపు సాయంత్రం ఇస్తాను.... అయితే ఆరు నుంచి ఏడు దాకా రేపు ఇక్కడ కూర్చున్న తరువాత మనం ఒకచోటకి వెళ్ళాలి”

అతడి వంక భయంగా చూచింది. అనుమానంగా చూచింది. ఆశ్చర్యంగా చూచింది. వింతగా చూచింది. ఊరికినే మాటలు చెప్పి నాలుగు రోజుల్లోనే ఇన్ని వేలు యిస్తున్నాడు అంటే

  • అవి దొంగ నోట్లు కాదుగదా! ఆ పైన రేపు తనను ఎక్కడికి తీసుకువెళతాదో.... ఊహించ లేకపోయింది భయంతో.

అతడు పకపకా నవ్వాడు.

“నీ మొఖం చూస్తుంటే నాకేనునిపిస్తున్నదంటే - నేనచ్చేవి ఫేక్‌ కరెన్సీ ఏమోనని అనుమానపడు తున్నావు కదూ! .... కాదు బేబీ..... తండ్రి ఎప్పుడూ కూతుర్ని మోసం చేయడు!” అన్నాడు చాలా సీరియస్‌గా మొఖం పెట్టి. 2222212122 సక

తను ఆయన కూతురా? ఉలిక్కిపడ్డట్టుగా అతడి వంక చూచింది. అంతే కాదు - డబ్బు విషయంలోనూ తన మనస్సులో మెదిలిన ఊహనే న్యక్తపరిచాడంటే - తల విదిలించింది - తనని తాను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నది - అతడి వయస్సు ముప్పయికి మించి వుండదు. తనకు మరో సంవత్సరంలో యిరవై రాబోతున్నాయి - తను అతడికి కూతురు ఎలా అవుతుంది?

మేనకకు అతడి వింత ప్రవర్తనకు అతడి మాటల్లోనే క్లూ దొరికింది - అతడి కూతురు చనిపోయింది - ఆ అమ్మాయి పోలికలు తన మొఖంలో కనబడుతుందడంతో అతడు తనను ఆప్యాయంగా చూస్తూ అంత దబ్బిస్తున్నాడు - కూతురు పోయిన షాక్‌లో అతడికి మతిస్థిమితం తప్పి వుండాలి!

“నేను చాలా ట్రిన్స్‌పుట్డ్‌ మనిషిని. నిబద్ధతతో పెరిగిన వాడిని..... క్రమశిక్షణకు ప్రాణం ఇస్తాను... సమయపాలన అంటే నాకు ఎంతో ఇష్టం.... అందుకే నిన్ను ఆరు అంటే - ఆరుకే ఇక్కడ వుండమంటాను.... నువ్వెప్పుడైనా ఈ విషయాలపైన దృష్టి వుంచావా?”

“మీరు ఎప్పుడైనా ఏ విషయంలో నైనా షాక్‌ తిన్నారా?” అతడి వంకే జాలిగా చూస్తూ అన్నది - అతడి ప్రశ్నను పట్టించుకోనట్లుగా.

“నన్ను ఎంత షాకైనా ఏమీ చేయలేదు..... నా మనస్సు అంత దృఢమైనది”

“నేను అడిగిందానికి సమాధానం చెప్పండి” కాస్త గొంతు హెచ్చించి మేనక అడిగింది.

“ఓకే... ఓకే! షాక్‌ తినని మనిషిని నువ్వెప్పుడైనా చూచావా..... చనిపోయిన తన పిల్లవాడిని బ్రతికించమని ఏడుస్తూ వచ్చిన ఓ తల్లికి బుద్ధభగవానుడు ఏం చెప్పాడో తెలుసా...... చావు అంటే ఎరగని కుటుంబం నుంచి కాసిని ఆవాలు పట్టుకు రమ్మన్నాడు. ఆ తల్లికి అలాంటి గృహం కనబడక ఆత్మజ్ఞానంతో తనని తాను సముదాయించుకుంటుంది. దుఃఖాన్ని మరిచి పరిస్థితికి తల ఒగ్జుతుంది!?”

మేనక నిట్టూర్చు విడిచింది. తన ఊహ నిజమే. అతడి ఆత్మీయులెవరో మరణించారు. ఆ

చనిపోయినవారి పోలికలు తనలో వున్నాయి. అందుకే తనని చూడడానికి తహతహలాడుతున్నాడు. “నువ్వాక్క పని చేయి బేబీ! అమ్మకు నువ్విలా పార్కుల వెంట తిరుగుతున్నా వని తెలిసినా ఇబ్బంది లేదంటివి గదా! కనుక ఆమెకు ఆ విషయాన్ని చెప్పు.... ఆమె స్పందన ఏమిటో నువ్వు నాకు చెప్పాలి!” |

“మా అమ్మ మీకు తెలుసా?” ఆశ్రం గా అడిగింది.

సచ్చితానందమూర్తి పకపకా నవ్వాడు. “మీ అమ్మ అందరికీ తెలియాల్సినంత గొప్ప మనిషా?” అన్నాడు ఎగఠాళిగా.

మేనక కుదించుకుపోయింది అతడి మాటలకు.

పార్శంతా దీపాల కాంతిలో పచ్చబారిపోయింది. ఫౌంటెన్‌ విరజిమ్ముతున్న నీటి తుంపరలు గాలిని తడిపేస్తున్నాయ్‌. దూరంగా గుడి గంటల శబ్దం వినబడుతోంది.

“రేప్తు ఎక్కడికి వెళ్ళాలన్నారు?” భయం భయంగా అతడి మొఖంలోకి చూస్తూ అన్నది.

“రేపు సాయంత్రం గదా.... అప్పుడు నిర్ణయిద్దాం!”

మేనక బిగుసుకుపోయి అతడి వంకే చూస్తున్నది. అతడి కళ్ళు ఆ తెల్లటి దీపాలకాంతిలో మ కధారహి?ి- 200% ేేెతతత222తతతతతడ౭త౭౭డతడడెెెేేే్న్న]]ోో ననన ననన

గాజుగోలీల్లా చిన్నవిగా, లోతుకు పోయినట్లుగా కనిపించగా మేను కంపించింది.

పార్కు మధ్యలో వున్న స్థంభం మీద వున్న పెద్ద గడియారం గంటలు కొట్టడం మొదలు పెట్టింది.

ఉలిక్కిపడి తలెత్తింది మేనక. సరిగ్గా ఏడు గంటలయింది!

  • అతడు సమయం అయిపోయినట్లుగా లేచి నిలుచుంటున్నాడు!

ళల

సచ్చితానందమూర్తితో అనుభవం చాలా ఎక్సయిటింగ్‌గా వున్నది. ఇతడెక్కడి మనిషి? చాలా వింతగా వున్నది అతడి ప్రవర్తన. రేపు ఏడు వేల మూడు వందలు యిస్తానంటున్నాడు.... తనని ఎక్కడికో రమ్మనమంటాడు. ఎక్కడికై వుంటుంది? మెల్లగా మాటలు చెప్పి తీసుకువెళ్ళి పిచ్చితనంతో తన గొంతు పిసికి చంపేయడు గదా!

ఆలోచనల నడుమ అస్తవ్యస్తమయిన మనస్సుతో - తన స్టేజీలో బస్సు దిగి అక్కడికి ఫర్లాంగు దూరంలో వున్న యింటికి నడుచుకుంటూ వెళ్ళింది.

తల్లి బెడ్‌రూంలో లైటు వెలగడం లేదు. పోషణ లేక పిచ్చి మొక్కలతో నిండిన ఆవరణ దాటి ముఖద్వారం దగ్గర నిలబడి కాలింగ్‌ బెల్‌ నొక్కింది మేనకు

పనిమనిషి తలుపు తీసింది.

“అమ్మ రాలేదా?” "

“లేదమ్మా! ఇప్పుడే ఫోను చేశారు.... ఒక గంటలో వస్తానన్నారు... మీరు వస్తే అన్నం తిని చదువుకోమన్నారు!?”

మేనక తన గదిలోకి వెళ్ళింది. మనస్సంతా కలవరపాటుతో వున్నది. తన సిమ్లా ప్రయాణానికి డబ్బయితే అందుబాటులోకి వస్తున్నది కాని సచ్చితానందమూర్తి ప్రవర్తనే అర్ధం గాకుండా వున్నది. ఎందుకిస్తున్నాడు తన కింత డబ్బు? తన నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడు? తననేదైనా రొంపిలోకి దింపే ప్రయత్నంలో వున్నాడా?

చీరె విప్పేసి మాక్సీ వేసుకున్నది. పొడువైన జడను చుట్టగా చుట్టుకున్నది. కాళ్ళూ, చేతులూ కడుక్కువచ్చి డైనింగ్‌ టేబిల్‌ ముందు కూర్చున్నది.

మేనక అన్నం తినడం పూర్తయ్యేటప్పటికి తల్లి వచ్చింది.

  • “సాడ్దున్నే నాకు బయటకువెళ్ళే పని వున్నది... రాత్రి వచ్చేటప్పటికి ఆలస్యం గూడా అవ్వవచ్చు.....నీకు రేపు కాలేజీ లేదుగదా.... ఆ పాత బీరువా తెరిచి క్రింది సారుగుల తాళం చెవులు వెతికి - అందులో పొలం డాక్యుమెంట్సు వుండాలి... తీసి బయట పెట్టు! సిమ్లా సిన్లూ అని ఏడుస్తున్నావు కదా..... పొలం అమ్మకానికి పెట్టాను.... డబ్బు అందగానే నీకు పది వేలిస్తానుగ” అని తన బెడ్‌రూంలోకి వెళ్ళిపోతూ, “అ కాగితాలు ఎక్కడున్నయ్యో ఏమిటో... ఆ బీరువా తెరిచి పదిహేను సంవత్సరాలపైనే అయివుంటుంది!” గొణుక్కున్నది.

“న్సవ్వు చూచుకోగూడదటమ్మా!” విసుగ్గా అన్నది మేనక తల్లితో. “నాకు నువ్వేం డబ్బు ఇవ్వనజ్ఞర్లేదులే.... ఓ పెద్దమనిషి ఇస్తానని ప్రామిస్‌ చేశాడు!” - సచ్చితానందమూర్తి తన విషయం తల్లికి చెప్పమన్న సంగతి గుర్తుకురాగా ఇదే దానికి మంచి తరుణంలా భావించి -

తల్లంటే నిర్లక్ష్యానికి తోడు కాస్త హుషారును గూడా జోడించి అన్నది.

“ఎవరా పెద్దమనిషి?” నుదురు చిట్లించి అడిగింది తల్లి.

“నాకు తండ్రి లాంటి వాడు!” - ఆయన పేరు చెప్పడం దండగనిపించింది. తనకు మేనక అని పెట్టినట్లే ఆయనకు సచ్చితానందమూర్తి అని పెట్టుకొని వుంటాడు!

“ఏ మొగవాడినీ తొందరపడి నమ్మబోకు.... తండ్రిగాని, భర్తగాని.... నీ నుండి ఆయన ఏం పొందాలని ఆశించి అంత డబ్బిస్తున్నాడో కాస్త తెలివిగా ప్రవర్తించి తెలుసుకో... లేకపోతే ఊబిలో ఇరుక్కుపోయి గిలగిలలాడి చస్తావు తరువాత!”

“అలాంటివాడు కాదులే ఆయన!” - మొండిగా అన్నది మేనక.

“స్త్ర! న్డ్‌ ఖర్మ... అనుభవించు.... కానీ రేపు ఆ కాగితాలు మాత్రం తీసి పెట్టు.... నాకూ డబ్బు కావాలి! ఎల్లుండి పొద్దున్నే పొలం కొనేవాళ్ళు వస్తున్నారు, ఎద్వాన్సు ఇచ్చేటందుకు!” ఆమె విసురుగా వెళ్ళిపోయింది.

అలా వెళుతున్న తల్లి వంక అసహ్యంగా చూచింది మేనక!

చ +

సాయంత్రం ఆరు గంటలయింది. ఇవ్వాళ ఆఖరి రోజు. అతడిని చూడటానికే ఆఖరి రోజు గాకుండా - పార్కుల వెంట తిరగటానికీ తను దీనిని ఆఖరి రోజు చేయాలి!

పార్కులో కాలు పెడుతూనే ఆ పొద వంక చూచింది.

ఆయన అక్కడ కూర్చుని వున్నాడు!

అయిదు నిముషాలు ఆలస్యంగా వెళ్ళి ఆయన ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలనిపించింది క్షణం. కానీ అతడిస్తానన్న డబ్బు అతడితో ఆటలాడటానికి సుముఖత చూపనీయలేదు. అంత మొత్తానికి తిరిగి తల్లి దగ్గర చేయి జాప వలసి వస్తుంది. ఆమె ఇచ్చే లెక్చర్లను ఓపిగ్గా వినాలి బుర్ర పాడుచేసుకుంటూ.

సరాసరి ఆ పొద దగ్గరకు వెళ్ళి వినయంగా, “నమస్కారమండీ!” అన్నది. ఆయన తనని కూతురిగా భావిస్తున్నప్పుడు అభివాదం చేయటంలో అసంబద్ధతత లేదనిపించింది.

“౬కే! కూచోరా! మీ అమ్మ చెప్పిన నీతి బోధలు విన్నావా రాత్రి! అయినా నువ్వు నన్నే సపోర్టు చేస్తావని నాకు తెలుసు!”

బిక్క మొఖమేసుకొని ఆయన వంకే చూస్తూ వుండిపోయింది.

“ఇవ్వాళ అఖరి రోజు గదా! ఓ అయిదు నిముషాలు ఆలస్యంగా వెళ్ళి ఈ పిచ్చివాడిని వడిపిద్దామని - ప్లాను వేస్తానేమోనని భయపడ్డానురా బంగారం! రా - కూర్చో!” అన్నాడు.

మేనక వళ్ళంతా చెమటలు పట్టసాగినయి అతడి మాటలు వింటుంటే. గొంతు తడారి పోతున్నది.

  • ఏం మనిషి ఇతడు? ఎదుటి మనిషి మనస్సును అంత స్పష్టంగా చదవగలుగుతున్నాడూ అంటే అతడికి అతీంద్ర శక్తులు గాని లేవుగదా! అతడి మేధస్సుకు శిరస్సు వంచి పాదాభి వందనం చేయాలనిపించింది.

“అమ్మ ఏంవన్నది?”

క భ౮క-204 1కే

“మీరు ఏం ఆశించి నాకు ఇంత దబ్బు ఇస్తున్నారో కాస్త తెలివిగా ప్రవర్తించి తెలుసు కోమన్నది!” స్పటికమంత స్వచ్చంగా నిజాన్ని చెప్పింది. .

“ఓకే... ఓకే... నీ తల్లి నీకు చెప్పగలిగే మాటలు అవే కాబట్టి వింత లేదు.... కానీ అసలు పార్కుకు ఎందుకు వెళుతున్నావని మొఖం వాచేలా చివాట్లు పెడుతుందేమోనని భయపడ్డాను!”

మేనక కసిగా తల్లి రూపాన్ని కళ్ళ ముందు నిలబెట్టుకున్నది. ఆవిడగారు తనని ఆ మాట అంటే తను ఎలా రిటార్ట్‌ ఇవ్వాలో తనకు బాగా తెలుసు. తనకు తెలుసని ఆమెకూ తెలుసు. తను ఎప్పుడు ఏం చేసినా నసుగుతుందే తప్పా - గట్టిగా మందలించే శక్తి ఆమెకు లేదు!

సచ్చితానందమూర్తి మేనకకు చాలా పకృకు జరిగాడు. ఆమెను అనుకున్నంత దగ్గరిగా జరిగాడు.

తన శరీరం ఆయన శరీరానికి తగులుతుండగా ఏవో శక్తివంతమైన విద్యుత్‌ తరంగాలు ఆమె శరీరాన్ని చుట్టివేస్తున్నట్లనిపించింది. తెలియని మగతలోకి వెళ్ళిపోతున్నట్లుగా భావించింది. ఎలాంటి భయమూ కలగటం లేదు. ఆదుర్ధా కలగటంలేదు. ఆవేశం కలగటం లేదు. ప్రశాంతత మనస్సును ఆక్సిజన్‌లా చుట్టి వేస్తోంది.

మేనక భుజం మీద రెండు చేతులూ వేసి అప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు సచ్చితానంద మూర్తి.

మేనక తన నాసికను కుడిచేతి వేళ్ళతో రుద్దుకున్నది - సుగంధభరితమైన వాసన వస్తుండగా. ఆయన వంటి నిండా ఏదో ఘ్యాటైన పర్‌ఫ్యూమ్‌ (స్ప్రే చేసుకున్నట్లే వున్నది.

“ఈలాంటి అద్భుతమైన, అతీతమైన సన్నివేశం స్వర్గంలోగాని లభించదురా నాన్నా! నీ శరీరంలోని ఒక్క సన్నని నరమైనా నన్ను తండ్రిగా భావిస్తూ ఆలింగనం చేసుకోమని నిన్ను ప్రోత్సహించటం లేదురా కన్నా... నిన్ను పొదివి పట్టుకొని నా గుండెలకు హత్తుకోలేక పోయిన ఈ సంవత్సరాలన్నీ నాకు యుగాలే కదాగ్‌ - అతడి నేత్రాలు జలిస్తున్నాయి. అతడి శరీరం వణుకుతోంది. అతడి కనురెప్పలు వాలిపోతున్నాయి. అతడి పలచని జుట్టు నిక్కబొడుచుకొని మేనక చెంపలకు సూదుల్లా పొడుచుకుంటోంది. అతడు ఆవేశంతో ఊగిపోతున్నాడు.

అలా ఎంతసేపు కూర్చున్నారో వాళ్ళకే తెలియదు. పైన ఆకాశాన్ని నల్లటి మబ్బులు క్రమ్మివేసిన విషయమే తెలియదు. బలమైన చల్లటి గాలి తమని ఊపేస్తున్నదనే విషయమే వాళ్ళకు తెలియదు. వాన చినుకులు కత్తుల్లా పైనుంచి దూసుకు వచ్చి వాళ్ళ శరీరంలోకి దూసుకుపోతుంటే ముందుగా మేనకే కళ్ళు తెరిచింది తెలివి తెచ్చుకొని. శరీరాన్ని కమ్మిన మాయ నుండి బయట పడి ఉలిక్కి పడుతూ నలువైపులా చూచింది.

చీకటి. చుట్టుపక్కలంతా కరెంటు పోయినట్లున్నది. భయంకరంగా వున్నదా చీకటి. పైనుండి వాన చినుకులు....

పక్కనున్న అతడిలో చలనమే లేదు. ఇంకా అతడు ఆమెను పట్టుకొని బిగుసుకు కూర్చునే వున్నాడు, “నాన్నా! బంగారూ!” అంటూ.

మేనకకు ఆ చీకటిలో అతడి చేష్ట భయం కలిగిస్తోంది. “ఏమండీ... ఏమండీ!” అంటూ అతడి భుజాలు పట్టుకు ఊపింది వడివడిగా. 2222222222) =

దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగినయి చీకటిని ఛేదిస్తున్నట్లుగా.

ఆమె కలవరపాటుతో తలెత్తి గడియారం వంక చూచింది. సరిగ్గా ఏడు గంటలు చూపిస్తున్నది. అతడూ మైకం వదిలినట్లుగా కళ్ళు తెరిచాడు.

“ఆత్మీయత నన్ను వివశుణ్ణి చేసిందిరా.... ఈ రోజున నేను నీకిస్తానన్న డబ్బు ఇవ్వకుండానే ఈ గంట గడిపేశాను కదూ! మైగాడ్‌.... ఎంత అవివేకినయ్యాను! నీ ముందు నేనెంత బలహీనుడనయ్యానో (గగ్రహించావా?” అంటూనే జేబులోనుంచి కవరు తీసి ఆమెకిస్తూ, "లెక్షపెట్టుకో!” అన్నాడు.

“అఖ్ధ్లేదు! ఏ కూతురు తండ్రిని అనుమానించగూడదు!” ఆమె గుండె లోతుల్లో నుంచి వచ్చిన అ మాటలకు అతడు చలించాడు.

చటుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వానకు తడిసిన ఆ చేయి మంచులా చల్లగా వున్నది. అతడి కళ్ళల్లోనుంచి మంచు నురుగులా బయటకు వచ్చి తనని చుట్టేస్తున్నట్లే వున్నది. కలవరపడింది మేనక.

“మీరెవరు?” - బిగుసుకుపోతూ, గిటక బారిపోతున్న పళ్ళను బలవంతాన కదిలిస్తూ అన్నది.

“నేను నేనే..... నువ్వు నా కూతురివే!” అన్నాడు అతను, నోటిని పళ్ళన్నీ కనబడేలా తెరిచి.

అతడిని చూడలేక భయంతో కళ్ళు మూసుకొని తలెత్తింది.

“వాన పెద్దదయ్యేలా వున్నది పదరా! ఆటో ఎక్కేద్దాం” అంటూ ఆమె చేతిని పట్టుకొని ఈడ్చుకు వెళుతున్నట్లుగా రోడ్డు మీదకు తీసుకువెళ్ళాడు. అక్కడున్న ఆటోలోకి నెట్టేస్తూ, “పోనీయ!” అన్నాడు.

మేనక అతడి ప్రవర్తను గజగజా వణికిపోతోంది. ఆ పైన వాన చినుకు లకు తడిసి శరీరాన్ని అతుక్కుపోతున్న చీరె.

ఆటో ముందుకు దూసుకుపోతున్నది. వీధి దీపాల గుడ్డి వెలుగులో అతి రయంగా వెళ్ళి పోతున్నది. ఎక్కడికి తీసుకువెళుతున్నాడు తనని?

  • ఆటో అతనూ అతడి మనిషేనా? మేను కంపించింది మేనకకు. అందులో నుంచి దూకేస్తే? అటో వెళుతున్న వేగంలో మేనకకు వళ్ళు తెలియటంలేదు. బుర్ర పనిచేయటం లేదు. దూకితే తను చచ్చిపోవటం మాత్రం ఖాయం!

“అపు” గొంతు తెరిచింది. పెద్దగా అరిచాననుకున్నది. కానీ నోరు పెగల్లేదు.

అతడు ఆటో డైవర్‌ భుజం తట్టి 'అపు” అన్నట్లుగా సైగ చేశాడు. అప్పుడు ఆటో ఆగింది.

“దిగుగ్‌ అంటూనే మేనక చేయి పట్టుకొని దింపాడు. ఇద్దరూ పెద్ద గేటు దాటి ఆ ఆవరణలోకి వెళ్ళారు. తలెత్తి నలువైపులా నిశితంగా చూచింది గుండె బిగపట్టుకొని - అది రామకృష్ణ మఠం!

అతడు చేయి పట్టుకునే వడివడిగా లోపలకు తీసుకువెళ్ళాడు పుస్తకాల విక్రయశాలలోకి. అందులో కాలు పెడుతూనే పుస్తకాల స్టాండు దగ్గరకువెళ్ళి ఒక పుస్తకం తీసుకొని ఆమె చేతిలో పెట్టాడు. క్షెెేడైడెేెడతెెైైైై౯ై౯ై౬౬౬ెెెఊఊఊఊఊజ కై కథరరొని- 2004 22తో

“ఈ పుస్తకం నువ్వు ఖచ్చితంగా చదవాలిరా. స్వామి బుధానంద రాసిన - ది మైండ్‌ ఎండ్‌ ఇట్స్‌ కంట్రోల్‌- నీ మనస్సు నీ ఆధీనంలో లేకపోతే నీ సమాజం నీ ఆధీనంలో వుండదు. .... నీ సమాజం నీ అదుపాజ్ఞలలో లేకపోతే వేల సంవత్సరాల విలువైన నీ దేశ సంస్కృతి నేల పాలయి పోతుందిరా, నాన్నో”

మేనక సచ్చితానందమూర్తి వంకే చూస్తున్నది ప్రశాంతంగా - అతడి మొఖం ఆ క్షణాన చాలా నిర్మలంగా వున్నది. స్ఫటికంలా మెరుస్తున్నది. ఏదో విజయం సాధించినట్లే వున్నది అతడి పెదాల మీద చిరు దరహాసం,

“ఊరికినే వచ్చిన పుస్తకాన్ని మనం మనసారా చదవలేం రా.... నువ్వే డబ్బు లివ్వు” అన్నాడు.

ఆ మాటకు అతడి చేతిలోని మరబొమ్మలా వ్యానిటీ తెరిచింది. యిరవై రూపాయల నోటు తీసి యిచ్చింది.

కౌంటర్‌లో అతను బిల్లుని, పుస్తకాన్ని కవరులో పెట్టి మిగిలిన డబ్బుతో సహా యిచ్చాడు. ఆమె వాటిని వ్యానిటీలో పడేసింది.

బయటకు వచ్చారు ఇద్దరూ. గేటు ఇంకొక పదడుగులు దూరంలో వున్నదనగా అతడు ఆమె చేయి పట్టుకొని పైకెత్తి ముంజేతి వంకే చూస్తూ, “నా ప్రాణమా! నిన్ను భారతీయ సిద్ద్ధాం తాలకు నిర్వచనంలా రూపొందించాలనేదే నా కోరిక... నా ఆశ.... నన్ను నిరుత్సాహపరచ బోకురా, నాన్నా” అంటూ చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు ఆ ముంజేతి మీద.

అవాక్కయింది మేనక అతడి చేస్టకు.

“బై బేవీ బై” చేతులూపుతూ, గేటు దాటి ముందుకు పోయి అక్కడే వున్న తాము దిగిన ఆటోలో ఎక్కి కూర్చొని, "పోనీయ!ా అన్నాడు.

ఆ ఆటో వెళ్ళిన తరువాతగాని మేనకకు పూర్తిగా స్పృహ రాలేదు. అలా వచ్చిం తరువాతగానీ తెలుసుకోలేక పోయింది అతడు వెళ్ళిపోయాడు అని!

4౮60 "

ఆటో దిగి ఇంట్లో కాలు పెడుతుండగానే తల్లి హాల్లో కూర్చొని కనబడింది. టీపాయ్‌ మీద సీసాలు పెట్టుకొని గ్లాసుల్లో నింపుకొని త్రాగుతున్నది. ఈ రోజున ఆమెను తీసుకెళ్ళిన మనిషి ఎక్కువ డబ్బయినా యిచ్చి వుండాలి - లేదా మోసమయినా చేసి వుండాలి..... అందుకే సీసాలు ముందు పెట్టుకున్నది!

“ఏమే! పొలం కాగితాలు దొరికినయ్యా?”

గతుక్కుమన్నది మేనక. లేచినప్పటి నుండి సచ్చితానందమూర్తి ఆలోచనల తోటే మనస్సంతా నిండి వుండటంతో తల్లి చెప్పిన విషయం మరిచిపోయింది.

“చూస్తానులే!” తన గదిలోకి వెళుతూనే వ్యానిటీ బ్యాగ్‌ తీసి మంచం మీద పదేసింది. చకచకా మాక్సీలోకి మారిపోయింది. “త్రాగుతూ కూర్చోకపోతే రాగానే వెతుక్కోగూడదూ!” అనుకున్నది కసిగా.

ఫ్రషప్‌ అయి తల్లి దగ్గరకు వెళ్ళి, “తాళం చెవులు ఎక్కడున్నయి?” అన్నది చికాగ్గా.

“వెతుకు” కసురుకుంటున్నట్లుగా అన్నది ఆమె.... అగ్నిలో మరింత ఆజ్యం పోస్తున్నట్లుగా గ్లాసెత్తి గడగడా త్రాగేసింది. “ఆ బీరువా నిండా ఆ దరిద్రపు మనిషి సామాన్లే వున్నాయి! ఎప్పుడూ నేను తెరవలేదు!”

చురుగ్గా చూచింది తల్లి వంక ఒకసారి మేనక - ఆమె ఎవరిని గురించి ఆ మాట అంటున్నదో అర్ధమవ్వగా!

విసురుగా బీరువా వున్న గదిలోకి వెళ్ళి ఆ బీరువా తలుపు తీసింది. ముక్క వాసన. మొఖం చిట్లించుకుంటూ క్యాష్‌ బాక్స్‌ తెరిచింది, మూలమూలలా వెతికింది. క్రింద సారుగుల తాళం చెవులు దొరకటంతో వాటిని తెరిచింది. ఏవేవో కాగితాలు. ఎక్కడా దాక్యుమెంట్సు కనబడలేదు. సొరుగులు బయటకు లాగి క్రింద పెట్టింది. సీక్రెట్‌ లాకర్‌ రేకు లాగింది.

తన తండ్రి ఆమెకేం అన్యాయం చేశాడో తెలియదుగాని - ఎప్పుడూ ఆయనంటే ద్వేషమే కుమ్మరిస్తుంటుంది. ఇంటి మొత్తం మీద ఎక్కడా ఆయన ఫొటో కూడా లేదు - అంత దాకా ఎందుకు ఇంతవరకూ తనకే తెలియదు ఆయన ఎలా వుంటాడో!

బీరువాలో క్రిందంతా కాగితాలు పరిచివున్నాయి. ఒక్కొక్కటి తీసి చూస్తూ పక్కన పెట్టింది. వాటి క్రిందగా డాక్యు మెంట్లున్న కవరు కనబడడంతో కాగితాలు పక్కకు నెట్టి దాన్ని తీసింది. దాని క్రిందగా (ఫ్రేము లేని పెద్ద ఫొటో ఒకటి వున్నది!

దాన్ని చటుక్కున అందుకున్నది మేనక.

ఆ ఫొటోను చూస్తూనే ఆమె బిగుసుకుపోయింది. అందులో వయస్సులో వున్న తన తల్లి పక్కన తన తండ్రి.... తన తండ్రి... అతడు తన తండ్రి..... అతడు అతడు.... సచ్చితానంద

మూర్తి... పెళ్ళి నాటి ఫొటో!

న! పెద్దగా అరిచింది ఆ ఫొటో పట్టుకొని వాల్లోకి .వస్తూ - “ఈయనేనా మా

నాను

ఆమె త్రాగిన మైకంలోనే కళ్ళు చికిలించి దాని వంక చూస్తూ, పరమ అసహ్యంగా మొఖం పెట్టి “ధీ! అవతల పారేయ్‌!” అన్నది.

“నేను అడిగిన దానికి సమాధానం చెప్పూగొ కఠినంగా అన్నది తల్లి వంక చూస్తూ మేనక.

“ఆల... ఆయనేలేగ” విసురుగా అంటూ మరో గ్లాసు అందుకున్నది - ఆమె.

“నేను ఆయన్ను చూచాను”

ఉలిక్కిపడ్డట్లుగా ఆమె కూతురి వంక చూచింది. “నువ్వు చూడడమేమిటి.... ఆయన చచ్చే ఇరవైయేళ్ళయితే!”

“లేదమ్మా! ఆయన బ్రతికే వున్నారు... సాయంత్రం పూట కలిసి ఒకాయన నాకు దబ్బు యిస్తున్నాడంటినే - ఆయనే!”

“నీ మొెఖం.... నా చేతులతో స్వయంగా నేనే చంపేశాను... సంఘం..... సంస్కృతి... సమాజం అంటూ వెధవ కబుర్లతో నన్ను పంజరంలో చిలకలా చేయాలనుకున్నాడు.... భరించలేక ఇంత విషం పెట్టి చంపి దగ్గరుండి మఠీ నేనే దహనం చేయించాను.... ఎవర్ని చూచి ఎవరనుకున్నావో!”” అన్నది నవ్వుతూ. కానక =

“కాదు ఆయనే... ఆయనే! ఇట్లాగే వున్నాడు!”

తల్లి మరోసారి పకపకా నవ్వింది. “ఇట్లాగే వుండడమేమిటి.... ఈ పాటికి యాఖై ఏ వచ్చి వుండి వుంటాయి..... ప్రతిదానికీ ఒకే... ఒకే అంటూ తల ఎగరేస్తూ నా మాట జీ నెగ్గనిచ్చేవాడు కాదు.... కాల్చుకుతిన్నాడు బ్రతికున్న నాలుగు రోజులూ!”

“ఆయన పేరేమిటన్నాన్‌?” అన్నది తల్లి ముందుకు మరో అడుగువేసి.

“ఆనందమూర్తిలే.... పెద్ద గొప్పగా అందరి ముందూ చెప్పుకుంటుండే వాడు.... సత్‌చిత్‌ ఆనందమూర్తిని - సచ్చితానందమూర్తిని అంటూ! ఎప్పుడూ దేంవుళ్ళూ.... పూజలూ.... పుస్తకాలు తప్పా మరో ధ్యాసే లేదు!”

మేనక కళ్ళు తిరుగుతున్నయి. వళ్ళు జలదరిస్తోంది. మైకం కమ్ముతోంది.... ఆయనే ఆయనే... శరీరం తూలిపోతున్నది.... తనూ.... ఇల్లు... తల్లీ..... అంతా గిరగిరా తిరిగిపోతు న్నారు.

ఫొటోలో వున్న ఆయన నవ్వుతున్నట్లే వున్నాడు. తననే పట్టుకొని, “నేనేరా కన్నా!” అంటున్నట్లే వున్నాడు.

తన గదిలోకి ఆ ఫొటోను తీసుకొని పరుగెత్తింది. మంచం మీద వున్న వ్యాని టీ బ్యాగ్‌ను అందుకొని తెరిచింది ఆయనిచ్చిన కవరు కోసం - దాన్ని తల్లి ముందు పెట్టి నిరూపించాలి అన్నట్లుగా. ఆ కవరు కనబడలేదు. ఆమె గుండె ర్సుల్లుమన్నది. వడివడిగా బీరువా తెరిచి పై అరలో పేపరు క్రింద తన చీరెల వెనగ్గా పెట్టిన రెండు వేల ఏడొందల కోసరం చూచింది

  • అవీ లేవు! డబ్బంతా ఏమైందీ...?”

అంటే -?

మళ్ళీ వ్యానిటీ బ్యాగ్‌ అందుకున్నది. అందులో ఆయన తనచేత డబ్బు లిప్పించి కొనిపించిన పుస్తకం మాత్రం వున్నది - 'ది మైండ్‌ అండ్‌ ఇట్స్‌ కంట్రోల్‌”

కెవ్వున అరిచింది మేనక మంచం మీదకు వాలిపోతూ.

తరువాత పది నిముషాలలోనే తల్లి కేక వేస్తూ, ఊగిపోతూ మేనక గదిలోకి వచ్చింది. “ఏమైందే.... ఇంతకీ ఆ కాగితాలు దొరికినయ్యా లేవా?”

మగతగా కళ్ళు తెరిచింది మేనక అతికష్టం మీద.

ఎదురుగ్గా నోరు తెరుచుకొని రక్కసిలా నిలబడివున్న తల్లి.

“మా నాన్నను చంపానని సంబరపడిపోతున్నావుకదూ - ఆయన చావలేదు!”

“ఛత్ర! నోర్ముయ్‌..... ఆయన ఒళ్ళో పడుకొని మాటలు చెబుతూ ఈ చేతుల తోటే విషం కలిపిన పాలు ట్రాగించాను!ొ

పక్కనున్న టేబుల్‌ మీద పేపరు వెయిట్‌ తీసుకొని తల్లి మోకాలు 'ఫట్‌' మని విరిగేలా విసురుగా కొట్టింది.

ఆమె కుప్పలా కూలబడిసోతూ “చచ్చాన్రా దేంవుడా!” అని అరిచింది.

“ఇక కదలకుండా పడివుండు.... కదిలావో రెండో కాలు గూడా. ఇరక్కొడతానుగా కళ్ళ వెంట నిప్పులు కురిపిస్తూ అన్నది మేనక 222222222౭ సళ ౩

మరుక్షణంలోనే తనని తాను నిగ్ర హించుకుంటూ - తన తండ్రి తనచేత కొనిపించిన పుస్తకాన్ని - ఆయన్నే పట్టుకున్నంత ఆప్యాయంగా పట్టుకొని గుండెలకు హత్తుకున్నది.

మరుక్షణంలోనే ఆమె హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన దానిలా రోడ్డు మీదకు పరుగెత్తింది ఆ మ్యాక్సీ మీదే. గేటు దాటుకూనే కనబడిన ఆటోను ఆపి ఎక్కి కూర్చొని ఎటు పోవాలో చెప్పింది.

అమె వళ్ళు సలసలా కాగిపోతున్నది. కుతకుతలాడి పోతున్నది. ఉద్వేగంతో గుండె ఎగిరెగిరి పడుతోంది.

తను సాయంత్రం పూట వచ్చి తండ్రిని కలుస్తుండే పార్కు వచ్చింది." మొదటి రోజు ఆయన చెప్పిన ఆ యింటి గుర్తులని మననం చేసుకోసాగింది.

'ముందుకు వెళ్ళు - ఎడంచేతి వైపు రెండో వీధిలోకి తిరిగితే కుడి వైపు నాలుగో యిల్లే - నడక దూరం) అన్న ఆయన మాటలు గుర్తుకు వచ్చినయి.

ఆటో అతను ఆమె చెప్పినట్లుగా తీసుకువెళుతున్నాడు.

“ఆపుగా అన్నది సందు తిరిగిన తరువాత కుడి వైపు ఇళ్ళను లెక్కిస్తూ - నాలుగో ఇల్లు రాగానే ఉత్సాహంగా. ఆటోలో నుంచి క్రిందకు దూకుతున్నట్లుగా దిగింది.

ఆ యింటి తలుపులు మూసి వున్నాయి. కిటికీ తలుపులు మూసి వున్నాయి. ఏ గదిలోనూ దీపం వెలగడం లేదు. గేటు తాళం వేసి వున్నది.

ఆయోమయంగా అటూ యిటూ చూచింది. తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇంకా ఇంటికి రాలేదా? భార్య లేదన్నాడు గదా..... భోజనానికి హాటల్‌కు వెళ్ళి వుంటాడా?

ఆలోచనలతో సతమతవుతుండగా పక్కింట్లోనుంచి ఎవరో ఒక ముసలాయన బయటకు వచ్చాడు.

ఆయన వైపుకు రెండడుగులు వేసి, “ఏమండీ! ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడొస్తారో తెలుసా అండో” అని అడిగింది ఆయన్ను

ఆయన మేనక వంక విచిత్రంగా చూచాడు.

“ఆ యింట్లో ఎవ్వరూ వుండరు గదా... అసలు మీకెవరు కావాలి?”

“సచ్చితానందమూర్తిగారి ఇల్లు కాదా అది!”

ఆయన మేనక వంక కళ్ళు చికిలించి చూచాడు. "ఆయన పోయి చాలా సంవ త్సరాలయింది గదండీ.... వాళ్ళకు ఈ ఊళ్ళోనే మరో ఇల్లు వున్నది... ఆయన పోగానే ఆయన భార్య దీన్ని అమ్మేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది...... తరువాత ఈ యిల్లు చాలామంది చేతులు మారినా ఎవ్వరూ వుండలేక పోవడంతో పాడుబడి నివాస యోగ్యం గాకుండా పోయింది... ఆ యింటి తాళాలు తెరిచి ఎన్ని సంవత్సరాలయిందో!” అన్నాడు ఆయన మేనకనే కన్నార్పకుండా భయం భయంగా చూస్తూ! . అ క ఃభలం-2004 =

ఇదీ హైటెక్‌ యుగం జీ

! ళ్గి

9 ప్రకంటే కృష్టార్యే

ోోట్ళిళ! ఈ బూమ్మింద దొంగతనం, రంకుతనం ఉండాయే? అవ్వి గంపకందేసి మూసిపెట్టి

ముడుక్కోమన్నా ముడుక్కోవు. రెక్కలొచ్చి ఎగర్తాయి జూడు, కనిపించిన చెవల మిందంతా

వాల్హాయి. అందుకే మణిసి ఎంత చండాళంవైన పనైనా చెయ్యచ్చుగానీ దొంగతనం ఉండాదే?

అంత చండాళంవైన పని ఇంగాొకిటి ఇంగొకిటి ఉండదు. అందుకే అడగతా ఉండదా, నిజిం చెప్పరా!”

అడిగింది గంగిరెడ్డి. అడిగేది కన్నిగ్రాణ్డి. కన్నిగాడు గంగిరెడ్డి ఇంట్లో సేద్యగాడు. సేద్యగాడంటే మట్టిని బువ్వగా మార్చే మహాశక్తి, అయినా వాడు తాగేది మోచేతుల కింద నీళ్ళేగదా? వాడు పచ్చి నిజం చెప్పినా పరమ అబద్ధమే అవుతుంది. అది వాడి అంతరాత్మకూ తెలుసు. అయినా అడిగింది రెడ్డిగారు. ఐదులు చెప్పకుండా ఉండలేడుగదా? అందుకే -

“సత్తి పెమాణకంగా నాకు తెల్టయ్యాగ

“ఒరే! ఎన్నిసార్లు అడిగినా “నాకేం తెల్టు, నాకేం తెల్టు?” అని పాడిన పాటే పాద్దా ఉండావ్‌. కాలి కుండేది చేతికు తీసుకుంటే అదే చెప్పిస్తింది.”

“మీతోడు నాకేం తెల్టయ్యా!”

“అపద్దాలు కుక్క మాదిర్లో మొరిగేదానికి నాతోడు కావాల్సి వచ్చిందిరా దొంగనాకొడకా! ఒకేళ ఈస్పిరుడు ఈ ఇంటి దొంగను ఇద్సిపెట్టేస్తే పెట్టచ్చు. అయితే ఈ గంగిరెడ్డి ఉండాడే? వాడికి ఇట్టా మాదిర దొంగ కూళ్ళకు ఆంవడల దూరం. వాళ్ళు హరిహర బెమ్మాదుల్చిగొచ్చినా వాడు మాత్రం వాదిలిపెట్టడనేది కడుపులోనుంచి బయటప్జె బిడ్డ మళ్ళీ కడుపులోకి పోదన్నెంత సత్తిం!”

“అయ్యా! పుట్టి బుద్దెరిగిననాటినుంచి మీ తావన పడుందా. మీరు కాల్లో చెప్తే నేను ఈ చేతల్లో చేస్తా ఉందా. మీ కూడు ఈ చేతల్లోనే తింటా ఉందా. ఆ చేతుల్లోనే ఇట్టా దొంగ కూటికి పాలుపడ్డానా? చెప్పండయ్యా!”

“అందుకేగదరా! గెడ్డం కింద రొండు వడ్లగింజలేసి అడుక్కుంటా ఉండేది. అయినా నువ్వే చెప్పు. కంటికి తెలవకుండా యాడన్నా కంట్లో పాప మాయంవయిపోతిందా?”

“అయ్యా! మీ మణుసే మీకు సొచ్చి. చెప్పండయ్యా చెప్పండి. నా మొకం జూసి చెప్పండి. మేడిపట్టి పచ్చని పైరు పెట్టిన చేతుల్లో ఇట్టా పాడుపని చేస్తానా?”

గుండెల్లో మెలితిరిగిన కన్నిగాడి బాధ గొంతులోకి ప్రాకితే గొంతు బొంగురు పోయింది.

“ఈ నంగేడుపులన్నీ ఆడకట్టిపెట్టువాయ్‌! ముదిగారం జేస్తే కుక్క కూడా మూతులు నాకి తిందంట. ఇట్టయితే ఇది కుదరే పనిగా తోచలా. అవుగదా? చెరుకా బెల్లం పెట్టు అంటే పెడ్తిందా?” 21న సు టం!

“అయ్యా! నన్ను కొట్టండి. కొయ్యండి. కావాలంటే మీ చేతుల్తోనే గొంతు పిసికి చంపిపారె య్యండి. కానీ ఈ దొంగతనాన్ని మాత్రం నామింద పెట్టబాకండయ్యా.”

గుండెల్లో బాధ కండల్లో కరిగి చెంపల మీద జారుతుంటే కన్నిగాడు ఒక్కొక్క మాటను ఆ కన్నీళ్ళతో తడిపి పలికాడు.

నెమలి కంట్లో నీళ్ళు గార్తీ వేటగాడికి ముద్దా?

గంగిరెడ్డిలో స్వార్ధం కసిగా మారి కోపాన్ని దోసిళ్ళతో జుర్రుకుంటే - పండ్లు పటపటలాడు తున్నాయి. కండ్లల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఆ ఎక్కుపెట్టిన బాణం ఏ క్షణాన అయినా కన్నిగ్రాడి గుండెల్లో దూసుకొనిపోవచ్చు.

చీమ చిటుక్కుమంటే గుండెలు కలుక్కుమనదం పల్లెల మనస్తత్వం. ఊరు గుప్పుమనింది. ఊరు ఊరంతా ఒక్కటయింది. గంగిరెడ్డి ఇంటి ముందు గుంపు కట్టింది!

ఇప్పుడు గంగిరెడ్డి చూపు జనం మీదికి మళ్ళింది.

“అయ్యా! పాలన్నం తినే పదిమంది పెద్దమణుసులు ఇప్పుడిక్కడ చేర్నారు గదా? చెప్పండయ్యా, మీరే నాయం చెప్పండి.”

ఏమి జరిగిందో ఏమో మాటమాత్రం చెప్పకుందా న్యాయం చెప్పమని అడుగుతున్నాడు గంగిరెడ్డి. పాపం! పాలన్నం తినే పదిమంది నిస్సహాయత చూపుల్లో చిత్రంగా తారట్లాడుతూ ఉంది. అమెరికా కయ్యానికి కాలు దువ్వుతుంటే వద్దని వారించలేక ఇరాక్‌ తప్పేమీ లేదని తేచ్చి చెప్పలేక ఒకదాని మొగం ఒకటి నిస్సహాయంగా చూసుకొంటున్న చమురు దేశాల్లో వాళ్ళ మొగాలు పోటీపడుతున్నాయి!

అది (గ్రహించాడు గంగిరెడ్డి,

“ఈ పొద్దుటికి సరిగ్గా మూడే మూడు దినాలకు ముందు, అగ్గివేని పల్లెలో మావొప్పార చుట్టాల పెండ్లి జరిగిందా? జరిగింది. ఆ పెండ్లికి మా ఇంట్లో ఆడది పొయ్యిందా? పొయ్యింది. పోతా ఉండేది సుబకార్నానికి గదా? అని బీరవాలో బంగారు గొలుసు తీసి మెళ్ళో ఏసుకొనిందా? ఏసు కొనింది. పొయ్‌ పెండ్లి చూసుకుణ్ణిందా? చూసుకుణ్ణింది. పెండ్లి అయిపోతానే తిరుక్కోని వచ్చిందా? వచ్చింది. వస్తానే అది ఏం జేసింది? కాళ్ళూ జేతులు కదుక్కోవాలని పెళ్ళోకి పొయ్యిందా? పొయ్యింది. పోయ్‌నాక ఆడదానికి ఏం బుద్ది పుట్టిందో ఏం పొదో? ఒళ్ళే కడుక్కోవాలనుకుణ్జిందా? అనుకుణ్ణింది. అనుకుంటానే అది ఏం జేసింది? మెళ్ళో గొలుసు తీసి గూట్లో పెట్టిందా? పెట్టింది. అది ఉండాదే తినిన చోట్నే చెయ్యి మర్సిసొయ్యే బాపత్తు. గొల్పు మాటే మర్సిపొయ్యింది. మద్దేణంకాడ మతికొస్తే ఒక్క లగువులో పెళ్ళోకి పొయ్యింది. పొయ్‌ గూట్లో తడుంవులాడింది. గౌలుసుకు కాళ్ళొచ్చి గునగున నడ్సిపోతే గూట్లో ఏంవుండాది నాతాడు? అప్పిటికీ పాంవరం పట్లేక దీగూట్లో పెళ్ళో కండ్లు రొండూ చించుకోని ఎతుకు లాడింది. ఎతుకులాడ్తే ఏంవయింది? ఎతుకులాటే మిగిలింది. పోనీ! మీరే చెప్పండి. ఇంట్లో ఉండేవాళ్ళను కాదని అదెట్ట బోతింది? చెప్పండి. మీరే చెప్పండి.”

పాకీస్థాన్‌ అధ్యక్షుడు ముషాగ్రఫ్‌లాగా ముడి వేసేదీ తానే విప్పేదీ తానేగా గంగిరెడ్డి అడిగేదీ తానే, బదులు చెప్పేది తానేగా నోటి మీద కాయ పదకుండా మాట్లాడ్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు చే సమా హే ఊ22222222222222ోోా

మాత్రం ఏం జేస్తారు? కాళ్ళీర్‌ పరిస్థితిని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని కూడా ఎవరేమి చెప్పినా (శ్రద్ధగా వింటున్న ఐక్యరాజ్య సమితి అన్నలనిపించుకొంటారు. ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకొన్ని గంగిరెడ్డి -

“వోనీ! ఇంట్లో ఎవురుండారో మీరే చెప్పండి. నేనూ మా ఆడది. మా కొడుకు. ఇద్దో ఈడూ మా సేద్దిగాడు కన్నిగాడు. మమ్మల్నిగ్రాదని ఇంట్లోకి ఇంకెవురొస్తారు? వొచ్చినా ఇంట్లో కొస్తారు గానీ పెళ్ళోకేం పని? పోనీ! పెళ్ళోకీ పొయ్‌నారే అనుకుందాం. దీ గూట్లోకి తొంగి తొంగి ఎందుకు చూస్తారు? చూడరుగదా? అయితే గొలుసు ఏంవయినట్టు? ఈ కొంపలో ఉండేవాళ్ళలో ఎవురో ఒకరు పుణ్ణెంగట్టుకో నుండాల. మా సొత్తు మేంవే దాంగిలించి లేదని చెప్తామా?”

“అదిగాదు గంగిరెడ్డ! దీనికి పొయ ఎందుకిట్లా మల్లగుల్లాలు పడ్డా ఉండావే? ఒక్క అడుగు. అట్టా పుత్తూరు దాకా పొయ్యెస్తే సరిపోలా. మమ్మల్ని అడిగినట్టు ఆ అయ్యోర్నే అడిగితే ఆయనే చెప్తాడు గదా?” - ఆ గుంపులో ఒక గొంతు గంగిరెడ్డి పాటకు పల్లవి పాడింది.

“అయితే నీ దగ్గిర చెప్పించుకుందేదానికి అంత పనికి మాల్నోడనుకుణ్డావా గంగిరెడ్డిని? నిద్దర మొకంతో లేసి పొయనోణ్జి. పుత్తూరు నుండి ఇప్పుడే గదా తిరుక్కోని వస్తా ఉండా.”

పుత్తూరు మాట చెవుల్లో పడేసరికి ఆ గుంపు గుండెలు గొంతుల్లో చిగురించాయి.

“ఎట్టెట్టా? పుత్తూరి అయ్యోరి తావుకి పొయ్యేసి వస్తా ఉండావా? అమ్మో! అయ్యోరంటే మహన్నబావుడు గదా? అంజనం తంవలపాక్కు రుద్ది చూసినాడంటే అచ్చిరం పొల్లు బోకుండా పలకతాడు. అప్పుడట్నే గదా? మా కడగోటోడు అలిగి పరారైపొాయనప్పుడు ఆయన తావుకు పొయ్‌ తాంబూళం బెట్టి అడిగితే - మూడు గెంటలు.... మూడు దినాలు.... మూడు వారాలు....మూడు నెలలు - అది తప్పిందంటే మూడేండ్లలో ఇల్లు చేర్తాడని చెప్తే - సరిగ్గా మూజ్జెల్లు తిరక్కముందే ఇల్లు చేర్నాడా? లేదా?”

ఇరాక్‌ మీద కాలు దువ్వుతున్న అమెరికా అధ్యక్షుడు బుష్‌కి ప్రధాని టోనీ ఇ్లెయిర్‌ వత్తాసు పలుకుతున్నట్లు గంగిరెడ్డికి ఒక తోడు దొరికింది. యుగధర్మం. తోడు దొరకాలేకానీ వాడు కోవడంలో ప్రతి మనిషి రాజకీయ నాయకులకే పాఠాలు నేర్పే పరిణతి సాధించాడు. గంగిరెడ్డి మాత్రం అందుకు మినహాయింపు ఎలా అవుతాడు?

“పుత్తూరులో బస్సు దిగతానే కాయా కర్పూరం తీసుకుంటి. నేరుగా అయ్యోరుండే తావుకు పోతి. అప్పిటికే ఆడ అయిదారు మంది కాసుకోనుండారు. ఆడ ముందొచ్చినోడు ముందే. ఎన కాల వచ్చినోడు ఎనకాలే. వాడెటువంటి మొగలాయి అయినా ఎనుకు ముందట్యేదానికి లేదు. అయ్యోరు పూజా పునస్కారాలు చేసుకొని వచ్చి కూసుండె. గుమ్మిడి పొండు మాదిర్లో గుమ్మటంగా ఉండే ఆ మణిసి పట్టుపంచె కట్టుకోని ఈబూది బొట్లు పెట్టుకోని మెళ్ళో రుద్రాచ్చ మాలలేసుకోని పీట మింద కూసుంటే ఆ మొకం ఒక ఎలుగు ఎలిగిపోతా ఉంటింది. వాడెటుమంటి ఇక్లామార్చుడైనా సరే? - అయ్యోర్ని చూస్తానే రొండు చేతులెత్తి మొక్కాల్సిందేగదా?”

“అది సరే గంగిరెడ్డీ! ఇంతకూ అయ్యోరు ఏం చెప్పినాడని?”

“న్సువ్వు నన్నోక పనికిమాల్నోడికింద జంవగట్టినట్టుందావే? అయ్యోరు ఎవుడి మిందనో చెప్తే నేను వచ్చొచ్చి ఈజ్జే ఎందుకడగతా?” 2222222222 నీ హైచో యుగం కే

“ఎట్టెట్టా? పుత్తూరయ్యోరు ఈడి మిందనే చెప్పినాడా? అయితే ఇంకా ఎందుకీ మద్దిస్తం?”

ఆ మాటతో చేజారిన ఆరు సవరాల బంగారు గొలుసు సజీవ దృశ్వమై కండ్ల ముందు మిలమిలా మెరిస్తే గంగిరెడ్డి కొలిమి గుండెల్లో మంటలు నాల్మలు సాచి పొగలు కక్కుతున్నాయి. అయినా నిగ్రహించుకొన్నాడు.

“రే! చెప్పరా. యాడ దాచిపెట్నావో చెప్పరా?”

“ఆ దేముడు సాొచ్చిగానాకు తెబ్బయ్యా!?”

“వోనీ ఎవురికిచ్చినావో చెప్పరా?” .

“మీ పాదాల సాచ్చిగా ఈ పాపం జేసిన కండ్రతో నేను చూడ్జ్ణే లేదే? ఇంక ఎవుడికో ఇచ్చినానని ఎట్లా చెప్పమంటారయ్యా?”

“సరే! ఎక్కడ అమ్మేసినావో చెప్పరా?”

“మా యబ్బతోడు నాకు తెల్బయ్యా!”

ఆ మాటతోగూడా గంగిరెడ్డి చెయ్యి పైకి లేచింది. అంత వరకు ఓర్చిన ఓర్పు శక్తిగా మారి చేతికి ఊపు వచ్చింది. కన్నిగాడి గూబ గుంయ్‌ మనింది.

ఆ దెబ్బతో వాడు తూలి కింద పడ్డాడు. పడి గంగిరెడ్డి రెండు పాదాల్ని వొడిసి పట్టుకొన్నాడు. దెబ్బతిన్న గూబ గొంతులో పుండై సలిపితే వాడు ఎలుగెత్తి -

“మీ పాదాల కిందుండే బూదేవి సాచ్చిగా చెప్తా ఉండా. ఈ చేతల్లో నేనా గొలుసు తాకుంటే ఇద్దే నా నోట్లో ఈ మట్టి పడ్తిందిగ” అంటూ చారడు మట్టిని జవురుకొన్నాడు.

మట్టిని నమ్ముకొని బతుకుతున్న గంగిరెడ్డికి ఆ మట్టే సాక్ష్యం. ఈ కఠిన సత్యాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఓర్పు నశించింది. ఎడం కాలికి మత్తెక్కింది. ఎగిరి ఒక్క తన్ను తన్నాడు.

కన్నిగాడి చెమట వీర్యంతో గర్భవతి అయిన గంగిరెడ్డి ఇంట్లో గాదె ముసిముసిగా నవ్వుకొనింది.

“నవ్వు కండ్లతో చూళ్ళేదు. చేతల్లో తాకలేదు. అయితే పుత్తూరి అయ్యోరికి నీ మిందేంవన్నా పగనా? - ఆది అంతం లేకుండా నేటి రాజకీయ నాయకుడి అధికార వాంఛలా పెరిగిన గంగిరెడ్డి కోపం ఉన్నట్లుండి అనునయంగా మారింది.

పుతూరు అయ్యవారి మాట చెవిని పడడంతో కన్నిగాడి కదుపు రగిలింది. వాడి చూపు చేతిలో మట్టి మీదికి మళ్ళింది. అది ప్రతినిత్యం తాను చెమటలో అభిషేకించిన మట్టి. సాటి మనిషి కొట్టినా మట్టి కడుపు కౌట్టదన్న ధైర్యం వచ్చింది. వాడు ఒక్క ఊపులో పైకిలేచి-

“పదయ్యా పద. పుత్తూరికి పద! అయ్యోరు నన్ను జూసి నా మింద చెప్పనీ. అక్కడికకృత్ణే వాడి నాలిక బట్టి తెగ్గాయ్యకపోతే నేను....”

“అయ్యు! అయ్యు! పుత్తూరు అయ్యోర్నే అనరాని మాట అంటావట్రా?”

పుత్తూరు అయ్యారి మీద భక్తివిశ్వాసాలు ఆ గుంపు గుండెల్లో జొరబడితే ఆశ్చర్యం ఆవిర్లు కక్కింది.

“అంటానయ్యా! అంటాను. ఎందుకనను? చెయ్యని దొంగతనాన్ని చేసినానని అన్నాయంగా కెేెైత22ఊఊ323223=క్రై2క కై క భారిని-2004 ౩౩ 2222222222

లాట నింద నా మీంద మోపితే - ఆ నా కొడుకు రగతం కండ్ల జూసేదాకా....”

“ఇనండయ్యా ఇనండి. వాడు కూసే కూతలు ఎట్టుండాయో, ఇనండి. మహన్నబావుడు అయ్యోర్నే అనరాని మాట్లు అంటా ఉండాడంటే?....” మందిని మలేసుకుండే దానికి గంగిరెడ్డి మాట లౌక్యంతో వియ్యమందింది.

“వాడు అంతమాట అంటా ఉండాడంటే?.... తప్పుచేసుంటే అంత దయిర్నం వాడికెట్టాస్తిం దబ్బా?” - ఒక గొంతులో నుండి ఊడి పడిన సందేహం ఆ గుంపును ఒక ఊపు ఊపింది.

