Telugu Gnapakala Varada - anilvaranasi/indianlanguages GitHub Wiki

అలా మస్‌. వర దా. జియస్‌. వరదాచారి ॥ లల /. ( అ 1! స 1బీ ౯ | ట్ట | . మ. .ఈలతే ప్‌ య్‌. స ల | “ త రను (11, 1:1

జ్ఞాపకాల నరీస్‌ దా. జియస్‌. వరదాచారి ఎమెస్తో

తు కతు [తత 4 + ఉుటుండ 6.5. *20262య120గ1 జ్ఞాపకాల వరద జియస్‌. వరదాచారి సంపాదకులు: డా॥ డి.చంద్రశేఖర రెడ్డి ముద్రణ : మార్చి, 2017 ర త్ర వెల: రూ.150/- ౦ క నాని రం వీల్లు ధో 159%: 978-93-86327-80-2 లా న స ము! బైటిల్‌ డిజైన్‌: జి. పురుషోత్త్‌ కుమార్‌ ఫె గ్గ | ( హా " / య ౦టర్స్‌ : రైతునేసం (సెస్‌ ౨. “టో ప్రింటర్స్‌ : రైతునేస్తం ప్రెస్‌, హైదరాబాదు - ఫొ / జో స ళ్‌ భో ౯ ప్రచురణ బ్రాంచ్‌ ఆఫీస్‌ నీమెస్త్సో బుక్స్‌ ఫ్రై, ల. ఎమెస్కో బుక్స్‌ ఫ్రై. లి. 1-2-7 బానూకాలనీ, ౩8-22-2, చంద్రం బిల్డింగ్స్‌ గగన్‌ మహల్‌ రోడ్‌, దోమలగూడ, సి.ఆర్‌. రోడ్‌, చుట్టగుంట హైదరాబాద్‌-500029, తెలంగాణ. విజయవాడ-520004, ఆంధ్రప్రదేశ్‌. అణ౭$ : లుజం0600010్ర్రి2ష00 00%, ఫోన్‌ ; 0866-2486648 ఇగ యటజ౦ం0000103 00% అ౫211 ; ౨06007 4(్రళ£ైం211.0001

విషయసూచిక క్షే చిన్ననాటి ముచ్చట్లు ర్‌ ల వివాహం - విద్యాభ్యాసం ర్‌లె 8. జర్నలిజం వైపు మొగ్గు 102 త్తే ఉద్యోగపర్వం 12డ 5... శ్రామికాభ్యుదయం 168 6 రచనలు - పురస్కారాలు 280 ' దొరకునా ఇటువంటి సేవ? 254

చిన్ననాటి ముచ్చట్లు

నా ఆత్మ కథో, అనుభవాలు జ్ఞాపకాలో వ్రాయుమని మిత్రులు కొంతకాలంగా సూచిస్తూ వచ్చారు. నా జీవితం చీకూ చింతా లేనిది కాకున్నా పెద్దగా ఒడుదుడుకులేమీ లేకుండా సాఫీగా సాగిపోయింది. అతి సామాన్యమైన జీవితం. గొప్పగా చెప్పుకోడానికి ఏమీలేదు. అందుకే అడుగు ముందుకు సాగలేదు. సుప్రసిద్ధ హిందీ రచయిత మున్నీ (ప్రేమ్‌చంద్‌ తమ ఆత్మకథ ముందుమాటలో వ్రాసుకున్న మాటలు గుర్తుకొచ్చాయి. ఒకరికి వినిపించదగిన విశేషం నా జీవితంలో ఏముంది అని 'ప్రశ్చించుకున్నారాయన. కోట్లాది ప్రజలమాదిరిగానే జీవిస్తున్న సామాన్యుడిని. జీవితమూ సామాన్యమైనదే అంటూనే ఆత్మకథ వ్రాశారు. ఇక్కడ ఈ ప్రసక్తి పోలికకోసం కాదు. (ప్రేమ్‌చంద్‌ మహారచయిత. ఉర్దూ సాహిత్యంలో ఒక విధంగా యుగకర్త. సామాన్యుడు కూడా ఆత్మకథ వ్రాసుకోవచ్చునన్న మనోబలాన్ని తెచ్చుకోవడానికే ఈ ప్రస్తావన. సామాన్య జీవితాలలో మంచిని కూడా అక్కున చేర్చుకోగల గుణం విచక్షణపరులైన పాఠకులకు ఉంటుందన్న సత్యం ఆయన వ్యాఖ్యతో బోధపడింది. నాదీ సామాన్య జీవితమే. అయితే ఎనఖై ఏళ్లకు పైబడ్డ నా జీవితంలో అరవై ఏళ్లకు పైగా ఎందరితోనో కలిసి పనిచేశాను. ఎన్నో సంఘటనలు దగ్గరుండి చూశాను. భిన్నమనస్తత్తాలుగల వ్యక్తులతో వ్యవహరించాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. సామాజిక జీవితంగురించి కొంత అవగాహన ఏర్పడింది. సామాన్య జీవితాల నుంచి, సామాన్య సంఘటనలనుంచి తెలుసుకోదగిన జీవితసత్యాలు, నేర్చుకోదగిన గుణపాఠాలు ఉంటాయని అర్థమైంది. ప్రతి అనుభవమూ జ్ఞానదాయకమే. కనుక నా స్వీయచరిత్ర అని కాకుండా “జ్ఞాపకాల వరదిగా అక్షరరూపమిద్దామని సంకల్పించాను. వరద అనేమాటను నా పేరును సూచించడానికేగాక కలగావులగంగా ఉండవచ్చునని చెవ్పడానికి కూడా ఉపయోగించాను. నా అనుభవాలనేగాక, నా పరిశీలనలను, నా స్పందనలను, నా నిర్ధారణలను సత్యనిష్థతో, నిర్దిష్టతకు భంగం కలుగకుండా పొందుపరచే ప్రయత్నం చేశాను. పత్రికారచనలో నేను దీక్షతో పాటించినదీ, బోధించినదీ ఈ సూత్రమే. తరతమభేదాలుకూడా రానివ్వకుండా జాగ్రత్త పడ్డాను. ఎక్కడ మొదలు పెడదామన్న ప్రశ్నకూడా ఎదురైంది. కాలక్రమానుగతంగా సాగడమే మంచిదనిపించి అలాగే చేశాను. జ్ఞాపకాల వరద ర్‌

నవనాథపురం మొదట మా ఊరుగురించి చెప్పాలి. మా ఊరిపేరు ఆర్మూరు. పూర్వం ఆరమూరు అనేవారు. మా నాయన చివరిదాకా అట్లాగే వ్రాసేవారు. నవనాథపురం అని ప్రాచీన నామం ఉండేదని చెపుతారు. ఊరికి సమాంతరంగా 220 అడుగుల ఎత్తు, మైలు పొడవు నల్లని పెద్ద రాళ్లగుట్ట ఉంది. గుట్టమీద తూర్పు చివర భాగంలో గుహలో నవనాథ సిద్ధేశ్వరాలయం ఉంది. అందుచేత నవనాథపురం అనేవారని పెద్దలు చెపుతారు. గుట్టపైకి ఈ ఆలయంవైపు వెళ్లాలంటే ఊరి మధ్యలో ఉన్న గోల్‌బంగ్లాకు దక్షిణంవైపు సందులోనుంచి వెళ్లాలి. సగంవరకు ఎక్కడానికి రాతి తంతెలు అంటే మెట్లు ఉన్నాయి. అక్కడినుంచి రాళ్లను ఎక్కుతూ పోవడం కొత్తవారికి కష్టంగానే ఉంటుంది. గుట్టమీద మట్టి, చెట్లుగల సమతల ప్రదేశం ఉంది. తూర్పు వైపు గుహ ఉంది. పది పదిహేను తంతెలు దిగి లోనికివెళ్ళాలి. ఇరవైమంది కూర్చోడానికి వీలైనంత స్థలం గచ్చుతో మల్లంచేసి ఉంటుంది. ఈశాన్య మూలలో ఉన్న పెద్ద పరుపు బండలో సుమారు గజం వ్యాసం గల రోలు లాంటి పెద్ద గుంట ఉంది. దానిలో రోజూ నీళ్లు ఊరుతుంటాయి. అవే అభిషేకానికి వాడుతుంటారు. రాతిలో నీళ్లూరడం గురించి ఇంతవరకు ఎవరూ శాస్త్రీయ నిర్ధారణలేవీ చేయలేదు. మా ఊరికి మూడు కోసుల దూరంలో ఉన్న తొర్లికొండలో కూడా ఇలాగే ఒక ఆలయం వద్ద నీళ్లూరే రోలు ఉంది. గుట్ట మీద గుహ ముందు ప్రాంతంలో చతురస్రాకారపు కోనేరు ఒకటుంది. దానిలోకి దిగడానికి ఒకవైపు తంతెలు ఉన్నాయి. కోనేరులో నీళ్లు ఎక్కువ లోతులోకి ఉండవు. అదే గుట్ట కింద ఊళ్లో చేద బావుల్లో నీళ్లు చాలా లోతుకు ఉంటాయి. కొండవీటి చేంతాడును కడితేతప్ప బొక్కెనకు నీళ్లు అందవు. గుట్ట మీద మాకు న వా. ఇదే నీద్ధుల గుట్ట గుద్దమీద స్తంభం 6 జియస్‌. వరదాచారి

తెలిసినప్పటి నుండి ఉత్తరాదినుంచి వచ్చిన ఎవరో ఒక సాధువు స్థిరనివాసం ఉంటుండేవారు. అట్లా వచ్చిన వారిలో ఒకరు రామాలయం కట్టించారు. రామచంద్ర హందే ఆర్భూరు సర్పంచుగా ఉన్నకాలంలో 1995లో గుట్టమీదికి కార్లు కూడా వెళ్లేట్టుగా ఘాట్‌ రోడ్డు వేయించారు. దీనికి స్థానిక ముస్లిం ఎం. పి. తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులలోనుంచి ధనసహాయం అందించారు. సాధారణంగా ఇలా సహాయం చేసేవారు ఫలకం మీద తమ పేరు వ్రాయించి పెట్టమంటారు. కాని ఇక్కడ తద్చ్భిన్నంగా వీరు పెడతామన్నా ఆయన వద్దన్నారట. గుట్ట పశ్చిమ చివరిభాగంలో విసుర్రాయి కిందిభాగం ఆకారాన్ని పోలిన పెద్ద ఆరడుగుల ఎత్తు వర్తులాకారపు రాయి మధ్యలో నిలిచిన స్తంభంతో సహా ఆకర్షణీయంగా ఉంది. మధ్యలోని స్తంభం కూడా ఆరడుగుల ఎత్తు ఉంటుంది. ఊళ్లో నుంచి కనబడుతుంది. అది ఎవరి నిర్మాణమో, ఎప్పటిదో తెలిపే ఆధారాలేమీ లేవు. దానికి కొంచెం దూరంలో సమతల ఫ్రదేశంలో మరో స్తంభం ఉంది. ఇది ఊళ్లో నుంచి కనబడదు. పది పన్నెండు అడుగుల ఎత్తు ఉన్న ఈ స్తంభంపైన చిన్న మంటపంలాటి నిర్మాణం ఉంది. అది ఖాళీగానే ఉందికాని, రెండేసి అడుగుల ఎత్తు విగ్రహాలు మూడు నాలుగు పట్టేటంత విశాలంగాఉంది. దాని చరిత్ర తెలిపే ఆధారాలు కూడా ఏమీ లేవు. ఇటువైపునుంచి గుట్ట ఎక్కాలంటే రాళ్లను దాటుళూ వెళ్లాలిసిందే. తంతెలు లేవు. సర్వ హంగులు తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలలో అతి చిన్నదైన నిజామాబాద్‌ జిల్లాలో మండల కేంద్రం ఆర్మూరు పూర్వం తాలూకా కేంద్రంగా ఉండేది. నేను పుట్టేనాటికి జిల్లా పేరు ఇందూరు అని ఉండేది. తర్వాత పాలకులపేరిట చాలా జిల్లాల పేర్లు మార్చారు. అప్పుడు ఇందూరు నిజామాబాద్‌ అయింది. అప్పుడు ఆర్మూరు అతి చిన్న జిల్లాలో అతి పెద్ద తాలూకా అనే ప్రత్యేకతను కలిగి ఉండేది. ఏడెనిమిది వేల జనాభా ఉన్న గ్రామం. టప్పాఖానా, పోలీసుస్టేషన్‌, తహసీల్‌ ఆఫీసు, మున్సిఫ్‌ మేజిఫ్టేట్‌ కోర్టు, ప్రభుత్వ వైద్యశాల, ఊరవతల ఏటి కాలువ పక్కన ఎత్తయిన ప్రదేశంలోచక్కగా తీర్చిదిద్దిన పూదోటతో డాక్‌బంగ్లా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ అప్పటికే విశాలమైన ఆవరణలో స్వంత భవనాలు ఉండేవి. బాలుర మాధ్యమిక పాఠశాల ఉంది."ఉర్జూలో దాన్ని మదరసె వస్తానియా అనేవారు. మా అన్నయ్య, నేను దానిలోనే చదివాము. బాలికలకు విడిగా ప్రాథమిక పాఠశాల ఉండేది. ప్రాథమిక పాఠశాలను ఉర్జూలో మదరసె తహతానియా అనేవారు. పాఠశాలకు విద్యార్థినులను జ్ఞాపకాల వరద (7

తీసుకురావడానికి ఒంటి ఎద్దు కచ్చలం మేదరి తడకగూడు గలది ఉందేది. కచ్చలాన్ని కొన్ని ప్రాంతాలలో కచ్చడం అని కూడా అంటారు. సూర్యారాయ నిఘంటువులో ఆ మాటే ఉంది. బండి అని అర్థమిచ్చారు. కచ్చలంలో కూర్చున్నవారు కనిపించకుండా దానికి ముందువైపు, వెనుకవైపు తెరలు దించేవారు. ఉపాధ్యాయులు, ఇతరసేవా సిబ్బందీ అంతా మహిళలే. మా అక్క లక్ష్మి ఆ పాఠశాలలో పెళయేవరకు - అంటే మూడవ తరగతి వరకు - చదువుకుంది. పెళయాక బావగారికి ఇష్టం లేనందున మానేసింది. ముస్లిం పాలన కనుక స్రీలు గోషా పొటించేవారు. ముస్లిం స్త్రీలు వారి సనాతన ఆచారం (ప్రకారం బురఖా ధరించేవారు. పాలకుల వేషభాషలను అనుకరించడం గొప్ప అనే భావం పాలితులలో ఎప్పుడూ ఉండేదే. కనుక హిందువులలో కూడా సంపన్న కుటుంబాలవారు, ముఖ్యంగా రెద్డు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న పురుషులు షేర్వానీలు ధరించేవారు. వీలైనంతవరకు ఉర్జూలో మాట్లాడేవారు. పాలనవ్యవహారాలు, వ్యాపార విషయాలేగాక ఇంట్లో అన్నదమ్ములు కుటుంబ విషయాల గురించి కూడా ఉర్జూలోనే మాట్లాడు కోవడం సర్వసాధారణమైపోయింది. హిందూ స్రీలు బురఖాలు ధరించకున్నా సాధారణంగా అపరిచిత పురుషులకు కనిపించేవారు కాదు. రెడ్లు అయినా, వెలమలైనా, ధనిక (బ్రాహ్మణులైనా ఇదే పద్ధతి. పనివారిక్తీ, పురోహితులకు మాత్రమే అంతఃపుర ప్రవేశముండేది. స్త్రీలతో మాట్లాడే అవకాశం ఉండేది. సందర్భం వచ్చిందిగనుక ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మదరసా అంటే పాఠశాల. ఎ అనేది సంబంధ బోధక ప్రత్యయం. కలిపి మదరసె అని పలుకుతారు. మజ్లిసె బల్జియా అనేది ఇలాటిదే ఎక్కువ వాడుకలో ఉన్న మరో పదబంధం, నగర సంఘం అంటే మునిసిపాలిటీ అని అర్ధం. ఇలాటి ప్రత్యయంకల ఉర్చూ పదబంధాలు ఇంగ్లీషులో వ్రాసినప్పుడు మధ్యలో ఎ అనే ధ్వనికి ఇంగ్లీషులో ఇ అనే అక్షర్రవ్సే వాడుతారు గనుక ఇక్కడ ఇనే ఇరికిస్తుంటారు. దాన్ని తెలుగులో ఉ్రచ్చార్రబృక్ష అనుగుణంగా ్రాద్దామనుకొని మజ్లిస్‌-ఇ-బల్జియా అనితప్పుగా వ్రాస్తున్నారు. మజ్లిస అని వ్రాయడం సరైన పద్ధతి. పాఠశాలను జన సామాన్యం పాఠ అనే భాగం వదిలేసి శాల అని మాత్రమే అనడంకూడా వాడుకలో ఉందేది. అర్భూరుకు మా చిన్నప్పుడు రెండు ఆర్‌టి.డి. బస్సులు వచ్చేవి. నిజాం

ప్రభుత్వానికి స్వంత. సైన్యం, పోలీసు వ్యవస్థ ఉండటమేగాక స్వంత రైల్వే రోడ్డు రవాణాశాఖ ఉండేది. స్వంత తపాలాశాఖ ఉందేది. చార్మినార్‌ ప్రతిమతో ముద్రించిన రి జియస్‌. వరదాచారి

స్వంత నాణేలు. కరెన్సీ నోట్లు ఉండేవి. దక్కన్‌ ఎయిర్‌వేస్‌ పేరుతో విమాన సర్వీసు ఉందేది. దక్కన్‌ రేడియో ఉండేది. దేశంలో హైదరాబాద్‌ రాజ్యం అతిపెద్ద దేశీయ సంస్థానం. తొమ్మిది తెలంగాణ జిల్లాలు, నాలుగు మరాఠ్వాడ జిల్లాలు, మూడు కర్దాటక జిల్లాలు మొత్తం 16 జిల్లాలుండేవి. నిజాం నవాబు బ్రిటిష్‌ పాలకులకు అత్యంత సన్నిహితంగా ఉందేవారు. మా చిన్నతనంలో ఆర్భూరుకు నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్లే బస్సు, నిజామాబాద్‌ - అర్మూరుల మధ్య రోజుకు మూడు సార్లు తిరిగే లోకల్‌ బస్సులు మాత్రమే వచ్చేవి. కొన్నాళ్ల తర్వాత జగిత్యాలనుంచి డిచ్‌పల్లికి వెళ్లే ప్రయివేట్‌ సర్వీసు ఒకటి (ప్రారంభమైంది. మొదట్లో బస్సులు పోలీసు స్టేషన్‌ ముందు అగేవి. అక్కడే ఒకటి రెండు ఫలహారశాలలు కూడా వెలశాయి. బస్సుల సంఖ్య పెరిగిన తర్వాత కొత్తగా పెరిగిన హుసేనాబాద్‌ అనేవాడలో కొత్త బస్‌ స్టాండు ఏర్పాటైంది. కొన్ని దశాబ్దాల తర్వాత బస్సుల సంఖ్య, బస్సు డిపోల సంఖ్య విపరీతంగా పెరగడంతో, విశాలమైన అవరణలో డిపోతో సహా కొత్త బస్‌ స్టాండు అన్ని సౌకర్యాలతో ఏర్పాటైంది. బైపాస్‌ రోడ్డు

మరొక విషయం చెప్పాలి. నిజామాబాద్‌ నుంచి వచ్చే బస్సులు, లారీలు ఊళ్లోకి రానవసరం లేకుండాగుట్ట వెనుకనుంచి వెళ్లడానికి బైపాస్‌ రోడ్డు అప్పుడే ఉండేది. ఊళ్లోకి రావలసినవారు మాత్రం పడమటి దిక్కునుంచి కూడా ఊళ్లో ప్రవేశించవచ్చు. కొంతదూరం ఒకే రోడ్డు ఉంటుంది. తర్వాత రెందుగా చీలి మైలుదూరంలో గోల్‌ బంగ్లా వద్ద కలిసిపోయి ఊరి చివరిదాకా మళ్లీ ఒకేరోడ్డుగా సాగుతుంది. రెండు రోడ్డు ఉన్న చోట దక్షిణంవైపు అంటే గుట్ట వైపు ఉన్నది పెద్ద బజారు, ఉత్తరంవైపు ఉన్నది కింది బజారు అంటారు. పెద్ద బజారులోనే బ్రాహ్మణవాడలో మా ఇల్లు ఉన్నది.

ఆర్భూరు గురించి మా చిన్నప్పుడు ఓ ఉర్దూ నానుడి ప్రచారంలో ఉండేది. అర్భూర్‌ ఖుదా కా నూర్‌, సేంధీ నజ్జీక్‌ పానీ దూర్‌ అనేది. ఆర్భూర్‌ దివ్యతేజం, కల్లు దగ్గర, నీరు దూరం అని అర్థం. ఆర్మూరు చుట్టూ మూడు చెరువులు ఉండేవి. ఊరికి అరకోసు దూరంలో ఉన్న గుండ్ల చెరువు ఒక్కటీ మంచినీటి చెరువు. దూరాన్ని కోసులలో చెప్పడం నాటి పద్ధతి. కోసు అంటే రెండు మైళ్లు. అన్న చెరువు అని ఊరికి అతి దగ్గరలో మరో చెరువు ఉండేది. పెద్ద నీటి మడుగు అనవచ్చు. అది చాకలివారు బట్టలు ఉతకడానికే ఉపయోగపడేది. దాన్ని తర్వాత పూద్చేశారు. మరోచెరువు మల్లెల చెరువు అని ఉంది. ఊరి మురికి నీరు చేరి సాగుకు మాత్రమే ఉపయోగపడుతున్నది. గుండ్ల చెరువు ఊరిపొలాలలో ఎక్కువభాగానికి సాగు నీరు జ్ఞాపకాల వరద 9

అందివ్వడమేగాక, తాగునీటికి కూడా ఆధారమైంది. ఇది ఇలా ఉంటే ఆర్మూరు చుట్టుపక్కల ఈతచెట్ల వనాలు విపరీతంగా ఉండేవి. రికార్డుస్థాయిలో కల్లు ఉత్పత్తి జరిగేది. పరిసరాల్లో ఊళ్లకు సరఫరా చేయడమేగాక, రోజు ఎన్నో లారీలలో తోలు తిత్తులలో నింపి ముస్తాజర్లు హైదరాబాద్‌కు రసాయనాలు కలుపని కల్గు సరఫరా చేస్తుండేవారు. ఊళ్లో ఇళ్లలో తాగే మోతుబర్లకు తోట్లలో అందజేస్తుందేవారు. కాని మంచి నీళ్లకోసమైతే కోసు దూరంలో ఉన్న గుండ్ల చెరువుకు వెళ్లవలసి వచ్చేది. కులీన స్త్రీలు ఎక్కువమంది ఇష్టపడేవారు కాదు. ఓపిక గలవారు కొందరు రెండేసి నిండు బిందెలను ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కష్టమైనా మోసుకువచ్చేవారు. ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకే కల్లు దగ్గర, నీరు దూరం అనే నానుడి పుట్టింది. ఊళ్లో బావులలో నీళ్లు చాలా లోతుకు ఉండేవి. కాని అంత ఉప్పగా ఉందేవి కావు. కనుక మేము అవే తాగేవారము. మంచి నీళ్లు తాగడానికి అలవాటు పడ్డ బంధువులెవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఇబ్బందిపడితే, మా నాయన కూపోదకం వటచ్భాయ ఆరోగ్యానికి మంచివని గంభీరంగా చెప్పేవారు. మా ఇంటి ముందు పెద్ద మళ్టీచెట్టు ఉండేది. ఆ రెండూ మాకు దేవుడిచ్చిన వరాలు అనేవారు. ఊడలు దిగిన మళ్ళీచెట్టునీడలో ఎంత ఎండాకాలంలో కూడా ఉక్కపోత ఉండేది కాదు. కనుక వరాలు అంటే ఎవరూ కాదనేవారు కాదు. ఖిన్నాభిప్రాయానికి అవకాశముండే ఏదైనా విషయాన్ని ఒప్పించే విధంగా చెప్పాలంటే లోకోక్తినో, సామెతనో, శ్లోకాన్‌ష్న్‌ ఉల్లేఖించాలని నాకు ఇలాటివి వినగా వినగా అర్ధమైంది. మంచినీళ్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు శీనయ్య పంతులు గురించి చెప్పాలి. శీనయ్య మా తాతలలో ఒకరి దౌహిత్రుడు - అంటే మనుమడు. బిడ్డ కొడుకు. తాతగారికి మగసంతానం లేనందున ఆయనను దత్తత తీసుకున్నారు. కూత్రురు సంతానాన్ని దత్తత తీసుకోవడం ఆ రోజులో చట్టం అంగీకరించిన సంప్రదాయం. శీనయ్య భార్య రత్తమ్మను మేము రత్తక్క అని పిలిచేవాళ్లం. పొరుగింట్లో ఉండేవారు. శీనయ్యకు చేదువు అబ్బలేదు. ఉపాదానం చేసుకొని మనుగడ సాగిస్తూ ఉండేవారు. నవ గ్రహ జపం మంత్రాలైనా నేర్చుకొమ్మంటే అదీ వల్లకాలేదు. ఊళ్లో కోమట్లకు గుండ్ల చెరువునుంచి మంచి నీళ్లు మోసి పై ఖర్చులకు సరిపడా సంపాదించుకునేవారు. ఎండాకాలంలో మంచి నీళ్ల అవసరం ఎక్కువ. అడిగినవాళ్లందరికీ అడిగినన్ని బిందెల నీళ్లు మాడ పగిలే ఎండలో తెచ్చి ఇస్తుందేవారు. రత్తక్క బాధపడేది. వద్దని చెప్పేది. కాని ఆమె విసుక్కున్నట్టు మేము ఎన్నడూ చూడలేదు. వాళ్లకు అవసరమైనప్పుడు 10 జియస్‌. వరదాచారి

మనం తెచ్చి ఇవ్వకపోతే మనకు డబ్బు అవసరమైనప్పుడు వాళ్లెందుకు పిలుస్తారనేవారు శీనయ్య శీనయ్య ఉదంతం నేర్చేదొకటే. చదువ నేర్వనివాడికి కాయకష్టం తప్పదు. గోవర్ధన వంశచరిత్ర

తెలంగాణప్రాంతంలో స్థిరపడ్డ గోవర్ధన వంశీయుల చరిత్ర తెలిపే రెండు వంశవృక్షాలు అందుబాటులోఉన్నాయి. ఒకదాని (ప్రకారం మూలపురుషుడు వరదాచార్యులు ఆయన తమిళనాడులోని ఆళ్వార్‌ తిరునగరి వారు. ఈ ప్రాంతంలో ఆయనకు పెద్ద శిష్యగణం ఉండేది. మొదట్లో శిష్య సంచారం వస్తూ పోతూ ఉండేవారు. ఆయన కుమారుడు యామునాచార్యులు అలాగే చేసేవారు. ఆయన కుమారుడు శ్రీనివాసాచార్యులనాటికి శిష్యగణం పదింతలు పెరిగింది. రాకపోకలు కష్టసాధ్యమై తిరునగరినుంచి మకాం శాశ్వతంగా నిజామాబాద్‌ జిల్లాలోని బేమ్‌గల్‌కు మార్చుకున్నారు. రెండవ వంశవృక్షం మా నాయన తయారుచేసింది. ఈ శ్రీనివాసాచారి వారసులుగా తర్వాత వచ్చినవారి వివరాలు రెండు వంశవృక్షాల ప్రతులలో ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయి. శ్రీనివాసాచారికి ముందు తరాల వారి విషయమే భిన్నంగా ఉన్నది. శ్రీనివాసాచారి తండ్రి ఆళ్వారయ్య అని, ఆయన తండ్రి శథగోపాచారి అని, ఆయన తండ్రి రామాచారి అని, ఆయన తండ్రి గోవర్ధన చక్రవర్తి దేశికాచార్యులని మా నాయన గుర్తించారు. మా నాయన తయారు చేసిన వంశవృక్షం గోవర్ధన చక్రవర్తి దేశికాచారితో అంటే శ్రీనివాసాచారి తాతగారి తాతతో మొదలవుతుంది. ఆళ్వార్‌ తిరునగరి వరదాచార్యుల ప్రస్తావన లేదు. మూడు తరాల వరకు వీరు కరీంనగరం జిల్లా కోరుట్లలో ఉండేవారట. శ్రీనివాసాచార్యులు ఆరమూరుకు వచ్చి స్థిరపడ్డారు. శ్రీనివాసాచార్యులకు వరదాచారి, యామునాచారి అని ఇద్దరు అన్నలు. వరదాచారి కుమారుడు అప్పలాచారి. ఆయనకు మగ సంతానం లేదు. ముగ్గురు ఆడపిల్లలే. కనుక ఆ శాఖ అక్కడితో ఆగిపోయింది. యామునాచారికి నరసింహాచారి, వరదాచారి ఇద్దరు కుమారులు. నరసింహాచారి వేములవాడలో స్థిరపడ్డారు. ఆయనకూ, సోదరుడు వరదాచారికి మగ సంతానం లేదు. శ్రీనివాసాచారికి ముగ్గురు కుమారులు - నరసింహాచారి, ఆళ్వారయ్య, లక్ష్మణాచారి. వీరిలో నరసింహాచారి జగడంపల్లిలో, ఆళ్వారయ్య ఆర్భ్మూరులో, లక్ష్మ ణాచారి బేమ్‌గల్‌లో స్థిరపడ్డారు. బేమ్‌గల్‌ను 'శ్రోత్రియులు వేముగల్లు అని అనేవారు. దానికి దగ్గరలోనే లింబాద్రిగుట్ట ఉంది. గుట్టమీద నరసింహస్వామి గుహాలయం ఉన్నది. వేముగల్లును కస్స అని కూడా అంటారు. ఖస్బ్ఫ అనే ఉర్దూ పదానికి తెలుగు రూపం. అంటే పల్లె, పట్టణం కాకుండా జ్ఞాపకాల వరద నేనై

మధ్యస్థంగా ఉండే గ్రామమన్నమాట. వేములవాడ ఊళ్లో శివాలయంలో నిలువెత్తు నంది ఉంది. అతి చక్కని శిల్చం. మెడలో హారాలు, గంటలు ఎంతో సుందరంగా చెక్కారు శిల్పులు. లేపాక్షిలో అంతకంటే పెద్ద నంది ఉంది. కాని దీనంత సుందరంగా ఉండదు. వరంగల్లులో కూడా నంది ఉంది. ప్రభుత్వచిహ్నంగా ఎంచుకొన్నది అదేనంటారు. కాని అందంలో బేమ్‌గల్‌ నందిదే అ(గ్రస్థానం. ఆ బేమ్‌గల్‌లో లక్ష్మణాచారి సంస్కృతపాఠశాలను ఏర్పరచారు. ఆయనకు ఐదుగురు కొడుకులు. నరసింహాచార్యులు, ధర్మాచార్యులు, నీింగరాచార్యులు, పెద్దాచార్యులు, నారాయణాచార్యులు, వేములవాడలో స్థిరపడ్డ నరసింహాచార్యులు, ధర్మాచార్యులను దత్తత తీసుకొన్నారు. ఆయనే మా నాయన కన్నతండ్రి. ఆయనకు ముగ్గురు కుమారులు. నరసింహాచారి పెద్దవారు. మానాయన కృష్ణమాచారి రెండవవారు. చివరివారు శ్రీనివాసాచారి. ధర్మాచార్యులకు పెదనాయన కుమారుడైన వెంకటాచారికి మగ నంతానం లేనందున, మా నాయన కృష్ణమాచారిని దత్తత తీసుకున్నారు. వెంకటాచార్యుల స్థిర నివాసం ఆర్మూరు గనుక, మా నాయన ఆర్భూరుకు వచ్చేశారు. కుటుంబాలు పెద్దవైనప్పుడు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అన్నదమ్ములు, వారి పిల్లలు అలా వేర్వేరు పట్టణాలలో స్థిరపడటం సామాన్య విషయమే. అలాగే తమ వంశీకుల పిల్లలను దత్తత తీసుకోవడం కూడా. గోవర్ధన వంశీయుల కులదైవం ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి గనుక మొదటి సంతానానికి మగబిడ్డయితే నరసింహాచారి అనీ, ఆడబిడ్డయితే లక్ష్మి అని నామకరణం చేయడం ఆచారంగా ఉండేది. గోవర్ధన వెంకటాచార్యులకు కూతురు - అంటే మా నాయనకు అక్క - ఉండేది. వెంకటాచారి సంస్కృత ద్రావిడ వేదాలలో నిష్టాతులు. కొంత ఆస్తిపరులు. ఆర్భూరుతో పాటు జగడంపల్లి, చేపూరు, కొమ్మనపల్లి, గంగసముద్రం, కోనసముద్రం, తదితర గ్రామాలలో పంట భూములు ఇనాంగా సంపాదించారు. శిష్యసంచారం ఎలాగూ ఉండేది. శిష్యులలో ఎక్కువమంది రెడ్లు, పద్మశాలీలు, ఇతర కులాల వారు కూడా ఉండేవారు. వీరు సమాశ్రయణం పొందేవారు. అంటే రాగితో చేసిన శంఖచక్రాల బిళ్లలను కర్రకాడల చివర అమర్చి, వాటిని అగ్నితప్తం చేసి, రెండు భుజాలమీద ముద్ర వేస్తారన్నమాట. అవి టీకా గుర్తులలాగే శాశ్వతంగా కనబడుతూ వారు వైష్ణవులని ఎరుకపరుస్తూ ఉంటాయి. గోవర్థన వంశీయులు స్వయం ఆచార్యులు కూడా. అంటే తమ కుటుంవీకులకు సమాశ్రయణం చేసే అధికారం వారికి ఉందేది. మా నాయనకు పినతండ్రి సింగరాచార్యులు సమాశ్రయణం చేశారు. వైష్ణవులకు, దివంగతులైనప్పుడు తనియలు రచించే పద్ధతి ఒకటుంది. తనియలో ఎవరి పుత్రులు, ఎవరి శిష్యులు, కేల జి.యస్‌. వరదాచారి

ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పరమపదించారు అనే వివరాలు ఉంటాయి. మా నాయన తనియ ఇలా ఉంది. శ్లోకం : అబ్దే దుందుఖి నామ్ని పూషణి ఘటప్రాప్తే౭_ ధికే ఫాల్గుణే, యుక్తే శుక్ల ద్వితీయా శతభిష గృక్షేందువారే దివా, ఆశ్రేయాన్వయ వేంకటార్య తనయ శ్రీకృష్ణమార్యో గురుః ఆత్తాన్‌ వెంకటనామ పూర్వ వరదార్యాంఘ్రియుగ్మం యయౌ. దీనితో కలిపి నిత్యతనియ ఉంటుంది. అది: ఆశ్రేయాన్వయ సంజాతం వేంకటార్య గురోస్సుతం, వరద శ్రీసెింగరార్య శిష్యం కృష్ణగురుం భజే. ఈ తనియలను ఆబ్బికంరోజున బ్రాహ్మణసమారాధన సమయంలో పఠిస్తారు. మాకు మా నాయనే సమాశ్రయణం చేశారు. ఆయనే తండ్రీ, గురువు. ఈ తనియలో లాగానే మన పూర్వికులెవరో, మన వంశం ఏ బుషిగణం నుంచి వచ్చిందో వారసులకు తెల్పడానికి పెద్దలు జాగ్రత్తలను ఏర్పరచారు. పెళ్లిళ్లలో వధూవరుల ముత్తాత, తాత, తండ్రి పేర్లను పురోహితుడు అడిగి తెలుసుకుని చదువడం మీరు గమనించే ఉంటారు. అలాగే నిత్యం సంధ్యవార్చుకునేవారు చివరలో ప్రవర చదువుకుంటారు. దానిలో తాను ఏ బుషుల గణం నుండి వచ్చాడో, తత్కారణంగా తాను ఏ గోత్రానికి చెందుతాడో, ఏ సూత్రాన్ని అనుసరిస్తాడో, ఏ శాఖాధ్యాయో తన పేరేమిటో స్మరించుకొని, అహం భో అభివాదయే అని నమస్కరిస్తాడు. ఈ అహం భో అభివాదయే అనేదాన్నే పేరుగా వాడుకొని తిరుమల రామచంద్ర ప్రముఖుల పరిచయవ్యాసాలు వ్రాశారు. అలాగే ప్రవర అనేమాటను కూడా తెలిసినవారు, ఏదైనా తనిఖీ సందర్భంగా పోలీసులో, మరో విచారణాధికారులో వ్యకిగతవిషయాలను గుచ్చిగుచ్చి అడిగినప్పుడు ప్రవర అడిగారన్న మాట వాడుతుంటారు. నమ్మాళ్వారుల ఉత్సవం

ఏటా వైశాఖ మాసంలో మా ఇంట్లో నమ్మాళ్వారుల ఉత్సవం నిర్వహించేవారు. నమ్మాళ్వారులు పన్నిద్దరు ఆళ్వారులలోఅ(గ్రగణ్యులు. నమ్మాళ్వారులకు తలిదండ్రులు పెట్టిన పేరు మారన్‌. శఠకోపన్‌, వకుళాభరణులు అనేవి గౌణనామాలు. సామాన్యుల శ్రేయస్సుపట్ల ఆసక్తులై ఉన్నందున నమ్మాళ్వారు అన్న ్రజ్ఞానామంతో ప్రసిద్ధి పొందారు. ద్రావిడవేదంగా పేరొందిన నాలాయిర ప్రబంధం అంటే నాలుగువేల పాశురాలున్న ప్రబంధంలో 12 వందల పైచిలుకు పాశురాలు వీరు వెలువరించినవే. 11 వందల పాశురాలుగల తిరువాయ్‌మొజి (అంటే దివ్యముఖము నుండి వెలువడిన మాట అని అర్ధం) ఇందులో ముఖ్యమైంది. తిరువిరుత్తం, తిరువాశిరియం, తిరువందాది మిగతా మూడు. ఇవి వరుసగా బుగ్‌వేద, యజుర్వేద, అథర్వణవేద సారాలుగా జ్ఞాపకాల వరద 18

గుర్తించబడినవి. తిరువాయమొజి సామవేద సారం. ఇది సర్వ ప్రబంధాలలో మూర్ధన్య మానమైనదని కొనియాడబడినది. నమ్మాళ్వారుల ఉత్సవంలో, మూడు రోజులపాటు దీనిలోని పాశురాలను అధ్యాపకులు పదులసంఖ్యలో రెందు బృందాలుగా ఏర్పడి, గానం చేసేవారు. భగవన్నారాయణ చరణశరణ ్రపత్తిని, ద్వయ మంత్రము అర్ధమును, నూటయెనిమిది దివ్య తిరుపతుల అర్బామూర్తుల మహత్తును తెలిపే ఈ ప్రబంధం ముముక్షువులకు కరదీపిక అని పెద్దలు చెపుతారు. వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి నెలల ముందు నుంచే మా నాయన సంబారాల సేకరణ మొదలుపెట్టేవారు. దానికి శిష్యవర్గం నుంచి సహాయం అందుతూ ఉండేది. కోరుట్ల, తక్కళ్లపల్లి వంటి దూరగ్రామాల నుంచి ద్రావిడవేద పారంగతులైన శ్రీవైష్ణవులు వచ్చి, మూడు రోజులు పాశురాలను పోటీపడి (శ్రవణానందకరంగా చదువుతుంటే, వినడానికి వచ్చిన భిన్నవర్ధాలవారికి భాష అర్థం కాకపోయినా దివ్యానుభూతి కలిగేది. మూడు రోజులూ శిష్యవర్గానికి చెందిన చాలా మంది ప్రముఖులు వచ్చి భక్తితో విని, ప్రసాదం స్వీకరించి వెళ్లేవారు. ఏ కారణంచేతనైనా రాలేకపోయిన భక్తులకు, ఉత్సవం ముగిశాక మా నాయన స్వయంగా వారిఊళ్లకు వెళ్లి లడ్డూ ప్రసాదం ఇచ్చివచ్చేవారు. పంచితేనే విద్యకు సార్థక్యం ప్రముఖ సంస్కృత విద్వాంసులు, శ్రీభాష్య బోధకులు చిక్కుడుగాయల కందాళై రంగాచార్యులు మా నాయనకు వరుసకు మేనల్లుడవుతారు. మా నాయన పరమపదించినప్పుడు ఆరమూరుకువచ్చిన రంగాచార్యులు ప్రసంగవశాత్తు ఆసక్తికరమైన విషయమొకటి చెప్పారు. మా తాతగార్లలో ఒకరు (బహుశా నారాయణాచార్యులు) ఆళ్వారు తిరునగరి వెళ్లి శ్రీభాష్యం సేవించి - ఆంటే చదువుకొని - వచ్చారట. దాన్ని ఉచితంగా చెపుతాను నేర్చుకోమని, ఊళ్లో రికామీగా ఉన్న ఒక వైష్ణవయువకుడిని అడిగారట. పాఠమైతే ఉచితంగా చెపుతారు సరే, తిండి ఎవరు పెడతారని ఆయన అడిగాడట. (శ్రద్ధగా నేర్చుకుంటే నెలకో రూపాయి ఇస్తానన్నారట. ఎనభై ఏళ్ల కిందటి మాట. రూపాయి ఆ రోజుల్లో పెద్ద పారితోషికమే. రూపాయి నాణేన్ని కల్తీలేని తులం వెండితో తయారు చేసేవారు. మా ఊళ్లో బంగారం తూచడానికి షావుకారు మల్లయ్య రూపాయి బిళ్లను తూకపురాయిగా వాడటం నేను చూశాను. కనుక రూపాయి ఎదురిచ్చి చదువు చెప్పడమంటే సామాన్యం కాదు. ఆ యువకుడు “మరి నాకు పెళ్లయింది, ఆమె సంగతేమిటి?” అన్నాడట. ఆమెకో రూపాయి ఇస్తానని ఒప్పించి శ్రీభాష్యం చెప్పారట. ఎంతో దూరప్రాంతానికి వెళ్లి కష్టపడి నేర్చుకొని వచ్చిన విద్యను నలుగురికి కేశ జి.యస్‌. వరదాచారి

