Telugu I.V.S. Achuyutavalli Navala Sahityam - anilvaranasi/indianlanguages GitHub Wiki

వీ వయ అిచ్వుంఏలి

ర9లం1(0 * స స ము 9 గ్‌ శ 1 వ

” ో గా టి సక జు ఇ 1 మ. యగ టె యమన. యి న. | . బా శనిలో _

ఏ.వి.యస్‌. అబ్యుతవల్లి నవలా సాహిత్యం (సజహెచ్‌.డి. సిద్దాలతీగ్రీంథీల) డా కె. బి. లక్ష్మి నేహ నికుంజ్‌ పబ్లికేషన్స్‌ హ్లైదీరాబొద్‌ 2007

లి రి 44:2 ర్‌. దా న గా ఓక. ఊట యో అ లవ క ౯15౬ ౬6100౧ - 2007 లి ళల ౧0౪౪ 06519౧6౯ - [42065 ;46 : ౧౪! గ18౧0/6 నిషం1॥150౧66 8 - 5౧604 4౧|| ౧4౦11042640౧5 ఫే 206, 919020 గంట., ౧౬౧౭౦౦62, 5గ౧402౯ 6౦1౦౧౫ ౦0౬6, గ౪/646౧20246 - 500 082. 10101% (౦040-2374 5250 న. బం [గ౧6౧౮ & 11/06 56641౧00 రా 34! 3[౧| ౧౧1౫౫౬౧౩ యయ! ౪ంధాం తిగిం6గాంఓ 0/66/2026. య టేంలాలడు చ్లా 9౧: 040-23730222 “4 న ౧ ౧౫౮4826). | 00౧6౩ 1212016 | నో 50902 [10౧ మలో [(0౪7062౫/ ప్రైదూబా డ్పగ0 గగక్సీ ౪154120౧62 1. 812౧0069 చమొూ- డ్‌ క డ/2/౮68 .. దిగం6 : ౧5. 80/ ఓ10/20/ ౬6100 : ౧8. 125/- తతత టీ తెలుగు విశ్వవిద్యాలయం నారి నాక్షిక్‌ ఆర్దిక లవాయంతో ట్రచురీణ

హు. వ్య నూ వ్‌ న్న ; క మాజా హ్‌ ప్ర: య ॥ లే గ టు 0! రాణ 1౯ మాటల భల న ” వ స కనా తన షష (. య్‌!! మ! [౯ రం! ఎ (గాలా | 7 3 గ్ర క. (1 | ౨) న! న | 2 (12 స] | ; పిత. న | . ఇ ॥ ర వ . [టల 1 1.0 1. య. 1.2 / క్ష |. 1 - 15 న. కుకా! అననన ల ని /; ౫ (1 పా మా ఇల! పున ప [1 ఇ [ _ హాల న్‌ వాం... త. టు న _ లి వం | స 1 షు. 1 చం నం క ఇ (స న్‌ ఉం వశ ల +. అజాన్‌ ని నా. ఎ న, ద షా శా (| న రం స్త / రసల. లో హరు వా వము లో వయస జ రసంని [12 న్‌ చౌ ఒ ఇ కం ్‌ షా మా తి తావ శ వచ గస [ య లగ ॥ 1 స య...” ల నా కం న్‌ 1. మ న ॥ ఎలా మం. ॥ నీ శ శ్‌ న... . స భా సు! గ్‌! న! 7 భమ ఆ ని | నా ల! ప. | న య నావీ | న. షి న న! 1! మ.

తత్వవేక్షక వాక్కం

  • బా ఎన్‌. [కేమి డాక్టర్‌ కె.బి.లక్ష్మి నా పర్యవేక్షణలో రూపొందించిన సిద్ధాంత లక్ష్మి స్వయంగా రచయిత్రి కావడం వల్ల ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలల విశ్లణ సమర్థవంతంగా సాగింది. ఊపిరి నలపని పత్రికావ్యాసంగంలో మునిగి తేలుతూ, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆమె తన పరిశోధనను నిరాఘాటంగా,

నిర్విఘ్నంగా నిర్వహించారు,

నాకు కె.బి.లక్ష్మి పట్టుదల్య పరిశ్రమ ప్రవణత, దక్షత బాగా నచ్చాయి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉల్లాసంగా కనిపించే లక్ష్మిగారిలో ఇంత పరిశీలనా శక్తి పరిశోధనా పటిమ ఉండడం వల్లనే ఐంవియస్‌, అచ్యుతవల్లి రచనల ఆత్మను పట్టుకోగలిగారు. ఏ

రచనకైనా ఇంతకంటే సాఫల్యం ఏముంటుంది? డాక్టర్‌ కె.బి. లక్ష్మిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను,

కృీతిజతాలజలి వలే

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కాలేజ్‌ బిల్డింగ్‌ వాస్తుశిల్ప సౌందర్యంపట్ల ఆకర్షణే సైన్స్‌ పట్టభద్రురాలినైన నన్ను ఎమ్‌.ఎ తెలుగు చదివేలా చేసింది. పిహెచ్‌.డి కూడా అక్కడే చేయగలగడం నాకెంతో ఆనందదాయకమైన విషయం.

రచయితల రచనలపై వచ్చినంతగా రచయిత్రుల రచనలమీద పరిశోధనలు జరగలేదు. ఎంతోమంది సమకాలీన రచయిత(త్రు) ల కంటే ముందు చూపుతో, ప్రగతిశీల దృక్సధంత్కో పరిజణావుళీల పాత్రలతో, అభ్యుదయ వాదంతో అద్భుతరచనలు చేసిన ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి భావాలు, ఆలోచనలు, కథాకథనం ఒక పాఠకురాలిగా నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆలోచింపజేశాయి. తదనంతర కాలంలో ఆమె రచనలపై పరిశోధన చేయాలన్న కోరిక కలిగింది. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, సుళీలానారాయణరెడ్డి అవార్డు అందుకోడానికి అమె వచ్చినవుడు కలిగిన పరిచయం నా నిర్ణయాన్ని స్థిరపరిచింది.

కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, కాలమ్స్‌ ఇలా వివిధ ప్రక్రియల్లో తనదైన ముద్ర వేసుకున్న అచ్యుతవల్లి మొత్తం రచనా ప్రక్రియల్ని బెపోసన పట్టి పరిశోధన చేయడం కొంచెం కష్టమే, అయినా ప్రయత్నించాలనుకున్నాను. కాగా, విస్తృతిని పరిమితం చేసుకుని ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలలు - సమగ్రపరిశీలన అన్న అంశాన్ని పరిశోధనకు ఎంచుకోమని సూచించి, పరిశోధనకు అవకాశం కల్పించిన వారు అనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులు, ఆనాటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య ఎన్‌.గోపిగారు. అలా మార్గం సుగనుం చేయడమే గాక వా పరిశోధనకు మార్గదర్శక పర్యవేక్షకులుగా వుండడానికి అంగీకరించి, ఎన్నో పనుల ఒత్తిడులలో ఉండి కూడా అధ్యాయాల వింగడింపు మొదలు, పరిశోధన పూర్తయ్యే వరకూ సముచిత సలహాల నందిస్తూ ఎంతో సమయాన్ని కేటాయించారు ఆచార్య ఎన్‌.గోపి. వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు,

నా పరిశోధనా వ్యాసంగానికి అనువైన పరిస్థితులు కల్పించి, అడిగినంతనే అన్ని విధాలా ఆత్మీయసహకారం అందించి ప్రోత్సహించారు ఉస్మానియా తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డిగారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

నా పరిశోధనాంశం ప్రస్తావించగానే ఆనందంతో ఆదరించి, తన దగ్గర లభ్యమైన రచనలు ఇచ్చి ఆశీర్వదించారు రచయిత్రి శ్రీమతి అచ్యుతవల్లి. తన జీవిత, సాహిత్య రేఖలను పారదర్శకంగా నా ముందుంచి రచయిత్రి అంతరంగాన్ని తెలుసుకునేందుకు దోహదపడ్డారు. ఆమెకు మనసారా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సవంయానుకళంల సలహాలిచ్చి సాయాపడిన ఆచార్యవర్షం డా. ఎస్‌.వి.రామారావుగారికి డా.సుమతీనరేంద్రగారికృ, డా.కసిరెడ్డి వెంకటరెడ్దారిక, డా. రఘుమన్నగారికి, డా. మసన చెన్నప్పగారికి నాహృదయపూర్వక కృతజ్ఞతలు, రచయిత్రి దగ్గర లేని రచనలు అడగ్గానే (శ్రమ తీసుకుని కొరియర్లలో నంసి శుభాకాంక్షలందించిన శ్రీ ఎన్‌.ఆర్‌. చందూర్‌, శ్రీమతి మాలతీచందూర్‌, డా.మిరియాల రామకృష్ణగార్లకు నా కృతజ్ఞతలు. సంక్లిష్ట పరిస్థితుల్లో నిశ్చింతను ఉపదేశించి, వెన్ను తట్టి సహాయ సహకారాలందించిన పాభ్రికేయమిత్రుడు డా, జె.చెన్నయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. పిద్ధాంత వ్యాసరచనా వ్యాసంగాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచిన హిథైైషులు డా. వంగపల్లి విశ్వనాధం, శీలా వీర్రాజు డా, ముక్తేని భారతి, డా. భార్గవీరావు, కీ.శే. డా. మాడభూషి రంగాచారికి నృత్తిరీత్తా, ప్రవృత్తి రీత్యా పరుగెడుతున్న కాలాన్ని పట్టి పరిశోధనా వ్యాసంగానికే పనిపెట్టమని పదేపదే పలకరించి ఉత్సాహస్ఫూర్తిని ఇనుముడింపజేసిన ఆత్మీయమిత్రులు టి. వినోద్‌కుమార్‌, సింగియా, సుధామ, డా. నాగినేని భాస్కరరావు, శేషుబాయి, రాఖీ బ్రదర్‌ రవీంద్రలకు నా ధన్యవాదాలు. అట్టలు చిరిగిపోయిన, అనాటి అశేషపాఠకుల చేతుల్లో నలిగిపోయినా, కొన్ని పేజీలు అదృశ్యమైపోయివా సరిచేసి, భద్రపరిచిన అరుదైన అలభ్యమైన అచ్యుతవల్లిగారి తొలినవలలను నాకు అందించి సహకరించిన వేటపాలెం సారస్వత నికేతనం సిబ్బందికి, ప్రత్యేకించి శర్మగారిక్కి సామ(గ్రి సేకరణలో సహకరించిన హైదరాబాద్‌ స్టేటొసింట్రల్‌లైబ్రరీ, ఉస్మానియా విశ్వవిద్యాలయ (గ్రంధాలయం, బ్రిటిష్‌ లైబ్రరీ వారికి నేనెంతో రుణపడి వున్నాను. నా ఉన్నతిని, శ్రేయస్సును అనుక్షణం కోరి ఆశీర్వచనబలంతో నన్నింతదాన్ని

చేసిన నాన్నగారు వి.బి.సుబ్రహ్మణ్యం, అమ్మ స్వర్గీయ దుర్గకు,నా పాదాభివందనాలు. నేనంటే, నా వ్యాసంగమంటే మిక్కిలి మక్కువ చూస్తి, మురిసిపోయే నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వారి కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు.

నా సిద్దాంత వ్యాసరచనను సీరియస్‌గా తీసుకుని అడుగడుగున్నా అన్ని విధాలా అనువైన స్నేహవాతావరణాన్ని కల్పించి, టివి, రేడియో కార్యక్రమాలను కూడా త్యాగంచేస్కి నా ఉత్సావోన్ని ద్విగుణం, (త్రిగుణం చేసి ప్రోత్సాహించిన చిరంజీవులు మా అబ్బాయి ప్రవీణ్‌చక్రవర్తి, అమ్మలా ఆదరించిన మా అమ్మాయి సమీర, నా జీవిత సహచరుడు కామేష్‌కి ఎంతని కృతజ్ఞతలు చెప్పుకోగలను!

మిడ్రులు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు ఎందరో! అందరికీ పేరు పేరునా బహుదా, శతధా కృతజ్ఞతాంజలులు.

డా॥ కె.బి.లక్ష్‌ త్రై

వినయ సూచిక ౫: ఈ పరిశోధన గురించి : డా. కె.బి.లక్ష్మి 13

  1. _ వస్తువైవిధ్యం - ఇతివృత్త నిర్వహణ 18-986 1.1 మనో విశ్లేషణ

1.2... వివాహ వ్యవస్థ

1,3 యువతీయువకుల సమస్యలు

1.4 మధ్యతరగతి జీవిత చిత్రణ

1.5... నిన్ను వర్గాల పక్షపాతం

1.6 కాల్పనికత - వాస్తవికత

పాదసూచికలు గ్‌ వాత్రచిత్రణ - వాయుఖ్యత 87-86 పురుషపాత్ర చిత్రణ 89.117

2.1 _ రచయిత్రి ఆదర్శానికి ప్రతినిధులైన పాత్రలు

2.2 _ వైద్యవృత్తి పరమైన పాత్రలు

2.3 _ మనోవిశ్లేషణాత్మక పాత్రలు

2.4 వాస్తవ పాత్రలు

2.5. దుష్ట స్వభావపొత్రలు

  1. స్రీపాతల చిత్రణ కేకేరి- 144 3.1 _ ధీర - అధీర వ్రధాన పాత్రలు

3.2 స్వేచ్చా ప్రణయతత్వ పాత్రలు

త3 స్థైర్యం గల పొత్రలు

3.4 _ రచయిత్రి ఆదర్శానికి ప్రతీకలు 3.5... రచయిత్రి సామాజిక - వైద్య శాస్టావగాహనను

సంతరించుకున్న పాత్రలు

  1. _ పాత్రల నామకరణంలో సహజత్వం 145-151 పాదసూచికలు చ్‌. భాషాశైలి-శిల్పం క52-160 వర్ణనలు 5.1 _ ప్రకృతి వర్ణన 5.2 _ అత్మాశ్రయ వ్రకృతి వర్ణన 5.3. పాత్ర మనోగత సారూప్యత 5.4 _ రూప వర్ణన (ఆకృతి వర్ణన) 5.5 వ్యక్తిత్వ స్ఫురణ 5.6 భావ వర్ణన 5.7. ఛాయా చిత్ర సదృళ్య వర్ణన 5.8 _ వురాణ చారిద్రాత్మక పాత్రలతో పోలిక 5.9 _ సామాజిక స్పృహతోకూడిన వర్ణన 5.10 సన్నివేశ వర్ణన
  2. వ్యాఖ్యలు 161-178 6.1 సంభాషణా శైలి 6,2 _ సంస్కరణాభిలాష 6.3 సంస్కార దృక్పధం 6.4 స్వాభావికత 6,5 _ వైజ్ఞానికమైన తార్కికత 6.6 సంగీతజ్ఞత 6.7 చమత్కార-హాస్య సంభాషణ 6.8 _ పాత్రోచిత భాష - మాండలికం 6.9 _ నుడికారాలు - అన్య భాషా వ్రయోగం

బం రచయిత్రి కథనం 179-180 8. శర్షికనామ సరళి 181-182 9. నేశుథ్యచితణ 18 3-18 4 10. సన్నివేశ కల్పనాశిల్పం 185-194 10.1 సంభాషణాథభ్రిత సన్నివేశాలు 10.2 చేష్పాగత సన్నివేశాలు 10.3 ముగింపు

పాదసూచికలు

అనుబంధం 195-203

అచ్యుతవల్లి జీవితం - సాహిత్యరేఖలు

కధారచయిత్రి

కాలమిస్ట్‌

వ్యక్తిగతం

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలల కుట్టిక 204-205

ఉపయుక్త గ్రంథ సూచి 206-211

నాలుగున్నర దశాబ్దాల కిందట ఆరో దశకంలో పురుషులు ఆడపీర్లతో నవలలు రాసి గుర్తింపు తెచ్చుకోవలసిన పరిస్థితిని స్త్రీ రచయిత్రులు కల్పించారు. ఆడవాళ్ళు వంటింటి సాహిత్యాన్ని సృష్టిస్తున్నారన్న అపప్రధ పుట్టించినా గరిటతో సమంగా కలం తిస్పిన రచయిత్రుల ఉధృతి ఆగలేదు. నవలామణుల ప్రవేశంతో నవలారచన కొత్తపుంతలు తొక్కింది. నవనవోన్నేషంగా నిరాజిల్లింది. ఆ ఉధృతి నిరాఘాటంగా దాదావు నాలుగు దశాబ్దాలపాటు కొనసాగింది. అచ్యుతవల్లి ముందుతరంలో విశ్వనాథ, చలం, ఉన్నవ లక్షీనారాయణ, డా.ఉస్పల లక్షణరావు, గోపీచంద్‌, శ్రీదేవి-తన సమకాలికులైన రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, అత తదితర రచయిత్రుల రచనలతో తెలుగు నవలా వికాసం జరిగింది. 196 0-8 0 దశకంలో ఆధునిక నవలా యుగానికి ప్రాతినిథ్యం వహించిన ఎందరో నవలానుణులున్నప్పటికీ ఐ.వి.యస్‌, అచ్యుతవల్లి విభిన్న వినూత్న సాహితీలోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్రీ వురుష సంబంధాలకు, స్వాతంత్ర్యానంతర మానవీయ విలువలకు, స్త్రీ సమస్యా ప్రధానమైన అంశాలకు ప్రాముఖ్యతనిచ్చి మనోవిశ్లేషణాత్మక రచనలు చేశారు. సంప్రదాయబద్ధమైన అభ్యుదయవాదం అమెది. విద్యావతి అయిన స్త్రీ వ్యక్తిత్వ సంస్కారంతో తన జీవితాన్ని తానే చక్కదిద్దుకోగలదనీ, చదువు, ఉద్యోగం, వివాహం, మాతృత్వం తదితర విషయాల్లో తన జీవితాన్ని తాను శాసించుకోవడమే కాకంండా ఎదంటి వ్యక్తుల జీవితాలనుఎ, ఆలోచనా సరళిని కూడా చక్కదిద్దగలుగుతుందని నిర్ద్వంద్వంగా చెప్పారు తన నవలల్లో. చలం స్ట్రీకి ధిక్కరించడం నేర్పాడు. కానో నిలదొక్కుకోడానికి పథనిర్దేశం చేయలేదు. గోపీచంద్‌ మన వివాహన్యవస్థ స్త్రీ అభివృద్ధికి మరీ ఇరుకైపోయిందన్నాడు. సంప్రదాయాన్ని ఎదిరించలేక, అలా అని సంప్రదాయాన్ని అనుసరించలేక మధ్యేమార్గాన్ని అనుసరించారు తదనంతర రచయిత్రులు. అయితే వాస్తవిక దృష్టితో సంప్రదాయ విలువలను నిలబెడుతూ, కుటుంబ వ్యవస్థను ఆదరిస్తూకూడా ప్రగతిశీల అభ్యుదయవాదంతో పాత్రలను సృష్టించి తన సమకాలీన రచయిప్రులకంటే కాలానికి ముందు నిలిచిన రచయిత్రిగా ఐ.వి.యస్‌. 'అచ్యుతవల్లి నవలల విశిష్టతను వెలుగులోకి తీసుకు రావడమే నా పరిశోధన ప్రధాన ఉద్దేశం. 13

పాఠకుల, విమర్శకుల ప్రశంసలు పొంద్శి నిశిత లేఖినిగా గణతకెక్కిన అచ్యుతవల్లి రచన తనకోసం కాదు, సమాజానికి మేలుచేసీదిగా వుండాలని నమ్మిన వ్యక్తి. బహుశా అందుకేనేమో చాలా నవలలు కాపీలు ఆమె వద్ద లేవు. ప్రచురణకు నోచుకున్న ప్రతి గ్రంథం [గ్రంథాలయాలను అలంకరించే రోజులు గనక తొలినాళ్లలోని ఆమె నవలలు వేటపాలెం గ్రంథాలయం సారస్వత నికేతనంలో లభ్యమయ్యాయి. నవలా ప్రక్రియలో రచనా వ్యక్తిత్వం నిరూపించుకున్న అచ్యుతవల్లి సమకాలీన సమస్యలను ఇతివృత్తాలుగా చేసుకుని, సామాజిక స్పృహతో, పరమ పఠనీయమైన కథాకథనంతో స్త్రీ చైతన్య సంఘర్షణకు అద్దం పట్టే పాత్రలను సృష్టించారు. స్త్రీవాద సిద్ధాంత రాద్ధాంతాలు తెలీని రోజుల్లో 19 7 5లో వచ్చిన అచ్యుతవల్లి కోరిక నవలలోని సంగీతపొత్ర, భ్రమరగీతం లోని సంగీతపొత్ర ఈనాటి నీనాగుప్తా వంటి అతివాద వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలవడం గమనార్హం. అలాగే నిమ్నవర్గ పక్షపాతంతో కూడిన దళితవాదం స్వాతంత్ర్యం సంతరించిన సరికొత్త విలువలతో కొడిగట్టిన దీపాలు, నేను దేవిని కాను నవలల్లో పాఠకుల్ని ఓ ఊపు ఊపింది. అచ్యుతవల్లి రచనాకాలంలో చలం, గోపీచంద్‌, అడవి బాపిరాజు, బుచ్చిబాబు, రావిశాస్త్రి కొమ్మూరి వేణుగోపాలరావు, బలివాడ కాంతారావు, గొల్లపూడి మారుతీరావు, ఇఛ్చ్బాపురపు జగన్నాథరావు, సింగరాజు లింగమూర్తి తదితర రచయితలు మధ్యతరగతి జీవితాల సమస్యలను తమ తమ నవలల్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు. అయితే రచయిత్రులు విద్యావంతులై ఉద్యోగం చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలను కథావస్తువుగా స్వీకరించారు. ఈ నవలలు ్రజాజీవితాలపై ప్రభావం చూపడం (ప్రారంభించాయి. వీరందరిలో ఐ.వి.యస్‌. అచ్యుతవల్లిగారి “టోన్‌” బలమైనది. కేవలం మధ్యతరగతి కన్నీళ్ళని, కష్టాల్ని ఉటంకించి వదిలేయకుండా ఆ నేపధ్యంలో యువతీయువకుల జీవన విధానం, మనస్తత్వం, సమస్యలపట్ల ప్రత్యేకదృష్టితో రచనలు చేశారు. మధ్యతరగతి స్త్రీల పట్ల ప్రగాఢ సానుభూతిని కలుగజేస్తాయి ఈమె రచనలు. స్త్రీపురుషులు సమానమన్న ధోరణి ప్రతి నవలలో కనిపిస్తుంది. సహజమైన 14

సంఘటనలను, పొత్రలను తీసుకుని పదునైన భాషలో నిర్భీతిగా ఈమె రచనలు చేశారు. సంప్రదాయ కుటుంబాల్లోని యువతీయువకులు ముఖ్యంగా యువతులు అభ్యుదయ పంథాలో నడవడం, తమ జీవిత గమ్యూలను తామే నిద్దేశించుకునేంత విచక్షణ కలిగి వుండడం ఈమె రచనల్లోని ప్రత్యేకత... ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు వినవస్తున్న స్త్రీ వాదానికి ఆనాడే అచ్యుతవల్లి ఆరోగ్యవంతమైన, బలమైన ఫునాదివేసి ఆలోచనలతో, అద్భుతమైన విశ్లేషణ నిచ్చి ఒప్పించారు. వైవిధ్య భరితమైన ఇతివృత్తాలతో రచనలు చేయడం ఆమె విశిష్టత. అందుకే రచయిత్రిగా ఆమె స్థానం ప్రత్యేకం,

ఆమె 'నవలల, కథల ప్రస్తావన ఆయా నిమర్శనా గ్రంథాల్లో చోటుచేసుకున్నా, స్త్రీ పురుష వేషభాషల్లోనే గాక వ్యక్తిత్వంలో, ఆలోచనా. దృక్పధంలో నవీనతను సంతరించుకున్న అచ్యుతవల్లి నవలల్లోని పాత్రలను, వస్తు వైవిధ్యాన్ని, భాషాకైలి, శిల్పాలను సమగ్రంగా పరిశీలించడం, పరిశోధించడం ఇంతవరకూ జరగలేదు.

బహుముఖ ప్రజ్ఞాలి, విదుషీమణి అయిన అచ్యుతవల్లి నవలల సమగ్ర పరిశీలనావళ్యకతను విశ్లేషణాత్మకంగా విశదీకరించడమే నా పరిశోధన. అచ్యుతవల్లి నవలా సాహిత్యంపై ఇది తొలి సిద్ధాంత వ్యాసం.

ఈ సిద్దాంత వ్యాసం మొదటి అధ్యాయంలో సిద్దాంత వ్యాస రచనా మర్యాదను అనుసరించి తెలుగు నవలా పరిచయం చేశాను. నవల అనే ప్రక్రియ పాశ్చాత్యుల నుండి (గ్రహించినది కనుక ఆధునిక సాహిత్యంలో దాని పుట్టుపూర్వోత్తరాలను, నవల సమగ్రమైన సాహిత్య ప్రక్రియగ్యా అన్నివిధాల అభిప్రాయాలను విభిన్న కోణాలనుంచి అభివ్యక్తీకరించగల ఏకైక సాహిత్య రూపంగా రూపొందడానికి ఉపయుక్తమైన నవల ముఖ్యాంగాలను, ఇతివృత్తాన్ని బట్టి, కథా వస్తువునుబట్టి స్థూలంగా నవలల విభజనను తెలియజేశాను. తెలుగు సాహిత్య క్రమ వికాసంలో అధునిక నవల పూర్వాపరాలను చిత్రించడమే మొదటి అధ్యాయం ప్రయోజనం.

రెండో అధ్యాయంలో 19 6 (వ దశకంలో తెలుగు నవలా రచనలో వచ్చిన ఆకస్మిక మార్పులు, అశేషంగా, అనివార్యంగా పెరిగిన పత్రికల, రచయిత్రుల సంఖ్య, పాఠకుల అభిరుచులను ప్రస్తావిస్తూ అనాటి తెలుగు నవల స్థితిగతులను తెలియజేయడం జరిగింది. అచ్యుతవల్లి రచనాకాలంలో తెలుగు నవల స్థితిగతులను స్పష్టంగా తెలుసుకోవాలంటే అంతకు పూర్వ రంగాన్ని స్టూలంగానైనా ప్రస్తావించడం

15

భావ్యమన్న ఉద్దేశంతో తలుగు నవల పూర్వరంగం, 1960 న్యుండి 1980 దాకా మూడు దశాబ్దాల్లో ముదితల రచనా విధానం, వీటన్నిటి మధ్యా ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి విశిష్టతను గురించి వివరంగా తెలియజేయడమే ఈ అధ్యాయం ధ్యేయం. మూడో అధ్యాయంలో అచ్యుతవల్లి నవలల పరిచయం జరిగింది. సామాజిక న్యాయం ఈమె నవలల ఆశయం. అచ్యుతవల్లి నవలల్లో సామాజిక స్పృహ అద్దంలో ఫ్రతిబింబంలా కనిపిస్తుంది. వాస్తవ జీవితంలో వ్యక్తులు తమ స్వభావాలను సులభంగా మార్చుకోలేరు. కానీ తన కల్పనాదాతుర్యంతో కథనానికి అనుగుణంగా పాత్ర చిత్రణ చేయడం అచ్యుతవల్లి ప్రత్యేకత. నాలుగు దశాబ్దాల కిందటి ఆమె నవలలు దొరకడం కష్టసాధ్యం. ఆనాటి గ్రంథాలను భద్రపరిచే కొన్ని గ్రంథాలయాల్లో పాఠకోభిమానులు, సాహిత్యాభిమానుల దగ్గర మాభ్రమే అవి లభ్యమయ్యే అవకాశంవుంది. అందువలన ఆమె నవలల సంక్షిప్త పరిచయానికి ఈ అధ్యాయం కేటాయించడం సమంజసంగా వుంటుందని భావించాను. ఈ అధ్యాయంలోని అచ్యుతవల్లి నవలల పరిచయం ముందు ముందు అధ్యాయాల్లో చర్చించే విషయాల అవగాహనకు ప్రాతిపదికగా వుంటుందన్నది ఈ అధ్యాయం వ్రాయడంలోని నిర్దిష్ట ఉద్దేశం. నాలుగో అధ్యాయంలో అచ్యుతవల్లి నవలల్లో వస్తు వైవిధ్యం - ఇతివృత్త నిర్వహణ గురించిన విశ్లేషణ జరిగింది. అపారమైన వైవిధ్య భరితమైన వస్తువులను తీసుకుని, కుటుంబ వ్యవస్థలోని సంఘర్షణలు, అనుభూతులు, అనుభవాలు, స్తీ వురుష సంబంధాల గురించిన అవగాహన, న్యాయపరంగా సమాజంలో స్త్రీకి దక్కాల్సిన న్యాయం, మారుతున్న విలువలపట్ల గౌరవం తదితర అనేక అంశాలను ఇతివృ త్తనిర్వహణలో రచయి(త్రి సమర్థించిన విధానాన్ని సైద్ధాంతికంగా, ప్రామాణిక ఉటింకింపులతో చర్చించాను. వస్తువిన్యాసం, ఎత్తుగడ, మనోవిశేషణ, మానవ మనస్తత్వం - స్వరూప స్వభావాలను కుటుంబ, సామాజిక నేపథ్యంలో విపులంగా చర్చించాను. ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలల్లోని పాత్ర చిత్రణ - ప్రాముఖ్యతను గురించిన విశ్లేషణ ఐదో అధ్యాయంలో చేయడం జరిగింది. రచయిత్రి ఆదర్శానికి ప్రతినిధులయిన పాత్రలు మనో విశ్లేషణాత్మకమైన పొత్రలు, వాస్తవ పాత్రలు, దుష్టస్వాభావికాలు, ధీర అధీర పాత్రలు, సామాజిక వైద్య శాస్టావగాహనను సంతరించుకున్న పాత్రలు, స్త్రీవాద ధోరణిలోసాొగే స్వేచ్భా ప్రణయతత్వ పాత్రలు, 16

స్టెర్యంగల పాత్రలు ఇలా అనేక స్త్రీపురుష పాత్రలను సృష్టించి, ప్రగతిశీల ధృక్పధంతో, కాల్పనిక వాస్తవికతల సమ్మేళనంతో రచయిత్రి తీర్చిదిద్దిన తీరు, సమర్థించిన వైనాన్ని ఆయా అంశాల సైద్ధాంతిక సమన్వయంతో వ్యాఖ్యానించారు, ఆరో అధ్యాయంలో అచ్యుతవల్లి నవలల్లో భాష్టా శైలి- శిల్పంల గురించిన వివరణ, నవలల నేపథ్యం' వాతావరణాల పరిశీలన గురించిన చర్చజరిగింది. ప్రకృతి, ఆకృతి వర్ణనలు, సన్నివేశవర్గన, సామాజిక స్పృహతో కూడిన వర్ణనలు, వ్యాఖ్యలు, సంభాషణా శైలిలోని స్వాభావికత, సంస్కారదృక్పథం, సంగీతజ్ఞత, నుడికారాలు, అన్యభాషా ప్రయోగాలతో కూడిన భాష్టాకైల్సి సన్నివేశ కల్పనా శిల్ప, శీర్ణికా నామకరణ సరళి ఇత్యాదులలో రచయిత్రి ప్రదర్శించిన నూతనత్వం, విభిన్నత వివరించబడ్డాయి. అనుబంధంలో అచ్యుతనల్లి జీవితం - సాహిత్య జీవిత రేఖల పరిచయం పొందుపరచడం జరిగింది. చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా, బలంగా, ప్రత్యేక కంఠస్వరంతో, ప్రయోజనాత్మకంగా, సందేశాత్మకంగా చెప్పిన రచయిత్రి ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి అని నిర్దుష్టంగా నిరూపించడమే యీ సిద్దాంతవ్యాస లక్ష్యం. అయితే సిద్ధాంత వ్యాసాన్ని గ్రంథంగా ప్రచురిస్తున్న క్రమంలో విశ్వవిద్యాలయ పరిశోధనా పద్ధతుల కోసం వింగడించివ సాంకేతిక సమాచార అధ్యాయాలను పరిహరించి రచయిత్రి నవలాసాహిత్యం పైనే వూర్తిస్తాయి విశ్లేషణను అందిస్తున్నాను. నవల జీవితానికి ప్రతిరూపమన్నప్పుడు జీవితంలోని సుఖదుఃఖాలను, అనుభవాలను సమాహారంగా రూపొందించి, కళాత్మకంగా తీర్చిదిద్దడమే నవల యొక్క లక్ష్యమని నమ్మిన ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యంపైన పరిశోధనకు సరళజైలిని, వ్యావహారికభాషను ఎన్నుకున్నాను. _ డా॥ కె.బి.లక్ష్మ 17

వస్తువైవిధ్యం - ఇతివ్పత్త నిర్వహణ

క్రీయాత్మక రూపంలోగానీ, సంఘటనల రూపంలోగానీ నవలను ప్రారంభిస్తే “నేరేటివ్‌ హుడ్‌” బాగుంటుంది. _ సంభాషణలతో ప్రారంభిస్తే పాత్రల హావభావాలను స్పష్టపరచవచ్చు. కథాగమనానికి, కథాంశాన్ని తెలపడానికి అవి తోడ్పడతాయి.

ప్రస్తావనతో ప్రారంభించడం వల్ల పొత్ర చిత్రణకు, వాతావరణ కల్పనకు వీలుంటుంది.

ఐ.వియస్‌. అచ్చుతవల్లి నవలల్లో ఈ మూడు విధాలయిన ఎత్తుగడలు కనిపిస్తాయి. కొన్ని ప్రస్తావనతో, కొన్ని సంఘటనలు నిర్మాణ వైచిత్రితో, మరికొన్ని వర్ణణాత్నక ధోరణిలో, ఇంకొన్ని సంభాషణా వైవిధ్యంతో ప్రారంభింపబడతాయి.. సమగ్ర ఇతివృత్తంలో ఎత్తుగడ, వికాసం, ముగింపు వుంటాయి. సంఘటనల వుధ్య క్రవముబద్ధత, పాత్రల వుధ్య సరయిన సంబంధంవల్ల ఇతివృత్తంలో ఐక్యత సిద్ధిస్తుంది భావస్సోరకమైన ముగింపు వుంటుంది,

ఐవియయస్‌. అచ్యుతవల్లి నవలల్లో అధికశాతం విభిన్న మనస్తత్వాలు కలిగిన స్త్రీ పురుషుల సమ్మేళనం కనిపిస్తుంది.

__సొమాజిక సమస్యలయిన విద్య, వివాహం, ఉపాధి, నిరుద్యోగం, కుటుంబ నిర్వాహణ వంటివి మధ్య తరగతి కుటుంబాలలో ఎటువంటి ప్రాధాన్యత వహిస్తున్నాయో చెప్పే నవలలు కొన్ని అయితే, స్త్రీ మనస్తత్వానికి ప్రాధాన్యతనిచ్చి (వ్రాసిన నవలలు మరికొన్ని.

మమత అనుబంధం, అనురాగం మొదలయిన అనుభూతుల సంగమంగా స్త్రీ అనేక రూపాలలో ప్రత్యక్షమౌతుంది.

కన్యగా, వివాహితగా, తల్లిగా స్త్రీ పొందే మూనసిక రూపొంతరాలను ఇతివృ త్తంగా తీసుకుని అచ్యుతవల్లి కొన్ని నవలలు ్రాశారు. ఆధునిక స్త్రీ వ్యక్తిత్వం, జీవితం, అభ్యుదయం, అధఃపతనాలను నిగ్గుదీసే నవలలు రాశారు.

రచయిత్రి వ్యక్తిత్వానికి ఆమె రచనల్లోని వస్తువు ప్రత్యక్ష దర్పణం,

ఐ,వియస్‌. అచ్యుతవల్లి నవలలోని అభ్యుదయభావాలు, సామాజిక

ఐవియయస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి -18

స్పృహ, సృజనాత్మకత,. వాస్తవికత, స్త్రీ చైతన్య సంఘర్షణను అవిష్కరించిన తీరు శ్లాఘనీయం.

నవలలోని కధ ద్వారా రచయిత చెప్పదల్చుకున్న అంశాన్ని వస్తు లక్ష్యంగా అఖభివర్ణిస్తాం. కధ నడిపే భావం కాన్సీ కధకి మూలంమైన రచయిత ఉద్దేశ్యాన్ని కానీ పరిశీలించడం వస్తు లక్ష్యస్థాయి పరిశీలన అవుతుంది. దీన్నే రచనోద్దేశ్యం అని కూడా అనవచ్చు.

“రచనోద్దేశ్యం అనేది రచయిత నవలలోని కథ ద్వారా సామాన్యీకరించిన జీవిత సత్యంగా అర్థం చేసుకోవలసి వుంటుంది. అన్ని రకాల నవలల్లోనూ ఒక . పాత్ర ద్వారా కానీ, ప్రకృతిలోనూ, సంఘంలోనూ వుండే మానవ సంబంధాల ద్వారా కానీ రచనోద్దేశ్యం వెల్లడికావచ్చు. అది ఒకనీతి వాక్యంలాగానో, ఒక జాతీయం లాగానో, ఒక గంభీరమైన స్ఫూర్తిలాగానో, ఒక పాఠంలాగానో వుండదు. అది ప్రధానంగా కథలోని జీవితసారంలాగా కనిపిస్తుంది"1. అందుచేత కథలోని వస్తువు, వస్తు నమన్వయం, మానవ, సాంఘిక సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఇతివృత్తాన్ని అనుసరించి, వస్తుగతంగా వస్తువైవిధ్య రీత్యా ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలలను కొన్ని

  1. మనో విశ్లేషణ
  2. వివాహ వ్యవస్థ
  3. యువతీ యువకుల సమస్యలు - స్తీ పురుష సంబంధాలు
  4. మధ్య తరగతి జీవనచిత్రణ
  5. నిమ్న వర్గాలపై పక్షపాతం
  6. కాల్పనికత - వాస్తవికత అన్న ఉప శీర్షికల్లో విశ్లేషించడం జరిగింది.

తెలుగునవలా సాహిత్య చరిత్రలో 19 40వ సంవత్సరం నుంచి కొత్తశకం (ప్రారంభమైనదని చెప్పుకోవచ్చు. అంతవరకు వచ్చిన నవలల్లో మానవునికి సమాజానికి మధ్యగల సంఘర్షణ ప్రధాన ఇతివృత్తమయితే, ఆ తర్వాత వచ్చిన నవలల్లో మానవుని ఆంతరంగిక సంఘర్షణ, తనతో తను లేదా తన వాతావరణానికి, తన ్రవృత్తికీ

_ మధ్య జరిగే సంఘర్షణ ్రధాన ఇతివృత్తంగా స్వీకరించబడింది. ఈ పద్ధతిలో ఐ.వియస్‌,. అచ్యుతవళ్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మీ -19

వ్రాయబడిన నవలలను “మనోవైజ్ఞానిక నవలలు” అన్నారు. , 1. మనోవిళ్లేషణ : సమాజంలోని వివిధ రకాల వ్యక్తుల జీవితాలను వర్ణిస్తూ, మానవ సంబంధాల సంక్లిష్టతను స్పృశిస్తూ, స్త్రీ విమోచనా దృక్పథంతో, మవోవిశ్లేషణా సిద్ధాంత రీతుల్లో ఒదిగేలా వున్న ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలలు 1. సీతకలలు, 2. ఇది మల్లెల వేళ 3. కానుక. (1౩ శీత కలలు ; అంధ్యజ్యోతి దినపత్రికలో 19 78లో ధారావాహికంగా వెలువడిన ఈ నవల అచ్యుతవల్లి మనస్తత్వపరిశీలనా దృష్టికి ప్రతీకగా పాఠకుల, విమర్శకుల ప్రశంసలనందుకుంది. పాత్రల మనస్తత్వాలలోని ద్వైదీభావాన్ని, ఆలోచనలకు, ఆచరణకు మధ్య వున్న అంతరాన్ని మనో విశేషణాత్మకంగా ఆవిష్కరించిన నవల సీత కలలు. సాధారణంగా ఈ తరహా నవలల్లో రచయిత దృష్టి ప్రధానపొత్రమీదనే కేంద్రీకృతమవుతుంది. అయితే కధానాయిక మనస్థితిని విశ్లేషిస్తూ మరో మూడు పాత్రల జీవనగతిని కూడా అదే దృష్టితో చూడడం రచయిత్రి పరిశీలనా శక్తికి తార్కాణం. వవలలో సీత ప్రధాన పాత్ర. గీత, లక్ష్మి కమల ఆమె స్నేహితురాళ్ళు, సహాధ్యాయినులు. చదువుకునే రోజుల్లో జీవితం గురించి, భవిష్యత్తుగురించి ఎన్నెన్నో కలలు కంటారు. నలుగురివీ నాలుగు రకాల మనస్తత్వాలు. కలలు కనడం అందరి జన్మహక్కు. కానీ వాటిని నెరవేర్చుకునే అదృష్టం, అవకాశాలు అందరికీ రావని స్పష్టం చేస్తుందీ నవల. ప్రధానపాత్ర సీత అయినా గీత, లక్ష్మి కమల పాత్రలు కూడా సమాన ప్రతిపత్తిని కలిగి వుంటాయి. హైస్కూల్లో చదువుకునేటప్పుడు గీత డాక్టర్‌ కావాలని, కమల చదువు అనేది వ్యక్తిత్వ వికాసం కోసమే గనుక ఉద్యోగ ప్రసక్తి లేకుండా బాగా చదువుకోవాలని, లక్ష్మి జీవితంలో ఎటువంటి జంజాటాలూ లేకుండా హాయిగా పెళ్ళి చేసుకుని, సిల్లల్నికని నోములు, వ్రతాలు చేసుకుంటూ వుండాలని కోరుకుంటే - సీత ఎమ్‌.ఎ. చదివి లెక్సరర్‌ అవ్వాలని కలలు కనేది. ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 20

గీత అనుకున్న ప్రకారం డాక్టరయినా, వృత్తిరీత్యా అనేక మంది రోగులను

చూసి వారి ప్రసూతి వైరాగ్యాలు, మాతృత్వపు మమకారాలు గమనించి మనసు మార్చుకుంటుంది. ఆర్థిక స్వాతంత్ర్యంలేని పూర్వం వాళ్ళకి గాని ఆధునిక స్త్రీకి పెళ్ళి, సంసారం అవసరంలేదంటుంది. “అమ్మా అనిపంచుకోవాలంటే స్వయానా పిల్లల్ని కననవసరంలేదంటుంది. ఆఖరికి ఎంతో నిబ్బరంగా ముష్ఫయి, నలఖైయేళ్ళు గడిపి ఆస్తి అంతస్థు సంపొదించిన గీత ఓ సాధారణ స్త్రీలాగే నలబై ఐదేళ్ళు పైబడిన పిల్లల తండ్రి, భార్యలేని వాడు అయిన బీహారీలాల్‌ని పెళ్ళిచేసుకుంటుంది. మాతృత్వ వాంఛే తన కోరికకు కారణమంటుంది.

జరగబోయే దాన్ని ఊహించుకుని “భయపడే ఫోబియా" కాంప్లెక్స్‌ అంటే భయ భావన గీతలో వుంది, “పెద్దవాళ్ళు బాధపడతారని పెళ్ళి చేసుకుంటాననుకో, తర్వాత అతనికి కావల్సినట్లు నేను నడుచుకోకపోతే అతను బాధపడతాడు. లేకపోతే నేనెవర్నో ప్రేమించి వుంటాననే అపోహ కూడా కలగవచ్చు....”2 అంటుంది గీత, సీతతో వాళ్ళింటికి వచ్చినపుడు. అందుకే పెళ్ళి వద్దనుకుంటుంది.

ఆ తర్వాత కొన్నాళ్ళకు సీతకి రాసిన ఉత్తరంలో “నేను ఒంటరితనం ఫీలవుతున్నాను. నేను అందరి పప్రేమాదరణలకు అర్రులు చాస్తున్నాను. వాళ్ళు మిథ్యాభిమానాలు ప్రదర్శిస్తున్నారనిపిస్తోంది. ఈ దుర్భరమైన ఒంటరితనాన్ని ఛేదించడానికి నేను చాలా సాహసమే చేశాను. నా కులం, కాఖ, గోత్రంకాని వ్యక్తిని వివాహమాడుతున్నాను. అతడు నన్ను గౌరవంగా, ఆరాధనగా, ప్రేమగా చూసుకుంటానన్న నమ్మకం కలిగించాడు...”౩ అంటుంది,

అంటే అంతకుముందు ఆమెలో వున్న నిశ్చితాభిప్రాయం చెదరి, ఒకానొక ఫోబియాకు గురై తర్వాత ఇంకో నిర్ణయం తీసుకుని రెండో పెళ్ళి వాణ్ణి వివాహమాడుతుంది. వివిధ దశల్లో వివిధ రకాల మానసిక సంఘర్షణలకు గురి అవుతూ వుంటాడు మానవుడు. బాల్య దశ నుండి వృధ్యాప్యదళ దాకా వుండే ఈ మానసిక సంఘర్హణల్లో యౌవన్క నడివయస్సు దశల సంఘర్షణలను గీత ఎదుర్కొంది. వీటిని సైకోబయాగ్రఫిన్ట్‌ (౧5౪౦౧0 8100720150 ఎరిక్‌ ఎరిక్‌సన్‌ “యౌవన దశలో ఆత్మీయత, ఏకాంతాల మధ్య సంఘర్షణ, నడివయసులో తరాల అంతరం, స్తబ్బతల మధ్య సంఘర్హణలుగా”4 వివరించాడు. గీత మానసిక స్థితి ఈరెండింటానుధ్యా్నా ఊగులాడింది. స ళకర రి వాలా

/ క్‌ వ్‌ ఛై | ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా, వం ఎ

కాలేజీ చదువు చదివించలేని ఆర్థిక స్టోమత లేని ఇంట్లో పుట్టిన లక్ష్మి టైవు, షార్ట్‌ హ్యాండ్‌ నేర్చుకుని ఉద్యోగంలో చేరుతుంది. 'డబ్బు సంపాదిస్తోందని తల్లిదండ్రులు పెళ్ళిమాట తలపెట్టలేదు. వయస్సు మీద పడుతోందని, ఇంక పెళ్ళి కాదని, అలా అయితే దాంపత్య జీవితానుభూతికి నోచుకోలేనేమోనని భయపడి తోటి ఉద్యోగస్థుడు ఆరుగురు పిల్లల తండ్రి అయిన సుబ్బారావుతో శారీరక సంబంధం పెట్టుకుంటుంది. సయంపోషకురాలైన ఆమె సెక్స్‌ వాంఛలను సుబ్బారావు తీరుస్తాడు. ఎందుకిలా చేశావని స్నేహితురాలు సీత అడిగితే “నాకూ ఒక మనసుంటుంది, ఆశ ఉంటుంది, నాకా అనుభవం కావాలనిపించింది. పెళ్ళికాని యువకుల కంటే పెళ్ళయి సంసారం చేస్తున్న మగవాళ్ళకే ఈ కాపీన్నం ఎక్కువ, అందుకే ఇలా చేశా”5 నని నిర్భయంగా చెబుతుంది లక్ష్మి జీవితంలో అతి స్వల్పకాలం అనుభవించే సెక్స్‌కోసం నీతినియమాలు, విలువలు పోగొట్టుకుని అవమానాల పాలవడం ఎందుకు అన్న సీత తర్కం లక్ష్మి విషయంలో సరిపోదు. ఫ్రాయిడ్‌ చెప్పిన సహజ ్రవృత్తుల వాంఛల్ని సంతృప్తి పొందించుకునే ఆనలద పర్వవసాయి అయిన సంతృప్తి సిద్ధాంతం (౧162946 న1౧01019 అయిన “లిబిడో స్వభావం లక్ష్మి ప్రవర్తనకు ప్రేరణ. జీవితంలో అనుకున్నది సాధించలేక, అలాఅని దాన్ని గురించి తల్చుకోకుండానూ వుండలేక '%/0164[06 ౦0౧౯1౦0 అనే మానసిక వేదనతో నలిగిపోతుంది సీత, ఎమ్‌.ఎ. చదువు, భర్తకి స్కూటర్‌, తనకి లెక్సరర్‌ ఉద్యోగం ఇవన్నీ కలలుగానే వున్నా వాటిని కూతురు విషయంలో నిజం చేయాలనుకుంటుంది. కానీ తల్లి చూసీన ఇంజనీర్‌ను కాదని తనకంటీ అందంలో, విద్యలో తక్కువయినా తనవి మనసారా ప్రీమించే వాణ్ణి చేసుకుని తల్లి కలలు కల్లలు చేస్తుంది. నెరవేరని కలలతో ఎంత రాజీపడదామనుకున్నా “డిథ్రైషన్‌ నుండి బైటపడలేకపోతుంది సీత. గ&[8 ఆధిక్యత చూపిస్తుంది, (1) ఇది మల్లెల వేళ; కథానాయిక పద్మ చుట్టూ కథంతా తిరుగుతుంది. రచయిత్రి పద్మ అంతర బాహ్య చేతనలను అద్భుతంగా చిత్రీకరించారు. యౌననంలో వేసిన సెక్స్‌వరమైన తప్పటడుగువల్ల ప్రాణాపాయస్థితికి చేరుకున్న పద్మ పడిన మనోవేదన అచ్యుతవల్లి ఇతర నవలల్లోనే "కాదు తెలుగు వఐ+వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి -22

రచయిద్రుల నవలల్లో ఏ పాత్రా పడివుండదంటే సత్యదూరం కాదు.

జమీందారీ ఉమ్మడి కుటుంబంలో కట్టుదిట్టలో పెరిగిన పద్మ ప్రతిక్షణం ఒక విధమైన “ఫఫ్రీషన్‌ (౯౪912400) కి గురౌతూ వుంటుంది. తొందరగా పెళ్ళయిపోతే ఈ చెర వదిలిపోతుందనుకుంటుంది. చిన్న వదిన జానకి లైబ్రరీ నుండి తెప్పించే ప్రేమ నవలల ప్రభావం సద్మ మీద బాగా వుంది. దానికి తోడు కొత్త వదిన చెప్పే ఏకాంత దాంపత్య విషయాలు వినడం, స్నేహితురాలు లక్ష్మి తనకి తన బావతో వున్న శారీరక సంబంధం గురించి ముచ్చటిస్తూ పద్మ ప్రతిచర్యనీ ప్రేమతోముడిపెట్టడం - అందుకు పరాకాష్ట అన్నట్లు కొత్తదంపతుల ప్రేమసమాగమం రాత్రివేళ చూడ్డం ఆమెలో కోర్కెల అలజడి రేపుతాయి. ఆదుపుచేసుకోడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటుంది.

అంత కట్టుదిట్టాల్లో వుంచినా ఉరకలు వేసే వయసుకి ఇవన్నీ తోడై అఖరికి తోటలో పాముబారినుండి రక్షించిన పాలేరు నారయ్య మనవడు కృష్ణ స్పర్శానుభవం పద్మని వివశురాల్ని చేస్తాయి. అంతః చేతనలోని వాంఛ చేతనలోకి వచ్చి బుసలుకొడుతుంది. ఒక విధమైన “1౧12౧16 8అ628/” భావన.

పట్నంలో చౌకబారు సినిమాలు చూసి కృష్ణ అప్పటికే మనసులో శారీరక సుఖం కోసం తపించే స్థితిలో వున్న పద్మ ఒకటౌతారు. వాళ్ళిద్దరికీ తప్ప ఆ రహస్యం ఇంకెవరికీ తెలియదు. కృష్ణని పాలేరుగానే చూస్తుందిగానీ తన కలల రాకుమారుడిగా చూడదు. ఆ కామోద్దీపన తగ్గిపోయాక మామూలుగా మర్చిపోతుంది. కృష్ణ వసట్నం వెళ్ళిపోతాడు. పద్మకి ఓ గొప్పింటి డాక్టర్‌తో పెళ్ళిచూపులు జరుగుతాయి. ఆ సందర్భంగా మేడమెట్లమీంచి కాలుజారి పడిన పద్మ ఆరునెలల గర్భిణి అని తెలుస్తుంది. ఆతర్వాత బలవంతంగా గర్భ(స్రావం, అది సెప్టిక్‌ అవడం, పాఠణాపాయం, గండం గడిచి గట్టెక్కుతుంది: కానీ చేసిన వనికి ఆత్మన్యూనతాభావంతో కృంగిపోతుంది. ఇంకో పక్క కోరికతీర్చుకోడానికి పనికి వచ్చిన కృష్ణని పెళ్ళికి అంగీకరించలేక పోతుందామె మనసు. అందుకే ఇంట్లో తండ్రి, ఇతరులు ఎంత కొట్టినా తిట్టినా అతని పేరు బైట పెట్టదు. బాగా మొండి వైఖరి అవలంబిస్తుంది. జీవితం పట్ట ఒక విధమైన వైముఖ్యం ఏర్పడుతుంది. దాన్నుండి బైటికి రాలేని పిరికితనం ఆవహిస్తుంది. స్వయానా తప్పిపోయిన పెళ్ళికొడుకు డాక్టర్‌ గిరిధర్‌ వచ్చి నీ మనసులో మాట చెప్పు, నిన్ను పెళ్ళాడతానన్నా ఆత్మన్యూనత, పిరికితనం ఆమెని వదలవు. ఎవరితో

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసొహిత్యం ౫ డా, కె,బి.లక్ష్మి - 23

ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని పడుకున్ని కన్నీరు కారుస్తుంటుంది. “0౧6౪౧౦ ౧4౩ 00గ66 6౧ 1166 2 [౧6606౧౦౮ *౧4 6 511661 6౮౧2౪౧ 0౪6౯౧15 [1616 15 ౧01 111461/ 10 06 51౧౪100 0 00౪2060063 ౦00౧420167 6 అని మనస్తత్వవేత్త ఆడ్గర్‌ భావించినట్లుగా పద్మ వైఖరిలో పిరికితనం కనిపిస్తుంది. ఏ అసంపూర్ణ భావమ్రైనా న్యూనతా భావానికి దారితీస్తుందన్న ఆడ్గర్‌ అభిప్రాయం కూడా పద్మ ప్రవర్తనను సమర్థిస్తుంది. జరిగినదానికి ప్రతిక్షణం వేదన చెందుతుంటుంది. యజమానిభార్యకు క్యారియర్‌ తెచ్చానని హాస్పిటల్లో కృష్ణ అన్న మాటలు విని పద్మ అసహ్యించుకుంటుంది. 114166 డెవలప్‌ చేసుకుంటుంది. అంతలోనే “తన ఈ స్థితికి కృష్ణ కారకుడన్న ఒక్క విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి వుంటే బలవంతంగానైనా తనని కృష్ణకిచ్చి ముడిపెట్టేద్దురు. తమకాళ్ళకింద పడి వుండే ఒక పనివాడితో తను ఎందుకిలా అనుబంధం పెంచుకుంది?”7 అని తన ఆధిక్యతా భావం (5406గంగ్యు/ ౧౦౧౧౧1అ౮) వి గుర్తుచేసుకుంటుంది. (ేమకాంక్షతో తనంతట తనే అతనికి దగ్గరయిన సంగతి తల్పుకోడానికి కూడా ఇష్టపడదు,

... కృష్ణ పాలేరు మమమడు. వాళ్ళ బ్రతుక్కి, తన బ్రతుక్కి ఎంతో తేడా వుంది. వాడు సీనా రేకు గిన్నెలో అన్నం తింటాదనీ తనూ అలాగే తినాల్సి వస్తుందని, ఈతాకుల దడిలో అందరికీ కనబడేలా స్నానం చేయాల్సి వస్తుందని, మురికి జీవితం గడపాల్సి వస్తుందని, ఇంటా బయట తన బంధువర్గంలా భాగ్యవంతమైన జీవితం దక్కదనీ మధవపడుతుంది. తొందరపాటుతో కృష్ణకి చేరువైంది కానీ పెళ్ళిచేసుకుని వాడితో శాశ్వతంగా బతకాలనికోరుకోదు ఇది ఒకరకంగా పలాయన చిత్త ప్రవృత్తి లేదా గిర్జీకావ్‌షస్‌వెస, జరిగిందానికి అసరాధ భావన.

(1) కానుక స్నేహ బంధాలకు, అనురాగ స్పందనలకు మధ్య సంఘర్షణ ఈ నవలా ఇతివృత్తం. 19 7 6లో డైరెక్ట్‌గా వెలువడిన ఈ కానుక నవలలో రదయిత్రి అచ్యుతవల్లి మనస్తత్వ విశ్లేషణకు పెద్ద పీట వేశారు. “కొంతమంది మవస్తత్వ శాస్త్రవేత్తలు వ్యక్తుల బాహ్య, ప్రవర్తనను (2902౪104గ పరిశీలిస్తారు. మరికొంతమంది మనిషి అంతరంగంలో ఎలాంటి వ,వియస్‌, అద్యుతవల్లి నవలాసాహిత్యం ౫8 డా, కె,బి,లక్ష్మి - 24

అంతస్సంఘర్హణలు జరుగుతున్నాయో... బాహ్యలోకంలోని వాస్తవికతలను, తమలోని బలహీనతలను వ్యక్తులు ఏ విధంగా గుర్రించలేకపోతున్నారో వివరించి చెబుతారు. “మనో విజ్ఞాన శాస్త్రపరిధి చాలా పెద్దది. ఈ శాస్ట్రానికంతటికీ ఒక్క తాళం చెవి పనికి వస్తుందని చెప్పడానికి లేదు”8. ఐ.వియస్‌, అచ్యుతవల్లి కానుక లోని పాత్రల మనస్తత్వ చిత్రణ ఈ అంశానికి అతి దగ్గరగా వుంటుంది. మంచికి మంచీ, చెడుకి చెడు సహజంగా జరుగుతుంటాయనుకుంటాం. నిజానికి ఆ విధంగా ఎవుడో గాని జరుగదని నిరూపిస్తాడు ఈ నవల లోని సుందరం. జానకి సుందరాన్ని సోదరునిలా చూసింది. ఆ వాత్సల్యంతో అతనికి సమాన హోదా నిచ్చింది. అతని భవిష్యత్తు గురించి ఎంతో తాపత్రయపడింది. హాస్టల్లాంటి ఎనిమి గదుల బంగళా వరండాలో మోకాళ్ళని పొట్టలోకి పొదుపుకుని చుట్ట చుట్టుకుని పడుకున్న సది పన్నెండేళ్ల కుర్రాణ్హి బి.యస్‌సి చదువుకుంటున్న జానకి "ఇక్కడెందుకు పడుకున్నావొ అడిగినవ్పృటినుంచి ఆ కుర్రాడికి “నాలోజులనుండి జొరం కాస్తోందండి. ఎవరో పెద్దమనిషి కొఫీ పట్రామన్నాడు, బల్లమీద ప్పెడతావుంటే తొణికి ఆ పెద్దనునిషి బట్టలమీద కాస్త వడ్డాది. ఆయన కోవంగా కేకలేసే సరికి మానేజరు వచ్చాడు. వచ్చి కొట్టాడు. ఆయన చెయ్యి కొరికి పారిపోయి. వచ్చి... ఇక్కడ దాక్కున్నాను"”9 అని చెప్పిన సుందరం మాటలు కట్టుకథ అని తోటివారన్నా జ్వరంతో వచ్చిన కుర్రాడి అమాయకత్వానికి జాలిపడింది జానకి. జ్వరం తగ్గేదాకా జాగ్రత్తగా చూసుకుంది. సుందరం పుట్టుకతో అందగాడు. ఎదుగుతున్నకొద్దీ తన సర్పనాలిటీ చూసుకుని ఏ ఆడపిల్ల అయినా తన వెనకపడాల్సిందేనని ఈగో పెంచుకుంటాడు. స్వయంగా పెంచిన గులాబీ మొక్కల్నించి పూలుకోసి, గుత్తిగా చేసి జానకికి ఒక్కదానికే ఇస్తూవుంటాడు. ఆమె వస్త్రధారణ, జడ, అందం గురించి అతని అంతరాంతరాల్లో మధుర భావనలు చెలరేగుతుంటాయి. జానకి అక్కలా ఆదరించినా సుందరం మాత్రం ఒక మగవాడిగానే ఆమెగురించి ఆలోచిస్తూవుంటాడు. జానకి లెక్కరర్‌గా ఉద్యోగం చేస్తూంటుంది. హాస్టల్‌లో జానకి పక్క గదిలో అనసూయ అనే వివాహిత వుంటోంది. ఆమె భర్త దుబాయిల్లో వుంటాడు. ఫ్రైవేటగా బి.ఎ. చదివే అనసూయ చదువు చెప్పే వంకతో సుందరాన్ని అందగాడివని, సినిమాల్లో ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మీ - 25

హీరోవయిపోతావని ్రోత్సాహిస్తూ వుండేది. అటు మరదలు జగదాంబ, ఇటు అనసూయ సుందరంతో చనువుగా వుంటారు. జగదాంబ అందగత్తెకాదని, అనసూయ ఎపుడైనా భర్తతో విదేశం వెళ్ళిపోతుందని అనుకుంటాడు సుందరం. సొస్టెటీలో తన అంతస్థు పెంచుకోవడానికి, తన కోరికలు తీర్చుకోవడానికి జానకే తనకి జోడీ అని కలలు కంటుంటాడు, అందుకే జానకి ఏం చేసినా తన మీద అనురాగం వల్లనే అన్న భావన పెంచుకుంటాడు. “తము ఏ ఫాన్సీ షాపో పెట్టుకుంటే, జానకిని పెళ్ళిచేసుకుంటే అవిడ తెచ్చే జీతంతో ఇద్దరూ చిలకాగోరింకల్లా వుండవచ్చు. డబ్బున్న అనసూయ షాపు పెట్టడానికి డబ్బిస్తుంది”10 అనుకుంటాడు. ఆ రాత్రి తను, జానకి అనసూయ విమానం ఎక్కి విదేశాలకి వెళ్ళినట్టు కలనస్తుంది. మనస్తత్వ శాస్త్రవేత్త యాంగ్‌ చెప్పినట్లు సుందరం కలలన్నీ అతని ప్రస్తుత సమస్యల పై ఆధారపడినవే. జయరాం అనే పెద్ద ఇంజినీర్‌తో జానకి పెళ్ళి కుదిరిందని తెలిసి సుందరం గుండెలో ముల్లు గుచ్చుకున్నట్లు బాధపడతాడు. ఓ పక్క జగదాంబ, అనసూయలతో వున్నా జానకే తన సాంతం అన్నభావం, అమెకి అందగాడైన తనే ఈడు జోడు అన్న అహం అతని మానసిక స్థితిని ఎప్పటికప్పుడు మార్చేస్తూవుంటుంది. జాన్సక్తి పట్ల అతనిది కాముకదృష్టి ఇది వరకు అంతబలమైన కోర్కె వుండేది కాదు. జయరాంతో పెళ్ళి అనేసరికి ఆమెను అతను ఎగరేసుకుపోతాడన్న అసూయాభావం సుందరాన్ని నిలవనివ్వదు. ధనవంతురాలు, గౌరవ కుంటుంబానికి చెందిన అనసూయ తనతో శారీరక్ష సౌఖ్యం పొందుతున్నందుకు సుందరంకి తన అందంమీద, యౌవ్వనం మీద విపరీతవెైైన గర్వం. జయరాంతో పెళ్ళిదాకా రాకుండానే జానకిని తను లోబరుచుకోవాల్సిందని ఆలోచిస్తూవుంటాడు. పెద్దింటి అమ్మాయి, గొప్పింటి సంబంధం వచ్చింది ఇపుడు అడిగితే తనమాట అంగీకరిస్తుందో లేదోనన్న ఆత్మన్యూనతా భావంతో బాధపడుతుంటాడు. అలా అని ధైర్యంచేసి అడగలేని పిరికితనం ఆవహిస్తుందతన్ని. కానీ ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన ఈడిపస్‌ కాంప్లెక్స్‌ బాల్యం నుంచీ అతనిలో వుంది. తల్లి తండ్రి, అక్కా, చెల్లెలు అని వావివరసలు ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 26

చూడని ఈ కాంప్లెక్స్‌ వల్లే సుందరం తన పదో ఏటనుంచీ అక్కలాంటి జానకిని కాముకదృష్టితోనే చూస్తాడు. ఇతరత్రా విషయాలకంటే కేవలం లైంగిక వాంఛా ధోరణిని ప్రయత్న పూర్వకంగా ఆణచివేయడం (3400855100) వల్ల, అణచివేత ఎంత తీవ్రస్థాయిలో వున్నా అది ఏదోవిధంగా ఏదో రూపంలో “కాషన్‌ లేయర్స్‌ అఫ్‌ మైండ్‌” లోకి తొంగిచూస్తూ వుంటుందంటాడు ఫ్రాయిడ్‌. సరిగ్గా సుందరం నిషయంలో అదే జరిగింది. జానకి మీది వాంఛను ఏదో కారణంగా అతను తొక్కి పెడుతూ వచ్చాడు. దానికి అసూయ స్వార్థం అనే మరో రెండు మానసికావస్థలు తోడై చివరికి ఉన్నాదావస్థకు చేరుకుని జానకిమీద అత్యాచారానికి పాల్పడే స్థితికి వచ్చాడు సుందరం, ఈడిపస్‌ కాంప్లెక్స్‌ కారణంగా వ్యక్తి అంతరంగంలో చెలరేగే అల్లకల్లోలం, “౧12౧16 86%481/” కారణంగా ఏర్పడిన భావాలే అందుకు కారణం. అర్థరాడ్రివేళ దొంగలా ఇంట్లో ప్రవేశించి తనమీద పడబోయిన సుందరాన్ని వారించిన జానకితో “నాకు ఒక్కసారన్నా లొంగకపోతే నిన్ను ప్రాణాలతో వదలను, నీకు నామీద ప్రేమ లేకపోయినా నీ శరీరాన్ని నేను పద్నాలుగేళ్ళ పిల్లాడప్పట్నుంచీ కోరుకున్నాను. నామీద ఏ మమకారమూ లేకుండానే నీ స్నేహితురాళ్ళందరితో వాదించి నాకాశయం ఇచ్చావా! పద1 అంటూ మంచంవైపు తోశాడు. అతనిలో ఎక్కడా చేస్తున్నది తప్పన్న అపరాధ భావం లేకపోగా తన ఆలోచనల్ని ఎదుటివ్యక్తిమీద రుద్దే సాహసం, దుర్మార్గపు ఆలోచనా కూడా వున్నాయి. పెనుగులాటలో అతన్ని గాయపరిచి, జైలుకు పంపుతుంది జానకి. నిరపరాధి అయినా జరిగిందాంట్లో తన ప్రమేయం ఏం లేకపోయినా తమ్ముడిలా వాత్సల్యంతో ఆదరిస్తే అన్నేళ్ళపాటు అతనిలో తనపట్ల పెరుగుతూ వచ్చిన లిబిడో తత్వం జానకిని స్థిమితంగా వుండనివ్వదు. మనసంతా కకావికలై జయరాం ఓదారుస్తున్నా మౌనంగా వుండిపోతుంది. మనస్తత్వ శాస్త్రవేత్తలెంత సిద్ధాంతీకరించినా మామూలు మనుషులకు ఇలాంటి కాంప్లెక్స్‌ మనస్తత్వాలు కొరుకుడుపడని విషయాలు. ఐ.వియయస్‌. అచ్యుతవల్లి నవలలన్నింటిలో మునస్తత్వ విశ్లేషణకు సంబంధించిన ఒక స్టూల దృష్టి కనబడుతుంది. ప్రత్యేకంగా అనుకుని ఏదో ఒక వ,వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి,లక్ష్మి - 2/7

సిద్ధాంతం ప్రకారమో, ప్రభావంతోనో ఆమె రచనలు చేయకసోయినప్పటికీ, విపరీతమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయిన'పొత్రల అంతరంగ చిత్రణలో ఐ.వి.యస్‌ అచ్యుతవల్లి మనో విశ్లేషణకు సంబంధించిన ఆధునిక దృక్పథాన్ని కనబరుస్తారన్నది నిర్వివాదాంశం. “వివాహం జన్మజన్న్మాలబంధం, ఆత్మానుబంధం' అన్నది అనాటిమాట. ఈనాడు అనుకూలతను బట్టీ ఆచరణ సాగుతోంది. 'శాస్త్రం శాస్త్రం కోసం అయిపోయింది. పాత విలువలు నశించిపోయాయి. కొత్త విలువలు ఏర్పడలేదు. ఈ సందిగ్ధావస్థలో వివాహ వ్యవస్థను అటు సంప్రదాయ ధార్మిక దృష్టితోను, ఇటు స్వేచ్చా దృక్పథంతోను పరిశీలించి రచనలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది, అచ్యుతవల్లి ధార్మిక దాంపత్యం గురించి, స్వేచ్భాప్రణయం గురించి సమతూకంలో నవలలు రాశారు. అచ్యుతవల్లి ప్రతి నవలలో కుటుంబ జీవనం, వివాహ వ్యవస్థ గురించిన ప్రస్తావన ఉన్నా, ప్రత్యేకంగా వివాహ వ్యవస్థను వివిధ కోణాలనుండీ ప్రదర్శించిన నవలల్లో “పుట్టిల్లు ఒకటి. వ్యవస్థకు, వ్యక్తికి మధ్య సంఘర్షణ ఇందులో ప్రధాన ఇతివృత్తం. వివాహ వ్యవస్థ కుటుంబానికి ఒక ఆకృతిని కల్పించింది. ఎంతో కొంత కుటుంబ జీవన చిత్రణం దాదాపుగా అన్ని నవలల్లోనూ కనిపిస్తుంది. వ్యక్తుల మనోభావాలు మారినంత త్వరగా సమాజంలోని ఆచారాలు, అలవాట్లు మారవు. మనిషి అనాగరిక స్థితినుండి నాగరిక స్థితికి పరివర్తన చెందేటపుడు ఏర్పడిన క్రమ పరిణామాలలో ఈ వివాహం ఒకటి. స్త్రీకిగాని, పురుషునికిగాని జీవితాంతం ఒకరికే భాగస్వామిగా వుందాం అనే భావన కలగడమే వివాహ వ్యవస్థకు నాంది. ఆ తర్వాత దీనిని మత సంప్రదాయాలతో, అక్కడున్న స్థల, ఆచారాలను బట్టి జరపడం ఆనవాయితీ అయింది. సృష్టిలో సకల (ప్రాణులకీ, ఆకలి, నిద్ర, దైహిక వాంఛ సమానమైన గుణాలే. మనిషి బుద్ధి జీవి కాబట్టి 'నియతికృతి నియనురహితి మైన కామాన్ని క్రమబద్ధమూ, సంఘబద్ధమూ చేయడానికి ఒక వ్యవస్థ కల్పించాడు. ఈ వ్యవస్థలో తనకీ తన జీవితాన్ని పంచుకునే ఆడదానికీ భర్త, భార్య అని హోదాలు కూడా కల్పించాడు. ఈ వ్యవస్థ పేరే వివాహం. ఐ-వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా, కె.బి.లక్ష్మి - 28

() వివాళూం - ధర్మనిరతి - ఉమ్మడి కుటుంబం - 'పుట్టిల్లు' చిన్నతనంనుంచీ తనకి తెలిసిన ధర్మాచరణమే వివాహంలో ప్రధాన ఉద్దేశ్యమని నమ్మిన వ్యక్తి అన్నపూర్ణ. భార్య భర్చత్వ సంటింధం దైవికము కాబట్టి ఎవరూ చేయగలిగింది ఏమీ లేదని, అంతా భరించాల్సిందేనని చివరికంటా కష్టాలను దిగమింగుకుంటూ వస్తుంది అన్నపూర్ణ. ఉమ్మడి కుటుంబంలో ఇంటి పెద్దకోడలు సిద్ధేశ్వరికున్న గడుసుదనం, లౌక్యం అన్నపూర్ణకు లేవు. ॥ కుటుంబరావుతో పెళ్ళి అయినా.ల్లిలేని.పిల్లఅనీీ తోడబుట్టిన వాళ్ళని చూసుకుంటూ బామ్మకి చేదోడుగా. వుంటుందని తోడికోడలు పుట్టింట్లోనే వుంచేస్తే కాబోలుననుకుని సమాధానపడిపోతుంది. కానీ తన తోటి పిల్లలు అత్తారిళ్ళనుండి భర్తృ అత్తా ఆడబిడ్డలతో వేడుగ్గా రావడం “నువ్వు ఇంకా ఇక్కడే వున్నావా? అత్తవారు తీసుకెళ్ళలేదా?” అని అడిగిన సందర్భాలో వూ్యయం ఆవెం వునసు ఎదురుతిరుగుతుంది. సహనం అలవర్చుకోమన్న బామ్మమాటలు విశ్వసించి, గట్టిగా నాకిది కావాలని నిలదీసి అడగలేని పిరికితనం, బలహీనత సంప్రదాయంమీది గౌరవం పెళ్ళయి ఇరవై ఏళ్ళయినా అన్నపూర్ణను పుట్టింట్లోనే వుంచేశాయి. భర్త కుటుంబరావు వచ్చిపోతుంటాడన్న సంతోషం తప్ప మిగతా అంతా దిగులే. పట్నంలో వుండి చదువుకుని, కాస్తో కూస్తో లోకజ్ఞానం వుండి కూడా పెళ్ళి సంసారం దగ్గరికి వచ్చేసరికి అజ్ఞానురాలిగా, చేతకాని దానిలా వుండిపోతుంది అన్నపూర్ణ “ప్రాచీన ధర్మాలు సురక్షితంగా ఉండాలంటే స్త్రీలను సాధ్యమైనంత అజ్జానంలో వుంచాలని, వ్యంగ్యంగా విమర్శించిన బెట్రాండ్‌ రప్పెల్‌ మాటలు *...1[6 [౯|51 6955601121 19 41 6 ఆరంం480% 0₹ ం||98[00416 06 540౧ &ఇ5 10 గణక6 6గ) 54016 4౧6 5006511065 2౧6 10౧౦౧౫౧....2 అన్నపూర్ణపాత్ర ద్వారా తన తొలినవలలోనే నిజం చేయాలనుకున్నారా అచ్యుతవల్లి అనిపిస్తుంది. కానీ భార్యొభర్త్సృత్వ సంబంధము దైవికము కాబట్టి ఎవరు చేయగలిగినదీ ఏమీ లేదు, భరించవల్సిందే అనుకున్న అన్నపూర్ణ చివర్లో పెళ్ళయిన ఇరవైయేళ్ళ తర్వాత ఎదిగిన కూతురు అనురాధను తీసుకుని భర్త దగ్గరికి వచ్చేస్తుంది. జ్లన్నేళ్ళు గడిచి యవ్వన దళ దాటి ప్రొాఢ వయసు వచ్చిన అన్నపూర్ణ ఇకమీదట కూడా అలాగే కాలం గడిపేయగలదు. అయినా మాంగల్యబంధం మీద మక్కువ, పిల్లల్ని తండ్రికి ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 29

చేరువచేయాలన్న తాపత్రయం ఆమెని ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ నిర్ణయమే ఇంకాస్త ముందు తీసుకుని వుంటే అనురాధ ఇష్టపడిన ఆడపడుచుకొడుకు రఘుని అల్లుడిగా తెచ్చుకుని వుండేది. తను చేయాల్సిన పని ఇంకొకరు నిర్దేశిస్తీనేగాని చేయలేని బలహీనత వున్న భర్తని చక్కదిద్దుకుని వుండేది. ఇన్ఫేళ్ళ బస్తీ జీవితం తర్వాత ఇపుడు తోడికోడలు సిద్ధేశ్వరి పుణ్యమాని గొడ్గదావిడిలోకి భర్తతో కాపురం తప్పేది. కానీ అటు ధర్మాచరణకు ఎంత విలువ ఇచ్చిందో ఇటు జరిగిందానికి ఏమాత్రం విచారం లేకుండా కూతురి బతుకు తనలా కాకుండా చక్కదిద్దడానికి నిర్ణయించుకుంటుంది. చదువుకుని, జ్ఞానవంతులై కూడా వివాహాన్ని విచ్చిన్నం చేసుకునే విద్యానంతులకంటే విధివశాత్తూ వుటింట్లో వుండి తోబుట్టువుల్ని చక్కదిద్దిన సంతృప్తి ఆలశ్యంగా అత్తింట అడుగు పెట్టినా సంసారాన్ని నిలబెట్టుకున్న అనందం అన్నపూర్ణను ఒక విధంగా ఆదర్శంగా నిలిపాయి. సంసారం కుంటుంబ వ్యవస్థకు మౌలికరూపం. కొన్ని తరాలవాళ్ళు కలిసి సాగించే సమిష్టి జీవనం ఉమ్మడి కుటుంబం. సంపొదనా ఖర్చు కూడా ఉమ్మడిగా సాగే ఈ సంసారాల్లో సిద్ధేశ్వరి లాంటి స్వార్ధపరులుంటే అది నరకప్రాయమౌతుంది. అన్నపూర్ణలా స్వార్థరాహిత్యం వుంటే వసుదైక కుటుంబమౌతుంది అన్నది రచయిత్రి ప్రతిపాదన. (7) ఢుమ వివాహాలు - "[్రుమించని మనసులు" సోంప్రదాయకమైన వివాహవ్యవస్థ భావనాత్మక ప్రేమ అనే ఆదర్శంతో, సర్దుబాటు ధోరణిలో సాగిపోవాలనేది సర్వాంగీకార సత్యం. అచ్యుతవల్లి ప్రేమించని మనసులు నవలలో పద్మనాభం పెళ్ళికి ప్రాతిపదిక ప్రేమ అనుకుంటాడు. చదువుకునే రోజుల్లో పరిచయమైన సంధ్యను గాఢంగా (్రీమిస్తాడు. పెళ్ళిచేసుకుంటానంటాడు. అవిడ ఇంతకంటే ధనవంతుడైన నంజుడయ్యతో వెళ్ళిపోతుంది. (స్రేమ వేరు, పెళ్ళివేరు అంటుంది. ప్రేమని, పెళ్ళిని ముడిపెట్టడమే మనం చేస్తున్న తప్పు అని భావించే సంధ్యకి వివాహం అంటే డబ్బు, నగలు, అంతస్థు, సుఖ భోగ భాగ్యాలు. ఆ తర్వాతే అనురాగమైైనా, అభిమానమైనా, “ప్రేమ మన చేతిలోని వెన్నెల. పెళ్ళి స్విచ్‌ వేస్తే వెలిగే విద్యుద్దీపం. వెన్నెలనీ, విద్యుద్దీపొన్ని ఒక్కసారే అనుభవిద్దామని మానవుడు ఆశిస్తాడు. కానీ ఆ రెండింటిలో ఏదో ఒకటే మిగులుతుంది"13. అందుకే ప్రభాకర్‌ని 30

కాదని నంజుండయ్యతో వెళ్ళగలుగుతుంది. ప్రభాకర్‌ తను గాఢంగా ప్రేమించిన సంధ్యని పొందలేక, చిన్నప్పటినుంచి తన భార్యే అనుకుని పెరిగిన మేనరికం లలితను పెళ్ళి, ప్రేమ దృష్టితో చూడలేక వివాహంపట్ల నిర్లిప్తతను పెంచుకుంటాడు. పైగా “చదువుకున్న ఆడవాళ్ళంటే సదభిప్రాయం లేదు... వాళ్ళకి హాళ్ళ మనసేగాని ఎదుటి మనసుఅనర్థం చేసుకునే శక్తి వుండదు. వాళ్ళకి ఒక విధమైనటువంటి అహంభావం వుంటుంది" 13 అంటాడు. అలా అని పెళ్ళిచేసుకోవడం మానుకున్నాడా అంటే అదీ లేదు. సంప్రదాయరీతిలో నాగమణీని పెళ్ళిచేసుకుంటాడు. ప్రేమలో విఫలమయ్యాకా ఓ సంవత్సరంపాటు దేశం. అంతా తిరిగి తల్లిమాట తీసెయ్యలేక పెళ్ళికి ఒప్పుకుంటాడు. అలా అని అమెని చేరదీయడు. శోభనం రోజు రాత్రే మణిని పన్నెత్తి పలకరించకుండా గదిలోంచి టైటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా తల్లి, చెల్లి అభిమానంగా వున్నా రెండేళ్ళపాటు వైవాహిక జీవనమాధుర్యాన్ని దూరం చేసుకుంటారు. ప్రేమకోసం పెళ్ళిత్యాగం అనుకుంటారు. తనని మించి నిరాసక్తతతో నిస్తీజంగా వున్న మణీని పట్టించుకోడు, ఆమె కూడా తన చుట్టూ ఓ గిరి గీసుకొని వుండిపోతుంది. విడాకులిచ్చి వివాహాన్ని విచ్చిన్నం చేయకుండా గొప్ప ధర్మనిరతి పొటిస్తున్నాననుకుంటాడు. నంజుండయ్యతో వెళ్ళిన సంద్య, విదేశీయుడు జాన్సన్‌ని మతాంతర, కులాంతర వివాహం చేసుకున్న లలితల పాటి జీవితానుభవం, అవగాహనలేని ప్రభాకర్‌ తల్లికెపుడూ ప్రశ్నార్థకంగానే వుంటాడు. కోడలు, కొడుకు సఖ్యంగా లేరని తెలిసీ ఏం చేయలేకపోతుంది. అందుకు మణీ మౌనంకూడా తోడ్పడుతుంది. పెళ్ళయిన రెందేళ్లకి కలసి షిక్రారుకెళ్తున్న కొడుకూ, కోడల్ని చూసి రెండేళ్ళ క్రితం ఇద్దరి చెంగూ ముడిపెట్టి అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేయించినప్పటి దృశ్యం గుర్తొచ్చి “హైందవ వివహధర్మంలో గల పవిత్రతవల్లే భార్యా, భర్తల అనురాగం వర్ధిల్లుతుంది" అనుకుంటుంది, అనుకున్నట్లే మనసులు విస్పి మాట్లాడుకున్నా వాళ్ళ ఎడబాటు మరో రెండేళ్ళు కొనసాగుతుంది. మనుగడ పట్ల నిశ్చితాభిప్రాయంలేక, దొంపత్య జీవితాన్ని అనుభవించడం ఇష్టం లేకా కాదు. మణ్‌ తన అనారోగ్యంవల్ల, ప్రభాకర్‌ విఫలప్రేమ, భార్య నిరాసక్తత వల్ల మనసును సమాధానసరచుకోలేక ఏళ్ళతరబడి ఒకే ఇంట్లో 31

ఉంటూ ఎలాంటి వాంఛలకు, స్పందనలకు లోనుకారు. అతనంతట అతను టైటపడేదాకా ఎవరూ అతన్ని పట్టించుకోకపోవడం పఠితకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ రచయిత్రి దృష్టి వేరే వుంది. మానవ సంబంధాలన్నింటిలో మధురమైనది స్త్రీ పురుష సంబంధం, పాశవిక స్ట్థాయినుంచి తప్పించేది ప్రేమ. దివ్యత్వానికి చేర్చేది ధర్మం. 'ధర్మబద్ధమైన, ఆత్మగతమైన ప్రేమే నిజమైన దాంపత్యానికి జీవం'15 అందుకే “మనం మనల్ని ప్రీమించుకున్నంతగా ఇక ఎవర్నీ ప్రేమించలేం. పేమించామనుకోవడం మన (భ్రమ. ప్రేమ అనేది స్వార్థపూరితమైైనది. మనని, మన ఉదారతని, సహనళీలతని ఇతరులు గుర్తించాలనే తాపత్రయానికి ప్రేమ అనే ముసుగు వేస్తున్నారు వ్యక్తులు”16 అని ప్రభాకర్‌ చేత “వా సహనశీలతని మీరందరూ గుర్తించాలనే తావత్రయంలో నా జీవితపు విలువని కోల్పోయాను"17 అని మణిచేత అనిపిస్తారు రచయిత్రి. వారి భావి దాంపత్యజీవిత సౌభాగ్యమంతా ఈ భావాభినివేశం పైనే ఆధారపడి వుందన్నదే వివాహ విజయం అన్నది రచయిత్రి అభిప్రాయం అన్నది స్పష్టమౌతుంది. సంధ్య, లలిత, ప్రభాకర్‌, నాగమణి అందరూ కూడా తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగానే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదటి ఇద్దరిదీ స్వేచ్చా ప్రియత్వం అయితే మిగతా ఇద్దరిదీ ధర్మనిరతి. (1) కులాంతర - మతాంతర వివాహాలు : '(భమరగీతం' భారతీయ సంస్కృతి, కుటుంబ, వివాహ వ్యవస్థలోని భద్రత, గొప్పతనం, వివాహం పట్ల విముఖతతో జీవితాన్ని విలాసవంతంగా అనుభవించాలనుకునే స్వేచ్భాప్రియత్వం, పాశ్చాత్యపోకడలలోని విశ్చంఖలత్వం ముప్పేటలుగా సాగిన కధనం “భ్రమరగీతం' నవల. జమీందారు రామజోగి పంతులు ఇద్దరు కూతుళ్ళలో పెద్దద్మూయి ఓ ఆమెరికన్‌ను పెళ్ళిచేసుకుని విదేశాలకు వెళ్తుంది. ఆమె కూతురు మేరీలీన్‌, కలకత్తాలో పిన్ని ఇంట్లో పెరిగి ఉన్నత విద్య అభ్యసించి బెంగాలీ యువకుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అతను అవకాశవాది. మేరీలీన్‌ సాయంతో అమెరికాలో ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడిపోతాడు. భారతీయతను ఇష్టపడే మేరీలీన్‌ కోర్టులో కేసువేద్దామని తల్లి రమ్మన్నా అమెరికా వెళ్ళదు. సుగుణ, సుమన, [భ్రమర్క శీల, నీల ఐదుగురు ఆడపీల్లలు ఆవిడకి. వాళ్ళని తీసుకుని సొంతవూళ్ళో వున్న తాతగారింటికి వచ్చేస్తుంది. ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - ౩2

ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మేరీలీన్‌ తల్లి విదేశీ వ్యామోహంతో ఖండాంతర నివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. మేరీలీన్‌ వుట్టాక అభిప్రాయ భేదాలతో విడాకులుతీసుకుంది. ఇండియా వచ్చి కలకత్తాలో చదువుకున్న మేరీలీన్‌ సంప్రదాయరీతిలో ఓ బెంగాలీని వివాహమాడి, ఐదుగురు పిల్లల్ని కన్న తర్వాత అవకాశవాది అయిన భర్తనుండి విడాకులు తీసుకుంటుంది, తన తల్లిలాగ, తనలాగ కులాంతర, మతాంతర, భాషాంతర వివాహాలు చేసుకుని, కుటుంబజీవనానికి దూరమయ్యే పరిస్థితి తన పిల్లలకి రాకూడదని తాతగారింటికి వచ్చేస్తుంది. లక్షలకొద్దీ ఆస్తివున్నా, లక్షణమైన సంబంధాలు, పెళ్ళి, ఇలు, కుటుంబం లేకపోతే, మనుగడకి అర్జంలేదని భావిస్తుంది. ఆ మేరకే కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంది.'

