Telugu Hindumatam ( Sanathana Dhramam Konni Etharamulu ) - anilvaranasi/indianlanguages GitHub Wiki
' టహొందూమతం , లం లాలా కొన్ని ఇతరమతాలు .. క్ “ 1, 1, సహజకవి మల్లెమాల యే శి, మనసుపడి మక్కువత్రో ప్రక్ర్బ్య
- ష్ స. | ఈ పుస్తకాన్ని సాహిత్ర్యాభిమ్రాన్సుల కోసం కం సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్సిక్రి ." భ్ షత | ఆనందంతో బెహూకరిస్తున్మాం " | మ శ - మలైమాల క్రుట్టుంబం , ” ళ్ | /. | ం ' శ కీ | , ! | స్స ( స్ గ్ | జ ౮ సు అగో వ. అ ॥ న. ౪. ఫి , గా 1 షల
హిందూమతం సనాతనధర్మం కొన్ని ఇతరమతాలు మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ప్రకాశకులు శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్ హైదరాబాదు
ర్ ఎరా వరాల రొ హిందూమతం ఆ అ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు రచయిత ప్రధమ ముద్రణ : 2008 వెల ఏ రూ.125/- డాలర్స్ ; ర$ ప్రకాశకులు : లల్లో !0 త్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్ ర జ
ప్రతులకు ; ['
- శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్
దోర్ నెం. 2-22-811/97 సి, వెస్టర్న్ హిల్పు,
స్టేట్ నెం. 3, నారాయణ జూనియర్ కళాశాల దగ్గర,
కూకట్పల్లి పోస్టు, హైదరాబాదు - 500 072.
ఫోను : 28050986 2) శ్రీ పావని సేవా సమితి క
శ్రీ సాయి నిలయము , జృందరయ్య (గందాల్భ్యా
(నో జ్యే 6
ఎస్.ఆర్టి. 270, సనత్‌నగర్, (ఇ గ ౧౫౦4క్రార వా ర్త
హైదరాబాద్ - 600 018&. సన ఉంటం ఇక్షు
ఫోన్ : 23702898 “లి వావాశమాోంం అక్షరకూర్చు ; ముద్రణ : సమంత గ్రాఫిక్స్ శ్రీ కళాంజలి గ్రాఫిక్స్ జవహర్‌నగర్, హైదరాబాద్ - 500 020. హైదరాబాద్ - 500 029. ఫోన్ : 27670198 ఫోన్ ; 65599881
శ్రీః ధర్యోపాయనమ్ మదీయసహధర్మచారిణి శ్రీమతి చి.సౌొ.ల. నుబ్బలక్ష్మీకి అస్మన్నందిని శ్రీమతి చి.సొల. నత్వవతికి అస్మన్నందనుడు చిరంజీవి సత్వ్యనారాయణశాస్త్రకి (ప్రేమోపహృత సౌవర్ణప్రాభృతము శ్రీమతీ సుబ్బలక్ష్మీర్మే ధర్మపల్నీగుణోజ్వులా, సముపొప్రాయతే తస్యై ధర్మ్యమేతదుపాయనమ్. _ సుతా£౬2వయోః సత్యవతీ, సత్యనారాయణః సుతు, శ్రేయసే£.స్తు తయో రమ్యం ధర్యమేతదుపాయనమ్. పుల్లెల శ్రీరామచంద్రుడు
గ అనుక్రమణిక హిందూమతం క్ష జైన-బౌద్ధాల ఆవిర్భావం 174 బౌద్ధమతం 187 జైనమతం 22] సిక్థమతం 239 జరోస్ట్ర మతం 260 యూదుల మతం 278 క్రైస్తవ మతం 297 ఇస్లాం మతం 334
సీ ప్రకాశకుల విజ్ఞప్తి
“హిందూమతం' అనే పేరుతో విస్తృత (ప్రచారంలో ఉన్న సనాతనధర్మం స్వరూపస్వభావాలపై స్పష్టమైన అవగాహన కలవారు అరుదుగా కనిపిస్తారు. ప్రపంచంలోని మతా లన్నింటిలోకీ అతిప్రాదీనమైన ఈ హిందూమతం పరిధి ఎంత విసృతమైనదో, ఇది ప్రతిపాదించిన విషయాలు ఎంత విశిష్టమైనవో, మానవజాతికి ఇది చూపు మహోన్నత లక్ష్యం ఏమిటో తెలిసికొనటం ప్రతిభారతీయునికీ కనీసధర్మం. అలాగే ప్రపంచప్రసిద్ధాలైన మతాలను గూర్చిన సమగ్రపరిచయం కూడా ఆధునికులకు అనివార్యమే. ఇలా వివిధమతాలను గూర్చిన అవగాహాన భారతీయుల్లో తమ ధర్మం పట్ల శ్రద్ధా ఇతరధర్మాలపట్ల సహనమూ కలుగజేసి సమాజంలో సుఖశాంతులనూ, అనందాన్నీ ఇనుమడింపజేస్తుంది.
ఇంతటి ఉదాత్తలక్ష్యంతో ఈ (గ్రంథాన్ని ప్రామాణికంగా రచించిన 'మహామహోపాధ్యాయ' దా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు జగమెరిగిన పండితులు. బహుభాషాకోవిదులు. ప్రాచ్యపాశ్చాత్య తత్త్వశాస్త్రనిష్టాతులు. సార్ధశతాధిక గ్రంథకర్తలు. పరస్సహస్ర శిష్యజన మార్గదర్శకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ పూర్వాధ్యక్షులు. అలుపెరుగని సారస్వత నిత్యకృషీవలులు. వారీ గ్రంథాన్ని వివిధ మతాల సంగ్రహ స్వరూప ్రతిపాదకంగా తెలుగులో సులభశైలిలో సమకూర్చి పాఠకలోకానికి మహోపకారం చేశారనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ (గ్రంథాన్ని ప్రచురించే అవకాశం అర్జాపేక్ష ఏ మాత్రము లేకుండా మాకు కలుగ జేసినందులకు వారికి మా హార్దిక కృతజ్ఞతలు సమర్పించుకొంటున్నాము. సర్వధారి సంవత్సరాది శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్సు 7-4-2008
ఇ శ్రీః ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః ప్రస్తావన ప్రపంచంలో ఉన్న మతా లన్నింటిలోకీ అతిప్రాచీన మైన మతం, “హిందూ మతం” అను పేరుతో ఈనాడు ప్రసిద్ధ మైన, సనాతనధర్మం. ఇది ప్రపంచంలోని అన్ని మతాలకీ మూల మైనది. ఇది ఏ కాలంలో ప్రారంభ మైనదో ఎవ్వరూ చెప్పజాలరు. అతిదీర్హ మైన చరిత్రలో అప్పుడప్పుడు ఏవేవో ఒడుదుడుకులు వచ్చినా, మూలసూత్రాలకి ఏమీ భంగం లేని విధంగా కాలానుగుణంగా సాంఘిక
- రాజకీయనియమాదులలో కొన్ని మార్పులూ చేర్పులూ చేసికొనడం ద్వారా
- వాటి నన్నింటినీ ఎదుర్కొంటూ, ఆఘాతం తగిలినప్పు డల్లా ద్విగుణీభూత మైన తేజస్సుతో విరాజిల్లుతూ, దృధంగా నిలద్రొక్కుకొన గలిగిన మహాశక్తిశాలి యెన మతం హిందూమతం. దాదాపు పన్నెండు వందల సంవత్సరాలనుంచి ఈ మతానికి ఎన్నో బలీయమైన దెబ్బలు తగులుతూనే ఉన్నాయి; ఎవరో మహాపురుషుదో, మహాపురుషులో ఆవిర్భవించి దీనిని ఆదుకొంటూనే ఉన్నారు. పాశ్చాత్యులు ఈ దేశంలో అడుగు పెట్టినది మొదలు దాదాపు 250- 00 సంవత్సరాలనుండి భారతదేశంలోని హిందూమతాన్ని రూపుమాపి తైస్తవమతాన్ని దాని స్థానంలో సుస్థిరంగా స్థాపించడం కోసం నిరంతరమూ (ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా కొందరు పాశ్చాత్యపండితులు భారతదేశచరిత్రనూ, సాంఘికపరిస్థితులనూ వక్రీకరిస్తూ (గ్రంథాలు వ్రాశారు. కొందరు మతాన్నీ ఆచారాలనూ అధిక్షేపిస్తూ (గ్రంథాలు (వ్రాశారు. కొందరు సరి మైన పరిపాలనావిధానాదులు విదేశీయులు (ప్రధానంగా తాము) భారతదేశంలో ప్రవేశించిన తరవాతనే అక్కడ ప్రవేశపెట్టబడ్డా యని (గ్రంథాలు వ్రాశారు. వీటి నన్నింటినీ ప్రాథమికపాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాలవరకు పాఠ్యక్రమంలో పాఠ్యాంశాలుగా నిర్ణయించి ప్రతీ సంవత్సరమూ కొన్ని వేలమందికి, కొన్ని లక్షలమందికి ఈ విషయాలు బోధింపచేశారు. వీటి అన్నింటిలోని సారాంశం 'ఏ మనగా - (1) భారతీయు లందరూ అనేక మైన మూఢవిశ్వాసాలతో జీవించే అనాగరకులు. (2) వీళ్ల ప్రాచీన వాజ్ఞయం అంతా ఆదిమానవులు అడవులలో తిరుగుతూ, భయంకర
స
మైన ప్రాకృతికదృశ్యాలను చూచి భయపడుతూ చెట్లకూ పుట్లకూ మొక్కుతూ వ్రాసిన అర్ధరహితా లైన పాటలవంటివి. (3) వర్షవిభేదా లుందడంవల్ల ఎల్లప్పుడూ వీళ్ల మధ్య కొట్లాటలు జరుగుతూంటాయి. (4) బ్రాహ్మణులు ఇతరులను అణగ ద్రాక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు. (5) అందుకు ఫలితంగా పూర్వం బ్రావ్మణులకీ పాలకులైన క్షత్రియులకీ మధ్య ఆధిపత్యం విషయంలో పోరాటాలు జరుగుతూందేవి. (6) ఈ సమాజంలో అస్పృశ్యత అనే అతిభయంకర మైన ఆచారం ఉంది. (వీటి కన్నింటికీ తగు సమాధానాలు ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి).
విదేశాలనుంచి వేలకొలది, లక్షలకొలది, ఈ కాలంలో నైతే కోట్ల కొలది రూపాయలు సహాయం పొందుతూ హిందూమతదూషణపూర్వకంగా క్లైస్తవమతాన్ని 'ప్రచారంచేస్తూన్న ఆ మతప్రచారకులు అలా ఉండగా భారతీయవాజ్మయాదులలో ఎంతో ఆదరం ఉన్నట్లు నమ్మించే కొందరు పాశ్చాత్యపండితులు కూడ ఈ దేశా న్నంతనీ ఏనాడు (కైస్తవమతంలోనికి మార్చాలా అను తహతశతహతో అందుకు తగిన ఉపాయాలను అన్వేషించారు. కొన్ని సందర్భాలలో వాళ్లు తమ మనస్సులలో నిగూఢంగా ఉన్న కోరికను స్పష్టంగా చెప్పడం కూడ జరిగింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో సంస్కృతప్రొఫెసర్గా పనిచేసిన జర్మనీ దేశీయు దైన, మాక్సుముల్లరు అను పండితునికి భారతదేశం అన్నా, దేశం సంస్కృతి అన్నా వాజ్బయం అన్నా అపారమైన ఆదరం అని ప్రసిద్ది. ఆతడు ్రాసిన పుస్తకాలు చదివితే అలాగే అనిపిస్తుంది. కాని అతడు 25-8-1856 తేదీన తన మిత్రుడు బారన్బన్సెన్కు వ్రాసిన లేఖలో తన అంతర్జతభావాలను ఈ విధంగా వ్యక్తీకరించాడు - “పాల్ కాలం నాటికి రోమ్ - గ్రీస్ దేశాలలో క్రైస్తవమత స్థాపనానికి ఎంత అనుకూల మైన పరిస్థితు లుండేవో అంతకన్న అనుకూల మైన పరిస్థితులు భారతదేశంలో ఈనాడు ఉన్నాయి. "71౧6 [0%19౧ 66 ౧౭౩ 10 50126 [106 ౧౭6 2గగ018| 56000గ5, 0604056 16 12|| ౪౦6160 ౧2౪6 096౧ 1౧౦౦౧౪౭౧6౧ (0/16 60౪67౫౧౧౪౧. కుళ్లి ఎండిపోయిన ఈ చెట్టు పూర్తిగా పడిపోవడం ప్రభుత్వానికి అంత మంచిది కాకపోవడంచేత దానిని ఏవేవో బోట్లు పెట్టి కొంత కాలం పాటు నిలబెట్టడం జరుగుతూన్నది ... నేను పదిసంవత్సరాల పాటు ఏమీ మాటలాడకుండా (వాళ్లు భాష నేర్చుకొని, వాళ్లతో మైత్రి చేసి కార్యక్రమంలోనికి దిగాలి అని ఆలోచిస్తున్నాను. భారతదేశంలో చాల కాలంనుంచీ వస్తూన్న పురోహితవంచనను (౧గ౭౩[- 6ఇగు పూర్తిగా
ఇ తొలగించి, నిరాడంబర మైన జ్రైస్తవోపదేశం ప్రతీ హృదయంలోకీ ప్రవేశించడానికి తగిన మార్గం ఏర్పరిచి, దానికి (హృదయానికి) పురోహితులు పన్నిన వలలనుండీీ, అయోమయం స్థితిలో పడవేసే దార్భనికుల 'ప్రభావంనుండీ విముక్తి కలిగించగలనా అని ఆలోచి స్తున్నాను.” ఇండియా ప్రభుత్వకార్యదర్శి యైన (360812౧ 0 51416 10 1౧౦12) ఆర్గిల్ డ్యూక్‌కు (0౮6 ౦14/0%) వ్రాసిన లేఖలో మాక్స్‌ముల్లర్ ఇలా అన్నాడు: “ఇండియాలోని ప్రాచీన మైన మతం నశించక తప్పదు. ఇలాంటప్పుడు క్రైస్తవమతం ఈ దేశంలోనికి ్రవేశించకపోతే ఇది ఎవరి తప్పు అవుతుంది?”. సాంప్రదాయికమైన హిందూమతాన్ని గూర్చి తన అభిప్రాయాన్ని తెలుపుతూ మాక్స్ ముల్లర్ ఇలా వ్రాశాడు - “ఈ మతాన్ని ఇంకా, నూటపది మిల్లియన్ల మానవాత్మలు (౧4౧౫౭౧ 90645) బోధిస్తూనే (పాటిస్తూనే) ఉన్నాయి ... అయినా కూడ వీళ్ల మతం చావబోతూన్నది, లేదా చచ్చినది అని చెప్పడానికి నేను వెనుకాడను. శివుడికీ ఇతరదేవతలకీ వీళ్లు చేసే పూజలు ప్రాచీనకాలంనాటి గ్రీక్లూ, రోమన్దేశీయులూ జుపిటర్ మొదలైన దేవతలకు చేసిన పూజలకంటె చాల నికృష్ణ మైనవి అను అభిప్రాయం కూడ ఇతడు వ్యక్తీకరించాడు. (౯. సోడ 1464116౧: 0౪ 112౧౮౭ [/00[6గ186; ౧౪౦19౧6౮61 గంగ) 16 8525404814 ౧1150100 గ౧౦6456, 80గ౦౭౪ 1౧ 1970, 5౧ 5-6). మంచి సంస్కృత[గ్రంథాల సంపాదనం చేసి, వాటిని అనువదించి ప్రచురించకుండా సంస్కృతంప్రాఫెసర్ మోనియర్ విల్లియమ్స్ డిక్ప్టరీలు తయారు చేయడం, వ్యాకరణం పుస్తకాలవంటి నీరసగ్రంథాలు వ్రాయడం వంటి పనులు చేస్తున్నాడు అని ఆతని (ప్రత్యర్థులు చేసిన అక్షేపణలకు సమాధానం చెపుతూ అతడు తన 'సంస్కృత - ఇంగ్లీష్ - డిక్ష్టరి మున్నుడిలో ఇలా వ్రాశాడు : "ఈ ఆక్షేపణలకు సమాధానంగా నేను ఒక విషయం స్పష్టీకరించవలసి ఉంది. బోదెన్ వైర్ (బ్రోడెన్ నెలకొల్పిన సంస్కృతాచార్యపీఠం) అధిష్టించినవాళ్లలో నేను రెండవ వాణ్ణి మాత్రమే. ఈ పీఠాన్ని స్థాపించిన కొల్నెల్ బ్రోడెన్ 15-8-1811వ తేదీన వ్రాసిన వీలునామాలో ఇంత ధనం విరాళంగా ఇవ్వడంలో తన ప్రధాన లక్ష్యం (క్రైస్తవ) మత [గ్రంథాలను సంస్కృతభాషలోనికి అనువదింపచేసి, ఇండియాలో నివసించేవాళ్ల నందరినీ శైస్త్రవమతంలోనికి మార్చడమే అని స్పష్టంగా వ్రాశాడు.” (కైస్త్వ్వ్రమత[గ్రంథాలను సంస్కృతంలోనికి అనువదించా లంటే నిఘంటువులూ,
బి
వ్యాకరణం పుస్తకాలూ కావాలి కాబట్టి తాను ఆ పని చేస్తున్నా నని విల్లియమ్ అభిప్రాయం.
ఇంకా ఎంతోమంది పాశ్చాత్యవిమర్శకులు ఈ మతాన్ని అనేకవిధాల విమర్శించారు. తెల్లజాతివాళ్ల క్రింద బానిసదేశంగా ఉన్న ఈ దేశంలో కాని, ఈ దేశం నాగరికతలోకాని, దీని సంస్కృతిలో గాని చెప్పుకొన వలసిన ఉత్తమ లక్షణా లేవీ లేవు, ఉన్న వన్నీ అవలక్షణాలే అని తమ దేశాలవాళ్లకి ప్రచారం చేసి చెప్పడమే కాక అడుగడుగునా ఈ దేశంవాళ్లని అన్ని క్షేత్రాలలోను ఎందుకూ పనికిరానివాళ్లనుగా చిత్రించడమే వీళ్ల ఉద్దేశ్యం. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించడానికి పూర్వం ఇలాంటి వ్రాతలు అత్యధికంగా ఉందేవి. హిందూమతాన్ని గూర్చిన కొందరి రచయితల ఇలాంటి నిందావాక్యాలను ఉదాహరించి శ్రీ డిఎస్. శర్మ 'గ౧6౧ఇ506౧1111060613%' అను గ్రంథంలో తగు విధంగా ఆ (భ్రాంతులను తొలగించి ఉన్నారు. (౧౯ 70-81).
అయితే - నిష్టాక్షికబుద్ధితో హిందూమతసిద్దాంతాలను, భారతీయ వాబ్మయాన్ని పరిశీలించి వాటిలో ఉన్న ఉదాత్త మైన సంప్రదాయాలను, సిద్ధాంతాలను శ్లాఘించిన ఎందరో పాశ్చాత్యపండితులు, కవులు, రచయితలు లేకపోలేదు. కాని తమ ఆధిపత్యాన్ని నిరంతరమూ భారతదేశంమీద కొనసాగించ దానికై మానసికంగా క్రుంగదీసి భారతీయులమీద దెబ్బతీయాలనే కోరికతో కొంతమంది పాశ్చాత్యరాజ్యాధికారవిస్తరణాభిలాషులూ, 'శైస్తవ్రమతాన్ని ఏ విధంగా నైనా ప్రచారంచేసి హిందూమతాన్ని రూపుమాపాలనే కోరికతో కొందరు మతదురభిమానులూ హిందూమతం విషయంలో దుష్ప్రచారం సాగిస్తూనే ఉన్నారు.
కైస్ర్వమతప్రచారానికి అప్పుడప్పుడు భారతీయుల నుండి ఎదురైన తీవ్రమైన ప్రతిఘటనలను చూచి అసలు ఈ దేశంలో తమ ఆధిపత్యానికే ఎక్కడ భంగం వస్తుందో అన్న భయంతో విదేశీయులు కొంత కాలం పాటు "ఒక విధమైన ఉదాసీనరీతి వహించి ప్రత్యక్షంగా, బలాత్కారంగా తమ మతాన్ని ప్రచారం చేయడం మానుకొని రహస్యమార్థాలలో ఆ కార్యక్రమం నడిపిస్తూ హిందూమతంతో తమ కేమీ విరోధం లేదన్నట్లు ప్రవర్తించారు. వెనుక ఉదాహరించిన - “16 016% ౪66 ౧౭౩ 10? 50గ౩ ౪౧౧6 ౧౭౮4 &2గ1౧౦18| 580005, 0602056 1 121 ౪౦౮16 ౧౭౪6 066% 1౧౦౦౧౪6౧1౧ 10 116 60౪౭గ౧౫౧౧6౧1 ..." అను మాక్స్ ముల్లర్ మాటలలో ఈ విషయం స్పష్టం అవుతుంది. భారతదేశంమీద
ఇ అధికారం తొలగిపోయిన తరువాత ఇప్పుడా మతస్టులకు ఆ భయం లేకపోవడంతో బాహాటంగా హిందూమతదూషణం చేస్తూ, దాన - భేదోపాయాల ద్వారా క్రైస్తవ మతప్రచారం ప్రారంభించారు. ధన - అధికారాదిలోభాలు చూపడం అనే దానోపాయమూ, జాతిద్వేషాలు రెచ్చకొట్టడం అనే భేదోపాయమూ ఈ నాడు వాళ్లకు సర్వవిధాలా లాభకరంగా కనబడుతున్నాయి. అందుచేత వాళ్లు తమ అభిప్రాయాన్ని చాల స్పష్టంగా చెప్పి తదనుగుణంగా కార్యరంగంలో ప్రవర్తిస్తున్నారు. “1999 సంవత్సరం డిశంబరు మాసంలో పోపు భారతదేశానికి వచ్చి ఢిల్లీలో కాథలిక్ బిషప్‌ల సంమేళనం ఒకటి జరిపాడు. ఆ సంమేళనంలో 140 పేజీల పత్రసంచయం (0004౧6౧0 ఒకటి వెలువరించబడింది. దానిలో - భారతదేశంలో ఉన్న కాథలిక్ చర్చియొక్క ఉద్దేశ్యాలూ, ఆశయాలూ, ఆశలూ ఆవిష్కరించబడ్డాయి : “మొదటి సహస్రాబ్దిలో యూరప్ఖండం నేలమీద శిలువ (౮౧౦53) నిలబెట్టబడింది; రెండవ సహస్రాబ్టిలో అమెరికాలోను, ఆఫ్రికాలోను నిలబెట్టబడింది. ఈ మూడవ క్రైస్తవశతాబ్దిలో విశాలమూ సారవంతమూ అయిన ఆసియాఖండంలో జైస్తవ విశ్వాసానికి సంబంధించిన అపారమైన పంట పండగల దని ప్రార్థిస్తున్నాం” అని ఉద్దోషించబడింది (౧౪06౬. 217). భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే, ఏ దివ్యశక్తియో అద్డుకొనకవోతే వీరి అభిలాష సహస్రాబ్ది దాకా అవసరం లేదు, అర్ధసహస్రాచ్చిలోనో, శతాబ్దిలోనో సఫలం అయే టట్లు కూడ కనబడుతూన్నది. ఏడెనిమిది సంవత్సరాల వయస్సు గల ఒక బాలుడు అమూల్య మైన రత్నాలు పొదిగిన ఒక బంగారు కంఠాభరణం ధరించి ఇంటి ముంగిట ఆడుకొంటున్నాడు. ఇంతలో ఎవరో అపరిచితుడు వచ్చి ఆ పిల్లవానిని బుజ్జగిస్తూ “అదేమిటి నీ మెడలో ఉన్నది? ఒక సారి ఇయ్యి చూచి ఇస్తాను అని ఆ ఆభరణం తీసికొన్నాడు. ఆ పిల్లవానికి తెలియకుండా దానిని సిరాలో ముంచి పైకి తీసి - “భీ! ఇదేమిటి, చూడు ఇది ఎంత చెడ్డగా ఉందో! నీకు మరొకటి మంచిది ఇస్తాను” అంటూ మూడు తీగలు కలిపి కట్టి చివర ఒక బిళ్ల (వేలాడ గట్టిన, వెండితో చేసిన ఒక వస్తువు తీసి చూపించి, “చూడు ఇదెంత ధగధగా తెల్లగా మెరుస్తూన్నదో” అని అంటూ అది వాని మెడలో వేసి ఆ రత్నాల హారంతో అద్భశ్యు దైపోయా డట. అలా ఉంది ఈ నాటి హైందవుల పరిస్థితి. ఈ పరిస్థితి ఇంకా దిగజారిపోకుండా ఉండా లంటే ప్రతీ భారతీయుడూ
న!
ముందుగా చేయవలసింది వేదాలు వల్లించడమూ, శాస్త్రాలు చదవడమూ కాదు; హిందూమతస్వరూపస్వభావాలు స్పష్టంగా తెలిసికోవాలి; వాటితో పాటు ఇతరమతాలను గూర్చి పై పైని వినడం కాదు వాటి స్వరూపస్వభావాలు ఎలాంటివో తెలిసికోవాలి. హిందూమతంలోనే అన్ని దోషాలూ ఉన్నాయా, ఇతరమతా లన్నీ శుద్ధస్ఫటికాల వలె నిర్దుష్టంగా స్వచ్ళంగా ఉన్నాయా; వాటిలో లేని ఉత్తమలక్షణా లేవైనా హిందూమతంలో ఉన్నాయా ఇలాంటి విషయా లన్నీ పరిశీలించి తెలుసుకోవాలి. తమ మతంమీద గట్టి నమ్మకమూ, (శ్రద్దా - భక్తులూ స్థిరంగా ఏర్పడిన తరవాత వేదశా[స్తాదులు వాటంతట అనే జాగర్తపడతాయి.
ఈ దృష్టితో హిందూమతస్వరూపాన్ని ఇతరమతాల స్వరూపాన్నీ సంక్షిప్తంగా తెలపడం కోసం వివిధగ్రంథాల సహాయంతో చేసిన ప్రయత్నానికి ఫలితమే ఈ చిన్న గ్రంథం. ఇతరులు ప్రచారంచేస్తూన్నట్లు, కొందరు భారతీయులే భావిస్తూన్నట్లు హిందూమతంలో ఏలాంటి దోషాలూ, లోపాలూ లేవు అని నిరూపించడమే మా ప్రధానోద్దేశ్యం గాని పరమతదూషణం కాదు. హిందువెవ్వరూ పరమతాన్ని దూషించడు; ఏ దేవుణ్ణీ ద్వేషించడు. నిజానికి “నువ్వు దేవుణ్ణి తప్పకుందా నమ్మాలి” అని కూడ హిందూమతం ఎవరినీ నిర్బ్భంధించదు. ఎవరైనా హిందూమతాన్ని దూపషిస్తేమాత్రం తగిన సమాధానం చెప్పవలసివస్తుంది; అలా దూషించేవాళ్ల మతాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపవలసివస్తుంది. పరులు ఎవరైనా తన తలిదండ్రులను దూషిస్తూంటే ఎవ్వడూ వింటూ కూర్చొనజాలడు కదా? వాళ్లతో కలిసి తాను కూడ దూషించడు కదా? అలా దూషించినా తప్పు లేదు అని ఏ బుద్ధిశాలి యైనా అంటే వానికి దూరంనుందే ఒక నమస్మారం. ఎందుచేత ననగా ఆతనికి కావలసినది తలిదండ్రులూ కాదు, తాను కూడ కాదు; తాత్కాలికంగా ఆకలి తీర్చుకొనడంకోసం పరుల భోజనం బల్లలమీదనుంచి చెదిరి పడే రొట్టి ముక్క తునకలు మాత్రమే.
“క్కశ్చరుడు మమ్ములను మాత్రమే తన అనుగ్రహానికి పొత్రులనుగా ఎన్నికొని మాకు మాత్రమే మతానికి సంబంధించిన అన్ని రహస్యాలూ బోధించాడు; అందుచేత మా దేవుడే దేవుడు; మాకు తెలిసిన మతమే మతం; ఆ దేవుణ్ణి మాత్రమే, మేం చెప్పిన పద్ధతులలో మాత్రమే ఆరాధించాలి; మా మతాన్ని మాత్రమే అనుసరించాలి అని అంటూ ఇస్రాయిల్ దేశీయులైన యూదులు చూపిన మార్గాన్నే అనుసరిస్తూ, పుట్టడం ఆ యూదమతంనుండే పుట్టినా తమకు స్వతంత్ర స్వరూప
ల!
స్వభావా లున్నా యని చెప్పుకొనే క్రైస్త్రవమతమూ, ఇస్తాంమతమూ కూడ అవి ఆవిర్భవించినది మొదలు నేటివరకు ఇతరుల నందరినీ తమ మతంలోకైనా మార్చాలి, లేదా వాళ్లందరినీ హతమార్చాలి అను పట్టుదలతో పనిచేస్తున్నాయి. ఇలాంటి ఆలోచన లన్నీ ఎంత. విపరీతమైనవో ఆలోచిస్తే స్పష్టంగా తెలుస్తుంది.
ఈ మతాలలోనే ఎన్నో భేదాలు ఏర్పడి ఒకరి నొకరు నిర్దాక్షిణ్యంగా చంపుకోవడం కొన్ని శతాబ్దాలుగా ఏ విధంగా జరుగుతూన్నదో ఆ మతాల చరిత్రలే చెపుతున్నాయి. ఇలాంటి విరోధాలూ విద్వేషాలూ భారతదేశంలో వీళ్లు ప్రవేశించడానికి పూర్వం ఎన్నడూ ఈ దేశంలో కనీ వినీ ఎరగని విషయాలు. భారతదేశంలో దేవునిమీద పూర్తి విశ్వాసం ఉన్నవాళ్లూ ఉందేవారు. అసలు దేవుడే లేడనేవాళ్లూ ఉందేవారు. ఈ నమ్మకం ఉండడం లేకపోవడం అను భేదాన్ని పట్టి ఒకళ్ల నొకళ్లు హింసించుకాన్న పరిస్థితు లేనాడూ ఈ దేశచరిత్రలో లేవు.
కైస్తవమతం ప్రకారం ఈ జగత్తును దేవుడు ఆరువేల (6000) సంవత్సరాల క్రితం, (క్రీ.పూ. 4004వ సంవత్సరంలో) శూన్యంనుంచి సృష్టించాడు. దేవుడు ఆరు రోజుల పాటు సృష్టి అంతా చేసి, అలసిపోయి, వదవ రోజున విశాంతి తీసుకొన్నాడు. అయితే ఈ భూమి ఇతరగ్రహాదులూ (012౧65 మొదలైనవి) కొన్ని లక్షల సంవత్సరాల వయస్సు గలవి అని వైజ్ఞానికులు చేసిన నిర్ణయాల దృష్ట్యా ఈ సిద్ధాంతం ఎంత అసంగత మైనదో ఊహించవచ్చు. ఇలాంటి తమ సిద్ధాంతాలకి విరుద్ధంగా మాటలాడి నందుకు, చర్చి ఎందరో వైజ్ఞానికులను అతిక్రూరంగా పీడించింది, కొంతమందిని హతమార్చింది కూడ.
వైజ్ఞానికుల విషయంలో ఆ విధంగా ప్రవర్తించడంలో ఏమీ తప్పు లేదు అని ఈనాటి కైస్తవపీఠాధిపతి పోపు కూడా అన్నా డంటే అ మతాని కున్న హృదయవైశాల్యమూ, తాత్త్వికద్భష్టీ ఎలాంటివో తెలుస్తూన్నది. ఇలాంటి భావాలను వ్యక్తం చేసిన పీఠాధిపతి ఒక విశ్వవిద్యాలయానికి వెళ్లడంకోసం ఏర్పాట్లన్నీ జరిగిన తరువాత ఆ విశ్వవిద్యాలయంలోని ఆచార్యులూ, విద్యార్థులూ తీవ మైన నిరసన ప్రకటించడంతో ఆతడు ఆ కార్యక్రమం మానుకొన్నట్లు ఒకటి - రెండు మాసాల క్రితం పత్రికలలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మన దేశంలో అయితే, అత డంగీకరిస్తే వానినుదుట కుంకుమబొట్టు కూడ పెట్టి, విశ్వ విద్యాలయాధికారులూ, రాజకీయనాయకులూ కూడ పూర్ణ కుంభాదులతో స్వాగతం ఇచ్చి శేషవన్తాదులతో సత్కరించి ఉండేవారు. ఇతదే
న...
ఇస్లాం మతప్రవక్తను గూర్చి అనాలోచితంగా కొన్ని మాటలు మాటలాడి నప్పుడు ప్రపంచకంలో ఉన్న ముస్లిము లందరూ తీవ్రనిరసనలు ప్రదర్శించడంతో వాళ్లకి క్షమాపణ చెప్పుకొన్నాడు. అతదే, ఈ భారతదేశం గడ్డమీదనే నిలబడి, “మేం మతాంతరపరివృత్తి (00౧౪6౪910౧) చేస్తున్నా మని ఎవరూ తప్పు పట్టడానికి వీలు లేదు; అది మా స్వధర్మం; మా హక్కు” అని ఉద్దోషించినప్పుడు హిందువు లందరూ తమకు పెట్టిన పేరైన, అసాధారణ స్వధర్మ మైన క్షమాగుణం ప్రదర్శిస్తూ కిమ్మనకుండా ఊరుకొన్నారు. ఎక్కడ నైనా చిన్న చిన్న మూలుగులు వినబడితే - “అది అంతే మరి; మన కాన్ స్టిట్యూషన్ లో కూడ అన్ని మతాలవాళ్లూ వాళ్ల వాళ్ల మతాలను ప్రచారం చేసికొనడానికి స్వేచ్చ ఇవ్వబడింది కదా అంటూ కొందరు సెక్యులరిస్టులు వాళ్ల నోళ్లు మూయించారు. “మతప్రచారాలకి అభ్యంతరం లేకపోయినా ఒక మతంనుంచి మరొక మతంలోనికి మార్చడం అంటే ఉన్న మతాన్ని దూషించే కదా అది చేస్తూంటారు? అలాంటి పరమతదూషణకి కాంన్స్టిట్యూషన్ అనుమతించదు కదా? అందుచేత కన్వర్షన్లను పూర్తిగా నిషేధించాలి” అని దేశంలో ఉన్న ఇంతమంది న్యాయశాస్త్రనిష్టాతులైన మేధా వంతులలో ఒక్కరు కూడ ముందుకు రాలేదు.
పాపాన్ని గూర్చి, అది తొలగించుకోవడాన్ని గూర్చీ నేటి క్రైస్తవమత ప్రచారకులు చేసే బోధలు వింతగా ఉంటాయి. తొలిమానవదంపతులు చేసిన, ఈశ్వరుని ఆజ్ఞను అతిక్రమించడం అను పాపానికి ఫలితంగా మానవు లందరూ పుట్టుకతో మహాపాపాత్ము లట. వీళ్ల కష్టాలను తొలగించడంకోసమే జీసస్ క్రీస్తు ఆత్మత్యాగం చేశాడట. అదే విధంగా మానవులు అప్పుడప్పుడు మతగురువుల వద్దకు వెళ్లి తాము చేసిన పాపకృత్యా లన్నీ ఒప్పుకుంటె ఆ పొపా లన్నీ భస్మమై పోతాయట.
వైబిల్ ఒల్లు టేస్టామెంటు (ప్రారంభంలోనే ఒక కథ ఉంది. ఈశ్వరుడు భూమ్యంతరిక్షాదు లన్నీ సృష్టించిన తరవాత చివర తన ప్రతికృతిగా (11206) మానవుణ్ణి సృష్టించా లని సంకల్పించి భూమినుండి మట్టి తీసి, మానవుణ్ణి సృజించి వానిలోనికి ప్రాణం ఊదాడు, 'ఆడమ్” అను మానవుడు తయారయ్యాడు. వాని శరీరంలోనుందే ప్రీని కూడ సృజించాడు. ఆమె “ఈవ్. ఒక “ఈడెన్” అనే స్వర్గోద్యానంలో అన్ని సౌఖ్యాలు కల్పించి ఈ ఇద్దరినీ అక్కడ సుఖంగా ఉండ మన్నాడు. అయితే ఆ ఉద్యానంలో ఉన్న అన్ని చెట్ల పండ్లూ తినవచ్చు గాని
న
ఫలానా చెట్టు పండ్లు తినగూడ దని వాళ్లని ఆజ్ఞాపించాడు. ఒక దుష్టప్రవృత్తి గల సర్పం ($6గ06౧౮ 'ఈవొను ప్రేరేపించగా ఆమె ఆ చెట్టు పండు తిని ఆదంచేత కూడ తినిపించింది. ఆ చెట్టు పేరు జ్ఞానవృక్షం (128 ౦ 1:౧0౪4/1666); అనగా ఇది మంచి ఇది చెడు అను జ్ఞానం కలిగించే వృక్షం. ఆ పండ్లు తినగానే వాళ్లకు తాము అంతవరకు దిగంబరులుగా ఉన్నట్లు తెలిసింది. సిగ్గుపడి ఏవో చెట్టు ఆకులు కుట్టుకొని శరీరాలమీద కప్పుకొన్నారు; ఆ ఉద్యానంలో సంచరిస్తూన్న ఈశ్వరుని ఎదుటికి వెళ్లడానికి సంకోచించారు. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు వాళ్లను భూమిమీదకు పంపివేశాడు. ఇలాంటి పౌరాణికకథలను ప్రతీకాత్మకంగా (9౧౫౦౦|॥౦) గ్రహించి మానవుని స్వరూప స్వభావాదులకు సూచకంగా అర్థం చేసికొంటే చాల అందంగా ఉంటుంది. అలా కాక యథార్థంగా గ్రహించి ఆడం సంతతివాళ్లిన మానవు లందరూ మహాపాపాత్ము లనీ, ఎవరో చేసిన ఆత్మత్యాగానికి వీళ్లందరూ దుఃఖవిముక్తు లౌతారనీ చెప్పడం చక్కని విషయాన్ని వక్రీకరించడమే అవుతుంది. అదే విధంగా - ఎన్నో పాపాలు చేసి ఏ మతగురువు ముందో చెప్పుకొంటే అవన్నీ పోయేట ట్లయితే ఆ మతగురువులు చేసే మహాపాపాలు వాళ్లెవరితో చెప్పుకోవాలి? ఇలాంటి కథలు చెప్పి పామరుల మనస్సులు విక్షుబ్ధం చేయడం అన్యాయం.
అదే విధంగా ఈ శరీరంతో ఈ భూమిమీద జీవించిన అత్యల్పకాలంలో మన పుణ్య-పాపాలకు ఫలితంగా, శాశ్వతంగా పుణ్యాత్ములు స్వర్గంలోను,
త్ములు నరకంలోను ఉండిపోవడమూ, పుణ్యాత్ములలో కూడ ఈశ్వరాను (గ్రహపాత్రులు మాత్రమే స్వర్గానికి వెడతారని చెప్పడం - ఇలాంటి వన్నీ యుక్తి విహీనములూ, తర్మదూరములూ అయిన సిద్దాంతాలు. తాము ఆ విధంగా విశ్వసించి ఆచరించుకొంటే ఎవరికీ ఏమీ అభ్యంతరం ఉండడు గాని ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థాయికి చెందిన హిందూమతాన్ని దూషిస్తూ తమ మతాలని హిందువులమీద అనేక ఉపాయాల ద్వారా రుద్దడం కోసం ప్రయత్నించడం ఎంతవరకూ యుక్తమో అలా చేసేవాళ్లూ, ఆ ప్రలోభనాలకు లొంగిపోతూన్న వాళ్లు కూడ్ర ఒక్కసారి నిలచి ఆలోచించడం మంచిది.
హిందూమతాన్ని విడిచిపెట్టి మరొక మతం తీసికొనడం చేతిలో ఉన్న చింతామణి దూరంగా పారవేసి ధగధగా మెరుస్తూన్న గాజు ముక్క తీసికొానడం
న ( వంటిది. ఈ మతంలో ఉన్న వైశిష్ట్యాన్ని ఎందరో పాశ్చాత్య పండితులు కూడ అనేకవిధాల కొనియాడారు.
నోబెల్ పురస్కార పురస్కృతుడు గొప్ప రచయిత, మహాత్మా గాంధీ మొదలైన భారతీయమేధావంతుల ఆదరాన్ని సొందినవాడూ అయిన ప్రాన్స్దేశానికి చెందిన
'రొమైన్ రోలండ్' ఇలా అన్నాడు - 1౧4లో 1 ర్ ణ కం &౧64512, 120 8200801540 6౧16౧౩౪. | 6౦ ౧౦+ సద కట [ల న్ రని 0౧6౪ 10౪9 8/20%2౧ 00౧౦౭౧1 200౪6 2|| [5 1081 1 86615 10 06 న! (౧6౧ ౭||. 8616? (1౧౭౧ 106 121 0 కల(009, 1 00616 156 1561 ౪10 1౧6 ౪౭51 ౧౧౦౪౧65153 06 ౧౧౦66౧) 5018౧06".
- గింగాడ!౧ గం|4౧6ే (౧౪౦1664 1౧ "0౧గ9$2౧|/ ౧౧౭586") “యూరప్ ఖండంలోను ఆసియాఖండంలోను ఉన్న అన్ని మతాలలోకీ ఇండియాలో ఉన్న బ్రహ్మకు సంబంధించిన సిద్ధాంతం చాలవరకు ప్రపంచకా న్నంతనీ తనలో ఇముడ్చుకొన్నట్లు కనబడుతుంది ఇతరమతాలను విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఈ బ్రహ్మసంబంధిసిద్దాంతాన్ని ఆదరించదానికి ప్రధానకారణం ఏమనగా - వాటిలో ఉన్న విషయా లన్నీ దీనిలో ఉండడం. యూరప్‌ఖండంలో ఉన్న మతాలకంటె అధికంగా ఈ సిద్ధాంతంలో ఆధునికవిజ్ఞానశాస్తానికి
సంబంధించిన అభ్యూహ లన్నింటికీ సమన్వయం కుదురుతుంది”. ఇదే విధంగా వారణాసిలోని సెంట్రల్ హిందూకాలేజి విద్యార్థులను సంబోధిస్తూ అన్నీ బెసంట్, పొందూమతానికి సంబంధించిన ఉత్తమమైన '" అదర్శ్భాలను గూర్చి 1904లో ఇలా అంది -
_ "14446 ౧౦ ౧౫౩౧6. ౧11౧06౬ |1106015గ 1౧౮12 ౧౭5 ౧౦ 4016. 111౧664157 15 ఆ 80111౧40 ౪౧100 1౧౦12'5 ౧006 2౧9 540%, 2౧6 1010 0406046506 4|| 1౧401 ౪6 23 2 (66 0౧) ౦410116 01206".
-తీ[౧16 06580౧1
(0౧6౦166 1% ౧6౧49601 111౧6415౧1. ౧. 10)
“షార్రభాటు చేయకండి. హిందూమతం లేకపోతే ఇండియాకు భవిష్యత్తు
లేదు. ఇండియా మొదళ్లు హిందూమతం అనే నేలలో పాతుకొని ఉన్నాయి. ఆ
నేలనుండి ఊడబెరికితే, నేలనుండి పీకివేసిన చెట్టు వాడిపోయినట్లు, ఇండియా, తప్పక వాదిపోతుంది.” న
షు!
ఇక్కడ ఇండియాలో హిందూమతం పాతుకొని ఉన్నది అనకుండా “హిందూమతంలో ఇండియా నిలచి ఉందొ అని ఆనీ బెసంట్ అనడం గమనార్హం. అందుచేత ఇండియాను (భారతదేశాన్ని) రక్షించుకోవాలంటే -
-
హిందూమతానికి సరియైన బలం చేకూర్చి దానిని రక్షించుకోవాలి.
-
దోషద్భష్టితో వెదికితే అన్ని మతాలలోను దోషాలు కనబడతాయి. ఎవరో ఆక్షేపించా రని తన మతాన్నీ తన పద్దతులనూ మార్చుకొనవలసిన పని లేదు.
౩. ఎన్ని మహాపాపాలు చేసినా హిందూమతం ప్రకారం ఎవ్వడూ ఎన్నదూ హతాశు డవవలసిన పని లేదు. నేను నడుస్తూన్న మార్గం తప్పు అని (గ్రహించిన తరువాత కూడ ఒక బాటసారి “ఎలాగా ఈ మార్గంలో బయలుదేరి వచ్చాం కదా అని అదే దారిలో పోతే వాని గతి ఏ మవుతుందో అందరికీ తెలిసినదే. ఏ క్షణంలో తాను నడిచేది తప్పుడు మార్గ మని (గ్రహించాడో ఆ క్షణంనుండి అతడు సరియైన మార్గంవైపు మళ్ళ్లుతాడు కదా? స్వప్రయత్నంచేతనే తాను చేసిన తప్పేమైనా ఉంటే దానిని దిద్దుకొని తనను తాను ఉద్ధరించుకొనే ఉపాయా లెన్నో హిందూమతం చూపిస్తూన్నది.
4, ఏ దేవుణ్ణి ఎలా పూజిస్తున్నా వని కాదు హిందూమతంలో (ప్రధాన విషయం. నీ కర్తవ్యాన్ని నీవు సరిగా పాలిస్తున్నావా లేదా అనేదే (ప్రధానవిషయం. స్వకర్తవ్య (ధర్మ) పాలనమే గొప్ప పరమేశ్వరారాధన అని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు:
“యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్,
స్వకర్శణా తమభ్యర్చ్య సిద్ధిం విన్హతి మానవఒ” (భగీ. 18-46) “ఏ పరమాత్మవల్ల సమస్తభూతాలూ తమ తమ పనులలో '్రవర్తిస్తుంటాయో, ఏ పరమాత్మ ఈ ప్రపంచా న్నంతనీ వ్యాపించి ఉన్నదో ఆ పరమాత్మను తన కర్మచేత పూజించి మానవుడు సిద్ధి పొందుతాడు. స్వకర్తవృపరాయణుడు దేవుణ్ణి పూజించక పోయినా కూడ ధార్మికుడే అని హిందూమతసంప్రదాయం. అందుచేతనే కొన్ని ఆస్తికదర్శనాలు కూడ దేవుణ్ణి గూర్చి మాట్లాడలేదు.
- స్వకర్మాచరణంతో బాటు దేవతాభక్త్యాదులు కూడ ఉంటే ఇంకా మంచిదే. దేవు డంటే ఎవరో, అతడు ఏ ఏ రూపాలలో తన వివిధశక్తులు చూపుతుంటాడో, ఏ దేవుణ్ణి (ఏ శక్తిని) ఎలా పూజించాలో ప్రతీ హిందువుకు తెలుసు. అందుచేత మా దేవుణ్ణి మాత్రమే పూజించు అని ఎవరూ వీనిని నిర్జంధించవలసిన పని లేదు.
మ.
-
సర్వసంప్రదాయసహనం అనేది హిందూమతంలో ఉన్న ఒక స్వాభావిక మైన లక్షణం. సెక్యులరిజం అను క్రొత్త పేరుతో ఎవరూ దీనిని హిందువులకు బోధించ నవసరం లేదు. అయితే - ఏవేవో క్రొత్త క్రొత్త నిర్వచనాలకు లోనౌతూ క్రమక్రమంగా “హిందూమతాన్ని విరోధించడం” అనే ఆకారంలో రూపుదిద్దు కొంటూన్న "సెక్యురిలజరంిను మాత్రం సరిచేయవలసి ఉంటుంది.
-
ఒకానొక కాలంలో శత్రువులకు అజేయ మైన మహాబలశాలిగా ఉన్న భారతదేశం దుర్చల మైపోయి శత్రువుల ఆక్రమణలకు గురి కావడానికి, చివరికి స్వాతంత్ర్యం కూడ కోల్పోవదానికీ హిందూమతం దుర్చలం అవదానికీ కొన్ని కారణాలు చెపుతారు ;
ఖ వీటిలో అహింసాసిద్దాంతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఒకటి. జైన - బౌద్ధమతాలు బోధించిన అహింసాసిద్దాంతాన్ని అతిగా అనుసరించి దుష్టులను, దేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన శత్రువులనూ కూడ ఉపేక్షించడం అలవాటు అయిపోవడంతో క్రమంగా జాతి నిర్వీర్యం అయిపోయింది.
హు “యుద్ధంలో ఓడిపోయినవాళ్లను చంపకూడదు; శరణు జొచ్చినవాళ్లను మన్నించి విడిచివేయాలి” - ఇలాంటి సిద్ధాంతాలను నమ్మి శత్రువులను విడిచివేయడం వంటి పనులు చేయడంతో వాళ్లు దేశాన్ని ఆక్రమించుకొన్నారు. మహమ్మద్ ఘోరీ మొదలైనవాళ్లు ఈ దేశాన్ని ఎలా కొల్లగొట్టారో చూస్తే దీనిలోని సత్యం అర్థం అవుతుంది. ఇది రెండవ కారణం.
ప్ర అన్నింటికంటె ప్రధాన మైన విషయం - వర్ణ - జాతి - సంప్రదాయ భేదాదులతో సమాజంలో అనేక మైన చీలికలు ఏర్పడి మొత్తం దేశం దుర్చలం అయి పోయింది. ఇది మూడవ కారణం.
1౪) దేశం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండడంతో ఆ యా దేశాల రాజులలో భోగలాలసత్వం సెరిగి పోయింది. ఎవరి మట్టుకు వారు తమ తమ అధికారాలను విస్తరింపచేసికొనడానికై పొరుగువారితో యుద్దాలు చేస్తూ తమ కర్తవ్యాలను పూర్తిగా విస్మరించడంతో మొత్తం దేశం పరాక్రాంతం అయిపోయింది.
. ఇ) ఒక మారు దేశం స్వాతంత్ర్యం కోల్పోవడంతో భక్తి అంటూ, జ్ఞానం అంటూ, కర్మ అంటూ, యోగసాధన అంటూ, పరలోకం అంటూ లౌకిక జీవనంతోను పురుషప్రయత్నంతోను సంబంధం లేని ఏవేవో బోధలు చేసేవాళ్లు అంతటా బయలుదేరి మొత్తం హిందూజాతిని నిర్వీర్యం చేశారు.
ఈ విధంగా భారతదేశం, ముఖ్యంగా హిందూజాతి, దుర్భల మవదానికి ఎవరి దృష్టిలో వారు అనేక విధాలైన కారణాలు వెదకుతూంటారు. ఇవన్నీ ఉన్న పరిస్థితులను పట్టి అన్వేషించే కారణాలు మాత్రమే. అందుచేత ఇవి చాలవరకు ఊహామాత్రకల్పితాలే కావచ్చు; వీటిలో కొంత సత్యం కూడ ఉంటే ఉండవచ్చు.
అయితే - పైన పేర్కొన్న మూడవ అంశాన్ని గూర్చి ఇక్కడ కొంత చెప్పవలసి ఉంది. గడచిన రెండు శతాబ్దాల కాలంలో పాశ్చాత్య ఐతిహాసికులు మనకు నూరిపోసిన విషయాలను దూరంగా ఉంచి మన ప్రాచీన వాజ్ఞయాన్ని పరిశీలిస్తే భారతీయు లందరూ నియమబద్ధ మైన జీవనవిధానానికి అలవడ్డ ఆత్మాభిమాన వంతు లనీ మొత్తం ఈ జాతి అవసర మైతే ఉన్నతాదర్శ్భాలకోసం ప్రాణా లైనా తృణప్రాయంగా విడవడానికి సిద్ధ మైన శౌర్య - ధైర్యశాలి మైన జాతి అనీ తెలుస్తుంది. విశేషించి దేశరక్షణం స్వధర్మంగా గ్రహించిన క్షతియజాతి తన ముందు ఉంచుకొన్న ఆదర్శా లెలాంటివో ఈ క్రింది వాక్యాలద్వారా స్పష్టం అవుతుంది -
రాజు ఎన్నడూ భోగాలను అనుభవించడంలో జీవితాన్ని వ్యర్థం చేయకూడదు అని మార్మందడేయపురాణంలో చెప్పబడింది :
“రాజ్ఞాం శరీరగ్రహణం న భోగాయ మహీపతే,
క్లేశాయ మహతే పృథ్వీస్వధర్శపరిపాలనే” (మా.పు.180.33-34)
మహారాజు! రాజులు శరీరం (గ్రహించినది భోగాలు అనుభవించడం కోసం కాదు. భూమినీ, స్వధర్మాన్నీ పాలించడం కొరకు ఎన్నో క్లేశాలు అనుభవించడానికే వాని కీ శరీరం లభించింది.”
యుద్ధరంగంలో ప్రాణాలు విడిచిపెట్టడమే క్షత్రియుని అత్యుత్తమధర్శ్మం అని మహాభారతంలో చెప్పబడింది :
__ “అధర్శః క్షత్రియస్యైెష యద్వ్యాధిమరణం గృహే,
యదయోనిధనం యాతి సో౬ స్య ధర్మః సనాతనఒ” (భీష్మ స, 17-11)
“రోగాలతో మంచం పట్టి ఇంట్లో మరణించడం అనేది క్షత్రియునకు గొప్ప అధర్మం. ఆయుధప్రహారంచేత ప్రాజాలు విడవడం అనేదే వీని అశి(ప్రాచీన మైన కాలంనుంచీ వస్తూన్న ధర్మం.”
యుద్ధరంగంలో వెనుకకు తిరగకుండా ప్రాణాలు విడచినవాడు మహాయోగీశ్వరునితో సమాను డని పరాశరస్మృతి చెప్పుచున్నది.”
“ద్వామిమౌ పురుషా లోకే సూర్యమణ్దలభేదినౌ,
పరి(వ్రాడ్యోగయుక్తశ్చ రణే చాభిముఖో హత” (పరా.స్మృ.8.37
“యోగాభ్యాసం చేసి తద్దారా ప్రాణాలు విడచిన పరివ్రాజకుడు, యుద్ధంలో శత్రువులను ఎదిరించి నిలిచి ప్రాణాలు విడిచిన యోధుడు - వీళ్లిద్దరూ సూర్యమండలాన్ని భేదించుకొని ఉత్తమలోకాలకు వెడతారు.”
ఇవి ఆ నాటి క్షత్రియల మహోత్తమాదర్శాలు. అవసర మైనప్పుడు ప్రతీ ఒక్కడూ క్షత్రియవృత్తి నవలంబించి దేశరక్షణకోసం, ఆత్మరక్షణకోసం ఆయుధం పట్టాలి అని -
“ప్రాణసంశయే బ్రావ్మాణో౭_పి శస్త్రమాదదీత” (గౌ.ధ.సూ. 1.7.25)
“ప్రాణసంశయం కలిగిన ప్పుడు బ్రాహ్మణుడు కూడ ఆయుధం పట్టాలొ ఇత్యాది స్మృతివాక్యాలు ఉద్దోషిస్తున్నాయి. బ్రాహ్మణుడే ఆయుధం పడితే ఇతరుల మాట చెప్పాలా?
క్రీస్తుకు పూర్వం ఏడవ శతాబ్దికి చెందిన (కొందరు విద్వాంసుల అభిప్రాయం ప్రకారం అంతకంటె కూడ పూర్వకాలానికి చెందిన) పాణిని అష్టాధ్యాయిలో (పాణిని నేటి పాకిస్తానులోని పెషావర్ దగ్గర ఉన్న శాలాతుర[గ్రామానికి చెందినవాడు) అ కాలంలో కొన్ని ప్రాంతాలలో అనేక మైన ఆయుధజీవులైన సంఘా లుండే వనీ, వీటిలో బ్రాహ్మణసంఘాలు, రాజన్యసంఘాలు, ఇంకా ఎన్నో సంఘా లుండే వనీ సూచించాడు.
“ఆయుధజీవిసంఘాత్ జ్యజ్ వాహీకేష్పబ్రావ్మణరాజన్యాత్, “ధృకాట్టేద్యణ్”, “దామన్యాది(త్రిగర్తవష్టాచ్చపొ, “పార్భ్వాదియౌధేయాదిభ్యో౨. ణజొ, “అభిజిద్విదభృచ్భాలావచ్చిఖావచ్చమీదూర్జావచ్భుమరణో యజఖొ.
(పా.సూ.5.3. 114-118) వీటినన్నింటినీ పట్టి భారతజాతి, హిందూజాతి ఎంతటి శౌర్య-ధైర్య- పరాక్రమాదులున్న జాతియో స్పష్టం అవుతుంది. ఈ విధంగా పరిశీలిస్తే వర్ణ- జాత్యాదిభేదాలతో భారతజాతి, హిందూజాతి, దుర్చలం అయిపోయింది అనే వాదం ఎంత దుర్చలమో తెలుస్తుంది. ఆస్తుల అధికారాల పంపకాలకోసం, ఈ నాడు వలె, కుమ్ములాటలకు
స అంతగా అవకాశం లేని స్వాతంత్ర్యసం[గ్రామకాలంలో, స్వార్ధచింత లేని మహాత్మా , గాంధీ వంటి దేశనాయకుల నాయకత్వంలో, భారతప్రజానీకం జాతి-మత-- కులాదిభేధా లన్నీ అధిగమించి, ఒక్క త్రాటి మీద నిలచి ఎన్ని త్యాగాలు చేసి విజయం సాధించిందో విస్మరించ దగిన విషయం కాదు.
-
వీటి అన్నింటికంటె ప్రధానమైన కారణం మరొకటి ఉన్నట్లు కనబడుతుంది. భారతదేశం ధన-ధాన్య సమృద్ధమై సుఖశాంతులలో వర్ధిల్లుతూన్న దేశంగా ఉండేది. తినడానికి తిండి లేక జీవికకోసం దేశాలు పట్టి తిరిగే కొన్ని జాతుల కళ్లు దీనిమీద పడ్డాయి. వాళ్లు హటాత్తుగా వచ్చి దీనిని ఆక్రమించారు. ఇది ఇంట్లోనివాళ్లందరూ ఆలమరచి నిద్రపోతూండగా ఎంతకైనా తెగించిన దుండగులు కొంతమంది వచ్చి ఆ ఇంటిమీద పడడం వంటిది. అలాంటి పరిస్థితులలో దేశం ఛిన్నాభిన్నం అయిపోయింది. ఆ విధంగా అకస్మాత్తుగా వచ్చి మీద పడి ఆ(క్రమించుకొన్నవాళ్లు క్రమంగా స్థిరపడి సుఖలాలసత్వం పెరిగి హాయిగా ఉంటున్నాం అనుకొంటూండగానే మరొక (ప్రక్కనుంచి మరొక జాతి వచ్చి పాతవాళ్లనీ, కొత్తవాళ్లనీ కూడ తన బానిసలనుగా చేసికొంది. ఎందరో మహాపురుషులు చేసిన అసాధారణ మైన త్యాగాల ఫలితంగా ఆ బానిసతనం వదల్చుకొన్న ఈ దేశం తన స్వాతంత్ర్యాన్ని, తన వ్యక్తిత్వాన్నీ సంరక్షించుకొనడం కోసం అన్ని విధాలా జాగరూకత వహించవలసి ఉంది. వెనుక చూపబడిన పరిస్థితు లన్నీ పునరావృత్తం అయే సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఏర్పడింది.
-
భారతదేశం గర్వించ దగిన అత్యుత్తమమైన ఇతిహాస్యగంథాలు రామాయణ-మహాభారతాలు. వీటికి సాటి యైన (గ్రంథాలు ప్రపంచకవాజ్బయా లలో దేనిలోనూ లేవు. ఇవి ప్రారంభంనుండి చివరివరకూ కూడ మానవుడు నిరంతరప్రయత్నశీలుదై, కర్మణ్యుడై ఉండాలి అని బోధిస్తున్నాయి. అన్నీ దేవుదే చూచుకొంటాడు అని అంటూ భజన చేస్తూ లేదా ముక్కు మూసికొని కూర్చుండ మని మన ఇతిహాసాలు కాని, ఇతరగ్రంథాలు గాని ఎన్నడూ బోధించవు. “దైవం అంటూ ఏదీ లేదు; పూర్వజన్మలలో చేసిన పురుషకారమే (పురుషప్రయత్నమే) దైవం. అందుచేత ఒకడు ఒక ఫలితాన్ని సాధించా లంటే దైవమూ, అనగా పూర్వజన్మకృతకర్మా పురుషకారమూ, అనగా ఇప్పుడు చేసే ప్రయత్నమూ, రెండూ కలవాలి” అని యాజ్జవల్క్యస్మృతిలో చెప్పబడింది :
స
“దైవే పురుషకారే చ కర్మసిద్ధిర్వ్యవస్థితా,
తత్ర దైవమభివ్యక్తం పౌరుషం పౌర్వదేహికమ్” (యా.స్మృ. 1348)
“ఒక పని సఫలం అవడం అనేది దైవంమీదా, పురుషకారంమీదా ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో అభివ్యక్త మైన, ఫలం ఇవ్వడానికి ఉన్ముఖ మైన, పహూర్వజన్మకు సంబంధించిన పొరుషమే (పురుషుని కర్మయే) దైవం అనగా”.
“యథా హ్యేకేన చక్రేణ రథస్య న గతిర్భవేత్,
ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధతొ (యా.స్మృ. 1350)
“రథం ఒక చక్రంతో ఏ విధంగా నడవదో అట్లే పురుషకారం (ఈ జన్మలో చేసే ప్రయత్నం) లేకుందా దైవం (పూర్వజన్మకృతకర్మ) సఫలం కాదు”.
ఈ దృష్టితో చూస్తే భక్తిమార్గ మైనా, ధ్యానమార్గ మైనా, జ్ఞానమార్గ మైనా, మరి ఏ మార్గ మైనా శాస్త్రంలో చెప్పిన అన్ని మార్గాలూ కూడ పురుషప్రయత్నంలోని విఖిన్నాంశాలే. వాటివల్ల సాధించవలసిన, సాధించ దగిన ప్రయోజనాలు ఉందనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలు చేసేవాళ్లు లౌకికవిషయాలకు సంబంధించిన ప్రయత్నాలు చేయకుండా కూర్చోవచ్చు నని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. అలాంటి కర్మణ్యమైన జీవనాన్ని రామాయణాదులు ప్రత్యక్షసూక్తుల ద్వారా, ఆ యా వ్యక్తుల చరిత్రల ద్వారా బోధిస్తున్నాయి.
మహాబలశాలి యైన రావణుని నగరంలో భయంకరులైన రాక్షసుల మధ్య ఏకాకిగా ఉన్న హనుమంతుడు తనకు తాను ధైర్యం చెప్పుకొంటూ అన్న ఈ మాటలు ప్రసిద్ధమైనవి :
“అనిర్వేదః శ్రియో మూలమనిర్వేదః పరం సుఖమ్,
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః (సుందరకాండ 12. 10)
“అన్సిర్వేదం (దిగులు చెందకపోవడం, లక్ష్మికి, అభివృద్ధికి, మూలం (ప్రధాన కారణం అనిర్వేదమే గొప్ప సుఖం; అన్ని పనులయందూ ప్రవర్తింపచేసేది అనిర్వేదమే”.
ఈ ఉపదేశం హనుమంతుని నోటినుండి వచ్చినా, మొత్తం రామాయణం
ఆదినుండి అంతం వరకు మనకు లభించే ఉపదేశం ఇదే.
పాండవులకు కౌరవులకూ మధ్య యుద్ధం తప్పదనే విషయం నిశ్చిత
మైపోయింది. అప్పుడు కుంతి శ్రీకృష్ణుని ద్వారా తన కుమారులకు సందేశం
నో
పంపే సందర్భంలో, విదుల అను క్షత్రియప్రే యుద్ధంలో పరాజితుదై (ప్రాణాలు కాపాడుకొనడం కోసం ఇంటికి తిరిగి వచ్చిన తన కుమారు దైన సంజయు దనే వానికి చేసిన ఉపదేశాన్ని వాళ్లకు గుర్తు చేస్తుంది. విదుల సంజయునితో అన్న మాట లివి :
“అలాతం తిన్దుకస్యేవ ముహూర్తమపి సంజ్వల,
మా తుషాగ్నిరివానర్చిర్భుమాయస్వ జిజీవిషుః”
ముహూర్తం జ్వలితం శ్రేయః న తు ధూమాయితం చిరమ్,
మాహ స్మ కస్యచిద్ గేహే జని రాజ్ఞః స్వరో మృదు
సంజయో నామతళ్చ త్వం న చ పశ్యామి తత్త్వయి”
(ఉద్యోగపర్వ. 183. 14-15)
“నువ్వు తిందుకం కళ్ణిమీద నిప్పు వలె ఒక్క క్షణకాలం పాటైనా భగ్గు మని మండడం మంచిది; అంతే కాని ఏదో విధంగా (బ్రతకా లనే కోరికతో ఊక నిప్పు వలె, చాలా సేపు పొగరాజుతూ ఉన్నట్లు ఉండకూడదు". “చాలా సేపు పొగ రాజడం కంటె ఒక్క క్షణకాలం భగ్గున మండడం మంచిది. ఏ క్షత్రియుని ఇంట్లోనూ కూడ పిరికి మాటలు వినబడకుండుగాక”. “నీ పేరు సంజయుడే కాని నీలో ఆ లక్షణా లేవీ కనబడడం లేదు.”*
- కుంతీదేవి చెప్పిన విదుల వంటి ఆత్మాబిమానవతులూ, దేశాఖిమానశాలినులూ అయిన వీరనారీమణులు కుంతీదేవికి పూర్వమే కాదు, అనగా మవాభారతకాలానికి పూర్వమే కాదు; ఈనాడు కూడ అలాంటి వీరవనితలు భారతదేశంలో ఎందరో ఉన్నారు.
- ఈ మధ్య పాకిస్తాన్ ప్రభుత్వం మరణదండం విధించిన సరబ్జిత్ సింగ్‌ను విడిపించడం కోసం భారతప్రభుత్వం చేస్తూన్న ప్రయత్నాల సందర్భంలో అతని భార్య సుఖ్‌ప్రీత్‌కౌర్ అసాధారణ మైన దేశభక్తి భావంతో ఇలా చెప్పి నట్లు 20.3.2008 నాటి “ది హిందూ" అను ఆంగ్లపత్రికలో వార్త ప్రచురింపబడింది : “భారతప్రభుత్వం ఈ దేశంలోని జైళ్లలో ఉన్న పాకిస్తానుకు చెందిన, అతి (క్రూరులైన ఉగ్రవాదులను విడిచిపెట్టడం ద్వారా సరబ్జిత్సింగ్ను విడిపించే టట్లయితే అది నాకు గాని, నా కుమార్తెలకు గాని ఏ మాత్రమూ ఇష్టం లేదు. మా కుటుంబానికి దేశాన్ని మించినది మరొకటి ఏదీ లేదు. మాతృభూమి శ్రేయస్సుకు విరుద్ధంగా మేం ఎన్నడూ ్రవర్రింప జాలం”. ఇవీ భారత దేశీయుల రక్తంలో దాగి ఉన్న శౌర్యథైర్యా లంటే.
మహాభారతరామాయణాదులలో ఇలాంటి ఘట్టాలు కోకొల్ల లున్నాయి.
ఈ మధ్య ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ కూడ వివిధ భాషలలో మంచి ప్రవచనపాటవం ఉన్న ఎందరో మహామేధావులు భారతీయసంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉపన్యాసాల ద్వారా, టి.వి.ల ద్వారా, ఆకాశవాణ్యాదుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అలాంటివా రందరూ నవయువకులను దృష్టిలో ఉంచుకొని వాళ్లను కర్మణ్యులనుగా చేసే ఉపన్యాసాదులు అధికంగా చేస్తే, గురుగోవిందసింగ్ వంటి వాళ్ల ప్రయత్నం చేత బలీయ మైన సిక్టజాతి అచిరకాలంలో ఆవిర్భవించి నట్లు తేజఃశాలియైన హిందూజాతి కూడ ఆవిర్భవిస్తుంది. ఈ దిశగా మార్గదర్శనం చేసిన ఛత్రపతి శివాజి వంటి మహావీరులు, మూర్తీభవించిన ఆత్మాభిమాన మైన రాణా ప్రతాపసింగ్ వంటి ఎందరో రాజపుత్రవీరులు, రూన్సీలక్ష్మీబాయివంటి వీరనారీమణులు, అభినవ అభిమన్యులైన భగత్‌సింగ్ ప్రభృతులు భారతీయచరిత్రలో సుప్రసిద్ధులు. మనం చేయవలసిన దల్లా వారు చూపిన మార్గాన్ని అనుసరించడం మాత్రమే. హిందూజాతి నిర్వీర్యమైన జాతికాదు అని చెప్పడానికి ఈ మహావీరుల చరిత్రలే ప్రమాణం. కొందరు దేశద్రోహుల కుతంత్రాలచేత. వాళ్లు విజయం పూర్తిగా సాధించజాలక పోయారంటే అది జాతి దోషం కాదు. పరిస్థితుల దోషం. ఇప్పుడు అనుకూల పరిస్థితులను సృష్టించుకొనవలసిన అవసరం ఏర్పడింది. తప్పక సాఫల్యం లభిస్తుంది. అలాంటి జాతి ఇతరులను అఆక్రమించడంకోసం కాకపోయినా స్వీయ రక్షణకోస మైనా తగిన ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకొనకలుగుతుంది. అందుచేత మహామేధావు లైన ఉపన్యాసకులూ, మతప్రవక్తలూ కూడ సామాజిక విషయాల మీద దృష్టి కేంద్రీకరించి మతవిశ్వాసాన్ని దేశభక్తినీ పెంపొందించే విధానాలు అన్వేషించ వలసి ఉంది.
- దేశం అంతా, ప్రపంచకం అంతా, ఒకే మతం (ధర్మం) అనుసరిస్తూన్న ప్పుడు వేరుగా మరొక మతం అనేది లేనప్పుడు, ఇతరమతాలవాళ్లని తనలోకి మార్చా లని ఆలోచించే అవకాశమే హిందూమతానికి ఏనాడూ కలగలేదు. అయితే “మా మతం మీ మతంకంటె చాల ఉత్కృష్టమైన మతం అనీ, మీ మతం విడచి మా మతం స్వీకరించాలి” అనీ అనేకఉపాయాలచేత హిందూమతస్థులను తమ మతంలోనికి ఆకర్షించే మతాలు బయలుదేరిన ఈ కాలంలో హిందూమతం
.
కూడ తన ఆలోచనలు మార్చుకొనవలసి ఉంటుంది. దీనికి తగిన మార్గం పర్నాల్లవ శతాబ్దంలో శ్రీ విద్యారణ్యస్వామి చూపి ఉన్నారు. ఆ మహాపురుషుడు తురుష్కులచేత ఐలాత్మారపూర్వకంగా మతాంతరంలోనికి పరివర్తితులైన హక్క - బుక్కసోదరులకు (ఈ సోదరులే హరిహరరాయ బుక్కరాయ లను పేర్లతో ఒకరి తరువాత ఒకరు విజయనగర సా(మాజ్యాధిపతులైనారు) సంస్కారంచేత ఆ తెర తొలగించి, వాళ్ల సహజధర్మం పునరుద్చుద్ధం చేసి వాళ్లచేత గొప్ప విజయనగరసామ్రాజ్యాన్ని స్టాపింప చేశారు. అలాంటి విద్యారణ్యులూ, హరిహరరాయ - బుక్కరాయలూ ఇంకా ఆవిర్భవించా లని పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. ఆ పద్ధతిని పూర్తిగా ప్రచారంలోనికి తీసికొని వచ్చి, ఎలాంటి నిర్బంధమూ లేకుండా, స్వేచ్భానుసారం తమ అజ్ఞానం తొలగించుకొనడంకోసం ప్రయత్నించే వాళ్లకు హిందూమతం సహకరించాలి. అది జరగా లంటే హిందూమతం విషయంలో ఉన్న కొన్ని అపోహలను తొలగించి దాని సత్యస్వరూపం తెలపవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇలాంటి దశసూత్ర కార్యప్రణాలిక రూపొందించడానికి ఈ చిన్న పుస్తకం కొంతవరకైనా ఉపకరిస్తుం దన్, సనాతనధర్మవైశిష్ట్యాన్ని స(ప్రమాణంగా విశదీకరిస్తూ ఇంకా కొన్ని ఉత్తమ[గ్రంథాలు తెలుగులో వెలువడడానికి ధీమంతులైన యువకులకు ఉత్సాహజనకం కాగల దనీ ఆశిస్తున్నాను.
శ్రీ చలమచర్ల వేంకటశేషాచార్యులు గారు శ్రీజయలక్ష్మీ పబ్లికేషన్స్ ద్వారా ఈ (గ్రంథాన్ని ప్రచురించడమే కాక దీని ద్వితీయ(ప్రా(గ్రూపాొన్ని (౧౦౦౧) చూచే (ఈమ కూడ వహించి ఉన్నారు. భారతీయ సంస్కృతిపై వీరికి గల ఆదరాభిమానాలు అభినందనీయములు. దా॥ ప్రొఫెసర్ పి. శశిరేఖ వ్రాగ్రూప పరిశోధనలో సహకరించి నందుకు ఆమెకు నా ఆశీఃపూర్వకాభినందనములు. హైదరాబాదు 24-8-2008 పుల్లెల శ్రీరామచంద్రుడు
శ్రీః ఓమ్ స్వస్తి శ్రీగణేశాయ నమః హిందూమతం సనాతనధర్మం కొన్ని ఇతరమతాలు
“సుమారు నలభై నంవత్సరాల పాటు నేను ప్రపంచకంలోని అన్ని ప్రధాన మతాల అధ్యయనం చేశాను. 'సొందూనుతం'” అని చెప్పుబదే అత్యుత్తమ మైన మతం వలె నర్వాంగసంవూర్థ మైన మతం మరొకటి ఏదీ నాకు కనబడలేదు. దానివలె వైజ్ఞానిక మైనది (64౯1640 గాని, తత్త్రచింతాభరిత మైనది (0470300260 గాని అధ్యాత్ధికతాసమంచిత మైనది (7/77/2/20 గాని మరొక మతం ఏదీ కనబడలేదు. దీనిని గూర్చి తెలుసుకొంటున్న కొలదీ మీకు దీనిమీద త్ద్ద పెరుగుతుంది.” - అనె బెసంట్ 410118 3854)
ఈ భూమండలం మీద అనాది కాలం నుంచీ విరాజిల్లుతూన్న ధర్మానికి “సనాతనధర్మం అని పేరు. 'సనాతనం? అనగా శాశ్వత మైనది, ఎల్లప్పుడూ' ఉండేది, ఆది లేనిది, స్థిర మైనది అని అర్ధం. “ధర్మం” అనగా లోకాలను నిలబెట్టేది. సుఖశాంతులను నెలకొల్పడం ద్వారా మానవులనూ మానవుల చుట్టూ ఉన్న చరాచర ్రాణిజాతాన్నీ రక్షించేది ధర్మం. భారతదేశంలో అనాదికాలంనుంచీ ఉన్న ఈ ధర్మాన్ని ఫలానా కాలంలో ఫలానా వ్యక్తి స్థాపించా దని కాని, బోధించా డని కాని చెప్పడానికి అధారా లేవీ లేవు. అందుచేత దీనికి ఆది అంటూ ఏద్ లేదు. అదే విధంగా ఇది ప్రపంచకం ఉన్నంతవరకూ ఉండవలసినదే. దీనికి వ్యాఘాతం కలిగితే దీనిచేత బోధింపబడిన సత్య-అహింసాది ప్రధాన నియమాలకు భంగం వాటిల్లితే, ప్రపంచకమే నిలబడదు. అందుచేత ఇది అనంతం. “సనాతనధర్శం” అనే పదం ఈ అర్జాన్నే బోధిస్తుంది. -
ఇది శాశ్వతమే కాదు; సార్వభౌమం కూడ; అనగా సకల జగత్తుకూ సంబంధించినది. ఈ ధర్మానికి సంబంధించి నంత వరకు - ఇది ఈ దేశానికి
2 హిందూమతం సంబంధించిన దని కాని, ఈ జాతికి సంబంధించిన దని గాని, ఈ కాలానికి సంబంధించిన దని కాని భావనయే ఏనాడూ లేదు. అందుచేతనే మనువు -
“వితద్దేశప్రసూతస్య సకాశాదగ్రజన్మన:,
స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాళొ (మ.స్కృ.2. 20) అని అంటాడు. “ఈ దేశంలో - అనగా వింధ్య - హిమాలయాల మధ్య నున్న పుణ్యభూమి యైన ఆర్యావర్తదేశంలో, పుట్టిన సకల విద్యాపారంగతు డైన (బ్రాహ్మణుని నుండి, ప్రపంచకంలో ఉన్న సకలమానవులూ, తమ తమ చరిత్రను, ఆచారాన్ని జీవనవిధానాన్ని నేర్చుకోవాలొ అని దీని అర్ధం. ఇది కేవలం గొప్ప కోసం చెప్పిన మాట కాదు. “అతి ప్రాచీనకాలం నుంచీ ప్రపంచం అంతటా సనాతనధర్మమూ, దానికి సంబంధించిన ఆచారవ్యవహారాలూ ప్రచారంలో ఉండేవి; ఆ యా కాలాలలో ఆవిర్భవించిన కొన్ని మతాలు సనాతనధర్మాన్ని రూపుమాపడానికి (ప్రయత్నం చేసినా దానికి సంబంధించిన కొన్ని ఆచారవ్యవహారాదులను, విశ్వాసాలను తమలో కలుపుకొని అవి తొలిసారిగా తమచేతనే ప్రతిపాదింపబడ్డా యని ప్రచారం చేశాయి, చేస్తున్నాయి కూడ; ఎన్నో సనాతనధర్మానికి సంబంధించిన అంశాలు ఈ నాటికి కూడ ఆ మతాలలో స్పష్టంగా కనబడుతున్నాయి. అందుచేత విశ్వవ్యాప్త మైన ధర్మం సనాతనధర్మమే అని స్టెఫెన్ నాప్ (5190162 2000) అనే అమెరికాదేశ పండితుడు - “వైదిక సంస్కృతి విశ్వవ్యాప్తంగా ఉండేది అని చెప్పడానికి ప్రమాణాలు” (౦౦501 ౪741001419 010041 కె(అంల) అనే గ్రంథంలో, అనేక ప్రాచ్య-పాశ్చాత్య పండితుల గ్రంథాలనుండి కూడ వారి వాక్యాలను, అభిప్రాయాలను ఉదాహరిస్తూ, ఆ యా మతాలలో ఉన్న సనాతనధర్మప్రభావితా లైన విషయాలను ఉటంకిస్తూ సప్రమాణంగా నిరూపించాడు. ఆర్యు లనేవాళ్లు ఎక్కడినుండో భారతదేశానికి వచ్చారు అనే పాశ్చాత్యపండితుల స్పకపోలకల్పితసిద్దాంతాన్ని తీవ్రంగా ఖండించి, ఆర్యులు తొలినుండీ భారతదేశానికి చెందినవారే అని స్థిరీకరించాడు.
పదిపన్నెండు వందల సంవత్సరాల క్రితం సింధునదీప్రాంతం ద్వారా వచ్చి ఈ భారతదేశంతో సంబంధం వర్పరచుకొన్న కొందరు విదేశీయులు సింధునదిని హిందునది అను పేరుతో వ్యవహరించడంతో ఆ ప్రాంతానికి చెందిన
హిందూమతం తె దేశానికి హిందుదేశం అని పేరు వచ్చింది. ఆ పదానికి అత్యధిక మైన (ప్రచారం వచ్చి ఈ దేశంలో ఉన్న సనాతనధర్నానికి, కొన్ని పాశ్చాత్యభాషలలో “హిందూ ఇజం” అనీ, హిందీ మొదలైన కొన్ని భారతీయభాషలలో “హిందూ ధర్మం అనీ తెలుగులో “హిందూ మతం” అనీ పేర్లు ప్రసిద్దిలోనికి వచ్చాయి. అందుచేత ఆం(ధ్రదేశీయులైన పాఠకుల సొకర్యంకొరకు ఈ (గ్రంథంలో 'హిందూమతం' అను పేరు ఉపయోగించబడుచున్నది.
'మతం' అనగా అభిప్రాయం అని అర్ధం. ఇతరదేశాలలో ఆవిర్భవించిన ప్రతీ మతాన్నీ ఒకనాడు, ఒక వ్యక్తి స్థాపించి, దాని కొక గ్రంథం ఇచ్చి దానినే అన్ని విధాలా ప్రమాణంగా స్వీకరించా లని ఆజ్ఞాపించి నట్లుగా చెప్పబడి ఉంటుంది. అందుచేత దానికి మతం అను పేరు సంగతంగా ఉంటుంది. అయితే సనాతనధర్మాన్ని (హిందూమతాన్ని) స్థాపించిన అలాంటి వ్యక్తి ఎవరూ లేరు. ఇది ఒక వ్యక్తి సృజించి స్థాపించిన మతం కాదు. అనాదికాలంనుంచీ, నాగరికత వివిధరూపాలలో ప్పెరుగుతూన్న కొలదీ వివిధరూపాలు సంతరించుకొంటూ అభివృద్ధి చెందిన మతం ఇది. “హిందూమతాన్ని ఎవరూ నిర్మించలేదు. ఇది తనంత తానుగా పెరుగుతూ వచ్చింది. ఇదొక భవనం కాదు; ఇదొక మహవావనం” అంటాడు సర్ చార్లెస్ ఇలియట్. (000జ2676 షెలుగ్ర0% లో ఉదాహృతము. పే.8). ఇదే విధంగా కే.యమ్. సేన్ హిందూమతం” అను గ్రంథంలో - “ఒక వాస్తుశిల్చి ఒక నిశ్చిత మైన కాలంలో నిర్మించిన భవనం వంటిది కాదు
- హిందూమతం. ఇది క్రమంగా ఎదిగిన మహావృక్షం వంటిది. అనేకసంస్కృతుల ప్రభావం దీనిలో ఇమిడి ఉంది. భారతదేశంలో ఉన్న వైవిధ్యం ఈ మతంలో కూడ కనబడుతుంది అన్నాడు (క 1415010664 €.?.8)
ఈ మతానికి సంబంధించిన ఎందరో సిద్ధపురుషుల పేర్లూ బుషుల పేర్లూ వినబడుతున్నా ఏ ఒక్క సిద్ధపురుషుడూ, ఏ బుషీ కూడ ఈ మతానికి స్థాపకుడు కాడు. ప్రతీ ఒక్కడూ ఆ యా కాలాలలో కొన్ని నూతనాంశాలను ఈ మతంలో చేరుస్తూ ఉండి ఉంటాడు. అదే విధంగా హిందూమతానికి సంబంధించి
- వేదాలు, పురాజాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, ఆగమాలు మొద లైన ఎన్నో పవిత్రగ్రంథా లున్నా వాటిలో ఇది ఒక్కటే ప్రమాణం అని ఏ ఒక్క
శీ హిందూమతం (గ్రంథాన్నీ అంగీకరించడం అనేది లేదు. హిందూమతానికి సంబంధించిన అనేక విశ్వాసాలు, ఆచారాలు ఈ గ్రంథా లన్నింటిలోనూ ఉన్నాయి. అందుచేత అన్నింటికీ ఆ యా విషయాలలో ప్రామాణ్యం ఉంది. “ఈ (గ్రంథా లన్నింటిలోకి అతిప్రాచీన మైనవి వేదాలు. ఇవి అపొరుషేయాలు. పురుషులు (మానవులు) రచించినవి కావు. వీటికి ఆది అనేది లేదు. అందుచేత ఇవి అనాదులు. ఇదే విధంగా ఇవి ఏనాటికీ అంతరించేవి కావు. అందుచేత అనంతాలు. ఇని ఇన్నే అను మాట కూడ లేదు అందుచేత కూడ ఇవి అనంతాలు” అని హిందువుల విశ్వాసం. అయితే పైన పేర్కొన్న ఇతరగ్రంథాలకు కూడ వేదాల కున్నంత (ప్రామాణ్యం ఉన్న దని హిందువులు అంగీకరిస్తారు.
ఒకే స్టాపకుడూ (ప్రవక్తా), ఒకే ఒక ప్రమాణగ్రంథము అనేవి లేకపోవడమే కాకుండా హిందూమతములో నిశ్చిత మైన, ఒకే విధ మైన, ప్రతి ఒక్కరూ అనుష్టించి తీరవలసిన నియమమూ, ఆచారమూ, పూజావిధానాదికమూ అంటూ ఏదీ లేదు. ఎన్నో విభిన్న మైన ఆచారాలు, అలవాట్లు ఈ మతంలో కనబడతాయి. ఆచార వ్యవహారాదులలో ఎన్ని భేదా లున్నా వీళ్లందరూ హిందువులే. బహుదేవతారాధకుడు ఎంతటి హిందువో ఏకేశ్వరవాది కూడ అంతటి హిందువే. ఏకేశ్వరవాది ఎంతటి హిందువో అద్వైతవాది కూడ అంతటి హిందువే. పరలోకం లేదు, దేవుడు లేడు అని చెప్పే నాస్తికుడు కూడ లౌకికనియమాలనూ, సామాజికనిబంధనలనూ పాటిస్తూన్నంతవరకూ హిందువే. అవి పాటించకపోతే మాత్రం అపరాధి మైన హిందువు అవుతాదు. ఇదే భావం అనీ బెసంట్ "8 [యం ఖ? జు 0644120046006 2500674640 క6యిూాఆం6ం 9లుఅ22 కొం ళం యులు 0108 ఆఅ లయుయం1మయు అకులుగ (6.9.[.1.5) అను మాటలలో వ్యక్తీకరించింది. హిందూమతం పైకి చూడడానికి ఏ మాత్రమూ పరస్పర సంబంధం లేని అనేకవిశ్వాసాల సంఘాతంలా కనబడుతుంది. అందుచేతనే ఇది ఎన్ని చెట్లున్నాయో, ఎన్ని తీగ లున్నాయో, ఎన్ని మొక్క లున్నాయో, వ రకమైన చెట్టూ తీగలూ, మొక్కలూ ఉన్నాయో తెలిసికొనడానికి శక్యం కాని మహావనం వంటిది అని అంటారు. నిజానికి ఏ మతం తీసికొన్నా మొన్న మొన్న బయలుదేరిన మతం తీసికొన్నా దానిలోని ప్రధాన మైన సిద్దాంతాలను,
హిందూమతం క్ విశ్వాసాలనూ, ఆచారాలనూ పూర్తిగా వర్షించి చెప్పడం, చివరికి సంక్షిప్త రూపంలో వాటి పరిచయం ఇవ్వడం కూడ చాల కష్ట మైన పని అనడంలో సందేహం లేదు. అతిప్రాచీనమైన హిందూమతం విషయంలో నైతే ఇది సర్వథా అశక్య మైన పని. అయితే - ఎన్ని విశ్వాసా లున్నా ఎన్ని ఆచారా లున్నా ఎందరు దేవుళ్లున్నా పూజా విధానాదులలో ఎన్ని భేదా లున్నా వీటి అన్నింటికి మూలాధారమైన ఒకే ఒక తత్త్వం ఉంది; ఆ తత్త్వాన్ని తెలిసికొనడమే, దానిని చేరడమే, మానవుని జీవితానికి పరమలక్ష్యం; ఏ మార్గం అవలంబించినా చివరికి ఆ లక్ష్యం చేరుకొనవచ్చు అని హిందూమతం దృధంగా విశ్వసిస్తుంది. ఈ దృధవిశ్వాసమే భారతీయు లందరినీ విడదీయ రాని వకతాభావంతో కట్టి ఉంచిన దృధ మైన బంధం.
మతానికి సంబంధించిన అన్ని ఆచారాదులూ కూడ మానవు అందరినీ ఒకే గమ్యానికి చేర్చే వేరు వేరు మార్గాల వంటి వైనప్పుడు - “ఎట్టి పరిస్థితిలోనూ వీటిని జవదాటకూడదు” అని అంటూ ఏవో కొన్ని నియమాలు కాని ఆచారాలు కాని, 'ప్రార్ధనావిధానాదులు గాని, పూజాపద్ధతులు గాని, ఉత్సవాదులు కాని విధించడానికి అవకాశమే ఉండదు. తన కిష్టమైన మార్గం అవలంబించి పరతత్త్వం సంనిధి చేరే అధికారమూ, స్వాతంత్ర్యమూ ప్రతీ మానవునికీ ఉన్నాయి. ఫలానా మతప్రవక్తయే నిజ మైన మతప్రవక్త, ఫలానా సిద్ధాంతమే అత్యుత్తమ మైన సిద్దాంతం అని హిందూమతం ఎన్నడూ చెప్పదు; ఎవరైనా అలా చెపితే అంగీకరించదు. ప్రార్ధనలు, పూజలు, ఉత్సవాలు మొదలైనవాటిలో ఎలాంటి మార్పులూ సహించని కఠిన నియమాలను హిందూమతం విధించదు. హిందూమతం ప్రకారం పూజాప్రార్ధనాదికం పరమేశ్వరునిపై మనస్సు లగ్నం చేయడానికీ తద్ద్వారా పరతత్త్వసాక్షాత్మారం పొందడానికీ ఉపయోగించే అనేకమార్గాలలో ఒక మార్గం మాత్రమే. కర్మ, జ్ఞానం, భక్తి అనేవి మానవుడు తనను తాను ఉద్ధరించుకొనడం కోసం ఉపయోగించే అనేక మార్గాలలో ప్రధానమైనవి. మానవుడు వీటిలో తన కిష్టమైన ఏ మార్గాన్నైనా అనుసరించ వచ్చు. ఈ విషయంలో హిందూమతం దృక్పథం అతివిశాల మైనది. హిందూమతానికి పరమ(ప్రమాణం వేదాలు. ఆ వేదాలను అనుసరించి
6 హిందూమతం వేదోక్తధర్మాలను గూర్చి చెప్పే స్మృతులూ (వీటికి ధర్మశాస్త్రగ్రంథా లని కూడ పేరు), వైదికయజ్ఞయాగాదికర్మ కలాపాలను వివరించే శ్రాతసూత్రాలూ, జాతకర్మ
- ఉపనయన వివాహాది సంన్మారా లను గూర్చి వివరించే గృహ్యసూ(త్రాలూకూడ పరమహ్రమాణాలే. వేదాలూ, వేదాన్ని అనుసరించి ఆ యా కాలాలలో మునులు రచించిన శ్రౌతసూత్ర - గృహ్యసూత్రాలు, సృతులూ ఇవన్నీ కలిసి వైదికవాజ్బ్యయం అని చెప్పవచ్చు. అపారమైన ఈ వాజయం హిందువులకు పరమప్రమాణం. (చూ. మొదటి అనుబంధం).
అయితే వైదికవాజ్బయంలో లేని ఎన్నో విషయాలు, ఆచారవ్యవహారాదులు, హిందూమతంలో అనాదికాలంనుంచీ కనబడుతున్నాయి. నాగ-వృక్ష- (గ్రామదేవతాద్యారాధనలు దేశంలోని వివిధసుదూర(ప్రాంతాలలో ఉన్న అనేకజాతులలో అనేక రూపాలలో (ప్రచారంలో ఉన్నాయి. పీటికి ఆధారాలు పైన చెప్పిన ఏ గ్రంథాలలోను ఉన్నట్లు కనబడదు. అలాగే నిగ్రహారాధనలు, వీటికి సంబంధించిన అసంఖ్యాకా లైన ఆచారాలు, సం(ప్రదాయాలు, దేవాలయ నిర్మాణాదులు-ఇవన్నీ ఆగమగ్రంథాలలో (వీటికి తంత్రగ్రంథా లని కూడ పేరు) విధింపబడి ఉన్నాయి. శైవ-శాక్త-వైష్ణవ- గాణపత్య-సౌర-కౌామారాది సంప్రదాయాలకు సంబంధించిన ఆగమగ్రంథాలు అనేకం ఉన్నాయి. ఈ విషయాలు కొన్ని పురాణాలలో కూడ చోటు చేసికొన్నాయి. వీటికన్నింటికీ మూలం వైదికవాజ్బయమే అని చెప్పడం సత్యదూరమే అవుతుంది. ఆ యా దేవతల అనుగ్రహం కోసం చేసే ఎన్నో వ్రతాదులు కూడ పురాణాదులలో చెప్పబడి ఉన్నాయి. అవేవీ వైదికవాజ్యయంలో కనబడవు. అయితే “వీటి కన్నింటికీ తగిన మూలప్రమాణాలు వేదంలో ఉండి ఉంటాయి. ఆ భాగాలు మనకు ఇపుడు లభించకపోవచ్చును. అంత మాత్రంచేత వాటికి వైదికప్రామాణ్యం లేదనడానికి వీలు లేదు” అని ఆవేశపూర్వకంగా వాదించేవారు లేకపోలేదు. అది వారి విశ్వాసం. ఇవన్నీ హిందూమతానికి సంబంధించినవే. ఇవన్నీ హైందవజీవనంతో నీళ్లూ పాలూ కలిసి పోయి నట్లు విడదీయడానికి శక్యం కానివిధంగా కలిసిపోయి ఉన్నాయి. పైన చెప్పిన విధానాలలో, ఆచారవ్యవహారాదులలో తమ తమ అభిరుచులను పట్టి ప్రతిఒక్కడూ ఏదో ఒక పద్ధతిని అవలంబించవచ్చును. ఏ
హిందూమతం / పద్ధతి అవలంబించినా ప్రతి ఒక్కడూ హిందువే. అందుచేతనే “హిందూమతం అనేది ఒక మతం కాదు. ఇదొక ధర్మం; ఒక జీవనవిధానం” అని పండితు లంటారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణ మొదలైన ఎందరో మేధావులు ఈ విషయాన్ని విశదీకరించారు.
వెనుక సూచించి నట్లు వీటిలో దేనిమీద విశ్వాసం లేకపోయినా తనకు ఇష్ట మైన జీవనవిధానాన్ని ఏర్పరచుకొని, సమాజంలోని అందరు వ్యక్తులతోను కలిసి మెలిసి ఉంటూ, సుఖమయజీవనాన్ని గడిపే నాస్తికు డని చెప్పబడేవాడు కూడ హిందువే. సామాన్యధర్మాలను అనుసరిస్తూ ఇతరుల యోగక్షేమాలకు భంగం కలిగించ నంతవరకు ప్రతి ఒక్కడూ ధార్మికుడే; ధార్మికుదైన ప్రతీ ఒక్కడూ హిందువే. అందుకు విరుద్దంగా ప్రవర్తించేవాడు కూడ హిందువు కాకుండాపోడు; కాని అధార్మికప్రవృత్తికి శిక్షార్హుడవుతాదు. ఆ మాటకు వస్తే హిందూధర్మాలను తు చ తప్పకుండా ఆచరించే ఆస్తికు డనే వాడు కూడ లోకోపద్రవకారకు దైతే దండనీయుడే.
ఈశ్వరుడు
మానవుని మనస్సుకు కూడ అందని అత్యద్భుతస్వరూపస్వభావాలు గల ఈ జగత్తును సృజించి ఒక నిర్లీత మైన పద్ధతిలో దీనిని నడుపుతూన్న ఒక మహాశక్తి ఉంది.ఆ మహాశక్తియే - దేనికంటె పెద్దదీ గొప్పదీ ఏదీ లేదో అట్టి బ్రహ్మ. ఆ బ్రహ్మకే ఈశ్వరు డని పేరు. ఏ భాషలో ఎన్ని పేర్లు పెట్టినా ఈశ్వరు డొక్కడే. ఆ ఈశ్చరునికి ఒక రూపం లేదు; శరీరం లేడు. అది సర్వవ్యాప్త మైన,సర్వశక్త మైన,సర్వజ్ఞ మైన (అంతటా వ్యాసించిన,అన్ని పనులూ చేయడానికి సమర్ధ మైన, అన్నీ తెలిసిన) ఒక నిత్యమూ, సత్యమూ అయిన తత్త్వం.ఇదీ హిందూమతం బోధించే ఈశ్వరుని యథధార్థస్వ్పరూపం.
హిందూమతానికి పరమప్రమాణ మైన వేదాలలో ఎందరో దేవతల వర్ణనలూ, స్తుతులూ కనబడతాయి. అలాంటి దేవతలలో వరుణుడు, ఇంద్రుడు, మిత్రుడు, అగ్ని అశ్వినీదేవతలు,రు(డ్రుడు మొదలైనవారు ప్రధానులు. కాలాంతరంలో వచ్చిన పురాణాదులలో బ్రహ్మ, విష్ణువు, శివుడు, వినాయకుడు, కార్తికేయుడు, ఆదిత్యుడు,
8 హిందూమతం సరస్పతి,లక్ష్మిపార్వతి మొదలైన దేవతల వర్హనలు,స్తుతులు,వాళ్ల అనుగ్రహం ద్వారా మానవుడు తన యోగక్షేమాలను సంపాదించుకొనడానికై వాళ్లను ఆరాధించే విధానాలూ చెప్పబడ్డాయి.
హిందువులు ఆ యా కాలాలలో,ఆ యా పర్వదినాలలో వేరు వేరు దేవతలను వివిధరీతులలో పూజిస్తూంటారు.ఆ విధంగా తమ అభీష్టాలను పొందుతూంటారు. అయితే ప్రతీ హిందువూ కూడ,నిరక్షరాస్యుడైన హిందువు కూడ, తాను ఏ దేవతను, ఎలా ఆరాధించినా తాను ఆరాధించే దేవుడు ఒక్కడే అనీ,ఈ దేవత లందరూ ఆ దేవుని వివిధ రూపా లనీ పూర్తి విశ్వాసంతో ఉంటాడు.ఒక పర్వదినంలో,ఒక పుణ్యక్షేత్రంలో- విష్ణువే జగత్తుయొక్క సృష్టిస్టిలయాలకు కారణభూతు డని అంటూ విష్ణువును ఆరాధించినవాద్కే మరొక పర్వదినంలో,మరొక పుణ్యక్షేత్రంలో శివుణ్ణి గాన్మి దేవిని గాని, వినాయకుణ్ణి గాని మరొక దేవతను గాని అదే భావనతో పూజిస్తాడు. ఇలాంటి దృఢనిశ్వాసానికి అనేకవేదవాక్యాలు, వాటిని అనుసరించిన పురాణవచనాలూ, అనూచానంగా వస్తూన్న పెద్దల ఆచారమూ మూలకారణం. బుగ్వేదంలో ప్రసిద్ధ మైన ఒక బుక్కు ఉన్నది-
“ఇస్టం మిత్రం వరుణమగ్నిమాహురథో దివ్యః సుపర్జో గరుత్మ్నాన్,
ఏకం సద్విప్రా బహుధా వదన్తి అగ్నిం యమం మాతరిశ్వానమాహువ”.
(బు.వే. 1. 164)
“ఒకే 'సతొ పదార్ధాన్ని పరమార్ధతత్తాన్నిపండితులు ఇండద్రు డనీ మిత్రు దన్మీ అగ్ని అనీ, దేవలోకవాసీ బంగారు రెక్కలు గలవాడూ అయిన గరుత్మంతు డన్మీయము డన్మీవాయు వనీ వర్ణిస్తూంటారు".
ఇదే భావం అనేక కథల రూసంలోను,వాక్యాల రూపంలోను,సంవాదాల రూపంలోను ఇతిహాసపురాణాదులలో అనేకస్థలాలలో కనబడుతుంది.
బహుదేవతారాధనం వెనుక ఉన్న ఈ రహస్యాన్ని కొందరు గుర్తించకపోవడం శోచనీయం.
పరమాత్మస్వరూపం విషయంలో ఉపనిషత్తులలో కూడ రెండు విధా లైన వాక్యాలు కనబడతాయి- “పరమార్ధసత్యం ఒక్కటే. అదే బ్రహ్మ. మరొక వస్తు వేదీ
హిందూమతం 9 లేదు.బ్రహ్మ నిర్గుణం; నిశ్చలం;రూపరహితం. ఎలాంటి దోషాలూ లేనిది. ఈ (బ్రవ్మయందే జగత్తు ఉన్నట్లు కనబడుతూన్నది"అని కొన్ని ఘట్టాలలో చెప్పబడింది. ఇది అద్వైతవాదం. “బ్రహ్మకు సర్వజ్ఞత్వం మొదలైన గుణా లున్నాయి. అదే జగత్సృప్టిస్టితి సంహారాదులు చేస్తుంది.అది అంతటా వ్యాపించి,జగత్తులో అణువణువునా అంతర్గతంగా,అంతర్యామిగా, ఉన్నది.ఆ (బ్రహ్మనే సేవించి,ఆరాధించి, మానవుడు ఇహలోక-పరలోకాలలో అభ్యుదయాన్ని చివరికి ని॥శ్రేయసాన్ని (మోక్షాన్ని పొందవచ్చు”అని కొన్ని ఘట్టాలలో చెప్పబడింది. ఇది ఏకేశ్వరవాదం. సగుణ (బ్రహ్మవాదం. ఈ రెండు వాదాలూ సాధకుల ఆధ్యాత్మికభూమికల తారతమ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పినవి.
అద్వైతసిద్దాంతాన్ని సుస్థిరంగా నిలిపిన శ్రీశంకరాచార్యులు కూడ ఏకేశ్వర వాదానికి విరోధి కారు ఆయన పారమార్థికసత్యమూ, వ్యావహారికసత్యమూ అని సత్యంలో రెండు భూమికలను ప్రతిపాదించి,వాస్తవంలో, పారమార్ధికళూమికలో, బ్రహ్మ అద్వితీయమే అయినా,నిర్లుణ మైనా,వ్యావహారికసత్యభూమికలో బ్రహ్మకు సృష్టికర్శ త్వాదులు ఉన్నాయి. ఈ భూమికలో జగత్తు సత్యం. జగత్తుకు సంబంధించిన ప్రతీ ఒక్క వ్యవహారమూ సత్యమే. పుణ్యపాపాలు,స్వర్గనరకాలు అన్నీ సత్యమే-అని ఆయన తమ భాష్యాలలోని అనేకస్థలాలలో,అతిస్పష్టంగా ప్రతిపాదించారు.
జగత్సృష్టి
ఈశ్చరుడు ఈ జగత్తునుుహూత్తుగా,ఏ కారణమూ లేకుండగా,శూన్యంనుంచి పుట్టించా దని హిందూమతం అంగీకరించడు. జగత్తుకు ఈశ్వరుడు నిమిత్త్రారణమూ, ఉపాదానకారణమూ కూడ.లోకంలో,కుండ, కుండలం మొదలైనవాటికి కుమ్మరి, కంసాలి మొదలైనవాళ్లు నిమిత్తకారణం. మట్టి, బంగారం మొద లైనవి ఉపాదాన కారణం. ఈ విధంగా లోకంలోని వస్తువులకు నిమిత్తకారణ-ఉపాదాన కారణాలు వేరు వేరుగా ఉంటాయి. జగత్తుకు మాత్రం ఈశ్వరుడే నిమిత్త్రకారణణమూ ఉపాదాన కారణమూ కూడ. అందుచేత ఈశ్వరుడు జగత్తుకు అభిన్ననిమిత్తోపాదానకారణం అని అంటారు.ఈ విషయం ఉపనిషత్తులలోను, పురాణాదులలోను అనేకప్రదేశాలలో చెప్పబడింది.
10 హిందూమతం
“యతో వా ఇమాని భూతాని జాయన్సేయేన జాతాని జీవన్సియత్ ప్రయన్యభి సంవిశస్తీతి, తద్విజిజ్ఞాసస్వ్పృతద్ బ్రహ్మేతి”. (కైత్తిరీయోపనిషత్. 3. 1)
“ఈ భూతా లన్నీ (ప్రాణు లన్నీ) దేనినుండి పుడుతున్నాయో,(పైకి వస్తున్నాయో) అలా పుట్టినవి దేనిచేత జీవిస్తున్నాయో,చివరికి దేనిలో చేరి అణగి పోతున్నాయో అదే బ్రహ్మ ఆ బ్రహ్మను తెలిసికొనడంకోసం ప్రయత్నించు”.
“యధోర్డనాభిః సృజతే గృహ్హతే చ యధా పృధివ్యామోషధయః సంభవన్తి,
యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్సంభవతీహ విశ్వమ్”.
(ముందకోపనిషత్తు. 7 1. 1.7)
“సాలెప్టరుగు ఏ విధంగా దారాలను తననుంచే పైకి తీస్తుందో,మళ్లీ తనలోనికే తీసుకుంటుందో,నేలమీద ఏ విధంగా మొక్కలు మొలుస్తాయోపురుషునినుంది జుట్టూ రోమాలూ ఏ విధంగా పుడతాయో,అదే విధంగా నిత్యమూ వినాశరహితమూ అయిన (బ్రహ్మనుండి ప్రపంచకం ఆవిర్భవిస్తూన్నది”.
జగత్మృష్టి విషయంలోను,జగత్స్వరూపం విషయంలోనూ హిందువులు నమ్మిన ఈ సిద్ధాంతాన్ని అర్థంచేసికొంటే-ప్రతీ హిందువూ ప్రపంచకంలోని ప్రతీ వస్తువులతోనూ
- చెట్టులోను,సర్బంలోను,శిలలోను కూడ భగవంతుణ్ణి ఎలా చూడకలుగుతున్నాదో,అ వస్తువుల ద్వారా భగవంతునిమీద ఎలా మనసు నిలపకలుగుతున్నాదో అర్థం అవుతుంది.
హిందూమతం ప్రకారం-ఈశ్వరుడు ఏ విధంగా నిత్వుడో,శాశ్వతుదో,ప్రపంచం కూడ అంత నిత్యమూ శాశ్వతమూను; ఎందువల్ల ననగా-్రపంచానికి మూలకారణం (ఉపాదానకారణం) ఈశ్వరుడు. కార్యానికీ కారణానికీ భేదం లేదు.బంగారానికీ ఉంగరానికీ భేదం లేదు కదా? ఈ (ప్రపంచానికి ఒక ప్రారంభం అంటూ,అంతం అంటూ లేదు.ఇది పైకి వస్తుంది,కొన్నాళ్లు కనబడుతుంది.కొంతకాలం పాటు కనబడకుండా పోతుంది. మళ్లీ కనబడుతుంది; ఈ విధంగా ఈశ్వరుని ఇచ్చ ప్రకారం సృష్టి-స్థితి-/ప్రలయాల చక్రం నిరంతరమూ తిరుగుతూ ఉంటుంది.
ఈశ్వరుడు ఈ ప్రపంచకాన్ని ఎందుకు సృష్టిస్తున్నాడు? ఈ సృృష్టి-స్టితి-ప్రలయా లకు నియామకా లైన సూత్రాలే వైన ఉన్నాయా,లేక ఈశ్వరుడు స్వేచ్భానుసారం
హిందూమతం (11 నిరంకుశప్రవృత్తితో ఈ పనులు చేస్తూంటాడా? ఈ ప్రశ్నలకు హిందూమతం ఇచ్చే సమాధానాలు ఇవ్-ఏ ప్రాణివిషయంలోను ఈశ్వరునికి పక్షపాతబుద్ధి ఏ మాత్రమూ లేదు;ద్వేషం లేదు;రాగం లేదు.' “సమోల్ల హం సర్వభూతేషు న మే ద్వేష్యో౭.స్తిన ప్రియలోొ. (భ. గీ. 9.29) “అన్ని ప్రాణులవిషయంలోనూ నేను సమబుద్ధి కలవాదనే;నాకు ద్వేషింపదగినవాడు లేడు,ప్రియమైనవాదు లేడూఅని భగవంతుడే చెప్పాడు. ప్రతీ జీవని నెత్తిమీదా కొండంత కర్మరాశి ఉంటుంది.ఆ కర్మల ఫలితాన్నిఅది సుఖమైనా దుఃఖమైనా కూడ, అనుభవించడానికి వాని కొక శరీరం ఉండాలి. అందుచేతనే ఈ శరీరానికి 'భోగాయతనం' అని పేరు 'సుఖదుఃఖభోగాలకి స్టానం' అని అర్ధం. శరీరంతో పాటు భోగాలకు అవసరమైన పరిస్థితులు దేశకాలాది రూపాలలో ఉండాలి. చుట్టు ప్రక్కల ఇంకా ఎందరో ఇతరప్రాణులు కూడ ఉందాలి. కోట్లాది జీవులు తమ తమ కర్మల ఫలాలను అనుభవించడానికే ఈశ్వరుడు జగత్తును సృష్టిస్తూంటాడు. ప్రతీ జీవుడూ తన కొండంత కర్మరాశిలో ఒక గుప్పెడు కర్మతో ఒక జన్మ పొంది, సుఖదుఃఖాలు అనుభవించి కొంత కాలానికి ఆ శరీరం విడచి, ఆ శరీరంతో చేయగా క్రొత్తగా ప్రోగు పడి, కర్మరాశిలో చేరిన, కర్మల ఫలాన్నీ ఇంకా మిగిలిన పూర్వకర్శ్మల ఫలాన్నీ అనుభవించడానికి, కొత్త పరిస్థితులలో, వేరైన దేశకాలాదులలో మళ్లీ జన్మ ఎత్తుతాడు. ఈ విధంగా ఈశ్వరుడు జీవుల కర్మలను బట్టి సృష్టి చేస్తూ వాళ్ల వాళ్ల కర్మల ఫలాలను అనుభవించడానికి తగిన పరిస్థితులను కల్పిస్తూంటాడు.ఇంతకు మించి ఆయనకు సృష్ట్యాదుల విషయంలో స్వాతంత్ర్యం లేదు. పరమేశ్వరాశ్రయణం;:మానవుడు తనకు లభించిన ఈ మానవజన్మను సద్బిని యోగం చేసికొంటూ ఒక్కక్షణం కూడ వ్యర్థం చేయకుండా శాస్రోక్త మైన సత్ష్రవర్తన అలవరచుకొనడం ద్వారా పుణ్యం సంపాదించుకోవాలి.ఆ విధ మైన పవిత్రజీవన విధానం అవలంబించడంవల్ల అతడు తన పాపకర్మలను నశింపచేసికొన కలుగుతాడు. ఆ కర్మలను ఈ పుణ్యజీవనవిధానం నిర్వీర్యం చేయడంతో అవి దుష్ఫలితాలు ఇవ్వజాలవు.దుష్మర్మ లను,పాపాలను,నశింపచేయగల అనేక
12 హిందూమతం ఉపాయాలలో ప్రధాన మైనది భగవద్బక్తి పరిపూర్ణ మైన,స్థిరమైన భక్తి విశ్వాసాలతో చేసిన భగవత్సేవ సర్వపాపాలను నశింప చేస్తుం దని శాస్త్రాలు ఉద్దోషిస్తున్నాయి. శారీరబలసౌందర్యాదులలో వలెనే బుద్ధిబలం విషయంలో కూడ మానవునికీ మానవునికీ మధ్య ఎంతో తారతమ్యం ఉంటుంది. లౌకికవ్యవహారాలలో- సామాన్యమైన బుద్ధిబలమూ మేధాశక్తీ ఉన్నవానిని చిన్న పనులలో నియోగించి అధిక మైన బుద్ధిబలమూ,ఆలోచనాశక్తీ,గ్రహణశక్తీ ఉన్నవానిని,అవి అవసరమైన పెద్ద పనులలో నియోగిస్తూంటారు. విద్యాబుద్దులు నేర్పేటప్పుడు క్రింది స్థాయిలో ప్రారంభించి) క్రమక్రమంగా పై స్థాయిలోనికి తీసికొనివెడుతూంటారు. భక్తీ, ఆధ్యాత్మికజ్ఞానమూ మొదలైన విషయాలలో కూడ ఈ పద్ధతినే అవలంబించా లని హిందూమతం దృధంగా విశ్వసిస్తుంది. ఎవనికి ఏ విధమైన శిక్షణ ఇస్తే అతదు క్రమక్రమంగా ఈ విషయాలలో ముందుకు బైక్షకలుగుతాడో అలాంటి శిక్షణ ఇచ్చి ఆతనిని ముందుకు నడపాలి.దీనినే అధికారిభేదంచేత వేరు వేరు పద్ధతులలో భగవత్తత్త్వాన్ని బోధించడం అంటారు. వేదాలలోను,పురాణాలలోను, ఇతిహాసాలలోను అనేకదేవతల వర్జనలూ, స్తుతులూ ఉన్నాయి.మనకు ప్రత్యక్షంగా కనబడే పృధివీ-ఉదక-అగ్నులలోను, వాయువులోను, సూర్యచంద్రాదులలోను వాటి స్థూలజదరూపాలకు అతీతంగా అధిష్టానదేవత లున్నా రని శాస్త్రాలు చెపుతున్నాయి. ఇంక ఈ అనంతాకాశంలో ఎన్ని లోకా లున్నాయో, ఎందరు దేవత లున్నారో ఆ విషయా లన్నీ ఊహకు అందనివి.మానవుడు ఈ దేవత లందరినీ మన్నిస్తూ ఏదో ఒక దేవతను 'ప్రధానదేవతగా గ్రహించి దానిని నిరంతరము ఆరాధించాలి. ఒక మహానగరంలో కొన్ని వేలమంది మవాధనికు లుండవచ్చు.జీవికకోసం తిరుగుచున్న ఒక పేదవాడు వాళ్లందరినీ ఆశ్రయించ నవసరంలేదు. అది శక్యం కాదు కూడ. ఒకనిని ఆశ్రయిస్తే తన జీవనం నడిచిపోతుంది.అట్లే ఇది కూడ.ఎందరు దేవతలను,ఏ దేవతలను ఆరాధించినా ఏకం సద్విప్రా బహుధా వదస్తొఅను సత్యాన్ని మరువకూడదు. 'ఇష్టదేవత' అను భావానికి ప్రధానకారణం ఈ అలవాటే. ఈ దృష్టితో ఏ దేవునికైనా, దేవికైనా,విభిన్నజాతులకు చెందిన వాళ్లూ ఆటవికాదులూ తమ ఆచారాల ప్రకారం కులక్రమాగతంగా విశ్వసిస్తూన్న ఏ దేవళకైనా ఒక రూపం కల్పించుకొని, దాని
హిందూమతం 13 ప్రకారం మూర్తులను,విగ్రహాలను నిర్మించుకొని అచంచల శ్రద్ధాభక్తులతో వాటిని ఆరాధించేవాళ్లు ఈశ్వరానుగ్రహానికి పాత్రు లవుతా రని హిందూమతం బోధిస్తుంది. ఇతర మతాలలో వేటిలోనూ లేని ఇంతటి విశాలదృక్పథం హిందూమతంలో కనబడదానికి ఈ సిద్ధాంతమే మూలకారణం.నిజానికి ఈ పద్ధతి పూర్వకాలంలో ప్రపంచకంలోని అన్ని దేశాలలోను,అన్ని జాతులలోను వివిధరూపాలలో ఉండేది. ఒక కాలంలో వైదికములైన యజ్ఞాలకు (ప్రాధాన్యం ఉందేది.వేదంలో వర్దించిన ఇంద్ర-వరుణ -అగ్వ్యాదిదేవతలను ఉద్దేశించి మంత్రోచ్చారణపూర్వకంగా నెయ్యి మొదలైన ద్రవ్యాలను అగ్నిలో హోమం చేయడం ప్రధానంగా ఉన్న యజ్ఞాదులు వేదాలలోను, వాటికి సంబంధించిన (శ్రౌతసూత్రాలలోను, కల్పసూత్రాలలోను విధింపబడ్డాయి. వీటిలో అనేకవిధాల యజ్ఞాలు ఉన్నాయి. కొన్ని రోజుల పాలు జరిపేవి,మాసాలకొలది, సంవత్సరాలకొలది జరిపేవి కూడ ఉన్నాయి.ఇవి ఏ దేశాలలో ఆచరిస్తారో ఆదేశా లన్నీ సుభిక్షంగా,సుఖశాంతులతో వృద్ధి పొందుతాయి. వేదాల చివరి భాగా లైన ఉపనిషత్తులలో ఈ యజ్ఞాలకు తోడు అనేక ఉపాసనలు విధింపబడ్డాయి. ఆదిత్యుడు, మనస్సు,ఓంకారము మొదలైనవాటిని సర్వశక్త మైన (బ్రహ్మగా భావన చేయగా చేయగా మనస్సుకు అపూర్వమైన శక్తి లభించి సకలశ్రేయస్సులు లభించడమే కాకుండా చివరకు ముక్తి కూడ లభిస్తుంది. నిరంతరభావనకే ఉపాసన అని పేరు.ఇలాంటి ఉపాసనలు ఎన్నో చెప్పబడి ఉన్నాయి కొందరు యజ్ఞయాగాదులు చేస్తే కొందరు ఉపనిషదుక్తము లైన ఉపాసనలు చేసేవారు. కాలాంతరంలో-వేదాలలో అక్కడక్కడ నిర్దేశించిన విష్ణువు, శివుడు, 'ప్రజాపతి,దేవి మొదలైన దేవతలను హోమప్రధానాలైన యజ్ఞాల ద్వారా కాక ఇతరవిధాల ఆరాధన చేసే సంప్రదాయాలు ప్రచారంలోనికి వచ్చాయి. ఈ విధంగా హిందూమతంలో వైష్ణవము, శ్రైవము,శాక్తము అను మూడు ప్రధాన మైన సంప్రదాయా లున్నాయి. ఈ సంప్రదాయాలకు చెందిన వారు వరుసగా శ్రీమహావిష్ణువును, శివుణ్డీ దేవినీ (శక్తినీ) అత్యుత్తమప్రధానదేనతగా ఆరాధిస్తారు. ఇవి కాక గణపతీ, సూర్యుడూ, కుమారస్వామీ మొదలైన దేవతలకు అత్యున్నత న్థానం
[4 హిందూమతం ఇచ్చి పూజించే సంప్రదాయాలు కూడ దాదాపు పదిహేను ఉన్నాయి. (ప్రతీ సంప్రదాయానికీ కొన్ని ప్రమాణ(గ్రంథా లున్నాయి. వాటికి ఆగమాలు అనీ, తంత్రగ్రంథా లనీ పేరు. ఆ యా దేవతలకు సంబంధించిన అర్చనావిధానాదులు, విగ్రహనిర్మాణానికి సంబంధించిన (విగ్రహాల అవయవాలు, ఆయుధాలు, (స్రమాణం, ఆకారం మొదలైనవాటిని గూర్చిన) నియమాలు,విశిష్టమైన పూజలు జరుపవలసిన పర్వదినాదులు ఈ ఆగమాలలో చెప్పబడి ఉంటాయి. ఒక్కొక్క ఆగమంలోని విషయా లన్నీ సమగ్రంగా తెలుసుకోవా లంటే అది సుదీర్షపరిశమచేత మాత్రమే సాధ్య మైన విషయం.అ యా ఆగమాలలో పరిపూర్ణపాండిత్యం సంపాదించిన పండితులు దేశంలో అక్కడక్కడ ఉంటూ మార్దదర్శనం చేస్తూంటారు. అలాంటి పండితుల మార్గదర్శనంలో జనులు తమ తమ అభిరుచులను పట్టి దేవాలయాదులు నిర్మించుకొంటూ,ఆ యా దేవతలను ఆరాధించుకొంటూ పరస్పర సహకారంతో సంతోషథరితమైన జీవనం గడుపుతూంటారు. అందరి గమ్యమూ ఒకటే అని మాత్రం ప్రతీ హిందువూ గాఢంగా విశ్వసిస్తాడు.
పుష్పదంతు డను గంధర్వుడు రచించిన మహ్ష్నిమ్నస్తోత్రం అనే అతిప్రాచీన
మైన స్తోత్రంలో ప్రసిద్ధ మైన ఒక శ్లోకం ఉంది-
“త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ,
రుచీనాం వైచిత్ర్యాద్భజుకుటిలనానాపథజుషాం
నృణామేకో గమ్యస్వ్వమసి పయసామర్హవ ఇవ”.
“వేదవిహితా లైన యజ్ఞయాగాదికర్శలూ, సాంఖ్యదర్శనం, యోగదర్భనం, శైవమతం, వైష్ణ్రమతం-ఈ మొదలైన వన్నీ నిన్ను చేరడానికి వేరువేరు మార్గాలు. అయితే -పరమేశ్వరా! మానవులు వారి వారి అభిరుచులను పట్టి ఇది ఉత్తమ మైనది, ఇది శ్రేయస్కర మైనది అని అంటూ వేరు వేరు మార్గాలను-కొందరు బుజువైన (వంకట టింకరలు లేని దగ్గర) మార్గాన్నీకొందరు కొంచెం వంకరగా ఉండడంచేత దూరమైన మార్గాన్నీ అనుసరిస్తూంటారు. ఏమైనా-నదు లన్నీ చివరికి సముద్రంలోనికే ప్రవేశించి నట్లు, అందరూ నిన్నే చేరవలసి ఉంది”.
హిందూమతం 15
వేదంలో చెప్పిన విషయాన్నే పునరుద్దాటిస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన మహోపదేశం భారతీయులలో అనూచానంగా వస్తూన్న ఈ విశ్వాసాన్ని మరింత దృధం చేస్తూన్నది-
“యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్,
మమ వర్మానువర్తన్తే మనుష్యాః పార్ధ సర్వశహొ(భ.గీ. 4 11)
“అర్జునా!నన్ను ఎవరు ఏ విధంగా సేవిస్తారో వాళ్లను నేను అదే విధంగా ఆదుకొంటాను. మానవులు అన్ని వైపులనుండీ వచ్చి చేరేది నన్నే.
పరమేశ్వరుడు సర్వజ్ఞుడు,సర్వగతుడు,సర్వశక్తుడు అని ఆస్తికు లందరూ అంగీ కరిస్తూన్న విషయమే. అలాంటప్పుడు భక్తులను అనుగ్రహించదానికై ఆ పరమేశ్వరుడు _ అనేకరూపాలు ధరించడంలో అసంభావ్యత్వం ఏముంది అని సూచిస్తారు శ్రీశంకరా చార్యులు ఒక చోట- “స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్భానశాత్ మాయామయం రూపం సాధకానుగ్రవార్ధమ్”
(బ్రహ్మసూత్రభాష్యం. 1. 1.23)
అనేకరూపాలు ధరించి నట్లే పరమేశ్వరుడు అనేకవస్తువులలోను, అనేకతీర్థాల లోను, అనేకక్షేత్రాలలోను అధికంగా సంనిహితుడై ఉండి అనేకపద్ధతులలో తనను ఆరాధించే భక్తులను ఆదుకొనవచ్చును. అందుచేతనే హిందువులు భగవంతుడు సర్వగతుడే అయినా కజ్జతోను,శిలతోను నిర్మించిన కొన్ని విగ్రహాలలోను, ఇతర వస్తువులలోను, దేవాలయాదులలోను, చిత్రఫలకాదులలోను,అగ్ని-సూర్య- జలాదులలోను అధికాంశతో సంనిహితుడై ఉంటా దని విశ్వసించి అనేకవిధాల ఆ పరమేశ్వరుణ్హి ఆరాధించి తరిస్తారు. ఇంకా పరిపక్వ మైన మానసికస్థితిని సంపాదించినవాళ్లు తమలోనే పరమేశ్వరు డున్నా డని భావన చేసికొంటూ వకాగ్ర చిత్తంతో ఉపాసిస్తారు.ఇవన్నీ మానసిక అవస్టాభేదాన్నీఅభిరుచుల భేదాన్నీ పట్టి ఏర్చడిన పద్ధతులు. అన్నీ మంచి మార్గాలే.
“అప్పు దేవా మనుష్యాణాం దివి దేవా మనీషిణామ్,
కాష్టలోష్టేషు మూర్ధాణాం యుక్తస్యాత్మని దేవతా” (శాతాతపస్మృతి)
“అగ్నౌ క్రియావతాం దేవో దిని దేవో మనీషిణామ్,
(ప్రతిమాస్వబ్బబుద్ధీనాం యోగినాం హృదయే హరిః (శాతాతపస్మృతి)
16 హిందూమతం
“సాధారణమానవులకు (వాళ్ల అభిప్రాయం (ప్రకారం) దేవతలు ఉదకాలలో ఉంటారు. బుద్ధిమంతులకు స్వర్గలోకంలో ఉంటారు. అంతగా జ్ఞానం లేనివారికి కజ్జలలోను మట్టిబెడ్డలలోను (శిలాదులలోను) ఉంటారు.యోగికి ఆ దేవత తనలోనే ఉంటుంది”.
“యజ్ఞయాగాదులు చే సేవాళ్లకి దేవుడు అగ్నిలో ఉంటాదు.బుద్ధిమంతులకు స్వర్గంలో ఉంటాడు. అల్పబుద్ధులకు ప్రతిమలో ఉంటాడు. యోగులకు హరి ప్పదయంలోనే ఉంటాడు"”-
ఇత్యాదివాక్యాలలో చెప్పినట్లు ఎవరికి వారు తమ మానసికస్టెతి, అధ్యాత్మికస్థెైతి ఎలాంటిదో అంచనా వేసికొని తదనుసారంగా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఇతరులను ఆక్షేపించకుండా ఉంటే క్రమంగా ఉన్నతమైన ఆధ్యాత్మికస్టితిని సాధించి ముక్తు లవుతారు. అధికారభేదం చేత ఆరాధనాఖేదం అంటే ఇదే.
హిందూమతంలో ఉన్న ఈ '“అధికారభేదంచేత ఉపదేశం? అను విధానాన్ని ఒక విశిష్ట లక్షణంగా వర్జిస్తూ ఆనీ బెసంట్ ఇలా అంది. "115 0౧6 ౦0 111౧6615౧౫5 61500419[100 ౦0౧4/4019గ51410, 21 | ౧౭౩ 16400100 10౧౪16 ౧౧౦05 19౧0౧2౧1 స్తో 09 ౧౧౦౪౪56, 6౧౨౦౧2౦1౧0 6%) &|| ౪4010 06 94౧౧6 ౧016" (9ఆగి.
పైన చెప్పిన విధానాలే కాక ఇష్టదేవతారాధనవిషయంలో మరొక విధానం కూడ అత్యధికప్రచారంలో ఉంది.ఒకే దేవతను (విష్ణువును,శివుణ్ణి, శక్తిని లేదా మరొక దేవతను) వేరు వేరు ఫలితాలకోసం వేరు వేరు రూపాలలో ధ్యానిస్తూ ఆ రూపానికి నిర్దిష్ట మైన ఒక చిన్న మంత్రాన్ని జపించడం అనేది ఈ విధానం. ఈ మంత్రంలో ఒకే అక్షరం మొదలు నూరుదాకా ఎన్నైనా అక్షరాలు ఉండవచ్చు; ఎక్కువ కూడ ఉండవచ్చు.దానిని యథావిధిగా ఏకా(గ్రచిత్తంతో జపిస్తే (పైకి వినబడకుండా చదవాలి లేదా మనస్సులోనే మననం చెయ్యాలి) అత్యుత్తమమైన ఫలాలను సాధించవచ్చు నను విశ్వాసంతో ఈ మంత్రజపం ద్వారా సిద్ధిని పొందిన, పొందుతూన్న ఎందరో మహాపురుషులు భారతదేశంలో ఉన్నారు. ఈ జపయజ్ఞంలో వివిధవస్తువులను ప్రోగుచేసికొనవలసిన శ్రమ గాని,బాహ్యాడంబరాలు గాని, నాలుగు దిక్కులకూ మైకులు తగల్చి పొలికేకలు పెట్ట వలసిన అవసరం గాని, ఇతరులను బాధ పెట్టవలసిన పని కాని ఉండదు. సాధకు డొక్కడే. ప్రశాంతచిత్తంతో వివిక్తదేశంలో
హిందూమతం 17 కూర్చుండి చేయవలసిన యజ్ఞం. ఇలాంటి మంత్రాలు తంత్రగ్రంథాలలో వేలకొలది ఉన్నాయి.వాటిని సంప్రదాయం తెలిసిన, ఉత్తమసాథకు దైన గురువునుండి తెలిసికొని, జపించాలనీ,ఈ యజ్ఞం నిష్టామంగా చేసినవాడు మోక్ష మార్గాన్ని కూడ అధిరోహించ వచ్చు ననీ హిందువుల విశ్వాసం. అందుచేతనే శ్రీకృష్ణుడు యజ్ఞాలలో జపయజ్ఞం ఉత్తమ మైన దని సూచిస్తూ “ఆ జపయజ్ఞం నేనే"అంటాడు-
“యజ్ఞానాం జపయజ్జో౭_స్మి”. (భ.గీ. 10.25)
అయితే ఈ మంత్రజపంతో పాటు చేసే ఎన్నో తాంటత్రికవిధానాలు కూడ తం(త్రశాస్త్ర గ్రంథాలలో ఉన్నాయి.శైైవ-శాక్తాదులలో ఇవి అత్యధికంగా కనబడతాయి. అదంతా ఒక అతిగహన మైన (ప్రక్రియ.ఇవన్నీ భారతదేశంలో అన్ని ప్రాంతాలలోను ఏదో రూపంలో ఈనాటికీ ప్రచారంలో ఉన్నాయి.
దేవాలయాలను కట్టించడానికీ,వాటిలో స్థాపించవలసిన వివిధ దేవతా విగ్రహాలను నిర్మించడానికీ, ఆగమాలలో అనేక నియమాలు చెప్పబడి ఉన్నాయి. వాటి ప్రకారం నిర్మించిన దేవాలయాలలో ఆ విగ్రహాలను స్థాపించడానికి ముందు కొన్ని దివసాల పాటు కొన్ని జపహోమాదులు చెయ్యాలి. బంగారు రేకులపై గాని, రాగి రేకులపై గాని శాస్త్రంలో చెప్పిన పద్ధతిలో కొన్ని రేఖలు నిర్దీతము లైన ఆకారాలలో గీయించి (వీటికి యంత్రా లని పేరు) వాటికి శాస్తోక్తవిధానంలో సంస్కారం చేయించి దానిని ముందుగా స్టాపించి,దానిమీద లేదా సమీపాన విగ్రహం స్టాపిస్తారు. అలాంటి దేవాలయంలో ఆ విధంగా స్థాపించిన విగ్రహానికి పూజార్హత లభిస్తుంది.దానికి నిత్యము ఒక శాస్రీయపద్ధతిలో పూజలు జరగాలి.ఆ పూజాదులు యథావిధిగా జరిగినకొలదీ దాని తేజస్సు,శక్తీ పెరుగుతా యని శాస్త్రం -
“అర్చకస్య తపోయోగాదర్చనస్యాతిశాయనాత్,
అభిరూప్యాచ్చ మూర్తీనాం దేవః సొంనిధ్యమృచ్చతి”.
“అర్చకుని తపఃశక్తివేతాాఅర్చ్బన బాగా జరగడం చేతా,విగ్రహాలు చక్కగా ఉండడంచేతా దేవుడు వాటిలో ఉంటాడు”.
హిందూమతంలో దేవాలయాలకు వాటిలో పూజలు చేసేవారికీ, ఇంత ప్రాధాన్యం ఉంది.
18 హిందూమతం యజ్ఞాల ప్రాధాన్యం
ఈ భూమిమీద ఉన్న సచేతనపదార్ధ మైనా అచేతనపదార్ధ మైనా దాని స్థితి (ఉనికి) ఎన్నో ఇతరపదార్థాల స్థితిమీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మన ఎదురుగా ఉన్న బల్లమీద ఒక పుష్పగుచ్చం అందంగా కనబడుతూన్నది. పుష్పాలు పుప్పించడానికి కొన్ని మొక్కలు, వాటికి అనుకూలవాతావరణం, ఆ పుష్పాలను చక్కగా గుచ్చంగా కట్టగలిగిన శిల్పి, దానికి ఆధారమైన ఒక పాత్ర, ఆ పాత్ర నిలబడడానికి బల్ల, ఆ బల్లకు ఆధారంగా గదిలోని నేల ఈ విధంగా ఎన్నో వస్తువు లుంటే ఆ పుష్పగుచ్చం అలా నిలచి ఉంది. అట్లే ఒక మనిషి ఆ విధంగా కొంత కాలం ఉండదానికీ, ఆ యా పనులు చేయడానికీ కొన్ని వందల, వేల, ఇతరపదార్థాల ఉనికీ, వాటి సాహాయ్యమూ అవసరం. ఇది భూలోకంలో మనం చూస్తూన్న పదార్థాల విషయంలో స్పష్టంగా కనబదే, కొంత వరకు ఊహించడానికి శక్య మైన పరాధీనతకీ, అన్యోన్యసహకారానికీ ఉదాహరణం.
ఇదే విధంగా ఈ భూలోకం ఇలా నిలబడదానికీ, ఈ లోకంలోని వ్యవహారా లన్నీ ఇలా జరగడానికీ స్వర్గాదులైన ఇతరలోకాల సాహాయ్యము, అవలంబనమూ కూడ అవసర మని హిందూమతం చెపుతుంది. అయితే ఈ లోకాల మధ్య, ప్రధానంగా భూలోకానికీ, స్వర్గలోకానికీ మధ్య భూలోకంలోని (ప్రాణులకీ, స్వర్గంలోని దేవతలకీ మధ్య సంబంధం ఏర్పరచే సాధనం ఒకటి ఉంటేనే ఈ అన్యోన్యసహకారమూ, పరస్పరావలంబనమూ కుదురుతాయి. ఆ సాధనమే యజ్ఞం.
ఈ యజ్ఞంలో బాహ్యయజ్ఞాలు, ఆంతరయజ్ఞాలు అని రెండు భేదాలు ఉన్నాయి. మొదటిది ద్రవ్యయజ్ఞాలు లేదా దైవయజ్ఞాలు. అగ్ని హోమం చేసే ఆవు నెయ్యి పాలు, పెరుగు మొదలైన పదార్థాలు, మంత్రాలు, హోమం చేసేవాడు, చేయించేవాడు ఇలాంటి (ద్రవ్యాలను సేకరించుకొని దేవతల నుద్దేశించి చేసే యజ్ఞాలు ద్రవ్యయజ్ఞాలు (బాహ్యయజ్ఞాలు). భావనమీద ఆధారపడినవి ఆంతర యజ్ఞాలు. వీటికి ఇతరబాహ్యదద్రవ్యాలతో పని లేదు. సాధకుడు (కర్త) ఒక్కడూ ఉంటే చాలు. ఇలాంటి అనేకయజ్ఞాలను గూర్చి వేదాలలో చెప్పబడి ఉన్న దని “వీవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే” (భ.గీి. 4.32) అని భగవద్గీతలో చెప్పబడింది.
హిందూమతం 19 వేదవిహితా లైన బాహ్యయజ్ఞాలు చాల వరకు ధన - ధాన్య - పళశ్వాది సమృద్ధికీ, అతివృష్టి - అనావృష్టి - శత్రుబాధాదుల నివృత్తికీ ఉపయోగించేవి. వీటిని యథాశాస్త్రంగా నిర్వహిస్తే అలాంటి ఫలా లన్నీ పొందవచ్చు ననే పరిపూర్ణ విశ్వాసంతో వాటిని ఆచరించి ఆ ఫలాలను ఎందరో పూర్వం పొంది నట్లు, ఈ నాడు కూడ పొందుతూన్నట్లు ఎన్నో ప్రమాణాలు కనబడుతున్నాయి. వైదిక మైనా, లౌకికమైనా ఏ కర్మైనా కోరిన ఫలం ఇవ్వా లంటే దానిని యథావిధిగా ఆచరించాలి. నామమూ, రూపమూ - ఈ రెండే జగత్తు అనగా, అని దార్భనికులు చెపుతారు. ద్రవ్యమూ, దేవతా - ఈ రెండే యాగం అనగా, అని కర్మకాండప్రవీణు లైన పూర్వమీమాంసకులు చెపుతారు. అదే విధంగా ఏ వైదికకర్మ నైనా యథా శాస్త్రంగా నిర్వహించా లంటే రెండు కావాలి - ఒకటి అతిపవిత్ర మైన గవ్యాన్ని (పాలు, పెరుగు, నెయ్యి) ఇచ్చే గోవు కావాలి. హిందూమతం ప్రకారం గోవుకూ, గవ్యాలకీ ఉన్న పవిత్రత్వం వర్ణనాతీత మైనది. ఆవునేతిని ప్రత్యక్షంగా హోమం చేయడమే కాకుండా హోమంచేసే సమిధలు మొదలైన ఇతరవస్తువులను అన్నింటినీ కూడ అవునేతి స్పర్శచేత పవిత్రం చేసి హోమం చేస్తారు. ఆవునేతికి బదులు బట్టి నెయ్యి గాని వాటి అసలు స్వరూపం ఏమిటో తెలియని దాల్దావంటి పదార్థాలు కలిపిన నెయ్యి గాని హోమం చేస్తే విపరీతఫలమే లభిస్తుంది. పరిశుద్ధమైన పట్టు తేనెకు బదులు బెల్లం పాకంతో సిద్ధమకరధ్వజం సేవిస్తే అది వారంరోజులలో వికటిస్తుంది. అనవసరంగా ఆయుర్వేదం మందులకు అపర్తీర్తి వస్తుంది. అందుచేత _ ఏ వైదికకర్మ యైనా సత్ఫలితా లివ్వాలంటే ముందుగా మంచి గోవులను పోషించి వాటికి చెత్తా చెదారం కాకుండా మంచి ఆహారం ఇవ్వాలి. ౪ గవ్యం అతిపరిశుద్ధ మైనది. ఇదే విధంగా కర్మలలో వినియోగించే మంత్రాలను నిర్జుష్టంగా ఒక్క అక్షరం కూడ పొల్లుపోకుండా, స్వరం చెదిరిపోకుండా ఉచ్చరించ గలిగిన బుత్విక్కు ఉండాలి. అక్షరాలు తారుమారైనా లోపించినా, స్వరాలు క్రిందుమీ దైనా ఆ కర్మ చెడిపోవడమే కాకుండా చెడ్డ ఫలితాన్ని కూడా ఇస్తుంది. టెలిఫోను నంబరు ఒక్క అంకే మారిపోయినా, ఇ మైల్ చేసే టప్పుడు పెద్ద అక్షరానికి (020112116646కి) బదులు చిన్న అక్షరం ఉపయోగించినా, కామాకు బదులు ఫుల్స్టాప్ పెట్టినా,
20 హిందూమతం పుల్‌స్టాప్‌కు బదులు మరొక గుర్తు పెట్టినా యంత్రం మొరాయించడం చూస్తున్నాం కదా? దివ్యదృష్టితో ఎన్నోవిషయాలు తెలిసికొని “ఈ విధంగా చేస్తే ఈ ఫలం పొందవచ్చును” అని బుషులు మన కందించిన విషయాలతో స్వేచ్చగా ఆడుకొంటే సత్ఫలితాలు రమ్మంటే ఎలా వస్తాయి?
ఈ విధంగా కర్మలు చేయదంవల్ల, హోమాదులు చేయడంవల్ల, ఆయా దేవతలకు కూడ పుష్టి లభిస్తుందనీ, దానితో తుష్టి పొందిన దేవతలు మానవులకు కావలసినవి ఆ యా పద్ధతులలో అందజేస్తా రనీ శాస్త్రం చెపుతూన్నది. అలా చేయకసోతే వాళ్లు కూడ మానవుల విషయంలో, మానవలోకం విషయంలో నిర్షక్ష్యభావం చూపుతారు. ఈ విషయం శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు-
“సహయజ్ఞాః ప్రజాః సృష్టా పురోవాచ ప్రజాపతిః,
అనేన ప్రసవిష్యధ్వమేష వోస్తిష్టకామధుక్”.
“దేవాన్ భావయతానేన తే దేవా భావయన్లు వః,
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్ప్యథ”
ఇష్టాన్ భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః,
తైర్ణత్తానప్రదాయైభ్యో యో భుజ్మే స్తేన వవ సజ” (భ.గీ.3. 10, 11,12)
“పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞాన్నీ ప్రజలనీ సృజించి (ఆ ప్రజలతో) “మీరు ఈ యజ్ఞం సాహాయ్యంతో ఉత్పత్తి చెయ్యండి; ఇది మీరు కోరిన కోరిక లన్నీ తీరుస్తుంది” అని చెప్పాడు”,
ఇంకా ఇలా చెప్పాడు - “మీరు ఈ యజ్ఞంచేత దేవతలను వృద్ధిపొందించండి (దేవతలకు సాహాయ్యం చెయ్యండి); వాళ్లు మిమ్మల్ని వృద్ధి పొందిస్తారు. ఈ విధంగా ఒకరి నొకరు వృద్ధిపొందించుకొంటూ గొప్ప శ్రేయస్సును పొందగలరు”. “యజ్ఞంచేత సంతోషపెట్టబడిన దేవతలు మీ కిష్ట మైన భోగా లిస్తారు; వాళ్లు ఇచ్చినదానిని వాళ్లకు సమర్పించకుండా తినేవాడు దొంగయే.*”
ఈ బాహ్యయజ్ఞం అగ్నిలో హోమాదులు చేస్తూ నిర్వర్తించే శాతయజ్ఞం కావచ్చు; దేవాలయాదులలో చేసే వివిధదేవతాపూజ కావచ్చు. మరొక విధ మైనది కావచ్చు. ఏ యజ్ఞ మైనా మానవునికీ దేవతలకూ మధ్య సంబంధం
హిందూమతం 21 ఏర్పరచేదీ తద్ద్వారా సమాజశ్రేయస్సుకు ఉపకరించేదీ అయిన ఉత్తమసాధనం. అందుచేతనే ఈ యజ్ఞాచరణ'్రక్రియ నిరంతరమూ కొనసాగా లనీ, పాలకులకూ, పాలితులకూ సమస్త లోకాలకీ క్షేమం చేకూరా లనీ చేసే ప్రార్ధన ఒక టుంది. దీనిని సాధారణంగా పురాణప్రవచనాదుల చివర చదువుతూంటారు -
“స్వస్తి ప్రజాభ్యః పరిపొాలయన్లాం
న్యాయ్యేన మార్చ్డేణ మహీం మహీశాః,
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినో భవన్తు.”
“ప్రజ లందరికి క్షేమం అగుగాక” అనేది ప్రధాన మైన కోరిక.అదెలా కలుగుతుంది? “రాజులు (పాలకులు) న్యాయసంమత మైన మార్గంచేత భూమండలాన్ని పాలింతురుగాక.” పాలకులు ధర్మసంమత మైన పాలన చేస్తేనే (ప్రజలు సుఖంగా ఉంటారు. ఐతే ఆ పాలకులకు సద్బుద్దీ, ధార్మికప్రవృత్తీ తగిన శక్తీ ఉండాలి కదా? ఇవన్నీ ఎలా లభిస్తాయి? “గోవులకూ బ్రాహ్మణులకూ నిత్యమూ శుభం కలుగుగాకొ అనగా గోవులూ, వేదవేత్తలై వైదికకర్మలను నడిపించడానికి తగు సామర్థ్యం గల ఉత్తములైన బ్రాహ్మణులూ క్షేమంగా ఉంటే శాస్తోక్తవిధానంలో యజ్ఞాదులు జరుగుతాయి. వాటివల్ల పాలకులకు సద్బుద్ధీ, ధార్మికప్రవృత్తీ, తగిన శక్తీ లభించి పాలితులైన ప్రజలు క్షేమంగా ఉంటారు. ఈ యజ్ఞాలవల్ల భూలోకానికే కాదు స్వర్గాదిలోకాలకి కూడ సుఖం కలుగుతుంది - “లోకాః సమస్తాః సుఖినో భవన్తూ.
ఇది యజ్ఞాదుల కున్న వైశిష్టాన్ని సూచిస్తూ చేసే ఈ ప్రార్ధనలోని సారాంశం. యజ్ఞంచేత దేనినైనా సాధించవచ్చు అను పూర్ణవిశ్వాసం ఉన్నవాళ్లు ఆ యజ్ఞసాధనాల విషయంలో అత్యధిక మైన ఆదరంలో పలికే “గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు” “బ్రాహ్మణాః సన్తు నిర్భయాళొ వంటి మాటలు వింటే ఈనాడు మనకు విడ్డూరంగా కనబడవచ్చు. వాళ్ల దృష్టితో ఆలోచిస్తే ఇవి సహజమైనవే అన్నట్లు కనబడతాయి. ఆ యా సమయాలలో ఉన్న అవసరాలను పరిస్థితులను పట్టి ఆవిర్భవించిన 'జై కిసాన్' 22 జవాన్” వంటి నినాధాలు ఎంత అర్ధవంతమైనవో, బొగ్గును నల్లబంగార
22 హిందూమతం మనీ, నదులమీద కట్టిన ఆనకట్టలను ఆధునికదేవాలయా లనీ అనడం ఎంత అర్ధ్థవంత మైనదో ఇవి కూడ అంత అర్ధవంత మైన వని గుర్తించవచ్చు. ఇక్కడ చెప్పిన గోవు లంటే గంగిగోవులు కాని జెర్సీ ఆవులు కావనీ, (బ్రాహ్మణు లంటే వేదవిదులూ, శుద్ధవర్తనులూ అయిన బ్రాహ్మణులు కాని వేదవాసన లేని వాళ్లు కాదనీ కూడ (గ్రహిస్తే సమస్య ఉండదు. ఇంతవరకూ మనం చూచినది బాహ్య యజ్ఞాలను గూర్చి మాత్రమే. కొన్ని ఆంతరయజ్ఞాలను, భావనా ప్రధానములైన యజ్ఞాలను కూడ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.
ఇంద్రియని[గ్రహము, ఆత్మజ్ఞానము మొద లైనవి కూడ యజ్ఞాలే అని వర్ణింపబడుతున్నాయి. యజ్ఞం అనగానే అక్కడ అగ్ని హోమం చేసే ద్రవ్యం, హోమం చేసేవాడు - ఇవన్నీ ఉండాలి. అందుచేత కొన్నింటిమీద ఆలంకారిక రీతిలో అగ్నిత్వాదములను కూడ ఆరోపించడం జరిగింది.
1 కొందరు బ్రహ్మ అను అగ్నిలో బ్రవ్మ అనే హవిస్సునే హోమం చేస్తున్నారు. ఇది జ్ఞానయజ్ఞం.
-
కొందరు ఇంద్రియాలను వాటిని నిగ్రహించడం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు. ఇది ఇంద్రైెయయజ్ఞం.
-
కొందరు శబ్దాదు లైన భోగ్యవస్తువులను ఇంద్రియా లనే అగ్నులలో హోమం చేస్తున్నారు. ఇది రాగ - ద్వేషరహితవిషయభోగం అను యజ్ఞం.
4& కొందరు ఇం(ద్రియాల కర్మలను, ప్రాణాల కర్మలను ఆత్మయందు నియమించడం, అను అగ్నిలో హోమం చేస్తున్నారు. ఇది చిత్తసమాధానం అను యజ్ఞం.
... 5. కొందరు ప్రాణాన్ని అపానంలో హోమం చేస్తున్నారు. ఇది పూరక ప్రాణాయామం అనే యజ్ఞం.
-
కొందరు అపానాన్ని ప్రాణంలో హోమం చేస్తున్నారు. ఇది రేచక (ప్రాణాయామం అనే యజ్ఞం.
-
కొందరు ప్రాణవాయుగతినీ, అపానవాయుగతినీ, నిరోధిస్తున్నారు. ఇది కుంభకప్రాణాయామం అను యజ్ఞం.
హిందూమతం 23
- కొందరు ఆహారనియమం పాటిస్తూ ప్రాణాలను పప్రాణాలలో హోమం చేస్తున్నారు. ఇది ఒక్కొక్క ప్రాణాన్ని జయించడం అనే యజ్ఞం.
(భగీ.4 25-30)
పైన చెప్పిన వాటిలో 5-8 యజ్ఞాలు ప్రాణాయామభేదాలకు సంబంధించినవి.
యజ్ఞం అనేదానిని అనేకవస్తువులను సంపాదించి ఆచరించవలసిన పని లేదు. అదొక విధానం కావచ్చును. ఆ యా క్రియలను యజ్ఞంగా భావించినా కూడ యజ్ఞఫలం లభిస్తుంది అని చెప్పడం వీటి అన్నింటియందు యజ్ఞత్వారోపం చేయడంలోని 'ప్రధానోద్దేశ్యం. భావనాప్రధానా లైన ఇలాంటి ఎన్నో యజ్ఞాలు ఆరణ్యకాదులలో చెప్పబడి ఉన్నాయి. అదొక విశిష్టమైన విచారణీయవిషయం. ప్రతీ ఒక్కరూ కూడ ఈ యజ్ఞాలలో ఏదో ఒక యజ్ఞం ఆచరించాలి. “అలా ఆచరించనివానికి ఇహలోకమే లేదు; ఇంక పరలోకం ఎక్కడ” అని శ్రీకృష్ణు డంటాడు.
“నాయం లోకోస్త్వయజ్ఞస్య కుతో౭_న్యః కురుసత్తమ”. (భ.గీ. 431)
పొందూమతంలో యజ్ఞాని కున్న ప్రాధాన్యం ఇది.
కర్మ సిద్ధాంత జూ పునర్జన్మసిద్ధాంతాలు
పిందూమతంలో కర్మసిద్దాంతమూ దానితో సంబంధించిన పునర్జన్మ సిద్దాంతము చాల ప్రధాన మైనవి.సృష్టిలో ఎంతో వైవిధ్యం కనబడుతున్నది.కొందరు సుఖవంతులు కొందరు దుఃఖవంతులు;కొందరు రూపవంతులు కొందరు కురూపులు; కొందరు ఆరోగ్యవంతులు కొందరు అనారోగ్యవంతులు. కొందరు ధీశాలులు కొందరు బుద్ధిహినులు-ఈ విధంగా మనుష్యులలోనే అనేకభేదాలు కనబడుతున్నాయి. ప్రాణికీ ప్రాణికీ మధ్య భేదం, జాతికీ జాతికీ మధ్య భేదం,ఒక దేశంలోని వాతావరణాదులకీ మరొక దేశంలోని వాతావరణాదులకీ భేదం- ఇన్ని విభేదాలకి ఏదో ఒక కారణం ఉండి తీరాలి.ఆ కారణమే కర్మ ప్రతీ జీవుడూ, అతడు మానవరూపంలో ఉన్నా ఏ ఇతరప్రాణిరూపంలో ఉన్నా తాను చేసిన కర్మఫలాన్ని అనుభవించవలసి ఉంటుంది.ఆ కర్మలలోని వైవిధ్యాన్ని పట్టి సృష్టిలో
24 హిందూమతం ఇంత వైవిధ్యం ఏర్పడింది. అంతేనే కాని దీని కంతకీ ఈశ్వరుదే కారణం అని హిందూమతం అంగీకరించదు. అలా చెపితే ఈశ్వరునికి రాగద్వేషాలు, పక్షపాతబుద్దీ ఉన్న ట్లవుతుంది. అలాంటివాడు ఈశ్వరుడే కాజాలడు. ఈశ్వరుడు చేసే దల్లా ఆ యా జీవులు వాళ్ల వాళ్ల కర్మల ఫలాలను అనుభవించడానికి తగిన విధంగా జగత్తును సృష్టిస్తూ, కొన్నాళ్లు దీని వ్యవహారాలు నదుపుతూ,తరవాత దీనిని కనబడకుండా చేస్తూ ఉండడమే. వీటికే స్థష్టి- స్టితి-ప్రలయా లని పేరు.పరమేశ్వరుడు సర్వజ్ఞుడు (అన్నీ తెలిసినవాడు), సర్వశక్తుడు (ఏ పనైనా చేయగలవాడు), సర్వగతుడు (అంతటా ఉన్నవాడు). అందుచేత ఆయనను ఎవరైనా ఆశ్రయిస్తే అలా ఆశ్రయించిన వాళ్ల పాపాలు,భగవంతుణ్ణి ఆశ్రయించిన పుణ్యానికి నశిస్తాయి. తరువాత వాళ్ల మనస్సు సత్మర్మలమీదనే ప్రసరించే టట్లు చేసి పరమేశ్వరుడు వాళ్లను ఉద్ధరిస్తాడు. చలితో బాధపడుతున్నవాడు అగ్నిని ఆశ్రయిస్తే అగ్నిలోని వేడి వీనికి సంక్రమించి శీతబాధ శాంతించి నట్లు పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఆయన శక్తులు ఆశయించిన వానికి సంక్రమించి కొంతవరకు వాని పాపం తొలుగుతుంది. అంతమాత్రమే పరమేశ్వరుడు చేసేది చేయకలిగినదీ కూడ. అందుకు తగిన ప్రయత్నం మాత్రం ఎవరిమట్టుకు వారే చేసికోవాలి.
“నాదత్తే కస్యచిత్సాపం న చైవ సుకృతం విభుః,
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యాన్ని జన్తవహొ. (భ.గీ.5. 15)
“ప్రభువైన పరమాత్మ ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసికొనడు. అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేయడంవల్ల ప్రాణులు మోహం చెందుతూంటారు"అని భగవద్గీతలో పరమాత్మ చెప్పి ఉన్నాడు.
కంటికి కనబడని అతిసూక్ష్మప్రాణి మొదలు స్వర్గాదులలో వసించే దేవాదుల వరకూ కూడ జీవు లందరూ తమ తమ కర్మలను అనుసరించి సుఖదుఃఖాలు అనుభవిస్తూ అనేకవిధా లైన జన్మ లెత్తుతూ ఉండవలసిందే.ఆ జన్మలు ఎత్తడం భూలోకంలో కావచ్చు ఇంకా వేలసంఖ్యలో ఉన్న ఇతరలోకాలలో కావచ్చు.కొందరికి పశు-పక్షి-మనుష్యాదిశరీరాలు లభిస్తే కొందరికి న్థావరాలైన చెట్లు, మొక్కలు మొదలైన వాటి శరీరాలు లభించవచ్చు. ఈ జననమరణ(ప్రవాహంలో ఏ జీవు
హిందూమతం 25 డైనా మనుష్యజన్మ గాని,అంతకంటె ఉత్తమ మైన దేవాదిజన్మ గాని ఎత్తితే అప్పుడు స్వప్రయత్నంచేత ఇంకా ఉన్నతమైన స్థితిని సంపాదించుకొనడానికి,పుణ్యసంపాదన ద్వారా సంచితపాపాన్ని తాలగించుకొనడానికీ అవకాశం ఉంటుంది.లభించిన ఆ సదవకాశాన్ని వ్యర్థం చేసికొని పాపకార్యాలు చేస్తే మళ్లీ పశుపక్ష్యాదిజన్మ లెత్తవలసి వస్తుంది. భూలోకంలో ఉన్న ప్రాణులలో స్వప్రయత్నంచేత ఉన్నతిని పొందదానికి గాని,అధోగతిని పొందదానికి గాని అవకాశం కేవలం మానవునికి మాత్రమే ఉంది.
కర్మసిద్ధాంతరహస్యాన్ని సరిగా అర్ధం చేసికొననివాళ్లు కొంతమంది కొన్ని ఆశంకలు చేస్తూంటారు-ఎవరి కర్మను అనుసరించి వాళ్లకు దాని ఫలం సుఖడుః ఖాల రూపంలో కలుగుతూంటుంది అని అంటే “అంతా దైవాధీనం; మానవుని చేతిలో ఏమీ లేదు” అని చెప్పిన ట్లవుతుంది. అలాంటప్పుడు మానవుడు ప్రయత్నాలు చేయడం ఎందుకు అనేది ఒక ఆశంక.ఈ కర్మ సిద్దాంతం-"ఏది ఎలా వస్తే దానిని అలా అనుభవించ వలసింద్కేమనం చేయగలిగినది ఏదీ లేదు”అను నిరాశావాదాన్ని (69900౧1500) బోధిస్తూన్నది అనేది రెండవ ఆశంక.కొందరు ఇతర మతస్థులు,అనాలోచితంగా వాళ్ల మాటలను అనువదించే కొందరు భారతీయులు చేసే ఆశంకలు ఇవి.