గంగిరెడ్డి గుండె ఒక్క క్షణం తడబడింది. అంతలోనే తెపరాయించుకొని -

“అయ్యా! పదిమంది తమబోటి పెద్దోళ్ళు నడిచే దోవలో నిలబడుకోని చెప్తా ఉండా. అపద్దం చెప్పాల్సిన కర్మ నాకేం పట్టింది. అయ్యోరి ముందర కాయా కర్పూరం పెట్టా తాంబూళం పెట్నా ఆ తాంబూళంలో అయిదు రూపాయలు దచ్చిన పెట్టా అంతే! నేను మడిచేతులు కట్టుకోని కూసుణ్ఞా. అయ్యోరు నేను పెట్నె తాంబూళంలోనే ఒక తంవలపాకు చేతికి తీసుకుందె. డబ్బీలో అంత కాటికి తీసుకోని తంవలపాక్కు పూసె. దాన్ని మద్సి అర్సేతిలో పెట్టుకోని రోంచేపు మంత్రాలేవో గొణిగె. ఆమిందట ఆకు ఇప్పి అర్సేతుల్లో పెట్టుకొని రెప్పార్చకుండా దానికల్లానే చూస్తా శెడ్డీ! నీ మిద్దింటికి తూర్పు వాకిలి. వాకిలి ముందు మూడు అంకణాల పశువుల కొట్టాం. ఆ కొట్టానికి ఉత్తర దిశలో పెరడు. ఆ పెరట్లో పడమటి తట్టు గోడకు ఒకదీ గూడు. ఆ గూట్లో పెట్టిన బంగారు గొలుసు కనబడ లేదు. ఏమంటావ్‌?” అని అడిగె.

“నా ఇల్లూ వాకిల్ని టీవీలో చూసి చెప్పినట్లు చెప్తా ఉంటే నాకు నరెంటికపదె. నాకు తెలవకనే రొండు చేతులు జోడిస్తి!

“అడిగిన దానికి సమాధానం చెప్పు రెడ్డీ!” అని రెట్టించె.

“అచ్చిరం పొల్లుబోకుందా అంతి నిజింవే సాంవీ!”

“రెడ్డీ! మనిసి చామనచాయలో ఉంటాడు. అంత పొట్టీ గాదు. అంత పొడుగూ కాదు. అంత లావు కాదు. అంత సన్నమూ కాదు. మీసకట్టు ఏర్పడీ ఏర్పడని వయసు. మనిషి మంచి దారుధ్యంతో ఉంటాడు. ఇంతకూ నీ ఇంట్లో మనిషే నీ కష్టం తిని బతికే మనిషే అయితే నగ చేతులు దాటి పోయింది. దొరకడం కష్టం. అయినా ప్రయత్నించు” ఇన

“ఇప్పుడు మీరే చెప్పండయ్యా? - వీడు అవునో కాదో?” అంటూ గంగిరెడ్డి దైన్యాన్ని పులిమిన చూపులతో ఆ మందిని పరామర్శిస్తూ చేతులెత్తి దండం పెట్టాడు.

“ఇంగిరెడ్డీ! నీకేంవన్నా పిచ్చిగిచ్చి పట్టిందా? రామాయణ మంతా విని రాంవుడు సీతకేం కావాల?” అని అడిగినట్టుండాదే యవ్వారం. పుత్తూరయ్యోరంటే ఏంవనుకుణ్లావ్‌? ఆయనేం వన్నా సటపటమైన మజణిసా? ఆ కండ్లు గెంవనించలా? పిల్లి కండ్లు గదా? నీగిట్లో పిల్లి సూపే గదా అది! అపద్దాలు చెప్పేటట్టుగా ఉంటే ఆయన తావుకు అంతమంది ఎందుకు పోతారు?”

గ్రామ పినపెద్ద వెంకట్రాయులు తాత. తాత ఆమోదముద్ర పడిందంటే గ్రామ న్యాయం తలెత్తి నిలబడుతుంది. ఆ మాట కోసరమే ఎదురు చూస్తూ ఉండిన గంగిరెడ్డి కార్గిల్‌ యుద్ధంలో భారత వీరుడే అయ్యాడు. కన్నిగ్రాడి మీద విరుచుకు పద్దాడు!

కాలితో..... చేత్తో....ఏది వాటమైతే దాంతో.... మార్చి మార్చి దెబ్బ మీద దెబ్బ పడ్డూనే

న ఉంది. దెబ్బ దెబ్బకూ “అయ్యో! కుయ్యో!” అని గుండెలు అవిసేలా ఏడుస్తూ “నాకేం తెల్టయ్యా నన్ను రచ్చించండయ్యా!” అని చుట్టూ చేరిన జనానికి చేతులు జోడించి చూపులతో అర్ధిస్తున్నాడు.

పాలన్నం తినే పదిమంది పెద్ద మనుషుల రాతి గుండెల్ని ఆ చూపు కరిగించలేకపోయింది. అన్యాయాల్ని ఎదిరించాలి. అక్రమాల్ని అంతం చేయాలి!- అన్న ధ్యేయంతో కవులు, రచయితలు విరివిగా సాహిత్యాన్ని సరఫరా చేయాలంటే వాళ్ళకు ముడిసరుకు అవసరం అనుకొన్నారేమో? వేడుక చూస్తున్నారే కాని ఎవరూ ముందు పడలేదు.

కొట్టి కొట్టీ గంగిరెడ్డి కాళ్ళు చేతులు సలుపుతున్నాయి.

ఇక కొట్టే ఓపిక కూడా లేకపోయింది.

“నీ కత ఇట్టగాదురా!” అంటూ వొడిసి వాడి జుట్టు పట్టుకొన్నాడు. వంగదీస్తూ ఒక్క తన్ను తన్నాడు. పట్టాలు తప్పిన రైలు పెట్టెలా వాడు తలకిందులుగా పడ్డాడు. పట్టిన జుట్టు పట్టు వదలకుండా చచ్చిన గొడ్డును బరబరా ఈద్చినట్లు వీధిలో నుండి ఇంట్లోకి ఈడ్చుకొని పోయాడు.

అలా ఈడ్చుకొనిపోతుంటే ఆ ఇంటికి తాకట్టు పెట్టిన పౌరుషం తల వంచింది!

పశువుల కొట్టంలో రాతి కూసానికి పెడరెక్కలు విరిచి కట్టేస్తుంటే వాడి శక్తి చేతులు కట్టుకొనింది. మట్టిలో నుంచి చరిత్ర సృష్టించిన ఆ వీరుడికే చరిత్ర పుటల్లో చోటు లేదు. అలా లేనివాళ్ళు ఈ పుణ్యభూమిలో ఎందరో? - వాళ్ళల్లో కన్నిగాడు ఒక్కడు. గంగిరెడ్డి చింతనిప్పుల కండల్లో నుండి జారిన కోపం గుండెను బండగా మారిస్తే ఎగిరెగిరి తన్నుళూ, “నిజం చెప్పరా? అని అడుగుతున్నాడు. వాడు చేయని నేరాన్ని చేశానని ఎలా చెప్పాడు? చెప్పలేడు. చెప్పకపోతే గంగిరెడ్డి రెచ్చిపోతున్నాడు. వాడు తన్నిన తన్నులు.... కొట్టిన దెబ్బలు.... తిట్టిన తిట్లు మౌనంగా భరిస్తున్నాడు. పాపం! కన్నిగాడు ఏదో ఒక మత మౌధ్యానికో.... లేదు సిద్ధాంతానికో కట్టుబడిన ఆత్మాహుతి దళంలో సభ్యుడు కాదు చంపినా నోరు విప్పకపోవడానికి! వాడు ఒక అమాయకుడు! అ అమాయకుడి మౌనరోదన గాట కట్టిన గొద్గు.... వాడి చేతి మేపు తిన్న గొడ్డు గ్రహించాయి. నోరులేని గొడ్లు కార్చిన కన్నీళ్ళు గాట్లో కసువు గుండెల్ని తడుపుతున్నాయి! ఒంటి మీద దెబ్బ తగలని చోటే లేకపోతే ఒళ్ళు పుండు పుండు అయింది. కట్టిన కట్లు మంట పెడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా మెడ నిలబడడం లేదు.

ఇప్పుడు వాడి ప్రాణం ఆకు అంచున నీటిబొట్టు!

ఈ ఘోరాన్ని చూడలేనన్నట్లుగా కాలపురుషుడు నల్లని ముసుగు తొడుక్కుంటున్నాడు.

“యదవ. పనికిమాల్ని యదవ. ఇంట్లో బిడ్డమాదిరుండి ఇంత పనికి వగతెగిస్తాడా? వాణ్ణని ఏంవిలాబం? కాలయవే అట్టయిపాయ!” అని తలకొక్క తీరుగా తలపోసుకొంటూ గంగిరెడ్డి ఇంటి ముందర గుంపు ఎప్పుడో. ఎవరి దారి వాళ్ళదయింది.

కన్నిగాడి ఎదురుగా గంగిరెడ్డి మంచం వాల్చి కూర్చున్నాడు. చూపులు మంటలై వా్డి. నిలువునా కాలుస్తున్నాయి. ఉచ్చ్వాస నిశ్వాసల్లో ఆవేశం పొగలు కక్కుతూ ఉంది. కాలం గంగిరెడ్డి అలుపును చప్పరించేస్తుంటే ఓపిక! ఓపికలో ఊపు! ఆ ఊపులో లేచి వాడి మీద పడడం! న కానన్‌???

లాయ ప్రహసనం ఆగకుండా సాగుతూనే ఉంది.

అర్థరాత్రి దాటింది. ఒక్క గంగిరెడ్డి ఇల్లు తప్పిస్తే ఊరు నిద్రపోతూ ఉంది. కన్నిగాడు కుమిలి కుమిలి ఏడ్చాడు. ఏడ్చే ఓపికను తన్నులూ దెబ్బలూ మింగేస్తే వడుపు మూలుగులుగా మారింది. అప్పటికి ఆ మూలుగులు కూడా మూగపోయాయి.

అప్పుడు ఇంట్లో ఇల్లాలు కలగచేసుకొనింది.

“పోతే పొయ్యింది పాడు నగ. వాణ్ణి ఎందుకట్లా కొట్టి కొట్టి చంపేస్తావే? - చేతికెదిగినోడు చేయ్‌దాటిపోతే? - నగనన్నా సంపాయించుకోవచ్చు కానీ మణిసిని?” అంటూ అద్దుపడింది.

“చంపతానే! వాణ్ణి నిలవనా చంపతానే. నగ పొయ్యిందని కాదే నా బాద. తూబెహ! ఆ నగ ఎంత? నా మాంవిడి తోపులో నాలుగు చెట్ల కాపంత కాదే? కడుపులో పుట్నై బిడ్డతో సరి సమానంగా చూసుకుంటే కడాన ఇదా ఈడు చేసేపని?” అని ఇల్లాలి మాటల్ని ఈ చెవుతో విని ఆ చెవులో వదిలేసి గంగిరెడ్డి కాలంతో పోటీపడ్డూ కాలికీ చేతికీ పని చెప్తూనే ఉన్నాడు.

తెల్లారింది.

కన్నిగాడి బతుకూ తెల్లారిపోయింది!

“అయ్యయ్యో! అడివిలో నాయం ఊళ్ళో కొచ్చేసిందే? ఒక నగ కోసరం నిండు పాణాల్ని ఎవుడైనా నిలవనా తీస్తాడా? పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి వాడు చేసిన కష్టిం లెక్కగట్టుంటే ఇటుమంటి నగ వాకిటి కాదు - పది రమ్మంటే రావా?”

ఊరు నోరు చేసుకొనింది!

అప్పటికి కానీ గంగిరెడ్డికి ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రతిపక్షం ఉన్నట్లు తనకా ఊళ్ళో కాని వాళ్ళున్నారన్న సంగతి గుర్తు రాలేదు. ఆ మాట మనసులో మెదిలేసరికి గుండెలు అర చేతుల్లోకి వచ్చాయి. అలానే పట్టుకొని ఊరి మీద పద్దాడు. కనిపించిన ప్రతి వ్యక్తి 'ఇవ్వి చేతులు గాదని!' చేతులే పట్టుకొంటున్నాడు. ఈ గండం నుంచి గట్టెక్కించమని ప్రాధేయపడుతున్నాడు!

“సరే! జరిగేదేదో జరిగిపొయ్యింది. ఇంక ఏంవి మాట్లాడితే మాత్రం ఏంవి లాబం? ఇట్టయితిందని ఆయనేంవన్నా అనుకుణ్ఞాడా? అక్కడా ఇక్కడా పొక్కి కొంపలు అంటక పోకముందే కాల్సి పారేసి కంటికి మరుగు చేసేస్తే పోతింది. గంగిరెడ్డీ! నువ్వు ముందాపని చూడు” అంటూ అయిన వాళ్ళు పురమాయిస్తున్నారు.

అయితే ఈ వ్యవస్థలో మాటలు ఊపిరిపోసుకున్నంత ఉదారంగా చేతల్ని ఊహించలేము కదా?

అందుకే కొందరికి డబ్బుగా ..... కొందరికి ఆ దబ్బు రూపాంతరం చెంది సారాగా - గంగిరెడ్డి ఇంట్లో ఇనప్పెట్టెలోంచి పచ్చ కాగితాలకు కాళ్ళొస్తే కన్నిగాడి శవం కదిలింది.

అప్పుడు గంట పది అయింది.

సాధ్యమైనంత తొందర్లో కన్నిగ్గాడి కట్టెను కట్టెల్లో ఒక కట్టెగా బూడిద చేయాలన్న తాపత్రయం కాళ్ళకు బుద్ధి చెప్పింది. శవ యాత్ర ఊరి గెవిని దాటింది! కాటికి చేరడానికి ఉరుకులు పరుగుల మీద ఉంది.

అంతలో ఒక జీప్‌ శరవేగంతో వచ్చింది. శవవాహకుల ముందు ఆగింది. జీప్‌ ఆగీ 2222222222 యిగం కై

ఆగడంతోటే సబ్‌ - ఇన్స్‌పెక్టర్‌ తన సిబ్బందితో దిగాడు. ఆ గుంపును చుట్టుముట్టాడు. శవాన్ని స్వాధీనపరచుకొని జీప్‌లో పెట్టించాడు.

ఆ తరువాత “గంగిరెడ్డి! ఎక్కు జీప్‌” - అన్నాడు సబ్‌- ఇన్స్‌పెక్టర్‌.

ఇది కానివాళ్ళు కట్టుకొన్న పుణ్యకార్యమని గ్రహించిన గంగిరెడ్డి వాళ్ళ గొంతులు కొరికి నెత్తురు తాగాలన్నంత కోపంతో కొంకర్లు తిరిగినా పరిస్థితుల చేతుల్లో బానిస. అందుకే నంగిగా-

“నేనేం చేశానయ్యా నన్ను జీప్‌ ఎక్క్మమంటా ఉండారే?”

“నువ్వు ఏం చేశావో తెలుస్తుంది. ముందు ఎక్కువాయ్‌ జీప్‌!” పోలీసు జులుం హుంకరించింది.

“అదిగాదయ్యా? నా నగ పొయ్‌ నేను ఏడ్చి చస్తా ఉంటే నేనెందుకెక్కాల జీప్‌? పుత్తూరి అయ్యోరి తావుకు శాస్త్రానికి పోతే కన్నిగాడే కన్ను కత్తరించేసినాడని చెప్పె. నలుగురి ముందర వాణ్ణి నిలదీస్తే వాడా అగుమానాన్ని భరించలేక ఉరు బోసుకుని సచ్చె. దిక్కులేని పీనుగ కుక్కలు నక్కలు పెరక్క తినకండా అట్టా మట్టికి మరుగు జేద్దామనుకుంటే? పుణ్జానికి పోలేం పాపం ఎదురైనట్లుండాదే కత?”

“అబ్బో! ఎంత పుణ్యకార్యం చేస్తున్నారు రెడ్డిగారూ! అనాథ (్రేత సంస్కారం అంటే మాటలా? అందుకే గదా జీప్‌ ఎక్కమంటున్నంది. శవపరీక్ష జరిపిస్తే నీ పుణ్యకార్యం ఎంతో తేలి పోతుంది. దానికి తగిన సత్కారమూ ఉంటుంది. హుం1 పుత్తూరు అయ్యవారు.... శాస్త్రాలు! ఆయన ఎంత గొప్ప శాస్రజ్ఞుడంటే అమెరికాలో క్లోనింగ్‌ శాస్రజ్ఞులకంటే నిపుణుడు గదా?- ఇక పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌... పోలీసులు ఎందుకూ? - నీ కథలు అక్కడికి కట్టిపెట్టి ఎక్కువాయ్‌ జీప్‌!” సబ్‌

  • ఇన్స్‌పెక్టర్‌ అజ్ఞ

గంగిరెడ్డి పాటించక తప్పలేదు!

ఏది జరిగినా గుంపుచేరి గుడ్లప్పగించి చూడడానికే అలవాటు పడిన ఊరు నిస్సహాయంగా చూస్తూ ఉంటే జీప్‌ బయలుదేరింది!

“ఒకే ఒక్క గెంట ముందుగా ఎలబారి వచ్చుంటే నా కొడుకులు జీప్‌ నిండికి బూడిద ఎత్తుకోని పొయ్యుందురు. అయినా తల్రాతను తప్పించేదెవుడితరం?” అని అయిన వాళ్ళు ఆలస్యాన్ని జరిగిన సంఘటనకు ముడేసే ప్రయత్నం చేస్తుంటే కానివాళ్ళ కండ్లల్లో కనకాంబరాలు పూస్తున్నాయి!

౨6

గంగిరెడ్డి ఎదురుగా పుత్తూరు అయ్యవారు. అయ్యవారికి ఎదురుగా గంగిరెడ్డి. ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చున్నారు.

తన శాస్త్రం తననే వంచించిందే? అన్న సందేహం అయ్యవారి కండ్లల్లో కాపురం పెడ్తే సమాధానం కోసరం చూపులు శూన్యాన్ని తడుముతున్నాయి. గుండె బరువు తలకెక్కితే తల వాల్చిన గంగిరెడ్డి ఉన్నట్లుండి తల పైకెత్తి -

“మన తల్రాతలు ఇంకతేనంటారా సాంవీ?” అని అడిగాడు.

తాంబూలం దక్షిణ పెట్టలేదన్నట్లుగా అయ్యవారు గంగిరెడ్డిని ఒక్క చూపు చూసి -

క థరా-26 1112222222

కు

“రెడ్డీ నేరుగా పుత్తూరికి పో, మా ఇంట్లో అడిగి అంజనం డబ్బా తీసుకో. వస్తా వస్తా మరిచిపోకుండా ఒక తమలపాకు కూడా తీసుకోనిరాగ” అంటూ ఏడవలేక నవ్వుతున్నాడు.

“ఎట్టబ్బా పుత్తూరికి పొయ్యేది?” అని దిక్కుతోచకుందా గంగిరెడ్డి దిక్కులు చూస్తూ ఉంటే ఒక దిక్కులో పదహారు కమ్ములు విరగబడి నవ్వుతున్నాయి!

గంగిరెడ్డి తల వాలిపోయింది - దెబ్బ మీద దెబ్బ తిని కన్నిగాడి తల వాలిపోయినట్లు!......

ఈ భూమి మీద దొంగతనం, రంకుతనం దాచిపెట్టినా దాగవని గంగిరెడ్డి ఆడిన మాట అనుభవపూర్వకమయింది. అక్షరసత్య మయింది.

ఊరు వాస్తవాన్ని కోడై కూస్తే గంగిరెడ్డి భార్య మేలుకొనింది!

జరిగినదంతా ఒక్కసారి కండ్ల ముందు దృశ్యమానమై గాజుపెంకుల్లా కండ్లలో గుచ్చు కొంటుంటే కండ్లలో కన్నీళ్ళ రక్తం. గుండె పోటెత్తింది. ఊపిరాడని భవిష్యత్తు కాళ్ళల్లోకి ప్రాకితే ఆమె నిలబడిన చోట నిలబడలేకపోతూ ఉంది. కొడుకు కంట పడ్తే వాడిని ఏం చేయాలన్న సందిగ్భావస్థలో సవాలక్ష ప్రశ్నలు వేధిస్తున్నాయి. కోపం కౌగిట్లో నలుగుతున్న అమెకు కాలం గడ్డకట్టినట్లనిపిస్తూ ఉంది.

అప్పుడు కుమారుడు కూనిరాగాల వగలు వయ్యారాలు పోతుంటే ప్రత్యక్షమయ్యాడు!

పరే! కదపన చెడబుట్టిన్నాకొదకా? ఎంతపనికి వగతెగించి నావురా? ఇంతకంటే కంటికి మరుగ్గా ఆంత విసం బెట్టి చంపేయ రాద్రంటా?”

“నేనేం చేశానమ్మా?”

“ఒరే! నీ సిగ్గు జింవడ? ఏం జేసినావని ఎట్రా మొరగతావు ఆ కూడు తినే నోటితో? నువ్వు చేసిన దొంగతనం వాడి మింద చెప్పిస్తావా?”

“ఎవురమ్మా నీకు చెప్పింది?”

“ఒకరేందిరా చెప్పేది? ఊరే కోడై కూస్తా ఉంటే? ఒక నిండు ప్రాణాన్ని నిలవనా తీయిస్తివి. కన్నతండ్రిని జైలు పాలు చెయపిస్తివి. ఇంతకంటే ఇంకా ఏం చెయాల్రా బ్రప్పుపట్టిన్నాకొడకా! చూడు నిన్నేం చేస్తానో? నీ కఠంతా పోలీసులకు చెప్పి నిన్ను జైలుకు పంపించకపోతే నేను గంగిరెడ్డి పెంద్లాన్నీ కాను, నీకు అమ్మనూ కానూ అంటూ కోపంతో కొంకర్లు తిరుగుతూ కొంగు ఈద్చి నడువున చెక్కింది.

ఆవేశంతో ఊగిపోతూ అనడానికేమో అంతమాట అనింది కానీ ఆ పని చేయలేకపోయింది

  • కన్నప్రేగు నోరు కుట్టేస్తే

ఏం చేస్తాం? ఈ వ్యవస్థలో మెదడు ఎదిగిన ఎత్తుకు మనసులు ఎదగలేదు. మనిషి మస్తిష్కం క్లోనింగ్‌ స్థాయికి ఎదిగినా మనసుల్ని క్లీనింగ్‌ చేసుకోలేక మరుగుజ్ఞులుగానే మిగిలి మెదడు మాత్రం నక్షత్ర మండలాల్లో విహారాలు చేస్తుంటే విజ్ఞాన తన్మయత్వంతో విర్రవీగు తున్నాం కానీ కాళ్ళు మాత్రం నేల మీదనే!

" ఆటవిక యుగంలో ఆయినా ఆటమిక యుగంలో అయినా మనస్తత్వాలు మాత్రం ఆ కాళ్ళ క్రింద నలిగిపోతూ!....

అ

22222౩౩322 1న హైహో యుగం క

నడవలేని నర్తకి

ఆమె ప్రతీ ఉదయం అదే బస్సులో ఎక్కుతుంది, అదే స్టాపులో దిగుతుంది. రెండు భుజాల కింద కర్రలతో అడుగొక యోజనంగా డైవరు సాయంతో మెట్లు దిగుతుంది.

ఈ మధ్యనే ఇంగ్లాండుకు వచ్చిన మీనాక్షి అంది.

“కవిడ చిత్రమైన మనిషి బావా. ముఖంలో హావభావ విలాసాలని చూస్తే కూచిపూడి నర్తకిని తలపింప చేస్తుంది. ఆ కళ్ళిప్పుడూ నాట్యం చేస్తూనే ఉంటాయి. ఆ పెదవులు చిరునవ్వుకి అభినయం నేర్పుకూనే ఉంటాయి. కానీ కర్రల సాయం లేకుండా కాలు తీసి కాలు వెయ్యలేదు. అయినా ఆ కుంటి నడకలో కూడా నా కర్ధం కాని వయ్యారం కనిపిస్తూనే ఉంటుంది. ఆమె బాధలో ఎంతో ఆనందం వున్నట్టనిపిస్తుంది.”

“నాకూ చిత్రంగానే వుంది కానీ కారణమెలా తెలుస్తుంది?”

“అడిగితేనో...” 1

“కావలిస్తే అడుగుకానీ అవకాశం వచ్చేవరకు ఆగు. ఈ దేశంలో కల్పించుకొని మాట్లాడరు”

ఆ అవకాశం నాలుగు వారాలు పోయేక గానీ రాలేదు. ఆ రోజున సారధి యింట్లోనే ఉండి అర్జంటు పనేదో చేసుకుంటున్నాడు. చలికాలం వెళ్ళి అప్పుడే వసంతం ప్రవేశించడం చేత బయట చాలా ఆహ్లాదంగా ఉంది.

“కాసేపలా వెళ్ళి షాపులు చూసిరానా?

“అందుకు నా అనుమతి కావాలా బొమ్మా? వెళ్ళు. ఏవైనా అందమైనవీ నీకిష్టమైనవీ కనిపిస్తే ఖరీదు గురించి ఆలోచించకు”

అనుకోని సమయంలో ఆవేళ బస్సులో మీనాక్షికి కూచిపూడి సత్యభామ కనిపించింది. ప్రశ్చని ఎలా అడగాలా అని యింగ్లీషు పదాలతో మనసులో వాక్య నిర్మాణం చేసుకుంటూ ఆమెతోనే బస్సు దిగింది.

౨ :ధ౮ఈ0-104 1211222222

నం

“క్షమించండి. నాకు ఇంగ్లీషు బాగా రాదు. కానీ మిమ్మల్ని కొంతకాలంగా వొక ప్రశ్న అదగాలని ఉంది”

“నాకూ తెలుగు బాగా రాదుగాని అర్ధమవుతుంది. ప్రతీ ఉదయం నువ్వూ ఆయనా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత కమ్మగా ఉంది అనుకుంటాను. ప్రశ్న అడిగే ముందు నీ పేరు చెబితే పరిచయం చేసుకోవడమవుతుంది. అది యీ దేశాచారం”.

“నా పేరు మీనాక్షి బావ పేరు - అదే ఆయన - పార్టసారథి"

శ ఇ

“శః. మధుర మీనాక్షి - ఎంతి తియ్యటి పేరు - ఎంత పవిత్రమైన పేరు! నన్ను మీమీ అని పిలువు. నాన్నకి ఇటాలియన్‌ ఒపెరా అంటే వెర్రి - అందుకని పుచ్చినీ రచించిన “అబోయయ్‌లో నాయిక పేరు మీమీ, నాకు ముద్దుపేరుగా ప్రారంభమయి అసలు పేరయింది"*.

ఇద్దరూ పార్కులో బెంచి మీద కూర్చొని కాసేపు అవీయివీ మాట్లాడుకున్నారు. అప్పుడు మీమీ అడిగింది - “ఇంతకీ నీ ప్రశ్న ఏమిటో అడగనే లేదు

“నాక్షూ బావకీ వో పెద్ద అనుమానం వచ్చింది - చూస్తే యీవిడ భారతీయ స్రీయేనా కాదు. మరి ఆ శరీరంలో అణువణువునా కూచిపూడి వయ్యారం ఎలా ప్రతిఫలిస్తోందా అని.”

“అందులో యీవిడ సరిగ్గా నదవనైనా నడవలేదు... అని కూడా అవునా?” అంది నవ్వుతూ మీమీ.

“క్షమించండి. అది కూడా ప్రశ్నలో భాగమే”

“ఆ నాట్యాచరణ నా పూర్వజన్మ సుకృతం, మీనాక్షీ పదేళ్ళ క్రితం నాన్నని ఇక్కడ పనిచేస్తున్న కంపెనీ వారు మద్రాసు బదిలీ చేశారు. అప్పుడే అమ్మ పోయిన విచారంతో కుమిలిపోతున్న నాన్నకి మార్చు బావుంటుందనిపించింది. మద్రాసు వెళ్ళిన కొన్ని మాసాల్లో వొక రోజున నాన్న కంపెనీలోనే పనిచేస్తున్న రెడ్డిగారి కుటుంబంతో ఆడయార్‌లో నాట్య ట్రదర్శనని చూడ్డానికి వెళ్ళేను. మొదటి క్షణాల్లోనే అది నా హృదయాన్ని పుణికి పుచ్చుకుంది. తరువాత తెలిసింది ఆ నాట్యానిది కూచిపూడి పద్ధతి అని, అందులో వగలమారి పేరు సత్యభామ అని. మరునాటీ నుండి నేనూ రెడ్డిగారి పిల్లలూ కలసి ప్రతిరోజూ మా ముందు గదిని అడయార్‌గా మార్చేనాళ్ళం. నా ఉత్సాహాన్ని చూసి నాన్న 'పోనీ నువ్వూ ఆ డాన్స్‌ నేర్చుకుంటావా అని అడిగేరు. జ వయస్సులో వున్న ఏ ఆడపిల్లకి డాన్స్‌ నేర్చుకొని సత్యభామో, రాభో అయిపోవాలని వుండదు?

“ఆ వయసులోకాదు ఏ వయసులో అయినా..” అంది మీనాక్షి నవ్వుతూను.

“బాగా చెప్పేవు! రెడ్డిగారు, నన్నూ నాన్ననీ వెంపటి చినసత్యంగారి దగ్గరికి తీసుకువ్మోరు. ఆనాటి గురుపూజ యిప్పటికీ నాకు కళ్ళకి కట్టినట్టుంటుంది. ఎంత ఘనమైన ఆచారాలవి! ఏదో తల్లిలేని పిల్ల సరదా పడుతోంది అని ముందు అనుకున్నా నా దీక్ష నాన్నని కూడా ఆశ్చర్యపరిచింది. మొదటి రోజుల్లో ఎవరో అసిస్టెంటు పాఠాలు చెప్పినా గురువుగారు కనిపించినప్పుడు ప్రతీసారి అయిదు నిమిషాలు కబుర్లు చెప్పి యోగక్షేమాలు కనుక్కొనే వారు. తరువాత తరువాత వీలైనప్పుడల్లా వారే సాధన చేయించేవారు. అలా మా సంబంధం గురు శిష్యులగానే కాదు, స్నేహితులుగా కూడా పెరిగింది - ఒకప్పుడు బోయ్‌(థ్రుండ్‌ అన్నంత చనువు మరొకృప్పుడు అడుగులలో తప్పు పడితే శిక్షించే గురువుల కాఠిన్యం! చిత్రం కదా? తేడానే నళుళ కై

“అదొక ప్రత్యేకమైన శుక్రవారం. దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. మరునాడు గురువుగారు కొత్త అడుగులు నేర్చిస్తానని చెప్పడం మరొక కారణం. దేవీ నవరాత్రులకి అడయార్‌లో క్షీరసాగర మధనం" ప్రదర్శించడానికి రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. అందులో మోహినిగా నాట్యం చెయ్యబోతున్న వసంత నాకన్న పెద్దదయినా మంచి స్పేహితురాలు. రాక్షసుల్ని మోసం చెయ్యడానికి వసంత ప్రదర్శిస్తున్న వగలు నిండిన వయ్యారం, సత్యం మేష్టారి

"గురువుగారు షష్టి పూర్తి అయిన మరునాడు రంగస్థలం మీద చూపినంత గొప్పగానూ వుందని తెలిసిన వారంటున్నారు. పట్టుమని రెండు పదులు నిండని వసంత, అరవై యేళ్ళు నిండిన

  • గురుపితామహులు, విశ్వమోహినిగా అవతరించిన విష్ణుమూర్తి - వీరికి కాలప్రమాణాలతో సంబంధం లేదు కాబోలు!

కొని ఆ శుక్రవారం శనివారం కాకముందే నా జీవితం తెల్లవారిపోయింది! సాయంకాలం బడి నుంచి తిరిగివస్తూ వుంటే కారు ప్రమాదానికిలోనై ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. తగిలించిన గొట్టాలని, యంత్రాలని విడదీసేక నేను కళ్ళు విప్పేసరికి దసరా వచ్చి వెళ్ళిపోయింది. కాళ్ళకి తగిలిన దెబ్బలచేత అందరి పిల్లలలాగా నడుస్తూ పరిగెత్తలేనని తెలిసినా కనీసం బతికేను కదా అని నాన్న సంతోషించేరుగాని నాట్యం నా భవిష్యశ్తులోంచి ఎగిరిపోయిందన్న బాధ యీ నాటికీ నన్ను విడిచిపెట్టలేదు!

“నేనింకా ఆసుపత్రిలో కోలుకుంటూ వుండగానే ఒక రోజున మేష్టారు వచ్చేరు. ఏదో లోకాఖి రామాయణం అయిన తరువాత “పాఠానికెప్పుడు వస్తావని అడిగేరు.

“గురువుగారూ మీకింకా తెలియదేమోకానీ యింక నా కాళ్ళు పనిచెయ్యవండి అని వలవల యేద్చేను.

“మీమీ నీకు నాట్యం నేర్పుతానే అన్నాను కాని నీ కాళ్ళకి కాదమ్మా! కాళ్ళూ చేతులూ - అవి అందరికీ వున్న వొట్టి కర్రలు. నాట్యమన్నది - మనసులోది - హృదయంలోది. దానిని ప్రదర్శించడానికి అంగబలం అవసరమే కానీ కళ అంతర్గతమయినది. ఆ అంతర్గతమైన కళని

సాధించిన వారే మహా నర్తకులు అవుతారు. నాకు చేతనయినది - నువ్వు నేర్చుకోవలసింది - అందులోనే శిక్షణ. అంతేకాని కాళ్ళకి కాదు”

ఎంతటి సహృధయులు! ఎంతటి మహానుభావులు!!! మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుర్దేవోభవ అని శాస్త్రాలు గురువుకి తృతీయ స్థానాన్నే యిస్తాయి కాని అది ప్రధమ స్థానమే కావాలని నా అభిప్రాయం.

అలాటి ప్రోత్సాహం మీద ప్రతీ శనివారం నాట్య పాఠశాలకి హోదాని. కేరళ వైద్యుల తైలమర్దన ధర్మమా అని పూర్తిగా నిర్జీవములైపోయిన కాళ్ళు కొంత బలాన్ని పుంజుకున్నాయి. మరీ అనారోగ్యంగా వున్నప్పుడు గురువుగారు యింటికి రావడమో,; ప్రధాన శిష్యుల్ని పంపడమో చేసేవారు. కూర్చున్నచోట నుండే అభినయాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చించేరు. 'సర్వాంగానాం నయనం వ్రధానం' అని మరొకసారి నిరూపించడం కోసమా అన్నట్టు ఆ కళ్ళతో నవరసాలే కాదు, ఆ తొమ్మిది మధ్యా వున్న వయ్యినొక్క హావభావాలని చూపించడానికి కావలసిన శిక్షణ యిచ్చేరు.

క భారం - 10౫ న్‌్‌

తరువాత అయిదేళ్ళకి నాన్న పనిచేస్తున్న కంపెనీ పరాధీనం కావడంచేత ఇంగ్లాండు తిరిగి వచ్చేం. ఇదీ కుంటీపిల్ల కూచిపూడి నర్తకి కథ మీనాక్షీ”

“కుంటిపిల్లేమిటి? నాట్యాన్ని హృదయంతో చెయ్యాలిగాని” అంది మీనాక్షి నవ్వుతున్న కళ్ళలోంచి జారుతున్న బాప్పమాలికలని తుడుచుకుంటూ. “మనసు లేని నర్తకి కన్నా నడవలేని నర్తకి గొప్పది కాదా? క్షమించండి మీమీ - మీరే ఉద్యోగం చేస్తారో నాకు తెలియదు గానీ అనవసరపు సంశయాలతో మీరోజంతా వృధా చేసేను”.

“ఉద్యోగమేదీ లేదు. ఇంట్లో బదులు లైబ్రరీలో కూర్చొని ఆ కూచిపూడి రోజుల గురించి పుస్తకం రాస్తున్నాను. శరీర పరిశ్రమ మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది కదా?”

“పుస్తకం పూర్తి అయ్యేక నన్ను చదవనిస్తారా?”

“తప్పకుండాను! నచ్చితే తెలుగులోకి అనువదించుదువు గాని”

“అలాటీ విషయాల్లో బావ చాలా గొప్ప”

“అయ్యే వుండాలి. లేకపోతే అంత మంచి వృదయాన్నెలా యిచ్చేస్తావు? ఇద్దరూ మా యింటికోసారి రండి" అని ఎద్రసూ, టెలిఫోను నంబరూ వున్న కార్డు యిచ్చింది.

మీనాక్షి ఇంటికి తిరిగి వచ్చేసరికి నాలుగు గంటలు దాటినా భోజనాల గదిలో కూర్చొని సారధి యింకా కంప్యూటర్‌తో కుస్తీపడుతూనే ఉన్నాడు.

“బావా వచ్చేసేను. టీకి కెటిల్‌ని పెట్టమంటావా?” - సారధి సమాధానం వినకుండానే బట్టలు మార్చుకొని కిందికి దిగింది.

“మేడ మీదకి వెళుతున్నానంటే నేను కూడా వచ్చే వాణ్ణి కదా?” అన్నాడు కనిపించీ కనిపించని నడుం చుట్టూ చెయ్యి వేస్తూ.

“ఎందుకూ” అంది నంగనాచి.

“ఎందుకేమిటి? ఆకలితో అలమటించిపోతూ వుంటే”

“ఆకలి వేసిన అబ్బాయిలు వంటింట్లోకి వెళ్ళాలి కాని పడకగదిలోకి ఎందుకా అని”

“అన్ని ఆకళ్ళు ఒకచోట తీరేవి కాదు కదా?”

“ఏం కలికాలం బాబూ... బొవా - యిందాక మీమీని చూసేను”

బావ జుట్టుని ఒక తీరులో వుందనివ్వదీ పిల్ల

“నీమ్స్‌ ఎవరు?”

“ఆవిడే బావా! ప్రతీరోజూ మనకి బస్సులో దర్శనమిచ్చే కూచిపూడి నర్తకొ అని జరిగిన కథంతా పూసగుచ్చినట్టు చెప్పింది.

“అయితే ఆవిడ పేరు మీమీ కాదు - మమ”

“అదేమిటి?”

“భామలలో సత్యభామ”

“అలా అని చెప్పు. సంతోషిస్తుంది.”

“తప్పకుండా”

ఆ యిద్దరి మధ్యా మనలేక కంప్యూటరు సిగ్గుతో కనుమూసింది. అ 2222222222 నరానట ౩

ఆక్రోశం అ సరి

“హుం1.... నాన్నట నాన్న! పిల్లలందర్నీ చూస్తున్నా కదా! ఈ నాన్న కలవరింత ఏవిటో? నాకు అర్థమై చావడం లేదు!” గొణుక్కుంది - పదేళ్ళ కొడుకు బాబుని కొరకొరా చూస్తూ - సత్య,

తన కొడుకు గోపాలం కూడా ఇదే వయసులో ఇదే తీరు. అప్పుడు తొనూ ఇలాగే మథనపడిన గుర్తు - సావిత్రమ్మకు. అలా అని కోడలితో అనలేదు ఆమె.

బాబు వెక్కిళ్ళ మధ్య పద్యం కంఠస్థం చేస్తున్నాడు. |

కళ్ళూ, ముఖం, ఒళ్ళూ, ఎర్రగా చేసుకొని వాడికి ఎదురుగా కూర్చుంది సత్య,

వాళ్ళిద్దర్నీ గమనిస్తూ “కాంతి వర్వం' తిరగేస్తోందీ - సావిత్రమ్మ. జ్‌

గోపాలంకీి - పెద్దవాడవుతున్నకొద్దీ - తండ్రి వాపిరితనం పెరిగిపోవటం గమనించి, కొడుకుని కారణం అడిగింది సావిత్రమ్మ. గోపాలం నవ్వేసాడు. ఆపైన “నాకూ తెలియదు అన్నాడు. సావిత్రమ్మ నమ్మలేదు.

ఆమె ఊరుకోలేదు. ఇందులోని అంతరార్థం చెప్పమని భర్తను అడిగింది ఆమె. అతనూ నవ్వేసి “నాకూ తెలియదు అన్నాడు. ఆమె హఠం చేస్తే-

“నిజం! ఎందుకో పిల్లలకు తెలుస్తుందట మా అమ్మ అంది. ఎట్లా! అంటే జవాబు లేదు. నేనూ ఈ విషయమై అంతగా ధ్యాస పెట్టలేదు” అన్నాడు అతను.

ఆనాటి నుంచి తండ్రీ పిల్లల అనుబంధం కంటపడితే చాలు ఆమెకు ఇదే జిజ్ఞాస.

౨౧౦౦౭

రాత్రి తొమ్మిది. గేటు శబ్దం వినడం తరువాయి, చేతిలో పుస్తకం పారేసి, పట్టుకోబోయిన తల్లి నుండి ఒడుపుగా తప్పించుకొని -

“నాన్నా” అంటూ గోపాలం కాళ్ళను చుట్టేసి, అక్కుర్లు బుక్కుర్లుగా ఏడుస్తూ, తల్లి కొట్టిందని ఫిర్యాదు చేసేడు బాబు. అతనికి కోపం వచ్చేసింది.

“ఈసారి వార్ని కొట్టేవని తెలిస్తే మర్యాద దక్కదు” అంటూ బాబుని ఎత్తుకొని ఊరడించేడు గోపాలం,

“పిల్లల ఎదరే తల్లిని గదిమితే, ఆ తల్లి పిల్లలకు అలుసైపోదా! ఆ అలుసు చూసుకొని పిల్లలు తల్లిని మరింత కాల్చుకు తినరా! వీడికి బొత్తిగా బుద్ధిలేకపోతోంది” అనుకుంది 22222222 కై కభారహని- 2004 హన్‌ ననన

సావిత్రమ్మ.

“ఇలా నెత్తి” అని ఏదో అనబోయి, అత్తగారి వారింపు చూపవు అందుకొని, ఆవేశం అదుపులోకి తెచ్చుకొని గిరుక్కున వెనుదిరిగి, కన్నీళ్ళు చీరకొంగుతో ఒత్తుకుంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది - సత్య.

వ్‌

పిల్లల్ని నయానో భయానో దార్లో పెట్టాలి కాని కొట్టీ, తిట్టీ కాదు - అన్నది అతని సిద్ధాంతం. 'దండం దశగుణే భవేత్‌” అన్నది ఆవిడ నమ్మకం. ఈ సిద్ధాంత నమ్మకాల మధ్య ఎప్పుడూ ఘర్షణ.

-“నయానా భయానా ప్రయత్నించేను. ఊహు...! నిష్ఫలం” - ఆమె.

“అడ్‌ నీ చేతకానితనం. సిద్ధాంతం తప్పిదం కాదు”- అతడు.

  • ౦6

భోజనాలు అయ్యేయి. కొడుకు దగ్గరగా కూర్చొని వాడి ఒంటి మీద తేలిన తట్లు చూస్తూ - గోపాలం. అతని కళ్లల్లోకి సూటిగా చూడలేక, ప్లాప్టిక్‌ బుట్ట అల్లిక అన్యమనస్కంగా పూర్తిచేస్తూ - సత్య, 'ఇదే విషయమై, గతంలో జరిగిన సిగ్గుచేటు కాట్లాట పునరావృతం కాకుండా చూడు భగవంతుడా!” అని దేవుడ్ని ప్రార్జిస్తూ సావిత్రమ్మ.

ఆనాడు భార్యా భర్తలిద్దరూ పందెపు కోళ్ళల్లే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈటెల్లాంటి మాటలు విసురుకున్నారు. అగ్నికి ఆజ్యం తోడన్నట్లు ఆ రోజు ఇక్కడే ఉంది ఆ ఇంటి ఆడబడుచు కాంతం. ॥

అప్పట్లో నెల రోజుల క్రితం భర్త పోగా కొడుకు దగ్గరకు రాక తప్పక వచ్చిందేమో, తనకు అంతా కొత్తగా ఉండటమే కాక, ఎవరి పక్షాన చేరిలే ఏమి తంటానో అని వీలైనంత మటుకు ఘర్షణకు పట్టపగ్గాలు వేయ జూసింది సావిత్రమ్మ.

భార్యాభర్తలు అన్నాక మాటా మాటా అనుకోవటం కద్దు. కాని ప్రత్యక్షంగా, అదీ, తమ ఇంట్లో ఇంత ఘోరంగా జరగటం ఆవిడకు దిగృమనే కాదు, సిగ్గూ, అసహ్యం కూడా కలిగించేయి.

*..... పిల్లవాడి మీద మీకే హక్కు నాకేం లేదా.” - అంటున్న సత్యని చూస్తూ -

“బాగుందర్రా! పిల్లాడ్ని తన్నడానికి ఎవరికి హక్కని తగువులాడుకుంటున్నారా!?” నవ్వుతూ అంది - సావిత్రమ్మ. ల

“చదువు విషయంలో ముద్దు నాకు నచ్చదు. చదువు అబ్బక, ఆఖరికి ఏ ముదనష్టపు సంస్టలోనో ప్యూనో, క్లర్కో అవుతాడని.... జీవితం అంతా పైసా పైసాకి వెదుకులాటేననీ.... ఆ గతి వాడికి పట్టరాదనీనూ.... నా ఇది...”

సత్యకి అడ్డుపడుతూ -

“అంటే! నీ ఉద్దేశ్యం ఏమిటి? ఏం నా చదువూ, ఉద్యోగాలకేం తక్కువ పట్టా ఉంది. హెడ్‌ గుమాస్తాను. లంచాలు దొరకనంత మానాన ఆ సంస్థ ముదనష్టపు దేమీ అయిపోదు. అదే మనకి ఇంత ముద్ద పడేస్తోందని గుర్తుంచుకో....”

“న్సువ్వుండరా అన్నయ్యా!.... ఇంతకన్నా బాగా చదువుకున్నవాద్నీ పెద్ద ఉద్యోగస్తుడ్నీ జే ఊఊఊ222ెాతక 2222222222 అ టీశం కై

పెద్ద ఆస్తిపరుద్నీ చేసుకోలేకపోయేవూ” అంది ఆడబడుచు కాంతం.

“నాకు గతిలేక, మా నాన్నకు మతిలేక, పిల్లాడు ఏరీ కోరీ నచ్చుకున్నాడు. కట్నకానుకల ఆశ అంతగా లేనివాళ్ళు. వారంతట వారు వచ్చి అడిగేరు... పిల్ల సుఖపదుతుందని...” రోషంగా జవాబిచ్చింది సత్య,

“అమ్మో! మోజు పడ్డాడు. పేరుకు తగ్గట్టు మొగుడ్ని కొంగుకి ముడివేసేసికొని ముద్దు మురిపాలు తీర్చుకోవచ్చని పేరాశతో ఇష్టపడి చేసుకున్నావు. మరి ఈ దెప్పిపొడుపులు ఎందుకో?” - కాంతం.

“దెప్పిపొడుపేం కాదు. పెద్ద పెద్ద చదువులన్న వాళ్ళే నేడు ఉద్యోగాల వేటలో పడుతున్న శ్రమదమనాదులు చూసి అన్నమాటేగానీ, ఎవర్నీ కించపరచాలనే ఉద్దేశం....నాకు లేదు. అన్నం పెట్టిన చేయిని కరిచే కుక్కను కాను....”

ఎవరికి ఎక్కడ తగిలిందో, ఎవరూ కిక్కురుమనకపోవడం చూసి -

“......శుభ్రంగా చదువుకుంటే వృద్ధిలోకి వస్తాడని ఆశ. అంటే అన్నాను అంటారు కాని, ఆయనకేమీ పట్టదు. ఫ్రోగ్రస్‌ కార్డు చూసి ఒక సంతకం గిలికేయడమేగాని.... మార్కుల హెచ్చు తగ్గులకు కారణాలు అడిగిన పాపాన పోయేరూ!..... తక్కువ మార్కులాస్తే కనీసం మందలించనైనా లేదు. నేనైనా పట్టించుకోకపోతే ఎలాగా!” - దుఃఖంతో సత్య గొంతు గద్దదమై పోయింది.

“వాడి చదువు ఏ పొటిది? పట్టించుకుందికి. వాడ్ని చావ బాదుతూ నువ్వేమీ తాపత్రయ పడిపోనఖల్లేదు. వాడి రాత ఎలాగుంటే...”

కాంతం మాట పూర్తి కానీయక -

“మొక్షై వంగనిది మానై వుంగుతుందా! రాతలంటే నేను నమ్మను. గాలిలో దీపం పెట్టి దేవుడా! అంటే ఎలా! వాడో మొద్దయితే నాకు ఏ బాధా లేకపోను. తెలివితేటలుండీ చదువకి దొంగ ఎత్తులు వేస్తున్నాడు. అది క్షమించరాని.....”

“దొంగ ఎత్తులు వేసేటంతటి వయసా వాడిది - తీవ్రంగా అడిగేడు గోపాలం.

“ఉదయమో రెండు గంటలూ, రాత్రో గంటా వాడితో గడిపినంత మాత్రాన వాడివి చాంగ్‌ ఎత్తులో, అంతపాటి జ్ఞానం వాడికి ఉందో లేదో తెలుసుకోవటం సాధ్యం కాదూ - బల,

“అంటే, నేను ఊరి మీద పడి రికామీగా తిరుగుతున్నానేగా నీ అభిప్రాయం.”

“అయ్యో! నా ఉద్దేశ్యం అది కాదండీ! రామా! - అంటే...”

“ఒకటిచ్చుకున్నానంటే!” కుర్చీలోంచి విసురుగా లేవబోయేడు గోపాలం.

“ఆగరా! నేను ఈ ఇంట్లో... ఉండగానేనా! దానెదురుగా అడగరాదు. అయినా, అడుగు తున్నాను. మొన్న మొన్నటి దాకా మీ నాన్నదీ ఇదే ఆఫీసులో ఇదే ఉద్యోగం. ఆయన ఆరో గంటకల్లా ఇంట్లో ఉండేవారు. రాత్రి తొమ్మిదైనా కొంప పట్టనంత రాచకార్యా లేమున్నాయి. చెప్పుమీ....” దగ్గాచ్చి ఉమ్మివేయ పెరట్లోకి వెళ్లోంది సావిత్రమ్మ.

అది అదనుగా చూసుకొని -

“మగాడన్న తరువాత లక్షా తాంనై పనులుంటాయి....” ననన డన క ళరాంి-104 ఇకా” =222222===22222222222222222222222222222222

వెళ్తూ, వెళ్తూ తల్లి చూసిన చూపు చూసి తగ్గింది - కాంతం. తల్లి అటు పూర్తిగా చాటు కాగానే -

“అవును. వాడు దొంగ ఎత్తులు వేస్తున్నాడు. చదువు రాదు. తట్టలో బస్తాలో మోస్తాడు. లేదు, కప్పులు కడుగుతాడు. కాదు, రిక్షాల్లాగుతాడు. అప్పుడు, వాడ్ని ఫలానా గోపాలంగారి అబ్బాయి అనే అంటారుగానీ.... ఫలానా సత్యభామా దేవిగారి సుపుత్రుడు అని అనరుగాగా అంది కాంతం.

పెరట్లోంచి తిరిగివన్తున్న సావిత్రమ్మకి ఆఖరి మాటలు వినిపించాయి. కూతురి మాటల్లోనూ, వైఖరిలోనూ ఏదో వెదకసాగింది. కూతురి మీద అసహ్యాం వేసింది. తండ్రి తరువాత అంతటివాడు అన్నే. కాదనలేం. కాని, అందుకు ఇంతలా దిగజారి పోవాలా అనుకుంటూ, గుండె రాసుకుంటూ చతికిలబడిపోయింది సావిత్రమ్మ.

“అంతే! అంతే లెండి. వాడు గోపాలంగారి అబ్బాయి. నాకు ఏమీ కాడు. తల్లి దాసీది. ఇటువంటి జన్మ పగవారికి కూడా వద్ద అని ముక్కు చీదుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది

  • సత్వ

వ. విసురుగా డాబా పైకి వెళ్ళిపోయేడు. అటూ ఇటూ చూసి అన్న వెనుకే వెళ్ళిపోయింది - కాంతం.

దీరంగా నిట్టూర్చింది సావిత్రమ్మ.

40

“నాన్నా!.... నాన్నా” అంటూ కలవరిస్తూ మధ్య మధ్య ఉలికిపడుతున్నాదు - బాబు.

“దండన అంటే! ఇలా తట్లు తేలేటట్లుగానా” కోపంగా అని, తల్లి ముఖం చూసి, “తగలరాని చోట తగిలితేనో!” అంటూ తగ్గేడు గోపాలం.

కిమ్మనకుండా కన్నీళ్ళు కారుస్తూ కూర్చుంది - సత్య,

“దానికి మాత్రం (శ్రేమ లేదటరా! ఆ క్షణంలో.... పిచ్చి కోపంలో.... అయినా న్‌ కొడుకేం చిన్నింటి వాడు కాదు.” - సావిత్రమ్మ.

గోపాలం ఏమీ అనలేదు.

తన రాకతో, వాళ్ళ మధ్య సంబంధం చిక్కబడడం ఆమెకు ఆనందం కలుగజేసింది. మళ్ళా గతం గుర్తుకొచ్చింది.

+శశిశి

గతంలో, పెరట్లోకి వెళ్ళిన సత్య ఎంతకీ తిరిగి రాకపోవటంతో వెతుక్కుంటూ వెళ్ళింది

  • సావిత్రమ్మ. నూతి గట్టుకు, అటువేపున, చేరబడి కూర్చొని, తన చుట్టూ వున్న పంచ భూతాలకీ, తన ఆక్రోసం వైన వైనాలుగా వెళ్ళబుచ్చుతున్న సత్య కనిపించింది.

“ఒకప్పుడు తానూ ఇలాగే... కాని, ఇంత తీవ్రంగా కాదు' అని అనుకుంది సొవిత్రమ్మ.

సత్య గోడు వింటున్న ఆమెకు - "కొంపదీసి దీనికి మతిగానీ చలించ లేదు కదా! - అని కూడా అనిపించి, నూతి గట్టుకు ఇటువేపున చేరబడి, కోడలిని ఒక కంట కనిబెడుతూ, కూర్చుంది - సావిత్రమ్మ.

“.౨.హు! నాన్నట నాన్న!....ఎంతో చేసిన, చేస్తున్న ఈ అమ్మ కన్నా... ఆ నాన్న

గొప్పేంటో? అసలు, ఇంతకీ ఈ నాన్న అనే వాడంటే వీళ్ళకెందుకు అంత మోజో!....”

*.... ప్రేమా గౌరవాదులు సంపాదించుకోవాలిగాని అడుక్కుంటే దక్కేవి కావు - అంటారు. అందుకు ఈ నాన్నలు చేస్తున్నదేవిటి!? ఏవీ కనబడదు. కాని, అవి వాళ్ళకు దక్కుతూనే ఉన్నాయి...”

“*..... నవమాసాలూ మోసేరా... నొప్పులు భరించేరా... చావు అంచులు తాకి తిరిగొచ్చేరా.... పేగు పంచి ఇచ్చేరా.... తొలిసారిగా కళ్ళారా చూసి ఆనందించేరా... ఆప్యా యంగా తడిమేరా.... అక్కున చేర్చుకున్నారా.... ఆనందంతో గర్వించేరా.... ఆకలి వేస్తే స్తన్యం ఇచ్చేరా....”

“.....మలమూత్ర విసర్జన చేస్తే గుడ్డలు మార్చి వెచ్చదనం పంచి ఇచ్చేరా.... రోదిస్తే అనునయించేరా.... ఊయలలు ఊపేరా....జోల పాదేరా....”

“...భీ....భీ.... అంటూ ఛీత్కారాలూ, పెడబొబ్బలు, పైపెచ్చు, వాడికి నాన్న అఖ్ఞర్లేదు, అమ్మే కావాలట - అని ఇచ్చకపు కబుర్లు....”

“...గోరు ముద్దలు పెట్టేరా.... విద్దెం చేయించేరా.... చిటికెన వేలు అందించి చిట్టి చిట్టి అడుగులు వేయించేరా... ఒళ్ళు వెచ్చబడితే తలక్రిందులైపోయి నిద్రాహారాలు మానేరా...”

“.....పైగా, ఏ దాక్టరుకో చూపి ఇంత మందో మాకో వేస్తే సరనో, ఈ గోల ఏదో చూడంటూ ఊరేగే ఉత్సవ వి[గ్రహాలు ఎవరో....”

“...లాల పోసేరా..... ముస్తాబు చేసేరా... కడుపు చూసి ఆకలి తీర్చేరా.... ఆట పాటలలో ఓలలాడించేరా.... తాలి గురువు అయ్యారా.... తాలి బడి అయ్యారా.....”

“.... సర్వవేళలందూ సర్వావస్థ లందూ తల్లే! అయినా, నాన్ను... నాన్న... అదే నామ స్మరణ. ఇంత చేసే అమ్మ కన్నా నాన్న గొప్పవాడై అందలం ఎలా ఎక్కగలిగేడు?!”

ఆమె శోధనా స్రవంతి అలా అనంతంగా ఇంకా తాకని పార్వ్వాలు తాకి ప్రవహించేదే -

“సత్యా! ఎక్కడున్నావు?.......... పురుగూ, పుట్రా ముట్టుకునేను. ఇంట్లోకి రా!” అని పిలించింది సావిత్రమ్మ

ఆ తరువాత ఈ విషయమై సత్య ఆలోచించిందో లేదో గాని, సావిత్రమ్మ ఆలోచించింది.

వ్‌

కొడుకుని జాగ్రత్తగా ఎత్తుకొని పడక గదిలోకి వెళ్ళిపోయేడు - గోపాలం.

“అత్తయ్యా! ఈ రోజు మీ దగ్గర పడుకోనా!” బిడియంగా అడిగింది సత్య.

“అలాగే!” అంది - కోడల్ని కొంతసేపు పరీక్షగా చూసింతరువాత - సావిత్రమ్మ.

అలా పడుకోవడం ఇదే తొలిసారి. గౌరవప్రదమైన దూరంలో పడుకున్న కోడల్ని దగ్గరగా

లాక్కుంది ఆమె. గువ్వ పిట్టలా ఒదిగిపోయిన సత్య నిశ్శబ్దంగా రోదిస్తోంది. తన ఆలోచనల్లో తను (గ్రహించిన కొన్ని విషయాలను ఒకటీ ఒకటీగా కోడలికి చెప్పసాగింది. ఎదురు (ప్రశ్నలు వేయకుండా వినసాగింది సత్య.

“అల్లకల్లోలంగా అశాంతిగా ఉండే వాతావరణం ఎవరి రాకతో ప్రశాంతంగా సక్రమంగా మారిపోతుందో అలాంటి వ్యక్తిత్వం కలిగిఉండటం - వీళ్ళ మోజుకి కారణమేమో!....”

“.... మన కంటికి కనబిడనీ, మేధకి అందనీ కనికట్టో.... వాళ్ళని ఇట్టే ఆకట్టుకునే = కథాలారాని- 2004 2222222222

ముఖకళో.... ఈ మగాళ్ళలో ఉండుంటాయి. వాటికే ఈ పిల్లలు ఆకర్షితులౌతున్నారేమో! కాదూ...”

“... ఆపదల్లో, అంతవరకూ అదృశ్యంగా ఉన్న హస్తం నేనున్నానంటే అనునయపరిచే స్పర్శ, తల్లి కన్నా అతగాడ్ని ఒక మెట్టు మీద కూర్చోబెడుతున్నదేమో! లేదూ....”

“...వాళ్ళలోని భయాలను బేలగా బయట పెట్టుకోని ధైర్యం, ఉబికే కన్నీళ్ళను అదిమిపెట్టే నిగ్రహం, ఎప్పుడోగానీ వాచకంగా బహిర్గతం చేయని నిక్షిప్త ప్రేమా లాంటి ధీరోదాత్త నాయక లక్షణ మాయాజాలంలో పడికొట్టుకుపోతున్నారేమో!....”