(భ్రమర తల్లి భావజాలానికి వూర్తిగా వ్యతిరేకి, ఆడపిల్లగాని, మగపిల్లవాడుగాని అనుకున్నది అనుకున్నట్లు చేయగలగడమే స్వేచ్చకి అర్ధం అనే మనస్తత్వం బ్రమరది. అందుకే తాతయ్య ప్రాపకంలో పెరిగిన చలపతిని ఇష్టపడుతుంది, స్నేహం చేస్తుంది, ప్రేమిస్తుంది, శారీరక ఆనందాన్ని పంచుకుంటుంది. అన్నీ అతనొక్కడితోనే. ఆ విషయంలో చాలా నిజాయితీ పాటిస్తుంది. మిగతా మగవాళ్లని చిటికెన వేలు మీద ఆడిస్తుంది. తాతని, తల్లిని చలపతిని ఎదిరించి న్యూడ్‌ (నగ్న మోడలింగ్‌ కూడా చేస్తుంది.

చలపతి సజ్జనుడు, విద్యావంతుడు. పూర్తి సంప్రదాయవాది కాకపోయినా అతిమంచితనం, సహృదయత, అవగాహన ఉన్నవాడు. భ్రమర విశ్చంఖల స్వీచ్చాతత్వాన్ని పూర్తిగా అంగీకరించలేని కించిత్‌ పిరికితనం వున్నవాడు. ప్రేమన్నా, పెళ్ళన్నా ఖచ్చితమైన నమ్మకం, విశ్వాసం, వున్నవాడు. సీకి స్వాతంత్ర్యం వుండాలి, కానీ అది సంప్రదాయ బద్ధమై వుండాలనుకుంటాడు. అందుకే భ్రమర అమ్మమ్మ, అమ్మల విడాకుల సంగతి విని -

“ఫ్రేమించానని పెళ్ళిచేసుకని, ఆ స్త్రీ జీవితంలో భాగం అయ్యి, ఆమె సిల్లలకి తండ్రి అయ్యి చటుక్కున దుష్యంతుడిలా వదిలివేయడానికి మనసెలా ఒపుతుంది? వాళ్ళు (ప్రేమించామని పెళ్ళిచేసుకోవటం ప్రేమ అన్న పదానికే అవమానం, బుల్లి కాగితం పడవచేస్తే తమ సృష్టికి తామే మురిసిపోతారే! అలాంటిది

సజీవ ప్రాణి బుల్లిపాపాయిని తను చేతులతో లాలించి, పెంచాలి అనిపించదా? ప్రేమ వివాహాలన్నీ ఇలాగే శిధిలమయిపోతాయా? తాను ప్రేమించాను అనుకుని వ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా. కె.బి.లక్ష్మీ - 33

జీవితంలోకి ఆహ్వానించిన స్త్రీని చివరిదాకా ఆదుకుని పోషించడానికి పనికిరాని ప్రేమ

ఇదెక్కడి ప్రేమ తను ప్రేమిస్తే మాత్రం తను చేయి అందించిన స్త్రీని ఎన్నడూ ఒంటరిని చేయడు. ఒక ప్రేమ భావానికి, ఆరతకి అర్థం కల్పిస్తాడు"18 అనుకుంటాడు చలపతి. తెలిసీ తెలియని వయసులోనే అలా ఆలోచించాడతను,

(భ్రమర ఆలోచనలు తద్భిన్నంగా వుంటాయి. భ్రమరవంటి స్వతంత్ర భావుకురాలు ఎంతటి ప్రేమలోనూ తన వ్యక్తిత్వం వదులుకోదు. బొంబాయిలో ఒంటరిగా వుంటూ అంత ఆస్తిపరురాలు చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ మోడలింగ్‌ వైపు మొగ్గుచూపుతూ మగపిల్లలతో చనువుగా వుంటుంది.

“విభిన్న జాతుల కలంయికవల్లనే ఈ పిల్ల ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. మన చెల్లాయిలు, అక్కలు వున్నారంటే ఎక్కడకు వెళ్లమన్నా భయం భయం అంటారు. మా అక్కయ్యకు నలుగురు పిల్లలు. పుట్టింటికి రావడానికి భర్త తోడు వుండాలి. అత్తింటికి వెళ్ళడానికి అన్న తోడు వుండాలి 'క్రాస్‌ బ్రీడ్స్‌' అయితే ఎంత ధైర్యం, ఎంత సాహసం చూడు19 అని మగపిల్లలు వెక్కిరించినా “ఏడశార్లే వెధవలు, చిటికేస్తే కుక్కల్లా నా కాళ్ళ దగ్గర వాల్తారు వీళ్ళా చెప్పేది”19 అని తీసి పారేసేది భ్రమర.

  • “చిన్ననాటి స్నేహం, మీ తాతగారి ఉప్పుతిని బతికిన ప్రాణం. దానికి కృ తజ్జతగా నిన్ను ఒక తోవలోకి తీసుకురావడం నా కర్తవ్యం. నాతో సహకరించు. (భ్రమరా ఊరికిపోదాం రా21 అంటాడు చలపతి బొంబాయినుండి తీసుకొచ్చే ప్రయత్నంలో.

“'భ్రమరలో అతనికి తెలియని రహస్యం లేదు. అన్నీ చెప్పేసినట్టే వుంటుంది. ఆమె అంటే తనకి లాలాస ఉంది. కానీ అమ్మలాగ ఇరుగుపొరుగు ఇల్లాళ్ళలాగా ఒక గృహిణీగా బ్రమరకి తన మనసులో ఒక చిత్ర కల్పన చేయలేకపోతున్నాడు. అతవికి భార్య ఇలా వుండాలి అన్న కోరిక లేదు. కానీ ఎలా వుండాలో తెలుసు. తనకి స్త్రీగా బ్రమర తెలుసు. కానీ భార్యగా భ్రమర తన జీవితం పంచుకోగలదా? తను ఎడ్జస్ట్‌ అయినట్లు ఆమె తనతో ఎడ్జస్ట్‌ కాగలదా?'22 అని ఆలోచిస్తాడు చలపతి.

ఆమె ఏది అడిగితే అది కాదనలేని బలహీనతవున్నా సంసారపక్షంగా వుండలేదేమోనన్న చింతన సమాంతర రేఖలా సాగుతూనే వుంటుంది. అందుకే ఆమెని విశ్చంఖలతకు దూరం చేయాలనుకుంటాడేగాని, లాక్కొచ్చి బలవంతంగా

ప.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా. కెబి.లక్ష్మి - 34

తాళికట్టాలనుకోడు. నిజానికి అలా చేయడానికి కూడా [్రమర ఆస్కారం ఇవ్వదు. ఆ అమ్మాయి మనసుమీద అమ్మ, అమ్మమ్మల విడాకులు, విచ్చిన్నమైన వివాహ బంధాల ప్రభావం బాగా వుంది. అగ్నికి ఆజ్యం తోడయినట్లు విశ్చంఖల స్వేచ్చా జీవితం మోజు ఆమె జీవిత విధానాన్ని, ఆలోచనా ధోరణిని మార్చేశాయి. “ఎవరో ఒకర్ని పెళ్ళిచేసుకుంటాను. పిల్లల్ని కంటాను. ఆ తర్వాత అతను వదిలేసి పారిపోతాడు... ఆస్తి అంతొ ఖర్చు పెట్టేస్తాడు. అపుడయినా నాబతుకు బతకలిగా? ఇంటికి రానందుకే”23 అంటుంది.

“ఆడవాళ్ళ ఆలోచనల్లోనే లోపం వుంది. ప్రతిదానికి చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. తమ బతుకు తాము బతకగలమనే ధీమా- సంసారం ఓటి పడవ ప్రయాణంలా వుంటే బెంగటిల్లిపోయి, మంచం పట్టి మరణించాల్పిన అవసరం లేదు. అరటికాయలు దొరక్కపోతే బీరకాయలు ఎలాగయితే వండుకుతింటామో అలాగే జీవితం కూడా. జీవించడానికి అనేక రకాలయిన మార్గాలున్నాయి. పెళ్ళి, పేరంటం, ఇల్డు సంసారం ఇవే జీవితానికి మార్గదర్శకాలు కావు. వైవిధ్య భరితమైన జీవితమార్గాలను తెలుసుకోగలిగి ఆచరించగలిగితే స్త్రీ మగవాడికి కట్టుబానిసలా పడివుండాల్పిన అవసరం లేదు*24 అంటుంది (భ్రమర.

జీవితాన్ని, సమాజాన్ని పారదర్శకంగా చూసే (భ్రమర మనస్తత్వం స్పష్టంగా

వర్ణాంతర వివాహాలను ఏనాడూ సమాజం అంగీకరించలేదు, ఈ నాటికీ వర్ణాంతర వివాహమంటే సమాజాన్ని ధిక్కరించటమే. _ అది రెండు తరాలకు సంబంధించినదయితే మూడో తరంలో ఆడసిల్లలకు పెళ్ళిళ్ళవడం కష్టం అని అసాధ్యమని కూడా భయపడే పరిస్థితి వుంది.

అమెరికన్‌ తండ్రి, బెంగాలీ భర్త వున్న మేర్‌లీన్‌ తల్లి బ్రాహ్మణ స్త్రీ ఆయినా, మాతామహుడిచ్చిన అపార ధన సంపదవున్నా, తన కూతుళ్ళు విద్యావంచులు, అందగత్తెలు అయినా లక్షణమైన పెళ్ళి సంబంధాలు వస్తాయో రావో అని భయపడుతుంది. తనలాగృ తల్లిలాగా కాకుండా చల్లని, చక్కని కుటుంబ వ్యవస్థలో

  • అత్తా, మామ, ఆడపడుచులు అందరూ వున్న ఇంట్లో కోడళ్ళుగా తన కుమార్తెలు సుఖపడాలని కోరుకుంటుంది. భారతీయ వివాహవ్యవసీ స్త్రీకి అండదండలిస్తుందని నమ్ముతుంది. కానీ బ్రమర స్వేచ్చా ప్రవృత్తి నచ్చకపోయినా ఆమె మొండి వైఖరికి

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 35

ఏం చేయలేక అంతా తండ్రి పోలిక అని సరిపెట్టుకుంటుంది.

“తాతగారూ, సుగుణ, సుమనలు గ్యాడ్యుయేట్స్‌ అయ్యారు. వాళ్ళకి మన కుటుంబాలలో సంబంధాలు కుదరవంటారా? సునంద పిన్నివద్ద వుండగా చదువు, సంగీతం తప్ప ఇతరమైన ఆలోచనలు వాళ్ళకు లేవు, ఇక్కడ నా సిల్లల్ని చేసుకుందుకు అభ్యంతరం తెలుపుతారంటారా?"25 అని ఓ పక్క అర్హతలు చెబుతూనే అనువూనాలూ వ్యక్త పరుస్తుంది మేరీలీన్‌.

రెండు తరాల ముందువాడు, వృద్ధుడు అయినా రానుజోగి పంతులు సామాజిక సత్యాల్ని వ్యక్తుల మనస్తత్వాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నవాడు కనుక

“ఒక్కజాతి మినహాయింపు తప్ప నీ పిల్లల్లో అవలక్షణాలు ఏమున్నాయి తల్లీ? అది వాళ్ళ తప్పుకాదు, పెద్దవాళ్ళు ఆలోచించగలిగితే ఏ పిల్లల్నయినా ఏ కుటుంబాలలో నయినా కలుపుకోగలుగుతారు. మీ అమ్మ చదువుకుంటానంటూ పేచీ పెట్టింది. ఎంతో ఉన్నత విద్యనభ్యసించింది. ప్రేవు పేవ అంటూ ప్రేమించాననుకుంది. పెళ్ళి చేసుకుంటానంది. నేను వద్దనలేదు. ఎందుకో తెలుసా? పెళ్ళి మంత్రాల విలువ తెలియని వ్యక్తికి ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది? పాప పుట్టింది. కుటుంబ జీవితంలోని ఆనందం లభించింది అనుకున్నాను. కానీ ఇద్దరికీ

అభిప్రాయాలు కలువలేదు. విడిపోయారు. పెళ్ళి, పిల్లలదాకా వున్న ప్రమ తర్వాత ఎక్కడికి పోతుంది? అది (ప్రీమకాదు ఆకర్షణ”26 అని సరిపెట్టుకున్నాడు. కన్నబిడ్డలపట్ల పెద్దల స్పందన ఎట్లా వుండాలో అచ్యుతవల్లి రామజోగి పాత్ర ద్వారా స్పష్టంచేశారు.

ఐదుగురూ ఆడపిల్లలేఅని, భార్య వన్నెల విసనకర్రలా వుండకుండా ఇల్లూ, వాకిలీ.అంటూ వుంటుందని బెనర్జీకి విసుగు. మొదటి ఇద్దరు ఆడపిల్లలు పుట్టేదాకా అన్యోన్యంగా సాగిన దాంపత్యం అతని స్వార్థం, అహంభావం, అవకాశవాదం వల్ల . మరో ముగ్గురు పిల్లలు పుట్టేనాటికి పుటుక్కుమంది. మేరీలీన్‌ని పిల్లలకోడివన్నాడు. నువ్వు నాతో విదేశాలకు రావద్దన్నాడు, ఆమె ద్వారానే విదేశీ ఉద్యోగం లభించిదన్న కృతజ్ఞతా భావం కూడా లేకుండా ఐదుగురు పిల్లల తల్లి పాతికేళ్ళ మేరీలీన్‌ను వదిలేశాడు, అఆ మాటే రామజోగిని అడుగుతుంది మేరిలీన్‌,

“నా తండ్రి అంటే విదేశస్తుడు, కానీ నా భర్త సంప్రదాయ కుటుంబం,

ఐ.వి.యస్‌. అచ్యుతనల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 36

ఉమ్మడి కుటుంబంనుండి వచ్చాడు. పదిహేనేళ్ళు నన్ను ప్రీమించానన్నాడు. పెళ్ళి చేసుకున్నోడు, నాకంటే వయసులో బాగా పెద్దవాడు, ఎందుకలా అయింది”27 అంటుంది.

కారణం కనబడదు, తల్లిది ప్రేమ వివాహం, కూతురిది హిందూ వివాహం అయినా ఆకర్షణ, స్వార్ధంతో కూడుకున్నవి కనగ బెడిసికొట్టాయి అనుకోవాలంటాడు రామజోగి. ముని మనుమరాలు సుగుణకి పెళ్ళి సంబంధం కుదిర్చి “నేను (బ్రతికుండగా మళ్ళీ మామూలు పెళ్ళి చేస్తున్నాను" అంటూ రామజోగి పంతులు కొడుకులకి కూతుళ్ళకి జాబులు ్రాశాడు. పెళ్ళి పెద్దరికంగా తన చేతులమీదుగా జరుగుతోందన్న నిశ్చింత అది.

స్త్రీ వ్యక్తిత్వం ప్వేచ్చలోనే వికసిస్తుందనే విషయం పురుషుడికి తెలుసు. కానీ ఆ దృక్పథం ఎలా వుంటుందంటే తనదాకా వచ్చేవరకు స్వేచ్చగా తిరిగే స్త్రీని చూస్తి పురుషుడికి ఇష్టమే. పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి బేరీజు వేయడం మొదలెడతాడు.

(భ్రమర తన జీవితంలోకి రావడానికి ఎప్పుడూ ఒక అధికారం తన మనస్సు పొరల్లో అట్టడుగున దాచుకున్న చలపతి ఆమె జీవితంలోకి మటుకు తను చారబడడు. =ఆమె అన్నీ మరిచి తన దారిలోకి వస్తే ఈ చల్లటి గృహహప్రాంగణంలోకి అమృత హృ దయంతో ఆహ్వానిస్తాడు. తన ఉద్దేశ్యం ఎంత రాసినా ఎకసెక్కంగా జవాబిస్తుందే గాని, తనతో సెటిల్‌ అవుదామన్న ఉద్దేశ్యం వ్యక్తీకరించలేదు"28 అని ఆమె మీద ఆశ వదిలేస్తాడు. అయితే ఇద్దరిదీ నిర్మలమైన, నిష్కల్మషమైన ప్రేమ అన్నది ఆ పాత్రల పరస్పర అవగాహన అనుబంధాల ద్వారా చిత్రితమయ్యే విషయాలు.

'మనసుకి బంధ విముక్తినిచ్చేది, చీకటి బలాలకు కాంతిని తెచ్చేది, హృదయ సీమను పుష్పింపజేసేది స్వాతంత్ర్యం' అన్న బైరన్‌ అభిప్రాయం ప్రకారం నడుచుకున్న (భ్రమర చివరికి కుటుంబ వ్యవస్థమీద, వివాహ బంధం మీద, ఈ రెండింటి అండతో సీల్లల పెంపకం జరగాలన్న విషయం మీద ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది.

=నా తాత, తండ్రి ఎంతో ఆదరంగా సంసారాలు మొదలుపెట్టినవాళ్ళే. మధ్యలో వదులుకొని వెళ్ళిపోయారు. బాధ్యతలకు భయపడి పారిపోయే పిరికివందలని అంటిపెట్టుకుని నేనెందుకు జీవించాలి? నాదయిన జీవితం నేను జీవిస్తాను. ఎవరికి నాలుగు డబ్బులు పారేస్తే వాళ్ళే ఆసరాగా వుంటారు. అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసి

ఐవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 37

పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది భార్యలను వదిలేయడంలేదు? వాళ్ళకి అసరాగా ఎవరుంటున్నారు? సంఘపరమైన ఈ బంధాలు ఎంతమంది కాళ్ళకు బంధాలు వేయించగలుగుతున్నాయి? కట్టుబాట్లకు నేను లోబడను"29 అని స్పష్టం చేస్తుంది.

పెళ్ళి అంటే ఒక కట్టుబాటు, సామాజిక పరమైన కట్టడి. దాని పరిధి

. చాలా సంకుచితం. కుటుంబ వ్యవస్థ కేవలం ఆర్థిక రక్షణకోసం ఏర్పాటయింది.

తనని తాను పోషించుకోగల శక్తి మనిషికి ముఖ్యం అని వాదించే భ్రమర అదే చలపతి దగ్గరకి వచ్చి తనకన్న కూతురికి కుటుంబ రక్షణ కావాలని అడుగుతుంది.

“పొపాయి నిజంగా మన పొపాయే. విశ్వామిద్రుడివి కాకు. దానికి రక్షణ కల్పించు. పాపాయికి ఐదేళ్ళు. కుటుంబ వ్యవస్థలో పావయికి తండ్రి వుంటే బావుండు అనిపించింది. నీ మీది ప్రీవు నిన్ను పతనం చేయడానికి సాహసించలేదు. ఇప్పటికయినా నీవు కమలని పెళ్ళి చేసుకున్నావు. పాపాయి చలపతి కూతురుగా పెరుగుతుంది. కమల నీకు మంచి భార్యే గాక పాపాకి దయగల తల్లికూడా అవుతుంది. మీ ఇద్దరి మీదా నాకా నమ్మకం వుంది. పాపకి నీ రక్షణ వుంటే అది దేవతాక్రన్య అయిపోతుందని ఆళ...230 అన్న బ్రమర మాటల్లో అచ్యుతవల్లి నివాహవ్యవస్థలోన్సి శక్తిని పవిత్రతన్నీ చెప్పకనే చెప్పారు. ఎంత స్వేచ్చాప్రియులయినా తమకోసం కాకపోయినా తమ సంతానానికి వివాహం, కుటుంబమే రక్షణ అని భావించక తప్పదన్న సామాజిక సత్యం, వ్యక్తిగత విశ్వాసం ప్రస్ఫుటం చేశారు. .

వైవాహిక జీవితంలో ప్రస్తుత సామాజిక వ్యవస్థలో స్త్రీ పురుషులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎన్నో కోణాలనుంచి చూపించారు రచయిత్రి అచ్యుతవల్లి. 'ప్రాణిని న్యక్తిగా రూపొందించే ఏకైక సామాజిక వ్యవస్థ కుటుంబం' “౧6 ౯8౧౧1౫ 15 6 0౧1౫ 800121 1౧941416 0౧2౧66 ౪11 2౧910౧0100 16 0101001021 00401501 1౧10 2 [౧4౧౧౬౧ 0610031 అన్న మాటలను చక్కగా నిరూపించారు రచయిత్రి. .

ఒక ప్రత్యేక సిద్ధాంత ప్రతిపాదన ధ్యేయంగా సమకాలీన సమస్యలను దృష్టిలో వుంచుకుని, విమర్శనాత్మకంగా విశ్లేషించి వివహవ్యవస్థను, కుటుంబ జీవనాన్ని చిత్రించిన బహుకొద్దిమందిలో అచ్యుతవల్లి ఒకరు.

అచ్యుతవళల్లిది వాస్తవిక దృష్టి సమాజంలో వస్తున్న మార్పులను “ప్రాక్టికల్‌

ఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 38

గా చూపించారు తన నవలలో. యువతీ యువకుల సమస్యలు

ఏ జాతి మనుగడకైనా, ఏ దేశ జీవన ఉజ్జీననకైనా, ఏ సమాజపు అభ్యున్నతికైనా పట్టుకొమ్మ వంటిది యువతరం.

'యువతరం సహజంగా అవేశాలకు, ఉత్సాహానికి ప్రతిరూసం. ఉడుకురక్తం పొంగుతున్న యువతరం సాధించలేని కార్యం వుండబోదు. కానీ ప్రకృతి సహజమైన ఆవేశాన్ని వొకింత అరికట్టి నవ్యమార్గంలోకి మరలించినట్లయితే యువతరం చైతన్య ప్రవంతియ్రై, పురోగామియై సాగుతుంది 32

అయితే యువతరం జీవిస్తున్న సమాజం, కాలమాన పరిస్థితులు, నమ్మకాలు - ఇవన్నీ వారి దృష్టినీ, వారి దృష్ట్యా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.

'యువతరపు జీవనరీతి, సామాజిక నీతి, కళాప్రీతి ఆధునిక దృక్పథంతో రంజితమై వుంటాయి. నవమానవతా నిర్మాణానికి ఇవి పూర్తిగా దోహదకారులుగా వున్నాయి'33.

సమాజంలో సర్వకాలాలలో నిన్న - నేడు యువతరం నిర్వహీంచవలసిన పొత్ర ఒక్కటే. తరతరాలుగా సమాజం సేకరించి, రూపొందించిన జీవిత విధానాన్ని, సంస్కృతిని నేర్చుకుని కాలానుసారంగా మార్చి నినియోగించుకోవడానికి కావల్సిన శక్తీ సొమర్థ్యాలను సంపాదించడం. జంతువులన్నీ వుట్టుకతోటే అప్రయత్నంగా వాటి జీవన విధానాన్ని నేర్చుకోగలుగుతున్నాయి. సృష్టాదిలో వీటి జీవిత విధానం ఎలా వుందో ఇప్పుడు కూడా అలాగే వుంది. మానవుని జీవితం అలా కాదు. తరతరాలుగా స్వయంకృషి చేత కల్పించుకున్నది. కష్టపడి నేర్చుకున్నది. ఈ నేర్చుకోవడం వల్లనే మానవుడు మానవత్వాన్ని సంపాదించి మానవోచితమైన జీవితాన్ని సాగించగలుతున్నాడు. ఈ నేర్చుకోవడమే యువతరం సమాజంలో నహించవలసిన పొత్ర,

సొంఘిక పారిసర్యాన్ని ప్రక్షాళితం చేసేందుకు సంస్కరణ భావాలతో రేపటిలోకం తనుదే అనుకుంటూ యువత ముందుకు రావాలి. సమాజంలో వ్యక్తి ఒంటరికాడు. వ్యక్తి సమస్త సమాజానికి కేంద్ర బిందువు. అతని చుట్టూ కుటుంబం, సమాజం, జాతి అనే అవిచ్చిన్న వలయాలున్నాయి. వ్యక్తి సంస్కారవంతుదైతే ఇవన్నీ

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 39

అవిచ్చిన్నంగా ప్రకాశిస్తాయి. కనక వ్యక్తిని సంస్కారవంతంగా తీర్చిదిద్దే బాధ్యత యువత చేపట్టాలి.

అందుకే నవభారత నిర్మాణంలో యువశక్తి ఆవళ్యకతను గుర్తించి 'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రాయుథం వంటి సంకల్పశక్తి యువతకి ఉండాలి. జీవితాన్ని సుఖమయ ఉద్యానవాటికగా భావించే ప్రేమ కలాపికాదు నేడు కావల్సింది. జీవన సంగ్రామ రంగంలో మహాయోధులై నిలువగల్లిన ధీర యువత కావాలి' 34

ఆర్థిక్క సామాజిక, విద్య, సాహిత్య, రాజకీయేతర, రాజకీయ రంగాలలో యువతరం పాత్ర గురుతరమైంది. ఈ దశలో వారి మానసిక పరిస్థితి కూడా ప్రమాద స్థితిలో వుంటుంది. సొంత ఆలోచన, పరిణత భావాలు లేనందువల్ల ఎనరేది చెబితే అది నమ్మి వారి ప్రభావానికి లోనవుతారు. అది పూలబాటకావచ్చు, ముళ్ళబాట కావచ్చు. రాదారీ కావచ్చు. అడ్డసందూ కావచ్చు. కాబట్టి యువతీ యువకులు సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాల వెంట సాగిపోవాలి.

యువతీ యువకుల సమస్యల గురించి ఆలోచించేముందు యువతి యువకులంటే ఎవరు? సమాజంలో ఏ వర్గానికి చెందినవారో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. వర్గం ఏదైనా ముఖ్యంగా వీరంతా ఏదో ఓ కుటుంబానికి లేదా కొన్ని కుటుంబాలకు చెందిన వారై వుంటారు.

“కుటుంబాల సాంఘిక ఆర్థిక రాజకీయ మతపరమైన విశ్వాసాలు, అలవాట్లు, జీవన విధానం యువతీ యువకుల జీవితాలను శాపిస్తాయి లేదా ప్రభావితం చేస్తాయి. కుటుంబాలలోని సమస్యలే యువతీయువకుల్ని వ్యక్తిగతంగా కలవరపెడతాయి'35.

ఇప్పటి తరాన్ని సతమతం చేస్తున్న సమస్యలను వస్తువులుగా తీసుకుని తనదైన ప్రత్యేక దృష్టికోణంతో యువతి యువకుల అవసరాలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆలోచనలు, అనుభూతుల్ని సమన్వయ ధోరణిలో రాసిన “తాకట్టు, “పేమగండం', 'కోరిక, “ఒడ్డుకు చేరిన ఒంటరి కెరటం, 'పూలూ - ముళ్ళు' నవలలు, ,

ఈ నవలల్లోంచి ప్రధానంగా విద్య, ఉద్యోగం, ప్రేమ, స్త్రీ వురుష సంబంధాలు చర్చనీయాంశాలు.

ఐవిఆయస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం % డా, కె.బి.లక్ష్మి - 40

() ఒడ్డుకి చేరిన ఒంటరి కెరటం : కుటుంబంలోని ఆర్థిక సమస్యలు విద్యకి అవరోధాలవుతాయి. సరయిన చదువు లేనపుడు ఉపాధినిచ్చే మంచి ఉద్యోగాలు దొరకవు. కలత చెందిన మనసు ప్రేమవైవు మొగ్గు చూపుతుంది. ప్రేమలోని జయాపజయాలు, అవకతవకలు స్త్రీ పురుష సంబంధాలను నిర్ణయిస్తాయి. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి యువతీ యువకుల్ని శాసిస్తాయి.

“ఒడ్డుకి చేరిన ఒంటరికెరటం' నవలలో తల్లిదండ్రులను పోగొట్టుకుని మేనమామ పంచన పెరిగిన అరుణ ఆర్ధిక ఇబ్బందుల రీత్యా, సరైన ఆలనా పాలనా లేని కారణంగా జీవితం పట్ల కొన్ని నిర్దిష్టమ్రైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటుంది. ఉన్నంతలో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని తమ్ముణ్ణి పట్టణంలో చదివించి పట్టభద్రుణ్ణి చేస్తుంది.

(ప్రయోజకుల్టై వేరుగా జీవిస్తున్న అక్కా తవ్య్ముళ్ళ పీడ తనకి వదిలిందనుకుంటాడు స్వార్ధపరుడైన మేనమామ. జీతాలు పెరగడానికి అవకాశం లేని ఉద్యోగం చేస్తున్నా పొదుపు, నిరాడంబరత వల్ల నాలుగు డబ్బులు దొచుకోగలుగుతుంది. తనూ, తమ్ముడే గనక ఒకరికొకరు అండ. వేరే వేరే ఊళ్ళలో వున్నా అనుబంధాలను చెదరనివ్వరు.

కోరి కోరి అరుణతో స్నేహం చేసిన లలితది ఇందుకు వూర్తిగా విరుద్ధ మనస్తత్వం. గంపెడు సంతానం వున్న మధ్యతరగతి కుటుంబంలో వుట్టిన లలిత తద్భినంగా బతకాలనుకుంటుంది. మగవాళ్ళని ఆకర్షించే వస్త్రధారణ, వాళ్ళతో తిరగడం, డబ్బులు ఖర్చుపెట్టడం, పెట్టించడం లలిత హాబీలు. అరుణ వారిస్తే పప్పుసుద్దవని వెక్కిరిస్తుంది.

“ఇంత తొందరగా సంసార బంధంలో చిక్కుకోవాలనుకోలేదు. నా అందం, వయసు సొగసులు ఏ బిజినెస్‌ మాగ్నట్‌నో పడగొట్టగలవనుకున్నాను. ఆఖరికి ఓ సామాన్య గుమాస్తా కోరిక తీర్చి గర్భం రావడంతో ఆ గుమస్తా భార్యనయ్యాను. ఏ జీవితమైతే వద్దనుకున్నానో! ఎదుగూ బొదుగూ లేని అలాంటి జీవితమే నిస్పారంగా గడుపుతున్నా”38 నని వాపోతుంది లలిత.

“ముళ్ళతో పుట్టిన గులాబీ ఎన్నాళ్ళు రక్షింపబడుతుంది? ఒకటి రెండు రోజులు కోయకపోతే రేకులు వీడి నేల రాలిపోతుంది. ఎంత ఆలోచించినా స్త్రీ ఎప్పుడో ఒకప్పుడు బోల్తావడక తప్పదు” అని ఆచి తూచి అడుగువేసే అరుణ లలిత, చలవతుల

ఇ.వి,యస్‌, అచ్యుతవల్లి నవలాసాహీత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 41

స్వార్థం అర్థం చేసుకోలేక పోతుంది? ఉద్యోగానికి రాజీనామా చేసి తమ్ముడు దగ్గరకి 'వస్తుంది.

“ఒక్కొక్కళ్ళు పుట్టిన వేళావిశేషం అటువంటిది. నాకు తల్లీ తండ్రీ వుంటే నా జీవితం పూలబాటలోనడిచేది. క్షణక్షణం ముళ్ళను తప్పించుకుంటూ నడవాల్సిన అవసరం వుండేది కాదు. జీవితంలో మరి కోలుకోలేని ఎదురు దెబ్బతిన్నాను. అయినా ఆ దెబ్బ వునస్సుకి పట్పించుకోకుండా అతీతంగా వున్నాను"౩7 అని నిబ్బరించుకుంటుంది అరుణ.

“సెల్స్‌ సఫిషియంట్‌గా వుండే ఏ ఆడదానికైనా భర్తగా వుండగలడు చలపతి, మనం కూడా మగవాళ్ళలాగ తేలిగ్గా బాధ్యతారహితంగా బతగ్గలిగితే ఈ ప్రేమ, దోమ మనల్ని కుట్టి బాధించవు"౩8 అని పశ్చాత్తాప పడుతుంది లలిత.

ఆర్దిక ఇబ్బందులు, ఉద్యోగం వల్ల వచ్చే వెసులుబాటు యువతి యువకుల సమస్యల్ని వారి వారి మనోదౌర్చల్యం వల్ల మరింత పెంచాయి. లలిత, అరుణ ఎవరికి వారే తమ జీవితాలకు దిశానిర్దేశం చేసుకుంటారు. చేతులు కాలినా సకాలంలో సరయిన నిర్ణయాలు తీసుకోగలగడం అందరివల్లా కాదు. అందుకే 'బర్గ్‌సనొ అనే పాశ్చాత్య తత్వవేత్త “నిన్నటి మనం ఈ రోజు కాము. ఈరోజు మనం రేపు అదే ప్రకారం వుండబోము"”౩9 అని చెప్పాడు.

తనని పెంచి పోషించి ఉద్యోగస్థుణ్ణి చేసిన అక్క అరుణ విధివశాన ఉద్యోగం వదులుకుని వస్తే గిరి తమ్ముడిగా ఆదరించినా ఒక పురుషుడిగా, మామూలు మనిషిలాగే ఆలోచిస్తాడు. తన జీతంతో జీవితాన్ని బేరీజు వేస్తాడు. అనాలోచితంగా ఉద్యోగం వదులుకుని వచ్చిందన్న దిగులు, ఎన్నాళ్ళిలా జరగగలదన్న ఆందోళన గిరిని పట్టి కుదువుతాయి.

అందుకు అరుణ రాకవల్ల ఖర్చు, తను ఇదివరకటిలా క్యాంటిన్లు, స్నేహితులతో గడపలేవితనం, ఇంటివాళ్ళమ్మాయి సీతతో కబుర్లుచెప్పే ఫైవసీ పోయిందన్న బాధ సమస్యలై అతన్ని బాధిస్తాయి.

అండలేని ప్రతివ్యక్తీ బతకడానికి భయపడక్కర్లేదని, కష్టపడి ఆత్మగౌరవాన్ని సంపాదించుకుని ఉన్నతస్థాయికి చేరవచ్చని అరుణ ద్వారా రచయిత్రి బలంగా చెప్పారు. నవలాంతంలో “చదువుకున్న అమ్మాయి తెలివైన నిర్ణయం తీసుకుంది.

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి,లక్ష్మి - 42

అవకాశం తెలివిగా సద్వినియోగం చేసుకుంది” అన్న ఆలోచన రచయిత్రిదే. ఉద్యోగం దొరకని స్థితిలో స్నేహితురాలు లలిత సూచనమేరకు ఓ జమీందారింట్లో పిల్లలకు ఆయాగా చేరి, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా చక్కబెట్టి, చివరికి అందరి మన్ననలు పొంది. భార్యావిహీనుడయిన ఆ పిల్లల తండ్రికి భార్యగా, పిల్లలకి తల్లిగా బాధ్యత స్థిరం చేసుకుంటుంది అరుణ. (1) తాకట్టు : “తాకట్టు' నవలలో విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం ఓ జంట విషయంలో ఏ విధమైన ముగింపుకు దారి తీశాయో! యువతీ యువకుల మనస్తత్వాలు ఈ నాలుగు అంశాలపట్ల ఏ విధంగా స్పందించాయో' నిరూపించిన విధానం గొప్పది. నిజొనికివి సమస్యలు కావల్సినవికావు ఆ జంటకి. కానీ కుటుంబం, సమాజంలోని వ్యక్తుల వల్ల, పెద్దల సరదాలు, ఒప్పందాలు పిల్లల జీవితాల్ని తాకట్టు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డం వల్ల యువత ఎదుర్కొనే సమస్యా పరిష్కారాల సమాహారం. ఈ నవల.

“ప్రభుత్వ రంగంలోను ప్రయివేటు రంగంలోను వివిధ శాఖల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సాగుతో వుంటాయి. వేరు వేరు అర్హతలు గలవాళ్ళు వేరు స్థాయిల్లో పనిచేస్తూ వుంటారు. వారిలో పరస్పర సహకారం, స్నేహం, సౌహార్దం, సానుభూతి నెలకొనవలసి వుంటుంది. అందరూ ఒకే కుటుంబంగా జీవించవలసి వుంటుంది'40. అలా ఓ ప్రెవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న కథానాయకుడు తన దగ్గర ఉద్యోగం చేయడానికి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అమె కూడా ఇతన్ని వరిస్తుంది. అంతవరకు బానే వుంది. కానీ ఈ విషయం ఇంట్లో పెద్దలకి చెప్పి వారి అనుమతి తీసుకోవడం పెద్ద సమస్య.

చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని, కనీసం చదువుకోవడానికి కూడా డబ్బు లేని స్థితిలో అల్లాడిపోతాడు. వేనమామ చదువు చెప్పిస్తానని ముందుకు వస్తాడు. పొట్టిగా, లావుగా వుండే తన కూతురికి ఆ పిల్లవాడు మంచి భర్త అవుతాడన్న స్వార్ధమే మేనమామని పురికొల్సి ఆ పిల్లలిద్దరికీ బాల్యవినాహం జరిపిస్తుంది.

సమకాలీన మానవసమాజంలో వున్న సొంఘిక, ఆర్థిక అసమానతలు మూనవ సంబంధాల మీద ఎటువంటి స్వార్ధపూరిత ప్రభావాన్ని చూపుతాయనడానికి ఈ ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. ౩.బి.లక్ష్మి - 43

నవల ఇతి వృత్తం నిర్వహించిన తీరు స్పష్టం చేస్తుంది.

చివరికి ఈ ్రేమికులే చిన్ననాటి బావామరదళ్ళవడం నాటకీయంగా అనిపించినా విద్యార్షనకోసం, ఉపాధికోసం, ఉద్యోగంకోసం, అఖరికి ప్రేమ, పెళ్ళికోసం కూడా యువత పడే సంఘర్షణ ఆద్యంతమూ అర్థవంతంగా నిర్ధారించబడింది. భావాలు అభ్యుదయ ధోరణిలో సాగినా సుఖప్రదజీవనానికి అనువైన పునాదులు కుటుంబ వ్యవస్థలోనే వున్నాయన్న రచయిత్రి భావం మరోసారి స్పష్టమౌతుంది. (10) శక్రుముగండం ;

అకర్షణ, బాధ్యతల మధ్య చిక్కుకున్న యువతీయునకుల ఆవేదనను ఆవిష్కరించే నవల “ప్రేమగండంి.

సమాజంలో స్రీ జాతి పురోగతి దృష్టా ఇస్త్రీ పురుషులు ఒకరికొకరు తారసపడే అవకాశాలు ఎక్కువైనందున స్త్రీ పురుషుల మధ్య (్రీమ ఏర్పడే అవకాశాలు సైతం ఎక్కువయ్యాయి. స్త్రీ పురుషుల ప్రేమ సంబంధాలు, వ్యవస్థతో వాటి సంఘర్షణ, యువతరంలో వ్యాప్తమైన ఆశా నిరాశలను ప్రదర్శించింది “ప్రేమగండం" నవల. ప్రేమ గురించీ, అది ఒక గండం అనీ సూచనగా చెప్పడం వల్ల శీర్ణికా జొచిత్యం ఈ నవలకు లభ్యమైంది. _

వివిధ ప్రాంతల నేపధ్యాలలో నవలలను నడిపించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించే అచ్యుతవల్లి ప్రీమగండానికి బెంగుళూరును నేపథ్యంగా తీసుకోవడం వల్ల కథాగమవానికి సహజత చేకూరింది.

శివకేశవ బెంగుళూరు వస్తుంటే రైల్లో అంబుజ తారసపడింది. పరిచయం అయి మాటా మాటా కలిపింది. బెంగుళూరు వచ్చేలోపల మరింత చనువుగా మెలగవచ్చని ఆశపడ్డ శివకేశవ అలాంటి అవకాశం రాకపోయేటప్పటికి నిరాశపడ్డాడు.

ఊళ్ళో దిగాకా ఎవరిదారి వారిది. అంబుజ తిరిగి కనిపి్తీ బావుండుననుకున్నాడు. అనుకోకుండా అంబుజ తిరిగి కనిపించింది. శివకేశవ ఆనందానికి అంతులేదు.

శివకేశవ స్నేహితుడు శేఖర్‌కి పెళ్ళయింది. ఒకసారి సంసార సాగరంలో వడితే చదువు నాశనం అవుతుందని భార్యకి దూరంగా వుంటున్నాడు. శివకేశవ, అంబుజల వ్యవహారం చూసి హెచ్చరించాడు శేఖర్‌, సరిగ్గా అదే సమయానికి తిరిగి

ఐ,వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 44

అంబుజతో రాజమండ్రి బయళల్లేరాడు శివకేశవ,

ఒకవైపు చదువు.... బాధ్యత... ఒకవైపు అంబుజ అకర్షణ. శివకేశవ

వంటి యువకుని పరిస్థితి ఎలావుంటుందన్నది, ఎంతటి సంఘర్షణకు గురాతుందన్నది

విదితమే! పదహారేళ్ళ అంబుజని బోల్డంత సామానుతో రైలెక్కించి తోటి ప్రయాణీకుదైన శివకేశకు చూస్తుండమని చెప్పిన ఫలితమే అంబుజమీద మనసు పారేసుకోడానకి తొలిమెట్టు. ఆమె మెస్‌ అయ్యరు కూతురని తర్వాత తెలుస్తుంది.

తమిళుల అమ్మాయికి, తెలుగబ్బాయికి మధ్య ఎంత ఇష్టం, ప్రేమ వున్నా పెళ్ళికి ఖచ్చితంగా సంప్రదాయం అడ్డురాకతప్పదు. అందులో అంబుజ సంప్రదాయవాది, కానీ విజయ్‌ పప్రీమించిన అమ్మాయి వనజాక్షి. వనజాక్షి అంబుజ చుట్టమే అయినా ఆమెది ప్రత్యేక వ్యక్తిత్వం. అందుకే విజయ్‌ తన ప్రీమను వెల్లడించినపుడు “ముందు శ్రద్ధ పెట్టి చదువు ముగించి, తర్వాత ఉద్యోగం సంపాదించండి. అంతవరకూ ప్రీమ మాట తలపెట్టద్దు. ఆ తర్వాత కూడా ఇంకా ప్రేమ మిగిలివుంట్కే అది ఆకర్షణ కాదని రుజువయితే, అప్పుడు పెళ్ళి గురించి ఆలోచిద్దాం అందాకా ఎవరి వ్యాపకం వాళ్ళదే"41 అని ఖచ్చితంగా చెబుతుంది.

అంబుజకూడా తక్కువది కాదు. ప్రేమ, స్నేహం కొంత వరకే. ఎవరి పెద్దలు కుదిర్చిన సంబంధాలు వాళ్ళు చేసుకుని తొలిప్రమను అపుడపుడు నెమరేసుకోడం మంచిదని అనేక సందర్భాల్లో వెల్లడిస్తూ వుంటుంది.

“మా నాయన ఫోను చేశారు. నాకు కళ్యాణం కుదిరిందట. ఎవళ్ళ వాళ్ళను వాళ్ళు పెండ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు సంతోషిస్తారు సామీ. మన ప్రేమ ఒక కల్కి ఒక కథ. పైగా పెళ్ళివాళ్ళు చాలా భాగ్యవంతులట. మద్రాసులో పెద్ద హోటలుందట. రవ్వల దుద్దులు, నాలుగు కంచిపట్టు చీరలు కొంటున్నారట”42 అన్న అంబుజ మాటల్లో స్టూడెంట్‌ శివకేశవతో ప్రేమకంటే గొప్పింటి సంబంధంతో వివాహ బంధం మేలనుకునే సగటు ఆడపిల్ల మనస్తత్వం కనబడుతుంది.

తొలిప్రేమ గురించిన ఆమి అభిప్రాయం యువత ఆలోచనా విధానానికి దర్పణం. 'పెళ్ళి చేసుకుని నన్ను మర్చిపోతావా?' అని శివకేశవ అడిగితే “ఎందుకు మర్చిపోతాను. తొలిప్రీమ ఎవరూ మర్చిపోలేరు. నాకు ఎప్పుడూ మీరు జ్ఞప్తికి వస్తూనే వుంటారు. మీరు మటుకు నన్ను మర్చిపోతారా సామీ... మన వయసువారికి ప్రమ ఒక గండం. ఆ గండం మీ పెద్దవాళ్ళు, మా పెద్దవాళ్ళు తప్పించారు. అందరిలాగే

ఐ.వి.యస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 45

పెళ్ళి చేసుకుంటాం. సంసారంలోకి దిగబడిపోతాం. ఎప్పుడయినా నడి వయసుకి చేరేసరికి చిన్నప్పటి ప్రేమగ౦డం గుర్తుకువస్తుంది. శరీరం పులకించిపోతుంది. వుళ్ళీ ఆ పదహారేళ్ళ ప్రాయుంకోసం తహతహలాడుతుంది. వునస్సు యౌవనమౌతుంది"43 అని హితబోధలు చేస్తుంది. శివకేశవ, విజయ్‌, (ప్రసాద్‌, శేఖర్క్‌ సారధి వీళ్ళు అయిదుగురు మిత్రులు పంచపాండవులు. వీరిలో శేఖర్‌కి కాలేజీలో చేరేటప్పటికే పెళ్లయిపోతుంది. అతనికి ప్రేమగొడవ లేదు. భార్యని తలుచుకుంటూ వుంటాడు. ముందే పెళ్లవడం వల్ల వీళ్లల్లా ప్రేమా, దోమా బాధ తప్పిందనుకుంటాడు,.

శేఖర్‌ చెల్లెలు సుమిత్రని ప్రసాద్‌ ప్రేమిస్తాడు. విజయ్‌ మనజాక్షిని ప్రేమిస్తాడు. సారధికి ఇవేవీ పట్టవు. అతని చదువు, మిత్రులతో సత్కాలక్షేపం అంతే.

శివ విఫల ప్రేమ గురించి విన్నాక ప్రసాద్‌ సుమిత్రను తలుచుకుంటాడు. “తనది కల్తీలేని ప్రేమ, వీళ్ళలాగ గండాలపాలు చేయకూడదు. ఎన్నిరోజులయినా కాగిన పాలమీద మీగడలా చిక్కపడాలి. ప్రేమ ఎన్నిగండాలయినా దాటుతుందని రుజువు చేయాలి. వనజాక్షి చెప్పినట్లు ముందు బాగా చదువుకోవాలి. తను ప్రేమిస్తున్నట్లు సుమిత్రకు తెలియకూడదు. ఆ పిల్లకు చదువు ధ్యాస తప్పించకూడదు' అనుకున్నాడు, ఆమె చదువు సంధ్యలన్నీ తన భుజస్కంధాలమీద వేసుకుంటాడు.

కట్టడిలేని పెంపకంలో స్వేచ్చగా పెరిగిన వనజాక్షికి జీవితపు విలువలు బాగా తెలుసు,

నిజానికి చాలామంది కాలేజీ అమ్మూయిలకు చదువులు ముఖ్యంకాదు. ఇప్పుడంటే కళాశాల విద్యార్థినీ, విద్యార్థులంతా 'కెరీరొకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారుగానీ ఒకప్పుడు అలా వుండేది కాదు. స్నేహంకంటే ప్రేమకే ప్రాముఖ్యతనిచ్చేవారు. 'ఒక ప్రేమ లేఖన్నా రాకపోతే అదేదో దిస్కాాలిఫికేషన్‌గా భావించి బెంగలు పెట్టేసుకునేవారు' అని వనజాక్షి మాటల్లో చెప్పిస్తారు రచయిత్రి.

తన వ్యక్తిత్వాన్ని తానే తీర్చిదిద్దుకున్న వనజాక్షి ఇంచుమించు వాళ్ళ వయసుదే అయినా తన చుట్టూ వున్న యువతీ యువకులను, వారి సమస్యలను గమనిస్తూ, వారికి ప్రయోజనకరమైన సలహాలిస్తూ మార్గదర్శిగా వుంటుంది. దేన్ని గురించీ నాకెందుకని ఊరుకోదు “పూని యేదైనాను ఒక మేల్‌ కూర్చి జనులకు చూపవోయ్‌”

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా, కె.బి.లక్ష్మి - 46

అని గురజుడ హితోక్తిని అక్షరాలా నిజం చేసే వ్యక్తి వనజాక్షి. సాధారణంగా యువతి యునకుల ఆలోచనా ధోరణికి భిన్నంగా వుంటుంది తన ఆలోచన. అందుకే “ఇష్టం వేరు, ప్రేమించడం వేరు, పెళ్ళిచేసుకోడం వేరు. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపెట్టకూడదు. ఇద్దరూ ఆర్థికంగా ఒకరిపై ఒకరు ఆధారపడని స్థితికి రావాలి. అప్పటికీ ఒకరిపై ఒకరికున్న అనురాగం తరగకపోతే అప్పుడు పెళ్ళిచేసుకుని బాధ్యతల్ని సమానంగా స్వీకరించాలి"44 అని ప్రసాద్‌కు హెచ్చరిక చేస్తుంది వనజాక్షి. సమాజంలో నానాటికి పెరుగుతున్న అరాచకం, అత్యాచారాలగురించి చెబుతూ “ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన దేశంలో ఈ దోపిడీలు, దారుణ హత్యలు, మానభంగాలు ఎలా జరుగుతున్నాయో! కావాలని తీసుకెళ్ళిన సీతాదేవిని కూడా తనపై మనసు మరల్చుకోమని ఒప్పించి చూశాడే కాని మానభంగం చేయలేకపోయాడు రావణాసురుడు. అంతటి ఉత్తమ గుణాలున్న దానవుడు అతను, అలాంటి భరత ఖండంలో ఈనాటి నరరూపరాక్షసులు ఎలా అవతరించి మనుగడ సాగిస్తున్నారో చూడండి" అన్న వాక్యాల్లో వాస్తవికతను ప్రస్ఫుటం చేసీ సామాజిక స్పృహ వుంది, యువతీ యువకుల ఆలోచనను సరైన దారిన పెట్టాలన్న తపన వుంది. .

“ స్త్రీ పురుష సంబంధాలలో ప్రేమకన్నా ఆర్థిక విషయాలు మన సమాజంలో ఎంతగా ప్రముఖ పొత్ర వహిస్తాయో ఈ నవలలో చక్కగా వర్ణిస్తారు రచయిత్రి.

ఆచార వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితులే వివాహ బంధాన్ని నిర్దేశించే ఈ సమాజంలో అప్పుడపవ్వుడు ప్రీమలో పడడం జరిగినా ఏదోలా ఆ గడంనుండి టైటపడి సమకాలీన సమాజంతో రాజీపడడం సర్వసాధారణ విషయం అనీ కొండొకచో అనివార్యం అనీ రచయిత్రి ఐ.వియస్‌, అచ్యుతవల్లి సూటిగా, సహజంగా చిత్రించారు"45.

ఈ నవలలో వరకట్నాలకు బలైపోయే స్త్రీలు మాత్రమేగాక డబ్బున్న వరుడికోసం ప్రేమకు నీళ్ళు వదిలే కన్యలు కూడా వుంటారని చూపారు. ప్రస్తుత వివాహ వ్యవస్థలో డబ్బుపొత్రమ ఇలా వివరిస్తారు ఓ సొత్రద్వారా.

“భార్యన్నది డబ్బు పెట్టబడి పెట్టే సాధనం మాత్రమే. ఎవరెంత ఎక్కువ కట్నం ఇస్తే ఆ అమ్మాయికే భర్త అవుతాడు. ఆ అమ్మాయి అందచందాలు, చదువు, మనస్సు అతనికేం అక్కర్లేదు. తన చదువుకో, ఉద్యోగానికో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారు పెళ్ళికూత్తురు. ఆపైన కాలానికి కట్టుబడి వున్నవాడైతే భార్యకు

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా, కెబి.లక్ష్మీ - 47

అన్యాయం చేయడు. మొరడువారిన గుండెవాళ్ళయితే భార్య అనేది జడపదార్థమని ఓ మూల్వ పారేసి వాళ్ళ సరదాలు వాళ్ళు తీర్చుకుంటారు."46

ఈ అంశాలు యీ మిలీనియంలో కూడా మన సమాజంలో కనబడే సత్యాలన్న సంగతి గమనార్హం: సమాజాన్ని అన్ని కోణాల్నించి వరిశీలించిన రచయిత్రి నిశితదృష్టికి తార్కాణం.

(౪7) కోరిక:

స్త్రీ పురుష సంబంధాల్లో విమోచనోద్యమంలోని అతివాద ధోరణి “కోరిక' నవలలో స్పష్టంగా కనిపిస్తుంది. నవలలో సంగీత వివాహ వ్యవస్థను నిరాకరిస్తుంది. కట్నం ఇచ్చి వివాహం చేసుకోవడాన్ని నిరసిస్తుంది. సమాజపరమైన విలువలు నిత్యమూ మారుతుంటాయి. తదనుగుణంగా యువత బాధ్యతలు, దృక్పథాలు మారే అవకాశం వుందని నిరూపిస్తుందీ నవలలో సంగీత.

"నేటి యువతరం కొత్తపోకడలు పోతుంది. వింత పోకడలు కూడా పోతుంది. ప్రతిదాన్నీ సూటిగా ప్రశ్నించే మనస్తత్వం అలవర్చుకుంది, అనాదిగా అందరూ అవునని తలలూపిన విషయాలను, వాస్తవాలను ధిక్కరిస్తోంది నేటి యువతరం. నిలదీసి అడుగుతోంది సమాధానం చెప్పమని, తనకు కావల్సిన దానికోసం తానే ఉద్యమిస్తోంది*47. చేజార్చుకున్న విలువలు, చేకూర్చుకున్న విలువల విశాలత్వాన్ని, సంకుచితత్వాన్ని సమతూకంగా చిత్రించిన నవల కోరిక.

స్త్రీ పురుషుల వ్యక్తిత్వాల నడుము ఏర్పడే సంఘర్షణ, సమాజంలో స్త్రీ ఆలోచనలు, కోరికలు స్వాతంత్ర్యానంతర తెలుగు నవలల్లో విస్పతంగా చిత్రించడం గమవార్హం. 19 60నుండీ అమెరికాలో పెద్ద ఎత్తున సాగింది స్త్రీ విమోచన ఉద్యమం. త్త స్థానం, వారి హక్కులు బాధ్యతలపై ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాల దృష్టి ప్రసరింపజేయడానవికి ఐక్యరాజ్య సమితి, యు.న్‌.ఎ. 1975ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. దీని ప్రధాన ఆశయాలు. 'స్తీ పురుషుల సమాన హక్కులను పెంపొందింపచేయడంి, “స్త్రీల యొక్క ఆర్థిక సాంఘిక, సొంస్కృ తికాభివృద్ధిని ప్రోత్సాహించడం', 'దేశ విదేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృ ద్ధి చేయడం, స్త్రీలు లోగడ చేసిన కృషిని గుర్తించడం".

కుటుంబ వ్యవస్థలో స్త్రీ జీవనాన్ని, సమస్యలను, స్త్రీల హక్కులను

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 48

పట్టించుకుంటూ, వివాహ వ్యవస్థలో స్త్రీ బానిసత్వాన్ని, వ్యక్తిత్వ శైధిల్యాన్ని ప్రధానంగా విశ్లేషిస్తూ రాసిన స్వాతంత్ర్యానంతర తెలుగు నవలాకారుల్లో ప్రత్యేకస్థానం ఐ.వి.యస్‌. అచ్యుతవల్లిది. అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించిన 1975లోనే “కోరిక నవల రాయడం, అపూర్వసృష్టిగా నిలవడం గమనార్హం. అటు స్తీ స్వేచ్చా భావాలపరంగా ప్రశంసలకు, రాడికల్‌ ఫెమినిజం (తీవ్రవాద స్త్రీ వాదం) దృష్ట్యా భారతీయ కుటుంబ జీవన నేపధ్యంలో ఎంతవరకు సమంజసం? అన్న విషయంలో సద్విమర్శలకు తావిచ్చిన సంగీత పాత్ర ఈ నవలకు అచ్యుతవల్లి నవలల్లో ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సంగీత పట్టభద్రురాలైన చెల్లెలు విమలతో చాలా విషయాల్లో విభేదిస్తూ వుంటుంది. వివాహితుడు, ముగ్గురు పిల్లలతండ్రి అయినా సంగీత' వెంటపడతాడు వాసుదేవ. ఆమెకీ అతనంటే ఆకర్షణ కలుగుతుంది. ఇంజనీరయిన అతనితో అతను పనిచేసే ప్రాంతానికి, అతని జీపులోనే వెళ్ళడానికి సంగీత కార్యక్రమం నిర్ణయించి విమలని రమ్మంటే *మన వాళ్ళెవరూ రాకుండా ఆడపిల్లలం మనిద్దరం ఎందుకు. పెద్దవాళ్ళు చూసిన బాటలో నడిస్తే మనకు వచ్చిన నష్టం ఏముంది?”48 అంటుంది. “నష్టం ఏమీ లేదు కాని మన వ్యక్తిత్వానికి విలువ వుండదు మన గన్యూన్ని మనమే నిర్దేశించుకోవడంలో గొప్ప ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఈనాటి పెద్దవాళ్ళు కూడా ఒకనాటి యువతరంవాళ్ళే. ఆనాడు వాళ్లు ఏదేదో నూతనత్వం వాళ్ళ జీవితంలో కావాలని ఆరాటపడినవాళ్ళే. అయితే ఆరాటం వున్నంతగా ఆశయసాధనకు వాళ్ళు కృషి చేయలేదు. అందుకనే గుడ్డెద్దు చేలో మేసినట్టుగా ఇంచుమించు అందరూ ఒకలానే జీవితాలు గడపసాగారు. అందులో ఆనందం వుండనీ, దుఃఖం వుండనీ మారు మాట్లాడకుండా ఆ, సంసార వలయంలో బిగించుకుపోయి. వున్నారు"49 అంటుంది సంగీత. ఇంట్లోని సంప్రదాయవాదం, ఒకే తల్లి కడుపున పుట్టినా తన తర్వాతదే అయినా విమల ధోరణికి భిన్నంగా “వ్యక్తులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ స్వభావాల్లో మార్పు కలుగుతుంది. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పంథా ఆకర్షిస్తుంది. నచ్చినమార్గంలో నడవగలిగిన సాహసం మగవాళ్ళకి వున్నంతగా ఆడవాళ్ళకి వుండడం లేదు"50 అన్న మాటలద్వారా సంగీత అనుకున్నది చేసి చూపించే వ్యక్తి అని అర్ధమైపోతుంది. అందుకే ఐవియస్‌. అచ్యుతవల్లి నవలొసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 49

ఎవరితోనైనా, ఏ సందర్భంలోనైనా సంగీత ఒకేలా మాట్లాడుతుంది.

ఏ విషయమైనా నిస్సంకోచంగా, సిగ్గుపడకుండా మాట్లాదే సంగీత వాసుదేవకి అర్థంకాని పజిల్‌లా కనిపిస్తుంది. “స్వేచ్చ ఒకరు పుచ్చుకునే దేమిటి? మానసికంగా ప్రతి వ్యక్తీ స్వేద్భాప్రియులే అవుతారు. సాహసం, ధైర్యం లేక ఒక ముసుగులో దూరి గిజగిజలాడుతూ అదే మహాగొప్పు జీవితం అని మురిసి పోతుంటారు"51 అని సంగీత అన్నప్పుడు వాసుదేవ ఆశ్చర్యపోవడానికి అదే కారణం, అతని భార్య జయ, తల్లిలా ఆదరించిన రాజేశ్వరి తద్భిన్నంగా అతని పురుషాధిక్యతను పెంచి పోషిస్తూ వుండడం కూడా అందుకు కారణం.

“నాకు ఏ మగవాళ్ళూ నచ్చరు. సౌందర్య దృష్టి కళాదృష్టి లేని మగవాడికి నేను లోబడను అనే సంగీత తనకు నచ్చిన వాసుదేవతోనే శరీర సౌఖ్యాన్ని కోరుకుంటుంది.

స్నేహితుడు వాసుదేవకి స్వయానా బావమరిది అయిన దివాకర్‌ వాసుదేవ భార్య జయ తన చెల్లెలని, ముగ్గురు అడపిల్లల తల్లి అనీ... అతనితో సంగీత ప్రేమ అనుచితం అనీ ధ్వని పూర్వకంగా మాట్లాడినప్పుడు “చౌకబారు స్త్రీలల్లా భార్యాభర్తల మధ్య నేను చారబడతానని అనుకోవద్దు. నేను ఎమ్‌.ఎ. పాసయ్యాను. నన్ను నేను పోషించుకోగలను. పెళ్ళి అంటే ఒక బంధం. ఆ బంధంకి కట్టుబడి మానసిన స్వేచ్చను తాకట్టు పెట్టుకోవడం నాకిష్టం లేక నేను పెళ్ళి చేసుకోవడం లేదు. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించగలిగే మనో నిబ్బరం నాకుంది”క2 అంటుంది.

ఈ నిబ్బరమే చివరికంటా నిలుపుకుంటుంది. మూరుమూల (గ్రామంలో కొడుకుని కన్కి టీచర్‌ ఉద్యోగం చేస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఆచూకీ తెల్సుకుని వాసుదేవ తనదగ్గరిక్తి వచ్చినా అతన్ని తిరస్కరిస్తుంది.

“స్త్రీలో మాతృత్వ కాంక్షలేకపోతీ మగవాడికి బానిసకావాల్సిన అవసరమే లేదు. నా బిడ్డను నేను ధైర్యంగా పెంచుతాను. ఆత్మశక్తీ సంయనునం వున్నవాడిలా పెరుగుతాడు నా బాబు, నేను ఇచ్చాపూర్వకంగా మిమ్ముల్ని కవ్వించాను. ఆ ఆనందం ఇద్దరం సమానంగానే సంచుకున్నాం. క్రమక్రమంగా మీరు నా మీద ఏదో అధికారం సంపాదించినట్లు (ప్రవర్తించడం మొదలు పెట్టారు” అని తనకది నచ్చదని సగటు భర్తకి సగటు భార్యగా తానుండననీ ఇంక తనని కలవద్దనీ తండ్రిపేరు అవసరం లేక్షుండానే తన కొడుకుగా వాడు పెరుగుతాడు పొమ్మంటుంది అతన్ని ఏ

ఐ,వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 50

విధంగానూ గిలవనివ్వదు. తన జీవితంతో తనే ప్రయోగం చేసుకున్న సంగీతను తండ్రి సరిగ్గా అర్ధం చేసుకుని ఆదరించడం ఆలోచింవజేస్తుంది. గత్యంతరం లేని వరిస్థితుల్లో బలరామయ్య అలా చేయలేదు. దృఢ నిశ్చయం చేసుకుని, జీవితాన్ని మలచుకున్న విద్యావంతురాలైన. కూతురి మీద వుండే గౌరవం అది. అందుకే ఓ స్త్రీగా తల్లిగా మధ్యతరగతి గృ హిణీగా రేవతి కూతురి గురించి బాధపడుతుంటే. “అందరూ ఒకే గాడిలో జీవితాలను నడపొలనుకోవడం దురభిమానం అవుతుంది. స్వేచ్చలో ఎవళ్ళ జీవితానికి వాళ్ళదే పూర్తి బాధ్యత వుంటుంది.” అని సమర్థిస్తాడు. స్వాతంత్ర్యానంతర తెలుగు నవలలగురించి ప్రస్తావించినపుడు. స్త్రీ విమోచనోద్యమం, అతివాద ధోరణులు రంగనాయకమ్మ 'అంధకారంలో', “ప్రేమ ప్రేమను ప్రిమిస్తుంది", 'జానకి విముక్తి - ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి కోరిక నవలలో విస్పష్టంగా కనిపిస్తాయి. “కోరిక నవలలో సంగీత వివాహ వ్యవస్థను నిరాకరిస్తుంది. స్త్రీకి మాతృత్వం ఒక వరంగానూ, కన్యగా గర్భవతి అయి పిల్లల్ని కనిపెంచడానికి భయపడే నేటి కన్యలకు తాను ఆదర్శప్రాయంగా నిలవాలని తలుస్తూ వుంటుంది. స్త్రీని బానిసగా చూసే కుటుంబవ్యవస్థని నిరసించి, సంగీతపాత్రద్వారా ఆదర్భ సమాజాన్ని సృష్టించడానికి అచ్యుతవల్లి యత్నించారు. స్త్రీలపట్ల వున్న కొన్ని నిశ్చితాభిప్రాయాలతో '“నీస్తానం ఫలానా అని నిర్దేశింపబూనడం పురుషాధిక్యత కిందకే వస్తుంది. అయితే యువతలు కూడా బయట ప్రపంచంలో మసలుకునే శక్తినీ, స్థయిర్యాన్నీ పెంపొందించుకోవాలి. అపుడే ఈ ప్రస్థానంలో స్త్రీ పురుష సంబంధాలలో కొత్త మార్పులు వస్తాయి. ఆధునిక యువతి జీవిత పోరాటంలో కొంత గెల్బుకున్నప్పుడు కొంత కోల్పోతుంది. ప్రతి గెలుపులోనూ కొంత కోల్పోవడం వుంటుంది. పాత సంఘం నిర్దేశించిన నీతుల కొలతలను, పాత విలువలను ఆధునిక యువతి కొంత మేరకు తృణీకరించవచ్చు. సంగీతను సృష్టించి, నా జీవితం నా ఇష్టం వచ్చినట్లు ములుచుకుంటాను, అని ఆమె చేత అనిపించినా రచయిత్రి వివాహ అవ్యవస్తన్తు.శళ్య్థాన్నారానస్న్హ జో ఉలి రన లతా ర్చ ఖ్‌ ల లాటా ట్‌ మ. ర్ట క

వ ఫి

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత, జద్చాకైటలక్సీ ఎల క్‌ ర్తి కర) ఎదీ, 4 ల్లీ సం కడ్వావై(బి+ క్ష్‌ య యం! 4 / గ

యువకుల సమస్యలకు సరిష్కారం కుటుంబ వ్యవస్థలోనే దొరుకుతాయని నమ్ముతారు అనడానికి "స్వేచ్చా ప్రణయాన్ని విశ్వసించి అందుకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకున్న సంగీతను, ఆమె "బిడ్డతో సహా తల్లిదండ్రులు ఆదరించి ఇంట్లో వుంచుకోవడమే తార్కాణం. సంప్రదాయాన్ని కాదన్న కుటుంబాన్ని, కుటుంబ సమస్యల మధ్య అవగాహన వుండితీరాలని ఏ వాదానికైనా అదే బలమని రచయిత్రి అభిప్రాయపడినట్లు స్పష్టమౌతుంది. (7 పూలూ - ముళ్ళు :

పూలూ - ముళ్ళు నవలలోని ఇతివృత్తం సమకాలీన సమాజంలో ఒక విప్లవాత్మక ప్రక్రియ అనిచెప్పాలి. 19 79 జ్యోతి మాసపత్రికలో సీరియల్‌గా వచ్చిన ఈ నవలను ఆ తర్వాత క్వాలిటీ పబ్లిషర్స్‌ పుస్తకంగా ముద్రించారు.

వివాహేతర సంబంధాలను నిగ్గుతేచ్చిన నవల పూలూ - ముళ్ళు అందంగా వున్న దంపతులంతా అనురాగంతో ముడిపడి వుంటారనుకోవడం పొరపాటు. ఒక్కో మనసు ఒక్కో అందాన్ని, ఒక్కో తత్వాన్ని కోరుకుంటుందన్న ్రాయిడ్‌ సిద్ధాంతానికి దగ్గరగా వున్న ఇతివృత్తంతో నదుస్తుంది.

చదువుకున్న పాతికేళ్ళ అన్మూయి సుమన వివాహితుడైన జగన్నాధాన్ని ప్రేమించి అతని భార్య నళినికి తెలీకుండా తనని తాను అర్పించుకుంటుంది.

నిజానికి నళిని అందగత్తె. సాక్షాత్తు ధర్మపత్ని. అయినా ఆమె అందంలో అతనికి స్పందన దొరకదు. అంతటి అందాన్ని భర్తగా అనుభవించలేకపోయాడు జగన్నాధం. సుమన అందగత్తె కాదు. కానీ అమె స్పర్శలో విద్యుత్‌ వుంది, మగాణ్ణీ సుఖపెట్టగల చొరవ వుందనిపిస్తుంది జగన్నాధానికి.

సుమన ఆలోచనా విధానమే వేరుగా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా స్వేచ్భా జీవితం వైపే ఆమె దృష్టి మొగ్గుతుంది. జగన్నాధంతో తన కలయికని సమర్ధించుకుంటూ “ఒక పని చేయలేకపోతే ఆ పనిచేయలేకపోయామే అని జన్మంతా బెంగపెట్టుకుంటూ కుమిలిపోవడం కంటే తప్పో ఒప్పో! సబబో బేసబబో! నీచమో, పాపమో! ఆ పని చేసేస్తే మనస్సు ప్రశాంతంగా వుంటుంది. ఒక్కొక్క అనుభవంతో మనిషిలో పరిశీలనా శక్తి పెరుగుతుంది. వయస్సులో ప్రేమానుభవం కలగని మనిషి మనస్సులో ఆర్హత చచ్చిపోతుంది. పండు ముదుసలి అయినా వయస్సులోని

ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 52

(ప్రేమానుభవం స్ఫురణకు వచ్చినప్పుడల్లా ఆ మనిషి వయసు మర్చిపోయి రసొర్దత పొందగలుగుతారు...”53 అంటూ వింత వేదాంతం చెప్పుకురటుంది.

సుమన, జగన్నాధరావుల వ్యవహారం తెలిసి సహజంగానే నళిని అతన్ని నిలదీస్తుంది. ఆ ఘర్షణలో “ఏ స్త్రీ అయిన తన భర్త ఎంత దుర్మార్గుడయినా అతని దుర్మార్గాలని పైకి రాకుండా తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. కానీ అతనిలోని దుర్గుణాలని ఎక్స్‌ప్లాయిట్‌ చేయటానికి సాహసించదు. దానివల్ల అమెకి మిగిలేది సంఘం యొక్క దమ్మిడీ విలువలేని సానుభూతి. దొంగాడి భార్య అయినా దొరసానిలా కనపడాలని చేసే వ్యర్ధ ప్రయత్నంలోని రహస్యం ఇదే"54 అంటుంది.

ఐశ్వర్యవంతురాలు, అందగత్తె, విద్యాధికురాలు అయిన నళిని పెళ్ళిచూపుల్లో జగన్నాధాన్ని వరించి, కోరి కోరి పెళ్ళాడుతుంది. తీరా చూస్తే సంసార జీవితం ఇలా అవుతుంది. సగటు స్త్రీలా అలోచిస్తోందనిపిస్తుంది గానీ స్పెర్మ్‌కౌంట్‌ తక్కువ వల్ల జగన్నాధం ద్వారా ఏ స్త్రీ తల్లి కాదని తెలుసు కాబట్టి చివరకు ఎవరి ద్వారానో గర్భవతి అయ్యి అది జగన్నాధం వల్లే అన్న సుమనను ఇంటికి పిలిపించి, వద్దు మొర్రో అంటున్నా జగన్నాధానికి అంటగడుతుంది.

అప్పటికి తన తప్పు, సుమన మోసం, నళిని పాతివ్రత్యం తెలుసుకుని జగన్నాధం కళ్ళు తెరిచినా ససీమిరా అంటుంది నళిని.

విప్లవాత్మక ధోరణిలో వివాహేతర స్త్రీ వురుష సంబంధాలు గల ఇతివృ త్తాన్ని రచయిత్రి ఎంతో నిబద్ధతతో నిర్వహించారు. సుమన, జగన్నాధం, నళిని యీ ముగ్గురి పాత్రల మధ్య జరిగే మెంటల్‌ గేమ్‌ ఈ ఇతివృత్తానికి కొత్త డైమన్హన్‌ ఇచ్చింది. అంతిమ విజయం నళినిదే అని చూపడం ద్వారా నైతికంగా పతనమై, ఒకరంటే ఒకరికి ఇష్టంపోయి, మనసులు విరిగిన వాళ్ళిద్దర్నీ కలిపి గుణపాఠం చెప్పిన రచయిత్రి నేర్పు ప్రశంసనీయం.

తీవ్రవాద ధోరణిని వ్రవేశపెట్టి దాన్ని సంప్రదాయబద్ధంగా పడగొట్టడం లేదా సమర్థించడం కనిపిస్తుంది ఈ నవలలో. పూలున్నచోట ముళ్ళుంటాయి. శూన్యంలోంచి తుఫానులు వస్తాయి అని అర్ధం వచ్చే “యే న భూల్‌నా జహా జహా పర్‌ ఫూల్‌ వహా హై కాంటే భీ, కభి భూల్‌ కర్‌ భీ న లగానా జీవన్‌ మేతుం చిన్‌గారీ! ఘర్‌ ఘర్‌ కో తుం స్వర్గ్‌ బనానా హర్‌ ఆంగన్‌ కో ఫుల్‌ వారీ దేఖ్‌ రహీ దునియా సారీ తుమ్‌ పె బడీ జమ్మేదారోకక అన్న హిందీ కవి వాక్కులతో భావ

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా. కె.బి.లక్ష్మి - 53

స్పోరకంగా నవల ముగుస్తుంది.

కేవలం యువతీ యువకుల సమస్యలు, వైఫల్యాలు కాకుండా జీవితపు లోతుల్లోకి తరచి చూస్తి సమాజంలో సంభవిస్తున్న మార్పులకు, సంప్రదాయాలకు మధ్య జరిగే సంఘర్షణలను సమర్థవంతంగా చిత్రించారు అచ్యుతవల్లి. సమస్యను సమస్యగా వదలకుండా ఏదో ఒక ప్రయోజనకర పరిష్కారం చూపడం రచయిత్రి ప్రత్యేకత.

అచ్యుతవల్లి నవలల్లో మధ్యతరగతి జీవిత మౌలికాంశాల స్వరూప స్వభావాల చిత్రణ ఎంతో సహజంగా సాగింది.

మధ్యతరగతి జీవిత చిత్రణ

1947 తర్వాత వచ్చిన ఆధునిక తెలుగునవల మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని విపులంగా చూపించింది. ఈ మధ్యతరగతి కన్సర్వేటివ్‌ కుటుంబాల్లో సమిష్టి కుటుంబ జీవిత విధానాన్ని ఆదర్శంగా నిలబెట్టటానికి ప్రయత్నించింది. మధ్య తరగతి కుటుంబ జీవిత ఇతివృత్తాలు బహుళంగా నవలల్లో చోటుచేసుకున్నాయి.

స్వాతండ్ర్యానంతరం, ప్రధానంగా మొదటి దశకంలో ప్రవేశించిన ఈ మధ్యతరగతి ఇటీవలి కాలం దాకా నవలా ప్రపంచంలో ప్రధానపాత్రని పోషిస్తూనే వస్తోంది. అటు పై తరగతి నారికి చెందలేక, ఇటు క్రిందిస్థాయివారిలాగా వుండలేక మధ్యస్థంగా మానసికంగా చిత్రహింసలు పదే త్రిశంకుస్వర్గంలాటి వర్గమే మధ్యతరగతి.

సమాజంలోనూ, నవలల్లోనూ కూడా మధ్యతరగతి జీవితమే అయ్యేటప్పటికి వారికి కావల్సిన ఇతివృత్తాల్లే ప్రధానాలయ్యాయి. ఎన్‌.జి.ఓ.లు, గుమాస్తాల కఠోర జీవిత వాస్తవాలు మధ్యతరగతి మందహాసాలయ్యాయి. ఈ మధ్య తరగతి రచయితల్ని, కవుల్ని ఒకేలా ప్రభావితం చేయడం గమనార్హం.

జాతి జీవనంలో తిరుగుబాటు తగ్గింది, 'యాంత్రిక నాగరికత కాంతివంతమైన చీకటివలె జీవితాన్ని ఆవరించి వేళ్ళాడుతున్నది'56 ఈ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మధ్యతరగతి స్వగతాలను", “మముట్రోచేవారెవరురా! కన్‌ఫ్యూజన్‌ ముట్టడినుండి - ఏంగ్‌ రు యిటీ గుప్పిటనుంచి..."57 అని ఆక్రందించే మధ్యతరగతి ప్రజల స్వగతాలకు అనేకరీతులుగా, సయుక్తికంగా వ్యాఖ్యానం చేశారు ఆరుద్ర.

“ఈ తరగతికి స్వగతములు తప్ప సంభాషణలు లేవని - “కృత్రిమ

ఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% దా. కె.బి,లక్ష్మి - 54

సమాజపు చట్టాలలో మేకు బందీ అయిపోయి గానుగెద్దులా బతుకుతారని", “మాసిపోయిన వనునస్సులు ఉతుక్కోలేక వుహర్జుల లాండ్రీలో పారేస్తారని వ్యాఖ్యానించారు' 58 డా, సీనారె. మార్క్స్‌ చెప్పినట్లుగా మధ్యతరగతి పరస్పర వైరుధ్యంతో సతమతమయ్యే వర్గం. ఆరుద్ర ఈ వర్గం గురించి “మీది మెట్టు ఎగురలేక కింది మెట్టు మీదకి పడిపోతారు" అన్నాడు. ఇతని 'త్వవే వాహం'లో మధ్యతరగతి మనిషీ ప్రధాన నాయకుడు. "లాభం లేదు సిస్టర్‌ - ఈ గాయం - మానబోదు డాక్టర్‌ - చేతులు కడుక్కోవోయ్‌ మిస్టరొ వంటి పంక్తుల్లో మధ్యతరగతి నిస్సహాయతను ప్రకటిస్తాడు. మధ్యతరగతి నుంచి వచ్చి చారీ చాలని జీతంతో ఉద్యోగం చేస్తున్న గుమాస్తాలకున్న కోర్కెలను, వాటీని తీర్చుకోలేక వారు పొందే ఆందోళన - ఆధునిక నాగరికత మీది వ్యామోహంతో, ఉద్యోగ వలయంలో పడి బ్రతుకులను 'గొంగళి పురుగుల్లా మార్చుకున్న మధ్యతరగతి మానవుల గురించి బాలగంగాధర్‌ తిలక్‌ “బల్లపరుపు జీవితం కింద కాషన్‌గా దాచిన కోర్కెల సీకైట్‌ బాక్స్‌లోంచి తీసి ఉద్రేకాల్ని, సెక్సుని, శృంగారాన్ని థ్రైమ్‌ని, షాక్‌ని, లాటరీ కాగితాల్ని చాటుగుండా చూసుకుని నవ్వుకుని, మీసం మెలేసుకుని మాట్లాడగుండా, జెంటిల్మన్‌లా మత్తుగా పడుకుంది గొంగళిపురుగు" అన్న గేయంలో చక్కగా వ్యాఖ్యానించాడు. ఉద్యోగ వ్యామోహం, తమ స్తోమతకు మించిన ఖర్చులు, ఇతరుల దృ ప్టైలో గొప్పగా వుండాలన్న తపవ మధ్యతరగతి కుటుంబాల్ని ప్రభావితం చేశాయి. పొళ్చాత్యుల స్వేచ్చా జీవనం, ఆహారపుఅలవాట్లు, క్లబ్బులు, విలాసం సొంతం చేసుకోవాలనే ఆరాటం మధ్య తరగతి ప్రత్యేకతలయ్యాయి. "కుటుంబజీవితం నవలకు కథావస్తువైంది. మధ్యతరగతి కుటుంబ జీవిలేతి ఐ,వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 55

వృత్తాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. నిరుద్యోగం, ప్రేమ వివాహాలను ఆటంకపరిచే కుల ఆంక్షలు, కులాంతర వివాహాల పర్యవసానాలు, అరవైయవ దశకం తర్వాత నవలా రచయితలకు ప్రధాన ఇతివృత్తాలయ్యాయి". స్వాతంత్రానంతరం ముఖ్యంగా పేర్కొనదగిన అంశం మహిళలెందరో నవలా రచనకు పూనుకోవడం, స్త్రీల సమస్యలుగా సామాజిక సమస్యలుగా స్టూల దృష్టికి టోచే అనేక సమస్యల చిత్రీకరణ నవలల్లో చోటుచేసుకుంది.