కర్మసిద్ధాంతంలో ఇలాంటి ఆశంకలకు వేటికీ తావు లేదు. ఏ మార్గదర్శక నియమాలతోను (6౪642 *రుయ]169) నిమిత్తం లేకుండా పరమేశ్వరుడు స్వేచ్చానుసారం జగత్తును సృష్టిస్తున్నాడు అని అంగీకరించే మతాలలోనే, నిజానికి, ఈ దైవాధీనతావాదానికీ (ఫ5ము), నిరాశావాదానికీ ()6మయణు) అవకాశం ఉంది.పరమేశ్వరుడు ఏ సమయంలో ఎవనికి ఏం చేస్తాడో ఏమీ తెలియదు కదా?ఏ సమయంలో ఏం జరుగుతుందో - అంతా పరమేశ్వరాధీనం (దైవాధీనం) మన చేతుల్లో ఏమీ లేదు అని కదా ఆ సిద్దాంతం ప్రకారం చెప్పాలి? ఇది దైవాధీనతావాదమూ, నిరాశావాదమూ కాకపోతే మరేమిటి? దేవుణ్జి శరణుపొందితే,ఆశ్రయిస్తే ఆయన రక్షిస్తాడు అని అంటే కర్మసిద్దాంతాన్ని కొంత వరకు అంగీకరించినట్లే కదా?ఆయనని ఆశ్రయించనివాళ్లు అన్యాయంగా బాధపడవలసినదే కదా?మొదటనే దేవుడు ఈ సృష్టిని ఏ నిమిత్తమూ లేకుండా
25 హిందూమతం ఇంత వైవిధ్యంతో ఎందుకు చేశాడు? ఆ మతాల (ప్రకారం ప్రతీవాని మంచి - చెడ్డలూ ఒక్క జన్మలోనే నిర్ణయించబడతాయి కదా?దేవుణ్ణి నమ్మనివాని గతి అధోగతే కదా?ఇదేమి న్యాయం?
హిందూమతం బోధించే కర్మసిద్ధాంతంలో ఈ దోషా లేవీ లేవు. ఈ సృష్టికి ఆది అంటూ లేదు.సృష్టి ఫలానా రోజున (క్రీ.పూ. 4004 సంవత్సరంలో) ప్రారంభం అయింది అన్న మాట లేదు.'జగత్' అనే పదానికి ఎల్లప్పుడూ అవిచ్చిన్నంగా ఇదే విధంగా నడుస్తూ ఉందేది అని అర్ధం. “సంసారం” అన్నా ఇదే అద్దం. ఎల్లప్పుడూ ప్రవహించేది 'సంసారం'”. జగత్తు ఇదే విధంగా కొంత కాలంపాటు నడుస్తూండగా 'ప్రలయం ఏర్పడుతుంది. అప్పుడు పంచభూతాలు తప్ప సమస్తలోకమూ నశించి పంచభూతాలలో లీన మైపోతుంది. జీవుల స్టూలశరీరాలు నశిస్తాయి. అది అవాంతరప్రలయం. కొన్ని లక్షల సంవత్సరాలకి పంచభూతాలు కూడ వాటికి కారణ మైన పరమేశ్వరశక్తిలో, మహామాయలో, నిలీన మైపోతాయి. అది మహాప్రలయం. కొన్ని లక్షల సంవత్సరాలకి మళ్లీ పంచభూతాదిక్రమంలో సృష్టి ప్రారంభం అవుతుంది. ఈ విధంగా సృష్టి-స్టితిా-ప్రళఉయాల చక్రం తిరుగుతూనే ఉంటుంది.
ప్రళయ - మహాప్రళయాలలో కూడ జీవులు స్ట్రూలశరీరాలు నశించగా సూక్ష్మ శరీరాలతో, వెన్నంటి ఉన్న కర్మలతో, అణగి ఉంటారు. అప్పుడు కూడ నశించరు. మళ్లీ సృష్టి ప్రారంభం కాగానే, వర్షం పడగానే నేలలో అణిగి ఉన్న గింజలు మొలిచినట్లుతమ తమ కర్మలను అనుసరించి వేరు వేరు స్టూలశరీరాలు ధరించి సుఖదుఃఖాలు అనుభవిస్తూంటారు. ప్రళయ-మహాప్రళయ-పునః సృష్ట్యాదులు కూడ జీవుల కర్మలను అనుసరించియే జరుగుతూంటాయి. ఇది హిందూమతం బోధించే సృష్టిప్రక్రియ.
ఈ విధంగా ఏ జీవు డైనా మానవుడుగా గాని, మరొక జంగమప్రాణిగా గాని, వృక్షలతాదిస్థావరప్రాణిగా గాని పుడుతున్నా డంటే తాను చేసినృతనను వెన్నంటి ఉన్న పూర్వకర్మను అనుసరించియే పుడతాడు. భూలోకంలోని ప్రాణులలో మానవునికి మాత్రమే విశిష్ట మైన జ్ఞానమూ, ఆలోచనాశక్తీ,వివేకమూ ఉన్నాయి.
హిందూమతం 27 ఇతర'ప్రాణులకు అవి లేవు.అవి ఎలా పుట్టాయో అలాగే కొంత కాలం జీవించి మరణిస్తూంటాయి.అవి ఈ జన్మలో పుణ్యం గాని పాపం గాని చేసే ప్రసక్తి లేదు.మానవులుగా ఉన్నప్పుడు చేసిన పుణ్యపాపాల ఫలితంగా సుఖదుఃఖాలు అనుభవిస్తూపుణ్యపాపాల అవశేషాలను పట్టి వివిధయోనులలో పుడుతూ ఏదో ఒక పూర్వపుణ్యాంశానికి ఫలంగా మనుష్యజన్మ ఎత్తుతాయి. జ్ఞానవివేకా లున్న మానవుడు మాత్రం శాస్త్రాలలో చెప్పిన మార్డాన్ని అనుసరిస్తూ నియమబద్ధ మైన జీవనాన్ని గడపాలి. అలాంటివాడు పుణ్యాత్ముడు.ఆ జన్మలోను రాబోయే జన్మలలోను సుఖవంతు డౌతాడు. అధికపుణ్యవంతు డ్రైలే ఉత్తమలోకాలకు కూడ వెడతాడు.శాస్త్రవిరుద్ధంగా ప్రవర్తించే దుష్టచరిత్రుడు పాపాత్ముడై అనేకజన్మలలో దుఃఖాలు అనుభవిస్తూ చివరికి మళ్లీ పశుపక్ష్యాది యోనులలో పుడతాడు. పశుపక్ష్యాదిప్రాణుల జీవనం దైవాధీనమే.మానవుని జీవనం మాత్రం దైవాధీనం కాదు.మానవుడు,దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు,తన బుద్ధిచేత,శాస్తాల సాహాయ్యంచేత, అందుకు కారణం పూర్వజన్మకృతపాపకర్మయే అని తెలిసికొని ఆ కర్మకంటె బలవత్తర మైన పుణ్యకర్మను చేసి గాని,పరిపూర్ణవిశ్వాసంతో భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధించి గాని ఆ పాపకర్మ దుర్భలం అయి పోయే టట్టుపూర్తిగా నశించే టట్లు కూడ చేసికొన కలుగుతాడు. ప్రసన్ను దైన పరమేశ్వరుడు తానుగా మానవుల పాపాలను తొలగించడం గాని,పుణ్యం పెంచడం గాని చేయకపోయినా అందుకు ఉపకరించే సత్మర్మలు చేయ గల శక్తినీ, సద్బుద్ధినీ వాళ్లకి కలిగిస్తాడు. దుష్టాత్ములను ఇంకా క్రిందికి అణగద్రొక్కడానికి వాళ్లచేత ఇంకా చెడ్డపనులు చేయిస్తాడు.పరమేశ్వరుడు వీళ్ల విషయంలో ఇలా చేయడానికి కూడ అసలు కారణం వాళ్ల పాపమే. ఈ విషయం కౌషీతకిబ్రాహ్మణాదులలో చెప్ప బడింది- “విష హ్యేవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతే, వష ఉ ఏవాసాధు కర్మ కారయతి తం యమధో నినీషతే”. (కౌ.బ్రా.3.8) ఈ విధంగా మానవుడు తాను చేసిన కర్మల ద్వారా తన ఉన్నతికి గాని అధోగతికి గాని తానే కారణం అని హిందూమతసిద్దాంతం. అందుచేత పశుషక్ష్యాది
28 హిందూమతం తిర్యస్టంతువులకు దైవాధీనత్వం కాని మానవునికి మాత్రం దైవాధీనత్వం లేదు.తన 'ప్రయత్నంచేత అతదు తనను తాను ఉద్దరించుకొనగలడు. వివేకపూర్వకంగా అలాంటి ప్రయత్నం చేయనివాడు పశ్వాదుల వలె దైవాధీనజీవనం గడపవలసిందే. పశువులు మంచి పని చేస్తే పుణ్యం లేదు, చెడ్డ పని చేస్తే పాపం లేదుఇలాంటి మానవునికి మాత్రం దైవవశంచేత చేసినా పుణ్యపాపాలు అంటుతాయి. దైవం అంటే మరేమీ లేదుుపూర్వజన్మకృత మైన కర్మయే దైవం అనగా -
“పూర్వజన్మకృతం కర్మ దైవమిత్యభిధీయడే”.
తెలిసి కాని తెలియక గాని ఈ జన్మలోనే ఏవైనా పాపకర్మలు చేసినా,ఇప్పుడు వచ్చిన కష్టాలను పట్టి పూర్వజన్మలలో ఏవేవో పాపకర్మలు చేసి నట్లు శాస్తాదుల ద్వారా తెలుసుకొన్నా వాటికి పరిహారంగా కొన్ని ప్రాయశ్చిత్తాలూ,దేవతాపూజలూ హిందూమతంలో విధింపబడి ఉన్నాయి.
“పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే,
తచ్చాన్సిరౌషథైర్టానైః తపోహోమక్రియాదిభిః”.
“పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధిరూపంలో బాధిస్తుంది. జెషధాలచేతా, దానాలచేతా, తపస్సుచేతా,హోమాదిక్రియలచేత దానిని తొలగించుకొనవచ్చును” అని ప్రసిద్ధళ్లోకం ఒకటి చెప్పుచున్నది. ఒక కర్మను మరొక బలవత్తర మైన కర్మచేత నిర్చీర్యం చేయవచ్చు నని చెప్పడానికి ఇది ప్రబల మైన తార్మాణం. అత్యధిక మైన పాపం చేస్తే పూర్వం చేసిన పుణ్యం కూడ నిష్ఫలమూ నిర్వీర్యమూ అవుతుంది. ఆ విషయాన్ని కూడ దృష్టిలో పెట్టుకొని మానవుడు ప్రవర్తించా లని ఈ మతం బోధిస్తూన్నది.
“తిభిర్వర్వై త్రిభిర్మాసైః త్రిభిః పక్షై త్రిభిర్దినై,
అత్యుత్మటైః పుణ్యపాపైః ఇహైవ ఫలమళ్చుతే”.
“చేసిన పుణ్యపాపాల బలాన్ని పట్టి మానవుడు అవి చేసిన మూడు సంవత్సరాలలో లేదా మూడు మాసాలలో,లేదా మూడు పక్షాలలో లేదా మూడు రోజులలో వాటి ఫలం అనుభవించవలసివస్తుంది”అని శాస్త్రం. ఈ విధంగా తన జీవితాన్ని, సమాజాన్నీ సుఖమయంగా గాని దుణఖభరితంగా గాని చేయగల శక్తి
హిందూమతం 29 మానవునిలోనే ఉంది అని చెపుతూ అందుకు తగిన సాధనాలను, ఉపాయాలనూ బోధించిన హిందూమతంలో కొందరు పాశ్చాత్యపండితులు ఆరోపించిన దైవాధీనతావాదానికి (1262115020) ఏ మాత్రమూ అవకాశం లేదు. ఇంక నిరాశావాదం గౌ౭59ళ50) మాట : చుట్టుప్రక్కల ఉన్న కష్టాలనూ, దుఃఖాలను, దుష్టప్రవృత్తులనూ గుర్తించి వాటిని గూర్చి మాటలాడడం నిరాశావాదం అవదు.“ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది;దీనికి పరిహారమార్గం ఏదీ లేదు”అని అంటే అది నిరాశావాదం అవుతుంది.“ఈ దోషాలను గుర్తించి వీటిని అధిగమించే శక్తి మానవునికి ఉంది”అని ధైర్యం చెప్పి,అందుకు తగిన ఉపాయాలు బోధించిన మతం నిరాశావాదస్థానం ఎలా అవుతుంది? రోగాన్ని గుర్తించిన తరువాతనే కదా చికిత్స ప్రారంభం అయేది?ఒక మూల జనం రోగాలతో బాధపడుతూండగా, దుష్టశక్తులు విజృంభించి సామాన్యమానవుణ్జి పీడిస్తూండగా “లేదు లేదు,అంతా బాగానే ఉంది”అనడం అజ్జత్వం అవుతుంది.క్షుద్రజంతువులు మొదలు దేవతాపురుషుల వరకూ అందరు జీవులూ ఏ నాటికైనా అత్యున్నతస్థితిని పాొందకలుగుతారు; వివేకవంతులు ప్రయత్నం చెయ్యాలి అని బోధించి అందుకు తగిన అనేకమార్గాలు చూపించిన హిందూమతంలో నిరాశావాదానికి ఏ మాత్రమూ తావు లేదు. వర్ణవ్యవస్థ ఒకటి-రెండు సహస్రాబ్బులకు పూర్వం బయలుదేరిన మతాలలో కూడ వందల కొలది భేదాలు, అవాంతరభేదాలు ఆవిర్భవించాయి. అలాంటపుడు అతి(ప్రాచీన మైన హిందూమతంలో శైవ-శాక్త-వైష్ణవాదిభేదాలు ఆ యా సంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో ఆచారభేదాలు ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే హిందువులలో సాంఘికంగా ఉన్న వర్ణవ్యవస్థ ఈ దేశంలో మాత్రమే ఉన్న ఇతరదేశాలలో లేని, ఒక విశేషం అని చెప్పవచ్చు. ఈ వ్యవస్థ ('ప్రథమంలో ఆ యా వ్యక్తులు చేసే పనులను పట్టి, స్వభావాలను పట్టి ఏర్పడిన దనీ, కాలక్రమంలో ఇది పుట్టుకతోనే నిశ్చయింప బడుతూ వచ్చిం దనీ అంటారు. వృత్తులను, పనులను పట్టీ వచ్చిన భేదాలు ఇతర దేశాలలో కూడ ఉన్నట్లు
30 హిందూమతం సర్వవిదితమే కాని పుట్టుకతో ఈ విభేదాలు నిర్ణయించడం అనేది మాత్రం హిందూసమాజంలో మాత్రమే కనబడుతుంది.
వర్దవ్యవస్థను గూర్చిన అనేక నిర్దేశాలు వైదికవాజ్బయంలోను. స్మృతులలోను, మహాభారతాది[గ్రంథాలలోని అనేక ప్రదేశాలలోనూ కనబడతాయి. ప్రపంచక వాజ్మయంలో అతిప్రాచీన మైన వాజ్బయం వైదికవాజ్బయం. వైదికవాజ్బ్యయంలో కూడ బుగ్వేద సంహిత అతిప్రాచీన మైన దని విమర్శకుల అభిప్రాయం. దానిలోని దశమ మండలం లోని పురుషసూక్తంలో తొలిసారిగా నాలుగు వర్దాల నిర్దేశం కనబడుతుంది. ఈ సూక్తంలో ఈ జగత్తంతా పరమేశ్వరుని దేహం అని వర్ణించబడింది. ప్రపంచ స్వరూపుడుగా భావించబడిన పరమేశ్వరునికి విరాట్ పురుషుడు అని పేరు. ఆ సూక్తంలో ఉన్న -
“బ్రాహ్మణో స్య ముఖమాసీత్; బాహూ రాజన్యః కృతః,
ఊరూ తదస్య యద్వైశ్వః, పద్భ్యాం శూద్రో£. జాయత” అను బుక్కులో *ఈ విరాట్పురుషనికి (బ్రాహ్మణుడు ముఖం; క్షతియుడు బాహువులు, వైశ్యుడు తొడలు, పాదాలనుండి శూద్రుడు పుట్టాడు, అనగా శూద్రుడు పాదాలు” అని చెప్పబడింది. ఇక్కడ (బ్రాహ్మణ-క్ష్మత్రియ (రాజన్య) వైశ్య- శూద్రనామధేయాలే చెప్పబడ్డాయి. కాని వీటికి *వర్ణం) అను పేరు అన్నట్లు చెప్ప బడలేదు.
ఆ సూక్తంలోని విరాట్పురుషత్వకల్పన ఇంకా ఈ విధంగా సాగింది - “క విరాట్పురుషనికి వేలకొలది శిరస్సులు, వేలకొలది కళ్లు, వేలకొలది పాదాలు ఉన్నాయి. అనగా జగత్తులో ఉన్న సమస్తప్రాణుల శిరస్సులు, నేత్రాలు, పాదాలు ఈ పురుషునివే అని అర్ధం. పూర్వం ఉన్నదీ, ఇపుడు ఉంటూన్నది, ముందు ఉండబోయేదీ, సమస్తము ఏతత్పురుషస్పరూపమే ... ఈ పురుషునినుండి బుగ్యజుః సామవేదాలు పుట్టాయి. అశ్చాలూ, రెండు పలువరుసలు గల పశువులూ, గోవులూ, మేకలూ, గొట్టెలూ, ఈ పురుషుని నుందే పుట్టాయి ... మనస్సునుండి చంద్రుడూ, నేత్రంనుండి సూర్యుడు, ముఖం నుండి అగ్నీంద్రులూ, ప్రాణంనుండి వాయువు, నాభినుండి ఆకాశం, శిరస్సు నుండి ద్యులోకం, పాదాలనుండి భూమి, చెవినుంది
హిందూమతం తె దిక్కులూ పుట్టాయి”. ఈ విరాట్ స్వరూపవర్జనం పూర్వాపరాలు పరిశీలించగా (బ్రాహ్మణాదులను ఆలంకారికరీతిలో ముఖాది రూపంలో కల్పించినట్లు స్పష్టం అవుతుంది. సమాజాన్ని ఒక పురుషునిగా భావన చేస్తే ఆ పురుషునికి ఈ (బ్రాహ్మణాదులు వివిధఅవయవాలు అని భావన చేయబడింది. శరీరావయవాలలో ఏ అవయవానికి ఉండవలసిన ప్రాధాన్యం దానికి ఉండనే ఉంటుంది. శరీరాన్ని నిలబెట్టడంలో అన్నింటికీ సమ్రాధాన్యమే. అందుచేత ఆ కాలం నాటికి ఈ వర్దాలలో తరతమభావం ఏదీ ఉన్నట్లు కనబడదు. బుగ్వేదబ్రాహ్మణారణ్య కాదులలోను, ఇతరవేదాలలోను ఈ వర్ణవిభాగం స్పష్టంగా కనబడుతుంది. స్మృతి- ఇతిహాస-పురాణాదుల కాలంనాటికి ఇది కొంతవరకు స్థిరత్వాన్ని సంపాదించు కున్నది.
వర్దాల ఆవిర్భావాన్ని గూర్చి బృహదారణ్యకోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది - సృష్టిప్రారంభంలో బ్రాహ్మణు డొక్కదే అగ్నిరూపంలో ఉండేవాడు. అప్పుడు అతనికి (బ్రహ్మ అని పేరు. అతడు ఒక్కడే అయి ఉండడంచేత, ఆతనికి తనను రక్షించుకునే శక్తి లేక, కర్మలు చేసే శక్తి లేకపోయింది. అప్పుడు అతడు 'క్షత్ర రూపం (క్షత్రియ జాతిని) సృష్టించాడు. ఇంద్రుడు, వరుణుడు, సోముడు, రుద్రుడు, పర్జన్యుడు, యముడు, మృత్యువు, ఈశానుడు - వీళ్లందరూ క్షత్రియదేవతలు.
“బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్; ఏకమేవ తదేకం సన్న్యభవత్.
తవ్చ్రేయోరూపమత్యసృజత క్షత్తమ”. (బృ.ఉ. 1.4. 11)
అప్పుడు కూడ, కర్మకు కావలసిన సంపత్తిని సమకూర్చేవాళ్లు లేకపోవడంచేత, అతడు కర్మ చేయలేకపోయాడు. అందుచేత వైశ్యజాతిని సృష్టించవలసివచ్చింది. అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, త్రయోదశవిశ్వేదేవతలు, సప్తమరుత్తులూ- ఈ గణా లన్నీ వైశ్యదేవతలు -
“స నైవ వ్యభవత్; స విశమసృజత” (బృ.ఉ.1. 412) అయితే అప్పుడుకూడ కర్మను పోషించేవాడు లేకపోవడంచేత అతడు కర్మ చేయలేక పోయాడు. అప్పుడు శూద్రజాతిని సృష్టించాడు. శూద్రుడే పూషుడు. అందరినీ పోషించే వాడని అర్ధం :
32 హిందూమతం . “స నైవ వ్యభవత్. స శౌద్రం వర్ణమసృజత పూషణమియం వై . పోషేయం హీదం సర్వం పుష్యతి యదిదం కించ” (బృ.ఉ.1.4 13)
ఈ విధంగా నాలుగు వర్జాల సృష్టి జరిగిన తరువాత కూడ అతనికి కర్మ చేసే సామర్థ్యం లభించలేదు. ఎందువల్ల ననగా ఉగ్రస్వభావం గల క్షత్రియజాతిని అదుపులో పెట్టవలసిన అవసరం ఉంది. క్షతియజాతినే కాదు; ఇతరులను కూడ, వాళ్లలో ఉండే సహజదోషాలను గుర్తించి, నియంత్రించవలసి వచ్చింది. అందుచేత వ్రేయోరూస మైన ధర్మాన్ని సృష్టించాడు. ధర్మం అనేది క్షత్రియునికి కూడ క్షత్రం-వానిని అదుపులో ఉంచగలిగినది. అందుచేత ధర్మాన్ని మించినది లేదు. రాజునుండి సాహాయ్యం పొందినట్లు ధర్మంనుండి సాహాయ్యం పొంది దుర్చలు దైనా బలవంతుణ్ణి కూడ వశం చేసికొంటాడు. సత్యమే ఆ ధర్మం -
“స నైవ వ్యభవత్; తత్ శ్రేయోరూపమసృజత ధర్మమ్. తదేతత్ క్షత్రస్య క్షత్రం యద్ధర్మఒ తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి; అథో అబలీయాన్ బలీయాంసం ఆళంసకే ధర్మేణ యథా రాజ్ఞా యోవై స ధర్మః సత్యం వై తతొ (బృ. ఉ. 1.4 14)
మహాభారతంలో వర్జవ్యవస్థను గూర్చిన చర్చ అనేక స్టలాలో కనబడుతుంది. 'వర్ణ' శబ్దానికి రంగు అను అర్ధం ్రసిద్ధమే. అందుచేత మనుష్యుల రంగును పట్టి ఈ వర్జభేదం ఏర్పడిం దనే వాదం కూడ ఉన్నట్లు మహాభారతంలో సూచింప బిడింది. భృగువు భరద్వాజునితో వర్ణవిభాగాన్ని గూర్చి చెపుతూ - పూర్వం (బ్రహ్మదేవుడు (బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-ళూద్రులను సృజించాడు; వీరిలో (బ్రాహ్మణుల రంగు తెలుపు, క్షత్రియుల రంగు ఎరుపు, వైశ్యుల రంగు పసుపు, శూద్రుల రంగు నలుపు అని అంటాడు -
“బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ ద్విజసత్తమ,
యే చాన్యే భూతసంఘానాం సంఘాస్తాంశ్చాపి నిర్మమే.
బ్రాహ్మణానాం సితో వర్ణః క్షత్రియాణాం తు లోహితః,
వైశ్యానాం పీతకో వర్షః శూద్రాణామసితస్తథా”. (శాం.ప.188.4,5) అది విని భరద్వాజుడు “శరీరవర్జాన్ని పట్టి వర్ణవిభేదం ఏర్పడింది అని చెప్పడం ఎలా కుదురుతుంది? అన్ని వర్జాలవాళ్లలోను అన్ని శరీరవర్థ్ణాలూ ఉంటాయి
హిందూమతం 33 కదా? కామం, క్రోధం, భయం, లోభం, శోకం, చింత, ఆకలి, అలసట, అన్ని వర్జాలవాళ్లకీ సమంగానే ఉంటాయి. రక్త-మాంస-స్వేద-మూత్రాదులు అందరి శరీరాలలోనూ సమంగానే ఉంటాయి. అదే విధంగా మనుష్యులే కాకుండా ఇతరస్టావర- జంగమాదుల, రంగులు కూడ వేరు వేరుగా ఉంటాయి. రంగుల భేదాన్ని పట్టి వాటిలో కూడ వర్ణభేదం ఉంటుం దని చెప్పవలసి ఉంటుంది కదా? అందుచేత రంగును బట్టి వర్ణభేదనిర్ణయం అసంగతం కదా?” అని ప్రశ్నిస్తాడు.
“చాతుర్వర్హ్యస్య వర్లేన యది వర్షో విభిద్యతే,
సర్వేషాం ఖలు వర్ణానాం దృశ్యతే వర్షసంకరః
కామః క్రోధో భయం లోభః శోకళ్చిన్తా క్షుధా శ్రమ
సర్వేషాం నః ప్రభవతి కస్మాద్వర్డో విభిద్యతే.
స్వేదమూత్రపురీషాది శ్లేష్మ పిత్తం సశోణితమ్,
తనుః క్షరతి సర్వేషాం కస్మాద్వర్భో విభజ్యతే.
జబ్గమానామసంఖ్యేయాః స్థావరాణాం చ జాతయః
తేషాం వివిధవర్షానాం కుతో వర్జవినిశ్చయక. (శాం.ప. 188. 6-9) అప్పుడు భృగువు ఈ విధంగా సమాధానం చెప్పాడు - “జగత్తు నంతనీ బ్రహ్మయే సృష్టించాడు. అందుచేత నిజానికి వర్ణభేదం లేదు. ఈ ప్రసంచకం అంతా “బ్రాహ్మం కర్మల భేదాన్ని పట్టి వర్దభేదం ఏర్పడింది.”
“న విశేషో౭స్తి వర్దానాం సర్వం బ్రాహ్మమిదం జగత్,
(బ్రహ్మణా పూర్వసృష్టం హి కర్మణా వర్షతాం గతమ్”. (శాం.ప. 188. 10) ఇంకా ఇలా చెప్పాడు - కొందరు ద్విజులు న్వధర్మాలను విడిచి కామభోగపరాయణులై, క్రోధస్వభావులై, తీక్షప్రవృత్తితో సాహసప్రియు లయ్యారు. వాళ్ల స్వభావంలో ఈ మార్పులు రావడంచేత వాళ్ల శరీరాలు రక్త వర్దాలు (ఎరుపు రంగు గలవి అయ్యాయి. అ ద్విజులే క్షత్రియు లయ్యారు. గోపాలనం చేస్తూ వ్యవసాయం చేసి జీవించే కొందరు ద్విజులు స్వధర్మాలను త్యజించారు. వాళ్ల శరీరాలు పచ్చగా తయా రయాయి. ఆ ద్విజులు వైళ్యు లయ్యారు. కొందరు
వెడే హిందూమతం హింస-అసత్యప్రధానులై, అన్ని పనులు చేస్తూ శౌచవిహీను లయ్యారు. వాళ్ల శరీరాలు నల్లగా అయ్యాయి. ఆ ద్విజులే శూ(్రులు. ఈ విధంగా ద్విజులే ఆ యా కర్మలను చేపట్టడంచేత వర్ణాంతరాన్ని పొందారు. అయితే వీళ్లందరూ యజ్ఞాలు చేయడం అనే ధర్మం ఆచరించవలసిందే. బ్రహ్మనుండి బయల్వెడలిన సరస్వతి (వేదం) వీళ్లందరికీ సమాన మైన సాత్తే. ధర్మాలను పాటించే వాళ్లు మాత్రం ద్విజులుగానే ఉంటున్నారు. ఇదే విధంగా (బ్రాహ్మసంతానంనుంచే కర్మభేదాలను పట్టి పిశాచ-రాక్షస-(ప్రేతాదులు, నీతి నియమాలు లేకుండా స్వేచ్చగా ప్రవర్తించే వివిధమ్లేచృజాతులూ ఏర్పడ్డాయి.
కామభోగప్రియాస్తీక్ష్ణాః క్రోధనాః ప్రియసాహసాః,
త్యక్తస్వధర్మా రక్తాజ్లాః తే ద్విజాః క్షత్రతాం గతాః
గోభ్యో వృత్తిం సమాస్థాయ పీతాః కృష్యుపజీవినః
స్వధర్మాన్ నానుతిస్టన్తి తే ద్విజా వైశ్యతాం గతాః
హింసాన్ఫతప్రియా లుబ్బాః సర్వకర్మోపజీవినఏ
కృష్ణాః శౌచపరిభ్రష్టాస్తే ద్విజాః శూద్రతాం గతాః
ఇత్యేతైః కర్యభిర్వ్యస్తా ద్విజా వర్దాన్తరం గతాః,
ధర్మో యజ్ఞక్రియా తేషాం నిత్యం న ప్రతిషిధ్యతే.
ఇత్యేతే చతురో వర్ణా యేషాం బ్రాహ్మీ సరస్వతీ,
విహితా బ్రహ్మణా పూర్వం లోభాత్త్వజ్ఞానతాం గతాః.
(బ్రాహ్మణా బ్రహ్మతన్రస్థాస్తపస్తేషాం న నశ్యతి,
బ్రహ్మ ధారయతాం నిత్యం వ్రతాని నియమాంస్తథా.
బ్రహ్మ చైవ పరం సృష్టం యే న జానస్తి ే2 ద్విజాః,
తేషాం బహువిధాస్త్వన్యాస్తత్ర తత్ర హి జాతయఃః
పిశాచా రాక్షసాః ప్రేతా వివిధా మ్లేచ్చజాతయః,
ప్రణష్టజ్ఞానవిజ్ఞానాః స్వచ్భన్దాచార చేస్టితాః. (శాం.ప.188 11-18)
పైన ఉదాహరించిన శ్లోకాలు మానవజాతి అంతా ఒక్కటే; పిశాచ-- రాక్షస-(ప్రేతాలు, వివిధజాతులవాళ్లు కూడ మానవజాతికి చెందినవారే అను విషయం స్పష్టం అవుతుంది.
హిందూమతం 3ెప్
అదే ఘట్టంలో భృగువు బ్రాహ్మణాదుల వృత్తులను కూడ చెపుతాడు -
“శౌచాచారస్థితః సమ్యక్ విఘసాళీ గురుప్రియః
నిత్యవ్రతీ సత్యపరః స వై బ్రాహ్మణ ఉచ్యతే”. (శాం.ప. 189.3)
శౌచమును ఆచారాన్నీ చక్కగా పాటిస్తూ ఇతరులకు పెట్టగా మిగిలిన ఆహారమును భుజిస్తూ, పెద్దలకు ఇష్టుడై లేదా పెద్దలబయందు భక్తి గలవాదై, నిత్యము నియమాలను పాటిస్తూ, సత్యమునందే ఆసక్తి కలవాడు బ్రాహ్మణుడు.
“సత్యం దానమథాద్రోహ ఆన్ఫశంస్యం త్రపా ఘృణా,
తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతీరితః శ
ఎవనిలో సత్యము, దానము, ఇతరులకు అపకారం చేయకపోవడం, మృదుత్వం, సిగ్గు (ఎవరేమనుకుంటారో అను జంకు), జాలి, తపస్సు ఉంటాయో అతడు బ్రాహ్మణుడు.
“క్షత్రజం సేవతే కర్మ వేదాధ్యయనసంగతః,
దానాదానరతిర్యస్తు స వై క్షత్రియ ఉచ్యతే”, ర్
క్షత్రియుడు చేయవలసిన ఆపదలనుండి రక్షించడం అనే పని చేస్తూ, వేదాధ్యయనంతో సంబంధం ఉన్నవాడై, ఇతరులకు దానం చేయుటయందు, తాను తీసికొనుటయందు ఆసక్తి గలవాడు క్షత్రియుడు.
“వణ్రిజ్యా పశురక్షా చ కృష్యాదానరతః శుచిః,
వేదాధ్యయనసంపన్నః స వైశ్య ఇతి సంజ్ఞితః” 6
వాణిజ్యము, పశుపాలనము, కృషి (వ్యవసాయము), ఇతరులనుండి వ్యాపారం మొదలైనవాటిలో ధనం తీసికొంటూండడము - వీటియందు ఆసక్తి కలవాడై, వేదాధ్యయన సంపన్నుడై, శుచిగా ఉందేవాడు వైశ్యుడు.
“సర్వభక్షరతిర్నిత్యం సర్వకర్శకరో౬_ శుచిః,
త్వక్తవేదస్త్వనాచారః స వై శూద్ర ఇతి సృతః” 7
అన్నింటిని అన్ని వేళలా భుజించేవాడు, అన్ని కర్మలు చేసేవాడు, పారిశుద్ధ్యము లేనివాడు, వేదములను త్యజించినవాడు, ఆచారశూన్యుడు
36 హిందూమతం అయినవాడు శూద్రుడు. ఇక్కడ ఉన్న “త్యక్తవేదళొ అను విశేషణం గుర్తించదగినది. శూద్రునికి వేదంతో సంబంధం ఉన్నా దానిని పరిత్యజించాడు అని అర్ధం. మరొక విషయ మేమనగా ఈ శ్లోకంలో శూద్రుని వృత్తి చెప్పబడలేదు; ఆతని అలవాట్లు స్వభావము మాత్రం చెప్పబడ్డాయి. దీనిని పట్టి పైన చెప్పిన మూడు విధాలైనవాళ్లు ఇలాంటి అలవాట్లు కలవారైతే శూద్రు లవుతా రని భావం. ఈ భావమే ఈ క్రింది శ్లోకంలో స్పష్టం చేయబడింది -
“శూద్రే చైతదృ్భవేల్లక్ష్యం ద్విజే తచ్చ న విద్యతే,
న వై శూద్రో భవేచ్చూద్రో బ్రాహ్మణో న చ బ్రాహ్మణః” రి
ఈ లక్షణాలు శూద్రునిలో కనబడతాయి. ద్విజునిలో ఉండవు. ఇవి శూద్రునిలో లేకపోతే అతడు శూద్రుడు కాడు; (బ్రాహ్మణునిలో కనబడితే అతడు (బ్రాహ్మణుడు కాడు. ఈ భావం గల వాక్యాలు మహాభారతంలో అనేక స్థలూలో కనబడతాయి.
ధర్మలోపంచేత క్షత్రియాదులు శూద్రత్వం పొందారు అనే విషయం మనుస్మృతిలో కూడ చెప్పబడింది -
“శనకైస్తు క్రియాలోపొదిమాః క్షతియజాతయ:,
వృషలత్వం గతా లోకే బ్రాహ్మణాదర్భనేన చ”.
పౌంద్రకాశ్చెడ్ర ద్రవిడాః కామ్బ్చోజా యవనాః శకాః,
పారదాః పహ్హవాళ్చీనాః కిరాతా దరదాః ఖశాణ”(మ.స్కృ. 10.38.31) . “పౌంద్రక-ఓడ్ర-ద్రవిడ-కామ్చోజ-యవన -శక-పారద-పహ్లవ-చబీన - కిరాత-దరద-ఖశదేశాలకు సంబంధించిన క్షత్రియజాతివారు ఉపనయనాది క్రియలు లోపించడంచేత యాజన -అధ్యాసన - ప్రాయశ్చిత్తాదిక్రియాకలాపాలు చేయించే బ్రావ్మణులు లభించకపోవడంచేత మెల్ల మెల్లగా శూద్రత్వం పొందారు.”
“ముఖబాహూరుపజ్ఞానాం యా లోకే జాతయో బహిః,
మ్లేచ్చవాచశ్చార్యవాచః సర్వే తే దస్యవః స్మృతాః” (మ.స్మృ. 10.45)
“బ్రాహ్మణ -క్షతియ-వైశ్య-శూద్ర వర్ణాలకు చెందినవాళ్లే లోకంలో వైదిక సంస్మారాదులు లేకపోవడంచేత బాహ్యజాతులుగా అయి వాళ్లందరూ మ్లేచ్చభాషలు
హిందూమతం తె మాటలాడినా, ఆర్యభాషలు (ఆర్యానర్తానికి చెందిన భాషలు) మాటలాదినా, 'దస్యువులు అను పేరుతో ఒక జాతిగా ఏర్పడ్డారు.”
నాలుగు వర్ణాలను గూర్చి భగవద్గీతలో ఉన్న -
“చాతుర్వర్హ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశకా (భ.గీ. 418) అను వాక్యం ప్రసిద్ధమైనది. “గుణాలయొక్క కర్మల (దేసే పనుల) యొక్క విభాగాన్ని అనుసరించి నేను నాలుగు వర్జాలను సృష్టించాను” అని దీని అర్ధం. ఇక్కడ చెప్పిన గుణవిభాగం అనగా ఏమో విశదీకరించవలసి ఉంది.
భారతీయదర్శనాలలో అతిప్రాచీన మైన దర్శనం సాంఖ్యదర్భనం. ఈ దర్శనం (ప్రకారం - స్థావర - జంగమాత్మక మైన ఈ జగత్తు అంతా సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణాలతో సంబంధించి ఉంది. మానవులలో కూడ 'ప్రతీవ్య క్తిలోను ఈ మూడు గుణాల ప్రభావం కనబడుతుంది. ఈ మూడు గుణాల సముదాయానికి ప్రకృతి అని పేరు. అయితే ఒక వ్యక్తిలో ఒక గుణం ప్రధానంగా, అధికంగా, ఉంటే మిగిలినవి రెండు గుణాలు తక్కువ పాళ్లలో ఉంటాయి. బ్రాహ్మణునిలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది; రజస్తమోగుణాలు తక్కువగా ఉంటాయి. సత్త్వగుణం అధికంగా ఉందడంచేత వానిలో -
“ఆమో దమస్తపః శౌచం క్షాన్సిరార్ణవమేవ చ,
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్” (భ.గీ. 18. 42) (మనో నిగ్రహము, ఇంద్రియని[గ్రహము, తపస్సు, శుచిత్వము, ఓర్పు, బుజుత్వము, ఆస్తిక్యము, శాప్రీయవిషయాల జ్ఞానం, శాస్త్రవిషయాల అనుభవరూప మైన జ్ఞానం
- ఇది బ్రాహ్మణునికి ప్రకృతివల్ల ఏర్పడిన కర్భ) అని చెప్పిన లక్షణాలు, కర్మలు ఉంటాయి. క్షత్రియునిలో రజోగుణం అదికంగాను, సత్త్వగుణం దానికంటె తక్కువగాను ఉంటుంది. అందుచేత -
“శౌర్యం తేజో ధృతిర్జాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్,
దానమీశ్వరభావశ్చ క్షత్తకర్మ స్వభావజమ్” (భ.గీ. 18.43) (శూరత్వము, తేజస్సు, చిత్తస్టైర్యం, నేర్పు, యుద్ధంలో పారిపోకుండా ఉండడము,
38 హిందూమతం దానము, ఇతరులను ని(గ్రహించ గలిగిన శక్తి - ఇది ప్రకృతివల్ల ఏర్పడిన క్షత్రియుని కర్మ) అని చెప్పిన లక్షణాలు, కర్మ క్షత్రియునిలో ఉంటాయి.
వైశ్యునిలో రజోగుణం ప్రధానంగాను, తమోగుణం అప్రధానంగాను, తక్కువగాను ఉంటాయి. అందుచేత -
“కృషిగౌరక్ష్యవాణిజ్యం వైళశ్యకర్మ స్వభావజమ్” (భ.గీ. 18. 44) (వ్యవసాయం, గోవులను పోషించడం, వర్తకం, ఇది వైశ్యునికి ప్రకృతివల్ల ఏర్పడిన కర్మ) అని చెప్పిన కర్మ వైళ్యునికి ఉంటుంది.
శూద్రునిలో తమస్సు అధికంగాను రజోగుణం తక్కువగాను ఉంటుంది. అందుచేత “పరిచార్యత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్” (భ.గి. 18.44) (సేవచేయడం అనేది శూద్రునికి స్వభాసిద్ధమైన కర్మ) అని చెప్పిన కర్మ శూద్రుని కున్నది. ఈ విధంగా ఇలాంటి గుణాల పాళ్లు ఉన్న వాళ్లు సహజంగానే ఇలాంటి లక్షణాలతో ఇలాంటి పనులు చేస్తూంటారు అని ఈ చాతుర్వర్యమ్ ఇత్యాది వ్యాక్యాని భావం.
సత్త్వ-రజస్-తమో గుణాలకి ఎంత ప్రాధాన్యం ఉన్న దనగా - మానవుల ఆహార వ్యవహారాదులూ, మానసికప్రవృత్తులూ దేవతారాధనాదులూ కూడ వాళ్లలో ఉన్న ఈ గుణాలను పట్టి ఉంటాయి అని భగవద్గీతలో 17వ అధ్యాయంలోను అనేక ఇతర స్థలాలలోను చెప్పబడింది. అందుచేత ప్రతీ వ్యక్తీ కూడ తన మానసిక స్థితీ అలవాట్లూ అభిలాషలూ మొదలైనవాటిని జాగర్తగా పరిశీలించుకొని తనమీద ఏ గుణంయొక్క ప్రభావం అధికంగా ఉన్నదో తెలిసికొని ఉన్నతస్థితికోసం ప్రయత్నిస్తే తమఃప్రధానుడైనవాడు స్వప్రయత్నంచేత రజోగుణ (ప్రధానుడు కావచ్చును; క్రమంగా సత్త్వగుణప్రధానుడు కూడ కావచ్చును. అదే విధంగా సత్త్వగుణప్రధానుడు కూడ అజాగర్తతో ఉంటే తమఃప్రధానస్థితికి దిగజారి పోవచ్చును. బాగా ప్రయత్నిస్తే త్రిగుణాలకీ అతీత మైన అత్యున్నతాధ్యాత్మిక
. స్థితిని పొందవచ్చును. స్పష్ట మైన మాటలలో చెప్పా లంటే - ఇతరులు గుర్తించినా గుర్తించకపోయినా, ఒక బ్రాహ్మణుడు క్షత్రియస్థితిని గాని, వైశ్యస్థితినిగాని, శూద్ర స్థితినిగాని పొందవచ్చు; అట్లే శూద్రాదులు వైశ్యాదిస్థితిని పొందవచ్చును.
హిందూమతం 39
గుణకర్మవిభాగాన్ని బట్టి వర్ణవిభాగం అనగా ఇదే. అయితే అప్పుడప్పుడు రక్తపరీక్ష చేయించు కొన్నట్లు ప్రతీ ఒక్కడూ గుణపరీక్ష చేయించుకొనజాలడు గాన ఈ వర్ణవిభాగం చివరికి జన్మను బట్టి నిశ్చితం అయిపోయింది. గుణముల చేత కలిగే మార్చులు మాత్రం మానవులలో ఎల్లప్పుడూ కనబడుతూనే ఉంటాయి.
ఈ గుణత్రయసిద్ధాంతం ఇతరమతాలో వేటిలోనూ లేని అత్యుత్తమ మైన తాత్త్వికసిద్దాంతం. (చూ. సాంఖ్యదర్శనం)
యాజ్ఞవల్మ్యస్మ ఎతిలో నాలుగు వర్థాలవాళ్ల వృత్తులు, ధర్మాలు ఈ విధంగా చెప్పబడ్డాయి -
“ఇజ్యాధ్యయనదానాని వైశ్యస్య క్షత్రియస్య చ,
ప్రతిగ్రహో£.ధికో విపే యాజనాధ్యాపనే తథా” (యా.స్మృ. 1.118) (యాగాలు, వేదాధ్యయనం, దానం - ఇవి వైశ్యుడు క్షత్రియుడు కూడ చెయ్యాలి. (బ్రాహ్మణునికి ప్రతిగ్రహము (ఎవరైనా దానం చేస్తే తీసికొనడం), యాగాలు చేయించడం, వేదాలు చెప్పడం అనేవి అధిక మైన కర్తవ్యాలు).
ఇతరస్మృతుల ప్రకారం - అనులోమద్విజులు (పై మూడు వర్జాలలో పైవర్దం పురుషనికీ క్రింది వర్ణం ప్రీకి పుట్టిన ద్విజులు) కూడ యాగ - అధ్యయన
- దానాలు చెయ్యాలి. బ్రాహ్మణుడు ఆపత్సమయంలో కేవలం తనను, తన కుటుంబాన్నీ పోషించుకొనడంకోసం, కృషి వాణిజ్యం, వడ్డీవ్యాపారమూ కూడ చేయవచ్చును. (బ్రాహ్మణుల (ప్రేరేపణచేత క్షత్రియ - వైశ్యులు కూడ అధ్యాపనం (వేదాదులు బోధించడం) చేయవచ్చు. బ్రాహ్మణుడు ఆపత్సమయం కానప్పుడు ఈ షట్కర్మలు ఆచరించాలి. యాగ - అధ్యయన -దానాలు ధర్మం కోసం చేసేవి. ప్రతిగ్రహం మొదలైన మూడూ వృత్తికోసం చేసేవి. అందుచేత యాగాదులు తప్పక చెయ్యా లను నియమం కాని ప్రతిగ్రహాదులు తప్పక చెయ్యా లను నియమం లేదు. ప్రతిగ్రహంవల్ల కలిగే పాపానికి ప్రతిదినమూ కూడ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
“ప్రధానం క్షత్రియే కర్మ ప్రజానాం పరిపాలనమ్,
కుసీదకృషివాణిజ్యపాశుపాల్యం విశ సృతమ్” (యా.స్మృ. 1.119)
4౦0 హిందూమతం (క్షతియుడు చేయవలసిన ప్రధనాకర్మ పప్రజారక్షణం. వడ్డీవ్యాపారము, కృషి (వ్యవసాయము), వాణిజ్యము (వర్తకము), పశుపాలనము వైశ్యుడు చేయవలసిన (ప్రధానకర్మ).
'ప్రజాపాలనం క్షతియునికి ధర్మానికీ, వృత్తికీ కూడ ఉపయోగించే కర్మ, వైళ్యునికి వడ్జీవ్యాపారం మొదలైనవి కేవలం వృత్తికోసమే. అతదు చేయవలసిన ధర్మం మాత్రం యాగ - అధ్యయన - దానాలు.
“శూద్రస్య ద్విజశుతూషా తయా2_ జీవన్ వణిగృవేత్
శిల్పైర్వా వివిధైర్టీవేత్ ద్విజాతిహితమాచరన్”. (యా.స్మృ. 1. 120 (ద్విజులకు శుశ్రూష చేయడం, అనగా పై వర్ణాలవాళ్ల పనులలో సహాయపదడం, శూద్రుని ధర్మం. దానితో జీవిక నడవనివాడు వర్తకుడు కావచ్చును; ద్విజులకు అనుకూలంగా ఉంటూ వివిధశిల్పాదులతో జీవించవచ్చును.
ఆ కర్మలను గూర్చి దేవలస్మృతిలో ఇలా చెప్పబడింది -
“శూద్రధర్శ్మో ద్విజాతిశుశూషా, పాపవర్దనం, కలత్రాదిపోషణ - కర్షణ - పశుపాలన - భారోద్వహన - పణ్యవ్యవహార - చిత్రకర్మ - నృత్య - గీత - వేణు - వీణా - మురజ - మృదజ్గవాదనాదిని”.
“ద్విజుల శుశ్రూష, పాపకర్మలు చేయకపోవడం, భార్యాదులను పోషించడం, భూమి దున్నడం, పశుపాలనం, బరువులు మోయడం, సరుకుల అమ్మకాలు చేయడం, చిత్రకర్మ (బొమ్మలు తయారుచేయడం, గీయడం మొ) నృత్యం, గీతం, వేణు - వీణా - మురజ - మృదంగాదులను (మోగించడం మొదలైనవి శూద్రధర్మం” అని దీని అర్థం.
ఇట్లే అనులోమ - (ప్రతిలోమసంబంధాలవల్ల పుట్టిన వివిధజాతులవాళ్లకి (వీటికి కులాలు అని కూడ పేరు) అనేకవిధా లైన వృత్తులు విధింపబడ్డాయి. వాటిని కులక్రమాగతంగా అనుసరిస్తూ ఉండేవారు.
ఆయా వర్జాలవాళ్లకు శాస్త్రంలో చెప్పిన వృత్తులతో జీవిక నడవకపోతే ఇతర వృత్తులను, ఆ ఇబ్బందులు తొలగిపోయేవరకు అవలంబించవచ్చునని ధర్మశాస్త్ర (గ్రంథాలలో చెప్పబడింది (చూ. గౌతమధర్మసూత్రం, ప్రథప్రశ్న సప్రమాధ్యాయం)
హిందూమతం శ
మహాభారతంలోని మరొక ఘట్టంలో వర్జాలను గూర్చిన (ప్రశ్చ 'ప్రతివచనాలు ఈ విధంగా నడిచాయి. “బ్రాహ్మణుడు ఎవడు?” అని శాపవశం చేత కొండచిలువగా పడి ఉన్న నహుషుడు ప్రశ్నించగా యుధిస్టిరుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు-
“సత్యం దానం క్షమా శీలమానృశంస్యం తపో ఘృణా,
దృశ్యన్తే యత్ర నాగేన్ధ స బ్రాహ్మణ ఇతి సృతణ”(వనపర్వ 180.21)
“సత్యమూ, దానమూ, ఓర్చు, మంచి శీలము, అక్రూరత్వము, తపస్సు, జాలి ఎవనిలో ఉంటాయో అతడు బ్రాహ్మణుడు.”
“ఈ గుణాలు శూద్రునిలో కూడ ఉండవచ్చును కదా?” అని నహుషుడనగా యుధిస్టిరు డిలా అంటాడు -
“శూద్రే తు యద్ భవేల్లక్ష్మ ద్విజే తచ్చ న విద్యతే,
న వై శూద్రో భవేత్ శూద్రో బ్రాహ్మణో న చ బ్రాహ్మణః”
(వనపర్వ 180.26)
“ఈ లక్షణా లున్నవాడు బ్రాహ్మణుడు, ఇవి లేనివాడు శూద్రుడు అని చెప్పాలి.”
“ఒక మనిషిని వాని నడవడికను బట్టి మాత్రమే బ్రాహ్మణుడు అని చెప్పాలి అన్నట్లయితే (బ్రాహ్మణుడుగా పుట్టడం వ్యర్థం అని అంగీకరించిన ట్లవుతుంది కదా?” అని నహుషుడు ప్రశ్నించగా యుధిప్టిరు డిలా చెప్పాడు -
“జాతిరత్ర మహాసర్ప మనుష్యశ్వే మహామతే,
సంకరాత్సర్వవర్దానాం దుష్పరీక్షేతి మే మతిః. (31)
“అన్ని వర్దాలూ సంకరం అవుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు మానవులలో పుట్టుకను బట్టి వర్దాన్ని నిర్ణయించడం శక్యం కాదని నా అభిప్రాయం.”
“సర్వే సర్వాస్వపత్యాని జనయన్తి సదా నరాః,
వాజ్మైథునమథో జన్మ మరణం చ సమం నృణామ్.” (82)
“పురుషు లందరూ అందరు స్త్రీలయందూ సంతానాన్ని పుట్టిస్తున్నారు; మాట, మైథునం, పుట్టుకు మరణం-ఇవన్నీ మానవు లందరికీ సమంగానే ఉన్నాయి.”
తై హిందూమతం
“ఇదమార్నం ప్రమాణం చ యే యజామహ ఇత్యపి,
తస్మాచ్ళీలం ప్రధానేష్టం విదుర్యే తత్త్వదర్శినః.” (33)
“ఈ విషయంలో “యే యజామహే” ఇత్యాదివేదవాక్యం కూడ ప్రమాణం. అందువల్ల బ్రాహ్మణత్వాబ్రాహ్మణత్వాల విషయంలో శీలమే ప్రధాన మైన దని తత్త్వవేత్త లంటారు.”
పై రెండు శ్లోకాలకీ నీలకంకఠు డనే ప్రాబీన భారతవ్యాఖ్యాత అర్ధం ఈ విధంగా వివరించాడు -
“వాగాదీనామివ మైథునస్యాపి సాధారణ్యాత్ జాతిః దుర్జ్లేయా, తథా చ (శ్రుతిః “న వైతద్విద్యో బ్రాహ్మణాః స్కో వయమబ్రాహ్మణా వా” ఇతి బ్రాహ్మణ్యే సంశయ ముపన్యస్యతి.”
“మాటలాడడం మొదలైనవి వలె మైథునం కూడ సర్వసాధారణ మైనది; “మేం బ్రాహ్మణులమో కాదో మాకే తెలియదు” అని (శుతికూడ చెప్పుచున్నది” అని పై వాక్యాల అర్థం. ఈ విధంగా “సర్వే సర్వాసు” ఇత్యాదిశ్లోకానికి భావం విశదీకరించి ఆ వ్యాఖ్యాత ఇంకా ఇలా వ్రాశాడు.
“నను జాత్యనిశ్చయే కథం “బ్రాహ్మణో౬_ హమ్” ఇత్యభిమానపురస్సరం యాగాదౌ ప్రవర్తేత ఇత్యాహ - ఇదమార్షమ్ ఇతి. అత్ర “యే యజామహే” ఇత్యనేన చ యే వయం స్మః బ్రాహ్మణాః అన్యే వా తే వయం యజామహే ఇతి బ్రాహ్మణ్యే అనవధారణం దర్శితమ్. మన్రలిజ్బమపి - “య వఏవాస్మిస సన్ యజే” ఇతి, నన్వేవం స్వస్య అబ్రాహ్మణత్వపక్షే యజ్ఞస్య అనిష్టకారిత్వమాయాతి ఇత్యాశజ్మ్య తత్పరిహారాయ యాగే యజమానస్య ప్రవరవరణం క్రియతే యాజ్జికైః తచ్చ 'అగ్నిర్హోతా" ఇతి మనే గోతమవత్, అయాస్యవత్, అజ్జిరోవత్, (బ్రాహ్మణవత్ ఇతి కుర్వన్లి. తస్య చ ప్రయోజనమ్ అబ్రాహ్మణస్యాపి యజమానస్య బ్రాహ్మణత్వసంపాదనార్థమ్. తస్మాదాచార ఏవ బ్రాహ్మణత్వహేతు:ః వేద ప్రామాణ్యాత్ ఇత్యుపసంహరతి - తస్మ్నాదితి.”
“జాతిని గూర్చి నిశ్చింతగా తెలియనప్పుడు “నేను బ్రాహ్మణుడను” అను అభిమానంతో (నమ్మకంతో) యాగాదులలో ఎలా ప్రవర్తిస్తాడు” అని ఆశంకించు
హిందూమతం 4 కొని “ఇదమార్నమ్” ఇత్యాదిశ్లోకం చెపుతున్నాడు - ఇక్కడే “యే యజామహే” (ఏ మేము యాగం చేస్తున్నామో) అనడంచేత “మేం బ్రాహ్మణులమో అన్యులమో తెలియదు; యాగం మాత్రం చేస్తున్నాం” అని (బ్రాహ్మణత్వం విషయంలో అనిశ్చితత్వం చూపబడింది. ఇదే భావం గల “య ఏవాస్మి స సన్ యజే” (నేను ఎవడనో ఒకడను అయి ఉన్నాను అను మంత్రం కూడ ఈ సంశయమును సూచిస్తూన్నది). తాను బ్రాహ్మణుడు కాకపోతే చేసే యజ్ఞంవల్ల అనిష్ట మైన ఫలం కలుగుతుంది కదా అని ఆశంకించుకొని ఆ దోషానికి ప్రాయళ్చిత్తంగా యాజ్జికులు (యాగం చేయించేవాళ్లు) యాగంలో యజమానుని గోత్రానికి చెందిన పూర్వప్రసిద్ధశ్రేష్టయుషుల (ప్రవరుల) పేర్లు “గోతముడు వలె, అయాస్యుడు వలె, అంగిరస్ వలె, బ్రాహ్మణుడు వలె నేను యాగం చేస్తున్నాను” అను అర్ధం బోధించే “అగ్నిర్లోతా” అను మంత్రం చదువుతారు. ఇలా చదవడంవల్ల ('బ్రాహ్మణకులంలో పుట్టిన అతడు ఏ కారణంచేతనైనా) అబ్రాహ్మణు దైనా వానికి బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. అందువల్ల బ్రాహ్మణత్వనిశ్చయానికి, వేదప్రామాణ్యాన్ని పట్టి ఆచారమే ('ప్రమాణం అని - “తస్మాత్ శీలమ్' అను వాక్యంతో ఉపసంహరిస్తున్నాడు.” ఇది రెండవ శ్లోకానికి నీలకంఠుడు వ్రాసిన వ్యాఖ్యానానికి అర్థం. దీనిని పట్టి ఏ వర్ణంలో పుట్టినా ఆ వర్జంలో పుట్టడంతో పాటు “నేను ఈ వర్జానికి చెందిన వాడను” అను నిశ్చిత మైన భావన కూడ ఉంటే అతడు ఆ వర్షానికి చెందినవా దవుతా డని భావం.
ఫలానా వర్ణమే అని నిశ్చితంగా చెప్పడానికి వీలు లేదంటూ సూచించే ఇలాంటివే రెండు శ్లోకాలు మనుస్మృతిలో తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నాయి.
“తథా చ శ్రుతయో బహ్వో విగీతా నిగమేష్వపి,
స్వాలక్షణ్యపరీక్షార్థం తాసాం శృణుత నిష్పృతీఐ” _ (మ.స్కృ.9. 19)
“స్త్రీపరుషులలో వ్యభిచారదోషం ఉండడానికి అవకాశం ఉంది అని సూచించే
వాక్యాలు, వేదంలో చాలా ఉన్నాయి. దానికి ప్రాయశ్చిత్తం చెపుతాను వినండి.”
ఇక్కడ వ్యాఖ్యాత యైన కుల్లూకభట్టు “న చైతద్విద్మో బ్రాహ్మణా నా
అబ్రాహ్మణా వా అను (పైన చూపిన) వేదవాక్యం ఉదాహరించాదు.
శ హిందూమతం
“యన్నే మాతా ప్రలులుఖే విచరన్య్యపతివ్రతా,
తన్నే రేతః పితా వృజ్క్తామిత్యస్త్యెతన్నిదర్శనమ్.” _ (మ.స్మృ.9.20)
కొన్ని యాగాదులు చేసేటప్పుడు పఠించే “యన్మేమాతా ... వృజ్క్తామ్” అను మంత్రం వ్యభిచారానికి అవకాశం ఉంది అని చెప్పదానికి నిదర్శనం. “నా తల్లి పాతి వ్రత్యరహితయై సంచరించి నప్పుడు దూషిత మైన రేతస్సును నా తండ్రి పవిత్రం చేయుగాక” అని దీని భావం.
ఈ మంత్రం పఠించడంచేత మానసవ్యభిచారానికి మాత్రమే ప్రాయశ్చిత్తం చేసికొన్నట్లవుతుంది అని మనువు చెప్పాడు. ఇది దేనికి ప్రాయశ్చిత్తమైనా శారీర వ్యభిచారోనికి అవకాశం ఉన్నది అనడానికి సందేహం లేదు కదా?
ప్రతీ కాలంలోను ప్రతీ దేశంలోను వర్ణ-జాత్యాదుల సంకరం అవ్యాహతంగా జరుగుతూనే ఉన్న దని అంగీకరించవలసి ఉంటుంది. అయినా భావనాబలంవల్ల మానసికశక్తివల్ల ఈ భేదాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయ్యి వాటివల్ల కలిగే లాభనష్టాలు కనబడుతూనే ఉన్నాయి. మానసిక
. భావనకు, విశేషించి సామూహిక మానసికభావనకు ఉన్న శక్తి ఊహింప శక్యం కానిది. ఈ విషయం అస్మదీయకౌండిన్యస్మృతిలో ఈ విధంగా (ప్రతిపాదించ బడింది -
ఆరోపాభినివేశాభ్యాం జగదేతత్ ప్రవర్తతే,
యద్యథా భావ్యతే లోకే తత్తథైవ హి వర్తతే. 64
ఈ జగత్తంతా లేనిదానిని ఆరోపించడం, గట్టి పట్టుదలతో కూడిన విశ్వాసం అనే రెండింటి మీదా నదుస్తూన్నది. లోకంలో దేనిని ఎలా భావిస్తే అది అలా జరిగిపోతూ ఉంటుంది.
“ప్రే రూపకతా, మూర్ధే మన్రితా౭_జ్ఞేల. ధికారితా,
నిరక్షరాస్యే విద్వత్తా వళ్చుకే చ యతీన్దతా,
పణ్జితే మూర్ధతా, దుష్టే సాధుతా, సతి దుష్టతా,
ఆరోష్యతే, తథైవాత్ర వ్యవహారః ప్రవర్తతే.” 65,66
కాగితం ముక్కమీద రూపాయల విలువ ఆపాదిస్తున్నాం. మూర్థునియందు
హిందూమతం తర్ మంత్రిత్వాన్సీీ తెలివితక్కువవానియందు అధికారిత్వాన్ని అక్షరం రానివానియందు పండితత్వాన్నీ వంచకునియందు యతీంద్రత్వాన్నీ పండితునియందు మూర్ధత్వాన్నీ, దుష్టునియందు సత్పురుషత్వాన్నీ సత్పురుషునియందు దుష్టత్వాన్నీ ఆరోపిస్తున్నాం; వ్యవహారం అంతా ఆ విధంగా నడిచిపోతూన్నది.
“బిడ్రాలాది శుభం కైశ్చిదశుభం కైళ్చిదిష్యతే,
క్షుతాదౌ చ తథైవైభిః ఫలం సముపలభ్యతే.” 67
కొందరు పిల్లులు మొదలైనవాటిని అమంగళసూచకం అంటే కొందరు (జపానుదేశీయులు మొదలైనవారు) శుభసూచకం అంటారు. అలాగే తుమ్ము మొదలైన వాటి విషయంలో కూడ ఆ ఫలితాలు వాళ్లకు అలా కనబడుతూనే ఉన్నాయి.
“ఆరోప్వ్యతే దేవతాత్వం శిలాదౌ, ఫలమాప్యతే,
భావనారోపయోరేవం మహిమా కేన వర్ప్వృతామ్.” 60
శిలావిగ్రహదులయందు దేవత్వాన్ని ఆరోపించి అలా ఆరాధించేవాళ్లకి ఫలం లఖిస్తూనే ఉంది. ఈ విధంగా మానసిక భావనకీ, ఆరోపానికీ ఉన్న మహిమ వర్ణింప శక్యం కానిది.
“జన్మతో వర్ణభేదో£యమతో£౬. ద్యాపి ప్రవర్తతే,
గుణా విభిన్నా దృశ్యన్తే తత్తద్వర్దాభిమానతప” 609
అందువల్ల ఈ నాటికి కూడ పుట్టుకను బట్టి వర్జభేదం నడుస్తూనే ఉంది. అ యా వర్దాలకు చెందినవారిలో వర్దాభిమానంచేత వేరు వేరు లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి.
“వర్లేల. ముకస్మిన్ జాతో£. హమతో£హం వర్ణతో£ ముక
ఇతి భావనయా తత్తద్వర్హధర్మాః స్యురేవ ను£ఓ” (70)
“నేను ఫలానా వర్ణంలో పుట్టాను; అందుచేత నాది ఫలానా వర్ణం” అనే
=. భావనచేత (వాని భావనా, చుట్టుప్రక్కల నున్నవారి భావనా - వీటిచేత)
మానవునిలో ఆ యా వర్జాలవాళ్లలో కొట్టవచ్చి నట్లు కనబడే కొన్ని లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి.
46 హిందూమతం
“అహో ప్రభాతో మనసః యో నర్తయతి నిత్యశః
శరీరం సేన్దియగ్రామమన్యాంశ్చ పరితః స్థితాన్.” (71)
ఆహా! మనస్సు ప్రభావం ఎంత గొప్పది! దాని ప్రభావమే నిత్యమూ శరీరాన్నీ ఇంద్రియాలనూ, చుట్టుప్రక్కల నున్న వాళ్లనీ కూడ ఆట లాడిస్తూంటుంది!
“భావేన జాతమాగ్రేణ ద్వేషక్రోధభయాదినా,
క్షణాత్ భవత్యన్య ఏవ, కిం పునశ్చిరభావనాత్.” (729)
ద్వేషం, క్రోధం, భయం మొదలైన భావాలు మనస్సులో పుట్టగానే మానవుడు క్షణంలో మారిపోతాడు; అలాంటప్పుడు చిరకాలం జరిగే భావనవల్ల మానవునిలో ఎలాంటి మార్చు వస్తుందో వేరే చెప్పాలా!
“మతాన్మతం గతేప్వేన రూపచిన్తనకర్మసు,
పరివృత్తిర్హి మహతీ దృళ్యతే విస్మయావహాో.” (73)
ఒక మతం విడచి మరొక మతం తీసికొన్నవాళ్ల ఆకారంలోను, ఆలోచనల లోను, పనులలోను, ఎంతో ఆశ్చర్యకర మైన మార్పు కనబడుతున్నది కదా?
“పితా యః కో£పి వాష్యస్తు జన్మతో£. ముకవర్ణకమ్,
స్వం భావయన్ కుతో న స్యాత్ నూనం తద్వర్హలక్షణ:.” (74)
తన తండ్రి ఎవదైనా జన్మను పట్టి తాను ఫలానా వర్దానికి చెందినవాడను అనుకొనే వానిలో ఆ వర్దానికి సంబంధించిన లక్షణాలు కనబడకుండా ఎలా ఉంటాయి?
“తత్రతున్యాయ ఏవాత్ర శరణం వస్తూనిర్ణయే,
యో యో యథా యథాత్మానం భావయేద్ భవితా తథా.” 78
ఎవడు తనను గూర్చి ఏ విధంగా భావన చేసుకొంటూ ఉంటాడో వాడు అలాంటి వాడే అవుతాడు. ఈ విషయంలో తతృతున్యాయమే సత్యనిర్హయానికి ఉపకరిస్తుంది.
“యథాక్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేతః (ప్రేత్య భవతి” అని ఛాందోగ్యోపనిషత్తులో ఒక వాక్యం ఉంది. “మానవుడు ఇహలోకంలో (ఈ
హిందూమతం 47 జన్మలో) ఎలాంటి ఆలోచనలతో ఉంటాడో తరువాతి జన్మలో కూడ అలాంటి వాదే అవుతాడు” అని దీని అర్థం. తరువాతి జన్మదాకా అవసరం లేదు; ఈ జన్మలోనే మార్పులు వస్తాయి అని చెప్పవచ్చు నని పై శ్లోకం భావం,
“పరిజీతాః ప్రియో దత్తపుత్రాద్యాశ్చాభఖిమన్వతే,
గోత్రవంశాన్తరగతానాత్మానం, స్యుస్తథైవ తే.” 79
వివాహం అయిన స్రీలు, దత్తపుత్రాదులు ఏ కుటుంబంలోనికి వెడతారో ఆ కుటుంబానికే గోత్రవంశాదులకే తాము చెందుతా మని తలుస్తున్నారు; అలాగే అవుతున్నారు కూడ.
“ఆశౌచాదిష్పపి భిదా తేషామస్వ్యేవ శాస్త్రతః,
స్వయంకృతో£థవా శాస్త్రకృతో£ ధ్యాసః ప్రవర్తతే”. 80
స్తీ-దత్తపుత్రాదులకు శాస్తానుసారం ఆశౌచాదులలో కూడ ఖేదం ఏర్పడుతుంది. అందుచేత ఆరోపం అనేది శా(స్తానుసారం చేయబడినదైనా, మానవకృత మైనా పని చేస్తూనే ఉంటుంది.
వెనుక ఉదాహరించిన మహాభారతశ్లోకంలో ఉన్న “సంకరాత్సర్వవర్దానామ్” అను మాటను పట్టి ప్రసంగవశంచేత ఇదంతా చెప్పబడింది.
మహాభారతంలో వనపర్వంలో మరొక ఘట్టం ఉంది. కౌశికు డను ఒక ముని, ఒక పతివ్రత ఉపదేశించగా ధర్మవ్యాధు డనే మాంసం అమ్ముకొనేవాని దగ్గరకు ధర్మసూక్ష్మాలు తెలిసికొనడంకోసం వెళ్లి చివరికి ఆతనిని ప్రశంసిస్తూ అంటాడు -
“సాంప్రతం చ మతో మే౭_సి బ్రాహ్మణో నాత్ర సంశయః,
(బ్రాహ్మణః పతనీయేషు వర్తమానో వికర్శసు,
దామ్మికో దుష్కృతః ప్రాయః శూద్రేణ సదృశో భవేత్.
యస్తు శూద్రో దమే సత్యే ధర్మే చ సతతోథ్ధితః,
తం బ్రాహ్మణమహం మన్యే వృక్తేన హి భవేద్దిజః”
(వన.ప.216 13-14) “నీవు నిస్సంశయంగా (బాహ్మణుడవ్వే నా కిపుడు నిశ్చయం ఏర్పడింది.
తరి హిందూమతం
పొతిత్యానికి హేతువు లైన చెడ్డ పనులు చేస్తూ దాంబికుదైన (బ్రాహ్మణుడు శూద్రునితో
సమానుడు. ఏ శూద్రుడు ఇంద్రియనిగ్రహవంతుడై, సత్య-ధర్మాలమీద స్థిరంగా ఉంటాడో, వాటి విషయంలో నిత్యమూ ఉత్సాహవంతుడై ప్రవర్తిస్తాడో అతడు
(బ్రాహ్మణుడే అని నా అభిప్రాయం. ఎందువల్ల ననగా మంచి నడవడిక గలవాదే
బ్రాహ్మణుడు.” అప్పుడు ధర్మవ్యాధు డిలా అంటాడు -
“శూద్రయోనౌ హి జాతస్య సద్ద్గుణానుపతిష్టతః,
వైశ్యత్వం లభ్యతే బ్రహ్మన్ క్షత్రియత్వం తథైవ చ,
అర్జవే వర్తమానస్య బ్రాహ్మణ్యమభిధీయతే.” (వనపర్వ,212. 10,11)
ఓ] బ్రాహ్మణుడా! సద్గుణాలను సంపాదించేవాడు శూడద్రుడుగా పుట్టినా కూడ వానికి వైశ్యత్వము, క్షత్రియత్వమూ కూడ లభిస్తాయి. కుటిలత్వం లేని మార్గంలో ఉన్నవాడు (బ్రాహ్మణు దని చెప్పబడతాడు.
ఇక్కడ వ్యాఖ్యాత యైన నీలకంఠపండితుడు - “సద్గుణవన్తం వైశ్యత్వాదయః స్వయమాయాన్తీతి గుణకృత ఏవ వర్ణవిభాగః న జాతికృతః ఇతి భావః” అని అన్నాడు. “సద్గుణవంతునికి వైశ్య్వత్వాదులు తమంతట తామే లభిస్తాయి. అందుచేత వర్ణవిభాగం గుణాలను పట్టి ఏర్పడినదే కాని జన్మవల్ల ఏర్పడినది కాదు అని భావం” అని దీని అర్థం,
పై పరిశీలనవల్ల వర్ణవ్యవస్థవిషయంలో ఈ క్రింది అంశాలు స్పష్టం అవు తున్నాయి -
-
_ ఇది భారతదేశంలో చాలా కాలంనుంచి ఉన్నట్లు ప్రాచీనవాజ్బ్మయాలను పట్టి తెలుస్తుంది. ఏనాడు ప్రారంభం అయిందో చెప్పడం అశక్యం.
-
దీనికి నంబంధించిన అతి(ప్రాచీననిస్టేశం బుగ్వేదనంపాతలో కనబడుతూన్నది. నాలుగు వర్జాల పేర్లలో 'క్షత్రియి” కు “రాజన్య” శబ్దం ప్రయోగించబడింది. క్షత్తః శబ్దం బుగ్వేదసంహితలో చాల చోట్ల కనబడినా వర్ణం అను అర్ధంలో ప్రయోగింప బడలేదు. వెనుక ఉదాహరించిన బుక్కులో
హిందూమతం 49 కూడ బ్రాహ్మణ -రాజన్య-వైశ్య-శూద్రశబ్దాల ప్రయోగం ఉంది కాని వీటికి “వర్దాలూో అను పేరు ఉన్నట్లు చెప్పబడలేదు.
- మనుష్యుల శరీరాల రంగులను పట్టీ ఈ విభాగం విర్చడిం దని ఒక అభిప్రాయం ఉందేది.
4 వృత్తుల (జీవనవిధానాల) భేదాన్ని పట్టి వర్ణభేదం ఏర్పడిం దనీ, ఆ వృత్తుల భేదాన్ని పట్టి మనుష్యుల రంగులు కూడ మారి ఉంటా యనీ మరొక అభిప్రాయం.
- గుణాల భేదాన్నీ వృత్తుల భేదాన్నీ పట్టి ఈ భేదాలు వచ్చా యని మరొక అభిప్రాయం. ఇది “చాతుర్వర్హ్యం మయా సృష్టం గుణకర్మవిభాగళః”
- అను ప్రసిద్ధ మైన భగవద్గీతావాక్యంలో చెప్పినదే, ఇంకా అనేక ఇతర (గ్రంథాలలో కూడ సూచింపబడింది. “గుణకర్మవిభాగశవో అనగా మానవులలో ఉన్న సత్త్వం- రజస్-తమోగుణాల తారతమ్యాన్ని పట్టి, కర్మలను పట్టీ అని అర్థం. ఇక్కడ ఒక అంశం గమనించవలసి ఉంది. సత్త్వగుణాదులను పట్టి మానవులు తమ తమ కర్మలు ఆచరిస్తూంటారు; వాళ్లు ఆచరించే కర్మలను పట్టి వాళ్లలోని సత్త్వ- రజస్-తమోగుజాలు మారుతూంటాయి; ఈ విధంగా గుణ-కర్మల మధ్య ఒక విధమైన అన్యోన్యాశయం ఉంది.
-
కాలక్రమంలో పుట్టుకచేతనే వర్ణభేదం ఏర్పడింది. ఇది బుక్సంహితా కాలానంతరం స్థిరంగా పాతుకొనిపోయింది. కాని అది ఎప్పుడు అనేది చెప్పడం శక్యం కాదు.
-
ఈ విధంగా వర్ణవ్యవస్థ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అను విషయంలో ఎన్నో అభిప్రాయా లున్నాయి. ఇవన్నీ చూస్తే ఏదీ నిర్ధరించడం అసంభావ్యం అని తోస్తుంది. అదే విధంగా దీనిలోని గుణదోషాలను గూర్చిన అభిప్రాయభేదాలు పూర్వమూ ఉండేవి ఈనాడూ ఉన్నాయి. ఈ సువిశాల దేశం అల్పసంఖ్యాకు లైన జనుల నివాసా లైన కొన్ని వేల గ్రామాలుగా విభక్తమై ఉంది. దేశం అంతా సుభిక్ష మైనది అవదంచేత ఈ దేశంలోనివాళ్లు
50 హిందూమతం అన్నం కోసం ఇతరదేశాలకి వలసపోయి, ఆ దేశాలను నశింపచేసి అక్కడ జీవించ వలసిన అవసరం ఎన్నడూ వీళ్లకు రాలేదు. ప్రతీగ్రామమూ స్వయంపోషణసమర్థ మైన ఒక సమవాయంగా (19190 గా ఉందేది. (గ్రామంలో కొందరు వ్యవసాయం చేసికొంటే కొందరు వివిధవృత్తులతో జీవితం గడిపేవారు. కొందరు ధర్మ (మత) - విద్యాసంబద్ధ విషయాలు చూచుకొంటే కొందరు దేశరక్షణపాలనాదివిషయాలు చూచుకొనేవారు. ఒకరి కొకరు సహాయం చేసికొంటూ ఉపకరిస్తూ జీవించే పరస్పరసహకారం అనేది ఎవ్వరూ నేర్చకుండా తనంతట తానే గ్రామంలో రాజ్యం ఏలుతూండేది. పుట్టినది మొదలు ఏ నాడూ ప్రక్కనే ఉన్న (గ్రామం కూడ చూడనివా ళ్లుండే రోజు లవి. ఆ రోజులలో వర్ణవ్యవస్థ ప్రతీ ఒక్కనికీ జీవనోపాధినీ, ప్రశాంతమైన సంతృప్తజీవనం గడిపే అవకాశాన్నీ కల్పించింది. ఎలాంటి ఒడుదుడుకులు వచ్చినా ప్రతీ వ్యక్తీ కూడ తన కులంనుంచి, జాతినుంచి సహాయం పొందుతూందేవాడు. ఈనాటికి కూడ కొన్ని కులాలలో ఎవరైనా వ్యాపారం మొదలైనవాటిలో నష్టం వచ్చి అసహాయస్థితిలో ఉన్నప్పుడు ఆతనిని ఆ కులంలోని ఇతరు లందరూ ఆదుకొని నిలబెట్టే సంప్రదాయం కనబడుతూన్నది. ఎవ్వరూ వృత్తికారకు తడుముకొనే ప్రసక్తే లేదు. అలాంటి లాభం వర్ణవ్యవస్థలో ఉందని కొంద రంటారు. ఏమైనా అనేకవిఖభేదాలను సృష్టించి దేశాన్ని దుర్చలం చేసింది ఈ వ్యవస్థ అని కొంద రంటారు,. ఈ వర్జవ్యవస్థకు మూలం ఏదైనా, దీనిలోని గుణదోషాలు ఎలా ఉన్నా ఈనాడు భారతదేశంలో సుమారు మూడు వేల (3000) జాతు లున్నాయి. (16 6810 0 స6ేడ5 ఆగ. సయం (జాం, ?. 143). నిజానికి ఇలాంటి జాతి భేదాలు, ఏవో విధ మైన విద్వేషకారణాలూ లేని దేశం ఏదీ వనాడూ లేదని నిస్సందేహంగా చెప్పవచ్చును.
ఈ భేదాలన్నీ రూపుమాపి ఒకే జాతిని ఏ మహాపురుషుదైనా నిర్మించకలిగితే సంతోషమే. అంతకుముందు చేయవలసిన పని - ఈ భేదాలవల్ల దోషాలేవైనా ఉంటే వాటిని తొలగించడం. అంతేకాని ఈనాడు నలుమూలలా కనబడుతూన్న
హిందూమతం ర్! వివిధజాతిపరస్పరదూషణం ఈ భేదాలను ఇంకా పెంచుతుంది కాని దేశానికి ఏ మాత్రమూ మంచిచేకూర్చదు.
ఒక విధంగా చూస్తే భారతదేశంలో కేవలం వర్ణవ్యవస్థను పట్టి ఏర్పడిన తీవ్రవిద్వేషాలు పూర్వం ఏనాడూ లేవనే చెప్పాలి. విదేశీయులు వచ్చి ఈ విభేదాలను వక్రీకరించి ఒక పద్ధతి ప్రకారం ద్వేషవిషబీజాలు నాటక ముందు భారతదేశం చరిత్ర చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ధనికత్వ-దరి[ద్ర త్వాదులనూ, సహజమైన దుష్టత్వసాధుత్వాదులనూ పట్టి విభేదాలు, ద్వేషాలు అన్ని దేశాలలోను ఎల్లప్పుడూ ఉన్నవే. స్వార్థపరత్వమూ, కామ-|(క్రోధ- అసూయాదులూ మానవులలో ఉన్నంతవరకు విభేదాలు ఏదో ఒక రూపంలో విజ్బంభిస్తూనే ఉంటాయి.
భారతదేశంలో అనాదికాలంనుంచీ వస్తూన్న ఈ వర్ణవ్యవస్థను గూర్చి ప్రొ॥ డియస్. శర్మగారు '౧ల౦150ల€ఏ0రేబుంరు' లో వ్రాసిన మాటలు ఉదాహరణ యోగ్యమైనవి.
“హిందూధర్మశాస్త్రకర్తలైన మునులు వర్ణవ్యవస్థ ద్వారా సమాజంలో పరస్పర సహకారం ఉన్న ఒక అధికారిక విధానాన్ని (14100 స్థాపించడానికి ఆశించినట్లు కనబడుతుంది. ఇది పెద్దవాళ్లకి ఎక్కువ బాధ్యతలూ స్వాతంత్యమూ, చిన్నవాళ్లకు గొప్ప సంరక్షణా ఉండే అవిభక్తకుటుంబవ్యవస్థ వంటిది. ఇది ఎవరు చేయవలసిన పనులు వాళ్లకు నిర్ణయించి పోటీలకు అవకాశం లేకుందా చేసింది. జీవన విధానంలో ఒక విధమైన వారసత్వం ఏర్పరిచింది. అయితే దీనివల్ల మనిషి తన వైయక్తిక శక్తి విశేషాన్ని ప్రదర్భించడానికి, ఏ పనిలోనైనా చొరవతీసికొనడానికీ తగిన అవకాశం లేకుందా చేసింది. ఒక మాటలో చెప్పాలంటే దీనివల్ల ఒక విధమైన క్రమబద్ధత (0146) ఏర్పడినా అభివృద్ధి కుంటుపడింది.”
“అయితే ఒక్క విషయం మరచిపోకూడదు - ఈ విషయా లన్నీ కేవలం సైద్దాంతికంగాను, ఆదర్భంగానూ మాత్రమే ఉన్నాయి కాని ఈ దేశచరిత్రకు సంబంధించిన ఏ కాలంలోనూ కూడ ఈ నియమాలను పూర్తిగా పాటించినట్లు కనబడదు ... కొన్ని శతాబ్దాల సామాజిక జీవనవిధానాన్ని పరిశీలిస్తే జాతీయ -
గ దరయ్య (గ్రంధాలయ స్పై
- (4 0.110... 3 య కా.
52 హిందూమతం సాంఘిక నియమాల నన్నింటినీ ప్రక్క్మకుపెట్టి వివిధ వృత్తులను కులక్రమాగత రీతులలో అవలంబించిన కులాలూ, జాతులూ అసంఖ్యాకంగా బయలుదేరాయి.”
“దీన్సిక్రి తోడు వేరువేరు నియమాలను, వివాహవిధానాదులనూ అనలంబించే అనేకమైన శాఖలు (సంప్రదాయాలు) ఈ మతంలో నిరంతరమూ ఆవిర్భవిస్తూనే ఉండడంతో అనేకమైన అవాంతరశాఖలు (5340-5606) బయలుదేరాయి. అన్ని కాలాలలోను, దేశం అంతటా కొనసాగుతూనే ఉన్న వెలివేతలూ, వర్దాంతర వివాహాలూ, సుదూర(ప్రదేశగమనాలు, వైదేశికనూతనరాజ్యస్టాపనాలు (0010035260) ఇవన్నీ కూడ వర్ణవ్యవస్థలో శైథిల్యం వర్పడదానికి దోహదం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితు లెన్ని ఏర్పడినా కూడ ఆదర్భరూపంగానైసా వర్దవ్యవస్థను కాపాడదానికి అవిచ్చిన్నంగా ప్రయత్నాలు కూడ కొనసాగుతూనే ఉన్నాయి. దీనిచేత పరిపాలకులు, పరిపాలనా విధానాలు మారినా హిందూ సమాజానికి ఉన్న ఒక ప్రత్యేకత పరిరక్షించ బడింది ...”
“ఈ వర్ణంవాళ్లకి ఇది ధర్మం అను ఆదర్శాన్ని బోధించే ఈ వర్ణవ్యవస్థ (ఎంత శిధిలం అవుతున్నా కూడ) హిందూనాగరికతకు, ప్రపంచంలోని ఇతరప్రాచీన నాగరికఠలకు పట్టిన గతి పట్టకుండా, రక్షించకలిగినది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు”
“... అయితే ఇతరుల ఆక్రమణలనుండి రక్షించుకొనే ప్రయత్నంలో ఫలితంగా ఈ వ్యవస్థలో అతితీవ్రమైన నియమకాఠిన్యం (14814167) చోటు చేసికొన్నా అది ఎప్పటికైనా శిథిలం కావలసిందే. వర్జధర్శనియమం గరూయం16 05 ₹2012- ఢ0జణు2) మాత్రం సార్వకాలికమైనది; దీనికి అన్ని కాలాలలోను ఆదరణీయమైన స్థానం ఇవ్వవలసే ఉంటుంది." (గఆ౧9౦ల౧రయంంి స. 23.24)
వర్జాలు నాలుగే; ఐదవ వర్ణం లేదు అని స్మృతులలోను మహాభారతంలోనూ కూడ స్పష్టంగా చెప్పబడింది.
“బ్రాహ్మణః క్షత్రియో వైశ్యస్తయో వర్దా ద్విజాతయః,
చతుర్ధ ఏకజాతిస్తు శూద్రో, నాస్తి తు పబ్బమ్ష” _ (మ.స్కృ.10.4)
“ఉపనయనం అను సంస్కారం ఉన్న బ్రాహ్మణ -క్షతియ-వైశ్యవర్థాలవాళ్లు
హిందూమతం 53 ద్విజాతులు - రెండు జన్మలు కలవారు. నాల్గవదైన శూద్రవర్దానికి చెందినవాళ్లు మాత్రం ఏకజాతులు - ఒకే జన్మ కలవారు. నాలుగు వర్జాలను మించి ఐదవ వర్ణం అనేది లేదు” అని దీని భావం.
మహాభారతంలో కూడ ఇదే విషయం చెప్పబడింది.
“స్మృతాశ్చ వర్జాశ్చత్వారః పళ్బుమో నాధిగన్యుతే*. (అను.ప,47. 18)
“వర్ణాలు నాలుగు మాత్రమే చెప్పబడ్డాయి. ఐదవది కనబడదు.” వర్షసంకరం వల్ల ఏర్పడిన జాతులు కూడ ఏదో ఒక వర్జానికి చెందుతాయి. అందుచేత వాటిని వేరువేరు వర్ధాలుగా స్మృత్యాదులు చెప్పలేదు.
ఒక విధంగా చూస్తే వర్ణసంకరానికి అనువైన మార్గం స్మృతులలోనే చూపబడింది. పై పై వర్జాలకు చెందిన పురుషులు క్రింది వర్గాలకు చెందిన ప్రీలను వివాహమాడవచ్చు నని మనుస్మృతిలో చెప్పబడింది.
“శూదైవ భార్యా శూద్రస్య సా చస్వా చ విశ స్కృతే,
తే చ స్వా చైవ రాజ్ఞశ్చ తాశ్చ స్వా చాగ్రజన్మనవ (మ.స్మృ.3. 13)
“శూద్రుడు శూద్రప్రీని మాత్రమే పెండ్లాడాలి. వైశ్యుడు వైశ్యశూద్రప్రీలను, క్షత్రియుడు క్షత్రియ - వైశ్వ - శూద్రస్తీలను, బ్రాహ్మణుడు బ్రావ్మణ-క్షత్రియ- వైశ్య-శూద్ర ప్రీలను వివాహ మాదవచ్చును.”
ఇలాంటి వివాహాలవలన కలిగిన సంతానానికి అనులోమసంతానం అని పేరు. ఈ సంతానాలకు వేరు వేరు పేర్లు చెప్పబడ్డాయి. ఇవి (అనులోమవివాహాలు) సవర్ణవివాహాల వలె మంచివి కాకపోయినా, తప్పని సరియైనప్పుడు అంతగా నిషిద్ధములు కావని స్మృతికారుల అభిప్రాయ మన్నట్లు కనబడుతుంది.
మానవస్వభావాన్ని పట్టి అనులోమవివాహాల వలె ప్రతిలోమవివాహాలు కూడ జరగకుండా ఎవ్వరూ ఆపజాలరు. ఆ విధంగా క్షత్రియుడు బ్రాహ్మణప్ర్రీని, వైశ్యుడు క్షత్రియ-బ్రాహ్మణస్రీలను, శూద్రుడు వైశ్యక్షత్రియబ్రాహ్మణ స్త్రీలను వివాహమాడడం అసంభావ్యం కాదు. అలాంటి వివాహాలవల్ల కలిగిన సంతానానికి ప్రతిలోమసంతానం అని పేరు. అలాంటి సంతానానికి వేరు వేరు పేర్లు చెప్పబడ్డాయి. మళ్లీ వీళ్లలో వీళ్ల మధ్య జరిగే సంబంధంవల్ల అనేకజాతులు ఉద్భవించాయి. ్రీ-
రీ హిందూమతం .. పురుషుల వేరు వేరు వర్జాల విషయం స్పష్టంగా తెలిసిన చోట వాళ్ల సంతానానికి ఆ యా క్రొత్త జాతుల పేర్లు పెట్టినా రహస్యమైన వ్యవహారాలలో స్త్రీ ఏ వర్దానికి ఏ జాతికి సంబంధించి ఉంటుందో ఆ వర్ణ-జాతులే సంతానానికి ప్రసిద్ధిలోనికి వచ్చి లోకవ్యవహారం జరిగిపోతూ ఉండి ఉంటుంది. జాగర్తగా పరిశీలిస్తే ఈ నాడు కూడ చాలావరకు అదే పద్ధతి నడుస్తూన్నది కదా. ఈ విధంగా ఏర్పడిన వివిధజాతుల వాళ్లు జాతి-వంశక్రమాగతమైన వేరు వేరు వృత్తులను అవలంబించడం ఏనాడో ఈదేశంలో స్థిరపడిపోయింది. అస్పృశ్యత
కొన్ని కులాలకు చెందినవారిని గ్రామాలలో బైట నివసించే టట్లు చేసి వాళ్లతో భాజనభోజనాదులలో సంబంధం లేకుండా వాళ్లను అస్పృశ్యులనుగా (స్పృశించతగని వాళ్లనుగా) చూడడం భారతదేశంలో చాల కాలంనుంచి ప్రచారంలో ఉంది.ఇది ఎప్పుడు ప్రారంభం అయిందో చెప్పడం కష్టం. ప్రారంభదశలో ఇది ఏ విధంగా ఉందేదో తెలియదు గాని మధ్యయుగంలో ఈ పద్ధతి అతితీవరూపంలో ఉన్నట్లు కనబడుతుంది. మధ్యయుగంలో కూడ దీనిలోని కాఠిన్యాన్ని తగ్గించడంకోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉండేవి. ఆధునికయుగంలో ఎంతోమంది ఆధునిక విద్యావంతుల ప్రయత్నాల ఫలితంగా ఇది చాలవరకు తగ్గుముఖం పట్టింది. సార్వజనికప్రదేశాలలోను (40110 ౫12౦66), సార్వజనిక సంస్థలలోను (116 56616019) ఇది పూర్తిగా అంతరించిం దని చెప్పవచ్చును. అస్పృశ్యతను తొలగించడానికి మొదటినుండీ గొప్ప చిత్తశుద్ధితో, అకుంఠితదీక్షతో ప్రయత్నించినవాళ్లు బ్రాహ్మణ -క్షతియ-వైళశ్య-శూద్రవర్దాలకు చెందిన అ(గ్రకులాలవారే అను విషయం చరిత్రప్రసిద్ధ మైనది. వాళ్ల ప్రయత్నాల ఫలితంగా పైకి వచ్చిన,కొందరు, ఆనాడు అస్పృశ్యు లని చెప్పబడే కులాలకు చెందినవారు కూడ ఈ దిశలో ప్రయత్నించడం సహజమే.అయితే వీరందరి ప్రయత్నాలకీ ఎక్కువగా సహకరించినది యాంత్రికాభివృద్ధి (4156022260) అను విషయం కూడ సర్వవిదితం.
భారతదేశంలోని అస్పృశ్యతకు హ్రూనంగా రెండు కారణాలు కనబడుతున్నాయి
- ఒకటి వర్దవ్యవస్థను స్థిరంగా నిలపాలనే ఆ కాలానికి సంబంధించిన సమాజంలో
హిందూమతం ర్5్ ఉన్న దృఢసంకల్పం, రెండు - కొందరి జీవనవిధానాదు లలో శుభ్రత, పవిత్రత లేకపోవడం. మనం వెనుక చూచి నట్లు వేరు వేరు వర్జాలకు చెందిన స్త్రీపురుషుల సంతానానికి తలిదండ్రుల వర్ధాలకి ఇిన్నమైన జాతులను కల్పించడం జరిగింది. బ్రాహ్మణప్రీయందు శూద్రపురుషునివలన పుట్టిన సంతానానికి చందడాలజాతి అని పేరు పెట్టి ఆ జాతికి చెందినవాళ్లు అస్పృళ్యు లన్నారు. ఇదొక అతికఠిన మైన శిక్ష అట్లే బహుశా కొందరు కొన్నివృత్తులను చేబట్టడంచేత కొన్ని ఆచారాలన్తునియమాలను పాటించక ఆహారాదులలో అశు(భ్రంగా ఉండడంచేత వాళ్లని కూడ, కొన్ని ఇతరదేశాలలో వలె అస్పృశ్యులనుగా చేసి ఉంటారు.మొదటి రకం అస్పృశ్యత వలె ఇది కూడ వంశపారంపర్యక్రమాన సంక్రమించి ఉంటుంది.
అస్పృశ్యులను, వివిధవృత్తులవారినీ వేరు వేరు జాతులుగా పరిగణించి వాళ్లకు వేరు వేరు పేర్లు పెట్టినా వారందరూ సాధారణరూపంలో శూద్రవర్గానికే చెంది నట్లు ప్రాచీన స్మృతిగ్రంఛాదులను పట్టి తెలుస్తున్నది. “స్మృతాశ్చ వర్జాశ్చత్వారః పజ్బమో నాధిగమ్యతే” ఇత్యాదివాళ్యాలు వెనుక చూచి ఉన్నాం. క్రీ.పూ. ఏడవ శతాబ్దికి చెందిన పాణిని “ళూద్రాణామనిరవసితానామ్” (అష్టాధ్యాయి 2.4.10) అను సూత్రంలో చండాలాదులు శూద్రులే అని సూచిస్తాడు.దీని భాష్యంలో పతంజలి కూడ ఈ విషయాన్ని విశదీకరించాడు.
బుగ్వేదంలోను యజుర్వేదంలోను చర్మమ్న(చర్మకారుడు)చండాల,పుల్మసృవప లేదా వసక(మంగలి),విదలకార లేదా ఛిదలకార (దొమ్మరి) వాసపల్పూలీ (రజకస్రీ) మొద లైన ఆ యా వృత్తులను చేసేవాళ్ల పేర్లు కనబడుతున్నాయి కానిివృత్తులను పట్టి వాళ్లందరూ వేరు వేరు జాతులుగా ఏర్చడ్డారా అను విషయం కాని,వాళ్లలో కొందరు అస్పృశ్యులు అయి ఉంటారు అను విషయం కాని తెలియడం లేదు.స్మృతుల కాలం నాటికి ఇవి కొన్ని జాతులుగా ఏర్పద్దా యనీ, జాతులలో కొన్ని అస్పృశ్యజుతులుగా పరిగణింపబడే వనీ తెలుస్తుంది.
స్పృశ్యత్వ-అస్పృశ్యత్వాల విషయంలో ఇంకా ఎన్నో నియమాలు కనబడు తున్నాయి. ఈ నియమా లన్నీ భారతీయసంస్కృతి-సంప్రదాయాలలో ఏ మాత్రము సంబంధం కానివాటి ప్రత్యక్షానుభవం కాని లేని కొందరు విదేశీయులు,వాళ్ల
56 హిందూమతం మాటలే పరమప్రమాణం అనే భ్రాంతిలో ఉన్న కొందరు భారతీయులు చిత్రించి నట్లు ఎవరిమీదనో ద్వేషంవల్ల గాని,కొందరి స్వార్టపరత్వంవల్ల గాని,మేమే గొప్పవాళ్లం అనే కొందరి అహంకారంచేత గాని వఏర్పరచినవి కావు భవంతుని అనుగ్రవాంవల్లనో, తాము చేసిన పూర్వపుణ్యాల ఫలితంగానో లభించిన మానవజన్మ కేవలం ఆహార-- నిద్రా-భోగ్గాదులతో వ్యర్థం చేయడానికి కాదు, సరియైన పద్ధతిలో కొన్ని నియమాలను ఏర్పరచుకొని, వాటి ప్రకారం ఇక్కడ జీవితం గడిపి చివరకు సకల దుఃఖశూన్యమైన ఒక ఉన్నత స్థితిని సంపాదించుకొనడంకోసం దీనిని ఉపయోగించు కోవాలి అనేది భారతీయుల '్రగాఢవిశ్వాసం. అందుకు అనుగుణంగా కొందరు తహఃశాలులైన బుషులు కొన్ని నియమాలను ఏర్పరచి జీవితంలో పయనించడానికి ఒక నిర్దుష్టమైన, సకలలోక హితమైన మార్గాన్ని చూవారు. ఈ నియమాలలో ఒకటి ఈ స్పృశ్యత్వాస్పృశ్యత్వనియమం కూడ. ఈ నియమాలలో కొన్ని శారీరారోగ్యానికి ఉపకరిస్తే కొన్ని మానసికారోగ్యానికి, ఆధ్యార్మికసమున్నతికీ ఉపకరిస్తాయి. ప్రతీదాన్నీ మూఢవిశ్వాసమనో,'మూఢనమ్మకాలు' అనో పేరుపెట్టి కొట్టి పారవేయడం మూధత్వానికి “పరాకాస్ట్రఅవుతుంది. ఉదాహరణకి కొన్ని నియమాలు చూద్దాం- మహాపాతకాలు చేసినవాళ్లు, ఏ వర్జానికి చెందినవారైనా, అస్పృశ్యులు. వాళ్లతో ఇతరులు ఏ విధ మైన సంబంధమూ పెట్టుకొనకూడదు. బుతుమతి యైన ప్రీ ఆ మూడు - నాలుగు రోజులు అస్పృశ్యురాలు. ఒక బుతుమతికి మరొక బుతుమతి అస్పృశ్యురాలు.భోజనం చేస్తూన్నవాడు ఇతరులను స్పృశించగూడదు. అతనిని ఇతరులు స్పృశించగూడదు. ఇతరులు తినగా మిగిలినది తినగూడదు. తానే తినగా మిగిలినది కూడ తినకూడదు. జాతాశౌాచ-మృతాశౌచా లలో కొన్ని దినాలు
జ్ఞాతు లందరు ఇతరులకు అస్పృశ్యులు. శవాన్ని స్పృశించినవాళ్లు అస్పృశ్యులు.
నిషేధించిన వృత్తి అవలంబించిన (బ్రాహ్మణుడు ఇతరబ్రాహ్మణులకు అస్పృశ్యుదు.
కుక్క కోడి, కాకి మొదలైనవాటిని,కొన్ని ఓషధులను, మొక్కలను,కాయలను కూడ
స్పృశించకూడదు అని కొన్ని స్మృతులు చెపుతున్నాయి. ఈ నిషేధా లన్నింటికీ వదో
ఒక కారణం ఉంటుందిికొన్ని కారణాలు మన ఊహకు అందుతాయి,కొన్ని అందవు.
అవి, అత్యాధునికవైద్యశాలలోను, శస్త్రచికిత్సాదిస్టానాల లోను పాటించే, సామాన్యుల
మనస్సుకు కూడ తెలియని అసాధారణ పరిశుభ్రతానియమాల వంటివి. అయితే
హిందూమతం 57 కాలం గడుస్తూన్న కొలదీ ఎందరో కల్పించిన అనావశ్యకములూ, శాస్త్రాలలో లేనివీ అయిన అర్థరహిత మైన నియమాలు కూడ ్రవేశించా యనడంలో సందేహంలేదు.వాటి యుక్తత్వా యుక్తత్వాలను పరిశీలించ వలసిన ఆవశ్యకత కూడ ఎంతో ఉంది.అందుకు ప్రాచీన స్కృత్యాదుల పరిచయమూ, సామాజిక పరివర్తనల జ్ఞానమూ కూడ చాల అవసరం బెతాయి.
కేవలం జాతిని పట్టి మాత్రం కూడ అస్పృశ్య లని చెప్పినది ఒక్క చండాలజాతి వాళ్లనే అన్నట్లు కనబడుతుంది. మనువు కూడ ప్రతిలోమజాతివాళ్లలో చండాలుణ్ణి ఒక్కనినే అస్పృశ్యునిగా పేర్కొన్నాడు -
“దివాకీర్తిముదక్యాం చ పతితం సూతికాం తథా.
శవతత్స్పృష్టినం చైన స్పృష్ట్వా స్నానేనశుధ్యతి (మ.స్మృ. 5.85)
(చండాలుణ్జి,రజస్వలాస్త్రీని, పతితుణ్జి, ప్రసవించినస్త్రీని, శవాన్ని శవం . స్పృశించినవానిని స్పృశించిన ద్విజుడు స్నానం చేస్తే శుద్దు డవుతాడు).
మనుస్మృతి 10 వ అధ్యాయం 13 వ శ్లోకం వ్యాఖ్యానంలో మేధాతిథి- చణ్డాల ఏకః ప్రతిలోమః అస్పృశ్యవొ (ప్రతిలోమసంతానమైన చందాలు డొక్కడే అస్పృశ్యుడు) అనీ,కుల్లూకభట్టు “అతః చాణ్జాల ఏవైకః ప్రతిలోమతః స్పర్భాదౌ నిరస్యతే” (అందువల్ల ప్రతిలోమసంతానం అవడంచేత ఒక్క చండాలుడు మాత్రమే స్పర్భాదుల విషయంలో నిరాకరించబడుచున్నాడు) అనీ వ్రాశారు. కొందరు వాళ్లు చేసే వృత్తిని పట్టి, అది అపరిశుద్ధ మనే భావంతో అస్పృళశ్యులుగా చెప్పబడ్దారు. ఇది జాతిని పట్టి అనువర్తించేది కాదు. ఆ వృత్తి విడచి మరొక శుద్ధవృత్తిని అనుసరిస్తే ఆ జాతివాళ్లకు కూడ అస్పృశ్యత్వం ఉండ దని స్కృతుల పరిశీలనవలన తెలుస్తుంది. మహాపాతకులు కూడ ప్రాయశ్చిత్తం చేసికొంటే స్పృశ్యు లవుతారు.
కొన్ని సమయాలలో స్పృశ్యాసృళ్యవిచారణ చేయవలసిన పని లేదని స్మృతి కొరులు చెప్పి ఉన్నారు.
“విష్వాలయసమీపస్థాన్ విష్ణుసేవార్థమాగతాన్స్
చాణ్జాలపుల్మసాన్వాపి స్పృవ్ట్వ్వాన స్నానమర్హతి”.
(నిత్యాదారపద్ధతినుండి 1.0.5/01.11 2.120172)
58 హిందూమతం “విమ్ణుసేవకై విష్టుదేవాలయానికి వచ్చిన చందాలులను పుల్మసులనూ,ఆ దేవాలయం దగ్గర స్పృశించడం జరిగినా స్నానం చేయవలసిన పని లేదు. “దథ్యాకర్షమతోయాని స్పృష్టాన్యన్యశ్చ్వవాయ సైః, మారుతేనైవ శుధ్యని పక్వేష్టకచితాని చ” (అంగిరస్స్మృతి 11 05/01.11 7.174) వీథులు, బురద, నీరు, కాల్చిన ఇటుకలతో కట్టిన ఇళ్లు - వీటికి అంత్యజుల, కుక్కల, కాకుల స్పర్శ కలిగినా కూడ అవి గాలికి శుద్ది పొందుతాయి. కొన్ని ప్రదేశాలలోను, కొన్ని సమయాలలోను స్పృశ్యాస్పృశ్యచింత ఏ మాత్రము అవసరం లేదని చెప్పబడింది. “దేవయాత్రావివాహేషు యజ్ఞప్రకరణేషు చ, ఉత్సవేషు చ సర్వేషు స్పృష్టాస్పృష్టిర్న విద్యతే. (స్మృతిచంద్రిక (11.09.5701 11.175) దేవాలయాలలోను,తీర్ణ్జయాత్రలయందు,వివాహాలయందు, యజ్ఞాదులందు, అన్ని ఉత్సవాలలోను స్పృశ్యాసృశ్యవిచారణ లేదు). “గ్రామే తు యత్ర సంసృష్టిర్యాత్రాయాం కలహేషు చ, గ్రామసందూషణే చైవ స్పృష్టిదోషో న విద్యతే”. (స్కృతిచంద్రిక (11.0.5/01.1] ౫.175) (గ్రామంలో ఉన్నప్పుడు (ఇతరసమయాలలో) అస్పృశ్యతాదోషం ఉన్నా ఉత్సవ యాత్రలలోను, కలహాడులలోను,గ్రామానికి ఆపద సంభవించినప్పుడూ స్పర్శదోషం లేదు. స్మృత్యర్థసారంలో (పే.79) ఈ విధంగా చెప్పబడింది- “సంగ్రామే హట్టనార్లే చ యాత్రాదేవగృహేషు చ, ఉత్సవ[్రతుతీర్ధేషు విప్లవే గ్రామదేశయోః మహాజలసమీపేషు మహాజనవరేషు చ అగ్య్యత్చాతే మహాపత్సు స్పృష్టాసృష్టిర్న దుష్యతి” (11.0.5.౪701.11 1.175)
హిందూమతం ర్ం యుద్ధంలోను, సంతకు వెళ్లే మార్గంలోను, యాత్రలయందు, దేవాలయాల లోను,ఉత్స వాలలోను, యజ్ఞాలలోను, పవి్రక్షేత్రాలలోను, గ్రామానికి గాని దేశానికి గాని ఉపద్రవం వచ్చినప్పుడూ, మహాజలాల (నదీ-సముద్ర-విశాలతటాకాదుల) సమీపములందు, మహాజనుల సమీపమునందు (మహాజను లనగా గొప్ప మహానుభావుడైన వ్యక్తి అని కాని జనసమూహం అని కాని అర్ధం చెప్పవచ్చు, అగ్నిభయం ఏర్పడినప్పుడు, పెద్ద ఆపదల యందు,స్పృశ్యాస్పృళ్యచింత ఉండదు. అస్పృశ్యతాదోషం అంటే ఏమిటో ఈ క్రింది శ్లోకంలో చెప్పబడింది.
“ప్రాప్యకారీన్షియం స్పృష్టమస్సృష్టి త్వితరేనియమ్,
తయోశ్చ విషయం ప్రాహుః స్పృష్టాస్పృష్ట్రభిధానతలో (పైదే) “సృర్శేంద్రియం (త్వగింద్రియం) మరొక వస్తువును తాకినప్పుడు స్పర్శజ్ఞానాన్ని కలుగ జేస్తుంది.ఇతరేంద్రియాలు దూరంనుండే వాటి వాటి జ్ఞానం కలిగిస్తాయి.ఈ ఇంద్రియాల ద్వారా కలిగిన సంబంధం స్పృష్టి (స్పర్శ॥ సంబంధం కలగకపోవడం అస్బృష్టి (అస్పర్భ:
'వ్రతాదులు ఆచరించడానికి ప్రతిలోమజుతులవారికి కూడ అధికారం ఉందని యాజ్ఞవల్క్య స్మృతివ్యాఖ్య మితాక్షరలో స్పష్టంగా చెప్పబడింది-
“అతః స్రీశూద్రయోః ప్రతిలోమజునాం చ ఖజైైవర్ణికవత్ వ్రతాధికొారః ఇతి సిద్ధమ్. గౌతమవచనం “ప్రతిలోమా ధర్మహీనాః” ఇతి తదుషనయనాదివిశిష్టధర్మాభి ప్రాయమ్” (11.05. ౪701. 11. 7.177.
“అందువల్ల స్రీలకు, శూద్రులకు, ప్రతిలోమజాతులవాళ్లకూ కూడ గ్రైవర్ణికులకు (పై మూడువర్ధాల వాళ్లకు) వలె వ్రతాలు ఆచరించడంలో అధికారం ఉన్న దని తెలిసినది. “*ప్రతిలోములకు ధర్మం లేదు”అని గౌతముడు చెప్పిన దైతే ఉపనయనాదులు లేవు అను అర్థంలో చెప్పబడింది”.
ఈ విధంగా అస్పృశ్యత విషయంలో ప్రాబీనస్మృత్యాదులలో అనేకమైన అపవాదలు (6౭9౪019) కనబడుతున్నాయి. వీటిని అన్నింటినీ చూస్తే ఆ యా సామాజికపరిస్థికులను పట్టి ఈ నియమాలలో అనేక మైన మార్పులు వచ్చి ఒక్కొక్క కాలంలో అతికాఠిన్యమూ ఒక్కొక్క కాలంలో శైథిల్యమూ ఉండేది అన్నట్లు స్పష్టం అవుతుంది.
60 హిందూమతం
వర్ణసాంకర్యం జరగకూడదు అను దృఢసంకల్పంతో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం వెలివేయడంచేత సమాజంలో కొందరికి వచ్చిన ఈ అస్పృశ్యతను నిరంతరమూ కొనసాగించడం అయుక్త మైనది. ఏ కారణంచేత నైనా ఏర్పడిన ఇలాంటి నియమాన్ని ఒకటి రెండు తరాల పాటు పాటించవచ్చు నేమో. అదైనా ఎంతవరకూ యుక్తమో ఆ కాలంనాటి పరిస్థితులు మాత్రమే నిర్ణయించ కలుగుతాయి. కొంత కాలం తరువాత దానిని తప్పక సడలించడం న్యాయం.
ఉదాహరణకి జాతాశౌచ - మృతాశౌచా లున్నాయి. ఎవరి కైనా సంతానం కలిగినప్పుడు ఆ కుటుంబంవాళ్లే కాక ఆ వంశానికి చెందిన జ్ఞాతులు కూడ కొన్ని రోజులు అస్పృశ్యు లనీ, వాళ్లు ఇచ్చిన ఆహారపానీయాదులు తీసికొనగూడ దనీ, వాళ్లు దేవ - పితృకార్యాదులు చేయకూడ దనీ చెప్పిన నియమం జాతాశౌచ నియమం. ఎవరైనా మరణించి నప్పుడు కూడ అందరికీ ఆశౌచం ఉంటుంది. అది జాతాశౌచంకంటె అధిక మైనది. ఇది మృతాశౌచం. అయితే కొన్ని తరాల తరవాత (ఐదు లేదా ఏడు తరాల తరువాత) జ్ఞాతులు ఈ ఆశౌచాలను పాటించ నవసరం లేదని శాస్త్రం.
అల్లే పై వర్దాలవాళ్లు కొన్ని పరిస్థితులలో (వివాహాదులనుపట్టి) కొన్ని తరాలకు (క్రింది వర్దాలవాళ్లు అయిపోతా రనీ, క్రింది వర్జాలవాళ్లు కొన్ని తరాలకు పైవర్థాలవా శ్లవుతా రనీ మను - యాజ్ఞవల్క్యాదిస్మృతులలో చెప్పబడింది. (చూ. మనుస్మృతి 10.64-69 యా.స్మృ.1.96) ఈ విధంగా పద్ధతి ఏదైనా, జాత్యపకర్షకు, జాత్యుత్మర్హకు అవకాశం ఉన్న దని అంగీకరించి నప్పుడు కొన్ని తరాల తరువాత అస్పృశ్యత కూడ ఉండదని చెప్పడానికి అభ్యంతరం ఎందు కుందాలి?
పాశ్చాత్యదేశాలలో అస్పృశ్యత
భారతదేశంలో ఒక జాతికి చెందినవాళ్లు అస్పృశ్యులుగా పరిగణింప బదేవారు అనే విషయాన్ని గూర్చి చాలామంది పాశ్చాత్యులు ఇ దేదో ఈ దేశంలో మాత్రమే ఉంది అన్నట్లు అత్యధికమైన ఆశ్చర్యం ప్రకటిస్తూ (వ్రాయడం పరిపాటి అయిపోయింది. అంతఃపరిశీలన చేసికొని చూస్తే ఇది ప్రాచీనకాలంలో అన్ని దేశాలలోనూ ఉండే దనే విషయం వాళ్లకి తెలియకపోలేదు. ఈ దేశంలో ఇది ఒక
హిందూమతం 61 జాతికి చెందిన వాళ్ల విషయంలో చూపబడితే వర్ణవ్యవస్థ అనేది లేని ఇతరదేశా అన్నింటిలోను ఇది కారణాంతరాలచేత ఏర్పడింది. జాగర్తగా పరిశీలిస్తే ఈ దేశంలో ఉన్న అస్పృశ్యతకూ ఇతరదేశాలలో ఉన్న అస్పృశ్యతకూ ఏమీ తేదా లేదు. వాళ్ల దేశానికే చెందిన కొందరిని వాళ్లు తమతో ఏ విధమైన సంపర్మమూ లేని విధంగా దూరంగా ఉంచేవారు. ఉంచడమే కాదు వాళ్లని నానా హింసలూ పెట్టేవారు. సొమాజికశాస్త్రవిజ్ఞానసర్వస్వం, పదకొండవ సంపుటం.339 వ పేజీలో (0700026412 055001219560ల665 ౪01.౫ ౧.339) అమెరికా దక్షిణరాష్త్రాలలో నివసించే నీగ్రోల విషయంలో చూపబడిన భేదభావం (988168240౧) ఎంత ఘోరంగా ఉండేదో వర్ణించబడింది-“నీగ్రోలు (గ్రామాలలోను నగరాలలోను చాల దూరంగా వేరుగా నివసించాలి.తెల్లవాళ్లతో పాటు వాళ్లు సాధారణవాహనాలు (9౪0116 60౫౪౪/జాంజ) ఎక్కకూడదు.వాళ్లు ఉపయోగించే విహారస్థలాలలో ప్రవేశించకూడదు. సాధారణసంస్థలలో (స్యూళ్లు మొదలైనవాటిలో) వాళ్లకు ప్రవేశం లేదు. సామాజికంగా ఉన్న ఈ తీనభేదభావం ఆర్థికరంగంలో కూడ ఉందేది.వ్యవసాయంలో కూలీలుగా పని చేయడానికి తప్ప ఇతర మైన పరిశ్రమల లోను, కార్యాలయాలలోను వాళ్లకి ప్రవేశం లేదు.వాళ్లకు ఓటుహక్కు లేదు”. (1050/01.0 ₹.165). బ్రిటిష్అఫ్రికాలో భారతదేశీయులను ఎంత నీచంగా చూచేవారో మహాత్మాగాంధీ చరిత్ర చదివినవారి కందరికీ తెలిసిన విషయమే. మహమ్మదీయులు క్రైస్తవులూ కూడ తమ మతాన్ని వెంటనే అంగీకరించనివారి విషయంలో,ఎంత క్రూరంగా అమానుషంగా ప్రవర్తించేవారో అందరికీ తెలిసిన విషయమే.“మానవుల ఆత్మలను పరిశుద్ధం చేయడానికి” నడుం కట్టుకొన్న క్రైస్తవ సంఘం (చర్చి) నాలుగు - ఐదుశకాబ్దాలలో ఎలాంటి ఫోరకృత్యాలకు పాల్పడిందో వర్ణించడానికి శక్యం కాదు. పెద్ద పెద్ద పుస్తకభాందాగారాలను తగులపెట్టించింది. అలెగ్జాండ్రియా, అథిన్స్ మొదలైన వాటిలో ఉన్నమతస్వాతంత్ర్యాన్ని బోధించే విద్యాసంస్థల నన్నిటినీ ధ్వంసం చేయించింది.ఆ మతానికి విరుద్ధమైనవాళ్ల దేవాలయాదులు కాని,నగరాదులు కాని (ప్రాకృతికప్రకోపాలకు నాశనం అయితే అందుకు ఈశ్వరుని కోపమే కారణం అనీ, తమ దేవాలయాదులకు అలాంటి నాశనం సంభవిస్తే అది పరమేశ్వరుని శత్రువైన, సతాన్ పని అనీ వీళ్లు ప్రచారం
62 హిందూమతం చేసేవారు. కాన్స్టెంటన్ అను పాలకుడు ప్రవేశపెట్టిన నియమాలతో ఈ అంధకారయుగం ప్రారంభం అయింది. యూరప్‌ఖండంలో క్రైస్తవ్వమత్రచారానికి “చర్చి కొన్ని వేలమందిని శారీరకంగా తీవ్రమైన హింసలకు గురి చేసి చివరకు చంపివేసింది. గీసుదేశీయు లైన కవుల, తత్త్యవేత్తల (గ్రంథాలను, వాళ్ల సంస్థలను పూర్తిగా ధ్వంసంచేసింది. అలెక్టాండ్రియాలో ఒక తత్త్వశాస్త్రసంస్థను (అకాడమీని) నడుపుతూ విశ్వజన సామరస్యాన్ని, సౌభ్రాత్రాన్నీ బోధిస్తూ అందరి మన్ననలూ పొందుతూన్న హైపేషియా అను విద్వాంసురాలిమీద అక్కడ ఉన్న చర్చికి సంబంధించిన బిషప్ కక్ష కట్టాడు. అందుకు ఫలితంగా ఆమెను వస్త్రహీనను చేసి,ఆమె శరీరాన్ని ఆలుచిప్పలతో కోసి.చర్చివరకూ ఈడ్చికొని వెళ్లి అక్కడ దారుణంగా చంపివేశారు ఆ సంస్థను మూసివేశారు. (2౫/66.80207 1288లో రోమన్ కాఫలిక్ చర్చి'ఇంక్విషనొఅను ఒక పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇది మతవిరుద్ధకార్యక్రమాహరూధ విచారణ. క్రైస్త్వమతబోధలకు ఏ మాత్రం విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్లమీద అపరాధం మోపి తీవ్రంగా దండించి,చివరకు చంపివేయడం కూడ ఈ 'ఇంక్విసిషన్ ద్వారా కొన్ని శతాబ్దాల పాటు నడిచింది. అపరాధిగా పరిగణింపబడిన వ్యక్తి ఆ అపరాధాన్ని అంగీకరించేవరకు వానిని చిత్రహింసలకు పాలు చెయ్యా లని 1252 లో పోప్ ఇన్నోసెంట్ 1 ఆజ్జలు జారీచేశాడు. 1480 లో ఇంతకంటె కూడ భయంకర మైన 'ఇంక్విిషన్ొ స్పెయిన్‌లో ప్రారంభింప బడింది.దీనికి “స్పానిష్ ఇంక్విసిషన్”అని పేరు. ఈ తథాకథిత అహాధులను దండించడంతో బాటు వాళ్ల ఆస్తులను కూడ వశం చేసికొనడంచేత “చర్చి ధనసమృద్ధ మైన మతసంస్థగా ఏర్పడింది. కొంత కాలానికి చర్చి కళ్లూ ఇంక్సిజిషన్ కళ్లూ కూడ శ్రష్షనమతం అంగీకరించని 'నాస్తికుల'మీదనే కాక 'విచొలమీద (మంత్రకత్తెలమీద) కూడ పడ్డాయి.కొన్ని ప్రాచీన దేవతలను పూజిస్తూ, ఆకు అలములతో వైద్యం చేస్తూ ఉండే కొందరు ఆడవాళ్లకు “విచొలు (1౪/01) అని పేరు. క్రైస్తవమతం ఆవిర్భవించదానికి ముందు చిరకాలం నుంచీ వస్తూన్న కొన్ని జానపద-ఆచారాలను పాటిస్తూ ఈ ఆడవాళ్లు ఛార్, వోటాన్,
హిందూమతం 6 హెర్న్మె మిధ్ర మొదలైన దేవతల పూజలు చేస్తూందేవారు. వాళ్లలో చాల తక్కువమంది ఏవేవో మంత్రాల ప్రయోగంలో ప్రవేశం ఉన్నవాళ్లు కూడ ఉండేవారు.అయితే అవి ఆ యా రోగాలు మాన్చదడానికి చిట్మాలవంటివి.ఈ మంత్రకత్తెలను గ్రామాలనుండి ఏరి ఏరి పీడించి చంపేస్తుందేవారు. ఈ విచ్ల ఏరేతకు “విచ్హాంటింగ్ అని పేరు.14వ శతాబ్దంలో ప్రారంభం అయిన ఈ విచ్‌హంటింగ్ యూరప్దేశా అన్నింటిలోనూ మూడు వందల సంవత్సరాలు నడిచింది. క్రైస్తవుల అధికారంలో ఉన్న న్యాయస్థానాలద్వారా 17వ శతాబ్దం నాటికి సుమారు రెండు లక్షలమంది మంత్రకత్తెలను చంపడం జరిగింది. రోమన్ సామ్రాజ్యం పతనం అవడంతో చర్చి అధికార(ప్రభావాలు బాగా పెరిగి, మంత్రకత్తెలు ఏ నాడూ చేయని అనేకమైన కుత్సితమైన పనులు వాళ్లకు ఆపాదించి వాళ్లను నానాహింసలూ పెట్టడం ఎక్కువైపోయింది.
“విచహంటర్స్'అను పేరుతో కొందరు బైలుదేరి ఏమీ తెలియనివాళ్లను గ్రామాల నుంచి తీసికొనివచ్చి చర్చికి అప్పగించి ఆ విధంగా ఒక జీవిక ఏర్పాటు చేసికొన్నారు.ఆ విధంగా పట్టుకొనబడిన మంత్రకత్తెకు మరణం తప్పదు.అయితే ఆమెను అనేకవిధాల శారీరకంగా పీడించి,ఆమె అపరాధం చేసినట్లు ఒప్పుకునే టట్లు చేసి, ఆమెచేత మరికొందరి పేర్లు కూడ చెప్పించేవారు.వాళ్ల విషయంలో కూడ ఇదే పద్ధతి.ఈ విధంగా 150 సంవత్సరాల కాలంలో 30,000మంది ఆడవాళ్లను కొరవులు ఎక్కించి సజీవ దహనం చేయించాడు. (0.౪7.06.1% 20.207- 210)
స్త్రీల విషయంలో ఇంత అనాదరంతో,క్రూరత్వంతో ప్రవర్తించడానికి కారణం 'ప్రారంభశతాబ్దాలలో యూదులు కైస్త్వ్రమతనాయకులుగా ఉండడం. వాళ్లకు స్త్రీల విషయంలో చాల చిన్నచూపు.హిస్పోకు సంబంధించిన సైంట్ ఆగస్టిన్ స్రీలకు అత్మ లేదని ఘోషించాడు. దీనికి ఆ రోజులలో ఎంత ప్రాధాన్యం ఇవ్వబడిం దంటే
- ఆరవ శతాబ్దంలో ఈ విషయాన్ని గూర్చి మాకన్లోని కౌన్సిల్లో పెద్ద చర్చ కూడ జరిగింది. బహుశా ఈ విధమైన ఆనాటివాళ్ల ప్రవృత్తియే విచ్‌హంటింగ్ కు దారి తీసి ఉంటుంది.
ఠ హిందూమతం
పాల్ కూడ-స్ట్రీలు కిక్కురుమనకుండా భర్తకు సేవలు చేస్తూండా లని అన్నాడు. పాల్ తరవాత పురుషాధికారాన్ని స్థాపించినవాడు మొట్టమొదటి కజైస్తవచడక్రవర్తి యైన కాన్స్టంటైన్.అతడు తన భార్యను,ఆమె సోదరుణ్జి,వాని కుమారుణ్ణీ చంపించివేశాడు. అంత క్రూరుడు. ఈ ప్రవృత్తి దాదాపు పద్నాలుగు శతాబ్దాల పాటు అవిచ్చిన్నంగా నడిచింది. మధ్యయుగానికి సంబంధించిన సైంట్ థామస్ ఆక్వినస్ కూడ స్త్రీలు దాసుల ($12763) కంటె తక్కువ అన్నాడు. (౧౪0౦69; ౧.210)
భారతదేశానికి వెళ్లాలని బయలుదేరిన కొలంబస్ 1492 లో అమెరికాలో కాలు పెట్టింది మొదలు వాని వెనుకనే ఎంతో మంది మిషనరీలు కూడ అక్కడ ప్రవేశించి అక్కడ ఉన్న రెడ్ఇండియన్స్తో మచ్చిక చేసికొని,కొంత కాలానికి బలం పుంజుకొని వాళ్ల దేశం ఆక్రమించారు.మెల్లమెల్లగా కొన్ని లక్షలమందిని రూపుమాపారు. వాళ్ల ఆచారాలను అలవాట్లను నశింపచేసి మిగిలినవాళ్లను తమ మతంలోనికి త్రిప్పుకొన్నారు. “మానిఫెస్ట్ దెస్టినొఅను ఒక క్రొత్త సూతం ప్రకారంభవంతుడు ఈ భూమి మాకు ఇష్టం వచ్చినట్లు చేసికొనడానికి ఇచ్చాదు”అని చెపుతూ అక్కడ ఉన్నవాళ్లను అనేక విధాల హింసించారు. వీళ్లద్వారా సంక్రమించిన అనేకవిధాలైన రోగాలతో దాదాపు యాఖై మిల్లియన్ల (ఐదు కోట్లమంది) రెడ్ ఇండియన్లు మరణించారు.
స్పైన్దేశానికి చెందిన చర్చి ఇంకా ఘోర మైనది. క్రిష్టియన్ స్పానియార్స్స్ హిన్టాయోలా(ఈ నాటి హైతీ,డొమినికన్ రిపల్లిక్లకు చెందిన) టైనో ఇండియన్లను, మెక్సికోలోని అజ్టెక్ ఇండియన్లను,పనామాదేశస్టులను దక్ష్యంఅమెరికాలోని ఆన్ెస్ పర్వతశ్రేణి వెంబడి ఉన్న ఇన్కాసామ్రాజ్యానికి చెందిన (ప్రజలను 16 వ శతాబ్దంలో లక్షల సంఖ్యలో రూపుమాపి ఆ దేశాలను కొల్లగొట్టారు. వీళ్లు ప్రచారంలోనికి తీసికొని వచ్చిన 'సాన్నియాగో'అనే నినాదంతో(ఇది ముస్లిమ్‌ల 'జిహాదొనినాదం వంటిది) ఆ దేశం యుద్ధభటు లందరూ క్రైస్తవమతం తప్ప ఏ మతానికి చెందినవారైనా అందరినీ మట్టుపెట్టడం తమ విధ్యుక్తధర్మం (ఈ నినాదానికి అర్ధం ఇదే) అని చెపుతూ క్రూరవీరవిహారం చేశారు. ఈ క్రైస్తవేతరులు యూదులు కావచ్చు, ముస్లిమ్‌లు కావచ్చు, అమెరికాలోని ఆదివాసులు కావచ్చు. అందరూ 'ఇన్ఫైడల్సే; రూపుమాప తగినవారే.
హిందూమతం 65
భారతదేశానికి వచ్చి శ్రమ లేకుండా లభించే బంగారం అంతా కొల్లగొట్టి పట్టుకొనివెళ్లా లనే అభిప్రాయంతో బయలుదేరిన కొలంబస్ దైవవశంచేత అమెరికాలో ప్రవేశించి అక్కడినుండే మరో మార్గంలో బంగారం సంపాదించా లనే అభిప్రాయంతో అమెరికాజాతీయులను దాసులనుగా బంధించి యూరప్దేశాలకు పంపాలని ప్రయత్నం చేశాడు. చాలమంది దారిలో చనిపోవడంతో ఆ ప్రయత్నం నుండి విరమించుకొన్నాడు. కాలాంతరంలో ఈ దాసవిక్రయవ్యాపారం మరికొందరు చేపట్టారు. మార్గమధ్యంలో చనిపోతూ ఉండడంచేత అమెరికానుండి దాసులను పంపడం కంటె ఆఫ్రికా నుండి పంపడం మంచి దని మొట్టమొదట సలహా చెప్పినవాడు స్పెయిన్ దేశానికి చెందిన కాథలిక్ మతప్రచారకుడు బార్జాలోమ్ డి లాస్ కాసాస్ అనేవాడు. స్పానిష్ విజేతలు మొట్టమొదటిసారిగా 1507లో ఆధఫ్రికానుంచి ఒక దాసుల గుంపును ఓడ ద్వారా అమెరికాకు పంపారు. అది మొదలు తరువాతి నాలుగు శతాబ్దాల కాలంలో పది మిలియన్ల (కోటిమంది) దాసుల్ని ఆఫ్రికానుండి అమెరికాకు దిగుమతి చేశారు. 1700 ప్రాంతంలో దాసుల వ్యాపారం అత్యున్నతస్థాయికి చేరుకుంది. ఈ వ్యాపారం అంతా నడిపించినవాళ్లు (కైస్రవమతస్కులైన బ్రిటిష్-ఫెంచ్-దచ్-పోర్చుగీస్దేశాలవాళ్లే. ఈ దాసుల్లో చాలమంది కారిబ్బీన్కు, బైజిల్కు పంపబడగా కొందరు ఉత్తర అమెరికాకు పంపబడ్డారు. అయితే 1834-38 సంవత్సరాలలో ఈ దాసుల వ్యాపారం నిషేధించారు. అయినా కూడ ఇందెంచర్షిప్ (వ్రాతమూలకంగా కొన్ని సంవత్సరాలపాటు పనిచేయించుకొనడం కోసం నిర్బంధించడం) వంటి విధానాలలో ఇది సాగుతూనే వచ్చింది. ఈ పద్ధతి ప్రకారం ఎంతోమంది భారతీయులను యూరప్ దేశీయులు అధికంగా ధనం ఇస్తా మని ఎరచూపి (్రినిడాడ్, గయానా, సురినామ్ మొదలైన దేశాలకు తీసికొని పోయి అక్కడ వాళ్లవేత ప్లాంటేషన్ మొదలైన వాటిలో బండచాకిరీ చేయించేవారు. 1888-1917 సంవత్సరాల మధ్య సుమారు అర్ధమిలియన్ (5 లక్షల మంది) భారతీయులను కూలీలనుగా ఒక్క కారిబీన్కు తీసికొనివెళ్లడం జరిగింది. ఇతర దేశాలకు తీసికొనివెళ్లడం మాట చెప్పనక్కరలేదు. ఒక్కమాటు అక్కడికి చేరారా, వాళ్లని దాసులకంటె నీచంగా చూచేవార్సు అదే
66 హిందూమతం పద్ధతి నేటికి కూడ కొనసాగుతూన్నది. “ఎవరైనా ఒక చెంపమీద కొదితే రెండవ చెంప చూపించు” అని బోధించే శ్రైస్తవమతాన్ని అనుసరించినవాళ్లు తోటి మానవుల విషయంలో (ప్రవర్తించిన, ప్రవర్తిస్తూన్న పద్ధతి ఇది? (.౪..6.8.?. 211-212)
యూరప్ దేశాలన్నింటిలోనూ ఈ నాటికి కూడ వదో ఆకారంలో '“అపార్ధీడ్ (కొన్ని జుతులవాళ్లని వెలివేయడం) కనబడుతూనే ఉంది. ఇతర దేశీయులనూ, ఒకే దేశంలో భిన్నప్రాంతీయులనూ చిన్నచూపు చూడడం అనేది ప్రతీ దేశంలోనూ ఉంది.
మెక్సికోలో ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన - నొబెల్ శాంతిపురస్మ్కార గ్రహీత్రి రిగొజెర్టా మెంచును ఆ దేశం ప్రెసిడెంటు ఏదో విషయంలో ఆమె సలహాలు కోరి ఆమెను ఆహ్వానించా డట. ఆమె సెంట్రల్ అమెరికా లోని ఆదివాసులు ధరించే దుస్తులు ధరించి మెక్సికోలోని ఒక సముద్రతీరంలో ఉన్న హోటల్‌కు వెళ్లగా ఆమె ఎవరో వీథిలో తిరిగి సరుకులు అమ్ముకొనే సాధారణమహిళ అనే అభిప్రాయంతో ఆ హోటలు యజమానులు ఆమెను గెంటివేయబోగా అంతలో ఆమెను కలవడానికి వచ్చిన ఇతరులు అడ్డుకొనగా ఆమెను లోనికి రానిచ్చారట. (హిందూపత్రిక 18.8.2007) ఇదీ పాశ్చాత్యులలో ఈనాడు కూడ కనబడుతూన్న ఉదారమానవతాప్రవృత్తి.
ఇతర మతస్థుడిని ఒకజ్డి చంపినా స్వర్గంలో సుస్థిరమైన స్థానం వేచి ఉంటుంది; వాళ్లసొమ్ములు కొల్లగొట్టుకొని జీవించినన్నాళ్లూ సుఖంగా ఉండవచ్చు అనే విశ్వాసంతో కొన్ని మతాలు ఈనాటికి కూడ ప్రపంచం అంతా వీరవిహారం చేస్తున్నాయి.
ఇన్లామ్ మతం ఆవిర్భవించిన ప్రారంభదశలో మహమ్మదీయుల ప్రవృత్తి ఏ విధంగా ఉందేదో “సర్వే ఆఫ్ యూరోపియన్ సివిలిజేషన్” అను (గ్రంథంలో వల్గాస్ క. ఫర్గూసన్ ఈ విధంగా వ్రాశాడు - "716 14091605 00౧౬0464 10 జర ంట జుం జర 0డర్రు/ 0286 జగరే 60 0106ల ఓల అయ! 61069. ఊక &ం;060015 1018100 000062 46 01650 ౦౯0 జజయిం 2%9 ౧62% జడే 01యురేల జడ ౧060 మ *0గేర, 19ట0 26020664 ౧౦౧౫ల 6" కొం మజ) 0046 5604104006 065 (.151-3).
హిందూమతం 67
(ముస్తిమ్లు జట్లు జట్లుగా ఇతర ప్రాంతాలనుంచి వచ్చే వర్తకులను, చుట్టు (ప్రక్కల గ్రామాలను, యూదులను వివిధజాతుల వారినీ దోచుకొనడం అవిచ్చిన్నంగా సాగిస్తూనే ఉండేవారు. మరణానంతరం స్వర్షసుఖం అనుభవించ వచ్చు, ఈ దోచుకొన్న సొమ్ములతో ఈ లోకంలో సుఖంగా జీవించవచ్చు అని బోధించే ఈ జయశీల మైన మతం వైపు ఆ ప్రాంతాలకుచెందిన బెడ్విన్జాతులవాళ్లు మొగ్గుచూపి దానిలోనికి మారిపోయారు).
ముస్లిమ్‌ల ఈ ప్రవృత్తి రెండు మూడు శతాబ్దాల క్రితం వరకు కొనసాగుతూనే ఉంది. వీళ్లు చేసిన ఎన్నో అమానుషచర్యలకు భారతదేశంలోని భగ్నదేవాలయాలు, దేవాలయాలను కూల్చి కట్టిన మసీదులు, భగ్నశిల్పాలు మూకసాక్షలుగా ఈ నాటికి కూడ నిలచి ఉన్నాయి. ఈ నాటికి కూడ ఏదో ఒక ఆకారంలో ఈ ప్రవృత్తి కనబడుతూనే ఉన్నది.
ఇలాంటి విచిత్రప్రవృత్తి గల విదేశీయులు ఈ గడ్డమీద కాలుమోపే వరకూ ఈ దేశం ఇలాంటి అమానుషచర్యలను ఎన్నడూ చూడలేదు అనే విషయాన్ని చెప్పడం కోసమే ఇదంతా చెప్పవలసివచ్చింది. ప్రపంచకంలో అంతటా మా మతాన్నే వ్యాపింప చేస్తాం అని నడుము కట్టుకొని ఎంతటి క్రూరకృత్యాలు చేయడానికైనా వెనుకాడని ఈ మతాలలో కూడ ఎన్నో చీలికలు ఏర్పడి ఒకళ్లని ఒకళ్లు ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా చంపుకోవడం ఎన్నో శతాబ్దాలుగా జరుగుతూన్న దనే
విషయం అందరికీ తెలిసినదే. అలాంటివాళ్లు భారతదేశంలో ఉన్న జాతిభేదాదులు
గోరంతలు కొండంతలు చేసి సానుభూతి చూపిస్తూన్నట్లు నటించడం హాస్యాస్పదం. ఈ దేశంలో ఈ విభేదాలు ఆధునికయుగంలో సడలిపోతూన్నా, ద్వేషాలుమాత్రం గట్టిగా పాతుకొనిపోవదానికి వీళ్ల రాతలూ, ప్రచారాలూ కూడ ప్రధానకారణం. దీనికి తోడు కొందరు స్వార్థపరులూ కొన్ని రాజకీయపక్షాలూ కూడ దోహదం
సమాజంలో ఇలాంటి లోపాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకొనే శక్తి సామర్దాలు భారతీయులకు లేకపోలేదు. బహుశా యథార్థవిషయజ్ఞానం కలగడానికి కొంత కాలం పట్టవచ్చు.
68 హిందూమతం జపాన్ మొదలైన దేశాలలో అస్పృశ్యత
జపాను, కొరియా మొదలైన దేశాలలో ఈ జాతిభేదంవల్ల వర్పడిన ఉచ్చ- నీచ భావం చాల తీవ్రంగా ఉండేది. చాలవరకూ తగ్గినా ఈ నాటికి కూడ ఉంది. మధ్యయుగంలో జపానులోని సమాజంలో నాలుగు తెగలు ఉందేవి. వాటిలో నాల్గవదానికి 'ఎటి (274) అని పేరు. దీనికి “చాల అపరిశుభ్రమైన జాతి” అని అర్ధం. ఈ పదం 'ఎటోర' (270) అను పదంనుంచి వచ్చినది. మధ్యయుగ ప్రారంభంలో ఈ పదాన్ని-పశువులను గుజ్టాలను చంపి వాటి మాంసం తిని (బ్రతికేవాళ్ల విషయంలో ఉపయోగించే వారు. వేటాడడానికి ఉపయోగించే దేగలకీ, కుక్కలకీ, పశువుల మాంసమూ చర్మాలూ అమ్మేవాళ్లకూ కూడ “ఎటోరి' అను పదం ఉపయోగించేవారు. జపానుదేశంలోని ప్రాచీన మతమైన షింటోయిస్నస్ మతం అనుసరించేవాళ్లు, బౌద్ధమతానుయాయులూ కూడ ఈ విధమైన వృత్తులు చేసేవాళ్లను అపవీత్రులనుగా భావించేవారు. ఇలాంటివా శ్తందరూ 'హినిస్ (11౧19) లు, అపురుషులు లేదా కుపురుషులు (101-0ల౮5౦1౧3). 17,18 శతాబ్దాలలో వీళ్లందరినీ వెలివేసి దూరంగా మురికివాడలలో నివసింపచేసేవారు. 1859 లో కూడ జపానులోని న్యాయాలయాలు జపానుపౌరుని విలువలో '“ఎటా” విలువ (1/7 ఏడు వంతులలో ఒక వంతు మాత్రమే అని నిర్ణయించాయి. 1871 లో వాళ్లకు సమాన మైన పౌరత్వం కల్పించి వాళ్లు 'కొత్తపొరులు అని పరిగణించడం జరిగింది. “గ్రామీణులు” (ల టయియిు అని ఈ మధ్య వీళ్లకి (హరిజనులు వంటి) మెత్తని (6౧0[ల160) పేరు పెట్టినా వీళ్ల విషయంలో సామాజికంగా తారతమ్య ప్రవృత్తి కొనసాగుతూనే ఉంది. నల్లజాబితాలు (91201 156) ఈనాటికీ జపానుదేశంలో ప్రచురింపబడుతూనే ఉంటాయి. ఈ జాతివాళ్లు తమజాతివాళ్లతోనే వివాహాదిసంబంధాలు చేసుకోవాలి. ఈ విధంగా సామాజికమైన ఆంక్షలకు వీళ్లు గురి బెతూ ఉన్నారు. ఇలాంటి అస్పృశ్య జాతుల వాళ్లకి కొరియాలో 'పీక్కాంగ్లు ()260101బ్రి అనీ, టిబెట్‌లో రాగియప్పాలు (౭ల202) అనీ పేర్లు. ఆ దేశాలకు సంబంధించిన ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుపుతూ ఎన్నో పుస్తకాలు పత్రికలూ వెలువడుతున్నాయి. దీనిని పట్టి ఈ సామాజికతారతమ్యా లనేవి కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నాయనే ప్రచారం చేస్తూ వర్గద్వేషాలు పెంచుకొనడం
హిందూమతం 69 కంటె ఇలాంటి విభేదాలు ప్రాచ్యపాశ్చాత్య దేశాలన్నింటిలోనూ వవో రూపాలలో ఎల్లప్పుడూ ఉండే వనీ, ఇప్పుడు కూడ ఉన్నా యనీ గుర్తించి ఆ విభేదాలను రూపుమాపజాలకపోయినా విద్వేషాలను తొలగించుకొనడానికి అందరూ 'ప్రయత్నించవలసి ఉంది. నాలుగు ఆశ్రమాలు
ఇతరమతాలలో గాని, ఇతరదేశాలలో గాని ఒక నిశ్చితరూపంలో కనబడని, హిందూమతంలో మాత్రమే అనాదికాలంనుంచీ ఆచరణలో ఉన్న అసాధారణమైన వ్యవస్థ ఆశ్రమవ్యవస్థ. మానవుని జీవితానికి ఒక అత్యున్నత మైన లక్ష్యం ఏర్పరచి దానిని చేరడానికై అతడు వాని జీవితకాలాన్ని ఒక నిర్జీతరీతిలో వినియోగించుకొనదానికై ఏర్పరచిన, (ప్రయత్నపూర్వకంగా పొటించవలసిన సమయపట్టిక (౧1౫6 - 12019) వంటిది ఈ వ్యవస్థ. ఇది మానవుని వైయక్తికాభ్యున్నతికీ సామాజికాభ్యుదయానికీ సమంగా ఉపకరించే అత్యుత్తమమైన విధానం. జ్ఞానం వచ్చినది మొదలు చివరి దాకా లోకవ్యవహారాలతో సతమత మవతూ, సరిగా నిర్వహించే సామర్థ్యం లేక, సామర్థ్యం ఉన్న వాళ్లకు అవకాశం ఇవ్వకుందా అనేకవిధాల సమాజంలో అశాంతికి కారణభూతులై, చివరికి ఇతరులు గెంటివేయగా హతాశులై తామే శాశ్వత మైన అశాంతికి గురి అయ్యే వయోవృద్ధులు గాని, నీతినియమాలతో సంబంధం లేని ధన - అధికారాదిసంపాదన ప్రధాన మైన విద్యల నభ్యసించి, స్వేచ్చగా ప్రవర్తిస్తూ భోగమాత్రలాలసులై సమాజంలో ఎలాంటి సంక్షోభాన్సైనా సృష్టించడానికి వెనుదీయని యువకులు గాని దేశాలను సుఖశాంతి విహీనాలుగా చేస్తూ వాటిని వినాశపథంలో నడపకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ కూర్చొని జాగ్రత్తగా ఆలోచించి పునరుద్ధరించి కాపాడవలసిన అత్యుత్తమ వ్యవస్థ ఈ ఆశ్రమవ్యవస్థ. దేశ - కాలాదులను పట్టి మార్పులూ, చేర్పులూ చేసికొనాలి అనేది అన్ని వ్యవస్థలకూ వర్తించే సూత్రమే. ఆశ్రమవ్యవస్థ మానవునికి మానసికమైన స్టైర్యాన్నీ ఎన్ని క్లేశాలకైన తట్టుకొనే శారీరకమైన సామర్ధాన్నీ ఇస్తుంది. దేశాన్ని భౌతిక - సాంస్కృతిక - ఆధ్యాత్మికరంగాలలో అగ్రగామిగా చేస్తుంది.
70 హిందూమతం
హిందూమతం కేవలం ఒక మతం కాదు, ఇది ధర్మం అని ప్రారంభంలోనే తెలిసికొని ఉన్నాం. దీనిని ధర్మంగా (గ్రహిస్తేనే దీని పరిపూర్ణస్వరూపం అర్ధం అవుతుంది.
సువిశాల మైన వేరు వేరు భూమికలు (16౪7619) ఉన్న మహోన్నతప్రాసాదం ఈ హిందూమతం. పరిశుద్ధ మైన ఆధ్యాత్మికజ్ఞానం అత్యున్నతమైన నాల్బవ భూమిక. ప్రతీ మానవుడూ చివరికి చేరి శాశ్వతానందభరిత మైన స్థితిని అనుభవించవలసిన భూమిక ఈ నాల్గవ భూమిక. సర్వజనులకూ (శ్రేయస్కరము లైన అందరికీ సంబంధించిన నైతికసద్గుణాల్లూ, కర్తవ్యాలూ మూడవ భూమిక. వర్ణాశ్రమాడులను బట్టి, లేదా తాను అవలంబించిన జీవనవిధానాదులను బట్టి ఆచరించవలసిన విభిన్నకర్తవ్యాలు రెండవ భూమిక. వంశ - జాతి - దేశాదులను బట్టి ఏర్పరచుకొన్న నియమాలు మొదటి భూమిక. ఈ విభిన్నభూమికలు గల మహోన్నత ప్రాసాదమే హిందూమతం. దీనిలో అందరికీ స్థానమూ పరమానందమూ లభిస్తాయి.
మానవుడు ఈ భూమిమీద ఏదో విధంగా సుఖంగా ఉండే టట్లు చేయడం గాని, వీనికి స్వర్గంలో ప్రవేశం కల్పించి అక్కడ నిరంతరము పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ కూర్చుండే టట్లు చేయడం గాని హిందూమతం లక్ష్యం కాదు. అనాదీ, అనంతమూ, సర్వవ్యాప్తమూ, ఎలాంటి విశేషాలకీ భేదాలకీ తావులేనిదీ పరిశుద్ధమూ అయిన పరమాత్మ తత్త్వమే నీ అసలు స్వరూపం అని బోధించి, మానవుణ్ణి ఈ జన్మమరణాదిసాంసారిక బంధనాలనుంచి పూర్తిగా విముక్తుణ్ణి చేసి ఆ సరతత్త్వంలో విలీనం అయే టట్లు చేయడమే ఈ మతం ప్రధానలక్ష్యం. మానవుడు భూమిమీద ఉన్నప్పుడు తన ప్రవర్తనను పరిశుద్ధం చేసికొన్నంతమాత్రంచేత మొదటి ఒకటి - రెండు భూమికలు ఎక్కినంత మాత్రం చేత, ఈ స్థితి - మోక్షం-లభించదు. అలా పరిశుద్ధజీవనం గడపుతూండడంతో పాటు ఆత్మస్వరూపానుసంధానం కూడ చేసికొంటూ ఉంటేనే కొన్ని జన్మలకు ఆ స్థితిని పొందకలుగుతాడు; నాల్గవ భూమికను చేరకలుగుతాడు. ఆత్మస్వరూపజ్ఞానం కలగాలంటే మనస్సును పూర్తిగా నిర్మలం చేసుకోవాలి. ఇందుకు సాధనాలుగా హిందూమతంలో కొన్ని నైతిక - ఆధ్యాత్మిక నియమాలు విధింపబడి ఉన్నాయి. వీటిని శ్రద్దాపూర్వకంగా పాటించేవానికి కొంత కాలానికి, వానికి తెలియకుండానే ఆత్మస్పరూపజ్ఞానం లభిస్తుంది. సాంసారికబంధనా
హిందూమతం గే లన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. రాజకీయనిబంధనలూ, సామాజిక నియమాలూ, ఆ యా ట్రాంతాలకీ దేశాలకీ చెందిన ఆచారవ్యవహారాదులూ ఇవన్నీ ఆ అత్యున్నతలక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే సాధనాలు మాత్రమే. ఈ సాధారణసాధనాలనూ, విశేషసాధనాలనూ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలిపే ఆయుష్మాలవిభాగమే ఆశ్రమవ్యవస్థ. నాలుగు ఆశ్రమాలనూ, ఆశ్రమధర్మాలనూ గూర్చి అన్ని స్మృతులలోను చెప్పబడింది. ఒక స్మృతిలో చెప్పని విషయాలు ఇతరస్మృతినుండి గ్రహించవలసి ఉంటుంది. “బ్రహ్మచారీ గృవాస్థశ్చ వానప్రస్థో యతిస్తథా, ఏతే గృహస్థప్రభవాశ్చ్ళత్వారః పృథగాశ్రమాఒ” (మ.స్కృ, 687) “బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సంన్యాసి - ఈ నాలుగూ వేరు వేరు ఆశ్రమాలు. వీటి కన్నింటికీ మూలం గృహస్థుడు.” ఈ ఆశ్రమాల క్రమం కూడ ఈ విధంగా చెప్పబడింది. “వేదానధీత్య వేదౌ వా వేదం వాపి యథాక్రమమ్, అవిఫ్లుతబ్రహ్మచర్యో గృహస్థాత్రమమావసేత్.” (మ.స్కృ.3.2) “వీలును బట్టి మూడు వేదాలు గాని, రెండు వేదాలు గాని, ఒక వేదం గాని, బ్రహ్మచర్యాన్ని కాపాడుకొంటూ కక్రమానుసారం అధ్యయనం చేసి తరవాత గృహస్తా (మంలో ప్రవేశించాలి.” (బుక్ - యజస్ - సామవేదాలు మూడు). “గృహస్థస్తు యదా పశ్యేద్వలీపలితమాత్మనః, అపత్యస్య తథాపత్యం తదారణ్యం సమాశత్రయేత్.” (మ.స్మృ, & లె “తల నెరిసి ఒంటిమీద ముడతలు కనబడగానే, సంతానానికి సంతానం కలగగానే (పౌత్రుడు కలగగానే) గృహస్థుడు అరణ్యానికి వెళ్లిపోవాలి (వాన ప్రస్టాశమంలో ప్రవేశించాలి.” ఈ ఆశ్రమంలో కూడ యథాశక్తి యజ్ఞాదులు చెయ్యాలి. “వనేషు ళు విహృత్షైవం తృతీయం భాగమాయుష్కు చతుర్ధమాయుషో భాగం సంగం త్యత్త్వా పరివ్రజేత్.” (మ.స్మృ. 6.33)
22 హిందూమతం
“తన ఆయుర్దాయంలోని మూడవ భాగం ఈ విధంగా అరణ్యాలలో గడిపి నాల్లవ భాగంలో సమస్తసంగాలు పరిత్యజించి పరివ్రాట్ (ఒక చోట స్థిరనివాసం లేకుండా సంచరించే సంన్యాసి) కావాలి.”
__ పూర్వజన్మసంస్కారంవల్ల బాల్యంనుంచీ ప్రగాధమైన వైరాగ్యం కలవా దైతే తప్ప ఇతరు లందరూ ఈ (క్రమంలోనే సంన్యాసం దాకా వెళ్లాలి; అలా కాకపోతే దారి తప్పి పతితు డయ్యే ప్రమాదం ఉంటుంది.
“అనధీత్య ద్విజో వేదాన్ అనుత్చాద్య తథా ప్రజామ్,
అనిష్ట్వా చైవ యజ్జైశ్చ మోక్షమిచ్చన్ వ్రజత్యధః.” _ (మ.స్కృ. 6.37)
“వేదాధ్యయనం చేయకుండా (బ్రహ్మచర్యాశమంలో కొంతకాలం ఉండకుందా,) సంతానాన్ని కనకుండా (గృహస్థాశమంలో ఉండకుండా యజ్ఞాలు చేయకుండా మోక్షం కావా లని కోరుకొనే (సంన్యాసం స్వీకరించే) ద్విజుడు అధః పాతాళంలో పడిపోతాడు.” అలాంటి వాళ్లని ఆదరించినవాళ్లకి కూడ పాపం సంక్రమిస్తుంది.
దీనిని పట్టి సంన్యాసం తీసికొనే ముందు మానవుడు మానసికంగా ఎంతటి పరిపక్వత చెందాలో అర్థం అవుతుంది. అలాంటి దేదీ లేకుండా వేషమాత్ర పరివర్తనం చేసిన వాళ్లందరూ కుహనాసంన్వాసులు. నిజానికి ఇది సంన్యాసం కాదు వేషభాషావిశేషవిన్యాసం. ఈ విన్యాసుల పరమలక్ష్యం మోక్షం కాదు; ధనార్దనము, శిష్య - శిష్యామానసావర్దనము, కీర్తి - ప్రతిష్టల సముపార్దనమూ మాత్రమే. వీళ్లని ఆశ్రయించిన వాళ్లకి తాత్మాలికంగా లౌకికవిషయాలలో లాభం లభించి నట్లు కనబడొచ్చు. వెనుకకు తిరిగి చూచుకొంటే నిజానికి వీళ్లకు లభించేది ధన - దార - మానాది మోక్షం మాత్రమే; సంసారమోక్షం ఆకాశకుసుమప్రాయమే.
- (బ్రవ్మచర్యాశమం
“బ్రహ్మి అనగా వేదం. వేదం అభ్యసించడానికి ఆచరించే వ్రతానికి (నియమానికి) “బ్రహ్మ అని పేరు. (బ్రహ్మను ఆచరించేవాడు బ్రహ్మచారి. బ్రహ్మచారి వేదంతో పాటు వేదంతో దగ్గర సంబంధం ఉన్నవీ, దూరం సంబంధం ఉన్నవీ అయిన ఎన్నో ఇతర విషయాలను కూడ నేర్చుకొంటాడు. అందుచేత నేర్చుకొనే
హిందూమతం 73 విద్య ఏదైనా విద్య నేర్చుకొనే వాణ్ణి (బ్రవ్మచారి అనవచ్చు. అనగా విద్యార్థి. అందుచేత పూర్వస్మృతులలో బ్రహ్మచారికి చెప్పిన నియమా లన్నీ కొన్ని మార్పులతో అన్ని కాలాల విద్యార్థులకూ కూడ వర్తిస్తాయి. ఈ నియమా లన్నీ వానిని భవిష్యత్పరిపూర్ణమానవుణ్ణిగా తీర్చి దిద్దుతాయి. బ్రహ్మచారి జీవనం ఉపనయనంతో ప్రారంభం అవుతుంది. ఉపనయనం అనగా ఐదారు సంవత్సరాల బాలుణ్ణి విద్యాభ్యాసంకొరకు ఆచార్యుని దగ్గరకు, లేదా పాఠశాలాదులకు పంపడం. ఆచార్యునిదగ్గర చేరినది మొదలు ఆ బాలుడు ఎన్నో కళోరనియమాలు పాటించాలి. ఇవన్నీ వానిలో వినయమూ, వినమ్రతా, పెద్దల ఎడ భక్తీ మొదలైన సద్గుణాలు వృద్ధి పొందిస్తాయి. క్షేశాలను సహించే శక్తినీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందిస్తాయి. భోగలాలసత్వాన్ని దరికి చేరనీయవు. (బ్రహ్మచారి (విద్యార్థి) సూర్యోదయానికి చాల ముందే నిద్రనుండి లేచి స్నానం చేసి సూర్యోదయం అయేవరకు ప్రాతకాలసంధ్యను ఉపాసించాలి. అగ్నిని పూజించాలి. అతడు నిద్రపోతుండగా సూర్యోదయం అయితే అందుకు ప్రాయశ్చిత్తంగా ఆ దినం ఉపవాసం ఉండి మంత్రజపం చెయ్యాలి. కొందరు ఉత్తమగ్భహస్టుల ఇండ్లకు వెళ్లి మాధుకరవృత్తితో ఆహారం సంపాదించి, లభించిన పదార్థా లన్నీ ఆచార్యునికి చూపి, ఆతడు అనుమతించిన ఆహారం భుజించాలి. “పూజయేదశనం నిత్యమద్యాచ్చెతదకుత్సయన్, దృష్ట్వా వృప్వేత్ ప్రసీదేచ్చ ప్రతినన్డేచ్చ సర్వశవ” _ (మ.స్కృ,254) “ఎల్లప్పడూ అహారాన్ని పూజించాలి. నిందించకుండా (లోపాలు ఎంచకుండా) దానిని భుజించాలి; దానిని చూడగానే అనందిస్తూ ప్రసన్నుడు కావాలి. అన్ని విధాలా దానిని ప్రశంసించాలి” “పూజితం హ్యశనం నిత్యం బలమూర్దం చ యచ్చతి, అపూజితం తు తద్భుక్తముభయం నాశయేదిదమ్.” _ (మ.స్మృ.2.55) “అన్నాన్ని పూజిస్తే అది ఎల్లప్పుడూ బలాన్నీ తేజస్సును వృద్ధి పొందిస్తుంది. దానిని నిందిస్తూ తింటే ఆ రెండింటినీ నశింపచేస్తుంది.” మానసికభావనకు అంత బలం ఉంది.