“.....ఇవే కాక వేరేమైనా కారణాలు ఉండి ఉండొచ్చు. నా మట్టి బుర్రకు అందటం లేదు” అంది సావిత్రమ్మ.

అత్తగారి ఎరుకలు సత్యని ఆశ్చర్యపరిచేయి. మధన పడడమే గాని, అత్తగారిలా మూలాలు వెదికే ప్రయత్నం చేయనందుకు సిగ్గు వేసింది సత్యకి. "

గోడ గడియారం పదకొండు గంటలు కొట్టింది. సావిత్రమ్మ గుర్రు పెట్టసాగింది. సత్యకు నిద్ర పట్టలేదు. ఆలోచనా సంద్రంలో ఈదులాడ సాగింది - ఆమె.

౨౦+

గడియారం ఐదు గంటలు కొట్టింది. తెల్లారుతోంది. ఒక ఒడ్డుకు చేరింది సత్య

“*.... గాడిద గుద్దేం కాదూ! కుక్కలకి రాత్రిళ్ళు దయ్యాలు కనబడినట్లు, పిల్లలకు నిత్యము ఒకే ఒక్క ఉదాత్త పురుషుడు దర్శనం ఇస్తూంటాడట దేవుడల్లే. పుట్టినది ఆది గిట్టే వరకు కష్ట సుఖాలలో అవసరాలకి ఆదుకుంటాడట. వాడే నాన్నట. అలా అని అతగాద్ని ప్రతిష్టించింది ఈ సమాజం. అందులోనూ ఈ ఆడవాళ్ళ ప్రమేయమే ఎక్కువేమో!....”

“..కాని, వీళ్ళు ఒక్క విషయం గుర్తించటం లేదనిపిస్తోంది - మగాడు అన్ని అవస్థల లోనూ స్త్రీ మీదనే ఆధారపడి ఉంటాడు. అంత ప్రాముఖ్యం గల తమని తాము ఇంత తక్కువ చూపు చూసుకోవటం వల్లే తమకీ గతి....”

“.... పిల్లలకు జ్ఞానం రాక ముందు నుంచీ వినిపింపడేసేది. అదిగో నాన్న వస్తున్నాడు. వాడు బలవంతుడు - శారీరకంగానూ, ఆర్థికంగానూ, వాడే నీకు అన్నింటా అన్ని వేళలా శ్రీరామరక్ష అని పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ నూరిపోస్తారు...”

*..జీవితపు గణిత సమీకరణంలో ఆడ - మైనస్‌, మగ - ప్లస్‌. ప్లస్‌ - ధనం - దానికున్న ఆకర్షణ అలాంటిది ఈ సమాజంలో. దాన్ని ఇంకా పెంచి అదే ఏడుగడ అంటారు. అదే నిజమనుకుంటారు....”

“....తరచి చూస్తే అదే యదార్థం కూడా. ఇది విశ్వజనీనం అయి కూర్చుంది. దీనికి జాతి, మత, వర్గ, వయో అది బేధాలు లేవు. ఇది అందరూ అన్నిచోట్లా ఎల్లవేళలా ఘోషించే వేదం. ఇది అప్రతిహతం. తిరిగి రాయలేం....”

“..డబ్బు సంచీ ముందు, క్షమయా ధరిత్రీ వెలవెలా బోతోంది-” అనుకుంటూ కళ్ళు మూసుకుంది - సత్య

అది నిద్రేనా!? ఠి కై కే లల శాం కక్ష

(౪్పి గోదానము - వృషోత్సర్ల అ గాః జోన్నంగద్ధు రూర్మీంచేయులు

దీపావళి వెళ్ళిన మరునాటి నుంచి కార్తీక మాసము ప్రారంభమైంది. ఉదయాన్నే లేచి స్నానం చేసి తులసి కోట దగ్గర పూజ చేసుకుంటున్న అరవై వళ్ళ నారాయణమ్మకు హఠాత్తుగా ఏదో గుర్తుకువచ్చింది. ఉన్నపళంగా లేచి వెళ్ళి వీధిలో అరుగు మీద పేపరు చదువుకుంటున్న భర్త కుటుంబరావును ఒక్క కుదుపు కుదిపింది.

“పుష్కరాలు అగస్టు నెలలో అంటున్నారు. అందుచేత ఈ ఏడు కార్తీకమాసంలో నా గోదానం సంగతి ఏం చేశారు? చాలాకాలము ఉంది వచ్చే ఏటికి కదాని ఊరుకునేరు. పనిలో పనిగా గోదానం కూడా చేసుకుని ఈ కార్తీకమాసంలో అష్టాది వర్దాలకి సమారాధన చేసుకుంటాను. అబ్బాయితో మాట్లాడండి” అంది.

కుటుంబరావు ఉలిక్కిపడ్డాడు. గోదానము, సమారాధన అంటే మాటలు కాదు. పైగా ఉంటున్నది పల్లెటూరు. అందుచేత ఖర్చు తలుచుకుని కుటుంబరావు కంగారు పద్దాడు. తనా పేరుకి కుటుంబపెద్ద కాని, పెత్తనషమంతా ఏనాడో కొడుక్కి అప్పజెప్పేశాడు. పొలం కూడ వెళ్ళడము మానేశాడు. కొడుకు వ్యవసాయదారుడే కాదు, దేవాలయాలన్నింటికి ధర్మకర్తగా కూడా నియమింపబడడంతో మంచి పలుకుబడి ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఈ విసయం కొడుక్కే అప్పజెప్పేయ్యాలనుకున్నాడు కుటుంబరావు.

కుటుంబరావు నవ్వి, “అబ్బాయి - శివయ్య సంగతి నీకు తెలుసు కదా! గ్రామంలోని అమ్మవారి గుడి దగ్గర నుంచి, శివాలయం, రామాలయం - ఆఖరికి చిన్న డిబ్బీ ఉండే చిల్లరదేవుళ్ళ బొమ్మల గుడికి కూడా వాడే ధర్మకర్త. వాడు తలచుకుంటే బ్రాహ్మణ సమారాధనే ఏమిటి? బ్రహ్మదేవుడు చెయ్యవలసిన (బ్రహ్మోత్సవాన్ని కూడా నీ పేర మార్చించేస్తాడు. నాకు పెత్తనం ఎక్కడిది? డెబ్బై వళ్ళ వాడిని. నేను వాడికి చెప్పగలనుగాని, ఒత్తిడి తేగలదానివి మాత్రము నువ్వే” అన్నాడు.

నారాయణమ్మ విసవిస నడుచుకుంటూ మళ్ళీ పెరట్లోకి వచ్చింది. ధర్మకర్త శివయ్య నూతి పళ్ళెము మీద కూర్చున్నాడు. మంగలి గవరన్న చేత గడ్డము గీయించుకుంటున్నారు. తల్లి రాక చూసి శివయ్య గవరయ్యను ఆగమన్నాడు.

నారాయణమ్మ - కొడుకు గడ్డం గీయించుకుంటున్నాదని కూడా ఆగకుండా, “నా గోదానం సంగతి ఏం చేస్తావురా?” అంది.

శివయ్య విసుగు కనపడనీయకుండా, “అమ్మా! ఎక్కడ బడితే అక్కడ అదక్కు సోమవారం క భరి-200* 2౩2౩232222

నాడు శివాలయంలో గ్రామస్థుల తరఫున లక్ష పత్రి పూజ జరుగుతోంది. గోదానం చేసు కుందువు గాని. సమారాధన వడ్డనలో పాల్గొంటే నువ్వు కూడా సమారాధన చేసేసినట్లే. ఆ ఫలితము దక్కేలా నీకు మన శంకరావధాన్లుగారు ఏం చెయ్యాలో వచ్చి చెపుతారు” అన్నాడు.

నారాయణమ్మ ఏదో మాట్లాడబోతుంటే “వద్దు అని వారించి లోపలకు వెళ్ళిపోయేలా చేసాడు.

శివయ్యకు గవరయ్య మళ్ళీ గడ్డం గీయడము మొదలు పెట్టాదు.

“అయ్యా! ఊరు ఖర్చుతో సమారాధన. అమ్మగారి చేత వడ్డన. మీకు మీరే సాటి. దయ చేసి ఈ కార్తీకమాసంలో దేవస్థానం ద్వారా నాకూ నాలుగు రూపాయలు ఎక్కువ ముట్టేలా చూడండి” అన్నాడు. గవరయ్య కార్తీక మాసంలో శివాలయము, రామాలయాలలో ప్రత్యేక పూజల సమయంలో బాజా వాయించడానికి దేవస్థానము వారి చేత నియమించబడ్డాడు. అతని ఆశ అతనిది. -

“నాలుగు కాకపోతే ఎనిమిది తీసుకుందుగాని. వేస్తానుగా పధకం. మన దేవస్థామాఫీసరు కలిసొస్తే చాలు. ఓచరు మీద ఎంత రాసుంది అని నువ్వడగకూడదు. నేనిచ్చింది మాత్రము తీసుకోవాలి” అన్నాడు.

“ఫ్రీ గడ్డము కాబట్టి ఓచరు అడగటం లేదు బ్రితికిపోయాను' అని మనసులో తిట్టుకుంటూ, “అయ్యా దేవస్థాన మాఫీసరుగారి తల్లి ఆబోతుకు పెళ్లి చేస్తుందిటండి ఈ కార్తీక మాసంలో. అలా చేస్తే అవిడ మనవడికి పెళ్ళవుతుందిట” అన్నాడు గవరయ్య.

“భలే మా అమ్మది గోదానం. ఆఫీసరుగారి తల్లి ఆబోతుకు కళ్యాణం చెయ్యడము, మనకేదేనా లాభమా?” - ఆలోచనలో పడ్డాడు శివయ్య.

గవరయ్య గడ్డము చెయ్యడం పూర్తి చేశాడు.

దేవస్థానం ఆఫీసరు పేరు గంగరాజు, అతని కొడుకు సెంట్రల్‌ బ్యాంకులో పనిచేస్తున్నాడు. కాని పొట్టిగా ఉంటాడు. లక్షలు కట్నం ఇస్తామని వచ్చినా తనకు పొడుగు పిల్ల వద్దని గంగరాజుగారి కొదుకు ఇంతవరకు చూసిన సంబంధాలు తిరగ్గొట్టాడు. గంగరాజు తల్లి భూదేవమ్మ కూడా నారాయణమ్మ వయసుదే. ఆబోతుకు పెళ్లి చేస్తే మనవడికి పెళ్ళవుతుందని ఆవిడకు నమ్మకం. అందులోను కార్తీక మాసంలో చేస్తే రౌరవాది నరకాలు తప్పించుకోవచ్చని కార్తీక పురాణంలో వింది. ఆబోతు పెళ్ళి ముచ్చటను వృషోత్సర్గమంటారని చేయించమని భూదేవమ్మ గంగరాజును వేధిస్తోంది. ఈ విషయం శివయ్యకు తెలుసు.

శివయ్య గడ్డం గీయించుకున్నాక చక్కగా స్నానం చేసి వచ్చాడు. భార్య కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతుంటే తల్లి నారాయణమ్మ మళ్ళీ వచ్చి, “సోమవారం అంటే ఎల్లుండేరా” అంది.

శివయ్య గతుక్కుమని ఒక్క గుటకలో కాథీ తాగేసి చొక్కా తొడుక్కుని భుజం మీద కండువా వేసుకుని శివాలయం చేరుకున్నాడు.

శివాలయం సందడిగా ఉంది. భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దేవస్థానం మంటపము మీద (గ్రామ పురోహితుడు శంకరావధాన్లు మరో ఇద్దరు బ్రాహ్మణులతో కలిసి 1222222222 నదుము -కృజ్తు క

(ఇ ఎవరికో గ్రహశాంతికి జపం చేస్తున్నాడు. పూజారి దుర్గయ్య గుడి లోపల ఉన్నాడు. భక్తుల సందడితో అతనికి ఊపిరి సలపటం లేదు. అక్కడికీ సాయంగా ఉంటాడని మేనల్లుడిని తెచ్చుకున్నాడు. వచ్చిన వారికి గోత్రనామాలు అడిగి దుర్ష్ణయ్య పూజలు చేస్తున్నాడు. వాళ్లిచ్చే దక్షిణను బట్టి గొంతు స్థాయి మారుతోంది. పూజ పూర్తయిన తరువాత మేనల్లుడు శఠగోపం పెట్టి ప్రసాదాలు ఇస్తున్నాడు. ఆ రోజు భక్తులు ఎక్కువగా ఉండడంతో దుర్గయ్య ఇంకా గర్భగుడి లోనే ఉన్నాడు.

అటువంటి సమయంలో ధర్మకర్త శివయ్య ఆలయంలోకి వెళ్ళారు. ధర్మకర్త కాబట్టి

భక్తులతనికి దారి యిచ్చారు. గర్భగుడిలో ఉన్న పూజారి దుర్గయ్య శివయ్యను చూడగానే ఊరంత గొంతుతో అతని గోత్రనామాలను చదివి తానే స్వయంగా శఠగోపం పెట్టడానికి గర్భగుడిలోంచి బయటకు వచ్చాడు.

శివయ్య శఠగోపం పెట్టించుకుంటూనే, “దుర్గ్ణయ్యగారూ! మీతో మాట్లాడాలి. ఓసారి బయమటకు రండి” అన్నాడు.

గుడిలోంచి బయటకు వెళ్ళిపోతున్న శివయ్య వెనకాలే దుర్గయ్య తన స్థానాన్ని మేనల్లుడికి అప్పజెప్పేసి బయటకు వచ్చాడు. మంటపం మీద కూర్చుని రుద్రాక్ష తిప్పుతు జపం చేస్తున్న పురోహితుడు శంకరావధాన్లు వీళ్ళు ఎప్పుడు వస్తారా అన్నట్లున్నాడు. వీళ్ళను చూడగానే, “ఓం ఓం” అంటూ రుద్రాక్షను వేగంగా తిప్పేస్తు గబగబ మంటపం దిగి శివయ్య, దుర్గయ్యలను అనుసరించాడు. ముగ్గురూ కలిసి కొంచెం దూరములో ఉన్న దేవస్థానము ఆఫీసరు గంగరాజు దగ్గరకు వచ్చారు. ఈసారి ఈ నలుగురూ కలిసి శివాలయాన్ని ఆనుకుని ఉన్న పెరట్లోని ఉద్యానవనంలోకి వెళ్ళారు.

ఆ ఉద్యానవనంలో ఓ అవు, దానికి కొద్దిదూరంలో ఒక లేగదూడ కట్టివేయబడి ఉన్నాయి. వీళ్ళు వస్తూండడము చూసిన లేగదూడ తమను విప్పేసి తల్లి దగ్గరకు వదిలేస్తారేమోనని ఆశగా చూసి ఓసారి “బో అంది. అది చూసి తల్లి ఆవు “అంబా అంది.

నలుగురూ ఓసారి ఉలిక్కిపడి అంతలోనే తేరుకున్నారు. ఓసారి నవ్వుకుని ముందుకు కదిలి అక్కడ ఉన్న ఒక సిమెంటు బెంచీ మీద కూర్చున్నారు. మడికట్టుకుని పూజా కార్యక్రమంలో ఉన్నాము కాబట్టి అనే అహంకారం ఆత్మ వంచన కన్న వాళ్ళిద్దరూ అధికారులు దూరంగా ఉండడమే మేలని నిలబడి దుర్గ్ణయ్య, శివయ్య వాళ్ళ మాటలు వింటున్నారు. వాళ్ళు కూడా వీళ్ళిద్దరినీ కూర్పోమనలేదు.

“ధర్మకర్తగారూ! అవధాన్లుగారి ఆవును ఈ గుడి ప్రాంగణములో తోటలో ఎందుకు కట్టేయించారో చెప్పండి” అన్నాడు. |

ధర్మకర్త నవ్వి “రాబోయే సంవత్సరంలో ఆగస్టులో పుష్క రాలు అంటున్నారు. అందుచేత ఈ కార్తీకమాసంలోనే పేరుకు పేరు సంపాదించడమే కాకుండా మన చేతి చమురు వదలకుండా, వీలుంటే సొమ్ము కూడా సంపాదించేందుకు భేషైన ఆలోచన చేశాను. మా అమ్మ గోదానమో గోదానమో అంటూ నా ప్రాణం తినేస్తోంది. మా అమ్మ చేత గోదానం చేయించటానికి ఈ గోవును మన పురోహితులు శంకరావధాన్లుగారి దగ్గర నేను కొన్నానన్న క ౮-10 2౬22222222

మాట” అన్నాడు శివయ్య మీసాన్ని మెలిపెడుతూ. ,

“అయ్యా! శివయ్యగారూ! మూడు వేలు రొక్కమివ్వడమే కాక తిరిగి ఈ ఆవును నాకే దానము చేస్తానన్నారు” అన్నాడు శంకరావధాన్లు కంగారుగా.

శివయ్య మరోసారి నవ్వి, “కంగారుపడకండి అవధాన్లుగారూ, మీరు ఆ పూజ, ఈ పూజ ఈ దానం, ఆ దానం అంటూ దక్షిణలు వసూలు చేసినట్లే - నేను కూడా మీ పద్ధతిలోనే భక్తుల దగ్గర వసూలు చేసి మీకిస్తాను. పది రూపాయల నుంచి ఎవరికి తోచింది వారు గోవు మీద పెట్టి దానం చేసుకుంటారు - మీరు గోదాన ఫలితం దక్కాలని దీవిస్తారు. మీ మూడు వేలు మీకు ముట్టగానే పైన ఎంత సొమ్ము వచ్చినా ఇంక మాదే - అంటే దేవస్థానంది. అవును కార్తీకమాసం అయిపోయాక తోలుకుపోండి” అన్నాడు శివయ్య.

“ఎవరూ గోదానం చేసుకోవడానికి ముందుకు రాకపోతే” అన్నాడు శంకరావధాన్లు దీనంగా.

“వస్తారండి. వస్తారు. వచ్చి తీరతారు. పుష్కరాలండీ బాబూ! పుష్కరాలు. ఆగస్టులో వచ్చేస్తున్నాయని చెప్పాలి. వైతరణీ నదిని దాటే గోదాన ఫలితాన్ని పితృదేవతలకి అందించని జన్మ వృథా. ఈ కార్తీక మాసంలో గోదాన ఫలితాన్ని వారికి ధారపోసి పుష్కరాల రోజులలో గోదావరిలో పిండప్రదానం చేస్తే పితరులే కాదు మనం కూడా తరిస్తామని చెపితే పది నుంచి మొదలుపెడితే వేల దాకా స్తోమతును బట్టి కాసులు రాలతాయి” అన్నాడు శివయ్య,

దేవస్థానం ఆఫీసరు గంగరాజు గుక్క పెట్టీ నవ్వాడు. “ప్రపంచ బ్యాంకు సొమ్మును ప్రభుత్వం అప్పుగా తెచ్చి ఇంత ధైర్యంగా ఎందుకు ఖర్చు పెడుతుందో, నాకిప్పుడు మీ చ్వారా సులువుగా అర్ధమయింది. ప్రజలు, భక్తులు జిందాబాద్‌. మా అమ్మగారు కూడా ఏదో వృషోత్సర్ణమట - ఆబోతుకు పెళ్ళి చేసి అచ్చొస్‌ వదిలేస్తే పితృదేవతలు తరిస్తారు అంటోంది. నాక్కూడ ఖర్చు లేకుండా ఆబోతు దొరికే మార్గం చెప్పండి” అన్నాడు.

“ఆబోతు దొరకాలే కాని, అవు రెడీగానే ఉంది. జంతువులకు శీల పరీక్ష ఉండదు కాబట్టి మన అవధాన్లుగారికి వరకట్నము కూడా వచ్చేలా ఆయన ఆవుకే ఇచ్చి పెళ్ళి చేద్దాము” అన్నాడు శివయ్య. తరువాత దుర్గయ్యకేసి చూసి, “పూజారిగారు మిగలిన కథ మీరే నడపాలి” అన్నాడు.

పూజారి దుర్గయ్య శివాలయ ప్రాంగణంలో దాతలు కట్టించి సర్వహక్కులతో ఇచ్చిన పెంకుటింట్లో ఉంటున్నాడు. దీపావళికి ముందు వచ్చిన తుపానుకు పైకప్పు పూర్తిగా దెబ్బతిని కొంపలోకి సూర్యచంద్రులు కాపురానికి రావడంతో తుపాను బాధితుల లిస్టులో తన పెరు చేర్పించి, ఇల్లు బాగు చేయించుకుందుకు ప్రభుత్వ సాయం వచ్చేలా చేయమని దుర్ణయ్య కొద్దిరోజుల (క్రితమే విలేజూఫీసర్ని కలుసుకున్నాడు.

విలేజాఫీసరు భార్య, “దుర్గయ్యగారూ! మీ దేవాలయము ఆఫీసరుగారబ్నాయి పెద్ద పొడుగు కాదని విన్నాను. వినడమేమిటి ఆ మధ్య గుళ్ళో చూశాను. మా లావఖ్య కూడా పొడుగు కాదు. ఈడూ జోడూ బాగుంటుంది. బ్యాంకు కుర్రాడు. కట్నం బాగానే ఇస్తాము. గోత్రాలు కలవలేదు. సంబంధం కదిలెయ్యకూడదూ అంది కాఫీ ఇచ్చి. 1222222222 నోచ లు -కక్ట్షకు క్ష

అంతవరకు దుర్గయ్యను, అతని మాటలను పెద్దగా పట్టించుకోని విలేజాఫీసరు కళ్ళు పెద్దవి చేసి, “పూజారిగారూ! నాకొకృ్కత్తే కూతురు. ఏదైనా తదనంతరమే ఇస్తాను. మీ చాకచక్యము చూపించి తక్కువ కట్నంలో ఈ పెళ్లి మీరు కుదర్చగలిగితే నా సాయం మీకు తప్పకుండా ఉంది” అన్నాడు.

దుర్గయ్య విపులంగా వివరించి చెప్పాడు గంగరాజుకు. శివయ్య విలేజాఫీసరుతో గంగ రాజు వియ్యమందాలని అందుకు దుర్గ్ణయ్యు రాయబారము నడుపుతాడని, అందు వల్ల మనకు లాభం ఉంటుందని సూచించాడు.

అంతే మరి కొంచెము సేపట్లోనే దుర్గయ్య వెళ్లి విలేజాఫీసరును పిలుచుకువచ్చాడు. దేవస్థానం ఆఫీసరు గంగరాజు, విలేజాఫీసరు దుర్గరాజు వియ్యంకులైపోవడానికి నిర్ణయిం చేసుకున్నారు. పెళ్ళిచూపులు ఏర్పాటు చేయాలనుకున్నారు.

ఇలా మాటలు జరుగుతుంటే అక్కడ (ప్రాంగణంలో ఉన్న మారేడు చెట్టొకటి, దీపావళికి ముందు కురిసిన తుపాను వానలకు పట్టుతప్పిందేమో పెద్ద శబ్దంతో వేళ్ళతో సహా లేచిపోయి నేల మీద దమనీయంగా పడిపోయింది.

మారేడు చెట్టు కూలిపోగానే వీలేజాఫీసరులో ఏదో ఉత్సాహము. కూర్చున్న వాళ్ళందరికీ ఏదో చెప్పి గబగబా తోటలోంచి బయటకు వచ్చి గుడి ప్రాంగణములోని జనాన్నందరినీ ఉద్యానవనంలోకి తీసుకువచ్చాడు.

“ఈ మారేడు చెట్టు శివ ప్రతిరూపం. ఇది మనకు కర్తవ్యాన్ని బోధిస్తోంది. ఈ చెట్టు ప్రతి ఏటా లక్షపత్రి పూజకు పయోగపడుతుంది. తరతరాల ఈ చెట్టు కూలిపోవడం దురదృష్టకరం. ఈ చెట్టు యొక్క ప్రతి ఆకు సద్వినియోగమయ్యేలా మనం లక్ష పత్రి పూజలు హాోరెత్తించాలి. అందరూ ముందుకు రండి. చందాలు వెయ్యండి. దంపతులు, దంపతులగ పీటలు మీద కూర్చుని పూజచేసి పుణ్యంపొంది ఈ చెట్టును తరింపచెయ్యండి” అన్నాడు విలేజాఫీసరు.

క్షణాల మీద లక్ష పత్రి పూజ పేరిట చందాలు పోగడ్డాయి. కార్తీకమాసంలో ఒక్క సోమవారమే కాదు, అన్ని రోజులు కూడా శివుడికి పూజ జరిగింది. పీటల మీద కూర్చోడానికి దంపతులు పోటీ పడ్డారు. నారాయణమ్మ గోదానము చేసింది. శంకరావధాన్లు ఆవు మీద గోదానాలు బాగానే సంపాదించాడు. ఎవరో శివుడికి ఆంబోతును దానం చేశారు. భూదేవమ్మ అవధాన్లుగారి అవుకిచ్చి పెళ్ళి చేసి, అచ్చోసి వదిలింది. ఆ పెళ్ళి సమయంలో లేగదూడ తల్లి ఆవు దగ్గరకు పరుగెత్తిరావడం వినోదంగా అనిపించింది. విలేజాథీసరు, దేవస్థాన మాఫీసరు వియ్యంకుళ్ళయ్యారు. శివయ్యకు డబ్బు, దేవస్థానానికి ఓచర్లు బాగానే మిగిలాయి. పూజారి ఇల్లు బాగుపడింది. సంతర్చణలు గురించి చెప్పనే అక్కరలేదు.

కాని నిశ్చలంగా చూస్తున్న నందీశ్వరుడి మీది అరటిపళ్ళు తినడానికి నాలిక చాపిన ఆబోతుకు కార్తీకమాసమన్ని రోజులు మాత్రమే ఫలహారాలు, పచ్చగడ్డి దక్కాయి. వృషోత్సర్గ్ణము మాత్రము మళ్ళీ కార్తీకమాసం కోసం ఎదురు చూస్తూనే ఉంది.

అ 2డ౭౭జడైడడడ2త32ఊ2ైకుైకడకకకకకైడ22 కు క భలాని-104 1౬22222222౬4౬4€ో్‌ో్‌ోోోోాడడే

రాణీఈగ అ ఇంద్రగం() జూనకీనొల శ్రీవల్లి సోఫాలో కూర్చుని ఎదురుగా వున్న టి.విలో కదిలే బొమ్మల వైపు చూస్తోంది. ఏదో కథ తెర మీద నడుస్తున్నా ఆ కథ వెంటా, ఆ బొమ్మల వెంటా ఆమె మనసు నడవటం లేదు. వేరే ఏదైనా ఆలోచిస్తోందని చెప్పటమూ కష్టమేగానీ ఆమె మనసులో స్థిమితంలేని ఆవస్థ ఏదో వుందనిపిస్తుంది. ఊరటా టి. వీ ముందు కూర్చున్నట్టుంది. అంత పెద్ద ఇంట్లో నిశ్శబ్దంగా వుండటం కష్టం -, ఏదో ధ్వని కోసం అది నడుస్తోంది. టెలిఫోను మోగడంతో వులిక్కిపడింది శ్రీవల్లి. వెంటనే వెళ్ళి ఫోనందుకోవాలంటే వదో బెరుకుగా, భయంగా అనిపించింది. ఎవరు ఫోను చేస్తున్నారో అనే సంశయం మొదలైంది. తీరా ఫోను అందుకుంటే ఏం మాట్లాడలో-, అసలు అవతలి వైపు వారు ఎవ్వరో-, నాలుగైదు సార్లు మోగాక విధిలేక వెళ్ళి రిసీవర్‌ తీసుకుంది. హల్లో అందామా వద్దా అని ఆలోచిస్తుండగా అవతలి వైపు నుంచి తల్లి గొంతు వినిపించింది. “అమ్మా” అంది సావిత్రి. “అవునమ్మా నేనే” అంది శ్రీవల్లి. “ఎప్పుడొచ్చావ్‌ -, ఫోను చేశావంటే కంగారు పడ్డాను ఎలా వున్నావు. -, నేనో గంట లోపు వచ్చేస్తాను. అన్నం తిన్నావో అంది సావిత్రి ఆఫీసు నుంచి-, శ్రీవల్లికి సమాధానం చెప్పాలని వుంది కానీ గొంతు పూడుకుపోతోంది. వెంటనే మాట్లాడక పోతే తల్లి గుండెలు బెంబేలు పడిపోతాయి. అందుకే ఎంతో నిగ్రహంగా, “తిన్నాను. నువ్వు నెమ్మదిగా రా- ఫర్వాలేదు అంది, పంటి బిగువున. సావిత్రి ఫోను పెట్టేసింది. శ్రీవల్లి నెమ్మదిగా కళ్ళు తడుచుకుని మళ్ళీ సోఫా వైపు వెళ్తుంటే కాలింగ్‌ బెల్‌ మోగింది. వెళ్ళి తలుపు తీసింది. తలకి తువ్వాలు కట్టుకుని వాచ్‌మెన్‌ కనిపించాడు. “ ఏమైందో అంది. “ఏంలేదమ్మా! అమ్మగారొచ్చారా?” అన్నాదు. 2121122224]

“ల్రేద్రు -

“ తేనె పట్టుతీసెయ్యాలమ్మా... అమ్మకి చెప్పామనీ...”

తనలో తను అనుకున్నట్లున్నాడు.

శ్రీవల్లి రెండడుగులు ముందుకు వేసి చూసింది. ఎదురు బ్లాకులో సన్‌షేడ్‌కి అంటి పెట్టుకుని పెద్ద తేనెపట్టు, దాని చుట్టూ తిరుగుతున్న ఒక తేనెటీగ -.

“మ్పెన్ననేగా తీసేశారు” అంది ఆశ్చర్యంగా.

“మూడు నెలలు దాటిపోయిందమ్మా !” అన్నాడు

ఆమెకి గుర్తుకొచ్చింది. తనిక్కడికి వచ్చినప్పుడే ఆ తేనెపట్టును కూలగొట్టారని -

“మూడొందలారు బెడ్‌రూం తలుపు తీసేందుకు లేదంటమ్మ”-

అతను వెళ్లి పోయాడు.

“ఈ అపార్టుమెంటులో మూడో అంతస్థులో ఎప్పుడూ ఈ తెనెపట్టు పెడుతూనే వుంటుంది! అనుకుంది శ్రీవల్లి -,

నీరసంగా వెళ్ళి దీవాన్‌ మీద తలగడ సర్దుకుని పడుకుంది. టీ.వీలో చాలా సేపట్నించి ఒక ఆడపాత్ర ఏడుస్తూ వుంది. శ్రీవల్లి కళ్ళు మూసుకుంది. ఒక్కక్షణం ఏలాగో అయిపోయింది ఆమె మనసు. తనకా ఏడుపు ప్లే బ్యాక్‌లా అనిపించింది.

అధ ళి

పెళ్లి జరిగే కల్యాణ మండపం సందడిగా వుంది. రాత్రి పన్నెండు గంటల మూడు నిముషాలకి సుముహూర్తం. ఉదయమే ఆడపెళ్ళి వారుగా సావిత్రీ, కృష్ణారావు బంధుజనంతో వచ్చి వాళ్ళ గదుల్లో సర్దుకుని హడావిడి పడటం మొదలుపెట్టారు. రెండు గంటల ప్రాంతంలో మగపెళ్లివారూ వచ్చి తమ కిచ్చిన గదుల్లో సామాను పరుచుకుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏం కావాల్సినా ఆడపెళ్ళివార్ని గదమాయించవచ్చుననే ధీమా వారి ప్రతి కదలికలోనూ స్పష్టమవుతోంది. ॥

కృష్ణారావు కూతురి పెళ్ళి గురించి హడావిడిపడిపోతూ, అటూ ఇటూ పరుగులు పెడు తున్నాడు. సావిత్రి కావలసిన వన్నీ మరొక్కసారి సరిచూసుకుని, రానివి వాళ్ళకీ వీళ్ళకీ పురమాయిస్తోంది. పూల దండలు రావాలి - పెళ్ళివారు తలలో పెట్టుకునేందుకు పూలు కావాలి -

కూతురి పెళ్ళి తాలూకు అనందం, ఆందోళన, బెంగ, భయం అన్నీ కలిసి సావిత్రి ముఖం జేవురించివుంది. -

మగపెళ్ళివారికి కాఫీలు, టీలు, టిఫెన్లు, డ్రింకులు ఎప్పటికప్పుడు అందుతున్నట్లు సమాచారం అందుతూనేవుంది.

బ్యూటీపార్లర్‌ నుంచి వచ్చిన నాజూకు అమ్మాయి శ్రీవల్లికి మేకప్‌ చేసేందుకు అన్నీ సర్జుకుంటోంది. తలంటు పోసుకుని జుత్తు ఆరబెట్టుకుంటూ అక్కడే కూర్చుంది శ్రీవల్లి.

నిజానికి శ్రీవల్లి అందగత్తె కాదు. చామన చాయ. చిన్న కళ్ళు బండ పెదాలు -, బుగ్గలపైన ఎముకలు కాస్త పైకిపోడుచుకొచ్చి, కళ్ళు మరీ గుంటల్లా' వుంటాయి. క౭ైైత2ఊ2జజడా22=2222క్తైకైకలకైకకకకడతడుకతతతడతతతడడడడతతడ కహా. 2 ై౭తతతపత22222====22సా-2222222222222222222222

బ్యూటిషియన్‌ నెమ్మదిగా శ్రీవల్లిని వీలయినంత అందంగా కనిపించేలా తయారు చేయ డానికి సొగసులు దిద్దుతోంది. ఏది ఏమైనా పెళ్ళి కూతురు కనుక ఆమెని అందంగా కనిపించేలా చెయ్యాలి. అందుకే వచ్చింది బ్యూటీషియన్‌.

“అమ్మా ! రేఖా వచ్చిందా” అని అప్పటికి ఎన్నోప్రార్లు అడిగింది శ్రీవల్లి,

“రాలేదమ్మా ! వస్తుందిలే” అంటూ సావిత్రి సమాధానం ఓర్చుగా చెప్పింది.

పిహెచ్‌.డి చేసిన ముప్ఫై రెండేళ్ళ కూతురు సిగ్గుల మొగ్గెపోతుంటే చూసుకుని మురిసి పోతోంది సావిత్రి.

అనుకున్నదానికంటే కాస్త ఆలస్యంగా రేఖ వచ్చింది. వస్తూనే “శ్రీ...” అంటూ వెనుకగా రెండు భుజాల మీదా చేతులు వేసింది స్నేహంగా.

“ఏమ్మా! సీకిప్పటికి తీరిందా” అంది అలక నటిస్తూ శ్రీ.

“ఇంకానయం ఇప్పటికైనా రాగలిగాను. సంతోషించు” అంది రేఖ దబాయింపుగా.

“ఏం ?”

“ఏముందీ - ఈ వేళ శలవు పెట్టేద్దామంటే కుదరలేదు మధ్యాహ్నం ఎగ్గొట్టి రావాలని ష్షాన్‌. కాని మా బాస్‌ దగ్గర ఒంటి గంట నుంచి మొదలుపెడితే ఇప్పటికైంది”

“అదేంటి?”

“అందంతే - మా బాస్‌ లేడీ కదా! ఒక పట్టాన వదిలి పెట్టలేదు”

“ నువ్వు మరీ అన్యాయం”

నిజం! ఇదే మా పాత బాస్‌ అయితే ఒక్క మాట చెప్పగానే ఓకే అనేవాడు" అంది రేఖ కాస్త ద్రమెటిక్‌గా.

“అదేంటీ”

“మగాడు కదా”

“ధీ! అలా మాట్లాడకు బాగుండదు. సిగ్గుగా వుంటుంది” అంటూ తలొంచుకుంది శ్రీ.

రేఖ ఆశ్చర్యంగా చూస్తూ -

“నువ్విలా మొద్దురాచ్చిప్పలాగే వున్నావు సుమా! అదిసరేగానీ పెళ్ళికొడుకుతో మాట్టాదొవా అంది.

భీ! ప్రాడు పెళ్ళి కాకుండా మాటలేమిటి అసహ్యంగా” నది వ

రేఖ మరింత ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేసి చూస్తుండి పోయింది.

ఒక్కక్షణం ఆగి 'స్రైసాగా ఖై ముందు కాస్త మాట్లాడితే మంచిది. ఇంత చదువుకునీ... నువ్వు...” న

“ఎంతచదువుకున్నా మన సంప్రదాయాల్ని విడుచుకుంటామా” అంది శ్రీ చాలా ముదురుగా.

రేఖ నిశితంగా చూస్తూండి పోయింది...

“అదికాదే శ్రీ... అసలు పెళ్ళిచూపులప్పుడే మాట్లాడాలి. అతని అభిప్రాయాలు, అభి రుచులు, అలవాట్లు కాస్త తెలుస్తాయి కదా” అంది. 222౬£ఓ£ఓ£౬£ఓ£ఒఓఒఓఒఊఓఒఊఒఊబఊబ్ల్లక =222ఒ2ఒ2ఒ2ఒ2ఒ4ఒ2ఒ2===

“అవన్నీ అమ్మా, నాన్న చూశారు. నాకేం కావాలో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళునా మంచి కోసం అన్నీ చేస్తారనే నమ్మకం నాకుంది” అంది సీరియస్‌గా. రేఖ అవాక్కయి పోయింది.-, “నేను వెళ్ళి పెళ్ళికొడుకుని చూనీవస్తా” అంటూ వెళ్ళిపోయింది రేఖ. “దీనికంతా తొందర. పైగా మగాళ్ళంటే అస్సలు భయం లేదు-సిగూ పడదు” అంటూ తేల్చింది శ్రీ. . -.. “పెళ్ళి కూతురివి నీకు సిగ్గుగానీ నీ స్నేహితురాలికెందుకూ సిగ్గూ...” అంటూ పక్కన కూర్చున్న పిన్ని దీర్హం తీసింది. కార్యక్రమం వేగం పుంజుకుంది. శ్రీవల్లి మరీ ముడుచుకుని కొంచెం కూడా తలెత్తకుండా భూమిలోకి కుంగిపోవడం మొద లెట్టింది. అంత చదువుకుని, యూనివర్సిటీల్లో మసిలిన శ్రీవల్లి అసలు మగ పురుగుని చూడనట్లు, అప్పుడే చూస్తున్నట్లు వుండటం రేఖనే కాక కొందర్ని ఆశ్చర్యపరచినా, పెళ్ళిలో ఆ విధంగా వుండటం మన సమాజంలో సహజమేనని సరి పెట్టుకుని, నవ్వుకుని వూరుకున్నారు. పెళ్ళి తంతులో అత్తగారు ధూము ధాములు చేసింది. అది సహజమే అని సరిపెట్టుకుని అడుగులకు మడుగులొత్తారు. ఆడబడుచు అలిగి అన్నానికి రాక పోతే అదే అసలు పెళ్ళికి అందం అని మురిసి, ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చి భోజనాల పంక్తికి తీసుకొచ్చారు -, అనుకున్నవీ, అనుకోనివీ అడుగుతూ వాళ్ళు బాగానే లాంఛనాలు లాగారు. కంగారు పెట్టారు. '“అవునుమరి. ఆడపిల్ల పెళ్ళంటే సామాన్యమా? అంటూ అయిన వాళ్ళంతా బుగ్గలు ' నొక్కుకున్నారు. ఏలాగోలాగ ఆ మూడు ముళ్ళూ పడ్డాయని ఆనందించారు. పెళ్ళికొడుకు తల్లి యందు ఎంతో విధేయుడుగా వుండటం అందరికీ ముచ్చటగా అనిపించింది. ప్రతీమాటా తల్లి నడిగి ఆమె అనుమతితో చెయ్యడం. . “కొడుకంటే అలా వుండాలి' అంటూ కొందరు అతి గొప్పలు కూడా పోయారు. శ్రీవల్లిని అత్తారింటికి పంపి సావిత్రి మూడు రోజులు మంచం దిగలేదు-, ఎన్ని చేసినా, ఎంతిచ్చినా, వాళ్ళు అల్లరి చేస్తూనే వున్నారు. అవమానంగా మాట్లాడుతూనే వున్నారు. అదేమంటే ఆడపిల్లని కన్నందుకు ఆ మాత్రం ఓర్చుకోలేరా? అని ముఖం మీదే అడిగారు-, కూతురి పెళ్ళి చేసిన సంతోషం, తృప్తీ, శాంతీ సావిత్రికి అస్సలు మిగల్లేదు సరికదా సన్నటి బెంగ గుండెల్లో మంటలా రాజుకోవడం మొదలైంది. మూడు నిద్రల కార్యక్రమంలోనే ముచ్చట్లన్నీ తీరిపోయాయి. కూడా వెళ్ళిన పిన్ని శ్రీవల్లిని నిలేసింది - 'ఇంత అందమైన చీర పెట్టిందేమే మీ అత్తగారూ” అని. ం శ్రీవల్లికి కోపం పిన్నిని మింగేద్దా మన్నంతగా వచ్చింది. “నేనో చీర కొనిచ్చేస్తానులౌ అంది గరాణాగా,. “నువ్వేం కొనివ్వక్కరలేదు. వడుగంటి చీర బాగుండలేదని, నానా అల్లరీ చేసి, చీర మార్చించిన మీ అత్తగారికి వచ్చిన వాళ్ళకి మంచీ చీర పెట్టాలని తెలీదా” అంటూ తేల్చింది కై కభారహిని- 2004 క్‌ డడ క] డడ కక

పిన్ని. , అప్పటికే సగం చచ్చిన సంతోషంతో శ్రీవల్లి ఏడుపు మొదలు పెట్టింది. “కొత్త పెళ్ళికూతుర్ని కళ్ళు నీళ్ళు పెట్టిస్తావుటే” అంటూ చెల్లెలి మీద తాడెత్తునలేచింది సావిత్రి. ఆ వెళ్ళడం వెళ్ళడం శ్రీవల్లి ఊసు నెల్లాళ్ళు వరకు తెలీలేదు. “ఇంకా ఏలాగైనా అది అక్కడసర్జుకోవాల్సిందే కదా అని కృష్ణారావు, సావిత్రి గుండె దిటవు చేసుకున్నారు. నెల్లాళ్ళయి పోయిందని చూసివద్దామని వెళ్ళిన వాళ్ళిద్దరూ శ్రీవల్లిని చూసి అవాక్కయి పోయారు. సన్నగా, నీరసంగా తయారై కళ్ళలో ప్రాణాలతో కూతురు కనిపించేసరికి వాళ్ళ గుండెలు జారి పోయాయి. ఏ మాట మాట్లాడినా దులిపేస్తోంది అత్తగారు. శ్రీవల్లి మీదా, పని తనం మీదా, ఆమె చురుకుతనం మీదా దుమ్మెత్తి పోసింది. ఆమెగారికి సపోర్టుగా మామగారు మాట కలుపుతున్నాడు. ఇంతా అతని ఎదురుగా జరుగుతున్నా గుడ్లు మిటకరిస్తూ వున్నాడేగానీ ఒక్కమాట మాట్లాడలేదు పతిదేవుడు. ఒకవేళ మాట్లాడినా అది వాళ్ళమ్మ వైపే. - కనీసం అత్త మామాల్ని గౌరవంగా ఆహ్వానించను కూడా లేదు. ఇద్దరూ ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని నోరు మూసుకుని యింటి కొచ్చిపద్డ్దారు. సావిత్రికి హైబిపీ వచ్చేసింది. కృష్ణారావు జ్వరంతో పడిపోయాడు. ఎక్కడే లోపం జరిగిందీ అని ఎంత తర్జన భర్జనలు చేసుకున్నా వారికి అంతు పట్టలేదు. పొరుషంగా మాట్లాడి పిల్లని తీసుకొచ్చేద్దామంటే, ఆమె జీవితం పాడయిపోతుందని భయం. జాతకాలు చూశారు. ఓహో ! ఆద్భుతంగా కుదిరాయి. ఇంటి గురువుగారు గ్రీన్‌ సిగ్నల్‌ యిచ్చి అంతటి ఉత్తమ పురుషుడు మరిక లేదని సర్దిఫికెట్‌ యిచ్చారు. గీసి, గీసి కట్నాలు కానుకలు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నవి కాక దొరికినంత దొరక పుచ్చుకున్నారు. పోనీ అంతా తీసుకుని హాయిగా వున్నా బాగుండేది. అబ్బే అది లేదు. - అల్లుడు అత్తారి వైపు, అంటే భార్య తల్లిదండ్రుల వైపు తిరిగి పోతాడని భయమట - కోడలు మాత్రం తల్లినీ, తండ్రినీ, ఆ వైపు బంధువుల్ని కన్నెత్తి చూడకూడదు. ఇంత జరిగినా పిల్లాడు మంచివాడే - అత్తగారే రాక్షసి, పిశాచి, గయ్యాళి అని తేల్చారు కృష్ణారావు, సావిత్రి. కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే శ్రీవల్లి మూడు నెలలు గడిచేసరికి కట్టు బట్టలతో పుట్టింటి కొచ్చేసింది. అక్కడ్నించి మళ్ళీ అగచాట్లు మొదలయ్యాయి. వ్‌ పిల్లని సముదాయించడాలు, వాళ్ళని బతిమాలడాలు, ఎన్నో జరిగి, ఆడపిల్ల పెరు చెప్పి సావిత్రి, కృష్ణారావు మొత్తం ఆత్మాభిమానాన్ని తెగనమ్ముకున్నారు. అత్తగారు అందుక్తుంది - “టీ.వీ పాతదైంది. మీ నాన్నని కొత్తది కొనిమ్మని చెప్పు అన్నాడు మా అబ్బాయి. వున్న మాట చెప్పేందుకు మాకేం భయం? ఏం తప్పా? అల్లుడు మామగార్ని ఏదైనా కొనివ్వమనడం తప్పా ! ఆ హక్కు లేదా? ఇది ఆచారమేగానీ మరోటి కతత ౮ాలేశగ క్ష

(ల్లి లా కాదుకదా! ఇస్తారు. ఇవ్వురు. ఇవ్వలేకపోతే ఏదో బతిమాలుకుని, సర్ది చెప్పుకుంటారు. అంతేగానీ మొదలుకంటా అడగడానికే మెలికలు తిరిగిపోతూ, ఏడిస్తే ఎలా? గట్టిగా చెప్పాం ఏడుపు మొదలుపెట్టి ఆగదే !! అడిగితే బాగుంటుందో, బాగుందదో మీరు చెప్తారుక అంటూ అత్తగారు వివరించింది.

“చదువుకుందిగానీ మీ అమ్మాయికి తెలివి లేదు” అని మామగారు తేల్చి చెప్పారు.

సావిత్రికీ, కృష్ణారావుకీ ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలీక తికమకపడి పోయారు. శ్రీవల్లికి సర్ది చెప్పి, “మమ్మల్ని అడిగితే మేం చూస్తాం కదా” అంటూ వెంటనే మంచి కలర్‌ టి.వీ సెట్‌తో బాటూ శ్రీవల్లిని అత్తారింటికి పంపారు.

ఈ హడావిడి పడుతున్నప్పుడే మూడో అంతస్టు సన్‌షేడ్‌ కింద పట్టిన తేనెపట్టును పాగ పెట్టి, నిప్పు పెట్టి, చెదర గొట్టి పడగొట్టారు. కాంపౌండులో తేనె టీగలు చెల్లాచెదరై గోలగా ఎగిరాయి. కాళ్ళా వేళ్ళా పడి బతిమాలితే వచ్చిన శ్రీవల్లి మొగుడ్ని ఒక తేనెటీగ కుట్టనే కుట్టింది. గిట్టక తేనెటీగ చేత కుట్టించారని అత్తగారు పెద్ద రాద్దాంతం చేయనే చేసింది.

మరో మూడు నెలలకి శ్రీవల్లి ఉద్యోగంలో చేరింది. ఆమె మీద ఇంటిల్లిపాదీ నిఘా వేసి కాలేజీకని వెళ్ళి అమ్మా నాన్నల దగ్గర కెళ్తుందేమోనని వెయ్యికళ్ళతో చూడటం మొదలు పెట్టారు. బయట నుంచి ఫోను' చేసి మాట్లాడుతుందేమోనని నానా రకాల ఒట్లూ వేయించు కున్మి బాగా కట్టుదిట్టం చేసి వుద్యోగానికి పంపటం మొదలు పెట్టారు.

ఇన్ని జరుగుతున్నా శ్రీవల్లి ఏం చేసిందీ అంటే చెప్పడం కష్టమే. - తరుచూ వడుస్తూ ఆడవాళ్ళకీ కష్టాలు సహజమేనని నమ్మి, కొన్నాళ్ళు భరించాలని నిర్ణయించుకుని వుండచ్చు.

పెళ్ళి అంటే ఇలాగే వుంటుంది గానీ ఇంతకంటే ఆనందంగా వుండదని నమ్మి వుండచ్చు.

వచ్చిన జీతంలో లెక్కలు సరిగాలేవని తల్లిదండ్రులకి దబ్బు ఇచ్చేస్తోందని అనుమానంగా వుందని అల్లరి చేస్తే భరించలేక అమ్మ దగ్గర కొచ్చేసింది శ్రీవల్లి.

సరిగా మూడు నెలల క్రితం ఆ రోజంతా సావిత్రి, కృష్ణారావు ఇంట్లో తలుపు లేసుకుని శ్రీవల్లి లెక్కలన్నీ సరిచేసి పెట్టారు. ఎందుకంటే బయట తేనెపట్టు చెదరగొడతున్నారు.

మర్నాడు పే సర్టిఫికెట్‌తో సహా చూపించి తమ కుమార్తె నిజాయితీని బలప్రదర్శనలో నిరూపించుకుని పిల్లని పంపారు. కాలేజీలో వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. కానీ ఆ తల్లి దండ్రులు పిల్ల అత్తారింటి కెళ్ళినందుకు గుండెల మీద చేయ్యేసుకున్నారు. -

అప్పటికీ పిల్లాడు మంచివాదే., అత్తగారే పేచీకోరు, గయ్యాళీ - ఆ మామాగారు తిక్కలాడు అంటారు కృష్ణారావు, సావిత్రి -,

కారణం అతను గదిలో బాగానే వుంటాడుట- చాలా దగ్గర స్నేహితులు, “పంపకు , వాళ్ళే కాళ్ళ బేరానికొస్తారు. పెళ్ళి, సంసారం ఆడపిల్లకెంత ముఖ్యమో, మగవాడికీ అంతే ముఖ్యం” అన్నారు. కానీ కాపురం కూలిపోతుందని వారి భయం.

అసలు కాపురం కూలడమంటే ఏమిటి? నిలబెట్టడమంటే ఏమిటి? ఇప్పుడామె కాపురం వున్నట్టా లేనట్టా -, పురుషుడి కున్నట్లే స్త్రీకీ తల్లీ దండ్రీ బంధుమిత్రులు వుంటారనే ప్రాధిమిక క కథారాలాని - 2004 22222ాతడతతఊ2ఊఊఊ2చఊ2చఊ22ైైత

విషయాన్ని ఒప్పుకోలేకపోతున్న మనుషుల మధ్య కాపురం ఏమిటి? -

ఒకప్పుడు ప్రీని పోషించే భారం పురుషుడి మీద వుండి, సర్వ అధికారాలతో అమెని బానిసగా చేసేవాడు. కానీ ఇప్పుడు ఆమె కూడా సంపాదించాలి. సాయం చెయ్యాలి. - మరీ దురన్యాయం ఏమిటి? అమ్మాయి ఎవరితో మాట్లాడాలో మాట్లాడకూడదో నిర్ణయించే అధికారం వాళ్ళ కెవరిచ్చారు?

ఈ ప్రశ్నలు వేస్తేనే - ఊహిస్తేనే ఆడపిల్ల తల్లిదండ్రులు భయంతో వాణికిపోతున్నారు. ఆడపిల్లల్ని వ్యక్తిత్వం లేని వాజమ్మల్లాగ, దద్దమ్మల్లాగా ఎందుకు పెంచుతున్నారు?

పిల్లలు కాపురాలెలా చెయ్యాలో తామే బయట నుంచి మోనిటర్‌ చేయగలమని తల్లిదండ్రులు ఎందుకు అనుకుంటున్నారు? అమ్మాయిని ఒక వ్యక్తిగా చూడక, ఆమెకేం కావాలో మేం చూస్తాం అంటూ తల్లిదండ్రులు ఎందుకు ముందుకొస్తున్నారు?

విజ్ఞతతోగల కాస్తంత స్వేచ్చను తన భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడపిల్లలకి ఎందు కివ్వడంలేదు?

చిలి

ఒక్కసారి పవర్‌కట్‌ అయింది. సాఫాలో పడుకుని నిద్రపోయిన శ్రీవల్లి వులిక్కిపడి లేచింది. బయట తలుపు మీద టక్‌ టక్‌ మంటూ శబ్దం వినిపిస్తోంది. లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తల్లిని చూడంగానే ఏడుపొచ్చింది. కౌగలించుకుంది. వెనుకగా రేఖను చూసి అవమాన పడింది.

“భి! ఏమిటదీ... చూడు - నీ కోసం రేఖ వచ్చింది. తనతో కబుర్లు చెప్పు - నేను కాఫీ కలుపుతాను” అంటూ సావిత్రి చేతిలోవున్న హ్యాండ్‌బ్యాగ్‌ టేబులు మీద పెట్టి లోపలి కెళ్ళింది.

రేఖ ఏం మాట్లాడలేదు. శ్రీవల్లి కూడా వెంటనే ఏం మాట్లాడలేదు. ఇద్దరూ పక్కపక్కన సోఫాలో కూర్చున్నారు.

“అమ్మగారూ ! తేనెపట్టు పీకేస్తున్నా - కిటికీ తలుపు లేసుకోండి” అంటూ కింద నించి కేక వినిపించింది -,

సావిత్రి, “ఇంటికొచ్చాను- మొదలు” అంటూ విసుగ్గా మొదలు పెట్టింది కిటికీ తలుపులు ముయ్యడం. ॥

“మూడు నెలలకోసారి మూలచ్చేదం చేసి, ఈగల్ని కొట్టీ పట్టుని పీకి, నిప్పు పెట్టినా ఆ రాణిఈగకి బుద్ధి లేదు. మళ్ళీ మర్చాటి నుంచీ మొదలు పెడుతుంది తేనెపట్టు పెట్టడం. ఛీ! ఇదో న్యూసెన్సయి పోయింది. మరోచోట పెట్టుకునే జ్ఞానం దానికి లేదు” అంటూ చివరి కిటికీ తలుపు ధడేలుమని మూసి బోల్టు పెట్టింది సావిత్రి.

ఒక్క క్షణం రేఖ కళ్ళు శ్రీవల్లి కళ్ళతో కలిశాయి.

శ్రీవల్లి తలొంచుకోబోయి, తలెత్తి ధైర్యంగా స్నేహితురాలి కళ్ళల్లోకి చూసింది.

ఆ చూపులో తళుక్కున ఒక భావం మెరిసింది.

. € 2222222222 :భీ+గ క్ష

అలి. పల్లవించిన పాట అ ౮దీూరి తెంకట్‌ సీఠారారుగభార్తి

బయట వేసవి ఎండ మాద్చేస్తోందేమో ఎ.సి, కంపార్ట్‌మెంట్లోకి వచ్చేసర్కి చల్లగా ప్రాణానికి హాయిగా వుంది. బెర్తు నెంబరు చూసుకుని కూర్చున్నాను. డబ్బుంటే ఎన్ని భోగాలైనా అమరుతాయి యీ రోజుల్లో. ఆఫీసు వారి ఆడిటింగ్‌ పని - వారి పని కోసం వోదాకి తగ్గట్టు ఎన్ని సౌకర్యాలనైనా సమకూర్షుస్తోర్ము నాలుగు రోజుల పనికి పది వేల రూపాయల ఖర్చు! థర్డ్‌ ఎ.సి. కంపార్ట్‌మెంటు కాస్త యిరుగ్గా అన్సించినా సుఖంగానే వుంటుంది. ఆలా

బండి బయళ్టేరదానికింకా పావుగంట వ్యవధి వుంది. ఆ సమయంలో ఆరడుగుల ఎత్తు, ఆజానబాహువనదగ్గ ఒక వ్యక్తి ఓ ముసలామెను తీసుకుని లోపలికొచ్చేడు. నా ముందు నించే నడిచివెళ్ళి బెర్తు నెంబరు చూసి ఆమెను కూర్చో బెట్టేడు. ఆ వెనుకే పోర్టరు నాలుగు లెదర్‌ సూట్‌కేసులు తెచ్చి ఆమె కూర్చున్న సీటు క్రింద సర్ది వెళ్ళేడు. అతనిని చూస్తే డబ్బున్న వాడిలా వున్నాడు. ఆమె అతని తల్లి కాబోలు అనారోగ్యంతో వున్నట్లుంది. అతను కాస్సేపు అటు యిటూ తచ్చాడి కిందికి దిగిపోయాడు.

బండి మరో రెండు మూడు నిముషాల్లో బయబ్టేరుతుందనగా అతను మళ్ళీ ఎక్కేడు. ఈ మారు అతని వెనుకే టి.టి.ఇ. ఉన్నాడు. ఆయనతో తన పరిస్థితిని వివరిస్తున్నాడు. టి.టి.ఇ చివరికి విసుగ్గా 'మిరు మిరూ ఎలాగో అడ్జస్ట్‌ అయితే నాదేం లేదు- అన్నట్లు ఏదో అంటున్నాడు. చేతిలోని ఛార్జు చూపిస్తున్నాడు.

ఇతగాడి ముఖంలో ఆందోళన - కిటికీ ప్రక్క సైడ్‌ బెర్తులో కూర్చున్న అబ్బాయితో ఏదో మాట్లాడేడు. ఆ అబ్బాయి అయిష్టంగా ఏదో జవాబు చెప్పేసి తను చదువుతున్న పుస్తకంలో లీనమయ్యేడు.

అతగాని పరిస్థితి నాకు లీలగా అర్ధమైంది - ఆ ముసలామె కూర్చోడానికి కూడా యిబ్బంది పడుతోంది - అతనిని పిల్చి సంగతేమిటని అడిగేను. అతను చాలా ఆత్రంగా నా దగ్గరకు వచ్చి తన పరిస్థితి వివరించేడు - నేనూహించిందే! ముసలామె అతని తల్లి - ఎవరింటికో పెళ్ళికని వచ్చి యిక్కడ జబ్బు పడిందని - ఫ్లయిట్‌ టికెట్స్‌ దొరకలేదట. రైల్లో కూడా వెయిట్‌ లిస్ట్‌ ఒకటి, రెండు రావటం వల్ల కనఫర్మ్‌ అయిపోతాయన్న ఉద్దేశంతో తీసుకున్నారట - కానీ బయళ్టేరే వేళకి ఒక టిక్కెట్టే కనఫర్మ్‌ అయిందట. ముసలామెకు తోడుగా యీయనగారు వుండితీరాలట. “ఎంత దాకా వెళ్తున్నారని అడిగేను. చెప్పాడు. టిటిఇ సెకెండ్‌ క్లాస్‌ స్టీపర్లో అడ్జెస్ట్‌ చేస్తానన్న సంగతీ చెప్పేడు.

“సరే. నేనూ అందాకే వెళ్తున్నాను - మీరు టిటియికి చెప్పి నా సీట్లో కూర్చోండి. ఆయన మీకిస్తానన్న సెకెండ్‌ క్లాస్‌ స్లీపర్‌ బెర్తీలో నేను అడ్జస్ట్‌ అవుతాను” అన్నాను - ఆ మాటకు అతను నా వంక చూసిన చూపు మర్చిపోలేను.

