Telugu Kadapa gadapalo jivana madhurimalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

] అతృుఠకథనం ౯ ర్ర్‌7రి ॥: 1 గ |. ము ఓ మనసుపడి మక్కునతో సేకరించిన 1 . “ఆలే జే ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం | | | గ్‌ త్తు: సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి . వనే " ఆనందంతో బహూకరిస్తున్నాం. ! ణా - మల్లెమాల కుటుంబం +: గ 0746000 స స్మ వజ-శడవ న నిం న స జ ల, వ 38ిటా న (నం 2. అలఖపర్తి ఫిచ్చయ్య చౌదరి ఖీ... ననన!

“కడప గడపలో జీనన మధురినులు” పుస్తక సమర్పణ 0 షాలిని పుచ్చలపల్లి 0 సి పుచ్చలపల్లి 0 శి౦ష రావిపాటి 0 విజయకృష్ణ అలపర్తి “ఆదరమున నీవు యన్నంబు బెట్టగా తిన్నవాడు పలుకు విన్నవాడు మరచిపోగలాదెి? మాటలేటికి పతి వ్రతవు నీవు ధర్మరతివి తల్లి

  • మహాకవి గుర్రం జాషువా తిరుమల రెడ్డి లలితమ్మ దివ్య స్కృతికి నివాళులు శ్రీ తిరుమలరెడ్డి వీర రాఘవ రెడ్డి చీఫ్‌ ఇంజినీర్‌ (రిటైర్డు) మరియు కుటుంబ సభ్యులు

య హర్రిదాయ4 ఆ పకల, 'శజంసకి ర జా. దంతి కంల బలీ 7 ౯౨ కడపగడపలో య్యర్థల రు! - / పడని జీవన మధురిమల్నుక్ర్రైష్య క్కు యో లది టు లి(లి పెన్నేటి పబ్లికేషన్స్‌ 7/88-ఇ, శ్రీ వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా, ఎన్‌జివో కాలనీ, కడప - 516 002

ఉం -321-ల%1 వీచు - క కడప గడపలో జీవన మధురిమలు అలపర్తి పిచ్చయ్య చౌదరి పెన్నేటి పబ్లికేషన్స్‌ ప్రచురణ నెం. 16 మొదటి ముద్రణ : ఆగస్టు 2009 హక్కులు రచయితవి కవర్‌ డిజైనింగ్‌: అన్వర్‌ డి.టి.పి : ఆర్‌.కె. (గ్రాఫిక్స్‌, కడప లే అవుట్‌ : కవిత, హైదరాబాద్‌ ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, హైదరాబాద్‌ ప్రతులకు: ఎన్‌, విజయ పెన్నేటి పబ్లికేషన్స్‌ 7/88-ఇ, శ్రీ వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా, ఎన్‌జివో కాలనీ, కడప - 516 002. సెల్‌ : 9441781957, 9492563364 నా ఎ. పిచ్చయ్య చౌదరి | జాయింట్‌ సెక్రటరీ, రిటైర్డు | ఇంటర్‌ విద్యా మండలి, ఆంధ్రప్రదేశ్‌ థా 7169, జయనగర్‌ కాలనీ, కడప. = ఫోన్‌ . 08562 - 253734, గ్ర సెల్‌ : 98493 51604 98499 191805 న; గంధాలయ న్ధా్చ్మ్హైవెల : 6€0/- రూపాయలు ్ష్డం3రిగా .

  • శం” = య. చాడు ర

అంకితం డాక్టర్‌ అట్లూరి కవిత ముఖష్మినేని 'ిన్నాన్ను చిన్నాన్న అంటూ పిలిచే నీ తీయని పలుకులు యింకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సుదీర తీరాలకు నీవు తరలిపోయినా, మా స్మృతులలో నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. _ బోయపాటి దుర్గా కుమారి

అభినందన

“ీద్యమం సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమః షడేతే యత్ర వర్తన్తే తత్ర దైవం (ప్రసీదతి.

ప్రయత్నం, సాహసం, ధైర్యం, బుద్ధి, పరాక్రమరీ"అను ఆరు గుణములున్నప్రుదే దైవం సహకరించును అన్నారు సూక్తి సుధాకారులు.

ఆత్మకధ అందరూ రాయరు. తన సంతానం, ఆత్మీయులు, అభిమానులతో తన జీవనయానంలోని అనుభవాలను వారు ఉత్తములుగా, సమాజ[్రేయోభిలాషులుగా పెంపొందాలన్న ఆశయంతో తమ అనుభవాలను అక్షరబద్ధం చేస్తారు.

మిత్రులు అలపర్తి పిచ్చయ్య చౌదరి గుంటూరు జిల్లాలోని రైతు కుటుంబంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టా అందుకొన్నారు.

ఆయన ఉద్యోగ జీవితమంతా (ప్రధానంగా రాయలసీమలోను, అందులోను కడప జిల్లాలోనే గడచింది. నందలూరు, రాయచోటి, ముఖ్యంగా కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులుగా, క్రమంగా ఆ కళాశాలలోనే ప్రిన్సిపల్‌గా తన విధ్యుక్త ధర్మాన్ని అత్యంత దీక్షాదక్షతలతో నిర్వహించి, విద్యార్థుల మన్ననలను, నమాజమందలి (ప్రముఖుల (ప్రశంసలను, ఉన్నతాధికారుల 'ప్రోత్సాహమును అందుకొన్న కార్యకుశలుడాయన.

తన ఆత్మకథలో ఎక్కడా తన మంచి చెడ్డలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయలేదు. అప్రియమైన సంఘటనలను కూడా నిర్మాహమాటంగా రాశారు.

విద్యావ్యవస్థలో ఇంటర్మీడియట్‌ దశ చాలా కీలకమైనది. విద్యార్థులలో పఠనాసక్తిని పెంచుటకెన్నో ప్రయోగాలు చేశారు. కార్పొరేట్‌ కళాశాలలు ప్రధానంగా, గ్రేడ్‌లు, ర్యాంకులే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఆ కళాశాలలు, లైబ్రరి, ల్యాబొరేటరీ సౌకర్యాలు, విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు మృగ్యం అన్న వాస్తవాన్ని ఎత్తిచూపారు.

ఇంటర్మీడియట్‌ విద్యాప్రమాణాల పెంపుదలకు సాకారంగా “అకడమిక్‌ ఆర్గనైజర్‌ తయారు చేశారు. ఆ సంచిక రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలన్నిటికీ దిశానిర్దేశం చేసింది.

ప్రాంతీయ విద్యాధికారిగానే కాక రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్య సంయుక్త సంచాలకులుగా, విద్యాధికారుల 'ప్రశంసలందుకొన్నారు. విధి నిర్వహణలో ఒడిదుడుకులు జరిగినప్పుడు చాలా చాకచక్యంగా వాటిని సరిదిద్ధుకొని, ఉన్నతోద్యోగుల ప్రశంసలందుకొన్నారు. ఉద్యోగ జీవితమంతా ఉద్యమంగా నిర్వహించారు. పిచ్చయ్య చౌదరి దయ, కారుణ్యంగల సేవాపరాయణుడు. అతని ఆత్మ కథలోని సంఘటనలు అతని శ్రమ జీవన సౌందర్యాన్ని ప్రస్ఫుటించేస్తాయి. ఆయన నిజాయితి అతనికి నిర్భీతినిచ్చింది. ఆయన అదృష్టవంతుడు. సహధర్మచారిణి శ్రీమతి దుర్గాకుమారి కుటుంబ నిర్వహణ బాధ్యతలన్నిటినీ నిర్వహిస్తూ భర్తచేసే సేవాకార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సహించిన ఇల్లాలు. ఆమెపట్ల పూర్తిగా న్యాయం చేయలేదే అన్న తపనను ప్రకటించాడు పిచ్చయ్య చౌదరి. నందలూరు, రాయచోటి, కడప కళాశాలల్లో ఆయన నిర్వహించిన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలన్నిటిలోను నాకు అవకాశం కల్పించారు. సంకల్పం బలంగా వుంటే చేపట్టిన పనులు సఫలం కాగలవని నిరూపించారు. ఒకనాడు కారాగారంలో భాగంగా వుండిన ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ఉన్నతమైన విలువలతో కూడిన వాగ్దేవి మందిరంగా రూపొందింది. అందుకు కారకులు పిచ్చయ్యగారే. ఆయన నాకు చిరకాలమిక్రులు, అతని మామగారు రామకృష్ణ ఉన్నత పోలీస్‌ ఉద్యోగిగా వుంగి, పదవీ ఏిరమచానంతరం శమాజసేవా కార్యక్రమాలు చేస్తుండేవారు. పిచ్చయ్య చౌదరి పదవీ విరణానంతరం దైవచింతనాయత్తులైనారు. భగవాన్‌ సత్యసాయి ఆశీస్సులందుకొని ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆయనొక కర్మయోగి, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్య భాగ్యములతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తున్నాను.

  • దాక్టర్‌ జానమద్ది హనుమచ్చాస్తి

ఎక్కడి చినుకో ఇక్కడి చిగురయ్యింది

ఖిక్కడో కొండ కోనల్లో, కానని సీమల్లో పుట్టిన నదులు కొన్ని వందల వేల మైళ్ల దూరం ప్రయాణించి వచ్చి బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. అక్కడి మట్టినీ, పైరునీ, నమస్త జీవజాలాన్ని తమ ఆత్మబంధువులుగా అక్కున చేర్చుకుంటున్నాయి.

కొందరు మహానుభావులు కూడా నదుల లాంటి వారే. పుట్టుక ఎక్కడో తెలీని పోతులూరి వీరబ్రహ్మంగారు కడప జిల్లా కందిమల్లాయపల్లెలో స్థిరపడి లోకానికి కాలజ్ఞానాన్ని అందించారు. ఇంగ్లీషు దొర సిపి బ్రౌన్‌ కడపను కేంద్రంగా చేసుకొని తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవంప చేశారు. కల్నల్‌ కాలిన్‌ మెకంజీ దొర కాలగర్భంలో కలిసిపోతున్న ప్రాంతీయ చరిత్రల్ని కైఫీయత్తులుగా రికార్డు చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండలో పుట్టిన పుట్టపర్తి నారాయణ చార్యులు తన సాహిత్య శివతాండవానికి కదప గడ్డనే వేదికగా చేసుకొన్నారు. వాళ్ళ పుట్టుక ఎక్కడైనా కడప గడపలో అడుగు పెట్టింది మొదలు ఇక్కడి మట్టిని ప్రేమించారు. ఇక్కడి మనుషుల్ని (ప్రేమించారు. వాళ్లలో ఒక్కరిగా మమేకమై జీవించారు. వెరసి తాము అచ్చమైన కడప వాసులుగా మారారు. ఈ పరంపరలోని వారే అలపర్తి పిచ్చయ చౌదరి గారు. గుంటూరు జిల్లా పొన్నూరులో పుట్టిన ఆయన బతుకు దెరువు కోసం కడప గడ్డమీద కాలు మోపినప్పట్నుంచి ఇక్కడి మనుషుల్లో ఒకడిగా కల్సిపోయారు. ఇక్కడి కష్టాల్నీ క్షన్నీళ్లనీ, కరువుల్నీ, కాటకాల్నీ. తాను కూడా అనుభూతించారు. తన జీవనయానంలో మూడొంతుల కాలం కడప నేలపైనే గడిపిన చౌదరిగారు, తనను ఆప్యాయంగా అక్కున చేర్చుకొని, ఆతిధ్యమిచ్చి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించిన కడప వానుల కోసం ఎనలేని సేవ చేశారు. తనకు మొక్కవోని ధైర్యానిచ్చి, పోరాట పటిమనిచ్చి, జీవిత సహచరినిచ్చి, జీవితాన్నిచ్చి, వ్యక్తిగా ఉన్న తనను ఒక వ్యవస్థగా మార్చిన కడప గడ్డ కోసం ఆయన కూడా అదే స్థాయిలో తన శక్తియుక్తులన్నీ ధారపోశారు. జీవిత చరమాంకంలో కూర్చొని స్మృతులన్నీ తవ్విపోసుకుంటూ “అరె! వీటిని పదిమందికి పంచితే బాగుంటుంది కదా! నేను దర్శించిన కడపను పదిమందికి అనుభూతికి తెస్తే న్యాయంగా ఉంటుంది కదా!

కడప గడ్డ మీద ఇతర ప్రాంతాల వారికి ఏవేవో అపోహలున్నాయి. నా స్మృతులన్నీ వాళ్లముందు ఇప్పటం వల్ల వాళ్లతో సంభాషించి నట్టవుతుంది కదా! రాయలసీమ 'అంతరంగమేదో వాళ్లకు తెల్సివస్తుంది కదాగొ అనుకొని వాటిని అక్షరీకరించుకుంటూ పోయారు. ఆ స్మృతుల దొంతర, ఆయన ఆంతరంగీకర భావాల పరంపర యీ “కడ్రప గడపలో జీవన మధురిమలు”.

కడప గడ్డ మీది మట్టిపొరలు తన నరనరాన ఉత్తేజకరమైన జీవరసాన్ని నింపి ఎలా చేవదేరేలా చేశాయో, ఆశక్తినంతా యీ నేల అభివృద్ధి కోసమే ఆయన ఖర్చు చేసిన వైనం చదువుతూ ఉంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఒక జూనియర్‌ కళాశాల లెక్చరర్‌గా రాయచోటిలో అడుగు పెట్టిన ఆయన ఇక్కడి మనుషుల్లోని మంచితనాన్ని ఇష్టపడ్డారు. “ప్రతి మహిళా చిన్నా పెద్దా తేదా లేకుందా అన్నా అని సంబోధించడం మనసులో ఏ విచిత్రభావాన్ని కలిగించదు. నిష్కల్మశంగా ఎదుటి మనిషి కళ్లల్లోకి సూటిగా చూస్తూ నిర్భయంగా మాట్లాడే రాయలసీమ మహిళల సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేను. ఎప్పుడు వెళ్లినా భోంచేసి పోన్నా అనే వాళ్ల మాటలు ఎలా మరచిపోగలం అని ఇక్కడి మహిళల పట్ల గౌరవభావాన్ని వ్యక్తపరచడమే కాకుండా తను ఇష్టపడే మరీ ఇక్కడి మహితైనా దుర్గాకుమారిని వివాహమాడారు.

“నాకు పోరాటం, ప్రేమ, పట్టుదల రాయలసీమ. నేర్చింది. సహజంగా పిరికివాడినైన నన్ను థైర్యవంతున్ని చేసింది ఈ ప్రాంతమే.” అని నిర్మాహమాటంగా చెప్పుకొన్న పిచ్చయ్యగారు ఆ పోరాట పటిమతోనే జీవితంలో ఎన్నో సాధించారు. జూనియర్‌ కాలేజి లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ప్రిన్స్‌పాల్‌గా, కడప అనంతపురం జిల్లాల ఇంటర్మీడియెట్‌ విద్యాపర్యవేక్షణాధికారిగా (ఆర్‌ఐఓ), ఇంటర్‌ బోర్డు జాయింట్‌ సెక్రటరీగా ఇలా మెట్టుకు మెట్టు ఎగబాకుతూ పోయారు. మరోవైపు లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శిగా ఉంటూ ఎన్నెన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలలో ఆంధ్ర, కర్ణాటకలో ఏ గ్రామీణ లయన్స్‌ క్లబ్‌ అందుకోలేనంత ఎత్తులో అత్యుత్తమ సేవలందించిన ఘన చరిత్ర ఆయనకుంది. దీనికంతటికీ కారణం “బక్మడి వలక్షణమైన జీవితం నాకు ప్రసాదించిన ఉత్సాహమే.” అంటారాయన. “కడపను నేను దశాబ్దాల జీవితానికి గమ్యం చూపించిన భాగ్యరేఖగా భావిస్తాను అని గర్వంగా చెప్పుకుంటారు.”

“సర్వీస్‌ యిజ్‌ ద గ్రేటెస్ట్‌ రెలీజియన్‌” అని నమ్మే పిచ్చయ్యగారు తన జీవితమంతా సేవ కోసమే వినియోగించారు. ఇంటర్మీడియెట్‌ విద్య కోసం ఆయన వయసంతా అరగదీసుకొని చేసిన కృషి ఈ పుస్తకం నిండా కనిపిస్తుంది. ఇంటర్మీడియెట్‌ విద్యపట్ల ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు చర్చించ తగ్గవి. అనుసరించ తగ్గవి. ఉన్నత విద్య, ప్రాధమిక విద్యల మధ్య సరిహద్దుల గురించి వివాదస్పద నిర్ణయాలు వెలువడుతూ ఉన్న యీ తరుణంలో పిచ్చయగారి అభిప్రాయాలు పరిశీలించ తగ్గవి.

ఎన్ని జీవితాలు! ఎంత మందితో పరిచయాలు! పుస్తకం నుండి మనుషుల కదలికలే! పేజీ పేజీలో ప్రత్యక్షమయ్యే కొత్త ముఖాలే. తన జీవితం చివరిదాకా పరిచయమైన ప్రతి వ్యక్తినీ గుర్తుపెట్టుకొని ప్రస్తావించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. పుస్తకంలో ఆ అవసరం ఎంత వరకు ఉందనేది నేను ప్రస్తావించను. ఈ నేపథ్యంలోంచి ఆయన మనుషులను ప్రేమించే విధానాన్ని గమనించమని చెబుతాను.

క్షణం తీరికలేని తనంతో ఎప్పుడూ ఉరుకులు పరుగుల మీద నడిచే ఆయన, అంతే ఓపికగా సమాజాన్ని పరిశీలించి అద్యయనం చేసిన తీరు కూడా నాణేనికి మరోవైపు మనకు కనిపిస్తుంది. రాయలసీమ వాసులు వివాహ సంబంధాల గురించీ, కుటుంబ వ్యవహారాల గురింబీ, సంస్కృతీ సాంప్రదాయల గురించీ, నలుగురు కొడుకులుంటే ముగ్గుర్ని వ్యవసాయానికి వదిలి, ఒక్కడినైనా బాగా చదివించాలనే పట్టుదల చూపే రైతుల గురించి, మనిషికీ మనిషికీ మధ్య అంతులేని ఆప్యాయతల గురించి, అద్భుతమైన మానవ సంబంధాల గురించి, అక్కడక్కదా పొడచూపే కక్షల గురించి, మరెన్నో జీవన కోణాల్ని విశ్లేషించారు.

వ్యవస్థలోపాల గురించి ఆయన ఎవర్నీ తప్పు పట్టరు. పరుషంగా ద్వేషించరు. తనకు నిర్ధేశించిన స్థాయిలో తన పరిధిలో వ్యవస్థను బాగు చేసేందుకు నిరంతరం శ్రమిస్తారు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం ఆయనకు ఇష్టం లేదు - చిరు దీపాన్నైనా వెలిగించడం తప్ప.

కడప పేరు వింటే చాలు ఇతర ప్రాంతాల వారికి ఓ భయానక అమానవీయ దృశ్యాలు కళ్లముందు కనిపించేలా చేసిన సినిమాలు, టీవీలు పత్రికల వక్రీకరణ మధ్య ఇలాంటి నిజాయితీతో కూడిన ఆత్మకధలు గొంతెత్తటం శుభ సూచకం. ఎక్కడో

కూర్చొని కడపను గురించి అల్లుకొన్న తప్పుడు కథలతో వ్యాపారం చేసుకొనేవాళ్లకు

  • దశాబ్దాల తరబడి ఇక్కడే జీవించి ఈ ప్రజల్లో ఒకడిగా మిగిలిపోయి ఈ గడ్డను గురించిన గడ్డు వాస్తవాన్ని నిజాయితీగా చిత్రించిన పిచ్చయ్యగారి ఆత్మకధ చెంపపెట్టు లాంటిదనడంలో సందేహం లేదు. సాహిత్యపు విలువల కోసము కొస మెరుపు సంఘటనలు ఆశించో యీ

రచనను చదివిన వారికి నిరాశ కలగవచ్చు గానీ, వ్యక్తిగా అడుగు పెట్టిన తనను ఒక బలమైన శక్తిగా మార్చిన ఈ కరువు నేల కోసం తన జవసత్వాలన్ని ధారబోసిన మానవమాత్రుడి గురించి తెలుసుకోవాలంటే తప్పక చదవాల్సిందే తనను ఆదరించి అక్కున చేర్చుకున్న మట్టి పొత్తిళ్లను తల్లి ఒడికంటే ఎక్కువగా (డ్రేమించిన ఆ నరున్ని నారాయణ స్వరూపాజ్జి వీక్షించాలంటే తప్ప చదవాల్సిందే.

బాలురాజుపల్లె ు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 5-8-09, బుధవారం,

శ్రావణ పౌర్దమి,

నా మాట

నాలుగు దశాబ్దాల కడప గడపలో జనజీవనంలో ఉద్యోగ పరంగా ఇంటర్‌ విద్యలో అనుబంధం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తోగల పరిచయాలను, వారితో అనుభవాలు సవివరంగా తెలపటానికి ఈ ప్రయత్నం ఉపయోగించుకున్నాను.

కడప వారి జీవనవిధానాన్ని వారు స్పందించే తీరును వివరించటానికి ప్రయత్నించాను. సమాచారంలో కొన్ని తప్పులు దొర్లితే క్షంతవ్వడను, సుదీర్ధ కాలంలో చోటుచేసుకున్న సంఘటనలు సందర్భాలు వివరించటంలో కొన్ని లోపాలుండవచ్చు.

వ్యాకరణ దోషాలు, నా రాతలో లోపాలును కాక, నా ఈ శ్రమకు మూలమైన నా అంతరంగాన్ని పాఠకులు గమనించగలరని నా ఆశాభావం.

స్వీయ అనుభవాలను వివరించటంలో తారసపడ్డ వ్యక్తులను తప్పక 'ేర్కొనక తప్పని పరిస్థితి, కొన్ని పేజీలలో ఎక్కువ మంది పేర్లు చోటుచేసుకున్నాయి. వారి పేర్లను, రాయకపోతే నా ఈ కథనానికి న్యాయం చేసినట్లు కాదని నా భావన.

నేను ఎంతగానో అభిమానించే వదిన గారి పిల్లలు యామిని, రాజేష్‌లు నేను అనారోగ్యానికి గురైనప్పుడు నాకు సేవలందించిన నా తోడల్లుడు నారయ్య నాయుడు, అదేవిధంగా కుటుంబ పరంగా అండదండలిస్తున్న నా అన్నల పిల్లలు సాగర్‌, రమణ, చిన్న క్రాంతి, బాబి, వెంకట్‌, బలరాం నా యీ అంతరంగ మథనానికి కారకులైన వారందరినీ ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాను. కష్ట సుఖాలలో తోడుగా ఉండే రిటైర్డు లెక్బరర్‌ బివి నరసారెడ్డిని మరచిపోతే నన్ను నేను మరచిపోయినలట్లే!

కడప గడప మధురిమలో నా జీవనం సంపూర్ణం, క్లిష్టతరం. జన్మస్థలం, విద్యాభ్యాసం, కళాశాల చదువులు పూర్వభాగంలో ముచ్చటించాను. ఈ ప్రయత్నాన్ని పాఠకులు సహృదయంతో స్వీకరించగలరని నా ఆకాంక్ష,

ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పెన్నేటి పబ్లికేషన్స్‌ అధినేత, ప్రముఖ కవి, నూకా రాంప్రసాద్‌రెడ్డి అందించిన సహకారం మరువలేను. సంస్కారవంతమైన ఆయన అండతో ఈ పుస్తకాన్ని పూర్తి చేయగలిగాను. వారికి నా హృదయపూర్వక అభినందన సుమాంజలి.

ముందుమాటలు రాసి, నా ఈ మొదటి ప్రయత్నాన్ని సమర్ధించి, నన్ను ప్రోత్సాహపరచిన గురుతుల్యులు జానమద్ది హనుమచ్చాస్తి, మిత్రులు రాయలసీమ జనజీవితాన్ని అక్షరబద్దం చేస్తున్న సుప్రసిద్ధ నవలా, కధా రచయిత, కవి సన్నపురెడ్డి వెంకటరామిర్తెడ్డిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

పుస్తక ముద్రణకు సహాయపడిన కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, డిటిపి చేసిన సోదరులు కె. జనార్దన రాజు, బి. శివరామ్‌లకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

జంతుశాస్త్ర ఉపన్యాసకులుగా వృత్తి, సేవ ప్రవృత్తి గల నాకు కుటుంబపరంగా సాహితీ వాసనలుండటంతో నా ఈ సాహసానికి కారణమై ఉండవచ్చు. స్వీయ అనుభవాలు వివరించటం కష్టసాధ్యమయినదేనని నా అభిప్రాయం.

కడప జిల్లా యువతరం, స్ఫూర్తివంతమై ముందుకు పోవాలని, కడప గడపలో జనజీవనం సర్వదా సుఖమయం కావాలని నా ఆకాంక్ష మీ అలపర్తి పిచ్చయ్య చౌదరి

రూస్త్రారు. కీకోలు మాస్టారు... వీడికోలు నర్మ్శారు కొలువ్నకె నర్భారులను వీడి నత్యారణము తోడి కదవ కొచ్చారు రాయచోటిలోన కాలుమోవీన నాడే రక్తపాతము చూసి జదవలేదు... వెనుకదుగవేయలేదు వాణివుతులే కారు లక్ష్మీవుతులు కూడ న్యాయమూర్తిని కూటి వరివూర్డులైరి వ్యాదిని మానవత్వం నిండె -పేమ తత్వం చదివె బీవశాస్రం తృుషియె తన అస్త్రం సాపొత్య నంగీత సామాజికాంశాల (ణాళికా కర్త నవయుగావిమవ్థర్త మా కళాశాలల్లో కాంతిరేఖలో మోర్చి తీర్చారు రంగస్థలి ఈ తోటలో వూలు కొత్తతరగతి గదులు మీ త్బ్పషికి రూపాలు ఇవి ఆరని పారాణులు ఎన్నడూ వాదని సౌగంధిక లే పార్వతీ కృష్ణమూర్తి త0-06-2005 ఫీ కడప గడపలో జీవన మధురిమలు

కడప గడపలో జీవన మధురిమలు

అనంతజీవన (స్రవంతిలో తోడై, నీదైై నిలిచిన వాళ్లు అసంఖ్యాకం. వారితో అనుబంధం, ఆత్మీయత అనిర్వచనీయం. జీవితం ఒక కల. ఆ కలను సాకారం చేసుకోవటంలో దీక్ష దక్షత అవసరం.

ఉద్యోగ విరమణ అనంతర జీవితం వి(శ్రాంతిమయం. ఈ విశ్రాంతి సమయంలో ఏదో ఆరాటం. గత అనుబంధాలకు, ఆత్మీయతలకు స్పందించే హృదయాలు కనుచూపు మేర కనిపించటంలేదు. కాలం పరిగిడుతున్నది. పిల్లలు దానికంటే ముందుకు పోవటానికి ఉరకలు వేస్తున్నారు. వారి పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు.

మన జ్ఞాపకాలు, దశాబ్దాల జనజీవనంలో ఆటుపోటులు, మనుషుల మానవీయత, అనుబంధాలు గుర్తుకు వస్తున్నాయి. సర్మారు ప్రాంతంలో పుట్టినా, జీవిత కాలగమనంలో మూడువంతులు రాయలసీమలో కడపలోనే గడిచిపోయింది. రాయలసీమలో కడప గడపలో అయినవాళ్లు అద్భుతంగా కనిపిస్తున్నారు. అందరిలో విలక్షణీయత. జీవితమే ఒక కథగా రాయలసీమలో కడప గడపలో దశాబ్దాల జనజీవనంలో చోటుచేసుకున్న విషయాలు, తారస పడ్డ వ్యక్తులు, జనజీవన సరళిని వివరించడానికి నా ఈ చిన్ని ప్రయత్నం.

అలవర్తి పిచ్చయ్య చౌదరి ఈ | టీ

ఈ కధనంలో పేర్లు ఎక్కువ. పేర్లలో అనుబంధం మరింత ఎక్కువ. జీవితం రసబంధురం అని నా సోదరుడు ప్రఖ్యాత కధకుడు, నవలా రచయిత అలపర్తి రామకృష్ణ తన కథలలో, నవలలో అభివర్డించాడు రాయలసీమలో నా జీవితం రసబంధురంగా సాగుతున్నది.

గుంటూరు జిల్లా పొన్నూరులో పుట్టిన నేను, కడప గడపలో అనంత ప్రఖ్యాతులు, గౌరవ పురస్కారాలు అందుకున్నాను. నాలుగు దశాబ్దాలుగా కడపలో జీవనం సాగిస్తూ అంతులేని కీర్తి ప్రతిష్టలు మూటకట్టుకున్నాను.

అప్పుడే జీవితంలో అరవైసంవత్సరాలు పూర్తి అయి, షష్టిపూర్తిని పిల్లలు, బంధువుల మధ్య అమెరికాలో వేడుకగా జరుపుకున్నాను. షామియానాలో, వెలుగు జిలుగులలో అసంఖ్యాక బంధుమిత్రుల మధ్య ఆ వేడుకలు బిడ్డలు ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకలలో పొందిన ఆనందంతోపాటు, దశాబ్దాల జనజీవితం, స్నేహితుల, విద్యార్థులతో అనుబంధం ఒక ఉపాధ్యాయుడిగా గుర్తుకు రాసాగాయి.

ఒక వ్యక్తి ఎంత కృషి చేయగలడు, ఎందరిని సమన్వయపరచగలడు. శత్రువులను సహితం ్రేమించగలడు, ఎంతటి ఫలితాలు సాధించగలడు అనేది కడప గడపలో నా జీవిత ఘట్టాలు తెలియచేస్తాయి. ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారగలగటం రాయలసీమలోనే సాధ్యమని నా దృథమైన నమ్మకం. అమ్మతో పేగుబంధం, అన్నయ్యల, అక్కయ్యల, చెల్లెళ్ల య్రేమానుబంధం, గురు శిష్య సంబంధాలు, (ప్రజా సంబంధాలు, భార్యాబిడ్డలతో జీవిత బంధం అనుక్షణం వృద్ధాప్యంలో గుర్తుకు వస్తున్నాయి. గంధపు చెక్కసువాసనలు వెదజల్లుతూ నలుగురికి ఉపయోగపడుతుంది. చెక్క అరిగిపోయినా సువాసన మిగిలిపోతుంది. మన కోసం చేసిన పని మనతోనే అంతమవుతుంది. ఇతరుల కోసం చేసింది కలకాలం మిగులుతుంది. ఇదీ నేను జీవితంలో తెలుసుకున్న జీవన సత్యం. జీవిత గమనంలో ఎక్కువ కాలం కడప గడపలోనే గడిచిపోతున్నది. చిన్ననాటి సంఘటనలు విద్యాభ్యాసం, ఉద్యోగ అన్వేషణ జీవితంలో కొంత భాగమయితే, నన్ను నేనుగా నిలబడటానికి రాయలసీమలో నా అనుబంధం జీవిత చరమాంకం వరకూ కొనసాగనున్నది. ఒక్కసారిగా గతంలోనికి వెళ్తున్నాను. జీవిత గమనం ఎన్ని మలుపులు తిరిగినా, | లి + కడప గడపలో జీవన మధురిమలు

కడప గడపలో మధురిమలు చూసిన నాకు అవి సవివరంగా చెప్పాలని ఉంది.బాల్యం నుండి కడప గడప వరకు గల జీవన 'ప్రస్తానాన్ని గుర్తుకు చేసుకుంటున్నాను. టే సీ లా ఇదు దశాబ్దాలకు ముందు గుంటూరు జిల్లా పొన్నూరులో పాత పొన్నూరులో ఒక పెద్ద పెంకుటిల్లు. ఇంటి చుట్టూ ప్రహరి, ఒకవైపు పెద్ద ఆర్చి, ఆర్చిపై కాళింది సర్పంపడగ పై గోపాలకృష్ణుడు, గోపాలునికి ఇరువైపులా మోరలెత్తి గోపాలుని వేణుగానం వింటున్న ఆవులు. ఆవుల పొదుగుల నుండి పాలు తాగుతున్న బుజ్ఞాయిలు, ఆకర్షణీయంగా చూపరులను ఆకట్టుకునే రాధామనోహరం ఆర్చిపైకి దట్టంగా అల్లుకుపోయి ఉండేది. ఇరవై అడుగుల ఆర్చి రెండు మూడు గాలి వానలకు కూడా చెక్క చెదరలేదు. ఆర్చికి ఇరువైపులా పెద్ద అరుగులు ఉండేవి. ఆ అరుగులపై సాయంత్రం అయ్యేసరికి పెద్దవారు వచ్చి లోకాఖిరామాయణం మాట్లాడుకునేవారు. కసుకర్రు, వల్లభరాయుడుపాలెం, కొత్త పాలెం (గ్రామాల నుండి ఆ వీధి గుండా వెళ్ళేవాళ్లు. ఒక్కసారి ఆగి ఆ ఆర్చిని చూడకుండా ముందుకు కదిలేవాళ్ళు కాదు. ఆ ఇంటి పెద్ద, గ్రామమునసబు అలపర్తి వెంకయ్యచౌదరి. మునసబు చౌదరి గారంటే చుట్టుప్రక్కల గ్రామాలలో పెద్ద పేరు. ఆజాను బాహువులతో, గుబురు మీసకట్టుతో, లాల్చీ పంచెలతో హుందాగా, చూపరులనిట్టే ఆకర్షించగల స్ఫూరద్రూపి ఆయన. పేదవారికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చే చౌదరి గారిని ఇప్పటికి పొన్నూరు ప్రజలు మరచిపోలేరు. ఆయన సేవలు అలాంటివి. పొన్నూరులో ఏ పని చేసినా మొదట ఉండేవారు.1930ల లోనే కారు ఉన్న, కారు నడిపిన మొదటి వ్యక్తి ఆయనే. లారీల వ్యాపారం చేసినా, సినిమా హాలు నడిపినా, తెనా ౨ వెంకటేశ్వర టాకీస్‌ మేనేజరుగా ఉన్నా ముక్త్యాలరాజా దివానుగా పనిచేసినా ఆయన హుందా ఎవ్వరికి ఉండేది కాదు. వెంకయ్య చౌదరి బెంగుళూరు వెళ్ళి, వచ్చారంటే రకరకాల చామంతి పూల బుట్టలు పొన్నూరులో ఆయనతోపాటు చేరేవి. ఆ వీధిలో వారందరికి పంపిణీ అయ్యేవి. చౌదరిగారంటే మహిళలకు గౌరవం. అభిమానం. ఆయన ఎదురుపడితే మహిళలు గౌరవంగా పక్కకు తప్పుకునే వారు. ఆంగ తెలుగు బాషూ౬” 2. ౧న అనర్గళంగా మాట్లాడేవారు. రామాయణ, భాగవత అలపర్తి పిచ్చయ్య చౌదరి + | ్రీ

పురాణాల కాలక్షపాలు చేసేవారు. అన్నదమ్ముల ఆస్తులను అజమాయిషీ చేసి, తన ఆస్తి పాస్తులు పోగొట్టుకున్నారు. అన్నతమ్ముళ్లకు అన్ని ఇచ్చి, బయటికు వచ్చి స్వంత ఇల్లు నిర్మించుకున్నారు చౌదరిగారు,

ఆయనకు 11 మంది సంతానం వారందరిని పోషించటం, రాజసంగా బతకటం ఆయనకే చెల్లింది ఆయన సంతానంలో నాలుగో వాణ్ణి నేను. కుటుంబంలో ఎన్ని ఆర్థిక సమస్యలున్నా అవి ఎన్నడూ నన్ను బాధించలేదు. కారణం నాన్న నాకు వాళ్ల నాన్న పేరు పెట్టటమే. మా నాయనమ్మ మాణిక్యమ్మ తన భర్త పేరు కాబట్టి నన్ను ఎంతో గారాబంగా చూసేది. మా అత్తయ్య హనుఘూయమ్మ తండ్రి పేరు నాకు పెట్టటంతో, తినుబండారాలు దాచి, దాచి మరి పిలిచి పెట్టేది. చదువులో ముందుంటానని నా అన్నలు నన్ను అపురూపంగా చూసేవారు.

చిన్ననాటి విషయాలు తలుచుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. కారులో ఊరేగించి నన్ను పాఠశాలలో చేర్ప్చించటం, ఊరులో అందరికి భోజనాలు పెట్టడం, ఉపాధ్యాయులకు కొత్త బట్టలు, పిల్లలకు మిరాయిలు పంచడం నా మదిలో మరుపురాని మధుర జ్ఞాపకాలు.

శ్రీరామా ఎలిమెటరీ స్కూలు హెడ్‌మాస్టర్‌ కాంతయ్యగారు, హైస్కూలు చదువులో రాధాకృష్ణమూర్తి, రంగనాయకులు, రామకోటయ్య మాస్టారు, హరి, వీరయ్య మాస్టర్ల మాధమ్యాటిక్స్‌ కోచింగ్‌లను వలా మరచిపోగలను? రాధాకృష్ణ మూర్తి మాస్టారు మా అన్న దమ్ములందరికీ రూపాయి తీసుకోకుండా చదువు చెప్పేవారు. చదువులో ఆయన వేసిన పునాదులపై సౌధాలును కట్టకోగలిగాం.

మా అమ్మ అన్నపూర్ణమ్మ, సాక్షాత్తూ అన్నపూర్ణమ్మే. ఎవరు వచ్చినా, వ వేళ వచ్చినా అన్నం పెట్టే తల్లి ఆమె. నాన్న సాయి భక్తులు. సాయి పూజలు, భజనలు నిరంతరం జరిగేవి. అమ్మ నాన్నల మంచితనం, పూజాపునస్మారాలు సేవాతత్పరత మా అన్నదమ్ముల జీవితాలపై ఎంతో ప్రభావం చూపాయి. ఓర్చ్పుకు మరో రూపం అమ్మ ఆరుగురి అన్నదమ్ములకు అపురూపమైన అక్క చెల్లి మా అమ్మ వంద తులాల బంగారుతో, అశేష సంపద మా నాన్నకు అప్ప చెప్పారు మా మేనమామలు వారి (ప్రేమ అంతా ఇంతా కాదు. నిజంగా ఆమె అన్నపూర్ణమ్మ, అమృతమూర్తి. | 7 శ కడప గడపలో జీవన మధురిమలు

బాల్యం అనేక ఆర్థిక ఇబ్బందులతో, ఒడుదుడుకులతో సాగిపోయింది. నేను 8వ తరగతి చదివేటప్పుడు ప్రముఖ రాజకీయవేత్త, సోషలిస్టు తెనాలికి చెందిన నన్నప్రనేని వెంకటరావు గారు మా ఇంటికి వచ్చారు. ఆయనకు అసెంబ్లీ ఎన్నికలకు పొన్నూరు కాంగ్రెస్‌ టికెట్‌ వచ్చింది. స్వతంత్ర పార్టీకి చెందిన ఆచార్య రంగా శిష్యులు పాములపాటి బుచ్చినాయుడుకు ఆ పార్టీ పొన్నూరు టిక్కెట్‌ ఇచ్చారు. వెంకయ్య చౌదరిని కలిస్తే అనుకూలం అవుతుందని నన్నపనేని వెంకటరావు గారికి ఎవరో చెప్పటంతో, మందీ మార్చలంతో ఆయన నాన్నను కలవటానికి వచ్చారు. నాన్నతో సంప్రదింపులు జరిపారు. ఆ రోజులలో రాజకీయ నాయకులలో పరస్పర గౌరవం, మర్యాదలు చూస్తే, అప్పటికి ఇప్పటికి ఎంత తేదానో అనిపిస్తుంది. ఒంటిగంట అయినా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. నాన్న వారిని భోజనం చేయమనటం, మాట ఇవ్వాలి, సాయంచేయాలి అని వారనటం, చివరకు మూ నాన్న అంగీకరించటంతో కధ సుఖాంతమయి, భోజనాలకు లేచారు. నాన్నకు, కాంగ్రెస్‌ అంటే ఇష్టం. నాకు ఇప్పటికి గుర్తు. ఆ భోజనాలకు పెరుగు కోసం నన్ను పక్కింటికి పంపటం, నాన్న బతికినంత కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. మాజీమంత్రి పాములపాటి అంకినీడు ప్రసాదరావు. అధరాపురపు శేషగిరిరావు లకుపాత పొన్నూరులో పెద్దదిక్కు ఆయనే! రోజులు ఒకేరకంగా ఉండవు. ఓడలు బళ్లవుతాయి. నాన్న వైభవం క్రమక్రమంగా అమావాస్య దగ్గరకు వస్తున్న చంద్రుడిలా క్షీణించసాగింది. లారీల వ్యాపారంలో నష్టం, కాంట్రాక్టులలో నష్టం, చందోలు (బ్రిడ్జి కాంట్రాక్టరుగా ఇంజనీరుతో తగాదాలు, ర్యాత్రిళ్లు పెట్రో మాక్స్‌ లైట్లతో వనులు పూర్తి చేయటం, పంతాలువట్టింపులతో ఆ కాంట్రాక్టులలో నష్టాలు, అప్పులకు భూములు అమ్మివేయటం, అర్చి ఇంటి నుండి చిన్న ఇంటికి చేరటం మా జీవితాలలో పెద్ద మలుపు. పెద్దన్నయ్యలు ఇద్దరూ సరిగా చదవక, చిన్న ఉద్యోగాలలో స్థిరపడటం, మూడవ అన్న పాలిటెక్‌నిక్‌ చదివి రైల్వే (బ్రిడ్జిస్‌ ఇన్‌స్పెక్టరుగా ఇంటికి ఆధారంగా నిలిచాడు. పుష్కరంపాటు ఆయన పంపిన 100 రూ మని ఆర్డరు కుటుంబానికి పెద్ద ఆధారం. మా పెద్ద నాన్న కొడుకు డా! చిట్టిబాబు పొన్నూరులో పేరు గాంచిన శస్త్ర నిపుణులు, అలపర్తి పిచ్చయ్య చౌదరి * | ద్ర

అయినవాళ్లను అపురూపంగా చూసుకొని, ఆరోగ్య, విషయాలలో ఎంతో అండగా నిలుస్తున్నారు. మా పెద్దనాన్న మనవడు ప్రసాద్‌ నడింపల్లెలో పేరుగాంచిన డాక్టరు. పేదప్రజల డాక్టర్‌గా గ్రామంలో మన్ననలు పొందుతున్నారు. కుటుంబంలో ఒక్కరైనా దాక్టరు కావాలని, చదువులలో ముందున్న నన్ను విజయవాడ లయోలా కళాశాలలో చేర్పించారు. యి టి ట్ధి

లయోల కళాశాల నా జీవిత గమ్యానికి పునాదులు వేసింది. 1963-64 నాటి విజయవాడకు ఇప్పటి విజయవాడకు ఎంతో తేదా అనిపిస్తుంది. ఆ రోజులలో 7వ నంబరు పడమటి సిటిబస్‌లో బెంజికంపెనీ వద్ద దిగేవాళ్ళం. బెంజికంపెనీ దగ్గర అంతా పంటపొలాలు, పడమటి, పడమట లంకల పూరిళ్లు మాత్రమే ఉందేవి. లయోలా దారిలో మెరిస్టెల్లా పాలిటెక్నిక్‌ భవనాలు తప్ప అంతా నిర్మానుష్యంగా ఉండేది. లయోలాకాలేజి నుండి ఆదివారం అయితే బెంజికంపెనీ దగ్గర కాని, గుణదలలో గానీ సిటీ బస్‌లలో టౌనుకు సినిమాలకు వెళ్లే వాళ్ళం. చాలా వరకు నడిచే వెళ్లేవాళ్లం.