  1. కుటుంబ వ్యవస్థ, స్త్రీ విద్య, స్త్రీ స్వేచ్చ, స్త్రీల ప్రతిపత్తి, (2) సేచ్చా ప్రణయ సిద్ధాంతాన్ని సమర్ధించే నవలలు, (3) కులాంతర, మతాంతర వివాహాలు సాఫల్యాల్తు వైఫల్యాలు - వైవాహిక సమస్యలు ఇతివృత్తాలుగా వచ్చిన నవలలు, (4) సమాజానికీ, వ్యక్తికీ గల సంబంధం పటిష్టం చేస్తూ సామాజిక స్పృహతో, వ్యక్తిత్వ నిరూపణ చేస్తూ వచ్చిన ప్రేమ కథానవలలు, (6) ఉద్యోగినులైన స్త్రీలు ఎదుర్కొనే సమస్యలపై రచనలు - ఇలా ఆరు తరహాలుగా రచనలు చేశారు ఐ.వియస్‌. అచ్యుతవల్లి.

“సాధారణ స్త్రీలలో సాహసం తక్కువ, సర్దుకుపోయే మనస్తత్వమే కాని ఎదురు తిరిగే స్వభావం, నైజం కాదు. అందువల్ల సాంఘిక అన్యాయాలపై తిరుగుబాటు చేయడంలేదంటున్నారు. స్త్రీలు అలజడిని వాంఛించకపోవడం వాస్తవమే. అరాచకం అసలే కోరరు. సభ్య సమాజంలో ప్రశాంతంగా జీవనం గడిస్తే చాలనుకుంటారు. కాని అటువంటి స్త్రీలు కూడా తమ కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాల్ని చూస్తూ ఊరుకోలేదో5 9. ఈ మేరకు అచ్యుతవల్లి 'ఇదెక్కడి న్యాయం", 'కొడిగట్టిన దీపాలు' నవలలు సాంఘిక దార్జన్యాలను, స్త్రీ పురుష అసమానతలను తీవ్రంగా ఖండించాయి.

అచ్యుతవల్లిని మధ్యతరగతి జీవితం కదిలిస్తూనే వుంది, రచయిత్రి రాసిన అనేక నవలలు ఇందుకు ఉదాహరణగా నిలిచినా ప్రత్యేకించి 1. పుట్టిల్లు, 2- మూడు ముళ్ళు, 3. కొడిగట్టిన దీపాలు, 4. ఇదెక్కడి న్యాయం నవలలు మధ్య తరగతి జీవన చిత్రణ దర్సణాలుగా పేర్కొనాలి.

(౧) పుట్టిల్లు : ఈ నవలలో మథ్యతరగతి కుటుంబానికి 'పేరుకి యజమాని రాజారాం. ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫8 డా. కె.బి.లక్ష్మి - 56

ఆయనకి ఇంటి వ్యవహారాలు పట్టవు. అన్నీ అతని భార్య సిద్భేశ్వరే చక్కబెడుతుంటుంది.

ఉమ్మడి కుటుంబంలో మరిది కుటంబరావుకి పెళ్ళయి కొత్త కోడలు ఇంటికి వస్తీ తోడికోడలిగా తన స్థాయి తగ్గిపోతుందేమోనని సిద్ధేశ్వరి అతని పెళ్ళి తప్పిస్తూ వుంటుంది.

రాజారామంక్‌ లోకులు ఏమనుకుంటారోనని జంకువుంది. కానీ సొంత నిర్ణయం తీసుకోలేడు. అందుకే తమ్ముడికి పెళ్ళయి మరదలు అన్నపూర్ణ ఏళ్ళతరబడి అత్తింటికి రాకుండా పుట్టింట్లోనే వుండిపోయిస్సా తన సొంత చెల్లెలు సుబ్బమ్మ ఆశ్రయం కోనం తన పంచన చేరితే అవిడ డబ్బు తన పేర పెట్టకుని ఖర్చు చేసేస్తాడు. తీరా సుబ్బమ్మ కొడుకు రఘు చదువుకి తన డబ్బు తనకిమ్మంటే లేదు పొమ్మంటాడు.

తండ్రికి తగ్గ కొడుకు కుటుంబం. సరైన చదువు, సరైన ఉద్యోగం లేకుండా, అవసరమైనపుడు అత్తారింటికి వెళ్ళి అన్నపూర్ణతో గడిపి జీవితాన్ని నిష్పయోజనంగా గడువుతాడు. ఇద్దరు పిల్లల తండ్రయినా బాధ్యతలంటే భయం.

ఛండ్రి సదానందం ఆర్థికస్థితి అంతంతమాత్రమే అయిన్సా భర్త తనని తీసుకెళ్ళకపోయినా తల్లిలేని తోబుట్టువుల్ని పెంచిపెద్ద చేస్తుంది. తమ్ముడు శంకరం ఇల్లు వట్టకుండా తిరుగుతుంటే మంచీ, చెడ్డా చెబుతుంది. తన కొడుకూ, కూతుర్ని బాగా తీర్చి దిద్దుకోవాలనుకుంటుంది. కుటుంబం చేతులారా కూతురు రాధని రఘుకిచ్చి పెళ్ళిచేసే మేనరికం చెడగొడతాడు.

అందరివీ మధ్యతరగతి మనస్తత్వాలు. రాజారాం భార్యని నిలదీయలేడు, కుటుంబం వదినకకి ఎదురు చెప్పలేడు, భార్యాబిడ్డల్ని బరువుగా భావిస్తాడు. కుటుంబం కొడుకు రమణకి చెల్లెలు రాధ బాగా చదువుకోవడం ఇష్టం వుండదు. అన్నపూర్ణ తండ్రి సదానందం బాధ్యతల్ని విన్మరించడానికి ఆధ్యాత్మిక చింతన ముసుగు వేసుకుంటాడు. కొన్నాళ్లకి రాజారాం, సదానందం ఇద్దరూ చచ్చిపోతారు.

వీళ్ళందరి మధ్యా పళ్ళబిగువున మర్యాద కాపాడుకుంటూ మధ్య తరగతి మందహాసాన్ని చెదరనివ్వకుండా పెళ్ళయిన ఇరవై ఏళ్ళకి స్వయం నిర్ణయం తీసుకుని తనంతట తను భర్త ఇంటికి వస్తుంది అన్నపూర్ణ. అప్పటికే నదినగారు వున్నది కాస్తా వూడలాక్కుని మరిదిని గొడ్గసావిట్లోకి తరిమేస్తుంది. అప్పటికీ కుటుంబం

ఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 57

అహం చావదు. “ఎందుకొచ్చావు?” అనడుగుతాడు భార్యని.

“బది మీరడగాల్సిన సరైన ప్రశ్న కాదు. ఇన్నాళ్ళు ఎందుకు ఆలశ్యం చేశావు?” అని అడగాలంటుంది కూతురు రాధ.

“మీ తమ్ముడు శంకరం ఇంట్లోంచి గెంటేశ్తాడా? నా మటుకు నాకు మీరు రమ్మని టెలిగ్రాం ఇచ్చినట్లు గుర్తులేదో అంటాడు వెటకారంగా.

“అట్లాంటి అవసరం ఎప్పటికీ రాకుండా వుండాలనే మా కోరిక” అంటుంది రాధ.

“మీ ఖర్మ ఏడవండి"60 అని బైటికెళ్ళిపోతాడు అంతకంటే కూతురికేం సమాధానం చెప్పలేక, భార్య మౌనాన్ని భరించలేక. మధ్యతరగతి గృహస్సు కింద పడ్డా తనదే పైచేయి అనుకుంటాడు. కుటుంబం మనస్తత్వం అందుకు ఏమాత్రం భిన్నం కాదు,

నర్తమాన సమాజంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయాలు, స్త్రీ పట్ల సమాజంలో తరతరాల నుండి వస్తున్న పురుషాహంకార దృక్పథం మారలేదని 'పుట్టిల్లు నవల స్పష్టం చేస్తుంది.

పుట్టిల్లు నవలకు దగ్గరగా వున్నట్లనిపించినా స్త్రీకి సంఘంలో స్వీచ్చ మాటెలా వున్నా ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని నిరూపిస్తుంది 'మూడుముళ్ళు' నవలం-

(0 మయూడుముళ్ళు ;

నరసయ్య ఆయుర్వేద వైద్యుడు. భార్య జగదాంబ. ఇరవైయేళ్ళ కూతురు కామేశ్వరి చిన్న కూతురు సుభద్ర, పి.యు.సి. చదివే పెద్ద కొడుకు చిట్టిబాబు, సెకండ్‌ఫారం చదివే చిన్నకొడుకు జగ్గూ ఈ ఆరుమందీ ఆ ఆయుర్వేద వైద్యం వల్లి వచ్చీరాని ఆదాయంతోనే బతకాలి.

కామేశ్వరిని చూడ్డానికొచ్చే పెళ్ళివారికి పెట్టాల్సిన ఫలహారాలకే పచారీకొట్లో అవ్వు చేయాల్సిన పరిస్థితి. గంతకు దగ్గ బొంతకోసం వెతుకుతారు. కానీ సంబంధాలు మంచివే వస్తాయి. ఆఖరికి మెట్రిక్‌ చదువుతున్న కామేశ్వరిని రెండో పెళ్ళివాడయిన కాలేజీ లెక్సరర్‌ కేశవరావుకిచ్చి పెళ్ళిచేస్తారు. కట్నం డబ్బులు మిగిలాయని కనీసం

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా. కె.బి,లక్ష్మి - 58

మంచి చీరయినా కొనివ్వకుండా అత్తారింటికి పంపేసి చేతులు దులుఫుకుంటాడు నరసయ్య. దాని ఫలితం కామేశ్వరికి అత్తింట్లో అత్తగారి ఎత్తిపొడువులు.

దిగువ మధ్యతరగతిలో పుట్టిన సుభద్రకి విలాసాల మీద మోజు. అక్క పెళ్ళి అయిపోవడంతో అరచేతిలో స్వర్గం చూపించిన కిళ్ళీకొట్టు గవర్రాజుని నమ్మిమోసపోతుంది.

కామేశ్వరి ఈడుదే అయిన సవతి కూతురు నలిని కూడా గవర్రాజు బుట్టలోపడి గర్భవతి అయినా డబ్బుంది గనక నరసింహమూర్తి అనే అతని పెళ్ళాడి బెంగుళూర్‌ వెళ్ళిపోతుంది.

అర్థిక ఇబ్బందులుండి, చదువు సంధ్యలకు దూరమై, ప్రలోభాలకు లోబడి మధ్య తరగతి ఆడపిల్లలు జీవితాన్ని ఎలా చేజేతులారా పాడుచేసుకుంటారో ఈ 'మూడుముళ్ళు' నవల చెబుతుంది. అదే నేపథ్యంలో వున్న కామేశ్వరిలాంటి నిదానస్థులు, ఆలోచనా సరులు కాపురాలను ఎలా చక్కదిద్దుతారో కూడా చెబుతుంది ఈ నవల.

స్త్రీకి సంఘంలో ఆర్థిక స్వాతంత్ర్యం మాటెలా వున్నా, ఆలోచనా స్వాతంత్ర్యం, జీవన ప్రవాహాన్ని మార్చాలన్న మనస్తత్వం వుంటే నినాదాలు లేకుండానే నిదానంగా జీవితాల్ని తీర్చి దిద్దుకోగలుగుతారు 'మూడుముళ్ళు" నవలలో కామేశ్వరిలొ.

"స్తుభద్ర, నళిని పురుషాకర్షణలో తేలిగ్గా పదిపోయినంత నూత్రాన స్త్రీ జాతి అంతా తేలికదే అనడం సమంజసం కొదు. అంతకంటే తేలిక మనుషులు పురుషజాతిలోనే ఎక్కువగా వుంటారవేది అందరికీ తెలిసిన సత్యమే”61

చదువు, ఆలోచనా వున్నా తమంత తాము జీవితాన్ని చక్కదిద్దుకోలేని మధ్యతరగతి నిస్సహాయతను 'మూడుముళ్ళు” నవల స్పష్టం చేస్తే, మధ్య తరగతివారు ఎదుర్కొనే వ్యక్తిత్వ అస్తిత్వ సంఘర్షణ '“కొడిగట్టిన దీపాలో' కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. (7) కాడిగట్టిన దీపాలు :

నవలలో పద్దెనిమిదేళ్ళ యశోద ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి పాసవగానే ఇంకా సై చదువులు చదివితే కట్నాలు పోయలేమని అస్తిపరుడైన మహేష్‌కిచ్చి పెళ్ళిచేస్తారు. మహేశం పట్నంలో డింకీలు కొడుతో మెట్రిక్‌ చదువుతుంటాడు.

ఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 59

“కన్యాశుల్కం, 'వరకట్నం' వేదకాలంనుండీ మన సమాజంలో కనిపిస్తాయి. క్రీ.శ (1542 = 1605) అక్బర్‌ పరిపాలన నాటికే వరకట్న దురాచారం సంఘంలో ప్రబలింది. 19 61లో భారత రాజ్యాంగం వరకట్న నిషేధ చట్టం రూపొందించింది. అదేం ఫలించలేదు. వరకట్న నిషేధాన్ని కోరుతో మహిళలు అనేక ఉద్యమాలు నడిపినా లాభంలేకుండా పోయింది. తమ కుమార్తెలకు కట్నాలు ఇవ్వలేక ఎందరో మధ్యతరగతి సంసారులు కుమిలిపోతున్నారు.

సాధారణంగా వరకట్న దురాచారం వల్ల సామాన్య సంసారులు అనుభవించే బాధలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా స్వార్థంతో సంపాదన పరురాలైన కుమార్తె వివాహ విషయంలో తల్లిదండ్రులు ఆలస్యం చేయడం చూస్తాం. అయితే “కొడిగట్టిన దీపాలు నవలలో పిల్ల ఉన్నత విద్యనభ్యసిస్తే అంతకంటే ఎక్కువ చదివినవాడిని, ఎక్కువ కట్నంపోసి తేవాలన్న స్వార్ధ దృష్టితో యశోదకి యస్‌.యస్‌.ఎల్‌సి అవగానే పెళ్ళిచేసేస్తాడు మధ్యతరగతి తండ్రి. మధ్యతరగతి వర్గంలో ఇలాంటివారు తక్కువేం

లేరు.

అంతంతమాత్రం చదువుతో పట్నం యశోద పల్లెటూరికి కాపురానికి వస్తుంది. అత్తగారి ఆరళ్ళకి, భర్త నిరాసక్తతతకి నడుమ నలిగిపోతుంది. మహేశానికి గుమాస్తా ఉద్యోగం దొరుకుతుంది. ఆ వంకన సట్నం వస్తుంది భర్తతో. పై చదువులు చదవకపోయినా తానభ్యసించిన శాస్త్రీయ సంగీతంతో ధనం, కీర్తి సంపాదిస్తుంది యశోద,

చెప్పుడు మాటలు వినడం, అనుమానించడం, అసూయపడ్డం సగటు మానవ నైజం, ఈ నవలలో చెప్పుడు మాటలు విన్న భర్త వల్ల, తనని ఆరాధిస్తున్నారని తెలిసి భర్త విశ్వంని అనుమానించిన తన స్నేహితురాలు దేవకివల్ల, తను పరిచయం చేసిన గాయని తనని మించి కీర్తిని పొందడం సహించలేని దేవకి అసూయవల్ల యశోద జీవితం కొడిగట్టిన దీపమై పోతుంది.

మనలో ఏదైనా ప్రత్యేకత వుంటే, దాన్ని గురించి మనవాళ్ళు కాకుండా ఇతరులు మెచ్చుకున్నప్పుడు మనసు చాలా తర్కెంచుకుంటుంది. మంచిగా చెడుగా కూడా ఆలోచిస్తుంది. ఇది చాలా వాస్తవం. అలాంటి తర్కవితర్కాల్ని యశోద పాత్రలో బాగా విపులీకరించారు రచయిత్రి.

ఐంవియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యరి * డా. కె.బి.లక్ష్మి - 60

యశోద తనపాొటని భర్త మెచ్చుకోవడం లేదనీ, కనీసం వినవైనా వినడనీ బాధ పడ్తుంది. ఆయన స్నేహితుడు విశ్వం. తన పాటని ఎంతలా ప్రశంసించాడు? అప్పుడుగాని తన గాత్ర మాధుర్యం తనకే తెలియలేదు అనుకుంటుంది యశోద.

విధి వక్రించినపుడు కచేరీలు చేయడం దాకా ఎందుకు? కూనిరాగాలు తీయడానిక్కూడా అవకాశం, అదృష్టం వుండవు. అందుకే పొడ్డం ఇంక ఆపేయమని, ఇంట్లోంచి పొమ్మని భర్త వెళ్ళగొట్టినపుడు దేవకి'దగ్గరకి వచ్చిన యశోద విశ్వంతో “విశ్వంగారూ...అవకాశాలను బట్టి ఆశయాలు తీర్చుకోవడం మంచిది. ఆశయాలకు అనుకూలంగా అవకాశాలు కలిసిరావు. అవమానాల పాలవుతూ ఆశయాలను వట్టుకుని పాకులాడడం కంటే, ఏ ఆశయాలూ లేకుండా బ్రతికేయడమే నయమనిపిస్తుంది"62 అంటుంది.

అందం, తెలివి, సంగీత కళాభినివేశం ఉన్న ఓ మధ్యతరగతి మగువ మనస్తాపానికి పతాక సన్నివేశం అది.

కొడిగట్టిన దీపాలు నవలలో ఇంకా అనేక పొత్రలున్నాయి. నిమ్నకులాల, నిరుపేదల జీవిత చిత్రణలు వున్నాయి. వాటిని ఇంకొక ఉపళీర్ణికలో చర్చించడం జరుగుతుంది.

“సామాజిక స్థితిగతులను ఆధారము చేసుకుని ఆసక్తికరమైన సాంఘిక నవలలు వ్రాయగల బహుకొద్దిమందిలో శ్రీమతి ఐ.వియస్‌. అచ్యుతవల్లి ఒకరు. ఆమె తన 'కొడిగట్టిన దీపాలు. అన్న నవలలోని వ్యక్తులు, తోటి వ్యక్తులు, తోటి వ్యక్తుల మనస్సులను గ్రహించలేక ప్రవర్తించుట వలన కలిగిన అనర్థములను, చిక్కు సమస్యలను చిత్రించినది. ఇందలి కొన్ని పాత్రలు పరిస్థితులకు అనుగుణ్యముగా నడుచుకొని గమ్యమును చేరుకొనగ్యా మరికొన్ని పాత్రలు కొడిగట్టిన దీపాల్టై కాంతివిహీనవై మిగిలిపోయినవి. సంగీత సాహిత్యముల పట్ల ఆసక్తిగల విశ్వనాధమునకు పల్లెటూరి అమ్మాయియైన దేవకి భార్యయైనది. అందచందములను చూచి ఆనందించలేని అయోగ్యుడైన మహేశమునకు యశోద పెండ్లామై నరక యాతనలు అనుభవించినది. వర్ణ విభేదములను పాటించక (ప్రేమకు ప్రాధాన్యతనిచ్చి మంగళను వివాహమాడి సర్వసుఖములను చూరగొనిన ధీరుడు చలపతి. కులమునకు తక్కువైనను గుణములో మిన్నయైన నారాయణ బాలవితంతువైన రమణ హృదయమును చూరగొనజులకపోవుట పెద్దలోటు. ఈ నవలలోని చలపతి - మంగళ

వఐ,వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 61

జీవితములపై ఎట్టి కొడి కట్టక కాంతివంతమై ప్రకాళించినవి. నారాయణ, రమణలకు వివాహము జరిపి కథను సుఖారితము చేసినచో బాగుగా నుండెడిది"63. అని సుఖాంతాన్ని కోరుకున్నారు విమర్శకులైన పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు.

మధ్యతరగతి పరిస్థితుల చుట్టూ తిరిగే కథాంశం, పాత్రల మానసికస్థితి, సంఘ్టర్ష్ణణ రచయిత్రి అచ్యుతవల్లి సమర్థవంతంగా చిత్రించారు.

" అయితే సమాన హోదా సమాన సామాజిక విలువలకోసం భార్యా భర్తల మధ్య తలెత్తిన వైషమ్యూల అద్భుత చిత్రణ “ఇదెక్కడి న్యాయం' ఎత్తి చూపుతుంది. . (౧౧ ఇచదెక్కడిన్యాయం

నవల కథానాయిక మాలతి మధ్యతరగతి యువతి. తండ్రిలేడు. ఉద్యోగస్థురాలు. తల్లి ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళ బాధ్యత అమెదే.

రామనాథం ముఫ్పై ఐదేళ్ళ యువకుడు. పెళ్ళికెదిగిన ఇద్దరు చెల్లెళ్ళు, తల్లి ఉంటారు. పేరుకి ఆఫీసరయినా వెనకేమీ ఆస్తులు, పై సంపాదన లేనందువల్ల వచ్చే జీతంతోనే ఎలాగోలా సంసారం సొగిస్తుంటాడు. అతనిక్‌ కట్నం వస్తే ఆడసిల్లల పెళ్ళిళ్ళు చేయవచ్చని తల్లి అనుకుంటుంది. కానీ అతను చెల్లెళ్ళ పెళ్ళిళ్ళయితేనే గాని తను చేసుకోనంటాడు. ఆఖరికి మాలతిని చేసుకుంటాడు. ఇద్దరి జీతంతో సంసారం నడపవచ్చనుకుంటాడు.

మాలతి తన తమ్ముళ్లను చదివించాలని, తన జీతంలో కొంత వాళ్ళకి ఇవ్వక తప్పదని పెళ్ళికి ముందే చెబుతుంది. ఒప్పుకుంటాడు. కానీ తర్వాత తన బాధ్యతలన్నీ తీరిపోయాక మూలతిని పుట్టింటికి సాయం చేయవద్దంటాడు. ఆమె తమ్ముళ్లకి రెక్కలొచ్చేదాకా సాయం తప్పదంటుంది.

“ఏరు దాటాక తెప్పతగలేసినట్లు మీ వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి కనుక మా వాళ్ళని నడిసముద్రంలో వదిలేయమంటున్నారు. మీ చెల్లెలు శారదని లక్షాధికారి కోడల్ని చేశాననే తృప్తి మీజీవితానికెంత నిండునిస్తుందో, మా తమ్ముణ్ణి గాడిద చాకిరీ చేసే గుమాస్తా జీవితం నుంచి తప్పించి లోకంలో నలుగురితో బాటు తనూ ఒక వ్యక్తిగా నిలబడేట్టు చేయగల్గటం నా జీవితానికి వెలుగునిస్తుంది. ఇద్దరిదీ ఒకే ఆశయం. ఒకే గమ్యం అయినపుడు, మీ గమ్యానికి నేను ఏమీ అడ్డం రానప్పుడు, మీక్కూడా నేను సాయం చేస్తున్నప్పుడు మీరు నా

ఐంవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫8 డా. కె.బి.లక్ష్మి - 62

గమ్యాన్ని ఎందుకు అవహేళన చేయాలి?"64 అని అడుగుతుంది మాలతి.

ఇంకో సందర్భంలో రామనాధం సరదాగో అడిగిన ప్రశ్నకు సమాధానంగా “మధ్యతరగతి గృహిణి సంసారం అరిటాకులా చిరిగిపోవడానికి పెద్ద పెద్ద విపచ్తులేమీ ముంచుకు రానక్కర్లేదు. చిన్న కారణం చాలు. అతుకువేయనంతగా చిరిగిపోతుంది స్త్రీ జీవితం"65 అంటుంది. మాలతి నిజాయితిగా.

స్త్రీ పురుషుల వ్యక్తిత్వాల నడుమ ఏర్పడే సంఘర్హణని సున్నితంగా చిత్రించిన నవల 'ఇదెక్కడి న్యాయం. ఈ నవబలో సామాజిక సత్యాలను కథగా మలచడానికి రచయిత్రి చూసిన ప్రతిభ గోచరిస్తుంది. స్త్రీని ఆమె ఎదుర్కొనే సమస్యలని అర్థం చేసుకోలేని వురుష మనస్తత్వం ఇందులో చిత్రింపబడింది. పురుష మనస్తత్వాలలోనే కాదు, కుటుంబ వ్యవస్థలో స్త్రీ వట్ల దృష్టి మారాలన్నది రచయిత్రి వాంఛ.

వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషులలో అసమానత్వం తల ఎత్తడానికి కారణం మధ్యతరగతి ఆర్దిక, సామాజిక శక్తులు తమ ప్రభావాన్ని చూపడమే. స్త్రీని బానిసగా చూసే కుటుంబవ్యవస్థ స్త్రీ పురుషల మధుర దాంపత్య జీవితాన్ని కలుషితం చేస్తుంది.

“ఇదెక్కడి వ్యాయం'లో మాలతి ఉద్యోగిని. ఆత్నాభిమానంగల యువతి, తండ్రి మరణించాకా సంసారాన్ని పోషిస్తూ వుంటుంది. రామనాధం మాలతిని ఇష్టపడి వివాహమాడతాడు. తర్వాత ఆమె తన కుటుంబానికి ధనసాయం చేయడం అతనికి ఇష్టం వుండదు. భార్యభర్తల నడుమ వైషమ్యూలు తలెత్తాయి. ఆధునికత మన సమాజంలో వేష భాషలలో వచ్చినంతగా ఆంతర్యాలలో రాలేదని ఈ నవల చక్కగా వ్యక్తీకరిస్తుంది. సంకుచిత హృతయుడైన భర్తని వదిలేసి తన కుటుంబాన్ని పోషిస్తూ తమ్ముళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది. సమాజం ఆమెను అవహేళన చేస్తుంది. అయినా మాలతి లెక్క చేయదు.

మధ్యతరగతి జీనిఠాల్లో క్షణానికో రీతిగా అవసరాన్ని బట్టి విలువలకి అర్థాలు మారి పోతుంటాయి. అన్ని బాగుంటే అందరూ అందర్నీ ప్రేమిస్తారు. ఏమాత్రం ఏ తేడా వచ్చినా స్వార్ధం బుసలుకొడుతుంది. ఎవరికి వారే యమునా తీరే!

చదువుకున్న సంసారులమనుకుంటున్న ఆధునిక భర్తలలో కూడా పాతుకుని వున్న సంకుచితత్వాన్ని, సమాజ పక్షపాతాన్ని, ఉన్నదున్నట్లు, హృదయాన్ని కదిలించేటట్లు చిత్రించి చూపింది 'ఇదెక్కడి న్యాయం' నవల.

ఐంవియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం * డా. కెబి.లక్ష్మి - 63

“ఒకేరకం బాధ్యతలను ఇద్దరమూ స్వీకరించాము. మిమ్మల్ని మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినందుకు -శ్రీరాముచంద్రుడని లోకం పొగిడింది. అదే బాధ్యత నేనూ వహించాను. దానికి ఈ లోకం నన్ను మొగుణ్ణి వదిలేసింది. పిల్లల్ని కన్న తల్లికాదు అంటూ నాన్నా రకాల అపవాదులతో నన్నేగాక ఉద్యోగాలు చేసుకుంటున్న స్తీలందర్నీ ఒక్క వూపు వూపేసింది. ఒకే బాధ్యత నిర్వహించినందుకు పురుషుడికి కీర్తా? స్త్రీకి అపకీర్తా? ఇదెక్కడి న్యాయం? ఇవేనా సమాన హక్కులు? నా కర్తవ్యం క్షంతవ్యం కానిదయి, నా సంసారానికే కాలదోషం పట్టిందా? మీరేం చెబుతారు ?”66 అంది ఉద్వేగంగా భర్తతో, కర్తవ్య నిర్వహణలో ఆహుతి అయిన మాలతి.

“తండ్రిని గోలుపోయిన మాలతి అను అమ్మాయి ఉద్యోగము చేసి తన తోబుట్టువులను పైకితీసుకొని వచ్చుటకూ పడిన శ్రమను, ఆమె తన వివాహానంతరము గూడ వారి అభివృద్ధికై కట్టుకున్న భర్త రామనాధమును, కన్నపిల్లలైన గిరిజ, రేవతి అనువారిని సైతము విడిచిపెట్టి పుట్టింటికి చేరినది. ఎవరి అభివృద్ధికై మాలతి

అహరహము కృషి చేసినదోో వారే చివరకు తనను అవహేళన చేసినప్పుడు మిక్కిలి ఖేదపడినది. ఈ నవలలో మధ్యతరగతి కుటుంబముల కష్టసుఖములు చక్కగా ప్రతిబింబించుచున్నవి"67.

మధ్య తరగతి కుటుంబాల్లోని కన్నీళ్ళు, కావేశాలు, కట్నాల బెడద, పిల్లల పెంపకం ఇలు, ఉద్యోగం, అత్తా కోడళ్ళ సమస్యలు, స్వార్ధాలు, ఒకటేమిటి ఈ నవలలో అచ్యుతవల్లి స్పృళించని కోణం లేదు. రాజీ పడని పురుషాధిక్యత, ఆత్మాభిమానం వదలని స్త్రీ వ్యక్తిత్వం సమజిజ్జీగా సాగిన ఇదెక్కడి న్యాయం నవల పాఠకుల ఆదరణే గాక, విమర్శకుల ప్రశంసలందుకోవడం రచయిత్రి రచనా ప్రతిభకు మేలైన గుర్తింపు. మధ్యతరగతి సంసారాల సాంఘిక జీవనాన్ని బాగా ప్రతిబింబించే పదునైన కలం.

నిమృవర్శ్ధాలపై పక్షపాతం

ఐ,వియస్‌. అచ్యుతనల్లి రాసిన 'నేను దేవిని కాను, "కానుక, 'కొడిగట్టిన దీపొలు' నవలల్లో నిమ్నవర్గాల జీవన చిత్రణ, మారుతున్న వారి జీవన విధానం, నిన్నువర్గాల పట్ల పక్షపాతం చిత్రీకరించబడింది.

వారి స్వేచ్చ, సమానత్వం, కుల వివక్షత, ఆర్థిక అసమానతలు, లైంగికత, దయనీయస్థితి, పోరాట, ఆరాటాలను సహజసిద్ధంగా వర్ణించారు రచయిత్రి.

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 64

వర్ణ వ్యవస్థ ఏనాడు ఏ ఉద్దేశ్యంతో సమాజంలో ్రవేశించిందో కాని యీనాటికీ ఆది అలా స్థిరంగా వుందె. వర్ణాంతర వివాహాలను ఏనాడూ సమాజం సంపూర్ణంగా అంగీకరించలేదు.

కులాలు, మతాలు మానవ కల్పితాలని, కులవ్యవస్థలోని లొసుగులను విప్పిచెస్పిన నవల 'నేను దేవిని కాను". () నేను దేవిని కాను

నిమ్న జాతులవారిని అగ్రకులాలవారు అణగదొక్కుతున్నారన్న నేపధ్యంలో కాలానుగుణంగా (బ్రాహ్మణీకానికి కట్టుబడిన ఓ “నిరుపేద బ్రాహ్మణ కుటుంబాన్ని తదితర కులాలు ఏ విధంగా చిన్న చూపు చూశాయో పాత్రల ప్రవర్తన ద్వారా బలంగా చెప్పారు రచయిత్రి.

పాత్రల ప్రవర్తన అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పవలసీవచ్చిందంటే నవలలో కొన్ని పాత్రలను స్వీకరించినపుడు అవి ఏ కులానికి చెందితే ఆ కులానికి చెందే వర్గం తాలూకు ఛాయలు రచనలో రాకపోయినట్లయితే ఆ పొభ్రలు గాలిలో తేలిపోయి, అవాస్తవికంగా మిగిలిపోతాయి. అయితే అలా జరగకుండా అచ్యుతవల్లి ఇతివృ త్తనిర్వహణలో పాత్రల కదలికల పట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారు.

తండ్రి తెచ్చే యాయవారం బియ్యంగింజలు తప్ప గతిలేని బీదరికంలో పధ్నాలుగేళ్ళ సావిత్రి ఇంట్లోవాళ్ళు ఆకలి ఎరిగి అన్నంపెడుతుంది. సనాతన కుటుంబంలో పుట్టిన సావిత్రికి అకలి అభ్యుదయం నేర్పింది. పాలుపోసీ వూరి చివర కావుల ఇంటి శారదమ్మ ఆమెకి అవ్పురాలు. పట్నంలో ఇంటర్‌ చదివే ఆమె కొడుకు నారాయణకి ఆమె స్నేహితురాలు.

ఎవరి కుల వృత్తులు వాళ్ళుచేసుకుని పొట్ట పోసుకునే గ్రామం అది. సావీత్రి తండ్రి దీక్షితులు పౌరోహిత్యం చేస్తాడు. కొడుకులిద్దరికీ ఇంగ్లీషు చదువులు చెప్పించలేక స్మార్తం చెస్పించి తనలాగే తయారుచేయడం వల్ల వాళ్ళూ ఏ ఉద్యోగానికి అర్హులు కాకుండా పోతారు.

ఊరి చివరి నృసింహనాయుడి గారి తోటకి కాపలాగా ఓ తాటాకు పాకవేసుకుంటుంది దీక్షితులు కుటుంబం. సావిత్రి తల్లి ఆరోగ్యం అంతంతమాడ్రం. తిండి, మందులు అన్నింటికీ కరువే శారదమ్మ గేదెలు శుభ్రంచేసి, ఆమెకు

ఐ-వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 65

బాగులేకపోతే వంటచేసి సాయంచేసి, ఏమైనా పెడితే తిని, తీసుకొచ్చి చెల్లెలికి పెడుతుంది సావిత్రి.

ఆకలికి ఆగలేక “అన్నం పెట్టేయ్‌ శారదమ్మా, ఆకలికి కులభేదాలుండవు. అందరికీ ఒకే ఆకలి వేస్తుందో68 అని సావిత్రంటే

“వద్దులేమ్మా, (బ్రామ్మర్లకి భోజనం పెట్టి పాపం మూటకట్టుకోలేను. ఏ జన్నలో చేసుకున్న పానమో! ఈ జన్మలో తీసుకుంటున్నాను"69 అంటుంది శారదమ్మ. అగ్రవర్ణాల వారమ్మాయితో చాకిరీ చేయించుకుంటున్నానన్న న్యూనతా భావం వుంది శారదమ్మకి.

సావిత్రి అలాకాదు. సేవ చేయడం, తగిన ప్రతిఫలం ఆశించడం తప్ప కులం గురించి, అస్పృశ్యత గురించీ ఎన్నడూ ఆలోచించదు. పైగా శారదమ్మ కోప్పడినా “నువ్వు నిజంగా చేసుకుంటానంటే, వాకిష్టమే నారాయణా. నిన్ను పెళ్ళిచేసుకోవడం” అంటుంది.

సావిత్రిని చూసినపుడల్లా ప్రేమ, పవిత్రభావం పోటీపడుతుంటాయి నారాయణ మనసులో, అది కులంవల్లో, ఆమె రూపం వల్లో తెలీదు.

పొరుగూరు వెళ్ళి తండ్రి తెచ్చే యాయవారం గింజలు చాలక దీక్షితులు కొడుకు అవధాని బస్టాండులో కూలిసనిచేయబోతే, వాళ్ళు మూటలు లాక్కుని “అబ్బనాకారం బాపనోడివి, నీవుకూడా మా కూలిపనులకే ఎగబడుతున్నావా? పోపో. ఇక్కడ మాకు నలుగురు వాటాదార్డున్నారు. వాళ్లకే తగ్గ కూలి రావడంలేదు. మీరు కూడా ఇక్కడకే తగలడితే మేమట్లా చచ్చేది?0 అంటారు.

ఊడ్పులకి, కోతలకి వెళ్దావుంటే “నువ్వుకూడా వూ కూటిలో మన్నుకొడదామని వస్తున్నావా అని తరిమేస్తున్నారు.

“ఏ చిన్న వ్రతం చేయాల్సివచ్చినా మమ్మల్ని పిలిచేవారు. ఇపుడు స్టోత్రాలు చదివేసుకుంటూ (బ్రాహ్మడికి ఇవ్వాల్సిన దక్షిణ తాంబూలాలు, స్వయంపాకం మిగుల్బుకుంటున్నారు, ఊళ్ళోవాళ్ళు” అని వాపోతాడు అవధాని. ఆఖరికి అతను జబ్బుపడ్డ మల్లయ్యను ఒప్పించి బల్లకట్టు నడిపి కొంతమల్లయ్యకిచ్చి మిగతా దాంతో కాస్త సావిత్రికి తోడుగా ఇల్లు నడుపుతున్నాడు.

“సావిత్రీ, మనం 'లేబరోళ్ళు' అనుకుంటాం గాని, వాళ్ళు తిండికి

ఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా, కెబి.లక్ష్మి - 66

వెతుక్కోనక్కర్లేదు. కష్టం చేసినవాడికి కడుపునిండకుండా వుండదు. వాళ్లల్లో ఇంటిల్లిపాదీ కష్టపడతారు" అని అవధాని అంటే

"కష్టపడదామన్నా బాపనోడివి అని తన్ని తగలేస్తారు” అన్నాడు తమ్ముడు

“కులం ఎందుకు చెప్పుకోవడం? వునం ఏ పనిచేయగలిగితే ఆ పనిచేయడమే” అంది సావిత్రి. .

అ(గ్రవర్ణాల వారైనా నిరుపీదలయినపుడు ఆకలి, ఆర్థిక సమస్యలు ఇతర వర్ణాల వారితో సమానమే. కష్టపడదానున్నా అ(గ్రవర్దం అంటూ వారిని అన్నింటికీ దూరం చేయడం సబబుకాదన్న కోణంలో రచన సాగుతుంది. నిజమే “బ్రాహ్మణ దళితుల” కష్టాలు అర్థం చేసుకోవల్సిన వ్యవస్థ ఏర్పడుతుంది.

నారాయణ ఒక సందర్భంలో “మీ ఎంగిలి మేం తినచ్చుగాని, మా ఎంగిలి మీరు తినకూడదు” అంటాడు. “ఆకలి ముఖ్యం, ఎంగిలికాదు అంటుంది సావిత్రి.

సొవిత్రి అంత అదరించినా కోడలిగా చేసుకోలేకపోతుంది శారదమ్మ.

తల్లీతండ్రి ఆచారం, బ్రాహ్మణ్యం వదలలేకపోయినా సావిత్రి, అవధాని తమతరంలో తద్భిన్నంగా ఆలోచిస్తారు. అందుకే నిమ్నువర్గాలతో కలిసిమెలసి తిరుగుతారు.

తోటకి కాపలావుంచిన “నాయుడే కాముకదృష్టితో చూస్తే అమ్మవారి అవతారం ఎత్తి శ్రీదేవిగా పీరుమార్చుకుని, భక్తుల్ని అలరిస్తుంది సావిత్రి.

కులం గొప్పదయినంతమాద్రాన వారిపట్ల వ్యక్తుల దృష్టి మారదు. మానవ మనస్తత్వం, బుద్ధి, స్రీ పురుషుల పట్ల ఏకరీతిలోనే వుంటుంది. నిమ్మవర్గాలలో మంచివారు, అగ్రవర్థాలలో అదుకోనివారూ వుంటారు. వాళ్ళని వీళ్ళు బాధించినా, వీళ్లని వాళ్ళు బాధించినా ఒకటే అన్న భావన.

మానవ బలహీనతలు, మూఢాధారాలు, నమ్మకాలు, సిద్దాంతాలను అభ్యుదయ దృష్టితో విశ్లేషించి చూపారు రచయిత్రి. నాణానికి బొమ్మ, బొరుసుల్లాంటి వర్గాలు ఏది ముద్రపడకపోయినా నాణెం చెల్లదు. జీవితమూ అంతే! అన్న భావన నిత్యనూతన అనుసరణీయాలు, ఆదర్శవంతాలు.

ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% దా, కె.బి.లక్ష్మి - 67

“నేను దేవిని కాను' నవల నిమ్నువర్గాల, అ(గ్రవర్గాల మధ్య సయోధ్య మానవ సరిబంధాలను పెంపొందిస్తుందని చెబితే, నివ్నవర్గాల యువతను సైకి తీసుకురావాలనే తపన వున్న జానకి కథ “కానుక.

(1) కానుక

“పాలేరుగా వుంటే తరతరాలు పిల్లా, పాపా అంతా పాొలోర్లుగానే వుండిపోతారు. కాస్త చదువుకుని మిల్లులో పద్దులు రాసుకునే గుమాస్తాగా వుంటే పిల్లలు టీచర్లుగా, ఇంకా మంచి ఉద్యోగులుగా వుండే అవకాశం ఉందొ?1 అని సుందరాన్ని పైకి తేవాలనుకుంటుంది జానకి.

మొట్ట మొదటిసారి పద్ధెనిమిదేళ్ళ కాలేజీ విద్యార్థినిగా హాస్టల్‌ వరండాలో జానకి చూసేనాటికి సుందరానికి పన్నెండు, పధ్నాలుగేళ్ళు. ఎవరని అడిగితే

“అజాంతా ఒటేల్లో పనిచేత్తానండి” అన్నాడు.

“ఇక్కడెందుకు పడుకున్నావ్‌” అంటే

“నాలోజుల్నించీ జొరం కాస్తాందండీ. ఎవరో పెద్దమడిసి కాఫీ వట్రామన్నాడు. బల్లమీద పెడతావుంటే... బట్టమీద కాస్త పడ్డాదొ అంటూ యాస భాషతో, మురికిగా, అనాగరికంగా వున్న సుందరాన్ని తమ్ముడిలా ఆదరిస్తుంది జానకి.

పుస్తకాలు, బట్టలు డబ్బు సాయంచేసి నాగరికంగా తిర్చెదిద్దుతుంది. సుందరం భాష్త రూపం మార్తాయి,

జానకి సొంతవూరెళ్ళినపుడు అక్కడికి వచ్చిన సుందరం అక్కడే వుండిపోత్రానంటాడు.

“ఇక్కడ నీకు అక్షరం ముక్క చెప్పేవాళ్ళుండరు. నువ్వు చదువుకుంటే ఉద్యోగం చేసుకునే అవకాశం వుంటుంది. పాలికావు కుర్రాళ్ళు పొలంలో ఎద్దులతో సమంగా కష్టపడాలి. చదువుకుంటే నీ బతుకు నువ్వు బాగుచేసుకోవడమేగాక నీ ముందు తరాలవాళ్ళ బతుకుకూడా ఈ అడవాదాకిరీనుంచి తప్పించవచ్చు. నువ్వు పాలేరుగా స్థిరపడితే నీ పిల్లలు గొడ్డ్గకావరులుగా మారుతారు ఆలోచించుకో" అని ప్రోత్సహిస్తుంది జానకి.

“సుందరం ఒక గ్రాడ్యుయేట్‌ కాగలిగినంతమాత్రాన సమాజంలో

ఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 68

అట్టడుగునున్న వాళ్ళందరో పైకి వచ్చేస్తారంటావా?” అనడుగుతుంది జానకి స్నేహితురాలు.

ఎవరెంత ఎద్దేవా చేసినా తన సంస్కరణవాదాన్ని మానుకోదు జానకి. పైగా ఎప్పటికప్పుడు అతని ప్రోగ్రెస్‌ని కనుక్కుంటూ, జాగ్రత్తగా బతకమని హెచ్చరిస్తూ, సలహాలు చెబుతూనవుంటుంది.

అయితే ఆశయాల్లో, ఆలోచనల్లో అభ్యుదయ కామన ఉన్నంతమాథ్రాన అన్ని వేళలా సంస్కరణాభిలాష సరయిన ఫలితాలనివ్వదని, అపాత్రదానమయ్యే ప్రమాదం వుందనీ స్పష్టం చేస్తారు అచ్యుతవల్లి.

కులతత్వాలు, మతతత్వాలు, ప్రాంతీయ తత్వాలు నిన్నటి తరంవారు తెచ్చినవి కొవు. పాత సమాజాన, నిర్మాణ, సిద్ధాంత కొనసాగింపే ఈ విచ్చిన్న విధానాలు అని చాటి చెప్పే నవల కొడిగట్టిన దీపాలు.

(1) కాడిగట్టిన దీపాలు

“అ(గ్రవర్ల ఆధిపత్యం, కులతత్వ సమర్థనం, అస్పృశ్యతను నిరసించకపోవడం అనాటి చరిత్రలో మనకు అవిభాజ్యంగా కనిపిస్తున్న అంశాలు. తరతరాలుగా నిర్లక్ష్యం చేయబడిన కులాధిపత్య, పురుషాధిసత్య సామాజికవ్యవస్థ మీద ఉద్యమాలు బలంగా నడుస్తున్న కాలమిది" మన సమాజంలో కనబడే లోపాలను సరిదిద్దుకోవాలనే ప్రబోధం స్వాతంత్ర్యానంతర నవలల్లో కనబడుతుంది.

“కొడిగట్టిన దీపాలు'నవలలో పల్లెల్లో పుట్టి పెరిగిన అగ్రకులాల వారికి, దళితులకీ మధ్య ఉండే సాంఘిక కట్టుబాట్లు, కులాల పట్టింపు, ధనిక వర్గపు అహంకారాన్ని ప్రధానంశాలుగా తీసుకుని నాలుగు కుటుంబాల జీవనగతి చిత్రించబడింది.

ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయనడానికి నిదర్శనం ఒక యానాదుల అబ్బాయి గొప్ప బిజినెస్‌ మాగ్నట్‌గా మారి, తను పశువులుగాసి, పేడ్రపిసికి, వెట్టిచాకిరీ చేసిన యజమాని కొడుక్కి తానే ఉద్యోగం ఇప్పించే స్థితికి ఎదగడం.

నారాయణ ఏకసంథాగ్రాహి. బామ్మర్ల పిల్లల్లా చదువుకోవాలని ఆశ. బడిలో మాష్టారి ప్రశంసలు పొందేంత తెలివైనవాడు. కానీ “నువ్వు ఈ పొద్దునుంచి రంగయ్యగారింటికాడ పన్టెయ్యాల. బడి సదువు మానెయ్యి. రెండూ ఎక్కడ

కుదుర్తాయి?” అని తల్లి అనగానే “నేను పనిలోకి ఎళ్ళనమ్మా. ఆళ్ళు గేదెల్ని కడగమంటారు. పేడ ఎత్తి పోగు పెట్టముంటారు. నాకసయ్యం, అట్టాంటి పనులు నేజెయ్యను. పంతులయ్య చెప్పారు. నాకు పెద్ద సదువాస్తదంట. ఉద్యోగం సేస్తనంట. ఇయ్యాళ మూడోక్షాసు పుస్తకం ఇస్తానన్నాడు చీనయ్య పంతులు”72 అన్నాడు నారాయణ.

గొప్ప పందుల యజమానినని గొప్పలుపోయే యానాది గవరయ్య అసలే వందులన్నీ జబ్బుపడిచచ్చిపోయి, గంజికి గతి లేకుండా వున్నాడు. కొడుకు నారాయణ ఆమాట అనగానే గయ్యిన లేచాడు. పనికి వెళ్ళాల్సిందే అన్నాడు దాంతో “వెధవ బాలిగాదిలాగ, అబ్బిగాడిలాగ తనుకూడా సిల్వర్‌ డబ్బాలో అన్నం, ఇంతకారం ఏసుకుని దూడల్ని నుళ్ళిస్తూ తిరగాలి కాబోలు. అందరు బామ్మర్ల పిల్లలు ఎక్కాలు అప్పజెస్స్పమంటే నాలుగేసి రోజులకి ఒక్కోఎక్కం కంఠతాపట్లారు. తను రోజుకి రెండేసి ఎక్కాలు అప్పజేప్పేవాడు. ఇక్కడ ఐదోక్లాసుకు సదూకొంటే, పట్నం పెద్దబళ్ళో జేరచ్చంట. అక్కడ మధ్యాహ్నం వేళ అన్నాలు కూడా పెడ్డారంట. అస్సుడసలు అన్నానికి ఎవర్నీ అడగక్కర్లేదు... అళ్ళు అన్నం పెట్టేటప్సుడు కడుపునిరిడా తినేస్తే ఇంక మళ్లీ మర్నాటిదాకా అకలెయ్యదుగా! అసలు ఫనిలోకి ఎత్తే చదూకుందికి తీరిక ఉణ్లిస్తారా?” అనుకుంటాడు నారాయణ. అతని మాటల్లో తనసొటివాళ్ళకంటే గొప్పగా వుండాలనుకోవడం, చదువుమీద ఆశ ఆకలిమీద ధ్యాస కనిపిస్తున్నా అగ్రకులాలవారికి మించిన తెలివి, చురుకుతనం నిమ్నకులస్థుడయిన ఆ కుర్రాడికి వున్నాయన్న ధ్వనివుంది. .

వర్షభేదంవున్నా ఒకే స్కూల్లో చదువుకోడం వల్ల చలపతికి నారాయణ అంటే మంచి స్నేహం. కానీ చలపతి చెల్లెలు రమణ మాత్రం అతన్ని యానాది కుర్రాడిగా కంటే ఎక్కువగా చూడలేకపోతుంది. అంటరానితనం పొటిస్తుంది, పెద్దయినా ఉద్యోగం చేస్తున్నా అతన్ని చూసినపుడల్లా చింకినిక్కరు, మురికి మొహమే గుర్తొస్తుంది. హీరోలా ఎదిగిన నారాయణనిచూసి “తామంతా తిన్న ఎంగిలి కంచాలు తోముతూ సందెడు గడ్డిపరకలతో అవుల్ని, గేదెల్ని రుద్దుతో, కడుగుతో నిలువెత్తు పేడకుప్పనీ కుమ్ముతూ తన తల్లిపోపే సత్తుగిన్నెడు గంజినీళ్ళకోసం, కళ్ళల్లోని ఆకలి కాంతులతో వుండే” చిన్నప్పటి నారాయణకి, ఈ నారాయణకి పోలికే లేదనుకుంటుంది రమణ. అతను 'మీరు' అంటే ఆమె “నువ్వు అంటుంది. ఎంత

ఐ,వి.యస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం * డా, కె.బి.లక్ష్మి - 70

పరిచయమున్నా నిమ్నభావన మాటల్లో వ్యక్తమౌతుంది.

కులం ఏదైనా ఉన్నంతలో ఒద్దికగా వుంటే ఎవరైనా ఉన్నతిని సాధిస్తారని చెప్పడానికే క్రమశిక్షణతో పైకి వచ్చి వ్యాపారస్థుడు, ధనవంతుడు అయిన సారయ్య ని, నిర్గక్యంతో కుటుంబాన్ని ఛిద్రం చేసుకుని సన్యాసుల్లో కలిసిపోయిన వెంకటరంగయ్యని పోల్చి చూసించి 'కృషితో నాస్తి దుర్భిక్షం) అని రుజువు చేశారు రచయిత్రి.

మారుతున్న వ్యవస్థలో వ్యక్తిపరంగా, ప్రభుత్వపరంగా నిమ్నవర్గాల వారికి కల్పించిన అవకాశాలు, వాటిని అందిపుచ్చుకుని అట్టడుగువర్గాలవారు అందలాలు ఎక్కే పరిస్థితుల్ని చాలా బాగా విడమర్చారు రచయిత్రి.

తమకులం వాడయిన సమ్మయ్య తమ కుటుంబానికి చేసిన సాయం, రోడ్డు కూలీ పని తండ్రికి ఇప్పించి ఆ తర్వాత తన వ్యాపారంలో పనికల్పించినందుకు “డబ్బున్న వాళ్ళంతా ఆర్థిక బాధలతో క్రుంగిపోయేవాళ్ళకి కాస్త చేయూతనిస్తే మన సమాజం ఎంతో ముందుకిపోతుంది. కానీ నాకు ధైర్యంగా రమణలొంటి అ(గ్రవర్ణపు అమ్మాయి ముందు కాలరెత్తుకుని నిలబడి, కుశల ప్రశ్నలు వేయగల స్తోమత సమ్మయ్యకల్పించాడు"” అన్న నారాయణ అలోచన ఆత్మసంతృప్తి అతనొక్కడికే కాదు అలాంటి అందరిదీ అనిపిస్తారు అచ్యుతవల్లి.

సంస్కరణాభిలాష్క అభ్యుదయకామన, నిమ్నవర్గాలపట్ల పక్షపాతం, వారి అభివృద్ధికోసం ఆకాంక్ష నవలలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. సమాజాభివృద్ధికి, వ్యక్తి బౌన్నత్యానికి కావల్సింది చదువు, సంస్కారం, శుచీ, శుభ్రతా అని, యువతీయువకులే కులాల హద్దుల్ని చెరిపీయాలన్న భావనను సమర్థవంతంగా చిత్రించారు రచయిత్రి. పొభ్రలు కనిపించవు. సమాజం కళ్ళకు కడుతుంది. అందుకే కేవలం వర్ణాంతర వివాహాలతో సరిపెట్టకుండా ప్రస్తుత సమాజంలో నిమ్న వర్గాలకున్న “దన్ను' కి ప్రాధాన్యతనిచ్చి కులవివక్షత, ఆర్థికత చిత్రించారు.

నారాయణను తన కూతురికిచ్చి పెళ్ళిచేయాలన్న కించిత్‌ స్వార్ధంతో అతన్ని చేరదీసి చదువు చెప్పించినా వ్యవస్థలో నిమ్నువర్గాల వారికి ప్రభుత్వం కల్పించిన వసతుల దగ్గర్నుంచి, వాటిని అందిపుచ్చుకోవల్సిన ఆవశ్యకత గురించీ అహరహం ఆలోచిస్తుంటాడు సమ్మయ్య. "

“మనప్రభుత్వం ఎంత సాధించినదీ, ఎక్కడెక్కడి హరిజన హాస్టళ్ళు, ఉచిత

ఐంవి.యస్‌. అచ్యుతవల్లి వవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - ౯1

భోజన వసతులు, ఉచిత వైద్య, విద్యా సౌకర్యాలు ఎన్నెన్నో కల్పిస్తున్నారు. కోళ్ళఫారాలకి, పందుల పెంపకానికీ కూడా సబ్సిడీలు ఇస్తున్నారు. బాగుపడదల్పుకున్న వారికి బోలెడన్ని అవకాశాలున్నాయి. ఇప్పుడిప్పుడే పైకివస్తున్న ఈ క్రింది తరగతుల వాళ్ళ పిల్లలకి, బాగాచదువుకున్నవాళ్ళకి పెళ్ళిళ్లవడం కొంచెం కష్టంగా వుంది. దానివల్ల. వర్ణాంతర వివాహాలు ఎక్కువగా అవుతున్నాయి. ఎక్కువ కులమైన్నా తక్కువ కులమైైనా ఒక కులం ఇంకొక కులంతో కలవటం ప్రాణసంకటంగా వుంటుంది. వీలైనంత త్వరలో తన కూతురు మంగళక్కి నారాయణకి పెళ్ళిచేసెయ్యాల” అనుకుంటాడు సమ్మయ్య.

పెళ్ళి కులం గురించి ఖచ్చితమైన అభిప్రాయాలున్నా సమ్మయ్య ఆ తర్వాత మంగళ అ(గ్రకులస్థుడయిన చలపతిని రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటే సరేననుకుంటాడు. అలా అని నారాయణనూ నిలదీయడు. ఒక రుషిలా సంయమనం పాటిస్తాడు. అది నిమ్నకులం వల్ల వచ్చింది కాదు. వ్యక్తిగత సంస్కారం. సమాజాన్ని ఆకళింపు చేసుకున్న ఆదర్శ దృక్పథం.

చిన్నప్పట్నించీ అగ్రకుల అభిజాత్యం ప్రదర్శించే రమణ అన్నయ్య నిమ్న కులస్థురాల్ని ఇంటి కోడల్ని చేస్తే "వది, పదిహేనువేలు కట్నాలు తెచ్చే కులీన భార్యకంటే మనసూ, మనసూ కలిసిన మనువే కావాలనుకున్నాడు అన్నయ్య దానిదేముంది” అనుకుని “రా వదినా" అని మంగళని సాదరంగా ఆహ్వానించింది రమణ. వర్ణాంతర వివాహాన్ని సమర్థిస్తూ కొడుకు చేసిన పని రాఘవమ్మ సరిపెట్టుకోలేకపోయినా నిస్సహాయురాలిగా ఊరుకుండిపోతుంది.

ఆదే తనదాకా వస్తే నారాయణ తనని పెళ్ళాడుతానంటే మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతుంది. మనసులో అతను కావాలనిపించినా తన వైధవ్యం, తన పెళ్ళినాటి వేదమంత్రాల ప్రభావంనుండి బైటపడి అంగీకరించలేకపోతుంది.

నవలంతా నిమ్నవర్గాల ఇంట్లో జ్యోతులు వెలిగించిన ఈ దీపాన్ని కొడెగట్టించడంలో ఉదేశ్యం శీర్ణికా బౌదిత్యం కోసమేనా? అ(గ్రవర్ణాల్లో పురుషుడు అట్టడువర్గ స్త్రీని వివహమాడినా పరవాలేదుగాని, అగ్రవర్ణ స్త్రీకి ఆచారాన్ని కాదని అటు విధవా వివాహం, అదీ ఒక నిమ్నవర్గస్థుడితో వివాహం అనంగీకారమా? ఎందుకు? మారుతున్న విలువలు అర్థసత్యాలేనా? అన్న(స్రశ్నలు పాఠకుల్ని బాధపెడతాయి. నారాయణ, రమణ పెళ్ళాడితే బావుండేదనిపిస్తుంది. .

ఐ.విఆయస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మీ - 72

నారాయణ, రమణలకు వివాహం జరిప్కి కధను సుఖాంతము చేస్తే బావుండేదని అవ్పట్లోనే కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. నిజానికి రచయిత్రి ఆశయం అదే. మార్పు వచ్చిందని చెబుతూనే అలాంటివి రావాలని, వచ్చి తీరాలని అందరికీ బలంగా అనిపించాలనే, ఆ దృష్టితో ఆలోచించాలనే అలాంటి ముగింపు నిచ్చారన్నది స్పష్టమౌతుంది.

“నిజమైన నాగరిక జాతి ఎక్కువ, తక్కువ కులాల విచక్షణను తీవ్రంగా శిక్షిస్తుంది. అస్పృశ్యతను ఏ రూపంలో పాటించినా శిక్షిస్తుంది. పేదల దృష్టితో సమాజ స్వరూపాన్ని దర్శించాలి"73 అన్న కొడవగంటి కుంటుంబరావుగారి అభిప్రాయాలతో రచయిత్రి అచ్యుతవల్లి ఏకీభవిస్తున్నట్లనిపీస్తుంది.

బతకడానికి బతుకును తెగించాల్సిందే అని ఖచ్చితంగా చెప్పిందీ నవల. అంటరానితనం వర్ణ వ్యవస్థవల్ల, కులవ్యవస్థవల్ల ఏర్పడిన దురాచారం కాదనీ భూస్వామ్య వ్యవస్థ తమ దోపిడీ విధానాల్ని నిరాఘాటంగా కొనసాగించుకోవడానికి ఉపయోగించే అనేక సాధనల్లో ఇదీ ఒకటని చెబుతూనే, దాన్ని తోసి రాజని అందిన అవకాశాల్ని ఆధారం చేసుకుని ఏ విధంగా ఎదగాలన్నది విడమర్చి చెప్పి మానవతకు పట్టం కట్టడం రచయిత్రి ఉద్దేశ్యం.

చరిత్రసాక్షిగా, నాగరిక వరిణామక్రమం సాక్షిగా శతాబ్దాల నుండి సమాజ బహిష్కృతమైె, నీచమైన, హేయమైన జీవనాన్ని గడువుతూ వచ్చిన నిమ్నువర్గాల ఆరాట పోరాటాల ఫలం దళితవాదం. నిత్య జీవన ఘర్షణ, హింస, దోపిడి, అణచివేత, అవహేళన, సాంఘిక నియంత్రణతో నీరసించిన జాతి, తామూ సమాజంలో భాగమని, అగ్రవర్ణాల అనొచిత్య ధోరణికి తలొగ్గాల్సిన అవసరం లేదని, భారతరాజ్యాంగం అందరికీ సమానమని, తామెవరికీ తీసిపోమని, తక్కువ కాదని - మనోధర్మం, పురాణేతిహాసాలు ఉటంకించిన ధర్మాలు నాటికాలానికి చెల్లుతాయేమోకాని, నేటి కాలానికి అవి చెల్లవని, అనౌచిత్యాలను ఘోషిస్తూ తరాల అణిచివేతకు నేడు ఊరటను ఆకాంక్షిస్తూ న్యాయంకోరుతూ ఉద్యమిస్తూ సాగుతోంది నిమ్నవర్గం. దాదావు 62 ఉపకులాలుగా గల దళితులందరి గమ్యం కులవివక్షలేని సమాజావిష్కరణమే.

విలువలు, సంస్కరణలు, అవకాశాలు సమాజంలో అన్నివర్గాలవారికీ సమానంగా అందనపుడు ఏదోవిధంగా బాధపడాల్సివస్తుంది. ఒకరికి న్యాయం, ఇంకొకరికి అన్యాయం కావచ్చు. ఒకరి హక్కుల వినియోగం ఇంకొకరిపాలిట దుర్వినీతి

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి,లక్ష్మి - 73

కావచ్చు.

'కొడిగట్టిన దీపాలు నవలలో చలపతి పట్టభద్రుడయినా ఉద్యోగంలేక, ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న సందర్భంలో “ఈ (బ్రాహ్మణ జన్మ ఎందుకిచ్చావు భగవంతుడా! ఏ మాదిగవాడివైనా బాగుండును. షెడ్యూల్డ్‌ కాస్ట్‌ అంటూ ఇట్టే ఉద్యోగం దొరికిపోను. కొన్నాళ్ళకి (బ్రాహ్మణులే వెనుకబడిన జాతులవారైపోతారు. మళ్ళీ (బ్రాహ్మణుల అప్‌లిఫ్ట్‌ అంటూ ఒక ఉద్యమం నడపాల్సివస్తుంది. 'నందో రాజా భవిస్యతి' ఎవరు చూడొచ్చారు. పూర్యం మెట్రిక్యులేషన్‌తో తాశీల్దారులైనవాళ్ళు కూడా వుండేవారట. అదే సువర్షకాలమనిపిస్తోంది" అని వాపోతాడు. సన్నివేశంలో రచయిత్రి దార్శనికత గణనీయమైనది.

“కులాల, హెచ్చుతగ్లులూ, అస్పృశ్యత వాస్తవంగా వున్నవేగదా అనవచ్చు. ఉండదగనివి లేకుండా చేసుకోవడమే నిజమైన అభ్యుదయం. జలుబు చేస్తే ముక్కు చీదుకుంటూ ఉండడం చికిత్స కాదు. అలాంటి చికిత్సలు అభ్యుదయం

అనిపించుకోవు”?4 అన్నట్లు సంస్కరణవాదం, మానవతావాదం వస్తినే తప్ప హెచ్చుతగ్గులు సమసిపోవన్న సామాజిక సత్యాన్ని అక్షరాలా స్పష్టం చేశారు రచయిత్రి. కాల్చ్పనికత - వాస్తవికత

వాస్తవ జీవితంలో వ్యక్తులు మన స్వభావాలను సులభంగా మార్చుకోలేరు. కానీ కల్సనా సాహిత్యంలోని పాత్రల స్వభావాలను సులభంగా మారుస్తారు కథాశిల్పులు,

అ మార్చడమనేది ఒక కళ. అది శ్రీమతి అచ్యుతవల్లికి బాగా తెలుసు.

సమకాలీన జీవిత వాస్తవికత మీద ఆధారపడ్డ కల్పనాత్మక వచన సాహిత్య ప్రక్రియ నవల అన్నది అందరూ ఒప్పుకోవల్సిన వాస్తవం. ఇందులోని సంఘటనలు, పాత్రలు వాస్తవ జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. అయితే స్త్రీలు రచించిన వాటిలో ఏ కొద్దిమందిలోనో మినహాయించి వాస్తవిక దృక్పథంలేదన్న వాదన ఒకటి వుంది. అందుకు సమాధానంగా

“నిజానికి ఏది వాస్తవిక దృక్పథం? ఈనాడు సమాజం వింతపోకడలు పోయింది. ఓ పక్క స్త్రీలకు సమాన హక్కులంటూనే ఇంకొక పక్క వారికి అర్హత లేకుండా చేస్తారు. ఒక పక్క సంఘ సంస్కరణ అంటూనే రెండో పక్క దాన్ని ఈసడిస్తారు. ఒకపక్క వితంతు వివాహాలను ్రోత్స్పహించాలంటూనే రెండోపక్క దాని

ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 74

తోసిరాజంటారు. సమాజపు నీతిని కొలిచే కొలబద్ద వేరు, వ్యక్తినీతిని కొలిచే కొలబద్ద వేరుగా చేస్తారు. సమాజపరంగా మరిచిది - వ్యక్తిపరంగా దద్రోహంగా చూస్తారు. ఇక వ్యక్తి తెగించి తనకు మంచిదనుకున్నదాన్ని సమాజం ఎంత మాత్రంగా గౌరవిస్తుందో తెలిసిన సంగతే కదా! అటువంటి అయోమయంలో పడి సమాజ వాస్తవికతను అయోమయంగానే చిత్రించడం జరుగుతుంది. తాను నమ్మిన విపరీత భావాలను జుగుప్సాకరంగా రచించే వారున్నట్లే తాను నమ్మిన వాటిని సాఫీగా చెప్పిన రచయితలూ ఉన్నారు. ఒక రచయిత తాగుబోతుల న్యాయం చర్చించవచ్చు. ఇంకొకరు సంప్రదాయాన్ని చర్చించవచ్చు. రెండూ బలవత్తరంగానే వున్నాయి సమాజంలో. అటువంటప్పుడు కొందరు వాస్తవికతకు పూనుకోవడం లేదని బాధపడడంలో అర్థంలేదు, కూడదనుకున్న చెడులన్నీ సాగుతున్న సమాజంలో వాస్తవికత పేరిట వాటికి ప్రాధాన్యం యిస్తూ, “వేం సమాజాన్ని ప్రతిబింబించుతున్నాం' అని బోరవిరుచుకుంటే లాభంలేదు”?5.

స్త్రీలు కూడా సంఘంలో జరుగుతున్న కృత్రిమన్యాయాన్ని, అన్యాయాన్ని, అసహాయతను నిలదీస్తున్నారు. వాటిని రూపుమాపొలని, అవి సంఘంలోంచి దూరం కావాలని కోరుకుంటూ రచనలు సాగించారు. అందుకు నిదర్శనంగా చెప్పాలంటే ఒకేరకం బాధ్యతలు భార్యభర్తలిద్దరూ నిర్వర్తించాల్సి వచ్చినపుడు సంఘం స్త్రీనే తప్పుపట్టడం అన్యాయమంటూ కొడుకుగా, అన్నగా, తండ్రిగా, మగవాడెంతో కూతురిగా, అక్కగా, భార్యగా, ఆడదీ అంతే అంటూ అత్యద్భుతమైన నవల రాశారు ఐ.వియస్‌, అచ్యుతవల్లి, అదే 'ఇదెక్కడి న్యాయం'. సంఘం కట్టుబాట్లకు తలవొగ్గితే నిజానికి భార్య భర్త పంచన, అతని దయాధర్మబిచ్చానికి పడివుండాల్సిందే. కానీ కర్తవ్యం ముందు కట్టుబాట్లు కాలదోషం పట్టిపోతాయని అత్యంతవాస్తవికంగా, అలాజరగడమే న్యాయమన్నట్లుగా చిత్రించారు.

అచ్యుతవల్లి “ఇదెక్కడి న్యాయం”, “మూడుముళ్ళు”, '(పీమగండం', “ఎగిరేపిట్టలు”, 'నేను దేవినికాను% 'తీరం చేరిన కెరటం), 'పూలూ - ముళ్ళూ' అనే నవలల్లో ఈ అంశం స్పష్టమౌతుంది.

ఒక మనిషిలోని మంచి చెడులను కొలవాలంటే ఆ మనిషి భావాలను పెట్టి గాక స్వభావాలను పెట్టి కొలవాలి. జీవన పరిణతితోబాటు భావాలు మాత్రమే మారితే చాలదు. స్వభావాలు కూడా మారాలి. భావాలు అనేవి అదర్శాలను తెలిపితే స్వభావాలు

ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా. కె.బి.లక్ష్మీ - 75

ఆచరణను తెలుపుతాయి. భావ స్వభావాలను అత్యంత వాస్తవికంగా చిత్రించిన నవల మూడుముళ్ళు. (౧ మూడుముళ్ళు ఇది సాంఘిక వాస్తవికతకు చెందిన నవల. కామేశ్వరి వాస్తవవాది. నళిని కాల్చనికతను, కలలను ఇష్టపడే యువతి. కేశవ రెండోపెళ్ళి చేసుకుంటాడు కామేశ్వరిని. చనిపోయిన భార్యకు నళిని అనే ఒక కూతురుంది. తన రెండవ భార్య కామేశ్వరికి, తన కూతురు నళినికి వయసులో పెద్ద తారతమ్యంలేదు. కామేశ్వరికి నయసుమించిన భర్తమీద కోపంలేదు, ద్వేషం లేదు. ఆయనను ఆమె మనసారా ఆరాధిస్తోంది. ఈ కామేశ్వరిని రామనాధం అనే యువకుడు పెళ్ళిచూపులకొచ్చి యిదివరలో వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడనీ, ఇప్పటికీ ఆమెమీద అతనికి మమకారం వుందనీ తెలుసుకున్న కేశవ వాళ్ళ పెళ్ళి ఇష్టపూర్వకంగానే చేయాలనుకుంటాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్టాడుకునే ఏర్పాటు చేస్తాడు. కావేశ్వరి రామనాథాన్ని అసహ్యించుకుని కోప్పడుతుంది విషయం (గ్రహించి నూతన దృక్పథంతో కామేశ్వరిని ప్రేమించడం ప్రారంభిస్తాడు కేశవ, ఇందులో కేశవుని హృదయ వైశాల్యాన్ని మాత్రమేగాక కామేశ్వరి సౌశీల్యాన్ని కూడా చక్కగా చిత్రించారు రచయిత్రి. సొంత భార్యను మరొకరికిచ్చి వివాహం చేసే భళ్తలుంటారా వాస్తవంలో అన్న ప్రశ్న ఉదయించడం సహజం. ఉండరని చెప్పలేం. కేశవ పాభ్రలాంటి వ్యక్తులు పాస్తవజగత్తులో వుంటే మాత్రమే అటువంటి పొత్రలను సృష్టించాలనిలేదు. వాస్తవవాదం మంచి ఆదర్శవాదం ఇక్కడే భేదించేది. వాస్తవ జగత్తులో ఎట్లావున్నది అనేదాన్ని మాత్రం చిత్రించక, ఎట్లావుంటే బాగుంటుంది అనే ఆదర్శాన్ని సృష్టించడం ఆదర్శవాదమవుతుంది. “వాస్తవవాదం ముడిపదార్థంవంటిది. దాన్ని ఏవిధంగా తయారుచేస్తే సుందరంగా వుంటుందో ఆ విధంగా తయారుచేయడం ఆదర్శవాదం. అందువల్ల ఆదర్శ చిత్రణ వాస్తవానికి ప్రతికృతి కావాల్సిన అవసరం లేదు” అని ఈ నవల పట్ల సంజీవ్‌దేన్‌ అభిప్రాయ పడారు. ఈ నవలలో వాస్తవికతతోబాటు సహజత్వం ఉంది. పొత్రల పేర్లు కూడా ఐ,వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 76

కామేశ్వరి, కేశవ, రామనాధం అంటూ జాతీయత కలిగి వున్నాయి. అచ్యుతవల్లి మానవచిత్రణ చేసినట్లే ప్రకృతి చిత్రణ కూడా కమనీయంగా చేయగలరు. మనిషి మనుషులలో మాత్రమే నివశించకుండా ప్రకృతిలో కూడా నివశిస్తాడు. కాల్పనిక వాదంలోని “ప్రకృతి ప్రీతి" అచ్యుతవల్లిగారికి బాగావ్సంది. అందుకే మానవ సౌందర్యంతోబాటు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడంలో ఆహ్లాదం చెందుతారు పాఠకులు.

“దూరదూరంగా కొండలకి, ఆకాశానికి మధ్యనున్న సరిహద్దు గీత వంకర టింకరగా కనబడుతోంది. కొండలకి ఎగబ్రాకుతున్న ఆవులు సుద్దచుక్కల్లా కనబడుతున్నాయి. నిర్మలాకాశంలో లేత నీలహరితాలు కలిసేచోట నల్లదనం వచ్చింది. ఒక వుబ్బుకీ ఒక వుబ్బుకీ పోలికే లేకుండా కణకణాలుగా విడిపోయి తొందరపడుతున్నట్లు పరిగెత్తుతున్నాయి....” అన్న రచయిత్రి వర్ణనను “సంజీవ్‌దేవ్‌ చిత్రించిన నీటిరంగుల నిసర్గచిత్రంలా వుంది శ్రీమతి అచ్యుతవల్లి ప్రకృతి వర్ణన” అని ఆయనే స్వయంగా ప్రశంసించారు.

వలూడువుళ్ళు నవలకు కొంచెం భిన్నంగా సాంఘిక వాస్తవాన్ని ప్రతిబింబించిన మరో నవల '“ప్రేమగండంి.

(0౧) భుయమగండం

సాహిత్య వాస్తవానికి సామాన్య వాస్తవానికి చాలా భేదం ఉంది. కంటికి కనిపించేదంతా సామాన్యవనాస్తవం. కనిపించని వాస్తవానికి కళారూపం కల్పించడం సాహిత్యవాస్తవం. సాహిత్య వాస్తవం అంతా ఒకటే అని చెప్పలేం. ఒక వ్యక్తి జీవితాన్నీ విశ్లేషించి దానికి కళారూపం ఇచ్చిచేసిన రచన వైయక్తిక వాస్తవం అవుతుంది. ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలించిన రచన ఆ వ్యక్తికి మాత్రమే చెందిన వాస్తవం అనుకోవడం సరికాదు. అ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులందరికీ అది వర్తిస్తుంది. (ప్రేమగండం' నవలలో శివకేశవ వ్యక్తిమాత్రమే. అయితే అలాంటి పరిస్థితుల్లో వున్న అందరికీ అతను ప్రతినిధి. -

ఒకవైపు చదువు, బాధ్యత, ఇంకోవైపు అంబుజ ఆకర్షణ - ద్వైదీభావంతో

నలిగిన యువకుడు శివకేశవ. యౌవన వుధువనిలో తుమ్మెదల్లా ఎగిరే

యువతీయువకుల ప్రీమాకర్షణల్ని, చదువు ఉద్యోగ బాధ్యతల్ని వాస్తవంగా చిత్రించడం

వేరు. “ఈ నవలలో వచ్చే శివకేశవ, ప్రసాద్‌లు తమ అనుభవాలను నిస్పంకోచంగా ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి,లక్ష్మి - 77

నాతో చర్చించి వ్రాయమని ప్రోత్సహించారు. వాళ్ళకి హృదయపూర్వక శుభాళీస్సులు అందజేస్తున్నానని” నవల చివర్లో ప్రత్యేకంగా రచయిత్రి ఉటంకించారు. వాస్తవానికి కాస్త కల్పన, నాటకీయత జోడించి అకర్షణ, బాధ్యతల మధ్యన చిక్కుకున్న వారి ఆవేదనని, యదార్థాలను, అనుభవాలను గుదిగుచ్చి రాసిన నవల ప్రేమగండం. *“పేవుగండలి నవల యదార్థ జీవితానుభవాలకు అడ్డం పడితే ప్రణయతత్వాన్ని వైజ్ఞానిక సత్యంతో ముడిపెట్టీన నవల “పూలూ - ముళ్ళు". (1) పూలూ - ముళ్ళు నవలలో వ్యక్తినిష్టమైన కాల్పనిక ప్రణయ తత్వం ఆవిష్కరింప బడుతుంది. ఇందులో వివాహితుడైన జగన్నాధం అవివాహితయిన పాతికేళ్ళ యువతి సుమనని ప్రేమిస్తాడు. అతనికి పిల్లలు పుట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేకపోయినా ఆమె గర్భవతి అవుతుంది. నీ వల్లే అంటుంది. తనలో ఏమైనా మార్పు వచ్చిందేమో! "స్పెరమ్‌ కన్‌టెంట్‌ (9061౫ 0016౧0 సపెరిగిందేమో అని డాక్టర్‌ని కలుస్తాడు. పరీక్షలు చేసి పిల్లలు ఈ జన్మలో పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పేస్తాడు. సుమన అబద్ధం చెప్పినందుకు ఆశాభంగం, ఎవరితోనో గర్భధారణ చేయించుకుని తనని మోసం చేసినందుకు నిరాశా నిస్పృహలకు లోనవుతాడు. భర్త, సుమన కలసి చేసిన (ద్రోహానికి నభినిలో అలవికాని ఆవేదన, ప్రతీకార ధోరణి చెలరేగుతాయి. తనను అవమానించిన భర్తకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. సుమన అసలు సంగతి తెలిసినా ఇంట్లో తెచ్చి పెట్టుకోమంటుంది. మధ్యలో ఈ విషయం తెలీకముందు కొన్నాళ్ళు పర్యటనలో గడుపుతుంది నళిని. ఈమె వెళ్ళిపోవడంలో పలయనతత్వం, నిరాశావాదం చక్కటి అభివ్యక్తిని పొందాయి. ఈ స్థితికాల్పనికోద్యవుకాలంలో గంగా౭౧౦ $161800000 గా వర్ణింపబడింది. తిరిగి వచ్చాకా తెలిసిన చేదునిజాలు వాస్తవికతకు (పతీకలు. పూలు-ముళ్ళూ నవలలో ప్రస్తావించిన విషయాలకు భిన్నంగా సంఘంలో వస్తున్న, ఆర్థిక్క రాజకీయ, జనజీవన పరిణామాలను ప్రస్ఫుటం చేసిన నవల కొడిగట్టిన దీపాలు. (1) కొడిగట్టిన దీపాలు. అచ్యుతవల్లి 'కొడిగట్టిన దీపాలు వాస్తవ పరిస్థితులను చిత్రించి మానవునికి ఐవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 78 |

నీతిబోధ కలిగేటట్లు చిత్రించారు. నవల మొత్తంలో ఎక్కడా అవాస్తవికత గోచరించదు. వాస్తవ సంఘటనలతో, వాస్తవ పాత్రలతో, వాస్తవ జీవితాన్ని చిత్రైంచిన నవల కొడిగట్టిన దీపాలు. పల్లెటూళ్లల్లో అగ్రవర్గపు భూస్వాముల ఇంటివ్యవహారాలు, వాళ్ళ ఇళ్ళల్లో, పొలాల్లో పనిచేసే నిమ్నవర్గాల జీవితాలు విశ్లేషించి, విమర్శించిన తీరు గొప్పది. వైయక్తిక వాస్తనికత కంటే సామాజిక వాస్తవికతను కళాత్మకంగా చిత్రించడం ఎంతోకష్టం. రచయిత అలాంటి రచన చేయాలంటే సమాజాన్ని సంపూర్ణంగానూ, సాకల్యంగానూ పరిశీలించవలసివుంటుంది. అ(గ్రవర్థాల, నిమ్నవర్గాల జీవితాల్లో పరిస్థితులు కాలానుగుణంగా అనేక మార్పులు చెందాయి. ఒకప్పుడు అన్నింటా తామే ఉన్నా అగ్రవర్గాలు నిమ్మవర్గాలకు ప్రభుత్వం కల్పించిన రాయితీలు, రిజర్వేషన్లు చూసి, అకారణంగా తాము వెనకబడి పోవడం గమనించి ఈ అ(వర్ణంలో ఎందుకు పుట్టాంరా? భగవంతుడా! అని చలపతిలాంటి (బ్రాహ్మణ భూస్వామి కొడుకు విలపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నవల వాస్తవిక్క అధివాస్తవికలకు ప్రతీక. ఎవరికీ వెరవక రచయిత్రి రాసిన కొన్ని సంభాషణలు ఆమె సాహసౌద్ధత్యాన్ని తెలియజేస్తాయి. నిబద్ధతగల రచయిత్రిగా అచ్యుతవల్లిని ఈ నవల నిలబెడుతుంది. ఉద్యమాలతో అవసరంలేకుండా పరస్పర సహకారంతో సమ సమాజాన్ని నిర్మించుకోవచ్చు అన్ని వర్గాలవారు ఒకటై అన్న ఐక్యతా నినాదం, సంస్కరణవాదం పెద్దపీట వేయించుకున్నాయి ఈ నవలలో. నూరుతున్న విలువల్ని ప్రస్ఫుటంగా, వాస్తవంగా చిత్రించిన నవల కొడిగట్టిన దీపాలు. మారుతున్న సమాజంలోని మార్పులను కొడిగట్టిన దీపాలు ఎత్తిచూపితే మారని మధ్యతరగతి మనస్తత్వాలు, కుటుంబ కట్టుబాట్లకు దర్పణం పట్టింది “ఎగిరే పిట్టలు' నవల, (౪) ఎగిరే కట్టలు 19 6 4లో వెలువడిన ఈ నవలలో మధ్యతరగతి జీవితాలను అతివాస్తవంగా చిత్రించారు. అచ్యుతవల్లి, “ఎగిరేసిట్టలు'లో పాత్రలు సాహిత్యపాత్రలుగా కనిపించవు, మనకిబాగా పరిచయమైన వ్యక్తులే పాత్రలయినట్టనిపిస్తుంది. మారుతున్న సమాజంలో మారలేని వ్యక్తి ఎంత అసమర్శ్భుడుగా జీనిస్తాడో అప్పాదొరై పొత్రద్వారా నిరూసిస్తారు రచయిత్రి. సామాన్యజీవితాలుగా కనిపించే వసుంధర, అప్పాదొరైల బతుకులు ఎంత వేదనామయమో, మధ్యతరగతి జీవితాల్లో ఆడపిల్లకి పెళ్ళవగానే సంగీతం, ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కెబి.లక్ష్మి - 79

నృత్యంలాంటి కళలు ఎలా అక్కరకు రాకుండా పోతాయో అద్భుతంగా చిత్రించారు. ఎగిరే పిట్టకీ నీలాకాశం, వచ్చని చెట్టు మాత్రమే గుర్తుంటుంది. కానీ పెళ్ళిచేసుకుని అత్తారింట అడుగుపెట్టిన వసుంధర సంజరంలో బంధించిన కోకిల అయిపోతుంది. ఓ పక్క అత్తగారి సాధింపు. పరోపక్క తెలుగుట్యూటర్‌గా ప్రబంధాలు పఠించిన అప్పాదొరై సన్నగా నల్లగావున్న వసుంధర ప్రబంధనాయికలా లేదని, శృంగారానికి తగదని భావించి నిర్లక్ష్యం చేసేవాడు. తనని అన్నా భరిస్తుందిగానీ తండ్రిని తూలనాడితే భరించలేకపోతుంధి. మాటకి మాట అంటుంది. ఆ తర్వాత ప్రాధేయపడినా వినక ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాడు అప్పాదొరై. పుట్టింటికి వెళ్ళకుండా సంగీతం చెప్పిన మాష్టారింటికి వెళ్ళి ఆయన అండదండలతో గొప్ప విద్వాంసురాలవుతుంది. కీర్తి కనకం సంపాదిస్తుంది. స్వార్ధంతో వెళ్ళగొట్టి, అన్నీ పోగొట్టుకున్న భర్త తిరిగి రమ్మంటే రానంటుంది. ఆ స్థితిలో కూడా తన దగ్గర వయొలిన్‌ వాయించే తన కొడుకు వయస్సువాడితో శారీరక సంబంధం అంటగడితే ఆమె గుండెను చిక్కబట్టుకుని నిష్క్రమిస్తుంది అక్కణ్డుంచి. మధ్యతరగతి జీవిత సత్యాలకి వాస్తవికళాదర్పణం “ఎగిరే పిట్టలు'. తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోడానికి “ఎగిరేపీట్టలు'లో వసుంధర జీవితాంతం పోరాడవల్సి వచ్చింది. సమాజంలోని మూధనమ్మక్షాల్ని కుటుంబ ప్రయోజనానికి అనుగుణంగా మలుస్తుంది' “నేను దేవిని కానులో సావిత్రి. (1/1) నేను దేవినికాను నిరుపేద పురోహితుని కూతురుగా వుట్టిన సావిత్రి ఇద్దరు అన్నలకు చెల్లి, ఒక తమ్ముడు, చెల్లెలికి అక్క. తల్లి అనార్యోగ్యం, తండ్రి పేదరికం ఆ పద్నాలుగేళ్ళ పిల్లకి అభ్యుదయం నేర్పుతాయి. పాలుపోసీ నిమ్మవర్గ కావుల శారదమ్మ, ఆమె కొడుకు నారాయణ ఆమె స్నేహితులు, ఆత్మీయులు. అ(గ్రకులంలో పుట్టినా నారాయణను ప్రేమిస్తుంది. పెళ్ళిచేసుకోమని అడుగుతుంది. నువ్వంటే ప్రేమేగాక పవిత్రభావం కూడా. స్నేహంగానే వుందాం పెళ్ళివద్దంటాడు. కారణాంతరాల వల్ల తల్లీకొడుకులు ఊరొదిలి వెళ్తారు ఇల్లు, పొలం అమ్మేసుకుని. తండ్రి బ్రాహ్మణీతరుల దగ్గర యాయవారం చేయలేక పొరుగూరికి వెళ్ళి దొరికిననాడు స్వయంపాకం తెస్తాడు. లేనినాడు లేదు. ఊళ్ళో ఏ పనికి వెళ్ళినా మీరు బ్రాహ్మలు, ఈ పని చేయకూడదు, ఆపని మాది" అని తరిమేస్తుంటారు ఐ.వియస్‌, అచ్యుతనల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 80

సావిత్రి అన్నలని. తోటకి కాపలాగా సావిత్రి కుటుంబాన్ని వుండనిచ్చిన నృ సింహనాయుడు తోటని అమ్మాలనుకుంటాడు. సావిత్రి అన్నలు, అవధాని, శాస్త్రి నిమ్నవర్గాలతో కలిసిమెలిసి, నచ్చజెప్పి బల్లకట్టునడిపి, కూలిపని చేసి ఇంటిని ఆర్థికంగా ఆదుకుంటుంటారు. ఈలోపల తోట అమ్మకానికి వచ్చిన రాయుడి దృష్టి సొవిత్రిమీద పడుతుంది. సావిత్రిని తనతో పంపమని అవధానిని అడుగుతాడు. మరికొద్ది రోజుల్లో వస్తానని నమ్మబలుగుతుంది.సొవిత్రి. ఆ పతనాన్ని తప్పించుకోడానికి పథకం ప్రకారం సావిత్రి “దేవిగా మారుతుంది. ఊరి ప్రజలు నీరాజనాలు పడతారు. మహత్యాలు కనిపిస్తాయి. కాకతాలీయవేం అయినా అవి నిజవుని. ప్రజలు నమ్ముతారు: తేజోమూర్తిలాంటి సావిత్రిలో మహిషాసురమర్దనిని చూస్తాడు. సాష్టాంగపడి, వెనుతిరిగి వెళ్ళిపోతాడు. శ్రీదేవి నిలయం సిరిసంపదలతో తులతూగుతుంది. దేవిపేరు పేపర్లలో. మారుమోగుతుంది. అదిచూసి పెళ్ళయి ఎన్నేళ్ళయినా పిల్లలు పుట్టని తన భార్యని తీసుకొని నారాయణ, శారదమ్మ వస్తారు. నారాయణ సావిత్రి దేవి కాదని ఆమైవల్లే నిజం తెలుసుకుంటాడు. అతను పీల్లా పాపల్లో సుఖంగా వుంటాడు. సొవిత్రి తన జీవితాన్ని కుటుంబానికి ధారపోస్తుంది.