గీ హిందూమతం
“అనారోగ్యమనాయుప్యమస్వర్ద్యం చాతిభోజనమ్,
అపుణ్యం లోకవిద్విష్టం తస్మాత్తత్ పరివర్దయేత్.” (మ.స్కృ.2.57)
“అతిగా తినడంవల్ల ఆరోగ్యం చెడుతుంది. ఆయుర్దాయం క్షీణిస్తుంది. స్వర్గం లభించదు. పాపాన్ని కలిగిస్తుంది. లోకు లందరూ నిందిస్తారు. అందుచేత అతిగా తినే అలవాటు మానుకోవాలి.” ఈ ఘట్టాలలో చెప్పిన కొన్ని ధర్మాలు కేవలం ఆ బ్రహ్మచార్యాదులకే కాక అందరికీ వర్తిస్తాయి. ఇవి సాధారణధర్మాలలో చేరతాయి.
సాయంకాలం కూడ సాయంసంధ్యను ఉపాసించి ఆహారం భుజించాలి. భోజనానికీ భోజనానికీ మధ్య సాధారణంగా మరేమీ తినకూడదు.
“వర్ణయేన్మధు మాంసం చ గన్థమాల్యం రసాొన్ స్త్రియః,
శుక్తాని చైవ సర్వాణి ప్రాణినాం చైవ హింసనమ్.” (య.స్మృ.2. 177)
“మద్య-మాంసాలను, మంచిగంధమును, పుష్పమాలలను, మధుర పదార్థాలను, స్త్రీలను, అన్ని పులిసిన పదార్థాలను, ప్రాణిహింసను వర్డించాలి. వీటికి దూరంగా ఉండాలి.”
“అభ్యజ్ఞమళ్టనం చాక్ష్ణోః ఉపానచ్చత్రధారణమ్,
కామం క్రోధం చ లోభం చ నర్తనం గీతవాదనమ్.” (మ.స్మృ. 2. 1786)
“ఒంటికి తైలమూ సుగంధద్రవ్యాలూ రాసికొనకూడదు. కళ్లకు కాటుక పెట్టుకొన గూడదు. చెప్పులూ, గొడుగూ ధరించకూడదు. కామ - క్రోధ - లోభాలు విడిచిపెట్టాలి. నృత్యము, సంగీతము, వాద్యాలు మోోగించదమూ చేయగూడదు.”
“ద్యూతం చ జనవాదం చ పరివాదం తథానృతమ్,
ప్రీణాం చ 'పేక్షజాలమృముపఘాతం పరస్య చ” (మ.స్మృ.2. 179)
“జూద మాడకూడదు. కబుర్లతో కాలక్షేపం చేయకూడదు. ఇతరులను ఆడిపోసి కొనకూడదు. అసత్యం పలకకూడదు. ప్ర్తీలను తేరబారి చూడకూడదు, వాళ్లను స్పృశించ కూడదు. ఎవరినీ కొట్టకూడదు.” సాధారణధర్మం.
“హీనాన్నవస్త్రవేషు స్యాత్సర్వత్ర గురుసంనిధౌ,
ఉత్తిప్టేత్తథమం చాస్య చరమం చైవ సంవిశేత.” (మ.స్కృ.2. 194)
హిందూమతం 75 “గృర్రువు దగ్గర ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆయనకంటె తక్కువ రకం అన్నమూ, వస్రాలూ, వేషమూ కలిగి ఉండాలి. ఉదయం గురువుకంటె ముందు లేవాలి, అతడు పరున్న తరవాత పండుకోవాలి.” “ప్రతిశ్రవణసంభాషే శయానో న సమాచరేత్, నాసీనో న చ భుజ్బానో న తిస్టన్ న పరాబ్ముఖష” (మ.స్కృ.2. 195) “గరువు ఆజ్ఞను వింటూన్నప్పుడు, ఆయనతో మాటలాడే టప్పుడూ పండుకొని ఉండి ఆ పనులు చేయకూడదు. అట్లే కూర్చుండి గాని, తింటూ గాని, నిటారుగా నిలబడి గాని పెడ మొగంతో గాని ఆ పనులు చేయకూడదు.” “నీచ్వై శయ్యాసనం చాస్య సర్వదా గురుసన్నిధౌ, గురోస్తు చక్షుర్విషయే న యథేష్టాసనో భవేత్.” (మ.స్కృ.2. 198) “శిష్యుని శయ్య ఆసనమూ కూడ గురువు శయ్యాసనాలకంటి క్రిందికి పల్లంగా ఉందాలి. గురువు కంటికి కనబడే టప్పుడు ఇష్టం వచ్చి నట్లు కాళ్లు చాపుకొని కూర్చొనటం వంటి పనులు చేయకూడదు.” “నోదాహరేదస్య నామ పరోక్షనపి కేవలమ్, న చైవాస్యానుకుర్వీత గతిభాషితచేష్టితమ్.” (మ.స్కృ.2 199) “పరోక్షంలో కూడ గురువు పేరు 'ఉపాధ్యాయి, “ఆచార్య వంటి పదాలు చేర్చకుండా చెప్పకూడదు. ఆతని నడకను, మాటలను, చేష్టలను అనుకరించ కూడదు” సాధారణధర్మం. “గురోర్యత్ర పరీవాదో నిన్దా వాపి ప్రవర్తతే, కర్ణౌ తత్ర పిధాతవ్యౌ గన్తవ్యం వా తతో£_న్యతవఒ” (యమ.స్మృ.2200) “తన గురువును గూర్చి ఎక్కడ చెడు మాటలు చెప్పుకొంటూంటారో, ఆతనిని నిందిస్తుంటారో అక్కడ చెవులు మూసికోవాలి. లేదా అక్కడి నుండి లేచివెల్లి పోవాలి.” సాధారణ ధర్మం. “మాత్రా స్వస్టా దుహిత్రావాన వివిక్తాసనో భవేత్, బలవానిన్లియగ్రామో విద్వాంసమపి కర్షతి.” (మ.స్కృ.2.215)
76 హిందూమతం “ఇతరు లెవరూ లేనిచోట తల్లితో గాని, సోదరితో గాని, కుమార్తెతో గాని కలిసి ఉండగూడదు. ఎందువల్ల ననగా చాలా బలం గల ఇంద్రియసముదాయం ఎంతటి విద్వాంసు జైనా లాగివేస్తుంది.” ఇది కూడ సాధారణధర్మం. “ఆచార్యశ్చ పితా చైవ మాతా (భ్రాతా చ పూర్వజు, నార్తేనాప్యవమన్తన్యాః బ్రాహ్మణేన విశేషత” (మ.స్మృ. 2.225) “ఆచార్యునీ, తండ్రినీ, తల్లినీ, అన్నగారినీ - వాళ్లవల్ల ఎంత పీడ కలిగినా కూడ అవమానించకూడదు. విశేషించి బ్రాహ్మణుడు అవమానించగూడదు.” (ఇది కూడా సామాన్యధర్మమే). “ఆచార్యో బ్రహ్మణో మూర్తిః పితా మూర్తిః ప్రజాపతేః, మాతా పృథివ్యా మూర్తిస్తు భ్రాతా స్వో మూర్తిరాత్మనః.” (మ.స్మృ. 2.226) “ఆచార్యుడు పరబ్రహ్మస్వరూపుడు. తండ్రి ప్రజాపతి స్వరూపుడు. తల్లి భూదేవీ స్వరూపురాలు. తన సోదరుడు తన స్వరూపమే.” “యం మాతాపితరౌ క్లేశం సహేతే సంభవే నృణామ్, న తస్య నిష్కృతిః శక్యా కర్తుం వర్షశతైరపి.” (మ.స్కృ.2.227) “మనిషి పుట్టిన తరువాత వాని తలిదండ్రులు వాని పాలన-పోషణాదుల కోసం ఎంత క్లేశం సహిస్తారో ఆ బుణం వందల కొలది సంవత్సరాలకు కూడ తీర్చదానికి శక్యం కాదు.” సామాన్యధర్శ్మం. “తయోర్నిత్యం ప్రియం కుర్యాదాచార్యస్య చ సర్వదా, తేష్వేవ త్రిషు తుష్టేషు తపః సర్వం సమాష్యతే.” (మ.స్మృ. 2. 228) “ఆ తలిదండ్రులకూ, ఆచార్యునికీ ప్రతిదినమూ, ఎల్లప్పుడు కూడ ప్రియ మైన కార్యమే చెయ్యాలి. వాళ్లు ముగ్గురూ సంతోషిస్తే చేయవలసిన తపస్సు అంతా పూర్తి అయినట్లే” సామాన్య ధర్మం. “తేషాం త్రయాణాం శుశ్రూషా పరమం తప ఉచ్యతే, న తై రభ్యననుజ్ఞాతో ధర్మమన్యం సమాచరేత్.” (మ.స్కృ.2229) “ఆ ముగ్గురికీ సేవ చేయడమే గొప్ప తపస్సు. వాళ్ల అనుజ్ఞ తీసికొనకుందా మరొక ధర్శకార్యం ఏదీ చేయగూడదు.” సామాన్య ధర్మం.
హిందూమతం ౯7 “త ఏవ హి త్రయో లోకాస్త ఏవ త్రయ ఆశ్రమాః త ఏవ హి త్రయో వేదాః త ఏవోక్తాస్త్రయోల_గ్నయః” (మ.స్కృ.2. 230, “ఆ ముగ్గురే మూడు లోకాలు; వాళ్లే మూడు ఆశ్రమాలు. వాళ్లే మూడు వేదాలు. వాళ్లే మూడు అగ్నులు” “సర్వే తస్యాద్భతా ధర్మా యస్వైకే తత్ర ఆదృతాం, అనాదృతాస్తు యస్వైతే సర్వాస్తస్యాఫలాః క్రియా” (మ.స్కృ.2.235) “ఎవడు ఈ ముగ్గురినీ ఆదరిస్తాడో అతడు చేసిన ఇతరధర్శకార్యాలు సఫలం అవుతాయి. వీళ్లను ఆదరించనివాడు చేసిన (శ్రౌత-స్మార్తాదికర్మలన్నీ నిష్పలములు.” సాధారణధర్మం. ఈ విధంగా బ్రహ్మచర్యాశ్రమానికి సంబంధించిన కఠోరమైన నియమాలు ఎన్నో ధర్మశాస్త్రగ్రంథాలలో విధింపబడి ఉన్నాయి. ప్రతీ బ్రహ్మచారీ కూడ ఈ విధంగా (బ్రహ్మచారి నియమాలను పాటిస్తూ విద్యాభ్యాసం పూర్తిచేసికొని, యథాశక్తిగా గురువునకు దక్షిణ సమర్పించి, ఇంటికి తిరిగి వచ్చి గృహస్థాశ్రమం స్వీకరించాలి. పైన చెప్పిన నియమాలలో నూటికి తొంభై నియమాలు కేవలం వేదాధ్యయనం చేసేవానికే కాక ఇతరవిద్యలు అభ్యసించే అందరు విద్యార్థులకు కూడ వర్తించే సామాన్యధర్మాలు. గృహస్థాశ్రమము (బ్రహ్మచర్యాశ్రమం పూర్తిచేసికొని, ఇంటికి తిరిగి వచ్చిన వాడు ఉత్తమమైన పవిత్రమైన కుటుంబంలో జన్మించిన కన్యకను వివాహ మాదాలి. మాతామహాదుల వంశంలో పుట్టిన కన్యను గాని, తనతో సమాన మైన గోత్రంలో పుట్టిన కన్యను గాని వివాహ మాడకూడదు.(మ.స్మృ. 3.5). నక్షత్రాలు, వృక్షాలు, నదులు, పర్వతాలు, మ్లేచ్చులు, పక్షులు, సర్పాలు, దాసులు - వీళ్ల పేర్లు ఉన్న కన్యను, భయంకరమైన పేరు ఉన్నదానిని వివాహమాడకూడడు. (3.9) సోదరుడు లేనిదానినీ, తండ్రి ఎవరో తెలియనిదానిని పెండ్లాడకూడదు. (3.11) ద్విజులు ప్రథమవివాహంలో సవర్దస్తీనే (తమ వర్దానికి చెందిన ప్రీనే) వివాహం చేసికొానడం మంచి దని చెపుతూ (మ.స్మృ.3. 12) కావా లని అన్యవర్డానికి
రి హిందూమతం చెందిన కన్యను వివాహం చేసికొనే పక్షంలో అనులోమవివాహాలు చేసికొనవచ్చు నని స్మృతికారులు వ్రాశారు. పై వర్దాల పురుషులు క్రింది వాల 'ప్రీలను వివాహం చేసకొనడం అనులోమవివావం. మనుస్టృతిలోని ఈ ఫుట్టాన్ని పరిశీలిస్తే అసాధారణ పరిస్థితులలో మాత్రమే ఇలాంటి వివాహాలు చేసికొనవచ్చు నని అనుమతించి నట్లు కనబడుతుంది - “శ్రూదైవ భార్యా శూద్రస్య సా చ స్వా చ విశః స్కృతే, తే చ స్వా చైవ రాజ్ఞశ్చ తాశ్చ స్వా చాగ్రజన్మనట” (మ.స్మృ. 3. 13) “శూద్రుడు శూద్రస్త్రీని మాత్రమే భార్యగా పరి[గ్రహించాలి. వైశ్యుడు తన వర్జం ప్రీని శూద్రప్రీనీ, క్షత్రియుడు తన వర్ణం స్త్రీని వైశ్యశూద్ర ప్రీలను, బ్రాహ్మణుడు తన వర్ణం స్త్రీని క్షత్రియ-వైళ్ళ్య-శూద్రస్రీలను వివాహ మాడవచ్చు.” ఇలా కొన్ని పరిస్థితులలో అనులోమవివాహాలను స్మృతికారులు అంగీకరించి నప్పుడు ప్రతిలోమ వివాహాలను (క్రింది వర్దాల పురుషులు పై వర్దాల ప్రీలను వివాహం చేసకొనడం) మాత్రం ఎవ రాషగలరు? అవి కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉండేవి. ఈ విధంగా అనులోమ - 'ప్రతిలోమ వివాహ సంబంధాల ద్వారా జనించిన సంతానాలకు వేరు వేరు పేర్లు పెట్టడంతో వేరువేరు జాతులు ఏర్పడ్డాయి. ఇదే విధంగా న్మృతికారులు ఎనిమిది విధా లైన వివాహాలను అంగీకరించారు. (బ్రాహ్మం, దైవం, ఆర్నం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం అనేవి ఆ అష్టవిధవివాహాలు. వీటిలో కాన్ని మంచివి కొన్ని కావు. అవి అన్నీ మొత్తం మీద వివాహాలే అని చెప్పబడ్డాయి. వీటిలో కూడ కొన్ని వర్ధాలవాళ్లకు కొన్ని వివాహాలు మంచి వని చెప్పబడింది. బ్రాహ్మణునికి - బ్రాహ్మ - దైవ - ఆర్న
- ప్రాజాపత్య - ఆసుర - గాంధర్వవివాహాలు ధర్మసంమత మైనవి; క్షత్రియునికి ఆసుర - గాంధర్వ - రాక్షస - పైశాచవివాహాలూ, వైశ్వ్యశూద్రులకు ఆసుర - గాంధర్వ - పైశాచ వివాహాలు ధర్మ సంమతమైనవి (మ.స్కృ.8. 28).
- _ బ్రాహ్మనివాహం : కన్య తండ్రి తానే వరుణ్ణి ఆహ్వానించి కన్యా-వరులకు మంచి వస్త్రాలు ధరింపచేసి, అలంకరించి, కన్యను ఇచ్చిన ట్లయితే అది బ్రాహ్మవివాహం.
హిందూమతం 79
- దైవవివాహం : ఏదైన యజ్ఞం ప్రారంభమై నడుస్తూన్నప్పుడు, కన్యను అలంకరించి, ఆ యజ్ఞంలో ఆర్వ్విజ్యం వహిస్తున్నవానికి ఇచ్చి వివాహం చేస్తే అది దైవవివాహం.
త. _ ఆర్షనివాహం : కన్యాదాత వరునినుంచి ఒక గోమిథునాన్ని గాని, రెండు గోమిథునాలను గాని (ఒక ఆవు ఒక ఎద్దు గోమిథునం) ధర్మకార్యాచనరణం కోసం లేదా కన్యకే ఇవ్వడం కోసం తీసికొని కుమర్తె నిచ్చి యథావిధిగా వివాహం చేస్తే అది ఆర్నవివాహం.
& _ ప్రాజాపత్యవివాహం : “మీరిద్దరూ కలిసి ధర్మాచరణం చెయ్యండి” అని చెప్పి వరుణ్ణి పూజించి కన్యాదానం చేస్తే అది ప్రాజాపత్యవివాహం.
- _ఆసురవివాహం : వరుడు యథాశక్తిగా కన్యకూ, కన్య బంధువు లైన ఆమె తండ్రి మొదలైనవారికీ ధనం ఇచ్చి వివాహం చేసికొంటే అది ఆసురవివాహం (కన్యాశుల్కం ఇచ్చిన వివాహం)
ఈ గాంధర్వనివాహం : వరుడూ వధువూ అంగీకరించి చేసికొన్న వివాహం గాంధర్వ వివాహం.
- రాక్షసవివాహం : అద్దు వచ్చినవాళ్లని సంహరించి, ఇష్టం లేని కన్యను హరించుకొని పోయి వివాహమాడడం రాక్షసనివాహం. (రుక్సిణి ఇష్టపడింది గాన రుకిణీ - శ్రీకృష్ణుల వివాహం గాంధర్వవివాహమే కాని రాక్షసవివాహం కాదు).
8 పైశాచ వివాహం : నిద్రలో కాని, మత్తులో గాని, అసహాయస్థితిలో ఉన్న ప్రీని బలాత్మరించి చెరిచి చేసికొన్న వివాహం పైశాచవివాహం. ఇది పాపిష్టమైన వివాహం.
“బ్రావ్మాదివివాహాలలో మొదటి నాల్గింటికీ జనించిన సంతానం ఉత్తమలక్షణాలు కలదై ఉంటుం దన్మీ మిగిలిన నాలుగు విధాల వివాహాల సంతానం దుష్టప్రవృత్తి కలదిగా ఉంటుం దనీ చెప్పబడింది (మ.స్మృ. 3. 39-42). అందుచేతనే (బ్రాహ్మవివాహం మాత్రమే ఈ నాడు శిష్టుల మన్ననలను పొంది ఉత్తమమైనదిగా పరిగణింపబడుచున్నది. అన్ని విధాలైన వివాహాలూ స్మృతిసమ్మతములే అని
80 హిందూమతం అంగీకరించడం, ఆ సంతానానికి కూడ దాయవిభాగాదులలో అధికారం ఇవ్వడం
- ఇలాంటి విషయా లన్నీ హిందూ మతంలో సహజంగా ఉన్న కాలానుగుణంగా సామాజికమైన మార్చులు చేసికొని అందరినీ కూడగట్టుకొని (ప్రధానలక్ష్యం వైపు నిరంతరయాత్ర చేయగలిగిన శక్తికీ విశాల దృక్చథానికీ అడుగడుగునా కనబదే అనేకఉదాహరణలలో ఒకటి.
వివాహం అనేది కేవలం సుఖానుభవం కోసం కాదు; సత్సంతానాన్ని కని సమాజపురోభివృద్ధికి తోద్దడడం కోసమే అని మాటిమాటికీ మన స్మృతులు హెచ్చరిస్తాంటాయి. అందుచేతనే ప్రీపరుషసంగమానికి ఎన్నో నియమాలు ఏర్పరచి, ఎన్నో దివసాలు నిషేధించి చివరకు మాసంలో దాదాపు పది దివసాలు మాత్రమే స్మృతులు అనుమతిస్తున్నాయి.
పూర్వకాలంలో, నూరు సంవత్సరాల క్రితం కూడ ఉన్నట్లుగా కన్యాశుల్కం ప్రచారంలో ఉండి ఉంటుంది. దానిని మనువు అతితీవ్రంగా నిందిస్తాడు.
“న కన్యాయాః పితా విద్వాన్ గృహ్హాయాచ్చ్భుల్మమబణ్వపి,
గృహ్ద్హన్ శుల్కం హి లోభేన స్యాన్నరో౭_పత్యవిక్రయీ.” (మ.స్కృ. 3. 51)
“కన్య తండ్రి ఇది ఎంత చెద్ద ఆచారమో గుర్తించి, అత్యల్పంగా కూద శుల్కం తీసికొనకూడదు. లోభంచేత శుల్కం గ్రహించినవానికి కన్యను అమ్మిన పాపం వస్తుంది.” కన్యాశుల్కం వంత నిషిద్ధమో వరశుల్కం కూడ అంత నిషిద్ధం అని దీనిని పట్టి గ్రహించాలి.
ప్రధాన మైన కొన్ని గృహస్థధర్మాలు : ఎంత అహింసావ్రతం పాలించేవా దైనా ప్రతీగ్భవస్థుడూ ప్రతిదినమూ తెలియకుండానే ఐడు జీవహింసలు చేస్తూంటాడు. ఆ జీవహింస జరిగే స్థానాలకి *'పంచసూనాలు అని పేరు. ఆ పాపానికి 'ప్రాయళ్చిత్తంగా అతడు ప్రతిదినమూ ఐదు మహాయజ్ఞాలు చెయ్యాలి -
“పళ్ళు సూనా గృహస్థస్య చుల్లీ పేషణ్యుపస్మరః
కజ్దనీ చోదకుమృశ్చ బధ్యతే యాస్తు వాహయన్.” (మ.స్కృ.3.68)
“వంట చేసే పొయ్యి, రుబ్బురోలు, చీపురు, రోలు-రోకళ్లు, నీళ్ల బిందె - ఈ ఐదూ గృహస్థునికి ఐదు హింసాస్థానాలు. అనగా ఈ ఐదు సాధనాలతో పనులు
హిందూమతం 81 చేసే టప్పుడు తెలియకుండానే మానవుడు ఐదు విధా లైన జీవహింసలు చేస్తూంటాడు. వీటి విషయంలో ఉపేక్షించినవాడు పాపబద్భు దౌతాడు.” “తాసాం క్రమేణ సర్వాసాం నిష్కృత్యర్థం మహర్షిఖిం పజ్బ క్లుప్తా మహాయజ్ఞాః ప్రత్యహం గృహమేధినామ్.” (మ.స్కృ.3. 69) “అందుచేత ఈ ఐదింటికీ ప్రాయశ్చిత్తంగా మహర్నలు, ప్రతీ రోజూ గృహస్థు లాచరించవలసిన ఐదు మహాయజ్ఞాలు విధించారు.” “అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృ్భయజ్ఞశ్చ తర్చణమ్, హోమో దైవో బలిర్భాతో నృయజ్జో౭_తిథిపూజనమ్.” (మ.స్కృ.3.70) “వేదాలను అధ్యయనం చేయడం ఇతరులకు బోధించడం “బ్రహ్మయజ్ఞం”. తొద్దాదులు, తర్పణాలు ఇవ్వడం పితృయజ్ఞం? అగ్నిలో దేవతల నుద్దేశించి హోమాలు చేయడం “దేవయజ్ఞం.” కాకులు, కుక్కలు, చీమలు, మొదలైన ప్రాణులకు ఆహారం వేయడం “భూతయజ్ఞం.” అతిథులను పూజించడం “చునుష్యయజ్ఞం.” పైన చెప్పిన వాటిలో మూడింటినీ, క్రొత్తవి రెండింటినీ కలిపి మరొక శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది - “దేవతాతిథిభృత్యానాం పిత్యాణామాత్మనశ్చ యః, న నిర్వపతి పజ్బానాముచ్చ్వసన్ న స జీవతి.” (మ.స్మృ.8.72) “దేవతలకు, అతిథులకు, భృత్యులకు అనగా తాను తప్పక భరించవలసిన (పోషించవలసిన) వృద్ధు లైన తలిదండ్రులు ఇతరు లైన దగ్గర బంధువులు మొదలైన వారికి, పితృదేవతలకు, తనకు ఈ ఐదుగురికీ అన్నం పెట్టని వాడు, శ్వాస పీలుస్తున్నా మరణించినల్లే.” “సర్వత ఏవాత్మానం గోపాయేత్” (అన్ని విధాలా తనను రక్షించుకోవాలి) అను (శ్రుతివాక్యా న్ననుసరించి తనను తాను పోషించుకొనడం కూడ ఒక ప్రధాన కర్తవ్యమే. గృహస్థాశమవైశిష్ట్రం “యథా వాయుం సమాశ్రిత్య వర్తన్తే సర్వజన్తవః, తథా గృహస్థమా్రిత్య వర్తన్తే సర్వ ఆశ్రమాణ” (మ.స్కృ.3.77)
8౭2 హిందూమతం
“సమస్తప్రాణులూ గాలిమీద బ్రదికి నట్లు అన్ని ఆశ్రమాలూ గృహస్టుణ్ణి ఆశ్రయించుకొని మనుగడ సలుపుతున్నాయి.”
“యస్మాత్రయో౬. ప్యాశమిణో జ్ఞానేనాన్నేన చాన్వహమ్,
గృహస్థేనైవ ధార్యన్తే తస్మాత్ జ్యేష్టాశ్రమో గృహీ.” (మ.స్కృ.3.78)
“వేదశాస్త్రాలలో ఉన్న విషయాలు బోధించడం ద్వారా జ్ఞానంచేతా, అన్నంచేతా గృహస్బృడే ప్రతిదినమూ మూడు ఆశ్రమాలవాళ్లనీ పోషిస్తున్నాడు; అందుచేత గృహస్థుడు ఉత్తమ మైన ఆశ్రమంలో ఉన్నవాడు.”
అతిథ్యాదుల విషయంలో గృహస్థుని కర్తవ్యం
గృహస్థు డాచరించవలసిన ప్రధానధర్మాలలో అతిథిసత్మారం ఒకటి. ఒక చోట ఉండకుండా తిరిగేవానికి అతిథి అని పేరు. (“అతతి గచ్చతి, ఇతి అతిథికి అని ఈ పదానికి వ్యుత్పత్తి. పారిభాషికంగా ఒక గృహస్థుని ఇంట్లో ఒక్క రాత్రి మాత్రమే నివసించేవాడు అతిథి అని అర్ధం -
“*ఏకరాత్రం తు నివసన్ అతిథిర్చాహ్మణ: స్మృతం
అనిత్యం హి స్థితో యస్మాత్ తస్మాదతిథిరుచ్యతే.” _ (మ.స్కృ.3. 102)
“ఒక బ్రాహ్మణగృహస్థుని ఇంట్లో ఒక్క రాత్రి మాత్రమే నివసించడానికి వచ్చిన (బ్రాహ్మణుడు అతిథి అని చెప్పబడుచున్నాడు. అనిత్యంగా (చాల తక్కువ కాలం) ఉంటాడు గాన అతదు అతిథి”
'ాభ్రి అనగా ఒక దివసం కూడా (గ్రహించాలి. ఏ వర్జ్ణాలవాళ్లకు ఆ వర్జాల వాళ్లు అతిఫులు. ఒక వర్ధం వారికి ఇతరవర్షస్థులు కూడ అతిథుల వలె ఆదరణీయులు. “న విద్యతే తిథిః యస్య సః అతిథధిః (ఎవనికి రెండవ తిథి లేదో అతడు అతిథి) అని వ్యాఖ్యాతలు వ్రాసినారు. పగటి పూట వచ్చినవాడు కూడ అతిథియే కాని రాత్రి వచ్చిన వానికి మాత్రం ఎట్టి పరిస్టికులలోను “కుదరదు అనకుండా ఆశ్రయం ఇవ్వాలి (మ.స్కృ. 1022 సూర్యాస్రుయం అయిన తరవాత వచ్చిన అతిథికి 'సూర్యోధ అతిథి" అని పేరు.
భూతబలి (కాకులు మొదలైనవాటికి ఆహారం వేయడం) తరువాత. (బ్రహ్మచార్యాదులకు భిక్ష వేసి తరవాత అతిథులు, జ్ఞుతులు, భృత్యులు (తన పోషణలో
హిందూమతం 8 ఉన్నవాళ్లు) భుజించిన తరవాత మిగిలినదానిని భార్యాభర్తలు భుజించాలి (మ.స్మృ.3.94 116).
తనకే అన్నం లేని గృహస్థుడు ఆహారం ఇవ్వజాలకపోతే ఇతరవిధాలచేత నైనా ఇంటికి వచ్చిన అతిధిని ఆదరించి పూజించాలి -
“తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ సూన్ఫతా,
ఏతాన్యపి సతాం గేహే నోచ్చిద్యన్తే కదాచన.” (మ.స్మృ.8 101)
“గడ్జి (చాప్‌కు నేల, ఉదకము, మధురమైన ప్రియవచనము వీటికైనా సత్పురుషుల ఇండ్లలో ఏనాటికీ లోటు ఉండకూడదు.” వీటితో నైనా గృహస్థుడు అతిథిని సత్మరించాలి. కిం
బ్రాహ్మణగృహస్థుని కొన్ని ప్రధానధర్మాలు
బ్రాహ్మణుడు ఆజీవితాంతమూ గుర్తు ఉంచుకొనవలసిన ఒక ప్రధాన మైన విషయం వసిస్టస్మృతిలో చెప్పబడింది. ఇది స్మృతిపథంలో ఉన్నవాడు ఎన్నడూ తప్పుడు దోవలో సంచరించడు.
“బ్రాహ్మణస్య తు దేహాఓఒయం నోపభోగాయ కల్పతే,
ఇహ క్షేశాయ మహతే (ప్రేత్యానన్తసుఖాయ చ”
“బ్రాహ్మణునికి లభించిన ఈ దేహం భోగాలు అనుభవించడంకొరకు
_ కాదు. ఈ జన్మలో, ఈ లోకంలో ఉన్నంతవరకు, గొప్ప క్లేశాలు అనుభవించడానికీ,
మరణానంతరం అనంతమైన సుఖం అనుభవించడానికీ ఈ దేహం లభించింది".
(బ్రాహ్మణుడు తనకు శాస్త్రంలో ఏ పనులు విధింపబడి ఉన్నాయో అవే చేస్తూ, శరీరాన్ని శ్రమపెట్టకుండా, శరీరయాత్రకు మాత్రం అవసర మైన ధనం సంపాదించాలి.
“యాత్రామాత్రప్రసిద్ధర్థం స్వైః కర్శభిరగర్దితై,
అక్లేశేన శరీరస్య కుర్వీత ధనసంచయమ్.” (మ.స్కృ.ఓ3)
“యిత-అమృతాలచేత గాని, మృతంచేత గాని, ప్రమృతంచేత గాని, సత్యాన్ఫత ములచేత గాని జీవించాలి. శ్వవృత్తి (కుక్కయొక్క వృత్తితో మాత్రం) ఎన్నడూ జీవించగూడదు” :
8 హిందూమతం
“బ్లుతానృతాభ్యాం జీవేత్తు మృతేన ప్రమృతేన వా,
సత్యాన్ఫతాభ్యామపి వా న శ్వవృత్త్వా కదాచన.” (మ.స్కృ. ఉత
“ఉంఛ-శిలవృత్తులకు బుతం అని పేరు. (కళ్లాలలో ధాన్యం అంతా తీసికొని పోయిన పిమ్మట దూరంగా చెదిరి పడి ఉన్న గింజలను ఒక్కొక్కటే ఏరికొనడం ఉంఛం, అలాంటి వెన్నులు ఏరికొనడం శిలం) అయాచితంగా లభించినది అమృతం. యాచించి సంపాదించిన భిక్షాన్నం మృతం (అది మరణంవంటిది,. నేల దున్నడం ప్రమృతం (నేల దున్ని నప్పుడు అనేకప్రాణుల హింస జరుగుతుంది గాన అది ప్రమృతం - మరణం కంటె చెడ్డది).
“సత్యానృతం తు వాణిజ్యం తేన చైవాపి జీవృతే,
సేవా శ్వవృత్తిరాఖ్యాతా తస్మాత్తాం పరివర్ణయేత్.” (మ.స్మృ. 46)
వాణిజ్యానికి (వ్యాపారం చేయడానికి) సత్యాన్ఫతం అని పేరు. (పై వృత్తులతో జీవనం) కుదరకపోతే ఈ వృత్తి రైనా ఆపత్కాలంలో చేసికొనవచ్చు. ఒకని క్రింద పని చేయదానికి 'శ్వవృత్తి అని పేరు. ఆ శ్వవృత్తితో మాత్రం ఏ నాడూ జీవించకూడదు.”
“వాణిజ్యంలో కొంత సత్యమూ కొంత అసత్యమూ కలిసి ఉంటాయి. అందుచేతనే దీనికి సత్యానృతం అని పేరు. బ్రాహ్మణుడు మాత్రం వాణిజ్యంలో కూడ పూర్తిగా సత్యాన్నే పాటించాలి. (వాణిజ్యం చేసేవాడు పాలు, పెరుగు, నెయ్యి తిలలు, తైలాలు, సిద్ధాన్నం మొదలైనవాటితో వ్యాపారం చేయకూడ దని చెపుతూ ఎన్నో వస్తువుల జాపితా ధర్మశాస్త్రగ్రంథఛాలలో ఇవ్వబడింది). వాణిజ్యం అనడంచేత ధర్మసంమత మైన రీతిలో వడ్డీవ్యాపారం కూడ చేయవచ్చును. సేవావృత్తిలో అడుగడుగునా దైన్యం చూపాల్సి స్వామి (యజమాని) తిడుతూ భయపెడుతూ ఉంటాడు. నీచమైన పనులు కూడ చేయవలసి వస్తుంది. అందుచేత అది శ్వవ్చత్తి.”
“కుసూలధాన్యకో వా స్యాత్ముమ్భీధాన్యక ఏవ వా,
త్యహైహికో వాపి భవేదశ్వస్తనిక ఏవ వా.” (మ.స్మృ.ఉ7)
“కుసూలధాన్యకుడు కావచ్చు. అనగా తాను తన భృత్యులూ మూడు
హిందూమతం 85 సంవత్సరాల పాటు జీవిస్తూ నిత్యనైమిత్తికాది ధర్మకార్యాలు చేసికొనడానికి సరిపదే టంత ధాన్యం సేకరించవచ్చును. లేదా కుంభీధాన్యకుడు కావచ్చును. అనగా ఒక సంవత్సరానికి మాత్రమే సరిపడు నంత ధాన్యం సేకరించవచ్చును. లేదా క్ర్యహైహికుడు కావచ్చు. అనగా మూడు దివసాలకు మాత్రమే సరిపోవు నంత ధాన్యం సంపాదించవచ్చును. లేదా అశ్వస్తనికుడు కావచ్చు. అనగా రేపటికి కూడ ఇంట్లో ధాన్యం లేనివాడు కావచ్చు.”
“ఈ నాలుగు విధా లైన బ్రాహ్మణులలో వెనుకటి వానికంటె తరువాతివాడు అధికధర్మాత్ముడు; స్వర్గాద్యుత్తమలోకాలను జయించేవాళ్లలో గొప్పవా డవుతాడు” :
“చతుర్జామపి చైతేషాం ద్విజానాం గృహమేధినామ్,
జ్యాయాన్ పరః పరో జ్లేయః ధర్మతో; లోకజిత్తమఓ” _ (మ.స్కృ.48)
ఎట్టి పరిస్థితులలోనూ కూడ జీవికకోసం లోకవృత్తాన్ని అనగా ఇతరులను సంతోషపెట్టడానికి అసత్యమైన ప్రియవాక్యాలు పలకడం, విచిత్రపరివీసాదులతో నిండిన (పిట్టకథలు చెప్పడంవంటి) మాటలు మాటలాడడం మొదలైనదానిని, అవలంబించకూడదు. వక్రత్వం లేని, డాంబికం లేని, ఇతరుల వృత్తికి ఉపఘాతకం కాని బ్రాహ్మణజీవనవిధానాన్ని మాత్రమే అవలంబించాలి -
“న లోకవృత్తం వర్తేత వృత్తిహేతోః కథంచన,
అజిహ్మామశకఠాం శుద్దాం జీవేద్ బ్రాహ్మణజీవికామ్.” (మ.స్మృ.4 11)
సుఖంగా ఉండా లనుకొనేవాడు తాను, తన భృత్యులూ జీవించడానికి అవసర మైనదానికంటె అధిక మైన ధనాన్ని సంపాదించడానికి ఆశపడకూడదు. అదే సంతోషం అనగా. అలాంటి సంతోషం అలవరచుకొని అధికంగా ధనం ఆర్జించ కూడదు. సంతోషమే సుఖానికి మూలం. అది లేకపోవడం దుఃఖానికి మూలం-
“సంతోషం పరమాస్థాయ సుఖార్జీ సంయతో భవేఠ్,
సంతోషమూలం హి సుఖం దుఃఖమూలం విపర్యయజ”(మ.స్మృ,. త్త కేల)
ఇంద్రియాలు భోగాలకోసం అధికంగా ఇటూ అటూ పరుగెత్తకుందా వాటిని మనస్సుతో నిగ్రహించుకోవాలి -
ఈ హిందూమతం
“ఇ(న్టియార్ధేషు సర్వేషు న ప్రసజ్యేత కామత:,
అతిప్రసక్తిం చైటేషాం మనసా సంనివర్తయేత్.” (మ.స్మృ.4 16)
వేదాధ్యయనానికి అడ్డుగా వచ్చే అన్ని పనులూ విడిచివేయాలి. ఏదో విధంగా జీవనం గడుపుతూ (శిష్యలచేత) వేదాధ్యయనం చేయించాలి. అప్పుడే అతని జన్మ కృతార్థం అవుతుంది -
“సర్వాన్ పరిత్యజేదర్భాన్ స్వాధ్యాయస్య విరోధిన:,
యథాతథాధ్యాపయంస్తు సా తస్య కృతకృత్యతా.” (మ.స్మృ. 4. 17)
(బ్రాహ్మణునికి వేదాధ్యయనం చాల ప్రధాన మైనది -
“యథా కాష్టమయో హస్తీ యథా చర్మమయో మృగ,
యశ్చ విప్రో నధీయానః త్రయస్తే నామ బచిభ్రతి” (మ.స్కృ.2. 157)
“కజ్ఞతో చేసిన ఏనుగు, చర్మంతో తయారు చేసిన మృగమూ, వేదాధ్యయనం చేయని బ్రాహ్మణుడు పేరుకు మాత్రమే ఏనుగూ, మృగమూ (బ్రాహ్మణుడూను.”
“యో£ నధీత్య ద్విజో వేదమన్యత్ర కురుతే శ్రమమ్,
స జీవన్నేవ శూద్రత్వమాశు గచ్చతి సాన్వయళి. (మ.స్మృ.2 168)
“వేదాధ్యయనం చేయకుండా ఇతరవిద్య లభ్యసించే బ్రాహ్మణుడూ వాని కుటుంబమూ కూడ జీవించి ఉందగానే శూ[ద్రత్వం పొందుతారు”.
“హిరణ్యం భూమిమశ్వం గామన్నం వాసస్తిలాన్ ఘృతమ్,
ప్రతిగ్భహన్నవిద్వాంస్తు భస్మీభవతి దారువత్”. (మ.స్మృ.4 188) “అవిద్వాంసు డైన,అనగా దానం పట్టడంవల్ల వచ్చే దోషానికి తగిన పరిహారం చేసికొనడం తెలియని,బ్రాహ్మణుడు బంగారమూ,భూమీ,అశ్వమూ,ఆవూ లేదా ఎద్దూ, వస్త్రమూ,తిలలూ,నేయీ-వీటిని ప్రతిగ్రహిస్తే (దానం పడితే) నిప్పు అంటించిన కల్టి వలె భస్మం అయిపోతాడు”.
“అతపాస్త్వ్రనధీయానః ప్రతిగ్రహరుచిర్ద్విజ,
అమృస్యశ్శప్లవేనేవ సహ తేనైవ మజ్జ్ఞతి”. (మ.స్మృ.4 190) “తపస్స్ఫూ,అధ్యయనమూ లేనివాడై కేవలం ్రతిగ్రహమునందు మాత్రమే ఆసక్తి
హిందూమతం 8/ గల బ్రాహ్మణుడు రాతిబండ పట్టుకొని ఈదేవాడు ఆ రాతిబండతో సహా నీటిలో మునిగి పోయి నట్లు,ఆ దానం పట్టిన వస్తువుతో సహా మునిగిపోతాడు”.
“న వార్యపి ప్రయచ్చేత్తు బైదాల(వ్రతికే ద్విజే,
న ఐకవ్రతికే విపే నావేదవిది ధర్మవిత్. (మ.స్మృ.4. 192)
“ధర్మం తెలిసినవాడు బైడాలవ్రతికు దైన బ్రాహ్మణునికీ, బకవ్రతికు దైన బ్రాహ్మణునికీ, వేదాధ్యయనం చేయనివానికీ నీళ్లు కూడ ఇవ్వకూడదు”.
(చూ. 195, 196ళ్లో.)
“న్యాయార్జితధనం కూడ ఈ మూడు విధాలైనవాళ్లకీ దానం చేస్తే దానివల్ల దాతా,ప్రతిగ్రహీతా కూడ నరకానికి పోతారు.”
“త్రిష్వప్యేతేషు దత్తం హి విధినా౭_ప్యర్దితం ధనమ్,
దాతుర్భవత్యనర్థ్ధాయ పరత్రాదాతురేవ చ”. (మ.స్కృ.4 198)
“ధర్మధ్వజీ సదా లుబ్ధిశ్చ్భాద్మికో లోకదమ్భక*
బైదాలవ్రతికో జ్లేయః హింస్రః సర్వాభిసంధకవొ. (మ.స్మృ.4. 195) “ధర్మధ్వజి (పదిమంది చూసే టట్లు ధర్మకార్యాలు చేస్తూ వాటిని గూర్చి స్వయంగా ప్రచారం చేస్తూ ఇతరులచేత ప్రచారం చేయించేవాడు ధర్మధ్వజి),ఇతరుల ధనము నందు ఆసక్తి కలవాడు,ఏవేవో వంకలు చెపుతూ వ్యవహరించేవాడు,జనులను వంచించేవాడు, అందరినీ ఆక్షేపించేవాడు,హింసాప్రవృత్తి కలవాడూ అయిన (బ్రాహ్మణుడు బైడాలవ్రతికుడు”.ఎలుకలు పట్టుకొనడానికి పిల్లి వలె ధ్యాననిష్టుడై ఉంటాడు గాన ఆ పేరు.
“అధోదృష్టిర్నెష్పృతిక: స్వార్థసాధనతత్సరః,
శళో మిథ్యావినీతశ్చ బకవ్రతచరో ద్విజవొ. (మ.స్మృ.4 196) “వినయం అభినయిస్తూ క్రిందికే చూస్తూండేవాడు,నిష్ణురంగా ప్రవర్తించేవాడు, స్వార్ధం సాధించుకొనడమే ప్రధానంగా కలవాడు,రహస్యంగా అపకారం చేసేవాడు, బహువిధాల వినయాన్ని అభినయించేవాడూ అయిన (బ్రాహ్మణుడు బకవ్రతచరుడు.” (కొంగజపం చేసేవాడు).
ఇవి ఎవరిలో ఉన్నా దోషాలే అయినా బ్రాహ్మణుడ నని చెప్పుకొనేవానిలో ఉంటే మహాదోషాలు గాన మనువు ఈ ఘట్టంలో చెప్పాడు.
808 హిందూమతం వానప్రస్థాశమం
వెనుక చెప్పినట్లు వార్ధక్యలక్షణాలు కనబడగానే గృహస్థుడు వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. “అంతవరకు (గ్రామంలో నివసిస్తూన్నప్పుడు తిన్న వరి, గోధుమలు మొదలైన ఆహారపదార్థాలను,సమస్తమైన పరిచ్చదాన్నీ (గోవులు, అశ్వాలు,శయ్యలు మొదలైన వాటిని) విడిచిపెట్టి భార్యతో కలిసి గాని,భార్య వనవాసానికి ఇష్టపడకపోతే ఆమెను పుత్రుల సంరక్షణలో ఉంచి గాని,వనానికి వెళ్లాలి.”
“సంత్యజ్య గ్రామ్యమాహారం సర్వం చైవ పరిచ్చదమ్,
పుత్రేషు భార్యాం నిక్షిప్య వనం గచ్చేత్సహైవ వా”. (మ.స్మృ. 6.2) గ్రామంలో ఉన్నప్పుడు చేసే మహాయజ్ఞాదులు అరణ్యంలో లభించే కూరలు,దుంపలు, ఫలాలు మొదలైనవాటితో నిర్వర్తించాలి (మ.స్మృ. 6. 5). జటాదులు పెంచి,నారచీర గాని, “మృగాల చర్మ కాని వస్తంగా ధరించాలి (మ.స్మృ. 6. 6). న్వాధ్యాయ-- హోమాదులు యథావిధిగా నిర్వర్తించాలి.అన్ని ప్రాణులతోను మైత్రీభావంతో ఉండదాలి.మనోనిగ్రహవంతుడై ఇతరులనుండి ఏ వస్తువూ ప్రతిగ్రహించకూడదు. చాంద్రాయణవ్రతాదులు,తపస్సు చెయ్యాలి. శరీరాన్ని పూర్తిగా కృశింపచెయ్యాలి. ఆతృ్మజ్ఞానంకోసం ఉపనిషత్తుల అధ్యయనం చేస్తూ వాటి అర్ధం మననం చేసుకోవాలి. “చికిత్సకు లొంగని వ్యాధ్యాదులు కలిగి నప్పుడు,కేవలం ఉదకం వాయువు భక్షిస్తూ శరీరపతనం అయ్యే వరకు ఈశాన్యదిక్కు వైపు మహాప్రస్థానం చేసి శరీరం
“అపరాజితాం వాస్థాయ (వ్రజేద్దికమజిహ్మగః,
అనిపాతాచ్చరీరస్య యుక్తో వార్యనిలాశనళో, (మ.స్మృ. 631)
శరీరత్యాగం చేయవలసిన అవసరం ఏర్పడని వానప్రస్థుడు పరిపక్వ మైన మనస్సుతో మోక్ట్షార్ధియై సంన్యాసాత్రమం స్వీకరించవచ్చును.
సంన్యాసాశ్రమం
ఎలాంటివాడు సంన్యాసాశ్రమం స్వీకరించాలో వెనుక చూచి ఉన్నాం. సంన్యాసికి పరివ్రాజకుడు అని కూడ పేరు.వైదికములూ లౌకికములూ అయిన అన్ని కర్మలూ పూర్తిగా విడిచివేసినవాడు 'సంన్యాసి.అతడు ఒక చోట స్థిరంగా
హిందూమతం 89 నివసించక ([గగ్రామంనుంచి గ్రామానికి తిరుగుతూ ఉందాలి; అందుచేత అతనికి 'పరివ్రాజకుదు' అని పేరు. సంన్యాసాశ్రమస్వీకారానికి ప్రధాన మైన అధికారం ఐహికపారలౌకికసుఖాల విషయంలో తీవ్రమూ,స్టిరమూ అయిన వైరాగ్యం. మొదటి మూడు ఆశ్రమాలలో చెప్పిన ధర్మాలను చక్కగా ఆచరిస్తూ పవిత్రమైన జీవనం గడిపేవానికి వానప్రస్థాశమంలో ఉండగా అలాంటి వైరాగ్యం కలగవచ్చు. అప్పు దతడు సంన్యాసం స్వీకరించవచ్చు.ఇది ఆశ్రమక్రమంలో తీసికొన్న సంన్యాసం. కొందరు పుణ్యాత్ములకు పూర్వాశమాలలో ఉండగానే తీవ్రవైరాగ్యమూ, మోక్షేచ్చా కలగవచ్చును. అలాంటివారు బ్రహ్మచర్యాశమంలో గాని గృహస్థాశ్రమంలో గాని ఉండగానే సంన్యసించవచ్చు నని (శ్రుతి చెప్పుచున్నది. “బ్రహ్మచర్యం సమాష్య గృహీ భవేత్;గృహీ భూత్వా వనీ భవేత్స్వనీ భూత్వా ప్రవ్రజేత్. యది వేతరథా బ్రహ్మచర్యాదేవ (ప్రవ్రజేత్ గృహాద్వా వనాద్వా... యదహరేన విరజేత్ తదహరేవ ప్రవ్రజేకొ” (జాబాలోపనిషత్.4) మన్వాదిస్మృతులలో చెప్పిన కొన్ని ప్రధానమైన సంన్యాసిధర్మాలు:
“అనగ్నిరనికేతః స్యాద్దామమన్నార్ధమాశ్రయేత్,
ఉపేక్షకో£. సంకుసుకః మునిర్భావసమాహితహొ, (మ.స్మృ.6.43)
“వంట మొదలైనవి చేసికొనే ప్రసక్తియే లేదు గాన సంన్యాసికి అగ్ని ఉండ కూడదు. గృహం ఏదీ ఉండదు.వ్యాధ్యాదులు కలిగినా వాటిని ఉపేక్షించాలి గాని బెషధాదులు సేవించకూడదు. స్థిరమైన బుద్ధి కలవాడై ఉండాలి. వస్తు సంచయం చేయకూడదు. వస్తువులనూ ధనాదులనూ కూడబెట్టకూడదు. బ్రహ్మను మననం చేస్తూ ఆ బ్రహ్మయందే మనస్సును నిలపాలి. అరణ్యంలోనే నివసిస్తూ కేవలం భిక్షాటనంకోసం (గ్రామానికి రావాలి",
“కపాలం వృక్షమూలాని కుచేలమసహాయతా,
సమతా చైవ సర్వస్మిన్ ఏతన్ ముక్తస్య లక్షణమ్”. (మ.స్మృ, 6 44)
“భిక్షకోసం ఒక మట్టి మూకుడు,లేదా కొబ్బరి చిప్ప,నివాసానికి చెట్ల మొదళ్లు, జీర్ణమైన వస్త్రం,రెండవ వాదెవడూ దగ్గర లేకపోవడం,అందరి విషయంలోను శత్రుమిత్రభావం లేక సమత్వదృష్టి-ఇది సంన్యాసియొక్క లక్షణం”.
90 పొందూమతం
“నాభినన్లేత మరణం నాఖభినన్దేత జీవనమ్,
కాలమేవ ్రతీక్షేత నిదేశం భృతకో యథా”. (మ.స్మృం5. 45)
“మరణం వస్తే బాగుండు నని కాని,జీవించా లని కాని కోరుకొనగూడదు. ప్రభువు ఆజ్ఞకోసం సేవకుడు ఎదురుచూస్తూ ఉన్నట్లు కాలంకోసమే నిరీక్షించాలి”.
“అతివాదాంస్తితిక్షేత నావమన్యేత కంచన,
న చేమం దేహమాథిత్య వైరం కుర్వీత కేనచిత్”. (మ.స్మృ.6. 47)
“ఏవ్షరైనా పరుషంగా మాట్లాడినా ఓర్చుకోవాలి, ఎవరినీ అవమానించకూడదు. అస్థిర మైన ఈ దేహంకోసం ఇతరులతో వైరం పెట్టుకొనకూడదు”.
“న చోత్చాతనిమిత్తాభ్యాం న నక్షత్రాజ్ఞవిద్యయా, .._నానుశాసనవాదాభ్యాం భిక్షాం లిప్సేత కర్టిచిత్”. (మ.స్మృ. 6.50)
“భూకంపాదులైన అపశకునాలకు, శరీరావయవాదులు అదరడం మొదలైన వాటికి ఫలం చెప్పడంచేత గాని, నక్షత్రాలను గూర్చి(జ్యోతిఃశాస్త్రవిషయాలు) చెప్పడంచేతగాని, సాముద్రికశాస్త్రాదులకు సంబంధించిన విషయాలను చెప్పడంచేత గాని, నీతిమార్గాన్ని బోధించడంద్వారా గాని, శాస్తవిషయాలు చెప్పడంచేత గాని, (ఉపన్యాసాలిస్తూ గాని) ఎన్నడూ భిక్ష సంపాదించడం కోసం ప్రయత్నించగూడదు”. (జనాకర్షణం కోసం ప్రయత్నించగూడదు).
ళ్ తాప సైర్భాహ్మడైర్వా వయోఖభిరపి వా శ్వఖిః,
ఆకీర్ణం భిక్షుకెర్వాన్యైరగారముపసం వ్రజేత్”. (మ.స్కృ. 6.51)
“వానప్రస్థలతోగాని, భోజనానికి వచ్చిన ఇతరబ్రాహ్మణులతో గాని,కోళ్లు మొదలైన పక్షులతో గాని,కుక్కలతో గాని,ఇతరసంన్యాసులతో గాని హడావుడిగా ఉన్న ఇంటికి భిక్షకోసం వెళ్లకూడదు”.
“వీక్రక్రాలం చరేద్భెక్షం న ప్రసజ్జేత విస్తే,
ఖైక్షే ప్రసక్తో హి యతిర్విషయేష్వపి సజ్జతి*. (మ.స్కృ. 6.55)
“యళతికి భిక్ష సంపాదించుకొనడంలోనే అధిక మైన ఆసక్తి ఉండకూడదు. భిక్షమీదనే దృష్టి ఉన్నవానికి క్రమంగా విషయాలమీద ఆసక్తి పెరుగుతుంది”.
హిందూమతం 91
విధూమే సన్నముసలే వ్యజ్లారే భుక్తవజ్ఞనే,
వృత్తే శరావసంపాతే భిక్షాం నిత్యం యతిశ్చరేత్ (మ.స్మృ.6.56)
“గ్రామంలోని గృహస్థుల ఇండ్రలో-వంటింటి పొగ నిలిచిపోయినతరువాత, బియ్యం దంచే రోకళ్లు నిలిచిపోయిన తరువాత,వంటచేసిన బొగ్గులు ఆరిపోయిన తరవాత,ఇంట్లో అందరూ భోజనాలు చేసి కంచాలు కడిగివేసిన తరవాత,నిత్యమూ భిక్షకోసం సంచరించాలి.”
స్మృతులలోనే కాకుందా సంన్యాసెధ్యూలు కొన్ని ఉపనిషత్తులలో కూడ చెప్పబడి ఉన్నాయి. నారదపరివ్రాజకోపనిషత్తులో చెప్పిన కొన్ని సంన్యాసిధర్మాలు-
“న సంభాషేత్ స్రియం కాంచిత్ పూర్వదృష్టాం చ న స్మరేత్,
కథాం చ వర్జయేత్తాసాం న పశ్యేల్లిఖితామపి”. (నా.ప.ఉి.4.2)
“ఏ ప్రీకోను మాటలాడకూడడు. పూర్వం చూచిన స్రీని గూర్చి స్మరించకూడదు. వాళ్లను గూర్చిన మాటలు పరిత్యజించాలి. చిత్తరువులో కూడ స్త్రీని చూడకూడదు”.
“ఆగచ్చ గచ్చ తిష్టేతి స్వాగతం సుహృదో£పి వా,
సంమాననం చ న బ్రూయాన్మునిర్మోక్షపరాయణః. (నా.ప.ఉ.47)
“మోక్షాసక్తు డై న యతి మిత్రుని విషయంలో కూడ గౌరవపూర్వకంగా “రమ్ము, వెళ్లుము, ఆగుము,నీకు స్వాగతము అని పలకకూడదు”.
“ప్రతిగ్రహం న గృహ్హీయాత్ నైవ చాన్యం ప్రదాపయేత్,
(పేరయేద్వా తథా ఛిక్షుః స్వప్నే£_.పి న కదాచన. (నా.ప.ఉ.48)
“ఎవరినుండీ ఏమీ ధనాదికం స్వప్నంలో కూడ తీసికొనగూడదు; ఎవరిచేతా ఇప్పించ కూడదు ఎవరినీ (్రేరేపించకూడదు”.
“వఏకరాత్రం వసేద్లామే పత్తనే తు దినత్రయమ్,
పురే దినద్వయం భిక్షుర్నగరే పజ్బురాత్రకమ్
వర్నాస్వేకత్ర తిష్టేత స్థానే పుణ్యజలావృతే”. (నా.ప.ఉ. 420)
“సంన్యాను ఒక గ్రామంలో ఒక్కరోజు మాత్రమే నివసించవచ్చును.పట్టణంలో మూడు రోజులు,పురంలో రెండు రోజులు. నగరంలో ఐదు రాత్రులు మాత్రమే
92 హిందూమతం నివసించవచ్చును. వర్షకాలం అంతా పవిత్ర మైన ఉదకం లభించే ఒకే చోట నివసించవచ్చును”.
ఈ ఉపనిషత్తులోనే ఆరు విధాల సంన్యాసాలు (గ్రహించిన సంన్యాసులు చెప్పబడ్డారు- (1) కుటీచకుడు (2) బహూదకుడు, (3)హంస, (4) పరమహంస, (5) తురీయాతీతుడు (6) అవధూత,
-
కుటీచకుడు : శిఖాయజ్ఞోపవీతాలు,దందకమండలువులు, కౌపీనము, బొంత-వీటిని ధరించి,తలిదండ్రులకు పెద్దవాళ్లకూ సేవచేస్తూపాత్ర,గడ్డపార, ఉట్టి మొదలైన సాధనాలు మాత్రమే దగ్గర ఉంచుకొని తెల్లని ఊర్హ్వపుండ్రాలు, మూడు దండాలు ధరించి ఒకే స్థానంలో అన్నం తింటూ ఉండేవాడు కుటీచకుడు.
-
బహూదకుడు : పైన చెప్పిన శిఖ మొదలు బొంత వరకు ఉన్న వస్తువులు, త్రిపుండ్రాలు ధరించి మధుకరనృత్తిచేత లభించిన ఎనిమిది కబళములను తినువాడు బహూదకుడు.
-
హంస : జటాధారియై,(త్రిపుండ్రాలు గాని ఊర్హ్వపుండాలు గాని ధరించి, “నా కీ ఇంట్లో లభిస్తుందొఅని ముందుగా అనుకొనని మధుకరవృత్తిచేత లభించిన అన్నం తింటూ, కౌపీనం ధరించే వాడు హంస.
-
పరమహంస : సర్వమును త్యజించిన వీనికి శిఖాయజ్ఞోపవీతములు ఉండవు.ఇతడు దోసిలితోనే ఐదు ఇండ్లలో భిక్షాటనం చేసి రాత్రిమాత్రమే అన్నం తినాలి.ఒక శాటి,ఒక కౌపీనము,వెదురు కజ్ఞ,ఉంచుకోవాలి. శరీరానికి భస్మం పూసికోవాలి.
-
తురీయాతీతుడు : ఇతడు గోముఖుడు; అనగా ఎద్దు వలె దైవవశంచేత ముఖం దగ్గరికి వచ్చిన ఫలాదులు తినేవాడు. ఫలాలు భుజించాలి. అన్నం భుజిస్తే మూడు ఇళ్ల దగ్గర మాత్రమే భిక్ష స్వీకరించాలి. దిగంబరుదై శుష్కించిన దేహంతో శవం వలె నిశ్చలంగా ఉండి అత్మధ్యానం చెయ్యాలి.
& అవధూత : ఇతడు సర్వనియమాతీతుదు. మహాపాతకాలు చేసినవాళ్లు పతితులు తప్ప నాలుగు వర్జాలవాళ్లలో ఏ వర్దంవాళ్లు ఇచ్చినా కొండచిలువకు వలె నోటి ముందుకు వచ్చిన ఆహారం తింటూ స్వరూపధ్యానం చేసుకొంటూ ఉంటాడు.
హిందూమతం 93 “సంన్యాసం స్వీకరించినవాడు ఒంటరిగా నివసించాలి. భిక్షకోసం మాత్రమే శాంతుదై త్రిదండియై కమండలువు ధరించి గ్రామంలో ప్రవేశించాలి”. “ఈ విధంగా ఒంటరిగా ఉన్నవాదే భిక్షువు. ఇద్దరు భిక్షువులు కలిసి ఉంటే అది మిథునం అవుతుంది. ముగ్గురు కలిసి ఉంటే గ్రామం అవుతుంది,అంతకు మించిన సంఖ్యలో భిక్షువులు కలిసి నివసిస్తే అది నగరం అవుతుంది.” “సర్వభూతపొతః శొన్త త్రిదబ్జీ సకమణ్డులు:, ఏకారామః పరివ్రజ్య భిక్షార్థం గ్రామమావిశేత్”. “ఏకో భిక్షుర్యధోక్త: స్యాత్ ద్వావేవ మిధునం స్కృతమ్, త్రయో (గగ్రామః సమాఖ్యాతః ఊర్ధ్వం తు నగరాయతే". (నా.ప.ఉి.8.55,56) “నగరంగా గాని,గ్రామంగా గాన్సిమిధునంగా గాని ఏర్పడకూడదు. ఈ మూడింటిలో ఏ ఒక్కటిగా ఏర్పడినా యతి స్వధర్శంనుంచి భ్రష్టు డదవుతాడు”- “నగరంహిన కర్తవ్యం గ్రామం వా మిధునం తధా, ఏతత్రయం ప్రకుర్వాణః స్వధర్మాచ్చ్వవతే యతిః. (నా.ప.ఉ.8.57) త్రిదండిశబ్దానికి ప్రసిద్ధమైన అర్థం మూడు దండాలు (ఒకటిగా) కట్టి ధరించిన వాడు అని.అయితే నారదపరివ్రాజకోపనిషద్వ్యాఖ్యానంలో (3.55) వ్యాఖ్యాత ఉపనిషద్పహ్మయోగి ఒక ్రుతివాక్యం ఉదాహరించారు : “వాగ్టణ్జః కాయదణ్డశ్చ మనోదణ్జశ్చ తే త్రయః, యస్వైతే నియతా దణ్డాః స త్రిదజ్జీ మహాయతివొ. దండం అనగా అదుపులో ఉంచుకొనడం. వాక్కును,శరీరాన్నిమనస్సును అదుపులో ఉంచుకొనడం అనే ఈ మూడు దందాలూ ఉన్న మహాయతి త్రిదండి అని దీని అర్ధం. ఇదే శ్లోకం మనుస్మ ఎతిలో (మ.స్మృ. 12. 10) కొంచెం భేదంతో ఉంది. “మూడు దండాలు ధరించి నంతమాత్రంచేత త్రిదండి కాడు;చెడ్ద మాటలు మాటలాడడం,చెడ్డ ఆలోచనలు చేయడం, చెడ్డ పనులు చేయడం అనే మూడింటినీ పరిత్యజించడం అనే త్రిదండం ఎవని బుద్ధిలో ఉంటుందో అతడే నిజమైన త్రిదంది అని ఈ శ్లోకానికి తాత్పర్యం”అని కుల్లూకభట్టు వ్యాఖ్య,
94 హిందూమతం
ఇలాంటి సంన్యాసిధర్మాలు స్మృతులలోను ఉపనిషత్తులలోను ఇంకా ఎన్స్న్నీ చెప్పబడ్డాయి. వీటిని పట్టి ఈ ఆశ్రమం స్వీకరించడానికి ఎలాంటివానికి అధికారం ఉంటుందో, ఈ అత్యున్నతాధ్యాత్మికస్థితిని నిలబెట్టకొనడం ఎంత కష్టమో ఊహించవచ్చు.
ఇట్టి ఉన్నత మైన ఆశ్రమాన్ని స్వీకరించి అ ధర్మాలను సరిగా నిర్వర్తించని వానికి ఆరూధపతితు డని పేరు. అలాంటివాడు అన్ని విధాలైన పాపాల పుట్ట అని శాట్యాయనీయోపనిషత్తులో చెప్పబడింది-
“అథ ఖలు సోమ్యేదం పారివ్రాజ్యం నైష్టికమాత్మధర్మం యో విజవాతి స వీరహా భవతి, స బ్రహ్మహా భవతి, స భ్రూణహా భవతి,స మహాపాతకీ భవతియ ఇమాం వైష్ణవీం నిష్ఫాం పరిత్యజతి స స్తేనో భవతి, స గురుతల్ప్చగో భవతి,స మిత్రద్రుగ్భవతి, స కృతఘ్నో భవతి,స సర్వాన్ లోకాన్ ప్రచ్యుతో భవతి. తదేతద్భచాభ్యుక్తమ్ ...
పారివ్రాజ్యం గృహీత్వా తు యః స్వధర్మే న తిష్టతి,
తమారూధచ్యుతం విద్యాదితి వేదానుశాసనమ్.”
(శాట్యాయనీయోపనిషత్ 28-31) సనాతనధర్మంలో ప్రవృత్తిరూపధర్మం అనీ నివృత్తిరూపధర్మం అనీ రెండు విభాగా లున్నాయి. లౌకికాలైన ఆచారవ్యవహారాలు, వైదికయజ్ఞాదికర్మలూ ప్రవృత్తిరూపధర్మం. శాశ్చతసుఖ మైన మోక్షాన్ని సంపాదించడానికి అనుసరించవలసిన ధర్మం నివృత్తిరూప ధర్మం.నిరంతరమూ వదో ఒక పనిచేయడంలో వ్యాప్పుతు డవడం ్రవృత్తి.మెల్ల మెల్లగా ఆ వ్యాపారా లన్నీ తగ్గించుకొనడం నివృత్తి. ఈ రెండు ధర్మాలకూ సమానమైన ప్రాధాన్యం ఇచ్చి వాటిని ఆచరణలో పెట్టిననాదే మానవుని జన్మ సార్ధకం అవుతుం దని సనాతనధర్మం బోధిస్తుంది. బ్రహ్మచర్య- గృహనస్థాశ్రమాలు ప్రధానంగా ప్రవృత్తిరూపధర్మానికి సంబంధించినవి. వానప్రస్థం రెండింటికీ సంబంధించినది. సంన్యాసం నివృత్తిరూపధర్మానికి సంబంధించినది. ఈ విధంగా మానవుని సర్వతో ముఖాభివృద్ధికీ పరిపూర్ణత్వానికీ ఉపయోగించేది ఆ(థభ్రమవిధానం.
హిందూమతం 95
“హిందూబుషిసంప్రదాయం ప్రకారం దేశాల గొప్పతనం అవి నిలిపిన సామ్రాజ్యాలను బట్టిగాని, కూడబెట్టిన ధనరాశులను బట్టిగాని,అవి సాధించిన వైజ్ఞానికాభివృద్ధిచేతగాని నిర్ణయించబడేది కాద్యు అవి పెంపొందించుకొన్న ధార్మికజీవన విధానాన్ని న్యాయసంమత ప్రవృత్తినీ పట్టి నిర్హయంచబడుతుంది. ఒక దేశంలోని మానవుల నైతిక - ఆధ్యాత్మిక సమున్నతిమీద మాత్రమే దాని వాస్తవమైన అభివృద్ది ఆధారపడి ఉంటుందని హిందూబుషులు బోధించారు. ఆధునిక కాలంలో మవిత్యాగాంధీ కూడ దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు (అ890ల 1100646000 2.21)
మానవుడు ఈ ఆధ్యాత్మికసమున్నతిని చేరడానికి ఉపకరించే అనేక సాధనాలలో చాల ప్రధానమైనది ఆశ్రమవ్యవస్థ.
చతుర్విధ పురుషార్థాలు
ధర్మ-అర్ధ-కామ-మోక్షాలకు పురుషార్ధాలు అని పేరు.పురుషుడు ప్రయత్న పూర్వకంగా సాధించవలసిన ప్రయోజనం పురుషార్థం.నాలుగు వర్జాలవలె, నాలుగు ఆశ్రమాల వలె నాలుగు పురుషార్థాలు అనేవి కూడ అనాదికాలంనుంచీ హిందూమతంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకొన్న అంశాలు. మొత్తం సమాజం సుఖశాంతులతో వర్ధిల్లడానికి అత్యావశ్వక మైన నాలుగు ప్రధానకార్యక్రమాలు గుర్తించి, వాటిని సామర్థ్యంతో నిర్వహించడానికై ప్రజలలో ఏర్పడిన నాలుగు విభిన్నవ్యవస్థలు నాలుగు వర్జాలు.మానవుడు ఒక నిర్జీతరీతిలో తన కర్తవ్యాలను నిర్వహించడంకోసం ఏర్పరచిన నాలుగు జీవనకాలవిభాగాలు ఆశ్రమాలు. ప్రతీ మానవుడూ వాని జీవితంలో సాధించవలసిన లక్ష్యాలుగా ఏర్పరచినవి నాలుగు పురుషార్థాలు.
శరీరధారి యైన ప్రతీ ప్రాణికీ సుఖదుఃఖాలు ఉంటాయి.ఇది సృష్టిలోని సహజలక్షణం.అయితే మానవుడు కొన్ని ఉపాయాలచేత కొంతవరకు కష్టాలను నివర్తింపచేసికొంటూ సుఖాన్ని పెంపొందించుకొంటూ ఉంటాడు. ఈ లోకంలోని ప్రాణులలో ఈ శక్తి మానవునిలోనే అధికంగా ఉన్నట్లు కనబడుతుంది. తాత్కాలికమైన సుఖం,నిత్యమూ విచ్చేదం లేనిది అయిన సుఖం అని సుఖం రెండు
96 హిందూమతం విధాలు. తన దుఃఖాలు తొలగి అన్ని విధాలా తనకు సుఖం కావాలని మానవున కున్న అభిలాషయే “కామం”. ఈ అభిలాష సఫలం కావాలంటే ఎన్నో వస్తువుల సాహాయ్యం కావాలి. ఆ వస్తుసముదాయమే “అర్దం ఈ అర్దం విషయంలో జాగర్తపడి దానిని సమకూర్చుకొంటే కామాలన్నీ (కోరికలన్నీ) తీరి సుఖం అనుభవించవచ్చు.
మానవునిలో సహజంగా ఇంకా కొన్ని లక్షణా లున్నాయి. అన్ని సుఖాలు తనకే కావా లనీ,అందరూ తనకంటె తక్కువగా ఉందా లనీ,అందరి మీదా తాను అధికారం వహించా లనీ,అందుచేత సుఖసాధనమైన అర్ధం తనదగ్గరనే అధికంగా ఉందా లనీ-ఇంకా ఇలాంటి దుష్టమైన ఆలోచన లన్నీ మానవునిలో ఉంటాయి. ఇలాంటి వ్రవృత్తులను అద్దుకొనేది ధర్మం. అర్ధకామాల విషయంలో ఎవరి మట్టుకు వాళ్లు ఇలాంటి ఆలోచనలతోనే ఉంటే లోకంలో సుఖశాంతులే కరవైపోతాయి. అందుచేత వాటిని అదుపులో పెట్టే విధానాన్ని బోధించేది ధర్మం;ప్రధానంగా లౌకికధర్మం. కామమూ, దానికి సహకారి యైన అర్థతృష్టా రెండూ కూడ ధర్మ నియంత్రితములై ఉండాలని శ్రీకృష్ణుని ఉపదేశం :
“ధర్మావిరుద్దో భూతేషు కామో౬_ స్మి భరతర్షభ (భ.గీ.7. 11)
అర్థకామాలద్వారా లభించే సుఖం అశాశ్వతమే అను విషయం '్రతి ఒక్కడూ ఏనాటికైనా (గ్రహిస్తాడు. శాశ్వతసుఖాన్ని అందించగలిగినది కూడ ధర్మం.అది నివృత్తిరూపధర్మం. అర్ధకామాలను ధర్మానుసారంగా సేవిస్తూ పరిశుద్ధజీవనం గడిపేవాని మనస్సు తప్పక నివృత్తిరూపధర్మ్శం వైపుకూడ తిరుగుతుంది. అప్పు డతడు శాశ్వతసుఖాన్ని మోక్షాన్నిపొందుతాడు. అందుచేత మానవుడు ఈ నాలుగు ప్రయోజనాల (అర్థాల) సాధనను లక్ష్యంగా ఉంచుకొని జీవనం గడపాలని బోధిస్తూ హిందూమతం అందుకు అనువైన విధానాలను చూపుతుంది.
పైన చెప్పినదానిని బట్టి అర్ధకామాలకంటె ధర్మం చాల ప్రధాన మైనా అర్ధ కామాలను విడచి కేవలం ధర్మాన్నే అనుసరించాలి అని హిందూమతం బోధించదు. అందుకు ప్రధానకారణం ఏమనగా ప్రతీ మానవుని ప్రవృత్తీ సహజంగా అర్ధకామాల వైపే ఉంటుంది.వాటియందు ఆసక్తి లేనివాడు వెయ్యికి ఒకడు
హిందూమతం 97 కూడ ఉండడం అసంభావ్యం. అలాంటి స్థితిలో శాస్త్రం చెప్పింది కదా అని ధర్మాన్ని మాత్రమే సేవించడం ప్రారంభిస్తే అచిరకాలంలోనే అలాంటివాడు అర్థకామాలవైపు ఆకృష్ణుడై ఆరూఢపతితుడు కావచ్చు; అందుచేతనే శ్రీమద్భాగవతంలో-
“ధర్మార్థకామాః సమమేవ సేవ్యాః
యో హ్యేకసక్తః స నరో జఘన్య,, తయోస్తు దాక్ష్యం ప్రవదన్త్హి మధ్యం స ఉత్తమో యో౭ భిరతస్ర్రివర్గ”.
“ధర్మ-అర్ధ-కామాలను సమంగానే సేవించాలి.వాటిలో ఒక్కదానియందే ఆసక్తి గలవాడు అధముడు.మొదటి రెండింటినీ సేవించేవాడు మధ్యముడు. మూడింటినీ సేవించినవాడు ఉత్తముడు”అని చెప్పబడింది.
మానవుల మధ్య పరస్పరసంబంధం
స్మృతులలో మానవులకు కొన్ని సంస్కారాలు విధింపబడ్డాయి. మాలిన్యాన్ని తొలగించి ఒక వస్తువును పరిశుద్ధం చేయడం 'సంస్కారం'. మానవునికి విధించిన ఈ సంస్కారాలు వానిలోని మాలిన్యాన్ని పాపాన్నితలిదండ్రులు మొదలైనవారినుండి సంక్రమించిన దోషాలను తొలగిస్తాయి అని శాస్త్రం చెపుతూన్నది. కొన్ని స్పృతులు 40 సంస్కారాలను విధించాయి.వీటిలో 16 సంస్కారాలు ప్రధాన మైన వని అంటారు. జాతకర్మ, నామకరణం, ఉపనయనం, వివాహం, కొన్ని చిన్న చిన్న యజ్ఞాలు-ఇవన్నీ సంస్కారాలలో చేరుతాయి. ఇవి చాల వరకు బాహ్యమైనవిపూజా హోమాదిరూపాల్లో ఉంటాయి. (చూ. రెండవ అనుబంధం). సంస్కారాలతో పాటు కొన్ని అత్మగుణాలు కూడ స్మృతులలో చెప్పబడ్డాయి. ప్రతీ మానవుడూ, ప్రయత్నపూర్వకంగా అలవరచుకొనవలసిన మానసికప్రవృత్తులే, ఆలోచనా విధానాలే, ఈ ఆత్మగుణాలు.ఇవి మనస్సును పరిశుద్ధం చేసి మానవునికి సుఖశాంతులను ఇస్తాయి.వీటి సంఖ్యాక్రమాదులలో కొంచెం భేదాలున్నా వీటి స్వరూపస్వభావాలు మాత్రం అన్ని స్మృతులలోను సమంగానే ఉంటాయి.
(ప్రాచీనస్మృతులలో ఒకటైన గౌతమధర్శసూత్రంలో సంస్కారాలు చెప్పిన తరువాత ఎనిమిది ఆత్మగుణాలు చెప్పబడ్డాయి -
98 హిందూమతం “అథాష్టావాత్మగుణాః-దయా సర్వభూతేషు,క్షాన్తి, అనసూయా, శౌచమ్,అనాయాసః,మణజ్ఞలమ్, అకార్పణ్యమ్,అస్పృహా ఇతి”.
(గౌధ.సూ.8. 22)
“(1) అన్ని ప్రాణులమీద(కేవలం మనుష్యులమీదనే కాదు) దయ, (2) ఓర్పు (3) (ఇతరుల ఉన్నతిని చూచి సహించలేకపోవడం అసూయ) అసూయ లేకపోవడం (4) మనోవాక్కాయాల పరిశుద్ధత్వము(5) శక్యం కాని పనులు (ప్రారంభించి శ్ర్రమపడకపోవడం (6) శుభకర మైన మంచి ఆలోచనలతో శుభకర మైన మాటలు మాత్రమే మాట్లాడడం (మంగళం) (7) దైన్యం లేకపోవడం (8) ఇతరుల వస్తువులను కోరకపోవడం అనేవి ఎనిమిది ఆత్మగుణాలు”.
ఈ ఆత్మగుణాలు సంస్కారాలకంటె గొప్పవి అని చెపుతూ గౌతమముని ఇలా అంటాడు-
“యస్వైతే చత్వారింశత్ (అష్టాచత్వారింశత్ అని మరొకపాఠం) సంస్కారాః న చాష్టావాత్మగుణాః న స బ్రహ్మణః సాయుజ్యం సాలోక్యం చ గచ్చతి.యస్య తు ఖలు సంస్కారాణా మేకదేశోల్న ప్యష్టావాత్మగుణాః అథ స బ్రహ్మణః సాయుజ్యం సాలోక్యం చ గచ్చతి గచ్చతి”. (గౌ.ధ.సూ. 8. 24-26)
“ఈ నలభై సంస్కారా లున్నా ఆత్మగుణాలు ఎనిమిదీ లేనివాడు బ్రహ్మతో సాయుజ్యాన్నీ సాలోక్యాన్నీ పొందజాలడు. కొన్ని సంస్కారాలు మాత్రమే చేయించు కొన్నా ఎనిమిది ఆత్మగుణాలూ ఉన్నవాడు బ్రహ్మతో సాయుజ్యమూ సాలోక్యమూ పొందుతాడు,పొందుతాడు”(బ్రహ్మలో కలిసిపోవడం బ్రహ్మసాయుజ్యం. (బ్రహ్మ ఉన్న లోకంలో ఉండడం (బ్రహ్మసాలోక్యం).
జాతి - వర్ణ - ఆశ్రమాదిభేదాలతో పని లేకుండా మానవమాత్రు లందరూ ఆచరించవలసిన, అలవరచుకొనవలసిన, ఇలాంటి సాధారణధర్మాలను (౧౦౫౫౫౦1 44665) అన్ని స్మృతులూ విధించాయి. ఉపనిషత్తులు, యోగశాస్త్ర (గ్రంథాలూ కూడ వీటికి అత్యధిక మైన ప్రాధాన్యం ఇచ్చాయి.
స్థిరంగా ఉండడం (ధృతి), ఓర్చు, ఓరిమి (క్షమ), మనస్సును అదుపులో పెట్టు కొనడం (దమం), ఇతరుల వస్తువులు అపహరించకపోవడం (అస్తేయం)
హిందూమతం 99 మనోవాక్కాయాలలో 'పరిశుద్దత్వం? (శౌచం), ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనడం (ఇంద్రియనిగ్రహం), జ్ఞానసముపార్టనం (విద్య), సత్యం- ఈ పదీ ధర్మలక్షణా లని మనుస్మృతి చెపుతూన్నది. “ధృతిః క్షమా దమో౬ స్తేయం శౌచమిన్టియని[గ్రహః, ధీర్విద్యా సత్యమక్రోధః దశకం ధర్మలక్షణమ్” (మ.స్కృ. 6.92) మనుస్మృతిలోనే ఈ దశవిధధర్మాల సంఖ్యను ఐదింటికి కుదించి- “అహింసా సత్యమస్తేయం శౌచమిస్టియని[గ్రహః, ఏతం సొమాసికం ధర్మం చాతుర్వర్యే?.. బ్రవీన్మనుకొ (మ.స్మృ. 10.63) అని చెప్పబడింది. అహింస,సత్యం,అస్తేయం,(బహ్మచర్యం,అపరి[గ్రహం అనే ఐదింటికీ “'యమాలు” అని పేరు పెట్టి యోగశాస్త్రంలో, ప్రతీమానవుడూ ఈ యమాలను అలవరచు కోవా లని చెప్పబడింది. “తత్రాహింసాసత్యాస్తేయబ్రహ్మచర్యాపరి[గ్రహా యమాళొ(యో.సూ. 2 80) అహింసలో- నిషేధరూపంలోను (౧౪|౫6౪ల్వుగ), విధిరూపంలోను (0916767 రెండు అంశా లున్నాయి. నిషేధరూపంలో అహింస అనగా ఏ (ప్రాణికీ కూడ ఏ విధంగాను బాధ కలిగించకుండా ఉండడం. విధిరూపంలో- ప్రతీ ప్రాణియందు దయ, ప్రేమ, కలిగి ఉండడం దీని స్వరూపం. అసత్య మైన మాటలు, ఇతరులకు బాధ కలిగించే పరుష మైన మాటలు మాటలాడకుండా ఉండడం సత్యం. ఇతరుల వస్తువులను వాళ్ల అనుమతి లేకుండా తీసికొనడం,వ్యాపారంలో ఇతరులను మోసగించి అత్యధిక మైన లాభాలు ఆర్జించడం, ఎదుటవారి హక్కులు వాళ్లకు దక్కకుండా చేయడం మొదలైనవి స్తేయం. అలాంటి స్తేయం చేయకుండా ఉండడం అస్తేయం. పవిత్ర మైన జీవనమూ, భోగలాలసత్వం లేకపోవడమూ,వ్యభిచారం చేయకపోవడమూ మొదలైనవి బ్రహ్మచర్యం. అధికంగా ధనం కూడబెట్టకపోవడం, ధనాదులందు అనాసక్తీ “అపరిగ్రహంి. ఒక జాతి,ఒక దేశం,ఒక సమయం-ఈ విధమైన ఖేదా లేవీ లేకుందా
100 హిందూమతం అందరూ, అన్ని దేశాలలోను అన్ని కాలాలలోను అన్ని సమయాలలోను పాటించవలసినవి అవడం చేత వీటికి “సార్వభౌమములు” అనీ '“మవావ్రతరి అనీ పేర్లు ;
“జాతిదేవకాలసమయానవచ్చిన్నాః సార్వభౌమా: మహావ్రతమ్”
(యోగసూటత్రం. 2.31)
లోకంలో ఏ కాలంలో నైనా ఏ దేశంలో నైనా అధార్మిక(ప్రవృత్తి విజ్బంభించడానికి కారణం అర్ధం విషయంలో,ధనం విషయంలో,మానవున కున్న అత్యధిక మైన లోభమే అను విషయం సర్వవిదితమే. ఎవ్వడైనా ఎంతటి పాపాన్నికైనా ఒడికడుతున్నా డంటే దానికి కారణం అర్ధమే.అందుచేత ఇతరవిషయాలలో శుచిత్వం, పరిశుద్ధత్వం ఎలా ఉన్నా ప్రతీ ఒక్కడూ అర్ధం విషయంలో పరిశుద్ధ మైన వ్యవహారం అలవరచుకోవా లని మన శాస్తాలు అడు గడుగునా బోధిస్తున్నాయి. అస్తేయం,అపరిగ్రహం అనే సద్గుణాలు ఈ ఆర్థికవ్యవహారాలతో సంబంధించినవే. మానవుని పరిశుద్ధత్వానికి,పవిత్రత్వానికి అవసరమైన అనేక విషయాలు చెప్పే సందర్భంలో, మనుస్మృతిలో ఆర్ధికవ్యవహారాలలో పరిశుద్ధత్వాన్ని మించిన పరిశుద్ధత్వం మరొకటి లేదని స్పష్టంగా చెప్పబడింది :
“సర్వేషామేవ శౌచానామర్థశౌచం పరం స్మృతమ్,
యో౭._ర్థే శుచిర్హిస శుచిః న మృద్వారిశుచిః శుచిపొ, (మ.స్మృ. 5. 106)
“అన్ని శుచిత్వాలలోకీ,పవిత్రత్వాలలోకీ,అర్ధం విషయంలో శౌచమే అత్యుత్తమ మైన దని శాస్త్రాలలో చెప్పబడింది. ఆర్థికవ్యవహారాలలో శుచియైనవాడే నిజంగా శుచియైన పురుషుడు. మట్టితోను నీళ్లతోను (సబ్బులతోను) కడిగికొనీ కడిగికొని శుచిగా ఉన్నా ననుకొన్నవాడు శుచి కాడు”.
ప్రతీ మానవుడూ పాటించవలసిన ఎన్నో సామాన్యధర్మాలు మన ప్రాచీనవాజ్బ్మయంలోను,వాటిని అనుసరించి బయలుదేరిన కావ్యనాటకాది సాహిత్యగ్రంఛాలలోను అడుగడుగునా కనబడుతున్నాయి. ఇంతకు మించిన నైతిక- ధార్మికప్రవృత్తి ఏముంటుందో అర్ధం కాదు.అట్టి స్థితిలో భారతీయులకు ఎథిక్స్ విషయంలో అంతగా (ద్ధ ఉన్నట్లు లేదని అక్కడక్కడ వ్రాసిన కొందరు పాశ్చాత్యుల మాటలు ఎంత హాస్యాస్పద మైనవో, ఎంత అసూయాభరిత మైనవో, అజ్ఞాన
హిందూమతం 101 విలసితములో వేరుగా చెప్ప నవసరం లేదు. వదో ఒక విషయం తీసికొని, చెప్పినదే చెపుతూ ఇంతింత లావు పుస్తకాలు రాస్తేనే ఆ విషయాన్ని గూర్చి చర్చించి నట్లు కొందరి అభిప్రాయం. సూత్రప్రాయంగా చెప్పినవి వాళ్లకు నచ్చవు? కొన్ని కాలాలలో కొన్ని పరిస్టితులలో, అధార్మికులు కూడ చాల అభ్యుదయం పొందుతూన్నట్లు కనబడినా అది తాత్మాలికమే, ఎప్పటికైన ఆ అధార్మికులే కాదు,వాళ్ల పుత్ర- పొత్రాదులు కూడ వాళ్లు చేసిన అధర్మ్శకార్యాలకు ఫలితం అనుభవించక తప్ప దని హిందువుల దృఢవిశ్వాసం. “నాధర్మశ్చరితో లోకే సద్యః ఫలతి గౌరివ, శనైరావర్తమానస్తు కర్తుర్మూలాని కృన్తతి”. (మ.స్కృ.4. 172) “ఒకడు అధర్మం ఆచరించా డంటే అదిలోకంలో,గోవు వలె వెంటనే ఫలం ఇవ్వదు. అది' మెల్లమెల్లగా ఫలోన్ముఖం అవుతూ ఆచరించినవానిని మొదలంటా నశింపచేస్తుంది. . గాలి అను పదానికి 'ఆవు,'భూమి' అని రెందర్థా లున్నాయి. ఇక్కడ రెండూ దృష్టాంతంగా గ్రహించవచ్చు. ఆవైతే మంచి ఆహారాదులు పెడితే వెంటనే పాలు ఇవ్వడం వంటి ఫలాన్ని ఇస్తుంద్వికాని అధర్మం అలా వెంటనే దాని ఫలం ఇవ్వదు అని భావం చెప్పుకొంటే దీనిని వైధర్యదృష్టాంతం అంటారు. భూమి- దున్నడం, విత్తనాలు చల్లడం మొద లైనవి చేసిన కొంతకాలానికి గాని ఏ విధంగా ఫలోన్ముఖం అయి ఫలం ఇవ్వదో, అలాగే అధర్మం కూడ కొంతకాలానికి కాని ఫలం ఇవ్వకపోవచ్చును అని భావం చెప్పుకొంటే దీనిని సాధర్యదృష్టాంతం అంటారు. “యది నాత్మని, పుశ్రేషు,న చేత్ పుభ్రేషు, నప్పృషు, న త్వేన తు కృతో9_ధర్మః కర్తుర్భవతి నిష్టల్ _ (మ.స్మృ.4. 173) “వేసిన అధర్మం చేసినవాని విషయంలో ఫలించకపోయినా వాని పుత్రులు లేదా పొత్రులు దాని ఫలం అనుభవించవలసి ఉంటుంది. అది ఫలం ఇవ్వక పోవడం అనేది ఉండదు.” .
102 హిందూమతం
“అధర్మేణేధతే తావత్తతో' భద్రాణి పశ్యతి,
తతః సపత్నాన్ జయతి, సమూలస్తు వినశ్యతి. (మ.స్మృ. 4.174)
“అధర్మం చేసినవాడు తాత్మానికంగా వృద్ధిలో ఉంటాడు; నౌకర్లు, చాకర్ణు, వస్తువాహనాదులు సంపాదిస్తాడు. దుర్చలులైన శత్రువులను కూడ జయిస్తాడు. అయితే ఏనాటి కైనా సమూలంగా నశిస్తాడు”.
ఈ ధర్మాలను జాగర్తగా పాటిస్తే కుటుంబంలోను సమాజంలోను ఏ విధంగా సుఖశాంతులు శాశ్వతంగా నెలకొంటాయో ఊహించుకొనవచ్చు.
ఒక్కొకప్పుడు-ధర్మం అని చెప్పినదానివల్ల భవిష్యత్తులో అనర్ధం వాటిల్లుతుం దని తోచినా,ఆ ధర్మాన్ని సమాజం ద్వేషించినా దానిని ఆచరించకూడదు అని కూడ ఎంతో విశాలమైన వ్యావహారికజ్ఞానంతో మన ధర్మశాస్త్రకారులు బోధించారు.
“పరిత్యజేదర్థకామౌ యౌ స్యాతాం ధర్మవర్దితౌ,
ధర్మం చాప్యసుఖోదర్శం లోకవిక్రుష్టమేవ చ”, (మ.స్కృ.276)
“ధర్మానికి విరుద్ధ మైన అర్థకామాలను విడిచిపెట్టాలి. భవిష్యత్తులో క్షేశాలకు హేతువైన లేదా లోకులచేత నిందింపబడే ధర్మాన్నైనా పరిత్యజించాలి”.
దీనికి వ్యాఖ్యాత రెండు ఉదాహరణలు ఇచ్చాడు. పోషింపవలసిన పెద్ద కుటుంబం ఉన్నవాడు సర్వస్వదానం (ఉన్న దంతా దానం చేయడం) వంటి ధర్మ కార్యాలు చేయకూడదు. శాస్త్రాలలో గోమేధం మొదలైనవి చెప్పినా ఈ కాలంలో ఇవి చేయకూడదు అని సమాజం నిషేధించిన తరువాత దానిని చేయకూడదు.” ఆధునికమైన ఉదాహరణలు చూపా లంటే - లోకులు అంగీకరించని బహుభార్యాత్వ - సహగమనాదులు ఆచరించకూడదు.
వివిధోపాఖ్యానాల ద్వారా ఈ ధర్మాలు (సామాన్యధర్మాలు) ప్రజల మనస్సు లలో బాల్యంనుండీ స్థిరంగా నాటుకొని ఉందే టట్లు బోధించడానికే రామాయణ - భారతాలు, పురాణాలు, కావ్య - నాటకాదులు బయలుదేరాయి,
ఇలాంటి సత్ష్రవర్తన ఉన్నవాడు దేవుణ్ణి నమ్మకపోయినా ధార్మికుదే. అందుచేతనే అతిప్రాచీన మైన సాంఖ్యదర్భనంలోను, వేదాలకు అత్యధికప్రామాణ్యం అంగీకరించిన పూర్వమీమాంసలోను ఈశ్వరుని ప్రసక్తియే లేదు. మానవుని
హిందూమతం 103 సత్ర్రవర్తనకీ, సత్ర్రయత్నాలకీ, వాటిచే సాధించవలసిన సత్మర్మలకీ మాత్రమే అవి ప్రాధాన్యం ఇచ్చాయి. హిందూమతశాఖలైన బౌద్ధ-జైనాదిమతాలు కూడ ఇందుకు ఉదాహరణం.
సాటి మానవుణ్ణి,మానవుజ్ణే కాదు,ఏ ప్రాణి నైనా అవమానించినవాడు పరమేశ్వరుణ్ణే అవమానించిన ట్లవుతుం దని విష్ట్రవతారాలలో ఒక అవతార మైన కపిలుడు శ్రీమద్భాగవతంలో అంటాడు-
“అహం సర్వేషు భూతేషు భూతాత్మా వస్థితః సదా,
తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతే2_. ర్బావిడమ్బనమ్.
యో మాం సర్వేషు భూతేషు సన్తమాత్మానమీశ్వరమ్,
హిత్వార్చాం భజతే మోహాత్ భస్మన్యేవ జుహోతి సః
ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః,
భూతేషు బద్ధవైరస్య న మనః శాన్తిమృచ్చతి”.
(భాగవతం 3.29. 22-23)
“నేను జీవాత్మరూపంలో అన్ని ప్రాణులలోను ఎల్లప్పుడూ ఉంటున్నాను. అలాంటి నన్ను అవమానిస్తూ మానవుడు, హాస్యాస్పద మైన ఒక అర్బారూపాన్ని నిర్మిస్తున్నాడు”. “అన్ని భూతాలలోనూ ఉన్నవాటి అన్నింటి ఆత్మ నైన, ఈశ్వరుడ మై నన్ను విడిచిపెట్టి (నన్ను కాదని) అర్బామూర్తిని పూజించేవాడు మూఢబుద్ధియై భస్మంలో హోమం చేస్తున్నాడు”. “ఇతరుల శరీరాలలో ఉన్నదీ నేనే అలాంటి నన్ను భేదద్భష్టితో ద్వేషిస్తూ దురహంకారియై ఇతరప్రాణులతో వైరం పెట్టుకొన్నవాని మనస్సుకు శాంతి లభించదు. (దేవాలయాదులలో పూజలు చేయడంకోసం నిర్మించిన వి[గ్రహాదులకు 'అర్చ' అని పేరు),
ఇక్కడ ఒక విషయం గమనించవలసి ఉంది. పైన ఉదాహరించిన కపిలుని మాటలలో తాత్సర్యం-మనిషి తోటి మానవుణ్ణి ద్వేషిస్తూ ఎన్ని మంచి పనులు చేసినా, దేవతాపూజాదిపుణ్యకార్యాలు చేసినా,అవి పూర్తి ఫలం ఇవ్వవు.తోటి మానవుణ్ణి గౌరవించడం,వానికి సాహాయ్యం చేయడం మానవుని ప్రథమకర్తవ్యం.
104 హిందూమతం మిగిలిన ఎంతటి పుణ్యకార్యా లైనా దీని తరువాతనే అని చెప్పడంలోనే కాని అర్పాపూజను నిందించడంలో కాదు.శాస్త్రంలో నహి నిన్హాన్యాయం” అను ఒక న్యాయం (సామెత) చెపుతారు. “న హి నిన్నా నిన్హ్యం నిన్దితుం ప్రవర్తతే, అపి తు స్తుత్యం స్తోతుమ్” అని ఈ న్యాయం. “ఎవరి నైనా, దేనినైనా నిందిస్తున్నా రంటే దానిలోని ప్రధానోద్దేశ్యం వానిని లేదా దానిని, నిందించడం కాదు.మరే మనగా- దేనిని ఆ సందర్భంలో స్తుతించా లని అనుకొంటారో దానిని స్తుతించడమే 'ప్రధానోద్దేశ్యం” అని దీని భావం.
'ప్రాచీనభారతీయవాజ్బయంలో, (ప్రధానంగా స్మృతి-ఆగమ-పురాణాదు లలో కొన్ని ఘట్టాలలో అతితీవ్ర మైన,అతిశయోక్తిభరిత మైన భాష ఉపయోగిస్తారు. ఉదాహరణకి-ఏదో ఒక చిన్న పాపకార్యాన్ని గూర్చి చెపుతూ ఈ పాపం చేసినవాడు కొన్ని వేల సంవత్సరాల పాటు రౌరవనరకంలో యాతనలు అనుభవిస్తాడు అని చెపుతారు. చిన్న పుణ్యకార్యాన్ని గూర్చి చెపుతూ ఈ పుణ్యం చేసినవాడు కొన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో అన్ని సుఖాలూ అనుభవించగలుగుతాడు అని వర్షిస్తారు. ఈ వ్రతం అన్ని వ్రతాలలోకీ గొప్పది అనే వర్దన అన్ని వ్రతాల విషయంలోనూ ఉంటుంది. ఈ దేవత యే పరదేవత; ఇతరదేవత లందరూ ఈ దేవతకు దాసులు అని అన్ని దేవతలను గూర్చీ చెపుతూంటారు. పురాణాలలో కూడ అనేకకథలు ఉపాఖ్యానాలూ ఉన్నాయి. వాటిలో చాలవరకు అతిశయోక్తి భరితాలుగాను అసంభావ్యాలుగానూ కనబడతాయి. అలాంటివాటిని అక్కడ ఉపదేశించదలచిన ధర్మాన్ని ప్రశంసించడం కోసం చెప్పినట్లుగా (గ్రహించి ఆ ధర్మాన్ని మాత్రమే అర్ధం చేసికొనడంకోసం ప్రయత్నించాలి. జరగదానికి అవకాశం ఉంటుంది అనుకొన్నవాటిని యథార్థాలు గానే గ్రహించాలి. సరిగా విమర్శించకుండా అన్నింటినీ పుక్కిటిపురాణాలే అని కొట్టిపారవేయడం యుక్తం కాదు. అలా చేస్తే అది పంచతంత్రకథలు చదివి - “జంతువులు ఇలా ప్రవర్తించడం ఏమిటి! ఇవన్నీ మోసం చేయడంకోసం చెప్పిన కట్టుకథలు; వీటిని చెప్పిన విష్ణుశర్మకూ బుద్ధి లేదు వానిని చేరతీసిన రాజుకూ బుద్ధి లేదు; ఈ కథ లన్నీ విన్న ఆ రాజపుత్రులు మూధాత్ములై ఉండాలి” అని పరిశోధనావ్యాసాలూ, (గ్రంథాలూ వ్రాసినట్లు ఉంటుంది. ఇలాంటివాటి నన్నింటినీ పైన చెప్పిన నహి నిందాన్యాయం
హిందూమతం 105 దృష్టిలో పెట్టుకొని అర్ధం చేసికోవాలి. ఇలాంటివాటికి “అర్ధవాదలు"అని పేరు పెట్టి వీటిని ఈ విధంగానే అర్ధం చేసికోవా లని పూర్వమీమాంసాశాస్త్రం ఏనాడో స్పష్టంగా చెప్పింది.వీటిని అలా గ్రహించక చాలమంది అపార్జాలు చేస్తూ తాము బాధపడుతూ ఇతరులకు చిత్తవిక్షేపం చేస్తూంటారు. హిందూమత[గ్రంథాలకు సంబంధించిన కొన్ని అపోహలను తొలగించడం కోసం ఇక్కడ ఈ చిన్న అప్రస్తుత ప్రసంగం చేయవలసివచ్చింది. పైన చెప్పిన ధర్మాలకు సామాన్యధర్మా లని పేరు.ఇవి మానవమాత్రుడు, అనగా మానవుడ నని చెప్పుకొనే ప్రతీ ఒక్కడూ, విధిగా చేయవలసిన, ధర్మాలు. వీటిని జాగర్తగా ఆచరిస్తే మానవుల మధ్య సంబంధాలు ఎంత స్నేహభరితాలుగా ఉంటాయో, సమాజం సుఖశాంతులతో ఏ విధంగా ఆనందమయమై ఉంటుందో ఊహించుకొనవచ్చును. స్రీపురుషుల మధ్య సంబంధం హిందూమతంలో స్త్రీకి అత్యున్నత మైన గౌరవన్థానం ఇవ్వబడింది. (ఇతర దేశాలలో ఆ యా కాలాల్లో స్రీకి ఇవ్వబడిన,ఈ నాడు కూడ ఇవ్వబడుతూన్న స్థానాన్ని జాగర్తగా పరిశీలిస్తే భారతీయస్త్రీ అనాదికాలంనుంచి ఎంతటి గౌరవాస్పద మైన స్థానాన్ని అలంకరించిందో అర్ధం అవుతుంది). స్రీ భార్యపురుషని అర్జాంగి; శరీరంలో సగభాగం. ఆమె ద్వారా మాత్రమే పురుషనికి పూర్ణత్వం లభిస్తుంది- “అర్జో వా వష ఆత్మనో యత్పత్నీ” (తైసం.6. 1.8) అని తైత్తిరియసంహితలో చెప్పబడింది. సహధర్మచారిణిగా ఉండి పురుషనికి స్రీ ధర్మకార్యాలు,యజ్ఞాదులు చేయడానికి తగిన అర్హతను కలిగిస్తుం దని అనాదికాలంనుంచి హిందూమతం చేస్తూన్న ఉద్దోషణ. ఇది ఇతరమతాలలో వేటిలోనూ లేదు. “ఏతావానేవ పురుషో యజ్ఞాయాత్మా ్రజేతి హ, విప్రాః ప్రాహుః తథా చైతత్ యో భర్తా సా స్మృతా బ్గనా” (మ.స్కృ.9)
106 హిందూమతం
“భార్యా సంతానమూ, తానూ కలిస్తేనే పురుషుడు పూర్చుడవుతాడు అని పండితులు చెప్పుతున్నారు. అది సత్యమే. ఎందువల్ల ననగా భర్తయే భార్య”అని మనుస్మృతి పురుషుని పూర్ణత్వానికి భార్యా సంతానమూ కూడ హేతువు అని చెపుతున్నది.
వాజసనేయిబ్రాహ్మణవాక్యం ఈ విషయానికి ప్రమాణంగా వ్యాఖ్యాతలచేత చూప బడింది -
“అర్భో హ వా వష ఆత్మనః తస్మాద్యజ్ఞాయాం న విన్దతే నైతావత్ ప్రజాయతే, అసర్వో హి తావద్భృవతి.అథ యదైవ జాయాం విన్దతే2.థ ప్రజాయతే తర్షి సర్వో భవతి”.
“భార్యను వివాహ మాడి సంతానం కనేవరకు పురుషుడు అర్ధభాగం మాత్రమే. భార్యను పొంది సంతానం కన్నతరవాతనే అతడు పూర్జ్చు దవుతాడు.
వివాహం అయి మరొక కుటుంబంలోనికి వెళ్లిన వధువుకు ఆ కుటుంబం మీద సర్వాధికారాలూ అప్రయత్నంగా సహజంగానే సంక్రమిస్తాయి. వివాహ సమయంలో పఠించే ఒక మంత్రంలో వరుడు వధువుతో “నీవు నీ మామగారిమీద, అత్తగారిమీద, మరుదుల మీద,అందరిమీదా సషమ్రాజ్ఞివి అగుదువు గాక”అని అంటాడు. ఇలా చెప్పడంచేత ఆమెకు తనమీద (భర్త మీద) సమ్రాజ్జీత్వం ముందే లభించినట్లు చెప్పినట్లే,
“సమ్రాజ్జీ శ్వశురే భవ సమ్రాజ్జీ శ్వశ్వాం భవ,
ననాన్షరి చ సమ్రాజ్జీ సమ్రాజ్జీ అధిదేవృషు”.
మా కుటుంబంలో ఉన్న సభ్యులకు ఎంత స్వాతంత్ర్యం ఉందో అంత స్వాతంత్ర్యం ఇటుపైన నీకు కూడ ఉంటుం దని భావం.
. _ నూతనవధువును సంబోధిస్తూ చెప్పిన ఈ బుక్కులో ఆమె కిచ్చిన గౌరవ స్థానం స్పష్టంగా తెలుస్తూన్నది ;
“గువోన్ గచ్చ గృహపత్నీ యథాసో,
వశినీ త్వం విదథమా వదాసి,
ఇహ ప్రియం ప్రజయా తే సమృధ్యతా
మస్న్మిన్ గృహే గార్జపత్యాయ జాగ్భహి.
హిందూమతం 107 ఏనా పత్యా తన్వం సంసృజస్వా ధా జివ్రీ విదథమా వదాథళొ. (బుగ్వేదం. 10. 85-26,27) “గృహానికి స్వామినివిగా (యజమానురాలివిగా) నీ భర్త ఇంటికి వెళ్లుము. గృహస్వామినివిగా ఇంట్లో నున్నవాళ్లతో మాట్లాడుము. ఇక్కడ నీ పిల్లలతో (ప్రేమతో నివసించుము. ఇంటిని వలుకొనడంలో సావధానురాలవై ఉండుము.నీ భర్తతో సంతానము కనుము. అనేకసంవత్సరాల పొటు మీ ఇంటిలోనివాళ్లతో మాటలాడుతూ ఉండుము. వరుడు వధువుతో ఇలా అంటాడు: “గృభ్దామి తే సౌభగత్వాయ హస్తం మయా పత్యా జరదస్టిర్యథాసవొ (బు.వే. 10.85.36) “మంచి సౌభాగ్యంకొరకు నీ చేయి పట్టుకొనుచున్నాను. నాతోపాటు వార్ధకం పొందెదవు గాక” వధువువరుని హస్తం పట్టుకొని అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ఇలా అంటుంది : “ఆయుష్మానస్తు మే పతిః వధన్హాం జ్ఞాతయో మమ” (శాంఖభాయనగృ్భహ్యసూత్రం. 1. 14 1) “నా భర్ర దీర్దాయుష్మంతుడగు గాక; నా జ్ఞాతులు అభివృద్ధి పొందెదరు గాక”. “ఇహైవ స్తం మా వియౌష్టం విశ్వమాయుర్వ్యశ్నుతమ్, క్రీడన్తా పుతైర్నప్తృభిర్మోదమానా స్వే గృహే” (బు.వే. 10. 85.42) “మీరిద్దరూ ఇక్కడనే ఉండండి. వియోగం లేకుండా దీర్దాయుర్దాయవంతులై మీ గృహంలో పుత్రులతోను,మనుమలతోను క్రీడిస్తూ ఆనందంగా ఉండండి”. పై మంత్రం వివాహసంబంధం శాశ్వతమైనది, అచ్చేద్యమైనది అని సూచిస్తున్నది. ఈ విషయం మనుస్మృతిలో స్పష్టంగా చెప్పబడింది. “అన్యోన్యస్యావ్యభీచారో భవేదామరణాన్లికం ఏష ధర్మః సమానేన జ్లేయః స్రీ పుంసయోః పర
108 హిందూమతం తథా నిత్యం యతేయాతాం స్త్రీపుంసౌ తు కృతక్రియౌ. యథా నాతిచరేతాం తౌ వియుక్తావితరేతరమ్”. (మ.స్కృ.9. 10. 101) “మరణించేవరకూ కూడ ఒకరినొకరు వ్యభిచరించకూడదు. వివాహం చేసికొన్నస్రీ పురుషులు ఆచరించవలసిన ధర్మం మొత్తం చెప్పాలంటే ఇదే. వాళ్లు ఏనాడూ ఒకరి నొకరు విడవకూడదు; దూరంగా తిరగకూడదు”. ఛార్మికకార్యాలలో నైనా లౌకికవ్యవహారాలలో నైనా భార్యకు భర్తతో సమాన మైన బాధ్యత సహభాగిత్వమూ కూడ ఉంటాయి. “ఇద్దరూ కలిసి చేసే ఉత్తమకార్యాల ద్వారా భార్య ఎల్లప్పుడూ భర్తతో కలిసి ఉండుగాక-వాళ్లిద్దరూ ఒక బండిని సమంగా లాగే రెం డెద్దుల వలెయజ్ఞాలను సమంగా నిర్వర్తించెదరు గాక. ఐకమత్యంతో మెలగుతూ శత్రువులను నశింపచేయుదురు గాక. స్వర్గంలో జరావర్జితమైన (ఏనాటికీ తగ్గని) తేజస్సును పొందెదరు గాక”అని తైత్తిరీయారణ్య కంలో చెప్పబడింది - “సపత్నీ పత్యా సుకృతేన గచ్చతామ్; యజ్ఞస్య యుక్తౌ ధుర్యావభూతామ్, సంజానానా విజహాతామరాతీః దివి జ్యోతిరజనమారభేతామ్”. (తైత్తిరీయారణ్యకమ్. 3. 7. 5) క్రీస్తుకు పూర్వం ఐదారు శతాబ్దుల ప్రాంతానికి చెందిన ఆపస్తంబముని రచించిన ధర్మసూత్రంలో (2.6. 18. 17-19) “భార్యాభర్త లిరువురూ ధార్మికకార్య కలాపాలలో సమంగా పాల్గొంటూ వాటి ఫలితాలను సమంగా పంచుకోవాలి. కుటుంబానికి సంబంధించిన సంపదలో వాళ్లిద్దరికీ సమానమైన అధికారం ఉంటుంది. భర్త దగ్గర లేనప్పుడు భార్య దానాలు ఇవ్వవచ్చునులఅని చెప్పబడింది. మనుస్మృతిలో స్త్రీకి మాతృమూర్తిగా అత్యున్నతమైన గౌరవస్థానం ఇవ్వబడింది. మనుస్కృతి'ప్రకారం -“లౌకికవిద్యలు నేర్పిన ఉపాధ్యాయునికంటె పదిరెట్లు ఎక్కువ గౌరవం ధార్మికవిద్యలు బోధించిన ఆచార్యునికి ఇవ్వాలి.తండ్రికి ఆచార్యునికంటె వంద రెట్లు ఎక్కువ గౌరవం ఇవ్వాలి. తల్లికి తండ్రి కంటె వెయ్యి రెట్లు ఎక్కువ గౌరవం ఇవ్వాలి” - “ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా, సహస్రం చ పిత్యాన్ మాతా గౌరవేణాతిరిచ్వతే' (మ.స్మృ.2. 145)
హిందూమతం 109 ప్రీలను గూర్చి చెప్పే సందర్భంలో మనువు-"“తమ శ్రేయస్సు కోరే తండ్రులూ, సోదరులూ,భర్రలూ,భర్త్రృసోదరులూ కూడ స్త్రీలను గౌరవించి వాళ్లను పూజించాలి, అలంకరించాలి.ప్రీలను పూజించిన చోట దేవతలు సంతోషిస్తారు. ప్రీలను పూజించని గృహాలలో చేసిన ధర్మకార్యా లన్నీ కూడ నిష్టలము లవుతాయి. కుటుంబంలోని స్రీలు దుఃఖాక్రాంత లైతే ఆ కుటుంబం శీఘ్రంగా నశిస్తుంది. ప్రీలను ఆనందంగా ఉంచిన కుటుంబాలు వృద్ధిలోనికి వస్తాయి” అని అంటాడు- పితృభిః భ్రాతృభిశ్పైతాః పతిభిర్దేవరైస్తథా, పూజ్యా భూషయితవ్యాశ్చ బహు కల్యాణమీప్పుభిఐ యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యన్తే సర్వాస్తత్రాఫలాః (క్రియాఓ “శ్రోచన్తి జామయో యత్ర వినశ్యత్యాశు తత్కులమ్, న శోచన్తి తు యత్రైతా వర్ధతే తద్ధి సర్వదా” (మ.స్కృ.3.55-57) ధర్మ-అర్థ-కామా లనే మూడుపురుషార్థాలను సాధించడంలో భార్యాభర్తలకు సమాన మైన బాధ్యత,అధికారమూ ఉన్నా యని చెపుతూ ఇతిహాసాలలోను పురాణాలలోను వందల కొలది శ్లోకా లున్నాయి. “న గృహం గృహమిత్యాహుః గృహిణీ గృహముచ్యతే, గృహం తు గృహిణీహీనమ్ అరణ్యసదృశం మతమ్”. (శాంతి ప.44 6) “అసలు ఇల్లు ఇల్లు కాదు.ఇల్లాలే నిజ మైన ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు అడవి”. “నాస్తి భార్యాసమో బన్ఫుర్చాస్తి భార్యాసమా గతిః, నాస్తి భార్యాసమో లోకే సహాయో ధర్మసంగ్రహే”. (శాం.ప. 14415) “భార్యతో సమాన మైన బంధువు లేదు.భార్యతో సమాన మైన రక్షణ (గతి) లేదు. లోకంలో ధర్మం సంపాదించడానికి భార్య వలె సాహాయ్యం చేసేవా రెవరూ లేరు”. “భార్యాభర్త లిద్దరూ అన్యోన్యసహకారంతో కలిసి ఉన్నప్పుడు ధర్మ- అర్ధ- కామాల త్రయం సఫలం అవుతుంది అని మార్కండేయపురాణం చెపుతున్నది-
110 హిందూమతం “యదా భార్యా చ భర్తా చ పరస్పరవశానుగాౌ, తదా ధర్మార్ధకామానాం త్రయాణామపి సంగతమ్. కథం భార్యామృతే ధర్మమర్థ్ధం వా పురుషః ప్రభో, ప్రాప్నోతి కామమథవా తస్యాం త్రితయమాహితమ్. తథైవ భర్తారమృతే భార్యా ధర్మాదిసాధనే, న సమర్ధా త్రివర్గోషయం దామ్బత్యం సముపా(శ్రితళొ. (మా.పు.21. 69-71) స్రీలకు కుటుంబంలో ఇలాంటి ఉన్నతస్థానం ఇవ్వవలె నని కేవలం (క్రుతి- స్మృతులలో చెప్పడమే కాదుఇది ఆచరణలో కూడ ఉందేది అని చెప్పడానికి అనేకకావ్యనాటకాదులలోను ఇతరగ్రంథాలలోను ఉన్న వర్దనాదుల ద్వారా స్పష్టం అవుతుంది. కాళిదాసరచిత మైన రఘువంశంలో,భార్య మైన ఇందుమతి మరణించగా విలపిస్తూన్న అజమహారాజు ఇలా అంటాడు- “గృహిణీ సచివః సభీ మిథః ప్రియశిష్యా లలితే కలావిధా, కరుణావిముఖేన మృత్యునా హరతా త్వావదకింనమే హృతమ్”. (ర.వం.8. 66) “నీవు నా గృహిణివి,మంత్రివి,సఖురాలివి. లలితకళలలో ప్రియశిష్యురాలవు. అలాంటి నిన్ను హరించిన కరుణావిహీను డైన మృత్యువు నా సర్వస్వాన్నీ హరించాడు. అతడు హరించకుందా ఏది మిగల్పాడు”! మాలతీమాధవంలో భవభూతి ఇలా అంటాడు- “*పేయో మిత్రం బన్ఫుతా వా సమగ్రా సర్వే కామాః శేవధిర్జీవితం వా స్త్రీణాం భర్తా ధర్మదారాశ్ళ పుంసామిత్యన్యోన్యం వత్సయోర్జ్ఞాతమస్తు” (మా.మా. 6) “స్త్రీలకు భర్త అతిప్రియు డైన మిత్రుడుసమస్తబంధువర్గమూ భర్తయే. అతదే సమస్త కామాలు; అతడే పెన్నిధి, అతడే జీవితం. భర్తకు భార్య కూడ ఇట్లే దంపతుల అన్యోన్యసంబంధం ఇలా ఉంటుంది.” ఇలాంటి భావాలు ప్రాచీనసాహిత్యంలో అడుగడుగునా మనకు
హిందూమతం 111 కనబడతాయి. దీనిని పట్టి ప్రీల కిచ్చే ఈ గౌరవం కేవలం సైద్ధాంతికమే కాదు, ఆచరణలో కూడ అనాదికాలంనుండి నేటివరకూ భారతదేశంలో ఉన్న దని స్పష్టం అవుతుంది.
ఈ విధంగా కుటుంబంలోను,తద్ద్వారా సమాజంలోను స్త్రీకి ఇవ్వబడిన స్ధానం అత్యున్నత మైనది. అధికగౌరవాస్పద మైనది. హిందూధర్మశాస్త్రం ప్రకారం తండ్రి ఆస్తిలోను భర్త ఆస్తిలోనూ కూడ స్త్రీకి వాటా ఉంటుంది.ఆమెకు ఇచ్చిన కట్నం పూర్తిగా ఆమెకే చెందుతుంది.భర్త అనుమతి లేకుండా కూడ ఆమె తన ఆస్తిని ఎవరికైనా దానం చేయవచ్చు; అమ్ముకొనవచ్చు. బంధువర్గంనుండి వచ్చిన పారితోషికాలు,భర్తనుండి వచ్చిన పారితోషికాలూ కూడ ఆమెకే చెందుతాయి.వాటి పై ఇతరుల కెవ్వరికీ అధికారం ఉండదు.
స్త్రీలకు గౌరవం ఇస్తూ వ్రాసిన వాక్యా లున్నట్లుగానే అక్కడక్కడ వాళ్లను చులకనగా చూస్తూ చెప్పిన మాటలు కూడ కనబడతాయి.అవి అన్నీ ఆ యా ఘట్టాలలో వర్ణించిన కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వ్రాసినవే కాని వాటికి ప్రీనిందయందు తాత్చర్యం కాదు. వెనుక చూచిన “న హి నిందాన్యాయం” ఇలాంటిచోట్ల కూడ అన్వయించుకోవాలి. అంతే కాక వైరాగ్యదృష్టిని పెంచడంకోసం కూడ ఇలాంటి నిందావాక్యాలు, కొన్నిచోట్ల కన బడతాయి. సాధారణంగా పురుషుడు అత్యంతాసక్తు డయ్యేది కాన్హా-కనకాలయందే. ఆత్మజ్ఞానాదులు సంపాదించుకొవా లంటే ఈ రెండింటినీ విడవా లని అక్కడ చేసే బోధ.అలాంటి చోట్ల పుత్ర- మిత్ర-గృహాదుల విషయంలో కూడ ఇలాంటి భావాలు చెప్పబడు తుంటాయి. ఆధ్యాత్మిక ప్రవృత్తి పెంచుకొనడంలో పురుషనికి స్ర్రీసంబంధం ఎంత ప్రతిబంధకమో స్త్రీకి పురుషసంబంధం కూడ అంత ్రతిబంధకమే. అందుచేత అలాంటి ఘట్టాలలో స్త్రీలకు సంబంధించినంతవరకు, స్త్రీనిందను పురుషనిందగా (గ్రహించ వచ్చును. "రం శు 0జం6 ఏ ౪0%జ0" అన్నంతమాత్రాన షేక్స్పియర్ ప్రీజాతివిరోధి అనడం అతని మిగిలిన రాతలను మరవడమే అవుతుంది.ఇలాటి వాక్యాలు, నిందాభాసలు ప్రతీవాజ్బయంలోను (పారసీకభాషాదులలో కూడ) కనబడతాయి.
అయితే ఇలాంటి పరిస్థితులలో కూడ స్త్రీయే అపరాధిని అన్నట్లూపురుషుడు
112 హిందూమతం నిరపరాధి అన్నట్లూ మాటలాడడం గాని,[వ్రాయడం గాని, యుక్తం కాదని బృహత్సం హితలో, క్రీ.శ. ఐదవ శతాబ్ది ప్రాంతానికి చెందిన వరాహమిహిరుడు తీవ్రంగా ఖండిస్తాడు - “యే£_ప్యజ్ఞనానాం ్రవదన్తి దోషాన్ వైరాగ్యమార్లేణ గుణాన్ విహాయ, తే దుర్దనా మే మనసో వితర్శః సద్భావవాక్యాని న తాని తేషామ్. (బృ.సం. 73.5) “వైరాగ్యమార్గాన్ని అవలంబించి చెప్పినా వాళ్లు స్త్రీల గుణాలను విడిచివేసి దోషాలను మాత్రమే వర్షించి చెపుతారు. వాళ్లు దుర్దనులే అని నా అభిప్రాయం.వాళ్ల మాటలూ యథార్థ మైనవి కావు” “ప్రబ్రూత సత్యం కతరో౬_బ్గనానాం దోషోఓ స్తియో నా£౬ చరితో మనుమ్టో, ధార్స్టేన పుంభిః ప్రమదా నిరస్తాః, గుణాధికాస్తా మనునా(త్ర చోక్తమ్” (బృ.సం. 73.6) “పురుషులు చేయని, స్త్రీలు మాత్రమే చేసిన దోషం ఏది ఉందో నిజం చెప్పండి. పురుషులు కేవలం మొండితనం వహించి స్త్రీలను నిరసిస్తూన్నారు. గుణాలచేత వాళ్లు పురుషులకంటె గొప్పవాళ్లు. ఈ విషయం మనువు (ఇతరస్మృతి కర్తలు” కూడ) చెప్పాడు - “సోమస్తాసామదాచ్చౌచం గన్టర్వః శిక్షితాం గిరమ్, అగ్నిశ్చ సర్వభక్షిత్వం తస్మాన్నిష్క్మసమాః ప్రియః (బృ.సం.78.7) “చంద్రుడు స్రీలకు శుద్ధత్వాన్ని ఇచ్చాడు.గంధర్వుడు శ్రేష్ట మైన ఆహ్లాదకర మైన వాక్కును ఇచ్చాడు. అగ్ని సర్వభక్షిత్వం (ఏమి తిన్నా దోషం లేకపోవడం) ఇచ్చాడు. అందు వల్ల స్రీలు బంగారంవంటివాళ్లు.స్వతః పరిశుద్ధ మైనవాళ్లు. (ఇది బౌొధాయనగ్భహ్యసూత్రం నుండి ఉదాహరించాడు). “బ్రాహ్మణాః పాదతో మేధ్యా గావో మేధ్యాశ్చ పృష్టతః, అజాశ్వా ముఖతో మేధ్యాః ప్రియో మేధ్యాస్తు సర్వతః” (బృ.సం.78.8) “బ్రాహ్మణులు పొదాలచేత పవిత్రులు(బ్రాహ్మణుల పాదాలు పవిత్రమైనవి).
హిందూమతం 113 గోవులు పృష్టభాగంచేత పవిత్ర మైనవి.మేకలు గుజ్టాలు ముఖాలచేత పవిత్ర మైైనవి.ప్రీలు అన్ని అవయవాలచేతా పవిత్రమైనవారు? (ఇదే భావం గల శ్లోకం వసిష్టస్మృతిలో కూడ ఉంది)
“స్త్రియః పవిత్రమతులం నైతాః దుష్యన్తి కర్షిచిత్,
మాసి మాసి రజో హ్యాసాం దుష్పృతాన్యపకర్షతొ (బృ,సం, 78.9)
“స్రీలు సాటి లేని పవిత్రవస్తువు. వీళ్లకు ఎన్నడూ దోషం లేదు; ఎందువల్ల ననగా ప్రతీ మాసమూ రజస్సు వీళ్లలోని దోషాన్ని తొలగించివేస్తుందా (ఈ శ్లోకం కూడ బోధాయనగ్భహ్యసూత్రంనుండి ఉదాహరించబడింది).
“జానయో యాని గేహాని శపన్య్యప్రతిపూజితాః
తాని కృత్యాహతానీవ వినళ్యన్తి సమన్తతః. (బృ.సం.78. 10)
“సన్మానింపబడని ఆడపడుచులు, కులస్ర్రీలు,ఏ గృహాలను శపిస్తారో (తిడతారో) ఆ ఇళ్లు (కుటుంబాలు) కృత్యచేత నశింపచేయబడినవి వలె అన్ని విధాల నశిస్తాయి.” (ఈ శ్లోకం మనుస్కృతినుండి ఉదాహరించబడింది. శత్రువులను గాని వాళ్ల రాజ్యాలను గాని నశింపచేయడంకోసం కొన్ని అభిచారప్రయోగాలు- కొన్ని (క్రూర దేవతలను గూర్చిన పూజాయజ్ఞాదులు-చేయగా ఒక మహాభూతం ఆవిర్భవించి ఆ శత్రువులను నశింప చేస్తుం దని కొన్ని ప్రక్రియలు ప్రాచీనవాజ్బయంలో చెప్పబడినవి.ఆ విధంగా పుట్టిన మహాభూతానికి కృత్య అని పేరు.ఆడపడచుల శాపం అంత ప్రభావవంత మైన దని మనువు వచనం;వరాహమిహిరాదుల విశ్వాసము).
“జాయా వా స్యాజ్జనయిత్రీ వా సంభవః స్రీకృతో నృణామ్,
హే కృతఘ్నాస్తయోర్నిన్దాం కుర్వతాం వః కుతః శుభమ్”.
(బృస.78. 11)
““జాయి అయినా,'జనయిత్రి అయినా పురుషుల పుట్టుక స్రీలవల్లనే జరుగుచున్నది. ఓ1!కృతఘ్నులారా! ఆ జాయను,జనయిత్రినీ నిందిస్తూన్న మీకు శుభం ఎలా కలుగుతుంది?”
114 హిందూమతం
“తానే పుత్రరూపంలో జన్మిస్తున్నాడు”అని “ఆత్మా వై పుత్రనామాసిొొఅను (ఢుతి చెప్పు చున్నది. అందుచేతనే భార్యకు “జాయాఅని పేరు.“జాయతే అస్యామ్ ఇతి జాయా” ఈమెయందు పుత్రుడుగా మళ్లీ పుడతాడు గాన “జాయ'అని దీని వ్యుత్చత్త్యర్థము. 'జనయిత్రి'అనగా “కన్న తల్లి. అందుచేత ఒక ప్రీ జనయిత్రి అయితే మరొక స్రీ జాయ. వాళ్లను నిందిస్తున్న పురుషుడు కృతఘ్ను డని భావం.
“దవ్చత్యోః వ్యుత్మమే దోషః సమః శాస్త్రే ప్రతిష్టితః,
నరా న తమవేక్షన్తే తేనాత్ర వరమజ్దనాా. (బృ.సం. 78. 12)
“వ్యభిచరించిన దంపతు లిద్దరికీ దోషం సమానమే అని శాస్త్రంలో చెప్పబడింది. పురుషులు ఆ విషయం ఆలోచించరు. అందుచేత స్రీలే ఉత్తమురాళ్లూ.
“బహిర్దోమ్నాతు షణ్మాసాన్ వేష్టితః ఖరచర్మణా,
దారాతిక్రమణే భిక్షాం దేహీత్యుక్త్వా విశుధ్యతి _ (బృ.సం.73. 13)
“భార్యను కాదని పరస్త్రీని సేవించినవాడు గాడిద తోలు దాని బొచ్చు పైకి వచ్చే టట్లు కప్పుకొని,ఆరు మాసాల పాటు “భిక్షాం దేహిఅని బిచ్చం ఎత్తుకొని బ్రతికితే శుద్ధు దవుతాడు”. ఇది స్మృతులలో విధించిన ప్రాయశ్చిత్తం.
“అవో ధార్ష్ట్రమసాధూనాం నిన్సతామనఘాః స్త్రియః,
ముష్టతామివ చోరాణాం తిష్ట చౌరేతి జల్చ్బతామ్”.
“తామే చౌర్యం చేస్తూ దొంగ దొంగ; ఆగు ఆగు అని అరుస్తున్నవాళ్ల వలె దోషరహిత లైన స్త్రీలను నిందించే దుష్టులు ఎంత సిగ్గులేనివారు!”
ఈ విధంగా స్త్రీలకు అత్యధిక మైన గౌరవం ఇవ్వాలని చెపుతూ వ్రాసిన ఎంతో మంది స్మృతికారులూస్తీలలో ఉన్న కొన్ని దోషాలను మాత్రమే ఎత్తి చూపుతూ ్రాసినవాళ్లూ అలా వ్రాసినవాళ్లను దూయబట్టి స్త్రీల వైశిష్ట్యాన్ని చాటి చెప్పిన ఎంతో నుంది శాస్త్రకారులూ, కవులూ, కూడ ఉన్నారు. విదేశీయుల నుండి ఆపద లేని పూర్వకాలంలో స్త్రీల కున్న స్థితికి భిన్నంగా ఒక కాలంలో కొన్ని మార్పులు వచ్చి ఉంటాయి. అవన్నీ రాజకీయ మైన పరివర్తనలవల్ల కలిగిన సామాజికమైన క్షిష్టపరిస్థితులను ఎదుర్కొనడంకోసం వచ్చినవి. ఒక కాలంలో ఒక విధమైన మార్పులు మరొక కాలంలో మరొకవిధమైన మార్పులు.
హిందూమతం 115 మధ్యయుగంలో దాదాపు ఆరు శతాబ్దాల పాటు ముస్లింలు చేసిన అమానుషమైన చర్యలను వర్జిస్తూ విలసశాసనం మొదలైనవాటిలో (వ్రాసిన -స్వాయత్తతా మతిర్నాసీత్ దారేషు చ ధనేషు చ” (అనాడు- ఈమె 'నా భార్య'.'ఇది నా సొత్తు అని చెప్పుకొనడానికి కూడ ఉందేది కాదు”) మొదలైన మాటలను పట్టి ఆనాటి పరిస్థితులలో స్త్రీల రక్షణను గూర్చి హిందూసమాజం ఎంత భయపడవలసివచ్చినదో ఊహించు కొనవచ్చును. నాగరికత అత్యున్నతస్థితిని పొందినది అనుకొనే ఈ నాడు కూడ కొన్ని వీధులలో పట్టపగలు స్రీలు సంచరించడానికి ఎంత కష్టంగా ఉంటుందో చూచి తెలుసుకొనవచ్చును. అలాంటి పరిస్థితులను గూర్చి తెలిసికొన కుందా, తెలిసినా వాటిని కప్పిపుచ్చి, ఈనాడు నాలుగు గోడల మధ్య తమకు మాత్రం మంచి రక్షణ కల్పించుకొనకలిగినవాళ్లు కొంత పలుకుబడీ యశస్సూ సంపాదించుకొనడంకోసం చేసే నినాదాలు, వ్రాతలూ సమాజానికి క్షేమకరాలు కావు. అవసరాన్ని పట్టి 144 వ సెక్షన్ విధించి నలుగు రొక చోట గుమి గూడరాదని నిషేధించినప్పుడు గాని,గమననిరోధాదులు (కర్చ్యూ) విధించినప్పుడు గాని “నా వాక్స్వాతంత్ర్యాన్ని అపహరిస్తున్నారు” “నా స్వేచ్చాసంచారస్వాతంత్య్యం అపహరిస్తూన్నారు” అని అలజడి చేయడం ఎట్టిదో ఇదీ అట్టిదే. జీవన స్వాతంత్ర్యానికే భంగం ఏర్పడి నప్పుడు ఇంక ఇతరస్వాతంత్ర్యాలను గూర్చిన అరపు లేమిటి! మొత్తంమీద పూర్వనిర్ణ్మయకలుషితం కాని మనస్సుతో జాగ్రత్తగా పరిశీలిస్తే అనాదికాలంనుంచి భారతీయమహిళలు, ఇతరదేశమహిళలతో పోల్చిచూడగా, అత్యధికమైన గౌరవం పొందుతున్నట్లు అంగీకరించవలసి ఉంటుంది. ఎనభై శాతం కుటుంబాలలో ఈనాడు కూడ గృహిణియే ఏదో విధంగా తన మాట చెల్లించుకొంటుంది అనేది సర్వవిదితమైన సత్యం. మనుస్మృతిలో ఒక చోటోన స్రీ స్వాతన్త్యమర్దతి” (స్త్రీకి స్వాతంత్ర్యం లేదు)
అను ఒక వాక్యం ఉన్నది.దానిని అది ఉన్న శ్లోకంలోని ఇతరపాదాలనుంచి వేరు చేసి, ఆ శ్లోకం ఏ సందర్భంలో ఉన్నదో తెలిసికొనకుండా (లేదా తెలపకుందా) దీనికి కొన్ని అపార్థాలు చెప్పడం జరుగుతున్నది. స్త్రీకి ప్రత్యేక మైన (విశిష్ట మైన) రక్షణ ఉండా లని స్మృతికారుల అభిప్రాయం. బాల్యంలో ఆమె తండ్రి రక్షణలో ఉండాల్సి యౌవనంలో భర్త రక్షణలో ఉండాల్సివార్ధకంలో (భర్తతో సహా ఆమె)
116 హిందూమతం కుమారుల రక్షణలో ఉండాలి.స్త్రీ పురుషుని రక్షణ లేకుండా ఎన్నడూ ఉండకూడదు”. ఈ విషయమే మనువు “రక్ష ధాతువును ఉపయోగిస్తూ ఈ క్రింది శ్లోకంలో చెప్పాడు -
“పిత్రా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే,
రక్షన్తి స్థావిరే పుత్రాః న స్త్రీ స్వాతన్త్యమర్హతి”. (మ.స్మృ. 9.8)
దీనిని పట్టి “న స్త్రీ స్వాతన్య్యమర్హతొఅను వాక్యానికి “ఆత్మరక్షణం విషయంలో స్త్రీకి స్వాతంత్ర్యం లేద్రుఆమె తనను తనంతట తాను రక్షించుకొనజాలదూఅని మాత్రమే అర్ధం.మిగిలిన గౌరవాదులు ఆమెకు గృహంలోను సమాజంలో తప్పక ఇవ్వవలసిందే. అందుకు విరుద్ధ మైన ప్రవృత్తులు సమాజంలో ఏ కాలంలో నైనా కనబడితే అందుకు బాధ్యత సమాజానిదే గాని శాస్త్రానిదీ,ధర్మానిదీ కాదు.
ఒక కాలానికి సంబంధించిన ఆచారాలను, అలవాట్లను విమర్శించడానికి పూనుకొనే ముందు ఆనాటి పరిస్థితులను అనాటి సమాజం ఆదరించిన ఆదర్శాలను సరిగా అర్థం చేసికొనడం ఎంతైనా అవసరం. అలా కాక ఏమేమో వ్రాయడానికి ఉపక్రమించినవాళ్లు ఇతరులను తప్పు దారి పట్టించినవా రవుతారు. పూర్వకాలంలో చాల దగ్గరగా ఉన్న ఒక ప్రదేశంనుంచి మరొక ప్రదేశానికి వెళ్లడం కూడ కష్టంగా ఉందేది.చాలవరకు జనులు స్వయంపోషకాలైన గ్రామాలలో నివసిస్తూ ఎప్పుడో కాని ప్రక్కనే ఉన్న గ్రామానికి కూడ వెళ్లవలసిన అవసరం లేకుండా తమ తమ వృత్తులను చక్కగా చేసికొంటూ సంతృప్తితో జీవనం హాయిగా గడుపుతూండేవారు. రైళ్లు బస్సులూ మొదలైన వాహనాలు,విద్యుత్తు మొదలైన సుఖసాధనా లేవీ ఉండేవి కావు. ఈనాడు మనం చూస్తూన్నట్లు దేశం అంతటా వందల కొలది పాఠశాలలూ, విద్యాలయాలు,వాటిలో గుంపులు గుంపులుగా చేరి హాస్టళ్లలో నివసిస్తూ వినయగంధశూన్య మైన, ధనార్దనప్రధాన మైన విద్యాభ్యాసం చేసే లక్షలాది విద్యార్థినీ -విద్యార్థులూ, విద్యాభ్యాసం అయిన తరవాత ఆయా కార్యాలయాదులలో వందల,వేల సంఖ్యలో జేరి ప్రీ - పురుషులు ఉద్యోగాలు చేసే పరిస్థితులూ ఆనాడు ఊహించడానికి కూడ శక్యం కాని విషయాలు. అలాంటి కాలంలో జీవించినవాళ్ల మానస ్రవృత్తులకూ, అలవాట్లకూ,
హిందూమతం 117 ఈనాటి జనుల మానసప్రవృత్తులకూ అలవాట్లకూ ఏమాత్రం పోలిక లుండడానికి అవకాశం లేదు.కొన్ని ఉన్నతాదర్శాలను ఎదుట నిలుపుకొని వాటి సంరక్షణం కొరకు జీవిత మైనా త్యజించదానికి ఎంతో మంది సిద్ధంగా ఉండే రోజు లవి.ఎంతటి కిష్టమైనా జాతిపరిశుద్ధతను రక్షించుకోవా లనే దృఢసంకల్పంతో మనుష్యులు జీవించిన రోజు లవి.ఆనాడు ఉన్న ఇలాంటి పరిస్థితులను అర్ధం చేసికొన్ననాదే అనాటి సామాజికప్రవృత్తులను, సాంఘికనియమాలను కుటుంబవ్యవస్థ మొదలైనవాటిని అభినందించ కలుగుతాము. ఈ ఆదర్భా లన్నీ మూఢవిశ్వాసాలనో, అనాగిరకతాలక్షణాలనో భావించేవాళ్లకు అప్పటి అలవాట్లు ఆచారాలూ కూడ అర్ధరహితాలుగాను, నాగరికతాప్రారంభదశకో,దాని పూర్వదశకో చెందినవిగాను కనబడతాయి. ఆనాడు రాజపుత్రవీరవనితలు చేసిన జోహార్ కూడ "11౧౧ల 2006 15 హం౪2016 06646 60 16 గం*గి ఖూ6 ఆ౫)౦) 14 వంటి ఉపదేశవాక్యాలు నలుమూలలా (మోగుతూన్న కాలంలో హాస్యాస్పదంగాను, మూఢత్వానికి ఉత్తమోదాహరణంగాను కనబడతాయి. వయస్సు పెరిగి కుటుంబానికి గాని సమాజానికి గాని ఉపయోగించనివాళ్లకి శాశ్వత మైన విశ్రాంతి ఇవ్వడం మంచిది,భూభారం పెరిగిపోకుండా చూచుకోవాలి కదా అను సిద్దాంతాలు ప్రచారంచేసేవాళ్లకి పెద్దలను కృతజ్ఞతాభావంతో ఆదరిస్తూ వార్ధక్యంలో సర్వవిధాలా వాళ్లకి సాహాయ్యం చెయ్యాలి అంటూ చేసే బోధలు తెలివితక్కువవాళ్లు చేసే వ్యర్థప్రలాపాలుగా కనబడతాయి. ప్రతీ మానవుడూ తోటి మానవుణ్సి (ప్రేమతో,దయతో చూడా లనీ,స్వార్ధదింతాపరుడు కాకుండా పరోపకారపరాయణుడు
కావాలన్సీ,'ప్రతీ హిందువూ కూడ భార్యను జీవితంలో, అన్ని రంగాలలోను
సహభాగినిగా గౌరవించా లనీ,శాస్త్రవిహిత మైన,వేల కొలది సంవత్సరాలు
అందరూ ఆనందపూర్వకంగా ఎంతో శ్రద్ధతో అనుసరించిన ధర్మం. దానికి విరుద్ధ
మైన ప్రవృత్తులు ఏ కాలంలో నైనా కనబడితే అది ఆ యా కాలాల, వ్యక్తుల
దోషమే కాని శాస్త్రదోషం కాడు. ఈ సందర్భంలో-హిందూమతంలో ఉన్న కొన్ని లోపాలను మాత్రమే ఎత్తి చూపే కొందరి ప్రవృత్తికి సమాధానంగా స్వామి వివేకానంద చెప్పిన మాటలు
118 హిందూమతం కొన్ని స్మరించడం అవసరం-“ఒక దేశం స్వరూపస్వభావాలను వర్హించి చెప్పడానికి ఉదాహరణలుగా తీసికొనవలసినది అక్కడ ఉన్న మురికివాడలనూ వాటి ఉత్పత్తులనూ కాదు.ఈ లోకంలో ఎవడైనా ఒక ఆపిల్ చెట్టు దగ్గరికి వెల్లి, కుళ్లిపోయిన, పురుగులతో పుచ్చిన ఆపిల్ పళ్లు ఏరికొని వచ్చి ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పుస్తకం వ్రాయవచ్చు.ఇంత వ్రాసినా ఆ ఆపిల్చెట్టుయొక్క యథార్థ మైన స్వరూపస్వభావాలు గాని,దాని గొప్పతనం గాని వానికి కొంచెమైనా అర్ధం అయి నట్లు కాదు.ఒక దేశాన్ని గూర్చి అంచనా వెయ్యాలంటే దానిలో ఉన్న ఉదాత్త మైన అంశాలను పరిశీలించవలసి ఉంటుంది.ఆ ఉదాత్తమైన ఆదర్శాలనుండి ఎవరైనా దిగజారిపోతూంటే ఆ జాతి ఒక ప్రత్యేకమైన జాతిగా వర్పడు తుంది.దేశంలో ఉన్న ఆచారవ్యవహారాల మంచి చెడ్డలను గూర్చి నిర్ణయించా లను కొన్నప్పడు వాటిలోని అత్యున్నతాంశాలను గ్రహించాలి” (వివేకానంద (గ్రంథమాల. ౪0. 11...504). ప్రకృతితోను ఇతరప్రాణులతోను మానవుని సంబంధాలు భూమి,జలము,అగ్నివాయువు అను నాలుగు మహాభూతాల వివిధపదిణామ విశేషాలే ప్రకృతి అనగా.ఇది పమేశ్చరునినుండి అవిర్భవించిం దని వెనుక తెలిసికొని ఉన్నాం. అతిసూక్ష్మ మైన ప్రాణి మొదలు అతిబ్బహత్'ప్రమాణం గల ప్రాణి వరకు ఉన్న కోట్లాది ప్రాణులు వాటి వాటి కర్మఫలాలను అనుభవించడానికి వీలు కల్పించడానికై పరమేశ్వరుడు ప్రకృతిగా ఆవిర్భవించాడు.(ఇది ఎలా జరిగింది అనేదే భారతీయదర్శనాలలో అన్నింటిలోను చర్చించిన అతిగంభీర మైన విషయం.ఇక్కడ మన కా చర్చలతో పని లేద్యుసిద్దాంతం గుర్తుంటే చాలు) ఆయా ప్రాణుల శరీరాలు కూడ (ప్రకృతి పరి జామాలే. ఈ ప్రక్రియకు,అనగా- ప్రకృత్యావిర్భావానికీ, దానితరవాత నిరంతరమూ కొనసాగుతూన్న సృష్టివిధానానికీ కూడ ఆదీ అంతమూ అనేవి లేవు. మధ్య మధ్య ప్రళయరూపా లైన సంధులు మాత్రం ఉంటూంటాయి.ఆ సంధికాలంలో పరమేశ్వరుడు ప్రకృతిని తనలో అంతర్జితం చేస్తూ ఉంటాడు. అందుచేత మానవుడు కూడ కొన్ని లక్షల రకాల ప్రాణులలో ఒక ప్రాణిమాత్రమే కాని వీనికి ఏదో ఒక ప్రత్యేకత,వైశిష్ట్రం, ఉందని హిందూమతం
హిందూమతం 119 చెప్పదు. ఈ ప్రపంచం మానవునికోసమే సృజింపబడిన దని హిందువులు విశ్వసించరు. ఈ ప్రసంచకంలో,జీవించదానికి మానవునికి ఎంత అధికారం ఉందో అంత అధికారమే ప్రతీ ప్రాణికీ ఉంది.అందుచేత మానవుడు ప్రకృతి తన కిచ్చిన వస్తువులను జాగర్తగా ఉపయోగించుకొంటూ ఇతర ప్రాణులతో కలిసి మెలసి ఉంటూ సంతృప్తితో జీవితం గడపాలి. ఇతరప్రాణులు కూడ జీవించే టట్లు చూడాలి. వాటికి బాధ కలిగించకూడదు. చివరికి స్థావరాలైన చెట్లుమొక్కలు మొదలైనవాటికి కూడ బాధ కలిగించరాదు.అవి కూడ ప్రాణుల్వేవాటికి కూడ సుఖదుఃఖా లుంటాయి అని హిందూమతం చెపుతూన్నది-
“తమసా బహురూపేణ వేష్టితాః కర్మహేతునా,
అన్తఃసంజ్ఞా భవన్వేతే సుఖదుఃఖసమన్వితాలో (మ.స్మృ. 1.49)
“వాటి పూర్వజన్మకృతకర్మవల్ల కలిగిన బహువిధ మైన అజ్ఞానంచేత ఆవరింపబడి ఉన్న వృక్షాదులకు అంతర్గతంగా చైతన్యం ఉంటుంది;సుఖదుఃఖా లుంటాయి.
అయితే ప్రాణిహింస చేయకుండా ఎంతో జాగ్రత్తతో ఉన్నవాళ్లు కూడ వృక్ష-ఓషధ్యాదుల విషయంలోను చిన్న చిన్న జీవరాశుల విషయంలోను హింస చేస్తూనే ఉంటారు. వాటికి తగు ప్రాయళ్చిత్తం చేసుకొంటూ ఉండాలి. (చూ.గ్భవాస్థ ధర్మాలు).
అదే విధంగా '్రతీకాలంలోను వాళ్ల వాళ్ల కర్మవశంచేత, అధార్మిక ప్రవృత్తి కలిగి ఇతరులను ఏదో విధంగా బాధించేవాళ్లూస్వార్థమాత్రపరులూ అయిన మానవులు ఉంటూనే ఉంటారు. వాళ్ల సంఖ్య అధికంగాను అల్ప్బంగాను ఉండడం అనేదానిలో మాత్రమే భేదం. వాళ్లని శిక్షించి సమాజాన్ని రక్షించవలసిన అవసరం కూడ ప్రతీ కాలంలోను ఉంటుంది. అలాంటి హింసాప్రవృత్తి కలవాళ్లను తగు విధంగా దండించడంలో కొంత హింస ఉన్నా అది ధార్మికమైన హింసయే-అని హిందూమతం బోధిస్తూన్నది. దేశపాలకులకు అలాంటి దుష్టదండనం కర్తవ్య మైన ధర్మమే అవుతుంది.
అందుచేతనే లోకానుగ్రహం చేసే ప్రతీ దేవతా కూడ దుష్టశిక్షణం చేస్తుంది
120 హిందూమతం అనే దృఢవిశ్వాసంతో ఆ దేవతామూర్తి హస్తాలలో వరదాభయము(ద్రలతో పాటు కొన్ని ఆయుధ విశేషాలు కూడ ఉన్నట్లు వర్షించడం,భావించడం హిందూసంప్రదాయం.
- సమాజంతో మానవుని సంబంధం
మానవుడు తన చుట్టుప్రక్కల నున్న మానవు లందరితోను స్నేహభావభరిత మైన ప్రవర్తన కలిగి ఉండాల్సితద్దారా సమాజ'(శ్రేయస్సుకు పాటుబడాలి.మానవు లందరూ తమ మధ్య స్నేహసంబంధాలు పెంచుకోవా లని బోధిస్తూ అనేకమైన వాక్యాలు వేద-ఇతిహాస-పురాణాలలోను,స్మృతులలోను ఉన్నాయి. ఈ విషయమే వివిధ ఉపాఖ్యానాదుల ద్వారా ఆ (గ్రంథాలలో బోధింసబడింది. ఈ బుగ్వేదబుక్ ప్రసిద్ధమైనది -
“సంగచ్చధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతామ్
దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే.
సమానో మనః సమితిః సమానీ,
సమానం మనః సహ చిత్తమెషామ్.
సమానం మన్తమభిమన్తయే వః,
సమానేన వో హవిషా జుహోమి. .. సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః
సమానమస్తు వో మనో యథా వః సుసహాసతి". (బుగ్వేదం 10.5. 191)
“ఒకరితో ఒకరు కలుస్తూ ఉండండి; మాట్లాడుకొనండి; మీ మనస్సులలోని ఆలోచన లన్నీ ఒకే విధంగా ఉండాలి.పూర్వం దేవత లందరూ ఏ విధంగా ఐకమత్యంతో ఉందేవారో ఆ విధంగా ఉంటూ ఎవరి వాటాలు వాళ్లు అనుభ వించండి. మీ అందరి లక్ష్యాలూ ఒకే విధంగా ఉండాలి. ఆలోచనలు ఒకే విధంగా ఉండాలి. మీ అందరికీ ఉపయోగించే ఒక లక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను.మీ అందరికీ సంబంధించిన హోమద్రవ్యంతో హోమం చేస్తున్నాను.మీ మనస్సులు ఒకే విధంగా ఉండి మీ రందరూ సుఖంగా ఉందురుగాక!”
మానవుడు సమాజంలోని ఇతరమానవులతో ఏ విధంగా ప్రవర్తించాలో మహాభారతంలోని ఒక శ్లోకార్ధంలో చెప్పబడింది-
హిందూమతం 121
“న తత్ పరస్య సందధ్యాత్ ప్రతికూలం యదాత్మనఃొ
“తనకు ఏది ప్రతికూలమో,దేనివల్ల తనకు దుఃఖం కలుగుతుం దని అనుకొంటాడో, దానిని ఇతరులకు కూడ చేయకూడదు”.
ఈ విషయమే మహాభారతంలోని మరొక ఘట్టంలో వేరు మాటలలో చెప్పబడింది.
“అత్మొాపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో౭_ర్జున,
సుఖంవాయదివా దుఃఖం స యోగీ పరమో మతః” (భ.గీ. 682)
“అర్జునా! తననే ఉదాహరణంగా తీసికొని ఎవడు సుఖాన్ని గాని దుః ఖాన్ని గాని అందరి విషయంలో ఒకే విధంగా చూస్తాడో (నేను నాకు సుఖం కావా లని కోరుకొన్నల్లే ఇతరులూ కోరుకొంటారు,నాకు దుఃఖం కలగకూడ దని నేను అనుకొన్నట్లే ఇతరులూ అనుకొంటారు అను విషయం మరచిపోకుందా ఇతరులతో వ్యవహరిస్తాడో) అతడే పరమయోగి అని నా అభిప్రాయం” (అని శ్రీకృష్ణు దన్నాడు).
విద్యాభ్యాసం చేస్తూన్న విద్యార్థులకు, సంన్యాసులకూ, ఆకలికొన్నవా శ్లందరికీ, చివరికి కాకులు కుక్కలు మొదలైనవాటికి కూడ యథాశక్తిగా ఆహారం ఇవ్వాలి అని శాస్త్రం విధిస్తూన్నది (చూ. గృహస్థధర్మాలు)
అలసిపోయినవాళ్లకు ఆసనశయనాదులు ఏర్పరచి వారి అలసటను పోగొట్టాలి, రోగులకు పరిచర్య చెయ్యాలి. హరి-హర-హిరణ్యగర్భాదిదేవతలను ఆరాధించాలి; తనతో సమానులు గాని అధికులు గాని అయిన ద్విజుల పాదాలు కడగాలి; అలాంటి వాళ్ల ఉచ్చిష్టాన్ని తుడిచి శుభ్రం చెయ్యాలి ఇలా చేసిన వానికి గోదానం చేసిన పుణ్యం లఖిస్తుం దని యాజ్ఞ్జవల్మ్యస్మృతి చెప్పుచున్నది :
“శ్రాన్తసంవాహనం రోగిపరిచర్యా సురార్చనమ్,
పాదశౌచం ద్విజోచ్చిష్టమార్జనం గోప్రదానవత్”. (యా.స్మృ. 1.209)
పూర్తకర్మలు (అందరికీ ఉపయోగించే ప్రదేశాలలో నూతులూ,చెరువులూ తవ్వించడం, చలివెందల నెలకొల్పడం మొదలైన పనులు), దానమూ, సమాజసేవా, దరిద్రులకు, దుఃఖార్తులకు సాహాయ్యం చేయడం మొదలైన పనులు అత్యుత్తమ మైన ధర్మా లని పురాణాలు చెపుతున్నాయి.
122 పిందూమతం
“దుఃఖఖార్తులను ఆదుకొనడంవల్ల ఎలాంటి సుఖం కలుగుతుందో అలాంటి సుఖమూ ఆనందమూ స్వర్గలోకంలోను బ్రహ్మలోకంలోనూ కూడ లభించవు. కష్టాలలో ఉన్నవాళ్లని ఆదుకొనడానికి ఎవని హృదయం తహతహలాడదో వానికి ఇహలోకంలో గాని పరలోకంలో గాని సుఖం లభించదు” అని మార్మందడేయ పురాణంలో ఒక రాజు అంటాదు- -
“న స్వర్గే బ్రహ్మలోకే వా తత్సుఖం ప్రాప్యతే నరైఓఒ
యదార్తజననిర్వాణదానోత్థమితి మే మతిః
యజ్ఞదానతపాంసీహ పరతశ్చ న భూతయే,
భవన్తి తస్య యస్యార్తపరిత్రాణే న మానసమ్”. (మా.పు. 15. 57,62)
మానవుడు తన పొట్ట నింపుకొనడానికి ఎంత ఆహారం అవసర మవుతుందో దానిపైన మాత్రమే వానికి స్వత్వం; ఇది నాది అని చెప్పుకొనే అధికారం. అంతకు మించి ఏ ద్రవ్య మైనా నాది అనుకొనేవానిని దొంగను శిక్షించి నట్లు శిక్షించాలొ అని శ్రీమద్భాగవతం చెపుతూన్నది :
“యావద్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినామ్,
అధికం యో౬_భిమన్యేత స స్తేనో దణ్ణమర్హతి (భా.గ.7.148)
ఇదీ హిందూమతం ఏనాటినుంచో బోధిస్తూన్న సకలజన(శ్రేయోవాదం; సమాజవాదం, నిజమైన కమ్యూనిజం.
ఒక ప్రసిద్ధ మైన పొరాణికళ్లోకంలో-*నాకు రాజ్యం మీద కోరిక లేదు;స్వర్గం మీద కోరిక లేదు; నాకు మోక్షం కూడ వద్దు. కష్టాలతో బాధ పడుతూన్న ప్రాణుల బాధలను తొలగించా లనేదే నా కోరికొఅని ఒక మహారాజు తన కోరికను తెలిపి నట్లుగా వర్ణించబడింది-
“న త్వహం కామయే రాజ్యం న స్వర్గం నా£_పునర్భవమ్,
కామయే దుఖతప్తానాం ప్రాణినామార్తినాశనమ్”,
మానవుడు సాటి మానవులతో,సమాజంతో,ఇతరప్రాణులతో వర్పరచుకొన వలసిన సంబంధం ఇది. సమాజ(శశ్రేయస్సుకోసం తన వైయక్తికసుఖాలను త్యజించ డానికి సర్వదా సన్నద్దుడై ఉండా లనేది ఈ మతంలోని సారాంశం.