పంచితేనే కదా సార్ధక్యం అని నమ్మి ఆచరించిన వంశం గనుకనే, సమాజంలో అన్నివర్ధాల మన్ననలను అందుకొంటున్నారని ప్రశంసించారు రంగాచార్యులవారు. గోవర్ధనవారి ఇంట్లో దూలాలను తడితే వేదమంత్రాలు వినిపిస్తాయనే నానుడి అప్పట్లో ప్రచారంలో ఉండేది. కొత్త ఇంట్లో మొదటి బిడ్డను తమ దత్తపుక్రునికి వెంకటాచార్యులవారు జగడంపల్లి వాస్తవ్యులు చక్రవర్తి రంగాచార్యుల పెద్దకూతురు జానకమ్మతో వివాహం జరిపించారు. వారికి మేము ఆరుగురం సంతానం. నరసింహాచారి, లక్ష్మి, నేను, రుక్మిణి, రమణాచారి, రంగాచారి. మా అన్నయ్య, అక్క మాతామహుల ఇంట్లో అంటే జగడంపల్లిలో పుట్టారు. నేను పుట్టేనాటికి మా నాయన వంశపారంపర్యంగా వస్తున్న ఇంటి పక్కనే స్థలం కొని, కొత్తఇల్లు కట్టించారు. అందులోనే ఆంగీరసనామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి ఆశ్లేషానక్షత్రం మొదటి పాదంలో నేను పుట్టాను. ఆ రోజులలో (ప్రసవాలు ఇంట్లోనే జరిగేవి. మంగలికులానికి చెందిన మంత్రసానులు కాన్పులు చేసేవారు. వారిలో కొందరు నైపుణ్యంతోపాటు సమయస్ఫూర్తి కలవారు సహజ సుఖప్రసవాలు ప స చప త తాపస? పసం అకు. సో నాను నో స. . ం స్‌ ( మౌ యు న న. లీ స న మ వ. మ. ర! మా నాయన గోవర్ధన కృష్ణమాచారి అన్నయ్య నరసింవోచారి, తమ్ముళ్లు రమణాచారి రంగాబారీతో మా ఇంటి పెరటి తోటలో 2963లో నా కొదాక్‌ కెమెరాతో లీసీన ఫొటో జ్ఞాపకాల వరద 15

చేసేవారు. మా చిన్న తమ్ముడు కడుపులో ఉండగా కాన్సు కష్టమైంది. మా నాయన శిష్యుడు అర్మూరులో ప్రముఖ ముస్తాజరు దశాగౌడు తమ కారులో తీసుకువెళ్లి దూదిగామలో ఉన్న క్రిస్టియన్‌ మిషనరీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవం ఇబ్బంది లేకుండానే జరిగింది. కాని కోలుకోడానికి సమయంపట్టింది. ఆస్పత్రి నర్సులు, డాక్టర్లు అంతా క్రిస్టియన్లే. ఆదివారంనాడు చర్చికి ప్రార్ధనకు రమ్మని ఒత్తిడిచేశారట. ఆరుగురు సంతానం. నాలుగో పిల్లవాడిని యేసు ప్రభువుకు ఇచ్చేయమని అన్నారట. పిల్లవాడిని ఎత్తుకు పోతారేమోనని మా అమ్మకు భయం పట్టుకుంది. ఇంటికి వెళ్లిపోదామని తొందర పెట్టిందట. మతం మార్చుకొమ్మనేదే వారి ఉద్దేశంతప్ప ఎత్తుకు పోవడంవంటివి చేయరని చెప్పినా వినక పోవడంతో, డాక్టర్ల సలహాను కాదని తల్లీబిడ్డ్దలను ఇంటికి తీసుకు వచ్చారట. బిద్డకీ బిడ్డకీ మధ్య ఎడం ఉండేట్టు చూడాలని కుటుంబ నియంత్రణ నినాదం తర్వాతి కాలంలో వచ్చింది. కాని మా చిన్నతనంలో చాలా కుటుంబాలలో పిల్లలు ఇలా నిర్ణీత ఎడంతో పుట్టడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. తల్లులు రెండు మూడేళ్ల వరకు పిల్లలకు చనుబాలు ఇస్తుండటమే దీనికి కారణమనేవారు. డాక్టర్లు కూడా ఇప్పుడు ఈ విషయాన్ని చెపుతున్నారు. మా తమ్ముల్లిద్దరి వయస్సులో రెందేళ్ల తేడా ఉంది కాని, మిగతా వారందరి వయసులో మూడేళ్ల తేడా ఉంది. వటేటా పిల్లలు పుట్టినవారు ఉన్నారు. కాని చాలా అరుదు. మిషనరీల పరివ్యాప్తి 1940ల దశకం నాటికి మా ప్రాంతంలో రెండు మిషనరీ ఆస్పత్రులు ఉండేవి. ఒకటి ఇంతకు ముందు పేర్కొన్నది. ఇది ఇప్పుడున్న శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. రెండవది ఆర్మూరునుంచి హైదరాబాదు వెళ్లే దారిలో 20 కిలోమీటర్ల దూరంలో డిచ్‌పల్లివద్ద ఉన్న కుష్టు రోగుల ఆస్పత్రి. దీనికి ఎన్నో ఎకరాల స్థలం ఉంది. చుట్టూ పెద్ద ప్రహరీగోడ. దట్టంగా చెట్లుఉండి భవనాలు బయటకు కనబడేవికాదు. ఇప్పుడు చాలా భవనాలు కట్టారు. వైద్యకళాశాల నడుపుదామని కూడా ఓ భవనం కట్టారు. అదెందుకో కార్యరూపం దాల్చలేదు. ఆ రోజుల్లో మతం మార్పిడులు ఐట్టబయలుగా జరిగేవికాదు. హరిజనవాడలలో మత (ప్రచారకుల అలికిడి కొంత ఉండేది. చర్చి అందించే ఆర్థిక సహాయం, విద్యాసౌకర్యాలు కొంత మందిని ఆకర్షించిన మాటా వాస్తవమే. అయితే మతం మారినా పేర్లు మార్చుకోడానికి హరిజనులు ఇష్టపడేవారు కాదు. మాల, మాదిగ, దెక్కల, దొమ్మరి, దోర, చిందు, దేవతల, బుడుబుక్కల, తదితర కులాలవారికి అప్పటికి గాంధీమహాత్ళుడు 16 జి.యస్‌. వరదాచారి

పెట్టిన హరిజనులనే పేరే వాడుకలో ఉండేది. గౌరవప్రదంగా భావించబడేది. దళితులనేమాట అప్పటికి వాడుకలోకి రాలేదు. ఎస్‌.సి అనేది లేనే లేదు. ఆర్థిక సాయం వస్తుందని ఈ వర్గాల వారు కొందరు చర్చిలో పెళ్లి చేసుకొనేవారు. కాని మంత్రాలు, బాజా భజంత్రీలు, బాసింగాలు, తాళిబొట్టు లేని పెళ్లిలో వారికి ఏదో లోటు కనిపించేది ఇంటికి వచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి జరిపించమని పురోహితుడిని కోరేవారు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు వేసవి సెలవులలో ఊళ్లో ఉండగా ఒకరోజు ఐదారుగురి బృందం శివారుపల్లె నుంచి మా ఇంటికి వచ్చింది. పెళ్లి జరిపించడానికి రావాలని మా నాయనను కోరింది. మీ పురోహితుడు ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగారు నాయన. పంతులు రానంటున్నాడని చెప్పారు. పౌరోహిత్యం కూడా వంశపారంపర్య హక్కుగా ఉంటుంది. గుండి దత్తాశ్రేయశర్మ ఆ పల్లె పురోహితుడు. ఆయన అనుమతి లేనిదే ఊళ్లో మరొకరు పౌరోహిత్యం చేయరు. నేను రమ్మంటున్నాని చెప్పి పిలుచుకురమ్మన్నారు. అలాగే వచ్చాడు. ఎందుకు వెళ్లనంటున్నావని అడిగారు. మతం మార్చుకొని చర్చిలో పెళ్లిచేసుకొని వచ్చారు. వాళ్లముఖం చూస్తేనే పాపం అన్నాడు శర్మ. ఏదో ప్రలోభపడ్డారు. వారికి ఇంకా పూర్వపు ఆచారాల మీద, మతం మీద అభిమానం పోలేదు. అలాటి వారిని కసిరికొట్టడం సరి కాదు. వారుకోరిన ప్రకారం చేసి ఆదరిస్తే పునరాలోచనలో పడవచ్చు. తిరిగి ఇటే రావచ్చు. ఆ మార్గాన్ని మనమే మూసివేయడం తెలివైన పనికాదని నచ్చజెప్పి, తానూ వెంట వెళ్లి పెళ్లి జరిపించి వారిని సంతోషపెట్టి వచ్చారు. చెడిపోయారని, దారి తప్పారని మనవారిని మనమే దూరం చేసుకోవడం గొప్ప కాదు. తడబడుతున్నవారికి సరైన దారి చూపి మంచిచేసుకోవడం, మనతో ఉండేటట్టు చూసుకోవడమే సరైన మార్గమని నాయన చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి.

పల్లెటూళ్లలో ఆ రోజుల్లో కులాలకు అతీతంగా అందరూ శుభాశుభకార్యాలలో ఒకరికొకరు సహాయపడటం సర్వసాధారణం. అలాగే మరీ పెద్దవారినీ, గౌరవించదగిన వారినీ వదిలేసి, తక్కిన వారిని ఆప్యాయంగా వరునలుపెట్టి పిలుచుకోవడం ఆనవాయితీ, ఆర్మూరులో పట్వారీ గోవిందరావు ఊరందరికీ మామే. రామాలయం పూజారి బాపూరావు ఊరందరికీ కాకాయే. అవుసలి వెంకటేశం ఊరందరికీ తాతే. ఎవరింట్లో నైనా ఏదైనా శుభకార్యం జరిగితే తలా ఒక చేయివేసి శుభం అనిపించేవారు. అలాగే ఎ”. కా చనిపోయినప్పుడు శవాన్ని వేరేకులాల వారు ముట్టుకునేవారు కాదుగాని బయటి పనుల... శోద్చడేశారు. జ్ఞాపకాల వరద 17

నిజొంసాొగర్‌ (ప్రాజెక్టు 1940ల దశకంలో నిజాంసాగర్‌ (ప్రాజెక్టు, దాని కాలువల నిర్మాణం పూర్తిఅయి సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఉర్జూ రాజ్యమేలుతున్న రోజులలో ఏటికాలువ వంటి పదబంధాల సృష్టి జరిగి బహుళవ్యాప్తిలోకి రావడం తల్లిభాషకుండే ఆదరణను చెప్పకనే చెపుతుంది. ఏరుమీద ఆనకట నిర్మించి జలాశయం నుంచి నీరు పారడానికి ఉద్దేశించినవి కనుక వాటిని ఏటి కాలువలు అన్నారు. ప్రధానకాలువ, భిన్న ప్రాంతాలకు ఉపకాలువలు, వాటినుంచి పంటకాలువలు బాన్సువాడ, బోధన్‌, నిజామాబాద్‌, ఆర్మూరు తాలూకాలలో విస్తరించాయి. ఈ కాలువల పరీవాహక ప్రాంతంలోకి వచ్చే పడీత్‌ భూములను అంటే వ్యర్థంగా ఉన్న భూములను రాళ్లురప్పలుంటే తొలగించి గట్లుకట్టి పొలాలుగా మార్చుకొని సాగులోకి తేవడానికి నిజాం ప్రభుత్వం రైతులకు రాయితీలు, బుణాలు ఇచ్చే పధకం ప్రకటించింది. పత్రికలలో ప్రచారప్రకటనలు వేసింది. ఆ సహాయపథకాలను కృష్ణాజిల్లా దానిచుట్టుపక్కల పాంతాలవారే సద్వినియోగం చేసుకున్నారు. పెద్దసంఖ్యలో వచ్చి మూడు తాలూకాలలో స్థిరపడ్డారు. కొత్త గ్రామాలనే పదుల సంఖ్యలో ఏర్పాటు చేసుకున్నారు. వాటికి తెలుగుదనం ఉట్టిపదే పేర్లు పెట్టుకున్నారు. వారి గ్రామాల్లో ప్రత్యేకత ఏమిటంటే ఎంత సంపన్నులైనా పూరిగుడిసెలోనే నివాసముండేవారు. రాళ్లు సిమెంటుతో భారీగా నిర్మించిన కట్టడం ఊళ్లో ఒకేఒకటి ఉండేది. అది చర్చి. వారి ప్రభావంతో కొత్త ఊళ్లలో కూడా చర్చీలు వెలశాయి. అంతకుముందు ఆర్భూరులో చర్చి లేదు. హరిజనవాడలలోనేగాక పట్టణ (ప్రాంతాలలో సైతం చర్చీలు వెలువడం ప్రారంభమైంది. మరో ఇరవైఏవళ్లలో అడుగడుగున గుడి ఉంది అనే కృష్ణశాస్త్రి పాటను గుర్తుచేసేటట్టు చర్చీలు వచ్చాయి. పేరు మార్చుకుంటే రిజర్వేషన్‌ సౌకర్యం పోతుందేమోనన్న భయం ఇప్పుడు పోయింది. అంకాపురం విజయగాథ నిజాం సాగర్‌ ప్రాజెక్ట కింద వ్యవసాయవికాసానికి నిజాం ప్రభుత్వం ప్రకటించిన సహాయపథకాల పట్ల స్థానికులు మొదట్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. కాని తర్వాత నిరాసక్తతను వదలి క్రియాశీలురయ్యారు. తమ సామర్హాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. దీనికి అంకాపురం రైతుల విజయగాఖే చక్కని ఉదాహరణ. వారు అధిక దిగుబడులు సాధించి ఆదర్శ రైతులుగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. మొక్కజొన్న పంట దిగుబడిలో దేశంలోనే రికార్డు నెలకొల్పారు. అంకాపురానికి చెప్పుకోదగిన పూర్వచరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు ఆర్భూరుకు కావలసిన పాలు, కేరి జియస్‌. వరదాచారి

పెరుగు, నెయ్యి, కూరగాయలు అన్నీ అంకాపురంనుంచే సరఫరా అయ్యేవి. అంకాపురం కాపులందరికీ (ప్రధాన ఆదాయమార్గం ఒకప్పుడదే. రోజూ తెల్లవారు జామునే అంకాపురం నుంచి పసిపిల్లలు, వయసు మీరినవారుతప్ప, స్రీలందరూ గంపలు నెత్తికెత్తుకొని గుంపులుగా బయల్దేరి, ఆర్మూరుకు రెండు మైళ్లు నడిచి వచ్చేవారు. తాము తెచ్చినవాటిని అమ్మి, తమకు కావలసిన దినుసులు కోమటి కొట్లలో కొనుక్కొని కలిసి తిరిగి వెళ్లేవారు. ఎవరికైనా, ఏ కారణంచేతనైనా ఆలస్యమైతే, ఒంటరిగా వెళ్లడానికి ఇబ్బంది పడేవారు. అయినా ఏళ్లతరబడి ఇదే పద్ధతి కొనసాగింది. రజాకార్ల ఆగడాలు ఎక్కువ కావడం, కొందరు పట్కరి యువకులు పాలవ్యాపారంపై దృష్టి పెట్టడంతో పరిస్థితి మారింది. ఆ యువకులు సైకిళ్లకు డబ్బాలు కట్టుకోని అంకాపురం వెళ్లి పాలుకొనితెచ్చి ఆర్మూరులో అమ్మడం ప్రారంభించారు. మరికొందరు కూరగాయలు తేవడం మొదలుపెట్టారు. అటు నిజామాబాద్‌ వ్యాపారులుకూడా లారీలతో అంకాపురం వచ్చి కూరగాయలు కొనేసి, చాలా ప్రదేశాలకు తరలించడం మొదలు పెట్టారు. దానితో అంకాపురం ఆడవాళ్ల గంపల వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వచ్చిన తర్వాత అంకాపురం చరిత్రను తిరగన్రాసింది. బంజపల్లివద్ద మంజీరానదిమీద నిర్మించిన ఆ (ప్రాజెక్టు నిజామాబాద్‌ జిల్లాకు, ముఖ్యంగా బాన్సువాడ, బోధన్‌, ఆర్మూరు తాలూకాలకు వరప్రదాయినిగా ఉండేది. దాని నీటితో బోధన్‌ తాలూకాలో రికార్డు స్థాయిలో చెరకు పండేది. దానిని సద్వినియోగం చేసుకొని చక్కెర ఉత్పత్తి చేయడానికి బోధన్‌లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పేరిట ఆసియాలోనే అతి పెద్దదైన చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటైంది. రైతులు పండించిన చెరకును వాడుకోవటంతో పాటు ఫ్యాక్టరీ స్వంతంగా చెరకు పండించేది. యాళ్రాస్థలానికి వచ్చినట్టు జనం, విద్యార్థులు ఫ్యాక్టరీని చూడవచ్చేవారు. 'ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత అంతటి ఫ్యాక్టరీని దివాలా తీయించారు. ఫ్యాక్టరీనే కాదు, నిజాం సాగర్‌నూ ఎండబెట్టారు. నిజాం సాగర్‌ నీటితో కళకళలాదుతున్నప్పుడు అర్మూరు తాలూకాలో వేలఎకరాలలో వరి, జొన్న మొక్కజొన్న పసుపు, సమృద్ధిగా కూరగాయలు, తమలపాకులు పండేవి. ఏటి కాలువతో పరీవాహక (ప్రాంతంలోని అన్ని చెరువులలో నీరు నింపుతుండేవారు. ఎద్దడి సమయంలో వాడుకోవడానికి అలీసాగర్‌లో, గుత్పలో ఖజానా చెరువులుండేవి. ఆర్మూరులో గుండ్ల చెరువుకింద వరిపొలాలతో పాటు తమలపాకుల తోటలు విరివిగా ఉండేవి. కొన్నేళ్లుగా ఏటికాలువలో నీరు ప్రవహించిన జాడలేదు. తోటలు అదృశ్య్వమయ్యాయి. "పొలాలు వడీత్‌గా ఉంటున్నాయి. ఇవి ఊహించగలిగిన పరిస్థితులు కావు. అయినా జ్ఞాపకాల వరద 19

అంకాపురానికి చెందిన యువకర్షకులు ఆదా, మగా కలిసి పథకాలు రూపొందించుకొని, వాటిని ఎవరోవచ్చి అమలుచేసి ఉద్ధరిస్తారని ఆశించక, తామే పట్టుదలతో అమలుపరచి గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. నీటి వసతికి కూడా వరుణదేవుడి మీద ఆధారపడకపోవడం వారి ప్రత్యేకత. ఊళ్లో సకలసౌకర్యాలూ కల్పించుకున్నారు. ఆధునిక పద్ధతిలో పక్కా ఇళ్లు కట్టుకున్నారు. బ్యాంకులు తెప్పించుకున్నారు. కాలాన్నిబట్టి పంటలువేసే పద్ధతులు పాటించారు. పండిన పంటను కాపాడుకోవడానికి గిడ్డంగులు నిర్మించుకున్నారు. ఏ సరుకు ఎప్పుడు ఎక్కడ అమ్మితే గిట్టుబాటు ధర పలుకుతుందో తెలుసుకొని అమ్మడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఊరి నిండా కార్లు కనిపిస్తాయి. మరో విషయం. ఊళ్లో ముఠాలు లేవు. అన్నీ సమష్టి నిర్ణయాలే. అందుకే గ్రామాభివృద్ధి పథకాల అమలు తీరును పరిశీలించదలచుకున్నవారికి అంకాపురం దర్శనీయ స్థలమైంది. ఈ మధ్య కందకుర్తినుంచి గోదావరి నీరు ఎత్తిపోసే పథకంతెచ్చి, గుత్చ ఖజానా చెరువును పునరుద్ధరించారు. అదొక శుభపరిణామం. తెలంగాణలో చెరువులకిందే వరిసాగు ఎక్కువగా జరుగుతుండేది. గత ప్రభుత్వాలన్నీ చెరువులను ఎండబెట్టినవి. చాలా చెరువులు దురాక్రమణకు గురయ్యాయి. దీనికి సిగ్గుతో తలవంచుకోవలసిన ఉదాహరణ మన రాజధానీనగరం హైదరాబాద్‌లోనే ఉంది. రాజ్‌భవన్‌కు ఎదురుగా రైలు కట్టకు హుసేన్‌ సాగర్‌ చెరువు వైపు 1969లో ఒక్క ఇల్లు కూడా ఉండేది కాదు. ఇప్పుడు అక్కడ పెద్ద పట్టణమే వెలసింది. 20 వేల జనాభా బహుళ అంతస్తుల భవనాలు కట్టుకొని నివాసముంటున్నారు. వీరిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. సాక్షాత్తు రాష్ట్రాధినేత కళ్లముందే చారిత్రక చెరువు కబళించబడింది. చెరువులను ఎండబెట్టడమేగాక, వాటిలో ఇసుక మేట వేయకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కూడా గత రాష్ట్రప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. నిజామాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేసిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిరుపయోగంగా మారడమే ఇందుకు సజీవ ఉదాహరణ. తొలకరిలో వచ్చే వరద ఇసుకతో పాటు రకరకాల కళ్ళులాలను తెస్తుంది. అప్పుడు వరద గేట్లు కొంచెం ఎత్తితే అదంతా ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అలా చేయకపోవడం వల్ల ఇసుక మేటవేసి వరద గేట్లను పూద్చేసి, కదలకుందా చేసింది. దాంతో ప్రాజెక్టు పూర్తి నిల్వ శక్తి గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు ఎగువ భాగంలో మంజీరపై సింగూరువద్ద హైదరాబాద్‌ నగరం తాగునీటి అవసరాలు తీర్చడానికి ప్రాజెక్టులు కట్టారు. తాగు నీటి సరఫరాను ఎవరూ వ్యతిరేకించరు. కాని ఆయకట్టును గాలికి వదిలేయడమే బాధాకరం. తెలంగాణ 20 జి.యస్‌. వరదాచారి

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణకు బృహత్‌ పథకాన్ని చేపట్టి, అందరి ప్రశంసలూ అందుకున్నది. హైదరాబాద్‌కు గోదావరి నీటిని సరఫరా చేసి మంజీరా నీటిని జిల్లా వ్యవసాయ అవసరాలకే వినియోగిస్తామని థైర్యంచెప్పడం రైతులకు దిలాసా ఇస్తున్నది. అక్షరాభ్యాసం

మామూలుగా మగపిల్లలకు మూడో ఏట కులదైవం సన్నిధిలో పుట్టువెంట్రుకలు తీస్తారు. కాని ధర్మపురికి సరైన రవాణా సౌకర్యం అందుబాటులో లేక, నాకు ఐదో సంవత్సరంలో తీశారు. అప్పుడే అక్షరాభ్యాసం కూడా చేశారు. తెలుగుతో పాటు దేవనాగరి అక్షరాలు కూడా దిద్దించారు. అది ఆ రోజుల్లో ముందుచూపు. బ్రాహ్మణులకు సంస్కృతం చదువు జీవనాధారం. ఆ భాషలోని చాలాగ్రంథాలు తెలుగులిపిలో లభ్యమయ్యేవికావు. కనుక నాగరిలిపి కూడా నేర్పేవారు. ఆ రోజుల్లో ఆరేండ్లు దాటినవారినే సర్మారు బడిలో చేర్చుకునేవారు. ఖాళీగా ఉంచడమెందుకని మా నాయన నన్ను వీధి బడిలో చేర్పించారు. వీధిబడులు ఎక్కువగా చాత్తాద వైష్ణవులు నడుపుతుండే వారు. తెలుగు, ఎక్కాలు, కూడికలు, తీసివేతలు,గుణకారం, భాగహారం చెప్పే వారు. కోమటి విద్యార్థులకు కన్నీ బన్నీ అని బుక్‌ కీపింగ్‌లా ఖాతావ్రాసే పద్ధతి నేర్చేవారు. గమ్మత్తేమిటంటే ఏడాది చదివాక పరీక్షరాసి ఉత్తీర్ణులైనవారు పైతరగతికి వెళ్లడం కాదు. ఒక తరగతి పుస్తకం, లెక్కలు క్షుణ్ణంగా వస్తే వెంటనే పైతరగతికి మార్చేవారు. వీధి బడులలో దండనలు కూడా భయంకరంగా ఉందేవి కావు. గోడ కుర్చీ వేయించడం, కోలుదండం ఎక్కించడం ఉండేవి. బెత్తాలు వాడటం లేదు. ఆ సంవత్సరం వేసవి సెలవుల తర్వాత సర్మారు బడిలో చేరాను. నిజాం పాలనలో నాలుగవ తరగతి వరకు బోధన మాతృభాషలో జరిగేది. ఐదవ తరగతి నుంచి స్కూలు విద్యేగాక, స్నాతకోత్తర స్థాయివరకు ఉన్నతవిద్య కూడా ఉర్దూ భాషలో బోధింపబడేది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలలలో ఇంజినీరింగ్‌, వైద్యం అంటే ఎం.బి.బి.ఎస్‌, వ్యవసాయశాస్త్రం, పశువైద్యశాస్త్రం అన్నిటి బోధన ఉర్జూలోనే సాగేది. యూనివర్సిటీ నిపుణులచేత ఉర్దూలో పాఠ్యపుస్తకాలు వ్రాయించి, స్వంత ్రెస్సులో వాటిని ముద్రించి విద్యార్థులకు అందజేస్తుండేది. ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనతో విద్యారంగంలో ఆధునికులు ఆశించే రెండు మహత్తరసంస్కరణలు ఆచరణలోకి వచ్చినట్టయింది. నాసిరకందో, నాణ్యమైందో రాజపుత్రుల నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే విద్య అందుబాటులోకి వచ్చింది. వారివారి గ్రహణశక్తికి తగినట్టు జ్ఞాపకాల వరద 21

అబ్బుతుంది. రెండవది కె.జి నుంచి పి.జి వరకు దేశభాషలో బోధన మొదలైంది ఉర్దూలో అంటే దేశభాషలలో ఒకటైనదానిలో ఉన్నతవిద్యనుగరిపే ఈ ప్రయత్నాన్ని ప్రముఖ రాజకీయవేత్త చక్రవర్తి రాజగోపాలాచారి, శాంతినికేతన్‌ సంస్థాపకుడు, నోబెల్‌ పురస్మారగ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ ఆదర్శవంతమైనదని ప్రశంసించారు. ఇతర దేశభాషలవారు దీన్ని అనుసరిస్తారన్న ఆశాభావాన్ని కూడా ప్రకటించారు. వారిద్దరూ ఆంగ్లంలో ప్రముఖరచయితలైనా, మెరుగైన విద్యాబోధన విధానం తెలిసినవారు గనుక అలా ఆశించారు. అది జరుగకపోగా, వర్తమాన ప్రభుత్వాల అనాలోచితవిధానాలవల్ల ఆంగ్లవ్యామోహం పెరిగి, విద్యార్థులలో సృజనాత్మకత బండబారి పోయేటట్టు చేస్తున్నది. సర్కారీ స్కూల్లో ప్రవేశం

మా నాయన మిత్రుడు, నర్మారీ న్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడు రఘువెంకటస్వామి నన్ను వెంటపెట్టుకువెళ్లి స్కూల్లో చేర్చించారు. పుట్టిన తేదీలో తేదారాకుండా ఆంగీరసనామ సంవత్సర పంచాంగం తీసి ఫసలీ సంవత్సరం నెల తేదీ అన్నీ సరిగాచూసి వ్రాయించారు. అయినా నా పుట్టిన తేదీలో పది రోజుల తేడా వచ్చింది. 24-10-1932 ఉండవలసింది 15-10-1932 అయింది. దానికి కారణం ఫసలీ తేదీలు వాడే ముస్లిం దేశాలవారు తమ క్యాలండర్‌ను గైగోరియన్‌ క్యాలండర్‌తో సరిదిద్దడమే. ఫసలీ నెలలు ఆజుర్‌, దయ, బహమన్‌ అంటూ ఉంటాయి. ఇంగ్లీషు నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి మొదలైనవి. ఈ రెండు రకాలలో ఆరంభ నెలల ఒకటవతేదీ ఒకే రోజు వచ్చేటట్టు సరిదిద్దారు. అదీ మార్చునకు కారణం.

(ప్రభుత్వ పాఠశాలలో మాకు ఉర్పూ ప్రథమభాషు ఇంగ్లీషు రెండవ భాష తెలుగుది మూడవ స్థానం. ఇవి కాక లెక్కలు, సామాన్యశాస్త్రం, చరిత్ర, భూగోళం పాఠ్యాంశాలుగా ఉండేవి. ఎనిమిదవ తరగతికి వచ్చాక ఐచ్చికాలు ఉండేవి. దీనిలో ఉన్నత గణితం, బ్రిటిష్‌ చరిత్ర ఉండేవి. బి.ఇ. చదవాలనుకునేవారు ఐచ్చిక గణితం చదివి ఉందాలి. ఇవి కాక ముస్లిం విద్యార్థులకు దీనియాత్‌ అంటే ఆధ్యాత్మికవిద్య అని ఖురాన్‌ బోధించేవారు. హిందూ విద్యార్థులకు అక్షాఖియాత్‌ అంటే నీతిశాస్త్రము బోధించేవారు. అకల్‌ అంటే బుద్ధి, తెలివి అనికూడా అర్థాలు ఉన్నాయి. సాటి ముస్లిం విద్యార్థులు అప్పుడప్పుడు సరదాగా “మీకు అకల్‌ ఉండదు గనుక అక్షాఖియాత్‌ చెపుతారు. మాకు ఉంది గనుక మహోన్నతమైన మతవిషయాలుగల ఖురాన్‌ షరీఫ్‌ బోధిస్తరని ఎద్దేవా గ! జి.యస్‌. వరదాచారి

చేసేవారు. ఏం చేసినా ముస్లిం విద్యార్థులతో హిందూ విద్యార్థులు ఘర్షణ పడేవారు కాదు. విద్యార్థులే కాదు, పెద్దవారు కూడా ఘర్షణ పడేవారు కాదు. ప్రతి ముస్తిమూ తాను రాచవర్గానికి చెందినవాడినని భావించేవాడు. ఊళ్లో పాకీ పని చేసేవారుకూడా మధ్యాహ్నానికల్లా తెల్ల బట్టలు ధరించి దొరల్లాగా తిరుగుతుండేవారు. వారిని కూడా ఎవరూ చిన్నచూపు చూసేవారు కాదు. జీతం విషయంలో కూడా వారితో తగాదా పెట్టుకునేవారు కాదు. ఆర్భూరులో చాలామంది కాలకృత్యాలు తీర్చుకోడానికి గుట్టకు వెళ్లేవారు. కొద్ది ఇళ్లలోనే పాయిఖానాలు ఉండేవి. మా ఇంటి ఆవరణలో పశువులకొట్టం ఉండేది. మా అన్నయ్య పుట్టినపుడు పిల్లవాడికి పాలకోసమని మా మాతామహులు ఆవును ఇచ్చారు. దాని సంతానం పెరుగుతూ వచ్చింది. ఆవులకు కోడె దూడలు పుట్టినప్పుడు, పాలు విడిచిన తర్వాత వాటీని పాలేరుకు అప్పగించేవారు. మా నాయన బరైను కూడా కొన్నారు. ఇంట్లో ఎప్పుడూ రెండు ఆవులూ, ఒక బర్రె ఉండేవి. వాటికి మేతవేయడం, పాలు పితకడం మా నాయన, ఆయన లేనప్పుడు మా అమ్మ చూసుకొనేవారు. ఆ పశువుల కోసమే ఇంట్లో ఈ కొట్టం ఏర్పాటుచేశారు. దానిలో ఓ మూలభాగంలో పాయిఖానా వెనుక వీధిలో నుండి రేకుడబ్బా లాగి శుభ్రపరచడానికి వీలుగా ఏర్పాటు ఉండేది. మెహతర్‌ అంటే పాకీ అతను ఇంట్లోకి రానక్కరలేకుందా శుభ్రత జరిగిపోయేది. మనుషులు ఎత్తిపోసే పద్ధతి ఇప్పుడు నిషేధించబడింది. ఎనభై ఏళ్ల కిందటి సంగతి. ఇంట్లో ఇలాటి వసతి ఉంటే అది విలాసజీవితంగా పరిగణింపబదేది. పల్లెటూళ్లకువెళ్తే ఇప్పటికీ చెరువుల కాలువగట్ల వెంటతిరుగుతూ ఇబ్బంది పడక తప్పదు. రాత్రిపూటనో, అనారోగ్యం చేస్తేనో పడే అవస్థ చెప్పనక్కరలేదు. ఇప్పటికీ దేశంలో చాలా ఊళ్లలో ఈ బాధలు తప్పడం లేదు. ఇంత వివరంగా దీని ప్రస్తావన ఎందుకంటే, ఇదొక సామాజికసమస్య, ప్రభుత్వాలు పట్టించుకోని సమస్య, ఎన్‌.టి. రామారావు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరచినప్పుడు తెలుగు మహిళా బహిర్భూమి పథకం (ప్రకటించారు. దాని ప్రాముఖ్యం గుర్తించక ఆ రోజుల్లో ఎద్దేవా చేసినవారున్నారు. అప్పుడు వారినిచూసి జాలికలిగేది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్యమస్ఫూర్తితో ఇంటింటికీ శెచాలయం పథకం అమలుకు నడుంకట్టారు. మీడియాకూడా తనవంతు బాధ్యతగా ప్రచారోద్యమాన్ని చేపట్టి, దేశమంకా - ముఖ్యంగా మహిళలలో - చైతన్యం తీసుకురాగలిగింది. ఇంట్లో శౌచాలయం లేకపోతే పెళ్లికి నిరాకరిస్తున్న వధువుల గురించి వింటున్నాము. జ్ఞాపకాల వరద 23

అంకురించిన అసమ్మతి ముందు చెప్పినట్టు నాలుగవ తరగతి వరకు బోధన మాతృభాషలో సాగేది. ఐదవ తరగతి నుండి భాషలు తప్ప అన్నివిషయాలు ఉర్దూలోనే బోధింపబడేవి. ప్రతీ పాఠ్యపుస్తకంలో పుట్ట అంటే కవరు తిప్పగానే ఎదుటి పుటలో ఆర్ట్‌ కాగితం మీద ముద్రించిన నిజాం బొమ్మ ఉండేది. దాని కింద మవాఘనత వహించిన నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అని వివరణ ఉండేది. ఆంగ్ల ప్రభుత్వం వారు నిజాంకు హిజ్‌ ఎగ్జాల్టెడ్‌ హైనెస్‌ అనే బిరుదు ఇచ్చారు. దాని తెలుగు అనువాదమే మహా ఘనత వహించిన అనేది. అప్పుడు నిజాం కొలువులో ఉన్న ఆచార్య కురుగంటి సీతారామయ్య చేశారు. కురుగంటి వారే “నిరాడంబరజీవి నిజాం ప్రభువు” అనే పుస్తకం కూడా వ్రాశారు. ఆ రోజులలో నిజాంకు ప్రపంచంలోకెల్లా ధనవంతుదడనే పేరు ఉండేది. అలాగే చినిగిపోయిన షేర్వానీలకు మాసికలు వేసి ధరిస్తాడని, పరమ పిసినారి అని ప్రచారంలో ఉండేది. నజరానాలు సమర్ప్చించుకుంటేగాని ఎవరికీ దర్శనమిచ్చేవాడు కాదట. రాజ్యంలో 85 శాతానికిపైబడి ఉన్న హిందువులు నిరంకుశ (ప్రభుత్వం ముందు తలవంచుకొనిపోవడం అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా పాలకవర్గంలో భాగంగా పరిగణింపబదే ముస్తింలకు అణగిమణగి ఉండటం కా నేర్చుకున్నారు. అయితే లోలోన అసంతృప్తి రగులుతుందేది. ముఖ్యంగా లౌక్యం వ తెలియని విద్యార్థులలో నిజాంపట్ల అసమ్మతి ఆరంభమైంది. కారణం అడుగడుగునా వారికి ఎదురయ్యే అనాదరణే. ప్రతి ముస్లిమ్‌ అనల్‌ మలిక్‌ - అంటే పాలకుడే - / అన్నభావనను నిజాంకు అతి ఇష్టుదైన బహాదుర్‌ యార్‌ జంగ్‌ ప్రచారంలోకి తెచ్చారు. [_ తల్లీగ్‌ పథకానికి ఆయన రూపకల్పన చేశారు. తబ్లీగ్‌ అంటే మతాన్ని సంఘటితం చేయడం, సాంస్కృతికంగా బలపడటం అనే అర్జాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే తమ మతస్థుల సంఖ్యపెంచుకోవడం. దీనికి మతం మార్పిడి ఒక పద్ధతి అనుకున్నారు. ప్రయత్నం చేశారు. అది ఫలించలేదు. అప్పటికే ఈ ప్రాంతంలో ఆర్య సమాజ్‌ బలమైన శక్తిగా రూపొందింది. శుద్ధి, ఘర్‌ వాపసీ ఉద్యమాలు కూడా చేపట్టింది. కనుక వేరే దారి వెతుక్కోవలసి వచ్చింది. ఉత్తరాదినుంచి ముస్లింలను ఉద్యోగాలిచ్చి పెద్దసంఖ్యలో దిగుమతి చేయడం ప్రారంభించారు. జనాభాలో 85 శాతం పైగా ఉన్న హిందువులతో అల్పసంఖ్యలో ఉన్న ముస్లింల వర్గనిష్పత్తిని సరిసమానం చేయడం అసాధ్యమని తేలిపోయింది. ముస్లిం పాలనాధికారాన్ని వటిష్టపరచుకొనడానికి మరింత నిరంకుశంగా వ్యవహరించడం తప్ప మరో దారిలేదనే నిర్ణయానికి వచ్చారు బహాదుర్‌ వడ జి.యస్‌. వరదాచారి

యార్‌ జంగ్‌. మజ్లిసె ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ సంస్థకు రూపకల్పన చేశారు. నిజాం సలహాపై నవాబ్‌ మహమూద్‌ నవాజ్‌ జంగ్‌ను దానికి అధ్యక్షుడిని చేశారు. 1988లో బహాదుర్‌ యార్‌ జంగ్‌ స్వయంగా అధ్యక్షబాధ్యతలు చేపట్టారు. నిజాం కంటే ఎక్కువ పలుకుబడి కలవాడుగాఎదిగాదు. ఆయన తర్వాత లాతూరుకు చెందిన చిన్నపాటి న్యాయవాది ఖాసిం రజ్వీ మజ్లిస్‌ నాయకుడయ్యాడు. మజ్లిసె ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ మరో పేరే రజాకార్ల సంస్థ. రజాకార్‌ అంటే వలంటీరు అని అర్ధం. శాబ్దిక అర్ధం తీసుకున్నా మేలు చేయువాదని అర్ధం. కాని వారి ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉండేది. చేసేవన్నీ దుర్మార్గపు పనులే. రాజ్యాంగేతరశక్తిగా మారి, నిజామును కీలుబొమ్మగా మార్చి, వారు సాగించిన ఆగడాలకు లెక్కే లేదు. నిజాంకూడావారిని అదుపు చేసేవాడు కాదు. రాజ్యాధికారాన్ని కాపాడుకోవచ్చుననే ఆశతో కావచ్చు, రాజీపడ్డాడు. రజ్వీ ముస్షిములందరకీ సైనికశిక్షణ ఇప్పించే కార్యక్రమం చేపట్టాడు. ఒకప్పుడు ఆసఫ్‌ జాహీ రాజుల అధీనంలో ఉన్న బందరు రేవును పునఃస్వాధీనం చేసుకుంటామనీ, ఎర్రకోట మీద పసుపుపచ్చ పతాకాన్ని ఎగురవేస్తామనీ గొంతు చించుకొనేవాడు. ఇవన్నీ తర్వాత జరిగిన పరిణామాలు. కాని వీటి నీలినీడలు మేము ప్రాథమిక తరగతులలో ఉండగానే కమ్ముకురావడం జరిగింది. ఉర్దూలో చదివి నిష్టాతులైఉన్నా, హిందువులకు ప్రభుత్వోద్యోగాలు దక్కేవి కావు. ఉద్యోగాలలో వారిశాతం ఐదారుకు మించి ఉండేదికాదు. అవి కూడా కుటుంబనేపథ్యంవల్ల లభించినవే. అంటే జాగీర్జారుల, జమీందారుల, మన్సబుదారుల కుటుంబాలకు చెందినందువల్ల లభించినవే. వారిలోనూ అభద్రతాభావం ఉండేది. (బ్రిటిష్‌ పాలన నుంచి దేశం స్వతంత్రం కాబోతున్నదనే ఆశ బలపడుతున్న రోజులు. కాని సంస్థాన ప్రజలస్థితి అగమ్యగోచరంగా ఉండేది. హైదరాబాద్‌ రాజ్యంలో ముస్లిమేతరుల ్రతీచర్యను ప్రభుత్వం అనుమానదృష్టితో చూసేది. రజాకార్లు ఆ దృష్టిని బలపరచేవారు. ఎవరి ఆలోచనో తెలియదుకాని, పాఠ్యపుస్తకాలలో ముద్రించిన రాజుచిత్రపటాన్ని చింపివేసే నిరసనోద్యమం ఊరూరా వ్యాపించింది. ఒకరోజు మా స్కూల్లో హడావిడి. నాజర్‌ - అంటే స్కూళ్ల ఇనస్పెక్టర్‌ బృందం - పుస్తకాలను తనిఖీ చేయడానికి వచ్చింది. మా అన్నయ్య నా క్లాసుకు వచ్చి నా పుస్తకాలలో బొమ్మలు లేకపోవడం గమనించి పుస్తకాలను తీసుకు పోయాడు. ఎవరడిగినా ఇవాళ పుస్తకాలు తేవడం మరచిపోయానని చెప్పమన్నాడు. నాజర్‌ బృందానికి అందరం అలాగే చెప్పాము. కాని వారు నమ్మలేదు. బొమ్మలు చించడం రాజద్రోహమవుతుందని, జైలుకు పోవలసి వస్తుందని బెదిరించి వెళ్లారు.