మానవ బలహీనతలు, నమ్మకాలు, ఆశలు నిరాశలను వాస్తవికంగా చిత్రించిన నవల, కుల వివక్షత, పేదరికం ఎంత వాస్తవాలో కల్పనలైన మూఢవిశ్వాసాలు అంతే అపద్ధర్మాలు జీవితంలో అని తెలియజేస్తుందీ నవల. తన పొత్రల్ని వాస్తవిక దృక్పధంలో సహజధోరణిలో అభ్యుదయ బాటలో నడిపించిన రచయిత్రికి మూఢనమ్మకాలపట్ల నిరసనవున్నా సామాజిక వాస్తవికతను బలంగా చెప్పడం గమనార్హం. ఎక్కడ రాయిఉన్నా రప్పవున్నా దేవుడనగానే వెళ్ళి కొబ్బరికాయలు కొట్టే ప్రజలే, నిన్నటిదాకా తమతో తిరిగిన వ్యక్తి తెల్లవారేసరికి దేవిగా మారిపోవడం, పథకం ప్రకారం వాళ్ళకుటుంబ సభ్యులు ముందే పాతి పెట్టిన విగ్రహాలు తవ్వకాల్లో దొరికినట్లు చూస్తే సాగిలపడి మొక్కి వ్యక్తి ఆరాధన చేయడం సామాజిక వాస్తవికతే. అయితే కధా సంవిధానంకోసం దాన్ని కల్పనగా చిత్రించి వాస్తవికవాదంతో ఒప్పించి గెలిచింది అఆచ్యుతవల్లి కథనం.

సామాజిక వాస్తవానికి “నేను దేవినికాను" పెద్దపీట వేస్తే సినిమూ నవలల పోటీల్లో గెలుపొందిన “తీరం చేరిన కెరటం” స్తీ త్యాగాన్ని సరళ సుందరంగా కళ్ళకు కడుతుంది.

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మీ - 81

(4 తీరం చేరిన కెరటం అనాధాశ్రమంలో పెరిగి, 'అందగాడైన వేణుగోపాల్‌ని వివాహమాడి చిన్నారి చిన్నకి తల్లి అయిన నీల స్నేహితురాలి పెళ్ళికి వెళుతూ రైలు ప్రమాదంలో లోయలోపడిపోతుంది. చిత్రకారుడైన జమిందారుకొడుకు మురళి ఆమెను రక్షించి ఇంటికి తీసుకెళ్తాడు. అంతా బాగానే వుంటుందిగానీ నీల పూర్వ స్కృతి కోల్పోతుంది. ఆమె సౌందర్యానికి ముగ్గుడై ఆమె తనకోసం వచ్చిన రాధగా భావించి ఆరాధిస్తుంటాడు మురళి. ఆమె ఫొటో పేపర్దోవేయించడు, ఎవరైనా తీసుకెళ్ళి పోతారని. దాంతో ఆచూకీ తెలియక ఆమె చనిపోయిందనుకుని చిన్నిపిన్నీ అనిపిలిచే ఎదురింటి గీతను పెళ్ళిచేసుకుంటాడు గోపాల్‌ ఓసారి గోపాల్‌ స్నేహితుడైన మురళి నీలను తీసుకుని గోపాల్‌ వూరికి వస్తాదు. అక్కడ చిన్నిని, పరిసరాల్ని చూసి నీలకు స్మృతి వస్తుంది. కానీ గీత గోపాల్‌ భార్య అవడం "గ్రహిస్తుంది. మురళి మరదలు సుధకి అతనిపై అనురాగవంని తెలుసుకుంటుంది. ఎవరికీ తెలీకుండా ఆస్ప(త్రినుంచి మాయమైపోతుంది. తిన్నగా ఒక స్వామిజీ ఆశ్రమానికి వెళ్ళి దీక్ష ఇప్పించమని వేడుకుంటుంది. వయసు చాలదంటాడాయన. తన దీనగాధ వినిపిస్తుంది. 'భవసాగరంలో ఒంటిగా ప్రయాణించి, అలసిసొలసి తీరం చేరిన చిరుకెరటానివి నువ్వు అని ఆయన దీక్ష ఇస్తాడు. జీవితంలో ఎదురుదెబ్బలు తగలడం సహజం “నానాటి బతుకు నాటకము" అని తెలిసినా మనిషి వాస్తవంకంటే కల్పననే ఎక్కువగా ఇష్టపడతాడు. ' టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసీ ప్రీక్షకుడు తనకి జీవితంలో దొరకని తళుకుబెళుకుల్ని, తాత్కాలిక వినోదాన్ని తెరపైన చూసి ఆనందిస్తాడు. అంతేగాని దాంట్లో వాస్తవికతకోసం వెతకడు. వెతికితే స్వస్నభంగమే! తీరంచేరిన కెరటంలో రైలు ప్రమాదం, ప్రాణాలు దక్కడం, విస్కృతి కలగడం వాస్తవాలైనా మిగతా సన్నివేశాలన్నీ కల్పనాయుక్త నాటకీయతను సంతరించుకున్నాయి. జీవన వాస్తవాలను, జీవిత నాటకాన్ని (లైఫ్‌ద్రామా) అద్భుతంగా చిత్రించగల ప్రవీణ అచ్యుతవల్లి సినిమా నవలల పోటీకోసం ఈ నవలని సినిమాటిక్‌గా రాయడంలో ఆశ్చర్యం లేదు. సన్నివేశ కల్పన సినిమాటిక్‌గా వున్నా మానవ మనస్తత్వ చిత్రీకరణలో వాస్తవికతకు దూరంకాని కథనం అద్భుతం. ప్రలోభాల ప్రవాహంలో కొట్టుకుపోతూ చివరికి తాత్వికతను, ఆధ్యాత్మిక చింతనను ఆలంబనగా చేసుకున్న గృహిణి జీవిత చిత్రణ వాస్తవికతా కల్పనా చమత్కతుల మిశ్రమం, వవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా, కె.బి.లక్ష్మి - 862

పవాదసూచికలు

1... కాత్యోయనీ విద్మహే - తెలుగు వచన రచనా పరిచయం- 5-6 విభాగాలు : “= పుట - 273

  1. సీతకలలు

  2. 10106-

  3. ౬గ|గ 2౧1౧980౦ - ౦|౧॥64౧౦౦౮ 2౧6౮ 900190

  4. సీతకలలు .

  5. శర!6!౯- "౧౦౦16౧౧5 0 %*66౧0౦515' - ౧౧-215

  6. ఇదిమల్లెల వేళ - పుట - 261

  7. ఆగగ౦గ౬౯॥ ౮2౧ - ఉగ 1౧ళంయంంయ4ంగ 10 గ౧౪9/౦౧౦|౦ర్రా/

  8. కానుక -పుట- 15

  9. 1016-పుట 73 కన

  10. 1016-వుట - 99

  11. 86౯౧7౧41౫౦ 820556 = [12౧12965 2౧61 [40౧213 ౭౮౪ - 61.

  12. 16౧౧౪౪ ౧6౧౧౭602 -

  13. గ.5. గంగం68/211 - ౨౧6౧౧౦౧4౧1 12౧25014 - ర-53 - న0119066 1౧ - 8౧2౧21-1963

  14. డా.సి. ఆనందరామం - తెలుగు నవలల్లో కుటుంబ జీవనచిభ్రణము నవజ్యోతి పబ్లికేషన్స్‌ - 1979.

  15. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - ప్రేమించని మవసులు

  16. 1016

  17. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - భ్రమరగీతం - సీరియల్‌ - జగతి మాసపత్రిక 1987-88 - ఎన్‌,.ఆర్‌. చందూర్‌

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి-83

  1. 1016

  2. 1016

  3. 1016

  4. 1016

  5. 1016

  6. 1016

  7. 10161

  8. 1016

  9. 1016

  10. 10106

  11. 10164

  12. 1016

  13. 10164

  14. మహతి - యువభారతి - భారత స్వాతంత్ర్యరజతోత్సవ ప్రచురణ - 197 2.

  15. సంజీవదేవ్‌ - మహతి - యువభారతి ప్రచురణ - 1991.

  16. నివేకానందలహరి - యువభారతి - 30వ వార్షికోత్సవ ప్రచురణ - 199 4 -పుట - 101

  17. పురాణం సుబ్రహ్మణ్యశర్మ - యువతీ - యువకుల సమస్యలు - యువత = పుట9ి6

  18. ఐ.వి.యస్‌ అచ్యుతవల్లి - ఒడ్డుకుచేరిన ఒంటరి కెరటం - క్వాలిటీ పబ్లిషర్స్‌

  19. 1016-పుట - ౩4

  20. [016-పుట- 1 05

  21. దెంగ్ర500౧-7౧6 ౧౧|౦9౦౧౧౫ 01 1116 - ని౭గర41౧౧ ౧౪౦016240౧ ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 84

  22. పోరంకి దక్షిణామూర్తి - కధానిక - స్వరూస స్వభావాలు - పుట-5 78

  23. ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి ప్రేమగండం-పుట-14 ౬15500 ప్రచురణ

  24. [01ర-పుట - 142

  25. 10160-పుట - 142

  26. 10160-పుటలు - 138, 139

  27. డాక్టర్‌ పరిమళా సోమేశ్వర్‌ - ఐ.వి.యస్‌. అచ్యుళవల్లి సాహిత్యంలో వైవిధ్యం

  • అచ్యుతవల్లి సాహితీ సమాలోచన సదస్సు - పత్రం యువభారతి - 2600
  1. ప్రమ గండం

  2. రచన - విలువలు, భాధ్యతలు, దృక్పధాలు - యువభరతి - 1970

  3. ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి - కోరిక - పుట - 3౩5 - క్వాలిటీ పబ్లిషర్స్‌

  4. 1016- పుట - 35.

  5. 1016- పుట - 36

  6. 10%6-పుట - 38

  7. [016-పుట-9 1

  8. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - పులూ - ముళ్ళు - పుట - 61

  9. 1016-పుట - 83

" క5్‌. [016-వుట - 243

  1. ఆరుద్ర -. సినీవాలి - పుట - 19

  2. ఆరుద్ర - త్వమేవాహం-పుట - 29

  3. డా. సీనారె - ఆధునికారధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు

  • పుట - 639
  1. డా. జి. లలిత - సమాలోచనం - నవల - మహిళ వ్యాసం, ఆంధ్ర్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురణ - జనవరి 1980 - పుట - 215

ఐ,వి.యస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫| డా, కెబి.లక్ష్మి - 85

ళ€. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - పుట్టిల్లు - పుట - 129 61. సంజీవదేవ్‌ - అలరిప్పు - మూడుముళ్ళు ముందుమాట - పుట -1 నవజ్యోతి పబ్లికేషన్స్‌ - ఏలూరురోడ్డు - విజయవాడ - 2 62. ఐ.వియస్‌. అచ్యుత వల్లి - కొడిగట్టిన దీపాలు - పుట 184 63. పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు - తెలుగు నవలాసాహిత్యవికాసం - 19 7 4 డిసెంబర్‌, వైయస్‌ ఫ్రెస్‌- ఖమ్మం. 64. ఐ.వి.యస్‌, అచ్యుతవల్లి - ఇదెక్కడి న్యాయం - పుట - 127 65. 19016-పుట - 58 66. 1016-పుట- 197 67. వుల్లాభొట్ల వెంకటేశ్వర్లు - సమీక్ష - తెలుగు నవలా వికాసం- 1 9 7 4 68. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - నేను దేవిని కాను-పుట-8 5-19 8 2 69. 1016-పుట-85 70. 1016 71. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - కానుక - క్వాలిటీ పబ్లిషర్స్‌ - ప్రథను ముద్రణ ఆ 1976 72. ఐ,వియస్‌. అచ్యుతవల్లి - కొడిగట్టిన దీపాలు - పుట - 15 " 73. కొడవటిగంటి కుటుంబరావు - రచనలలో సామాజిక స్వరూపం - (వ్యాసం) రచన - యువభారతి ప్రచురణ 1970 - వుట - 110 74. 101-పుట్‌-110 75. కె.రామలక్ష్మి - మారుతున్న సమాజంలో నవల - (వ్యాసం)-రచన - వుట 205 - యువభారతి ప్రచురణ ఐంవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫8 డా. కె.బి.లక్ష్మి - 66

పాత చిత్రణ - ప్రాముఖ్యత

సంఘ జీవితానికే గాక్క సంఘంలో స్రీ వురుషుల జీవన సంబంధాలకీ, వారి మానసిక చైతన్యానికి అక్షరరూపం ఏర్పడి సాంఘిక నవల ఎంతగానో. సుసంపన్నమైంది. “ఆ దశకంలో సమాజానికి కావల్సిన వస్తువును ముందు చూపుతో అందించిన 'మాలతి', “చలపతి, 'జానకి, 'కామేశ్వరి", 'సంగీతి, 'నుమని వంటి విలక్షణమైన పాత్రలను సృష్టించి కాలానికి నిలబడిన రచయిత్రి అచ్యుతవల్లి”1.

అమె చిత్రించే స్త్రీ పాత్రలన్నీ సామాజికంగా, ఆర్థికంగా పురుషాధిక్యతను అంగీకరించి సహించే కుటుంబాలనుంచి వచ్చినవే. ఐనా కొన్ని ప్రత్యేక పరిస్థిత్తులవల్లనో, . స్వతంత్ర మనస్తత్వం వల్లనో కొందరు స్త్రీలు కట్టుబాట్లను ఉల్లంఘిస్తారు. వారు నిర్చలులుగ్కా నిస్సహాయులుగా వుండకుండా అనుకున్నది సాధిస్తారు.

“నవలా రచయిత చేతిలో వున్నది ఒక మాజిక్‌ లాంతరు. దానిద్వారా రచయిత తను అనుకున్నవి, పాఠకులకి కావల్పినవీ కూడా ప్రదర్శించవచ్చు. ఎటువంటివి సృష్టిస్తున్నారనేది ఆ వ్యక్తిని బట్టి వుంటుంది. ఉత్తమమైన నవలకు కావల్పినది పుష్టిగల కథ, అనువైన పాత్రలు. ఆ పాత్రలు సామాన్యపాఠకునికి సన్నిహితంగా వుండాలి. ప్రతి రచయితకి తన రచనద్వారా, పొత్రలద్వారా వీవో కొన్ని అభిప్రాయాలు చెప్పాలనివుంటుంది. దాన్నే సందేశమంటారు. ఈ సందేశం మనకి మాటలలో చెప్పకపోవచ్చు. కాని మనకి స్ఫురింవచేస్తారు. ఇక కధ నడిపించే విధంలోనే సంభాషణల బిగువు కూడా ఇమిడి ఉంటుంది. అన్ని నవలల్లో నిర్దుష్టమైన సంభాషణలు కనబడవు. కొందరు నవలను చిత్రపటంలా చిత్రించుకుంటూ వెళ్తారు. ఆ బిత్రణలో పాత్రలు మాట్లాడవు. వనులు చేస్తాయి. మరికొందరు పాత్రలచేత మాట్ట్లాడిస్తారు. అటువంటప్పుడు సంభాషణలోనే రచయిత భావాలు చాలామటుకు బైటపడతాయి”2. ఈ విధంగా అచ్యుతవల్లి పాత్ర చిత్రణ సమర్ధవంతంగా వుంటుంది.

ఇతివృత్తం జీవిత వాఖ్యానమన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకుంటే, ఇతివృత్తానికి పాత్రల ఎడతెగని సంబంధం వున్నప్పుడే కధాకధనం మనోహరంగా . ఉంటుంది. పాత్ర చిత్రణ నవలకు అతి ప్రధానమైనది. పాఠకుడిలో సానుభూతిని రేకెత్తించి రసానందాన్ని కలిగించేందుకు ప్రధానంగా తోడ్పడేవి పాత్రలే.

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలల్లో అన్నిరకాల పాత్రలున్నా ఆదర్శపాత్రల

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం 8% డా. కె.బి.లక్ష్మి - 87

చిత్రణకు, ప్రత్యేక వ్యక్తిత్వం, ధీరత్వం వున్న పాత్రల చిత్రణకు ప్రాముఖ్యం ఎక్కువ సామాన్య పాఠకునికి సన్నిహితంగా ఉంటాయి. ఆ పాత్రల వ్యక్తిత్వానికి అనువుగా సంభాషణల్ని, సంఘటనల్ని జోడించడం మరోనిశేషం. అచ్యుతవల్లిరచనా విధానంలో వైవిధ్యం వున్నట్లుగానే పాభ్ర పోషణలో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. ఇతరుల ఆనుభవాలను తాననుభవించగల పరిశీలనా శక్తి అచ్యుతవల్లి ప్రత్యేకత. అచ్యుతవల్లి నవలల్లో కుటుంబ జీవితానికి సంబంధించిన పాత్రలు, ప్రేమైెకపాభ్రలు, సందేశాత్మక పొత్రలు, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పాత్రలు, మనో విశ్లేషణకు సంబంధించిన పాత్రలు, పరిణామశళీలక పొత్రలు, వరిణొమ రహిత పాత్రలు, ఆదర్శవాద పాత్రలు, ధీరత్వం, స్వతంత్ర ప్రతిపత్తిగల పొత్రలు, అధీర పాత్రలు మొదలయిన పాత్రల చిత్రణ వుంది. అచ్యుతవల్లి నవలల్లో స్త్రీ వ్యక్తిత్వ వైళిష్ట్రంతోమాటు, జీవితంలో అనుభూతి వైవిధ్యానికి కూడా సాహసంతో అన్వేషిస్తున్నట్లు పాత్రచిత్రణ జరిగింది. సంప్రదాయానికి, మారుతున్న స్త్రీకి అనివార్యంగా సంభవించే ఘర్షణ కూడా ఈమె పొత్ర చిత్రణలో వుంది. కాల్పనికవాదం తాలూకు ప్రణయం, ప్రేమ సంఘర్లణా వుంది. అచ్యుతవల్లి పాత్రలు నేటి యువతుల మనస్తత్వానికి ప్రతినిధులు కూడా. నేటి స్త్రీ కోరుతున్నది వివాహం సుఖహ్రదం కావాలనేకాదు, వ్యక్తిగా స్వతంత్ర ప్రతిపత్తి. అంటే సంఘంలో గృహిణిగానేగాక ఇతరత్రా ప్రత్యేకవ్యక్తిగా తనకు గణన, వికాసమూ వుండాలని. ఆ అన్వేషణ ఫలితంగా లోకంలో ఏర్పడే సంబంధాలలో ఆమె ఓటమి, గెలుపు సుఖదుఃఖాలు (ప్రాధాన్యం వహిస్తున్నాయి. ఇక్కడ సెక్స్‌కీ, రొమాన్స్‌కీ ప్రమేయం వున్నా అది వ్యక్తిత్వ నిరూపణలో ఒక సాధనమో, అవరోధమో తప్ప దానికదే లక్ష్యమైన విషయలాలస ప్రవృత్తి కాదు”3 అన్న విషయం అచ్యుతవల్లి పాత్ర చిత్రణా పాముఖ్యాన్ని విశదీకరిస్తుంది. నవల సవుగ్రజీవిత చిత్రణ అయినపుడు స్త్రీలు, పురుషులు, ప్రధానపాత్రల్లోను సహపాత్రల్లోను వివిధ మనస్తత్వాలతో నవల సమగ్ర చిత్రణకు చోడ్పడతారు. కనుక స్త్రీపాత్రలనేగాక ఆయా నవలల్లో ప్రాముఖ్యత వహించిన పురుష పాత్రలను కూడా ప్రస్తావించడం సముచితం. తదనుగుణంగా స్త్రీ పురుషపొత్ర చిత్రణలో రచయిత్రి సమన్వయ దృష్టి ఎన్నదగినది. ఐ,విఆయస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ రా, కె.భి.లక్ష్మి - 86

కురుకపాత్ర చిత్రణ

అచ్యుతవల్లి నవలల్లో మధ్యతరగతి కుటుంబ జీవితం ఎక్కువగా చిత్రించబడింది. వుధ్యతరగతి కుటుంబంలోని పాత్రలు ఆర్థికపరమెన' ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. ముఖ్యంగా పురుష పాత్రలు బాధ్యతల్ని నిర్వహించడంలో విస్మరించడంలో, నిరాశానిస్సృహల మధ్య ఓర్పుతో, నేర్పుతో నిండుజీవితాన్ని నిలబెట్టుకోవడంకోసం తాసత్రయపడుతుంటాయి. అనుకున్నది అందితే ఆనందం, లేదంటే విషాదం. కొందరు. ధైర్యంతో నిలబడితే, కొందరు అంతా విధి దేవుడిదయ అని తాత్విక వేదాంతచింతనను ఆశ్రయిస్తుంటారు.

కొన్ని రచయిత్రి ఆదర్శానికి ప్రతినిధులుగా నిలబడితే, కొన్ని పాత్రలు కథానుగుణంగా సాగిపోతుంటాయి. రచయిత్రి ఆదర్శానికి భుతినిధులయిన పాత్రలు ; (ఏ) రామం ; 'సీతకలలు” లో రామం మధ్యతరగతి కుటుంబ యజమాని అక్షళాలను, మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్నవాడు. మొదటినుండి చివరిదాకా రామం వ్యక్తిత్వ నిరూపణ సముచితంగా సాగింది, మొదట్లో 'ఇదేం మొగుడురా బాబూ!” అనిపించినా కథాగమునంతోబాటు నడుస్తున్న పఠిత కథానాయిక సీతలాగే 'భర్తంటే ఇలా వుండాలి. ఏ ఆడపిల్లకయినా ఇలాంటి భర్తకావాలి అనుకునేలా వుంటాడు. రామం. రచయిత్రి ఆదర్శానికి ప్రతినిధిగా రామం పాత్ర నిలుస్తుంది.

జీవితాన్ని ఒక 'ప్లానొ ప్రకారం నడిపిస్తాడు. కలల్లో, ఊహల్లో బతికే భార్య సీతను నొప్పించకుండానే బతుకు అర్థం తెలియజెప్పి ఒప్పిస్తాడు. 'మగడు మెచ్చిన చాన కాపురంలోన, మొగలి పూలా గాలి, ముత్యాలవాన' అని సీత అనుకుంటూ రామం అలా వుండాలని కోరుకుంటూ వుంటే, ప్రశంసలు, అభిశంసల జోలికిపోకుండా “నీకు నేనున్నాను. నా గుండెలో నీది చెక్కుచెదరని స్థానం" అని భరోసా ఇస్తూ అలవికాని అనురాగాన్ని, ఇతరులు అనూయపడే దాంపత్యజీవన సౌఖ్యాన్ని అందిస్తాడు. భార్యంటే స్నేహం, గౌరవం అని నిరూపిస్తాడు.

రామం చేసేది గుమాస్తా ఉద్యోగం. పెళ్ళిలో ఇచ్చిన నాలుగువేల కట్నం వాటికీ వీటికీ పొగా మిగిలిన ఐదొందలళో వైవాహిక జీవితం ప్రారంభిస్తాడు, హ్యైదరాబాదులాంటి నగరంలో రెండు చిన్నగదుల్లో, కొత్తగా కావురానికొచ్చిన భార్యతో,

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 89

'పేయింగ్‌ గెస్ట్‌లుగా వున్న ఇద్దరు బంధువుల అబ్బాయిలతో, మధ్యలో చుట్టం చూపుగా వచ్చి ఏకుమేకైన అక్కగారితో చాలా కేలిక్యులేటెడ్‌గా, స్థితప్రజ్ఞతతో సంసారం నడిపిస్తాడు. ఎన్నడూ హెచ్చులకు పోడు. పై పెచ్చు పొదుపుగా, నీతిగా, నిజాయితీగా జీవితం గడుపుతాడు. అవినీతికి పాల్పడ్డం, అప్పులపాలైపోవడం, విసుక్కోనడం, సాధించడం, నిరాశా నిస్ప్రహలపాలవడం వుండదు. మాటా చేతా రెండూ ఖచ్చితంగా వుంటాయి. పెళ్ళయిన కొత్తల్లో కూడా భార్యని తీసుకొని పిక్రార్లకి, సినిమాలకి వెళ్ళేవాడు కాదు. "చదువుకుంటాను, కాలేజీకి వెళ్తాను అన్న భార్యతో 'వద్దు' అనడు. కానీ “ఎందుకులెద్దూ కాలేజీకి వెళ్ళడం, రావడం - నుళ్ళీ ఇంటి పనిచూసుకోవాలి, కష్టమౌతుంది” అంటాడు. “నాకేం కష్టంలేదు" అని ఆమెఅంటే 'నోర్మూసుకో' అనడు. “జీతాలు కట్టాలి, పుస్తకాలు కొనాలి, కష్టపడి చదివి తీరా పరీక్షవేళకు నువ్వు “అన్నం సయించడంలేదు, వికారం వస్తోంది" అంటూ మొదలెడితే ఇంత పెట్టబడి వృధాయే"4 అంటాడు - అతని మాటలు ఆమెకు సబబుగానే అనిపించేవి అనేకంటే అతను ఒప్పించిన తీరు అలాంటిది అనడం సబబు. తన స్నేహితురాలు తన ఇంటికి భర్తతో చాలాసార్లు స్కూటర్‌మీద రావడంతో రామంని స్కూటర్‌ కొనుక్కోమంటుంది.

“మనకంత కోరికలుండకూడదు సీతా” అంటాడు.

“మీ ఆఫీసులో పని చేపే సూర్నాయణ, వెంకట్రావు స్కూటర్లు కొనుక్కోలేదూ? మీరు చేసే ఉద్యోగాలే కదా? వాళ్ళూ చేస్తోంది?” అంటే

“వాళ్ళ స్టాండర్డ్‌ అఫ్‌ లివింగ్‌ వేరు. వాళ్లకి వెనకాల తాత తండ్రులిచ్చిన ముత్యాలమ్మ మూట వుంది. మనకేం వుంది" అన్నాడు.

“మా వాళ్ళను అడుగుతాొనంటుంది సీత.

“వేను అడగగలిగితే అలకపానువు మీదే అడుగుదును. నాకు ఒకరిని అడిగి నా సరదాలు తీర్చుకోవాలనే నీరసగుణం నచ్చదు" అని స్పష్టం చేస్తాడు. అంటే స్వయం కృషి మీదే అతనికి నమ్మకం.

ఐ.వొయస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 90

సీత సరదాలు తీర్చలేకపోతున్నానని బాధపడుతూనే అవకాశం వచ్చినపుడు పోన్లే ఖర్చుపెట్టేద్దాంలే అనుకోడు. ఓ రోజు బట్టల కొట్టుకి తీసుకెళ్తాడు. చిరకొనడానికని సీతకి తెలుస్తూనే వుంటుంది. మురిసిపోతుంది. ఇది-బాగుంద్కి అది బాగుంది" అంటూనే వుంది. ఈ లోపల దోసెడు జరీ అంచులున్న. రెండునేత చీరలు ప్యాక్‌. చేయించాడు. పెద్దవాళ్ళ చీరలు అనుకుంటుంది సీత "

“ఈ ఫుల్‌ వాయిల్‌ చీర బాగులేదూ?” అని సీత అంటే

“ఎంత ఆ చీర?” అన్నాడు

“ఢెళ్బయి ఆరు రూపాయలు అవుతుందండీ" అంది సీత.

“ఎందుకు అంత ఖరీదు పెట్టి ఒక్కచీర కొనడం? ఈ చీర ఇరవై రెండేసి రూపాయలకు వస్తోంది. ఇలాంటివి నాలుగు చీరలు కొనుక్కుంటే ఏడాది పొడుగునా విడవాా మడవా కట్టుకోవచ్చు” అన్నాడు. సాధారణంగా ఆడవాళ్ళు ఇలా ఆలోచిస్తారు. కానీ రామం అటువంటి ఆడవాళ్ళ మనస్తత్వంలో పెరిగినవాడు. అందుకే అలా అనగలిగాడు. సంక్రాంతినాడు ఓ చీర కట్టుకుని, రెండో చీరకు కూడా పసుపుబొట్టు పెట్టి కట్టుకోబోతుంటే.

“అది మడత విప్పకు. మా అక్కయ్య వస్తానని వ్రాసింది. అవిడవస్తే ఆవిడకు ఇవ్వవచ్చు ఆ చీర” అంటాడు.

ఓ పక్క వున్నంతలో అవసరాలు తీరుస్తూ, సంప్రదాయం పాటిస్తూ, పొదుపుగా వుంటాడు, కానీ అది పిసినారితనం అనిపిస్తుంది సీతకి, ఆలోచింపచేస్తుంది పాఠకుణ్ణి. అప్పులపాలవకుండా వచ్చిన ఆదాయంతో కొంతమిగిల్చి బ్యాంక్‌లో వేస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించి, వాళ్ళు సంస్కారవంతులై జీవితంలో స్థిరపడ్డాకా - కులాంతర వివాహం చేసుకున్న కూతుర్ని తల్పుకుని బాధపడుతున్న భార్యను దగ్గరికి తీసుకుని “వెంకట్రావు డబ్బు పుచ్చుకోనన్నాడు. పదివేలు వున్నాయి... ఇంక డబ్బు మనం జాగ్రత్తగా దాదాలి, సంసారం పొదుపుగా నడుపుకోవాలి అన్న బాధ్యత లేదు. వచ్చిన జీతం అంతా నువ్వూ, నేనూ ఖర్చుపెట్టుకుందాం. పిల్లలు ఎవళ్ళ ఉద్యోగాలు, సంసారాలు వాళ్ళని. పొదుపు చేసుకుని మేడలు, మిద్దేలు కట్టుకుంటారో, టింగు రంగా అని తిరుగుతారో, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే, వాళ్ళకి నచ్చిన విధంగా నడుపుకుంటారు" అంటాడు.

వ.వి.యస్‌, అచ్యుతవల్లి నవలాసొహిత్యం ౫ డా, కెంబి.లక్ష్మి - 91

అదే సందర్భంలో కూతురు, అల్లుడి చదువుల్లో తేడాలు, కులం గురించి సీత ప్రస్తావిస్తే “అతనికే భార్య తనకన్నా ఎక్కువ చదువుకున్నదీ అని పట్టింపు లేదు. మనకెందుకు?" అది వాళ్ళిద్దరి స్వవిషయం... మనకెందుకు కులం పట్టింపు? దానితో వియ్యం పొందాలా? కయ్యం ఆడాలా? అవి దాని అన్నదమ్ములకు వుండాలి. వాళ్ళూ వాళ్ళూ ముందునుంచీ స్నేహితులాయే” అంటాడు. అతని మాటల్లో, ఆలోచనల్లో, ఆత్రుత, ఆదుర్దా లేవు. ఏదో జరగరానిది జరిగిపోయిందన్న బాధలేదు. తాను అనుకోనిది జరిగిందన్న దుగ్ధలేదు. తన బాధ్యత, కర్తవ్యం తను సక్రమంగా నెరవేర్చాడు గనుక, పిల్లలు ఒకదారిలో నడిచేందుకు మార్గదర్శి అయ్యాడు గనక వాళ్ళ జీవితం వాళ్ళదే అన్న డిటాచ్‌మెంట్‌ ధోరణి అతనిది. మళ్ళీ వాళ్ళందర్నీ ఇంట్లో పెట్టుకుని బాధ్యతల్ని పొడిగించుకోవాలన్న మనస్తత్వం " కాదని స్పష్టం అవుతోంది.

అందుకే పాతికవేలు కట్నం ఇచ్చి తేబోయే ఇంజనీర్‌ను కాదని చిన్ననాటి స్నేహితుడు, తనకన్నా తక్కువ చదువుకున్నవాడు, కేవలం బ్యాంకు ఉద్యోగి అయిన వెంకట్రావ్‌ని చేసుకుంటే బాజాభజంత్రీలతో గొప్పవాడికిచ్చి చెయ్యలేకపోయానన్న భార్య దిగులును తేలిగ్గా తీసేస్తూ.

“నాకేం చింతగా లేదు. ఇంకా అది మనకి - మనం దానికి బాగా చదువు చెప్పించినందుకు ఉపకారమే చేసింది అంటాడు. ఆ అనడంలో ఖర్చు తప్పింది అన్నభావం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. పెళ్ళయిన కొత్తల్లో భార్యకి ఇరవైరెండు రూపాయల చీరకాన్ననాటికి, ఇరవై ఏళ్ల తర్వాత కూతురి పెళ్ళినాటికి ఒకేరకం ధోరణీ కనబడుతుంది.

అలాగే పొతికేళ్ళకే తొలి సంతానం కలిగినపుడు, పురిటికందును చూడగానే మనసు మురిసినా వెనువెంటనే బాధ్యత వెన్నుతట్టి గుర్తుకు వచ్చింది. తనకి నిండా పాతికేళ్ళు లేవ, త్రనకి భార్య, పిల్లలు, సంసారం. వీళ్ళని పోషించాలి. పిల్లల్ని పెద్దచెయ్యాలి. చదువులు చెప్పించాలి. తన రెక్కల మీద ఇదంతా సక్రమంగా నెరవేర్చగలగాలి. దానికి సీత తోడ్పడాలి... అనుకున్న నూత్న యౌవనంలో రామం

భావాలు చివరికంటా నిలబెట్టుకుంటూనే వచ్చాడు. అందుకే చిన్ననాటి కలలు కల్లలయ్యాయని భార్య అన్నప్పుడు “మన ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 92

కలలు మనమే నిజం చేసుకోలేము. అలాంటిది పిల్లలు మన కడుపున వుట్టినవాళ్ళయినా మన కలలు వాళ్ళు నిజంచేస్తారనుకోవడం మన దురాశ అవుతుంది. మన సరదాలు. . మనమే కొనసాగించుకోలేని అబలత్వం మనకున్నప్పుడు, "మన పిల్లలు కానీ ఇంకో - బంధువులుకాని వున కలలకి. రూపం దాల్స్బాలని: అనుకోవడం అవివేకం” అనగలుగుతాడు..

ఇంతగా ఈ పాత్రగురించి చెప్పడానికి కారణం మధ్యతరగతి గృహస్టుపట్ల రచయిత్రికున్న ప్రత్యేక దృక్కోణం గురించి తెలియజేయడానికే. నేల ..విడిచి సాముచేయకుండా సమకాలీన సమాజంలోని బరువు..బాధ్యతలు తెలుసుకుని బతుకులోని కష్టసుఖాలను ఎదుర్కోవలసిన వ్యక్తి-తనకుగా తను, ఇతరులతోను ఏ విధంగా మెలగాలన్నది రచయిత్రి రామం పాత్ర ద్వారా స్పష్టం చేశారు. మధ్యతరగతి జీవిత చిత్రణలో పురుష పొత్రల్లో ఇంత ఆదర్శవంతమైన, అద్భుతమైన. పాత్ర ఇప్పటి దాకా వచ్చిన నవలల్లో ఇదొక్కటే. అదే అచ్యుతవల్లి పాత్రాచిత్య చిత్రీకరణ ప్రతిభ. (నారాయణ : కొడిగట్టిన దీపాలులో నారాయణ కథానాయకుడు. అట్టడుగు వర్గానికి (యానాదికులం) చెందిన నారాయణ తన జీవితానికి తనే ఓ ఆదర్శ లక్ష్యం పెట్టుకుని, ఆ మేరకు కృషి చేసి అదర్శవాదిగా నిలబడతాడు, ఒక విలక్షణమైన వ్యక్తిత్వంగల నారాయణపాత్ర పరిణామశీలమైనది. నవల (ప్రారంభంలో పందులు కాసుకునే తల్లిదండ్రుల భయభక్తుల్లో పెరిగి, తిండికి గతిలేని స్థితిలో అగ్రవర్ణాల భూస్వాముల ఇంట్లో ఉండే మూడో తరగతి కుర్రాడు నారాయణ, తనతోటి పిల్లలకంటే చదువుసంధ్యలన్నింటిలో తెలివిగా, చురుగ్గా వుండేవాడు. పేరుకే నిమ్నవర్గీయుడుగాని తెలివిలో అఖండుడు. పరిస్థితులవల్ల పట్నం వచ్చాకా అదృష్టం, అవకాశం కలిసొచ్చి ఉన్నతస్థాయికి చేరుకుంటాడు. ఈ వ్యక్తిత్వ ప్రస్థానంలోని వరిణామం వాస్తవికంగా వుంది. అందుకు దోహదపడిన వ్యక్తులు, సమాజం, ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకున్న విధానం ఎన్నదగినదిగా వుంది. రమణతో ప్రేమ విషయంలో విఫలుడవడం, అనుకున్న ప్రకారం ఆమెను పరిణయమాడి అ(గ్రవర్ణాలకు చెందిన. ఆ విధవరాలిని, చిన్ననాటి నెచ్చెలిని తనదాన్ని చేసుకోలేకపోతాడు. ఆద్యంతం పాఠకుల సానుభూతిని పొందే పాత్ర నారాయణ.

వెట్టికి వెళ్ళమనీ ఓ సంవత్సరం కష్టపడితే అంతా సర్దుకుంటుందని అన్న

ఐ-వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా. కె.బి.లక్ష్మి - 93

తల్లి మరిడమ్మ మాట నిజమేననిపిస్తుంది. తన కుటుంబాన్ని నడపడానికి తనే నాయకుడిప్పుడు అనుకుంటాడు. ఆ సంతృప్తితోనే పలకా బలపం, చింకి ఎక్కాలబుక్కూ, తెలుగువాచకం తను బట్టలు దాచుకునే ఓ డబ్బాలో, . గోనెగుడ్డలడుగున దాచుకున్నాడు, “తల్లితో “మరటయితే చప్పును గెంజిపోయి, పనికెల్తా అన్నాడు, పద్నాలుగేళ్ళ నారాయణ.

వెంకటరంగయ్యగారింట్లో పనికి కుదిరిన నారాయణ, వెంకటరంగయ్య _ కొడుకు చలపతి, కూతురు రమణ ఒక బడిలో చదువుతున్నారు. చలపతి నారాయణకన్నా రెండు, మూడు క్లాసులు పెద్దవాడు. నారాయణంటే ఇష్టం. రమణది అహంభావం. అగ్రవర్ణ ఆధిపత్యం ఆ పదేళ్ళ పిల్లకి.

“ఆ ఎంగిలి కంచాలుతోము, ఆ పేడ పిసుకు...' అని దాస్టీకం చూపించినా కోపం తెచ్చుకోకుండా ఆపిల్ల ముఖంకేసీ చూస్తూ నిల్చుని ఈ ఊళ్ళో అందరి పిల్లలకన్నా రమణమ్మే బాగుంటుంది అనుకున్నాడు.

ఆలాంటి వాడు సాటి కులస్థుడు సమ్మయ్య చేసిన సాయంతో చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు. కలసవ్యాపారి అయ్యాడు. విధి వక్రించి పొట్టచేతబట్టుకుని ఉద్యోగాన్వేషణలో తన దగ్గరికి వచ్చిన చలపతిని గౌరవించి ఉపాధి చూసించే స్థాయికి

ఎదిగాడు. పెద్దలపట్ల మర్యాద, వృత్తిపట్ల అంకితభావం వుందతనికి. తండ్రి సమ్మయ్య కూతురు మంగళతో పెళ్ళి కుదిర్చినా ధ్యాస పెట్టడు. ఆమె చలపతిని పెళ్ళిచేసుకున్నా మాట్లాడడు. లక్షాధికారి, పలుకుబడిగల ఎమ్‌.ఎల్స్‌ఏ అల్లుడు కాబోయి తప్పిపోయినా బాధపడడు నారాయణ. కారణం రవుణ అతని వునసులో గాఢంగా ముద్రవేసుకోవడమే,

బాల్యంలో పల్లె వదిలేశాక, పెద్దవాడై వ్యాపారి అయ్యాక ఓ రోజు పట్నం రోడ్లో కవబడిన రమణ దగ్గరికి వెళ్ళి “నేను జ్ఞాపకం రాలేదా అండి? నేనండి నారాయణి” అని పలకరించి ఎందుకో తనని తనే పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు బిడియపడతాడు నారాయణ.

జవాబుగా “నువ్వా” అని రవుణ ఆశ్చర్యంగా అనగానే, ఆరెండు అక్షరాలలోను తన దౌర్భాగ్యపు బాల్యజీవితం అంతా తిరగతోడినట్లవుతుంది నారాయణకి, తన బి,కాం చదువు, వ్యాపారం, తన పర్సనాలిటీ, తన అభ్యున్నతిని

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 94

చూసి నిర్వేదపడిపోవడం నారాయణకు నచ్చదు.

మాటవసరకయినా మా యింటికోసారి రా అని ఆహ్వానించలేదనుకుంటాడు. ఆమె తీరు ఎలా ఉన్నా నారాయణ మాత్రం ఆద్యంతం ఆమెసట్ట ఆరాధనా భావం కలిగివుంటాడు. అమె దుఃఖం, కష్టం అతను భరించలేడు:'అందుకే రమణ అతన్ని ఎంతదూరం వృుంచినా మానసికంగా ఆవెకంత దగ్గరవుతాడు. అఖరికి . పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. .

“.మీతోటి వారు పిల్లా పాపల్లో పచ్చగా ' సంసారం చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళు మిమ్మల్ని మీరు వంచించుకుంటారు..:” అనడుగుతాడు.

ఆ మాటల్లో కేవలం జాలి కాదు తాను అట్టడుగు స్థితినుండి అందలం ఎక్కాడు. ఆమె శిఖరాలనుండి కిందికి దోర్గిపోయింది. ఆమె కోల్పోయింది అమెకి తెచ్చివ్వలేడు. కానీ ఆమె తనది కావాలన్న భానం కన్నా ఆమె ఎవుడూ ఆనందంగా వుండాలన్న కోరిక అతనిది. అందుకే

“రమణా, మీరు నన్నెస్పుడూ గుర్తించలేదు. నేనెప్పుడూ మిమ్మల్ని ఆకాశంలో నక్షత్రంలాగే చూస్తున్నాను. మీవూరు వదిలేసిన తర్వాత మళ్లీ మీరు కనబడేలోగా రోజుకోసారైనా మీరు నా మనోనేత్రం ముందు వచ్చి నుంచునేవారు. మీకున్న స్థితిని లోకువచేసుకోకండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ...ఎంతగొనో.. అంతకన్న ఎక్కువ చెప్పలేను5 అంటాడు ఆమె భుజంమీద చెయ్యి వేసి.

భుజంమీద చెయ్యివేయగల ధైర్యం ఆమెపట్ల అతనికున్న ఆరాధన ఇచ్చిందీ అనే దానికంటే పట్నంలో మొదటిసారి రమణని వలకరించినపుడు తానీనాడు ధైర్యంగా రమణలాంటి అగ్రవర్గపు అమ్మాయి ముందు కాలరెత్తుకుని నిలబడి ఆసిల్లను కుశలప్రశ్నలు వేయగల స్తోమత సమ్మయ్య కల్పించాడు అనుకున్న ఆలోచనే సబబు.

తనతో వివాహాన్ని రమణ తిరస్కరించినవుడు .. “అంత తేలిగ్గా మీ నిర్ణయం చెప్పెయ్యకండి, మీరు దేన్నిగురించి భయపడుతున్నారో అదంతా వట్టిభ్రమ... నేను జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నాను. అన్నీ సమకూరుతున్నాయనుకున్న ఈ. తరుణంలో నన్ను చాతకానివాణ్ణి చేయకండి. నన్ను దూరం చేయకండి. నేను మిమ్మల్ని విడచి వుండలేను" అన్నప్పుడు

“కుదరదు నారాయణా. నేను విధవరాలిని. నువ్వు కులంకానివాడివి.

. ఐవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా.కె,బి.లక్ష్మి - 95

మనిద్దరం పెళ్ళాడాలా? ఎలా కుదురుతుంది? నేను ఆత్మహత్య చేసుకోవడం నీకిష్టమైతే నువ్వేం చెప్పినా వింటాను” అని నిర్ణయిం చెప్పేసినపుడు నారాయణ మౌనసికస్థితిని పాఠకుడు కూడా స్వయానా అనుభవిస్తాడు. అంత సహజంగా నారాయణపొత్రను మలిచారు రచయిత్రి. చన వ్యక్తిత్వ వికాసంకోసం కృషిచేసుకున్నా తోటివారిని, సమాజాన్ని గురించి కూడా సహృదయతతో ఆలోచించి ఆదర్శంగా నిలబడ్డ నారాయణ నవలలో పాత్రకాదు, నిజజీవితంలో బాగాపరిచితుడైన వ్యక్తి అనిపిస్తుంది. 'కొడిగట్టిన దీపాలు' నవలలో నారాయణ పాత్రకు భిన్నమైనది 'నేను దేవిని కాను" లోని నారాయణ పాత్ర. (1) నారాయణ ; 'నేను దేవిని కాని నవలలో నాయకుదిపేరు కూడా నారాయణీ, అతనూ నిన్ను కులంవాడే. అయితే కొడిగట్టిన దీపాలు నవలకి భిన్నంగా అగ్రవర్డానికి చెందిన 'బీదింటి సావిత్రి ఈ నారాయణను ్రీమిస్తుంది. ఆమె అతన్ని ఎంత ్రోత్సహించిన్సా ఎంతలా జీవిత సత్యాలు విడమరిచి చెస్పినా చివరిదాకా అతన్ని నిమ్న భావనలు వీడిపోవు. “నీ చేతుల్ని కళ్ళకద్దుకోవాలనిపిస్తుంది. నిన్ను చూస్తీ నాకేకెదో పవిత్ర భావం కలుగుతుంది. ఊరట కలుగుతుంది" అంటాడు సావిత్రితో. ఆకలి, బీదరికం బాధ తాళలేక తమింట్లో స్నేహంగా మెలుగుతూ అపనీ ఈ సవీ చేస్తూ పాలు, అన్నం, కూరలు తీసుకెళ్ళి ఇంట్లో చెల్లెలికి, అనారోగ్యంగొ వున్న తల్లికీ ఇచ్చే సావిత్రి అంటే ఓ విధమైన అభిమానం అతనికి. గ్రాడ్యుయేట్‌ అయి ఉద్యోగాన్వేషణలో తిరుగుతుంటాడు. సావిత్రిని చూసి ఇష్టపడి ఆ పిల్లని పెళ్ళాదేస్టే సాయంచేసినట్టవుతుందనుకుంటాడు. ఆ నారోగ్యవంతురాలైన తల్లికి చేయి సాయంగా వుంటుందముకుంటాడు. తల్లి తిడుతుంది, “ధఛ, తప్పు, పాపం. కళ్ళుపోతాయి. అలాంటి తలంపు మనసులో పెట్టుకోకు" అన్న తల్లిమాటలు నారాయణని గాఢంగా ప్రభావితం చేస్తాయి. వాళ్ళున్న పల్లెలో సావిత్రి తండ్రి దీక్షితులు యాయవారంచేసి సీతా రామాభ్యాం నమః అనడానికి వాళ్ళు తప్ప ఇంకో బ్రాహ్మణ కుటుంబం లేకపోవడం, ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 96

వ్రతాలూ, పూజలూ క్యాసెట్లతో చేసేసుకోవడంతో భుక్తికోసం ఆయన పొరుగూళ్ళు వెళ్ళిరావడంతో, సావిత్రి ఇల్లు నడపడం - కష్టాలన్నీవిని

“తనకి తండ్రి లేకపోయినా, తక్కువ కులం అయినా తల్లి సంకోచవడకుండా గేదెల్ని పోషించి, పాలు, పిడకలు అమ్మి వున్న అర ఎకరం . మడిచెక్కమీద వచ్చే. గింజలనూ జాగ్రత్తగా వాడుకుంటూ తనని గ్రాడ్తుయేట్‌ చేసింది. ఎన్నటికీ తరగని విద్యాధనం తన దగ్గరవుంది. ఉన్నతకులం అయివుండి, తల్లిదండ్రులిద్దరూ వుండీ. సానిత్రి తనని గూర్చి, తన వాళ్ళని గూర్చి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. తోటి కులస్ఫులు వాళ్ళకెందుకు సాయం చేయరు. ఉన్సత కులాలవారు నిమ్నకులాలవారిని అణగదద్రొక్కారనే జన ఘోష తాను సర్వత్రా వింటున్నాడు. మరి ఈ ఉన్నత వేద పాండితీ ప్రకర్షగల కుటుంబాన్ని ఎవరు అణదొక్కుతున్నారు"6. అన్న నారాయణ ఆవేదన రచయిత్రి సామాజిక స్పృహతో, ఆదర్శవాదంగా ఆ పొత్రద్వారా పలికించినవే, అయినా పాత్ర మాట్లాడినట్ట్లుండటం వల్ల సహజత్వం ధ్వనిస్తుంది. బ్రాహ్మణ దళితవర్గం ఏర్పడుతున్నదనిపిస్తుంది.

సావిత్రి దేవి అయి ఆధ్యాత్మికంగా పూజలు అందుకుంటూ మహిమలు గల అమ్మవారిగా లోక ్రసిద్ధి చెందాకా తల్లీ భార్యతో ఆమె దర్శనార్థం వచ్చిన నారాయణను విడిగా కల్పుకుని తను ఎంత నాటకీయంగా అమ్మవారిగా మారిందీ, రాయుడి కాముకదృష్టి గురించీ చెబుతుంది.

“సావిత్రీ నువ్వు దేవివి కాను, కాలేను అన్నావు. కానీ నాకు మటుకు దేవివే. నాకళ్ళకు నీవెపుడూ కనబడుతూనే వుంటావు నక్షత్రంలా.. నీవు నించున్నచోటు చాలా పవిత్రమైంది. నీవు మాకు కులదేవతవి. నిన్ను నేను మనస్ఫూర్తిగా ఆళీర్వదిస్తున్నాను. నాకా అర్హత నీవే కలిగించావు” అంటాడు. అటు స్నేహితురాలిగా, నునసైనదానిగా, ఇటు దేవీమూర్తిగో ఎలా ఆమెని స్వీకరించాలన్న భావ సంఘర్షణ బాగౌ చిత్రితమయింది.

చిన్నవాటినుండీ, అది అభ్యుదయభావన అని తెలియని స్థితినుండీ మనల్ని ప్రేమించి, ఆదరించేవారే మనవాళ్ళు. అందుకు కులం, వర్గం అడ్డంరావు అని గాఢంగా నమ్మి సావిత్రి హృదయాన్ని అర్పించినా నిమ్నభాననతో అందుకోలేని నారాయణ చివరిదాకా అదే ఆలోచనా ధోరణిలో వుంటాడు. అందుకే

ఐవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె,బి.లక్ష్మి - 97

“నీవు ఉన్నతురాలివి సావిత్రీ. నీ పుట్టుక గొప్పది, పవిత్రమైనది... చిన్ననాటినుండీ ఎందువలనో నీకు సాయపడాలన్న ప్రేమవుండేది నాకు. అది ఎలా విశదపరచాలో తెలియక పెళ్ళిచేసుకుంటే సరిపోతుందనుకునేవాణ్ణి. నన్ను ఈ మాత్రం వైతికంగా నిలబెట్టింది మా అమ్మ ఆమె లేకపోతే నేను క్షుద్రమైన, హేయమైన ' పనులు చేసి సంఘంలో ఒక నేరస్తుడిగా నిలబడి వుండేవాడిని” అన్నమాటల్లోనే అతని మనోగతం అవగతమౌతుంది.

(1౪) కేశవ : 'మూడుముళ్ళు' నవలలోని కేశవపాత్ర ఉన్నత మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆదర్శవాద పాత్ర, లక్షాధికారి అయివుండి, ప్రొఫెసర్‌ ఉద్యోగం చేస్తూ భార్యావిహీనుడై ఇంచుమించు తన కూతురంత వయసున్న కామేశ్వరిని పెళ్ళాడతాడు. ఆమెని పై చదువులకోసం కూతురుతోబాటు కాలేజీకి పంపిస్తాడు. పెళ్ళిచూపులుచూసి పెళ్ళిదాకా రాని తప్పిపోయిన పెళ్లికొడుకు రామనాధం తారసవడితే తన భార్య అయిన కామేశ్వరిని సహృదయంతో అతనికిచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు కేశవ. పరపురుషుణ్ణి కన్నెత్తి చూస్తేనే కాల్చి పారేసే భర్తలున్న సమాజంలో కేశవపాత్రను సృష్టించడంలో ఆదర్శంకంటే తాను సుఖపెట్టలేని భార్యని ఆమెకు నచ్చిన, ఆమెమీద సీకలదా్రా (ప్రేమవున్న వ్యక్తి కిచ్చి వివాహం చేయడం ఉత్తమమని భావించిన మంచితనం అనవచ్చు. సొంత భార్యను వురొకరికిచ్చి వివాహం చేసీ భర్తలుంటారా వాస్తవలోకంలో!? అన్న ప్రశ్న ఉదయించడం సహజం. ఉండరని చెప్పలేం. అసలు అటువంటి వ్యక్తులున్నారా లేదా అనే ప్రశ్నేలేదు. కేశవ పాత్రలాంటి వ్యక్తులు వాస్తవ ప్రపంచంలో వుంటే మాత్రమే అటువంటి పాత్రను సృష్టించాలని లేదు. ఎదుటివ్యక్తికి తను అన్యాయం చేశానేమోనన్న భానం కలిగినపుడు మరింత మంచిచేయాలన్న ఆలోచన వచ్చినపడు, వ్యక్తులు తాము వున్న స్టాయికి మించి వ్రవర్తిస్తూంటారు. కేశవ అటువంటి వ్యక్తి. కామేశ్వరి తన వయసులో సగం వయసున్నది కావడం ఒకటి, మొదటి భార్య పోయిన నాలుగునెలలకే తను పిల్లలు పుట్టకుండా ఆపరేషను చేయించుకోవడం ఒకటి అతన్ని యీ విధంగా ప్రేరేసించాయేమో అనిపిస్తుంది అందుకే - “నన్ను క్షమించు కావేఎశ్వరీ! నీకు తీరని ట్రోహం చేశాను. నీకు చెప్పాలనుకుంటూనే ఈ విషయం నీకు చెప్పలేకపోయాను. అందుకే నీకు మరో ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 98

పెళ్ళితలపెట్టాను. నీ లేత ముఖంలోని కోరిక నాకు తెలుసు కామేళ్ళరీ!”? అంటాడు అపరాధ భావం ద్యోతకమౌతుంది మాటల్లో.

అలాగని అతనికి కామేశ్వరిమీద ప్రేమాభిమానాలు లేవని అనుకోవడానికి లేదు. ఆమెతో రహస్యంగా మాట్లాడడానికి రామనాధాన్ని పంపించినపుడు, అతన్ని కొవేంశ్వరి తిట్టి పంపించిన సందర్భంలో 'కేశవకి అవ్యక్తానందంతో శరీరం పులకించిపోయింది. కామేశ్వరి మంచి పిల్ల. ఆ పిల్లని చెంప నిండా ముద్దులతో నింపి, తనలోకి అదుముకోవాలన్న గాఢకాంక్ష అతనిలో బలంగా పాతుకుపోయింది. కేశవ ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకున్నందుకు కుమిలి పోతున్న మధ్య వయస్కుడు కాదు. నూతన తేజంతో చిప్పిల్లుతున్న కొత్త పెళ్ళికొడుకైనాడు” అని వర్ణిస్తారు రచయిత్రి. తన అంతరంగాన్ని తానే మోసం చేసుకుని కేవలం మంచివైపు మొగ్గుచూపే కేశవ. మనస్తత్వ చిత్రణకు దర్శణం ఈ సన్నివేశం.

కేశవది విలక్షణమైన పాత్ర. సౌందర్యాతిశయంతో ఇల్లుపట్టకుండా తిరిగిన మొదటి భార్య రాజేశ్వరిని వల్లెత్తునూట అనడు. రాజేశ్వరి మొత్తం సౌందర్యం కామేశ్వరి కంటి మెరుపులోనే వుందనుకున్నా నవల చివరిదాకా ఆమెను దగ్గరకి తీసుకోకపోవడం, తల్లిలేని పిల్లని నళినిని అతి గారాబంగా చేసి ఆమె ఏంచేసినా అదువుచేయకపోవడం ఒక మేధావిగా అతని పాత్రకి తగని లక్షణొలుగా అనిపిస్తాయి. అయితే అతని ప్రతి కదలికా నిర్హేతుకం కాదని ఆయా సన్నివేశాల ముగింపు, కొనసాగింపు నిరూపించడం కేశవపాత్రను మరచిపోనివ్వవు. (1) చలపతి : 'భ్రమరగీఠం' లో కథానాయకుడు చలపతి. స్కూలు ఫీజు, కాలేజీ ఫీజు కట్టడానికే కష్టమైన మధ్యతరగతి కుటుంబంనుండి వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు తల్లీ తండ్రీ - వాళ్ళ మనసులు నొప్పించకుండా వుండాలని ప్రయత్నం, అందుకే నలభై యేళ్ళదాకా అవివాహోతుడుగానే వుండిపోతాడు. దిగువ మధ్యతరగతి. నుండి ఒక్కొక్క మెట్టూ ఎంతో జాగ్రత్తగా, ఏకదీక్షగా కష్టించి నిర్మించుకున్నాడు. ఆర్థికంగా ఎదిగాడు. జీవితంలో ప్రతివ్యక్తి ఏదో ఒక విషయంలో ఓటమి పొంది తీరుతాడు. చలపతికి చిన్నప్పట్నించీ అన్నీ ఏదోవిధంగా అమురుతూనే వచ్చాయి, . ఒక్క ప్రేమ వ్యవహారం తప్ప. తను ఎన్నుకున్న అమ్మాయికోసం ఎంత సంయమనం వహించినా, ఎంత మంచితనం ఖర్చుచేసినాా ఆ కుటుంబంకోసం ఎన్నిటన్నుల కృ తజ్జతా భావం కుమ్మరించినా భ్రమర తిక్కతనం, స్వేద్చాఫ్రియత్వం అతనికి అశాంతినే

ఐ.వి.యస్‌, అచ్యుతవల్లి నవలాసాహీత్యం ౫8 డా, కె.బి.లక్ష్మి - 99

మిగిల్చాయి. మధ్యతరగతి కుటుంబ నేపధ్యంలోంచి వుట్టుకొచ్చిన ఆదర్శపాత్ర చలపతి. ఎదురింటి వృద్ధ జమీందారు రామజోగి పంతులుగారి దయాదాక్షిణ్యాలతో చదువుకొని ఆయన మనుమరాలు తనకంటే నాలుగేళ్ళు పెద్దదయిన (భ్రమర ప్రేమ ప్రభంజనంలో ఉక్కిరి బిక్కిరై ఆమె మనసుకి చిక్కి కొన్నాళ్ళు బైటవూళ్ళో ఉద్యోగం చేసి ఆఖరికి రామజోగి తాతగారి ఎస్టీట్‌కి మానేజరవుతాడు చలపతి. చెల్లెళ్లకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడు. తల్లిదండ్రుల్ని ప్రేమగా, గౌరవంగా చూసుకుంటాడు. కానీ ఎప్పటికప్పుడు భ్రమర తన జీవితంలోకి శాశ్వతంగా వస్తుందేమోనని ఎదురుచూడ్డంలోనే నిరాశా నిస్పృహలకు గురౌతూ వుంటాడు. సంప్రదాయ, సంస్కృతీ విలువలు నమ్మిన నిజాయితి వుంది అతనిలో. అందుకే అవకాశం వున్నా నమ్మిన సిద్ధాంతాలను వదలి ఆమె వెంట వెళ్ళిపోడు. పెద్దలు కుదిర్చిన కమల తన ఆఫీసులో పనిచేసే అమ్మాయి.

ఈ పిల్లతో జీవితం పంచుకోవాలి తను. ఈమెను సంతోష పెట్టగలడా? తనవల్ల ఏ స్త్రీ కూడా దుఃఖపడకూడదు అని ఆత్మవిమర్శ చేసుకుంటాడు.

జీవితంలో అలజడి అతనికి ఇష్టం వుండదు. ఏదీ దాచుకోకుండా మనసులో మాట చెప్పేస్తూవుంటాడు. అందుకే కమలతో...

“భ్రమర అంటే నాకు అభిమానం వున్నమాట నిజమే. ఆమెకి ఏదన్నా అవసరం వచ్చి “నా పక్కన నువ్వు నిలబడాలి" అంటే కాదనగల దాష్టీకం నాకు లేదు. వా వయసును ఆమె ట్రేరేసించినప్పుడూ నేను వూరుకోలేకపోయాను. దానికి నేను కట్టబడి వుందామన్నా ఆమెకి మన కట్టుబాట్లు, వివాహ బంధాలు ఇష్టంలేవు. నిజానికి నన్ను దూరం చేసుకున్నందుకు ఆమె దుఃఖ పడడం లేదు. ఆమెకి స్వేద కావాలి... అందుకనే ఆమె బతుకులోకి నేను జొారబడ్డంలేదు"॥ అని స్పష్టం చేశాడు.

ఎక్కడో ఓ మూల మళ్ళీ ఎప్పుడైనా భ్రమర తన దగ్గరికి వచ్చి ఏదైనా కోరరానిది కోరుతుందేమోనని ముందే ఊహించినట్లు “ఎప్పుడు ఏస్థితిలో వచ్చినా ఆమెని ఆదరించగల ఉదారతని నాకు మిగల్పాలి నువ్వూ" అనేస్తాడు.

అనుకున్నట్లే ఆ తర్వాత భ్రమర ఓ అర్జ్హరాత్రివేళ కబురంపి, ఓ ఐదారేళ్ళపాపని చూపించి “నీ కూతురే, విశ్వామిత్రుడిని కాకు దానికి రక్షణ కల్పించు, ఐ,వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం 2% డా. కె.బి.లక్ష్మి - 100

చాలు” ను అంటే.

“ఇంత మంచి మాట నాకు ఇంత ఆలశ్యంగానైనా చెప్పాలనిపించినందుకు సంతోషం (భమరా?! నీ మాట నేను కాదనగలనా? అంటూ పాపని గుండెలకి . హత్తుకుంటాడు. ప్రేమ, త్యాగం, బాధ్యత, కలగలసిన మధ్యతరగతి పాత్ర చలపతి. నొస్పింపక, తానొవ్వక, తప్పించుకోకుండా కార్యాల్ని సాధించే అరుదైన మనస్తత్వం. వున్నపాత్ర. పాఠకుడిలో అలోచనను,. సానుభూతిని రేకెత్తించగలిగిన సంఘర్షణా

_. భరిత పాత్ర చలపతి.

చలవతి'పేరున్న మరో ప్రధాన పొత్ర 'కొడిగట్టన దీపాలు” లో కూడా వస్తుంది

ఈ చలపతి అగ్రవర్ణంలో పుట్టి, పట్టభద్రుడై చిన్ననాటి సహపాఠి, అన్నీ కలిసొచ్చి స్థితిమంతుడైన నిమ్నుకులస్టుడు నారాయణ దగ్గర ఉద్యోగం సంపాదిస్తాడు. (/) చలపతి : లౌక్యుడు, అవకాశవాది కాదు. మంచి వ్యవహార జ్ఞానం వున్నవాడు చలపతి. డబ్బు అవసరం అయి నారాయణను అడిగినపుడు “ఒక కాగితం ముక్కవుంటే మంచిది. మనిద్దరి మధ్యా సొమ్ము అడ్డం రాకూడదు. నెల జీతంలో యాఖైరూపాయలు అసలులోంచి కొట్టేసుకుంటూ వుండు". అంటాడు చలపతి, డబ్బువల్ల స్నేహ సంబంధాలు చెడిపోకూడదన్నదే ఆ మాటలకి అర్థం. అలా అనడంవల్ల నారాయణకి చలపతిమీద వున్న సదభిప్రాయం ఇనుమడించే అవకాశంకూడా వుంది. చలపతి ఇవన్నీ అనుకుని చేయకపోయినా అతని ప్రవర్తనే అలా వుంటుంది.

లక్షాధికారి, ఎమ్‌.ఎల్స్‌ఎ. సమ్మయ్య కూతురు మంగళని నారాయణకే ఇవ్వాలనుకుంటారు నిజానికి. కానీ చలపతి ఆమెతో ఆత్మీయంగా, స్నేహంగా వుంటాడు. రచయిత్రే చెప్పినట్లు చదువుకునే రోజుల్లో అతనికేమీ ఆశయాలూ, ఆదర్శాలూ అంటుకోలేదు. దానికి కారణం అతని కుటుంబం ఆర్దిక క్లేశాల్లో పడిపోవడం. అంచేత అతని ధ్యేయం అప్పట్లో ఎలాగో అలాగ ఒక డిగ్రీ తెచ్చుకుంటే . ఎక్కడయినా వందరూపాయలు సంపాదించుకునే మార్గం కలుగుతుంది అనేదే! లక్ష్యంగా వుంచుకొని చదువుకునేవాడు ఇది పాత్రను వరిచయం చేయడంలో వర్ణనాత్మక పద్ధతి.

నిమ్నవర్గాలవాళ్ళు చదువుకుని నాగరికత నేర్చుకోవడంవల్ల చెబితేనేగాని ఎవరైనా ఫలానా కులం అని తెలిసి అవకాశం రా

హం రాాలాం్‌ ల

గ ఖా

బరి 0 జంత 63]641 1 ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫౫ (త్రషి! 101 లం. ర్జు గ్‌.

పట్టిచ్చినా అంతగా పట్టించుకోవడం లేదెవరూ. మంగళా అలాగే నాజూకు తెలిసిన. పడతి. ఆమెను కలసినీపుడు మాటల సందర్భంలో చలపతి “ఈ కులమతాలు మనం కల్పించుకున్నవి, ఏ దేవుడయినా మంచి సంపాదించుకోముని, తోటివారిని హీనదృష్టితో చూడవద్దని, మన సుఖ సంతోషాలు నలుగురితో పంచుకోమనే చెప్పాడు" అంటాడు. “చదువూ, సంస్కారం కలిగిన కుటుంబాలలో తక్కువ కులాలవాళ్ళు కూడా ఎక్కువ కులాలవారికి మాటపొందికలో 'అయితేనేమి, ఆహారపొనీయాదులలో నేమి ఏమీ తీసిపోకుండా వున్నారు...” అని సమానత్వ ప్రసంగాలు చేసేవాడు. తను, ఊహించుకున్న కొన్ని ఆదర్శాలలో ఒకటైనా సిద్ధించాలంటే మంగళ సహకారం అవసరం అని (గ్రహించాడు చలపతి. మంగళని రిజిస్టర్‌ మ్యారేజ్‌. చేసుకుంటాడు. అలా సామాన్యంగా తన చదువేదో, తన పనేదో చూసుకునే చలపతి. ఆదర్శాల నాయకుడ్దైపోయాడు. చలపతి పాత్ర ఓవిధంగా “సపోర్టింగ్‌ పాతి అనికూడా చెప్పాలి. చలపతి పాత్ర నారాయణ పాత్రకి స్వాతంత్ర్యం సంతరించిన కొత్త విలువల నేపధ్యంలో అగ్రవర్ణాల జీవన చిత్రణకి అత్యంత దోహదకారి. వైద్య వృత్తిపరమైన పాత్రలు

రచయితకు సామాజిక చైతన్యంతోపాటు వాస్తవ దృక్కోణం, మానవుల్ని కాపాడే శాస్తాలపట్ల అవగాహన కూడా వున్నప్పుడు వైజ్ఞానిక విషయాలను ఇతివృ త్తపరంగా రచించి మెప్పించే అవకాశం ఎక్కువగా వుంటుంది.

వృత్తిపరంగా వైద్యవృత్తి పరమపవి(త్రమైైనది. సరయిన చికిత్స చేసి ప్రాణాలను కాపాడే వైద్యుడు సాక్షాత్తూ భగవంతుడితో సమానం. అందుకే వైద్యో నారాయణో హరిః అన్నారు. వయసుపైబడి అనుభవపూర్వకంగా గాక నవయౌవనంలో వైద్యవృత్తి చేపట్టిన తొలిదశ నుండీ మమతా, మానవత్వాలను కలిగివుండడం గొప్ప విషయం. (1) డాక్టర్‌ గిరిధర్‌ : 'ఇది మళల్లెలవేళలో డాక్టర్‌ గిరిధర్‌ పాత్ర ఆదర్శవంతమైనది. జీవితంలో ఒక చిన్న పొరపాటువల్ల కాలుజారి, ఇంట్లోవాళ్లకి డబ్బుతప్ప బొత్తిగా వైద్య పరిజ్ఞానం లేకపోవడంతో ప్రాణాలమీదకి తెచ్చుకున్న వదహారేళ్ళ పడుచుని

వఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 102

అత్యంత శ్రద్ధాసక్తులతో తన చికిత్సతో బతికిస్తాడు.

తను పెళ్ళిచూపుల్లో చూసిన పెళ్ళికూతురు ఆరునెలల గర్భవతి అని, మూర్భపోయిన ఆ పిల్ల పద్మను చూసి చెప్నిన మేనత్త డాక్టర్‌ సుశీల మాటలు నమ్మలేకపోతాదు. పెళ్ళిచూపులు దాకా ఆమెక్సీ ఇంట్లో వాళ్ళకీ కూడా గర్భం సంగతి తెలియదంటే, మూడో నెలలోనే ఆబార్డన్‌ చేయించకుండా ఇంతదూరం తెచ్చారంటే నిజంగానే ఎవరికీ తెలీదని గ్రహిస్తాడు. మధ్యతరగతి మనస్వత్వంతో మేనత్త వాళ్ళది మోసం అని నిందించినా అతను. పల్లెత్తుమూాటనడు, ఒక డాక్టర్‌లాగే ఆలోచిస్తాడు.

అంతకు ముందు ఆ అమ్మాయి నీకు తగినది కాదు అని మేనత్త అన్నప్హుడు ఎందువలన? ఏదయినా జబ్బు అయితే చెప్పండి. మనం డాక్టర్లం, జబ్బులకి భయపడవలసిన పనిలేదు. ఎన్నాళ్ళు దూరంగా వుండమన్నా వుండగలను అంటాడు. ఈ మాటల్లో పద్మమీద ప్రేమ భావం ఒకటైతే, ఎటువంటి అనారోగ్యాన్నయినా తీసిపారెయ్యగలనన్న డాక్టర్‌ ధీమా ఇంకోటి.

హౌస్‌ సర్జన్సీలో తనకి పోస్టింగ్‌ వచ్చిన ఆస్పత్రిలోనే పద్మని ఉంచడం, ఆమె పెద్దన్న శ్రీపతి ద్వారా సంగతంతావిని 'తెల్లవారిలేస్తే పేపర్లో అన్నీ రేప్‌ వార్తలే. మగవాడికి ఒక క్షణం వేడుక స్త్రీకి జన్మజన్మలకి సరిపోయే శిక్ష విధిస్తుంది, ఆడదానికొకనీత్తి మగవాడికొక నీతి. ఈ సమాజ నియమ నిబంధనలు ఎంత నికృ ష్టంగా వున్నాయి%10 అనుకున్న అతని మనో భావనలోనే మంచీ చెడుల విచక్షణ, మానవత్వం ద్యోతకమవుతున్నాయి.

పద్మది సెప్టిక్‌ అబార్డన్‌ కేసని, ఇంకా థ్రైసిస్‌ నుండి టైట పడలేదని, రిపోర్టులు చూసుకో, ఈ కేసు నువ్వు చూడు అని డాక్టరు రాజేశ్వరి పద్మకేసు అప్పగించినపుడు -

“ఎలాగైనా ఆ ఆమ్మాయి (బతికి తీరాలి. మీ గైడెన్స్‌లో ఆ అమ్మాయి బాధ్యత నేను తీసుకుంటాను”11 అంటాడు. ద్గూరే వుండి ఒక నర్స్‌లొ, ఆత్మీయుడిగొ, డాక్టర్‌గా అన్నీ తాను అయి రాత్రింబవళ్ళు కనిపెట్టుకుని వుండి గండం గట్టెక్కిస్తాడు గిరిధర్‌. డాక్టర్‌కి రోగిపట్ల వుండాల్సిన సేవాభావం, వృత్తిపట్ల అంకిత భావానికి ప్రతీక గిరిధర్‌ పాత్ర. అలాగే ఆమె పొరపాటును మన్నించి పెల్ఫిచేసుకోవాలని నిర్ణయించుకున్న మానవతావాది గిరిధర్‌.

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవల్తాసాహిత్యం జి డా. కె.బి.లక్ష్మి - 103

(1) డాక్టర్‌ విమల : ఇదే నవలలో మరో డాక్టర్‌ విమల. డాక్టర్‌ వృత్తికే కళంకం తెచ్చే పాత్ర అది. సమాజంలో గిరిధర్‌, రాజేశ్వరి లాంటి డాక్టర్లుండడం అరుదుగాని కేవలం డబ్బుకోసం స్వార్ధంతో రోగుల ప్రాణాలతో చెలగాట మాడే విమలవంటి డాక్టర్లు సమాజంలో అధిక సంఖ్యలో వున్నారని, అలాంటి వాళ్ళవల్ల జరిగే కీడుని రచయిత్రి విమల పాత్ర చిత్రణలో అద్భుతంగా ఆవిష్కరించారు. సొంతంగా విమలానర్సింగ్‌హోం పెట్టుకుని వైద్యం చేస్తూ ఆరునెలలు దాటిన గర్భస్రావం తల్లి ప్రాణానికి ప్రమాదం అని తెలిసే పెద్దింటి వాళ్ళిచ్చే డబ్బుకు ఆశపడి, వాళ్ళ పరువు మర్యాదల్ని అవకాశంగా తీసుకుని పద్మకి అబార్డన్‌ చేస్తుంది విమల. ఫీజు తీసుకుని ఇంటికి పంపేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి పద్మకి తీవ్ర జ్వరం వస్తే మళ్ళీ విమలని తీసుకొచ్చినపుడు రోగిని పరీక్షించి అదిరిపోతుంది విమల. “మైగాడ్‌, సెప్టిక్‌ అబార్దన్‌. పద్మను డిళ్చార్డ్‌చేసిన రోజు తను సరిగా గమనించలేదు. యుటిరస్‌లో ఇంకా ప్లజంటా బిట్స్‌ ఉండిపోయాయి. అందువల్ల శరీరంలో రెసిస్టెన్స్‌ తగ్గడం వల్ల సెప్పిస్‌ వచ్చింది*12 అనుకుంటుంది. ఏం చేయాలో తోచక కంగారుపడుతుంది. ఈ విషయం బైటకు రాకూడదు. వచ్చిందంటే ప్రాక్టీస్‌కు చాలా ప్రమాదం అనుకురిటుంది. అందుకే మరేం భయంలేదు. రెండు రోజుల్లో తగ్గిపోతుంది. రెండురోజులు పోయాక వచ్చి చూస్తాను. అంటుంది. మళ్ళీ ఆస్పత్రిలో జాయిన్‌ చేసుకోమని బతిమాలినా, అక్కడే వుండమన్నా వుండకుండా వెళ్ళిపోతుంది. “ఈ కేసు అడ్మిట్‌ చేసుకుంటే ఏమైనా వుందా? అసలే అంతంతమాత్రం ప్రాక్టీస్‌. ఈ పిల్లది సక్సెస్‌ అయ్యే కేసులా లేదు. రూల్స్‌కి వ్యతిరేకంగా ఆరోమాసంలో అబార్డన్‌ చేసింది, అబార్డన్‌ చేయడానికి తనకి తగిన క్వాలిఫికేషన్‌ కూడా లేదు. ఇప్పుడిదంతా తలకి చుట్టుకుంటుందని"13 అనుకుని గబగబా వెళ్ళిపోతుంది. బాధ్యతారాహిత్యం, అనుభవరాహిత్యం, విద్యారాహిత్యం, స్వార్ధం వైద్యరంగాన్ని ఏవిధంగా చీడపురుగలై పీడిస్తున్నాయో విమల పాత్ర సుస్పష్టంగా నిరూపిస్తుంది. అలాగే రచయిత్రి వైజ్ఞానిక విజ్ఞాన పరిశీలన ద్యోతకమవుతుంది. వ్యక్తి జీవితంలో వైజ్ఞానిక విజ్ఞానం ఎంత ప్రయోజనకారో మనో వైజ్ఞానిక శాస్త్రం కూడా అంతటి ప్రభావాన్నీ కలిగివుంది. మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని అచ్యుతవల్లి స్పష్టించిన పురుషపాత్రలు కొన్ని. ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 104

మయమనోవిశ్తేషణాత్మక పాత్రలు (1) అప్పాదొరై : స్త్రీ ప్రగతిని, ముఖ్యంగా భార్య ప్రగతిని కించిత్‌ కూడా సహించలేని ప్రగతినిరోధక మనస్తత్వం “ఎగిరే పిట్టలు నవలలో అప్పదొరై పొత్రది. పెళ్ళిచూపుల్లో ' వసుంధర హరి కాంభోజరాగంలో “ఒక మాట ఇక బాణను' అంటూ త్యాగరాజ కీర్తన పాడితే ఆనంద పారవశ్యంలో తేలియాడే సంగీతాభిరుచిని వ్యక్తం చేసేలా తలూపుతాడు. కట్నంతీసుకుని పెళ్ళిచేసుకుంటాడు. కాపురానికొచ్చిన మూడోరోజే అతని అసలు స్వరూపం బైటపడుతుంది. బైటపడుతుంది అనేకంటే దుష్టస్వభావాన్ని దాచుకోలేకపోతాడు. భార్యని పొడనివ్వడు, ఆమె అనాకారి అని ఆమె మొహం. చూస్తీ శృంగార భావనలే రావని ఈసడించుకుంటాడు, తల్లితో కలిసి అదేపనిగా' సాధిస్తూ వుంటాడు. ఆఖరికి ఆమెని ఇంట్లోంచి వెళ్ళగొడ్తాడు. పతియే ప్రత్యక్ష దయ్యం అనేరీతిగా ప్రవర్తిస్తాడు. మాటలతో, తీవ్రవదజాలంతో ఆమెని అవమానిస్తాడు.

“మూడువేలుకాదు, ముప్పయివేల నోట్లల్లో నిన్ను కప్పెట్టినా నీ ముఖానికి అందంరాదు అని వఎుష్టి వమూడువేలు కట్నంతో ఈ వలటండ రాజ్యం చేయడానికొచ్చింది కాబోల్ను, నా ఇంట్లో వుండక్కర్లేదు, నీ ముఖం నాకు చూపెట్టకు. పో బైటికి నీకు దిక్కున్నదోట చెప్పుకో14 అని దుర్భాషలాడి ఆమె మనసుమీద దెబ్బకొడ్తాడు.