“మోకు ఇబ్బంది కలిగిస్తున్నాను. మా మదర్‌ అనారోగ్యం కారణంగానే లేకపోతే...” _ అంటూ ఏదో అనబోయేడు.

“ఫర్వాలేదు - నాకు సెకెండ్‌ క్లాస్‌లో ప్రయాణం చేయడం అలవాటే - ఇది మా కంపెనీ వారు కల్పిస్తున్న సదుపాయం - అంతే. మీరేం వర్రీ కాకండి” అన్నాను - అతను నా రెండు చేతులూ పట్టేసుకున్నాడు.

“క మండు వేసవిలో ఎవరూ యింతటి సహాయం చేయరు - ఇది త్యాగమే” అన్నాడు. అతడు ట్రావెలింగ్‌ టికెట్‌ ఎక్టామినర్‌తో మాట్లాడేక నేను నా బేగ్‌ తీసుకుని లేచాను -

అతగాడు సెకెండ్‌ క్లాస్‌ స్లీపర్‌ కోచ్‌ వరకూ నాతో వచ్చి “ఏ స్టేషన్‌లోనైనా రావల్సిన కోటా రాకపోతే తప్పకుండా బెర్త్‌ యిస్తానని మాట యిచ్చేరు టిటియి” అంటూ జేబులోంచి తన విజిటింగ్‌ కార్ట్‌ తీసి యిచ్చి వెనుదిరిగేడతను - బండి కదిలింది. 22౭2222222 శట్లలించ తట కై

(ప్రి వ

ఒక్కసారి స్వర్గంలోంచి నరకంలోకి పడ్డట్టయింది నా స్థితి - వేడిగాలి కిటికీలోంచి భరించలేనంతగా తగుల్తోంది. రాత్రి తొమ్మిది దాటేక చల్లగాలి కాస్త తగిలింది - కంపార్టు మెంట్లోని వారంతా టిఫిన్లో, భోజనాలో చేసేసి, వారి వారి బెర్లుల్లో సెటిలయ్యారు - ప్రయాణాల్లో నాకు నిద్ర పట్టదు - శ్రీమతి కట్టియిచ్చిన టిఫినూ, పళ్ళూ తిని, బెర్తు మీద నడుం వాల్చ్బబోతూ అతనిచ్చిన కార్డు చూసేను.

అంతే! ఒక్కసారి వెదకబోయిన తీగేదో కాలికి చుట్టుకున్నట్లయింది.

అంధకార మార్గంలోంచి రేపటి ఉషస్సు వైపు రైలు పరుగులు పెడుతోంది.

04

“ఖుదా నీవే అదే వీలువు...ఖుదా నీదే సదా గెలువు.

లోకలోకములు నిండి...నాలోన నిండి...లోలోన నుండి... అదే.... అదే...”...

పాట వింటున్న నాకు తలుపు తీసిన చప్పుడైతే అటు వంక చూశాను - పద్మలత!

“ఈ కొత్త పాట ఎక్కడిదంకుల్‌. ఎంత బాగుందో... చదువుకుంటున్న నన్ను మీ యింట్లోకి లాక్కొచ్చింది” అంటోంది పద్మలత.

“క్షాత్త పాట కాదు - నీ అంత పాత పాట” అంటూ టేప్‌ వాల్యూమ్‌ తగ్గించి, “పాటలంటే యిష్టపడేదానివీ, లలిత సంగీతం పాొదేదానివీ నీకీ పాట రాసిందెవరో తెలిసుండాలే” అన్నాను.

పద్మలత ముఖంలోని ఉత్సాహమంతా చప్పున చల్లబడిపోయింది. “ఏవో నేను విన్న పాటల్లో మంచివి పోగుచేసుకుని పాడ్డమే గాని నిజంగా గొప్ప గొప్ప రచయితల మంచి మంచి పాటలు మాలాంటి వాళ్ళకెలా దొరుకుతా యంకుల్‌. మీరంటే రైటర్స్‌ కాబట్టి...

“ఆపాపు. రైటర్సు మంచి సాహిత్యాన్ని తెల్సుకొని చదివినట్లే గాయనీ గాయకులు కూడా మంచి పాటల్ని కలెక్టు చేసుకోవాలి - కేసట్ల రూపంలో దొరకని వాటిని కూడా సంపాదించి- పుస్తకాల్లో రాసుకోవాలి - అవి రాసుకునే వారి కోసం కాదు - పాడుకొనే వారి కోసం, యిష్టంగా వినేవారి కోసం. బెనా?” అన్నాను.

బెనన్నట్లు తలూపింది పద్మలత. పద్మలత మంచి గాయని. డిగ్రీ చదువుతోంది. ఏ పాటైనా ఆమె గొంతులో అలవోకగా ప్రాణం పోసుకుని శ్రావ్యంగా తయారౌతుంది - దానికితోడు శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటోంది. ఆ అమ్మాయి తండ్రి ఒక (పైవేటు కంపెనీలో అక్కౌంటెంటు. మా ఇంటి పక్క వాటాలోనే అద్దెకుంటున్నారు -

“నీకో చిన్న హింట్‌ యిస్తున్నాను - ఈ పాట రాసినది నీకు తెల్సిన రచయితే. భావ కవిత్వంలో అందెవేసిన చెయ్యి. సినిమా పాటలు కూదా చాలా రాసేరు. ఆయన రాసిన పాటొకటి నువ్వు పాడగా నేను విన్నాను కూడా” అన్నాను.

పద్మలత కాస్సేపు ఆలోచనలో పడింది.

“మామిడి చెట్టును అల్లుకొన్నదీ... మాధవీ లతొకటీ... ఆ పాటేనా? ఆ పాట రాసింది... ఎవరంటే...బఐసవరాజు అప్పారావుగారు జెనా” అంది.

“అంత కరెక్టుగా ఎలా చెప్పావ్‌” అడిగాను.

“ఎలా అంటే... ఎప్పుడో మిరే చెప్పారు కాబట్టి” అంది నవ్వుతూ.

౩ థరరని- 2001 2222౭౭

ర

“గుడ్‌. అలా గుర్తుంచుకోవాలి. మంచి పాట విన్నవెంటనే ఆ పాట రాసిందెవరో

ముందు తెల్సుకోవాలి - ఆ తర్వాతే పాడిన వారూ, సంగీతం కూర్చిన వారూ...ఓకేనా?

అయితే నువ్వు విన్న యీ పాట రాసింది మాత్రం నువ్వు చెప్పిన ఆయన కాదు - మరో

హింట్‌ కూడా యిస్తాను. ఈ పాట రాసింది కూడా ఆయనే. జగ్రత్తగా విను” అంటూ టేప్‌ రికార్టర్‌లోని టేపు ముందుకు నడిపి వాల్యూం పెంచి మరో పాట వినిపించేను.

“రందవమ్నూ వాంసలు,. రామ చిలుకలూ

వపందగకి మా యిల్లు వచ్చతోరణం

ఆ వహాంసలెవరో... ఆ చిలక లెవరో....

వాంసలే మా యింటి ఆదబిద్దలు

బిలకలే మా యింటి చిట్టి కోదళ్ళు....”

పద్మలత ముఖం గంభీరంగా మారిపోయింది.

“అంకుల్‌ నాకివాళ క్విజ్‌ పోటీ పెట్టేస్తున్నారు - తెల్సుకోకపోడం నా తప్పే. ప్లీజ్‌ మిరే చెప్పండంకుల్‌ొ అంది బతిమాలే ధోరణిలో.

“మహూదయంలో మంచి ముహూర్తంలో చెబుతాను" అన్నాను నవ్వుతూ.

“ఆం తెల్సిపోయింది. ఆ పాట రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు. అవునా?” అంటూ ముఖంలో ఆనందం నింపుకుని నవ్వింది. నేనూ నవ్వి వూరుకున్నాను.

“నేనిప్పుడు లలిత భక్తి గీతాల్ని సేకరిస్తున్నానంకుల్‌. ఆయన రాసిన భక్తి గీతాలేమైనా మీ దగ్గర వున్నాయా?” అడిగింది.

“వూజింతునా నిన్ను భూషింతునా

ఆశా (ప్రనూనములు వోరంబుగా (గుచ్చి

నీదు గళమున వైచి నెన్మదిని భక్తితో......” ం

  • అంటూ నెమ్మదిగా కూనిరాగంతో ఆలపించి, *ఈ పాట నా దగ్గర లేదుగానీ ఎప్పుడో ఆకాశవాణిలో విన్నది - అప్పట్లో పుస్తకంలో రాసుకున్నాను కాబట్టి అలా గుర్తుండి పోయింది. మళ్ళీ వినలేదు” అన్నాను.

“మళ్ళీ ఆకాశవాణి వార్ని వినిపించమని కోరితేనో?” అంది.

“మీలాంటి వారే కోరాలి-కోరి వేయించుకుని వినాలి-మరుగున పడిపోతున్న అటువంటి పాటల్ని రేడియో వారే మో తరానికి అందివ్వగలరు” అన్నాను.

పద్మలత ఒక్క క్షణం అలా ఆలోచనలో వుండిపోయింది.

“అన్నట్టు అంకుల్‌. నేను నిన్నట్నించి అడగాలనుకుంటూ మరిచిపోతున్నాను. మికు పరమహంసగార్ని తెల్సా” అడిగింది వదో గుర్తుకొచ్చిన దానిలా.

“పరమహంస అంటే ఎవరూ అడిగేను.

“మో కులం వారే. రచయితల కులం. మిరు కథలు రాస్తే ఆయన పాటలు రాస్తారు. అంతే తేడా. మరేం లేదంకుల్‌, ఆయనవి ఈ మధ్య రెండు ఆడియో కేసెట్లు మార్కెట్లో రిలీజ్‌ అయ్యాయి. ఒకటి పూర్తిగా భక్తి గీతాలు, మరొకటి కమర్షియల్‌ పాటలూ” అంది- =222222222222222222ఒ2ఓ2€€€్ష్ష్షేేేేేేెస్ట్ష్ష్హ్ష్హ్‌ూూు -

ఆమె చెప్పేదేమిటో చూచాయిగా అర్ధమైంది. పద్మలత రేడియోలోనూ, బయట సభలలోనూ చిన్న చిన్న సంగీత కచ్చేరీ లిస్తుంది - అంతే యిష్టంతో స్ఫూర్తితో యితర పాటల్నీ పాడుతుంది

  • ప్రైవేటు టీవీ ఛానెళ్ళలో సినీ, లలిత గీకాల పోటీల్లో పాల్గొని బహుమతులూ అందుకుంది-

ప్రస్తుతం ఆ అమ్మాయికున్న ఒక్కగా నొక్క కోరికా - తను పాడగా కొన్ని భక్తి గీతాలను ఒక కేసెట్‌గా తీసుకురావాలని. అలా తను నలుగురికీ పరిచయమై మంచి పేరు తెచ్చుకోవాలనీ

  • కేసెట్లు వేయించడం - లాభనష్టాలూ - ఆ ఫీల్టే వేరు. అంచేతే ఆమె గానాన్ని మెచ్చుకున్న వారు కూడ అమెకీ విషయంలో ఎటువంటి సహాయమూ చేయలేకపోతున్నారు - ఆమె కోరిక కోరికగానే మిగిలిపోయే పరిస్థితి కన్చిస్తున్నా తన ప్రయత్నం కూడా ఆమె కొనసాగిస్తూనే వుంది. సినీమా పాటల కేసెట్టు కాక మార్కెట్లోకి ఏ ప్రైవేట్‌ కేసెట్‌, ఆల్బమ్‌ వచ్చినా వాటి వివరాలు తెల్సుకుంటుంది. వాటిని వినడానికి ప్రయత్నిస్తుంది - తనకు బాగా నచ్చినవి కొనుక్కుంటుంది. వీలైతే అలా తన పాటలతో కేసెట్టు తీసుకురావాలని తపన పడుతుంది.

“అంటే...పరమహంసగారు రాసిన పాటలతో రెండు కేసెట్లు బజార్లోకి వచ్చేయంటావ్‌ొ అన్నాను ఆమె చెప్పింది విని - ం

“అవునంకుల్‌ - పైగా వాటిని ప్రొడ్యూస్‌ చేసింది కూదా మన వూరికి చెందిన వారే - మోరూ రచయితే కాబట్టి పరమహంసగారిని అడిగితే...”

“ఇందులో తెల్సుకోవాల్సింది ఏముందీ?...... డబ్బులున్న ప్రొద్యూసరు ఆయన చేత పాటలు రాయించుకుని ఏ పేరున్న సినీ గాయకులచేతో పాడించి మద్రాసులో రికార్డు చేయించి వుంటారు - డబ్బుందాలిగానీ కేసెట్‌ మార్కెట్లోకి రావడం ఎంతసేపూ” అన్నాను.

పద్మలత ఒక్క క్షణం మౌనంగా వుండిపోయి తర్వాత నెమ్మదిగా అంది -

“అదికాదంకుల్‌. ప్రాడ్యూసరు డబ్బున్నాయనే కావొచ్చుగానీ పాడింది మాత్రం సినీ గాయకులు కాదు. లోకల్‌ ఆర్టిస్టులే. పైగా పాటల రచయిత కూడ మోక్కూడ తెలియని ఒక కొత్తాయనే గదా. అంచేత కేసెట్‌ తయారీకి ఎంతయిందో కనుక్కుంటే....”

పద్మలత కోరిక ఎంత గాఢమైందో అర్ధమైంది.

కేసెట్‌ మోదున్న వివరాల నాధారంగా పరమహంస ఫోన్‌ నెంబరు దొరికే సర్మి వారం రోజులు పట్టింది - ఒకరోజు రాత్రి ఆయనకు ఫోన్‌ చేసి నా పూర్తి పేరు, వివరం చెస్పేసర్కి “మిరా గురువుగారూ, మిమ్మల్ని తెలియకేం. కథలూ, నాటకాలూ రాస్తుంటారుగా. మిమ్మల్ని సభల్లో చూడ్డమే కాని పరిచయం లేదు” అన్నాడు అతి వినయంగా.

“మీ కేసెట్లేవో రెండు మార్కెట్లో కొచ్చాయని తెల్సింది. నాక్కొాంత సమాచారం కావాలొ అంటూ అతను ఉత్సా హం చూపించిన తర్వాత నాక్కావలసిన వివరాలన్నీ అడిగేను. పద్మలత టాలెంట్‌ గురించీ, వారి ఆర్థిక పరిస్థితి గురించీ చూచాయగా చెప్పేను.

“వారు కేసెట్‌ స్వంతంగా వేసుకునేట్టయితే నేను తప్పకుండా గైడ్‌ చేయగలను సార్‌. మో అడ్రస్‌ చెబితే సాయంకాలం మి ఇంటి దగ్గర కలుస్తాను” అన్నాడతను. సాటి రచయితగా అతను నాకిచ్చిన గౌరవానికి ఆనందమనిపించింది.

అనుకున్నట్టే మర్నాడు సాయంకాలం అతను మాయింటి కొచ్చేడు. ఆ సమయంలో క:థూోూ-1ఓ౫౫ ౯222222222

పద్మలత అక్కడే వుంది. పరిచయాల తర్వాత విషయంలో కొచ్చాడు. ఒక ఆడియో కేసెట్టు మద్రాసులో రికార్డ్‌ చేయించాలంటే చాలా ఖర్చువుతుంది. అదే సినీ గాయకులచేత కళాకారుల చేత చేయించేట్టయితే లక్ష అవుతుందని చెబుతూ 'లోకల్‌ టాలెంట్‌ని ఉపయోగించుకోవాలను కున్నప్పుడు మన వూళ్ళోనూ ఒక స్టూడియో అన్ని హంగులతోనూ వుందనీ, అక్కడ రికార్డింగ్‌కు అక్కడి ఖర్చులో సగం చాలుననీ తేల్చేశాడు. పద్మలతగారే పాడాలనుకున్నపుడు సింగర్స్‌ ఇచ్చే పారితోషికం కూడా ఆ మేరకు తగ్గుతుందని కొసమెరుపు నిచ్చేడు.

ఆ క్షణంలో పద్మలత ముఖంలో ఓ ఆనందరేఖ, ఓ ఆశాకిరణం కలిసి కన్పించేయి నాకు.

“ఈ వూళ్ళో రికార్డింగ్‌ స్టూడియో పెట్టినతను నాకు చిన్ననాటి స్నేహితుడే. కొన్నాళ్ళు సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేసి మరీ వచ్చిన వాడు. కంపోజింగ్‌, రికార్డింగ్‌ స్టూడియో ఖర్చులు - అన్నిటి మోదా మిగతా వాళ్ళకంటె తక్కువగా అయ్యేట్టు చూడగలను - అదీ మో మీద నాకున్న గౌరవం కొద్దీ....” అన్నాదు.

అన్నీ బాగానే వున్నాయి కాని ఆ చివరి మాటే నా కెందుకో బాగా అన్పించలేదు. అతనికీ, నాకూ ఉన్న పరిచయం ఏపాటిదని?

“నాంతంగా రికార్దింగ్‌ వరకూ చెప్పారు. మరి ఆపై మార్కెటింగ్‌ విషయమో...” అన్నాను.

“ఆ విషయం నాకొదిలేయండి. మాస్టర్‌ కేసెట్‌ మన చేతికొచ్చాక దాని డిస్ట్రిబ్యూషన్‌ ఎంతసేపు? ఒక మంచి డిట్టిబ్యూటర్ని చూసి అమ్మేశామంటే రెండు నెలల్లోగా మన ప్రాడక్టు బజార్లో వుంటుంది. లాభం అట్టే రాకపోయినా నష్టం రాదు. నాకున్న అనుభవంతో చెబు తున్నారు. ఇప్పటికి నావి ఐదు కేసెట్లు వచ్చేయి. ఆలోచించుకోండి” అంటూ సమస్యను తీర్చేసిన వాడిలా వెళ్ళిపోయాడు. _

కానీ సమస్య ఆ రోజు నుండే మొదలయిందని పద్మలత గాని, నేను గాని గుర్తించలేదు.

“ఏమైనా యిది మనకు పరిచయం లేని ఫీల్డు, మనం పెట్టిన సొమ్ము మన చేతికొచ్చేవరకూ టెన్షన్‌ వుంటుంది. ఇదొక ఎత్తయితే కేసెట్‌ మార్కెట్లో విడుదలై నలుగురి మన్ననలనూ పొందడం మరో ఎత్తు. మీ నాన్నగారితో ఆలోచించు” అన్నాను పద్మలతతో.

నేనూహించినట్టుగానే పద్మలత తండ్రిని ఒప్పించింది. ఆయన కొంత, ఈమె సేవింగ్స్‌ కొంత - మొత్తానికి ఎలాగైతేనేం ఒక కేసెట్‌కి సరిపడా పాటలు - పద్మలత పాడేందుకూ అందుకయ్యే ఖర్చు భరించేందుకు సిద్ధమయ్యారు. మరోమారు పరమహంసను పిలిచి ఆయనతోనే అన్ని విషయాలూ వారు ముఖాముఖిగా చర్చించేందుకు ఏర్పాటు చేశాను.

“పాటల ఎంపిక విషయం మీరు చూసుకోండి. వాటికి సంగీతం కూర్చి మంచి వాయిద్యా లతో మాస్టర్‌ కేసెట్‌ రికార్డింగ్‌ చేయించి యిచ్చేట్టు నేను మాట్లాడతాను. ఆర్థిక విషయాలు మోరూ మిరూ మాట్లాడుకోండి” అన్నాడు పరమహంస.

“మార్కెటింగ్‌ విషయం కూడా మిరే చూడాలి. ఆ ప్రయత్నం లేకపోతే యివన్నీ వృధాయే” అన్నాను నేను కల్పించుకుని.

“ఆ విషయం నాకొదిలేయండి” అన్నాడతడు ధైర్యంగా. 22222222 5౮00-2ఏ5ఎక్ష్‌

[్రి లా

రామదాసు, అన్నమయ్య కీర్తనలతో పాటు మరికొన్ని లలిత భక్తి పాటలను కూడా ఎంచుకుంది పద్మలక, కేసెట్‌ కోసం మొదటి పాట రిహార్సల్‌ మొదలు పెట్టేరోజు, 'మిరూ రండి అంకుల్‌ో అని పద్మలత పిలిస్తే కాదనలేకపోయాను. స్టూడియో చిన్నదే అయినా ఎ.సి. చేయబడి వుంది. ఎలక్ష్రానిక్‌ వాద్యాలన్నీ విదేశాల నించి తెప్పించానని చెప్పాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ వినయ్‌. పద్మలత కిష్టమైన రాగాల్లోనే తన ప్రతిభను కూడా మేళవించి ఎనిమిది పాటలకూ చక్కని బాణీలను కూర్చేడాయన. తొలిపాట రికార్డింగ్‌ నాడు సగం సొమ్ము అడ్వాన్సు గానూ, మాస్టర్‌ కేసెట్‌ యిచ్చేనాడు మిగతా సొమ్మునూ వినయ్‌కి యిప్పించాడు పరమహంస. ఉన్నంతలో కేసెట్‌ బాగానే వచ్చిందని సంతృప్తి వ్యక్తపరచింది పద్మలత.

మాస్టర్‌ కేసెట్‌ చేతికొచ్చిన రెండ్రోజుల తర్వాత పరమహంసకి ఫోన్‌ చేసి, “కేసేట్‌ను మార్కెట్లోకి పంపే బాధ్యత మీదే మరి” అన్నాను. దానికాయన -

“నేనా విషయం అప్పుడే ఆలోచించే వుంచేను. తెల్సిన కేసెట్‌ కంపెనీలు నాలుగైదు వున్నాయి. వాళ్ళతో తప్పకుండా మాట్లాడతాను. కాసెట్‌ రికార్డింగ్‌ బాగుంది కాబట్టీ ఎవరో ఒకరు కొంటారు. లాభాలు రాకపోయినా నష్టం మాత్రం రాదు. నేను సెలవు చూసుకుని హైద్రాబాద్‌ వెళ్ళాలి. వెళ్తే పని అయిపోయినట్టే - * అన్నాడు - అలా ఓ నెల్లాళ్ళు కాలయాపన చేశాడు. రాన్రాను అతను ఫోన్లో దొరకడమే గగనమయ్యేది. దొరికిన్నాడు “ఇదిగో వచ్చే వారం వెళ్తున్నాను అనేవాడు - అలా మరో నెల గడిచిపోయింది.

“వోనీ ఆయన హైదరాబాద్‌ ఖర్చులేవో ముందుగానే యిచ్చేద్దాం. ఆ పనేదో చేసిపెట్ట మనండి” అన్నారు పద్మలత తండ్రి.

స్టార్టింగ్‌ ట్రబులెక్కడో అప్పుడు తెలిసొచ్చింది నాకు. అలా ఖర్చుల కోసం డబ్బునూ, కంపెనీ వాళ్ళకి విన్పించడానికి మాస్టర్‌ కేసెట్‌ కాపీని తీనుకువెళ్ళినాయన పది రోజుల వరకూ వత్తాలేడు. ఫోను చేస్తే *కేసెట్‌ యివ్వడం జరిగింది. త్వరలో మికే తెలియ జేస్తామన్నారు” అని తప్పుకున్నాడు -

పరమహంస చెప్పినవన్నీ కల్లబొల్లి కబుర్లే అని తెలిసేసర్కి నాలుగు నెలల కాలం గతించి పోయింది - కేవలం రికార్టింగ్‌ స్టూడియో వారిచ్చే రెండు వేల రూపాయల కమిషన్‌ కోసం అతనలా చేశాడని తెల్సి ఆశ్చర్యపోయాం. సుమారు పాతిక వేలు ఖర్చుచేసి తయారు చేసిన కేసెట్‌ విడుదల కాక అలా వుండి పోయింది.

4 చ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కాబోలు అతనొచ్చి థర్డ్‌ ఎ.సిలో బెర్తు దొరికిందని తీసుకువెళ్ళేడు. అతని పేరు భరద్వాజ! చేసిన సాయానికి ఎన్నో రకాలుగా థాంక్సు చెప్పాడు. ఉదయం సికిందరాబాద్‌ స్టేషన్లో కంపార్ట్‌మెంట్‌ చాలా భాగం ఖాళీ అయిపోయింది. బ్రష్‌ చేసుకుని కాఫీ తాగి కూర్చున్నాను. నేను హైద్రాబాద్‌ లో దిగాలి. రైలు నత్తనడకలా నడవడం మొదలు పెట్టింది. ఈలోగా భరద్వాజ్స్‌ నా దగ్గర కొచ్చాడు. అతనూ హైదరాబాద్‌లోనే దిగాలట - “స్టేషన్‌కి కారు వస్తుంది. మీరెళ్ళడికి వెళ్ళాలో చెబితే డ్రాప్‌ చేయిస్తాను” అన్నాదు, “అక్ష్మళ్లేదు. అక్కడికి మా కంపెనీ గెస్ట్‌హౌస్‌ దగ్గరే. ఎలాగో వెళ్తానులెండి” అన్నాను - క భంరు- 20+ 1౬1122౬2౬2

“వోనీ మిరు వెళ్ళేముందు ఫోన్‌ చేసి ఓమారు మా షాపుకి రండి” అన్నాడతను. వచ్చిన అవకాశాన్ని జారవిడుచు కోకూడదనిపించింది.

“మోది కేసెట్‌ కంపెనీయా” అడిగేను.

అవునన్నాడతను.

“కమర్నియల్‌ కేసెట్స్‌తో పాటు ప్రైవేట్‌ కేసెట్లు కూడా రిలీజ్‌ చేస్తుంటారా?”

“అప్పుడప్పుడు. జనాలకి సంగీతాన్ని కూడా యివ్వాలి కదండీ” - నవ్వేశాడు.

“అయితే మి వల్ల నాకో చిన్నపని అవుతుందేమో అడగొచ్చా? నిజానికి యా సమయంలో అడగడం సబబుగా వుండదేమో” అన్నాను కాస్త మొహమాటంగా.

“మోరలా ఏం అనుకోవద్దు. చెప్పండి. నేను చేయగలిగిందయితే చేస్తాను. లేదా తెలిస్తే పనయ్యే మార్గమన్నా చెబుతాను” అన్నాడు. ఆ మాటల్లో నిజాయితీ ఆ చల్లని ఉషోదయ వేళ విరిసీ విరియని వెలుగులా పరచుకుంది.

“ఒక బెత్సాహ గాయని పాడిన భక్తి గీతాల కేసెట్టు ఒక అవకాశవాది చర్య వల్ల మార్కెట్లోకి రాకుండా వుండి పోయింది. దానికి మారేమైనా మార్గం చూపుతారేమోననీ” అంటూ జరిగింది జరిగినట్టూ చెప్పాను. అతను ఆశ్చర్యంగా అంతా విన్నాడు.

“కళాకారులు వేరు - వ్యాపారస్తులు వేరు. వీరిద్దరి మధ్యా కొన్ని పరాన్న భక్కు లుంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి అని, “అతని పేరేమిటన్నారూ” అడిగేడు. చెప్పేను. అతను ఒక్క క్షణం ఆలోచించి, “ఆ కేసెట్‌ యిప్పుడు మి దగ్గరుందా” అడిగాడు. “ఉంది” అంటూ బయబచ్టేరే టప్పుడు వీలైతే ఎంక్వైరీ చేయ్యొచ్చునన్న ఉద్దేశంతో పద్మలత దగ్గర తీసుకున్న కేసెట్‌ కాపీ బ్రీఫ్‌లోంచి తీసి యిచ్చేను.

“విని చెప్పండి. నేనింకా రెండు రోజులుంటాను. ఈలోగా మిమ్మల్ని కాంటాక్ట్‌ చేస్తానూ” అన్నాను.

“తప్పకుండా. వీలైతే యీ రాత్రే చెయ్యండి. చెప్తాను” అన్నాడు లేచి వెళ్తూ.

ఆ రాత్రి ఆయన చెప్పిందాని ప్రకారం సగం ఆశతోనే మర్నాడు వారి కంపెనీకి వెళ్ళేను

  • ఒక అపార్జుమెంట్లోని ఒక ఫ్లోరంతా వాళ్ళ కంపెనీ ఆఫీసే. పెద్ద ఎ.సి. రూంలో అర్ధచంద్రాకారపు టేబిల్‌కి అటువైపు కూర్చున్న అతను నన్ను చూడగానే, “రండి” అంటూ నవ్వుతూ పలకరించి కుర్చీ చూపించేడు.

“మీ అమ్మగారికెలా వుంది” అడిగాను, చల్లని ఆ వాతావరణంలో హాయిని పొందుతూ.

“నిన్న డాక్టరుగారాచ్చి చూశారు. ఫర్వాలేదు” అంటూ బెల్‌ నొక్కారు. బోయ్‌వచ్చి ఫ్లాన్క్‌లోని కాఫీ రెండు కప్పుల్లో పోసి బల్ల మీద పెట్టేడు.

“ప్రీస్నోండి” అని, “మి ఆఫీస్‌ పని ఎంతవరకూ వచ్చిందొ అడిగేడు.

కాఫీ తాగుతున్నంతసేపూ ఏవోవో మాటలు దొర్లాయి.

ఈలోగా ఇంటర్‌కమ్‌ మోగితే తీసి, “వచ్చేరా. పంపించు” అంటూ పెట్టేశాడు.

లోపలికొచ్చి ఆయనకు నమస్కరించి నా పక్కన కూర్చున్న వ్యక్తి నన్ను చూసి ఒక్కమారు షాకయ్యాడు. కథల్లో, సినిమాల్లో జరిగినట్టుంది ఆ సంఘటన. అతని ఉలికిపాటును గమనించని 222222

వాడిలా 'హలో” అన్నాను. అతను పరమహంస!

“మాకు వీరు తెల్సా” అడిగేడు భరద్వాజ ఏమీ తెలియని వాడిలా.

“తెలియకేం. గతంలో మా ఫ్రెండ్‌ డాటర్‌ కేసెట్‌ ఒకటి తయారు చేయించారీయన, కొన్ని కారణాలవల్ల అది వెలుగు చూడలేదనుకోండి” అన్నాను ధైర్యంగా.

పరమహంస ముఖం కళ తప్పింది. ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చున్నాడు.

ఇదేదీ గమనించనట్టు భరద్వాజ ఇంటర్‌కమ్‌లో ఎవర్నో పిలిచి, “క్రితం నెల పరమ హంసగారిచ్చిన రెండు కేసెట్లూ తీసుకురండి” అన్నాడు.

బోయ్‌ వాటిని తెచ్చి టేబిల్‌ మీద పెట్టాడు.

“వీటి నెలాగైనా వచ్చే నెలలో రిలీజ్‌ చేయించండి సార్‌” అన్నాడు పరమహంస తేరుకొని.

భరద్వాజ అదోలా నవ్వేడు.

“అనుకోకుండా మూడు పిక్చర్స్‌ వచ్చాయి. అంచేత మరో నాలుగు నెలల వరకు మీవి తీసుకోవడం వీలుకాకపోవచ్చు. అందాకా యివి మి దగ్గరే వుంచండి. మరోలా రిలీజ్‌ చేసినా సంతోషమే” అంటూ కేసెట్లను అతని కందిం చాడు.

“పైంన్స్‌ వీ దగ్గరే వుంచి...” ఏదో అనబోయాడు పరమహంస.

  • “ఒద్దులెండి. తీసుకెళ్ళండి. తర్వాత చూద్దాం” అంటూ నా వైపు తిరిగాడు భరద్వాజ ఒక్కక్షణం మౌనం వహించి లేచి కేసెట్లను తీసుకుని వెళ్ళిపోయాడు పరమహంస. పరీక్ష రాసి రిజల్టు కోసం ఎదురు చూసే విద్యార్థి మనసులా వుంది నా మనసు ఆ

క్షణాన. కాస్సేపున్న మౌనాన్ని ఛేదిస్తూ, “విన్నానండీ - పద్మలతగారి గొంతు విలక్షణంగా వుంది - ఎంచుకున్న పాటల్లోనూ వైవిధ్యముంది. అయితే రికార్దింగ్‌ క్వాలిటీ మాత్రం...” అంటూ అగేడు.

ఆయన చెప్పబోయే దేమిటో చూచాయగా వూహించాను.

“వచ్చేనెల మా కంపెనీ బేనర్‌ మిద మూడు కేసెట్లను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. అందులో మోరిచ్చిందొకటి - అ(గ్రిమెంటు కాగితాల మిద సంతకాలు చేయించి పంపుదురు గాని” అన్నాడు.

నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.

తల్చుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే! ఒక చిన్న కోరిక-సాటి మనిషి మాట మీదున్న నమ్మికకు బలైపోతే - ఒక్క చిన్న సాయం - మనిషిలోని విలువల్ని పెంచి మరో మనిషికి సాయపడేలా చేసింది!

క

ఇది జరిగి అప్పుడే నాలుగేళ్ళయింది - ఈ నాలుగేళ్ళలోనూ పద్మలత అంచెలంచెలుగా ఎదిగింది - ఎం.ఎ. మ్యూజిక్‌లో గోల్డ్‌ మెడల్‌ తెచ్చుకుంది. కట్పకాన్మల కాసించకుండా కేవలం ఆమె సంగీతాన్నే యిష్టపడి చేసుకున్న భర్త దొరికాడు. కర్టాటక సంగీతం రెండు క ధాాంం-10+ 1౬11112ఓఒఓఒఓ2౬2£౬౯౯౯౯ెేేేే

కేసెట్లూ, లలిత జానపద గీతాలు రెండు కేసెట్లూ ఆమె పాడగా ప్రముఖ కేసెట్‌ కంపెనీలు తీసుకొచ్చాయి. నాలుగైదు సినిమాల్లో ఐదారు పాటలు పాడే అవకాశమొచ్చింది. కొత్తగా విడుదలై అన్ని రకాల (ప్రేక్షకుల ఆదరణ పొందిన ఓ హిట్‌ సినిమాలో ఒక చక్కని పాట పాడి మంచి పాప్యులారిటీని కూడా సంపాదించింది.

ఆ సందర్భాన్ని పురస్కరించుకుని న్ధానిక సాంస్కృతిక సంఘం వారామెకు ఉగాది పురస్కారాన్ని ప్రకటించి ఆమె పాడిన ఓ లలితగీతాల కేసెట్‌ని రిలీజ్‌ చేయబోతోంది!

“మీరీ సభకు తప్పకుండా రావాలంకుల్‌. వచ్చి ముందు వరుసలో కూర్చుని మా దంపతులు నన్నాశీర్వదించాలి” అని ఆహ్వాన పత్రం స్వయంగా తెచ్చి యిచ్చింది పద్మలత.

అంతకంటే ఆనందం ఏముంది? అందుకే వచ్చాను! ముందు వరసలో ఆమె తలిదండ్రుల, భర్త పక్కన పద్మలతకు' నిలువెత్తు గులాబీల దండ వేసి సత్కరించారు - వివిధ రంగాల్లోని పెద్దలామె సంగీతాన్ని వేనోళ్ళ పొగిడారు. అటువంటి కళాకారిణి మన వూరి ఆడపడుచు కావడం గర్వించదగ్గ విషయమన్నారు - ఆమె పాడిన కొత్త కేసెట్‌ను విడుదల చేశారు.

సత్మారమయ్యాక ఆమె తన అనుభూతిని నలుగురితోనూ పంచుకునేందుకు మైకు ముందుకొచ్చింది. తనకు తెల్సిన చిన్నపిల్ల పద్మలత ఎంతగా ఎదిగిందీ!

“అందరికీ నమస్మారం. నాకు జన్మనీ, సంస్కారాన్నీ నలుగురూ మెచ్చే స్వరాన్నీ యిచ్చిన నా తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటూ రెండు మాటలు చెప్పదల్బుకున్నాను - జీవితం ఒక ప్రయాణంలాంటి దంటారు పెద్దలు. ఈ ప్రయాణంలో ఎన్నో మంచిచెదులున్నాయి. ఎన్నో ఒడిదుడుకులుంటాయి: నిలదొక్కుకుని నిలిస్తేనే గమ్యం. ఆ గమ్యాన్ని చేరటంతో ఏ చిన్ని సాయమైనా అపురూపమే - నా యీ ఉన్నతికి కారకులైన ఒక మహోన్నత వ్యక్తిని యీ ఆనంద సమయంలో నేను మికు పరిచయం చేయాలనుకుంటున్నాను - అంతే కాదు. హృదయపూర్వకంగా పుష్పమాలతో సత్మరించాలనుకుంటూన్నాను. వారిక్కడే యీ సభలోనే వున్నారు. పూజ్యులు ............... పిత్రు సమానులు... శ్రీంంంంంంంంంంటంంంంంంలంంలా

పద్మలత నోటి వెంట నా పేరు! నా చెవులను నేనే నమ్మలేక పోయాను. నేనేం చేశానని! మనసులో ఉద్విగ్నం ఒక వంక, గుండె పొరల్ని చీల్చుకుంటూ ఆనందం మరొక, వంకా...

“దయచేసి వేదిక మిదికి రావాలి” - ఆమె నా వంక చూస్తూ చేసిన అభ్యర్థనకు కార్యకర్తలు నా దగ్గరకు వచ్చారు. తప్పనిసరి పరిస్టితి. లేచి అడుగులు ముందుకు వేశాను. వెనుక ప్రేక్షకుల చప్పట్ల హోరు ....వేదిక మెట్లు ఒక్కొక్కటే ఎక్కుతుంటే పద్మలత పాడిన కొత్త కేసెట్లోంచి గీతం ....ఎంతో మధురంగా....

=... మనిషిలోనె వున్నాయి మణులూ మాణిక్కాలు

తీగలోనే దాగున్నాయి నడిచేయని రాగాలు

స్నేవోలకు చేతులు చాచే వృదయాలకు సిరులున్నాయి

గగనంలో తారకలల్లే వెలుగు నవ్వులొలికిస్తాయి....

అ జతడడడడడడడడడఊ22222222222ట్ట్‌్ట్‌ు క్ష

అ గంధం యాళ్ఞ్థరల్యాశర్మ

జిల్ల జడ్జి “భార్గవి లంచ్‌ ్రేక్‌లో బెంచి దిగి తన చాంబర్సులోకి వచ్చి అలా కుర్చీలో కూర్చోగానే "స్టెనో ఆనాటి టపాను ఆయన ముందుంచాడు. అందులో పైనే చిరంజీవి వి, భార్గవ, జిల్లా జడ్జి, విశాఖపట్నం” అన్న కవరు కన్పించింది. ఆశ్చర్యంతో నొసలు ముడి

పడగా - 'ఏభయి ఏళ్ళ తనకు చిరంజీవి భార్గవి అని వ్రాసిందెవడై వుంటారా అనుకొంటూ

తెరిచాడా కవరును.

చిరంజీవి భార్గవను ఆశీర్వదించి!

నేనెవరో నీకు తెలియదు కదూ.... నా పేరు “అహల్య... నీకు పెద్దమ్మను. ఈ బంధుత్వాన్ని నీవు అంగీకరిస్తావనే నమ్మకంతోనే, నీ పెద్దమ్మను అంటున్నాను. మీ నాన్నగారున్నారే, 'వెంకటశివుడు” గారు, ఆయనగారి మొదటి భార్యను నేను. అయితే మా [ల స డెడ్‌

పెళ్ళైన కొద్దికాలానికే నేను మీ నాన్నగారి నుండి దూరంగా జరిగి వెళ్ళిపోయాను.

ఏవనాటిదీ ఉదంతం....ఏభయి అయిదేళ్ళనాటిక్రింద మాట! కొంచెం వివరంగా వ్రాస్తున్నాను. ఈ వివరణ... మాలో ఎవరు దోషులు ఎవరు కారు అనే నిజ నిర్ధారణకో, నేర నిర్ధారణకో కాదు. ఆ “విడబడటం” ఎందుకో నీకు తెలియటానికి మాత్రమే. సుమీ!

మీ నాన్నగారు నా మేనత్తగారి కొడుకు. నేను ఆయనగారి మేనమామ కుమార్తెను.

మా నాన్నగారి కంటె అత్తయ్య... అంటే మీ నాన్నగారి తల్లి, రెందేళ్ళు చిన్నది. ఆమె గారిని 'కోనసీమ* ప్రాంతాన, ఒక శోత్రియ కుటుంబంలో యిచ్చారు. వేద విద్యలు నేర్చిన కుటుంబమది. అంత సంపన్నం కాకున్నా తరతరాలుగా స్మార్తం” వృత్తిగా జీవిస్తున్న ఆ కుటుంబానికి “తిన-కుడవి లోటులేదు. కాని, ఆమెగారు “వెంకటశివుడు” గారికి ఏడవ ఏటనే చనిపోయారు. నాకామె రూపు లీలా మాత్రంగా గుర్తు. తన చెల్లి అంటే మా నాన్నగారికి పంచప్రాణాలు. ఆమె మరణం ఆయన్ను ఎంతగా కృంగతీసిందో...!

చిన్ననాన మా నాన్నగారంతటి శ్రీమంతులు కాకున్నా 'లా” చదివి రాజమండ్రిలో (ప్రాక్టీసు చేసి బాగ ఆర్జించి ఆస్థిపాస్తులను కూడపెట్టారు.

నేను బి.ఎ. చదివాను. నాకు మొదటి నుండి స్వతంత్ర భావాలుండేవి. విద్యార్థిగానే “రుక్మిణి సమాజం అనే ఒక మహిళా మందలికి కార్యదర్శినిగా పనిచేసాను. ఈ దేశపు సగటు 'స్తీ ఎంతటి స్వాతంత్ర్య విహీనగా బ్రతుకుతోందో.... నిశ్శబ్దంగా ఎంతటి అరాచకా నికి, హింసకు గురి అవుతుందో నాకా వయసుకే అర్ధమయ్యేది.

మీ నాన్నగారు తన కుటుంబపు సంప్రదాయ విద్యనే చెప్పుకున్నారు. ఆ' కుటుంబపు - వృత్తి పరిధిలోనే వుండిపోయారు. నా చిన్నతనాన, మా మేనత్తగారు, అదే మీ నాన్నమ్మగారు... మా ఇంటికి వచ్చినపుడల్లా నన్ను తన ఒడిలోకి తీసికొని - “దీన్ని మా “వెంకటశివుడి"కిచ్చి నా కోదల్ని చేయరా. అన్నయ్యా!” అనేదట మా నాన్నగ్రారితో...., చెల్లెలి పట్ల వున్న (ప్రేమాను రాగాలతో, ఆమె మాట చెల్లించాలని మా నాన్నగారు నన్ను మీ నాన్నగారికిచ్చి పెండ్లి చేయాలని సంకల్పించారు. యూనివర్శిటీకెళ్ళి ఎం.ఏ. చేయాలను కొన్న నా ప్రయత్నాన్ని కాదని నా పెళ్ళి తలపెట్టారు నాన్న!

నాకంతగా ఇష్టంలేకపోయింది. విముఖత చూపాను.

'ఏం.... ఎందుకని" అని ప్రశ్నించారు నాన్ను

“ఆయనకు చదువు లేదు-' అన్నాను.

“వెంకటశివుడు... వేద, తర్మ మీమాంస, వాస్తు విద్యలలో దిట్ట. ఆ విద్యలతో పోల్చితే, నీ బి.ఎ..... ఒక విద్యే కాదు. ఇక ఆస్థి పాస్తులంటావా.... ఈ మన ఆస్తంతా మీది కాదా...” అంటూ పట్టుపట్టారు. "

ఏమయితేనేం.... మా పెండ్లి జరిగిపోయింది.

కాపురానికి వెళ్ళాను. కొద్ది రోజులలోనే నా స్వతంత్ర భావ ప్రవృత్తికి ఆ కుటుంబపు... “న ప్రీ స్వాతంత్ర్య మర్షత్రి” అనే ఛాందస భావాలకు పొంతన కుదరదని తేలిపోయింది.

మా మామగారు నాపై అంక్షలు విధించటం ప్రారంభించారు. మహిళా సమాజాలని, 22112222౭2 గాంచంమి క

ళు న. సమావేశాలని బయటకు వెళ్ళటం, విచక్షణ లేకుండా అందరితో కలిసి తిరగటం కూడదు... ఆడది నాల్గు గోడల మధ్యే తనను తాను నియంత్రించుకోవాలి అని శాసించారు. 'వెంకటళివుడి గారికి, తండ్రి మాట శిరోధార్యం. తండ్రి అభీష్టానికి భిన్నంగా ఆచరించటమే కాదు..... ఆలోచించటం కూడ తెలియదాయనకు. ఆ వాతావరణంలో గడపటం అసాధ్యమనిపించింది నాకు. అక్కడ వుండి ఘర్షణ పడటం అనవసరమనుకొన్నాను. తిరిగి 'రాజమండ్రి' వచ్చేసాను. నా చర్యను అమ్మ... నాన్న ఆమోదించలేదు. నీ కిక్కడ స్టానం లేదు, వెనక్కి వెళ్ళ అమ్మ సరే.... చదువుకొన్న నాన్న నన్ను అర్ధం చేసికోక అలా అనేసరికి.... తెల్లబటోయాను. తిరిగి వెళ్ళలేకపోయాను. నా వ్యక్తిత్వం పట్ల నాకున్న విశ్వాసంతో ..... బయట ప్రపంచం లోకి ఒంటరిగానే ప్రయాణమయ్యాను. అనాడు నా కళ్ళ ముందున్న “భూమిక నా వ్యక్తిగత భవిష్యత్తుకంటె నాటి మహిళాలోకపు దుస్తితి! . నా జాతి సాంస్కృతిక నాగరికతా మూలాలు మహోత్కృష్టమైనవే. మన ప్రాచీన మహిళ పురుషులకు సరిసాటిగా విద్యావతి, జ్ఞాననేత్రి కూడ! కాని కాలగతిలో వమయిందో.... ఏమో... నిజమైన మన సాంస్కృతిక, వారసత్వాన్ని మనం కోల్పోయాం.... సామాజిక శాస్త్రం దుర్వ్యాఖ్యలకు, అన్వయ లోపాలకు ఎర అయింది. మన మధ్య మనమే అర్దత్రానర్దతలను సృష్టించుకొన్నాం. వివక్షతలను పెంచి పోషించుకున్నాం. ఈ పరిణామ క్రమంలో నష్టపడి, నలిగిపోయిన వారు, బడుగు జీవులు, అన్ని వర్గాల ప్రీలూను! ఒక ప్రక్క పురుషాధిక్య సమాజం.... దాని అరాచక రూపం.... మరో ప్రక్క అవిద్య.... అస్వతంత్రత.... వీటికి తోడు సాంఘిక అసమానతలు, మూఢ విశ్వాసాలు - వీటి మధ్య నలిగిపోతున్న “స్తీ నిస్స హాయత! ఈ నేపధ్యమే నన్ను మహిళాభ్యుదయ సాధనోద్యమాలలో పాలుపంచుకోవటానికి పురికొల్పింది. అందుకు నన్ను నేను సమాయత్త పరచుకొని ఆ పోరాటాలలోకి దిగిపోయాను, చిత్రంగా నా ఉద్యమ కార్యస్థానం ఆంధ్రదేశం నుండి ఉత్తర భారతానికి మారిపోయింది. అఖిల భారత మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యురాలిగా, ఉప కార్యదర్శినిగా,... ముఖ్య కార్యదర్శినిగా, ఆపై అధ్యక్షురాలినిగా పలు బాధ్యతలు నిర్వహించాను. ఉద్యమాల నిర్వహణలో, ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో ఆందోళనలు,....., స్త్రీ విద్యావ్యాప్తికి విరామమెరుగని ప్రయత్నాలు, విధవా వివాహాలకై ప్రచారాలు.... స్త్రీలకు సమాన హక్కుల కోసం, ముఖ్యంగా ఆర్ధిక హక్కుల కోసం, సమాన వేతనాల కోసం, సామాజిక అంతరాల నిర్మూలనల కోసం, అసెంబ్లీల ముందు - పార్లమెంటు ముందు ధర్నాలు, నిరసన (వ్రతాలు, శాసనోల్లంఘనలు... లాఠీ దెబ్బలు, అరెస్టులు.... జైలు జీవితాలు.... ఇలా, ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు... ఆ ఉద్యమాల యానంలో ఒక వెనుతిరగని బాటసారిలా బాధ్యతాయుత భాగస్వామినిలా *... అలుపెరగని సారధిలా నా ఈ 'వఏభయి అయిదేళ్ళ జీవితం సాగిపోయింది. ఒక కై కథారాతిని - 2004 చైతన

వా 60 విధంగా చెప్పాలంటే కరిగిపోయిందేమో! ఇప్పుడొక్కసారి వెనక్కి తిరిగి చూచుకొని నేను సాధించిందేమిటి ..... కోల్పోయినదేమిటి

  • అని సింహావలోకనం చేసికొంటే..... ఈ దేశపు మహిళ అవిద్య నుండి... మూఢ విశ్వాసాల నుండి, పురుషాధిక్యత నుండి, అస్వతంత్రత నుండి ఈ అర్ధశతాబ్టికాలంలో కొంత మేరకైనా విముక్తి సాధించిందంటే..... ఆ విజయసాధనలో నా వంతు కృషి లవ మాత్రమైనా వుందనే తృష్తి....! ల ఇక కోల్పోయిందంటవా, ప్రత్యేకంగా ఏమీ లేదేమో... ఒక్క నా సంసార జీవితాన్ని తప్ప. ఈ చేశాన కోటానుకోట్ల స్రీలు ఎన్నో కోల్పోతున్నారు. ఎన్నో కోల్పోయారు.... వారితో పోల్చుకుంటే, నేను అనే ఒకే ఒక వ్యక్తి కోల్పోయినదేపాటి.... చాల అల్పం... ఏదో కోల్పోయాను అనే భావం నాలో ఏ కోశాన లేదు. కాకుంటే నేనెంచుకొన్న ఈ జీవన పధాన నడిచి నడిచి ఈనాటికి నేనలసిపోయాను. శారీరకంగా వృద్ధురాలినయ్యాను. డెబ్బయి అయిదేళ్ళ మైలు రాయిని దాటాను. సంఘసేవలో, నా ఇన్నింగ్స్‌, పూర్తయినట్లే...! ఆందోళనలే ఊపిరిగా, నిత్యపోరాటాల మధ్య గడిపిన ఏ 'జీవినైనా వెంటాడే అనారోగ్య లక్షణాలు.... బి.పి. షుగర్‌ నన్నూ చుట్టుముట్టాయి. మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. మరిఒకరి సాయం లేకుండా కదలలేని స్థితి దరిదాపులకు వచ్చేస్తోంది. ఈ శరీరమే కాదు, మనసూ విశ్రాంతిని కోరుకొంటోంది. నా పూనికతో నిర్మాణమైన ఏ అనాధ “స్తో ఆశ్రమంలోనో, ఈ శేష జీవితాన్ని గడిపివేయ వచ్చు.... కానీ ఎందుకో అలా అనిపించటం లేదు. నన్ను నేను అనాధను అనుకోలేకపోతు నాను. నా వాళ్ళ దగ్గర ఈ చరమ జీవితాన్ని గడపాలనే ప్రగాఢమైన కోరిక నన్ను వెంటాడు 0ది..... ఇన్నేళ్ళ తర్వాత నేను పుట్టి పెరిగిన “రాజమండ్రి వచ్చాను. నేనెరిగిన వాళ్ళెవరుంటారు.. ఎవరూ లేరు. అమ్మ, నాన్న చాల ఏళ్ళ క్రిందటనే కాలం చేశారు. అక్కడ నాకో విషయం తెలిసింది. మా నాన్నగారు తన చివరి రోజులలో నా కోసం ఎదురు చూసి, చూసి, ఇక నేను రాననుకోనో, లేననుకొనో తనకుగ్గా మిగిలిన ఒక్క రక్తబంధువు అయిన మీ నాన్నగారి కడకెళ్ళి తన అస్థిపాస్తులను ఆయన, అధీనం చేస్తానన్నారట. మీ నాన్నగారు - వద్దన్నారట.... ఇక చేయగల్లిందేమీ లేక...తనకు మిగిలిన యావదాస్టిని,. 'కాకినాడ' లోని ఒక “తరుణీ మండలి నడుపుతోన్న అనాధ ఆశ్రమానికి విరాళంగా యిచ్చారట. మా నాన్నగారు చేసిన ఆ సత్కార్యానికి ఎంతగా సంతోషించానో..... ఆ శరణాలయానికెళ్ళి చూచాను. అక్కడ అమ్మ, నాన్నల చిత్రపటాలు కన్పించాయి. వాటికి నమస్కరించి తిరిగి వచ్చేసాను. నా గురించి ఈ కాలమంతా మీకెవ్వరికి తెలియకున్నా... మీ గురించి నాకు తెలుస్తూనే ఉంది. .మధ్య మధ్య...... మీ నాన్నగారు మళ్ళీ మీ అమ్మ “సర్వమంగళిను వివాహ మాడటటం... వారి వకైక సంతానమైన నీవు లాయరుగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి, జిల్లా జడ్జి అవ్వటం... నీకో అబ్బాయి.... వాడు “ఎయిర్‌ఫోర్స్‌”లో, పైలట్‌ ఆఫీసరవ్వటం... ఈ సమాచారమంతా నాకు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా తెలుస్తూనే వుంది. మే్‌న్‌్‌్‌్‌్‌్‌్‌్‌న్‌నడనననడ సంక |

త్త తేరిపారచూస్తే.... ఒక నా వాళ్ళంటూ ఎవరున్నారు.... రక్త సంబంధీకులైన మీ నాన్న... మీరుతప్ప.మీ దగ్గరకు రావాలనుకొంటున్నాను. నాకా అవకాశం వుందా... లేదా అనే విషయం నేనాలోచించటం లేదు. నా వాళ్ళ దగ్గరుండి నా ఈ మిగిలిన జీవితాన్ని గడపాలనే “వాంఛ నన్ను మరేమి ఆలోచింపనీయటం లేదు. ఒకనాడు, మీ తాతగారి ఆలోచనాధోరణితో పొసగక నేను మీ నాన్నగారి నుండి దూరంగా జరిగిపోయాను. నిజమే. కాని.... ఎనభయి ఏళ్ళ అనుభవసారంతో '“వెంకటశివుడు'గారు. అదంతా గతమని, దాని మంచి, చెడుగుల ప్రస్తావన అఫ్రస్తుతమని భావించి నన్ను తన మేనమామ బిడ్డగా ఆదరింపకపోతారా అనే భావం నన్ను మీ వద్దకు చేరమని ప్రోత్సహి స్తోంది... అంతేకాదు.... మీ చెంతకు రావాలనే నా కోరికకు, చేరగలననే నమ్మికకు మరో ముఖ్య కారణం వుంది.... అది నీవు!.... నీవో మంచి న్యాయవాదివని..... దొడ్డ న్యాయమాూర్తివని విన్నాను. కొంత కాలంపాటు మహిళా న్యాయస్థానానికి న్యాయాధిపతిగా వ్యవహరించావని.... మహిళల పట్ల సానుభూతి పరుడవని తెలిసింది. ఈ దేశపు మహిళా మానసికస్థితేమిటో నీకు తెలిసే వుంటుంది. అందుకే నిన్ను చూడాలని, నీవు వున్న మీ మధ్యకు వచ్చి నాకై మిగిలివున్న ఈ శేష జీవితాన్ని గడపాలని, ఈ పిడికెడు గుండెలో కొండంత అశ నాయినా! నేను, ప్రస్తుతం తన అవసాన దశలో, మంచంలో వున్న ఒక మిత్రురాలిని చూచేందుకు బెంగుళూరు వచ్చాను. మరో వారం రోజుల పాటు నీ కబురు కోసం ఎదురుచూస్తూ ఇక్కడే వుంటాను. నీవు రమ్మంటే మీ దగ్గరకు వస్తాను.... మీలో ఒక్కరి అభీష్టానికి వ్యతిరేకం కాకుంటేనే సుమా....మీ ఆనంద నిలయం నా రాకతో ఎలాంటి చికాకులకు నిలయం కాకూడదు. ఆలోచించి నాకో జాబు ఈ క్రింది చిరునామాకు వ్రాయి. నీకేదయినా ఇబ్బంది అనుకొంటె మొహమాట పడకు. నేనేమి అనుకోను. ఏది (ప్రాప్తమో దాన్ని ఆమోదించగల స్టెర్యముంది నాకు. ఆశీస్సులతో.... _ . అవాల్య! జాబు చదవటం పూర్తి చేసేపాటికి.... తానేనాడో చిన్నతనాన విన్న తన తండ్రిగారి మొదటి పెండ్లి విషయం మదిలో మెదిలింది భార్గవకు. అయితే ఆయనగారి మొదటి భార్యను గురించిన మరే ఇతర విషయాలు అంతగా తెలియవు. మొదటిసారిగా ఈ జాబుతోనే ఆమెగారు తన ముందు ... ఒక స్వతం్రేచ్చతో ప్రభవించిన మహిళామూర్తిగా.... తన తోటి వారి కోసం రగిలిన ఒక అగ్నికణంలా.... ఒక మహోన్నత వ్యక్తి...? ఒక సామూహిక శక్తిగా దర్శనమిచ్చినట్లెంది. భార్గవ్‌ లంచ్‌ ట్రేకీ తర్వాత బెంచి మీదకు వెళ్ళాడన్న మాటేకాని లాయర్ల వాద 'ప్రతివాదాలు అతని తలలోకి ఎక్కటం లేదు. మనసు ఆలోచనలు అహల్యగారి జాబు చుట్టూ పరిభ్రమి స్తున్నాయి. ఒక జీవితకాలమంతా సమాజ సేవలో గడిపి, అలసిసౌలసిన ఒక వృద్ధనారి సేద తీర్చుకొనేందుకు తనవారి ఆశయం కోసం వెతుక్కొంటోన్న దృశ్యం తన కనుల ముందు ౩4-144 1౬1221౬1౬1”

టి కన్పిస్తోంది.

అర్ధాంతరంగా అన్ని కేసులను వాయిదా వేసి తన “ఛాంబర్సు'లోకెళ్ళి మళ్ళీ మళ్ళీ చదువుకొన్నాడా జాబును.

భార్గవ సాయంత్రం ఇంటికి వస్తూనే భార్య “గౌతమిని - “నాన్నగారు గదిలో వున్నారా అని (ప్రశ్నించాడు.

“ఉన్నారు అంది.

బట్టలు మార్చుకొని తండ్రిగారి గదిలోకి వెళ్ళి, పడక కుర్చీలో వెనక్కు వాలి ఏదో గ్రంథాన్ని చూస్తోన్న ఆయన్ను- “నాన్నగారూ...” అని పిలిచాడు.

తలెత్తి చూసారు వెంకటశివుడుగారు.

ఇంత వయసు వచ్చినా భార్గవకు తండ్రి ఎదుటగా నిలబడి మాట్లాడాలంటే కొంచెం బెరుకే... అది ఆయనగారి పట్ల వున్న గౌరవం!

ఏదో చెప్పాలని ఆగిపోయిన భార్గవను... “ఏవిటి... చెప్పు” అన్నారు వెంకటశివుడుగారు.

“ఈ జాబును చూడండి" - అంటూ తన చేతిలోని కవరును ఆయనగారికిచ్చి, వెంకటశివుడుగారు దానిని తీసికోగానే బయట కొచ్చేడు భార్గవ.