హిందూమతం 123 మనం వెనుక చూచి నట్లు,హిందూమతం-ఆ యా దేవతలను తన అభిరుచిని అనుసరించి ఆరాధించడంలోను,అందుకు తగిన ఆచారాలను పద్ధతులను అవలంబించడంలోను మానవునికి సంపూర్ణ మైన స్వాతంత్ర్యం ఇస్తుంది. శ్రీమహా విష్ణువును స్తుతిస్తూ ఒక ప్రసిద్ధ మైన శ్లోకం ఉంది - “యం శైవాః సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాన్తినో బౌద్దా బుద్ధ ఇతి ప్రమాణపటవః కర్తేతి నైయాయికాః, అర్హన్నిత్యథ జైనశాసనరతాః కర్మేతి మీమాంసకాః సోయం వో విదధాతు వాజ్ళితఫలం కైలోక్యనాథో హరి£ “శైవులు శివు దనీ,వేదాంతులు (బ్రహ్మ అనీ,బౌద్దులు బుద్దు దనీ, నైయాయికులు (న్యాయ శాస్త్రపండితులు) సర్వజగత్రృష్ట అనీ,జైనులు అర్హన్ అనీ, మీమాంసకులు కర్మ అనీ ఏ శ్రీమహావిష్ణువును ఆరాధిస్తున్నారో అలాంటి శ్రీమహావిష్ణువు మీ కోరిన ఫలాలను ప్రసాదించుగాక”. ఇదే పద్ధతిలో ప్రతీ హిందువూ కూడ,మనస్సులో ఎలాంటి సంకోచమూ లేకుండా, ఎన్ని పేర్లు పెట్టినా దేవు డొక్కడే అను పూర్ణవిశ్వాసంతో ఈ క్రింది శ్లోకం హాయిగా చదువుకొంటూ ఆనందించగలడు- యం శైవాః శివ ఇత్యహుర్మజద ఇత్యర్బన్ని యం పార్సికాః యూదాశ్సైవ జహోవ ఇత్యభిదధత్యల్లేతి మాహమ్మదాః చీనాః షాంగతిరిత్యచిన్యమహిమా శిక్ధాః పరాత్మేతి తే సర్వే కైస్తవకాశ్చ గాడితి స నః పాయాత్ సదా మాధవః “ఏ మాధవుణ్ణి శివు డని శైవులూ,అహుర్మజ్ద్ అని పారసీకులూ,జహోవా అని యూదులూ,అల్లా అని మహమ్మదీయులూ,షాంగతి అని చైనాదేశీయులూ, పరమాత్మ అని సిక్కులూ,గాడ్ అని క్రైస్తవులూ ఆరాధిస్తూంటారో ఆ మాధవుడు మనలను ఎల్ల వేళలా రక్షించుగాక”. అయితే ఇంతటి విశాలమైన దృక్పథం గల హిందూమతాన్ని నిందిస్తూమా మతమే గొప్పది,మా దేవుదే దేవుడు అని అంటూ,ఎన్నో (ప్రలోభాలు చూపి ఆ మతాలను ప్రచారం చేస్తూమతం మార్పిడులు చేసే ఇతరమతస్థు లందరికీ
124 హిందూమతం ఇలాంటి మాటలూ, “ఈశ్వర అల్లా తేరే నామ్” ఇత్యాదిగీతాలూ హాస్యాస్పదంగాను, నిశహాయులు మాటలాడే మాటలు గాను కనబదవచ్చు.వాళ్ల భ్రమలను తొలగించి ఈ విశాలదృక్సథాన్ని విడనాడ కుందా ఈ మతాన్ని ఈ సనాతనధర్మాన్ని రక్షించడమూ “నిజమైన లౌకికతావాదం అంటే, సెక్యులరిజం అంటే, మతదురఖి మానరాహిత్యం అంటే ఏమిటో తెలుసుకోవా లని ఉంటే హిందూమతస్వరూపం సరిగా అర్థంచేసికొనండి” అని వాళ్లకు ఉద్చోధించడమూ ఈనాడు ప్రతీ భారతీయుడు తన (ప్రధానకర్తవ్యంగా భావించాలి. అన్ని మతాలకు, సంప్రదాయాలకూ కూడ వైదికమతమే మూలం అని చెప్పడానికి ఈ వైదికమతంనుండి సత్యం,అస్తేయం,శౌచం మొదలైన సదాచారాంగా లను గ్రహించడమే కాదు ఆ మతాలలో ఈశ్చరునికి నామధేయాలుగా వేదంలో ఉన్న ఈశ్వరవాచకపదాలను [గ్రహించడం కూడ ప్రమాణం. బైబిల్ ప్రథమభాగ మైన ఓల్డ్ టెన్టామెంట్లో-హిబ్రూమతంలో ఈశ్వరుని పేరు “యహోవా”, “యహ్వేవాయహ్వే' ఇత్యాది రూపాలలో చెప్పబడింది.ఇది వేదంలో ఉన్న దేవవాచక మైన 'యహ్వాయొక్క వికృతరూషమే. బుగ్వేదంలోని అనేక మంత్రాలలో “యహ్వాశబ్దం ప్రయోగించబడింది. “విశ్వతిం యహ్వమతిథిం నరః” (బు.వే.3.3.8) “ప్రవో యహ్వాం పురూజాం విశాం దేవయతీనామ్, అగ్నిం సూక్తేభిర్వచోభిరీమహే యం సీమిదన్య ఇళతే” (బు.వే. 1.36. 1) నిఘంటువులో ఈ 'యహ్వా' శబ్దం 'మహత్” శబ్బపర్యాయశబ్దాలలో పఠింపబడింది. అందుచేత దీనికి 'బ్రహ్మన్'శబ్బానికి వలె “చాల పెద్దది,'గొప్పది'అని అర్ధం. ఈ శబ్దానికి నిర్తుక్తంలో- “యాతశ్చ హూతశ్చ” (అందరిచేత పొందబడిన వాడు, పిలవబడినవాడు, 'ప్రార్ధించ బడినవాడు) అని అర్ధం చెప్పబడింది. కోరిక లున్నవాళ్లు వెళ్లి ప్రార్థించేది ఈశ్వరుణ్ణే కదా?హిబూమతంలో పరమేశ్వరుని పేరు 'జెహోవహ్ఫయకారం జకారంగా ఉచ్చరించడం ప్రసిద్ధ మైన విషయమే. అందుచేత ఈ 'జెహోవహ్),'యహ్వా' నుండే పుట్టిన దని పండితుల అభిప్రాయం. క్రైసవమతంలోని 'గాద్'అనే పదం ట్యూటానిక్ భాషలోని 'ఘూతో-మ్'నుండి వచ్చినది.ఈ 'ఘూతో-మ్'శబ్దం “హూతమ్ిఅను సంస్కృతశబ్దంనుండి వచ్చిన
హిందూమతం 125 దని ₹[6 2౭646 ర4074 9016060407 లో చెప్పబడింది. 'హూత'శటబ్బానికి హోమాదులచేత పూజింపబడదేవాడు,ప్రార్ధనల ద్వారా పిలవబడేవాడు అని అర్ధం. ఈ విధంగా ఇది 'హులేదా “అను సంస్కృతధాతువు నుండి నిష్పన్న మైనది. అందుచేత “గాడ్"శబ్దానికి ప్రారంభంలో 'యజ్ఞంచేత ఉపాసింప దగిన దేవుడు, “భక్తులచేత ప్రార్థింపబడు దేవుడు అని అర్థం అయి ఉంటుంది.సంస్కృత పదంలోని హకారం ప్రాచీన ట్యుటానిక్ భాషలో ఘకారంగా మారగా తరవాత గకారంగా మారింది. ఈవిధంగా 'ఘూతో-మ్'అను ట్యూటానిక్ భాషాపదం ఆంగ్రభాషలో "గాడ్ గాను,జర్మన్‌భాషలో “గాతొ,గాను మార్చు చెందింది. (చూ.వారణసేయ సంస్కృతవిశ్వవిద్యాలయం ప్రచురించిన (1967) శాండిల్యభక్తిసూట్రానికి బలదేవ ఉపాధ్యాయ (వ్రాసిన ప్రస్తావన). మానవునికీ రాజుకీ (ప్రభుత్వానికీ) మధ్య సంబంధం అన్ని ఆపదలనుండీ,అన్ని సంక్షోభాలనుండీ (ప్రజలను రక్షించడం రాజు ప్రధాన కర్తవ్యం.*ప్రజలందరూ సుఖంగా ఉంటేనే రాజు సుఖంగా ఉంటాడు. ప్రజల హితమే రాజు హితం.ఏది తనకు ప్రీతికర మైనదో అదే తన హితం అని రాజు ఎన్నడూ భావించకూడదు”అంటాడు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో - “ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే పొతమ్, నాత్మప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు హితం హ్తమ్” ఉత్తము డైన రాజులో అష్టదిక్సాలకుల అంశా లుంటా యని భారతీయుల విశ్వాసం. అలాంటి రాజు విషయంలో ప్రజలు ఎల్లప్పుడూ భక్తివిశ్వాసాలతో కృతజ్ఞతాభావంతో ఉండాలి. అతడు విధించిన నియమాలను ఉల్లంఘించకూడదు. ప్రతీ పొరుడూ తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ రాజ్యపాలనలో రాజుకు తోద్బ్చడాలి. ధర్మాత్ము దైన రాజు తన పరిపాలనలో ఉన్న ప్రజల పుణ్యంలో ఆరవ లేదా నాల్లవ వంతు పంచుకొంటా డని శాస్త్రం చెపుతున్నది. రాజులో ఎంత శక్తి ఉంటుం దనగా-అతడు కాలాన్ని కూడ మార్చగలడు అని మహాభారతంలో చెప్పబడింది. “క్షాలో వా కారణం రాజ్ఞః రాజా వా కాలకారణమ్, ఇతి తే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణమ్”
126 హిందూమతం “కాలం రాజుకు కారణమా (కాలం రాజును లొంగదీసికొంటుందా) లేక రాజు కాలానికి కారణమా (రాజే కాలాన్ని లొంగదీసుకొంటాడా) అని నీ వే మాత్రమూ సంశయించవలసిన పని లేదు. మహారాజా!రాజే కాలానికి కారణం”. ఇంతవరకూ చెప్పిన దంతా శాస్తానుసారంగా రాజ్యాన్ని పాలించే ధర్మాక్ము దైన రాజు విషయంలో. దుర్మార్డు డైన రాజును ప్రజలు ఆదరించవలసిన పని లేదు. దుర్మార్గు డైన రాజు పాలనలో కొందరు ప్రజలూ,అధికారులూ కూడ దుర్మార్గులై అనేకపాపకృత్యాలు చేస్తారు.ఆ పాపంలో సగం రాజుకు చేరుతుంది. “అరక్ష్యమాణాః కుర్వన్తి యత్మిజ్బిత్ కిల్చిషం ప్రజాః, తస్మాత్తు నృపతేరర్ధం యస్మాద్ గృహ్దాత్యసొ కరాన్” (యా.స్మృ. 1.386) “అరక్షితారం హర్తారం విలోస్తారమనాయకమ్, తం వై రాజకలిం హన్యుః ప్రజాః సంనహ్య నిర్చృణమ్, అహం వై రక్షికేత్యుక్స్వా యో న రక్షతి భూమిపః, స సంహత్యా నిహన్తవ్యః శ్వేవ సోన్మాద అతురవొ (అను.పర్వ 61. 32,33) “ప్రజలను సన్మార్గంలో నడపకుందా బలాత్మారంగా పన్నులు (గ్రహిస్తూ, ధనం అపహరిస్తూ సరి యైన రక్షణ ఇవ్వని దుష్టు డైన రాజును ప్రజ లందరూ కలిసి, నిరయగా, చంపివేయాలి.” “నేను మిమ్మల్ని రక్షిస్తా నని శపథం చేసి,రాజ్యానికి వచ్చి,రక్షించని రాజును (ప్రజ లందరూ కలిసి పిచ్చికుక్కను కొట్టి చంపి నట్లు చంపివేయాలి” పూర్వకాలంలో ఉన్న పద్ధతిని పట్టి 'రాజు' అని చెప్పినచోట్లల్లా ఈనాడు 'పరిపాలకుడు' “ఉన్నతాధికారులు అని అర్ధం చేసికోవాలి. రాజే సర్వోన్నతాధికారి మధ్యయుగంనాటి పొశ్చాత్యదేశాలలో రాజు (5219) కూ, క్రైస్తవ సంఘానికీ (యషుయి మధ్య ఆధిపత్యాన్నిగూర్చి ఘోరమైన సంఘర్షం కొన్ని శతాబ్దాల పాటు నడిచింది. చర్చి రాజుమీదనే అధికారం వహించడానికి గొప్ప ప్రయత్నం
హిందూమతం 127 చేసి, కొంత కాలం పాటు సఫల మైనది. చివరికి ప్రభుత్వానిదే పైచేయి అయింది. తమ దేశాల చరిత్రలో ఇలాంటి సంఘటన లుండడంచేత చాల మంది పాశ్చాత్య చరిత్రలేఖకులు భారతదేశంలో కూడ బ్రాహ్మణులకు (వీళ్లకు ఈ చరిత్రలేఖకులకు (గ656- 11255) అని పేరు పెట్టారు) రాజులకు మధ్య (వీళ్లకు [8 ల&55 అని పేరు పెట్టారు) అధికారం విషయంలో వివాదా లుందేవని వ్రాశారు. అదంతా ఊహాకల్పితం. భారతదేశచరిత్రలో ఇటువంటి సంఘటన లేవీ జరిగినట్లు కనబడదు.
భారతదేశంలో అనేకరాజ్యా లుండేవి. ఒక రాజ్యంలో కొంతకాలం ఒక వర్ణం వాళ్లూ, మరొక రాజ్యంలో మరొక వర్ణంవాళ్లూ, ఇలా అన్ని వర్గాలవాళ్లూ రాజ్యపాలన చేశారు. వాళ్ల దగ్గర మంత్రులుగా ఉన్న కొందరు “ప్రీస్ట్క్లాస్' వాళ్లు రాజ్యపాలన విషయంలో సలహాలు మాత్రం ఇస్తుందేవారు. పురోహితులుగా ఉన్నవాళ్లు ధార్మికకార్యాలలో సలహా లిస్తుందేవారు. సలహాలు ఎలా ఉన్నా సర్వాధికారం రాజుదే. ఇలా సలహాదారులుగా పని చేసిన “ప్రీస్ట్క్లాసు' వాళ్ల సంఖ్య (వేళ్లమీద లెక్కపెట్టదగినదిగా ఉండేది. ఇలాంటి ఏ కొద్దిమందో తప్ప మిగిలిన బ్రాహ్మణు లందరూ, రాజ్యపాలనతో ఎలాంటి సంబంధం లేకుందా, ఇతరప్రజల వలెనే తమ వృత్తులు తాము చేసికొంటూ ఉండేవారు. క్రైస్తవ సంఘం (చర్చి) ఉన్నట్లు ఒక హిందూమత సంఘం అనేది ఏదీ ఎన్నడూ లేదు. చాలవరకు ధార్మికకార్యా లన్నీ ప్రాచీనకాలం నుంచీ వస్తూన్న ధర్మశా(స్తాల ద్వారా నడిచిపోయేవి. క్రొత్తగా ఆవిర్భవించిన కైస్తవసంఘం అనేక ఉపాయాలు పన్ని పరిపాలకులను కూదా అఆడించడానికి ప్రయత్నించి నట్లు హిందూమతానికి ఏనాడూ అవసరం ఏర్పడలేదు. దేశం అంతా ఒకే మతం అయినప్పుడు ఒక మతసంఘం ఆవిర్భవించే ప్రసక్తే లేదు కదా? అందుచేత ఇవన్నీ భారతదేశంలో చీలికలు ఏర్పరచడానికి పని కట్టుకొని వ్రాసిన వ్రాతలే, వీటిలో సత్యం ఏమాత్రమూ లేదు. భారతదేశంలో రాజే సర్వోన్నతాధికారి. పాలన విషయంలో ఆతనితో ఎవ్వరూ ఎన్నడూ పోటీపడలేదు.
128 హిందూమతం హిందూమతం బోధించిన కొన్ని రాజధర్మాలు
రక్షకు డైన రాజు లేకపోవడంతో లోకం అంతా అన్ని వైపులనుంచీ భయాందోళనలతో వణకి పోతూందడగా పరమేశ్వరుడు రాజును (పరిపాలనా విధానాన్ని) ఏర్పరిచాడు. (మ.స్మృ. 78)
“రాజు (పాలకుడు) దండింపదగినవాళ్లను దండించకపోతే బలవంతులు దుర్భలుల్ని చేపలను ఇనుపకడ్డీలకు గుచ్చి నిప్పులో కాల్చి తిన్నట్లు తినేసి ఉందురు”
“యది న ప్రణయేద్రాజా దణ్జం దజ్బేష్వతన్థితః
శూలే మత్స్యానివాపక్ష్యన్ దుర్చలాన్ బలవత్తరాజో (మ.స్మృ. 7.20)
“దండమే గాఖుమగలుఫ ప్రజల నందరినీ పాలిస్తుంది.దందమే రక్షిస్తుంది.అందరూ నిద్రపోతున్నప్పుడు కూడ దండమే మేల్మొని ఉంటుంది. అందుచేత దండమే ధర్మ మని పండితు లంటారు” :
“దణ్ణః శాస్తి ప్రజాః సర్వాః దణ్జ్ణ వవాభిరక్షతి,
దణ్ణః సుప్తేషు జాగర్తి దణ్ణం ధర్మం విదుర్చధావొ (మ.స్మృ.?7. 18)
“లోకా న్నంతనీ దండమే అదుపులో పెడుతుంది. ఎందువల్లననగా-సహజం గానే (దందభయం లేకుండా) శుచిగా ఉన్నఅపరాధాలు చేయని మానవుడు ఎక్కడో కాని ఉండడు. దండదభయం ఉంది కావుననే లోకంలో అందరూ అన్నం వండుకొని తింటున్నారు; జీవిస్తున్నారు” :
“సర్వో దణ్జజితో లోకః దుర్లభో హి శుచిర్నరః,
దణ్జస్య హి భయాత్సర్వం జగద్భోగాయ కల్పతే” (మ.స్కృ.?.22)
రాజు (పాలకుడు) ఆ యా విద్యలలో ప్రవీణులైనవాళ్లనుండి మూడు వేదాలను, వాటిలో చెప్పిన విషయాలను దందనీతిని, (పరిపాలనావిధానాన్ని బోధించే శాస్త్రం దందనీతి, దీనికి అర్ధశాస్త్రం అని కూడ పేరు), తర్మాన్నీ అధ్యాత్మ విద్యను నేర్చుకోవాలి. వ్యవసాయము, పశుపాలనము, వ్యాపారము, ఏ సమయంలో ఏ కాలంలో ఏ పనులు చెయ్యాలి అనే విషయాన్నీ లోకం నుంచి అనుభవజ్ఞులైన వ్యవసాయదారులు మొదలైనవాళ్లనుంచి నేర్చుకోవాలి.
(మ.స్కృ. 7.439)
హిందూమతం 129 వేట,జూదం,పగటి నిద్ర,ఇతరులమీద ఆడిపోసుకోవడం, స్త్రీలు, మద్యంవల్ల కలిగే మదం,నృత్య-గీత-వాద్యాలు,పని లేకుండా దేశసంచారం అనే కామంవల్ల కలిగే పది వ్యసనాలలోను రాజు సక్తుడు కాకూడదు. (మ.స్మృ.7.45-47) పైశున్యం (ఇతరుల దోషాలను చాటి చెప్పడం), సాహసం (సత్చురుషులను బంధనాదులచేత ని[గ్రహించడం) ఈర్ష్య (ఇతరుల గుణాలను సహింపజాలక పోవడం) అసూయ (ఇతరుల గుణాలను దోషాలుగా చిత్రించడం), ద్రోహం (రహస్యంగా అపకారం చేయడం చంపడం మొ.), అర్ధదూషణం (ధనం అపహరించడం,ఇవ్వవలసినది ఇవ్వక పోవడం్శి మాటలలోను, చేతలలోను పరుషత్వం, దండనంలో పరుషత్వం-ఇవి (ోధంవల్ల కలిగే ఎనిమిది వ్యసనాలు. వీటికి దూరంగా ఉండాలి. ఈ రెండు విధాల వ్యసనాలకీ ప్రధానకారణం లోభం- ధనాదులందు దురాశ.ఆ లోభం దరికి రానీయకూడదు. (మ.స్మృ. 7. 48,49) వ్యసనం మరణంకంటె కూడ చాల చెడ్డది.వ్యసనా లున్నవాడు క్రింది క్రిందికి పతితు డైపోతాడు. అవి లేనివాడు మరణించి స్వర్గానికి వెడతాడు. (మ.స్మృ. 7.58) సాధారణ మైన పనులు కూడ మానవుడు ఒంటరిగా సాధించజాలడు. అలాంటప్పుడు రాజ్యపాలనం మాట చెప్పాలా! అందుచేత రాజు అన్ని విభాలైన పరీక్షలలో నిగ్గుదేరిన మంచి పాలనాసామర్థ్యం గల ఏడుగురిని గాని ఎనమందుగురిని గాని అమాత్యులుగా నియమించాలి. వాళ్ల మంత్రణం ప్రకారమే కార్యాలు నిర్వర్తించాలి. (మ.స్కృ.?.54-59) రక్షాధికారులు సాధారణంగా ఇతరులను పీడించి లంచాలు తీసు కొంటూంటారు. అలాంటి వాళ్ల సర్వస్వం లాగికొని దేశంనుండి వెడలగొట్టాలి. (మ.స్కృ.?7. 1231-24) జలగ,లేగదూడ,తుమ్మెద ఏ విధంగా కొంచెం కొంచెం (రక్తం,పాలు,తేనె) తీసు కొంటాయో అట్లే రాజు రాష్ట్రంనుండి పన్ను తీసికోవాలి. (మ.స్మృ.?7. 129) దోపిడిదొంగలు మొదలైనవాళ్లచేత పీడింపబడుతూ ఏ రాష్త్రంలో ప్రజలు ఏడుస్తూంటారో ఆ రాష్ట్రం రాజు జీవిస్తున్నా మరణించి నల్లే, (మ.స్మృ. 7. 148)
130 హిందూమతం సైన్యాదులను ఏర్పరచుకొని రాజు శత్రువులనుండి తన రాజ్యాన్ని రక్షించు కొనడంలో జాగరూకుడై ఉందాలి. (మ.స్కృ.?. 144-215) నెల కొక సారి లేదా ఆరు మాసాల కొకసారి పాలనాదులకు సంబంధించిన కొత్త నియమనిబంధనలు (చట్టాలు) నిర్మిస్తూ, ఉన్నవాటిని సవరిస్తూ ఈ విషయాలలో ఒక అనిశ్చితస్థితిని కల్పించవలసిన పని లేదు. పూర్వకాలంనుంచీ వస్తూన్న స్మృతి విహితాలైన,లేదా అర్ధకాస్త్రాలలో చెప్పిన పద్ధతులను అవలంబించి రాజు ప్రజల వివాదాలను పరిష్కరించాలి. దండనాదులను విధించాలి. ఇలా చేయడంవల్ల న్యాయనిర్ణయం నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆలస్యం అవడానికి అవకాశం ఉండదు. ధర్మనిర్జేత కూడ రాజే.అతడు స్వయంగా నిర్ణయించడానికి సమయం లభించ నప్పుడు ముగ్గురు విద్వాంసులతో,ఒక అధ్యక్షునితో ఒక సంఘం ఏర్పరచి ధర్మ నిర్ణయం చెయ్యాలి. ఆ సంఘానికి సభ అని పేరు. (మ.స్మృ.8. 1-39-11) మానవుల మధ్య వివాదాలు పద్దెనిమిది కారణాలవల్ల వస్తూంటాయి.వీటికి వివాదస్థానా లని పేరు.(1) బుణం ఇచ్చిపుచ్చుకోవడాలు (2) నిక్షేపం (ఏదైన వస్తువును దాచడానికి మరొకరివద్ద ఉంచడం) (3) అస్వామివిక్రయం (ఒకడు తనకు చెందనిదానిని ఇతరులకు అమ్మడం) (శ) సంభూయసముత్థానం (కాందరు కలిసి ఏదైన వ్యాపారం వంటిది చేయడం) (5) ఇచ్చినదానిని-ఇస్తా నన్నదానిని- ఇవ్వకపోవడం (6) కూలి ఇవ్వకపోవడం (7) అనుకొన్న మాటను లేదా అలవాటులో ఉన్న నియమాన్ని, పాటించకపోవడం (8) క్రయవిక్రయాదులను వెనుకకు తిరగతోడడం (9) యజమానికి పాలేరుకు మధ్య వివాదం (10) సరిహద్దులకు సంబంధించిన వివాదం, (11) పరుషంగా మాటలాడడం (12) పరుష మైన దండం ఇవ్వడం (13) చౌర్యం (14) సాహసం (బలాత్కారంగా ధనాదులు) లాగి కొనడం) (15) అయుక్త స్రీపురుషసంబంధం (16) ప్రీపురుషుల మధ్య ఉండవలసిన సంబంధం (17) ఆస్తి పంపకాలు (18) జూదం,కోడిపందాలు మొదలైనవి-ఇవి పద్దెనిమిది వివాదస్థానాలు. (మ.స్మృ. 4-7) ఈ వివాదాలను ధర్మబద్ధ మైన రీతిలో పరిష్మరించాలి.అలా కాక ఈ వ్యవహారంలో అధర్మంగా ప్రవర్తించిన న్యాయనిర్దేతలకు సాక్షులు మొదలైనవాళ్లకు గొప్ప పాపం చుట్టుకొంటుంది. (మ.స్కృ.8. 12-15)
హిందూమతం 131 ఇలా జరిగిన అధర్మంలో నాల్గువంతులలో ఒక వంతు అర్ధి-ప్రత్యర్థులలో (వాది ప్రతివాదులలో) ఒకనికి,ఒక వంతు సాక్షికి ఒక వంతు న్యాయనిర్దేతలకు,ఒక వంతు ఆ న్యాయనిర్దేతలను నియమించిన రాజుకు అంటుతుంది. (మ.స్మృ.8. 18) సరి లైన దండం విధిస్తే మాత్రం పాపం అంతా చేసినవానికే చెందుతుంది. రాజుకు గాని,న్యాయనిర్లేతలకు గాని ఏమీ పాపం ఉండదు. (మ.స్మృ.8. 19) దొంగలనుండి తీసికొన్నఎవరిదో తెలియని సొత్తును రాజు నాలుగు వర్ణాల వాళ్లకీ పంచిపెట్టి వెయ్యాల్సితాను తీసుకొంటే పాపాళ్ళు డౌతాదు.(మ.స్కృ.8. 40) ధర్మనిర్ణయం చేసేటప్పుడు ఆ యా జాతులలో ఉన్న ధర్మాలను,దేశధర్మాలను, వర్తకుల (శ్రేణులు మొదలైనవాటిలో ఉన్న ధర్మాలను,కులధర్మాలను దృష్టిలో ఉంచుకొని ధర్మనిర్ణయం చెయ్యాలి. (మ.స్మృం. 841) వ్యవహారాలలో కూటసాక్ష్యం చెప్పినవాడు మహాపాపాత్స్ముడౌతాడు. (మ.స్మృ.8.82 97-101) “దండింపకూడనివాళ్లని దండించినా,దండింపదగినవాళ్లని దండింపక పోయినా రాజుకు గొప్ప అపయశస్సు వస్తుంది; నరకంలో పడతాడు”- “అదణ్యాన్ దణ్జయన్ రాజా దణ్జాంశ్రైవాష్యదణ్ఞయన్, అయళో మహదాప్నోతి నరకం చాధిగచ్చతి” (మ.స్కృ.8. 128) “సర్వతో ధర్మషద్భాగో రాజ్ఞో భవతి రక్షతః, అధర్మాదపి షడ్భాగో భవత్యస్య హ్యరక్షతః” (మ.స్మృ.8.304ఏ) “రక్షించే రాజుకు ఆ ప్రజల ధర్మంలో ఆరో వంతు వస్తుంది. రక్షించనివానికి వాళ్ల అధర్మంలో ఆరవ వంతు వచ్చి చేరుతుంది” = ప్రజలను రక్షించకుండా వాళ్లనుండి పన్ను తీసికొనే రాజుకు వాళ్లపాపం అంతా చుట్టుకొంటుం దని పెద్ద లంటారు. (మ.స్మృ. 8.308 శాస్త్రంలో చెప్పిన కట్టుబాట్లు ఉల్లంఘించి,పరలోకాదులు లేనంటూ,అనుచిత మైన దండాదులు విధించి ధనం దోచుకొంటూ,రక్షించకుండా ప్రజలను పీక్కొని తింటూన్నవాడు అధోగతి పాలవుతా దని తెలుసుకోవాలి.
132 హిందూమతం “అన పేక్షితమర్యాదం నాస్తికం విప్రలువ్పకమ్, అరక్షితారమత్తారం నృపం విద్యాదధోగతిమ్*% (మ.స్మృ.8.309) రాజు స్వధర్శంలో నిలబడని తండ్రిని గాని,ఆచార్యుజ్ణి గాని,మిత్రుణ్ణి గాని, భార్యను గాని, పుత్రుణ్ణి గాని, పురోహితుణ్ణి గాని ఎవరినైనా తప్పక దండించాలి. “పిత్రాచార్యః సుహృన్నాతా భార్యా పుత్రః పురోహితః, నాదణ్చో నామ రాజ్ఞో£_స్తి యః స్వధర్మే న తిష్టతి” (మ.స్మృ. 8.335) ఇళ్లు కాల్చేవాడు,ధనం దోచుకొనేవాడు,హత్యలు చే సేవాళ్లు-వీళ్లందరూ సాహసికులు' రాజు సాహసికులను క్షణకాలం కూడ ఉపేక్షించకూడదు. (మ.స్మృ. & 344-846) మిషత్రుడు చెప్పడంచేత గాని,అధికంగా ధనం లభించడంచేత గాని రాజు అందరికీ భయం కలిగించే సాహసికుణ్ణి విడిచిపెట్టకూడదు- “న మిత్రకారణాద్రాజా విపులాద్వా ధనాగమాత్, సముత్సృజేత్సాహసికాన్ సర్వభూతభయావహాన్”. (మ.స్మృ. 8.347) “గురుం వా బాలవృద్ధౌ వా (బ్రాహ్మణం వా బహుశ్రుతమ్, ఆతతాయినమాయాన్తం హన్యాదేవావిచారయన్. నాతతాయివధే దోషో హన్తుర్భవతి కశ్చన”. (మ.స్మృ.8.350,51) “చంపదానికై ఆయుధంతో మీదికి వస్తూన్నవాడు 'ఆతతాయి'. “అలాంటి ఆతతాయి గురు వైనా, బాలు దైనా, వృద్ధు దైనా మహావిద్వాంసు డైన బ్రాహ్మణు డ్రైనా రెండవ ఆలోచన లేకుండా వానిని చంపివేయాలి. ఆతతాయిని చంపినవానికి అలా చంపినందుకు ఏ పాపమూ రాదు. ఈ విధంగా ధర్మానుసారం పాలించడమూ,శాంతిభద్రతలను రక్షించడము, దుర్మార్గులను శిక్షించడమూ చేయవలసిన ప్రధానకర్తవ్యంగా హిందూమతం బోధించిన పరిపాలకధర్శం.
హిందూమతం 133 ప్రపంచదృష్టి
ఇంతవరకు మనం చూచి నట్లు హిందూమతానికి(సనాతనధర్నానికి) ఎల్లలు లేవు. ప్రపంచకంలో ధార్మికులు, అధార్మికులూ అని రెండు తెగల మనుష్యులు మాత్రమే ఉన్నారు.ఒకడు తన కిష్టం వచ్చిన పేరు పెట్టి తన కిష్టమైన రీతిలో పరమేశ్వరుణ్ణి ఆరాధించవచ్చును.మరొకడు దేవుడున్నా డని కూడ నమ్మక పోవచ్చును. స్మృతులలో విధించిన సామాన్యధర్మాలను అనుసరిస్తూన్నంతవరకు (ప్రతీ ఒక్కడూ ధార్మికుదే.ఇంచు మించుగా స్మృతులు చెప్పిన ఈ సామాన్యధర్మాలనే ఇతరమతాలలో [గ్రహించి బోధిస్తున్నారు. ఈ ధర్మాలు మానవుని వైయక్తికాభివృద్ధికే కాక సామాజికసుఖశాంతులకు కూడ మూలకారణ మైనవి. అందుచేతనే “లోకాన్ని నిలబెట్టేది ధర్మం”౮ధారణాత్ ధర్మభొ) అను ధర్మపదాని కున్న అర్ధం సామాన్యధ్మూల విషయంలో సార్ధకం అవుతుంది.విశేషధర్మాలు చాలవరకు వైయక్తికోన్నతి సాధనాలు.
ఈ సందర్భంలో -కొన్ని ప్రాచీనజాతుల విషయంలో మనువు వెల్లడించిన అభిప్రాయం గమనార్హమైనది.ఈ జాతులవాళ్లు అనేకకారణాలచేత సనాతనధ్య్మూనికి సంబంధించిన కొన్ని అంశాలను పాటించజాలకపోయినా సనాతనధర్మానికి (హిందూమతానికి) చెందినవారే అని ఆయన అభిప్రాయం అన్నట్లు స్పష్టం అవుతుంది.
“శనకైస్తు క్రియాలోపొదిమాః క్షత్రియజాతయః,
వృషలత్వం గతా లోకే (బ్రాహ్మణాదర్భనేన చ
పౌథ్హీకాళ్చోఢ్రద్రవిడాః కామ్బ్చోజా యవనాః శకాఓ
పారదా బహ్లావాళ్చీనాః కిరాతా దరదాః ఖశాళొ. (మ.స్మృ. 10.43,4ఉ4)
“కాని ఈ క్ష్వత్రియజాతులు (క్రమక్రమంగా వేదోక్తకర్మకలాపాలు లోపించడంచేత,ఆ కర్మలు చేయించే (బ్రాహ్మణులు వాళ్లకు దొరకకపోవడంచేత శూద్రు లైపోయారు”. “పొంద్రకులు, ఓఢ్రులు, ద్రవిడులు, కాంబోజులు, యవనులు, శకులు, పారడులు, బహ్లవులు, చీనులు, కిరాతులు,దరదులు, ఖశులు- ఈ జాతులవా ళ్లందరూ అలాంటి క్షత్రియజాతులకు చెందినవారే”
134 హిందూమతం ఈ దృష్ట్యా చూస్తే భారతదేశంలోని పప్రతిఒక్కడూ సనాతనధర్నానికి చెందినవాడే. ధర్మాన్ని అనుసరించడంలో తారతన్యుం అన్ని మతాలలోను ఉన్నట్లు ఈ ధర్మంలో కూడ ఉంటే అది దోషం కాదు. ఎప్పటికైనా సరిదిద్దుకోవచ్చును. జాగ్రత్తగా ఆలోచిస్తే సనాతనధర్మానికి చెందని మానవుడే ప్రపంచకంలో లేడు. అందుచేత ఫలానా మతంవాళ్లే సుఖంగా ఉందురుగాక అని కొన్ని ప్రార్ధనామంది రాదులనుండి వినబడుతున్నట్లు కాక సర్వమానవసౌఖ్యాన్ని కోరే -
“సర్వ్ త్ర సుఖినః సను సర్వే సన్తు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్దుఃఖభాగృ్భవేత్”
(ఈ లోకంలో అందరూ సుఖవంతు లగుదురు గాకృఅందరూ ఆరోగ్యవంతు లగుదురు గాక.అందరూ కల్యాణకరము లైన విషయాలే చూచెదరు గాక; ఏ ఒక్కనికీ దుఃఖం కలగకుందుగాక”) వంటి శ్లోకాలు, వాటికి మూల మైన వైదికమంత్రాలు చిరకాలంనుంచి భారతీయుల నాలుకలమీద ఆడుతూన్నాయి. '
భారతీయదర్భనాల సంక్షిప్తస్వరూపం __ భారతీయదర్శనాలను ఆస్తికదర్శనా లనీ నాస్తికదర్భ్శనా లనీ రెండు తెగలుగా విభజించడం ఇప్పుడు అధికప్రచారంలో ఉంది. “*నాస్తికో వేదనిన్షకః” అను మనువచనాన్ని పట్టి వేదాన్ని నిందించేవాడు నాస్తికుడు. దాని ప్రామాణ్యాన్ని అంగీకరించు న్యాయ-మైోేపిక-సాంఖ్య-యోగ- పూర్వమీమాంసా-ఉత్తరమీమాంసా దర్శనాలు ఆస్తికదర్భనా లనీ, లోకాయత -జైన -యోగాచార-సౌత్రాంతిక-వైభాషిక- మాధ్యమిక దర్శనాలు నాస్తికదర్శనా లనీ వ్యవహారం. ఈశ్వరు డున్నా దని అంగీకరించేవాడు ఆస్తికు దనే నిర్వదనం అంగీకరిస్తే ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించని సాంఖ్య-పూర్వమీమాంసాదర్భనాలు నాస్తికదర్శనా లని చెప్పవలసి వస్తుంది. ప్రాచీనపూర్వమీమాంసకులు ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు. అందుచేత మనువు చెప్పిన నిర్వచనం (గ్రహించబడింది. అయితే ఈ విభాగం ఎప్పుడు ఎవరు ప్రారంభించారో తెలియదు. ముందుగా ఆస్రికదర్శనాలు ఆరు అని నిర్ణయించుకొని నాస్తికదర్శనాలు కూడ ఆరే అని ఆ ఆరు అనే సంఖ్యను నిర్వహించడంకోసం, అలా
హిందూమతం 135 చేసి ఉంటారు. ఎందువల్ల ననగా మొదటి అస్తికపదనిర్వచనం ప్రకారం నాస్తికదర్భనాలు మూడే-అవి లోకాయత-జైన -బౌద్ధ దర్శనాలు. అయితే షట్సంభఖ్యా పూర్తికోసం బౌద్దదర్శనంలోని అవాంతరభేదా లైన యోగాచార-సాత్రాంతిక-వైభాషిక -మాధ్యమిక సంప్రదాయాలను నాలుగు దర్శనాలుగా (గ్రహించి నాస్తికదర్భనాలు కూడ ఆరు అని చెప్పడం జరిగింది. అలాంటి అవాంతరభేదాలను కూడ కలుపుకొంటే ఆస్తికదర్శనాలు ఏ ఇరవైయో కావాలి. అలాగే శ్వేతాంబర- దిగంబర భేదద్వయాన్ని పట్టి నాస్తికదర్భ్శనాలు కూడ ఏడు కావాలి. అందుచేత ఈ దర్శనసంఖ్యాప్రతిపాదనం అంతా అర్వాదీనంగా, ఏ నూరు నూటయాఖై సంవత్సరాల క్రితమో చేయబడినదిగా కనబడుతుంది. నాస్తికదర్భనాలు లోకాయతదర్శనం : దీనికి చార్వాకదర్భనం అని కూడ పేరు. చార్వాకులు కేవలభౌతికతావాదులు. వీరి మతంలో ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం. అనుమానం, శబ్దం మొద లైనవి పూర్తిగా నమ్మదగిన ప్రమాణాలు కావు. (ధూమాన్ని చూచి అక్కడ అగ్ని ఉన్న దని ఊహించడం అనుమానం. ఆప్తులు చెప్పిన మాట శబ్దం. వీటివల్ల మానవుడు అనేకస్థలాలలో పొరబడడం కూడ మనం చూస్తున్నాం కదా? నేత్రాదింద్రియాలు ఎదుట ఉన్న వస్తువుతో కలిసినప్పుడు కలిగే జ్ఞానం ప్రత్యక్షజ్ఞానం. ఇలాంటి జ్ఞానం కలిగించే ఇంద్రియాలు ప్రత్యక్షప్రమాణం, మనకు-భూమి, అగ్ని, వాయువు, జలం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూన్నది. మనకు కనబడు పదార్డా లన్నీ ఈ భూతచతుష్టయంనుంచే పుడుతున్నాయి. మానవుడు కూడ ఈ భూతచతుష్టయం కలయికవల్ల ఏర్పడిన ఒక పదార్థమే. మానవునిలో ఈ భూతచతుష్టయంకంటె భిన్న మైన ఆత్మ అనేది ఒకటుం దని ఎట్లు నమ్మాలి? మానవుని దేహంలో చైతన్యం అనేది ఒక టున్న దన్న మాట నిజమే. కాని అది, తమలపాకులు, వక్క సున్నం కలవడంచేత ఎరుపు అనే మరొక పదార్థం ఉదయించి నట్లు నాలుగు భూతాల విశిష్టమైన కలయికవల్ల ఏర్పడినదే. దేహం నశించడంతో చైతన్యం కూడ నశిస్తుంది. దేహం నశించిన తరవాత ఇక్కడ చేసిన పాపపుణ్యాల ఫలం అనుభవించడానికి అత్మ అనేది ఏదీ మిగలదు. ఈశ్వరు డనేవాడు కూడ లేడు. ఈ సృష్టి అంతా
136 హిందూమతం మహాభూతాల కలయికచేత సహజంగా కలుగుతూన్నది. దీనికి కారణ మైన ఈశ్వరు డొక డున్నాడని విశ్వసించవలసిన పని లేదు. స్వర్గాదిసౌాఖ్యాలు అనుభవించడానికి గాని, దేవుని అనుగ్రహం సంపాదించడానికి గాని కర్మలు ఆచరించడం మూరత్వం. అమాయకు లైన జనులను మోసగించడానికి ఎవళ్లో కల్పించి వ్రాసిన వేదాలు ప్రమాణం కావు. ఈ దేహం ఉన్నంతవరకు ఏదో విధంగా భోగభాగ్యాలు సంపాదించి ఆనందించడమే జీవితపరమావధి. అదే స్వర్ణం. అనవసరంగా దానిని గూర్చి దీనిని గూర్చీ ఆలోచిస్తూ బాధపడడమే నరకం. ఇది లోకాయతసిద్ధాంతం. ఇలాంటి మాటలు వినడానికి చాల ఇంపుగా ఉంటాయి గాన లోకాయతులు చారువాక్కులు (ఇష్టంగా అందంగా కనబడే మాటలు మాట్లాదేవారు) అనీ, చారువాక్కులకే కాలక్రమేణ చార్వాకులు అను పేరు వచ్చిన దనీ కొంద రుటారు. వీళ్లమతంప్రకారం మనకు కనబడే ఈ లోకం ఒక్కటే ఆయతనం (నివాసస్థానం) కాబట్టి వీళ్లు లోకాయతు లైనారు. లేదా ఈ మతం లోకంలో ఆయతం గాన, అతివిసృతప్రచారం గలది గాన, లోకాయతమతం అని కూడ చెప్పవచ్చును. ఈ మతంవాళ్లు బృహస్పతి చెప్పిన కొన్ని వాక్యాలు ఉదాహరిస్తూంటారు. అందుచేత ఈ మతాన్ని బృహస్పతి అనేవా డొకదు ్రవర్తింపచేసి ఉంటాడు అని కొందరి అభిప్రాయం. (జైనబౌద్ధమతాలను గూర్చి ఈ పుస్తకంలోనే వేరుగా వ్రాయబడింది. అక్కడ చూడవలెను). ఆస్తికదర్శనాలు
- న్యాయదర్శనం : న్యాయదర్శనం గౌతమునిచేత ప్రవర్తింపబడినది. ఇది చాలవరకు తర్మంమీద ఆధారపడి ఉంటుంది. నైయాయికులు ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం అను నాలుగు ప్రమాణా లంగీకరిస్తారు. (అరణ్యంలో సంచరించే గవయమృగం ఎద్దు ఆకారంలో ఉంటుం దని ఒకడు విని ఉన్నాడు. అత దొక పర్యాయం అరణ్యానికి వెళ్లినప్పుడు అలాంటి మృగాన్ని ఒకదానిని చూడగానే వానికి తాను వెనుక విన్న పోలిక గుర్తుకు వచ్చి ఇది గవయం అని గ్రహించాడు. ఈ విధంగా ఉపమానంవల్ల వీనికి ఆ జ్ఞానం కలిగింది గాన ఇది ఉపమానప్రమాణం). ఆత్మ, శరీరం, ఇంద్రియాలు వాటి విషయాలు, బుద్ధి మనస్సు,
పొిందూమతం 137 ప్రవృత్తి, దోషాలు, (పేత్యభావం (మరణానంతరం పునర్జన్మ) ఫలం (కష్టసుఖాల అనుభవం), దుఖం, అపవర్గం (మోక్షం) అనేవి ఈ ప్రమాణాలచేత (గ్రహింపదగిన ప్రమేయాలు. నైయాయికులు (1) ప్రమాణాలు (2) ప్రమేయాలు (3) సంశయం (4) ప్రయోజనం (5) దృష్టాంతం (6) సిద్ధాంతం (7) అవయవం (8) తర్మం (9) నిర్ణయం (10) వాదం (11) జల్పం (12) వితండం (13) హేత్వాభాసం (14) ఛలం (15) జాతి (16) నిగ్రహస్థానాలు అను పదహారు పదార్థాలు అంగీకరిస్తారు. నైయాయికులకు కూడ పరమలక్ష్యం మోక్షమే. ఇది తత్త్వజ్ఞానంచేత సిద్ధిస్తుంది. ఆత్మ దేహ-ఇంద్రియ-మనస్-బుద్దాదులకంటె భిన్నమే అయినా అజ్ఞానంచేత వాటికంటె అభిన్నం అన్నట్లు తోస్తుంది. వాటి యథార్ధస్వరూపం తెలుసుకొంటే బంధం తొలగి మోక్షం లభిస్తుంది. మనస్సు అణుపరిమాణం నిత్యం. ఇది ఆత్మకు సుఖదుఃఖానుభవం కలిగిస్తూంటుంది. ఆత్మకు జ్ఞానం సహజం కాదు. ఇంద్రియాల ద్వారా ఆత్మకు విషయాలతో సంపర్శం ఏర్పడినప్పుడు జ్ఞానం పుడుతుంది. ఈ విధంగా జ్ఞానం అనేది ఆత్మకు ఆగంతుకం అవడంచేత ముక్తావస్థలో ఏ జ్ఞానమూ ఉండదు. ఆత్మ (ప్రతీ జీవాత్మా కూడ) సర్వగతం; అంతటా వ్యాపించి ఉంటుంది. మిథ్యాజ్ఞానంవల్ల కలిగిన రాగద్వేషమోహాదులచేత ్రేరితమై సుకృత దుష్కృుతా లాచరిస్తూ సంసారబంధంలో చిక్కుకొంటూ ఉంటుంది. తత్త్వజ్ఞానం కలగగానే రాగద్వేషమోహాదులు తొలగి సకలదుఃఖనివృత్తిరూప మైన అపవర్గం కలుగుతుంది. ముక్తావస్థలో సుఖమూ ఉండదు. దుఃఖమూ ఉండదు. నైయాయికమతంలో దుః ఖాభావమే మోక్షం.
నైయాయికులు యుక్తిసాహాయ్యంచేతనే ఈశ్వరు డున్నట్లు సాధిస్తారు. ఏదైన కార్యం ఒకటి ఉన్న దంటే దాని కొక కర్త ఉండాలి. ఘటం తయారుకావా లంటే దాని నిల్మాణకార్యక్రమం అంతా తెలిసిన కుమ్మరి ఒక డుందాలి కదా? ఈ ప్రపంచ మంతా సావయవ మైన (వివిధ అవయవాలు గల) కార్యం. దీనిని నిర్మించడానికి సర్వసమర్థు దైనవా డొకడు లేకపోతే దీని నిర్మాణం కుదరదు. ఆ సర్వసమర్భుదే ఈశ్వరుడు. ఈ విధమైన అనేకయుక్తులచేత ఈశ్వరాస్తిత్వాన్ని సాధించవచ్చును. ఈ ఈశ్చరుడే జగత్సృష్టి -రక్షణ-సంహారకర్త. నిత్యము లైన భూతచతుష్టయ
138 హిందూమతం పరమాణువుల సాహాయ్యంతోను, కాల-ఆత్మ-దిక్-ఆకాశ-మనస్సుల సాహాయ్యం తోను ఈశ్వరుడు, ఈ జగత్తును, జీవు లందరూ వారి వారి పుణ్యపాపాల ఫలం అనుభవించడం కోసం సృష్టిస్తాడు. ఎప్పటికైనా పతీ జీవుడూ కూడ తత్త్వజ్ఞానం సంపాదించుకొని అపవర్గాన్ని పొందవచ్చును.
' 2 వైశేషికదర్భనం : ఈ దర్శనానికి మూలపురుషుడు కణాదముని. అతనికే ఉలూకు దని కూడ పేరు. న్యాయ-వైశేషికదర్శనాల మధ్య ఎక్కువ పోలిక లున్నాయి. వైశేషికమతానుసారం - (1) ద్రవ్యం (2) గుణం (3) కర్మ (4) సామాన్యం (5) విశేషం (69 సమవాయం (7) అభావం అను ఏడు పదార్థా లున్నాయి. న్యాయశాస్త్రంలో చెప్పిన పదార్ధాలను ఈ ఏడు పదార్జాలలోను అంతర్గతం చేయవచ్చు నని వీళ్ల అభిప్రాయం.
_ 1. గుణకర్మలు ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. భూమి, జలం, అగ్నీ వాయువు, ఆకాశం, కాలం, దిక్కు ఆత్మ, మనస్సు అని పదార్థాలు తొమ్మది. వాటిలో మొదటి ఐదింటికీ పంచమహాభూతా లని పేరు. వీటిలో వరుసగా గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం అను గుణా లున్నాయి. మొదటి నాలుగు భూతాలూ నిత్యాలైన పరమాణువుల కలయికచేత ఏర్పడ్డాయి. ఆకాశ-దిక్కులు నిత్యములు, సర్వవ్యాప్తములు. మనస్సు అణుపరిమాణం గాన ఒకే క్షణంలో రెండు జ్ఞానాలు ఉందజాలవు. ఇది నిత్యం. ఆత్మ సర్వవ్యాప్తం; నిత్యం; జ్ఞానాధారం; జీవాత్మ మానసైకవేద్యం. పరమాత్మ అనుమానప్రమాణవేద్యుడు. ఇతడు జీవుల కర్మల ననుసరించి నిత్యము లైన పరమాణువులతో జగత్య్యష్టి చేస్తూంటాడు. సర్వజ్ఞుడైన ఈశ్వరు డొక డున్నా డని అంగీకరించకపోతే అచేతనా లైన పరమాణువుల ద్వారా సృష్టి జరగడం సంభావ్యం కాదు.
2, గుణం సర్వదా (ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఒక గుణంలో మరొక గుణం గాని, కర్మ గాని ఉండదు. ఇలాంటి రూపరసాది గుణాలు ఇరవైనాలుగు (24) ఉన్నాయి. (1) ఉత్క్షేపణం (పైకి విసరడం) (2) అవక్షేపణం (క్రిందికి విసరడం (9) ఆకుంచనం (ముణవడం) (4) ప్రసారణం (దాపడం) అని కర్మ నాలుగు విధాలు. కర్మ కూడ (ద్రవ్యాన్నే ఆశ్రయించుకొని ఉంటుంది. సామాన్య
హిందూమతం 139 మనగా జాతి. అనేకగోవు లున్నాయి. ఆ గోవులన్నింటిలోను 'గోత్వమ్” అను జాతి ఒక టుంది. అది గోవు పుట్టి నప్పుడు క్రొత్తగా పుట్టదు, అది చనిపోయి నప్పుడు నశించదు. అందుచేత సామాన్యం నిత్యం; అనేకవస్తువులను ఆశ్రయించుకొని ఉంటుంది. ఒక వస్తువుయొక్క అవయవవిశేషాలు, గుణాలు మొదలైనవాటిని బట్టి ఈ వస్తువుకంటె ఆ వస్తువు భిన్న మైన దని అంటాం. కాని నిత్యములు సమాన గుణములూ అయిన రెండు పృథ్వీపరమాణువులలో ఒకటి రెండవదానికంటె భిన్న మైనది అని చెప్పా లంటే కారణం ఏదీ కనబడదు. అందుచేత ఈ పరమాణువులో ఒక విశేషం ఆ పరమాణువులో మరొక విశేషం ఉందనీ, ఈ విశేషాన్ని బట్టి ఈ పరమాణువు ఆ పరమాణువుకంటె భిన్న మైనది అనీ చెప్పాలి. ఈ విధంగా విశేషం నిత్యము లైన పరమాణువులు మొదలైనవాటిలో ఉంటుంది. ఇలాంటి విశేషాలను అంగీకరించడంచేతనే వీరి మతానికి వైశేషకమతం అను పేరు వచ్చింది. సమవాయం అనగా విడదీయరాని సంబంధం. ఇది గుణం గుణి, అవయవం అవయవి, మొదలైనవాటిలో ఉంటుంది. ప్రాగభావం, ప్రధ్వంసొభావం, అత్యంతాభావం, అన్యోన్యాభావం అని అభావం నాలుగు విధాలు. ఏదైన వస్తువు పుట్టడానికి పూర్వం లేకపోవడం ప్రాగభావం. ఉదాహరణకి ఘటం తయారు చేయడానికి ముందు ఘటం లేదు గాన ఆ అభావం ఘట'్రాగభావం. పుట్టిన వస్తువు కొంత కాలం ఉండి నశించిన పిమ్మట ఏర్పడిన దాని అభావం 'ప్రధ్వంసాభావం. ఉదాహరణకి-ఘటం బ్రద్దలైపోవడంచేత ఏర్పడిన దాని అభావం ఘటప్రధ్వంసాభావం. ఒక వస్తువు ఎన్నడూ లేకపోవడం అత్యంతాభావం. ఉదాహరణకి-వాయువునందు ఎన్నడూ రూపం ఉండదు గాన దానిలో రూపం లేకపోవడం అత్యంతాభావం. ఘటం పటం కాదు పటం ఘటం కాదు అను పరస్పరభేదం అన్యోన్యాభావం. ఈశ్వరుడు, జీవాత్మ, మోక్షం మొదలైన విషయాలలో మైోషికులు నైయాయిక మతాన్నే అంగీకరిస్తారు. ఈశ్వర'ప్రోక్తం అవడంచేత వేదం ప్రమాణమని నైయాయికులు, వైశేషికులూ కూడ అంగీకరిస్తారు.
140 హిందూమతం
- సాంఖ్యదర్శనం : సాంఖ్యదర్శనప్రవర్రకుడు కపెలముని. సాంఖ్యులు ప్రత్యక్ష- అనుమాన-శబ్దప్రమాణాలను అంగీకరిస్తారు. ఈ దర్శనం ప్రకారం ప్రకృతి, పురుషుడు (జీవుడు) అని రెండే మూలతత్త్వాలు. ప్రకృతి జడం; జీవుడు చైతన్య స్వరూపుడు. మనోదేహేంద్రియాలకంటె భిన్నుడు. ఇతడు సాక్షి వలె ఉంటూ ప్రపంచవ్యవహారా లన్నీ చూస్తూ ఉంటాడు. ప్రకృతి ప్రాపంచికవ్యవహారాలు నడుపుతూంటే జీవుడు అనుభవిస్తూంటాడు. ఆ విధంగా జీవునికి భోకృృత్వమే కాని కర్శృత్వం లేదు. దేహాల భేదాన్ని పట్టి జీవులు కూడా వేరు వేరుగా ఉన్నారని అంగీకరించాలి.
(ప్రపంచానికి మూలకారణం ప్రకృతి. అది అచేతనం. సత్త్వ-రజస్- తమోగుణాల సంఘాతం ప్రకృతి. ఈ మూడు గుణాలు సామ్యావస్థలో ఉన్నప్పుడు సృష్టి ఉండదు. అప్పుడు ప్రకృతి (ప్రధానం అని కూడ దీని పేరు) అచంచలంగా ఉంటుంది. పూర్వకర్మానుసారం పురుషులకు ప్రకృతితో సంయోగం ఏర్పడడంతో ప్రకృతి సృష్టి చేయడం ప్రారంభిస్తుంది. ప్రకృతినుండి మొట్టమొదట మహత్రత్వం పుడుతుంది. పురుషుని చైతన్యం ఈ మవహత్తత్వంలో (ప్రతిబింబించడంచేత అది చేతనం వలె భాసిస్తుంది. అప్పుడు దానిని సకలజగదుత్పత్తిహేతు వైన బుద్ధితత్త్వం అంటారు. ఈ బుద్ధితత్షం అహంకారంగా పరిణతం అవుతుంది. ఈ అహంకారతత్త్వం 'నేను, నాది” అను అభిమానానికి కారణం. దీనితో సంబంధించడంచేత పురుషుడు కర్త నని అనుకొంటూంటాదు. సత్త్వగుణప్రధాన మైన అహంకారం నుంచి త్వక్- చక్షః-శోత్ర-ఘాణ- రసన లను అయిదు జ్ఞానేంద్రియాలు, వాక్-పాణి-పాద- పాయు- ఉషస్థులను అయిడు కర్మేంద్రియాలు, ఉభయాత్మక మైన మనస్సు జనిస్తాయి.
తమఃప్రధాన మైన అహంకారం నుంచి పంచస్తూలమహాభూతాలకు కారణ మైన సూక్ష్మభూతాలు (వీటికే భూతతన్మాత్ర లని పేరు) పుడతాయి. వీటిలో శబ్ద- స్పర్శ- రూప-రస-గంధాలు అవ్యక్తావస్థలో ఉంటాయి. వీటినుండి స్థూలము లైన పంచ మహాభూతాలు పుడతాయి. ఈ విధంగా సాంఖ్యులు ఇరవై నాలుగు (24) తత్త్వాలు అంగీకరిస్తారు.
జీవుడు అజ్ఞానవశంచేత అనాత్మలైన దేహేంద్రియాదులకు చెందిన సుఖదుః
హిందూమతం [41 ఖాదులను తనమీద ఆరోపించుకొని సుఖదుఃఖవశంవడు దౌతూంటాదు. ఈ అజ్ఞానం తొలగగానే లౌకికవ్యవహారా న్నంతనీ ఒక విధ మైన నిర్లిప్తతతో చూస్తూంటాడు. ఇట్టి స్థితికే కైవల్యం, ముక్తి, అపవర్గం అని పేర్లు. ఇట్టి స్థితిని ఈ శరీరం ఉండగానే సంపాదించకలుగుతే అది జీవన్ముక్తి.
సాంఖ్యులు ఈశ్వూస్త్వూన్ని అంగీకరించరు. వేదప్రామాణ్యాన్ని అంగీకరిస్తారు. కాని కొందరు సాంఖ్యులు తమ మతం కూడ ఈశ్వరుణ్ణి అంగీకరిస్తుంది అని చెప్పడం ఉంది. ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించకపోయినా వేదప్రామాణ్యాన్ని అంగీకరించడంచేత ఇది ఆస్తికమతంగా పరిగణింపబడింది.
4 యోగదర్శనం :; యోగదర్భనం జగన్నిర్మాణాది విషయాలలో చాలవరకు సాంఖ్యదర్శనాన్ని అనుసరించి ఉంటుంది. వతద్దర్శన ప్రవర్తకుడు పతంజలిముని. సాంఖ్యు లంగీకరించిన చతుర్వింశతితత్త్వాలను అంగీకరిస్తూ ఈ దర్శనం ఈశ్వరుణ్ణి కూడ అంగీకరిస్తుంది. అయితే ఈశ్వరుడు జగత్స్సుష్టి-స్టితి-సంహారాలకు కారణ మని యోగదర్భనంలో అంగీకరించి నట్లు లేదు. ఆత్మానాత్మవివేకజ్ఞానంవల్ల ముక్తి కలుగుతుం దని సాంఖ్యులు బోధించగా ఈ వివేకజ్ఞానం కలగడానికి ఉపయోగించే సాధనాలను యోగదర్భనం ప్రతిపాదించింది.
చిత్తంలో సర్వదా ఏవేవో భావాలు కలుగుతూనే ఉంటాయి. వాటికి చిత్తవృత్తు లని పేరు. ఈ చిత్తవృత్తుల్ని పూర్తిగా ఆపివేయడమే యోగం. ఈ స్థితిని సాధించడానికి ఆవశ్యక మైన యమనియమాదిసాధనాలను యోగదర్శనం బోధిస్తుంది. వైరాగ్యాదుల ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసికొని ఏదైన ఒక ఆలంబనం మీద చిత్తాన్ని స్థిరంగా నిలబెట్టడంచేత చిత్తవృత్తులను నిరోధించవచ్చును. ఇలా ధ్యానం చేయడానికి అత్యుత్తమ మైన ఆలంబనం పరమేశ్వరుడు. అతడు సర్వజ్ఞత్వాదిగుణవిళిష్టుడు. ఆతనిపై చిత్తం నిలిపి యోగాన్ని అభ్యసిస్తే ముక్తి లభిస్తుం దని యోగశాస్త్రసిద్దాంతం.
సాంఖ్యు లంగీకరించిన సృష్టావిప్రక్రియ నంతనీ స్వీకరించి ఈశ్చరు డను ఇగమైమొందవ తత్త్వాన్ని కూడ అంగీకరించడంచేత ఈ మతానికి సేశ్వరసాంఖ్యం అను పేర కూడ వచ్చినది.
యోగశాస్త్రం అతిప్రాచీన మైనది. దీని మూలాలు వేదాలలోను ఉపనిషత్తుల
142 హిందూమతం లోనూ కూడ అతిస్పష్టంగా కనబడతాయి. ఇది ప్రయోగప్రధానమూ (ప్రత్యక్షసలమూ అయిన శాస్త్రం. అందుచేతనే జగత్తు, ఈశ్వరుడు, జగత్సృష్టి మొదలైన విషయాలలో అభిప్రాయభేదా లున్నా అన్ని దర్శ్భనాలూ కూడ అత్యుత్తమమూ అనివార్యమూ అయిన మోక్షసాధనంగా యోగమార్దాన్ని అంగీకరిస్తాయి. జైన-బౌద్ధమతాలలో కూడ యోగసాధన కిచ్చిన స్థానం అత్యున్నతమైనది. బౌద్ధమతం ద్వారా యోగమార్గంలో ప్రధానాంగ మైన ధ్యానం, 'జెన్” మొదలైన పేర్లతో చైనా-జపాన్ మొదలైన దేశాలలో కూడ అత్యధిక మైన ప్రచారం పొందింది. గడచిన ఒకటి రెండు శతాబ్దాలలో భారతదేశీయు లైన ఎందరో యోగిపుంగవుల ప్రయత్నాల ఫలితంగా ఈ ధ్యానమార్గం అనేకపాశ్చాత్యదేశాలలో కూడ బహుళప్రచారం పొందింది. అయితే కొన్ని ఇతరమతాలకు చెందిన కొందరు 'పీఠాధిపతులు' యోగమార్డానికి విరుద్ధంగా తమ మతానుయాయులకు ఆదేశాలు కూడ జారి చేసి ఉన్నారు. ఇది వాళ్లకు ఇతరమతాల విషయంలో, విశేషించి హిందూమతం విషయంలో ఉన్న ఉదారభావానికి నిదర్శనం! ర్ పూర్వమీమాంసాదర్శనం : వేదాల పూర్వభాగాలను ఆధారంగా చేసికొని బయలుదేరిన శాస్త్రానికి పూర్వమీమాంస అనీ, వాటి ఉత్తర (చివరి) భాగాలను ఆధారంగా చేసికొని బయలుదేరిన, ఉపాసనాజ్ఞానాదిప్రతిపాదనప్రధాన మైన శాస్త్రానికి ఉత్తరమీమాంస లేదా వేదాంతం అనీ పేర్లు. పూర్వమీమాంసాదర్శన (ప్రవర్తకుడు జైమినిముని. ఇది ప్రధానంగా కర్మకాండను సమర్ధించడానికి ఆవిర్భవించిన శాస్త్రం. జైమిని రచించిన సూత్రాలకి శబరస్వామి భాప్యం రచించారు. భాషానికి ప్రభాకరుడు, కుమారిలభట్టు వ్యాఖ్యానాలు వ్రాశారు. ప్రధానవిషయాలలో ఐకమత్యం ఉన్నా కొన్ని అంశాలలో వీరిద్దరికీ అభిప్రాయభేదా లున్నాయి. అందుచేత పూర్వమీమాంసలో ప్రధానంగా ప్రాభాకరమతం, భాట్టమతం అని రెండు మతాలు 'ప్రసిద్ధిలోనికి వచ్చాయి. భాట్టమతానికే అత్యధిక మైన ప్రచారం ఉంది. ప్రాభాకరులు - ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అర్జాసత్తి అను ఐదు ప్రమాణా లంగీకరించగా భాట్టులు అనుపలబ్ధి అను ఆరవ ప్రమాణం కూడ అంగీకరించారు. (దేవదత్తుడు బలిసి ఉన్నాడు; అతడు పగలు భోజనం చెయ్యడు”
హిందూమతం 143 అన్నప్పుడు అతడు బలిసి ఉండడాన్ని పట్టి “రాత్రి భోజనం చేస్తాడు” అని తెలుసుకొంటాం. ఈ విధంగా ఒక ఫలితాన్ని పట్టి దాని కారణాన్ని ఊహించడం అర్జాపత్తి. “ఇక్కడ ఘటం లేదు; ఉంటే కనబడేది కదా” అన్నప్పుడు ఘటం లేదని చెప్పడానికి ప్రమాణం అది అక్కడ కనబడక పోవడం. ఇది అనుపలబ్ది ప్రమాణం...
మీమాంసాసిద్దాంతం ప్రకారం వేదాలు అపొరుషేయాలు. అనగా మానవులు రచించినవి కావు. ఇవి అనాదిగా వస్తున్నాయి. వీటిలో పురుషబుద్ధికి సంబంధించిన దోషాలు ఏవీ ఉండడానికి అవకాశం లేదు. అందుచేత ఇవి పరమప్రమాణం. ఇలా చెయ్యాలి అని వేదంలో విధించిన దంతా ధర్మం. ఇలా చేయకూడదు అని నిషేధించినది అధర్మం. వేదవిహితా లైన స్వధర్మాలను (కర్మలను) మానవుడు ఆచరిస్తూనే ఉండాలి. ఇలా స్వధర్మానుష్టానం చేయగా కర్మబంధా లన్నీ నశించి మోక్షం లభిస్తుంది. మోక్షం అవిచ్చిన్నానందరూప మైన దని కొందరు మీమాంసకుల అభిప్రాయం. స్వధర్మ్శానుష్థానంచేత జన్మరాహిత్యం, తద్ద్వారా సర్వదుఃఖవినాశం కలుగుతుం దని మరి కొందరి మతం. ప్రాచీనమీమాంసకులు స్వధర్శానుష్టానంచేత స్వర్గం లభిస్తుందని అంగీకరించగా తరువాతి వారు నిష్కామకర్శచేత మోక్షం కలుగుతుంది అని అంగీకరించారు.
ఆత్మ జన్మమరణరహితం. నిత్యం. ఆత్మకు జ్ఞానం సహజం కాదు. ఈ ఆత్మ దేహేంద్రియాదులతో సంబంధించి ఉండి విషయాలను గ్రహించే సమయంలోనే జ్ఞానం కలుగుతుంది. దేహభేదాన్ని పట్టి జీవులు కూడ భిన్నులుగా ఉంటారు. కనబడుతూన్న ఈ జగ త్తంతా సత్య మైనది. దీనికి ఆది కాని అంతం కాని లేదు. అన్ని కాలాలలోను జగద్వ్యవహారం ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. అందుచేత జగత్సృష్ట్యాదుల నిమిత్తం ఈశ్వరు డొక డున్నా డని అంగీకరించవలసిన పని లేదు. జీవుల కర్మల ననుసరించి ప్రపంచంలో పదార్థాలు పుడుతూంటాయి. కర్మయే సర్వశక్తమై లోకవ్యవహారం నడుపుతూన్నది.
మానవుడు ఇక్కడ చేసిన కర్మలచేత ఆతని ఆత్మలో ఒక శక్తి పుడుతుంది. దీనికి అపూర్వం అని పేరు. చేసిన కర్మ నశించిపోయినా కూడ జీవుణ్ణి అంటిబెట్టుకొని ఉన్న ఈ అపూర్వం దేశాంతర-కాలాంతరాలలో ఈ జీవునికి ఆ యా ఫలా
144 హిందూమతం లిస్తుంది. ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించకపోయినా వేద(ప్రామాణ్యం స్టాపించినవా ళ్లవడంచేత పూర్వమీమాంసకులు అపస్తిీకులుగా పరిగణింపబడుతున్నారు.
- ఉత్తరమీమాంస లేదా వేదాంతం : వేదాల చివరి భావా లైన ఉపనిషత్తుల అర్జాన్ని నిర్ణయించడానికి రచించిన శాస్త్రానికి ఉత్తరమీమాంస అని పేరు. ఉపనిషత్తులు వేదాల అంతాలు గాన ఈ శాస్త్రానికి ఉత్తరమీమాంస అను పేరుకంటె కూడ వేదాంతం అను పేరు బహుళప్రచారంలో ఉంది. వేదాంతదర్శ్భనానికి మూలగ్రంధం (బ్రహ్మసూత్రాలు. వీటి రచయిత బాదరాయణుడు. బ్రహ్మసూత్రాలకూ, ఉపనిషత్తులకు శ్రీశంకరాచార్యులు అద్వైతపరంగా వ్యాఖ్యానం వ్రాసి అద్వైతమతాన్ని ప్రతిపాదించారు. శ్రీశంకరాచార్యుల తరువాత కూడ శ్రీరామానుజాచార్యులు మొదలైన ఏదెనమండుగురు ఆచార్యులు ఈ సూత్రాలకూ ఉపనిషత్తులకు కూడ ద్వైతపరంగా వ్యాఖ్యానాలు రచించి విష్ణువిశిష్టాద్వైతం, శివవిశిష్టాదై నతం, శక్తివిశివ్టాద్వైతం, ద్వైతం ఇత్యాది నామధేయాలతో తమ మతాలను స్టాపించారు. ఈ ఆచార్యు లందరూ విష్ణువు, శివుడు, దేవి మొదలైన వేరు వేరు దేవతలకు (ప్రాధాన్యం ఇచ్చినా, కొన్ని అంశాలలో భేదా లున్నా మొత్తంమీద అందరూ కూడ అద్వైతాన్ని నిరాకరిస్తూ ద్వైతాన్ని సమర్ధించారు.
శ్రీశంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైతంయొక్క సంక్షిప్తరూపం ఇది.
నీర్ణుణమూ నిరాకారమూ అయిన ఒకే ఒక తత్త్వం ఉన్నది. అది ఒక్కటే సత్యం. అది అంతటా వ్యాపించి ఉన్నది. దీనినే 'సకొ, “చిత్ (జ్ఞానము). ఆనందము, “బ్రహ్మ' ఇత్యాదిపదాలతో ఉపనిషత్తులు నిర్దేశిస్తున్నాయి. ఈ తత్త్వంనుండి జగత్తు ఆవిర్భవించి, దానియందే ఉండి దానిలోనే లీన మవుచున్నది. అయితే కనబడుచున్న ఈ జగత్తుకు సత్యత్వం లేదు. సత్యం అనేది ఏదైనా ఉంటే అది ఒక్కటి మాత్రమే, అదే బ్రహ్మ. “సర్వం ఖల్విదం బ్రహ్మ” (ఇదంతా బ్రవ్మాయే) “అయమాత్మా బ్రహ్మ” (దేహాదులతో సంబంధించి ఉన్నట్లు కనబడే ఈ ఆత్మ, జీవాత్మ, బ్రహ్మయే), “నేహ నానాస్తి కించన” (ఈ 'సతొలో బ్రహ్మలో, ఎలాంటి భేదమూ లేదు మరొకటి ఏదీ లేదు) ఇత్యాదివాక్యాలు ఆత్మ ఒక్కటే సత్య మనీ, మిగిలిన దేదీ కాదనీ ప్రతిపాదిస్తున్నాయి. ఈ వాక్యాలను (ప్రమాణంగా తీసికొని, ప్రత్యక్షాదుల ద్వారా
హిందూమతం 145 తెలియబడుతూన్న జగత్తుయొక్క స్వరూపం ఏదో విశదీకరిస్తూ శ్రీ శంకరాచార్యులు అద్వైతాన్ని ప్రతిపాదించారు.
సత్య-జ్ఞాన-ఆనందస్వరూప మైన బ్రహ్మ అనంతశక్తిరూప మైనది కూడ. టబ్రహ్మలో ఎవ్వరూ ఊహించడానికి శక్యంకాని శక్తి ఉన్నది గాన దీనిని అనంతశక్తి
- రూపము అని శ్రుతులు చెపుతున్నాయి. మన మాటల సౌకర్యం కోసం సూర్యునిలో
ప్రకాశ ఉన్న దనీ, అగ్నిలో వేడి ఉందనీ అన్నా కూడ సూర్యునినుంచి ప్రకాశను ఏ విధంగా వేరు చేయడం శక్యం కాదో, అగ్నినుండి దాహకత్వశక్తిని వేరు చేయడం ఎలా శక్యం కాదో అదే విధంగా (బ్రహ్మనుండి ఈ శక్తిని వేరుచేయడం శక్యం కాదు. బ్రహ్మయే శక్తి, శక్తియే బ్రహ్మ. ఈ శక్తికే మాయ అని పేరు. ఈ మాయయే జగద్రూపంలో జీవులకు కనబడుతూన్నది. అనగా జగత్తు మాయాకల్పితం.
నామము (పేరూ), రూపము (ఏదో ఆకారమూ) కర్మ (పనీ) ఫలమూ (ఆ పనివల్ల కలిగే ఫలితము) - ఈ నాలిగింటికే జగత్తు అని పేరు. ఈ జగత్తులో, ఈ జగత్తును చూస్తూ, ఎన్నో లక్షల విధా లైన, లెక్కించడానికి శక్యం కాని, ఎందరో జీవులు జీవిస్తున్నారు. వ్యవహరిస్తున్నారు. మనకు కొంతవరకు స్పష్టంగా అర్ధం అవడానికి ఆ జీవుల ప్రతినిధిగా, ఒక ఉదాహరణం (5ఖుం]1ల గా మానవు డను జీవుని స్వరూపం ఏదో పరీక్షిస్తే దానినే అందరి జీవుల విషయంలో ప్రవర్తింపచేయవచ్చును.
మానవునికి ప్రత్యక్షంగా కనబడే ఒక ఆకారం ఉంది. అది వాని స్టూలశరీరం. ఈ స్ట్రూలశరీరమే కాక వీనిలో ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, అయిదు ప్రాణాలు, మనస్సు, బుద్దీ అనేవాటితో కలిసి ఉన్న ఒక సూక్ష్మశరీరం ఉంటుంది. ఈ శరీరం పంచతన్మాత్రలు అను నామాంతరం గల సూక్ష్మభూతాలతో ఏర్పడినది. ఇది ఇంద్రియాలకి గోచరం కాదు. స్టూలశరీరం నశించినా ఈ సూక్ష్మశరీరం (దీనికి లింగశరీరం అని కూడ పేరు) నశించదు. పుణ్యపాపాలను అనుసరించి వివిధజన్మలలో క్రొత్త శరీరాలు (స్టూలశరీరాలు) ధరించేది ఈ సూక్ష్మ శరీరం. దీనిలో అంతకరణం ప్రధాన మైనది. దీనికే అది చేసే వేరు వేరు పనులను బట్టి మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అని పేర్లు ఈ అంతఃకరణాలు కూడ
146 హిందూమతం మాయ సృజించినవే. ఇవి, అంతటా వ్యాపించిన సూర్యకాంతిలో మట్టి బెడ్డలూ, రాళ్లూ మొదలైనవాటితో పాటు ఇటూ అటూ చెదిరి పడి ఉన్న గాజు పూసల వంటివి. సూర్యకాంతి అన్నింటిమీదా సమంగానే ప్రసరించినా ఈ గాజు పూసలు మాత్రం తళతళా మెరు స్తుంటాయి. మట్టి బెడ్డలు మొదలైనవి అలా మెరవవు. ఆ పూసలలో కూడ వాటి రంగులను బట్టీ, ఆ రంగుల, దట్టంగాను పల్చగాను ఉండడంవంటి భేదాలను పట్టీ, వాటి మెరుపులో కూడ భేదం ఉంటుంది. ఆత్మ (బ్రహ్మా సర్వవ్యాప్త మైనది. అది లేని ప్రదేశం లేదు. ఆత్మతో సంపర్మ్శ్మం, సంబంధం, లేనిది ఏదీ జగత్తులో ఉండదు. అయితే అంతఃకరణం ఇతరవస్తువులకంటె ఎక్కువ పరిశుద్ధ మైనది అవడంచేత ఇది అత్మప్రకాశను అధికంగా (గ్రహిస్తుంది. అలా ఆత్మసంబంధం గల అంతఃకరణమే జీవు డనగా. గాజు పూసలను ఎటు వైపు ఎలా ఆ ప్రదేశంలో దొర్లించినా వాటి ప్రకాశ అలాగే ఉన్నట్లు, ప్రకాశ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటూండగా ఆ పూసలు మాత్రమే ఇటూ అటూ దొర్లు తూన్నట్లు అన్ని లోకాలలో అన్ని స్టూలదేహాలలో, ప్రవేశించి తిరిగేది అంతఃకరణమే; ఆత్మ కదలదు; కూటస్టం. ఆ గాజు పూస పగిలిపోయినా సూర్యకాంతి యథాప్రకారంగానే ఉంటుంది. అలాగే అంతఃకరణం నశించినా ఆత్మ అలాగే ఉంటుంది. అందుచేత ఆత్మకంటె వేరుగా జీవు డనేవాడు లేడు. జగత్తులో కిందా మీదా పడుతున్న దల్లా అంతఃకరణమే; ఆత్మసంపర్శం గల దీనికే జీవు దని పేరు పెట్టుకొన్నాం.
ఈ విషయాన్నే విశదీకరిస్తూ మరొక ప్రసిద్ధ మైన దృష్టాంతం ఉంది. ఆకాశం సర్వగతం. ఆకాశం లేని ప్రదేశం లేదు. అనేక పాత్రలు వివిధప్రమాణాలలో ఉన్నాయి. ఆ పాత్ర లన్నింటిలోనూ ఆకాశం ప్రవేశించి ఉంది. నిజానికి ఆకాశం ప్రవేశించి లేదు; ఆకాశం ఉన్నచోట్ల పాత్ర లుంటున్నాయి. అఆ పాత్రలను ఒక చోటినుండి మరొక చోటికి తీసికొని వెళ్లినా అకాశం ఏ విధంగా ఎక్కడికీ వెళ్లదో, వేరు వేరు పాత్రలలో ఉన్న ఆకాశం వేరు వేరు అన్నట్లు కనబడినా ఏ విధంగా అది వేరు కాదో అట్లే ఆత్మ- అంతఃకరణాల విషయం కూడ.
చైతన్యరూప మైన ఆత్మతో సంబంధం ఏర్పడి అంతఃకరణం కూడ చైతన్యం కలది వలె కనబడుతుంది. అది దేహేంద్రియాదులతో సంబంధం ఏర్పరచుకొని
హిందూమతం 147 సుఖదుఃఖాదులు అనుభవిస్తూంటుంది. ఒక దీపం వెలుగులో జరుగుతూన్న వివిధ కార్యక్రమాలతో ఆ దీపానికి ఏ విధంగా సంబంధం ఉండదో ఆత్మకు కూడ అంతః కరణం ద్వారా జరుగు కార్యకలాపాలతో గాని, వాటి ఫలమైన సుఖదుఃఖాలతో గాని ఏమీ సంబంధం లేదు. ఆత్మ పరిశుద్ధము, నిర్మలము అన్నదానికి అర్ధం అదే.
శాంకరసిద్దాంతంలో ప్రధాన మైన - “బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరళో (బ్రహ్మ ఒక్కటే సత్యం; జగత్తు మిథ్య జీవుడు (బ్రహ్మయే కాని బ్రహ్మకంటె వేరుగా లేడు) అను మూడు అంశాలలో బ్రహ్మ ఒక్కటే సత్యం అను విషయమూ, బ్రహ్మకంటే వేరుగా జీవు డనేవాడు లేడు అను విషయమూ చూచాం. ఇంక జగత్తు మిథ్య అనగా ఏమో తెలుసుకోవాలి.
పంచమహాభూతాలు, వాటి వివిధస్వరూపా లైన స్థల-వన-నదీ-సముద్ర పర్వతాదులు చైతన్యసంపర్మం గల జంగమ-స్థావరప్రాణులూ-ఇవే జగత్తు. ఈ జగత్తు మాయవలన పుడుతూన్నది. ఈ మాయాప్రభావంచేత ఈ జగ త్తంతా 'బ్రహ్మమీదనే ఉన్నట్లు కనబడుతున్నది. దీనికి ఆది గాని అంతం గాని లేదు. అప్పు డప్పుడు ఏర్పడే ప్రలయ-మహాప్రలయాలలో కొంత కాలం కనబదకుందా ఉండవచ్చును గాని పూర్తిగా నశించడం అనేది లేదు. ఇంక జగదంతర్గతులైన జీవులు (వైతన్యోసహితాలైన అంతఃకరణాలు మాత్రం) మోక్షం పొంది పూర్తిగా విలీను(ము)లు కావచ్చును. ఈ జగత్తు మాయాకార్యం అవడంచేత మిథ్య. మిథ్య
_ అనగా అసత్యమూ, అసలే లేనిది అని అర్థం కాదు. ఎవరికి అది ఏ విధంగా ఎంత కాలం వరకు కనబడుతుందో అంత కాలంవరకు అది ఆ విధంగా సత్యమే. మిథ్య అనగా స్పష్టంగా అర్ధం చేసికొనదానికి శాంకరసిద్ధాంతంలో చెప్పిన త్రివిధసత్తలను గూర్చి ముందుగా చెప్పాలి.
“సత్తు అనగా ఉనికి,” “ఉండుట. శ్రీశంకరాబార్యులు మూడు విధాలైన సత్తలు ఉన్నా యని ప్రతిపాదించారు. అవి ప్రాతిభాసికసత్త వ్యావహారికసత్త, పారమార్థికసత్త.
- ప్రాతిభాసికసత్త : ఎండ పడి ధగధగా మెరుస్తూన్న ముత్యపు చిప్ప ముక్క గాజుముక్క మొదలైనవాటిని చూడగానే వెండి అనో బంగారం అనో
148 హిందూమతం భ్రాంతి కలుగుతుంది. త్రాడు చూడగా సర్పం అను (భ్రాంతి కలుగుతుంది. స్వప్నం చూస్తున్నంత సేపూ ఏవో పదార్దాలు కనబడుతూంటాయి. అందుచేత ఆ చూచేవానికి, అవి కనబడుతూన్నంతసేపూ అవి ఉన్నవనే అంగీకరించాలి. అవి నిజానికి అక్కడ లేవనే విషయం తరవాత, అనగా “ఇది వెండి కాదు, “ఇది బంగారం కాదు”
ఇత్యాదిరూపంలో ఉండే బాధజ్ఞానం కలిగిన తరువాత, నిద్రనుండి మేల్మొన్న తరవాత, తెలుస్తుంది. ఈ విధంగా భ్రాంతిజ్ఞానసనమయంలో ఆ రజతాదుల సత్త (ఉనికి) ప్రాతిభాసికసత్త.
2, వ్యావహారికసత్త : జీవుడు ఆది లేనివాడు. ఆ జీవుణ్ణి అనాదిగా అజ్ఞానం కూడ అనువర్తిస్తూ వస్తూన్నది. అలా అనుసరిస్తూ రావడం మూలానే జీవు డయ్యాడు. దూరం, సూర్యకాంతి మొదలైన కారణాలచేత లేని వెండి బంగారాలు కనబడి నట్లు కనుచీకటి అను దోషంచేత త్రాడుమీద సర్పం కనబడి నట్టు, నిద్రాదిదోషంచేత స్వాస్పజగత్తు కనబడి నట్లు అనాదిగా వస్తూన్న ఈ అజ్ఞానం (దీనికే అవిద్య అని నామాంతరం) చేత జీవుడు నిత్యశుద్ధబుద్ధస్వరూప మైన బ్రహ్మమీద ఈ జగత్తును, జగత్తు కంటె బ్రహ్మకంటె వేరుగా తననూ కల్పించుకొని చూస్తున్నాడు. ఈ అవిద్యకు లోబడి ఉన్నంతవరకు ఈ జగత్తు, తాను, బ్రవ్మా (పరమాత్ళు) వేరు వేరుగా ఉంటాయి. ఈ భూలోకం ఉన్నట్లే వేదపురాణాదులలో చెప్పిన వివిధలోకాలు, పుణ్యపాపాలు, వాటి ఫలాలు, స్వర్గనరకాలు అన్నీ ఉంటాయి. ఈ లోకన్యవహారం అంతా ఒక నిశ్చితరీతిలో మామూలుగా జరుగుతూనే ఉంటుంది. ఆ భూమికలో అదంతా సత్యమే. దీనికి వ్యావహారికసత్త అని పేరు.
పారమార్థికసత్త : “నేహ నానాస్తి కంచన” అని బ్రహ్మకంటె వ్యతిరిక్త మైన మరొక వస్తు వేదీ లేదని చెప్పే ఉపనిషద్వాక్యాల శ్రవణం, మనన -నిదిధ్యాసనలూ కూడ చేసి అద్వైతబ్రహ్మ ఒక్కటే పరమార్ధతత్త్వం; ఈ జగత్తు కల్పిత మైనది. నేను ఆ'బ్రహ్మ ఒక్కటే అను తత్త్వసాక్షాత్మారం కలిగిన పిమ్మట ఈ జగత్తు ఇతరవిభేదాలు అన్నీ విలీనం అయిపోతాయి; అంతా (బబ్రహ్మగానే కనబడుతుంది. అలా చూడగలిగినవాడు ఈ జన్మలోనే ముక్తు డైనాడు. అతడే జీవన్ముక్తుడు. అట్టివానికి అంతటా బ్రహ్మమే కనబడినా ఇతరులకు యథాపూర్వంగా జగత్తు ఉండనే ఉంటుంది. ఇది శ్రీశంకరాచార్యులు చెప్పిన అద్వైతతత్త్వం.
హిందూమతం 149
శ్రీశంకరాచార్యులు వ్యావహారికసత్తను అంగీకరించి - “ప్రపంచం మిథ్య అనగా ఆకాశకుసుమం వలె అసలు లేదని అర్ధం కాదు స్వప్నవ్యవహారం వల 'ప్రపంచవ్యవహారం అంతా అనాదికాలంనుంచీ అవిచ్చిన్నంగానే నడుస్తూన్నది; భవిష్యత్తులో కూడ నడుస్తుంది. స్వస్షం చూచేవానికి ఆ స్వప్నం చూస్తున్నంతసేపూ ఆ వ్యవహారం అంతా ఎలా సత్యమో అలాగే ప్రపంచవ్యవహారం చూస్తూన్నంతవరకు ఇది సత్యమే. స్వప్నం ఏ ఒక్కడో మాత్రమే చూస్తే ప్రపంచవ్యవహారాన్ని పద్నాలుగు భువనాలలోనూ ఉన్న ప్రాణు లందరూ చూస్తున్నారు. నిద్ర అనేది స్వప్నం చూచేనానిని ఒక్కనినే ఆవహించి వాని మనస్సులో ఉన్న పాత సంస్మారా లన్నీ బైటకు తీసి ఏవేవో విషయాలు చూపిస్తే అజ్ఞానం అనేది చతుర్దశభువనాలలో ఉన్న ప్రాణు లందరినీ ఒకే విధంగా ఆవహించి ఒకే విధ మైన జగత్తును చూపిస్తూన్నది. కొన్ని జన్మలలో చేసిన సాధనల ఫలితంగా ఏ ఒక్కదో దీనిని జగత్తుగా కాక బ్రహ్మనుగా చూస్తాడు. దానితో బంధవిముక్తుడై మోక్షం పొందుతాడు” అని ప్రతిపాదించారు. అందుచేత ఈ ప్రపంచం ద్వైతాన్ని నమ్మినవానికి ఎంత సత్యమో అద్వైతికీ అంత సత్యమే. అత దెంత అహంకార-మమకారాదులతో వ్యవహరిస్తున్నాడో ఇతడు కూడ అంతకు ఏ మాత్రమూ తీసిపోని అహంకార-నుమకారాలతో వ్యవహరిస్తున్నాడు. యజ్ఞాలు చేస్తున్నాడు; యాగాలు చేస్తున్నాడు; వివిధదేవతలను ఆరాధిస్తున్నాడు. సర్వవిధాలా లోకవ్యవహారాలలో చిక్కుకొని ఉన్నాడు. అలా ఉండకూడదు; అందరూ ఆధ్యాత్మికదృష్టితో అద్వైతమార్గసాధనపరులై ఉండాలి అని శ్రీశంకరాచార్యులు కూడ ఎక్కడా చెప్పలేదు. “నీ విధ్యుక్తఫర్మాలు శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ జీవనం గడుపుతూంటే ఏ నాటికైనా, ఏ జన్మకైనా నీకు ఆత్మజ్ఞానం కలగడానికి అవకాశం ఉంది అని మాత్రమే ఆయన బోధించాడు.
అయినా కూడ తరువాత వచ్చిన ఆచార్యులు చాలమంది శాంకరమతాన్ని నిరాకరించడానికి ప్రధానకారణం ఈ లోకవ్యవహారాన్ని గూర్చిన వివాదం కాదు. ఈ ఉభయులు అంగీకరించిన మోక్షస్వరూపాలలో భేదం ఇందుకు ప్రధానకారణం.
ఆత్మజ్ఞానం కలగినవాడు ఈ శరీరంలోనే కొంత కాలం ఉన్నా అంతటా బ్రహ్మనే చూస్తాడు. శరీరం దాని పనులు అది చేసుకొంటూ ఉంటుంది. అతడు మామూలుగానే వ్యవహరిస్తూన్నట్లు అందరు అనుకొంటుంటారు.. అయినా ఆతని
150 హిందూమతం వాస్తవమైన స్థితి వేరు. అదే జీవన్ముక్తావస్థ కాలాంతరంలో స్టూలశరీరంతో పాటు సూక్ష్మశరీరం కూడ ఇక్కడనే నశించడంతో అతడు విదేహముక్తి పొందుతాడు. ఇది శ్రీశంకరాచార్యులు బోధించిన మోక్షస్వరూపం. అయితే ద్వైతవాదు లందరూ ఒకే దేవతను ప్రధాన మైన సర్వోత్తమ మైన దేవతగా అంగీకరించి ఆ దేవతానుగ్రహపాత్రు దైన భక్తుడు ఆ దేవత నివసించిన లోకం చేరి, ఆతని సంనిధిలో ఉంటాడు. ఈ విధంగా సాలోక్యం (దేవత ఉన్న లోకంలోనే తాను కూడ ఉండటం), సొరూప్యం (ఆ దేవతతో సమానమైన రూపం సంపాదించడం) సామీప్యం (చాలా సన్నిహితంగా ఉండడం) సాయుజ్యం (చివరికి ఆ దేవతతో కలిసిపోవడం) వంటి మోక్షాలను అంగీకరిస్తారు. ఇదే పరమగమ్యం. వ్యావహారికదశలో వీటి నన్నింటినీ శ్రీశంకరాచార్యులు అంగీకరించినా అన్నింటికంటె ఉత్తమ మైన లక్ష్యం విదేహముక్తి. ఏ దేవత దగ్గరికీ వెళ్లే ప్రసక్తే లేదు. సగుజోపాసనలు చేసి ఆ యా దేవలోకాలకు వెళ్లినవాళ్లు కూడ కొన్ని యుగాల తరువాత ఆ తమ అరాధ్యదేవతలతో సహా విదేహముక్తి పొందవలసిందే. ఎందువల్ల ననగా, ఆరాధించిన దేవతలు, వాళ్ల దృశ్యస్వరూపాలూ, వాళ్ల లోకాలూ కూడ మిథ్య అంటే అది అంగీకరించడానికి కష్టంగానే ఉంటుంది కదా. అందుచేత అసలు మిథ్యాత్వవాదమే అసందర్భ మైన వాదం అనే విషయంలో ద్వైతు లందరికీ ఏకాభిప్రాయం ఉంది. శ్రీ శంకరాచార్యులు చెప్పిన ఇతర విషయాలు వాళ్లకీ శ్రీరామానుజాచార్యులు ఈ శాంకరమతాన్ని అంగీకరించకుండా ఈశ్చరునికి జీవునికి మధ్య భేదాన్ని అంగీకరిస్తూ జగత్తు సత్య మైనది అని ప్రతిపాదిస్తూ బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం రచించారు. ఈశ్చ్వరు డొక్కదే సత్యం. ఆ ఈశ్వరునిలో ఆతని అవయవాలుగా చిత్తులు (జీవులు) అచిత్తు (చైతన్యరహిత మైన జగత్తు) ఉన్నాయి. ఈశ్వరుడు (ఈయన మతం ప్రకారం శ్రీమహావిష్ణువే సర్వోత్తముడైన దేవుడు) అనంతసకలకల్యాణగుణవిశిష్టుడు. అతడు తన అవయవంగా, తనలోనే తనతో పొటు శాశ్వతంగా ఉన్న “అచిత్” నుండి జగత్తులోని అచేతనపదార్థాల నన్నింటినీ, సాలెపురుగు తన శరీరంనుండి దారం పుట్టించి నట్లు పుట్టిస్తాడు. జీవాత్మలు కూడ శాశ్వతమైనవి. అణుప్రమాణం కలవి. అవి స్వభావంచేతనే
హిందూమతం 151 చైతన్యం కలవి; ఆత్మ శరీరంనుండి పూర్తిగా విడిపోవడమే మోక్షం. బంధానికి హేతువు కర్మ. ఇది అజ్ఞానంనల్ల వచ్చినది. జీవాత్మ తన యథార్థస్వరూపం తెలియకపోవడంచేత శరీరమే తానని అనుకొంటూ ఇం(ద్రియభోగాలకోసం ప్రయత్నిస్తుంది. ఈ విధంగా ఇది ప్రపంచం విషయంలో రాగం పెంచుకొని పునర్దన్మలు పొందుతూంటుంది. వేదాధ్యయనంచేత అజ్ఞానం తొలగి పోతుంది. అప్పుడు మానవుడు తన ఆత్మ శరీరంకంటె వేరనీ, తాను వాస్తవంలో బ్రహ్మయొక్క (విషప్ట్ణవుయొక్క అవయవ మనీ, తాను పూర్తిగా ఆ విష్ణువుమీదనే ఆధారపడిన వాడనీ తెలిసికొంటాడు. వేదోక్తమైన నిత్యకర్మలను ఫలకామన లేకుండా చేయడంవల్ల కర్మలు నశిస్తాయి; పరిపూర్ణజ్ఞానం కలుగుతుంది. విష్ణు వొక్ళడే ప్రేమించ దగినవాడు అను నిశ్చయం కలుగుతుంది. ఆ జ్ఞానం కలగడంచేత నిరంతరం భగవద్దానం చేస్తూ ఆతనిని సర్వవిధాలా శరణు పొందుతాడు. భగవంతుడు వాని భక్తికి సంతోషించి వానిని బంధంనుండి విముక్తుణ్ణి చేస్తాడు. మరణించిన తరవాత అతడు మరల జన్మించడు. మోక్షం పొందిన జీవాత్మ ఈశ్వరుడు వలె పరిశుద్దుడు చిద్రూపుడూ గాన, మాలిన్యా లన్నీ తొలగిపోవడంచేత భగవంతునివంటి వా డవుతాడు. అయితే ఆ జీవాత్మ ఈశ్వరునితో అభేదం మాత్రం ఎన్నటికీ పొందజాలడు; పరిచ్చిన్నమైనవాడు అపరిచ్చిన్నుడు కాడు కదా?
రామానుజమతం ప్రకారం ఈశ్చరు డొక్కడే సత్య మైనా, ఈశ్వరుని వెలుపల ఏదీ లేకపోయినా, ఈశ్వరుని లోపల చాలా సత్యపదార్థా లున్నాయి. జగత్సృష్టీ సృష్టింపబడిన వస్తువులూ - ఇవన్నీ ఈశ్వరు డెంత సత్యమో అంత సత్యములు, అందుచేత ఇది అఖండాద్రైతం కాదు భిన్నపదార్థాలను కలపగా ఏర్పడిన అద్వైతం; విశిష్టాద్వైతం.
ఈశ్వరుణ్ణి (విష్ణువును) ఒక అవయవి (అవయవాలు కలవాడు) గాను, చిత్
- అచిత్తుల నన్నింటినీ వాని అవయవాలు గాను భావించి, ఆ మూడు రకాలైనవాటినీ ఒక సమూహంగా పరిగణించి అద్వైతం అని పేరు పెట్టినా దానికీ ఇతర ద్వైతమతాలకీ అంతగా భేదం ఏదీ లేదు. ఇవి భక్తిమార్గానికి అధికంగా ఉపయోగించే మతాలు.
152 హిందూమతం
పైన చూచిన విధంగా ఆస్తికదర్శనా లన్నీ చాలా కాలం క్రితం ఆయా మునులు, ఆచార్యులు రచించిన సూత్రాలతో ప్రారంభ మైనట్లు చెప్పినా వాటి మూలాలు ఎంతో కాలానికి పూర్వమే వివిధకూపాలలో వాజ్బయంలో ఉండి ఉండాలి. వాటిని ఆ యా ఆచార్యులు సూత్రరూపంలో నిబంధించగా తరువాతి ఆచార్యులు ఆ సూత్రాలకు భాష్యాలు రచించారు. వాటిపై మళ్లీ అనేకవ్యాఖ్యానాలు బయలుదేరాయి. అందుచేత ఆ యా దర్శనాలు ప్రస్తుతం లభ్యం అవుతూన్న సూత్రగ్రంథాలతోనే ప్రారంభం అయ్యాయి అని భావించగూడదు. తమకు పూర్వమే బహుళప్రచారంలో ఉన్న సిద్దాంతాలను తాము సూత్రరూపంలో క్రోడీకరించి నట్లు ఆ యా సూత్రకారులే తమ దర్శనాలలో సూచించి ఉన్నారు.
ఈ విధంగా హిందూమతంలో ఆతిప్రాచీనకాలనుంచీ కూడ అతివిస్తృత మైన, ఎంతో వైవిధ్యంతో కూడిన అతిగంభీరమైన తత్త్వవిచారం నిరంతరమూ కొనసాగుతూ ఉంది. దీని దృష్ట్యా చూస్తే ఇతరమతాలలో ఉన్న తత్త్వవిచారం అంతా పైపై మాటలలో నడచినట్లు స్పష్టం అవుతుంది.
హిందూమతం 153 హిందూమతంలో కొన్ని విభిన్న సంప్రదాయాలు ఇతరమతాలలో వలెనే హిందూమతంలో కూడ కొన్ని శాఖలు ఆవిర్భవించాయి. ఇవన్నీ అంతగా పరస్సరద్వేషం లేకుండా కలిసి మెలిసి ఉండడం ప్రధానంగా గుర్తించ వలసిన విషయం. అప్పు డప్పుడు అలాంటివి తల ఎత్తినట్లు కనబడినా అవన్నీ తాత్కాలిక భేదభావాలు మాత్రమే అవడంచేత వీటిని శాఖ లని కాక సంప్రదాయా లని అనడం యుక్తంగా ఉంటుంది. వీటిలో చాల సంప్రదాయాలు ఆరాధ్యదేవతల (ప్రాధాన్యాన్ని పట్టి ఏర్పడినవి. పరమేశ్వరుడు జగత్సృష్టి - రక్షణ - సంహారకర్త అని అందరూ అంగీకరించిన విషయమే. ఆ పరమేశ్చరుడే మూడు మూర్తులు ధరించి బ్రవ్మాగా సృష్టినీ, విష్ణువుగా రక్షణమునూ, రుద్రుడుగా సంహారమునూ చేస్తుంటా దనే భావన కాలాంతరంలో, ప్రధానంగా పురాణాల కాలంలో, ప్రబలమైనది. ఈ మూర్తులలో కూడ ఒక మూర్తే ప్రాధాన్యం ఇచ్చి ఇతర మూర్తులను, దేవతలను ఆ మూర్తులకు అంగాలుగా, సహాయకులుగా అంగీకరించే కొన్ని సంప్రదాయాలు కూడ బయలుదేరినవి. వీటిలో (1) శైవసంప్రదాయమూ, (2) వైష్ణవసంప్రదాయమూ, (3) శాక్తసంప్రదాయమూ చాల ప్రధానమైనవి. ఇతరదేవతలను ప్రధానంగా ఆరాధించే గొణాపత్య - కౌమార
- సౌరాది సంప్రదాయాలు కూడ ఉన్నాయి. శైవసంప్రదాయంలో దాదాపు పది (10) అవాంతరశాఖలు (9109-5666), మష్ణవ సంప్రదాయంలో దాదాపు ఇరవై (20) అవాంతరశాఖలు, శాక్తసంప్రదాయంలో దాదాపు ఐదు (5) అవాంతరశాఖలు ఉన్నాయి. శైవసంప్రదాయం ఈ సంప్రదాయంలో ఈశ్వరుడు, “రుద్రుడు అను పేరుతో భయంకరదేవత గాను, 'శివు డను పేరుతో సర్వమంగళ ప్రదుడు ప్రశాంతుడు అయిన దేవతగానూ కూడ ఆరాధింపబడుతున్నాడు. యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలో శివుడు సర్వజగత్స రూపుడుగా, సకలాభీష్టప్రదాతగా వర్ణింపబడ్డాడు. ఇతరవేదాలలో కూడ అనేకస్థలాల్లో శివుని, రుద్రుని నిర్దేశా లున్నాయి. ఈతని మాహాత్యాాన్ని వర్ణించే అతివిస్తృతమైన
154 హిందూమతం పురాణవాజ్బయం ఉంది. రుడ్రుడు గజచర్మ ఆ వ్యాఘ్రచర్శాదులు, స్ప్పూలు, మానవుల శిరుకపాలాలు జటాజూటము ధరించి అతిభయంకర మైన వేషంతో శృశానాదులలో సంచరిస్తుంటాడు. శివుడుగా సౌమ్య మైన రూపం ధరించి పార్వతితో (శక్తితో) కలిసి కైలాసంమీద నివసిస్తాడు. వరా లొసగి భక్తులను కాపాడతాడు. శివుణ్ణి నాలుగు చేతులతో ఉండి నాట్యం చేస్తున్న నటరాజునుగా చిత్రిస్తారు. ఈ మూర్తి సృష్టికి, ప్రపంచావిర్భావానికి ప్రతీకం. ఈశ్వరుణ్ణి ప్రధానంగా, భారతదేశం అంతటా లింగం ఆకారంలో దేవాలయాదులలో ప్రతిష్టించి ఆరాధిస్తారు. ఈ లింగం సృష్టికి 'ప్రతీకం అని కొందరి అభిప్రాయం. హిందువులలో ఒక సంప్రదాయానికి చెందిన లింగాయతులు అనువారు శివలింగాన్ని ఎల్లప్పుడూ వారి శరీరాలమీద రజతసంపుటాదులలో భద్రం చేసి ధరిస్తారు పూజాసమయాలలో దానిని పూజిస్తారు. శైవులు అత్యున్నత మైన నైతికప్రమాజాలు పాటించే పవిత్రజీవనవిధానం కలవారు. శివుడు మహాయోగిగా కూడ అనేకస్థలాలలో వర్ణింపబడుతున్నాడు. ఈ
మతానికి వైరాగ్యంతోను, సంన్యాసంతోను ఘనిష్టమైన సంబంధం ఉంది. మహాయోగిగా ఈశ్వరుడు శరీరం అంతా భస్మం పూసికొని జటాజూటంతో, ఎల్లప్పుడూ ధ్యానముద్రలో కూర్చున్నట్లు వర్ణింపబడతాడు. ఇది శైవులలో ఉన్న వైరాగ్యప్రధాన మైన జీవనానికి సూచకం. కొన్ని శైవసంప్రదాయాలలో అతిక్రూర మైన ఆచారాలు ఉన్నాయి. వాళ్లు తమ శరీరాలకు మేకులు (గ్రుచ్చికొని, తల పైకి చేతులు ఎత్తి రాత్రింబవళ్లు ఇనుషమేకుల శయ్యల మీద శయనించి ఉంటారు. ఇది ఆధ్యాత్మికసమున్నతికై శరీరాన్ని అన్ని విధాలైన కష్టాలకి పాలుచేసి, దానిమీద మమకారం పూర్తిగా విడిచివేయడానికి చేసే అతితీవ్ర మైన సాధన. శైవ సంప్రదాయంలో కాపాలికులు (మనుష్యుల శిరఃకపాలాలు ధరించి, వాళ్ల ఎముకలు దండగా వేసికొని, ఆ కపాలాలలో అన్నం తింటూ కొన్ని శక్తులు సంపాదించి మద్యపానం చేస్తూ స్వేచ్చగా అంతటా తిరిగేవాళ్లు కాపాలికులు) మొదలైన ఎన్నో శాఖలవాళ్లు ఉండేవారు. వీళ్లు భయంకరమైన కాళీపూజాదులు చేస్తూ నరులతో సహా అనేకప్రాణుల ఐలు లిస్తూ ఉందేవారు.
హిందూమతం 155 క్రీ.శ. ఏడు - ఎనిమిది శతాబ్దాలలో, దక్షిణదేశంలో నాయనార్లు అను శివభక్తులు శైవమతానికి అత్యధికమైన ప్రచారం చేశారు. వీరు రహస్యవాదికవులు (147560 ౧౦౭౪). వీరి గీతాల ద్వారా దక్షిణభారతదేశంలో శైవమతానికి గొప్ప ఉత్తేజనం లభించింది. వీరు అరవైముగ్గురు (63) ఉండేవారని సిద్ధి ఈ భక్షకవులలో అన్ని జాతులవాళ్లూ ఉండేవారు. అందరూ కూడ సమాజంలో అత్యధికమైన జనాదరం పొందినవారే. వీరి విగ్రహాలు దక్షిణదేశంలోని శివాలయా లన్నింటిలోనూ 'ప్రతిష్టితములై నిత్యము పూజింపబడుతూంటాయి. నూతనంగా నిర్మించే దేవాలయాలలోకూడ వీటి ప్రతిష్ట చేయబడుతుంది. పదమూడవ శతాబ్దం ప్రారంభంలో మేయకందర్ శైవసిద్దాంతసంప్రదాయం స్థాపించారు. ఇది శివుని (ప్రాధాన్యాన్ని బోధించే సిద్దాంతం. లింగాయత సంప్రదాయం కూడ ఈ కాలంలోనే దక్షిణదేశంలో ఆవిర్భవించింది. వైష్ణవసంప్రదాయం ఈ సంప్రదాయానికి చెందినవాళ్లు విష్ణువును ప్రధానదేవతగా ఆరాధిస్తారు. వీళ్లకు సంన్యాసాదులతో అంతగా సంబంధం లేదు. విష్ణువు దయామయుడు సకలసద్దుణసంపన్నుడూ అయిన దేవుడు. దుష్టులను సంహరించి. శిష్టులను రక్షించదానికై విష్ణువు అప్పు డప్పుడు వేరు వేరు రూపాలతో భూలోకంలో అవత రిస్తూంటాడు. ఇలాంటి అవతారాలలో చాల ప్రధానమైనవి రామ - కృష్ణ అవతారాలు. భారతదేశం అంతటా ఈ రెండు అవతారాల ఆరాధన రూపంలో వైష్ణ్ట్ఫ్టమతం వ్యాపించి ఉంది. రామాయణ - మహాభారతాలు ఈ అవతార మూర్తులతో సంబంధించి ఉన్నవి. వైష్ణవసంప్రదాయాన్ని ముందుగా ప్రచారంలోనికి తీసికొని వచ్చినవారు శ్రీరామానుజాచార్యులు. తరువాత వచ్చిన శ్రీ మధ్వాచార్యులు, శ్రీవల్లభాచార్యులు, శ్రీరామానంద, శ్రీవైతన్యప్రభువు మొదలైనవారు దీనిని దేశం అంతటా అత్యధిక ప్రచారంలోనికి తీసికొనివచ్చారు. ఈ సంప్రదాయం ప్రకారం విష్ణువే సర్వోత్తమదేవత; అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఇతరదేవత లందరూ విష్ణువుయొక్క వివిధ రూపాంతరాలు. వైదికకాలంలో విష్ణువు ఇతరదేవతలలో ఒక దేవత మాత్రమే
156 హిందూమతం అయితే కాలాంతరంలో విష్ణువే సర్వదేవాధీశ్వరుడు, సర్వశక్తుడు, సర్వగతుడు అని పూజించడం (ప్రారంభం అయింది. ఇది పురాజాలకాలంలో అత్యధికంగా కనబడుతుంది. విష్ణువు సర్వసద్గుణసంపన్నుడు; కరుణామయుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు అను మూర్తిత్రయంలో విష్ణువు కూడ ఒక్కడైనా ఆ ముగ్గురిలోనూ విష్ణువే (ప్రధాను డనీ, మిగిలిన ఇద్దరూ ఆతనికి క్రిందివారే అనీ ఈ వైష్ణవసంప్రదాయుల విశ్వాసం. ప్రారంభదశలో ఉన్న విశ్వాసం ప్రకారం సర్వలోకస్ఫృష్టి - స్థితి - వినాశాలకు కారణమైన ఒక దేవుని మూడు అంశాలు త్రిమూర్తు లనీ, వారిలో ఒకరు విష్ణు వనీ చెప్పినా తరువాత - విష్ణువే జగదుత్పత్త్యాదికారణభూతు దైన అత్యుత్తమదేవత అను వాదం ప్రచారంలోనికి వచ్చింది. విష్ణువు తన భార్య యైన లక్ష్మి దగ్గర నుండి సేవిస్తూండగా సముద్రం మీద శేషళయనంపై శయనించి ఉంటాడు. ఎప్పుడైనా దేవతలకు ఆతని రక్షణ అవసరమై వాళ్లు వచ్చి మేల్మొల్పితే తప్ప అతడు ఎల్లప్పుడూ ఆ విధంగా నిద్రించే ఉంటాడు. సృష్టికర్త యైన బ్రహ్మదేవుడు ఆతని నాభిలో నున్న పద్మంలోనుండి జనించి నట్లు వర్ణించబడింది. వైష్ణవసంప్రదాయం ప్రకారం విష్ణువుమీద పరిపూర్ణ మైన నిశ్చల మైన భక్తితో ఆతనిని ఆరాధించడమే మానవుని ప్రధానకర్తవ్యం. రామాయణము, మహాభారతంలోని భగవద్దీతాదులు నిత్యమూ పారాయణ చేయడమూ, అప్పుడప్పుడు రాముని లీలలకూ కృష్ణుని లీలలకూ సంబంధించిన ఉత్సవాలు చేస్తూండడమూ, నామసంక్తీర్తనమూ, భజనలూ - ఇవన్నీ భక్తులు చేయవలసిన కర్శకలాపాలు. శ్రీరాముని విగ్రహాలు, శ్రీకృష్ణుని విగ్రహాలు స్థాపించిన అనేకదేవాలయాలు భారతదేశం అంతటా ఉన్నాయి. శ్రీరామానుజసంప్రదాయం అనుసరించేవారు అధికంగా రామభక్తులుగా సదాచారసంపన్నులుగా ఉంటారు. వీరు దక్షిణభారతంలో ఉన్న అత్యధికసంఖ్యాకు లైన వైష్ణవులు. శ్రీమధ్వాచార్యసంప్రదాయం అనుసరించేవారు, ఉత్తరదేశంలో ఉన్న వైష్ణవులలో అత్యధికసంఖ్యాకులూ కూడ శ్రీకృష్ణభక్తులు. విగ్రహరూపంలో సాక్షాత్తు విష్ణువును పూజించడం కంటె రామ - కృష్ణవిగ్రహరూపాల్లో విష్ణువును ఆరాధించడం అధిక ప్రచారంలో ఉంది. కొన్నిచోట్ల నరసింహమూర్తి రూపంలో కూడ దేవాలయాలలో ఆరాధించడం ఉంది.
హిందూమతం 157 శైవసంప్రదాయానికి చెందిన నాయనార్ల వలె దక్షిణదేశంలో వైష్ణవ సంప్రదాయా నికి చెందిన ఆళ్వార్లు కూడ క్రీ.శ. ఏదెనిమిది శతాబ్దాలలో జన్మించారు. ఈ రహస్యవాదవైష్టవకవులు దేశసంచారం చేస్తూ తమ భక్తిభరితమైన గీతాలతో విష్ణుభక్తిని ఉజ్జులితం చేశారు. దక్షిణభారతంలో ఆ కాలంనాటికి దృఢంగా పాతుకొని ఉన్న జైన-బొద్దాలు ఈ ఆళ్వార్ల - నాయనార్ల గీతాలచేత ఎగురగొట్టి వేయబదినాయని అంటారు. " క్రీ.శ 11-12 శతాబ్దాలకి చెందిన శ్రీరామానుజాచార్యులు, 18వ శతాబ్దానికి చెందిన శ్రీ మధ్వాచార్యులు కూడ దక్షిణభారతదేశంలో వైష్ణవ్రమతాన్ని దృఢంగా నిలబెట్టారు. శ్రీరామానుజాచార్యులు ఆళ్వారుల భావాలకు ఉపనిషత్తులలోని విషయాలకు చక్కని సమన్వయం ఏర్పరిచి తమ సిద్దాంతానికి ఒక క్రొత్త శక్తిని ఇచ్చారు. క్రీ.శ. 1400-1800 శతాబ్దాల మధ్య ఉత్తరభారతదేశంలో వైష్ణవభక్తిమార్గం అతివిస్తృతమైన ప్రచారాన్ని పొందింది. దీనికి శ్రీరామ - శ్రీకృష్ణులు ఆరాధ్య దేవతలు. రామానందుడు శ్రీరాముని నామాన్ని మోక్షహీతువుగా ప్రచారం చేస్తో ఆళ్వార్లవలె గీతాలు గానం చేస్తూ ఈ భక్తిమార్గంలో జాతిభేదాలతో పని లేకుండా అందరికీ ప్రవేశం కల్పించాడు. తులసీరామాయణరచయిత అయిన తులసీదాసు రామానందసంప్రదాయానికి చెందినవాడు. ఇస్లాం వైపు కూడ దృష్టి ఉన్న రహస్యవాదికవి కబీర్, సిక్రమతస్థాపకుడైన నానక్ కూడ ఈ సంప్రదాయాన్నే అనుసరించారు. . బట్టలు నేసే ముసల్మాన్ అయిన కబీరు కాశీలో ఉండేవాడు. అతడు రామానందునికి శిష్యుదై హిందువుల కర్మసిద్ధాంతం, మోక్షం, నామజపమాహాత్యం మొదలైన సిద్ధాంతాలు అంగీకరించినా అవతారవాదాన్నీ వర్ణవ్యవస్థనూ, వి[గ్రవారాధననూ, వేదాల (ప్రామాణ్యాన్నిి కొరాన్ (ప్రామాణ్యాన్నీకూడ నిరాకరించాడు. అందుచేత రెండు మతాలవాళ్లూ ఆతనిని మతవిరోధినిగా భావించినా మరణానంతరం ఆతడు అందరి మన్ననలూ పొందగలిగాడు. కృష్ణభక్తులలో రెండు విధాలవాళ్లు ఉన్నారు. కొందరు రుక్కిణీపతీ, పాండవ
158 హిందూమతం మిత్రుడూ అయిన పురాణాదిప్రసిద్దుడైన శ్రీకృష్ణుత్తి పూజిస్తే కాందరు రాధాప్రియుడుగా భావింహడే ప్రేమిస్తారు. రాధ జీవనికి, శ్రీకృష్ణుడు పరమాత్మకూ ప్రతీకలు. అందుచేత మొదటి భక్తి నిర్మలమైనది, (శ్రద్దాభరితమైనదీ కూడ. రెందవభక్తి పూర్తిగా శృంగారాత్మకమై తీవ్రభావావేశరూపమైనది. రాధా -= కృష్ణసంప్రదాయం 12వ శతాబ్దికి చెందిన నింబార్ముని తాత్త్విక సిద్ధాంతంలోనే నిక్షిప్తమై ఉంది. పదమూడవ శతాబ్దంలో బాగా వికసించిన ఈ సంప్రదాయాన్ని పధ్నాలుగు - పదిహేను శతాబ్దాలకు చెందిన వైష్ణవకవులు తమ మధురమైన కావ్యాల ద్వారా బాగా ప్రచారంలోనికి తీసికొని వచ్చారు. ఇలాంటి కవులలో ముఖ్యంగా బెంగాలుకు చెందిన చండీదాసు, రాజస్థాన్‌కు చెందిన మీరాబాయి చెప్పుకొనదగినవారు. పదహారవ శతాబ్దానికి చెందిన వల్లభుడు (1479- 1531) చైతన్యుడు, (1486-1533) ఈ రాధాకృష్ణసంప్రదాయాన్ని ఆధారంగా చేసికొని తమ సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వల్లభసిద్దాంతం ప్రకారం కృష్ణుడు సనాతనమైన బ్రహ్మా రాధ ఆతని ప్రియురాలు వీరిద్దరూ వాళ్ల భక్తులతో స్వర్ణలోకంలోని బృందావనంలో నిత్యమూ క్రీడిస్తూ ఉంటారు. వల్లభుని సమకాలికుదైన చైతన్యుడు ప్రారంభంలో శుషృతార్శికుడు. అయితే కొందరు రాధాకృష్ణభక్తకవుల ప్రభావంచేత అత్యంతభావావేశపరుడైన రాధాకృష్ణభక్తుడుగా మారిపోయాడు. అతడు సంన్యసించి పూరీలో జగన్నాథస్వామి సంన్నిధిలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నాడు. పాటల ద్వారా, నృత్యం ద్వారా, బోధనం ద్వారా అతడు తన భక్తి భావావేశాన్ని ప్రకటిస్తూ బెంగాలులో ఒక విధమైన మతావేశాన్ని ప్రసరింపచేశాడు; ఈనాటికి కూడ అక్కడివారు ఆతని విషయంలో అపారమైన ఆదరం '్రకటిస్తూంటారు. ఈ విధంగా 1400-1800
- శతాబ్దుల కాలంలో భక్తిమార్గ ప్రవృత్తి దేశంలోని అన్ని ప్రాంతాలలోను వ్యాపించి అనేకభాషలలో అతివిసృృత మైన భక్తివాబ్బయం ఆవిర్భావానికి కారణం అయింది. శాక్త సంప్రదాయం ఈ సంప్రదాయానికి చెందినవారు దేవి (శక్తి) యే సర్వప్రధానమైన దేవత; ఇతరదేనత లందరూ ఈమె ఆజ్ఞచేతనే తమ తమ పనులు చేస్తుంటార్సు సర్వకామప్రద యైన శక్తియే మోక్షాన్ని కూడ ప్రసాదించగలిగినది అను ప్రగాఢ విశ్వాసంతో
హిందూమతం 159 ఉంటారు. శివుని భార్యయే ఈ శక్తి. ఈ శక్తి లలిత, దుర్గ, కాళి, పార్వతి ఇత్యాది నామధేయాలతో ఆరాధింపబడుతుంది. దుర్గ కాళి అనేవి దుష్ట్టంహారం చేసే శక్తియొక్క భయంకర రూపాలు: ఇంకా అనేకరూపాలతో నామాలతో చేసే శక్తిపూజావిధానం చాల రహస్యాత్మకమై, కొన్ని సందర్భాలలో జుగుప్సాకరంగాను, దురాచారభూయిష్టంగానూ కూడ ఉంటుంది. మానవులతో సహా వివిధప్రాణులను బలులుగా ఇస్తూంటారు. శాక్తంలో ఒక సంప్రదాయానికి (వామాచారానికి) సంబంధించినవాళ్లు మద్యం సేవించి వివిధరీతులలో స్త్రీపూజ చేస్తారు. మత్స్య- మాంసాదులు నైవేద్యంగా సమర్పిస్తారు. పూజాదిసమయంలో ఎంత స్వేచ్చాప్రవృత్తి కనబర్చినా శాక్తేయులు బావ్యాజీవనం చాల నియమబద్ధంగా గడుపుతారు. ఈ సంప్రదాయానికి చెందినవాళ్లు స్రీలకు చాల గౌరవం ఇస్తారు. బలి ఇచ్చే పశువులలో ఆడవి ఉందకూడదు. వేశ్యావృత్తి సర్వథా నిషిద్ధం.
శాక్తసంప్రదాయంలో స్త్రీలు, పురుషలు, అన్ని వర్థాలవాళ్లూ ఎలాంటి భేదమూ లేకుందా పూజాడులు నిర్వర్తించవచ్చును.
శాక్తసంప్రదాయంలో దక్షిణాచారం వామాచారం అను రెండు ఆచారా లున్నాయి. పైన చెప్పిన పంచమకారాలు వామాచారంలో ప్రత్యక్షంగా ఆచరిస్తారు. మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం అనేవి పంచమకారాలు. దక్షిణాచారంలో ప్రత్యక్షంగా వాటిని ఆచరించకుండా వీటి ప్రతినిధులను మాత్రమే ఉపయోగిస్తారు. శ్రీశంకరాచార్యులు వామాచారాలను నిషేధించి దక్షిణాచారాలను 'ప్రవర్తింపచేశా రనీ, నాటినుండీ వాటికే అధికప్రచారం ఉన్న దనీ అంటారు. వామాచారం కూడ ఈ నాటికీ నడుస్తూనే ఉంది.
“'హైందూమతంలో ఉన్న ఈ శైవాదిసంప్రదాయాలు, దేశంలో ఉన్న రాజకీయ పక్షాల వంటివి. వేరు వేరు విధానాలతో ఎన్ని పార్టీలూ, వాటికి మాత్రమే సంబంధించినవాళ్లూ ఉన్నా, దేశంలోని అత్యధికసంఖ్యాకులు ఏ పార్టీకీ చెందనివాళ్లే ఉన్నట్లు హిందువులలో కూడ చాలనుంది కేవలశైవులూ కాదు, కేవలవైష్ణవులూ కాదు, కేవలశాక్తులూ కాదు, కేవల అన్యసాంప్రదాయికులూ కాదు. ఇందుకు కారణం ఏ మనగా “కంటితో చూడడానికి శక్యం కాని సూర్యమండలాన్ని వేరు
160 హిందూమతం వేరు రంగులు పూసిన అద్దాలతో వేరు వేరు విధాలుగా చూచి నట్లు తత్త్వం ఒక్కటే అయినా మనం అల్బశక్తిమంతులం అవడంచేత దానిని వేరు వేరు రూపాలలో చూస్తున్నాం” అను భావం వాళ్లలో పూర్తిగా జీర్ణించుకొని పోయి ఉన్నది. మనకు సంబంధించి నంతవరకు పరమాత్మకు ఒక ఆకారం ఏర్పరచుకొన్నాం.” (1164590601 [0644900 1. 17). శ్రీ వివేకానందస్వామి ఒకచోట చెప్పి నట్లు - మానవుడు ఈశ్వరుణ్ణి మానవాకారంలో భావిస్తే సింహాదులు తమ ఆకారంలో భావించవచ్చును కదా? స్మార్త సంప్రదాయం
ఇది అద్వైతదర్శనాన్ని అనుసరించే వారి సంప్రదాయం. ఆ యా దేవతలను 'ప్రధానదేవతలుగా పూజించేవాళ్లు ఆ యా సంప్రదాయాలకు సంబంధించిన ఆగమాలకు, ఆ ఆగమాలలో చెప్పిన పూజావిధానాదులకు (ప్రాధాన్యం ఇస్తారు. వేదోక్తకర్శలకు, లేదా స్మృతులలో చెప్పిన కర్మలకూ అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అట్లు కాక శ్రుతి - స్పృత్యుక్తథర్మాలకి, నిత్యకర్మలకీ, యజ్ఞయాగాదులకీ ప్రాధాన్యం ఇచ్చేవారు స్మార్తసంప్రదాయులు. సైద్ధాంతికంగా ఒకే తత్త్వాన్ని అంగీకరిస్తూ, ఏ నామ - రూపాలతో ఆరాధించినా ఆ పరమార్ధకత్త్వాన్ని ఆరాధించి నట్లు విశ్వసించడం చేత ఈ సంప్రదాయంవారికి ఈ దేవత (ప్రధాన మైనది, దీనినే పూజించాలి; ఆ దేవత అప్రధాన మైనది అను ఆలోచన ఉండదు. ఆ యా సమయాలలో లలో ఉన్న ద్వేషాలను తొలగించి అన్ని మతాలూ, సకలదేవతారాధనలూ, మంచివే; ఆచరణీయములే అని బోధించారు. ఆ విధంగా శైవులు, శాక్తులు, వైష్ణవులు, సౌరులు (సూర్యుణ్ణి ఆరాధించేవారు), గాణొపత్యులు, కౌమారులు (కుమారస్వామిని ఆరాధించేవారు) మొదలైనవారి మధ్య సౌమనస్యం ఏర్పరచడంచేత శ్రీశంకరాచార్యులకు షణ్మతన్థాపనాచార్యులు అని ప్రసిద్ధి వచ్చింది. అందుచేతనే స్నార్తసంప్రదాయానుసారులు కొందరు తమ గృవాలలో పంచాయతనపూజ (శివ ,
- విష్ణు - శక్తి - ఆదిత్య - గణపతుల పూజ) నిత్యమూ చేసికొంటూ ఉంటారు.
నిజానికి మధ్యయుగంలో భక్తివాదాలకు ప్రాబల్యం వచ్చి శైవ - వైష్ణవాది
హిందూమతం 161 భేదాలు దృఢంగా నాటుకొనడానికి పూర్వం స్థితి ఈ విధంగానే ఉన్నట్లు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి కాళిదాసు కుమారసంభవంలో ఒకచోట - “మూర్తి ఒక్కటే, అది మూడు విధాలుగా బ్రహ్మా - విష్ణు - శివరూపాలలో ఏర్పడింది. అందుచేత ఒకప్పుడు విష్ణువు బ్రహ్మకూ శివునికీ మూలపురుషుడుగా చెప్పబడితే బ్రహ్మ మిగిలిన ఇద్దరికీ మూలపురుషు డనీ, శివుడు బ్రహ్మవిష్ణువులకు మూలపురుష డనీ చెప్పబడుతూంటాడు. వాస్తవంలో వాళ్లలో ఏమీ భేదం లేదు”.
“వకైవ మూర్తిర్చిభిదే త్రిధా సా సామాన్యమేషాం ప్రథమావరత్వమ్,
విష్ణోర్దరస్తస్య హరిః కదాచిత్ వేధాస్తయోస్తావపి ధాతురాద్యా-” (కు.7) అని అంటాడు. అందుచేతనే తన కావ్యాలలో ఈ ముగ్గురు మూర్తులలో ఒక్కొక్కరినీ వేరు వేరు సందర్భాలలో సృష్టి - స్థితి -సంహార కారకుడైన సరమాత్మనుగా వర్ణిస్తాడు. ఇలాంటి ఉదాహరణలు ఇతిహాసపురాణాలలోను, ఇతరప్రాచీన కావ్యాదులలోను కోకొల్లలు చూపవచ్చును. నాటినుండి నేటి వరకూ సర్వదేవతలను సమమైన భక్తితో ఆరాధించే ప్రవృత్తి జనసామాన్యంలో (ప్రబలి ఉంది. నేటి కాలంలో శ్రీరామకృష్ణ పరమహంస -- వివేకానందాదిమహాపురుషుల బోధనలు కూడ ఇందుకు ఉపకరిస్తున్నాయి.
ఆధునికయుగంలో కొన్ని సాంఘికములైన సంస్కరణలు, మతసంబద్ధ మైన నూతనభావాలు హిందూమతంలో ప్రారంభమై ప్రచారంలో ఉన్నాయి. వాటిలో - బ్రహ్మసమాజం, ఆర్యసమాజం అనేవి ప్రధాన మైనవి.
బ్రహ్మసమాజం
రామ్మోహన్ రాయ్ దీనిని స్థాపించాడు. హిందూమతంలో ఏకేశ్వరవాదాన్ని పూర్తిగా పునరుద్ధరించా అని కైస్త్వవ్రమత(ప్రభావితుదైన ఇతడు తీవ్రంగా (ప్రయత్నించాడు. ప్రతీ మతంలోను కొన్ని హ్రూన మైన మౌలిక సిద్దాంతా లుంటాయి, వాటిని మాక్రమే విశ్వసించి అనుసరించాలి అని ఆతని నిశ్చితాభిప్రాయం. అప్రధాన మైన విషయాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదు. హిందూమతం బోధించిన (ప్రధానాంశాలు ఇవి :; ఈశ్వరుడు ఒక్కడే, ఈశ్వరుడు ఎన్నడూ కూడ భూమిమీద మానవుడుగా జనించలేదు. ఆత్మ నాశరహిత మైనది. పశ్చాత్తాపంచేత, సన్నార్గమును
162 హిందూమతం అనుసరించడంచేత, ఈశ్వరునియందు దృఢవిశ్వాసపూర్వక మైన భక్తిచేత మోక్షం పొందవచ్చు. అందుచేత మనం ఈ అంశాలను మాత్రమే విశ్వసించా లనీ, తదనుసారంగా ఆచరించా లనీ రాయ్ ఉపదేశించాడు. అతడు తీర్ణయాత్రలను, యజ్ఞాలను, పూజాదివివిధకార్యకలాపలను కూడ వ్వతిరేకించాడు. ఈ విధంగా ఇతడు హిందూమతం చుట్టూ అల్లుకొని ఉన్న అనావశ్యకము లైన ఆచారాలను, విశ్వాసాలను, పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించాడు. అయితే ఈ సంప్రదాయం బెంగాలులోను చుట్టుప్రక్కలా మాత్రమే కొంతకాలం కొందరు పాశ్చాత్య విద్యావంతుల ఆదరణ పొందింది. ఆర్య సమాజం
దీనిని దయానందసరస్వతి స్థాపించాడు. వేదాలు ఈశ్వరుని ద్వారా లభించిన అతిపవిత్రములూ, సత్యమైన జ్ఞానానికి నిధానములూ అయిన [గ్రంథాలు అని ఆయన దృఢవిశ్వాసం. అందుచేత - “మళ్లీ వేదాల వైపు వెడదాం” అనేది ఆయన భారతీయులకు అందజేసిన నినాదం. వేదాల అధ్యయనం చేయడం, కనీసం ఎవరైనా వాటిని చదువుతున్నప్పుడు వినడం, వాటిలోని సత్యాన్ని ఇతరులకు బోధించడం ఇది ప్రతీ హిందువూ (ఆర్యుడూ) తప్పక చేయవలసిన ధర్మం. బ్రహ్మసమాజం వలె ఆర్భసమాజం కూడ పూర్తిగా ఏకేశ్వరవాదాన్ని నమ్ముతూన్నట్లు కనబడుతుంది; కాని “మళ్లీ వేదాలవైపు వెడదాం” అను వీరిచ్చిన నినాదాన్ని పట్టి బహుదేవతావాదాన్ని కూడ అంగీకరిస్తుందా అను సందేహం కలుగుతుంది. ఈ మతం వి[గ్రహారాధననూ, వర్హభేదాన్నీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. విధవాపునర్వివాహాన్ని అంగీకరిస్తుంది. ఇది ఇస్లాంను, కైస్తవమతాన్నీ కూడ పూర్తిగా ద్వేషిస్తుంది. హిందూమతంలోని మౌలిక సిద్ధాంతాలను మాత్రమే అంగీకరించాలి అని బోధించే పరిశుద్ధ ఆకికమతం ఆర్భసమాజమతం. ఇది నైతికమార్గానికీ, మాన వతాద్భక్చథానికీ ప్రాధాన్యం ఇస్తుంది. మానవుని ఆధ్యాత్మిక - సామాజిక - శారీరక శక్తిని వృద్ధి పొందించడం దీని ధ్యేయం.
ముస్లింలు చేసే ఆగడాలను అద్దుకొనడంలోను, వాళ్ల మతాంతరపరివర్తన యత్నాలను త్రిప్పికొట్టి హిందూమతాన్ని రక్షించడంలోను ఆర్వసమాజం చేసిన
హిందూమతం 163 సఫలయత్నం ప్రశంసనీయము. ఇది ఈ నాటికి కూడ దేశం అంతటా, విశేషించి ఉత్తరభారతంలో వృద్ధిలో ఉంది.
ఆర్యసమాజీయులు కొన్ని కర్మకలాపాలను ఆచరిస్తూంటారు. ఆదివారాల ప్రాతఃకాలం ఒక చోట కలిసి ఇవి చేస్తూంటారు. వైదికమైన అగ్నిగుండం దగ్గర ధూపం సమర్పించి ప్రార్ధనలు చేయడం, హోమాలు చేయడం, వేదమంత్రాలు పఠించడం, దయానందుని బోధల ప్రవచనం చేయడం వీటిలోని ప్రధానాంశాలు. ఎవరినో ఒకరిని మాత్రమే పురోహితునిగా గ్రహించడం దీనిలో లేదు; అందరూ సమానంగానే వ్యవహరిస్తారు.
ఇవి కాక ఇంకా ఎన్నో సంస్కరణోద్యమాలు బయలుదేరాయి. అయితే ఇవన్నీ విభిన్నశాఖ లని గాని సంప్రదాయా లని గాని భావించవలసిన పని లేదు. హిందూమతంలో ఉన్న సిద్దాంతాలనే, నూతనపద్ధకులలో, క్రొత్త భాషలలో ప్రచారం చేయడం వీటి లక్ష్యం. అలాంటి ఒక సంస్థ శ్రీరామకృష్ణురమహంస ఆశీస్సులతో ఆవిర్భవించింది. ఆయన శిష్యుడైన వివేకానందుడు దీనిని స్థాపించి దీనికి ఒక నిశ్చిత మైన స్వరూప మిచ్చినవాడు. ఈయన స్టాపించిన రామకృష్ణమళం ద్వారా అద్వైతవేదాంతాన్ని హైందవజీవనవిధానంలో ప్రధానాంగంగా చేయడం కోసం ప్రయత్నం ఈ దేశంలోనే కాక అనేకవిదేశాలలో కూడ జరుగుతూన్నది. చిన్న్మయమిష్ి మొదలైన అనేకసంస్థలు కూడ ఇలాంటి కార్యక్రమంలో అభినందనీయమైన గొప్ప ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఆధునికవిద్యావంతు లైన ఎందరో భారతీయులు హిందూమతంలోను, భారతీయతత్త్వశాస్త్రంలోను మంచి పాండిత్యం సంపాదించి, 'సంన్యాసం స్వీకరించి (అనగా కాషాయవస్తాలు ధరించి) కొందరూ, లౌకికజీవనమే గడుపుతూ కొందరూ భారతదేశంలోనే కాక అనేక ఇతర దేశాలలో కూడ హిందూమత - యోగాభ్యాస
- తత్త్వశా(స్రాదులలో ఉన్న వైశిష్ట్యాన్ని చాటి చెప్పుచూ అపార మైన సేవ చేస్తున్నారు. హిందూమతం విషయంలో పాశ్చాత్యుల ద్వారా (ప్రచారంలోనికి వచ్చిన దురభిప్రాయాలను తొలగిస్తున్నారు. భారతీయసంస్కృతికి వీరొక ఆశాజ్యోతి.
164 హిందూమతం మొదటి అనుబందం వైదికవాజ్బ్యయం సనాతనధర్మం వేదాలచేత బోధింపబడినది. వేదాలు అసంఖ్యాకములు. వీటికి ఆది గాని అంతం కాని లేదు అనగా ఒక నాడు ప్రారంభం అయాయి అని కాని కొన్నాళ్ల తరవాత అవి నశిస్తాయి అని కాని లేదు అని సాంప్రదాయికుల విశ్వాసం. కొంత కాలం ప్రచారంలో ఉన్న కొన్ని వేదశాఖలు కాలాంతరంలో అంతర్జితాలు కావచ్చును. వాటిని పరమేశ్వరుడు మరల తహాసంపన్స్ను లైన బుషులకు అందజేస్తూ ఉంటాడు. వారు వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు. అందుచేతనే రెండు వేల సంవత్సరాల క్రితం ప్రచారంలో ఉన్న కొన్ని వేదశాఖలు కూడ మన కిపుడు లభ్యములు కావు. వైదికవాజ్బయం ఎంత విస్తృత మైనదో చెపుతూ పతంజలి మహాభాష్యంలో “చారో వేదాః సాజ్లా సరహస్యాః బహుధా భిన్నాల ఏకశతమధ్వర్యు శాఖా సహ(స్రవర్మా సామవేదం; వకవింశతిధా బాహ్యచమ్. నవధాథర్వణో వేదళొ. అని వ్రాసి ఉన్నాడు. దీనిని పట్టి పతంజలి కాలం నాటికి, అనగా క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్దం నాటికి, యజుర్వేదానికి నూటజఒక్మ శాఖలు, సామవేదానికి వెయ్యి శాఖలు, బుగ్వేదానికి ఇరవై యొక్క శాఖలు, అథర్వవేదానికి తొమ్మిది శాఖలు ఉండే వని తెలుస్తూన్నది. అధ్భయనాధ్యాపనాడులు లేకపోవడంచేత పతంజలి చెప్పిన 1180 శాఖలలో ఎన్నో శాఖలు అంతరిక్షంలో అంతర్జితము లైపోగా ఇప్పుడు పది పన్నెండు శాఖలు మిగిలి ఉన్నాయి. ఆ యా (గ్రంథాలలో ఉన్న నిర్దేశాలను పట్టి 17వ శతాబ్దం నాటికి లభ్యం అవుతున్నట్లుగా ఊహించడానికి తగిన శాఖలు కూడ ఈ నాడు లభ్యం కావు. ప్రతీ వేదానికీ సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు ఉందే వని ఊహించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లభించే శాఖలకు కూడ కొన్నింటికి సంహితాదులు నాలుగూ లభిస్తున్నాయి. కొన్నింటికి ఏ ఒక్కటో రెండో మాత్రమే లభిస్తున్నాయి. ఇపుడు లభిస్తూన్నవి ఇవి ; బుగ్వేదం : (1) శాకలశాఖకు సంబంధించిన సంహిత, ఐతరేయబ్రాహ్మణం, ఐతరేయారణ్యకం, ఐతరేయ ఉపనిషత్తు (2) బాప్కలశాఖకు సంబంధంచిన కౌషీతకి
హిందూమతం 165 లేదా సాంఖ్యాయన(బ్రావ్మణం, సాంఖ్యాయన ఆరణ్యకం, కౌషీతకి ఉపనిషత్తు మాత్రం లభిస్తున్నాయి. సంహిత లభ్యం కాదు.
యజుర్వేదం : (1) కృష్ణయజర్వేదానికి సంబంధించిన తైత్తిరీయశాఖలో సంహితాదులు నాలుగూ లభిస్తున్నాయి. (2) మైత్రాయణీశాఖలో సంహితా - (బ్రాహ్మణ - ఉపనిషత్తులు (3) కఠశాఖలో సంహితా - బ్రాహ్మణ - ఉపనిషత్తులు (4) కాపిష్టలకఠశాఖలో బ్రాహ్మణం మాత్రం (5) శ్వేతాశ్వతరశాఖలో సంహితా - ఉపనిషత్తులు లభిస్తున్నాయి (6) శుక్షయజర్వేదానికి సంబంధించిన (1) కాజ్వశాఖలో సంహితాదులు నాలుగు (2) మాధ్యందినశాఖలో సంహితాదులు నాలుగు లభిస్తున్నాయి.
సామవేదం : కౌథుమశాఖకు సంబంధించిన సంహిత, ఎనిమిది బ్రావ్మాణాలు, ఉపనిషత్తు (2) రాణాయనీయశాఖకు చెందిన అత్యల్ప మైన బ్రాహ్మణభాగాలు మాత్రం లభిస్తున్నాయి (3) జైమినీయశాఖకు చెందిన సంహిత, మూడు బ్రావ్మాణాలు, ఒక ఉపనిషత్తు లభిస్తున్నాయి.
అథర్వవేదం : (1) పైప్పలాదశాఖకు చెందిన ప్రశ్నోపనిషత్తు మాత్రము (2) శౌనకశాఖకు చెందిన సంహితా - బ్రాహ్మణాలు, మూడు ఉపనిషత్తులూ లభిస్తున్నాయి.
ఈ విధంగా 99 శాతం వేదవాజ్బయం అంతరించిపోగా మిగిలిన, మన కిపుడు లభ్య మౌతున్న వాజ్యయం కూడ అఆతివిసృత మైనదే. వేదాలకు అపౌరుషేయత్వాన్ని అంగీకరించని ఇతరదేశీయపండితులు కూడ ప్రపంచకంలో ఇంత ప్రాచీన మైన విస్తృతమైన వాజ్బయం మరొకటి ఏదీ లేదని అంగీకరించారు. అకిప్రాదీనకాలంనుంచీ ఈ మాత్రం వేదవాజ్మయాన్నైనా మనం గక్షిచుకొనగలిగినా మంటే స్వార్ధవింతన అణుమాత్ర మైనా లేకుండా కేవలకర్తవ్యతాబుద్ధితో కొందరు మహాపురుషులు ఈ వేదాల పఠన - పాఠనాలను నిరంతరంగా కొనసాగించడమే ఇందుకు కారణం.
వేదాన్ని స్థూలంగా మంత్రం, బ్రావ్మాణం అని రెండు విధాలుగా విభజిస్తారు. మంత్రభాగానికి 'సంహిత' అని కూడ పేరు. యజ్ఞాదులు ఆచరించడానికి ఆవశ్యక
166 హిందూమతం మైన ద్రవ్య - దేవతాదులను గూర్చి మంత్రాలలో చెప్పబడుతుంది. ఈ ఫలం పొందా లంటే ఈ కర్మ ఆచరించాలి అని వివిధకర్మలను విధించే వేదభాగానికి (బ్రావ్మాణం అని పేరు. బ్రావ్మాణాలలో కొన్ని అలౌకికమైన రహస్యమైన విషయాలను ప్రతిపాదించే భాగా లున్నాయి. వాటిని ఇంట్లో అధ్యయనం చేయకూడదు. అరణ్యాలలో, వివిక్తప్రదేశాలలో అధ్యయనం చెయ్యాలి. అందుచేత వాటికి ఆరణ్యకాలు అని పేరు. ఆరణ్యకాలలో అధ్యాత్మవిద్యాప్రధాన మైన భాగా లున్నాయి. వాటికి ఉపనిషత్తులు అని పేరు. ఇవి వేదాల చివర ఉండడంచేత వేదాంతాలు అని కూడ పేరు.
బుగ్వేదసంహితలో ఛందోబద్ధ మైన మంత్రా లుంటాయి. వాటికి “బుక్” లు అని పేరు. సామవేదంలో కూడ ఛందోబద్ధమైన బుక్‌లు ఉంటాయి. వాటిని ఒక పద్ధతి ప్రకారం గానం చేస్తారు. యజుర్వేదం గద్యరూపంలో ఉంటుంది. వేదాలలోని సంహితా - బ్రాహ్మణభాగాలు చాలావరకు ఆ యా కర్మలను ఆచరించడానికి వినియోగించబడతాయి. అందుచేత ఆ వేదభాగానికి కర్మకాండ అనీ అధ్యాత్మవిద్యాప్రధానా లైన ఉపనిషత్తులకు జ్ఞానకాండ అనీ పేర్లు.
వేదాంగాలు : వేదాలు అపొరుషేయాలు. వాటి ఉచ్చారణా విధానమూ, అర్థమూ తెలుపదానికీ, ఆ యా కర్మలను ఏ విధంగా ఆచరించాలో, ఎప్పు దెప్పుడు ఆచరించాలో బోధించదానికీ కొన్ని (గ్రంథాలు మహామేధావులూ తపుసంపన్నులూ అయిన బుషులు రచించినవి ఆరు ఉన్నాయి. వీటికి వేదాంగాలు అని పేరు. ఇవన్నీ పౌరుషేయాలు. వేదాలలోనే అక్కడక్కడ ఉన్న సూచనలను అనుసరించి పురుషులచే రచింపబడినవి గాన ఇవి పొరుషేయాలు.
- శిక్ష; ఇది స్వరాలు (అచ్చులు), వ్యంజనాలు (హల్లులు) అను రెండు విధా లైన వర్దాలను ఏ విధంగా ఉచ్చరించాలో బోధించే శాస్త్రం. 'హస్వ-దీర్హ ఆ ఫ్లుత - ఉదాత్త - అనుదాత్త - స్పరితాదిభేదాలు స్వరాలకు ఉంటాయి. వీటితో కూడిన వర్థాల ఉచ్చారణలో ఏ మాత్రం వైకల్యం కలిగినా ఆ మంత్రాలు నిరర్ధకాలు. నిరర్ధకాలే కాక ్రత్యవాయం కూడ కలిగిస్తాయి. ఉచ్చారణ మాత్రంచేత కూడ మంత్రాలకు శక్తి ఉంటుంది. అర్ధం కూడ తెలిసి ఉచ్చరిస్తే చెప్ప నవసరమే లేదు.
హిందూమతం 167 మంటత్రం శక్తిమంతంగా ఉండా లంటే ఒక్క మాత్ర కూడ పొల్లుపోకుండా, ఒక్క అక్షరం కూడ అటూ ఇటూ కాకుండా చదవాలి.ఆ విధానాన్ని బోధించు పాణినీయ శిక్ష మొదలైన శిక్షాగ్రంథాలు అనేకం ఉన్నాయి.వేదాలలోని (ప్రతీశాఖకు సంబంధించిన (ప్రాతిశాఖ్యలు అను (గ్రంథాలలో కూడ శిక్షలకు సంబంధించిన అనేకవిషయా లున్నాయి.
-
వ్యాకరణం : పదాలను ప్రకృతు లనీ, ప్రత్యయా లనీ వ్యాకరించి (విడ గొట్టి) పదాల సాధుత్వాసాధుత్వాలను బోధించే శాస్త్రం వ్యాకరణశాస్త్రం. పాణిని అష్టాధ్యాయి అను సూత్రరూప మైన [గ్రంథంలో వైదికపదాలకు లౌకికపదాలకు కూడ సంబంధించిన వ్యాకృతి చేసి ఉన్నాడు. ఈ సూత్రాలూ కాత్యాయనుడు వ్రాసిన వార్తికాలు,ఈ రెండింటికీ కలిపి పతంజలి వ్రాసిన విస్తృతవ్యాఖ్యానం మహాభాప్యం. ఈ మునిత్రయరచితవ్యాకరణమే ఈ నాడు బహుళప్రచారంలో ఉన్న వ్యాకరణం. " పాణినికంటె పూర్వం కూడ కొన్ని వ్యాకరణా లున్నా ఈ వ్యాకరణం వచ్చిన తరువాత ఇదే ఈ నాడు వేదాంగవ్యాకరణంగా పరిగణించబడుతూన్నది. పాణిని క్రీ.శ. ఏడవ శతాబ్దం ప్రాంతంవాడు. అంతకంటె కూడ ్రాచీను డని కొందరి అభిప్రాయం.
-
నిరుక్తం : పాణినికంటె కూడ పూర్వం యాస్కుడు అను ముని నిఘంటు అను గ్రంథం రచించాడు.దీనిలో వేదంలో ఉన్న కొన్ని పదాలు,సమానార్థకపదాలు, సంగ్రహించి వాటి నిర్వచనం చూపి ఉన్నాడు. ప్రస్తూనుప్రసక్తంగా కొన్ని బుక్కులను వ్యాఖ్యానించి ఎన్నో ఇతరవిషయాలు కూడ చర్చించి ఉన్నాడు. దీనికి నిరుక్తం అని పేరు. వేదార్ధం తెలుసుకొనడానికి ఈనాటికి కూడ దీనికి చాల ప్రధాన్యం ఉంది.
-
ఛందస్సు : ఏ మంత్రం ఏ ఛందస్సులో ఉందో, దానికి (మంత్రానికి) ఏది దేవతయో తెలిసికొనకుండా,మంత్రాలను వినియోగిస్తూ చేసిన కర్మ నిరర్ధకం అవుతుం దని శాస్త్రంలో చెప్పబడింది. అందుచేత వైదికచ్చందస్సులను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని పింగళాచార్యుడు ఎనిమిది అధ్యాయాలలో ఛందోవివృతి రచించాడు. పింగళాచార్యుడు పాణిని సోదరు డని ప్రసిద్ధి.
-
జ్యోతిషం : కొన్ని నక్షత్రాలలోను తిథులలోను బుతువులలోను ఆ యా కర్మలు చెయ్యాలి అని విధింపబడి ఉంది, జ్యోతిస్సు అనగా రవి-చంద్ర-నక్షత్రాది
160 హిందూమతం రూప మైన జ్యోతిస్సు. ఆ జ్యోతిస్సులను పట్టి కాలనిర్ణయం చేసే శాస్త్రం జ్యోతిః శాస్త్రంఆ యా కర్మలు చేయడానికి తగిన కాలాలను నిర్ణయించడంకోసం ఆదిత్య- గర్జాదులు నిర్మించిన ఈ శాస్త్రం వేదాంగ మైనది.
- కల్పం : ఆ యా కర్మలు ఏ విధంగా అనుష్టించాలో చెప్పే శాస్త్రం కల్పం. ఇది సూత్రరూపంలో ఉండడంచేత దీనికి కల్చ్పసూత్రం అని పేరు.యజ్ఞాలలో హోత అను బుత్విక్క్ బుగ్వేదమంత్రాలు పఠిస్తూ హొత్రం చేస్తాడు. (అతడు చేసే పనికి హౌత్రం అని పేరు) ఉద్దాత అను బుత్విక్కు సామగానం చేస్తూ బెద్దాత్రం చేస్తాడు. అధ్వర్యువు అను బుత్విక్కు యజుర్వేదమంత్రసాహాయ్యంతో ఆధ్వర్యవం చేస్తాడు. అశ్చ్వలాయన-శంఖభాయనాదులు రచించిన కల్చ్పసూత్రాలు హొత్ర (ప్రయోగానికి సంబంధించినవి. బోధాయన -ఆపస్తంబ-కాత్యాయనాదులు రచించిన సూత్రాలు ఆధ్వర్యవప్రయోగానికి సంబంధించినవి. లాట్యాయన-'ద్రాహ్యాయణాది రచిత సూత్రాలు బెద్దాత్ర ప్రయోగానికి సంబంధించినవి. ఇవన్నీ యజ్ఞాలు చేసే విధానాన్ని బోధించేవి గాన వీటికి శ్రాతసూత్రా లని పేరు. ఇవి కాక ఉపనయన వివావాదులు చేసే విధానాలను బోధించే సూత్రా లున్నాయి. వాటికి గృహ్యసూత్రాలని పేరు.
ఈ ఆరు వేదాంగాలలో మొదటి నాలుగు వైదిక - శబ్దార్థస్వరూపజ్ఞానానికి ఉపయోగించేవి. మిగిలిన రెండు ఆ యా కర్మలు ఎలా చెయ్యాలో బోధించేవి.
ధర్మశాస్త్రం : వేదోక్త మైన ధర్మాలను బోధించడానికి ఉపయోగించే గ్రంథాలు ధర్మశాస్త్రగ్రంఛాలు. వీటిని వేదార్థజ్ఞానసంపన్ను లైన మహాపురుషులు ఆ యా కాలాలలో రచించారు. మను-యాజ్ఞవల్క్య-విష్ణ-యమ-అంగిరస్-వసిష్ట-దక్ష- సంవర్త-శాతాతప-పరాశర-గౌతమ-శంఖ-లిఖిత-హారీత-ఆపస్తంబ -ఉశనస్- వ్యాస -కాత్యాయన -బృహస్పతి-దేవల-నారద-పైఠీనసి మొదలైనవారు రచించిన ధర్మ్శశాస్త్రగ్రంథాలు ప్రసిద్ద మైనవి.
వేదభాష్యాలు: వేదాలలో అనేకవిషయాలు చెప్పబడ్డాయి. వ్యాఖ్యానాల సాహాయ్యం లేకుండా వేదాలను అర్ధం చేసికొనడం ఎవరికీ శక్యం కాదు. అందుచేత అతిప్రాచీనకాలంనుంచీ కూడ వేదాలకు వేదాంగాల సాహాయ్యంతో మహాపండితులు
హిందూమతం 169 వ్రాసిన అనేకభాష్యాలు ప్రచారంలో ఉన్నని.చాలవరకు ఈ వ్యాఖ్యానా లన్నీ వేదాలకు కర్మకాండప్రతిపాదనపరంగా వ్రాసినవి. ఈ వ్యాఖ్యానాలలో ఈనాడు బహుళ ప్రచారంలో ఉన్నవి సాయణాచార్యవిరచితవేదభాష్యాలు.
శ్రీఆనందతీర్జులు,(ద్వైతమతాచార్యులైన శ్రీ మధ్వాచార్యులు) బుగ్వేదంలోని కొన్ని సూక్తాలను ఆధిభౌతిక-ఆధిదైవిక - అధ్యాత్మికార్థాలతో మూడు విధాలుగా వ్యాఖ్యానించారు. అందుచేతనే శ్రీజయతీర్ణులోబుగర్థశ్చ త్రివిధో భవతి-ఏకస్తావత్ 'సిద్ద్ధాగ్య్యాదిరూహ; అపరస్తదన్తర్గతే శ్వరలక్షణప అన్యో£_ధ్యాత్మరూపః. తత్తితయపరం చేదం భాష్యమ్”అని అన్నారు.
వేదాలూ, వేదాంగాలూ, వేదభాష్యాలూ,ధర్మశాస్తాలూ వీటి కన్నింటికీ కలిసి వైదికవాజ్బ్యయం అని పేరు. ఈ సంక్షిప్తవర్జ్దనను పట్టి కూడ ఈవాబ్బయం ఎంత విస్తృత మైనదో సుధీవరులు ఊహించవచ్చును.
1/0 హిందూమతం రందవ అనుబంధం హిందూసంస్మారాలు
ఒక వస్తువులో ఉన్న మాలిన్యాన్ని తొలగించి పరిశుద్ధం చేయడానికి సంస్కారం అని పేరు.అలా సంస్కారం చేసే విధానానికి కూడ సంస్కారం అనే పేరు. పుట్టినది మొదలు మరణించినంతవరకు మానవునికి చేయవలసిన కొన్ని సంస్కారాలు ధర్భశాస్త్ర (గ్రంథాలలో చెప్పబడ్డాయి. ఈ సంస్కారాల సంఖ్య విషయంలోను వీటి క్రమం విషయంలోను ధర్మశాస్త్రగ్రంథాలలో అభిప్రాయభేదా లున్నాయి. గౌతమధర్మ సూత్రంలో(40) నలభై సంస్కారాల పేర్లు చెప్పబడి ఉన్నాయి.వీటిలో కొన్ని మానవుడు ఆ యా వయస్సులలో ఉన్నప్పుడు చేయవలసినవి,కొన్ని గృహస్టాదులు నిత్యము చేయవలసినవి.కొన్ని అప్పుడప్పుడు చేయదగిన యజ్ఞాదులు. గౌతమధర్మసూత్రంలో చెప్పిన సంస్కారాల పేర్లు ఇవి - (1) గర్భాధానం (2) పుంసవనం (3) సీమంతోన్న్మయనం (4) జాతకర్మ (5) నామకరణం (6) అన్నప్రాశనం (7) చౌలం (8) ఉపనయనం (9-12) నాలుగు వేదవ్రతాలు (18) స్నానం (14) వివాహం (15-18) దేవయజ్ఞ-పితృయజ్ఞ్జ- మనుషయజ్జ-భూతయజ్ఞ- బ్రహ్మయజ్ఞులు, (19) అష్టకా(శ్రాద్ధం (20) పార్వణశ్రాద్ధం (21) (శ్రావణి (22) ఆగ్రహాయణి (28) చైత్రి (24) ఆశ్వయుజి (25) కార్తికి (ఈ ఏడూ పాకయజ్ఞసంస్థలు) (26) అగ్న్యాధేయం (27) అగ్నిహోత్రం (28,29) దర్శ పూర్ణమాసములు (30) ఆగ్రయణం (31) చాతుర్మాస్యలు (32) నిరూఢపశుబంధం (338) సొ(త్రామణి (ఈ ఏదూ హవిర్యజ్ఞసంస్థలు), (84) అగ్నిష్టోమం (85) అత్యగ్నిష్టామం (36) ఉక్టృం (37) షోడశి (38) వాజపేయం (39) అతిరాత్రం (40) ఆప్తోర్యామం (ఈ ఏడూ సోమసంస్థలు). వీటిలో (ప్రధాన మైన సంస్కారాలు పది.
1 గర్భాధానము 6. అన్నప్రాశనము
-
పుంసవనము 7. చూడాకరణము
-
సీమంతోన్నయనము 8. ఉపనయనము
హిందూమతం 1/71
-
జాతకర్మ 9, సమావర్తనము
-
నామకరణము ॥ 10. వివాహము
-
గర్భాధానము : దీనికి నిషేకము అని నామాంతరము.'గర్భమును ఉంచుట అని దీని అర్ధం.“ఇది భార్యలో గాని భర్తలో గాని ఎలాంటి దుష్టభావాలు లేని మంచి సమయంలో ఎంతో జాగరూకతతో చేయదగిన కార్యము.కేవలము సుఖభోగంకోసం కాక మానవశరీరాన్ని పుట్టించగలిగిన దివ్య మైన శక్తిని ఉప యోగించుకొనడంకోసం చేసే కార్యం. పవిత్రమంత్రపకనంతో భర్తఈమె గర్భంలో పుత్రుడు ప్రవేశించుగాక"అని ప్రార్ధిస్తాడు. (సనాతనధర్మం. పేజి. 106)
. 2. పుంసవనం : మొదటి రెండు మాసాలలో,తల్లి గర్భంలో అన్నమయ- ప్రాణ మయకోశాలు ఏర్పడతాయి.పవిత్ర మైన మంత్రాలతో “గర్భంలో పుత్రుడు ఏర్పడాలి” అని ప్రార్థిస్తూ చేసే సంస్కారం పుంసవనం.ఇది మూడవ మాసంలో చేయబడు తుంది.
- సీమంతోన్నయనం : సీమంతోన్నయన మనగా మంత్రహనపూర్వకముగా, శాస్త్రంలో చెప్పిన వస్తువును ఉపయోగించి తల్లి తలపై పాపిడ దిద్దడం అని అర్థం. ఇది ఏడవ మాసంలో చేయబడుతుంది. ఇది తల్లికి ఎట్టి చెడుగులూ కలగకుండా, దోషాలూ తగలకుండా కాపాడుతూ గర్భస్థశిశువు కోశాలు యుక్తరూపంలో ఏర్పడడానికి ఉపయోగించే సంస్కారం.
ఈ మూదు సంస్కారాలు తల్లికీ గర్భస్థశిశువుకూ కూడ రక్షణ ఇస్తాయి.
4 జాతకర్మ: పుత్రుడు పుట్టిన వెంటనే తండ్రి వానికి దీర్చాయురారోగ్యాదులు, సద్బుద్ధి,జ్ఞానము కలగా లని కోరుతూ చేసే సంస్కారం జాతకర్మ.