జ్ఞాపకాల వరద £2ర్‌

పాఠశాలలో కూడా చుట్టూరా ఆవరించి ఉన్న వాతావరణప్రభావం ప్రతిఫలిస్తూ ఉండేది. రోజూ పాడే ప్రార్థనాగీతమే విద్యార్థులకు వెగటుగా ఉండేది. తాబదె ఖాలికె ఆలం యే రియాసత్‌ రఖ్ధె, తురుకు ఉస్మాన్‌ బసద్‌ జిలాల్‌ సలామత్‌ రఖ్జె అనేపల్లవితో 'ప్రారంభమయేది. అర్ధమేమిటంటే పృథ్వి ఉన్నంతకాలం ఈ రాజ్యం ఉండుగాక, నిన్ను ఉస్మాన్‌ ఆ పరమాత్ముడు క్షేమంగా ఉంచుగాక అని. విద్యార్థులంతా అయిష్టంగానే పాడేవారు. నిజామ్‌కు కొడుకు పుట్టాడని నెలకోసారో, రెండుసార్లో సెలవు ఇచ్చేవారు. మొదట్లో సెలవంటే నంతోవం కలిగించినా ఇంతమంది వుట్టడవేమిటని విస్తుపోయేవారం. ఆ రోజులలో స్కూలుకు శుక్రవారం వారాంతపు సెలవు ఉండేది. మొహగ్రంకు పన్నెండు రోజులు సెలవిచ్చేవారు. ఫలకాలపై తెలుగు లోకోక్తులు “బోధన ఉర్జూలో సాగినా మా తెలుగు ఉపాధ్యాయులు తరగతి గదులలో . . చెక్కలమీద తెలుగు లోకోక్తులు వ్రాయించి పెట్టడం నాకు గుర్తుంది. తలిదండ్రులను గౌరవించవలెను, ఆడిన మాట తప్పరాదు, అసత్యము పలుకరాదు, మలమూ(త్రముల నావరాదు వంటివి. ఇవి యావజ్జీవం పొటించేటట్టుగా పిల్లల మనసులపై ముద్రవేసినవి. మాకు పాఠ్యేతర అంశంగా వడ్రంగంపనో, తోటపనో ఏదో ఒకటి నేర్పేవారు. డ్రిల్లు చేయించేవారు. డ్రాయింగ్‌ నేర్పించేవారు. వాలీబాల్‌ కోర్చుకూడా ఉండేది. స్కూల్లోకాని, ఊళ్లోకాని గ్రంథాలయం మాత్రం లేదు. శాస్త్రి అని తెలుగు టీచర్‌ సూర్యనమస్మారాలు, యోగాసనాలు నేర్పుతానని విద్యార్థుల వెంటబడేవారు. సూర్యోదయానికి ముందు లేచి శిక్షణ స్థలమైన వేంకటేశ్వరస్వామి గుడికి రావాలంటే ఇబ్బందిగా ఉండటం వల్ల ఎక్కువ మంది వచ్చేవారుకాదు. మాకు నాలుగవ తరగతిలో మొహసిన్‌ అలీ ఖాన్‌ అని క్లాస్‌ టీచరు, ఉర్జూ టీచరు ఉండేవారు. వేసవి సెలవుల్లో ఆయన ఒక రోజు వీధిలో తారసపడ్డారు. నలుగురం కలిసి పోతున్నాం. మీరంతా ఎన్నో తరగతి అని అడిగారు. మేము నాలుగవ తరగతి పరీక్షలు వ్రాశాం. ఆ మాటే చెప్పాం. అయితే పదండి ఇంటికి, మీకు పనిచెపుతానని తీసుకు పోయారు. నలుగురిని నాలుగు వైపుల నిలబెట్టి ఇద్దరికి ఒకతాడు ఇచ్చి మిగిలిన ఇద్దరినీ సమాధాన పత్రాలు ఎగజల్లమన్నారు. తాడుకు కుడివైపు పడ్డవన్నీ కామ్యాబ్‌ అంటే పాస్‌, ఎడమవైపు పద్దవన్నీ నా కామ్‌ అంటే ఫేల్‌, మీకు తోచినన్ని మార్కులు వెయ్యందన్నారు. మేము పాసైనవారికి నలభై యాఖై, ఫెయిలైనవారికి ఇరవై ముష్ఫయివరకు వేద్దామనుకొని అలాగే ఖుషీ ఖుషీగా వేస్తున్నాము. ఇంతలో సక్క మిత్రుడు “ఒరేయి, నీ పేపరు ఫెయిల్‌లో వచ్చిందిరా!” అని తీసి నా చేతికిచ్చాడు. నాకు ఏడుపు ఆగలేదు. గట్టిగా 26 జి.యస్‌. వరదాచారి

ఏడుస్తుంటే ఖాన్‌ లోపలినుంచి వచ్చి ఏమైందని అడిగారు. విషయం తెలుసుకొని నా పేపరు చేతిలోకి తీసుకొని, “ఇప్పటి వరకు అన్నిటికంటె ఎక్కువ మార్కులు ఎన్ని వేశారు?” అని అడిగి, దానికంటె నాలుగు ఎక్కువ వేసి, “అబ్‌ ఖుష్‌” అని నవ్వారు. కాని నాకు ఏడుపు ఆగలేదు. “ఠీక్‌ హై బేటా, బెర్‌ ఖౌ అని మరో మూడు మార్కులు వేశారు. “సబ్‌ సే జ్యాదా, అబ్‌ నై రోనా” అన్నారు. అలా నేను ఉర్జూ పరీక్షలో మొదటి మార్కు సాధించాను.

ఈ మొహసిన్‌ అలీ ఖాన్‌ సాహెబ్‌ జాదా అని మాకు తర్వాత తెలిసింది. సాహెబ్‌ అంటే నిజాం నవాబు. ఆయనకు శతాధిక భార్యలు. రాజ్యంలో పర్యటనకు వెళ్లినప్పుడు తాను చూచి మెచ్చిన ప్రతిస్తీని దివానానికి తరలించేవారు. దివానంలో పుట్టిన వారిలో రెండు రకాలు. సాహెబ్‌ జూదాలు, ఖానా జాదాలు. మొహసినొద్దీన్‌ సాహెబ్‌ జాదా. అంటే నిజాము స్వంత కొడుకు. దివానంలో పుట్టినవారంతా ఖానా జాదాలు. నిజాం మరణించినప్పుడు ఆస్తిపంపకాల వివాదం ఉత్పన్నమైంది. తమకు జీవనాధారం కల్పించమని వారంతా ఆందోళనకు దిగారు. అప్పుడు సాహెబ్‌ జాదాలు, ఖానా జాదాల మధ్య వ్యత్యాసం చర్చనీయాంశమైంది. శాస్త్రోక్తంగా ఉపనయనం

న్కూల్లో యూనిఫామ్‌ లేదు కాని కోటు తప్పనిసరిగా ధరించాలన్న నియమముండేది. కాలేజీ విద్యార్థులకు షేర్వానీ, పైజామా తప్పనిసరి. తురక పిల్లలు ఎజ్జ ఫెజ్‌ టోపీని, హిందువులు నశ్యం రంగు బట్టతో అట్ట పొదిగిన టోపీని ధరించేవారు. గాంధీ టోపీ నిషిద్ధం. నేను ప్రాథమిక తరగతులలో ఉన్నప్పుడే నాకు ఉపనయనమైంది. పంచశిఖలు పెట్టి శాస్త్రోక్తంగా చేశారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాల తెరిచే నాటికి శిఖలు తొలగించి గుండుకొట్టించారు. తలపై సన్నగా జుట్టు మొలిచింది. టోపీ ఉండేది గనుక ఎవరికీ వింతగా కనిపించలేదు. నా రెండు చెవులకు వేరుసెనగ గింజంత తెల్లనిరాళ్లు పొదిగిన బంగారు కమ్మలు ఉండేవి. ఆ రోజులలో చాలామంది మగవారు కమ్మలు ధరించేవారు గనుక వింతగా అనిపించేవి కావు. పండితులు భారీ మకరకుండలాలు ధరించేవారు. అపండితులు కుండలాలు ధరిస్తే వారిని రచ్చకీడ్చి పండితపరీక్షపెట్టి దానిలో నెగ్గకపోతే కుండలాలు ఊడబీకించేవారు. సభలలో, శుభకార్యాలలో సంభావనలు కూడా కుండలపండితులకు ఎక్కువ ఇచ్చేవారు. “ఏకేక దుద్దుః ఖలు పండితానాం దుద్దుద్వయం కుండల పండితానాం అని స్వభావోక్తి వాడుకలో ఉండేది. అంతే కాదు. శిష్యసంచారంచేసే గురువులకు, ఊరిలో జ్ఞాపకాల వరద జ

ప్రవేశించేముందు గ్రామకంఠంలో నిలబడి తమ రాకను తెల్పుతూ తిరుచూడ్డాలు ఊదదానికి అనుమతి పత్రం ఉండేది. మా అమ్మ తాతగారు చక్రవర్తి రామాచారికి, ఆరవ నిజాం ఇచ్చిన సనదు అంటే సర్టిఫికెట్‌ ఉండేదని చెప్పేవారు. నాకు ఏడవ తరగతి పూర్తయేవరకు శిఖ లేదుగాని తల వెనుక సగభాగంలో మెడ మీదికి వేలాడే జుట్టు ఉండేది. మాడభాగాన్ని నున్నగా ఉంచడం సంప్రదాయం. హ(జమీ అనే సారు వెక్కిరింపుగా “జుట్టు బొలిగాగో అని పిలిచేవారు. ఆంజనేయ భక్తీ

మా ఇంటిని అనుకొని ఉత్తర వాయవ్య దిశలో ఆంజనేయస్వామి గుడి ఉంది. పూర్వం అదొక గద్దెగా మాత్రమే ఉండేది. మా అన్నయ్య ఆంజనేయస్వామి భక్తుడు. ఆయన మారుతీ భజనమండలి పేరిట ఒక భజన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండలిని ఆయన పట్టుదలతో పెంచి పోషించారు. రోజూ రాటత్రి దీపారాధన తర్వాత భజన మండలి సభ్యులు గుడికి వచ్చి రెండుగంటల సేపు ధోలక్‌, తాళాలు వాయిస్తూ భజన చేసేవారు. హిందీ, తెలుగు కీర్తనలు రాగయుక్తంగా, శావ్యంగా పోటీపడి పాడేవారు. మా అన్నయ్య కొంతకాలం పుల్లప్ప పుల్లన్న అనే గురువు వద్ద సంగీతం నేర్చుకున్నారు. భజన బృందం కొద్ది మందితో ప్రారంభమైనా, నిర్వాహకుల శ్రద్ధ చూసి అన్ని కులాలవారు రావడంతో, దినదినాభివృద్ధి చెందింది. వైశాఖ పూజలు, గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపనారంభించారు. పైకప్పు కూడాలేని ఆలయాన్ని పక్కా భవనంగా మార్చి గోడల మీద పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి మంత్రాలు పొదిగిన ఇత్తడి ఫలకాలను ఏర్పాటు చేశారు. పాలరాతి ఫలకం మీద హనుమాన్‌ చాలీసా వ్రాయించి గోడలో అమర్చారు. భజన మండలి కృషితో ఊళ్లో ఆధ్యాత్మిక వాతావరణ ప్రకాశం ప్రారంభమైంది. చిన్న బజారులోని రామమందిరంలో స్టానిక పట్కరివారు మరో భజనమండలిని స్థాపించి మహారాష్ట్ర నుంచి అఠవాలె వంటి సంతులను పిలిపించి కార్యక్రమాలు ప్రారంభించారు. రజాకార్ల ప్రాబల్యం పెరుగక ముందు ఊళ్లోకెల్లా పెద్దదైన వేంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యయనోత్సవం, రథోత్సవం జరిగేవి. స్వామిరథం ప్రదక్షిణాకారంలో ఊరిని చుడుతూ, అప్పటికి తూర్పు చివరి భాగంలో ఉన్న జంబి హనుమాన్‌ గుడి వరకు వెళ్లేది. దారిలో రెండు మసీదులు ఉన్నాయి. అ రోజులలో మసీదులకు అటూ ఇటూ వందగజాల పరిధిలో పూర్తి నిశ్శబ్దాన్ని పాటించాలన్న రాజాజ్ఞ ఉండేది. నమాజు సమయంలోనేకాక రోజంతా ఈ నియమం పాటించవలసిందే. ఉత్సవాలు, ఊరేగింపులైనా, పెళ్లిళ్లు, ఇతర 28 జి.యస్‌. వరదాచాది

శుభకార్యాలైనా, శవయాత్రలైనా మసీదు సమీపానికి వస్తున్నదంటే, నిళ్ళబ్దం పాటించవలసిందే. లేకపోతే గౌడవైపోయేది. నిశ్శబ్దం పాటించినా అప్పుడప్పుడు పెరుమాళ్ల సేవపై, రధంపై రాళ్లు వచ్చిపడేవి. అలా పరిస్థితులు అననుకూలంగా ఉన్నందున రధయాత్రను గుడిచుట్టుకే పరిమితం చేశారు. మళ్లీ పోలీసుచర్య జరిగి, హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన తర్వాతనే, రధం పూర్వంలా జంబి హనుమాన్‌వరకు వెళ్లడం ప్రారంభమైంది. ఆర్నూరులో వోలీ పండుగను కూడా ఘనంగా జరిపేవారు. ఊరి జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న పట్కరివారు దీనికి కారణం. వారి ప్రధానవృత్తి పట్టుబట్టలు నేయడం. అందుచేత రంగులు కలపడంలో వారు నిపుణులు. హోలీ రంగులు చల్లుకొనే పండుగే కదా. వారు తమ వాడలలో రంగులు చల్లుకోవడమేగాక మధ్యాహ్నం పూట బండ్లలో రంగులు నింపిన పీపాలు పెట్టుకొని ఊరేగింపుగా ఊరంతా తిరుగుతూ హడావిడి చేసేవారు. కాని పొరపాటున ముస్త్లిములెవరి మీదనైనా రంగు చిల్లితే పెద్ద గొడవైపోయేది. మొహరం పీర్ల పందుగకూడా పన్నెండు రోజులపాటు ఉత్సాహంగా జరిగేది. అట్టలు, రంగు కాగితాలతో నిర్మించిన గుమిటీలను, పంజాలను కూచోబెట్టి, ముఖ్యంగా హిందువులే ఎక్కువగా పూజలు చేసేవారు. ప్రసాదాలు పంచేవారు. చివరిరోజున పంజాలను చెరువుకు తీసుకువెళ్లే ఊరేగింపులో వాటిని మోసేవారు. శివమెత్తి అస్పై దూలా అంటూ షియా మతన్ఫులు శోషవచ్చేట్టు ఎగురుతుంటే, చూడవచ్చిన జనంకూడా ఊగిపోయేవారు. దీన్ని మతసామరస్యానికి ఒక ఉదాహరణగా ఇప్పటికీ చెప్పుకుంటారు. అది నిజమే కావచ్చు. ఐతే ఆ సామరస్యం ఏకపక్షంగా ఉండేది. రాదు అనరాదు

నాకు ఉపనయనం అయిందని చెప్పాను కదా. నేను రోజు రెండు పూటలా తద్ధగా సంధ్యవార్చేవాణ్ణి. దీనికి మా రాముల కాక కారణం. రాములు కాక అంటే కందాకై రామాచార్యులు ఆయన మా నాయన పినతల్లి కొడుకు. మా నాయన మేనమామ లింబగిరి స్వామికి మేనల్లుడే కాక, అల్లుడు కూడా. పిల్లలచేత కొన్ని పనులు చేయించడానికి ఆయన గమ్మత్తయిన పద్ధతులు పాటించేవారు. “నీకు సంధ్యావందనం వచ్చా?” అని ఎవరైనా అడిగిజే, రాదనడం అవమానమనుకుంటాము కదా. వచ్చునంటే అందులోని కరినమైన మంత్రమేదో చెప్పి చదువు చూద్దామంటే తెల్ల మొహంవేసే పరిస్థితి రాకూడదు. సంధ్యావందనంలో కాలాతీత దోషపరిహారార్థం విడిచే చతుర్ధ అర్హ్యం మంత్రం హగుంశళశ్ళుచిష ద్వసు రంతరిక్షసత్‌ అనేది చాలా జ్ఞాపకాల వరద 29

కఠినమైన మంత్రం. అది స్పష్టంగా పలకడం వస్తే ఉచ్చారణసౌష్టవం అలవడినట్టే. అందుచేత ముఖ్యమైనవి కొన్ని కంఠస్థం చేస్తే బాగుంటుందని ఒప్పించేవారు మా కాక. అలా మొదలైన అధ్యయనం మిగిలినవాటినికూడా చదివేట్టు చేసేది. రాదు అనరాదని ఆయనే నేర్పారు. ఏదో చెప్పి ఒప్పించి పనులు సాధించేవారాయన. నేను కూడా ఏదడిగినా నాకు రాదని అనకూడదని, అప్పుదే ఓ వట్టుదలకు వచ్చాను. సంధ్యావందనం క్ష£ణ్ణంగా నేర్చుకున్నాను. నేర్చుకున్నది మరిచిపోకుండా ఉండాలంటే వల్లెవేయడం తప్పనిసరి. ఆ ప్రయత్నంలో సంధ్యవార్చడం అలవాటుగా మారిపోయింది. రాముల కాక నుండి నేను నేర్చుకున్న మరో ముఖ్యవిషయం - ఏదైనా విషయంమీద మనం ఒకరి వైఖరిని తప్పుబట్టే ముందు, మనమే ఆయన స్థానంలో ఉంటే ఏమి చేసేవారమని ఆలోచించుకోవాలనేది. ఇదెప్పుడూ సరైన నిర్ణయం తీసుకోవడానికి తోద్బడుతుందని ఆయన చెప్పేవారు. ఉద్యోగాలు చేసుకునేవారికి ్రికాలసంధ్యావందనం కుదరదు. కనుక చాలామంది 'ప్రాతర్‌ మాధ్యాహ్నిక నంధ్యావందనం కలివి ఒకసారి, రాత్రి మరొకసారి సాయంసంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనంలోనే యథాశక్తి గాయత్రీమంత్ర జపమహం కరిష్యే అని సంకల్పం చేయడముంది. పదిసార్లు గాయత్రీమంత్రం జపించడం చాలా మందికి అలవాటు. ఈ పదబంధం స్ఫూర్తితోనే శ్రీశ్రీ తన కవితలో స్వా్సీ సీతారామ్‌ను “యథాశక్తి సత్యాగ్రహి పదోవంతు గాంధీ” అంటూ ఎగతాళి చేశార్తు, ఇదే కాదు. ఇలాటివే మరెన్నో పురాణప్రతీకలను అలనాటి కవులూ, పత్రికా రచయితలు సందర్భోచితంగా కొన్ని సార్లు, అర్ధవిపర్యయానికి దారి తీసే విధంగా మరిక్షాన్ని సార్లు ప్రచారంలోకి తెచ్చారు. అదలా ఉంచితే గాయటత్రీమం(త్రం ఎవరైనా జపించవచ్చు. న గాయత్ర్యాః పరం మంత్రం, న మాతుః సమదైవతం అనే సూక్తి ఉంది. గా 'యత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దేవత లేదని అర్ధం. సరస్వతీ శిశుమందిరాలలో విద్యార్థులందరికీ పలు సంప్రదాయ విలువలతో పాటు గాయత్రీ మంత్రాన్ని బోధిస్తారు, అందుకే సరస్వతీవిద్యామందిరం కేవలం ఒక పాఠశాల కాదంటారు అదొక జాత్రీయ ఉద్యమం. భారతీయభాషలకు, భారతీయ విలువలకు, భారతీయసంస్కృత్రిక నానాటికీ దూరమైపోతున్న భారతసంతతిని మళ్లీ మహా (ప్రవంతిలోకి తెచ్చే ఉద్య ఒక లక్ష్యం, ఒక ఆశయం, ఒక ఆదర్శం. దీని లక్ష్యం తిరోగమనం కాదు. ప్రాచీన సాంస్కృతిక విలువల పునాది మీద ఆధునిక జ్ఞానసౌధ నిర్మాణం దీని ఉద్దేశం, 80 జియస్‌. వరదాచారి

సామూహిక శ్రావణి

(థ్రావణపౌర్ణిమ సామాన్యులకు రాఖీపండుగగా బాగా తెలుసు. ద్విజులకు అంటే యజ్ఞోపవీతం ధరించేవారికి అది జంధ్యాల పొర్టిమ. అంటే కొత్తజంధ్యం వేసుకునే పండుగ. మామూలుగా జంధ్యం జీర్ణమైనప్పుడల్లా కొత్తది వేసుకుంటారు. కాని జంధ్యాల పౌర్జిమనాడు మాత్రం విధిగా కొత్తది వేసుకోవలసినదే. విధివిధానం తెలిసినవాళ్లు విధ్యుక్తంగా వేసుకుంటే, వీలుకానివారు యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనే మంత్రం పుస్తకంలో చూచో లేదా వచ్చినమేరకు చదివో వేనుకుంటారు. ఆర్మూరులో (బ్రాహ్మణులంకా కలిసి సామూహిక యజ్ఞోపవీతధారణ చేయడం ఆనవాయితీగా ఉండేది. పట్వారీ గోవిందరావు దీనికి తమఇంట్లో ఏర్పాట్లు చేస్తుండేవారు. ఆయనది పెద్దచతుశ్శాల భవంతి. అందరికీ కూర్చునేందుకు చాపలు, పూజాసామగ్రి ఆయనే సమకూర్చేవారు. తెచ్చుకోనివారికి పాత్రలు, పళ్లేలు, ఉద్ధరణీ ఇచ్చేవారు. దీనికి (త్రిమతస్థులు అంటే వైష్ణవులు, స్మార్తులు, మధ్వలు హాజరయ్యేవారు. మామూలుగా వైష్ణవులకు, ఇతర బ్రాహ్మణులకు పంక్తిభోజనాలు, వివాహబంధాలు లేవు. అర్మూరులో, ధర్మపురిలో బాంధవ్యం కలుపుకోవడం లేకపోయినా పెళ్లిళ్లలో, ఇతర శుభకార్యాలప్పుడు సహపంక్తిభోజనాలు ఉండేవి. ఇప్పుడు శాఖాంతరవివాహాలే కాక కులాంతర వివాహాలు కూడా జరుగుతుండటం కాలమహిమ!

మేము రోజూ బడికి వెళ్లేటప్పుడు ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్లి మూడు ప్రదక్షిణాలు చేసి, ఓ నిమిషం కూర్చొని వెళ్లేవారం. గుళ్లో కూర్చున్నప్పుడు ఏదైనా మర్చిపోతే గుర్తుకు వచ్చేది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ ప్రశాంతత చాలా మందికి గుడిలో లభిస్తుంది. అదొక లాభం అనుకునేవారం. రోజూ భజన తర్వాత హారతి నేనే ఇచ్చేవాణ్ణి. బ్రహ్మచారిని గనుక అది నా హక్కు అనుకునేవాణ్ణి. గుడిలో మూలవి[గ్రహం భక్తాంజనేయస్వామి. లింగము, వినాయకుడు, నంది, సర్పముతో కూడి పంచాయతనం ఉన్నాయి. చక్కగా సిందూరం పూసినందున ఆంజనేయస్వామి నిగనిగలాడుతూ ఉంటారు. వెండి కళ్లు, కవచం అమర్చిఉంటాయి. లింగంమీద జలధార పడటానికి అడుగున మొనదేలి రంధ్రంగల ఇత్తడి బిందె వేలాడుతుంటుంది. ఇవన్నీ హుండీలో డబ్బుతో చేయించినవే. హారతి తర్వాత భక్తులకు వితరణ చేయడానికి ఎవరో ఒకరు ఏదో (వ్రసాదం సమర్పించుకునేవారు. శనివారం చాలామంది కొబ్బరి కాయలు కైంకర్యం చేసేవారు. జ్ఞాపకాల వరద 31

శనివారం భజన కూడా విశేషంగా జరిగేది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. భజన పరాకాష్టకు చేరినప్పుడు భక్తులు తన్మయులై కాలాతీతాన్ని కూడా గుర్తించేవారు కాదు. గొల్ల వెంకటేశం అనే మా అన్నయ్య సన్నిహితమిత్రుడు, పట్మరి జ్ఞానోబా, బారెడి రాములు రోజూ క్రమం తప్పకుండా భజనలో పాల్గొనేవారు. చివరి ఇద్దరు ధోలక్‌ మీద అద్భుతంగా తాళవిన్యాసం చేసేవారు. చర్మవాద్యాలలో తబలాలాగే ఢోలక్‌ ఉత్తరాది వాద్యం. వీటిలో వేగం ఎక్కువ. నేను తాళాలతో పొటు ధథోలక్‌ వాయించడం కూడా నేర్చుకున్నాను. బ్రహ్మానంద భజనమాల అని వందకుపైగా భజనలున్న అచ్చు పుస్తకం కొత్తగా నేర్చుకోవాలనుకునేవారికి ఉపయోగంగా ఉండేది. భజనలతో పాటు విజయీ విశ్వ తిరంగా ప్యారా, రుండా ఊంచా రహే హమారా వంటి దేశభక్తిగీతాలు కూడా పాదేవారు. చివరన విఠల విరల అంటూ వేగం పెంచుతూ చేసే నామస్మరణ ఒక రకంగా తన్మయావస్థలోకి తీసుకువెళ్లేది. తర్వాత మనసు తేలికపదేది. భజన ఆయ్యాక హారతి, ప్రసాద వినియోగం జరిగేవి. బ్రహ్మచారి హారతి ఇవ్వడం విశిష్టంగా భావించేవారు. కనుక నా కన్నా పెద్దవారు ఉన్నా, రోజూ నేనే హారతి ఇచ్చేవాణ్ణి. కొంత గర్వంగా కూడా ఉండేది. ఆ రోజులలో ఆంజనేయ దండకం అందరికీ నోటికి వచ్చేది. దానివల్ల ఎవరకీ దయ్యాలంటే భయం ఉండేది కాదు. రాత్రి జనసంచారంలేని దారిలో వస్తున్నప్పుడు భయంవేస్తే అప్రయత్నంగానే శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం అని చదువుకొనేవారం. కొండంత ధైర్యం వచ్చేది. దేవతలవారి ఉదంతం ఒకటి గుర్తుకు వస్తున్నది. దేవళలవారంటే దళితులలో ఒక కులం. మంటత్రశక్తులున్నవారిమని చెప్పుకొని జనాన్ని భయపెడుతుంటారు. చంటిబిడ్డను బట్టలు లేకుండా చేటలోపెట్టి, రొమ్ముమీదంతా రక్తంలా కనిపించే రంగు చిలకరించి, లావుపాటి జనుము కొరడాతో వీపుమీద కొట్టుకొంటూ, రోడ్డు మీద వెళ్లేవాళ్ల వెంటబడి భీతావహులను చేస్తూ బిచ్చమడుగు తుంటారు. ఒకరోజు చెల్లెలు, నేను ఇంటిముందు నిలబడి ఉండగా చేటలో పాపతో మా చెల్లెలిని భయపెట్లాడు. నేను కోపంవచ్చి చేతిలోఉన్న చెరకుతో రెండు ఉతికాను. వాడు ఎదురుదాడి చేసేలోగా దారినపోయేవారు కల్పించుకొని వెళ్లగొట్టారు. వాడు “నెల లోపల నీ శవం లేస్తుంది చూడు!” అని బెదిరించి పోయాడు. మా అమ్మకు ఒకటే భయం. ఉన్చాళ్డక్తు మంత్రాలు వస్తాయిరా!” అని బాధపడింది. “వాడికి మంత్రాలు వస్తే నాక్తు గాయద్రీమంత్రంవచ్చు. ఆంజనేయ దందకం కూడా వచ్చు” అని అమ్మకు ధైర్యం చెప్పాను. మంత్రశక్తులు లేకున్నా దండకం వచ్చన్న ధైర్యం అలా ఉపయోగపడింది. ఇప్పటికీ ఏ భయంలేకున్నా ఆంజనేయస్వామి గుడో, విగ్రహమో కనబడగానే శ్రీఆంజనేయం స్మరణకు వస్తూనే ఉంటుంది. 82 జి.యస్‌. వరదాచారి

విషప్రయోగం

ఊళ్లోకి సాధువులు రావడం కొత్త కాదు. ఉత్తరాదినుంచి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు సాధువులు వచ్చి గుట్ట మీద స్థిరపడ్డారు. నేను ఆరవ తరగతిలో ఉండగాననుకుంటా, ఒక కొత్త సాధువు వచ్చాడు. ఎర్రగా బుర్రగా ఉండేవాడు. మాటకారి. కాషాయవస్త్రాలే కాని ఖరీదైనవి ధరిస్తుండేవాడు. భజన సమయానికి గుడికి వస్తుండేవాడు. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఒకరోజు హారతిఇచ్చి నేను ప్రసాదపళ్లెం ఎత్తుకోగానే ఇవాళ ప్రసాదం పంచడంలో నేను నీకు సహాయం చేస్తానని నా చేతిలో నుంచి పళ్లెం తీసుకున్నాడు. అరటి పండు, కొబ్బరి ముక్కలు, పంచదార కలిసిన ప్రసాదం. అందరితోపాటు నాకూ పెట్టాడు. ప్రసాదం తిని చేతులు తుడుచుకొని ఇంటికివెళ్లాను. సంధ్యావందనం చేద్దామని వెండి చెంబులో నీళ్లు, పాత్ర, పళ్లెం, ఉద్ధరణీ తెచ్చుకున్నాను. “అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా అన్నానో లేదో, విపరీతమైన దాహం వేసింది. చెంబెదు నీళ్లు తాగేశాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. మూడు రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది. మూడు రోజులు అపస్మారక స్థితిలో ఉన్నానని ఇంట్లోవారు చెప్పితే తెలిసింది. విషప్రయోగం వల్ల మూడు రోజులు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడి, ఓ సాధువు చికిత్సవల్ల బతికి బయటపద్డానని చెప్పారు. మొదటిరోజు రాత్రి, నీటిలోనుండి బయటపడేసిన చేపలాగా నేను అరుగుమీద విలవిల్లాడుతూ ఎగిరెగిరిపడి కొట్టుకొంటూ ఉంటే, ఆపడం ముగ్గురు నలుగురితరం కాలేదట. మా తాత, ఆయుర్వేద వైద్యులు లింబగిరి స్వామి వచ్చిచూశారు. మందులేవో పోశారు. కాని ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఆ సాధువే నేను చూస్తానని వచ్చి తులం బంగారమిస్తే బాగుచేస్తానన్నాడట. సరేనన్నాక “ఇంట్లో నెయ్యి ఉందా?” అని అడిగి తెప్పించి, దాన్ని కరిగిస్తూ గొట్టంపెట్టి తాగిస్తూ పోయాడట. ఇంట్లో నెయ్యి అయిపోతే బయటినుంచి తెప్పించి కొన్ని సేర్ల నెయ్యి తాగించాడట. కొన్నిగంటల నేతి చికిత్స తర్వాత నేలమీద ఎగిరెగిరి పడటం ఆగిపోయిందట. రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చానట. అనుకున్న ప్రకారం తులం బంగారమిచ్చి సాధువును ప్రాణదాతగా కీర్తించి పంపారట. ఆ సాధువు కొన్ని రోజుల తర్వాత తమ్మి శివానందం అనే బట్టలవర్తకుడికి జామపండు ప్రసాదమంటూ ఇచ్చాడట, ఆయనను వెంటనే తినమని బఐలవంతపెట్టాడట. అనుమానం వచ్చి ఆయన గమనిస్తే తొడిమె దగ్గర గాటు కనిపించిందట. విప్పిచూస్తే నల్లటి పొడి కనబడిందట. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాధువును అరెస్టు చేశారు. (ప్రసాదంలో ఉమ్మెత్త గింజల పొడి కలిపాడని అప్పుడు తెలిసింది. “చ్రూడగానే గౌరవభావం కలిగే జ్ఞాపకాల వరద 83

వేషధారణతో, అసామాన్య ముఖవర్చస్సు గలిగి, దుర్మార్గపు పొడ ఏ మాత్రం కనబడని ఒక సాధువు, “డబ్బుకోసం సాటి మనిషికి విషప్రయోగం చేసేటంతటి నీచానికి దిగజారుతాడా?” అని ఊరంతా ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం తర్వాత మా అమ్మ జానకమ్మ మంగళసూత్రం గొలుసు, చేతి గాజులు, చెవుల కమ్మలు, ముక్కుపుడక తప్ప బంగారు సొమ్ములు పెట్టకోవడం మానేసింది. అంతకుముందు మా అమ్మ తనకున్న నగలలో చాలావాటిని రోజూ పెట్టుకొంటూ ఉండేది. అగ్రకులాలవారే కాక సామాన్యులు కూడాఅలాగే చేసేవారు. ఆ రోజులలో అదే భద్రమని భావించేవారు. దొంగలు కూడా ఆడువారి ఒంటిమీది నగలను ముట్టుకునేవారు కాదంటారు. ఆ రోజులలో బ్యాంకు లాకర్లు లేవు. గోద్రెజ్‌ కంపెనీవారి తిజోరీలు సంపన్నుల ఇళ్లలో ఉండేవి, మా అమ్మకు నగలు చాలానే ఉండేవి. మూడువరుసల చంద్రహారం, కంటె, కెంపుల గొలుసు, రవ్వల గొలుసు పట్టెడ, ఒడ్డాణం, ముక్కుపుడకలు, ముక్కుపోగు, చేతికి రెండేసి గాజులు, పాటీ లు దండకడియాలు, మాటీలు, కొప్పులో కొప్పెర ఇంకా ఏవేవో ఉండ్రేవ్లి మా నక గేదెలు వట్టిపోయినపుడు పాలు, పెరుగు, నెయ్యి తెచ్చిఇచ్చే పెదక్తా్రా ల్ని ఇంట్లో అంకాపురం నుంచి చాలా నగలు ధరించి వచ్చేది. ఆమె చెవులకు క్రవ్చ వూదా వరుస చిల్లులలో ధరించిన నాలుగు జతల చెవిపోగులు ఉండేవి, ఒంటినిందో గాక స్రీలను చూనీనవారికి ఆలయంలో అమ్మవారిని చూసిన ఆనందం నగలతో మా అమ్మకూడా మూర్తీభవించిన ధనలక్ష్మిలా ఉండేది. ఒంటి నిండా బంగార లినద్వ సాధువుకు దుర్చుద్ధి పుట్టిందని, నగలు పెట్టుకోవడం తగ్గించివేసింద్ర. ఆ మాసి మా నాయన కూడా తిజోరీ కొన్నారు. సొమ్ములను దాంట్లో పెళ్టవార్ర 4 తర్వాత పబ్బాలు, శుభకార్యాలు వచ్చినప్పుడు తామే నగలు తీసి క్రో కకు, అను ,నదుగలు ఆ కార్యం అయిపోగానే అడిగి తీసుకొని తిజోరీలో పెట్టేవారు. ఎవరూ త ఇచ్చి, చెప్పేవారు కాదు. భ్యంతరం తిండిపెట్టే విద్యలు " మా నాయన జ్యోతిష్యం చెప్పేవారు. పురాణకాలక్షేవం చేసేవారు. జన హోమాదులు, పూజలు చేసేవారు. పొలాలలో పండిన ధాన్యం కుటుంబ అవసర! తీర్చేది. పశుగ్రాసం కూడా కొనవలసిన అవసరం ఉండేది కాదు. మామూలుగా జ్యోతిష్యం చెప్పిన తర్వాత నాయన పంచాంగం మూసేసి చాప్రమీద పెట్టేవారు (గ్రహచారం చెప్పించుకోడానికి వచ్చినవారు తోచినంత డబ్బు దానిమీద పెట్టి దండం తశ జి.యస్‌. వరదాచారి

పెట్టేవారు. ఆ చిల్లరంతా డబ్బాలో పోసేవారు. అందులో రూపాయి బిళ్లలతో పాటు అర్ధరూపాయి, పావలా, బేడ అంటే రెండు అణాల బిళ్ల అణా, అర్ధణా అంటే మూడు పైసల బిళ్ల, పైసా బిళ్లలు ఉండేవి. మా నాయన వాటిని లెక్కపెట్టినట్టు మేము ఎప్పుడూ చూడలేదు. మేము గమనిస్తుండేవారం. కొందరు డబ్బులేమీ ఇవ్వకుండా దండం మాత్రంపెట్టి వెళ్లిపోయేవారు. అలాటివారు మళ్లీ వచ్చినప్పుడు మా నాయన అంతే (శ్రద్ధగా అన్నీ చెప్పడమేగాక, కాగితం మీద వ్రాసి ఇమ్మని అడిగితే అలాగే ఇచ్చేవారు. అతను డబ్బులు ఇచ్చేరకం కాదని ఒకసారి ఆయన దృష్టికి తెచ్చాం. అప్పుడాయన చెప్పింది నేనొక పాఠంగా భావించి గుర్తుపెట్టుకొన్నాను. “డబ్బు ప్రధానం కాదు. మనను నమ్మివచ్చినాడు. మనం చేసే పని సక్రమంగా, సంపూర్ణంగా చేయాలి. మనకు సంతృప్తికరంగా ఉండేట్టు చేయాలి.” కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదం

మాకు ఆరు, ఏడు తరగతులలో ఇంగ్లీషు టీచరుగా అమృత్‌ లాల్‌ అని ఉండేవారు. రోడ్డు మీద కనపడ్డప్పుడు విద్యార్థులు నమస్మారంచేస్తే ఆయన రెండు చేతులను జోడించి కుడిభుజంపైకి ఎత్తి గొడ్డలితో ప్రహారం చేస్తున్నట్టుగా పరశు ముద్ర పట్టేవారు. అది అప్పుడు విద్యార్థులలో చర్చనీయాంశంగా కూడా ఉందేది. కొన్నాళ్లకు ఆయన కనపడకుండా పోయారు. తర్వాత కమ్యూనిస్టు ఉద్యమకారుడుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలిసింది. అప్పుడు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండేది. నన్ను పాఠశాలలో చేర్పించిన రఘువెంకటస్వామి ఏడుగురు అల్లుళ్లలో ఒకతను ఇలాగే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్నాళ్లకు ఆయన పోలీసు కాల్పులలో మరణించారని తెలిసింది. అమృత్‌ లాల్‌ మాత్రం ఉద్యమంలో కొనసాగారు. ఆంధ్ర ప్రాంతంతోపాటు తెలంగాణలో కూడా కమ్యూనిస్టుల ప్రాబల్యం బాగానే ఉండేది. ఆర్మూరు తాలూకాలో మానాల, శిరికొండ అటవీప్రాంతాలలో వారికి బలమైన స్థావరాలు ఉండేవి. వారిది ప్రధానంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటం. సామాన్య జనానిది బాధ్యతాయుత ప్రభుత్వసాధనకోసం నిజాంకు, ఆయనను సమర్ధించే రజాకార్లకు వ్యతిరేకంగా ఉప్పొంగిన ప్రజా ఉద్యమం. నిజాం ప్రభుత్వం భూస్వాములకు విశేషాధికారాలు ఇచ్చింది. వారి దోపిడీ విధానాలను మన్నించింది. తమకు పరమవిధేయులుగా ఉన్న తాబేదారులకు బారా ఖూన్‌, చౌదా ఖూన్‌ మాఫ్‌ అంటే పన్నెండు, పద్నాలుగు మంది వరకు హత్యలు చేసినా శిక్ష పడకుండా సౌకర్యం కల్పించింది. ఆ అధికారాలు వాడుకొని జనాన్ని పీడించి, వారు ఆర్జించినధనంతో రాజ్యానికి ఉండవలసిన హంగులన్నీ జ్ఞాపకాల వరద తిర