వసుంధర ఇంట్లోంచి వెళ్లిపోయాక అందంగా వుంటుందని చూడికుడుత్తమ్మని పెళ్ళి చేసుకుని అరడజనుమంది పిల్లల్ని కంటాడు. తల్లి చచ్చిపోతుంది. తెలుగు ట్యూటర్‌ ఉద్యోగంతో ఒక్కచేతి జీతంలో సంసారాన్ని ఈద లేక దరిద్రంలో మగ్గుతుంటాడు. ఆడసిల్లలు పెళ్ళికి ఎదిగొచ్చారు అయినా బుద్ధిమారదు.

నసుంధర కచేరీలు చేసి డబ్బు సంపాదిస్తోందని, వున్న వూళ్లోకి వచ్చి సంగీత కచేరీ చేస్తోందని విని వెళ్తాడు. అక్కడ ప్రేక్షకులు ఆమెను ప్రశంసించడం విని ఎవరూ ఆమె అంతరంగిక జీవితం గురించి ప్రస్తావించకపోవడం గ్రహించి మామూలు వాళ్ళకి ఆమె భర్త వొదిలేసిన స్త్రీ అని తెలియకుండా వుంటుందా? ఎంత ప్రసిద్ధ గాయనీమణి అయిపోయినా భర్తవాదిలేశాడు అన్న చెడ్డపేరు పోతుందా? తెగిన గాలిపటంలా గాలివాటుకి ఆకాశంలో విహరిస్తున్నా ఎప్పటి కయినా నేల వాలాల్సిందే కదా అనుకుంటాడు. అతని వునసు వసుంధర ఉన్నతిని

ఐ.విఆయస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫8 డా. కె.బి.లక్ష్మి - 105

సహించలేకపోతుంది. కచ్చిగా నాలుగు అడిగేద్దామనే వుంటుందతనికి. కానీ వసుంధర చివర్లో అతన్ని తిప్పికొడుతుంది. అంత జరిగినా ఇంకా తన దగ్గరికి రాక ఎక్కడికి * పోతుంది అన్న ఆత్మారాధనా ధోరణిలోనే వుంటాడు. కిందపడినా తనదే పైచేయి అనుకునే పురుషాధిక్యతకి వికృతరూపం అస్పాదొరై. స్త్రీ శరీరానికి తప్ప అమె మనోభావాలకు ్రాధాన్యతనివ్వని అతిసాధారణ మగవాడు. తనకి ఆనందాన్ని కూర్చే ఉపకరణంగా తప్పు పరిపూర్ణవ్యక్తిగా పరిగణింపలేకపోవడం వల్ల జీవితంలో గుక్కతిప్పుకోలేని దెబ్బతిన్న అప్పాదొరై పాత్రని సానుభూతినోచుకోని పాత్రగా చిత్రించడంలో సఫలీకృతురాలయ్యారు రచయిత్రి. 'కొడిగట్టిన దీపాలు' లో మహేశం పాత్ర ఫక్తు మధ్యతరగతి, అనుమానం భర్త పాత్ర. అప్పాదొరై పాత్రకి కాస్త అటూ ఇటుగా వున్నట్టనిపీంచినా అతనిది కనిపించే విలనీ, ఇతనిది కొని తెచ్చుకున్న దుష్టత్వం, కానీ భార్యల ప్రతిభాపాటవాలను సహించలేకపోవడం, అణగదొక్కడం, నోటికొచ్చినట్లు తిట్టడం, వెళ్ళగొట్టడంలో ఇద్దరికీ కవలపిల్లలకున్నంత సారూప్యత వుంది. (1 మహేశం : మహేశం మూడుసార్లు ఎస్‌.ఎస్‌.ఎల్సొసి. తప్పి మూడు సంవత్సరాలనుంచీ మెట్రిక్‌ పరీక్షలు కడుతుండగానే యశోదతో పెళ్ళయింది. పెళ్ళిచూపులనాడు యశోదను చూసి ఈ పిల్ల స్కూలు ఫైనల్‌ ప్యాసయిందట. కానీ అంత విరగబాటుతనంగా లేదు... ఇంతకీ ఈ పిల్లకి తను యస్పెల్సీ రెండు మూడుసార్లు తప్పినట్లు తెలుసునో, లేదో! అయినా ఏం చేస్తుందిలే. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకి లోకువన్నారుగా అనుకుంటాడు. ఆడవాళ్ళమీద, కాబోయే భార్యమీద అతనికున్న అభిప్రాయం ఎలాంటిదో ఇక్కడే స్పష్టమైపోతుంది. అవవాయితీగా ఎవరో పొడమంటే “సంగీత జ్ఞానము భక్తివినా..' అని యశోద థ్రావగా పాడుతుంటే ఏమాత్రం ఆసక్తిలేకుండా సినిమాపదత్రిక తిరగేస్తూ కూచుంటాడు మహేశం. సంగీతం అంటే శ్రద్ధ లేదనడానికి అదే నిదర్శనం. యశోద పట్ల ఎప్పుడూ ముభావంగా వుంటాడు. ఆమె అందం, తెలివి తెలిసినా ప్రశంసిస్తే గర్వం ఎక్కువవుతుందని భయం. పల్లెలో పొలం వుట్రావున్నా ఉద్యోగం, పురుషలక్షణం అని పట్నంలో చిన్న ఉద్యోగం చేస్తూ చాలీ చాలని జీతంతో అవస్థలు పడుతున్న మహేశానికి కచేరీకి ఐదువందలు సంపాదించే యశోదపట్ల అదోలాంటి భావం. - “"ఐవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 106

“...అతనికీ ముష్టి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? ఆవిడ వెనకాల మద్దెల వాయించుకుంటో కూచుంటే చాలు. బోల్డు కనకవర్షం!” అన్న తోటి ఉద్యోగుల మాటలు అగ్నికి అజ్యంపోసినట్టయ్యాయి. అసలే కోతి, అందులో కల్లుతాగిందన్నట్లు అవమానభరితమైన అతని హృదయం ఆమె “నా అభిరుచిని గుర్తించలేదు మీరు, కనీసం స్వేచ్చ అయినా ఇయ్యకూడదా?” అన్నందుకు తట్టుకోలేక చిందులు వేసింది.

“నా దగ్గర స్వేచ్చా విహరిణులు వుండడానికి వీల్లేదు. నీ వేషాలు ఎన్నిచూడకపోతే తోటి ఉద్యోగస్థులు-అలా.అంటారు. నిష్పులేనిదే పొగరాజుతుందా? ఇన్నాళ్ళూ నీ స్వేచ్భాగానాన్ని నేను గుర్తించలేదు. తప్పయిపోయింది. నా ఇంట్లోంచి పో. ముందు గుమ్మం దాటి మరీ మాట్లాడు” అంటాడు.

పెళ్ళయిన ఆరేళ్ళల్లో మహేశం యశోదని ప్రేమించినా ప్రేమించకపోయినా ద్వేషించలేదు. కానీ ఆఫీసరం యశోద గానాన్ని పాగడడం, ఆవెంని ఇంటికితీసుకురమ్మనడం, తోటి ఉద్యోగస్థుల అనహేళన అతని పురుషాహంకారాన్ని రెచ్చగొట్టి ఆత్మన్యూనతలో పడేశాయి.

నిస్సహాయతను మరొకరూపంలో ఆ(గ్రహంగా వెళ్ళగక్కడాన్ని మన స్తత్వ శాస్త్రజ్హులు '01501208౧06౧౯ అని పేర్కొన్నారు. సాంఘిక జీవితంలో తటస్థపడే ఆవమానాలన్నింటినీ భార్యపై ఆగ్రహంగా ప్రకటించడానికి ఈ మనస్థితే కారణం.

అలాగే వ్యక్తి తన బలహీనతలు కప్పిపుచ్చుకునేందుకు స్వైర

కల్పనల్లో((2౧(ఇ0169) తేలియాడతాడని మనస్తత్వ నిపుణుడు అడ్డ్గర్‌ అన్నాడు. ఈ స్వైర కల్పనలు అతని ఆధిక్యతేచ్చకు దర్పణాలు, “కానుక నవలలో సుందరం పాత్ర అలాంటిదే. (1) సుందరం : తనను ఆదరించి, గౌరవించి తనకొక వ్యక్తిత్వం ఇవ్వచూసిన జానకి వాత్సల్యాన్ని కాటేసీ ప్రయత్నంచేసిన సుందరం మనస్థితికి కారణం ఇదే. జానకి సుందరాన్ని సోదరునిలా చూసింది. ఆ వాత్సల్యంతోనే అతనికి సమాన హోదా నిచ్చింది. అతని భవిష్యత్తు గురించి ఎంతో తాసత్రయపడింది. అదంతా తన పట్ల పేమ అనుకుంటాడు.

అనసూయ భర్త విదేశాల్లో వుండడంతో సుందరంతో చనువు పెంచుకుని

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి,లక్ష్మి- 10/

అస్తమానూ అతని పర్పనాలిటీని పొగుడుతూండేది. దాంతో సుందరంకి తన అందంమీద గొప్ప నమ్మకం ఏర్పడింది. వివాహితురాలైన అనసూయను అవసరానికి వాడుకున్నా పెళ్ళికాని జానకి తనకే సొంతం అనుకుంటాడు. పెళ్ళి నిశ్చ్వయమై జానకి కాబోయే భర్త జయరాంతో కబుర్లు చెప్పినా సహించలేకపోయేవాడు. జానకికి మగథ్రైండ్‌ వుండడం నచ్చదు సుందరానికి. తన అందంమీద, యవ్వనం మీద విపరీతమైన గర్వంతో సుందరం జానకికి కూడా తనమీద కోర్కె వుంటుందని నమ్మాడు. అంతవరకు మీరు, అమ్మాయిగారు అని పిలిచిన సుందరం పతాక సన్నివేశంలో ఆధిక్యతేచ్చతో ఏకవచన ప్రయోగంలోకి దిగుతాడు. “..నిన్ను వదలను... నీ శరీరాన్ని నేను పద్నాలుగేళ్ళ పిల్గాడప్పట్నించీ కోరుకున్నాను నువ్వు కూడా నన్ను కోరుకునే వుంటావు... నిన్ను వదలను నేను"15 అని బలాత్కరించబోతాడు, ళారీరక మనస్థితులు రెండూ అతని ఆధీనంలో లేకుండాపోతాయి. బాహ్యాజీవితంలోని చెత్త సినిమాలు, వ్యక్తుల పరిచయాలు, మిడి మిడి జ్ఞానంతో తాను ఏర్పరచుకున్న సొంత అభిప్రాయాలు వాటి ప్రభావం అతని మానసిక జీవితాన్ని ప్రేరేపించింది. సుందరం ప్రవర్తనకి మూలకారణమైనది అతని మనస్సులోనే వుంది. అందుకే విచక్షణ కోల్పోయి జైలుపాలవుతాడు. () పద్మనాభం : “ప్రేమించని మనసులు' నవలలో పద్మనాభం పాత్ర మామూలు కుటుంబాల్సో సమాజంలో ఎదురయ్యే పురుషులకు భిన్నమైన మనస్తత్వం గల పాత్ర. చదువుండి, డబ్బుండి, హోదావుండి అన్నీ వుండీ జీవితాన్ని ఏమీలేని విస్తరిలా చేసుకున్న పాత్ర, ఇందుకు కారణం అతని పిరికితనం. తను ప్రేమించిన స్తీలనుంచి వచ్చిన తిరస్కారాలు అతని మనసుని కుంచింపజేసి, పిరికితనంతో కూడిన న్యూనతాభావాన్ని నింపాయి. చదువుకున్న స్త్రీలపట్ల సదభిప్రాయం లేనిపాత్ర.

“నా కసలు చదువుకున్నవాళ్ళంటే సదభిప్రాయంలేదు. వాళ్లకి ఒక విధమైన అహంభావం వుంటుంది. వాళ్ళకి వాళ్ళ మనసులేగాని ఎదుటి మనసులనర్థం చేసుకునే శక్తి వుండదు... నువ్వూ సంధ్యలాగే చదువుకున్నదానివనీ ఒంటరితనం భరించలేక ఏదో దారి చూసుకుంటానని అనుకున్నాను....16 అంటాడు భార్య నాగమణితో. శోభనం రాత్రే నాగమణిని ఒంటరిగా వదిలి గది బయటికి వెళ్ళిపోతాడు. ఆమె తనింటికొచ్చి తన తల్లితో చెల్లితో సఖ్యంగా వున్నా రెండేళ్ళపాటు ఆమె ముఖం చూడడు. రెండేళ్ళ తర్వాత బైటికి తీసుకెళ్ళి మనసు విప్పి మాట్లాడి మరో రెండేళ్లు

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 108

ఆమెకి దూరంగా వుంటాడు. చిట్ట చివర్లో ఆమెకి క్షయ అని ఒక ఊపిరితిత్తి చెడిపోయి, రెండోది చెడిపోవడానికి సిద్ధంగా వుందని తెల్సినా నిన్ను నేను రక్షించుకుంటానని దగ్గరికి తీసుకుంటాడు.

పద్మనాభం ప్రీమించిన విద్యావతి సంధ్య డబ్బున్న నంజుండయ్యతో వెళ్ళిపోతుంది. మేనమామ కూతురు లలిత ఇతన్ని కాదని పైలెట్‌ని పెళ్ళిచేసుకుని విదేశాలకు వెళ్ళిపోతుంది. ప్రేమకి, పెళ్లికి కూడా స్త్రీలు తనని ప్రాధేయపడాలని కోరుకుంటాడు. అలా వుండకు, ఇలాచేయకు అని కొన్ని అంక్షలు విధించాలని . చూస్తాడు. అందుకే “నీలాంటి వాళ్ళు నిర్బలులుః.. వూలాంటి వాళ్ళు లెక్కచేయకపోవడంతో చేతులు ముడుచుకుని ఏడుస్తూకూర్చోడం. అంతకన్నా ఏం చేతకాదు"? అని సంధ్య,

“నేను నీ ముందు ప్రాధేయపడితే అంగీకరిద్దామన్న ఉద్దేశ్యంతో వచ్చావు.

ఓడిపోయి వెళ్ళిపోతున్నావో18 అని లలిత అతన్ని లక్ష్యపెట్టకుండా వెళ్ళిపోతారు. అందుకే విద్యాధికురాలైన నాగమణి కూడా వాళ్ళల్లాగే పొగరుగా వుంటుందేమోనని, (ప్రాధేయపడాలని అమెని అ(శ్రద్ధ చేస్తాడు. పద్మనాభం అధీరనాయకుడు. ఏవగించుకోవాల్సిన గుణాలు కనిపించవు. దుష్టుడు కాడు, వ్యసనపరుడుకాడు. సగటుమనిషి. తన మూఢత్వం వల్ల జీవిత మాధుర్యాన్ని కోల్పోయి, చివరకు ఆత్మవిమర్శతో తన అవివేకాన్ని, అహంకారాన్ని గ్రహించి పరిణతి చెందినట్లు చిత్రించడం వల్ల పద్మనాభం పాత్ర చిత్రణ వాస్తవంగా వుంది. (౪7) కుటుంబరావు : 'పుట్టిల్లు' నవలలో కధానాయిక భర్త కుటుంబం అనబడే కుటుంబరావు..అలా అనడమే సమంజసం. అలా అంటే అన్నపూర్ణ అతన్ని కొంగున ముడివేసుకుందని కాదు. తన చేతకానితనంతో పెళ్ళయి ఇరవై ఏళ్లయినా ఇద్దరు పిల్లలు ఎదిగివచ్చినా అత్తింటికి తీసుకురాకుండా భార్యని పుట్టింట్లోనే మగ్గపెట్టిన చేవచచ్చిన వాడు అని అర్థం. కానీ పైకి మూపత్రం వేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. సంవత్సరం అయినా భార్యను తీసుకురావడంగాని, తను అత్తారింటికి పోవడంగానీ లేకపోవడం చూసి కుటుంబం స్నేహితుడు రాధాయ్‌ కుటుంబాన్ని మళ్ళీ పెళ్ళి చేసుకోమంటాడు.

కుటుంబానికి తనొక పెద్ద అందగాడిననే అహంభావం వుంది. “శ్రీకృ ష్టుడుకి పదహారు వేలముంది గోపికలు ఎందుకున్నారు? అతని అందానికి

ఐవియస్‌, ఆచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా, కె.బి.లక్ష్మి - 109

మురళిగానానికి సమ్మోహితులయ్యేకదా! ఆ స్త్రీలు అతని చరణదాసులై పోయారు..”' అనుకుంటాడు. వదినమాట 'జవదాటలేది నిస్సహాయత, అన్నగారి మాట కాదనలేని. భయం, స్వతహాగా నిర్ణయం తీసుకోలేని తెలివి తక్కువతనం, ఒళ్ళొంచి పనిచేయలేని బద్ధకంతో ఒక అసమర్భుడిగా తయారవుతాడు. దాంతో తన ప్రతిచర్యనూ ఏదోవిధంగా సమర్థించుకోడానికి ప్రయత్నిస్తాడు. అత్మన్యూనతను కప్పి పెట్టుకునే ప్రయత్నంలో కుటుంబం అవలంబించే ఈ తర్కపద్ధతి మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయంలో హేతువిధానం. అసమర్హుడయిన తనను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ, తనను అత్తింటికి తీసుకెళ్ళకపోయినా భరిస్తూ సంసారంలో కలతలు రాకుండా కాపాడే అన్నపూర్ణ. ఉన్నత సంస్కారం అతని ఆత్మన్యూనతకు ఆజ్యంవంటిది. అందుకే పెళ్ళయిన ఇరవైఏళ్ల. తర్వాత తనంతట తను అన్నపూర్ణ పిల్లల్ని తీసుకుని తన దగ్గరికి వస్తే “ఎందుకు వచ్చావు?... మీ తమ్ముడు గెంటేశాడా ఇంట్లోంచి?... నా మటుకు నేను మీకు రమ్మనమని టెలిగ్రాం ఇచ్చినట్లు గుర్తులేదు"19 అంటాడు కోపం, వ్యంగ్యం వెటకారం అన్నీ కలిపి, అఖరికి అట్లాంటి అవసరం ఎప్పటికీ రాకుండా వుండాలని కూతురిచేత చివాట్లు తినాల్సివచ్చినా మీ ఖర్మ అని బైటికి వెళ్ళిపోతాడు. తండ్రిగా పిల్లల్ని, భర్తగా భార్యని తిన్నగా చూసుకోడం రానివాడే గాక, వదిన చేత గొడ్డ సావిళ్ళోకి గెంటించుకుని బతుకుబండలు చేసుకున్న అతినీరస పాత్ర కుటుంబం. (1) రామనాథం : చదువుకున్న ఆధునిక భర్తలలో పాతుకుని వున్న సంకుచిత్వానికి ప్రతీక “ఇదెక్కడి న్యాయం' లో రామనాథం పాత్ర. సమాజ నిర్దిష్టమైన అనుబంధాలు, ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధాలు వ్యక్తిగత జీవితాన్ని శాసిస్తాయని గ్రహించికూడా స్వార్థంవైపే మొగ్గుచూపించే పాత్ర రామనాథం. తన మనస్తత్వం, ఆలోచనా రీతుల్లోని లోపాలను అంగీకరించడానికి ఇష్టపడని వాడు రామనాథం. రెండు కుటుంబాల కష్టసుఖాలు మనిద్దరివీ అని మాలతిని పెళ్ళిచేసుకొని ఆమె సంపాదన వాడుకుని, తన చెల్లెళ్ళిద్దరికీ మంచి మంచి సంబంధాలు చూసీ, బాగా ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళుచేసి బాధ్యతలు తీర్చుకుంటాడు. ఇద్దరు పిల్లల తండ్రి అవుతాడు. ఆ తర్వాత మాలతితో చేసుక్ను ఒప్పందాన్ని కాదని ఆమెని పుట్టింటి వారికి సాయంచేయడం మానెయ్యమంటాడు. భార్య జీతాన్ని లెక్కలు వేస్తాడు. ఐ-వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 110

చెల్లెలి సీమంతానికి అయిన ఖర్చు మాలతి తమ్ముడు సుందరం మెడిసన్‌ పుస్తకాలు కొనుక్కునే ఖర్చు ఒకటి కాదంటాడు. భర్తగా హక్కుల గురించి, అవసరాల గురియీది మాలతిని నిలదీస్తాడు.

పెళ్ళికి ముందు రామనాధానికి, ' పెళ్ళయిన తర్వాత రామనాధానికి పోలికలేదు. రెండూ రెండు పాత్రలేమో అన్నంత వైరుధ్యం వుంటుందా.రెండు తరహాల్లో. ఒకే ఆఫీసులో పనిచేసే రామనాధర గెజిటెడ్‌ ఆఫీసర్‌ మాలతి సాధారణ గుమాస్తా. పనిపట్ల ఆమె బాధ్యత, కుటుంబం పట్ల ఆమె త్యాగం, శ్రద్ధ గమనించిన రామనాధం మధ్యతరగతి మనస్తత్వం' తన "కుటుంబ కష్టసుఖాల్లో సమభాగినిగా సంసారం సొగించగల అర్హత ఆమెకి వుందని గ్రహిస్తుంది. ఆ సంగతి నివాహాత్పూర్వం మాటల్లో *...లోకం అనుకునేట్టు నువ్వు నన్ను ట్రాప్‌ చేయలేదు. నేనే నిన్ను ట్రాప్‌ చేవాను. ... పెళ్ళివంకతో నిన్ను నా ఆత్మబంధువుగా మార్చేసుకున్నాను"”20. మాలతివట్ల అతనికున్న అనురాగభావన వ్యక్తమౌతుంది. అలాగే ఆమె తన తల్లి, తమ్ముళ్ళు, కుటుంబ బాధ్యతల గురించి ్రస్తావించినపుడు.

"బాధ్యతలు నీకేనా వున్నవి? నాకు మటుకు లేవా? నీ తలకు మించిన ఆలోచనలతో నీ ముంగిట నిల్చిన ఈ అవకాశం వదులుకోకు. జీవితంలో కష్టసుఖాలు, మంచి చెడులూ కలిసి అనుభవిద్దాం. ఇంక ఈ రెండు కుటుంబాల కష్టసుఖాలు మనిద్దరివీ21 అన్న మాటల్లోని సమతూకం కలసి బతుకుని వంచుకొవడమే అయినా, ఈ అవకాశం వదులుకోకు అన్నప్పటి అభిజాత్యాన్ని కూడా తూకాన్ని తప్పించే మొగ్గుగా భావించాలి.

మాలతి జీతం అండ చూసుకుని ఇంటి ఖర్చులకంటే ఎక్కువగా చెల్లెళ్ళకోసం తల్లి సరదాలు, వేడుకల కోసం అప్పులపాలనవుతాడు. దాంతో అనుకున్న ప్రకారం మాలతి పుట్టింట్లో డబ్బిచ్చి, తమ్ముళ్ళని చదివిస్తుంటే, వద్దంటే వద్దంటాడు. మాలతి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముందు నిలబడలేకపోతాడు. సంసారం ఆర్థికంగా చితుకుతుంది. మానసికంగా ఇద్దరూ దూరమౌతారు. ప్రమోషన్‌ మీద పొరుగూరికి వెళ్ళి, తల్లీ పిల్లల్ని వెంట తీసుకెళ్ళిపోతాడు. రెండో పెళ్ళి చేసుకుంటాడు. మాలతి మాటకి నిలబడి, సంసారం చెడినా, తమ్ముళ్ళని ఓ దారికి తెస్తుంది, తనకి, మాలతికి ఎన్ని వాగ్వివాదాలయినా, ఆమె మాటల్లో నిజాయితీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నా పురులు విప్పిన పురుషాధిక్యత అందుకు ఒప్పుకోనివ్వదు. చిట్ట చివర్లో కూడా మాలతి

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం 8 డా, కె.బి.లక్ష్మి - 111

ముందు ఓడిపోయానని ఒప్పుకోవడానికి అతని మనసు అంగీకరించదు. “నూలతీ నువ్వు విశిష్టమైన వ్యక్తివి. లక్ష్యానికి నిలబడ్డ ధీరురాలవు. నేను మామూలు మగవాడిని. నాకు వ్యక్తిత్వం వున్న భార్యకాదు కావల్సింది, అడుగులకు మడుగులొత్తుతూ, భర్త పాదాల దగ్గర చోటుకోసం ప్రాధేయపడే చవుకబారు ఆడది చాలు. తరతరాల నాటు భర్తలకి ప్రతినిధిని నేను... నీ పట్ల వూవమూలు మనిషినయిపోతే నా జీవితం నరకప్రాయమవుతుంది. నన్ను క్షమించి నీపట్ల రాక్షసుడిగానే వుండనియ్యి”22 అని తన ఆత్మఘోష తనే వింటాడు మౌనంగా. సామాజిక పరిస్థితులను ఎదిరించలేక, సంసారస్థితిగతులను సర్జుకోలేక పలాయనవాదం చిత్తగించిన అవకాశవాది రావమునాధం. అతని వునస్సితికి అనుగుణంగానే పెద్దగా వ్యతిరేకత రాకుండా రచయిత్రి రామనాధం పొత్రను చిత్రించిన తీరు శ్లాఘనీయం. తాస్తవ పాత్రలు అచ్యుతవల్లిగారి నవలల్లోని పాత్రలన్నీ వాస్తవానికి దగ్గరగానే వున్నా అచ్చంగా యదార్థ జీవితంలో తారసపడిన వ్యక్తులు స్వయంగా రచయిత్రి దగ్గరకు వచ్చి, నిస్సంకోచంగా తమ అనుభవాలను రవయిథ్రితో చర్చించి, వ్రాయమని కోరిన శివకేశవ, ప్రసాద్‌లు 'ఫప్రేమగండరిలో వాస్తవ పాత్రలు. శివకేశవ, (పసాద్‌ : చదువుకోవడంకోసం బెంగుళూరు వస్తూ రైల్లో అంబుజ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు శివకేశవ, అంబుజని బోల్డంత సామానుతో రైలెక్కిస్తూ కాస్త మా అమ్మాయిని చూస్తుండమని వాళ్ళ పెద్దవాళ్ళు అప్పగించగానే ఆ పిల్లమీద మనసు పారేసుకుంటాడు శివ. రైలు స్టేషన్లో విడిపోవడం, తర్వాత వీళ్ళు భోంచేసే మెస్‌ అరవ అయ్యర్‌ కూతురే అంబుజ అని తెలుసుకోవడం సరదాగా అపుడపుడు షాపింగ్‌లకి వెళ్ళడందాకా వస్తాడు శివ అంబుజతో. కానీ ఆ అమ్మాయి ఇది ప్రమ అనుకోదు. సరదాగా, స్నేహంగా తన హద్దుల్లో తనుంటుంది. శివ సీరియస్‌ గా తీసుకుని ప్రేమ, దోమ అనుకుని చివరకి అంబుజకి కంజీవరం సంబంధం నిశ్చయం అయిపోవడంతో సర్దుకుంటాడు. అలాగే ప్రసాద్‌ తన ఫ్రెండ్‌ చెల్లెలు సుమిత్రను ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను, పెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశ్యాన్ని ఆ అమ్మాయికి చెప్పడు. ఆమె చదువుకి ఆటంకం కలగకుండా పుస్తకాలు తెచ్చిచ్చి, తెలీనివి చెప్పి, కూడా వుండి సాయం ఐపియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 112

చేస్తుంటాడు, సమయం వచ్చినపుడు చెప్పడానికి వేచి వుంటాడు.

వీళ్ళిద్దరికీ సలహాదారిణి వనజాక్షి. అంబుజ, శివ వాళ్ళ ప్రేమకథని విషాదాంతం ఎందుకు చేసుకున్నారు? అని ప్రసాదు అడిగినప్పుడు “పిచ్చి ప్రసాదుగారూ? వాళ్ళది ప్రేమకథ అయితేనే కదా! విషాదాంతమూ, సుఖాంతమూ - అవడానికి. మీకేం తెలుసు, శివా అంబుజలది ప్రేమకథ కాదు. కేవలం కాలక్షేపం ' కథ”23 అని శినవిషయంలో -

“ఇష్టం వేరు, ప్రేమించడం వేరు. పెళ్ళిచేసుకోవడం వేరు. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపెట్టకూడదు. ఇద్దరూ ఆర్టికంగా ఒకళ్ళ పై ఒకళ్ళు ఆధారపడని స్టేజికి రావాలి... బాధ్యతల్ని ఇద్దరూ సమానంగా స్వీకరించాలి. మీకు అఆ అమ్మాయి అంటే ఇష్టం అన్నారు. ఇష్టమైతే ఇష్టంగానే వుండండి. అంతేగాని ప్రేమ అనీ దోమ అనీ ఆ పిల్లతో కబుర్లు చెప్పి ఆ పిల్ల ఏకాగ్రత చెదగొట్టకండి"24 అని ప్రసాద్‌ విషయంలోను హితవు చెస్పిన వనజాక్షి మాటలు రచయిత్రి చెప్పినట్టే వుంటాయి. బహుశా శివకేశవ, ప్రసాద్‌ పాత్రలు రచయిత్రికి వ్యక్తిగతంగా పరిచితులు అని పాఠకుడికి ముందే తెలియడం కూడా ఇందుకు కారణం కావచ్చు.

“వాస్తవ జీవితంలోని మనుష్యులను అర్థం చేసుకోవాలన్నా, వాళ్ళ మధ్య వుండే సంబంధాలనూ, నెలకొనే పరిస్థితులను తెలుసుకోవాలన్నా వాళ్ళతో మనం కొంతకాలం కలిసి వుండాలి. సాహిత్యంలోని పాత్రల విషయంలో కూడా ఇంతే. అయితే కథాకథనంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలను, నెలకొన్న పరిస్థితులనూ కొద్ది నిమిషాల్లోనే పాఠకుడు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది”25. ఈ విషయాల్ని దృష్టిలో వుంచుకొని తన కథ వ్రాయమన్న శివకేశవ, ప్రసాద్‌ జీవితాల్లోని సంఘటనల చిత్రణలో డాక్యుమెంటేషన్‌ రాకుండా నాటకీయంగా ఆ పొత్రలను చిత్రించారు రచయిత్రి. అలా చేయడం వల్ల వాళ్ళ జీవిత చరిత్ర అంతా వూసగుచ్చినట్లు చెప్పడంగాక వాళ్ళ ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, అలవాట్లు, విద్యా సంస్కారాలు, పేమగండాలు, ఇత్యాది సమస్త వివరాలు చక్కగా సపోర్టింగ్‌ పాత్రలద్వారా సమర్థవంతంగా చిత్రించారు. ఆ పాత్రలు వాస్తవపాత్రలని చెప్పేదాకా తెలీనంత సహజంగా కథా కథనంలో వాటకీయత ఒప్పింది. సమాజంలోని యువతీయువకుల తాజా సమస్యల దృష్ట్యా సందేశాత్మకంగా'పాత్రల ప్రవర్తనారీతుల్ని మలచడం మంచి విధానం.

ఐంవిఆయస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 113 ॥

దుష్ట స్వాభావ పాత్రలు

మనిషి జీవితం నాటకం అనుకున్నప్పుడు నవలలోని పాత్రలు నానాటి బతుకు నాటము అన్న రీతిలో రచయిత చేతిలో రూపుదిద్దుకోవలసివచ్చినవుడు నవల జీవితానికి దర్పణం అయితీరుతుంది. మనచుట్టూ జీవితం మంచీ చెడుల మేలుకలయికయినట్లే నవలల్లో కూడా మంచి పాత్రలు, హానిచేసినా చెయ్యకపోయినా. స్వాభావికంగా దుష్టత్వం వున్న పాత్రలు కూడా వుండడం అనివార్యం. జీవనవాహిని సవ్యంగా, నిర్మలంగా సాగుతున్నప్పుడు ఇటువంటి పాత్రలు సుడిగుండాలు సృష్టించి అలజడి పుట్టిస్తాయి. మంచి పాత్రల సముచిత గమనానికి దుష్టపొత్రలు . అడ్డుతగులుతుంటాయి. ఏ మలుపులో ఏం జరుగుతుందో! దుష్టపాత్ర మంచి పాత్రనేం చేస్తుందో! అన్న ఉద్వేగం, ఉత్కంఠ పాఠకుల్లో రేకెత్తిస్తాయి. అవి చేసేమేలు, కీడును బట్టి భూషణ దూషణలకు గురౌతాయి. ముందు దుష్టస్వభావంకలిగివున్నా ఎదురైన ఢక్కామొక్కీలతో బుగర్రబొప్పికట్టాక పశ్చాత్తాప పడేవి, ముందు మంచిగా వుండి చివర్లో దుష్టత్వం ప్రదర్శించేవి, స్వభావాన్ని మార్చుకునేవి, మార్చుకోనిని రకరకాలు. వాస్తవ జీవితంలోంచి అటువంటి పాత్రలను తీసుకుని ఇతివృత్తానికి అనుగుణంగా వాటిని మలచడంలో అచ్యుతవల్లి సమర్భురాలు (1) గవత్రాజు : 'మూడుముళ్ళు' నవలలో గవర్రాజు కిళ్ళీ కొట్టు యజమాని. “బుట్టలా ఎత్తుగా వున్న క్రాఫు, తెల్లని, పల్పని వాయిల్‌ లాల్చీ వేసుకుంటాడు. మెళ్ళో వంటిపేట సన్నని బంగారు గొలుసు, దానిమధ్య పులిగోరు పతకం వుంది26 అని వర్ణనాత్మకంగా ఆపాత్రను పరిచయం చేసినపుడే సంపాదనతో బాటు సరదా వున్నవాడని, షోక్రిల్లారాయుడని అర్థం అవుతుంది. దిగువ మధ్యతరగతి నరసయ్యా వాళ్ళింటి వీధరుగు పక్కన కిళ్ళీకొట్టు పెట్టుకుని ఆ ఇంటి వ్యవహారాలు ఓ కంట కనిపెడుతూ వుండేవాడు. నరసయ్యగారి పెద్దకూతురు కామేశ్వరిపై మనసుపడి ఆమె పెళ్ళి సంబంధాలన్నీ చెడగొడుతుండేవాడు. ఆస్తిపాస్తులు, డబ్బూదస్కంలేని, నల్లిగావుండి అందగత్తె కాని ఆమె తనను పెళ్ళాడక తప్పదన్న నిశ్చయంతో ఉండేవాడు. ఆ అంచనాలు తారుమారు కావడంతో ఆమె చెల్లెలు సుభద్రను లొంగదీసుకుని గర్భవతిని చేసి, వూరునుంచి పారిపోయి పట్నానికి వచ్చేస్తాడు. అక్కడ అష్ట ఐశ్వర్యాలూ సంపాదించి, కామేశ్వరి సవతికూతురు నళిని వ్యామోహంలో పడతాడు. నళిని అతన్ని వాడుకుని వదిలేస్తుంది. గర్భవతి అయినా “సరదా వేరు, సంసారం వేరు. నేను

వఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 114

కోటీశ్వరుడికి భార్య కావాల్సినదాన్ని నీతో పెళ్ళేంటి పో అని ఛీ కొడుతుంది. దాంతో డబ్బున్న నళినికి టోపీ వేద్దామున్న అతని అహం దెబ్బతింటుంది. సుభద్ర అమాయకత్వం, ఆమెకు తను చేసిన అన్యాయం గుర్తొచ్చి పశ్చాత్తాపపడతాడు. చివరికి కామేశ్వరి ప్రయత్నంవల్ల సుభద్రని, కొడుకుని చేరదీస్తాడు. అవ్మూంలులతో ఆడుకోవాలని నళినిలాంటిదయితే ఆవెం ఆస్తి కాజేయాలన్నవి చిన్నపాటి స్వార్దాలుగానే కనబడినా ప్రధానంగా అతని ధ్యేయం ధనార్జన, దర్జా. చిన్నతనంలో తన దుబారాతనంవల్ల, అవిద్యవల్ల జీవితంలో. చాలా పోగొట్టుకున్నానని తెలుసుకున్న వ్యక్తి. అయితే అదీ ఇదీ రెండూ సాధించి, అందుమూలంగా పరువుగల కుటుంబాల్లోని ఆడపిల్లల జీవితాల్లో అలజడి సృష్టించి, తనూ మనశ్శాంతిని కోల్పోయి చివరికి సన్మార్గుడై దుర్మార్గానికి తిలోదకాలిస్తాడు. తను చేస్తున్నది తప్పు అని తెలుసుకునేలా చేసి, మానసిక బలహీనతకు మానవత్వమే మందు అని గవర్రాజు పాత్రని పరిణామళీలపాత్రగా మలిచారు రచయిత్రి, (1) రాయుడు : 'నేను దేవిని కాను" లో దుష్టపాత్ర రాయుడు. అసలు పేరు చింతా వేంకట లక్ష్మీ నృసింహరాయుడు. పట్నంలో నివాసం. సల్లెలోని చింతావారి తోటగా ్రసిద్ధిపొందిన పెద్దతోటకి యజమాని. పల్లెలో అది గిట్టుబాటుకావడం లేదని అమ్మకం సెట్టడానికి కొనుక్కునే అభ్యర్థితో సైతం వచ్చిన రాయుడి కన్ను సావిత్రి మీద పడుతుంది. రాక్షసులకయిన్నా దుష్టపాత్రలకైనా మొదటి బలహీనత కాముకత, తర్వాతే దొంగతనం, దోపిడీ వగైరాలు. రాయుడూ ఆ కోవకే చెందుతాడు. అమ్మకానికి వచ్చి అమ్మాయి మీద మోజుపడ్డమాట తెలీకుండా జాగ్రత్త పడుతూ విషయం కొనుక్కోవడానికి వచ్చిన కోటగిరి మీద పెడతాడు రాయుడు తెలివిగా. దుష్టులకు అతి తెలివితోపాటు తాము తీసుకున్న గోతిలో తొనే పడ్డం కూడా జరుగుతుంది. రాయుడు అందుకు మినహాయింపు కాదు.

“క్ష్యుగెరి తోటలో బంగళావేసుకుని కాపురం వుందామనుకుంటున్నాడు,. కోటగిరి కళ్ళు మంచివి కావు. మీకా ఆడపిల్లలున్నారు...*27 అని బెదిరిస్తాడు సావిత్రి అన్న అవధానిని.

ఆ అమ్మాయి మీద నాకు అభిమానం కలిగింది. మీరాప్‌ల్ల పెళ్ళిచేయలేరు. నాకు వదిలెయ్యండి. మీకు పట్నం గుళ్ళో అర్చకత్వం ఇప్పిస్తాను. సంపాదించుకుని సంప్రదాయం, సంసారం నిలబెట్టుకోవచ్చు...”28 అని ఎరవేస్తాడు.

ఐ,వియస్‌. అచ్యుతవల్లి నవలాసొహిత్యం * డా. కె.బి.లక్ష్మి - 115

“పంతులూ, ఏమిటలా బిగుసుకుపోయావు. అదృష్టదేవత జీవితంలో ఎవరికయీనా ఒకసారే తలుపు. తడుతుంది... కోటికి పడగలెత్తినవాణ్లీ. మిమ్మల్ని పైకి లేవనెత్తడం నాకు కష్టం కాదు. నా అండన మీరు సుఖంగా బతకడం మీకు నీచకం కాదు..” అని ఆశ చూపిస్తాడు. ఆలోచించుకోవడానికి అవకాశం ఇచ్చి, మళ్ళీ వస్తానని వెళ్ళిన రాయుడు తమ తోటలో దేవి విగ్రహం దొరికిందన్న వార్త విన్నాడు. వచ్చాడు. ఆ దేవీ విగ్రహానికి సావిత్రే పూజా పునస్కారాలు చేస్తోందని తెలుసుకున్నాడు. స్వయంగా చూశాడు.

“భక్తి ధ్యానంలో వున్న సావిత్రి తాను కామించిన పాలరాతి బొమ్మ కాదు.. అది మగవాళ్ళను కవ్వించే మన్మధబాణంలాంటి చిరునవ్వుకాదు. జనంలోని మూర్ధతని అపహసించే చిరునవ్వు, అనిపించి అప్రయత్నంగా నృసింహరాయుడు రెండు చేతులూ జోడించాడు... కడుపులో ఏదో పెద్ద బాధ సుడులు తిరిగింది. అదేపవిగొ వాంతులు, విరోదనాలూ పట్టుక్తున్నాయి. సావిత్రి మంత్రించి ఇచ్చిన మిరియాలు నేతిలో వేయించి వేడి వేడి అన్నంలో పొదివి రెండు ముద్దలు తినిపించారు. సాయంకాల్గానికి తగ్గిపోయాయి: సావిత్రి పాదాలకు సొష్టాంగపడ్డాడు. అతని కళ్ళంబడ నీళ్ళు ఊరాయి”29 అని ఆపొత్రకి ముగింపు ఇచ్చారు 'రచయిత్రి. ఒక కన్నెపిల్ల జీవితాన్ని కబళించాలనే దుష్టబుద్ధిని పాపభీతి, దైవభక్తి అనే సామాజికాంశం ద్వారా వామరూపాలు లేకుండా చేయడంలో మనస్తత్వ శాస్టాన్ని అయుర్వేద వైద్య శాన్తిన్ని మేళవించి సంక్షిప్తంగా బలంగా, ప్రతిభావంతంగా చిత్రించారు రచయిత్రి.

(11) సిట్ధేళ్యరి : 'పుట్టిల్లు' నవలలో సిద్ధేశ్వరి సొంత మరిది కాపురాన్ని కూల్చిన దుష్టపాత్ర. మధ్య తరగతి ఉమ్మడి కుటుంబంలో ఇంటి పెద్దకోడలిగా తన గయ్యాళితనానికి సమానార్థక పురుష పదం లేకపోవడంతో సిద్దేశ్వరి స్వార్దం పడగవిప్పింది. పెళ్ళయిన ఇరవైయేళ్ళయినా మరిదీ తోడికోడలు ఆ యింట కలసి కాపురం చేయడానికి వీల్లేకుండా, అసలు అన్నపూర్ణ అత్తింట్లో కాలు పెట్టకుండా, పుట్టింట్లోనే వడివుండేలా చేసింది, పెళ్ళికెదిగిన కూతురు, కొడుకుతో ధైర్యంచేసి అన్నపూర్ణ అత్తవారిల్లు చేరేటప్పటికి మరిదిని పశువుల పొకలోకి తరిమేస్తుంది. మరిది కుటుంబం కూతుర్ని ప్రేమించి పెళ్ళాడతానన్న ఆడపడుచుకొడుకు రఘు తన అనాక్రారి కూతురును పెళ్ళాడేలా చేసే వరకూ మరిది బుర్ర తినేస్తుంది. సంసారంలో అన్నీ తనకే చెందాలని, భర్త, మరిది, పిల్లలు అందరూ తన చెప్పుచేతల్లో ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్షి - 116

వుండాలనే తపన (౧౦55655146 1861100) ఒక విధమైన సైకో బలహీనత. అయితే ఆ బలహీనతని తన బలంగా మార్చుకున్న పాత్ర సిద్ధేశ్వరి. అందులో ఆమె సఫలీకృ తురాలవడానికి ఆమెఅంటే అందరికీ వున్న అకారణ భయమే (౧౧౦౦12) కారణం.

సిద్ధేశ్వరి నోటి దురుసుతనం ముందు, ఆమె శకుని యుక్తుల ముందు ఎవరూ నిలబడలేరు. అయితే అవన్నీ తమ మంచి కోసమే చెప్పినట్లు ఆమె చేతిలో పావుగా మారిన మరిదిని నమ్మిస్తుంది. సిద్ధేశ్వరికి రాజకీయ నాయకులకి వుండతగ్గ ప్రజ్ఞావిశేషాలున్నాయి. కాని ఆమె సామాన్య స్త్రీగా ఒక సమిష్టి కుటుంబానికి ప్రాతినిధ్యం వహించవలసి రావడంతో ఆ అద్భుత తెలివితేటలు వింతపుంతలు తొక్కనారంభించాయి. పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే నదికి సరయిన ఆనకట్టలు కట్టి నీటిని కావల్సిన చోటికి మళ్ళించుకోగలిగితే పృథ్వి సస్యశ్యామల మవుతుంది. లేకపోతే వూరులూ, నాడులూ ఆ సుడిగుండాలలో పడి సర్వనాశనమవుతాయి అని వర్ణవాత్మకంగా సిద్ధేశ్వరి తత్వాన్ని విడమరిచి చెప్పారు రచయిత్రి.

ఐ-వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 117

స్తు వాత్రల చిత్రణ ప్రత్యేకించి స్త్రీ పాత్ర చిత్రణ విషయానికి వస్తే సమాజంలో, కుటుంబ వ్యవస్థలో అత్యంత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన స్త్రీ ఎన్నోరకాలుగా తెలుగునవలల్లో వర్ణించబడింది. సమాజంలో వస్తున్న, వచ్చిన సామాజిక్క ఆర్థిక రాజకీయ మార్పులకనుగుణంగా స్త్రీని వర్ణించారు రచయితలు. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం. తర్వాత సమాజంలో కుటుంబ జీవనంలో స్త్రీ నిర్వహించవలసిన పాత్రలో ఎంతో మార్పు రావడం, ఆ మార్పుకు అనుగుణంగా నవలల్లో స్త్రీ పాత్ర చిత్రణలో కూడా మార్పురావడం గమనించదగిన విషయం. ఆర్థిక స్వాతం(త్ర్యం వున్నంత వూత్రాన స్త్రీ ఆధునికతను సంతరించుకుంటుందా? అన్నది (ప్రశ్న. సమాజంలోని పరిస్థితుల దృష్టా కుటుంబంలోని ప్రముఖ వ్యక్తి మాత్రమే కాకుండా ఆమె తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో, చదువు, ఉద్యోగంలో కూడా తనదైన సాంత భావాలకు అనుగుణంగా తన జీవితాన్ని తాను శాసించుకోవడమే కాకుండా, ఎదుటి వ్యక్తి జీవితాన్ని కూడా శాసించగలగుతోందా? లేదా? కనీసం ఎదుటివ్యక్తి జీవితంలోని మార్పుకు ప్రాతిపదిక కాగలుగుతున్నదా? నిజానికి స్త్రీ ఒక వ్యవస్థలోని సామాజిక, అర్థిక, రాజకీయ పరిణామాల క్రమానుగతమైైన సామాజిక మార్పులకనుగుణంగా ఎంతవరకు మారింది? ఆధునిక ప్రపంచంలోని సామాజిక విప్లవంలో తన పొత్ర ఏమిటి? మొదలైన ప్రశ్నలకు ఐ,విఆయస్‌. అచ్యుతవల్లి నవలల్లోని పాత్రలు సమాధానంగా నిలుస్తాయి. సాంప్రదాయిక మధ్యతరగతి కుటుంబాల్లోంచి వచ్చిన స్త్రీలలో ఆధునిక భావాలుండడం కద్దు, ఆధునికమైన పాత్ర చిత్రణలో స్త్రీ పాత్రలలో గుర్తింపదగిన అంశం స్త్రీలను ధీరత్వము కలవారిగా చిత్రించడం. ధీరత్వమంటే ఉదాత్తత అనే అర్థంలోనేగాక్క కొంత సాహసమూ, ఉత్తేజనూ కలిగిన పాభ్రలని అన్వయించుకోవాలి. స్త్రీకి కావాల్సింది సానుభూతి కాదు. స్వతంత్ర ప్రతిపత్తి. పూర్వకాలంలో స్త్రీ తనను తాను భర్తకి అనుకూలంగా మలచుకోవలసి వచ్చేది. ఆధునిక స్త్రీ తనలాగే భర్తకూడా కొంతవరకు సర్జుకోవాలని వాంఛిస్తోంది. అన్ని సందర్భాలలోను భర్త అడుగుజాడల్లోనే నడవలేకపోతుంది. అధికారం చెలాయించడానికి అలవాటు పడ్డ పురుషుడు మాత్రం భార్య కనుకూలంగా తనను తాను కొంచమైనా సర్దుకోవడానికి ప్రయత్నించడం అటుంచి, ఇష్టపడడం లేదు. దానిదీనా స్త్రీకి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం సమస్యగా వవియస్‌. అద్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 118

తయారయింది.

సాహసం, జీవితంలో విశ్వాసం, మూఢత్వం మీద, కర్మ సిద్దాంత శాసనం మీద తిరుగుబాటు, . భవిష్యత్తుపట్ట నిర్భయం). ఆత్మస్థయిర్యంతో అనుకున్నది. సాధించగలిగి, పొందగలిగే దిశగా స్త్రీ పయనం సాగాలన్న అచ్యుతవల్లి భావ పరిపక్వతకు ప్రతీకలు ఆమె సృష్టించిన స్త్రీ పాభ్రలు.

కట్టుబాట్లను ఉల్లంఘించటం ఆయా పాత్రల సహజ స్వభావంగా, ద 01 (16 ౩౧౫6 గా 'కనబడుతుందే తప్ప ఆ ఉలళ్లంఘనలో 00౧5010645 .8%01 కనబడదు. 'అచ్యుతవల్లిగారి స్త్రీ పాత్రల చిప్రీకరణలోని ప్రత్యేకత అదే. లత' స్తీ పాభ్రల్లా మోహపారవళ్యంతో ఊహాగానాలు చేసే స్త్రీలు, చలంపొత్రల్లోలా ప్రేమక్షోసం సామాజిక గౌరవాన్ని త్యాగం చేసే స్త్రీలు, రంగనాయకమ్మ పాత్రల్లా పురుషాధికృతను ప్రశ్నించే స్త్రీలు అచ్యుతవల్లి రచనల్లో కనబడతారు. ఆయా పాత్రల ప్రవర్తన సహజంగా, స్వాభావికంగా వుండడం వల్ల అచ్యుతవల్లి వాద ముద్రలకు అతీతంగా నిలబడ్డారు.

తుఫాను సవుయంలో కల్గ్లోలిత సాగర కెరటాలు, హఠాత్తుగా లావానువిరజిమ్మే అగ్ని పర్వతాలు కావు ఆమెస్తీ పాత్రలు, స్వభావరీత్యా తప్పటడుగు వేసినా, వ్యక్తిత్వాన్ని నిలబెట్టు కోవడమేగాక సమాజాన్ని ప్రశ్నిస్తాయి, నిలదీస్తాయి. పైకి ప్రశాంతంగా కనబడుతూనే గాఢంగా ఆలోచింపజేసే పాత్రలు అచ్యుతవల్లివి. స్త్రీకి సంఘంలో ఆర్థిక స్వాతంత్ర్యంమెలావున్నా ఆలోచనా స్వాతండత్ర్యంతో జీవన ప్రవాహాన్ని మార్చాలన్న వునస్త్రత్వం గలవి, మారుతున్న స్ట్రీక, మార్పులేని సంప్రదాయానికి అనివార్యంగా సంభవించే ఘర్దణనే పదే పదే గుర్తుతెస్తూ, అమూల్యమైన జీవితాన్ని ఆటవిడుపుగా గడపకూడదనే జీవితపు విలువల్ని విడమర్చే విజ్ఞతగల ప్రత్యేకత, ప్రాధాన్యతల స్త్రీ పాత్రలు, పాత సంప్రదోయాన్ని ధిక్కరించడమే కాకుండా కొత్తమార్పును కోరుకునే పాత్రలు అచ్యుతవల్లి నవలల్లో చక్కగా అఖభివ్యక్తీకరించబడ్డాయి. ధీర - అధీర - భుధాన పాభతలు

ధీరత్వం, అధీరత్వంతో కూడిన కొన్ని ప్రధాన పాత్రలను తీసుకుని, వాటి (ప్రాముఖ్యతను సమీక్షించడం ఈ శీర్ణిక ముఖ్య ఉద్దేశ్యం. () మాలతి ; 'ఇదెక్కడి న్యాయం" లో మాలతి ధీర చిత్తురాలు. భర్త తనను

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం * డా. కె.బి.లక్ష్మి - 119

కాదని ఇద్దరాడపిల్లల్ని తీసుకుని బదిలీ అయి వూరికి వెళ్ళిపోయినా బాధ భరించింది. అతను అక్కడ రెండో పెళ్ళి చేసుకుంటే చేసుకున్నందుకు గాక తన పిల్లల విద్యాబుద్దులు ఏమైెపోతాయో అని దిగులు చెందుతుంది. ఇదంతా ఓ సానూన్య స్త్రీ ఆలోచన. కానీ పెళ్ళికి ముందు తన జీతంలో కొంత పుట్టింట్లో ఇస్తానని, తమ్ముళ్ళని చదివించి వాళ్ళకాళ్ళమీద వాళ్ళు నిలబడేలా చేస్తానని కాబోయే భర్త రామనాథంతో కుదుర్చుకున్న ఒప్పందం అతను కలిసిరాకపోవడంవల్ల వీగిపోతుంది, అయినా నిలదొక్కుకుంటుంది. మాలతిపాత్ర మొదట్నించీ స్థిరమైన నిర్ణయాలు కలిగి ఆత్మగౌరవం, స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన స్త్రీగా చిత్రీకరింపబడింది. ఒకదారిని పోతున్న భార్యభర్తల కర్సృత్వాన్ని మరొకదారికి మళ్ళించాలని చూడ్డం ఒకవిధంగా సాహసమే. మాలతి ఆ సాహసాన్ని చేయడానికి కారణం రామనాధాన్ని గురించి తనకంతా తెలుసుననుకోవడం. అతని మంచితనాన్ని ఎక్కువగా అంచనా వేయడం. ఆ నమ్మకం వమ్ము అయినపుడు ఒంటరిగానే జీవనపోరాటం సాగిస్తుంది. ఎవరి సహాయ సహకారాలు అర్థించదు, అందుకే తమ్ముడు కోర్టుకెళ్ళి రామనాధం రెండోపెళ్ళి గురించి దావా వేస్తానన్నప్పుడు అతనితో

"నా భవిష్యత్తు మీ అందరి చేతుల్లో లేదు సుందరం. నా భనిష్యత్తు నా చేతుల్లోనే వుంది. నా గురించి మీ అన్నదమ్ములు ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపడం నాకిష్టం కాదు30 అంటుంది.

ఆడదానికి పెళ్ళయ్యాకా అత్తవారిల్లే సర్వస్వవునేది సమాజంలో జీర్లించుకుపోయిన భావన. ఒకవేళ ఏ కారణంచేతనైనా స్త్రీ భర్తను వదిలివేస్తే అది ఆ స్త్రీకే గాక్క ఆమె పుట్టింటికి కూడా అవమానం. అందుకే ఎన్ని నీతులైనా చెప్పి ఆడదానికి కష్టమైవాా సుఖమైనా భర్త దగ్గరే వుంచడానికి ప్రయత్నిస్తారు. మాలతి తల్లి శాంతమ్మ కూడా ఆ పనే చేస్తుంది. కానీ మాలతి వినదు.

“కూతురి కాపురం కూల్చేసి దాని సంపాదనతో బతుకుతున్నాననే అఫ్రతిష్టనేను బతికున్నంతకాలం మోయాలా?... ఆడపిల్లకి సంసారం ముఖ్యమా? తమ్ముడి చదువు ముఖ్యమా?"31 అన్న తల్లిమాటలు లక్ష పెట్టదు. అవాంతరాలను అధిగమించి అనుకున్నది నెరవేర్చడమే మాలతి ధ్యేయం.

ఐ,వియపస్‌. అద్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 120

ఎంత కోరి పెళ్ళాడినా ఈ నవ నాగరిక సమాజంలో కూడా భార్య అయ్యేసరికి మగవాడికి ఆడది బానిస అయిపోతుంది. తల్లి చెప్పుడు. మాటలు విని ప్రతీసారీ భార్యను నిలదీస్తుంటాడు రామనాధం. అందుకు భిన్నంగా తన వ్యక్తిత్వం గుర్తించిన. పూర్ణపురుషుని సహచర్యంలో సంసార జీవితం పండించుకోవాలని కోరే స్త్రీ మాలతి. అది తారుమారైనపుడు సహించలేకపోతుంది.

“అనాడు మన రెండు కుటుంబాల కష్టసుఖాలు మనిద్దరివీ అన్నారు. ఆమాట మీ నుండి తీసుకున్నాకే నేమ పెళ్ళికి ఒప్పుకున్నాను... మీ చెల్లెల్ని లక్షాధికారి కోడల్ని చేశాననే తృప్తి మీ. జీవితానికెంత. నిండునిన్తుందో, నా తమ్ముణ్ణి .గాడిద చాకిరీ చేసే గుమాస్తాల జీవితంనుంచి తప్పించి ఒక వ్యక్తిగా నిలబడేలా చేయగల్లడం నా జీవితానికంత వెలుగునిస్తుంది. ఇద్దరిదీ ఒకే ఆశయం, ఒకే గమ్యం అయినప్పుడు. మీరు నా గమ్యాన్ని ఎందుకు అవహేళన _చేయాలి?”32 అని ప్రశ్నిస్తుంది మాలతి రామనాధాన్ని.

“...సంతానానికి భవిష్యత్తు నేనొక్కడాన్నేనా చూడాల్సింది?... నేను ఒక్క తమ్ముణ్ణి చదివించుకుంటానన్నాను. మీరు ఇద్దరు చెల్లెళ్ళకు ఖరీదయిన సంబంధాలు చేశారు. మీరు మీ ఇంటికి పెద్ద కొడుక్రైతీ నేను మా ఇంటికి పెద్ద పిల్లను..” అంటుంది.

రచయిత్రి ఆదర్శానికి ప్రతినిధి మాలతి పాత్ర, సంఘం యుక్క పరిమిత రూపమైన కుటుంబంలో మాలతి ఎదుర్కొనే సంఘర్షణ (ప్రతిభావంతంగా చిత్రితమయింది. భర్తను నిర్లక్ష్యం చేసిన స్త్రీని లోకం అవమానిస్తుంది. నిరసిస్తుంది. అదే తప్పుచేసిన మగవాడికి ఆ శిక్ష లేదు. అదంతా ఆడదాని ఖర్మ ఆ మగవాడు తలెత్తుకుని సదిమందిలో మహారాజులాగ తిరుగుతాడు. సమాజం చూపిస్తున్న ఈ పక్షపాత ధోరణి అన్యాయమని సునిశితంగా విమర్శిస్తూ మాలతి పొత్రద్వారా స్పష్టం చేశారు రచయిత్రి. అందుకే మాలతి రచయిత్రి ఆదర్శానికి సామాజిక, వైయక్తిక వైరుధ్యాలకి ప్రతినిధి.

(1) అన్నపూర్ణ : 'పుట్టిల్లు' లో అన్నపూర్ణ అటు భర్త వురుష్తాధిక్యత, ఇటు తోడికోడలు అసూయల మధ్య నలిగిపోయిన పాత్ర. పెళ్ళయిన ఇరవైఏళ్ళకుగాని పుట్టిల్లు వదిలి అత్తింట అడుగు పెట్టలేని మధ్యతరగతి ఇల్లాలు ఆమె. మనోధార్థం, అత్మసంయమననం, అనన్యసాధ్యమైన నిగ్రహం, అందర్నీ అర్థంచేసుకుని, అదరించాలనే సంస్కారం కలిగిన స్త్రీ,

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 121

పురుషనిర్మితములైన సామాజిక న్యాయసూత్రాలు ఈ నాటికీ స్త్రీని బానిసగానే వుంచేస్తున్నాయి. మాతృత్వం స్త్రీ జీవితానికి ఒక వరం కావచ్చును. కానీ సంతానం కోసమే స్త్రీ మరింత బానిసకావడం అర్జంలేని పద్ధతి. అందుకే అన్నపూర్ణ అప్పుడప్పుడొచ్చి దైహిక వాంఛలు తీర్చుకుని తన గురించి, పిల్లల గురించీ, పట్టించుకోకుండా పుట్టింట్లోనే పడేసి వుంచిన భర్త కుటుంబంతో తనని అతనివెంట తీసుకెళ్ళమని అడిగితే నామీద విరహం భరించలేకపోతున్నావా? అని ఈసడిస్తాడు. ఆ మాటలవల్ల చెలరేగిన పరాభవాగ్నిని పిల్లలకోసం అణుచుకుని -

“పిల్లలు ఎదిగొస్తున్నారు. పిల్లలు ఎదిగే రోజుల్లో మధ్యస్థంగా వుంటే పాడయిపోతారు. వాళ్లకి చదువూ, సంధ్యలూ సెళ్ళిళ్ళూ పేరంటాలు చేయాలా " వద్దా...33 అనడుగుతుంది.

“భార్యా పిల్లలూ వుండగా ఎన్నాళ్ళు పరాయి పంచన అన్నగారింట్లో పడివుంటారు? నాకున్న బాధ్యత వాళ్ళకెందుకుంటుంది మీపట్ట్ల? కావాలంటే మీ వాటాలో కొంతపాలం రాసిచ్చేయ్యండి. మన మానాన మనం పడుందాంి34 అన్న అన్నపూర్ణ మాటల్లో భర్త ఆదరణ, అనురాగం ముందు మిగతావన్నీ దిగదుడుపే అన్న ధ్వని వుంది.

అయినా అర్ధంచేసుకోని భర్తతో అలాగే కాలం వెళ్ళదీస్తుంది. ఒక్కోసారి భర్తతో సంసారం చేయగా పుట్టిన పిల్లలే ఆయినా అన్నపూర్ణ తానేదో తప్పుచేసిన దాన్లా అత్మన్యూనతకు గురౌతూ వుంటుంది. సంసారాన్ని, సంప్రదాయాన్ని నమ్మిన పట్నవాసం స్త్రీగా భావ సంఘర్షణకు లోనవుతుంది అన్నపూర్ణ,

ఆమె పెంపకంలోనే పెరిగినా కొడుకు రమణకు తండ్రికున్న అలసత్వం, కూతురు అనురాధకి తల్లి వ్యక్తిత్వం వస్తాయి. అందుకే ఆ పిల్ల చివర్లో తండ్రి దగ్గరకి వెళ్ళినపుడు తల్లి తరపున వకాల్తా పుచ్చుకుని అతని నోటికి తాళం వేస్తుంది.

. పెళ్ళయిన కొత్తల్లో అందరూ “ఇంకా పుట్టింట్లోనే వున్నావా? అత్తగారింటికి వెళ్లలేదా?” అని అడిగినపుడు వాళ్ళనానమ్మ ఏదో సర్జిచెబుతుంటే -

“అలా చెప్తావ్‌ దేనికి బామ్మా! వాళ్ళు నన్ను తిసుకెళ్లరు కదా! వదిలేశారు అని చెప్పేయ్‌” అని ఉక్రోషపడే అన్నపూర్ణ రాను రాను “పైవాళ్ళు ఎన్నయినా అంటారు. మనం తేలిపోకూడదు. మన బతుకు నునమే టొంటాం చేసుకోకూడదు. నీ సహనమే

ఐ-వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 122

నీకు శ్రీరామరక్ష అన్న బామ్మ మాటలకు లొంగిపోతుంది. తన భావాల్లోని పరిణామశీలత్వాన్ని నొక్కి పెట్టి తనకి తనే పిరికి మందు మింగుతుంది. ఆఖరికి అదెంత దూరం వస్తుందంటే కూతురికి “ఆడపడుచు కొడుకునిచ్చి పెళ్ళిచేద్దాం. వాళ్ళిష్టపడుతున్నారు. చేతికి వచ్చిన సంబంధం కాదంటే మళ్ళీ ఈ జన్మలో అంతమంచి సంటంధం తేలేము..”35 అని. ధైర్యంగా భర్తకి చెప్పిన మనిషి

“నోర్ముయ్‌, అట్టేపీలకు: నాకిష్టంలేదు. నేను చేయను" అని కుటుంబం అనగానే ఇంకోమాట మాట్లాడుకుండా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటుంది. .

ఆలోచనాతీరులో పరిణత వున్నా అమలు పరచలేని పిరికితనం చివరి

దశదాకా కొనసాగించడంవల్ల, ఆ దశలో కూడా కూతురు తండ్రికి సమాధానం చెప్తుంటే చూస్తూ వూరు కుంటుందే గాని తను పెదవి విప్పకపోవడం వల్ల అన్నపూర్ణపాత్ర పరిణామరహిత పాత్రగానే మిగిలిపోతుంది. (10) నారవుణిొ : 'ఫీమించని మునసులు' లో నాగవుణి (థేవుకోసం. పరితపించడమేగాని ఆ ప్రేమకోసం సంఘాన్ని ధిక్కరించడంగాని, వ్యక్తుల్ని ధిక్కరించడంగాని ఆమె వ్యక్తిత్వంలో లేవు. సాంసారిక జీవితంలోని స్త్రీల నిస్సహాయ స్థితీ చైతన్య రహితమైన చేరికకు దారితీస్తుంది.

నాగమణి అసాధారణ మనన్తత్వం కలది. అంతరంగాన్ని అణచుకుని తన మనసును మరలించుకోలేదు. నునసు నడిపించినట్టు నడవడమే ఈమెకు తెలుసు. తన స్వభావం వల్ల సుఖం లేదని తెలిసినా దుఃఖాన్ని భరించడానికే సంసిద్ధురాలవుతుంది.

“నా యొక్క సహనశీలతను మీరందరూ గుర్తించాలవే తాపత్రయంలో నా జీవితపు విలువను కోల్పోయాను36 అంటుంది. ఆమెలోని ఈ స్వభావమే ఆమెను నాలుగేళ్ళపాటు భర్తకి దూరం చేసింది. స్త్రీల దుస్థితికి కొంతవరకు వాళ్ళే కారణమన్న ధ్వనివుంది ఆ మాటల్లో.

జీవితంలో ఎదురయ్యే వ్రతి సన్నివేశాన్ని, వ్యక్తిని భయసందేహాలతో వీక్షిస్తూ. ప్రతి ఒక్కరూ తనని నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రేమరాహిత్యంలో పడేస్తున్నారనే ఆత్మన్యూనతాభాన పీడితురాలు నాగమణి.

చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి, ఇంట్లో బంధువుల నిరసనకు

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 123

గురై స్నహితురాలైన కనకాంగి వదినగా వచ్చాకా చేసిన నిర్లక్ష్యం, అన్నగారి అభిమాన రాహిత్యం అన్నీ కలిసి ఆమె మెత్తని మనసుని దెబ్బతీశాయి, మానవ జీవితంలో బాల్యానికి అత్యంత [ప్రాధాన్యత వుందని, బాల్య జీవిత ఛాయలు మనిషి అనంతర జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి, వ్యక్తి స్వభావాన్ని నిరేశిస్తాయని మనస్తత్వవేత్త అడ్డర్‌ ప్రతిపాదించిన సిద్దాంతానికి నాగమణి పాత్ర చక్కటి తార్కాణం. తన ప్రేమను వాళ్ళు గుర్తించలేదనే చివరిదాకా బాధపడుతుంది. అందుకు తగ్గట్టు ఆమె వైవాహిక జీవితం కూడా అంతంతమాత్రం అవడానికి తొలిదశలో భర్త పద్మనాభమే కారణం. పెద్దలు కూడా శుభముహూర్తాలు, శోభనం తంతులు ఇవే ప్రధానంగా భావించి వారి పొటికి వారిని వదిలేశారేగాని దాంపత్య' జీవితపు ప్రధానాశయమేదో వాళ్ళకి ఎవరూ విడమర్చి చెప్పనూ లేదు, వాళ్లని ఓ కంట కనిపెట్టి వుండనూ లేదు. శోభనం రాత్రే నాగమణిని గదిలో ఒంటరిగా వదిలేసి సద్మనాభం వెళ్ళి పోతే “ఎందుకలా?” అని నాగమణి అడగలేదు. లోపలికి వచ్చి తలుపేసుకుని పడుకుంది. ఆలోచన, ఆవేదనలేని ఒక నిర్లిప్తా దృష్టి ఆమెది. అందుకే తదనంతర కాలంలో తనకి వచ్చిన క్షయరోగాన్ని దాచి మేడమీంచి కిందకి దిగకుండా అతనికి మరింత దూరమవుతుంది. అతని భగ్నప్రేమలు, ఆమె అశ్రద్ధ ఒకర్నొకరికి దూరం చేస్తాయి. వివాహమంటే ఒకరిపట్ల ఒకరికుండే మముతానురాగాల బంధం అని తెలుసుకునే ప్రహసనంలో నాగమణి తన అంతర్ముఖీనత వల్ల ఒక అద్భుత జీవితకాలాన్ని కోల్పోతుంది. నాగమణి పొత్రచిత్రణకు ఎక్కువగా స్వగతాలనే రచయిత్రి ప్రయోగించారు. స్వగతంలో పాత్ర అంతర్జోషతోపాటు మధ్య మధ్య ఒక ప్రేక్షకుడిని, లేక శ్రోతను ఉద్దేశించి చెబుతున్నట్లు వాక్య నిర్మాణం సూచిస్తుంది. నాగమణి పాత్ర కడదాకా అలాగే సాగుతుంది. (7) వసుంధత : “నేను సంగీతాన్ని మర్చిపోను రామానుజం, నన్ను నేనే మర్చిపోతుంటాను"37 అంటుంది ఓ సంగీత వేదికమీద తరువాతి కీర్తన ఏం పాడుతుందో తెలీక ఆగిన కొడుకులాంటి రామానుజంతో వసుంధర. సంగీతమంటే అంతలా మైమరచిపోతుంది గనుకే ఆ విద్యతోనే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటుంది. గానం మీది అభిలాష ఆమె అంతర్వాహిని. ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% దా. కె.బి.లక్ష్మి - 124

పరిణామశీలక పొత్రల్లో చెప్పుకోదగినది అచ్యుతవల్లి 'ఎగిరేపిట్లలు' నవలా నాయిక వసుంధర, పెళ్ళయిన కొత్తల్లో పేరుకు తగ్గీట్టే ఆమెకి భూదేవంత ఓర్పు వుండేది.;,అత్త ఆరళ్ళు, భర్త. దాష్టీకం ఆమె. గుండెల్లో భూకంపాలు సృష్టించాయి: పెళ్ళిచూపుల్లో అత్తగారికి, భర్తకి కూడా.సంగీతాభిరుచి వుందనుకుంటుంది. అది పొరపాొటని;: కాపురానికొచ్చిన మూడోనాడే గ్రహిస్తుంది. అత్తవారింట్లో కాపురంచేసిన మూణ్లెల్లూ వసుంధర “సొ అంటే ఒట్టు. పతియే ప్రత్యక్షదైవం అనుకుంది. అప్పాదొరై ప్రత్యక్ష దయ్యంలా ్రవర్తిస్తేకూడా పన్నెత్తి మాట్లాడకుండా భరించేది.

“వాకిట్లో నించోకు...ఎవరైనా చూసేరు? అని అత్తగారు

“మూడువేలు కాదు, ముప్పైవేల నోట్లల్లో నిన్ను కప్పెట్టినా నీ ముఖానికందం రాదు. తెలుసా?” అని భర్త ఈసడించినా క్షమించమనే అడుగుతుంది. హైందవ సంప్రదాయంపట్ల తదుక్తమైన వైవాహిక జీవిత వైళిష్ట్రంపట్ల ఆమెకున్న సదవగాహనవల్లే ఆ మేరకు ఆవమానాన్ని దిగమింగుతుంది. .

స్త్రీలకు ఆత్మాభిమానం, సమస్యలని పరిష్కరించుకునే శక్తి వుండాలని రచయిత్రి అభిప్రాయం. అందుకే

చసుంధరకి భర్త అంటే ఈ నాలుగు నెలల్లోనూ అనురాగం కురిసిపోయిందేమీ లేదు. ఆ ఇంట్లో ఆమె అత్తగారి సహాయకురాలిగా మాత్రమే స్థానం సంపాదించుకుంది. ప్రకృతి సిద్ధంగా స్త్రీ సహజమైన సహనగుణంవల్ల ఎన్ని అన్నా మూగగా భరించింది.

“వసుంధరకి తన ఇల్లాలితనం వెగటుగా తోచింది. పెళ్ళయినది మొదలు భరిస్తోంది. ఒక మంచిమాటలేదు తనేదో త్యాగంచేసినట్లు డబ్బావాయించుకోవడం తప్పిస్తే... ఇంక దేనికని వీళ్ళ అవమానపు చర్యలని సమర్ధించుకుంటూ. కాలం గడపడం? సీత, సావిత్రి అంటే వాళ్ళకి భర్తల అనురాగం వుంది గనక కప్పాలెన్నయినా భరించారు. అప్పాదారైలాంటివాళ్ళయితే ఏం చేద్దురో!....38 పాత్ర స్వగతం, రచయిత్రి వ్యాఖ్యానం రెండింటి మేళవింపుద్వారా వసుంధర పాత్ర స్వభావనిర్దేశం సమగ్రంగా జరిగింది.

ఏ పాటను మెచ్చుకున్నట్లు నటించి పెళ్ళిచేసుకున్నాడో ఆపాటనే నిషేధించడం వసుంధర సహించలేకపోతుంది. అందుకు ఓర్చుకున్నా తన వ్యక్తిత్వాన్ని

ఐ.వి.యస్‌, అచ్యుతవళ్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 125

దెబ్బతియ్యడాన్ని క్షమించలేక పోతుంది.

_ ఆడదానికి అటు వుట్టిల్లు, ఇటు అత్తిల్లు రెంటికీ చెందలేని పరిస్థితులు అత్మస్థంబుర్యాన్నంయునా పెంచుతాయి, ఆత్మహత్యకైైనా పురికొల్పుతాంయి. అచ్యుతవల్లిపాత్రలు ఆవేశంలో జీవితాలకు మంగళం పాడేవి కావు.

అందుకే వసుంధర అత్తిల్లు వదిలి, పుట్టింటికీ పోకుండా చిన్నతనంలో సంగీతం నేర్పిన మాష్టారి దగ్గరికి వెళ్ళి “ఏకం సంగీత విజ్ఞానం - చతుర్వర్గ ఫలప్రదమ్‌ అన్నారు పెద్దలు, నీగానం అమరమవుతుంది. అందుకే నీకీ సంసార విచ్చేదనం లభించింది"39 అన్న ఆయన మాటల స్ఫూర్తితో కృషిచేసి విద్వాంసురాలవుతుంది. ఓ కచేరీలో అప్పాదొరై కలిసి ఇంటికి రా అని అమె డబ్బు సంపాదన కోసం స్వార్థంతో ఆహ్వానిస్తే “అది ఎప్పుడూ నా యిల్గుకాదు. ఇవ్వుడు అవుతుందా? ఎప్పటికీ కాబోదు. ప్రస్తుతం నాదగ్గర ఐదువేలున్నాయి. తీసుకోండి. భవిష్యత్తులో కావాలంటే అడగండి. ఆడపిల్లలున్నారు మీకు” అంటుంది. అంతరంగ తరంగాల కల్లోలాన్ని వెలువరించి ఓదార్సుకై ఎదురుచూడ్డం వసుంధర లక్షణం కాదనిపిస్తుంది. చన వ్యక్తిత్వపు విలువ గుర్తించి, విజ్ఞానాత్మక జీవితాన్ని వాంఛించి దానికై కృషి చేసింది వసుంధర. ఆమె కోరుకున్నది భర్త చేత స్నేహ గౌరవాలతో చూడబడే స్వాతంత్ర్యం. తన ఆలోచనలను తాను నిర్ణయించుకునే స్వాతంత్ర్యం. మొదటిది

లభ్యం కాలేదు. రెండోదాన్ని ఎన్నుకుంది. అందుకే ధైర్యంగా “భర్తా రక్షతి యౌవనే అన్నారు. ఆ దశ నాకు దాటిపోయింది... గూటిలోంచి ఎగిరిన పిట్ట మళ్ళీ గూటిలోనే నివాసం ఏర్పరచుకుంటుందా? పిట్టలు చాలా హాయిగా స్వేచ్చగా ఎగురుతాయి. నేను ఎగిరే పిట్టను కాను. మీరన్నట్లు ఎగురుతున్నదినేను కాదు, నాలోని అ తర్వేదన...40 అని అతన్ని సున్నితంగా తిరస్కరించి నమ్మిన ఆశయంకోసం గట్టిగా నిలబడిన ధీర వసుంధర. భర్త కాదన్నంత మాత్రాన భార్య తనకు భగవంతుడు ప్రసాదించిన అపురూపమైన వరాన్ని, కళను నాశనం చేసుకోవల్పిన

అవసరం లేదని వసుంధర పాత్ర ద్వారా నిరూపించారు రచయిత్రి. (౧ యశోద : 'కొడిగట్టిన దీపాలు' లోని యశోదకి 'ఎగిరేపిట్టలు' లో వసుంధరకి సంగీత జ్ఞానంలో పోలికలున్నా వ్యక్తిత్వాలు పరస్పర విరుద్దాలు. పెళ్ళినాటికి గాత్రమాధుర్యం వున్నా అంతగా సాధనలేని సంగీతజ్ఞానం వంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 126

యశోదది. స్నేహితురాలు దేవక్తి విశ్వంల ప్రోత్సాహంతో సాధన, పరిశోధన కళాభివృ ద్ధికి మూలమని (గ్రహిస్తుంది. యశోద తన ఆశల్ని పండించుకోవడానికి మనస్సంతా ఒక లక్ష్యం మీద కేంద్రీకరించి, శ్రమించి కీర్తిని, కనకాన్ని పొందింది. ఎంత పొందినా పురుషాహంకారం, స్వార్ధం, అనుమానాలతో పెనుభూతంగా మారిన భర్త నిషేదాజ్ఞలకు . నిలువునా నీరైపోయిన పాత్ర యశోద.

ఆమె పాటని ముగ్ధుడై వినే విశ్వం “నేను ఇచ్చిన అవకాశంతోనేగా ఇంత గొప్పదయిందని' అహంకరిస్తూనే, అమె పాటంటే చెవికోసుకునే భర్త ఎక్కడ ఆమెను. తనదాన్ని చేసుకుంటాడోనని అనుమానించి ఆదరణ కరువు చేసిన దేవకి, ఆఫీసులో . తోటి ఉద్యోగుల మాటలు నమ్మి భార్య రూసవతేగాక, ్రజ్ఞావంతురాలైనా శత్రువే అని అసూయాగ్నితో రగిలిపోయే భర్త మహేశం ఈ మూడు పాత్రలమధ్య యశోద అస్తిత్వ వ్యక్తిత్వాలు నలిగిపోతాయి.

యశోద సంగీత కచేరీల వల్లే తన పరువుపోతోందని, టైట్ల కార్యక్రమాల్లో పాల్గొనే స్త్రీలకు శీలం వుండదనీ, నీ బోడి సంపాదన నాకక్కర్ణేదని నిందిస్తాడు మహేశం. కచేరీలు గిచేరీలు మానేసి పడుండు అంటాడు.

“ఒక్కనాడయినా పాడమని అన్నారా? ఇంతబాగా పాడగల్లుతావనుకోలేదని అభినందించారా? నా అభిరుచి గుర్తించలేదు మీరు. కనీసం స్వేచ్చ అయినా ఇవ్వకూడదా?”41 అని,

“మ్పీరు అన్నట్లు బజూరుపాలు కావల్సిన ఖర్మ నాకేమీ పట్టలేదు. నా బ్రతుకు నేను గౌరవంగా బ్రతకగలను"42 అని మహేశంతో ధైర్యంగా అంటుంది. ఆమె స్వతంత్ర వ్యక్తిత్వాన్ని సహించలేని మహేశం అవమానకరంగా మాట్లాడి ఫో బైటికి అని గెంటినంత పనిచేస్తాడు. అత్మన్యూనత, అనుమానదృస్టి అతన్ని అవివేకిని చేస్తాయి. ఆ సందర్భంలో

“ఛీ ఛీ ? వెధవ మగాళ్ళు ఎంతలో మారిపోతారు. భర్త భార్య అభిరుచిని ప్రోత్సహిస్తే ఆ భర్త లోకుల దృష్టిలో చవట వాజమ్మగా కనిపిస్తాడా? ఎంత అజ్ఞానం? కచేరీలు మానెయ్యమన్నమాట సభ్యంగా, సౌమ్యంగా చెప్పకూడదా? భీఫో అని కుక్కని విదిలించి కొట్టినట్టు కొడుతుంటే ఎంతకని ప్రాకులాడడం!.....4 అని మొండి ధైర్యంతో, అవేశంతో గడపదాటిన యశోద దేవకి ఇంటికి వెళ్ళాకా ఆమె

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి వవలాసాహిత్యం ౫8 డా. కె.బి.లక్ష్మీ - 12/7

అనాదరణ వాక్యాలతో, విశ్వం అనునయించినా వినే స్థితి దాటిపోతుంది. బేల అయిపోతుంది. భర్త తనని శంకించడం, దేవకి తనపట్ల విశ్వం ప్రవర్తనను శంకించడం యశోద ధైర్యాన్ని దెబ్బతీస్తాయి. గుక్క తిప్ప్సుకోలేకపోతుంది. అందుకే “ఇన్ని అవమానాల పాలయి ఆశయాలను పట్టుకుని వేలాడ్డంకంటే ఏ ఆశయాలూ లేకుండా బతికేయడం నయం. మీరిద్దరూ కలిసి మహీళశంగారిని సమాధానపరిచి నాకు ఉత్తరం రాయండి, నేనిప్పుడే మావాళ్ళింటికి వెళ్ళిపోతాను. మీ ఉత్తరం కోసమే రోజులు లెక్కబెట్టుకుంటూగడుపుతాను"44 అని పుట్టింటికి వెళ్ళిపోతుంది. పరిణామ రహిత అధీర పాత్ర యశోద. అనేకమంది అభాగినులకు ప్రతీక. _ స్వేచ్భా యుణయతత్వ పాత్రలు 'సంగీక, భ్రమర, సుమన, నళిని : ఈ నలుగురూ ఇంచుమించు ఒకే తరహాకు చెందిన పాత్రలు. స్వేచ్చా ప్రణయ సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా గ్రహించి, తమ జీవిత గమనాల్ని తామే నిర్దేశించుకున్న ధీర వనితలు. అయితే పరిస్థితులు, మనస్తత్వాలు, చుట్టూ వున్న వాతావరణం, కుటుంబ నేపధ్యం వీరి ప్రవర్తనా రీతుల్లోని తేడాను పట్టి ఇవ్వడం గమనార్హం. స్త్రీ మానసిక ఘస్వేచ్చ సంప్రదాయాలకు లొంగని స్విచ్చాప్రణయతత్వాలు ఈ పాత్రల్లో సాక్షాత్కరిస్తాయి. (ఏ) సంగీత : "కోరిక నవలలో సంగీత వివాహవ్యవస్థను నిరాకరిస్తుంది. ఈ నవలలో స్త్రీ విమోచనోద్యపు తీభ్రవాదం కనిపిస్తుంది. నవలలో సంగీత కట్నం ఇచ్చి వివాహం చేసుకోవడాన్ని నిరాకరిస్తుంది.