లయోలా కళాశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ గార్జన్‌ చూపిన ఆదరణ, (ేమ మరువలేం. ఆస్మృతులు మరువలేనివి. ఆ కళాశాలతో అనుబంధం ఉన్నవారెవరూ జీవితకాలంలో మరచి పోలేరు. అనాటి ఆ కళాశాల చదువు ఏ విద్యాధ్ధికైనా జీవితంలో గర్వకారణమే. గోగినేని హాస్టల్‌లో సీటు దొరికింది. వార్డన్‌ మీరాండా డిప్యూటివార్డెన్‌ కురియ కోస్‌లు, ఆ క్రమశిక్షణ వణుకు పుట్టించేది.

ఉదయం 5 గంటలవగానే సైలన్స్‌ అవర్‌, 680 నుండి 7.30 వరకు స్టడీ అవర్‌, 8 గంటలకు టిఫిన్‌, 8.80 నుండి 9.30 వరకు సైలన్స్‌ అవర్‌, 10 గంటలకు కళాశాలకు పోవటం దినచర్య. సైలన్స్‌ అవర్‌లో మాట్లాడినందుకు పనిష్మెంట్‌, ఫైన్లు చెల్లించిన సందర్భాలు అనేకం.

హాస్టల్‌ లీడర్‌ జగన్నాధరావు బహుపాత్రాఖినయాలు, టెన్నిస్‌ భూపతి విన్యాసాలు, కళాశాలలో సింగ్‌ గారి బోటనీ పాఠాలు, బసవ పున్నయ్య గారి ఫిజిక్స్‌, భాస్మరరావు గారి జువాలజీ బోధన, సురేష్‌గారి ఇంగ్లీషు. పెద్ది బొట్ల సుబ్బరామయ్య, ]] () + కడప గడపలో జీవన మధురిమలు

నాగళ్ళ గురు ప్రసాదరావు గార్త తెలుగు బోధన. ఇలా అందరి మాస్టార్ల పాఠాలు, సాయంత్రం ఆటలు, రాత్రి స్టడి అవర్లు. శనివారం రాత్రి హాస్టల్‌లో సినిమా ప్రదర్శన ఎలా మరచిపోగలను?

నా రూమ్‌మెట్‌ మంగళగిరి అబ్బాయి, భోజనశాలలో పక్కనే కుర్చునే కాకినాడ సుబ్చిరెడ్డి, చీరాల సుబ్బారావుతో ఎన్‌.టి.ఆర్‌., ఎ.ఎన్‌.ఆర్‌. సినిమాల విశ్లేషణ కొట్లాటలు తలచుకుంటే హ్యాపీడేస్‌ సినిమా గుర్తుకు వస్తుంది. నా బంధువు, ఆత్మీయుడు దావులూరి రాజేంద్రప్రసాద్‌ నా కేర్‌టేకర్‌గా ఉందేవారు. ఆయన అజమాయిషీ ఉందేది. యూనివర్సిటిలో చదివేటప్పుడు కూడా ఆయన అజమాయిషీ నాపై ఉందేది.

టి లి లా

ఆశించిన ఫలితాలు రాక, డాక్టర్‌ సీటుకు తగిన మార్కులు రాక, ఆర్థిక పరిస్థితుల కారణంగా డిగ్రీ నిడుబ్రోలు పి.బి.ఎన్‌. కళాశాలలో చదివే పరిస్థితి ఏర్పడింది.

ఆ రోజులలో వదాన్యులు (ప్రైవేటు డిగ్రీ కళాశాలలు స్టాపించి విద్యాదానం చేశారు. విద్యా వ్యాపారం చేయలేదనే నా అభిప్రాయం. రాయలసీమలో కళాశాలలు అతి తక్కువగా ఉండటవలన విద్యార్థులు ఉన్నత చదువులకు విజయవాడ లయోలా, నరసారావుపేట, చీరాల, నిడుబ్రోలు కళాశాలలకు తరలివచ్చేవారు. ఆ ఒరవడిలోనే రాయలసీమ విద్యార్థులకు నిడుబ్రోలులో 'కల్పన బిల్దింగ్స్‌' ఆవాసంగా ఉండేది. రాయలసీమ విద్యార్థులు ఆ బిల్జింగ్స్‌లో ఉండి కళాశాలలకు వచ్చేవారు. ఆ రోజులలో రాయలసీమ, సర్కారు అనే భావాలు ఉండేవి కావు. రాయలసీమ విద్యార్థులకు కల్పన బిల్లింగ్స్‌ కల్పతరువు.

డిగ్రీలో నరసరావుపేట కాలేజి నుండి వచ్చిన దయాచారి (ఐఏఎస్‌అధికారి), నెల్లూరు కోటప్పనాయుడు (టీచర్సు, పెదపాలెం సీతరామయ్య (టీచరు), కడప కర్నూలు వాసులు రమణయ్య, తిరుషప్పాలు, వీరనారాయణరెడ్డి (జోగిపేట డిగీ కళాశాల. బోటనీ లెక్చరర్‌) నా సహ విద్యార్థులు

మహమ్మద్‌జాని (గ్రూప్‌-1 అధికారి), దుర్గాప్రసాదరావు (నేటి కృష్ణ వి.సి.) కళాశాల రాజకీయాలలో జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని, జైలుకు కూడా వెళ్లారు.

అలపర్తి పిచ్చయ్య చౌదరి ఫీ “౨౧0

అలాంటి వారి మధ్య డిగ్రీ చదువులు కొనసాగాయి. విశాలమైన కళాశాల భవనాలు, పెద్ద లైబ్రరీ, ఆడిటోరియం, పంట పొలాలమధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఆనాటి ఈ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాల అన్ని సౌకర్యాలతో ఉండేది

పాములపాటి బుచ్చి నాయుడు కళాశాలలో కెమిష్ట్రీ సీతారామయ్య గారి కారిన్యాన్ని బోటనీ సన్యాసిరావు గారి పాఠాలు, కొండపల్లి బోటానికల్‌ టిప్‌, యేసు రత్నం, ఆదిశేషయ్య గార్ల జంతుశాస్త్ర బోధన, ఇంగ్లీషు అమరయ్యగారి జోకులు, లక్ష్మయ్య గారి “ఒథెల్లో, లాజిక్‌ సీతారామయ్య గారి విన్యాసాలు, పాలిటిక్స్‌ సాంబశివరావు గారి పాఠాలు, పరీక్షల నిర్వహణ తీరు, ఎన్నటికి మరువలేని జ్ఞాపకాలు. ఆ రోజుల్లో డిగ్రీలో సైన్సుతోపాటు, జనరల్‌ సబ్బెక్టుగా ఆర్ట్స్‌ సబ్జెక్టు కూడా చెప్పేవారు.

యేసురత్నంగారు డయాగ్రము వేసి పొఠాలు చెపితే క్లాసులోనే పారాలు వచ్చేవి. అది అలనాటి లెక్చరర్ల బోధనాపటిమ. తరువాత రాజకీయాలలో ప్రవేశించి మా లెక్సరర్‌ యేసురత్నం గారు గుంటూరు మేయర్‌ పదవిని కూడా చేపట్టారు. ముగ్గురు ఆడపిల్లలు డిగ్రీలో మా క్లాస్‌మెట్లు. వారితో మాట్లాడిన సందర్భాలు అతి తక్కువ. ఆడపిల్లలతో మాట్లాడాటమంటే భయం. వరలక్ష్మి, ధనలక్ష్మి అనే అమ్మాయిలు మా వీధిలోనే ఉండేవారు.

నాన్నగారు నన్ను డాక్టరు కావాలని కోరుకున్నారు. మామగారు [గ్రూప్‌-1 ఆఫీసర్‌ కావాలని కోరుకున్నారు. ఉపాధ్యాయ వృత్తి నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. పెద్దల కోర్కెలు నెరవేర్చలేకపోయినా, కడవ జిల్లా వారికి బముముఖ సేవలందించటానికి నా ఈ వృత్తి తోద్బడింది. మరో రకంగా కొంతకాలం పాలనా శాఖలో ఉన్నత ఉద్యోగాలు నిర్వహించి, వారు ఆశించిన కార్యదక్షత, ప్రజా సంబంధాలు ఆ పదవుల ద్వారా నెరవేర్చానని అనుకుంటున్నాను. ఆత్మతృప్తితో ఉపాధ్యాయవృత్తి సామాజికపరంగా అనేకమందితో ప్రత్యక్ష సంబంధాలు, శవ చేసే అవకాశం కార్యనిర్వాహక పదవుల ద్వారా లభించింది.

ఎంతోమంది ఉన్నతాధికారులు, ఐఎఏస్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘంలో అన్ని వర్గాల వారితోగల సంబంధాల ద్వారా ప్రజాసేవకు అధికార పదవులు తోడ్పడ్డాయి. నా సహచరులు, మిత్రులైన అధికారులు ఆరోజులలో నువ్వెందుకు 0 ] కడప గడపలో జీవన మధురిమలు

పరీక్షలు రాసి ఆ స్థానాల కోసం గట్టి ప్రయత్నం చేయలేదు అనేవారు. ఆ సమయంలో సంఘసేవ మీద ఉన్న ఆసక్తితో ఉన్నతాధికారిగా బహుముఖ సేవలందించే ఆ అవకాశాల గురించి, ఆలోచించలేదు.

అత్యుత్తమ అధ్యాపకుడిగా గుర్తింపు పొంది, దాదాపు ఇరవై ఏళ్లు లెక్చరర్‌గా పనిచేశాను. నేను డిగ్రీ కళాశాలకు లెక్చరర్‌గా వెళ్లాలా, జూనియర్‌ కళాశాల పిన్స్‌పాల్‌గా పదోన్నతిపై వెళ్లాలా అనే సమస్య వచ్చినప్పుడు నా ఐఎఎస్‌ మిత్రుడిని సలహా అడిగాను. ఉపాధ్యాయుడుగా డిగ్రీ కళాశాలకు వెళితే వృత్తికి సంబంధించిన తృప్తి, ఎందరినో తీర్చిదిద్దటానికి ఉపయోగపడుతుంది. ప్రిన్స్‌పాల్‌గా తరువాత ఉన్నతాధికార బాధ్యతలతో ప్రజలకు ప్రత్యక్షంగా, జిల్లా, రాష్త్ర ప్రభుత్వ శాఖలలో పనిచేయటంవలన సామాజికంగా మరింత సేవలందించవచ్చని ఆయన అన్నారు. అప్పటికే లయనిజంతో సామాజిక పరంగా సేవలు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉన్నాను. అద్మినిప్టేషన్‌లో కూడా రాణించగలననే నమ్మకంతో టప్రిన్స్‌పాల్‌గా, ఆర్‌ఐవో, జాయింట్‌ సెక్రటరీగా కార్యనిర్వాహక పదవులలోనికి (ప్రవేశించాను.

ఈ విధంగా అధ్యాపకుడుగా, అడ్మినిస్టేటర్‌గా రాణించే అవకాశాలు లభించాయి. అనంతపురంలో శాసనసభ్యులు పల్లె రఘునాథరెడ్డి వారి సోదరులు రామకృష్ణారెడ్డి, ప్రిన్స్‌పాళ్లు కృష్ణప్ప, బ్రహ్మానందరెడ్డి, దేవరాజులు నాయుడు, కడప జిల్లాలోని ప్రిన్స్‌పాళ్లు, లెక్సధర్లు మరెంతమందో ఈ రంగాలలో నా కృషికి తోడ్చాటునందించారు.

య

డిగ్రలో వచ్చిన మంచి మార్కులతో ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెన్సీ జువాలజీలో చేరాను. 1970 నాటి వైజాక్‌కు ఇప్పటి విశాఖపట్టణానికి పోలికలే లేవు. చదువు పూర్తి చేసిన తరువాత ఈనాటి వరకు వైజాక్‌ వెళ్ళే అవకాశమే రాలేదు. ఇంటర్‌ బోర్డు జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తూ ఒకసారి రాజమండ్రి వరకూ వెళ్ళి అర్జెంటుగా ప్రోగ్రాం కాన్సిల్‌ చేసుకొని హైదరాబాద్‌కు వెనుతిరిగి రావలసి వచ్చింది. నా పాత మిత్రులు మన్మధరావు, శివప్రసాద్‌, రాజగణపతిలను కలవాలనుకున్నాను. నా గురువు దా॥ హనుమంతరావు (జువాలజీ రిటైర్డ్‌ ప్రాఫెసర్‌)ను వ్యక్తిగతంగా కలవాలనే నా కోరిక కలగానే మిగిలిపోయింది.

అలపర్తి పిచ్చయ్య చౌదరి ఛి (040

ఆంధ్రా యూనీవర్సిటీ క్యాంపస్‌లో ఇంటర్వ్యూకు వెళ్ళాను. గుంటూరు పి.జి. సెంటర్‌లో సీటు వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ వెయిటింగ్‌ లిస్టు 1లో ఉన్నాను. పొన్నూరుకు గుంటూరు దగ్గర అవటంతో మా అన్న నరేంద్రనాథ్‌ నన్ను అక్కడ చదివించటం ఇష్టపడలేదు. ఆ కారణంగా ఇంటర్వ్యూకు వైజాక్‌ వెళ్ళాను. ఉదయం ఇంటర్వ్యూలు జరిగాయి.

జువాలజీలో అందరూ చేరారు, నిరాశపడ్డాను. ఆపద్బాంధవుడుగా తెల్లచొక్కా తెల్ల ష్యాంటుతో పొట్టిగా ఒక విద్యార్థి జువాలజీ వదులుకొని బోటనీలో అవకాశం వచ్చి అక్కడ చేరినట్లు సమాచారం ఇచ్చాడు. అతడు వదిలిన జువాలజీ సీటు నాకు దక్కింది. ఆయనే జి, నాగేశ్వరరావు. అనేక హోదాలలో సమర్థుడైన అధికారిగా గుర్తింపబడిన ఐ.ఎ.ఎస్‌. అధికారి జి.ఎన్‌. రావు. ఆయన పూర్తి పేరు గోపిసెట్టి నాగేశ్వరరావు. మా ఇద్దరి అనుబంధం ఆనాటి నుండి ఈనాటి వరకు అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంది.

మొదటి రోజు ఇరస్స్వీన్‌స్మేబ్రోర్‌ జువాలజీ గ్యాలరీ క్లాసుకు వెళ్లాను. హాలులో అమ్మాయిల కేకలు, అరుపులు వినిపించాయి. క్లాస్‌రూముకు వెళ్లటానికి భయపడ్డాను. క్లాస్‌ రూములో ఇరవై ఐదుమంది అమ్మాయిలు, హాలు వెలుపల ఎనిమిది మంది అబ్బాయిలం ఉన్నాం. క్లాస్‌మేట్స్‌లో శివప్రసాద్‌ది వైజాక్‌, ఆయన పాటలు బాగా పాడేవారు. సుబ్బరాజు, సుబ్రమణ్యం, రామమోహన్‌రావు, కాశయ్య, నాగిరెడ్డి, రామారావు, బసవ పున్నారావు, మన్మధరావు, రామసుసేన్‌లు నిరంతరం మదిలో మెదులుతూ దశాబ్దాలుగా వారి జ్ఞాపకాలతో దోబూచులాడుతుంటారు. ఆడపిల్లలలో రంగరాజ్యం, రాజేశ్వరి, సుధోరాణి (ఐ.ఎ.ఎస్‌.), విజయలలితకుమారి, కృష్ణకుమారి, హైమావతి, లక్ష్మి, ఉమాదేవి, కమలకుమారి, రాణిస్రభావతీ ఇంకొ ఎందరో అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటారు. వారంతా ఈనాడు అరవై పడిలో ఉంటారు. వారంతా దశాబ్దాలుగా నా జ్ఞాపకాల పల్లికిలో ఊరేగుతూనే ఉన్నారు.

గలగలా కదిలే గోదారిలా మొదటి సంవత్సరం గడిచిపోయింది. డిపార్ట్‌మెంటు సెక్రటరీగా నేను నిర్వహించిన అరకువ్యాలి అనంతగిరి పిక్సిక్‌ను మరచిపోలేను. రెండవ సంవత్సరం డిపార్ట్‌మెంట్‌ (పెసిడెంట్‌గా ఎన్నిక అయ్యాను. ఇనాగురల్‌ ఫంక్షన్‌లో ప్రొఫెసర్‌ గణపతి, ఫ్రొ। వెంకటేశ్వర్లు (బోటనీ) మధ్య కూర్చొని, మాటలు 03 ఛా కడప గడపలో జీవన మధురిమలు

తడపడి ఇనాగురుల్‌ ఫంక్షన్‌కు బదులు వ్యాలిడిటరీ ఫంక్షన్‌ అని అన్నాను. అమ్మాయిలంతా నవ్వారు. అలా తడబాటుతో ఆరంభించిన జీవితం తరువాత కాలంలో అనర్గళంగా మాట్లాడుతూ, వందలాది సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజ్ఞాశాలిగా గుర్తింపుపొంది, రాష్ట్ర అధికారిగా రిటైరు కావటం నా సహచరులయిన ఆనాటి విద్యార్భలకు తెలిస్తే ఆశ్చర్యంలో మునకవేయక తప్పదు.

ఆ ప్రవాహంలో ఈశ్చర్‌ చంద్‌ (డి.ఎఫ్‌. వో) ప్రక్కరూములలో ఉన్న రూమ్మేట్స్‌ నాగేశ్వరరావు (జి.ఎన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌.) సాయిబాబా (గ్రూపు-1 అధికారి), గోపాలరావు (గ్రూప్‌-1 అధికారి, కెవి. రావు (ముఖ్య కార్యదర్శి, ఐ.ఎ.ఎస్‌.), మంగపతి రావు (ఐ.ఎ.ఎస్‌, బాలస్వామిరెడ్డి (పులివెందుల), వీరయ్య (లెక్చరర్‌), భాస్మర్‌ (ఫిజిక్స్‌), సత్యనారాయణ (ఫిజిక్స్‌), లక్ష్మిపతి అలా ఎందరో ఆప్పులు, ఆత్మీయులు.

నా రూమ్‌మెక్మీట్‌ ఈశ్వర్‌చంద్‌ బాడీ బిల్డర్‌, సౌత్‌ క్యాంపస్‌ షీల్డులు పొందారు. మెస్‌ సెక్రటరీగా ఉండేవారు. సద్ధర్మసదనలో 2వ రూము నుండి 9వ రూము వరకు మా మిత్ర బృందం ఉండేది. ఈశ్వర చంద్‌ అంటే ఇష్టం. డబ్బులయిపోతే అదిరించి, బెదిరించి, అలిగి సాధించుకునే వాడిని. కానీ దశాబ్దాలుగా అతనితో కలసిన సందర్భాలు అతి తక్కువ.

రెండవ సంవత్సరంలో జరిగిన భయంకర సంఘటన జీవితకాలంలో మరువలేనిది. 1970 సంవత్సరం ఆంధ్రా యూనివర్సిటీలో చదివిన సైన్సు, ఆర్ట్స్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ విద్యార్థులు అందరూ మరువ లేని సంఘటన. ఈశ్వరచంద్‌ మెస్‌ సెక్రటరీ కావటంతో టెర్మినల్‌ ఫీస్టు ఘనంగా జరుపుకున్నాం. మరుసటి రోజు ఉదయం నుండి ఆకాశం మేఘావృతమైంది, తుఫాను కారణంగా చినుకులు పడుతూ, సముద్రపు అలలు, టైడల్‌ వేవ్స్‌ భీకరంగా కనిపించాయి. ఆనాటి వాల్తేరుకు ఇప్పటి వాల్తేరుకు సంబంధం లేదు. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎక్కడ ఉన్నా. క్రిందగా దిగువ ప్రాంతంలో సముద్రం అలలు కనిపిస్తుండేవి. మా క్లాస్‌మేట్లు నాగిరెడ్డి, రామారావు సముద్రంలో ఆ సమయంలో అరుదుగా ఉండే స్పెస్పిమన్లు వస్తాయని సేకరిద్దామని నన్ను, ప్రక్క రూములోని గోపాలరావును బలవంతంగా సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్ళారు.

అలపర్తి పిచ్చయ్య చౌదరి శ “లట,

అలల మధ్య స్పెసిమన్ల సేకంణకు వంగి ఉండగా 15 అడగుల ఎత్తున అలలు వచ్చి మమ్ములను ముంచివేసాయి. నా కళ్ళముందే రామారావు, నాగిరెడ్డి బెండుముక్కల లాగా సముద్రములో కొట్టుకుపోవటం చూచాయగా గుర్తుకు వచ్చింది. అంతే. ఏమి జరిగిందో తెలియదు. నేను గోపాలరావు స్పృహ లేని స్థితిలో ఉండగా జర్మనులు 'సన్‌ అండీ సీ స్టార్‌ హోటల్‌లో ఉంటూ బైనాక్యులర్స్‌తో గమనించి సముద్రములోనికి (ధైర్యం చేసి ముందుకు వచ్చి మమ్మల్ని ఒడ్డుకు చేర్చారని తెలిసింది. ఒకటిన్నర రోజులు స్ప పహ లేకుండా కింగ్‌జార్జి హాస్పిటల్‌లో ఉన్నాం. తరువాత యూనివర్సిటి హాస్పిటల్‌లోకి చేర్చారు. ఈ లోగా చనిపోయిన విద్యార్థుల శవాలను తెప్పించాలని విద్యార్థులు ఆందోళన చేశారు. వైస్‌చాన్సలర్‌ బుల్లయ్య గారిని కలిసారు. మీరు కూడా పోతే ఇది జరిగేది కాదు కదా అన్నారు. ఆయన మాటలను అపార్ధం చేసుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఎక్కువ మంది వెళితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆయన ఉద్దేశం.

యూనివర్సిటీ మొత్తం ఆర్ట్స్‌, సైన్సు విద్యార్భల ఆందోళనతో అట్టుడికి పోయింది. విద్యార్థులు ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థినులు మమ్మల్ని చూడటానికి క్యూలు కట్టారు. మాకు నాగిరెడ్డి, రామారావులు చనిపోయారని వెంటనే తెలియ కూడదని మా స్నేహితులు జి.ఎన్‌. రావు, ఈశ్వరచంద్‌, రాజగణపతి మా దగ్గరకు ఎవ్వరినీ రానీయకుండా జా(గ్రత్త పడ్డారు. తెలిసిన తరువాత వారి మరణం మమ్ముల్ని కృంగదీసింది. వాళ్ల తల్లిదండ్రులు మమ్మలను పరామర్శించారు. మేం (బ్రతికినందుకు' సంతోషపడాలో, ఆప్తమిత్రులను కోల్పోయినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. యూనివర్సిటీ జీవితంలో అదో మరువరాని, మరువలేని విషాద సంఘటన. మాకు ధైర్యం చెప్పి, ప్రోత్సహించిన ప్రొఫెసర్‌ గణపతి, ప్రాః హనుమంతరావు, ప్రొః రామశర్మలను జీవితంలో మరువలేం. వారికి రుణపడి ఉన్నాం. అన్నయ్య పంపే డబ్బుతో చదువుకు ఇబ్బందులు రాలేదు. సీలేరు ప్రాజెక్టు పని మీద పెద్దన్నయ్య వైజాక్‌ వచ్చి, యూనివర్సిటిలో నన్ను చూసి వెళ్ళినపుడు ఖర్చులకు అదనంగా ఐదువందలు ఇవ్వటం మరువలేని జ్ఞాపకం.

ఫి ఛి ఛి

“ల్‌ + కడప గడపలో జీవన మధురిమలు

ఫలితాలు వచ్చాయి. మొదటి శ్రేణిలో పాసయ్యాను. మా అన్నయ్య కలలను సాకారం చేసాను. చిలకలూరిపేట చుండిరంగనాయకులు కళాశాలలో డిగ్రీ లెక్బరర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. సెలక్టయినాను అనటంకంటే కులబలంతో సాధించాననటంలో అతిశయోక్తి లేదు.

భోజనానికి బయటకు వస్తే యూనివర్సిటీ స్నేహితుడు జి.ఎన్‌. రావు బోటనీ లెక్పరర్‌ పోస్టుకు ఇంటర్వ్యూకు వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తి అయింది. నా సెలక్షన్‌ అయిందని చెప్పగానే నాగేశ్వరరావు సంతోషంతో తన విషయం కళాశాల కరస్పాండెంట్‌ చుండిరంగనాయకులు గారికి చెప్పమని అడిగాడు. నేను చుండి రంఘనాయకులు గారి కలిసి నాగేశ్వరరావును బోటనీ లెక్చరర్‌గా తీసుకోవాలని అడిగాను. ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఆయన మనవాడేనా అని. అతడు యూనివర్సిటి డిస్టింక్షన్‌ క్యాండిడేటు అని, మనవాడు కాకపోయినా మంచి లెక్చరర్‌గా రాణించి, కళాశాలలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాడని చెప్పటంతో, నా మీద గౌరవం, బంధు (్రేమతో నాగేశ్వరరావుకు కూడా లెక్చరర్‌ పోస్టు ఇచ్చారు.

కామర్స్‌ లెక్చరర్‌ శివకుమార్‌ కళాశాల యాజమాన్యం గురించి, విద్యార్థుల అరాచకాలు కధలు, కధలుగా చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసేవాడు. అద్భుతమైన మేధాశక్తితో, బోధనా పటిమతో శివకుమార్‌ లెక్చరర్‌గా బాగా రాణించేవాడు. మా ముగ్గురి స్నేహం ఇప్పటికి కొనసాగుతునే ఉంది.

మేం ముగ్గురం ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాళ్లం. ఆ రోజులు తలుచుకుంటేనే ఆశ్చర్యంవేస్తుంది. రెండువందల అరవై రూపాయలు వేతనం. అయినా దేనికి కొదవ ఉండేది కాదు. బేసిక్‌ వేతనం మాత్రమే ఇచ్చేవారు. యాజమాన్యం మమ్మల్ని సొంతవారిగా చూసుకునేవారు. ఇప్పటికీ మా మిత్రులంతా కల్సినప్పుడు చుండి రంగనాయకులు గారి ఆప్యాయత, అభిమానం ఆరోజుల్ని తలచుకుంటాం.

ఒక రోజు సాయంత్రం రూములో కూర్చున్న ముగ్గురు మిత్రులం మాటల సందర్భంగా గుంటూరులో మెకన్నాస్‌ గోల్డ్‌ సినిమా ఆడుతున్నది, చూడాలని అనుకున్నాము. అన్నపూర్ణమ్మ మెస్‌లో భోజనానికి ఆ రోజే డబ్బు చెల్లించటంతో

అలపర్తి పిచ్చయ్య చౌదరి ఉ “౮ద్రీ

జీతం చాలా వరకు ఖర్చయిపోయింది. మా దగ్గర నూటయాఖై రూపాయలు ఉన్నాయి. నా కోర్మెకుస్పందించిన మిత్రులు పదండి పోదాం అంటూ గుంటూరు తీసుకువెళ్లారు. అద్దెకారులో గుంటూరు చేరి మంచి హోటల్‌లో భోజనం చేసి, సంతృప్తిగా సినిమా చూసి వచ్చాం. ఏమీ లేని ఆరోజులలో ఎంతో తెగువతో ఖర్చు చేసి అనుకున్నది నెరవేర్చుకున్నాం. లక్షల రపాయలున్న ఈనాడు అంత స్వేచ్చ, తెగువ, తీరిక, కోర్కెలు నెరవేర్చుకునే స్నేహానుబంధం సుదూరమై అది సాధ్యపడటం లేదు. కల్మషంలేని ఆ స్నేహం మనస్సు పొరలలో నిక్షిప్తమైంది.

(ప్రైవేటు కళాశాలలో ఉద్యోగం, యాజమాన్యానికి మాపై ప్రత్యేక శ్రద్ధ మిగతా లెక్చరర్లకు బాధ కలిగించేది. స్టాఫ్‌ రూములో మేం రాగానే సంభాషణలు ఆగిపోయేవి. యాజమాన్యం మనుషులుగా మాపై ముద్రపడింది. విద్యార్థులలో మంచి లెక్చరర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాం. ఆనాటి నా విద్యార్థులలో బాబురావు, మరో విద్యార్థి ఇప్పటి ఐఎఎస్‌ అధికారి సాంబశివరావు గుర్తుకు వస్తుంటారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల లెక్చరర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు రావటంతో హైదరాబాద్‌ వెళ్ళాం. నాగేశ్వరరావుకు తుని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌గా పోస్టింగ్‌ వచ్చింది. ఇంటర్మీడియట్‌ బోర్జు స్పెషల్‌ ఆఫీసర్‌ సంగమేశ్వర రావు మా ఊరి వారు కావటం, మా నాన్న క్లాస్‌మెటే అంటూ మా పెద్దనాన్న నాకో రికమండేషన్‌ లెటర్‌ ఇచ్చాడు. ఇంటర్వ్యూ అయిన తరువాత ఆయనను కలిసాను. నాన్న గురించి చిన్ననాట వారిద్దరు నాటకాలు వేసేవాళ్లని, నాన్న మరణవార్త ఆయనకు తెలియకపోవడం, నాన్న జ్ఞాపకాలను ఆయన వివరిస్తుంటే స్నేహం విలువేమిటో అర్ధమయింది. “ఇంటర్వ్యూ బాగా చేశావులే, చూద్దాం.” అన్నాడు. తరువాత రెండు నెలలకు కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్బరరుగా అపాయింట్‌మెంటు వచ్చింది. శివకుమార్‌కు నంది కొట్టూరు జూనియర్‌ కళాశాల కామర్స్‌ లెక్చరర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇద్దరం చుండిరంగ నాయకులు కళాశాలకు వీడ్కోలు చెప్పి నరసరావు పేట బస్టాండు చేరుకున్నాం. ఆయన నందికొట్ళూరు వెళ్లారు. నేను కడప బస్సు ఎక్కాను.

ఫి ధి స ₹0/ శ కడప గడపలో జీవన మధురిమలు

కడప అంటే భయం. అందరూ భయపెట్టారు. కడప గడపలో అడుగుపెట్టాను. కడప పాత బస్టాండులో ఒక ఎర్రపెట్టతో దిగాను. “రాయచోటి” అంటూ హమాళీలు కేకలు, ప్రైవేటు బస్‌లలో ఎక్కడానికి ప్రయాణికుల హంగామా కడప పాత బస్‌స్టాండ్‌లో నాటి పరిస్థితి (6-3-1971).

కొండలమధ్య ఘాటు, వర్షంతో కొండలపై నుండి ప్రవహించే జలధారలు, ఆహ్లాద వాతావరణంమధ్య ప్రయాణం సాగింది. రాయచోటికి చేరి బస్‌స్టాండులో లాడ్జిల గురించి వాకబు చేసాను. బస్‌స్టాండులో ఒకే ఒక హోటలు, కొండలపై ఉన్న ఆ ఊరు కేవలం 30 వేల జనాభా ఉన్న గ్రామం. ఆ హోటల్‌లో రెండే గదులున్నాయి. హోటల్‌ మేనేజరును బతిమాలి ఎర్ర పెట్టెను కౌంటర్‌ దగ్గర వదిలి, తెరచి ఉన్న గదిలో స్నానం చేసి బయటపడ్డాను. హోటల్‌లో టిఫిన్‌ చేసినపుడు తెలిసింది ముందు రోజు ఆ గదిలో కరెంట్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఒకరు చనిపోయారని. భయం భయంగా టిఫిన్‌ ముగించాను. జూనియర్‌ కళాశాల అడ్రస్‌ తెలుసుకుని ప్రిస్సిపాల్‌ గదికి చేరాను.

పరిచయం పూర్తి చేసుకొని జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చాను. హయర్‌ సెకండరీ స్మూల్‌ను జూనియర్‌ కళాశాలలుగా మార్చారు. హైస్కూల్‌తోపాటు ఇంటర్మీడియట్‌ కలిసి ఉండేది. హైస్కూల్‌ సీనియర్‌ హెడ్‌మాస్టర్లని ప్రిన్స్‌పాల్‌గా, లెక్బరర్లగా నియమించారు. కొన్ని పోస్టులలో మాలాంటి వారిని డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో జూనియర్‌ లెర్బరర్లుగా నియమించారు.

ప్రిన్స్‌పాల్‌ రామారావుగారు చాలా స్టిక్స్‌ ఆయన చాదస్తంతో విసిగిపోయేవాళ్లం. తరచూ హైస్కూల్‌ తరగతులు కూడా తీసుకోమని ప్రిన్స్‌పాల్‌ విసిగించేవారు. ఇంగ్లీష్‌ సంపత్‌, మ్యాథ్స్‌ చెన్నారెడ్డి, కామర్స్‌ లెకరర్‌ వెంకటేశ్వర్లుకు ప్రిన్స్‌పాల్‌తో పడేది కాదు.

లెక్చరర్లు అదనపు కోచింగ్‌ పేరుతో ఇళ్లవద్ద (ప్రైవేటు ట్యూషన్లు చెప్పేవారు. రిటైర్డు టీచర్‌ జలీల్‌ఖాన్‌ ఇంగ్లీష్‌ ట్యూషన్‌ చెప్పేవాడు. మాటల సందర్భంగా సంపత్‌ కంటే జలీల్‌ ఖాన్‌ బెటర్‌ టీచర్‌ అని ప్రిన్స్‌పాల్‌ మాతో అన్నాడు. యువ లెక్చరర్లు ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఉండేవాళ్లం. ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్లకు

అలపర్తి పిచ్చయ్య చౌదరి + ౧౮

406 రూ ఆరంభ జీతం. 50 రూ. భోజనం. 20 రూ॥ ఇంటి అద్దె. 100 రూ. టెర్రికాటన్‌ (డ్రస్‌, అన్ని ఖర్చులు పోగా 200 రూ. మిగిలేది. సినిమాలు చూడటం మాత్రమే వాబీ. ఆ రోజులలో టీవీలు లేవు. పార్కులు లేవు. వాహనాలు తక్కువ బ్యాచిలర్‌ లెక్చరళ్ల దగ్గర డబ్బులు బాగా ఉండేవి. సంపత్‌ వంటి మందు ప్రియులు మా రూము వద్దకు చేరేవారు.

మందుకొట్టిన నిషాలో ఉన్న సంపత్‌ను జలీల్‌ ఖాన్‌ మీ కంటే బెటర్‌ టీచర్‌ అని ప్రిన్స్‌పాల్‌ అన్నాడని రెచ్చగొట్టేవాళ్లం మరునాడు కళాశాలలో పెద్ద సీను. ప్రిన్స్‌పాల్‌, సంపత్‌ గొడవ చూసి మేం ఆనందించే వాళ్లం. లెక్బరర్లతో టీచర్లకు సత్సంబంధాలుండేవి, నాగమునిరెడ్డి, చిన్నపరెడ్డి, సుబ్బరామయ్య, నాగన్న, సుబ్బారావు, చెన్నకేశవులతో సన్నిహితంగా ఉందేవాడిని.

సర్కారు నుండి వచ్చిన నలుగురు లెక్చరర్లకు హోటల్‌ భోజనం, వ్యవహారిక భాషతో సమస్యలు వచ్చేవి. మైక్రోస్మోపలో సెడ్‌లో సెక్షన్‌ సరిగా కనపడలేదని చెప్పటానికి 'మబ్బు'గా ఉంది సార్‌ అనేవాళ్లు. ప్రతి టీచర్‌ను, లెక్బరర్‌ను వారి పేర్లకు పక్కన 'సార్‌' చేర్చి పలికేవారు. ఊళ్లో అందరికి సార్లు అంటే గౌరవం. ఉపాధ్యాయ వృత్తికి రాయలసీమలో ఇచ్చే గౌరవం ప్రశంసనీయం. మా రూమ్‌మెట్‌ నాగరాజు బ్యాంకు క్లర్క్‌ ఆయన సరదా మనిషి ఆయనకు పబ్లిక్‌ రిలేషన్లు ఎక్కున,

తిరిగి తిరిగి రాత్రి ఒంటి గంటకు రూముకు వచ్చేవాడు. సినిమా యాక్టర్‌ 'శ్రీదేవి” క్యాలెండర్‌ తెచ్చి, అర్ధరాత్రి రూములో మేకులు కొట్టి తగిలించి హంగామా చేసేవాడు. ఇంటి ఓనరకు నాగరాజంటే భయం. జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్మూల్స్‌గా పనిచేసే ఇంటి ఓనర్‌ మూర్తిగారు సాత్వికుడు. అమాయకంగా ఉండే నాతోమాత్రమే మాట్లాడేవాడు. సినిమావాళ్ల బొమ్మలతో మేకులు కొట్టి రూములో క్యాలెండర్‌ తగిలంచాలా, దేవుని పటాలు తగిలించవచ్చు కదా అని నాగరాజును అనలేక నాతో అనేవారు. ఇది విని నాగరాజు బయటకు వచ్చి తగవు పెట్టుకోవటం, చిలికి చలికి గాలి వానైంది.

పరిస్థితి రూము ఖాళీ చేసే దాకా వచ్చింది. వేరే ఇంటికి మారాం. ఒక రోజు ఉదయం లేవగానే ఎవరో “మెట్టుతో కొట్టండి” అని అరవడం వినిపించింది. “067 శ కడప గడపలో జీవన మధురిమలు

దాబా మెట్లతో ఎలాకొడతారు అని అనుమానం వచ్చింది. మెట్లు అంటే చెప్పులు అని తరువాత తెలిసింది. జీడిపప్పును ముంతమామిడిపప్పు, “ఓయి అనే పదం సర్మారులో తప్పుగా అనిపించదు. బావమరిది వరసవారిని ఓయ్‌ అని రాయలసీమలో అంటారు. త్రోయటాన్ని దొబ్బటం అంటారు. ప్రాంతీయ పదాలు నెమ్మదిగా అర్థమవుతూ వచ్చాయి.

సర్మారు సంస్కృతికి రాయలసీమ సంస్కృతికి గల వైవిధ్యం నెమ్మదిగా తెలిసి వచ్చింది. ప్రతి మహిళ చిన్న పెద్ద అని తేడా లేకుండా “అన్నా! అని సంబోధించటం మనస్సులో పవిత్రభావం కలిగించేది. నిష్కల్మషంగా, సూటిగా కళ్లతో ఎదుటివారితో నిర్భయంగా మాట్లాడే రాయలసీమ మహిళల సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఎప్పుడు వెళ్ళినా భోజనం చేసి వెళ్ళన్నా! అనే మాటను ఎలా మరచి పోగలం?

ఒక రోజు హోటల్‌లో భోజనం చేసి బయటకి వస్తుండగా ఒక వ్యక్తి ఒక మహిళ జుట్టుపట్టుకొని వంచి కత్తితో పొడవటం చూశాను. అనూహ్య సంఘటనతో ఒక్క ఊపుతో ప్రక్క వీధికి పరుగులెత్తాను. రెండు రోజులు భయంతో వణికి జ్వరం తెచ్చుకున్నాను.

చెన్నారెడ్డి సార్‌ వచ్చి తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. రెండు రోజులు ఆయన ఇంటిలోనే ఉన్నాను. ఆయన భార్య ఈశ్వరమ్మ అక్క ఆదరణ మరువలేను. చెన్నారెడ్డి గారు మానవతావాది. కమ్యూనిస్టు సాహిత్యం వంటపట్టించుకున్న ప్రగతిశీలక భావాలున్నవారు. ఆ కుటుంబంతో సాన్నిహిత్యం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఆయన కొడుకు మదన్‌ నన్ను మామా అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు. ఆ పిలుపు అంతరంతరాలలో ఏదో పులికింత. మరో మిత్రుడు లెక్సరర్‌ బాలచంద్రారెడ్డి సౌమ్యుడు, సంసారి.