కల్పించుకొంటూ వచ్చింది. పాలకులకు అవసరమైన సకల సౌకర్యాలు రాజధానిలో ఇతర చోట్లలో సమకూరినాయి. చుట్టూరా ఏ అభివృద్ధికీ నోచుకోని గ్రామసీమ మిగిలిపోయింది. దీన్నే ఆర్థికనిపుణులు ఆంగ్లంలో సెంటర్‌ పెరీఫరీ డెవలప్‌మెంట్‌ మాడల్‌ అన్నారు. తెలంగాణలో ఇదే జరిగింది. హైదరాబాద్‌ నగరంలో అత్యంత అధునాతన నగరాలకు ఉండే హంగులన్నీ ఏర్పడ్డాయి. అలాగే జాగీర్దారుల నివాస(ప్రాంతాలలో కూడా చాలాసౌకర్యాలు ఏర్పడ్డాయి. ఇతరపట్టణాలు, గ్రామాలు దుర్భరదారిద్ర్యంలో మగ్గుతూ ఉండిపోయాయి. మరో వైపు మితిమీరిన రజాకార్‌ దురంతాలు. వెరసి ప్రజాపోరాటానికి సానుకూల వాతావరణం ఏర్పడి ఉంది. సాధారణప్రజలు కోరుకొన్నది బాధ్యతాయుత ప్రభుత్వం, స్టేట్‌ కాంగ్రేసు అదే నినాదంతో ఉద్యమం నిర్వహించింది. కాని నల్లగొండ లాటి కొన్ని జిల్లాలలోనైనా జనసామాన్యానికి రైతు పోరాటంలో దారి కనబడింది. క్షేతస్థాయిలో పని చేస్తున్న రావి నారాయణరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటివారి స చ్చీలత, నిజాయితీ కూడా వారిని అకట్టుకున్నాయి. కమ్యూనిస్టు దళాల ప్రజాబలం పెరిగింది. రైతు పోరాటం అంతర్జాతీయఖ్యాతి గడించింది. కాని స్వతంత్రభార తంలో హైద్రర్రాబ్రా ద్‌ రాజ్యం విలీనమైన తర్వాతకూడా కమ్యూనిస్తలు ప్రభుత్వ వ్యతిశ్ర క వః కొనసాగించి చారిత్రికతప్పిదం చేశారు. తర్వాతి కాలంలో అధ్ధిక్షార్రా న్ని చే్షక్ష రాటం అవకాశాన్ని చెడగొట్టుకున్నారు. 1956లో అమృత్‌సర్‌లో జర్రిగ్య మహాస్త్య్యజ్నముకు పోరాటానికి కాలదోషం పట్టిందని తీర్మానించి, కమ్యూనిస్టుల్స అజ్ఞాతంవీడ్ష ఇ యుధ ఏర్పడుతుందని ఆశించారు. కాని అలా జరగలేదు. అప్పటి ఎన్నికలలో మ ఆలో! సారు అమృత్‌ లాల్‌ సిరిసిల్ల నియోజకవర్గం నుండి పోటీచేసి శాసనసభ ప ఎన్నికయ్యారు. భాషాజ్ఞానం పెంచే కసరత్తు నేను ఆరవతరగతిలో ఉండగా మాకు వరుసకు శ్రాశ్ర అంటే మా ప్రినత్రలి మామగారైన మాడభూషి శ్రీనివాసాచార్యులు తెలుగు టీచరుగా వచ్చారు. మొదటి రోజే ఆయన “జఉక్త లేఖనము చెప్పెద, చిత్తు పుస్తకమ్సుల్ప తీయుడు” అంటూ ప్రారంభించారు. “ఆరో తరగతి విద్యార్థులం. మాకు ఉత్త లేఖనవ్సేమిట్రి సార్‌?” అని ఒకవిద్యార్థి అభ్యంతరం చెప్పాడు. ఆయన “ఉత్త కాదు ఉక్తొ అని సవరించి, “ముందు వ్రాయండి, తర్వాత చెబుతా” నన్నారు. విద్యార్థులు పుస్తకాలు తీయగానే అంబిక 86 జి.యస్‌. వరదాచారి

నుండుండుమని వెండికొండ డిగ్గి అని రెండు పద్యాలు నున్నా లేకుండా వ్రాయమన్నారు. అంటే సున్నా ఉచ్చారణలో తేడా తెలియాలి. అది కొన్ని చోట్ల నకారంగా, మరి కొన్నిచోట్ల మకారంగను పలుకుతుంది. అది తెలిస్తే తప్ప అమ్బిక నున్దున్దుమని వెని కొన్ష డిగ్గి అని వ్రాయలేము. ఆయన చెప్పిన ఇంకో పద్యంకూడా గుర్తుంది. మర్రి మిర్రాకుపై గర్రుగుర్రని కర్రైకుర్రని గని వేల్పులర్రులెత్తి అనేది. ఇప్పుడు వాడుకలో లేదు కాని, అది బండి అ ను గుర్తించడానికి సంబంధించింది. భాషలో మెలకువలు నేర్పడానికి నాటి అధ్యాపకులు ఇలాటి కసరత్తులు చేయించేవారు. ముఖ్యంగా పత్రికారచయితలకు ఇలాటి అభ్యాసాలు పెడితే, పత్రికలలో వర్ణదోషాలు రావు. ఫలితంగా సామాన్యులు కూడా తప్పులు లేని భాష వ్రాయడానికి అలవాటు పడతారు. భాష అంటే ఏమిటి? అక్షరాలు, పదాలు, ప్రత్యయాలు, పదప్రయోగవిధానం, వాక్య నిర్మాణ విధానం, అన్వయపద్ధతి, అవసరమైనప్పుడు నూతనపదనిర్మాణం ఇవేకదా. వీటి గురించి ప్రతి పత్రికారచయికకీ తెలిసి ఉండాలి. విద్యార్థి దశలో నేర్చుకోగలిగితే బాధే లేదు. ఆ అవకాశంలేనివారు వృత్తిలో చేరినాకైనా స్వయంబోధక పెరటి తోట

మా ఇంటికి దక్షిణంవైపు ఉన్న ఇల్లును అమ్మకానికి పెడితే మా నాయన కొన్నారు. చాలా పాత ఇల్లు అందులో చేదబావి మాత్రమే ఉపయోగకరంగా ఉండేది. పాత మట్టిగోడల పెంకుటిల్లు. దాన్ని తొలగించి పెరటి తోటగా మార్చారు. మొదట్లో మొక్కజొన్న కూడా పండించారు. కాని క్రమంగా పూలు, పండ్ల చెట్లను పెడుతూ పోయారు. జామ, దానిమ్మ, రేగు, సీతాఫలం, రాచమేడి, చివరకు ఒక కొబ్బరి చెట్టు కూడా పెట్టారు. చూసినవారు, కొబ్బరి చెట్లు సముద్రతీరప్రాంతాలలో తప్ప ఇక్కడ పెరగవన్నా ఆయన “తగిన శ్రద్ధ తీసుకుంటే అన్నీ పెరుగుతాయి” అనేవారు. మా ఇంట్లో కొబ్బరి చెట్టు అలాగే పెరిగి మూడు దశాబ్దాలకు పైగా కాయలు కాసింది. ఇంట్లో పశువుల కొట్టంలోని పచ్చి ఎరువువేయడమేగాక పైన కొమ్మలమధ్య ఉప్పు పొట్లాలు పెట్టించేవారు. బావి దగ్గర వాడిన నీరు వృథాగా మోరీలోకి వెళ్లకుండా సిమెంటుతో చిన్న కాలువలు కట్టి చెట్లకు పారించేవారు. మేము చమత్కారంగా గోవర్ధన వాటర్‌ వర్క్‌ అంటుందేవారం. దొండకాయలు, ఆనిగెపు కాయలు అంటే సొారకాయలు సమృద్ధిగా కాసేవి. గుమ్మడి తీగ మొలిస్తే గమనించి వంచన లేదని పీకిపారేసేవారు. ఈ వంచన అనే మాటలో చ ను చంద్రుడులో చలాగా కాక చంకలో చ లాగా జ్ఞాపకాల వరద 37

పలకాలి. చకు దంత్యముగా, తాలవ్యముగా రెండు రకాల ఉచ్చారణ ఉంటుందని చెపితే అందరకీ తెలియక పోవచ్చు. పూర్వం పైన గరిట గుర్తుతో వేరేఅక్షరం ఉండేది, అది లేకపోతే అర్ధం మారిపోతుంది. మొదటి వంచనకు మోసము అని అర్థం. రెండవదాన్ని అచ్చిరావడం అనే అర్ధంలో మా ప్రాంతంలో వాడుతారు. మాకు గుమ్మడి తీగ పెంచడం వంచన లేదు అంటే అచ్చిరాదని, పెంచితే ఏదో అశుభం జరుగుతుందని భావం. ఇది మూఢ నమ్మకమే. కాని జనం పాటిస్తారు. మా ఇంట్లో గుమ్మడి విత్తనం వేయకపోవడం అలాటిదే. దానంతట అదే దృష్టి తప్పించుకొని పెరిగిన తీగకు కాసిన కాయలను కూడా ఇంట్లో వాడేవారు కాదు. పొరుగున ఉన్న బ్రాహ్మణ కుటుంబికులు కోసుకుపోయేవారు. వంచన అనే మాటను పల్లెటూళ్లలో తరచూ వింటుంటాము. ఒకరి ఇంట్లో ఏదైనా వ్రతమో, వేడుకో చేసినప్పుడు ఏదైనా కీడు జరిగ ఉంటే, తర్వాత కాలంలో తనుకు వంచన లేదంటూ ఆ పని చేయడం మానేసారు. అపద కొనితెచ్చుకోవడంకంటే ఆపేయడం శ్రేయస్కరం అనుకుంటారు. అంతకు ముందెప్పుడో గుమ్మడి తీగ పెంచినప్పుడు ఏదో కీడు జరిగి ఉంటుంది. దానంతటదే పెరిగి విరగకాచి పక్కింటివాళ్లు సంతోషంగా వాడుకుంటుంటే అలాగే పెరగనిచ్చేవారు. అంటే వంచన అనేది మూధనమ్మకమేనని తేలిపోయినట్టే కదా! చిన్నప్పుడు ఎందుకో మా అన్నయ్య తప్ప మేమెవరమూ దొండకాయకూర తినేవాళ్లం కాదు. పక్కింట్రి జోషీ నారాయణ పంతులు మీరు నా కోసమే పెంచుతున్నారంటూ వారానికోసారి వచ్చి ఇష్టా తీస్తుకుని పోయేవారు. మానని సంప్రదాయవిద్య పాఠశాలలో ఒకనైపు సర్కారీ విద్యను అభ్యసిస్తున్నా ఇంట్లో సంప్రదాయవి. ద్యను చెప్పడం మా నాయన మానలేదు. శబ్దమంజరి చేతికి ఇచ్చి శ్రబ్బుల్సా ధాతువులు కంఠస్థం చేయించారు. బాలరామాయణ శ్లోకాలను నేర్పించారు. జ్యోతిషంలో ముఖ్యంగా ఫలజ్యోతిషంలో ప్రవేశం కల్పించారు. బిడ్డ జన్మించినప్పుడు జాతకం (వ్రాయించు కోడానికి ఎవరైనా వస్తే జన్మనక్షత్రం, రాశి మా అన్నయ్యను, నన్ను కూడా చూడమనేవారు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకోడానికి ఎవరైనావస్తే అష్ట కూటాలు చూడమనేవారు. వర్ణం, వశ్యం, తారా, యోని, గ్రహమైత్రి, గణం, రాశీ కూటం, నాడీకూటం అనేవి అష్టకూటాలు. వాటికి ఒకటి నుంచి ఎనిమిది వరకు గుణాలు ఉంటాయి. మొత్తం 82 గుణాలలో సగానికి పైగా వస్తేనే సంబంధం కుదిరేది. అలా వచ్చినప్పటికీ గ్రహమైత్రి, గణం, నాడీకూటం కూడా అనుకూలంగా లేకపోతే తతి జి.యస్‌. వరదాచారి

చేసుకునేవారు కాదు. చాలా మంది పట్టింపుగా చూసే వీటిని నేర్చడానికే నాయన తనతోపాటు మా చేత చూయించేవారు. పంచాంగాలలో గుణమేళన పట్టికలు ఉంటాయి. ఆ రోజుల్లో కూడా కొందరు వాటిని చూసి బాగుంది, బాగాలేదని చెప్పేసేవారు. పంచాంగంచూడకుండా వీటన్నిటినీ చెవగలగాలి. వీటికి శ్లోకాలుంటాయి. ఉదాహరణకు గణం తీసుకుందాం. మామూలుగా అబ్బాయి, అమ్మాయి శత్రుగణాలకు చెందినవారు కాగూడదని చూస్తారు. గణాలు మూడు ఉంటాయి. దేవ మనుష్య రాక్షస గణాలు. దేవ రాక్షస శత్రుత్వం పనికిరాదు. దేవ మనుష్య మంచిది. మనుష్య రాక్షస అయితే మళ్లీ ప్రమాదం. ఈ గణాలు చూడటానికి శ్లోకం ఉంది. పంచాంగంలో కూడా చూసుకోవచ్చు. దీనికి మాకు నేర్పిన సులభమైన శ్లోకం లాంటిది చూడండి, దేమరా మదమందేదే రారామ మదేరాదెరా ఇలా సాగుతుంది, వేళ్లమీద నక్షత్రాన్ని లెక్కపెట్టుకొని దేమరా అని చదువుకుంటూపోతే అక్కడ దే మ రాలలో ఏ అక్షరం వస్తే ఆ గణం అని గుర్తిస్తాం.

ఇది కాక, ఏ నక్షత్రం ఏ గణమో సూటిగా తెలిపే శ్లోకం ఉన్నది. అలాగే యోని. దీనికి రకరకాల జంతువుల పేర్లుంటాయి. దీనికీ రెండు రకాల శ్లోకాలు చెప్పారు. అశ్వం గజమజం సర్పం సర్పిణీ శున మార్దరీ అనేదొకటి. దీనిలో నక్షత్రాల పేర్లు లేకుండా జంతువుల పేర్లే ఉన్నాయి. వేళ్లమీద గుర్తుంచుకొని సరి చూసుకోవాలి. ఇంకో శ్లోకంలో ఈ బాధ లేదు. అశ్వినీ శతతారాశ్వౌ భరణీ రేవతీ గజౌ అంటూ సాగుతుంది. అశ్విని శతభిషం గుర్రాలని, భరణి, రేవతి ఏనుగులని స్పష్టంగా ఉంది. యోనికూటంలో కూడా అబ్బాయి అమ్మాయివి శత్రుత్వం ఉన్నవని అంటే వనుగు సింహం, పులి ఆవు, పాము ముంగిస వంటివి కాగూడదు.

నాడీ కూటానికి కూడా చాలా ప్రాముఖ్యముంది. షష్టాష్టకం అనేమాట ఎక్కువ ప్రచారంలో ఉంటుంది. తరచూ కలహించుకునే దంపతుల గురించి చెపుతున్నపుడు వారిది షష్టాష్టకం అంటుంటారు. అంటే నాడీకూటం కుదరలేదన్నమాట.

వరుని రాశితో (ప్రారంభించి వధువు రాశి వరకు లెక్కిస్తారు. అటునుంచి ఇటూ లెక్కిస్తారు. రాశులు పన్నెండే ఉన్నా ఈ రెండూ కలిసి 2-12, 5-9, 6-8 అని లెక్క వస్తుంది. దీనికీ ఫలితం చెప్పే శ్లోకం .ఉంది. ద్విరాదశకే మృత్యుః ఆయుర్దాదశకే ద్వికే అంటూ. శుభం చ పంచ నవమం అశుభం నవపంచకం, అట్లాగే షష్టాష్టకం అయితే ఎప్పుడూ గొడవలు పడుతారని నమ్మకం. అది లోకోక్తిగా చలామణిలోకి వచ్చింది. చాలా మంది గ్రహమైత్రికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ప్రతి రాశికి రాశ్యధిపతి జ్ఞాపకాల వరద 39

ఉంటాడు. అబ్బాయి అమ్మాయి రాశుల అధిపతుల మధ్య మైత్రి ఉందాలి. వైరం ఉంటే పొంతన కుదరదు. మనుష్యుల స్వభావాలు ఎట్లా ఉంటాయో తెలిసేదెలా? (గ్రహాల ప్రభావం ఉంటుందని నమ్మి ఈ పద్ధతి అనుసరిస్తున్నారు. (గ్రహచారఫలాన్ని చెప్పే శ్లోకాలు కూడా చెప్పారు. షట్‌ త్రి దశస్తో భానుః, షడ్‌దశ జన్మ త్రి సప్తక శీతాంశుః గురు రద్రి ద్వి నవమ పంచమ శుభ ఫలదః వంటివి. ఇవన్నీ నాకు చాలావరకు జ్ఞాపకమున్నాయి. గురు అద్రి అంటే ఏడవ ఇంట్లో నవమ పంచమ స్థానంలో ఉంటే శుభఫలాన్ని ఇస్తాడని తెలుస్తున్నది. చివరకు సర్వే గ్రవాః ఏకాదశ స్థానే శుభఫలదః అని ఉంది.

ఈ జ్యోతిష అంశాలు తెలుసుకుంటున్నప్పుడే, నాకు ఆత్మబలాన్ని పెంచిన అంశం ఒకటి తెలిసివచ్చింది. అది జాతకాంశలు ఉంటాయని. దానికీ శ్లోకం ఉంది. చోరస్తు భోక్తా మతిమాన్‌ ధనాధ్యః రాజా నపుంసో విజయీ దరిద్రః కార్యేషు దక్ష ఖలు కర్శకర్తా క్షుద్రశ్చ విద్వాన్‌ ఇతి జాతకాంశకః అనేది. జన్మ నక్షత్రాన్ని బట్టి వీటిని లెక్కించాలి. మా బంధువు ఒకరు మా ఇంటికి వచ్చినప్పుడు మా పినతండ్రిని హెచ్చరిస్తూ నాయన “అతనికి కొంచెం ప్రథమాంశ ఉంది, జాగ్రత్తగా ఉండా” లన్నారు. అంశ చూసి గుణాన్ని చెప్పలేదు. ఆయన గుణం తెలిసి అంశను ప్రస్తావించారు. అంటే చోరగుణం ఉందని భావం. కార్యం అంటే మిధునమని, అంత్యమంటే మీనమని అర్ధం చేసుకోవాలి. ఇది సంకేతభాష, అందరిలో చెప్పినా తెలిసినవారికే అర్థమవుతుంది. ఓ షావుకారెవరో సంభావన దండిగా ఇస్తాడని చెప్పడానికి అవతారాలు ఇస్తాడని చెప్పుకోవడం నేను విన్నాను. అంటే పదిరూపాయలు ఇస్తాడని అర్ధం. జాతకాంశ

గురించి చెపుతున్నాను కదా నా జాతకాంశ ఏమిటో తెలుసుకుందామని లెక్కించి చూసుకుంటే, ఆశ్లేషా నక్షత్రానికి నవమాంశ కార్యేషు దక్ష వస్తుంది. నపుంస, దరిద్ర అనేవి వస్తే ఏం చేసేవాడినో తెలియదుకాని, కార్యేషు దక్ష అనేది కావడం నాకెంతో మనోబలాన్ని ఇచ్చింది. దాన్ని నిజంచేస్తూ ఇన్నేళ్ల జీవితానుభవంలో నేను ఏ కార్యం తలపెట్టినా సవ్యంగా జరిగిపోతూ వస్తున్నది. అంటే నేనేమీ చేయకుండానే జరిగిపోతాయని కాదు. స్వాభావికంగానే నేను అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాను. బాధ్యతలను సమర్భులకే అప్పగిస్తాను. వారిని గమనిస్తూ సూచనలు ఇస్తుంటాను. నిఘా వేస్తున్నారనే భావన కలుగనివ్వను. సహకార్యకర్తలకు ధైర్యం చెపుతాను. సంప్రదాయవిద్యాభ్యాసాన్ని గురించి చెపుతున్నాను. జ్యోతిష్యమే కాదు, సంస్కృతం కూడా కొంతనేర్చే ప్రయత్నం చేశారు. అమరకోశం మొదలు పెట్టారు. శీ౦ జి.యస్‌. వరదాచారి

నాకు మొదటి శ్లోకం యస్య జ్ఞాన దయా సింధూ రగాధస్యానఘా గుణాః గుర్తు ఉంది. ద్రావిడప్రబంధాలలో తిరుప్పల్లాణ్లు చెప్పారు. మొదటి రెండు పంక్తులుతప్ప జ్ఞాపకం లేదు. ఎక్కువసార్లు విన్నందుకో ఏమో తిరువాయ్‌మొజి లోని మొదటి పాశు రం వీడుమున్‌ ముత్తవుమ్‌ వీడుతైదు, ఉమ్మయిర్‌ వీడుడై యానిడై వీడుతైమినే అనేది గుర్తుంది. ఇవన్నీ వివరంగా చెప్పడం ఎందుకంటే, ఒకనాడు ఆర్థం తెలియకుండా కంఠస్థం చేసిన శ్లోకాలు, పాశురాలు, పద్యాలు ఎన్నేళ్లయినా జ్ఞాపకముండి, అర్ధం తెలుసుకునే దశ వచ్చినప్పుడు అందివస్తాయనడానికే. వయసు మళ్లినాక కంఠస్థం చేయడం కష్టసాధ్యం అని చెప్పడానికే. సరే, ఇప్పుడు అచ్చుపుస్తకాలు, ఆడియో వీడియో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి గనుక, ఆసక్తిగలవారు, అచ్చు అందుబాటులోకి రాకముందటి తరాలవారు పడ్డంతకష్టం పడవలసిన అవసరం లేదు. ఆ రోజులలో చదువు నేర్చుకోవడం ఎంత కష్టంగా ఉండేదో దీన్నిబట్టి తెలుస్తుంది. అందుకే ఎక్కువమంది నేర్చుకోలేదు. తమను చదువుకు దూరంచేసి వంచించారని కొందరు ఆరోపిస్తుంటారు. ద్రోణుడు, ఏకలవ్యుడి ఉదాహరణ చెపుతుంటారు. ఆ నాడు ద్రోణుడు చేసింది రాజకీయమైతే, ఇప్పుడు వీరి విమర్శా రాజకీయమే. ద్వాపరయుగం సంగతేమో కాని, మా తరంలో అర్భూరులో పట్కరి వాళ్లు ఏకలవ్యుడిలాగ పట్టుబట్టి జ్యోతిషం నేర్చుకున్నారు. తమ ఇంటిదగ్గర అన్నీ చూసుకొని అనుమానాలు తీర్చుకోడానికి నాయన దగ్గరికి వచ్చేవారు. ఎన్నో ప్రశ్చలు వేసేవారు. వారు లోతుగా అధ్యయనం చేశారనడానికే ఇదంతా చెపుతున్నాను. వారి ప్రశ్నలన్నిటికీ నాయన ఓపికగా సమాధానాలు చెప్పేవారు. జిజ్ఞాసువులను నిరుత్సాహ పరచగూడదనేవారు. నాయన పంచసూక్తాలు వల్లె వేయించారు. పురుషసూక్తం, లక్ష్మీ సూక్తం ఇప్పటికీ పూర్తిగావచ్చు. మంత్రపుష్పం వచ్చు. ఆశీర్వచనం పనసలు యో వైతాం (బ్రహ్మణోవేదా వంటివి గుర్తు ఉన్నాయి. ఒకటి రెండు ఘనలు కూడా వచ్చేవి. వీటిలో అన్నయ్యచేత వల్లెవేయిస్తున్నప్పుడు వింటూ స్వరం కలిపి నేర్చుకున్నవీ కొన్ని ఉన్నాయి. వీటన్నిటినీ వీలుచిక్కినప్పుడల్లా అంటే పండుగలు, శుభకార్యాలు, ఉత్సవాలప్పుడు పండితులు చదువుతుంటే అప్రయత్నంగా గొంతుకలిపి గుర్తుపెట్టుకున్నని ఎక్కువ. నేను హైస్కూలు చదువుకోసం ఊరువిడిచి వెళ్లవలసిన అవసరం రాకపోతే, నాయన దగ్గర ఇంకా చాలా నేర్చుకోగలిగేవాణ్ణి, నేర్చుకున్నంతవరకు ఉచ్చారణ, స్వరజ్ఞానం బాగానే అబ్బాయి. సంస్కృతశ్లోకాలు నిర్జష్టంగా, సుస్వరంగా చదువడంలో తెలుగువారు దేశంలోనే అగ్రేసరులు. ఆ కీర్తిని నిలబెడుతున్నవారు ఈ నాటికీ ఉండటం తెలుగుజాతి అదృష్టం! జ్ఞాపకాల వరద త్తీక్తే

నాయనే కాక మా ధర్మాచార్ల తాత ఆర్మూరుకు వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పేవారు. వెంకటాచార్ల తాతను నేను చూసిన గుర్తులేదు. ధర్మాచార్ల తాత సామాన్యంగా ఎండాకాలంలో వేములవాడనుంచి ఆర్మూరుకు వచ్చేవారు. రాత్రిళ్లు వాకిట్లో పడకలు వేసుకునేవాళ్లం. వాటిలో పడుకొని నక్షత్రాలను చూపుతూ ఏదేమిటో ఆయన చెప్పేవారు. అవి ఉన్న స్థలాన్నిబిట్టి సమయం కూడా చెప్పేవారు. అయితే వీటికన్నా ఆయన నేర్చిన భజగోవిందం శ్లోకాలే మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటీకీ జ్ఞాపకమున్నాయి. వాటిని ఆయన లయాత్మకంగా చదువుతుంటే పిల్లలందరం ఉత్సాహంగా సంతకలిపేవాళ్లం. నహి నహి రక్షతి డుకృఇ్‌ కరణే అన్నప్పుడు అర్థమేమిటో తెలియకున్నా మాట ఏదో గమ్మత్తుగా ఉందనిపించి, మళ్లీ మళ్లీ అంటూ విరగబడి నవ్వేవాళ్లం. మరణసమయం ఆసన్నమైనపుడు వ్యాకరణ సూత్రాలు కాపాడబోవు అని భావమని తర్వాత ఎప్పుడో అర్థమైంది. ఆదిశంకరాచార్య విరచితమైన ఆ 14 శ్లోకాలలో భాష అత్యంతసులభంగా ఉండటం కూడా వాటి ప్రాచుర్యానికి కారణం. ఈ శ్లోకం చూడండి. సత్సంగల్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం । నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్తే జీవన్ముక్తి ॥ సత్‌ సంగత్వం జీవన్ముక్తికి దారితీస్తుందని ఎవరికైనా బోధపడుతుంది. ద్వాదశీవ్రతం మా లింబగిరి తాత గురించి చెప్పాలి. ఆయుర్వేదవైద్యుడైన ఆయన పూర్తి పేరు గోవిందుల లింబగిరి స్వామి. ల లేకుండా గోవిందు అనే ఇంటి పేరూ కూడా ఉంటుంది. మా ఆంధ్రభూమి దిన పథత్రిక సంపాదకులుగా ఉండిన గోరాశాస్త్రి పూర్తి పేరు గోవిందు రామశాస్త్రి. అలాగే గోవిందరాజు అనీ, గోవిందరాజుల అని రెండురకాల ఇంటి పేర్లు ఉంటాయి. నామవాచకాన్ని ఏదైతేనేమి అన్నట్టు వ్రాయడం సరైన పద్ధతికాదు. సరైన ఉచ్చారణ తెలుసుకొని వ్రాయడం విలేఖరి విధి. లింబగిరితాత మొదట్లో మెట్టుపల్లిలో ఉంటుండేవారు. ఆర్మూరు దొరగారైన వెంకట భూమా రెడ్డి దేశ్‌ముఖ్‌ ఆశయం సంపాదించారు. ఊళ్లో ప్రధానదేవాలయమైన వేంకటేశ్వర స్వామి ఆలయానికి రెడ్డిగారే ధర్మకర్త. ఆర్మూరులో ఆయన నివాసానికి పెద్ద గడి అని విశాలభవనమున్నాా ఆయన అంకాపురంలో ఉందేవారు. దేవాలయప్రాంగణంలో తై జియస్‌. వరదాచారి

ఉన్న ఇళ్లను ఆలయ అర్చకునికి, ఇతర శ్రీవైష్ణవకుటుంబాలకు ఉందటానికి ఇచ్చారు. లింబగిరి తాతకు కూడా ఇల్లు ఇచ్చారు. దానితో ఆర్మూరులో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. దొరవారికి అవసరమైన మందులు తయారుచేసి అంకాపురం వెళ్లి ఇవ్వడమేగాక, ఊళ్లోవాళ్లకు కూడా వైద్యసేవలు అందిస్తుండేవారు. ఊళ్లో చిన్న గడి అని ఒకటుంది. గడి అంటే దొరలు ఉండే కోటలాటి నివాసగ్భహం. దాని సింహద్వారం ఎంత పెద్దగా ఉండేదంటే, వనుగు అంబారీతో సహా లోనికి వెళ్లవచ్చు. తలుపులను నలుగురు కలిసి కదిలించాలి. నైరుతి మూలలో బురుజు ఇప్పటికీ ఉంది.

లింబగిరిస్వామి మా నాయనకు మేనమామ. మా నాయన ఆర్భూరుకు దత్తత రావడంలో ఆయన పాత్రకూడా ఉన్నదని అంటారు. ఆయనకు ముగ్గురు సోదరీమణులు. ఒక సోదరి కొడుకు కందాళకై రామాచారికి తమ ఏకైకపుట్రికనిచ్చి ఇల్లింటం - అంటే ఇల్లరికం - తెచ్చుకున్నారు. మరో సోదరి కుమారులు ఇద్దరికి ఆర్మూరుకు మూడు కోసుల దూరంలో ఉన్న అర్గులలో అర్చకత్వబాధ్యత ఇప్పించారు. లింబగిరి స్వామి, ఆయన భార్య లక్ష్మీనరసమ్మ ద్వాదశీవ్రతం శ్రద్ధగా ఆచరించేవారు. ప్రతీ ఏకాదశి రోజున నిరాహారం పాటించి, ద్వాదశి రోజు పొద్దున్నే బ్రహ్మచారికి షడ్రసోపేతమైన భోజనంపెట్టి, దక్షిణఇచ్చి, చిన్నవాదని సంకోచించకుండా పాదాభివందనం చేసి ఆ తర్వాత వారు భోజనం చేసేవారు. నా ఉపనయనమైన తర్వాత నేను ఆర్మూరులో ఉన్నంతకాలం నాకే ఆ అవకాశం దక్కింది. లింబగిరి తాత కూడా, మాకు ఆహారనియమాలు పొటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకొనే చిట్కాలు చాలా చెప్పారు. మా నాయనతో పురాణకాలక్షేప్రాలకు వెళ్లడంవల్ల కూడా చాలా విషయాలు తెలిసినవి.

ఆరాధ్యుల లింగమ్మ ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలైనా పురాణకాలక్షేపాలు ఏర్పాటు చేసేవారు. ఆమెకు ఊళ్లో పెద్ద శిష్యగణం ఉండేది. ఆమె చాలా వ్రతాలు, పూజలు, ఉత్సవాలు కూడా చేయించేవారు. నాయన ఏదైనా జనరంజకంగా చేయించేవారు. కనుక లింగమ్మతో పాటు ఊళ్లో ఎక్కువమంది నాయన చేయిస్తేనే తృష్తిపదేవారు. ఎడ్జెం అంటే తెడ్డెం అనే భార్య కథ, ముంగిసను పెంచుకున్న (బ్రాహ్మడి కథ, అవి చెప్పే నీతులు ఈ కాలక్షేపాలలోనే తెలుసుకున్నాను.

మొదటి కథలో తండ్రి తద్దినం పెట్టాలనుకున్న బ్రావ్మాణుడు బెనంటే కాదనే భార్యను ఒప్పించడానికి, తాను చేయదలచుకున్న పని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ, పెళ్లాంచేత అదెట్లా అన్నీ శాస్త్రప్రకారం జరగవలసినదేనని అనిపించి జ్ఞాపకాల వరద ట్తీత్రి

కార్యం సాధిస్తాడు. ఆ సంతోషంలో మైమరచి భోక్తలు తిన్న విస్తరాకులను చెరువులో వేసి వస్తానని బయళ్దేరబోతాడు. భార్య అలవాటు (ప్రకారం అదేం వీలుకాదని వాటిని లాక్కొని మురికి కాలువలో పారవేస్తుంది. నీతి ఏమిటంటే ఒక కార్యం తలపెట్టినప్పుడు అదిపూర్తయే వరకు ఓపికతోనే వ్యవహరించాలి. రెందవ కథలో బ్రాహ్మడు ముంగిసను పెంచుకుంటుంటాడు. పని మీద బయటకుపోవలసి వస్తుంది. ఇంట్లో వేరే ఎవరూ "లేనందున ఉయ్యాలలోని పసిబిడ్డకు ముంగిసను కాపలా పెట్టిపోతాడు. ఉయ్యాలమీదికి ఒక పాము వస్తుంది. కాపలాఉన్న ముంగిస బిడ్డను కాపాడటానికి పామును కొరికి చంపేస్తుంది. బ్రాహ్మడు తిరిగివచ్చేసరికి ముంగిస మూతినిండా రక్తంమరకతో ద్వారం దగ్గరే ఎదురవుతుంది. ఉయ్యాలలోని పసిబిడ్డనే ముంగిస కొరికి ఉంటుందని భ్రమపడి దాన్ని కోపంతో కొట్టి చంపేస్తాడు. లోపలికి వెళ్లి చూస్తే బిడ్డ ఉయ్యాలలో హాయిగా ఆడుకుంటూ కనిపిస్తుంది. కింద ముక్కలై చచ్చిపడి ఉన్న పాము కనిపిస్తుంది. అప్పుడు అయ్యో, ఎంతపని చేశానని బాధపడుతాడు. ఫప్రథమకోపం పనికిరాదు అనేది నీతి. విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఆవేశపడిపోయి నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే అనర్థాలకు దారి తీస్తుందని. వర్గాతీతస్నేహం నా అదృష్టమేమిటంటే నా మిత్రమండలిలో అన్ని కులాలవారు, వర్ణాలవారు ఉండేవారు. వీరిలో విఖేదాలేమీ ఉందేవి కాదుగాని అలవాట్లు, కలిసి తిరగడాలను చిట్టి మూడువర్ధాలుగా వ్యవహరిస్తూందేవారు. ఒక వర్గం దిగువ మధ్యతరగతికి చెందినవారిది. రెండవది షావుకార్లు, ముస్తాజర్లు, బీడీ ఫ్యాక్టరీ యజమానుల పిల్లలది. ఆంటే కొంత సంపన్నవర్గం, మూడవది మా బంధువర్గం, వారి శిష్యవర్గం. ఈ మూడు వర్ధాలవారికీ నన్ను తమలో కలుపుకోవడం ఇష్టం. నేనూ అలాగే కలిసిపోతుందేవాణ్ణి. నువ్వు వాళ్లతో కలువవద్దని ఎవరూ నన్ను నిర్బంధించేవారు కాదు. మొదటి వద్దంలో మేర గంగాధర్‌, పట్కరి గంగాధర్‌,ఆరె మరాఠా ద్రుపద, ద్యావర పోశెట్టి ముఖ్యులు. వీళ్లంతా వేంకటేశ్వరస్వామి గుడిలో ఆటలాడుకొంటుండేవారు. గిల్లీ డండా అంటే బిల్లగోడు, తుడుమ్‌, కబడ్డీ మొదలైనవి. తుడుమ్‌ అనేది ఆ రోజులలో పల్లెటూర్లలో చాలా ప్రచారంలో ఉన్న ఆట, దొంగ అయిన ఆటగాణ్జి ఏదో చెట్టు ఆకు తెమ్మంటారు. ఆటగాళ్లు ఎక్కడో దాక్కుంటారు. దాన్ని తెలుసుకోడానికి దారిపొడుగునా ఇళ్ల గోడలమీద బొగ్గుతో బాణంగుర్హు పెడుతూ పోతారు. అవి గమనించి వాళ్లను పట్టుకోవాలి. ఖర్చు లేని ఆట. ఒకరోజు నేను వెళ్లేసరికి, గుడి పక్కనే ఉండే సరిప్తేదారు రెడ్డిగారి అమ్మాయి శశ జి.యస్‌. వరదాచారి

మా వాళ్లను మందలిస్తున్నది. ఏమైందని అడిగితే “కృష్ణమాచార్ల కొడుకువి. ఈ గాలిపోరగాళ్లతో నీకేమిటి సోపతి?” అని నన్నూ వాయించేసింది. “అయ్యగారి పేరు చెడగొడతావా?” అంది. ఆమె మాకంటే పెద్దది. నిర్మాహమాటంగా మాట్లాడేది. “ఏమైందిరా?” అని మా వాళ్లనడిగితే, సుందరి అనే ఓ అమ్మాయి పక్కన ఆడుకుంటుంటే వీళ్లు గేలి చేశారట. ఆమె పేరుతో ప్రాసకుదురుతుందని ఎందరు అనే మాటకలిపి ఆమెను ఏడిపించారట. ఈ నాడు పెనుభూతంగా తయారైన ర్యాగింగ్‌లాగ. అది విని “మీసాలు కూడా సరిగా మొలవలేదు, అప్పుడే ఆడపిల్లలంటే ఎగతాళా?” అని బుద్ధిచెప్పింది. నాకు కూడా మంచి పని చేసిందనిపించింది. నవ్వులాటకైనా తప్పుడు మాటలు మాట్లాడటం సరి కాదు. వాళ్లను ఇకనైనా బుద్ధిగా ఉండందని హెచ్చరించాను. మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనకే కాక కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుందన్న ఆమె మాటలలోని ధ్వని, మాకందరికీ బోధపడింది. (గ్రామ సుధార సంఘం

మా మిత్రబృందం రెండవ వర్గంలో ముక్కా హనుమంతరావు గుప్త, కొండా నాగనాథం, రామలింగం గౌడు, చిట్ల జీవన్‌రాజ్‌ ముఖ్యులు. ఇక మూడవ వర్ణంలో రామచంద్రాచారి, లక్ష్మీకాంతాచారి, నరసింవోచారి, కాపు నారాయణ, హనుమాంధ్లు ముఖ్యులు. నేను ఏ వర్జానికీ నాయకత్వం వెలగబెట్టకుండా, అందరితో కలసి మెలసి ఉండేవాణ్ణి. అందరూ నా రాకకోసం ఎదురు చూసేవారు. నా సలవో అడిగేవారు. గౌరవించేవారు. ఊళ్లో అవాంఛనీయమైన పనులు చాలా జరుగుతున్నాయి, మనమేదైనా చేయాలని ఒకరోజు గంగాధర్‌ బృందం సలహాకు వచ్చారు. రజాకార్ల గొడవలు తీవ్రంగా ఉన్న రోజులు. మనం చేయగలిగిందల్లా గ్రామ సుధార సంఘం అనే పేరుతో కరపత్రాలు ప్రదర్శించడమేనని చెప్పాను.