“జీవితావసరాల్లో పెళ్ళి ఒకటి. ఆడదానికి భర్త అవసరం వుంటే మగవాడికి భార్య అవసరం వుండదా? ఒకనాడు ఆడదాని అవసరం వుండి చావుకి సిద్ధంగా వున్న ముత్తాతలు కూడా డబ్బుపోసి ఆడపిల్లను కొనుక్కుని, తాము చచ్చి ఆ ఆడపిల్లల్ని నానా అగచాట్లపాలు చేశారు. ఈనాడు ఆ ఆడపిల్ల భర్త పొందు కావాలంటే ఆ అనుభూతి కావాలంటే వేలకు వేలు పోసి భర్తను కొనుక్కోవలసి రావడం నీచాతినీచదం కాదూ? అంతకన్నా వ్యభిచరించడమే నయం, మనకి నచ్చితే వెళ్తాం. లేకపోతే

ఐ,వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం * డా, కె.బి.లక్ష్మి - 128

మానుతాం. వ్యభిచారిణులకి ఒక స్వతంత్ర జీవనం వుంది. కాని ఈ పతివ్రతామ తల్లులకి మటుకు ఒక వ్యక్తిత్వం అంటూ లేదు. మగవాడిచేత మూడుముళ్ళూ నేయించుకున్ననాడే స్త్రీ తనని తాను బానిసగా చేసుకుంది"45 అన్న సంగీత మాటల్లో తరతరాలుగా స్త్రీ జాతి అనుభవిస్తున్న దుర్భర వేదనానముయ జీవితం వుంది. అలాంటి స్త్రీలను చూసి ఊవ్ర మానసిక వేదనకి లోనైన ఒక ఉద్వేగభరితమైన పొత్ర ఆమె.

సంగీత సిద్ధాంతాలు వేరు. వివహితుదైన ఒక వ్యక్తిని ప్రేమించి, గర్భవతియై ధైర్యంగా బిడ్డను కన్మి పెంచుతుంది. మగవారిలో పిరికితనం ఈమెకు అసహ్యాన్ని కలిగిస్తుంది. పెళ్ళి సంసారం అనేవి తనకి పడవని నిర్ణయించుకుంటుంది. అలా అని సంగీతలో విశ్చంఖలత్వం, విచ్చలవిడితనం లేవు. జీవితం సౌందర్యపూరితంగా, ఎంతో ఉన్నతమైన అనుభూతులతో గడపాలని కోరిక.

స్వతంత్ర్య ప్రతిపత్తిగల సంగీతది కళాత్మక హృదయం. ఎదుటివ్యక్తీలో సౌందర్యానికి, రసికతకూ దాసోహమనే స్వభావం. వాసుదేవ రూప సౌందర్యానికి, స్టయిల్‌కె, బుద్ధి కుశలతకూ ముగ్గురాలై అతని సొంగత్యాన్ని వాంఛిస్తుంది. అదీ యాంత్రికమైన దైహిక వాంఛా సంతృప్తిని గాక, శృంగార రససిద్ధిని కోరుకుంటుంది సంగీత. వాసుదేవతో స్నీహం, ప్రమ, కామం, స్టూలదృప్టికి కేవలం లైంగికేచ్చ కలిగిన స్త్రీలా దర్శనమిచ్చినా వాస్తవానికి ఆమె విచక్షణా రహితంగా వురుష సంపర్కం కోరుకున్న ఘట్టాలు నవలలో లేవు. వాసుదేవతో గడిపిన రసానుభవంతోనే శృంగార జీవితానికి భరతవాక్యం పలికిన సంగీతలో విశిష్ట ఆలోచనా దృక్పథం, రస సమంచిత హృదయమే సాక్షాత్కరిస్తాయి.

అదే వాసుదేవ వచ్చి కోరినా “మామూలు స్నిీహితుడిలా వుంటే వుండండి... మీరు మళ్ళీ నన్ను గెల్పుకోలేరు"48 అంటుంది. అలాగే పీన్నితో

"న్పీ కంటే ముందు తరం దాన్ని. చదువుంది, ఉద్యోగం చేసుకుంటాను. ఒక్కపిల్లవాణ్ణి పెంచలేనా? వీణ్ణి పెంచలేనేమోనన్న అధైర్యం నాకు వుంటే నేను వీణ్ణి కనకుండానే వుందును. కోరిక పర్యవసానం ఆలోచించే ఆ కోరిక మీద నేను ప్రలోభం . పెంచుకున్నాను"47 అని స్పష్టం చేస్తుంది.

స్త్రీకి మాతృత్వం ఒక వరంగాను, కన్యగా గర్భవతి అయి పిల్లల్ని కనిపెంచడానికి భయపడే నేటి కన్యలకి తను ఆదర్శప్రాయంగా నిలవాలని తలుస్తూ

ఐ.వి.యస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా, కె.బి.లక్ష్మి - 129

వుంటుంది. స్త్రీని బానిసగా చూసే కుటుంబ వ్యవస్థని రచయిత్రి నిరసించి సంగీత పాత్ర ద్వారా ఆదర్శ సమాజాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు. సంగీత పాత్ర పాశ్చాత్య ఫెమినిస్ట్‌ ఉద్యమాల ప్రభావం చేత స్త్రీ బానిసత్వాన్ని రూపు మాపడానికి కంకణం కట్టుకున్న రచయిత్రి ఊహాచిత్రం. నేటి సమాజంలో ఇలా నిజంగా చేసి చూపించి సంచలనాత్మక వార్తల్లోని వ్యక్తి అయిన సినీ నటి, నిర్మాత నీనాగుప్తాకి, రాబోయే సొమాజిక మార్పులపట్ల రచయిత్రికున్న ముందుచూపుకు నిదర్శనం సంగీత పాత్ర చిత్రణ. (1) భమర : 'భమరగీతం' నవలలో భ్రమర వ్యక్తిత్వం విలక్షణమైనది. తల్లిమాట, తాతగారి మాట వినకుండా నిర్భయంగా ఒక విధమైన సూపర్‌ఇగోతో తనకిష్టమైన రీతిలో సంచరిస్తూ వుంటుంది. కావల్సినంత డబ్బు, ఆస్తి వున్నా వాటిని లక్ష్యపెట్టదు. సొంతవూరు వదలి నగరానికి వెళ్ళి సీల్స్‌గర్గ్‌ నుండి మోడలింగ్‌ దాకా తోచిన ఉద్యోగం చేస్తూ మగపిల్లలతో స్వేచృగా మాట్లాడుతూ, మళ్ళీ వాళ్ళు హద్దులు దాటకుండా చూస్తూ ఒక నాయకురాల్లా ప్రవర్తిస్తుంది. నవల మొదటి నుండి చివరిదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రమర ఆత్మవిశ్వాసం వీగిపోదు. తను అనుకున్నదానికి భిన్నమైన ఏ బలహీనతకి లొంగదు. జమీందారీ కుటుంబంనుండి వచ్చిన భ్రమరని దిగువన మధ్యతరగతికి చెందిన తనకంటే నాలుగేళ్ళు చిన్నవాడైన చలపతిలోని నిరాడంబరత, దయార్ధ హృదయం అకర్షిస్తాయి. ఇతరులచుట్టూ గిరి గీసి, తన హద్దుల్లో తానుండే భ్రమర చలపతిని కవ్వించి, మురిపించి, బులిపించి అతనితో స్వేచ్చా ప్రణయం నడుపుతుంది. అది కేవలం వాంఛ తీర్చుకునే ఉద్రేకంకాదు, అతనే తన పురుషుడన్న భావం, జీవితాన్ని అతనికి ముడుపు కట్టినా అతనివల్ల ఒక కూతుర్ని కన్నా పెళ్ళికి పూర్తిగా వ్యతిరేకి భ్రమర. సంసార జంరూటాలు తనకు పడవని చెప్పేస్తుంది ఖచ్చితంగా. ఎవరినూటా వినదు. స్నేహం, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం అన్ని విషయాల్లోనూ స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, ప్రశాంతంగా, నిర్విచారంగా వుంటుంది భ్రమర. స్వేచ్చను కోరే స్త్రీలు చెడిపోతారవే అభిప్రాయం ఉంది. అది నిజంకాదు. స్వేచ్చగా ఆలోచించగలిగిన వ్యక్తులే నైతిక విలువలను గ్రహించగలరు. ఆచరణలో చూసించగలరు. స్వేచ్చే నీతికి మూలం వ,వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.అక్ష్మి - 130

అని నిరూపిస్తుంది భ్రమర.

తనకి సంసారం, పెళ్ళి వద్దన్నా, సంప్రదాయాన్ని కాదన్నా చివర్లో తన కూతురు కుటుంబ వ్యవస్థలో, సజ్జనుడైన చలపతి సంరక్షణలో పెరగాలని కోరుకుంటుంది.

“కుటుంబ వ్యవస్థ కేవలం ఆర్థిక రక్షణకోసం ఏర్పాటు అయివుంది. తనను తాను పోషించుకోగల శక్తి మనిషికి ముఖ్యం. పెళ్ళి అంటే ఒక కట్టుబాటు, సామాజికపరమైన కట్టడి. దాని పరిధి సంకుచితం. అందులో నేను ఇమడలేను. నన్ను వదిలెయ్‌”48 అన్న బ్రమరకు'

*పాపకి ఒక తండ్రి వుంటే బావుంటుంది అనిసించిందోయ్‌. పాపాయి నిజంగా మన పాపొయే. విశ్వామిత్రుడివి కాకు. దానికి రక్షణ కల్పించు"49 అన్న భ్రమర ఒకరేనా అన్న సందేహం సహజంగా వస్తుంది.

అయితే స్వేచ్చాప్రియత్వం అన్నివేళలా అనుకూలంకాదని, సమాజంలో కుటుంబ వ్యవస్థకు మించినది లేదని అందరూ (గ్రహించాలని చెప్పాలన్నదే రచయిత్రి ఉద్దేశ్యం.

బ్రమర పాత్రలో యాంగ్‌ విశ్లేషించిన స్త్రీలోని పురుష ప్రవృత్తి లక్షణాలు

కూడా ద్యోతకమవుతాయి. పురుష లక్షణమైన తెగింపు, ఇంటి పెద్దల అవసరంలేని ధీరత్వం, ఏకాంత జీవితం గడపాలని కోరుకోవడం, తన కిష్టమైన వ్యక్తితోనే లైంగిక స్వేచృను అనుభవించడం వంటి వురుషలక్షణాలు బ్రమరలో ఎక్కువగా కనిపిస్తాయి. అవే ముందుగా చెప్పుకున్నట్లు ఆమెలోని సూపర్‌ఇగోను పెంచి పోషించటానికి హేత్రువులు. (12 సుమన : 'వూలూ - ముళ్ళు' నవలలో సుమనలో సమపాళ్ళలో దర్శనమిచ్చే చిలిపితనం, ప్రగాఢత, బేలతనం, సాహసం, మొండిపట్టు, అనురాగం ఆ పాత్రను పాఠకుడికి సన్నిహితంగా తీసుకెళ్ళే గుణాలు. కథా వస్తువుని అధిగమించి సుమన స్వభావమే పాఠకుణ్ణి ఆకర్షిస్తుంది కనక ఆ పాత్రను స్వతంత్ర ప్రతిపత్తి గలదిగా వర్ణించవచ్చు.

సువున స్వతంత్ర ప్రతిపత్తిలోని స్వార్ధం, మోసగించే గుణం వల్ల ఎదుటివారిని బాధించడమేగాక తనకు తానే అన్యాయం చేసుకున్నదవుతుంది.

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసొహిత్యం =5'డా, కెబి.లక్ష్మి - 131

ధనవంథుడు, స్పురద్రూపి అయిన జగన్నాధాన్ని తన విద్యుత్‌ స్పర్శతో పడగొట్టి సుఖానుభూతిపాొందినా, పిల్లలు పుట్చే అవకాశంలేని అతనివళ్లే తను గర్భవతినయ్యానన్న అబద్ధం వల్ల తనపైన తనే నమ్మకాన్ని కోల్పోయే నిస్సహాయస్థితిలో పడిపోతుంది. ఆమెలోని ఈ రెండు లక్షణాలను సమర్ధవంతంగా చిత్రించారు రచయిత్రి.

“బియ్యం అయిపోతాయని భయపడి అన్నం వండుకోవడం మానరు. చీకటి వస్తుందని వెలుగులో కూడా చేతులు ముడుచుకుని కూర్చుంటారా? మీలాంటి పురుషుల చేతిలో పడగలనా, లేనా అని నేను రోజూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను. లెట్‌ మి ఎంజాయ్‌ మై లైఫ్‌. ఈ పిల్ల ఇంత ఈజీ గోయింగ్‌ ఏమిటా అని ఆలోచించకండి. ఆడవాళ్ళకి చాలా విషయాల్లో స్వార్థం వుంటుంది. చేజారిన క్షణం తిరిగి చేతికిరాదు. నా బతుకు, యౌవనం సార్థకమయ్యాయి"50 అంటూ జగన్నాధానికి పాదాక్రాంతురాలైనంత పనిచేసిన సుమన వేరే వ్యక్తివల్ల గర్బవతి అయి జగన్నాధం దగ్గరకు వచ్చి

“ఆ బిడ్డ మన బిడ్డ ఎందుకు కాదు? ఏమిటి మీ దబాయింపు? తాళి కట్టించుకోనంత మాత్రాన తల్లినయ్యే హక్కులేదా?”51 అని నిలదీస్తుంది. అతను డాక్టర్‌ రిపోర్ట్‌ తెచ్చి చూపించేదాకా అతను సంతానోత్పత్తికి అనర్హుడని తెలీదు. స్వేచ్భా ప్రవృత్తిలోని అవకాశవాదానికి ప్రతీక సుమన. పెళ్ళయి పన్నెండేళ్లయినా పిల్లలు పుట్టని నళిని స్థానాన్ని పడగొట్టాలన్నా, సంతానవతి అయి జగన్నాధాన్ని పూర్తిగొ తనవాణ్డీ చేసుకోవాలన్నా ఎలాగోలా గర్భధారణే ముఖ్యమన్న దురాలోచనే ఈ అనకాశవాదానికి పునాది. అందుకు భిన్నంగా రెండోభార్య స్థానం కన్నా మాతృత్వమే మిన్న అని ఎబార్జన్‌న్ను వ్యతిరేకించడం కొసమెరుపు.

(70 నళిని : 'మూడుముళ్ళు" నవలలో కథానాయిక సవతి కూతురు నళిని పాత్ర ఫక్తు ఆధునిక యువతికి మారుపేరు. ఆలోచనల్లోనుు ఆచరణలోను పూర్తిగా స్వేచ్చాయుత పంథాలో నడిచిన పాత్రగా నలళినిని సృష్టించారు రచయిత్రి.

అర్ధిక స్వేచ్చ స్త్రీ జీవితం సుఖంగా సాగడానికి గొప్ప కారణమే గాని డబ్బువుంటే చాలు స్త్రీ సుఖంగా బతుకుతుంది అనడం చాలా పొరపాటు. తల్లిలేని పిల్లని చిన్నతనంనుంచీ చేసిన గారాబం, ఇంచుమించు తన వయసువున్న యువతితో తండ్రి పునర్వివాహం ప్రతి ఘట్టంలోనూ నళిని పొగరుబోతుగానే సాక్షాత్కరిస్తుంది.

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసొహిత్యం ౫ డా. కెబి.లక్ష్మి - 132

తన సవతితల్లి అయిన కామేశ్వరి స్వభావానికి ఆమె స్వభావం చాలా విరుద్ధమైంది. ఆమెని ఎంత మాటంటే అంతమాట అనడానికి కూడా వెనుకాడదు. పైగా పేరు పెట్టి పిలుస్తుంది. సిన్నీ అనదు.

“చూడు కామేశ్వరీ, రాత్రి, అర్ధరాత్రి దాకా మీ గదిలో దీపం వెలుగుతూనే ఉంది. మా నాన్నగారి ఆరోగ్య అంత దిట్టమైెంది కాదు. అర్థరాత్రి దాకా ఆయన్ను చదువు చెప్పమని వేధించకు"52 అంటుంది. కామేశ్వరిని తనతోబాటు కాలేజీలో చేర్పించి చదివించడం ఇష్టంలేని నళిని నర్మోక్తి ఆ మాటల్లో ధ్వనిస్తుంది.

అంతేగాక వాళ్ళ దాంపత్య అన్యోన్యతను ఊహించుకుని ఆమె కుతూహలం వెర్రితలలు వేస్తుంది. ఏమేమో దృశ్యాలు ఊహించుకుని తండ్రిమీద, ముఖ్యంగా సవతి తల్లి మీద విపరితంగా ద్వేషం పెంచుకుంటుంది. అది ఒక్కోసారి భరింవరాని మనోవైకల్యంగా కూడా పరిణమిస్తుంది. అతిశయించిన అహం, ఆత్మన్యూనత నళిని మనస్థితిలో అలజడి సృష్టిస్తాయి. అందుకు తగ్గట్లు నష్టపరిహారంగా తనని తను ప్రత్యేకంగా చూపించుకోడం కోసం నళిని స్వేచ్చగా యువకులతో కలసి ఏకాంతంగా షికార్లు చేస్తూంటుంది. అందులో భాగమే గవర్రాజు నలలో వడ్డం, అది గర్భధారణదాకా వెళ్ళడం.

-నళినికి యధేచ్చగా విహరించడం తప్ప ఎటువంటి విలువలతోను పట్టింపులేదు. అంతా జీవితంలో ఒక ఆట అంతే. అన్నివిధాలా గొప్ప సంబంధం తండ్రి కుదర్చగానే పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఆమె ఆస్తి మీద కన్నేసి ఇంతదూరం తెచ్చిన గవర్రాజు ఇదేంటి అని అడిగితే అతని సంగతి పూర్తిగా తెలిసిన నళిని

“నేన్సు పిరికిపందను కాను ఇల్లు వదిలిపారిపోవడానికి. నువ్వు మోసం చేసిన సుభద్రలా నేను గతిమాలిన దాన్ని కాను. నన్ను బెదిరించక్కర్లేదు. నీ సంతానాన్ని అనాధను చేయడంలేదు. మా జీవితాన్ని నీకంటే అధికంగా తిర్చిదిద్దగల వారినే ఎన్నుకున్నాను..”53 అని నిర్ద్వంద్వంగా అతన్ని తిరస్కరించి మహావైభవంగా పెళ్ళిచేసుకునని అత్తారింటికి వెళ్ళిపోతుంది.

సంగీత, భ్రమర, సుమన, నళిని పాత్రల్లో స్వకీయమైన చైతన్యం, మానసిక సంఘర్షణ, ఆదర్శప్రాయిత్వం సమ్మిళతమై వున్నాయి. సంగీత, (బ్రమర ఒక తరహా పాత్రలయిత్తే సుమన, నళిని ఇంచుమించు ఒక తరహా పొత్రలు. నిర్భయాన్ని, రసికత్వాన్ని, చిత్తశుద్ధిని, స్వేచ్చా ప్రియత్వాన్ని ఏ దశలోనూ మార్చుకోడానికి ఇష్టపడని

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసొహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 133

పాత్రలు. ఈక్రమంలో ఎన్ని ఆటుపోట్లు, సాంఘిక ఛీత్కారాలు ఎదురయినా నిలదొక్కుకుని అనుకువ్నది సాధిస్తారు. ఇటువంటి పాత్రలున్న నవలల్లో కథ కంటే బలంగా ఆ పాత్రలే పాఠకుణ్ణి ఆకర్షిస్తాయి. స్టైర్యం గల పాత్రలు మూడుముళ్ళు నవలలోని స్వేచ్చా ప్రియత్వం వున్న నళిని పాత్రకు పూర్తిగా భిన్నమైన, గాంభీర్యం, స్టైర్యం వున్న పాత్ర పూలూ - ముళ్ళులోని నళిని పొత్ర. (1 నళిని : పూలూ - ముళ్ళు లోని మరో ప్రధానపాత్ర నళిని. అందగత్తె, విద్యాధికురాలు, సూక్ష్మగ్రాహి, భర్త, ఇల్లు, సంసారం చూసుకుంటూనే మహిళామండలి స్థాపించి తమగ్రామం, చుట్టు ప్రక్కల (గ్రామాల్లోని స్త్రీల అభ్యున్నతికి కృషి చేసే సామాజిక స్పృహవున్న పాత్ర. ఆ మహిళామండలి వల్లే సుమన నళినికి బాగా పరిచయం. తనని మేడమ్‌ అని పిలిచే పాతికేళ్ళ సుమనని అమాయకురాలిగానే చూస్తుంది నళిని. సుమన తన కళ్ళు గప్పి తన భర్త జగన్నాధంతో ప్రణయసంబంధం పెట్టుకోవడం, గర్భిణి అనికూడా తెలీడంతో హతాశురాలవుతుంది. కానీ అంతలోనే సర్దుకుంటుంది. ఆమె జగన్నాధాన్ని మోహించి పెళ్లి చేసుకుంటుంది. అతనికి సంతానోత్పత్తి శక్తిలేకపోయినా దాంపత్య జీవితం సుఖంగానే సాగుతుంటుంది. కానీ భర్త చిలక్కొట్టుడు వ్యవహారంతో మనస్తాపానికి గురౌతుంది. ఇంటా బైటా జరిగే నాటకీయ పరిణామాలను గవునిస్తూ జగన్నాధాన్ని నిలదీయడానికి తగిన సమయంకోసం ఎదురుచూస్తుంటుంది. సుమన, జగన్నాధంల విషయంలో చిరుసందేహం కలిగిన సందర్భంలో నళిని జగన్నాధంతో “వేను మిమ్మల్ని చెడ్డవాడిగా శ్రమపడి నిరూపించితే వాకు వచ్చే లాభం ఏమిటి? ఫలానా వాళ్ళమ్మూయి భర్తతో అమెరికా వెళ్ళిందన్కో రవ్వల దుద్దులు కొనుక్కుందనో.. చెప్పుకుంటే గర్వకారణంగానీ ఫలానా నళిని భర్త జల్సాలు చేసి ఆస్తి పొడు చేశాడనో, స్త్రీ లోలుడయి అనారోగ్యం పాలయ్యాడనో చెప్పుకుంటే యీ ప్రపంచంలో నా స్థానం ఎక్కుడుంటుందో నాకు బాగా తెలుసు...54 అనడంలో తస్మాస్‌ జూగ్రత్త అన్న ధ్వని "వుంది. ఆమె స్వరంలోని తీవ్రతకు జగన్నాధం వ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - ౨34

జడుసుకున్నాడని, అనవసరంగా టైటపడ్డానా! అని మధన పడ్డాడని రచయిత్రి వ్యాఖ్యానించడం నళిని అధిపత్యాన్ని చూపడానికే. సుమన జగన్నాధంల వరస బాగా ముదురుపాకంలో పడ్డాకా కావాలని టూర్‌ వెళ్ళి వచ్చిన నళిని స్టేషన్లో జగన్నాథాన్ని చూసి “ఇన్నాళ్ళకి చూశాను అన్న ఆఅగర్ధత, అనురాగం తనలో కదలాడ్డం లేదు. ఇద్దరి మధ్య అత్మీయత, ప్రేమ మొదలైన అతి సుకుమారమైన బంధాలు లేవు. గౌరవం, మర్యాద, అర్థిక సుస్థిరత మొదలైన కఠిన వాస్తవాలకు కట్టుబడి వుంది. ఈ దాంపత్య బంధంకు ప్రేమ, ఆప్యాయత, మమత, మమకారం సున్నితమైన జరీదారాలయితే-మిధ్యా గౌరవం కుటిల మర్యాద,. సంఘపరమైన అపవాద భీతి గట్టి చేంతాండులు తఅయివుంటాయి"55 అనుకుంటుంది: ఈ అనుకోవడంలోనే విరిగిన మనసు తేటతెల్లమవుతుంది. సుమనకి గర్భం వేరేవాళ్ళవల్ల వచ్చిందని తెలిసీ ఆ విషయంలో భర్త అశక్తుడని తెలిసీ అప్పుడే దెబ్బతీయాలనుకుంటుంది నళిని. అగ్నిసాక్షిగా తాళిగట్టిన భార్యని చులకనచేసి కన్నెతో విహరించి పొందిన తీయని అనుభూతికి శిక్ష జగన్నాధరావు జీవితమంతా మోయాలి. తనకాళ్ళ వద్ద ఇద్దరూ పడుండేలా చేయగల అవకాశం ఇదే తనకి అని నళిని అనుకున్న ఆలోచనలో కసిలేదు. దెబ్బతిన్న సంప్రదాయ స్తీ హృదయం వుంది. అలాంటి సమస్యలకి అదే పరిష్కారమని పశ్చాత్తాపపడినా వదలక వాళ్ళిద్దరి పెళ్ళికీ ఏర్పాట్లు చేసి మహిళామండలిలో విందు చేస్తానంటుంది నళిని. ఎక్కడా మనసు మార్చు కోకుండా, ఎప్పటికప్పుడు సమస్యల్ని అధిగమించుకుంటూ వచ్చిన పరిణామ రహిత పాత్రగా కనబడినా హుందాగల వ్యక్తిత్వం నళినిది. (1) కామేశ్వరి : 'మూడుముళ్ళు' నవలలో కామేశ్వరి తన జీవితాన్ని గురించి తానే విశ్లేషించుకుంటుంది. సవతి కూతురి అహంకారం, భర్త అతి ఆదర్శ స్వభావం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, ధనవంతునికి రెండో భార్యగా అత్తింట కాలు పెట్టిన అతివ ఎదుర్కొనే క్లిష్ట సమస్యలు కామేశ్వరిని నిత్య సంఘర్షణకు గురిచేస్తాయి. పాఠకుల సానుభూతిని అన్ని విధాలా పొందిన పాత్ర కామేశ్వరి. అత్తింట్లో కామేశ్వరి చిరు అవమానాలను ఎదుర్కొనవలసి రావడానికి ఈ నాటికీ మూరని సామాజిక దృక్పథమే కారణం. కామేశ్వరి పెళ్ళిచేసి పంపడంతోనే పుట్టింటివారు తమ బాధ్యత తీరిపోయిందనుకుంటారు. ఆమెకు చీర సారెలివ్వకపోగా ఐ-వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫8 డా. కె.బి,లక్ష్మి - 135

డబ్బున్న ఇంటికి పోతున్నావు వాళ్ళే నీకు పెడతారు పో అంటారు. అవసరమయితే "అండగా నిలిచి, ఆదుకోడానికి ముందుకి రారు. ఆమే ఛిద్రమైన చెల్లెలి జీవితాన్ని చక్కదిద్దుతుంది. చెల్లెల్ని మోసం చేసినవాడికి తగిన బుద్ధి చెప్పి సంసారాన్ని చక్కజేస్తుంది. రచయిత్రి కామేశ్వరి సౌశీల్యాన్ని చక్కగా చిత్రీకరించారు, కామేశ్వరి దేన్నీ తర్కెంచడానికి ఇష్టపడదు. భర్త కేశవ చదువుకుంటానా? అంటే మీ ఇష్టం అంటుంది, . నాతో కాపురం చేస్తావా? అంటే మీ ఇష్టమే నంటుందేమో! అని చమత్కరిస్తారు రచయిత్రి. చీరా సారె పెట్టలేదని పుట్టంటివారిని అత్తగారు ఈసడిస్తే, "నిజమే, ఖర్చులు కలసి రావాలనే రెండోపెళ్ళివాళ్ళకి పిల్లనిచ్చి చేస్తారు. ఆయనికి రెండో పెళ్ళిగాని, వాకు రెండో పెళ్ళికాదుగో56 అని మనసులోనే అనుకుంటుంది గాని పైకి అనదు. అలాగే కామేశ్వరి తనకంటే చిన్నదని, ఆమెని రామనాధం ఇష్టపడుతున్నాడని తెలిపి వాళ్ళిద్దరూ మాట్లాడుకోడానికి కేశవ అవకాశం కల్పించిన సందర్భంలో “పెళ్ళిచూపులకి వచ్చినప్పుడు మీ ముఖం చూసిన గుర్తు కూడా నాకు లేదు. తొంభయ్‌ సంబంధాల వాళ్ళు వస్తారు, పోతారు.... ఒక పేద ఇంటి పిల్ల నేడు ఒక.ఉత్తను మానవుని భార్యగా గౌరవమైన స్థానం సాధించడం చూసి మీలో ఈసు ప్రారంభమైందా?... ఇక ముందు ఇలాంటి కబుర్లు చెప్పక లక్షణమైన అమ్మాయిని పెళ్ళిచేసుకోండి.”57 అని ఎంతో స్టైర్యం ప్రదర్శిస్తుంది. మొదటి భార్య కోరికమీద నళినికోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకున్నానని కేశవ చెప్పినప్పడు కామేశ్వరి మౌనంగానే వుంటుంది. దిగువ మధ్యతరగతి నుండి వచ్చి గొప్పింటి కోడలై, ప్రొఫెసర్‌ భార్య అయి చదువుకునే అవకాశం ఇచ్చినా కొనసాగించలేక్క అడుగడుగునా అర్థం చేసుకుంటూనే సంసారం చేస్తుంది కామేశ్వరి. “ఈ మూడు ముళ్ళతో ఏనాడో తనని తను బంధించుకుంది.స్వయం బద్భురాలు తను”58 అనుకునే కామేశ్వరి జీవితంలో ఎంత బాధ్యతాయుతంగా అందరి బాగోగులు చూస్తుందో అంత హుందాగానూ ఆమె పాత్రను ఆనిష్కరించారు రచయిత్రి. (7 శీత ; 'ఫీతకలలు నవలల కథానాయిక సీత. బాగా చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం చేయాలని, గొప్పగా బతకాలని చిన్నప్పట్నించీ కలలు కంటుంది సీత. ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసొాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 136

తండ్రి ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా పెంచాడు. పెళ్ళయ్యాక మధ్యతరగతి భర్త రానుం జీవన సారధ్య క్రమశిక్షణ ఆమె కలలకు కళ్ళెం వేసింది

సీతపాత్ర చీత్రణలో యాంగ్‌ ప్రతిపాదించిన కఠల విశ్లేషణ కనిపిస్తుంది. అవి కల్టలయిన మానసిక సంఘర్షణ కనిపిస్తుంది. |

ఎమ్‌.ఎ. చదవాలనుకుంటే- ఎస్‌.ఎస్‌.ఎలోసి. తోనే చదువాగిపోతుంది. పెళ్ళవుతుంది. నగరంలో ఇరుకు గదుల్లో కాపురం: దాంట్లో ఇద్దరు చుట్టాలు. పేయింగ్‌ గెస్ట్‌లు కూడా. ఏకాంతంలేని దాంపత్యజీవితం. నిక్కచ్చి భర్తతో అన్నీ లెక్కలే. సరదాలు, షిక్రార్డు లేవు. పురిటికి పుట్టింటికి వెళితే భర్త రామం నించి లేతనీలిరంగు కాగితంపైన ఓ ప్రేమలేఖ లేదు. ఇద్దరు కొడుకుల్లో ఒకణ్ణి ఇంజనీరు,. ఇంకొకరు డాక్టరు, కూతురు ఎం.ఏ అన్వాలనుకుంటే - మగ పిల్లలిద్దరూ కష్టంమీద. పట్టభద్రులవుతారు. కూతురు ఎం.ఏ అయితే చదువుతుంది. గానీ సీత కుదిర్చిన. ఇంజనీరు సంబంధంగాక సాదాసీదా బ్యాంక్‌ ఉద్యోగి, బాల్య మి(త్రుణ్జి దండల పెళ్ళిచేసుకుంటుంది. ఇలా అడుగడుగునా సీత కలలు ఏవీ నెరవరవు. ఏస్థాయిలోనూ ఆ కలల్ని నిజం చేసుకునే తెగువ సీతకు లేదు. ఉన్న దాంతోనే తృప్తిపడుతూ, ఎక్కడికక్కడ తన స్థితిని, గతిని, పరిస్థితిని సమర్థించుకుంటూపోయే పరిణామ రహిత మనస్విని సీతపొత్ర. అందుకే

“ఫీత్రక్షు ఆరాటం, సమాజంలో తాను చాలా అట్టడుగున బతుకుతున్నాననే భావం ఆమె మనసులో ఏమూలో తొలుస్తూనే వుంటుంది. చిన్నప్పుడంతా ఫలానా వారి అమ్మాయి క్లాసులో ఫస్టు, సంగీతంలో ఫస్టు, వాట్యంలో ఫస్టు అనిపించుకోవాలి. అనిపించుకున్నా అంత తృప్తిలేదు. ఎప్పుడూ నలుగురిలో తాను గుర్తింపబడాలి. ఫలానా అవిడ అన్పించుకోవాలి. రామం పెద్ద గౌరవ హోదాలున్న ఉద్యోగికాడు. ఫలావా కలెక్టర్‌ భార్యగానో, గవర్నర్‌ కోడలుగానో గుర్తింవబడే అర్హతలేదు... ముచ్చటగా ముగ్గురు పిల్లలు, నీతి నియమాలు గల భర్త మనస్తును మురిపించడంలేదు. ఏదో కాలేకపోయానన్న తపన, దిగులు! తను పొందలేనిదేదో పొందగలగడానికి ఏం చెయ్యాలో! దారీ దిక్కూ తెలియని అన్వేషణ! ఎదురుచూపు! అశక్తత! అసమర్థత! ఇవి అన్నీ కడుపులోనే దాచుకుంటుంది సీత...”59 అన్న రచయిత్రి వ్యాఖ్యానమే సీత పాత్ర చిత్రణను పారదర్శకం చేసింది. (౧ సావిత్రి : 'నేను దేవిని కాను" నవలలో సావిత్రి అన్నివర్గాల వారికి

వఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 137

స్ఫూర్తిదాయకమైంది. కుటుంబ సౌఖ్యంకోసం తనకు తాను అంకితం చేసుకున్న ఆదర్శమూర్తిగా సావిత్రి పాత్రను చిత్రీకరించారు రచయిత్రి. జీవితం సమస్యాపూరితం. సమస్యలు ఎదురైనపుడు నిబ్బరంతో ఎదుర్కొని నిలవగలగడమే ధీరత్వం. అలాంటి ' ధీర సావిత్రి. సావిభ్రిలో అశయం లేదు. ఓ నిరుపేద పూజారి కూతురు. తను నాలుగుమెతుకులు తెస్తేనే ఇంట్లోవాళ్ళు తినగలిగే పరిస్థితి. చిన్నతనం నుండి ఇది అభ్యుదయం అని తెలీకుండా మంచి, మానవత్వాన్ని నమ్మి వర్గభేదాల్ని పాటించని మనస్తత్వం సావిత్రిది. పాలుపోసీ శారదమ్మకి, అమె కొడుకు నారాయణకి పనిలో సాయం చేస్తుంది. పద్నాలుగేళ్ళ పిల్లయినా ఇంటి పనంతా చేస్తుంది. శారదమ్మ, నారాయణ తమ నిమ్నకులం గురించి, ఆమె అగ్రవర్ణం గురించి మాట్లాడితే ఆకలికి కులం లేదు అంటుంది. వారాయణని ఇష్టపడుతుంది. అతనూ ఈ పిల్లని పెళ్ళాడితే బావుండనుకుంటాడు. కానీ శారదమ్మ పడనివ్వదు. ఆవిడ అనారోగ్యంతో అస్తి అమ్ముకుని ఊరొదిలి వెళ్ళిపోతే ఒంటరితనం ఫీలవుతుంది. కానీ నిబ్బరంగా వుంటుంది. పౌరోహిత్యానికి రోజులు కావని మీనమేషాలు లెక్కగడుతూ కూర్చోకుండా అన్నల్ని ఏదో ఒక పని చేయమంటుంది? బల్లకట్టునడిపినా, పొలంలో నాట్లు వేసినా డబ్బు కోసమేగా అని హితువు చెబుతుంది. తోట యజమాని డేగ కళ్ళు తనమీద పడగానే ప్రజల్లోని మూఢ విశ్వాసాల్ని, ఆధ్యాత్మిక చింతనని ఆసరాగా చేసుకుని రాత్రికి రాత్రి దేవిగా మారిపోతుంది. కులమతాలు, వర్గభేదాలు పట్టించుకోకుండా, నిమ్నవర్గాలపట్ల పక్షపాతం చూపీ సావిత్రి పాత్రను అత్యద్భుతంగా, అభ్యుదయ భావాలతో ప్రతిభావంతంగా చిత్రించారు అచ్యుతవల్లి. ఇది సావిత్రి ఎదుర్కొన్న ప్రతి సన్నివేశంలోనూ నిరూపితమైంది. ఎంత దేవీమూర్తిగా పూజలందుకుంటున్నా నారాయణ ఆమె మనసులోంచి తొలగిపోడు. తను ఎలా మారవలసివచ్చిందీ అతనితో చెప్పి నేను సొవిత్రనే! దేవినికాదు అని చెప్పి ఒక నిశ్చింత స్లితికి వెళ్ళిపోతుంది. సుఖ దుఃఖాలను సవుభావంతో స్వీకరించగల ఆత్మస్థయిర్యం, హైందవధర్మం నరనరాల జీర్ణించుకుపోయిన్నా నిమ్మవర్గాలపట్ల సమభావం ఉన్న హృదయ సంస్కారి సావిత్రి పాత్ర, ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 138

“కులంమాట ఎందుకు నారాయణ! నా బ్రాహ్మణత్వం నీకు భీరుత్వాన్ని కలిగించే మాటయితే ఈ బ్రాహ్మణత్వాన్ని నేను వదులుకుందుకు సిద్ధంగా వున్నాను"60 అని సావిత్రి'పలికిన మాటలు రచయిత్రి అభ్యుదయ దృక్పథానికి మేల్బంతులు. 4. రచయిత్రి ఆదర్శానికి తీకలు

తను చెప్పదలుచుకున్న ఆదర్శ భావాలను కొన్ని ముఖ్య పాత్రలద్వారా చెప్పించి, ఒప్పించడం అచ్యుతవల్లి నవలల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ తరహా పాత్రల పరిశీలనకు వేదిక ఈ శీర్షిక.

() అరుణ : అత్నాభిమానం గల స్త్రీగా జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ " జీవన సాగరాన్ని ఈది గట్టు చేరిన వనిత 'ఒడ్డుకి చేరిన ఒంటరి కెరటం” నవలలో " అరుణ, స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న నానుడిని నిజంచేస్తూ ఒక స్త్రీ జీవితంలో సాటి స్త్రీ

కారణంగా ఎలా సుఖ శాంతులు లోపిస్తాయనడానికి, వాటిని అధిగమించడానికి

ఎంత శక్తిని కూడగట్టుకోవాలన్న దానికి ఆరుణపాత్ర ఉదాహరణ.

ఛల్లిదండ్రులు చిన్ననాటే చనిపోతే మేనమామ ప్రాపకంలో పెరుగుతారు అరుణ, ఆఅవెం తవర్ముడు. బుద్ధిగా చదువుకుంటుంది. ఉద్యోగం సంపాదించుకుంటుంది. వేనమామ మంచివాడైనా ఆయన భార్యకి తాము కంటగింపయిన కారణంగా బైటికి వచ్చి లలిత అనే అమ్మాయితో కలిసి ఓ గది తీసుకుని వుంటుంది. తన' జీతంతో తమ్ముణ్లీ చదివిస్తుంది. పారుగూర్లో చదువుకుంటూ వుంటాడు. ఉద్యోగం వస్తుంది అక్కడే. లలిత ద్వారా పరిచయమైన చలపతి ప్రేమ కబుర్లు నమ్ముతుంది. పెళ్ళిదాకా వస్తుంది. సరిగ్గా ముహూర్తం సమయానికి లలిత, చలపతి పెళ్ళిచేసుకుని వస్తారు. అది అరుణ ఊహించని దెబ్బ. అందులో లలితతో శారీరక సంబంధం పెట్టుకున్నాక అరుణతో పెళ్ళిదాకా వచ్చిన చలపతి కుటిలత్వం, అతనివల్ల తల్లి కాబోతూ బతుకు బండలవకూడదని అరుణకి కూడా చెప్పకుండా పెళ్ళిచేసీసుకుని వచ్చిన లలిత స్వార్ధం వున్నాయి.

అభిమానవతి అయిన అరుణ తన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే వనిని ఎన్నడూ తల పెట్టదు. అందుకే అక్కడ వుండి అవహేళన పాలయ్యేకంటే ఉద్యోగం మానెయ్యడమే మంచిదని, రాజీనామా చేసి తమ్ముడి దగ్గరికి వచ్చేస్తుంది. స్థిర నిర్ణయాలు తీసుకునే స్థిత ప్రజ్ఞత్వంగల పాత్ర అరుణ, తమ్ముడికి తనమీద అభిమానం ఉన్నా అతనూ పెళ్ళి, సంసారం కోరుకుంటున్నాడని గ్రహించి ఓ పల్లెటూళ్లో తల్లిలేని

ఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫8 డా. కెబి.లక్ష్మి - 139

జమీందారు పిల్లలకి ఆయాగా వెళ్తుంది. ఎదుటివ్యక్తి బలహీనతను అర్థం చేసుకుంటే మనలో ఆ బలహీనత లేకుండా చేసుకోవచ్చునని అరుణ అభిప్రాయం. నువ్వంగీకరిస్తే చలపతి నిన్నుకూడా పెళ్ళిచేసుకుంటాడని లలిత అంటే “నీ మొగుడికి మళ్ళీ పెళ్ళిచేస్తావా? నీ భర్త రసికుడే కావచ్చు, కాని నేను అగ్నిని. కణ కణమండే కన్నెని. కుక్క ముట్టకున్న కుంటలోని అన్నం నేను తినను... ఇలాంటి చచ్చు సలహాలు ఇంకెప్పుడూ ఇవ్వకు”61 అని తిప్పికొడ్డుంది. అరుణ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరూ మార్చలేరు. తమ్ముడు అరుణని తమతోనే వుండమన్నాడు, కానీ “తనకు స్థిరత్వం కావాలి. వాళ్ళ పంచనా నీళ్ళ పంచనా చాకిరీ చేస్తూ పవిత్రంగా బతుకుతున్నానన్న ఆత్మవంచన తనకి వద్దు. తనని తాను పోషించుకునే అవకాశం వచ్చింది. అది ఆయా అయినా ఫరవాలేదు..."52 అనుకోవడంలో దెబ్బతిన్నా సైకి లేచే నిబ్బరం కనబడుతుంది అరుణలో. బతుకు బాటలోని కీలకమైన మలుపుల్లో అరుణ తీసుకున్న నిర్ణయాలు, ఆమె వ్యక్తిత్వం పొందిన పరిణామం వాస్తవికంగా వుంది. ఆద్యంత్యం ఆసక్తిదాయకంగా ఆలోచింపజేసే పరిణామశీలక పాత్ర అరుణ, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆత్మగౌరవాన్ని కోల్పోరాదని అరుణపాత్ర ద్వారా ప్రబోధించారు రచయిత్రి. (1 వనజాక్షి : రచయిత్రి ఆదర్శాన్ని ప్రతిబింబించే మరో పొత్ర “ప్రేమగండం' నవలలో వనజాక్షి, వరకట్నం వంటి సాంఘిక దురాచారాలు, పప్రేమవంటి వ్యక్తిగత వ్యామోహాలు, ఆర్థిక అసంబద్ధాలను తూర్పారసడుతూ, స్త్రీ పరుషులమధ్య సమానత్వం ఆకాంక్షించే ఆదర్శానికి ప్రతినిధి వనజాక్షి,

తల్లిదండ్లులు వనజాక్షిని ఆడపిల్లలా కాకుండా కొడుకుతో సమానంగా పెంచారు. కట్టడిలేని పెంపకంలో స్వేచ్చగా పెరిగిన వనజాక్షికి జీవితపు విలువలు బాగా తెలుసు. అవకాశం దొరికితే చాలు సందర్భాన్ని బట్టి, అంశాన్ని బట్టి ఉపన్యాసాలిస్తూపోతుంది. అది చిన్న సలహా అయినా పెద్ద ప్రయోజనాన్ని కలిగివుంటుంది.

“పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలను ఒక్కసారిగా వదులుకోరు.. మనం, యంగర్‌ జనరేషన్‌ వాళ్ళం కనుక మనం మనం ఎప్పటికీ ఒకళ్ళ ఇళ్ళకు ఒకళ్ళం వస్తూ పోతూ, వీలయితే ఒకళ్ళ పిల్లలని ఒకళ్ళకి ఇచ్చి పుచ్చుకుని పెళ్ళిళ్ళు

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా, కెబి.లక్ష్మి - 140

చేస్తూ వుంటే వరకట్న సమస్యే వుండదు"63 అన్న వనజాక్షి మాటల్లో యువత తల్చుకుంటే ఉద్యమాలే గాక స్నేహంతో సాంఘిక దురాచారాల్ని అరికట్టవచ్చన్న అభ్యుదయ కామన ద్యోతకమౌతుంది.

అలాగే తనని ప్రీమించానని, పెళ్ళిచేసుకుంటానని వెంటపడిన విజయ్‌కి బతుకు అర్హం విడమరచి చెప్పి

“ముందు బుద్ధిగా చదువుకోండి: ఆపైన ఉద్యోగం సంపాదించుకోండి. ఆపైన మీ చదువుకు పెట్టుబడి పెట్టిన డబ్బు కట్నంగా రాదని తోస్తే అప్పుడు నాకు. అప్లికేషన్‌ పడెయ్యండి"64 అన్న వనజాక్షి జీవితాన్ని దిద్దుకునే ఆత్మవిశ్వాసం. వువ్న. పాత్రగా పాఠకుడి కళ్ళముందు. సజీనంగా కదళాడుతుంది.

నవలలో అనేక పాత్రలున్నా వనజాక్షి పొభ్ర ప్రవేశంతో అవన్నీ ఆమె ప్రభావానికి లోనై ఆమె మాటే వేదంగా తలచేలా మారడం ఆ పాత్ర ప్రాధాన్యతను చెబుతుంది.

రచయిత్రి ఆదర్శానికి, సమాజ ప్రవృత్తులకూ ప్రతినిధిగా మాత్రమేగాక వీటన్నింటినీ అధిగమించిన ప్రత్యేకతతో కథను ఆసాంతం నడిపే బాధ్యత భుజస్కంధాలమీద వేసుకున్న స్వతంత్రం ప్రతిపత్తిగల పొత్రగా వనజాక్షి పాత్రను సమర్థవంతంగా చిత్రించారు రచయిత్రి.

శు సంతరించుకు,

రచయిత్రి నామాజక, వైద్యశాస్తావగాహనను స న్న్న వా్యాతలు (1) శుద్మ : ఎన్ని కట్టుబాట్లలో వుంచినా, ఎంత ధనవంతులయినా తొందరపొట్లకి వైయక్తిక శిక్షలు అనుభవించక తప్పదని, వ్యామోహాలు, ప్రలోభాలు కొండకచో ప్రాణాంతకాలు కూడానని గుణపాఠం చెప్పి హెచ్చరించే పొత్ర 'ఇది మల్లెల వేళ లోని పద్మ

అసహాయతవల్ల కలిగిన ఆత్మన్యూనతతో ఆప్పుల అనాదరణకు గురై, ఆత్మ విమర్శనా జ్ఞానం అందొచ్చే సమయం మించిపోగా ఆ జలహీనత్య అసహాయతతో బాధపడుతూ తన్నుతాను నిందించుకుని కన్నీటి పుట్ట అయిన పద్మ పొత్ర ఈ నవలలో వురపురానిది. ఆత్మన్యూనతా నిర్మూలన కం సంఘీభావం పెంపొందించుకోవడం ఒక్కటే మార్గమని అడ్డర్‌ చెప్పాడు. కానీ అది లోపించిన

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం 2జి డా. కె.బి.లక్ష్మి - 141

పద్మ జబ్బుపడి, నూరేళ్ళ జీవితం పట్ల నిరాశనే పెంచుకుంటుంది. వయసు తొందరలను ఉధృతం చేసి, కాము ప్రకోపనలు కలిగించే సంఘటనలు, సాహిత్యం, దృశ్యాలు, మిష్రుల సజెస్టివ్‌ సంభాషణలు - ఇందులో ఏ ఒక్కటోగాక అన్నీ సామూహికంగా పద్మని ముద్దాయిని చేశాయి. పాలేరు కుర్రాడితో లైంగికానుభవం ఆనందంతో పొటు అత్యంత విషాదాన్ని మిగులుస్తుంది ఆమె జీవితంలో. తమాష్థా ఏమిటంటే అంత జరిగినా అందుకు కారణమైన పాలేరు కృ. . పని పెళ్ళాడ్డానికి ఇష్ట్టడదు. అమాయకంగా కోరుకున్న అనుభవమే అయినా, సెప్టిక్‌ అబార్డన్‌ ప్రాణాంతకమై, మనిషిని కృంగదీసి, కృశింపజేసినా అరచేతులమీద నడిచిన అసూర్యం పశ్య పద్మ మనసు అట్టడుగు వర్గం వ్యక్తికి అర్జాంగి కావడానికి ససేమిరా అంటుంది.

“కచ్చితంగా కృష్ణ దీనికి కారకుడని తెలిస్తే తప్పకుండా అతనికే ఇచ్చి పెళ్ళి చేస్తారు. కృష్ణని పెళ్ళిచేసుకోవడం కంటే చనిపోవడం నయం. బలహీనుడయిన వాడికి భార్యకావడం కంటే బలవంతుడికి బానిసకావడమే నయం"65 అనుకుంటుంది పద్మ. “ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ పని చేయకపోదును"668 అని పశ్చాత్తాప పడుతుంది.

తప్పిపోయిన పెళ్ళికొడుకు గిరిధర్‌ డాక్టరుగా ఆస్పత్రిలో తనకి చికిత్స చేసి గండం తప్పించి, జరిగిందాన్ని పట్టించుకోని క్ష్మమూ హృదయంతో తనని తననుగా

గౌరవించి పెళ్ళాడ తానంటే పద్మ అంతరంగం అపరాధ భావంతో కుంచించుకుపోతుంది. అతను చేతిలో చెయ్యివేస్తే “గిరిధర్‌ని భర్తగా భరించగలదా? తనలోని నీచత్వాన్ని స్వయంగా చూశాడు. అయినా కృష్ణతాకితే తన మవసు, శరీరం పరవశించినట్లు గిరిధర్‌ తనను తాకినపుడు తనకేమీ అనిపించలేదెందుకని?*67 అనే అనుకుంటుంది గానీ అతని పెద్ద మనసుని అర్థంచేసుకోడానికి ప్రయత్నించదు. అయినా అతను పట్టు వదలక ఒప్పించడానికి ప్రయత్నించినపుడు మౌనంగా రోదిస్తుంది. అయ్యో! ఈమె పెళ్ళికి ఒప్పుకుంటే బావుండు. లేకపోతే జీవితాంతం దుఃఖమే మిగుల్తుంది అని పాఠకులు అనుకునేలా సానుభూతి భావనలో ఈ పాత్ర వుండిపోతుంది. పద్మ జీవిత నిర్ణయాన్ని ఆ పొత్రకే వదిలేసి గర్భధారణ, పిల్లల్ని కని పెంచడం సృష్టిలో అన్ని జీవులకు సహజమే అయినా “సృష్టిలో ఏ ప్రాణి జననానికి లేని నీతి నియమాలన్నీ ఈ దిక్కుమాలిన 'ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం 8 దా..కె,బి.లక్ష్మి - 142

సంఘంలో బతుకుతూన్న మాధ్యమిక అహంభావిక సమాజంలోని మిధ్యాడంబరపు కుటుంబాలకే వున్నాయన్న"68 అభిప్రాయాన్ని పద్మ పాత్రద్వారా స్పష్టంచేస్తారు. రచయిత్రి.

(1) సుభద్ర : తరాల అంతరాలున్నా మహిళల జీవితాల్లోని కష్టనష్టాల మౌలికాంశాల్లో" మార్పు రావడం లేదు. విచ్చిన్నమౌతున్న కుటుంబ వ్యవస్థలో స్త్రీ ఒంటరిగా వుండడానికే

ఇష్టపడుతోందన్న ఆవేదన అచ్యుతవల్లి అముద్రిత వవల 'ఏకాంత' లో సుభద్ర

పాత్రది.

“మనిషిని నమ్మే స్వభానం వుంది. పెద్దపులి కడుపున పుట్టిన లేడికూన, చాలా మెత్తని స్వభావర.*69 అని వర్ణనాత్మకంగా సుభద్ర పాత్రగురించి పరిచయం. చేశారు రచయిత్రి.

తండ్రి భాందసుడు, చండశాసనుడు. తను ఇష్టపడిన ప్రభాకర్‌ మోసగాడు, తనని ఇష్టపడిన సుబ్రహ్మణ్యం స్వార్థపరుడు. అందుకే పురుషుడు, పెళ్ళి అంటే విరక్తి తేలికతనం పెంచుకుంటుంది సుభద్ర.

“పెళ్ళి చేసే వాళ్ళు లేక నేమ మిగిలిపోయాను. నువ్వు చేస్తానన్నా వద్దని భీష్మించుకు కూర్చున్నావేమిటి?” అన్న స్నేహితురాలి మాటలకు సమాధానంగా.

“ఒకప్పుడు పెళ్ళిసంబరంకోసం ఎంతో ఎదురుచూశాను. బి.ఎ. ప్యాసయి ఇంట్లో కూర్చున్న మొదట్లో నాకు అస్తమానూ సెళ్ళిఊహలే వచ్చేవి. అందుకనే ప్రభాకరానికి నా నగలన్నీ ఇచ్చాను. కానీ సిరికిపంద, నా నగలన్నీ. తీసుకుని నా ప్రేమను చులకన చేశాడు. సుబ్రహ్మణ్యం రసికత్వం గురించి నాకు తెలుసును. కానీ మా నివాహం వల్ల నేను నష్టపోయేదానికంటే అతని భార్య నష్టపోయేదే ఎక్కువనిపించింది. అంచేత అవిడ అనుమతి ఇస్తానన్నా ఆమె బిడ్డకు తండ్రి పేమలేకుండా చేయడం అన్యాయమనిపించింది...”7౦ అంటుంది. ఈ దృష్టితో ఆలోచించడం నేర్చుకున్నాకా సుభద్రకి కర్తవ్యం బోధపడింది.

చలం అన్నట్లు 'సవుస్త జీవరాసులూ తవా జీవనం తావేం సంపాదించుకుంటూ వుండగా లోకంలోకల్లా ఒక్క స్త్రీమాత్రం తన జీవవం కోసం యింత నీచంగా పురుషుడి కాళ్ళు పట్టుకోవడమా?” అని ప్రత్యమ్నాయం నిర్ణయించుకుంటుంది సుభద్ర. ఆ నిర్ణయంలోని కష్టనష్టాల ప్రస్తావన వచ్చినప్పుడు

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా. కె.బి.లక్ష్మి - 143

“ఇది కష్టదూ? సంతోషమయిన (శ్రమ. ప్రశాంతంగా వుంది ఇప్పుడు. ఇన్నాళ్ళూ ఒక ధ్యేయమంటూ లేక తెగిన గాలిపటం ఆకాశంలో పల్టీలు కొట్టినట్టు నా మనసు ఊహాకాశంలో పల్టీలు కొడుతూ ఉండేది. ఇపుడు వయసు ప్రలోభ పరిచే ఒడిదుడుకులన్నీ గడిచాయి. సేఫ్‌ పీరియడ్‌ రీచ్‌ అయ్యాను. ఇప్పుడంతా హాయే”71 అంటుంది. అందుకే కేవలం నివాసం వుండడం, తినడం, పడుకోవడం కాకుండా . స్త్రీల మూనసిక వ్యక్తిత్వవికాసాలకి దోహదకారిగా వుండేలా ఒక ఆశ్రమం స్టాపిస్తుంది సుభద్ర. వేటి స్త్రీ మారుతోంది. ఈ మార్పు వ్యక్తిగతంగానూ, సొంఘికంగానూ

జరుగుతోంది. కానీ దీనికి తగ్గట్టు పురుషుడు మారడంలేదు. అందువల్ల కుటుంబ

జీవితంలో ఘర్షణ, అల్లకల్లోలం అధికమౌతున్నాయి. దానా దీనా స్త్రీ ఏకాంతగా

వుండాలని కోరుకుంటోంది. అటువంటి ఏకాంతల ఏకాంత సౌధమే సుభద్ర ఆశ్రమం.

సుభద్రది పరిణామశీలక గుణం.

ఐ.వి-యస్‌. అచ్యుతవల్లి నవలాసొహిత్యం 2% దా. కె.బి.లక్ష్మి - 144

వాతల నాయమకరణంలో 'సహజత్యం

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి పాత్రలన్నీ సామాజిక వ్రతిన్స్పందవకు ప్రతిరూపాలే. నమ్మినదాన్ని ఆచరించడం ఆమె పొత్రల స్వభావం. ఒక నాణానికి వుందే బొమ్మ, బొరుసుల్లా స్త్రీ వురుష పాత్రలు వాటి వాటి ప్రత్యేకతలను, విలువలను కలిగివుంటాయి.

ఇతివృత్తానికి తగినట్లు పాత్రల ఎంపికవున్నట్లే, పాత్రల కుటుంబ, సాంఘిక నేపథ్యం బట్టి పాభ్రల పేర్లు వుంటాయి. అచ్యుతవల్లి ఆ విధంగా పాత్రలకి నామకరణం చేయడంలో సిద్ధహస్తురాలు. కొత్త కొత్త పీర్లు పెట్టాలనిగాని, చమక్కులు చూపించాలన్న తాపత్రయంగాని ఇసుమంతైనా కనిపించదు. నారాయణ, చలిపతి, అరుణ, కామేశ్వర, . శివ ఇలా ఆయా పాత్రలన్నీ మనకి సుపరిచితాలే అనిపీస్తాయి. వాళ్లు మన మధ్యనే వున్న భావన కలుగుతుంది. అది రచయిత్రి గొప్పతనం. ఆ గొప్పదనం తనచుట్టూ జీవితాల పరిశీలన వలన వచ్చిందన్నది స్పష్టం. ఈ నాస్తాల్టియావల్లనే మనకి ఆమె నవలల్లో కొన్నిపేర్లు ఒకటికి రెండుసార్లు పునరావృతమౌతాయి.

ఉదాహరణకి “కొడిగట్టిన దీపాలు" లో 'నారాయణ', 'నేను దేవిని కాను" లో నారాయణ రెండూ కథాపరంగా ప్రధాన పాత్రలే. అలాగే రెండు నవలల్లోనూ నారాయణ నిమ్నవర్గానికి చెందినవాడు కావడం విశేషం.

“భ్రమరగీతం' నవలలో 'చలపతి' బుద్ధిమంతుడు, త్యాగధనుడు, అయితే, “కొడిగట్టిన దీపాలు' నవలలో చలపతి భార్యని అనుమానించి, బాధించే స్వార్థపరుడు.

'పేమగండం' లో శివకేశవ యువకుడు, విద్యార్థి, ప్రేమలోపడి ఇతరుల మార్గదర్శకత్వంతో కుదురయిన జీవనం గడపడానికి నిశ్చయించుకున్నవాడు. 'మూడుముళ్ళు' నవలలోని 'కేశవరావు" నడివయస్కుడు, ప్రొఫెసరు. తన రెండవభార్యను ఆమెకి తప్పిపోయిన పెళ్ళికొడుక్కి ఇవ్వజూపి ఆఖరికి భార్య మార్గదర్శకత్వంలోనే తప్పు చక్కదిద్దుకున్నవాడు.

“'కొడిగట్టిన దీపాలు” లో 'గవర్రాజు' పందులు పెంచుకుని బతుకు ఈడుస్తూ, అవి జబ్బుపడి చచ్చిపోతే భార్యాబిడ్డల సంపాదన మీద ఆధారపడి ఆ తర్వాత కాలం కర్మం కలిసొస్తే బాగుపడిన నిమ్నవర్గీయుడు. 'మూడు ముళ్ళు" లో 'గవర్రాజు' కిళ్ళికొట్టు పెట్టుకుని బతుకుతూ, ఇంటివాళ్ళ అమ్మాయిని ప్రలోభపరిచి మోసగించిన (ప్రబుద్ధుడు. అనంతరకాలంలో లక్షలకి పడగలెత్తి, జీవితానుభవాలతో బుగర్రబొప్పి

ఐ.విఆయస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 145

కట్టి మోసగించిన ఆ అ(గ్రవర్గం అమ్మాయినే పెళ్ళాడి పశ్చాత్తాపంతో మనసుకు ప్రక్షాళనం చేసుకున్నవాడు.

“ఇదెక్కడి న్యాయం" లో 'రామనాధం' కథానాయకుడు. ప్రీమించి పెళ్ళాడిన భార్య మాలతిని మధ్యతరగతి మనస్తత్వంతో బాధించి, అఖరికి ఆమెకి దూరమై రెండో పెళ్ళి చేసుకున్న ఘనుడు. “మూడు ముళ్ళు" లో 'రామనాధరంి కధానాయిక కామేశ్వరికి తప్పిపోయిన పెళ్ళికొడుకు. పెళ్లయిన ఆమెతో మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెచ్చి భంగపడి బతుకును చక్కదిద్దుకున్న బుద్ధిమంతుడు.

“ఏకాంత'లో 'సుభద్రి ప్రధానపాత్ర. సామాజిక దృక్పథంతో మెలిగే ధీర వనిత. “ప్రీమించని మనసులు" నవలలో 'సుభద్ర' కుటుంబగౌరవం కలిగి అన్నా వదినల అన్యోన్యతని ఆళించే ఆదర్శ ఆడపడుచు.

“నేను దేవినికాను" లో 'శారదమ్మ' నిమ్మవర్గీయురాలైనా కష్టపడి ఇంటిని చక్కదిద్ది తండ్రిలేని పిల్లవాడైన ఒక్కగానొక్క కొడుకుని ప్రయోజకుణ్ణి చేస్తుంది. “ఇదెక్కడి న్యాయం' లోని 'శారదమ్ము పేరుకి కథానాయికకి తల్లేగాని ఆద్యంతం నిస్పహాయత్వంతో కూతురి రెక్కల కష్టం మీద ఆధారపడిన సామాన్య స్త్రీ.

'వూలూ - ముళ్ళు" నవలలో 'నళిని' ప్రధానపాత్ర. అందగత్తె, ధనికురాలు, విద్యావతి. గాడితప్పిన భర్తను గౌరవప్రదంగా చక్కదిద్దిన సంయమన మనస్కురాలు. 'మూడుముళ్ళు' లో “నళిని' అహంభావి, స్వేచ్చాప్రణయ పిపాసి. అదుపు తప్పినా అంతలోనే జ్ఞానోదయమై తనకి తాను మేలుచేసుకున్న అవకాశవాది.

అలాగే వైష్ణవ సంప్రదాయ ప్రభావంతో, ఆ సంప్రదాయనిబద్ధతతో వ్రాసిన నవలల్లోని పాత్రలపేర్లు తిరుప్పావై స్పర్శ కలిగి వుండడం, అరవ సంప్రదాయ పోకడలు కనిపించడం గమనార్హం.

“ఎగిరే పిట్టలు' నవలలో అప్పాదొరై, చూడికుడుత్తమ్మ, నాయకి, రామానుజం అన్నపేర్గు, “ప్రేమించని మనసులు' లో నంజుండయ్య, 'ప్రేమగండం' లో అంబుజ, అయ్యర్‌ ఈ కోవకు చెందినవే.

దేవుడి వెంక్కుబడుల వలనో, పెద్దల పేర్లు పెట్టీ తీరాలన్న సంప్రదాయంవల్లనో ఆడపిల్లలకి మగపేర్లు పెట్టడం రివాజు, 'భాస్కరం' అని పేరున్న అందాల భరిణ 'ఇదెక్కడిన్యాయం' లో కథానాయకుడికి రెండోభార్య అయి చక్రం

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం % డా, కె.బి.లక్ష్మి - 146

తిప్పితే, “కొడిగట్టిన దీపాలు" నవలలో రెండో కథానాయిక రమణ జీవితంలోని ఒడిదుడుకుల్ని తట్టుకుని అనుకున్నదానికి కట్టుబడివున్న తరుణి.

ఇలా అచ్యుతవల్లి నవలల్లోని పాత్రలు తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు

_ నిరంతరం పోరాడేవాళ్ళు, తమ వ్యక్తిత్వాన్ని లుప్తం చేసుకునేలా ప్రవర్తించేవాళ్ళు,

బలహీనతలకు, సంఘర్షణలకు గురయి బలయ్యే వాళ్ళు, నిలదొక్కుకుని గట్టిగా నిలబడే వాళ్ళు పలురకాలుగా పాఠకుల ముందుకు వస్తాయి.

వ్యక్తి వ్యవస్థల మధ్య ఉండే సున్నిత సంబంధాలను సమన్వయిస్తూ వ్యవస్థకు ప్రతీకలుగా వున్న పాత్రలొన్నింటినో చిత్రించారు. సావూజిక దృష్టి, మనోవిశ్లేషుణాసామర్థ్యం అచ్యుతవల్లి స్త్రీ పురుష పాత్రల్లో ప్రస్ఫుటమవుతుంది.

అచ్య్యతవల్లి నవలల్లోని పాలం పరిణావంళీలకంగానళూ, పరిణావమరహితంగానూ ఉన్నాయి. సమాజంలోని వివిధ వ్యక్తుల స్ఫురణతో దర్శనమిస్తాయి. పొత్ర ప్రధాన నవలల్లో మనో విశ్లేషణాత్మక విధానం ద్వారా, ఆత్మాశ్రయ నవలల్లో రచయిత్రి సిద్ధాంతాలకు ప్రతిబింబాలుగా వుండేలా పొత్ర చిత్రణ జరిగింది.

అచ్యుతవల్లి నవలల్లో పాత్ర స్వభావాల నిర్దేశం, వాటి చిత్రణలో అధిక వైవిధ్యం, ప్రతిభా ప్రదర్శన అసొమాన్యం. వీరి పొత్రలు నవల పఠనీయతను పెంపొందింపజేయడమేగాక, అత్మవిమర్శనా జ్ఞానంతో పాఠకుడి మనసుకి సన్నిహితంగా తోస్తాయి. “ తీ వ026 2౧6 10000816 11౧0౪/6606 0 ౧౮౧౧౭౧ ౧41/6 4 1206, & 660 1౧510౧1 1౧40 1౧6 ౪0141003 01 19 60౧౧౫౧౫౫౦౧ ౧౧౦౪౪63 2౧6 ౧43510౧5, 088/6 ౧0౪/6 2౧6 62౧240 9౧౧౭1౫ ౪|| 1096106 0[6౧ 56106 (0 01౪6 9405120181 668116/ 2౧6 ౪౧౧౧౫154202016 10601 0 0 ౧౧4౧404665 ₹0౯౪/0౧10% 504[06%/ & 510016 56006510౧0 040 ౧2౪౭ ౨6680 14590 61/66) 100౧) 672 అన్నట్లు లోకవృత్త పరిశీలనా దక్షత, అవగాహన, పొత్రల మనోవృ త్తులను స్పష్టంగా (గ్రహించి, వాటిని వివరించడానికి తగిన ప్రతిభా సముత్పన్నతలు వున్న రచయిత్రి అచ్యుతవల్లి.

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి,లక్ష్మి - 147

పాదసూచికలు

  1. శీలా వీర్రాజు - అచ్యుతవల్లి సాహితీ సమాలోచన సదస్సు - పత్రం - యువభారతి మార్చి క వతేది 2000

  2. మాలతీ చందూర్‌ - నవలా రచన (వ్యాసం) - జగతి - 1959 ఆగస్ట్‌ - పుట - 16 - సంపొదకుడు ఎన్‌. ఆర్‌. చందూర్‌

  3. ఆర్‌. ఎస్‌. సుదర్శనం - మహతి - పుట 109 - యువభారతి

  4. ఐ-వియస్‌. అచ్యుతవల్లి - సీతకలలు - పుట - 31 క్‌, ” * = కొడిగట్టిన దీపాలు - పుట - 189 ళం గ న - నేను దేవిని కాను - పుట - 117 భా ళ్‌ తి -మూడు ముళ్ళు - పుట - 216 8, న ౪ - భ్రమరగితం - పుట 131 9, ః "= కొడిగట్టిన చీపాలు - పుట 158

  5. ॥ జి - ఇదిమల్లెల వేళ - పుట - 192 క్షే న న = 1016 - పుట - 196 క్షే2ై, న ౨ 1016 - పుట - 172 క్షే3ం న జి = 10164 - పుట - 173 కేశ.” "= ఎగిరేపిట్టలు - పుట - 235 కేక్‌, ళ్‌ ల్‌ = కానుక - పుట - 98

  6. న ః - ప్రేమించని మనసులు-పుట - 52 17, న “ -110- పుట- 60

  7. న “= -(14- పుట- 57 [ే9, లి *.. - పుట్టిల్లు - వుట - 129

  8. ” గి - ఇదెక్కడి న్యాయం - పుట - 44 ఐ-వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా, కె.బి.లక్ష్మి - 148

  9. లి ౫ = 1016 - పుట - 45 22.” = 16 - పుట 197 23." * = ప్రేమగండం - పుట - 138

  10. "16 - పుట - 139

  11. 1661404 ౬౫౯” ౧౮౦౩౦|%| - ఉగ 1౧70660100 10 116 546% 01 1062016 = నిన - 336 & 337. న

  12. లి వో = ముడుముళ్ళు - పుట - 12

  13. ః శ్‌ _ వేను దేవిని కాను - వుట - 113

  14. క స్ట - ౨16 - పుట - 118

  15. ఖః న = 1016 - పుట - 118

  16. ౫ ౫ _ ఇదెక్కడి న్యాయం - పుట - 188

  17. పె ౫ _ 19164 - పుట - 141

  18. ః్‌ ౨ [6 - పుట- 127

  19. లి న్‌ - పుట్టిల్లు - పుట - 43 3 శీ, ః జ్‌ _ 1016 - 48 వెక్‌. ౫ ్‌ = 1014 - 118 36 2. _ ప్రేమించని మనసులు - పుట - 69

  20. & = 2 __ ఎగిరేపిట్టలు - వుట - 221

  21. / జః _ 1014 - వుట - 259

  22. ౯ న్‌ = 1014 - పుట - 259

  23. ళ్‌ జ = 1016 - పుట - 263

  24. = _ కొడిగట్టిన దీపాలు - పుట - 177 జీరా న లె _ 1014 - వుట - 178

ఐంవియస్‌. అద్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 149

  1. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - 1016 - పుట - 179 44 = _ 1164 - వుట 184 శీ5్‌, ॥ః ॥ _- కోరిక - పుట - 93,94

  2. ॥ న = 1౨16 - పుట- 160 శీ, స ల్‌ - (16 - పుట- 161 48, లి "౨. = భ్రమరగీతం - పుట - 200 శీ9, ల్‌ = - 6 - పుట - 272 క్‌0, ॥ ".. -పూలుముళ్ళు-పుట- 67? క్‌ 1, న ళ్‌ = 1016 - పుట - 226 ప్‌ 2, తె లి - మూడుముళ్ళు - పుట - 87 3 ౯ ౨ 1016- వుట - 204 కశ. ౩. _ పూలు-ముళ్ళు - పుట - 83 క ౨ -1016- పుట - 229 ర్‌ 6. న వ్‌ - మూడు ముళ్ళు - పుట - 66

  3. ౨ ఎ 1016- పుట - 170 మ (16 - పుట - 213 ఏ9 = -సీతకలలు -పుట - 106

  4. ” ౫౨. _ నేను దేవినికాను - పుట - 102 ళక, ౫ % - ఒడ్డుకి చేరిన ఒంటరి కెరటం - పుట - 51

  5. లం ౨-16 - పుట- 107

  6. లి - ప్రేమగండం - పుట - 90

  7. 7 గ - 1016 - పుట - 137 ఐంవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 150

  8. ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి - ఇది మల్లెల వేళ - పుట - 134

  9. ॥ లి - 1016 - పుట - 134

  10. ళి ళీ = 1016 - పుట - 202

  11. న లి = 1016 - పుట- 140 69, 7 ళ్‌ - ఏకాంత - పుట - 56

  12. క జ = 1016 - పుట - 212 71, న ॥ = 1016 - పుట - 213

    1. [౮౦5౦|౫ - 4౧ 1౧00660600 10 106 9066౪ 0 ౬౧91130 [16%66 - 7౧౪ 5946౪ ౦ ౯|౧౦56 గ౦౪10% ౧286 - 151. ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 151

ఖారాశ్రైలి - శిల్పం తచర్గనలు “మాట్లాడేటప్పుడుగాని, రాసీటప్పుడుగాని భాష్తాభివ్యక్తి లో కనబడేతీరును శైలి అంటాం, విసృ్రతమైన భాషాన్యవస్థలో శైలి భాష అన్నవి అంతర్భాగాలు”, “రచయిత వ్యక్తిత్వమూ, అతడు వెలిబుచ్చే భావాలు అనే రెండు అంశాలు సమ్మేళనమే శైలో2. నవలకుకాని, కథకుకాని శైలిప్రాణం వంటిది. రదనా ప్రశస్తి నిర్ణయంలో శైలికి ప్రధానస్థానం వుంది. ఒక విధంగా చెప్పాలంటే రచనా చమత్కారానికే శైలి అని పేరు. అచ్యుతవల్లి శైలీ వైవిధ్య పరిశీలనలో, కథాకథనంలో ముఖ్యంగా 1. వర్ణనలు (ప్రకృతి వర్ణన, ఆకృతి వర్ణన), 2. సంభాషణా శైలి, 3. భాష్కు 4. పొత్రలపట్ల రచయిత్రి వైఖరి, 5. రచయిత్రి కథన శైల్కి శిల్పం గురించి చర్చించడం జరుగుతుంది. ఈ ఐదింటిలోను రచయిత్రి ప్రయోగించిన భాష్క వాక్య విధానం, ఉపమానాదులు, ప్రతీకలు, ధ్వనింపజేసిన అనుభూతులు ఆమె శైలీ నిర్దేశకాలు. (1) శ్రుకృతి వర్ణన - భావుకురాలయిన రచయిత్రిగా అచ్యుతవల్లి ప్రకృతి వర్ణనలను అటు ప్రబంధ రీతిలోను, పాభ్ర, ప్రకృతుల తాదాత్మ్య్యంగాను, ఆత్మాశ్రయ ధోరణిలోను సన్నివేశ జెచిత్యంతో ఆవిష్కరించారు. కళ్ళకి కన్పించే ప్రవంచంతోపాటు ప్రకృతిని, మానవ ప్రకృతిని కూడా ఆమె వర్ణించినతీరు అసామాన్యం. పకృతి అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆమె వర్ణనల్లోని ఆకాశం, మేఘాలు, వక్షత్రాలు, సూర్యోదయ, సూర్యాస్తమయాల్లోని అద్భుత, అలౌకిక సౌందర్యం పాఠకులకు అనిర్వచనీయమైన అనుభూతినిస్తాయి. అందుక్షేనేమో! మానవప్రవృ త్తులని ప్రకృతితో పోల్పిచూడడం కనిపిస్తుంది. “ప్రకృతి శాంతంగా వుంటే ప్రణయ సౌందర్యం, కోపిస్తే ప్రళయం! మనిషీ అంటేగా...!' అన్న అభివ్యక్తి ఇంచుమించు ఆమె రచనలన్నిటిలోనూ సహజ సిద్ధంగా దర్శనమిస్తుంది. అచ్యుతవల్లి మానవ చిత్రణ చేసినట్టుగానే ప్రకృతి చిత్రణ కూడా కమనీయంగా చేయగలరు. మనుషులను గురించి చదివీ చదివీ వున్న కళ్ళకు ప్రకృతిని గురించిన వర్ణన కనబడగానే. మనిషి మనుషులలో మాద్రమే నివసించకుండా ఐవి.యస్‌. అద్యుతవల్లి నవలాసాహిత్యం 3% డా, కె.బి.లక్ష్మి - 152

ప్రకృతిలో కూడా'నివసిస్తాడు. అందుకే మానన సౌందర్యంతోబాటు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడంలో కూడా ఆహ్లాదం చెందుతాడు మనిషి, అచ్యుతవల్లి ప్రక్యతి చిత్రణ హాయిగా అనిపిస్తుంది. ఒక కాన్వాస్‌ మీద బొమ్మగీసి నట్టుంటుంది.

“దూరదూరంగా కొండలకి, ఆకాశానికి మధ్యన వున్న సరిహద్దు గీత వంకర టింకరగా కనబడుతోంది. ఆకాశంలో పక్షులు స్వేచ్చగా ఎగురుతున్నాయి. కొండలకిందుగా వున్న విశాలమైన పసరిక మైదానంలో ఆవులు, దూడలు పచ్చికలు మేస్తున్నాయి. కొండలకు ఎగబ్రాకుతున్న ఆవులు, సుద్దచుక్కల్లా కనబడుతున్నాయి. నిర్మాలాకాశంలోని లేత నీల హరితాలు కలిసేచోట నల్లదనం వచ్చింది. ఒక మబ్బుకీ ఒక మబ్బుకీ పోలికే లేకుండా కణకణాలుగా విడిపోయి తొందరపడి వున్నట్లుగా పరిగెత్తుతున్నాయి"3 అన్నవర్లన నీటిరంగుల నిసర్గ చిత్రంలా వుంది.

“'ముడుముళ్ళు' నవలలోని ఈ వర్ణనని కేవలం ప్రబంధ వర్ణ్లనగా కాకుండా పాత్ర మనస్తత్వంతో అన్వయించిన తీరు విశిష్టమైనది. ఆ విడిపోయిన మబ్బులను చూస్తుంటే కామేశ్వరికి తమ విభిన్న జీవన దృక్పథాలు జ్ఞాపకం వస్తున్నాయని వర్ణనకి వ్యాఖ్యానం జోడించడం జరిగింది.

“వేను దేవిని కాను నవలలో “చాలా అందమైన ప్రభాతసమయం అది. మందాకినీ సెలయేరులోంచి సూర్యుడు అరుణారుణ వర్గంతో పైకి లేస్తున్నాడు. ఆకాశంలో అక్కడక్కడ చిన్న చిన్న మబ్బు తునకలు దూదిపింజల్లా దూరదూరంగా పరుగులు తీస్తున్నాయి. రాతంతా కొట్టి కురిసిన వేంఘరాజు అలసట తీర్చుకుంటున్నాడు. గాలిరాజు మేఘరాజుని ఆకాశం నలుమూలలా పరుగులు పెట్టిస్తున్నాడు - చింతా వారి నూమిడితోట వెనుకవైపున సావిత్రి పడిపోయిన కూరపాదులని పందిళ్ళకు చుట్టబెడుతోంది". అన్న వర్ణనలో వర్షం వచ్చి వెలిసిన ఆకాశం తీరు, ప్రభాతవేళను వర్ణిస్తూనే దాని పర్యవసానంగా తోటలోని మొక్కల దుస్థితి కళ్ళకు కడుతుంది.

(1) అత్నాశయ (పక్పతి వర్దన : పొత్ర అంతరంగ కేంద్రితంగా,

అనుభూతిపరంగా “శ్రీమించని మనసులు' చిత్రించిన తీరు పొత్ర ఆత్మానుభూతికి

తార్కాణం. తన పెళ్ళయిన రెండేళ్ళకి వైవాహిక జీవితం గురించి ఒక సంతోషకరమైన

వార్త విన్న కధానాయిక నాగమణి మేడమీది కిటికీలోంచి కింది “తోటని చూసే

సన్నివే శంలో తోటలోని రకరకాల పూవ్వులు, సువాసనలు వెదజల్లుతూ ఐ.వి.యస్త్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం 38 డా, కె.బి.లక్ష్మి - 153

ఛలలూపుతున్నాయి. విరిసిన పూవుల మురిపాల ముచ్చట్లు తల్లి ఆకులు చెవులగ్జి వింటున్నాయి. తుమ్మెదలు, 'సీతాకోక చిలుకలు, ప్రతిపువ్వూ ఆహ్వానాన్ని అందుకున్నాయి. మత్తెక్కి జోగుతూ సంగీతాలు పాడుతున్నాయి. వాటి సంగీతానికి తోటగట్ట్లమీద సరుగుడు చెట్లు శృతి చేస్తున్నాయి. దూరంగా ఇనప స్తంభాల అర్చి మీదున్న చంపకాలు తమ శక్తినంచన లేకుండా సువాసనలు వెదజల్లుతున్నా తుమ్మెదలుకానీ, సీతాకోకచిలుకలు కానీ వాటి హృదయ పూర్వక నిమం(త్రణాన్ని అందుకోలేపోతున్నాయి. నాగమణి “చలిత చంపకం' యొక్క మూగవేదనని పరీక్షిస్తూ కూర్చుంది. హృదయ మూత్ర సౌందర్యం అనాకర్షితం అని చంపకపుష్పం రుజువుపరుస్తోంది. తుమ్మెదలక్కావల్సిన వుధువుకాని, సీతాకోకచిలుకలని మరిపించగల వన్నెల రంగుల రేకలుగానీ చంపకపుష్పం సంతరించుకోలేదు. ఒక పుష్పజీవితం ఒకే రంగులో గల నిసర్గసౌందర్యంతో, ఒకే ఒక అనుభూతితో పరిపూర్తి అవుతుంది, అనుకుంది నాగమణి”4 అని వర్ణిస్తారు రచయిత్రి. వాగమణి అనారోగ్యం, భర్త అనాదరణ, శృంగార రసొనుభవ వైఫల్యం వల్ల కలిగిన నిరాశ నిరాసక్తతలను ధ్వనింపజేస్తూ, పువ్వుతో తన జీవితాన్ని పోల్చుకున్న నాగమణి హృదయ సౌకుమార్యం, తాత్వికతలను ఈ వర్ణన తెలియజేస్తుంది. 'షణ్ముఖప్రియిలో “రాత్రి పన్నెండు గంటలవుతోంది. వరండాలో నించుని చిక్కటి చీకటి అకాశాన్ని చూస్తోంది దేవసేన. చీకటి ఆకాశంలోని నక్షత్రాలు, వెన్నెల అకాశంలోని నక్షత్రాలకంటే ఎక్కువ ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి. ఆశల అలల్ని నిరాశా కెరటాలుతోసి వేస్తుంటే, ఆ అలలు ఇంకా ఎక్కువగా గలగల్లాడుతూ సంగీతం పాడుతాయి. ఇది నిత్య జీవిత సాగరంలోని సంగ్రామం"5 ఈ వర్ణన ఎంత ఆత్మాశ్రయమో? అంత విషయ ్రధానమైైనదని, దేవసేన అనుకున్నదొకటయితే జరిగినది ఇంకొకటన్నది విదితమౌతుంది. (1) పాత్ర మనోగత సారూప్యత: తొలి ప్రేమానుభవంతో సర్వ ప్రపంచం కూడా తాను వలచిన వనిత కాలిగోటికి సరిపోదనే వలపు వెల్లువలో ఎవరేమన్నా పూచికపుల్లల్లా కొట్టిపారేశాడు “ఇదెక్కడి న్యాయం' లో రామనాధం. ఉద్యోగం చేసే భార్య పుట్టింటికి సాయం చేయడం నీ తెలివితక్కువ అవుతుందని మేమమామ ఎద్దేవా చేసినపుడు నిశ్చల తటాక్రంలా వున్న అతని మనస్థితిని “ఏమాత్రం గులకరాయి విసిరినా నిశ్చల తటాకం గిరగిరా గింగిరాలు తిరుగుతుంది. వెల్లువ వచ్చి తీసిపోయాకా ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 154

తీరాన్ని చెత్తా చెదారం అంటి పెట్టుకున్నట్లు ఈ (ప్రవమమయ మనోతీరాన్ని అనువమూనాలూూ దురభిమూనాలు, దురహంకారాలు గట్టిగా అంటిపెట్టుకు కూచుంటాయి. వాటిని ఎంతటి సంస్కార, విజ్ఞాన పూరితమైన ఆలోచనా తరంగాలు . కూడా మామూలు ప్రవాహపు వెల్లువలోకి ఈడ్చుకుపోలేవు. అంతరాంతరాలలో ఆ . మురికి, ఆ మకిలి అలా అలా పేరుకుపోతూనే పైకి స్వార్థం అనే అందమైన నైలాన్‌ ముసుగులోంచి అలవోకగా దర్శనమిస్తూ వుంటుంది. రామనాధం హృదయం ఆత్మీయమైన హృదయం. మమతానురాగాలతో స్పందించే హృదయం. మేనమామ నీలాంబరం మూటలతో సన్నని పగులు నిచ్చింది. కాస్త బీట చాలు గోదావరీ ప్రవాహం ఆ రాతిని పగలగొట్టి విపరీత వేగంతో ప్రవహించగలదు."6 మధ్యతరగతి మగ మనస్తత్వాలు మాట మాత్రానికే ఎంతలా మారిపోతాయని చెప్పడానికి అచ్యుతవల్లి ఎన్నుకున్న వినూత్న వర్ణనాతైలిని తలియజేయడానికే ఇంత సుదీర్ణ వర్ణనని ప్రస్తావించవలసివచ్చింది.