ఆ సాయంత్రం స్థానిక కళాశాల వార్చికోత్సవాల సభకు ముఖ్యఅతిథిగా వెళ్ళిన భార్గవకు తిరిగి ఇంటికి రావటం ఆలస్యమయింది. అప్పటికే వెంకటశివుడుగారు నిద్రించటంతో ఆయనగారితో మాట్లాడే అవకాశమే లేకపోయిందానాటికి.

మరునాటి ఉదయాన ఒకటి రెండుసార్లు ఆయనగారితో మాట్లాడాలనుకొంటే - “'మామయ్యగారు అనుష్థానంలో వున్నారని ఒకసారి, 'దేవాలయానికి వెళ్ళారని మరోసారి చెప్పింది గౌతమి. పదిన్నర గంటలకు కోర్టుకు వెళ్ళబోతూ గదిలో వెంకటశివుడుగారు, ఒంటరిగా వుండటం గమనించి లోపలకెళ్ళి,

“నాన్నగారూ.... ఆ జాబు....” అంటూ అర్జోక్తిలోనే ఆగిపోయాడు భార్గవ.

'“ఆ.... చూసాను... ఏం! ఇన్నేళ్ళ తర్వాత తానిక్కడకు రాకుంటే ఏమిటట... మరెక్కడైనా వుండవచ్చుగా-' అన్నారాయన.

“మరోచోట వుందే అవకాశం ఆమెగారికి లేక కాదుగా" అన్నాడు భార్గవ.

“మరి?

క్షమించండి! మీరు మరోలా అనుకోక, ఆ జాబును మరోసారి చదవండి. ఆమెగారు కోరుకొంటున్నదేమిటో అర్ధమవుతుంది-”

“నీవు న్యాయమూర్తివి కదా... నీ కర్థమయిందేదో చెప్పు” అన్నారు వెంకటశివుడుగారు.

“నాన్నగారూ! నేను మీకు చెప్పగలవాణ్లికాదు. మీరు సర్వ శాస్త్రాలు, సర్వ ధర్మాలు ఎరిగినవారు. చట్టపరమైన న్యాయాన్ని మాత్రమే చదివిన వాణ్ణి నేను. ఆ కాలాన కాదు కాని = ఈ కాలాన అయితే, మీరు. విడాకులు పొందకుండ పునర్వివాహం చేసికోవటం.... నేరం. అదలా వుంచండి.....ఈ కుటుంబంతో కలిసి వుండే హక్కు ఆమెగారికుంది.... అని నా భావన... చట్టాలు పొలకుల తత్వాలని బట్టీ మారుతూ వుంటాయి. కాని ధర్మం అలా

కైెేేహోోో్‌హ్‌ే్‌హయనమోయ్‌్‌న్‌న్‌న్‌్‌న్‌న్యయౌడడ్‌ త “౯ బ క

కాదుగా.... ఆ ధర్మ తత్వాన్ని ఎరిగినవారు మీరు. ప్రశాంత మనస్స్ములై ఆలోచించండి= అనేసి భార్గవ బయటకు వచ్చి కోర్టుకు బయలుదేరేందుకు సిద్ధంగా వున్న కారెక్కేసాడు. 4౭౨

సాయంత్రం విచారణలు ముగించి కోర్టు నుండి బయలు దేరబోయే సమయానికి ఫోను రింగయింది భార్గవ చాంబర్సులో. ఫోనులో అవతలివైపు నుండి - వెంకటశివుడు గారు - 'భార్గవా.... నేనక్కడకు వస్తున్నాను... అనేసి ఫోను పెట్టేసారు.

నాన్నగారు ఇక్కడకెందుకొస్తున్నట్లు.... అనే ఆలోచనల నుండి తేరుకోకముందే.... బయట కారాగిన శబ్దం... మరో కొద్ది క్షణాలలో వెంకటశివుడుగారు తన ఛాంబర్సులోకి రావటం గమనించిన భార్గవ ఆయనగారికెదురెళ్ళి తీనుకొనివచ్చి కుర్చీ చూపించి ఎదురుగా నిలుచుండిపోయాడు.... ఆయనేం మాట్లాడతారో వినటానికన్నట్లు.

“మరోమారు అహల్య జాబు చదవమన్నావుగా.... చదివాను! అహల్య కోరుకొంటున్న దేమిటో నాకు పూర్తిగా అర్ధమయింది.... ఏభయి అయిదేళ్ళ (క్రిందట నన్ను, నా ఆశ్రయాన్ని వదిలివెళ్ళిపోతున్ననాడు “అహల్య'ను వారింపక మౌనంగా వుండిపోయాను. ఎందుకో తెలుసా... నా చిన్ననాటనే మా అమ్మ స్వర్గస్థురాలయ్యారు. ఆ నాటికి మా నాన్నగారికి చిన్న వయస్సే.... అయినా ఆయనగారు పునర్వివాహాన్ని తలపెట్టక.... తన సుఖాన్ని త్యాగం చేసి తానే నాకు అమ్మ.... నాన్న అయి ప్రాణప్రదంగా పెంచారు. ఆ తండ్రిగారి అభీష్టానికి ఎదురాడలేక.... వూరక వుండిపోయాను. అంతేకాని “అహల్య” దోషి అని కాదు. అంతేకాదు ఆయనగారి మరో అభీష్టానికి ఎదురాడలేకనే.... మళ్ళీ వివాహమాడాను.

'సరే! అదంతా గతం.

“అహల్య ఈ అర్ధ శతాబ్దికాలమంతా తోటివారి కోసం తనను తాను కోల్పోయి త్యాగమయ జీవితాన్ని గడిపిన ధన్యజీవి. ఈ జీవన సంధ్యలో ఆమె కోరుకొంటున్నదేమిటో నాకర్ధం కాక కాదు. కాని, ఆమె కోరిక తెలిశాక, నా కనుల ముందు అహల్య కంటే ప్రస్ఫుటంగా మీ అమ్మ 'సర్వమంగళి నిలచి వుంది....

'ఏభయి అయిదేళ్ళుగా తన సతీత్వ ధర్మాన్ని “తూ.చ.” తప్పక- “కష్టాన, సుఖాన మీరు ఒంటరికాదు... మీ వెంట నేనున్నాను” అని నాకు చేదోడు, వాదోడుగా నిలచిన మీ అమ్మతో... “నా మొదటి భార్య అహల్యను రమ్మంటాను” అని ఎలా చెప్పాలి అనేదే నా

“ఈ రోజు మధ్యాహ్నం మీ అమ్మ తానేదో పనిలో వుండగా, నీ భార్య “గౌతమిని పిలిచి, అహల్య జాబిచ్చి తన అభిప్రాయం చెప్పమన్నాను. గౌతమి జాబు చదివి..... చాల నిర్వందగా

  • “వద్దు మామయ్యగారు.... ఆమెగారిని మన మధ్యకు పిలవవద్దు.... ఆమెగారు ఇక్కడకు రావాలనుకొంటోంది, అత్తయ్యగారి నుండి మీ అర్జాంగిగా స్టానాన్ని లాక్కోవటానికి కాక పోవచ్చు... కాని ఆమెగారు వచ్చాక, ఆమెను పదుగురు _=మీ పెద భార్య అనేగా అంటారు.... అత్తయ్యగారనే కాదు..... ఏ స్త్రీ మరో 'సపల్నిని.... ఆమె ఉనికిని అంగీకరించదు. అంగీ కరించమనటం న్యాయం కూడ కాదు. అత్తయ్యగారి మనసు నొప్పించకండి-” అని ఊకను క భారళి-204 12ోో్ష్‌్‌్‌ాాాాాాల౯లల్‌్‌ 2222222222

మాకూ హెచ్చరించింది.

“భార్గవా! నాకు సర్వశాస్తాలు, సర్వధర్మాలు తెలుసని నీవన్నావు.... ఏమో నాకేం తెలుసో.... ఏం తెలియవో.... నాకే అర్ధం కావటం లేదు.... అటు “అహల్య'కు అసంతృప్తి మిగిలకుండ.... ఇటు 'సర్వమంగళికు అశాంతి కలగకుండ ఏది చేయాలో.....ఎలా చేయాలో, ఒక నిర్ణయం నీవే చెయ్‌- అనేసి లేచి - 'మరో అరగంటలో '“థియోసాఫికల్‌ సొసైటిలో స్వామి దయానంద భారతి ఉపన్యాసం వుంది. వెళ్ళొస్తాను- అంటూ బయటకు వెళ్ళారు వంకటశివుడుగారు.

ఆయనగారు వెళ్ళేక - అవును అమ్మను గురించి ఆలోచించాను, కాదేం - అనుకొన్నాడు భార్గవ సాలోచనగా!

60

రాత్రి భోజనాలయ్యేక, భార్గవ, గౌతమి తమ గదిలో 'అహల్య' గారి జాబును గురించే మాట్లాడుకొంటున్నారు. అంతలోనే వెంకటశివుడుగారు వారి గదిలోకి - 'భార్గవా?్‌ అంటూ వచ్చారు.

సామాన్యంగా, ఆయన అలా రారు. అవసరమైతే 'భార్గవనే తన గదికి పిలుస్తారు.

వస్తూనే - “ఏం నిర్ణయించేవు” అని (ప్రశ్నించారు.

“అదే నాన్నగారు.... అమ్మతో మాట్లాదాలనుకొంటున్నాను- అన్నాడు భార్గవ.

. వెంటనే గౌతమి కల్పించుకొని - “వద్దండి... అహల్యగారిని ఆహ్వానించి ఈ వయసున అత్తయ్యగారి మనసును అల్లకల్లోలం చేయకండి. అంతగా కావాలనుకొంటే “అహల్య'గారి శేషజీవితానికి సరిపడ, 'ఏదో కొంత, జీవన భృతిని ఏర్పాటు చేయండి' అంది.

“ఆమెగారు కోరుకొంటోంది జీవనభృతిని కాదు కదా”- అన్నాడు భార్గవ,

“దేనినైనా కోరుకోగల అర్హతను, స్థానాన్ని ఈ ఇంట ఏనాడో కోల్పోయారామె - మనం అమెగారి కంటూ ఏమి చేసినా, కేవలం దయాదాక్షిణ్య భావనతోనే + అంది గౌతమి.

అంతలోనే ఆ గదిలోకి 'సర్వమంగళి వచ్చారు. ఆమెను చూస్తూనే మాట్లాడడం ఆపి మౌనంగా వుండిపోయారు - ముగ్గురు. ,

“ఏవిటి - ఎవరిని గురించి మాట్లాడుతున్నారు.... అహల్య అక్కయ్యగారిని గురించేనా-' ప్రశ్నించారామె.

ఆమె నోట “అహల్య” పేరు' వినగానే ముగ్గురు గతుక్కుమన్నట్లు తెల్లబోయారు. భార్గవ తేరుకొని ఏదో చెప్పబోయే సరికి.... " _

“నాకు తెలుసురా భార్దవా... ప్రొద్దున మీ నాన్నగారి ప్రక్క బట్టలు మార్చుతుంటే, తలగడ క్రింద ఆమెగారి జాబు కన్పించింది. చదివాను. ఇప్పుడు మీ సంభాషణ విన్నాను... ఇన్నేళ్లుగా నాకు తెలిసింది... 'అహల్య'గారు ఈ ఇంటి నుండి వెళ్ళిపోయారనే కాని.... ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు.... ఇదిగో ఈనాడే తెలిసింది... ఆమెగారిదెంతటి గొప్ప వ్యక్తిత్వం! తన్ను తాను విస్మరించుకొని, ఒక నిండు జీవితకాలం స్రీ జాతి అభ్యుదయం కోసం ఎంతటి మహత్రర త్యాగం చేశారామె! కడ డడఊఊఉఊఊఊ2ఊఊడదఊఊఊఊడై కేల్‌ సిమీ ౩

“అమ్మాయ్‌.... గౌతమీ.... నీవు మా తరం కంటే ఆధునిక మహిళవు.... ఎక్కువ చదువు కొన్నదానవు.... గొప్ప ఫెమినిస్టువు కూడా కదా.... ఒక్కసారి ఆలోచించు.... 'అహల్యగారు తానూ, అనాదే తన ఆలోచనా ధోరణికి తగిన మరొకరిని పెళ్ళాడి తన జీవితాన్ని తాను భ(ద్రపరచుకోవచ్చునే.... మరి అలా చేయలేదే.... సమాజ (శ్రేయస్సు కోసం అంకితమై తన జీవితాన్ని బలి చేసుకొందే!.. ఆమె బుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలమో.... నీవే చెప్పు? బానిసత్వపు (బ్రతుకు తీరు నుండి ప్రీ జాతిని విముక్తం చేసే అనేక పోరాటాలలో, అలసి సొలసిన ఆమెగారు కోరుకొనే కాసింత, ఆత్మీయ (ప్రశాంతతను పంచిపెట్టి - “సేద తీర్చటం మన కనీస కర్తవ్యం కదూ!

“దేనినైనా కోరుకోగల అర్హతను, స్థానాన్ని ఏనాడో కోల్పోయారామె, ఈ ఇంట- అని ఎలా భావించావమ్మా! ఎంతటి దాక్షిణ్య లోభం!..... మీ మామయ్యగారు, నాకంటె ముందు ఆమెగారికే, 'నాతిచరామి' అని బాస' చేసి తీసుకొని వచ్చారు, ఈ ఇంటికి. మరి ఈ ఇంట ఆమెగారు తన స్థానాన్ని ఎలా కోల్బోతారు.... ఎందుకు కోల్పోతారు- అంటూ అందరి వేపు చూచారామె.

మొదటిసారిగా, వెంకటశివుడి గారికక్కడ, తనకిన్నాళ్ళు తెలిసిన సర్వమంగళ కాదు.... మరో నూతన ధర్మ స్వరూపం కన్పించినట్లెంది.

భార్గవకు తనెరిగిన అమ్మ కాదు.... ఒక సనాతన అధునాతన భావ వారధి అయిన స్హ్రీ మూర్తి దర్శనమిచ్చింది.

గౌతమికి - తనను అత్తగారు అతి సున్నితంగా మందలించినట్ట్లు.... ఆ మందలింపుకు తాను అర్హురాలినే అన్నట్లు అనిపించింది. తల ఎత్తి అత్తగారిని అలా నిలువెల్లా చూస్తో వుండిపోయింది- !

“అమ్మా! అయితే రేపే దొద్దమ్మగారికి, బయలుదేరి రమ్మని జాబు రాయనా అన్నాడు భార్గవ,

'భార్గవా! తాపీగా జాబులు వ్రాసుకొనే కాలమా ఇది. ఆమెగారి జాబు చదివిన మరుక్షణమే “బెంగుళూరులో వున్న నీ కొడుక్కి... అదే నా మనుమడు- 'ఉదయ్‌'కి ఫోను చేశాను. అంతా విని వాడెంత ఉద్వేగపడ్డాడో తెలుసా... వెంటనే ఆమెగారిని కలుసుకొని ఆమెగారి ఆశీస్సులు తీసికొంటానన్నాడు. వాడు అకాశాన ఎగిరే "పైలెట్‌ కదా...... వాడి ఆలోచనలు...... ఆశయాలు..... ఆచరణలు అలాగే ఎత్తుగా నిర్మలంగా వుంటాయి. వాడీపాటికి, ఏదో సైట్‌లో వాళ్ళ దొడ్డ బామ్మగారిని తీసికొని బయలుదేరే వుంటాడు... ఏ క్షణాననైనా వాళ్ళిక్కడకు రావచ్చు...!

“అమ్మాయ్‌ గౌతమీ! మీ గదిని పైకి మార్చుకొని, ఈ క్రింది గదిని - 'అహల్య'గారి కోసం సిద్ధం చేసి వుంచు. అలాగే మీ “కస్తూరిబా మహిళామందలిలో రేపు సాయంత్రమే - ఆమెగారిని, స్వాగతిస్తూ ఒక సన్మాన సభను ఏర్పాటుచేస్తే బాగుంటుందేమో కదూ....” అంటున్న సర్వమంగళను దిగ్భాంతితో నిర్నిమేషులై చూస్తూ వుండిపోయారా ముగ్గురూ!

అ క౭ఉతప౭ఉఊ౭ఊపాాైకైాాాాాాాక22క చకకని క్‌

లాలా లు కర్తవ్యం అని

అ 190.90. రముణరొర్టు పార్కలో వేపచెట్టు కిందవున్న సిమెంట్‌ బెంచ్‌ మిద ఉదయం ఆరున్నర గంటలకి కూర్చుని వుండటం మూడు రోజులుగా గమనిస్తున్నాను. మార్నింగ్‌ వాక్‌ ఆరు రౌండ్లు అయింతర్వాత, నేనూ మా కాలనీలో వున్న ఎడ్బొకేట్‌ వెంకట్రావు ఆ బెంచీ మదే కూర్చోటం

పరిపాటి. అయితే మా వాకింగ్‌ పూర్తయి వొచ్చేటప్పటికి ఆమె లేచి వెళ్ళిపోయేది. మొదటి రెండు రోజులూ, దూరాన్నుంచి చూశానేమో ఆనవాలు పట్టలేదు. మూడో రోజున కాస్త పరకాయించి చూడ్డానికి అవకాశం వుండేలాగ ఆమె అప్రయత్నంగా 'పాత్‌ వే" వైపు తిరిగింది. ఆమె ప్రసాదరావు భార్య, సరస్వతే అన్న అనుమానం కలిగింది. ఆమె సరస్వతే అయితే అమెరికా నుంచి అప్పుడే తిరిగొచ్చేస్తుందా! అగి, అడ్డంపడి వెళ్ళి పలక

రించడం సభ్యత కాదని ఊరుకున్నాను.

  • ఇంటికి తిరిగొచ్చేక ఈ విషయం పద్మజకి చెప్పేను.

“సరస్వతేనండి. మోకు చెప్పడం మరిచిపోయేను. నిన్న 'ఫుడ్‌ వరల్గొలో కనబడింది. అమెరికా నుంచి తిరిగొచ్చి నాలుగు రోజులయిందట” అంది.

“ప్రసాదరావు పోయి రెండు నెలలేగా అయింది. వెంటనే కొడుకొచ్చి కర్మకాండంతా

పూర్తిచేసి, తల్లిని వెంట బెట్టుకుని అమెరికా వెళ్ళేడు. అప్పుడే తిరిగొచ్చేసిందా! కనీసం మనకో వుత్తరం ముక్క లేదు. టెలిఫోన్‌ లేదు” అన్నాడు.

“ఆమాటే అడిగేను. శాంతినగరీలో వాళ్ళ చెల్లెలు గాయిత్రింట్లో దిగిందిట. భార్యా భర్తలిద్దరూ ఇంజనీర్లు కదా! అమెరికా వెళ్ళిన వారం రోజులకే ఫోన్‌ చేసి వీళ్ళ యిల్లంతా “ఠీ మోడల్‌ చేసి రంగులేసి సిద్దం చెయ్యమందిట. నాలుగు రోజుల్లో పూర్తవుతుంది, టెలీఫోన్‌ కూడా ెస్ట్రోరొ చేస్తారు అంది. ఈలోగా ఎవరింటికెడితే ఏం తప్పట్టుకుంటారో, ఎవరికి ఏం పట్టింపులుంటాయో, ఫోనొచ్చేక పలకరిద్దామని వూరుకుందట పాపం!” అంది పద్మజ.

౧౦౮6

మర్నాడు ఉదయం సరస్వతి లేచి వెళ్ళకముందే పార్క్‌లో కలిసేను.

“నమస్కారం అన్నయ్యగారూ!” అంటూ నవ్వుతూ పలకరించింది.

ఎక్కడ ఏం గొల్లుమంటుందోనని భయపడ్డాను.

“కూర్చో అమ్మా! మూడు రోజులుగా నిన్ను చూస్తున్నాను. నిన్న ఆనవాలు పట్టేను కానీ....” డత ఊఊఊ. 2222222222

“మొన్న పద్మజగార్ని కలిసేను, మోకు చెప్పే వుంటారు. నిన్న నేనూ మిమ్మల్ని ఆనవాలు పట్టేను. మోరూ, మితో బాటు మరో ఆయనా వేగంగా నదుస్తున్నారు....”

కా!

“అతనెవరనుకున్నావు! ఎడ్వొకేట్‌ వెంకట్రావు. అయ్యప్ప దీక్షలో వున్నాడు” అన్నాను నవ్వుతూ. |

“అలాగా! ఆ నల్లబట్టలు, ఆ గెడ్డం. దూరాన్నుంచి ఎవరో అనుకున్నాను. - ఇక్కడికి తిరిగొస్తున్నట్టు ఆయనకీ తెలీదు. ఆయన్ని కలవ్వల్సిన పనుంది. వూళ్ళో వుంటారా? శబరిమలై...”

“ఈ నెలంతా యిక్కడే వుంటాడు. ఇల్లంతా ముస్తాబు చేయించేవని తెలిసింది. ఇక్కడే స్థిరపడతావన్నమాట! చాలా సంతోషం. మి అబ్బాయి, కోడలు యింత త్వరగా రానివ్వరేమో అనుకున్నాం.”

“అక్మడే కూర్చుంటే ఎలా! ఇక్కడ చక్కబెట్టుకోవాల్సిన పనులు పెట్టుకుని! నేను నాలుగైదు రోజుల్లో ఫోన్‌ చేస్తాను - మిరు వొదినగారు ముందు మా యింటికి రావాలి” అంది.

౨6 € _

“లంకంత ఇల్లు. ప్రసాదరావు తండ్రి కూడా నైజాం స్టేట్‌లో పెద్ద ఉద్యోగం చేసి, ఇప్పుడు కోట్లు విలువచేసే కావాల్సినంత అస్తి సంపాదించేడు. లింగు లిక్కూమంటూ ఈవిడ ఇక్కడ కూర్చునేం చేస్తుంది. ఇల్లూ, ఇళ్ళ స్థలాలు - యింకా ఏమి ఆస్తులున్నాయో అన్నీ అమ్మేసి సొమ్ము చేసుకుని ఏకంగా బిచాణా ఎత్తేసి అమెరికాలో కొడుకు కోడలు దగ్గిరుంటుందనుకుంటాను. చూస్తూ వుండండి” అంది పద్మజ.

“ఒక్కనాటికక్కడ కింత తొందరగా వెళ్ళదు. ఆస్తిపాస్తు లమ్మడమంటే సులభం కాదు. ఈ సొమ్మంతా అక్కడికి చేరవెయ్యాలనుకోడం సాధ్యమూ కాదు, వివేకం కాదు. రెండేళ్ళ క్రితం ప్రసాదరావు, సరస్వతి అమెరికా వెళ్ళి నెలా పదిహేను రోజులుండేటప్పటికి మొహం మ్మొత్తి తిరిగొచ్చేయలేదూ!” అన్నాను. ,

“అప్పటి సంగతి వేరు. ఇప్పుడు సరస్వతి వొంటరిది. అప్పుడైతే రెండో పెళ్ళి పెళ్ళా మయినా, అయ్యేయస్‌ ఆఫీసర్‌ భార్యగా, ఎక్కడికెళ్ళినా ఆ హోదా, ఆ హుందాతనం, ఆ గౌరవం వుండేవి. ఇప్పుడుంటాయా! ఎక్కడి కెళ్ళినా “అయ్యో పాపం” అని పరామర్శించే వాళ్ళే కదా! చదువు సంస్కారం (ప్రపంచానుభవం వున్నాయి, అక్కడే ఏదో వ్యాపకం కలిగించు

కోగల సమర్భరాలు. ఇక్కడే వుండి ఏం బావుంకుంటుంది! పైగా ఆ సవితి కొడుకు సురేష్‌ బ్రప్పుడై గర్భశత్ళవై చివరికి తండ్రి పోతే తల కొరివి పెట్టడానికి కూడా రాలేదు. ఈవిడిక్కడే వుంటే ఎటువంటి అవమానాలకి గురిచేస్తాడో!”” అంది పద్మజ.

. “ఇంకిప్పుడు వాడేం చేస్తాడు! చెయ్యగలిగినదంతా చేసి, చివర్రోజుల్లో తండ్రి మనశ్శాంతి లేక 'హార్టెటాక్‌' వొచ్చి చావడానికి కారకుడయ్యేదు. ఇప్పుడు రెండు నెలలు పట్టి జైల్లో మూలుగుతున్నాడు. బెయిల్‌ కూడా యివ్వలేదు.”

“వాడు కత్తితో పొడిచిన భాస్కర్‌ బ్రతికి బయటసడ్డాడట కదా! అయినా ఆ భాస్కర్‌ కదేంబుద్ధి! సురేష్‌ తన స్పేహితుడు కదా! వాడి భార్య రేఖతో అక్రమ సంబంధం పెట్టుకుంటాదా! భక. న్‌్‌ న్‌్‌

పెద్ద చదువు చదువుకుంది. ఉద్యోగం చేస్తుంది, ఇద్దరు పిల్లల తల్లి, భర్త ఎంత దుర్మార్డుడైతే మాత్రం, రేఖకి మాత్రం బుద్ధుండొద్దూ! పైగా వాళ్ళిద్దరిదీ లవ్‌ మేరేజ్‌ ఆయిరి!”

“కేస్‌ ఇంకా విచారణలో వుంది. ఇంతకీ కేస్‌ పెట్టింది సురేష్‌ భార్య, సురేష్‌ తన భర్తని కత్తితో పొడిచేడని. తన భార్యతో భాస్కర్‌కి అక్రమ సంబంధం వుందని తెలుసుకుని ఉద్రేకంలో పొడిచేడని సురేష్‌ తరఫు ప్లీడర్‌ వాదన. ఇదంతా రుజువవ్వాలి కదా!” అన్నాను.

_ “అ పొడిచేదేదో గట్టిగా పొడిచుంటే భాస్కర్‌ చచ్చేవాడు, ఉరిశిక్షతో ఆ సురేష్‌ చచ్చేవాడు. ఈ రేఖకి బుద్దాచ్చేది. సరస్వతికీ వాడి పీడ వాదిలేది” అంది పద్మజ తన సహజ, ధోరణిలో. 46

నాలుగు రోజులు పోయిన తర్వాత, మార్నింగ్‌ వాక్‌ అయిన తర్వాత మేము కూర్చున్నప్పుడు, “రెండు మూడు రోజుల్లో తన కుటుంబ వ్యవహారాల్లో సంప్రదించడానికి సరస్వతిగారు ముందుగా ఫోన్‌ చేసి మా యింటికి వస్తానన్నారు అన్నాడు వెంకట్రావు.

“తప్పకుండా చెయ్యగలిగినదంతా చెయ్యి. చాలా మంచి మనిషి సవితి కొడుకు సురేష్‌ మిదున్న క్రిమినల్‌ కేస్‌ వల్లొచ్చిన షాక్‌లోనే ప్రసాదరావు హార్చెటాక్‌ వొచ్చి పాపం! పోయేడు” అన్నాను.

“కేస్‌ విషయం అలా వుంచు. నలభయ్యేళ్ళుగా మి దంపతులు (ప్రసాదరావు దాంపత్య జీవితాన్ని గురించి అన్ని విషయాలూ తెలుసున్న వాళ్ళు. నేనాయన్ని అయిదారేళ్ళుగా ఎరుగు దును. ఆమెతో పరిచయం కూడా అంతంత మాత్రమే. ఏ పెళ్ళిళ్ళలోనో రిసెప్పన్లలోనో ఆ దంపతులు, మా దంపతులం కల్సుకున్నప్పుడు పలకరించుకోడానికే పరిమితం.”

“చాలా అన్యోన్యంగా వుండే దంపతులు, సరదా అయిన వాళ్ళు ఉదారస్వభావులు, ఉపకారస్తులు.....”

“అనే నేనూ విన్నాను. అంత మంచివాళ్లకీ, పెద్దకొడుకు సురేష్‌కీ మధ్య అంత బద్ధవైరం ఎలా ఏర్పడిందో తెలుసుకునే అవకాశం కాని, అవసరం కాని యింతవరకూ కలగలేదు” అన్నాడు వెంకట్రావు.

“ఆ కథ పెద్దదే కాని క్లుప్తంగా చెబుతాను. సరస్వతి బియ్యే, ఆమె చెల్లెలు గాయిత్రి ఇంటరూ చదువుతూండగా, కుటుంబాన్ని దారిద్ర్యంలో ముంచి, క్షయ వ్యాధితో తండ్రి పోయేడు. గత్యంతరం-లేక తమకేదైనా ఉపాధి కల్పించమని సరస్వతి మన కాలనీ మహిళా మండలిని అర్ధించింది. దానికప్పుడు ప్రసాదరావు మొదటి భార్య, వరలక్ష్మి అధ్యక్షురాలు. సానుభూతితో వాళ్ళ తల్లికో 'ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటరొలో నౌకరీ యిప్పించింది. అప్పుడు సులేష్‌కి పదకొండేళ్ళు. ఇంటికొచ్చి వాడికి ట్యూషన్‌ చెప్పడానికి సరస్వతిని నియోగించింది. మొత్తం మోద సరస్వతి బియ్యే, గాయిత్రి ఇంటరూ పూర్తి చేశారు. ప్రసాదరావుతో చెప్పి సరస్వతికొక ప్రయివేట్‌ కంపెనీలో ఉద్యోగం వేయించింది. దాంతోబాటు సురేష్‌కి ట్యూషన్‌ కూడా కొన సాగిస్తూ ఆ కుటుంబాన్ని అనేక విధాల ఆదుకుంది. మహిళా మందలి కార్యకలాపాల నిర్వహణలో వరలక్ష్మి తన పెర్సనల్‌ సెక్రటరీగా సరస్వతిని వేసుకుని ఎంతో ఆదరించి అభిమానించింది.” 1111” ళు క

“అయితే చిన్నప్పుడు సురేష్‌ సరస్వతిగారి శిష్యుడన్న మాట!” అన్నాడు వెంకట్రావు.

“అక్షరాలా! ఎటొచ్చీ వాడొక పెంకి ఘటం. చదువంటే ! లేదు. వరలక్ష్మి గారాబం వల్లా అనారోగ్యంతో పెరిగిన అశ్రద్ధ వల్లా సురేష్‌ స్కూల్‌ ఎగ్గొట్టేసినా, ట్యూషన్‌ ఎగ్గొట్టేసిన్మా ప్రసాద రావుకి తెలిస్తే మండిపడతాడని, నిర్లిప్తంగా వూరుకునేది. అప్పుడిన్ని 'సూపర్‌ స్పెషాలిటీ వాన్సటల్స్‌” లేవు. ఆమె అనారోగ్యానికి కారణం 'లంగ్‌ కేన్సర్‌ అని తెలుసుకునే టప్పటికే వ్యాధి ముదిరిపోయింది. నెల్లాళ్ళలో పోతుందనగా, నేనూ పద్మజా వుండగానే సరస్వతితో తను పోయిన తర్వాత ప్రసాదరావుని పెళ్ళి చేసుకుని, సురేష్‌ని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిమ్మంది"

“అంతా సినిమా ఫక్కీలో అవ్ఫగింతలు పెట్టిందన్న మాట! ఆ పరిస్థితుల్లో అది సహజమే అనుకో”

“సరస్వతి బెంబేలెత్తిపోయి వరలక్ష్మి చేతులు పట్టుకు ఏడ్చింది. నేనూ పద్మజ ఆమె చేతిలో చెయ్యేసి ధైర్యంగా వుండమని, దైవచింతన చెయ్యమని, ఆమె (బ్రతుకుతుందని ఏవో ఓదార్పు మాటలు చెప్పేం. కాని ఆమె ఆ మాట ప్రసాదరావుతో కూడా అన్నట్టు తర్వాత తెలిసింది"

“సరే, ఆమె పోయింది. మిరు సరస్వతికి నచ్చజెప్పి పెళ్ళి జరిపించేసేరు....” అన్నాడు వెంకట్రావు.

“వెంటనే అలా జరగలేదు. వరలక్ష్మి పోయిన ఆర్నెల్లకి ఆమె పుట్టింటి వాళ్ళు కలగుజేసుకుని వాళ్ళకి తెలుసున్న కాస్త కలిగున్న వాళ్ళ సంబంధాలే తీసుకు రావడం మొదలెట్టేరు. ప్రసాదరావు అయ్యేయస్‌ ఆఫీసరు, నలభై రెందేళ్ళు. మంచి చలాకీగా, సరదాగా వుండేవాడు. లోకజ్ఞానం వున్నవాడు. ఉదారస్వభావుడు. ఈ పరిస్థితిలో నేనూ, పద్మజా కలుగజేసుకున్నాం. సరస్వతి దగ్గిర సురేష్‌కి మంచి చనువుందన్న వుద్దేశ్వంతోనూ, నిస్సం కోచంగా సంతోషంగా సరస్వతి ఒప్పుకోవడం చేతనూ, అది తన భార్య అభిమతం. అవడంవల్లనూ సరస్వతిని పెళ్ళి చేసుకున్నాడు. దాంతో వరలక్ష్మి పుట్టింటి వాళ్ళు ప్రసాదరావు సరస్వతి వలలో పడ్డాడని వాళ్ళిద్దర్నీ దుమ్మెత్తి పోసేరు.”

“సురేష్‌ని దార్గోకి తెచ్చుకోలేదా సరస్వతి?”

“అదే సమస్య. వరలక్ష్మి చేసిన అతిగారాబం వల్లా, వాడికి చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్లా, ఎంత ప్రయత్నించినా వాడికి చదువు నేర్చడం ఆమెకి సాధ్యం కాలేదు. చివరికి సరస్వతి భయపడ్డట్టుగానే త యేడు సెవెన్స్‌ క్లాస్‌ ఫేలయ్యేడు. దాంతో కొత్త పెళ్ళాం మోజులో పడి......”

“వరలక్ష్మిగారి పుట్టింటివాళ్ళు - అంటే ప్రతిపక్షాలు - అభాండం వేసుంటారు. ప్రసాదరావేం చేసేడు?”

“ప్రసాదరావు అప్పుడు జాయింట్‌ సెక్రటరీ ఎడ్యుకేషన్‌. ఆ స్కూల్‌కి వెళ్ళి హెడ్‌మాస్టర్‌ని కల్పుకున్నాడు. గత మూదేళ్ళుగా వాడి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లూ, క్లాస్‌ టీచర్లు వాడి క్రమశిక్షణా రాహిత్యం గురించీ, చదువు పట్ల చూపే అశ్రద్ధ గురించీ, వాడి అల్లరి గురించీ చేసిన

ం ౩ ఫరా - 200% 2౩2౩౩౩

వాలు కంప్లెయింట్లన్నీ వరలక్ష్మి అందుకుని కూడా తనకి చెప్పకపోవడం ఈ అనార్జానికి కారణమని గ్రహించేడు. ఆ యేడు ఆ స్మూల్లో సెవెన్త్‌లో అందరికీ ఫస్ట్‌ క్లాసొచ్చింది. వీడొక్కడే ఫేలయ్యేడు. ”

“మరి కుర్రాడి ప్రయోజకత్వాన్ని గురించి ప్రతిపక్షాలకి చెప్పలేదా?”

“ఆలస్యం చెయ్యకుందా, తన పలుకుబడి ఉపయోగించి, మంచి రెసిడెన్షియల్‌ స్మూల్లో అయిదో క్లాస్‌లో జాయిన్‌ చేసేడు.”

“స్సరేష్‌ ఊరుకున్నాడా?”

“వాడి అమ్మమ్మకీ, తాతయ్యకీ ఉత్తరాలు రాసేదు. స్కూల్‌ బాగాలేదని, వొస్టల్‌ బాగా లేదనీ, భోజనం బాగాలేదనీ, తననీ స్కూల్‌ జెయిల్లోంచి విడిపించి వాళ్లింటికి తీసుకుపొమ్మనీ, సవితితల్లి తనకి ట్యూషన్‌ శ్రద్ధగా చెప్పకపోవడం వల్లనే ఫేలయ్యాననీ, ఆమెకి తనంటే కిట్టదనీ, తండ్రి కూడా ఆమె మాటే విని తనని కోప్పదేవాడసీ రాసేవాడు.”

“వాడు రాసేదని నీకెలా తెలుసు?” అడిగేడు వెంకట్రావు.

“ఇదంతా నేను చేసిన ఘనకార్యమేనని దెప్పుతూ ఆ వుత్తరాల కాపీలు నాకు పంపించే వారు"

“ఆ కుర్రాడు రాస్తే రాసేడు - వాళ్లెలా నమ్మేరు? నీకెలా రాశారు?”- _

“దిక్కూ మొక్కూ లేని సరస్వతిని పెళ్ళిచేసుకోవడం వాళ్ళ కిష్టం లేదు. .ఎంతో కొంత నిజముంటుందన్న నమ్మకం. దానికి, సాయం సరస్వతి చెల్లెలు, గాయిత్రిని పోలీటెక్సిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్‌ కోర్స్‌లో చేర్చించి చదివిస్తున్నాడు ప్రసొదరావు.” -

“సురేష్‌ అక్కడ నిలకడగా వున్నాడా? పారిపోయెచ్చేసేడా?”

“ఏడాది తిరిగేటప్పటికి దార్లో పడ్డాడు. శలవుల్లో ముందు వాళ్ళ తాతగారింటికెళ్ళి పది రోజులుండి యిక్కడ కొచ్చేవాడు. వాళ్ళు బాగా 'బెయిన్‌ వాష్‌ చేసి వంపేవారేమో, వాడిక్కడ ఎన్ని ఉత్సాహకరమైన కార్యక్రమాలు, సరదాగా గడిపే వాతావరణం సృష్టించినా . యాంత్రికంగా పాల్గొనేవాడు. వాడు సెవెన్త్‌ పేసయ్యేటప్పటికి సరస్వతికి కొడుకు పుట్టేడు. పదో క్లాస్‌ పాసయ్యేటప్పటికి గాయిత్రిని ఓ ఇంజనీర్‌కిచ్చి ప్రసాదరావే పెళ్ళి జరిపించేడు.”

“దాంతో ఇరుపక్షాల మధ్యా 'కోల్డ్‌వార్‌” ప్రారంభమై వుంటుంది.”

“స్సరేష్‌కి పాతికేళ్ళొచ్చేటప్పటికి బికాం పాసై ఎంబియ్యే చేసేడు. శలవులొస్తే ఎక్కువ కాలం మేనమామల యింట్లోనే గడిపేవాడు. చుట్టించూపుగా వొచ్చి తల్లితండ్రులతో గడిపే వాడు. అప్పటికి తన సవతి తమ్ముడు వివేక్‌ ఆరో క్లాస్‌లో మంచిమార్ములతో క్రమశిక్షణతో పెరుగుతూ అందరిచేత భేష్‌ అనిపించుకుంటే కలిగిన అసూయ, తల్లిదండ్రులు ఎంత ఆప్యాయతతో వాడికి సంతోషం, సంతృప్తి కలిగించాలని ప్రయత్నించినా వాళ్ళని.గౌరవించడం లేదు సరికదా వాళ్ళపట్ల నిర్లక్ష్య భావం పెంచుకున్నాడు.”

“చదువు సంస్కారం అబ్బేయి. అలా ్రవర్తించడం తప్పని, మాలాంటి వాళ్ళు పిలిచి బుద్ధి చెప్పొచ్చుకదా!” ॥

“ఆ ప్రయత్నం చాలాసార్లు చేసేను. వాళ్ళ మేనమామలు నేర్పిన పాటే వాడు పాడేవాడు. “మా అమ్మ స్థానంలో ఈ కోట్ల ఆస్తిని ఈవిడ మహారాణీలాగ అనుభవిస్తుంది. ఈ ఆస్తికి ఈ

... 2222222332 త2డడడత2డ2242424ఊ22ఊ2ఊఊఊ22 కకక] డన కు క

ర. కుర్రవెధవ నాకు భాగస్వామి. ఈవిడ చేతిలో మా నాన్న కీలుబొమ్మ. వాళ్ళు దర్జాగా తగలెయ్యగా మిగిలిందాంట్లో ఆవిడ దయాధర్మంతో ఏం పడేస్తే అదే నాకు గతి. కడుపు చేత్తో పట్టుకుని ఏదైనా ఉద్యోగం చేసుకోమని ఆయన ప్రబోధ! పెట్టుబడికి డబ్బిస్తే వ్యాపారం చేసుకుంటాను అంటే, నువ్వు ముందు ఉద్యోగంలో చేరి రాణిస్తే ఆ అనుభవంతో బిజినెస్‌ చేద్దుగానిలే అంటూ ఆయన ప్రబోధ అంటాడు.”

“రెటే కదా! ఏ అనుభవంలేందే ఏం వ్యాపారం చేస్తాడు?”

“వాడికి అనుభవం లేకపోయినా, అనుభవం వున్న వాడి మేనమామల్తో కల్సి వ్యాపారం చేస్తానంటాడు. అది ప్రసాదరావు కిష్టం లేదు. అసలు వరలక్ష్మిగారికే వాళ్ళ పుట్టింటివాళ్ళ జీవన సరళి మోద గౌరవం లేదు. వాళ్ళదంతా ఫిల్మ్‌ ఫైనాన్సింగ్‌, ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌లు, షేర్లు - దానికి సాయం తాగుడు, పేకాట జల్సాలు...”

“అదన్నమాట సురేష్‌ తండ్రి ఆస్తిలో భాగం కోసం దావా వెయ్యడానికి కారణం! అక్కడ నుంచి కథ నాకు తెలుసు. గత్యంతరం లేక అస్తి పంపకాల కొప్పుకుని, ఏ తండ్రీ ఆ వయస్సులో చెయ్యకూడనంత బెదార్యంతో పిత్రార్జితం, స్వార్దితం అన్న భేదం లేకుండా ఆస్తిలో సగభాగం ప్రసాదరావుగారు సురేష్‌కి రాసిచ్చేడు. ఆ దావా తాలూకు దస్తావేజు లన్నీ నా దగ్గరున్నాయి. విధం చెడ్డా ఫలం దక్కనట్టు కోట్ల ఆస్తి ఈ పదిహేనేళ్ళలోనూ హారతి కర్పూరం లాగ.....”

“వాడు చేసిన ఘనకార్యమల్లా రేఖ అనే ఇండష్టియల్‌ కెమిస్ట్‌ని (ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల తండ్రయ్యేడు. మొహం చెల్లక తల్లిదండ్రుల దగ్గిరకి వెళ్ళడు. భార్యా బిడ్డలు వెళ్ళ కూడదు. వాళ్ళేదైనా డబ్బూ దస్కం యిస్తే, వాళ్ళ మొహాన విసిరిపారేసేవాడు. ఇప్పుడు తాగుడు పేకాటకీ కూడా రేఖ సంపాదనే ఆధారం. ఇవ్వకపోతే కొట్టి లాక్కుంటాడు” అన్నాను.

“ఇలాంటి వాణ్ణి ఆ రేఖ ఎలా ్రేమించి పెళ్ళి చేసుకుంది?” అడిగేడు వెంకట్రావు.

“పదేళ్ళ క్రితం కెమికల్‌ టెక్నాలజిస్ట్‌ భాస్మర్‌తో సురేష్‌కి స్నేహమైంది. అతనో 'స్మాల్‌ స్కేల్‌ యూనిటొ జాగ్రత్తగా నడుపుకుంటున్నాడు. ఆ కంపెనీలో రేఖ ఉద్యోగం చేస్తుంది. ఆ పరిశ్రమని అభివృద్ధి చెయ్యడానికి కావాల్సిన పాతిక లక్షలు తను పెట్టుబడిగా పెతానని అందులో భాగస్వామిగా చేరేడు. ముందు పది లక్ష లిచ్చేదు. ఫిల్మ్‌ డిస్టిబ్యూషన్‌లో పెద్ద దెబ్బ తగిలి, రెందేళ్ళయినా మిగిలిన పదిహేను లక్షలకి చేతులెత్తేసేడు, అప్పు పుట్టక.

..... ఈలోగా రేఖని పెళ్ళి చేసుకున్నాడు.”

“ ఆ పెళ్ళయినా తల్లిదండ్రుల ఆశీస్సులతో....”

“వర్ణాంతర వివాహం. ఆ అమ్మాయి తల్లితండ్రుల కిష్టం లేదు. వీడి తల్లితందడ్రులకి చెప్పలేదు. రిజిస్టర్డ్‌ మేరేజ్‌ చేసుకున్నారు. (ప్రసాదరావు, సరస్వతి తెలుసుకుని డబ్బు, నగలు, దిట్టలు తీసుకెడితే విసిరేసి అవమానించేడు.”

“భాస్మర్‌ ఊరుకున్నాడా?” .

“సురేష్‌ మూలాన్ని అప్పటికే తనకి అయిదు లక్షలు నష్టం వాచ్చిన లెక్కలు చూపెట్టి క గ. ేడైడతఊ2222222222222222222ేె

యయ టై కంపెనీ నుంచి వెళ్ళగొట్టేడు. భాస్కర్‌ అనుమతితో రిజైన్‌ చేసేసి, మర్యాదగా రేఖ మరో కంపెనీలో ఉద్యోగం చూసుకుంది.”

“అసలు భాస్కర్‌ ముక్కూ మొహం తెలియని సురేష్‌ని...”

“భాస్కర్‌ తండ్రి ప్రసాదరావు నెరుగును. సురేష్‌ సామర్భాన్ని ఎరగడు. భాస్కర్‌ సురేష్‌ని అన్యాయం చేసేడనుకుంటాడేమోనని ఆయనెళ్ళి సంగతంతా (ప్రసాదరావుకి చెప్పేడు. వెంటనే ప్రసాదరావు అయిదు లక్షకి చెక్కు రాసి భాస్కర్‌ కిచ్చి, ఈ విషయం రహస్యంగా 'వుంచమనీ, సురేష్‌ ఎంతటి అభిమానధనుడో వివరించి సముదాయించి పంపేడు.”

“ఇలాంటి వాణ్ణి ఆ రేఖ ఎలా ప్రేమించి పెళ్ళి చేసుకుంది?

“అప్పట్లో ఆస్తులమ్మి అప్పులు తీరుస్తున్నాడని తెలియదు కాని, సురేష్‌కి చదువు, పలుకుబడి, పరిచయాలు, సొంత యిల్లు, కారు -- దర్జాగా వుండేవాడు. ఆ తర్వాత కూడా రెండు మూడేళ్ళ క్రితం వరకూ ఏలోటూ కనపడనివ్వలేదు. వాళ్ళకి ఆరేళ్ల కొడుకు, నాలుగేళ్ళ కూతురూను. ఆ తర్వాతే ఆర్థికంగా బాగా చితికిపోయి, మానసికంగా కృంగిపోయి, తన నుంచి తాను పారిపోవడానికి తాగుడుకి బానిసయ్యేడు” - అని సురేష్‌ చరిత్ర వివరించేను.

4 టు

సరస్వతి మరీ మరీ రమ్మని పిలిచింది. వెళ్లకపోతే బాగుండదని పద్మజని తీసుకుని బయళ్టేరేను. ప్రసాదరావు పోయిన పెన్నండో రోజున- వైకుంఠ సమారాధన తర్వాత మళ్ళీ యిదే వాళ్ళింటి కెళ్ళడం. ఆవిషాద ఛాయల జ్ఞాపకాలు యింకా నా మనస్సుని వెంటాడుతూనే వున్నాయి. సురేష్‌ మూలంగా యింకా ఏమి అల్లరి, అప్రతిష్టపాలవుతుందోనన్న భయంతో సలహాలు, సంప్రదింపులు కోసం వెంకట్రావు నాశ్రయించింది. అతను సమర్థుడు, 'శ్రేయోఖి లాషి. ఇంక ఆ విషయాల ప్రసక్తి సంభాషణలోకి రానివ్వకుండా, రెండు ఓదార్చు మాటలేవైనా అవసరమైతే పలికి, రెండు మెతుకులు గతికి బయట పడాలని ఆలోచిస్తూ పద్మజని కూడా హెచ్చరించేను.

(ప్రసాదరావింటిని దూరాన్నుంచి చూసి విస్తుపోయేను. చక్కని రూపురేఖలు సంతరించు కున్న నూతన భవనంలాగుంది. దానికి సాయం ఆ యింట్లో వాతావరణం, ఆవిడ అప్యాయత, ఆమె మొహంలో చిరునవ్వు చూశాక మనస్సు స్థిమితపడింది. ఈ బంగళాని సర్వాంగ సుందరంగా పునరుద్ధరించడానికి మూలస్తంభాలయిన గాయిత్రి, ఆమె భర్తని కూడా భోజనానికి

పిలిచింది.

డైనింగ్‌ హాల్లో కొసరి కొసరి వొడ్డిస్తూ మాతోనే ఆమె కూడా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూండగా భోంచేసేం. తర్వాత హాల్లో గోడలన్నీ నేను పరిశీలించడం సరస్వతి గమనించి నట్టుంది.

“ఎక్కడా ప్రసాదరావుగారి ఫోటో పెట్టలేదేమని ఆలోచి స్తున్నారా?” అంది.

అది నిజం!

“దానికి ముహూర్తం చూసి, మంచి ఫ్రేం చేయించి....” అని పద్మజ అంటుంటే...

“అలాంటి పని చెయ్యను. మా ఫోటోలు ఆల్బమ్‌లో నా వార్డ్‌రోబ్‌లో భద్రంగా 2222222222

వున్నాయి. ఆయన జ్ఞాపకాలే నా ఊపిరి. ఆ మధురస్మృతుల పరిమళంతో నా హృదయం నిండివుంది. నేనెప్పుడూ వంటరిదాన్ని కాను. ఆయన చిరంజీవిగా నాలోనే వుంటూ నన్ను నడిపిస్తూవుంటారు. ఆయన ఫోటో పెట్టి దండలేసి, అగరవత్తులు వెలిగించి పెట్టి వుంటే యీ గంటసేపూ యిక్కడ యింత సరదాగా గడిపేవాళ్ళం కామూ అంది నవ్వుతూ.

“యు ఆర్‌ రైట్‌ అప్పుడిక్కడ సంతాప సభ వాతావరణం నెలకొనేది. నీ సంస్కారాన్ని

భినందిస్తున్నాను అన్నాను. 6

వెంకట్రావు మార్చింగ్‌ వాక్‌కి రాలేదేమా అనుకుంటూ అతని యింటి మిదుగా తిరిగొస్తుంటే, గుమ్మంలో ప్రసాదరావు, అదే, సరస్వతి కారు కనబడింది. ఇంట్లో కెళ్ళడం ఎందుకని తటపటాయిస్తుంటే, కిటికీలోంచి వెంకట్రావు చూసినట్టున్నాడు - వెంకట్రొవూ, అతని భార్య, సరస్వతి వరండాలో కొచ్చి నన్ను లోపలికి రమ్మన్నారు.

“రండన్నయ్యగారూ కూర్చోండి. మంచి సమయాని కొచ్చేరు. మో ఆశీస్సులు కూడా కావాలొ అంది సరస్వతి.

“చిత్తశుద్ధి, ఆత్మ విశ్వాసం వున్నదానివి. నీకు కావల్సింది ఆ భగవంతుడి ఆళీస్సులు” అన్నాను

“భగవంతుడి ఆశీస్సులు నాకెప్పుడూ వున్నాయి. చిన్నతనంలో, పేదరికంలో చదువు కొనసాగదేమోనని భయపడ్డాను. ఈ సమాజం నన్నాదుకుంది. సమాజం భగవంతుని విశ్వ రూపం. ఆ రూపంలో నాకు సాయం చేసేడు. పెళ్ళవ్వదనుకున్నాను. వరలక్ష్మిగారు నాకు మాంగల్యభిక్ష పెట్టేరు. (ప్రసాదరావుగారి దయవల్ల మా గాయిత్రికి చదువు చెప్పించి, పెళ్ళి చేయగలిగేను. వివేక్‌ని కన్నాను. పెద్ద చదువు చదివించేను, పెళ్ళి చేసి స్టేట్స్‌కి పంపేను, వీటి వెనక ఆ భగవంతుడి అదృశ్య అభయహస్తం లేదంటారా!” అంది.

“కాని భగవంతుడు అంత నిర్ణయగా ప్రసాదరావుగార్నిలాగ తీసుకుపోతాడనుకోలేదు” అంది వెంకట్రావు భార్య,

“భగవంతుడెప్పుడూ దయామయుడదే. కష్టం సుఖం రెండూ ఆయన ్రసాదాలే, కష్టాలనుభవిస్తే కాని సుఖం విలువ తెలియదు. నేను ముఫ్పయ్యేళ్ళు ఆనందంగా దాంపత్య జీవితాన్నను భవించేను,. ఆయన డెభృ్ళయి రెండేళ్ళు జీవించేరు. ఆయన మరో పదేళ్ళున్నా సురేష్‌ గురించి దిగులుతో, శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యంతో, అశాంతితో జీవించవల్సి వచ్చును. అందుకే ఆ మహానుభావుడు అనాయాస మరణం పొంది, ఆ కుటుంబ గౌరవం కాపాడే బాధ్యత నా కప్పగించేరు. అదేనా లక్ష్యం, నా కర్తవ్యం” అంది.

“మో కుటుంబ గౌరవం కాపాడే బాధ్యత నీ వాక్తర్తిదీ కాదమ్మా, ఆ సురేష్‌లో పరివర్తన రావాలి. ముందు వాడీ కేసు నుంచి బయటపడాలి, కదా!” అన్నాను, సాధ్యాసాధ్యాలు బేరీజు వేస్తూ,

“బయట పడినట్లే. భాస్కర్‌ ప్రాణాలతో బయట పడటమే వాడి అదృష్టం” అన్నాడు వెంకట్రావు ధీమాగా.

క కథారాహిని - 200% చెడ 2222222

2

“భాస్మర్‌ భార్య కేసు ఉపసంహరించుకుంటుందా"”* అడిగేను.

“భాస్మర్‌కి ప్రసాదరావు దంపతులపైన అపారమైన గౌరవం వుంది. సురేష్‌ పట్ల జాలి తప్ప ద్వేషం లేదు. సురేష్‌ భాస్మర్త స్నేహం, సురేష్‌ రేఖ ఆ కంపెనీ నుంచి ఎందుకు వైదొలగవచ్చిందో, ఆ వివరాలన్నీ సరస్వతికి తెలుసు. ఆ దంపతుల చేతులు పట్టుకుని సరస్వతి ఆదరించడంతో భాస్కర్‌ భార్య కరిగిపోయి కేసు ఉపసంహరించుకొందుకు అంగీ కరించింది. దానికి సాయం ఆ కంపెనీ అభివృద్ధి చెయ్యడానికి కావల్సిన పెట్టుబడి ఎంతయినా సరే తను పెడతాననీ, సురేష్‌ రేఖలకు తిరిగి తన కంపెనీలో స్థానం కల్పించమని సరస్వతి కోరింది. అందుకు భాస్కర్‌ అంగీకరించేడు” అన్నాడు వెంకట్రావు.

“భాస్మ్కర్‌కి, సురేష్‌ భార్య రేఖకి మధ్య అక్రమ సంబంధం వుందనీ, భాస్మర్‌ రెండుసార్లు డబ్బు పట్టుకొచ్చి రేఖ కివ్వడం స్వయంగా చూశానని సురేష్‌ వాంగ్మూలం...” నా సందేహం చెబుతు న్నాను.

“భాస్కర్‌ యిచ్చింది రెండుసార్లు కాదు ఈ రెండు సంవత్సరాల్లో చాలా సార్హు, సురేష్‌ చూసింది రెండుసాల్లే. నిజానికి ఆ డబ్బు ఎక్కణ్డుంచి వాచ్చిందనుకున్నావు!” అని వెంకట్రావు నన్నడగడం, దానికి సమాధానమన్నట్లుగా సరస్వతి చిరునవ్వు చూసేకనా కర్ధ మైంది.

“*'ప్రసాదరావుకి తెలుసా?”

“తెలియదు. నేనిచ్చినట్లు చెప్పొద్దని, నా నగలమ్మి భాస్మర్‌ ద్వారా రేఖకి డబ్బు పంపించేదాన్ని* అంది సరస్వతి.

“మరి భాస్కర్‌ మోద అంత నీచమైన నింద....” అంటున్నాను.

“ఆస్తంతా తగలబెట్టుకొని, భార్య సంపాదన మోద బ్రతుకుతున్నాడు. ఆ దారిద్ర్యంలో, దురభిమానంతో, తాగుడు మైకంలో వొళ్ళు తెలియని ఆవేశంలో కత్తితో పొడిచేడు. తను చేసిన ఘాతుకాన్ని సమర్ధించుకోడానికి ఆ నింద వేసేడు” అన్నాడు వెంకట్రావు. .

“ఇప్పుడైనా సురేష్‌ దార్లో కొస్తాడంటారా?” అన్నాను.

“నిన్న జైల్లో భాస్కర్‌ సురేష్‌ని కలిసి జరిగినదంతా వివరించేడు. వాడు పశ్చాత్తాపంతో కంట తడిపెట్టుకున్నాడట.”

“వాడు మారితే అంతకంటే ఏం కావాలి! అటువంటి పుణ్యదంపతుల కొడుకు. వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది” అంది వెంకట్రావు భార్య.

“తప్పకుండా మారతాడు. వివేక్‌ నేను కన్నకొడుకు. వాడు సంపాదించుకుంటున్నాడు. వాడికే లోటు లేదు. సురేష్‌ నాకు జీవితాన్ని ప్రసాదించిన కొడుకు. అజ్ఞానంతో తప్పు చేసేడు. రెండు నెలలుగా జైల్లో వున్నాడు. ఆ శిక్ష చాలు. వివేక్‌ అంగీకారంతోనే, మిగిలిన ఈ యావదాస్తినీ అనుభవిస్తూ, సురేష్‌ రేఖ, పిల్లలతో నేను వుండటానికే ఈ యిల్లంతా బాగుచేయించి సిద్ధం చేశాను” అని సరస్వతి అంటుంటే ఆమె ముఖంలో కనిపించిన శాంతి, కాంతి.....

అ 2222221112 “ఫు క

దగా అ 5. కన్‌

బురదలోకి విసిరిన రాయిలా వుంది ఆ గుడిసె.

గుడిసె తుమ్మచెట్ల తోపులో వుంది. దాని వెనక నుంచి మురికికాలవ పారుతోంది. ఆ మురికికాల్వలో ప్రవహించే నీరు రకరకాల వాసనల్ని మోసుకెళ్తుంది. ఆ గుడిసెకు ఎడం ప్రక్కగా స్మశాన వాటిక వుంది. ఆ చుట్టుపక్కల వూళ్ల కంతటికీ అదే తుది యాత్రాస్థలం. అక్కడ వీచే గాలి ఎప్పుడూ కుళ్లి కంపు కొడుతుంది. అక్కడ నక్కలు పట్టపగలే స్వైర విహారం సాగిస్తూ వుంటాయి. ఆ గుడిసెకు కుడి ప్రక్కగా పెద్ద పెంటకుప్ప వుంది. ఆ కుప్పలో ఊళ్లోని చెత్తనంతా పోగుపెడతారు. ఆ పక్మనే మరో కుప్ప వుంది. అక్కడ ఊరి మనుషులు విసర్జించిన మలాన్ని పోగుపెడతారు. అందుకే అక్కడ పందులు నిత్యమూ కీచుకీచుమంటూ తిరుగుతుం టాయి. " అవి కెలికినపుడల్లా కుప్పమించి దుర్గంధం ముక్కుపుటాలు ఎగిరిపోయేలా వీస్తూ వుంటుంది.