-
నామకరణం : శిశువునకు పదవ రోజున గాని, పన్నెండవ రోజున గాని పదకొండవ రోజున గాని తగిన పేరు పెట్టాలి. ఇది నామకరణసంస్మ్కారం,
-
అన్నప్రాశనం : ఆరవ మాసంలో అంతవరకూ పాలు మొద లైన ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసికొంటూన్న శిశువుకు ఘనపదార్ధం తినిపించ బడుతుంది.ఇది అన్నప్రాశనసంస్మారం.
172 హిందూమతం
- చూడాకరణం : మొదటి సంవత్సరంలో కాని,మూడవ సంవత్సరంలో కాని కేశఖండనం చేయబడుతుంది.క్షత్రియులలో ఐదవ సంవత్సరంలోను వైశ్యులలో ఏడవ సంవత్సరంలోను చేయబడుతుంది.
8 ఉపనయనం : ఉపనయనం అనగా విద్యాభ్యాసంకోసం బాలుణ్ణి ఆచార్యుని దగ్గరికి చేర్చడం.ఇది దీక్షాపూర్వకంగా చేసే సంస్కారం.ఇది బ్రాహ్మణబాలునికి ఐదన సంవత్సరంలోను,క్షత్రియునకు ఆరవ సంవత్సరంలోను,వైశ్యునికి ఎనిమిదవ సంవత్సరంలోను చేయ్యాలి అని మనుస్మృతిలో చెప్పబడింది. యాజ్ఞవల్క్య స్మృతిలో వరసగా ఎనిమిది,పదకొండు,పన్నెండు సంవత్సరాల వయస్సు చెప్పబడింది. అయితే ఆ వయస్సులలో ఏ కారణంచేత నైనా శక్యం కానప్పుడు వీళ్లకు వరుసగా 16,22, 24 సంవత్సరాల వయస్సు దాటకుండా చెయ్యాలి. “ఉపనయనం చేసిన వటువు కౌపీనం దానిపై నూతనవస్తం, (బ్రాహ్మణుడు ముంజగడ్డితో అల్లిన త్రాడుతో మూడు పేట్ల నడుముత్రాడు, క్షత్రియుడు, ధనస్సు నారి నడుముత్రాడు, వైశ్యుడు, ఊలు నడుముత్రాడు ధరించాలి. వర్దాన్ని పట్టి కృష్ణాజినం కాని గోచర్మ గాని ధరించాలి (ఈ కాలంలో అన్ని వర్దాలవాళ్లూ కృష్ణాజినమే ధరిస్తున్నారు). తరవాత యజ్ఞోపవీతం ధరించాలి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందిన తరువాత ఆచార్యుడు పవిత్ర మైన మంత్రోదకం వటువు శిరస్సుమీద చల్లుతాడు ... పిమ్మట గాయత్రీమంత్రోపదేశం చేయబడుతుంది. చేతిలో వర్ణభేదాన్ని పట్టి వటువు వేరు వేరు దండాలు ధరిస్తాడు.
“ఈ సంస్కారం వటువునకు ఆధ్యాత్మికజన్మ వంటిది. దీనిలోని అన్ని అంగాలకు ప్రత్యేక మైన వైశిష్ట్రం ఉంటుంది.కౌపీనం ఆ బ్రహ్మచారి లింగభేదా తీతు డని సూచిస్తుంది. అతడు పూర్తిగా బ్రహ్మచర్యాన్ని (స్రీసంబంధరాహిత్యాన్ని) పాటించాలి. అతని నడుముకు కట్టిన మూడు పేటల త్రాడు అతడు సంహితా- బ్రాహ్మణ- ఉపనిషత్తుల అధ్యయనం చెయ్యా లని సూచిస్తుంది.కృష్ణాజినం నిరాడంబర మైన తాఫసజీవనాన్ని గడపా లని సూచిస్తుంది. దగ్గరగా ముడిపెట్టిన మూడు దారాలతో పేనిన యజ్ఞోపవీతం జగత్తులో ఉన్న కొన్ని ప్రయాలకి- సూచకం. ఆత్మ యొక్క
సత్, చిత్, ఆనందము అను త్రివిధస్వరూపం,సత్త్వ-రజస్-తమస్-రూప మైన త్రివిధప్రకృతి స్వరూపం, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు అను మూర్తిత్రయం, జీవాత్మకు
హిందూమతం 1/3 సంబంధించిన జ్ఞానశక్తి -ఇచ్భాశక్తి-క్రియాశక్తి అను శక్తితయమూ,భూ-భువర్- స్వర్ అను లోకత్రయము,శరీరంమనస్సు,మాట అను త్రయమూ,ఇలాంటి అన్ని త్రయాంలకీ ప్రతీకం. ఈ.యజ్లోపవీతం ధరించినవాడు 'మనస్స్ఫు,మాట,దేహము”' ఈ మూడింటినీ తన అధీనంలో ఉంచుకోవాలొ. (సనాతనధర్మం. పేజి. 110)
9,సమావర్తనం:'బ్రహ్మఅనగా వేదం. వేదాధ్యయనం కోసం చేసిన వ్రతానికి కూడ “బ్రహ్మ'అని పేరు.ఆ వ్రతాన్ని (బ్రహ్మను) ఆచరించినవాడు బ్రహ్మాచారి. బ్రహ్మచారి వేదాధ్యయనం పూర్తి అయిన తరువాత యధాశక్తిగా గురువుకు గురుదక్షిణ సమర్పించి ఆతని అనుజ్ఞ పొంది ఇంటికి వచ్చి సమావర్తనవ్రతం చేసుకోవాలి.దీనికే “'స్నానం'” లేదా “స్నాతకవ్రతం' అని కూడ పేరు.దీనితో బ్రహ్మచర్యవ్రతం పూర్తి అయి వివాహార్దత్ర లభిస్తుంది.
- వివాహం : స్నాతకం అయిన తరువాత తగిన వంశంనుండి కన్యకను ఆమె తండ్రిని అభ్యర్థించి వివాహ మాడాలి.వివాహం చాల ప్రధాన మైన సంస్కారం. ఉపనయనంతో బ్రహ్మచర్యాశమం ప్రారంభం అవుతే వివాహంతో గృహస్థాశ్రమం ప్రారంభం అవుతుంది. (చూ. గృహస్థాశ్రమం). వివాహసంబంధం అచ్చేద్యమైన దని హిందువుల దృఢవిశ్వాసం.ఈ యుగంలో కూడ దాదాపు అరవై సంవత్సరాల క్రితం వరకు హిందువులలో దీని పవిత్రత్వాన్ని ఎంతో శ్రద్ధతో,పట్టుదలతో కాపాడు కొంటూ రావడం జరిగింది. స్వేచ్భానుసారం వివాహవిచ్చేదానికి అనుమతి నిస్తూ నియమాలను (చట్టాలను) రూపొందించడంతో హిందువుల వివాహవ్యవస్థ చిన్నాభిన్న మైపోతూన్నది. అనతికాలంలో ఇది ఏలాంటి సాంఖిక-సామాజికదుప్పరిణామాలకి దారితీయనున్నదో భగవంతునికే తెలియాలి.
“వాసాంసి జీర్ణాని యథా విహాయ” అను గీతాచార్యోపదేశాన్ని పవిత్రదాంపత్య బంధం విషయంలో కూడ ్రవర్తింపజేశారు మన భారతప్రభుత్వంవారు!
జైన-బౌద్ధాల ఆవిర్భావం క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో ఉత్తరభారతం
క్రీస్తుకు పూర్వం ఆరవ శతాబ్దంలో ఉత్తరభారతదేశం అంతా అనేక మైన చిన్న చిన్న స్వతంత్రరాజ్యాలుగా విభక్తమై ఉందేది.మొత్తం దేశా న్నంతనీ ఒక్క అధికారం క్రిందికి తీసికొని రాగలిగిన సామ్రాజ్యం ఏదీ ఉందేది కాదు.గౌతమ బుద్దుడు ఆవిర్భవించడానికి కొంచెం ముందు కాలంలో పదహారు (16) రాజ్యా లుందే వని బౌద్ధగ్రంథాల ద్వారా తెలుస్తూన్నది. అంగ్యమగధ,కాళి, కోసల, వృజ(వజ్జి), మల్ల,చేది,వత్స(వంశు, కుర్కుపాంచాల, మత్స్య, శూరసేన, అశ్వక, అవంతి,గంధార కంబోజ అనేవి ఈ పదహారు రాజ్యాలు.ఇలాంటి రాజ్యా లున్నట్లు పురాణాలవల్ల, జైనవాజ్బ్యయంవల్లా కూడ తెలుస్తూన్నది. ఈ రాజ్యాలే కాకుండా స్వయంపాలకా లైన (240౧020249) కొన్ని వంశాలు లేదా సంఘాలు (61115) ఉండే వని బౌద్దగ్రంథాల ద్వారా తెలుస్తూన్నది. అవి రాజు పాలనలో లేని సంఘరాజ్యాలు (గల4010టు 0౯ ౦%822001641). అవి-కపిలవస్తువుకు చెందిన శాక్యులు, పవ-కుశీనరాలకు చెందిన మల్లులు, వైశాలికి చెందిన లిచ్చవులు, మిథిలకు చెందిన విదేహులు, రామగమకు చెందిన కోలియులు, అల్లకప్పకు చెందిన బులీలు, కేశకుత్తకు చెందిన కలములు, పిప్పలవనానికి బెందిన మోరియులుభగ్గలు ఇలాంటి వంశాలు.రాజు పాలనలో లేని దాజ్యాలలో శాక్యరాజ్యం (ప్రధాన మైనది. ఈ వంశంలో గౌతమబుద్ధుడు జన్మించడంచేత దీనికి ప్రాధాన్యం వచ్చినా రాజకీయంగా ఇది అంత బలీయమైన రాజ్యం కాదు” (౧౧౪ 4౭౬6 051%0ల121 ౮౧197. 1.16). ఇక్ష్వాకువు పుట్టిన సూర్యవంశానికి చెందినవార మనీ,పూర్వం కోసలదేశం తమ స్వదేశం అనీ శాక్యులు చెప్పుకొనేవారు. ఈ శాక్యులు ఎనఖైవేల కుటుంబాల (దాదాపు ఐదు లక్షల జనం) వాళ్లు. శాక్యరాజ్యానికి - ఉత్తరాన హిమాలయం,తూర్చ్పున రోహిణీనది,పడమట-- దక్షిణాలలో రాప్తీ సరిహద్దులు.
క్రీ.పూ. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ అన్ని రాజ్యాలలో తొలి సారిగా మగధరాజ్యం సర్వూధిపత్యాన్ని సంపాదించదానికి ప్రయత్నించి సఫలం అయింది.
జైన - బౌద్దాల ఆవిర్భావం 175 దక్షిణభారతా న్నంతనీ ఒక అధికారం క్రిందికి తీసికొనిరావడానికై మగధరాజ్యం ఒక (ప్రక్కప్రయత్నంచేస్తూండగా సరి యైన రక్షణ లేని ఆగ్నేయ(ఉత్తర-పదమటి) భాగాలమీద పర్షియన్లు మొదలైన విదేశీయులు దాడులు చేస్తూందే వారు. ఈ విధంగా ఏ రాజ్యాని కా రాజ్యం ప్రక్క రాజ్యాన్ని ఆక్రమించి తన ఆధిపత్యం విస్తరింపచేసికొనడంకోసం ప్రయత్నిస్తూ ఎన్నో చిన్న చిన్న రాజ్యా లుండడమూ, పరస్పరయుద్దాలూ,వైదేశికుల దండయాత్రలూ ఇవన్నీ ఆ కాలంలో రాజకీయ మైన అస్థిరతకీ, సామాజికవిక్షోభానికీ దారి తీశాయి. భావప్రజ్వలనయుగం 48౭6 046048%06అయిలు!
పరిస్థితులలోని ఇలాంటి అస్తవ్యస్తతకు ఫలితంగా ఆనాటి ప్రజలలో ఒక విధమైన విపరీతమనస్తత్త్వం (ప్రబలింది.సాంప్రదాయికంగా వస్తూన్న నియ మాలనూ,ఆచారాలనూ గూర్చి జనం ప్రశ్నించడం ప్రారంభించారు.ఎంతో కాలం నుంచి అంగీకరిస్తూ వచ్చిన జీవితపు విలువలకూ,జీవనవిధానాలకు ఎదురు తిరిగి వాటిని ధిక్కరించడం ప్రారంభించారు.దీని కంతకీ ఫలితంగా ఉపనిషత్తుల చివరి కాలానికీ మహావీర-గౌతమబుద్దులు ఆవిర్భవించడానికి సుమారు ఒక శతాబ్దానికి ముందు కాలానికీ మధ్య ఉన్న కాలంలో కొన్ని తాత్త్వికసిద్ధాంతాలు, తత్త్యాభాససిద్దాంతాలు (1803900006 ఖర క96460- [0500016 శం0169) బయలుదేరి పాతుకొనిపోయాయి (1/64 జక సమింంంస్సు. 364టమలయి, 1.85) ఈ కాలానికి బెల్వాల్మర్ భావప్రజ్వలనయుగం (426 0౯90201 6ల00అ0 అని పేరు పెట్టాదు. బుద్ధుడు తన కాలంలో ప్రచారంలో ఉన్న సంప్రదాయవిరుద్దా లైన (62) అరవైరెండు వాదాలను,సిద్దాంతాలను,చిన్న మతాలను సమీక్షించా డని బౌద్ధగ్రంథాలవల్ల తెలుస్తూన్నది.మహావీరునికి ఇలాంటి సిద్ధాంతాలు (363) మూడువందల అరవైమూడు తెలియు నని జైనగ్రంథధాలు చెప్పుచున్నాయి. వీటిలో కొన్నింటి పేర్లూ బుద్భనికి తెలిసినవాటి పేర్లూ సమంగా ఉన్నాయి. దీనిని పట్టి మహావీరుడు,బుద్దుడు అవిర్భవించేనాటికి ఎన్నో సిద్దాంతాలు, వాదాలు,విశ్వాసాలూ ప్రచారంలో ఉన్నాయను విషయం స్పష్టం అవుతుంది. మహావీరునికి,బుద్ధునికీ సమకాలికులైన కొందరు సంప్రదాయవిరోధుల వాదాలు ఈ కాలానికి విశిష్టలక్షణ మైన భావప్రజ్వలనానికి ఉదాహరణలుగా గ్రహించవచ్చు.
176 జైన - బౌద్ధాల ఆవిర్భావం పురానకస్సపు డనువాని వాదం ఈ క్రింది విధంగా ఉందే దని సామాన్యఫల సుత్తంలో చెప్పబడింది.
“ఎవడైనా ఒక పని చేసినా లేక చేయించినా,ఎవదైనా ఖండించినా లేదా ఇతరునిచేత ఖండింపచేసినా వానికీ...ఎవడైనా,ఇతరులకు దుఃఖం కాని పీడ కాని కలిగించినా, వానికీ... ఎవడైనా జీవించి ఉన్న ప్రాణిని చంపినా వానికీ ... ఎవడైనా ఇండ్లకు కన్నం వేసినా వానికీ ... ఎవ డైనా అబద్దా లాడినా వానికీ, ఎలాంటి అపరాధదోషమూ లేదు. ఎవడైనా క్షురం వలె వాడి యైన అగ్రభాగం గల చక్రంతో లోకంలో ఉన్న ప్రాణుల నన్నింటినీ ఖండించి ప్రోగులు పెట్టినా,ఒక మాంసం ముద్దగా చేసినా దానివల్ల ఏ విధ మైన అపరాధమూ చేసినట్లు కాదుపాపం ఏ మాత్రమూ పెరగదు. అందరినీ చంపుతూ,నరుకుతూ,నరికిస్తూ గంగ దక్షిణతీరాన నడుచుకొంటూ వెళ్లినా దానివల్ల అపరాధం (పాపం) ఏదీ కలగదు;ఏ మాత్రమూ పాపం పెరగదు. దానాలు చేస్తూ బహుమతులు ఇస్తూ ఇప్పిస్తూయజ్ఞాలు చేస్తూ చేయిస్తూ ఎవడైనా గంగ ఉత్తరదిక్కున నడిచి వెళ్లినా వానికి పుణ్యం కలగద్యుపుణ్యం పెరగదు. బెదార్యంలో గాని,ఆత్మనిగ్రహంలో గాని,ఇంద్రియని[గ్రహంలో గాని,సత్యభాషణంలో గాని పుణ్యం ఉండదు;దానికి పెరుగుదల ఉండదు”.
సాంఖ్యంలోను, ఉపనిషత్తులలోను చెప్పిన,ఆత్మకు కర్షృత్వం లేదు అను సిద్దాంతాన్ని ఎంతవరకూ లాగవచ్చునో చూడడానికి ఇదొక ఉదాహరణం. ఈ “అకారకవాదానికే' విరుద్ధంగా బుద్దుడు పటిచ్చసముప్పాదవాదం (ప్రతీత్య సముత్పాద వాదం) ప్రతిపాదించాడు.
అజితకేశకంబలి అను మరొక తాత్త్వికుడు వైదిక మైన యజ్ఞాలను ఈ విధంగా వ్యతిరేకించాడు.
“బిచ్చం పెట్టడం అంటూూయజ్ఞం చేయడం అంటూ,సమర్చించడం అంటూ ఏమీ లేదు.మంచి పనులకు కాని చెడ్డ పనులకు గాని ఏమీ ఫలితం ఉండదు. ఇహలోకమూ పరలోకమూ అంటూ ఏదీ లేదు.తండ్రీ లేద్రుతల్లీ లేదుతలిదం(్రులు లేకుండా పుట్టినవా డంటూ ఎవడూ లేడు. ఈ లోకంలో తాపసులు అంటూ
జైన - బౌద్దాల ఆవిర్భావం 177 లేదా (బ్రాహ్మణు లంటూ అత్యుత్తమలక్ష్యాన్ని చేరినవా ళ్లంటూ ఎవరూ లేరు.ఎట్టి దోషాలూ లేకుండా నడుస్తూాతమంతట తాముగా ఏదో కనిపెట్టి, సాక్షాత్మరించుకొని, ఇహలోకంలోను పరలోకంలోను ఇతరులకు జ్ఞానం పంచి పెట్టేవా శ్లంటూ ఎవరూ లేరు. మానవశరీరం నాలుగు భూతాల ద్వారా నిర్మించబడింది.మానవుడు మరణించి నప్పుడు వాని శరీరంలోని పార్థివభాగం మట్టిలో కలిసిపోతుంది; ద్రవ పదార్ధం నీటిలో కలిసిపోతుంది;వేడి నిప్పులో కలిసిపోతుంది; గాలిభాగం గాలిలో కలిసిపోతుంది; ఇంద్రియాలు ఆకాశంలో కలిసిపోతాయి. నలుగురు వాహకులు... శవవాహికమీద ఉన్న ఐదవవాని శరీరాన్ని దూరంగా తీసికొనిపోయి శృశానానికి చేరుస్తారుమనుష్యులు మంచి మాటలు పలుకుతారు, అక్కడ వాని ఎముకలు తెల్లగా అయిపోతాయ్యివాడికి సమర్పించిన వన్నీ భస్మం అవుతాయి.దానాలు చేయా లనేది మూర్చులు చెప్పే మాట.దానాలు చేస్తే పుణ్యం వస్తుం దనేది పూర్తి అబిద్ధం. అర్ధం లేని మాట. మూర్చులైనా,బుద్ధిమంతు లైనా అందరూ కూడ శరీరం నశించగానే నశిస్తారు. చచ్చిన తరవాత ఎవ్వదూ ఉండడు”.
ఆ కాలానికి చెందిన వాదాలు ఎంత సూక్ష్మంగా ఉందేవో,వాటి ప్రభావం బుద్దుని సిద్ద్ధాంతాలమీదా,మహావీరుని సిద్దాంతాలమీదా ఎంతగా ప్రసరించిందో సంజయచేలత్తిపుత్తుని ఈ వాక్యాలవల్ల స్పష్టం అవుతుంది :
“పరలోకం ఉందా అని నువ్వు నన్నడిగితే-సర్కేఉంది అని నేను అనుకొంటే నేను అలా చెపుతాన్నుకాని నేను అలా చెప్పను.అది 'అలాగి ఉంది, లేదా “అలాగుఉంది అని నేను అనుకొనను;నేను దానిని నిరాకటించను. పరలోకం ఉందని గాని లేదని గాని చెప్పను. ప్రాణులు యాదృచ్చికంగా పుడతారా అని గాని, మంచి పనులకు చెడ్డపనులకు ఏదైనా ఫలితం,లాభం ఉంటుందా అని గాని, సత్యాన్ని జయించినవాడు మరణానంతరంకూడ ఉంటాడా,ఉండడా అని గాని నువ్వు నన్ను (ప్రశిస్తే నేను అదే సమాధానం చెపుతాను”.
సంజయుని ఈ ఉపదేశం సంశయాత్మకంగా,లేదా నిర్ధారణశూన్యంగా ఉంది.అయినా ఇది మంచి నిర్ధారణశూన్యవాదం (29౧0940500). మానవుని జ్ఞానానికి గోచరం కాని విషయాలను గూర్చి,తాత్త్వికాంశాలను గూర్చి నిర్ణయాలు
178 జైన - బౌద్దాల ఆవిర్భావం చేయకుండా మానసికంగా ఒక విధ మైన విశ్రాంతిని, చాంచల్యం లేని స్థితిని, అలవరచుకోవా లని ఈ వాదం సూచిస్తూన్నది. ఈ రెండవ అంశం మహావీరుని ఉపదేశాలలోను, బుద్దుని ఉపదేశాలలోనూ కూడ కనబడుతుంది. ఈ వాదాన్ని ఆధారంగా చేసికొని మహావీరుడు స్యాద్వాదాన్ని ప్రవేశపెట్టాడు. బుద్దుడు సంజయుని సిద్దాంతం అవిరుద్ధకాలలో(తన వాదానికి విరుద్ధం కాని వాదాలలో) చేరుతుంది అన్నాడు.ఈ సందర్భంలో జాకోబి అన్న మాటలు ఉదాహరణార్దములు.
“ఈ అసాంప్రదాయిక (1౮౭6020 వాదాలకీ,జైన -బౌద్ధవాదాలకీ మధ్య స్పష్టంగా కనబడుతూన్న సామ్యాన్ని బట్టి బుద్ధుదూ,మహావీరుడూ కూడ ఈ వాదాలను ఆధారంగా చేసికొని తమ కొన్ని సిద్దాంతాలు రూపొందించుకొన్నా రన్సీవీళ్లతో జరిగిన వివాదాల సహాయంతో మరి కొన్ని సిద్దాంతాలను వర్పరచుకొన్నా రనీ స్పష్టం అవుతూన్నది”.
ఈ క్రింది అభిప్రాయాలు పకుద్ధకాచ్బాయనుడు ప్రచారం చేసేవా డన్నట్లు సమన్నఫలసుత్తం చెపుతూన్నది ;
“ఈ క్రింది ఏడు వస్తువులు సృష్టింపబడలేదు,సృష్టించవలసిందిగా (పేరే పింపబడలేదు. అవి వంధ్యములు (వాటినుండి ఏమీ పుట్టదు) పర్వతశిఖరాల వలె స్థిరములు. గట్టిగా పాతిన స్తంభాల వంటివి.అవి కదలవ్రుమార్చు చెందవు.ఒక దానిమీద ఒకటి పాతుకొని నిలబడవు. బాధించడానికి గాని,బాధ తొలగించదానికి గాని రెందూ చేయడానికి గాని దేనికీ ఉపయోగించవు. ఆ ఏదూ వఏవనగా- పృథివి, జలము, అగ్ని వాయువు అను నాలుగు భూతాలు. సుఖము, దుః ఖము; ఏడవది ఆత్మ అందుచేత చంపేవాడు గాని, చంపించేవాడు గాని, వినేవాడు గాని మాట్లాదేవాడు గాని, తెలుసుకొనేవాడు గాని తెలిపేవాడు గాని లేడు. ఎవ దైన వాడి యైన కత్తితో ఎవని తలైనా రెండు ముక్కలు చేసినా ఎవడూ ఎవని ప్రాణమూ తీయలేదు. జరిగిన దల్లా ఏమి టనగా ఒక కత్తి ఏడు భౌతికపదార్థా లున్న వస్తువు మధ్యలో దిగిందిిఅంతే”
దీనికి సాస్సతవాదం (శాశ్వతం అనే వాదం), అనిక్కవాదం(అనేకత్వవాదం) అని పేర్లు ఈ వాదాల వర్ణన మహాభారతంలో కూడ అక్కడక్కడ కనబదుతుంది.
జైన - బౌద్దాల ఆవిర్భావం 1/9 మహావీరుడు,బుద్దుడు ఆవిర్భవించడానికి ఒకటి-రెండు శతాబ్దాల ముందు కాలంలో “భావప్రజ్వలనం' ప్రారంభం అయి వీరిద్దరూ జన్మించేనాటికి అనేక మైన సిద్దాంతాలు,వాదాలు,విశ్వాసాలు ఏర్పడి ప్రచారంలో ఉండే వని మనం పైన చూచినదానిని పట్టి స్పష్టం అవుతున్నది.*ఈ కాలంలో జను లందరూ తత్త్వవాదాలకి సంబంధించిన సూక్ష్మవిషయాలమీద మతసంబంధివిషయాలమీద వాళ్ల శక్తులను వ్యర్థం చేస్తూండడంతో నైతికజీవనం బాగా దెబ్బతిన్నది. ఒక పద్ధతి లేకుండా శరపరం పరగా, బయలుదేరుతూన్న పరస్పరవిరుద్దాలైన భావాలకో,సిద్దాంతాలతో దేశం అంతా నిండిపోయింది.ఒకడు ఒకటి ప్రతిపాదిస్తే మరొకడు దానిని ఎదుర్శొనేవాడు. మనిషి మారితే సిద్ధాంతం కూడ మారిపోయేది. ఈ సిద్దాంతా లన్నీ వాటి 'ప్రవర్తకుల స్పభావాలనూ,వాళ్ల భావావేశాలనూ,వాళ్ల అభిలాషలనూ ప్రతిబంబించేవిగా ఉందేవి. ఎవని ఆలోచన వానిది.ఎవనికి ఏది తోస్తే అది సిద్ధాంతం.అత్మ ప్రపంచము ఆనంతములా సాంతములాపరిచ్చిన్నములా అపరిచ్చిన్నములా,సత్యం అంటే ఏమిటి,ఆభాస అంటే ఏమిటి,వీటిలో భేదం ఏమిటి,పరలోకం అనేది ఉందా లేదా, ఆత్మ మరణానంతరం కూడ ఉంటుందా ఉండదాామానవునికి స్వాతంత్ర్యం ఉందా లేదా-ఇలాంటి చర్చలు అధికంగా సాగుతూ ఉందేవి.కొందరు బుద్ధీ ఆత్మా రెండూ ఒకటే అంటే కొందరు అవి వేరు వేరు హూర్ధా లన్నారు. ఈశ్వరుడు సర్వోత్తముడు అని కొంద రంటే మానవుడే చాల హ్రూనమైనవా దని కొంద రన్నారు.ఈ విషయాలు మన కేమీ అర్ధం కావు అని కొంద రంటే కొందరు ఎన్నో ఆశలు చూపుతూ (శ్రోతలను ఉవ్విళ్లూరించారు.కొందరు అతిగంభీర మైన తాత్త్వికసిద్దాంతాలు ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తూండగా మరి కొందరు వాటిని ఖండించడానికి నడుము బిగించి కూర్చున్నారు.బంధా లన్నీ తెంపుకొన్నా మని చెప్పుకొనే నిగంభులు ఉండేవారు. వైదికసంన్యాసులు కాని శ్రమణు లుండేవారు. ప్రపంచానికి దూరంగా ఉండడం ద్వారా ఆత్మశాంతి సంపాదించుకోవా లనుకొనేవాళ్లు కొందరు, ఉపవాసాలు మొదలైన కఠిననియమాలతో శరీరాలను శుష్కింపచేసికొనేవాళ్లు కొందరు, ఊహ కందని ఆధ్యాత్మికవిషయాలు మాట్లాడేవారు కొందరు,వాదాలు చేసేవాళ్లు కొందరు, ఏది చెప్పినా ఖండించేవాళ్లు కొందరు,భౌతికతావాదులు కొందరు,ప్రతీదానిని సందేహించేవాళ్లు కొందరు; ఈ విధంగా అనేకవిధా లైన జను లుందేవారు.సచ్చకుని
180 జైన - బౌద్ధాల ఆవిర్భావం వంటివాళ్లు కొందరు చెప్పరాని అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్లు ఉండేవారు. అత్యధిక మైన అహంభావంతో సచ్చకుడు ఇలా అన్నాడట - 'నాకు శమనుడు లేడు, బ్రాహ్మణుడు లేడు గురువు లేడు,స్వామి లేదు,మకాధిపతి లేడు;ఎవదైనా నేను సాక్షాత్తు బుద్దుణ్జి అని చెప్పుకొంటూ నా ముందుకు వచ్చి వాదం ప్రారంభిస్తే అతడు గజగజలాడవలసిందే, వణకవలసిందే,చలించిపోవ లసింద్కేచెమట కార్చ వలసిందే.నా వాగ్దాటితో నే నొక ప్రాణం లేని స్తంభాన్ని ఎదుర్కొంటే అది కూడ గజగజలాడాలి,వణకాలి,కదలి పోవాలి. ఇంక మానవ మాత్రుని మాట చెప్పాలా! అది దారీ తెన్నూ లేని ఊహల కాలం. పొందిక లేని సిద్ధాంతాలు, అస్పష్టమైన వితండవాదనలూ ఎక్కువగా ప్రచారంలో ఉండేవి.కొందరు తాత్తికవిషయచింతకులు కాలం,ఆకాశం,నిత్యసత్యం మొదలైన విషయాలతో ఆడుకొంటూ ఉదాత్త మైన తత్త్వశాస్త్రాన్ని భ్రష్టు పట్టించారు. అస్పష్ట మైన తత్త్వవాదాల మంచులో మహాసత్యా లన్నీ మరుగుపడిపోయాయి” (5. 2ఇ4%20య0జు-0యజు కేం500స్రు/స/011. 35239).
బుద్ధుడు తన కాలంలో ప్రభావంలో ఉన్న 62 అసాంప్రదాయికవాదాలను (11065165) పేరొన్నట్లుగా వెనుక చూచి ఉన్నాం.ఇవి రెస్ దేవిడ్స్ రచించిన "1115 3400 జర 1161404116 0 క464641500 (9.21-23) అను గ్రంథం లో సంక్షిప్తంగా ఇలా చెప్పబడ్డాయి. 1-4 సాస్సతవాదం : మూడు ధ్యానభూమికల ద్వారా గాని,తర్మసాహాయ్యంతో గాని కొందరు బాహ్యజగత్తు, జీవాత్మలూ కూడ నిత్యములు శాశ్చతములు అని తెలిసికొని విశ్వసించారు. 5-8. వకాచ్చ-సొస్సతికం : కొందరు కొన్ని ఆత్మలు శాశ్వతము లనీ,కొన్ని కావనీ నాలుగు విధాలలో, అంగీకరించారు: అ) ఈశ్వరుడు శాశ్వతుడు; జీవాత్మలు మాత్రం శాశ్వతం కావు. ఆ) దేవత లందరూ శాశ్వత మైనవారు కాని జీవాత్మలు శాశ్వతములు కావు. ఇ) కొందరు ఉత్తములైన దేవతలు శాశ్వతమైనవార్కు జీవాత్మలు మాత్రం
శాశ్వతములు కావు.
జైన - బౌద్దాల ఆవిర్భావం 181
ఈ) దేహాలు శాశ్వతములు కాకపోయినా వాటిలో హృదయం లేదా బుద్ధి లేదా చైతన్యం అను ఒక సూక్ష్మవస్తు వున్నది; అది శాశ్వతం.
9-12. అంతనాంతికులు : నిత్యత్వానిత్వాలను గూర్చి తర్మసాహాయ్యంతో చర్చించువారు :
అ) ప్రపంచం నిత్యం కాదని చెప్పువారు.
ఆ) ఇది నిత్యం అని చెప్పువారు.
ఇ) ఇది ఉభయవిధమూ కూడ అని అంగీకరించువారు.
ఈ) ఇది రెండు విధాలైనదీ కాదు అని అంగీకరించువారు.
13-16. అమర-విక్థేపకులు : గుణాలను గూర్చి దోషాలను గూర్చి సందిగ్ధంగా
మాటలాడువారు,.
అ) ఏమైనా నిశ్చితంగా చెప్పిక్కేఅది తప్పైతే దానివల్ల తమకు హాని కలుగుతుంది అనుకొనేవాళ్లు.
ఆ) ఏది చెప్పినా దానిమీద రాగం కలిగి దానివల్ల హాని కలుగుతుం దని భయపడువాళ్లు.
(ఇ) నేర్పు గల వాదులకు తాము తగు విధంగా సమాధానం చెప్పజాల మేమో అని భయపడువాళ్లు.
(ఈ) తెలియకపోవడంతో అలా మాటలాదేవాళ్లు.
17,186. అధిచ్చ-సముప్పన్నిక్షులు : కారణం అవసరం లేకుండానే వస్తువుల మూలాన్ని
గూర్చి వర్ణించవచ్చు నని అనేవాళ్లు, 19-50. ఉద్ధమ-అఘతనికులు : భవిష్యత్తులో మానవుల ఆత్మ లుంటా యని విశ్వసించేవాళ్లు.
అ) మరణానంతరం చైతన్యంతో ఉంటుం దను విషయంలో చేసే అభ్యూహలో (006416915) పదహారు పక్షాలు.
ఆ) మరణానంతరం చైతన్యరహితమై ఉంటుం దను అభ్యూహలో ఎనిమిది పక్షాలు.
182 జైన - బౌడ్డాల ఆవిర్భావం ఇ) మరణానంతరం చైతన్యం ఉండడం ఉండకపోవడం అను విషయంలో చేసిన అభ్యూహలో ఎనిమిది పక్షాలు. 51-57.ఉచ్ళేదవాదం : ఏడు స్థాయిల (41687౭69) సూక్ష్మత్వంలో వదో ఒక స్థాయిలో ఆత్మ ఉంటుం దనీ,అయితే అది ఏ స్థాయిలో ఉన్నదైనా మరణానంతరం నశిస్తుం దనీ బోధించేవాళ్లు.వీళ్లు వినాశవాదులు. (వైనాశికులు) 58-62. ది్ట-ధమ్మ-నిబ్బాన-వాదం : ఆత్మ ఉంది.అది ఈ జన్మలో గాని,లేదా అది ఎక్కడ ఉన్నా గాని పరిపూర్ణ మైన ఆనందం పొందగలదు అని విశ్వాసం. అ) పూర్తిగా సంచేంద్రియాలతో సుఖం అనుభవించడం ద్వారా, ఆ) జిజ్ఞాసారూస మైన మానసికవికారం (మొదటి రూనం) ద్వారా, ఇ) _జిజ్ఞాసాకలుషితం కాని,'్రతిబంధం ఏదీ లేని,మానసిక ఆనందం (రండవ రూనం) ద్వారా ఈ) సుఖదుఃఖాలు గాని, జిజ్ఞాస గాని లేని మానసికశాంతి ద్వారా (మూడవ రూనర్క ఉ) పైన చెప్పిన మానసికశాంతి, పవిత్రతాబుద్ధి-ఈ రెండింటి ద్వారా (నాల్లవ జ్ఞానం) (ఆనందం పొందగలదు). మహావీరుడు బుద్ధుడు నడిపిన మతసంబంధ మైన గొప్ప సంచలనాల (07ల0అ౧౪) యదార్థస్వరూపం తెలిసికోవా లంటే వాటి వెనుక ఉన్న ఈ పరిస్థితులను (020యళ్రాంలుర) జాగర్తగా అర్ధం చేసికోవాలి.ఆ కాలంలో మితి మీరిన నియమరహిత మైన ఊహలవల్ల సమాజంలో ఏర్పడిన సంక్షోభాన్నీ అధః పతనాన్నీ అద్దుకొనడంకోసమే వాళ్లు చేసిన ప్రయత్నం అంతా.ఆ ప్రయోజనాన్ని సాధించడంకోసం వాళ్లు ప్రసిద్ధ మైన నైతికనియమాలను, తాత్త్వికసిద్ధాంతాలను ప్రచారంచేయడానికి మాత్రమే ప్రయత్నం చేశారు గాని క్రొత్త సిద్ధాంతాలను, మతాలనూ స్టాపించడంకోసం కాదు. అందుచేత ఈ రెండు మతాలూ యజ్ఞయాగాది భూయిష్టమూ కొంత మందికి మాత్రమే పరిమితమూ అయిన వైదికకర్మమార్ల సంప్రదాయాన్ని ఎదిరించడానికి పుట్టినవి అని ఎవళ్లో (వ్రాయడమూ,దానిని అనాలోచితంగా తరువాతి విద్యావంతులం అనుకొనేవా క్లందరూ ఎంతో అఖభినివేశంతో
జైన - బౌద్ధాల ఆవిర్భావం 183 ప్రచారం చేయడమూ ఆనాటి పరిస్థితులను సరిగా అర్ధంచేసికొనకపోవడంవల్లనే చాలా కాలంనుంచి జరుగుతూన్నది. వైదికకర్మకాండ ఈ మతాల ఆవిర్భావానికి కాక కొన్ని భావాలకి కారణం అయితే కావచ్చును. అందుచేతనే ఈ రెండింటిలోనూ కూడ వేదప్రామాణ్యం అంగీకరించకపోవడం ఒక సమానలక్షణంగా కనబడుతుంది. అయితే జైన -బౌద్ధవాజ్బయాల ద్వారా, మహాభారతాదులద్వారా స్పష్టంగా తెలుస్తూన్న ఆనాటి నీతికీ నియమాలకీ దూర మైన, స్వేచ్భావిచారసంచారప్రధాన మైన సంక్షుబ్ధస్థితులను గమనించకుండా యజ్ఞయాగాదికర్మకాండమాత్రమే వీటి ఆవిర్భావానికి కారణం అని భావించడం,ప్రచారం చేయడం కూడ పునః పరిశీలింపతగిన విషయాలు. ఇలాంటి సంక్షుబ్బస్థితిని అధిగమించే ప్రయత్నమే వీరిద్దరూ చేసిన ముఖ్య మైన కార్యం అను విషయం మరువకూడదు.
ఈ ఇద్దరు మహాత్ములూ చేసిన్ ఉపదేశాలలో నైతికమార్దానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడిన దను విషయం వీరి బోధలను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. ఇప్పుడు లభిస్తూన్న బౌద్ధసాహిత్యమూ,జైనసాహిత్యమూ కూడ ఆ ఇద్దరు సంఘసంస్కర్తలూ మరణించిన కొన్ని శతాబ్దాల తరవాత ఎందరో పండితుల ప్రయత్నాల ఫలితంగా రూపొంది అభివృద్ధి చెందిన దనే విషయం అందరూ అంగీకరించినదే. వీళ్లందరూ కార్యరంగంలో దిగేనాటికి బుద్ధ-మహావీరుల కాలంనాటి పరిస్థితులూ లేవు, ఆ నాటి సిద్ధాంతాలనూ,సిద్ధాంతాభాసలనూ సమర్థించే గ్రంథాలూ లేవు; ఇంక అతివిస్తృతమైన వైదికవాజ్బ్యయం మాత్రమే ఎదుట కనబడుతూన్నది. వాళ్ల మేధాబలా న్నంఠనీ వినియోగించి తమ నూతనభావాలను ప్రచారం చేయడంతో బాటు ఆ వాజ్మయంలో ఉన్న ఏవేవో దోషాలను, ఉన్నవీ లేనివీ ఎత్తి చూపడమే ్రధానకర్తవ్యంగా వీరు భావించారు.ఆ వాజ్బ్యయంమీద (శ్రద్ధ కలవాళ్లు ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తూ వాళ్ల ధోరణిలో వాళ్ల వాజ్బయం పెంచుకొంటూ పోయారు. దీనితో జైన -బౌద్ధమతాలు ఏ పరిస్థితులను చకృచేయదానికై బయలుదేరాయో వాటినీగూర్చి మరచిపోయి ఈ విరోధం అంతా ఒక ప్రక్కవైదిక మతానికీ మరొక ప్రక్క జైన-బౌద్దాలకీ మధ్య ఉన్న దన్న పాశ్చాత్య భావం ప్రచారంలోనికి వచ్చింది. నిజానికి వైదికమతంలోని భావా లనే ఆయుధాలకే పదును పట్టి బుద్ధ-మవాి వీరులు ఆనాటి పరిస్థికులను ఎదిరించి తమ ప్రయత్నంలో
184 జైన - బౌడ్డాల ఆవిర్భావం సాఫల్యం సంపాదించారు. అందుచేత వైదికమతానికీ,జైన -బౌద్ధమతాలకీ మధ్య అనుకొన్నంత విరోధం ఏదీ లేదు.ఇవి వైదికమత (హిందూ మత) శాఖలు. దేవుణ్ణి గూర్చీ, యజ్ఞయాగాదులను గూర్చీ అభిప్రాయభేదా లున్నా యంటే అదొక పెద్ద విషయం కాదు.సాంఖ్యులూ,పూర్వ మీమాంసకులూ కూడ దేవుణ్ణి అంగీకరించలేదు. పూర్వమీమాంసకులు ఇంద్రాదిదేవతలకు రూపాలు లేవని స్పష్టంగా చెప్పారు. కర్మకాండకు అంతంగా ప్రాధాన్యం ఇవ్వకూడదు అని “తైగుణ్యవిషయా వేదాః నిసైగుణ్యో భవార్డున”ఇత్యాదిగీతాశ్లోకాలలోను ఇతరస్థలాలలోను మహాభారతాదులు కూడ చెప్పాయి. ఈ విషయాలు గుర్తు ఉంచుకొంటే చాలా అపోహలు దూరం అవుతాయి.
మహావీరుడు వైదికమతాన్ని ఎదిరించడంకోసమే తన మతం క్రొత్తగా స్థాపించాడు అను వాదం విషయంలో డా॥ సర్వేపల్లి రాధాకృష్ణ వ్రాసిన మాటలు ఇక్కడ ఉదాహరించదగినవి-
“ఉదారహదయం గల క్షత్రియు డైన మహావీరుడు తన సునిశితమైన విచారణశక్తితో,నాల్లవ ఆశ్రమ మైన సంన్యాసానికీ, 'యజ్ఞయాగాదికర్మకలాపానికీ, ఇతరు లెవరికీ లేకుండా,అవి కేవలం తమకు మాత్రమే అధికారం ఉన్న దని చెప్పే బ్రాహ్మణులను ఎదుర్కొనడానికి తన మతం స్టాపించాడు అని కొందరు జైనమతంతో పరిచయం ఉన్న పండితు లంటూంటారు. సంన్యాసం విషయంలో (బ్రాహ్మణుడు అలాంటి నియమం ఏదీ విధించలేదు; పై మూడు వర్ధాలవాళ్లకీ దీని విషయంలో సమాన మైన అధికారం ఉంది అను విషయం గుర్తిస్తే ఈ వాదానికి అవకాశం ఏమీ లేదు.ఈ విషయంలో ఎవరైనా ఎదురుతిరగవలసి ఉంటే అది క్షత్రియుడు కాదు,క్రింది వర్జానికి (శూద్రవ్వూనికి) చెందినవారు చేయవలసిన షని. ఈ విషయంలో (బ్రావ్మణుడు ఎంత మంచివాడో లేదా చెడ్డవాడో క్షత్రియుడు కూడ అంతే మంచివాడు లేదా చెడ్డవాడు కదా?సామాన్యజనుల బాధలు తొలగించడంకొరకు జైనమతం ఆవిర్భవించింది అనడానికి ప్రమాణం ఏమీ లేదు.ఇది ఇతిహాసయుగప్రారంభ కాలంలో దేశంలో వ్యాపించి ఉన్న భావప్రజ్వలనాన్ని సూచించే తన్నిరోధ ప్రయత్నం. అందుచేత దీని వెనుక,బ్రాహ్మణుల ప్రవృత్తికి (వైదికధర్మానికి) ఎదురు తిరగాలనే భావం ఉన్న దని మనం క్రొత్త కారణం ఏమీ కనిపెట్టవలసిన పని
జైన - బౌద్ధాల ఆవిర్భావం 185 లేదు. వేరు వేరు జనులు బోధించిన వేరు వేరు సిద్ధాంతాలు,భావాలు ఒకదాని కొకటి ఎదురై నప్పుడు వేరు వేరు వ్యాఖ్యానాలు బయలుదేరడం సహజం. అప్పుడు కొన్ని అసాధారణ మైన భావాలు,విశ్వాసాలు ప్రచారంలోనికి వస్తూంటాయి.జైన మతం కూద అలాంటి మానసికవిక్షోభానికి సూచకం మాత్రపా(;య జు 105000)” ౪701172939).
దా ॥ రాధాకృష్ణ చైనమతం విషయంలో చెప్పినది బౌద్ధమతం విషయంలోకూడ వర్తిస్తుంది.ఇవే భావాలను "15000 0£[6జు 02050013” అను గ్రంథంలో బెల్వాల్మర్-రానడేలు వ్యక్తీకరించారు :
“ఉపనిషత్తులకు, జైన -బౌద్ధమతాల ఆవిర్భావానికీ మధ్య వివిధతాత్తికవాదాల పెను తుఫాను చెలరేగిన రెండు శతాబ్దాల కాలంలో ఉన్న పరిస్థితులను జాగర్తగా అర్థం చేసికొంటే ఈ రెండు మతాల స్వరూపాన్ని అర్ధం చేసికొని వాటి మూల్యాన్ని సరిగా అంచనా వేయకలుగుతాం;ఇవి వైదికమతాన్ని ఎదిరించి దానిని ముంచెత్తి వేయడానికి లేదిన పెద్ద తరంగాల శిఖరాలను అధిరోహించి వచ్చాయి అని అందరూ అనుకొన్నట్లు, అంటూన్నట్లు కాక ఇతరకారణాలవల్ల ఏర్పడిన సంక్షుబ్ధపరిస్థితులలో సమాజంలో,ఒకవిధమైన స్థిరత్వాన్ని శాంతిని నెలకొల్బడంకోసమే ఇవి ప్రయత్నించా యను విషయం స్పష్టంగా తెలుస్తుంది.ఎలాంటి అడ్డంకులూ లేని మొండి భావాలు రాజ్యం వలుతూన్న ఈ కాలానికి ప్రధానలక్షణంగా అక్రియావాదాన్ని చూపవచ్చు. “నాష్థి కమ్మం; నాత్ధి కిరియం, నాత్ధి వీరియం” (ఏలాంటి కర్మా గాని, వలాంటి కర్తవ్యమూ గాని,ఏలాంటి ప్రయత్నమూ కాని ఉండడానికి అవకాశం లేదు)అను ఈ అక్రియావాదాన్ని ఎదిరిస్తూ జైనమతం తన నిర్ణయాన్ని ఈ మాటలలో చెప్పింది- “అథ్ధి ఉత్ళానేతి వ, కమ్మేతి వ, బలేతి వ,విరియేతి వ,పురిసకారే పరాక్మమేతి వా” (ప్రయత్నించడం అనేది ఉంద్విపని చేయడం అనేది ఉంది,శక్తి అనేది ఉంది, పురుషకారం అనేది ఉంది,హాక్రమించడం అనేది ఉంది).జైనమతం ఎలా చెప్పిందో అదే విధంగా బౌద్ధమతం కూడ కమ్మవాదాన్ని, క్రియావాదాన్న్సి వీరియవాదాన్ని అంగీకరించింది (701.11. ఆ.ఉ&4-5)
ఈ విధంగా జైన -బౌద్ధమతాలు హిందూమతంతో ఘనిస్టమైన సంబంధం
186 జైన - బౌడ్దాల ఆవిర్భావం గల,హిందూమతార్లతములే అయిన రెండు శాఖలు. శైవ-శాక్త -వైష్ణవాది సంప్రదాయాల వలె,ఆర్యసమాజ-బ్రహ్మసమాజాదిసంప్రదాయాల వలె ఇవి కూడ హిందూమతానికే చెందిన,నూటికి నూరు పాళ్లూ భారతీయములే అయిన,ఆ యా కాలాలలో సమాజంలోని క్షోభలను తొలగించి సుఖశాంతులను నెల్పగొల్పిన, అత్యున్నతసంప్రదాయాలు. వేదాంతంలో ఉన్న విభిన్నసంప్రదాయాలలో కొన్ని సైద్ధాంతిక మైన భేదా లున్నా అవన్నీ ఏవిధంగా ఒకే శాస్త్రానికి సంబంధించినవో,అదే విధంగా ఇవి కూడ హిందూమతంలో భాగాలే కాని దానికంటె భిన్నములు కావు. ఆలోచించగలవాళ్లలో అభి[ప్రాయభేదాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఇతరదేశమతాలలో వలె హింసా్రవృత్తికీ, నిర్భంధాలకీ, క్రౌర్యానికీ వీటిలో లేశమాత్రం కూడ అవకాశం లేదు.ఇవి ప్రతీ భారతీయుడు గర్వించదగిన రెండు హిందూమత (సనాతనధర్మ) శాఖలు.
ఈ సందర్భంలో ఆనీ బెసంట్ వాక్యాలు ఉదాహరణార్హ మైనవి. “బౌద్ధమతం హిందూమతంయొక్క కూతురు అని చెప్పడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. జాగర్తగా చదివితే బౌద్ధమతగ్రంథా లన్నీ హిందూమతగ్రంథాల ప్రతిధ్వనులే; దానిలోని బోధ లన్నీ తాత్తికమార్గంలో తక్కుపగానూ,ఆచరణయోగ్యమైన మార్గంలో అధికంగానూ చేసినవే అయినా అవన్నీ హిందూమతచైతన్యంతో నిండి ఉన్నాయి. పరిశుద్ధ మైన హిందూనైతికమార్గాన్ని హిందూమతపు ఎల్లలకు అవతల ఉన్న దేశాలకు బోధించడం కోసం బుద్దుడు దూరదృష్టితో ప్రత్యేకంగా ఈ మార్గాన్ని ఎన్నుకొన్నాడు.వీటిని హిందువులకంటె తక్కువ తాత్త్వికదృష్టీ తక్కువ గ్రహణశక్తీ ఉన్నవాళ్లదాకా తీసికొనివెళ్లా లని ఆతని అభిలాషా.(ఎస్.జి. ఆర్.పి. 91,92).
జైనమతాన్ని గూర్చి కూడ ఆమె ఈ విధంగా వ్రాసింది-“జైనమతం బౌద్ధ మతంనుండి పుట్టిన దని చాలా కాలం పాటు పొశ్చాత్యవిద్వాంసులలో ఒక భ్రాంతి ఉందేది.అది పొరబా టనీ ఈ రెండు మతాలూ కూడ అతిప్రాచీన మైన హిందూ మతంనుండే ఆవిర్భవించా యనీ ఇప్పు డందరూ అంగీకరిస్తున్నారు... భారతదేశంలో జైనమతం బౌద్ధమతంకంటే ఎంతో ప్రాచీన మైన దను విషయంలో ఏ మాత్రం సందేహం లేదు.చివరి జైనమతప్రవక్త బుద్ధునికి సమకాలికుడు”. (ఎస్. జి. ఆర్. పేజి.239)
బౌద్ధమతం
బౌద్ధమతమూ జైనమతమూ కూడ హిందూమతంనుండి బయల్విడలిన రెండు శాఖలు మాత్రమే. వేదాల ప్రామాణ్యాన్ని అంగీకరించకపోయినా ఈ రెండు మతాలమీద వేదాల ప్రభావమూ,వేదాల చివరి భాగా లైన ఉపనిషత్తుల ప్రభావమూ స్పష్టంగా కనబడుతుంది.హిందూమతంలో బాహ్య మైన యజ్ఞయాగాదులకు, పూజాదులకు ఎంత ప్రాధాన్యం ఇవ్వబడిందో దానికంటెకూడ ఆధ్యాత్మికదృష్టికీ, దానితో సంబంధించిన నైతికనియమాలకీ మౌలికంగా అత్యధిక మైన (ప్రాధాన్యం ఇవ్వబడింది.'ప్రారంభదశలో బౌద్ధమతం ఈ బాహ్యక్రియాకలాపాలను నిరాకరించి ఆధ్యాత్మిక ప్రవృత్తికీ, నైతికనిమయాలకీ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది.ఐతే కాలక్రమంలో యజ్ఞయాగాదులు కాకపోయినా కొన్ని బాహ్యాచారాదులు బౌద్ధమతంలో కూడ చోటుచేసికొన్నాయి. ఏమైనా బౌద్ధమతం విశిష్టమైన నైతిక- తాత్త్విక రూపంతో ఒక స్వతంత్ర మైన మతంగా,అనేకదేశాలలో వ్యాపించింది. అందుచేతనే చాలమంది పాశ్చాత్యవిద్వాంసుల అభిప్రాయం ప్రకారం హిందూమతం కేవలం భారతదేశానికి మాత్రమే సీమితమైన మతం అయితే బౌద్ధమతం విశ్వవ్యాప్త మైన మతం.
శ్రైస్తవ-ఇస్తామ్ మతాలకు వలె బౌద్ధమతానికి కూడ ఒక నిశ్చిత మైన ఆవిర్భావకాలం ఉంది; ఒక (ప్రారంభకుడు ఉన్నాడు. ఈ మతాన్ని స్థాపించిన గోతముడు ఒక హిందూరాజవంశంలో జన్మించాడు. అయితే బాల్యంనుంచీ కూడ ఆతని మనస్సు లొకికసుఖాల విషయంలో విముఖంగా ఉండేది. లోకం తెలిసినది మొదలు చివరి దాకా ఆయన మనస్సు మానవుల వివిథక్లేశాలకు మూలకారణం ఏమో అన్వేషించడంలోను, కొన్ని ఉపాయాలు తెలిసికొన్న తరువాత వాటిని ప్రచారంచేయడంలోను వ్యగ్రమై ఉండేది.మానవుల క్లేశాలకు అన్నింటికీ మూలకారణం పుట్టుకముసలితనం,రోగాలు, మరణమూ అను విషయం గ్రహించి గోతముడు ఆ క్లేశాలను తొలగించడానికి తగిన ఒకే ఒక ఉపాయం బోధి లేదా ప్రజ్ఞ అని గ్రహించి దానిని సంపాదించడం కోసం ఒకనాటి రాత్రి తన భార్యను,అప్పుడే పుట్టిన కుమారుడు రాహులుణ్జి, అంతఃపురాన్నీరాజ్యాన్నీ విడచిపెట్టి
188 బౌద్ధమతం వెళ్లిపోయాడు.కొందరు అధ్యాత్మజ్ఞానసాధకులను కలిసి వాళ్లు చెప్పిన పద్ధతుల ప్రకారం కొంత కాలం కొన్ని సాధనలుు,తీవ్ర మైన తపస్సు చేసి వాటివల్ల ఫలం ఏదీ కనబడకపోవడంతో ధ్యానరూప మైన తీవ్రసాధన ప్రారంభించాదు.నేటి బీవారు ప్రాంతానికి చెందిన గయలో ఒక అశ్వత్థవృక్షం క్రింద ఏడురోజులు యోగసమాధిలో కూర్చొని ఉండగా ఏడవ రోజున ఆతనికి హఠాత్తుగా బోధి కలిగింది, జ్ఞానోదయ మయింది. ఆ బోధివృక్షం క్రింద నుండి లేచి మళ్లీ ఏడు రోజుల పాటు వటవృక్షం క్రింద ధ్యానంలో కూర్చున్నాడు. చివరి రోజున ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ బ్రాహ్మణుని విషయంలో తన కున్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. “ఏ (బ్రాహ్మణుడు సర్వపాపాలనుంచీ దూరంగా ఉంటాదో, అహంకారంగాని, అపవిత్రత్వంగాని లేకుండా ఉంటాడో, ఆత్మనిగ్రహం కలవాదో, పరిపూర్ణమైన జ్ఞానం (లేదా వేదాలలో ప్రావీణ్యం) కలిగి ఉందాడో, పవిత్రత్వానికి కావలసిన ధర్మాలన్నీ నిర్వర్తిస్తాడో, అలాంటి (బ్రాహ్మణుడు తనను బ్రావ్మాణుడ నని చెప్పుకొనదానికి అర్హుడు. ఈలోకంలో అలాంటివాని నడవడికలో, ఏ మాత్రమూ వైషమ్యం కనబడదు”. మళ్లీ ఏడేసి రోజులు ప్రక్క నున్న రెండు చెట్ల క్రింద కూర్చొని అతడు తనకు 'ప్రథమశిష్యులైన ఇద్దరు వర్తకు లిచ్చిన ఆహారం తీసికొన్నాడు. అక్కడినుండి మళ్లీ వచ్చి ఆ వటవ్చక్షం క్రింద కూర్చొని ఉండగా తనకు కలిగిన జ్ఞానాన్ని లోకంలో అందరికీ పంచిపెట్టా లని నిశ్చయం చేసికొన్నాడు (ఎస్.జి.ఆర్. పేజి. 102). అది మొదలు గోతమునకు “బుద్ధుడు (జ్ఞానం సంపాదించినవాడు,జ్ఞానవంతుడు) అను పేరు ప్రసిద్ధిలోనికి వచ్చినది.బుద్ధుడు తనకు కలిగిన జ్ఞానాన్ని అందరికీ షంచి,అందరినీ సంసారదుణఖంనుండి ఉద్ధరించదానికై ఆజీనితాంతమూ రాత్రింబవళ్లు పరి(శమించాడు. బుద్ధుని ఉపదేశం ప్రకారం మానవుని క్లేశా లన్నింటికీ మూలకారణం ఈ లోకంలో పుట్టడమే. ఈ పుట్టుక లేకుండా చేసికొంటే ఈ క్లేశాలు రావడానికి అవకాశమే ఉండదు.మానవుడు తనను నిరంతరమూ త్రిప్పుతూన్న ఈ జననమరణ చక్రంనుండి విముక్తి పొందడానికి ప్రయత్నించాలి.తాను నివసిస్తూన్న ఈ లోకం యొక్క నిజమైన స్వరూపస్వభావాలు తెలియకపోవడమే మానవుడు ఈ చక్రంలో పడి తిరుగుతూందడదానికి కారణం. అశాశ్వతము,అసత్యమూ అయిన ఈ
బౌద్ధమతం 189 ప్రపంచంలో పుట్టి అత్యధిక మైన రాగంతో, అత్యాసక్తితో,వివిధకార్యాలలో మానవుడు లగ్గుడై ఉంటున్నాడు. మానవునకు ఈ ప్రపంచం విషయంలో ఉన్న ఈ అత్యాస్తియే వాని క్షేకా లన్నింటికీ కారణం; ఈ అత్యాస్తక్తికి కారణం పైన చెప్పిన అజ్ఞానం.జాగర్తగా ప్రయత్నిస్తే ఈ అజ్ఞానాన్ని విడచి మానవుడు క్షేశాలు లేని స్థితి పొందకలుగుతాడు. ఈ స్థితికి 'నిర్వాణం'అని పేరు. సకలక్షేశాలు తొలగిపోయి పరిపూర్ణ మైన శాంతితో కూడిన స్టితియే ఈ నిర్వాణం. పరిపూర్ణ మైన ఈ ఆధ్యాత్మిక్టితిని పొందిన మానవునికి తిరిగి జన్మ ఉండదు. అజ్ఞానం తొలగించుకొనడం ద్వారా ఈ స్థితిని పొందడానికి బుద్దుడు ఎనిమిది అంగాలు గల మార్గాన్ని ఉపదేశించాదు.దీనికి అమ్టాంగమార్గం అని పేరు.ఈ అష్టాంగమార్గంలో అతి కఠిన మైన నియమాలు గాని, స్వేద్భాజీవన విధానం గాని ఉండదు. అందుచేత దీనికి మధ్యమ మార్గం (మ్షిమనికాయం) అని పేరు. ఈ మార్గంలో సమ్యగ్దృష్టి (పొరబాటు లేని విషయగ్రహణము), సమ్యక్సం కల్పం (మంచి ఆలోచన), సమ్యగ్వాక్ (మంచి మాటి), సమ్యకృర్తాంతం (మంచి పనులు చేయడం), సమ్యగాజీవం (మంచి జీవనవిధానము), సమ్యగ్ వ్యాయామం
- (మంచి ప్రయత్నం) సమ్యక్స్కృతి (మంచి మనః'ప్రవృత్తి) సమ్యక్సమాధి (మంచి మానసిక ఏకాగ్రత) అను ఎనిమిది అంగా లుంటాయి. _ ఈ విధంగా ప్రారంభదశలో బౌద్ధమతంలో కేవలం నైతిక మైన కొన్ని నియమాలు మాత్రమే ఉండేవి.ఈ మతంలో ఈశ్వరుని ప్రసక్తియే లేదు గౌన దీనిలో పూజలూ, ఈశ్వరారాధనలూ, వాటికి సంబంధించిన కార్యకలాపాలూ ఏవీ లేవు. (నిజానికి బుద్ధుని కాలంనాటికి వైదికమైన యజ్ఞయాగాదులు తప్ప దేవాల యాలు,వాటిలో పూజాదులూ ఉన్న సంప్రదాయా లేవీ ఉన్నట్లు కనబడదు, అందుచేత దీని నొక విశేషంగా చెప్పడం అనవసర మని తోస్తుంది.) ఇది కేవలం మానవునితో మాత్రమే సంబంధించిన మతం. ఇక్కడ ఈ నేలమీద నివసించే మానవుడు ఎదుర్కొం టూన్న సమస్యలనూూ,వాటిని అధిగమించే ఉపాయాలను గూర్చి మాత్రమే ఈ మతం చర్చిస్తుంది. ఒక దేశానికీ ఒక కులానికీ లేదా ఒక వర్దానికీ చెందిన మానవుని గూర్చి మాత్రమే కాక సకలమానవులను గూర్చీ కూడ ఆలోచించే ఈ మతం సకలమానవుల శ్రేయస్సుకూ ఉపకరించే మార్గాలను అన్వేసిస్తుంది.ప్రతీ మానవుడూ కూడ పైన చెప్పిన అష్టాంగమార్గాన్ని అనుసరించి తాను అనుభవిస్తూన్న క్లేశాల
190 బౌద్ధమతం నుండి విముక్తుడు అవుతా డని ఈ మతం బోధిస్తుంది.మానవునికి ఆ మానవుడే దీపం,(ఆత్మదీపభావం) అతడు తనను తానే రక్షించుకానగలుగుతాడు, స్వపయత్నం చేత సకలక్షేశాలనూ అధిగమించగలదు; తనకంటె గొప్ప దైన ఏ శక్తిమీదా మానవుడు ఆధారపడవలసిన పని లేదుఅతడు చేయవలసిన దల్లా మధ్యమమార్గ మైన ఈ అపష్టాంగమార్లాన్ని అనుసరించడమే. బౌద్ధమతం ఈశ్వరుణ్ణి అంగీకరించక పోయినా కాలక్రమంలో బౌద్దులు బుద్దుజ్జే దేవునిగా ఆరాధించడం (ప్రారంభించారు. బౌద్ధమతప్రారంభంనుంచీ కూడ బుద్దుజ్జి ఒక మతప్రవక్తగా మార్గదర్భ్శకుణ్జిగా,రక్షకుణ్ణిగా ఆరాధించడం జరుగుతూ వచ్చింది. బౌద్దులు అంగీకరించిన త్రిరత్నాలలో మొదటి రత్నం బుద్ధుడు; రెండవ రత్నం బౌద్ధధర్మం; మూడవ రత్నం బౌద్ధసంఘం. ఈ మూడూ శరణు పొందవలసిన మూడు రత్నాలు- “బుద్ధం శరణం గచ్చామిగోసంఘం శరణం గచ్చామ%ె*ధర్మం శరణం గచ్చామి”, బౌద్ధమతంలో ప్రవేశించ దలచిన ప్రతి ఒక్కడూ పై మూడు వాక్యాలను జపించ వలసి ఉంటుంది. బౌద్ధసమావేశాల ప్రారంభంలో కూడ తప్పక ఈ మూడు వాక్యాలను ఉచ్చరించాలి. బుద్దుడు బోధించిన సిద్దాంతానికి లేదా నియమావళికి ధమ్మం (ధర్మం) అని పేరు. బౌద్ధభిక్షువుల సముదాయం సంఘం. ఈ విధంగా ఈ మూడు రత్నాల మధ్యా ఘనిష్ట మైన సంబంధం ఉంది. ఇని బుద్ధుని విషయంలో అత్యధికమైన ఆదరభావాన్న్సీ శరణాగతినీ, బుద్ధునిమీద భక్తినీ సూచిస్తాయి. ఈ మూడు శరణాగతివాక్యాలను జపించడానికి ముందు బుద్ధుని విషయంలో అపారమైన భక్తిని సూచించే “నమో తస్పో భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స”అను వాక్యం పాలిభాషలో పఠింపబడుతుంది. “పరిపూర్ణపరిశుద్దజ్ఞాన వంతుడూ,పూజ్యుడూ, భగవంతుడూ అయిన ఆ బుద్ధునికి నమస్కారము”అని దీని అర్ధం. ఈ రత్నత్రయశరణాగతివాక్యజపం ప్రారంభంలో ప్రతీ బౌద్ధమతావలంబీ కూడ తన విశ్వాసం దృఢంగా స్థిరంగా ఉండడానికి చేస్తూంటాడు. ప్రారంభదశలో ఈశ్వరునియందు విశ్వాసం కాని ఈశ్వరారాధనకు సంబం ధించిన పూజాదికార్యక్రమాలు కాని బౌద్ధమతంలో ఉందేవి కావు;ఇది కేవలం నైతికమార్గప్రవృత్తిప్రధాన మైన మతంగా ఆవిర్భవించింది అను విషయం వెనుక
బౌద్ధమతం 191 చూచి ఉన్నాం. ప్రతీ బౌద్దుడూ కూడ బౌద్ధమతం విషయంలో పరిపూర్ణ మైన విశ్వాసంతో పాటు నాలుగు ఉత్తమసత్యాలనూ, ప్రతీత్యసముత్సాదం, అనాత్మవాదం, కర్మ మొదలైన సిద్దాంతాలనూ కూడ దృధంగా నిశ్వసించాలి. నైతికము లైన కొన్ని సద్గుణాలను అలవరచుకోవాలి.ఇది ('ప్రాథమికదశలో ఉన్న బౌద్ధమత స్వరూపం.
కాల(కమేణ బౌద్దమతంలో కొన్ని శాఖలు ఆవిర్భవించాయి. వాటిలో ప్రధానంగా చెప్పతగినది మహాయానబౌద్ధమతం. దీనిలో ఈశ్వరాస్తిత్వవాదము, బహుదేవతారాధనా కూడ చోటు చేసికొన్నాయి. దానితో ఈశ్వరారాధనకు, అనేకదేవతల ఆరాధనకు సంబంధించిన వివిధకార్యక్రమాల అనుష్టానం కూడ ప్రారంభం అయింది. అనేక మైన పూజాస్థానాలు,దేవాలయాలు, విహారాలు (బౌద్ధ . భిక్షువులు నివసించే మఠాలు) మొదలైనవి నిర్మించడం కూడ అత్యధికంగా జరిగింది. బుద్దుడే సాక్షాత్తు పరమేశ్వరు డనీ,బుద్ధుడుగా ఆవిర్భవించడానికి ముందు కూడ అతడు అనేకరూపాలలో అవతరించా దనీ విశ్వాసం దృఢంగా ఏర్పడింది. అలాంటి అవతారాలకి '“బోధిసత్తులుఅని పేరు.భూమిపై అవతరించి స్వప్రయత్నంచేత నిర్వాణాన్ని పొందిన మహాపురుషులు బోధిసత్తులు. బుద్దునితో పాటు ఈ బోధిసత్తులను కూడ,హిందూమతంలోని వివిధదేవతలను ఆరాధించి నట్లుఈ మతంలో ఆరాధించేవారు. అలాంటి ఆరాధనలకు సంబంధించిన అనేకపద్ధతులు కూడ ప్రచారంలోనికి వచ్చాయి. అయితే బౌద్ధమతానికి చెందిన హీనయానశాఖ మాత్రం ఇలాంటివాటికి వేటికీ అవకాశం ఇవ్వకుండా బుద్ధుడు బోధించిన కేవలనైతికపరిశుద్ధత్వానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది.
బౌద్ధమతంలో తాత్తీకసిద్దాంతాలకు సంబంధించిన అనేకవిభేదాలు కూడ ఆవిర్భవించాయి.వీటిని వేటినీ బుద్ధుడు బోధించకపోయినా ఆతని తరువాతి కాలంలో వచ్చిన అనేకులు ఉద్దందబౌద్ధపందితులు ఈ వాదా లన్నింటినీ స్థాపిస్తూ వీటికి బుద్దుని బోధలలోనే కొన్ని సూచన లున్నా యనీ,అందుచేత అవి ఆయనకు అంగీకారయోగ్యములే అనీ ప్రతిపాదించారు. ఇలాంటి సిద్ధాంతాలలో నాలుగు సిద్ధాంతాలు ప్రధానమైనవి.
192 బౌద్ధమతం
- మాధ్యమికమతం(లేదా శూన్యవాదం) ; ఈ మతం ప్రకారం ప్రపంచకం అంతా అసత్యం. మానసికప్రపంచకము,భౌతికప్రపంచకము,రెండూ కూడ అజ్ఞానం చేతనే కల్పించబడినవి.నిజానికి ప్రపంచకం అంటూ ఏదీ లేదు.ఈ సత్యాన్ని (గ్రహించినవాడే నిర్వాణాన్ని పొంది సమస్హ్హాశాలనుండి విముక్తు డదవుతాడు.సర్వమూ శూన్యమే అని చెప్పడంచేత ఈ మతానికి శూన్యవాదం అని కూడ పేరు.
2.యోగాచారమతం : ఈ మతం (ప్రకారం బాహ్యప్రపంచం అంతా కాల్పనికం. విజ్ఞానమే (అనగా మానసిక మైన భావాలే) బాహ్యప్రపంచరూపంలో కనబడుతూన్నది. విజ్ఞానం మాత్రం సత్యం.మనస్సు కూడ అసత్యం అనడం అనుభవానికి విరుద్ధం. విజ్ఞానమే ప్రపంచరూపంలో భాసిస్తూన్నది అని చెప్పదంచేత దీనికి విజ్ఞానవాదం అని కూడ పేరు.
- సౌత్రాంతికమతం (బాహ్యమేయవాదం) :ఈ మతం (ప్రకారం బాహ్య (ప్రపంచమూ మానసికప్రపంచకమూ కూడ సత్యములే. బాహ్యప్రపంచకం అంతా ఆంతరవిజ్ఞానపరిణామమే.అంటే-ప్రపంచం అంతా,అన్ని వేళలలోను జ్ఞానగోచరం కావాలి (తెలియబడాల్సి అలా అవడంలేదు. ఎదుట ఒక వృషభం నిలిచి ఉన్నప్పుడు మాత్రమే వృషభజ్ఞానం కలుగుతున్నది.అది ఎదుట లేనప్పుడు దాని జ్ఞానం కలగడం లేదు. అందుచేత జ్ఞానం కలగడానికి వృషభం ఉండడం కారణం అని అంగీకరించి తీరాలి. అయితే-విషయం ఏమి టనగా మనకు వృషభజ్ఞానం కలగదాన్ని పట్టి వృషభం ఉన్నట్లు ఊహిస్తున్నాం. అందుచేత బాహ్యపదార్దా లన్నీ అనుమేయాల్వే కేవలం ఉన్నట్లు ఊహింపబడుతున్నాయి. బాహ్యప్రపంచం అనుమేయం అని ప్రతిపాదించడంచేత ఈ మతానికి బాహ్యమేయవాదం అని కూడ పేరు,
4 వైభాషికమతం (బాహ్యప్రత్యక్షవాదం) : ఈ మతం ప్రకారం కూడ బాహ్య- మానసికప్రపంచాలు రెండూ సత్య మైనవే. అయితే వీళ్లు సౌత్రాంతికుల వలె బాహ్యప్రపంచం అనుమేయం అని అంగీకరించకుండా ప్రత్యక్షవేద్యమే అని ప్రతిపాదిస్తారు. అందుచేత ఈ మతానికి బాహ్యప్రత్యక్షవాదం అని కూడ పేరు.
బౌద్ధమతానికి సంబంధించిన తాత్తికసిద్దాంతాలలో ఈ నాలుగు చాల ప్రధాన మైనవి. ఈ సిద్దాంతాలను ప్రతిపాదిస్తూ సమర్థిస్తూ సంస్కృతభాషలో
బౌద్ధమతం 193 అసంఖ్యాక మైన బౌద్ధగ్రంథాలు ఆ యా కాలాలలో రచింపబడ్డాయి. బౌద్ధమతానికి సంబంధించి సర్వజనసాధారణ మైన నైతికబోధలూ,వాటితో సంబంధించిన కథలూ ఉపాఖ్యానాలూ మొదలైనవి పాలి మొదలైన,అందరికీ తెలిసే భాషలో ఉన్నా సిద్ధాంతాలకి సంబంధించిన వాద(గ్రంథా లన్నీ అతిసూక్ష్మవిషయాలను సామర్థ్యృపూర్వకంగా అవిష్కరించ గలిగిన శక్తి గల పండితభాష యైన సంస్కృతం లోనే రచింపబడ్డాయి. ఇదే విధంగా జైనులు కూడ సాధారణవిషయాలకు అర్ధమాగధి మొదలైన (ప్రాకృతభాషలు ఉపయోగించినా వాదగ్రంథా లన్నీ సంస్కృతభాషలోనే రచించారు.ఇది ఆనాటి పద్ధతి. పాలి - సంస్కృతభాషలలో అతివిస్త్రృత మైన బౌద్ధవాజ్బయం ఉంది.
'ప్రాథమికబౌద్ధమతానికి సంబంధించిన విషయా లన్నీ పాలీభాషలో ఉన్న మూదు పిటకాలలో ఉన్నాయి. పిటకం అనగా గంప. ఈ మూడు పాలీగ్రంథ పిటకాలకు త్రిపిటకం అని పేరు. వినయము, ధమ్మము లేదా సూత్తము అభిధమ్మము అనేవి ఈ త్రిపిటకాలు. బౌద్దభిక్షువులు అనుసరించవలసిన నియమా లన్నీ వినయపిటకంలో చెప్పబడ్డాయి. బుద్ధుడు బోధించిన ధర్మం అంతా ధమ్మపిటకంలో (లేదా సూత్తపిటకంలో) నిక్షిప్తం అయి ఉంది. ఇది (బౌద్ధ సిద్దాంతాలకి సంబంధించి నంతవరకు అత్యంతప్రామాణిక మైన గ్రంథం. నాలుగు ఆర్యసత్యాలు అష్టాంగమార్గము, నిర్వాణము, ప్రతీత్యసముత్సాద సిద్ధాంతము, ఆత్మ, కర్మ మొదలైన విషయా లన్నీ ఈ పిటకంలో ఉన్నాయి. కొన్ని శతాబ్దుల కాలంలో బౌద్ధవిహారాలలో సండితులు రూపొందించిన, బౌద్ధమతానికి సంబంధించిన అనేకసిద్దాంతాలు అభిధమ్మపిటకంలో పొందుపరచి ఉన్నాయి. ఈ పిటకాలే కాకుండా పాలీభాషలో అనేకకథ లున్నాయి.గోతమబుద్భుని 547 జన్మల వృత్తాంతాలను,(అవతారాల కథలను) చెప్పే ఈ కథలకు జాతకకథ లని పేరు.
బౌద్ధమతంలోని ప్రధానవిషయాలు
- ప్రధానంగా బౌద్ధమతం ఈశ్వరునితో సంబంధం లేని మతం.బుద్దుడు బోధించిన మతం పూర్తిగా మానవునికి మాత్రమే సంబంధించినది. అనేకవిధాలైన క్లేశాలలో చిక్కుకొని ఉన్న మానవుని దుఃఖాలను తొలగించడమే ఈ మతం
194 బౌద్ధమతం ప్రధానలక్ష్యం. ఇందుకు చూపించిన ప్రధానమార్గం అష్టాంగమార్గం. కాలక్రమంలో బుద్దుణ్ణి ఈశ్వరుడుగా భావించి ఆతనిని ఆ విధంగా పూజించడం ప్రారంభం అయినా కూడ ఈ మతం ఈశ్వరవాదిమతం అని చెప్పడానికి వీలు లేదు; ఎందువల్ల ననగా బుద్దుడు దేవుడు అని అంగీకరించినా కూడ అతడే జగత్ సృష్టి-స్టితా-లయకర్త అని అంగీకరించలేదు; అదే విధంగా అప్పుడు కూడ నిర్వాణానికి ప్రధానోపాయం అష్టాంగమార్గమే అను సిద్ధాంతంలో ఏ మాత్రమూ మార్పు లేదు.
2.ప్రారంభదశలో బౌద్ధమతం పూర్తిగా నైతికప్రవృత్తికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన మతం అవడంచేత దానిలో ఏ విధ మైన కర్మకాండకూ అవకాశం ఉండేది కాదు. అయితే కాలాంతరంలో ప్రచారంలోనికి వచ్చిన మహాయానశాఖలో అనేకవిధా లైన కర్మకాండకీ,విహారాదుల నిర్మాణానికీ ప్రాధాన్యం ఇవ్వబడింది. వైదికమతంలో వలె చాతుర్మాస్యదీక్షాదులు కూడ ఉన్నాయి.
-
బౌద్ధమతంలో అత్యంతప్రధాన మైనవి నాలుగు ఆర్యసత్యాలు(చత్వారి ఆర్యవ్రతాని),అష్టాంగమార్గమూ అనేవి. (1) దుఖ ఆర్యసత్యం (2) దుఃఖసముదయ అర్యసత్యం (3) దుఃఖనిరోధ ఆర్యసత్యం (4) దుఖనిరోధగామినిప్రతిపద్ ఆర్భసత్యం అనేవి నాలుగు ఆర్యసత్యాలు. మారు మాటలలో చెప్పాలంటే- (1) ప్రపంచకంలో ఎక్కడ చూచినా దుఃఖమే ఉంది (సర్వం దుఃఖమ్) (2) ఈ దుఃఖానికి వెనుక పన్నెండు కారణాల పరంపర (ద్వాదశనిదానాలు) ఉంది (9) ఈ ద్వాదశకారణ పరంపరను తొలగించవచ్చును (నిర్వాణం). (4) దుఃఖాన్ని తొలగించడానికి నిశ్చితమైన ఉపాయం ఉంది (అష్టాంగమార్గం).
-
క్షణికతావాదము,అనాత్మవాదమూ అనేవి బౌద్ధమతంలో మాత్రమే అంగీ కరించిన రెండు ప్రధాన మైన వాదాలు. ప్రతీ వస్తువూ కూడ క్షణికమే-ఒక క్షణంలో పుడుతుంది,మరు క్షణంలో ఉండదు (సర్వం క్షణికమ్) అనేది క్షణికతా వాదం. ఈ క్షణికతా వాదానికి బౌద్భులే అంగీకరించిన ప్రతీత్యసముత్పాదవాదం = మూలం. ఈ వాదం ప్రకారం-ప్రతీ కార్యమూ కూడ దాని వెనుక (దానికి ముందు) ఉన్న ఒక అవస్థనుండి (పరిస్థితినుండి) పుడుతుంది. ఈ కార్యం పుట్టగానే
బౌద్ధమతం 195 ఆ అవస్థ నశిస్తుంది. ఈ విధంగా ప్రపంచం అంతా అన్యోన్యాభితా లైన క్షణికము లైన అవస్థల (పరిస్థితుల) గొలుసు మాత్రమే.ప్రపంచంలోని ఇతరపదార్థాల వలె ఆత్మ కూడ అనిత్యమే.క్షణికా లైన విజ్ఞానాల ప్రవాహమే ఆత్మ. క్షణికతావాదాన్ని స్థాపించడం ద్వారా బౌద్ధమతం అశాశ్వత మైన క్షణిక మైన ప్రపంచకం విషయం లోను, ధన భోగాదుల విషయంలోను మానవునికి స్థిరమైన అనాసక్తి, వైరాగ్యం కలిగించదానికీ, తద్ద్వారా వానిని అష్టాంగమార్జాదులను అనుసరించి నిర్వాణం పొందే టట్లు చేయడానికీ ప్రయత్నిస్తుంది.క్షణికము లైన వస్తువులమీద అత్యాసక్తి కేవలం దుఃఖానికే హేతు వవుతుంది అని బోధించడమే ఈ క్షణికతావాదానికి ('ప్రధానలక్ష్యం. (చూ. అనుబంధం).
ర5.పిందూమతం వలెనే బౌద్ధమతం కూడ కర్మసిద్ధాంతాన్నీ పునర్జన్మ సిద్ధాంతాన్నీ పూర్తిగా విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కడూ తాను చేసిన కర్మయొక్కఫలితాన్ని ఈ జన్మలోనో రాబోయే జన్మలోనో తప్పక అనుభవించవలసి ఉంటుంది. ఒకడు తాను చేసిన కర్మల ఫలాన్ని ఒక జన్మలో పూర్తిగా అనుభవించకపోతే మరొక జన్మలో అనుభవించాలి.రాబోయే జన్మ ఈ జన్మలో చేసిన కర్మలను పట్టి ఉంటుంది.నిర్వాణం పొందా లంటే పూర్వకర్మల నన్నింటినీ నశింపచేసికొనడం చాల అవసరం.
6.కర్మలు బంధానికి హేతువులై దుఃఖాన్ని కలిగిస్తాయి అనే మాట సత్యమే అయినా కేవలం రాగద్వేషపూర్వకంగా చేసిన కర్మలు మాత్రమే బంధనానికి హేతువులు.రాగడ్వేషాలు లేకుండా చేసిన నిష్కామకర్మ బంధహేతువు కాదు. అందుచేత బౌద్ధమతం అకర్మణ్యత్వాన్నివ పనీ చేయకుండా ఉండడాన్ని బోధించడు, నిష్కామకర్మ చెయ్యా లని బోధిస్తుంది.
- బౌద్ధమతం (ప్రకారం మానవుని ప్రధానగమ్యం నిర్వాణం,అది ఈ దేహంతో ఉండగానే లభించవచ్చును. నిర్వాణం పొందడానికి ఈ దేహం నశించ వలసిన పని లేదు.జీవించి ఉండగానే నిర్వాణం పొందవచ్చును, అపవ్టాంగమార్గాన్ని అనుసరించడం ద్వారా సకలకర్మలనుు,వాటికి మూల మైన రాగద్వేషాలను నశింప చేసికొన్నవాడు ఈ దేహంతో ఉండగానే నిర్వాణం పొందుతాడు.
196 బౌద్ధమతం 8.తత్త్వవాదాలలో నైనా, నైతికమార్దాల విషయంలో నైనా, ఇతర వ్యవహారాలలో నైనా అతి పనికిరాదు; మధ్యమార్థాన్నే అనుసరించాలి.
9, ఆత్మావలంబనబుద్ధితో ప్రతి ఒక్కడు తనకు తానే సాహాయ్యం చేసికోవాలి (ఆత్మదీపో భవ).అయితే మానవు లందరూ పరస్పరం సాహాయ్యం చేసికొనడం, మానవతాబుద్దితో (భ్రాతృ్భభావంతో పరోపకారం చేయడం కూడ మానవుని కర్తవ్వాలు.
10.మానవుడు తన ఒక్కని నిర్వాణంకోసం మాత్రమే ప్రయత్నించకూడదు. తాను నిర్వాణం పొందిన తరవాత ఇతరులకు కూడ నిర్వాణం లభించే టట్లు ప్రయత్నించాలి. బౌద్ధమతంలో బోధిసత్తులను గూర్చిన వర్ణనలు,తనకు జ్ఞానం కలిగిన తరువాతకూడ బుద్దుడు ఆజీవితాంతం ఇతరులకొరకై చేసిన నిర్విరామ యత్నమూ ఇందుకు నిదర్శనం.
11.బౌద్ధమతం అడుగడుగునా అహింస,సత్యం,దయ,ఇంద్రియని[గ్రహం, ఉదారస్వభావం, బ్రహ్మచర్యం మొద లైన సద్గుణాలను బోధిస్తుంది. వీటిలో అహింస చాల ఉత్తమ మైనది.
- 12“బుద్ధం శరణం గచ్చామి”,“ధమ్మం శరణం గచ్చ్భామి,'సంఘం శరణం గచ్చామి” అను ప్రసిద్ధ మైన త్రిరత్నశరణాగతివాక్యాలలో బౌద్ధమతసారం అంతా నిక్షిప్తం అయి ఉంది.
ఈశ్వరుడు
బుద్దుడు ఎక్కడా కూడ దేవుణ్ణి గూర్చో మాటలాడలేదు. దీనిని పట్టి బొద్దమతం నాస్తికమతం అని చెప్పవచ్చు. అయితే దేవుడు లేడని కూడ బుద్దుడు ఎక్కడా చెప్పలేడు. మానవుడు స్పప్రయత్నంచేత నిర్వాణం పొందవచ్చును అని చెప్పినప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అన్న ్రశ్చకు అంత ప్రాధాన్యం లేదని కాని, మానవుని అల్పశక్తి గల బుద్ధి ఇలాంటి విషయాలను నిర్ణయించజాలదు అని కాని బుద్దుని అభిప్రాయం అయి ఉంటుంది. అందుచేత బుద్దుడు నాస్తికుడు (241690 అని చెప్పడానికి వీలులేదు; దేవుని విషయంలో ఉదాసీనుడు (28౧09640) అని మాత్రమే చెప్పవచ్చు అని కొందరి అభిప్రాయం. ఏది వమైనా అతిప్రాచీనమైన బౌద్ధమతంలో
బౌద్ధమతం 197 దేవుని నిర్దేశం లేదు; ఇది పూర్తిగా మానవునితో మాత్రమే సంబంధించిన మతం అని చెప్పడంలో సందేహం లేదు. ప్రతీమానవుడూ నిర్వాణం పొందవచ్చు నని బౌద్ధమతం చెపుతూన్నది. అలా నిర్వాణం పొందిన ప్రతీమానవుడూ దేవుడే. అందుచేత ప్రతీమనిషిలోనూ ఈశ్వరత్వం నిగూఢమ్లై ఉంది. ఈ దృష్టితో చూస్తే ఈశ్వరుని కొక సత్య మైన స్వరూపం లేకపోయినా ఈశ్చరత్చం (804006) మాత్రం ప్రయత్నించి సంపాదించదగిన అత్యుత్తమస్థితి.
పైన చెప్పెన దంతా ప్రాచీనబౌద్ధమతం విషయంలో సత్యమే అయినా తరువాతి కాలంలో బొద్దులు బుద్దుణ్ణే దేవునిగా అంగీకరించారు. అతడు పూర్వజన్మలలో అనేక మైన అవతారాలు ఎత్తా దని కూడ వాళ్లు ప్రతిపాదించారు. ఆధునిక బౌద్ధ మతావలంబులు అనేకవిధాలైన ఆరాధనామందిరాలలో బుద్దుని విగ్రహాలు స్థాపించి వాటికి హిందువులు జరిపిన విధంగా పూజాదికర్మకలాపాలు జరుపుతున్నారు. మహాయానబౌద్దులు ఎందరో బోధిసత్తులను అనేకమైన విస్తృతపూజావిధానాలతో ఆరాధిస్తున్నారు. బౌద్దమతంలో ఉన్న ఈ షక్షం చూస్తే ఇది హిందువుల బహుదేవతా వాదాన్ని పోలిఉంటుంది. అయితే వీరు కూడ బోధిసత్తులకు, హిందువులు వాళ్ల విభిన్నదేవతలకు ఇచ్చిన స్థానం ఇస్తూన్నట్లు కనబడదు. అదే విధంగా బుద్దుణ్ణి దేవుడని అంగీకరించినా, హిందువులు దేవుణ్ణి జగదుతృత్తి-స్థితి - లయాలకు కారణభూతునిగా అంగీకరించి నట్లుగా, వీరు బుద్దుణ్జి అంగీకరించరు. బుద్దుణ్ణి వాళ్లు కేవలం ఒక పవిత్రుదైన దయామూర్తిగాను, మానవులను ఉద్ధరించే గొప్ప ఆధ్యాత్మికనాయకుణ్ణి గాను పూజిస్తారు. ఈ విధంగా బుద్దుజ్జి ఆరాధిస్తే ఆతని అను([గ్రహంచేత తమ దుఃఖా లన్నీ తాలగిపోతా యని వాళ్లు విశ్వసిస్తారు.
జగత్తు
జగత్సృష్టాదుల విషయంలోను, ఈశ్వరుని విషయంలోను బుద్దు దేమీ చెప్పలేదు. అందుచేత బౌద్ధమత[గ్రంథాలలో సృష్టిని గూర్చిన నిర్దేశం లభించదు. ప్రపంచానికి దీని వ్యవహారానికి ఆది అంటూ ఏదీ లేదని బౌద్దుల అభిప్రాయం అన్నట్లు తోస్తుంది. “ఈ సంసారచక్రం ఆది అంటూ ఏదీ లేకుండా, ఈశ్చరు డనేవాడు లేకుండా ఇదే విధంగా ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటుందని మహాబౌద్ధ
198 బౌద్ధమతం పండితుడు బుద్ధఘోషు డొక చోట అంటాడు. అయితే బుద్దుని ఆలోచన లన్నీ జగత్తులో నివసిస్తూన్న మానవుని గూర్చియే ఉండడంచేత జగత్తును కూర్చిన ఆతని కొన్ని అభిప్రాయాలు కూడ అక్కడక్కడ కనబడుతున్నాయి. బౌద్దుల “సర్వం కణికమ్” అనే సర్వక్షణికత్వవాదాన్స్సీ దానికి మూలమైన ప్రతీత్యసముత్పత్తివాదాన్నీ గూర్చి వెనుక చూచి ఉన్నాం. నిరంతరమూ జరిగే మార్పు అనేది ఒక గొలుసు అయితే దానిలో క్షణిక మైన అతుకులు (11109) వస్తువులు. నిజానికి మార్పు చెందే వస్తు వంటూ ఏదీ లేదు; ఉన్నదల్లా నిరంతర మైన మార్పు మాత్రమే.
బౌద్దులు ప్రతిపాదించే ప్రతీత్యసముత్పాదం అనేది వాళ్లు అంగీకరించిన కార్యకారణభావానికి మరొక పేరు. “ఇది ఉన్నప్పుడు అది పుడుతుంది” (“అస్మిన్ సతి ఇదం భవతొ) అనగా - “ఒక కారణంమీద ఆధారపడి కార్యం పుడుతుంది”. ఈ విధంగా ప్రతీ వస్తువూ కూడ సాపేక్ష మైనది (76126౪7ల); తాను తన వెనుక ఉన్నస్థితినుండి ఆవిర్భవించి మళ్లీ తాను మరొక వస్తువు ఆవిర్భవించడానికి కారణం అవుతుంది. అందుచేత ఏ వస్తువూ కూడ ఒక్కక్షణంకంటె ఎక్కువకాలం ఉండదు; పుడుతుంది, నశిస్తుంది (కనబడకుండా పోతుంది).
ప్రతీ వస్తువూ క్షణికమే అని చెప్పడానికి దీపాన్ని దృష్టాంతంగా చూపనచ్చును. ఒక దీపం వెలుగుతూన్నప్పుడు ఒకే జ్వాల నిలిచి ఉన్నది అన్నట్లు సామాన్య మానవుడు అనుకొంటాడు. నిజానికి అది “ఒకే జ్వాలి కాదు; అది సమానమైన జ్వాలల పరంపర; ఆ పరంపరలోని ఒక్కొక్క జ్వాల ఒక్కొక్క క్షణం మాత్రమే ఉంటుంది. 'ఒక్తే జ్వాలిగా కనబడుతూన్న దీపజ్వాల ఏ విధంగా అనేక జ్వాలల పరంపరయో అదే విధంగా అన్ని వస్తువులూ కూడ ఆవిర్భవిస్తూన్న వస్తువుల పరంపరయే. నదీప్రవాహాన్ని పరిశీలిస్తే కూడ పప్రపంచకంలోని వస్తువు లన్నీ క్షణక్షణానికీ మారిపోతూంటాయి అను విషయం స్పష్టం అవుతుంది. ఒక క్షణంలో ఉన్న నది ఉత్తరక్షణంలో అదే నది కాదు. అందుచేతనే “నువ్వు ఒకే నదిలో రెండు సార్లు స్నానం చేయజాలవు” అని హెరాక్షిటస్ అన్నాడు. మార్చు అతిశీఘ్రంగా జరుగుతూండదంచేత అది ఒకే వస్తువు అను భ్రాంతి కలుగుతూన్నది. వాస్తవంలో స్థిర మైన వస్తు వంటూ ఏదీ లేదు. ఈ క్షణికతావాదం జగత్తు స్థిర మైనది అను
బౌద్ధమతం 199 వాదానికి గాని, శూన్యవాదానికి గాని అవకాశం లేని మధ్యమమార్గం (మక్షిమనికాయం).
బౌద్ధమతం జగత్తుయొక్క సత్యత్వాన్ని నిరాకరించకపోయినా అది చాల అశాశ్వత మైనది క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది అని చిత్రించడం ద్వారా మానవునకు దానియందు ఆసక్తి లేకుందా చేయడానికి, ఐహికసుఖభోగాదుల నుండి వాని మనస్సు మరల్చి నిర్వాణం అనే ఉత్తమలక్ష్యం వైపు త్రిప్పదానికి ప్రయత్నం చేస్తుంది; అందువల్ల లౌకికవిషయాలమీద స్థిరమైన వైరాగ్యం కలిగి అతడు అష్టాంగమార్గం మొదలైన సాధనాలను ఆశ్రయిస్తాడు.
మానవుడు
మానవుడు కేవలశరీరమూ కాదు, శరీరంతో కూడిన నిత్య మైన ఆత్మా కాదు. భౌతిక - మానసికశక్తుల సముదాయం మానవుడు. రూపము (భౌతిక పదార్ధం), వేదన (అనుభవము), సంజ్ఞ (జ్ఞానము), సంస్కారము (సహజ స్వభావము, విజ్ఞానము (చైతన్యం) అనే ఐదు సృంధాల సంఘాతం మానవుడు అని హీనయానంలో 'ప్రతిపాదించబడింది. చార్వాకుల వలె బౌద్ధులు మానవునిలో చైతన్యం అనేది లేదు అని చెప్పరు గాని, నిత్యమూ స్థిరమూ అయిన ఆత్మ అనేది ఉన్న దని మాత్రం అంగీకరించరు. సర్వం క్షణికమ్ అని క్షణికతావాదం. అంగీకరించిన తరువాత ఆత్మమాత్రం స్టిర మైనది అని చెప్పడం కుదరదు కదా? వాళ్ల మతం (ప్రకారం క్షణికము లైన విజ్ఞానాల నిరంతరధారయే ఆత్మ. క్షణికవిజ్ఞానా లన్నీ విడిపోకుందా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అందుచేత ఒక క్షణికవిజ్ఞానం నుంచి దానిలో ఉన్న సంస్మ్కారాదులు తరువాతి విజ్ఞానక్షణంలోనికి సంక్ర మిస్తూంటాయి. ఇలా సంక్రమించడంవల్లనే మానవునిలో ఏకత్వబుద్ధి కలుగుతుంది. ఒక దేహం విడచిన తరవాత మరొక జన్మ ఎత్తి మరొక దేహం ధరించడం అనేది కూడ కుదురుతుంది. స్థిరమైన ఆత్మ లేకపోయినా ఒక విధంగా మానవుడు అమర్హ్యుడే; దేహం నశించినా అతడు పూర్తిగా నశించడు. ప్రస్తుతశరీరంలో ఉన్న చివరి విజ్ఞానక్షణం దానిలో ఉన్న సంస్కారాదులతో సహా క్రొత్త దేహంలోనికి ప్రవేశిస్తుంది; ఆ విజ్ఞానక్షణం ఆ క్రొత్త శరీరంలో రాబోయే విజ్ఞానక్షణప్రవాహానికి ప్రారంభకం అవుతుంది.
200 బౌద్ధమతం బౌద్ధమతం ప్రకారం మానవుడు సర్వస్వతంటత్రుడు. ఆతనికంటె గొప్పవా డని చెప్పే దేవు దనేవాడు ఎవడూ లేడు. మానవుడు స్వప్రయత్నంచేతనే పరమలక్ష్యమైన నిర్వాణాన్ని సాధించగలడు. అయితే మానవుడు దుఃఖమయ మైన జీవితంలో చిక్కుకొని ఉన్నా డనే విషయం సత్యమే. దీనికి కారణం వాని అజ్ఞానం. 'ప్రసంచకంలో ఉన్న వస్తువుల యథార్థస్పరూపం తెలియకపోవడంతో వాటి ఆకర్షణలో పడి ఇతడు దుఖాల పాలవుతున్నాడు. అహంకారంతో కర్మలు చేసి వాటి సంస్కారాలు వెన్నంటడంతో మళ్లీ మళ్లీ జన్మ లెత్తుచున్నాడు. స్వార్టబుద్ధితో సకామకర్శ్మలు చేయడమే దీనికి ప్రధానకారణం. లౌకికవిషయాలయందు ఆసక్తి పూర్తిగా విడిచి నిష్కామకర్మ ఆచరించిన ట్లయితే దాని సంస్కారం వెన్నంటి రాదు; అప్పుడు ఆ మానవుడు నిర్వాణం పొందుతాడు. పరిపూర్ణ మైన వైరాగ్యం సంపాదించి కర్మబంధవిముక్తు డవదానికి తగిన ఉపాయాలు బుద్దుడు బోధించి ఉన్నాడు. వాటిని అనుసరించి అత్యుత్తమస్థితిని పొందడం గాని, భోగలాలసత్వంతో ఈ సంసారచక్రంలో తిరుగుతూ ఉండడం గాని మానవుని చేతిలోనే ఉంది. చెడుగు, దుఃఖము ప్రపంచంలో అంతటా దుఃఖం వ్యాపించి ఉంది. దీనికి మూలకారణం ఏమిటో (గ్రహించిన బుద్దుడు నాలుగు ఆర్భసత్యాలను కనుగొన్నాడు. ఇవన్నీ ఆచరణ
- ద్వారా తప్పక సత్ఫలితాన్ని ఇచ్చే సత్యాలు. యూదమతం, కైస్త్వవ్రమతం మొదలైన ఈశ్వరుణ్ణి అంగీకరించే మతాలలో వలె బౌద్ధమతంలో సైద్దాంతికవాదాలకి అవకాశం గాని, వాటి ఆవశ్యకత గాని లేదు. దీని బోధ లన్నీ ప్రయోగాత్మక మైనవి. సర్వసమర్థుదూ, దయామయుడు అయిన పరమేశ్వరుడు సృష్టించిన ఈ (ప్రపంచంలో ఇన్ని కష్టాలూ, దుఖూలూ ఎందుకు ఉన్నాయి అను ప్రశ్నకు అవకాశం గాని దానికి తగిన సమాధానాలు అన్వేషించవలసిన ఆవశ్యకత గాని, దేవుణ్ణి అంగీకరించని ఈ బౌద్ధమతంలో లేదు. ఇది నూటికి నూరు పాళ్లు మానవునికి మాత్రమే సంబంధించిన మతం. అందుచేత మానవుని సమస్యలకు పరిష్మారం కూడ మానవుని చేతిలోనే ఉన్న దని బోధించిన బుద్ధుడు సైద్దాంతికము లైన వాదోపవాదాలకు ఏ మాత్రమూ అవకాశం ఇవ్వలేదు. ఎవడు దుఃఖం
బౌద్ధమతం 201 అనుభవిస్తున్నాడో, ఆ దుఃఖం తొలగించుకునే ఉపాయం కూడ వాని చేతిలోనే ఉన్న దని వైజ్ఞానికపద్ధతిలో బోధించాడు. దుఃఖాల స్వరూపస్వభావాలను గూర్చి కాదు ఆలోచించవలసినది; వాటిని నిర్మూలించే ఉపాయాలు ఆలోచించాలి. బుద్ధుడు చెప్పిన మొదటి ఆర్య్భసత్యం దుఃఖాన్ని గుర్తించడానికి సంబింధించినది. మానవుని దుఃఖం జన్మ - జరా - మరణాల రూపంలో ఉంటుంది. వీటికి ఏదో కారణం ఉండి ఉందాలి. అదే అజ్ఞానం. నిజానికి పన్నెండు కారణాల గొలుసు ఒకటి ఉంద్వి నాటిలో మొట్ట మొదటిది అజ్ఞానం. ఈ పన్నెండు కారణాలకు ద్వాదశనిదానములు అని పేరు. ఈ గొలుసులో ఉన్న పన్నెండింటిలో ఉత్తరోత్తరానికి పూర్వపూర్వం కారణం. వీటిలో పన్నెండవది జరామరణం ; అనగా జరామరణాది రూప మైన దుఃఖం. జరామరణానికి కారణం జాతి ; అనగా పుట్టడం. మనిషికి పుట్టుక లేకపోతే దుఃఖ మనేది ఉండదు కదా? అందుచే పుట్టుక అనేది అతి సమీపంలో ఉన్న దుఃఖకారణం. ఈ జాతికి కారణం భవం, అనగా పుట్టా లనే కోరిక. ఎందువల్ల ననగా పుట్టా లను కోరిక లేకపోతే పుట్టుకయే జరుగదు. ఈ భవానికి కారణం ఉపాదానం అనగా భోగద్భష్టి. ఉపాదానానికి కారణం తృష్ణ, అనగా అలాంటి భోగాలకోసం తీవ్రమైన కోరిక. తృష్ణకు కారణం వేదనం, అనగా భోగాల అనుభవం. ఈ వేదనకు కారణం స్పర్శ, అనగా ఇంద్రియాలకు విషయాలతో, భోగ్యవస్తువులతో, సంబంధం. స్పర్శకు కారణం షదాయతనం, అనగా పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఇవి లేకపోతే విషయేంద్రియస్పర్భ కలగదు కదా? షడాయతనానికి కారణం నామరూపం, అనగా సచేతన మైన భౌతికశరీరం. నామరూపానికి కారణం గర్భంలో ఉండగా ప్రవేశించిన మొదటి చైతన్యం, లేదా విజ్ఞానక్షణం. ఈ విజ్ఞానానికి కారణం సంస్కారం అనగా పూర్వకర్మ్శల (ప్రభావం. ఈ సంస్కారానికి కారణం అజ్ఞానం. ఈ విధంగా పరిశీలిస్తూ వెనుకకు వెనుకకు పోగా పోగా అన్నింటికీ మూలకారణం అజ్ఞానం అని తేలింది. ఈ విధంగా అజ్ఞానమే డుణఖాలకి మూలకారణం. దుఖం అనేది సత్యమే అయినా దీనికి కారణం అజ్ఞానం అవడంచేత ఈ అజ్ఞానం తొలగించుకొనడం కోసం తగు ప్రయత్నం చేయని మానవుడే తన దుఃఖానికి (అజ్ఞానం ద్వారా) కారణం అని చెప్పాలి. ఈ దుఃఖమయ మైన ప్రపంచం దానిమట్టుకు అది ఎల్లప్పుడూ ఉంటే ఉండవచ్చు;
202 బౌద్ధమతం అయితే మానవుడు మాత్రం తన అజ్ఞానాన్ని తొలగించుకుంటే దుఃఖంనుండి బైట పదవచ్చు. ఈ ప్రపంచం అశాశ్వత మైనది, క్షణిక మైనది; అందుచేత ప్రాపంచిక విషయాల సంబంధాలు కూడ అశాశ్వత మైనవి; వీటిపై అత్యాసక్తి మూధత్వానికి లక్షణం అనే దృఢ మైన నమ్మకంతో అజ్ఞానం తొాలగించుకొన్న మానవుడు కర్మలు రాగద్వేషాదులతో అత్యాసక్తితో, ఆచరించడు. నిష్మామంగా చేసిన కర్మ సంస్కారాలను పుట్టింపజాలదు. సంస్కారాలు లేకపోతే జన్మయే ఉండదు. సకల దుఖశూన్య మైన స్థితి లభిస్తుంది. అదే నిర్వాణం.
బుద్ధుడు చెప్పిన మూడవ ఆర్వసత్యం ఈ నిర్వాణానికి సంబంధించినది. ఇది కాల్చనికమైన స్వప్నం కాదు. దీనికి ఒక నిశ్చితమైన రూపం ఉంది. దీనిని సాధించడానికే నాల్గవ అర్యసత్యం నిర్దేశించబడింది. అష్టాంగమార్గం అనే మధ్య మార్గాన్ని భద్దాపూర్వకంగా అవలంబిస్తే ఈ నిర్వాణం లభిస్తుంది. నిర్వాణాన్ని ఈ జన్మలోనే ఈ దేహం ఉండగానే పొందవచ్చు. చేయవలసిన దల్లా ఏమి టనగా - రాగద్వేషాలను పూర్తిగా విడిచిపెట్టి నిష్కామంగా కర్మ ఆచరించాలి. ప్రపంచం దుఃఖానికి కారణం కాదు అది ఎలా ఉందో అలాగే ఉండవచ్చు. మానవుడు మాత్రం తన మానసిక దుష్ప్రృవృత్తులను పూర్తిగా తొలగించుకొంటే, ఈ ప్రసంచం ఎలా ఉన్నా తాను నిర్వాణం పొందవచ్చును.
మరణానంతరం
బౌద్ధమతం ప్రకారం మరణానంతరం మానవుడు తాను చేసిన కర్మను అనుసరించి మళ్లీ మానవజన్నైనా ఎత్తుతాడు, మంచి కర్మ చేసి సంస్కారా లన్నీ నశింపచేసికొన్న ట్లయితే పునర్జన్మకు కారణం ఏదీ లేకపోవడంచేత నిర్వాణ మైనా పొందుతాడు. ఈ రెండింటిలో దేనికైనా మానవుని స్వప్రయత్నమే కారణం. వీని పుణ్య -పాపాలను పరిశీలించి వీనికి స్వర్గమో నరకమో ప్రసాదించే ఈశ్వరు దనేవాడు ఎవడూ లేడు. నిజానికి ప్రాచీన బౌద్ధమతంలో (కొందరి అభిప్రాయం ప్రకారం) స్వర్ణనరకాదుల ప్రసక్తి కూడ కనబడదు. (చూ. అనుబంధం).
అయితే సర్వక్షణికతావాదాన్ని అంగీకరించడంచేత ఈ మతంలో నిత్య మైన ఆత్మ అనేది కూడ లేదు; క్షణిక మైన విజ్ఞానాల, లేదా విజ్ఞానక్షణాల, ప్రవాహమే
బౌద్ధమతం 203 ఆత్మ అని అనాత్మవాదం అంగీకరించవలసి వచ్చింది. అలాంటప్పుడు నిత్య మైన ఆత్మ అనేదే లేనప్పుడు పునర్జన్మ దేనికి, నిర్వాణం దేనికి అను ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానంగా (వెనుక సూచించినట్లు) ఈ మతంలో ఇలా చెపుతారు. విజ్ఞానక్షణాలు ఒకదాని వెనుక ఒకటి నిరంతరధారారూపంలో ప్రవహిస్తూంటాయి. ఒక విజ్ఞానక్షం తనకు ముందున్న విజ్ఞానక్షణంనుంచి సంసారాలు తీసికొంటుంది, తన తరువాత వచ్చే విజ్ఞానక్షణానికి అందజేస్తూ ఉంటుంది. ఈ విధంగా స్థిరమైన ఒక ఆత్మ అంటూ లేకపోయినా ఈ విజ్ఞానక్షణధార నిరంతరము అవిచ్చిన్నంగా 'ప్రవహిస్తూండడంచేత ఒకే ఆత్మ స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వెనుకటి దేహంలోని చివరి విజ్ఞానక్షణం (క్రొత్త శరీరంలోని మొదటి విజ్ఞానక్షణానికి సంస్కారాలను అందజేస్తుంది. నిర్వాణం లభించినవాళ్ల విషయం కూడ అంతే. (చూ. అనుబంధం). నిర్వాణస్వరూపం
సమస్త దుఃఖాలు పూర్తిగా ఆగిపోవడమే నిర్వాణం. జన్మ - మరణ చక్రానికి సంబంధించిన, దానికి హేతువైన పన్నెండు కొందీలు విడిపోయి దుఖ సముదాయం అంతా నశించిన స్థితి నిర్వాణం. అయితే - ఈ నిర్వాణం అనేది కేవలం సర్వ దుఃఖాభావరూపమా లేక దీనిలో ఏదైన భావరూపవిశేషం కూడ ఉన్నదా? ఈ విషయంలో బౌద్ధమతంలో అభిప్రాయభేదా లున్నాయి. హీనయానంలో నిర్వాణానికి సంబంధించిన అభావరూపానికే ప్రాధాన్యం. ఒక విధంగా ఇది శూన్యస్పరూపం. బుద్దుడు నిర్వాణస్వరూపాన్ని గూర్చి ఏమీ చెప్పకపోయినా ఆతని మౌలికోపదేశాలను పరీక్షించి చూస్తే నిర్వాణం కేవలం అభావరూపం కాదు భావరూపం కూడ కాదు, ఇది అనిర్వచనీయం అని తెలుస్తుంది. అనిర్వచనీయం అనగా దీనిని భావరూపం అని చెప్పడానికి వీలులేదు, అభావరూపం (శూన్యం) అని చెప్పడానికి వీలు లేదు అని అర్ధం. శూన్యతావాదులు నిర్వాణం అనేది శూన్యమే అని చెప్పినదానికి అర్ధం అది అనిర్వచనీయం అని మాత్రమే. మామూలు మాటలలో వర్ణించడానికి శక్యం కాకపోయినా నిర్వాణంలో భావరూహ్మ్థితి కూడ ఉన్నది అని చెప్పాలి. నిర్వాణం స్వరూపం ఏమిటో చెప్ప మని గ్రీక్ రాజైన మిలిందుడు నాగసేను దనే బౌద్ధభిక్షువుని కోరినప్పుడు అతడు - “నిర్వాణం సముద్రం వలె గంభీరమైనది; పర్వతం వలె
204 బౌద్ధమతం అత్యున్నత మైనది, తేనె వలె మధుర మైనది” అని సమాధానం చెప్పాడు. అయితే ఈ వర్దనంవల్ల నిర్వాణం అనిర్వచనీయం అని మాత్రమే తెలుస్తూన్నది. ఎలాంటి విక్షేపాలకీ అవకాశం లేని పరిపూర్ణ మైన శాంతి ఉన్న స్థితియే నిర్వాణం అని చాలమంది బౌద్ధభిక్షువుల, బోధిసత్తుల విశ్వాసం. ఇది కేవలం దుఃఖవినాశమాత్రం కాదు; పరిపూర్ణశాంతిరూపం; మరొక మాటలో చెప్పా లంటే శాశ్వతాఖండానంద రూపం; ఎందువల్ల ననగా నిర్వాణం నిత్యమూ, అనంతమూ (అంతం లేని) అయిన స్థితి. “నిబ్బానం పరమం సుఖం” అని ధమ్మపదంలో (203) చెప్పబడింది, నిర్వాణం ఒక్కటే శాశ్వత మైనది; ఇతరము లన్నీ క్షణికములు. పాలీ[గ్రంథాలలో ఒక సందర్భంలో సవితుడు అను ఒక పూజ్యుడైన భిక్షువు, ముసిలుడు అను మరొక పూజ్యు డైన భిక్షువుతో మాటలాడుతూ - “జన్మ లేకుండా ఉండడం నిర్వాణం” అని అంటాడు. ఈ జన్మాభావం శాంతియొక్క లక్షణం. నిర్వాణం కేవలం శూన్యరూపం అనే వాదాన్ని ఖండించే అనేక వాక్యాలు పాఠీగ్రంథాలలో ఉన్నాయి.
నిర్వాణ” శబ్దానికి ఆర్పివేయడం అని అర్ధం. ఈ ఆర్పివేయడం దేహాన్ని పూర్తిగా నశింపచేయడం కావచ్చు, లేదా రాగ-మోహాదులను అణచి వేయడం కావచ్చు. అయితే దేహాన్ని పూర్తిగా నశింపచేయడం నిర్వాణం అని చెప్పడానికి వీలులేదు. ఎందువల్ల ననగా - దేహంతో ఉండగానే బుద్దుడూ, ఎంతో మంది బోధిసత్తులూ నిర్వాణం పొందారు. నిర్వాణానికి శరీరత్యాగం ఆవశ్యకం కాదు. బౌడ్డులు జీవన్ముక్తిని అంగీకరిస్తారు. అందుచేత ఒకడు జీవించి ఉండగానే నిర్వాణం పొందవచ్చును. అలాంటివానికి “అర్దత్” అని పేరు. అతడు లోకంలో అందరితో కలిసి జీవిస్తాడు, పనులు చేస్తాడు అయినా కూడ ఆతనికి ప్రపంచకం విషయంలో ఏ మాత్రమూ రాగం, ఆసక్తత, ఉండదు. ఆతని తృష్ణ మొదలైనవి పూర్తిగా అణగిపోయాయి, ఆరిపోయాయి. అందుచేత “నిర్వాణం అనగా తృష్ణాదుల వినాశం అని మాత్రమే అర్ధం. తృష్టాదులు పూర్తిగా తొలగిపోతే ఇంక మిగిలేది శాంతీ, పరమానందమూ మాత్రమే. అందుచేతనే నిర్వాణం శూన్యరూపం అని చెప్పడం కావా లని చేసిన కువ్యాఖ్యానమే అని చాలమంది అంటారు. ఈ విధంగా ఏ స్థితిలో మానవుడు జన్మమరణాలను, వాటివల్ల కలిగే సమస్త దుఃఖాలనూ అధిగమించి
బౌద్ధమతం 205 పరిపూర్ణ మైన శాంతిని పొంది శాశ్వతానందరూపంలో ఉంటాడో ఆ స్టితియే నిర్వాణం; ఈ నిర్వాణమే బౌద్ధమతం బోధించిన అత్యున్నత లక్ష్యం. బౌద్ధమతంలో కొన్ని నియమాలు కాలాంతరంలో బౌద్ధమతంలోనికి అనేక మైన ఆచారాలు, పూజా విధానాదులూ ప్రవేశించినా ప్రారంభదశలో, ఈ మతంలో సొధారణ మైన నైతిక విధానాలకే ప్రాధాన్యం ఉండేది. నాల్బవ ఆర్యసత్యంలో బుద్దుడు ఈ నైతిక మార్గాన్ని అష్టాంగమార్గం అను పేరుతో బోధించాడు. వీటికి మధ్యమార్గం అని కూడ పేరు. విశ్చంఖలంగా భోగాలను అనుభవించడంలోనే జీవనం గడపడం ఎంత నికృష్ట మైనదో,ఎంత హానికరమో ఉపవాసాదులచే శరీరాన్ని బాధపెట్టడం కూడ అంత చెడ్డదే అనీ,మధ్యమార్గంలో నడవడం మంచి దనీ అతడు బోధించాడు. మొదటిది ఆధ్యాత్మికమార్గంలో నడవడానికి ప్రతిబంధకం అవుతే రెండవది మనస్సును దుర్చలం చేస్తుంది. బుద్ధుడు స్వయంగా కొంతకాలం ఈ రెండు మార్గాలను అనుసరించి చివరికి ఈ మధ్యమార్గం కనుగొని శిష్యులకు బోధించాడు. రాజకుమారుడుగా రాజభవనంలో కొంత కాలం మొదటిరకం జీవితం గడిపి, అంతఃపురం విడచి వెళ్లిపోయిన తరవాత కళోరనియమాలు అవలంబించి శరీరాన్ని శుష్కింపచేసికొని చివరికి ఈ మధ్యమార్గం కనుగొన్నాడు. ఈ మార్గాన్ని తన శిష్యులకు ఈ విధంగా బోధించాడు-"ఇది నిజ మైన ఆర్యఅష్టాంగమార్గం- యుక్తమైన దృష్టియుక్తమైన ఆలోచన,యుక్తమైన మాట, యుక్తమైన పన్మియుక్తమైన జీవనవిధానం,యుక్తమైన ప్రయత్నం,యుక్తమైన మానసికప్రవృత్తియుక్తమైన ధ్యానము-ఇవే అష్టాంగమార్గంలోని ఎనిమిది అంగాలు. భిక్షువులారా! ఇది మధ్యమార్గం. దీనివల్ల సరియైన దృష్టి కలుగుతుంది.దానివల్ల మంచి జ్ఞానం కలుగుతుంది.అది శాంతినీ,విశిష్ట మైన జ్ఞానాన్నీ సత్యసాక్షాత్కారాన్నీచివరికి నిర్వాణాన్నీ ఇస్తుంది”. ఈ. అష్టాంగమార్గాన్ని గూర్చి పాలిగ్రంథాలలోను సంస్కృత[గ్రంథాలలోను అనేకస్టలాలలో వివరణ లున్నాయి. బుద్దుడు స్వయంగా భిక్షువులకు ఈ విధంగా బోధించి నట్లు చెప్పబడింది :
206 బౌద్ధమతం
-
బిక్షువులారా! యుక్తదృష్టి అనగా ఏది? దుఃఖం ఉన్న దనీ, దుఃఖస్వరూపాన్నీ దుఃఖనివారణనీ దుఃఖనివారణోపాయాన్నీ తెలుసుకొనడమే యుక్తమైన దృష్టి(సమ్యగ్దృష్టి.
-
భిక్షువులారా![యుక్తమైన ఆలోచన లేదా లక్ష్యం అనగా ఏది?త్యాగము, పరోపకారము,దయ-వీటిని లక్ష్యంగా పెట్టుకొనడమే యుక్తమైన ఆలోచన (సమ్యక్ సంకల్పం).
౩. భిక్షువులారా!యుక్తమైన మాట అనగా ఏమి?అసత్యం పలకక పోవడమూ, ఇతరులను నిందించకపోవడమూ, ఇతరులను గూర్చి చెడ్డగా చెప్పక పోవడమూ, వ్యర్థంగా మాటలాడకుందడడమూ-ఇవే యుక్తమైన మాట (సమ్యగ్వాక్)
- భిక్షువులారా! యుక్తమైన పని అనగా ఏమి? ప్రాణాలను తీయక పోవడమూ,ఇవ్వనిదానిని తీసికొన కుందడమూ,శారీరకసుఖాలమీద ఆసక్తి లేక పోవడమూ-ఇవే యుక్తమైన పని(సమ్యక్కర్మాంతము)
5.భిక్షువులారా![యుక్త మైన జీవనవిధానం ఏది?ఆర్యు దైన సాధకుడు దుష్టమైన జీవనవిధానానికి దూరంగా ఉంటూ ధర్మసంమత మైన పద్దతిలో తన జీవితం గడుపుతాడు.ఇదే యుక్తమైన జీవనవిధానము(సమ్యగాజీవం).
6 భిక్షువులారా! యుక్త మైన ప్రయత్నం అనగా ఏది? చెడ్డభావా లేవీ (ప్రవేశించకుండా తన మనస్సును పరిశుద్ధంగా ఉంచుకొనడంకోసం చేసే నిరంతర పరిశ్రమ యుక్త మైన ప్రయత్నం (సమ్యగవ్యాయామం,).
- భిక్షువులారా! యుక్త మైన మానసికప్రవృత్తి అనగా ఏది? ప్రాపంచిక విషయాలపై రాగం గాని ద్వేషం గాని లేకుందా,చాపల్యం లేకుండా మనస్సును స్థిరంగా నిలబెట్టుకొనడం యుక్త మైన మానసికస్థితి (సమ్యక్‌స్మృతి).
&. భిక్షువులారా! యుక్త మైన ధ్యానం అనగా ఏది? సాధకుడు ఇంద్రియ సుఖాలనుండి దూరంగా ఉండి, చెడ్డ భావా లన్నీ పారద్రోలి మొదటి జ్ఞానభూమికలో ప్రవేశిస్తాడు.ఆ భూమికలో ఏకాంత ప్రదేశస్థితివల్ల విషయజ్ఞానమూ ఆలోచనలూ కూడ ఉంటూండగా మనస్సు తేలికపడదం,అనందానుభవమూ కూడ ఉంటాయి. ఆ భూమికలో ఉన్న విషయజ్ఞానాస్నీ ఆలోచనలనూ నిరోధించి సాధకుడు రెండవ
బౌద్ధమతం 207 జ్ఞానభూమికలో ప్రవేశిస్తాడు. ఈ స్థితి స్త్వయంగానే కలుగుతుంది. మనస్సు శాంతమై ఆనందభరితమై ఉంటుంది.పిమ్మట ఆ సాధకునికి ఆ ఆనందంమీద కూడ ఆసక్తి తొలగిపోతుంది.తనను తాను నిగ్రహించుకొని ధ్యాననిమగ్నుడై ఉంటాడు.శరీరం పూర్తిగా తేలికపడుతుంది. ఈ విధంగా అతడు మూడవ జ్ఞానభూమికలో ప్రవేశిస్తాడు. క్రమంగా అతడు ద్వేషాన్నీ సుఖాన్నీ కూడ దూరం చేసికొని పరిశుద్ధానందరూపమైన నాల్గవ జ్ఞానభూమికలో 'ప్రవేశిస్తాడు.ఆ భూమికలో సుఖం కాని,క్లేశం కాని ఉండదు. ఇదే యుక్త మైన ధ్యానం (సమ్యక్సమాధి. అపష్టాంగమార్గాన్ని ఇంకా స్పష్టంగా వివరించాలంటే-
-
సమ్యగ్దృష్టి : బుద్దుడు బోధించిన నాలుగు ఆర్యసత్యాలను బాగుగా అర్ధం చేసికొనడం సమ్యగ్దృష్టిలో ఇమిడి ఉంది.అదే విధంగా బుద్దుడు బోధించిన ప్రతీత్యసముత్పాదసిద్ద్ధాంతాన్నీ సర్వక్షణికతావాదాన్నీ అనాత్మవాదాన్నీ కూడ సరిగా అర్ధం చేసికొనడం కూడ సమ్యగ్భృష్టియే.అనగా సాధకుడు ముందుగా సంసార స్వరూపాన్ని స్పష్టంగా గుర్తించి అర్ధం చేసికోవాలి.
-
సమ్యక్సంకల్పం : మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దుష్టమైన కోరికలు,భావాలు రాకుండా చూచుకోవాలి. ఆధ్యాత్మికరంగంలో పురోగతికి ప్రతి బంధకాలైనవాటి నన్నింటినీ పరిత్యజించడానికి వెనుకాడకూడదు. ఉదాత్తమైన భావాలను అలవరచుకోవాలి.
-
సమ్యగ్వాక్ : అసత్యం పలకడం,చాడీలు చెప్పడం, పరుషంగా మాటలాడడం,వ్యర్థసంభాషణలూ విడిచిపెట్టాలి. దురాలోచనలూ,స్వార్ధపరత్వమూ ఉన్న మాటలు పలకకూడదు.పిడివాదం చేయగూడదు. మాట కూడ ఉదాత్తమైన భావాలకు అనుగుణంగా ఉందాలి.
-
సమ్యక్కర్మాంతం : స్థూలంగా చెప్పాలంటే పంచశీలాలలోని అన్వయ- వ్యతిరేకపక్షాలు (౦91676 జం6 ౧684676) రెండింటిని పాటించడం
సమృక్యర్మాంతం.
(1) దేనినీ హింసించకూడదు; అన్ని ప్రాణుల విషయంలో దయాభావంతో మెలగాలి.
208 బౌద్ధమతం
(2 ) ఇతరులు ఇవ్వని,వాళ్ల వస్తువులు తీసికొనకూడదు; దాతృత్వాన్సీీ బెదార్యాన్నీ అలవరచుకోవాలి.
(3) వ్యభిచారం చేయకూడద్యుబ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆత్మనిగ్రహం చేసుకోవాలి.
(4) అబద్దా లాదకూడద్యుచేసిన మాట నిలబెట్టుకోవడం,మోసం చేయక పోవడం అలవరచుకోవాలి.
(5) మాదకద్రవ్యాలు సేవించకూడద్యుని[గ్రహంతో ఉంటూ మనస్సు ఇటూ అటూ చెదిరిపోకుందా చూచుకోవాలి.ఈ ఐదింటిలో మొదటి మూడూ సమ్యక్క ర్మాంతంలో చేరుతాయి.
-
సమ్యగాజీవనం : మోసాలకి తావు లేని గౌరవప్రద మైన జీవన విధానాన్ని అనుసరించాలి. ఇతరుల నోళ్లు కొట్టి తాను తినే ప్రయత్నం చేయకూడదు. సంపదను కూడబెట్టుకొనకూడదు. ఆయుధాలతోను, జీవించి ఉన్న ప్రాణులతోను, మాంసంతోను, మాదకద్రవ్యాలతోను, విషపదార్థాలతోను వ్యాపారం (వర్తకం) చేయకూడదు.
-
సమ్యగ్వ్యాయానుం : చెడు అలవాట్లు విడనాడి మంచి అలవాట్లు చేసికోవాలి.ఇందుకు నిరంతరమూ ఈ క్రింది నాలుగు ప్రయత్నాలలో లగ్గుడై ఉండాలి (1) ఏవైనా చెడుగులు (౪119) బైటకు వచ్చే టట్లు కనబడితే అవి రాకుండా నిరోధించాలి. (2) బైటకు వచ్చినవాటిని అణచివేయాలి. (3) మంచి జరగడానికి ప్రయత్నించాలి. (4) ఉన్న మంచిని పెంపొందించడానికి ప్రయ త్నించాలి. ఇలాంటి ప్రయత్నాలవల్ల దశపారమితాలు అని ప్రసిద్ధి పొందిన- బెదార్యము, శీలము, త్యాగము, జ్ఞానమూ, శక్తీ ఓర్పు, సత్యనిష్ట్ర దృఢనిశ్చయము, (ప్రేమపూర్వక మైన దయ,సమబుద్ధి అను పది అత్యుత్తమగుణాలను వృద్ధిపొందించు కొనవచ్చును.
. 7. సమ్యక్స్పృతి : తన దేహమూ,మనస్సు,మనస్సులో ఉదయించే వివిధ భావాలూ-వీటి విషయంలో జాగరూకతతో ఉండడం సమ్యక్‌స్మృతి.ఇలా ఉండడం
బౌద్ధమతం 209 చేత ఇవి చెడు మార్గాలలో ప్రవర్తించకుండా ఉంటాయి. రాగద్వేషాలు తొలగి మనస్సు ధ్యానానుకూలం అవుతుంది.
- సమ్యక్సమాధి : సమ్యక్స్కృతిని సాధించిన సాధకుడు చివరి స్థితి అయిన, సమ్యక్సమాధికి సంనద్దు డవుతాడు.దీనిలో క్రమంగా నాలుగు భూమిక లున్నాయి. మొదటి మూడు భూమికల ద్వారా మనస్సు నాల్గవ దైన సమాధిస్థితికి చేరుకుంటుంది.ఆ స్థితి పరిపూర్దానందరూప మైనది. అక్కడ సుఖం కాని,దుఃఖం కాన్మి బాధ కాని ఉండదు. ఈ స్థితి మానసికైకాగ్రతతో ప్రారంభం అవుతుంది.
ఈ ఎనిమిది మార్గాలలో మొదటి రెండింటికీ ప్రజ్ఞ అనీ, తరువాత మూడింటికీ శీలం అనీ, చివరి మూడింటికీ సమాధి అనీ బౌద్ధమతంలో ప్రసిద్ధమైన పేర్లు. ఈ ప్రజ్ఞా-శీల-సమాధులు నిర్వాణానికి రాజమార్గాలు. ఇవన్నీ ఒకదానితో ఒకటి చాల దగ్గర సంబంధం గలవి.
సమ్యకృర్మాంతంలో చెప్పిన పంచళీలాలకు ఇంకా మూడు శీలాలు కలపగా, “అట్టాంగశీలిఅనే ఎనిమిది శీలాలు, వీటికి రెండు కలపగా “దశళీల' అనే పది శీలాలూ అవుతాయి. (1) అకాలంలో భోజనం చేయకపోవడం (2) నృత్తగీతవాద్యా దులను, పరిహరించడం,సుగంధద్రవ్యాలను ఉపయోగించకపోవడం,శరీరంమీద అలంకారా లేవీ ధరించకుండా ఉండడం (3) ఉన్నతాసనాలు ఉపయోగించక పోవడం అనేవి అష్టశీలాలలోని పంచళీలాలు కాక మిగిలిన మూడు శీలాలు.వీటికి రెందు కలపగా దశశీల అవుతుంది.దశశీల సమనేరులకు విధింపబడింది. బౌద్ధమతంలో భిక్షువుగా అవాలని చేరిన, 20 సంవత్సరాల లోపు వయస్సువాళ్లకు సమనేరులు అని పేరు. అష్టశీలలోని ఏడవ శీలాన్ని రెండుగా విభజించి నృత్తగీత సంగీతాది పరిహారం వడవ శీలంగాను,గంధమాల్యాదిపరివారం ఎనిమిదవదిగాను చెప్ప బడింది. అష్టశీలంలో ఎనిమిదవదిగా చెప్పబడింది దశశీలంలో తొమ్మిదవది అవుతుంది.బంగారమూ వెండి సేకరించకపోవనడం దశశీలంలో పదవది. .
కొంతకాలం తరువాత బౌద్ధమతంలో అష్టాంగమార్గంతో పాటు బుద్దుని ఆరాధనకు,దానికి సంబంధించిన అనేక కర్శకలాపాలకు (ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభం అయింది. అనేకప్రదేశాలలో అనేకవిధా లైన దేవాలయాల నిర్మాణాలు
210 బౌద్ధమతం చేయబడ్డాయి. ఎన్నో స్తూపాలు నెలకొల్పబడ్డాయి. ఇవన్నీ పవిత్రమైన తీర్ధయాత్రా స్థానాలు అయ్యాయి.బోధగయలో నిర్మించిన దేవాలయం ప్రపంచంలోని వివిధదేశాలనుండి వచ్చే బౌద్ధయాత్రికులకు విశిష్టమైన యాత్రాన్థానం అయింది. ఈ దేవాలయా అన్నింటిలోను బుద్దుని విగ్రహాలు స్టాపింపబడ్డాయి. యాత్రికులు ఆ విగ్రహాలకు పుష్పాదులను సమర్పించి పూజలు చేస్తూంటారు. ఈ సామాన్యప్రార్థనాదులే కాక మహాయాన -వజయానాదిబౌద్దసం(్రదా యాలలో బుద్దుణ్జ, ధర్మాన్నీ గూర్చిన అనేక ఉత్సవాలూ,విసృతములైన పూజా విధానాలూ (ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఉత్సవమూ కర్శకలాపమూ కూడ “బుద్ధం శరణం గచ్చామి%ౌధర్మం శరణం గచ్చామిసంఘం శరణం గచ్చామిఅను (త్రిశరణగమనమంత్రాల జపంతో ప్రారంభం అవుతుంది. వజయానసంప్రదా యంలో మంటత్రాలుముద్రలు,ధారిణీలు, మండలాలు మొదలైన అనేక రహస్యా చారాల ప్రచారం అత్యధికంగా వ్యాపించింది. బౌద్ధసంఘాలను నెలకొల్పడంలోను, 'వాటిని నిర్వహించడంలోను అనేక ఆచారాలు పద్ధతులు ప్రారంభం అయ్యాయి. అనేక పవిత్రోత్సవాలు జరపబడుతూందేవి. వీటిలో పరివ్రజ్య (క్రొత్తవాళ్లకి దీక్ష ఇవ్వడం), ఉపసంపద (భిక్షువులకు భిక్షుకీలకు దీక్ష ఇచ్చే సంస్కారం) కఠినము (భక్తులు భిక్షువులకు భిక్షుకీలకు వస్త్రాలు తెచ్చి ఇవ్వడం అనే వార్షికోత్సవం), ఉపోస్థము (పూర్ణిమా-అమావాస్యలలో మతసిద్ద్ధాంతప్రవచనాలు చేసే సమావేశాల నిర్వహణము) మొదలైనవి ప్రధాన మైనవి. ఇవే కాకుండా బౌద్దులు ఇంకా కొన్ని పవిత్రపర్వలకు సంబంధించిన ఉత్సవాలు కూడ నిర్వహిస్తూందేవారు. ఉదాహరణకు -హిందువుల పంచాంగం ప్రకారం వచ్చే వైశాఖపూర్ణిమనాడు బుద్ధుని జన్మదివసానికి సంబంధించిన ఉత్సవం జరుపుకొనే వారు. పవిత్రగ్రంథఛాల పారాయణాలు ఏర్పాటు చేస్తూండేవారు. లెక్కింపడానికి శక్యం కాని ఇంకా ఎన్నో కర్మకలాపాలు ప్రచారంలో ఉండేవి.హిందువుల శాక్తసంప్రదాయానికి సంబంధించిన అనేక ఆచారాలకు కూడ బౌద్దసంప్రదాయా లలో స్థానం లభించింది. -
బౌద్ధమతం 211 'ప్రధానశాఖలు
ప్రపంచంలోని ఇతరమతాల వలెనే బౌద్దమతం కూడ వేరు వేరు కాలాలలో అనేక మైన మార్పులకూ చేర్పులకూ నిలయం అవడంతో అనేకమైన సంప్రదాయాలు ఆఅవిర్భవించాయి.ఏ సంప్రదాయానికి అది 'మా సంప్రదాయమే బుద్దుని బోధలను అనుసరించిన సంప్రదాయం అని చెప్పుకొంటూంటుంది. ఇలాంటి సంప్ర దాయాలలో హీనయానం, మహాయానం అనేవి'ప్రధాన మైనవి. వీటి కీ పేర్లు ఎలా వచ్చాయో చెప్పడం కష్టం.ఈ రెండూ ఎన్నో భేదాలు గల రెండు సం(్రదాయాలుగా క్రీస్తుశకం ప్రారంభంనాటికే వృద్ధి చెందాయి.యానం అనగా వాహనం. 'హీనయానం'అనగా చిన్న వాహనం, మహాయానం అనగా పెద్ద వాహనం. తమ సంప్రదాయం అందరినీ నిర్వాణమార్గానికి చేర్చగల దనీ, అందుచేత అది మహాయాన మనీ,అలాంటి సామర్ధ్యం లేకపోవడంచేత రెండవ సంప్రదాయం హీనయానం అనీ మహాయానులు అంటారు.నిజానికి మహాయాన సంప్రదాయం వాళ్లు చాలామందిని ఆకర్షించడంకోసం మౌలికమైన బౌద్ధమతంలో అనేక మైన మార్పులు చేని,ఎన్నో (కొత్త విషయాలూ,ఆచారాలు, పూజావిధానాదులూ చేర్చారు.హీనయానులు బుద్దుని మౌలికబోధలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ థేరవాదు లని పేరుపెట్టుకొన్నారు. “పురాతనుల సిద్ధాంతాలను మాత్రమే అంగీకరించినవారుూ అని థేరవాది (స్థనిరవాది) పదానికి అర్ధం. అందుకు ఫలితంగా వాళ్ల సంఖ్య చాల అల్బంగా ఉండిపోయింది. హీనయానబౌద్ధమతం శ్రీలంక, బర్మాఆగ్నేయవషియా మొదలైన దక్షిణదేశాలలో ప్రచారంలో ఉంది. అందుచేత దీనికి దాక్షిణాత్యబౌద్ధమతం అని కూడ పేరు వచ్చింది. మహాయాన బౌద్ధమతం టిబెట్స్ చైనాాజపాను మొదలైన దేశాలలో అధికప్రచారంలో ఉంది. అందుచేత దానికి బెత్తరబౌద్ధమతం అని ప్రసిద్ధి ఏర్పడింది.
హీనయానం బుద్దుడు చేసిన బోధలకే ప్రాధాన్యం ఇస్తూ చాలవరకు నాస్తికమతంగానే కొనసాగుతూన్నది. అష్టాంగమార్జానుసారి యైన సాధనయే నిర్వాణానికి ఉపాయం అని విశ్వసిస్తుంది. బుద్దుజ్సి మహాపురుషుణ్ణిగా అంగీకరిస్తూ అతడు చూపిన మార్గమే శరణ్యం అని బోధిస్తుంది.బుద్దుజ్జి పూజిస్తుంది.ఐతే
212 బౌద్ధమతం బుద్ధుడు దేవుడు అని ఎన్నడూ చెప్పలేదు. ప్రతీ ఒక్కడూ కేవలం స్వప్రయత్నంచేతనే నిర్వాణం పొందకలుగుతాడుు ఈ విషయంలో ఎవ్వరూ కూడ సాహాయ్యం చేయ జాలరు అని హీనయానులు బోధిస్తారు.అట్లే వీరు బౌద్ధుల మూలసూత్రా లైన క్షణికతావాద-నిరాత్మవాదాదులను పూర్తిగా విశ్వసిస్తారు.
అయితే మహాయానం బుద్దుడు చేసిన బోధల నన్నింటినీ యథాతథంగా అంగీకరించినా ఒక విధ మైన ఏకేశ్వరవాదాన్నీబహుదేవతావాదాన్నీ కూడ ప్రవేశ పెట్టింది. మహాయానులు బుద్బజ్జి దేవుణ్ణిగా పూజించడమే కాక ఎందరో బోధిసత్తులను కూడ,హిండువులు వివిధదేవతలను పూజించిన రీతిలో పూజిస్తారు. తత్త్వవాదాలజోలికి వెళ్లకూడదు అని బుద్దుడు చెప్పి ఉన్నా కూడ వీళ్లు అనేక తత్త్వవాదాలను ప్రారంభించారు. వీళ్లు సామాజికదృక్పథం ఉన్నవాళ్లు. ఒక వ్యక్తి తనతో పాటు ఇతరులను కూడ నిర్వాణమార్దం వైపు నడిపించి వాళ్లకు సహాయపడ నంతవరకూ అతడు సంపాదించిన నిర్వాణం పరిపూర్ణం కాజాల దని వీళ్ల సిద్ధాంతం. ఈ విధంగా వివిధసంప్రదాయాలకు చెందిన కొన్ని ఇతరవిషయాలకు కూడ అవకాశం కల్పించడం, సామాజికదృష్టి, నిరాడంబరత మొదలైన గుణాలు ఉండడంచేత మహాయానం బహుజనప్రియత్వాన్ని సంపాదించు కొనగలిగింది.
మహాయానంలో కూడ వజయానం మొదలైన ఎన్నో క్రొత్త క్రొత్త సంప్ర దాయాలు,హిందూసం'ప్రదాయాలలోని అనేక అంశాలను తమలో సొందు పరచుకొని అసంఖ్యాకంగా శాఖోపశాఖలుగా ఆవిర్భవించాయి. శాక్తసం(ప్ర దాయంలో ఉన్న కొన్ని వామాచారాలు (మకారపంచకం మొదలైనవి) ఈ వజ యానంలో కూడ ప్రవేశించాయి. బొద్ధమతం విషయంలో జనాదరణం తగ్గడానికి ఇది కూడ ఒక కారణ మని కొందరి అభిప్రాయం. (2500 *629 ౦9661900. 2,314.
బౌద్ధమతం 213 అనుబంధం
బౌద్ధమత(గ్రంథాలను జాగర్తగా పరిశీలిస్తే బుద్దుడు చెప్పని ఎన్నో విషయాలు కాలాంతరంలో ఇతరుల ద్వారా దీనిలో ప్రవేశించా యన్మ,వాటిని ఆధారంగా చేసికొని తరువాత వచ్చిన నైయాయికులు, వేదాంతులు మొదలైన దార్భనికులు వాటిని ఖండించడానికి ప్రయత్నించా రనీ,డా.రేస్ దేవిడ్స్ (01౬075 0424639) మొదలైన కొందరు పాశ్చాత్యవిద్వాంసులు తదనుసారు లైన భారతీయవిద్వాంసులూ కూడ అలాంటి వాదాలను బౌద్ధమతంలో ఉన్నట్లు చెప్పా రనీ స్పష్టం అవుతుంది. అవి చాలావరకు ప్రాబీనబౌద్ధవాజ్బ్యయంలో లేవని తత్త్వశాస్త్రనిష్టాత ఆనీ బెసంట్ సషప్రమాణంగా నిరూపించింది;
1.బుద్దుడు వారణాసినుండి 'ధర్మచక్రాన్ని! ప్రవర్తింపచేసి నప్పుడు భూలోకం మొదలు పైపైన ఉన్న ఏదు స్వర్గలోకాలలోను ఉన్న దేవత లందరూ ఆనందంతో హర్షధ్వానాలు చేశా రని ప్రాచీనవాజ్బయంలో చెప్పబడింది. దీనిని బట్టి బుద్దుడు దేవతల అస్తిత్వాన్ని ఏనాడూ ఎక్కడా కూడ నిరాకరించలే దని తెలుస్తూన్నది. (566%..106
(అశ్వహోషుడు రచించిన బుద్ధచరి త్రమహాకావ్యం,సౌందరనందమహాకావ్యం మొద లైన కావ్యాలలోను) ఇతరుల [గగ్రంథాలలోనూ కూడ దేవతలను గూర్చి స్వర్గలోకాన్ని గూర్చీ అనేకస్థలాలలో నిర్దేశా లున్నాయి. “అందుచేత బుద్ధుడు దేవతల అస్తిత్వాన్ని నిరాకరించాడు అను ఆధునికవాదం అర్థరహితం” (66772106
2.“సర్వం క్షణికమ్” అను క్షణికతావాదమూ,దానినే అనుసరించి బయలుదేరిన అనాత్మతావాదమూ బౌద్ధమతానికి మూలస్తంభాలవంటివి అని ఆధునికులు చాల మంది ఎంతో అభినివేశంతో వ్రాస్తోాంటారు.ఇవి ఆ మతానికి సంబంధించిన, ఇతరమతాలలో లేని వాదా లని కొన్ని శతాబ్దాలనుండి ఇతరదార్భనికులు కూడ భావించారు.ఇవి వాస్తవంలో బుద్ధునికి అంగీకార్యములేనా అనునది సందేహాస్పద మైన విషయం.అతడు 'సర్వం క్షణికమ్” అని అంటే అని ఉండవచ్చు.దాని భావం అంతా అశాశ్వతం,అనిత్యం అని మాత్రమే. “ఈ దేహం నీటి బుడగ వంటిది”
214 బౌద్ధమతం ఇత్యాదివచనాలకు ఏమి భావమో అదే దీనికి కూడ.ప్రమిదలో నూనె పోసి వెలిగించిన దీసమూ,నదీప్రవాహమూ మొదలైనవి క్షణికా లైతే కావచ్చును. అలాంటి రెండు మూ డుదాహరణలు చూపించి అన్నీ అంతే అని చెప్పడం యుక్తం కాదు.ప్రతీ వస్తువూ మార్చుచెందుతూ ఉంటుంది, ఆ విధంగా అశాశ్వతం అని మాత్రమే ఇలాంటి ఉదాహరణల ద్వారా తెలుస్తుంది. నదీప్రవాహం క్షణికం అయినా చెంబులో నీళ్లూ చెరువులో నీళ్లూ ఆ విధంగా క్షణికాలు కావు కదా?దీని నేదో పరమసిద్ధాంతంగా భావించి దీనిని ఆత్మవిషయంలో కూడ ప్రవర్తింపచేసి ఆత్మ అనేది లేదు; నిరంతరవిజ్ఞానక్షణ'ప్రవాహమే ఆత్మ అను వాదం అర్థరహిత మైనది. కర్మసిద్ధాంతాన్నీ పునర్జన్మసిద్దాంతాన్నీ ఒక ప్రక్క ఒప్పుకొంటూ స్థిర మైన ఆత్మ అనేది లేదు అని అంటూ దాని నేదో విధంగా సమర్థించడంకోసం ప్రయత్నించడం ధీమంతులకు అంగీకారయోగ్యంగా ఉండదు. ఇవన్నీ బుద్ధుని తరువాత వచ్చిన కొందరు బౌద్ధపండితుల కల్పనలు.
బుద్ధుని ఉపదేశాలను పరీక్షించి చూస్తే అతడు ఆత్మకు సత్యత్వాన్నీ నిత్యత్వాన్నీ అంగీకరించాడని స్పష్టం అవుతుందని ఆనీ బెసంటు ప్రతిపాదించింది - “ఇంకా అతడు వాళ్లకు - “మానవునిలో నిత్యమైన ఆత్మ అనేది లేదు అని బుద్దుడు ఉపదేశించాడు'అను వాదానికి ఏమాత్రమూ అవకాశం లేని మాటలలో ఆత్మ- అనాత్మల మధ్య భేదాన్ని ఇలా బోధించాడు-భిక్షువులారా!శరీరం (రూపం) ఆత్మ కాదు...భిక్షువులారా! అనుభూతి ఆత్మ కాదు...ఇంద్రియజ్ఞానం ఆత్మ కాదు...సంస్మ్కారాలు ఆత్మ కాదు. సచేతనత్వం ఆత్మ కాదు. వాటి అన్నింటి లక్షణాలూ స్పష్టంగా విశదీకరించి ఇలా అన్నాడు-"వీటిలో ఏఒకటీ నాది కాదు,నేను కాదు నా ఆత్మ కాదు. ఈ విషయం సత్యానుసారం యథార్థజ్ఞానంతో గుర్తుంచుకోవాలి”. తరువాత ఈ విధంగా ముగించాడు - 'భిక్షువులారా! అందుచేత చదువుకొని పదాల అర్థం బాగా తెలిసి కొన్నవాడు శరీరంమీద విరక్తు డవుతాదు; అనుభూతులమీద విరక్తు డవుతాడు; ఇంద్రియజ్ఞానాలమీద విరక్తు డవుతాడు; సంస్కారాలమీద విరక్తు డవుతాడు; సచేతనత్వంమీద విరక్తు డవుతాడు. వీటన్నింటి మీదా విరక్తుదై అతడు కామం నుండి దూరం అవుతాడదుకామం తొలగిపోవదంచేత విముక్తి పొందుతాడు, విముక్తి పొంది విముక్తి పొందా నని (గ్రహిస్తాడు. అప్పు
బౌద్ధమతం 215 డిక పునర్జన్మ లేదను విషయం తెలుసుకొంటాడు. ఆ పవిత్రత్వం పూర్ణ మైనది.ఆ కర్తవ్యం నెరవేరింది.ఇంక మళ్లీ ఈ లోకంలోనికి తిరిగి రావలసిన పని లేదు”. (661.9. 106-107
బుద్దుడు తన సిద్దాంతాన్ని బోధించి నప్పుడు దానికి అంతగా విరోధం ఏమీ కనబడలేదు.ఆ మతాన్ని అంగీకరించినవా శ్లందరూ (బ్రాహ్మణులే. స్థిరమైన అత్మ అనేది ఒకటి ఉంది అని హిందువులు అనాదినుండీ విశ్వసిస్తూన్న విషయాన్ని సమర్ధిస్తూనే తన నూతనభావాలను బుద్దుడు బోధించడం ఇందుకు కారణం. అలా కాకపోతే ఈ బౌద్ధధర్మప్రచారానికి ప్రారంభంలోనే తీవ్రమైన ప్రతిఘటన వచ్చి ఉండేది అని ఆనీ బెసంట్ అభిప్రాయం -“బుద్దుని బోధలకు ప్రతిఘటన రాలే దంటే అందుకు కారణం అతడు ఆత్మనూ, ఆత్మనిత్యత్వానికి సంబంధించిన అన్ని విషయాలనూ నిరాకరించకపోవడమే. బుద్ధుని తరవాత వచ్చిన అతని అనుయాయులు ఈ (ఆత్మాస్తిత్వనిరాకరణం అనే) ఘోర మైన తప్పు చేయడంతోనే బౌద్ధమతం భారతదేశంలో అదృశ్యం అయిపోయింది. దేవతలమీదా,నిత్యమైన ఆత్మమీదా విశ్వాసాన్ని నిరాకరించే (దేవతలు లేరు నాశరహిత మైన ఆత్మ అంటూ లేదు అని చెప్పే) మతం అని పేరుపెట్టుకొన్న ఏ వాదాన్నీ కూడ హిందువులు ఎన్నడూ అంగీకరించరు". (501%1.110)
3.నిర్వాణం అఖండానందరూప మైనది అని బుద్ధుని బోధలవల్ల తెలుస్తూన్నది. అందుచేత శూన్యవాదమే బుద్ధునికి అభిమతం అను అభిప్రాయం కూడ కాలాంతరాలలో వచ్చిన ఆచార్యుల అభిప్రాయమే.బుద్దునికి అంగీకార యోగ్యం కాదు.
- బ్రాహ్మణుల విషయంలో, బ్రాహ్మణత్వం విషయంలో బుద్దుని అఖిప్రా యాన్ని సూచించే అనేకఘట్టా లున్నాయి. “బ్రాహ్మణులను ఆదరభావంతో పూజిం చాలి అని చెపుతూనే బుద్దుడు-“ఎవ డైతే కుటిలస్వభావం కలవాడో, ఆత్మనిగ్రహం లేనివాడో,దురాశాపరుడో,లోకానికి సంబంధించిన అన్ని దుర్గుణాలూ ఎవనిలో ఉంటాయో వానిని మాత్రం నేను బ్రాహ్మణు డని అంగీకరించను” అని స్పష్టంగా చెప్పాడు.కాషాయవస్తాలు మాత్రం ధరించి ఏ మాత్రమూ ఆత్మనిగ్రహం లేని
216 బౌద్ధమతం బౌద్ధభిక్షువుల విషయంలో కూడ బుద్దుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు”. (563%).122-129)
ఈ కాలంలో ఉన్న బ్రాహ్మణులు ప్రాచీనకాలంలో ఉన్న బ్రాహ్మణుల వలె ఉన్నారా అను ప్రశ్నకు సమాధానంగా బుద్దుడు బ్రాహ్మణుని కుందవలసిన లక్షణా లన్నీ వర్జించి చెప్పి పూర్వం (బ్రాహ్మణు లా లక్షణాలతో ఉందేవారు,ఇప్పు డల్లా ఎవరూ లేరు అని సమాధానం చెప్పాడు. అంతే కాకుందా వాళ్లంతా స్వధర్మాన్ని సరిగా పాటించకపోవడంతో వాళ్లతోపాటు క్షతియ -వైశ్య-శూద్రవర్థాలవాళ్లు కూడ స్వధర్శచ్యుతులై భౌతికసుఖాలమీద అత్యాసక్తు లైనారు అని కూడ చెప్పాడు. (50%0.122-123)
ధమ్మపదం చివర నున్న 28 శ్లోకాల భిక్టువగ్గో లోను, 41 శ్లోకాల బ్రాహ్మణవగ్గోలోను వర్ణించిన భిక్షువులకు (బ్రాహ్మణులకు ఉండవలసిన లక్షణాలను బట్టి చూస్తే ఆదర్శ మైన జీవనం గడిపే భిక్షు-బ్రాహ్మణుల విషయంలో బుద్ధున కున్న ఆదరభావం స్పష్టంగా తెలుస్తుంది. (5061.0.123-124)
ఉత్తమ మైన ధర్మమార్జాన్ని అనుసరించనివాడు బ్రావ్మాణుడు కాదని బుద్దుడు అన్నట్లే మహాభారతంలో కూడ అనేక స్థలాలలో అలాంటివాడు (బ్రాహ్మణ(బ్రువుడే కాని నిజమైన బ్రాహ్మణుడు కాదని చెప్పబడింది. మనుస్కృతిలో కూడ -“కట్టతో తయారుచేసిన ఏనుగు వలె, తోలుతో తయారుచేసిన లేడి వలె వేదాధ్యయనం లేని బ్రాహ్మణుడు పేరుమట్టుకే బ్రాహ్మణుడు” అని చెప్పబడింది. పరిశుద్ధ మైన జీవన విధానం లేనివాడు బ్రాహ్మణుడు కాడు అని చెప్పినంత మాత్రంచేత బుద్ధుడు బ్రాహ్మణవిరోధి అనిచెప్పిన ట్లయితే మనువు కూడ బ్రాహ్మణవిరోధియే అని చెప్ప వలసి ఉంటుంది. (6061%.0.125-6)
(మనుస్మృతిలోని శ్లోకం ఇది-
“యథా కాషస్టమయో హస్తీ యథా చర్మమయో మృగః
యశ్చ విప్రో. నధీయానస్త్రయస్తే నామ బిభ్రతి” (మ.స్మృ.2. 1570 “కణ్ఞత్రో చేసిన ఏనుగు,చర్మంతో చేసిన లేడి, వేదాధ్యయనం లేని (బ్రాహ్మణుడు ఈ
ముగ్గురూ (మూడూ) ఆ పేర్లు మాత్రమే ఉన్నవాళ్లు)
బౌద్ధమతం 217 దేవతల విషయంలోను,స్వర్షనరకాదుల విషయంలోను బుద్దుని అభిప్రాయా లను గూర్చి ఇంకా ఇలా వ్రాస్తూ ఆనీ బెసంటు-దేవతలనూ స్వర్గాదులను బుద్దుడు నిరాకరించాడు అను కొందరు ఆధునికులు వ్రాసే వ్రాతలు నిరాధారమైన వనీ,బౌద్ధవాజ్మయానికి విరుద్ధమైన వనీ ప్రతిపాదించింది. తాను దేవలోకాలకు స్వయంగా వెళ్లి నట్లుఆ లోకాలకు మార్గం తనకు తెలిసి నట్లు,ఆ దేవతలవద్దకు ఇతరులను తాను తీసికొనవెళ్లకలిగి నట్లూ కూడ బుద్ధుడు అనేకస్థలాలలో చెప్పాడు. “బ్రహ్మదగ్గరికి దారి చూపగలవా” అని ఒక శిష్యుడు బుద్ధణ్ణి ప్రచ్చించగా “నీకు నీ గ్రామానికి వెళ్లే మార్గం తెలియున్యాక్రొత్త వాళ్లకి అక్కడికి వెళ్లే దారి చూపగలవా?”అని బుద్ధుడు ఆతనికి ఎదురు ప్రశ్న వేశాడు. “నేను ఆ గ్రామంలోనే పుట్టాను;ఆ (గ్రామానికి దారి చూపగలనుూ" అని అతడు సమాధానం చెప్పాడు.”అయితే నాకూ బ్రహ్మలోకం తెలుసు; నేను అక్కడికి వెళ్లాను; నాకు దానితో బాగా పరిచయం ఉంది”అని బుద్దుడు అన్నాడు. (56010. 126,127). దేవతలకీ, దేవలోకానికీ, ఇంద్ర - యమాదులకీ సంబంధించిన నిర్దేశాలు ధమ్మపదం మొదలైన (గ్రంథాలలో అడుగడుగునా ఉన్నాయి. (56%).127 ఉత్తరదేశాలలో (వైనా,జపాన్ మొదలైన దేశాలలో) ఉన్న బౌద్ధసం'ప్రదా యాలలో హిందువుల వలెనే వాళ్లు కూడ అనేకదేవతలను పూజిస్తారు. హిందువుల త్రిమూర్తులు వేరు వేరు పేర్లతో బౌద్ధసంప్రదాయంలో కూడ ఉన్నారు. అమితాభ అను పేరుతో శివుడు, పద్మపాణి లేదా అవలోకితేశ్వర అను పేరుతో విష్ణువు, మంజుశ్రీ అను పేరుతో సృష్టికర్తగా (బ్రహ్మ కనబడుతున్నారు. భూలోకంలో ఉన్నవాళ్లకు కనబడని స్వర్గనరకలోకాలు కూడ వర్ణింపబడ్డాయి. మరణానంతరం మానవుడు ఈ లోకాల ద్వారా ప్రయాణం చేస్తాడు. (66౫౫.128) బుద్దుడు వీటిలో వేటినీ నిరాకరించలేదు.ఒక బిక్షువు మరణించినపుడు ఆతని భవిష్యత్స్థితిని గూర్చి చెప్పే సందర్భంలో అనేకనరకాలను గూర్చి బుద్ధుడు వర్ణించి చెప్పినట్లు మహావగ్గంలోఉంది. అట్లే మహాపరినిబ్బానసూత్తంలో బుద్ధుడు పాపాత్ములకు మరణానంతరం ఏమి జరుగుతుందో ఇలా చెప్పాడు-"ఈ శరీరం
218 బౌద్ధమతం నశించిన తరవాత అతదు దుఃఖభరిత మైన స్థితిలో మళ్లీ పుడతాడు.మంచి పనులు చేసినవాడైతే,శరీరం నశించిన తరవాత స్వర్గంలో సుఖ మైన స్థితిలో పుడతాడు”. ఉత్తరదేశీయబౌద్ధమత([గ్రంథాలలో అదృశ్యలోకాల అతివిస్తృతవర్దనం ఉంది. కామలోకం అనేది ఒక టుంది. భూలోకమూ,నాలుగు క్రింది స్వర్గాలు కామలోకంలో చేరుతాయి. ఇవి దేవ-అసుర-రాక్షస-మృగ-మానవుల నివాస స్థానాలు. తరవాత మారుని లోకం, దాని పైన రూపలోకం అను పేరుగల పద్దెనిమిది స్వర్గలోకాలు ఉన్నాయి.వాటి పైన నాలుగు స్వర్గ్లా లున్న అరూపలోకం ఉంది.ఇవి నిజ మైన ఆనందస్థానాలు. అమృతత్వాన్ని పొందని,బుద్దుని శిష్యులు, ఈ లోకంలో నివసిస్తారు. దీని పైది నిర్వాణం. (66]..128,129) అద్భుతశక్తులను గూర్చిన బుద్దుని అభిప్రాయం సురంగమసూత్రంలో ఈ విధంగా విశదీకరింప బడింది.బోధిని ఆశ్రయించకుండా,అనగా జ్ఞానంకోసం కాకుండా, ఏవో సిద్ధులు కావా లని కోరుతూ,సమాధిని అభ్యసించినవాళ్లకు ఆకాశంమీద ఎగిరే శక్తి, (ఇతరులకు) కనబడకుండా ఉండగలిగిన శక్తీ, ఇంకా కొన్ని సూక్ష్మవిషయజ్ఞానాదులూ లభిస్తాయి.కాని పరిపూర్ణ మైన జ్ఞానం లభించదు. అలాంటివాళ్లు జన్మమరణచక్రంలో తిరుగుతూ ఉండవలసిందే. (69%..129). మరణించిన కొందరు శిష్యులను గూర్చి "ఫలానా వాళ్లు మళ్లీ ఎక్కడ
- పుట్టారు,వాళ్ల భవిష్యత్తు ఏమిటి"”అని ప్రశ్నించి నప్పుడు బుద్ధుడు-వాళ్లలో ఒకడు ముక్తి పొందా డనీ,మరొకడు సకదాగామిగా అయ్యా డనీ అనగా మళ్లీ భూమిమీదికి వచ్చి అతడు దుఃఖాలను నశింపచేసికొంటా డనీ,మూడవవాడు మళ్లీ కష్టమైన పరిస్థితులలో పుట్టవలసిన పని లేదనీ సమాధానం చెప్పాడు. ఇవన్నీ బుద్ధుడు నిత్య మైన ఆత్మను అంగీకరించాడు అని చెప్పడానికి ప్రమాణాలు. (60%.0.130). బౌద్ధధర్మంలో ప్రవేశానికి ముందు సాధకునికి వివేకము, వైరాగ్యము,శమం మొదలైన ఆరు మానసికగుణాలు, మోక్షం కావాలనే తీవ్రమైన ఇచ్చా ఉండా లని బుద్దుడు బోధించాడు. ఇది శంకరాచార్యులు బోధించిన సాధనచతుష్టయసంపత్తియే (606%..139.