ఆలయప్రాంగణంలో ఉంటున్న ఒక మహిళ ఇంటికి అపరిచితులు పలువురు రావడాన్ని తప్పుబడుతూ ఒక కరపత్రం వేశాము. ఒక పేజీ మ్యాటర్‌ నేను వ్రాసి ఇస్తే పట్మరి గంగాధర్‌ 30 ప్రతులు చక్కని దస్తూరీతో వ్రాశాడు. తెల్లారేసరికి ఊళ్లో ముఖ్యకేంద్రాలలో మిత్రులంతా వెళ్లి అతికించారు. ఊరంతా అది చర్చనీయాంశమైంది. ఊళ్లో ఏ మాత్రం పరపతి లేని ఒక రౌడీ గురించి మరొక కరపత్రం వేశాము. వెనుకా ముందూ ఎవరూ లేని ఆ దుర్చలుడికి భయపడటమేమిటని హెచ్చరించాము. తిరగబడితే వాడే పారిపోతాడని బెదిరించాము. ఇదీ అలాగే అనేకప్రతులు వ్రాసి చాలా చోట్ల అతికించాము. వాడు కొన్నాళ్లు ఆగడాలు మానేశాడు. జ్ఞాపకాల వరద జర్‌

తమ్మి రాములు అని ఊళ్లో పుస్తకవిక్రేత ఉండేవాడు. స్కూలు పక్కనే ఆయన దుకాణం. నన్ను పిలిచి గ్రామ సుధార్‌ మంచి పని చేస్తున్నారని అభినందించాడు. మీకు ఎట్లా తెలిసిందని ఆశ్చర్యంగా అడిగాను. ప్రతులు వ్రాసిన గంగాధర్‌ ఏదో కాగితం ఇవ్వబోయి, పొరపాటున కరపత్రం ఇచ్చాడని చెప్పాడు. ఆర్మూరులో ఆ రోజులలో పౌరస్వేచ్చ గురించి ధైర్యంగా మాట్లాడే వ్యక్తి మాకు కనిపించింది రాములు ఒక్కడే. ఆ రోజులలో ఆర్నూరులో ఉన్న ఓ గాంధేయవాది గురించి కూడా ఇక్కడ చెప్పాలి. కాన్‌ కటా అంటే చెవులు కత్తిరించబడిన నర్సింగ్‌రావుగా ప్రసిద్దుడు. గాంధీలాగానే మోకాళ్లపైకి చిన్న ముతక పంచె కట్టుకొని, అంగి అంటే చొక్కా లేకుండా అంగవస్త్రం కప్పుకొని నిరాడంబరంగా ఉండేవారు. ఉపాధ్యాయ వృత్తి. ఊరికి తూర్పున ఆయన ఆశభ్రమం ఉండేది. ఓ హరిజన బాలుడిని దత్తత తీసుకుని చదువు సంధ్యలు చెప్పించారు. ఆయన వేషం, సరళి నచ్చని దుండగులు చెవులు కోసేశారు. ఐనా ఆయన మారలేదు. చివరిదాకా సిద్ధాంతాలు వీడలేదు. మా మిత్రమండలి కార్యకలాపాల గురించి చెపుతుండగా మధ్యలో శాఖా చంక్రమణం జరిగింది. ఒక వర్గం ఉత్సాహాన్ని గురించి చెప్పాను. రెండవవర్గం దృష్టి క్రీడలపై ఉండేది. గుట్టవెనుక ఒక కాపు పెద్దనడిగి కొంత స్థలం తీసుకొని బ్యాడ్మింటన్‌ క్లబ్‌ ఏర్పాటు చేశాము. ఆటలో నైపుణ్యం సాధించి ఊళ్లో ఉన్న మరో జట్టుతో పోటీలు కూడా నిర్వహించాము. అలాగే గుండ్ల చెరువులో ఈత నేర్చుకొని గంటల తరబడి ఈదుతూ నీళ్లలోనే ఉండటంలో రికార్డు నెలకొల్పాము. చెరువు కింద వ్యవసాయం పనులు చూసుకునే కాపు పెద్దలు ఈ విషయాన్ని నాయనకు ప్రశంసాత్మకంగా చేరవేశారు. ఏమి ఈతలండి! గుండ్ల చెరువులో మునిగి అన్న చెరువులో తేలుతున్నారన్నారట. నాయన ప్రమాదకరమైన వనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించారు. మూడవ వర్ణం సమకాలీనసంభఘటనలపై చర్చలకు మాత్రమే పరిమితమయ్యేవారు. నా వివరణలు బాగా ఇష్టపడేవారు. మణియారి దుకాణం ఏడవ తరగతి ఉత్తీర్ణుడైన మా అన్నయ్య నరసింహాచారి నిజామాబాద్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో చేరాడు. ఆ రోజులలో హైదరాబాద్‌ రాజ్యంలో జిల్లాకు ఒక్కటే ఉన్నత పారశాల ఉండేది. స్కూలు దగ్గరలోనే గది అద్దెకు తీసుకుని వంట చేసుకునేవాడు. అప్పుడే శోభనం అయింది. అన్నయ్య చదువు మీద శద్ధ శం జి.యస్‌. వరదాచారి

తగ్గింది. ఎప్పుడూ ఆర్మూరులోనే ఉండేవాడు. చౌటుపల్లి కృష్ణమాచారి, ఎస్‌.కె. చారి అనే మా బంధువు అర్మూరులో మణియారీ దుకాణం నడుపుతుందేవాడు. చౌటుపల్లిలో ఆయనకు ఇల్లు, అర్బ్భకత్వం ఉందేవి. అవీ చూసుకోవాలి. ఒకరోజు నాయన దగ్గరికి వచ్చి భాగస్వామిగా చేరుమని అడిగారు. తెలియని వ్యవహారమని నాయన అంగీకరించలేదు. వ్యాపారవ్యవహారాలు బంధుత్వంలో కలతలకు దారితీస్తాయని నాయన భయం. చౌటుపల్లి అయ్యగారు పట్టు వదలలేదు. “నేనెలాగా నడపలేను, మీ వాడికి ఏదో వ్యాపకం ఉండాలి కనుక లాభాపేక్ష లేకుండా అమ్మేస్తాను, తీసుకో” అని బలవంతంగా ఆ దుకాణాన్ని అంటగట్టాడు. అప్పుడు అన్నయ్య వయస్సు పదిహేడేళ్లు. ఏడాది తిరిగేసరికి దుకాణం ఊళ్లో చాలామందికి అభిమానపాత్రమైంది. తీరిక సమయాలలో నాయనకూడా దుకాణంలో కూర్చునేవారు. మణియారీ దుకాణమంటే జనరల్‌ మర్చెంట్‌ షాపు అంటామే అది. టోకువర్తకుల దగ్గరినుండి సామాను కొని తేవడానికి అన్నయ్యకు వీలు కానప్పుడు నాయన కూడా సికిందరాబాద్‌ వెళ్తుండేవారు. ఒకసారి నేను వెంటబడి సికిందరాబాద్‌ వెళ్లాను. కింగ్స్‌ వేలో బూరుగు

మహాదేవ్‌సత్రంలో దిగాము. సరుకులన్నీ పక్కనే జనరల్‌ బజారులో దొరుకుతాయి.

పెద్ద వ్యాపారకేంద్రమని విన్నా. తీరా చూశాక నిరాశ కలిగింది. మా ఊళ్లో సందులకంటే

చిన్నగా ఉంది. కాని అక్కడే అన్ని సరుకులూ దొరుకుతాయి.

ఆ రోజులలో మేమెవరమూ హోటళ్లకు వెళ్లేవాళ్లం కాదు. మిఠాయి తప్ప బయట వండిన పదార్థాలేవీ - చుడువా బూందీలతో సహా - తినేవాళ్లం కాదు. పట్నంలో భోజనం చేయాలంటే గౌలీగూడలో శ్రీవైష్ణవులు నడుపుతున్న భోజనశాలలకు వెళ్లవలసిందే. అప్పుడు హైదరాబాద్‌లో 1, 2, 7, 8 నంబర్లతో నడిచే నాలుగే సిటీ బస్సులుండేవి. మిద్దె బస్సులు కూడా ఉండేవి. నేను మిద్దె బస్సు ఎక్కుతా, చార్మినారు చూస్తా, ట్యాంకు బండ్‌ చూస్తా, అన్నం తింటా, సినిమా చూస్తా అని మారాం చేస్తే నాయన తొందరపడకు అన్నీ చూపిస్తానని బుజ్జగించారు. అలాగే అన్నీ చూపించారు. మా సన్నిహితమిత్ర వర్గంలో హైదరాబాద్‌ చూసిన మొదటివాణ్ణి నేనే అయ్యాను. మా షాపులో బనీన్లు, చెడ్డీలవంటి హెంజైరీల నుంచి మెయిసబ్బులు, బట్టల సబ్బులు, దంత మంజన్లు, పేస్టులు, పౌడర్లు, కాన్వాస్‌ బూట్లు, చివరకు బాటా చెప్పులు, బూట్లు కూడా అమ్మకానికి దొరికేవి. దుకాణం జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతానికి మైలుదూరంలో కొత్తగా నెలకొన్న హుసేనాబాద్‌ ప్రాంతంలో ఉన్నాా చాలా మందికి అభిమానపాత్రమైంది. జ్ఞాపకాల వరద శీ

దేశ స్వాతంత్రోద్యమం ఉధృతమైనకొద్దీ రజాకార్ల ఆగడాలు కూదా పెరిగాయి. ఊరూరా వారి సంఘాలు వెలశాయి. అర్బూరు తాలూకా రజాకార్ల సంఘ అధ్యక్షుడుగా ప్రముఖ న్యాయవాది అలీ మింయా నియమితుడయ్యాడు. మహమ్మద్‌ అని స్మూల్లో మా సహాధ్యాయి కాని వయసులో మాకంటే చాలా పెద్దవాడు కార్యదర్శి అయ్యాడు. ఊళ్లో వ్యాపారులందరికీ నెలకింత అని చందా నిర్ణయించి వసూలు చేసేవారు. ఇవ్వనివారిపై దౌర్షన్యం చేసేవారు. మా షావువైవు వచ్చేవారు కాదు. గొడవపెట్టుకునేవారు అసలు కాదు. అలీ మింయాకు నాయన అంటే చాలా గౌరవం. దానీకి కారణముంది. తీర్ధం మాహాత్యం అలీ మింయా భార్యకు ఫిట్స్‌ వస్తుండేవి. చాలా అవస్థపడుతుందేది. అలోపత్తీ, యూనానీ వైద్యం వల్ల గుణం కలుగలేదు. నాయన శిష్యుడు దశాగౌడు ముస్తాజరుగా ఆయన భాగస్వామి. కొన్నాళ్లు చూశాక ఒకరోజు సాహసించి “మీకు నచ్చుతుందో లేదోగాని నేనో సూచన చేయాలనుకుంటున్నా” అన్నాడట. ఆయన సరే చెప్పమంటే “కృష్ణమాచార్లయ్యగారి వద్ద తీర్ధం పుచ్చుకుంటే వ్యాధి తగ్గుతుందని నా నమ్మకం” అని చెప్పాడట. మీరు సరేనంటే ఆయ్యగారితో మాట్లాడుతానన్నాడట. అలీ మింయా అరబ్బు. దేశీయ ముస్లిం కూడా కాదు. ఆ రోజులలో చాలా మంది అరబ్బులు, చావూస్‌లు, రొహిల్లాలు, నిజాం కొలువులలో ఉండేవారు. అరబ్బులు ఉన్నతోద్యోగాలలో ఉండేవారు. ఖజానా కాపలాదారులంతా అరబ్బులే. వారు ముస్లింలలో కులీనుల కింద, ఉన్నతవర్గం కింద లెక్క అల్లాను తప్ప మరే దేవుడిని కొాలువగూడదన్నది వారి సిద్ధాంతం. అల్లా ఆదిమధ్యాంతరహితుడు, నిరాకారుడు. కనుక విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. విగ్రహారాధకులంతా వారిదృష్టిలో కాఫిర్లు. వీలైతే మతం మార్చించడమో, అది సాధ్యం కాకపోతే హతమార్చడమో చేయదగినవారు. ఇస్లామ్‌ ఆరంభయుగంలో అలాగే చేశారు. నేటి విధిలేని పరిస్థితులలో సహించి ఊరుకుంటున్నారు. అలాటిది ఒక బ్రాహ్మడు దేవతారాధనచేసి పెట్టే తీర్ధం పుచ్చుకోవడమా? అసంభవమన్నాడు అలీ మింయా. కాని గౌడు గారిచ్చిన సలహా ఆయన భార్యకు తెలిసింది. ఆమె పోరుపెట్టింది. విధిలేక అలీ మింయా సరేనన్నాడు. నాయనను పిలిపించాడు. విషయం చెప్పాడు “తీర్ధం పెట్టడానికి అభ్యంతరం లేదు కాని ఆమె స్వయంగా రోజూ మా ఇంటికివచ్చి తీర్ధం తీసుకోవా” లన్నారు నాయన. ఇది విశ్వాసాలకు సంబంధించిన విషయం. ఎవరి విశ్వాసము తిరస్మరించదగినది కాదు. తీర్ధపాత్రను చేత బట్టుకొని 48 జి.యస్‌. వరదాచారి

వీధివెంట నడిచివచ్చే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పారు. ఒక మంచిరోజు చూసి ఆ నాటినుంచి రమ్మని చెప్పారు. 40 రోజులు రావాలన్నారు. చెప్పిన నాటినుంచి ఆమె రోజూ ఉదయం 9 గంటలకు తిరువారాధన పూర్తయే సమయానికి ఒంటెద్దు బండిలో వచ్చేది. బండికి రెండు వైపులా నల్లని పరదాలుండేవి. ఇంటి ముఖద్వారం ముందు బండిని వెనుకకు తిప్పి ఆపితే బండిలో కూర్చొనే పరదా సందులోనుంచి చేయి ద్వారం లోపలికి చాపేది. నాయన గడప దాటకుండానే “అకాల మృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్త దురితోపశమనం శ్రీవిష్ణుపాదోదకం పావనం శుభం” అంటూ తీర్ధంపెడితే, పుచ్చుకొని వెళ్లేది. విశ్వాసమో, చమత్మారమో మండలం రోజులలో ఆమెకు పూర్తిగా నయమైంది. ఆ నాటినుంచి నాయన కనబడితే అలీ మింయా లేచి సలాం చేసేవాడు. రజాకార్లకు మా జోలికి పోవద్దనీ, మా దుకాణంనుంచి చందాలు వసూలుచేయవద్దని ఆదేశించాడు. ఇది అందరూ కచ్చితంగా పాటించారు. కార్యదర్శి కూడా మా వైపు వచ్చేవాడు కాదు. ఇతర దుకాణదార్ల నుండి, గ్రామాలలో మోతుబరుల నుండి కూడా నిర్భంధ వసూళ్లు చేస్తుందేవారు. వేధింపులకు గురి చేస్తుండేవారు. పోలీసులకు ఫిర్యాదుచేసే ప్రశ్నే లేదు. మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎవరైనా అలీ మింయాకే చెప్పుకునేవారు. ఆయన ఆర్బిందీ తీర్చిందీ, కూడా ఏమీ లేదు. పోలీసు చర్య తర్వాత అలీ మింయా కాంగ్రేసులో చేరి కొన్నాళ్లకు ఆర్మూరు మునిసిపల్‌ చైర్మన్‌ అయ్యారు. పోలీసు చర్య తర్వాత మహమ్మద్‌ కనిపించకుండా పోయాడు. మిలిటరీవాళ్లు చంపేసి ఉంటారని అనుకునేవారు. కాని కొన్నేళ్ల తర్వాత నేను అబిద్‌ పోలీసు స్టేషన్‌లో బస్సులో జేబు కొట్టేశారని ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు, ఒక జవాను నా దగ్గరికివచ్చి “నువ్వు వరదాచారివి కదా, నేను మహమ్మదును, ఆర్మూరు వాణ్ణి గుర్తున్నానా?” అని పరిచయం చేసుకొన్నాడు. ప్రజాస్వామ్యవ్యవస్థలో, రాజ్యాంగబద్ధపాలనలో ఉండే వెసులుబాటు అది.

పత్రికతో పరిచయం

రోజూలాగే ఒకరోజు స్కూలునుంచి మధ్యాహ్నభోజనానికి ఇంటికి వస్తున్నాను.

మా వాడలో మేర రాజయ్య అని ఒకాయన ఉండేవాడు. మా అన్నయ్య సమవయస్ముడు. ఆయనకు ఏదో కొత్త పని చేయాలని తపన. నేను ఆయన దుకాణం వద్దకు రాగానే ఆయన హడావిడిగా బయటకు వచ్చి “రావయ్యా! నీకోసమే చూస్తున్నా” అని పిలిచాడు. షాపులో ఉన్న వ్యక్తిని కృష్ణాపత్రిక ఏజెంటని పరిచయం చేసి, “పత్రికకు చందా కట్టాను” అని చెప్పాడు. “నీకు చదువే రాదు కదా, చందాకట్టి ఏం చేస్తా?” వన్నాను. జ్ఞాపకాల వరద త్స

రాజయ్య క్షణం ఆలోచించకుందా “నాకు రాకపోతే చదువాచ్చినోడివి నీవున్నావు గదా!” అన్నాడు. “అంటే నేను చదివి వినిపించాలా?” అన్నాను. “ఏమొద్దు, చదివి సారంచెప్పు చాలు” అన్నాడు. అట్లా కృష్ణాపత్రికతో పరిచయం ఏర్పడింది. పత్రిక రాగానే తెచ్చి నాకు ఇచ్చేవాడు. నేనుచదివి ముఖ్యమైన విషయాలు ఆయనకు చెపుతుండేవాణ్ణి. అట్లా వార్తా వితరణ కూడా అలవాటైంది. రాజయ్యతో నా స్నేహంలో మరో ఆసక్తికరమైన సంఘటన చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడు చెపుతాను. ఆర్భూరులో అప్పటికి గ్రంథాలయం లేదు. పత్రికలు ఉర్జూవి మాత్రమే వచ్చేవి. ఆ రోజులలో ఉన్న తెలుగు పత్రిక గోలకొండ ద్వైవార వార్తాపత్రిక ఒక్కటే. అది ఎవరింటికైనా వచ్చేదో లేదో నాకు తెలియదు. తెలుగు వారు కూడా ఉర్దూ పత్రికలే చదివేవారు. ఏ పత్రికైనా పోస్టులో రెండు రోజులకు వచ్చేది. రహబరె దక్కన్‌ అనేది నాటీ పెద్ద పత్రిక. మజ్లిసె ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ను సమరద్ధించేది. మందుముల నర్సింగరావు నడిపిన రయ్యత్‌ ఉండేది. ప్రజాసమస్యలను ్రస్తావించినందుకు నిషేధానికి గురైంది. ఇమోజ్‌ పత్రిక సంపాదకుడు షాయిబుల్లా రజాకార్ల చేతిలో హత్యకు గురైనందున నిలిచిపోయింది. రణ్‌బీర్‌, యశ్‌వీర్‌, యుద్ధవీర్‌ సోదరులు దిల్లీ - జలంధర్‌లలో విజయవంతంగా నడుపుతున్న మిలాప్‌ హైదరాబాద్‌ ఎడిషన్‌ 1948లో కాని రాలేదు. అందుచేత వార్తలకోసం రేడియో మీదనే ఆధారపడాలి. అవికూడా ఊరికొకటైనా ఉండేవి కావు. వార్తలు అంతగా తెలిసేవి కావు. అందుకే లోకజ్ఞానం తక్కువ. వైష్ణవ రుద్రాభిషేకం గుట్టమీద ఉత్తరాదినుంచి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకొన్న సాధువు ఎవరో ఒకరు ఉంటుండేవారని చెప్పాను కదా. అట్లా ఉన్న సాధువు ఒకరికి, శివరాత్రి నాడు మహారుద్రాభిషేకం జరిపించాలన్న ఆలోచన కలిగింది. తనకు సదుపాయాలు కల్పిస్తున్న స్థానిక మార్వాడీ ప్రముఖుడు జవాహర్‌ మల్‌ సేర్‌ను సంప్రదించాడు. చక్కగా చేయించేవారు కావాలంటే కృష్ణమాచార్ల అయ్యగారే సరైనవారని ఆయన చెప్పాడు. సాధువు ఆశ్చర్యపోతూ “వైష్ణవుడు రుద్రాభిషేకం చేయించడమేమి?” టన్నారు. “అవును ఆయనకు నమకం చమకం నోటిపాటగా వచ్చు” అన్నాడట సేర్‌. జవాహర్‌ మల్‌ మా నాయనకు వీరాభిమాని. (ప్రధానంగా బట్టల వర్తకం, రైన్‌ మిల్లు నడుపుతుందేవాడు. బహుసంకానం ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక వ్రతమో, శుభకార్యమో జరుగుతూ ఉండేది. మా న్గయన చేయిస్తేనే ఆయనకు తృప్తి. ఆయన లాగానే ఊళ్లో ర్‌0 జి.యస్‌. వరదాచారి

ముక్కా జయరామ్‌ సేఠ్‌ వంటివారు కూడా “మీకు వీలైనప్పుడే చేద్దొ మని అనడం నేను విన్నాను. సాధువు సరేనని ఏర్పాటు చేయమన్నాడు. నాయన వెళ్లి రుద్రాభిషేకం జరిపించారు. సాధువు ముగ్గుడై నాయనను ఘనంగా సత్మరించి పంపాడు.

“నాయన రుద్రాభిషేకం నేర్చుకున్నాడా?” అని బంధువర్గంలో చర్చజరిగింది. అప్పుడు తెలిసింది. మా పొరుగున జోషీ కాంతయ్య, గుండి వెంకన్న, గుండి చంద్రశేఖరశాస్తి అని పండితులు ఉండేవారు. వారు ప్రతి శివరాత్రికి శివాలయంలో రుద్రాభిషేకం చేసేవారు. అర్ధరాత్రి లింగోద్భవం జరుగుతుంది రమ్మని నాయనను ఆహ్వానించేవారు. ఆయన వారి కోర్కెను మన్నించి వెళ్లేవారు. అదేదో చమత్కారం చూద్దామని పిల్లలం కూడా శివాలయానికి వెళ్లేవాళ్లం. నమకంలో నమః నమః అని పదేపదే వస్తుంది చమకంలో చమే చమే అంతకంటే ఎక్కువ సార్లే వస్తుంది. అంతా కలిసి చదువుతుంటే అదొక అనుభూతి. చదివిందే మళ్లీ మళ్లీ చదువుతున్నారనిపించేది. కారణం తర్వాత తెలిసింది, నమకంలోని 11 అనువాకాలను చదివినాక చమకంలోని ఒక అనువాకం చదువడం పద్ధతని. అందుచేత నమకం 11 సార్లు చదివితేనే చమకం ఒకసారి పూర్తిచేయడం అవుతుంది. ఇలా 121 పర్యాయాలు చదివితే లఘురుద్రం అని, ఆ తర్వాత మహారుద్రం, అతిరుద్రం అని ఉన్నాయి. రుద్రం వైష్ణవులు చదువుకోగూడదని ఎక్కడా లేదు. రుద్రం యజుర్వేదంలో ఉంది. అది అందరికీ పరనయోగ్యమే. పుస్తకం పట్టి నేర్చుకోకపోయినా, వినీ వినీ నాయనకు సేర్‌ అన్నట్టుగానే, నమకం చమకం స్వరయుక్తంగా నోటిపాటగా వచ్చాయి. యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంటుంది. నమకం, చమకం, పురుషసూక్తం యజర్వేదంలోనివే. ఈ మూడింటిని నిత్యం పఠిస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని శ్లోకం కూడా ఉంది. మేము లింగోద్భవం చూడాలని ఆసక్తిగా చివరిదాకా ఎదురుచూసేవాళ్లం. లింగోద్భవం అయిందని చెప్పి హారతివ్వడం జరిగేది.

తర్వాత పిల్లలంతా పదే పదే అనుకరిస్తూ నవ్వుకుంటూ ఇల్లు చేరడానికి ఉపకరించే ఘట్టం ఒకటి ఉందేది. అది అర్చకులు మేక గొంతును మేవఏవవఏఏఏ అంటూ అనుకరించడం. దక్షయజ్ఞం తర్వాత వీరభద్రుడు దక్షుని తల నరకడం తెలిసిందే. తర్వాత అతనికి మేకతల అతికించి బతికిస్తారనేది విదితమే. మరి ఆయన పలికితే మేక గొంతు వినిపిస్తుంది కదా. ఆ మేఏపప్‌ప్లిష్షమ్నప్రిల్లల సరదాతీర్చేది.

తా యాయన ్గ మ జ్ఞాపకాల వరద (షస నా భ్‌ ర్‌ 1 వు చయ

2, వివాహం - విద్యాభ్యాసం

ఆ రోజులలో ఆడపిల్లలకు రజస్వల కాకముందే పెండ్లిచేయాలన్న నియమం ఉండేది. ఈడూ జోడూ కుదరాలంటే పెళ్లి కొడుకు కూడా పది పన్నెండేళ్లకు మించని వయసువాడై ఉండాలి. పెళ్లీడు వస్తున్నదంటే ఆడపిల్లలున్న కుటుంబాలవారు వరాన్వేషణ మొదలుపెట్టేవారు. పెళ్లయిన అమ్మాయిలు కాపురానికి సిద్ధంగా లేకపోయినా అత్తవారింటికి వెళ్లి కొన్నిరోజులు ఉండటం పరిపాటి. దానివల్ల మగని కుటుంబంలోని ఇతరసభ్యులతో పరిచయాలు వర్చడటమేగాక, కాపురానికి వచ్చేనాటికి భర్రతోసహా అందరి ఇష్టాయిష్టాలు, స్వభావాలు అర్ధమయ్యేవి. పాశ్చాత్యదేశాలలో డేటింగ్‌ లాంటిదన్నమాట. మా నాయన పెత్తల్లి కొడుకు సముద్రాల వెంకట నరసింహాచార్యులు నంబివారి రెండవ అల్లుడు. ఆయనే నా సంబంధం గురించి మా పెదబావమరది నంబి గోపాలాచార్యులకు గొప్పగా చెప్పారు. కృష్ణమాచార్లతో వియ్యమందడమంటేనే గొప్ప అని మురిపించారు. వధూవరులు 8-12 ఏళ్ల వయసు వాళ్లయినపుడు వారి కుటుంబస్థితి, సమాజంలో వారికి ఉన్న మర్యాదమన్ననలు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ప్రధానంగా పరిగణించేవారు. వరునికి వ్యక్తిగత అర్హతలు ఏముంటాయి తెలుసుకోటానికి? అలాగే వధువు వరుని కుటుంబపెద్దలకు నచ్చితే చాలు. వరుడు చూడవలసిన, మెచ్చవలసిన అవసరం కూడా ఉందేది కాదు. అందుకే పిల్లను ఫలానావారి ఇంటికి ఇచ్చామని చెప్పుకునేవారు. ఊరివారుకూడా తమ ఊరి పిల్లను చేసుకున్న వ్యక్తిని మా ఊరి అల్లుడు అని సంబోధించేవారు. నేను పెళ్లికి

ముందు అమ్మాయిని చూడలేదు. ఆమె నన్నూ చూడలేదు. గోపాలాచార్యులు సంబంధం కుదుర్చుకోటానికి మందీమార్చలంతో అట్టహాసంగా ఆర్మూరు వచ్చారు. మరుసటి నెలలోనే మా తమ్ముడి కేశఖండనం ఉన్నందున ధర్మపురికి వస్తున్నామని, అమ్మాయిని చూచి ఏ నిర్ణయం చెపుతామని నాయన వారిని పంపించి వేశారు. అలాగేవెళ్లి చూచి సమ్మతిని తెల్పడమేగాక వేసవిలో ముహూర్తం కూడా నిర్ణయించుకొనివచ్చారు. ఆ రోజులలో నగదు రూపంలో వరకట్నం ఇచ్చే అలవాటు లేదు. ఇరువైపులా కట్నాలు పెట్టుకోవడం ఉండేది. వధువుకు మగపెళ్లివారు ఎంత 52 జి.యస్‌. వరదాచారి

బంగారం పెడతారు, వరునికి వధువు వాళ్లు వెండి బంగారాలు ఏమేమి పెడతారు అనేవి మాట్లాడుకుని నిశ్చయతాంబూలాలు పుచ్చుకునేవారు. వార్షికపరీక్షల రోజులు గనుక మేము పిల్లలం ఎవరమూ కేశఖండనానికి వెళ్లలేదు. కనుక తర్వాత కాలంలో అనివార్యలాంఛనంగా మారిన పెళ్లిచూపుల తతంగమేదీ జరుగలేదు. పెళ్లికి ముందు వరుని ఇంట్లో స్నాతకం, కాశీయాత్ర అనే క్రతువులుంటాయి. స్నాతకమనేది, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత (బబ్రవ్మాచర్యదీక్ష వదిలేని గృహస్థాశ్రమంలో చేరుమని గురువు ఆదేశించినపుడు చేసే వ్రతం. ఈ నాడు విశ్వవిద్యాలయాలలో స్నాతకోత్సవం పేరిట జరుపుతున్నటువంటిది. గురుకులాలు ఇప్పుడు లేవు గనుక పెళ్లికి ముందు లాంఛనంగా జరుపుతున్నారు. ఇక కాశీయాత్ర అనేది బహుశా తగు నమయంలో పెళ్లి నంబంధాలు రాకపోతే మరింత ఉన్నతవిద్యాభ్యాసం కోసం వెళ్ల దలచిన వరుడు తలపెట్టింది కానచ్చు. పిల్లను ఇవ్వదలచినవారు ఆ మాటచెప్పి దాన్ని అపేవారేమో! అదే ఇప్పుడు పెళ్లికి ముందు ఓ వేడుకగా జరుపుతున్నారు. పెళ్లి కూతురు తరఫువారు దగ్గర ఉండి కాళీకి వెళ్లవద్దనీ, పిల్లనిచ్చి వివాహం చేస్తామని చెప్పి వరుడిని వెనకకు తీసుకువస్తారు. ఈ తంతు కోసమని ఇరువర్గాలకూ బంధువైన సముద్రాల గోపొలకృష్ణమాచారి బృందం, నెలరోజులముందే ఆర్మూరుకు వచ్చి మా ఇంట్లో తిష్టవేశారు. అది నేను ఆరవ తరగతి ఉత్తీర్ణుడనైన 1945 సంవత్సరం. ఆ వేసవిసెలవులలోనే నా వివాహం జరిగింది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన అర్చకులు నంబి సీతారామయ్య కూతురు సరోజిని వధువు. అప్పుడు నాకు 18 ఏళ్లు నడుస్తున్నాయి. సరోజినికి ఎనిమిదేళ్లు. సీతారామయ్య దంపతులు అప్పటికే కాలధర్మం చెందారు. వారికి ఎనిమిదిమంది సంతానం. సరోజిని కడగొట్టుది. పెద్దకుమారుడు నంబి గోపాలాచార్యులు కుటుంబపెద్దగా భార్య రత్తమ్మతో కలిసి మా వివాహం జరిపించారు. సీతారామయ్యగారికి నలుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు. రెండవ కుమారుడు జగన్నాథాచార్యులు తర్వాత బి.ఇ. పట్టా పుచ్చుకొని ప్రభుత్వ పనుల శాఖలో ఇంజినీర్‌గా పనిచేశారు. మూడవ అతను మేఘనాథాచారి. నాకంటే పెద్దవాడు. ఆయన పెళ్లి నా పెళ్లితోపాటు అదే రోజు జరిగింది. నా భార్య చిన్న అక్క సుగుణాబాయి భర్త, లక్ష్మీ నరసింహాచార్యుల మొదటిభార్య కూతురైన లక్ష్మి వధువు. ఒక విధంగా మేనమామతో పెళ్లి అన్నమాట. తెలంగాణప్రాంతంలో మేనరికం పెళ్లిళ్లు ఇష్టంతో చేసుకొనేవారు. కానీ మేనరికం అంటే సోదరి కొడుకు, సోదరుడి కూతురుల మధ్య జరిగేది మాత్రమే. జ్ఞాపకాల వరద 6538

మేనమామతోకాని, ఆ వరుసైన వారితోకాని జరిగేది మేనరికంగా ఒప్పుకోరు. సోదరికూతురు, సోదరుడి కొడుకు మధ్య జరిగేదాన్ని కూడా ఎదురు మేనరికం అవుతుంది గనుక పనికిరాదని, చేసుకునేవారు కాదు. అవి ఆరోగ్యవంతమైన సంతానానికి తోడ్పడవని నమ్మేవారు. ఆధునికవైద్యులు ఆ మాటే చెపుతున్నారు. మాది పూర్తిగా కొత్త సంబంధం. ధర్మపురిలో మా అత్తవారికి మూడు నాలుగు ఇళ్లు పక్కృపకృనే ఉండేవి. వేర్వేరు ఇళ్లలో రెండు పెళ్లిళ్లు ఒకే రోజు జరిపించారు. ఆడపడుచు పెల్లికి కుటుంబపెద్ద కర్తగా వ్యవహరించారు. అందరి కంటే చిన్నకొడుకు మురళీమనోహరాచారి. నాకు సమవయస్సుడే. తర్వాత ఆర్‌.టి.సిలో కందక్టర్‌గా చేరి కంట్రోలర్‌గా రిటైర్‌ అయ్యారు. నా భార్య చిన్నఅక్క సుగుణాబాయి గురించి ప్రస్తావించాను. మరో అక్క రంగుబాయి. నా పెళ్లి కుదిర్చిన మా కాక భార్య, అందరి కంటె పెద్దామె సుందరమ్మ. ఈ ప్రాంతంలో బాయి అని ఆడవాళ్ల పేర్ల చివర గౌరవవాచకంగా వాడుతారు. మహారాష్ట్ర సంప్రదాయం, గుజరాతీలు ఇలాగే బెన్‌ అని, సిక్కులు కౌర్‌ అనీ, కశ్ళీరీలు కౌల్‌ అనీ ఆడవారి పేర్ల చివర వాడుతారు. పెళ్లిళ్లు ఆ నాడు సంప్రదాయం ప్రకారం ఐదు రోజులు జరిగేవి. నా పెళ్లికి మా ఊరినుంచి 60 కచ్చలాలు, సామాన్లబండ్లు తీసుకొని మా నాన్నకు సన్నిహితులైన ఊరిపెద్దలు, కోమట్లు, కాపులు, బొందిలీలు, అవుసలివారు, (బ్రాహ్మణులలో వైష్ణవ బంధువులే కాక స్మార్తులు, మధ్వలు పెద్ద సంఖ్యలో సకుటుంబంగా వచ్చారు. అయ్యగారి కొడుకు పెళ్లికి హాజరైనట్టు ఉంటుంది. తీర్థయాత్ర అవుతుందన్న ఆలోచన. ఆ రోజుల్లో రవాణాసంస్థ బస్సులు ఎక్కువ లేవు. నిర్మల్‌నుంచి ఆర్మూరు మీదుగా నిజామాబాద్‌కు రెండుమూడు బస్సులు నడుస్తుండేవి. బాడుగ బస్సులు అసలే లేవు. కొందరు శుభకార్యాలకు తెలిసినవారి లారీలు కుదుర్చుకుని వెళ్లేవారు. కాదంటే కచ్చలాలే శరణ్యం. పెళ్లికొడుకు కోసమని మా కన్యాదాత తన స్వంత కచ్చలం అలంకరించి పంపించారు. ఆయన బండెడ్లకు ఓ ప్రత్యేకత ఉండేది. వేగంగా పరుగెత్తడంలో వాటికి సాటి లేదు అని చెప్పాలి. ధర్మపురికి దగ్గరలో కోటిలింగాల అనేప్రాంతం ఉన్నది. శాతవాహనుల తొలి రాజధాని అని చరిత్రకారులు చెపుతారు. అక్కడ ప్రతిసంవత్సరం ఎడ్లపందాలు జరుగుతుండేవి. వరుసగా కొన్నేళ్లపాటు వెలమదారలు పలువురు పోటీలోఉన్నా నంబి గోపాలాచారే పందెం గెలుస్తుండేవారు. ఎడ్లను ర్‌శ్తీ జి.యస్‌, వరదాచారి

(ప్రత్యేకంగా పోషించి తర్చీదు ఇస్తుండేవారు. తానూ ఒక్కసారైనా పందెం గెలవాలని తమ్ముడు మేఘనాథాచారి కోరిక. వేరే ఎడ్లను సాకుతూ అవస్థ పదడుతుండేవాడు. ఆయన కోరిక నెరవేరినట్టు లేదు. తిరిగి పెళ్లి విషయానికి వస్తే - ఆర్మూరులో స్నాతకం పూర్తి చేసుకొని, మా పెళ్లి బృందం ధర్మపురికి మూడురోజుల ముందు ప్రయాణమైంది. పప్పుఉప్పులతో సవా సమస్త వంటసామాను, పెద్ద పెద్ద గిన్నెలు, ఆండలు, గుండిగలు, తాంబాణాలు, మూతలు, చారుపప్పుచారువంటివి వడ్డించడానికి వాడే గోకర్టాలు, చెంబులు, జాంబులు (ఇప్పటి గ్లాసులు), ఇతర పాత్రలు, పెద్ద జంపుఖానాలు మూడు బండ్లలో సర్జినారు. మొదటి రోజు 20 కిలోమీటర్లు ప్రయాణించి మోర్తాడు వద్ద పాలెం వాగు ఒడ్డున చెట్ల కింద విడిదిచేసి వంటలు, భోజనాల ఏర్పాటుచేశారు. తర్వాత విశ్రాంతి. పొద్దువాలుతుందనగా కోరినవారికి చాయ్‌లు, తక్కినవారికి షర్చతులు ఇచ్చి, పాటలు, పద్యాలతో కొంతసేపు సరదాగా గడిపారు. చల్లబడ్డాక మళ్లీ ప్రయాణం. రెండో రోజు జగిత్యాలలో మజిలీ. అక్కడ భోజనాలు, విశ్రాంతి అయ్యాక హరి కథాకాలక్షేపం. పెళ్లి బృందంలో ఒక హరిదాసు బంధువు ఉన్నాడు. ఆయన మరాకీలో పాటలు పాడుతూ తెలుగులో కథ చెప్పేవాడు. మూడోరోజు రాత్రి ఎదుర్మోళ్ల సమయానికి సిద్ధంగా ఉండేట్టు ధర్మపురికి చేరుకొని, ఊరిబయట మామిడితోటలో సేదదీరాం. ముఖ'ప్రక్షాళనలు, అల్పాహారాలు, అలంకారాల తర్వాత రాత్రి ఎదురుకోళ్లు. అందులో భాగంగా కొన్ని వేడుకలుంటాయి. ఉభయబ్బందాలు ఎదురెదురుగా కదలివచ్చి స్వాగతాలు చెప్పుకోవడం, బుక్కాగులాలు చల్లుకోవడం, నోట్లో చక్కెర పోసుకోవడం, తాంబూలాలు ఇచ్చుకోవడం వంటివి కొన్ని. అంతేకాదు. ముందుగా నలుగురు వరిష్ట (బ్రాహ్మణుల కాళ్లు కడిగి, తర్వాత పెళ్లి కొడుకు కాళ్లు కడగటం ఆచారం. బహుశా పెళ్లికి సాక్షులుగా ఉంటారనేమో. తర్వాత పెళ్లి బృందాన్ని బాజాభజంటత్రీలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి విడిదిలో దింపుతారు. ఆ రోజుల్లో పెళ్లిళ్లు వధువు ఇంట్లోనే జరిగేవి. వారే తమకు తెలిసినవారివి, సకలసౌకర్యాలు ఉన్న ఇళ్లను విడిదిగా ఏర్పాటు చేసేవారు. మాకు దాదాగారి నరహరి ఇంట్లో విడిది ఏర్పరిచారు. ఆయన జాగీర్జారు. తాము ఉండే ఇల్లు కాక పక్కనే మరో పెద్ద ఇల్లు ఉంటే, దాన్ని విడిదిగా ఇచ్చారు. అంతేగాక ఆయన దగ్గర ఉండి ఏది కావాలన్నా సమకూరుస్తుందేవారు. ఆయన కొడుకు డి. కిషన్‌రావు తర్వాత నాకు మంచి మిత్రుడయ్యారు. విడిదిలో దింపిన జ్ఞాపకాల వరద ర్‌ర్‌

తర్వాత లుక్కోత్రం పెట్టడమనే ఆచారం ఒకటుంది. పెళ్లివారికి అవసరమైన సబ్బులు, పౌడర్లు నూనె సీసాలు, అద్దం దువ్వెనలతోబాటు చుడువా, చకినాలు వంటి చిరుతిండ్లు అందజేయడమన్నమాట. ఏ అవసరంవచ్చినా బయటకు వెళ్లే పని లేకుండా అన్నీ అందుబాటులో ఉంచే ఏర్పాటు. ఆ తర్వాత ఊరి బంధువులందరికీ రాత్రి భోజనాలు. అత్తవారింటి విశేషాలు మా అత్తగారి కుటుంబం గురించి, ధర్మపురి గురించి కొన్నివిషయాలు చెప్పాలి. మా మామ కుటుంబికులు ప్రధాన అర్బ్చకులని చెప్పానుగదా. ఆ రోజుల్లో దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వజోక్యం లేదు. అర్బకకుటుంబాలే వంశపారంపర్య మిరాసీదారులుగా ఆలయంలో సేవలు నిర్వహిస్తూ ఉండేవారు. కొందరు పెద్దల సహాయంతో నిత్యపూజలను, వీధి ప్రకారం జరువవలనిన నిత్యసేవలను, ఉత్సవాలను జరిపిన్తుందేవారు. దేవాలయాలలో ఒకటికి మించిన అర్భకకుటుంబాలు వంశపారంపర్యంగా సేవలందిస్తుందేవారు. అప్పుడున్న అర్బకకుటుంబాలలో ఎక్కువ రోజులు వంతుగలవారు గనుక, మా మామగారి కుటుంబికులు పెద నంబులుగా గుర్తింపు పొందినారు. కొమాండూరి అనే ఇంటిపేరే నంబిగా మారిపోయింది. జమీందారులు, వతన్‌దారులు కూడా. గోదావరి ఆవలి గట్టున ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేట తాలూకా నర్సాపురంలో విశేషంగా భూములు ఉండటమే గాక, పట్వారీగిరి కూడా ఉండేది. ధర్మపురి గోదావరి నదికి పశ్చిమ ఒడ్డున కరీంనగర్‌ జిల్లాలో అప్పటి జగిక్యాల తాలూకాలో ఉండేది. ధర్మపురి ఇప్పుడు మండల కేంద్రం. ధర్మపురి బ్రాహ్మణ అగ్రహారం కూడా. మా తాత అంటే పితామహులు గోవర్ధనధర్మా చార్యుల ఈర్రైన వేములవాడ కూడా బ్రాహ్మణ అగ్రహారమే. అక్కడి బ్రాహ్మణ కుటుంబాలకు ఘర్‌పట్టి అంటే ఊరిమొత్తం మీద వసూలయ్యే ఆస్తి పన్నులో కొంత వాటా పంచిఇచ్చే పద్ధతి ఉండేది. మా తాతగారు గతించినప్పుడు, నాయన వేములవాడ వెళ్లి తనకు వాటా అక్కరలేదని తన తమ్ముడు శ్రీనివాసొచారికి , కీర్తిశేషులైన తన అన్న నరసింహావారి కొడుకులకూ ఆ సొమ్ము చెల్లించాలని పత్రం వ్రాసి ఇచ్చివచ్చారు. ధర్మపురిలో అలాటి పద్ధతి ఉన్నట్టు తెలియదు. ఊళ్లో అత్యధికసంఖ్యాకులు బ్రాహ్మణులే. చాలామంది వేదపండిశులు, ఘనాపాఠీలు. సుస్వరంగా పనసలు చదువడంలో ఇతర అగ్రహారికులకు, కాశీ పండితులకు దీటుగా నిలిచేవారు. రాష్ట్రపతి ఏటా ఇచ్చే పండిత పురస్కారం అందుకున్నవారూ పలువురు ఉన్నారు. ర్‌6 జి.యస్‌. వరదాచారి

అనర్థరత్నం

పాండిత్యాన్ని గురించి చెపుతున్నప్పుడు సుప్రసిద్ధ శతకకవి శేషప్ప స్ఫురణకు రాకతప్పదు. “భూషణ వికాస! శ్రీధర్మపురినివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!” అనే మకుటంతో ఆయన వ్రాసిన నరసింహ శతకం శతకసాహిత్యంలో అనర్హరత్నంగా పరిగణింపబడుతున్నది. ఉక్తి విశేషాలకు ఉదాహరణగా చెప్పబడు తున్నది. పలు దేశభాషలలోకి అనువాదమైంది. అద్ధశతాబ్ది క్రితం నేను తొలిసారి విశాఖపట్నం వెళ్లినపుడు, బ్రాహ్మణకుటుంబాలలో ఈ పద్యాలను చదవడం విన్నాను. నేను ఆంధ్రభూమిలో పనిచేస్తున్న రోజులలో మా బావమరదులలో ఒకరు గోరాశాస్ర్రిగారిని పరిచయం చేయుమని అడిగాడు. ధర్మపురి అర్చకుడు అని పరిచయం చేశాను. అప్పుడు శాస్త్రిగారు విశాఖ, రాజమండ్రి ప్రాంతాలలో నరసింహశతకమని చాలా ప్రసిద్ధమైన శతకం ఒకటి ప్రచారంలో ఉందని చెపుతూ, దానిమకుటం చదివి “ఆ ధర్మపురి ఇదేనా?” అని అడిగినారు. అవును, శేషప్ప ఇక్కడివాదేనని చెప్పాము. మహిళలు నిత్యపారాయణ [గ్రంథంలాగా చదువుతారని చెప్పారు శాస్త్రిగారు. ధర్మపురిని, శేషప్పను విస్తృత పాఠక లోకానికి పరిచయం చేయాలనిపించింది. 1966 మార్చి నెలలో రెండు ఆదివారం సంచికలలో ధర్మపరికి చెందిన పరిశోధకరచయిత, 'నరసింహ శతకత్రయం' పరిష్కర్త ఇందారపు నరసింగరావు వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించాము.