(ప్రేమే లయనిజం పరిభాషు (10౪6 19 12౧౮6౦౬86 ౦0 ఓ1[0౧19౧)) అని లయన్స్‌ గరవ్నర్‌ కృష్ణయ్య గారి ఆంగ్ల స్లోగన్‌కు తెలుగులో చెప్పి, చేతల ద్వారా నిరూపించిన ఘనత నాది. సహజంగా పిరికివాడిని అయిన నన్ను థైర్యవంతునిగా చేసింది ఈ (ప్రాంతమే,

(ప్రభుత్వ సామాజిక కార్యక్రమాల నిర్వహణలో తరిస్తున్న నాకు స్వంత బిడ్డలకు (ప్రేమ నందించటానికి తీరికలేదు. నా భార్యా బిడ్డలకు ఆ విషయంలో ఇప్పటికే

అలపర్తి పిచ్చయ్య చౌదరి +* ద్ర

అసంతృప్తే. కర్తవ్యం ముందు కుటుంబాన్ని పట్టించుకోలేదు. అన్ని బాధ్యతలు నా భార్య నిర్వహించి, నా బిడ్డలు స్థిరపడేలా తీర్చిద్దింది. నేను ఎంత చేసినా ఆమె సహకారం లేకపోతే ఇంత అనుభవంతో, ఇవన్నీ చెప్పటానికి సాహించేవాడిని కాదేమో. ఆమె కూడా లయనిజంలో సేవలందించారు. కడప మహిళా సమాజ కార్యదర్శిగా, ఆర్తి హోమ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, అనేక న్యాయ కమిటీలలో సభ్యురాలిగా నిజాయితీ, అంకితభావంతో సేవలందిస్తున్నారు. గుర్తింపు, ఆమె అండదండలే నాకు శ్రీరామ రక్ష

కడపలో వరదలు వచ్చినపుడు 15 లక్షల రూపాయలు విలువగల బియ్యం, దుప్పట్లు, వస్త్రాలు బాధితులకు ప్రయివేటు కళాశాలల యాజమాన్య సహకారంతో అందచేశాం. గుజరాత్‌ భూకంప బాధితులకు ఆ సంవత్సరం 2.5 లక్షల రూపాయలు ఇంటర్‌ విద్యా మండలి ద్వారా అందచేశాం. (ప్రొద్దుటూరు కుందూనది వరద బాధితుల, రిహెబిలిటేషన్‌ కార్యక్రమాలకు ఇంటర్‌ విద్య తరుపున జిల్లా కలెక్టర్‌ అధర్‌ సిన్హా గారికి 1 5 లక్షల రూపాయలు విరాళాలు సేకరించి ఇచ్చాం.

గుట్టక్రింద రాచపల్లి జూనియర్‌ కళాశాల ప్రిన్స్‌పాల్‌ బసిరెడ్డి, వీరపునాయునిపల్లి జూనియర్‌ కళాశాల ప్రిన్స్‌పాల్‌ ప్రభాకర్‌ రెడ్డి గత మూడు దశాబ్దాలుగా నన్ను వెన్నంటి ఉన్న ముఖ్య స్నేహితులు. నా బదిలీ విషయంలో బసిరెడ్డి స్వర్గీయ ఇంద్రారెడ్డి గారి ద్వారా అందించిన సహాయము మరువలేనిది.

కడప జిల్లాలో ఇంటర్‌ విద్యలో ప్రభుత్వ కళాశాలలలో ఎవ్వరూ సాధించలేని అరుదైన అవకాశాలు, గౌరవపురస్మారాలు నాకు లభించాయి. ఐదు సంవత్సరాలు కడప, అనంతపురం జిల్లాల ఇంటర్‌మీడియట్‌ విద్య పర్యవేక్షణాధికారి (ఆర్‌.ఐ.ఓ.)గా పనిచేశాను. రెండు సంవత్సరాలు ఇంటర్‌మీడియట్‌ బోర్డు, హైదరాబాద్‌లో జాయింట్‌ సెక్రటరీ, పరీక్షల విభాగంలో పనిచేశాను. ఇంటర్మీడియెట్‌ బోర్డు సభ్యునిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచేత నామినేట్‌ చేయబడి పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాను. 32 సంవత్సరాలు కడపలోనే నా ఉద్యోగ కాలం గడిచింది.

ఎందరో మహానుభావులు, దశాబ్దాలుగా వివిధ రంగాల ప్రముఖులతో సత్సంబంధాలున్నాయి. కవిపండితులు జానమద్ది హనుమచ్చాస్తి, శశిశ్రీ, డా మల్లెమాల, వెంకటపతిరెడ్డి, కట్టా నరసింహులుతో పరిచయ భాగ్యం. అనేక సాహిత్య త్రై] + కడస గడపలో జీవన మధురిమలు

సభలలో పాల్గొన్నాను, నిర్వహించాను. కబీర్‌ జాతీయ పురస్కార గ్రహీత, రాజరత్నం ఐజాక్‌ దంపతులు అంటే ప్రత్యేక అభిమానం. కడపలో రాజారత్నం ఐజాక్‌ అందిస్తున్న సేవలు సర్వదా ప్రశంశ నీయం. ప్రస్తుత శాసనమండలి సభ్యులు సుబ్బారెడ్డి దశాబ్దాలుగా పరిచయం ఉన్న ఉపాధ్యాయ మిత్రులు, నాయకులు నందలూరు ప్రిన్స్‌పాల్‌ శ్రీనివాసులు, రాజంపేటి' ప్రిన్స్‌పాల్‌ ప్రసాదరావు, అనంతపురం ప్రిన్సిపాల్‌ సుబ్బరామిరెడ్డి, డి.వి.ఇ.ఓ రామకృష్ణ ఆప్రమిత్రులు. సోదరి డా విమల, శాంతకుమారి వృత్తిరీత్యా పరిచయస్తులే కాక, కుటుంబ స్నేహితులుగా సన్నిహితులు. డా విమల లెక్సరర్‌గా రాణించడమే కాక ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచారు. శారీరక వైకల్యం ఉన్నప్పటికి మానసికంగా వైకల్యం లేని ఆమె తలంపు మనస్సుకు ఊరట కలిగిస్తుంది. ్రిన్స్‌పల్‌గా, లెక్సరర్‌గా శాంతకుమారి మేడం ఉద్యోగ నిర్వహణలో ఆమె అందించిన సహకారం మరువలేను మరో తెలుగు లెక్చరర్‌ శివతులశమ్మగారు “తమ్ముడూ అని ఆప్యాయంగా పిలిచేది.

1970-80 సంవత్సరాలలో గ్రామాలలో ఫ్యాక్షన్‌ గొడవలు ఎక్కువగా ఉందేవి. అయినా ఎవరూ ఉద్యోగుల జోలికి వచ్చేవారు కాదు. ఉపాధ్యాయులంటే అమితమైన గౌరవం. నేటికి కడపను సినిమాలలో భయంకరంగా చూపిస్తారు. బాంబులగడ్డగా అభివర్ణిస్తారు. ఈనాటి కడపను చూసిన వారు కడప గురించి తెలిసినవారు ఎవరూ ఆ విషయాన్ని అంగీకరించరు.

తెలుగుదేశం ప్రభుత్వపాలనలో గ్రామీణ ప్రాంతాలలో జన్మభూమి కార్యక్రమంతో సిమ్మెంటు రోద్డు, ష్తార్హశాల భవనాలు, జూనియర్‌, డిగీ కళాశాలలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, తెలుగు గంగ (ప్రాజెక్టు, నందలూరు ఆల్విన్‌ కర్మాగారం, అనేక సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధికి శ్రీకార చుట్టబడింది.

రాజశేఖర్‌ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, కాంగ్రెస్‌ ప్రభుత్వం రావటంతో జిల్లాకు మహర్దశ ప్రారంభమయింది. కడప, పులివెందుల (ప్రాంతాలలో అభివృద్ధి, గ్రేడ్‌-1 మునిసిపాలిటీలు, కడప పురపాలక సంస్థలు ఏర్పడ్డాయి. కడప చాలా ఏళ్లుగా వెనుకబడి ఉంది. గతంలో కడప అభివృద్ధికి రాజకీయాలతో ఒక విషయం ప్రతిబంధకంగా ఉండేదని నాకు తెలిసిన కొంతమంది ఐఏఎస్‌ అధికారులు అంటూంటే వినేవాడిని. కడపలో కొందరు రాజకీయనాయకులు తమకు జరగకపోయినా

అలపర్తి పిచ్చయ్య చౌదరి + ద్ర

పరవాలేదు. వారి శత్రువుకు సహాయం జరగకూడదని అద్దుపదేవారని, దానివలన అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడేవని అనేవారు. కానీ నేటి పరిస్థితి మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి కడప అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌, ట్రిపుల్‌ ఐ.టి. రాజీవ్‌ గాంధీ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (రిమ్స్‌) రెండువందల ఏఖై కోట్లతో భవనాలు, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, నిర్మాణంలో కలక్టరేట్‌ భవనాలు, యోగి వేమన యూనివర్సిటీ, కడప పురపాలక సంస్థ అనేక అభివృద్ధి పనులు, డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పడ్డాయి. వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో ఇడుపులపాయ టెక్నికల్‌ కారిడార్‌లు ఏర్పడబోతున్నాయి. రెండో సారి కూడా రాజశేఖర్‌ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటంతో జిల్లా వాసులు కడప అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోతుందని బలమైన అభిప్రాయంతో ఉన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తయి, బ్రహ్మసాగరంతో (బ్రహ్మంగారి మరం కళకళలాడుతున్నది. ఎయిర్‌పోర్టు విస్తరణ, ఉక్కు కర్మాగారాలు, మౌలిక సదుపాయాలు, విశాలమైన రోడ్లతో కడప ప్రగతి పధంలో ముందుకు దూసుకుపోతున్నది. 10వేల కోట్ల రూపాయలతో గండికోట అభివృద్ధి పనులతో టరిజం శాఖ చేపట్టనున్నది. రాయచోటి, రాజంపేట, బద్వేలు, కోడూరు మునిసిపాలిటీలకు కూడా నిధుల వరదతో ముంచెత్తనున్నారు. రాజకీయాలలో విఖేదాలున్నవారు సైతం రాజశేఖర్‌ రెడ్డి గారి చిత్తశుద్ధిని శంకించలేరు. ఎవరేమనుకున్నా తను అనుకున్నది చేయటంలో రాజీలేని వ్యక్తి అసాధారణ వ్యక్తి ఆయన. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే కడప వారి ప్రవృత్తి, నిర్భయంగా సాధ్యాసాధ్యాలను వివరిస్తే, వారు స్పందించే తీరు, అధికారులకు ఇబ్బందులుండవని అనుభవంతో నాకు తెలిసింది. జీవితమంతా మలుపులు, అనుకొని సంఘటనలతో ముందుకుసాగి పోతూ వచ్చింది. ఒక ఏప్రియల్‌ మొదటి తేది కామర్స్‌ క్లాస్‌లో ఎకనమిక్స్‌ పార్ట్‌ టైమ్‌ లెక్సరర్‌ భానుమతి పాఠం చెపుతుండగా, వప్రియల్‌ మొదటి తేదీని పురస్కరించుకొని చివరి బెంచిలోని విద్యార్థులు ఒకరిపై ఒకరు ఇంకుచల్లుకున్నారు. ఇంకు పొరబాటున లెక్సరరు చీర మీద పడింది. ఆ లెక్చరర్‌ స్టాఫ్‌ రూమ్‌కు వచ్చి ఆ విషయం చెప్పి రెప *కడప గడపలో జీవన మధురిమలు

బాధపడగా, ప్రిన్స్‌పాల్‌ వద్దకు ఆ ఇద్దరు విద్యార్థులను పిలిచి విచారిస్తుండగా, ఈలోగా తొందరపాటుతో ఆ విద్యార్థులను బోటనీ లెక్చరర్‌ షరీఫ్‌ తిట్టారు. ఆ రోజులలో విద్యార్ధి సంపూలు చురుకుగా వ్యవహరించేవి. డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు ఒకే క్యాంపస్‌లో ఉండేవి. ఇంటర్‌ పరీక్షలు కరినంగా నిర్వహించటంతో, డిగ్రీ చేరిన తరువాత విద్యార్థులు జూనియర్‌ కళాశాలలోని కొందరు లెక్బరర్లపై కోపం ఉండేది. ఏ సంఘటన జరిగినా ఆ నేపథ్యంలో గొడవలకు దిగేవారు. కొట్టిన, తిట్టిన లెక్బరర్‌ ముస్లిం అని, క్షణాలలో విద్యార్థులు హిందూ ముస్లిం ఫీలింగ్‌తో గుంపులు గుంపులుగా వచ్చి ప్రిన్స్‌పాల్‌ రూము వద్దకు వచ్చారు. రాళ్లవాన కురిపించారు. ఆ లెక్చరరును లంబర్‌ రూములో దాచాం. ఆ రాళ్ల దాడిలో అనుకోకుండా నేను తీవ్రంగా గాయపడ్డాను, నా తలకు కుట్లుపడ్డాయి. లోకల్‌ పోలీసులు వెంటనే స్పందించి విద్యార్థులపై కేసులు నమోదు చేసారు. ఆ కేసులు మూడు నాలుగు సంవత్సరాలు నడినాయి. ఈ లోగా రాజీ ఏర్పాట్లు జరిగాయి. చివరకు నేను దోషులను సరిగా గుర్తించలేకపోవటంతో, కేసు వీగిపోయింది. ఈ సంఘటనలో తోడుగా నిలిచినవారు తెలుగు లెక్చరర్‌ (ప్రభాకర్‌ రెడ్డి. నా రక్తంచిందిన ఆ కళాశాల ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే పట్టుదల, ఆకాంక్ష పెరిగింది. కళాశాలలో పారశాల సిబ్బందికి కళాశాల లెక్చరర్లకు చక్కని సమన్వయం కుదిరింది. కళాశాలకు సువిశాలమైన ఆటస్థలం ఉంది. అన్యాక్రాంతము కాకుండా కాంపొండువాల్‌ నిర్మాణంలో ప్రిన్స్‌పాల్‌కు సహకరించి, విరాళాల సేకరణలో తోడ్పడి రక్షణ గోడ నిర్మించాం. ఇప్పుడు ఆ గోడ శిధిలమై సమస్యలవలయంలో కళాశాల నడుస్తోంది. లయన్స్‌ క్లబ్‌ వేదికగా కళాశాల ప్రాంగణం ఉపయోగపడింది. ఆ రోజు నుండి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకొని సంవుసేవలో నిమగ్నమయ్యాను. నా పాతమిత్రుడు జి.ఎన్‌. రావు లెక్చరర్‌ పదవి వదలి గగ్రూప్‌- 1కు సెలక్టయి కడప ఆర్జీవోగా వచ్చారు. ఇందిరాగాంధీ పర్యటనను పురస్కరించుకొని కళాశాల ఆవరణలో పోడియం, టాయిలెట్లు, కొన్ని అభివృద్ధి పనులకు ఆర్టీవో శ్రీకారం చుట్టారు. రాయచోటి లయన్సు క్లబ్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. లయనిజంలో కొత్త చరిత్రకు నాంది పలికింది. తీరికలేని జీవితం అయింది. దేశవ్యాప్తంగా (ప్రాంతీయ అలపర్తి పిచ్చయ్య చౌదరి * ద్రెటీ

సమావేశాలు, సేవా కార్యక్రమాలు పెద్దవారితో పరిచయాలు పెరిగాయి. ఒక సంవత్సర కాలంలో 800పైగా సేవాకార్యక్రమాలు నిర్వహించాం. 20,000 బాలబాలికలకు (గ్రామీణ ప్రాంతాలను ఎన్నిక చేసుకొని పోలియో డి.పి.టి. వాక్సిన్‌లు, ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాలు నిర్వహించాం 1560 లాప్రోస్కోపిక్‌ ఆపరేషన్లు, 600 కంటి ఆపరేషన్లు, జంతు సంక్షేమ శిబిరాలు, వయోజన విద్యా కార్యక్రమాలు, పేదవిద్యార్థులకు ఆర్థిక సహాయం, జర్మనీ నుండి పాలపొడి, కార్టన్స్‌లో తెప్పించి గ్రామీణ ప్రాంతాలతో ఆరోగ్య శిబిరాలకు వచ్చిన పేదలకు పాలసరఫరా చేశాం.రాయచోటి డాక్టరు బయారెడ్డి, జనార్ధన్‌ రెడ్డి, పుల్లారెడ్డి ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారు. లయన్‌ సాయినాధ్‌ గుప్తా, శ్రీధర్‌, తులసీశ్వరరెడ్డి, లాయర్‌ శ్రీనివాసులురెడ్డి, రెడ్డెన్న కృష్ణయ్య స్వరూప గుప్తా, నరసింహులు గుప్తా, మల్లికార్డుస గుప్తా వంటి వార్లతో కలిసి చరిత్ర సృష్టించాం.

ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో ఒక సంవత్సర కాలంలో జయప్రదంగా నిర్వహించిన కార్యక్రమాలతో, అత్యుత్తమ లయన్స్‌ సేవాసంస్థగా రాయచోటి క్లబ్‌, ఎన్నిక్రెంది. ఉత్తమ కార్యదర్శిగా నేను ఎన్నిక కావటం, 30 రాష్ట్ర అవార్డులు అన్నీ మా క్లబ్‌ కైవసం చేసుకోవటం ఒక చరిత్ర. ఒక సాధారణ సామాన్య స్థాయిలోని గ్రామీణ క్లబ్‌ సేవా కార్యక్రమాలలో ఢిల్లీ మెట్రో పాలిటన్‌ క్లబ్‌ల స్థాయిలో పనిచేయటం ఒక రికార్డు. అ చరిత్రను తిరగ రాసిన దాఖలాలు లేవు. ఆంధ్ర, కర్ణాటకలలో ఏ (గ్రామీణ లయన్స్‌ క్లబ్‌ ఈనాటికీ ఆ స్థాయి అందుకోలే దనేది చారిత్రిక నిజం.

డా। బయారెడ్డి వదాన్యత, సేవాతత్పరత, నిరాడంబరత, పేదల సంక్షేమంపట్ల ఛద్ధతో లయనిజానికి ఊతంగా నిలబడ్డారు. నేను ఎడిటర్‌గా ప్రచురించిన లయన్స్‌ మాగజైన్‌ ఒక కొత్త ఒరవడిగా లయన్స్‌ కార్యక్రమాలలో నిలిచిపోయింది. ఆ కార్యక్రమాలలో నిర్విరామంగా కృషి చేసిననాకు నేటికి అంతరాష్ట్రీయ లయినిజంలో స్థాయి, గుర్తింపు ఉంది. డా; బయారెడ్డి, డా సంగమ్మ దంపతులు సాయిభక్తులుగా, లయన్స్‌ సేవలను కొనసాగిస్తు పేదల దాక్టర్లుగా మన్ననలు పొందుతున్నారు. రాయచోటి లయన్స్‌ క్లబ్‌ శాశ్వత కంటి ఆసుపత్రి భవనాలు నిర్మించుకొని, శస్రచికిత్సలతో, సేవా కార్యక్రమాలతో యువనాయత్వంలో ముందుకు పోతూ ఉండటం నాలాంటి వారికి వాస్తవంగా ఆనందం కలిగించే విషయమే.

ఫి భి

త్రైద్‌ + కడప గడపలో జీవన మధురిమలు

నందలూరు జూనియర్‌ కళాశాల ప్రిన్స్‌పాల్‌ పదవీ బాధ్యతలు తీసుకున్ననాటి నుండి జీవిత గమ్యమే మారింది. నాకు వ్యక్తిగతంగా అదృష్టాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా జరగటంలో, జీవితంలో అనేక మలుపులకు నందలూరు కేంద్రమైంది. కళాశాల పరిస్థితి ఆశించినంత అనుకూలంగా లేదు. ప్రిన్సిపాల్‌ కుమారస్వామి గారు నాకు అత్యంత సన్నిహితులు. ఆయన వద్ద 6 నెలలు లెక్పరరుగా పనిచేశాను. ప్రిన్స్‌పాల్‌గా ఆయన బదిలీపై వెళ్ళగా, ఆయన స్థానంలో అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌ అయ్యాను. కళాశాల ఫలితాలు '0' శాతం. పాఠశాల, కళాశాల జిల్లా పరిషత్‌ భవనాలలో షిస్ట్‌లో జరిగేవి. ఇప్పటికి అదే పరిస్థితి. ఆ స్కూలుకు జిల్లాలో ఏ పాఠశాలకు లేని ప్రత్యేకత ఉంది. ఆ స్కూల్లో చదివిన 7మంది విద్యార్థులు ఐ.ఏ.ఎస్‌.లు అయ్యారు. అటువంటి రికార్డు బహుశా రాష్ట్రంలో ఏ పారశాలకూ లేదు. ఏవిఎస్‌ రెడ్డి, ఉమాపతి, శర్మ వంటి వాళ్లు ఆ పాఠశాల విద్యార్థులే. అటువంటి స్కూల్‌లో నిర్వహింపబడే కళాశాలకు ప్రిన్స్‌పాల్‌గా పనిచేయడం నాకు గర్వకారణమే. కళాశాలలో ఆఫీసు సిబ్బందికి పూర్వ ప్రిన్స్‌పాల్‌కు అభిప్రాయ బేధాలుండేవి. పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. కళాశాల ఫలితాలు గణనీయంగా తగ్గటతో ఉన్నతాధికారుల తనిఖీలు, సంజాయిషీలు ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడింది. అసలే ఫలితాలు తక్కువ, పరీక్షలలో కరినంగా వ్యవహరిస్తున్నానని నాపై ఆరోపణ, స్థానిక రాజకీయ నాయకుల నుండి ఈ విషయమై వత్తిడి ఎక్కువయింది. నేను ఎవరిని లక్ష్యపెట్టలేదు. నేను అనుకున్న విధానంలో, ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాను. క్రమబద్ధంగా, ఫలితాలు 45% వరకూ పెంచగలిగాను. లెక్సరర్లను సమన్వయపరచి పారాలు సక్రమ బోధనకు శ్రీకారం చుట్టాను. వ్యక్తిగతంగా వైభవంగా పదవులు నిర్వహించిన అదృష్టం నందలూరు జూనియర్‌ కళాశాల నాకు కల్పించింది. జిల్లా సెలక్షన్‌ కమిటీకి శాశ్వత సభ్యులు హోదాలో ఆ కళాశాల ప్రిన్స్‌పాల్‌గా సంవత్సరాలు తరబడి నిర్వహించాను. జిల్లాలో డిగ్రీ, జూనియర్‌ కళాశాల నాన్‌ టీచింగ్‌ ప్రమోషన్లు, అపాయింట్‌మెంట్లతో విసృత ప్రాతిపదికన ఆ కమిటీకి అధికారాలు ఉండేవి, నాదే నిర్ణయాత్మక పాత్ర. దానితో కొన్ని వందలమందికి ప్రమోషన్లు, అపాయింట్‌మెంట్లలో కీలకపాత్ర వహించాను. అలపర్తి పిచ్చయ్య చౌదరి * ద్రెద్రీ

'అక్షరరళ్శి' ఉద్యమానికి జిల్లాలో మొట్టమొదటి ర్యాలి నిర్వహించి జిల్లా కలెక్టరు ఎ.కె. ఫరీదా నుంచి గుర్తింపు పొందాను. నందలూరుకు కలెక్టరు, ఎస్పీ కె.వి. రెడ్డి, జాయింట్‌ కలెక్టరు ఉమామల్లేశ్వరరావులతో ఉన్న వ్యక్తిగత పరిచయంతో పలుమార్లు అనేక కార్యక్రమాలలో వారిని భాగస్వాములను చేసి నందలూరుకు గౌరవం పెంచడంలో నా వంతు పాత్ర నిర్వహించాను. జిల్లాలో ప్రాముఖ్యంలోకి తేవటానికి కృషి చేశాను. అబ్బిగారి రాజేంద్రప్రసాద్‌ ఉపాధ్యాయుడుగా, మి(త్రుడుగా ఉద్యమవ్యాప్తిలో అండదండలిచ్చారు.

“అక్షరరశ్ళ్శి' పత్రికకు ఎడిటర్‌గా పనిచేశాను. జిల్లా కలెక్టరుతో కలిసి (గ్రామగ్రామాలలో పర్యటించాను. అనేక సాంస్కృతిక, సేవాకార్యక్రమాలలో పాల్గొన్నాను. షిఫ్ట్‌ పద్ధతిలో కళాశాల నడవటంతో నాకు ఇతర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశం లభించింది.

ఆ కళాశాలకు స్థల సేకరణ నేను వచ్చేనాటికే పూర్తి అవటంతో నిధుల కోసం ప్రయత్నం చేశాను. బహుదా నదీతీరంలో పవిత్ర సౌమ్యనాథ స్వామి దేవాలయానికి దగ్గరగా ఉన్న మహా వీర్‌ జైన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాననే కొరత నాకు ఇప్పటికి ఉంది. నేను పనిచేసిన అన్ని కళాశాలలు, అద్మిని(ప్టేటర్‌గా అద్భుత ప్రతిభా పాఠవాలను చూపి అభివృద్ధిలో ముందుకు తీసుకువెళితే నాకు, నందలూరులో పరిమిత ఒనరులతో, లెక్సరర్ల బోధనతో కొరత లేక పోయినా, ఆశించిన ఫలితాలు రాబట్టలేక పోయాను. అక్కడ అనేక సంవత్సరాలు పనిచేసినా దాదాపు 5 సంవత్సరాలు కడప, అనంతపూర్‌ జిల్లాల పర్యవేక్షణాధికారిగా నియమించబడటంవలన, నా పదవీకాల సమయంలో ఆ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్స్‌పాల్‌ నిర్వహణలోనే కొనసాగింది. ఇన్‌ఛార్జి ప్రిన్స్‌పాల్‌, సిబ్బంది, లెక్చరర్లు ఏ సమస్యలు లేకుండా కళాశాలను నిర్వహించారు. కడప నుండి పర్యవేక్షణ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా కళాశాల స్థాయి తగ్గకుండా నిర్వహించారు. హైస్కూలు సిబ్బందికి, కళాశాల సిబ్బందికి ఏ విధమైన విబేధాల్లేకుండా చాకచక్యంగా కార్యక్రమాలు నిర్వహించగలిగేలా కృషి చేశాను

అక్కడ ఉన్న ఆఫీసు సిబ్బందికి నా జిల్లా స్థాయి హోదాలో కడప కేంద్ర కార్యాలయాలలో స్టానం కల్పించి, వారి ఎదుగుదలకు తోద్బడ్డాయి. అటెండర్‌ ఏ్రై/ + కడప గడపలో జీవన మధురిమలు

రమణ అంటే ఎంతో ఇష్టం. వాడి అమాయకత్వం నన్ను కట్టి పడేసేది. బస్‌స్టాండ్‌లో రేగికాయలు కొనుక్కొని, ప్రిన్స్‌పాల్‌ హోదాను కూడా మరచి వాడు అమాయకంగా నాకిచ్చిన పళ్లుతినేవాడిని. అది ఒక మధురమే. జాతీయ సేవాపథక కార్యక్రమాలు, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు, మీడియావారితో సహకారం, నా స్థాయిని పెంచటానికి తోడ్బడ్డాను. కలెక్టరు ఫరిధాగారు నేను లేకుండా రాజంపేటలో 'అక్షరరశ్శి సమావేశాలు నిర్వహించేవారు కాదు. అసూయతో కొందరు స్థానిక శాసన సభ్యునికి నా పై ఫిర్యాదులు చేశారు. స్థానిక శాసన సభ్యులు సంవత్సరమధ్యలోనే నన్ను అడ్మినిప్టేటివ్‌ బదిలీ చేయించారు. అనంతపురం కణేకల్‌ జూనియర్‌ కళాశాల ్రిన్స్‌పాల్‌గా బదిలీ జరిగింది. కష్టపడి పనిచేస్తున్నప్పుడు రాజకీయ బదిలీకి మనస్సు అంగీకరించలేదు. డిప్యూటి సెక్రటరీ అంబరీష్‌ గారిని కలిశాను. ఇంటర్‌ బోర్డు డైరెక్టర్‌, కార్యదర్శి నటీశన్‌ గారిని పిలిచి బదిలీకి గల కారణాలు ఆయన తెలుసుకున్నారు. శాసన సభ్యుని లేఖ మీద ఎలా బదిలీ చేస్తారు, విచారణ జరిపి ఆ బదిలీ చేసి ఉంటే బాగుండేది కదా అని అన్నారు. బదిలీ తాత్మాలికంగా నిలిచిపోయింది. శాసన సభ్యునికి, నాపై అభాందాలు మోపిన వారికి నా బదిలీ నిలుపుదల అర్ధంకాక, మరల శాసన సభ్యుని ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. నేను 4 నెలలు నందలూరులో కొనసాగి, పరిక్షలు నిర్వహించి సెలవలు వరకూ ఉండి, రాయచోటి ప్రిన్స్‌పాల్‌గా బదిలీ చేయించుకున్నాను. ఐ.ఎ.ఎస్‌. అధికారుల ద్వారా రాజకీయాలను ఎదుర్కున్నాను. మైన్‌ ఓనర్‌ పసుపులేటి బ్రహ్మయ్య గారిని రాజేంద్రప్రసాద్‌ పరిచయం చేశారు. అసాధారణంగా 7ఓట్ల మెజారిటీతో రాష్ట్ర ప్రిన్సిపాళ్లు సంఘం సహ అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. కడపలో మేం నిర్వహించిన రెండు రోజుల ప్రిన్స్‌పాల్స్‌ సదస్సు ఎంతో పేరు తెచ్చింది. వందలాది పిన్స్‌పాల్స్‌, ఏడుగురు శాసనసభ్యులు, కలెక్టరు, రాష్ట్ర స్థాయి విద్యావేత్తలు, సంఘ నాయకులతో అపూర్వంగా ట్రిన్స్‌పాల్స్‌ ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించాం. (బ్రహ్మయ్య ఆ కార్యక్రమ నిర్వహణా భారం భరించారు. ఆయన వెలుగులోకి వచ్చారు. ఆయన ద్వారా ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు రాజంపేట ప్రాంతంలో నిర్వహించాం. అలపర్తి పిచ్చయ్య చౌదరి + త్రైత

ఏ హోదాలో పనిచేసినా విద్యుక్తధర్శ్మం మరువలేదు. పదవులకు నా కృషి, శక్తి సామర్థ్యాల ద్వారా గౌరవం వచ్చింది కాని, పదవుల ద్వాఠా నాకు గుర్తింపు రాలేదు. అటువంటి నాకు, నా సేవలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారుల నివేదిక ద్వారా చిన్న తప్పుకు ఒక ఉన్నతాధికారి పెద్ద దండన విధించారు. ఆత్మాభిమానాన్ని ఏనాడు చంపుకోలేదు. మనన్సుకు బాధ కలిగించింది. విద్యాశాఖామంత్రి రామచంద్రరావుగారి వద్దకు వెళ్లాను. ఉపాధ్యాయ నాయకుడుగా, బోర్డు సభ్యులుగా ఆయనకు కడపలో నా కృషి తెలుసు.

వ్యక్తిగతంగా కలిసి నా పై డైరెక్టరు విధించిన క్రమశిక్షణా చర్యలు వివరించాను. ఆ అర్జర్‌పై విద్యాశాఖామంత్రి తనకున్న అసాధారణ, విచక్షణాధికారులను వినియోగించుకొని స్టే విధించి (ప్రభుత్వానికి పంపారు. అది అనాటి మంత్రుల స్థాయి, విషయ పరిజ్ఞానం.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ట్రిన్స్‌పాల్‌గా ఉన్న నన్ను గాలివీడు ప్రైవేటు జూనియర్‌ కళాశాల పరీక్షలకు సూపరిటెండెంటుగా వేయటం, వైద్య కారణాలతో నేను వెళ్ల లేకపోవటం, దానిపై సంవత్సరాల తరబడి విచారణలు, రెండు ఇంక్రిమెంట్లు క్యుములేటివ్‌గా రద్దు చేయటం, ఛార్జస్‌ (ఫేమ్‌ చేసి దండన విధించిన ఆ అధికారి చిన్న తప్పులకు సైతం పెద్ద దండన విధించేవారు. ఎన్నో విచారణలు, చివరకు నిర్ణోషిగా బయట పడ్డాను. పోరాటం, (ప్రేమ, పట్టుదలను, రాయలసీమ నేర్పింది.

నేను లెక్చరర్‌గా పనిచేసేటప్పుడే అడ్మినిప్టేషన్‌లో ప్రిన్స్‌పాళ్ల నిర్వహణా సామర్ధ్యాన్ని గమనించేవాడిని. రామిరెడ్డి గారి నుండి అద్మినిప్టేషన్‌ పుల్లయ్య సార్‌ గారి నుండి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. కేశవులు నాయుడు గారి నుండి ఉపన్యాస సరళి, చెంగయ్యనాయుడు గారి నుండి ఆత్మీయత మానవీయత, శ్రీనివాసులు రెడ్డి గారి నుండి లౌక్యం, తెలుసుకున్నాను.

జిల్లా జూనియర్‌ లెక్చరర్ల సంఘ నాయకుడుగా, రాష్ట్ర ప్రిన్స్‌పాల్స్‌ సంఘ సహ అధ్యక్షులుగా పని చేశాను. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో కలిసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాను జూనియర్‌ లెక్చరర్ల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశాము. ప్రిన్స్‌పాల్స్‌ సంఫఘునాయకుడుగా విద్యా సదస్సులు నిర్వహించాను ప్రిన్స్‌పాళ్ల పదోన్నతులు, బోర్డు వికేంద్రీకరణలో సహాయపడ్డాను ఏ౪) + కడప గడపలో జీవన మధురిమలు

జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో జిల్లాలో జూనియర్‌ లెక్చరర్లను ప్రాతినిధ్యం వహించేవాడిని. ఉద్యోగ సంఘాలతో కలసి ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలు నడిపాను. ఎస్టీయు ఎన్నికలలో ఒకసారి పెద్ద ఆక్సిడెంట్‌కు గురియై, క్షణంలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాం. అప్పటి ఎమ్మెల్సీలు విజయ రామరాజు భుజంగరావు, ప్రస్తుత ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి గార్లతో సాన్నిహిత్యం ఉంది. శి టి ట్టి 984 నుండి నా దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. జిల్లా అభివృద్ధికి నావంతు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అంచలంచలుగా ఎదిగాను. ఎదిగిన కొద్ది ఒదిగి రాష్ట్ర వ్యాప్తంగా అందరివాడిగా మన్ననలు పొందాను. రాయచోటి కళాశాలలో చేరిన కొత్త రోజులలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాలకొండ్రాయుడుగారు ఓట్లు అడగడానికి, కళాశాల సిబ్బందిని పలుకరిస్తూ, జువాలజీ ప్రయోగశాల వద్దకు వచ్చారు. మందీమార్చలంతో వచ్చిన ఆయనకు నన్ను పరిచయం చేశారు. నిర్భయంగా నేను మీకు ఓటు వేయను, నేను ఇందిరమ్మ అభిమానిని అని అందరి సమక్షంలో అన్నాను. అది రాయచోటిలో సంచలనం సృష్టించింది. సర్కారు నుండి వచ్చినవాడికి ఇంత ధైర్యమా అన్నారు. ఎమ్మెల్యే హబీబుల్లా గారితో మంచి స్నేహం ఉండేది. బంధువు, పేదల మనిషి రెడ్జయ్య నాయుడు, కాలువ రెడ్దెన్న వంటి వారితో సత్సంబంధాలు ఆ రోజులలో చాలామందికి ఇష్టం ఉండేది కాదు. ఉర్జూ మున్సీలు (టీచర్లు) సహాయంతో 1971-72లో నేను నిర్వహించిన బిర్యాని విందు ఈనాటికి ఆనాటి మిత్రులు మరచి పోలేరు. హబీబుల్లా గౌరవార్థం ఒక లెక్చరర్‌ ఇచ్చిన వీందు గ్రామంలో సంచలనం సృష్టించింది. దీనితో నా ప్రాముఖ్యత పెరిగింది. సర్వీస్‌ కమిషన్‌ మాజీ సభ్యులు, రాష్ట్ర ఎన్‌.జి.వో నాయకులు వెంకటరెడ్డిగారు మా ప్రక్క ఇంటిలో ఉండేవారు. వారితో నాలుగు దశాబ్దాల పరిచయం ఉంది. నా సహచరుడు జెలుగు లెక్చరర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆయన మంచి స్నేజాతులు. వీరిద్దరూ పాలకొండ్రాయుడుతో చాల సన్నిహితంగా ఉండేవారు. వారి కారణంగా పాలకొంద్రాయుడుతో సన్నిహితమయ్యాను. రాజకీయాలలో ఎవరూ అలపర్తి పిచ్చయ్య చౌదరి * 40

ఊహించని, సాధ్యపడని సహాయాలు ఉన్నతాధికారులలో నాకున్న పరిచయాలతో ఆయనకు అందించాను. కానీ ఏనాడు ఆయన పదవి ద్వారా, వ్యక్తిగతంగా గాని ఏ సహాయం అందుకోలేదు. ఆయన కుమారుడు బాలసుబ్రమణ్యం ఉన్నత విద్యావంతుడు, సంస్కారి.నేనంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. పాలకాండ్రాయుడుతో పరిచయంతో గ్రామంలో గుర్తింపు పెరిగింది. ఇప్పటికి ఆయనకు నేనంటే అభిమానమే. నేనే ఆయనకు దూరంగా జరిగిపోయాను.

ఒక వంక కళాశాలలో పాఠాలు బోధన, లయనిజంలో ముందుకు పోతున్నాను. కళాశాల షిస్ట్‌ పద్దతిలో పనిచేయటంతో లయన్స్‌ క్లబ్‌ నిర్వహణకు తీరిక దొరికేది. లెక్బరర్‌గా మంచి పేరు ఉండేది. పెద్దవారితో సన్నిహిత సంబధాలుందేవి కానీ, రాజకీయాలలో జోక్యం చేసుకునే వాడిని కాదు. ఆ తీరిక ఉండేది కాదు.

సేవారంగం, బోధనారంగంలలో చురుకుగా పాల్గొనేవాన్ని వంద శాతం ఫలితాలు జంతుశాస్త్ర బోధనలో 14 సంవత్సరాలు వరుసగా సాధించాను. అది ఆ కళాశాలలో ఇప్పటికి రికార్డు. బోధన, సేవారంగాలలో కృషికి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు, రజత పతకం, క్యాష్‌ బహుమతి లభించింది (1989).

రాయచోటి నుండి బదిలీ అయి కడప ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు లెక్చరర్‌గా చేరాను. ఇంగ్లీష్స్‌ తెలుగు మీడియంలలో జంతుశాస్త్ర బోధనలో ఉత్తమ అధ్యాపకుడుగా అనతి కాలంలో గుర్తింపు పొందాను.

ఆర్‌.ఐ.ఓ.గా ఉన్న గురివిరెడ్డి గారు మంచి అడ్మినిష్టేటరు, స్నేహశీలి. నేను అమితంగా గౌరవించే ఉన్నతాధికారి. ఆయన డిప్యుటేషన్‌ కొనసాగింపు, నా పదోన్నతి ప్రయత్నాలకు హైదరాబాద్‌ సెక్రటేరియట్‌కు వెళ్లాం. అక్కడ కనపడిన నా శిష్యుడు ఆదినారాయణరెడ్డి రాయచోటి ఎమ్మెల్యే నారాయణరెడ్డిని పరిచయం చేశాడు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మమ్మల్ని విద్యాశాఖామంత్రీ పాటి రాజంగారి వద్దకు తీసుకు వెళ్లారు. గురివిరెడ్డి గారి పదవీ కాలం పొడిగింపునకు మంత్రి సుముఖత చూపలేదు. నారాయణరెడ్డి పట్టు వదలలేదు.