బౌద్ధమతం 219 జ్ఞానమార్గంలో ప్రవేశం లభించిన సాధకుడు ఏ విధంగా క్రమక్రమంగా అత్యున్నతస్థితిని పొందుతాడో బుద్ధుడు ఈ విధంగా బోధించాడు. “అర్హత్రుడు గాలిలో ఎగురకలుగుతాద్రుతన ఆకారం మార్చివేయగలడు.తన ఆయుర్దాయం ఇచ్చానుసారం నిర్ణయించుకొనగలడు. స్వర్గ-భూలోకాలను కంపింపవేయగలదు. ఈ స్థితిని చేరడానికి క్రమంగా ఉపయోగించే అవస్థలు ఇవి: (1) అనాగామిన్: ఇతడు ఇక్కడ తన ఆయుర్దాయం పూర్తి అయిన తరువాత చైతన్యరూపంతో పందొమ్మిది (19) స్వర్గాలు అధిప్టిస్తాడు. వీటిలో ఒకదానిలో తన గమ్యాన్ని పూర్తిచేసుకొని అర్హతుడు అవుతాడు. తరువాతి అవస్థ సక్రీదాగామిన్. ఒక జన్మా మరణమూ పూర్తి చేసికొని ఇతడు అర్హతు డవుతాదు. తరువాతి అవస్థ స్రోతాపన్న. ఇతడు ఎనిమిది పుట్టుకలు ఎనిమిది మరణాలు పూర్తిచేసికొని అర్హతు డవుతాడు...” (96..1302. అర్దత్రుడు అవడం నిర్వాణానికి చివరిమెట్టు.బుద్ధుడు వర్ణించిన నిర్వాణం చాలామంది అనుకొంటున్నట్లు శూన్యం కాదు; భావరూప మైనది. భిక్షువు తాబేలు తన అవయవాలను తనలోనికి ఇముడ్చుకొన్నట్లు ఇంద్రియాలను తనలో నిరోధించుకోవా లని బోధించి బుద్దుడు నిర్వాణాన్ని గూర్చి ఇలా చెప్పాడు. “భిక్షువు లారా[సృజింపబడనివి, కనబడనివీ, కార్యములు కానివీ, మూల మైనవీ, చేయబడదనివీ అయిన వస్తువులూ (ఆత్మలు) సృజింపబడినవీ, కనబదేవీ, చేయబడినవీ, ఊహింప శక్యమైనవీ, మిశ్రములూ అయిన వస్తువులూ, (అచేతన పదార్థాలూ) ఈ రెండు విధా లైనవీ కూడ ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. భిక్షువులారా! సృజింప బడనివీ,కనబడనివీ, కార్యములు కానివీమూల మైనవీ,.చేయబడనివీ అయినవి శూన్యములే అయితే వాటికీ - సృజింపబడినవీ, కనబడేవీ, చేయబడినవీ, ఊహింప శక్యమైనవీ, మిభ్రములూ అయినవాటితో కార్యకారణరూపంలో సంబంధంవల్ల కలిగిన ఫలితం చివరి మోక్షం అని నేను చెప్పి ఉండేవాణ్ణి గాను... సృజింపబడినవీ, చూడబడేవీ, చేయబడినవీ, పుట్టినవీ, మిశ్రములూ, వృద్ధత్వం వల్లా, మరణంవల్లా, అజ్ఞానంవల్లా, తినడంవల్లా కలిగే పీడలూ ఇవన్నీ అశాశ్వత మైనవి.ఇదంతా నశిస్తుంది. దీనిలో ఆనందం లేదు.చివరి మోక్షంయొక్క సారం ఇదే.తరువాత సందేహాలు కాని చిత్తక్షోభ కాని ఉండవు.దుఖమూలా లన్నీ ఛిన్నమై
220 బౌద్ధమతం పోతాయి. శాంతి ఆనందమూ లభిస్తాయి. ఇది చివరి గమ్యాన్ని చేరినవారికి కలిగే ప్రధానవిషయం (మహానందం). పరిపూర్ణమూ, మించినది ఏదీ లేనిదీ అయిన శాంత్సి సమస్తవిశేషాల వినాశం. పూర్ణపవిత్రత్వం యొక్క పూర్ణత్వం. ఇది మరణం యొక్క వినాశం” (506.[.0%.133-4. ఉదానవర్గం నుండి ఉదాహరింపబడిన వాక్యాలు).
“బుద్దుడు తానే శరీరంతో ఉన్నప్పుడు శరీరత్యాగానంతరమూ ఉన్న స్థితియొక్క వర్జనం ఇది. నిర్వాణస్వరూపాన్ని గూర్చి సాక్షాత్తు బుద్దుదే ఇంత స్పష్టంగా చెప్పినా నిర్వాణం అనగా మరణం లేకపోవడం(అమృతత్వం) అని గ్రహించడానికి బదులు జీవవినాశం అని అర్థం కొందరు (రేస్ డేవిడ్ మొదలైనవాళ్లు) చెపుతున్నా రంటే ఆశ్చర్యకరంగా ఉంది. నిర్వాణస్వరూపం ఇంత స్పష్టంగా మరొక ఏ (గ్రంథంలోనూ చెప్పబడలేదు.నిర్వాణం అనగా సత్త్వం(ఉనికి),అసత్త్వం కాదు. సత్యత్వం, అసత్యత్వం కాదు. ఇది నిత్యత్వం, అనిత్యత్వం కాదు. “నిర్వాణం” (అనగా వెళ్లిపోవడం) అను పదానికి అనిత్య మైన పదార్థాలన్నీ తొలగిపోవడం అని అర్ధం అని బుద్ధుడు ఘోషించాడు - అవన్నీ తొలగిపోగా మానవుడు మోక్షం పొందుతాడు (506%.).
ఈ విధంగా ఆనీ బెసంటు అనేకప్రాచీనబౌద్ధమత(గ్రంథాలనుండి ప్రమాణాలను చూపి స్వర్గ-నరకాలు,దేవతాదులు, ఆత్మస్వరూపం,నిర్వాణతత్త్వం, (బ్రాహ్మణత్వం విషయంలో బుద్దుని అభిప్రాయం,శూన్యవాదం మొదలైన విషయాలలో అర్వాచీనులలో ఉన్న పాశ్చాత్యవిమర్శకులు (ప్రారంభించగా (ప్రచారంలోనికి వచ్చిన, కొన్ని అపోహలను తొలగించింది.
జైనమతం
బౌద్ధమతం వలెనే జైనమతం కూడ హిందూమతంనుండి ఆవిర్భవించిన
ఒక శాఖ. పొిందూమతంలోని అనేక మైన ్రధానసిద్దాంతాలు సహజంగా జైనమతంలో కనబడతాయి. జైనమతం స్థాపించిన మహాపురుషుడు మహావీరుడు.
- ఇతని బాల్యనామధేయం వర్ధమానుడు. అయితే జైనమతాన్ని తొలిసారిగా స్థాపించినవాడు మహావీరుడు కాదు, ఆయనకు పూర్వమే వివిధకాలాలలో ఉన్న ఇరవై ముగ్గురు మహాపురుషులు ఈ మతాన్ని స్థాపించి వృద్ధిపొందించా రని జైనమతస్థృల విశ్వాసం. ఈ మహాపురుషులకు తీర్ధంకరులు (మహామతన్థాపకులు) అనీ, జినులు (మానసికరాగాదులను జయించినవారు) అనీ పేర్లు ఈ తీర్ధం కరులలో బుషభదేవుడు మొదటివాడు, పార్వదేవుడు ఇరవైమూడవవాడు. మహావీరుడు ఇరవైనాల్గవవాడు, చివరివాడూ కూడ. మహావీరుడు కూడ బుద్దుడు వలెనే క్షత్రియుడు; ఆతనికంటె కొంచెం ముందు జనించిన ఆతని సమకాలికుడు. అతడు కొంతకాలం గృవాస్థుడుగా ఉండి, సత్యాన్వేషూకై గృహం విడచి ష్లోపోయాడు. పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి, తత్త్వజ్ఞానోదయం కలగగానే ఆ తత్త్వం
ఆజీవితాంతం అందరికీ బోధించాడు.
నైతికమైన పరిశుద్ధతత్వాన్ని బోధించే జైనమతం నాస్తికమతం. ఇది కర్మ -
జన్మ - మరణాల చక్రంలో తిరుగుతూన్న మానవుణ్ణి దానినుండి విముక్తుణ్ణి చేయడానికి ఉద్దిష్ణ మైనది. బౌద్ధమతం వలెనే జైనమతం కూడ ఈ విముక్తి ఈశ్వరుణ్ణీ ఇతరదేవతలనూ పూజించడంచేత గాని, కర్మకలాపాలు చేయడంచేత గాని లభించదు; కేవలం పరిశుద్ధ మైన నైతిక మైన జీవనవిధానం అనుసరించడం ద్వారా దానిని పొందవచ్చు అని బోధిస్తుంది. జైనమతం (ప్రకారం ఈ ప్రపంచకం ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉంటుంది; అందుచేత దీనిని సృష్టించి పాలించే ఈశ్వరు డొక డున్నా డని అంగీకరించవలసిన పని లేదు, వివిధప్రాణులతో కూడిన ఈ (ప్రపంచం ఆరు పదార్థాలతో నడుస్తూన్నది; దీనికి ఆధారం ఇద్వే ఇది తన నిర్వహణాన్ని తానే చేసుకొంటుంది. నైతికప్రపంచం అంతా కర్మమీద, దానికి సంబంధించిన నియమాలమీదా ఆధారపడి ఉంది. దీనిని నడపడానికి ఏ దివ్యశక్తిసాహాయ్యమూ
222 జైనమతం అవసరం లేదు. పరిపూర్ణ మైన ఆత్మ గల మానవుడు ప్రాణిలోకంలో ్రేష్టుడు. స్వప్రయత్నంచేతనే అతడు దేవత్వాన్ని సంపాదించగలడు. జైనమతం అహింస అత్యుత్తమమైన సద్గుణ మనీ బ్రవ్మాచర్యవ్రతం అవలంబించి, ప్రపంచకాన్ని త్యజించి, ఆధ్యాత్మిక సాధనలో నిత్యసక్తు దైన సంన్యాసి జీవనం అతిపవిత్ర మైన దనీ బోధిస్తుంది. జైనమతంలో దిగంబరులు, శ్వేతాంబరులు అను రెండు శాఖ లున్నాయి. తనకంటూ ఏ సొత్తూ ఉంచుకొనకూడదు (అపరి[గ్రహం) అను నియమం (ప్రకారం వస్త్రం కూడ ఉండకూడదు అనుకొని దానిని కూడ విదిలివేసినవాళ్లు దిగంబరులు. అంత తీవ్రంగా ఆ నియమాన్ని అనుసరించవలసిన పని లేదు అను అభిప్రాయంతో తెల్లటి వస్త్రాలు మాత్రం ధరించేవారు శ్వేతాంబరులు. ఈ ఒక్క భేదమే తప్పు ఈ శాఖలలో సిద్దాంతాల విషయంలో అభిప్రాయఖేదా లేవీ లేవు. స్థానకవాసులు అను మూడవ శాఖ కూడ ఉందిగాని ఈ శాఖకు చెందినవాళ్లు మహారాష్ట్రలో ఒక చాల చిన్న ప్రదేశంలో మాత్రమే ఉన్నారు. శ్వేతాంబరులు చేసే తీర్ధంకర విగ్రహపూజను వ్యతిరేకిస్తూ శ్వేతాంబరులనుండి విడివడిన ఒక చిన్న శాఖ ఇది. బౌద్ధమతంలో ఉన్నట్లు జైనమతంలో ్రచారదృష్టి లేకపోవడంచేత ఇది భారతదేశంలో మాత్రమే కనబడుతున్నది. ఈ మధ్య కొందరు జైనమతశ్రద్దాకువులు జైనమతానికి సంబంధించిన వాజ్ఞయం అన్ని భాషలలో ప్రచురిస్తూ అన్ని దేశాలలోను పంచి పెడుతున్నారు. జైనులు ఇతరులను తమ మతంలోనికి మార్చే ప్రయత్నం చేయరు. కేవలం తమ మతంలో ఉన్న అహింస మొదలైన నైతికసద్గుణాల ప్రచారం మాత్రమే చేస్తూంటారు. బౌద్ధమతంలో వలెనే జైనమతంలో కూడ వర్హవిభాగం విషయంలో పట్టుదల లేకపోయినా నాలుగు వర్జాలు లేకపోలేదు. వీళ్లు బ్రాహ్మణులకు ఎక్కువ గౌరవం ఇస్తారు. చాలవరకు జైనదేవాలయాలలో (బ్రాహ్మణులే అర్బకులుగా ఉంటారు. జైనమతావలంబులలో ఆధునికకాలంలో వైళ్యుల సంఖ్య అధికంగా ఉంది. జైనుల మతగ్రంథాలలో ప్రధానంగా మహావీరుడు చేసి నట్లు చెప్పే ఉపదేశాలు నిక్షిప్తములై ఉంటాయి. ఈ [గ్రంథాలలో కొన్నింటికి అంగాలు అనీ, కొన్నింటికి పూర్వాలు అనీ పేర్షు. ఐదు ప్రకరణాలు అనే గ్రంథాలు, ఇంకా మతానికి
జైనమతం 223 సంబంధించని [గ్రంధాలు కూడా ఉన్నాయి. ఇవి కాక వినయవిజయుడు కూర్చిన, జైనమతవిషయాలకు సంబంధించిన లోకప్రకాశ అను విజ్ఞానసర్వస్వగ్రంథం కూడా ఉంది. ఇది జైను లందరికీ ఆదరపాత్ర మైనది.
జైనమతంలోని ప్రధానాంశాలు
-
ఇది ఈశ్వరుణ్ణి అంగీకరించని నాస్తికమతం. జగత్తును ఈశ్చరుడు సృజించాడు అని అంగీకరించదు. జగత్తు దానిలో సహజంగా ఉన్న నియమాల ననుసరించి ఎల్లప్పుడూ ఇదే విధంగా నడుస్తూ ఉంటుంది అని ఈ మతం బోధిస్తుంది.
-
మానవుడు నైతికంగాను, ఆధ్యాత్మికంగాను పవిత్రత్వాన్ని సంపాదించడం ద్వారా పరిపూర్ణస్థితిని, దైవత్వాన్ని పొందుతాడు అని అంటూ జైనమతం ఈశ్వరుణ్ణి అంగీకరించకపోయినా దేవత్వాన్ని అంగీకరించి నైతికపరిశుద్ధజీవనం ద్వారా మానవుడు ఆ స్థితిని పొందగల దని చెపుతుంది.
-
ఈ ప్రపంచం మనకు కనబడుతూన్న ఇన్ని విభేదాలతో పూర్తిగా సత్యమైనది. నిత్యము లైన ఆరు పదార్థాల ద్వారా ఈ జగత్తు పని చేస్తూన్నది. వీటిలో ఐదు పదార్థాలు భౌతికములు, ఒకటి చైతన్యరూపము.
-
ప్రతీ ప్రాణిలోనూ నిత్యమూ అనశ్చ్వరమూ అయిన ఒక చేతనపదార్ధం ఉంది. దానికి జీవాత్మ అని పేరు. ఎన్ని శరీరా లుంటాయో అన్ని జీవాత్మ లుంటాయి. వృక్షలతాదులలోను రజఃకణాదులలోను కూడ జీవాత్మ లుంటాయి. అయితే వివిధజీవులలో నున్న జ్ఞానంలో వైషన్యుం ఉంటుంది. వృక్షలతాదులలోని జీవులకు స్పర్భజ్ఞానం మాత్రమే ఉంటుంది. ఆ జీవులు ఏకేంద్రియాలు. ఇల్లే ఐతే కొన్ని జీవాత్మలకు రెండింద్రియా లుంటాయి. కొన్నింటికి మూడుంటాయి,; కొన్నింటికి నాలు గుంటాయి; మనుష్యాదులకు ఐదు ఇంద్రియా లుంటాయి. ఈ విధంగా ఏకేంద్రియజీవులు మొదలు పంచేంద్రియజీవుల వరకు గల ప్రాణిసంఘాతంలో జ్ఞానతారతమ్యం ఉంటుంది. కాని అన్ని విధా లైన జీవులలోను కూడ అనంతజ్ఞానాన్ని, అనంతశక్తిని, అనంతానందాన్ని పొందగల సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం కర్మబంధంచేత ఆవృతమై ఉంటుంది. అన్ని ప్రాణులలోనూ జీవుడున్నా మానవునిలోని జీవుడు పూర్ణస్వరూపంలో ఉంటాడు. అందుచేతనే వానిలోని చైతన్యం బాగా వికసించి
224 జైనమతం ఉంటుంది. మానవునిలోని ఆత్మ పరిపూర్ణత్వాన్ని పొంది అనంత మైన శక్తినీ, అనంత మైన జ్ఞానాన్నీ అనంత మైన (శద్ధనూ అనంత మైన ఆనందాన్నీ పొందడానికి సమర్ధ మైనది.
-
మరణానంతరం మానవునిలోని అత్మ పునర్జన్మకోసం మరొక శరీరంలో నైనా ప్రవేశిస్తుంది లేదా జన్మమరణచ|క్రంనుంచి మోక్షం పొందుతుంది.
-
జీవుడు ఈ శరీరంలో బద్దుదై ఉన్నాడు. ఇందుకు కారణం పూర్వజన్మలలో అతడు చేసిన సకామకర్మలు. కామంతో, అత్యాస్తక్తితో చేసిన కర్మలు జీవునికి విషం వంటివి. జీవులు మళ్లీ మళ్లీ జన్మ లెత్తదానికి కారణం ఇలాంటి కర్మలే. ఈ విధంగా జైనమతం హిందూమతంలో చెప్పిన కర్మ సిద్దాంతాన్నీ పునర్దన్మనూ, బంధమోక్షాలను పూర్తిగా అంగీకరిస్తుంది.
-
మానవుడు దుఖంతో ఉన్నాడంటే అందుకు కారణం కర్మయే. మరాక కారణం ఏదీ లేదు.
-
దేవతలకోసం యజ్ఞాలు చేసినా మోక్షం లభించదు. యుక్త మైన విశ్వాసము, యుక్త మైన జ్ఞానము, యుక్తమైన నడవడిక అను త్రిరత్నమార్గం అనుసరిస్తేనే మోక్షం లభిస్తుంది.
-
జైనమతంలో నైతికప్రవర్తనకు, విశేషించి అహింసకు, ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది. పవిత్రత్వము, బ్రహ్మచర్యము, రాగం (ఆసక్తి) లేక పోవడము, దయ, (ప్రేమ, మైత్రి అను గుణాలకు కూడ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది.
ఈశ్వరుడు
జైనమతం ఈశ్వరుణ్ణి విశ్వసించదు. భౌతికప్రపంచం అంతా నిశ్చిత మైన నియమాలను అనుసరించి నడిచిపోతూంటుంది. మానసికప్రపంచవ్యవహారం కర్మను పట్టి నడిచిపోతూంటుంది. ఇంక ఈశ్వరునితో ఏమి పని? మానవుదే దేవుడు; ఎందువల్ల ననగా వానిలో పరిపూర్ణత్వం దాగి ఉంది. అతడు జగత్తును సృష్టించ జాలకపోవచ్చు. అయినా అతని పరిపూర్ణత్వానికి లోపం ఏదీ లేదు. అనంతశక్తి, అనంతజ్ఞానము, అనంతవిశ్వాసము, అనంతానందము అను అనంతచతుష్టయాన్ని
జైనమతం 225 పొందగల సామర్ధ్యం మానవునికి ఉంది. మరొక మాటలో చెప్పాలంటే మానవుడు దేవత్వాన్ని సాధించగలడు. పరిపూర్ణత్వాన్ని సంపాదించిన తీర్ధంకరులు, కేవలులు, సిద్దులూ వీళ్లంతా దేవుడే అని చెప్పవచ్చును; ఎందువల్ల ననగా వాళ్లందరూ అజ్ఞానాన్ని ఆశాబంధాలను పూర్తిగా జయించారు; ఇంక వాళ్లకు కావలసిన దేమీ లేదు. వాళ్లు కైవల్యాన్ని నిర్వాణాన్ని పొందారు.
బౌద్డులు బుద్దుని ఈశ్వరునిగా భావించినట్లే జైనులు మవావీరుణ్ణి ఈశ్వరునిగా భావిస్తారు. మహావీరుని విగ్రహాలతో అనేక మైన దేవాలయా లున్నాయి. జైను లందరు ఆ విగ్రహాలను వివిధపద్ధతులలో పూజిస్తాంటారు. అయితే వాళ్లు మవావీరుణ్ణి మహాత్మునిగాను, మానవులను ఉద్ధరించిన మతప్రబోధకుని గాను, మార్గదర్శకుని గాను మాత్రమే పూజిస్తారు గాని సర్వశక్తుడూ, జగత్తును సృజించినవాడూ అయిన ఈశ్వరుణ్ణిగా పూజించరు. అదే విధంగా ఎంతోమంది ఇతరసిద్ధులను కూడ మహాపురుషులనుగా మాత్రమే పూజిస్తూ వారి గుణాలను అలవరచుకొని వాళ్లను ధ్యానిస్తే కైవల్యం లభిస్తుం దని విశ్వసిస్తారు. ప్రార్ధింపబడిన జనులు గాని, కేవలులు గాని ప్రార్ధించేవాని కోరికలను తీరుస్తా రని గాని, తీర్చగల రని గాని జైనుల భావం కాదు) మరేమనగా అలాంటి ఆదర్శభూతు లైన మవిపురుషులపై మనస్సును స్థిరంగా నిలపడంవల్ల అలాంటి గుణాలు తమకు లభించి తద్ద్వారా తమకు కూడ శైవల్యం లభిస్తుం దని వాళ్ల విశ్వాసం.
జగత్తు
జైనమతం జగత్రృష్ణ్ట యైన ఈశ్వరుణ్ణి అంగీకరించకపోవడంచేత జగత్సుష్టి ప్రక్రియను గూర్చిన పౌరాణికవర్దనాదులకు ఈ మతంలో అవకాశం లేదు. జగత్తు ఏదో ఒక నిశ్చిత మైన కాలంలో ఆవిర్భవించలేదు; ఇది ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉంటుంది. దీనికి ఆది గాని అంతం కాని లేదు. ఈ భౌతికప్రపంచకం ధర్మం (చలనం), అధర్మం (స్థిరత్వం) ఆకాశం, కాలం, పుద్గలం (పదార్ధం) అను ఐదు ద్రవ్యాలతో ఏర్పడినది. జీవుడు చేతనపదార్థం. భూతసముదాయం (2%లు) పుద్దలాల (అణువుల) కలయికచేత ఏర్పడుతుంది. భౌతికవస్తువులకు మౌలిక మైన ఉపాదానకారణం అణువులు. భౌతికము లైన అణువులలో స్పర్శ, రుచి,
226 జైనమతం . వాసన, రంగు అను గుణా లుంటాయి. ఆకాశం పుద్గలాలకు చోటు కల్పిస్తుంది.
కాలం పరిణామాన్ని కలిగిస్తూంటుంది. ధర్మ-అధర్మాలు (చలన -స్థిరత్వాలు) జైనులు మాత్రమే అంగీకరించిన విశిష్టధర్మాలు. ధర్మంచేత పుద్దలాలు చలించి, కలిసికొని, వస్తువులుగా ఏర్పడతాయి. చలనం బాహ్యకారణంచేత దేనిచేతా కలిగేది కాదు; ఇది పుద్దలాదులలో సహజంగానే ఉంటుంది. ఈ విధంగా జగత్తు ఈ ఐదు (ద్రవ్యాలచేత ఏర్పడుతుంది.
జైనమతం జగత్తు సత్య మనీ, భేదా లన్నీ సత్యమే ననీ అంగీకరిస్తుంది. బౌద్ధమతం వలె కాక పదార్ధం స్థిర మని అంగీకరిస్తుంది; క్షణికతావాదాన్ని అంగీకరించదు. ప్రతీ పదార్థంలోనూ దాని స్థిర మైన సారభూత మైన అంశము, పరిణామం చెందే అంశమూ అను రెండంశాలు ఉంటాయి. సారభూత మైన అంశాన్ని పట్టి అది శాశ్వతం, పరిణామాల దృష్ట్వా అది అశాశ్వతం.
ప్రపంచం సత్యమే అయినా మానవుడు దీనియందు అత్యాసక్తుదె ఉండకూడదు. జగత్తులో తన స్పితిని కేవలం ఉత్తమగతిని పొందడానికి మాత్రమే వినియోగించుకోవాలి; భోగానుభవం కోసం కాదు. ఇది నైతికజీవనానికి ఉపయోగించవలసిన స్టానం కాని భోగాలు అనుభవించడంకొరకు ఉపయోగించ వలసిన స్థానం కాదు.
మానవుడు
జైనమతంలో మానవునికి అత్యున్నత మైన స్థానం ఇవ్వబడింది. దేవుడు లేడు.కాని, ఒక విధంగా చూస్తే దేవత్వం మానవునికే చెల్లుతుంది. పరిపూర్ణత్వాన్ని పొందగల శక్తి మానవునిలో ఉంది. మానవునిలో ఉన్న జీవాత్మ శాశ్వత మైనది; జ్ఞానరూప మైనది. దేహం నశించినా ఇది నశించదు. ఆత్మ (వైతన్యం) అన్ని ప్రాణులలోనూ ఉన్నా ఇది మానవునిలో అత్యధికంగా వికసించి ఉంది. జీవునిలో మార్పులు చెందే ఎన్నో గుణా లున్నా చైతన్యం మాత్రం ఏ నాటికీ నశించని సార మైన ప్రధానలక్షణం (చేతనాలక్షతో జీవ). మానవునిలోని ఈ ఆత్మలో అనంతమైన శక్తినీ అనంతజ్ఞానాన్నీ అనంతవిశ్వాసాన్నీ అనంతానందాన్నీ పొందగల సామర్థ్యం
జైనమతం 227 నిగూఢంగా ఉంది. వీటి అన్నింటి సముదాయమే ఆత్మ. ఒక్క మాటలో చెప్పా లంటే ఇది దేవత్వాన్ని పొందే సామర్థ్యం కలది.
అయితే మానవుడు (జీవాత్మ) పుద్గలంతో సంబంధంచేత బద్దుదై సహజ మైన సర్వశక్తత్వాదికం మరుగుపడి కించిద్జ్ఞుడుగా, పరిచ్చిన్నమైన శక్తి కలవాడుగా అయి దుఃఖాలలో చిక్కుకొని ఉన్నాడు. సూర్యుని కాంతిని మేఘాలు కప్పివేసి నట్లు చుట్టు ప్రక్కల ఉన్న పుద్ధలాలు జీవుని ప్రభావాన్ని పూర్తిగా కప్పివేస్తున్నాయి. ఆత్మకు ఈ దేహంతో సంబంధమే బంధం. అయితే ఈ బంధం ఎందుకు వచ్చింది? దీనికి ప్రధాన మైన కారణం అజ్ఞానం. అజ్ఞానంచేతనే జీవుడు కామాదులకు లోనై అవి నడిపించి నట్లు నడుస్తున్నాడు. ఈ కామాదులు నూనె జిద్దువంటివి; ఇవే కషాయాలు. ఇవి తమ చుట్టు ప్రక్కల నున్న ధూళి నంతను తమ వైపు లాగికొంటాయి. జీవునికి కషాయాలతో సంబంధం ఉండడంవల్ల ఆ కషాయాలు పుద్దలాలను తమ వైపు లాగికొనడంతో అవి శరీరంగా ఏర్పడి జీవుని అసలు స్వరూపాన్ని కప్పివేస్తున్నాయి. ఈ విధంగా పుద్గలాలు జీవుణ్ణి కప్పివేయడానికి అస్రవం అని పేరు. భౌతికపదార్థంతో జీవునికి ఏర్పడిన ఈ సంబంధం మరణంతో తొలగిపోదు. ఇది ఒక జన్మనుంది మరొక జన్మకు అనువర్తిస్తూ ఉంటుంది. కామాడులతో చేసిన కర్మల ఫలా లన్నీ అనుభవించడం పూర్తి అయ్యే వరకూ జీవుడు తానున్న శరీరంనుంచి మరొక శరీరం లోనికి వెళ్లవలసి ఉంటుంది. చేసిన కర్మలను అనుసరించి క్రొత్త శరీరాలు వస్తూంటాయి. అయితే మానవుడు ఈ జన్మలో తీవ్ర మైన ప్రయత్నం చేసి ఈ జన్మమరణచక్రంనుంచి తప్పించుకొన గలుగుతాడు. ఇందుకు అతడు రెండు పనులు చేయ వలసి ఉంటుంది. (1) ఇంతవరకు తనను ఆవరించి ఉన్న అచేతనభౌతికపదార్థాన్ని నశింపచెయ్యాలి. (2) క్రొత్తది ఏదీ వచ్చి చేరకుండా చూచుకోవాలి. ఇందుకు తగిన ఉపాయాలు జైనమతంలో చెప్పబడి ఉన్నాయి. ప్రధానంగా గుర్తుంచుకొనవలసిన విషయం ఏమనగా - ఏ కర్మా కూడ కామాడుల తోను, అహంకారంతోనూ చేయగూడదు. కామ-అహంకారాడులతో చేసిన కర్మలచేత ఆస్రవం పెరుగుతుంది; జన్మమరణచక్రం అవిచ్చిన్నంగా తిరుగుతూనే ఉంటుంది. అందుచేత స్వప్రయత్నంచేత అంతవరకూ ఉన్న పుద్దలాలను పూర్తిగా నశింపచేసి,
228 జైనమతం కొత్తవి వచ్చి అంటకుండా చేసికొనడం ద్వారా మానవుడు దివ్యత్వాన్ని సంపాదించుకొన కలుగుతాడు. సుఖదుఃఖాలు - వాటి కారణం
లోకంలో కొందరు సుఖం అనుభవిస్తున్నారు, కొందరు దుఃఖం అనుభవిస్తున్నారు. ఈ సుఖదుఃఖాలలో కూడ తారతమ్యం కనబడుతూన్నది. దీని కంతకీ కూడ మానవులు పూర్వజన్మలలో చేసిన కర్మలే కారణం అని జైనమతసిద్దాంతం. పుణ్యకర్మ చేసినవాళ్లు సుఖం అనుభవిస్తే పాపకర్మ చేసిన వాళ్లు దుఃఖం అనుభవిస్తున్నారు. ఒకడు ఒక కుటుంబంలో పుట్టడానికీ, కొంత ధనాదికం సంపాదించడానికీ, కొంత కాలం జీవించడానికీ, ఆరోగ్యాదులకూ కూడ కారణ మైన వేరు వేరు కర్మ లున్నాయి; వాటివల్లనే ఆ యా విధ మైన జన్మలు లభిస్తాయి. ఒక కుటుంబంలో పుట్టడానికి కారణ మైన కర్మకు గోత్రకర్మ అని పేరు; ఆయుర్జాయానికి కారణ మైన కర్మ ఆయుస కర్మ, శరీరసౌష్టవాదులకు కారణ మైన కర్మ నామకర్శ. ఈ విధంగా తాను అనుభవించే సుఖదుఃఖాలకు తాను చేసిన కర్మల ద్వారా మానవుదే కారణం.
లోకంలో కొందరు సుఖం అనుభవిస్తున్నట్లూ కొందరు దుఃఖం అనుభవిస్తున్నట్లూ కనబడినా జాగర్తగా పరిశీలిస్తే అంతటా వదో ఒక రూపంలో దుఃఖమే కమ్ముకొని ఉన్నట్లు స్పష్టం అవుతుంది. దుఖం పూర్తిగా తొలగా లంటే ఒకే ఒక ఉపాయం పునర్జన్మ లేకుందా చేసికొనడం. అందుకు తగిన ఉపాయా లన్నీ ఈ మతంలో చెప్పబడ్డాయి.
మరణానంతరజీవితం
జీవుడు నిత్యుడు. శరీరం నశించినా జీవుడు నశించడు. ఒక శరీరం నశిస్తే తాను చేసిన కర్మలను బట్టి మరొక ప్రాణిగా గాని, మానవుడుగానే గాని మళ్లీ జన్మ ఎత్తుతాడు. దురాలోచనలతోను, వంచనలతోను, అత్యంతాసక్తితో దుష్కర్మలు చేసినవాడు పశుపక్ష్యాదిజన్మ ఎత్తుతాడు. తక్కువ ఆసక్తితో, వినయపూర్వకమైన ప్రవృత్తితో కర్మ ఆచరించినవాడు మళ్లీ మానవజన్మయే ఎత్తుతాడు. కొన్ని విధాలైన కర్మలవల్ల కొన్ని రకాలైన కుటుంబాలలో పుడతాడు. కొన్ని విధాల కర్మలవల్ల
జైనమతం 229 కొన్ని విధా లైన శారీరసొందర్యబలాదులతో పుడతాడు. వీటికి వరుసగా గోత్రకర్మ అనీ నామకర్మ అనీ పేర్లు. ఇతరులను గూర్చి చెడ్డగా మాటలాడడం, ఆత్మస్తుతి, ఇతరుల సుగుణాలను కప్పిపుచ్చడం, లేని గుణాలు ఆరోపించి స్తుతించడం మొదలైన దుష్కర్మలు చేసినవాడు నీచకుటుంబంలో పుడతాడు. వక్రబుద్ధి, నిజాయితీ లేక పోవడం - ఇలాంటివాటివల్ల వికలాంగుదై పుడతాడు. బుజుప్రవర్తన, శుచిత్వము ఉన్నవాడు మంచి శరీరం కలవా డవుతాడు. వలాంటి కర్మ చేస్తే ఏ జన్మ లభిస్తుందో అతివిసృత మైన వర్ధనలు జైనమతగ్రంథాలలో ఉన్నాయి. కొన్ని కర్మలవల్ల స్వర్గానికి కొన్నింటివల్ల నరకానికీ వెడతా దని కూడ జైనగ్రంథాలలో చెప్పబడింది. సంస్కారాలు మిగిలిపోయిన ప్రతీ జీవుడూ పునర్జన్మ ఎత్తవలసి ఉంటుంది. కర్మలు అత్యాస్తితో ఆచరించక సత్య మైన విశ్వాసమూ, సత్య మైన జ్ఞానమూ, సత్య మైన చరిత్రము అవలంబించి, వైరాగ్యంతో అన్నింటిని పరిత్యజించగలిగినవాని సంస్కారా లన్నీ నశించిపోతాయి; అప్పు డతడు పునర్జన్మ ఎత్తకుండా మోక్షం పొందుతాడు; తన సహజమైన స్వరూపాన్ని పొంది సర్వదుఃఖాలనుండి విముక్తు డౌతాడు. ఇదే ఉత్తమలక్ష్యం. మోక్షాన్ని పొందిన జీవుని అనంతచతుష్టయం - అనంతశక్తి అనంతజ్ఞానం, అనంతవిశ్వాసం, అనంతానందం అనే నాలుగు సహజ లక్షణాలు, వాటంతట అవే భాసిస్తాయి. ఈ మోక్షం లభించా లంటే జీవునికి భౌతికపదార్థాలతో సంబంధం పూర్తిగా తొలగిపోవాలి. శరీరం ఉన్నంతవరకూ ఆ సంబంధం ఉంటుంది గాన ఈ మతంలో జీవన్ముక్తికి అవకాశం లేదు. అదే విధంగా ఈ మోక్షం కేవలం దుఃఖవినాశరూపమే కాక ఆనందస్వరూపం కూడ. జైనమతం బోధించిన సాధనలు
జైనమతంలో (ప్రధానంగా మూడు విధా లైన నియమాలు, సాధనలు చెప్పబడ్డాయి. వీటికి 'త్రిరత్నాలు' అని పేరు. యుక్త మైన విశ్వాసము (సమ్యద్దర్భనం) యుక్త మైన జ్ఞానం (సమ్యగ్జ్ఞానం), యుక్త మైన చరితం (సమ్యక్చరితం) అనేవి ఈ రత్మ్మతయం. ఈ మూడూ అన్యోన్యసంబంధం గలవి. ఈ మూడూ కలిసి నప్పుడే మోక్షం లభిస్తుంది.
సమ్యర్ద్య్భునం : సమ్యర్దర్శనం విషయంలో అభిప్రాయఖేదా లున్నాయి. తొమ్మిది
230 జైనమతం జైనమతోక్తద్రవ్యాల విషయంలో విశ్వాసం సమ్యగ్దర్భనం అని కొందరూ, ఆరు పదార్దాలయందు, తొమ్మిది ద్రవ్యాలయందు విశ్వాసం అని కొందరూ, హింసారహిత ధర్మంమీద విశ్వాసం అని కొందరూ, జినులు, కేవలులు బోధించిన జీవనవిధానం మీద విశ్వాసం అని కొందరూ, జైనమతగ్రంథాలమీదా, గురువులమీదా విశ్వాసం అని కొందరూ చెపుతారు. జ్ఞానం చాల గొప్పది; అది తప్పక ఫలం ఇస్తుంది అను దృఢవిశ్వాసం సమ్యర్దృష్టి అని ఉమాస్వామి చెప్పాడు. సామాన్యరూపంలో తీర్థంకరుల ఉపదేశాలమీదా, జైనమతానికి సంబంధించిన అన్ని విషయాలమీదా పరిపూర్ణ విశ్వాసం సమ్యగ్దర్భనం అని చెప్పవచ్చును. జైనమతోక్తమైన మోక్షమార్లంలో ప్రవేశించ దలచినవానికి ఇది అత్యంతప్రధాన మైన మొదటి పదం (అడుగు). సమ్యగ్గర్భనానికి సంబంధించిన ఎనిమిది ప్రధాన మైన అంశాలు చెప్పబడ్డాయి. (1) మత[గ్రంథాల బోధల విషయంలో సందేహా లేవీ ఉండకూడదు (నిఃశంకితా) (2) ప్రాపంచికసుఖాలమీద ఆసక్తి ఉండకూడదు (నిష్కాంక్షితా). (3) ఆధ్యాత్మికమార్గాన్ని పొందడం విషయంలో సందేహం ఉండకూడదు (నిర్విచికిత్స) (శ) లక్ష్యాన్ని గూర్చిన నిశ్చిత మైన జ్ఞానం ఉందాలి (అమూఢద్చ్భష్టి. (5) ఆధ్యాత్మికలక్షణాలను వృద్ది పొందించుకోవాలి (ఉపబృ్బంహణం). (6) సత్యమార్గం నుంచి చ్యుతుడు కాకుండా చూచుకోవాలి (స్టికీకరణం). (7) సత్యమార్గం అనుసరించే వాళ్లవిషయంలో ప్రేమభావంతో ఉందాలి (వాత్సల్యం). (8) సత్యంయొక్క ప్రాశస్త్యాన్ని చాటి చెపుతూందాలి (ప్రభావన). సమ్యగ్జ్ఞానం : వస్తువుల స్వరూపస్వభావాలను గూర్చి నిర్దుష్టమైన జ్ఞానం సమ్యగేజ్ఞానం. చేతన - అచేతన వస్తువుల లక్షణాలను బాగుగా తెలిసికోవాలి. అచేతన పదార్థాల స్వరూపస్వభావాలు బాగుగా తెలిసినవాడు చేతనస్వభావం కూడ బాగుగా తెలిసికొని అచేతనవస్తువులమీద క్రమంగా వైరాగ్యం పెంచుకొన గలుగుతాడు. స్వస్వరూపాన్ని బాగా గుర్తించి దానిలోనే ఆనందిస్తాడు. సమ్యక్చరితం (మంచి నడవడిక) : సమ్యగ్దృష్టి, సమ్యగ్జ్ఞానం ఉన్నంత మాత్రంచేత ప్రయోజనం లేదు. మోక్షం లభించా లంటే సమ్యక్చరితం కూడ చాల అవసరం. సమ్యక్చరితం అనగా రాగద్వేషాలు, అత్యాసక్తీ లేని కర్మాచరణం
జైనమతం 231 అని చెప్పవచ్చును. జైనగ్రంథాలలో సంన్యాసులకూ, ఇతరులకూ అవసర మైన, సమ్యకృరితానికి సంబంధించిన ఎన్నో నియమాలు వేరువేరుగా చెప్పబడ్డాయి. అయితే పరమతసహనానికి జైనులది పెట్టిన పేరు. ఇందుకు వీళ్లు అంగీకరించిన స్యాద్వాదం ఎంతగానో ఉపకరించింది. ఒక సమయంలో కొన్ని పరిస్థితులలో ఒక వస్తువును ఒక దృష్టికోణంతో చూస్తే అది ఒక విధంగా కనబడుతుంది. అదే వస్తువు మరొక సమయంలో, వేరు పరిస్థితులలో, వేరు దృష్టికోణంతో చూస్తే మరొక విధంగా కనబడవచ్చు. ఈ సత్యాన్ని పురస్మరించుకొని జైనులు సప్తభంగీనయం అను నామాంతరం గల స్యాద్వాదాన్ని ప్రతిపాదించారు.
- స్యాదప్తి = ఉండవచ్చును.
- _ స్యాన్నాస్తి = లేకపోవచ్చును
- _స్యాదస్తి చ నాస్తి చ = ఉండవచ్చును లేకపోవచ్చును కూడ శ. _ స్యాదవక్తవ్యమ్ = వర్ణింపశక్యం కాకపోవచ్చును.
- _స్యాదస్తి చ అవక్తవ్యం చ = ఉండవచ్చును వర్ణింపశక్యం కాకపోవచ్చును.
- _ స్యాన్నాస్తి చావక్తవ్యం చ = లేకపోవచ్చును; వర్ణింపశక్యం కాకపోవచ్చును.
- _ సాద్యస్తిచ నాస్తి చావక్తవ్యం చ = ఉండవచ్చును, లేకపోవచ్చును, వర్థింపశక్యం కాకపోవచ్చును. ఇదే సప్త్రభంగీనయం.
ఈ (క్రింద చెప్పిన నియమాలు సంన్యాసులకు, ఇతరులకు అందరికీ కూడ వర్తించే నియమాలు.
- అహింస : జైనమతంలో ఇది చాల ప్రధాన మైన ధర్మం. మానవుడు ఏ విధంగానూ ఏ ప్రాణికీ కూడ హింస జరగకుండా చూచుకోవాలి. ఈ అహింసా సిద్ధాంతాన్ని జైనులు ఎంత కఠినంగా ఆచరిస్తా రంటే సాయంకాలం సూర్యాస్తమయం అయిన తరువాత పొయ్యిలో నిప్పు రగిల్చి వంటలు కూడ చేయరు. అలా చేస్తే కంటికి కనబడకుండా ఏ వైనా ప్రాణులు ఆ మంటల వేడికి నశిస్తా యని భయం. జైనసంన్యాసులు మార్గంలో నడిచే టప్పుడు చీమలు
232 జైనమతం మొదలైనవి తమ పాదాల (క్రింద పడకుండా చూచుకొంటూ మెత్తని కుంచెలలో నేల తుడుస్తూ అడుగులు వేసి నడుస్తారు.
ఇతరులను ఏ విధంగానూ హింసించ గూడదు. హింస అనేది కేవలం శారీరకంగానే కాక మానసికంగాను, వాచికంగానూ కూడ జరగవచ్చు. మనసా
. ఇతరులకు చెడు కలగా లని తలవడం మానసికహింస. ఇతరుల మనస్సుకు
కష్టం కలిగించే మాటలు మాటాలడడం వాచికహింస. శరీరంమీద ఆయుధాదులతో కొట్టి బాధ కలిగించడం ఎలాంటి హింసయో ఈ రెందు కూడ అలాంటి హింసలే. రెండూ చెడ్డవే. ఒకనికి ఇష్టం లేని పని వానిచేత చేయించినా, ఒకని కుండవలసిన స్వాతంత్ర్యానికి అడ్డు తగిలినా అది కూడ హింసయే అని జైనసిద్దాంతం. సరియైన (శద్ధ చూపకపోవడంచేత (ప్రమాదం) ఇతరులకు కష్టం కలిగించడం కూడ హింసయే. ప్రమాదం (నిర్లక్ష్యభావం) అనేది రాగంవల్ల గాని ద్వేషంవల్ల గాని కలుగుతుంది. రాగాద్వేషాలతో చేసేది ఏదైనా హింసయే. ఈ విధంగా అహింసయొక్క పరిధి చాల విస్తృత మైనది. జైనమతం (ప్రకారం ఇదొక గొప్ప తపస్సు. ఈ అహింసలో సకలప్రాణుల విషయంలో (పేమభావం చూపా లనేది అంతర్గతమై ఉంది.
సత్యం : ఉన్న దున్నట్లు చెప్పడం సత్యం అనేది ఈ పదానికి సాధారణ మైన అర్ధం. ఇతరులకు హానికర మైతే ఇలాంటి సత్యం పలకకూడదు. ఇతరులకు . హితకర మైన సత్యమే పలకాలి. అలా కాని సత్యం ఇతరుల మనస్సుకు బాధ కలిగించే హీంస అవుతుంది. ఉన్న విషయాన్ని అతిశయోక్తిభరితంగా చెప్పడం, ఇతరులలో దోషాలు ఎత్తి చూపడం, అనరాని మాటలు అనడం ఇవన్నీ అసత్యం (క్రిందికి వస్తా యని జైనుల అభిప్రాయం. (1) ఒక సమయంలో, ఒక విధంగా, ఒక స్వరూపంతో ఉన్న వస్తువును అలా లేదని చెప్పడం (2) అలా లేని దానిని ఉన్న దని చెప్పడం (3) నింద్య మైన మాటలు మాటలాడడం (4) ఒక వస్తువును మరొక వస్తువుగా చిత్రించడం (5) పాపభూయిష్ట మైన మాటలు చెప్పడం (6) అప్రియవాక్సాలు పలకడం ఇవన్నీ అసత్య స్వరూపాలే. వీటిని పరిహరించాలి. ఎందుచేత ననగా ఇవి పరుల హింసకు కారణం అవుతాయి.
జైనమతం 233 అస్తేయం (దొగిలించకపోవడం) : ఇతరుల వస్తువును వారికి తెలియకుందా తీసికొనడం స్తేయం అనేది సామాన్యార్ధం. అయితే జైనులు 'స్తేయి శబ్దానికి చెప్పే అర్ధం అతివిసృత మైన పరిధి కలది. అన్ని విధా లైన మోసమూ కూడ స్తేయం అనీ అలాంటి స్తేయం చేయకపోవడం అస్తేయం అనీ జైనమతం బోధిస్తుంది. అధికమైన విలువగల వస్తువును చాల తక్కువ మూల్యానికి కొనడం, ఎవరైనా మరచిన వస్తువును తనదిగా చేసికొనడం, ఇతరుల సొమ్మును ఆశించడం, ఎవరిదో తెలియని వస్తువును తీసికొనడం - ఇవన్నీ స్తేయం క్రిందికే వస్తాయి. ఇలాంటి స్తేయాన్ని విడిచిపెట్టాలి. స్తేయం హింసయే అని జైనుల అభిప్రాయం. ఎందుచేత ననగా ధనం అనేది మానవుని బాహ్యప్రాణం; దానిని వాని అనుమతి లేకుందా తీసికొనడం వానికి బాధ కలిగిస్తుంది గాన అది హింసయే అవుతుంది. స్తేయం చేసేవానికి సాహాయ్యం చేయడం, దొంగసొత్తు కొనడం, రాజనియమవిరుద్ధ మైన వ్యాపారం చేయడం మొద లైనవి కూడ స్తేయమే) ఎందువల్ల ననగా ఇవన్నీ ఇతరులకు వారి ఆస్తిపై ఉన్న అధికారానికి భగంకర మైనవి. | బ్రహ్మచర్యం : దీనికి హిందూమతంలోను బౌద్ధమతంలోనూ కూడ ప్రాధాన్యం ఉంది. అయితే జైనమతంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడింది. భార్యతో తప్ప ఇతరస్త్రీలతో సంబంధం సర్వథా నిషేధించబడింది. శారీరక వ్యభిచారమే కాక మానసికవ్యభిచారం కూడ పాపహేతువే. ఇంద్రియభోగాల మీద అత్యంతాసక్తి లేకపోవడం కూడ (బ్రహ్మచర్యమే. ఎల్లప్పుడూ విషయసుఖాలను గూర్చియే ఆలోచించేవాళ్లు ఈ బ్రహ్మచర్యవ్రతాన్ని అతిక్రమించిన వాళ్లే అవుతారు. అపరిగ్రహం : తనకు అవసరమైనవాటికంటె ఎక్కువ ధనధాన్యాదులను 'ప్రోగుచేసికొనడం పరి[గ్రహం. అలా చేకపోవడం అపరిగ్రహం, వస్తువులను సేకరించకపోవడమే కాకుండా అనావశ్యకము లైన వస్తువులమీద ఆస్తి రాగము, లేకపోవడం కూడ అపరి[గ్రహమే. ఇదే నిజ మైన అపరి[గ్రహం. అవసరమైన దానికన్న ఎక్కువ వస్తువులను సేకరించడం ద్వారా ఒకడు ఆ వస్తువులు ఇతరులకు అందకుండా చేస్తున్నాడు గాన పరిగ్రహం కూడ ఒక విధంగా స్తేయమే. వాటియందు ఆసక్తిని విడిచి నట్లయితే వాటిని సేకరించే ప్రసక్తి గాని స్తేయప్రసక్తి గాని ఉండదు. ఈ కోరికయే ప్రపంచకంలోని అన్ని క్లేశాలకీ మూలకారణం,
234 జైనమతం అందుచేతనే హిందూ - బౌద్దమతాలలో గూడ అపరి[గ్రహానికి చాల ప్రాధాన్యం ఇవ్వబడింది. అహింసాదు లైదింటికీ మహావ్రతములు అని పేరు.
అందరూ అభ్యసించి ఆచరించవలసిన ఈ ఐదు మహావ్రతాలే కాక గృహస్థునికి కొన్ని అనువ్రతాలు కూడ విధింపబడ్డాయి. సంన్యాసికి ఇంకా కొన్ని అనువ్రతాలు విధింపబడ్డాయి. గృహస్థుని అనువ్రతాలు (1) గుణవ్రతాలు అనీ శిక్షావ్రతాలు అనీ రెండు విధాలు. మొదటివి మళ్లీ మూడు విధాలు - (1) దిగ్రతాలు, (2) దేశావకాశికవ్రతాలు; (3) అనర్థ్ధదానదవ్రతాలు. శ్వేతాంబర సంప్రదాయంలో దేశావకాశికవతాలకు బదులు భోగోపభోగ(వతాలు అంగీకరించబడ్డాయి. శిక్షావ్రతాలు - (1) సొమయికదవ్రతాలు (2) ప్రోషదోప వాసవ్రతాలు (3) భోగోపభోగవ్రతాలు (4) అతిథిసంవిభాగవ్రతాలు అని నాలుగు విధాలుగా విభజింపబడ్డాయి. ఇక్కడ నున్న భోగోపభోగవ్రతానికి బదులు శ్వేతాంబరసంప్రదాయంలో దేశావకాశికవ్రతం చేర్చబడింది.
- దిగ్రతం : ఈ వ్రతం ప్రకారం ఒక గృహస్థుడు ఫలానా దిక్కు వైపే సంచారం చెయ్యాలి అను నియమం బిధించుకోవాలి. దీనివల్ల హింసకు అవకాశం తక్కువగా ఉంటుంది; అపరి[గ్రహానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది.
2, దేశావకాశికవ్రతం : ఇది కూడ ది(గ్వతం వంటిదే, దీనిలో సంచరించే ప్రదేశం వైశాల్యం విషయంలో నియమం విధించబడుతుంది.
- అనర్థదానదవ్రతం : ఏ పనులు చేస్తే చేసేవానికే హాని కలుగుతుందో అలాంటి పనులను నిషేధిస్తూ చేసిన నియమం ఈ వ్రతం. (1) చెడ్డ ఆలోచనలు (2) పాపకృత్యాలను (ప్రోత్సహించడం, తాను చేయడం (3) సరియైన పర్యవేక్షణ లేని పనులు చేయడం (4) హింసకోసమై ఆయుధాలు ఇవ్వడం (5) చెడ్డ పుస్తకాలు చదవడం - ఇవి ఇలాంటి పనులు అని పూజ్యపాదుడు చెప్పాడు.
శిక్షావ్రతాలు
- సామయిక వ్రతం : ఇది శాంతిని, సమచిత్తత్వాన్ని అభ్యసిస్తూ ఆత్మయందు స్థిరంగా ఉండదానికి సంబంధించిన వ్రతం. ఇది రోజుకు రెండు సార్గు గాని
జైనమతం 235 మూడు సార్లు గాని చెయ్యాలి. ఇలా చేయడంలో గృహస్థుడు చాల వరకు సంన్యాసియొక్క స్థితిని అలవరచుకొంటాదు. ఈ వ్రతం ఆచరించడానికి తగిన స్థానమూ, ఆసనమూ (శరీరస్థితీ) మొదలైనవి కూడ విధింపబడి ఉన్నాయి.
-
ప్రోషదోపవాస (వ్రతం : అష్టమి, చతుర్దశి, పూర్ణిమ - ఈ రోజులలో ఉపవాసం చెయ్యాలి. ఉపవాసంలో కేవలం భోజనాన్ని మాత్రమే కాకుండా స్నానం, సుగంధద్రవ్యాలు, శరీరాన్ని అలంకరించుకొనడం, అలంకారాలు, మైథునమూ వీటిని కూడ పరిత్యజించాలి.
-
భోగోపభోగ వ్రతం : ప్రతిదివసమూ ఉపయోగించే వస్తువుల విషయంలో కూడ నియంత్రణ పాటించాలి. ఎక్కువ వస్తువులను ఉపయోగించ కూడదు. దీనివల్ల ప్రాపంచికవస్తువులమీద ఆసక్తి తగ్గుతుంది. అంతగా అవసరం లేని వస్తువులను విడిచివేయగా విఢిచివేయగా (క్రమంగా వాటి విషయంలో వైరాగ్యం ఏర్పడుతుంది. ఇదే ఈ వ్రతం ప్రయోజనం.
శ అతిథిసంవిభాగ వ్రతం : ఇది అర్హులైనవాళ్లకి దానం చేయడానికి సంబంధించిన వ్రతం. హిందూమతంలో కూడ దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దాతకు ్రతిగ్రహీతకు ఉండవలసిన లక్షణాలు, దానవిధానమూ మొదలైన విషయాలు జైనగ్రంథాలలో అధికంగా వర్ణించబడ్డాయి.
సంన్యాసులకు ఇంకా కఠిన మైన నియమాలు విధించబడ్డాయి. జైనమతంలో సంన్యాసులకు అత్యధిక మైన గౌరవం ఇవ్వబడింది. సంన్యాసి అతిపవిత్రమూ పరిశుద్ధమూ అయిన జీవనం గడపాలి. అస్థలితబ్రహ్మచర్యం పాటిస్తూ ప్రపంచకాన్ని పరిత్యజించాలి. శ్వేతాంబరసంన్యాసులు దిగంబరసంన్యాసులు అని రెండు తెగల సంన్యాసు లుంటారు. దిగంబరసంన్యాసులు ఈ క్రింది నియమాలు పొటించాలి :
- పైన చెప్పిన ఐదు మహావ్రతాలు ఆచరించాలి.
- _ సంచారంలో జాగరూకత, మాటలలో జాగరూకత, అహారం తీసికొనడంలో జాగరూకత, వస్తువులను పైకి ఎత్తడంలోను కింద ఉంచడంలోనూ
236 జైనమతం జాగరూకత, మలాదులను దూరంగా విసర్జించడంలో జాగరూకత అను ఐదు జాగరూకతలు పాటించాలి.
-
ఇంద్రియాలు ని([గ్రహించుకోవాలి.
-
_ ఈ క్రింది ప్రధానకర్తవ్యాలు ఆరూ తప్పక ఆచరించాలి -
(౧) _ సామయికాలు (వెనుక చెప్పినవి) పాటించాలి.
(0 _ ఇరవైనలుగురు తీర్థంకరుల స్తోత్రాలు (చతుర్వింశతిస్తవం) పఠించాలి.
(1) _ ఆచార్యులకు, పైవాళ్లకు, కేవలుల విగ్రహాలకు, సిద్దుల విగ్రహాలకూ, జ్ఞాన - ఆచారాదులలో తనకంటె గొప్పవారికీ వందనం చెయ్యాలి.
(1) _ నైతికంగా తాను చేసిన పొరబాట్లను గురువు ఎదుట చెప్పుకొని తనను తాను నిందించుకోవాలి (ప్రతిక్రమం). ఇది పశ్చాత్తాపం వంటిది.
(౧ భవిష్యత్తులో పాపకార్యాలు చేయ నని నిశ్చయించుకోవాలి (ప్రత్యాఖ్యానం).
(1) _ ధ్యానానికి తగిన ఆసనాలు (యోగాసనాలు) అభ్యసించాలి.
- _ కేశాలు ఖండించుకోవాలి.
6 దిగంబరుదై ఉందాలి.
-
_ స్టానం చేయకూడదు.
-
_కటికనేలమీద శయనించాలి.
-
దంతధావనం చేసికొానగూడదు.
-
నిలబడి ఆహారం తీసికోవాలి.
11 ఇరవైనాలుగు గంటలలో ఒక్కమారు మాత్రమే భోజనం చెయ్యాలి.
శ్వేతాంబరశాఖకు చెందిన సంన్యాసి ఈ క్రింది నియమాలు పాటించాలి.
- ఐదు మహావ్రతాలు ఆచరించాలి.
జైనమతం 237
-
_ రాత్రి భోజనం చేయకూడదు.
-
ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి.
-
_ అంతఃశుద్ధిని 'పెంపొందించుకోవాలి.
-
_స్వంతవస్తువుల విషయంలో పవిత్రత్వం పాటించాలి (అన్యాయంగా సంపాదించగూడదు).
-
_ ఓర్పు చూపాలి. క్షమించాలి.
-
వైరాగ్యం కలిగి ఉందాలి.
-
_ మనస్సు పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
-
మంచిమాటలే మాట్లాడాలి.
-
శారీరంగా బాగుండాలి.
-
(ప్రాణులను రక్షించాలి.
-
త్రివిధనియమాలు పాటించాలి.
-
శమను సహించాలి.
14 _ కొన్ని పరిస్థితులలో, విహితము లైన పద్ధతు లవలంబించి స్వేచ్చగా (ఇష్టపూర్వకంగా) ప్రాణాలు త్యజించాలి (సల్లేఖనావ్రతం). సంన్యాసి ప్రయత్నపూర్వకంగా అభ్యసించి ఆచరణలో పెట్టవలసిన కొన్ని
సద్గుణాలు ఇవి - క్షమాగుణం, వినయం, బుజుత్వం, సంతృప్తి సత్యం, నిగ్రహం,
తపస్సు, త్యాగము, వైరాగ్యము, బ్రహ్మచర్యము. పురుషులు స్త్రీలు కూడ సంన్యాసం
తీసికొనవచ్చును. సంన్యాసిను లైన ప్రీల విషయంలో అధికంగా గౌరవం
చూపబడుతుంది. ఇంతవరకు చూచినదానిని పట్టి జైనమతం నైతికనియమ'ప్రధాన మైన
మతం అనీ, పవిత్రత్వము, బ్రహ్మచర్యము, ఆత్మని[గ్రహము, వైరాగ్యము, వినయము,
(పేమ, దయ, జాలి మొద లైన గుణాలకు ఈ మతంలో అత్యధికమైన ప్రాధాన్యం
ఇవ్వబడిన దనీ స్పష్టం అవుతుంది. అయితే ఈ మతంలో కొన్ని ప్రార్ధనలూ,
238 జైనమతం కాన్ని కర్మకలాపాలూ కూడ చోటుచేసికొన్నాయి. భారతదేశంలో అనేకప్రాంతాలలో అనేక మైన జైనమందిరా లున్నాయి.వాటిలో స్టాపించిన తీర్థంకరుల విగ్రహాలకు, ప్రధానంగా మహావీరుని విగ్రహాలకు పూజలు జరిపి నైవేద్యాలు సమర్పిస్తూంటారు. జైనమత[గ్రంథాల అధ్యయనం కూడ పవిత్రకార్యంగా పరిగణింపబడుతుంది. ప్రతీ సంవత్సరమూ కూడ జైనులు మహావీరుని జన్మదివసాన ఆతని విగ్రహాన్ని ముందు ఉంచుకొని పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తూంటారు. కొన్ని జైనదేవాలయాలు యాత్రాస్థానాలుగా పరిగణింపబడడంచేత భారతదేశం నలుమూలలనుండీ యాత్రికులు ఆ న్గానాలకి వెడుతూంటారు. ప్రధాన మైన శాఖలు లేదా సంప్రదాయాలు జైనమతంలో అపరి([గ్రహానికీ(సామ్ము కూడబెట్టకుండా ఉండడానికీ) స్వయంగా శరీరాన్ని శుష్కింపచేసి దానిని విడిచిపెట్టదానికీ ఎక్కువ (ప్రాధాన్యం ఇవ్వబడింది. ఈ రెండు ధర్మాల స్వరూపాన్ని నిర్ణయంచడంలోను, వీటి విషయంలో అతికాఠిన్యాన్ని శైథిల్యాన్నీ చూపడంలోను ఏర్పడిన అభిప్రాయభేదాలచేత ఈ మతంలో శ్వేతాంబర, దిగంబర అను రెండు శాఖలు ఏర్పడ్డాయి. దిగంబరశాఖకు చెందినవారు అపరి[గ్రహం విషయంలో అతి తీవ్ర మైన దృష్టిని అవలంబించి నిజ మైన సంన్యాసి ఏ వస్తువూ తనదిగా తన దగ్గర ఉంచుకొనకూడదు; చివరికి గుడ్డ పీలిక కూడ ఉంచుకొనకూడదు అని అంటారు. అందుచేతనే దిగంబరశాఖకు చెందిన సంన్యాసులు పూర్తిగా వస్త్రవిహీనులై ఉంటారు. శ్వేతాంబరులు మాత్రం అంత కఠోరనియమానికి పోకుండా పవిత్రత్వమూ, అల్బవ్యయత్వమూ దృష్టిలో ఉంచుకొని తెల్లని వస్త్రాలు ధరిస్తారు. కొన్ని ఇతరవిషయాలలో కూడ దిగంబరులు కఠోరనియమా లన్నింటినీ చాల తీవ్ర మైన పట్టుదలతో ఆచరిస్తారు. ఏమైనా ప్రధాన మైన నియమాల విషయంలో అభిప్రాయభేదా లేవీ లేకపోవదంచేత ఈ రెండు శాఖలకీ అంతగా భేదం లేదని చెప్పవచ్చును.
సిర్థ్యమతం
సిక్టమతం ప్రపంచకంలోని అత్యాధునికమతం. ఇది భారతదేశంలోనే పుట్టి ఇక్కడనే వ్యాప్తిచెందింది. ఈ నాడు కొందరు సిక్టమతస్థులు ధనార్దనాదులకోసం విదేశాలకు వెళ్లి అక్కడ నివసిస్తున్నా కొందరు అక్కడ స్థిరనివాసాలు ఏర్పరచుకొన్నా సిక్మమతప్రధానస్థానం భారతదేశమే. ఇది హిందూమతాన్నీ, ఇస్లాంమతాన్నీ కూడ వ్యతిరేకిస్తూ బయలుదేరిన మతం అని చాలమంది అంటారు. సిక్టమతాన్ని స్థాపించిన గొప్ప కవీ, సాధువూ అయిన నానక్ - “వేద్రాల్లు గాని కటెబ్ (కురాన్) గాని రహస్యాన్ని తెలిసికొనజులకపోయాయి” అని అన్నా దని ప్రసిద్ధి. ఇది నానక్‌కు ఈ రెండు మతాల విషయంలోనూ ఉన్న అసంతృప్తిని సూచిస్తుంది. ఒక విధంగా చూస్తే హిందూ - ఇస్తాంమతాల మధ్య సామరస్యం కూర్చడానికై సిక్టమతం ఆవిర్భవించిం దని కూడ చెప్పదానికి అవకాశం ఉంది. సాధు సంప్రదాయానికి చెందిన కబీర్ మొద లైన కవులు కూడ ఇలాంటి ప్రయత్నం చేసి నట్లు కనబడుతుంది. అయితే - ఈ రెండు మతాల మధ్య సామరస్యం కూర్చడానికి బయలుదేరిన దైనా ఈ మతంలో ఇస్లాంనుంచి గ్రహించినది ఏమీ లేదని కొందరి అభిప్రాయం. “గురునానక్ అండ్ ది సిక్ట్ రిలిజియన్” అను [గ్రంథంలో మాక్. లియోడ్ అన్నట్లు - “ఈ విధంగా చూస్తే గురునానక్ స్థాపించిన మతాన్ని హిందూనంప్రదాయాలకూ ఇస్తాంసంప్రదాయాలకూ మధ్య సమన్వయంగా ప్రతిపాదించడం యుక్తం కాదు. నిజంగా ఇది ఒక సమన్వయమే కాని దీనిలోని ఇస్తాంమతానికి సంబంధించిన విషయాలు అప్రధాన మైనవి" (6౬౩. 179).
నానక్ పుట్టుకచేత హిందువే అయినా ఆతని విశ్వాసాలమీద ఇస్త్లాంమత (ప్రభావం తప్పకుందా ఉంది. అయినా కూడ ఈ ప్రభావం ఎంత ఉందో గుర్తించడం చాలా కష్టమైన పని. “గురునానక్ ఆలోచనలమీద ఇస్లాం ప్రభావం కొంతవరకు పని చేసినా, దానికి ఏ విధంగానూ కూడ మౌలికప్రాధాన్యం ఇవ్వజాలము” అని కూడ మాక్.లియోద్ అన్నాడు. ఈ అభిప్రాయా లన్నీ యథార్థ మైన పక్షంలో
240 సిక్టమతం సిక్టమతం హిందూ - ఇన్లాంమతాల భావాలచేత, విశ్వాసాలచేత (ప్రభావితం అయినా ఇది ఇన్లాంకు కంటె హిందూమతానికే సంనిహిత మైనది అని చెప్పాలి.
గురునానక్ సిక్థమతస్థాపకు దని ప్రసిద్ధి ఉన్నా సికముతం ఇప్పు దున్న స్వరూపంలో అభివృద్ధి చెందడానికి నానక్ తరవాత వచ్చిన తొమ్మందుగురు గురువుల ప్రయత్నం ఎంతో ఉంది. వీరందరి బోధల, ప్రయత్నాల ఫలితమే నేటి సిక్టమతం.
సికృమతం ఈశ్వరభక్తికీ, గురుభక్తికీ ప్రాధాన్యం ఇచ్చే మతం. 'సిక్ట పదం “శిష్య శబ్బంనుంచి నిష్పన్న మైనది. ఈ మతం గురు - పరమేశ్వరులపై భక్తిని బోధించే మతం అని ఈ పదమే సూచిస్తున్నది.
- గురునానక్ (1469-1539) ఇతడు ఈ గురుపరంపరలో అత్యుత్తము దైన సిద్ధపురుషుడు. ఇతరమత్రవక్త లందరి వలెనే గురునానక్ కూడ శైశవం నుంచీ అతివిలక్షణ మైన ప్రవర్తనతో ఉండేవాడు. ఇత డొక సామాన్యకుటుంబంలో జన్మించాడు. ఇతని తలిదండ్రులు అతిపవిశ్రమైన జీవనం గడిపినవారు; సత్స్వభావం కలవారు. నానక్ ఇతరబాలుల వలె క్రీడాదులందు ఆసక్తి చూపేవాడు కాదు. అవకాశం దొరికినప్పుడల్లా నిర్ణన ప్రదేశాలకి వెళ్లి అక్కడ ధ్యానంలో కూర్చునేవాడు. విద్య నేర్చుకొనే టప్పుడు కూడ ఇతరబాలుల వలె కాక *ఈ అక్షరంలో ఉన్న రహస్యార్థం ఏమిటి, దీని అసలు అర్థం ఏమిటి?” అంటూ ప్రశ్నలు వేసి గురువులను ఏమి సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో పెట్టి వాళ్లకు విసుగు కలిగిస్తూందేవాడు.
నానక్ గంటల కొలది సమయం ధ్యానం చేస్తూ గడిపేవాడు. సరిగా ఆహారం తీసికొనేవాడు కాదు. అందుకు ఫలితంగా జ్వరం వస్తుందేది. వైద్యం చేయడానికి వచ్చిన వైద్యుణ్ణి పట్టుకొని “నువ్వు ఆత్మలో ఉన్న రోగాలకు చికిత్స చేయగలవా?” అని (ప్రశ్నిస్తూందేవాదు. ఆతనికి ఉపనయనం చెయ్యాలని తలబెట్టారు. బంధువు లందరూ వచ్చి ఉన్నారు. అతనికి పురోహితుడు యజ్ఞోపవీతం మెడలో వేసేటప్పుడు అతదు “దీని ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నిస్తూ అది ధరించడానికి నిరాకరించాడు. “ఈ యజ్ఞోపవీతం ధరించకపోతే కర్మలు చేయడానికి
సిక్ట్రమతం 241 అధికారం ఉండదు; అందుచేత దీనిని ధరించాలి” అని పురోహితుడు సమాధానం చెప్పగా - “ఇది ధరించినవాడు అపవిత్రమైన జీవనం గడపినా పాపం అంటకుండా ఉంటుందా?” అని నానక్ ఆతనిని ప్రశ్నించాడు. “నా కదేమీ తెలియదు; శాస్త్రాలు ఇది ధరించా లని చెపుతున్నాయి. మనం పెద్దవాళ్లు అనుసరించిన ఆచారం అనుసరించాలి అని పురోహితుడు సమాధానం చెప్పాడు.
“దయ అను దూదినుంచి ప్రేమ అను దారం తీసి ఇంద్రియభోగాలనుంది దూరంగా ఉండడము, సత్యమూ అను రెండు ముళ్లు వేసి దానిని ధరించాలి. మనస్సు ఎల్లప్పుడూ దానిమీద నిలపాలి; అది తెగదు; మాసిపోదు; కాలిపోదు; దీనిని ధరించినవాళ్లే ధన్యాత్ములు” అని అంటూ నానక్ పురోహితు డెంత చెప్పినా యజ్ఞోపవీతం ధరించడానికి నిరాకరించాడు. చివరికి తల్లి బ్రతిమాలగా ధరించాడు. ఇది నానక్‌లో బాల్యంనుంచి ఉన్న బాహ్యాచారాదులకంటె ఆంతరద్భష్టికి ప్రాధాన్యాన్ని ఇచ్చే ప్రవృత్తికి ఒక ఉదాహరణం.
చిన్నతనంనుంచీ కూడ ఈతని ప్రవృత్తి తండ్రికి శ్రమ కలిగించేదిగానే ఉండేది. ఇతడు వ్యవసాయం చేయించడానికి వెళ్లడు, కొట్లో పని చూచుకొనడు; వర్తకంకోసం ప్రయాణాలు చేయడు. అతడు ఇష్టపడి చేసే పనల్లా బీదలకు ధనం ఇవ్వడం, సంన్యాసులకు భిక్ష పెట్టడమూను. ఏమీ చేయలేక తండ్రి ఆతనిని తన సోదరి ఇంటికి పంపాడు. అక్కడ కొంతకాలం ఉన్న నానక్ ఒక నవాబు దగ్గర పని చేయడానికి చేరి చాల భక్తివిశ్వాసాలతో పని చేశాడు. కొంత కాలానికి తానున్న గృహస్టజీవితంమీదా, నవాబువద్ద నౌకరీమీదా వైరాగ్యం కలిగి అతడు ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ బైటకు వెళ్లిపోవా లని నిశ్చయించుకున్నాడు.
ఇంకొక సంఘటన జరిగింది. ఒకనాడు నవాబు అతనికోసం కబురు పంపాడు. అతడు వెళ్లాడు గాని ఆలస్యంగా వెళ్లాడు. ఆలస్యంగా వచ్చినందుకు నవాబుకు కోపం వచ్చింది. అది చూచి నానక్ - “అయ్యా నవాబూ! ఇప్పుడు నేను నీ భృత్యుడను కాను; ఈశ్వరుని భృత్యుణ్జి” అన్నాడు. అప్పుడతడు “నువ్వు ఒక్క దేవుణ్ణే నమ్ముతావా చాలామంది దేవుళ్లను నమ్ముతావా?” అని ప్రశ్నించాడు. “నేను అద్భశ్యుడు, స్ప్వుప్రతిష్టుడు, అచింత్యుడు, సర్వవ్యాపి, పూజ్యుడు అయిన ఒకే దేవుణ్ణి నమ్ముతాను” అని నానక్ సమాధానం చెప్పాడు.
242 సిక్టమతం “అయితే నువ్వ ఒకే దేవుణ్ణి నమ్ముతున్నావు; నేను ఒకే దేవుణ్ణి నమ్ముతాను; అందుచేత నీ దేవుడూ నా దేవుడూ ఒకదే అయి ఉందాలి; నీకు ఈ నమ్మకమే దృఢ మైతే నాతో మసీదుకు వచ్చి మాతో కలిసి ప్రార్ధన చెయ్యి” అని నవాబు అన్నాడు. “నేను సిద్ధమే” అన్నాడు నానక్. ఇదంతా చూసిన ఆతని మామగారు అతడు ఇస్లాంలోనికి చేరిపోయా డనుకొని ఆశ్చర్యంతో ఏమీ అనలేక ఆ నవాబును విడిచి వెళ్లిపోయాడు. ఆ రోజున శుక్రవారం ప్రారనాసమయం కాగానే నవాబు నానక్‌తో కలిసి మసీదుకు వెళ్లాడు. కాజీ ప్రార్ధనలు చదువుతూందడగా నవాబూ, మిగిలినవాళ్లూ వంగి నమస్కారం చేయడం మొదలైన పను లన్నీ చేస్తున్నారు. నానక్ మాత్రం అలా నిలబడే ఉన్నాడు. ప్రార్ధనలు పూర్తి అయ్యాయి. నవాబు నానక్కేసి తిరిగి - “నువ్వు ప్రార్ధాసమయంలో చేయవలసిన పను లన్నీ ఎందుకు చేయలేదు; నువ్వు అబద్దాలకోరువి. నువ్వు చేసిన దంతా అభినయం. నువ్వు ఇక్కడ స్తంభంలా నిలబడడానికి రాలేదు” అని కోపంతో అన్నాడు. నానక్ వెంటనే ఇలా సమాధానం చెప్పాడు - “అయ్యా! నువ్వు నేలమీదకి చూస్తూ తల వంచుకొని ఉన్నావు నీ ఆలోచనలు మాత్రం ఆకాశంలో సంచరిస్తున్నాయి. ఆ సమయంలో నువ్వు కాందహార్నుంచి గుజ్టాలను తెప్పించడాన్ని గూర్చి ఆలోచిస్తున్నావు గాని ప్రార్ధన చేయడం లేదు. మీ కాజీ కూడ అప్రయత్నంగా క్రిందికి వంగడం వంటి పనులు చేస్తూ నిన్ననే ఈనిన ఒంటె క్షేమాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. ఈ విధంగా అలవాటు ప్రకారం ఏవేవో చేష్టలు చేస్తూ చిలక లల్లా ప్రార్ధనావాక్యాలు చదివేవాళ్లతో కలిసి నే నెలా ప్రార్ధనలు చేయగలను?”. నవాబు తాను గుజ్టాలను గూర్చే ఆలోచిస్తున్నట్లు ఒప్పుకొన్నాడు గాని కాజీ మాత్రం ఎంతో కోపంతో నానక్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. మర్చాన అను సంగీతజ్ఞునితోను బాలా అను ఒక మిత్రునితోను కలిసి నానక్ గీతాల గానం చేస్తూ సత్యాన్వేషణ కోసం యాత్రకు బయల్దేరాడు. ఒక గ్రామంలో పవిత్రజీవనం గడుపుతూన్న ఒక బీదవాడైన లాలూ అను వడ్రంగి "ఇచ్చిన ఆతిథ్యం అంగీకరించి ఆతడు పెట్టిన భోజనం భుజించి ఆతని మంచం మీద శయనించాడు. మరునాడు అక్కడే నివసించే ఒక ధనికుడు (బ్రాహ్మణులకు సంతర్చణ ఏర్పాటుచేసి నానక్‌ను కూడా ఆహ్వానించాడు. నానక్ వెళ్లాడు గాని ఆ
సిక్టమతం 243 ఆహారం తీసికొనలేదు. ఎందుకు తినడంలేదు అని ఆ ధనికు డడగగా నానక్ - “నువ్వు ఈ భోజనాలు నీ గొప్ప చాటుకొనడం కోసం పెడుతున్నావు. అందుచేత ఇది అపవిత్రమైన తామసికాహారం” అని సమాధానం చెప్పాడు. “నువ్వు నా ఆహారం అపవిత్రం అంటున్నావు? క్రింది వర్జంవా దైన ఆ లాలూ పెట్టిన అన్నం పవిత్రమా?” అని రాయ్భాన్ నిందాపూర్వకంగా ప్రశ్నించాడు. అపుడు నానక్
- “నువ్వు అతిథులను అనాదరంగా చూస్తావు. దీనివల్ల నీ తామసికప్రవృత్తి స్పష్టంగా తెలిసిపోతున్నది. లాలూ ఎంతో (ప్రేమతో వండి ఆదరపూర్వకంగా, వ్ ప్రతిఫలమూ అపేక్షించకుండా తీసికొనివచ్చాడు. నువ్వు లాలూనుంచి పాఠం నేర్చుకోవాలి. నీ ఆహారం రక్తంతో నిండి ఉంది” అని సమాధానం చెప్పాడు. అందుకు (ప్రమాణం ఏమిటి అని అడగగా నానక్ ఆతని అన్నమూ లాలూ అన్నమూ రెండు చేతులలో తీసికొని గట్టిగా పిండగా ధనికుని అన్నంనుంచి రక్తబిందువులు కారాయి, లాలూ అన్నంనుంచి పాల చుక్కలు పడ్డాయి.
నానక్ బోధించే పద్ధతి ఈ విధంగా ఉండేది. ఆతడు హిందువా ముస్లిమా అని జనంలో వివాదం ఉండేది. నానక్ ఈ రెండు ఖేదాలకీ అతీతుడుగా జీవించాడు. అతడు డెబ్బె సంవత్సరాలు ఈ విధమైన పవిత్రజీవనం గడిపి మరణించి నప్పుడు ఆతని దేవాన్ని హిందూసంప్రదాయం (ప్రకారం దహనం చెయ్యాలా లేక ముస్లిం సంప్రదాయం ప్రకారం నేలలో పాతిపెట్టాలా అని ఆతని శిష్యుల మధ్య వివాదం ఏర్పడింది. ఇంతలో ఒకడు ఆ శరీరంమీద కప్పిన వస్త్రం తీసి వేయగా అక్కడ ఆ శరీరం కనబడలేదు.
-
గురు అంగద్ (1539-1552) ; ఇతడు చేసిన చెప్పుకొనదగిన పని ఏదీ లేదు. అతడు తన గురువు కీర్తనలు చాలావరకు ్రోగుచేశాడు - దీనితో సిక్టుల పవిత్రగ్రంథ మైన అదిగ్రంథసాహిబ్ సంకలనం ప్రారంభం అయింది.
-
గురు అమర్దాస్ (1552-1574) ; ఇతడు ముస్లిమ్ చక్రవర్తియైన అక్బర్‌ను కలసి మతాలకి సంబంధించిన విషయాలు చర్చించి హిందూ-ఇస్లాం మతాల మధ్య సామరస్యం సంపాదించడంకోసం గురునానక్ చేసిన ప్రయత్నం ఇంకా ఏ విధంగా ఫలప్రదంగా ఉందో తెలిపాడు.
244 సిక్టమతం
- గురు రామ్‌దాస్ (1574-1581) : ఈతని కాలంలో అక్బర్ అమృతసర్‌లో ఇచ్చిన చిన్న స్థలంలో ప్రసిద్ధ మైన పెద్ద చెరువు తవ్వించారు.
- గురు అర్జున్ మాల్ (1581-1696) : ఈతడు గోల్డెన్ టెంపుల్ అని ప్రసిద్ధ మైన ఆలయం కట్టించాడు. గురు నానక్ - “హరినామం మోక్షప్రదం” అని బోధించేవాడు. అందుచేత ఈ ఆలయానికి ప్రారంభంలో “హరిమందిరో అను పేరు పెట్టబడింది. తరవాత దీనికి దర్బార్ సాహెబ్ అను పేరు పెట్టారు. ఇది నిర్మించిన తరువాత సిక్టు లందరూ ఒక నిశ్చితస్వరూపం గల సంఘంగా ఏర్పడి ఈ ఆలయం చుట్టూ చేరారు. ఈ సంఘానికి అర్జున్ మాల్ మతగురువుగా అయ్యాడు; ఒక సిక్టరాష్ట్రం ఏర్పడడానికి ఇది నాంది అయింది. పూర్వం ఉన్న గురువు లందరి కీర్తనలూ ఒక చోట సేకరించి “ఆదిగ్రంథసాహిబోొ కు ఒక తుదిరూపం ఇచ్చి దానిని ప్రచారంలోనికి తీసికానిరావడం ఇతడు సాధించిన మహాకార్యాలలో ఒకటి.
ఇతని కాలంలో ముస్లింలతో సిక్టులకు వైరం ప్రారంభం అయింది. అక్బర్ తరవాత రాజ్యానికి వచ్చిన జహంగీర్ అంత ఉదారస్వభావుడు కాడు; ఆతనికి వాని కుమారుడు ఎదురుతిరిగాడు. గురు అర్జున్ మాల్ ఎదురుతిరిగిన తన కుమారునికి అనుకూలుడు అను శంక సరియైన కారణం ఏదీ లేకుండానే జహంగీర్ మనస్సులో పుట్టింది. జహంగీర్ మంత్రికి అర్హున్మాల్ తన కుమార్తెను ఇవ్వడానికి నిరాకరించినందుకు ఆ మంత్రికి ఇతనిపై ద్వేషం ప్రారంభం అయింది. అతడు జహంగీరు మనస్సులో అంకురించిన శంకకు దోహదం చేసి అర్హున్మాల్ను కారాగారంలో బంధించే టట్లు చేశాడు. ఆ కారాగారవాసకష్టాలలో అర్జున్ మాల్ మరణించాడు.
ఒక జాతికి అధిపతిగా ఉన్న గురువు విషయంలో చేసిన ఈ కిరాతకచర్య అంతవరకూ ప్రశాంతమైన ఒక మతసంస్థగా ఉన్న సమాజం యోధానీకంగా మారిపోవడానికి దారి తీసింది. జహంగీర్ తరువాత షాజహాన్, ఇతని తరువాత బెరంగజేబ్ రాజ్యాధికారానికి వచ్చారు. ఈ మతదురభిమాని రాజ్యానికి రావడంతో పరిస్థితులు పూర్తిగా చెడిపోయాయి.
సిక్మమతం 24ర్
-
గురు హరగోవింద్ (1606-1645) : ఇతడు తన సహచరుల నందరినీ ఆత్మరక్షణకు సంనద్దులుగా ఉండదే టట్లు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. వీళ్లని హిందూ - ముస్లింల మధ్య సామరస్యం సంపాదించడం కోసం ప్రయత్నించే సంఘంగా కాకుందా ఒక వేరైన స్వతంత్రసమాజంగా తీర్చిదిద్దాడు. ఒక సిక్టుల రాష్ట్రం ఆవిర్భవించడానికి బీజావాపం జరిగింది. యుద్దాలు ప్రారంభం అవడంతో సిక్టుసమాజంలో దృఢ మైన సంఘటితత్వం ఏర్పడింది.
-
గురు హరరాయ్ (1645-1661) : ఇతడు ప్రశాంతంగా ఉందేవాడు కాని ఈతని కాలంలో సిక్టుసమాజంలో వీరప్రవృత్తి బాగా పెరిగింది.
-
గురు హరకిషన్ : (1661-164) : ఆరేళ్ల వయస్సులో ఈ స్థానానికి వచ్చిన ఇతడు తొమ్మిదవ ఏట మరణించాడు.
-
గురు తేఘ్ బహదూర్ (1664-1675) : బెరంగజేబ్ ఇతనిని అతిక్రూరంగా చంపించివేశాడు. ఇతని కుమారుడు గోవిందసింగ్ గురు వయ్యాడు.
-
గురు గోవింద్‌సింగ్ : (1675-1708) ; తండ్రి మరణించేనాటికి బాలుడుగా ఉన్న ఇతడు ఎక్కడికో పారిపోయి శత్రువులపై పగ దీర్చుకోవడానికి ఇరవై సంవత్సరాలపాటు నిరంతరం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మత గురువుగానే కాక సేనాసంఘటకుడుగా కూడ తనకు ఎన్ని చిక్కులు వచ్చినా లెక్కచేయక సాధించవలసిన ఒక కర్తవ్యం ఉన్న దని దృఢంగా నిశ్చయించుకొన్నాడు. ముందుగా సిక్టులకు ఇతరమతాలతో వేటితోటీ సంబంధం లేకుండా చెయ్యా లని సంకల్పించాడు. ఒకనాడు విశ్వాసపాత్రు లైన ఐదుగురు శిష్యులతో కలిసి ఒక '“పహులొ అను నిరాడంబర మైన యుద్ధదీక్షావిధానం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆతని భార్య ఐదు రకాల మధురపదార్థాలు తీసికొని ఆ మార్గాన వెళ్లడం జరిగింది. అత డా మధురపదార్థాలు ఐదింటినుండి కొంచెం కొంచెం తీసికొని వాటిని నీళ్లలో వేశాడు. దానిని రెండంచుల కత్తితో కలిపి ఆ నీళ్లు ఆ ఐదుగురి తలలమీదా చల్లిన తరువాత వాళ్లు కొంచెం కొంచెం ఆ నీళ్లు త్రాగారు. వాళ్లు ఆ నీళ్లు ఆతనిమీద చల్లి మిగిలినవి త్రాగడానికి ఇచ్చారు. అప్పు దతదు వాళ్లను “ఖాల్సా” (పవిత్రులు) అని ఘోషించి వాళ్ల పేర్ల చివర 'సింగొ అను పదం
246 సిక్టమతం చేర్చుకోవలసిందిగా ఆజ్ఞాపించాడు. ప్రతీ ఒక్కరూ ఛేదించని పొడవైన జుట్టు కేశం) దువ్వెన (కంఘా రెండు అంచు లున్న కత్తి (కిర్పాణం) ఇనుప చేతి కడియం (కర) మోకాలువరకు పొట్టి చొక్కా (కచ్చం) ఈ ఐదు వస్తువులూ వాళ్ల శరీరాలమీద తప్పక ధరించా లని ఆదేశించాడు వీటికి పంచకకారా లని పేరు. ఈ విధంగా ఒక ప్రత్యేకత ఏర్పరచి ఇతరమతస్టులనుండి వేరు చేయబడిన మొదటి సంఘం ఈ ఆరుగురి సంఘం.
సిక్టు లందరూ దీనిని అంగీకరించి తమ సేనానాయకునిగా గురుగోవింద సింగ్ చుట్టూ చేరారు. తన తరువాత ఇంక గురు వుండడు, తాను పూర్తిచేసిన పవిత్రగ్రంథం ఆదిగ్రంథసాహిబే గురువు అని కూడ గురు గోవిందసింగ్ ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అసాధారణ మైన శౌర్యమూ ధైర్యమూ గల ఒక జాతిని నిర్మించాడు. ఈ మహాయోధులు అత్యల్పసంఖ్యలో ఉండడంచేత కొన్ని యుద్ధాలలో ఓడిపోయినా కొన్నింటిలో ఘనవిజయాలు సాధించి శత్రుభయంకర మైన జాతిగా పేరు తెచ్చుకొన్నారు. గురు గోవిందసింగ్ సిక్రమత[గ్రంథాలలో చివరిదైన “దస్విన్ పాద్‌షాహీ” (పదవ రాజుయొక్క పుస్తకం) తన శిష్యుల కిచ్చి దానిని అది గ్రంథ సాహిబ్‌కు చివరిభాగంగా చేర్చాడు. ఈ [గ్రంథమే గురుస్థానంలో పూజింప బడుతుంది. ప్రతీ గురుద్వారా (సిక్కుల దేవాలయం) లోను ఎత్తైన ప్రదేశంలో దీని ప్రతి ఉంచబడుతుంది.
ఒక చిన్న విషయంమీద ఒక పఠాన్‌తో వివాదం వచ్చి గోవిందసింగ్ వానిని చంపివేశాడు. మరణించినవాని పిల్లలు తన దగ్గరకి వచ్చి నప్పుడు అతడు వాళ్ల విషయంలో చాల (ప్రేమ చూపి తన దగ్గరనే ఉంచుకొన్నాడు. తన తండ్రిని ఎవరో చంపినప్పుడు తనకు కలిగిన బాధను గుర్తుంచుకొని తన మూలాన తండ్రిని కోల్పోయిన వాళ్ల విషయంలో తండ్రివంటి (్రేమభావంతో ఉన్నాడు. చివరికి ఒకనాడు, తాను దేహం త్యజించవలసిన సమయం ఆసన్న మైన దని (గ్రహించి, వాళ్లలో ఒకనిని పిలిచి - “తన బంధువును చంపినవాని విషయంలో పగ తీర్చుకొనడం ప్రతీ ఒక్కడూ చేయవలసిన ప్రథమకర్తవ్యం. అందుచేత నువ్వు నీ తండ్రిని చంపిన నా విషయంలో అలా చెయ్యాలి” అని బోధించి తనను
సిక్మమతం 247 చంపడానికి ప్రోత్సహించాడు. అతడు అలా చేయగా తన వాళ్లెవరూ వాని నేమీ చేయకుండా నివారించి, “మతగ్రంథం మీద, ఖాల్సామీద దృఢవిశ్వాసంతో ఉండండి” అని వాళ్లకు అంతిమసందేశం ఇచ్చి కళ్లు మూశాడు.
గురు గోవిందసింగ్ మరణించిన తరువాత మరొక గురువు లేడు. ఆదిగ్రంథ సాహిబే గురువు. రణజిత్సింగ్ (1797-1889) నాయకత్వంలో సిక్టులు ప్రబలమైన ఒక జాతిగా ఏర్పడి, యుద్ధంలో జయం సంపాదించి సిక్థసా'మ్రాజ్యం స్ధాపించారు. 1839 తరవాత విశ్వాాఘాతుకత్వం, స్వామిద్రోహం మొదలైనవి ప్రధానకారణాలు కాగా (బిటిష్సైన్యాలు 1849 లో ఈ సామ్రాజ్యాన్ని ఆక్రమించాయి.
సిక్టముతంలో ఏకేశ్వరవాదం చాల ప్రధాన మైనది. ఇది ఇస్లాంమతంలో ఉన్న ఏకేశ్వరవాదంచేత గట్టిపడి ఉండవచ్చు కాని ఇది నానక్యొక్క వైయక్తిక మైన అనుభవంమీదనే ఆధారపడి ఉంది. "నేను ఒక దివ్యసందేశంగా దీనిని బోధిస్తున్నాను” అని నానకే అన్నాడు. నిజానికి ఆతడు పాడిన గీతాలు ఇతర గురువులు పాడిన గీతాలూ కూడ వీళ్ల ఆంతరప్రబోధనుండది వచ్చినవే. ఈశ్వరుడు సృష్టి - స్థితి - సంహారకర్త అను విశ్వాసమూ, కర్మసిద్ధాంత - పునర్జన్మసిద్ధాంతాల మీద నమ్మకము, గుర్వనుగ్రహంచేత, గురు సహాయంచేత మోక్షం లభిస్తుం దనీ, హృదయంలో ఎల్లప్పుడూ భగవంతుని నామం స్మరించడం అభ్యుదయానికి హేతు వనీ, ధ్యాన - నైతికజీవనాలవల్ల మోక్షం లభిస్తుం దనే విశ్వాసమూ - ఇవి ఈ మతంలోని ముఖ్యసిద్ధాంతాలు.
సిక్టమతంలో కొన్ని విశిష్టలక్షణాలు
హిందూ-ఇస్తాంమతాల మధ్య సామరస్యం సంపాదించడంకోసం సిక్థమతం ఆవిర్భవించిం దని చెప్పినా ఇది ఒక విధంగా వాటి రెండింటినీ ఎదిరించి బయలుదేరిన మతంగా కనబడుతుంది. అందుచేతనే దీనిలో కొన్ని అసాధార ణాంశాలు ఉన్నాయి
- సిక్ట్రమతం సర్వవిధాలా ఏకేశ్వరవాదాన్ని మాత్రమే అంగీకరించిన మతం.
24రి సిక్ట్మమతం
-
సర్వోత్తము డైన ఆ ఈశ్వరుదే సృష్టి - స్థితి - లయ కర్త. ఈ మతంలో కూడ (బ్రహ్మ - విష్ణు - శివుల ప్రసక్తి ఉన్నా ఈ ముగ్గురు మూర్తులూ కూడ ఆ పరమేశ్వరుని సృష్టియే అని చెప్పబడింది.
-
సృష్టి శూన్యంనుండి జరగలేదు. పరమేశ్వరునికంటె వేరుగా ఉన్న మరొక పదార్ధంతో కూడ జరగలేదు. పరమేశ్వరుదే జగద్రూపంలో తనను తాను అవిష్కరించాడు. ఈ అవిష్కారంతో ఈశ్వరస్వరూపం పూర్తిగా వ్యయం కాలేదు. ఈ ప్రపంచకాన్ని మించి కూడ పరమేశ్వరు డున్నాడు.
-
పరమేశ్వరుడు సర్వవ్యాపి సర్వాతీతుడూ కూడ. ప్రపంచం అంతటా వ్యాపించి ఉంటాడు గాన సర్వవ్యాప్కి జగత్తును సృజించినవాడు గాన జగత్తుకు ముందుకూడ ఉన్నవా డవడంచేత జగదతీతుడు. ఇతడు ఊహింపరాని స్వరూపం గలవాడు; ఆ విధంగా కూడ జగదతీతుదు.
-
ఈ సృష్టి సత్య మైనది. పరమేశ్వరుడు సత్య మైనవాడు గాన ఆతని ఆవిర్భావమే అయిన జగత్తు కూడ సత్యమే. ఈ ప్రపంచం మానవు డెల్లప్పుడు విడిచి పారిపోవడానికి ప్రయత్నించవలసిన ప్రదేశం కాదు. మానవుడు ఇక్కడనే ఉంటూ నియమబద్ధ మైన ఉత్తమజీవనం గడపవలసిన ప్రదేశం. సంన్యాసం యుక్త మైనది కాదు. ప్రపంచంలో మనకు ఉత్తమకార్యాలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అందుచేత ప్రాపంచికజీవనం నింద్య మైనది కాదు; దీనిని మానవుడు తన జీవితంలో అభివృద్ధి సాధించడానికి పూర్తిగా ఉపయోగించుకోవాలి.
-
మానవుడు అత్యుత్తమప్రాణి. ఆత్మరూపంలో మానవునిలో దివ్యాంశ ఉంది. అయితే అనేక దుష్టభావాలతో నిండి మానవు డిక్కడ చెడిపోయిన స్థితిలో ఉన్నాడు. అహంకారంతో తన పరమార్ధస్వరూపాొన్ని మరచి ఉన్నాడు.
'- దుష్టభావాలనూ అహంకారాన్నీ తొలగించుకొని ఆత్మను పరిశుద్ధం చేసికోవాలి. అలా పరిశుద్ధం చేసికొనకుండా మానవుడు తన సత్యమైన స్వరూపాన్ని పొందజాలడు.
- హిందూమతం వలెనే సికృమతం కూడ కర్మసిద్దాంత - పునర్దన్మసిద్దాం తాలు విశ్వసిస్తుంది. అహంకార మమకారాలతో సకామకర్మలు చేసేవాళ్లు జన్మ-
సిక్థమతం 249 మరణచక్రంలో తిరుగుతూంటారు. మంచి సనులు చేస్తూ శ్రద్ధాభక్తులతో ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్లు దీనినుండి విముక్తు లవుతార్చు. మోక్షం పొందుతారు.
-
మోక్షంలో జన్మ - మరణచక్రంనుండి విముక్తి ఈశ్వరునితో ఐక్యమూ అనే రెండంశా లుంటాయి.
-
సత్కార్యాలు ఆచరించడము, నామజపము, సామూహికంగా చేసే భజనలు, కీర్తనలు, ఇవి కూడ మోక్షసాధనాలు.
-
అయితే ఈశ్వరుని అనుగ్రహమూ, సాహాయ్యమూ లేకుండా మోక్షం లభించదు.
-
మనస్సునూ, హృదయాన్నీ పరిశుద్ధంగా ఉంచుకొనడానికి ప్రాధాన్యం ఇస్తూ సిక్టమతం బాహ్యాడంబరా లన్నింటినీ నిరాకరిస్తుంది. తీర్థయాత్రలు, పవిత్ర స్నానాలు, మూర్తిపూజూ మొదలైనవి కేవలం హృదయంతో సంబంధం లేని బాహ్యాడంబరాలు. సహృదయంతో సంబంధం ఉన్న నామసంక్తీర్తనాదులు మాత్రమే లాభకర మైనవి. హృదయపూర్వకంగా చేయని అవి కూడ వ్యర్థ మైనవే.
-
సిక్టమతం వర్షభేదాన్ని తీవ్రంగా నిరసిస్తుంది.
ఈశ్వరుడు
సికృమతం అంగీకరించిన ఈశ్వరుని స్వరూపం ఆది[గ్రంథంలోని మొట్ట మొదటి మంత్రంలోనే చెప్పబడి ఉంది. దీనికి సిక్టమతానికి మూలనుంత్రం అని పేరు.
“| ఓంకార్ సత్నామ్ కరతా పురుఖ్ నిరభవ్ నిరవైర్ అకాల్ మూరట్ అజూని సైభంగ్ గురు ప్రసాద్”
ఈ మంత్రానికి భావం ఇది : “ఈ తత్త్వం ఒక్కటే, ఇది అనంత మైనది. ఇది అన్ని వస్తువులలోను ఉన్నది; అన్నిటికీ ఆధార మైనది. అన్నింటిని సృష్టించినది. తన సృష్టి నంతనీ వ్యాపించినది. భయం కాని శత్రుత్వం కాని లేనిది. కాలాతీత మైనది. జన్మమరణాతీత మైనది. తన ఆవిర్భావానికి తానే హేతువు. గురుప్రసాదం చేత తెలియదగినది.”
250 సిక్టమతం
ఈ మూలమంత్రం ప్రారంభంలోనే ఉన్న ఒకటి అంకె ఈశ్వరుడు ఒక్కడే అని నొక్కి చెప్పుచున్నది. కొన్నిచోట్ల నానక్ బ్రహ్మ - విష్ణు - శివులను గూర్చి చెప్పినా వాళ్లు ఆ ఈశ్వరుని సృష్టియే అని ఆతని అభిప్రాయం. ఈశ్వరుదే సృష్టి
- స్థితి - లయకారకుడు అని చెప్పి నప్పుడు బ్రహ్మ-విష్ణు-శివులు ఆ ఈశ్వరుని (క్రిందివారే అని అర్థం. “ఈశ్వరుడు ఒకడే; అతడే (బ్రహ్మ, విష్ణువు, శివుడూ కూడ. అన్నీ అతదే చేస్తాడు” (ఆది[గ్రంథం. 1. 908 )
సిక్టమతం ఈశ్చరు డొక్కదే అని అంగీకరించినా ఇది ఏకేశ్వరవాదమే కాని అద్వైతవాదం కాదు. అయితే గురునానక్, గురు అర్హునసింగ్ మొదలైన కొందరు గురువులు ఈశ్వరుడు నిర్గుణుడు సగుణుడూ కూడ అని వర్ణించారు. “నిర్గున అపి సరగున ఇి ఓహొ” అని గురు అర్జునసింగ్ అన్నాదు. ఈశ్వరుణ్ణి జగత్సుష్ట్వాది కర్తగా చూడనప్పుడు అతడు నిర్గుణు డనీ, సృష్ట్యాదులకు కర్తగా అతడు సగుణు డనీ గ్రహించాలి. సృష్టి సంబంధం లేని ఈశ్వరుడు అపరిచ్చిన్నుడు. సాధారణగుణా లేవీ లేనివాడు. అందుచేత మానవుల మనస్సుకు కూడ అందనివాడు. అతడే స్వేచ్భానుసారం తనను తానే జగద్రూపంలో ఆవిష్కరించుకొంటాడు. “ఆ అపరిచ్చిన్న స్థితినుంచి శుద్ధస్వరూపుడైన ఆ ఈశ్వరుడే (జగద్రూపంలో) వ్యక్తు డయ్యాడు. నిర్ణుణుడే సగుణు డయ్యాడు” (ఆదిగ్రంథం ౫. 940). ఈశ్వరుడు తానే జగద్రూపంలో వ్యక్తు డైనా ఆతని స్వరూపం పూర్తిగా జగద్రూపంలో మాత్రమే లేదు; జగత్తుకు అతీతంగా కూడ ఉన్నది. ఈశ్వరుడు జగత్తును అంతా వ్యాపించి ఉన్నా దానికి అతీతంగా ఉన్నాడు. సృష్టికి పూర్వం కూడ ఈశ్వరు డున్నాడు; అతడు తాను చేసిన సృష్టికంటె వేరైనవాడు. మానవుల మనస్సుచేత ఊహింప శక్యం కాని వాడు. ఈశ్వరుణ్ణి వర్ణించాలంటే “అగమ్” (కొలవ శక్యం కానివాడు), “అగోచరొ' (పరీక్షింప శక్యం కానివాడు) అనంత్ (అంతం లేనివాడు). “అపార్” (సరిహద్దులు లేనివాడు), “అలఖ్' (చూడ శక్యం కానివాడు) “అకథ్ (మూటలతో వర్ణింప శక్యం కానివాడు) మొదలైన నిషేధార్థకపదాలతో మాత్రమే వర్ణించ కలుగుతాం. ఈశ్వరుడు కాలాతీతుడు; శాశ్వతుడు. ఆదిగ్రంథం చెప్పినట్లుగా - “ఈశ్వరుడు మానవులకు అందడు; అనంతుడు; ఎల్లలు లేనివాడు, సర్వశక్తుడు;
సిక్టమతం 251 సర్వోత్తముడు; కాలం ప్రారంభం అవడానికి ముందు ఉన్నవాడు; అన్ని కాలాలలోను ఉన్నాడు; అన్ని కాలాలోను ఉంటాడు; అత డొక్కడే సత్య మైనవాడు. మిగిలిన దంతా అసత్యం, దానిని గూర్చి ఏవగింపుతో నిరాకరింపుము” (ఆదిగ్రంథం 1. 437) ఈశ్వరుడు సర్వగతుడు కూడ. ప్రపంచకాన్ని దాని లోపల ఉండి నడిపిస్తున్నాడు. అంతటా ఉన్నాడు; ఆతని కాంతిలోనే అంతా ప్రకాశిస్తున్నది. “నువ్వు అన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ నీళ్లల్లో వ్యాపించి ఉన్నావు; భూమి నంతనీ వ్యాపించి ఉన్నావు; భూమ్యాకాశాల మధ్య వ్యాపించి ఉన్నావు” (ఆదిగ్రంథం ). 596% ఈశ్వరుడు విశ్వవ్యాపి, విశ్వాతీతుడు అను విషయాన్ని ఆదిగ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది - “ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించి దాని మధ్య ఉన్నాడు; దానికంటె దూరంగా వేరుగా కూడ ఉన్నాడు” (ఆది[గ్రంథం 1,4) “అతడు అన్నింటి మధ్యా ఉన్నాడు; అయినా భిన్నుడుగా ఉన్నాడు” (ఆదిగ్రంథధం ౧. 939). ఇవన్నీ ఉపనిషత్తులలోని భావాలే. అన్ని ఆస్తికమతాల వలెనే సిక్థమతం కూడ ఈశ్చరుడు సర్వశక్తుడు, సర్వజ్ఞుడు, సర్వగతుడు ఇత్యాదివిధాలుగా చెపుతుంది. అయితే ఇస్లాంవలెనే ఈశ్వరుని సర్వశక్తత్వాన్ని దృఢంగా ప్రతిపాదిస్తుంది. ఈశ్వరుని ఆజ్ఞ అద్దులేనిది. అంతే కాకుండా సిక్టమతం ఈశ్వరుణ్ణి తండడ్రిగాను, తల్లిగాను, మిత్రునిగాను, సోదరుని గాను, తేజఃప్రదాతగాను, రక్షకునిగాను, శరణ లేనివాళ్లకు శరణగాను, బీదవారికి సహాయకుడుగాను వర్ణిస్తుంది. ఈశ్వరుడు దయామయుడు, ఉదారహృదయుడు, (ప్రేమమూర్తి సర్వసద్దుణసాగరుడు. అయితే సిక్టమఘతం అవతారవాదాన్ని అంగీకరించదు. జగత్తు జగత్తు ఈశ్వరునిచేత సృష్టింపబడింది. ఈశ్వరుడు దీనిని శూన్యంనుండి గాని, తనకంటె వేరుగా ఉన్న మరొక పదార్ధంనుంచి గాని సృజించలేదు. మొత్తం ప్రపంచకం ఈశ్వరుని (ముకం) ఆజ్ఞవల్ల పుట్టింది. ఈ ప్రపంచకం అంతా ఈశ్వరుని అభివ్యక్తి. ఇది ఈశ్వరుని తేజస్సు అని కూడ చెప్పబడింది. అందువల్ల
252 సిక్థమతం ఈశ్వరుడే జగత్తుకు ఉపాదానకారణమూ, నిమిత్తకారణమూ కూడ అని సిక్టమతం అభిప్రాయం అన్నట్లు కనబడుతుంది. అయితే ఈశ్వరుడు ఉపాదానకారణం అనడం యుక్తం కాదు; కేవలం ఆతని ఆజ్ఞవల్లనే జగత్తు ఆవిర్భవించింది అని చెప్పాలి అని కొందరి అభిప్రాయం.
జగదావిర్భావాన్ని గూర్చి ఇలా చెప్ప బడింది. “అనంతయుగాల పాటు అంతటా దట్ట మైన అంధకారం ఉండేది. అప్పుడు ఆకాశం గాని, భూమి గాని లేవు. కేవలం అనంత మైన ఈశ్వరుని హుకం (ఆజ్ఞ - ఇచ్చ) మాత్రమే ఉంది. (ఈ సిద్దాంతానికి బుగ్వేదంలోని నాసదీయసూక్తంలో (బు.వే. 10. 129)లో చెప్పినదానితో పోలిక ఉంది). ఈశ్వరునికి ఇచ్చ కలిగింది. అప్పు డతడు ప్రపంచకాన్ని సృష్టించాడు. (బ్రహ్మ - విష్ణు - శివులతో సహా సమస్తమూ సృష్టించాడు.” (ఆది[గ్రంథం 1.1035). జగత్తు ఒకానొకప్పుడు సృష్టించబడింది; ఎప్పుడు సృష్టించబడిందో ఎవరికీ తెలియదు. ఈ విధంగా సిక్టమతం జగత్తుకు ఆది అనేది లేదు అను హిందూమతసిద్దాంతాన్ని అంగీకరించదు. అయితే హిందూమతం వలె ఈ మతం కూడ జగత్తు యొక్కసృష్టిలయ'ప్రక్రియ మాటిమాటికీ ఆవృత్తం అవుతూంటుం దని అంగీకరిస్తుంది. సృష్టిలయప్రక్రియ మాయావి చేసే ప్రదర్శన వంటి దని గురు అర్జునసింగ్ అన్నాడు - “మాయావి ప్రదర్శన చేసే టప్పుడు అనేకవేషాలు వేస్తాడు. వాడి వేషా లన్నీ తీసివేస్తే వా దొక్కడే మిగులుతాడు. ఒక ఆకాశం అన్ని పాత్రలను నింపి (అన్నిపాత్రలలోను నిండి) ఉంటుంది. ఆ పాత్ర లన్నీ బద్ద లైపోయి నప్పుడు ఆ ఆకాశం తన ఏకత్వాన్ని మళ్లీ పొందుతుంది.”
సృష్టి నీరంతరమూ జరుగుతూనే ఉంటుంది. ఈశ్వరుడు ఈ (ప్రపంచకా న్నంతనీ ఒక్కసారి సృష్టించి దూరంగా కూర్చొనలేదు. ఈ 'ప్రపంచకంలో ఉంటూ ఈశ్వరుడు నిరంతరమూ పని చేస్తూనే ఉంటాడు; సృష్టిప్రక్రియ నిరంతరమూ కొనసాగుతూనే ఉంటుంది. అందుచేత మార్పూ, క్రొత్తతనమూ కూడ పూర్తిగా సత్య మైనవి. ఈశ్వరుడు ఈ విధంగా నిరంతరమూ పని చేస్తూ ఉండడాన్ని బట్టి ఆతనికి ఈ ప్రపంచకంమీద ఆసక్తి ఎంతో ఊహించుకొనవచ్చును. అందుచేత
సిక్టమతం 253 ఇది ద్వేషింపదగినది గాని, ఎదురుతిరగవలసినది గాని కాదు. ఇది ఈశ్వరుని తోట వంటిది; ఇది మానవునికి చక్కగా పని చేయడానికి తగిన అవకాశం ఇస్తుంది. సిక్థమతం ప్రకారం ఈ జగత్తు పూర్తిగా సత్య మైనది. “అతడు (ఈశ్వరుడు) సత్యుడు. ఆతని సృష్టి సత్యం” (ఆదిగ్రంథం. 1. 294. అయితే కొన్ని చోట్ల సిక్ట గురువులు “జగత్తు మాయ” అని వర్ణించారు. దీనిని పట్టి సిక్టమతం (ప్రకారం జగత్తు అసత్యం అన్నట్లు కనబడుతుంది. కాని అది కాదు భావం. మాయాశటబ్దానికి ఇక్కడ నిరంతరపరివర్తనం అని అర్థం. ఇది ప్రపంచం అసత్యం అని చెప్పదు; ఇది నిరంతరము మార్పు చెందుతూంటుంది అని మాత్రమే దీని అర్ధం. “జగత్తు మాయ లేదా మిథ్య” అనే అద్వైతుల మాటకు కూడ జాగర్తగా పరిశీలిస్తే ఇదే అర్ధం. సిక్టమతం ప్రకారం సృష్టికి ఏదో ప్రయోజనం ఉంది. ఈ జగత్తు గుడ్డిగా నడిచిపోవడం లేదు. దీని కేదో ప్రయోజనం ఉంది. కాని ఆ ప్రయోజనం మానవునికి తెలపబడడం లేదు. అతడు తన అహంకారాన్ని (హౌమై) పూర్తిగా నశింపచేసికొన్నప్పుదే ఆతనికి తెలుపబడుతుంది. జగత్తుకు ప్రయోజనం ఉందనగా ఈశ్వరునికి దీనిని సృష్టించడంలో ఏదో ప్రయోజనం ఉందని అర్ధం కాదు. ఈశ్వరుడు సర్వథా పరిపూర్ణుడు; ఆతనికి దేని అవసరమూ లేదు. మానవుడు మానవుడు ప్రపంచకంలో అత్యుత్తమ మైన ప్రాణి. ప్రాణమూ, చైతన్యమూ వివిధప్రమాణాలలో ప్రాణు లన్నింటిలోనూ ఉన్నాయి. అయితే పూర్తిగా అభివృద్ధి చెందిన రూపంలో మానవునిలో ఉన్నాయి. “మానవుడు బుద్ధి-వివేకాల ప్రకాశ ఇచ్చి అనుగ్రహింపబడ్డాడు” (ఆదిగ్రంథం. 1. 913), మానవుడు ఈశ్వరునికి చాల (ప్రేమపాత్ర మైన జంతువు. “నీకు మానవశరీరం ఇవ్వబడింది. ఈశ్వరుణ్ణి కలవడానికి నీకిది ఒక అవకాశం” (ఆదిగ్రంథం. ? 12). మానవుడు పైకి శరీరం మాత్రంగానే కనబడినా లోపల ఒక సారవంత మైన పదార్థం ఉంది. అది “మని (మనస్సు లేదా ఆత్మ). ఇది దివ్యవైతన్యసము[ద్రంలో ఒక బుడగ
254 సిక్టమతం వంటిది. వేరు వేరుగా కనబడే ఆత్మ లన్నీ ఒకే సముద్రానికి చెందిన వేరు వేరు బుడగలు. వేరు వేరు పరిస్థితులను పట్టి ఆ ఆత్మలు వేరు వేరు పద్ధతులలో వృద్ధి పొందుతూంటాయి. అయితే మూలంలో అవన్నీ ఒక్కటే. అయితే - ఈ ప్రపంచకంలో మానవుడు అజ్ఞానము, గర్వము, అహంకారమూ అనే తెరలచేత, తన దివ్యమూలం నుంచి దూరమై, చెడిపోయిన స్థితిలో ఉన్నాడు. (అజ్ఞానము, గర్వము, అహంకారము అను ఈ మూడూ హౌమై అను పదంచే నిర్దేశించబడతాయి). పరిశుద్ధ మైన ఆత్మ కామము, (క్రోధము, లోభము, మోహము, అహంకారము అను ఐదు చెడు భావాల సంబంధంచేత మలిన మైపోయినది. వీటి సంబంధంచేత కర్మలు చేసి వాటిచేత బద్దు డవుతున్నాడు; జన్మ - మరణ- పునర్దన్మల గొలుసులచేత బంధింపబడు తున్నాడు. ఈ దుష్టభావాలకి దాసుడైన మానవునకు సిక్ట్రమతంలో “మన్నుఖి (తనను గూర్చి మాత్రమే ఆలోచించువాడు) అని పేరు. మన్ముఖనికి వ్యతిరేకం “గురుముఖుడూు' (గురువునందు ఆసక్తి కలవాడు). గురువు నాశ్రయించి మానవుడు ఈ బంధంనుండి విముక్తుడు కాగలడు. మానవుడు స్వప్రయత్నంచేత ఈ దుః స్థితిని అతిక్రమించ గలడు. ఇందుకు అత్మను అంటిపెట్టుకొని ఉన్న హౌమైని క్షాళన చేసికొనడం అవసరం. “మన్ జితై జగ్ జితై” (జగత్తును జయించడానిక్తి మనస్సును జయించు) అని నానక్ బోధించాడు (ఆదిగ్రంథం. 1౧.6.) మనముఖుడు కాక గురుముఖుడు అయినవాడే ఈ దుజ్ధితినుండి తనను ఉద్ధరించుకొనగలడు. .. దౌష్ట్రము - దుఃఖము లోకంలో ఉన్న దుఃఖాని కంతకీ అజ్ఞానమే కారణం. ఈ విషయంలో సిక్థమతం హిందూమతాన్నే అనుసరిస్తుంది. దుఃఖం అనేది జగత్తులో లేదు; ఇదంతా జగత్తును తప్పుగా చూడడంలో ఉంది. ఈ జగత్తు పరుగెత్తుతూ మారిపోతూ ఉంటుంది. ఇది నిత్యం అనుకొని మనం దీనిని పట్టుకొని (వ్రేలాడు తూంటాం. ప్రపంచంమీద ఈ రాగం అజ్ఞానంవల్ల ఏర్పడింది; అదే దుఃఖానికి కారణం. రాగంతో చేసిన కర్మలు, పునర్జన్మ ఇవే దుఃఖలక్షణాలు. మానవుని దుఃఖాని కంతకీ అహంకారమే (హౌమై) కారణం. దీనిని విడిచివేసిన క్షణంలో
సిక్టమతం 255 దుఃఖం అంత మొందుతుంది. అంతా కూడ ఈశ్వరుని సృష్టివిషయంలో మానవుని దృక్పథం మీద ఆధారపడి ఉంది. ఈ సృష్టి అంతా ఈశ్వరుని ఆవిష్కారం; అభివ్యక్తి. దీనివి ఈ విధంగా చూచేవానికి ఏ దుఃఖమూ ఉండదు. అలా కాక దీనిని మరో విధంగా (గ్రహించి దీనిని హొమైలో లగ్నం అవడానికి సాధనంగా ఏర్పరచుకున్నవాడు దుఖాలకు లోను కావలసిందే. అందుచేత ఈ ప్రపంచకం వారి వారి దృక్పథాన్ని పట్టి చక్కని ఉద్యానవనంగా గాని, కష్టాల నిలయంగా గాని అవుతుంది.
అయితే దుఃఖం ఈశ్వరుడు ప్రసాదించిన ఒక వరం అను దృష్టి కూడ ఈ మతంలో కనబడుతుంది. ఇది మానవుడు తనను తాను సరిదిద్దుకొనడానికి ఈశ్వరు డిచ్చినది. ఈశ్వరుడు దయామయుడు అని ఒక ప్రక్క అంటూ అతడే ఈ దుఖాన్ని మానవున కిస్తున్నాడు అనే ఈ సిద్దాంతం క్రైస్త్రవమతంలో వలెనే అలాంటి ఈశ్వరుడు ఇలా ఎందుకు చేస్తాడు అని ప్రశ్నను లేవదీస్తూనే ఉంటుంది. ఈ సిద్దాంతం ఏదో విధంగా కష్టాలను సహించదానికి ఉపకరించవచ్చు నేమో కాని ఆ ప్రశ్నకు సరి యైన, సంతృప్తికర మైన సమాధానం కాజాలదు. మొదటి సిద్ధాంతమే సంతృప్తికరంగా ఉంటుంది.
మరణానంతరజీవితం
హిందూమతం వలెనే ఈ మతం కూడ కర్శసిద్దాంతాన్ని పూర్తిగా విశ్వసిస్తుంది. మన లేదా ఆత్మ మరణరహిత మైనది. ఒక దేహం నశించిన తరువాత కర్మానుసారంగా ఇది మరొక దేహంలో ప్రవేశిస్తుంది. అయితే ఏ కర్మ చేస్తే ఏ జన్మ వస్తుందో సిక్టమతంలో స్పష్టంగా చెప్పలేదు. దుష్టకర్మలు చేస్తేనే పునర్జన్మ వస్తుంది. పుణ్యకర్మలు మాత్రమే చేసినవాడు జననమరణచక్రంనుండి తప్పించుకొని ఈశ్వరునితో ఐక్యం పొందుతాడు.
హిందూమతంలో పురాణాలలో చెప్పినట్లుగా లేదా సిమెటిక్ మతాలు అంగీకరించినట్లుగా, మరణానంతరం ఈశ్వరుడు మానవుల కర్మల ననుసరించి జన్మలను నిర్ధరిస్తాడు లేదా మోక్షం ఇస్తాడు అని ఈ మతం అంగీకరించి నట్లు కనబడుతుంది. “ఈశ్వరుని సమక్షంలో ధర్మరాజు మానవుని పుణ్యపాపాల లెక్కలను
256 సిక్టమతం పరిశీలిస్తాడు. వాటిని అనుసరించి మానవుడు ఈశ్వరునికి దగ్గరగా గాని దూరంగా గాని ఉండిపోతాడు (ఆదిగ్రంథం. . 146). దూరంగా ఉండడం అనగా పునర్జన్మ ఎత్తడం, దగ్గరగా ఉండడం అనగా మోక్షం. కొన్ని చోట్ల యముని నగర మైన నరకంయొక్క నిర్దేశం కూడ ఉంది. నరకం అనగా పాపాత్ములు పునర్జన్మ ఎత్తి ఆ జన్మలో అనుభవించే దుర్భర మైన కష్టాలే నరకమా లేక అదొక లోకమా అను విషయం స్పష్టంగా చెప్పకపోయినా, యమలోకాన్ని గూర్చి అనేక పర్యాయాలు నిర్దేశించడాన్ని బట్టి ఈ మతంలో కూడ పాపాత్ములు పునర్జన్మ ఎజ్తే ముందు కొంతకాలం ఆ నరకం అనే స్థానంలో పడి ఉంటారు అను విశ్వాసం ఉన్నట్లు _ చెప్పవలసి ఉంటుంది. అయితే ఈశ్వరునియందు పరిపూర్ణ మైన భక్తి ఉన్నవాళ్లు మాత్రం మోక్షం పొందుతారు అనేది సిక్వమతవిశ్వాసం. ప్రధానజీవనలక్ష్యం
సంసారచక్రంనుండి విముక్తి పొంది ఈశ్వరునితో ఐక్యం పొందడమే పరమ లక్ష్యం. అయితే ఈశ్వరునితో ఐక్యం అనగా ఈశ్వరునితో సమానంగా ఉండడమా, ఈశ్వరునిలో పూర్తిగా కలిసిపోవడమా అను సందేహం ఉంటుంది. కాని నానక్ అక్కడక్కడ చెప్పిన మాటలను బట్టి ఈశ్వరునిలో పూర్తిగా విలీనం అయిపోవడమే ఈ ఐక్యం, మోక్షం అని తెలుస్తూన్నది - “ఈశ్వరుడు అను[గ్రహిస్తే మానవుడు ఈశ్చరుణ్ణి ధ్యానిస్తాడు; ఆత్మ ఈశ్వరునిలో కలిసిపోతుంది. జీవాత్మ పరమాత్మగా అయిపోవడంతో వాటి మధ్యలో ఉన్న ఖేదం పూర్తిగా నశిస్తుంది.” (ఆదిగ్రంథం ₹. 661)
సిక్టమతం (ప్రకారం మోక్షం లభించా లంటే మానవుడు నామస్మరణం మొదలైన పుణ్యకార్యాలు ఆచరించాలి. ఎన్ని పుణ్యకార్యాదు లాచరించినా ఈశ్వరానుగ్రహం ఉన్నవానికే గాని ఇతరులకు మోక్షం లభించదు. ఈశ్వరాను (గ్రహం పొందా లంటే గురువును ఆశ్రయించి ఆతడు చూపిన మార్గాన నడవాలి. అయితే ఈ గురువు ఎవరు అను ప్రశ్న ఉదయిస్తుంది. కామక్రోధాదిదుష్టభావా లన్నీ పూర్తిగా జయించి, అహంకారాదులను విడచి, జగత్స్వరూపస్వభావాలను చక్కగా తెలిసికొని, ఈశ్వరుని స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్నీ కూడ బాగుగా అర్ధం
సిక్మముతం 257 చేసికొన్నవాడే సద్గురువు. ఆ గురువు మాత్రమే సన్మార్గం చూపి ఈశ్వరానుగ్రహం కలిగే టట్లు చేస్తాడు.
అయితే ఈ మతంలో మొట్టమొదటి గురువైన నానక్‌కు గురువు ఎవరు; అట్లే గోవిందసింగ్ తరువాత సిక్ట్లకు గురు వెవరు అను రెండు ప్రశ్నలు కూడ ఉదయిస్తాయి. గోవిందసింగ్ తరువాత ఆదిగ్రంథమే సిక్టులకు గురువు అనేది రెండవ ప్రశ్నకు సమాధానం. మొదటి ప్రశ్నకు సమాధానం ఏమనగా నానక్‌కు ఈశ్వరుడే గురువు. వాస్తవంలో నానక్కే కాకుండా అర్జునసింగ్, గోవిందసింగ్ మొదలైన కొందరు ఇతరగురువులు కూడా ఈశ్వరుడే తమ నిజమైన గురువు అని సూచించారు. గోవిందసింగ్ ఈ విషయంలో ఒక చోట స్పష్టంగా చెప్పాడు
- “నిజమైన గురువు నిరంజన్ (ఈశ్వరుడు). గురువు మానవాకారంలో ఉన్నా డని అనుకొనకుమూ (ఆదిగ్రంథం 1. 895), ఈ విధంగా సిక్థమతంలో ఒకప్పుడు “గురూ శబ్దం మానవు దైన గురువు అను అర్థంలోను ఒకప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడే అను అర్ధంలోను ఉపయోగించబడింది.
సిక్టుల సొధనామార్గం
అహంకారం మానవునిలోని ప్రధాన మైన దోషం. దీనివల్ల కామక్రోధాదులు కలుగుతాయి. అహంకారాన్ని తొలగించుకొనడం ద్వారా ఈ కామక్రోధాదులను జయించి మనసు లేదా ఆత్మను నిర్మలంగా ఉంచుకొంటూ ఈశ్వరైకపరాయణత్వం అలవరచుకొనడమే ప్రధాన మైన కర్తవ్యం. ఇదే ముఖ్యమైన సాధన. ఈశ్వరుడు జగత్తులోని అన్ని వస్తువులలోను వ్యాపించి ఉన్నాడు అను పూర్ణవిశ్వాసంతో ఈ సాధనను చేసినవాడు క్రమంగా మనస్సును పరిశుద్ధం చేసికొనకలుగుతాడు.
సర్వదా ఈశ్వరుని నామం స్మరించడం కూడ మరొక ప్రధాన మైన సాధన. అయితే మనఃపూర్వకంగా కాక కేవలం యాంత్రికంగా చేసే నామస్మరజాదికం వ్యర్ధం. సామూహిక మైన భజనలూ కీర్తనలూ కూడ మోక్షానికి మార్గాలు. బాహ్యాచారా లన్నీ నిరర్ధక మైనవి. “మలిన మైన మనస్సును రాళ్లను పూజించడం చేత గాని, తీర్థయాత్రలు చేయడంచేత గాని, అరణ్యాలలో నివాసంచేత గాని సంన్యాసుల చుట్టూ తిరగడంచేత గాని పరిశుద్ధం చేయడానికి ఎలా శక్యం
258 సిక్టముతం అవుతుంది?” (ఆదిగ్రంథం 1. 886). తీరయాత్రలవల్ల ఏమీ ప్రయోజనం లేదు. నిజ మైన తీర్ధం నీలోనే ఉంది. మతం అనేది ఆంతర మైనది. ఇది (శద్దాపూర్వక మైన భక్తిలోనే రూపం దిద్దుకొంటుంది. బాహ్యాచారా లన్నీ ఆడంబరాలు, నామ సంకీర్తనాదుల వలె మానవసేవ, సత్చురుషసాంగత్యమూ కూడ మోక్షానికి సాధనాలుగా సిక్టమతం బోధిస్తుంది. వినయం, (ప్రేమ అనేవి నైతికసాధనకు చాల అవసర మైనవి. సంతృప్తి, సత్యనిషస్ట్ర సత్ర్రవృత్తి దయ, జాలి, పవిత్రత్వం మొద లైనవి కూడ ప్రయత్నపూర్వకంగా అలవరచుకొనవలసిన సద్దుణాలు. సిక్టమతం వర్జభేదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వర్ణ - జాతి భేదం లేకుండా అందరినీ సమంగా (పేమించడం అనేది పరమధర్శ్మం అని బోధిస్తుంది.
బాహ్యాచారాలను నిందించినా కూడ సిక్టముతంలో కాలక్రమాన కొన్ని పూజావిధానాలు, కర్మకాండ చోటు చేసికొన్నాయి. ఇది ప్రతీ మతంలోను కొట్టవచ్చి నట్లు కనబడే విషయమే. బాలులకు గాని బాలికలకు గాని ఈ మతంలోనికి (ప్రవేశం కల్పించడానికి కొన్ని కర్శకలాపాలు ఉన్నాయి. ప్రతిదినమూ అనుసరించ వలసిన కొన్ని నియమాలను చాలవరకు గోవిందసింగ్ విధించి ఉన్నాడు. ఉదయమే తొందరగా నిద్రనుండి లేవాలి. చన్నీళ్లలో స్నానం చెయ్యాలి. ఉదయమూ సాయంకాలమూ కూడ కొన్ని ప్రార్ధనలు చదవాలి. ఈశ్వరుణ్ణి ధ్యానించాలి. తీర్థయాత్రలు ఈ మతంలో నిషేధింపబడినా గురుగోవిందసింగ్ జన్మస్టానాన్ని సందర్భించడం తమ ్రధానకర్తవ్యంగా సిక్టులు భావిస్తారు. ప్రతి సంవత్సరమూ అతని జన్మదివసాన ఆతని పూజలు చేస్తారు.
శాఖలు
సిక్థమతం కొన్ని శతాబ్దాల క్రితమే ఆవిర్భవించిన క్రొత్త మతం అవడంచేత దానిలో ప్రగాఢ మైన మౌలికవిభేదా లున్న శాఖలు లేవు. అయినా కొన్ని అంశాలలో భేదాభిప్రాయా లున్న నామధారీలు, అకాలీలు, నిరంకారీలు, నానక్ పంథీలు మొదలైన కొన్ని అవాంతరశాఖలు లేకపోలేదు. సిక్థులలో నామధార్లు పవి(త్రతకు, ప్రారంభికాచారాలకు ప్రాధాన్యం ఇస్తారు. పవిత్రత్వానికి ప్రాధాన్యం ఇవ్వడంచేత వీళ్లు ధూమపానం, మద్యపానం మొదలైనవాటికి పూర్తిగా దూరంగా
సెక్టముతం 259 ఉంటారు. (ప్రాతకాలస్నానాదులు తప్పక ఆచరిస్తారు. గోవిందసింగ్ మాంసాహారాన్ని అంగీకరించినా వీళ్లు మాంసాహారం తీసికొనరు. అకాలీలు యోధప్రవృత్తి కలవాళ్లు. సిద్ధాంతాలలో ఏమీ భేదం లేదు. ఒక విధంగా చెప్పవలసి వస్తే వీళ్లు తమ మతం కోసం పోరాడదానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే మతాభిమానులు. ఆధునికభారతదేశంలో అకాలీలు సిక్టులలో ఒక బలీయమైన రాజకీయపక్షంగా పరిగణింపబడుతున్నారు. గురు బచన్‌సింగ్ అనే ఒకడు బయల్దేరి తాను ఈశ్వరుని వార్తను (ఉపదేశాన్చి) జనానికి అందించడానికి వచ్చిన ఈశ్వరదూత నని ఘోషించుకొన్నాడు. ఆతనికి నిరంకారి బాబా అని కూడ పేరు. ఈతని చుట్టూ చేరిన ఒక సంఘానికి నిరంకారీలు అని పేరు. పదవ గురు వైన గోవిందసింగ్ తానే చివరి గురు వనీ, తన తరువాత మనుష్యరూపంలో గురువు లెవ్వరూ ఉండ రనీ, ఇంక ఆదిగ్రంథమే గురు వనీ ప్రకటించాడు. సిక్టులు ఈ ఆదేశాన్ని శిరసా పాలిస్తున్నారు. అయితే గురు బచన్‌సింగ్ దీనికి ఎదురు తిరిగి తాను గురు వని పప్రకటించుకొన్నాడు. చాలామంది సిక్టులు ఈతని చుట్టూ చేరిన నిరంకారి సిక్టులను తీవ్రంగా ద్వేషిస్తారు. నానక్పంథీ సిక్టులు ఐదు కకారాలను ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వరు. తాము ఖాల్చాలో సభ్యుల మని కూడ అంగీకరించరు. మొదటి గురు వైన నానక్ చేసిన ఉపదేశాలను అనుసరించడమే ప్రధానకర్తవ్య మనీ, ఇతరవిషయా లేవీ ప్రధాన మైనవి కావనీ వీళ్ల అభిప్రాయం. అందుచేత చాలమంది సిక్థులు నానక్పంధీలను సిక్టులుగా పరిగణించరు. మెల్ల మెల్లగా ఈ నానక్పంధీలు హిందువులలో కలిసిపోతున్నారు.
జరోష్ట మతం
జరోష్ట్రమతం ప్రపంచకంలోని అతిప్రాచీన మైన మతాలలో ఒకటి. బహుశా ఇది 2500 లేదా 3000 సంవత్సరాలకు పూర్వం (ప్రారంభ మైనది. ఈనాడు ఈ మతాన్ని అనుసరించేవాళ్ల సంఖ్య అత్యల్ప మైనది. అసలు ఈ మతం సజీవమత మేనా, దీనిని అనుసరించేవాళ్లు ఎక్క దైనా ఉన్నారా అనేది కూడ కొంతవరకు సంశయా స్పదం. అయినా కూడ ఒక నైతికమార్గప్రధాన మైన మతంగాను యూదమతం, క్రైస్తవమతం, ఇస్లాంమతం మొదలైన మతాలమీద ఎంతో ప్రభావం ప్రసరింప చేసిన మతంగాను దీని కున్న అత్యధికప్రాధాన్యాన్ని పట్టి దీని స్వరూపం కూడ తెలియడం ఎంతైనా అవసరం.ఇది పర్షియాదేశంలో ఉండేది. అన్ని దేశాలలోను అక్కడక్కడ నివసిస్తూన్న అత్యల్పసంఖ్యాకులైన పారసీకులు (పార్సీలు) దీనిని ఇంకా కొంతవరకు అనుసరిస్తున్నారు. జొరోస్టర్ అను నామాతరంతో ప్రసిద్ద దైన జరస్టుస్తుడు అనే మహాపురుషుడు ఈ మతం స్థాపించాడు. జెన్టావెస్తా లేదా అవెస్తా దీని ప్రమాణగ్రంథం. జొరోస్టరు జన్మించిన సంవత్సరాదులను గూర్చి అభిప్రాయభేదం ఉన్నా ఇతడు భారతదేశంలో ఉన్న కొందరు వైదికబుషులకు సమకాలికు డని మాత్రం నిర్వివాద మైన విషయం. జెన్టావెస్తాలోని అనేక ఘట్టాలలో వేదాల (ప్రభావం స్పష్టంగా కనబడుతుంది.
జొరోస్టర్ ఆవిర్భవించడానికి పూర్వం,పర్షియాలో యజ్ఞయాగాదుల ఆచరణం, ఇతర కర్మకాండ, పారోహిత్యం,ఐబహుదేవతారాధన మొద లైన ఆచారాలు అంతటా ప్రచారంలో ఉండేవి.ఆ కాలంలో అనిశ్చితరూపంలో ఉన్న మతానికి సంబంధించిన పరిస్థితులను గూర్చి అవెస్తాలోని మొదటి గాథలోనే స్పష్టంగా వర్ణింపబడింది. (అవెస్తాలో, ముఖ్యంగా యస్నా అను పేరు గల మొదటిభాగంలో ఉన్న అధ్యాయాలకు గాథలు అని పేరు.వీటిని (యంత్రాల రూపంలో) జొరోస్టరే రచించా దని అంటారు). అక్కడ ఈ విధంగా చెప్పబడింది-అనాటి విక్షుబ్ధ మైన పరిస్థితులలో ఏమి చేయాలో తెలియని మానవు లందరూ సర్వశక్తు దైన భగవంతుని దగ్గరికి వెళ్ళి-*భూలోకంలో అంతటా దుష్టత్వం ప్రబలిపోయి ఉంది; నువ్వు ఎవరి నైనా రక్షకుణ్ణి పంపించి దీనిని రక్షించాలొఅని ఆయనను ప్రార్థిస్తారు. అప్పడు
జరోష్ట మతం 261 భగవంతుడు- “ఈపని చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?ోఅని తన ప్రక్కనే ఉన్న దేవతలను ్రళ్నిస్తాదు.ఆ దేవతలు తమ అసమర్థతను ప్రకటిస్తారు. అప్పుడు భగవంతుడే ఈ పని చేయవలసిందిగా, మానవులను ఉద్దరించవలసి నదిగా ఆజ్ఞాపించి జొరోస్టర్ను భూలోకానికి పంపుతాడు. ఈ కథ పౌరాణికమే అయినా జొరోస్టరు పుట్టేనాటికి పెర్షియాలో పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉండేవో స్పష్టం అవుతుంది.
జొరోస్టర్ కొంతకాలం భార్యతోను (ముగ్గురు భార్యలతోను) పిల్లలతోను గృహస్థజీవనం గడిపాడు.ముప్పై సంవత్సరాల వయస్సులో ఉండగా ఆతనికి భగవంతునినుండి తత్త్వాన్ని ఆవిష్కరించే ఒక ఉపదేశం లభించింది.ఒక నదీ తీరంలో ఆతనికి వోహు మన అను దేవత దర్శనం అయింది.ఆ దేవత ప్రమాణం మనిషి ప్రమాణానికి తొమ్మిది రెట్లుంది.“అహుర మజ్ద” అను ఒకే ఒక దేవు డున్నాడు;నువ్వు (జొరోస్టర్) ఆ దేవుని ప్రవక్తగా వ్యవహరించాలొఅని ఆ దేవత జొరోస్టర్కు చెప్పింది. తరువాత పది సంవత్సరాల కాలంలో అహురమజ్ద పంపిన దేవతలు అనేకపర్యాయాలు జొరోస్టర్కు కనబడి ఆతనికి ఎన్నో తత్త్వాలు బోధించారు.వెంటనే జొరోస్టర్ తనకు తెలిసిన ఆ తత్త్వాలను అందరికీ బోధించడం ప్రారంభించాడు. ప్రారంభంలో అంతగా ప్రయోజనం కనబడలేదు. అతడు చెడ్డ వైన ఆసురభావాలు ప్రచారం చేస్తున్నా దని ప్రజలు ఆతనిని నిందించారు. అయితే కొంత కాలానికి అతడు తన దగ్గరి బంధువైన మైథ్యోమహుణ్జి తన మతం వైపు త్రిప్పకలిగాడు. ఆతనితో కలిసి జొరోస్టర్ ప్రయాణించి బాక్టైరియా చక్రవర్తి యైన వైష్టస్సుని అన్థానానికి వెళ్లి ఆతనిని కలుసుకొన్నాడు.ఎంత ప్రయత్నం చేసినా ఆ చక్రవర్తి ఆ మతం స్వీకరించలేదు. అయితే ఆ చక్రవర్తికి అత్యంతప్రియ మైన ఒక గుట్టానికి వచ్చిన వ్యాధిని జొరోస్టర్ తగ్గించడంతో ఆ చక్రవర్తి మాత్రమే కాక ఆతని రాజ్యంలోని ప్రజ లందరూ ఆ మతం స్వీకరించారు.దానితో జరోష్ట్రమతానికి మంచి రోజులు ప్రారంభం అయ్యాయి. తరువాతి సంవత్సరాలలో జరోష్టమతం ఆ చక్రవర్తి సాహాయ్యంతోను,కొన్ని పవిత్రయుద్దాల ద్వారానూ కూడ అంతటా వ్యాపించింది. డెబ్బెఏడు సంవత్సరాల వయస్సులో ఉండగా జొరోష్టర్ను ఒక శత్రుసైనికుడు చంపివేశాడు.
262 జరోష్ట మతం
జొరోస్టర్ ఆ కాలంలో ప్రచారంలో ఉన్న బహుదేవతారాధనను తీవ్రంగా వ్యతిరేకించి అహురమజ్ద ఒక్కడే దేవు డని ఏకేశ్చ్వరవాదాన్ని బోధించాడు. “ఏకం సద్విప్రా బహుధా వదన్తి” అన్న వైదికబోధను బాగా జీర్ణించుకొన్నవాడు జారోస్టర్. అతడు అహురమజ్ద యొక్క ఆరాధనను నైతికమార్గంతో ముడివెట్టి బోధించాడు. భగవంతుడు అత్యధిక మైన శ్రేయస్సుకు ప్రతీక అనీ,పరిశుద్ధమైన నైతికజీవన విధానాన్ని అనుసరించడం ద్వారా మానవు లందరూ ఆ భగవంతుని శ్రేయోమయ స్వభావానికి బలం చేకూర్చా లనీ అతడు బోధించాడు.ప్రతి ఒక్కడూ మంచి ఆలోచనలు,మంచి మాటలు,మంచి పనులూ అలవరచుకోవా లనేది ఆతని బోధలలోని సారాంశం.దీనిని బట్టి నైతిక మైన అత్యున్నతాదర్భాలతో కూడిన సమాజాన్ని నిర్మించడమే ఆతని ప్రధానలక్ష్యం అనే విషయం స్పష్టం అవుతుంది.
జరోష్టమతంలోని కొన్ని ప్రధానాంశాలు
-
_ జరోష్టమతంలో ప్రధాన మైనది ద్వైతభావసంమి(శ మైన ఏకేశ్వరవాదం.
-
_ అహుర మజ్ద ఒక్కడే ప్రధాను డైన ఈశ్వరుడు (దేవుడు), సర్వశక్తుడు, సర్వజ్ఞుడు,కరుణామయుడు. జగత్తును సృజించి పాలించేవాడు ఆ దేవుడే.
-
ఈశ్వరుడు అతిసూక్ష్మస్పరూపుడు, అందుచేత సామాన్యమానవుల జ్ఞానానికి అందడు. అయితే అతడు కొందరు ప్రధానదేవతలద్వారా అప్పు డప్పుడు మానవుల అనుభవాలకు గోచరిస్తూంటాడు.
-
ఈ ప్రపంచకం రెండు మహాశక్తుల యుద్ధరంగం. స్పెంట మైన్యు అనేది సాధుశక్తి అంగ్ర మైన్యు అనేది దుష్టశక్తి. దీనికే అహిర్మన్ అని కూడ పేరు. సాధుశక్తి ఈ దుష్టశక్తిని ఓడించేవరకూ ఈ యుద్ధం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది.
-
మానవునికి స్వయంగా మంచి చెడ్డలను గూర్చి తెలిసికొనే శక్తీ స్వాతంత్ర్యమూ ఇవ్వబడ్డాయి. అందుచేత అతడు సాధుశక్తికి తోద్బడానికి ప్రయత్నించడం (శ్రేయస్మరం. ఇందునిమిత్తం అతడు చేయవలసిన దల్లా నైతిక మైన నాధుజీవనవిధానం అనుసరించడం మాత్రమే. ఏ మార్గాన్ని అనుసరించాలి అనేది పూర్తిగా మానవుని చేతిలో ఉంది.
జరోష్ట మతం 283 6. మరణించిన తరువాత కూడ మానవునికి మరొక జీవితం ఉంటుంది. ఈ లోకంలో పుణ్యకర్మలు అధికంగా చేసినవాడు స్వర్గలోకానికి వెడతాదు. పుణ్యకర్మలకంటె పాపకర్మలు అధికంగా చేసినవాడు నరకానికి వెడతాడు.
-
అయితే నరకంలో శాశ్వతంగా ఉండకుండా ప్రతీ ఒక్కడూ చివరికి ఆనందభరిత మైన మంచి జీవితం పొందుతాడు అనేది ఈ మతంలోని విశేషం.
-
_ ఎందరో దేవతలు ఈశ్వరుని చుట్టు ఆతని ఆజ్ఞ్జకోసం నిరీక్షిస్తూ ఉంటారు.
-
_ అదే విధంగా అహిరమన్ చుట్టూ ఉండే కొన్ని దుష్టశక్తులు ప్రపంచ కంలో దౌష్ట్యాన్ని వ్యాపింపచేస్తూ ఉంటాయి.
-
ఇది చిన్న చిన్న కర్మకలాపాలకు కూడ ఏ మాత్రమూ అవకాశం లేని, పరిపూర్ణ నైతికవిధానాన్ని బోధించే మతం.మంచి ఆలోచన,మంచి మాట, మంచి చేష్ట అనేవి ఈ మతం బోధించే మౌలికనైతికసిద్ధాంతాలు.
11 అహురమజ్దను గూర్చిన కౌన్ని ప్రార్థనలూ,పూజావిధానాలూ కూడ ఈ మతంలో చెప్పబడినా,ఇది (ప్రధానంగా నైతికజీవన ప్రాశస్త్యాన్ని బోధించే మతం.
- అగ్ని చాల పవిత్ర మైనది.ఇది దివ్య మైన పవిత్రత్వానికి ప్రతీక అని విశ్వసించబడుతుంది.
ఈశ్వరుడు
అహురమజ్ద ఒక్కడే ఈశ్వరుడు (దేవుడు) మానవులు ఆతనిని ఒక్కనినే ఆరాధించాలి; ప్రార్ధించాలి. అహుర అనగా ఈశ్వరుడు (సర్వశక్తుడు) అనీ్కీమజ్ద అనగా సర్వమూ తెలిసినవాడు (సర్వజ్ఞు డైన ఈశ్వరుడు) (ప్రభువు) అని అర్థం. అహురమజ్ద సకలశ్రేయస్కరుడు, పవిత్రతముడు,బహుబలుడు,సర్వశక్తుడు; అజేయుడ్రుదయామయుడు. స్పర్శకు కాని,దృష్టికి గాని గోచరించడు. జగత్తును సృజించి పాలించువాడు. అతిసూక్ష్మస్వరూపు డవడంచేత మానవుల ఇంద్రియాలకు గోచరం కానివాడు. అయితే ఈశ్వరుడు ఆరు పద్ధతులలో మానవులకు సాక్షాత్క
264 జరోష్ట మతం రిస్తూంటాడు.వీటికి అమేషాస్పెంటా లని పేరు.వీటికి పవిత్రులైన అమర్వులు అని అర్ధం.ఈ ఆరు (ప్రకారాలు ఈశ్వరుని ఆరు విభిన్నపక్షాలు లేదా అంశలు అని చెప్పవచ్చు.వీటి ద్వారా అహురమజ్ద మానవులకు సాక్షాత్మరిస్తూంటాడు. ఈ ఆరు అంశాలకు లేదా ఆరు ప్రధానదేవతలకు అపష్క వోహుమనో, క్షధ్ర, అర్మైతి, హౌర్వాటఫ్,అమెరేతత్ అని పేర్లు ఈశ్వరుడు రెండవ అంశం రూపంలో జొరోస్టర్కు సాక్షాత్కరించాడు.
అహురమజ్ద ఒక్కడే సర్వోత్తము డైన దేవుడు అని జొరోస్టర్ ఏకేశ్వర వాదాన్ని మాత్రమే బోధించా దని చెప్పినా జొరోస్టమతానికి సంబంధించిన ఈశ్వరత్వం (306060) లో ద్వైవిధ్యం ఉంది అని చాలామంది అభిప్రాయం. అందుచేత వారి అభిప్రాయం ప్రకారం ఈ మతం ఏకేశ్వరవాదం కాదు, ఉభయేశ్వరవాదం. ఈ మతంలో (శ్రేయోదాత యైన దేవు డొకడు,దుష్టప్రవృత్తి గల తామసస్వభావు డైన దేవు డొకడూ,ఈ విధంగా ఇద్దరు దేవుళ్లను అంగీకరించి నట్లు కనబడుతుంది. మొదటి దేవుడు స్పెంటామైన్య; అతదే అహుర మజ్ద,అని కొందరి అభిప్రాయం. రెండవ దేవుడు అంగ్రామైన్య వీనికే శైతాన్ లేదా సతాన్ అని కూడ పేర్లు. దీనిని పట్టి జరోష్టమతం ఉభయేశ్వరవాదిమతం అని కొంద రంటారు. అహ్రిమన్ అను ఒక దుష్ట (క్రూర) దేవతను అంగీకరించినా కూడ ఇది ఏకేశ్వరవాదిమతమే అని కొందరు భావిస్తున్నారు; జొరోస్టర్ చేసిన ఉపదేశం పూరం ఈ సాథుశ్తక్తీ దుష్టశ్రక్తీ రెండూ కూడ అహురమజదనుంచే ఆవిర్భవించాయి; అందుచేత అహురమజ్ద ఒక్కడే ఈశ్వరుడు, ఈ విధంగా ఏకేశ్వరవాదానికి ఏమీ భంగం లేదు అని వీరి వాదం.అమురమజ్ద స్వభావతః సాధుస్వభావుదే అయినా, ఒక నైతిక మైన ప్రయోజనాన్ని ఉద్దేశించి రెండు శక్తుల స్వరూపాలతో ఆవిర్భవించాడు. ఈ రెండు శక్తుల ద్వారా ఈశ్వరుడు ప్రపంచకంలో మంచి- చెడుగుల మధ్య ఒక యుద్ధరంగాన్ని సృష్టించి వాటిలో ఏదో ఒక పక్షాన్ని స్వీకరించడానికి తగిన స్వాతంత్ర్యం మానవున కిచ్చాడు. ఈ విధంగా చేయడంలో అహురమజ్ద ప్రధానోద్దేశ్యం ప్రపంచకంలో పరిపూర్ణ మైన మంచియొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడమే. మంచి-చెదుగుల మధ్య జరిగే ఈ యుద్ధంలో
జరోష్ట మతం 265 చివరికి మంచికే విజయం లభిస్తుం దని జొరోస్టర్ బోధించాడు.ఈ విధంగా క్షేమకర మైన శక్తీ/క్రూర మైన శక్తీ అను రెండు శక్తులను అంగీకరించినా ఈ మతంలో ఉన్న ఏకేశ్వరవాదాని కేమీ భంగం లేదు.దీనిని బట్టి కొందరు- స్పెంటమైన్య, అంగ్రమైన్య అనేవాళ్లు ఇద్దరు స్వత్రంత్ర్య- దేవత లనీ,వాళ్లిద్దరి మధ్యా నిరంతరంగా యుద్ధం జరుగుతూంటుం దనీ,జరోట్ట మతంలో చెప్పిన ఆశావాదం ప్రకారం చివరికి స్పెంట మైన్యయే జయిస్తా దనీ,ఈ జయం వాస్తవానికి అహురమజ్దయొక్క జయమే అనీ,అంటారు. ఇక్కడ ఒక్కవిషయం గుర్తించవలసి ఉంది. జొరోస్టర్ మాత్రమే రచించిన దని చెప్పబడే అవెస్తా పూర్వభాగంలో నిశ్చితంగా ఏకేశ్చ్వరవాదమే కనబడుతుంది.ఆ భాగంలో ఎదురు తిరిగిన దుష్టశక్తిని గూర్చి చాల అస్పష్ట మైన నిర్దేశం మాత్రమే ఉంది. ఐతే అవెస్తా తరువాతి భాగంలో మళ్లీ కొన్ని బహుదేవతావాదసూచనలు కనిపిస్తాయి. ఆ దుష్టశక్తి కూడ స్వతంటత్ర మైన దేవుడుగా చెప్పబడింది. పూర్వ భాగంలో చెప్పబడిన ఆరు పవిత్ర అమర్హ్యులు కూడ క్రమక్రమంగా వేరు వేరు దేవతలుగా వర్ణింపబడ్డారు.ఇంతే కాక అతర్ అను అగ్నిదేవత,మిధ్ర అను ఎవరూ జయింహూని సూర్యదేవత మొదలైన దేవతలను కూడ చేర్చడం జరిగింది. వెండిదద్ అను మూడవ పుస్తకం పరిశీలిస్తే ఈ మతంలో కూడ ఎన్నో కర్మకలాపాలు, యజ్ఞాదులు చేరి నట్లు స్పష్టం అవుతుంది. బాక్వెట్ (బొకే 300260 అనుపండితు ని మాటలు ఈ సందర్భంలో ఉదాహరించడం యుక్తంగా ఉంటుంది : “జరథుస్తుడు ఉపదేశించిన మతం అత్యున్నత మైన ఏకేశ్వరవాదం అని గాథధలవల్ల స్పష్టంగా తెలుస్తుంది.ఆ ఈశ్వరుని క్రిందివా రన్నట్లు అమెషా స్పెంటలు అను ప్రధానదేవతలవంటి దేవతలు కూడ వాటిలో కనబడతారు...తరువాత పెర్షియన్ మతంలో అహురమజ్దతో సమానమైన గౌరవం గల మిథధ్ర అను దేవత నిర్దేశం ఉంది.అయితే రెండవ ఇసైయ్య (192120) ఎంత ఏకేశ్వరవాదియో జరఖథుస్తా కూడ అంతటి ఏకేశ్వరవాది అని చెప్పడం న్యాయ్యం.తరువాతి కాలంనాటి జరోష్ట మతంలో అహ్రిమన్ అను దుష్టశక్తి నిర్దేశం కనబడడంతో మనం వేరైన వాతావరణంలో ఉన్న ట్లనిపిస్తుంది”. (4.6. 300166209.99.100
266 జరోష్ట మతం జగత్తు
జగత్తును ఈశ్వరుడే సృష్టించి పోషించి పాలిస్తున్నాడు. ఈ జగత్తు పూర్తిగా ఆ ఈశ్చరునిమీద ఆధారపడి ఉంది. ఈశ్వరునికి తలియకుందడా,ఆతని ఇచ్చ లేకుండా ఏమీ జరగదు.ఈ జగత్తు సర్వథా సత్య మైనది;మానవుని నైతికతాభ్యాసానికి తగిన యథార్థ మైన స్థానం. అహురమజ్ద ఈ జగత్తును ఒక నిశ్చిత మైన వైతికప్రయోజనాన్ని ఉద్దేశించి సృష్టించాడు. ఈ జగత్తు ఒక (ప్రక్క తేజస్సూ సాధుత్వమూ నిలచి,మరొక (ప్రక్క అంధకారమూ చెడుగూ నిలచి నిరంతరమూ చేస్తూన్న యుద్దానికి రంగస్థలం. మంచికి జయం లభించేటంతవరకు ఈ యుద్ధం నిరంతరమూ సాగుతూనే ' ఉంటుంది.మంచికి విజయం తప్పదు.అయితే ఇది ఎప్పుడు కలుగుతుందో తెలియదు. అహురమజ్ద సంకల్పించిన ఈ ఫలం లభించగానే అతడు ఈ జగత్తును ఉపసంహరించి ఎలాంటి దోషాలూ క్లేశాలూ లేని మరొక ఉత్తమ మైన జగత్తును సృష్టిస్తాడు. అందుచేత ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచం మానవుడు తన స్వతంత్ర మైన ఇచ్చను చూపడానికి నైతికమార్గాన్ని అవలంబించడానికీ తగిన స్థానం. ఈ జగత్తు అన్ని విధాలా సత్య మైనది;అందుచేత దీనిని త్యజించవలసిన పని లేదు. జరోష్టమతంలో సంన్యాసం నిందింపబడింది. ఈ ప్రపంచంలో నివసిస్తూన్న ఒక సత్యమైన వ్యక్తిగా మానవుడు సత్యం, (బ్రహ్మచర్యం, దయ మొద లైన నైతికసద్దుణాలను అభ్యసిస్తూ పూర్తిగా ధార్మిక మైన జీవనాన్ని గడపాలి. ఈ జన్మలో చేసిన కర్మ ననుసరించి మానవునికి తరువాతి జన్మ లభిస్తుంది.