అందుకనే బురదలోకి విసిరిన రాయిలా వుంది ఆ గుడిసె.

ఆ గుడిసెలో రెండు జీవాలుంటున్నాయి. ఆ రెండూ సమాజం ఊరవతలకి విసిరేసినవే. ఆ రెండూ ఆడజీవాలే. అందులో ఒక జీవికి ఎనిమిదేళ్లుంటాయి. అది కుక్కి మంచంలో ఇంకా నిద్రావస్థలోనే వుంది. రెండో జీవి పండుముసలి. “ముగ్గు బుట్టలాంటి తల, ముడతలు తేరిన దేహం” ఆమెది. ఆమె మంచానికి కొంచెం అవతలిగా కుంపటి ముందు కూర్చొని చలి కాచుకుంటోంది. ఆ యిద్దరూ ఊరవతలకి విసిరేసిన వాళ్ళే కాదు. సమాజం దరిద్రంలోకి విసిరేసిన వాళ్లే!

చమురు సంస్కారం లేని జుట్టూ, దేహాన్ని పూర్తిగా కప్పలేని చింకి వస్త్రాలూ వారి దారిద్ర్యాన్ని చాటుతూనే వున్నాయి. శరీరాలు సరేసరి!

సూర్యుడు బంగారు ముద్దలా పైకి లేస్తున్నాడు. తుమ్మచెట్ల సందుల్లోంచి ప్రాతః సంధ్య కాంతి లాంటి తొలి ఎండ తొంగి చూస్తోంది. ఆ యిద్దరూ బయటికి వచ్చి ఎండలో చలి కాగవచ్చు. అయినా మంచంలోని జీవి లేవలేదు. కుంపటి ముందున్న ముసలి జీవి కుంపటి వదల్లేదు. ఆ ముసలి జీవి ఎలాగూ రాలేదు కనుక బయటికి రాలేదేమో!!! ఆమె నడుం వంగి వుంటుంది. ఆ వైనం కుంపటి ముందు కూర్చున్నా తెలుస్తూనే వుంది. ముసలమ్మకి వయస్సు సడలినా కంఠ తీవ్రత మాత్రం సడలినట్లు లేదు. ఆ కంఠాన్ని కుక్కి మంచంలో పడుకుని వున్న సన్న జీవం మీదికి ఎక్కుపెట్టింది.

“ఏమే మొద్దుముండా! తెల్లారి యింతసేపైనా యింకా నిద్దురోతానే వున్నావు”

మొద్దు ముండ అసలు పేరు సీతామహాలక్ష్మి. పేరు మాత్రం వాళ్ల అమ్మ ఘనంగానే పెట్టుకుంది. పిలవటానికే బతికి లేదు. ముసబ్దయిలే ఎన్నడూ ఆ పేరుతో పిలవలేదు. ముద్దుగా 'మొద్దుముండా” అనే పిలుస్తుంది.

ఇప్పుడూ అలాగే పిల్చింది. 2తై2ైతడత౭త౭తడతడేతైనడతైడడడడతడడడైతడతడడతడతడ తతత. క కభరాంంి-101 2122222222

డాటా “ఉండు మామ్మా! సలెడతంది” అని సమాధానం చెప్పింది మొద్దుముండ. “నువ్వు సలిసలి అంటా తొంగుని వుంటే అక్కడ సలిదన్నం కాత్తా కాకుల కేసేత్తరు. అప్పుడు మనం యింక తొంగోటమే కాల్లు కడుపులో యెట్టుకుని” అంది ముసిల్టి “అవును కదా' - అనుకుంది మొద్దుముండ, కళ్ళు విప్పకుండానే. కళ్లు విప్పితే కన్నాల్లోంచి వచ్చే ఎండ పొడ కన్పిస్తుంది. ఎండ కన్పిస్తే లేవక తప్పదు. లేవటం యిష్టం లేదు మొద్దు ముండకి. అయినా లేచింది. లేచిందే తడవుగా అల్యూమినియం గిన్నె చేత్తో పుచ్చుకుంది ఊళ్లోకి వెళ్లటానికి. కాటికి కాళ్లు కాచుక్కూర్చున్నా కళ్లు బాగానే కన్పిస్తున్నట్టున్నాయి ముసిల్దానికి. “వెంపల మీద పాచి కడుక్కునెల్లు” అని చెప్పింది వెళ్లబోతున్న మొద్దుముండని ఆపి. “ఊళ్లో కెల్లాక కడుక్కుంటాలే మామ్మా. పంటకాలవలో నీల్లు బావుంటాయి. ఆ మురికి నీల్లతోటెవడు కడుక్కుంటాడు” అంటూనే బయటికెళ్లి పోయింది మొద్దు ముండ. “రోజూ ఆ నీల్లలోనే గదా గంటల తరబడి యీదులాడతది. మొకం కడుక్కోటానికేమైందిటి అనుకుంది అవ్వ కుంపట్లో వెచ్చదనం తగ్గినట్లుంది. చేత్తో నిప్పులు కెలికింది. నిప్పులు నివురు సడలి కొంచెం వెచ్చదనం తగలటంతో అరచేతులు కుంపటి మీద పెట్టుకుని చలి కాచుకుంటోంది. షష ల్ల పొద్దు పైకెక్కే వుంటుంది. పెంటబళ్లు ఒచ్చే వేళయిన గుర్తుగా పందులు 'కేర్‌కేరొమని అరుస్తున్న సద్దు విన్చించింది ముసలమ్మకు. తర్వాత ఏవో కార్లు ఆగిన చప్పుడు. “ఇక్కడికి కార్లెందుకొత్తాయబ్బా! అనుకుంది అవ్వ కార్లు తలుపులు పడిన శబ్దం, తర్వాత అడుగుల చప్పుడు బాగానే విన్సించాయి అవ్వకు. అడుగుల చప్పుడు క్రమంగా చేరువయ్యింది. తర్వాత - “ముత్యాలమ్మా! ఓ ముత్యాలమ్మా!!” “ముత్యాలమ్మగారూ! ఓ మామ్మగారూ!” ఎవరో పిలుస్తున్నారు. “ఎవరు కావాలి బాబూ....” అంటూ లోపల్నుంచే జవాబిచ్చింది అవ్వ “మీరేనండి మామ్మగారూ...”అంది ఓ కంఠం. “నేనయ్యుండదు బాబుగారూ... నన్నెవరూ అలాగా పిలవరు” అంది. “మీరే ముత్యాలమ్మగారూ....” అంటూ గుడినెలోకి వెళ్ళే ప్రయత్నంచేసేడో ఆసామీ. “లోపలి కొత్తన్నరేమో, ఒంగోవాలి బాబూ..... లేకపోతే పైని తగులుద్దొ అని సలహా యిచ్చింది అవ్వ అప్పటికే ఆ మనిషి లోపలికి వచ్చేశాడు. ముసలమ్మ లేవబోయింది. “లేవకండి.... లేవకండి....” “ఇంతకీ తమరెవరు బాబూ" అనడిగింది అవ్వ పడడు 122ఊ22ఊఒఓఒఓఊఊఊఊఊఊఊఊ21232ైడేడేేేెేెేేడైడడేడేడే

కట్టుకున్న తెల్లని ఖద్దరు పంచె, తొడుక్కున్న పొందూరు ఖద్దరు లాల్చీ చూదగానే అర్ధమైవుండాలి బామ్మకు. కాని, ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రవేశించిన ప్రతి డబ్బున్న అవే కడుతున్నాడాయె. ఎవరని అనుకోవాలి? అందుకే అడిగింది - తమరెవరని.

“నేనే మామ్మా! చిన్నకొపును” తను ఎవరో చెప్పుకున్నాడు చిన్నకాపు. సమే అనే వాద

  • ఆ వచ్చినవాడు చిన్నక్షాపే అయితే 'మామ్మా' అని పిలుస్తున్నాదేంటి? ఏమే” అ

, అనుకుని కాస్సేపు ఆ పది, తరాత తమాయించుకుని, గద అయ్య? నం పోల్చుకొనే లేకపోయాను బాబుగారూ... తమరిలా వచ్చారేంటి అయ్యగారూ!” అనడిగింది. ,

“ఏదో... నిన్ను చూసి పోదామని ఒచ్చాన్లే... ఇంతకీ బావున్నావా మామ్మా?....”

“ఏదో తమరి దయ. ఇలాగున్నాను బాబుగారూ”

“నీ కొడుకు ఏమైనా పంపుతున్నాడా?”

“నా కొడుకెక్కడున్నాడు అయ్యా...”

“బొంబాయిలో లేదూ...?” ం

ఆ మాట చురుక్కుమన్నది ముసలమకి.

“ఏమీ ఎరగనట్టే 'అడుగ్‌ళునా గ్రే బాబుగారూ... ఆడిని సంపించేసింది మీరే గదా! అడిని సంపించేసి ఆడి పెళ్లాన్ని సెర పట్టింది మీరు గాదా?” అనడిగింది ఒక్క గుక్కలో.

'ముసలి ముండకు అన్నీ తెల్సునే' అనుకున్నాడు చిన్నకాపు.

“నేనంటే కిట్టని వాళ్లెవరో అలా చెప్పివుంటారు...” అన్నాడు.

“వారం రోజులు 'అర్హాల్లు చేసారుగదా సామీ*

“వాళ్లే కిట్టని వాళ్లంటే...”

“ఏమయితేలెండి బాబుగారూ! అల్లిప్పుడు లేరుగదా?” ॥

“అలాగా? మిమ్మల్ని చూస్తే చాల జాలేస్తుంది మామ్మగారూ” అన్నాడు ముక్కు మూసుకునే.

అలాగా బాబూ!.... సరేలెండి. ఇంతకీ తవరొచ్చిన పనేవిటో చెప్పనే లేదు”

అప్పుడే ఒక వ్యక్తి గుడిసెలోకి దూసుకు వచ్చేడు. ఒచ్చి...

“మీకు తెలవదేమో మామ్మగారూ... చిన్నకాపుగారికి కొత్తగా అసెంబ్లీ సీటిచ్చారు. ఓటడగటానికి ఒచ్చారు" అని చెప్పేడు

“రమణ బాబుగారిలాగున్నారే,”

“అవును మామ్మా.. రమణనే”

“అదేంటి బాబూ... మొన్ననే గదా ఓటేసింది. అప్పుడు మీరు వరే అళ్లతో ఒచ్చారే”.

“ఇప్పుడు చిన్నకాపు వెంట వున్నానే. ఇంతకీ మీ సందేహం మొన్ననే ఓటేసామని. ఇప్పుడు మళ్లీ వెయ్యాల్లే! ఈసారి అసెంబ్లీకి, 'పార్లమెంటుకీ కూడా వెయ్యాలి” అని చెప్పేడు రమణ.

“ఊ... చూడు రమణా! త్వరగా తెముల్చు...” అన్నాడు ఆసహనంగా చిన్నకాపు. అతని చెయ్యి ఇంకా ముక్కు మీదనే వుంది.

రమణ అయిదు వంద రూపాయిల నోట్లు బయటికి తీసి, “నీ రేషను కార్టేది మామ్మా...?” తనక. 2 ధరా-2౧4 121212 222222 2222222222

అనడిగాడు. “ఎందుకు బాబూ...?” " “ఊరికేనే... మా దగ్గిర వుంచుతాం... ఎలక్షన్లయిపోగానే మీ కిచ్చేస్తాం. అది మా కిచ్చి. ఇదిగో అయిదొందలూ మీ దగ్గిర ఉంచుకోండి” అని నోట్లు ఆమెకు ఇవ్వబోయేడు. “ఒద్దులెండి బాబూ... నాకు రేషను కార్డు కూడా లేదూ” “అలాగా.......” అని రమణ నోట్లు తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు. కాస్సేపు చిన్నకాపు కళ్లూ, రమణ కళ్ళూ మాట్లాడుకున్నాయి. తర్వాత - “ఫర్వాలేదు మామ్మగారూ... ఈ డబ్బు మీ దగ్గిర ఉంచుకొని మీ ఓటు మాకే వెయ్యండి” అన్నాడు చిన్నకాపు. “మాడండి బాబుగారూ... నేను బీదదాన్నే.. దిక్కులేని దాన్నే... కాని, ఓటెప్పుడూ అమ్ముకోలేదు. ఆ డబ్బులేవో మీ దగ్గరే వుంచుకోండి అంది. చిన్నకాపుకు షాక్‌ తగిలినట్లయింది. ఏమీ మాట్లాడలేకపోయేడు. అతని అంగరక్షకుడు మాత్రం- న “సరే... ఇంకెవరొచ్చినా వాళ్లకి ఓటెయ్యొద్దు” “ఇంకెవరొత్తారు బాబూ ఇక్కడికి?” “ఒస్తార్లెండి.... ఒచ్చి ఏవేవో ఆశలు చూపిస్తారు. యిల్ల స్థలాలిస్తామంటారు. యిశ్లిస్తా మంటారు... అవేం నమ్మకండి...” “నమ్మకేంజేత్తాం బాబూ! అదొక్కటేగా మాకున్న జబ్బు. ఏం చెప్పినా నమ్మేసి ఓటేసేత్తాం... ఆ తరవాత మల్లీ కనిపించరు” అంది. “అమ్మ ముసిల్చి చురకేసిందే?” అనుకున్నాడు చిన్నకాపు “ఈసారి అలా జరగదులే. గూడెంలో తప్పకుండా రామాలయం కట్టిస్తాం...” అని ముక్కు మూసుకుని వెనక్కి తిరిగేడు చిన్నకాపు. 'నోరున్న మడుసులకే యిళ్లు లేవు. నోరులేని దేవుడికి గుడికట్టిత్తాడంట' అనుకుంది అవ్వ. వాళ్లు వెళ్లిపోయిన గుర్తుగా కార్లు కదిలిన చప్పుడు విన్సించింది. కుంపటి మరోసారి కదిపి ఇంకోస్తారి చేతులు వేడి చేసుకుంది. పొద్దు పైకెక్కింది. అయినా అవ్వ చలి కాచుకుంటూనే వుంది. ౨౦4 అరగంట గడిచింది. కార్ల మోత విన్పించలేదుగాని అడుగుల చప్పుడు మాత్రం విన్చించింది ముసలమ్మకు. అయితే, వాళ్తు చెత్తబిండి తాలూకు మనుషులేమో అనుకుంది. లేకుంటే శవవాహకులైనా అయి వుండాలి. ఎంచేతనంటే అ సమయంలో అక్కడికి ఎవరూ రారు, వాళ్లు తప్ప. కాకులూ, గెద్దలూ మాత్రం నిత్యవిహారం చేస్తూనే వుంటాయి. అవి మాత్రం కాదు. చేయి నుదుటికి ఆనించి బయటక్షు చూసింది. ఏమీ కన్పించలేదు. “చూపు తగ్గిందా ఏమిటబ్బా అనుకుంది... కాని, దగ్గరికి వస్తోన్న అడుగుల సవ్వడి వినిపిస్తూనే వుంది. మై టకెడడడకై 2221222242 డే” (గాక 1221222

“ముత్యాలమ్మా! లోపలున్నావా?”

ఈసారి మాటలు స్పష్టంగానే విన్సించేయి. అది ఆదినారాయణ కంఠం. అయినా-

“ఎవరూ?” అనడిగింది ముసలమ్మ.

“నేను ఆదినారాయణని”

“ఏంటి నారాయణా యిలా గొచ్చావు?” అనడిగింది.

అది పరామర్పో ఎత్తిపొడుపో అర్ధం కాలేదు ఆది నారాయణకు.

“ఎందుకొచ్చామో నీకు తెలవదేంటి? ఉప్పుడేగా చిన్నకాపూ వాళ్లూ ఒచ్చి వెళ్ళారు”

“అల్లు ఓట్లు కోసం ఒచ్చారు నాయనా”

“మేమూ అందుకే ఒచ్చాం. ఇది మన పార్టీ. పేదవాళ్ల పార్టీ. చిన్నకాపు లాగ మాకు ఆర్థిక బలం లేదు. మీలాంటి వాళ్ల అండదందలే మాకు బలం. అందుకనే నిన్ను ఓటడగటానికి ఒచ్చాం”

“అది నిజమే నారాయడా. ముందుగాల అయిదెకరాల్లూ, ఆవూ అన్నాడు. నిజమే - కామోసనుకుని ఓటేసాము. తర్వాత అది మార్చి మరేమో అన్నారు. అదీ నమ్మాము. ఎన్నిసార్లు ఓటేసినా మీరేమీ సెయ్యలేదు నాయ్నాా కనీసం పలకరించటం కూడా మర్చిపోయారు. ఒకప్పుడు మీరంతా మా తోటే వుండే వారు. ఉప్పుడు మేడల్లో కెల్లిపోయారు. ఇంక మేమేం కనబడతాం నాయనా మీకు” అంది.

అమె మాటకి సమాధానం లేదు ఆదినారాయణ దగ్గిర. నాయకులు చేసిన తప్పులకు కార్యకర్తలు తల యివ్వక తప్పదు మరి! ఏదో ఒకటి చెప్పాలి గనుక -

“నువు అన్న మాటలన్నీ నిజమే మామ్మా! మేం నిజంగా అధికారంలోకి వస్తే నువు అన్నట్లే చేసి వుండే వాళ్లం. కాని, ఎప్పుడూ అధికారంలోకి రాలేదే. కాన్ని రాష్ట్రాల్లో ఒచ్చినా, రాజ్యుంగ పరంగా రాజ్యం చేయాలే తప్ప వేరువిధంగా చేయడానికి లేదు. మీరంతా మాకు పూర్తి అధికారం ఇవ్వండి. అప్పుడు ఏమీ చేయలేదని నిందించండి” అన్నాడు.

“సరేలే నాయ్య్నా! ఏదో మాటవరసకి అన్నానే! అలాగే” అంది ముసిల్లి

“మర్చిపోకండి”

.__ “మర్చిపోతానా నారాయడా. మిమ్మల్నే కదా మేము నమ్ముకున్నది. మీరేమీ చెయ్యలేక షోయినా ఎప్పుడూ పలకరించక పోయినా మా వోటు మీకే”

వీళ్లు ఏమీ చెయ్యక పోయినా కనీసం అరుస్తున్నారు. తన కొడుకూ వీళ్లతో బాటు ఉద్యమంలో పనిచేసినవాదే. ఊరి మోతుబరుల్ని ఎదిరించాడని వాడిని చంపేశారు. అప్పుడు వీళ్లే కదా అరిచి సమ్మె చేసింది. తర్వాత తన కోడల్ని చెరబట్టి చంపేసినప్పుడు కూడా పెద్ద ఉద్యమం లేవ దీశారు. అయినా చేసేదేం లేక్క కనీసం ఆమె చావుకు కారణం ఎవరో నలుగురికీ తెలిసేట్టు. అరిచారు. అంతే చాలనుకుంది అవ్వ .

వీళ్లతో వున్న కుర్రకారంతా వీళ్లని ఒదిలేసి డబ్బున్న వాళ్ల వెంట పోతున్నారు. ఎందుచేత? ఏమీ అర్ధం కాలేదు ముసలమ్మకు. అర్ధం కాకపోవడం ఏమిటిలే!' డబ్బే సర్వస్వం. అది వీళ్ల దగ్గర లేదుగా!

పొద్దు పైకెక్కింది. ముసలి పొట్టలో రైళ్లు పరుగెడుతున్నాయి. మనవరాలేమో యింకా క భం -10+ 2222222

లాటి ఇంటికి చేరలేదు. ముసలమ్మ మెల్లిగా లేచి, గూనె మీది గుడ్డను సరిచేసుకుని కుక్కి మంచంలో నడుం వాల్చింది. ఆమె వయస్సుకి ముదుసలి. ఆలోచన్లకు కాదు. ఆమె ఆలోచన్లు వెనక్కి పోయేయి. కాలు మీద కాలేసుకుని బతకాల్సిన సమయం ఇది. అన్నవాళ్లు ఆదరించాల్సిన వయస్సిది. ఊరి మధ్య.... పెంకుటి కొంపలో వెచ్చగా బతకాల్సిన సమయం. అంతా పోయింది- తిండిపెట్టే ఆస్టీ పోయింది. ఆదరించాల్సిన కొడుకు, వాడిని కట్టుకున్న పాపానికి కోడలూ పోయేరు. చివరికి ఊరి చివర పూరి గుడిసెలో బతకాల్సి వచ్చింది. అందుకు కారణం కొడుకేనని నిందించలేదు ఆమె. ఉన్నదానితో తృప్తి పడటం అందరికీ చాతకాదు. అందరి బతుకులూ బావుండాలని కొందరు ఆశిస్తారు. అలాంటి కోవలోని వాడే తన కొడుకు, బాగా చదువుకున్నాడు. చేస్తే మంచి ఉద్యోగమే వచ్చేది. కాని, వాడు ఊరిని ఉద్దరించాలనుకుంటే ఉద్యోగం ఎలా చేస్తాడు? లేనివాళ్లనందర్నీ కూడగట్టేడు. వాళ్ల హక్కు లేమిటో తెలియజెప్పేడు. వాళ్లు అలా వుండటానికి కారాణాలోవిటో తెలియజెప్పేడు. ఉన్నవాళ్ల మీద తిరగబడ్డాడు. పర్యవసానంగా చిన్నకాపుకు పెద్ద కోపమే వచ్చింది. వాడి పెళ్ళికి అయ్య చేసిన అప్పుని లెక్క మోద లెక్కగట్టి ఆస్థంతా కాజేసాడు చిన్నకాపు. ఊళ్లో ఉన్నవాళ్ల ఒత్తిడికి తట్టుకోలేక కుర్రకారంకా తన కొడుకుని ఒదిలేశారు. వాడు మాత్రం కష్టజీవుల మాద గురిని ఒదులు కోలేదు. బొంబాయిలో కార్మిక సంఘాలు నడపాలని బయల్టేరేడు. వాడు అక్కడికి చేరకముందే చిన్నక్షాపు చంపించేసేదు. వాడు ఎలా పోయేదో, ఎందుకు పోయేదో అందరికీ తెల్సు! కాని, లాభం? లెక్కలు తారుమారు చేసినా చిన్నక్రాపు అప్పు తీరలేదు. అందుకు తన కోడల్ని ఇంటిలో పని చెయ్యమన్నాడు. వారం రోజులు పని చేసిందో లేదో ఉరిపోసుకు చనిపోయింది కోడలు. ఆమె ఎందుకు చనిపోయిందో, ఎలా చనిపోయిందో కూడా అందరికీ తెల్సు. చిన్నకాపుకు అంతకంటే బాగా తెల్పు. కోడలు చనిపోయింది కాబట్టి అప్పు తీరలేదు. అందుకు యిల్లు స్వాధీనం చేసుకున్నాడు. ఊరంతా అతని మాట మోడే నడుస్తుంది కాబట్టి ఎవరూ నోరు విప్పలేదు. అంతచేసిన చిన్నకాపు నోరు విప్పి తనని ఓటడగటానికి వచ్చేడు. వెయ్యదని అతనికీ తెల్సు. వెయ్యకూడదని ముసలమ్మకూ తెల్సు. అయినా ఇద్దరూ ఎవరి పరిధి విడిచి వారు ప్రవర్తించేరు. పరిధి దాటలేనివారు మాత్రం అక్కడికి రాలేదు. విజయం తమదేనని వారి నమ్మకం. “ఈసారి ఖచ్చితంగా సెంటర్లో మనదే రాజ్యం” అన్ని ఎవరో అంటూండగా విన్నది మొద్దు ముండ. ” ఎవరు ఎక్కడ రాజ్యం చేసినా ఆమెకూ, ఆమె లాంటి వాళ్లకూ ఒక్కటే. నిర్వికారంగా గుడిసె , చేరింది మొద్దుముండ. ఆమె గుడిసెలోకి దూరగానే అడిగింది అవ్వ - “మల్లీ ఎలచ్చన్లొచ్చాయేంటే, అందరూ మన గుడిసెకే ఒత్తన్నారు.” “కాబోసు మామ్మా” అంది మొద్దుముండ. అ 2222ఊ2222డ2త222ఊ2222222డడడ222ేెేేేే క

న. “విధివంచితులు అ ౨నుంధీర్‌

స్కి జుత్తుకు నల్లరంగు వేసింది. ముఖానికి క్రీము పులిమింది. పెదాలకు లిప్‌స్టిక్‌ అదిమింది. ఐశ్వర్యారాయ్‌లా చీర కట్టింది. మాధురీ దీక్షిత్‌లా వయ్యారాల నడకతో డ్రాయింగ్‌ రూంలోకి వచ్చేసరికి అక్కడ టీవీ చూస్తున్న కుటుంబ సభ్యులందరూ వెనక్కు తిరక్కుండానే వాతావరణంలో ఏదో మార్పును ఫీలై అదేమిటో తెలుసుకుందుకు ఒక్కుమ్మ డిగా వెనక్కు తిరిగారు.

అంతే - వాళ్ళు కన్నార్చకుందా సీతమ్మనే చూస్తూ ఉండిపోయారు - సీరియల్‌ సంగతి

“నన్ను గుర్తుపట్టలేదుట్రా - నేను సీతమ్మనే” అంది సీతమ్మ గొప్పగా.

అక్కడ సీతమ్మ అన్నా వదినెలున్నారు. తమ్ముడు, మరదలు ఉన్నారు. అన్నగారి కునుమరాలు, తమ్ముడి మనుమడు కూడా ఉన్నారు. వాళ్ళలో ముప్పై ఏళ్ళ లోపు వాళ్లెవరూ

రు.

“ఏమయిందే నీకు?” అన్నాడు అన్నయ్య,

“అక్కా - ఇలా చాలా బాగున్నావే - నిజంగా చిన్న పిల్లలా ఉన్నావు” అన్నాడు తమ్ముడు.

“చిన్న పిల్లంటే - నాకే చెల్లెల్లా ఉందొ అన్నారు అన్నగారి మనుమరాలు, తమ్ముడి మనుమడు ఒకేసారి.

స తెలుసు. అందుకే ఇక మోదట ఇలాగే ఉంటాను....” అంది సీతమ్మ తృప్తిగా.

“ఏమయిందే నీకు?” అ అ మ

సీతమ్మ నవ్వి, న్ను న్న మొహమాట పదేదాన్నేమో - ఇప్పుడు నాకే సంకోచమూ లేదు -నా (ప్రేమ గురించి చెప్పడానికి” - అంది.

అప్పుడందరూ తెల్లబోయారు. తేరుకుని అది వేళాకోళంగా తీసుకోవాలనుకున్నారు కానీ సీతమ్మ తన ప్రేమికుడి పేరు పేర్రాజు అని చెప్పేసరికి మళ్ళీ తెల్లబోయారు.

ఒకప్పుడు వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. డబ్బుకు ఆశపడి తండ్రి సీతమ్మను ఓ రోగిప్టికిచ్చి పెళ్ళి చేసాడు. వాడు సంసార సుఖాన్నివ్వకుండానే సీతమ్మను విధవరాలిని చేసి వెళ్ళిపోయాడు. ఆ కుటుంబానికి బోలెడు డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో కుటుంబం బాగు పడింది. ఇంటిల్లపాది ఆకాశాని కెత్తేస్తూ పౌగిదేస్తూంటే ములగ చెట్టెక్కిన సీతమ్మను కిందకు దింపే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి 'పేర్రాజు. అప్పటికి పాతికేళ్ళ వయసులో ఉన్న సీతమ్మకు మగతోడు అవసరం అర్థమై పేర్రాజును (ప్రేమించాను కాబోలు అనుకుంది. కానీ తలిదండ్రులు పేర్రాజు మోసగాడంటూ నచ్చజెపితే కూడా కాబోలు అనుకుంది. అలా కధూూ-:౧౫ ౬౬న

లాకు ఎన్నింటికో కాబోలు అనుకుంటూ తాను మాత్రం అశుభానికి చిహ్నంగా మిగిలిపోయి ఆ యింట్లో అన్ని శుభకార్యాలకూ మూలమయింది.

... పేర్రాజు వేరే పెళ్ళి చేసుకుని విదేశాలు వెళ్ళిపోయాడు. బాగా డబ్బు సంపాదించాడు. వంశవ్చక్షాన్ని వృద్ధి చేశాడు. పదేళ్ళ క్రితం అతడి భార్య చనిపోయింది. మనశ్శాంతి కోసం సీతమ్మకు ఉత్తరం వ్రాసాడు. ఆమె బదులివ్వలేదు. రెందేళ్ళ తర్వాత మళ్ళీ ఉత్తరం వ్రాసాడు. దానికీ సీతమ్మ బదులివ్వలేదు. తానింకా ఆమెను (ప్రేమిస్తున్నాననీ, పెళ్ళి చేసుకుంటాననీ ఉత్తరం రాసాడతడింకో రెందేళ్ళ తర్వాత. ఆ ఉత్తరాన్ని సీతమ్మ అన్నకు చూపిస్తే ఈ వయసులో నీకు పెళ్ళేమిటన్నాడు అన్నయ్య కాబోలనుకుంది సీతమ్మ.

ఇటీవలే పేర్రాజు మళ్ళీ ఉత్తరం రాసాడు. “నేను ఇండియాలో స్థిరపడాలనుకుంటున్నాను. నా వాళ్ళెవ్వరూ నాతో రావడానికి సిద్దంగా లేరు. నాకు తోడు కావాలి. నీ నుదుట కుంకుమ మెరవాలి. ఇదీ నా కోరిక. ఈ ఉత్తరానికి జవాబు రాకపోతే నువ్వు అంగీకరించినట్లే భావి స్తాను. ఈ నవంబరు నెలాఖరుకి నేను, నా మనమడు ఇండియాకి వస్తున్నాం. ఈ వయసులో మనకు పెళ్ళి ఎందుకవసరమో, ఎంత అవసరమో నా మనుమడు నీకు వివరంగా చెబు తాడు. వాడి వాక్ళాతుర్యం గొప్పది. అంతా వాడిది పూర్తిగా నా పోలికంటారు. అయితే నీ ముందు మాత్రం నేను మూగవోతాను. అందుకే వాణ్జి వెంటబెట్టుకుని వస్తున్నాను. డిసెంబర్లో మనం పెళ్ళి చేసుకుందాం -*

ఈ ఉత్తరం అన్నకు చూపించింది సీతమ్మ. ఈసారి ఆ ఉత్తరం ఇంటిల్లిపాదీ చూసారు. దాని మిద చర్చలు జరిపారు. చివరకు ఆ ఉత్తరమో జోకు అని తేల్చేశారు. సీతమ్మ ఊరుకుంటే కాబోలనుకుందనుకున్నారు కానీ ఆ రోజుకిలా తయారై వచ్చింది.

“అంటే పేర్రాజూ నువ్వూ నిజంగానే పెళ్ళి చేసుకుంటారా - ఈ వయసులో” అన్నాడు అన్న

“ఒరేయ్‌ - అన్నయ్య - ఈ వయసు అంటున్నాడు. నీ దగ్గర పోలరాయిడ్‌ కెమెరా ఉందిగా - ఇప్పుడు నాదో ఫోటో తీసి అందరికీ చూపించరా - ” అంటూ సీతమ్మ తమ్ముడి మనుమణ్ణి పురమాయిస్తే వాడు క్షణాల మిద ఫోటో తీసిచ్చాడు. అది చూసి, “భీ - ఇది నా ఫోటో కాదు. నీ కెమెరాలో ఏదో డిఫెక్టుంది. లేదా నువ్వు జోక్‌ చేస్తుండాలి” - అందామె. కానీ అక్కడున్న అందరూ ఆ ఫోటో ఆమెదేనని మరీ మరీ నొక్కించారు. సీతమ్మ ఏ మాత్రమూ చలించక, “అన్నింటికీ నిజం కాబోలనుకొని తలాడించే పాత సీతమ్మని కాను నేను. నా నిజ న్వరూపాన్ని అద్దంలో చూనుకున్నాకనే మి దగ్గర కొచ్చాను. అదెలా ఉందో చూపిస్తాను...”అంటూ ఆమె తన గదిలోకి వెళ్ళి ఓ ఫోటో తెచ్చి వాళ్ళకు చూపించింది. ఆ ఫోటో చూసి వాళ్ళు తెల్లబోయారు. అది సీతమ్మ టీనేజరుగా తీయించుకున్న ఫోటో.

ఇంట్లో వాళ్ళందరూ ముఖముఖాలు చూసుకున్నారు. సీతమ్మ వాళ్ళ వంక జాలిగా చూస్తూ, “నాకంటూ వేరే జీవితమేర్చడినంత మాత్రాన మోరు నా జీవితంలో భాగం కాకుందా పోతారనుకుంటున్నారా? మనమెప్పటికీ కలిసే ఉంటాం. పేర్రాజు కూడా మనతోనే ఉంటాడు. ఈ విషయంలో మోకేమైనా సందేహాలుంటే అవి రేపు పేర్రాజు తీరుస్తాడు -” అంది.

మర్నాడు పేర్రాజు మనుమడితో కలిసి వచ్చాడు. సీతమ్మతో ఏకాంతంగా మాట్లాడానికి చ్‌] చటక

మనుమజణ్జి పంపించాడు. ఇద్దరూ ఓ గదిలోకి వెళ్ళేక ఆ కుగర్రాడేదో చెప్పబోతే, “నువ్వింకేం చెప్పకృళ్లేదు. నేను నిన్ను, పెళ్ళి చేసుకుందుకు సిద్ధంగా ఉన్నాను -” అంది సీతమ్మ.

“నన్ను కాదు. తాతయ్యని” సవరించాడు పేర్రాజు మనుమడు.

“నువ్వే తాతయ్యవి” - నాక్కించింది సీతమ్మ.

“తాతయ్య డ్రాయింగు రూంలో ఉన్నాడు..”- కంగారు పడ్డాడు మనుమడు.

“ఛీ - ఆ ముసలాడు పేర్రాజేమిటి? నువ్వే పేర్రాజువి”” నమ్మకంగా అంది సీతమ్మ.

అచ్చం తాత పోలికలతో ఉన్న మనుమడు పేర్రాజు కాదని ఆమె నెవరూ ఒప్పించలేక పోయారు. ఆ మనుమదైనా ఆమెను పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకునే వాడేమో - ఆమె తాననుకుంటున్న ఫోటోలో రూపమే ఇంకా కలిగి ఉంటే....

సీతమ్మ పెళ్ళి ఆగిపోయింది.

న | .

“ఫణి బాగుపడి పోతున్నాడు. వాణ్ణి పడగొట్టాలి-” అన్నాడు మల్లయ్య.

“సార్‌ - ఫణికి ఊర్నిండా మంచి పేరుంది. ఆయన్ను దెబ్బ తీయాలనుకుంటే మనమే దెబ్బ తింటాం +” అన్నాడు అసిస్టెంటు.

“మనం దెబ్బ తీయం. ఇంకెవరిచేతో తీయిస్తాం-” అన్నాడు మల్లయ్య.

“ఊళ్ళో అందరూ మనవల్ల కనీసం ఒక్కసారైనా మోసపోయారు. అంతా మనకు విరోధులే అయి కూర్చున్నారు. ఇప్పుడు మన మాటెవరు వింటారు?”

“మనం ముందు రాఘవరాజును కలుసుకుందాం. గతంలో చేసిన తప్పులన్నింటికీ క్షమించమని అడుగుదాం. చాలా కష్టాల్లో ఉన్నామనీ, డబ్బు సాయం కావాలనీ చెబుదాం...”

“అంటే చేస్తారా సార్‌!”

“చెయ్యరుగానీ సంతోషిస్తారు. మనంతటి వాళ్ళకు డబ్బు సాయం కావాలంటే మనం పడిపోయినందుకు మనసులో తెగ ఆనందపడతారు. మనం కూడా సాయం వాళ్ళనడగం. ఫణి చేత చేయించమందాం. చాలామందికి మధ్యవర్తిత్వమంటే తెగ ఇష్టముంటుంది. రాఘవరాజు మనకు ఫణి చేత అప్పు ఇప్పించడానికి ఉత్సాహంగా ముందుకొస్తాడులో

“ఫణి ఇస్తాడంటారా?”

“నేను చెడ్డవాజ్జని ఒప్పేసుకుంటాను. వాడి మంచితనాన్ని పౌగిదేస్తాను. నాకు అప్పిస్తే శత్రువు క్కూడా నమ్మి డబ్బు సాయం చేసిన పేరొస్తుందని ఆశపడతాడు ఫణి. మనం పెద్ధ మొత్తం అప్పు తీసుకుని ఎగేస్తాం. అంతేకాదు - ఆ డబ్బుతో ఫణిని దెబ్బతీసే పనులు కూడా చేద్దాం. ఫణి, రాఘవరాజు కొట్టుకుంటారు. వీలుంటే మనమే వాళ్ళిద్దరికీ మధ్యవర్తిత్వం చేయొచ్చు......”

“ఏమో సార్‌ - ఊళ్ళో మిమ్మల్నెవ్వరూ నమ్ముతారని నాకు తోచదు. మో ఆశలు నిజం కావు. మోరనుకున్నదేమీ జరుగదు” అన్నాడు అసిస్టెంటు.

“ఇందాకట్నుంచి చూస్తున్నాను. నేను పాట పాడుతూంటే ఇన్‌స్తుమెంటల్‌ మ్యూజిక్‌లా తగుల్కుంటున్నావు - నేను మోసగాణ్జి, మోసగాణజ్టి అంటూ - ఇక నాకు చిర్రెత్తు కొస్తోంది. ఇంతకీ నా ప్లానంతా అమలుచేయాల్సింది ,నువ్వేనని తెలుసా నీకు?” కై శథావాహిని - 2004 2౩32222222

2

“నేనా - ఇంతవరకూ మితో చేతులు కలిపి ఎన్నో వెధవ పనులు చేసాను. ఇకనా వల్ల కాదు...”

“వల్లకాదంటే వల్లకాటికి పంపిస్తాను-” హూంకరించాడు మల్లయ్య

“ఈలోగా నేను ఫణి దగ్గరకు వెళ్ళిపోయి ఆశ్రయం కోరతాను. మీ చెడ్డతనానికి భయపడ్డం కంటే ఆయన మంచితనానికి తల వంచడంలోనే నా భవిష్యత్తుకు దారి కనపడుతుందని నాకు అనిపిస్తోంది -” అని వెళ్ళిపోయాడు అసిస్టెంటు.

మల్లయ్య దుర్మార్గానికి ఆదిలోనే హంసపాదు - మొదటిసారిగా!

చిలి 6

“నా కోడలు శాపవశాన మనిషిగా పుట్టిన దేవత. అందుకే ఆమె పోతే అత్తగారు కూతురు పోయినట్లుగా ఏడుస్తోంది. అసలే మంచం పట్టిఉన్న నా కొడుకు భార్య చావుకు మరింత కృంగిపోయి కోలుకోలేకుండా ఉన్నాడు. నా మనుమడు కల్లి కోసం బెంగపెట్టు కుని తనకు కొత్తగా పెళ్ళయిందన్న ఉత్సాహాన్ని కూడా మర్చిపోయి నీరసంగా ఉంటున్నాడు. అందుకే నీ దగ్గరకు వచ్చాను” అన్నాడు నరసింహం.

“నేనేం చెయ్యాలి?” అంది స్వర్ణముఖి. ॥

“నా భార్యకు దిగులు పోగొట్టాలి. నా కొడుకులో కొత్త జీవాన్ని నింపి జబ్బు నుంచి కోలుకునేలా చెయ్యాలి. నా మనుమణ్ణి హనీమూన్‌కు పంపాలి-” అన్నాడు నరసింహం.

“ఇవన్నీ నా వల్ల ఎలా అవుతాయి?”

“నువ్వు మా యింటికి నా కోడలి రూపంలో రావాలి” అన్నాడు నరసింహం.

“నేన్సు - మా కోడలిగానా-” ఏ క్రీమూ రాయకుందానే ముఖం తెల్లబడింది స్వర్ణముఖికి.

స్వర్ణముఖి కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. అందమైన, అమాయకమైన ముఖం కారణంగా ఆమె వయసు కంటే చిన్నగా కనబడుతుంది. ఆమె ఇప్పుడు పొతికేళ్ళకు తక్కు వుండని ఓ కుర్రాడికి తల్లిగా, తన కంటే పెద్ద వయసు కుగ్రదానికి అత్తగా నటించాలి.

“మా యింటికి నువ్వే కావాలి. ఎందుకంటే నువ్వు అచ్చం మా కోడలిలా ఉన్నాను... అంటూ నరసింహం ఆమెకు కొన్ని ఫోటోలు చూపించాడు. వాటిలో ఆ ఇంటి కోడలు టీనేజి నుంచి యాభై దాకా వివిధ దశల్లో కనపడింది. టీనేజి ఫోటో అచ్చం స్వర్హముఖి ఫోటోలానే ఉంది. .

“నాకు ముసలి వేషం వెయ్యడం ఇష్టం లేదు. నేను కాలేజీ మానడానికి వీల్లేదు. మోరెంత డబ్బిచ్చినా నేనీపనికి ఒప్పుకోను -...”అంది స్వర్ణముఖి.

న ముసలి వు వెయ్యొద్దు. కాలేజీ మానొద్దు. ఇప్పుడెలాగున్నానో అలాగే మ ఇంటికి రా. నువ్వు డబ్బు మనిషివని నేను అనడం లేదు. కానీ మీ నాన్నకు గుండె రప చేయించాలిగా. నువ్వు నాకీ సాయం చేస్తే నేను నీకా సాయం చేస్తాను....”అన్నాడు న ల.

“కానీ వాళ్లందరూ నన్ను మో కోడలిగా నమ్ముతారా?” - మ

“నేను చెబితే నమ్ముతా. నా కోడలు రైలు, ప్రయాణంలో మరణించింది, దుస్తు్ని బట్టీ శవాన్ని గుర్తు పట్టేమప్పుడు. నువ్వు చావలేదనీ గతం మరిచి కాలేజీలో చేరావ 222ఊఊఊఊఒఊఊఊ2ఊ2ై23=-2

చెబుతాను. డాక్టర్‌ చేత మానసిక చికిత్స చేయించగానే నీకు గతం గుర్తుకొచ్చిందంటాను. నువ్వునా కొడుకుని తాకనవసరం లేదు. (ప్రేమగా పలకరిస్తే చాలు. నా మనుమణ్ణి కొడుకులా దగ్గరగా తీసుకో. అందరూ నిన్ను నా కోడలి స్థానంలో గౌరవిస్తారు....”

ఆవసరం కొద్దీ మాత్రమేకాక ఓ కుటుంబానికి సాయపడుతున్నానన్న తృప్తికి కొత్త అనుభవం (థ్రిల్‌ కోరే టీనేజి స్పిరిట్‌ని జతచేసి అన్నింటికీ ఒప్పుకుంది స్వర్ణముఖి.

ఆ తర్వాత అంతా ,.నరసింహం చెప్పినట్లే జరిగింది. నరసింహం ఇంట్లో అందరూ ఆమెను 'ఉదయ'గా గుర్తించి మహదానందపడి పోయారు.

ఆ యింట్లో స్వర్ణముఖి కోడలిగా, భార్యగా, అమ్మగా, అత్తగా అందరి అభిమానాన్నీ ఆప్యాయతనీ అందుకుని మురిపిసోతూనే - తండ్రికి ఆపరేషన్‌ చేయించింది. మంచి మార్కులతో ఇంటర్‌ ప్యాసై ఎంసెట్‌కు ప్రిపేరవుతూ తన భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటోంది.

క

మంచి జరిగినా చెడు జరిగినా భక్తులు దేవుణ్ణి తలచుకుంటూనే ఉంటారు. ఆ భక్తుల్లో సీతమ్మ, మల్లయ్య, నరసింహం కూడా ఉన్నారు. పాల సముద్రంలో శేషపాన్సుపై పవళించిన శ్రీమహావిష్ణువుకు పాదాలొత్తుతూనే ఈ భక్తుల తీరుతెన్నులు గమనించిన శ్రీమవాలక్ష్మి ఎంతో ఆశ్చర్యపడి, “స్వామి! మా లీలలు ఈ ఆధునిక కలియుగంలో మరింత విచిత్రంగా ఉంటున్నాయి-లొ అంది. _

శ్రీ మహావిష్ణువు మందహాసం చేసి, “విజ్ఞానంలో సాధించిన ప్రగతితో మనిషి నన్నె మించిపోయేలా ఉన్నాడు. గత యుగాల్లో విజ్ఞానం సామాన్యులను చేరకుండా దాన్ని బుషులకు మాత్రమే పరిమితం చేసాను. ఇప్పుడు విజ్ఞానం సామాన్యులందరికీ అందు బాటులోకి వచ్చేస్తోంది. ఇలాంటప్పుడు సామాన్యుడి ప్రగతిని అదుపు చేయడానికి ఓ మార్గం కనిపెట్టాను. అదే బుల్లితెర. అందులో సీరియల్సు. వాటిలో కథలకు కాళ్ళు చేతులే కాదు, పాత్రలకు కాలమూ, వయసూ కూడా ఉండవు. ఆ విధంగా ఓ గర్భవతి ఎన్నేళ్ళయినా బిడ్డను కడుపులో మోస్తుంది. అంతర్జాతీయ వ్యాపారవేత్తలను కూరగాయలమ్మేవాడు తన ఎత్తులతో చిత్తు చేస్తూంటాడు. ఇలాంటి అసందర్భాలెన్ని ఉన్నా సామాన్యుడు నిరంతరంగా వాటిని చూస్తూ ఆలోచనా శక్తినీ కోల్పోయి మానసికంగా ఎదుగుదల లేక సామాన్యుడిగానే మిగిలిపోతాడు. ఆధునిక కలియుగంలోని సామాన్యుడు కూడా కృతయుగంలోని సామాన్యుల లాగే ఉండిపోవదానికి నేను చేసిన ఏర్పాటిది - ” అన్నాడు.

“స్వామి! మీ లీలల నర్ధం చేసుకోవడం కష్టమే. అయితే ఈ విధంగా మీరుమీ భక్తుల్ని వంచించడం న్యాయమా? మో కారణంగా వారు అసందర్భాలకు తలపడుతున్నారు. అసాధ్యాలకు ప్రయత్నిస్తున్నారు. కొందరిని జయం వరిస్తోంది. కొందరికి అపజయం ఎదురౌతుంది. కానీ అందరూ ఆలోచనను మర్చిపోతున్నారు-” అంది ఆదిలక్ష్మి.

“పొరపాటు - దేవీ! బహుశా నీవు సీతమ్మ, మల్లయ్య, నరసింహుల గురించి మాట్లాడుతున్నావనుకుంటాను. వాళ్ళను నేను వంచించలేదు. వాళ్ళు “విధి వంచితులు -* అన్నాడు ఆ శ్రీ మహావిష్ణువు. అ ౩ కథాం -204 2౬2222222ఒ2ఒఓఒ2ఒ2ఒ22ఓఊ2ఊ2ఊ2ఊహహ్షోో

ల్లీ క కి

క ంప్యూటర్‌ కల అ గోయీ జంగయ్య ఆఆ టౌన్‌ ఒకప్పుడు బాగా వెనకపడ్డదే. ఆ మధ్య సాగర్‌ కాలువ రావటం వల్లా అక్కడి భూముల ధరలు బాగా పెరిగినాయి. టౌనూ పెరిగింది. చుట్టూర వున్న చెలుకలన్నీ ఫ్లాట్స్‌గ మారినట్టు ఇళ్లను, నాటిన రాళ్ళను చూస్తేనే తెలిసిపోతుంది. అందువల్లా చాలామంది కొత్త ధనవంతుల వరుసలో చేరిపోతున్నారు. వాళ్ళల్లో రమేష్‌చంద్ర ఒకరు. రమేష్‌చంటద్రది స్టీల్‌ సిమెంటు వ్యాపారం. అదనంగా భూములను కొని అమ్ముతువుంటాడు. అందువల్ల

కొద్దికాలంలోనే బాగ సంపాదించాడు. ఓ బంగళా కట్టించుకున్నాడు. ఆధునిక వస్తువులతో ఇల్లును అలంకరించాడు. ఒక్కకొడుకు, ఒక్కకూతురు. చక్కని సంసారం. పిల్లవాడు యస్సెస్సీ, అమ్మాయి ఏడవ తరగతి అదే టౌన్‌లోనే మంచి స్కూల్లో చదువుతున్నారు.

ఒకరోజు ఫోన్‌ మోగింది. రిసీవర్‌ ఎత్తి -

“హల్లో రమేష్‌చంద్ర, చెప్పండి.”

“నేనోయ్‌ రాజును, హైద్రాబాదు ఎప్పుడొస్తున్నావు?”

“ఎప్పుడంటే అప్పుడే”

“సాయంత్రం వరకు రాగలవా? ఇంట్లోనే వుంటాను, రా”

రమేష్‌ రిసీవర్‌ పెట్టేసి, “ఓయ్‌ మధ్యాహ్నం హైద్రాబాదు వెళ్ళాలి బ్రీఫ్‌కేసు సర్దు” అన్నాడు భార్య సుశీలతో.

“అనుకోని ప్రయాణం” అంటూ భర్త దగ్గర్కి వచ్చి నిలుచుంది.

“అదే మీ అన్న రాజు, రమ్మని ఫోన్‌ చేశాడ” అంటూ (డ్రెస్సింగ్‌ టేబుల్‌ వైపు నడిచాడు.

న!

ఆటో, రాజు ఇంటి ముందాగింది. ఆటో చప్పుడు విన్న రాజు గేటు తెరచి నిలుచున్నాడు.

“సరళా ఇటు చూడు ఎవరాచ్చారో” అంటూ భార్యను పిలిచాడు రాజు,

“నమస్మారం అన్నయ్యా, ఇప్పుదేనా రావటం” అని అడిగింది.

“అవునమ్మా” బ్రీఫ్‌కేస్‌ రాజు కిస్తూ, బాత్‌రూమ్‌ వైవు నడిచాడు. బయటికి రాగానే తువాలందించాడు రాజు.

(ఫెష్‌ అయి సోఫాలో కూర్చోగానే, సరళ కాఫీ ట్రేతో వచ్చింది.

ముగ్గురు కాఫీ తాగుతు వున్నారు.

“అన్నయ్యా, వదిన పిల్లలు అందరు బాగే కదా?” అని అడిగింది.

“ఓ అంతా బాగానే వున్నారు”

ఈ లోపు రాజు బట్టలు మార్చుకుని తయారు అయ్యాడు. శాండల్‌వుడ్‌ ఆయిల్‌ను తాను అద్దుకొని చంద్రకూ అద్దాడు. +

“సరళా ఈ రోజు ఓ పార్టీ వుంది. మేం వెళుతున్నాం. డిన్నర్‌ కూడా అక్కడే” అంటూ కారు తీసి స్టార్ట్‌ చేశాడు.

అది నిజాం క్లబ్‌ వైపు పరుగెత్తింది. లైట్లు వెలుగుతున్నాయి. రాత్రి ఏడైంది. కారు పార్ముచేసి, ఓపెన్‌ ఏరియాలోని ఓ టేబుల్‌ ముందు కూర్చున్నారు. సన్నని క్లార్‌నెట్‌ మ్యూజిక్‌ వస్తువుంది. కాస్త దూరంలో ఓ మగ, ఇద్దరు ఆడవాళ్ళు వైన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. బేరర్‌కు ఆర్డర్‌ ఇవ్వాల్సిన డ్రింక్స్‌ ఆర్జరిచ్చాడు రాజు. మిగతా వాటికి తర్వాత రమ్మన్నాడు.

“అట్లాగౌ అంటూ బేరర్‌ కదిలాడు.

ఎదురుగా వున్న టీవీలో ఏదో ఆధునికమైన డాన్స్‌ వస్తూ వుంటే చూస్తు వున్నారు. డ్రింక్‌ వొచ్చింది, గ్లాసులు కదిలాయి. బేరర్‌ ఐస్‌క్యూబ్స్‌ వేసి, సోడా పోసి ఇచ్చి పోయాడు. ఈసారి ఫుడ్‌ ఆర్జరిచ్చాడు. పదియేను నిమిషాల తరువాత చిల్లిచికెన్‌ వొచ్చింది. అరగంట తరువాత ైత౭౭తడైతత2త323త22జ2తత22డ్లైైకనకడైతతతతతడతతతలైడడతతతఊఊ2త2ఊ22తఊ సయ క భారళని- 2004 22222222

జింజేర్‌ ప్రాన్స్‌ వొచ్చింది. ముచ్చట్లు నడుస్తూనే వున్నాయి. మొదట వ్యాపారం, ఆ తరువాత రాజీకీయాలు, చివర్న కాల్‌గర్ల్స్‌ గూర్చి ఆలోచనలను కలబోసుకుని డ్రింక్‌ పూర్తిచేసి, బిర్యాని ఆర్డర్‌ ఇచ్చారు.

“అవును సందీప్‌ ఏ క్లాసు” అని అడిగాడు రాజు.

“టెన్స్‌”

“జాబిలి?”

“స్పెవైన్స్‌,”

“ఇద్దరిని ఆ వూళ్ళో వుంచకు. సందీప్‌ను మంచి రెసిడెన్షియల్‌ కాలేజీలో జాయిన్‌ చేయి. ఇంటర్‌ చాలా ఇంపార్టెంట్‌. విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పేది సుమా” అన్నాడు

" రాజు.

“నేనూ ఆలోచిస్తూనే వున్నా. నీవు కూడ చూడు. మనం సంపాదించేది పిలల్ల కోసమే కదా. వాళ్ళు బాగ చదవుకుని వృద్ధిలో కొస్తే చాలు”

“అట్ల రావాలంటే వాళ్ళను మంచి స్కూల్‌లో చదివించాలి. తాలూకాలలో మంచి స్మూల్లెక్కడుంటాయి? ఇంగ్రీష్‌ మీడియమే కదా” అన్నాడు రాజు విస్కి చప్పరిస్తు.

ఈలోపు రాజు సెల్‌ మోగగానే చెవి దగ్గర వుంచాడు. “హాల్లో రాజు, ఎక్కడరా నేను ఇంటికి ఫోన్‌ చేస్తే బయటికి వెళ్ళావు అని చెప్పారు. ఎక్కడున్నావు?” అవతల కంఠం.

“నిజాం క్లబ్‌లో”

. “ఈ రోజుల్లో ఇంకా నిజాం క్షబ్బేమిటిరా నా బొంద. కంట్రి క్లబ్‌ మెంబర్‌షిప్‌ తీసుకో గూడదు - నేనక్కడినుండి మాట్లాడుతున్నా. మార్చు వల్ల త్రిల్‌ వుంటదిరా” అన్నాడు. సెల్‌ను ఆపు చేశాడు. “ఎవరు” అని చంద్ర అడిగాడు.

“ఓ (ఫ్రెండ్‌లే - వాడు కంట్రి క్లబ్‌లో మెంబర్‌. నన్ను కూడ చేరమంటున్నాడు. ఓ పని చేయగూడదు నీవు - అందులో మెంబర్‌షిప్‌ తీసుకుంటే బాగుండదు? మనం చాయిస్‌ను బట్టి దేనికంటె దాని కెళ్ళచ్చు” అన్నాడు రాజు.

“సరే” అన్నాడు చంద్ర. "

“డబ్బు సంపాదించడమే కాదోయి ఎంజాయ్‌ చేయడం కూడ తెలుసుకోవాలి. పదిమంది తో పరిచయాలు మనకు ఉపయోగపడతాయి.”

బేరర్‌ తెచ్చిన బిల్‌ను నేనంటే నేను చెల్లిస్తానని కాసేపు అన్న తరువాత, “ఓయ్‌. ఇది హైద్రాబాదు నేను ఇక్కడే వుంటున్నా. నేను చెల్లించడమే మర్యాద” అంటూ రాజు వచ్చనోట్లు టేలో వుంచాడు. కొంత చిల్లరను వదిలి ఇద్దరు లేచి బయటికి నడిచి కార్లో కూర్చొన్నారు. కారు ఇంటి వైపు పరుగెత్తింది.

౨౭0

పరీక్షలు జరిగే రోజులు.

అప్పటి వరకు చదువుకున్న సందీప్‌, జాబిలి నిద్రలోకి వెళ్ళారు. చంద్ర, ఆయన భార్య డక్‌. కట్‌ కై

మధ్య హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాటల్లో పిల్లల చదువు విషయం వొచ్చింది.

“రాజు పిల్లలను సిటీలో చదివించమంటుండు” అని చెప్పాడు.

అది విన్న సుశీల, “బాగానే వుంటుంది కానీ వ్యాపారం ఎప్పుడు ఇట్లా సాగుతుందని ఏం నమ్మకం. సిటీలో చదవంటే ఓ ఇల్లు కావాలి. పిల్లల కోసం నేను అక్కడే వుండాలి. నేనొకచోట మీరాకచోట ఏం బాగుంటుంది” అన్నది.

“అట్లా ఏం కాదు. పిల్లలను రెసిడెన్షియల్‌ కాలేజీలలో చేర్చుదాం, మనకు ఏ బాధలుందవు” అన్నాడు.

“అది సరే.- అయ్యే ఖర్చులు”

“ఇది కంప్యూటర్‌ యుగం, మంచి కాలేజీలలో చదివిస్తే మంచి మార్కులు సంపాదిస్తారు. బాగా మార్కులు సంపాదిస్తే క్యాంపస్‌ ఇంటర్‌వ్యూలలో ఎన్నిక అవుతారు, లేదా బయటికి పంపొచ్చు, అమెరికాలో మంచి డిమాండ్‌, వుంది.”

“ఆలోచించండి - నేనైతే తెచ్చేదాన్ని కాదు ఇచ్చే దాన్ని కాదు. మీ ఇష్టం.”

అవును అనసూయ వాళ్ళ కొడుకు అమెరికాలోనే కద వుండేది. ఐదేండ్లు అయ్యిందో లేదో ఇరువై లక్షలు పంపాడట. హైద్రాబాదులో ఓ పెద్ద ఇల్లు కొన్నారట - ఏ మూలనో తన కొడుకూ వెళితే బాగుంటుంది అనుకుంటూనే, అంది సుశీల ఆశ్చర్యంగా చూస్తూ,

“అందుకే మొదటి నుండి మంచి కాలేజీలో చదివిస్తే బాగుంటది. అనుకున్న కోరిక నెరవేతది.” .

సందీప్‌ యసెస్సీలో ఫస్ట్‌క్లాస్‌ వొచ్చాడు.

రాజుకు ఫోన్‌ కలిపి రిసీవర్‌ ఎత్తాడు.

“హల్లో రాజూ

“ఆ చెప్పవోయ్‌”

“సందీప్‌ ఫస్ట్‌క్లాసులో పాసైయ్యాడు”

“కంగ్రాట్స్‌ చెప్పు వానికి. ఇక ముందు ఇంటర్‌ కూడ ఫస్ట్‌ క్లాస్‌వొస్తే, నీ పంట పండిందనుకో”.

“వస్తాడు వాడు చాల తెలివైనవాడు” అంటూ కొడుకు తెలివిని ఓసారి గుర్తుచేసుకున్నాడు. వాడు సెవెన్స్‌ వరకు “ఎ గ్రేడు. ఆ తరువాత గూడ మంచి మార్కులే, ఎవుడు ఫస్ట్‌ సెకండ్‌ ర్యాంకులే. ఓసారి థర్డ్‌ ర్యాంకు వొస్తే ఓ పూట అన్నం గూడ తినలే! చదువు మీద (శ్రద్ధ వున్నవాడు కాబట్టే అంత ఇదిగా ఫీలై పోయాడు.