నరసింహశతకంలో అన్నీ సీసపద్యాలు, తేటగీతి పద్యాలే. శైలీ, భావవైచిత్రి అతిరమణీయం. పద్యాలు అల్లడానికి తనకుగల ఒకే అర్హత భక్తిపారవశ్యమేనని కవి చెప్పుకొన్నాడు. ఈ పద్యం చూడండి. 'పద్మలోచన సీసపద్యముల్‌ నీ మీందం జెప్పంబూనితినయ్య! చిత్తగింపు, గణయతిప్రాస లక్షణముం జూడంగలేదు, పంచకావ్య శ్లోకపఠన లేదు, అమరకాండత్రయం బరసి చూడంగ లేదు, శాస్త్రీయ గ్రంథముల్‌ దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనె?, చెజకునకు వంకపోయిన చెడునె తీపి, భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంవోర! నరసింహ! దురితదూర! మాటవరునకు చదువలేదన్నాడు కాని ఉపయుక్షగ్రంథాలు ఏమేమి ఉన్నాయో తెలియడం కూడా విజ్ఞానమే. శేషప్ప ఎన్నీ పురాణసంఘటనల గురించి ప్రస్తావించారు. ఎందరో పురాణ పురుషులను, గ్రంథాలను, కావ్యాలను పేర్కొన్నారు. వర్తమానానికి వర్తించే వ్యాఖ్యలూ చేశారు. ఈ పద్యపంక్తులు చూడండి.

“లక్షాధికారైన లనజమున్నమె కాని మెటుంగు బంగారంబు మింగబోండు', “అధికవిద్యావంతు లప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి, “భార్య గయ్యాళైన జ్ఞాపకాల వరద 57

బ్రాణనాథుని తప్పు తనయుండు దుష్టయిన తండ్రి తప్పు. ఇలా నేదు లోకోక్తులుగా చలామణి అవుతున్నవి ఎన్నో ఉన్నాయి.

ధర్మపురిలో పండితులు కవులే గాక, సంగీతవిద్వాంసులు కూడా పలువురు ఉండేవారు. లక్ష్మీనృసింహ నాట్యమండలి పేరిట పద్యనాటకాలను గొప్పగా ప్రదర్శించే నటప్రముఖులు ఉండేవారు. కృష్ణ పాత్రను అమోఘంగా పోషించి ఆంధ్రనాటక పరిషత్తు చేత సన్మానం పొందిన కాకర్ల లక్ష్మీకాంత శాస్రి ఉదాహరణీయులు. ఆయనకు పరిషత్తు సన్మానం జరిపించడంలో దాదాగారి కిషన్‌ రావు, ఏ.ఆర్‌. కృష్ణతో పాటు నా పాత్రా కొంత ఉండటం నాకు సంతోషదాయకం. శాస్త్రి అభినయం పీసపాటివారిని తలపిస్తూ ఉండేది. ప్రసిద్ధ సినీనటి భానుమతికి అదే సభలో సన్మానం జరిగింది. శాస్త్రిగారు పాడిన పద్యాలు విని ఆమె పరవశించి ప్రశంసించడం చెప్పుకోదగిన విషయం. ఆయుర్వేదవైద్యవిధానంలో ఆరితేరిన కాసర్ల వెంకటరాజయ్య వంటి వైద్యులు ఉండేవారు. మూత్రపిండాలలో రాళ్లను ఆయన మందులతో కఠిగించేవారని ప్రతీతి. అందరూ నిరాదంబరజీవులే.

ఒక ఉదంతం చెపుతాను. 1980ల దశకంలో ఢిల్లీలో రాష్ట్రపతిపురస్మారం అందుకొని ధర్మపురి వెళ్తూ ఒక వేదపండిత ఘనాపాఠి మా ఇంటికి వచ్చారు. ఢిల్లీ అనుభవాలను ఆయన ఆసక్తిగా వివరిస్తుంటే, పక్కన ఉన్న పత్రికా రచయిత “వ్రాసి ఇవ్వండి, పత్రికలో వేయిద్ధాము” అన్నారు. అప్పుడా పండితుడు *నాకు వ్రాయడం రాదు, చెప్పుతాను. మీరు వ్రాసుకొండి" అన్నారు. ఇన్ని విద్యలు వచ్చు వ్రాయలేక పోవడమేమిటని అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వారు విద్యావంతులే కాని నిరక్షరాస్యులు. “విద్యలన్నీ గురుముఖతః కంరోపారంగా నేర్చుకున్నవేనాయె, వ్రాత పనేమిటి?” అన్న ఆయన సమాధానంవిని మరింత ఆశ్చర్యపోయారు.

నాకు అప్పుడనిపించింది వేదవిద్య నుంచి కొందరిని బుద్ధిపూర్వకంగా వంచించారని తరచూ వినబడే విమర్శ, అనాలోచితంగా చేసిందేమోనని. విద్య అందరికీ అబ్బకపోవడానికి పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతోపాటు ఇలాటి కఠినమైన అభ్యసన విధానంకూడా కారణమై ఉంటుందనిపించింది. మా మాతామహులు చక్రవర్తి రంగాచార్యులు దేవయాజ్జికులు. (బ్రహ్మోత్సవాల వంటి కార్యక్రమం మధ్యలో దేవదాసితో నృత్యం చేయించేవారు. దాసరిచేత తత్త్వాలు పాడించేవారు. ఆ పనులను వారు నిర్జుష్టంగాచేసి సదస్యుల ప్రశంసలందు కొంటుండేవారు. రాతకోతలు తెలియకున్నా ఉచ్చారణదోషం లేకుండా తత్త్వాలు పాడటంలో తమకు తామే సాటి అనిపించు ర్‌రి జి.యస్‌. వరదాచారి

కొనేవారు. దీన్నిబట్టి ఏ కులంవారైనా, ఏ విద్యనైనా కోరికా, ఓపికా, తద్ధ ఉంటే పుక్కిట పట్టగలరని స్పష్టమవుతున్నది. ఐదు రోజుల పెళ్లి అని మొదటి రోజు ఎదురుకోళ్ల వరకు చెప్పాను. ఈ రోజులలో పెళ్లిళ్లు చూసేవారికి ఐదురోజులు ఏం చేస్తారని అనిపించవచ్చు. కాని విధ్యుక్తంగా చేయాలనుకునేవారికి చాలా తతంగం ఉంది. రక్షాబంధనం, స్వస్తి పుణ్యాహవాచనం, గణపతిపూజ, సుముహూర్తానికి జిలకర, బెల్లంపెట్టడం, వధూవరపరస్పరవీక్షణం లేదా ముఖావలోకనం, కన్యాదానం, పాణిగ్రహణం, మాంగల్యధారణం, మహా సంకల్పం, స్థాలీపాకం, సప్తపది, లక్ష్మీపూజ, సదస్సు, నాగవల్లి, అప్పగింతలు ఇవిగాక 'ప్రవేశహపోమం, ప్రధానహోమం, లాజహోమం, శేషహోమం మొదలగు క్రతువులు, నూతన వధూవరులు అన్యోన్యంగా తలంబ్రాలు పోసుకోవడం, నీళ్లబిందెలో ఉంగరాన్ని పట్టుకోవడం, పట్టెపాన్పుపై పూలచెండ్లు విసురుకోవడం, తిరుపతి చెక్కబొమ్మలు రెంటిని పెట్టుకొని జూతకర్మ చేయడం, అరుంధతీనక్షశ్రాన్ని జంటగా వీక్షించడం, వధూవరులు సహపంక్తిభోజనంలో ఎంగిలి వంతులు వేసుకోవడం, ఊళ్లో జంట ఊరేగింపులు తీయడం వంటి వేడుకలతో అసలు సమయం చాలదు. ఇక అప్పగింతలైతే పరమ ఇద్విగ్నసన్నివేశం. ఐదో రోజు జరిగే కార్యక్రమం. ఆ రోజు పెళ్లికొడుకు అలిగి పోవడమనే తతంగం ఒకటుంది. పొద్దునే పెళ్లి ఇంటినుంచి అలిగి విడిదికి వచ్చేస్తాడు. తర్వాత కన్యాదాత పెళ్లికూతురును వెంటబెట్టుకొని అలక తీర్చడానికి వస్తారు. పెళ్లికొడుకు ఏమైనా కోరవచ్చు. నేను చేతిగడియారం కోరాను. ఏడవ తరగతికి వచ్చావు కదా అది పాసవగానే కొనిస్తామన్నారు కన్యాదాత. ఆ రోజులలో ఏడవ తరగతి ఉత్తీర్ణులైనవారికి కచేరీలలో సేగేదార్‌ అంటే క్లర్కు ఉద్యోగం, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడి ఉద్యోగం వచ్చేది. నా సహచరులలో చాలా మంది అలా ఉద్యోగాలలో చేరారు - ముఖ్యంగా ఉపాధ్యాయులుగా ఎక్కువమంది చేరారు. ఎందుకంటే ఉపాధ్యాయులకే (ప్రైవేటుగా ఉన్నత చదువులు కొనసాగించే అవకాశం ఉందేది. అలా స్నాతకోత్తరదశ వరకు చదివినవారున్నారు. అలక తీర్చడం గురించి చెపుతున్నాను. కోరికలు, సమాధానాలు ముగిశాక పెళ్లికూతురు ఉత్తరీయం వరుని మెడలో వేసి, కొసలు చేతబట్టుకొని పెళ్లింటికి తోడ్కొని లేదా లాక్కొని తీసుకుపోతుంది. తర్వాత అప్పగింత కార్యక్రమం మొదలవుతుంది. కన్యాదాత సతీసమేతంగా వధువును వరుని దగ్గరి బంధువులందరికీ తగురీతిలో కట్నాలుపెట్టి అప్పగిస్తారు. అప్పుడు పురోహితుడు చదివే శ్లోకం గుర్తుంచుకోదగినది. “అష్టవర్నా భవేత్‌ కన్యా పుత్రవత్‌ పాలితా మయా, ఇదానీం తవదాస్యామి దత్తాంస్నేహేన జ్ఞాపకాల వరద 59

పాలయా' వరునికి చెప్పే ఈ శ్లోకపాఠాన్ని బంధువులనుద్దేశించినప్పుడు తవదాస్యామి అనే మాటమార్చి తవభ్రాతుర్‌ వంటి బంధుత్వాన్ని సూచించే పదాలు వాడుతూ దత్తాం స్నేహేన పాలయా అని చెపుతారు. ఒక కొబ్బరి కుడుకలో పాలు వెంటతెస్తారు. వధువు మునివేళ్లను పాలలో ముంచి ఎవరికి అప్పగిస్తున్నారో వారి అరచేతిలో చుక్కలు పెడతారు. ఆ పాలచుక్కలతో వారు వధువు కళ్లను తుడుస్తారు. అంటే భరోసా ఇచ్చారన్నమాట. ఆడపిల్ల పెళ్లి రజస్వల కాక పూర్వమే చేయాలనే పట్టింపు ఉన్నప్పటి శ్లోకమది. ఇప్పుడు 18 ఏళ్లు నిండనిదే పెళ్లి చేయడాన్ని చట్టం ఒప్పుకోదు. ఎనిమిదేళ్లయినా పద్ధెనిమిదేళ్లయినా, ఇరవై ఎనిమిదేళ్లయినా అన్నేళ్లు పుత్రవత్‌ పెంచి అప్పగిస్తున్నందున స్నేహంగా ఆదరించాలన్నదే సందేశం. ఇది పురోహితుడు అప్పగింతలు పూర్తయేవరకు లెక్కలేనన్ని సార్లు చదువుతాడు. పుత్రవత్‌ పెంచాననే మాట గుర్తు ఉంచుకోవాలి. ఆడపిల్లను ఒక రకంగా, మగపిల్లాడిని మరొక రకంగా పెంచడాన్ని సంప్రదాయం ఒప్పుకోదు. న స్త్రీ స్వాతంత్ర్ర్యమర్షతి అని మనువు అన్నాడని పెడర్ధంతీసి హేతువాదులమనుకునేవారు వాదిస్తుంటారు. దాని సరైన అర్ధం చెబుదామన్నా వినరు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతా అన్నది కూడా మనువే, ఇది తెలిశాకనైనా మొదటిదాని సరైన అర్ధం తెలుసుకోవాలనిపించాలి. పెళ్లికొడుకువారు పెళ్లికూతురు బంధువులకు కూడా కట్నాలు పెడతారు. తర్వాత ఊళ్లో బంధువర్ధానికంతటికీ పెళ్లికొాడుకువారు విందు భోజనం పెడతారు. ఆ తర్వాత పెళ్లికూతురును తీసుకొని మగపెళ్లి బృందం స్వగ్రామానికి తరలి వెడుతుంది. మా బృందం అలాగే బయలుదేరింది. ధర్మపురి చరిత్ర ధర్మపురిలో మొదట్లో హోటళ్లు ఉండేవి కొదు. కొన్ని కులాలవారి ధర్మసత్రాలు ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. కాని ఊరికి వచ్చే యాత్రికబ్బందానికి న్థానికబ్రాహ్మణులే తమ ఇళ్లలోనే వసతి, భోజనం ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు హోటళ్లు ఉన్నా, దేవాలయంవారి ధర్మసత్రం అందుబాటులోకి వచ్చినా, ఎక్కువ మంది పొత పద్ధతిలోనే (బ్రావ్మణుల ఇళ్లలోనే దిగుతారు. ఇక్కడికి తెలంగాణ జిల్లాలనుంచే కాక మరాఠ్వాడ ప్రాంతం నుంచి, బొంబాయి (ఇప్పుడు ముంబై) నుంచి ఎక్కువమంది యాత్రికులు వస్తారు. వారంతా క్షేతపురోహితులుగా పరిగణింపబడే బ్రాహ్మణుల ఇళ్లలోనే దిగుతారు. పొద్దునే వారు యాత్రికులను గోదావరినదికి తీసుకువెళ్లి, సంకల్పం చెప్పి స్నానం చేయించి, నదిలో (బ్రహ్మగుండం వంటి తీర్థాల ప్రాశస్త్యం తెలియపరిచి, ఒడ్డున ఉన్న పలు దేవాలయాల గురించి వివరించి, ప్రధాన ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ 60 జి.యస్‌. వరదాచారి

నరసింహ స్వామికి మొక్కుకున్న ప్రకారం అర్చనలు, వ - అభిషేకాలు, కల్యాణాలు, ఇతరసేవలు జరిపించి, న న భోజనాలు పెట్టి, ఊళ్లోని సత్యవతి గుడి, ఇసుకస్తంభం న్‌ా వ. | వంటివి చూవీ సాగనంవుతారు. యాత్రికులు స్టా. 1. మ సంతోషంగా ఇచ్చిన దక్షిణ తీసుకొని ఆశీర్వదిస్తారు. హా ప చో న ఈ యాత్రికులు మళ్లీ వచ్చినప్పుడు గుర్తుంచుకొని టై. జసిసూ వారి ఇళ్లలోనే దిగుతుండటాన్ని బట్టి, వారు న్‌్‌ సంతుష్టులైనారనుకోవలసి ఉంటుంది. నా పెళ్లికి కహ ముందు మాకు చిలుకముక్కు గోవిందాచారి క్షేత్ర ధర్శశరి లక్ష్మీనరనింవస్వామి పురోహితుడుగా ఉండేవారు. ఆయన మాకు మాతామహుల తరపున బంధువు కూడా. నా పెళ్లి తర్వాత మేము వారి ఇంట్లో దిగకపోయినా, ఉన్నంతకాలం ఆయనను దర్శించి, ఆయన గతించిన తర్వాత ఆయన కుమారుడు చిలుకముక్కు వరదాచారిని గుడిలో కలుసుకొని తగు సంభావన సమర్ప్చించుకుంటూ ఉందేవారము.

ధర్మపురి క్షేత్రంలో యోగనరసింహస్వామిది ప్రధాన ఆలయం. ఇది ప్రాంగణం ఉత్తరభాగంలో ఉంది. ప్రాంగణం దక్షిణదిశలో ఉగ్రనరసింహస్వామి ఆలయం ఉంది. మధ్యభాగంలో ముందు వైవు వేంకటేశ్వరస్వామి ఆలయం, దానివెనుక వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నాయి. ఉత్తరదిక్కు ప్రధాన ఆలయం ద్వారం పక్కన ఆంజనేయస్వామి గుడి, ద్వారానికి దక్షిణ పక్క యమధర్మరాజు విగ్రహం ఉన్నాయి. కుబేరుడి విగ్రహం కూడా ఉంది. ఇవేవీ చిత్రం కాదు. చిత్రమేమిటంటే ఈ ఆలయ సముదాయ అవరణలో ఆగ్నేయభాగంలో ఒక మసీదు కూడా ఉన్నది. ప్రవేశద్వారం మాత్రమే వేరు. మధ్యయుగాలలో దేశమంతటా ముస్లిం దండయాత్రలకు గురై మసీదులుగా మారిన ఆలయాలలో ఇదొకటి. రుస్తుం దిల్‌ ఖాన్‌ అనే అతను, బెరంగ్‌జేబు పాలనకాలంలో దీన్ని మసీదుగా మార్చినట్టు, భూవసతి సమకూర్చినట్టు ఫార్సీలో వ్రాసిన దానపత్రం ఉందని శ్రీధర్మపురి క్షేత్రచరిత్ర రచయిత డా. సంగనభట్ల నరసయ్య ససాక్ష్యంగా ఇలా వ్రాశారు: 'ఆలయ వితర్దిక (అంటే వేదిక, తిన్నె లేదా అరుగు) ఇప్పటికీ అలాగే ఉంది. స్తంభాలు, పైకప్పు అలాగే ఉన్నాయి. నాసికాశిలలు (అంటే బాల్మనీలనాపే చిన్న అడ్డ దూలాలు) అలాగే ఉన్నాయి. స్తంభాలమధ్య గోడలు లేపి, మధ్య హాలుగా చేసి, పైన గుమ్మటాలు (మీనార్‌లు) కట్టి మసీదుగా మార్చారు.”

పూర్వం దేవాలయాల ప్రాంగణమంతటికీ కలిపి ఒకే సింహద్వారం ఉండేది. 1970ల దశకం చివరలో ఆలయనిర్వహణకు దేవాదాయశాఖ ధర్మపురి వాస్తవ్యలే జ్ఞాపకాల వరద 61

అయిన కె.వి. కేశవుల ఆధ్వర్యంలో కమిటీని నియమించినది. వారు ప్రధాన ఆలయద్వారం ఎదుట ఒకటి, వేంకటేశ్వరస్వామి అలయం ఎదుట మరొకటి రెండు గాలిగోపురాలు నిర్మించారు. మధ్యలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ముందుగాక దక్షిణాన చివరగా ఉన్న ఉ(గ్రనరసింహుని ఆలయం ముందు గోపురద్వారం నిర్మించే అవకాశం లేదు. ఆ ప్రాంతంలో మసీదు ఉంది. వేములవాడలో కూడా ప్రసిద్ధ రాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రధానద్వారం పక్కనే ఒక దర్గా ఉంది. అన్ని మతాలనూ ఆదరించే హిందూభక్తులు దర్ధావద్దకు కూడా వెళ్లి, నెమలి ఈకలతో నెత్తిన కొట్టించుకొంటూ ఉంటారు. అలా కొట్టించుకుంటేనే రాజరాజేశ్వరుని సేవించిన పుణ్యం లభిస్తుందని దర్ధా నిర్వాహకుల ప్రచారం. ప్రజలు నమ్ముతారు. దేశంలో నరసింవాక్షేత్రాలు లెక్క లేనన్ని ఉన్నాయి. అందులో 108 ముఖ్యమైనవని లోకప్రసిద్ధి. వాటిలో మళ్లీ నవనారసింహక్షేత్రాలు పరమపుణ్యక్షేత్రాలని ప్రతీతి. ధర్మపురి వాటిలో ఒకటి. మా గోవర్ధన వంశీకుల ఇష్టదైవం. మా వంశీకులు స్థిరనివాసం ఎక్కడున్నా మగపిల్లల పుట్టు వెంట్రుకలు ధర్మపురిలోనే తీయిస్తారు. ఇంట్లో నిత్యార్చనలో నరసింహస్వామి విగ్రహాన్ని పూజిస్తారు. కలౌ వేంకటనాయకః అన్నారు గనుక వేంకటేశ్వరస్వామి విగ్రహం ఎక్కడైనా ఉండవచ్చు. ఇళ్లలో ఎక్కువగా వేంకటేశ్వరస్వామి విగ్రవాలే పెట్టుకుంటారు. నరసింహుని విగ్రహమున్నాా సాలగ్రామాలున్నా, పూజాదికాలు చాలానిస్టగా నిర్వహించాలని నమ్ముతారు. కన్యాదానం, మాంగల్యధారణ ఐదు రోజుల పెళ్లి కార్యక్రమమేమిటో ముందు చెప్పాను. మా పెళ్లి మొదటి రోజు ఎదురుకోళ్ల వరకు చెప్పాను. రెండవ రోజు ముఖ్యమైన కార్యక్రమం పెళ్లి, మాది ఉదయం ముహూర్తం గనుక తెల్లవారక ముందే లేచి వరునికి మంగళస్నానం చేయించి, అలంకరించి మేనలో కూర్చోబెట్టి, ఊరేగింపుగా పెళ్లి ఇంటికి తీసుకువెళ్లారు. ఇవి పెళ్లి ఎదురుకోళ్లు, ఆ తర్వాత రక్షాబంధనం, స్వస్తి పుణ్యాహవాచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. మిగతా వివరాలన్నీ పేర్కొనవలసిన అవసరం లేదు కాని, నిత్య కర్మానుష్టానయోగ్యత సిద్ధించడంకోసం ఉపనయనం చేసుకొని యజ్ఞోపవీతం ధరించిన (బ్రావ్మాణవరులకు, ఉద్వాహాంగభూత ద్వితీయయజ్ఞోపవీతం కన్యాదాత ధరింపజేస్తాడు. తర్వాత కాళ్లు కడిగి కన్యాదానం చేస్తాడు. సాలంకృత కన్యాదానమనేమాట అందరికీ సుపరిచితం. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం అనే శ్లోకాన్ని పెళ్లిళ్లలో, సినిమాలలో ఎక్కువగా వింటుంటాం. గనుక దృష్టి కనకందారి పట్టి దానిమీదనే కేంద్రీక్సృత మవుతున్నది. సాలంకృతనే గాక సాధ్వీ, సుశీల, సుధీమతి అయిన కన్యను 62 జి.యస్‌. వరదాచారి

ధర్మకామ్యార్ధసిద్ధికై నీకు అప్పగిస్తున్నాను అని కన్యాదాత చెప్పే మాటలు గమనించడం లేదు. ధర్మే చ అద్దే చ కామే చ నాతిచరితవ్య అని వరుడిచేత కన్యాదాత ప్రమాణం చేయిస్తాడు. నాతిచరామి అని ముమ్మారు అనిపిస్తాడు. ఇక్కడ సందర్భం వచ్చిందిగనుక ఒక విషయం స్పష్టం చేయాలి. ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్ధాలు అని కలిపివాడటం అందరికీ అలవాటైంది. కనుక కొందరు రచయితలు, ముఖ్యంగా సినిమావారు మోక్షాన్ని కూడా పెళ్లి ప్రమాణంలో కలిపేస్తున్నారు. దంపతులు కలిసి సాధించాల్సినవి ధర్మార్ధ కామాలే. మోక్షం వ్యక్తిగతం. దీనిలో కలువదు. మరొక విషయం కూడా చెప్పాలి. కొందరు సుముహూర్తానికి జీలకర్ర, బెల్లం పెట్టించి తర్వాత కన్యాదానం కానిస్తున్నారు. అది వరుసకాదు. ఇంకొకటి చెప్పాలి. జీలకర, బెల్లం పెట్టేటప్పుడు కొందరు దురుసుగా వ్యవహరిస్తుంటారు. వధూవరులలో ఎవరుముందు అవతలివారి తలపై బీలకర, బెల్లం పెడితే జీవితాంతం వారిదే పైచేయిగా ఉంటుందన్న మూఢ నమ్మకం దీనికి కారణం. పెద్దవాళ్లు చుట్టూ చేరి, పిల్లల చేతులను తమ చేతులలోకి తీసుకుని బలప్రయోగం చేసి ప్రమాదాలు జరిగే పరిస్థితులు సృష్టిస్తున్నారు. కొంచెం విచక్షణతో వ్యవహరిస్తే పెళ్లిళ్లు ఇట్లాంటివేమీ లేకుండా సవ్యంగా జరిగిపోతాయి. తొలి దీపావళి తెలంగాణ (ప్రాంతంలో తొలి దీపావళికి కొత్త అల్లుడిని అత్తవారింటికి ఆహ్వానించి కట్న కానుకలు పెట్టడం రివాజు. ఆం(ధ్రప్రాంతంలో సంక్రాంతిలాగా తెలంగాణలో దీపావళిని పెద్దపండుగ అని వ్యవహరిస్తారు. సంక్రాంతిని కూడా మిగతా పండుగల మాదిరిగా చేసుకుంటారు. అల్లుడి ప్రత్యేకత ఏమీ లేదు. తొలి దీపావళి నాటికి జగిత్యాలనుంచి డిచ్‌పల్లికి ప్రైవేటు బస్సుసర్వీసు ఏర్పాటు అయింది. జగిత్యాలలో బస్సుదిగి అత్తవారు పంపిన కచ్చలంలో ధర్మపురికి సునాయాసంగా చేరుకున్నాము. ఇలా అనడానికి కొన్నేళ్ల తర్వాత కలిగిన అనుభవం కారణం. నేను హైదరాబాద్‌లో కాపురం పెట్టినాక కలిగిన అనుభవం. దీపావళికి రమ్మని పిలిస్తే మా ఆవిడను తీసుకొని వెళ్లాను. తరచూ ధర్మపురి నుంచి వచ్చే మా మిత్రుడు కిషన్‌రావు రైలు ప్రయాణం సులభమని చెప్పాడు. ఆయన చెప్పినట్టు నాంపల్లిలో రైలెక్కి మంచిర్యాలలో దిగాము. అక్కడినుంచి బస్సులో లక్సెట్టిపేటకు చేరుకున్నాము. అక్కడి నుంచి అద్దె కచ్చలంలో గోదావరి ఒడ్డుకు చేరుకున్నాము. బల్లకట్టుపై నది దాటి జ్ఞాపకాల వరద 69

ధర్మపురి రేవులో దిగాము. సామాను చేతబట్టుకొని నడిస్తే పది నిమిషాలలో అత్తారిల్లు చేరాము. విమానం, గుజ్జం ఎక్కడం తప్ప అన్ని రకాల వాహనాలూ వాడాము. మళ్లా ఎప్పుడూ ఇలాటి ప్రయత్నం చేయడానికి సాహసించలేదు. దీపావళి పండుగకి తెలంగాణ ప్రాంతంలోనేగాక దేశమంతటా ప్రత్యేకత ఉంది. వ్యాపారస్తులంతా ముస్లింలతో సహా దీపావళి రోజునే లక్ష్మీపూజ చేసి కొత్త సంవత్సరపు వ్యాపార ఖాతాలను పసుపు కుంకుమలుపూసి శ్రీశుభమస్తు అని వ్రాసి ప్రారంభించేవారు. రాత్రి తమ దుకాణాలను అరటి స్తంభాలతో, దీపాల తోరణాలతో అలంకరించేవారు. బ్రాహ్మణులను పిలిచి లక్ష్మీపూజలు చేయించేవారు, మేము పిల్లలం కొందరం జట్టుగా వర్ప్చడి పూజలు పూర్తయిన దుకాజాలకు వెళ్లి, లక్ష్మీసూక్తం ఎంతో కొంత చదివితే, మాకూ దక్షిణ ఇచ్చేవారు. ముంబై దలాల్‌ ఫ్రీట్‌లో ఉన్న భారత స్టాక్‌ ఎక్స్‌చేంజిలో కూడా దీపావళి రోజు రాత్రే మూరత్‌ ట్రేడింగ్‌ అంటే ముహూర్తపు వ్యాపారం లాంఛనంగా జరుగుతుంది. ప్రభుత్వం వారి ఆర్థికసంవత్సరం ఆధికారిక పనులకోసం పాటించినా, సంప్రదాయాన్ని అనుసరించి దీన్నీ పాటిస్తారు. బెంగాల్‌, గుజరాత్‌ తదితర చాలా రాష్ట్రాలలో ఇదే పద్ధతి. బెంగాల్‌లో కార్మికులకు ఇచ్చే బోనస్‌ను పూజా బోనస్‌ అంటారు. వ్యాపారస్తులు ఆ రోజు వచ్చిన అతిథులందరికీ మిఠాయిలు పంచడంతో పాటు, ఎందుకో పేకాట ఆడటం కూడా ఒక లాంఛనంగా పాటించేవారు.

నా మొదటి దీపావళి పండుగ ఘనంగానే జరిగింది. ఒక విధంగా ఇది నాలుగు రోజుల పండుగ. చతుర్దశితో ప్రారంభమవుతుంది. ఆ రోజు నరకాసుర వధ జరిగింది గనుక దాన్ని నరకచతుర్దశి అని కూడా అంటారు. ఆ రోజు తెల్లవారుజామునే ముత్తయిదువలు - ముఖ్యంగా ఇంటి ఆడపడుచులు - మగవారందరికీ బొట్టుపెట్టి తలకు పువ్వుతో నూనె రాచి హారతి ఇస్తారు. హారతి తీసుకున్నవారు. తగినంత కట్నం ఇస్తారు. రెండవ రోజు అంటే అమావాస్య రోజున దీపావళి పండుగ. అరవదేశంలో అమావాన్య నాడు ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావిస్తారు. కాని దేశమంతటా ఆశ్వయుజ బహుళ అమావాస్యను నిన్సంకోచంగా అందరూ శుభదినంగా, లక్ష్మీప్రసన్నదినంగా భావిస్తారు. ఆ రోజు విందు భోజనంలో ఎన్ని పదార్థాలున్నా ఫేణీలు, సేవెల పాయసం తప్పనిసరి. మూడవరోజు కార్తీక శుద్ధ ప్రతిపద. దీన్ని బలి ప్రతిపద అంటారు. బలిని అణచడానికి విష్ణువు వామనావతార మెత్తిన కథ అందరికీ తెలిసిందే. ఐతే బలి దుర్మార్గుడు కాదు. వామనుడే బలిని 'పుణ్యుం డితం డల్పుడు కాడు" అన్నట్టు భాగవతంలో ఉంటుంది. ఐతే ఈ బలి ప్రతిపద కేరళలో ఎక్కువ పాటిస్తారు. ఇక నాలుగవ రోజు యమద్వితీయ. నేను దీని 6డీ జి.యస్‌. వరదాచారి

గురించి మొదటిసారి ధర్మపురిలోనే విన్నాను. దీన్నే భ్రాతృద్వితీయ అనికూదా అంటారు. ఇది యముడు, ఆయన సోదరి యమికి సంబంధించిన పండుగ. మామూలుగా సోదరులే ఎప్పుడూ ఆడపడుచులకు కట్నాలు పెడుతుంటారు. యమద్వితీయ రోజు యమి తన సోదరుని ఇంటికి పిలిచి, విందు భోజనం, కట్నం పెట్టినట్టు పురాణగాథ. కనుక (భ్రాతృద్వితీయ నాడు సోదరి తన సోదరులకు వస్తాదికాలు పెట్టడం సంప్రదాయం. ఇది విన్నవెంటనే, నాయన ధర్మపురిలోనే బట్టలుకొని నా భార్య సరోజిని అన్నలు నలుగురికీ కట్నాలు పెట్టించి సత్కరించారు.

ఫైలేరియాతో పరీక్ష తుస్‌

నేను ఏడదవతరగతిలో ఉండగా నాకు ఎడమ కాలు ఎర్రగా వాచి విపరీతమైన

జ్వరం వచ్చింది. లింబగిరి తాతచూచి మందిస్తే జ్వరం తగ్గింది కాని మళ్లీ మళ్లీ వస్తుండేది. బోదవ్యాధిగా గుర్తించారు. ఇంగ్లీషులో ఫైలేరియా అంటారు. ఆ రోజులలో మా ప్రాంతంలో ఈ వ్యాధి చాలావ్యాప్తిలో ఉండేది. చెరకు మొలాసిస్‌ కారణంగా నీళ్లు కలుషితమై ఈ వ్యాధి వస్తుందని అనేవారు. జ్వరం తగ్గినా కాలు బాగా వాచి పాదం బాగా పొంగి ఏనుగు కాలు వలె మారి అట్లాగే నిలిచి ఉండిపోతుంది. కొందరికి రెండు కాళ్లూ, చేతులు కూడా అట్లాగే ఉబ్బి ఉండిపోయేవి. ఇంగ్లీషులో దీన్ని ఎలిఫెంటాసిస్‌ అనేవారు. యావజ్జీవం ఆ అంగవైకల్యంతో బతుకవలసి వచ్చేది. ఫైలేరియాకు ఆ రోజులలో అలోపతి మందులు లేవు. మోర్తాడులో కాపు కులస్థుడు ఈ వ్యాధికి పసరు మందు పోస్తాదని తెలుసుకొని నాయన అక్కడికి తీసుకువెళ్లారు. మందు రెండు మూడు వారాలు ఇవ్వవలసి ఉంటుందంటే, అక్కడే మా వేలువిడిచిన మేనత్త ఇంట్లో నన్ను ఉంచి, ఆయన ఆర్భూరు వెళ్లిపోయారు. మా మేనత్త పేరు రామలక్ష్మి. దప్పూరి కిష్టమాచారి ఆమె భర్త. మోర్తాడులో వేంకటేశ్వరన్వామి ఆలయంలో అర్చకులు. ఆయన సహఅర్బకుల ఇంటిపేరు దరూరు. కేరళలో కూడా దరూరు, దప్పూరు, ఆదూరు వంటి ఇంటి పేర్లు ఉండటం నేను పత్రికారంగంలోకి వచ్చాక గమనించాను. ఇలాటి నామవాచకసామ్యాలను, ఉచ్చారణసామ్యాలను గమనించడం జర్చలిస్టులకు వార్తారచనలో ఉపయోగపడుతుంది. సరే, పసరు మందుతో నాకు అంగవైకల్యస్థితి తప్పింది. కాని ఎడమ కాలు ఎర్రబడి జ్వరం రావడం మాత్రం చాలాకాలం పీడిస్తూనే వచ్చింది. ఏడవతరగతి వార్నికపరీక్షలప్పుడు విపరీతమైన జ్వరంవచ్చి పరీక్ష వ్రాయలేదు. ఆ రోజులలో మళ్లీ పరీక్ష పెట్టే పద్ధతి లేదు. అదే తరగతిలో మరో యేడాది చదువక తప్పలేదు. నేను 1947లో ఏడవతరగతి ఉత్తీర్ణుడనయ్యాను.

జ్ఞాపకాల వరద 65

దేశంలో స్వాతంత్రోద్యమం ఉధృతం కావడంతో రాష్త్రంలో రజాకార్ల ఆగడాలు మితిమీరి పోయాయి. ఖాసిం రజ్వీ సర్వసేనానిగా అవతారమెత్తాడు. నిజాం ప్రభుత్వానికి ఆధికారిక సర్వసేనానిగా జనరల్‌ ఇదిరీస్‌ ఉన్నా, రజ్వీ రాజ్యాంగేతరశక్తి. తిరుగులేని అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. నిజాం నిర్ణయాలను కూడా మార్చించ గలిగేవాడు. ముస్లిములందరినీ రజుకార్లుగా చేర్చి, వారికి అనధికారసైన్యంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎంతవరకు నిజమో తెలియదు కాని, వారికి లెఫ్ట్‌ కైట్‌ అంటే తెలియదని ఎడమ చేతిలో ఇటుకా, కుడిచేతిలో రాయిపెట్టి ఈంట్‌ పత్థర్‌ అని కవాతు చేయించేవాడని ఆ రోజులలో చాలా ప్రచారంలో ఉండేది. సిద్నీ కాటన్‌ అనే ఆష్టియన్‌ ఆయుధవర్తకునితో స్టెన్‌గన్‌, (బెన్‌గన్‌ లాంటి అధునాతన ఆయుధాలను దిగుమతి చేయించాడు, వీటిని రజాకార్లకు పంచాడు. కాని వాటిని వాడటంలో శిక్షణ ఇవ్వలేక పోయాడు. జనాన్ని భయపెట్టడానికి రజాకార్లు వీధి కవాతు జరుపుతుండేవారు. విచ్చుకత్తులతో ఊరేగింపులు తీస్తుండేవారు. ఒక సైనికశక్తిగా కాక, అసాంఘిక శక్తిగా రూపొందారు. వీరిని అదుపుచేయడం నిజాంకు గాని, ఆయన (ప్రధాని లాయక్‌ అలీకి గాని, సైన్యాధిపతి ఇదిరీస్‌కు గాని సాధ్యం కాకపోయింది. జిల్లాకు ఒకటే హైస్కూలు నేను ఏడవ తరగతి పాసయ్యాను గనుక పైచదువులకు పోతానని నాయనకు తెలుసు. నా కంటే ఏడేళ్లు పెద్దయిన అన్నయ్యనే చదివించే ఏర్పాటు చేసినవారు నన్ను కాదంటారా? ఆ రోజులలో జిల్లాకు ఒక్కటే ఉన్నతపాఠశాల ఉండేది. మా జిల్లా కేంద్రం నిజామాబాద్‌లో ఒకటుంది. మా అన్నయ్య దానిలో చేరాడు. కాని చదువు సాగించలేకపోయాడు. వండుకు తింటూ ఉండలేకపోయాడు. కనుక నాయన ప్రత్యామ్నాయం చూశారు. ఆదిలాబాద్‌ జిల్లా హైస్కూలు నిర్మల్‌లో ఉండేది. నిజామాబాద్‌ కంటే కొంచెం దూరం. అక్కడ మా నాయన అక్క కొడుకు సముద్రాల పురుషోత్తమాచారి కొత్తగా కాపురం పెట్టాడు. ఆయనతో మాట్లాడి వారి ఇంట్లో ఉండే ఏర్పాటు చేశారు. అలా నిర్మల్‌ హైన్కూలులో 1947 జూన్‌లో చేరాను, పురుషోత్తమాచారికి అప్పటికి సంతానం కలుగలేదు. బ్రాహ్మణవాడలో ఒక పెద్ద ఆవరణలో రెండు చిన్నగుడులు ఉన్నాయి. ఒకటి శివాలయం, రెండవది వేణుగోపాలస్వామి ఆలయం. పురుషోత్తమాచారి వేణుగోపాలస్వామి ఆలయం అర్చకులుగా ఉండేవారు. అదే ప్రాంగణంలో పెద్ద ధర్మశాల ఉండేది. పిట్టగోడ లేని కోనేరు ఉండేది. అర్చకునికి ఒక గది, మరొక పెద్ద హాలుతో కూడిన నివాసస్థలము 66 జి.యస్‌. వరదాచారి

ఉండేది. దానిలో పురుషోత్తమాచారి దంపతులు, ఆయన అన్న కుమారుడు లక్ష్మణాచారి, నేను ఉండేవాళ్లం. లక్ష్మణాచారి ఏడవతరగతిలో ఉండేవాడు. ఇతని కొడుకే ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ (ప్రభుత్వ అధికార ్రతినిధిగా ఉన్న వేణుగోపాలాచారి. అంటే మా మేనబావకు మనుమడు.