మానవుడు
జరోష్ట్రమతం సర్వదుణఖరహిత మైన క్రొత్త జగత్తును నిర్మించడంలో మానవుడు ఈశ్వరునికి సహకరిస్తా డని చెపుతూ మానవునికి అత్యున్నత మైన స్థానం ఇచ్చింది.ఈ (ప్రపంచం మంచి శక్తికీ చెడు శక్తికీ మధ్య నిరంతరమూ పోరాటం జరిగే రణరంగం.ఈ యుద్ధంలో మంచికి మానవుడు తన పరిశుద్ధ నైతిక (ప్రవర్తన ద్వారా సాహాయ్యం చేయవలసి ఉంది. మానవుడు సహజంగా ఉన్న పెద్ద పాపభారంతో పుట్టా డని చెప్పే క్రైస్తవమతం వలె కాక ఈ మతం మానవుడు
జరోష్ట మతం 2657 సహజంగా పరిశుద్దు డనీ, పాపరహితు దనీ బోధిస్తుంది. మంచియొక్క పక్షమైనా చెడుయొక్క పక్ష మైనా తీసికొనడానికి మానవుడు సర్వస్వతం్రు దని ఈ మతం చెపుతూన్నది.తాను నిర్మించబోయే సర్వదుఃఖశూన్య ప్రపంచనిర్మాణంలో సహాయంగా ఉండదానికి మానవుడు మంచి వైపు నిలవాలని భగవంతుడు కోరుకొంటాడు.ఆ విధంగా మానవుడు తన స్వేచ్చను వినియోగించి మంచి పక్షంలో ఉంటూ నైతికజీవనం గడిపితే స్వర్గసుఖం అనుభవిస్తాడు. అలా కాక చెడు పక్షాన నిలిస్తే నరకానికి వెళ్ల వలసి ఉంటుంది అని జౌరోస్టర్ మానవునికి ఉపదేశించాడు - “నేను బోధిస్తూన్న అత్యుత్తమసత్యాన్ని మీ చెవులతో వినండి. ప్రకాశవంత మైన బుద్ధితో వీటిని జాగర్తగా పరిశీలించండి. ఈ రెండు మార్గాలలో ఏ మార్గం అవలంబించాలో ఎవరి మట్టుకు వారు ఆలోచించుకొండి. ఆ క్రొత్త కాలం ప్రారంభం కొక ముందే మేల్కొనండి అహురుని ఆదేశం ప్రచారం చెయ్యండి (యాన్నా.30. 12) మానవుడు ఒకే జన్మలో సన్మార్గాన్ని ఎన్నుకొంటే పరిపూర్ణత్వాన్ని సాధించవచ్చు. హిందూమతంలో వలె ఒక జన్మ తరవాత మరొక జన్మ అను పద్ధతి ఈ మతం అంగీకరించదు.“ఒకే జన్మలో మానవుడు పట్టుదలతో ప్రయత్నించి పరిపూర్ణత్వాన్ని సాధించవచ్చు” (యాన్నా51. 12) సంన్యాసాన్ని నిరసిస్తూ ఈ మతం మంచి ఆలోచనలతో మంచి మాటలతో మంచి చేష్టలతో ఉన్నత మైన పవిత్రజీవనాన్ని నడపా లని బోధిస్తుంది. మానవుడు సహజ మైన ఆరోగ్యకర మైన జీవనం గడపాలి గాని అరణ్యాలలో నివసించకూడదు. ప్రపంచం ఒక రణభూమి వంటిది. దానిపై మానవుడు తన పాత్రను ధార్మిక మైన పద్ధతిలో నిర్వహించాలి. ప్రపంచంనుండి దూరంగా పారిపోకూడదు.తాను చేసిన పనులకు తానే బాధ్యుడు. అందుచేత మానవుడు తన బాధ్యతను అంగీకరించి, సన్మార్గాన్ని అవలంబించి అహురమజ్ద తలబెట్టిన కార్యంలో ఆతనికి సహకరించాలి.
268 జరోష్ట మతం
జరోష్ట మతంమీద హిందూమతప్రభావం అత్యధికంగా ఉన్నా, క్రైస్తవ- ఇస్తాంమతాల మీద జరోష్టర్ మతం ప్రభావం ఉన్నా కూడ దానిలో వాటితో కొన్ని భేదాలు స్పష్టంగా కనబడతాయి. ఇన్లాంవలె కాక ఈ మతం మానవునకు పరిపూర్ణస్వాతంత్ర్యం ఉన్న దని అంగికరిస్తూ తాను చేసిన మంచి పనుల కైనా చెడ్డ పనుల కైనా మానవునిదే బాధ్యత అని చెపుతుంది. ఈ విషయంలో ఇది క్రైస్తవమతానికి సంనిహితంగా ఉంది.అయితే క్రైస్తవమతం వలె కాక ఈ మతం మానవుడు సహజంగా పరిశుద్దు డనీ పాపరహితు దనీ ప్రతిపాదిస్తుంది. క్రైస్తవ మతం ప్రకారం ఆదం వారసుడైన మానవుడు సహజ మైన పెద్ద పాపం మూటతో భూమిమీదకు వస్తాడు గాన అతడు భగవంతుని అనుగ్రహం కోసమూ,ఆతదడు . క్షమించడంకోసమూ ఎదురు చూస్తూ కూర్చోవాలి. హిందూమతం ప్రకారం కూడ మానవుడు పూర్వజన్మలలో చేసిన కర్మరాశితో పుట్టి వాటి ఫలం ఈ జన్మలో అనుభవించాలి.జరోష్టర్ మతం ప్రకార మైతే మానవుని నెత్తిమీద పాపపు మూట గాని, కర్మరాశి గాని ఉండదు. అతడు కేవలం సన్మార్గంలో (ప్రవర్తించడం ద్వారా మంచిని పెంచి, తద్ద్వారా తన బాధ్యతను నిర్వహించాలి. దుఃఖదూరజగ న్నిర్మాణంలో అహుర మజ్ద కు సహాయపడాలి.
చెడుదుఃఖము
లోకంలోని చెడు అంతకీ కారణం అహ్రిమన్ అని చెప్పడం ద్వారా జరోష్టమతం ఈ విషయంలో అహుర మజ్దకు ఏ మాత్రమూ బాధ్యత లేదన్నట్లు సూచిస్తూన్నది. అట్లే నైతికదోషాలకు మానవుడు బాధ్యుడు కాని అహురమజ్ద కాదు.మానవులు చెడ్డగా (ప్రవర్తించడానికి కూడ అహ్రిమన్,వాని పరివారమైన అసురులూ కారణం అయినా అహురమజ్ద మాత్రం ఇందుకు బాధ్యుడు కాదు. అతడు అత్యంతసాధుశీలుడు. ప్రపంచకంలో చెడుగు ఉండడానికి గాని, దానివల్ల కలిగే దుఃఖాలకు గాని అతడు కారణం కాదు.మానవుని సాహాయ్యంతో చెడుగును అణచివేసి ప్రపంచకంలో మంచియొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడంకొరకే అతడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు.
అయితే చెదుగువిషయంలో అహురమజదకు బాధ్యత లేదు అనడం ఎంతవరకు సత్యము అనేది ప్రశ్న అహురమజ్ద ఒక్కడే సర్వసమర్జుడైన ఈశ్వరుడు
జరోష్ట మతం 269 అని అంగీకరించి నప్పుడు ప్రపంచకంలో కనబడుతూన్న ఈ చెదుకీ,దాని దుః పృ్పలితాలకూ కూడ ప్రపంచకాన్ని సృష్టించిన అతదే కారణం అని చెప్పవలసి ఉంటుంది కదా?ఈ దోషం అహురమజ్దకు అంటకుండా ఉండా లంటే ఉభయేశ్వరవాదం అంగీకరించాలి. అలా అంగీకరించిన పక్షంలో అహుర మజదకు ఉన్న సర్వసమర్థత్వాన్ని నిరాకరించిన ట్లవుతుంది. అప్పుడు అహ్ర్హిమన్ రెండవ ఈశ్వరు డవుతాదు; అతనిపై అహురమజ్దకు ఏ మాత్రమూ అధికారం ఉండదు. అతడు అహ్రిమన్తో నిరంతరం యుద్ధం చేస్తూదానికై మానవుని సహాయం కూడ అపేక్షిస్తూన్న దుర్చలు దైన ఈశ్చరు డవుతాడు. ఈ దోషం సరిహరించడానికి అహ్రైమన్ అహురమజ్ద అధీనంలో ఉంటాడు అని అంగీకరిస్తే అప్పుడు చెడును కూడ సృష్టించిన దోషం అహుర మజ్దకు తప్పదు.అందుచేత ఈ మతంలో కూడ యూదమతంలోను జ్రైస్తవమతంలోను చెప్పిన సమాధానమే చెప్పవలసి ఉంటుంది. అన్ని చెడులకు అహుర మజ్దయే బాధ్యుడు.నైతిక మైన ప్రయోజనం కోసమే ఇతడు వీటిని సృష్టించాడు. మంచి-చెడుగుల మధ్య నిరంతరంగా పోరు జరిగే టట్లు చేసి మానవుడు తన స్వాతంత్ర్యం ఉపయోగించు కొని మంచి- చెడుగులలో ఏదో ఒకదాని వైపు వెళ్లే అవకాశం కల్పించాడు. అయితే చెడ్డమీద మంచికే విజయం లభించే టట్లు ఏర్పరిచాడు అని చెప్పవలసి ఉంటుంది. అలా కాక అప్రొమాన్ మాత్రమే చెడుకు కారణం అని చెప్పిన పక్షంలో ఉభయేశ్వరవాదమేనా అంగీకరించవలసి వస్తుంది,లేదా చెడుకు సంబంధించిన బాధ్యతనుండి అహుర మజ్దను తప్పించడానికి శక్యంకాకుండా నైనా పోతుంది. మరణానంతరం జీవితం
ఇతరమతాల వలె జరోష్టమతం కూడ నిత్య మైన ఆత్మను అంగీకరిస్తుంది. మరణానంతరం మానవుని జీవితం, జీవించి ఉండగా అతడు చేసిన కర్మలను పట్టి ఉంటుంది. పుణ్యకర్మలు చేసినవాళ్లు స్వర్గానికి వెళ్లి సమస్తసౌఖ్యాలు అను భవిస్తారుపాపం చేసినవాళ్లు నరకానికి వెడతారు. మరణించిన తరువాత కూడ ఆత్మ ఆ శరీరంలో మూడు రోజుల పాటు ఉండి తాను చేసిన కర్మలను గూర్చి ఆలోచిస్తుంది. నాల్గవ రోజున ఆ శరీరం విడచి కర్మఫలం నిర్ణయించే స్థానానికి
270 జరోఫష్ట్ర మతం ప్రయాణం అవుతుంది. ఈశ్వరుని దగ్గర ఉందే ప్రముఖదేవత భూమిమీద మానవుడు చేసిన అన్ని కర్మల లెక్కలూ సిద్ధం చేసి ఉంచుతుంది.తాను చేసిన లెక్కల ప్రకారం వాని చెడ్డ కర్మలను మంచి కర్మలను తూచుతుంది. పుణ్యకర్మలు ఎక్కువగా తూగినవాడు స్వర్గానికీ, పాపకర్మలు ఎక్కువగా తూగినవాడు నరకానికీ పంపబడతాదు.రెండు విధా లైన కర్మలూ ఇంచుమించు సమంగా ఉన్నవాడు ఒక రక మైన తాత్కాలిక బాధాకరన్థానంలో ఉంచబడతాడు. స్వర్గం వైపు గాని నరకం వైపు గాని ప్రయాణం చేసే ఆత్మ ఒక వంతెన దాటవలసి ఉంటుంది. స్పర్ణంలోనికి వెళ్లవలసినవానికి ఆ వంతెన సులభంగా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఆ ఆత్మను అందమైన యువతులు ఎదురేగి గౌరవించి కూడా ఉండి స్వర్గం చేరుస్తారు. పాపాలు చేసినవాని ఆత్మ రాగానే ఆ వంతెన దాని వంచ పైకి వచ్చే టట్లు తిరుగుతుంది. కత్తి అంచుమీద నడచి నట్లు దానిమీద నడవడం చాల కష్టంగా ఉంటుంది.ఒక ముసలి పంది వచ్చి స్ట ఆత్మను పీడిస్తుంది. అందుచేత ఆ ఆత్మ వంతెననుండి జారి లోతైన నరకంలో పడుతుంది. ఈ మరణానంతర వృత్తాంతాన్ని ఇస్లాంమతం ఈ మతంనుంచీ, యూదమతంనుంచీ, జైస్త్వవమతం నుంచీ గ్రహించింది.
జరోష్టమతం ప్రకారం ఈ స్వర్గ-నరకనివాసం శాశ్వతం కాదు. ఆత్మలు (ప్రపంచం పూర్తిగా నశించేవరకు,తమ పుణ్య-పాపకర్మల ననుసరించి స్వర్గంలో గాని నరకంలో గాని ఉంటాయి.ఒక నిర్ధారతసమయంలో భవిష్యత్తులో ఈ (ప్రపంచం పూర్తిగా నశించిపోతుంది.అప్పటికి అహుర మజ్ద ప్రపంచకంలో ఉన్న చెడు నంతనీ పూర్తిగా నశింపచేసి ప్రపంచంలో అంతటా మంచితనం యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించగలిగిన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు నరకంలో ఉన్న ఆత్మ లన్నీ పైకి తీసికొనివచ్చి పరిశుద్ధం చేయబడతాయి. అలా శుద్ధి చేయబడిన తరువాత పుణ్యకర్మలు చేసిన అత్మలతో కలుస్తాయి. చెడు గాని దుఃఖం కాని ఉండని క్రొత్త లోకం అవిర్భవిస్తుంది.ఆ ప్రపంచకంలో ఆత్మ లన్నీ జరామరణాదులు లేకుండా శాశ్వతంగా నివసిస్తాయి. అంతా మంచి మాత్రమే ఉంటుంది;చెడుకి అవకాశం ఉండదు.
జరోష్ట మతం 271 నైతికజీవనం ్రార్థనాదికం
జరోషస్టమతం నైతికజీవనానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే మతం. జొరోష్టర్ చేసిన బోధల (ప్రకారం మంచి ఆలోచనలు (హుమత), మంచి మాట (హుఖ్త), మంచి పని (హర్ష్త) అనేవి చాల ప్రధాన మైన ధర్మాలు. ఈళశ్వరు డైన అహుర మజ్దను పూజించడానికి బాహ్య మైన ఇత ్రార్థ్ధనాదులకంటె నైతికజీవన విధానాన్ని అనుసరించడమే చాల ప్రధాన మైనది. పైన చెప్పిన మూడింటికి అనుగుణ మైన మరి కొన్ని సద్గుణాలను కూడ జొరోష్టర్ ఉపదేశించాడు. ప్రతీ మానవుడూ సత్యపరాయణత్వము, న్యాయము, దయ, బ్రహ్మచర్యము, దానము, మోసం చేయకపోవడం, పవిత్రత్వం, పశుపోషణం, మావనసేవ మొద లైన ధర్మాలను అలవరచుకోవాలి. కాలాంతరంలో కొన్ని కర్మకలాపాలూ, పూజా విధానాదులూ ప్రవేశించినా ప్రధానంగా జరోష్టమతం నైతికప్రవర్తనా ప్రధాన మైన దను విషయం దీనివల్ల స్పష్టం అవుతూన్నది.
సన్మార్గంలో ప్రవర్తించే శక్తిని అనుగ్రహించవలసిందిగా అహుర మజ్దను ప్రార్ధించా లని కూడ విధింపబడింది. ఈ విధంగా ఈ ప్రార్ధన కూడ నైతిక మార్గానుసరణకు సంబంధించినదే.పవిత్ర మైన అగ్నిలో మంచిగంధపు కజ్ఞ ముక్కలు వేయడాన్ని మించి మరొక యాగాదికం కూడ ఏమీ చెప్పబడలేదు.కొన్ని అగ్నిదేవాలయా లుంటాయి. వాటిలో ఎల్లప్పుడూ అగ్ని మండుతూ ఉంటుంది. పూజారులు ఆ అగ్నిని ఆరిపోకుండా కాపాడుతూ ఉంటారు. జరోష్టమతం అనుసరించేవాళ్లు ఈ దేవాలయాలకు వెల్లి చందనదారుఖండాలు అగ్నికి సమర్చించి అక్కడ ఉన్న భస్మం తీసికొంటూంటారు. పశుబలి ఎట్టి పరిస్థితులలోను చేయగూడదు.
అగ్నిని ఒక దేవతను పూజించి నట్లు పూజించకపోయినా అగ్ని పవిత్ర త్వానికి ప్రతీక అని జరోస్టమతస్థులు విశ్వసిస్తారు. అగ్నిని సంరక్షించే పూజారులు తమ శ్వాసలచేత ఆ అగ్ని దూషితం కాకుండా ఉండడం కోసం ముఖానికి ఆచ్చాదనలు కట్టుకొంటారు. అగ్నిని కలుషితం చేయకూడ దను భావంతో ఈ మతంవాళ్లు శవాలను అగ్నిలో దహించరు.వాటిని ఖననం కూడ చేయరు.దీని
272 జరోస్త్ర మతం విషయంలో వాళ్లలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది. అంత్యక్రియలు చేయడానికి వాళ్ల కొక మౌొనప్రాసాదశిఖరం (ంజ/ఆ ౦5586000) అను ప్రదేశం ఉంటుంది. దాని దగ్గర నున్న ఎత్తైన అరుగుమీద, శవాన్నిదానిలోని మాంసాన్ని (గ్రద్దలు తినడానికి వీలుగా ఉండే టట్లు ఉంచి,తరువాత దానిని దగ్గరనే ఉన్న చాల లోతైన గోతిలో పడవేస్తారు.
పర్షియాదేశాన్ని క్రీ.శఈ716 లో ఇన్లాంమతస్టులు ఆక్రమించి నప్పుడు అక్కడినుండి పారిపోయి వచ్చి భారతదేశంలో నివసిస్తూన్న అత్యల్పసంఖ్యాకు లైన కొందరు “పారసీలు మాత్రమే ఈ జరోష్టమతాన్ని అనుసరిస్తున్నారు. అప్పుడు వాళ్లు తమతో పాటు తమ పవిత్ర మైన అగ్నిని కూడ తీసికొని వచ్చారు. అదే ఈనాటికి కూడ అగ్నిదేవాలయాలలో అవిచ్చిన్నంగా మండుతూన్నది. ఈ పార్సీల మతం జరోష్టర్మతమే అయినా కాలక్రమంలో కొన్ని హిందూమతానికి సంబం ధించిన ఆచారాలు, పూజావిధానాదులూ కూడ దీనిలోనికి ప్రవేశించాయి. అయితే కొంత కాలానికి క్రైస్త్రవ్వమతప్రభావాన్ని ఎదుర్కొనడం కొరకు ఈ పార్సీలు తిరిగి గాథల వైపు వెళ్లాలి అను సంచలనం ప్రారంభించి అనావశ్యక మైన కర్మకలాపాలను తీసివేయడంకోసం ప్రయత్నించారు.పవిత్ర మైన అగ్ని సమక్షంలో అహుర మజ్దను ప్రార్ధన చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. నైతిక జీవనవిధానానికి కూడ చాల ప్రాధాన్యం ఇవ్వబడుతూన్నది. చిన్నతనంలోనే పిల్లలచేత మంచి ఆలోచనలు చేస్తాం, మంచి మాటలు పలుకుతాం, మంచి పనులు చేస్తాం అని శపథాలు చేయిస్తూంటారు. ఈ విధంగా పునరుజ్జీవిత మైన జరోష్టమతం భారత దేశంలో నివసిస్తూన్న పార్సీలలో ప్రచారంలో ఉంది.
పార్సీలలో షాహన్ షాహీలు, కడ్మీలు అను రెండు శాఖ లున్నాయి. వీటిలోని భేదం అత్యల్ప మైనది... పర్షియాను పాలించిన సస్ఫానియన్ వంశానికి చెందిన చివరి రాజు మరణించిన రోజు యాజెర్ గర్ట్ విషయంలో ఐతిహాసిక మైన అభిప్రాయ భేదాన్ని పట్టి ఏర్పడినది.ఆ రోజును పార్సీలు తమ సంవత్సరాదిగా భావిస్తారు.
ప్రఖ్యాతతత్ర్త్వశాస్త్రవిశారద అనీ బెసింట్ 'శెవెన్ గ్రేట్ రెలిజియన్స్' అను
జరోష్ట మతం 2/3 గంథంలో జరోష్టమతాన్ని గూర్చిన లఘునిబంధంలో వ్రాసిన కొన్ని విషయాలు గమనింప దగినవి.
-
హిందూమతం ఆతి ప్రాచీనమైనది. దీని తరవాత చెప్పదగిన ప్రాచీన మతం జరోస్టమతం. ఈ మతం హిందూమతం నుండి ఆవిర్భవించినది. జొరోస్టర్ క్రీ.పూ. 610 ప్రాంతంవాదనీ, క్రీ.పూ. 1000 ప్రాంతంవాడనీ, 2800 సంవత్సరాల ప్రాంతంవాడనీ విభిన్నాభిప్రాయా లున్నా ఇది అంతకంటె అతి(ప్రాచీన మైనది.
-
గ్రీస్ దేశతాత్త్వికుడైన అరిస్రోటల్ వ్రాసిన దానిని పట్టి క్రీ.పూ.9000 సంవత్సరాలకు పూర్వమే జొరోస్టర్ అను మతప్రవక్త పర్షియాలో ఈ మతం బోధించాడు (49).
8.ఈ మతం చరిత్ర కనీసం క్రీ.పూ.7000 లేదా 8000 సంవత్సరాలకు పూర్వంనాటిదై ఉండాలి (౫.57.
-
హిందూమతసంప్రదాయంలో ఇరవై ఎనమండుగురు (28) వ్యాసు లున్నట్లే వేరు వేరు కాలాలలో జొరోస్టర్ అను పేరుతో వేరు వేరు మతప్రవర్తకులు ఆవిర్భవించారు.
-
క్రీ.పూ.9600 సంవత్సరాలకు పూర్వం ఉన్నట్లు అరిస్ట్రోటల్ చెప్పిన జొరోస్టర్ ఏడవవాడై ఉంటాడు. ఇతడు వైదికమతానికి మనువు ఎట్టివాడో ఈ మతానికి అలాంటివాడు. క్రీ.పూ.4000 ప్రాంతంలో మరొక జొరోస్టర్ జన్మించాడు. (౫.53)
-
జరోస్టర్ మతానికి సంబంధించిన వాజ్బయం చాలావరకు నశించి పోయింది. క్రీ.పూ.329 లో అలెక్టాండర్ పెర్సెసోలిస్లో ఉన్న చాలపెద్దదైన (గ్రంథాలయాన్ని మద్యం మత్తులోనో లేక పగతీర్చుకొనడం కొరకో కాల్చివేశాడు. అందుచేతనే ఈ మత[గ్రంథాలన్నింటిలోనూ ఇతని పేరు చెప్పవలసిన అన్ని చోట్లలోనూ 'ఇ6య5661' (దురాత్ముడు) అను పదం చేర్చి 'దురాళ్ళుడైన అలెగ్జాండర్ అని నిర్దేశింపబడింది (1.62).
-
అయితే కొన్ని మతగ్రంథాలకు రెండు ప్రతు లుండేవి; ఒక (గ్రంథ సముదాయం దగ్ధమైపోగా బైటి నున్న (గ్రంథసముదాయం గ్రీస్‌కు తీసికొని
274 జరోష్ట మతం పోయినట్లు ఇప్పుడు ప్రామాణికంగా నిశ్చితమైనది. ఈ [గ్రంధాలు గ్రీక్ భాషలోనికి అనువదింపబడడంచేత ఈ మతానికి సంబంధించిన అనేకవిషయాలు గ్రీక్ వాబ్బ్యయం ద్వారా తెలుసుకొనడానికి వీలు కలిగింది. దీని అతిప్రాచీనత్వం కూడ తెలుస్తూన్నది (1.62).
-
ఈ మత(గ్రంథమైన జెంద్ - అవేస్తాలోని భాష బుగ్వేదభాషకు అతి సన్నిహితంగా ఉంటుంది. దానిలోని గాథలు సామవేదంలోని బుక్కులవలె ఆ విధమైన స్వరాలతో పఠింపబడతాయి.
-
నిజానికి మతగ్రంథంపేరు “అవెస్తొ అని మాత్రమే. “జెన్ అను పదానికి వ్యాఖ్యానం అని అర్ధం. మూలమూ వ్యాఖ్యానమూ కలిపి వేసి “జెంద్ - అవెస్తా అను పేరు పప్రసిద్ధిలోనికి వచ్చింది. దీని పహ్హవీ భాషానువాదాలకు కూడ “జెంద్” అను పేరు ప్రసిద్ధిలో ఉంది (.58,59).
-
గ్రంథాలయాన్ని తగుల బెట్టిన తరువాత దాదాపు 550 సంవత్సరాల కాలం అంధకారయుగంగా ఉండిపోయింది. తరువాత ఆ దేశాన్ని ఏలిన సస్సాన్ చక్రవర్తుల ప్రయత్నాల ఫలితంగా లభ్యమౌతున్న జరోష్టవాజ్బయంలోని ముక్కలు ప్రోగుచేసి, వాటికొక ఆకారం ఇచ్చి జాగర్రచేశారు (౧.65).
-
జరోస్తమతవాజ్బ్యయంలో యాస్నా అతిప్రాచీన మైనది. దీనిలో ముక్క ముక్కలుగా గాథ లున్నాయి. ఇవి జొరోష్టర్ ప్రత్యక్షంగా ఇచ్చిన ఉపదేశాలు. ఐదు గాథలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది మొదటి భాగం. రెండవ భాగంలో (ప్రార్ధన లున్నాయి (63).
యాస్నారెండు భాగాల తరవాత ఆహ్వానరూపాలైన విస్పరాదలు ఉన్నాయి. యాన్నా - విస్పరాదలు రెండూ కలిసి హిందువుల వేదాలవంటివి. విస్పరాదలు ప్రార్ధనలకూ యజ్ఞాలకూ ప్రారంభంలో చేసే ఆహ్వానాలు (౪0626019) (ౌ.6కు.
వీటి తరవాత అతివిస్త్రతమైన వాజ్బ్యయం ఉంది. కొన్ని గ్రంథాలు ముక్క ముక్కలుగా లభిస్తున్నాయి. కొన్నిటి పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి. ఇవి హిందువుల వేదాంగాలవంటివి. వీటిలో విజ్ఞానశాస్తవిషయాలు, ధర్మశాస్త్రవిషయాలు మొదలైనవి చెప్పబడ్డాయి. వెండిదాద్ అను ఒక్క పుస్తకం మాత్రమే పూర్తిగా
జరోష్ట మతం 2/5 లభిస్తూన్నది. బాహ్యప్రకృతినీ,మానవుణ్జీ పరిశుద్ధంగా ఉంచుకొనే నియమాలు దీనిలో బోధింపబడ్డాయి (1.64).
వీటి తరవాత 'ఖోర్జాహ్ అవెస్తా, అనగా చిన్న అవెస్తా, ఉంది. దీనిలో పూజారుల కోసం కాక సామాన్యజనులకోసం ఉద్దిష్టమైన ప్రార్ధనాదు లుంటాయి. నేటి పార్సీలు వీటిని ఉపయోగిస్తూంటారు గౌ.64.
-
జారోష్టర్ తాను వ్యవసాయం ప్రధానవృత్తిగా గల జనులకు బోధించడంచేత ఖగోళశాస్తానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఆతని సిద్ధాంతం ప్రకారం ప్రాణం లేని జడపదార్ధమైన సూర్యుని చుట్టూ ప్రాణం లేని ఇతర (గ్రహాదులు తిరగడం లేదు. అవన్నీ వైతన్యమూ బుద్ధీ ఉన్నవి. అవన్నీ తమ ఇచ్చ ప్రకారం నియమబద్ధరీతిలో సంచరిస్తున్నాయి (.55).
-
ఆధునికభౌతికవాదులు చెప్పినట్లుగా జరోష్టమతం ఎక్కడో సుదూరంలో దేవుడూ, మరొకచోట దూరంగా ఈ పప్రపంచకమూ మానవుడూ ఉన్నారనీ, వీటి మధ్య శూన్యమైన అనంతాకాశం మాత్రమే ఉన్న దనీ చెప్పదు. దేవునికీ మానవనికీ మధ్య అంతటా అనేకమైన సచేతనభూతాలున్నా యని చెపుతుంది. క్రింద నున్న మానవునినుండి దేవునివరకు వరుసగా సోపానపంక్తివలె అనేకసచేతన భూతలోకా లున్నాయనీ, పైపైకి వెళ్లిన కొలదీ వాటిలో దివ్యత్వం పాలు పెరుగుతూంటుందనీ బోధిస్తుంది (.63).
-
జరోష్టమతం అంగీకరించిన అహర్ మజ్ద ఉపనిషత్తులలోని బ్రహ్మ వంటివాడు. ఖోర్జాహ్ అవేస్తా ప్రకారం అహుర్ మజ్ద మూడు రూపాలలో ఆవిర్భవించాడు. ఇది హిందువుల టత్రిమూర్తిత్రయం వంటిది (౫.68).
-
(త్రిమూర్తులకు మూలమైన పరతత్త్వం ఒకటుంది. పేజి.68. అది అనంతకాలం అని కొందరూ, ఆకాశం అని కొందరూ మహాతేజస్సు అని కొందరూ అంటారు.
-
అహుర్ మజ్దలో స్పెంట్ మైన్యుష్క్ అంగ్రా మైన్యుష్ అను రెండంశా లుంటాయనీ, మొదటిది సాధుశక్తి అనీ రెండవది దుష్టశక్తి అణ కొంద రంటారు. కాని కొందరు అవి చేతన - అచేతనపదార్డా లనీ వాటిలో మొదటిది సత్ లేదా సత్యం అనీ, రెండవది అసత్ లేదా అసత్యం అనీ అంటారు (1.71).
276 జరోష్ట మతం
-
స్వర్గంలో ఉన్న సచేతనభూతాలలో ఏడుగురు దేవతలు ప్రధానమైన వారు. వారికి 'అమేషాస్పెంటా' అని పేరు. (1) వోహుమద్ (సద్బుద్ధి) (9) ఆషావహిష్ట (అత్యుత్తమపవిత్రత) (3) క్షత్రవెర్ (శక్తి) (4) స్పెందర్మద్ (ప్రేమ), (5) హౌర్వతత్ (ఆరోగ్యం) (6) అమెరెతర్ (అమరత్వం) (7) అగ్ని (ఇది అన్నిదేవతల కంటె అత్యధికంగా ఉపకారం చేసే దేవత) పేజి.75. ఈ దేవతలను స్తుతిస్తూ అనేకస్తోత్రా లున్నాయి. అయితే ఇవన్నీ అహర్ మజ్ద యొక్క గుణాలు అని డా.మిల్స్ మొదలైనవాళ్ల అభిప్రాయం యుక్తం కాదు (౧.75)
-
యాస్నాలలో మిధ్ర-జలదేవతా-'్రోష్ - సూర్య - చం(ద్ర-నక్షత్రాల పూజలు అత్యధికంగా వర్ణించబడ్డాయి (73).
-
అగ్ని ఈశ్వరుని అత్యుత్తమమైన ప్రతీక. అహుర్ మజ్దయొక్క పుత్రుడుగా వర్ణింపబడ్డాదు. అగ్నికి వజిష్ట అని పేరు (0.79),
-
జరోస్టమతస్థులు సూర్యాస్తమయసమయంలో ఇంట్లోని ప్రతీ గదిలోనికీ అగ్నిని తీసికొనివెడతారు (.89).
-
7-15 సంవత్సరాల మధ్య వయస్సులో పిల్ల లందరికీ ఆడ పిల్లలకూ మగ పిల్లలకూ కూడ, 'కుస్తి అను పవిత్రసూత్రం, 'సూద్రా అను తెల్ల ఊలుచొక్కా ధరింపచేస్తారు. ఇవి పవిత్రతాచిహ్నాలు. 'కుస్తీ గొట్టె వూలుతో ఒదికిన డెబ్బెరెండు (72) దారాలతో పేనుతారు.ఇది నడుముకు మూడు చుట్లు త్రిప్పి కడతారు. ఈ మూడు చుట్లూ - మంచి ఆలోచనలకూ, మంచి మాటలకూ, మంచి పనులకూ చిహ్నాలు (ా.8ు.
22.హిందూమతంలోవలెనే నాలుగు జాతు లుందేవి- మొదటిది పూజారులు, రెండవది యోధులు, మూడవది వ్యవసాయం చేసేవాళ్లు, నాల్గవది కార్మికులు (అనేకవిధాలైన పనులు చేసేవాళ్లు.)
- నాలుగు జాతులవాళ్లకీ ప్రత్యేకంగా కొన్ని ధర్మాలు చెప్పబడినట్లే వాళ్లు చేయకూడనివి కూడ ప్రత్యేకించి చెప్పబడ్డాయి : పూజారిజాతికి చెందిన వాళ్లకు దాంబికము, దురాశ, అశ్రద్ధ (ఏమరుపాటు, సోమరితనం, చిన్న విషయాలను ఎక్కువగా పట్టించుకొనడం, మతంమీద విశ్వాసం లేకపోవడం
జరోష్ట మతం 277 అనే దుర్గుణాలు ఉండకూడదు. యోధజాతివాళ్లకు ఎదుటివాళ్లను తొక్కిపెట్టడం, (క్రూరత్వం, మాట నిలబెట్టుకొనకపోవడం, చెడును (ప్రోత్సహించడం, ఆడంబరం, గర్వం, మాంద్యం అను దుర్గుణా లుండకూడదు. వ్యవసాయంజాతివాళ్లకు అజ్ఞానం (తెలివితక్కువతనం), అసూయ, దుష్టభావాలు, దుష్టత్వం ఉండకూడదు. కార్మిక జాతివాళ్లకు నమ్మకంగా ఉండకపోవడం, కృతజ్ఞత లేకపోవడం, కాఠిన్యం, ఇతర దూషణ ఉండకూడదు (1.84, 85).
- హిందువుల సామవేదంలో వలె హోమయాష్ట్లో ఇంట్లో యజ్ఞం చేయడం అత్యధికంగా ప్రశంసించబడింది. బుత్విక్కుల పేర్లు కూడ ఆధర్వన్ జోతా (హోతా) అని ఉన్నాయి. అధ్వర్యువుకు వలె 'రఫ్టాకి యజ్ఞంలో చేయవలసిన కర్తవ్యాలు చెప్పబడ్డాయి. పాలు, నెయ్యి, పవిత్రజలం, పవిత్రమైన సమిధలు హోమానికి ఉపయోగించాలి. హిందువులవలె పార్సీలు కూడ మృతులకు ఆ యా కాలాలలో త్రాద్దాలు చేస్తారు (.85).
ఈ విధంగా నేటి పారసీకులలో లుప్తము లైపోయినా కూడ ఎన్నో పూజా విధానాలు, యజ్ఞప్రక్రియాదులు హిందూమతంలోవలె ప్రాచీన జరోస్ట్రర్ మతంలో ఉందేవి. వైదికమతం పర్షియాలో ఉందేది అని చెప్పడానికి ఇంతకంటె వేరు (ప్రమాణా లేవీ అవసరం లేదు.
యూదుల మతం
యూదమతం ప్రాచీనహెబ్రూల జాతికి చెందిన యూదుల మతం.'హెబూ అనగా విశేషించి ఏరికొనబడిన జనులు'అని అర్ధం. ఈ మతానికి సినాయపర్వతం మీద ఉండగా మోసెస్ అను మత'ప్రవక్తకు ఈశ్వరుని ద్వారా అందిన వార్త (ఆదేశం) మూలం.మానవుడు అనుసరించవలసిన మార్గాన్ని సూచిస్తూ ఈశ్వరుడు మానవునితో మాటలాడతాడు అనే విశ్వాసాన్ని ఈ మతం దృఢంగా (ప్రతి పాదిస్తుంది.ఈ మతం - (1) జెహోవా (అనగా) ఈశ్వరుడు, (2)ఈశ్వరునితో చేసికొన్న సమయమూ (ఒప్పందమూ) (60౪అజాజు0 (9) నియమాలూ (గంజి ఓ24) అను మూడు స్తంభాలమీద నిలిచి ఉంది.ఇది ఒకే ఈశ్వరుడు అని విశ్వసించే మతం. ఈశ్వరునితో చేసికొన్న సమయాన్ని (ఒప్పందాన్ని ఆతని ఆజ్జలను,ఆతదడు విధించిన నియమాలను తు.చ. తప్పకుండా పాటించడమే ఈ మతాన్ని అనుసరించడం అనగా. ఈ మతానికి బైబిల్లోని ప్రాచినసమయం (01461016౧౪ పరమప్రమాణం. ఈ మతంయొక్క (ప్రాదుర్భావవికాసాలను గూర్చి ప్రాచీనసమయం (0164 76961006౧0 లోనే చెప్పబడింది. ఈ మతానికి ఒక నిశ్చిత మైన స్వరూపం ఇచ్చినవాడు మోసెస్ అయినా దీని న్థాపకుడు అబ్రహాం అను మతప్రవక్తయే.ఆ యా కాలాలలో ఈ మతంలో కలిగిన విక్షోభా లన్నింటినీ సర్టుతూ మోసెస్,ఆతని తరువాత వచ్చిన ఎందరో మత(ప్రవక్తలూ కాలానుగుణంగా దీని స్వరూపాన్ని సరిదిద్దుతూ వచ్చారు. ఈ విధంగా ఇది అనేకమైన మార్పులతో వెయ్యి సంవత్సరాల సుదీర్హక్రాలంలో ప్రస్తుతం ఉన్న ఆకారానికి వచ్చింది. (౫౦౦. [70 130-157
మోసెస్‌కు ముందు అబ్రహాం హెబ్రూల మతప్రవక్తగా ఉండేవాడు. అతదు ఒక చోట స్థిరంగా నివసించకుండా ఒక ్రదేశంనుంచి మరొక ప్రదేశానికి వెడుతూ యాయావర (దేశసంచారి) జీవితం గడిపేవాడు. మెసపొటేమియా పర్వత లోయప్రాంతంలో హరన్ అను ప్రదేశంలో ఉంటూన్న కాలంలో అతడు షడ్డె పర్వతదేవత యైన షద్దేని తన ఈశ్వరుణ్ణిగా (దేవతనుగా) స్వీకరించాడు. ఆ దేవత ఆజ్ఞను అనుసరించి అతడు కన్నన్ అను ప్రదేశానికి వెళ్లి దాని సమీపాన
యూదుల మతం 2/9 నివసించాడు.కొంత కాలానికి అక్కడ భయంకర మైన కరువు ఏర్పడడంతో అతడు అనుచరులతో కలిసి ఈజిష్ట్కు వెళ్లాడు.అక్కడ ఈజిస్ట్దేశీయులు వాళ్లను దాసులనుగా (511769) చేసికొనడంకోసం ప్రయత్నించి చాల నీచంగా చూచారు. ఈజిష్ట్దేశీయులకు శక్తిమంతు లైన దేవతలున్నా రనీ,ఆ దేవతలు వాళ్లను రక్షిస్తూండడంచేత హిబ్రూలు ఈజిస్ట్దేశీయులు చేసే హింసల పాలుకావలసి వస్తుం దనీ ఆ కాలంలో ఒక నమ్మకం ఉండేది. అందుచేత వాళ్లు ఇంకా ఎక్కువ శక్తి గల దేవతను సంపాదించి దానిని తమ దేవతగా చేసికోవా లనే తలంపుతో అలాంటి దేనతకోసం అన్వేషిస్తూందేవారు.ఆ కాలంలోనే మోసెస్ జన్మించాడు. అతదు పెరిగి పెద్దవా దవుతూన్నప్పుడు తనవాళ్లు పడుతూన్న బాధలు చూచి భరించలేకపోయాడు. ఒకనాడు ఒక ఈజిప్ట్ దేశీయుడు ఒక హిబ్రూను కొడుతూన్నప్పుడు అది చూచిన మోసెస్‌కు పట్టరాని కోపం వచ్చింది.ఆ కోపావేశంలో అతడు ఆ ఈజిప్టవానిని చంపివేసి,ఎజ్బసముద్రం గంగే 562) అవతల తూర్చుదిక్కు వైపు పారిపోయాడు. మిడియన్ అను ప్రదేశంలో ప్రవేశించాడు. అక్కడ సినైపర్వతం ప్రక్కన గొట్టెలను కాస్తూండగా అతనికి ఆ పర్వతం దేవతతో సంబంధం ఏర్పడింది. ఈ దేవత పేరు యాహ్యూ (ఇదే ఇంగ్లీషులో జెహోవా అయింది). మోసెస్ ఈ దేవత వైపు ఎక్కువగా ఆకృష్ణు డయ్యాడు: ఆతనికీ ఆ దేవతకీ మధ్య కొన్ని ఆశ్చర్యకర మైన సంభాషణలు జరిగా యని అంటారు. తరవాత అతడు తనవాళ్ల నందరినీ ఈజిస్ట్నుంచి అక్కడికి తీసికొనివచ్చి వాళ్లని యాహ్యామతంలోనికి మార్చా లని నిశ్చయం చేసికొన్నాడు. అతదు వాళ్లను ఎజ్జసముద్రం దాటించి సినైపర్వతం దగ్గరకు తీసికొనివచ్చి తాను మాత్రం ఆ దేవతతో మాటలాడవలసిన దంతా మాటలాదడడంకోసం ఆ కొండ శిఖరం ఎక్కాడు. ఆ ప్రజలను తనవాళ్లనుగా చేసికొని వాళ్లని రక్షించడం విషయంలో ఆ దేవత కొన్ని షరతులు విధించాడు.ఆ విధంగా మోసెస్ ఆ దేవతతో సమయం (ఒప్పందం) కుదుర్చుకొన్నాడు.ఆ ప్రజల మార్గదర్శనం కోసం ఆ దేవత కొన్ని ఇతరమైన నియమాలు కూడ విధించింది.ఆ ఒప్పందం ప్రకారం యాహ్యా హెబ్రూలను కాపాడుతూ వాళ్ల స్వదేశమైన కన్నన్ వాళ్లకు లభించే టట్లు చెయ్యాలి. ఇందుకు (ప్రతిఫలంగా వాళ్లు ఎప్పటికీ ఆ దేవతను ఆరాధిస్తూ సేవిస్తూ ఉండాలి.
280 యూదుల మతం
యాహ్యామోసెస్తో ఈ క్రింది విధంగా చెప్పా డని అంటారు."*నేనే ఈశ్వరుణ్ణి (ప్రభువును). నేను అబ్రహాంకు, ఇస్సాక్‌కు,జాకోబ్కు సర్వశక్తు దైన ఈశ్వరుడుగా సాక్షాత్మరించాను.ఐతే “ఈశ్వరుడు, (ప్రభువు) అను నా పేరు వాళ్లకి తెలియనీయలేదు. వాళ్లకు కన్నన్దేశం ఇవ్వదానికీ,వాళ్లు నివసించిన ప్రదేశాలు ఇవ్వదానికీ నేను వాళ్లతో ఒప్పందం కుదుర్చుకొన్నాను. అంతే కాకుండా ఈజిష్ట్ దేశంవాళ్లు బంధించి పీడిస్తూన్న ఇ(స్రాయిల్దేశీయుల ఏడ్పులు విని నేను వాళ్లతో చేసిన ఒప్పందాన్ని గుర్తు చేసికొన్నాను. అందుచేత ఇస్రాయిల్దేశం బిడ్డలతో (ఇస్రాయిల్దేశంవాళ్లతో) చెప్పు-“ప్రభువు నైన నేను మిమ్మల్ని ఈజిప్ట్దేశీయుల వలన కలిగిన బాధలనుండి ఉద్ధరిస్తాను. వాళ్ల బంధనాలనుండి విముక్తుల్ని చేస్తాను. చేయి ఎత్తి మహాన్యాయనిర్ణయం చేసి మిమ్మల్ని తరింపచేస్తాను. మిమ్మల్ని నా ప్రజలనుగా స్వీకరిస్తున్నాను. నేను మీ దేవుడ నవుతాను. మిమ్మల్ని ఈజిస్ట్దేశీయుల భారం నుండి ఉద్ధరించిన మీ ప్రభువు,మీ దేవుడు నేనే నని మీరు తెలుసుకొనగలరు. దేనిని గూర్చి నేను అబ్రహాంకు, ఇస్సాక్‌కు, జాకోబ్కు నా చెయ్యి ఎత్తానో ఆ భూమి మీ అధీనం చేస్తాను.దీనిని మీకు వారసత్వంగా ఇస్తాను...” మీరు నా ఆజ్ఞను పాలిస్తేనా ఒప్పందాన్ని పరిరక్షిస్తే అందరిమానవులలోకీ మీరు నా మానవులు (నావాళ్లు) అవుతారు; ఎందువల్ల ననగా ఈ భూమి అంతా నాది,మీరు నా పూజారుల,పవిత్రవ్యక్తుల రాజ్యంగా అవుతారు”.
మోసెస్ తన వాళ్ల నందరినీ పిలిచి ఇలా చెప్పాడు-*ఓ!ఇస్రాయిల్ దేశీయులారా! ఈ రోజున నేను చెప్పే నియమాలు విధులూ మీ చెవులతో వినండి. మీరు వాటిని స్వీకరించి తెలిసికొని వాటిని జాగర్తగా ఆచరించగలరు. హెరెబ్లో ఆ ్రభువృుమన దేవుడు మనతో ఒక సమయం ఏర్పరచుకొన్నాడు. ప్రభువు మన తండ్రులతో (పూర్వపురుషులతో) ఈ సమయం చేసికొనలేదు. ఈనాడు జీవించి ఉన్న మనతోనే చేసికొన్నాడు ... మీ రాజులు,మీ వివిధజుతులు,మీ పెద్దలు,మీ అధికారులు, ఇస్రాయిలుకు చెందిన అందరు జనులు,మీ భార్యలు,మీ మధ్యలో నివసిస్తూన్న అపరిచితులు (క్రొత్త మనుష్యులు) చెట్లు నరికేవాడు మొదలు నీళ్లు మోసేవాని వరకూ ఉన్నవాళ్లూ, అందరూ ప్రభు వైన మీ దేవుని ఎదుట
యూదుల మతం 261 నిలబడండి; ప్రభు వైన మీ దేవునితో సమయం ఏర్పరచుకొనండి; ఈ రోజున ప్రభు వైన మీ దేవుడు మీతో చేసిన శపథం ప్రకారం అతడు ఈ రోజున మిమ్ములను తనవాళ్లనుగా చేసికొంటాడు,అతడు మీ దేవు దవుతాడు.అతడు మీతో మాటలాడి నట్లుగా, మీ తండ్రులైన అబ్రహాంతోను; ఇస్సాక్తోను,జాకోబ్తోను శపథం చేసినట్లుగా అతదు మిమ్ములను తనవాళ్లను చేసుకొంటాడు;తాను మీ దేవు డవుతాడు.నే నీ సమయాన్ని, శషూన్ని కేవలం మీతో మాత్రమే చేయడంలేదు; ఈ రోజున మనతో పాటు దేవునిముందు నిలిచి ఉన్నవానితోను, ఈ రోజున మనతో ఇక్కడ లేనివానితోనూ కూడ చేస్తున్నాను.
“నేను మిమ్మల్ని శపథపూర్వకంగా,ఏనాటికీ విడిపోకుండా నాతో బంధిస్తున్నాను. నేను మిమ్మల్ని ధర్మబుద్ధితో,న్యాయంతో,ప్రేమతో,దయతో శపథ పూర్వకంగా నాతో బంధిస్తున్నాను;నేను మిమ్మల్ని విశ్వాసంతో శపథపూర్వకంగా నాతో బంధిస్తున్నాను,మీరు ప్రభవును ప్రేమించగలరు"”- ఈ ఒప్పందంతో మోసెస్ జనాన్ని కన్నన్ వైపు - జనం అర్థం చేసికొన్నట్లు ఒప్పందంలో భాగమైన “మాట ఇచ్చిన భూమి” (౧7౦౫561206) వైపు - తీసికొని వెళ్ళాడు.అయితే “మాట ఇచ్చిన ఈ భూమి” ఉచితంగా లభించే బహుమతి కాదు.దానికోసం యుద్ధం చేయవలసి ఉంది.దీనివల్ల తేలిన దేమనగా-యాహ్యా యుద్ధదేవతగా ప్రతిజ్ఞ చేశాడు (మూట ఇచ్చాడు).
ఈ విధంగా మోసెస్ యూదులకు యాహ్యూ దేవతగా ఉన్న ఒక క్రొత్త మతాన్ని కన్నన్ అనీ 'మాట ఇచ్చిన భూమి” ఇచ్చాడు. ఈ భూమి తరవాత ఇస్రాయిలు, జూడా పంచుకొన్నాయి.అయితే మోసెస్ తరవాత ఈ మతం ఎన్నో తీవ్ర మైన ఆటంకాలను ఎదుర్కొంది; అది ఎంతవరకు అనగా యాహ్యూను జాతియొక్క దేవునిగా మరచిపోవడం కూడ జరిగింది.తరువాత వచ్చిన ఎలిజా,అమోస్, హొసీ,ఇసయ్యా,జెరిమియా మొద లైన ఎందరో మతప్రవక్తలు చేసిన గొప్ప ప్రయత్నాల ద్వారా ఈ మతం ఎన్నో కొత్త కొత్త రూపాలు ధరిస్తూ
నిలిచింది. ఈ మతానికి చాల పెద్ద దెబ్బ నెబ్యూషడనెజ్ఞార్వల్ల వచ్చింది. అతడు జరూసలెంలో ఉన్న యూదుల దేవాలయాన్ని పడగొట్టి యూదులను బాబిలోని
282 యూదుల మతం యాకు తరిమి వేశాడు. బాబిలోనియాలోని దేవతలు ఇంకా ఎక్కువ శక్తిమంతు లవడంతో యాహ్యూ పూజ పూర్తిగా అంతరించినట్లే అయిపోయింది. అయితే దాదాపు యాభై సంవత్సరాల తరువాత జరోష్టమతానుయాయి యైన సైరస్ బాబిలోనియాను జయించి యూదులకు వాళ్ల భూమి తిరిగి లభించే టట్లు చేశాడు. ఈ దేశాంతర ప్రవాసానికీ సైరస్ విజయానికీ ఫలితంగా యూదమతం బాబిలోనియాలోని కొన్ని సిద్ధాంతాలచేతా,జరోష్టమతంచేత చాలా ప్రభావితం అయింది. సతాన్ అను దుష్ట అసురునికి ఈ మతంలో కూడ ప్రవేశం లభించడానికి ఇదే కారణం. ఈ భావం జరోష్టర్ మతం నుంచి యూదమతంలోనికి నేరుగా వచ్చి చేరింది. ప్రవాసానికి పూర్వం యూదమతంలో ఈ దుష్పాసురప్రసక్తి లేదు. మత్రవక్తల పరంపరలో ప్రవాసానంతరం వచ్చిన డ్యూటో ఐసయ్యా (0౭46౦ 192%) అను ప్రవక్త- “యాహ్యూ ఒక్కడే దేవుడుమరాక దేవుడు లేడుఅని నిశ్చితంగా ఉద్దోషించడం ద్వారా యూదమతంలో ఉన్న ఏకేశ్వరవాదాన్ని ఒక నూతనౌన్నత్యానికి చేర్చాడు. “ఎన్నుకోబడిన జనులు” (౧6౦9ల) 6౦016) అనే దానికి కూడ అతడు క్రొత్త వ్యాఖ్యానం ప్రచారంలోనికి తీసికొని వచ్చాదు.దీనికి అర్ధం ఇస్రాయిల్ దేశీయులు మాత్రమే ఎట్టి నిబంధనలూ లేకుండా, ప్రయత్నమూ లేకుందా ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రులు అని కాక ఈశ్వరుని ఉపదేశాన్ని (ఆజ్ఞను) ప్రపంచం అంతటా వ్యాపింపచేయటానికి ఈశ్వరునిచేత నియమితులైన నిజమైన ఈశ్వరభక్తులు ఇస్రాయిల్దేశీయులే అని దీని అర్ధం అని ప్రచారం చేశాడు. మానవజాతి కంతకీ యాహ్యూ ఒక్కడే దేవుడు; ప్రపంచకం అంతా యాహ్యూ అధికారంలోనికే వస్తుంది. అయితే తన ఉపదేశాన్ని ప్రపంచం అంతటా చాటడం కోసం మాత్రమే ఈశ్వరుడు ఇస్రాయిలుదేశీయులను ఎన్నుకొనడం జరిగింది. ముక్తి కేవలం ఈ “ఎన్నుకొన్న జనులకే” కాదు. ఈశ్వరుని ఆజ్ఞను అంగీకరించి నైతికజీవనం గడిపే అందరికీ ముక్తి లభిస్తుంది. సహజంగా ఈశ్వరుడు గొప్ప క్షమాగుణం కలవాడు. పాపాత్ళు దైన మానవుణ్ణి సన్మార్గంలో వ్రపర్తింప చేయడానికై ఎల్లప్పుడూ వేచి ఉంటాడు. ఒప్పందం చేసికొని కూడ యూదులు యాహ్యాను మరచిపోయారు. అయినా కూడ వాళ్లు తన వైపు తిరిగి వచ్చేదాకా ఈశ్వరుడు నిరీక్షించాడు.ముఖ్యంగా-యూదమతం న్యాయం, దయ, ప్రేమ మొద
యూదుల మతం 2683 లైన ఉత్తమభావాలను బోధించే నైతికతాప్రధాన మైన మతం.భగవంతునితోను తోటి మానవులతోను నైతికసంబంధాలు నెలకొల్పుకొనడమే నిజ మైన మతం. ఈశ్వరునిలో ఉన్న నైతికసద్దుణాల అనుకరణమే దీని సారం. యూదమతంలోని మౌలికసిద్ధాంతాలు
-
ఈశ్వరుడు ఆవిష్కరించిన మతాలకి ప్రాచీనోదాహరణం యూదనతం. సాక్షాత్తు ఈశ్వరుడే తాను “ఎన్నుకొన్న జనులకు'మతసిద్దాంతాలు బోధించాడు. ఈశ్వరుడు మానవులతో మాటలాడి ముక్తికోసం అనుసరించనలసిన సన్మార్గం ఉపదేశించదానికి ఇది ఉదాహరణం.
-
ఇది ఒకే దేవుణ్ణి నమ్మే ఏకేశ్వరవాదం గల మతం. ఈశ్వరునికి కూడ ఒక వ్యక్తిత్వం (౧౬౪౭౦౧4110) ఉంది గాని ఇది మానవుని వ్యక్తిత్వం వంటిది కాదు. ఈశ్వరుడు చైతన్యమూ బుద్దీ ఉన్నపురుషుడు (6500). జనుల ప్రార్ధనలు వింటాడు,బదులు ఇస్తాడు.
-
సర్వశక్తత్వమూ, సర్వజ్ఞత్వమూ మొదలైన తత్ర్త్వవాదానికి సంబంధించిన (0160201%)/51020 లక్షణాలే కాక ఈశ్వరునిలో న్యాయం,దయ,జాలి,'ప్రేమ పవి(త్రత్వం మొదలైన. సద్గుణాలు కూడ ఉన్నాయి.
-
యూదమతంలో నైతికప్రవర్తనకు ఎక్కున ప్రాధాన్యం ఇవ్వబడింది. న్యాయం,దయ,వినయం మొదలైన గుణాలను మానవుడు అలవరచుకోవాలి. భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ ఆరాధించడం కూడ ఆవశ్యకమే అయినా భగవంతు డిచ్చిన ఆజ్ఞలను,ఆతడు విధించిన నియమాలను పాటించడం ద్వారా భగవంతునికి చేసే సేవ ప్రధాన మైనది.
ర్.జగత్తు ఈశ్వరునిచేత సృజించబడింది,భగవంతునిపై ఆధారపడి ఉంటుంది. ఇది నిందించదగినది కాదు.ఈ భూమిమీద నివసిస్తున్నందుకు మానవుడు తన కర్తవ్యాలను చక్కగా నిర్వర్తిస్తూ ధార్మిక జీవనం గడుపుతూ భగవంతు డుద్దేశించిన ప్రయోజనానికి సహకరించాలి.
6.యూదమతం ప్రకారం చాలమంది మతప్రవక్త లున్నారు.వారిలో అందరి కంటె గొప్పవాడు మోసెస్ అని ఈ మతం అంగీకరిస్తుంది.
284 యూదుల మతం 7.మంచివాళ్లు చెడ్డవాళ్లు అయిన దేవతలూ,కొన్ని భూతాలు (900139) ఉన్నాయని యూదమతం అంగీకరిస్తుంది. చెడ్డ భూతాల నాయకుడు సతాన్. ఇతడు ఒక గొప్ప దయ్యం.ఇతదే ప్రపంచకంలో చెడును వృద్ధిపాందిస్తూంటాడు. అయితే ఇతడు ఈశ్వరునికి లొంగనివాడు కాడు. 8.అత్మ మరణం లేనిది. అందుచేత ఈ శరీరం పోయిన తరువాత కూడ మరొక జన్మ ఉంటుంది. చివరికి ఆత్మ పునరుజ్జీవితమై చేసిన పుణ్యపాపాలను అనుసరించి స్వర్గానికి గాని నరకానికి గాని పంపబడుతుంది. 9.మానవుని నైతికప్రవర్తనకు ప్రాధాన్యం ఇచ్చినాయూదమతంలో ఎన్నో సంస్కారాలు మతసంబంధమైన ఉత్సవాలు, ప్రార్ధనాపద్ధతులు, ఆరాధనావిధానాలు చెప్పబడి ఉన్నాయి. ఈశ్వరుడు ఒక్కడే ఈశ్వరుడు. మరొక ఈశ్వరుడు లేడు. ఈశ్వరునికి ఒక ప్రత్యేక మైన వ్యక్తిత్వం ఉంది.అది మానవుల వ్యక్తిత్వం వంటిది కాదు.వానిలో చైతన్యమూ,ఇచ్చ మొద లైనవి ఉంటాయి.జగత్తులో ప్రతీ కార్యమూ ఈశ్వరుని ఇచ్చ (ప్రకారమే జరుగుతుంది. ఈశ్చరుడు మానవులతో మాట్లాడతాడు, వాళ్ల ప్రార్థనలను వింటాడు, వాటిని మన్నిస్తాడు. ఈశ్వరుడు సర్వశక్తుడు, సర్వజ్ఞుడు, సర్వగతుడు. సకలసద్దుణ సంపన్నుడు. పవి(త్రతమ్ముడు. జగత్తును సృజించి పాలిస్తాడు. ఆద్యంతాలు లేనివాడు. అనంతశక్తిమంతు డైనా కూదా కావా లని తన శక్తికి కొన్ని అవధులు నిర్మించుకొని మానవులకు స్వాతంత్ర్యం ఇస్తాడు. అంతటా వ్యాపించి ఉంటూ ఈ జగత్తుకు అతీతుడుగా కూడ ఉంటాడు.మానవుల మనసుకు గోచరించనివాడు. ఈశ్వరుడు చేసే పనులను మానవుడు అర్ధంచేసికొనజాలడు. ఈశ్వరుడు అనేకమార్దాలలో మానవులకు కనబడతాడు. తన పనుల ద్వారా మాత్రమే తెలియబదతాదు. ఈశ్వరుడు దయామయుడు. అందుచేతనే మానవులకు కొన్ని నియమాలు విధించాడు,పది ఆజ్ఞలు ఇచ్చాడు.ఎంత దయామయు డైనా పుణ్యాత్ములను అనుగ్రహించి నట్లు పాపాత్ములను శిక్షిస్తాడు. దయ,న్యాయమూ కూడ ఈశ్వరునిలో ఉండదంచేతనే యూదమతంలో ఈశ్వరుడు తండ్రిగాను,రాజుగాను వర్ణింపబడ్డాడు. అందుచేతనే
యూదుల మతం 285 ఈశ్వరుణ్జి ప్రార్ధించాలి ఆతనితో నైతిక మైన ప్రవర్తన ద్వారా న్యాయసంమత మైన సంబంధం ఏర్పరచుకోవాలి. ఈశ్వరుని పై పరిపూర్ణ మైన భక్తి ఉండడం ఎంత అవశ్యకమో,నైతిక మైన జీవనవిధానం అవలంబించడం కూడ అంత అవసరం. జగత్తు జగత్తు ఈశ్వరునిచేత సృజింపబడింది.అయితే ఈశ్వరు డీ జగత్తును, సామాన్యమానవుడు (బంగారం మొదలైన) ఒక వస్తువునుండి (ఉంగరం మొదలైన) వస్తువులను సృష్టించి నట్లు సృష్టించలేదు.ఏ పదార్ధమూ లేని శూన్యంనుందే సృష్టించాడు. ఈశ్వరుడు ఆకాశాన్నీ భూమినీ సృష్టించా లని అనుకొన్నాడు; అవి ఏర్పడ్డాయి. ఈశ్వరుని ఇచ్చచేతనే సృష్టి అంతా ఆరు రోజులలో జరిగింది. జగత్తు కాలంలో సృజింపబడింది. జగత్తు ఈశ్వరునితో పాటు ఎల్లప్పుడూ ఉన్నది కాదు. ఈ జగత్తు లేని కాలం ఉండేది. అప్పుడు ఈశ్వరు డొక్కడే ఉన్నాడు.అయితే కాలం పూర్వం ఉండే దని అర్ధంకాదు.కాలం కూడ ఈశ్వరునిచేతనే సృష్టింపబడింది. ఈశ్వరుడు కాలాతీతుడు. ఈశ్వరుడు జగత్తులో ఉంటాదు;దీనికి బైటి కూడా ఉంటాడు. ఎల్లప్పుడూ దీనికి సంరక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు.అందుచేత జగత్తు ఎల్లప్పుడూ పూర్తిగా ఈశ్వరునిమీద. ఆధారపడి ఉంటుంది. జగత్తులోని ప్రతీ వస్తువూ ఈశ్వరునిచేతనే సృష్టింపబడింది; ప్రతీ కార్యమూ ఈశ్వరుని ఇచ్చ ప్రకారమే జరుగుతుంది. జగత్తు సత్యం.దానిమీద ఉన్నంతవరకు మానవుడు నైతిక మైన ఉన్నతికొరకు నిరంతరం ప్రయత్నించాలి. ఈ భూమిమీద ఉన్నంతవరకే మానవునికి స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకొని మానవుడు చెడును విడనాడి మంచిని పెంచుకోవాలి. ఈ జీవితాన్ని ద్వేషించకూడదు. భగవంతుణ్ణి సేవించడానికి దొరికిన అవకాశంగా భావించాలి. ఈశ్వరుడు అంతటా ఉన్నా ఇస్రాయిల్ ఈశ్వరునికి అతిప్రియ మైన దేశ మనీ, ఇస్రాయిల్ దేశంవాళ్లు కూడ ఈశ్వరుని అధికథ్రేమకు పాత్రు లనీ, అందుచేతనే ఈ దేశంలోని జనుల ద్వారా ప్రపంచం అంతటా మంచిని వ్యాపింప చేయడానికి ఈశ్వరుడు వీళ్లనే ఎన్నుకొన్నా డనీ యూదుల విశ్వాసం.
286 యూదుల మతం మానవుడు “ఈశ్వరుడు మానవుణ్ణి తన ప్రతిబింబంగానే సృష్టించాడు”అనేది బైబిల్ చెప్పిన మానవుని గూర్చిన సిద్ధాంతం.మానవుడు చైతన్యరూపు డనీ ఈశ్వరుడు మానవునికి ప్రత్యేక మైన స్థానం ఇచ్చా డనీ దీని భావం. మానవుడు సృష్టియొక్క ప్రధానలక్ష్యం.అందుచేతనే ఇతడు చివరి రోజున సృష్టింపబడ్డాడు. చివరికి భూమి మీద మంచిని స్థిరంచేయడం అనే ఈశ్వరుని కార్యక్రమంలో మానవుడు సహాయ పడా లని ఈశ్వరుని అభిప్రాయం.మానవుని ప్రధానకర్తవ్యం ఈశ్వరుణ్జి అనుకరించడం. ఈశ్వరుడు పవిత్రతముడు.మానవుడు కూడ ఆ స్థితిని సంపా దించాలి. “ఈశ్వరుడు మానవుణ్ణి సృష్టించడానికి సిద్ధం అవుతున్నప్పుడు-'మానవు దెవరు? ఆతని కోసం నువ్వు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నావు?నీకు అతనితో పని ఏమి” అని ప్రక్క నున్న దేవతలు అడగగా ఈశ్వరు డెిలా సమాధానం చెప్పాడు - “మానవుడు లేకపోతే నా 'తోరా'ను,'అజ్ఞలను'ఎవడు పాలిస్తాడు?దీనిని . పట్టి మానవుని ప్రధానకర్తవ్యం నైతికజీవనం గడపడమే అని తెలుస్తూన్నది. ఈశ్వరుడు అనంతశక్తిమంతు దైనా, స్వేచ్చచేత తన శక్తిని తగ్గించుకొని మానవునికి స్వాతంత్ర్యం ఇచ్చాడు.అందుచేత మానవుని కర్మలకు బాధ్యత మానవునిదే.మానవుడు తనకే కాదు,తాను నివసిస్తూన్న సమాజానికి కూడ బాధ్యుడు. యూదమతం సంన్యాసాన్ని బోధించదు;కర్మణ్య మైన,(పేమభరిత మైన, ధార్మిక మైన జీవనాన్ని బోధిస్తుంది. మానవుడు స్వతందత్రుడు గాన తాను చేసిన పాపకృత్యాలకు తానే బాధ్యుడు. ఈశ్వరుడు దయామయు డవడంచేత వెంటనే మానవుణ్ణి వాని పాపాలకు దండించడు. అతడు సన్మార్గానికి రావచ్చు నని నిరీక్షించి చూస్తూ ఉంటాడు. అయితే పాపాచరణమే అలవాటుగా ఉన్న మానవుణ్ణి శిక్షిస్తాడు. మనఃస్ఫూర్తిగా మానవుడు తన పాపాలకు పశ్చాత్తాపం చెందితే మాత్రంవానిని = శిక్షించడు. స్వాభావికంగా చైతన్యస్వరూపు డవడంచేత మానవుడు ఈశ్వరునితో సమంగా రాశ్వతత్వాన్ని సంపాదించవచ్చు. ఈ ప్రపంచం శాశ్వతం కాదు; అలా అవడానికి శక్యం కాదు. అయినా మానవుడు మాత్రం తన పుణ్యంచేత శాశ్వతత్వాన్ని సంపా
యూదుల మతం 287 దించగలడు.“విశ్వాసవిహీను లైన కొందరు ఈ జగత్తు శాశ్వతం అని అంటారు. ఈ వాదం నిరాధార మైనది.నిజం ఏమి టనగా-ఈ జగత్తూ,ఈ జగత్తులో ఉన్న సర్వమూ కూడ ఉండవచ్చు.కాని తప్పక ఉంటుం దనదానికి వీలు లేదు.కేవలం ఈశ్వరుడు మాత్రమే ఉండాలి.మానవుడు తనను తాను మరచి నప్పుడు మాత్రమే (అహంకారం విడిచి నప్పుడు మాత్రమే) శాశ్వత మైన ఈశ్వరైకత్వంలో భాగం కావచ్చు.భగవంతునితో ఏకత్వాన్ని పంచుకోవా లంటే మానవుడు తనను తాను పూర్తిగా మరచిపోవాలి.అతడు ఆ స్థితిని పొంది నప్పుడు వాని ఆత్మ తప్పక ఉండేది అవుతుంది. శాశ్వతత్వాన్ని పొందుతుంది” (6.£.క.115). దౌష్ట్రము (7% దుఃఖము
ఈశ్వరుడు సర్వశక్తుడు,దయామయుడు,న్యాయం చేయువాడు. అలాం టప్పుడు ప్రపంచకంలో ఈ దౌస్ట్రము దుఃఖము ఎందు కున్నాయి అనుదానికి ఈ మతంలో కూడ సమాధానం చెప్పవలసి ఉంది. నైతికపతనానికి సంబంధించి నంతవరకు ఈ మతం చెప్పే సమాధానం ఇది-ఈశ్వరుడు మానవనికి స్వాతంత్రం ఇచ్చాడు; అందుచేత పాపకార్యాలు చేసినా పుణ్యకార్యాలు చేసినా బాధ్యత మానవునిదే.పాపం చేయడం అనగా ఈశ్వరుణ్ణి ఎదిరించడమే. ఇది బైబిల్లో ఉన్న మొదటి పాపానికి సంబంధించిన కథనుండి స్పష్టం అవుతుంది.ఈ కథ మానవునిలో ఉన్న పాపప్రవృత్తికీ, అతడు అనుభవించే దుఃఖానికీ కారణం ఏదో ఒక విధంగా చెప్పినట్లే. పాపానికి ఇచ్చిన శిక్షయే దుఃఖం.
ఈ అభిప్రాయం సమయసిద్దాంతంలో (దేవునితో ఒప్పందం చేసుకొనడం అనేదానిలో) నిగూఢంగా ఉంది. ఒప్పందం ఉల్లంఘించినవాళ్లకు శిక్ష తప్పదు. అయితే ఈ సమాధానం అంత సంతృప్తికరంగా ఉందదుుఎందువల్ల ననగా ఏమీ తెలియని అమాయకులు కూడ ఎన్నో దుఖాలు అనుభవిస్తున్నారు; దుప్పులు సుఖంగా ఉంటున్నారు.అయితే దుష్టులు సుఖాలు అనుభవిస్తూండడం చూచి విచారించ వలసిన పని లేదు.వాళ్లకు తగిన శిక్ష ఆలస్య మైనా,ఎప్పటి కైనా తప్పక లభిస్తుంది. ఈ సమాధానం కూడ అంతగా సంతృప్తికరంగా లేదు. అందుచేతనే దీనికి తగిన సమాధానం ఊహించడానికి శక్యం కాదని యూదమత [గ్రంథాలలో , అక్కడక్కడ
288 యూదుల మతం సూచన లున్నాయి.ప్రపంచకంలో దౌష్ట్రమూ,దుఃఖమూ ఉండడానికి కారణం ఏమిటో ఈశ్వరునికే తెలియాలి.
మానవుని విశ్వాసాన్ని పరీక్షించడంకోసమే దౌష్ట్రం ప్రపంచకంలో సృష్టింప బడింది అను సమాధానం కూడ ఈ మతంలో అక్కడక్కడ కనబడుతుంది. ఏ పాపమూ చేయకపోయినా జాబ్‌కు కష్టాలు కలగడానికి కారణం ఇలాంటి విశ్వాసపరీక్షయే అని జాబ్పుస్తకం (30001.05)00) లో చెప్పబడింది. “ప్రభూ! నే నెందుకు కష్టాలో ఉన్నానో నాకు చెప్పక్కుఎందువల్ల ననగా ఆ విషయం తెలుసు కొనడానికి నాకు ఏమాత్రమూ అర్దత లేదు. అయితే నీకోసమే కష్టాలలో చిక్కుకొని ఉన్నా నను నమ్మకం మాత్రం నాకు కలిగించు”
మానవుణ్ణి సరి యైన దారిలో నడపడానికి ఈ దౌష్ట్రమూ దుఃఖమూ, ఉన్నా యనీ,అందుచేత వీటిని గురించి పట్టించుకొనకూడ దనీ కూడ యూద మతంలో కొన్ని చోట్ల చెప్పబడింది.ఇవన్నీ ప్రేమభరితహృదయు డైన తండ్రి. కొడుకును చేసే నిందల వంటివి. ఇచ్చే శిక్షల వంటివి.వానిని సరియైన మార్గం లోనికి తీసికొనిరావడమే ఆ తండ్రి ప్రధానోద్దేశ్యం.
చెడు (దౌష్ట్రం) రాబోయే మంచికి సూచన అని కూడ యూదుల విశ్వాసం. ప్రతీ దౌష్ట్వానికీ వెనుక ఏదో మంచి ఉంటుంది. అందుచేత చెడుగును పూర్తిగా చెడ్డ దని భావించకూడదు. ప్రతీదీ మంచికొరకే.
ఈ విధంగా యూదమతంలో చెడుగును,దుఃఖాన్నీ గూర్చిన అనేక మైన అభిప్రాయా లున్నాయి. ఏది ఏమైనా ప్రపంచకంలో ఉన్న ఈ దోషాలకి కారణం ఈశ్వరుడే అని చెప్పవలసి ఉంటుంది.అయితే ఈశ్వరునిలో ఉన్న నిర్భయత్వం గాన్మిక్రూరత్వం గాని ఇందుకు కారణం అని చెప్పడం యుక్తం కాదు. ఈశ్వరుడు వీటిని ప్రపంచకంలో ఉండే టట్లు చేసినందుకు ఏదో ఒక్కృమానవుని ఊహకు అందని, ఈశ్వరునికి మాత్రమే తెలిసిన కారణం ఉండి ఉండాలి.
ఎట్టి పరిస్థితులలోనూ దౌష్ట్యాన్ని (చెడుగును) ఈశ్వరునికి ఆపాదించడానికి వీలు లేదు;దీనికి కారణం సతాన్ మాత్రమే అని కూడ యూదమతంలో ఒక నమ్మకం ఉంది.ఇది జరోష్టమతంనుండి ఈ మతంలోనికి వచ్చిన సిద్దాంతం.
యూదుల మతం 289 అయితే ఇది ఈశ్వరుడు సర్వశక్తుడు అను ప్రధాన మైన సిద్దాంతానికి విరుద్ధంగా ఉంది.ఎందుచేత ననగా సతాన్ కూడ ఈశ్వరునితో సమాన మైన ప్రభావం కలవాడై దయామయు దైన ఈశ్వరుడు సుఖానందాలకు హేతు వైతే తాను దుఃఖం కలిగిస్తున్నాడు అని చెప్పవలసి వస్తుంది.దీనివల్ల వకేశ్వరవాదానికి భంగం వస్తుంది. అందుచేత ఈశ్వరునికంటె చాల తక్కువవాడూ దుర్చలుడూ అయిన సతాన్ కొంతవరకు దౌష్ట్రానికీ క్లేశాలకూ కారణ మైనా,వాటిని పూర్తిగా తొలగించ కలిగిన సామర్ధ్యం గల ఈశ్వరుడు ఉపేక్షిస్తున్నా డంటే అందుకు మానవుని విశ్వాసాన్ని పరీక్షించడం వంటి,మనకు తెలియని కారణం ఏదో ఉండి ఉండాలి. మరణానంతరజీవితం
మరణానంతరజీవితం విషయంలో,యూదమతంలో నిశ్చిత మైన అభిప్రాయం ఉన్నట్లు లేదు. మరణంతో జీవితం పూర్తి కాదని విశ్వసించడంచేత ఈ మతంలో కూడ మరణానంతరజీవితం అంగీకరించవలసి ఉంటుంది. మరణించినవాళ్లు పునరుజ్జీవితు లవుతా రనీ తరువాత వచ్చే జగత్తులో వీళ్లు కూడ భాగస్వాములుగా ఉంటా రనీ విశ్వసించినా పునరుజ్జీవనం కేవలం పుణ్యకర్మలు చేసినవాళ్లకే ఉంటుం దనీ,పాపకర్శలు చేసినవాళ్లు శరీరం నశించడంతో నశిన్తా రనీ ఈ మతంలో ఒక వాదం ఉంది.ఈ వాదం (ప్రకారం పుణ్యాత్ములు మాత్రమే క్రొత్తగా ఏర్పడే లోకంలో, ఈశ్వరసంనిధిలో,దేవతలతో కలిసి సమస్త భోగాలూ అనుభవిస్తారు. ఇది స్వర్గలోకప్రాప్తి వంటిది. దీనిని పట్టి ఈ వాదంలో నరకప్రసక్తి లేదు,ఎందువల్ల ననగా దుష్టులు ఇక్కడనే నశించిపోతారు; వాళ్లకు పునర్జన్మ లేదు.
నిజానికి బైబిలులో కూడ స్వర్గ-నరకాలకు సంబంధించిన నిశ్చిత మైన అభిప్రాయం ఉన్నట్లు లేదు.ఈ భావాలు తరువాతి కాలంలో వచ్చినవి.జుడాయిజమ్ (14౫900) అను పుస్తకంలో (1.207 హెర్ట్ట్బెర్ ఇలా అన్నాడు. -“బైబిల్లోనే మానవుని కార్యరంగం ఈ పప్రపంచకం మాత్రమే అని చెప్పబడింది.స్వర్ష- నరకాలకు సంబంధించిన సిద్ధాంతం ఏదీ దానిలో లేదు.రోజు లన్నీ గడచిన తరవాత పునరుజ్జీవనం (0160412 1656గ60601%) జరుగుతుంది అను భావం మాత్రమే
290 యూదుల మతం కనబడుతుంది. పునరుజ్జీవనానికి సంబంధించిన వాదా లన్నీ బైబిలు తరవాతి కాలంలోనే బయలుదేరాయి. మరణించినవాళ్లకు పునరుజ్జీవనం ఉంటుంది అన్న పారసీల అభిప్రాయం మాత్రమే ఒక సాధారణాభిప్రాయంగా (గ్రహించ బడింది. మరణానంతరం ఎంతో కాలం తరవాత, ్రతీవ్యక్తివిషయంలోను చివరిరోజున న్యాయనిర్ణయం చేయబడుతుంది,అతడు స్వర్గానికి గాని నరకానికి గాని పంపబడతాడు అనే సిద్దాంతం కాలక్రమేణ ఆవిర్భవించి నిలద్రొక్కుకొంది”.
దీనిని బట్టి యూదమతంలో స్వర్గ-నరకాలను గూర్చిన అభిప్రాయాలు కొంత కాలం తరవాత వచ్చా యని స్పష్టం అవుతుంది. ఏమైనా ఈనాటి యూద మతంలో పునరుజ్జీవనసిద్దాంతం ప్రపంచం అంతా అంతమయిపోయిన ఆఖరు రోజున మరణించి భూమిలో పాతిపెట్టిన వాళ్లందరూ మళ్లీ ఒక్క సారి లేస్తా రనీ, ఈశ్వరుని నిర్ణయం ప్రకారం పుణ్యాత్ములు స్వర్గానికీ పాపాత్ములు నరకానికీ పంపబడి అక్కడనే ఉండిపోతా రనీ విశ్వాసించే సిద్దాంతం స్థిరపడి ఉంది.
అయితే పాపాత్ములు నరకంలో పన్నెండు నెలలు మాత్రమే ఉంటా రనే వాదం కూడ యూదమతంలో ఉంది. అందుచేత మరణానంతరజీవితాన్ని గూర్చి యూదమతం ఏమి విశ్వసిస్తుందో నిశ్చితంగా చెప్పడం కష్టం.అయినా కూడ ఖైబిల్ తరువాతికాలంలో యూదుల విశ్వాసం ప్రకారం న్యాయనిర్ణయదివసం ఒకటి ఉన్న దనీ, ఎప్పుడో మరణించి ఆనాడు లేచినవాళ్ల పుణ్యపాపాలలోని హెచ్చుతగ్గులను బట్టి ఈశ్వరుడు వాళ్లను స్వర్గానికి గాని నరకానికి గాని పంపడం ఉంటుం దనీ చెప్పవచ్చును.
యూదమతంలో పునరుజ్జీవనాన్ని గూర్చిన మరొక విశ్వాసం కూడ ఉన్నట్లు కనబడుతుంది. న్యాయనిర్హయదివసాన మరణించినవాళ్ల నందరినీ ఈశ్వరుని ఎదుట నిలబెట్టి నప్పుడు వాళ్ల కందరికీ ఈశ్వరుడు చికిత్స చేస్తాడు ఇతరులను హింసించిన వాళ్లకు మాత్రం చికిత్స చేయడు. ఈ చికిత్సకు అర్ధం స్పష్టంగా లేదు. మరణించిన నాటికి ఏ రోగాలూ,అంగవైకల్యాదులూ ఉందేవో వాటితోనే ఆ రోజున మృతు లందరూ లేస్తా రన్కీఇతరులను హింసించినవాళ్లు తప్ప మిగిలినవాళ్ల అందరి రోగాదులూ ఈశ్వరుడూ పోగొడతా దనీ అర్ధం అయి ఉండవచ్చును. ఈ చికిత్సలో
యూదుల మతం 291
క్షమించడం కూడ ఉంటుం దేమో తెలియదు.అది కూడ ఉన్నట్లయితే పాపాలకి
తగినశిక్ష ఇవ్వడం అనే మాటకు అర్ధం లేకుండా పోతుంది.ఈ విధంగా
మరణానంతరజీవితం విషయంలో యూదమతంలో నిశ్చితత్వం ఉన్నట్లు కనబడదు. మానవుని ప్రధానలక్ష్యం
స్టూనికి వెళ్లి అక్కడ ఈశ్చరునితోను దేవతలతోను కలిసి సుఖంగా ఉండడమే మానవుని ప్రధానలక్ష్యం. పుణ్యాత్ములకు మాత్రమే లభించే ఈ స్థితిలో శరీరం గాని,శారీరకచేష్టలు గాని ఉండవు.అక్కడికి చేరిన మానవులు కేవలం చిన్మయ శరీరాలతో పరిపూర్ణ మైన కాంతితో నిందిన వాతావరణంలో నివసిస్తారు. ఈశ్వరుడు చిద్రూపుడు (50111014). ప్రతీ మానవునిలోనూ కూడ ఆ చిదంశ ఉంటుంది. స్వర్గంలో ఉన్నది కేవలచేతనసమాజమే. ఈ చేతను లందరూ శాశ్వతంగా ఈశ్వర సంనిధిలోనే ఉంటారు. “అక్కడ తినడం, త్రాగడం,సంథానం కనబడం, అసూయ, పోటీలు, వ్యాపారాలు ఇలాంటి వేమీ ఉండవు. పుణ్యాత్ములు తమ శిరస్సులమీద ధరించిన కిరిటాలతో కూర్చొని ఉండి షేఖినాయొక్క వైభవాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు” (స్వర్గంలో జెహోవానుండి బయల్వెడలుతూన్న మవాతేజస్సుకు షేఖ్నా అని పేరు) (6.1.0.122,23).
ఈ భావాలనే మైమొనైడ్స్ క్రింది మాటలలో వివరించాడు-రాబోయే ప్రపంచంలో శరీరా లుండవు.కేవలం పుణ్యాత్ములు మాత్రమే దేవతల వలె శరీరాలు లేకుండా అక్కడ నివసిస్తారు. శరీరాల్లు లేకపోవడంచేత తినడం గాని (త్రాగడంగాని,శరీరంతో చేసే ఏ పనులూ గాని ఉండవు.కూర్చొనడం,నిలబడడం, నిద్రించడం,మరణించడం,దైన్యం,నవ్వడం మొదలైన శరీరసాధ్యమైన ఏ పనులూ కూడ ఆ క్రాత్త ప్రపంచంలో ఉండవు.” (6..9.123).అక్కడ ఉన్న వాళ్లు కిరీటాలు ధరించి ఉంటారు అన్నమాటలకు అర్ధం ఏమనగా ఏ జ్ఞానంయొక్క సాహాయ్యంచేత ఆ పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్లారో ఆ జ్ఞానమే వాళ్ల కిరీటం. యూదమతం బోధించిన తోరా, పది ఆజ్ఞలూ, పాటించిన పుణ్యాత్ములు మాత్రమే స్వర్గం చేరకలుగుతారు.వాటిని పాటించని పాపాత్ములు నరకానికి పంపబడతారు. వెనుకచూచి నట్లు పాపాత్ములు నరకంలో శాశ్వతంగా ఉండిపోతారా లేక
292 యూదుల మతం కొంతకాలం పాటు మాత్రమే ఆ నరకయాతనలు అనుభవిస్తారా అనేది స్పష్టం కాదు.జరోస్టర్ మతప్రభావంచేత యూద మతంలో నరకయాతనలు పాపాత్ములకు కూడ కొంతకాలం మాత్రమే అను విశ్వాసం కూడ ఉంది.ఏదో ఒక రోజున మెస్సయ్య (సర్వబాధానివారకు డైన మహాపురుషుడు) ఈ లోకానికి వస్తా దనీ, అందరికీ విముక్తి కలిగిస్తా దనీ యూదమత సిద్దాంతం, పై విశ్వాసానికి అనుకూలంగా ఉంది.ఆ మెస్సయ్య వచ్చిననాటినుండీ ఎవ్వడూ ఆకలితో బాధపడడు (ఆకలి ఉండదు) యుద్ద్ధా లుందవు;పట్టుదలలు విరోధాలు ఉండవు. అంతటా సాధుత్వం ప్రవహిస్తూ ఉంటుంది.అనంతసుఖా లుంటాయి.ప్రపంచం అంతా ఈశ్వరజ్ఞానంకోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. క్రైస్తవులు అలాంటి మిస్సయ్య క్రీస్తే అని అంటారు.యూదులు ఇది అంగీకరించరు. ఇస్రాయిల్ను అన్ని కష్పాలనుంచీ గట్టెక్కించే మిస్సయ్య ఇంకా రావలసి ఉందని వాళ్లు ఎదురు చూస్తున్నారు. యూదుల నైతికనియమాలు, ప్రార్ధనాదికము
యూదమతం చేసిన ప్రధానోపదేశం ఇమిటేషియో దెట్ (1216260 060 అనగా ఈశ్చరునిలో ఉన్న లక్షణాలను అలవరచుకొనడం.*మీ ప్రభువు నైన నేను ఎంత పవిత్రుడనో అంత పవిత్రంగా ఉండండిఅని ఈశ్వరుడు చేసిన ఉపదేశం. న్యాయం, దయ,ధార్మికత్వం,పవిత్రత్వం అనేవి ఈశ్వరుని లక్షణాలు. ఈ లక్షణాలను అలవరచుకొనడం మానవుని ప్రధానకర్తవ్యం. యూదమతం బోధించే ధర్మాలు-వస్తాలు లేనివాళ్లకు వస్త్రాలు ఇవ్వాలి.రోగులకు సేవలు చెయ్యాలి. ఎవరైనా మరణించి నప్పుడు వాళ్ల బంధువులను ఓదార్చాలి. శవాలు ఖననం చెయ్యాలి. దయతో పనులుచెయ్యాలి. తొరా ప్రేమతోను దయతోను చేసే పనుల నిర్దేశంతో (ప్రారంభం అవుతుంది, (ప్రమదయాకృతములైన పనుల వర్ణనతో ముగుస్తుంది. మీరు మధురమైన మాటలే మాటలాడాలి. తల వంచాలి.కళ్లు క్రిందికి దించి ఉండాలి.ష్ఫదయం పైకి ఉండాలి. ఎల్లప్పుడూ మీరు ఈశ్వరుని సమక్షంలో ఉన్నట్లు భావించాలి. గర్వం, అహంకారం,అసత్యం, ఏ అపరాధమూ లేనివాళ్లను చంపడం, చెడ్డ ఆలోచనలు,మోసం,కూటసాక్ష్యం,సోదరుల మధ్య కలహాలు పుట్టించడం- వీటిని ఈశ్వరుడు సహించడు వీటిని పూర్తిగా విడిచిపెట్టాలి మాటలో ఒక
యూదుల మతం 293 విధంగాను, మనస్సులో ఒక విధాంగాను చేతిలో ఒక విధంగానూ ఉండకూడదు. సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకనిని గూర్చి తెలిసినదానిలో మంచిని కప్పిపుచ్చి చెద్దను మాత్రమే చెప్పడం నిషిద్ధం. యూదమతం ప్రకారం ఎవరి నైనా దోషి అని నిర్ధరించ దానికి కనీసం ఇద్దరు సాక్షు లుండాలి.అప్పిచ్చి దానిమీద వడ్డీ తీసికొనడం ఈ మతంలో మహాపాపంగా పరిగణించబదుతుంది.బహుశా ఇన్లాం ఈ ధర్మాన్ని ఈ మతంనుంచే (గ్రహించి ఉంటుంది.హిందూమతం వలె యూదమతం కూడ కావలసినదానికంటె ఎక్కువ ధనధాన్యాదికం కూడబెట్టుకొనడం చాల చెడ్డ 'దని బోధిస్తుంది. లాభమాత్రదృష్టి గర్షణీయ మైనది.కేవలం ధనంమీద మాత్రమే ఆసక్తి గలవాడు ఈశ్చరునినుండి దూరమైపోయి చెడిపోతాడు;మొత్తం ప్రపంచాన్ని చెడగొడతాదు.
యూదమతంలో పవిత్ర మైన జీవనవిధానానికి చాల అవసర మైన పది ఉపదేశాలు ఉన్నాయి; వీటికి పది ఆజ్ఞలు (అ 00ుజుయులుట) అని పేరు. వీటిని ఇస్రాయిల్ ప్రజలకు బోధించవలసిందిగా చెప్పి జెహోవా మోసెస్‌కు ఇచ్చాడు.(1) నా ముందు నీకు మరొక దేవుడు ఎవ్వడూ ఉండకూడదు (2) నువ్వు విగ్రహా లేవీ నిర్మించకూడదు. (8) నువ్వనీ ప్రభువు (దేవుని) పేరు వ్యర్థంగా ఉచ్చరించ కూడదు. (4) సబ్బాత్ దివసాన్ని నువ్వు ఎల్లప్పుడు గుర్తుంచు కోవాలి. దీనిని పవిత్రంగా ఉంచాలి. (వారంలో ఏడవ రోజు, శనివారం రోజు, సబ్బాత్ దివసం. ఆ రోజున యూదులు అన్ని విధాలైన పనులూ కట్టిపెట్టివేసి ఈశ్వరారాధన చెయ్యాలి). (5) తలిదండ్రులను గౌరవించాలి. (6) నువ్వు ఎవరినీ చంపకూడదు (7) నువ్వు వ్యభిచారం చేయకూడదు (8) నువ్వు ఎవరి సొత్తూ దొంగిలించకూడదు. (9) నీ పొరుగింటివానికి విరుద్ధంగా కూటసాక్ష్యం చెప్పకూడదు. (10) నీ పొరుగింటివాని భార్యను గాని, సేవకుణ్ణి గాని, సేవకురాలిని గాని,ఎద్దును గాని,గాడిదను గాని, ఇతరవస్తువును గాని ఆశించ కూడదు. చివరి ఐదూ హిందూమతంలో బోధించిన జైనబౌద్ధమతాలలో కూడ గ్రహింపబడిన అహింసా- బ్రహ్మచర్య-అస్తేయ-సత్య-అపరి[గ్రహాలే.
యూదమతం నైతికమార్గప్రధానమత మైనా ఈశ్వరప్రార్ధనకూ, ఈశ్వరా
294 యూదుల మతం రాధనకూ కూడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. మానవుని సృజించడానికి ప్రయోజనం ఈశ్వరసేవయే అని చెప్పబడింది.ఇతర మైన ఆలోచన లేవీ లేకుండా మనః పూర్వకంగా ఈశ్చరుణ్ణి ప్రార్ధించడమే ఈశ్వరసేవ. ఈశ్వరుడు మానవుల ప్రార్థనలను వింటాడు. వాటికి .సమాధానం కూడ ఇస్తాడు.అయితే ఎల్లప్పుడూ మానవుడు కోరిన విధంగానే ఈశ్వరుని ప్రతిస్సందనం ఉండా లనే నియమం లేదు. ఈశ్వర విలాస అచింత్య మైనది. ఈశ్వరప్రార్థ్ధన మానవుని ఇష్టం ప్రకారం చేసేది కాదు. దీనికి కొన్ని కాలాలు విధించింది యూదమతం.మానవుడు ప్రాతఃకాలము, మధ్యాహ్నము,సాయంకాలము, ఈ మూడు కాలాలలోను కూడ తప్పక ప్రార్ధన చెయ్యాలి.యూదుల ప్రార్ధనలు భక్తిభరితాలుగాను, ఆత్మనివేదనపూర్వకాలుగాను ఉంటాయి.[ప్రార్ధన విషయంలో యూదమతం కాన్ని పద్ధతులను విధించింది.: క్ ప్రార్ధన చేసేవాడు తాను ఉచ్చరిస్తూన్న వాక్యాల అర్ధం తెలిసికొని ఉండాలి. 2. పదాలు సావధానంగా ఉచ్చరించాలి. 8. _ దేవతల నలె ఒక్క పాదంగా కనబడే టట్లు రెండు పాదాలు చాలా దగ్గరగా చేర్చి నిలబడాలి.తల కొంచెం వంచి,ఇటూ అటూ చూడకుండా కండ్లు మూసుకోవాలి.పుస్తకం చూచి ప్రార్ధన చేస్తున్నవాడు తన దృష్టిని ఆ పుస్తకంనుంచి మరల్చకూడదు.క్తుడి చెయ్యి ఎడమచేతిమీద ఉండే టట్లుగా చేతులు రెండూ గుండె మీద ఉంచుకొని, హృదయపూర్వకంగా, .. భ్రద్దాభక్తులతో,గుమ్మం దగ్గర నిలబడిన ముష్టివాని వలె,ప్రార్ధన చెయ్యాలి. 4. ఇస్రాయిల్లో కాక విదేశంలో ఉన్నవాడు ఇస్రాయిల్ వైపు తిరిగి ప్రార్ధన చెయ్యాలి.ఇస్రాయిల్లోనే ఉన్నవాడు జెరూసలెం వైపు తిరిగి (ప్రార్ధన చెయ్యాలి. దిక్కు సరిగా గుర్తింపజాలనివాడు తన హృదయం ఈశ్వరుని వైపు త్రిప్పి ప్రార్థన చెయ్యాలి. 56. వంగడం మొదలైనవి చేసే టప్పుడు వేరు వేరు శరీరవిన్యాసాలు (ఆసనాల వంటివి) చెప్పబడ్డాయి. సాధారణంగా చాలామంది కలిసి చేసే ప్రార్ధనలు సినగోగ్‌లలో (యూడుల దేవాలయాలు) చేస్తూంటారు. వైయక్తికప్రార్ధనలలోను సామూహికప్రార్థ్ధనలలోను
యూదుల మతం 295 ఏ మాత్రం భేదం లేదు.సామూహికపూజలలో లేదా సామూహికప్రార్ధనలలో ఎక్కువగా తోరాలోని కొన్ని ఘట్టాలు చదివి వింటూంటారు. ఇలాంటి సమావేశాలు సబ్బాత్ దివసాలలోను ఇతర ఉత్సవదివసాలలోను జరుగుతూంటాయి.
(ప్రారంభదశలో ఈ మతంలో ఆధ్యాత్మికపవిత్రత్వానికి ప్రాధాన్యం ఉండేది. కాలక్రమాన ఇతరమతాలలో వలెనే ఈ మతంలో కూడ అనేకవిధా లైన ఉత్సవాలు, పూజావిధానాలూ ప్రవేశించాయి.్రతీ యూదుడూ కూడ ప్రతిదినమూ మూడు సార్లు ప్రార్ధనలు జరపడమే కాకుండా ఈ క్రిందివి కూడ చెయ్యాలి. ప్రార్ధనా ప్రారంభంలో షెమాలోని మొదటి పంక్తులు చదవాలి.భోజనానికి ముందూ తరువాతా కూడ ఆశీర్వాక్యం పఠించాలి.మంచి దృశ్యాలు కనబడడం,శుభవార్త వినడం, మొదలైన ఆనందకర మైన సమయాలలో ఈశ్వరునికి కృతజ్ఞత చెపుతూ ఉండాలి.శరీరంమీద కొస లున్న వస్త్రాలు ధరించాలి. మతగ్రంథాలలోని ఘట్టాలు పారాయణచేస్తూ ఉండాలి.తోరాను ఊరేగిస్తూండాలి. ఇంకా ఎంతో కర్మకాండ ఈ మతంలోనికి ప్రవేశించింది.ఇప్పుడు యూదమతం కేవలం అనేకవిధా లైన కర్మకలాపాల అల్లికగా మిగిలింది.ఇది జీసస్ క్రీస్తు వచ్చినప్పుడు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చింది.
ప్రధానశాఖలు
యూదమతంలో వురాతననం(ప్రదాయవరులు (02040%), ఆభ్యుదయికులు (7027655170) అను రెండు శాఖలు బయలుదేరాయి.మోసెస్ అందజేసిన నియమాలను,తాల్మడ్ను “తుచి తప్పకుండా పాటించా అని సాంప్రదాయికు లంటారు.యూదుల వ్యవహారాలకు మతానికీ సంబంధించిన నియమాలను పొండు పకుస్తూ రాబ్చీలు (74090) కూర్చిన అరవైమూడు సంపుటాల ఒక (గ్రంథానికి తాల్మడ్ అని పేరు) ఆభ్యుదయికులు వీటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు.వీటి ప్రామాణ్యాన్ని కొంతవరకే అంగీకరిస్తూ వీళ్లు నైతికములు, మత సంబద్ధములూ అయిన నియమాలను పాటించడం విషయంలో వ్యక్తులకు స్వాతం(త్ర్యం ఉండాలి అని అంటారు. సాంప్రదాయికులు ఉత్సవాలకీ,కర్మకలా పాలకీ, పురోహితులు చెప్పే విధానాలకీ గ్రౌగంంళ్స? 1161209) ఎక్కువ ప్రాధాన్యం
296 యూదుల మతం ఇస్తే ఆభ్యుదయికులు ఈ మతానికి సంబంధించిన నిజమైన నైతిక-ఆధ్యాత్మిక అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు.
ఆభ్యుదయికులలో కూడ సంస్కర్తలు (1268000065) ఉదారులు (1061219) అనే రెండు శాఖ లున్నాయి. ఈ విభాగం ప్రధానంగా బ్రిటిష్ దేశంలో మాత్రమే ఉన్నట్లు కనబడుతుంది. అమెరికాలో ఉన్న యూదులలో సాంప్రదాయికులు, సంస్కర్తలు అను రెండు శాఖ లున్నాయి. ఈ రెండు శాఖలకు మధ్య శీ'ఘ్రపరివృత్తి విముఖులు (€౦౧౩ల౫&6౪ఆ) అను మూడవ శాఖ కూడ కనబడుతూన్నది. బ్రిటిష్ దేశంలో ఉన్న సంస్కర్తలు సంప్రదాయంమీద శ్రద్ధ లేనివాళ్తే అయినా సినగోలలో జరిగే పప్రార్ధనాదులకు కొంత విలువ ఇస్తారు. ఉదాసీను లైతే సాంప్రదాయికపద్ధతుల నుండి చాల దూరం అయ్యారు. అమెరికాలోని సంస్కర్తలు (బ్రిటిష్దేశంలోని ఉదాసీనులకు చాల దగ్గరగా ఉంటారు. వీళ్లకు సంప్రదాయం విషయంలో శ్రద్ధాభక్తులు చాల తక్కువ.యూదమతంలో అత్యధిక మైన అభివృద్ధీ మార్పులూ తీసికొనిరావా లని అంటూ వాళ్లు సంప్రదాయాన్ని అనుసరించరు. అమెరికాలోని పరివృత్తివిముఖులు(కన్సెర్వేటివ్స్) సంస్మర్తలకు సాంప్రదాయికులకూ మధ్య ఉంటారు.సాంప్రదాయికా లైన మతసంబద్దా లైన ఆచారాలకు చాలా విలువ ఇస్తూనే వీళ్లు అతిశీఘంగా వస్తూన్న మార్పులకు అనుగుణంగా ప్రవర్తిస్తూంటారు.
దీని నంతనీ పట్టి స్థూలంగా చెప్పా లంటే యూదులలో ఎట్టి మార్పులూ లేకుండా సంప్రదాయానుసారమే ఉండాలి అని చెప్పే సాంప్రదాయికులు,సంస్మరణ లను,నిర్మలీకరణనూ కోరేవారూ అని రెండు శాఖ లున్నా యని చెప్పవచ్చు.
క్రైస్తవ మతం
సెమిటిక్ (షమ్ వంశీయజాతుల) మతాలలో ప్రధానంగా పాశ్చాత్య దేశాలలో అత్యధికవ్యాప్తిని పొందినది, క్రైస్త్ర్రమతం. ఈ మతం జీసస్ చేసిన ఉపదేశాలను ఆధారంగా చేసికొని ఆవిర్భవించిన మతం. జీసస్ యూదుడు, కానీనుడు. అవివాహితకన్య యైన మేరీకి పుట్టినవాడు. ప్రధానంగా ఈ మతం ఏకేశ్వరవాదంగా కనబడుతుంది. అయితే ఈ మతంలో అంగీకరించిన మూర్తి త్రయాన్ని ౧౩౬00 పట్టి ఇది నిజ మైన ఏకేశ్వరవాదం అను విషయంలో సందేహం కలుగుతుంది. ఈ మతానికి,జీసస్కు ఈశ్వరునినుండి లభించిన తత్త్వావిష్కారమూ (1657614601) ఆతని లోకాతీత మైన అంతర్హష్టులూ (051806) మూలం అని క్రైస్తవులు చెప్పుకొంటారు. అయితే ఈ మతం యూదమతంనుండి అనేకవిషయాలను [గ్రహించిన దనే విషయం నిర్వివాదం.జీసస్ స్వయంగా యూదుడు.తాను మతసంబంధ మైన విషయాలు బోధిస్తూన్నప్పుడు తానేదో క్రొత్త మతం బోధిస్తున్నా నని ఆతడే ఎన్నడూ అనుకొనలేదు. అతడు చేసిన యత్నం అంతా కాలక్రమంలో యూదమతం చుట్టూ చేరిన మాలిన్యా న్నంతనీ దూరంచేయడంకోసమే.మనం వెనుక చూచి నట్లు మోసెస్ యూదులకు నైతికమార్ష్గప్రధాన మైన ఒక నిర్మల మైన మతం అందచేశాడు.అలాంటి మతంలోనికి యూదులు ఎన్నో కర్మకలాపాలు, పూజాది విధానాలు, మూఢ విశ్వాసాలు ప్రవేశపెట్టారు.జీసస్ కేవలం ఒక సంస్కర్త్రయొక్క పాత్ర వహించా లని మాత్రమే అనుకొన్నాడు. అయితే యూదమతానికి చెందిన కొన్ని విశ్వాసాలకు ఆచారాలకు విరుద్ధంగా ఆతడు చేసిన ఉపదేశాలను, కాలంలో జరిగిన కొన్ని యాదృచ్చికసంఘటలను పట్టి,ఇది ఒక కొత్త మతం అనీ,జీసస్ ఒక మతస్థాపకు దైన మతప్రవక్త అనీ ప్రచారం ప్రారంభం అయింది. ఆతడు తాను యూదు డనే అని సర్వదా చెప్పుకొంటూ జనులకు యూదమతోక్త జీవనవిధానాన్ని బోధించడంకోసం మాత్రమే ఎల్లప్పుడూ ప్రయత్నించాడు. మోసెస్ అందచేసిన ఆజ్ఞాదశకాన్ని (అ ౧౦౧ జాయుులట) యథాతథంగా స్వీకరించి తాను అంగీకరించిన ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు అను వాదానికి అనుగుణంగా వాటిని తన మాటలలో మళ్లీ బోధించాడు. ఒక విధంగా మోసెస్ అవలంబించిన పాత్రనే
298 కైసవ మతం తాను కూడ గ్రహించి యూదమతంలో చెప్పిన యదార్ధమైన ఈశ్వర స్వరూపాన్ని పునరుద్దాటించాడు. ప్రాచీనసమయం (014 76562096౧9 యూదులకు ఎంత ఆదరపాత్రమైన మత([గ్రంథమో క్రైస్తవులకు కూడ అంతే ఆదరపాత్ర మైన పవిత్రగ్రంథం. క్రైస్తవులుమాత్రం జీసస్ చేసిన బోధలతో నవీనసమయం (౫౯౫ "ఆ౪౫లాఫీ ఒకటి క్రొత్తగా ఏర్పరచుకొన్నారు. అందుచేత క్రైస్తవమతాని కున్న యూదమత వారసత్వం ఏ విధంగానూ కాదనడానికి వీలు కానిది. క్రైస్తవమతం ఇంకా కొంత ఉన్నతరీతిలో విస్తరింపబడిన యూదమతం అని మాత్రమే చెప్పవచ్చును. ఈ క్రింది రెండు వాక్యాలలో జీసస్ సంక్షిప్తంగా చెప్పిన అజ్ఞాదశకం గల ౧౦౧౫ జగయలం ట్) యూదమతంలోని తొరా యొక్క పునఃప్రతిపాదనమే అని చెప్పవచ్చును. (1) “నువ్వు హృదయ పూర్వకంగా నీ పూర్తి ఆత్మతో,నీ పూర్తి మనస్సుతో ఈశ్వరుణ్ణి ప్రేమించాలి” (2) “నువ్వు నీ పొరుగింటి వానిని నిన్ను ప్రేమించినట్లే ప్రేమించాలి”. కైస్తవమతం జీసస్‌ను గూర్చి వేరు వేరు విధాలుగా చెపుతుంది.జీసస్ ఈశ్వరుని పుత్రుడు అని సాధారణంగా క్రైస్తవ లంటారు. ఈశ్వరుని మాటలు జీసస్లో మాంసంగా అయిం దని వాళ్ల విశ్వాసం. (యూదమతంలోను ఇస్లాం మతంలోను ఈశ్వరుని మాట బుక్‌గా (సవిత్రగ్రంథంగా) అయిం దను విశ్వాసం ఉంటే క్రైస్త్వ్వమతంలో ఈశ్చరుని మాట జీసస్లోని మాంసంగా అయిం దను విశ్వాసం ఉంది. జీసస్ ఈశ్వరుని సత్య మైన మూర్తి (102486) అనీ, ఈశ్వరుని ప్రతినిధి అనీ, ఈశ్వరుని మూర్తిని జనులకు అందజేసిన మెస్సియా (4659120 = ఈశ్వర ప్రతిజ్ఞాతక్షేశవిమోచకుడు) అనీ మరొక విశ్వాసం. అతదే ఈశ్వరు దని ఒక మాటు అంటారు అతడు మానవు దని కొన్ని సందర్భాలలో అంటారు: ఒక విధంగా జీసస్-ఈశ్వర - మానవుడు (6064 %జు కైస్తవత్రిమూర్తులలో జీసస్ రెండవవాడు. (ఈ త్రిమూర్తి సిద్ధాంతం సత్య మైన కైస్తవదివ్యత్వానికి (01968 రగుఫగె లేదా నిజ మైన కాథలిక్ దివ్యత్వానికి సంబంధించినది). కొన్ని చోట్ల జీసస్ మానవులకు దివ్యసందేశం అందించడానికి దిగి వచ్చిన ఈశ్వరుని అవతారం అని వర్ణింపబడ్డాడు. అందుచేత జీసు చేసిన ఉపదేశా లన్నీ మానవులకు అందజేసిన యథార్థమైన దివ్యసందేశాలుగా పరిగణింపబడుతున్నాయి.
కైస్రవ మతం 299
ఇంతవరకూ మనం చూచినదానిని పట్టి - జీసస్ ఉపదేశాలను ఆధారంగా చేసికొని క్రైస్తవమతాన్ని రూపొందించి నట్లు చెప్పినా,ఈ నాడు ప్రచారంలో ఉన్న క్రైస్తవవిశ్వాసాలూ,ఆచారాలూ కేవలం జీసస్ ద్వారా మాత్రమే ఏర్పడినవే అనడానికి ఏ మాత్రమూ అవకాశం లేదు. క్రైస్తవమతం నేటి ఈ రూపంలో ఉండడానికి ఎంతో మంది సిద్దులు ($22026), రహస్యసాధనాపరులు (1౫566) బుద్ధిశాలులూ చాలా సహాయపడ్డారు. కైస్తవమతంమీద ప్రసరించిన, జీసస్కు వెంటనే వచ్చిన సైంట్ పాల్ యొక్క అత్యధిక మైన ప్రభావాన్ని తేలికగా తీసివేయడానికి వీలు లేదు.అందుచేతనే నిజంగా క్రైస్త్వమతం న్థాపించినవాడు పాలే కాని జీసస్ కాదు అని చాలమంది పండితుల అభిప్రాయం. కైస్తవమతం జీసస్ చేసిన బోధలను ఆధారంగా చేసికొని బయలుదేరినా మతంగా దీనికి ఒక నిశ్చిత మైన రూపం ఇచ్చినవాడు సైంట్ పాల్ మాత్రమే.ఇతడు జీసస్ బోధల నన్నింటినీ
(శద్దాభక్తి పూర్వకంగా (ప్రచారం చేయడంతో పాటు ఎన్నో ప్రధాన మైన తన
భావాలను కూడ ఈ మతంలో చేర్చాడు. అందుచేత ఈనాడు (ప్రచారంలోఉన్న
కైస్త్వవమతం జీసస్ చేసిన బోధలయొక్కా సైంట్పాలు చేసిన జోధలయొక్కా కలయికవలన ఏర్చడిన మతం అని చెప్పాలి. క్రైస్త్రమతంలోని మౌలికసిద్ధాంతాలు కైస్రవమతం జరోష్ట -యూదమతాలనుండే ఆవిర్భవించినా దీనిలో కూడ కొన్ని విశిష్టలక్షణాలు లేకపోలేదు.ఆ లక్షణాలు అతి సంక్షిప్తరూపంలో క్రింద చూపబడుతున్నాయి.
1... క్రైస్రవమతం ఒకే ఈశ్వరుణ్ణి విశ్వసించే ఏకేశ్వరవాదమతం.
-
ఈశ్చరుడు కూడ ఒక పురుషుడే (5౦:0). అయితే ఈశ్వరుని పురుషత్వం సాధారణమానవుని పురుషత్వం (6900200) వంటిది కాదు.ఇతనిలో చైతన్యమూూ,బుద్దీ (ఇచ్చ) ఉన్నాయి. ఇతడు పరిశుద్ధవేతనస్వరూపుడు.
-
ఈశ్వరుడు ఒకడే అయినా వీనిలో అంతర్గతంగా (1) త్రం్ధి సైన్స శ్యష్షగ్ణస్ష (6౦4 116 46అు, (2) పుత్రుడైన ఈశ్వరుడు (604 భా9ంగ) మ్య
300 కైస్త్రవ మతం మైన భూతం ౧16 ౧03 కష అను (త్రిమూర్యాత్మక మైన అంతర్గత విభేదం ఉంది. ఈశ్వరుడు మూడింటి సమాహారం 11౭౭ హ ౦౫అ).
4 ఈశ్వరుని పుక్రు డనీ,కొన్ని చోట్ల ఈశ్వరుడు పంపిన క్లేశవిమోచకు డనీ (04జకయ) అని చెప్పబడే జీసు ఈ మతానికి స్థాపకుడు. ఇతడు ఈశ్వరుని యథార్థస్వరూపానికి ప్రతినిధి మైన, భూమిమీద ఉన్న మూర్తి.
-
_ ఈశ్వరునిలో తాత్త్వికసిద్దాంతాలలో చెప్పిన,నైతిక మైన ఎన్నో లక్షణా లున్నాప్రధానంగా అతడు (ప్రేమభరితు డైన తండ్రివంటివాడు.
-
ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టించినవాడు; దీనిని పోషిస్తున్నవాడు. దీనిని నశింపచేయగలవాడు. ఈశ్వరు డీ జగత్తును ఏమీ లేని శూన్యంనుంచి సృజించాడు. ఎప్పుడు అనుకొంటే అప్పుడు దీనిని తన ఇచ్చానుసారం నశింపచేస్తాడు.
-
_ ఈశ్వరుడు మానవుణ్ణి తన ప్రతికృతిగా (000286) సృష్టించాడు. అందుచేతనే మానవునిలో గొప్ప శక్తి నిగూఢంగా దాగి ఉంది.అయితే మానవుడు తనకు ఈశ్వరుడు ప్రసాదించిన స్వాతంత్ర్యాన్ని దురుపయోగంచేసి పాపం చేశాడు. మొట్టమొదటి మానవు దైన ఆదమ్ చేసిన మొట్టమొదటి పాపమే మానవుని కష్టా లన్నింటికీ కారణం. ఈశ్వరుని ఆజ్ఞ పాలించకపోవటమే పాపం,
8 అయినా కూడ ఈశ్వరుడు సహజంగా కకుణామయు డవడంచేత మానవుణ్ణి ఏదో విధంగా ఉద్ధరించా లని కోరుతాడు. అందుచేతనే మానవులకు సరి యైన బోధలు చేసి వాళ్లని సన్మార్గంలో నడిపించడంకోసం జీసస్‌ను భూమి మీదికి పంపాడు. ఈవిధంగా జీసస్ మానవోద్దారకుడు.
-
_ ఈశ్వరుణ్జీ తన తోటి మానవుల్నీ వినయంతో హృదయపూర్వకంగా (పేమించడమే మతం.
-
(ప్రేమభరిత మైన,మనఃపూర్వక మైన నైతికజీవనం మానవుని ఉద్ధరించ డానికి చాలుతుంది.అయినా కూడ ఎలాంటి కార్యకలాపాలతో గాని పూజాదులతో గాని సంబంధం లేకుండా ఈశ్వరుణ్ణి హృదయపూర్వకంగా
కైసవ మతం 301 'ప్రార్ధించా లని కూడ కైస్తవమతం బోధిస్తుంది. ఈశ్వరుని అనుగ్రహానికి (ప్రధాన మైన ఫలం సముద్ధరణమే; మోక్షమే.
11... జైస్త్వవమతం ఆత్మకు మరణం,వినాశం లేదనీ,అందుచేత దీనికి శరీరం త్యజించిన తరవాత మరల జన్మ ఉంటుం దనీ విశ్వసిస్తుంది. ఈశ్వరుడు అందరి విషయంలోనూ న్యాయనిర్ణయం చేసే చివరి రోజు వస్తుంది.ఆ రోజున ఆత్మ లన్నీ పునరుజ్జీవితము లవుతాయి. అప్పుడు ఈశ్వరుడు ఆత్మల పుణ్యపాపాలను పరీక్షించి వాళ్లను స్వర్గానికీ నరకానికీ పంపుతాడు అనేవి కూడ కైస్రవమతానికి సంబంధించిన ప్రధాన మైన విశ్వాసాలు.
-
నరకానికి పంపబడినవాళ్లు ఎప్పటికీ దుఖం అనుభవిస్తూంటారు; స్పూనికి వెళ్లినవాళ్లు ఈశ్వరుని సన్నిధిలో శాశ్వతంగా అనేకసుఖాలు అనుభవిస్తారు.
-
స్వర్గంలో మంచి దేవతలూ,చెడ్డ దేవతలూ కూడ ఉంటా రని క్రైస్తవ మతం విశ్వసిస్తుంది.దుష్టదేవతల (ప్రభువు సతాన్.అత డొక దయ్యం ౧౧౪౪1). అతడే మానవుల్ని పాపాచరణకై ప్రోత్సహించి చెడుగును వ్యాపింపచేస్తాదు. ఆడం ఈశ్వరుని ఆజ్ఞను ఉల్లంఘించడానికి 'ప్రేరేపించినవాడు ఈ సతానే.అయితే ఇతడు ఈశ్వరునికి మించిన శక్తి కలవాడు కాదు.అతని వశంలోనే ఉంటాడు.అతడు నరకానికి అధిపతి.
ఈశ్వరుడు ఈశ్వరుడు ఒక్కదే.ఇద్దరు ఈశ్వరులు లేరు. ఈశ్చరుడు చైతన్యస్వరూపుడు. ఇచ్చ (బుద్ది) చైతన్యము ఉన్న పురుషుడు.అయితే అతడు సామాన్యప్రురుషునివంటి వాడు కాడు. ఈశ్వరుడు అనంతుడు సర్వశక్తుడు; సర్వగతుడు, సర్వజ్ఞుడు. ఈశ్వరునికి ఆది కాని అంతం కాని లేదు. అతడే జగత్తును సృజించి,పాలించేవాడు. ఈశ్వరుడు
ఈ జగత్తును సృజించేనాటికి ఇక్కడ ఏమీ లేదు.శూన్యంనుంచే ఈశ్చరుడు జగత్తును
సృజించాడు. అతడు ఈ జగత్తులోను,జగత్తుకు బైటా కూడ ఉన్నాడు.తనకు
తోచినప్పుడు అతడీ జగత్తును నశింపచేయగలడు. అతని స్వభావం అతిరహస్య మైనది. అప్పు డప్పుడు అతడు తనను కొందరికి రహస్యమయానుభవాల ద్వారా అవిష్మరించినా ఆతని పరిపూర్ణస్వరూపాన్ని ఎవ్వరూ తెలిసికొనజాలరు. ఈశ్వరుని
302 కైస్త్రవ మతం శక్తికి ఇది ఇంత అను కొలత లేదు.ఇది అనంతం. అయినా ఈశ్వరుడు తన శక్తికి కొంత పరిచ్చేదం,తానే విధించుకొని మానవునికి స్వాతంత్ర్యం ప్రసాదించాడు. ఈశ్వరుడు పరిపూర్చుడు. సాధుస్వభావుడు. అన్నింటికీ మించి ఈశ్వరుడు అనంతదయా-'ప్రేమ-మయుడు. ప్రేమయే ఈశ్వరుడు. ఈ విధంగా ప్రేమయే ఈశ్వరుడు, ఈశ్వరుడంటే (ప్రేమయే అనునది మాత్రమే శజ్రైస్తవు లంగీకరించిన ఈశ్వరునికీ యూదుల ఈశ్వరునికీ ఉన్న భేదం. ఈశ్వరుడు (ప్రేమించేవాడు, క్షమించేవాడు, చిరకాలం క్లేశాలను సహించేవాడు అను విశ్వాసం యూదమతంలో కూడ ఉంది. అందుచేత క్రైస్త్వ్వమతంలో విశేషం ఏమీ లేదు. అయినా ఈశ్వరుడు (ప్రేమా ఒకటే అని ఈశ్వరప్రేమల మధ్య అభేదాన్ని అనేకపర్యాయాలు జీసస్ బోధించాడు.ఇది కైస్తవేశ్వరుని కున్న విశిష్టలుక్షణం.యూదమతం ప్రధానంగా ఈశ్వరుణ్ణి మహాశక్తిశాలి అనీ,న్యాయమూర్తి అనీ చిత్రిస్తుంది. అయితే- ఈశ్వరుడు కోపం గలవాడు, పగ తీర్చుకొనే స్వభావం కలవాడు అని కూడ కొన్ని చోట్ల వర్దింపబిడ్డాడు. మరొక విషయ మేమనగా - “మీరు సరిగా సేవ చేస్తే మిమ్ములను ఉద్ధరిస్తాను” అని యూదుల ఈశ్వరుడు యూదులతో మాత్రమే ఒప్పందం చేసికొన్నాడు. అయితే కైస్తవేశ్వరుడు తన జను లందరినీ ఎలాంటి షరతూ లేకుండా ప్రేమిస్తాడు. ఈశ్వరునికి భయపడవలసిన పని లేదు. ఈ ఈశ్వరుడు ఉదారహృదయుడు. దయామయుడు. పశ్చాత్తాపం చెందిన మహాపాపాలు చేసినవాళ్లను కూడ క్షమిస్తాడు. ఈశ్వరుడు తన బిడ్డలను ఉద్ధరిస్తూంటాడు. ఇలా ఉద్ధరించదానికే అప్పు డప్పుడు తన వార్తాహరులను భూమిమీదికి పంపుతూంటాదు. తన చివరి మిస్సయ్యగా జీసస్‌ను పంపించాడు. ఆతని ద్వారా సన్మార్గం తెలిసికొని మానవు లందరూ శాశ్వత మైన సుఖం అనుభవించే స్థానాన్ని చేరుకోవా లసీ,శాశ్వతనరకబాధనుండి తప్పించుకోవా లనీ ఆ దయామయుని అభిలాష
జీసస్ తరువాత వచ్చిన సైంట్పాల్ ఆతని బోధలను చాల వరకు అంగీ కరించి ప్రచారం చేసినా కొన్ని నూతనాంశాలు కూడ కైస్త్రవమతంలో ప్రవేశ పెట్టాడు. ఈశ్చరుని విషయంలో కొన్ని యూదమతంలో చెప్పిన విషయాలను కూడ చేర్చాడు. ఈశ్వరుడు కేవలం (పేమస్వరూపుడు అని జీసస్ అంటే పాల్ - ఈశ్వరుడు కోపం గలవా డనీ,న్యాయమూర్తి అనీ,అర్థం చేసికానడానికి శక్యం
'శైస్త్రవ మతం 303 కానివా డనీ కూడ చెప్పాడు.పిల్లలయందు చాల ప్రేమ గల తండ్రి ఏ విధంగా అప్పు డప్పుడు వాళ్లపై కోపం చూపి వాళ్లను శిక్షిస్తూంటాడో అలాగే ఈశ్వరుడు కూడ మానవుల విషయంలో ప్రవర్తిస్తాడు. ఈ విధంగా చెప్పడంచేత కైైస్తవుల ఈశ్వరుని మౌలికమైన ప్రమమయత్వంలో అంతగా ఏమీ భేదం రాలేదు. ఏకేశ్వరవాదానికి మాత్రమే జ్రైస్తవమతంలో ప్రాధాన్యం ఉన్నాకొన్ని చోట్ట, ప్రధానంగా కాథలిక్ సంప్రదాయంలో, ఈశ్వరుడు మూర్తిత్రయస్వరూపుడుగా వర్ణించబడ్డాడు. ఈ వాదానికి మూర్తిత్రయ (౩119 వాదం అని పేరు.తండి యైన ఈశ్వరుడు,పుత్రు దైన ఈశ్వరుడు, పవిత్రభూతమూ (604 €6 ౯2026, 6౦4 16 50%, [1017 5ంహఖ) అనేవి త్రిమూర్తులు. జీసస్ రెండవ మూర్తి పవిత్రభూతం ((ఢేమదేవత) మూడవ మూర్తి. పవిత్రభూతం తండ్రినుండీ పుత్రునినుండీ ఆవిర్భవించినది. ఈ త్రిమూర్తిసిద్దాంతం ఒక పెద్ద రహస్యం (007569609౧; అయినా కూడ కాథలిక్ సంప్రదాయంవాళ్లకి ఇది ఒక నిశ్చితంగా ఆవిష్కరించబడిన సత్యం. తప్పక అంగీకరించి అనుసరించవలసిన విశ్వాసం. శైస్త్రవసంఘం (య6) లో సభ్యత్వానికి ఇది తప్పనిసరి యైనది.
ఈ మూర్తిత్రయసిద్దాంతం క్రైస్తవమతం ఏకేశ్వరవాదం అను విషయంలో సందేహాలకు హేతు వైనది. ఇస్లాంమతస్థాపకు డైన మహమ్మద్ క్రైస్తవమతాన్ని ఈ సిద్దాంతం అంగీకరించినందుకు ఆధిక్షేపించాడు. ఈ సిద్దాంతం ఈశ్వరుని ఏకత్వానికి భంగం కలిగిస్తుం దనీ,అందుచేత దీనిని అంగీకరించిన కైస్తవవా దం ఏకేశ్వరవాదం కాజాల దనీ ఆతడు అభిప్రాయపద్దాడు.కాని దీనివల్ల తమ ఏకేశ్వర వాదాని కేమీ భంగం లేదని క్రైస్తవులు ఎంతో పట్టుదలతో వాదిస్తారు.
అథెనీషియాలోని క్రైస్తవశాఖ ట్రిమూర్తివాదాన్ని చాల గట్టిగా సమర్థిం చింది- *...కాథలిక్‌ల విశ్వాసం ఇది- మేం మూర్తిత్రయంలో ఒక ఈశ్వరుణ్ణి పూజిస్తాం,ఏకత్వంలో మూర్తిత్రయాన్ని పూజిస్తాం.అలా చేసినా ఆ మూర్తులను ఒకదానితో ఒకటి కలిపివేయం,ఒక వస్తువును విభజించం, ఎందువల్ల ననగా తండ్రి మూర్తి ఒక టుంది,పుత్రుని మూర్తి ఒక టుంది, పవిత్రభూతంమూర్తి ఒక టుంది.ఐతే తండ్రి,పుత్రుడు,పవిత్రభూతం - ఈ మూడింటి ఈశ్వరత్వం (806 646) ఒక్కటే.వీటి ప్రభావం సమసద్భశం,మహత్త్వం సమశాశ్వతం - అనగా
304 కైస్ర మతం మూడింటి ప్రభావ-మహత్ర్త్యాలు ఒకే విధ మైనవి. తండ్రి ఎట్టివాడో పుత్రు డట్టివాడు,పవిత్రభూతం కూడ అట్టిది.తండ్రి అచింత్యస్వరూపుడు; పుత్రుడు అచింత్యస్వరూపుడు,పవిత్రభూతం అచింత్యస్వరూపం గలది.తండ్రి శాశ్వతుడు; పుత్రుడు శాశ్వతుడు; పవిత్రభూతం శాశ్వతం. అయినా కూడ వాళ్లు శాశ్వత మైన మూడు వస్తువులు కాదు;శాశ్వత మైన ఒకే వస్తువు... అందుచేత తండ్రి ఈశ్వరుడు, పుత్రుడు ఈశ్చరుడుపవిత్రభూతం ఈశ్వరుడు. అయినా వాళ్లు ముగ్గురు ఈశ్వరులు కాదు. ఒకే ఈశ్వరుడు”.
“క మూర్తిత్రయంలో ఒకరు ముందు ఒకరు తరువాత అనే మాట లేదు. ఏ ఒక్కడూ మిగిలిన ఇద్దరికంటె గొప్పవాడు కాదు తక్కువవాడు కాదు.అందరూ సహ-శాశ్వతులు,సహ-సములు, అందుచేత అన్నింటిలోను త్రయంలోని ఏకత్వమూ, ఏకత్వంలోని త్రిత్స్వమూ ఆరాధించాలి. రక్షణ కోరేవాడు మూర్తిత్రయాన్ని గూర్చి ఈ విధంగా అర్ధం చేసికోవాలి” (0.[.2.136)
జగళ్తు
జగత్తు ఈశ్వరుని సృష్టి ఈశ్వరుడు దీనిని శూన్యంనుంచి పుట్టించాడు. సృష్టి విషయంలో ప్రాచీనసమయంలో (014721౫6౧0 లో చెప్పినదానినే క్రైస్తవమతం అంగీకరిస్తుంది. ఈశ్వరుడు మొత్తం సృష్టి అంతా ఆరు రోజులలో చేశాడు. ముందుగా స్వర్గాన్నీ భూమినీ సృష్టించాడు.మిగిలిన వన్నీ ఆరు రోజులలో సృష్టించాడు. అన్నీ సృష్టించిన తరువాత,ఆరవ రోజున ఈశ్వరుడు మానవుణ్ణి సృష్టించాడు. ఏడవ రోజున సృష్టిని నిలిపేసి విశ్రాంతి తీసికొన్నాడు. జగత్తును సృష్టించిన ఈశ్వరుడే దీనిని నిలుపుతున్నాడు, రక్షిస్తున్నాడు. శూన్యంనుండి పుట్టినా జగత్తు సత్యమే. మంచివా దైన ఈశ్వరునిచేత సృష్టింపబడడంచేత ఈ జగత్తులో కూడ అంతటా మంచియే సహజంగా ఉంది.అయితే జగత్తు శాశ్వతం కాదు; ఒక కాలంలో పుట్టింది ఏదో ఒక కాలంలో ఈశ్వరుని ఇచ్చ ప్రకారం తప్పక నశిస్తుంది. ఈశ్వరుడు సృష్టించిన ఈ జగత్తును నిందించకూడదు,విడిచిపెట్టకూడదు.
జగత్సృష్టి విషయంలో రెండు ప్రశ్న లుదయిస్తాయి: శూన్యం నుండి జగత్తు ఎలా పుట్టింది? శూన్యంనుంచి ఏదీ పుట్టదు కదా? (2) ఈశ్వరుడు దీనిని ఒక కాలంలో సృష్టించా దంటే సృష్టికి పూర్వం కాలం అనేది ఉందని చెప్పవలసి
'కైస్తవ మతం 305 ఉంటుంది కదా? అగస్టైన్,అక్వినస్ మొదలైన తత్త్వవేత్తలు ఈ ప్రశ్చలకు సమాధానం అన్వేషించడానికి చాల ప్రయత్నించారు. ఈశ్వరుడు సర్వసమర్హుడు.అతడు ఏమైనా చేయగలడు. సామాన్యమానవులు శూన్యంనుండి దేనినీ సృష్టించజాలక పోయినా ఈశ్వరుడు సృష్టించడంలో ఆశ్చర్యం లేదు.ఇంక కాలం విషయం.కాలం సృష్టికి పూర్వం లేదు.జగత్తూ కాలమూ కూడ ఒకే మారు సృష్టింపబడ్డాయి అని (గ్రహించాలి.దీనికి క్రైస్తవుల విశ్వాసమే (య96జ 21% ప్రమాణం.ముందుగా స్వర్గభూలోకాలను సృష్టించి నట్లు చెప్పినా వాటితో పాటు కాలాన్ని కూడ సృష్టించా దని అర్ధం చేసికోవాలి. మానవుడు
సృష్టి చివరి రోజున ఈశ్వరుడు మానవుణ్ణి తన ్రతికృతిగా (0289) సృష్టించా దని జెనిసిస్ (ఓల్డ్ టెస్టామెంటులోని సృష్టిని గూర్చి చెప్పే మొదటి బుక్) చెపుతున్నది. దీనిని పట్టి రెండంశాలు స్పష్టం అవుతున్నాయి. (1) మానవుడు సృష్టికి చిట్టచివర సృజింపబడ్డాడు గాన ఇతడు సృష్టియొక్కఫలం. (2) ఈశ్వరుని ప్రతికృతి గాన ఈశ్వరుని దృష్టిలో కూడ చాలా ప్రాధాన్యం గలవాడు. ప్రపంచకంలో (వ్రేయఃసామ్రాజ్యం (౧10840 0[ 606) స్థాపించడంలో తనకు సహకరించే భాగస్వామినిగా ఈశ్వరుడు మానవుని సృష్టించి ఆతనికి బుద్ధి,అంతర్జష్టి జ్ఞానము మొద లైన కావలసిన అన్ని గుణాలూ ఇచ్చాడు.వానిని తనవలెనే చైతన్యరూపునిగా నిర్మించాడు. నశించే శరీరంలోపల నాశరహిత మైన ఆత్మను కూడా మానవుని కిచ్చాడు.అయినా కూడ మానవుని ఆత్మ సాంత మైనది;దివ్యమైన అనంతత్వం దీనికి లేదు.సహజంగా మానవుడు సర్వసమర్థుడు;అయినా కూడ ఈశ్వరుని కున్న పరిపూర్ణత్వాన్ని మానవుడు పొందజాలడు. ఎంతటివా డైనా మానవుడు ఈశ్వరునిచేత సృష్టింపబడినాడు గాన ఈశ్చరునిమీద ఆధారపడక తప్పదు.
మానవుడు ఈశ్వరుడు చూపిన 'ప్రేమ-దయామార్థాలను అనుసరించాలి. ఆ మార్గంనుండి తొలగితే పాపాత్ముడుగా పరిగణింపబడతాడు. ఉదారస్వభావం గల తండ్రిగా ఈశ్వరుడు స్వాతంత్ర్యం ప్రసాదించాడు.అందుచేత మానవుడు తన కర్తవ్యాన్ని తానే నిర్ణయించుకొని అందుకు తగినట్లుగా పనులు చేయగలడు.
306 కైస్రవ మతం అయితే దుష్మార్యాల వైపు వెడితే పాపాత్ళు డౌతాడు. ఈశ్వరుడు బోధించిన సన్మార్గం వైపు వెడితే పుణ్యాత్ము డవుతాడు. మొట్టమొదటి మానవు దైన ఆడం ఈశ్వరుని ఆజ్ఞ ఉల్లంఘించి పాపం చేశాడు.అది మానవజాతి కంతకీ సంక్రమించిన మొట్ట మొదటి పాపం (0:121419%0)దానితో మొత్తం మానవజాతి అంతా కష్టాలలో పడింది. అయితే వాత్సల్యభరితు దైన తండ్రిగా ఈశ్వరుడు మిమ్మల్ని ఉద్దరిస్తాను అని మాట ఇచ్చాడు.ఆ ప్రకారం మానవోద్ధరణకై జీసస్‌ను భూమిమీదికి పంపాడు. జీసస్ బోధలను అనుసరిస్తే మానవుడు ఈ కష్టాలనుండి తప్పక విముక్తి పొందు తాడు. ఆడం పతనానంతరం కూడ మానవుని సహజశక్తి పూర్తిగా నశించలేదు; అది చాల తగ్గిపోయింది. ఈశ్వరుని అనుగ్రహంచేత మానవుడు మళ్లీ తన సహజశక్తిని పొందకలుగుతాడు. అందుకు అతడు చేయవలసిన దల్లా జీసస్ బోధలు ఆచరిస్తూ హృదయపూర్వకంగా ఈశ్వరుణ్జీ,తోటి మానవుజణ్ణీ ప్రేమించాలి. దౌష్ట్రము - దుఃఖము (272 16 5జ648లగ8ల్ర)
ఈశ్వరుడు ప్రధానంగా దయా - (పేమమూర్తి యైతే, తండ్రి వలె వాత్సల్య పూర్చు దైతే, ఆతడే సృజించిన మానవునికి ఇన్ని కష్టాలూ దుఃఖమూ ఎక్కడినుండి వచ్చాయి అనే ప్రశ్న కలుగుతుంది. ప్రారంభంలో జైస్త్రవమతం ప్రపంచంలో ఉన్న ఈ దౌప్టానికీ క్లేశాలకీ కారణం సతాన్ అని సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది. అదంత సంతృప్తికర మైన సమాధానం కాదు. ఎందువల్ల ననగా-- అప్పుడు ఆ సతాను ఈశ్వరునికి లొంగి ఉంటాడా స్వతంత్రుదా అను ప్రశ్న ఉదయిస్తుంది. స్వతంత్రుడు అని అంటే ఈ దుఃఖా లన్నింటికీ ఈశ్వరుడు బాధ్యుడు కాదని చెప్పడానికి వీలున్నా ఈశ్వరుని సర్వశక్తత్వానికి భంగం వస్తుంది. ఓల్డ్టెస్టా మెంటులో సతాన్ స్వతంత్రు డైన దుష్టబుద్ధిగల లోకకంటకుడు అని చెప్పలేదు. అతదు ఈశ్వరుని ఆస్థానంలో ఒక సభ్యు దనీ,జనులకు ఈశ్వరునియం దున్న భక్తినీ, విశ్వాసాన్నీ పరీక్షించడం కోసం అతడు వాళ్లచేత చెడ్డపనులు చేయించి వాళ్లకు కష్టాలు కలిగిస్తా దనీ చెప్పబడింది. ఈశ్వరుదే మానవుల భక్తిని పరీక్షించడం కోసం బాధలు కల్పిస్తా దని యూదమతంలో అంగీకరించి నట్లు వెనుక చూచాం. అయితే తరువాతి కాలంలో - సతాన్ ఒక తిరుగుబాటుచేసినవాడుగా చిత్రించ
కైస్త్వవ మతం 307 బడ్డాడు.అతడు ఈడెన్ ఉద్యానంలో ప్రవేశించి ఆడం ఈశ్వరుని ఆజ్ఞకు విరుద్దంగా ఆచరించే టట్లు చేశాడు.ఆడం చేసిన పాపం మానవజాతిపొపానికి కారణం అయింది.ఈ విధంగా ఇప్పుడు, సతాన్ చేసిన దుష్టప్రేరణ, ఆడం తన కిచ్చిన స్వాతంత్ర్యాన్ని చెడ్డగా ఉపయోగించడం అనే రెండు అంశాలు కష్టాలకు కారణం అని తీలింది.అయితే ఇక్కడ కూడ ఈశ్వరునికి వాళ్లిద్దరినీ అలా చేయకుండా చూచే బాధ్యత లేకపోలేదు. అందుచేత క్రైస్తవమతం ఈ రెండు పద్ధలనూ విడిచి పెట్టి ఈశ్వరుడే దుఃఖానికి బాధ్యు డనీ,అయినా తన సర్వశక్తత్వాన్ని నిరూపించు కొనడంకోసం ప్రయత్నిస్తున్నా దనీ చెపుతూ మరొక సమాధానం అన్వేషించింది. మానవుని కష్టాలకి సతాన్యొక్క రాక్షసప్రకృతియే కారణ మైనా దానిని అడ్డుకొన దానికి ఈశ్వరునికి సామర్ధ్యం లేకపోలేదు.కాని భగవంతుడే ఒక విధ మైన నియమబద్ధతను అలవర్చడంకోసం ఈ కష్టా లన్నీ ఉండే టట్లు చేస్తున్నాడు.“మీరు ఇదొక నియమబంధం (4000) అనుకొని సహించాలి. ఈశ్వరుడు మిమ్ములను పుత్రులనుగా చూస్తున్నాడు (పెంచుతున్నాదు).తండ్రి నియమబద్ధత నేర్చని పుత్రు డెక్కడదైనా ఉంటాడా?” (హెబ్రూస్ [600649 12:3). ఈ విధంగా క్రైస్తవమతం దుఃఖం విషయంలో సాధనత్వదృష్టిని అవలంబిస్తూన్నట్లు కనబడుతుంది. కష్టాలు ఈశ్వరుని చేతిలో ఉన్న దండించే బెత్తం వంటివి; నియమబద్ధత అలవడే టట్లు ఇవ్వబడిన ఈ కష్టాలను గూర్చి విచారించకూడదు; మౌనంతో సహించాలి.ఈ సమాధానం సైద్దాంతకంగా (ంం16402క్రే0 ఈశ్వరుని సర్వజ్ఞత్వానికి భంగం లేకుండాను, ప్రాయోగికంగా (0206020) మానవుడు తప్పనిసరిగా వచ్చి తనమీద వచ్చి పడుతూన్న కష్టాలను గూర్చి ఏదో విధంగా సరిపెట్టుకొని విచారిస్తూ కూర్చొనకుండా ఉండడానికీ ఉపయోగిస్తుం దని వీళ్ల విశ్వాసం.జీసస్ వంటివాడు కూడ అన్ని కష్టాలకు లోనై చివరికి విజయం సాధించడం ఈ సమాధానానికి (ప్రబలప్రమాణంగా వీరు చూపుతారు.జీసస్‌ను అనుకరిస్తూ కష్టాలను అనుభవించడం తప్పక మంచికే దారి తీస్తుంది. ఈ విధంగా దౌష్టుదుఃఖాదులను గూర్చి కైస్తవుల అభిప్రాయం సంక్షిప్తంగా చెప్పా లంటే- వీటికి సతానూ,తన స్వాతంత్ర్యాన్ని సరియైన పద్ధతిలో ఉపయోగించుకొని మానవుడు ఇద్దరూ కూడ కారణమే.ఇది ఇలా జరగకుండా చేయడానికి సర్వవిధాలా సమర్భు దైనా కూడ
308 కైస్త్రవ మతం ఈశ్వరుడు భవిష్యత్తులో కలుగబోయే మంచిని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ఉపేక్షించాడు. మరణానంతరం జీవితం మానవుని ఆత్మ మరణరహిత మైనది.శరీరం నశించినా ఆత్మ నశించదు. అందుచేత శరీరపతనానంతరం కూడ మానవులు చివరి న్యాయనిర్ణ్హయదివసం వరకు వేచి ఉంటారు.ఆ రోజున వాళ్ల వాళ్ల పుణ్య - పాపకర్శలను బట్టి స్వర్గానికి గాని నరకానికిగాని పంపబడతారు. ఇంతవరకు క్రైస్తవమతం జరోష్టమతంలోను, యూదమతంలోను చెప్పినదానినే అంగీకరించింది.కొన్ని అంశాలలో మాత్రమే భేదం ఉంది. ప్రపంచం పూర్తిగా నళించిన చివరిరోజున అంతవరకు దేహాలు లేకుండా పడి ఉన్న మానవాత్మలు మళ్లీ వాటి పూర్వశరీరాలలోనికి (ప్రవేశిస్తాయి. ఈ ప్రపంచం ఏ రోజున పూర్తిగా అంతం అవుతుంది అనేది కేవలం ఈశ్వరునికి మాత్రమే తెలుసును. అయితే ఈ ప్రపంచసర్వవినాశానికి ముందు క్రీస్తు న్యాయ నిర్ణేతగా మళ్లీ వస్తాడు; అందరినీ ఉద్దేశించి ఉపదేశం చేస్తాడుయూదులు పూర్తిగా ఈ మతానికి పరివర్తింపబదతారు;ప్రకృతిలో అసాధారణ మైన సంక్షోభం కలుగుతుంది. శరీరాలలో ప్రవేశించిన ఆత్మ లన్నీ ఈశ్వరుని ఎదుట నిలబెట్ట బడినప్పుడు అతడు వాళ్ల పుణ్యపాపాలను అనుసరించి వాళ్లను స్వ్లానికీ నరకానికీ పంపుతాడు.జీసస్ బోధల ప్రకారం జీవనం గడపినవాళ్లకి శాశ్వత మైన స్వర్షం,అలా కానివాళ్లకి శాశ్వత మైన నరకం లభిస్తుంది. పుణ్యాత్ములు స్వర్గంలో ఈశ్వరుని సంనిధిలో సుఖా లనుభవించగా పాపాత్ములు ఈశ్వరునికి దూరమైపోయి కష్టా లనుభవిన్తారు. అయితే-మానవుని ఆత్మ ఈ శరీరం విడిచిపెట్టి వేసిన తరవాత చివరి న్యాయనిర్ణయదివసం వరకు ఎక్కడ ఎలా ఉంటుంది అను ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానంగా క్రైస్తవమతం రెండు విధా లైన న్యాయనిర్ణయాలను (4608ల౫ల౫8) అంగీకరిస్తుంది - ఒకటి వైయక్తికనిర్ణయం,రెండు సార్వజనిక (1017ల52)) నిర్ణయం. రెండవది చివరి రోజున చేసేది,అందరికీ వర్తిస్తుంది. మొదటిది ప్రతీ మానవుడూ శరీరం విడిచిపెట్టగానే వాని విషయంలో చేసేది. ఈ
(కైస్తవ మతం 309 అభిప్రాయం ప్రకారం - ఈశ్వరుణ్ణీ, సాటి మానవుణ్ణీ ప్రేమిస్తూ మరణించినవాని ఆత్మ ఎలాంటి మాలిన్యమూ లేకుండా స్వర్గానికి పంపబదుతుంది. ఈశ్వరునియందు తోటి మానవునియందూ (ప్రేమ లేనివాని ఆత్మ తిన్నగా నరకంలో పదవేయబడు తుంది. పాపకలుషితము లైనా కూడ పశ్చాత్తాపంతో తపస్సు చేసిన ఆత్మలు ముందు పాపప్రక్షాళనంకోసం పారిశుద్ధ్యకేంద్రాలకి గాటూర్రైజకంం) పంప బడతాయి. తరువాత స్వర్గానికి పంపబడతాయి. శైస్తవమతం ప్రకారం 'హర్లేటరీ' అనేది పాపాలను ప్రక్షాళనం చేసే స్థానం లేదా పాపప్రక్షాకనం జరిగే ఒక అవస్థ. [ మానవుని ఉత్తమలక్ష్యం
మానవుని ప్రభానలక్ష్యాన్ని నిర్దేశిస్తూ క్రైస్తవమతంలో మోక్షం (52172600) అమృతత్వం (1౧%022100, శాశ్వతజీవనం (16 320బ పునరుజ్జీవనం లేదా ఉద్ధారం (౭46౧౯౦౧౫) మొదలైన పదాలు ఉపయోగిస్తారు. సొల్వేషన్, రిడెంప్షన్ అను పదాలు మరణానంతరస్థితిలోని అభావపక్షాన్ని (దుఃఖాదులు లేకపోవడం మొ. (౧6826౪76 ౦౪అ101ల) సూచించగా ఇమ్మార్దాలిటీ, (2 ఎటరల్ అను పదాలు భావహ్లూన్ని (౧౦౪4౪6 ౦౪౪10౧౪) సూచిస్తాయి.ఈ ప్రూానలక్ష్యంలో ఈ రెండు పక్షాలూ కూడ ఉన్నాయి. మానవుడు ప్రస్తుతం ఉన్న స్థితి వేచసులు మైనది. అందుచేత ఈ స్థితినుండి విముక్తి సంపాదించాలి.తొలి అపరాధం ఆడంని ఈశ్వరుడు ఈ లోకంలోనికి పంపివేయడంచేతనే మానవుల కష్టాలు ప్రారంభం అయ్యాయి. అందుచేత కష్టాలనుండి విముక్తి అనగా ఈ లోకంనుంది విముక్తి అని కూడ అర్ధం. ఈ విధంగా మానవుడు తిరిగి ఈడేన్ ఉద్యానం ఈశ్వరుని సంనిధి చేరితేనే నిజ మైన ముక్తిని పొంది నట్ల వుతుంది.
“అమృతత్వము?, 'శాశ్వతజీవనము” అనగా క్రైస్తవమతం ప్రకారం ఈఈత్వేం సాంనిధ్యం అని అర్ధం.మరో మాటల్లో దీనికే “ఈశ్వరుని సొమ్రాజ్యం'” అని రంగ అయితే ఇది ఎక్కడ ఉంది? ఈ లోకంలోనే ఉందా లేక ఈ ప్రపంచానికి దూ మరొక చోట ఉందా?స్వరం నిత్యమూ,శాశ్వతమూ అయిన దనీ,ఈశ్వరసామాజ్యం స్వర్గంలోనే ఉన్న దనీ కైస్తవమతవిశ్వాసం, అందుచేత నిజమైన మోక్షం అనగా స్వర్గంలో సభ్యత్వం సంపాదించి ఈశ్వరసంనిధిలో ఉండడం.
310 క్రైస్తవ మతం
అయితే కష్టాలనుండి విముక్తి పొంది శాశ్వతజీవనాన్ని సంపాదించడం అనే విషయంలో,జైస్తవమతంలో కొంత అభిప్రాయభేదమూ,అస్పష్టతా ఉన్నట్లు కనబడుతుంది.కేవలం దుఃఖంనుండి విముక్తి పొందడమే కాకుండా ఈ (ప్రపంచానికి దూరంగా ఉన్న స్వర్గాన్ని చేరడం మోక్షం అనే అభిప్రాయం ప్రాచీన క్రైస్తవ్రమతంలో స్పష్టంగా కనబడుతుంది.ఈ ప్రపంచంయొక్క వినాశం చాల దగ్గరలో ఉన్న దనీ, ఇది నశించిన తరవాత ఈశ్వరుని సామ్రాజ్యం ఆవిర్భవిస్తుం దనీ జీసస్స్ఫూ,ఆయన అనుయాయులూ కూడ అనేకస్థలాలో చెప్పి ఉన్నారు.చాల మంది ఆధునికవిద్వాంసుల అభిప్రాయం కూడ ఇదే.ప్రొటస్టెంట్ క్రైస్త్ర్వమతం ప్రకార మైతే మోక్షం పొందడానికి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లవలసిన పని లేదు. ఈశ్వరుని సామ్రాజ్యం ఈ ప్రపంచంలోనే స్థాపింపబడుతుంది;అందుచేత ఈ (ప్రపంచాన్ని విడచి దూరంగా పారిపోవలసిన పని లేదు. “స్వర్గసామాజ్యం నీలోనే ఉంది” అని కూడ వాళ్లు గట్టిగా చెపుతారు. ఇదెక్కడనో దూరంలో లేదు; దగ్గరనే,ఈ ప్రపంచంలోనే ఉంది.మానవుడు చేయవలసిన దల్లా తన హృదయంలో మూసివేసి ఉన్న ప్రేమకవాటాలు తెరవాలి. ఏమైనా శాశ్వతజీవనంలో మానవుడు సకలదుఃఖాలనుండి,పాపాలనుండి విముక్తుడై ఎల్లప్పుడూ ఈశ్వరుని సంనిధిలో ఉందాలి.
శాశ్వతజీవనం సాధించిన మానవుడు తన సహజ మైన పరిపూర్ణ చైతన్య స్వరూపాన్ని తిరిగి పొందుతాడు. అప్పుడు కూడ అతడు పరిచ్చిన్నుడుగానే (4049 ఉంటాడు ఈశ్వరుని అపరిచ్చిన్నత్వాన్ని పొందజాలడు. ఈశ్వరునితో సమానత్వాన్ని గాని,ఏకత్వాన్ని గాని పొందడు. ఈశ్వరునితో పోల్చి చూస్తే మానవుడు ఏ నాటికీ మానవుడే. మరేమంటే సర్వదుఃఖాలనుండీ విముక్తుడై ఈశ్వరసంనిధిలో అన్ని విధాలా శాంతీ ఆనందమూ అనుభవిస్తాడు. శాశ్వతజీవనం లేదా అమృతత్వం అనగా ఇదే.
ఆత్మ శరీరంతో పాటు నశించదు;ఇది అనశ్వర మైనది అని చెప్పినప్పుడు (క్రొత్తగా అమృతత్వం సాధించడం అంటూ ఏమిటి అను ప్రశ్న ఉదయించవచ్చు. దీనికి సమాధాన మేమనగా - మానవుని ఆత్మ అమృతము అన్నదానికి అర్ధం ఇది శరీరం నశించినా నశించదు అని మాత్రమే అర్థం.ఇలాంటి అమృతత్వం
కైసవ మతం 311 పుణ్యాత్ముల ఆత్మలకు ఉంది. పాపాత్ముల ఆత్మలకూ ఉంది. ఈశ్వరుని సంనిధిలో ఎల్లప్పుడూ నివసించడం అనే అమృతత్వం మాత్రం మానవుడు ఎంతో ప్రయత్సిస్తేనే కాని,ప్రయత్నించినా ఈశ్వరానుగ్రహం ఉంటేనే కాని లభించదు. నైతికత (కయ), ప్రార్థనాదికం దుఃఖభూయిష్ట మైన జీవితంనుండి విముక్తి పొందడమే క్రైస్త్రవమతప్రధాన లక్ష్యం.ఈ మతానికి స్థాపకుడైన జీసస్ క్రీస్త్ మానవులను దుఃఖంనుండి విముక్తులను చేయడానికి వచ్చా దని వాళ్ల విశ్వాసం. అందుచేత జీసస్ అనుసరించిన జీవన విధానాన్ని అనుసరించడమే అత్యుత్తమనైతికమార్గం. ప్రగాఢ మైన (ప్రేమ, వినయము, క్లేశాలను ఓర్పుతో సహించడమూ-౪ఇవే జీసస్ తన జీవనవిధానం ద్వారా ఆచరణపూర్వకంగా బోధించిన ధర్మాలు. (ప్రేమ, వినయము అనేవి క్రైస్తవ మతంలోని ప్రధానధర్మాలు. “నీ పొరుగువానిని నీవలెనే ప్రేమించు “నీ ఎడమ చెంపమీద కొట్టినవానికి నీ కుడి చెంప త్రిప్పి ఇమ్ము” అనేవి దీనిలోని అత్యుత్తమ మైన బోధలు. వీటికి సంబంధించిన ఇంకా ఎన్నో సద్గుణాలు కూడ ఈ మతం బోధిస్తుంది. ఆజ్ఞాదశకానికి క్రైస్తవరూపం ఇచ్చి బోధించింది.ఇది నైతికతకు సంబంధించిన మౌలికోపదేశం.యూదమతంలో చూచిన మొదటి నాలుగు ధర్మాలు మానవుడు ఈశ్వరుని విషయంలో ఆచరించ వలసినవి.మిగిలినవి సమాజంలోని ఇతరజనుల విషయంలో ఆచరించదగినవి. హత్యను,వ్యభిచారాన్నీ, దొంగతనాన్నీకూటసాక్తునీః లోభాన్నీ నిషేధించే చివరి ఐదూ హిందూమతంలో చెప్పిన అహింస, బ్రహ్మచర్యం: అస్తేయం, సత్యం, అపరిగ్రహం అనువాటివలె నిషేధాత్మక మైనవి.ఇవి క్రైస్తవ మతంలో జీవితాన్ని ఆదరించడం, గౌరవసంపడలు,సత్యనిష్ట సంతృప్తి అను భావ రూపంలో గ్రహించబడ్డాయి. (గ్రీస్దేశప్రభావంచేత న్యాయం,దానం,మృదుత్వం: జ్ఞానం,సహనం అను సద్గుణాలు కూడ చేర్చబడ్డాయి. భగవంతుని విషయంలోను ఇతరుల విషయంలోను,తన విషయంలోను అనుసరించవలసిన ధర్మాలను పేమ. ఈశ్వరుని విషయంలో ఆనందము-శాంతీ, ఇతరుల విషయంలో ఓర్పు, దయ, మంచితనము,తన విషయంలో విశ్వాసము, అక్రూరత్వము, ఆత్మనిగ్రహము అను
312 'కైసవ మతం తొమ్మిది ధర్మాలను పాల్ బోధించాడు. ఈ తొమ్మిదింటిని ఈశ్వర-పర-ఆత్మ విషయకాలుగా పాల్ చేసిన విభాగం అంతగా వైజ్ఞానికంగా లేకపోయినా ఇవన్నీ సద్దుజా లనడంలో సందేహం లేదు.మొత్తంమీద కైస్త్వవమతంలోని ప్రధాన మైన సద్గుణాలు ప్రేమ-దయా-వినయ-ఆత్మని(గ్రహాలు.
ప్రతీ క్రైస్త్రవుడూ అలవరచుకొనవలసిన నైతికజీవనము,('ప్రేమ వలెనే ఈశ్వర ప్రార్ధనకూడ చాలా ప్రధాన మైనది. చాల శక్తివంత మైనది. ఈశ్వరుని అనుగ్రహం తప్ప మోక్షానికి మరొక మార్గం లేదు. ప్రార్ధనలు వైయక్తికంగా గాని సామూహికంగా కాని చేయవచ్చును. సాధారణంగా ఇవి ఆదివారాలలో 'ప్రారనాలయాలలో (యయల) చేస్తూంటారు. ఈ ప్రార్ధనాలయాలలో విగ్రహా లేవీ ఉండవు. ఇవి కేవలం ఈశ్వరప్రార్థన చేసే పవిత్రన్థానాలు. క్రైస్తవప్రార్థనలలో దేవునికి చేసికొనే విన్నపాలు.పూజ, చేసిన పాపాలను ఒప్పుకొనడం, ధ్యానం, ఇచ్చాప్రకటనం, శరణాగతి మొద లైన అంశా లుంటాయి. చేసే విన్నపాలు కూడ చిన్న చిన్న లౌకికవిషయాలకోసం ఉండవు.నైతిక మైన జీవనం గడపగల శక్తి ఇవ్వ మని కోరడం వంటివి ఉంటాయి.