“యస్సెస్సీలో చాలామంది ఫస్ట్‌క్లాసే వస్తారులే, ఆబ్జెక్టివ్‌ పేపరుంటది కనుక ఎక్కువ మార్కులొస్తాయి” అన్నాడు రాజు తేలికగా తీసుకుంటూ.

“కాని వాడు అట్లా కాదు, క్లవర్‌ స్టూడెంట్‌” అన్నాడు.

“ఇక్కడో రెసిదెన్నియల్‌ కాలేజి వుంది. రిజల్స్స్‌ సెంటు పర్సెంట్‌, క్లాసు రాకపోతే ఫీ వాపస్‌ అట, అందులో చేర్చిద్దాం” అన్నాడు. “నీవు ఇక్కడికొచ్చినాక మాట్లాడుదాం రా”.

“ఇంకా మెమోలు రాలేదు. వచ్చినాక వస్తానూ” అంటూ ఫోను పెట్టేశాడు.

క కథ్గారాతని - 2004 కాడ

“ఖర్చు ఎక్కువ కావొచ్చు” అంతవరకు పక్కనే నిల్పోని అంతా విన్న సుశీల అంది.

“నా కొదిలేయి నేను చూసుకుంటా, ఈ రోజు పెడితే రేపు రావూ? అప్పు చేసి అయినా చదివించాలి అని బయటకు నడిచాడు. ॥

అనుకున్నట్టు హైద్రాబాదులోనే చేర్చాడు. సందీప్‌ సిటీలో చదువు బాగునే వుంటుందని సంతోషించాడు. సందీప్‌ వెనకటికంటే ఊశారుగానే వున్నాడు. కాని రెసిడెన్షియల్‌ కాలేజీ కనుక కట్టేసినట్లు వుందన్న ఫీలింగ్‌ వుందని అతని ముఖం చెపుతువుంది. స్నేహితులు మారారు. అలవాట్లు మారుతున్నాయి. కాలేజీ ఫీజులు, హాస్టల్‌ ఛార్జీలు, పాకెట్‌ మని కూడ పెరిగింది. మొత్తం మీద మొదటి సంవత్సరం గడిచింది. ఫస్టియర్‌ మంచి మార్కులతోనే పాసైయ్యాదు. తండ్రి సంతోషించాడు కాని మార్కులు మాత్రం రావల్సినన్ని రాలేదు.

రెండవ సంవత్సరం మొదలైంది. బట్టల విషయంలో తండ్రిని అడిగి మరీ మంచివి కొనిపిచ్చుకున్నాడు. వాటికి తగిన షూ కొనిపిచ్చుకున్నాడు. టీ షర్ట్స్‌, మంచిరకపు బెల్ట్స్‌. తండ్రి దేనిని కాదనలేదు. సందీప్‌లో సగం మార్పు వచ్చింది. కాస్త వల్లు చేసాడు. షాపింగ్‌ పేరుతో బయటికి వెళ్ళినప్పుడు సినిమాలు చూడడం, రెస్టారెంట్‌లో తినడం సందీప్‌కు, అతని స్నేహితులకు మామూలై పోయింది. అట్లా రెండవ సంవత్సరము పూర్తిచేసాడు. కానీ ఈసారి క్లాసు రాలేదు, మంచి మార్కులు రాలేదు.

అది తెలిసిన తండ్రి ఉగ్రుడైనాడు. “వాన్నెమనకుండి. ఈ రోజుల్లో పిల్లలు మాట పడడంలేదు. ఏమన్న చేసుకుంటే జీవితాంతం ఏడ్చి చావాలి అంది ఆతురుతగా సుశీల.

పొంగుతున్న పాలపై నీళ్ళు చల్లితే చప్పున తగ్గినట్టు తగ్గాడు చంద్ర. “అవును, అదీ నిజమే' అనుకున్నాడు. ఎక్కడ కోపమొచ్చి వాన్ని తిడతానో అని ఆ తరువాత తాను హైద్రాబాదుకు వెళ్ళలేదు, రాజుకు ఫోన్‌ చేసి, “వాన్ని ఎంసెట్‌ ఎంట్రెన్స్‌కు ప్రిపేర్‌ కమ్మను. ఎక్కడన్నా కోచింగ్‌ సెంటర్‌లో చేర్చించు. ఇక ఆ కాలేజీలో వద్దు. అక్కడి దోస్తుల వల్లనే వాడు అట్లా తయారయ్యాడు. ఫీ ఎంతో నీవు చెల్లించి నాకు ఫోన్‌ చేయి. పంపిస్తానూ అన్నాడు. ఒళ్ళంతా చెమటలు పోసి, ఎద ఎగురుతు వుంటే అణుచుకున్నాడు.

“సరేగాని, నీవు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నవే. ఇది మామూలే. ఇది ఇంటింటి రామాయణం. నీవు అతిగా ఆలోచించకు” మాటను మార్చించే ప్రయత్నం చేశాడు రాజు.

“ఒక్కగానొక్క వెధవ, వాన్నే బాగ చదివించాలి అనుకుంటూ వుంటే వాడేమో పట్టించు కోవడం లేదు. చదువంటే సరదా అనుకుంటువున్నాడు. వాన్నీ ఓసారి క్లాను తీసుకో” అంటూ ఫోను పెట్టేశాడు.

సుశీల మంచినీళ్ళ గ్లాసు అందించింది చంద్రకు.

చంద్రకు తాను చదువుకునే రోజులు గుర్తొచ్చాయి. సర్కారు స్కూల్స్‌ వాళ్ళు చెప్పిందే చదువు, ఆ రోజు టెక్ట్స్‌ పుస్తకాలు ఉండేవి కావు. ఇప్పుడు అన్నీ పుస్తకాలు, వాటితో పాటు గైడ్స్‌ వగైరా, కావల్సింది (శ్రద్ధగా చదవటమే. తిండి దొరకని పిల్లలు కేవలం బడిలో మాత్రమే చదివి, మంచి మార్కులు తెచ్చుకుని ఐఐటిలలో చదివి అమెరికా పోయినోళ్ళూ ఉన్నారు. ఇది కంప్యూటర్‌ కాలం. కంప్యూటర్‌ రాకపోతే చదువురాని వానితో సమానమట. కేకే కక్షోెసం టట్‌ 6౮

“సుశీల శ్రమ శ్రద్ధ చాల అవసరం. ప్రభుత్వం కంప్యూటర్‌ అదే "సైబర్‌ సిటీ" ఓ పట్ట జూన్నే నిర్మించారు. ఎందరో దేశవిదేశీయులు వచ్చి పోతున్నారు. సలహాలు ఇచ్చిపోతున్నారు. బిల్‌గేట్స్‌ విషయం పేపర్లో చదివాంగ. అంటే ఒక్క మనిసి ఎంత సాధించాడు. చూడు తెలివిని పెంచుకుంటే ఎవరైనా ఎంతైనా ఎదగగలరు. చేయవలసిందల్లా చదవడమే. బాగా చదువుకున్నవాడు ఏదైనా సాధిస్తాడు. ముఖ్యంగా కంప్యూటర్‌ కాలంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో మన ప్రభుత్వం సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఇక ఉద్యోగాలకు కొదవ వుండదు. రాబోవు కాలంలో మంచి భవిష్యత్‌ వుందని మీడియా వర్షన్‌.”

చంద్ర హైద్రాబాదు వెళ్ళటం తగ్గించాడు. వెళ్ళినా కొడుకు చదివే కాలేజీకి వెళ్ళటం లేదు. ఈలోపు ఎంసెట్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలు వచ్చినయి. సందీప్‌తో సహా ఎందరో రాసారు. తరువాత రెండు నెలలు గడిచాయి. రిజల్ట్స్‌ వచ్చాయి. సందీప్‌కు మంచి ర్యాంకు రాలేదు. చంద్ర నెత్తి పీక్కున్నాడు. ఆ రోజు మరింత తాగాడు. సుశీల ఎప్పటికప్పుడు సర్ది చెపుతూనే ఉంది.

“పోనీయండి, అందరు కంప్యూటర్‌ ఇంజనీర్లు అవుతున్నారా? మన దగ్గరే వున్న బియస్సీ చదివించండి అంటే విననే వినరైతిరి. సరే అయిందేదో అయింది వోనీయండి. వానికి శ్రద్ధ లేనపుడు మనం ఏం చేస్తాం” అంది సుశీల.

“ఏదో పని చేసుకోని ఐతుకుతడు. దునియాలో అందరూ అది చదివే ఉద్యోగాలు చేస్తున్నారా?” అంది మళ్ళీ తానే.

“నీ ముఖం చాలా మంచి సలహా ఇచ్చావు. మంది పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతుంటే నీ కొడుకేమో ఏదో ఓ పని చేసుకొని బతుకుతాడు. అబ్బా నీ కోరిక పాడుగాను. ఎంత మంచి కోరిక” అన్నాడు వెటకారంగా పంద్లు కొరుకుతూ.

“మరేం చేస్తాం బుద్ధి వాని కుండాలె కాని, మనం చేసేది ఏముంది. కావల్సిన ఖర్చు ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం చదివించడం మన వంతు, చదవడం పాని వంతు” అంది సుశీల,

“ఇక చాలు నీ సలహాలు. వాన్ని కంప్యూటర్‌ ఇంజనీరుగా చేసి తీరుతా. డొనేషన్‌ కట్టి కర్షాటకలోనైన చదివిస్త. అందుకని సెటొ రాయమని గూడ చెప్పాను” అన్నాడు తీవ్రంగా స్పందిస్తూ, ॥

న క్‌ రోజులు అదో మాదిరిగ మౌనంగా తండ్రిని తప్పించుకుంటూ తిరుగుతున్నాడు దిప్‌. “

చంద్ర సంపాదించిన ప్లాట్లను ఒక్కొక్కటే అమ్మేసాడు. సుశీలను నోరెత్తనీయలేదు. అనుకున్నట్టే పది లక్షల డొనేషన్‌ ఇచ్చి కర్ణాటకలోని దావణగెరేలోని ఓ ప్రయివేటు కాలేజీలో చేర్పించాడు. ఓ నలుగురు స్టేట్స్‌కు చెందిన వాళ్ళు, ఓ అద్దె యింట్లో వుండేటట్లు వాళ్ళకు ఓ పనిమనిషిని కూడా ఏర్పాటు చేశాడు.

వేరే వేరే పిల్లలు రూమ్‌కు వస్తూ పోతు వుండేవారు, ఒక్కొక్కరు తమ తమ అలవాటును ఆ రూమ్‌లో వదిలిపోతు వుండేది. మొదట పనిమనిషికి బీరు బాటిల్సు మూతలు, ఆ = (ధరహిని- 2004 కక్షేేేడేెె్‌్‌ెాన్‌నా22్‌

రూమ్‌ మూలన కనిపించాయి. ఆ తరువాత రెండవ సంవత్సరం సోడా సీసొల మూతలు కనిపించాయి, అంతేకాదు సిగరెట్‌ పీకలు కనిపించేసరికి పనిమనిషికి వీళ్ళ తతంగమంత తెల్సిపోయింది.

తల్లి-దండ్రి పంపించే డబ్బు ఇట్లా తగలెయ్యడం ఏం బాగలేదనిపించింది. మూడవ సంవత్సరం వచ్చేసరికి అన్ని చెడు అలవాట్లను వాళ్ళలో చూసింది. అట్లా అట్లా ఓ నాలుగు సంవత్సరాలు గడిచిపోయి, ఫైనల్‌ ఎగ్జామ్స్‌ అయిపోయినయి. ఫలితాలు కూడ ప్రకటించినారు.

సందీప్‌ నంబరు రాలేదు. ఆరోజు ఆయనకు కాస్త జ్వరం కూడ వచ్చింది.

సందీపు మౌనంగా వుండిపోయాడు. రమేశ్‌చంద్ర పరేశాన్‌ పాలయ్యాడు. గుర్రపు పందేల ఆట గుర్తొచ్చింది చంద్రకు.

సుశీల నోరు విప్పలేదు. మెమో రాగానే చూస్తే నాలుగేళ్ళ పేరు మీద నాలుగు పేపర్లు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయినయి.

చంద్ర జుట్టు పీక్కున్నాడు. అమ్మిన ప్లాట్లు గుర్తొచ్చాయి. తరిగిన బ్యాంక్‌ అకౌంట్సు గుర్తొచ్చాయి. భార్య మీది బంగారం అమ్మిందీ గుర్తొచ్చింది.

“పంతుల్ల పిల్లలు, కూలీల పిల్లలు ఒకేసారి పాస్‌ అవుతుంటే మూడు పూటలు రాజ భోజనాలు తిని, విచ్చల విడిగా ఖర్చుపెట్టుకుని ఏటా ఓ పేపరు వొదిలేస్తూ వస్తుంటే చివ రికి నాలుగు పేపర్పు, మిగిలిపోయినయి. మరి*ఇక _ఏం చేస్తాడో చేయమను. చెప్పి చెప్పి విస్కొచ్చింది. నా కడుపున మొద్దు పుట్టాడు” అంటూ చించుకున్నాదు.

సుశీల మౌనంగా వింటూ నిలుచుంది. లక్షలు, లక్షలు ఖర్చు పెట్టినా కొడుకు లెక్కకు రాడాయే అని ' కుమిలిపోతూనే వుంది.

“నేను హరికథ చెపుతున్నానా, వింటూ నిలుచున్నావు. పిలువు వాన్ని పిల్చి అడుగు” అన్నాడు కోపంగా.

“వేను ఇప్పుడు అడిగేదేముంది. మొదలె చెప్పాను, ఇక్కడ వున్నంత వరకు చదువుతదడని. మీరే వానికి అలుసిచ్చి డబ్బంత పాడుచేస్తిరి, అత్త మామ పెట్టిన బంగారాన్ని అమ్మిస్తిరో అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది.

“దరిద్రం మొఖం నీవొలెనే నీ కొడుకు” అంటూ అసహ్యంగా చీదరించుకున్నాడు.

“ఆమె నెందుకు అంటరు, అసలు నేను బియన్సీ చదువుత అన్న వినక నా కిష్టంలేని కోర్సులో చేర్చారు. నా కష్టం నేను చేసాను. పాస్‌ కాలేదు - నేనేం చేయను” అన్నాడు తలుపు దగ్గర నిలుచోని. |

“వరేయ్‌ కష్టం చేస్తే ఎందుకు పాస్‌ కారు? మిగత వాళ్ళు కాలేదా?” అంటూ కొడుకు వైపు చూస్తు పళ్ళు కొరకుతూ అడిగాడు.

“సగం మంది ఫెయిలే. ఏదో కొంతమందే పాస్‌ అయ్యారు. ఇష్టంలేని చదువు చదివిస్తే అంతే మరి” నేలను చూస్తూ అన్నాడు.

“అసలు ఏ తందైనా నీవు ఏం చదవదలచుకున్నావురా అని అడిగి చదివిస్తుంద్రాని. ఎవరినో చూసి నా కొడుకు గూడ అట్లా కావాలని చదువులను చాసిస్తే, చదువొస్తదా?

కంప్యూటర్‌ అని ప్రాణం తీస్తూంటే ఏం చేసేది ఇంకా నయం పిచ్చి లేవలేదు” - ఓ రకంగా తండ్రి వైపే చూస్తూ అన్నాడు.

“అరే నీవు మాట్లాడకుర. నాకు బీపీ పెరుగుతుంది. చదవనన్నప్పుడు నా ఇంట్లో ఉండొద్దు, ఎటన్న వెళ్ళిపో” అన్నాడు విసుగ్గా.

“& పోత. ఈ పోరు నేను భరించలేను. ఎటన్నపోయి అమాలి పని చేసుకుని బతుకత. కంప్యూటర్‌ కంప్యూటర్‌ అని మీరు కన్న కలలన్ని కరిపోయాయి. అమెరికాలో పనిచేస్తూ ఆస్తి సంపాదించాలని వెళ్ళిన వాళ్ళు ఒక్కొకరే తిరిగి వస్తున్నది చూస్తూనే వున్నాంగ. ఇకపోతే మన దగ్గర యం.సి.ఎ. చేసిన వాళ్ళంతా కొట్లల్లో బిల్స్‌ రాస్తున్నది చూస్తలేము. నా పని అంతే” అన్నాడు విసుగ్గా,

“సిగ్గు లేదుర, తండ్రి వ్యాపారి - కొడుకు అమాలి” అన్నాడు

“ఏం వ్యాపారం నాన్న మీరు చేసేది? రియల్‌ ఎస్టేట్‌ ఓ వ్యాపారమా?” అన్నాడు వెట కారంగా సందీప్‌.

“అరేయ్‌ నీకేమైనా బుద్ధుందా. తండ్రితో మాట్లాదేది అట్లానేనా? నోర్మూయ్‌” అంది కొడుకు వైపు చూస్తూ తల్లి.

“అమ్మా నేను కాన్వెంట్‌లో లేను, ఏదన్నా పడడానికి” అని కాస్త గట్టిగానే అన్నాడు.

“ఇప్పుడు ఆ న్థాయే కదా మిగిలింది” అని మాత్రం అన్నాడు కాని తాను ఒక్కసారె కదిలిపోయాడు.

సందీప్‌ మాట్లాడే ప్రయత్నం చేయబోగా, “పో” భుజాలు పట్టి అక్కడి నుండి నెట్టుతూ, “లోపలికి పొ అంది తల్లి,

పరీక్షలు ఏట రెండు సార్లు వస్తూ, పోతున్నాయి. కాని సందీప్‌ ఉన్నచోటే వుండిపోయాడు.

చిరం ళి

ఈలోపు అమెరికా ఆర్థిక పరిస్థితి మారి, సాఫ్ట్‌వేర్‌ వేవ్‌ను కన్‌ఫ్యూజ్‌ చేసింది.

రంగంలో అనుకోని విధంగా వచ్చిన మార్పు వల్ల ఎంసెట్‌ కోసం కట్టించిన ప్రయివేటు కాలేజీలు బి.ఇడి కాలేజీలుగా మారుతున్నాయి.

బిఎస్సీ పాస్‌ అయిన కూతురును, “నీ ఇష్టం వచ్చిన కోర్సు చదువుకో” అన్నాడు గత అనుభవం చెప్పిన పాఠం గుర్తుంచుకొని.

అమ్మాయి బి.ఇడిలో చేరింది.

సందీప్‌ హైద్రాబాద్‌లో రాజు వాళ్ళ దగ్గర వుంటు ఏదన్నా వ్యాపారం చేయాలని ఆలోచి స్తున్నాడు.

చంద్ర' చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు పూర్తిగా పడిపోయినయి. పంటలు లేవు, జనం చేతిలో డబ్బు లేదు. రోజు పథ్రికల వాళ్ళు ఆర్థికపరమైన వ్యాపారుల గుట్టు రట్టు చేస్తూ వార్తలు రాస్తూ వుండడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగంలో చాలామంది అరెస్ట్‌ల పాలు అవుతున్నారు. కొడుకు సాఫ్ట్‌వేర్‌ చదువు సాగక అమెరికా పోవడం ఆగిపోగా, సంపాదించింది కరిగిపోయి చంద్ర వ్యాపారంలో మళ్ళీ మొదటికొచ్చిందు. అ కై కథాతాహిని - ఓ004 2

అంతా మిథ్యే! అ దేరి

"ఫైవ్‌ స్టార్‌ వాస్పిటల్‌. స్పెషల్‌ రూం.

మంచం మాద పడుకున్న పార్వతమ్మ తన అరవై ఏళ్ళ జీవితాన్ని ముగించడానికి ప్రయాసపడుతోంది.

“కన్ను తెరిస్తే జీవితం

కన్ను మూస్తే మరణం

ఆ రెవ్ఫపొటు కాలమే యీ జీవితం”

  • అన్నాడు ఓ మహానుభావుడు. కైక డ్‌" బిజి క

జీవితానికి యింతకంటె చక్కటి భాష్యం ఎవరు చెప్పగలరు!

ఆవిడ కన్ను మూసే ప్రయత్నంలోనే ఉంది.

అంతకు పది నిమిషాల ముందే ఓ డాక్టరు వచ్చి అవిడ్ని చూసి, “యింక మేము చేసేదేం లేదు. యింటికి తీసికెళ్ళండి” అంటూ, * 2౫ 9౦గ్సా” అని కూడా చెప్పి వెళిపోయేడు.

పార్వతమ్మ మంచానికి ఓ వైపు కొడుకు కామేశ్వగర్రావు, రెండో వైపు కోడలు అనసూయ నిల్చున్నారు. కాళ్ళ దగ్గర మనవడు మురళి నిల్చుని ఆవిడ కాళ్ళు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

అతన్ని కన్నది అనసూయ అయినా పెంచిందీ, పెద్ద చేసిందీ, కథలు చెప్పిందీ, మంచి- చెడు తెలియజెప్పిందీ, అన్ని పార్వతమ్మే. ఆవిడ భర్త రిటైరైన తర్వాత వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఇల్లు కొనిపించింది.

“ఈ వయసుతో ఇల్లు కొనడవేమిటే వెర్రి కాకపోతే! ఆ డబ్బు శుభ్రంగా ఏ బ్యాంకులోనో వేసుకుంటే అవసరానికి పనికొస్తాయి కదా?” అని అందరూ విమర్శించారు.

అయితే ఆవిడ అవేం పట్టించుకోలేదు.

ఆవిడ తన కష్టసుఖాలన్నీ మనవడు మురళితో చెప్పుకునేది.

“ఒరే! నానా! నేనోమాట చెప్తున్నాను. జ్ఞాపకం ఉంచుకో. బతికినన్నాళ్ళు ఏ యిల్లు అయినా ఒకటే. కాని చచ్చిపోవటం ఉంది చూశావూ! అది మాత్రం స్వంత ఇంట్లోనే జరగాలి. ఎందుకో తెలుసా?” అని ఆగింది.

తెలీదన్నాడు మనవడు.

“ఎందుకంటే అద్దె యంట్లో అయితే నక్షత్రం మంచిది కాదనీ, అదనీ, ఇదనీ తీసికెళ్ళి కారు పార్క్మింగులో పడేస్తారు. ఇంత్త బతుకూ బతికి యింటి వెనకాల చచ్చేదని, నాకు అది యిష్టం లేదురా. అందుకే చిన్నదైనా ఇల్లు కొనుక్కున్నాను, చావడానికే మరి. మీ తాతయ్య చూశేవా! మారాజులాగ ఇంట్లోనే వెళ్ళిపోయేరు. అందరూ బైట పెట్టమంటే నేను ఒప్పుకోలేదు. మరింక నేనూ యిందులోనే కడతేరి పోవాలి. యిదే నా కోరిక” అన్నది ఆవిడ మనవండిలో.

“టెను! ఆవిడ కోరిక తీర్చటం మన ధర్మం' అనుకున్నాడు. వెంటనే కళ్ళు ఒత్తుకొని, “నాన్నా నేను వెళ్ళి అంబులెన్సు తెస్తాను. నాన్నమ్మని ఇంటికి తీసికళిపోదాం” అన్నాడు.

కామేశ్వర్రావు మాట్లాడేలోపున అనసూయ, “ఇంటి కెందుకురా ఇప్పుడు? పైగా నక్షత్రం కూడా మంచిది కాదు. ఆర్షల్లు ఇల్లు వదిలి పెట్టాలి. ఎక్కడికి పోతాం? చిన్న పిల్లాడివి నీకెందుకు యివన్నీ. మేము చూసుకుంటాంలే” అంది.

బిక్క చచ్చిపోయేడు మురళి.

ఈవిడ ఎంత నిరయగా మాట్లాడుతోంది? పైగా తండ్రి ఏం మాట్లాడడేం?

ఛ! ఏం మనుషులో!

వీళ్ళు తర్జన భర్ణనల్లో ఉండగానే నర్సు వచ్చి పార్వతమ్మని చూసి - “ఆవిడ పోయేరు. ఇంక తీసికెళిపొండి” అని దుప్పటి కప్పేసి వెళిపోయింది.

గొల్లుమన్నాడు మురళి. క:థరరన-204 తక్‌ 2222222222 ైజడడడడయడైతఊడడడడ

" కామేశ్వర్రావు నెమ్మదిగా మురళి వీపు మీద చెయ్యి వేసి, “లే, లేచి ఏదైనా టాక్సీ తీసుకొనిరా. అమ్మని ఇంటికి తీసికెళిపోదాం” అన్నాడు. అనసూయ తండ్రి, కొడుకులిద్దర్నీ ఓసారి ఎగాదిగా చూసి, “ఇప్పుడింక ఇంటి కెందుకూ? మీ అక్కలకి ఫోన్లు అందాలి. వాళ్ళు రావాలి. అంతవరకు ఇంట్లో శవజాగరం చెయ్యాలి. ఎక్కడైనా మార్చురీలో పెట్టండి. అందరూ వచ్చేక చూద్దాం” అంది.

తండ్రి, కొడుకులు నిర్భ్బాంతపోయేరు. కాని ఆవిడ మాట కాదనే సాహసం ఇద్దరికీ లేదు.

పైగా అది వాదనలకి సమయం కాదు.

“కనీసం మేము వచ్చేవరకైనా అమ్మ దగ్గర ఉంటావా?” - కామేశ్వరావుకి నిస్సత్తువ, నిస్సహాయత వచ్చేసేయి.

“ఉండక ఛస్తానా? మిరు తొందరగా వెళ్ళిరండి. అవతల చాలా పన్గున్నాయి” ఆంది విసుగ్గా.

ఈఈ

కామేశ్వర్రావు, మురళి కలిసి మార్చురీ వేట ప్రారంభించేరు. గవర్నమెంటు ఆస్పత్రిలో బైట చచ్చిపోయిన వాళ్ళని పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకుందామనుకున్నా అక్కడ చచ్చిపోయిన వాళ్ళకే ఆ మార్చురీలు చాలవు.

సరే. కార్పొరేట్‌ హాస్పిటల్‌కి వెళ్ళేరు. ఎక్కడా ఖాళీలు లేవన్నారు. ఒక్కచోట మాత్రం ఆర్‌.ఎం.ఓని కలిసి ఐతిమాలారు, ఎలాగైనా చూడమని. అతను కామేశ్వరరావ్‌కి తెలిసిన వాడే.

“ఇందులో నా అభ్యంతరం ఏమిటి? కాని ఖాళీ ఉందో లేదో కనుక్కోండి. ఉంటే పెట్టు కోండి” అన్నాడు.

“భగవాన్‌! స్వంత ఇంట్లో పోవాలన్న అమ్మ కోరిక తీర్చలేకపోయేను. కనీసం మార్చురీలో నైనా చోటు చూపించు. లేకపోతే ఆ 'సెల్లార్లో అయిసు దిమ్మల మోద ఆవిడ్ని నేను చూసి భరించలేను అని మనసులో దేవుణ్ని ప్రార్ధిస్తూ కామేశ్వరరావు, కొడుకుతో మార్చురీకి వెళ్ళేడు. , ,

అక్కది వాచ్‌మన్‌ బొత్తిగా కుర్రాడు. ఇరవై ఏళ్ళు ఉండొచ్చు. గోడ నానుకుని కూర్చుని బీడీ కాల్చుకుంటున్నాడు.

వీళ్ళని చూచి లేచి నిల్చుని బీడీ పారేసి ఏవింటన్నట్లు చూశేదు.

“లోపల ఖాళీ ఉందా?” అడిగేడు మురళి.

“రోజూనండి అదేటోగాని ఫుల్‌గా ఉంటూందండి. యిప్పుడే యింతకు ముందే ఒకటి ఖాళీ అయ్యిందండి. అది మా ఆద్నష్టం అనుకోండి. బాడీని తెచ్చినారా?” అన్నాడు వాడు చాలా కాజువల్‌గా, |

"అదీ.స్రంగతి! నీ కొడుక్కి ఇంజనీరింగ్‌ సీటు రావడం, నీ కూతురికి మంచి సంబంధం కట్నం లేకుండా దొరకడం, అనుకోకుండా నీకు ప్రమోషను రావడం - 'ఇవేవీ అదృష్టాలు కావు.

1222222222 0౮ బస! 1

నీ తల్లికి మార్చురీలో బాటు దొరికిందే!

అదే ఆసలు అదృష్టం!

ఎలా అయిపోయేయి బతుకులు!

పూర్వం మార్చురీలు, అయిసు దిమ్మలు లేని రోజుల్లో ఏం చేసేవారు?

అప్పుడు మనిషి సంఘజీవి.

దగ్గర వాళ్ళు, రావలసిన వాళ్ళు వచ్చేవరకు అగరొత్తులు, సాంబ్రాణి దూపం వేశేవారు. చీమలు పట్టకుండా చుట్టూ కర్పూరం జల్లేవారు.

వీధి వీధంతా వచ్చి కూర్చుని పోయిన వాడి గురించి చెప్పుకుంటూ, యింట్లో వాళ్ళని ఓదారుస్తూ శవ జాగరం చేసేవారు.

ఇప్పుడు పక్కింట్లో ఎవరైనా పోయినా మనకి తెలీదు.

ఎలాగైతేనేం ఆవిడ్ని మార్చురీలో పెట్టేశారు.

వాచ్‌మన్‌ చేతులు నులుపుకుంటూ నిల్చున్నాడు. జెను - టిప్‌ యివ్వాలి.

“ఎంతిమ్మంటావ్‌?” అడిగేడు మురళి.

వాడోసారి మార్చురీ వేపు చూసి, “ఏదో తమ సంతోషం” అన్నాడు.

త్రుళ్ళిపద్దారు తండ్రి కొడుకులు.

సంతోషం దేనికి?

అవిద్ని క్షేమంగా మార్చురీలో పెట్టినందుకా?!

చేతికి వచ్చినంత తీసి యిచ్చేడు మురళి.

అక్కడితో అయిపోలేదు.

మార్చురీ మన తాతగారిధి కాదు.

అద్దె ముందే కట్టాలి. కట్టేరు.

రశీదు మోద ఆవిడ పేరు రాసి 'థాంక్స్‌ టు అని రాశారు.

అంటే వాళ్ళ మార్చురీలో ఉన్నందుకు ఆవిడకి 212010 చెప్తున్నారు?

ఎంత గౌరవం!

ఎంతైనా మన సంస్కృతి చాలా గొప్పది.

చచ్చిపోయిన వాళ్ళక్మూడా థాంక్స్‌ చెప్తున్నాం.

మొత్తానికి ఆవిడ దినం తెల్లారిపోయింది.

కథ అయిపోలేదు.

ఇక్కడే మొదలు.

ఆవిడకేం ఆస్తిపాస్తుల్లేవు. .

ఎటొచ్చీ కామేశ్వర్రావు తండ్రి గవర్నమెంటు ఉద్యోగం చేశేడు కాబట్టి అవిడకి ఫామిలీ 'పెన్సను వస్తుంది.

అది ఆపెయ్యాలి.

కామేశ్వర్రావు మర్చాడే బేంకుకి వెళ్ళి ఆవిడ పెన్షను ఆ రోజు నుండి ఆపెయ్యామన్నాడు? త ధారని - 004 కేకే

అయితే ఆకౌంటు మూసెయ్యాలంటే మున్సిపాలిటీ దగ్గర డెత్‌ సర్టిపికెట్‌ కావాలిట.

అయితే కామేశ్వర్రావుకి తరువాత తీరిక దొరక్క అశ్రద్ధ వల్ల ఊరుకున్నాడు.

ఓ ఏదాది గడిచిపోయింది.

ఇంతలో అతనికి పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కావాల్సి వచ్చి ఇల్లు తాకట్టు పెడదావం నుకున్నాడు. ఇల్లు తల్లి పేర ఉంది. మరి ఆవిడ దెత్‌ సర్టిఫికెట్‌ కావాలి.

ఆస్పత్రిలో ఆవిడ పోయాకే డాక్టరు ఇచ్చిన కాయితం (అది చూపిస్తేనే తప్ప స్మశానంలోకి రానివ్వరు), స్మశానంలో వాడిచ్చిన రశీదు తీసుకొని మున్సిపల్‌ ఆఫీసుకి వెళ్ళాడు.

ఆవిడ పోయినప్పుడు దగ్గర్లో ఉన్న స్మశానానికి తీసికెళ్ళలేదు. కామేశ్వర్రావు (ఫెండు వాళ్ళ అమ్మమ్మని సికింద్రాబాదులో ఓ స్మశానానికి తీసికెళ్లేడుట. అక్కడ పదిహేను మందిని ఒక్కసారే తగలబెట్టవచ్చుట. కర్మ చెయ్యడానికీ, అస్తికలు దాచడానికీ గదులున్నాయట. మొత్తానికి వాడు దాన్నాక సైవ్‌స్టార్‌ స్మశానంలా వర్ణించి చెప్పేడు.

పాపం! కామేశ్వర్రావు తల్లి బతికుండగా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కాదు కదా ఏ హోటలూ చూడలేదు. కాని చచ్చిపోయేక మాత్రం ఫైవ్‌స్టార్‌ స్మశానంలో దర్జాగా వెళ్ళిపోయింది.

ఏతా వాతా అది సికింద్రాబాదులో ఉంది కాబట్టి అక్కడి మున్సిపల్‌ ఆఫీసుకే వెళ్ళేడు. డెత్‌ సర్టిఫికెట్‌ కౌంటరు దగ్గర కెళ్ళి తన దగ్గరున్న రశీదునిచ్చి డెత్‌ సర్టిఫికెట్‌ యిమ్మ న్నాడు.

ఆ కౌంటర్లో ఉన్నతను కామేశ్వర్రావుని ఎగాదిగా చూసి, “అవిడ ఎక్కడ పోయింది?” అన్నాడు.

చెప్పేడు.

“ఆ హాస్పిటల్‌ ఎక్కడుందీ?”

చెప్పేడు.

“అయితే అది మా పరిధి కాదు. మిరు హైదరాబాదు ఆఫీసులో అడగండి” అన్నాడు.

దేవుడా అని హైదరాబాద్‌ ఆఫీసుకి వెళ్ళేడు. అది ఆఫీసంటే ఎవరూ నమ్మరు.

పెద్ద బిల్దింగు. చిన్న చిన్న గదులు.

నేల, గోడలు అన్నీ గుంటలే.

అసలా బిల్దింగు ఏ నవాబులో గుర్రాల శాలగా కట్టించి ఉంటారు. కాని ఆ గదుల్లో గుర్రం పట్టదు. బహుశా గుగ్రప్పిల్లల్ని పెట్టి ఉంటారు. కట్టిన తరవాత మరింక అది సున్నం ఎరగదు.

ఆ ఆఫీసు గదిలో నాలుగు కాళ్ళూ లూజు అయిపోయి అమ్మవారు పూనినట్టు ఊగుతున్న టేబిలు, చేతులు విరిగిపోయి మేకులు గుచ్చుకునే కుర్చీ, తిరుగుతున్నా గాలి తగలని ఫాను.

పాపం! వాళ్ళెలా పని చేస్తున్నారో!

ఏం! ఇంటి పన్ను ఒంటి పన్ను అంటూ రకరకాల పన్నులు వసూలు చేస్తారే, అక్కడ పనిచేసే వాళ్ళకి కనీస సొకర్యాలైనా యివ్వలేరా? 2221212 ల సఫ్టే

యివ్వలేక కాదు బాధ్యత లేక. పట్టించుకునే నాథుడు లేక. వాళ్ళని చూస్తే జాలేసింది కామేశ్వర్రావుకి. జాలిపడుతూ కూర్చుంటే ఎలా? పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా అన్నట్లు మళ్ళీ వాళ్ళకి ఆ కాయితాలు చూపించి, “డెత్‌ సర్టిఫికెట్‌ కావాలి” అన్నాడు. అక్కడున్న అతను ఆ కాయితాలు చూశేదు. “ఈ హాస్పిటల్‌ ఎక్కడుందీ?” అడిగేడు. చెప్పేడు. “అయితే యిది సికింద్రాబాదులోకి వస్తుంది. అక్కడికి వెళ్ళి అడగండి” అన్నాడతను కాయితాలు యిచ్చేస్తూ, కామేశ్వర్రావుకి కోపం, దుఃఖం వచ్చేయి. “నిన్ననే అక్కడికి వెళ్ళేను. వాళ్ళు యిక్కడికి వెళ్ళమన్నారు. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళమంటున్నారు. నా శలవంతా యీ తిరుగుడుకే అయిపోతోంది” అన్నాడు విసుగ్గా. ఆయన సన్నగా నవ్వి, “లేదు సార్‌, వాళ్ళు పొరపాటు పడి ఉంటారు” అని, “బేగంపేట పైఓవరుందా?” అన్నాడు, “ఉంది” “దాని కింద రైలు పట్టాలున్నాయా?” కామేశ్వర్రావుకి కోపం నసాళానికెక్కింది. యీ క్విజ్‌ ప్రోగ్రామేమిటి? “నిన్న సాయంత్రం వరకు ఉన్నాయి - రాత్రి ఎవరూ పేల్చకుండా ఉంటే” అన్నాడు. “మిరు చాలా చమత్మారంగా మాట్లాడుతారు సార్‌” అన్నాడతను నవ్వుతూ. చమత్కారమా? నా శార్జమా? నా బతుకే ఓ చమత్మారంలా ఉంది. “ఆ రైలు పట్టాలకి అవతల సికింద్రాబాదు, ఇవతల హైదరాబాదు. వాళ్ళకి చెప్పండి" అన్నాడు. మళ్ళీ 026 10 ఖం 400. మర్నాడు మళ్ళీ శలవు పెట్టి సికింద్రాబాద్‌ ఆఫీసుకి వెళ్ళేడు. అక్కడున్న గుమాస్తాకి కాయితాలు యిచ్చి, “నిన్న యిక్కడికి వస్తే హైదరాబాద్‌ వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ యిక్కడికి వెళ్ళమన్నారు. అసలు మీకెవరికీ రూల్సు తెలీవా? లేక తెలిసి మాతో ఆడుకుంటున్నారా?” అని కడిగేశాడు. దాంతో ఆ గుమాస్తా ఏవంనుకున్నాడో కామేశ్వర్రావు దగ్గర కాయితాలు తీసుకొని చదివినట్టు నటించేడు. తరువాత పక్కసీటులో ఉన్న ఒకావిడకి యిచ్చేడు. ఆవిడా చదివినట్టు నటించి, “డెత్‌ ఎప్పుడు జరిగింది?” అంది. క కథాాలిని - 2004 22 22222

లాటా లు హత్య జరిగినట్టు, డెత్‌ జరగడమేమిటి? ఏం భాష తల్లీ! చెప్పేడు! “ఇది నిరుడిది. ఇక్కడ కరెంటు యియర్‌ వే ఇస్తాం. పాతవన్నీ ఫలానా ఆఫీసులో యిస్తారు. అక్కడికి వెళ్ళండి” అన్నది. . కామేశ్వర్రావుకి వాళ్ళిద్దర్నీ తన్నాలన్నంత కోపం వచ్చింది. - ఈ ఏడుపేదో నిన్ననే ఏడుస్తే నాకీ కుక్క తిరుగుడు తప్పేది కదా. యింక ఈ సర్టిఫికెట్‌ సంగతి మరిచిపోదావనుకున్నాడు. తరువాత 'కాదు దీని అంతేమిటో చూద్దామనుకున్నాడు. సరే, అక్కడికి వెళ్లేదు. మొన్న వెళ్ళిన ఆఫీసే నయం. కనీసం గుర్రప్లిలలు అయినా పట్టేవి. యిక్కడ కుక్క పిల్లలు కూడా ఉండలేవు. రెండు చిన్న కొట్టు. ఒక బెంచీ. టేబిలు మిద కాయితాలు ఎగిరిపోకుండా రాళ్ళు. గాలి, వెలుతురు లాంటి పంచభూతాల్లో వ ఒక్కటీ అందులోకి రావు. వస్తే మనిషి భూతాలే రావాలి, వాళ్ళ డెత్‌ సర్టిఫికెట్‌ కోసం. ఏవుందీ? మళ్ళీ పేదరాశి పెద్దమ్మా! పెద్దమ్మ కొడుకా! కొడుకు చేతి గొడ్డలా! “నాకు దెత్‌ సర్టిఫికెట్‌ కావాలి.” అక్కడున్నతను ఎదురుగా ఉన్న పుస్తకం అంతా తిరగేశాడు. | “ఆ సంవత్సరంలో ఆ వీస్పిటలు నుండి మాకు ఒక్క దెత్‌ కూడా రిపోర్టు అవలేదు సార్‌. మీరిచ్చిన కాయితం చాలదు. ఆ హాస్పిటల్‌ వాళ్ళు మున్సిపాలిటీ ఫారం నింపి మాకు పంపాలి. పోనీ మిరు వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి తెచ్చినా సరే” అన్నాడు. చేసే మనకీ అయినా ఆ హాస్పిటల్‌ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఎవడి డ్యూటీ వాడు చేస్తే తిప్పతెందుకు? సరే. మర్షాడు ఆ హాస్పిటల్‌కి వెళ్ళేడు. అక్కడ బోర్డు లేదు. లోపలికెళ్లి అడిగేడు. ఆ డాక్టరుగారు ఆస్పత్రి మూసేసి ఆర్నెల్ల క్రితం దుబాయ్‌ వెళ్ళిపోయేడు. శభాష్‌! యింక చెయ్యగలిగిందేం లేదు. ఠి కావేంశ్రర్రావు ఇంటికి - కథ దుబాయ్‌కి! వైన పడకకే మౌ కెకె 22ఊఊఊఊఊఊ౭డడడెడెసెెడడడడడ

ఈ వెలుతురు అ '00ధీర్‌

“మానవ సంబంధాలకు, రాజకీయాలకు, కళలకు ఎంత మనం ఇవ్వగలం? అన్న ఆలోచన ముఖ్యం...అప్పుడే మన తపన తాదాత్యం చెంది కాలాతీతంగా నిలబడుతుంది. అంతేకాని ప్రజాసేవకుడికి, కళాకారుడికి, తన చుట్టూ వున్న జనాన్ని [్రేమించగలిగేవాడికి ఈ వ్యాపార సంబంధాలు వర్రించవనే నా ఉద్దేశ్యం....”

టపటపమని చప్పట్లు.

ఆ మాటలు అన్నది పేరెన్నికగన్న రాజకీయవేత్త మిత్ర.

.. “అంటే.....డబ్బు, కీర్తి పొగడ్త ఇవేవీ ఆశించకుండా ఉండాలంటారా? అది సాధ్యమా? చటుక్కున లేచి అడిగాడు ఒక కుల జర్నలిస్ట్‌.

“అవన్నీ మనం ఆత్మతృప్తితో చేసే పనులకు బైప్రొడక్ట్స్‌. అలా అనుకోవడం సాధ్యమా అంటారా? అసాధ్యం మాత్రం కాదు...”

పాలమిగడ రంగు జుబ్బా సరిచేసుకుంటూ, కళ్ళజోడు సుతారంగా తుడుచుకుంటూ మెల్లిగా.... సున్నితంగా జవాబు చెపుతున్నాడు మిత్ర. అతడు చాలా కాలిక్యులేటడ్‌ జస్ట్వర్స్‌ (0జేయ12668ఎట6ూం) అలవాటు చేసుకున్న కళాకారుడు. +"

“మికు సాధ్యమా?” మరొకసారి తుపాకీ తూటా లాంటి ప్రశ్న

టప టప తప్పట్లు కొట్టింది నందిని టి.వి. చూస్తూ... టి.వి.లో పేరెన్నికగన్న రాజకీయ షార్టీకి ప్రధాన నాయకుల్లో ఒకరైన మిత్రగారి ఇన్టర్వ్యూ వస్తోంది.

రకరకాల ఫీల్డ్స్‌ నుండి అతణ్ఞి ఇన్టర్వ్యూ చేస్తున్నారు. 'నిజం... అతనికి సాధ్యమా!? మంచి ప్రశ్న వేశారు. ఏం సమాధానం చెబుతాడుట మానవుడు? మాట్లాడినంత తేలిక కాదు జీవితం అంటే?”

తనలో తాను గొణుక్కుంటూ అనుకుంటోంది నందిని. ఆమెకు చాలా అశాంతింగా, కచ్చగా ఉన్నది.... అనాలోచితంగా సీసాడు మంచి నీళ్ళు గటగట తాగేసింది.

“అదే చెపుతున్నాను. అందరు రాజకీయ వేత్తలు, కళాకారులు, వాజ్‌పాయిలు, రవివర్శలు, రవిశంకర్లు, లతామంగేష్మర్లు. అవనజ్ఞల్లేదు. అంతమాత్రం చేత, ప్రపంచంలో గుర్తింపు లేనంతమాత్రం చేత దేశసేవ చేసే వారు ప్రపంచం గురించి ఆలోచించే వారు, ఒంటరి నక్ష్మత్రంలాగా బ్రతికేవారు లేకపోలేదు. వారంతా మాకు గుర్తింపు వచ్చిందా లేదా అన్నది ౩ కథరిని- 200౫ చేడు

ఆలోచించకుండానే ప్రపంచానికి చాలా చేస్తున్నారు... వీరికి కీర్తి డబ్బు రావచ్చు. రాకపోవచ్చును. సంఘంలో నిజమైన మార్పు, ఎదుగుదల - ఇదుగో ఇటువంటి వారిని గుర్తించినప్పుడే వస్తుంది.”

మళ్లీ జడివానలా చప్పట్లు....మేధావి వర్గం నుంచి మిత్రకు అభినందనలు అలవాటే... అతని శత్రువులు కూడా అతని మాటల్లో చాలా లౌక్యం, టాక్టిక్స్‌ ఉన్నది అని చచ్చినట్లు ఒప్పుకుంటారు.

ఈ నెగిటివ్‌ ప్రాపగాండా చాలా గొప్పది .... తమాషాగా మిత్ర చాలా మంది (ప్రతిపక్ష నాయకుల విమర్శల వలన పేరు తెచ్చుకున్నాడు. అతడు అనవసరంగా ఎవరినీ విమర్శించి దొరికిపోలేదు. అందుకనే అతని మంచి మాటలకు “లౌక్యం” అన్నది అంటగట్టి ఆనందిస్తారు - శత్రువులు. ప్రపంచం “లౌక్యం” తెలిసిన వాళ్ళను దూరం చేసుకోలేదు కాబట్టి అతడు గొప్ప నాయకుడిగా చలామణి అయ్యాడు. -

మిత్ర నాటకాలు వేసేవాడు... పేరురాక, బ్రతకడం చాతకాక ఆదర్శాలు తాగి బతుకు తున్న మంచి రచయితకు తృణమో పణమో చేతిలో పెట్టి నాటకాలు రాయించుకుని దేశం అంతా టట్రూప్‌తో తిరిగేవాడు మిత్ర. చాలా సొంత సొమ్ము ఒదుల్బుకునేవాడు. కానీ, కొంతకాలానికి అతడు పెట్టినదానికి రెండింతలు, అయిదింతలై తిరిగి వస్తుందని అతనికి తెలుసు అన్నది " గిట్టని వాళ్ళ న్లోగాను.

“ఆ వచ్చి కూర్చున్న వ్యక్తి ఒక్కడి కోసరం నేను నాటకం ఆదే తీరుతాను...” - ఎదుటి పార్టీ వాళ్ళు ఒక చిన్న టౌన్‌లో అతని నాటకానికి జనాన్ని. రానీయకుండా ఆపితే అతను తీసుకున్ననిర్ణయమది.

ఆ విషయం బాక్స్‌ కట్టివేసింది ప్రముఖ పత్రిక. అంతే.... మర్నాడు అవతలి వాళ్ళను “ఫీ కొట్టి తండోపతండాలుగా తమ కళాకారుడిని గౌరవించుకోవడానికి తరలి వచ్చారు జనం... “మికు జనం నాడి తెలుసు....” మెచ్చుకుంటూనే కాస్త వంకరగా అన్నాడు ఒక పత్రికా సంపాదకుడు.

“యు ఆర్‌ రైట్‌...నా జనం నాకు తెలుసు....” తియ్యగా నవ్వుతూ అన్నాడు మిత్ర.

అలా అంచలంచలుగా పైకి వెళ్ళిపోతున్నాడతను.

“రాజకీయాలు, కళారంగం సరే...మానవ సంబంధాలలో ముఖ్యంగా పెళ్లిలో మనం ఎదటి వారికి ఏమిస్తున్నాము? అన్నదే ముఖ్యం అన్నార్రే...అది అసాధ్యం కాదా?...” జీవితమంతా సంపాదిస్తూ మొగుడి వ్యసనాలు, అసమర్థతను పోషిస్తున్న లేడీ జర్నలిస్ట్‌ అడిగింది.

“పెళ్ళిని వ్యాపార సంబంధంగా భావించకపోతే సాధ్యమే. పెళ్ళి వేరు - ప్రేమలు, అభిమానాలు ఉన్నా ఉండక పోయినా అది తప్పనిసరి. కట్టుబాటు అనుకుంటే...కష్టమే... ఏదో సున్నితమైనదంతా హరించుకు పోతుంది” - నిట్టూరుస్తూ అన్నాడు మిత్ర.

అతడు నటుడు...ఎప్పుడు ఏ మాట ఎలా ఉచ్చరించాలో తెలిసిన వ్యక్తి.

“అది సాధ్యమా?...మాకు సాధ్యమనిపిస్తుందా?”

ఉత్సుకతతో చూస్తోంది నందిని... ఏం సమాధానం చెప్తాడు? కరెంటు పోయింది.

చీకట్లో టి.వి. ఇంకా మాట్లాడుతున్నట్లే, దానివంకే కన్నార్సకుండా చూస్తోంది నందిని.

“ఏం చెప్తాడు?! ఎలా చెప్తాడు?! పెద్ద గొప్ప...” విరబోసుకున్న జుట్టు ముడి కట్టుకుంటూ కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది నందిని. 2111222222 3ంటటఏ క

(ప్రి వ అతణ్జి తిట్టుకునే హక్కు తన సొంతం - అనుకునే నందిని మిత్ర భార్య. ౨66 చాలా పెళ్ళిళ్ళల్లో జరిగినట్లే మిత్ర నందిని పెళ్ళి ఏమాత్రం ఒకరినొకరు అర్థం చేసుకోని ఆనవాయితీ అనే కల్యాణ మంటపంలో జరిగింది....చాలా తెలివిగలవాడు అనుకునే మిత్ర నందిని అమాయకమైన అందాన్ని మౌనంగా బేలగా చూసే ఆ పెద్ద పెద్ద కళ్లల్లోని నీలినీడల మైకంలో పడిపోయాడు....ఆమె దేన్ని గౌరవిస్తుంది? ఎలా ఆలోచిస్తుంది? అని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు... అందగాడు, కాలేజీ యూనియన్‌ లీడరు, తను తప్ప కట్నం అడగనివాడు, తన ప్రత్యేకతలను పొగిడేవాడు అయిన మిత్ర ఆరాధనలో పడిపోయాను అనుకున్నది నందిని. పెళ్ళైన మర్నాటి నుంచే చాలా అమాయకమైన ఊహల.... మేఘాలు చెదిరిపోవడం ప్రారంభించాయి. మిత్ర మనిషిగా వేరు...అతను చాలా ఆంబీషియస్‌. తను అనుకున్నది సాధించేదాకా నిద్రపోడు...అతను ఏ రోజూ సామాన్యుడిలో ఒకడిగా (బ్రతకలేదు....తను ఒక మెట్టు పైన నిలబడికే కానీ మరొకరికి చెయ్యి అందివ్వలేము అన్నది అతని వ్యక్తిగత అనుభవం... అప్పుడు మనం చెప్పినది వింటారు జనం ....అంటాదతను. అతడికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలున్నా యని అతని చుట్టు పక్కల జనం అంటారు కానీ, అతను నాయకుడు అవడానికి చాలా విషయాల్లో చాలా శ్రమపడి తనను తాను మార్చుకున్నాడు. ఎన్నో నేర్చుకున్నాడు. అతడు బైటకు చెప్పడు కానీ, తన వ్యక్తిత్వం పట్ల అతనికి చాలా గర్వం ఉన్నది....మనిషి త్వరలో పైకి లావడానికి, పేరు, గుర్తింపు పొందడానికి రాజకీయాలు చాలా దగ్గర మార్గం అని గుర్తించాదతను. రాజకీయం నేర్చుకున్నాడు. అందువల్లే కేవలం ప్రజాసేవో, మంచితనమో మాత్రం గుర్తింపు తీసుకురావు; తనను తాను మార్కెట్‌ చేసుకోవడం, ప్రతిక్షణం మంది తనను మర్చిపోకుండా చూసుకోవడం అతి ముఖ్యం అని గుర్తించాడు. మిత్ర లోపలి ఈ వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి తెలుసు. అతి సామాన్యురాలైన నందినికి అసలు అర్థం కాలేదు. మధ్యతరగతి ఆడపిల్లల జీవితాలను చుట్టూ ఉండే మనుష్యులు, భావాలు, మాటలు చాలా ప్రాభావితం చేస్తాయి. అమాయకంగా ఉండి ఎదురు చెప్పడానికి భయపడే వాళ్లను మరింత భయపెట్టి ఇన్‌ఫీరియారిటీ కాంప్పెక్స్‌ తెచ్చి తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తారు జనం. కుటుంబ వ్యవస్థలో చాలా అస్తావిస్తాలకు ఇది పెద్ద కారణం. ప్‌ొ ఏపనైనా టైముకు చేశావా? ఎందుకు నీ వస్తువులు ఆర్టర్‌లో ఉంచవు? ఏమిటా తిండి? ఇంతింత చిన్న విషయాలు నీకు అర్దం కావడం లేదా? నీకు పైజు వచ్చిందా నేను నమ్మను....” న్న విష స్వ టూ వచ్చి ఇట్లాంటి మాటల ఈటెల మధ్య పెరుగుతారు చాలా మంది... నేను ఏదీ చెయ్యలేనేమో, నేను ఎందుకూ పనికిరానేమోనన్న భావన మనస్సులో నాటుకుపోతుంది. కొన్నాళ్ళకి మన చుట్టూ సాంఘిక నీతులు, భార్య లేక భర్త, ఎదుగుతున్న కొడుకు, పక్కింట్లో మనుష్యులు - అంతా కలిసి నన్ను అన్యాయం చెయ్యడానికీ, బాధపెట్టడానికే సిద్ధంగా ఉన్నారన్న భావాలతో కొత్త నరకాలు సృష్టిస్తారు. క కథా౮హిగి- 2004 2222222222

న 2

సరిగ్గా నందిని విషయంలో ఇదే జరిగింది....తమ ఇల్లు అనే నరకం నుంచి మిత్ర తనను రక్షిస్తాడు అనుకున్నది కానీ... అతడేమిటి? ఎలా ఆలోచిస్తున్నాడు?! అని ఏనాడూ ఆలోచించలేదు నందిని.

“నన్నుగా కోరుకోవడం” అనే అహం సంతృప్తి వల్లనే చాలా (ప్రేమబాంధవ్యాలు పెళ్ళిళ్ళుగా రూపుదిద్దుకుంటాయి.... కానీ, మూడు వంతుల పెళ్ళిళ్ళు సమస్యలపాలు కావడానికి కారణం “నేను నేనుగా ఏమిటి?” అని తెలుసుకోలేకపోవడమే.

కానీ కట్నం లేకుండా పెళ్ళి చేసుకోవడం, పెళ్ళి అయిన తరవాత అతడి సంపాదనంతా నాదే అన్న ఈ రెండు ఆలోచనలే నందిని లాంటి అమాయకుల్ని రంగుల వలలో ఇరికిస్తాయి. పెళ్లి కేవలం ఆర్థిక సంబంధం మోద ఆధారపడితే ఎంత ప్రమాదమో, ఒకరి ప్రియారిటీస్‌ మరొకరికి అర్ధం కాకపోజే ఎంత నష్టమో అర్ధమయ్యేటప్పటికి అతి భయంకరమైన ఒంటరితనం జీవితానికి నీడగా మారి శిక్షిస్తుంది.

కలిసివచ్చే కాసిని డబ్బులు మనం దాచుకోక ఈ పెట్టుబడులు, ఆర్తుల సహాయాలు ఏమిటిట?! వారంలో నాలుగు రోజులు ట్యుటోరియల్‌లో పనిచేస్తూ, మిగతా కాలం పార్టీ కోసరం పనిచేసేవాడు మిత్ర....పార్టీలో చేరే అట్టడుగు జనానికి అకలి, అసమానత - ఈ రెండింటికి అర్ధం తెలియనంత కాలం పార్టీ దెబ్బతినదని తెలిసిన రాజకీయవేత్త అతను.

తన ఆలోచనలేమిటో, తను దేనికోసం పోరాడుతున్నాడో తెలియకుండా, కనీసం తెలుసు కోవాలన్న ప్రయత్నం చెయ్యకుండా మూర్ధంగా మాట్లాడే నందినిని చూసి మొదట్లో ఆశ్యర్య పోయాడు మిత్ర. ;.

కొంతకాలానికి, “నా సంపాదనలో నీకు భాగమున్నది. దాని ఖర్చుకు నేడు లెబ్ధలు అడగను

  • కానీ నా ఆలోచనలపైనా, నా ఆదర్భాలపైనా నీకు హక్కు లేదు...అది కావాలంటే వాటిని నాతో పంచుకోవాలి...” మెల్లిగా నచ్చచెప్పాడు మిత్ర.

అర్ధం చేసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు నందిని....

“మో ఆయన లైసెన్సులు గట్రా ఇప్పిస్తాడట.... బాగానే చెయ్యి తడి అవుతుం దట...కనీసం మరొక జత బంగారు గాజులన్నా చేయించుకోలేదేం?”- అక్కయ్య వ్యంగ్యంగా అన్న మాటలు పనిచేశాయి నందిని మోద. .

“నాకు మీ బోడి ఆదర్శాలు అబ్ధర్లేదు. నేను మనిషిని... మామూలు మనిషిని....నేను గొప్పదాన్ని అని ఎప్పుడూ చెప్పలేదు...నా గురించి ఆలోచించమని అడిగే హక్కు భార్యగా నాకు ఉన్నది....” - రాక్షసంగా అరిచింది ఒకరోజు... కాస్సేపటికి బేలగా ఏద్చింది.... ఇలా ఆ సంవత్సరంలో చాలాసార్లు జరిగింది. అతను పార్టీ మీటింగ్‌కు వెళ్లేముందో, ముఖ్యమైన పని ఉన్న రోజో ఈ ఇంట్లో కుంపటి అతణ్ణి చాలాసార్లు ఇబ్బంది పెట్టింది.

ఆ రోజు కూడా అంతే...అతి ముఖ్యమైన మిటింగ్‌... అప్పటికే ఆలస్యం అయింది.

“క్రారుకు ఏక్సిడెంటు ఏదో కల్పించు... జనానికి తెలిసేలా చెయ్యి....నా చేతికి కొంచెం బాండేజి అవీ సిద్ధం చెయ్యి...” ఫోన్‌ చేసి చెప్పాడు అతనిలో రాజకీయవేత్త.

కాసేపు అతడిలో మనిషి కిటికీలోనించి చూస్తూ నిలబడ్డాడు.