కడపజిల్లాలో కొందరి రాజకీయాలను దశాబ్దాలుగా నిశితంగా పరిశీలిస్తున్నాను. తాము చేపట్టిన పని జరగకపోతే సహించలేరు. రాజశేఖర్‌ రెడ్డి ఎం.పి. (ప్రస్తుత ముఖ్యమంత్రి) ద్వారా నారాయణరెడ్డి నన్ను నందలూరు ప్రిన్స్‌పాల్‌గా, ఆర్‌.ఐ వో లీ] + కడప గడపలో జీవన మధురిమలు

గురివిరెడ్డి కొనసాగింపు సాధించారు. నాటి నుండి నేటి వరకు నిరాటంకంగా నారాయణరెడ్డితో స్నేహం కొనసాగుతోంది. ళీ పా లా కడపలో నాఅనుబంధాన్ని అన్ని కోణాలలో స్పృశించటానికి ప్రయత్సిస్తున్నాను. నా మధురిమలలో వివాహ బంధం కడప నాకందించిన అపురూప కానుక. వివాహబంధం భార్యాభర్తల జీవన పంథాను నిర్దేశిస్తుంది. రాయచోటిలో పనిచేసే టప్పుడు మా మామగారు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉండేవారు. స్థానిక పెద్దలు రెడ్డెయ్య నాయుడు గారు, గడికోట శ్రీరాములురెడ్డి, సరసబల్లి వెంకటసుబ్బారెడ్డి గారు మా మామగారికి సన్నిహితులు, మిత్రులు, వారి ప్రేరణతో జూనియర్‌ లెక్చరర్‌గా ఉన్న నన్ను పరిచయం చేశారు. ఆయనకు నచ్చటంతో ఏమీ అలోచించకుండా వివాహానికి అంగీకరించారు.నా మిత్రులు వీరబల్లి ప్రభాకర్‌రెడ్డి, సహలెక్సరర్లు చెన్నారెడ్డి, ప్రభాకరరెడ్డి ఈ వివాహబంధానికి కారకులయ్యారు. స్నేహానుబంధమే ఈ బంధానికి తోడ్పాటు నిచ్చింది. సహనం, సంస్కారం, ఆత్మాభిమానం మూర్తీభవించిన నా భార్య దుర్గాకుమారి జీవన సహచరిగా ముష్పయిపడేళ్లుగా నా కుటుంబానికీ, నాకూ సేవలందిస్తూనే ఉంది. ఆమె అక్క అర్ధాంతరంగా చనిపోయినా, వారి పిల్లల వివాహ బాధ్యతలు, నా బిడ్డల బాధ్యతలు, సామాజిక సేవ అనేక రంగాలలో విశిష్ట సేవలందిస్తూనే ఉంది, కష్టకాలంలో అండగా మృత్యుముఖంలోకి వెళ్ళినా రెండు సార్లు ఆమె అందించిన తోడ్చాటు జీవన సహచరి అనే పదానికి కొత్త భాష్యం చెప్పింది. వివాహం అనంతరం పిల్లల చదువులు చూసుకోవటమే కాక, ఇరవై ఏళ్ల తరువాత నిలిచిపోయిన చదువును ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసి, లా కోర్సును పూర్తి చేసి బార్‌ కౌన్సిల్‌ సభ్యురాలయ్యారు. కడప వినియోగదారుల ఫోరమ్‌ సభ్యురాలిగా ప్రభుత్వంచే నామినేట్‌ కాబడి పదిసంవత్సరాలు కడప వినియోగదారుల ఫోరమ్‌ సభ్యురాలిగా సేవలందించారు. టెలికం, (గ్రామీణ బ్యాంకులలో మహిళా ఉద్యోగులపై అట్రాసిటీస్‌పై విచారణ సంఘసభ్యురాలిగా నియమితులై సేవలందింస్తున్నారు. అలపర్తి పిచ్చయ్య చౌదరి శా లీల

ఆర్తి హోమ్‌, విజయ ఫౌండేషన్‌ ట్రస్టు ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా అనాథల, మహిళలల సంక్షేమం, విద్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలకు తోడ్చాటు ఇవ్వటమేకాక అనేక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటుంది. కుటుంబ బాధ్యతలు, సామాజిక సేవలను కొనసాగిస్తూ నాకు పదవీ విరమణ అనంతరం జీవితం ఆనందమయంగా కొనసాగటానికి ఆమె అందిస్తున్న సహకారం, సాంస్కృతిక, సేవారంగాలలో పనిచేయాలనే నా ఆసక్తికి శక్తినిచ్చి బలం చేకూరుస్తున్నారు.

కుమారుడు విజయకృష్ణ మైక్రోసాఫ్ట్‌లో సీనియర్‌ మేనేజరుగా సియోటల్‌, అమెరికాలో పనిచేస్తున్నాడు. కుమార్తె శిరీష, అల్లుడు రావిపాటి రఘు సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా డిట్రాయిటోలో ఉన్నారు. మరో కుమార్తె భారతి, విజయవాడలో తన కుటుంబంతో స్థిరపడింది.

ఉద్యోగబాధ్యతలు నిర్వహించే కాలంలోనే పిల్లలకు పెళ్లిళ్లై, జీవితంలో స్థిరపడ్డారు. నేను ఉద్యోగ విరమణ చేసి అప్పుడే నాలుగేళ్లయింది. నా శక్తి సామర్థ్యాలతో, ఉత్సాహంతో కొత్త రంగాలలో (ప్రవేశించాలని కోరుకుంటున్నాను. అందుకు బిడ్డలు అంగీకరించడం లేదు. విశ్రాంత జీవనాన్ని విశాంతమయంగా, అరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో గడపాలని అనిపిస్తోంది. ఉద్యోగబాధ్యతలతో ఆ పిల్లలపై శద్ద చూపలేకపోయాను. మనవరాలు సమన్వి, మనవడు ప్రణవ్‌ అంటే ప్రాణం. బహుశా వయస్సువల్ల నాలో వచ్చిన మార్చుగా భావిస్తాను. భగవంతుడు సుఖమయ జీవితాన్ని ప్రసాదించాడు. జీవితం తాలిదశలలో సమస్యలు, బాధలు తప్పకపోయినప్పటికీ మలిదశ ఆనందంగానే ఉంది. ఆర్థిక సమస్యలు లేవు. కుటుంబ సమస్యలు లేవు. ఇంతకంటే కావల్సిందేముంది అంటున్నారు మిత్రులు.

భార్యాబిడ్డల (ప్రేమానురాగాలు పొందడం పెద్ద అదృష్టంగా భావిస్తాను. జీవన సంధ్యలో తోడుగా ఉండే సహచరిగా నా పట్ల ఆమె చూపే శ్రద్దా, ప్రేమ, కుటుంబంపట్ల నా బాధ్యతలు గుర్తు చేస్తుంటాయి. నా చిన్న తమ్ముడు చంద్రమోహన్‌ అంటే ఇష్టం. తమ్ముళ్లు అప్పుడప్పుడు యోగక్షేమాలు అడుగుతుంటారు. రాయలసీమ వదిలి రమ్మంటారు. వారికి, నాకు కడపతో ఉన్న అనుబంధం పూర్తిగా తెలియదు. వారు రమ్మన్నా కడప వదలలేకపోతున్నాను. టర + కడప గడపలో జీవన మధురిమలు

వివాహ బంధం నన్ను కడపలో స్థిరపడేలా చేసింది. మా మామగారు మదనపల్లెకు చెందినవారు కాబట్టి నా తోడల్లుళ్లు చాలామంది ఈ ప్రాంతం వారవటం, అంతకంటే దశాబ్దాల జనజీవితంలో నా అనుబంధంతో కడపలో కొనసాగుతున్నాను. అందుకు కడప అంటే దశాబ్దాల జీవితానికి గమ్యం చూపించిన భాగ్యరేఖగా భావిస్తాను. శి చా ల లెక్సరర్‌గా, జిల్లా అధికారిగా కడప జిల్లాలో అనేక సందర్భాలలో సార్వత్రిక ఎన్నికలలో అధికారిగా బాధ్యతలు నిర్వహించాను. ఆ అనుభవాలు పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు రాయచోటి జూనియర్‌ కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు ఎలక్షన్‌ నిర్వహించాల్సిన ప్రిసైడింగ్‌ అధికారిగా నియామక పత్రాలు వచ్చాయి. ఎలక్షన్‌ తరగతులకు హాజరయ్యాను. రాయచోటిలో చేరిన కొద్ది సంవత్సరాలలోని ఈ ప్రక్రియలో పాల్గొానవలసి వచ్చింది. చిన్నమండెం దగ్గర ఒక గ్రామంలో మహిళల బూత్‌కు నన్ను, మా కళాశాలలో మరో అధ్యాపకునికి పురుషుల బూత్‌=కేటాయించారు. ఎన్నికల సరంజామా భద్రం చేసుకొని, ఎలక్షన్‌ విధానం ప్రకార సిద్ధమయ్యాం. పురుషుల బూత్‌లో పోలింగ్‌ వేగం అందుకుంది. మా బూత్‌లో పోలింగ్‌ మందకొడిగా జరుగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంటకు పురుషుల బూత్‌లో పోలింగ్‌ పూర్తయింది. పక్క ఊరు నుండి నెమ్మదిగా వస్తున్న మహిళలను మా బూత్‌ దగ్గర స్థానికులు దాడులతో, రాళ్ల వాన కురిపించారు. మా బూత్‌లో పోలింగ్‌ ఆపి వేసి, తలుపులు మూసుకున్నాం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, ఉన్న ఒక్కపోలీసు జవానును మొబైల్‌ పోలీసు వ్యానుకు సమాచారం అందించటానికి పంపి వేశాం. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించే సమయంలో మొబైలు స్క్వాడ్‌ వచ్చి, గుంపులను చెదరగొట్టారు. బూత్‌ వాకిలి దగ్గరే ఇద్దరు, ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక గంటపాటు పోలింగ్‌ ఆపివేసి, పోలీస్‌ సహాయంతో పోలింగ్‌ యధావిధిగా కొనసాగించాం. ఈలోగా గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వారిని పరామర్శించడానికి స్థానిక బి.జె.పి. నాయకుడు, మందులషాపు యజమాని, కృష్ణారెడ్డి వెళ్లగా, ఆయనను దుండగులు కత్తితో పొడిచి, హత్యాప్రయత్నం చేశారు. ఆ సంవత్సరంలో నేను అలపర్తి పిచ్చయ్య చౌదరి ఈ పీలే,

ఉన్న పోలింగ్‌ బూత్‌లో తప్ప కదపలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలీస్‌ అధికారులు కళాశాలకు విచారణకు వచ్చారు. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. సర్మార్‌ ప్రాంతంలో మా గ్రామంలో పోలింగ్‌ విధానం చూసి ఉండటంతో ఇక్కడ ఇలా జరగటం నాపై కొంత కాలం తీవ్ర ప్రభావం చూపింది.

కడపలో ఎన్నికల బాధ్యతలంటే భయం వేసేది. అధికారులు ఎంతో అండదండలిచ్చినా, పరిస్థితులలో మార్పు వచ్చినా గత అనుభవాల ద్వారా ఉద్యోగులకు ఎన్నికల ప్రక్రియ అంటే భయం. దానితో చాలాకాలం ఎన్నికల విధులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించేవాడిని. స్మెలిటల్‌ స్టాఫ్‌ పేరుతో ప్రిన్స్‌పాల్‌ సహాయంతో మినహాయింపు పొందేవాడిని. కొన్నిసార్లు రిజర్వ్‌స్టాఫ్‌లో ఉండేవాడిని. ఎగ్జిక్యూటివ్‌ పదవులలోనికి వచ్చిన తరువాత ఆర్‌ఐఓగా, జిల్లా కలెక్టరు అధర్‌సిన్హాగారు బద్వేలు జోనల్‌ ఆఫీసర్‌గా ఎన్నికలలో నియమించారు. వాహనం, రిజర్వ్‌ కానిస్టేబుల్స్‌ ఎస్కార్టు, వైర్‌లెస్‌ సదుపాయం, బద్వేలు సమీపంలో రిగ్గింగ్‌ కోసం అనంతపురం నుండి సూరీడు అనే రాజకీయ నాయకుడు వస్తున్నారని అభియోగం. వెంటనే అక్కడు వెళ్ళి పరిస్థితిని గమనించాలని జిల్లా కలెక్టరు ఆదేశాలు.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి. కొన్ని సమయాలలో లౌక్యం కూడ అవసరం. ఎలక్షన్‌ ప్రిసైడింగ్‌ అధికారితో మాట్లాడాను. సూరీడు గారు జనంతో ఎదురయ్యారు. స్థానికులు కాని వారు ఊరులో ప్రవేశించారని స్థానికుల ఆందోళన. ఆ గుంపుల మధ్య నేను, నా జీపు, తీరా చూస్తే సూరీడు గారు. నాకు తెలిసనవారే తిమ్మసముద్రంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు నేను వెళ్ళటం, నిజాయితీగా నేను వ్యవహరించటం, ఆయనకు నచ్చి ఆయనతో స్నేహితం ఉండటంతో, కలిసివచ్చింది. ఆయనతో కాసేపు మాట్లాడి, ఆందోళనకు అవకాశం లేకుండా, స్థానికులతో మాట్లాడి ఆయనను దూరంగా ఉన్న ఇంటికి తీసుకువెళ్ళి, భోజనం చేయించి మళ్లీ పోలింగ్‌ బూత్‌ వైపునకు రాకుండా, ఆయనను సమాధానపరుస్తు పోలింగ్‌ అయిపొయేంతవరకు ఆయనను గమనిస్తూ వచ్చాను. అప్పటికే జిల్లా కలెక్టర్‌ వైరలెసలో సమాచారం కోసం రెందుసార్లు ఫోను చేయటం, ఎప్పటికప్పుడు సమాచారం తెలిపాను. పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షిస్తూ కలెక్టర్‌ గారి కోసం బయలుదేరాను. ఆరోజు బద్వేల్‌లో కలెక్టరు అధర్‌సిన్హా గారు నన్ను అభినందించిన విషయం ఇప్పటికి మరువలేను. _ రాజంపేట లద + కడప గడపలో జీవన మధురిమలు

సుబ్బయ్యగారు ఆర్‌డిఓగా, ఎన్నికల అధికారిగా నేను, డిఎఫ్‌ఓ మనోరంజన్‌ భాంజా సహా ఎన్నికల అధికారులుగా ఎన్నికలలో పాల్గొన్నాం. ఇరవై ఐదు రోజులు ఎన్నికల విధులు నిర్వహించటం గొప్ప అనుభూతిగా మిగిలింది. ఇవి ఎన్నికలలో ఎన్నికల అధికారిగా నా అనుభవాలు

ఎంత కష్టం వచ్చినా నేనున్నా నని ఆపన్న హస్తం ఉద్యోగం, జీవితాలలో ముందుండి నడిపించేది. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో పేద బాలికల సితిగతులపై నిరంతరం మహిళా లెక్పరర్లతో చర్చించుకునే వాళ్లం. ఆ (ప్రేరణ నుండి సోదరి సంధ్య నిర్వహిస్తున్న “ఆర్తి హోమ్‌” పుట్టింది. వందల, వేలాది మహిళా జీవితాలు మెరుగుపడటానికి, అనాధ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు, వెలుగు రేఖలు నింపుతూ కొనసాగుతోంది. విజయ ఫౌందేషన్‌ ట్రస్ట్‌, దాతల వదాన్యతతో, నిర్వాహకుల అకుంటిత దీక్షతో పదిహేను సంవత్సరాలుగా కడపలో ఈ సంస్థ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది. సోదరి సంధ్య, నా సతీమణి, దుర్గాకుమారి, దా॥ శ్రీనివాసుల రెడ్డి డా బాలిరెడ్డి సునీత, చాముండి, దాః విమల, రాజనారాయణ రెడ్డిలు కార్యవర్గంగా, జయేష్‌ రంజన్‌, కె.వి. రెడ్డి, తివారి, సుబ్రమణ్యం, జయభారతరెడ్డి వంటి ఐ.ఎ.ఎస్‌.ల సహకారం, సలహాలతో ముందుకు పోతుంన్నదీ సంస్థ ఆ సంస్థ కార్యక్రమాలతో మా కుటుంబ సభ్యులు ఇప్పటికి పాలుపంచుకుంటున్నారు.

విద్యార్థులను చూస్తే ఆనందం. చేపలకు ఎలా పిల్లలు పుడతాయి? అని అమాయకంగా తెలుసుకోవాలని జిజ్ఞాసతో క్లాసులో ప్రశ్నించిన నాటి నా విద్యార్థి రాష్ట్ర హైకోర్టు జడ్జి అవుతాడని ఆనాడు అనుకోలేదు. అది సాధ్యం అని నిరూపించారు జస్టిస్‌ నాగార్జున రెడ్డి. తినడానికి తిండిలేక చదువుకు అవకాశాలు లేక నా పంచనచేరి, నా అండదండలతో విద్యాభ్యాసం, ఉద్యోగం సంపాదించి ఎస్‌.సి. కార్పొరేషన్‌లో జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్న జయరాం.

సరిగా చదవటంలేదని తరచూ నాచే మందలించబడి, విద్యావిలువలు గుర్తించి (ప్రముఖ పారిజ్రామిక వేత్తగా రూపొందిన సైకం జయచంద్రారెడ్డి, నా విద్యార్థులు ఎందరో ఐఎఎస్‌, ఐపిఎస్‌, గ్రూప్‌-1 అధికారులుగా అందలం ఎక్కి రాష్ట్ర ప్రజలకు

అలపర్తి పిచ్చయ్య చౌదరి శ ల్తీద్రీ

సేవలందిస్తున్నారు. ఎంతో అభిమానించే నా ప్రియ విద్యార్థి, లక్షిరెడ్డివల్లె సత్యనారాయణ రెడ్డి, జీవన పోరాటంలో ఆరోగ్యం కోల్పోయి, ఆర్థిక బాధలతో సతమవుతూ, ఇప్పుడే నిలదొక్కుకుంటున్నాదు. పైకి వచ్చిన విద్యార్థులను చూసి సంతోషపడాలో, పైకిరాక జీవిత సమస్యలతో సతమతమవుతున్న అనేకమంది పాత విద్యార్థులను చూసి బాధపడుతుంటాను. రవాణా శాఖలో ఉన్నతాధికారి కృష్ణారెడ్డి తండ్రి సుబ్బారెడ్డి నా సహచర లెక్చరర్‌. వారితో అనుబంధం మరువరానిది. అదే శాఖలో పనిచేస్తున్న జయకుమార్‌ రెడ్డి యువకుడు, సౌమ్యుడు, ఆత్మీయుడు. సహ లెక్చరర్‌గా ఉండేవారు. రాయచోటి జూనియర్‌ కళాశాల నుండి కాలనీకి వెళ్తుంటే నులకమంచం మీద కూర్చొని ఎంతో గౌరవంగా పలకరించేవారు, ఐ.జి. వరకు ఎదిగిన జయరామిరెడ్డి గారు. కామర్స్‌ లెక్చరర్‌ పసుపులేటి సత్యనారాయణ అత్యంత ఆప్తుడు. కుటుంబ స్నేహితుడు. ఇలా ఎందరో. అందరిలో ఏదో (ప్రత్యేకత. వారితో అనుభూళులు, స్పందనలు, మరువరానివి నేను ఆర్‌ఐఓగా పనిచేస్తున్నపుడు కొందరు అధికారులు, మిత్రులు ప్రాంతీయ ప్రసక్తి తెచ్చి సీనియార్టి లేదని నా బదిలీకి ప్రయత్నించారు. వారి మాటలకు అనాటి మంత్రి వీరారెడ్డి, (ప్రతిపక్ష నాయకులు, ఈనాటి ముఖ్యమంత్రి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. పనిచేసేవారికి కడపవారు ఎప్పుడూ అండగా ఉంటారు. జిల్లా కలెక్టరుగా వీజాయీష్‌ పగలంతా జిల్లాలో విస్త లతంగా పర్యటంచి, రాత్రిపూట ్రొద్దుపోయే వరకు జిల్లా అధికారులతో నమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఆ రోజులలో జన్మభూమి కార్యక్రమాలను సమన్వయపరచటానికి సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటి డైరెక్టరు సిద్దార్ధన రెడ్డిని, నన్ను సమన్వయ కర్తలుగా నియమించారు. చాలా కష్టపడ్డాం. యాఖ్లైమండలాలలో జూనియర్‌ కళాశాలల ప్రిన్స్‌పాళ్లను ఆ కార్యక్రమాలకు పర్యవేక్షణాధికారులుగా కో-ఆర్టినేటర్లుగా నియమించాం. ముగింపు దశలో కలెక్టరేట్‌లో కో -ఆర్టినేటర్లుగా సమావేశం జరిగింది. కమ్యూనికేషన్‌ లోపం వలన ప్రిన్స్‌పాళ్లకు సమాచారం సకాలంలో అందలేదు. చాలామంది ప్రిన్స్‌పాళ్లు సమావేశానికి హాజరు కాలేదు. నన్ను సభాముఖంగా అందరిముందు నిలబెట్టి జిల్లా కలెక్టరు నిందించటం, దోషిగా నిలబడవలసిన పరిస్టితి ఏర్పడింది. టీ" కడప గడపలో జీవన మధురిమలు

మరునాడు 'ఈనాడు' పత్రికలో ఆర్‌.ఐ.ఓ.ను దండించిన కలెక్టరు అని, ఫొటోత్రో బాక్స్‌ ఐటమ్‌ వచ్చింది. కష్టపడి పనిచేసే నాకు ఈ విధమైన అవమానం జరగడం బాధించింది. జిల్లా మంత్రి వీరారెడ్డి గారు స్పందించి, కలెక్టరును అడిగారు. కలెక్టరు వెంటనే స్పందించి, నన్ను పిలిచి అమె అన్నమాటలు ఇప్పటికి మరచిపోలేను. మనమంతా ఒకటే టీము, ముఖ్యమంత్రికి సమాచారం సకాలంలో పంపాలి గదా, లోపం క్రింది అధికారులదయినా బాధ్యత మాకుంటుంది కదా, అని అనునయంగా మాట్లడటం, అద్పి ఒక ఇంటిలో సమస్యలా భావించటం, ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో 'జన్మభూమి' కార్యక్రమం జయప్రదం చేశాం. ఆ కృషిలో రాష్ట్ర స్థాయి జన్మభూమి అవార్డును సభాభవన్‌లో జిల్లా కలెక్టరు మంత్రి వీరారెడ్డి గారు నాకు అందించిన ప్రశంసా పత్రాలు, మొమెంటోలు ఇప్పటికి పదిలంగా ఉన్నాయి. అది ఏ పార్టీ ప్రభుత్వమా ఆనే మీమాంస నాకెన్నడు లేదు. అన్ని పార్టీల పభుత్వాలలో అంకిత భావంతో పనిచేసి అవార్డులు, రివార్డులు కైవసం చేసుకున్నాను. ఆ రోజులలో నాక్రు ఛాలెంజ్‌గా బోగస్‌ మార్కుల సర్జిఫికెట్లు అనంతపురం జీల్లా గుంతకల్స్‌ (బోగ సర్టిఫికెట్లు) కేంద్రంగా తయారై, పంపిణీకి వచ్చాయి. అసెంబ్లీలో పెద్ద దుమారం లేచింది. ఆ సర్టిఫికెట్లతో ఎందరో ఉద్యోగాలలో చేరారు. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు సంపాదించారు. గుంతకల్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్స్‌పాల్‌ అందచేసిన సమాచారంతో అర్ధరాత్రి దాడులు జరిపి కొన్ని కళాశాలలో అక్రమ సర్టిఫికెట్లు సు చేశాను. ఇంటర్‌ బోర్టు నుండి బ్లాంక్‌ సర్టిఫికెట్లు సంపాదించి, మార్కులు బ్రెప్‌చేసి, దొంగ సంతకాలతో ఒరిజనల్స్‌కు గ్రీటుగా 'ప్రవేశపెట్టేవారు. మార్మాపురంలో ఆ రోజులలో మహిళా జూనియర్‌ కళ్రాశ్రాల లేకపోయినా, స్టాంపు, ప్రిన్స్‌పాల్‌ దొంగ సంతకం సర్టిఫికెట్లు దొర్రిక్షాల్బు. సమగ్రమైన రిపోర్టు, నివేదిక పంపి సి.బి.సి.ఐ,డికి ఈ కేసును పంపవలసినదిగా ఇంటర్‌ బోర్డు కంట్రోలర్‌ ప్రణోతి సువాసిని గారికి పంపాను. దోషలను తరువాత ప్రోలీస్పువార్డు పట్టుకోన్నారు. అంత థైర్యం ఎలా వచ్చింది అని అప్పుడప్పుడు అనుకుంట్రాను, ఆ కేసు నడిచినంత కాలం కొందరు వ్యక్తులు నన్ను వెంటాడే వారు. అయినా నేనెన్షడూ భయపడలేదు. ఫ్‌ భి టి అలవర్తి పిచ్చయ్య చౌదరి + ల్లీ ర్రి

ఆర్‌ఐఓగా ఎన్నో గౌరవపురస్కారాలతోపాటు, ఒడిదుడుకులు ఎదుర్శొన్నాను. పరీక్షల నిర్వహణలో అందరి సహకారం పొందాను. కడప, అనంతపురం జిల్లాలలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ, కళాశాలల నిర్వహణ కత్తిమీద సాములా ఉండేది.

ప్రశ్నాపత్రాల కొరత, బార్‌కోడ్లతో మొదటిసారిగా పరీక్షల నిర్వహణ, సిట్టింగ్‌ స్మ్వాడ్‌లు, మొబైలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాట్లు, నిబంధనలు కఠినంగా అమలు పరచటం, క్రొత్త కళాశాలల ఫీజెబిలిటీ రిపోర్టులు, తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు, లెక్చరర్లను శిక్షణా కార్యక్రమాలు, విద్యార్థి సంఘాలతో సమస్యలు, ఒకదాని వెంట ఒకటి వచ్చేవి. రెండు జిల్లాల్లో ఐదు సంవత్సరాల సుదీర్హ కాలంలో నాదైన ముద్రవేయటానికి ప్రయత్నించి సఫలమయ్యాను. ఇంటర్‌ బోర్జుంసభ్యులుగా బోర్డు వికేంద్రీకరణ, బడ్జెట్‌ సమస్యల పరిష్కారం వంటి కీలకాంశాలలో నేను కీలక ప్రాతవహించాను.

అనంతపురం, కడప జిల్లాలలో అన్ని కళాశాలల తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాను. సమస్యలు తెలుసుకొని, పరిష్కరించేవాడిని. ప్రైవేటు, ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్స్‌పాల్స్‌, కరస్పాందెంటులలో సమావేశాలు నిర్వహించేవాడిని. కడప, అనంతపురం సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాలల ఫలితాలు పెరగడానికి, కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి అ కళాశాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవాడిని,

'బైటీష్‌ కాలం నాటి జైలు గదులలో పాఠ్యబోధన. 1500 మంది విద్యార్థినులకు టాయిలెట్‌ సౌకర్యాలు లేవు. 30 శాతం లోపే వార్షిక ఫలితాలు. ఇదీ నేను ప్రిన్స్‌పాల్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి పరిస్థితి, విద్యార్ధి నాయకులతో సమావేశామయ్యాను. ఒక అమ్మాయి చెప్పిన విషయం విని నిశ్చేష్టడనయ్యాను. మూత్ర విసర్జనకు ఇబ్బందులుంటాయని, కళాశాలకు వచ్చేటప్పుడు, కళాశాలలో విద్యార్థినులు నీటిని తాగడం మానివేశారని విని వ్యాకులపడ్డాను. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల రూపురేఖలే మార్చివేయాలని గట్టిగా నిశ్చయించుకున్నాను.

ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి, ఇంటర్‌ బోర్జు సెక్రటరీ, కమిషనర్‌ నుండి రాష్ట్ర జూనియర్‌ కళాశాలలకు అకడమిక్‌ ఆర్గనైజర్‌ టీలో + కడవ గడపలో జీవన మధురిమలు

పుస్తకము తయారు చేయాలని, చీఫ్‌ ఎడిటర్‌గా నియమించినట్లు మరుసటి రోజు ఆదేశాలు వచ్చాయి. ఆర్‌ఐఓగా అదనపు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ అవకాశాన్ని జారవిడవ కుండా సెక్రటరీని కడపకు ఆహ్వానించా. ఆయనతో అనేక కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను చూపించి, పరిస్థితులు వివరించాను. నా పనితీరుకు ఆయన ఆశ్చర్యపోయారు. కడప ఆర్‌ఐఓ అఫీసు రాష్ట్రంలోనే అత్యుత్తమ రీజియన్‌గా సర్టిఫై చేశారు. నా కోరిక మేరకు నందలూరు బాలుర కళాశాల భవనాలకు 11 లక్షలు, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలకు 7 లక్షలు, బాలుర కళాశాలకు 2 లక్షలు, ఆర్‌.ఐ.ఓ. ఆఫీసు భవనాల విస్తరణకు, రోడ్డుకు, ప్రహరీ, టాయిలెట్లు, కాన్ఫరెషన్స్‌ హాలుకు 4 లక్షలు, అప్పటికప్పుడు మంజూరు చేశారు. 6 నెలల వ్యవధిలోనే జిల్లా కలెక్టరు, సోషల్‌వెల్ళేర్‌ డిపార్ట్‌మెంటు, ఆర్‌ అండ్‌ బి సహకారంతో ఓపన్‌ ఎయిర్‌ స్టేజి, తరగతి గదులు, వృత్తి విద్యాభవనాలు, టాయిలెట్లు, నిరంతర నీటి సరఫరా వ్యవస్థలు, కళాశాలలో ఏర్పాటు చేశారు. డి.ఇ మనోహర్‌ రెడ్డి, (ప్రస్తుతం ఇఇ. మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌), ఇఇ. గంగాధార్‌ (ప్రస్తుతం ఆర్‌ అండ్‌ బి చీఫ్‌ ఇంజనీర్‌), నందలూరు అమ్మాయి మాధవి జూనియర్‌ ఇంజనీర్ల కృషి కారణం. వారి పనితీరును గమనించి మనోహర్‌రెడ్డి పర్యవేక్షణలో డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణం కూడా, విద్యాశాఖ ఉన్నత్రాధికారులు గుర్తించి ఇచ్చారు. అదే అధికారి కడపలో రిమ్స్‌ భవనాల నిర్మాణ సారథి అయ్యారు. కడప బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రారంభమైన అభివృద్ధి వీటికి నాందీ ప్రస్తావన అయింది. 14 టాయిలెట్లు, రన్నింగ్‌ వాటర్‌తో యూరినల్స్‌ ఏర్పాటు చేసి మూడు మాసాలలో బాలికల సమస్యలు పరిష్కరించగలిగాను. ఇప్పటికి లెక్చరర్లు, విద్యార్థినులు కళాశాల సర్వతోముఖాభివృద్ధి. ఆనాటి చదువు, కళాశాలల నిర్వహణ, స్టడీ అవర్సు, పరీక్షల నిర్వహణ స్వర్ణయుగంగా పేర్కొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యాభివృద్ధికి ప్రోత్సాహకాలు, ఆటలు, క్రీడల ప్రోత్సాహం, అన్ని రంగాలలో కళాశాల అభివృద్ధిని సాధించి, రెసిడెన్షియల్‌ కళాశాలల స్థాయిలో ఫలితాలు సాధించి కళాశాల పనితీరును మెరుగుపరచాం. డైట్‌ సెట్‌లో మా కళాశాల విద్యార్థిని (ముస్లిం విద్యార్ధిని) ఉర్జూలో రాష్ర్రంలో మొదటి స్థానం సాధించటం మాకు గర్వకారణమైంది. ముస్లిం విద్యార్థులను ఉర్దూలో రాష్ట్రంలోని అబపర్తి పిచ్చయ్య చౌదరి ఈ ధక

మొట్టమొదటి సారిగా క్యాలండర్‌, అనేక అభివృద్ధి కార్యక్రమాలు (ప్రారంభించాం. ఇష్తార్‌ విందు సాంప్రదాయాలు, వారికోసం ప్రత్యేక తరగతి గదులు, ముస్లిం విద్యావేత్తల సన్మానాలు నిర్వహించాం. కళాశాల ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం.

ప్రిన్స్‌పాల్‌గా నాకు అత్యంత తృప్తి నిచ్చింది. కొద్ది కాలమే (ప్రిన్స్‌పాల్‌గా ఉన్నా దశాబ్దాల అభివృద్ధిని చేసి చూపించామన్న ఆనందం కలిగింది. అనాటి విద్యార్ధినులు తమ జీవితకాలంలో ఒక మరపురాని మధురానుభూతుల్ని 'హ్వాపీదేస్‌'గా మిగిల్చుకునేలా చేసుకోవడానికి కళాశాల లెక్చరర్లు, సిబ్బంది ఎంతగానో తోద్చడ్డారు. ఆ విద్యార్థినులు జీవిత కాలంలో ఈ ్రిన్స్‌పాల్‌ను మరువలేరని నా అచంచల విశ్వాసం.

రాష్ట్రంలో ఒక హరిజన ఐ.ఎ.ఎస్‌. అధికారి పేరుతో 'కృపానందం సమీక్షా సమావేశ మందిరము” ఏర్పాటు చేసిన ఘనత నాకే దక్కింది. ఈనాటికి అనేక కార్యక్రమాలు ఆ మందిరంలో నిర్వహిస్తుంటారు.

యి భి లీ

రెండు సంవత్సరాల జాయింట్‌ సెక్రటరీగా బోర్డు కేంద్ర కార్యాలయంలో చేరిన మొదటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. బోర్డు సెక్రటరీ, ఇంటర్‌ విద్య కమిషనర్‌ శశాంక గోయల్‌ గారితో కడప జిల్లాలో జన్మభూమి కార్యక్రమాలలో చురుకుగా పనిచేసిన సందర్భంగా ఉన్న పరిచయంతో ఆయనను కలిసాను. ఆర్‌.ఐ.ఓగా మరల డిప్యూటేషన్‌ ఇవ్వవలసినదిగా కోరాను. “క్రడ్రపలో చేసిన సేవలు చాలు. రాష్ట్రవ్యాప్తంగా సేవలు అవసరం” అంటూ బోర్డులో అవకాశం ఇస్తానన్నారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్స్‌పాల్‌ కార్యదర్శి సుధీర్‌ గారి అనుమతిలో రూల్స్‌ రిలాక్స్‌ చేసి పరీక్షల విభాగానికి జాయింట్‌ సెక్రటరీగా నియమించారు.

బోర్జులో ప్రశ్నాపత్రాల తయారీ, స్మీమ్‌ ఆఫ్‌ వాల్యువేషన్‌, పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల పంపిణి, వాల్యువేషన్‌ సెంటర్ల ఏర్పాటు, వికేంద్రీకరణ, సమాధాన పత్రాల మూల్యాంకనము, రివాల్యువేషన్‌, రికౌంటింగ్‌, ఫోటో కాపీ అడ్మినిస్ట్రేషన్‌, సెక్రటరీ ఫైనాన్సియల్‌ పవర్సు, ఆర్‌.ఐ.ఓ.లు, డి.వి.ఇ.వోలు జాయింట్‌ డైరెక్టర్లతో సమన్వయం, వీడియో కాన్ఫరెన్సులు, అధికారుల కాన్ఫిడెన్నియలిటీ, ఎంక్వయిరీలు వంటి కీలక బాధ్యతలు నిర్వహించాను. న. ర ద] +కడప గడపలో జీవన మధురిమలు గలం న!

న్‌! లో గ / (నో నం. లీపా: న్‌ య్య న్‌

ఉదయం 3గంటలకు ఆఫీసుకు వెళ్తే తిరిగి ఇంటికి చేరడం రాత్రి 11 గంటలకే. పరీక్షల జాయింట్‌ సెక్రటరీకి పూర్తి కాలం వాహన సదుపాయం ఉందేది కాదు, కానీ నా పనితీరును గమనించి సెక్రటరీ నాకు ఆ అవకాశం ఇచ్చారు. పదవీ బాధ్యతలు నిర్వహించిన కాలంలో సాయంత్రం వేళలలో హైదరాబాద్‌ను చూసిన సందర్భాలు తక్కువ. ఆఫీసులో ఎక్కువ కాలం గడపటమే కారణం.

సెక్రటరీ శంశాక గోయల్‌ గారి వ్యవహారశైలి భిన్నంగా ఉండేది. క్రింది ఉద్యోగుల పని సక్రమంగా ఉండాలని కరినంగా వ్యవహరించేవారు. కంప్యూటీకరణ, నిరంతర పర్యవేక్షణతో బోర్డును అదుపులోక్రి తెచ్చి, పరీక్షలలో ప్రశ్నాపత్రాల కొరత, బోర్డు ఫలితాల ప్రకటనలలో లోపాలను, సాంకేతిక లోపాలను సవరించి, బోర్డును ఒక దారిలో ఉంచిన ఘనత ఆయనది. రాజకీయ నాయకులతో ఆయన సంబంధాలు అతి తక్కువ. సకాలంలో పనిపూర్తి చేయాలి, తప్పులుండ కూడదనేది ఆయన తత్వం. సుదీర్చ అనుభవంతో నేనందించే సలహాలకు గౌరవమిచ్చి పరీక్షల సంస్కరణలు చేపట్టారు. స్పాట్‌వాల్యువేషన్‌ సెంటర్లలో వొకేషనల్‌ సంస్కృతం వికేంద్రీకరణ, స్కీము ఆఫ్‌ వాల్యువేషన్‌లో స్పష్టత, ఫలితాలు రికార్డు స్థాయిలో ప్రకటించటం, ఆయన నాయకత్వంలో బోర్జు సాధించిన ఘనవిజయాలు.

ఆయన బదిలీ అయిన తరువాత కొద్ది కాలం శిశోడియా సెక్రటరీగా వచ్చారు. ఉద్యోగులకు కొంత స్వేచ్చనిచ్చి మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆయన వద్ద కొద్ది కాలం పనిచేసిన తరువాత రిటైరు అయ్యాను.

ఆర్‌ఐఓగా రామస్వామి రెడ్డి, బిస్వాల్‌, పి, సుబ్రమణ్యం, ఆర్‌. సుబ్రమణ్యం, డా శ్రీనివాసరావు, కృపానందల వద్ద పనిచేశాను. అధర్‌సిన్హా చంద్రమౌళి, నాగిరెడ్డి, వీణాయీష్‌్‌ జయేష్‌ రంజన్‌ జిల్లా కలెక్టర్లుగా ఉన్నప్పుడు పనిచేశాను.

దాః శ్రీనివాసరావు ఇంటర్‌ విద్యలో ఓ.ఎం.ఆర్‌. బార్‌కోడ్‌ షీట్లు ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. ఆయన ఆదరణ మరువలేను. రెండవసారి ఆర్‌.ఐ.ఓ.గా నియమించినా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన అధికారిగా నా మనస్సులో ఎప్పుడు ఉంటారు.

ముఖ్యమంత్రి పేషిలో ఐ.ఎ.ఎస్‌. అధికారులు సుబ్రమణ్యం, ప్రభాకర్‌రెడ్డి గార్కు నా సేవలు గుర్తించి, గౌరవించేవారు. ఆర్థిక ప్రయోజనాలను ఆశించి చేసే

అలపర్తి పిచ్చయ్య చౌదరి * లిం

పైరవీలు నా ఉద్యోగజీవితంలో ఏ ఉన్నతాధికారుల వద్ద చేయకపోవడమే నా విజయరహస్యం. జూనియర్‌ లెక్చరర్‌ పదవి నుండి జాయింట్‌ సెక్రటరీ పదవి వరకు ఫోనులో సహితం ఐఎఎస్‌ అధికారులతో మాట్లాడి, సమస్యలు పరిష్కరించే చొరవ, ధైర్యం, తెగువ ట్రదర్శించే వాడిని.

బోర్డు సమస్యలు, లెక్చరర్ల, పిడిలు, లైబ్రేరియన్ల సమస్యల పరిష్కారంలో అధికారిగా, బోర్డు మెంబర్‌గా నా వంతు కృషి చేసి అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాను.

నా ధైర్యానికి క్రింద ఉద్యోగులు ఆఅశ్చర్యపోయేవారు. ఉద్యోగ సంఘాల నాయకులు నన్ను వెన్నంటి ఉండేవారు ఇంటర్‌ బోర్జు ఉద్యోగులు, లెక్పరర్ల సమస్యల పరిష్కారానికి కమిషనరుకు, వారికి మధ్య “వారధిగా ఉండేవాడిని. సానుకూల దృక్పధంతో పనిచేయించి, ఉద్యోగుల సమస్యలపట్ల అవగాహన, ఏర్పరచుకొని, వారి ఆర్థిక విషయాల పరిష్కారానికి కృషి చేస్తూ వారి మన్ననలు పొందుతూ వచ్చాను.

రాష్ట్ర జూనియర్‌ లెక్చరర్ల సంఘం మాజీ అధ్యక్షులు దస్తయ్య నాయుడు ఒక రకంగా నాకు అండ, ప్రోత్సాహం అందించినవారు. 'పిచ్చయ్యా!' అని పిలిచే ఆయన ఆత్మీయుత నా అంతరంగంలో జీవమున్నంత కాలం ఉంటుంది. నా అంకితభావం, కృషిని గమనించి నా ఒక్కడి కోసం రాయలసీమలో మరో 11 మందికి ప్రిన్స్‌పాల్స్‌ ప్రమోషన్లు పొందటానికి అవకాశం కల్పించిన శక్తి వంతమైన ఉపాధ్యాయ నాయకుడు ఆయన.

బిస్వాల్‌ బోర్డు కార్యదర్శిగా బోర్డు కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించారు. కడపకు వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. చిస్వాల్‌, కృపానందం, చక్రపాణి వంటి అధికారులు ప్రత్యక్షంగా జిల్లాలలో తిరిగి, క్షేత్ర పర్యటనలో కళాశాలల పనితీరును గమనించేవారు.