(1) రూపవర్ణన (ఆక్పతి వర్జన) : వ్యక్తి ఆకృతి వర్ణన పాత్ర చిత్రణలోని (ప్రధానాంశాల్లో ఒకటి. స్వరూప వర్ణన పొత్ర సజీవంగా కళ్ళముందు కదలాడ్డానికి దోహదపడుతుంది. పాత్ర అంగాంగ వర్ణన చేయడమే రూప వర్ణనగా చెప్పుకోవచ్చు. కానీ పాత్రల ఆంతరంగిక స్వరూప స్వభావాల్ని కూడా దృష్టిలో వుంచుకొని చేసే వర్ణనలో సమగ్రత, రచయిత అల్లిక జిగిబిగీ నైపుణ్యం కూడా ప్రదర్శితమవుతుంది. ఈ తీరు వర్ణనల్లో అచ్యుతవల్లి శైలీ వైశిష్ట్యం ఎన్నదగినది. ఆమె ప్రయోగించే ఉపమలు, ఉక్తి వైచిత్రాలు అసామాన్యాలు. ఆకృతి వర్ణనకు ప్రకృతి సిద్ధాలను మిళితం చేయడంతో ఒక కొత్తదనాన్ని, ఒక ప్రత్యేకతని సంతరించారు అచ్యుతవల్లి. వర్ణనలోని నవ్యత, సంక్షిప్తత పాఠకుణ్ణి వదలకుండా వెంటాడతాయి.

'మూడుముళ్ళ'లో “రాజేశ్వరి శరీర సౌందర్యం అంతా కామేశ్వరి కళ్ళలోని కాంతి కిరణాల్లో నిబిడీకృతమై వుందా అన్న భావన వచ్చింది కేశవకి”? అన్న వాక్యాలు ఇద్దరు స్త్రీల సౌందర్యశోభను రేఖా చిత్రంలా మనముందుంచుతాయి.

'సీజ్ర కలలు' నవలలో 'అకు సంపెంగ పువ్వు గుప్పెటలో ఘుమఘుమలాడి నట్టు అతని ఒడిలో గువ్వపిట్టలా ఒదిగిపోయింది సీత'8. పుష్ప సౌకుమార్యాన్నీ, అనురాగ పరిమళాన్ని, దాంపత్య జీవన ఒద్దికను, రసానుభూతిని ఇంత అలతి

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 155

అలతి వదాల్లో అందించి పాఠకుల మనసుల్పి కువకువలాడించగల ఘనత అచ్వుతనలికే సొంతం.

'పుట్టిల్లులో మేనత్త మేనకోడల్ని దగ్గరకి తీసుకున్న సన్నివేశంలో మేనకోడలు. అనూరాధ రూపలావణ్యాన్ని చెప్పకనే చెప్పింది ఈ వర్ణన. “మెత్తని కాళ్మీరపు సిల్యుచీర మడతలా వున్న అనూరాధ శరీరాన్ని తన గుండెల్లోకి పాదువుకుంటూ కులొసొగా వున్నావా అని పలకరిస్తుంది సుబ్బమ్మి9. పట్టులాంటి మృదువైన, మెత్తని నాజూకు రూపం అనూరాధది అని చెప్పిన ఆ వర్ణన అప్పటికీ ఇప్పటికీ ఎంతో కొత్తది.

(7) వ్యక్తిత్వ స్ఫురణ : శరీరశాస్త్రం ప్రకారం కన్ను, ముక్కు తీరును బట్టి మనిషి వ్యక్తిత్వం చెప్పవచ్చని మనస్తత్వవేత్తలంటారు. అందుకు తగినట్లున్న వర్ణన “ఇదెక్కడి న్యాయరలో మాలతిని వర్ణించిన తీరు.

“మాలతి మోకాలి మడత దాటిన పెద్ద జడ. పక్కనించి చూస్తే వంకులు వంకులు తిరిగిన జుట్టుతో ఆమె చెంప ఆకర్షణీయంగా కనబడుతోంది. దృఢంగా; పొడుగ్గా వుంటుందా. చామన చాయ, కోలముఖం, సన్నగా ఎత్తయిన ముక్కు, ముడుచుకున్నట్టుండే సన్నని పెదాలు, నల్లని కళ్ళు. చూడగానే అందగత్తె అనిపించకపోయినా పరకాయించిచూస్తే ఆమె చక్కని ఎర్రని గన్నేరు మొగ్గలా వుంటుందనుకోవచ్చును. ఆమెలో స్త్రీ సహజమైన లాలిత్యం కంటె, గాంభీర్యం ఒకపాలు ఎక్కువో!6, ఎర్రని రంగు, మొగ్గ గన్నేరు అనడంలోనే గంభీరత్వం తెలుస్తుంది, పాఠకుడికి పాత్రను గురించిన అవగాహన కలుగుతుంది.

“గ్గాస్కో పంచెకట్టు, సిల్కులాల్చీ ధరించి, పక్క పాపిడి తీసి నొక్కులు నొక్కులుగా జుత్తు ఎగిరేటట్లు దువ్వుకున్న క్రాఫింగ్‌తో కునేగా పరిమళంతో గవర్రాజు ఆకర్షణీయంగా కనిపించాడు నళినికి”11. 'మూడుముళ్ళు'లోని ఈ వర్ణన గవర్రాజు షోకిల్లాతనం, ప్రతివాయక అక్షణొలను ఇట్టే పట్టిస్తుంది. వర్ణన చదవగానే పొట్రని ఒక ఫేంలో చూసినట్లనిపిస్తుంది పాఠకులకి.

(7) భావవర్టన : పెళ్ళిచూపుల్లో పెళ్ళికూతుర్ని చూసినపుడు “తల్లో ముద్దబంతి

పూల చెండుమీద అరచేయంత నాగరం, గట్టిగా బిగించి వేసిన జడకి జడగంటలు,

పెద్ద పట్టుచీరలో పదిలంగా చుట్టబడిన ఆ పిల్ల పదిహేనేళ్ళ వయస్సూ రామనాథధానికి

అసుర సంజవేళ సింహాచలం కొండమీద నుంచుని కింద లోయలోకి చూస్తే కనబడే వఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 156 -

చిక్కని చీకటిలా కనబడింది*12 పాత్ర మనోభావ వర్ణన వల్లపాత్ర స్వభావాన్ని స్పష్టం చేయగల సమర్శురాలు అచ్యుతవల్లి. అందుకు ఇంకో ఉదాహరణ “ఇదెక్కడి న్యాయరంిలో మాలతి పాత్ర మనోభావన.

అభిప్రాయ భేదాలతో భర్తతో విడిపోయిన ఎనిమిదేళ్ళకి భర్త దగ్గరకు వెళుతున్న మాలతికి "జీవితమంతా దారితప్పిన బాటసారిలా, ఎండలో నిల్చున్న చెట్టులా అనిపిస్తుంది. తన శరీరం చెరుకుగానుగలో తిప్పి బాధపెట్టినట్లు విలవిల్లాడిపోయింది”13. సందర్భానుసారంగా జొచిత్యానికి భంగం కలగకుండా పాత్ర విషాదమనోభావాల్ని హృద్యంగా వర్ణించిన తీరు గమనార్హం.

ఒకే వ్యక్తి పరంగా ఇరువురు వ్యక్తుల్లో కలిగిన భావసంచలనాన్ని “ఆకాశం

.విరిగినట్ట్లు అనిపించింది వూధవకి. పిడుగు మీదపడినట్లు భారంగా ముడుచుకుపోయాడు రామనాధం"”14 అని 'మూడుముళ్ళు' లో వర్ణించారు. (1) ఛాయచి(త 'సద్పుశ్య వర్ణన : 'రవిగాంచనిచో కవిగాంచున్‌ అన్నట్లు సాధారణ కంటితో చూసినదానికి కెమెరా కన్నుతో చూసినదానికి తేడా కచ్చితంగా వుంటుంది సహజసిద్ధమైన ఆకృతి వర్ణనలు చేయడంలో సిద్ధహస్తురాలు, అచ్యుతవల్లి. స్వాభావిక వర్ణనా సామగ్రితో పాత్ర రూపవర్ణనలో నూతనత్వాన్ని తీసుకురావడం ఆమె ప్రతిభకు దర్పణం.

'కొడిగట్టిన దీపాలు' నవలలో "పరికిణీ కుచ్చిళ్ళు బొడ్లో దోపుకుని గెంతుకుంటూ బాదం చెట్టు దగ్గర పడేసింది ఆ ఎంగిలి కంచాలు. పదేళ్ళు నిండి వుండచ్చు రమణకి. పచ్చగా బొద్దుగా పందిరి దోసపండులా వుంది. పరికిణీ కుచ్చిళ్ళు పైకి దోపటంతో మోకాలికింద నుంచి కాళ్ళు అరటి దూటల్లా నవనవలాడుతున్నాయి”15.

అదే నవలలో మరోచోట ఆ రమణ గురించే చెబుతో “కళ్ళనిండా చింతాకు వెడల్పున కాటుక్క నుదుట పావలా కాసంత అగరు బొట్టూ, మెళ్ళో నల్లటి పట్టుతాడుకి రెండంగుళాలున్న బంగారు ఆంజనేయులు బిళ్ళ, ఒత్తయిన జుట్టు బిగించి జడలఅల్లి, చివరన ఎ(ర్రని పూలు కుచ్చూ, బడికి వెళ్ళడానికి సిద్ధంగా వుంది"16 అని వర్ణిస్తే, అదే సందర్భంలో ఇంకోపాత్ర దృష్టికి రమణ కనబడే తీరును “పచ్చటి ముఖంలో నల్లటి కాటుక, నల్లటి గుండ్రని బొట్టుతో రమణ చిన్న బంగారు దేవతామూర్తిలా వుంది. సన్నగా ఎత్తుగా వున్న ముక్కుకి వున్న చిన్ని మంచి ముత్యం ముక్కుపుడక

ఐ,వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 157

దగ్గరగా వచ్చి చూస్తేనే గాని కనపడడం లేదు"17 చక్కగా ముస్తాబయిన పదేళ్ళ ఫక్తు పల్లెటూరి పిల్ల కళ్లముందు కదలాడేంత సహజసిద్ధమైన వర్ణన అచ్యుతవల్లి ప్రత్యేకత. దోమలు, చీమలు కుట్టడం, దద్దుర్గెక్కడం సాధారణంగా జరిగేదే. అయితే చర్మసౌందర్యాన్ని పాడుచేసే ఆ దద్దుర్ల ను కళాదృష్టీతో చూసినపుడు రచయిత్రికి తట్టిన వర్గ్షన చూడండి. మామూలుగా స్త్రీల చేతులను తామరతూడులతో పోలుస్తారు. అది కావ్యరితి. కానీ వాస్తవదృష్టితో “నల్లులు కుట్టి చూడికుడుత్తమ్మ దూటలాంటి చేతులనిండా కందిగింజలంత దద్దుర్లు లేచాయి"18 అని 'ఎగిరే పిట్టలు' నవలలో వర్ణించారు. పచ్చగా, పొడుగ్గా, పుష్టిగా వున్న స్త్రీ చేతులు నిజానికి అరటి దోటల్లానే వుంటాయి. ఆ స్వాభావికతను వర్ణనలో చొప్పించి నేటివిటీ సాధించి మెప్పించడం ఆచ్యుతవల్లి రచనా కైలీ ప్రతిభ. అందుకు ఇంకో మచ్చుతునక "కోరికలో "బాబు బోర్లగిలా పడి దేకడానికి పొట్టతో ప్రయత్నిస్తున్నాడు. వాడి పిర్రలు తెల్లగా పంపర పనాసకాయ సగం కోసి బోర్లించిన డొప్పల్లా ఎత్తుగా వృండి అక్కడక్కడ లేతాకుపచ్చరంగులో సొట్టలుపడివున్నాయి"19. అత్యంత సహజమైన ఉపమానం. (1) పురాణ - చరిత్రాత్మక పాత్రలతో పోలిక : "పెళ్ళి అయితే ఆడదానికి అన్ని ద్వారాలు మూసుకుపోతాయన్నమాట. ఇటు భర్త దగ్గర చనువుండదు. అటు పుట్టింటివాళ్ళు వేలకి వేలు కట్నాలు పోసి, భర్తను కొనగలిగినా ఇంకా ఏమికావాలన్నా మనల్నే అడుగుతుందేమిటన్న చిన్న చూపు చూస్తారు. పరమేశ్వరుని భార్య సతీదేవి పుట్టింటివారి నిరాదరణ భరించలేకనే కదా ఆత్మాహుతి చేసుకుంది”20 అని సీతకలలు లో సీతపాత్ర నిరాసక్తతత ఆమె భర్త ఆమెను పుట్టింటికి పంపని సందర్భంలో వర్ణన,

'నేను దేనిని కాను' లో కధానాయిక సావిత్రి చిన్నన్న “ఏలుబదికి ఊళ్ళులేవు కాని ఆయవారానికి ఊళ్ళులేవా? కుంతీదేవి అయిదుగురు పిల్లలతో ఊళ్ళు తిరగలేదా? నీకేం భయంలేదు... మిధ్యా గౌరవాన్ని మందాకినీ ఏరులో తర్పణంగా వదిలేద్దాం'21 అంటాడు. -

“ప్రేమించని మనసులు" లో విద్యావంతులయిన ఇద్దరు స్నేహితురాళ్ళు మాట్టాడుకునే సంభాషణలో, “యౌగంధరాయణుడు సామ్రాజ్య విస్తీర్ణతకోసం

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 156

ఉదయనుడు పద్నావతిని పెళ్ళాడేటట్లు చేశాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కకారణం. నీవు కూడా ఒక బంధువు పతనమవకుండా వుండడంకోసం చేసుకుని ఉద్ధరించావనే ఒక కారణం వుంది"22. అని వర్ణించబడింది.

పురాణ పాత్రలు, చరిత్రలోని పాభ్రలు వాటి స్వరూప స్వభావాలు ఎంతో

కాలంగా పాఠకులకి సుపరిచితాలు గనుక ఇటువంటి వర్ణనలు వారి హృదయానికి త్వరగా హత్తుకుంటాయి. అలా నవలల్లోని పాత్రలు వారికి సన్నిహితమౌతాయి. ఈ' విధమైన వర్ణనలో అందెవేసిన చెయ్యి అచ్యుతవల్లిది.. (౧9. సామాజక స్పృుళూతో కూడిన వర్దన : ప్రజల్లో ఈస్తటిక్‌ సెన్స్‌ లేదన్నమాట తరచుగా వింటుంటారు. అలాగే బొత్తిగా సామాజిక స్పృహ లేదన్నమాట కూడా అంత తరచుగానూ వినిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరూ దేన్నీ వట్టించుకోకుండా గడిపేస్తుంటారు. అయితే బాధ్యత నిబద్ధత, సామాజిక అవగాహన గల రచయిత్రిగా అచ్యుతవల్లి “కోరిక నవలలో సౌందర్య సామాజిక స్పృహలు లేని సౌందర్యరాహిత్యాన్ని ఎంత అధివాస్తవిక ధోరణీలో వర్ణించారో గవునిస్తే ఆవె పరిశీలనదృష్టి అవగతమౌతుంది.

“ఈ మధ్య గోదావరి తీరంలో వున్న ఒక పల్లెటూరికి వెళ్ళాను. గోదావరి ఒడ్డునే పెద్ద పెద్ద పచ్చిక బయళ్ళు ముఖమల్‌ తివాసీలా పరుచుకుని వున్నాయి. రోడ్డుమీంచి చూస్తే ఎంతో సుందరంగా, అహ్హాదంగా వున్నాయి. చల్లిన్లి గాలికి ఆ పచ్చికలో కూర్చుందామని దిగిన వెంటనే తెలిసింది ఆ వూరి ప్రజల అజ్ఞానం, మూర్ఫత్వం, 'చిత్రకారుని కుంచె కందలేని ఆ సుందర దృశ్యాన్ని, కవితా హృదయం మూగబోయే మధుర తమమైన ఆ పవిత్ర గోదావరీ తీరాన్ని అవూరి ప్రజలు పబ్లిక్‌ లెట్రిన్స్‌లా ఉపయోగించుకుంటున్నారు, మన ప్రజలలో ఎంత సౌందర్య రాహిత్యం చోటు చేసుకుందో ఊహించుకోండి"23 అంది" సంగీత. ఇక్కడ కేవలం వర్ణనేగాక పాత్ర స్వభావం కూడా పాఠకుని మనుస్ప్సుకి బలంగా పడుతుంది.

(౧9 సన్నివేశ వర్ణన : కధా కధన సౌలభ్యం కోసం సన్నివేశ కల్పన అనివార్యం.

నవలలో పఠనీయ గుణాన్ని పెంచే అంశం సన్నివేశం. పాత్రల స్వభావాన్ని

అవిష్కరించడానికి, అవిచ్చిన్నంగా కధాగవునాన్ని సాగించడానికి, ప్రధానంగా

నాటకీయతా పోషణకు ముఖ్యమైన సాధనం సన్నివేశమే. అలాంటి ఒక సన్నివేశంతో

నవల ప్రారంభించి ముందు ముందు ఏం జరగబోతుందా అన్న ఉత్కంఠను రేకెత్తించే ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం సోడా, కె.బి.లక్ష్మి - 159

రీతిలో వినూత్న సన్నివేశకల్పనాభినివేశం గల రచయిత్రి అచ్యుతవల్లి. ఉదాహరణకి “ఒకటి - రెండు - మూడు - నాలుగు - అయిదు. వసుంధర చేతివాచీలోని సెకన్లముల్లు గిరగిర అరవయిసార్లు తిరిగింది. బద్ధకంగా నిముషం ముల్లు కాస్త పక్కకి జరిగింది. అలా పదిహేనుసార్లూ సెకన్లముల్లు వాచీ వర్తులాన్ని గానుగెద్దులా చుట్టింది. పదిహినుసార్లూ నిముషం ముల్లు కాస్త కాస్త జరుగుతూనే వుంది ఒక్కసారిగా కాళ్ళు తిమ్మిర్లెక్కుతీ లేచి నించోలేం మనం. కొంచెం సరిచేసుకుంటేకాని. అలానే నిముషం ముల్లు కూడా తనకాలిని కొంచెం కొంచెం సరిచేసుకుంటోంది. నిముషం ముల్లు జరగడంలో భాధ, విసుగు స్ఫుటంగా కనిపిస్తుంది. సెకన్లముల్లు గిరగిరా తన చలాకీతనాన్ని నిరూపించుకుంటూ తిరుగుతురిది. వీటి నాటకాన్ని మౌనంగా చూస్తూ నించున్న పెద్దమనిషి గంటముల్లు. ఏదో చెప్పబోయేలా అసింటా జరిగింది, తను నించున్న చోటుకి కాస్త ఎడంగా... టప్‌, టప్‌, టప్‌, టప్‌.... చప్పట్ల వర్షం. ఓ పావుగంటనించీ ఆగడంలేదు"24. (ఎగిరే పిట్టలు) ప్రేక్షకుల్లోని విభిన్న మనస్తత్వాలకు ప్రతీకగా వర్ణించిన ఈ సన్నివేశం సన్నివేశ వర్ణనలో ప్రత్యేకతను సంతరించుకుని పాఠకుని కళ్ళముందు కాలాన్ని నిలబెట్టేస్తుంది. అచ్యుతవల్లి నవలల్లో వర్ణనలు ప్రధానంగా విషయ్రధానాలు. సరళంగా, సహజ సౌందర్యయుతంగా వుంటాయి ఆమె వర్ణనలు. పాత్రల స్వరూప స్వభావ, మనోస్థితి వర్ణనల్గో సన్నివేశ నేపధ్య వర్గనల్లో ప్రదర్శించిన వైవిధ్యం, శ్రద్ధవల్ల నవలారచనలో తనదైన శైలిని సుస్థిరతను సాధించారు అచ్యుతవల్లి. ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం స డా, కె.బి.లక్ష్మి - 160

తాఖ్యలు

వాఖ్యలు రచయిత లోకజ్జతను, (గ్రంథ పరిశీలనా శక్తిని, విశ్ల్ష్వణా సామర్థ్యాన్ని నిరూసిస్తాయి. వర్ణనల్లాగే వ్యాఖ్యలు కూడా కథకు తాత్వికశక్తిని, గాంభీర్యాన్ని చేకూరుస్తాయి. ఆయా సందర్భాలలో కథకుడు చేసే వ్యాఖ్యలతోపాటు, పాత్రల ముఖతః కూడా వ్యాఖ్యలు వెలువడుతుంటాయి, అవి జీవిత సత్యాల్ని, తాత్విక భావాల్ని నిర్వచనాత్మకంగాను, వివరణాత్మకంగానూ వ్యక్తం చేస్తాయి. వీటిల్లో పాజిటివ్‌ వ్యాఖ్యలూ వుండవచ్చు. నెగటివ్‌ వ్యాఖ్యలూ వుండవచ్చు. అని సందర్భానుసారంగా, పాత్రపరంగా సాగుతాయి. అచ్యుతవల్లి నవలల్లోని ఏరిన ముత్యాల వంటి కొన్ని వ్యాఖ్యలను చూద్దాం.

సందర్పానుసారంగా చేసే వర్ణనలు, వ్యాఖ్యలు కథకు మెరుగులు పెడుతూ పాఠకునికి వఠనానందం కలిగిస్తాయి. కధాసందర్భంలో రచయిత్రి అరుదుగా ప్రకటించే భావాలు నిత్య సత్యాలు. అవి ఆలోచనీయాలు, అభివృద్ధిదాయకాలుగా నిలిచి ప్రామాణికతను సంతరించుకున్నాయి.

అచ్యుతవల్లి సంప్రదాయ రైతుకుటుంబం నుంచి వచ్చిన వ్యక్తేగాక, స్వయంగా సొంత వ్యవసాయం చేసిన అనుభవజ్ఞురాలు కూడా. అందుకే ఆమె సాహిత్య సృష్టిలో సమగ్ర పరిశీలనా దృష్టి ఆమె వ్యాఖ్యలలో ప్రస్ఫుటమవుతుంది.

“నాలుగెకరాల పొలం వున్నవాడు పల్లెలో మకుటంలేని మహారాజు. నలఖై యాఖై బస్తాల ధాన్యం ఇంటికొస్తుంది. కూరా వారా పుష్కలంగా, తాజాగా పండించుకుని తినచ్చు. ఒక గేదె వుందంటే శుభ్రమయిన పాలు. తమ కడుపునిండా తిని నలుగురికి పెట్టగలిగే స్తోమత “వుంటుంది. ఉద్యోగస్థుడనే మిధ్యా గౌరవం కోసం ఎంత ఆరోగ్యపూరితమైన జీవితాన్ని వదులు కుంటున్నాడు రైతు యువకుడు”25. అని ొడిగట్టిన దీపాలు" లో బతికి చెడిన చలపతి గురించి వ్యాఖ్యానిస్తారు.

అదే నవలలో-లేఐకనాడు కడుపులో చల్ల కదలకుండా కాలం గడిపిన కామందుల పిల్లలు. ఈరోజు జీవనభృతికి లేక అర్రులు చాస్తూ తిరగాల్సి వస్తోంది. పారిశ్రామికంగా దేశం పుర్లోగమిస్తున్న కొద్దీ వ్యవసాయ రంగంలో మందకొడితనం ఏర్పడుతోంది, పెట్టుబడి పేట్టుకునే సన్నకారు రైతుకి ఎరువులు, పన్నులు, కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. క్రిమికీటకాదులనుంచి పంటను రక్షించేసరికి

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా. కె.బి.లక్ష్మి - 161

తల(ప్రాణం తోకకి వస్తోంది.."26 అని నారాయణ పాత్ర పరంగా వ్యాఖ్యానించారు.

“గ్వర్లింపులేని ఉత్తవము గాయనీ గాయకులు ఎంతవుంది వున్నారో! ఎంతమంది మామూలు సంసారపు చక్రబంధంలో ఇరుక్కుపోయారో! నంగీతజ్ఞానంలో “సాపాసొలైనా అయిదు నిమిషాలు ఒకేస్టాయిలో వుంచి నిలిపిపొడలేనివాళ్ళు విద్వాంసులుగా చెలామణి అవుతున్నారు,"27

“ఈ కులనుతాలనేవి మనకు మనం నిర్మించుకున్నవి. ఏ దేవుడయినా మంచి సంపాదించుకోమని, తోటివారిని హీనదృష్టితో చూడవద్దని మన సుఖ సంతోషాలు నలుగురితో పంచుకోమనే చెప్పాడు.”28

“ప్రజల్లో తరతరాల బట్టీ నూనె అడుగున మడ్డిలాగ అజ్జానం పేరుకు పోయింది. అజ్ఞానం వున్నదోటునే అహంకారం నస్తుంది. మనలో మనం కులమత ద్వేషాలు పెంచుకుని కొట్టుకు చస్తే మనకే నష్టం. ఈనాడు సర్వమానవ సమానత్వం, వ్యక్తిగత స్వేచ్చ అన్నవి ఊతపదాలుగా కన్పడుతున్నాయి. వాటి విలువలు మనకు బోధపడ్డంలేదు.

“వదువూ సంస్కారం కలిగిన కుటుంబాలలో తక్కువ కులాల వాళ్ళుకూడా ఎక్కువ కులాల వారికి మూట పొందికలో నయితే నేమి, ఆహార పానీయాదులలో నేమి ఏమీ తీసీపోకుండా వున్నారు. చదువువల్ల వ్యక్తి సంస్కారం పెంపొందుతుంది కానీ వుట్టిన కులం వల్ల కాద*29 న్నదే ఈ వ్యాఖ్యకర్థం.

భారతీయ సంప్రదాయాల్లో ఎన్నదగిన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ (ప్రాముఖ్యతను “భ్రమరగీతం'లో “ఇక్కడ ఇన్ని కుటుంబాలలో తరతరాలనుంచి అనుశ్రుతంగా వచ్చే ఆలోచనా విధానం, బిడ్డలమీద మమకారం, కుటుంబ జీవనంపట్ల ఆవగాహన భార్యభర్తలు కలసి సహజీవనం చేసేలా చేస్తాయి. ఒకళ్ళిద్దరు పిల్లవు వుట్టగానే వాళ్ళ రక్షణకోసం, వాళ్ళని పెంచడంకోసం భార్యాభర్తా బాధ్యత స్వీకరిస్తారు31 అని జోగిపంతులు పాత్రచేత పలికిస్తారు.

వరకట్నం ఇన్నేళ్ళయినా ఇంకా మురాచారంగా మిలిగిపోవడానికి బలమైన కారణాలు వ్యాఖ్యానిస్తూ 'మూడుముళ్ళు'లో సుందరమ్మనోట “ఏ యునకుడైనా నిజంగా తనకంటిక్షీ మనస్సుకీ నచ్చిన పిల్లని కట్నాపేక్షలేకుండా, వర్ణ వివక్షత లేకుండా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడా? ఏ ఆడపిల్లల తల్లీదండ్రులయినా తమ కూతుళ్ళని

ఐవి.యయస్‌. ఆచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 162

కట్నం లేకుండా పెళ్ళిచేసుకుందుకు ముందుకి వచ్చిన యువకులకి వర్ణ విచక్షణ పెట్టుకోకుండా యిచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారా? అవ్వా కావాలి, బువ్వాకావాలి, అంటున్నారు. చేసుకుంటానన్న వాళ్ళకి ఇయ్యబుద్ది పుట్టదు. ఇయ్యబుద్ధి పుట్టిన వాళ్ళకి చేసుకోబుద్ది పుట్టదు"32 అనిపిస్తారు.

“దారిశ్రాత్మక నవలలు వ్రాయడం అంత తేలిక కాదు. దానికి బోలెడు పరిజ్ఞానం వుండాలి, రాజుల సమయాలు, స్థల నిర్ణయాలూ వివరంగా తెలిసివుండాలి. వాళ్ళ దుస్తుల వివరాలూ, ఆభరణాల వివరాలు సీకరించాలి. అందుకనే నేటి రచయితలు క్లిష్టమైన చారిత్రాత్మక చిత్రణకు పూనుకోవడం లేదు"33 అని 'మూడుముళ్ళు' లోను,

ఇల్లాంటి బుద్ధావతారం హీరోలుండబట్టే మన తెలుగు సినిమాలింత చౌకబారుగా వుంటున్నాయి. “అబ్బబ్బ, ఆ రొమాంటిక్‌ సీన్స్‌ చూస్తుంటే డోకొస్తుంది. . సెక్సంటే విముఖత కలుగుతుంది. ఆ పెదాలు కొరుక్కోవడం, ఆ కోరచూపులు ఛఛ! డర్జి34 అని 'కానుకి లోను పాత్రల పరంగా చేసిన వ్యాఖ్యల్లో చురకలంటించారు.

“నిజం ఆలోచిస్తే 'శాంతి' అన్నది ఒక బంగారులేడి. అది అందిన్‌ట్లు మురిపిస్తూ మానవుల జీవితపు విలువల్నే మార్చేస్తుంది. అందుకనే ప్రపంచ ప్రజలు శాంతిని ఖూనీ చేయడానికి ప్రయత్నిస్తున్నార35 అని మాయలేడితో శాంతిని పోల్చి ప్రతీకాత్మకంగా వ్యాఖ్యానించడం లోని సహజత్వం, షణ్ముఖప్రీయ లోనిది. తాత్వికత ఎన్నదగినది.

“పుట్టింటికి చేరితే భర్తవదిలేసిన ఆడదాన్ని వంటలక్కగానో, పనిమనిషిగానో చూస్తారు తప్ప కన్న కూతురిగా చూడరు. కాగితాల మీద, సభల్లో ఉపన్యాసాలలో స్త్రీ జనాభివృద్ధి లెక్కకు మించి కనబడుతుంది తప్ప స్త్రీ నలభయ్‌ ఏళ్ళక్రితం ఎలావుందో ఇప్పుడూ అలాగే వుంది”36 అని 'వూలూ ముళ్ళూ” నవలలో సావిత్రి అన్న వ్యాఖ్యల్లోని సత్యం ఇప్పటిక్సీ వాస్తవంగానే వుండడం వ్యాఖ్య వదునుకు తార్కాణం.

“ఒక్కొక్క అనుభవంతో మనిషిలో పరిశీలనాశక్తి పెరుగుతుంది. జీవితం ముందుకి సాగుతోంది. వయస్సులో ప్రేమానుభవం కలగని మనిషి మనస్సులో

ఆర్ధత చచ్చిపోతుంది*37. అనుభవం ఎలాంటిదయినా హృదయంగమం అవుతుందన్న విషయం ఈ నవలలోని సుమన పాత్ర ద్వారా వ్యాఖ్యానించడంలో బౌచిత్యం వుంది. ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా, కె.బి.లక్ష్మి - 163

అలాగే భర్త భార్యని ఒక వస్తువులా చూడడాన్ని నిరసిస్తూ “దానం చేయబడీన వస్తువు కదా మరి! దాన , విక్రయ, సర్వాధికారాలతో కన్యాదానం అన్నారు. ఎందుకు కన్యనే దానం చేయాలి? కాళ్ళు కడిగి వరుణ్ణి కన్యకు ఎందుకు దానం చేయకూడదు? అది మన స్కృతుల్లో లేదు కదా! భూదానం, గోదానం, కన్యాదానం, స్వర్ణదానం, అంటూ చైతన్యంలేని వాటితో జను ఆడపిల్లకూడా38 అని నిలదీస్తుందీ వ్యాఖ్యతో నవలలోని మధుర పాత్ర.

“ఇప్పుడు స్త్రీలలో, ఆలోచనావిధానంలో మార్పొచ్చింది. స్త్రీ ఇప్పుడు తనదైన వ్యక్తిత్వం కావాలని ఆశిస్తోంది. ఆ వ్యక్తిత్వంలో ఆమె పొందగలిగే సంతృప్తికోసం అవమానాల్ని కూడా తేలిగ్గా సహించగలుగుతోంది”౩9 కోరిక నవలలో.

“తెలుగు స్త్రీ తన సౌఖ్యం, తన సంతోషం లెక్కచేయకుండా తన కుటుంబ సభ్యుల క్షేమం కోసం పాటుపడుతుంది. ఆమె వల్ల లబ్బిపొందుతూనే పుట్టింటా, మెట్టినింటా ఆమెను తృణీకార భావంతో చూస్తారు"40 ఇదెక్కడి న్యాయం? నవలలో.

“భార్యాభర్తలు ఒకరి జీవన పద్ధతిని ఇంకొకరు సమర్థించాలి. అలా ఇద్దరూ ఒకే మాటతో ఒకే బాటలో పయనించగలిగితే సంసారం ముచ్చటగా మూడుపువ్వులుగా వర్ణిల్లుతుంది"41 'సీతకలలు'.

“పిల్లలు కలగగానే తనేదో స్థిరత్వం వహించానని సంబరపడుతుంది స్త్రి, తానేదో పోగొట్టుకున్నట్లు ఫీలవుతారు మగవారు"42 అని డాక్టరు గీత పొత్ర పరంగా మానవ మనస్తత్వాన్ని చిన్న వ్యాఖ్యలో పొందుపరచడం రచయిత్రి రచనాఖినివేశానికి తార్కాణం.

విషయజ్జత, లోకజ్జత, సనుసమాజం పట్ల సరైన అవగాహన వున్న వ్యక్తి గనుకనే అచ్యుతవల్లి రచయిత్రిగా తనదైన శైలిలో ఇటువంటి అద్దుత వ్యాఖ్యలు చేయగలిగారన్నది ప్రత్యక్షరసత్యం.

(39) సంభాషణా శైలి

కథలో తాను సృష్టిస్తున్న పాత్రల స్వభావం గురించి పాఠకుడికి సరైన అభిప్రాయం కలిగించడంలో కథకుడికి సాయపడే సాధనం సంభాషణ. పలుకుతీరును బట్టి మాట్లాడుతున్న పాత్ర సంస్కారాన్ని, చిత్తవృత్తినీ, వ్యక్తిత్వాన్ని, విద్యా వివేకాలను, వృత్తి, అలవాట్లు, అభిలాషలు, అసూయాద్వేషాలను అంచనా వేసుకోవచ్చు.

' ఐంవియస్‌, అచ్యుతవల్లి నవలాపాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 164

అచ్యుతవల్లి సంభాషణలు చదువుతుంటే పాత్రలు కళ్ళముందు కనిపిస్తాంయఎ. పాత్రలు ప్రత్యక్షంగా పాఠకునితో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. చతుర సంభాషణలు, నిష్కర్ల విమర్శలు ఆమె నవలల్లో కనిపిస్తాయి. నిత్యజీవితంలోని వ్యవహార సరళిలోంచి వచ్చిన సంభాషణల్లో స్వాభావికత. చోటు చేసుకుంటుంది. జీవితాన్ని, సమాజాన్ని విభిన్న కోణాల్లోంచి దర్శించిన అచ్యుతవల్లి సందర్భోచితంగా సరళసహజమైన భాషను, మాండలికాల్ని ప్రయోగించి తన రచనా శైలిలో ప్రత్యేకతను సాధించారు.

స్వాభావికత్క సంగీతజ్జ్ఞత, సంస్కరణాభిలాష్కు చమత్కారం, పాత్రోచిత

మాండలికం, అన్యభాషాపదప్రయోగం అచ్యుతవల్లి సంభాషణాశైలికి విశిష్టతను చేకూర్చాయి. ఈ దృక్కోణంలో కొన్ని సంభాషణల ఉదాహరణలు. () సంస్మరణాభిలాళ్ళు : “ఈ రోజుల్లో వర్ణభేదాలకన్నా వర్గభేదాలే ఎక్కువగా వున్నాయి, శ్రామికవర్గం వాళ్ళు కూడా అన్ని విధాలా వురోగమించడానికి ప్రభుత్వం ఎన్నెన్నో అవకాశాలు కలిగిస్తోంది కానీ అవి అన్నీ సవ్యంగా జరగాలంటే ఉద్యోగస్థులలో అంచగొండితనాలు పోవాలి, ప్రతివ్యక్తీ శుచీ శుభ్రతా నేర్చుకోవాలి"43 (కొడిగట్టిన దీపాలు)

“ఒకే బాధ్యత నిర్వహించినందుకు వురుషుడికి కీర్తి, స్త్రీకి అపకీర్తా? ఇదెక్కడి న్యాయం? ఇవేనా సమానహక్కులు? సంసార బాధ్యతలు, కర్తవ్యాలు స్తీ వురుషులిద్దరికీ సమానంగా వుండే చట్టం రావాలి"44 (ఇదెక్కడి న్యాయం)

“ప్రతి వ్యక్తీ సయంపోషకం అయినస్తుడు ఈ వివాహ వ్యవస్థ ఇలా వుండదు, ఇద్దరూ కలసి జీవితం పంచుకుని ఉండడానికి ఇన్నిన్ని కట్నాలు, కానుకలు ఏమిటి? 45 (కానుక)

“నువ్వు పాలేరుగా స్థిరపడితే రేప్పొద్దున నీ పిల్లలు కూడా గొ 'డ్లకాపరి కు(ర్రాళ్ళుగా జీవితం ప్రారంభించాల్సి వస్తుంది. నువ్వు కొంచెంగానైనా చదువుకుని, కనీసం ఏ చిన్న మిల్లులో పద్దులు రాసీ గుమాస్తాగానైనా వుంటే నీ పిల్లలు బాగా చదువుకుని టీచర్లుగానో ఇంకా మంచి ఉద్యోగస్థులుగానో అయ్యే అవకాశం వుంది. జీవితం సుగమంగా సాగడానికి ఏ దారయినా కష్టపడాలి” 46. (కానుక

రచయిత్రి సంస్కరణాభిలాష ఈ సంభాషణల్లో కొట్టవచ్చినట్లు

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 165

కనబడుతుంది. వ్యవస్థలో పాతుకుపోయిన లంచగొండితనం, అవినీతి, వరకట్నం, నిమ్నవర్గాలను అణగదొక్కే దృక్పథం పట్ల తీవ్ర నిరసన, వాటిని సంస్కరించే సహ్బ దయత, చాటిచెప్పే ధోరణి అందుకనుగుణంగా పొత్రలు స్పందించిన తీరు ప్రధానంగా గమనించవలసిన విషయాలు.

(1) సంస్కార దృక్పథం : *ఒద్దు, నేను కట్నం, కానుకలు అనే పేరుతో కాణీ తీసుకోను నేను సంపాదించుకుంటున్నాను, నా భార్యని నేను పోషించుకోగలను. నా సంసారానికి కొవాల్సిన హంగులు సమకూర్చు కోగలను4?7.

“నువ్వు ఆడపిల్లవి. నీతో సమానంగా వేంం వంటపనికి సాయం చేయాలా?"48..

“మీరు మగపిల్లలు. మీతో సమానంగా నేను చదువుకోవడం లేదూ? తినే తిండి మీరూ నేనూ ఒకేలా తింటున్నాం ఆడా మగా అని తిళ్ళు వేరే వున్నాయా? కాస్త పనిలో సాయంచేస్తే ముగ్గురం బైట పడచ్చుగా49,

“దెబ్బలాట ఎందుకురా? ముగ్గురూ కలిసి చేసుకోండి. పనులకు ఆడా మగా తేడాలేమిటి? సరదాగా చేసుకోండిోక౦.

“స్టీలు తమని గురించి తామే ఆలోచించుకోవాలి, ప్రతిదానికి చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. తమ బతుకు తాము బతకగలమనే ధీమా వుండాలి"51.

“పెళ్ళి పేరంటం, ఇల్లు సంసారం ఇవే జీవితానికి మార్గదర్శకాలు కావు. వైవిధ్యమయిన జీవిత మార్గాలున్నాయి. అవి తెలుసుకోగలిగి ఆచరించగలిగితే స్త్రీ మగవాడికి కట్టుబానిసలా పడి వుండాల్సిన అవసరం లేదు"”52.

చదువు మీద ఆసక్తి వుంటే గొడ్డను కాసే కుర్రవాళ్ళుకూడా చదివి పైకి వస్తారు. ఎంతో మంది రిక్షాలు లాక్కుని బి.ఏ.లు ప్యాసయిన వాళ్ళున్నారు"53.

తనను నమ్మి వచ్చిన భార్యను సుఖపెట్టాలని, గౌరవంగా చూసుకోవాలన్న

సంస్కార హృదయం మగవాళ్ళకి వుండాలని, ఆడా మగా తేడా లేకుండా అన్నింటా

పిల్లల్ని సమానంగా పెంచాలన్న సంస్కారయుతమైన ఆలోచన తల్లిదండ్రులకి

వుండాలని, ఆడపిల్ల జీవితంలో అనివార్యంగా అమకున్నది జరక్కపోతే ప్రత్యామ్నాయ

నూర్గంలో మన్శాంతిగా బతకాలని, కులమతాలు కతీతంగా అందరూ విద్యావంతులు ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 166

కావాలన్న రచయిత్రి సంస్కార దృక్పథం ఈ సంభాషణాశైలిలో ద్యోతకమవుతోంది. (19 న్వాభావికత : తెల్లవారి లేచినది మొదలు ఇంటా బయటా అనేకమందితో సంభాషించవలసిన ఆవశ్యకత అనివార్యం. నిత్యజీవితంలో వ్యవహరించే సంవాదధోరణీ అత్యంత స్వాభావికంగా చిత్రించడంలో అచ్యుతవల్లి సిద్ధహస్తురాలు.

“ఇదెక్కడి న్యాయం నవలలో కాసేపు కూర్చుని వెళ్ళమున్న వియ్యవురాలు శాంతమ్మతో “ఫరవాలేదు. ఈసారి వస్తానులెండి. ఇంట్లో చంటిదాన్ని వదిలిపెట్టి వచ్చాను. అబ్బాయి వస్తే కేకలేస్తాడు. అసలు అడపిల్లలు టైట తిరగడం ఇష్టం వుండదు వాడికి. కోడలు చంటి పిల్లాడితో వస్తుంది. అవిడ వస్తే నాకంతా ఖాళీయే. వస్తూనే వుంటాన్లెండి"54. అన్న పార్వతమ్మ మాటల్లో కొడుకు ప్రొవకంలో వున్న మధ్యతరగతి తల్లి మనోభావాల్లోని పారదర్శకత గోచరిస్తుంది.

అదే నవలలో తోటి ప్రయాణీకురాలు మాలతితో “తొలి కాను, పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరాడపిల్లలకి కన్యధార పోస్తేగాని కానువురాలేదు”55 అన్న పలుకుల్లో పల్లెటూరి నమ్మకాలు, సంప్రదాయంతో కూడిన స్వాభావికత వుట్టిపడుతోంది.

“కొడిగట్టిన దీపాలు' నవలలో రాఘవమ్మ అత్తింటివారిని భరణం అడిగిన కూతురితో “ఛీ ఛీ! ఎంతకు తెగించావే! మొగుడు ఛస్తే చచ్చాడు, డబ్బు పంపమని రాశావా? ఎల్లాంటి బుద్ధులు పుడుతున్నాయ్‌! ఇవన్నీ చూడడానికే కాబోలు నన్ను పాలూ, పళ్ళతో తెగమేపుతూ-బతికిస్తున్నారు. ఏం సిల్లలర్రా మీరు?"56 అనడంలో బతికి చెడిన కుటుంబ యజమానురాలిగా తన నిస్పహాయస్థితికి ఉక్రోషం, సుఖపడాల్సిన వయసులో భర్శృహీన అయిన కూతుర్ని చూడలేని దుఃఖాతిశయం

ప్రస్ఫుటమవుతున్నాయి.

మూడు ముళ్ళు నవలలో రామనాధాన్ని పెంచుకున్నాకా గర్భవతి అయిన దేవమ్మను చూసి, “బిడ్డ వచ్చిన వేళా, గొడ్డు వచ్చిన వేళా అంటారు దేవమ్మా. అంతా రామయ్య కాళ్ళ చలువ"57 అన్న గ్రామస్థుల మాటల్లో ఫక్తు తెలుగు నుడికారం ఆకృతి దాల్చింది

ఇదే నవలలో పెద్ద కూతురు కామేశ్వరి పెళ్ళి సంబంధం విషయంలో “చూసి చూసి రెండో సెళ్ళివాడికా యాయడం? అందులో మనం తొలిసారిగా చేస్తున్న కన్యాదానం. ఒకరు కడిగిన కాళ్ళు మళ్ళీ ఎలా కడగడం?”58 అని నరసయ్య అనడంలో

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం స డా, కె.బి.లక్ష్మి - 167

ఆవేదనతో కూడిన లోక సహజ సంవాద ధోరణి అతి రమ్యంగా వుంది.

(౫) వైజ్ఞానికమైన తార్మికత : "ఇది మల్లెల వేళి లో పెళ్ళిచూపుల్లోనే తను ప్రేమించిన అమ్మాయి పద్మ అత్యాచారానికి గురై గర్భస్రావం చేయించుకుని, అది బెడిసికొట్టి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలై, తన వైద్యంతోనే కోలుకుంటున్న స్టీతిలో పద్మని పెళ్ళాడతానన్నపుడు తోటి సీనియర్‌ డాక్టర్‌ రాజేశ్వరి డాక్టర్‌ గిరిధర్‌తో.

“పద్మకి ఈ ఇన్‌ఫెక్షన్‌వల్ల రెండు ఫెల్లోసియన్‌ ట్యూబ్స్‌ బ్లాక్‌ అయిపోయి వుంటాయి. బహుశా పద్మకి తల్లి అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఇటు నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడివే మొగపిల్లాడివి. ఆ విషయం ఆలోచించావా?59 అన్నప్పుడు.

“మున ఫెర్టిలిటీ క్లినికకి వచ్చే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళేకాదుగా మేడం. అందరికీ ట్యూబల్‌ బ్లాక్‌ 408] 800% కారణంకాదుగా. మరివాళ్ళందరూ భార్యలను వదిలేస్తున్నారా, పిల్లలు పుట్టడంలేదని. పిల్లలు పుట్టక పోవడానికి ఎన్ని కారణాలు లేవు?”60 అనేది గిరిధర్‌ జవాబు.

విద్యా వివేకాలతో కూడిక సంభాషణా తీరు, పాత్రల సంస్కార భావాలకు కూడా అద్దం పట్టింది. ఒక వైద్య వైజ్ఞానిక సత్యాన్ని ప్రామాణికంగా ఆవిష్కరించడం గమనార్హం. మానవ సంబంధాలను వైజ్ఞానికాంశాలతో జతచేసి అందుకు నిదర్శనంగా ఫలితాంశాన్ని కూడా తీర్చి దిద్దడంలో సంభాషణ ప్రయోజనం వెరవేరింది. సంవాదంలో సహేతుకత, సహృదయతతో బాటు తార్కికత తొణికిసలాడింది.

'తీరం చేరిన కెరటం" నవలలో రైబు ప్రమాదంలో బతికి బ్రైటపడినా అనూహ్యారీతిలో జీవితం తల్లక్రిందులయిన నీల ఒక ఆశ్రమంలోని స్వామీజీని దీక్ష ఇవ్వమని అర్జించిన ఘట్టంలో

“స్వామీ, భగవంతుని అనంతమైన లీలలో నా జీవితం కూడా ఒకటయింది, అందుకనే దుఃఖాల ఆటుపోటులని అధిగమించి ఈతీరాన్ని చేరుకున్నాను. మీరొ వయసు చెల్లినవారు, నేను జీవితమే చెల్లినదాన్ని. ఇక్కడవుండడం వల్ల మీకేమీ అప యశస్సు కలగదు”61 అని నీల అంటే

“ఎంత అమాయకురాలివమ్మా ఈ వయస్సులో నేను యశస్సు గురించి ఆలోచిస్తాననుకున్నావా? అందరమూ భగవంతుని చేతిలోని ఆటబొమ్మలం, చేజారిన

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవబాసాహిత్యం ౫% డా, కె.బి.లక్ష్మి - 168

క్షణాల గురించి ఆలోచిస్తూ భవిష్యత్తుని నిరాశామయం చేసుకోకూడదు"62. అంటారు స్వామీజీ

నీలమాటల్లో వ్యక్తిగత సంస్కారం, స్వామీజీ సమాధానంలో ఆధ్యాత్మిక, దైవ చింతన, తాత్వికత దర్శనమిస్తాయి ఈ సంభాషణా శైలిలో.

(౧ సంగీతజ్ఞత

లలిత కర్ణాటక సంగీతాలపట్ల అచ్యుతవల్లికున్న అభిలావ్కు అభినివేశం దాదాపుగా అన్ని నవలల్లోను, ఏదో ఒక సందర్భంలో ద్యోతకమవుతున్నా ప్రత్యేకించి “ఎగిరే పిట్టలు", కొడి గట్టిన దీపాలులోని కథానాయికల జీవితాలు సంగీతంతోనే ముడిపడి వుండడం, సంభాషణలు, పాత్రలు మలిచిన తీరు రచయిత్రి సంగితజ్ఞతకు నిలువెత్తు దర్ప౭ఠాలు.

“భావయామి రఘురామం స్వాతి తిరునాళ్‌ రచన. స్వాతి తిరునాళ్‌వారు పందొమ్మిది వందల శతాబ్దంలో తిరువాన్కూరు రాజ్యాన్ని పాలించిన రాజవంశీయులు. పలు భాషా కోవిదులు, వీరి కీర్తనలు తెలుగు, సంస్ర్రతం, మళయాళము, మణిప్రవాళము అనగా మళయాళ సంస్కృతము, హిదుస్లానీ, మరాఠీ భాషలలో రచించారు. కీర్తనలేగాక పదములు, వర్ణములు, తిల్లానలు కూడా చాలా ప్రచారములో వున్నవి”63. అని “ఎగిరే పిట్టలు కధానాయిక వసుంధర కచేరీిముందు ఎనౌన్సర్‌ చేత పలికించిన మాటల్లో సంగీతవిద్వాంనుల జీవిత విశేషాల గురించిన ఆవగాహన - ॥

“భావయామిరఘురామం అన్నది రాగమాలిక. రూపకతాళం, పల్లవి సొవేరిలోను, బాలకాండ నాటకురంజిలోను, ఆయోధ్యకాండ ధన్యాసిలోను, అరణ్యకాండ మోహనలోను, కిష్కింధకాండ ముఖారిలోను, సుందరకాండ పూరీ కల్యాణిలోను, యుద్ధకాండ మధ్యమావతిలోను పాడబడుతుంది అన్న మాటల్లో ఆయాకీర్తనల్లో, సంగీతంలో రచయిత్రికి వున్న అభినివేశం స్పష్టమౌతుంది.

“ఇంద్ర ధనుస్సులోని రంగులు ఎంత మృదువుగా ఒకదానిలో ఒకటి విలీనమవుతూ ఎలా నయనానందం కలగజేస్తాయో రాగమాలికల్లోని రాగాలు కూడా ఒక రాగంలో ఇంకొక రాగం మృదువుగా కలసిపోతూ థవణానందం కలగజేస్తాయి”.

“రాగం, రంగు - ఒకటి అదృశ్యం - ఇంకొకటి దృశ్యం, ఒకటి చెవికింపు,

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 169

ఇంకొతోటి కంటికింపు. సంగీతం చి(త్రకారునికి అవినాభావ సంబంధం వుండి తీరుతుంది. సంగీతం హృదయ స్పర్శ! అద్భుతంగా పాడుతున్నారు కదూ?” అని జయలక్ష్మి పొత్రచేత సలికించిన సంభాషణ పాఠకునికి రసానందానుభూతిని కలిగించడంతోబాటు, రచయిత్రి సంగీత విషయ పరిజ్ఞానాన్ని చెప్పకనే చెబుతుంది.

“ఆకలితో మాడిపోతూ, అడుక్కుతింటానికి సాధనంగా మాట్రవే ఉపయోగించుకుంటున్న ఆ డొక్కు హార్మణీమీద రిసగస రిససని రిసగస రినిసస - రిగపాదానిపదా దానిదపా రిగమూ పొాదపవమూ పదపమా గరిసా రిసగసరినిసని అంటూ అంత అత్యద్భుతమైన స్వర మాధురి జ్వలింపచేయగలగటం శారదాదేవి దయవల్ల కదా!64 అన్న విశ్వం సంగీత ప్రియత్వంలోను,

“బాగా పొడావమ్మాయ్‌, సంగీత సరస్వతి నిన్ను వరించింది... కోకిల ఎందుకు పొడుతుంది. నెమలి ఎందుకు నాట్యం చేస్తుంది. అది వాటి సహజగుణం. లోకం కోసం కాదు. త్యాగరాజు కూడా అప్పటికప్పుడు భక్తి భావ తన్మయావస్థలో అన్ని కీర్తనలు సృజించారు కాని, తనచుట్టూ వున్నవాళ్ళు, విద్వాంసులు అయినవాళ్ళూ తన కీర్తవలని ఆరాధించాలని ఆశించాడా?... ఏ కళకైనా ఆరాధన వుండాలి. నిరంతరారాధనలోనే సంగీత కళ యొక్క భావం పరిపక్వదశకి చేరుకుంటుంది"65 యశోదతో భగవతి అన్న మాటల్లోని సంగీతాభినివేశం,

"లేత లేత ఎన్నెల్లో నీలి నీలి చీరగట్టి నూకాలమ్మ జాతర నాడూ నూతికాడ కూకుంటె! పిల్లి కళ్ళచిన్నోడు చేయిపట్టుకున్నాడు. ఏం చెప్పనోలమ్మి ఏం చెప్పను?1-ఏం చెయ్యనోరయ్య ఏం చెయ్యనూ?"66 అంటూ వనజాక్షి పాడిన జానపద గీతం

'కొడిగట్టిన దీపాలు' నవలలో తిరుమల కొండమీద ఓ రాత్రివేళ బ్రయోదశి వెన్నెల్లో కాటేజ్‌ మెట్లమీద కూర్చున్న విశ్వానికి

“తులసీ పూజన్‌ హరీ మిలేతో, మై పూజూం తులసీ హాల్‌!

పళ్ణర్‌ పూజన్‌ హరే మిలేతో మై పూజూం పహాడ్‌!

మీరాకహే బినా ప్రీమ్‌ సీ నహీ-మిలే నందలాలా!”67 అంటూ వినిపించిన మరారీ అమ్మాయి పొడిన మీరాభజన్‌, అందులోని రాగ నిర్‌రురి - ఇవన్నీ ఒక్క

కర్ణాటక శాస్త్రీయ సంగీతం లోనే గాక లలిత, జానపద, పరభాషాసంగీతం పట్ల ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా, కె.బి.లక్ష్మి - 170

కూడా రచయిథ్రి అచ్యుతవల్లి కున్న సంగీతజ్ఞతా స్వారస్యం సుభోదకమవుతుంది. పొఠకుణ్ణి అలౌకికానందాల అంచులకి తీసుకెళ్ళి స్వరసతరంగాలలో తేలియాడించే అద్భుతశైలి. | చమత్కార - కరూస్యు సంభాషణ

సునిశిత హాస్యం, ఛక్‌ మనిపించే చమత్కారం వుట్టిపడేలా సంభాషణలను రసవత్తరంగా తీర్చిదిద్దేశైలి అచ్యుతవల్లికి కరతలామలకం.

'మూడుముళ్ళు"' నవలలో ఓ పెళ్ళిచూవుల సన్నివేశంలో జరిగిన సంభాషణ:

చూపులు, ఫలహారాలు అన్నీ అయి వెళ్ళబోతున్న పెళ్లివారితో పెళ్ళికూతురి

“ఉండండి. మా పిల్ల పెట్టి నేర్చుకుంటోంది పాడుతుంది, వినండి".

“అవశ్యం, శ్రవణీయం అన్నారు పెళ్ళివారు.

“హార్మోనియం సరే, గొంతుతో పొడు”

హార్మోనియం, గొంతు జతకలసి ఆ స్వరాలు ఒకస్తాయిలో వుంటే ఆ పిల్ల ఇంకోస్టాయిలో అరుస్తూ స్వరాలు వాయించడం మొదలెట్టింది.

“ఏదన్నా కీర్తనపాడు”

“నీవు లేక వీణా పలుకలేనన్నదీ...”

“ఇంకో కీర్తన పాడు”

“నరవరా! ఓ కురువరా[ొ

“తప్పక సెళ్ళికి ఒప్పుకో అన్నయ్యా. ఈ పిల్లవేసిన విచిత్ర వేషధారణకి ఒక ప్రయిజ్‌ ఇవ్వొచ్చునూ అన్నాడు పెళ్ళికొడుకు తమ్ముడు, మెల్లిగా.

“ఎక్కడ నేర్పించారు?”

“పక్క వూరినుంచి వస్తారు పాట వంతులు. నెలకి ఇరవై రూపాయలిచ్చి చెప్పిస్తున్నాం ఇరవయి కీర్తనలొచ్చాయి"

“బాగుంది. శ్రద్ధగా చెప్పిస్తున్నారు"68.

ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా. కె.బి.లక్ష్మి - 171

హార్మోనియం నేర్చుకోవడమే గొప్పఅంటే, దానికితోడు కీర్తనలు. డబ్బిచ్చి చెప్పించడమే గాని సినిమాపాటకి, త్యాగరాజకీర్తనకి తేడా తెలియనితనం, శ్రద్ధగా చెప్పిస్తున్నారన్న మెచ్చుకోలులోని చమత్కారం సన్నివేశాన్ని కళ్ళకు కట్టి హాస్యాన్ని గుప్పిస్తుంది.

అలాగే 'సీతకలలు” నవలలో నాయికా నాయకులు సీత, రామంల మధ్య శోభనం గదిలోని సంభాషణ:

*ర్కా పీతా! ఏం భయమా?

“కాళ్ళు లాగుతున్నాయి”

“మరి అంతసేపు నించున్నావు”

“మరి మీరు మాట్లాడలేదుగా”

“అవును. వాకూ ఏమిటో కొత్తగా వుంది. నువ్వు బాగున్నావు. నీ కళ్ళు మరీ బాగున్నాయి.”

“డి! మరి జడో[”

“మర్‌ అంత పెద్ద జడ ఎందుకు? నీకు సరదానా?”

“ఊ, నేను చిన్నప్పుడు డాన్సు నేర్చుకున్నాను"

“వీణ కూడా నేర్చుకున్నాను. అసలు నేను కాలేజీలో చేరాలనుకున్నాను. మా మామ్మచెప్పింది. పెళ్ళి అయ్యాక అతనికి సరదాగా వుంటే చదువుకోవచ్చునని. నేను ఎం.ఏ. ప్యాసయితేనే గాని పెళ్ళిచేసుకోనని చెప్పా”

“మరి ఎందుకు పెళ్ళిచేసేవారు”

“మీరు చేసుకుంటానన్నారు కదాని”

“వేను చేసుకోకపోతే!”

“నన్ను కాలేజీలో చేర్పించుదురు*69

పెళ్ళికూతురి ముగ్గమోహనత్వం, అమాయకత్వం, పెళ్ళికొడుకు కొంటెతనం

ఐంవి.యస్‌, అద్యుతవళ్లి నవలాసాహిత్యం ౫% డా, కె.బిలక్ష్మి - 172

కలగలసిన పై సంభాషణ హృదయాహ్హాదకరమైన రచయిత్రి హాస్యస్స్ఫూర్తి, సన్నివేశ కల్పనా చమత్కతిని స్పష్టం చేస్తుంది.

“మూడుముళ్ళు” నవలలోని చమత్కారాలు. కేశవ తన రెండవభార్య అయిన కామేశ్వరిని ఏమి అడిగినా మీ యిష్టం, మీ యిష్టం అనే సమాదానమిస్తుంది. అందుకని కేశవ తనలో తాను అనుకుంటాడు.

“చదువు కుంటావా అంటే మీ యిష్టమన్నది కామేశ్వరి. నాతో కావురం చేస్తావా అంటే కూడా మీ యిష్టమే నంటుందేమో!”

అదేవిధంగా కామేశ్వరి అనుకుంటుంది వుట్టింటివారి గురించి “నిజమే, ఖర్చులు కలసిరావాలనే రెండోపెళ్ళి వాళ్ళకి పిల్లనిచ్చి చేస్తారు. ఆయనకి రెండోపెళ్ళి కాన్కి నాకు రెండోపెళ్ళి కాదుగా మరి?”7౦ అని చక్కని చమత్కారం. పొతోచిత భాక్ళు - యూండలికం

ఖాషను ్రవాహళీలం చేసే శక్తి శైలికి వుంది. అచ్యుతవల్లి శైలి, భాష కూడా స్వభావ సిద్ధం, సహజం. భావావేశమే భాషచేత పనులన్నీ చేయించుకుంటుంది. వీరి రచనల్లో ఎక్కవగా ఆకర్షించేది తెలుగు నుడికారం. తర్వాత సంస్కృతాంగ్ల హిందీ పదాల ప్రభావం.

అచ్యుతవల్లి తను తీసుకున్న వస్తువులకు, తను సృష్టించిన పాత్రలకు అనువైన భాషనే స్వీకరించారు. ఆమె భాష హృదయంగమమైనది. శబ్దలొలిత్యం పఠితను పరవళింపచేస్తుంది. భాషాకైలి కవితామయమైై, భావానికి తగిన రసం, రసానికి తగిన భావంతో కూడి వుంటుంది.

సజీవమైన, వ్యావహారికమైన, సరళసుందరమైన ఆయా ప్రాంతాల ప్రజల మూండలికాలను బంగారంలో రత్నాలు పొదిగినంత రమ్యంగా పాశత్రోచితంగా, ప్రయోజనాత్మకంగా వినియోగిస్తారు అచ్యుతవల్లి.

రచయిత్రి పశ్చిమగోదావరి జిల్లా వాస్తన్యురాలెనా భర్త ఉద్యోగరీత్యా భారతదేశంలోని పలు ప్రాంతాలు విస్సతంగా పర్యటించడం వల్ల, ప్రత్యేకంగా సంస్కృ తం, హిందీ చదువుకున్న విదుషీమణి కావడం వల్ల, ఆంగ్లభాషా ప్రావీణ్యం వల్ల రచన ప్రధానంగా తెలుగులోనే నడిచి నప్పటికీ ఆయా భాషల పదాలు తెలీకుండానే

ఐ-వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 173

సంభాషణల్లో చోటుచేసుకోవడం జరుగుతుంది. అవి ఆమె రచనా శైలికి చక్కగా ఒదిగిపోవడమే గాక, ఒక ప్రత్యేకతను కూడా ఆపాదించాయి, ఒక్కోసారి ఆ సంస్కృ త పదాలు కించిత్‌ ఇబ్బంది పెట్టిన సందర్పాలూ లేకపోలేదు. ఉదాహరణకి “మూడుముళ్ళు” నవలలో “వివాహితురాలైన యువతిని పట్టుకుని ప్రేమించానంటూ అవమానించితే ఎంత సాహసకృత్యం. తప్పుకాదూ నళినీ, నీకెందుకు ఆ కామేశ్వరి మీద ఇంత ఘృుణ పెరిగింది?”71 “ఇకముందు మటుకు ఇలాంటి ప్రేమ కబుర్లు చెప్పక లక్షణమైన అమ్మాయిని పెళ్ళిచేసుకోండి?2 రూక్షంగా, కఠినంగా అంది కామేశ్వరి ఉద్వేగభరితమైన సంభాషణల్లో ఘృణ, రూక్ష వంటి పద ప్రయోగొలవల్ల పాఠకుడు నిఘంటువు దగ్గరికి పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. సాంఘిక నవలా పాఠకుడికి ఇది కొంచెం ఇబ్బందేగా మరి. మాండలికం : కధనంలోను, సంవాదంలోను, సందర్భోచితంగా మాండలికాన్ని ప్రయోగించి అత్యంత సహజంగా పాత్ర స్వభావాన్ని, సన్నివేశాన్ఫి అవిష్కరించిన తీరు దాదాపుగా అచ్యుతవల్లి నవలలన్నింటా ప్రస్ఫుటమవుతుంది. ముఖ్యంగా “కానుక, 'కొడిగట్టిన దీపాలు” నవలలు తీసుకుంటే ఆయా పాత్రల జాతి సహజమైన భాష ఎంత చక్కగా నప్పించి, ఒప్పించారో అర్థమవుతుంది. కథనంలో ప్రామాణిక భాషను, పాత్రలపరంగాను ప్రయోగించి ఒప్పించారు. 'కానుకి నవలలో సుందరం ఓ హోటల్లో సర్వరు. తప్పిదారి ఓ రోజు మహిళల వసతి గృహానికి వస్తాడు. అక్కడ వాళ్ళ ప్రశ్నలకు జవాబుగా “అజంతా ఒటేల్లో పనిచేత్తానండి నాల్రోజుల్నించీ జొరం కాస్తాందండి... మానేజరు వొచ్చి కొట్టాడు ఉత్తప్పుడయితే ఎన్ని దెబ్బలయినా కాసీవాణ్ణి. నాకుజొరం వల్ల వీపంతా మంటెక్కి పోనాది.దాన్హో ఆ మానేజరు చెయ్యి కొరికి పారొచ్చేసానండి"?3 “ఎవరూ పని ఇత్తంలేదండమ్మాయిగారూ! ఒటేలు యజమాని నేను వాన్ని కొట్టేనని అందరితో చాటింపు ఏసేశాడు. ఎవరూ పని ఇత్తం లేదండీ.. ఆడి చెయ్యి కొరికి సారొచ్చిన మూట నిబద్ధే కదాండి"?4 అనేతీరుగా వుంటుంది అతని సంభాషణ. ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 174

'ొడిగట్టి దీపాలు' నవలలో తన అక్క కూతురు పది పన్నెండేళ్ళ వయసున్న రావుడు తనబదులు పాచిపనికి వెళ్తానన్నస్పుడు మరిడమ్మ

“ఆళ్ళొప్పుకుంటారో లేదో! గుంటల్ని తోలేవంటారు. నీకు ఆమసి గిన్నెలు తెల్లగా తోవటం చాతోస్తదా? “అంటుంటే వూరుకోరు బామ్మర్లు. ఒక వారంరోజులు కూలికెళ్ళినా పన్నెండు రూపాయిలొస్తాయి. రెండుకోక గుడ్డలు కొనుక్కోవచ్చు. వొంటిమీద బట్ట బొత్తిగా పీలికలై పోనాది” అనడంలోను,

కూల్తిపనికి పోను చదువుకుంటానన్న కొడుకుతో యానాది మరిడమ్మ

“ఏటేటి? సదూకొని ఉద్దోగాల్టేస్తవా? పన్దెయ్యివూ? అందాకా ఏటి తింటావు? నీబాబు ఆతీరువా! నువ్వీతీరువా! ఇంక గిన్నెలుకి గిన్నెలు గెంజి ఎట్టాగొస్తదనుకున్నా?”

“ఏదో నేను ఆరికడుపూ, ఈరికాళ్ళూ పట్టుకుని పని దొరికించుకొస్తే అదికాస్తా నువ్వు చెల్లగొట్టుతావు కామాలు. అదేం కుదరదు. ఇన్ని నూకలు గెంజి కాసిపోస్తొ, తాగి బుద్ధిగా పన్గోకెళ్ళు. నువ్వు సదూకుని ఉద్దోగాల్డేసేదాకా ఎట్టా బతకటం9”75 అనడంలోను పొత్ర స్వభావ నిర్దేశంతోబాటు, సహజ సంభాషణా ధోరణి, మాండలికం మీదున్న పట్టు స్పష్టమౌతుంది. వర్గాల మధ్య అగాధాలు, వ్యవస్థలోని అవ్యవస్థ గురించి సూటిగా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.

అదేవిధంగా అదే నవలలో పొద్దున్నే లేచిన మరిడమ్మ మొగుడు గవరయ్యల మధ్య సంభాషణ ; “మరిడీ, ఇంకా పాయ్యిలో అగ్గెయ్యలేదంటే?”

“తూర్పు తెల్లారలేదు. అప్పుడే అగ్గెందుకు? పొయ్యి రాజేసి ఏటి చెయ్యాలి గనక?

“అబ్బ! ఏం సలి, సంపేత్తున్నాది. సుట్ట ఎలిగించుకుందామనుకున్నా”

“దీపంతో ముట్టించవే అమ్మా”

“కాణి కిరసనాయిల్‌ దీపం. తెల్లారిందాకా వుండిందా? ఎప్పుడో ఆరిపోనాది”76 అనే తీరుగా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని నూచిస్తూ సాగుతుంది.

అయితే గవరయ్య, మరిడమ్మ, కొడుకు నారాయణుడు స్వతహాగా తెలివితేటలు గలవాళ్ళు గనక ఆ తర్వాత జీవితంలో కష్టపడి పైకొచ్చి ఆర్థికంగా స్టిరపడ్డాకా వారి వ్యక్తిగత సంస్కారం సర్వత్రా వారి చూటల్లో కనబడి, విభిన్న

ఐ-వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం * డా, కె,బి.లక్ష్మి - 1/5

సంవాదవైఖరి ద్యోతకమవుతుంది. నుడెకారాలు - అన్యభాషా్య(్రచయోగం

శైలీ సౌకుమార్యం దెబ్బతినకుండా, బెచిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని, సందర్భానుసారంగా నుడికారాలు, అన్యభాషాపదప్రయోగాలు చేసి తనదైన శైలిని ఏర్పరచుకున్న రచయిత్రిగా అచ్యుతవల్లి ప్రసిద్ధురాలు.

  • . నిజజీవితంలో వ్యావహారికంలో అనుశ్రుతంగా వచ్చే తెలుగు నుడికారాలు అచ్యుతవల్లి సంభాషణల్లో అలవోకగా చోటు చేసుకుంటాయి. మచ్చుకి కొన్ని ఉదాహరణలు చూద్దాం,

(1) నుడికారాలు : “ఏం చేస్తుందిలే, వాళ్ళ అన్నయ్యలు ఉదయాన్నే చల్దితిని పాలెం వెళ్ళిపోతారు. ఇంక ఉన్నవాళ్ళలో ఈ పిల్లే కాస్త గడికట్టింది. మిగిలిన ఇద్దరూ ' నత్తునావాసు" “మా అమ్మాయికేదో గాలిపట్టింది”?? “పద్మా ఏళ్ళు ఎగుస్తుంటే బుద్ధి దిగువన అవుతుందేమిటే నీకు?” “బాగుంది, మొగుడు కొట్టినందుకు కాదు. తోడికోడలు దెస్పినందుకు అందిట ఒక ఇల్లాలు. అత్తగారు కోప్పడితే ఫర్వాలేదు. నేనేదో అడబిడ్డకదాని హాస్యం చేయబోతే కొట్టినట్లు ఏడుస్తోంది" “బుద్ధీ జ్ఞానం రాదా నీకింకళి తాడిచెట్టులా పెరుగుతున్నావు. ఇంకొ చిన్నదానివా?”78 “వుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. తాను ఈ జన్మలో తెలిసి తెలిసీ ఏ పాపం చేసి మూట కట్టుకోకపోయినా సంచితార్థం ఏదో వుంది, అందుకే ఏదనుకుంటే అది కాకుండా పోతోంది “పిల్లకి అయిదోనెల వచ్చేదాక్షా వుంటానన్నావు కదా! మరీ కూనా గురుజుతో ఏంచేసుకుంటావే? “తాయారమ్మకు పట్నం అంతా చూసెయ్యాలనే వాపిరితనం" “మా ఇంట్లో ఎవ్వరూ ఇంత వేడి కాఫీలు తాగలేరమ్మోయ్‌, తెనాలి ఐ,వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 176

రామలింగడి పిల్లి పాలలా చేస్తావు కాబోలు"79

“తల్లి గలప్పుడే పుట్టిల్లు. పాలు గలప్పుడే పరమాన్నం అంటారు"

“తప్పు, ఏడుస్తున్నావా? అసుర సంజవేళ కంటతడిపెట్టకూడదు తల్లీ. ఇంటి ఇల్లాలివి”80

“మూడుముళ్ళు వేయగానే తనకీ వాళ్ళకీ రుణానుబంధం తీరిపోయింది”

“ఏమిటే? ఎవత్ఫెలా పోతే మనకేం వచ్చింది? వానలేని వరదా, పిల్ల లేని పెంటా ఎవరు భరాయిస్తారు"81 (మూడుముళ్ళు)

“నాకు చేయి విరిగిపోయినట్లున్నాదండీ ఈ వారంరోజుల్నుంచీను. ఒక్కదాన్నీ వుండలేక నీరద దగ్గరికి వెళ్ళివున్నాను”

“ఏ నిమిషాన వాడి ఊహాలు ఎలా పరుగెత్తుతాయో! వమనం ఎలా అరికట్టగలం? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ లాభం?”82 (ప్రేమించని మనసులు) -

సమకాలీన జీవితాన్ని, వ్యక్తుల్ని, పరిస్థితుల్ని పరిశీలించిన రచయిత్రి దృ

ష్టికోణం పై నుడికార ప్రయోగాల్లో ప్రస్ఫుటమవుతుంధి. పొత్ర స్వభావం, సన్నివేశ బలం ద్యోతకమవుతాయి, (9 అన్యభాషా(యోగం : అచ్యుతవల్లి అన్యభాషా ప్రయోగం గురించి చెప్పాలంటే బహుభాషా కోవిదురాలైనా తెలుగుతో సమానంగా ఈమెకు సంస్కృతం హింద్‌ భాషల పట్ల మక్కువ ఎక్కువ అనిపిస్తుంది. అందుకే సాహిత్యం నుండి మాటలు, పాటలదాకా ఆయా భాషల ప్రయోగం సంభాషణల్లో చోటుచేసుకోవడం గమనార్హం.

“ప్రేమించని మనసులు నవలలో పెళ్ళయిన రెండేళ్ళకు భర్తతో కలసి మాట్లాడిన వదిననుద్దేశించి "ప్రధమ సమాగమ లజ్జితయా, వటుచాటు శతై రనుకూలం అన్నాడు జయదేవికవి83 అంటుంది భద్రి.

భ్రమరగీతం లో భ్రమరని చూసి కథానాయకుడు చలపతి “ఆపద్ధర్మంగా ఏదో నోటికి వచ్చినట్లు చెప్పేసింది. ఆ పిల్ల తనని నిజంగా పెళ్ళిచేసుకుని తనతో కాపురం చేస్తుందా?" కించిత్‌ భోగం భవిష్యతి"84 అనుకుంటాడు.

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 1/7/

తన పెళ్ళి అప్పు తీర్చడానికి ఇల్లమ్మ నిశ్చయించిన తండ్రిని వారించిన వసుంధరతో ఆయన “వస్తూ యస్యాస్తి విత్తం ననరః కులీనః,.. శృతవాన్‌ గుణజ్ఞః అన్నది మర్చిపోకు"85 అంటాడు

“'ప్రేమగండం” నవలలో వనజాక్షి "జ్యోతిసె జోత్‌ మిలాకె చలో! ప్రేమ్‌కి గంగా బహాతె చలో! అన్నాడు సంతు జ్ఞానేశ్వర్‌. దీపంతో దీపం ముట్టించినట్లే (ప్రేమళో ప్రేమ పుడుతుంది86 అని స్నేహితులకి ప్రేమజ్ఞానాన్ని వివరిస్తుంది.

“ఇదెక్కడి న్యాయం" నవలలోని పతాకసన్నివేశంలో భర్త దూరమైనా పిల్లలు తన దగ్గరికొస్తే బావుండునని ఆశపడుతున్న భార్య మాలతితో

“ఛాయా మన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయ మాతపే! అన్నారు. చెట్టు ఎన్నివేల పక్షి సంసారాలకు ఆశ్రయమిస్తోంది. రెక్కలు వచ్చిన పిట్టలు ఎగరక మానవు వాట్లని గురించి భాధ పడడం వ్యర్థం"87 అంటాడు రామనాథం.

“జనని సంస్కృతంబు సకల భాషలకును' అన్నట్లు పై విధంగా రచయిత్రి సంస్కృత భాషను అనివార్యంగా ప్రయోగించడం సంభవించింది. అయితే సాధారణ వ్యావహారిక సంభాషణల్లో సాధ్యమైనంత వరకు తెలుగునుడికారం ప్రయోగించడమే అభిలషణీయం అనిపించినా ఈ తరహా శైలి అచ్యుతవల్లిని ఇతర రచయి(త్రులకంటే ప్రత్యేకంగా, స్ఫూర్తిదాయకంగా, శైలీ సౌందర్యానికి ప్రతీకగా నిలబెడుతుంది.

'సామాన్యమ్టైన వ్యవహార పద్ధతికి భిన్నమైన (ప్రతి ప్రయోగమూ శైలీ భేదం కిందకి వస్తుందని" ప్రఖ్యాత విమర్శకుడు ఎరికో వెలాండర్‌ అన్న ప్రకారం విషయ స్వభావం, రచవా ప్రయోజనం, రచయిత మూర్తిమంతము కారణాలయి అచ్యుతవల్లి శైలీ వైశిష్ట్యం ఆమె నవలల వస్తు గౌరవాన్ని ఇనుమడింపచేసింది.

ఐమియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 176

రచయి[తి కథనం

కథను చెప్పే తీరు కథనం. కథన కుతూహలంలో ప్రతి రచయితకూ తనదైన శైలి ఉంటుంది. పాత్రల స్వరూప స్వభావాలు, వాతావరణం, సన్నివేశం, సంఘటన వంటి మౌలిక కథాంగాల వివరణీ కథనం. ఈ అంశాలన్నింటితోబాటు రచయిత్రి స్వీయ కథనంలోనే ఆమె శైలిలోని విశిష్టత ప్రస్ఫుటమయింది. నవలా సృష్టికర్త అయిన రచయిత్రి అందుకు సంబంధించిన విషయాల్లో సర్వజ్ఞురాలు. విషయాన్ని ఎలా చెప్పాలనుకున్నారు. ఏం చెప్పాలనుకున్నారు అన్నది ఆమెదృ క్పథాన్ని బట్టి స్పష్టం చేశారు. అంటే ముందుగా బాషా ప్రస్తావనవస్తే పాత్ర పరమైన భాపక్షు కొంత భేదం వుంది. దీనివల్ల రచయిత్రి భాషా పరిజ్ఞానమే కాకుండా పొత్రలు, కథావస్తువుని అమె ఎలాంటి దృక్పథంతో చూస్తున్నారో విశదమయింది. కథకురాలికి కథా వస్తువుకు, కథనానికి కథకురాలికి, పాఠకునికి వున్న సంబధాన్ని ఈ దృక్పథం లేదా కంఠస్వరం స్పష్టపరిచింది. ఇంత వరకూ చర్చించిన అంశాలను బట్టి చూస్తే ఆమె శైలిని బట్టి ఆమె కంఠస్వరం అవగాహనకు వచ్చేలా చేసింది. తన పాత్రలను రచయిత్రి అభిమానంతో, గౌరవంతో, కోపంగా, వ్యంగ్యంగా, హాస్యంగా, హీళనతో, సానుభూతితో, గర్వంతో - ఇలా ఏరకంగా దర్శించారు, విషయాన్ని ఏ దృక్కథంతో అవలోకించారన్నది స్పష్టమయింది. కథాకథనం పట్ల - కథనం (ప్రారంభం కావడానికి వెనక వున్న కాలం, వర్తమానం, వాతావరణం (నేపధ్యం) పట్ల వ్రశంసనీయమైన సమన్వయం సాధించారు అచ్యుతవల్లి. సర్వసాక్షి దృష్టికోణాన్నే తన కథ శైలిలో అధికంగా వినియోగించారు రచయిత్రి.

  • పఠిత భావుకతకి, లోతైన ఆలోచనలకి వదునుపెట్టేదిగా వుండే రచయిత్రి కధనశైలిలో వర్ణనాత్మక ధోరణి, తర్కబద్ధమైన చర్చాపద్ధతితోబాటు నాటకీయత కూడా చేసుకుంది. వర్ణనలు, వ్యాఖ్యలు కవితాత్మకంగా సాగి కథన శైలి అత్యంత సహజంగా రూపొందింది. నవలా నేవధ్యం కథాకధనానికి ఉద్ధీపనం కలిగించే అంశంగా అచ్యుతవల్లి సందర్భోచితంగా చిత్రించారు.

అచ్యుతవల్లి నవలలన్నింటిలో కదులుతున్న సామాజిక స్వరూపం

ప్రస్ఫుటమౌతుంది. దేశ కుల (ప్రాంతాలకు అతీతమైన మానవ మనస్తత్వాలకు

ప్రాధాన్యతనివ్వడం గమనార్హం. రచయిత్రి కథనశైలిలో తర్కబద్ధమైన చర్చాపద్ధతి

ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిత్య జీవితానికి సంబంధించిన అనేక వైజ్ఞానికాంశాలను ఐంవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం :% దా. కె.బి.లక్ష్మి - 179

ఆయా నవలల్లోని పాత్రలు చర్చించే విధానంలో ప్రామాణికతను సాధించారు. ముఖ్యంగా 'ప్రేమగండం', “ఇదెక్కడి న్యాయం, 'కొడిగట్టిన దీపాలు' నవలల్లో ఈ పద్ధతి అధికంగా ప్రదర్శితమయింది.

అచ్య్యుతవల్లి భాష్య వాక్య విన్యాసం రసోచితవాా, ఆవె హృదయాంతరాళాలనుంచి పెల్లుబికిన అనుభూతి, ఆవేశం అత్యంత సహజంగా కథాకథనంలో అనిష్పుతమయింది. రచయిత్రి కధనంలో వర్ణనాత్మక్క నాటకీయ పద్ధతులు రెండూ సమస్థాయిలో వున్నట్టనిపించినా వర్ణనాత్మక పద్ధతే ఆమె శ్రైలీ వైశివ్యాన్ని పెంపొందించిందన్నది సుష్పష్టం.