“నా గురించి ఆలోచించు....అని అడిగే హక్కు నీకు లేదు నందినీ...దానికి ఆప్యాయత డడ 2222222222 =... కై

అవసరం. నీ వైపు నించి ఆలోచించగలనేమో కానీ, నీ గురించి ఆలోచించాలంటే....”

“చాలా అర్హళలు కాపాలి అంటావు... అవునా?! మరి ఈ మంది ప్రజలకు, ఆర్హులకు, దుః ఖితులకు ఏ హక్కు అర్హత ఉన్నాయని వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు?”

చటుక్కున వెనక్కు తిరిగాడు మిత్ర.

“ఆగు....ఆగు...ఏమిటీ నీ ఉద్దేశ్యం?! వాళ్లకు ఏం కావాలో, ఏది కావాలో తెలియదు ..“మంద” అని నువ్వు అనుకుంటున్న జనం మంచి చెప్పిన సోక్రటీస్‌కు విషమిచ్చారు.. జీసస్‌ను సిలువ వేశారు..... గాంధీని కాల్చేసుకున్నారు... వాళ్లెంత అమాయకులంటే... వాళ్లకు మంచేదో చెడేదో తెలియని అమాయకులు. వాళ్ళకు వాళ్ల మేలుకోరుతున్నాను అనే భావన కావాలి. కానీ, నీ విషయం వేరు నందినీ...నీకెలా చెప్పాలి?!” నిట్టూరుస్తూ అన్నాడు మిత్ర.

“నాకు అవన్నీ తెలియదు...నాకు కావలసింది నీ అటెన్షన్‌. నన్ను గురించి ఆలోచించా లన్న కోరిక...” ఎజ్జబడి పోయిన కళ్ళ నీరు ఒత్తుకుంటూ స్థిరంగా, రోషంగా చెప్పింది నందిని,

“అటెన్షన్‌ కోరుకోకు నందినీ....టెన్సన్‌ వస్తుంది అంతే... అది కోరుకోకూడదు. ఎదటి మనిషి గుర్తించి ఇవ్వాలి.” _

నాకు నవ్వు వేరు నందినీ...” అన్న అతడు ఆమెకు ఎప్పుడూ అర్ధం కాలేదు.

“నాకన్న నీకు ఈ మంది ఎక్కువ... నీ మాటలన్నీ నీటి మాద రాసిన రాతలు...” - అతడు కానుకగా ఇచ్చిన మంచి పుస్తకాలన్నీ చింపి పొయ్యడం ప్రారంభించింది నందిని.

“ఒకప్పుడు ఈ అమ్మాయిని చూసేనా కవిత్వం రాశాను అని ఆలోచిస్తూ రాక్షసిలా ఉన్న ఆమె చేతిలోనించి లాగి మంచి పుస్తకాలు దాచుకోగలిగాడు మిత్ర.

“ఏడవకు నందినీ.... ఆలోచించు ... ప్లీజ్‌..” తల మిద చెయ్యి వేసి నిమురుతున్న అతణ్జి ఒక తోపు తోసి-

“నీ గురించి ఆలోచిస్తే ఏదవక ఏం చెయ్యను?! నా ప్రవర్తనకు నువ్వే కారణం ...” అరిచింది నందిని.

“మన ప్రవర్తన మన నిర్ణయాల మిద ఆధారపడి ఉంటుంది కానీ మన పరిస్థితుల మాద కాదు నందిసీ...అర్థం చేసుకో...” అని బైటికి వెళ్లిపోయాడు మిత్ర.

వెంగాంత 5143 26 6900096 08) 125 16 6660100 10 0%0056 .

సూటుకేసు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది నందిని.

6

రెండేళ్ళ తరువాత ఆమె ఉండే ఊరుకు వచ్చాడు మిత్ర. కుటిల రాజకీయాల్లో కూడా తట్టుకుని నిలబడి ఒక మంచి రాజకీయవేత్తగా, కెటలిస్ట్‌గా పేరు పొందాడు మిత్ర.

  • “ఆయీ ఆ జాతకంలో ఆ శుక్ర దశ తప్పనీ...అప్పుడు తెలుస్తుంది అయ్యగారి పని...గ్రహాలు బావున్నంతసేపే....” అని వెక్కిరించాడు, అవతలి పార్టీ నాయకుడు వర్శతో అతని భజన పరుడైన జ్యోతిష్కుడు. కుటిలుడు, స్వార్ధపరుడు అయిన వర్మ చాలా కప్పదాటు వ్యవహారాల వ్యక్తి...అతను మిత్రలోని ఛరిస్మా భరించలేడు.... బద్ధ విరోధి అయిపోయాడు మిత్రకు. అపోజిషన్‌ పార్టీలో ఉన్నాడతను. .

టి.వి.లో మిత్ర ఇన్టర్వ్యూ చూసిన తరువాత చాలా ఆలోచనలో పడింది నందిని. తడై కై కథారరిని - 2004 2223232322

లాటా టా . అంత ఎదుగుతున్న మిత్రను ఈ మధ్యలో కలుసుకోలేదు నందిని. ఈ రెండేళ్ళలో చాలా చేదు నిజాలు తెలిసాయి. ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగా బ్రతుకుతాను అన్నది ఎంత ఓటి మాటలో ఆమెకు కౌంచెం అర్థమౌతోంది. నా వాళ్లు అనుకునే ఐనవాళ్ల నీచత్వం అర్థమౌతోంది. తను అనుకునే స్వతంత్ర్యం కొంత డబ్బు కట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. కానీ, చాలా నీచత్వాలు తెలియనట్లు నటిస్తే కానీ జీవితాలు...చాలా జీవితాలు గడవవు. (ప్రస్తుతం నందిని పనిచేస్తున్న ఆఫీసులో ఒక పోస్ట్‌ ఉన్నది....అన్ని అర్హతలు ఉన్న తనని కాదని ఏవో లంచాలు చేతులు మారి ఆ ఉద్యోగం చెయ్యి జారిపోతుందని తెలిసింది నందినికి. అందుకే మిత్రను కలుసుకోవాలని వెళ్లింది.

దాని వెనక ఇంట్లో వాళ్ల ప్రోద్భలం, స్నేహితుల సలహా ఉన్నవి.

ఒంటరిగానే వెళ్లింది....కారణం అక్కడ ఒకవేళ ఏదైనా అమర్యాద జరిగితే అది అందరికీ తెలియడం ఇష్టంలేక...

గూర్థా ఆపితే ఏం చెప్పాలి? ఎవరు మిరంటే వమనాలి? నేను అతని భార్యనని ఛస్తే చెప్పను...మరి?! ఇలా తర్జన భర్ణన చేసుకునే వెళ్లింది.

ఆ అవకాశం, ఇరకాటం లేకుండానే అతడే వరండాలో కనిపించాడు.

“రా నందినీ...”

మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు.

అతడి చుట్టూ చాలా మంది హోదా గలవాళ్ళు ఉన్నారు. తన కోరిక ఎంత చీప్‌గా ఉంటుందో ఎవరూ చెప్పకుండానే అర్ధమైంది నందినికీ,

“నా భార్య....” - మామూలుగా రెండేళ్ళ క్రితం తమ డ్రాయింగ్‌ రూంలో పరిచయం చేసినట్లే చెప్పాడు మిత్ర.

కొందరు ఉలిక్కిపడ్డారు. కొందరు ఆశ్చర్యపోయారు... మరి కొందరు తలపంకించారు.

ఎవరో మిత్ర దగ్గరకు వచ్చి ఏదో చెప్పారు. అది రాజకీయం.... ఆమె ఎందుకు వచ్చిందో అతడికి అర్ధమైంది. పక్కన గదిలోకి తీసుకువెళ్లి -

“నీకు అన్ని అర్జతలు ఉన్నప్పుడు ఆ పోస్ట్‌ నీదే నందినీ! నేను కనుక్కుంటానులే...మి అన్నయ్య వాళ్ళూ బావున్నారా?! మి వదిన చేసే చక్కిలాలు నేను ఇప్పటి దాకా మర్చిపోలేదని చెప్పు....”

నవ్వుతూ, మాట్లాడుతూ అరగంటలో కార్గో ఇంట్లో దిగబెట్టాం చాడు మిత్ర.

“నీ చక్కిలాలు మితభ్రకు జ్ఞాపకం ఉన్నాయి వదినా!” మెల్లిగా ఆలోచిస్తూ ఆ రాత్రి వదినకు చెప్పింది నందిని.

“నిజమా! ఎంతైనా మనిషి చాలా మంచివాదమ్మా! అయినా వెళ్ళిన దానివి ఉండిపోక పోయావా?! నువ్వు డైవోర్స్‌ కావాలని పోట్లాడినా అతను ఇవ్వలేదుగా!....అయినా నీది మూర పంతంలే నందినీ...” సూటీ పోటీ మాటలు అంటూనే నిద్ర పోయింది.

కేవలం ఒక చిన్న కాంప్లిమెంటు మిత్రను తిట్టే మనిషిని మార్చేసిందా?! నిర్లిప్తంగా నవ్వుకున్నది నందిని. ఈ మధ్య ఆమెకు చాలా అర్ధమౌతున్నాయి.

“మా ఇంటి పక్కన మిత్రగారి శక్రటరీ చుట్టాలున్నారట...ఆవిడ వచ్చింది....మూడు, వేళ్ల 2122222222 సెంటట క

వెడల్పు వెంకటగిరి జరీ చీర కట్టుకుని... తొందరపడ్డావేమో నందినీ...సకల భోగాలు అనుభవించేదానివి కదా....” - తోటి లేడీ ఆఫీసరు మాటలు అసలే అస్థిత్వం లేని నందినిలో మళ్ళీ కచ్చ రేపింది. తను కట్టు కున్న నూలు చీర చూసుకున్నది. ఐదు వేళ్ల వెడల్పు జరీ చీర, రవ్వల దిద్దులు ఊహించుకున్నది. ఇవన్నీ తనకు లేకుండా చేసినవాడు మిత్ర అనిపించింది. “ఎక్కడ తన దగ్గర ఉండిపోతానో అని కార్లో వెనక్కు పంపాడు ఆనాడు” అని కచ్చగా మాట్లాడింది.

సరిగ్గా ఆ సమయంలో, ఆమెను, ఆమె పరిస్థితిని వర్మ అర్ధం చేసుకున్నాడు. అవకాశం తీసుకున్నాడు.

మొగవాడి జీవితంలో బలహీనతలకు, హిపోడ్రసీకి భార్య కన్నా మంచి మౌత్‌ పబ్లిసిటీ ఉందదు....ఈ విషయం (గ్రహించిన వర్మ సరిగ్గా ఎలక్షన్ల ముందు నందిని అన్నగారికి లైసెన్సు ఇప్పించి, వదినగారికి బంగారు నెక్లెసులు ఇప్పించి, నందినలో అసూయ రేకెత్తించి అనుకున్నది సాధించగలిగాడు.

మిత్ర గురించి నందిని ఎక్కువ చెడు చెప్పలేకపోయినా వర్మకు కావలసింది జరిగింది....మిత్ర ఓడిపోయాడు.

“ఒదిలిపోయింది తిక్క.. ఒక్కసారి... ఒక్కసారి అలా చెంప దెబ్బ తగిలితే చచ్చినట్లు అహం దిగుతుంది...అందుకే అతను ఓడిపోవాలని నేను వెయ్యి దేముళ్లకు మొక్కుకున్నాను. ఆలికి అన్నం పెట్టని వాడు ఊరికి ఉపకారం చేస్తాడా?”...ఇలా చాలా చాలా మాట్లాడింది నందిని...కానీ! ఆమె భరోసా చూసుకుని 'ఇంట్లో అందరూ అతడిని రాక్షసుడిలా మాట్లాడుతూ వుంటే ఎందుకో భరించలేకపోయింది. కానీ...ఆమె దేనినీ ఆపలేదు... కారణం ఆ నిప్పు రగిలించింది తనేగా...నందినిలో అంతర్మధనం ప్రారంభమైంది.

ఒక్క సంవత్సరంలో చాలా జరిగాయి.... ఓడిపోయినా మిత్ర తన నియోజకవర్ధానికి చాలా చేస్తూనే ఉన్నాడు....అతడు మళ్ళీ రాజకీయపరంగా పుంజుకోవడాన్ని భరించల్సేని వర్మ వర్గం అతణ్జి కత్తితో పొడిచారు....

అంతే....జాలి జనాన్ని ఓట్లు వేయిస్తుంది. రైళ్లు తగలబెట్టిస్తుంది...ప్రజలకు తమకన్న మేధావి మిద ్రజుడీస్‌ ఉంటుంది. అందుకే అభిమానించినా దూరంగా ఉంచుతారు... కానీ, తాము జాలి పడగలవాళ్ల మిద అధికారం వస్తుంది.... గోచీ పెట్టి బక్కచిక్కి పోయి, ఉపవాసాలు చేసే గాంధీగారంటే ఉన్న సానుభూతి శక్తివంతులుగా, మేధావులుగా కనబడే వల్లభాయ్‌ పటేలు మాద, నేతాజీ, సుభాష్‌ చంద్రబోస్‌ మిద ఉండదు....అందుకే తెలివైన రాజకీయవేత్త ప్రజల సొనుభూతిని సంపాదించుకుంటాడు.

అనాలోచితంగా మిత్రకు అదే జరిగింది.... ఒక్కసారిగా అతను హీరో అయి పోయాడు... అతని కోసం కిరోసిన్‌ పోసుకుని తగలబడే సానుభూతిపరులు ఎక్కువయ్యారు. మిత్ర-వర్గం ఈ అవకాశాన్ని వదిలిపెట్టకుండా అతణ్జి ఆకాశానికి ఎత్తేసింది.

" ఉప్పెన గాలిలో, వర్షంలో కారు దిగి తన ఇంటి వైపు వస్తున్న వర్మను చూస్తోంది నందిని...ఆమె ఈ మధ్యకాలంలో చాలా చాలా ఆలోచించడం నేర్చుకున్నది....మనని బాధపెట్టే విషయాలకు మనం చాలా శక్తిని ఇస్తాము....దీనివల్ల మనను దిగజార్చే వాళ్ల ప్రభావం మన మోద చాలా ఉంటుంది.... అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న తమ ఇల్లు, తన వాళ్లు ఎంత

బాగా వర్మకు అర్ధమై పోయారా? అని ఆశ్చర్యపోయింది.

వర్మ మాటలు అన్నీ విన్నది....అతని భయంకరమైన ప్లాను, దానికి తమ కుటుంబం ఇవ్వవలసిన సహకారం, దానికి పరిహారంగా తనను ఎలక్షన్లలో ఎదటి పార్టీ ఖర్చుపెట్టి నిలబెట్టడం

  • అన్నీ విన్నది. ఆ పొగడ్తల వెనకాల హేళన, ఆ లంచాల వెనకాల నీచత్వం అర్థమైంది. ప్రతిక్షణం మిత్ర గుర్తుకు వస్తున్నాడు.....'లౌక్యం తప్ప కోపం లాభం లేదు' అని అతడు ఎందుకు చెప్పేవాదో ఆర్థమైంది.

“రేపు రంది...అన్నయ్య లేడు...ఆలోచించి చెప్తాను...” అని చెప్పింది.

అతను వెళ్ళగానే ఆ తుపానులో, కరెంటు పోయిన ఆ చీకట్లో మిత్ర ఉండే ఇంటి వైపు అడుగులు వేస్తోంది నందిని.

“'మానవ సంబంధాలకు, రాజకీయాలకు, కళాకారుడికి ఇవ్వాలన్న కోరిక, ఏదైనా చెయ్యాలన్న కోరిక ఉందాలి....ఎంత మంచి చెయ్యగలం? అన్న ఆలోచన ఉండాలి...” - ఎంత బాగా చెప్పావు మిత్రా!....

కళ్ళ వెంబడి కారే నీరు తుడుచుకుంటూ ఎవరో ఆపాలన్న ప్రయత్నం చేసినా ఆగకుండా మిత్ర దగ్గకు వెళ్ళి కుప్పకూలి పోయింది నందిని. గబగబా ఎదటి పార్టీ వాళ్ల ప్లానంతా చెప్పేనింది. మరుక్షణంలో ఆ చుట్టూ ఉన్న మందికి ఆవె మోద గౌరవం పెరిగిపోయింది....*“ఎంతైనా భార్య...” అని క్షమించేశారు.

ఈ డ్రామా అంతా మౌనంగా నవ్వుతూ చూస్తున్నాడు మిత్ర. అందరూ వెళ్ళిపోయి వాళ్ళిద్దరే మిగిలారు. -

“నన్ను క్షమించు మిత్రా! మాట్లాడు....” ఏడిచింది నందిని.

“ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పు...” అని కుదిపింది.

“సమాధి....సమాధి గురించి ఆలోచిస్తున్నాను”

“అంటే?...”

“వర్మ వర్గం నన్ను చంపడానికి ప్రయత్నించగానే నాకు గుర్తుకు వచ్చింది ఏమిటో తెలుసా?! సమాధి... 'మన సమాధి మాద రాసే వాక్యాలు ఎలా ఉండాలో మనం నిర్ణయించుకుంటే అలాగే మన జీవితాన్ని మనం మనం కొనసాగిస్తాము అన్న మాటలు నన్ను చాలా ప్రాభావితం చేశాయి. జీవితాన్ని భగవంతుడు మనకు కానుకగా ఇస్తే మనం భగవంతుడికి తిరిగి మనం జీవించిన కాలాన్ని బహుమతిగా ఇవ్వగలమా?! అందుకు అర్హలమేనా? అన్నదే ప్రశ్న...”

“అంటే?...నేనిప్పుడు ఎలా ఉండాలి?” పసిపిల్లలా అడిగింది నందిని.

“ఎలాగైనా ఉందు. నువ్వు నువ్వుగా ఉండు... నాకు కావలసినట్లు అని చెప్పేటంత తెలివితక్కువ వాణ్ణి కొను. నాతో నవ్వు జీవించగలవా? అని ప్రశ్నించుకో...జీవితాంతంలో సమీక్ష చేసుకుంటే నువ్వు ఏం మిగుల్చుకోదలచుకున్నావో దానికి ఇప్పటి నుంచి ప్రయత్నం చెయ్యి...ఈ పార్టీలు, రాజకీయాలు, గెలుపు, ఓటములు, దబ్బు... వీటన్నింటి మధ్య మనం మనంగా ఏమిటి? ఆలోచించుకో... ఇదే నీకు నేను చెప్పేది...”

ఏదో బలమైన వెలుతురు హస్తం ఆమెలో మూసుకున్న తలుపును భళ్ళున తెరిచినట్ల యింది....అర్థమైతే?...అంతా వెలుతురే! ఠి 2222222222 కె ప3ంటట క

అ 5ాగ్రుగద్ద దయానంద్‌

దుఃఖాన్ని దిగమింగుకోవడం నావల్ల ఎప్పుడూ కాదు. ఎన్నో రాత్రులు ఇక్కదే ఈ వేపచెట్టు, రావిచెట్టు మధ్యలో చెరువొద్దున కూర్చుని వెక్కివెక్కి ఏద్చేను.

నిజానికి ఈ చెరువే ఒక దుఃఖ సముద్రం...

ఒక శోక సంగీతం....

తెల్లారితే చాలు! చెరువొడ్దునున్న ఈ గుడిసెనూ కూల్చేస్తారు. చెరువుకీ, గుడిసెకీ మధ్యనున్న పాతికేళ్ల అనుబంధం మట్టిలో కల్సిపోతుంది. రోడ్డును వెడల్పుచేసి బతుకుల్ని బజారు చేసే ప్రయత్నం ఈ మధ్యనే మొదలైంది. మొదట్లో రోడ్డును రెండు వైపులా సమానంగానే సాగదీస్తారనుకున్నారు. కొన్నాళ్ళకు రోడ్డుకు ఆ వైపు కూలుస్తారా, ఈ వైపు కూలుస్తారా అనే సందిగ్ధాలు, సందేహాలు ప్రచారమయ్యాయి. ఇప్పుడదేమి లేదు. ఎక్కడ ఎంతవరకు ధ్వంసం చెయ్యాలో రోడ్డుకు ఒక పకృనే పసుపుపచ్చ గుర్తులు పెట్టేర్కు చెరువుకీ, రోడ్డుకీ మధ్య నున్న గుడిసెలు, చెప్పులు కుట్టే పాత టార్బాలిన్‌ చూర్లు, ఇక్లీ దోసెలు అమ్మే నెట్టేడు బండ్లూ పూలకొట్ల. బల్లలూ, సైకిల్‌ షాపులూ, లారీల పంచరు కొట్టూ......తెల్లారితే ఏమి ఉండవు. రోద్దుకు ఆ వైపునున్న పుగాకు గోడౌన్లూ చీకటి పడితే కళ్ళు చెదిరే షాపింగ్‌ కాంస్తెక్సులూ, మందు కొట్టూ, కిరాణా షాపులూ, కుదువ వ్యాపారం చేసే బంగారపు కొట్టూ......పదిలం. వాటిని కదిలించాల్సిన అవసరంలేదన్నారు. పచ్చ మార్కింగ్‌ జరిగిందే ఆలస్యం, షాపింగ్‌ కాంప్లెక్సు ల్లో ఉన్న ఖాలీ రూముల బాడుగలు భగ్గుమన్నాయి. కాంప్లెక్సుల బయట రోడ్దు పక్కన బళ్ళు పెట్టుకొని అమ్ముకోడానిక్కూడా బాడుగలు వసూలు చేయడానికి రంగం సిద్ధమైంది.

ఇవ్వాల పొద్దున్నే వెట్టి చిన్నోడు మండలమాఫీసు నుంచి బయల్దేరి రోడ్డు ఆ చివర నుంచి ఈ చివర వరకూ తిరుగుతూ, రేకు డబ్బా మోద అరచేతి దరువేసి డబడబ లాడిస్తూ, “వినం డహో! తెల్లారితే ఇరవై రెండో తారీఖు బుధవారం పొద్దున ఎనిమిది గంటలలోగా రోడ్డు పక్కన పచ్చగుర్తులు పెట్టినకాడికి ఇళ్ళూ స్థలాలూ ఖాళీ చేయ్యాలహో .... లేకపోతే గవర్శమెంటే చర్య తీసుకుంటుందహో” అంటూ చాటింపు వేసేడు. వాడి మాటకు భరోసాగా నడిజామయ్య్యే సరికి ఊరికాచివర ఒకటి, ఈ చివర ఒకటి రెండు ్రాక్లెయిన్లు ఇనుప తొండాలు, ఉక్కు దంతాలతో ఇనుప ఏనుగుల్లా కొలువుతీరి నిల్చున్నాయి.

చాటింపు వేసిందగ్గర్నుంచి గుడిసెల్లో కలకలం -

ఏం చెయ్యాలో తోచక అయోమయమైన జనం - కభక.ఒ04 మోన ననన

గుడిసెల్ని విప్పి పనికొచ్చే కర్రా కలపను జాగ్రత్త చేసుకుంటున్న జనం - ముగ్గురు, నలుగురు గుంపులుగా చేరి రేపు జరగబోయే బీభత్సాన్ని ఎలా ఎదుర్మోవాలో చర్చించుకుంటున్న దృశ్యం - పాతికేళ్లనాడు రాత్రికి. రాత్రి మార్తమ్మతో కలిసి వేసుకున్న గుడిసె - చెరువొడ్డున తదికె తలుపైనా లేని బహిరంగ నివాసం! ఆనాడది రోడ్డు పక్కన ఒక ఏకాంత కుటీరం. . మార్తమ్మ.....మార్తా....మార్తా (గ్రేస్‌... అమె కళ్ళ చుట్టూ ఎప్పుడూ వెలిగే గొప్ప కాంతివలయం - ఆ వెలుగే మార్కింగ్‌ జరిగిందగ్గర్నించి రోడ్డు పక్క నున్న గుడిసె వాసుల్నీ బడుగు వ్యాపారుల్నీ ఒకటి చేసింది. ఎవరెవరికో అర్జీలు రాయించింది. కలక్టరు ఆఫీసు ముందు ధర్నాలు చేయించింది. ఆమె ఎప్పుడూ అంతే! నలుగుర్లో ఉండాల్సిందే. ఒంటి కాలితో రెండు చక్రాల రిక్షా సాయంతో నలుగుర్నీ కలవాల్సిందే. ఎన్ని చేసే లాభం లేదు. తెల్లారితే రోడ్డు ప్రక్కన చెరువొడ్డంతా శిధిలాలు శిథిలాలుగా కూలిపోవాల్సిందే. ఏదో ఒక సీడ కింద బతుకు నీడుస్తున్న జనం నాలుగు లైన్ల రోడ్డు కోసం చెల్లా చెదురై పొట్ట చేతపట్టుకుని దిక్కుదిక్కుకూ ఎగిరి పోవాల్సిందే! ఎవడిని కదిలించినా ఆందోళనే, ఆరాటమే, రేపు ఏం జరుగుతుందోనన్న దిగులే! " అప్పటికీ మార్తతో, “గుడిసెను ఊడదీసి పనికొచ్చేవి తీసుకొని బంకుతో మరో చోటికి వెళ్ళిపోదామా” అంటే - చిరునవ్వుతో మార్త - చెదరని అఖండ ధైర్యం - వచ్చే పోయే వాళ్ళతో పాద్దుట్నుంచీ గుడిసెలో సందడి. ఎంతకూ తెగని రేపటి కార్యాచరణ (ప్రణాళిక - వయసు ముసురుతోంది. మాటల్లో ఇదివరకటి తెగింపు లేదు. చేతల్లో నిన్నటి అవేశం లేదు. ఒంట్లో నెత్తురుదికే కొద్దీ ఎక్కడికక్కడ రాజీ పదాలన్న ఆలోచన - భద్రత కావాలి

  • జీవితానికి భరోసా కావాలి. పొద్దుటి చాటింపు తర్వాత ఊళ్ళో నుంచి శారద కూడా వచ్చి గుడిసె బయట నిలబడి, “మనింటి కొచ్చెయ్యరాదా?” అంది. పాతికేళ్ళనాడు కాదునుకుని వచ్చేసిన ఇల్లు - నలుగుర్తో కూర్చుని మాట్లాడుతున్న మార్త పెదాల మోద నవ్వ పువ్వును పూయించి మిలమిల మెరిసే కళ్ళతో లోపలికి రమ్మంది. గుడిసెలోకి రాలేదామె. నా నుండి మారు సమాధానం కోసం ఎదురు చూచి కనపదని విసురుతో వెళ్ళిపోయిందామె. పదిహేను రోజుల్నుంచి కొడుకులిద్దరూ చాటు మాటుగా కల్సి చెవిలో ఇల్లు కట్టి ఊళ్లోని ఇంటికి రమ్మంటున్నారు. “పెద్దదిక్కులేని సంసారం! జరిగిందేదో జరిగిపోయింది. ఇకపైన పువ్వులా చూచుకుంటారు! ముందు ముందు నీకైనా మన, తన అంటూ అండ ఉండాల్సిన రోజులు” అంటూ ఇద్దరు ముగ్గురు బంధువుల చేత రహస్య రాయబారాలు కూదా పంపేరు. ఈ విషయాలు మార్తకు చూచాయగా తెల్సినా పల్లెత్తు మాటన్నా బయటపడలేదు. అది తన ప్రస్తావన కాదన్నట్లుగా మసలుకుంటోంది. 1ఊజేెే్డడెెడ 22222222 డడ స ౩

నిన్నటి దాకా ఇంకో ఆలోచనే లేదు. ఈ రోజే-

ఎక్కడో ఏదో లాగుతోంది. లోపల్లోపలేదో తొలుస్తోంది. కొన్ని గంటల్లో గూడు కూలి నిలువ నీడ లేకుండా పోతుందన్న బాధే ఒళ్ళంతా సలపరం పుట్టిస్తోంది.

ఊళ్ళోకి వెడితే మార్తను వదిలి వెళ్ళాలి. పాతికేళ్ళ అనుబంధాన్ని పుటుక్కున తెంపుకుని తను నాకేమీ కానట్లు నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలి.

మార్తమ్మ.... మార్త... మార్తా గ్రేస్‌....

ఒక వెలుగు... ఒక కాగడా... ఒక కరవాలం... _

జీవితాన్నిచ్చింది. ఆలోచన నిచ్చింది. శరీరాన్నిచ్చింది. మనిషితనాన్ని పంచింది. ముందుకు నడిపించింది. "

నిజమే! అయితే మరి రేపటి సంగతో-

వయసు ముసురుతోంది. భద్రతా... భరోసా.... నిలబడటానికి ఏదో ఒక చూరు నీడంటూ ఉండాలి కదా! పైత్యం చేసి లోలోపలి ఒళ్ళంతా తిప్పుతున్న వికారం- సుడులు తిరుగుతున్న దుఃఖం-

ఒక చోట నిలవనీయడం లేదు. ముసురుకుంటున్న ఆలోచనల వెల్లువ-

ఈఈఈ

ఆదివారం పండగ పూట ఉగాది గడియలు ఇంత దుఃఖాన్ని మోసుకొస్తాయని నాకు తెలీదు. కబురు తెల్సి హాస్టల్‌ నుంచి వచ్చేసరికి నాన్న చాప మిద ఉన్నాడు.

తల దగ్గర గంప కింద వెలుగుతున్న దీపం ప్రమిద -

పెదాలు చిట్లించి చిరునవ్వుతో నిద్రిస్తున్న నాన్న -

నన్ను గుండెల మిద పడుకోబెట్టుకుని భారతం కథలు చెప్పేటప్పుడూ అదే చిరునవ్వు -

నాన్నకు ఏకలవ్యుడంటే ప్రాణం. చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. ఏకలవ్యుడిని పొగిడేవాడు.

పురిట్లోనే అమ్మ పోయిన నాకు నాన్న నవ్వే ప్రాణం -

నాన్న వెళ్ళిపోవడాన్ని కథలు కథలుగా చెప్పేరు ఊరి వాళ్ళు. నడుస్తూ నడుస్తూనే నీరసంగా ఉందని కూర్చున్నాడంట. మంచమ్మిద పడుకోబెడితే గురక వచ్చిందట. పందిట్లో చాప మోద పడుకో బెట్టేసరికి కళ్ళు తేలిపోయాయంట.

వేకువనే కుష్పనూర్చడానికని బయల్దేరి వెళ్ళిన నాన్నను మంచమ్మిద వేసుకుని నలుగురూ మోసుకొచ్చిన దృశ్యం నేను చూడకపోయినా నా కళ్ళ ముందు కదుల్తోంది.

గొప్ప మరణం అన్నారు కొందరు. బంగారు చావన్నారు. ఎవ్వరి నుంచీ గొంతు తడుపుకోను నీటిబొట్టన్నా ఆశించకుండా వెళ్ళిపోయాదన్నారు.

పైటాల నాన్నను సాగనంపదానికి తలార స్నానం చేయిస్తుంటే తల మోద మెడ చుట్టూ రక్తం చారికలు - ,

ముచ్చన గుంటలో దెబ్బ కమిలిన గుర్తులు -

నిజానికి నాన్నది వీరమరణమని నాకప్పటికి తెలీదు. . క భారం -204+ 1౬22222222

నాన్న నన్ను విడిచి వెళ్ళడం భరించలేని నా తాలి దుఃఖం. నాన్నను సాగనంపిన రోజు రాత్రీ ఇలానే బిగ్గరగా చెరువొడ్డున కూర్చుని, “నాన్నా. నాన్నాగొ అంటూ బిగ్గరగా ఏద్బేను. వెళ్ళిన నాన్న తిరిగి రాలేదు. ఆయన జ్ఞాపకాలు గుండెల్లో మెదుల్తుంటే కంటి నిండా వందల కొద్దీ ఊట బావులు-

పురిట్లోనే అమ్మన్‌, పదిహేనేళ్ళ వయసుకే నాన్ననీ కోల్పోవడం ఎంత శాపం!

నాట్లేసి, నీళ్ళు పెట్టి, సత్తువలేసి, మందులు కొట్టి కళ్ళ నిండా ఆశల జ్యోతులతో వెన్నెల రాత్రి వరికుప్ప వేసిన నాన్న కుప్ప నూర్ప్చించే సమయం కూడా లేదంటూ వెళ్ళిపోవడం ఎంత దుఖం! తిరిగే తిరిగే నాన్న - రాత్రంతా తన తోటి జతగ్గాళ్ళతో పాటలు పాడుతూ, పదాలు అల్లుతూ వరి మోపుల్ని కుప్ప మీదికి “హూప్‌” అంటూ ఒడుపుగా విసిరేసిన నాన్న ధాన్యం రాశిని చూడకుండానే వెళ్ళిపోతే భరించడం ఎంత కష్టం!

నాన్నకు దుఃఖమంటే ద్వేషం. ఆయన దుఃఖాన్ని నేనెప్పుడూ చూడలేదు. మాట ఎంత బిరుసో మనసు అంత మెతువు. కష్టం తప్ప సుఖం ఎరగడు నాన్న నన్ను పెంచడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాన్న! తను ఒంటరై అన్నీ వేళకు అమర్చి బడికి పంపలేక పోతున్నానని ఖర్చని కూడా ఆలోచించకుండా నన్ను హాస్టల్లో చేర్చించేడు. పెద్ద చదువులు చెప్పించాలని తహతహ లాడేదు.

అలాంటిది, ఏ కబురూ చెప్పకుండానే ఏ కోరికా తీరకుండానే వెళ్ళిపోతే పొగిలి పాొగిలి ఎంతలా శోకించేను. నాన్న మసలిన ఇంట్లో దుఃఖించడం ఇష్టం లేక ఎన్ని రాత్రులు కుమిలి కుమిలి ఈ చెరువొద్దున కరువు తీరా రోదించేను.

ఏం చెయ్యాలో దిక్కుతోచని ఏడుపు రాశ్రులు-

ఆ శోకం నుంచే కొత్త జీవితం-

ఆఅ జీవితం నుంచే మరో కొత్త దుఃఖం-

ఒక చీకటి రేయి ఇలానే దుఃఖిస్తుంటే- .

భుజమ్మీద లాలనగా నిమురుతున్న చేతుల చల్లదనం- ముసిరిన నీడల చీకట్లో మామయ్య- ఏనాడో వేలు విడిచిన అమ్మ తమ్ముడు.

మాటలే చెప్పేడో, తత్వం బోధించి దుఃఖ మర్శ్మమే విప్పేడో - ఆ దుఃఖపు రాత్రి ఆయన వెనకే నడక - ఆయన పొలంలోనే జీవితం - జీతం లేని జీతగాడి తనం -

మెల్లిగా మట్టితో అనుబంధం-

తాలకరి జల్లులు, మట్టి పదునై సలిబింది ముద్ద గావడం, నాగలి పట్టడ్భు, కోండ్ర వెయ్యడం. అణువణువూ విడిపోయి ఫలఫల లాడటం, విత్తనపు గింజలు వెద బెట్టడం, మిలమిలా మెరుస్తూ మట్టి మట్టంతా ఆకుపచ్చని అరణ్యం కావడం- కొడవలి కక్కు మీటి, సుతారంగా కాయ్యడం, కుప్ప వెయ్యడం, కళ్ళు నిండా పరుచుకున్న ధాన్యం-

ఇదంతా పరిమళించే కొత్తచదువు - నాన్న జీవించిన మట్టి చదువు - మనిషిక్మావలసిన చదువు- . ,

అదే లోకం - మట్టే ప్రపంచం! మేనమామ ఆస్తి అయిదేళ్ళల్లో అంత కంతైంది.

పొలాలకు గట్టెక్కడో కూడా తెలీని మామయ్య - బడిలో లెక్కల పంతులు - కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తే జీవితాంతం పెరిగే ఆస్తి లెక్కలు- పెళ్ళి చేసుకోవాలా వద్దా సందిగ్ధంలోనే మామయ్య ఆరాటం, ఆర్భాటం, - ఆయన ఒక్కగానొక్క కూతురు శారదతో ఆడంబరంగా జరిగిన పెళ్ళి! ఆమెకు మట్టంటే చులకన - ఆకాశమంటే ఆరాటం - పంచె కట్టి గోచీ పెడితే ఏహ్యభావం, పొలాన్నుంచి దువ్వ కాళ్ళతో ఇంటికొస్తే అంతులేని అసహ్యం, చీదర- ఇద్దరు పిల్లలు పుట్టేసరికే మానసికంగా దూరం పెంచుకున్న శారద- పొద్దంతా ఎండన, వానన బడి చాకిరి చేసి రాత్రి కడుపు నిండా అన్నం తినాలంటే బెరుకు

  • తిండి కూడా నాజూకుగా తినాలనే వెక్కిరింతలు - ఏ రాత్రో నరాల ప్రకంపనల మధ్య దరి చేరబోతే ఛీత్మారాల బుసలు- ఎన్ని అసంతృప్త రాత్రుల్ని ఈ చెరువొద్దున గడిపేనో! జీవితమంటే విరక్తి, చేసే పని మీద నిరాసక్తత-పంట తగ్గింది. రాబడి తరిగింది. లెక్కల మామయ్య తీక్షణమైన చూపులు, కరుకు మాటలు - పంచుకోవాల్సిన మనసు కరువు - ఓదార్చు మాటలు కరువు. ఒకానొక రాత్రి శారద దరి చేరబోతే ఎప్పటిలాగే చీదరింపులు, వెక్కిరింతలు - అణచుకోలేని మానవ బలహీనతా (ప్రకంపనలు - బతిమాలాడి భంగపడితే ఫెటిల్లున కాలితో తన్నిన అహంకారం! నిద్ర లేచిన రాక్షసత్వం, చీకట్లో విచ్చుకున్న వెర్రి ఆవేశం, మూడో నాలుగో పిడిగుద్దులు- శారద ఏదడుపుల్తో లైటు వెలిగే సరికి అత్తామామల ముందు, ఏమీ ఎరుగని పసికందుల ముందు దోషిలా నిలబడటం -అయిదేళ్ళ వైవాహిక జీవితం ఫెటిల్లున పగిలిపోవటం- ఆ రాత్రీ ఇవే చెట్లు - ఇదే చెరువు, ఎంతకూ ఎడతెగని వెర్రి దుఃఖం! పగలంతా మనుషులకు హూరంగా చెట్లల్లో పుట్టల్లో మసలడం, రాశ్రయ్యేసరికి చెరువొద్దుకు చేరడం- నడిరేయి- చుట్టూ కటి- , చెరువులో ఈత గొడుతున్న చుక్కలు దరిచేరి ఓదార్చాలన్న ప్రయత్నం- ఎదురుగా నిల్చున్న మానవాకారం- మట్టీ, పుగాకు, మనిషీ కలగల్సిన గమ్మత్తయిన పరిమళం - చీకట్లో కూడా దారి చూపెట్టే మిలమిల మెరిసే నేరేడు రంగు కళ్ళు- కాస్త కదిలికే కాలి గజ్జల, చేతి గాజుల సవ్వడి- ఓదార్పు, బుజ్జగింపు, అనునయం - గుండెల్లో కదలిక, మాటల్లో బట్వాదా- ఎన్నో రాత్రుల్నుంచి నేను ఆగమాగమై తిరగడం వాడలోంచి గమనిస్తున్నానంది. దుఖాన్ని చూస్తూ చూస్తూ ఊరుకోలేనంది. లాలించి కరిగించి మనసులోపలి అరల్ని కదిలించింది. అంతా విన్నాక తను మాదిగ రోశయ్య కూతురు మార్తా గ్రేస్‌ నంది. ఎన్నో రాత్రులు దుత్తలో పెట్టుకొచ్చిన బువ్వ నోటి కందించింది. మొరటు చేతుల్లో లాలించి గుండెలకు హత్తుకుని తనకు దుఃఖమంటే ప్రేమంది. దుఃఖాన్ని మోసుకుని తిరిగే వాళ్ళంటే ప్రాణమంది. ఊరు వాడ మై భారగి- 2004 2౭తో

నడుమ ఈ చెరువొడ్డున కలిసుందామంది.

తనొక గొప్ప ధైర్యం - నిలువెల్లా విరగబూసిన మట్టిమనిషితనం - కెల్లారేసరికల్లా వేపచెట్టు కొమ్మల క్రింద చెక్కలతో పాత రేకులతో తయారు చేసిన చిన్న బంకు - బంకు చుట్టూ తాటాకుల పైన పూరికప్పుతో ఇద్దరమే కల్సి వేసుకున్న పూరి గుడిసె - గుడిసె వెనక చెరువు, ముందు పక్క కాస్త ఎడంగా సుదూర తీరానికి రారమ్మనే రోడ్డు - రోడ్డుకు తూర్సున కాస్త ముందుకు వెడితే ఊరు, దక్షిణం మళ్ళితే వాడలోకి కాలి బాట -

ఊరుకూ వాదకూ సమాన దూరంలో విస్తరించిన చెరువు - చీకటి చెళువులో విద్యుద్దీపాల వెలుగు పొడవుగా సాగి వికసిస్తే తడికె తలుపైనా లేని తాటాకుల గుడిసెలో పైన మిలమిల మెరిసే చుక్కలు - మార్త కళ్ళలా -

ఊళ్ళో గుసగుసలు - వాడలో ఆశ్చర్యాలు-

మార్త మొదట్లో పుగాకు గ్రేడింగు కెళ్ళేది. సాయంత్రం బంకులో టీ కాచి అమ్మేది. మెల్లిమెల్లిగా టీ కోసం వాడ జనం రావడం - రాత్రయ్యేసరికి పట్టలు తీసుకుని పలకా పుస్తకాలు పట్టుకుని చదువుకోడానికోచ్చే వాడలోని పిల్లలు-

పగలంతా నాన్న వదిలి వెళ్ళిన కొద్దిపాటి పొలంలో సేద్యం - పొడి బట్టిగొడ్త ఆలనా పాలన చూడటం - రాశ్రులు మార్తతో కూర్చుని పిల్లలకు చదువు చెప్పడం-

శ్రమ, శ్రమలోనే ఆనందం - శ్రమంటే నాన్న కెంత ఇష్టం- నాన్న నవ్వుతూ కన్పించేవాడు. భ్రమ ఎక్కడుంటే నాన్న అక్కడుండే వాడు. మనుష్యులెక్కడుంటే నాన్న అక్కడే మసలే వాడు. మార్త తండ్రి రోశయ్య నాన్న గురించి ఎన్ని తెలియని విషయాలు చెప్పేడు.

యాకోబు - నాన్నకు స్నేహితుడు, సహచరుడు - నాన్న వెళ్ళిపోవడంలోని మర్మాన్ని విప్పేడు.

నాన్నకు కులం లేదు. గోత్రం లేదు. ఊళ్ళో కాపుల ఇంట పుట్టినా వాడలోని తోటి ఈదు వాళ్ళతో జట్టు కట్టి ముఠా తయారు చేసేదు. అందరూ కల్సికట్టుగా పని పాటలకు వెళ్లే వాళ్ళు. నాన్న పనిచేస్తూ పాటలు కట్టేవాడు. పదిమంది మంచి కోసం పదునైన తీర్మానాలు చేసేవాడు.

ఊరి కొక్కటే చెరువు - చెరువు నీళ్ళ కోసం ఊరికీ, వాడకీ నడుమ అప్పుడప్పుడు జరిగే వాద వివాదాలు - నీళ్ళు మేమెందుకు ముంచుకోగూడదని వాడ జనం - నాన్న వాడ పక్షాన నిలబడ్డాడు.

ఊరిలో కలకలం - వాడలో ఉత్సాహం-

వాడలో నలుగుర్నీ కలుపుతున్నాడని ఊరి జనం కత్తులూ, కఠార్గు నూరడం -

వేకువ జామున కుప్ప నూర్చడానికని వెడుతున్న నాన్న మోద చాటుగా వెనుక నుంచి పడ్డ దెబ్బ - ముందుకు పద్ద నాన్న మరి లేవలేదు. నాన్న అర్ధాంతరంగా వెళ్ళిపోవడంలోని రహస్యం తెలిశాక రక్తం సలసలమని కాగింది. ఏదో ఒకటి చెయ్యాలనిపించేది.

కొన్నాళ్ళకు మార్త గ్రేడింగు కెళ్ళడం మానేసి పూర్తిగా గుడిసెలోనే ఉండేది. పిల్లలతోపాటు చదువు నేర్చుకోవాలని వచ్చే వాడలోని పెద్దవాళ్ళతో ఎప్పుడూ సందడిగా ఉండేది గుడిసె.

చదువు నేర్చుకుంటూనే పదాలు కట్టేవాళ్ళు. పాటలు కూర్చేవాళ్ళు. కాలికి గజ్జె కళ్ళి క్ష్‌ సా క

(బి క చిందులేసేవాళ్ళు. అప్పుడప్పుడూ ఎవరెవరో కొత్తవాళ్ళు వచ్చేవాళ్ళు. కొత్త ప్రపంచాన్ని మోసుకొచ్చే వాళ్ళు. మాట్లాడే వాళ్ళు - మంతనాలాడే వాళ్ళు - అదో కొత్త లోకం - అప్పుడప్పుడూ వాళ్ళ పాటల మధ్యలో నాన్న చరణ మయ్యేవాడు. ఉత్సాహంగా ఉండేది. ఉగర్రూతలూగే వాది

ఒక వేసవి రాత్రి -

వాడలోని బావి నీరు ఆడుగంటితే నీళ్ళ కోసం తపన, ఆరాటం - ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితి - మూటా ముల్లె సర్జుకొని గొడ్డూ గోదల్ని వదిలి పిల్లాజెల్లతో వాడకు వాదే తరలి వెళ్ళడమా - వాడలోని జనం చెరువులోకి దిగి నీళ్ళు ముంచుకోవడమా -

గుక్కెడు నీళ్ళతో గొంతు తడుపుకోవడానికి సవాలక్ష సందేహాలు, చర్చలు, తీర్మానాలు -

వాడలోని జనం చెరువు నీళ్ళు ముంచుకెళ్ళాలనే తీర్మానం -

ఈ వైపు ఉత్సాహం - చెరువు కావైపు కత్తులు నూరటాలు -

ఒకవైపు మార్త ముందుండి పిల్లాజెల్లా చెంబూ తపేలాలతో సాగి వెళ్ళటం - అదొక విజయం -

ఆ రాజ్రే గుక్క తడుపుకోను నీళ్ళు ముంచుకున్నందుకు వాడవాడంతా దగ్ధం - వాడతో పాటు చెరువొద్దున గుడిసె కూడా దగ్ధం - నాన్నను బలి తీసుకున్నారనుకుంటున్న వాళ్ళే - వెడుతూ వెడుతూ కత్తులతో మార్త కాళ్ళ మిద దాడి - వెర్రి కేకలు - ఆర్తనాదాలు - విజయం విహారంతో వికటాట్టహాసం చేస్తూ వెళ్ళే వాళ్ళ మోద గురి చూచి వెనక నుంచి గెడ్డపారతో ఒకే ఒక్క పోటు - మళ్ళీ లేవలేదు వాడు. మిగతా ఇద్దరూ పరుగెత్తి పారిపోయేరు. తెల్లారేసరికి ఎటు చూచినా పోలీసులు - అరెస్టులు, కేసులు, ఏదేళ్ళ జైలు -

జైలు నుంచి వచ్చేసరికి ఎప్పటిలానే బంకు, నా కోసం ఎదుర్చూస్తూ తలుపుళ్లేని గుడిసె - చెరువుకి ఉత్తరం వైపున గుడిసె పక్కనుంచి వాడ వైపు నలిగిన దారితో పడిన నీళ్ళరేవు - నీళ్ళు ముంచుకోడానికొస్తున్న వాడ జనం, కావిళ్ళ హడావుడి - నాలో గొప్ప ఉత్సాహం, ఆనందం - నన్ను చూడగానే మార్త కళ్ళల్లో వెలిగిన జ్యోతులు - గుడిసెలో తాటాకు, తడికెలకు వేళ్ళాడుతున్న ఫోటోలు, పిల్లి గెడ్డమున్న ఒకాయన ఫోటో, టై పెట్టుకుని చూపుడు వేలితో దారి చూపెడుతున్న మరొకాయన ఫోటో, ఆ ఫోటోల మధ్య నాన్న రూపురేఖల్ని చేత్తో గీసిన మరొక ఫోటో -

నాన్నను వాళ్ళ మధ్య చూడగానే గొప్ప ఆనందం - ఆశ్యర్యం - ఈ ఏదేళ్ళలో గుడిసె తీరే మారిపోయింది.

సంకల కింద కర్రలతో అటూ ఇటూ నడుస్తూ హడావుడి చేస్తూ మార్త - వచ్చే పోయే వాళ్ళతో వేడి వేడి చర్చలు - ఎక్కడెక్కడ అసైన్‌మెంటు భూములు న్నాయో, పోరంబోకులున్నాయో ఆరా తీయడం - వాటి కోసం భూమి లేని వాళ్ళ చేత అర్జీలు పెట్టించడం - అర్జీలు కదలకపోతే ఆందోళన చెయ్యడం - ఈ ఏడేళ్ళలో ఆ రోడ్డు తీరు కూడా మారిపోయింది.

రోడ్డుకు ఒక ప్రక్క అందంగా కొలువు తీరిన షాపింగ్‌ కాంస్తెక్సులు, పుగాకు గోడౌన్లూ, గుడ్డల కొట్లూ - గుడిసె వైపు మరిన్ని గుడిసెలు, తోపుడు బండ్లు, టీ బంకులు - రోద్దు రెండు వైపులా ఆక్రమణలతో ఇరుకైపోయింది.

గుడిసెకు ఆ ప్రక్క ఈ ప్రక్క పనిపాటలు చేసుకుంటూ వాడ జనం - తెల్లారింది మొదలు క కథారహిని - 2004 22222ైతైతఊతైతతతత2త22త222ఊ2ై2ై2ై2త2త222

పొద్దుపోయిందాక వచ్చే పోయే వాళ్ళతో గుడిసంతా హడావుడి -

రోడ్డు రెండు వైపులా ఆక్రమించిన స్థలాలే! అయినా ఒకవైపే కూల్చేస్తున్నట్లు ప్రకటించేరు. ఎక్కడో ఏదో జరిగినట్లు విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది.

రోడ్డుకు ఆ వైపు, ఈ వైపు రెండూ రెండు యుద్ధ శిబిరాలలా అనిపించేవి. చిన్న చిన్న విషయాలకే వేడెక్కే జనం, ఉద్రేకపడే జనం, మునుపటిలా ఏం చేసినా, ఏం మాట్లాడినా ఊరుకునే వాళ్ళు లేరు. ఆ స్థితిలో ఇపుడు రోడ్దు వెడల్పు చేసే కార్యక్రమం - తెల్లారితే ఏం జరగబోతుందోనని జనం ఊపిర్లు బిగబట్టి ఉన్నారు. పొద్దుట్నుంచీ మార్త అలజడిగా ఉంది. ఆందోళనగా ఉంది. హడావుడిగా ఉంది. ఎవరెవరో వస్తున్నారు. కలుస్తున్నారు. రేపటి కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నారు. ఎలాగైనా గుడిసెలు కూల్చడాన్ని ఆపాలన్న పట్టుదల-

నాలో ఎంతకూ తెగని ఆలోచనల దారం -

సందిగ్ధం....సంశయం....రేపు ఏమవుకుందోనన్న ఆందోళన-

జీవితానికి భద్రత కావాలి - భరోసా కావాలి - వయసు ముసిరేటప్పుడు భద్రమైన నీడ కావాలి.

లోలోపల సుడులు తిరుగుతున్న వికారం -

౨6

దూరంగా మినుకు మినుకు మంటూ ఊరి దీపాలు - జీబురు మని అరుస్తూ వాడలోని గుడిసెల నంటిపెట్టుకున్న జిల్లేడు పాదలు-

చీకటి చెరువులో చుక్కల మిలమిలలు.

గాలి అలలకు సాగుతూ కుంచించుకుంటూ చెరువులో చందమామ, చెట్టు నీడలు -

ఎక్కడో ఏదో భీతి - ఆలోచనలు తెగకపోయినా కాళ్ళు ఊరి వైపు కదిలేయి.

నడుస్తుంటే వింతగా విచిత్రంగా చూస్తున్న ఊరి జనం-

“రాయ్యా! రా! అమ్మాయ్‌, అబ్బాయొచ్చేడు చూడు, కాళ్ళు కడుక్కుని రాయ్యా” - ముసలి అత్త ఆహ్వానం.

“నాకు తెల్సు మారొస్తారని” - శారద కళ్ళల్లో అహంకారపు విశ్వాసం. కొడుకులిద్దరూ వాకిట్లో నిలబడి చూచి నిశ్శబ్దంగా లోపలికెళ్ళి పోయేరు. "

గోడకు వేళ్ళాడుతూ లెక్కల మామయ్య, ఆయన పటానికో దండ - జీతగాడు కాళ్ళకు నీళ్ళిచ్చేడు. కాళ్ళ దువ్వ రుద్ది రుద్ది కడుగుతుంటే, “ఒరేయ్‌! స్పానానికి నీళ్ళు తోడురాకా. శారద హూంకరింపు. -

స్నానం చేసొచ్చేసరికి కొత్త పంచె సిద్ధం. ఇష్టంకాక విప్పిన పంచెనే మళ్ళీ చుట్టుకోవడం -

అంతా కొత్త కొత్తగా ఉంది. బెరుకు బెరుగ్గా ఉంది.

సిగ్గుగా ఎబ్బెట్టుగా ఉంది.

శారద అలానే -

ఏళ్ళు గడిచినా తగ్గని అహంకారంలానే -

మనిషేమి మారలేదు. తిండి పుష్టి కండ పుష్టి - ఊఊఊ న

“అన్నానికి రాయ్యాగ” - పీట వాల్చి అత్త ఆహ్వానం. “నీకిష్టమైన కోడి గుద్దు అట్టు వేశా. తిను” ందో” “అదేం తిండో, పిట్ట తిండి, పిడికెడు మెళుకులన్నా తినలేదు. ఆకలంతా ఎటు పోయి

  • ముసలి అత్త జాలి జాలి మాటలు. ॥

“ఒంటి మాద పిడికెడు కండ లేదు. గువ్వలాగయ్యేడు. ఇన్నాళ్ళూ ఏం తిన్నాడో ఏమో, అరాయింపంతా ఎటు పోయిందో నమ్మాయ్‌?” - కూతురితో చెబుతోన్న అత్త.

ఊరు సద్దుమణిగింది. ఇల్లు సద్దుమణిగింది. "

మంచమ్మిద తళతళలాడుతూ కొత్త దుప్పటి.

అదే గది, అదే మంచం, చీకటి రాత్రి, పెనుగులాట, భంగపాటు, అవమానం - = విడిచి వెళ్ళటం! గాలి రాక ఊపిరాడక తలుపు తోసుకుని దొద్లో కెడితే కొడుకుల్ని సముదా యిస్తూ శారద -

“నాకు మాత్రం ఇష్టమై రమ్మాన్నానంట్రా! మాదిగ దాంతో లేచిపోయినోడు. ఏడేళ్ళు ఊచలు లెక్కపెట్టి వచ్చినోడు. నాకూ చీదర, పిచ్చిదాన్నై వెళ్ళి పిలుచుక రాలేదు. మరేమో పెళ్ళీడు కోస్తిరి. వచ్చే పెద్ద పెద్ద సంబంధాలకు పిల్లల తండ్రి ఏడంటే సమాధానం చెప్పలేకపోతుంటిమ్‌. ఇదంతా మి పెళ్ళిళ్ళు అయిందాకానే! అందాకా ఇక్కడే పడుంటే తర్వాత సంగతి తర్వాత

కడుపులో మళ్ళీ వికారం -

తెమలటం మొదలైంది.

“కోడి గుద్దట్ట! అల్లుడి కిష్టం” - అత్త మాటలు కడుపులో అల్లకల్లోలం చేస్తున్నాయి.

కండువా విదిలించి భుజునేసుకుని ఇల్లు దాటి రోడ్డు మొదకు చేరేసరికి భళ్ళున వాంతి - దుర్వాసన - నోరంతా ఊరంతా, ఒళ్ళంతా కంపు.

చెరువొద్డుకి పరుగు లాంటి నడక - చెరువులో నీళ్ళు దోసిల్లో తీసుకుని నోట్లో పోసుకుని ఎన్నిసార్లు పుక్కిలించినా వదలని వాసన - చెరువులో దీగి బుడుంగున మునిగి తనివి తీరా కాస్సేపు ఈత గొట్టి తల తుడుచుకోకుండానే గుడిసె ముందుకొచ్చి నిలబడితే -

చక్రాల రిక్షాలో ఎదుర్చూస్తూ మార్త- -

లోపల భోజనాలు చేస్తూ ఏడెనిమిది మంది కొత్తవాళ్ళు-'

“సీ కోసం చూచి చూచి వాళ్ళిప్పుడే అన్నానికి కూర్చున్నారయ్యా! అట్టా అధైర్యపడితే ఎట్టా? గుడిసె కాలితే కట్టుకోలేదా? పురుగు తొలిస్తే మళ్ళీ విప్పి కట్టుకోలేదా? ఇదైనా అంతే! చావైనా బితుకైనా ఇక్కడే. మనల్ని తొక్కించి గుడిసె మిదకు వెళ్ళాల్సిందే ఎవడైనా - ఇట్టాంటప్పుడు గుండె దిటవు చేసుకోకపోతే ఎట్టయ్యా? దుఃఖపడుతూ అగమాగంగా తిరగాల్సిన సమయం కాదిది. దా! వచ్చి నవ్వు కూడా కూర్చో. తినేద్దాం. తెల్లార్లూ చెయ్యాల్సిన పన్లు చాలా ఉన్నాయి” .

అదే ఛిరునవ్వు, అదే పంతం మార్త కళ్ళల్లో -

ఈసారేందుకో దుఃఖం ళావటం లేదు. .

నా మాద నాకే అసహ్యం -

ఛి కై ధారి- 204 222 కడడడడడడడడకడడడేెక

చెను ళో 6౬ . గా టా య కధాంాతప-200 ద్ర న ఈ

త ర2్రాతు 009 మం తం టతైో న లంలషల 2 వేటూరి సుందర రామమూర్తి అల్లం శేషగిరిరావు ( కాశీభట్ల వేణుగోపాల్‌ డా.ఎసుబ్బారావు '... తోలేటి జగన్మోహనరావు పి.ఎస్‌. నారాయణ . కళ్యాణ సుందరీ జగన్నాథ్‌ పులికంటి కృష్ణారెడ్డి | కర్లపాలెం హనుమంతరావు జి. రామకృష్ణ శాస్త్రి ప. సలీం కేసరి - . "చావా శివకోటి డా. జొన్నలగడ్డ మార్మండేయుల్తు న కెవి.గిరిధరరావు _ ఇంద్రగంటిజానకీబాల ఉపద్రష్టసాయి. ఆదూరి వెంకట సీతారామమూర్తి సుధారమ గంథంయాజ్ఞవల్యశర్మ మాచిరాజు వెంకటరత్నం బి.వి. రమణరావు పాలెపు బుచ్చిరాజు కె.కె.మీనన్‌ ఛాయా మల్లిక్‌ వసుంధర ఎలక్ష్రాన్‌ బోయ జంగయ్య ॥ అరుణ నిషల బీనాదేవి నే ఎ. అప్పలనాయుడు జలంధర యు. విజయలక్ష్మీ రామకృష్ణన్‌ కాట్రగడ్డ దయానంద్‌ . జే అనం సక్‌ న్‌ య్య | స! ట్ర. న్‌ వా