ఆర్‌ఐఓగా నేను సాధించిన విజయాలలో క్షేత్ర పర్యటన ఒకటి. కడప, అనంతపురం జిల్లాలలో నెలకు, ఇరవై రోజులు కళాశాలల తనిఖీలు, వార్షిక తనిఖీలు క్రమం తప్పకుందా నిర్వహించేవాడిని. అధికారులు తెలసుకోవలసినది తీరిక లేదనేది కాదు, తీరిక చేసుకొని బాధ్యతలు నిర్వహించాలని నా అభిమతం. నా పర్యవేక్షణలో ఉన్న జిల్లాలలో ఏ రాష్ట్ర అధికారులు వచ్చినా సభలు, సన్మానాలకు ప్రాధాన్యత 'ధాధ' + కడప గడపలో జీవన మధురిమలు

కాకుండా, కళాశాలల తనిఖీకి ప్రాధాన్యత ఇచ్చేవాడిని. బిస్వాల్‌ కడప పర్యటనలో షెడ్యూల్‌లో భాగంగా కార్యక్రమాలన్ని ముగించి, మరియాపురం జూనియర్‌ కళాశాలను చూడడానికి రాత్రి 11 గంటలయ్యింది. రాయలసీమలో అత్యుత్తమ జూనియర్‌ కళాశాల మరియాపురం, సెయింట్‌ జోసఫ్‌ జూనియర్‌ కళాశాల. ఫలితాలలో, నిర్వహణలో పేరెన్నిక గన్న ఎయిదెడ్‌ మైనారిటీ సంస్థ. ఆ కళాశాల లాబారేటరీలు ఆయనకు చూపించాలని నా పట్టుదల. రాత్రి సమయంలో సైతం లెక్చరర్లు, సిబ్బంది ఉండి కమిషనర్‌ మన్ననలు పొందారు. ఈ విషయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుధీర్‌ గారికి కూడా నేను మినహాయింపు ఇవ్వలేదు. ప్రైవేటు విజిట్‌లో పుట్టపర్తికి వచ్చిన సుధీర్‌ గారిని, స్వామి దర్శనం పూర్తి చేసుకొని, కుటుంబ సభ్యులతో గడపాలని వచ్చారు. పట్టువదలని విక్రమార్ముడులా ఆయనను ఒప్పించి ధర్మవరం, అనంతపురం ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలల తనిఖీకి తీసుకెళ్లాను. ధర్మవరంలో ఒక ముఖ్య సెక్రటరీ స్థాయి అధికారి జూనియర్‌ కళాశాలను చూడటం ఆ రోజులలో సంచలనం. నిగ్రహం, సమగ్ర వ్యక్తిత్వం మూర్తీభవించిన సుధీర్‌ గారు కళాశాలల పనితీరు గమనిస్తూ, అనేక సూచనలు చేశారు. రాష్ట్ర అధికారులు నెలకు పది రోజులు క్షేత్ర పరిశీలన చేస్తే 70 శాతం సమస్యలు పరిష్మారమౌతాయని నా నమ్మకం. నేను ఆర్‌ఐఓ పదవి వదలి, జాయింట్‌ సెక్రటరీ అయినా, నా తరువాత చాలామంది ఆర్‌ఐఓలుగా వచ్చినా ఇంకా అనంతపురంలో నేనే ఆర్‌ఐఓ అని చాలాకాలం భావించేవారు. అది క్షేత్ర పరిశీలన, క్షేతదర్భ్శన మహత్యం. ఇది అధికారులు గుర్తిస్తే వారి బాధ్యతల నిర్వహణలో సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి. ఇంటర్మీడియెట్‌ విద్యకు కమిషనర్‌గా పనిచేసిన చక్రపాణి గారితో సాన్నిహిత్యం తక్కువ. కమిషనర్‌గా ఇంటరు ఎడ్మినిస్టేషన్‌ను క్రమబద్ధం చేసిన ఘనత, క్షేత్రస్థాయి పర్యటనలు, ఫలితాలు పెరుగుదలకు ఆయన సేవలు అపారం. సుధీర్‌ గారితో పరిచయం, నా అంకితభావం, అభివృద్ధి, పరీక్షల నిర్వహణ, కృషిని ఆయన గమనించి తరువాత కొన్ని సంవత్సరాల తరువాత నిబంధనలు సడలించి ఇంటర్‌ బోర్జు సంక్షోభంలో ఉన్నప్పుడు నన్ను జాయింట్‌ సెక్రటరీగా నియమించటానికి దారి అలపర్తి పిచ్చయ్య చౌదరి + ర్రితీ

తీసింది. రాజకీయ (ప్రమేయం లేకుండా కేవలం పనితనంతో ఉన్నత్రాధికారుల మన్ననలు పొంది, అవకాశాలు చేజిక్కించుకొని అందరికి ఉపయోగపడ్డాను.

ఇంటర్‌ బోర్డు సభ్యునిగా 1993 నుండి 2003 వరకు ఒక దశాబ్దంపాటు పనిచేశాను. జూనియర్‌ లెక్చరర్‌గా నా సేవలను గుర్తించి ప్రాంతీయ స్థాయిలో గుర్తింపబడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అదే సమయంలో ప్రమోషను పొందటం, ట్రిన్స్‌పాల్‌గా కొద్ది కాలంలోనే కడపలో సంచలనంగా పనిచేయటంతో ప్రభుత్వం తరుపున ప్రతిపాదన పోయింది. రాయలసీమలో జూనియర్‌ లెక్చరర్లు, ప్రిన్స్‌పాల్స్‌ రెండు కోటాలలో జి.ఓ.తో ఒకే వ్యక్తినయిన నాకు బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నామినేట్‌ చేసింది. ఆ ఒరవడిలో బోర్డు సభ్యులుగా నియమించబడటం కాలపరిమితి రెండు సంవత్సరాలయితే, దాదాపు దశాబ్ద కాలం పునర్వ్యవస్టీకరణకు నోచుకోక బోర్జు సభ్యునిగా కొనసాగుతూ వచ్చాను.

బోర్డు అధ్యక్షులుగా విద్యాశాఖ మంత్రి, ఉపాధ్యక్షులుగా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, నిర్వాహకులుగా ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉంటారు. 20 మంది బోర్డు సభ్యులుగా వివిధ శాఖల డైరెక్టర్లు, యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు ఎయిడెడ్‌, గవర్నమెంటు కళాశాలలో జూనియర్‌ కళాశాలల లెక్సరర్లు, ప్రిన్స్‌పొళ్లు ఉంటారు. వాస్తవంగా అవగాహన లేని ఉన్నత స్థాయి అధికారులు, ఇంటర్‌ వ్యవస్థకు సంబంధంలేని వారు ఎక్కువమంది ఉంటారు. జూనియర్‌ కళాశాలల వారు తక్కువగా ఉందేవారు.

ముగ్గురు జూనియర్‌ కళాశాలల వారిలో రాయలసీమకు ప్రతినిధిగా నాకు అవకాశం వచ్చింది. ఇంటర్‌ బోర్టులో సుదీర్ధమైన అనుభవం, సమస్యల పట్ల అవగాహనతో పరిష్కారదిశలో చక్కగా వివరించేవాడిని. బోర్డు నమావేశం జరిగిందంటే పిచ్చయ్య చౌదరి ఒప్పించి చేయిస్తారని ఇంటర్‌ బోర్జు ఉద్యోగులు సహితం అనుకునేవారు.

ఇంటర్‌ బోర్డు వికేంద్రీకరణ, ప్రాంతీయ కార్యాలయాలు, అధికారుల ఏర్పాటు, అధికారాలు (ప్రాంతీయ కార్యాలయాలను బదలాయింపు, బోర్డు బడ్జెట్‌, బోర్డు సమస్యలు, నియామకాలు, పాలనా వ్యవహరాలకు దశదిశ ఇంటిర్‌ విద్యామండలి దది + కడప గడపలో జీవన మధురిమలు

నిర్వహిస్తోంది. దానిలో క్రియాశీలక పొత్రనిర్వహించి, ఉద్యోగ సంఘాల నాయకుల సహకారంతో వారు తెలిపిన విషయాల పరిష్కారం, కోట్లాది రూపాయల బడ్జెట్‌లో కళాశాలల నిర్వహణా బాధ్యతలు, కొత్త కళాశాలల ఏర్పాటు, నిబంధనలు మార్పుల వంటి మౌలికాంశాలపై చర్చలు జరిగేవి. మా వాదనలు, సూచనలతో బోర్జును ఒప్పించేవాళ్లం. విధంగా పనిచేయడమే కాక, ఆఅ బోర్డు సభ్యులలో స్టాండింగ్‌ కమిటీ అకడమిక్‌ అఫయిర్స్‌కు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాను. బహుముఖంగా సేవలు చేసే అదృష్టాన్ని అవకాశాన్ని కడప జిల్లా నాకు కల్పించింది. కడపలో ఇంటర్‌ విద్యారంగంలో నాతో పనిచేసిన అధికారులలో నిజాయితీ, అంకితభావం, నిరాడంబరత కనిపించిన వారిలో పోలిరెడ్డి ఒకరు. నేను ఇష్టపడే వారిలో ఆయన ఒకరు. ఆయన బాలుర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను అభివృద్ధి పరచిన తీరు నన్ను మెప్పించింది. నిజాయితీకి నిలుపుటద్దం పోలిరెడ్డి. “సాయిరాం జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ శివరామిరెడ్డి కుటుంబ స్నేహితులు. కష్టకాలంలో అండగా నిలిచారు. ఎందరికో విద్యావకాశాలు (ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటంలో ఆయన సంస్థ కృషి ప్రశంసనీయం. రోడ్డు మీద నడిచేటప్పుడు కనిపించి ఆప్యాయతతో పలుకరించేవారు చాలా ఎక్కువ. రాయచోటిలో రూమ్‌మెట్‌గా ఉండి నిరంతరం సేవాపరంపరలో, ఎప్పుడూ ఖాదిలో కనిపించే హెడ్‌మాస్టర్‌ టి.వి. నారాయణ రెడ్డి దశాబ్దాలుగా ఒకే విధంగా మనిషిలో మార్పులేకుండా కనిపిస్తున్నారు. కడపలో కవిపండితులకు లోటు లేదు. సాహితీ సదస్సుల, సాహిత్య సమీక్షా సమావేశాలు, కడప కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలకు వేదికగా ఉంది. గడియారం వేంకటశేషశాస్తి, పుట్టపర్తి నారాయణాచార్య, జానమద్ది హనుచ్చాస్తి, శతవధాని సివి సుబ్బన్న, కేతు విశ్వనాధరెడ్డి, పొన్నపురెడ్డి, కసిరెడ్డి, జీరెడ్డి, మల్లెమాల, సత్యాగ్ని పి. రామకృష్ణారెడ్డి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి వంటి కవులు, కధకులు జిల్లా ఖ్యాతిని దశదిశలా వ్యాపిపంజేశారు. టి స్‌ లి అలపర్తి పిచ్చయ్య చౌదరి * లీదీ

ఇంటర్‌ విద్యలో సుదీర్హ అనుభవం ఉన్న నాకు కొన్ని సూచనలు చేయాలని అనిపిస్తుంది. ఉన్నత విద్యలో సింహభాగం ఆక్రమించుకున్న ఇంటర్‌ విద్యపై ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటి ద్వారా సమగ్ర అధ్యయనం చేయించాలి. మౌళిక సదుపాయాలు, భవన వసతి, బోధనా వ్యవస్థ, ఆట స్థలం, లైబ్రరీ, ఒక్కోక్క కళాశాలకు ఒక మైకో యూనిట్‌గా నిధుల మంజూరు, సంస్థలు అభివృద్ధికి “అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసి ఆర్థిక పరంగా గ్రామ ప్రజలను కూడా భాగస్వాములు చేసి కొత్త ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలి. కేంద్ర నిధులను రాబట్టి కళాశాలల భవన వసతికి ప్రత్యేక (గ్రాంటులకు కృషిచేయాలి. (గ్రామీణ కళాశాలల్లో సైతం వెనుకబడిన విద్యార్థులకు కోచింగ్‌ ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, పట్టణ స్థాయి విద్యార్థుల తరహలో అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు వారి సమస్యల పరిష్కారంతోపాటు, కళాశాలల అకడమిక్‌ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి మార్గదర్శకులుగా ఉందాలి. శాసనమండలి ఉపాధ్యాయ ప్రతినిధుల సేవలు పొందటంలో జూనియర్‌ కళాశాలల అధ్యాపక, ఉద్యోగ వర్గాలు నిరంతరం వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలి. తద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లి జూనియర్‌ కళాశాలల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయేటట్లు వారి సేవలను వినియోగించుకోవాలి. ఈనాటి కార్పొరేట్‌ సంస్థలు. విద్యాసంస్థల్లో చూస్తున్న కార్యక్రమాలు ఆనాడు నేను చదివిన లయోలా జీవితం గుర్తు చేస్తుంటాయి. లయోలా జీవితంలో చదువుతోపాటు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట. కాని ఈనాటి కార్పొరేట్‌ సంస్కృతిలో మచ్చుకైనా కనిపించదు. నాటి లయోలాలో 8 సైన్సు సెకన్లు ఉండేవి. వందలాదిమంది విద్యార్థులు సైన్సు క్లాసుల్లో ఉండేవారు. చదువుతోపాటు ఆటలు, సాంస్కృ తిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. కానీ ఈనాడు కళాశాల నిర్వాహకులు ఆటలు, నాంస్కృతిక కార్యక్రమాలకు అవకాశం కల్పించటంలేదు. లైబ్రరీ, ప్రయోగశాలలలో పరికరాల కొరత, ప్రాక్టికల్స్‌ నిర్వహింపకుండానే పరిక్షలకు సన్నద్ధం చేస్తున్నారని చాలా కళాశాలలపై తల్లిదండ్రుల ఆరోపణ. ఇంటర్‌ విద్యావ్యవస్థ ఉన్నత విద్యలో భాగంగానే ఉండాలి. దీ + కడప గడపలో జీవన మధురిమలు

సంస్థాగతమైన లోటుపాట్లను నరిదిద్యకోవలనిన బాధ్యత నంన్ధల నిర్వాహకులపైన, అజమాయిషీ చేసే బాధ్యత ప్రభుత్వంపైన, పరీక్షలు నిర్వహించే బాధ్యత ఇంటర్‌ విద్యామండలిపై ఉన్నదనటంలో ఏమాత్రం సందేహంలేదు. కళాశాలల వ్యాస్తితోపాటు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించటంలో అన్ని కళాశాలలపై ప్రభుత్వ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఎంతో అవసరం. ఇంటర్మీడియట్‌ విద్యామండలిలో బోర్డు సభ్యులుగా అనేక విషయాలపై అవగాహన ఏర్పడింది. బోర్డు నిధుల నుండి జూనియర్‌ కళాశాలలకు ఆర్థిక సహాయం అందేది. ప్రతి సంవత్సరము కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు భవన నిర్మాణాలకు, (ప్రయోగశాలల పరికరాల కొనుగోలు, ఫర్నీచర్‌ కొనుగోలు, ఆర్థిక సహకారం లభించేది. సిలబస్‌, ప్రశ్నాపత్రాల తయారీలో అనుభవజ్ఞులయిన లెక్చరర్ల సహకారంతో ప్రతియేటా 9 సెట్ల ప్రశ్నాపత్రాలు తయారు చేసేవారు. కాన్ఫిడెన్నియాలిటి విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. రీవాల్యుపషన్‌, ఫోటో కాపీలలో రూపొందించిన నిబంధనలు కొన్ని నాకు నచ్చేవి కావు. బోర్డు సెక్రటరీని సైతం ప్రశ్నించి, ఆయన దృష్టికి తెచ్చినా ఫలితం ఉందేది కాదు. రివాల్యువషన్‌లో “0 వేయబడిన సమాధానాలకు మాత్రమే రివాల్యుచేయటం, కొన్నిసార్లు సరియైన సమాధానాలు రాసినా ఎగ్జామినర్‌ కొట్టివేసి “0 వేయటం విద్యార్థులకు అన్యాయం జరిగినా, బోర్జులో ఈ వాల్యువషన్‌ ప్రక్రియకు ఉన్న పరిమితులు కారణంగా కొంత అన్యాయం జరుగుతున్నట్లుగా భావించేవాడిని. రివాల్యుఏషన్‌ ప్రక్రియ జరిగినంతకాలం బోర్టులో వత్తిడితో పనిజరిగేది. నిబంధనల ప్రకారం రివాల్యుపషన్‌ జరిపించే వాళ్లం. నాకు తెలిసినంతవరకు కాన్ఫిడెన్నియాలిటి విషయంలో 100 శాతం న్యాయబద్ధంగా వ్యవహరించేవాడిని. కొన్ని లక్షల సమాధాన పత్రాలు షెడ్యూల్‌ టైమ్‌లో మూల్యాంకనం జరిపించటం కత్తి మీద సాములాంటిది. రోజుల తరబడి స్కీమ్‌ ఆఫ్‌ వాల్యుఏషన్‌ నెలల తరబడి ప్రశ్నాపత్రాల తయారి, పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల ముద్రణ, సక్రమ పంపిణీ కౌరత లేకుండా చూడటం, కళాశాలల నుండి, ఆర్‌.ఐ.ఓ.ల నుండి వచ్చే నామినల్‌ రూల్స్‌, పరీక్షల అక్రమాలు, మాల్‌్రాక్టీస్‌ కమిటీలతో తీరిక లేకుండా ఉండేది. అలపర్తి పిచ్చయ్య చౌదరి * బద్రి

కాని పనికి తగ్గట్టు ఉద్యోగుల సంఖ్య బోర్జులో లేదు. బోర్డులో క్రింది ఉద్యోగుల సంఖ్య పెంచటం, రిటైర్డ్‌ ఉద్యోగుల స్థానంలో క్రొత్త వారి నియామకాలు, అదనపు పనికి సకాలంలో అలవెన్సులు, వారి కృషిని గమనిస్తే బోర్డు ఉద్యోగులను అభినందించకుండా ఎవరూ ఉండలేరు. పరీక్షల సమయంలో అర్థరాత్రి వరకు పనిచేసే వాళ్లు. అతి కొద్ది మంది చేసిన తప్పులకు, బోర్డును నిందించటంలో అర్థం లేదని బోర్డు కార్యక్రమాలు చూసిన వారు, బోర్డుతో అనుభవం ఉన్నవారు ఎవరైనా చెప్పగలరు.

లక్షలాది విద్యార్థుల భవితవ్యాన్ని నీర్ణయించే ఇంటర్‌ విద్యామండలి నిర్వహణ ఐఎఎస్‌ అధికారుల చెప్పుచేతుల్లోనే నడుస్తోంది. వారి ఆలోచనా సరళికి, నిబంధనలు చేసి, బోర్డులో అనుమతి పొంది ఏటా అనేక సంస్కరణలు తెస్తున్నారు. కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా, బార్‌కోడ్‌ షీట్ల ఏర్పాటు, సబ్జెక్టుల ఓరియెంటేషన్‌ వర్క్‌షాపులు, సిలబస్‌ మార్పుల వంటి విషయాలలో బోర్డు తీసుకునే జాగ్రత్తలతో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి.

ఏటా పెరిగే విద్యార్థుల సంఖ్యతో పరిమిత సంఖ్యలో ఉన్న బోర్డు ఉద్యోగుల సేవలతో బోర్డు పరిక్షలు నిర్వహించే కేంద్రంగానే మిగిలి పోతున్నది. మారుతున్న పరిస్థితులను బట్టి పరిక్షా విధానంలో సమూలమైన మార్పులు తేవలసిన సమయం ఆసన్నమయింది.

కొత్త కళాశాలల ఏర్పాటు, నిబంధనలు రూపొందించడంలో బోర్లు మరింత (ఛద్ధ తీసుకోవాల్సి వుంది. ఆర్‌ఐఓలకు పరీక్షల నిర్వహణకు అత్యధిక కాలం సరిపోతుంది. అకడమిక్‌ తనిఖీలకు, ఆకస్మిక తనిఖీలకు, ప్రాలనావిధానంలో ఆత్యంత (ప్రాముఖ్యమైన బోధనా విషయాలు, కళాశాలలో బోధనా కార్యక్రమాలు సక్రమ నిర్వహణ వంటి కార్యక్రమాలపై బోర్జు దృష్టి సారించే విధంగా మార్పులు చేస్తే, బోర్టు కార్యక్రమాలు అర్ధవంతంగా కొనసాగుతాయి. సుదీర్ధ అనుభవం ఉన్న అధ్యాపకులు, ప్రభుత్వ అవార్డులు పొందిన

అధ్యాపకులు, సేవలు తీసుకొని సంస్కరణలతో అకడమిక్‌ కార్యక్రమాలతో బోర్డు ముందంజవేయటానికి కృషి చేయాలి. అకడమిక్‌ ఆర్గనైజర్‌ (ప్రతి ఏటా సకాలంలో ముద్రణ వేసి కళాశాలలు ప్రారంభమయ్యేసరికి ప్రతి లెక్చరర్‌ వద్ద కరదీపికగా 5౮ ఛ కడప గడపలో జీవన మధురిమలు

ఉండేలా చర్యలు చేపట్టాలి. వార్షిక తనిఖీలు పెంచాలి. లెక్చరర్లు తమ బోధనాపటిమను పెంచుకోవటానికి వార్షిక ఓరియెంటేషన్‌ కార్యక్రమాలు, ఫలితాలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థుల అటెండెన్సు ఇంటర్‌ విద్యలో అంత్యత ప్రాధాన్యమైనది అటెందెన్సు లేకపోతే పరీక్షలకు అవకాశం ఇవ్వకూడదు. మాల్‌(ప్రాక్టీసులకు తొవుందకూడదు. ఎమ్‌సెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉన్నందున విద్యశాఖ ఉన్నతాధికారులు అకడమిక్‌ విషయాలలో సైతం ప్రత్యేక శ్రద్ధ కనపరచి, విద్యార్థుల శక్తి సామర్ధ్యాలను ఎప్పటికప్పుడు గమనించగలిగిన విధానాలకు రూపకల్పన చేయాలి. 19వ శతాబ్దం చివరి భాగంలో కడప జిల్లాలో 2 డిగ్రీ కళాశాలలు, 20 ఎయిడెడ్‌ కళాశాలలు, 8 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యాబోధన జరిగేది. ఈనాడు 126 జూనియర్‌ కళాశాలలు జిల్లాలో ఉన్నాయి. డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీ, సాంకేతిక కళాశాలల సంఖ్య పెరిగింది. ఆ రోజులలో చదివేవారు, చదివించేవారు తక్కువ. ఇవ్వాళ పరిస్టితి ఇందుకు భిన్నం. ఇవ్వాళ సామాన్యులు సైతం చదువుకోవడానికి వేలాది రూపాయలు ఖర్చు చేయటానికి వెనుకాడటంలేదు. తల్లిదండ్రులలో ఉన్నత విద్యపట్ల (శ్రద్ధ కనిపిస్తున్నది. సుదీర్ధ అనుభవంతో విద్యావిధానంలో మార్పులతో పాటు, అధ్యాపక లోకంలో అంకితభావం, వృత్తిపట్ల శ్రద్ధ, విద్యార్థులను తీర్చిదిద్దే ప్రక్రియలో రాజీలేని విధానాల ద్వారా ప్రభుత్వం ముందుకు రావాలి. ఇంటర్‌ విద్య రాష్ట్రంలో దాదాపు 4000 జూనియర్‌ కళాశాలలు నిర్వహింప బడుతున్నాయి. వీటిలో ప్రైవేటు, ఎయిదెడ్‌, గవర్నమెంట్‌, సోషల్‌ వెల్ఫేర్‌, కార్పోరేట్‌ రంగాలలో పనిచేస్తున్నాయి. బోధనా ప్రక్రియ, పరీక్షల నిర్వహణ, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, క్యాలండెర్‌ కార్యక్రమాలను సమన్వయంచేసి, అకడమిక్‌ షెడ్యూల్స్‌ అమలు చెయ్యాలి. కళాశాలలలో విద్యార్థులకు కేవలం ఇంజనీర్లు, డాక్టర్లను తయారు చేసే సంస్థలుగా కాకుండా, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంచేలా చూడాలి. కార్బొరేట్‌ రంగంపై ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించవలసి ఉన్నది. గ్రంథాలయం, క్రీడా స్థలి, తరగతి గదులు, రంగస్థలం, (క్రీడా పరికరాలు, కళాశాలలో ఫర్నీచరు, జూనియర్‌ కళాశాలలో ఎంతో ఆవశ్యకం. ఇవన్నీ లేకపోవడంతో విద్యార్థులు సమగ్ర వ్యక్తిత్వంగల వారుగా రూపొందటం ప్రశ్నార్థకమే. అలపర్తి పిచ్చయ్య చౌదరి + (౮

ఇటీవల రెండుసార్లు అమెరికా పర్యటనలో కొన్ని పాఠశాలలను, కళాశాలలను పరిశీలించాను. హైస్కూలు విద్యార్థులకు పెద్ద ఆడిటోరియాలు, క్రీడాస్థలిలో టెన్నిస్‌, వాలీబాల్‌ బేస్‌బాలు కోర్టులు, సువిశాలమైన ఆటస్థలాలు, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎక్కువ మంది క్రీడాస్థలాలకే పరిమితం కావటం, పాఠశాలలో, కళాశాల బోధనా షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే క్రీడా స్థలికి చేరేవారు... క్రీడా కార్యక్రమం పూర్తి అయ్యే సమయానికి తల్లిదండ్రులు అక్కడకు వచ్చి కార్లలో తమ పిల్లలను తీసుకొని వెళతారు. విద్యార్థి జీవితాలను ప్రభావితం చేసే వాల్యువేషన్‌ ప్రక్రియలో తప్పులు లేకుండా, పారదర్శకంగా ఉండేట్లుగా లక్షలాది తల్లిదండ్రుల, విద్యార్థుల ఆకాంక్షలను సక్రమంగా అమలు పరిచే వ్యవస్థగా బోర్డు పనిచేయాలని, సుదీర్హ సేవలందించిన నా వంటివారు ఆశించటంలో తప్పు లేదనుకుంటాను. ఇంటర్‌ విద్య ప్రతి విద్యార్థి జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం. ఇంటర్‌ విద్య జీవితానికి ముఖ్యమైన మలుపు. రెండు సంవత్సరాల ఇంటర్‌ విద్య, మూడు లేక ఐదు సంవత్సరాల డిగ్రీ, ఉన్నత విద్యలలో విద్యార్థి కష్టపడితే, ఉద్యోగ సాధనలో విజయవంతమై, ఆనందమయ జీవితం గడపవచ్చని అధ్యాపకులు అంటూ ఉంటారు. అది వాస్తవం. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ధోరణిలో మార్పు వస్తున్నది. వృత్తి విద్యా కోర్సుల ప్రాధాన్యత గుర్తిస్తూ, బోధనా కార్యక్రమాలలో ఉంటే లెక్సరర్ల పని తీరును ప్రభావితం చేసే పరిక్షా ఫలితాల ఆధారంగా, బ్రిన్స్‌పాల్స్‌, లేకరర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టటం, పరీక్షలలో మాల్‌ప్రాక్టీసులకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టటం హర్షణీయమైనా, స్థాయి తక్కువ విద్యార్థులు, (గ్రామీణ ప్రాంత విద్యార్థులును దృష్టిలో పెట్టుకొని (వత్యేకమ్రైన కార్యక్రమాలు నిర్వపాంచటానికి కార్యక్రమాలు రూపొందించకుండా సంవత్సర కాబమంతా బోధనా పర్యవేక్షణ లేకుండా, పరీక్షా ఫలితాలు మాత్రమే పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టటం అంత సమంజసమా? అని ఉద్యోగ సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు, బోర్డు నిర్వహణకు చాలా తేడాలు ఉన్నాయి. కాన్ఫిడెన్నియాలిటీ కారణంగా కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు బోర్డు దీ || శ కడప గడపలో జీవన మధుదిమలు

ఉద్యోగులు, బోర్డు కార్యక్రమాలలో పాల్గొనే అధ్యాపకులు ప్రయోజనం పొందుతూనే ఉన్నారు.

ఆర్థికంగా సదుపాయాలు కలిగించి, ఉద్యోగుల, లెక్చరర్ల కృషిని గమనించి, శ్రమకు తగినట్లు రెమ్యురేషన్‌ చెల్లించే విధానం ఉండాలని, అప్పుడే సత్ఫలితాలు వస్తాయని నా అనుభవంలో తెలిసింది.

కొందరు ఉన్నతాధికారులు ఈ విషయాలలో అనుకూలంగా స్పందించి, మంచి ఫలితాలు రాబట్టే వారు బోర్డు ఉద్యోగుల, అధ్యాపక వర్గ సమన్వయ కృషి బోర్డు కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొన్ని సంవత్సరాలు అవ(ప్రదను మూటకట్టుకున్న బోర్డు, సమస్యల అధిగమిస్తూ, లక్షలాది మంది విద్యార్థులకు సేవలందిస్తూ ముందుకుపోతున్నది.

(ప్రభుత్వ సోషల్‌ వెళ్ళేర్‌ జూనియర్‌ కళాశాలలలో మంచి ఫలితాలు వస్తున్నాయి. క్రమక్రమంగా గ్రామీణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలుగా మార్చే కార్యక్రమం చేపడితే పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

(ప్రాంతీయ పర్యవేక్షణాధికారులుగా రెండుజిల్లాల కళాశాలళ్లో అకడమిక్‌ పరీక్షల, అభివృద్ధి పర్యవేక్షణలో అనేక సమస్యలు వచ్చేవి. రెండువందల కళాశాలలో కడప, అనంతపురంలో నా పర్యవేక్షణ కాలంలో వందకుపైగా కొత్త కళాశాలలు మంజూరు అయ్యాయి. ప్రశ్నాపత్రాలు హైదరాబాద్‌ నుండి రక్షణతో జిల్లా కేంద్రాలకు ఆర్‌.ఐ.ఓ.లో తెచ్చేవారు. బారకోడ్‌ షీట్లతో పరీక్షలు, అనేక వర్శ్‌షాపులు, ఓరిఎంటేషన్సు, పని వత్తిడి అమితంగా ఉండేది. ఈనాడు జిల్లాకు ఒక ఆర్‌ఐఓ, వాహన సౌకర్యం, అన్ని వసతులు, సౌకర్యాలు వచ్చాయి.

కొన్ని అనుభవాలు, వాటికి పరిష్మారాలు ఎప్పటికి మరువలేను. పర్షపాడు కళాశాలలో ఒకసెట్‌కు బదులు మరో సెట్‌ పరీక్షలలో ఇచ్చారు. అదే తప్పు జరిగితే కర్నూల్‌లో ప్రిన్స్‌పాల్‌ను సస్పెండ్‌ చేశారు. విషయాన్ని బోర్డు సెక్రటరీ పి. సుబ్రమణ్యం గారికి తెలియచేశాను. ప్రొద్దుటూరు నుండి ప్రశ్నాపత్రాలు తెప్పించి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించాలని నన్ను ఆదేశించారు. ఆ ఏర్పాట్లు చేశాను.

అలపర్తి పిచ్చయ్య చౌదరి * ట్రీ

ప్రీన్స్‌పాల్‌ పొారబాటుకు, మానవతా దృక్పథంతో పరిశీలించి, అతనికి ఇబ్బంది రాకుండా, విద్యార్థులకు పరీక్షలకు నష్టం జరుగకుండా పరిష్మరించాను. అదే విధంగా సెట్‌కు బదులు మరో సెట్‌ ఇవ్వటం మైదుకూరు జూనియర్‌ కళాశాలలో జరిగింది. వారు వెంటనే తెలుసుకొని తప్పును సరిదిద్దుకున్నారు. ఇంటర్‌ బోర్డు సెక్రటరీ శ్రీనివాసరావు గారు చాలా కోపగించుకున్నారు.. వీడియో కాన్ఫరెన్స్‌లో చాలా చాకచక్యంతో ఈ విషయం వెలుగులోకి రాకుండా, చిన్న విషయాన్ని పెద్ద విషయం చేయకుండా, ప్రభుత్వానికి అపప్రద రాకుండా, విద్యార్థులకు సమస్యలేకుండా పరిష్కరించాను. రాయచోటిలో పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి పరీక్ష సమాధాన పత్రాలు కొట్టి వేశారు. ఫోటో కాపీ అందటంతో విషయం బయటకు వచ్చింది. విచారణాధికారిగా నన్ను వేశారు.

ఇంటర్‌ బోర్జులో ప్రత్యేకంగా సెక్రటరీతో మాట్లాడి సమాధాన పత్రం ఒరిజినల్‌ తెప్పించి, రికార్డు సమయంలో పరిష్కారం చేసి విద్యార్థికి న్యాయం చేశాం. ఒక్క రోజులో బోర్డులో ఆ సమాధాన పత్రం ప్రాంతీయ కేంద్రం నుంచి తెప్పించి రీవ్యాల్యు చేయించి, పరిష్కరించాను. ప్రతిపనికి విపరీతమైన 'ఫాలో అప్‌' నేను ఉన్నతాధికారుల నుండి నేర్చుకున్న పాఠాలు, సకాలంలో న్యాయం చేయాలి అనే నా దృక్పథం జాయింట్‌ సెక్రటరీగా రివాల్యువషన్‌, రకౌంటింగ్‌లో వేలాది మంది విద్యార్థులకు న్యాయం చేయటంలో వ్యక్తిగతంగా ఎంతో కృషి చేశాను. అదో ఆత్మతృప్తి. కడప నుండి ఏ విద్యార్థి వచ్చినా బోర్డులో నేరుగా నన్ను కలిసేవారు.

ఉపాధ్యాయవృత్తి, అడ్మినిస్ట్రేటర్‌, సంఘసేవ, ప్రజాహిత సంబంధాలు, ఆస్తులు, అంతస్తులు, స్నేహం, బంధుత్వం, ఉద్యోగబంధం, అనురాగబంధం ఇలా అన్ని రుచులు చవిచూశాను. ఈ ప్రాంతంలో జన జీవనంలో కలిసిపోయాననే అనుకుంటున్నాను.

మూడు దశాబ్దాలుగా ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తున్న పాథత్రను, కృషిని త్రోసిపుచ్చలేము. ప్రశ్నాపత్రాల లీకేజి, కొరతల వంటి సమస్యలను అధిగమించి, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా డిగ్రీ కళాశాలల అడ్మిషన్లు, ఐ.ఐ.టి. - సాంకేతిక విద్య అడ్మిషన్లకు వీలుగా పరీక్షా ఫలితాలు వెలువరిస్తూ లక్షలాది సమాధన పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేస్తూ జిల్లాలలో పటిష్టమైన యంత్రాంగంతో టీవై + కడప గడపలో జీవన మధురిమలు

ముందుకుపోతున్న ఇంటర్‌ విద్యామండలిని, అడ్మినిష్టేషన్‌ చేస్తున్న ఇంటర్‌ విద్యాకేంద్ర కార్యాలయాలను, జూనియర్‌ లెక్చరర్ల, ప్రిన్స్‌పాల్స్‌ ఆత్మాభిమానాన్ని, కృషిని, దీక్షను గండికొట్టే విధంగా ఇంటర్‌ విద్యను మాద్యమిక విద్యలో విలీనం చేసే ప్రయత్నాలు జరగడటం శోచనీయం. ఏది వమయినప్పటికి మేధావులు, ఉద్యోగ సంఘాలు, శాసనమండలి సభ్యులు, ఇంటర్‌ విద్యకు సంబంధించిన వారితో సంప్రదించి, సలహాలను తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళితే బాగుంటుందని నా అభిప్రాయం. వ. ఇంటర్‌ బోర్డులో పనిచేసే సమయంలో మరో జాయింట్‌ సెక్రటరీ కృష్ణప్రసాద్‌, విజయపూర్ణిమల సహకారం మరువలేను. శశాంక్‌ గోయిల్‌తో పట్టుబట్టి పి. ఆర్‌.ఓ.గా పులివెందులకు చెందిన ఇంగ్లీషు లెక్చరర్‌ రామసుబ్బన్నను బోర్డులో వేయించాను. వై.ఎస్‌. వివేకానందరెడ్డి గారు అన్నమాటలు నాకు ఇప్పటికి గుర్తున్నాయి. రామసుబ్బన్న ప్రతిభ నాకంటే మీకు బాగా తెలుసు. ఆతనికి బోర్డులో పనిచేసే అవకాశం ఇవ్వండి అన్నారు. (ప్రజాప్రతినిధిగా ఆయన చెప్పినప్పుటికి, ముఖ్యమంత్రి సోదరుడయినా, బోర్డు కార్యదర్శి వెంటనే స్పందించలేదు. ఎన్నోసార్లు నా ద్వారా ఆయన రామసుబ్బన్న గురించి అడిగేవాడు. ఆర్‌.ఐ.ఓ.గొ నేను ఏ సమస్యాత్మక కేంద్రానికి పంపినా డిపార్ట్‌మెంట్‌ల్‌ ఆఫీసర్‌గా వెళ్ళేవాడు. అతని నిజాయితీ, అంకితభావం నాకు తెలుసు. ఆయన సేవలు గుర్తించిన నేను, బోర్డు సెక్రటరీతో పలుమార్లు చెప్పి బోర్డులో నియమించే విధంగా చర్యలు తీసుకున్నాను. మరో ప్రిన్స్‌పాల్‌ పోలిరెడ్డి సేవలను గుర్తించి, సెక్రటరీతో మాట్లాడి అడిన్మిస్టేషన్‌ జాయింట్‌ సెక్రటరీగా నియామక ఉత్తర్వులు పంపాను. కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన బోర్డులో చేరలేదు. నేను బోర్జులో రాకముందు కడప వారికి, రాయలసీమ వారికి స్కీమ్‌ ఆఫ్‌ వాల్యువేషన్‌, రీటోటలింగ్‌, రివాల్యువేషన్‌, మాల్‌ప్రాక్టీస్‌, ఇతర కమిటీలలో అవకాశాలు తక్కువగా ఉండేవి. ఆ అన్యాయాన్ని సరిదిద్దాను. కడప పట్ల, రాయలసీమపట్ల నా బాధ్యతను గుర్తించి, బోర్డులో నేను పనిచేసినంత కాలం వారి అవకాశాలు మెరుగుపరిచాను. అలపర్తి పిచ్చయ్య చౌదం + ట్రీలీ

స్వంత జిల్లా అయిన గుంటూరులో స్పాట్‌ వాల్యువేషన్‌లో సమస్యలు వస్తే సెక్రటరీ నన్ను అక్కడకు పంపారు. ఎయిడెడ్‌, గవర్నమెంట్‌ లెక్చరర్ల దీర్హ కాలిక టి.ఎ. సమస్యలు పరిష్కరించాను. ఎయిడెడ్‌, గవర్నమెంట్‌ లెక్చరర్ల మధ్య సయోధ్యకు కృషి చేశాను గుంటూరులో పదవి విరమణ సందర్భముగా ఘనసన్మానం అందుకున్నాను. జన్మభూమి రుణం తీర్చుకున్నాను.

గుంటూరులో స్పాట్‌ వాల్యువేషన్‌ సెంటర్‌లో ఏ సమస్యలొచ్చినా సెక్రటరీగారు నన్ను పంపేవారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో ఇంటర్‌ విద్యామందలికి సంబంధించిన విచారణాధికారిగా ఎన్నో సమస్యలు జయప్రదంగా పరిష్మరించాను.

కడపలోని పేద విద్యార్ధులు అనేకమందికి విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, నెల్లూరులోకల కార్పొరేటు సంస్థలలో అడ్మిషన్లు, ఫోనుద్వారా సంబంధిత జిల్లా అధికారుల ద్వారా ఫీజుల రాయితీతో అడ్మిషన్లు ఇప్పించేవాడిని. ఆ విషయంలో విద్యాసంస్థల అధిపతులు కూడా సహకరించేవారు. ఏ విషయాన్ని దాచేవాడిని కాదు సెక్రటరీగారికి ఆ విధంగా పేద విద్యార్థులకు సహాయపదుతున్నానని చెప్పాను. అదేమి అవినీతి కాదులే అని సమర్ధించేవారు. ఈ విధంగా లక్షల రూపాయలు రాయితీల ద్వారా పేద విద్యార్థులకు, మిత్రులకు సహాయపడ్డాను

ఒకసారి కమిషనర్‌ గారికి స్కీము, రివాల్యుపషన్‌, రీకౌంటింగ్‌, మాల్‌ప్రాక్టీస్‌ కమిటీలలో ప్యానల్స్‌ తయారుచేసి, ముఖ్యంగా కడప వారిని ఎక్కువమందిని వేసి ఫైలు తీసుకువెళ్ళాను ఏమి చౌదరి! కడప వారితో నింపేశావు అన్నారు. ఉద్యోగ నాయకులు ముందే ఈ సంభాషణ జరిగింది. ఏదైనా నన్నడిగితే గణాంక వివరాలతో వెంటనే స్పందించేవాడిని గతంలో ఈ కమిటీలకు అతి తక్కువ మందిని రాయలసీమ వారిని పిలిచేవారు. న్యాయబద్ధంగా సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని, బోర్డులో సమగ్రమైన లిస్టు ఉండాలని వాదించి, లిస్టు క్రమబద్ధం చేసి, ఉద్యోగ సంఘాల మన్ననలు పొందాను.