రచయిత్రి కథనరీతుల్లోని శైలీ భేదాల్లో అంతస్సూత్రంగా సాగిన దృశ్య శైలి స్పష్టంగా గోచరిస్తుంది. ప్రతి సన్నివేశం, పాత్ర స్వరూప స్వభావాలు, కదలికలు కళ్ళకు కట్టినట్లయి తేలిగ్గా పాఠకుల్ని చేరుకుంటాయి. కథనంలోని స్పష్టత, సుభోదకత, సరళత అచ్యుతవల్లి కధన శైలికి ఒక ప్రత్యేకతను చేకూర్చాయి.

మానవ మనస్తత్వాల్లోని సంక్లిష్టళల్ని, జీవితంలోని మానవత్వపు లేమిని, జీవిత సత్యాలను, అందాలను, ఆనందాలను, వ్యక్తిత్వాలను, వ్యవస్థలోని అస్తవ్యస్తతలను భావగర్భితంగా, భానస్సోరకంగా రసవత్తరంగా, పారదర్శకంగా, ఉదాత్తంగా చెప్పిన అచ్యుతవల్లి కథనశైలి ఎన్నదగినది.

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా కె.బి.లక్ష్మి - 180

శీర్షిక నామకరణ సరళా

వ్యక్తిని చూడగానే మీ పేరేమిటి? అని అడగడం, ఫలానా వ్యక్తీ అని పేరు బట్టి గుర్తించడం, ఈ వ్యక్తి పేరేమై వుంటుంది అని కుతూహలపడడం అందరికీ అనుభవైక వేద్యాలు. అదే సాహిత్యం దగ్గరికి వస్తే ఫలానాన్యక్తి రాసిన నవల, కథ అంటే సరిపోదు. శీర్లిక ముఖ్యం. చూడ్డంతోనే ఆకట్టుకుని పాఠకుడిలో కుతూహలాన్ని రేకెత్తించేది శీర్షిక. చూడగానే కథ తెలిసిపోయేలా కొన్నివుంటే, కొన్ని శీర్ణికలు భావగర్భితంగా, ధ్వనిపూర్వకంగా వుంటాయి. కొన్ని సందర్భాల్లో శీర్ణికకి,. కథకి పొంతన లేకపోవడం కూడా కద్దు..

అయితే శీర్లికలు ఆకర్షణీయంగా పెట్టడంలో సిద్ధహస్తురాలు అచ్యుతవల్లి. కథకు శీర్షిక శిరోభూషణంం వంటిదని అమెకు బాగా తెలుసు. 'నామకార్యం నాటకస్య గర్భితార్థ ప్రకాశనమ్‌” - గర్భితార్థ ప్రకాశమగు వామకరణం నాటకానికి చెయ్యాలి అని అలంకార శాస్త్రం చెప్పిన విధంగా అచ్యుతవల్లి తన నవలలకు నామకరణం చేయడం గమనించదగిన సంగతి.

“ఇదెక్కడి న్యాయం?, 'కొడిగట్టిన దీపాలు”, 'పుట్టిల్లు, 'మూడుముళ్ళు' ఈ తరహాకు చెందిన గర్భితార్థ ప్రకాశనములైన శీర్ణికలు.

అలాగే ఒక ప్రత్యేక పంథాలో సాగే నవలలకు శీర్లికల్ని పెట్టడంలో అచ్యుతవల్లి చూపిన శ్రద్ధ చాతుర్యం 'ఒడ్డుకి చేరిన ఒంటరి కెరటం, 'తిరం చేరినకెరటం'లో గమనించవచ్చు. చూడగానే ఈ రెండు శీర్షికలు ఒకేలా అనిపించినా వస్తువులో, కథనంలో దేనికదే ప్రత్యేక పంథా గలవి. కథలోని ముఖ్య సంఘటనని సూచించే శీర్షికలు.

శీర్షికను చూడగానే ఒక విధమైన భావ ప్రేరణను కలిగించడం రచయిత్రికి ఇష్టంగా తోస్తుంది. 'భ్రమరగీతం”, 'ఎగిరేపిట్టలు”, 'కోరిక', 'కానుక, “ప్రేమగండం', “ఇది వుల్లెలవేళి నవలల శీర్షికలు కవితాత్మకంగానూ, ధ్వన్యాత్మకంగానూ రూపుదిద్దుకున్నాయి.

కథలోని భావాన్ని శీర్ణిక వ్యక్తం చేయగలగాలి. రచయిత్రి 'సీతకలలు', “ప్రేమించని మనసులు), 'తాకట్టు”, 'నేను దేవిని కాను”, 'ఏకాంత' నవలల శీర్ణికలు చూడగానే కధ తెలిపి పోయిందని, ఉత్కంఠలేదన్న భావం కలిగే అవకాశం వుంది.

ఐ.వి.-యస్‌. అచ్యుతవల్లి నవలొసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 161

అదే రచయిత్రి చమత్కారం, అలా అనుకుని నవలలోకి అడుగుపెట్టిన పాఠకుడు తద్భిన్నమైన మలుపులు, అనుకోని ముగింపులు చూసి ఆనందపరవశుడవుతాడు.

పరస్పర విరుద్ధ భావాలు గల పదాలను జతచేసి పెట్టిన శీర్షిక 'పూలూ - ముళ్ళు,

కథా వస్తువుల్ని స్ఫురింపజేస్తూ, వస్తువును మలిచే శిల్ప విధానాన్ని అనుసరిస్తూ, రచనా సంవిధానం చెడకుండా పాఠకుల్ని ఆలోచింప చేసేవిగా వుంటాయి అచ్యుతవల్లి శీర్షికలు. కథనంలో, శీర్ణికా నామకరణ సరళిలో ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ప్రదర్శించడంవల్ల అచ్యుతవల్లి నవలలు పాఠకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. అచ్యుతవల్లి నవలా రచనలో ప్రస్ఫుటించే శిల్పసౌందర్యానికి శీర్షికల్ని నిదర్శనాలుగా ఉటంకించవచ్చు.

ఐ.వియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫8 డా, కె.బి.లక్ష్మి - 182

నేకుుథ్య చితణ

కథా నిర్మాణశిల్పంలో కథతో, వస్తువుతో, పొత్రలతో విడదీయరాని సంబంధం కలిగిన మరికొన్ని అంశాలు నేపథ్యం, వాతావరణం, కాలం, స్థలం. స్థలం, కాలాల చిత్రణే నేపథ్యం. దీన్నే బ్యాక్‌గ్రౌండ్‌ (8406 ౮౧౦౪౧౦) అనికూడా వ్యవహరించవచ్చు.

నేపథ్యం అంటే కథకు రంగస్థలం. నవలలోని పాత్రల జీవితానికి, కథలోని అంశాలకు ఆలంబనం నేపథ్యం. అచ్యుతవల్లి నవలల్లో వాతావరణ చిత్రణ, దేశకాలాబ నేపథ్య వర్ణన సామాజిక చైతన్యంతో ముడిపడి వుంది. నేవథ్య చిత్రణలో, కథవెనకవున్న స్థలాన్ని చిత్రించడంలో రచయిత్రి భౌతికాంశాలనే గాక భావజాలాన్ని కూడా వాస్తవికతతో ఆవిష్కరించారు. అందుకే పాఠకుడికి తను ఆ ప్రదేశంలో వున్న ప్రత్యక్ష భావన కలుగుతుంది., పాఠకుడికి వస్తువుమీద నమ్మకం పెరుగుతుంది.

అచ్యుతవల్లి నేపథ్య చిత్రణను పరిళీలిస్తే-

“కొడిగట్టిన దీపాలు సంస్కరణాభిలాషతో స్వాతంత్ర్యం అందించిన నూతన విలువల్ని ఆవిష్కరించిన నవల. అగ్రవర్షాల ఆధిపత్యంలో నివ్నవర్గాల వెనుకబాటుతనం, వారిని వారే సంస్కరించుకుని, విద్యాబుద్దులు నేర్చుకుని ప్రగతి సాధించిన విధానాన్ని అచ్యుతవల్లి ఈ నవలలో గొప్పగా చిత్రించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ పల్లెలోని బ్రాహ్మణవాడ, అగ్రవర్ణాల కుటుంబాలు ఏడెనిమిదికంటే ఎక్కువుండవు. కూలీ నాలీలవి కూడా ఏభయ్‌, అరవై గడపకి మించదు. వీళ్ళంతా పనిపాటలకి, తిండి తిప్పలకి ఒకరిమీద ఒకరు ఆధారపడి వుండక తప్పని పరిస్థితి. స్వతంత్రం వచ్చాకా జీవన విధానంలో వచ్చిన మార్పులు, అందివచ్చిన విద్యావకాశాలను అందిపుచ్చుకుని, పట్నం వలసివచ్చి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బాగుపడిన నిమ్నువర్గాలు, గొప్పలకు, వ్యసనాలకుపోయి. ఆస్తులు కరిగించుకుని వీధులపాలైన అగ్రవర్ణాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు - ఇలా అనేక మార్పులని, భావజాలాన్ని విశ్లేషిస్తూ దేశకాలాలు, స్థితిగతుల్ని కళ్ళకు కట్టినట్లు ప్రామాణికంగా చిత్రించిన నవల “కొడిగట్టిన దీపాలు. ఈ నవలలోని నేపథ్య చిత్రీకరణలో రచయిత్రి వ్యక్తిగత నైతిక దృష్టిమా(త్రమే గాక, సామాజిక రాజకీయ దృక్పథం, వ్యవస్థలోని మార్పులపట్ల అవగాహన ప్రస్ఫుటమవుతుంది. గ్రామీణ, నగర వాతావరణాలు సమతుల్యంగా చిత్రించబడ్డాయి.

ఐ-వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ దా. కె.బి.లక్ష్మి - 183

కథావస్తువుకు, నేపథ్యానికి సమానమైన ప్రాధాన్యతనిచ్చిన. నవల “ప్రేమగండం'. యువతీయువకుల సమస్యలకు సంబంధించిన ఈ నవలలోని ఇద్దరు నాయకులు యదార్థజీవితానికి సంబంధించిన శివకేశవ, ప్రసాద్‌ లు కావడం విశేషం. కోస్తాప్రాంతంనుండి చదువులకోసం కర్ణాటక. (బెంగుళూర్‌) వెళ్ళిన యువతీయువకులు, జీవనోపాధికోసం తమిళనాడు, కేరళ రాష్ట్రాలనుండి వచ్చి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో స్టీరపడిన వ్యాపారస్థులు - వీరి జీవన సరళిని మేళవిస్తూ ఆకర్షణ, బాధ్యతల మధ్య చిక్కుకున్న జీవితాలను సమశగ్రంగా విశ్లేషిస్తూ, సక్రమ పరిష్కారాలు సూచించిన నవల. ఆయా ్రొంఠాల నేపథ్య చిత్రణలో రచయిత్రి పరిశీలనా శక్తి సహజ వర్ణనలకు సౌందర్య ప్రియత్వం జతకలిసి పాఠకులకి ఆహ్లాదం కలిగిస్తాయి.

“భ్రమరగీతం', 'వూలు-ముళ్ళు” నవలలు పాత్రల్ని, కథా వస్తువుల్ని నేవథ్యం నుంచి ఎంత మాత్రమూ విడదీయడానికి వీలులేనివి, (భ్రమరగీతం'లోని నేపథ్యం స్వాతంత్ర్యం రాకపూర్వం నుండి అధునిక కాలందాకా పాత్రల చిత్రణకు బాసటగా నిలుస్తోంది. కులాంతర మళాంతర వివాహాలే కాక ఖండాంతర వివాహాలు, విడాకులు, యువతీ యువకుల స్వేచ్చా ప్రియత్వం, అటు పల్లెలు, ఇటు నగరాల్లోని బతుకుతీరులు బతుకు తెరువులు అత్యంత సహజంగా చిత్రించిన నవల (్రమరగీతం. దేశ కాలాలకు సమాన ప్రాతినిధ్యం అభించిన నవల.

'పూలు-ముళ్ళు' నవలలో కాలం కాస్త మసక మసగ్గా వుంటుంది. కొనీ స్థలం మాత్రం స్పష్టంగానే ఉంటుంది.

తదితర నవలల్లో దేశకాలాలు స్పష్టంగా లేకపోయినా సార్వకాలీనతను సంతరించుకోడానికి భావోద్రేకంతో వాటిని అర్థంచేసుకుని అవిష్కరించడంలో రచయిత్రి అచ్యుతవల్లి చూసిన అసాధారణ ప్రజ్ఞాపాటవాలు, నిజాయితీ బలమైన కారణొలు. కాలాన్ని చిత్రించడం అంటే కథాకాలానికి చెందిన భావజాలాన్ని చిత్రించడం ఈ సార్వకాలీనత సిద్ధించి అచ్యుతవల్లి స్థానాన్ని నవలా ప్రపంచంలో స్పష్టంచేసింది.

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 184

'సన్నివేశ కల్పనాశిల్పం

కథలో జరిగేవాటికి అనుగుణమైన పరిసరాలను, నేపథ్యాలను, వాతావరణ స్థితిగతులను అత్యంత సహజంగా, ప్రతీకాత్మకంగా చిత్రించడమన్నది సన్నివేశ కల్పనాశిల్పం.

సన్నివేశాలు, సంఘటనలు లేని పక్షంలో ఆయావ్యక్తుల తత్వాన్ని, శీల వృత్తులను, స్వభావాలను చిత్రించడం కష్టసాధ్యం.

కథకొనసాగడానికే గాక్క ఆసక్తిని కలగజేస్తూ, పఠనీయతా గుణాన్ని పెంపాందించేవి సన్నివేశాలు. ఈ సన్నివేశ చిత్రణ అత్యంత సహజంగా తీర్చిదిద్దడంలోనే రచయిత ప్రతిభ వ్యక్తమౌతుంది. దీనినే సీన్‌ క్రియేషన్‌ (509106 080౧) అంటారు. అంత సీన్‌ లేదు అనిపించుకోవడం అంటే అద్భుత సన్నివేశ కల్పన అన్న ముద్ర వేయించుకోవడమే రచనా స్టాయికి గీటురాయి.

సన్నివేశ కల్పన (ప్రధానంగా రెండు రకాలు. ఒకటి సంభాషణాశ్రితాలు, రెండు చేష్ణాగతాలు.

పాత్రలు మూట్లాడుకుంటున్నట్లుగా చిత్రింపబడేవి సంభాషణను ఆశ్రయించుకున్న సన్నివేశాలు. పాత్రలమధ్య ఉండే అనుబంధాలు, రాగద్వేషాలు, వ్యక్తిత్వాలను సంభాషణలు వెల్లడిస్తాయి. లాక్షణికులు సంభాషణకు శోభనిచ్చేవి వాడి, వేడి, వ్యంగ్యం చమత్కారం, ధ్వని, నిగూఢత, పదును మొదలైన లక్షణాలని చెబుతూనే, అవి సన్నివేశాలలో భాగమే అయినప్పటికీ నాటకీయతా ప్రయోజనం దృష్ట్యా దీనిని ప్రత్యేకంగా పేర్కొన్నారు. పాత్రల మధ్య సంభాషణల్లోని ఈ లక్షణాలే సంభాషణాథ్రిత సన్నివేశాన్ని రక్తికట్టించడానికి తోడ్పడతాయి.

చేష్టాగత సన్నివేశంలో వ్యక్తుల చేష్టలే ప్రాధాన్యత. రదయిత పాత్రల చర్యలను తన మాటల్లో వివరిస్తారు. “ఇక్కడ ఆలోచనల, సంభాషణల ్రసక్తిలేక, కేవలం ఆ వ్యక్తి చేస్తున్న పనియొక్క చిత్రణో వుంటుంది. ఇది నాటకీయతా పోషణకు తోడ్పడకపోయినా, వస్తువును బట్టి, కథాగతికి అప్పుడప్పుడు ఆవళ్యకమైనది”88.

అచ్యుతవల్లి నవలల్లో ఈ రెండు తరహాల సన్నివేశ చి్యితణ సందర్భానుసారంగా చోటుచేసుకుని, కథాగతికి అత్యంత దోహదకారులుగా రూపుదిద్దుకున్నాయి.

ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి - 185

(0) సంభాషణాణశిత సన్నివేశాలు : 'ఇదెక్కడి న్యాయం" నవలలో కథానాయకుడు రామనాథం బదిలీమీద వేరే ఊరికి వెళుతూ, భార్య మాలతిని ఉద్యోగం రాజీనామా చేసి తనతో వచ్చెయ్య మన్నప్పుడు, అదే నవలలో భార్యాభర్తలిద్దరూ ఒకేరకం బాధ్యతల్ని పంచుకునే విషయంలో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు, “ఎగిరే పీట్టలు' నవలలో ఇంట్లోంచి వెళ్ళగొట్టిన భార్య వసుంధర ఇరవై ఏళ్ళ తర్వాత ప్రముఖ విద్వాంసురాలై ధనార్జన చేయడం గమనించి భర్త అప్పాదొరై స్వార్ధంతో ఇంటికి రమ్మన్నప్పుడు, 'పూలూ-ముళ్ళు' నవలలో ప్రధాన కథానాయికా నాయకులైన నళిని జగన్నాధాల మధ్య వ్యక్తిత్వాల సంఘర్షణ చెలరేగినపుడు - 'కోరికి నవలలో కథానాయిక సంగీత అతివాద స్త్రీవాద ధోరణితో అవివాహిత ఛల్లికావడానికి తనకి తెలీకుండానే సహకరించిన వాసుదేవతో తాడో పేడో తీల్పుకోవాల్సివచ్చినప్పుడు-ఆయా సందర్భాల్లో రూపుదిద్దుకున్న సన్నివేశాల్ని చక్కని సంభాషణా్రిత సన్నివేశాలుగా ఉదహరించవచ్చు. ఈ సన్నివేశాల్లోని సంభాషణల్లోని పదును, తార్కికత, చమత్కారం, తదితరలక్షణాల వలన అవి సూటిగా పాఠకుని హృదయానికి హత్తుకుంటాయి. సన్నివేశ కల్పనలో ఈ గుణాల్ని అంత స్పూత్రంగా పోషించి, వాస్తవికతకు దగ్గరగా, అత్యంత సహజంగొ చిత్రించారు అచ్యుతవల్లి,

ఈ సన్నివేశాల్లోని సంభాషణల ద్వారా పాత్రలు తను చునసులోని భావాలను స్పష్టంగా, శక్తివంతంగా చెప్పగలిగాయి. అంటో రచయిత్రి తాను చెప్పదలచుకున్న ముఖ్యాంశాల్ని, పాత్రల సంబంధాలలోని పరిణామ వికాసాన్ని, కథావరమైన ముఖ్య మలుపుల్ని, సుఖదుఃఖాలని, జీవిత సత్యాలని, సంభాషణాశ్రిత సన్నివేశాలద్వారొ అద్భుతంగా ఆవిష్కరించారు. నాటకీయతతో కూడిన ఇటువంటి అనేక సన్నివేశాలను ప్రధాన సాధనాలుగా చేసి పఠనీయతను పెంపొందించడంలో సునాయాసంగొ కృతకృత్యులయ్యారు.

ఇదేవిధంగా అచ్యుతవల్లి నవలల్లో రూపుదిద్దుకున్న చేష్టాగత సన్నివేశాల తీరును చూడాల్సి వుంది.

(1 చేష్టాగక సన్నివేశాలు: చేష్టగత సన్నివేశ చిత్రణలో వాటకీయత వుండదు గనుక రచయిత మరింత శ్రద్ధతో సన్నివేశ కల్పన చేయాల్సి ఉంటుంది. చేష్టాగత సన్నివేశాల్ని సహజంగా, ఆసక్తిదాయకంగా చిత్రించడంలో అచ్యుతవల్లి ప్రతిభానైపుణ్యాలు ఎన్నదగినవి,

ఐంవి.యస్‌. అచ్చుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మీ - 186

“పేమించని మనసులు' నవలలో పాత్రల మధ్య సహజంగానే సంభాషణలు తక్కువ, దాదాపుగా నవలలో చేష్టాగత సన్నివేశాలే ఎక్కువగా చోటుచేసుకోవడం గమనార్హం. వర్ణనలు, వ్యాఖ్యలతో కూడిన ఈ సన్నివేశాలు పాఠకునిలో ఉత్సుకతను పెంచి కథాగమనానికి ఎంతగానో తోడ్పడతాయి. ఉదాహరణకి “కలవారింటికోడలు నాగమణి తలవంచుకుంది. కారణం అమె కళ్ళు నిండుకుంటున్నాయి. అమె చేళులు క్యాబేజీని తరుక్కుంటూ పోతున్నాయి. తన వాళ్ళందరూ తనను అవాంఛితంగా వరించిన అదృష్టదేవత పద్మనాభం అనుకుంటున్నారు. కానీ ఆ దేవత ప్రసన్న దృష్టీ తనకి కరువని తనకీ, ఆ ఇంట్లోని జనానికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు, ఇందరి రాకుమార్తెల కలల్లోని రాకుమారుడు తనకి నిక్షిప్త ధనంలా అభ్యమవడం, తన అదృష్టమో, దురదృష్టమో తెలుసుకోవాలన్న తహతహతోనే ఆమె రోజుల్ని నిర్మోహంతో గడుపుతోంది”. వంటింట్లో తలవంచుకుని తనపని తాను చేసుకుపోతున్న నాగమణి పాత్ర పూర్వాపరాలు, ఆ ఇంట్లో ఆఅమెస్త్థానం భః సన్నివేశంలో ఉదాత్తంగా చిత్రితమయ్యాయి.

“నేను దేవినికాను' నవలలో అర్థరాత్రి సావిత్రి ఆలోచనలతో నిద్రపట్టని నారాయణ అలవాటుగా మందాకినీ తీరానికి వెళతాడు. ఆ సన్నివేశం “దూరంగా సర్విచెట్లకావల ఒంటరి పారిజాతం చెట్టువద్ద ఎవరో పల్పని తెల్లచీర మేలిముసుగుతో నిలబడినట్లు కనిపించింది, మసక మసక వెన్నెల నీడల్లో విరబూసిన పారిజాత సుమ సౌరభాల కెరటాలలో అ మూర్తి వెన్నెల కిరణంలా నిల్చుని వుంది. ఆ వెన్నెల కిరణం వెనకాతల పొడుగాటి సర్విచెట్ల నీడలు, చారలు చారలుగా జాడలు, దూరంగా ఎక్కడో, ఎవరో పాడుతున్న గీతం... ధైర్యం చేసి ఆ మూర్తి దగ్గరకు అడుగు ముందుకి వేశాడు నారాయణం.”

రోమాలు నిక్కబొడుచుకునే ఈ చేష్పాగత సన్నివేశంలోని నారాయణ ప్రతి అడుగూ, కదలికా పాఠకుల్లో ఉత్కంఠను రేకెత్తించి తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ చీకట్లో వున్నదెవరు? అన్న ఉత్సుకతను కలుగజేస్తుంది. పాత్రల కదలికలతో పాటు దృశ్య వర్ణన కూడా చోటు చేసుకోవడం వల్ల సన్నివేశానికి మరింత సహజత్వం చేకూరింది. కాల నిర్దేశం లేకుండా నారాయణకి నదీ తీరానికి వెళ్ళడం స్వభావసిద్ధం

గనక చేష్టలతో దృళ్య చిత్రణ అనివార్యంగా జత కలిసింది. ఒక చిత్రకారుడు చిత్రించిన రంగుల చిత్రంలా అత్యంత అద్భుతంగా, సహజంగా ఈ సన్నివేశ చిత్రణ చేశారు ఐంవియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం * డా. కె.బి.లక్ష్మీ - 18/7

రచయిత్రి.

కథాగమనానికి తోడ్సడే రీతిలో అచ్యుతనల్లి తన ఇతర నవలల్లోని సన్నివేశ కల్సనా సమయాల్లో ప్రతిభావంతంగా సంభాషణాశ్రిత, చేష్టాగత సన్నివేశ చిత్రణలను చేశారు.

చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, బలంగా, ప్రత్యేక కంఠస్వరంతో, భావోద్రేక యుక్తంగా ఉద్దేశాన్ని స్పష్టంచేస్తూ అద్భ్బుతరీతిలో పఠనీయంగౌ, (ప్రయోజనాత్మకంగా, సందేశాత్మకంగా చెప్పిన అచ్యుతపల్లి రచనాళిల్ప, శైలీ వైశిష్ట్యాలను వివరించడం జరిగింది.

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 188

మయుణగింషు

ఐ-.వి.యస్‌. అచ్యుతవల్లి నవలల సమగ్ర పరిశీలన ద్వారా ఆమె రచనలు ఏవిధంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఉత్తమ రచనలుగా ధృవపడుతూ ఆమెను ఉత్తమ రచయిత్రిగా రుజువు చేశాయో నిరూపించాను. సమకాలీన ఆధునిక నవలా రచయి(త్రుల్లో అచ్యుతవల్లి ప్రత్యేకబాణి, ప్రత్యేక స్టానం గురించి విశదీకరించాను.

వురుషాధిక్య సమాజంలో తరతరాలుగా స్త్రీలపట్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగాను జరుగుతున్న అన్యాయాలగురించిన అనేక విషయాలు ఇతి వృత్తాలుగా తీసుకుని కాలానికి నిలబడే నవలలు రాశారు అచ్యుతవల్లి,

స్త్రీవాదం, ఫెమినిస్ట్‌ మూమెంట్‌ అంటే ఏంటో తెలుగు పాఠకులకు అంతగా పరిచయం లేని 19 60-70 దశకంలోనే 'కోరికి, 'భ్రమరగీతం” వంటి నవలల్లో అతివాద స్త్రీవాద ధోరణిలో సాగే స్త్రీ పాత్రలను సృష్టించి సంచలనం సృష్టించారు.

అచ్యుతవల్లి స్త్రీ పాత్రలు సంపూర్ణ స్వేచ్భా దృక్పథంతో, అభ్యుదయ భావనలతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని సమాజానికి, వురుషాధిక్కతకు ఎదురొడ్డి నిలబడ్డం గమనార్హం.

సాధారణ మధ్యతరగతికి చెందిన పాత్రలు అత్యంత వాస్తవికతతో (ప్రవర్తించడం అచ్యుతవల్లి కథన శైలి. ప్రత్యేకత. స్త్రీ అభ్యుదయం, సమానత్వం అన్న పదాలకు అర్థం పురుషాధిక్యతకు వ్యతిరేకంగా పోరాడడమేగాని, వురుషాధిక్యతను వ్యతిరేకించడంకాదని ఆమె నవలలు స్పష్టం చేస్తాయి. స్త్రీ పురుషులు పరస్పరం సహకరించుకోవడం వల్ల జీవితంలో ప్రేమ, శక్తి, ఆనందం కలుగుతాయి. స్త్రీ స్వేచ్చ అంటే పురుషులతో తెగతెంపులు చేసుకోవడం కాదు, పరస్ఫరం సహకరించుకుని, సమానంగా జీవితం గడపడం అన్న విషయం అచ్యుతవల్లి నవలల్లోని ఇతి వృత్తాల సారాంశం.

1960 - 70 దశకంలో సాహితీరంగం పైకొచ్చి నిలబడి మధ్యతరగతి అంతరంగ చిత్రణలో సాంత ముద్రవేశారు. సున్నితమైన సెంటిమెంటును పండించడంతోబాటు, వస్తువుకు సంబంధించిన సూక్ష్మాంశాలను చక్కగా వ్యక్తీకరించడం రచయిత్రి అఖభినివేశానికి తార్కాణం. అచ్యుతవల్లి శైలి పాఠకుల్ని పరుగెట్టిస్తుంది, ఆకర్షణీయమైన నిర్మాణ శిల్పం రచయిత్రి ప్రత్యేకత.

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 189

పాశ్చాత్య రచయితలనుండి, రచనలనుండి ప్రేరణ పొందకుండా సంప్రదాయ పద్ధతులు పాటిస్తూ, అభ్యుదయ భావజాలంతో కూడిన బలీయమైన సాంఘిక నిబద్ధత, ఉన్నత ఆదర్శాలు కలిగిన వ్యక్తివాద దర్శనాన్ని ఆమె నవలల్లో వ్యక్తం చేసిన తీరును విశ్లేషణాత్మకంగా స్పష్టపరిచాను.

ఇతివృత్తం, దాని నాటకీయతను పెంపొందింపజేసే కొన్ని సూచనాత్మక ఘటనలు, ఇతివృత్తానికి అత్యంత అనువుగా వుండే ఒక వూర్వరంగం, వాస్తవికతను, పద్రాసను రెంటినీ ఒప్పించే ఒక విశిష్టకైలి రచయిత్రి రచనల్లోని విశేష లక్షణొలు.

ఆధునిక స్త్రీ పురుషుల మధ్య స్వీచ్చాస్వాతంత్ర్యాలు, సమాన హక్కుల పేరుతో సంఘర్షణకు లోనవుతున్న కుటుంబ వ్యవస్థ, సమాజంలో ప్రతి ఫలిస్తున్న సంఘర్షణ ఆమె కధా వస్తువులయ్యాయి. మనిషిలో భద్రతా భావం లోపించి ఆందోళనకు గురౌతున్నాడన్నది సామాజిక సత్యం. అలాంటప్పుడు స్త్రీ పురుషులు ఒక సమిష్టి ప్రయోజనాన్ని కాంక్షిస్తూ పరస్పర సమర్పణ భావంతో, ప్రేమభావం పునాదిగా జీవితాన్ని కొనసాగించినపుడు కుటుంబ వ్యవస్థలో ఎగుడు దిగుళ్ళు ఏర్పడవు అన్న అంతస్సూత్రత అచ్యుతవల్లి నవలల్లో ప్రస్ఫుటమౌతుంది.

స్త్రీ పురుష సంబంధాలు, జీవితాలకు సంబంధించి సమన్యాయం తన సందేశంగా, సమాజంలోని అసమానతల్ని, మానవ సంబంధాల్లోని సంక్షి ప్టతల్ని ప్రతిబింబించే ఆమె ప్రత్యేక కంఠస్వరం నన్ను అమితంగా ఆకర్షించి, ఆలోచింప చేశాయి. ఆదర్శవంతమైన అమె భావజాలం మరుగునపడి పోకుండా ముందు తరాలకు అందించి శాశ్వతత్వాన్ని చేకూర్చాలన్న పట్టదలతో (శ్రమకోర్చి నవలలు సేకరించి, వ్యక్తిగతంగా రచయిత్రిని కలిసి మాట్లాడి పరిశోధనాంశాల్ని నిరూపించాను.

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫| డా, కెబి.లక్ష్మీ - 190

చవాదసూచికలు

  1. పోరంకి దక్షిణా మూర్తి - కధానిక స్వసూప స్వభావాలు - వుట - 386
  2. '566/6 19 ఇ ౦00౧౧౧|1౧ఇ40౧ ౦01 04/0 618౧౭౧౪. ౧6 16625 10 06 ఉ౫గం౧85566 2౧౮ 16 1౧61/602410/ 0% 9 ఉంటం” - గజగ౧5 /౦గం ౮గ|, 01660౧౬౧/ ౦1 116120/ 169గ౫5 ౭౬6 110. 116.
  3. ఐంవిఆయస్‌. అచ్యుతవల్లి - మూడుముళ్ళు - పుట - 112,113 శే ః "= ప్రీమించని మనసులు - పుట - 52 వ్‌, ల కష = షణ్ముఖప్రియ ఆరవభాగం - పుట - ఏ5క్క8ి6 ళం ప “* - ఇదెక్కడి న్యాయం - పుట - 110 7, ॥ ౫“ _ మూడు ముళ్ళు - వుట - 75
  4. 7 *” - సీతకలలు - పుట - 29 ఫి లో * _ పుట్టిల్లు - పుట- 66
  5. ల * _ ఇదెక్కడి న్యాయం - పుట - 128 శే జ * _ మూడుముళ్ళు - పుట - శ్ష28 క్షే2ై. ప * _ ప్రేమించని మనసులు - వుట - న! క్షేఫం క * _ ఇదెక్కడి న్యాయం - వుట - 168 శేడ. *॥ ౫ _ మూడు ముళ్ళు - వుట - 222 వ్‌, ళ * _ కొడిగట్టిన దీపాలు - పుట - 36
  6. తి * - 1016 - పుట - 38 శే, శి * _ ||6- వుట - 38
  7. (| = _ ఎగిరేపిట్టిలు - పుట - 244 క్షం, ౫ ౫ _ కోరిక - వుట - 154
  8. / * _ ప్రీతకలలు - పుట - 34
  9. జ ' * _ నేను దేవినికాను - పుట - 116 ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 191
  1. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - ప్రేమించని మనసులు - పుట 57
  2. | * - కోరిక - పుట- 68
  3. లౌ “= ఎగిరేపిట్టలు - పుట - 1
  4. ౯ * = కొడిగట్టిన దీపాలు - పుట - 9?
  5. ॥ * - 10164 - పుట - 106 27, న * _-1|90160 - పుట- 105
  6. న *“ -1016 - వుట - 158
  7. నె *" - 1016 - పుట - 158
  8. ళ్‌ * -10160- పుట- 159
  9. క * _ భ్రమరగీతం - పుట - 43
  10. ళ్‌ ” - మూడుముళ్ళు - పుట - ౩7 తప, గ " -10164- పుట- 95 34, న * _ కానుక - పుట - 47 3ర్‌, న * - షణ్ముఖప్రియ - వుట - 82 వెరు ” * = పూలూ ముళ్ళు - పుట - 51 వ7, తి * -10164- పుట- 61 ఏగ్ర ళ్‌ * 1016 - పుట - 132 వ్ర న * - కోరక - పుట- 107 40, ॥ " _ ఇదెక్కడి న్యాయం - పుట - 57 శ1, / న - సీతకలలు - పుట - 82 42, ఖ్‌ * 10164 - పుట - 90
  11. న ” - కొడిగట్టిన దీపాలు - పుట - 159 44, / * = ఇదెక్కడి న్యాయం - పుట - 127
  12. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - కానుక - పుట - 54

వఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం డా. కె.బి.లక్ష్మి - 192

  1. ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి - 10160 - పుట - 27

శ, శ * _ పీతకలలు - పుట - 181

  1. ల *= -|018- వుట - 120

శం జ * - 10164 - వుట - 121

5్‌0. % * - 1516 - పుట - 121

క్‌ 1, న్‌ * _ భమరగీతం - పుట - 91

వ్‌ 2, క = - 1006 - పుట- 91

వ్‌ 3, ల “ - ఇదెక్కడిన్యాయం - పుట -117

వ్‌4, ల * _-|0164 - పుట - 186

5్‌5్‌, * * - 1016 - పుట - 173

క్‌ళ. క = _ కొడిగట్టినదీపాలు - పుట - 106

క్‌ 7. త ౫ - మూడుముళ్ళు - పుట - 42

క్‌ 8. న * _ |16- వుట - 55

క్‌ 9, ॥ ” _ ఇదిమల్లెల వేళ - వుట - 199

  1. న * -|9164- పుట - 199.

  2. గ * _ తీరం చేరిన కెరటం - వుట - 182

62, ౫ * _ 1016 - వుట - 182

6వ, న ౫ _ ఎగిరేపిట్టలు - వుట - 183

64, | ౫ _ కొడిగట్టినదీపాలు - పుట - 147

  1. య ౩ _ |56- పుట - 142

5ళ. న * _ పేమగండం - పుట - శ్షేరైక్ష

ఈళ7. క 13 = కొడిగట్టిన దీపాలు - వుట - 9

  1. తి ౫ _ మూడుముళ్ళు - పుట - 45

69, గి ౫ _ కీతకలలు - పుట - 27, 28 ఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం 8 డా. కె.బి.లక్ష్మి - 193

  1. ఐ.వియస్‌. అచ్యుతవల్లి - మూడుముళ్ళు - పుట - 67

గ్గ గ * = [016- పుట- 137

72, గ ఎ 10140- పుట- 171

  1. ల్‌ * - |014- పుట - 15

  2. ళ్‌ * -|90164- వుట- 15

      • కొడిగట్టిన దీపాలు - పుట - 6€4,16,17
  3. ॥ * _ |016- పుట - 9,10,111

77, న * = నేను దేవినికాను - వుట - 117

78, గ “ _ ఇది మల్లెల వేళ - పుట - 143, 29, 66

79 గ " - పీత కలలు - పుట - 186, 69, 52, 42

  1. ఖా ” = పుట్టిల్లు - పుట - 235, 67

  2. న * _- మూడుముళ్ళు - పుట - 145

  3. ళ్‌ * - పేమించని మనసులు - పుట - 63

  4. ల ” _ భ్రమరగీతం - వుట - 32

84, లి * - పుట్టిల్లు - వుట - 234

  1. ళ్‌ ” _ ప్రేమగండం - పుట -123

87” * - ఇదెక్కడి న్యాయం - ప్పుట - 199

  1. మొదలి నాగభూషణళర్మ - తెలుగు నవలావికాసము - పుట - 197 వవి.యస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి- 194

అనుబంధం

అచ్యుతవల్తి జీవితం - నాటాత్య రేఖలు

తెలుగు నవల, కథ, వ్యాసరచనా రంగాల్లో అబ్బ ప్రతిష్టురాలైన రచయిత్రిగా గణనీయురాలైన ఐ.వియస్‌. అచ్యుతవల్లి పూర్తిపేరు ఇరంగంటి వెంకట శేష

1943 సంవత్సరం మే నెల ఒకటవ తేదీన శ్రీ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అంజమ్మ, వెంకట గోవిందాచార్యులు. పశ్చిమగోదావరి జిల్లా దొంతవరంలో పుట్టిన ఈ మేల్చంతి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చదువుల సరస్వతిగా ఎదిగింది. దొంతవరంలో పాఠశాల (ఇప్పటికీ లేదు) లేని కారణంగా మాతామహుల ఇంట వుండి మొదట పిళావురం రాజా హైస్కూల్లోను, తర్వాత కాకినాడ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు అచ్యుతవల్లి ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. చదివి, అంధ్ర విశ్వవిద్యాయం బి.ఎ. పట్టాపొందారు. అన్నింటికీ మించి ముష్పయి అయిదేళ్ళ వయసులో వివాహానంతరం మైసూర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో డైరెక్ట్‌గా చరిత్ర ప్రధానాంశంగా ఎమ్‌,ఎ. డిగ్రీ చేశారు.

దక్షిణ భారత హిందీ ప్రచారసభవారు నిర్వహించే పరీక్షలు రాసి విశారదగా ఉత్తీర్ణులయ్యారు. అలాగే డాక్టర్‌ అనంత శయనం అయ్యంగార్‌ అధ్యాపకత్వంలో సాగిన దక్షిణ భాషా ప్రచారం వారి సంస్వత భాషను అధ్యయనం చేసి సమర్థ విశారద - బి.ఎ. చేశారు. కేవలం పరీక్షల్లో ఉత్తీర్లులై డిగ్రీలు సంపాదించడమే కాక ఆయా భాషల్లో ప్రావీణ్యతను, సాధికారతను కలిగి వుండడం ఆమె భాషాభిమానానికి నిదర్శనం.

భాషా ప్రవీణ, వయోలిన్‌ విద్వాంసురాలైన తల్లి అంజమ్మగారి స్ఫూర్తితో తను కూడా కర్ణాటక గాత్ర సంగీతంలో డిప్లామా చేశారు. నేర్చుకున్న విద్యను గాలికి వదిలేయడం ఆమెకి తెలీదు. అందుకే నేర్చిన విద్యల సారం అచ్యుతవల్లి నవలల్లో సహజ కాంచులతో వ్రస్ఫుటిస్తూ వుంటుంది. ఆకాశవాణిలో లలిత సంగీతం పాడే అచ్యుతవల్లి 1960 - 62లలో బి-హ్హై ఆర్టిస్టు కూడా.

యుక్త వయస్సులోనే కలం పట్టిన రచయిత్రి తొలిరచనలు తిరిగి రాకుండా పత్రికల్లో అచ్చనడం విశేషం. 19 5 8-5 9లో రాసిన మొట్ట మొదటి వ్యాసం “ఇంటి

ఐ-వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా. కె.బి.లక్ష్మి - 195

శుభ్రత ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ప్రమదావనంలోను, ఆ సమయంలోనే రాసిన తొలికథ 'వంచిళి' ఎన్‌.ఆర్‌.చందూర్‌ గారి సంపాదకత్వంలో వెలువడే జగతి మాసపత్రికలో వెలువడింది. ఆ కథకి ఐదురూపాయలు పారితోషికం అందుకున్నప్పటి ఆనందం ఇప్పటికీ మర్చిపోలేను అంటారామె. ఈ సందర్భంగానే పత్రికలు కొని తెచ్చి ఇచ్చి, నువ్వు ఇంతకన్నా మంచి కథలు, నవలలు రాయగలవు అని ప్రోత్సహించిన మేనమామ లాయర్‌ ఎన్‌.వి.కె, రంగాచారిని తల్పుకున్నారు. పెళ్ళికాకముందు కెయస్‌. అచ్యుతవల్లి, కె.వియస్‌, అచ్యుతవల్లి అన్న పేర్లతో రాసేవారు. తొలికథ జగతిలో వచ్చినా భారతిలో వచ్చిన 'దీపకరాగం' కథ అచ్యుతవల్లికి కథకురాలిగా మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆమె అన్నట్లు రచయిత్రిగా జగతిలో కథ మంచి బోణి. దీపకరాగం అమె కలాన్ని కింద పెట్టనివ్వలేదు. భారతి సంపాదకవర్గంలో వున్న పిలకా గణపతిశాస్త్రిగారు “ఫలించని కలలు” అన్న తన కథా శీర్ణికను దీపకరాగంగొ మారుస్తున్నానని, కథ బావుందని ఉత్తరం రాయడంతో ఈ సారి ఎవరూ తన రచనకు పేరు మార్చనంత గొప్పగా రాయాలని పట్టుదల వచ్చిందన్న అచ్యుతవల్లి మాటలు అక్షరసత్యాలు. ఆ తర్వాత పుంఖానుపుంఖాలుగా వెలువడిన ఆమె సాహిత్యంలో శీర్షికా బౌదిత్యం, సౌందర్యం అంతలా పాఠకుల్ని ఆకట్టుకున్నాయి. చిన్ననాటినుంచీ సాహిత్యం పట్ల విపరీతమైన అభిరుచి వుండడం, అందుకు తగినట్లు అందివచ్చిన సాహిత్యాన్ని అత్యంత భద్ధాశక్తులతో చదవడం వల్ల రచనా ప్రకియలపట్ల ఒక చక్కని అవగాహన ఏర్పడింది. తెలుగేగాక హిందీ, అంగ్ల, సంస్కత భాషల్లో ఆమెకున్న ప్రావీణ్యం, సంగీతజ్ఞత, లోకజ్ఞత అచ్యుతవల్లి భావ సంఘర్షణకు దారులు వెతకసాగాయి. అటు స్త్రీ స్వేచ్చకు నీరాజనాలు పట్టే సంచలనాత్మక రచనలు చేసిన చలం, ఇటు ఇతర సమకాలీన రచయితల, రచయిత్రుల రచనలు బాగొ చదవడం, అధ్యయనం చేయడంవల్ల తన ఆలోచనలను తనదైన ప్రత్యేక దృష్టికోణంతో, కంఠ స్వరంతో వెలువరించాలన్న ఉద్దేశ్యంతో కలం పట్టారు. తను నమ్మిన సిద్ధాంతాల్ని రాద్దాంతాల్ని, కుటుంబంలోను, సమాజంలోను ఘర్షణతో కూడిన స్త్రీ పురుష సంబంధాల తీరు తెన్నులను, వ్యవస్థలోని అవ్యవస్థను నిర్భీతితో పాఠకుల ముందుంచి ప్రగతిశీల దృక్పథంతో ప్రయోజనకరమైన ఉత్తమ రచనల సృష్టికి నాలుగున్నర దశాబ్దాల క్రితమే శ్రీకారం చుట్టి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. వవియస్‌, అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా. కె.బి.లక్ష్మి - 196

1961-62లో రాసిన మొట్టమొదటి నవల 'పుట్టిల్లు'లోని అన్నపూర్ణ పాత్రకి ఆ తర్వాత నవలల్లో ఆమె సృష్టించిన విష్ణవాభ్యుదయ భావాలి స్త్రీ పాత్రలకి ప్రగతిశీలత్వంలో ఎంతో తేడా ఉంది. మానవసంబంధాలు ప్రాతిపదికగా అభ్యుదయ విప్లవభావాలను పరిప్లవించే ఆమె పాత్రలు ఎన్నడూ నేల విడిచి సాము చేయలేదు. తన సమకాలీన రచయితలలో ముందంజలో వున్న అచ్యుతవల్లి రచనలు ఆకర్షణీయంగా పరమ పఠనీయంగా వుంటాయి. అందుకు కారణం ఆమె పరిశీలన, భాప్వు కథాకధన శైలితోబాటు సహజత్వం చెడని నిర్భీతివాదం. వందలాది కథలు, వ్యాసాలు, స్కెచ్‌లు రాసినా నవలా ప్రక్రియపట్లే ఆమెకు మక్కువ ఎక్కువ. ఏ విషయమైనా చెప్పదలచిన వాదమైనా విస్త్రతంగా చెప్పగలిగే పెద్ద కాన్వాస్‌ నవలకే వుందని ఆమె భావిస్తారు. ఇందుకామె ప్రతి నవలా ఒక ఉదాహరణే అవుతుంది. పల్లెలో పుట్టి, పట్టణంలో చదువుకుని, భర్త ఉద్యోగరీత్యా ఆంధ్రా, కర్ణాటక, తదితర ప్రాంతాలు తిరిగి, చివరికి పశ్చిమగోదావరి జిల్లా పెంటపొడులో స్థిరపడి, సొంత వ్యవసాయం చేస్తూ, చేయిస్తూ రచనల్లో అభ్యుదయం పండించడం ఆమెకే చెల్లింది. అదెలా సాధ్యమని అడిగినపుడు “వ్యక్తి తనకి లేనిదాని గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. పల్గెటూర్లో వున్నా బైటి ప్రపంచం గురించిన అవగాహన 'పెంపొందించుకోవాలన్న తపన వుంటుంది. చుట్టూ సమస్యలతో వున్నవాళ్ళే ఎక్కువగా అభ్యుదయం గురించి ఆలోచిస్తారు. బంధనాలున్నప్పుడే తెంచుకోవాలన్న భావన కలుగుతుంది. పల్లెల్లో పట్టణాల్లో, నాచుట్టూ వున్న మధ్యతరగతి అంతరంగాల పరిశీలనల్లో నేను గుర్తెరిగిన సంగతుల్ని నా రచనలద్వారా నా పాఠకులకి అందించే ప్రయత్నం చేశాను. డిగ్రీలు సంపాదించినా ఉద్యోగం పట్ల ఆసక్తి వుండేది కాదు. వివాహ వ్యవస్థ, స్త్రీ పురుష సంబంధాలు, కుటుంబ జీవితం, మనిషి ప్రవర్తనకు, ప్రేరణలకు వెనక తొంగిచూసీ నిగూఢ పరిణామాలు, మగవాళ్ళ నమ్మకద్రోహం గురించి, చంచల స్వభావాలగురించి, విచిత్ర విధిరాతల వల్ల సంభవించే విషాదకర పరిణామాల గురించి రాయాలని, చెప్పాలని వుండేది. అందుకే రచన నా నిత్యజీవితంలో ఒక భాగమయిపోయింది”అని వివరించారు. (వీడియో క్యాసెట్‌ - అచ్యుతవల్లి ఉత్తమ రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు పొందిన ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా, కె.బి.లక్ష్మి - 19/

సందర్భంగా దూరదర్శన్‌ ఇంటర్యూ - మార్చి 2000, కె.బి.లక్ష్మి

సంప్రదాయ పట్టింపులు, ఛాందస భావాలు గల అగ్రవర్ణ కుటుంబంలోని వ్యక్తి అయినా చిన్ననాటి అనుభవాలు ఆమెను నిమ్నవర్గాల పట్ల పక్షపాతం చూపేలొ చేశాయి. పాలేరు పిల్లల్ని ముట్టుకోవద్దని, వాళ్ళతో కలిసి మెలసి వుండద్దని, ఆటలాడద్దని పెద్దవాళ్ళు నిషేధించడం వల్ల చేస్తే ఏం? అన్న ఆలోచన పొడచూసింది. పెరట్లో దూరంగా కూర్చుని అన్నం తింటున్న పాలేరు కూతురు పక్కనే తనూ కూర్చుని అన్నం తినాలని ఆశగా వుండేది. పెద్దల ఆంక్షలు ఆ ఆశలు నెరవేరనివ్వలేదు. పెద్దయి, రచయిత్రిగా ఆ రెండు వర్గాల మధ్య అభేదం చూపుతూ రచనలు చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు. తాను అనుకున్నది తన పాత్రల ద్వారా సొధించానన్న తృప్తి పొందారు.

-ఇదెక్కడిన్యాయం?! నవల బహుళ ప్రజాదరణ పొందింది. ఈ నవల తమిళం, కన్నడం, హిందీలోకి వరసగా 'పెణన్‌ జన్మం' 'ఇదుయవన్యాయి, 'ఏక్యొ ఇన్నాఫ్‌' అన్న పేర్లతో అనువదితమయ్యాయి. నాలుగు భాషల్లో సినిమాగా వచ్చింది. 197 7లోనే ఉత్తమ చలనచిత్రకథగా రాష్ట్రప్రభుత్వ బహుమతినందుకుంది. ఇదే నవలకు సినీ హెరాల్డ్‌వారి పోటీలో ఉత్తమ కథ బహుమతి, తమిళ అనునాదం 'పెణన్‌ జన్మం' కు మద్రాసు లయన్స్‌క్లబ్‌వారిచే ఉత్తమ రచనా బహుమతి లభించాయి. పరిశీలనాదృష్టి పరిపక్వ భావాలు, అభ్యుదయ అలోచనలు, సామాజిక న్యాయం పట్ల రచయిత్రికున్న నిబద్ధతకు ఈ నవల గీటురాయిగా నిలిచింది.

పశ్చిమగోదారిజిల్లా పెంటపాడు గ్రామంలో ప్రశాంత వాతావరణంలో నివసిస్తూ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్న అచ్యుతవల్లి నవలలు మాత్రం పఠితల హృదయాల్లో ఆలోచనల కల్లోలాలు సృష్టిస్తాయి.

బాల్యంలో తను కళ్ళారా చూసిన వర్గభేదం, వయసు పెరుగుతున్న కొద్దీ అర్థమవుతూ వచ్చిన సామాజిక ధోరణులు ఆమె రచనలకు చిక్కనయిన, చక్కనయిన విషయాలయ్యాయి.

అచ్యుతవల్లి కలంపట్టేనాటికి తెలుగునాట సమాజమూ, సాహిత్యమూ అనేక ఇజాల తాకీడికి ఊగిపోయాయి. కానీ స్త్రీ పరంగా ఆడది వంటింటి గుమ్మందాటి వీధిలో అడుగుపెట్టడం గొప్ప పరిణామం, కట్టుబాట్ల పరదాలు చీల్చుకుంటూ,

ఐ-వి.యస్‌,. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, కె.బి.లక్ష్మి - 196

ఆంక్షల ఇనుపతెరలు ఛేదించుకుంటూ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే, నిరూపించుకునే స్త్రీ పాత్రలను అనాడే అచ్యుతవల్లి సృష్టించారు. స్త్రీకి మనో వికాసం, అవగాహన ముఖ్యమని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవాలన్న ధోరణి ఆమె రచనలన్నింటా కనిపిస్తుంది. అచ్యుతవల్లిని సాహితీరంగంవైపు ఆకర్షితురాలిని చేసిన పరిస్థితుల్ని గమనిస్తే ఆమె తాతగారు లాయరు. వేదాంతపరంగా బాగా చదువుకున్నారు. ఆంగ్లంలో పుస్తకాలు రాసేవారు. ఇంట్లో అందరికీ సంగీత, సాహిత్యాల్లో ఆసక్తి వుండేవి. ఆడపిల్లల్ని చదివించడానికి ఎలాంటి అభ్యంతరాలు వుండేవి కావు. అటువంటి స్వేచ్చాయుత వాతావరణంలో రచయిత్రి ఆలోచనలు వ్యక్తిత్వ పరిశీలన ముఖ్యాంశంగా సొగి, సంస్కరణ ప్రియత్వం, సంప్రదాయ విలువల నేపధ్యంలో విప్లవాభ్యుదయ భావాలతో నిండి నిజాయిత్కీ నిబద్ధతతో కూడిన సామాజిక స్పృహతో పురులు విప్పాయి. తన చుట్టూ వున్న జీవితాన్ని పట్టించుకునే వారే ఆధునిక రచయిత. సమాజంలో వాదాలు, ఉద్యమాలు ఎన్నయినా లేవచ్చు. కానీ కుటుంబంలో స్నేహ సంబంధాలు, మానవతా విలువలు లేకపోతే మనుగడ దుర్భరం అని నమ్మి, నమ్మిన తన భావాలను స్పష్టంగా చెప్పిన రచయిత్రి అచ్యుతవల్లి. కథారచయిత్రి : కథా రచయిత్రిగా కూడా అచ్యుతవల్లి లబ్ధ ప్రతిష్టురాలు. నాలుగుదశాబ్దాల్లో నాలుగు వందల కథలు రాశారు. ఆమె కథలు 'మూగవోయిన ప్రకృతి 'అవ్యక్తాలు మనస్తత్వాలు”, 'బాత్‌ ఏక్‌ రాత్‌కి', 'అచ్యుతవల్లి కథలు”, 'నాగావళి నవ్వింది. సంపుటాలుగా ఓ డజను పైగా వెలువడ్డాయి. అచ్యుతవల్లి అనగానే ఆమె కథల్లో “సన్నాటా', “ముత్యాల చెరువు”, “వర్షం వచ్చిన రోజు అన్న మూడు కథలు వెంటనే స్ఫురిస్తాయి. “వర్షం వచ్చిన రోజు హిందీ తదితర ఐదు భాషల్లోకి 1959 - 60 లలోనే అనువదింపబడింది. “సన్నాటాలో పావురాయి గూళ్ళవంటి పాతకట్టడం దగ్గరికి ఒకనాడు ఒక కారు వచ్చి ఆగింది. ఆ గూళ్ళలో వున్న పొవురాళ్ళవి మానవ రూపాలే. వాళ్ళలో ఆ కారును చూడగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం కలుగుతుంది. డాక్టరు వచ్చాడేమో అనుకుంటుంది రోగిప్టి సూరమ్మ. తనను తారను చెయ్యడానికి సినిమావాళ్ళు వచ్చారేమో ఐ.విఆయస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ఫో డా, కెబి.లక్ష్మి - 199

అనుకుంటుంది అరవై ఏళ్ళ ముసలివాడి మూడో పెళ్ళాం మాలిని. దాంట్లో పెళ్ళివారు దిగారేమో అనుకుంటుంది పాతికేళ్ళ'కన్య సుబ్బులు. తీరా చూడబోతే దిగినవాడు ఆ ఇంటి యజమాని. ఆ పాతకట్టడాన్ని లాడ్డింగ్‌గా మార్చాలని అతని ప్లాను - ఇదీ కథ.

“వర్షం వచ్చిన రోజులో చెట్టుకింద మొక్కజొన్న కండెలు అమ్ముకునే దంపతుల మనస్థితి, 'ముత్యాల చెరువు'లో అగ్రవర్ణ కామందు కూతురు, వాళ్ళింట్లో పనిచేసే పాలేరు కూతురు మధ్య స్నేహం, అగ్రవర్ణ నిమ్నువర్గాల మధ్య అభేదం చిత్రితమయ్యాయి. కాలమిప్స్‌ :

సమాజానికి మేలు చేయాలని తన చూటలు, భావాలు, అనుభవాలు, అనుభూతుల్ని అందరికీ పంచాలన్న అచ్యుతవల్లి ఆకాంక్షకు తగినట్లు ఆమె కాలమ్స్‌ నిర్వహించి కాలమిస్ట్‌ గా మంచి పేరు తెచ్చుకున్నారు. హిందీ భాషాభిమానంతో శీర్షికలు హిందీలో పెట్టడం అచ్యుతవల్లిగారికి ఇష్టం. జయశ్రీ మాసపత్రికలో 'ఆజ్‌ బెర్‌ కలౌ, రచన మాసపత్రికలో 'బాతోంమే ఖూనీ అచ్యుతవల్లి నిర్వహించిన శీర్దికలు. ఇతరడ్రా అనేక వ్యాసాలు పత్రికల్లో అచ్చయ్యాయి. రేడియోలో ప్రసారమయ్యాయి. ఇప్పటికీ రేడియోకి కథలు, ప్రసంగాలు, నాటికలు రాస్తూ వుంటారు. వ్యక్తిగతం :

1964 జూన్‌ 4వ తేదీన తన 21వ ఏట అచ్యుతవల్లి వివాహం జరిగింది. వివాహం ఆమె రచనా వ్యాసంగానికి ఏ మాత్రం ఆటంకం కాలేదు. సెంట్రల్‌ ఎక్సయిజ్‌ శాఖలో ఆఫీసర్‌గా పదవీవిరమణ చేసి, పెంటపాడులో సొంత వ్యవసాయం పనులతో నిరంతరం అవిశ్రాంతంగా వుండే అచ్యుతవల్లి భర్త రాఘవాదారిగారు ఆమె సొ హితీ కృషిని ప్రోత్సాహించడం విశేషం. భార్యా భర్తలిద్దరూ కలసి “ఆడుతు పొడుతు పనిచేస్తుంటే అలుపూ సౌలుపేమున్నది" అన్నట్లు పొలంపనులు చూసుకోవడం అత్యంత ఆదర్శప్రాయం.

భర్త ఉద్యోగరీత్యా గతంలో ఎక్కువగా ఊళ్ళు తిరిగారు. ఆయన రిటైరయ్యాకా పెంటపాడులో స్థిరపడి వ్యవసాయం చూసుకుంటూ “రోజంతా పనులు సరిపోతాయి. రాత్రిళ్ళు ఎక్కువగా చదువుతాను. తెల్లవారుజామున లేచి రాసుకుంటూ

వఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫॥ దా, కె.బి.లక్ష్మి - 200

వుంటాను". అని ఎంతో నిరాడంబరంగా చెప్పే అచ్యుతవల్లి తమ ఇంటికి 'ఎవర్‌గ్రీనొ అని పేరు పెట్టుకున్నారు. అందుకు తగినట్టు అటు వ్యవసాయం, ఇటు సాహితీ వ్యవసాయం రెండూ సస్యశ్యామలంగా సాగడం ఎంతో బెచిత్యభరితంగావుంది. చరిత్రంటే మిక్కిలి మక్కువ గల అచ్యుతవల్లికి హొయిసల, కుంతల సంస్టానాలకు సంబంధించి ఒక గొప్ప చరిత్రాత్మక నవల రాయాలన్న అభిలాష వుంది. అది బహుశా ఆమె జీవితాశయం కూడా. అలాగే వరకట్న సమస్య మీద రచన చేయడం ఆమె భవిష్య ప్రణాళికలో వుంది. పేదా గొప్పా తారతమ్యాలు లేకుండా సామాజిక న్యాయం అందరికీ ఒకలాగే వుండాలంటారు అచ్యుతవల్లి. అందుకే సాహిత్యాన్ని వివిధ వాదాల్లోకి విడదీయడాన్ని ఆమె ఇష్టపడరు. నేటి రచనల్లోకైమ్‌ అతిగా వుంటోందని, జీవితాల్లోని వేదనను పైపైన రాస్తున్నారని. ఇప్పుడేవీ అంతంగా హృదయానికి వట్టడం లేదంటారామె. జీవన విధానంలో చోటు చేసుకుంటున్న వేగం మానవ సంబంధాలను కాసిస్తోందని, మనసుల మధ్య దూరాన్ని, కృత్రిమత్వాన్ని పెంచుతోందని ఆమె అభిప్రాయవద్డారు. సాధా సీదాగా, నిరాడంబరంగా జీవిస్తూ, తనదైన రీతిలో సమాజాన్ని విశ్లేషిస్తూ, వస్తువైవిధ్యంతో, బాధ్యతతో, నిబద్ధతతో రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు అచ్యుతవల్లి. సమాజం మీద రచన ప్రభావం వుందని అచ్యుతవల్లి (ప్రగాఢంగా నమ్ముతారు. పరిణత ఆలోచనలు, భావ పరిణామం ఆమె రచనల్లో స్పష్టంగా కనబడుతుంది. రచనల్లో, వ్యక్తిగత జీవితంలో తన అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయడం ఆమె ప్రత్యేకత. అచ్యుతవల్లి ఎంత మృదుభాషిణో! అంత అభ్యుదయ వ్యక్తిత్వం గలవారు. స్త్రీకి వ్యక్తిత్వంవుంది. అమె వ్యక్తిత్వాన్ని సమాజం గుర్తించాలి. సంప్రదాయం మీద, సంఘంమీద, వ్యక్తులమీద, తన వ్యక్తిత్వాన్ని ఖూనీ చేసే ప్రతి వస్తువు మీదా స్త్రీ ిరగబడాలి. వ్యక్తిత్వ వికాసాన్ని పెంపాొందించుకోవాలి అన్న ధోరణిలో రచనలు చేసిన అభ్యుదయ రచయిత్రిగా అ(్రశ్రేణి రచయితల వరసలో ప్రథృమపంక్షిలో వున్న నిశితలేఖిని ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి. ఈాటా్న్భ్యా చా లా మ. మ రం. 32ట్టి ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా, ఇబలక్షీ. ర్హిం. ల. + ట్ల ణు

అవార్డులు, పురస్కారాలు ;

ప్రతిష్టాత్మకమైన అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు

అచ్యుతవల్లి. 197 0లో మద్రాసు కేసరి కుటీరంవారి గృహలక్ష్మీకంకణం.

19 7 7లో ఉత్తమ కథారచయిత్రిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు.

199 4లో తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి వురస్కారం.

1995లో సుశీలా నారాయణరెడ్డి అవార్డు.

200 సంవత్సరంలో ఉత్తమ రచయిత్రిగా పొట్టి శ్రీరాములు తెలుగు

విశ్వవిద్యాలయం పురస్కారం.

2000 సంవత్సరంలోనే యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ

పురస్కారం అందుకున్నారు.

వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలోను, వివిధ సంస్థల ద్వారాను ఆమె

ఎన్నో బహుమతులు, సన్మానాలు అందుకున్నారు. వాటిల్లో ప్రధానంగా ఆంధ్రజ్యోతి సినిమా నవలల పోటీలో రచయిత్రి 'తీరం చేరిన కెరటం' నవలకి వచ్చిన బహుమతి, శ్రీకాకుళం స్త్రీ సమాజం పురస్కారం చెప్పుకోదగినవి.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి మలేషియా వెళ్ళారు. 19 65లో అభిలభారత రచయిత్రుల సమావేశంలో పాల్గొన్నారు. సాహిత్య అకాడమీ నిర్వహించిన ఆ సమావేశంలో విజయలక్ష్మీ పండిట్‌ చేత చందనమాల, శాలువతో సత్కారం జరిగింది.

ఖమ్మం అరసం సభల్లోను, సాహిత్య ఎకాడమీ ఆహ్వానంపై వరంగల్‌? తిరుపతిల్లో జరిగిన సాహితి సమావేశాల్లో వక్తగా పాల్గొని ప్రసంగించడం అచ్యుతవల్లి సాహితీమూర్తిత్వానికి వన్నె తెచ్చే ఘట్టాలు.

19 62లో ఆకాశవాణీ ఉద్యోగి అయిన కథా రచయిత బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం 'షణ్ముఖప్రియి గొలుసు నవల రాయడం, అశేషశ్రోతల అభిమానాన్ని చూరగొనడం ఒక మలుపు. పి.సరళాదేవి, యద్దనపూడి సులోచనారాణ్‌, కోడూరి కౌసల్యదేవి, శ్రీమతి వాచస్పతి, ముప్పాళ రంగనాయకమ్మలతో కలిసి ఐ.వి.యస్‌, అచ్యుతవల్లి ఆ గొలుసు కథ రాశారు. షణ్ముఖప్రియ రాగ అవగాహన ఆ నవలా రచనలోని ఆరోహణ, అవరోహణ

ఐవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫% డా. కె.బి.లక్ష్మి - 202

(ప్రారంభం - ముగింపు) అకు రచయిత్రికి దోహదవడిందన్న విషయం ఆ రచన అంతీలా శ్రోతల, ఆ తర్వాత పుస్తకంగా వెలువడి పాఠకుల హృదయాలకు హత్తుకోవడమే తార్కాణం.

ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి = 203

ఇ,వి.యస్‌ి. ఆచ్యుతవల్లి నవలల పట్టిక

  1. పుట్టిల్లు - 1961 - 62 (అట్ట ముందు, వెనుక పేజీలు లేవు. ప్రచురణ సంవత్సరం వేటపాలెం సారస్వతనికేతనం వారి రిజిష్టర్‌ ఆధారంగా)

  2. ప్రేమించని మనసులు - 1963 భారతిలో ప్రచురితం

  3. ఎగిరే పిట్టలు - 1964 (ముందు వెనుక అట్టలు లేని కారణంగా పబ్లిషర్స్‌ వివరాలు తెలీవు. ప్రచురణ సంవత్సరం రచయిత్రి చెప్పారు.)

  4. మూడు ముళ్ళు - 1967 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో సీరియల్‌ గా వెలువడింది. 1968 జూన్‌ నవజ్యోతి పబ్లికేషన్స్‌, విజయవాడ వారు నవలగా (ప్రచురించారు.

  5. కొడిగట్టిన దీపాలు - 1970, ఫిబ్రవరి ఎమెస్కో ప్రచురణ - సికిందరాబాద్‌

  6. కోరిక -1975, అక్టోబర్‌ క్వాలిటీ పబ్లిషర్స్‌ - విజయవాడ

  7. తాకట్టు 1975-1976 విజయ మాసపత్రికలో సీరియల్‌

శ. కానుక-19 76, జవవరి క్వాలిటీ పబ్లిషర్స్‌ - విజయవాడ.

$. ఇదెక్కడి న్యాయం -1977 ఆంధ్రప్రభలో సీరియల్స్‌ క్వాలిటీ పబ్లిషర్స్‌ ప్రచురణ - 19 8 0, విజయవాడ.

  1. సీతకలలు - 1978 ధారావాహిక ఆంధ్రజ్యోతి దినపత్రిక, క్వాలిటీ పబ్లిషర్స్‌, విజయవాడ.

  2. ఒడ్డుకు చేరిన ఒంటరి కెరటం- 1979 క్వాలిటీ పబ్లిషర్స్‌,

ఐంవి.యస్‌. అచ్యుతనల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 204

  1. తీరం చేరిన కెరటం - 1979 అంధ్రజ్యోతి సినిమూ నవలలు"పోటీల్లో గెలుపొందినది. క్వాలిటీ పబ్లిషర్స్‌, విజయవాడ
  2. పూలూ - ముళ్ళు 1979 ధారావాహిక జ్యోతి మాసపత్రిక క్వాలిటీ పబ్లిషర్స్‌, విజయవాడ
  3. పేిమగండం 1981 ఎమెస్కో ప్రచురణ - సికిందరాబాద్‌
  4. నేను దేవిని కాను - 1982 జ్యోతి మాసపత్రిక
  5. ఇది మల్లెలవేళ - 1984 కీర్తి పబ్లికేషన్స్‌, విజయవాడ
  6. భమరగీతం - 1987-88 (1987 ఏప్రిల్‌ నుండి 1988 ఏప్రిల్‌ దాకా జగతి మాసపత్రికలో ధారావాహికంగా వెలువడింది)
  7. ఏకాంత - అముద్రిత నవల రచనాకాలం, 1989-90 ఐ.వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 205

ఉపయుక్త (గగ్రంథసూచి

తెలుగు

  1. ఆంధ్ర నవలా పరిణామము - గాయత్రీ ప్రచురణ - హైదరాబాద్‌ ఎ శీఢ బి.వి. కుటుంబరావు, 1971,

  2. ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు - ప్రయోగములు - డొ సి నారాయణరెడ్డి = 1967.

  3. ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్య ప్రవంతి - వేదిక సాహితీ సొంస్కృతిక సంస్థ ప్రచురణ - హైదరాబాద్‌ - 20, వై. రామకృష్ణారావు, 1987-

  4. కథా చరిల్ర - సుధర్మ పబ్లికేషన్స్‌ = సారాయణగూడా - హ్ఞదరాబాద్‌, యశోదారెడ్డి. పి.

  5. కథానికా రచనా విధాన్‌ - హిందీ ప్రచారక పుస్తకాలయ్‌ - వారణాసి, జగన్నాథ్‌ ప్రసాద్‌ శర్మ 1961.

  6. కథలెలా రాస్తారు? - వసుబుక్‌ లింక్స్‌ - మద్రాసు - శార్వరి (సంపాదకుడు, 1975,

  7. కథ వ్రాయడం ఎలా? - యశోధర ప్రచురణాలయం - 19 55, వరంగల్‌ = కృష్ణమూర్తి శొంఠి.

  8. కథానిక - స్వరూప స్వభావాలు - సిద్దాంత గ్రంథం - శివాజీ ఫెస్‌, 4-4-53 గంజ్‌ బజార్‌, సికిందరాబాదు - 560 603. దక్షిణామూర్తి పోరంకి.

  9. గృహలక్ష్మి స్వర్ణకంకణ (గ్రహీతలు - కేసరి కుటీరం _ మట్రాను - కేసరి కె.యన్‌.

  10. చివరకు మిగిలేది - ఎమెస్కో ప్రచురణ - సికిందరాబాద్‌ - బుచ్చిబాబు

ఓ1. తెలుగు నవల - అధునిక స్త్రీ - సిద్దాంత వ్యాసం - 1993 - రంగాచారి. యం- వ్రాత ప్రతి.

  1. తెలుగు నవలల్లో కుటుంబం జీవన చిత్రణము - నవజ్యోతి పబ్సిషర్స్‌, ఏలూరు రోడ్డు, విజయవాడ - ఆనందరామం సీ. 1979

ఐంవి.యస్‌. అచ్యుతవల్లి నవళాసాహిత్యం 2% డా. కె.బి.లక్ష్మి - 206

  1. తెలుగు నవలా వికాసం - అప్పలస్వామి పురిపండ.

  2. తెలుగు నవలా వికాసం - నాట్య కళాఫ్రెస్‌ - 1967 - నాగభూషణశర్మ మొదలి.

1 5. తెలుగు నవలానుశీలనం - శాంతా ఆర్ట్‌ ప్రింటర్స్‌, ప్టైదరాబాద్‌ - 1990

  • సుజాతా రెడ్డి. ఎమ్‌.
  1. తెలుగు నవల - నూరు సంవత్సరములు - ఆం.ప్ర. సాహిత్య ఆకాడమీ ప్రచురణ - 1973, హైదరాబాద్‌.

  2. తెలుగు నవలల్లో సామాజిక స్పృహ - విశాలాంధ్ర పబ్లికేషన్స్‌ - సంజీవమ్మంపి.

  3. తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ - కిరణ్‌ కిశోర్‌ పబ్లికేషన్స్‌ - 1979 _ బొబ్బిలి - శ్రీరామమూర్తి.

  4. తెలుగు నవల - మనో విశ్లేషణ - విద్యేశ్వరి డి. 1930.

  5. తెలుగు నవలా సాహిత్య వికాసము - వై.యన్‌.డ్రైస్‌- వెంకటేశ్వర్లు పుల్లాభొట్ట్ల ౨ 1974.

  6. తేలుగు నవల - సాహిత్య అకాడమీ ప్రచురణ - 1975 - దక్షిణామూర్తి పోరంకి.

  7. తెలుగు వచన రచనా పరిచయం - 5,ళ విభాగాలు - కాత్యాయనీ విద్మహే

  8. తెలుగువిజ్ఞాన సరస్వము - 3, 4, 6 భాగములు 1961

  9. తెలుగు సాహిత్యంపై ఇంగ్రీషు ప్రభావం - వీరభద్రరావు కొత్తపల్లి.

  10. నవల - మహిళ - సమాలోచనం - లలిత. జి.

  11. నవలా రచయితగా గోపిచంద్‌ - జయమిద్ర పబ్లికేషన్స్‌ - బాగ్‌లింగంపల్లి = హైదరాబాద్‌ - 44 - 1988 - వేణుగోపాల్‌ అమ్మంగి.

  12. నవలా శీల్పం - విశాలాంధ్ర పబ్లిషర్స్‌ - హైదరాబాద్‌ - వెంకట సుబ్బయ్య వల్లంపాటి.

  13. నవ్యసాహిత్యలహరి - 1987 - యువభారతి ప్రచురణ.

ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 207

  1. పరిశీలన - (వ్యాస సంకలనం) _ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రచురణ - ఆగష్ట్‌ 1971 - డా. కృష్ణకువూరి నాయని.

  2. పరిశీలన - విమర్శ వ్యాస సంపుటి - 1983 _ రంగాచార్య దాశరధి.

  3. భారతీయ సంస్కృతిలో స్త్రీ. లోకాయత ప్రచురణలు - 1993 - పద్మారావు కత్తి.

  4. మన నవల - పరిశీలన - స్వరూపం - పరిణామం - చైతన్య సాహితి ప్రచురణ - 1979

  5. మహతి - యువభారతి ప్రచురణ - 1972- ఆంధ్ర సారస్వత పరిషత్‌ బిల్జింగ్స్‌ - బొగ్గులకుంట - హైదరాబాద్‌.

  6. రచన - విలువలు - బాధ్యతలు - దృక్పధాలు - యువభారతి ప్రచురణ - క్క జూలై. 19705, కింగ్స్‌ వే సింకిందరాబాద్‌.

  7. వివేక చంద్రికా విమర్శనం 1897 _ పీఠిక,

3ళ. వేయి పడగలు - విశ్లేషణాత్మక విమర్శ - డా. గంగప్ప. ఎస్‌.

  1. సమాజము - సాహిత్యము - చిత్తూరు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం - చిత్తురు - 1972 _ సుదర్శనం . ఆర్‌.ఎస్‌.

38ి. సాంఘిక నవల - కథాశిల్పం - తెలుగు పరిశోధనా ప్రచురణలు - 1988 = మృణాళిని. సి.

  1. సారస్వత వివేచన - విశాలాంధ్ర ప్రచురణ - రామచంద్రా రెడ్డి రాచమల్లు

  2. సారస్వత వ్యాసములు - సాహిత్య ఎకాడమీ ప్రచురణ - 1979 - నరసింహశాస్త్రి నోరి.

  3. సాహిత్యదర్శనం - క్వాలిటీ పబ్లిషర్స్‌ - విజయవాడ - నరసింహం - కె.వి.ఆర్‌.

  4. సాహిత్యంలో దృక్పథాలు - సాహిత్య విమర్శ - నవోదయ పబ్లిషర్స్‌ - ఏలూరు రోడ్డు విజయవాడ - 2 సుదర్శనం ఆర్‌.ఎస్‌,

ఐ-వియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కె.బి.లక్ష్మి - 208

  1. సాహిత్య ప్రయోజనం - (వ్యాసావళి, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్స్‌ 19 69
  • విజయవాడ - కుటుంబరావు కొడవటిగంటి.
  1. సాహిత్య శిల్ప సమీక్ష - బాలాజీ పబ్లిషర్స్‌ - 19 81- లక్ష్మీకాంతం, పింగళి.

  2. స్వాతంత్ర్యానంతర తెలుగు నవల - క్వాలిటీ వబ్లిషర్స్‌ - డా. రాజేశ్వరి తుర్తపాటి, శం91,

4 6, స్వాతం(్రానంతరయుగంలో తెలుగు నవల - చైతన్య '్రవంతి - భారతి - జూలై - 1977 _ శ్రీరామమూర్తి - కోడూరి.

సాటాత్య సంచికలు :

  1. అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనం - ప్రత్యేక సంచిక - 1994, నవ్య సాహితి సమితి.

  2. అభ్యుదయ - ఈ దశాబ్ది నవల విశేషి సంచిక -_ హైదరాబాద్‌, జనవరి

౩ _ ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచిక - విశ్వావసు (1964-65)

శీ. ఇండియా టుడే - తెలుగు - వార్షిక సంచిక - 1994.

  1. తెలుగు నవల - ఆంధ్రప్రదేశ్‌ ఉగాది ప్రత్యేక సంచిక 1994

  2. తెలుగు వాణి - ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక - 1975.

  3. రంజని రజతోత్సవ సంచిక - 2000 - హైదరాబాద్‌

  4. సుజాత - ఆంధ్ర సారస్వత పరిషత్తు - సప్తమ మహాసభ - ఆలంపురం - ఆసంవుటి 2 సంచిక - 1, 1982.

ఇవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫8 డా. కె.బి.లక్ష్మి - 209

322006[2490౪7 ౦౯ 80018 [౫ [౫౮1౬1511

  1. శీగ15[0%/ ౮౪ 6౧01150 61920166 0౧) క4గ1691 71063 10 1916 - 6౧౦౧౫౦౧ గంకంగ

  2. & గం2606౧0 6౮41646 10 8941 (౪/6౧౪160 ౧౧౧౧/ 6001190 [0౪618 - ౯/666గ0| ౧. గగ 206 112౧10 గ|808 62066

  3. 4౧ 1౧౯0060100 10 16 546౪ 0618 - గజ[/2౧]| ౧4011506గ - 1973 = 46001204 - 41118౧ గం[౧౧/ గంరం0గ. త. 01160006 2౧64 5006160/ - 61650౧.

  4. 012% 0116 510% 510 - 560గగ౧6౯ ౧౦౧౭౧.

  5. 0161004౧/ 0 ౬116:2౧/ 73గా౧౩ - 4గ5 /0గ0 7... “503205 10 0గ%6645% & ౦00౧౫౧౩౧౪6 00640 - 4121 ౧06012 ౮౧౧/౭191/ ౧౪53 - 1977, ౪544౧2604౧ క 8,. గగ. 5. 36016 0126166 56016౧6౧1- 840 1*15100/ 0 50౧2021 - శి [10౪61

  6. గ2గ1206 2౧6 1101213 - 82063౧ 80016 1౧0. 271, [261540 తం ఆ౧౮6, అణ ₹0గ6 16 - 12౪. 1963 - గ69561 26111206.

  7. 11౧0066400 ౬9010199 0% దిక్ర/౦[10 - 4గ౧4/515 - ౦౧౧౭౧19౯- 3, 519౧606 ౯౪౪౮.

  8. [౦౪6 2౧6 నిం౦గ16 - గం1౧౧ ౯౦౬

  9. '౧౧౧౦1౧|ల 0 11614౧ ౦౧౦౦15౧౫ - [0౧60౧ - 1960 - ౧౦౪1 ఓ6606 206 గ6్ర60 ది॥4॥1 - ౧౦౧4౧69. 1.4.

  10. 564౧ 0 00౧5010450655 1౧ 16 [106611 [110౪61 - 82861 ఆ|| ౪76౧61 0 04110౧0014 ౧౪55 1965 - ౧14000౧66౪ గొం౨6గ.

  11. 1604064 ౦0౪6! - ఉ ౪8 రి%27:20| ౧౦||0౦260౧, గ/౮6౧202ర6. వఐపి.యస్‌. అచ్యుతవల్లి నవలాసొహిత్యం ౫ డా, కెబి.లక్ష్మి- 210

  12. 7౧6 0/4% 0౧009 ౧10౪6! - ౬0౧౮౦౧, ౪1010౧/ ఆ౦|18౧02 16. ౪/11501, 0011౧.

  13. 1౧6 ౯5౧0150 ౦౪6! - గం౧౮౮|౧౧ 8005, 1964 - గ|9౧ 21190 1/7. 7౧6 6౧౮1130 ౦౪6! - ౮.8. ౧౧౪౩.

  14. 706 గ౭౧౧|౫/ - సీం. ౮144 |! 800% 00., [౧౦. 4 0 2౧౮ ఓ0౧600౧ 1931 - 5900౧ ౧6౮6౧ ౬644౧0.

  15. 7౧614406 0౯106 10౪6! - 655205 0౧ 16 ఇగ 0+గ014100 - ౧16౪౦౫ = ౪1౧12096 800165 - 1956 - ౮4౧౧౪౩, [6౧౧౧

  16. ౧6 0౪6! - ఓంగ౧౮౦గ న౧4౨|15౧6౧ - ౬24061) 0౧64

  17. 706 77/6౧060 06౧10/ 10౪6! 546189 1౧ 600౧1046 64 *0గ - &ీ00]16510౧0 1960 - 586201, ౨౮౦56౧౧ ౪/2౧౮6౧.

  18. 0౪/2063 & 0౦౧౦6౧1 01 ౪౧6 1౧612౧ ౧10౪6! - 4 0690440 ౦౦౧9[౧4౦ఓ -

  19. ౧. 31౧01.

  20. “౫౭౧4611 069౧2౧/ 0గ(౦౫౩1౧ 6 ౧౧౭౦! 54160160౧5” (౫/4౧ ౧జి 1651 0010 164 ౪౦౧౦ ౯౧96 ౧/835 - 174 (60) - ౧2౧6౫ ౪/14.

  21. */0గ6 ౮౧౫6౧1౪ 6[10/010026612 ౪0౦! 1.0.3630. వ్‌ వో ఏం నక స్వా యల్‌ వం దం డ0ికి0. 4 [న 0. 1085 ర జ ధ్‌ ( లో సు ఆలో జ. ఆ జ్‌ గ ఐంవియస్‌. అచ్యుతవల్లి నవలాసాహిత్యం ౫ డా. కెబి.లక్ష్మి- 211

ఆ ః ర్ల డా॥ ఓటి. సరన దీశొర్టాయగా తెలిసు లీక్స్‌ ఫాలాత్ట టిగాల్లో తై ప్త మ్మే రాక్ష తీయి $థా రనీయిర్సిగా, టీయిర్సిగా, కాందిన్ట్‌గా, జర్మలన్ట్‌గా, రితుర్మీవీరొవిగా ఫాలారీ ఫాం్క్రతికీ ఖలీ రనిటినై రృొచ్యారీగా బత? ప్రజలు, ఆం్టాల్‌ మీఓయీతో 'చెక్ట బాస్‌క్యోల్‌గా'. శైషైల్‌ రీత్సీగాలిటీగా స్యురక్కాతు. సిల్క్‌ ఆఫ్‌ యమ్‌ %ఫ్‌ తళియా ఇండియా ( 0 గ్యురాయి. తులేకయా త్రామీత్టు ఆత్వోనంపై అంతడ్ధితీయ రార్తేయుం సటస్కతో పొర్లాన్నరు. ర ఓటై కథం లంభట, గరం త్తం రా రంపృహాలి ఆమె రూ రాటం తాత్యా భాయి. 1 యసస్‌గా ఇట్రూర్త అభిదయంతో సాతీపం, యీర్మీపీం ప్రోోసీలు - రౌందే౮ా '30)౮ట ఒక ౮100౮8 తుంల్లీగా ల్యోదిడ్డిదు. . అ ్ర్యర్మమ్టున అతొర్మీం అందుపీగ్ఫోరు. . డాః బి.ఆర్‌, అంచేష్యల్‌ చల్‌ యీశంతిటీరో | | తీడరుక్‌ కిల్టింత్‌గా ఉద్యోగం చేస్పూరు.