నిర్మల్‌లో ఆ రోజులలో కోతులెక్కువ. మందలు మందలుగా తిరుగుతుండేవి. కనుక ఇళ్ల పైకప్పులన్నీ టిన్ను రేకులతో ఉండేవి. ఆర్మూరులో ఇతరగ్రామాలలో లొగా పెంకుటిళ్లు లేవు. అప్పటికి ఆర్‌.సి.సి. డాబా ఇళ్లు నిర్మించే పద్ధతి వాడుకలోకి రాలేదు. ఆర్మూరులో పాత పద్ధతిలో నిర్మించిన మూడంతస్తుల బంగళా పెంటాజీవారిది ఒక్కటే ఉండేది. వారు పట్సరి కులస్టులే అయినా బంగారం వ్యాపారం చేసేవారు. చాలా ధనవంతుల కింద లెక్క వారి కుటుంబసభ్యులలో ఒకడైన విఠోబా నా క్లాస్‌ మేట్‌. నిర్మలలో డాబా ఇళ్లు లేవు. కోతులు తిండి పదార్భ్ధాలకోసం వెతుకుతూ ఇంటి పెంకులను పీకి కుప్పపోసేవి. జనాన్ని మాత్రం సామాన్యంగా ఏమీ అనేవి కావు: ఒకో గుంపునకు నాయకుడుగా ఉండే మగ లడ్డకోతిని చూస్తే భయం వేసేది. అవి మనుషులను మీద దుంకబోతున్నట్టు పోజు పెట్టి బెదిరించేవి. కాని దుంకవు. దాన్నే ఉర్దూలో బందర్‌ భప్‌కీ అనేవారు. క్రాఫు, ఫుల్‌ సూట్‌

ఏడవ తరగతి పూర్తయే వరకు నాకు తల ముందు భాగం మాడపట్టు నున్నగా గొరిగి వెనుక సగభాగం జులుపాలు ఉండేవి. సెలవుల్లో అది తీసివేసి క్రావు- చేయించుకున్నాను. చదువుకు తగ్గ దుస్తులుండాలని నాయన కొత్తవి కుట్టించారు. ఒక ఫుల్‌ సూటు కూడా కుట్టించారు. బంగారు చెవి పోగులు తీసివేశాను. మా అన్నయ్య నాకు రాజా పెన్ను కొనిచ్చాడు. ఫుల్‌ సూటులో స్కూలుకు వస్తున్న విద్యార్థిని నేనొక్కడినే. దాంతో కొద్ది రోజులలోనే స్కూలంతటికీ తెలిసిపోయాను. వరదాచారి అని పేరు చెప్పగానే “ఆ ఫుల్‌ సూటాయనా?” అని గుర్తించేవారు. దానికి తోడు ఐచ్చిక గణితంలో ముందుండటం కూడా, తర్వాతికాలంలో తరగతి గదిలో నాకు చాలామంది మిత్రులను సంపాదించి పెట్టింది. మా లెక్కల మాస్టారు శేషగిరిరావు నా గ్రహణ శక్తిని పసిగట్టారు. బీజగణిత సూత్రాలు, యూళ్లీడియన్‌ జ్యామితి సిద్ధాంతాలు (థియరమ్‌లు) చెప్పీచెప్పకముందే నేను గ్రహించేవాడిని. విద్యార్థులకు ఫార్ములా, థియరమ్‌ చెప్పి అభ్యాసపులెక్కలను వారి చేతనే బోర్డు మీద చేయించడం ఆయన అలవాటు. అందరికీ జ్ఞాపకాల వరద 67

అవకాశం ఇచ్చేవారు. ఎవరూ ముందుకు రాకపోతే “వరదాచారీ నువ్వు చేస్తావా?” అని అడిగేవారు. దానితో నా బాధ్యత పెరిగింది. నేను ముందే జాగ్రత్తపడి వెళ్లేవాణ్సి. నేను చేయలేనన్నప్పుడే ఆయన చేసి చూపేవారు. లెక్కలు, ముఖ్యంగా ఉన్నత గణితం నేర్చడంలో ఆయనకు సాటి లేరు. అందరూ ఎంతో గౌరవించేవారు. అదే స్కూలులో ఏడవ తరగతి వరకు ప్రథముడుగా ఉంటూ వచ్చిన గంగారెడ్డి అనే విద్యార్ధికి తొలుత కొంత అసూయగా ఉండేది. కాని క్షాసులోకెల్లా పెద్దవాడైన తమ్మడి గంగారాం అనే విద్యార్థి మా ఇద్దరినీ కలిపి, ప్రాణమిత్రులయ్యేట్టు చేశాడు. తరగతి ఫస్టుగా ఎవరు వచ్చినా సంతోషమే అన్న భావాన్ని కలిగింపజేశాడు. ఆ యేడాది ఎనిమిదవ తరగతిలో నేనే ఫస్టు వచ్చాను. పురుషోత్తమాచారి - యశోదమ్మలది చాలా అనుకూలదాంపత్యం,. భార్యాభర్తల సంబంధాల గురించి అప్పుడప్పుడే ఆలోచనలు వస్తున్న వయసు మాది. అనుకూలవతి అయిన భార్యకు యశోదమ్మ ఉదాహరణగా ఉండేది. భర్త ఎలాటి ఆదాయమూ లేని గుడిలో అర్చకుడు. నిర్మల్‌లో ముస్లిములు ఎప్పుడో ధ్వంసంచేసిన దేవరకోట ఆలయాన్ని పునరుద్ధరింపజేయాలన్న తాపత్రయంలో ఉన్న వ్యక్తి. అదీ రజాకార్లు విజృంభిస్తున్న రోజుల్లో. శిష్యసంచారం లేదా కాలక్షేపాదులు చేసి డబ్బు సంపాదించగల నేర్చు ఉన్నవారే. హరికథలు చెప్పనేర్చినవారు. కాని ఆదాయం లేని గుడిలో అర్చనకు, దుస్సాధ్యమైన మరో ఆలయపునర్నిర్మాణ లక్ష్యానికి అంకితమైపోయారు. అయినా ఆమె ఎన్నడూ విసుక్కోలేదు. ప్రతీ సాయంకాలం భర్తతో పాటు తానూ గుడిలో దీపారాధనలో పాల్గొనేది. ఆయనతో కలిసి భజన చేసేది. శ్రావ్యంగా కీర్తనలు పాడేది. పవళింపు సేవ అయ్యాకే ఇంట్లోకి వచ్చి భోజనాలకు ఏర్పాట్లు చేసేది. నాకు రామదాసు కీర్తనలను పరిచయం చేసింది ఆ దంపతులే. “తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని ధైర్యం ప్రకటించినా, “ఎవడబ్బ సొమ్మని కులుకుచూ తిరిగేవు రామచంద్రా” అని నిందాస్తుతితో నిలదీసినా, 'సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకమ్మూ అని నివృరాలాడినా ముఖాలలో భక్తిభావనే తప్ప మరొకటి కనిపించేది కాదు. మగవాళ్లందరూ తిన్న తర్వాత తాను ప్రశాంతంగా ఎక్కువతక్కువలు సరిపెట్టుకొని భోజనం చేసేది. వ్యాకటి మనిషిగా - అంటే కడుపుతో ఉన్నప్పుడు సైతం - అంతే ప్రసన్నంగా ఉండేది. దిగులుపడేదికాదు. పురుషోత్తమాచారి నిక్కచ్చి మనిషి అవసరార్థం రాజీపడే మనస్తత్త్వం కాదు. దేవరకోట స్థలంగురించి మాట్లాడటానికి అంబయ్య సిద్ధాంతి ఇంటికి బయళట్దేరాడు. నన్ను రమ్మన్నాడు. నిర్మల్‌లో పెద్ద షావుకార్లంతా ఆయన శిష్యులు. ఆయన మాట జవదాటరు. నిర్మల్‌లో ఆ రోజులలో ఒక నానుడి 68 జి.యస్‌. వరదాచారి

ఉండేది. అంబయ్య మాటకు, అబ్బుల్లా మాటకు తిరుగు ఉండదని. అంబయ్య ఆధ్యాత్మికగురువు. అబ్బుల్లా రజాకార్‌ నాయకుడు. ఒకరి పట్ల ఎనలేని భక్తి మరొకరి పట్ల చెప్పలేని భయం. ఎవ్వరూ వారిమాట జవదాటేవారు కాదు.

మేము అంబయ్య ఇంటి ద్వారందాకా వెళ్లాము. పురుషోత్తమాచారి వెనుదిరిగి “పద, వెళ్లిపోడా” మన్నారు. “ఇక్కడి దాకా వచ్చి తిరిగిపోవదమెందుకు?” అని నేనడిగితే సింహద్వారం మీద ఉన్న బోర్డు చూడమన్నారు. దాని మీద శివుడే పరమదైవమని నమ్మనివారికి ప్రవేశం లేదు అని వ్రాసి ఉంది. అంతే, తిరిగి వచ్చేశాము. పురుషోత్తమాచారికి గమ్మత్తయిన అలవాటు ఒకటి ఉందేది. తెల్లారి లేవగానే యశోదమ్మను పిలిచేవారు. ఆమె అద్దం తీసుకొనివచ్చి చేతికి ఇచ్చేది. అప్పుడు కళ్లు తెరిచి అద్దంలో ముఖం చూసుకొనేవారు. ఆతర్వాత మంచందిగి కాలకృత్యాలు తీర్చుకునేవారు. అదేమిటని అడిగితే చెప్పారు. “ఏ రోజైనా పనులు చెడిపోతే పొద్దున్నే ఎవడి మొగం చూశానో ఏ పనీ జరగడంలేదని తిట్టుకుంటాం గదా. మరి మన ముఖమే చూసుకుంటే ఎవరినీ తిట్టవలసిన అవసరం ఉండ” దన్నారు. పత్రికా రచనలోకి వచ్చినాక నేను లఘువ్యాఖ్యలు వ్రాస్తున్నప్పుడు ప్రభాతే కరదర్శనం అని ఈ ఉదంతం గురించి వ్రాశాను. పూర్తి శ్లోకం ఇక్కడ ప్రస్తావించాలి. 'కరాగ్రీ వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ, కరమూలే జగత్సర్వం ప్రభాతే కరదర్శనం” అన్నదా శ్లోకం. దీనినుండి నేర్చుకోదగిన నీతి ఏమిటంటే నీ చేతలమీద నమ్మకముంచుకో అన్నదే. ఐహిరంగ బలాత్కారం

నిర్మల్‌లో రజాకార్ల ఆగడాలు ఆర్భ్మూరుకంటే ఎక్కువగా ఉండేవి. రజాకార్ల అధ్యక్షుడుగా అబ్బుల్లా అనే అరబ్బు ఉండేవాడు. ఆయనకో తమ్ముడు అలీ. ఆకతాయి ముఠాను వెంటవేసుకుని తిరిగేవాడు. అబ్బుల్లా మాటకు తిరుగుండదేది కాదు. ఆయనకు రాబిన్‌ హుడ్‌ లాంటివాడని పేరుండేది. చుట్టుపక్కల లంబాడీ తండాలలో అతని పట్ల విపరీతమైన అభిమానం. పేద విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేవని మొరపెట్టుకుంటే, ఆయన పుస్తకాల దుకాణానికి తీసుకువెళ్లి కావలసిన పుస్తకాలు, నోట్‌ బుక్‌లు ఇప్పించేవాడు. డబ్బులు ఈయన ఇవ్వడు, వాళ్లు అడుగలేరు.

అలీ కాలాంతకుడు. ఆ రోజులలో పెద్ద (గ్రామాలలో భోగంవాళ్లు అని ఆటపాటలతో జనాన్ని రంజింప చేసేవారు ఉండేవారు. నిర్మల్‌లో రంగసాని అనే ప్రసిద్ధ భోగస్రీ ఒకామె ఉండేది. అలీ ఆమెను ఒక రోజు పిలిపించాడట. ఆమె జ్ఞాపకాల వరద 69

ఇంట్లో ఆరోజు డిఎస్‌పి ఉన్నారట. ఆమె ఆ విషయమే తెలిపి ఇవాళ్ల రాలేను, రేపు వస్తానని కబురు చేసిందట. అలీ ఆ రోజు ఊరకుండిపోయాడు. మర్నాడు ఉదయం తొమ్మిదిగంటల సమయానికి ఆమెను పట్టి తెప్పించాడు. నిర్మల్‌లో వాడలపేర్లు వారాలతో ఉంటాయి. సోమవారప్పేట, బుధవారప్పేట అలాగ. సోమవారప్పేట అప్పుడు ఆ ఊరిలోకెల్లా పెద్ద వ్యాపారకేంద్రం, హైదరాబాద్‌లో ఆబిద్‌ రోడ్డులాగ. అక్కడ నడిబజారులో ఆమెపై తన అనుచరులచేత అత్యాచారం చేయించాడు. సోమవారప్పేట పడమటి కొసలోనే మా స్ఫూలు ఉంది. స్కూలుకు వస్తున్న విద్యార్థులను ఆపి “చూడండి అంటూ, అక్కడ పోగై ఉన్న పెద్దవారిని పక్కకు తోసి ముందుకు లాగారట. దుకాణాలు తెరవడానికి ఒకరొకరుగా వస్తున్న షావుకార్లను చూడమని బలవంతంగా చుట్టూ నిలబెట్టారట. సామూహిక అత్యాచారం అనే పదబందం అప్పటికి వాడుకలోకి రాలేదు. కాని అదే చేశారు. ఆ మర్నాడు మేము స్కూలుకు వెళుతుంటే ఆ భోగస్త్రీ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. *వెలయాలే అయినా ఆమెకూ ఆత్మగౌరవం ఉంటుంది కదా” అని పెద్దలు అనుకోవడం విన్నాము.

ఇంతటితో అయిపోలేదు. డిఎస్‌పి అలీమీద కేసు పెట్టి అరెస్టు చేసి జుడీషియల్‌ కష్టడీకీ పంపాడు. అప్పుడే ఖాసిం రజ్వీ పర్యటనకు నిర్మల్‌ వచ్చాడు. అలీని విడుదల చేయాలని ఉత్తర్వు జారీ చేశాడు. అప్పటికే రాత్రి ఏడు గంటలైపోయింది. డిఎస్‌పి “ఆరు తర్వాత ఖైదునుంచి ఎవరినీ విడుదల చేయడానికి నియమాలు ఒప్పుకోవు గనుక రేపు విడుదల చేస్తా నన్నాదు. కాని రజ్వీ తాను దగ్గరుండి జైలు తలుపులు తెరిపించి అలీని విడుదల చేయించాడు. “డిఎస్‌పికి ఇక దుద్గతే!” అని పెద్దలు పెదవి విరిచార్హు

అలీ దుర్మార్గాలు రోజుకొకటి తెలుస్తుండేవి. ఊళ్లో పెద్దషావుకారు భార్య ఊళ్లోనే ఉన్న తల్లిగారి ఇంటికి ఒంటరిగా వెళ్తూ అలీ కంటబడింది. ఆమెను తన ఇంటికి తరలించ్చాద్సు షావుకారుకు “నీ భార్య నా ఇంట్లో ఉంది. వదివేలు చెల్లించి విడిపించుకో అని కబురు పంపాడట. అడిగిన సొమ్ము ఇచ్చి భార్య చెరవిడిపించుకోక ఎవరైనా ఏం చేయగలరు? అలీకి తన అధికారాన్ని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయగూడదన్న అహంకారం. అందుకోసం ఎంత క్రూరానికైనా తెగించేవాడు.

ముస్లింలలో ఆ నాదు, ఈ నాడు కూడా సంఘబలం ఎక్కువ. ఎవరిద్దరు ఎందుకు తగొదాపద్దా, అందులో ఒకడు ముస్లిమైతే దారినపోయే ముస్లిములంతా విషయమేమిట్రో తెలుసుకోకుండానే అవతలివానిపై దాడికి దిగేవారు. తమవాడికి అండగా నిలవడమే తమ పవిత్రకర్తవ్యమనుకునేవారు. అందువల్ల చిల్లరతగాదాలు 70 జి.యస్‌. వరదాచారి

పైతం మతకలహాలుగా మారిపోతుండేవి. ఇప్పటికీ ఈ మనఃస్థితి - ముఖ్యంగా మదరసాలలో చదువుకున్నవారి మనఃస్థితి - మారలేదు. కారణం అప్పుడు రాజ్యమేలుతున్నామన్న అహంకారమైతే ఇప్పుడు అస్తిత్వాన్ని కాపాడుకోడానికి నిరంతర పోరాటమే మార్గమన్న మూఢ నమ్మకం.

మేము ఎనిమిదవ తరగతిలో ఉండగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఎక్కడా ఉత్సవాలు జరుపుకోవడానికి అవకాశంలేకపోయింది. ముస్లిములు మాత్రం పాకిస్తాన్‌ సాధించామని విచ్చుకత్తులతో ఊరేగింపులు తీశారు. ఊరేగింపు సమయంలో వారు చేసిన నినాదం గమనించదగినది. 'హంన్‌కే లియే పాకిస్తాన్‌, లడ్‌కే లేంగే హిందుస్తాన్‌. ఈ నినాదం రాజ్యమంతా మారుమోగింది. నవ్వి పాకిస్తాన్‌ను తెచ్చుకున్నాము, పోరాడి హిందుస్తాన్‌ను తీసుకుంటామని అర్థం. ఒక పాక్‌ సైనికుడు ఎనిమిదిమంది భారతసైనికులకు సమానమని గొప్పలు చెప్పుకుంటుందేవారు. సామాన్యులే కాదు. పాక్‌ సర్వసేనానిగా ఉండి అధ్యక్షుడైన అయూబ్‌ ఖాన్‌ అంతటివారు కూడా ఈ మాటలు అంటుండేవారు. ఇప్పటికీ పాక్‌ భద్రతా సలహాదారులు, మన ఇంగ్లీషు టి.వి. చానళ్లవారు చర్చలకు పిలిస్తే వచ్చి, ఇలాగే మాట్లాడుతున్నారు.

గాంధీ మవాత్ముడు మేము ఎనిమిదవ తరగతిలో ఉండగానే హత్యకు గురయ్యారు. ఆ మరుసటి రోజు పురుషోత్తమాచారి, మరి కొందరు ఊరి పెద్దలు ' నిరాహారదీక్ష పాటించారు. న్మూలుకు సెలవు లేదు. న్య్మూలుకు వెళ్లవద్దనుకున్నాము. కాని మా పొరుగునే ఉండే మా విద్యార్ధి సంఘ కార్యదర్శి డి. విశ్వనాథరావు వచ్చి, స్కూలుకు వెళ్లకపోతే చాలా చిక్కులు వస్తాయని నచ్చచెప్పి తీసుకువెళ్లాడు.

-కొమ్మిదవ తరగతిలో గంగారెడ్డి, నేను మంచి స్నేహితులుగా కొనసాగాము. దీనికి కొంత కారణం తమ్మడి గంగారామే. ఆయన మా క్లాసులో అందరికంటే పెద్దవాడు. రాజకీయపరిజ్ఞానం కలవాడు. బొంతల (గ్రామస్థుడు. బొంతలను ఇప్పుడు బోథ్‌ అంటారు. అప్పుడే తాలూకా కేంద్రం. అక్కడ ఆయన కుటుంబికులకు బట్టల దుకాణం ఉండేది. రజాకార్ల దుశ్చర్యలు తీవ్రస్థాయిలో ఉన్న రోజులు. విద్యార్థులలో చీలికలు రావడం ఆయనకు ఇష్టం లేదు. కలిసి చదువుకుందామని చెప్పి తన అద్దెఇంట్లో చాలామంది విద్యార్థులను పోగుచేసేవాడు. ఇద్దరు తెలివైన విద్యార్థులు ఆ బృందంలో ఉందటం మంచిదని మా ఇద్దరినీ ఒప్పించాడు. మా తరగతి విద్యార్థులలో బహుశా నేనే చిన్నవాణ్ణి. బక్కపలుచగా ఉండేవాణ్ణి. అయినా ఆ సంవత్సరం విద్యార్థి పంఘం ఎన్నికలలో నన్ను సహాయకార్యదర్శిగా ఎన్నుకున్నారు. క్లాస్‌ ఫస్టు రావడమే దానికి కారణం. జ్ఞాపకాల వరద 71

సుభాష్‌ అంటే అభిమానం ఆ రోజులలో విద్యార్థులకు గాంధీ, నెహ్రూలకంటే సుభాష్‌ చంద్రబోస్‌ అంటేనే ఎక్కువ అభిమానం. తుమ్‌ మురు ఖూన్‌ దో, మైం తువ్వే ఆజాదీ దేవుంగా అన్న ఆయన నినాదం దేశమంతా మారుమోగుతున్న రోజులు. “మీరు నాకు రక్తమిస్తే నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తానని అర్ధం. సుభాష్‌ ఇచ్చిన మరో నినాదం జై హింద్‌! ఇద్దరు భారతీయులు కలుసుకున్నప్పుడు తెలువుకునే అభివాదానికి పర్యాయపదంగా అప్పటికే వాడుకలోకి వచ్చింది. అంతకుముందు “రామ్‌ రామ్‌” అని అభివాదం తెలుపుకోవడం సంప్రదాయం. అప్పుడు సుభాష్‌ విమానం గల్లంతైన సంగతి మాకు తెలియదు. అంగీలకు అంటే చొక్కాలకు పెట్టుకునే గుండీలు సుభాష్‌ బొమ్మతో బజారులో విరివిగా అమ్మకానికి వచ్చాయి. నేపథ్యంలో త్రివర్దపతాకం, దాని ముందు సైనిక దుస్తులోసుభాష్‌ ముఖచిత్రం ఉండేది. సుభాష్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఏర్పాటు చేయడం, సైన్యం ఈశాన్యభారతంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించినట్టు, స్వతంత్ర భారతప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు వార్తలు రావడం ఈ అభిమానానికి కారణం. ఆయన బొమ్మఉన్న గుండీలు ధరించడం గర్వకారణమనే నమ్మకం. ఆ రోజులలో చొక్కాలకు గుండీలు కుట్టే పద్ధతి లేదు. గుండీలు చదరంగంలో సిపాయి పావును పోలి ఉండేవి. చొక్కాలకు ఇప్పుడు గుండీ కుట్టి ఉండే చోట కూడా కాజా ఉండేది. పైపారకు మరో కాజా - రెండేసి కాజాలు ఉండేవి. గుండీని అడుగు కాజాలో నుంచి తొడిగి పై కాజాలోంచి వెలికి తీస్తే చొక్కాను అదిమి పట్టినట్టుగా ఉంచేది. ఆ గుండీలు పెట్టుకొని ఒకరోజు నేను స్కూలుకు వెళ్లాను. మా క్లాసు టీచరు ఉర్దూ టీచరు అయిన రజ్వీకి నచ్చలేదు. క్లాసులో గుండీలు తీయించి లాగేసుకున్నాడు. గట్టిహెచ్చరిక కూడా చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కొన్ని రోజులు పోలీసు స్టేషన్‌లో హాజరీ ఇవ్వాల్సి వచ్చింది. పేరు రజ్వీయే అయినా ఈ రజ్వీ రజాకార్‌ నాయకుడు ఖాసిం రజ్వీకి బంధువేమి కాదు. మతైక్యత వల్ల ఏర్పడ్డ భావసమైక్యతే. పాఠం చెప్పేటప్పుడు విషం కక్కేవాడు. జాతీయనాయకులు గాంధి, నెహ్రూ, సుభాష్‌ల గురించి చులకనగా మాట్లాడేవాడు. “ఈ బమ్మన్‌ బన్యాలకు (బ్రాహ్మలు కోమట్లకు) పరిపాలనేం తెలుసు?” అనే వాడు. “మూటలను మీ స్వంతవాక్యాలలో ఉపయోగించండి” అంటూ ఇచ్చే ప్రశ్నలలో తుక్కు రేగ్గొట్టారు, విజయపతాకం ఎగురవేశారు వంటి పదబంధాలు ఇచ్చి, “రజాకార్‌ వీరులు భారత సైన్యం తుక్కురేగ్గొట్టారు, నిజాం సేనలు ఎ(రకోటమీద ఆనవఫ్‌ జాహీ విజయపతాకం ఎగురవేశాయి* అని వ్రాయమనేవాదు. వాక్యాన్ని తప్పులు లేకుండా 72 జి.యస్‌. వరదాచారి

వ్రాసినా, మరో రకంగా వ్రాస్తే మార్కులు ఇచ్చేనాడు కాదు. అర్ధసంవత్సరపరీక్షల సమాధానపత్రాలు దిద్దినాక విద్యార్థులకు ఇచ్చే పద్ధతి ఉండేది. “నా వాక్యంలో తప్పు లేదే, మరి మార్కులు ఎందుకివ్వలేదు?” అని అడిగితే “నేను చెప్పినట్టు వ్రాయలేదు గనుక మార్కులు ఇవ్వను” అనేవాడు. నిజాం లొంగుబాటు

దేశం స్వతంత్రమైంది. హైదరాబాద్‌ రాజ్యంలో అల్లకల్లోలపరిస్థితి నెలకొని ఉంది. పెద్దగా ప్రచారం లేదు కాని, విద్యార్థులు కూడా సమరంలోకి దూకి అమరులైనట్టు పుకార్లు వ్యాపించాయి. చాందాలో విద్యార్థులకు ఉద్యమకార్యకలాపాలలో శిక్షణ ఇవ్వడానికి శిబిరం నిర్వహిస్తున్నారని విని, వయసులో పెద్దవారైన విద్యార్థుల బృందం ఒకటి వెళ్లింది. రెండవ బృందం వెళ్లడానికి సిద్ధమవుతున్నది. దానిలో వెళ్లడానికి నేను సిద్ధయమయాను. “ఇంత చిన్నగా ఉన్నావు, రావద్దు” అని సీనియర్లు నిరుత్సాహ పరచారు. ఐనా మంకు వీడలేదు. “సరేలే, ఇంటికి వెళ్లి మీ బావ ఒప్పుకుంటే బట్టలు తెచ్చుకొని రా” అన్నారు. ఇంటికి వెళ్లేసరికి, “నిజాం భారతసైన్యం ముందు లొంగిపోయాడు, శిక్షణా లేదు, ఎక్కడికీ వెళ్లవలసిన అవసరమూ లేదు” అన్నారు. మాకు హైదరాబాద్‌ మీద పోలీసు చర్య ప్రారంభమైనట్టుగాని ఐదు రోజులలోనే పోరాటం ముగిసినట్టుగాని సమాచారం లేదు. క్షణాలమీద అంటే అబద్ధమవుతుందిగాని రోజు గడిచేసరికి ఈ వార్త జనమందరికీ తెలిసిపోయింది. మిఠాయిలు పంచుకున్నారు. మర్నాడు మామూలుగా మేము స్కూలుకు వెళ్లాము. ప్రార్ధన ముగిసింది. అప్పుడే కొందరు సైనికాధికారులు రజాకార్ల గురించి ఆచూకీ తీయడానికి స్కూల్లోకి వచ్చారు. “సామాన్యజనాన్ని అడిగితే కోపతాపాలుండి సరైన సమాచారం చెప్పకపోవచ్చు. విద్యార్థులు సరైన సమాచారం ఇస్తారని మీ వద్దకు వచ్చా” మన్నారు. “ఎవరు రజాకారులో చెప్పండి” అని అడిగారు. నేను వెనుకా ముందూ చూడకుండా ఎదురుగా ఉన్న రజ్వీసారును చూపించి “ఈయన రజాకారు” అన్నాను. వారు రజ్వీసారును వెంట తీసుకుపోయారు. మా లెక్కల మాస్టారు శేషగిరిరావు అప్పుడు ఇన్‌చార్జి హెడ్‌ మాస్టరు. ఆయన కోపగించుకొని “టీచరును పట్టిస్తారా? విడిపించి తెచ్చే వరకు నిరాహారదీక్ష చేస్తా నని స్కూలు ఆవరణలో కూర్చున్నారు. విద్యార్థి సంఘనాయకులు “లేనిపోని గొడవ తెచ్చావుగదయ్యా!” అని నన్ను మందలించారు. “రజ్వీ ఎంత విషం కక్కుతాడో మీకు తెలియదా!” అని నేను ఎదురుతిరిగాను. చివరకు ఆయనను దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కే తీసుకువెళ్లారని తెలుసుకుని, నాతో “పద, విడిపించుకు వద్దా జ్ఞాపకాల వరద " 73

మన్నారు. “నేనెందుకు?” “నేను రాను” అన్నాను. “చెప్పింది నువ్వే కదా నీవు రానంటే ఎట్లా?” అని ఒప్పించి తీసుకుపోయారు. స్థానిక ఇన్‌ స్పెక్టరు రజ్వీగారిని హెచ్చరించి పంపించేశారు. అందరం స్కూలుకు వెళ్లాము. శేషగిరిరావు సంతోషించి ఉపాధ్యాయుల, విద్యార్థుల ధర్మాలను వివరించి, అందరినీ తరగతి గదుల్లోకి పంపించారు.

1948 సెప్టెంబర్‌ 18వ తేదీన భారతసైన్యం నిజాం ప్రభుత్వంపై నాలుగు వైపులనుంచి చర్య ప్రారంభించింది. దీనిని పోలీసు చర్య అన్నారు. మిలిటరీ పరిభాషలో “ఆపరేషన్‌ పోలో అన్నారు. (ప్రధాని నెహ్రూకు ఇష్టం లేకున్నా సర్దార్‌ పటేల్‌ ఈ చర్యకు ఆదేశించారు, నిజాం సైన్యం వద్ద, రజాకార్ల వద్ద అత్యంత అధునాతన ఆయుధాలు ఉన్నా ఉపయోగించడం తెలియక, అభాసు పాలయ్యారు. నిజానిజాలు తెలియవు కాని అప్పుడు బాగా (ప్రచారంలో ఉన్న ఓ కథనం ఏమిటంటే - భారత సైన్యం వారి ట్యాంకులు దూసుకు వస్తుంటే రజాకార్లు నేలమీద బోర్లా పడుకున్నారట. అదేం వ్యూహమో తెలియక దళాధిపతి ట్యాంకులను నిలిపివేశారట. ఒకటి రెండు ట్యాంకులను ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందుకు పంపారట. ట్యాంకులు నేలమీద పడుకున్నవారి మీదినుంచి వెళుతున్నాయి. పడుకున్న రజాకార్లు నలిగి నజ్జినజ్జి అయిపోతున్నారు. పేలుళ్లలాటివేమీ జరుగకపోవడంతో, ఒకరిద్దరిని లేపి “ఎందుకు ఇలా పడుకుంటున్నా'రని అడిగారట. విమానదాడులు జరిగితే పడుకొమ్మని చెప్పారని, అదే ట్యాంకుల విషయంలో పాటిస్తున్నారని అర్ధమై, “అనవసరంగా బలిపశువులవుతారెందుకు? లేచి పారిపొండ'”ని చెప్పి తరిమివేశారట. అలా ఎక్కడా చెప్పుకోదగిన ప్రతిఘటన లేకుండా భారతసైన్యం ముందుకు సాగింది. సెప్టెంబర్‌ 17 వ తేదీ సాయంత్రం నిజాం లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. హైదరాబాద్‌ రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. ప్రధానిగా ఉన్న లాయక్‌ అలీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్‌కు పారిపోయాడు. మేజరు జనరల్‌ జె.ఎన్‌. చౌదరి సైనిక పాలకుడుగా బాధ్యతలు చేపట్టాడు. ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు. తెలుగుపై మక్కువ

దసరా సెలవులకు నేను ఆర్భూరు వచ్చాను. సెలవుల్లోనే కాను సమయంలో యశోదమ్మ చనిపోయింది. దానితో నేను ఏ ఆసరా చూసుకొని నిజామాబాద్‌ బదులు నిర్మల్‌ హైస్కూలులో చేరానో అది కాస్తా పోయింది. మా అక్క బావ వెల్మల (గ్రామస్థులు. వారికి సంతానం కలుగలేదు. రెండేళ్ల కొకసారి బావకు దేవతార్చన వంతు వచ్చేది. అది ముగిసి రికామీగానే ఉన్నారు. నాకు వండిపెడుతూ నిజామాబాద్‌లో ఉండటానికి 74 జియస్‌. వరదాచారి

సిద్ధపడ్డారు. దాంతో నేను నిర్మల్‌వెళ్లి టి.సి. తెచ్చుకొని నిజామాబాద్‌ హైస్కూలులో విద్యాసంవత్సరం మధ్యలో తొమ్మిదవతరగతిలో చేరాను. మా క్లాసులో బహుశా నేనే అందరికంటే చిన్నవాణ్ణి. నా వయసేమీ ఈ నాటి తొమ్మిదవ తరగతి విద్యార్థిలాగ 19 ఏళ్లు కాదు. పదహారులో (ప్రవేశించాను. నేను వచ్చేసరికే నా గురించి కొంత ప్రచారం జరిగింది. దానివల్ల చేరిన కొద్దిరోజులకే ఒక మిత్రబృందం - ఏర్పడింది. వారిలో ఎక్కువ మంది చక్రంగుడి, పెద్ద బజారు పరిసరాలలో ఉందేవారు, బ్రాహ్మణులు, కోమట్లు. నేను దగ్గరలోనే నగరేశ్వర గుడి పూజారి, మా నాయన మిత్రుడు అయిన పుల్లప్పు పుల్లన్న ఇంట్లో ఉండేవాణ్ణి. విద్యార్థులందరం బడికి కలిసివెళ్లకున్నా, తిరిగి వచ్చేటప్పుడు కలిసి వచ్చేవారం. సమాజస్థితిగతుల గురించి, రావలసిన మార్పుల గురించి, భావిపౌరులైన విద్యార్థుల బాధ్యతగురించి చర్చించుకునే వాళ్లం. ఒకరోజు తెలుగు భాష వైభవాన్ని కాపాడుకోవడమెలా అన్న అంశం చర్చకు వచ్చింది. ఉర్దూ మీడియం విద్యార్థులమైనందున తరగతిగదిలో దాన్నే వాడక తప్పదు. బయట ఉర్టూ మాట్లాడరాదు అని నియమంపెట్టుకుందామని నేను సూచించాను. ఒక మిత్రుడు మాటతప్పినవాడికి శిక్ష ఉండాలన్నాడు. అందరూ బెనంటే బెనన్నారు. ఎవరైనా పొరపాటున ఉర్దూ మాటజారితే మిత్రబ్బందం మొత్తానికి చాయ్‌ తాగించాలన్నది శిక్ష “జెల్టీ చెప్పు” అన్నాడొక మిత్రుడు. జెల్టీ ఉర్జూ మాట గనుక ఆయన అందరికీ చాయ్‌ ఇప్పించవలసిందేనన్నాను నేను. “ఇట్టయితే పరేషానే!” అన్నాడు ఇంకో _ మిత్రుడు. “పరేషానీ తెలుగు కాదు కనుక ఆయన చాయ్‌ బాకీ ఉంటుంది. తర్వాత వాడుకుందాం” అన్నాడు మరో మిత్రుడు. “బాకీ తెలుగు కాదు నీదొక చాయ్‌ లెక్కలో రాసుకో” అన్నాన్నేను. ఇట్లా ఏది తెలుగు ఏది కాదు అనే చర్చ కొన్నాళ్లు సాగింది. భాషమీద అభిరుచితోపాటు పట్టు కూడా ఏర్పడింది. ఏ భాషవో తెలియకుండానే ఎన్ని పరభాషాపదాలు నిత్య వ్యవహారంలో వాడుతున్నామో తెలిసివచ్చింది. నెహ్రూతో కరచాలనం

మేము తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడే ప్రధాని నెహ్రూ హైదరాబాద్‌ వచ్చారు. మా విద్యార్థులు చాలామంది చూడబోదామని సిద్ధమయ్యారు. నన్ను రమ్మన్నారు. అందరం రైలు స్టేషన్‌కు చేరుకున్నాము. జనంతో కిక్కిరిసి ఉంది. టిక్కట్లు అమ్మడం మానేశారు. జనమంతా టిక్కట్టు లేకుండానే రైలు ఎక్కేశారు. పెట్టెలలో దూరలేక కొందరు కప్పుమీదకు ఎక్కి కూర్చున్నారు. హైదరాబాద్‌ చేరాము. మా నాయకుడు శ్రీధర్‌కు తెలిసినవారు గౌలీగూడలో ఉంటే అక్కడ బస చేశాము. నెహ్రూ బహిరంగసభ జ్ఞాపకాల వరద 75

సాయంత్రం .ఫతే మైదానంలో ఉంటుందన్నారు. ఇప్పటి లాల్‌ బహాదుర్‌ స్టేడియమే అప్పటి ఫతే మైదానం. గోలకొండపై దండెత్తి వచ్చినప్పుడు జెరంగ్‌జేబు సైన్యం మకాం చేసినస్థలం. యుద్ధంలో అబూల్‌ హసన్‌ తానాషాను మోసం చేసి బెరంగ్‌జేబు గెలిచాడు. గనుక దానికి ఫతేమైదానమని పేరువచ్చింది. అంతకుముందు నేను మా నాయనతో ఓ సారి హైదరాబాద్‌ వచ్చాను. చార్మినార్‌ మొదలైనవి చూశాను. కనుక దగ్గరలో సుల్తాన్‌ బజార్‌ తిరిగి వద్దామని బయళ్టేరాము. కోటీ చౌరస్తాకు వచ్చేసరికి జనం గుమిగూడి ఉన్నారు. నెహ్రూ అక్కడే ఉన్న ఖాదీ భండారుకు వస్తున్నాడని చెప్పారు. వెంట ఉన్న ఇద్దరు మిత్రులు, నేను ఇదో అవకాశమని అక్కడే ఫుట్‌ పాత్‌ మీద నిలబడ్డాము. అప్పుడు పెద్ద భద్రతా ఏర్పాట్లేమీ లేవు. నెహ్రూ టాపు లేని జీపులో వచ్చారు. తనవద్ద ఉన్న వూలదండలను ఆడవారిపైకి విసిరారు. నేను. అసంకల్పితంగానే ఫుట్‌ పాత్‌ దిగి ముందుకు వెళ్లి చేయి చాచాను. ఆయన చూశారు. నా చేతిని తనచేతిలోకి తీసుకొని ఊపారు. ముందుకు సాగిపోయారు. నేనేదో ఘనకార్యం చేశాననుకోలేదు. కాని పక్కనున్న ఓ అపరిచితవ్యక్తి ఇతనితో కరచాలనం చేస్తే నెహ్రూతో చేసినట్టే అన్నాడు. దాంతో జనం నా చుట్టూ మూగారు. కొంతసేపు కరచాలనాల వేడుక సాగింది. మేము నిజామాబాద్‌ తిరిగి వెళ్లినాక కొన్నాళ్లపాటు కొనసాగింది. మా మిత్రులు కొత్తవారెవరు కనపడ్డా, “వీడితో కరచాలనం చేయండి. నెహ్రూతో కరచాలనం చేసిన చేయి” అని ఆటపట్టించేవారు. వారూ కాదనక చేయి అందించి మురిసిపోయేవారు. అల్ప్ససంతోషులు కాదు. పిల్లల సరదా చెడగొట్టరాదన్న నేను నిర్మల్‌లో క్లాస్‌ ఫస్టు రావడం కూడా చర్చనీయాంశమైంది. నిజామాబాద్‌ స్కూల్లో ఐదవ తరగతి నుంచి వరుసగా క్లాసు ఫస్టు వస్తున్న ముస్లిం విద్యార్ధి ఒకడు మా తరగతిలో ఉండేవాడు. అతనిపై నెగ్గడం సాధ్యంకాదని కొందరు, వాడి కథ ముగిసిందని మరికొందరు వాదించేవారు. అప్పటికి నాకు మీసాలు కూడా సరిగా రాలేదు. “చాలా చిన్తోడని కొందరు సానుభూతి చూపితే, “పేడి మూతోడు ఎప్పటికీ, పెళ్లి కొడుకే!” అన్న సామెత చెప్పి మరికొందరు ఎగతాళి చేశారు. ఆ స్థితిలో నేను ఆ కుర్రాడి రికార్డు బద్దలు కొట్టి తొమ్మిదవ తరగతిలో స్కూలు ఫస్టు వచ్చాను. అప్పుడు జరిగిన స్కూల్‌ డే ఫంక్షన్‌ కొన్ని సినిమాలలో దృశ్యాన్ని గుర్తుకు తెస్తుంది. 9వ తరగతి ఎ సెక్షన్‌లో ఫస్టు వచ్చినందుకు, తొమ్మిదవ తరగతి నాలుగు సెక్షన్‌లలో కలిపి ఫస్టు వచ్చినందుకు, స్మూలు మొత్తంలో అత్యధిక మార్కులు సాధించినందుకు మూడుసార్లు వేదిక ఎక్కి బహుమతులు తీసుకున్నాను. నా ప్రత్యర్ధి ఎలాటి అక్కసు 76 జి.యస్‌. వరదాచారి