నేను వచ్చాక రాయలసీమ వారికి న్యాయం చేయాటానికి 'ప్రయత్నిస్తున్నానన్న మాటలు విని, విమర్శలకు తావులేకుండా, పారదర్శకంగా, అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేయాలని కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ సుతిమెత్తగా మందలించారు. దీలి + కడప గడపలో జీవన మధురిమలు

తెలంగాణాలో నల్గొండ, కరీంనగర్‌, వరంగల్‌లో పరిక్షలలో అనేక సమస్యలు వచ్చేవి. రాజమండ్రి, వైజాక్‌ సెంటర్లలో స్పాట్‌ కేంద్రాల విషయాలలో అనుభవంతో సమస్యలు పరిష్కరించాను. ఉద్యోగ సంఘాలు, జిల్లా అధికారులతో నిరంతరం సంప్రదించే వాడిని. బోర్డులో అన్యాయం జరిగినచోట దానిని క్రమబద్ధం చేయటంలో కృషి చేశాను. సర్కార్‌, తెలంగాణా జిల్లాలో పరీక్షల సమయంలో విస్తృతంగా పర్యటించే వాడిని. ఆ స్పాట్‌ వాల్యుపషన్‌ కేంద్రాలలో నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేవాడిని. గుంటూరులో జరిగిన పదవీవిరమణ సభలో రాష్ట్ర జూనియర్‌ లెక్సరర్ల సంఘం అధ్యక్షులు గొనారెడ్డి నన్ను అందరివాదుగా అభివర్ణించారు. లై(బైరియన్లు, పీడిలకు పరీక్షలలో వారి నియామకాల నిష్పత్తిని పెంచటానికి చర్యలు తీసుకున్నాను. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాల నిచ్చాయి. ఎయిడెడ్‌, వృత్తి విద్యా కళాశాలల లెక్చరర్ల పోరాటాలకు మద్దతునిస్తూ, సకాలంలో వారి సమస్యల పరిష్మారానికి విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి, కమిషనర్లకు ఎప్పటికప్పుడు సుదీర్హ అనుభవంతో సలహాలనిచ్చి, పరిష్కార మార్గం “మాపేవాడిని. పనిచేసింది రెండేళ్ల లో పైనా, రాష్ట్రవ్యాప్తంగా అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నాను. నా నిజాయితీ, అంకితభావం, నిబద్ధత, అనుభవం, అవగాహనను గుర్తించిన బోర్డు సెక్రటరీ అసాధారణ అధికారాలు ఇచ్చి, నాపై నమ్మకం ఉంచేవారు. వారిచ్చిన బాధ్యతలు నిబద్ధతతో నిర్వహించేవాడిని. నాతోపాటు చదివిన జిఎన్‌ రావు గుంటూరు కలెక్టరుగా పనిచేస్తున్నప్పుడు ఆయనను కలిశాను. నడింపల్లిలో ఒక గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం ఉందని నన్ను వెంటబెట్టుకొని వెళ్లారు.ఆ ఊరు చేరుకోగానే ఆర్‌డిఓ సిబ్బంది కలెక్టరుకు స్వాగతం పలికారు. కలెక్టరు వెంట ఉన్న నాకు ఆర్‌డిఓ నమస్మరించారు. కలెక్టర్‌ వెంట వున్నందుకు నమస్మరించాడులే. అనుకొని చూసీ చూడనట్లు ప్రక్కకు తాలిగాను. అతడు వదలకుండా మరల నమస్మారం చేశారు. అలపర్తి పిచ్చయ్య చాదం + దీదీ

రాయలసీమలో నాకు చాలాసార్లు ఒక అనుభవం ఉంది. ఉపాధ్యాయుడుగా ఎన్నో వందల మందికి, ఎన్నో సంవత్సరాలుగా పాఠాలు చెప్తంటాం. అందరిని గుర్తించే పరిస్థితి ఉపాధ్యాయునికి ఉండదు. కానీ, విద్యార్థికి చిన్ననాటి ప్రాధమిక పారశాల ఉపాధ్యాయుడు నుండి యూనివర్సిటీ ఆచార్యులు వరకు అందరూ గుర్తుంటారు. గుర్తించ లేదు కదా అని విద్యార్థి వదలదు. తన విషయం, తను చదివిన విషయం ఆ అధ్యాపకుడికి గుర్తు చేస్తాడు. ఆ రకమైన గౌరవం ఏ ఉద్యోగికి లభించదు. “గుర్తించలేదా సార్‌! నేను భాస్కర్‌ను...” అని అన్నాడు. ఆర్‌డిఓను అప్పుడు నిశితంగా చూశాను. ఎప్పుడో రాయచోటిలో ఆ విద్యార్థికి జనరల్‌ బయాలజీ చెప్పటం గుర్తుకు వచ్చింది. నేను చెప్పిన పాఠాలు, నాగురించి కలెక్టర్‌తో ముచ్చటించబోయాడు. అందరం సభావేదిక వద్దకు చేరాం.

(గ్రంథాలయ నిర్వాహకులు ఒక పెద్దాయనను, గ్రామ పెద్దగా, రిటైర్టు అధ్యాపకుడిగా పరిచయం చేశారు. ఆయన నాకు నిడుబ్రోలు హైస్కూల్‌లో లెక్కలు చెప్పిన హరి మాస్టారు. నా జీవితంలో మరువరాని అపూర్వ సంగమం. ఒకే వేదిక మీద ప్రారంభకులుగా, ఆప్తమిత్రులు, యూనివర్శిటీలో సహపాఠకుడు కలెక్టరు, పూర్వ విద్యార్ధి ఆర్‌డిఓ సభను అలంకరించిన నా గురువు ఉండటం ఆ వేదికను పంచుకోవటం ఆనందం కలిగించింది. ఆ ప్రారంభోత్సవ భవనం, స్కూలు మా దగ్గరి బంధువులది కావటం మరో విశేషం. యాదృచ్చికమైనా అపూర్వం.

భి భి సా

కడప చారిత్రిక ప్రాముఖ్యత, అభివృద్ధిలో దశాబ్దాల వెనుకంజ, (గ్రామీణ పేద ప్రజల పరిస్థితి, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, కడప గురించి రాస్త్రానికి తెలియవలసినది ఎంతో ఉన్నదని నా అభిప్రాయం. కడపలో అద్భుత దర్శనీయ స్థలాలున్నాయి. ప్రాంతీయ ప్రభుత్వ కార్యాలయాలకు ముఖ్య కేంద్రం. పరిపాలనా సౌలభ్యమున్న జిల్లా కడప. ్రధాన కేంద్రాలైన కడప, రాయచోటి, రాజంపేట, కోడూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల,జమ్మలమడుగు, కమలాపురం 70 కి.మీ. పరధిలోనే ఉన్నాయి. జిల్లాలో మారుమూలలకు సైతం రెండు గంటలలోపు చేరవచ్చును. ముంబై చెన్హై హైదర్గాబాద్‌లకు దక్షిణ మధ్యరైల్వే మార్గాలలో ప్రధాన కూడలి. ట్రీ/ + కడప గడపలో జీవన మధురిమలు

ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామాలయం, నందలూరులో శ్రీ సౌమ్యనాధస్వామి, రాయచోటిలో వీరభద్రస్వామి, (బ్రహ్మంగారి మరం, ్రొద్దుటూరులోని శ్రీ ముక్తి రామేశ్వరాలయం, మహాకవి పద్మశ్రీ డా॥పుట్టపర్తి నారాయణచార్యులు, శివతాందవాన్ని రాసిన గొప్ప ప్రాంతమైన శివాలయం తదితర దేవాలయాలను కడప జిల్లాలో ఎన్నో ఉన్నాయి. సిద్ధవటం కోట, గండికోట, పుష్పగిరి చారిత్రక ప్రాముఖ్యత గల కేంద్రాలు. రాయచోటి వీరభద్రస్వామి దేవాలయం, పులివెందుల సమీపంలో శ్రీ మోపూరు ఖైరవేశ్చరస్వామి దర్శనం కోసం కర్ణాటక నుండి భక్తులు నిరంతరం వస్తూ ఉంటారు. మైలవరం, పింఛా, బ్రహ్మసాగరం కడపకే తలమానికమైన జలవనరుల జలాశయాలు, ఒంటిమిట్ట, బద్వేలు చెరువులు ఎంతో [ప్రాముఖ్యత సంపాదించాయి. కడప పట్టణంలో దేశంలోనే ప్రాముఖ్యత పొందిన దర్గా, క్రైస్తవ చర్చిలున్నాయి. కడపలోని ప్రాచీన దర్గాను దర్శించడానికి దేశవిదేశాల నుండి భక్తులు వస్తూవుంటారు. కడప జిల్లాలో 126 జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళశాలలు, తాలూకా కేంద్రాలలో సైతం ఇంజనీరింగ్‌ కళాశాలలు కడప పట్టణంలో ఇంజనీరింగ్‌, మెడికల్‌, నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలు, యోగి వేమన విశ్వవిద్యాలయం ఉన్నాయి. తెలుగు భాష కోసం జీవితాంతం అహర్నిశలూ (శ్రమించిన సిపిబ్రౌన్‌ దొర పేరుతో నిర్మించిన (గ్రంధాలయం తప్పకుండా చూడాల్సిందే. వేలాది కోట్ల వ్యయంతో భారీ ఉక్కు పరిశ్రమల స్థాపనకు వేదిక సిద్ధమయింది కడపలో విమానాశ్రయం విస్తరణ, జమ్మలమడుగులో మరో విమానాశ్రయం, ఏర్పాట్లకు కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాజకీయ వైషమ్యాలు, కక్షలు తగ్గిపోవటంతో అశాంతి తగ్గి పరిశ్రమల స్థాపనకు ఇతర రాష్ట్రాల వారు సైతం ముందుకు వస్తున్నారు. రాజకీయ సుస్టిరత ఈ దిశలో కడపకు ప్రయోజనకారిగా ఉండటం ముదావహం. టి టి టి రాయలసీమలో కుటుంబ బంధం ఎంతో ఆనందమయంగా ఉంటుంది. కడపలో 1970-80 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ వ్యవస్థను గమనించాను. కుటుంబంలో తండ్రి, పెద్ద కుమారుడు తమ ఆర్ధిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, స్థితిగతులు చూసుకుంటూ, కుటుంబంలో ఒక్కరు లేక ఇద్దరిని చదువులకు పంపేవారు. విద్యార్థులు కూడా కష్టించి చదివేవారు. అలపర్తి పిచ్చయ్య చౌదరి * గ్రరి

(గ్రామీణ (ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు కళాశాల తరగతులు అయిన తరువాత ఇంటికి వెళ్ళి వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు సహాయపదడేవారు. వేరుశనగ (ప్రధానమైన పంట. వర్నాధారమైన ఈ పంట సాగు, దిగుబడి అయ్యెంతవరకు కుటుంబం అంతా కష్టపడాల్సిందే. కాయ కష్టంతో పండించే ఈ పంటే గ్రామీణ రైతులకు జీవనాధారం,

గ్రామీణ ప్రాంతాలలో కుల, మత, అంతస్థులతో సంబంధం లేకుండా, తారతమ్యం లేకుండా మహిళలు వ్యవసాయ భూములలో పనిచేయటం చూస్తాము. ఏ విధమైన భేషజాలు కనిపించవు. సమష్టిగా పని చేయటం వారి మధ్య అనురాగబంధం దృథపడటానికి కారణమవుతుంది. వివాహబంధం విషయంలో కూదా కట్న కానుకల పై పెద్ద పట్టుదలలు కనిపించవు. సమష్టి కుటుంబ బాధ్యతలు దృష్ట్యా పరాయి ఇంటి అమ్మాయి తమ ఇంటికి కోడలిగా వచ్చినా, తమ ఇంటి అమ్మాయి మరో ఇంటికి వెళ్ళినా ఆస్తులను వెంట వీసుకురావటం కనిపించదు. పుట్టింటివారు ధనాన్ని బంగారును స్తీ ధనంగా ఇచ్చినా ఉమ్మడి కుటుంబంలో ఉపయోగించుకుంటారు. కనుక ఆడపిల్లలు తల్లిదండ్రుల స్థిరాస్థులను తెచ్చుకొని, ఆ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం పొందుతూ, వారి తల్లిదండ్రులను ఆ ఆస్తుల అజామాయిషీకి ఇచ్చి ప్రతి విషయంలో వారి ప్రమేయం వంటి విషయాలు ఉండవు. ఈ ఆదాయాలతో కుటుంబ మహిళలు ప్రత్యేక వ్యక్తిత్వంతో, అహంతో ప్రవర్తించే అవకాశం ఉండదు.

మహిళలందరూ కష్టించి పని చేయటంవలన అందరిలో ఆనందమయ జీవితం కన్పిస్తుంది. కొన్ని చిన్న సమస్యలు, వచ్చినా కుటుంబ పెద్దలపట్ల గౌరవంతో వారి సూచనలు ఆమోదిస్తూ మెలుగుతారు. క్రమక్రమంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి కారణంగా, పెద్ద కుటుంబాల వలన జీవనాధారమైన వ్యవసాయం అందరికి జీవనోపాధిగా లేక వేరు వేరు ప్రాంతాలలో స్థిరపడినా, వేరే ఉపాధులలో ఉన్నా వారి మధ్య అవగాహనలో, కుటుంబ బంధంలో, ఆప్వాయత, అనురాగాలలో అంతరం అంతగా కనిపించదు.

అనేక కుటుంబ సంబంధమైన వేడుకలు, కష్టకాలంలో సహితం వారు స్పందించే తీరును పరిశీలించిన తరువాత ఈ విధమైన అంచనా వేయగలుగుతున్నాను.

బీ) + కడప గడపలో జీవన మధురిమలు

తల్లిదండ్రుల కష్టాలను గమనించిన బిడ్డలు చదువు సంధ్యలు కొనసాగిస్తూ, చదువులపట్ల బాధ్యతలను గుర్తించి, సౌకర్యాలు, వసతులు లేకపోయినా చదువులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ గ్రామాలలో పాఠశాలలకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం నడిచి పోతున్న గ్రామీణ విద్యార్థులను చూస్తూనే ఉన్నాను. మండుటెండలో పాదచారులై, పాదరక్షలు లేకుండా నడుస్తున్న విద్యార్థులను ప్రభుత్వ జీపులో నేను వెళుతుండగా గమనించి, పారశాలలకు చేర్చిన సందర్భాలెన్న్నీ ఉన్నాయి. వారు ఆణిముత్యాలుగా, మట్టిలో మాణిక్యాలుగా ప్రతిభా విశేషాలలో రాణించటలో ఆశ్చర్యం అనిపించదు. బంధుత్వానికి పెద్ద పీట వేస్తారు. రాజకీయాలు, ఆస్తులు, అంతస్థులు వారిని కుటుంబ జీవితంలో విడదీస్తున్నట్లు కనిపించదు. అనంతపురం, కడప జిల్లాల ఇంటర్‌ విద్యామండలి పర్యవేక్షణాధికారిగా కొత్త కళాశాలలు మంజూరు, కళాశాలల తనిఖీ, ఆకస్మిక తనిఖీలు సందర్భంగా మారుమూల 'ప్రాతాలను సైతం దర్శించి కుటుంబ స్థితిగతులను తెలుసుకోగలిగాను. అనుభవాల సమాహారంతో వారి జీవన గమనాన్ని అంచనా వేయగలిగాను. అనంతపురంలో వజకరూరు, మడకసిర, రొద్దం, రాయదుర్గం, కళ్యాణదుర్గంలో కొన్ని ప్రాతాలు ఎదారి ప్రాంతాలను తలపిస్తాయి. కడప జిల్లాలో కూడా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బద్వేలు ప్రాంతాలలో అనేక గ్రామాలలో మంచినీటి ఎద్దడి కన్పిస్తుంది. కడప జిల్లాలో రాయచోటి పట్టణంలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారినా మంచినీటి సమస్య నిరంతరం వేధిస్తూ, నీటిని కొనే పరిస్థితి ఉంది. (గ్రామీణ ప్రాంతాలలో సాగునీటి వసతి, సురక్షిత మంచినీటి పథకాలు, రహదారులలో నిర్మాణం, సకాలంలో మరమ్మతులు, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు, పాఠశాల, వైద్యశాల, పశువైద్యశాలల భవనాలు, సిబ్బంది. గ్రామీణ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, వంటి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి వుంది. గ్రామీణ రుణ మాఫీ పధకాలు, పావలా వడ్డీ, ఇందిరమ్మ గృహాలు, కిలో 2 రూ। బియ్యం, జాతీయ ఉపాధి పధకం, ఆరోగ్యశ్రీ, 104, 108, వృద్ధాప్యపు పించన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వం ఐ.టి. రంగం మీద శ్రద్ధ, సాంకేతిక కళాశాలల ఏర్పాటు కారణంగా (గ్రామీణ (ప్రాంతాలకు చెందినవారు ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో ఇక్కడి సాంకేతిక అలపర్తి పిచ్చయ్య చౌదరి * / (౮

విద్యావకాశాలు వినియోగించుకొని చదివి విదేశాలలో సైతం స్థిరపడి గ్రామీణ సంపద పెంపుకు కృషి చేస్తున్నారు. గల్స్‌ దేశాలలో సైతం మధ్య తరగతులవారు, పేదలు, ఉపాధి కోసం వలసలు వెళ్లి, రాజంపేట ప్రాంతంలో సుభిక్షానికి బాటలు వేస్తున్నారు.

భారీ పరిశ్రమల స్థాపన, ఖనిజ సంపద వినియోగించుకొని ఆ దిశలో మౌలిక సదుపాయాలను పెంచే దిశలో ప్రస్తుత ప్రభుత్వం పనిచేయటం ద్వారా కడప జిల్లా రాష్ట్రంలోనే పారిశ్రామికంగా ముందున్న జిల్లాగా రూపొందే దిశలో ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. విద్యాసంస్థలు గణనీయంగా పెరిగాయి. వట్టణాలు, మునిసిపాలిటీలుగా, కడప పురపాలక సంస్థ అయ్యింది. అనంతపురంలో సామాజిక సేవాసంస్థల కృషిని అభినందించవలసినదే. ఫాదర్‌ ఫెగ్రర్‌ (ఆర్జీటీ), సేవా సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు, సత్యసాయి మంచినీటి పధకం ద్వారా కరువు (ప్రాంతంలో దాహార్తుల ఆర్తిని తీర్చిన ఘనత ఆ సంస్థల కృషి కూదా కొంత కారణం. ఇటువంటి సంస్థల కృషి కడప జిల్లాకు కూడా విస్తరించవలసిన అవసరం ఉన్నది.

(గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితుల కారణంగా, పిల్లలను చదివించుకోవాలని పట్టణాలను చేరేవారి సంఖ్య పెరిగింది. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ వనరుల ద్వారా వచ్చిన ఉత్పాదకాలు, గొర్రెలు, మేకలు, ఎనుములు (ోదలు), ఆవులు ప్రధాన సంపద. పూరిగుడిసెలలో, చిన్నగ్భృహాలలో గేదెలు, గొలైలతో సహజీవనం గమనిస్తుంటాం. అనారోగ్య పరిస్థితుల నుండి బయటికి రావాలి అంటే విద్యా ఉపాధి మార్గాలను పెంచడం కంటే గత్యంతరం లేదు.

(గ్రామీణ రహదారులు దారుణంగా ఉన్నాయి. రవాణా సదుపాయాలు లేవు. క్రిక్కిరిసిని జనంతో ఆటోలు, వాహనాలపై ప్రయాణాలు చేస్తున్నారు. రహదారుల ప్రమాదాలలో ప్రతీ ఏటా వందలాది మంది (గ్రామీణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

(గ్రామీణ రహదారులు, మంచినీటి వసతి, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు కడప (గ్రామాలలో నిరంతరం యుద్ధ ప్రాతిపదికలో కొనసాగాలి. ప్రభుత్వం ఈ దిశలో స్పందిస్తే ఈ జిల్లా సుభిక్షంగా ముందుకు పోగలదు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పెద్దపీట వేయవలసి ఉన్నది. నిధుల కొరత లేకపోయినప్పటికి, నిరంతర పర్యవేక్షణ, నియంత్రణ ద్వారా సత్ఫలితాలను పొందవలసి ఉన్నది.

/ ] + కడప గడపలో జీవన మధురిమలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, మౌక్తికాపురానికి చెందిన మా సమీప బంధువు టి.వి చౌదరి కుటుంబాన్ని కుటుంబ బంధానికి ఒక ఉదాహరణంగా చెప్పదలుచుకున్నాను. వారి తాత గారు అటవీ ప్రాంతంలో కొన్ని ఎకరాల భూమీ కొని, కుటుంబానికి దూరంగా నివాసయోగ్యం చేసుకున్నాడు. తన కుటుంబాన్ని విస్తరింప చేసుకొని, అన్ని కులాల, వృత్తి పనుల వారిని ఆ ప్రాంతంలో స్థిరపదేలా చేశారు. టి.వి. చౌదరి గారి తండ్రి ములకన్నగారు ఆ గ్రామంలో పాఠశాల, వైద్య, ఆరోగ్య, సంక్షేసు కార్యక్రమాల ద్వారా ఒక గ్రామంగా రూపొందే విధంగా కృషిచేశారు. ఈ గ్రామమే మౌక్తికాపురం, ములికన్నగారంటే అనంతపురంలో తెలియని వారులేరు. ఆయన కుమారుడు టి.వి చౌదరి. రాష్ట్ర మైన్స్‌, జియాలజీ శాఖకు డైరక్టరుగా పదహారేళ్లు పనిచేశారు. సుదీర్హ కాలం ఆ శాఖలో దైరక్టరుగా పనిచేసి శాఖను అభివృద్ధిని చేసి, ప్రభుత్వ ఆదాయం పెంచి ముఖ్యమైన శాఖగా తీర్చిదిద్దారు. వారి ఉమ్మడి కుటుంబం ఇప్పటికి నిరంతరం సాగిపోతున్నది. నాకు ఇప్పటికి ఎవరు స్వంత సోదరులో, చిన్నాన్న పెద్దనాన్న కొడుకులో అర్ధం కాదు. ఆప్యాయత, అనురాగాలు, మానవతా విలువలకు ఆ (గ్రామీణ కుటుంబం నిలిచిపోతుంది. అన్న తమ్ముల్లలో చాలామంది వివిధ ఉద్యోగాబలో సంఘంలో ఉన్నత స్థానాలలో ఉన్నా, (గ్రామాన్ని మరచిపోవటం లేదు. వారి మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉన్నది. ఒక ట్రస్టు ద్వారా వారి గ్రామాన్ని అభివృద్ది పరుస్తున్నారు. గత మూడు నాలుగు దశాబ్దాలుగా బంధురీత్యా అనేక మందిని రాయలసీమలో గమనిస్తున్నాను. అతిశయం, అహంకారం, అధికార దర్చం వారిలో కనిపించదు. ఇలా ఎన్నో కుటుంబాలు కుటుంబ బంధం కొనసాగిస్తూ రాయలసీమ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన వీరి కుటుంబ సభ్యులు (గామ (ప్రాంతాలలో కాయాకష్టంతో పనిచేస్తూ, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు. జనజీవనంలో ఎన్నో ప్రత్యేకతలు. కడప జిల్లాలో (గ్రామీణ ప్రాంతాలలో కొన్ని గ్రామాలు “ఫ్యాక్టన్‌' గ్రామాలుగా గుర్తింపు పొందాయి. చిన్నచిన్న మాట పట్టింపులు, వ్యవసాయ భూముల వద్ద తగాదాలు ఆత్మీయుల మధ్య చిచ్చు పెట్టి గ్రామీణ కక్షలకు కారణమయ్యేవి. సంవత్సరాల తరబడి కేసులతో, జిల్లా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆస్తులను కోల్పోయి, అలపర్తి పిచ్చయ్య చౌదరి శ (ల

జైళ్ళ పాలవటం జరుగుతూ వచ్చేది. విధ్యాభివృద్ధి కళాశాలలు, పాఠశాలలు విస్త తంగా ఏర్పడటం, గ్రామీణ సంక్షేమం పట్ల (గగామాలలో అవగాహన పెరగటం, వారి సంతతి చదువులలో ముందుకు వచ్చి, స్థిరపడటంలో ఆ సంస్కృతికి చరమగీతం పాడటం జరుగుతున్నది. పోలీస్‌ శాఖ వారు ఈ దిశలో శాంతి సంఘాల ఏర్పాటు, ప్రచారంతో కొంత మంచి ప్రయత్నాలే చేస్తున్నారు. సినిమాలలో చూపిస్తున్న భయానక సంఘటనలు, బాంబుల హోరు, రాయలసీమలో లేవు.

ఒకసారి ఒక మిత్రుడితో తిరుమలకు దైవ దర్శనానికి వెళ్లాం. సర్కారు ప్రాంతానికి చెందిన (గోదావరి పరివాహక ప్రాంతం) ఒక కుటుంబం హోటల్‌లో మా ముందు కూర్చున్నారు. మాటల సందర్భంలో మీ రెక్కడ ఉంటున్నారు అని వారు అడిగారు. కడప అని సమాధానమిచ్చాను. గుంటూరు నుండి కడపలో స్థిరనివాసం ఏర్పరచుకున్నామనీ తెలిసి, మీకు భయం లేదా! అక్కడ వారు హత్యలు చేస్తారు కదా అన్నాడు. ఎవ్వరు చెప్పారు అన్నాను. సినిమాలలో చూస్తున్నాము కదా అన్నారు రాజశేఖర్‌ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏమిటి అని నన్నడిగాడు ఆయన వీటిని ప్రోత్సహిస్తాడా అని అడిగాడు. తడుము కోకుండా సమాధానమిచ్చాను అటువంటిదేమి లేదు. ఆయనే కాదు, ఏ రాజకీయ నాయకుడు ఎవ్వరిని హత్యలు చేయమని ప్రోత్సహించరు. ఉద్యోగుల విషయంలో కూడా ఏ జోక్యం ఉండదూ దౌర్జన్యాలు ఉండవు. మీరు ఊహించే పరిస్టితులు లేవు అన్నాను.

సంభాషణ పొడిగింపుతో రాష్ట్ర సంపద అంతా కడపలో ఇడుపులపాయలో పెడుతున్నారంట కదా అన్నాడు. కడప జిల్లా దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబడింది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసాయి. వెనుకబడిన జిల్లాలల అభివృద్ధి, అభివృద్ధి చెందిన జిల్లాతో సమంగా తేవడానికి కొన్ని సాహసోపేతమయిన నిర్ణయాలు తీసుకోవలసి ఉన్నది. సొంత జిల్లా అభివృద్ధిని చూపించి, ఆదర్శంగా ఇతర జిల్లాల్లో అలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని రాష్ట్ర అధినేతగా ఆయన నిర్ణయాలు సమంజసమేనని అన్నాను. నేనెంత చెప్పినా అతడు కడపలో ఇన్నేళ్లు ఎలా ఉంటున్నారు అని అంటూనే నాపై సానుభూతి చూపించాడు 0 + కడప గడపలో జీవన మధురిమలు

మానవాళిని ఉద్ధరించటానికి భగవంతుడు మానవ రూపం దాల్చి సాయినాథుని అవతారంగా షిర్డీలో ఉద్భవించారు. బాబా పరబ్రహ్మ స్వరూపుడు. స్వయంతేజో ప్రకాశి. సర్వవ్యాపుకుడైన సాయిని విశ్వసించనివారు తల్లిని కూడా విశ్వసించలేరు. తల్లి అడిగితే అన్నం పెడుతుంది. సాయి ఆకలి ఎరిగి అన్నం 'పెదతాడు. నా తల్లిదండ్రులు సాయి చరణాలను ఆథయించారు. సాయినామ జవ పారాయణముతో జీవితకాలమంతా గడిపారు. పాత పొన్నూరులో సాయి విగ్రహాన్ని తెచ్చి, దశాబ్దాల పాటు పూజలు నిర్వహించిన ఘనత మా తల్లిదండ్రులకు దక్కింది. వృద్దాప్యంలో ఉన్నవారు ఆనాడు మా నాన్న సాయిపూజలు గురించి ఇప్పటికి చెపుతూ ఉంటారు. అనుకోకుండా విశ్రాంత జీవనంలో ఆప్రేరణతో 'సద్దురు సాయి కృపి, 'శ్రీ సత్యసాయి కృప నా అనుభూతులు అనే చిన్న పుస్తకాలు (ప్రచురించాను. నేను ఇంటర్‌ బోర్డు పర్యవేక్షణాధికారిగా పని చేస్తున్నప్పుడు పుట్టపర్తి సాయి బాబాతో కొన్ని స్వీయ అనుభూతూలున్నాయి. పుట్టపర్తిలో వెలసిన (ప్రత్యక్ష దైవం భగవాన్‌ సత్యసాయి బాబా. బాబాశక్తి అనంతం. భక్తుల పాలిట కల్పతరువు శ్రీ సత్యసాయిబాబా. సాయి జీవనమే ఈ సర్వజగత్‌కి ఒక సందేశం. స్వామి మందిరం ఆధునిక దేవాలయం, ప్రశాంత నిలయం ప్రశాంతతకు మరో రూపం. అది ఒక దేవాలయం, మసీదు, యూదుల ప్రార్ధామందిరం. ఎవరు ఏ దైవున్నైనా, హాయిగా ధ్యానించుకునే ధ్యానమందిరం. స్వామి కరుణకు, అదరణకు, (ప్రేమకు ఎల్లలు లేవు. స్వామి దీనజన సేవకు పట్టపర్తిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపథ్రి, అనేక జిల్లాలకు మంచినీటి పంపిణీ వ్యవస్థలు, సత్యసాయి విశ్వవిద్యాలయం, మహిళా డిగ్రీ జూనియర్‌ కళాశాలలు, పుట్టపర్తి, బెంగుళూరులలో అద్భుత ప్రాంగణాలు, నిర్మాణాలు వెనుక సూత్రధారి, పాత్రధారి శ్రీ సాయి భగవానుడే. ఉద్యోగరీత్యా ఒకసారి అనంతపురంలో సత్యసాయి మహిళా జూనియర్‌ కళాశాలలో తొమ్మిది జూనియర్‌ లెక్చరర్ల పోన్దుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించటానికి ఆ విద్యాసంస్థకు కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌, సభ్యురాలు, అలపవర్తి పిచ్చయ్య చౌదరి ఈ (లీ

పదవిరీత్యా నేను సెలక్షన్‌ కమిటి సభ్యులుగా హాజరయ్యాం. ప్రధాన భూమిక నాదే అవటంవలన ఆ పోస్టులకు ఇంటర్వ్యూలకు వచ్చే మహిళాల లెక్చరర్ల ఎన్నికకు సంబంధించి ప్రముఖు వ్యక్తుల నుంచి వత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

స్వామి కళాశాలలో కళాశాలల కన్వీనర్‌ జ్వాలానయ్య గారు స్వామి పటానికి దండవేసి ప్రార్ధనలు జరిపి, హారతిచ్చి ప్రతిభావంతులను ఎన్నిక చేయవలసినదిగా మమ్ములను కోరటం నా మనస్సులో చెరగని ముద్ర వేసింది.

నా మనస్సులో ఏదో ప్రశాంతత చేకూరినట్లు అనిపించింది. ఇంటర్వ్యూలో మేం ముగ్గురు సభ్యులం ఏ విధమైన (ప్రేరణ, వత్తిడి, ప్రలోభాలకు తావు లేకుండా మాధర్మాన్ని నిర్వర్తించార్ల. అత్యంత ప్రతిభావంతులైన మహిళలను ఎన్నిక చేశాం జరిగింది. వృత్తిపరమైన తృప్తిని మొదటి సారిగా పొందాను.

సెలక్షన్‌ కార్యక్రమం పూర్తిచేసి విశ్రాంతి భవనానికి చేరుకున్నాం. జ్వాలానయ్య గారు వచ్చి స్వామి దర్శనానికి పుట్టపర్తి రావాల్సిందిగా ఆహ్వానించారు. చైర్మన్‌, మహిళా సభ్యురాలు అంగీకారం తెలపడం. నాకు అక్కడకు వెళ్లడం అంత ఇష్టం అనిపించక తర్వాత వస్తానని చెప్పి తప్పించుకున్నాను. కానీ, కన్వీనరు జ్వాలనయ్యగారు మాత్రం పట్టువదలకుండా మళ్లీ సాయంత్రం వచ్చి మీరు బాబా దర్శనానికి రావాలి. మరునాడు ఉదయం ఆరు గంటలకు వస్తాను. సిద్ధంగా ఉందండి అని చెప్పి వెళ్లిపోయారు. ఆ పెద్దాయనను నొప్పించటం ఇష్టంలేక సరే అన్నాను.

అప్పటి వరకు నా మనస్సులో ఒకే భావన ఉండేది. సేవాధర్మంతో, ఉద్యోగ ధర్మంతో జీవనం సాగిస్తే చాలు ఇతరులకు సేవ చేయటంలో, సామాజిక సేవలో ఆనందాన్ని వెతుక్కుంటే చాలు అనుకునేవాణ్ణి. అందువలన భగవంతుని సన్నిధానాలు, దేవాలయ దర్శనాలు, కుటుంబసభ్యుల ప్రమేయంతో జరిగేవి కాని, నా మనస్సుకు ఆనందం, ప్రశాంతత కలిగించేవి కావు. నిజం చెప్పాలంటే మొక్కుబడులుగా ఉందేవి.

అలాంటి నేపథ్యంలో మరునాడు ఐదు గంటలకు లేచి దైవరునుపిలిచి కడపకు పోదాం, జీపు సిద్ధం చేయమని చెప్పాను. లగేజి సర్దుకున్నాను. ముందు పట్టణం వదిలేసి జ్వాలానయ్య గారికి ఏదో ఒకటి చెప్పవచ్చులే అని నా ఆలోచన. నేను సిద్ధమై బయటకు వచ్చేసరికి ఉదయం 5-15 గంటలైంది. /లి + కడప గడపలో జీవన మధురిమలు

తెల్లని వస్త్రాలతో జ్వాలనయ్యా గారు ప్రత్యక్షం. ఆయనను తప్పించుకోవాలి అని నేను అనుకుంటే ఎవరో పంపినట్లు వస్తానన్న సమయానికి అర్ధగంట ముందుగనే వచ్చారు. కాదనలేక, చేసేది లేక పుట్టపర్తికి బయలుదేరాను. ప్రశాంతి నిలయం చేరగానే దర్శనానికి పోయేముందు నాకు ప్రత్యేకత వద్దు అని ఆయనకు ఒక షరతు పెట్టాను. స్వామి వెయిటింగ్‌ రూము వద్ద వరండాలో కూర్చోబెడితే స్వామిని అతి సమీపంలో చూడవచ్చని ఆయన అన్నారు. నాకు అటువంటి దర్శనం వద్దన్నాను. అందరితోపాటు రెండు మూడు వరుసలు వెనుక కూర్చుందాము అన్నాను. ఆయన సరే అని నన్ను కూర్చో బెట్టినా, ప్రక్కనే ఆయన కూర్చున్నారు. స్వామి హాలులో నడుస్తూ, మా వరుసలో మాకు అతి దగ్గరగా వచ్చారు. జ్వాలానయ్యను చూసి బంగారు అని సంబోధించారు. జ్వాలానయ్యగారు నన్ను పరిచయం చేయబోయారు. నేను నమస్కారం చేయగా అసంకల్పితంగా స్వామి ఏదో వేసినట్లుగా అది వేడిగా తగులుతుంటే చూశాను. విభూతి నా చేతిలో ఉంది. స్వామి నన్ను బాగా చేశావు! బంగారూ! అనటం విన్నాను. నేను నిర్దాంతపోయాను. ఇంటర్వ్యూలు జరిగిన విషయం బాబాకు ఎవరూ తెలియపరచలేదు. ఆ విషయం అప్పుడే చెప్పాలని జ్వాలానయ్య భావించారు. స్వామి సందర్శన భాగ్యంతో లభించిన ఆనందంతో పరవశం పొందటం నావంతయింది. నాకు తెలియని ఆనందం, ప్రశాంతత ఆనాటి నుండి చోటు చేసుకున్నాయి. స్వామికి పరీక్ష పెట్టాలని దుస్సాహసానికి పాల్పడ్డాను జ్వాలానయ్యగారు, మరి ఎవరి ప్రమేయం లేకుండా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయానికి మా మామగారు, కుమారునితో దర్శనానికి వెళ్ళాను. ఆశ్చర్యం, మరలా స్వామి మా వరుసలో మావద్దకే రావటం, మా మామగారు, నా కుమారుడు స్వామి పాదాలకు నమస్కరించటం, స్వామి నా పై 'అక్షింతలు' సృష్టించి వేసి ఆశీర్వదిస్తుండగా హాలులోని వేలాది మంది హర్షధ్వానాలు చేయటం, నాకు ఆ రోజులలో జుట్టు ఎక్కువగా ఉండటంతో తలలో చిక్కుకుని రాలిన అక్షతల కోసం విదేశీయులు సైతం ఎగబడి తీసుకోవటం ఒక్కసారిగా జరిగిపోయాయి. ఆ రకమైన అదృష్టాన్ని స్వామి అనుగ్రహం పొందగలిగాను. స్వామి సంస్థలో మహిళా ఇంటర్‌ కళాశాలల ఆటల క్రీడల పోటీలు నిర్వహించే అవకాశం. అన్‌ ఎయిడెడ్‌ అలపర్తి పిచ్చయ్య చౌదరి శ “ద్ర

కళాశాలల టప్రిన్స్‌పాల్స్‌, కరస్పాండెంట్ల ఓరియంటేషన్‌ కార్యక్రమాలు, ఎన్నో నిర్వహించగలిగాను.

ఉద్యోగ నిర్వహణలో ఎన్ని పదవులు పొందినా, పేరు ప్రఖ్యాతులు, గౌరవ పురస్కారాలు ఇంటర్‌ విద్యామండలిలో రాష్ట్ర అధికారిగా పనిచేసిన గుర్తింపు, సామాజిక సేవలో కడప జిల్లాలో గణనీయ సేవలు అందించినా, పనిచేసినంత కాలం తెలియని అశాంతికి లోనయ్యేవాణ్ణి. సకాలంలో భోజనం చేయకపోవటం, ఆరోగ్యం పట్ల నిర్లక్షం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై రెండు సార్లు మేజర్‌ ఆవరేషన్లు చేయించుకొనవలసిన పరిస్థితి ఏర్పడింది. సత్యసాయి, సాయి నామస్మరణలతో విశ్రాంతి జీవనంలో ప్రశాంతత పొందటానికి ప్రయత్నిస్తున్నాను.

పదవీ విరమణ సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో వీడ్కోలు సభలు జరుపబడ్డాయి. కడప జిల్లాలో ఎక్కువ కాలం పనిచేయటంవలన కడపలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలో కళాశాలల ్రిన్స్‌పాల్స్‌, లెక్చరర్లు, ఉన్నతాధికారులు అపూర్వమైన వీడ్కోలు సభ నిర్వహించారు.

సుదీర్హమైన నా సేవలు ఇక సమాజానికి అవసరం ఉండదని ఒక వంక నిస్బృహ, మరోవైపు సంతృప్తి చోటుచేసుకొన్నాయి. అయినా గుర్తింపుతో, ఇంకొ పనిచేయాలనే తృష్ణ తీరలేదు, కుమారుడు, కుమార్తె అమెరికాలో స్థిరపడినా, కుటుంబ బాధ్యతలు పూర్తయినా, బరువు బాధ్యతలు లేకపోయినా ఏదో అసంతృప్తి. సాయిసేవలు, సామాజిక సేవల ద్వారా శేషజీవితం గడపాలని నిర్ణయించుకున్నాను.

మూడుసార్లు మృత్యువు దగ్గరకు వెళ్ళాను. ప్రతిసారి జీవనపోరాటంలో, ఆరాటంతో ముందుకు సాగిపోయాను, ఎందరికో సహాయపడ్డాను. సామాజికంగా వెనుకబడినవారికి అండగా, వ్యక్తిగతంగా సహాయం, ఆర్థిక సహాయం కూడా అందచేశాను.

ప్రశాంత జీవనానికి అలవాటు పడుతున్నాను. ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడ ఎదిగాను నన్ను నేను ప్రచ్చించుకుంటున్నాను.. కడప గడపలో మూడువంతుల జీవితం జరిగిపోయింది. జీవితం పోరాటమయం, కష్టాలతోపాటు, సుఖాలు, గౌరవ పురస్కారాలకు లోటు లేదు. వాస్తవాలను వెల్లడించటంలో / 7 శ కడప గడపలో జీవన మధురిమలు

వెనుకంజలేదు. నన్ను ఇబ్బందులు పెట్టినవారు, నా ప్రమేయం లేకుండానే వారు ఇబ్బందులు పడ్డారు. విమర్శలతో, సమస్యలతో నేను ముందుకు పోగలిగాను. ఆర్థిక (ప్రయోజనాల కంటే పదిమందికి ఉపయోగపడాలనే తపన ఎక్కువ రాయలసీమలో జీవనగమనం ఉత్తేజకరంగా, ప్రయోజనకరంగానే సాగింది. భి చ టి విద్యార్థుల అభిమానానికి ఏ అవార్డులు మిన్న కాదు. రాయచోటి జూనియర్‌ కళాశాలలో ప్రిన్స్‌పాల్‌గా 2 సంవత్సరాలు పనిచేశాను. స్కూలు, కళాశాలను సమన్వయపరచి కళాశాల ఫలితాలను గణనీయంగా పెంచాం. కళాశాల (ప్రాంగణంలో వేదిక, వృత్తివిద్యా భవనాలు నిర్మించాం. అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించాం. విశాలమైన శ్రీడాస్టలిని బాగుచేసి, జిల్లా ఇట్రబ క్రీడల పోటీలు నిర్వహించాం. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండేది. అప్రెంటిస్‌ టీచర్లను డిఇఓ ద్వారా నియామకం చేస్తే, వాది నియామకాలు (క్రమబద్ధం చేసి ధైర్యంగా చేర్చుకోవటంలో నా కృషి ఉంది. రాజకీయ అధికారి బలంతో కాక ప్రతిభా పాఠవాలతో అనంతపూర్‌, కడపలో ఇంటర్‌ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారిగా పనిచేశాను. అనితర సాధ్యమైన కృషి, అంకిత భావం, నిజుయితీ, సేవాతత్పరతలలో ఆర్‌.ఐ.ఓ.గా రాణించాను. రాష్ట్రంలో కడప స్థాయిని అన్ని విధాలుగా పెంచటానికి కృషి చేశాను.నేను ఆర్‌.ఐ.ఓ. పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో కడప జిల్లాలో వార్నిక పబ్లిక్‌ పరీక్షలలో మాల్‌ప్రాక్టీసుల సంఖ్య 320, అనంతపురం జిల్లాలో 290. ఇంటర్‌మీడియెట్‌ బోర్డులో ఈ రెండు జిల్లాల మాల్‌్రాక్టీస్‌ కేసుల పరిష్కారానికి ఒక ప్రత్యేకమైన సెక్షన్‌ ఉండేది. మార్కుల కోసం, పరీక్షలలో ఉత్తీర్ణర కోసం కోస్తా ఇతర జిల్లాలనుండి వందలాది మంది విద్యార్థులు కడప జిల్లాలోని పరిక్షా కేంద్రాలను ఎన్నిక చేసుకొని పరీక్షలు రాసేవారు. పరీక్షల సమయంలో జిల్లా కేంద్రంలోనే కాక, (గ్రామాలలో ఉన్న జూనియర్‌ కళాశాలలో కొన్నింటికి కేంద్రాలుగా కొనసాగేవి. అలపర్తి పిచ్చయ్య చౌదరి * / 6

25 సిట్టింగ్‌ మొబైలు స్క్వాడ్‌లు, వాహనాలు ఏర్పాటుచేసి నిర్ధిష్టమైన ప్రణాళికతో, ఆర్‌.ఐ.ఓకు తప్ప రూట్లు ఎవరికి తెలియకుందా పకదృందిగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రాకముందే చేరేటట్లు ఏర్పాట్లు చేసాం. 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, కలెక్టరు ద్వారా మండల అధికారులను సహితము భాగస్వాములు చేసి, చక్కని పథకాలతో నిర్దాక్షిణ్యంగా, ఉక్కుపాదంతో మాల్‌ప్రాక్టీస్‌లను అణచివేశాం. అన్ని కళాశాలల యాజమాన్యం, ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి సహకారం అందజేశారు. 12 సంవత్సరాలు జిల్లా విద్యాశాఖాధికారి ఫ్లయింగ్‌ స్క్వాద్‌లో లీడర్‌గా పనిచేసిన అనుభవం ఉపయోగపడింది.