ప్రధానశాఖలు
క్రైస్తవులలో ప్రధానంగా - కాథలిక్స్, ప్రొటస్టాంట్స్ అను రెండు తెగ లున్నాయి. స్టూలంగా చెప్పా లంటే మొదటి తరగతికి చెందిన వాళ్లు సాంప్రదాయికులు,రెండవ తరగతికి చెందినవాళ్లు సంస్మారప్రియులు. ఈ విభేదాలు ప్రధానంగా చర్చియొక్క అధికారాన్ని పురస్కరించుకొని ఏర్పడినవి. చర్చి భూమి మీద ఉన్న ఈశ్వరప్రతినిధి అనీ, ఈశ్వరుడు దీని ద్వారా తత్త్వాన్ని ఆవిష్కరిస్తూంటా డనీ మొదటివా ళ్లంటారు. మానవుల ఉద్ధరణకు చర్చిలో చేసే సంస్కారా లన్నీ చాలా ఆవశ్యక మైనవ్విఅందుచేత 'పోష్కూ, చర్చిలలో ఉందే మిగిలిన పూజారులకూ ఈశ్చరదత్త మైన అధికారం ఉంది అని కాఫలిక్స్ అభిప్రాయం. అయితే 'ప్రొాటస్టాంట్స్-“మానవుడు ప్రత్యక్షంగానే ఈశ్వరునితో సంబంధం పెట్టుకొన వచ్చును; మానవుడే ప్రత్యక్షంగా ఈశ్వరునికి బాధ్యుడు; మానవునికీ ఈశ్చ్వరునికీ మధ్య చర్చియొక్క మధ్యస్థత్వం అవసరం లేదు. క్రైస్తవ మతానికి ఆచారాదులకీ
(కైస్తవ మతం వో బైబిల్ మాత్రమే ప్రమాణం.జీసస్ మాత్రమే భూమిమీద ఈశ్వరుని ప్రతినిధి, ఈశ్వరుడు పంపిన మిస్సయ్య ఆతని కున్న అధికారం పోప్ గాని ఇతరు లైన పూజారులు గాని తీసికొనగూడదు. ఈ జ్రైస్తవపురోహితులు మానవులమీద తమకు ఎవరూ ఇవ్వని అధికారం నడిపిస్తున్నారు.దీనిని పూర్తిగా తుడిచిపెట్టాలి 21 అంటూ ప్రజలమీద చర్చి,చర్చిలోని పూజారులు చేస్తూన్న, ఎలాంటి ప్రమాణమూ లేని ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు లేవదీశారు. క్రైస్త్రవమతాన్ని విశ్వసించేవా క్లందరూ చర్చిలో పూజారులుగా ఉండవచ్చు నని అంగీ కరించాలి. కొంతమంది మాత్రమే ఈశ్వరు డిచ్చిన అధికారం గలవారు అనడానికి వీలు లేదు.మానవకల్పిత మైన ఏ సంస్థకూ ఇతరమానవుల్ని దాసులను చేయ గూడదు. మానవునికీ ఈశ్వరునికీ మధ్య ఈశ్చరు డిచ్చిన బైబిల్ ఒక్కటే మధ్యవర్తి. ఈశ్వరుడు పంపిన జీసస్ క్రీస్తు ఒక్కడే విశ్వసనీయుడు.మూదవవారి కెవరికీ అవకాశం ఉండకూడదు. ఈ విధంగా బైబీల్కీ జీసస్క్రీస్తకూ మాతమే అధకరాన్ని అంగీకరిస్తూ, ప్రాటస్తాంట్లు చర్చికి గాని,దానితో సంబంధించిన మతగురువుల మని చెప్పుకొనేవారికి గాని ఏ మాత్రమూ అధికారం అంగీకరించరు. యథాశాస్త్రంగా బాప్టిజం (శిశువుగా ఉన్నప్పుడు మూడు మునకలు వేయించడం) అయి కాథలిక్ చర్చికి సభ్యుడైన ప్రతి ఒక్కడూ కొథలిక్ అని చెప్పబడతాడు. కాథలిక్ చర్చిలో కూడ రోమన్ కాథలిక్ అనీ ఈస్టర్న్ ఆర్థడొ కీ అనీ రెండు భేదాలు ఏర్పడ్డాయి. కాథలిక్ అనే పదం రోమన్కొథలిక్ చర్చికి సంబంధించినవాళ్లకే ఉపయోగించా లనే మాట కూడ ఉంది.రో మన్ కాథలిక్స్ అంగీకరించి నట్లుగా ఈస్టర్న్ కాథలిక్స్ మేరీ సశరీరంగా పైకి వెళ్లిం దని అంగీకరించరు. పర్డేటరీ, ప్రీస్ట్‌లకు బ్రహ్మచర్యం (అవివాహితులుగొ ఉండడం), రోమన్పోప్ అధికారానికి అద్దు లేకపోవడం, మొదలైనవి కూడ అంగీకరించరు. పవిత్రభూతం (11007 5044 తండ్రినుండీ పుత్రునినుండీ (20౯ జారే50ు ఆవిర్భవించిందా, పుత్రుని ద్వారా తండ్రినుండి ఆవిర్భవించిందా అంటూ ఈ చర్చిల మధ్య రోచక మైన ఒక వివాదం బయలుదేరింది. ఈస్టర్న్ అర్ధడాక్స్ చర్చి మొదటి పక్షం అంగీకరిస్తుంది. ఈ క్రింది ఏడు సంస్కారాలనూ (2020606) రెండు చర్చిలూ అంగీకరిస్తాయి : బాప్టిజం,దృఢీకరణం (6028226యి, తపస్సు
314 క్రైస్తవ మతం లేదా తప్పు ఒప్పుకొానడం, యుఛాల్ళ్ట్ (ప్రీస్ట్ ఆశీర్వాదంతో ద్రాక్షమద్యం (౫109) తో కలిసిన రొట్టెను క్రీస్త్ యొక్క దేహంలోని రక్తముగా భావిస్తూ తినడం అనే సంస్కారం), వివాహం, పవిత్ర మైన ఆశ్రమం (11007 0146౪ -సంన్యాసం వంటిది) రోగగ్రస్తుని శరీరానికి (తైలాదులు) పూయడం. చివరిదాని విషయంలో అభిప్రాయభేదం ఉంది-రోమన్ కేధలిక్స్ ఇది రోగి మరణించే ముందు చేయవలసిన చిట్టచివరి సంస్కారం అంటారు. మరణానికి పూర్వమే రోగ ప్రారంభం లోనే ఇది చెయ్యాలి అని ఈస్టర్న్ కాథలిక్స్ అంటారు. ప్రాటెస్టాంట్స్లో కూడ-లూథెరియన్స్, కాల్వినిస్ట్స్,పెస్బైటేరియన్స్, ఆంగ్రికన్స్,కాంగ్రేగేషనలిస్ట్స్ మొదలైన చాలా శాఖ లున్నాయి.మొదటి రెండు శాఖలు గొప్ప సంస్కర్త లైన లూథర్, కాల్విన్ అనేవాళ్ల పేర్లతో సంబంధించినవి. రోమన్ చర్చి విషయంలో వ్యతిరేకభావాలు చాలకాలం (క్రితమే ప్రారంభం అయినా వాటి కొక దిశాదర్భనం చేసి వాటిని ఒక పద్ధతి ప్రకారం నడిపినవాడు లూథర్. చర్చికీప్రీస్ట్లకూ ఉన్న అధికారౌన్నత్యానికి వ్యతిరేకంగా లూథర్ బైబిల్‌కు మాత్రమే సర్వోన్నతాధికరం అని అంటూ అతదు “మళ్లీ బైబిల్ వైపుకు” (320.10 16 31010) అను నినాదాన్ని లేవదీశాడు. ప్రతి ఒక్కడూ ఈశ్వరుని సందేశం తానే చదువుకోవా లనీ, తనకు తానే ఉద్ధరణానికి మార్గం నిర్ణయించుకోవా లనీ బోధిస్తూ ప్రచారం చేశాడు. కెర్దీలను (మతానికి సంబంధించిన కార్యకలాపాలలో ఉన్నవాళ్లను) ఒక ప్రత్యేక మైన వైశిష్ట్రం గల వర్గంగా భావించ కూడదు అని చెప్పి 'అందరూ ప్రీస్టులే అన్న వాదాన్ని ప్రచారం చేశాడు. ఈశ్వరునికీ మానవునికీ మధ్య ప్రీస్ట్ల మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించినా కాల్విన్ ఈశ్వరుని అనుగ్రహానికి, ఈశ్వరునినుండి లభించే పారితోషికానికీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. బైబిల్ బోధించిన పద్ధతుల ననుసరించి మానవుడు తన మార్గాన్ని తాను ఎన్నుకొనే స్వాతంత్ర్యాన్ని పూర్తిగా తగ్గించివేశాడు.ఇలా చేయడంతో ఇతడు వ్యక్తియొక్క విశ్వాసము,ఉద్ధరణకు ఆతని కున్న అవకాశాలూ,వీటితో సహా ప్రతీదీ ఈశ్వరునిచేత పూర్వనిర్దీతమే అను సిద్ద్ధాంతంలోనికి జారిపోయాడు. ఈశ్వరుడు తన (ప్రేమచేత అనుగ్రహబుద్దిచేతా-కొంతమందిని ఉద్ధరించా లనీ,
'కైస్త్వవ మతం 315 కొంతమందిని శాశ్వతంగా నరకంలో పడవెయ్యా లనీ నిర్ణయించుకొన్నాడు అను వాదాన్ని కాల్వనిజం ప్రతిపాదిస్తుంది. నిజానికి మానవు లందరూ ఆడం చేసిన పాపానికి ఫలితంగా దుర్గతి పొందవలసిందే.అయినా కూడ ఈశ్చరుడు అనుగ్రవా దృష్టితో కొందరిని మాత్రమే ఉద్ధరించా లని నిర్ణయించుకొన్నాడు.కొందరు మంచి పనులు చేస్తున్నా రంటే అందుకు కారణం వాళ్ల స్వప్రయత్నం కాదు; ఈశ్వరాను (గ్రహం ఉండడంచేతనే, ఈశ్వరుడు వాళ్లను ముందుగానే రక్షించి (ఉద్ధరించి ఉండడం చేతనే వాళ్లు అలా చేస్తున్నారు. చర్చి,చర్చికి సంబంధించిన ప్రీస్ట్లు మొదలైనవాళ్లు తామే గొప్పవాళ్లం,తమకు ఉన్నత మైన ఆధిపత్యం ఉంది అని చెప్పుకొనడం మహాపాపం. ఈశ్వరు డొక్కడే సర్వోత్తముడు; ఆతని అనుగ్రహం మాత్రమే మానవుణ్ణి రక్షిస్తుంది.తాను ఎన్నుకొన్నవా శ్లందరినీ ఈశ్వరుడు,ఎ మాత్రము భేదం చూపకుండా,అనుగ్రహిస్తాడు. ఈ విధంగా కాల్వినిజం అదొక రక మైన ప్రాటస్టాంటి జంగా కనబడుతుంది. ఇది మానవుని కున్న స్వాతంత్ర్యాన్నంతనీ పూర్తిగా తీసి వేసింది. ఈ దృష్టితో చూస్తే ఇది రోమన్కొథలిజం కంటె కూడ చాల ఫోరం అనిపిస్తుంది. అందుచేతనే నేటి కాల్వినిజానికి చెందినవాళు ఆత్మోద్ధరణం విషయంలో మానవుని స్వప్రయత్నానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రెష్బైటేరియనిజం (ఆ09/128జు5రు), కాల్వినిజానికి ఒక శాఖ.అంతా ఈశ్వరుని చేతులలోనే ఉంది; కేవలం ఈశ్వరుని ఆజ్ఞలను ప్రాలించడమే మానవుని కర్తవ్యం అను వాదాన్ని ప్రెస్బిటర్ ప్రచారం చేశాడు.అయినా కూడ చాలా విషయాలలో మానవుదే నిర్ణయాలు తీసికొనవలసి ఉంటుంది. ఈ పని పెద్దలకు అప్పగించ బడింది. వీళ్లకు పెన్బైటర్స్, అని పేరు.వాళ్లు చెప్పిన విధంగొ మతసంబంధ మైన కార్యకలాపాలు చెయ్యా లని నిర్ణయించుకొని ఆ విధంగొ (ప్రవర్తించేవాళ్లు పెస్బైరియన్స్. రోమన్కాథలిక్స్లో ఉన్నట్లు దీనిలో అధికార తారతమ్యాలు లేవు. ప్రెస్బైటర్స్ అందరికీ సమానమైన అధికారమే. వీళ్లకు ఈశ్వరుని నుండి సంక్రమించిన అధికారా లంటూ ఏవీ లేవు.
ఇంగ్లాండ్‌లో ప్రచారంలో ఉన్న ప్రాటస్టాంటిజునికి ఆంగ్లికనిజం అని పేరు.ఇది రోమన్కాథలిజానికీ ప్రొటస్టాంటనిజానికి మధ్యేమార్గం అవలంబిస్తూంది.
316 కైసవ మతం తాను కాథలిక్ అని చెప్పుకుంటూనే ఇది సంస్క్మరింపబడినది అని కూడ చెప్పు కొంటుంది. పవిత్రమత[గ్రంథం (బైబిల్) సాధారణప్రార్థనల పుస్తకం (300% 01 6౦౧౫౦ క4/60). ఈ రెందింటికే ఆంగ్రికనిజంలో ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. పునర్వ్యవస్థీకరణం (ఇటంగగ46ం౧) జరిగినది మొదలు ఇంగ్లాండు చర్చిలో (ప్రచారంలో ఉన్న జైస్తవమతమే ఆంగ్లికనిజం. అయితే మొదటినుంచీ ఇంగ్లాండులో ఉన్న శైస్తవ్రమతమే ఇప్పుడు కూడ అక్కడ ఉన్నది అని కాథలిక్స్ చెప్పినా అది యథార్థం కాదు.ఎందువల్ల ననగా-రోమన్‌కాథలిక్ చర్చియొక్క అధికారాన్ని తిరస్కరిస్తూ ఎనిమిదవ హెన్రీ (11607 ౪11) “రోమ్‌లో ఉన్న బిషపుకి ఇంగ్లాండ్‌లో చర్చిమీద అధికారం ఏమీ లేదు.ఇంగ్లాండ్చర్చి మతానికీ విశ్వాసానికి సంబం ధించిన ముప్పై తొమ్మిది నియమాలను గ౧హ60116 మూ[ంఆం) రూపొందించు కొంటుంది” అని ఉద్దోషించి నప్పుడే ఇంగ్లాండ్‌లో పూర్తి పునర్వ్యవస్థీకరణం వచ్చింది. అది మొదలు ఈ చర్చి కూడ ్రాటస్తాంట్ తిరుగుబాటుకు ప్రతినిధిగా నిలచింద్రిఅయితే దానిలోని తీవ్రత దీనిలో లేదు.
కాంగ్రెగేషనలిజం (సాంఘిక క్రైస్తవం) : 1578,1586ల మధ్య రాబెక్ట్ (బ్రౌన్ చేత స్థాపించబడింది. మతం మానవుల వైయక్తికచేతన (1౧641౪14424160%- 5016069) కు సంబంధించినది. దీనిని రాజకీయములైన ఒత్తిడుల ద్వారా బలవంతంగా ప్రచారం చేయకూడదు.దీనిని ప్రెస్బైటేరియన్లు, ఇంగ్లాండు చర్చీ కూడ నిరాకరించాలయి. ఈ రెందు శాఖలలోను పరస్పరభేదా లున్నా రెండూ కూడ మతాన్ని బలవంతంగా ప్రచారంచేయడం ప్రభుత్వం చేయవలసిన కర్తవ్యం అని విశ్వసించాయి. కాంగ్రెగేషనలిస్టులు ముఖ్యంగా స్వతంత్రులు. ప్రారంభంలో వీళ్లకు ఆ పేరే ఉందేది. ప్రతీ చర్చి లేదా ప్రతీ సంఘమూ జీసస్ క్రీస్తు అధికారం క్రిందికే వస్తుంది. మానవుల కెవ్వరికీ దీనిమీద అధికారం లేదు. ప్రతీ చర్చి కూడ స్వతంత్ర ప్రతిపత్తి గలది. మతం విషయంలో దేని నియమాలు అదే ఏర్పరచు కొనవచ్చు. వీళ్లు బైబిల్ ఒక్కటే పరమ(ప్రమాణం అని అంటారు.
పైన చెప్పిన శాఖలే కాక,ఆధునిక కైస్తవ్రమతంలో మెథాడిస్ట్స,యునిటేరి యన్స్ మొదలైన ఏన్నో శాఖలు,వాటి ఉపశాఖలు, (82040హర్ర9) ఉన్నాయి, ఇంకా బయలు దేరుతున్నాయి.
'కైసవ మతం 317 మొదటి అనుబంధం
'ప్రసిద్ధతత్త్వశాస్త్రవిదుషీమణి,ఉత్తమ మైన ఆధ్యాత్మికస్థితిని సంపాదించిన సాధకురాలు అయిన అన్నీ బెసంటు కెవెన్ గ్రేట్ రెలిజియన్స్ అను గ్రంథంలో (కైస్తవమతాన్నిగూర్చి వ్రాసిన కొన్ని విషయాలు తప్పక తెలియ దగినవి, అమె ఆ మతంలో జనించిన ఉత్తమసాధకురా లవడంచేత అమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది.
-
క్రైస్తవమతం ఆవిర్భావాన్ని గూర్చి ఐతిహాసికంగా చాల అస్పష్టత కనబడు తుంది.ఇందుకు కారణం - అప్రామాణికా లైన ఎన్నో రచనలు చాల ్రామాణికా లైన పవిత్రగ్రంథా లను పేరుతో ప్రచారంలోనికి రావడం.ఇలాంటి వాటిని అన్నింటినీ వరివేయా లంటే చాలమంది క్రైస్తవులు అందుకు అంగీకరించరు. అలా ఎవరైనా చేస్తే వాళ్లు తమ మతంమీద దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నా రని భావిస్తారు. (1. 139 - 140)
-
జకైస్తవ్వమతశాఖలలో ఎంత తీవ్ర మైన భేదా లున్నా యనగా - ఒక శాఖను అనుసరించి క్రైస్తవమతం అంటే ఇది అని ఎవరైనా ప్రతిపాదిస్తే ఇతర శాఖలవాళ్లు తమ మతం వక్రీకరింపబడుతూన్న దని కోపావిష్టులవుతారు. (0.140)
-
'ప్రధానశాఖ లైన ఆర్థదాక్ చర్చి, రోమన్ కాథలిక్ చర్చి, ప్రొటస్టాంట్ చర్చి అనే మూడు శాఖలలోనే పరస్పరవిరుద్దా లైన ఎన్నో సిద్ధాంతా లున్నాయి. ఒక సిద్ధాంతాన్ని గూర్చి మాట్లాడితే మిగిలిన సిద్ధాంతాలవాళ్లు తమకు అవమానం జరుగుతూన్న దని ఆక్రోశిస్తారు. (9. 140)
-
ఇతరమతాలవాళ్లు తమ మతాలకు సంబంధించిన విషయాలు వాటి మీద విశ్వాసం గల తమ అనుయాయులకు బోధిస్తూ సంతృప్తి పడతారు.ఇతర మతాలను గూర్చి అంతగా పట్టించుకొనరు; ఉదాసీనభావంతో ఉంటారు. క్ల్స్తవులు అలా కాదు.తమ మతమే అన్నింటికంటె గొప్ప దనీ, సాక్షాత్తు ఈశ్చరుడు బోధించిన మతం ఇదే ననీ ప్రచారం చేస్తూ ఇతరమతస్థులను హీదెన్స్ (11620605 - సంస్కారశూన్యు లైన అనాగరిక నాస్తికులు) అని నిందిస్తూంటారు. అందుచేత ఇతరమతస్థులు, ప్రధానంగా భారతీయులు,కైస్తవమతంలోని చెడు లక్షణాలను మాత్రమే చూడడం సహజం. (0. 14-140)
318 కైస్త్రవ మతం
-
కైస్త్రమతానికి సంబంధించిన అనేకగ్రంథా లున్నాయి.వాటిలో బైబిల్‌కు ఉన్న ప్రామాణ్యాన్ని ఈస్టర్ని ఆర్థడాక్స్ - రోమన్ కాథలిక్స్ - ప్రొటన్టాంట్ చర్చిలు మూడూ ఏకగ్రీవంగా అంగీకరిస్తాయి. (1. 143
-
బైబిల్లోని ఓల్టు టెన్టామెంట్ (పూర్వసమయం) చాల ప్రాచీనమైనది. యూదుల దేశానికి సంబంధించిన, వేరు వేరు పుస్తకాలలో వ్రాసిన ఎన్నో ఐతిహాసిక కధలతో నిండి ఉంది. (. 144).
-
న్యూటెన్టామెంట్లో - క్రాత్త మతాన్ని స్థాపించిన ప్రవక్త జీవితానికి సంబంధించిన వృత్తాంతము ఆతడు చేసిన,మతానికి సంబంధించిన బోధలు (6090ల) ఉన్నాయి. (. 144
-
క్రీస్ట్ చేసిన బోధలు అధికంగా నైతికమార్గపర మైనవి. వాటిలో తత్త్వ విచారం చాల తక్కువ. (). 145)
-
అపోకైైఫల్ స్రిప్ట్స్ అను పేరుతో కొంత వాజ్ఞయం ఉంది. (ఓల్డ్టెస్టా మెంట్లోని సెప్టువాజెంట్లోను,వళ్లేట్లోను చేర్చబడిన కొన్ని బుక్సుకు అపోకైఫల్ అని పేరు.ఇవి హిబ్రూ బైబిల్లో లేవు.క్రాత్త బైబిల్స్లో కూడ అన్నింటిలోనూ లేవు). ఆర్థడాక్స్ - రోమన్ చర్చిలు రెండూ వీటికి (ప్రామాణ్యాన్ని అంగీకరించినా ప్రొటస్టాంట్ చర్చి అంగీకరించదు. (౫. 145)
-
ఇవి కాక మరి కొన్ని అపోకైఫాలు ఉన్నాయి.వీటిలో క్రీస్తు, ఆతని తల్లి మొదలైనవాళ్ల చరిత్ర లున్నాయి. (ప్రారంభకక్ఞైస్త్ర్రమతం అర్ధంచేసికొనడానికి ఇని బాగా ఉపయోగిస్తాయి. గ. 145)
-
క్రీ.శరెండవ శతాబ్దం ఉత్తరార్థంలోను, మూడు - నాలుగు - ఐదు శతాబ్దాలలోను ఫాదర్స్,బిషప్స్,టీచర్స్ రచించిన అతివిస్త్రృత మైన వాజయం ఉంది. క్రైస్త్రవ్వమతంయొక్క ('క్రమవికాసాన్ని తెలిసికొనడానికి ఈ వాజ్బ్యయం ఎంతగానో ఉపకరిస్తుంది. కాని ప్రొటస్ట్రాంట్స్ దీని ప్రామాణ్యం అంగీకరించరు.
అందుచేత వాళ్ల మతంలో తాత్త్వికదృక్పథం ఏ మాత్రమూ లేకుండాపోయింది (0. 146). (దీనిని పట్టి ఈ తాత్తికవిషయా లన్నీ ప్రాచీనకైస్తవంలో లేవనీ, కాలాంతరంలో చేర్చబడిన వనీ స్పష్టం అవుతుంది).
('కైస్తవ మతం 319
-
మౌఖికసంప్రదాయాన్ని అనుసరించి కూడ కొంత వాబ్బయం (ప్రచారంలోనికి వచ్చింది. దీనిలోని విషయా లన్నీ (వేరు వేరు రచనలనుండి (గ్రహించి) రెండవ శతాబ్దంనుంచి కొందరు పండితులు నాలుగు గాస్పెల్స్‌లో సంగ్రహించారు. ఇలా సంగ్రహించినవారికి 6౪26400986 05యిరు, (గేట్ అపోస్టల్స్) అని పేరు. (. 147
-
మౌఖికంగా వచ్చిన ఇంకా కొంత వొజ్బయం ఉంది.దానిని చాల కాలం తరవాత గాని గ్రంథస్థం చేయలేదు. (10. 147
-
కైస్తవబోధలు ఆవిష్టృతములు (౪౪౭౫68) (అందరికీ బోధింప బడినవి), అనావిష్టృుతములు (1016762166) (అందరికీ కాక కొంతమందికి మాత్రమే బోధించబడినవి) అని రెండు విధాలుగా విభజింప బడ్డాయి. (1. 148).
-
జనుల యోగ్యత - అయోగ్యతలను పట్టి కొంత మందికి (పామరులకు) సామాన్య మైన నైతికప్రవర్తన వంటి విషయాలను, ఉత్తమమైన యోగ్యత కలవారికి మాత్రమే అతినిగూధతాత్త్వికవిషయాలను బోధించాడు.కేవలం సామాన్య విషయాలను మాత్రమే [గ్రహించడానికి తగనివాళ్లు బాహ్యులు (4140) గొప్పబుద్ధిశాలు లైనా కూడ కొందరు నిగూఢవిషయాలను గ్రహించజాలరు. వాళ్లందరూ బాహ్యాలే. బుద్ధిమంతులై ఉండి పవిత్రత కూడ ఉన్నవాళ్లు ఆంతరికులు (9 6109ల). వాళ్లకు మాత్రమే నిగూధవిషయాలు (గ్రహించే అర్హత ఉంటుంది. (0. 149)
-
ఈ విషయం జీసస్ స్వయంగా తన మాటలలో స్పష్టీకరించాడు. “పవిత్రమ్రైనదానిని కుక్కల కివ్వకండి;[మీ ముత్యాలు పందుల ముందు చల్లకండి.అవి వాటిని కాళ్లతో ్రొక్కినేసే ప్రమాదం ఉంది”, ఇక్కడ “కుక్కలు అను పదం అబ్రహాం బీజానికి చెందని దేశాలను నిర్దేశిస్తుంది. (1. 150). “నేను మీకు బోధించవలసిన ఇంకా ఎన్నో విషయా లున్నాయి;అయితే నేను మీ కిప్పుడు చెప్పడం కుదరదు” అని కూడ జీసస్ అన్నాడు, (౫, 150)
-
రిసర్రక్షన్ తరవాత,అనగా శిలువమీద వేసి చంపబడిన జీసస్ తన సమాధి (గోరీ) నుండి మళ్లీ లేచిన తరవాత, భూమిమీద పదకొండు సంవత్సరాల
320 (క్రైస్తవ మతం పాటు ఉన్నా డనీ, (కేవలం నలఖై రోజులు మాత్రమే ఉన్నా దని కొందరి మతం) అప్పుడు అపోస్టల్స్‌కు నిగూధరహస్యసిద్దాంతా లన్నీ బోధించా డనీ,భగవత్సా (మ్రాజ్యానికి (౧౫౪ కూడం[10[606) సంబంధించిన విషయాలు బోధించా దనీ ఫాదర్స్‌లో ఉన్న సంప్రదాయం (. 150-151).
-
పాల్ కూడ “అన్ని విషయాలూ అందరికీ చెప్పేవి కావు;కొన్ని రహస్య సిద్ధాంతాలు కొందరికి మాత్రమే బోధిస్తాం” అన్నాడు (1. 151)
-
క్లెమెంట్ ఆఫ్ అలెక్టాండ్రియా కూడ ఇదే అభిప్రాయం వ్యక్తీకరించాడు. “అన్ని విషయాలూ అందరికీ,తారతమ్యాలు పరీక్షించకుందా బోధించగూడదు. స్వప్నంలో కూడ పవిత్రత్వం అంటే ఏమో తెలియనివాళ్లకి ఉత్తమజ్ఞానఫలాలు పంచిపెట్టగూడదు;(ఎందువల్లననగా - ఎంతో ప్రయత్నం చేసి సంపాదించుకొన్న దానిని దారేపోయేవానికి ఇవ్వడం నిషిద్ధం). ప్రపంచరహస్యాలు (అపవి(త్రుడైన) నీచునికి తెలపగూడదు” (౫. 151 - 152).
-
కొంత నియమబద్ధత్వాన్ని నెలకొల్పడంకోసం కైస్త్రమతంలోనికి మార్చినవాళ్లకు నాలుగు దశలు క్రమంగా ఏర్పరుపబడ్డాయి. మొదటిదశలో వాళ్లు కేవలం శ్రోతలుగా (౧62ల౫) ఉండాలి.తరువాత్తి దశలో శిక్షణ పొందే వాళ్లుగా (62001బుులు) ఉండాలి. తరవాత బాప్టిజం అనగా పవిత్రోదకస్నానం లేదా పవిత్రోదకం శిరస్సుమీద చల్లించుకొనడం అయిన తరవాత వాళ్లు చర్చిలో (కైస్త్రవసంఘంలో) పూర్తి సభ్యత్వం లభించినవా ళ్లవుతారు. చర్చిలో కూడ కొన్ని తారతమ్యా లున్నాయి. మొదట సాధారణసభ్యత్వం. వీళ్లల్లోనుంచి పవిత్రజీవితం గడపినవాళ్లు రెండవ స్థితి (240) లో చేరుతారు. తరువాత అన్ని పాపాలనుండీ దూరంగా ఉన్నవాడు జీససయొక్క రహస్యోపదేశాలు పొందడానికి అర్హుడవుతాడు. (౧. 152 -153)
“కాలం గడచిన కొలదీ ఈ నియమాలను సరిగా పాటించకపోవడంతో అనర్హు లందరూ చేరి క్రైస్తవమతాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు” అని టెర్జుకెల్లియన్ వాపోయాడు. (1. 153 - 154)
- రహస్యసిద్దాంతాలు ఉపదేశించగలిగినవాళ్లు కరవై పోయారు. (1.155)
(కైస్తవ మతం 321 22. జీసస్ మూడు సంవత్సరాలు మాత్రమే బోధించాడు. మరణించిన వాళ్లను బ్రతికించడం, గుడ్డివాళ్లకు చూపు ఇవ్వడం,రోగాలు కుదర్భడం వంటి అనేక అద్భుతకార్యాలు చేస్తూ పొలస్తీన్దేశం అంతా సంచరించాడు. (1. 161) 23. ఇలాంటి అద్భుతాలు క్రీస్తుకు పూర్వం కూడ ఎంతోమంది చేసేవారు. అందుచేతనే క్రీస్తు “మీరు ఇంకా గొప్పపనులు చెయ్యాలి” అని శిష్యులను ఆదేశిస్తూండేవాడు. (౫. 162)
-
క్రీస్తు చేసిన ఉపదేశాలు మనువు, జొరోస్టర్, బుద్ధుడు ఇతరమహా పురుషులు చేసిన ఉపదేశాలవంటివే. (౫. 163,165)
-
మూర్తితయవాదం ఓల్టుటెస్ట్రామెంటులో లేదు. న్యూబిస్టామెంట్లో ఉన్నా అది ఎవరో తరువాత మతప్రచారకులు చేర్చి ఉంటా రని కొందరు కొట్టివేశారు. (2.173
-
దేవుని సింహాసనానికి ఎదురుగా ఏడు సచేతనభూతాలు ఉంటాయి. ఇవి హిందువుల పంచభూతాధిష్టానదేవతలవంటి ప్రాకృతికదేవతలు. వీటి క్రింద కొందరు ముఖ్యదేవతలు, దేవతలు ఉంటారు. వీళ్లనే పాల్ దేవతలు (08215); (ప్రముఖులు గౌణగం10216ల3), శక్తులు (ం౪లం) అని అన్నాడు.వీళ్లలో తొమ్మిది గణాలు (07౯4ల) ఉన్నాయి.వీటికి సెరాఫిమ్ (లజ) చెరూబిమ్ (యలు, టోన్స్ (120069), దామినేషన్స్ (0026009), వర్చూ (7(హ%ం9), పవర్స్ (౦0౪౪ల), ట్రిన్సిపాలిటీస్ (రయం24ల), ఆర్బ్ఏంజెల్స్ (చూరుఖ్యర్రలిక), వంజల్స్ (చలం) అని పేర్లు... రోమన్ కాథలిక్ చర్చిలో దేవత లందరికీ పూజలు చేయడం ఉంది; ఎందుచేత ననగా ఈ దేవతలు ప్రకృతికి సంబంధించినవాళ్లు అవడంచేత మనుష్యులతో నిత్యసంబంధం కలవారు. (172-173)
-
మానవుని స్వరూపమూ,,వానికి దేవునితో సంబంధమూ ఈ విషయాలను గూర్చిన వివరణ, దురదృష్టవశంచేత, ఆధునిక ్రైస్రవసంఘంలో (404ల౫ యేఖూయ) లేకపోయినా ప్రాచీనగ్రంథాలలో వీటి అతిస్పష్ట మైన వర్ణన లున్నాయి. మానవుడు చేతన (90ష14, ఆత్మ (60410 దేహము అను జహూడింటి సంఘాతం అని పాల్ చెప్పాడు. కాలక్రమంలో చేతనకీ ఆత్మకీ మగ్య ఉన్న భేదం
322 కైస్తవ మతం పూర్తిగా తొలగి ఈ రెండూ ఒకటిగా (గ్రహించడం జరిగింది. ఆత్మ దివ్యరూప మైనది. “నువ్వు ఈశ్వరుని ఆలయం అనీ, ఈశ్వరుని చైతన్యం నీలో ఉన్న దనీ నీకు తెలియదు” అని పాల్ అన్నాడు.ఇది మానవశరీరం “విష్టుపురం” అనీ “బ్రహ్మపురం'” అనే హిందువుల మాటల ప్రతిధ్వని. (2.173 - 174)
-
“నువ్వు ఈశ్వరుని కుమారుడ నని ఎలా చెప్పుకొంటున్నావు?” అని యూదులు జీసస్‌ను ఆక్షేపించగా - “బెను! నేనొక్కడినే ఈశ్వరుని పుత్రుడను” అని ఆధునికక్షైస్తవుడు సమర్దించి నట్లు సమర్ధించకుండా వాళ్లకు అతడు చెప్పిన సమాధానం అత్యద్భుత మైనది. “పవిత్రగ్రంథాల ప్రకారం మానవు లందరూ దేవుళ్లే కదా? అలాంటప్పుడు నేను దేవుని కుమారుడను అని చెప్పుకొంటే మతవిరోధం ఏముంది?” అని ఆయన సమాధానం (1.174 - 75). క్రీస్తును శిలువ దగ్గరికి తీసికొనివెళ్లే ముందు అతడు చర్చిలో చేసిన ప్రార్ధనలో కూడ మానవునికి దేవునితో ఏకత్వాన్ని ఘోషించాడు.
-
“సర్వమూ ఈశ్వరుడే. చివరికి ఈ జగత్తుపుత్రుడు (90%) క్రీస్తు - అన్నీ అంతా ఈశ్వరుదే.అంతా ఈశ్వరునిలో లీనం అవుతుంది”. అని పవిత్రగ్రంథాలు ఉద్దోషిస్తూంటే ఆధునికకైస్తవమతం ఇందుకు విరుద్ధంగా బోధించడం చాల శోచనీయం. (.176)
-
జీసస్ పునర్జన్మను (అనగా మరణానంతరం మానవుడు తాను చేసిన పుణ్యపాపకర్శ్మలను అనుసరించి ఈ లోకంలోనే మళ్లీ పుడతా దని) అంగీకరించి నట్లు ఆతని మాటలవలన తెలుస్తూన్నది. అదే విధంగా ఆతని తరువాత కూడ చాలమంది క్రైస్తవులు దీనిని విశ్వసించి నట్లు వాళ్ల వ్రాతలు స్పష్టంగా చెపుతున్నాయి. ప్రాచీనక్రైస్తవసంఘం (68) ౦1౪70) అంగీకరించింది. అయిజే అంధకారం (౧ఖోంగఆ9) తరువాత జరిగిన సాధారణసభ (6లల21 0౦టూయి ఈ విశ్వాసం మతవిరుద్ధం అని నిషేధించింది. ఆనాటి నుండి ఈ మతంలో పునర్దన్మసిద్దాంతం నిరాకరింపబడింది. (౫.179)
దీనితో క్రైస్త్వ్వమతం ఇతరమతాలనుండి దూరం అయిపోయింది. ఇది ఘోర మైన పరిణామాలకి దారి తీసింది. పునర్దన్మసిద్దాంతంతో ముడివడి ఉన్న
'కైస్రవ మతం 323 కర్మసిద్దాంతాన్ని కూడ నిరాకరించవలసివచ్చింది. ప్రాచీనమైన ఎపిస్టల్స్ లో- “మానవుడు తాను చల్లినదానినే (బీజాన్నేపంటగా పొందుతాడు” (1//2250 ఆ౪ఆ 2 జ 50౪66, శ469%2]1 26 2150 1620) అని స్పష్టంగా చెప్పబడింది. దానికి ఈ నాడు అర్ధం లేకుండా పోయింది. మానవుడు తాను చేసిన పనుల ఫలితాలను అనుభవించడు అనడానికి ఎన్నో కొత్త కొత్త సిద్ధాంతాలు ఆవిష్కరించ వలసి వచ్చింది. ఎన్ని చెప్పినా ఆ శాస్త్రవాక్యం అలాగే ఉంది. (1.179 - 180)
పునర్దన్మసిద్దాంతాన్ని నిరాకరించడంతో శాశ్వతంగా నరకంలో పడి ఉండడం అనే అసాధారణ మైన సిద్ధాంతాన్ని అంగీకరించవలసివచ్చింది. ఈ లోకంలో గడిపిన అత్యల్పమైన జీవితానికి ఫలం ఏమయ్యా అంటే శాశ్వత మైన స్వర్గం లేదా నరకం. ఇక్కడ ఇరవైయో,నలభైయో,అరవైయో,వందో సంవత్సరాలు జీవించిన వాని భవిష్యత్తు శాశ్వతంగా నిర్ణయించబడిపోతుంది అనేది ఎంత భయంకర మైన సిద్దాంతమో,మానవుల మనస్సుపై దీని దుష్ప్రభావం ఎంతగా (ప్రసరిస్తుందో, ప్రసరిస్తూన్నదో ఊహామాత్రగమ్యం. అయితే ఈ శాశ్వతనరకసిద్దాంతానికి విరుద్ధంగా 'కానన్ఫార్రరొ మొదలైన వాళ్లు “శాశ్వతమైన ఆనందానికి ఆశ (ఆ౪౪౫2] 1100ల) అను సిద్దాంతాన్ని ప్రచారంలోనికి తీసికొనిరావడం సంతోషించ దగిన విషయం. (.180- 182)
ధ్యానం ద్వారా ఆంతరరహస్యాలను సాక్షాత్మరింపచేసికొనడం అనే ప్రక్రియ కొన్ని ధ్యానప్రధానకైస్తవసంప్రదాయాలలో (00౧2001268 0౯665 ఉంది. రోమన్ కాథలిక్ క్రైస్తవసంఘంలో కొన్ని మూర్తులూ పవిత్రజలాలు మొదలైనవాటి ఉపయోగం ఉంది. కొన్ని ప్రాచీనభాషలలో ఉన్న ప్రార్ధనలు ప్రచారంలో ఉన్నాయి.వీటిని ఉచ్చరించి నప్పుడు వీటి ధ్వనుల ద్వారా కొన్ని సత్రయోజనాలు లభిస్తాయి. వీటితో అదృశ్య మైన విశ్వంతో మానవుడు సంబంధం ఏర్పరచుకొన కలుగుతాడు అనేది వీళ్ల విశ్వాసం. ఇలాంటి సాధనల ద్వారా ఎందరో రహస్యవాద నిష్హాతులు (౫)/5603) సిద్దులు (62216), అద్భుతాలను సృష్టించకలిగిన వాళ్లు ఈ రోమన్ కాథలిక్ చర్చిలో ఆవిర్భవించారు. ఇతరసంఘాలకు (చర్చిలకు సంబంధించినవా ్లైవరూ వీటి దగ్గరికి కూడ వెళ్లజాలరు. ఈ రోమన్ కాథలిక్ సంప్రదాయానికి సంబంధించిన కొందరు రహస్యవాదులు జీవునికి ఈశ్వరునితో
324 కైసవ మతం ఐక్యాన్ని బోధిస్తూ ఇందుకు ఆవశ్యక మైన సాధనాలను కూడ బోధించారు. ఇవన్నీ హిందూమతానికి చాల సన్నిహితంగా ఉంటాయి. గ.182 - 183) క్రైస్రవమతానికి సంబంధించిన లఘునిబంధం చివర విభిన్నమతస్థులను, విశేషించి క్రైస్తవులను,సంబోధిస్తూ అన్నీ బెసంట్ ఈ విధంగా వ్రాసింది.
“క్రైస్తవు లందరూ విఖేదా లన్నింటినీ ఛేదించుకొని ప్రపంచంలోని గొప్ప మతా లన్నింటితోటి ఒకసర్వసాధారణ మైన వేదికమీదకు ఎందుకు రాకూడదు? కేవలం పందొమ్మిది శతాబ్దాల వయస్సుమాత్రమే కలిగిన ఈ ఆధునికమతం రెండువేల ఐదువందల సంవత్సరాల వయస్సు గల బౌద్దమతంతోను,పదివేల సంవత్సరాలకు, ఇరవైవేలసంవత్సరాలకు వెనుకకు వెనుకకు జరుగతూన్న జరోస్ట్ర మత-హిందూమతాలతోను ఎందుకు సహమతితో ఉండకూడదు? ఈశ్వరుదు,అన్ని మతాలకంటె చిన్నమత మైన తమ మతానికి మాత్రమే సంబంధించినవాడు అని చెప్పడంలో వాళ్లు మతవిషయక - ఈశ్వరవిషయకమహాపరాధం చేస్తున్నారు అను విషయం ఎందుకు గుర్తించడంలేదు”? (7.185)
“..మతాల మధ్య సౌహార్దం నెలగొనా లంటే మతాంతరాలలోనికి మార్చడం కోసం చేసే ప్రయత్నా లన్నీ పూర్తిగా ఆగిపోవాలి.ఏ ఒక్కరూ కూడ ఇతరులను తన మతంలోనికి మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. అలా ప్రయత్నించడానికి బదులు ఆ మతంలో ఉన్న మంచి విషయాలను తెలుసుకొనడానికి ప్రయత్నించాలి. ప్రతీ మతమూ కూడ ఈశ్వరునినుండి వెలువడిన ఒక రంగు కిరణం.అన్ని మతాలను కలిపితే సత్యమైన తెల్లని తేజస్సు మనకు కనబడుతుంది. మనం వేరు వేరుగా ఉన్నంతవరకూ మనం ఒక కిరణానికి చెందిన ఒక్క రంగుచేతనే ఆవరింపబడి ఉంటాం. మనం అన్ని మతాల అధ్యయనం చెయ్యాలి; అన్నింటినీ ఆదరించాలి; అప్పుడు మనం అందరమూ మనకు ఆదిమూలమూ అంత్యన్థానమూ అయిన ఆ మహాస్రోతస్సుకు గం 9 దగ్గర అవుతాం (9.186).
క్రైస్తవ మతం 325 'రెందవ అనుబంధం
శ్రైస్తవమతాన్ని గూర్చి "0060076410 య8౪ 6092 కుయ(6006 అను పుస్తకంలో ఉన్న కొన్ని విషయాలు.
-
జీసస్ పుట్టిన నాటికి యూదమతంలో అనేక అవాంతరశాఖ లుండేవి. పార్సీలు, సద్దూసులు,ఎస్సీన్లు అను జాతుల వారుండేవారు. ఎస్సీన్‌ల జీవనవిధానం చాల పవిత్రంగా ఉండదేది.సిరియా భాషలో ఎస్సీన్ అనగా చికిత్స చేసేవాదు.వీళ్లు శారీర - మానసిక - ఆత్మసంబంధి రోగాలకు చికిత్స చేస్తూందేవారు... వీళ్లు ('ప్రాచ్యదేశంనుంచి అక్కడికి వెళ్లి ఉంటారు. వీళ్ల [ప్రార్ధనలు,ధ్యానం, ఉపవాసాలు మొదలైనవి పూర్తిగా ప్రాచ్యదేశీయుల,భారతీయుల పద్ధతులను అనుసరించి ఉండేవి. గ్రా.176) (జీసెస్ వడ్రంగి వృత్తి చేసికొనేవా డని ఒక “ప్రసిద్ధి ఉంది.) (17
-
జీసస్ పుట్టడానికి చాల కాలం ముందునుంచీ కొన్ని కొన్ని ఆచారాలు, కొన్ని మాటలు ఎస్సీన్‌లలో ఉండేవి. వాటిని ఇప్పుడు క్రైస్తవమతానికి మాత్రమే సంబంధించిన విశేషాలు అని చెప్పుకొంటున్నారు. (2.177)
-
ఎస్సీన్లు బాప్టిజం (పవిత్రజలంతో సంస్కారం) ఆచరించేవారు. సామూ హిక పూజలలో వైన్ (ద్రాక్షసవం) లో ముంచిన రొట్టె తినేవారు.రొట్టె మధ్యకు విరిచి దానిలో వైన్ పోసి, ప్రీస్ట్ దానిపై నిలబడి దేవుని ప్రతినిధిగొ మాటలాొడుతూ
- “ఇది నా దేహం;ఇది నా రక్తం” అని అంటాడు. అక్కడ చేరిన భక్తు లందరూ అది తింటారు. ఈ ఆచారం ఇప్పటికీ క్రైస్రనమతంలో పాటించబడు తూన్నది, (177
-
“కంటికి బదులు కన్ను అనేది యూదుల న్యాయానికి సంబంధించిన అభిప్రాయం. అయితే ఎస్సీన్లుజీసస్కంటె చాల ముందే - “ఒక చెంపమీద కొడితే రెండవ చెంప చూపాలొ అని బోధించేవారు. (2.177
-
పైథాగరస్ క్రీ.పూ. 600-590 సంవత్సరాల ప్రాంతంలో ఆవిర్భ వించాదు. మాంసాహారం ఆలోచనాశక్తిని తగ్గిస్తుంది గొన అది మంచిది కాదు అని అతదు బోధించాడు. జీసస్ కూడ శాకావారియే. (2.279)
326 కైస్రవ మతం
-
కాన్స్టెచటెన్ చక్రవర్తి కాలంలో ఎక్యూమెనికల్ సమావేశం తరవాతనుంచీ క్రైస్తవులు మాంసాహారం ప్రారంభించారు. మాంసాహారం పరిహరించిన కైస్తవుల గొంతులో కరిగించిన సీసం పొయ్యా లని ఆతని ఆజ్ఞ. ఐతే కాలాంతరంలో మాంస భోజనం క్రైస్తవులకు మామూలు అలవాటైపోయింది.దీనికితగి నట్లు పశువులకు ఆత్మ లేదనీీచేతన ఉండ దనీ అరిస్టోటర్ (క్రీ.పూ. 384-322) సిద్ధాంతాన్ని సైంట్ ఆగస్టిన్ (క్రీ.ఈ 854-430) ప్రచారంలోనికి తీసికొనివచ్చాడు. థామస్ అక్వినస్ (1225-1274) కూడ దీనిని అంగీకరించాడు. అప్పటినుంచి ఇది ఒక మతసిద్ధాంతం అయిపోయింది. (1.179)
-
ప్రారంభదశలో పునర్దన్మసిద్ధాంతము,కర్మసిద్ద్ధాంతమూ మొదలైనవి క్రైస్తవులు అంగీకరించినవే. జీసస్ భారతదేశం, సిలోన్, హిమాలయ ప్రాంతదేశాలు మొదలైన ప్రాంతాలలో పర్యటించి ఆధ్యాత్మికజ్ఞానం పెంపొందించుకొన్నాడు. దాని ఫలితమే ఈ సిద్ధాంతాల అంగీకారం కూడ. అయితే ఆధునికకైస్తవసంఘాలు (చర్చిలు) ఈ జీసస్ దేశసంచారం విషయంలో మౌనం వహిస్తాయి.
-
ప్రాచీనకాలంలో రోమన్సు,గ్రికులూ కూడ చాలామంది దేవతలను పూజించేవారు. మిథ్ర అను పేరుతో సూర్యుడు గొప్ప శక్తి గల దేవతగా ఆరాధింప బడేవాడు. కాన్స్స్టెంటిన్ చక్రవర్తి (క్రీశ 280-887) కూడ మిధ్రదేవతను ఆరాధించే వాడు. అతడు క్రైస్త్ర్వమతంలోనికి మారిన తరవాత కూడ ఈ దేవతను పూజించే వాడు. అందుచేతనే యూదుల ప్రకారం సబాత్దే (ఈశ్వరుడు సృష్టి పూర్తి చేసిన తరువాత విశ్రాంతి తీసికొన్న రోజు) శనివారమే అయినా కూడ ఇతడు దానిని ఆదివారానికి మార్చాడు. (0.180)
-
బైబిల్లోని మొదటి కథ జరోష్టమత[గ్రంథాలలో ఉంది. అహుర మజద ఆరు దశలలో ప్రపంచకాన్ని సృష్టించి చివర మొదటి స్ర్రీపురుషులను సృష్టించాడు. అహ్రీమాన్ అను దుష్టాసురుని ప్రోత్సాహనంచేత వాళ్లు నిషిద్ధ మైన ఫలాన్ని తింటారు. దానితో పాప - మరణాదులు ప్రపంచంలోనికి వచ్చాయి. (౧.180)
-
ఈనాడు జైస్తవులలో ఉన్న అ[గ్రచర్శకర్తనం (0101౫05109) అను ఆచారం యూదులనుండి వచ్చినది కాదు.యూదజాతులు ఏర్పదకముందు
కైసవ మతం 327 క్రీ.పూ.4000 సంవత్సరాలకు పూర్వమే ఈజిస్ట్లోని ట్రీస్ట్లు ఈ ఆచారం పాటించేవారు. (౫.181)
-
బాప్టిజమ్ (పాపపరిహారంకోసం పవిత్రజలస్నానాదికం) చాలకాలం మంచి అనేకదేశాలలో ఉన్నది.దానినే క్రీస్తు అంగీకరించాడు. బాప్టిస్టు జాన్ దీనిని ప్రచారంలోనికి తీసికొనివచ్చాడు. అందుచేత ఇది క్రైస్తవమతానికి మాత్రమే సంబం ధించినది కాదు అని రివియర్డ్ జె.పి.లండీ వ్రాశాడు. (1.181)
-
జీసస్ పుట్టినప్పుడు ఆతని చుట్టూ తేజస్సు ఆవరించి ఉంది అని అంటారు. ఇలాంటిది బచ్చుస్, అప్పోల్లోమొదటి జొరోస్టర్, మోసెస్,అందరికంటె పూర్వం శ్రీకృష్ణుడు పుట్టి నప్పుడు కూడ కనబడింది. (1.181)
-
జీసస్ నలఖై రోజులు ఉపవాసం చేసినప్పుడు సతొన్ ఆతనిని చెడు మార్గం వైపు తిప్పడానికి ప్రయత్నించి నట్లు విఫలు డైనట్లు చెపుతారు. ఇటువంటి సంఘటనలు బుద్దుడు, పెర్షియాకు చెందిన జారోస్టర్, ప్రాలీన మెక్సికోకు చెందిన క్వెట్టల్కోట్ల్ మొదలైనవాళ్ల విషయంలో కూడ జరిగి నట్లు ఉంది. (2 181)
-
గొశ్జరేం (మార్క్‌లో (8-29-80) ఇలా చెప్పబడింది. “నన్ను మీరే మనుకుంటున్నారు?” అని జీసస్ అడిగి నప్పుడు “క్రీస్తో అనుకొ ంటున్నాము అని పీటర్ సమాధానం చెప్పగా “నన్ను గురించి ఎవరికీ ఇలా చెప్పకంది” అని జీసస్ హెచ్చరించాడు. "క్రిస్ట్ అను గ్రీక్ిపదానికి 'మెస్సయా' (లోకోద్దారకుడు) అని అర్ధం. ఇది ఎవరికీ పేరు కాదు.అయితే పాల్ ఆంటి యార్నగరంలో బోధించడానికి ప్రారంభించి నప్పుడు జీసస్‌ను గూర్చి మొట్టమొదటిసారిగా కన్ అను పదం ప్రయోగించాడు. ().189)
-
జీసస్ చెప్పిన ఏదో విషయం (గ్రహించి దానికి ఎన్నో కొతీ విషయూలు చేర్చి చెప్పడం పాల్‌కు బాగా అలవాటు. ఈ విధంగా జీసస్ చెప్పని ఎన్నో సిద్దాంతాలు క్రైస్త్వవ్రమతంలో (ప్రవేశించాయి. “మానవుల ప్రాపాలకోసం జీసస్
ఆత్మత్యాగం చేశాడు” అనేది ఇలాంటి కల్చనలలో ఒకటి.దీనిలో జీసస్ బో ధించి సన్మార్గ ప్రవర్తన మొదలైనవాటికి విలువ పోయి,కేవలం ఈ విషయంమీద విశ్వం ఉంటే మానవుని పాపా లన్నీ పోతాయి అను శాస్త్రవిరుద్ధ మైన నమ్మకం క్రైస్తవుల మనస్సులలో నాటుకొని పోయింది. (189)
326 కైస్తవ మతం
-
జీసస్ సిలువమీద ఎక్కించబడి మరణించిన తరువాత నరకంలో ఉండి మూడవ రోజున మళ్లీ లేచి నట్లు చెప్పబడుతున్నది.ఇదే కథ పర్షియాకు చెందిన జొరోస్టర్, ఈజిప్ట్‌కు చెందిన ఓసిరిస్ - హోరస్ -అడోనిస్ - బచ్చుస్ - హెర్మ్యుల్స్ల విషయంలోను,స్కాండినేవియాకు చెందిన బల్టుల్ విషయంలోను, మెక్సికోకు చెందిన క్పెట్టెల్కోట్ల్ విషయంలోను వాళ్ల పుస్తకాలలో ఉంది. వీళ్లందరూ అద్భుతకృత్యాలు చేసినవాళ్లే. (౧.182)
-
జీసస్ పుట్టిన రోజును గూర్చి అభిప్రాయభేదాలున్నాయి. అతడు వసంత బుతువులో పుట్టి నట్లు కొన్ని చోట్ల చెప్పబడింది.కొందరు ఏప్రిల్ - మే మాసాలలో పుట్టి నట్లు చెపుతారు.ఈ నాటికీ ఈస్టర్న్చర్చ్ జనవరి ఏడవ తారీకున ఈ పండుగ జరుపుతుంది; వెస్టర్న్చర్చ్ డిశంబరు 25 న జరుపుతుంది. ఈ రోజు ఆంటోనిక్స్పయస్ (138 - 161 4 0 ) చేతనో, కమ్మోదస్ (180 - 192 &.0.) చేతనో నిర్ణయించబడిం దని అంటారు. (1 185)
-
నేడు క్రైస్తవమతంలో కనబడే ఎన్నో ఆచారాలు ప్రాచీనమతాలనుంచి వచ్చాయి. (.9.186-189)
-
జీసస్ పుట్టిన రోజును గూర్చే కాక ప్రదేశాదులను గూర్చి కూడ చాల అభిప్రాయఖేదా లున్నాయి. బైబిల్లో కూడ విరోధం కనబడుతున్నది. న్యూటెస్టా మెంటులోని మాధ్యూమార్క్ట్యాక్,జాన్ అను నాలుగు గాస్పెల్సు క్రీస్తును గూర్చీ, క్రైస్తవసిద్దాంతాలను గూర్చి పరమ(్రమాణాలుగా చెప్పబడుతాయి. అయితే అవి కూడ క్రీస్తు మరణించిన తరువాత అనేక దశాబ్దాల అనంతరం 50-100 4.0. సంవత్సరాల మధ్య గ్రీక్ లేదా అరామైక్ (4200210) భాషలో వ్రాయబడ్డాయి. (2.189-190)
-
జీసస్ పుట్టుకకు సంబంధించిన కొన్ని కథల విషయంలోనే కాకుండా అసలు జీసస్ అను వ్యక్తి ఉందేవాదు అను విషయంలో కూడ తీవ్రమైన వాద - ప్రతివాదాలు 1768 నుండి నేటి దాకా జరుగుతూనే ఉన్నాయి. (1.191 - 1902). 1768లో హెర్మాన్ రీమారస్ (140% గలుుజగుం) అను ప్రొఫెసర్ హాంబర్ల్లో
క్రీస్తు జీవనాన్ని గూర్చి వ్రాసిన 1400 పేజీల వ్రాతప్రతి ప్రకటించకుండా
'కైసవ మతం 329 ఉంచివేశాడు.ఆరు సంవత్సరాల తరవాత గాత్వోల్డ్ లెస్సెంగ్ (60౪1014165 బ్రి దానిలోని భాగాలను (వుల్హ్యబ్బెల్ ప్రాగ్మెంట్స్ (1/0[046421228ై01అట) అను పేరుతో ప్రకటించాడు. 1796లో హెర్టెర్ (1అ64ల0 మాథ్యూ - మార్క్ - బ్యాక్లలో ఉన్న క్రిస్తుకూ జాన్ గాస్పెల్లో ఉన్న క్రిస్తుకూ మధ్య ఉన్న సమన్వయం చేయడానికి శక్యం కాని భేదాలను గూర్చి వ్రాశాడు. హీనిిక్ పాలస్ (యయ ౧2౬15) 1828లో, 1192 పేజీల పుస్తకంలో క్రిస్తు చేసినట్లు చెప్పిన అద్భుతకార్యా లన్నీ (ప్రాకృతిక మైన కారణాలవల్ల జరిగినవే అని వ్రాశాడు. డేవిడ్ స్త్రాస్ (02౪14 56209) “లైఫ్ ఆఫ్ జీసస్” అను పుస్తకంలో ఆ జీవితానికి సంబంధించిన అలౌకిక విషయా లన్నీ పురాణకథలు మాత్రమే అని వ్రాశాడు. 1885-1886 సంవత్సరాలలో ప్రకటించిన ఈ పుస్తకం చాల దుమారం లేపింది.జీసస్ ఆఅవిర్భావాన్నే ప్రశ్నిస్తూ అనేక గ్రంథాలు వివిధ దేశాలనుండి ప్రకటింపబడ్డాయి. క్రైస్తవసిద్ధాంతా లన్నీ జీసస్‌ను ప్రత్యక్షంగా చూడని పాలునుండి వచ్చినవే అవడంచేత ఇలాంటి విభిన్నాఖిప్రాయాలకు అవకాశం ఏర్పడింది.
న్యూటెన్టామెంట్ సంకలనం చేసేనాటికి సుమారు యాఖై (60) గొస్పెలు ప్రచారంలో ఉండేవి.వాటి నన్నింటినీ దీనిలో సంగ్రహించలేదు.తమకు అంగీకార్య మైన సిద్ధాంతాలు ఉన్నవాటిని మాత్రమే సంగ్రహించడం జరిగింది. మానవులను, ప్రధానంగా క్రైస్తవులను,పాపాలనుండి ఉద్ధరించదానికి క్రిస్త్ తనను సిలువపై బలి ఇచ్చాడు అను సిద్ధాంతానికి విరుద్ధంగా ఉండడంచేత పీటర్ గొస్పెల్ను (6౦౩610? 620) దీనిలో చేర్చలేదు. “దీని నంతనీ పట్టి క్రైస్తవమతం ప్రస్తుతం మనకు లభిస్తూన్న బైబిల్మీద ఆధారపడి వృద్ధి పొందింది అని చెప్పదంకంటి బైబిల్ దీని సంకలనం చేసిన రోజులలో ఉన్న భావాలను ఆచారాలను ఆధారంగొ చేసికొని వ్రాయబడింది అనిచెప్పదం యుక్తంగా ఉంటుంది". (9.192)
- మరణించినవాడు కొన్ని వందల - వేల - సంవత్సరాల తరనొ త పునరుజ్జీవితుడై మళ్లీ తన శరీరంలో ప్రవేశించి శాశ్వతస్థానంలోనికి వెదతొడు అనే ఈ అర్ధరహితమైన సిద్దాంతాన్ని కల్పించినవాడు పాల్ (౫.194). భూమిలో ఖననం చేసిన శరీరాన్ని ఎవరైనా అపహరించినా,అది పూర్తిగా చివికిపోయిగా:
330 కైసవ మతం సము(ద్రంలో పడవేసినా,దానిని కాల్చివేసినా,దానిలోని కొన్ని అవయవాలు ఇతరులకు దానం చేసినా అదే శరీరంలోనికి మళ్లీ రావడం అనేది ఎలా కుదురు తుంది? (10196)
బి న్యూటెన్టామెంట్లోని గాస్పెల్సు పన్నెండుగురు అపోస్టల్స్ వ్రాశా రని చాలమంది నమ్మకం. ఆండ్రూ,జున్,బర్లోలోమ్యూ, జుడాస్,జూద్,జేమ్స్,మరొక జేమ్స్,మాత్యూపీటర్,ఫిలప్,సిమోన్,థామస్ అనేవాళ్లు పన్నెండుగురు అపోస్టల్స్. జుడాస్ ఆత్మహత్య చేసికొన్న తరవాత అతని స్థానంలో మిథియాస్ వచ్చాడు. న్యూటెస్టామెంట్లోని చాలా పుస్తకాలు వ్రాసినట్టు చెప్పబడే మార్క్ల్యూక్, పాల్
- అపోస్టల్స్ కారు.పాల్ జీసస్‌ను ఎన్నడూ కలవలేదు;జీసస్ అంతర్జితు దైన చాల కాలానికి పాల్ జైస్త్రవ్రమతం తీసికొన్నాడు. రివెలేషన్స్ (6౪౦12601౧9) కూడ అజ్ఞాతరచయితల రచనల సంకలనా లని చాలమంది అంటారు. (196)
క్రీస్తు మరణానంతరం కొన్ని వందల సంవత్సరాల తరవాత కైస్తవమతం బలపడింది. కాన్స్టటెన్,పోప్ కూడ జీసస్ యొక్క దివ్యత్వాన్ని శంకించే (గ్రంథా లన్నీ నశింపచేసి,వాటి రచయితలను వెలివేసి,వాళ్లందరు శాశ్వతంగా పతితులై పోయా రని ఉద్దోషించారు. థియోడోసియస్ చక్రవర్తి 881లో ఒక సాధారణ సమితి సమావేశం ఏర్పరచి విరుద్దాభిప్రాయం కలవాళ్ల నందరినీ కఠినంగా దండించాడు. (197
ఇలాంటి దండనలు,వెలివేతలు,వైజ్ఞానికులకు మరణశిక్షలు క్రైస్తవమత చరిత్రలో అందరికీ తెలిసినవే.
- 1994 సంవత్సరంలో వాటికన్నుంచి బిషప్లందరికీ ఒక లేఖ (ఆజ్ఞా పత్రం) పంపబడింది. దీనిలో భారతదేశంలో అనాదికాలంనుండీ ప్రచారంలో ఉన్న యోగాభ్యాసాన్నీ చైనా జపాన్ మొదలైన దేశాలలో 'జెన్ అను పేరుతో ప్రసిద్ధమైన యోగధ్యానపద్ధతినీ నిందిస్తూ వాటిని అభ్యసించకూడ దని నిషేధింపబడినది. ఈ లేఖ కార్డినన్ రాట్జింజెర్చే వ్రాయబడింది. దీనికి పోప్ జాన్ పాల్2 ఆమోదము(దద్ర వేశాడు. (2.216)
ఇలాంటి ప్రవృత్తులు చూచినప్పుడు-
కైసవ మతం 331
“భుజ్యతే£౬.న్నం చ వసతే వాసః సర్వే౭_ ప్యనాగరాః
భుజ్జీమహి తతో నాన్నం న వా వాసో వసీమహి”
“నాగరికత తెలియనివా క్షందరూ అన్నం తింటారు,బిట్ట కడతారు. అందుచేత మేం అన్నం తినం బట్ట కట్టం”అన్న శ్లోకం గుర్తుకు వస్తుంది.
-
అమెరికాలోని చాల పెద్ద ప్రాటస్ట్రాంట్ చర్చకి సంబంధించిన ఇంటర్ నేషనల్ మిషన్ బోర్డ్ ఆఫ్ ది సతర్న్ బాప్టిస్ట్ కన్వెన్నన్ ద్వారా 1999 అక్టోబర్‌లో ఒక ప్రార్ధనల పుస్తకం ప్రచురించబడింది.పిందువులను క్రైస్తవమతంలోనికి మార్చ వలసిందిగా ఈ కన్వెషన్ సభ్యుల నందరినీ ఉద్చోధిస్తూ ఈ పుస్తకంలో ఒక . చోట ఇలా వ్రాయబడింది- “తొమ్మిదివందల మిలియన్లకు పైగా జనం హిందూ మతం అనే ఎలాంటి ఆశకూ అవకాశం లేని (1100616559) అంధకారంలో మునిగిపోయి. ఉన్నారు.అందుచేత మీరందరూ దీపాల పండుగ (దీపావలి) జరుపుకొనే హిందువు లందరూ వాళ్ల హృదయాలలో ఉన్నఏ దీసమూ తొలగించే లేని, అంధకారాన్ని గూర్చి తెలుసుకోవా లని ప్రార్థించండి”. “హిందూమతానికి సంబంధించిన కాళికాదేవి ద్వారా ఇతర దేవీదేవుల ద్వారా సతొన్ కలకత్తాను ఆక్రమించుకొని ఉన్నాడు. క్రిస్తు చూపిన మోక్షమార్గం కలకత్తాకు చేరడానికి ఇది సరి మైన సమయం”. (1.216)
-
1999 సంవత్సరం డిశంబరు మాసంలో పోప్ భారతదేశానికి వల ఢిల్లీలో కాథలిక్ బిషప్ సమ్మేళనం ఒకటి జరిపొదు.ఆ సంమేళనంలో 14లి పేజీల పత్రసంచయం (ఉంయులలి ఒకటి వైలువరించబడింది. దొనిలో భారతదేశంలో ఉన్న కాథలిక్ చర్చియొక్క ఉద్దేశ్యాలూ, ఆశయాలూ, ఆశలూ ఆవిష్మరింపబడ్డాయి - “మొదటి సహస్రాబ్దిలో యూరప్ఖందం నేలమీద శిలువ (౮౦99) నిలబెట్టబడింది; రెండవ సహస్రాబ్టిలో అమెరికాలోను, ఆథ్రికొలోను నిలబెట్టబడింది.ఈ మూడవ క్రైస్తవసహ్రాబ్టిలో విశాలమూ సారవంతమూ అయిన ఆశియాఖండంలో క్రైస్తవవిశ్వాసానికి సంబంధించిన అపార మైన పంట పండింపబడగల దని (ప్రార్ధిస్తున్నాం”. (27
వీటినన్నింటినీ పట్టి ప్రతీ ఒక్కరినీ ్రైస్తవమతంలోనికి మార్చడమే క్రైస్తవ
332 కైస్త్వవ మతం మతం యొక్క ప్రధానధ్యేయం అని స్పష్టం అవుతుంది.అయితే యూరప్ఖందంలో విస్తరించిన ఈ మతం అందరినీ ఉద్ధరించడంకోసమే ప్రయత్నించిందా, ప్రయత్ని స్తూన్నదా అనేది జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం. అతిభయంకర మైన 'ప్రపంచయుద్దాలు రెండూ ప్రారంభించినది యూరప్‌లోని క్రైస్తవులే అను విషయం పోప్కూ,బిషప్లకూ గుర్తు చేయవలసి ఉంటుంది.ఐదు మిలియన్ల (యాభై లక్షల) యూదులను నిర్దాక్షిణ్యంగా హతమార్చింది జర్మన్కైస్తవులే కదా? స్పైన్కైస్తవులే కదా ఎందరో ముస్లింలను ఆ దేశంనుండి తరిమివేసింది? ఈ నాడు కూడ ఐర్లాండులో ' కాథలిక్ (క్రిస్టియన్లు, ప్రాటిస్ట్రాంట్ క్రిస్టియన్లు ఒకళ్ల నొకళ్లు చంపుకొంటూ యుద్దాలు కొనసాగిస్తున్నారు. (ప్రొటస్టాంట్లు కాథలిక్స్మీద తోడేళ్లవలె పడి చంపుతున్నారు” అని పోప్ స్వయంగా అన్న మాటలు. వాళ్ల చరిత్ర ఇలాంటి సంఘటనలతో నిండి ఉన్నప్పుడు క్రైస్తవుల భాతృత్వము (3౯06ల 006) (ప్రేమా ఇవన్నీ ఏమై పోయినట్లు? (217 జీసస్ గోరీనుంచి కొన్ని రోజుల తరవాత లేవడం వంటి విషయా లన్నీ పౌరాణిక కల్పనలే అని డేవిడ్ స్ట్రాస్ మొదలైనవాళ్ల వాదనలు ఉందనే ఉన్నాయి. ఈ మధ్య 2007 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీకునాటి “ది హిందూ పత్రికలో “జీసస్ కుటుంబ అవశేషాలు : ఒక వివాదజనక మైన అవిష్క్మరణం” (69౪5 క్)? 1600215) అను శీర్షికతో ఒక వార్త అమెరికాలో ప్రచారంలో ఉన్నట్లుగా, (ప్రచురించబడింది. రెండు వేల సంవత్సరాల (క్రితం జెరూసెలం ప్రాంతంలో ఉన్న అలవాటు ప్రకారం మృతశరీరం దానంతట అదే శుష్కించిపోయేటట్లు ఒక సంవత్సరం పాటు అలాగే ఉంచివేయబడుతుందట. అస్థిపంజరం మాత్రమే మిగులుతుంది. దానిని జాతి పెట్టెలో పెట్టి గోరీలో పెడతారు. ఈ జాతి పెట్టెలకి అస్సువరీస్ (05542663) అని పేరు. జెరూసలెం దగర తాల్పియోట్ (౧౫1౦4 94065 ౦5 ల౪92169) 1980 సంవత్సరంలో క్రీ.శ. మొదటి శతాబ్దానికి చెందిన పది ఆస్సువరీస్ త్రవ్వకాలలో దొరికాయి.ఆ పదింటిలో ఆరు ఆస్సువరీస్మీద జీసస్ పేరు,మేరీ మగ్గాలెన్
'శైస్త్రవ మతం 333 (487 11286441లల) పేరూ,మరొక మేరీ పేరు (ఈమె జీసస్ తల్లి అని కొందరి అభిప్రాయం).మాథ్యూ - యోస్ల పేర్లు (వీళ్లు జీసస్ నలుగురు సోదరులలో ఇద్దరు అని కొందరి అభిప్రాయం) అతని కుమారుడు జుడా (౪621) పేరూ ఉన్నాయి.జీసస్ మేరీ మెగ్టాలిన్ను వివాహం చేసికొన్నా డన్సీవారిద్దరికీ 116 ల/హేం 006పద్ధతిని పుత్రు డున్నా డనీ అంటారు. పెట్టెలు 1980 లోనే బైట పడినా ఆనాడు వీటి కాలాన్ని నిర్ధారించ డానికి తగిన వైజ్ఞానికసాధనాలు లేకపోవడంచేత వీటిని చాలమంది అంతగా పట్టించుకొనలేదు. ఈ మధ్య 9]4 పరీక్షల ద్వారా ఇవి రెండు వేల సంవత్సరాల క్రితానివే అనీ జీసస్ - మేరీవెగ్దానీన్లు దంపతు లనీ నిర్ధారణ అయినట్లుఈ పెట్టెలు వాళ్లకి సంబంధించినవే అనీ చాలమంది (ప్రచారం చేస్తున్నారు. ఆ కాలంలో చాలమందికి ఈ పేర్లు ఉందేవిఅందుచేత వాటికి ప్రామాణ్యం అంగీకరించ వలసిన పని లేదనీ ఇస్రాయిల్లోని పురావస్తుపరిశోధక శాఖవారు అంటున్నారు.
అసలు క్రీస్తు అను వ్యక్తియే ఉండేవాడో లేదో అను విషయం సందేహాస్పదం అను వాదం దీనిచేత నిరాకరింపబడిన్నాపునరుజ్జీవనాదులు కాల్పనికములే అను వాదానికి ఇలాంటివి పునరుజ్జీవకాలుగా ఉంటాయి.
ఇస్లాం మతం ఇన్లాం ఒక మతప్రవక్రద్వారా ఆవిర్భవించిన మతం. ఇతరమతాలతో పోల్చి చూస్తే చాల నవీన మైనది. మహమ్మద్ చేసిన బోధలు దీనికి ఆధారం. మహమ్మద్ ఈశ్వరుని (అల్లాయొక్క దూత (రసూల్) అని ఈ మతస్థుల విశ్వాసం. అబ్రహాం, మోసెస్, జీసస్ మొదలైన పూర్వమతప్రవక్తలు నిజమైన ప్రవక్తలే అనీ, వారి బోధలు కూడ (ప్రమాణమే అనీ అంగీకరించినా ఇస్లాంమతం మహమ్మదే చివరి ప్రవక్త అనీ, అతదే ప్రబలుడైన ప్రవక్త అనీ విశ్వసిస్తుంది. ఆతడు చేసిన బోధలే చివరి బోధలు అందరూ ఈ బోధలను అనుసరించాలి. భగవంతుడు మహ్మదుకు చేసిన ఆవిష్కరణలూ, ఆతని అనుభవాలూ ఆధారంగా చేసికొని బయలుదేరిన ఈ మతం స్వతంత్రమతం అని ఈ మతం అనుసరించేవాళ్లు వాదించినా ఈ మతంమీద జరోష్టర్ - యూద - క్రైస్తవమతాల ప్రభావం అత్యధికంగా ఉన్న దన్న విషయాన్ని ఎవరూ కాదనజాలరు. ప్రచారకుల పట్టుదల (0115510027 2621) చేర్చిన యూదమతమే ఇస్లాం అయిన దని చాలమంది అంటారు. పర్వతశిఖరం మీద చేసిన ఉపదేశాల (6ఠషం[గ 0% 6 !10లూ0 ప్రయోగాత్మక స్వరూపమే దీనిలో బోధించిన వైతికమార్గం అని కూడ అంటారు. ఈ అభిప్రాయం పూర్తిగా యథార్థం కాకపోయినా ఈ మతంమీద యూదమతప్రభావం అత్యధికంగా ఉన్న దనే విషయం నిర్చివాద మైనది. యూద - కైస్తవమతాల వలె సెమిటిక్ మూలం గల ఇస్లాంమీద ఆ రెండు మతాల ప్రభావం ఉండడంలో అశ్చర్యం కాని అసంభావ్యత్వం కాని లేడు. ఈశ్వరస్వరూపం, మరణానంతరజీవితం, స్వర్గనరకాలు మొదలైన విషయాలలో ఈ మూడు మతాలకీ సామ్యం ఉంది. అతి కఠిన మైన నియమాలు విధించి ఒక విశిష్ట మైన జీవనవిధానాన్ని బోధించడం ఈ మతంలో చెప్పుకొనదగిన గొప్ప విశేషం. మహమ్మద్ క్రీ.శ. 570-580 ల మధ్య అరేబియాలో బానీహషిం అను ఉత్తమవంశంలో పుట్టాడు. ఆ కాలంలో అరేబియాలో బహుదేవతారాధన, వివిధ పూజావిధానాలు, వి[గ్రహారాధన (ప్రచారంలో ఉండేవి. దేవతలకు పశువులనే కాక మానవులను కూడ బలులుగా ఇస్తూందేవారు. బలి ఇచ్చినవాటి మాంసం
ఇస్తాం మతం 335 తింటూండేవారు. క్రీ.శ. ఆరవ శతాబ్దంలో మతయుద్దాలు చాల తీవ్రంగా ఉండేవి. బంధువులు బంధువులను చంపేస్తూండేవారు. మహమ్మద్ కర్మకలాపం గాని, విగ్రహపూజ కాని లేని ఏకేశ్వరవాదాన్నీ కళోరనియమాలతో కూడిన జీవనవిధానాన్నీ బోధించాడు. ఈ విధంగా మహమ్మద్ బోధించిన మతం ఆ నాడు అలవాటులో ఉన్న ఆచారాలకీ మతవిశ్వాసాలకీ విరుద్ధంగా ఒక సంస్కారరూపంలో అరేబియాలో ఆవిర్భవించింది. ఈ దృష్ట్యా దీనిని బౌద్ధమత - క్రైస్తవమతాదులతో పోల్చవచ్చును.
మహమ్మద్ తండ్రి ఆతడు మాతృగర్భంలో ఉండగానే మరణించాడు. తల్లి కూడ ఆతని శైశవంలోనే మరణించింది. తలిదండ్రులు లేని ఆ పిల్లవాడిని ఆతని పినతండ్రి అబుతాలిబ్ పెంచి పెద్దవానిని చేశాడు. వీళ్లది ఉత్తమవంశమైనా పేద కుటుంబం. మహమ్మద్ చదువు చాల స్వల్ప మైనది. ఆతడు నేర్చుకొన్న దంతా పినతండ్రినుండియే నేర్చుకున్నాడు. అతడు పన్నెండు సంవత్సరాల బాలుడుగా ఉండగా పినతండ్రితో కలిసి సిరియా వెళ్లి నప్పుడు అక్కడ తొలిసారిగా క్రైస్తవమతాన్ని గూర్చి కొంచెం తెలుసుకొనడం జరిగింది. అది ఆతని మనస్సుపై తాత్విక (0120500110) భావముద్ర వేసింది. కొంతకాలం అతడు గొజ్జెల కాపరిగా, ఒంటెల కాపరిగా ఉన్నాడు. పినతండ్రి వద్ద వ్యాపారం చేయడం నేర్చుకొన్నాడు. అతడు 25 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు భర్భృవిహీన యైన ఖాడిజా అను ఒక ధనికురాలి సార్ద్థానికి (యాత్రచేసే వర్తకసంఘానికి) నాయకత్వం వహించి సిరియాకు తీసికొని వెళ్లాడు. కొంతకాలం తరవాత ఆమె కోరగా ఆమెను వివాహం చేసికొన్నాడు. అమె ఈతనికన్న 15 సంవత్సరాలు పెద్దది. వారికి ఇద్దరు పుత్రులూ నలుగురు కుమార్తెలూ కలిగారు. అయితే కుమారు లిద్దరూ బాల్యంలోనే మరణించారు.
మహమ్మదు నలభై సంవత్సరాల వయస్సులో ఉందగా శ్రీశ. 610 సంవత్సరంలో ఒకనాడు ధ్యానంలో ఉన్న ఆతనికి గ్రేబిల్ అను దేవత కనబిడి ఈశ్వరుని దివ్యసందేశం అందించాడు. నిజానికి ఈ సందేశావిష్మారానికి పూర్వం కూడ మహ్మద్‌లో అసాధారణ మైన ఆధ్యాత్మికశక్తిని సూచించే లక్షణాలు కనబడుతుండేవి. అతడు మాటి మాటికీ ప్రార్ధనలూ ధ్యానమూ చేయడంకొరకు పర్వతగుహలలోనికి వెడుతూండదేవాడు. ఏకాంతప్రదేశం ఆతనికి చాల ఇష్టంగా ఉండేది. గేబ్రిల్ సాక్షాత్మారంలో ఆతనికి ఈశ్వరునినుండి మతప్రవక్తృత్వానికి
336 ఇస్తాం మతం సంబంధించిన పిలుపు అందినది. మహమ్మదుకు ఈ క్రింది విధంగా తత్త్వావిష్కారం జరిగిం దని అంటారు. “ఓ! మహమ్మదూ! నువ్వు భగవంతుని దూతవు. నేను గేబ్రిల్ను.” తరువాత ఈ క్రిందిది చదవవలసిందిగా గేబ్రిల్ మహమ్మదుతో చెప్పాడు”-
“చదువుము; రక్తశకలాలనుండి (రక్తపిండాలనుండి) మానవుణ్ణి సృజించిన
నీ ప్రభువు పేర చదువుము. లేఖనితో
ఇంతవరకు మానవులకు తెలియనిదాన్ని బోధించిన
నీ ప్రభువు ఎంతో హితకరుడు” మహమ్మదు దీనిని చదివినతరవాత గేబిల్ అంతర్జానం చెందాడు. అయితే ఈ సాక్షాత్మారం జరిగిన తరువాత మహమ్మదులో చాల భయం ప్రవేశించింది. ఖాడిజా ధైర్యం చెప్పిన తరవాత, గేబ్రిల్ మళ్లీ కనబడి “నువ్వు ఈశ్వరుని దూతవు” అని మరొక పర్యాయం చెప్పిన తరవాతనే మహమ్మదు మామూలు మనిషి అయ్యాడు. మహమ్మద్ ఆ వార్తను ప్రచారం చేయడానికి ప్రారంభించిన క్రొత్త రోజులలో చాల తక్కువమంది మాత్రమే ఆ మాట విన్నారు. బహుశా ఆతని భార్య యైన ఖాలిజాయే ఆతని వార్తను విశ్వసించిన మొట్టమొదటి వ్యక్తి.
దాదాపు పది సంవత్సరాల పాటు మహమ్మదు మక్కాలో తన సిద్దాంతం బోధించినా దాని నెవరూ పట్టించుకొనలేదు. కొందరు క్రింది జాతులవాళ్లు మాత్రం చేరి ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఈ రోజులలో ఒకనాడు మహమ్మదు కాబాకు వెళ్లి “ఒకే దేవు డున్నాడు” అని ఘోషించాడు. అనేకమైన దేవీలను దేవుళ్లనూ పూజించే అక్కడి వాళ్లు కోపించి ఆతనిని చంపడానికి సిద్ధపడగా ఆతని పినతండ్రి కాపాడాడు. అతని అనుచరు లందరూ పారిపోయి అబిసీనియాలో తల దాచుకొన్నారు. ఆతని పినతండ్రి ఈ ఉపదేశం మానుకోవలసిందిగా సలహా ఇచ్చినా అతడు విడువలేదు. ఆతని మతానికి విరోధం పెరగడంతో మహమ్మదు 621 సంవత్సరంలో యాధ్రిబ్ చేరి తానూ తన అనుచరులూ నివసించడానికి తగిన ప్రదేశం చూచుకొన్నాడు. కాలంతరంలో యాథ్రిబ్కు మదీనా అను పేరు వచ్చింది. మతప్రవక్తయొక్క నగరం అని దీని అర్ధం. ఈ 621 నుండి ఇస్లాంశకం ప్రారంభం అయింది. ఇంతలో ఆతని (ప్రేమ - విశ్వాసపాత్రురా లైన ఖాడిజా మృతి చెందింది.
ఇన్లాం మతం 337 మహమ్మద్ తన అధికారాన్ని బలపరచుకొనడం ప్రారంభించాడు. తన మతం అంగీకరించని మదీనావాసులను, ప్రధానంగా యూదులను అధికంగా ద్వేషించి వాళ్లను దేశంనుంచి వెడలగొట్టడం గాని, చంపివేయడం గాని చేశాడు. “ప్రాచీన మతప్రవక్తలు చెప్పిన బైబిల్లో ఉన్న విషయా లనే వక్రీకరించి చెపుతున్నాడు” అని యూదు లనడంచేత వాళ్లపై ఆతని కంత కోపం. క్రైస్రవమతంలో ఉన్న త్రిమూర్తి (17 హ0౧) వాదం ఈశ్వరునికి ఇద్దరు భాగస్వాములను కల్పిస్తున్నది అని అంటూ దానిని నిరాకరించి జీసస్ లోకరక్షకుడు (52౪100 గాని, దివ్యాంశ సంపన్నుడు కాని కాడు అని ఘోషించాడు. అందుచేతనే క్రైస్తవులు ఇస్లాం సిద్ధాంతవిరోధి మతం (16:65) అని దీనిని ఆక్షేపిస్తూంటారు. క్రమంగా బెడోవిన్ మొదలైన జాతులకు చెందినవాళ్ల సాహాయ్యంతో బలపడి యుద్ధాలు చేసి జయం సంపాదించాడు. పదిహేనుగురు (తొమ్మండుగురు అని కొందరంటారు) భార్యలను వివాహం చేసికొన్నాడు. ఆ వివా హససంబంధాలవల్ల కూడ అధికంగా బలం చేకూరింది. వీని అనుచరులు మెక్కాసార్థాలను దోచుకొనడం ద్వారా ధనం కూడ బెట్టారు. 624 సంవత్సరంలో మక్కొ వాసులతో సంఘర్షం ప్రారంభించాడు. యుద్ధం చేయనవసరం లేకుండానే 630 లో దానిని వశం చేసికొన్నాడు. తరువాత కాబాలో ఉన్న దేవతల నన్నింటినీ ధ్వంసం చేసి ఒక్క అల్లాను మాత్రమే పూజించా లనే కట్టడి చేసి తాను అల్లా నియమించిన ప్రవక్త నని ఘోషించుకున్నాడు. వాస్తవానికి స్త మహమ్మదు పుట్టడానికి ముందే బెడీవిన్ అరబ్బులకు అల్లాను గూర్చి తెలుసును కాని వాళ్లు తమ మతసంబంధి ఆచారాలలో ఆతని కంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ కాలంలోనే మక్కాలోని కాబా ఒక పవిత్ర తీర్ధయాడ్రాక్షేతంగా ఉండేది. హబూల్ ప్రధానదేవతగా ఉండేవాడు. చుట్టు ప్రక్కల ఉన్న జాతులవాళ్లు కూడ పవిశ్రక్షేతం అవడంచేత కాబొకు చాలా ఇతరదేవతలను తీసికొనివచ్చి ప్రతిష్టించి పూజిస్తూందేవారు. ఇలాంటి దేవతలు 860 మంది ఉందేవారు. మహమ్మద్ ఈ విగ్రహా లన్నీ ధ్వంసంచేసినా వాటి పూజాదులకు సంబంధించిన కొన్ని ఆచారాలు ఇస్లాం చేరాయి. అయితే కాబాలో ఉన్న నల్లటి రాయి అబ్రహాంకు దేవుడు ఇచ్చా దనీ అది పవిత్ర మైన శిల అనీ మహమ్మదు ఘోషించాడు. ఆ శిల పేరు హజర్-అల్-
338 ఇన్లాం మతం అస్పద్. ప్రనమదంపతులు పాపంలో పడినప్పుడు ఆ శిల స్వర్గంనుండి భూమిమీదకు వచ్చిన దని ఇస్లాంలో ఒక విశ్వాసం ఉంది. అసలు తెల్లగా ఉండే శిల పాపాత్ముల స్పర్శవల్ల నల్లబడిన దట. (.౪.68; ౫.111). కాబాదేవాలయంలో ఆగ్నేయదిక్కు మూలలో ఉన్న ఈ శిల నేలమీదనుండి 114 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఎరుపు ఛాయలతో పసుపుపచ్చని చుక్కలతో నల్లగా ఉంటుంది. ఇది 11 అంగుళాల వెడల్పు 15 అంగుళాల ఎత్తు. ఇది పై భాగంలో కోడిగుద్దు కొన ఆకారంలో ఉంటుంది (2.112). ఇది ఈశ్వరలింగం అయి ఉంటుం దని కొందరి అభిప్రాయం. కాబాలోపల ఉన్న చిత్రా లన్నీ కూడ తీసివేయబడ్డాయి. అయితే మేరీ - జీసస్‌ల చిత్రాలు మాత్రం ఉంచారు. అయితే ఇక్కడికి క్రైస్తవమతం వ్యాపించనప్పుడు ఇవి మేరీ - జీసస్‌ల పటాలు కాక దేవకీ - శ్రీకృష్ణుల పటాలు కావచ్చు నని కొందరి అభిప్రాయం. అంతే కాకుండా ఇక్కడ ధ్వంసం చేసిన 360 విగ్రహాలు వైదికమతానికి చెందిన గరుత్మంతుడు మొదలైన దేవతల వి[గ్రహాలు, (గ్రహాల విగ్రహాలు అని కూడ వీరి అభిప్రాయం (..66.%; 99111129. మహమ్మదు సంగీతాన్నీ వాద్యాలను కూడ నిషేధించాడు.
మహమ్మద్ పినతండ్రీ, ఆతని కుటుంబసభ్యులూ కూడ దేవాలయాల విగ్రహాలను నిర్మిస్తూండేవారు. మహమ్మద్ పితామహుడు, పినతం[ద్రులూ కూడ 860 దేవతావి[గ్రహా లున్న కాబాదేవాలయానికి వంశానుక్రమంగా పూజారులుగా ఉండేవా రని “ఇస్లాం విజ్ఞానసర్వస్పం”లో (2007000266412 1912012) చెప్పబడింది. మహమ్మద్ ఇతర విగ్రహా లన్నీ ధ్వంసం చేయించినా ్రధాన మైన “నల్లరాయి” మాత్రం ఈ నాటికీ అక్కడ ఉంది (౫.1/.0.6.%, 9.118.
మహమ్మద్ పినతండ్రి మైన ఉమర్బిన్-ఎ-హస్సమ్, ఆతని కుటుంబ సభ్యులూ కూడ వైదికమతానుయాయులుగా ప్రసిద్ధులు. దేవతావి[గ్రహాలు నిర్మిస్తుండేవాడు. ఆతడు గొప్ప శివభక్తుడు. ప్రాచీనమతాలకీ ఆచారాలకీ సంబంధించిన గ్రంథాలు మొదలైన వన్నీ నశింపచేసినా కొన్ని ప్రాచీన అరబిక్ పద్యాల సంగ్రహం అయిన సయర్-ఉల్-ఓకుల్ అను [గ్రంథంలో ఉన్న ఒక పద్యం అనాటి ఇతిహాసానికి సూచకంగా ఉంది. ఇది మహమ్మద్ పినతండ్రికి శివునిపై ఉన్న భక్తికి నిదర్శనం.
ఇన్లాం మతం 339
“జీవితం అంతా పాపక్ఫత్యాలు చేస్తూ కామక్రోధాలతో వ్యర్ధం చేసిన మానవుడు చివరికి పశ్చాత్తాపం చెంది ధర్మమార్గానికి తిరిగి వస్తే ఆతడు రక్షింపబడతాడా? అతడు పవిత్రహృదయంతో ఒక్క మారు మహాదేవుణ్ణి పూజిస్తే అధ్యాత్మికోన్నతిని పొందకలుగుతాడు. ప్రభూ! శివా! నా మొత్తం జీవితంలో ఒక్క రోజైనా మోక్షాన్ని ఇవ్వగల భారతదేశంలో, నివసించే అవకాశం ఇమ్ము. అక్కడికి తీర్థయాత్ర చేసిన ప్రతీ ఒక్కడూ అన్ని పుణ్యాలూ, సత్యమైన మహాపురుషుల స్నేహమూ పొంద గలుగుతాడు (౫.౪.6౬3.2., 2.119)
మహమ్మదీయులకు కొరాన్ ఈశ్చ్వరునినుండి వచ్చిన, ప్రామాణ్యం విషయంలో ఎలాంటి శంకలకూ తావు లేని పవిత్రగ్రంథం. ఇది స్వర్గంలో ఉన్న ఒక లోహపత్రాలలో వ్రాసి ఉన్న గ్రంథానికి ప్రతికృతి. దీనిని గేబిల్ మహమ్మదుకు ఆవిష్కరించాడు. ఇది మెల్ల మెల్లగా ఇరవై సంవత్సరాలకాలంలో అవిష్ణరించబడింది. స్వర్గంలో ఉన్న గ్రంథంనుంచి కొన్ని భాగాలు మాత్రం పూర్వకాలంలో వచ్చిన ప్రవక్తలకు ఆవిష్కరింపగా అవి గ్రంథరూపంలో వ్రాయబడ్డాయి. జీసస్యొక్క ఇంజల్ (లేదా గాస్పెల్, డేవిడ్ యొక్క సొమ్స్ (9౬౫5) మోసెస్ యొక్కతోరా (గౌం?జ) మొదలైనవి ఇలాంటివే. అరబ్లకోసమై వాళ్ల భాషలో ఈ (గ్రంథం సర్వాంగపరిపూర్ణరూపంలో మహమ్మద్ ద్వారా ఆవిష్టరించబడింది. అంతే కాకుందా ఇతడు చివరి ప్రవక్త ఈతని తరువాత మరొక ప్రవక్త ఎవ్వడూ వచ్చే ప్రసక్తి లేదు. దీనిమీద యూద-కైస్తవబోధల ప్రభావం ఉన్నట్లు కనబడినా, యూదులు పవిత్ర [గ్రంథంలోని విషయాలను వక్రీకరించారనీ, క్రైస్తవులు ప్రత్యక్షంగా దేవుణ్ణి ఆరాధించడానికి బదులు జీసస్ దేవుడి పుత్రు డని అంటూ ఆతనిని ఆరాధిస్తున్నా రనీ, ఇలాంటివాళ్లందరూ, కొరాన్లో అనేకస్టలాలలో చెప్పినట్లు నరకంలో పడడం తప్ప దనీ మహమ్మదీయుల సుద్భఢ మైన విశ్వాసం.
“కొరాన్, అను శబ్దానికి చదవవలనినది' అని అర్థం. ప్రతీ మహమ్మదీయుడూ కొరాన్ తప్పక చదవాలి. మహమ్మద్‌కు చదవడం గాని వాయలం గాని తెలియ దంటారు. ఇప్పుడు లభిస్తూన్న కొరాన్ మహమ్మదు మరణించి పిమ్మట జయద్ ఇబెన్ థాబిట్ అనునతడు ఆ మతానికి సంబంధించిన చాలమంది ప్రతికృతులుగా వ్రాసికొని (కాపీచేసికొని) లేదా సేకరించి వానిపెట్టుకొన్న
340 ఇస్తాం మతం అనేకరచనలనుండి విషయాలు సేకరించి సంకలనం చేసినది. మూడవ కాలిఫ్ అయిన ఉథ్మాన్ ఆజ్ఞప్రకారం ఇది ఆధికారికంగా నిశ్చితమై ప్రకటింపబడింది. 114 సూరాల (అధ్యాయాల) రూపంలో విభక్తమై ఉన్న ఈ కొరాన్లో మతానికే కాక దైనందినజీవనానికి కూడ సంబంధించని అన్ని విషయాలూ పొందుపరచి ఉన్నాయి.
ఇస్లాం వ్యాపించిన కొలదీ తలెత్తిన కొన్ని క్రొత్త సమస్యలను పరిష్కరించు కొనడం కొరకై కొరాన్లో క్రొన్ని కొత్త అంశాలు అనుబంధంగా చేర్చడం అవసరం అయింది. మహమ్మద్ అనుసరించిన కొన్ని సాంప్రదాయికా లైన ఆచారాలనూ అలవాట్లనూ ఆతడు చెప్పిన విషయాలనూ పొందుపరుస్తూ (వాటికి 'సున్నాహ్” అని పేరు) గ్రంథాలు బయలుదేరాయి. మౌఖికసంప్రదాయానికి “హడీథ్'లు అని పేరు. ఈ హడీథ్లు ఇస్లాంచరిత్ర ప్రారంభిక శబ్దాలలో వెలువడ్డాయి. అధిక మైన మతాఖినివేశం గల మహమ్మదీయులు వీటికి చాల ప్రాధాన్యం ఇస్తారు. ఆధునికు లైన ఇస్లాంపండితు లైతే వీటి కంతగా ప్రామాణ్యం అంగీకరించరు. వీటిలో చాలా పరస్పరవిరుద్ధాలైన అంశా లున్నా యనీ, ఇవి ఇస్త్లాంచరిత్ర మూడవశతాబ్దంలో ప్రచారంలో ఉన్న సామాన్యాచారవ్యవహారాడులను మాత్రమే వోదిస్తా యనీ అంటారు. కొందరు నవీనులు వీటిని పూర్తిగా నిరాకరించి కొరాన్కు మాత్రమే ప్రామాణ్యం అంగీకరిస్తారు.
మతంగా ఇస్లాంలోని కొన్ని మౌలికలక్షణాలు ఇన్లాంమతానికి మూలం యూదమతమే అయినా దీనికి కొన్ని అసాధారణ మైన లక్షణాలు లేకపోలేదు :
1 ఇస్లాం “అల్లా అను ఒకే ఒక దేవుణ్ణి విశ్వసిస్తుంది. ఈ విధంగా ఇది నూటికి నూరు పాళ్లూ ఏకేశ్చ్వరవాదం.
- కొందరు మతప్రవక్తలు ఈశ్వరుని సందేశాన్ని జనులకు అందించడం కోసం ఆ యా కాలాలలో వచ్చా రన్న విషయాన్నీ వాళ్ల ఉపదేశాలనూ ఈ మతం విశ్వసిస్తుంది. మహమ్మద్‌కు ముందు కూడ నోహ్, అబ్రహం, మోసెస్, జీసస్ మొదలైన ప్రవక్తలు వచ్చార్యు అయితే ప్రవక్తలలో మొహమ్మదు చివరివాడు;
ఇన్లాం మతం 341 తరువాత మరెవ్వరూ రావడం ఉండదు. అతడే గొప్పవాడు; మహామహిమ కలవాడు. ఆతని సందేశాన్ని ప్రతీ ఒక్కరూ ఆదరించితీరాలి.
- యూదుల తోరా, జీసస్ ఇచ్చిన గాస్పెల్ మొదలైన ప్రాబీన మతగ్రంథాల పవిత్రత్వాన్ని అంగీకరిస్తూనే ఈ కొరాన్ అన్నింటికంటె గొప్ప దనీ, అతి పవిత్రమైన దనీ ఇస్లాంమతస్థులు (ముస్లింలు) ఎంతో పట్టుదలతో ఉద్గొసిస్తారు.
4 మంచి దేవతలూ చెడ్డ దేవతలూ, కొన్ని మంచి చేతనాలూ (590౮16) చెడ్డ చేతనాలూ ఉన్నా యని ముస్లింలు అంగీకరిస్తారు. మంచి దేవత లందరూ ఈశ్వరుని ఆజ్ఞలను నిర్వర్తించడంకోసం ఈశ్వరునికి అందుబాటులో స్వర్గలోకంలో ఉంటారు. దేవతలలో ఆడ మగ ఖేదం ఉండదు. వాళ్లందరూ చైతన్యరూపులు. చివరి న్యాయనిర్ణయదినం కోసం వాళ్లు మానవులకు సంబంధించిన అన్ని విషయాలూ పుస్తకరూపంలో (260076) సంరక్షించి ఉంచుతారు. న్యాయనిర్ణయ దివసాన దేవతలు మానవుల్ని వాళ్ల గోరీలనుండి బైటకు తీసికొని వచ్చి అంతిమ నిర్ణయం కోసం ఈశ్వరుని ఎదుట నిలబెదతారు. మంచి స్వభావం గల దేవతలే కాకుండా చెద్దవా డైన ఇబ్లిస్ అనే దేవతా, అలాంటివాళ్తే అయిన వాని అనుచరులూ కూడ ఉన్నా రని ఇన్లాం విశ్వసిస్తుంది. ఇతడు నరకలోకానికి ప్రభువు. దేవతలే కాక కొందరు మంచి జిన్సు కొందరు చెడ్డ జిన్లు (ఇవొక విధమైన సచేతనాలైన భూతాలు) ఉన్నట్లుగా ఇస్లాం అంగీకరిస్తుంది.
- మరణానంతరం పునర్టన్మ చివరి న్యాయనిర్హయదివసాన మానవు అందరికీ ఉంటుంది. ఆనాడు ఈశ్వరుడు తమ గోరీలనుండి పైకి లేచివచ్చిన మానవు
లందరినీ, వాళ్లు చేసిన పుణ్య - పాపాలను అనుసరించి స్వర్గానికి కొందరిని, నరకానికి కొందరినీ పంపుతాడు. ఈ మరణానంతర జీవనం ఇస్లాంమతంలో అతి విస్తృతంగా వర్ణించబడింది.
- శరీరాలు నశించిన తరువాత పుణ్యాత్ములు శాశ్వతంగౌ సభా లనుభు నివసించేది స్వర్గం; పాపాత్ములు శాశ్వతంగా కష్టా లనుభవిస్తో పడి ఉం నరకం.
7 ఈ మతంలో నీతికి, మతానికీ వైయక్తిక ప్రర్తవకూ: సామా పన్తకా
342 ఇనాం మతం సంబంధించిన ఎన్నో నియమాలు నిశ్చితరూపంలో విధింపబడి ఉన్నాయి. ఈ విధంగా ఇది నిశ్చితరూపంలో నియమబద్ధ మైన మతం అని చెప్పవచ్చును.
- విగ్రహపూజను బహుదేవతారాధనను, కర్మకలాపాలను, పూజారితనాన్ని (7౧66006) ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిజానికి మహ్మద్ కాలంలో అరేబియాలో అత్యధికంగా ఉన్న ఈ ఆచారాలను ఖండించడానికే ఈ మతం బయలుదేరింది.
అయిజకే అనాడు ఆదేశంలో ఉన్న బహుదేవతావాదం, మూర్తిపూజా మొదలైనవి నమ్మేవాళ్లు, హిందూమతంలో వభె మౌలికంగా ఏకేశ్వరవాదానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, దానిని కూడా మించి అద్వైతతత్త్వాన్ని అంగీకరిస్తూ, వ్యవహారంలో మాత్రం ఆ పద్ధతులు అనుసరించేవారా, లేక ఏ దేవతకు ఆ దేవతే గొప్ప దంటూ ఆదేవతలను ఆరాధిస్తూ ఒకరి నొకరు హింసించుకొంటూ అరాజక పరిస్థితులను సృష్టించేవారా అను విషయం పరిశీలించవలసి ఉంది. ఈ దృష్టి లేకుందా మూర్తిపూజా, బహుదేవతారాధనం అనే మాట వినగానే ఒక్క మారు ఉలిక్కిపడి, ఇదేదో మహాపరాధం అనీ, అనాగరికతాచిహ్నం అనీ ప్రచారం చేస్తూ భారతదేశంలో వివిధ సమయాలలో అల్లకల్లోలాలు సృష్టించడం జరిగింది. జరుగుతూన్నది. ఇలాంటి విషయాలలో సూక్ష్మదృష్టి విషయపర్యాలోచనా ఎంకేనా అవసరం.
-
ఈశ్వరుని ఆజ్ఞ తిరుగులేనిది అని ఇస్తాంమతవిశ్వాసం. ఈ విధంగా దైవప్రాధాన్యవాదానికీ (21211520) పూర్వనిర్హీతతతావాదానికీ (అంతా ముందే నిర్ణయించబడి ఉంది అనే వాదానికీ, ?64666%4260%) ఈ మతంలో ప్రాబల్యం కనబడుతుంది. అయితే మానవునికి కొంత స్వాతంత్ర్యమూ, బాధ్యతా కూడ లేకపోలేదు.
-
పరిపూర్ణ మైన పవిత్రత్వాన్ని ఇచ్చే నైతికప్రవృత్తికీ, మానవసమాజ సేవకూ మానవులలో (భ్రాత్భభావానికీ ఈ మతంలో చాల ప్రధాన్యం ఇవ్వబడింది.
-
ఈ మతాన్ని విశ్వసించనివాళ్లతో పవిత్రయుద్ధం (జిహాద్) చెయ్యా లని ఈ మతం ఆదేశిస్తుంది. జిహాద్ అనగా మతంకోసం శ్రమపడడం అని కూడ ఒక నిర్వచనం ఉంది.
ఇస్తాం మతం 343
- నైతికములూ, మతసంబద్ధములూ అయిన అనేకకర్తవ్యాలలో ఇస్లాం) అనగా పరిపూర్ణమైన పవిత్రత్వంతో ఈశ్వరుణ్ణి పూర్తిగా శరణుపొందడం, ప్రధాన కర్తవ్యం అని ఈ మతం బోధిస్తుంది.
ఈశ్వరుడు
ఒక్కదే దేవుడు; మరొక దేవునికి స్థానం లేదు. ఈ విషయాన్ని కొరాన్ సూరా తరవాత సూరాలో అడు గదుగునా నొక్కి చెపుతూంటుంది. ఈ విషయాన్ని దృధంగా నమ్ముతూ ప్రతీ ముసల్మానూ కూడ ్రార్ధనచేయడానికి (ప్రారంభించేటప్పుడు - “అల్లా తప్ప మరొక దేవుడు లేడు, మహమ్మద్ ఆతడు పంపిన మతప్రవక్త (లా ఇలాహ ఇలా ల్లాహు, ముహమ్మద్ రెసులు ల్లాహ్) అను మాటలు ఉచ్చరించాలి. మౌలికమైన ఈ ఏకేశ్వరసిద్దాంతాన్ని ప్రతీ ముస్లింకూ జ్ఞాపకం ఉండేటట్లు చేయడానికి ప్రతీ రోజూ ఉదయమూ సాయంకాలమూ కూడ మసీడులో ఉందే ఇస్తాంమతబోధకు దైన “ఇమాం” లేదా “'ముల్లా' మసీదుపైకి ఎక్కి “అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లా ల్లాహం ముహమ్మద్ రసూలు” అని బిగ్గరగా అరుస్తూంటాడు. ఈ మతం అనుసరించేవాళ్లు క్రైస్తవుల మూర్తిత్రయ (౫:౪) వాదాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ అరబ్దేశాలలో పూర్వం ఆరాధించిన దేవతలను గూర్చి పరిహసిస్తూంటారు. సర్వమునూ అల్లాయే సృష్టించాడు; మిగిలిన క్షదదేవత లందరూ కలిసినా ఒక్క ఈగను కూడ సృష్టించజాలరు, వాళ్లే సృష్టింపబడ్డారు కొడ అని కొరాన్ చెపుతుంది (సురా 22,25౫
ఈశ్వరుడే జగత్తు నంతనీ సృష్టిస్తాడు, రక్షిస్తాడు: నళింపచపాన. అతు సర్వశక్తుడు. ఈ సిద్ధాంతం యూదమతం ప్రభావంవల్ల ఈ మతం: నికి చం దని అంటారు. “అల్ ల్లాహ్ యొక్క సంక్షిప్తదూప మైన 'అల్లావో' అను బలవంతుడు, సమర్థుడు, శక్తిమంతుడు అని అర్ధం. ఈశ్వరుని వా! + అది ఏ నియమాలనూ పాటించదు. అది ఎప్పుడైనా: ఏ విధంగా నైగొ మారవచ్చు. ఈశ్వరుడు అనంతశక్తి గల పరిపాలకుడు. మానవుడు చేయ కలిగిన దల్లా భక్తిశ్రద్ధలతో అతనికి లొంగి ఉండడమే. “ఇస్లాం పదానికే శరణాగకుద లం ఉందడం అని అర్ధం. &.6. 8006166(బోకే) చెప్పి నట్లు - “అల్లాకూ
డత ఇస్తాం మతం మధ్య దాటరాని అగాధమైన లోయ ఉంది. మానవుడు చేయగలిగిన ఒకే ఒక పని ఇస్తాం (లొంగి ఉండడం) (06.౫1. 157) క్రేమర్ (1026060) మాటలో - “ఇస్లాంలో అల్లా తెల్లని వేడి (1/2166-%00 చక్రవర్తీ తెల్లని వేడి సర్వశక్తుడూ తెల్లనివేడి అసాధారణత్వమూ అయి ఉంటాడు” (0.1%. 158) (౧౫16 - [౧62 అనగా లోహంనుంచి తెల్ల మంటలు పైకి వచ్చే అతితీవ్ర మైన వేడి).
హిందూమతంలోని కొన్ని భక్తిసంప్రదాయాలలో వలె ఇస్లాంమతస్థుల ఆదర్శం “ఇబ్ద్' (దాసుడు - 914౪ల) గా ఉండడం. ఈ విధంగా ఇస్లాం మతంలో ఈశ్వరుడు ఏమీ మాటలాడకుండా మానవుల సేవ చెయ్యా లని ఆదేశించి వాళ్ళను చాల దూరంగా ఉంచిన నిరంకుశప్రభువుగా చిత్రింపబడ్డాడు. ఈశ్వరుడు సర్వగతు దని కూడ వర్ణింప బడ్డాడు. ప్రతీదీ ఆతని వైభవమే; ప్రతీదీ ఆతని సంరక్షణలో ఉన్నది అను అర్ధంలోనే ఈశ్వరుడు సర్వగతుదని చెప్పబడ్డాడు. ఈశ్వరుడు సర్వమును వినువా దనీ, అన్నీ తెలిసినవా డనీ, సర్వవిధాలా ప్రభావశాలీ అనీ (41- 2201069) సర్వవిధాలా సూక్ష్మ డనీ, అన్నీ అద్ధం చేసికొనగలవాదనీ, అన్ని విధాలా సమర్థ దనీ కొరాన్ అనేకస్థలాల్లో వర్ణిస్తుంది. ఈ విధంగా ఇస్లాంలో అన్ని విధాలైన పురుషలక్షణాలూ ఈశ్చరున కున్నా యని వర్ణింపబడింది. అయినా కూడ ఏ ముస్లిమూ కూడ ఈశ్వరుణ్ణి ఒక పురుషునిగా (౭500) నిర్దేశించడు. ఈశ్చరునికి ఇచ్చా, శక్తి కూడ ఉన్నాయి. అయినా ఆతనికి ఆకారం గాని శరీరం గాని లేవు. అందుచేత ఈశ్వరుణ్ణి ఏ విధంగానూ సామాన్యమైన అర్థంలో పురుషుణ్ణిగా చెప్పడానికి వీలులేదు. అతడు శాశ్వతుడు; మార్పు లేనివాడు. అయినా నిరంతరమూ పని చేస్తూనే ఉంటాడు. అందుచేతనే ప్రపంచకంలో ఎల్లప్పుడూ మార్పులు తెస్తూ ఉంటాడు.
పైన చెప్పిన తత్త్వశాస్తానికి సంబంధించిన లక్షణాలే కాక ఈశ్వరునిలో దయ, జాలి, న్యాయం మొద లైన అనేక మైన నైతికా లైన లక్షణాలు కూడ ఉన్నాయి. ఇవన్నీ యూదమతప్రభావంచేత వచ్చినవి. కొరాన్లోని మొట్టమొదటి సూరాలోనే ఈశ్చరుడు జాలి ఉన్నవాడు గాను రాజుగాను ప్రభువుగాను మార్గదర్శకుడు గాను వర్చ్టించబద్దాడు.
ఈశ్వరుడు మానవుల మనస్సుకు అందనివాడు, అతిరహస్యస్వభావం గలవాడు అని వర్ణించినా ఇత డప్పుడప్పుడు తనను దూతలద్వారా ఆవిష్కరిస్తూంటా డనీ,
ఇస్తాం మతం 345 మిస్సయ్యాల ద్వారా మానవులతో సంభాపిస్తుంటా దనీ కూడ చెప్పబడింది. చివరికి మానవులను వాళ్ల పుణ్యప్రాపాలను బట్టి శాశ్వతంగా స్వర్గనరకాలకు పంపేవాడు కూడ ఈశ్వరుడే. జగత్తు
జగత్తులో ఉన్న సమస్తవస్తువులూ కూడ ఈశ్వరునిచేత సృష్టింపబడినవే. ప్రతీ వస్తువూ ఈశ్వరుని ప్రభావాన్ని చాటి చెపుతూన్నది. బైబిల్లో ఉన్న ఇతరకథ లన్నింటినీ చెప్పి నట్లే జగత్సృష్టికి సంబంధించిన కథను కూడ కొరాన్లో చెప్పినా ఇస్లాం క్రైస్తవులు అంగీకరించిన సృష్టికి సంబంధించిన సిద్దాంతాన్ని అంగీకరించదు. ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు అని మాత్రమే చెప్పుతుంది. మొత్తంమీద సృష్టి అంతా మనకు అర్ధం కాని గొప్ప రహస్యం అన్నట్లు ఈ మతం సూచిస్తుంది. యూదమతంలోను, క్రైస్త) మతంలోను చెప్పినట్లు శూన్యంనుంచే ఈశ్వరుడు జగక్తును సృష్టించా దని ఇస్లాం అంగీకరించదు. తనకంటె భిన్నంగా ఉన్న వస్తువుతో సృష్టించా డని కూడ చెప్పదు. ఈశ్వరుడు సృష్టించాడు అని మాత్రమే చెపుతుంది. ఎలా సృష్టించాడు అను (ప్రశ్నకు సమాధానం లేదు. అది అచింత్య మైన విషయం అని ఇస్లాం అభిప్రాయమై ఉంటుంది.
అయితే జగత్తు సత్యమే కాని అసత్యం కాదు. ఇది పరిచ్చిన్న మైనది. అనిత్య మైనది. ఈశ్వరుని వలె శాశ్వతంగా ఉందేది కాదు. ఇది ఒక కాలం సృజింపబడింది. కాలమూ, ఆకాశమూ (అవకాశమూ, కూద ఈశ్వరునిచత సృష్టింపబడినవే. ఈశ్వరుడు ఇది ఎంతవరకు ఉందా లనుకొంటే అంతవరకు ఉంటుంది. అనుకొన్నప్పుడు అతడు దానిని నశింపచేస్తాడు. ఈ జగత్తు పూర్తిగా ఈశ్వరుని మీద ఆధారపడి ఉంది. ఈశ్వరుని ఆధారం లేకుండా ఒక్కక్షణం నిలవజాలదు. ప్రపంచంలో అడుగడుగునా, ప్రతీ చోటా ఈశ్వరుని ఉనికిని గుర్తించ వచ్చును.
మానవుడు చ
జగత్తులోని ఇతరవస్తువులతో పొటు మాననడు కూడ ఈశ్వరుని త్ సృష్టింపబడ్డాడు. ఈశ్వరుడు మానవుణ్ణి రక్తకణాలతో (రక్తపిండాలతో) సృష్టించా డని కొరాన్లో చెప్పబడింది.
346 ఇన్లాం మతం
ఇస్లాం పూరం మానవు డొక నిజమైన సత్సదార్థు. ఈశ్వరునిచేత సృష్టించబడిన మానవుడు పూర్తిగా ఆతనిమీదనే ఆధారపడినా ఆతని కొక స్వతంత్రసత్త (స్టైతి) ఉంది. అయితే ఈశ్వరుని ఎదుట వీని సత్తకు ఏ మాత్రమూ విలువ లేదు. వినయంతో వంగి వంగి ఈశ్వరునికి సేవచేయడం ఒక్కటే మానవుని కర్తవ్యం. ఈశ్చరుని విషయంలో మానవునికి ఎలాంటి అధికారాలూ లేవు; కర్తవ్యాలు మాత్రమే ఉన్నాయి. ప్రార్ధిస్తూ ఈశ్వరునికి సేవ చేయడమే కర్తవ్యం. ప్రార్తించే టప్పుడు కూడ తనకు ఫలానాది ఇమ్మని ప్రార్ధించకూడదు. అనుగ్రహించ మనీ దారి చూప మనీ మాత్రమే ప్రార్థించాలి. ప్రతీ మానవుని కార్యవిధానమూ, వాని అంతిమలక్ష్యమూ కూడ ఈశ్వరుడు ముందుగానే నిశ్చయించి ఉంచుతాడు. “మీ చివరి గమ్యస్థానం అగ్నిగుండమా స్వర్గమా అని భగవంతుడు రాసిపెట్టనివాడు మీలో ఒక్కడు కూడ లేడూ అని మతప్రవక్త చెప్పి ఉన్నాడు. దీనిని పట్టి మానవునికి స్వేచ్చగా ఆలోచించి చేసే అవకాశం ఏదీ ఇస్లాంలో లేదని స్పష్టం అవుతుంది. మానవుడు తన మనోభావా లన్నీ అణచిపెట్టుకొని వినయంతో ఈశ్వరునికి సేవ చేయవలసిందే. నైతికంగా ఇది ఇలా చెయ్యాలి అనేది ఇన్లాంలో లేదు. ఈ విషయంలో కూడ కొరాన్లో స్పష్టంగా చెప్పబడింది. “అల్లా తాననుకొన్నవానిని అమార్గంలో నడిపిస్తాడు : తాననుకొన్నవానికి దారి చూపిస్తాడు : ఈశ్వరునికి ఎవడు ఇష్టుడు అనే విషయం ఈశ్వరునికే తెలియాలి. ఈ పూర్వనిర్దీతత్వాన్ని (0౪1౪౦15900) చాలమంది ఇస్లాం పండితులు అంగీకరించరు. మానవుని స్వాతంత్ర్యానికి ఇస్లాంలో తగినంత అవకాశం ఉందని చెపుతూ తమ వాదాన్ని సమర్ధించడం కోసం కొరాన్లోని కొన్ని మాటలు ఉదాహరిస్తూంటారు. షియా ముస్లిములు ఈ విషయంలో మధ్యేమార్గం అవలంబించి మానవుడు పూర్తిగా స్వతంత్రుడూ కాడు పూర్తిగా పూర్వనిర్దీతస్వభావుడూ కాడు అని అంటారు.
ఇలాంటి అభిప్రాయభేదా లున్నా కూడ ఇస్లాంలో మానవునికి ఏ మాత్రమూ స్వాతంత్ర్యం గాని, బాధ్యత గాని లేవనడానికి వీలు లేదు. అదే నిజమైతే ఈ మతంలో మంచి పనులను గూర్చి చెద్దపనులు గూర్చీ, ఈశ్చ్వరు డిచ్చే పారికోషికాలను గూర్చీ శిక్షలను గూర్చీ మాటలాడవలసిన అవసరమే ఉండేది కాదు. ముహమ్మద్‌ను ఆతని అనుయాయులు - “మహాత్మా! ఈశ్వరుడు మా స్టానాలను ముందుగానే
ఇస్తాం మతం 347 నిర్ణయించి ఉన్నాడు కదా; మేం దీనినే నమ్మి మతసంబంధ మైన, నీతిసంబంధ మైన కర్తవ్యా లన్నీ విడిచివయవచ్చునా?” అని ప్రశ్నించగా - “అలా కాదు; ధర్మాత్ములు మంచి పనులు చేస్తారు : దుష్టులు చెడ్డ పనులు చేస్తారూ అని ముహమ్మద్ సమాధానం చెప్పాడు. దీనిని పట్టి మానవుని స్వాతంత్ర్యమూ, వాని బాధ్యతా పూర్తిగా నిరాకరింపబడదలే దని తెలుస్తూన్నది. ఏమైనా మానవుడు ఈశ్వరుని ముందు ఏ మాత్రమూ విలువలేనివాదేే ఏ నాటికీ అలాగే ఉండవలసినవాడే. స్వర్గంలో ఈశ్వరసంనిధిలోకూడ వీని స్థితి ఇంతే. ఈ విధంగా ఈశ్వరుని దృష్ట్వా చూస్తే ఈ మతంలో మానవుని స్థానం హిందూమతంలోని స్థానం కన్నా, (కైస్రవ్వమతంలోని స్థానం కన్నా కూడ చాల నీచమైనది. దౌష్ట్రము - దుఃఖము
ఒక్కడే దేవుడు, ఆ దేవుడే సర్వమును సృజించినవాడు అని ఇన్లెం చెప్పుచున్నది. “ప్రతీ విషయంలోను ఈశ్వరునిదే అధికారం” అని కొరాన్ చెప్పుచున్నది. అండుచేత ప్రసంచకంలో ఉన్న దౌష్టానికి, కష్టాలకీ కూడ కారణం ఈశ్వరుడే అని తెలుస్తాన్నది. అలాంటప్పుడు ఈశ్వరుడు దయామయుడు అని చెప్పడం ఎలా కుదురుతుంది అను ప్రశ్న ఉదయిస్తుంది. అయితే ఈ ప్రశ్న వేయడం గాని దానికి సమాధానం కోసం ప్రయత్నించడం గాని ఇస్లాం చేసి నట్లు కనబడదు. ప్రపంచకంలో దుఃఖం ఉంది అనే తథ్యం మాత్రమే కొరాన్ గుర్తించింది. సైద్ధాంతికంగా దీనిని గూర్చిన విమర్శ ఏమీ చేయలేదు. నోరు మెదపకుండా ఈశ్వరునికి పూర్తిగా లౌంగి ఉండడమే మానవుని కర్తవ్యం. ఆతని పనులను గూర్చి ప్రశ్నించే ప్రసక్తే లేదు. ఈశ్వరుని పద్ధతులు అచింత్యములు. వాటిని గూర్చి షరీక్షించదానికి ఐదులు పరిపూర్ణ పవిత్రత్వంతో వాటిని సహించడమే మానవుడు చేయవలసిన పని. 'ప్రపంచకం అంతా ఈశ్వరాధీనమై ఉంది. అందుచేత దుఃఖం కూడ ఆతేదు ఏషో కారణంచేత, ఏదో ఫలాన్ని ఉద్దేశించి సృష్టించినదే. ఈశ్వరుని పనులను 'ప్రశ్ళించడం మత విరుద్ధము, అపవిత్రకార్యమూ కూడు.
అయితే - ప్రపంచకంలో దుఖం సృజించడంలో భగవంతు దుద్దేశించిన (ప్రయోజనాన్ని గూర్చి కొరాన్ రెండు కారణాలు సూళింళింధి. యూదమతంలో
348 ఇన్లాం మతం చెప్పి నట్లు, పాపాలకు ఇది శిక్ష అనేది మొదటిద్వి ఈశ్వరుని మీద మానవుని కున్న విశ్వాసాన్ని పరీక్షించడం అనేది రెండవది. మొదటి పక్షంలో ఎవరికి ఎంత శిక్ష ఎలాంటి శిక్ష ఇవ్వాలి అనే విషయంలో చిక్కులు వచ్చే ప్రసక్తి ఉంది. అందుచేత రెండవ కారణమే యుక్తం. కొంతమంది ఈశ్వరుడు ఎంతవరకు సహాయపదతాడా అని పరీక్షించడంకోసం అన్నట్లు ఈశ్వరుని విషయంలో సగం సగం విశ్వాసంతో ఉండి వాళ్ల కోరిక సఫల మైతే అప్పుడు పూర్తిగా విశ్వసించడం ప్రారంభిస్తారు; సఫలం కాకపోతే నాస్తికు లైపోతారు. ఈశ్వరుడు అల్లాంటివాళ్లను నిజమైన భక్తులనుగా అంగీకరించడు. అందుచేత ఎవళ్లు గట్టిగా నిలబడతారో ఎవళ్లు మధ్యలో జారిపోతారో చూడడంకోసం ఈశ్వరుడు చెడుగును ప్రపంచకంలో వృద్ద్ధిపొంద నిస్తున్నాడు అని కొరాన్ (సురాహ్ : 22:11) సూచిస్తూన్నది. యూదులు, క్రైస్తవులు చెప్పిన పురాణకథ కొరాన్లో కూడ చెప్పబడింది. సృష్టిప్రారంభంలో ఇబ్లిస్ అనుదేవత అదంకు ఇవ్వబడిన ప్రాధాన్యాన్ని అంగీకరించ డానికి నిరాకరించాడు. అప్పుడు ఈశ్వరుడు ఇబ్లిస్ను నశింపచేయా లనుకున్నాడు. అయితే ఇతర దేవతలు వారించగా ఈశ్వరుడు వానిని విడిచిపెట్టాడు. ఆనాటి నుండీ ఇబ్లిస్ వాని పరివారంతో కలిసి, ఎదురు తిరిగి మానవుల్ని చెడ్డపనులు చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఇబ్లిస్, వాని పరివారమూ కూడ ఈశ్వరునికి లొంగి ఉండవలసినవాళ్లే, కావాలనుకుంటే ఈశ్వరుడు ఇబ్లిస్ను పూర్తిగా అలాంటి దుష్మార్యం నుండి నిరోధించగలడు. అయినా కూడ వాని మూలాన జరిగిన పాప కర్మాదుల ద్వారా మానవుల ్రద్ధను విశ్వాసాన్నీ పరీక్షించవచ్చును కదా అని ఇబ్లిస్ను ఉపేక్షిస్తున్నాడు. అందుచేత ఇస్లాంలో ఈశ్వరునితో సమానమైన శక్తి గల మరొక డుండదానికి అవకాశం లేదు; ఏకేశ్చరవాదానికి భంగంలేదు. మరణానంతరజీవితం ఈ విషయంలో ఇస్లాంమతం జరోష్ట - యూదమతభావాలు (గ్రహించింది. శరీరం నశించడంతో మానవుడు పూర్తిగా నశించడు. వాని ఆత్మ చివరి న్యాయ నిర్ణయదివసం వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆత్మ “అల్ - బెర్జమ్మ్ అను ప్రదేశంలో భద్రంగా ఉంటుంది. చివరి రోజు ఎప్పుడు వస్తుందో ఈశ్వరునికే తెలియాలి. బాకాలతో దాని రాకను సూచిస్తారు. ఆ రోజున, మరణించినవాళ్లందరూ
ఇస్తాం మతం ష49 వాళ్ల గోరీలనుండి లేస్తారు. ఆత్మలు ఆ శరీరాలతో కలుస్తాయి. దేవతలు వాళ్ల నందరినీ అల్లూ ముందు నిలబెడతారు. పాపాలకంటె ఎక్కువ పుణ్యం ఉన్నవాళ్లు ఈశ్వరసమీపంలో స్వర్దానికీ, పుణ్యంకంటె పాసం ఎక్కువ ఉన్నవాళ్లు నరకానికీ పంపబడతారు.
స్వర్గం పచ్చని మైదానాలతోను అందమైన ఉద్యానాలతోను, ప్రవహిస్తూన్న జలాలతోను పళ్లు ముగ్గిన చెట్ల తోటలతోను అద్భుతంగా ఉంటుంది. కావలసినంత వైన్ (మద్యం) ఉంటుంది. నల్లని కళ్లు గల అందమైన యువతులు ఇటూ అటూ తిరుగుతూ ఉంటారు. కొరాన్లో ఏడు స్వర్గాలు చెప్పబడ్డాయి. ఇవి స్వర్గసుఖంలో ఉన్న ఏడు భూమికలకు ప్రతీకలు. అట్లే ఏడు నరకాలు కూడ వర్ణించబడ్డాయి. అతిక్రూర మైన బాధలకు నిలయ మైన ఈ నరకాలలో పెద్ద పెద్ద మంటలు, మరుగుతూన్న నీళ్లు, వేడిగాడ్పులు, ముళ్లు, పొగలు, తేళ్లు మొదలైనవి అంతటా వ్యాపించి ఉంటాయి. న్యాయనిర్ణయం తరవాత “అల్సిరలో అనే ఒక వంతెన దాటి స్వర్దానికి గాని నరకానికి గాని వెళ్లవలసి ఉంటుంది. స్వరానికి వెళ్లే సరికి ఆ వంతెన విశాలంగా సుగముంగా ఉంటుంది. అదే వంతెన నరకానికి మ్లోవాళ్లకి కత్తి అంచు వలె తయారవుతుంది. దానిని దాటేవాళ్లు మధ్యలో జారి అగాధమైన గోతిలో నరకంలో పడతారు. ఈ విధంగా ఇస్లాంమతం ప్రకారం స్వర్గ - నరకాలు పుణ్యాత్ములూ పాపాత్ళులూ శాశ్వతంగా నివసించే స్థానాలు.
మానవుని అంతిమలక్ష్యం
స్వర్గం చేరి అక్కడ ఈశ్వరుని సంనిధిలో దేవతలతో కలిసి సకలసుఖాలూ అనుభవించడం మానవుని అత్యున్నతమైన లక్ష్యం. అక్కడ ఫానపను భౌతికశరీరం ఉండదు. శుద్ధచేతనారూపమే ఉంటుంది. అందుచేత వానికి అఖ్ధడ శారీరక మైన చేష్టలు గాని బాధలు గాని ఏమీ ఉండవు. అక్కడ కూడ మానవుడు పరిచ్చిన్నుడే. ఎట్టి పరిస్థితులలోను వానికి ఈశ్వరునితో సమాన మైన పరిపూర్ణస్థితి లభించదు.
ఇస్లాంలోని నియమబద్ధజీవనవిధానం
ఇన్లాంమతం మానవుని దైనందినజీవితంలో అతికఠోర మైన నియమాలు
విధించింది. వీటి దృష్ట్యా ఇస్లాం పూర్తిగా బాహ్యాచారప్రధానమైన (148960)
350 ఇన్లాం మతం మతం. అయితే ఆధ్యాత్మికమైన ఆంతరపవి[త్రతకు దీనిలో అసలు స్టానం లేదని అర్ధం కాదు. ఈశ్వరుడు సర్వోత్తము దైన ప్రభువు; ఎట్టి షరతులూ లేకుండా ఆ దేవునికి అణగిమణగి ఉండి సేవ చేయడం మానవుని ఒకే ఒక కర్తవ్యం అని ఇన్లాం బోధిస్తున్న దని చూచి ఉన్నాం. అందుచేతనే ఇస్తాంయతంలో విధించిన నియమ నిబంధన లన్నీ ఈశ్వరుని విషయంలో శద్దాభక్తిపూర్వకమైన ప్రార్ధనలకు ఉపకరించే నిశ్చిత మైన మార్గాన్ని చూపేవిగా ఉంటాయి. దీనిలో ఆత్మపారిశుద్దాన్ని సంపాదించడానికి ఉదారత్వానికీ సంబంధించిన అంశాలు కూడ ఉన్నాయి. అందుచేత ఇస్లాం నియమావళి మతసంబంధినియమాలయొక్క నైతికనియమాల యొక్క సంమేళనం అని చెప్పవచ్చును. దీనితో ఐదు స్తంభాలు అని పసిద్దా లైన ఈ (క్రింది ధర్మాలు చెప్పబడ్డాయి :
1 ఈశ్వరుని ఏకత్వాన్ని సర్వదా స్మరించడంకొరకై ప్రతీ ముస్తిమూ కూడ ప్రార్ధనల ప్రారంభంలో - “లా ఇలాహ ఇల్లా ల్లాము, ముహమ్మద్ రెసులా, ఇల్లాహ్” (అల్లా తప్ప మరొక దేవుడు లేడు) ముహమ్మద్ అతదు పంపిన మతప్రవక్త) అను వాక్యాలు తప్పక చదవా లని ఆదేశింపబడింది.
ల్సి నిత్యప్రార్థన వ ఉదయం, మధ్యాహ్నం, సాయంమధ్యాహ్నాల మధ్య, సూర్యాస్తమయం, రాత్రిప్రారంభం - ఈ ఐదు కాలాలలో నిశ్చిత మైన ప్రార్ధన తప్పకుండా చెయ్యాలి. ఈ ప్రార్ధనలు చేసేటప్పుడు చేయవలసిన శరీరవిన్యాసాలు యోగాసనాల వలె ఉంటాయి. ప్రార్ధించే టప్పుడు మక్కావైపు తిరిగి ఉండాలి. ప్రతీ ముసల్మాన్ కూడ ఎక్కడున్నా ఈ ప్రార్ధన చెప్పిన కాలంలో తప్పకుండా చెయ్యాలి. మసీదులో చేస్తే చాలా మంచిది. వైయక్తికంగాను సామూహికంగానూ కూడ ప్రార్ధనలు చేయవచ్చు. శుక్రవారం పవిత్రదివసం అవడంచేత మసీదులలో సామూహికప్రార్థనలు చేయడం మంచిది. పవిత్రస్థానాలుగా పరిగణింపబదే
మసీదులలో విగ్రహాలు ఏవీ ఉందవు. ఇస్తాంమతంలో పూజారులు ఉండరు. ఆ యా ప్రదేశాలలో అక్కడ నున్న వయోవృద్భుణ్ణి ఎన్నుకొంటారు; అతడు తాను (ప్రార్తన చేస్తూ ఇతరులచేత చేయిస్తాడు. ఇస్లాంలో ఈ ఐదు ప్రార్ధనలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇవి “స్వర్గానికి తాళం చెవి అంటారు. “ఒక్కటి కూడ మానకుండా
ఇస్తాం మతం 351 ప్రతీరోజూ ఐదుసార్లు ప్రార్ధనలు చేసేవానిని స్వర్గానికి పంపుతా నని ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు”.
౩. బీదవాళ్లకు దానం చేయడం : బీదవాళ్లకు, అవసరం ఉన్నవాళ్లకు దానం చేయడం ప్రతీ మహమ్మదీయుడూ చేయవలసిన మరొక ప్రధానధర్మం. మతంలో 'ప్రారంభంనుంచీ మొహమ్మదు దీనిని అతిపవిత్రకార్యంగా బోధించాడు. కొంత కాలం తరువాత దరిద్రులను పోషించడానికి, ఇతరప్రభుత్వశార్యాలకీ ఉపయోగించ దానికై 'జకత్' అను పన్ను విధించడం ప్రారంభం అయింది. భూమినుండి వచ్చే ఆదాయంలో పదివంతులలో ఒక వంతు ఇవ్వా లని ఒకప్పుడూ, ఇరవై వంతులలో ఒక వంతు ఇవ్వాలని ఒకప్పుడూ ఆచరణలో ఉండేది. సమర్భులైనవాళ్లు ఇంకా చానం చేయవచ్చు. దానం గొప్ప పుణ్యహేతువు. కొరాన్లో ఒకచోట ఇలా చెప్ప బడింది. ఒకడు దెబ్బై ఏళ్ల పాటు ఈశ్వరుణ్ణి సేవించాడు. అయితే అత దొక పాపం చేశాడు. దానితో ఈశ్వరుడు అతడు వెనుక చేసిన పుణ్యం అంఠౌ తొలగించివేశాడు. తరువాత ఆ వృద్ధుడు ఒక బీదవానికి ఒక రొట్టిముక్క ఇచ్చాడు. దానితో ఈశ్వరుడు వానిని క్షమించి తీసివేసికొన్న పుణ్యం అంతా ఇచ్చివేశాడు.
-
ఉపవాసం : రంజాన్ మాసం అంతా ఉపవాసం చేయడం అనేది మరొక ప్రధాన కర్తవ్యం. సూర్యోదయ - సూర్యాస్తమయాల మధ్య ఆహారం ఏదీ తీసికొన గూడదు, ఏమీ త్రాగకూడదు. రాత్రులందు తీసికొనవచ్చును. ఈ మాసంలో మద్యం సేవించడం మొదలైన అపవిత్రకార్యాలు నిషేధింపబడ్దాయి. పిల్లలు, రోగులు, ప్రయాణాలలో ఉన్నవాళ్లు చేయకపోయినా దోషం లేదు. ఇలా ఉపవాసం చేస్తే ఆ సంవత్సరం చేసిన పాపా లన్నీ తొలగిపోతాయి.
-
తీర్ధయాత్ర (హజ్జ్) : శారీరకంగా సమర్థ జైన ప్రతీ మహమ్మదీయుడూ కూడ, జీవితలో కనీసం ఒక్కపర్యాయ మైనా మొజో వలి. * దోల్ ఘల్ హిజ్ఞా అను పవిత్రమాసంలో చెయ్యాలి. మక్కొ యాత్రికుడు దారిలో ఒక తగిన మజిలీ దగ్గర శాస్త్రంలో విధించిన దుస్తులు మాత్రమే ధరించి మక్కా చేరి అక్కడ నిశ్చితమైన కొన్ని మతసంబంధి కార్యక్రమాలు చెయ్యాలి. అంచులు లేని రెండు తెల్లని వస్త్రాలు, బొడ్డు దగ్గరినుంచి మోకాలివరకు నడుముకు చుట్టుకొనే బట్ట,
352 ఇస్తాం మతం ఎడమభుజం కప్పుతూ కుడి భుజం క్రింద ముడిపెట్టిన శాలువా - ఇవి అప్పుడు ధరించవలసిన బట్టలు. చెప్పులు తొడిగికొనవచ్చును గాని బూట్లు పనికిరావు. అక్కడ చేయవలసిన కార్యక్రమాలు : కబ్బా చుట్టూ ఏడు పర్యాయాలు నడవాలి లేదా పరుగెత్తాలి; ప్రతీ ప్రదక్షిణంలోనూ నల్లరాయి ముద్దు పెట్టుకోవాలి. మైనా దగ్గరన నున్న మూడు స్తంభాలమీదికి రాళ్లు విసరాలి. గొట్జెను గాని, మేకను గాని, ఒంటెను గాని బలి ఇచ్చి వాటి మాంసం బీదవాళ్లకు పంచిపెట్టాలి. ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇలాంటి అన్ని పనులూ చేయదానిక్తీ, ప్రార్ధనలకీ పదిరోజులు పడుతుంది. అన్నీ పూర్తి అయిన తరువాత యాత్రికుడు పవిత్రవన్తాలు (దీక్షావస్రాలు) (ఇహం) తీసివేసి మామూలు బట్టలు ధరించాలి. ఇలా యాత్ర చేసినవానికై స్వర్గంలో స్థానం ఆరక్షితమై ఉంటుంది. ఈ స్తంభాలతో పాటు పవిత్రయుద్ధం (జిహాద్) అనే ఆరవ స్తంభం కూడ చేర్చబడింది. ఇస్లాంమతం విశ్వసించనివాళ్లతో యుద్ధం ప్రకటించి యుద్ధం చెయ్యా లని ఈ మతం బోధిస్తుంది. ఇందుకు ప్రమాణం కొరాన్లోనే ఉంది :
“ఈశ్వరుణ్ణీ, చివరిదైన న్యాయనిర్ణయదివసాన్నీ నమ్మనివాళ్లతోను, ఈశ్వరుడూ ఆతని దూత నిషేధించినవాటిని ఎవరు నిషేధించరో వాళ్లతోను సత్య మైన ఈ మతాన్ని ఎవరు అనుసరించరో వాళ్లతోను యుద్ధం చెయ్యండి ...” (సురాహ్. 929)(612. 168)
పవిత్రయుద్ధంలో మరణించినవాళ్లకు వెంటనే (చివరిరోజు దాకా నిరీక్షించనవసరం లేకుండా) స్వర్గం లభిస్తుం దని ప్రతిజ్ఞ చేయబడింది. అయితే నేటి ఇస్తాం జివాద్ విషయంలో ఈ అభిప్రాయాన్ని అంగీకరించదు. దీనికి ఒక ఆధ్యాత్మికమైన అర్థం ఇవ్వబడింది. ఇది పాపాన్ని ఎదిరించి యుద్ధం చెయ్యా లని బోధిస్తుంది. అదే విధంగా ఇది మతంకోసం ఎంత శమైనా సహించాలి అని బోధిస్తుంది.
స్వర్గం అనే ప్రధానలక్ష్యం సాధించడానికి పైన చెప్పిన ధర్మాలు సరిపోతాయి; అయినా కూడ ఇస్లాం కొన్ని నైతికమార్గబోధలు కూడ చేస్తూన్నది. ఈ నీతు లన్నీ చాలావరకు సామాజిక మైనవి. అతిథిసత్మారం చాల గొప్ప సద్గుణం. మానవులలో
ఇస్తాం మతం 353 పరస్పరం భ్రాతృభావమూ మానవసేవా కూడ ప్రధానమైన ధర్మాలు. తలిదండ్రుల విషయంలో వినయంతో ఉండాలి. వ్యభిచారం, మోసం, అసత్యం మొదలైనవి చేయకూడదు. ఇతరుల సొమ్ము అపహరించకూడదు. ఎవరినీ చంపగూడదు. మతం కోసమూ, ఆత్మధక్షణకోసమూ తప్ప మరొక కారణంచేత యుద్ధం చేయగూడదు. కొన్ని వైయక్తికధర్మాలు కూడ బోధింపబడ్డాయి. సుగంధద్రవ్యాలు ఉపయోగించ కూడదు. మాదకద్రవ్యాలు సేవించకూడదు. త్యాగము ప్రాపంచికవిషయాలమీద వైరాగ్యమూ మొదలైన సద్గుణాలు కూడ అలవరచుకోవాలి.
వాస్తవానికి ఇస్లాంమతంలో వ్యక్తికీ, సమాజానికీ సంబంధించిన ఒక్క విషయం కూడ విడవకుందా వాటి విషయంలో 'నిశ్చిత మైన నియమాలు విధింపబడ్డాయి. ఇది పూర్తిగా బాహ్యాచార - వ్యవహారప్రధాన మైన మతం. వివాహం, విదాకు లివ్వడం, కట్నం, వారసత్వం, అంత్యక్రియలు - అన్ని విషయాలలోను లౌకిక జీవనానికి సంబంధించిన నిర్దిష్టపద్ధతిలో నియమాలు స్పష్టమైన మాటలలో విధింపబడ్ద్డాయి. ఇస్లాంకు సంబంధించిన మౌలికనియమా లన్నీ చక్కగా ఈ (క్రింది సూరాలలో క్రోడీకరించి ఉన్నాయి :
“మీ ముఖాలు తూర్పు వైపుకు గాని పడమట వైపుకు గాని త్రిప్పడం
పవిత్రం కాదు,
నిజమైన పవిత్రత్వం అంటే ఇది : ఈశ్వరుణ్ణి, చివరి రోజును, దేవతలను, పుస్తకాన్ని మతషప్రవక్తలను నమ్మడం, ఎంత ఇష్టపడి సంపాదించుకొన్నదైనా తన సొత్తును జ్ఞాతులకు, తలిదండ్రులులేని వాళ్లకు, అవసరం ఉన్నవాళ్లకు, బాటసారులకు, భిక్షుకులకు ఇవ్వడం, ప్రార్ధనలు చేయడం, బిచ్చం పెట్టడం ... ”
“అఆస్తికులారా! మీకు ఉపవాసం విధింపబడింది ...
తీర్థయాత్రను దేవుని దగ్గరకు వెళ్లడానికి పూర్తిచేసుకొనంది,
ఈశ్వరునికి భయపడండి; శిక్ష విధించడంలో ఈశ్వరుడు
చాల భయంకరుడు అని తెలుసుకొనండి” (సురాహ్ 2;:174-196)
ప్రధాన మైన శాఖలు : తన మతం అనుసరించేవాళ్లు (72) డెబ్సైరెండు వేరు వేరు శాఖలుగా విడిపోతా రని మొహమ్మద్ జోస్యం చెప్పా డంటారు. అయితే
354 ఇస్తాం మతం అసలు ఏర్పడిన శాఖల సంఖ్య అతడు చెప్పిన జోస్యానికి బాగా మించిపోయి నట్లు కాలం నిరూపించింది. అయినా ముస్లిములలో చాల ప్రధాన మైనవి షియాలు, సున్నీలు అను రెండు శాఖలు. ఈ విడిపోడానికి సైద్దాంతికభేదం కంటె రాజకీయ భేదం ఎక్కువ కారణం. మొహమ్మదు అల్లు దైన ఆలీ (411) పక్షానికి చెందివాళ్లు షియాలు. మొహమ్మదు తరువాత వెంటనే అతని వారసునిగా అలీని కాలిఫ్గా ఎన్నుకొని ఉండవలసింది అని షియాల అభిప్రాయం. వాస్తవంలో జరిగిన దేమనగా మొహమ్మద్కూ అలీకీ మధ్య అబు బేకర్, ఒమర్, ఓథ్‌మన్ అను ముగ్గురు వరుసగా కాలిఫ్లుగా వచ్చారు. వీళ్లు ఈ విధంగా రావడమే న్యాయసంమతం అని సున్నీ లంటారు : అంతే కాకుండా 655 లో అలి కాలిఫ్ అయ్యాడు ; ఆరు సంవత్సరాల తరవాత. ఆతనిని చంపివేశారు. ఆతని తరువాత అతని కుమారుదైన హసన్ న్యాయసమ్మత మైన వారసు డయ్యాడు. అయితే - అతడు మోవీయా తరవాత తానే మళ్లీ కాలిఫ్ కావాలి అను షరతుమీద కాలిఫత్ను మోవీయాకు ఇచ్చివేశాడు. కాని హసన్ మోలీయా కంటే ముందు చనిపోయాడు. అందుచేత మోవీయా తరువాత హసన్ సోదరుడైన హుస్సేన్ న్యాయసమ్మతమైన వారసుడు కావలసి ఉంది. కాని హుస్సేన్‌కు బదులు మోవీయా కుమారుడు కాలిఫ్ అయ్యాడు. అంతే కాకుండా కార్బలా (16210212) అనే చోట హుస్సేన్ చంపివేయబడ్డాడు. అతడు పవిత్రకార్యం కోసం ప్రాణత్యాగం చేసినవాడుగా (౫4౧) పరిగణింపబద్దాడు. అప్పటినుంచి ఇస్లాంలో ఈ విభేదాలు ప్రారంభం అయాయి. ఆలీకి వాని కుమారునికీ సంబంధించిన వాళ్లం దరూ ఆలీ ప్రభృతులే మహమ్మదుయొక్క నిజ మైన వారసు లనీ మధ్యలో వచ్చిన ముగ్గురూ అధికారం లేకపోయినా వచ్చినవాళ్లనీ అన్నారు. అల్ మహ్దీ (అల్లాచే నడిపింపబడినవాడు) అను మరొక పేరుతో కూడ ప్రసిద్దు దైన మొహమ్మద్ - అల్ - అంట్జార్ వరకూ ఉన్న పన్నెండుగురుని ఆవిధమైన వారసులునుగా చెపుతారు. మహ్దీ మరణించలేదనీ, 878లో కేవలం అంతర్జానం చెందా దనీ - న్యాయనిర్ణయదివసానికి ముందు మళ్లీ వస్తా డనీ షియాల నమ్మకం. ఈ వారసుల నందరినీ షియాలు '“ఇమాంలు” అని అంటారు. ఇమాం అనగా మతనాయకుడు. ఈ ఇమాంలు ఈశ్వరత్వం (6౦4 16464) యొక్క అవతారం అని కూడ కొందరు షియాలు భావిస్తారు.
ఇస్తాం మతం 355
వెనుక చెప్పిన విధంగా సున్నీలు షియాలతో వ్యతిరేకిస్తూ, కాలిఫత్కు వచ్చిన కాలిఫాల క్రమం సరియైనదే నని అంటారు. వీళ్ల మధ్య సైద్దాంతిక మైన భేదాలు కూడ ఉన్నాయి. సున్నీలు 'సున్నాను (సంఘంలో ఉన్న సంప్రదాయం) అనుసరిస్తారు. మొహమ్మడు మాటలను ఆత డనుసరించిన ఆచారాలను నిబంధించిన సాంప్రదాయిక (గ్రంథానికి 'సున్నా' అని పేరు. ఇవి కొరాన్ ఎంత ప్రమాణమో అంత ప్రమాణం అని సున్నీలు అంటారు; షియాలు దానికి అంగీకరించరు. వాళ్లకు కొరాన్ ఒక్కటే పరమ'ప్రమాణం. అందుచేత సున్నీలు సాంప్రదాయికులుగా భావించబదతారు. ఇస్లాం ప్రపంచంలో వీళ్లే అధికసంఖ్యలో ఉన్నారు. అరేబియన్ దేశాలలోను, ఆఫ్రికన్ దేశాలలోను టర్కీలోను ఉన్నవాళ్లు చాలమంది సున్నీలే. షియాలు పెర్షియాలోను, మెసొపొటోమియాలోను, పాకిస్తానులోను మాత్రమే అధిక సంఖ్యలో ఉన్నారు.
అచిరకాలంలోనే షియాలనుంచి విడిపోయి ఇస్మైలియా అను ఒక శాఖ బయలుదేరింది. ఈ శాఖకు ఈ పేరు ఇస్మైల్ అను వడవ ఇమాంను బట్టి వచ్చింది. వీళ్లు అతనిని అనుసరించేవాళ్ల మని చెప్పుకొంటారు. 'ప్రపంచకంలో ఇమాం లేకుండా ఎన్నడూ ఉండ దని వీళ్ల విశ్వాసం. ఆరవ ఇమాం తరువాత రహస్యమైన ఇమాముల పరంపర ఉన్న దని వీళ్లు నమ్ముతారు. ఈ విధంగా నిగూఢ - ఇమాంపరంపరయందు నమ్మకం కలవారవడంచేత ఈ ఇస్మైలియాలు ఒక విధమైన రహస్యసమాజంలో సభ్యు లయ్యారు. జగత్తుయొక్క సృష్టిని గూర్చీ, దాని సంరక్షణను గూర్చీ వీళ్ల కొక ప్రత్యేకమైన తాత్తికసిద్దాంతం ఉంది. ఈశ్వరుడు తన క్రింద (వెప్పుచేతలలో ఉను వైశ్వబుద్ధి గంయిాలం21 1762902) మధ్యవర్తిత్వం ద్వారా జగత్తును సృష్టించా దని వీళ్లంటారు. ఈ వైశ్వబుద్ధి ఒక వైశ్వ అత్ఫను (౮౫౫౮౪౭1 5040 ను సృష్టించింది. అప్పుడప్పుడు ఈ వైశ్వాత్మ మానవునిలో అవతరిస్తుంది. ఇమామ్‌లు అందరూ అలాంటి అవతారాలే. మవ్దీ తిరిగి భూమిమీదకు వస్తా డనీ ధర్మసామ్రాజ్యం స్టాపిస్తా డనీ, అలీ శత్రువులమీద పగ తీర్చుకొంటా డనీ కూడ ఇస్మైలీలు విశ్వసిస్తారు.
షియాలనుండి విడిపోయిన మరొక శాఖ జైడీల శాఖ వీళ్లు యెమన్‌లో అధికసంఖ్యలో ఉన్నారు, షియాలు అంగీకరించి నట్లు ఇమాంలకు అలౌకికశక్తు లున్నా యని వీళ్లు అంగీకరించరు. వీళ్ల మధ్య ఉన్న (ప్రధానమైన భేదం ఇదే.
356 ఇస్తాం మతం వహబీలు, అహమదీయులు, సూఫీలు అనే వాళ్లు కూడ ఇస్లామంతానికి చెందిన కొన్ని ప్రధానశాఖలు. అలీ వాహబ్ వహబ్శాఖ స్థాపించాడు. ఇతడు ఇస్లాంలో పవిత్రత్వాన్ని తీసికొనిరావడానికై ప్రయత్నించాడు. ఇస్లాంలో అత్యధికంగా ఉన్న కర్మకలాపాలను నిరాకరించాడు. మతప్రవక్తల విషయంలోను, దేవతల విషయంలోను అతిగా భక్తిని ఆరాధ్యభావాన్ని ప్రదర్శించే అలవాటును కూడ తిరస్కరించాడు. కొరాన్కు ఎక్కువ [ప్రాధాన్యం ఇచ్చి దాని వ్యాఖ్యానాలు మూలానుసారంగా ఉండే టట్లు చూడడానికి ప్రయత్నించాడు. ఎక్కువ ఆడంబరంగా బంగారు ఆభరణాలు ధరించడం, సంగీతం వినడం, చదరంగం ఆడడం. పొగాకు, ఇతరమాదకద్రవ్యాలూ సేవించడం ఇలాంటి వన్నీ నిషేధించాడు. ఈ విధంగా వహాబీ శాఖ ఇస్లాంలో బయలుదేరిన పవి[త్రీకరణోద్యమానికి ప్రతీక. అహంమదీయశాఖ భారతదేశంలో ఆవిర్భవించింది. దీనిని అవిభక్తపంజాబు దేశంలో జన్మించిన మిర్దా అహమ్మద్ స్థాపించాడు. తనలో దివ్యశక్తు లున్నా యనీ, దివ్యసందేశాన్ని ప్రచారం చేయడానికై తాను పంపబడ్డా దనీ అతడు చెప్పుకొన్నాడు. శ్రీకృష్ణుని అవతారం అనికూడ అతడు తరువాతికాలంలో చెప్పు కొన్నాడుట. ఈ శాఖమీద హిందూసంప్రదాయాల ్రభావంకూడ అధికంగా ప్రసరించింది. దీని ప్రచారం చేసే సంస్థలు ఆఫ్రికాలోను, యూరప్దేశాలలోను న్థాపింపబడ్డాయి; జనులను ఈ మతంలోనికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సూఘీలలో ఇస్లాంకు సంబంధించిన రహస్యవాదం (97560 అలురు అధికంగా కనబడుతుంది. సంన్యాసానికి భౌతికసుఖత్యాగానికీ ప్రతీకగా రంగు వేయని ముతగగా ఉన్న కంబళీలను ధరించిన మహ్మదీయసాధువులకు (52116) సూఫీలు అను పేరు ప్రారంభంలో ప్రసిద్ధిలోనికి వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు ఇస్లాం మతానికి చెందిన రహస్యవాదు లందరికీ వాడబదుతూన్నది. ఈ ఇస్లాంమతరహస్యవాదానికీ ఇతరరహస్యవాదాలకీ ప్రధానసిద్ధాంతాలలో భేదం ఏమీ లేదు. ఇదొక విధ మైన బహుదేవతావాదసంమిశ్ర అద్వైతవాదం. మానవుని ఆత్మ పరమాత్మతో ఐక్యాన్ని పొందడమే పరమలక్ష్యం అని వీళ్లు అంగీకరిస్తారు. ఈ దృష్టితో చూస్తే ఇది హిందూమతంలోని వేదాంతానికి చాల. సంనిహితంగా ఉంటుంది. “దేవునికి మానవునికీ మధ్య చాలా దూరం ఉంది సర్వప్రభువూ సర్వసమర్థుడూ అయిన
ఇస్తాం మతం 357 ఈశ్వరునితో మానవునికి ఏ మాత్రమూ పోలిక లేదూ అని చెప్పే ఇస్లాంలో జీవాత్మసరమాత్మల ఐక్యాన్ని అంగీకరించే ఈ సూఫీసిద్దాంతం చాల అసంగతంగా ఉన్నట్లే కనబడుతుంది. అయితే - రాభియాా, హల్లజ్ మొదలైన సూఫీరహస్యవాదులు ఈశ్వరుని మీద ్రగాధమైన (ప్రేమను, ఈశ్వరునితో ఏకత్వాన్నీ బోధిస్తూ వాళ్ల జీవితం అంతా ఆ విధంగానే గడిపారు. గొప్ప ప్రీ రహస్యవాదిని మైన రబియా ఈశ్వరునిమీద ప్రగాఢ మైన (ప్రేమభావంతో జీవితం అంతా బ్రహ్మచారిణిగా ఉండిపోయింది. “నా ప్రియుడు ఎల్లప్పుడు నాతోనే ఉన్నాడు నాకు ఆతని ప్రతినిధిగా మరెవ్వడూ లేడూ అని ఆమె అంటూందేది. ఈ మాటలు శ్రీకృష్ణుని విషయంలో మీరా పలికిన మాటలను స్మరింపచేస్తాయి. సూఫీసిద్ద్ధాంతానికి ఇన్లాం సిద్దాంతంతో పొత్తు కుదరకపోయినా, పెర్షియాదేశకత్త్వవేత్త ర్రైన అల్ - ఘజలీ చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈ రెండింటి మధ్యా సఖ్యత నెలకొల్పబడింది. ఆనాటినుంచీ గొప్ప సూఫీ గొప్ప ఇస్లాంమతానుసారిగా కూడ ఉండవచ్చు ననేది స్థాపించబడింది. యత్కృపాలేశసంసర్గాద్గన్టోమి యం [గ్రథితో మయా, తస్వైన జూనకీజానేః పదయోరయమర్చ్వతే. దేవతొనుగ్రహః పిత్రోస్తపశ్చాచార్వసత్కృపా, కర్తాస్మద్గస్థజుతస్య కరణం నేవలం వయమ్. శ్రీః శ్రీః ్ల్రీః 83.2008 న చమ ఈలా ళో ల గ రా. 0104 హాం శ తా మోస!
/ శ గ - గ ళ్ . క న. _ ఉం 1 వ 1 క్యు న ం " | | ఓ ఒం / వంత శ " "4 /| | | | . గీ . ॥ | _ ల | ళ్ ఖీ | ॥ ల! , |: | - 1 చ్ | | - || న " | య “ శ ఎ అత ॥ జ ఉలవ | 4 య క . న. లే లో శె ల చ ల . నా ఈ ॥ శ్ | వ 1 ॥ ల ఏ ఇ వ ఆలని 1! ॥ ౯ మల ॥ / నో ఎలక | " షె - ళ్ | / & (| క. | న త / ॥ ఎ ఖానా ల ళో హ్ . + | ల శ ॥ ॥ ై చి | భి 0 క శ్రీః | | ణి ( | ల ల " య? క 4 న నీ త య” ” “ల / ( శ ॥ €( ల ” ఓ! “
- ఇ ఇ ః ఇల ల . ం ” శ న | ” = ఆ . ,