క్రమంగా విద్యార్థులకు చదువుపై శ్రద్ధ వచ్చేటట్లు ఈ విధానం వలన జరిగింది. ఇతర జిల్లాల నుండి పరీక్షల కోసం రావడం పూర్తిగా తొలగిపోయింది. 20 - 25 సంఖ్యలో మాల్‌ప్రాక్టీసులు గణనీయంగా తగ్గేలా మా చర్యలు తోడ్బడ్డాయి.

అక్రమపద్ధతులను తొలగించిన ఘనత, కళాశాలల ఏర్పాటు, అద్మినిప్టేషన్‌కు కడప ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కార్యాలయం అత్యుత్తమమైనదిగా ఇంటర్మీడియెట్‌ బోర్డు కమిషనర్‌ కృపానందంగారితో గుర్తించబడి, రికార్డు సాధించింది.

ఆర్‌ఐఓ ఆఫీసు సిబ్బందిలో రమణ, సాయిలీల, చౌడేశ్వరరావు, మల్లయ్య, సుబ్బారావులు సంపూర్ణ సహకారం అందించారు. సుబ్బరాయుడు, సుబ్బారెడ్డికి ఉద్యోగ అవకాశాలు కలిగించాను.

వందకుపైగా (ప్రైవేటు, 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కొత్తగా నా పదవీ కాలంలో ఏర్పడ్డాయి. 3200 ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల మార్గదర్శిగా “అకడమిక్‌ ఆర్గనైజర్‌'ను రూపొందించాను. వార్షిక ప్రణాళిక, నెలవారీ పిరియడ్డు, పాఠ్యాంశాల బోధన, ఎసైన్‌మెంట్లు, పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌, వివిధ కోర్సుల, వృత్తి విద్యాకోర్సులు మొదలగు అంశాలతో పుస్తకం తయారు చేసి ప్రతి సంవత్సరం బోర్డు ప్రచురించి కళాశాలలకు అందచేస్తుంది.

అధ్యాపక కరదీపికగా ఉండే ఈ పుస్తక నృష్టికర్తగా కడప ఇంటర్‌ విద్యకు శాశ్వత గౌరవం తెచ్చి పెట్టాను. వరుసగా 4 సంవత్సరాలు చీఫ్‌ ఎడిటర్‌గా పనిచేశాను. ఎడిటర్‌గా ప్రిన్స్‌పాల్‌ చంద్రశేఖర్‌ ఎంతో సహాయపడ్డారు. నా ఈ గౌరవానికి ఆయన కూడా కారకులు.

    • కడప గడపలో జీవన మధురిమలు

ప్రభుత్వ (ప్రైవేటు, సోషల్‌ వెల్ఫేర్‌, ఎయిడెడ్‌ కార్పొరేట్‌ కళాశాలల అన్నింటికి వర్తించే విధంగా సమగ్ర ప్రణాళిక, నిబంధనావళితో అన్ని కళాశాలలో ఒకే విధంగా బోధన, పరీక్షల విధానంలో సమ(గ్రంగా తయారైంది ఇంటర్‌ బోర్డు అకడమిక్‌ వింగ్‌కు అకడమిక్‌ ఆర్గనైజర్‌ మణిహారం. ఇంటర్‌ బోర్జు ప్రభుత్వం దృష్టిలో ప్రతిష్ట పెంచిన పుస్తకంగా గుర్తింపు వచ్చింది. ఈ హారాన్ని కూర్చే భాగ్యాన్ని కమిషనర్‌ కృపానందంగారు ప్రసాదించారు. నా మనస్సులో నుండి పుట్టిన ఈ సంచలన కరదీపికకు సూత్రధారిగా చంద్రశేఖర్‌ తోడ్చాటు ఎంతో ఉంది. మా ఇద్దరి శ్రమకు (ప్రతి రూపం అకడమిక్‌ ఆర్గనైజర్‌. ఇంటర్‌ విద్యకు దశ, దిశను చూపిస్తూ విద్యార్థులకు మార్గదర్శిగా, అధ్యాపకుల కరదీపికగా అకడమిక్‌ ఆర్గనైజర్‌ కొనసాగినంత కాలం నా పేరు విద్యార్థులలో, అధ్యాపకులలో, సంస్థలలో గుర్తింపుకు నోచుకుంటుందనటంలో సందేహం లేదు. ఇంటర్‌ విద్యలో అకడమిక్‌ ఆర్గనైజర్‌ సంచలన విజయంగా నమోదు అయింది. ఇంటర్‌ విద్యకే పరిమితం కాకుండా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో కూడ నా పాత్ర ఉంది. అక్షరశ్శి-పచ్చదనం పరిశుభ్రత, అక్షరజ్యోతి, ట్రాఫిక్‌ సమస్యలు, జన్మభూమి కార్యక్రమాలలో పాల్గొన్నాను. అధర్‌సిన్హా కలెక్టరుగా ఉన్నప్పుడు నందలూరు రైల్వే స్టేషన్‌లో “రాజీవ్‌ లైఫ్‌ లైన్‌ ఎక్స్‌ప్రెస్‌, కంటి, ఆర్షోపెడిక్‌ చికిత్సల నలఖై రోజుల ప్రోగ్రాంలో గ్రామ ప్రజలకు భోజన వసతి, వాలంటీర్లతో సహకార బాధ్యతలు నాకప్పగించారు.. లక్షలాది రూపాయల వ్యయంతో నిర్వహించిన గ్రామీణ ఆరోగ్య సంక్షేమ జాతీయ కార్యక్రమం నందలూరులో నిర్వహించి, జయప్రదం చేసినందుకు ఆ సంవత్సరం జిల్లా ఉత్తమ అధికారిగా ఎన్నికయ్యాను. మూడుసార్లు వరుసగా రిపబ్లిక్‌ దే, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లాలో ఉత్తమ అధికారిగా ఎన్నికయ్యాను. కృషి, సేవ, అంకిత భావంతో పనిచేసిన నేను అందుకోని అవార్డులు, సత్మారాలు లేవు. పేదప్రజలకు సన్నిహితంగా ఒక విద్యాశాఖాధికారికి అపూర్వ గౌరవాలు దక్కటం కడప గడపలో మధురమే కాదా? అలపర్తి పిచ్చయ్య చౌదం + ట్ర

అన్ని రాజకీయ పార్టీల వారిని గౌరవించి, సమస్యల పరిష్కారంలో సహకరించేవాడిని. కొందరు అసూయపడినా, నా వ్యక్తిత్వం, నిజాయితీ, శ్రమ, అంకితభావానికి అవేవి అడ్డంకులు కాలేదు. అక్కడక్కడా అవి చిన్న సమస్యలుగా ఉండేవి.

అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర గారితో రెండుసార్లు కడపలో సంగీత గేయధార ఏర్పాటు చేశాను. ఇంటర్‌ కళాశాలల బాలికల సాంస్కృతిక పోటీలు రెండు రోజులు కడపలో ఘనంగా నిర్వహించాం. ఆ కోవలో విద్యార్థినులను

ప్రోత్సహించాలనే క్రియేటివ్‌ ధింకింగ్‌ను నా మిత్రులు ఇప్పటికీ మెచ్చుకుంటారు. న

నా పదవీకాలంలో కడప జిల్లాలో రాజకీయ నాయకులతో సత్సంబంధాలు, ఉద్యోగరీత్యా సమస్యల పరిష్కారానికి దోహదపడేవి. ఉద్యోగి విజయానికి అధికారుల అందేకాకుండా, ప్రజలతో సన్నిహిత సంబంధాలు, ప్రజాప్రతినిధుల తోడ్పాటు. పత్రికా విలేఖరులతో సత్సంబంధాలు ఎంతో అవసరమని నా అభిప్రాయం. నా విజయాలకు ఈ పద్ధతిలో నదడవటమే కారణమని అనుకుంటాను.

జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులతో దశాబ్బాలుగా పరిచయాలున్నాయి. వైఎస్‌ వివేకానందరెడ్డి గారితో మూడు దశాబ్దాలుగా పరిచయం. రాజకీయ నాయకులలో విలక్షణ వ్యక్తిత్వం ఆయనది. 'పిచ్చయ్య సార్‌ అని ఆప్యాయంగా పలకరిస్తారు. గర్వం, అహంకారం ఆయనలో లేవు. లయనిజంలో ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన నాయకత్వంలో రాయచోటి లయన్స్‌ క్షబ్‌ను ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో అత్యుత్తమ క్లబ్‌గా తీర్చిదిద్దాను.

సాయిప్రతాప్‌, ఎంపీగారు సాయిభక్తులు. సంస్కారం, వినయం ఆయనకు పెట్టని ఆభరణాలు. సభ్యత, సంస్కారాలకు ఆయనకు ఆయనేసాటి. రాజకీయాలలో పెద్ద మనిషి ఆయన నుండి రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. సుదీర్హ కాలం ఎంపీగా ఉండి, ఇటీవల కేంద్ర, ఉక్కు సహాయ మంత్రి అయ్యారు. కడప జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారనటంలో సందేహంలేదు. రాజంపేట పార్లవెంటరీ నియోజకవర్గం డిలిమిటేషన్‌లో నవ్ఫపోకుండా, నాకున్న ద్ర] + కడప గడపలో జీవన మధురిమలు

ఉన్నత్రాధికారులతోగల సత్సాంబంధాలతో, ఆయన వాదనకు సరియైన సమయంలో అండగా నిలిచాను.

కడప ఎంపీ జగన్‌మోహన్‌ రెడ్డి గారితో ప్రత్యక్ష పరిచయం లేదు. కానీ వారి కుటుంబ స్నేహితులు ద్వారా నా విషయం తెలుసుకుని, నాకు ఎంతో సహాయపడ్డారు. ఆ పనిలో నేను విజయవంతం కాలేకపోయినా ఆయన సహాయం మరువలేను.నేను ఆర్‌ఐఓగా ఉన్నప్పుడు మాజీమంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి, గోవర్దనరెడ్డి, విజయమ్మ, పులివెందులలో కమలమ్మ గారు వారి విద్యాసంస్థలతో ఉన్న అనుబంధంతో పరిచయం. మరో మాజీమంత్రి సరస్వతమ్మ నాతోపాటు నందలూరు జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. నేను ప్రిన్స్‌పాల్‌ అయిన తరువాత అదే కళాశాలలో లెక్సరరుగా కూడా పనిచేశారు. అణకువ, పెద్దలపట్ల గౌరవం అమెకు సహజంగా ఉన్న లక్షణాలు.

మాజీ మంత్రి ఖలీల్‌ బాషా మంచి డాక్టరు. పదేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించారు. కడప ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల అభివృద్ది కార్యక్రమాలలో, ఉర్జూ విద్యార్థినుల సాంస్కృతిక సమావేశాలలో పాల్గొనేవారు. వ్యక్తిగతంగా నన్ను అభిమానించే మంచి మిత్రులు. మాజీమంత్రి రామమునిరెడ్డి గారు కుటుంబ మిట్రులు. కడప జూనియర్‌ కళాశాల అభివృద్ధికి అనేక సూచనలిచ్చారు. అనేక సందర్భాలలో అండగా నిలిచారు. మాజీ శాసనసభ్యులు శివానందరెడ్డి, శివరామకృష్ణరావు, కందుల రాజమోహన్‌ రెడ్డి మా మామగారికి సన్నిహితులు. కుటుంబ స్నేహితులు.

మాజీమంత్రి, రాజ్యసభ సభ్యులు సి. రామచంద్రయ్య లయనిజంలో మామగారితో పనిచేయటమే కాక, మా కుటుంబ శ్రేయోభిలాషి, రామచంద్రయ్య గారి బంధువు ఆడిటర్‌ చలపతి మామగారికి చిరకాల మిత్రులు. మొదటిసారి శాసన సభ్యులుగా ఎన్నిక అయిన సందర్భంగా మామగారు బి. రామకృష్ణ, రిటైర్డు డి.ఎస్‌.పి. క్రియాశీలకంగా రాజకీయాలలో ఆయనను వెన్నంటి ఉందేవారు. ఆ అభిమానంతో నేను ఫోను చేస్తే వెంటనే స్పందించేవారు. “బ్రదర్‌” అని పిలుస్తారు. ఆయన క్లిష్ట సమయాలలో కాపాడారు. నేను ఆయనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా సహకరించే అవకాశం ఎన్నడూ రాలేదు.

అలపర్తి పిచ్చయ్య చౌదరి + ద్రిల

కడపవారి నైజం పుణికిపుచ్చుకున్న రాజకీయ వృద్ధుడు దివంగంతనేత వీరారెడ్డి గారు. కడప పదం తలుచుకుంటే నాలాంటి వారికి కాకుండా, ఎందరికో పెద్ద దిక్కుగా ఉండేవారు. నన్ను 'రామకృష్ణ అల్లుడు” అంటూ ఆయన ఆప్యాయంగా పిలిచేవారు. చనువుగా ఎన్నోసార్లు మందలించేవారు. రెండోసారి ఆర్‌ఐఓ కావటానికి ఆయన కృషి ఎంతో ఉంది. కొందరు అసూయతో నాపై పనికట్టుకొని వెళ్లి ఫిర్యాదులు చేసినా వారినే మందలించిన వ్యక్తి. ఆయన జిల్లాలో ఆ రోజులలో పార్టీకి ఆయనే పెద్దదిక్కు మాట చెప్పితే నిలబెట్టుకొనేవారు. పోరాడి నన్ను అందలం ఎక్కించారు.

మాజీమంత్రి బ్రహ్మయ్యగారు నాకు అత్యంత సన్పిహితులు. నాపై గురుభావం ఉండేది. అనేక సాంస్కృతిక, సేవాకార్యక్రమాల ద్వారా రాజంపేట, కోడూరు, కడప ప్రాంతాలలో బ్రహ్మయ్య గారు పరిచయమై వదాన్యుడుగా, సేవా తత్పరుడుగా పేరు సంపాదించారు. దశాబ్దం పాటు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా ఉండటంతో చిరకాలమిడత్రుడు ఎద్దుల సుబ్బరాయుడు దూరంగా జరిగారు.

(బ్రహ్మయ్య గారిని వెలుగులోనికి తేవటంలో నా కృషి ఉందని రాజంపేట మిత్రులు ఇప్పటికి అనుకుంటారు. నేను చేసే సేవా కార్యక్రమాలను అభినందించటమే కాక, నాకు అండగా ఉండేవారు. లక్షల రూపాయలు విరాళాలు నేను ఎవ్వరికి చెప్పినా ఇచ్చేవారు. వారి దగ్గర ఆ గౌరవం, అభిమానం ఇప్పటికి ఉంది. నేను రాజకీయ నాయకుడని కాదు కనుక దగ్గరగా ఉన్నట్లే దూరమయ్యాను.

రాజంపేట ప్రాంతంలో పట్టు ఉన్న మరో నాయకుడు ఎద్దుల సుబ్బరాయుడు. ఆర్‌.టి.సి. జోనల్‌ ఛైర్మన్‌గా పని చేశారు. సుదీర్హ రాజకీయ ప్రస్థానంలో ఆయన అందుకోవలసిన స్థానం అందుకోలేక పోయారు. మంచి స్నేహితులు, సమర్ధుడైన రాజకీయవేత్త, ఆయన బంధువు రిటైర్జు డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పాల్‌ సుబ్బరాయుడు విద్యారంగంలో భుజం భుజం కలిపి అనేక సంవత్సరాలపాటు పనిచేశాం.

ఆ ప్రాంత నాయకులలో గుర్తింపు పొందిన నాయకులు రామరాజు, పారా సుబ్బానాయుడు. రామరాజుగారు సహృదయులు. కళలపట్ల అవగాహన, అభిమానం ఉన్నవారు. నుదీర్హ రాజకీయ జీవితంలో ఆయన కింగ్‌ మేకరే కాని కింగ్‌ దరె *కడప గడపలో జీవన మధురిమలు

కాలేకపోతున్నారు. పారా సుబ్బానాయుడు నిజాయితీగల రాజకీయ నాయకుడు. ఆయన నిజాయితీ ఆయనకు శాపంగా పరిణమిస్తున్నదని నా అభిప్రాయం. నందలూరులో సుదీర్హ కాలం ప్రిన్స్‌పాల్‌గా పనిచేయటంవల్ల ఆ ప్రాంత నాయకులు సాయిబాబా, పల్లె సుబ్రమణ్యం, శివశంకర్‌ రెడ్డి, షబ్బీర్‌ అహ్మద్‌తో పరిచయం ఉంది. రాజకీయాలలో నిజమైన కింగ్‌ మేకర్‌ దివంగత కట్టా నారాయణయ్య నాయుడు. పార్టీపై అంకిత భావమున్న వ్యక్తి. కోడూరు నియోజక వర్గంలో తిరుగులేని రాజకీయ నాయకుడు. ఒక దశలో జిల్లా రాజకీయాలను శాసించగల స్టాయిలోనికి ఎదిగారు. రిజర్వు నియోజకవర్గం అవటంతో అందుకోవాల్సిన పదువులు ఆయనకు దక్కలేదు. నాలుగు దశాబ్దాల అనుబంధం. రాజకీయాలలో విశ్వాసానికి, ఆత్మీయతకు, ప్రజాదరణకు నిదర్శనం ఆయన జీవితం. ఆయనంటే ఇష్టపడని ఆ ప్రాంత మరో నాయకుడు ఒకరు ఎప్పుడూ ఇబ్బందులు పెట్టటమేకాక, అధికార హోదా నుండి నన్ను తొలగించుటానికి ప్రయత్నించేవాడు. మాజీ మంత్రి బ్రహ్మయ్య గారికి నారాయణ నాయుడిని పరిచయం చేశాను. రాజంపేట రాజకీయాలలో అ(్రత్యక్షంగా సంబంధాలున్నాయనే ఆరోవణ నామీద ఉందేది. కట్టా నారాయణయ్య నాయుడుతోగల సన్నిహిత సంబంధాల వల్లనే ఆ ఆరోపణలు వచ్చేవి. నేను అభిమానించే మరో జిల్లా నాయకులు దివంగత ఆర్‌. సూర్యనారాయణ రెడ్డి గారు. మాజీమంత్రి రాజగోపాల్‌ రెడ్డి సోదరులు. నేను రాయచోటిలో లెక్చరర్‌గా పనిచేసే రోజులలో ఆయన జిల్లా పరిషత్‌ చైర్మన్‌. రాయచోటి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల స్థాపనకు ముఖ్య కారకులు. (1969-1970). ఆ కళాశాల న్థాపించటంవలన రాయచోటి, లక్కిరెడ్డిపల్లెల ప్రాంతాల పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కలిగింది. ఆ రోజుల నుండి ఆయన చనిపోయే వరకు సాధారణ వ్యక్తిలా అందరితో కలసిపోయేవారు. జీపులో ఆయన వస్తుంటే ప్రజలు గుంపులుగా చేరి, సమస్యలు చెప్పుకునేవారు. ఆ ప్రజాదరణ చూసి ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పటికి ప్రజాబాహుళ్యంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు సన్నిహితంగా మెలగటం కడపలో చూస్తున్నాను. జూనియర్‌ లెక్చరర్‌గా అనుకునేవాడిని, ఏనాటికైనా ఆ జూనియర్‌ కళాశాలకు ్రిన్స్‌పాల్‌ అయి, ఆయనకు ఘనంగా సన్మానించాలని. నా కోరిక అలపర్తి పిచ్చయ్య చౌదరి + ద్రిశ

(1971) నెరవేరి నేను ఆ కళాశాల ప్రిన్స్‌పాలయి, రెందు రోజుల వార్షికోత్సవ కార్యక్రమంలో సూర్యనారాయణ రెడ్డి గారిని ఘనంగా సన్మానించాను (1996) నాటి ఆకాశవాణి డైరెక్టర్‌ అనంతపద్మనాభరావు, బ్రహ్మయ్య, హనుమచ్చాస్ర్రిలను కూడా ఘనంగా సన్నానించాం.

నేను ఏ కళాశాలలో పనిచేసినా జానమద్ది హనుమచ్చాస్తి గారిని పిలిచి సాహితీ సమావేశం ఏర్పరచి వారి ఆశీర్వాదాలు తీసుకునే వాడిని. అదే విధంగా మల్లెమాల వేణుగోపాల్‌ రెడ్డి గారు ఆప్తులు, ఆత్మీయులు. వారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉందేవి.

రాయచోటి, నందలూరు, కోడూరు, కడప ప్రాంత రాజకీయ నాయకులే కాక జిల్లాలో వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి, అహ్మదుల్లా, మోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడి తదితర ఎమ్మెల్యేలతో పరిచయం ఉండేది. మోహన్‌ రెడ్డి గారు నన్ను అభిమానించేవారు. అహ్మదుల్లా మున్సిపల్‌పల్లె చైర్మన్‌గా ఉన్నపుడు కళాశాలలో నీటి వసతికి సహాయం చేశారు. వారు కళాశాల కార్యక్రమాలలో అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఇటీవల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో సుదీర్ధ కాలంగా రాజకీయాలలో పేరు ప్రతిష్టలున్న మాజీ పార్లమెంటు సభ్యులు రహంతుల్లా కుమారుడు. రాజంపేట ప్రస్తుత ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి గారు సహృదయులు, వారితో పరిచయం ఉంది. జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ సురేష్‌బాబు యువకుడు, ఉత్సాహవంతుడు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఈ యువననాయకుడు, నాకు కుటుంబ స్నేహితులు. మూర్తి సీనియర్‌ అడ్వకేటు. రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన మా కుటుంబ శ్రేయోభిలాషి

రాజకీయనాయకులలో పరిచయం ఉన్న వారిలో జిల్లా పరిషత్‌ మాజీ అధ్యక్షులు తులసిరెడ్డి గారు, మేధావి. గణాంకాలతో వివరణలు, సమగ్ర సమాచారంతో (ప్రత్యుర్థులను కట్టడిచేసే ప్రజ్ఞాశాలి. వేంపల్లి ప్రాంతనాయకులు సతీష్‌రెడ్డి రాజకీయాలలోనే కాకుండా, వ్యక్తిగా సౌజన్యమూర్తి, విద్యాధికుడయిన సతీష్‌ రెడ్డి సంచలన రాజకీయ నాయకుడు. శ్రీకాంత్‌రెడ్డి ఇటీవల రాజకీయాలలో ప్రవేశించారు. వీరేకాక ఉభయ కమ్యూనిస్టు నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో సత్సంబంధాలుండేవి. దుష్యంతరెడ్డి యువ పారిశ్రామికవేత్త, వారి కుటుంబంతో ర్రైర్‌ + కడప గడపలో జీవన మధురిమలు

మా కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది. హరిప్రసాద్‌ కడప రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే న్థానం సంపాదిస్తున్నాడు.

జిల్లాలో యువరాజకీయ నాయకులు జోరుకనిపిస్తుంది రాయచోటి ప్రాంతంలో నా శిష్యులు చాలామంది రాజకీయనాయకులుగా ఎదిగి, ప్రజా సేవలో ముందుకు పోతున్నారు.

రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు రాజకీయం నడపటానికి కాక, ప్రజా సమస్యల పరిష్కారానికి, పరస్పర అవగాహనకు ఉద్యోగులకు ఎంతో అవసరమని నా అనుభవంలో అర్ధమైంది. కొన్ని సమస్యలు వచ్చినా, కొందరు అపార్ధం చేసుకొని సమస్యలు సృష్టించినా, ఈ అనుభవం దీర్ణకాలంలో గౌరవ ప్రతిష్టలు పెరగటానికి తోద్చడతాయని నా అభిప్రాయం.

పత్రికల వారితో సత్సంబంధాలు మీడియాతో జాగ్రత్తలు ప్రతి శాఖాధిపతికి, అధికారులకు చాలా అవసరం. ఆ కోణంలో ఉద్యోగంలో చేరినప్పటి నుండి రిటైరు అయ్యే వరకు వారితో ప్రత్యక్ష సంబంధాలుందేవి. కడప జిల్లాలో సీనియర్‌ పాత్రికేయులు దుర్దా ప్రసాద్‌, లక్ష్మణ్‌ (ఈనాడు), త్రీనాధరెడ్డి, శశిశ్రీ, రమణయ్యలతో దశాబ్ధాల పరిచయం. ఈనాడు సురేష్క్‌ నందలూరు భాస్కర్‌, రాయచోటిలో నా ప్రియ శిష్యుడు నారాయణ ఇంకా ఎంతోమంది విలేఖరులు తరచూ నన్ను సంప్రదిస్తూ, నా సేవాకార్యక్రమాలకు, అక్షరరళ్ళ్శి, లయనిజం, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, లెక్చరర్‌గా బోధన, మరెన్నో విషయాలపై బహుముఖ ప్రచారం కల్పించారు. నాలుగు దశాబ్దాల 'ప్రజాజీవనం, ఉద్యోగ పర్వంలో నా ఎదుగుదలకు, జిల్లా వ్యాప్తంగా గుర్తింపుకు పత్రికా ప్రతినిధుల సహాయం, సహకారం ఎంతో తోద్చడింది.

సద్విమర్శలు ఉపయోగపడ్డాయి. సంచలనాత్మక విమర్శలు బాధించేవి. అయినా అవి ఉగాది పచ్చడిలా మీడియాతో నా సంబంధాలుండేవి. ఇంటర్‌ బోర్డు జాయింట్‌ సెక్రటరీగా అన్ని పత్రికల, ఎలక్ష్రానిక్‌ మీడియా రాష్ట్రస్థాయి ప్రతినిధులలో ఉన్న ప్రత్యక్ష సంబంధాలతో వారిలో సృజనాత్మకత, విమర్శ, పరిశీలన, విజ్ఞాన పరంపరను గమనించి, వారికి దగ్గరయ్యాను.

“రేడియో సుబ్బన్న అని పిలువబడే గ్రామీణ కార్యక్రమాల అకాశవాణి ఎగ్జిక్యూటివ్‌ కడపలో తారసపడిన వ్యక్తి. ఎగ్జిక్యూటివ్‌ అయినా ప్రభుత్వ వాహనాన్ని

అలపర్తి పిచ్చయ్య చౌదరి * గ్రిద్రీ

అవసరానికి మించి వాడని పాదచారిగా ఆయన వ్యవహరించిన తీరు ఎందరికో ఆదర్శం. సుబ్బన్నగారు మంచితనానికి, మానవత్వానికి ప్రతిబింబం. ఆయన ఇచ్చిన అవకాశాలతో ఆకాశవాణిలో బి+ (గ్రేడ్‌తో ఉపన్యాసకులుగా నేను గుర్తింపు పొందాను. గ్రామీణ ప్రాంతాలలో సాయంసమయంలో నా వాణి, గళం వినిపించటంలో ఆయన ్రోత్సహం జీవితకాలంలో మరువలేను. ఆకాశవాణిలో “ఇందిరాగాంధీ, సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌, విప్లవ యోధుడు భగత్‌సింగ్‌, కడప జిల్లాలో సేవా సంస్థలు, లయనిజం అనే అనేక అంశాలపై ప్రసంగాలు నాచే ఇప్పించారు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు, వ్యవసాయ సదస్సులలో ఆయనతో పాల్గొన్నాను. సుబ్బన్న మానవతావాది.

కళాకారులు కృష్ణకుమార్‌, రవీంద్ర, 'రాకా' రమణ, సవేర వెంకటయ్య గారు నన్ను ఎంతో అభిమానించి, నా సేవలు గుర్తించి నన్ను ఘనంగా సన్మానించి గౌరవించారు. సవేర ఆర్ట్స్‌ వారు సేవాప్రపూర్ణ, విద్యా సేవాధురీణ అనే బిరుదులతో నన్ను గౌరవించి, సభాసామ్రాట్‌, భాస్కరరావు, సినీనటి జమునలతో సన్మానం చేయించారు.

సుబ్బన్న మరణంతో రేడియోతో నా అనుబంధం మసక బారింది.నా ఈ ఎదుగుదలకు కుటుంబసభ్యులు సహకారం ఎంతో తోడ్బడింది. డా! శ్రీనివాసులు రెడ్డి (కంటి శస్త్రచికిత్స నిపుణులు) శ్రీమతి సంధ్య (నాతో పాటు లెక్చరర్‌గా పనిచేశారు) దశాబ్దాలుగా కుటుంబ స్నేహితులు. వారితో అనుబంధం, వారి పీల్లలు మా పిల్లలతో కూడా కొనసాగుతోంది. నాజీవితంలో స్నేహానికి అర్ధం చెప్పిన ముగ్గురు వ్యక్తులున్నారు. జి.ఎన్‌. రావు, శివకుమార్‌, శ్రీనివానులు రెడ్డి వీరు జీవన గమనంలో పెనవేసుకుపోయిన ఆత్మీయులు. స్నేహానికి మరో నిర్వచనంగా వారిని భావిస్తాను. నాకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినపుడు అండగా నిలిచిన డా॥ మల్లెమాల వేణుగోపాల రెడ్డి, డా! శ్రీనివాసులు రెడ్డి, దొ॥ బాలిరెడ్డి డా। అలోక్‌ రంజన్‌న్ఫు ఎలా మరువగలను?

యి సీ సా

ట్‌ద్యోగ ధర్మంలో, సేవాపరంపరలో భార్యా బిడ్డలు, అన్నదమ్ముళ్లు, అక్కవచెల్లెళ్లతో, బంధుమిత్రులతో గడిపిన సందర్పాలు అతి తక్కువ. విశ్రాంత ర/ + కడప గడపలో జీవన మధురిమలు

సమయంలో అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో చిన్ననాడు గడివిన రోజులు గుర్తుకువస్తున్నాయి. మనవళ్లు, మనవరాళ్లతో గడపాలని మనస్సు ఉరకలేస్తుంది. ఉవ్విళ్లూరుతుంది. పెద్దన్నయ్య మెకానిక్‌గా యంత్రంలో భాగంలా పనిచేసి, తముళ్ల కోసం, కుటుంబం కోనం తపించి, అందరిని నిలబెట్టి కనుమరుగైపోయాడు. మంచితనానికి మరోపేరుగా, జీవితమంతా ఇతరులకు సహాయం చేయటానికే ప్రాధాన్యత నిచ్చిన భాను అన్నయ్య, కుటుంబం కోసం, తన వారికోసం, ఉద్యోగ ధర్మం అంకిత భావంతో నిర్వహించిన మంగారావు అన్నయ్య ఇప్పుడు లేరు. ముగ్గరం తమ్ముళ్లం మిగిలాం. రంగమ్మ అక్కయ్యతో అనుబంధం, పెద్దక్కయ్య ప్రేమ, చెల్లెలి అమాయకత్వం గుర్తుకు వచ్చి వారిని తరుచూ చూడాలనిపిస్తుంది.

వదినల ఆప్యాయత, అనురాగం మరువలేనిది. వారి ఆదరణే లేకపోతే ఇంత వాళ్లం అయ్యేవాళ్లం కాదు. పెద్దన్నయ్య, పెద్దవదినల తోడ్పాటుతో ఇంతవాళ్లమయ్యాం.

అక్కడకు వెళ్లినా ఒకటి రెండు రోజులు కంటే ఉండలేకపోతున్నాను. కడపను వదలలేకున్నాను. నాలుగ దశాబ్దాల అనుబంధం పెనవేసుకుని, ఈ మనుషులను వదులుకొని మరోచోటికి వెళ్ళ లేకపోతున్నాను.

రిటైరు అయిన తరువాత పిల్లలను చూడాలని రెండుసార్లు అమెరికాకు వెళ్లాను. చూడటానికి అమెరికా ఆనందం కలిగించింది. అభివృద్ధి పధంలో ఉన్న అమెరికా ఎక్కడ, కడప ఎక్కడ అనిపించింది. అమెరికాలో మనవాళ్ళు అందరూ ఉద్యోగాలు చేస్తూ క్షణం తీరిక లేకుందా ఉండటం, ఆరాటాలు, ప్రతిదానికి ప్రణాళికలు, పెద్దవాళ్ళతో వారి (ప్రేమానుబంధం, డాలర్ల ప్రపంచాన్ని సవివరంగా చూడగలిగాను. బహుశా నేను కడపను అర్ధం చేసుకున్నంతంగా అమెరికాను అర్ధం చేసుకోలేదేమో అనుకుంటాను. తెలుగు భాషకు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, దైవారాధనకు అక్కడున్న మనవారు పెద్ద పీట వేయటం ఆనందం కలిగించింది.

కాలం మారుతున్నది. దానికనుగుణంగా ధర్మం మారుతున్నది. వృద్ధాప్యంలో మన ధర్మం కూడా మారాలి. ఉద్యోగ ధర్మంలో అంకితభావం, సేవ, నిజాయితీ, పట్టుదల ఉండాలి, విశ్రాంత జీవితంలో పనిభారం లేదు, మానసిక, శారీరక (శఛమలు

అలపర్తి పిచ్చయ్య చౌదరి + 88

లేవు, వత్తిడులు లేవు. అయినా తెలియని అసంతృప్తి, ఈతరం వారితో జూగ్రత్తగా ఉండాలి. వారి అభిప్రాయాలను గౌరవించటం నేర్చుకోవాలి. సర్టుకుపోవాలి. అవేశం తగ్గించుకోవాలి. సంభాషణలలో జోక్యం తగ్గించుకోవాలి. మన అభిప్రాయాలను వారి ముందు వ్యక్తపరిచేటప్టుడు జాగ్రత్తగా ఉండాలి. హర్రీ, వర్రీ, కర్రి విషయాబలో జా(గ్రత్తగా ఉండాలి ఉదయం, సాయంత్రం వీలు దొరికినపుడు నడక, వ్యాయామం, యోగా, ధ్యానాలపై దృష్టిసారించాలి. పుస్తక పరనంపై ఆసక్తిని పెంచుకోవాలి,

ఉద్యోగ జీవిత (ప్రస్తావన, మన విజయాలు, మన గొప్పతనం చెప్పాలని ఉంటుంది. ఇప్పటి వారికి అవన్ని వినే ఓపిక ఉండదు. విశ్రాంత జీవనంలో ఉన్నవారి బలహీనత అదే. ఆ బలహీనతే అందరికి ఇబ్బంది కలిగిస్తుంది. ఆవేశం తగ్గించుకోవాలి, అభిప్రాయాలు చెప్పకూడదు. వినటం, తల ఊపటం నేర్చుకోవాలి. చిన్నపిల్లలను డ్రుమిస్తూ, వారి చిలిపి పనులు, వారి ప్రేమానుబంధాలలో తడిసి ముద్దయి పోగలిగిడే అంతకు మించిన స్వాంతన ఉండదు. పుట్టిన బిడ్డలు, మనకు ఉపయోగపడినవారు, మనద్వారా ఉపయోగం పొందినవారు, వరుసక్రమంలో వస్తూ పోతూ ఉంటారు. కష్ట సుఖాలలో తోడూ నీడగా నిలచే భాగస్వామి దొరకడం ఎవరికైనా అద్భష్టం.

ఆరోగ్య విషయంలో (శ్రద్ధ, సకాలంలో ఆరోగ్య పరిక్షలు వృద్ధాప్యంలో అనీవార్యం. ఆరోగ్యంపట్ల జూగ్రత్తలు జీవితం పొడిగింపుకు దోహదపడుతుంది. కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెట్టిన వారం కాకుండా మిగల కలుగుతాం.

చాలామందితో మాట్లాడుతున్నప్రుడు ఒక విషయం గమనించేవాడిని. ఎంతో సహాయం చేశాను. వాళ్లు నా వళ్లే బాగుపడ్డారు. అలా చేశాను, ఇలా చేశాను అని చెప్తుంటారు. ఆ విషయంలో వాస్తవం ఉన్నా అంతా మనవల్లే అయిందనుకుంటే అది తప్పు కదా అని నా అభిప్రాయం. కొన్ని సమయాలు, సందర్భాలు, అనుభవాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం కొందరి ప్రతిభను గుర్తించి, వారికి సహాయం చేయాల్సిందిగా మనకు తెలిసిన అధికారులకు రికమెండ్‌ చేస్తాం. వారు సహాయం పొంది, ప్రయోజన కారులయిశే అది మన ప్రతిభ అనుకుంటాం, ఇది వాస్తవం కాదు. మనం జీవిత కాలంలో సంపాదించిన స్థిర, చరాస్తులు కాదు 'గృడ్‌ విలో అనే క్యాష్‌ను వారికి సహాయం చేయటం ద్వారా పంచినట్లుగా భావించాలి. ఏలి శ కడప గడపబో జీవన మధురిమలు

ఇటీవల నాకు ఒక వ్యక్తితో పరిచయమైంది. మార్నింగ్‌ వాక్‌లో నాతోపాటు వస్తూ ఉండేవారు. మాటల సందర్భంలో ఆయన స్థితిగతులు అడిగాను. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నట్లు, కొడుకు బీటెక్‌ పూర్తి చేసినట్లు చెప్పాడు. తాను ఆర్టీసీలో మెకానిక్‌ అని, దళిత కుటుంబానికి చెందిన వాడిగా చెప్తూ, ఆర్థికంగా వారిని ఉన్నత చదువులు చదివించటం కష్టంగా ఉంది అన్నారు. రిటైర్‌ అయిన రాష్ట్ర అధికారిగా నన్ను గుర్తించి, నా సహాయం అడగటానికి అతనికి ఆత్మాభిమానం అద్దువచ్చేది. నేనే చెప్పాను, మీ అబ్బాయిని తీసుకురా, ఎవరైనా తెలిసినవారికి చెప్తాను అన్నాను. ఆ అబ్బాయికి 59 శాతం మాత్రమే మార్కులు వచ్చాయి. ఈ పోటీ ప్రపంచంలో ఆయనకు ఏ ఉద్యోగ అవకాశం అందున ఈ ఆర్థిక మాంద్య పరిస్థితులలో కష్టం అని నాకు అర్ధమైంది.

మరునాడు అమెరికా ప్రయాణం పెట్టుకున్నాను. వారితో మాట్లాడుతున్న సమయంలో ఫోను వచ్చింది. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేసే తమ్ముని కొడుకు. ఒక సాస్ట్‌వేర్‌ సంస్థ సొంతంగా ప్రారంభింస్తున్నానంటూ ఆశీర్వాదాలు అదగటానికి ఆ ఫోను. మార్ములు స్థాయి తక్కువ, కొద్ది పరిచయం, అయినా అతనిని బెంగుళూరుకు పంపుతున్నాను, ట్రైనింగ్‌ ఇచ్చి నీ కంపెనీలో చేర్చుకోమని చెప్పాను. వెంటనే లెటర్‌ రాసి ఇచ్చి, మరునాడు అమెరికా వెళ్లాను.

నాపై ఉన్న గౌరవం, నామాటకు విలువ నిచ్చి మా తమ్ముని కుమారుడు అతనిని మంచి వేతనంతో, టైనింగ్‌ ఇచ్చి, తన సంస్థలో చేర్చుకున్నాడు. అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అతని సహచరులకు ఇంత వరకూ ఉద్యోగావకాశాలు లేవు. దీనిని ఈ విధంగా విశ్లేషంచదలచుకున్నాను. అతదు వచ్చిన వేళా విషయం. అంతకుముందు వస్తే నా సహాయం అతనికి ఏ విధంగా ఉంటుంది. మనమాట సహాయం అతనికి ఉద్యోగావకాశం, నా ప్రత్యేకత కాదు, అతనికి ఆ అవకాశం అందవలసి ఉన్నందునే ఆ విధంగా నన్ను చేరాడని, మనం నిమిత్తమాత్రులం అని అభిప్రాయం. ఇలా ఎందరో, ఎవరు సహాయం పొందినా జీవితకాలం గుర్తుంచుకోవటం ఇక్కడి వారి సంస్కృతి.

మరో సందర్భంలో నాకు ఇద్దరు సన్నిహితంగా ఉండే విద్యార్థులకు సహాయ పడాలనుకున్నాను. జిల్లా అధికారిగా ఉన్నమిత్రుడు, ఎస్సీ కార్పొరేషన్‌లో తాత్కాలిక

అలపర్తి పిచ్చయ్య-బాదరి + ఈ)

నియామకాలలో ఒకరికి సహాయం చేయగలనని, ఎవరైనా అర్హులుంటే చెప్పాలని నన్ను అడిగారు.

లక్షిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నా విద్యార్ధి సత్యనారాయణరెడ్డిని ఆ ఉద్యోగానికి వెళ్లాల్సిందిగా కోరాను. 'సార్‌, మాది ఆర్థికంగా గౌరవ కుటుంబం, మాకు నిమ్మ తోటలున్నాయి. అలాంటి చిన్న ఉద్యోగానికి వెళితే మావాళ్లు, మా ఊరివాళ్లు అనేక రకాలుగా అనుకుంటారు అన్నాడు. ఇంతలోనే నేను చదివిస్తున్న ఆధారంలేని మరో విద్యార్ధి ఈ అవకాశం తనకివ్వమని కోరటం, ఆ ఉద్యోగంలో చేరటం, అంచలంచలుగా ఎదిగి ఉన్నతాధికారి కావటం, ఈ మూడు దశాబ్దాలలో నేను చూసిన విషయం.

ఇకపోతే సత్యనారాయణ రెడ్డి పరిస్థితి విచిత్రంగా మారింది. చీనీ తోటలు ఎండిపోయాయి, చెల్లెళ్ళ పెళ్ళి, కుటుంబ బాధ్యతలు పెద్ద కొడుకుగా ఆయనమీద పడ్డాయి. అవి పూర్తి చేస్తూ, అనారోగ్యానికి గురి అయ్యాడు. ఎల్‌.ఐ.సి. ఏజెంట్‌గా పనిచేస్తూ దుర్చర దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇప్పుడిప్పుడే నిలద్రొక్కు కుంటున్నాడు. ఆత్మాభిమానం ఉన్న అతనంటే నాకెంతో ఇష్టం. నా దృష్టిలో మొదటి అవకాశం అతనికి ఇచ్చి అందంలం ఎక్కిద్దామనుకున్నా అతడు అందుకోలేదు. మరొకరు అందుకొని, అంచలంచలుగా ఎదిగి పోయారు.

దీనిని ఏమనాలి? అది నా బెన్నత్యం. గొప్ప తనం కాదు. వారి జీవన గమనంలో గమ్యంలో మనం తారసపడ్డాం. మనం మంచి బుద్ధితో సహాయపడదాం. వారు ప్రయోజనం పొందుతారు. అలా అని అందరికి సహాయం చేస్తున్నామా? చేయగలమా? సాధ్యమా? సమాధనం లేని ఈ ప్రశ్చలు అప్పుడప్పుడు నన్ను వేధిస్తుంటాయి. ఇలా ఎందరో ఎందరి జీవితాలలో వారి అభివృద్ధిలో నాదో చిన్న పాత్ర. పాత్ర పరిమితమైనా అదోరకమైన మానసిక సంతృప్తి

ఒకసారి మామిత్రుడు కడప అర్జీఓగా పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు ఒంటిమిట్ట దేవాలయం చూశాను. జిల్లా రెవెన్యూ అధికారి కావటంతో, అంతా హడావిడి. ఎమ్మార్వో ఒక చిన్న పిల్లవాణ్ణి తీసుకువచ్చాడు. ఆ పిల్లవాడు లాంతరు తీసుకొని ఒకపల్లెలో ప్రైవేటుకు వెళ్ళి, తిరిగి వస్తూ ఆగి ఉన్న లారిలో ఎక్కి 6] + కడప గడపలో జీవన మధురిమలు

నిదరపోయాడు. ఆ లారీ ఒంటిమిట్టలో ఆగింది. ఆ చీకటిలో ఆ పిల్లవాడు గ్రామం గుర్తించలేక, సరైన సమాధానం చెప్పలేక బెదురు చూపులు చూస్తున్నాడు.

మా మిత్రుడు మానవతా దృక్బధంతో మాతోపాటు జీపులోకి ఎక్కించుకున్నాడు. మాతోపాటు రాజలాంఛనంగా దైవదర్శనం చేసుకున్నాడు. రాత్రి పదింటికి కడపకు చేరాం. ఆర్టీవో బంగళాలో మాతోపాటు భోజనం చేశాడు. ఆ పిల్లవాడిని ఆర్టీవో తల్లిగారు ప్రొద్దున్నే లేపి, డబ్బులిచ్చి, జవానుతో వాళ్ల గ్రామానికి పంపారు.

ఆ నందర్భంగా మా మిత్రుడుని అతని మానవతా దృక్పథానికి అభినందించకుండా ఉండలేకపోయాను. అతను నవ్వి 'నువ్వు చిన్ననాటి మితక్రుడివి. నాతోపాటు నా ఆహ్వానం పై వచ్చి అన్ని మర్యాదలు పొందావు. ఆ పిల్లవానికి మనకు ఏ సంబంధంలేదు. మనతోపాటు దైవదర్శనం, జీపులో ప్రయాణం, బంగళాలో మనతో భోజనం చేయడం, జవానుతో వాళ్ల ఊరు చేరడం ఏమనాలి? దీనినే ప్రాప్తం అంటారు" అన్నాడు. జ్ఞాపకాల దొంతరలలో కడప గడపలో జీవన మధురిమలు మదిలో నిక్షిప్త మవుతున్నాయి.

య

విద్యార్థులకు, అధ్యాపకుడు పాఠ్యాంశ బోధనతోపాటు, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహపడే అంశాలను, సామాజిక అంశాలను మేళవించి బోధనలో భాగంగా చేసుకోవాలి. అధ్యాపకుడు కేవలం కళాశాలలో బోధనకే పరిమితంకాక, సాంస్కృతిక, కాడా, బోధనేతర అంశాలలో కూడా పాల్గొని చైతన్యవంతంగా విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. కళాశాల ప్రధానోపాధ్యాయులు సహితం అధ్యాపక భాగస్వామ్యంలో కళాశాలను నిర్వహించగలిగినపుడు మంచి ఫలితాలు వస్తాయి. కళాశాల నిర్వహణ పారదర్శకంగా ఉండాలి. నేను ప్రిన్స్‌పాల్‌గా ఏ కళాశాలలో పనిచేసినా విద్యార్థుల స్పెషల్‌ ఫీజులకు సంబంధించిన కమిటీలలో, ఆ కమిటీలలో ఉండే అధ్యాపకులకు,

విద్యార్ధి ప్రతినిధులకు పూర్తి స్వేచ్చనిచ్చి, వారి ద్వారా కార్యక్రమాలు నిర్వహించే వాడిని. ప్రభుత్వ కళాశాలలలో మారుతున్న పరిస్థితులను బట్టి, కార్పారేట్స్‌ ఇతర కళాశాలల నుండి పోటీని తట్టుకొని కొనసాగాలంటే అధ్యాపకులు, సిబ్బంది అదనపు కృషి చేయవలసినది ఎంతో ఉంది.

అలపర్తి పిచ్చయ్య చౌదరి ఛ రాల

అధ్యాపకుడు సైతం నిరంతర విద్యార్థివలే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. కళాశాల భవిష్యత్తు తమ భవిష్యత్తుగా అంకితభావంతో పనిచేయాలి. ఫలితాలు సాధించటంలో అప్రమత్తంగా ఉండాలి. ఫలితాలు సాధించనప్పుడు విమర్శకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, వ్యాసరచన, వకృత్వపు పోటీలు విద్యార్థులలో పోటీతత్వం, వికాసానికి దోహదం చేస్తుంది. మంచి వాతావరణం సృష్టించటంలో అధ్యాపకులు, ప్రిన్స్‌పాల్‌, ఇతర సిబ్బంది సమష్టి కృషి ఎంతో అవసరం. సుదీర్హ అనుభవంతో తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పటంలో నేనెన్నడూ వెనుకంజ వేయలేదు. కడప విద్యారంగంలో పనిచేయటం, సేవాకార్వక్రమాలతోపాటు సాంస్కృతిక, క్రీడా రంగాలలో కూడానా భాగస్వామ్యముంది. క్రీడాకారుడిని కాకపోయినా క్రీడలంటే ఇష్టం. కళాకారులంటే గౌరవం. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనటమే కాక నిర్వహణలో కూడా నా కృషి ఉంది.

కళాకారులంటే గౌరవం. సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ఆనందించేవాడిని. కడప కళాకారులకు పుట్టినిల్లు సురభినాటకం కడప వారిదే. వాగ్గేయకారుడు అన్నమాచార్య కడపవారే. కవిపండితులకు, కళాకారులకు కడపలో కొరవే లేదు. సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుంటారు. ఘంటసాల జయంత్యుత్సవాలు ప్రతియేటా ఘనంగా జరుగుతాయి. నేను కూదొక్రమం తప్పకుండా హాజరవుతుంటాను. చిన్ననాటి నుండి పాటలన్నాా సాంస్కృతిక కార్యక్రమాలన్నా ఎంతో ఇష్టం. స్వర్గీయ ఘంటసాల పాటలు ఏమాత్రం తీరిక దొరికిన వింటూ ఉంటాను.

హైస్కూలు చదువులలో ఉన్నప్పుడు మా వీధిలో మా అన్నలు వారి మిత్రులు, సాంఘిక, పౌరాణిక నాటకాలు వేయటం బాగా గుర్తు. “పోతుగడ్డ”, “బాలనాగమ్మ”, “శ్రీకృష్ణ రాయభారము" నాటకాలు అర్ధరాత్రి అయినా పూర్తిగా చూసిగాని ఇంటికి వెళ్లే వాళ్లం కాదు.

ఆ రోజులలో నాగభూషణం 'రక్తకన్నీరు' నాటక రంగంలో సంచలనం సృష్టించి, రోజుల తరబడి ప్రదర్శింపబడేది. ఒక్కొక్క మునిసిపాలిటీలో ప్రదర్శనలు జరిగితే అప్పటికప్పుడు స్వంత సంభాషణలలో నాగభూషణం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను ఎండగట్టేవారు.

౮౪౩ శ కడప గదపలో జీవన మధురిమలు

సినిమాలు చూడటం, నాగేశ్వరరావు సినిమా అయితే మూడు నాలుగు సార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సోదరుడు రామక్షృష్ణ రామారావు అభిమాని, ఈ విషయాలలో నా తమ్ముడితో ఎప్పుడూ విభేదించేవాడిని. చిన్నతనంలో టూరింగ్‌ టాకీస్‌లో దేవదాసు సినిమా చూశాను. సినిమాకు దబ్బులివ్వకపోతే అమ్మ మీద అలిగేవాడిని. సినిమాలు, నాటకాలు చూసే అలవాటులో సహజంగానే సాంస్కృతిక కార్యక్రమాలపై మక్కువ, అభిరుచి ఉండేవి. ఆ కారణంగా ఉద్యోగపర్వంలో రాయచోటి, కడప, రాజంపేటలలో సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పక హాజరయ్యేవాడిని. నటన అబ్బకపోయినా నటులు, కళాకారులు అంటే ఇష్టం. కళాశాలలో ఆ రంగాలలో రాణించే విద్యార్థులను ప్రోత్సహించేవాడిని. నేను పని చేసిన (ప్రతి కళాశాలలో క్రమం తప్పకుండా ప్రతినెలా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాడిని, కళాకారులను, మిమిక్రీ ఆర్టిస్టులను, నాటికరంగం, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని, క్రీడాకారులను సైతం వేదికలపై సన్మానించేవాడిని. కళాశాల జీవితంలో విద్యార్థికి బోధనా కార్యక్రమాలతోపాటు, సాంస్కృతిక, క్రీడలు అవసరమని భావించి వాటిని ప్రోత్సహించేవాడిని.

సవేరా వెంకటయ్య గారు కడప నాటకరంగానికి విశేష సేవలందిస్తున్నారు. 'వాసవీ కన్య' నాటకం అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన ప్రదర్శన. తమ ప్రదర్శనల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కడపకు గుర్తింపు తేవటమే కాక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నంది అవార్డు పొందారు. రాజంపేటకు చెందిన కృష్ణకుమార్‌ వృత్తిరీత్యా అడ్వకేటు అయినా మంచి కళాకారులు. ఆయన కుటుంబసభ్యులు సైతం ఈ రంగంలో కృషి చేస్తున్నారు. కడప రవీంద్ర ఈ రంగంలో నటులుగా దర్శకులుగా పేరుప్రతిష్టలు పొందినవారు. కళాభిరుచి ఉన్న ఎందరినో మంచి మిత్రులుగా పొందగలిగాను.

ఇంటర్మీడియెట్‌ విద్యామండలి ద్వారా కడపలో అంతర కళాశాలల విద్యార్ధి, విద్యార్థినులను సాంస్కృతిక పోటీలు రెండు రోజులు నిర్వహించాను. ఇంటర్‌ విద్యారంగంలో ఇదో సంచలనం. కడప కళాక్షేత్రంలో శాస్త్రీయ సంగీతం, లలితసంగీతం, నృత్యం, పాటల పోటీలు నిర్వహించాం. అద్భుతంగా నిర్వహించిన ఆ కార్యక్రమాలను ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టరు చంద్రమౌళి, అడిషనల్‌ జడ్జి ప్రశంసలతో ముంచెత్తారు.

అలపర్తి పిచ్చయ్య చౌదరి + రోలే

కళాశాలలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం, విజయవంతం చేయటం (శ్రమతో కూడుకున్న విషయమే. ఎన్నిక శిక్షణతోపాటు, వారిని ఒకచోట చేర్చి అధ్యాపకులు పడే శ్రమను అర్థం చేసుకొని వారిని కూడ సముచిత రీతిలో గౌరవించేవాడిని, అంతర కళాశాలల విద్యార్థుల సాంస్కృతిక పోటీలు ఇంటర్మీడియెట్‌ విద్యారంగంలో ఒక కొత్త ఒరవడికి నాందీ ప్రస్తావన అయింది. విద్యార్థులలో ప్రతిభా విశేషాలను వెలికి తీయటానికి వీలుపడింది. కళాశాలల యాజమాన్యం వదాన్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించాను.

ఈనాడు అందరిని వేధిస్తున్న 'ర్యాగింగ్‌' వంటి వాటికి మంచి పరిష్కారం కళాశాలలో సక్రమ పంథాలో, నిర్జీత సమయాలలో, బోధనా కార్యక్రమాలతోపాటు క్రమం తప్పకుండా బోధనేతర కార్యక్రమాలయిన సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించటమే పరిష్కారమని నా అభిప్రాయం.

రాయచోటి, కడప బాలికల జూనియర్‌ కళాశాలలో, నందలూరులో కళాశాల విద్యార్థులలో ఎన్నెన్నో విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక విహార యాత్రలు నిర్వహించేవాడిని. ఈ బహుముఖ సేవలలో విద్యార్థులతో నిర్వహించిన విహార యాత్రలు కలికితురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

లెక్చరర్‌గా, ప్రిన్స్‌పాల్‌గా ఈ విద్యావిహార యాత్రలు నిర్వహించాను. నేను స్వయంగా పాల్గొనే వాడిని. హార్సలీ హిల్స్‌, బెంగుళూరు, మైసూరు, ఊటి, అహోబిలం, మహానంది, బెలుంగుహలు, శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రాంతాలకు విద్యా, వైజ్ఞానిక యాత్రలు నిర్చ్వహించాం. ఆడపిల్లలకు సైతం, ప్రత్యేకంగా అనేక బస్సులలో, ఇతర వాహనాలను తీసుకొని వెళ్లేవాళ్లం. తల్లిదండ్రులు, విద్యార్థులు నుంచి ఈ వైజ్ఞానిక విహారయాత్రలకు మంచి స్పందన లభించేది.

జిల్లా వ్యాప్తంగా ఆర్‌.ఐ.ఓ.గా ప్రిన్స్‌పాల్‌గా అటల, క్రీడల పోటీలు నిర్వహించే వారం. ఒకసారి కడపలో జిల్లా జూనియర్‌ కళాశాలల అద్లటిక్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో, రాయచోటిలో జూనియర్‌ కళాశాల వేదికగా, ఆ కళాశాల ట్రిన్స్‌పాల్‌గా జిల్లా ఆటల, క్రీడల పోటీలు నిర్వహించే అవకాశం ఇవ్వవలసినదిగా ప్రతిపాదించాను. సభ్యుల నుండి సహకారం రాలేదు. జిల్లా అధికారి ఒక మాట అన్నారు. గత పదిసంవత్సరాలుగా ప్రిన్స్‌పాల్‌ రాయచోటిలో ఈ పోటీలు నిర్వహించటానికి ధైర్యం బ్ర + కడప గడపలో జీవన మధురిమలు

చేయలేదు. ఒకసారి జరిగిన పోటీలలో ఘర్షణలు జరగటంతో హిందూ, ముస్లింలు ఘర్షణలకు కారణమయ్యారని ఆయన చెప్పటం, ఇవ్వండి, జరిపి చూపిస్తాను అని నేను అనటం, సభ్యుల అమోదంతో నిర్వహణ బాధ్యతలు చేపట్టాను.

జిల్లాలో అన్ని కళాశాలల ఆటల, క్రీడల పోటీలు నిర్వహించే బాధ్యతను నాపై వేసుకొని నిర్ధిష్టమైన (ప్రణాళికతో కార్యనిర్వహణకు పూనుకున్నాను. పారశాల, కళాశాల సిబ్బందిని సమావేశపరిచాను ఆహ్వాన కమిటీ, నిర్వహణ కమిటీలు ఏర్చర్చాను. నిధుల సేకరణకు ఒక కమిటీని గ్రామంలోనికి పంపాను. అప్పటికే లయన్స్‌ సేవలద్వారా, కళాశాలలో సుదీర్హ కాలం లెక్చరర్‌గా, మంచి ప్రిన్స్‌పాల్‌గా గౌరవం, గుర్తింపు ఉండటంతో కమిటీకి అంచనాలకు మించి విరాళాలు అందాయి. పిచ్చయ్యసార్‌ చెపితే ఇవ్వమా! ఆయన నిర్వహణ, నిజాయితీ మాకు తెలుసు, ఆయనను చూసి ఎంతయినా ఇస్తామన్న (గ్రామ (ప్రజల ఆదరణ ఏ మిచ్చి రుణం తీర్చుకోగలనని అనుకునేవాడిని,

తొమ్మిదెకరాల క్రీడాస్టలంలో పెద్ద చెట్టును తొలగించి చదును చేసి క్రీడలకు సిద్ధం చేశాను. ఈ విధంగానైనా క్రీడాస్థలి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని నా ఆలోచన. పోటీలకు అనుకూలంగా కోర్టులు ఏర్పడ్డాయి, వ్యాయామం అధ్యాపకులను పిలిచి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి, నిర్దిష్టమైన సూచనలతో క్రీడల, ఆటలను నా ప్రత్యేక పర్యవేక్షణలో పెట్టుకున్నాను. ఆ రోజులలోనే 27 క్రికెట్‌ టీములు జిల్లా వ్యాప్త కళాశాలల నుండి పాల్గొన్నాయి. సంచలన రీతిలో ప్లడ్‌లయిట్స్‌తో బాల బ్యాట్మింటన్‌ పోటీలు నిర్వహించాను. అపూర్వ రీతిలో స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధికారులలో బహుమతుల పంపిణీ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలలో అపూర్వంగా నిర్వహించాం. బెంగుళూరు నుండి రజిత పతకాలు, షీల్టులు తెప్పించాం.

విరాళాలు అందజేసిన వారిని సముచిత రీతిలో సన్మానించాం. రోలింగ్‌ షీల్డులను ఏర్పాటు చేశాం. జయప్రదంగా, ఘనంగా జిల్లా అద్లెటిక్స్‌ పోటీలు నిర్వహించిన ఘనత రాయచోటి కళాశాలకు దక్కింది. ఆర్‌.ఐ.ఓగా అనుభవంతో జిల్లా అద్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా నిబంధనలు నిర్దిష్టం చేసి, నిధులు సమకూర్చి, అన్నీ కళాశాలలు విధిగా జిల్లా అబ్లెటిక్స్‌ క్రీడలలో పాల్గొనే విధంగా సమగ్ర ప్రణాళిక ప్రకటించి అమలు పరిచాను

అలపర్తి పిచ్చయ్య చౌదరి * ర్లోర్రీ

జిల్లా కలెక్టర్లకు జిల్లా అధికారిగా కడపోత్సవాలు నిర్వహణలో పాల్గొని, కడప పట్టణంలోని విద్యాసంస్థలను భాగస్వాములను చేసి, బాలికల కళాశాలలో మహిళా కార్యక్రమాలు నిర్వహించాం. వివిధ రంగాల ప్రముఖులను కళాశాలలకు అహ్వానించి, వారి అనుభవాలు, (ప్రజ్ఞా పారవాలు విద్యార్థులకు (ప్రేరణ, ప్రోత్సాహం కలిగించాయి. ఏ కార్యక్రమం చేపట్టినా చక్కని ప్రణాళిక, నిర్వహణతో అందరిని భాగస్వాములను చేసి, (పేమ, అభిమానాలతో ఆకట్టుకొని మంచి ఫలితాలు సాధించేవాడిని. విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో రాజీలేదు. తప్పు చేస్తే కఠినంగా శిక్షించేవాడిని. ఆ రోజులలో అది అవసరం అనిపించింది. మరి ఈనాడు ఆ పరిస్థితులు లేవు. క్రమంగా పేమ, నిజాయితీ, అంకితభావంతో విద్యార్థులు, అధ్యాపకులు, యజమానులలో వ్యవహరించే తీరులో లౌక్యం ప్రదర్శించటం నేర్చుకున్నాను. ప్రతి విషయాన్ని “ఛాబెంజొగా తీసుకునేవాడిని ఈనాటి విద్యార్థులకు, అధ్యాపకులకు, నిర్వహణాధికారుబకు అ పట్టుదల, ఛాలెంజ్‌, ఫలితం, బాధ్యత అవసరం అని నా అభిప్రాయం కడప ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో నాలుగు వందలు పైగా ఉరూ విద్యార్థులు వుంటే వారు క్రమశిక్షణా సమస్యలు వచ్చేవి కావు. వారి సమస్యలు పరిష్కరించి భవన వసతులు కల్పించాను. రాష్ట్రంలోనే మొదటిసారిగా 'ఉర్జూలో కళాశాలలో తెలుగుతో పాటు కళాశాల క్యాలెండర్‌ పుస్తకం ప్రచురించి ఆందజేశాను. 'ఇవ్హార్‌' విందు జరుపుతామని విద్యార్థునులు ముందుకు వచ్చారు. కళాశాల ప్రాంగణంలో పొందూ-ముస్లిం విద్యార్థునులు ఘనంగా జరుపుకున్న వేడుకలు జిల్లా వ్యాప్తంగా తెలిసి, డిగ్రీ కళాశాలలో సైతం ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించటానికి కారణమైంది. ఆ కార్యక్రమంలో విద్యార్థినులు నా ఆరోగ్యం కోసం ఉర్పూలో ప్రార్ధన జరపటం మరుపురాని మధురజ్ఞుపకం. వారి ఆదరణ, (ప్రేమ జీవన సంధ్యలో కూడా మరువ లేకున్నాను. నేను ఆర్‌.ఐ.ఓ. కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధటం చూసి, ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనాటి జిల్లా విద్యాశాఖాధికారి ప్రియ మిత్రులు పుల్లారెడ్డి గారు గమనించి, మా కార్యాలయం ్రక్శనే స్థలసేకరణ చేసి, (ప్రేరితులై అదే నమూనాలో మరింత సౌకర్యాలతో, జిల్లా పాఠశాలల అడ్మినిస్ట్రేటివ్‌ భవనాన్ని ర + కడప గడపలో జీవన మధురిమలు

జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ సంఘాలు, జిల్లా ఉపాధ్యాయుల సహకారంతో నిర్మించి, శాశ్వత గౌరవం పొందారు. టి టి లా విద్యార్భబలో, అధ్యాపకులలో మార్చును గమనిస్తున్నాను. విద్యావకాశాలు పెరగటంలో గతంలో కంటే విద్యార్థులలో నవచైతన్యం చూస్తున్నాను. రెండు దశాబ్బాల పూర్వం గురు శిష్య సంబంధాలు ఒక (ప్రత్యేకత సంతరించుకుని ఉందేవి. విద్యాలయాలలో (క్రమశిక్షణ, గురువు అంటే భయభక్తులు, బోధనా కార్యక్రమాలలో అధ్యాపకునిదే ముఖ్యపాత్ర. ఏద్యార్ధి శోతగా ఉందేవాడు. సమగ్ర వ్యక్తిత్వం పెంపొందించుకోవటానికి కళాశాలలో (గ్రంథాలయాలు, ఆటస్థలాలు, అధ్యాపకుల అంకితభావం, క్రమశిక్షణ, కళాశాలల నిర్వహణా విధానము విద్యార్థికి ఎంతో అందగా నిలిచేవి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆనాటి విద్యార్థులు జీవన యానంలో స్థిరపడి నాటి విద్యావిధానం పట్ల అపూర్వ అనుభూతులను నిలుపుకొని, వారి బిడ్డలకు వారి చదువుల విషయాలు, అధ్యాపకుల కృషిని గుర్తుచేసుకొని చెప్తుతుంటారు,

కానీ, ఈనాటి విద్యార్థులకు, అధ్యాపకులను తప్పుషట్టవలసిన అవసరం కనిపించదు. ఉన్నత విద్యలో ఈ దశాబ్దంలోనే పెనుమార్చులొచ్చాయి. పటిష్టమైన స్థితిలో ప్రాథమిక, మాధ్యమిక విద్య ఉండాలి. కానీ, ఉన్నత విద్య బహుముఖంగా విస్తరించటం గమనిస్తున్నాను. సాఫ్ట్‌వేర్‌ అవకాశాలలో సాంకేతిక విద్య పురోగమిస్తుంది. ఇంజనీరింగ్‌, నర్సింగ్‌ వృత్తి విద్యా కళాశాలల సంఖ్య పెరిగింది. ఉద్యోగ అవకాశాల కొరకు పోటీ అనూహ్యంగా ముందుకు వచ్చి సాంప్రదాయక కోర్సుల వెనుకకుపోయాయి. చరిత్ర పాఠ్యాంశాల బోధన కరువైపోయింది. ఆర్ట్స్‌, సైన్సులు వెనుకబడి, ఆ స్థానంలో సాంకేతిక, వృత్తి విద్యలు ఆక్రమించుకున్నాయి.

ఈ నేపథ్యంలో అధ్యాపకుల దృక్పధం మారింది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు, ఉద్యోగ అవకాశాలు దొరకసీవారు, తప్పనిసరిగా ఈ రంగంలో అధ్యాపకులుగా వస్తున్నారు. వారు మంచి ఉద్యోగాలు దొరికితే ఈ రంగాలు వదిలి వెళుతున్నారు. గతంలో యూనివర్సిటీలలో మంచి ఫ్యాకల్టీ, ప్రయోగశాలలు, సౌకర్యాలు

అలపర్తి పిచ్చయ్య చౌదరి + ధాగ్రి

ఉండేవి. విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉండేవారు. కానీ ఈనాడు పరిస్థితి భిన్నంగా ఉంది. విద్యాసంస్థలు సంఖ్య గణనీయంగా పెరిగింది. (ప్రైవేటు యాజమాన్యాలు, యువకులు సాంకేతిక, ఉన్నత విద్య కళాశాలలు ప్రారంభిస్తున్నారు. క్వాలిటీ ఉన్నదా లేదా అనేది కన్పించటం లేదు. విస్తరణ గమ్యం లేకుండా కొనసాగుతుంది. ప్రభుత్వ పర్యవేక్షణ ఉన్నా నామమాత్రంగానే కనిపిస్తుంది.

కానీ విద్యార్థులు క్రియాశీలకంగా, చిన్న వయస్సులోనే అపూర్వ జ్ఞాన సంపదతో పరిణితి చెందుతూ కనిపించటం కొంత ఊరట కల్లిస్తుంది. తల్లిదండ్రులకు, అధ్యాపకులకు ర్యాంకులపై మక్కువ పెరిగింది. స్థాయి తక్కున వారి న్థాయిని పెంచటం గతంలో కృషి జరిగేది. కాని నేటి పరిస్థితులు విభిన్నంగా ఉంది. క్రీడా, సాంస్కృతిక రంగాలలో రాణించగల నత్తా ఉన్న విద్యార్ధులను విద్యానంన్ధల వారు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది.

విద్యార్థి సమగ్ర వ్యక్తిత్వం అభివృద్ధి చేసే కృషి అధ్యాపకునికి ఎప్పుడూ గౌరవం ఉంటుంది. రాకెట్టులా దూసుకుపోతున్న ఉన్నత విద్యను క్రమబద్ధం చేయటంలో కేవలం అధ్యాపకులు, విద్యాసంస్థల కృషియే కాక ప్రభుత్వ నియంత్రణ అవసరం. సమిష్టి బాధ్యత ఉంది. రాబోయే రోజులలో సంక్షోభాలు తప్పవు. దానిని ముందుగా విస్తరణతోపాటు, ఆ దిశలో కూడా చర్యలు ఉన్నత విద్య సక్రమ నిర్వహణకు తోద్చడగలవని ఆశాభావం.

మారుతున్న పరిస్థితులలో మేధావులు తమ అభిప్రాయాలను విద్యాసంస్థల వేదికలు, జానాభిప్రాయాలలో పంచుకోకపోతే వ్యవస్త నిర్వర్భ్యమయ్యే ప్రమాదం ఉంది.

ఉన్నత విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి (ప్రశంసనీయమైనా, పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య, విద్యాలయాలను దృష్టిలో పెట్టుకొని విద్యావేత్తల సహకారం, సలహాలు తీసుకొని, సక్రమ పద్ధతిలో లేని విద్యాలయాలను క్రమబద్ధం చేసే చర్యలు చేపట్టాలి. అడ్మినిస్టేటర్సు కార్యనిర్వహణాధికారులకు ఉండే ప్రాధాన్యత విద్యావేత్తలకు లేకపోవటం శోచనియం.

ఎన్ని పదవులు, హోదాలు, గౌరవ పురస్కారాలు, సన్మానాలు, అవార్డులు పొందినా అవి విద్యార్ధి అభిమానం ముందు ఎందుకూ పనికిరావు. కాలగర్భంలో (6) + కడప గడపలో జీవన మధురిమలు

అవి అన్నీ కలిసిపోయినా, ఉత్తమమైన అధ్యాపకుని సేవలు విద్యార్థులు అంతరంగాలలో చిరకాలం నిలిచిపోతాయి.

జీవిత కాలగమనంలో, కడప జిల్లాలో నా జీవనంలో ఎన్నో సమస్యలతోపాటు, ఆదరణ, అభిమానం, పేమనా విద్యార్థుల నుండి, నా వల్ల సహాయం పొందిన వారి నుండి, నానుండి ప్రయోజకులయిన వారి నుండి నానుండి (పరణ పొందిన వారి నుండి నిరంతరం పొందుతూనే ఉన్నాను.

సౌకర్యాలు, సుఖాలు, సంపదలు, వ్యక్తిగత ప్రయోజనాలు, వాహనాలు, తీరికలేని జీవితం, పదిమందిలో ఎప్పుడూ గొప్పగా ఉండాలనే తపన, ఇటువంటి వన్ని తాత్కాలిక సుఖాల నివ్వగలవు కానీ మనస్సును సంతోషపెట్టలేవని జీవన కాలగమనంలో అర్థం చేసుకోగలిగాను. నలుగురికి ఉపయోగపడాలనే తాపత్రయం నను వీడని నీడలా వెంటపడుతూనే ఉంది.

కాలగమనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎదుటి వారిలోని మంచిని మాత్రమే స్వీకరించి, మనం మంచి చేస్తే అన్నీ విజయాలే. “లక్షలాది మంది పుడుతున్నారు, జీవిస్తున్నారు, చనిపోతున్నారు. వారిలో ఒక్కడిగా కాక ప్రత్యేకంగా ఉండాలి, గుర్తింపు ఉండాలి” అని అన్న పెద్దల మాటలు జీవితమంతా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఒక కాణి దాచుకోవటానికి చేతకాలేదు. పిల్లలు బలపడటంతో నాలోని ఈ బలహీనత నన్ను అంతగా బాధించలేదు.

భగవంతుడున్నాడో లేడో తెలియదు. భగవంతునిపై విశ్వాసం ఉంది. మన నందరిని నడిపించే ఒక శక్తి ఉన్నది. ఆ భయంతో, భావంతో జీవిత కాలంలో మంచినే చేయాలని నా అంతరంగం చెపుతూ ఉంటుంది. ఆశక్తి మనకెప్పుడూ అండగా ఉంటుందని నా విశ్వాసం.

మనస్సును సంతోషపరచటం చాలా కష్టం. ఇతరుల బాధలను గమనించి, అర్ధం చేసుకుని సహాయ పడే సంస్కారం పెంపొందించుకోవాలి. ప్రతి కళాశాలలో ఏదో ఒక సందర్భంలో ఒక మాట విద్యార్థులకు చెపుతుంటాను. “సర్వీస్‌ ఈజ్‌ ది గ్రేటెస్టు రెలిజియన్‌' "సేవే ఉత్తమ మైన మతం' అని, అది అందరి మతం, అభిమతం కావాలని అనుకుంటాను, కోరుకుంటాను.

/7 సల రై ది ర్‌? ల అలపర్తి పిచ్చయ్య చౌదరి శ] 00

మ. ॥ . శి వి లా వ ణ్‌ శ మా ్రు లా ఆం అం తారారా చె అలానా ఆ గు జై జ. నల్‌ డై "6 న | యం? 7 [న . ఖి న | 4 న ప. ళ్టటి య. 1 చ ౮ క . న్‌ న. . ] . రే స. న! స. (షట. 1 11.01.1111. న! మం ము. మ... గ .

సి అటే న్‌! ల (7 న్‌ స రం " య ళీ య టం ల స త్‌ ఈ (| శా శ ఆ! || శ |] న న ఇ 1! ల. గ స ట్‌ జా; ॥.. [గ ీ కే లయన్స్‌ ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యే వైఎస్‌ రాజశేఖర రెడ్డి త్‌... వలి జే / [ (న. (బా మం న - మాం. వి వ్య స్త్‌ 1. రూ. నళ న సాలు న. వ నం (౯ మ రా... త న. జబపవ న ఎ నీ ర క | ఆర్తిహోం సందర్శించిన ముఖ్యమంత్రి వైఎస్‌, చిత్రంలో సంధ్య, దుర్గ, పిచ్చయ్య త గా _ | ా- ” జా ॥ పా / న న భూ గ! , / న్‌ న్న న్తే ళా నం న జభ శ క - గ |. ॥ మయ ఊచ (+ న1 యె [లు ణ్‌ ||| (గ్‌ లో / టా ఇ న ల. | రాక స్ట వే: న! గ ఓ శీ [. సో ీ శో 7 / . కుమారుడు విజయకృష్ణ వివాహ సందర్భంగా...

ఖు . వ ॥ ఖో! అప్పటి సిఎం ఎన్‌. జనార్ధన్‌ రెడ్డి నుంచి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకుంటూ.. టి న. టై ([ / (క ర. వి న. క మంత్రి విజివేముల వీరారెడ్డి నుంచి రాష్ట్ర స్థాయి జన్మభూమి అవార్డు అందుకుంటూ... యమమ న ల స. క క ఇ స్ట వే ౧. |" గ న ఖు టీ. అమెరికాలోని డెట్రాయిట్‌లో షష్టిపూర్తి మహోత్సవం

కనిన. . న శ న. తు లు అరకు అనంతగిరిలో సహ విద్యర్థులతో కలసి పిక్నిక్‌ వెళ్లిన జ్ఞాపకం త్‌ (+ (న్నా | ॥ జ [. య టి కాలి సయం /. . క | ర! ( ప కత స. (. టే ల్‌ , బీ కుమారుడు విజయకృష్ణ, కోడలు తేజస్విని, కుమార్తె శిరీష, అల్లుడు రఘుబాబు, మనవడు ప్రణవ్‌లకో...

తన్న జ శ్‌ ట్ట పిచ్చయ్య చౌదరి గారి అత్తా మామలు బి. లక్ష్మీ బి. రామకృష్ణ, రిటైర్డ్‌ డీఎస్సీ ఆ స న న ని మనం త్‌ పట సుతో శి (| ము... య. శీ. ట్‌ లే ష్‌ లె . ” (౫౫% పిచ్చయ్య చౌదరి ఉద్యోగ విరమణ సందర్భంగా తన శ్రీమతి దుర్గాకుమారితో...

ర | తా తా ల లా / ఇంటర్‌ విద్యా కమిషనర్‌ బిశ్వాల్‌ క్షేత్రపర్యటనకు కడపకు వచ్చిన సందర్భంగా .. [షష ప న ప 1 | స్‌ గ్‌ మనవడు, మనవాళ్లు ప్రణవ్‌, వైభవ్‌, సమన్ని .. ల కనకాల క టంలో ఆ న నా కో! ఖ్డ్గ న్‌ క్‌ స. గో న్‌ ఇ ప శి వ స నేల సాగ స్‌ . 1 శ్జే నో క ష్‌ ధల! శీ మం ౨ టట మాం సజ [| స స గ | 7 చే ఫ్లై స 105 న్‌ స సీకో | ల్ల "ఈ 1. స్క స్గ శీ 1... ౯) [ న. గ ప... ల లా లో చ గ భాతాశి చు యక

. ః సా సాన్యా ణా. . ౮ త. నం ను! ణీ శ 10 గు! ల్‌ టట. న్‌. గ్‌ న. ్‌ ౯ 11111 ట్‌ ఖ్‌ 1 రు య. (( ళ్‌ యల న ని 1 న. 1 కాణలులాలు + ॥ లో శ భ్‌ /. (1 య. స ను 11111111 | నం , టం. 1 శ నంగి (| 11

గో శ. మన. గళ వ్‌ (క ప. రం కమ లన 1. *. నా లైల జ టే! మ న మ వవ సోన నన. | టన... నుట తట తు ఈ ాాాాం జీవన మధురిమలు . |. మిత్రుల అలపర్త్‌ పచ్చమ్యు వాదక్‌ ఆన అత్మకథలో ఎక్కడ తన మరి చెడ్డలను కప్పవచే | | ధయత్మం చేధులేదు. 'అర్ధయాన సుటినళను కట నిర భో ిగా గళరు విద్యన్యవ్థల . | ఇ్రటర్మీ డయట్‌ దశచాలా కీ ఇకమై నట్ట 'ఏద్మరులలో ఎరసాసకిన పంచుటకన్న ప్రయగాలు చేశారు. _ | | కార్చారట్‌ కళాశాలలు ప్రధానంగా, గ్రడ్‌లు న్య పల అక్షరంగా పసవేస్తన్నాయి. ఆ కళాజలలు లైల... | న... 'వల్తిచూపారు. పిచ్చయ్య చౌదరి దయ,కారుణ్యంగల సేవా రాయణుడు. 'సరికల్ళం పుద్దరిగొ వన్నచేపట్టిన. | ; పన్గుల్యుసప్రలిం: కాగలవనీ 'నీరూపించారు. ఓక్షన్నొడు; కొథుగారతలో భాగంగా వుండిన ప్రభుత్వ బాలికల: జూనియర్‌ కళాళళ్ళ ఉన్నతమైన విలువలత్తో కూడిన 'పళ్టేవి మర్రదిరంగా పెపాందింది. అందుకు! | ' కారకులు పీచ్చయ్యగారే... (| . , , | . ఇ డాక్టర్‌ జానమద్ది: హముమచ్చ్భాప్రి: _క్సృడో కొండ కోనల్లో, కానీ సీమల్లో పుట్టిననదులు కొన్ని వందల చేలమైళ్లదురంభ్రయాతించి . వళ్ళి బీ భూముల్ని పస్యళ్యములం చెసన్నాయ అక్కడి వటి, ఫైరునీ వస బీవజాలాన్ని తమ |. ' అత్మబంధువులుగా అక్కున చెడ్పకుంటున్నాయి.; కొదరు మహానుభావులు కూడా నదుల.లాంటి వారే, పుట్టక: ఎక్కడో తెలీని పోతులూరి వీరబ్రహ్మంగారు: కడవ జిల్లా కందిమల్లాయపతల్లెలో స్థిరపడి లోకానికే | కొలజ్డోనాన్ని అందించారు: శ్ఞరగ్టీషు దొర సీపీ బ్రాన్‌ కడపను శంద్రంగా చేసుకొనీ తెలుగు సాహిత్యాన్ని | వునరుజీఏంప చేశారు: కల్మల్‌ కాలిన్‌ మేకర్తిజీ దొర కాలగర్భంలో కలిసిపోతున్న ప్రాంతీయ: చరిత్రల్ని, ' వైఫీయత్తులుగా కికార్డుచేశారు. అనంతపురం, జిల్లా పెనుగొండలో పుట్టిన పుట్టపర్తి నారాయణచార్యులు తన;సాహిత్య శివతాండవానికీ: కడప గడ్డనే చేదికగో చేసుకొన్నారు. వాళ్ల పుట్టుక ఎక్కడైనా కడప:గడపలో . || అడుగు పెట్టింది మొదలు: ఇక్కడి మట్టిని ప్రేమించారు: ఇక్కడి మనుషుల్ని ప్రేమించారు. వాళ్లలో

  • ఒక్కరిగామమెకమై జీవించారు: ఈ పరంపరలోని వాతే అలపర్తి పచ్చయ చౌదరిగారు, = సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. అలపర్తి పిచ్చయ్య చౌదరితో నాకు నాలుగు దళాబ్దాలసొన్నిహిత్యం ఉంది; ఆతనిలో సేవాగుణం విద్యార్థి దశ . నుంచే అతనితోపోటు పెరుగుతూ. వచ్చింది. తనకు ఒక పరిపూర్ణమైన టతుకునిచ్చిన రాయలసీమ రుణాన్ని తీర్చుకుంటున్నాడు; విద్యార్థులపొలిట దేవుడిగా, అధ్యాపకులకు ఆదర్శ (ప్రాయునిగా, (ప్రజలకు నిత్య చైతన్య స్ఫూర్తిగా వారి హృదయాల్లో స్థిరమైన. స్టానాన్ని ఏర్పరచుకున్నాడు: మా స్నేహకాలంలో అన్ని రుతువులూ , వసంతాలే! అన్నిక్షణాలూ పరిమళభరితాలే! అన్ని రాత్రులూ నిండు పున్నమి వెన్నెలలే! “= టీఎన్‌. రావు, వ.వ:ఎస్‌. . ఆత్మకథనం ' అలపర్తి పిచ్చయ్య చౌదరి (|