చూపలేదుకాని ఆయన జట్టువారు కొంత అసహనాన్ని వ్యక్తపరచినట్టున్నారు. ఇది నా సహాధ్యాయులు ముఖ్యంగా విద్యార్ధి సంఘ అధ్యక్ష కార్యదర్భులుగా ఉన్న శ్రీధర్‌, వేణుగోపాల్‌ గమనించినారు. వయసులో పెద్దవారు, జీవితానుభవం ఉన్నవారు. ముస్లిం మనఃస్థితి ఎరిగినవారు. పోలీసు చర్య జరిగిన కొత్త రోజులు. ముస్లిం కుర్రాణ్ని పదథభ్రష్టుడిని చేసి వారి దృష్టిలో నేను ఘనకార్యం చేశాను. దానివల్ల నాకేమైనా కీడు జరుగుతుందేమోనన్న శంక వారికి ఉండేది. కాని నాకా స్పృహ లేదు. భయం కూడా లేదు. శ్రీధర్‌, వేణు ఎందుకైనా మంచిదని నన్ను ఓ కంట కనిపెడుతూ ఉందేవారు. నిర్మల్‌లో శేషగిరిరావు లాగానే నిజామాబాద్‌లో రామచంద్ర సింగ్‌ అనే లెక్కల మాస్టారు, వీలైనంత వరకు అభ్యాసపులెక్కలు విద్యార్థుల చేతనే చేయిస్తుండేవారు. ఇక్కడకూడా నేను ఆయన అభిమానాన్ని చూరగొన్నాను. నేను చేయలేనంటేనే ఏ లెక్కనైనా తాను చాక్‌ పీసు చేతబట్టి చేసిచూపేవారు. దీంతో నా పరపతి పెరిగింది. దగ్గర ఉండే పలువురు విద్యార్థులు సందేహాలు తీర్చుకోడానికి ఇంటికి వచ్చేవారు. మాకు జంబులింగం అని ఇంగ్రీషు మాస్టారు ఉండేవారు. గ్రామర్‌ నేర్చడంలో దిట్ట. విద్యార్థులు గైడ్‌లో సమాధానాలు బట్టీపట్టి వ్రాయకుండా స్వంతవాక్యాలు వ్రాయడాన్ని నేర్పించారు. పాఠ్యపుస్తకంలో పాఠాన్ని ఒకటికి రెండు సార్లుచదివితే మంచి భాష అలవడుతుందని ఆయన చెప్పినమాట నేను అక్షరాలా పాటించాను. మా అన్నయ్య కొన్నాళ్లు ఆయన విద్యార్ధి గనుక ఒకసారి కలిసి మాట్లాడినప్పుడు ఈ మధ్యకాలంలో నాలాటి ఇంగ్లీషు వ్రాసే విద్యార్థిని చూడలేదనిచెప్పి మెచ్చుకున్నారట. ఉర్దూలో కూదా నాకు ముస్లిం విద్యార్థులతో సమానంగా మార్కులు వచ్చేవి. పదవతరగతిలో ప్రథమశ్రేణి సాధించగల ఏకైకవిద్యార్థిని నేనే అని టీచర్లందరూ అనేవారు. కాని నొ బలహీనతలను గుర్తించి సరిదిద్దుకొనే మెలకువలు చెప్పడానికి ఎవరూ యత్నించలేదు. నేనైనా తరగతి గదిలో పాఠాలు వినడాన్ని మించి పరీక్షకోసం ప్రత్యేకంగా చదివిందేమీ లేదు. గణితంలో 98, ఉన్నతగణితంలో 81 మార్కులు వచ్చాయి. చరిత్ర భూగోళంలో తక్కువ మార్కులు వచ్చినందున నాలుగు మార్కులతో ప్రథమథేణి తప్పిపోయింది. టి.సి. తీసుకోవడానికి వెళ్లినపుడు హెడ్‌మాస్టర్‌ అబ్బాస్‌ హుసేన్‌. “ఏమయ్యా, నీ మీదపెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు చేశావు!” అన్నారు. ఈ రోజులలో లాంగ్‌ టర్మ్‌ ఇంటెన్సివ్‌ కోచింగ్‌ల లాగా అతిగా రుద్దడం ఆ రోజులలో లేదు. అలా కాకున్నా కనీసం ఇది చదివావా, అది చూశావా అని ఏ ఉపాధ్యాయుదైనా ఒకసారి ప్రశ్చిస్తే విద్యార్థి మెరుగులు దిద్దుకోడానికి అవకాశం ఉండేదని నాకు అప్పుడనిపించింది. జ్ఞాపకాల వరద 77

కళాశాల ప్రవేశం ఆ రోజులలో తెలంగాణ ప్రాంతంలో కళాశాలలు హైదరాబాద్‌ నగరంలో ఐదు, వరంగల్‌ వట్టణంలో ఒకటి మాత్రమే ఉండేవి. నేను హైదరాబాద్‌ వెళ్లి చదువుకుంటానని అనకముందే మా నాయన తెలిసినవారితో సంప్రదించి, ఏర్పాట్లు చేశారు. గౌలీ గూడలో మరింగంటి నర్సమ్మ ఇంట్లో సాపాటు, బస రెంటికి కలిపి నెలకు నలభై హాలీ రూపాయలు ఇచ్చేటట్టుగా కుదిర్చారు. హాలీలంటే నిజాం ప్రభుత్వ స్వంత కరెన్సీ. బ్రిటిష్‌ కరెన్సీతో కొన్ని పైసలు తక్కువ మారకం విలువ కలది. నర్సమ్మ నాయనకు తెలుసు. ఆయన హైదరాబాద్‌ ఎప్పుడు వచ్చినా భోజనం అక్కడే చేసేవారు ప్రవేశసమయానికి నాయన వెంటవచ్చారు. నేను ఇంటర్మీడియట్‌ సైన్స్‌ ఇచ్చిక్షాలు తీసుకొని చదువాలనుకుంటున్నా గనుక సిటీ కాలేజిలో, నిజాం కాలేజీలో దరఖాస్తులు దాఖలుచేశాను. నాకు రెండుచోట్లా సీటు వచ్చింది. కాని సిటీ కాలేజిలోనే ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుకున్న దగ్గరి బంధువు సంపత్ముమారాచారి, నేను ఉండబోయే ఇల్లు గౌలీ గూడలో గనుక సిటీ కాలేజిలో చేరడమే మంచిదని నాయనను ఒప్పించాడు. ఆయన ఇంకో భయంకూడా చెప్పాడు. ఆ రోజులలో అట్లాటి భయాలు ఉండేవి, నిజాం కాలేజీ ఆడా, మగా కలిసి చదువుకునే కాలేజి. పల్లెటూరి పిల్లాడు ఇబ్బందులు పడతాడని చెప్పాడు. నాయన నమ్మారు. ఇప్పుడు చెపితే ఎగతాళిగా ఉంటుంది కాని, 1950లో కొత్తగా వస్తున్న విద్యార్థులకు సీనియర్లు కో-ఎజుకేషన్‌ కాలేజీల గురించి రకరకాల కథలు చెప్పేవారు. మా ఊళ్లోనే కొందరు మాకంటే పెద్దదయసువారు, హైదరాబాద్‌ ముఖంకూడా చూడనివారు, ఎన్నో కల్పితకథలు చెప్పారు. అవన్నీ అబద్ద్ధాలని వినగానే అర్థమవుతుంది. అయినా చెప్పేవారికో సరదా. వినేవారికో వినోదం. ఒకరిని మించి ఒకరు కల్పించి చెపుతుంటే మానవస్వభావం కొంత బోధపడింది. మనమెవరం, మనస్థితిగతులేమిటి, మననెవరో ఎందుకు బుట్టలో. పడేస్తారు అనేవన్నీ ఆలోచించి, ఏదైనా స్వయంగా చూస్తేగాని నమ్మగూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పటిలాగా ఆ రోజులలో ర్యాగింగ్‌లు లేవు. ఏమైతేనేం, నేను సిటీ కాలేజిలో చేరాను. గౌలీ గూడలో (ప్రసిద్ధ రామమందిరానికి ఎదరుగా ఉన్న సన్న సందులో కొంచెం దూరంలో బాలాజీ మందిరం ఉంది. దాని పక్కనే నరసమ్మ ఇల్లు, నరసమ్మ మేనల్లుడు యాదగిరి, నేను ఒకేగదిలో ఉండేవాళ్లం. నరసమ్మకు వితంతు కూతురు ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. పెద్దావిడే. చిలుకమళ్ఞి శ్రీనివాసాచారి అనే అతడిని దత్తత తీసుకుంది. పెళ్లి చేసింది. వాళ్లకు వేరేగదులు ఉండేవి. అత్తా, కోడలు పెద్దావిడ కలిసి వండి వడ్డించి పొట్టగడుపుకొంటుండేవారు. 78 జి.యస్‌. వరదాచారి

ఇంటి నుంచి కాలేజికి మేము ఎక్కువగా నడిచే వెళ్లేవారం. లేదంటే గౌలీ గూడ చమన్‌లో ఉన్న బస్‌ స్టాపు వరకు వెళ్లి బస్సు ఎక్కి నయా పుల్‌ దగ్గర దిగి నడుస్తూ నయా పుల్‌ హైకోర్టు దాటి సిటీ కాలేజి వెళ్లాలి. అంటే సగం దూరం నడువక తప్పదు. కనుక చమన్‌ దగ్గరకు చేరేసమయానికి బస్సు సిద్ధంగా లేకపోతే, మిగతా సగం కూడా నడిచేవాళ్లం. జ్ఞానభాందాగారం

సిటీ కాలేజీలో మాదో మిత్రబ్బందం ఏర్పడింది. కాని చెప్పవలసిన విషయం అదికాదు. సిటీ కాలేజీది చాలా పెద్ద భవనం. ఇప్పటికీ అలాగే వాడుకలో ఉన్నది. ఆజం హాలు (అంటే పెద్ద హాలు అని అర్ధం) సభలు జరుపుకోవడానికి ఉంది. వీటికంటే ముఖ్యమైంది పెద్ద గ్రంథాలయం. మా ఊళ్లో గ్రంథాలయం లేనికొరత గురించి చెప్పాను. నిజామాబాద్‌లో మా స్కూలు ఎదుటే మహాత్మా గాంధీ సార్వజనిక వొచనాలయం అని ఉందేది. కాని అక్కడ పటత్రికలే ఉందేవి. సిటీ కాలేజి (గ్రంథాలయంలో ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, తదితరభాషల పుస్తకాలు చాలా ఉండేవి. నేను తెలుగు పుస్తకాలు దాదాపు అన్నీ దొరికినవి దొరికినట్టు చదివాను. విషయపరిజ్ఞానం, భాషాజ్ఞానం కూడా పెంచుకున్నాను. పదవ తరగతి వరకు ఉర్దూ బోధనభాష. ఇంటర్‌కు వచ్చేసరికి ఇంగ్లీషు బోధనభాష అయింది. సంధికాలం. విద్యార్థులకు, లెక్చరర్లకు కూడా అదే మొదటి సంవత్సరం. నిజాం కాలేజీలోతప్ప మిగతా అన్ని కాలేజీల లెక్చరర్లు ఉర్దూలో బోధించడానికి అలవాటు పడ్డవారు. ఇంగ్లీషులో పాఠాలు చెప్పడానికి అవస్థ వదేవారు. ఉర్దూ ఇంగ్లీషు కలివి కొడుతుండేవారు. మాకూ అదో సౌలభ్యం. దానిలో మళ్లీ చిక్కులున్నాయి. తెలుగులాగే ఇంగ్లీషుభాషను ఎడమవైపు నుంచి ప్రారంభించి కుడివైపు వ్రాస్తూ పోతామా, ఉర్జూ అందుకు విరుద్ధం. అది కుడినుండి ఎడమకు ఎదురు నడుస్తుంది. వాక్యం మధ్యలో భాష మార్చినప్పుడు వదిలిన స్థలం సరిపోక అక్షరాలు పైకెక్మేని. సమానార్థకాలు బోధపదేవి కాదు. అస్తవ్యస్తస్థితి,

నిజామాబాద్‌లో నా క్లాసు మేట్‌గా విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఉండిన శ్రీధర్‌ ఇక్కడ మళ్లీ నా క్లాస్‌ మేటు. శ్రీధర్‌ నేనుండే వీధిలోనే నాలుగిళ్ల అవతల ఉండేవాడు. ఐదారుగురు అవుసలి అంటే కంసాలి మిత్రులతో కలిసి ఉండేవాడు. అవుసలి, అగసాలి అనేవి పర్యాయపదాలు. శ్రీధర్‌ కంసాలి అని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. వారు నాతో ఆప్యాయంగా ఉండేవారు. నేను వారి కులంవాడినే జ్ఞాపకాల వరద గ్గరి

అని కొందరు అనుకునేవారేమో నాకు తెలియదు. కంసాలివారు కూడా పేర్ల చివరన చారి పెట్టుకోవడం అప్పటికే ఉన్నది. ఐతే ఆ పేర్లు కులం తెలిసేట్టుగా ఉండేవి. ఉదాహరణకు వెంకయ్యాచారి, వీరభడ్రాచారి, కిష్టయ్యాచారి వగైరా. శ్రీవైష్ణవుల పేర్లు అలా ఉండవు. వెంకటాచారి, కృష్ణమాచారి లేదంటే కిష్టమాచారి అని ఉంటాయి. శివసంబంధమైన పేర్లు ఏ రూపంలోనూ ఉందవు. కంసాలులలో వరదాచారి అనే పేరు ఉన్నట్టు నాకైతే తటస్థపడలేదు. పేరులో చారి ఉన్నందునే ఆ గుంపుకంతటికీ నా మీద అభిమానమేమో తెలియదు. హైస్కూలులో నా రికార్డు తెలిసి నేనంటే గౌరవం ఏర్పడి ఉండనూ వచ్చు. వారిలో వెంకటాచారి అని ఒకాయన ఉండేవాడు. చాదర్‌ ఫాట్‌ కాలేజీలో చదువుతుందేవాడు. వయసులో మాకంటే పెద్దే. సాంఘిక దురాచారాలు నిర్మూలించడం వంటి ఏదో ఘనకార్యం చేయాలని తపన కలవాడు. ఆ రోజులలో అవుసలివారిలో కూడా (బ్రాహ్మణుల్లో లాగానే బాలవితంతువుల పునర్వివావోలు లేవుట. దానిగురించి ఉద్యమం ఏదో నడుపుతున్నట్టు చెప్పేవాడు. ఆయనతో మాట్లాడుతుంటే కన్యాశుల్కం నాటకంలో గిరీశం గుర్తుకు వచ్చేవాడు. గిరీశానికున్న అవగుణాలు లేవక్షాన్సి మాటతీరు అలాగే ఉండేది. నేనప్పటికి కన్యాశుల్కం చదివేశాను. కనుకే ఈ పోలిక చెవ్వైన్సు. మాతో వాదుకు దిగేవాడు. నాకోసారి విసుగుపుట్టి, అయ్యా “మాకు పెళ్లిళ్లు అయిపోయాయి. వితంతువును ఉద్ధరిద్దామనుకున్నా అవకాశం లేదు, నీవు ఇంక్రా అవివాహితుడవు. ఆచరించి చూపి ప్రచారం చెయ్యి” అని నిష్టూరంగా అన్నాను. నా క్రాళ్ళమ్సీద నిలబడే స్థితి వచ్చాక తప్పక చేసిచూపిస్తానన్నాడు. మా చదువులు పూర్తయి అందరం చెల్లాచెదరయి పోయాక, కొన్నేళ్లకు ఒకరోజు సుల్తాన్‌ వెజార్సు చౌరస్తాలో కనబడ్డాడా వెంకటాచారి. “అబ్బా! ఎన్నాళ్లకు దొరికావయ్యాగ?” అని కౌగిలించుక్తున్నాడు. ఇంటికి వచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టాడు. గౌలీ గూడాలోనే ఉంద్సి దూరం లేదన్నాడు. “నువ్వు ఇంత ఆప్యాయంగా పిలుస్తున్నప్పుడు కొదనేదేమ్సుంద్ష? పదా" అని వెంటవెళ్లాను. భార్యను పిలిచాడు. “నేను చాలాసార్లు చెపుతుంట్రాన వరదాచారి అని, ఇతడే” అని పరిచయం చేశాడు. అందమైన అమ్మాయి. ముఖాన కుంక్రుము బొట్టు, తలలో మల్లెపూలదండతో కళకళలాడుతున్నది. ముఖంమీద చూపుడువేలు పెట్టీ “బాలవితంతువు. నీవు అన్నావే, అలాగే పెళ్లి చేసుకున్నా” అన్నాడు.

ఆ అమ్మాయి సంగతేమిటోగాని నాకు చాలా బాధ కలిగింది. చాయ్‌ తెన్తానని అమ్మాయి లోపలికి వెళ్లగానే వెంకట్రాదారికి నాలుగు వడ్డించాను. “నీవు సంస్కారవంతమైన పనిచేశావు, కాన్సి చెప్పే విధానమిది కాదు. ఇంకెప్పుడూ అమ్మాయిని బాలవితంతువని, 80 జియస్‌. వరదాచారి

పునర్వివాహం చేసుకున్నానని అనను” అని మాటతీసుకున్నాను. అలాగే మరో ఇద్దరు కట్నం తీసుకోకుండా పెళ్లిళ్లు చేసుకున్న మిత్రులు ఆ మాట పదేపదే చెపుతుంటే, అలా ఇంకెప్పుడూ చెప్పబోమని ప్రమాణం చేయించాను. చేసింది మంచి పనే. సందేహం లేదు. కాని దాన్ని గురించి చెప్పుకోవడం అవతలివారిని బాధిస్తుంది. దినచర్యలో లైబ్రరీలు

ఇంటర్మీడియెట్‌ చదివే రోజులలో నా దినచర్య క్రమపద్ధతిలో సాగేది. ఉదయం కాలకృత్యాలు, స్నానసంధ్యావందనాలు, ఆ తర్వాత భోజనం, కాలేజీకి వెళ్లడంతో సరిపోయేది. సాయంకాలం ఐదు కాగానే శుభ్రంగా తయారై ముందు గౌలీగూడ చమన్‌లో ఉన్న ఖాల్చా లైబ్రరీకి వెళ్లేవాడిని. అది సిక్కులు నడుపుతున్నది. పక్కనే వారి గురుద్వారా ఉంది. దానికి అనుబంధంగా లైబ్రరీ. అక్కడ ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషల పత్రికలు, ఇల్లప్టేటెడ్‌ వీక్లీ వంటి మ్యాగజిన్‌లు వచ్చేవి. నలువైపుల నుంచి చాలామంది అక్కడికి వచ్చేవారు. ఆరుగంటలయ్యేవరకు అక్కడ భిన్నభాషల పత్రికలు తిరగేసేవారం. ఆరింటికి రేడియోలో వార్తలు పెట్టేవారు. వార్తల సమయానికి చాలామంది జనం పోగయ్యేవారు. వార్తలు అయిపోగానే అందరితోపాటు నేనూ బయటకు వచ్చి, సుల్తాన్‌ బజార్‌ చౌరస్తా వైపు నడకసాగించే వాడిని. సుల్తాన్‌ దఐిజార్‌ చౌరస్తాకు ఆ రోజులలో ఓ ప్రత్యేకత ఉందేది. అదో కూడలి స్థలం. నలువైపుల నుంచి జనం వాహ్యాళికి వచ్చేవారు. మిత్రులు కలిసేవారు. వచ్చి పోయేవాళ్లను చూడటం. సరదా కబుర్లు చెప్పుకోవడం. పకృ్శనే ఉన్న చాయ్‌ దుకాణంలో కడక్‌ చాయ్‌, మలైదార్‌, ఖడా చెంచా (మీగడపాలతో చక్కెర ఎక్కువ వేసి చంచా మధ్యలో నిలబడేట్టు చేసిన చాయ్‌) తాగి, ఓసారి కృష్ణదేవరాయ భాషానిలయంలోకి తొంగి చూడటం అలవాటు. భాషానిలయంలో రోజూ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉండేది. కొంత సేపు ప్రసంగాలు విని నచ్చితే ఉండటం, లేకపోతే జారుకోవడం. ఒకవైపు భాషానిలయంలో సాహిత్య సాంస్కృతికసభలు జరుగుతూ ఉంటే మరో వైపు కొంచెం దూరంలోనే సుల్తాన్‌ బజార్‌ హైస్కూలు ముందున్న క్లాక్‌ టవర్‌ మైదానంలో చిన్నపాటి రాజకీయసభలు తరచుగా జరుగుతుండేవి. అవే మరికొంత పెద్ద సభలైతే ఇంకొంచెం దూరంలో ఉన్న హష్మత్‌ గంజ్‌లో, భారీ సభలైతే బ్యాంక్‌ ప్టీట్‌లో - ఇప్పుడు చెవి, ముక్కు గొంతు వ్యాధుల ఆస్పత్రి ఉన్న ప్రతాప్‌ గీర్టీ కోఠీ ఆవరణలో - జరుగుతుండేవి, లోకజ్ఞానం పంచుకోవాలంటే సభలకు వెళ్లాలి. శ్రద్ధగా వినాలి. రాజకీయసభలలో సాధ్యంకాదు గాని, సాహిత్య సాంస్కృతిక సభలలో సందేహాలుంటే నిర్భయంగానే జ్ఞాపకాల వరద 81

కాని, మర్యాదగా అడిగి నివారించుకోవాలి. దేన్నీ గుడ్డిగా నమ్మగూడదు. దేన్నీ మనకెందుకులే అని వదిలేయగూడదు. కొత్తగా ఆలోచించాలి. తార్మికంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇవీ ఆ రోజులలో మా ఆలోచనలు. సభలలో, సమావేశాలలో అయినా, తరగతి గదిలో అయినా ఇదే పద్ధతి. ఎవరైనా “ఈ పని చేస్తావా?” అని అడిగితే, శారీరకంగా హాని కలిగించనిదీ, చట్టవిరుద్ధం కానిది, నేరంగా పరిగణించ బదనిదీ అయితే ఓ అని ముందుకువచ్చేవారం. శక్తి కొలది ప్రయత్నించేవారం. ఎక్కువసార్లు విజయం సాధించేవాళ్లం. అచ్చయిన తొలి కథ సిటీ కాలేజీలో ఐదారుగురం సన్నిహితవర్దంగా మారిపోయాం. వీరిలో ఇద్దరు భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం ్రాక్టికల్స్‌లో నా (గ్రూప్‌ మేట్లయిన మూర్తి, ఆర్‌. శ్రీనివాసన్‌”మరొకరు నగరవాస్రవ్యుడైన పి. నరసింహారెడ్డి. ఈయన డిగ్రీలో కూడా నా క్లాస్‌ మేట్‌, కలకత్తా వెళ్లి గణాంకశాస్త్రంలో పి.జి. చేసివచ్చి, మళ్లీ న్యాయశాస్త్రం ఎల్‌ఎల్‌. బిలో నా క్లాస్‌ మేట్‌ అయ్యాడు. హైదరాబాద్‌ నగర మునిసిపల్‌ ఇంజినీరుగా ఉన్న రామచంద్రారెడ్డి కుమారుడు. తర్వాత కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడుగా వనిచేయడమేగాక రెడ్డి మహిళా కళాశాల, తదనుబంధసంస్థల కార్యదర్శిగా చిరకాలం పనిచేసి, పేరుప్రఖ్యాతులు గడించాడు. మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన రామకృష్ణ ఈయన కాలేజీ తెలుగు సారస్వత సమిత్తి కార్యదర్శిగా ఎంపికయ్యాడు. ఒకరోజు నేను మా ఇంట్లో రెండు బజ్టెలు, ఒక ఆవు ఉన్నాయన్నాను. “బత్దేమిటయ్యా బజ్జె? గేదె అనలేవూ?” అని తప్పు పట్టాడు. “మా వైపు బజ్జై అనే అంటారు. మాండలికాలు ఉంటాయి. అవీ తెలుగే. వాటిని వాడటం తప్పుకాదు" అని సమాధానమిచ్చాను. అలా రామకృష్ణ మాండలికాలను నా దృష్టికి తెచ్చాడు. రామకృష్ణ మరో పని చేశాడు. ఆయన సారస్వత సమితి కార్యదర్శి అని చెప్పానుకదా. సమితివారు కాలేజీ వార్షిక మ్యాగజిన్‌ వేస్తున్నారు. ఇంగ్లీషు లెక్చరర్‌ వెంకటాచారి హితవరిగా ఉండేవారు. రామకృష్ణ నా వద్దకువచ్చి “మ్యాగజిన్‌కు నువ్వో కథ రాస్తున్నావు” అన్నాడు. వారంలోగా ఇచ్చేయాలన్నాడు. నీవు రాస్తున్నావని నేను వెంకటాచారిగారికి చెప్పేశానన్నాడు. అప్పటికి నేను కధ కాని, కవిత్వం కాని, మరో సృజనాత్మక రచన కాని చేసి ఎరుగను. కాదు అనరాదు అన్న మొండితనం ఉంది. రాత్రి భోజనాలయ్యాక నోట్‌ బుక్‌ పెన్ను పట్టుకుని కూర్చున్నాను. ఆ రోజులలో నిజాం కాలేజీలో ఇందిర అని ఓ అమ్మాయి ఉందేది. అందమైంది, తెలివైంది. 8జి జి.యస్‌. వరదాచారి

అంతర్‌కళాశాలల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుందేది. మంచి వాగ్గాటి కలది. ఆమెతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కాని ఇందిర పేరు బాగుంది. నేను వబ్రాయబోయే కథలో నాయిక పేరు ఇందిరఅని నిర్ణయించుకున్నాను. ఇందిరకు దీటుగా కథానాయకుడి పేరు సుందర్‌ అనుకున్నాను. ఏం వ్రాద్దాం, ఎలా వ్రాద్దాం ఏమీ తెలియదు. ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ప్రణాళిక లేదు. సరే, అమ్మాయి పెద్ద ధనవంతురాలు. చదువులో అగ్రగణ్యంగా ఉన్న సహవిద్యార్థి, పల్లెటూరి అమాయకుడితో (ప్రేమలో పడితే మంచికథ అవుతుందనిపించింది. ముగింపు అనుకోకుండానే (వ్రాస్తూపోయాను. మంచితనం, ఇద్దరి స్నేహాన్ని పెంచడం, అది అమ్మాయివైపునుంచి ఏకపక్షప్రేమగా మారడం, ఆమె ఆ విషయం ఐయటపెట్టక ముందే కథానాయకుడికి చిన్నతనానే పెళ్లయిన విషయం ఆమెకు తెలియడం, ఆమె కుమిలి, కృశించి మనోవేదనతో మరణించడం. ఇలా సాగింది. ఇవాళ నలిగిన ఫార్ములాయే. కాని అరవై ఏళ్లకింద, ఇరవై ఏళ్లయినా నిండని కుర్రాడికి ఆసక్తికరమైన కథనమే. కథను కథానాయకుడు చెపుతున్నట్టుగా మలిచాను. చివరన ఇందిర లేని జీవితం వ్యర్ధృమనుకుంటాడు నిస్సహాయుడైన కథానాయకుడు. ముగింపు ఉల్లేఖిస్తాను

  • “అని మరణించానా. లేదు జీవిస్తున్నాను జీవచ్చవంలా. ఇందిరనా హృదయంలో మాసినపటంగా మారిపోయింది. అప్పుడప్పుడు ఆ పటాన్ని రెండు కన్నీటి బిందువులతో తుడవడానికి ప్రయత్నిస్తాను.”

మర్చాడు కథను తీసుకుని రామకృష్ణతో కలిసివెళ్లి వెంకటాచారిగారికి ఇచ్చాను. మూడో రోజు ఆయన కలిసినప్పుడు “కథ బాగుందోయ్‌. (ప్రేమపుష్పము అని పేరు మార్చాను. అచ్చుకు ఇచ్చాను” అని చెప్పారు. అలా నా మొదటి కథ కాలేజి మ్యాగజిన్‌లో అచ్చయింది. దాన్ని మురిపెంగా దాచుకున్నాను. పత్రికారచనలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు స్వర్ణోత్సవ సంఘం ప్రచురించిన 'వరద స్వర్దాక్షరి అభినందన సంచిక తొమ్మిదవ భాగం పల్లవించిన పాళీలో దాన్ని అచ్చువేశాను. మాతృవియోగం

నేను ఇంటర్మీడియట్‌లో ఉండగా మా కుటుంబంలో మా జీవితగమ్యాలను మార్చివేసే రెండుసంఘటనలు జరిగాయి. ఒకటి మా అన్నయ్య నరసింహాచారి తనకోసం మా నాయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దుకాణాన్ని నడపటం మానేసి టీచర్‌ ఉద్యోగంలో చేరడం. దుకాణం బాగా నడుస్తుండేది. ఊళ్లో మంచి పేరువచ్చింది. కాని తన బావమరదుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగంలో చేరడమే (శ్రేయస్కరమని ఇచ్చిన జ్ఞాపకాల వరద 88

సలహా, అన్నయ్యకు సరైందనీ అనిపించింది. “ఒక తమ్ముడు (నేను) ఇంటర్‌కు వచ్చాడు. ఇంకా ఇద్దరు తమ్ముళ్లు (ప్రాథమిక తరగతుల్లో చదువుకుంటున్నారు అందరూ పెద్ద చదువులు చదివి మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే స్థితికి వస్తారు. వ్యాపారంలో భాగస్వామ్యం కూడా అడుగుతారు. వ్యాపారం లాభసాటిగా ఉండవచ్చూ లేకపోనూవచ్చు. వయసు మీరినందున అప్పుడు నీకు ఉద్యోగం చేసే అవకాశమూ ఉండదు. ముందే జాగ్రత్త పడటం మంచి” దని చెప్పాడు. అన్నయ్య ఏడవతరగతి ఉత్తీర్ణుడై ఉన్నాడు గనుక, టీచర్‌ ఉద్యోగం దొరుకుతుంది. దరఖాస్తు పంపగొనే ఉద్యోగం వచ్చింది. ఆర్మూరు తాలూకాలోనే ఇప్పటి బేమ్‌గల్‌ మండలంలోని విప్పెర అనే పల్లెలో వేశారు. పెళ్లాన్ని తీసుకొని వెళ్లి ఉద్యోగంలో చేరాడు. దుకాణం నడపడానికి అప్పటికి గుమాస్తా కూడా లేడు. మా నాయన నేనే నడుపుతానని కొన్నాళ్లు నడిపారు కాని, అభిమానవర్గం ఆయనను పౌరోహిత్యం మాననీయలేదు. “వ్రతాలు, క్రతువులు ఏవైనా, మీరు వచ్చినపుడే” అని మొండికేసేవారు. నాయనకు పౌరోహిత్యమే ప్రధాన వ్యాపకం. వారిని కాదనడం ఇష్టముందేది కాదు. దుకాణానికి తాళంవేసి వెళ్లిపోయేవారు. దానితో చారిగారి దుకాణం ఎప్పుడూ మూసేఉంటుందని పేరువచ్చింది. (గ్రాహకులు రావడం మానేశారు. ఊళ్లో అమ్మకం పన్ను కడుతున్న కొద్ది దుకాణాలలో మాదొకటి. పొరపాటున నాయన రెండుసార్లు పన్ను కట్టారు. దాంతో విసుగెత్తి దుకాణం అమ్మేశారు. రెండవది కుటుంబసభ్యులందరినీ విషాదంలో ముంచెత్తిన దుస్సంఘటన - మా అమ్మ హఠాన్మరణం. కలరా వచ్చి మరణించింది. ఆ రోజులలో కలగా, ప్లేగు రెండు మహమ్మారి వ్యాధులు. వందలమంది చనిపోతుండేవారు. రెండూ అంటు వ్యాధులు, కలరావ్యాధికి గురైనవారు ఆగకుండా అయ్యే వాంతులు, విరేచనాలవల్ల ఒంట్లో తదారిపోయి తుది శ్వాస విడిచేవారు. ప్లేగు మరింత భయంకరమైంది. ఈ వ్యాధి ప్రబలితే ఊళ్లకు ఊళ్లు ఖాళీచేసి తాత్కాలికంగా ఊరికి దూరంగా గుడిసెలు, గుడారాలు వేసుకొని ఉండేవారు. రెండు వ్యాధులూ, పరిసరాల అశుభ్రత వల్ల ప్రాణాంతక బ్యాక్టీరియా విపరీతంగా పెరిగి ముప్పు తెస్తాయి. ప్లేగు బ్యాక్టీరియా ముందు ఎలుకలలో ప్రవేశిస్తుంది. అవీ పెద్ద సంఖ్యలో చచ్చిపడిపోతుంటాయి. వాటిపై వాలిన కందిరీగల ద్వారా మనుష్యులకు వ్యాధి సంక్రమిస్తుంది. అందుకే ఊరువదిలి శిబిరాల్లో ఉండేవారు. వ్యాధి పూర్తిగా తగ్గిన తర్వాతనే ఇళ్లకు తిరిగివెళ్లేవారు. ఈ రెండు వ్యాధులూ ప్రపంచమంతటా నిర్మూలింపబడటం సంతోషించదగిన విషయం. రశ జియస్‌. వరదాచారి

మా అమ్మ కలరా వ్యాధితో చనిపోయిందని, వెంటనే ఊరికి రమ్మని హైదరాబాద్‌కు పనిమీద వస్తున్న వ్యక్తితో నాకు కబురు పంపారు. నేను వెంటనే బయళట్టేరి సమయానికి చేరుకోగలిగాను. ఆ రోజులలో సాయంత్రం లోపల అంత్యక్రియలు పూర్తి కావలసిందే. ఈ రోజులలోలాగా దూరప్రాంతాలలో ఉన్న బంధువులకోసం పార్ధివశరీరాన్ని మంచుపెట్టెలలో పెట్టిఉంచే పద్ధతిలేదు. వాడకట్టులో శవం ఉండగా ఎవరి ఇంట్లోనూ పొయ్యి రాజేసేవారు కాదు. పిల్లలు, వృద్దులుంటే వారిని వేరేవాడలో ఉన్న బంధువుల ఇళ్లకు పంపి భోజనం పెట్టించేవారు.

అమ్మ చనిపోవడం, పెద్ద కొడుకు, కోడలూ ఉద్యోగం నిమిత్తం వేరే చోటికి వెళ్లిపోవడంతో ఇంట్లో పెద్ద వెలితి ఏర్పడింది. మా అక్క బావ వారి స్వగ్రామం వెల్మలలో ఉండేవారు. మా చెల్లెలి పెళ్లి అప్పటికే జరిగిపోయింది. చినబావకు ఓవర్సీయర్‌ ఉద్యోగం రావడంతో ఆమె కాపురానికి వెళ్లిపోయింది. నాకూ పెళ్లి అయింది కాని, చదువు నిమిత్తం నేను హైదరాబాద్‌లో ఉండటంతో కాపురం పెట్టలేదు. తమ్ముల్లిద్దరూ చిన్నపిల్లలు. వారికీ, తనకూ వండి వడ్డించి, మంచీ, చెడూ చూచుకునేందుకు నాయనకు ఒక తోడు కావాలి. మరో పెళ్లే పరిష్కారం అనుకున్నారాయన. కాని ఆరుగురు పిల్లల తండ్రికి ఈ ప్రాంతంలో పిల్లనెవరిస్తారు. అదీగాక పదహారు పద్ధెనిమిదేళ్ల వయసున్న పెళ్లికాని పిల్లలెవరూ ఈ ప్రాంతంలో ఆ రోజులలోఉండేవారు కాదు. మైసూరు రాష్ట్రంలో వయసు వైష్ణవ ఆడపిల్లలు దౌరికేవారు. అప్పటికే మా నమీపబంధువు ఒకరు, నాయనకంటే కొంచెం పెద్దదయసువారు, నలుగురు పిల్లల తండ్రి, మైసూరు నుంచి ఇరవైల పడిలో ఉన్న అమ్మాయిని పెళ్లాడి తెచ్చుకున్నారు. ఆయన సలహాతో మా నాయన మైసూరు వెళ్లి, సంప్రదాయ వైష్ణవకుటుంబంలో అమ్మాయిని ఎంపిక చేసుకొని, ఆమెను, ఆమె తండ్రిని వెంటబెట్టుకొని వచ్చారు. బెంగళూరు రైలులో హైదరాబాద్‌కు పొద్దున్నే చేరుకున్నారు. నేరుగా నేను ఉంటున్న నర్సమ్మ ఇంటికే వచ్చారు. స్నానపానాదికాలు ముగించుకొని ఆర్భ్మూరుకు బస్సులో వెళ్లిపోయారు. ఊళ్లో స్థితిగతులు చూసి, అమ్మాయి భవిష్యత్తు గురించి వాళ్ల నాయన సంతృప్తి చెందినాక, ఆర్భ్మూరుకు సమీపంలో ఉన్న ఈశపల్లి దేవాలయంలో పెళ్లి తంతు ముగించారు. పెళ్లికూతురు అక్కను కూడా ఈ ప్రాంతంలోని దుబ్బాకలో ఒక అర్బకస్వామికి ఇచ్చినట్టు మాకు తర్వాత తెలిసింది. మా అమ్మకు మేము నలుగురం మగపిల్లలం, ఇద్దరు ఆడపిల్లలు - మొత్తం ఆరుగురం సంతానమైతే, జ్ఞాపకాల వరద 85

మా చిన్నాయికి (సవతి తల్లిని మేమంతా అలాగే పిలుస్తాము) కూడా ముగ్గురేసి చొప్పున ఆరుగురు పిల్లలు. రమాదేవి, శ్యామ్‌, వనజ, సుదర్శన్‌, లత, రమేశ్‌. అందరూ జీవితంలో బాగానే స్థిరపడ్డారు. మా చిన్న తమ్ముళ్ళిద్దరూ ప్రభుత్వోపాధ్యాయులుగా ఉద్యోగాలు చేయడంతోపాటు పౌరోహిత్యంలో కూడా పేరు గడించారు. ఇంకొక విషయాన్ని గురించి కూడా చెప్పాలి. మా అమ్మ పోయి కుటుంబమంతా అయోమయస్థితిలో ఉన్నప్పుడే, 1951లో సూతకంలోనే మా వదిన ప్రసవించింది. అన్నయ్యకు మొదటి కొడుకు, నాయనకు మొదటి మనుమడు, ఎటువంటి ఆనందోత్సాహాలకూ తావులేని పరిస్థితుల్లో పుట్టాడు. అప్పుడే పేరులో కులాన్ని సూచించే ప్రత్యయం ఇక వాడరాదని నిర్ణయించి మా అన్నయ్య మోహన్‌ అని పేరు పెట్టారు. ఆ తర్వాత మా కుటుంబంలో పిల్లలెవరికీ *చార్లు లేవు. మా అమ్మ కలరా వల్ల చనిపోలేదనీ, గర్భ(స్రావం కోసం పసరు మందు తాగితే వికటించి చనిపోయిందనీ, మాకు కొన్నేళ్ల తర్వాత పెద్దలు మాట్లాడుకుంటుంటే తెలిసింది. మా ఊళ్లో సర్కారు దవాఖాన ఎప్పటి నుంచో ఉంది. ఎం.బి.బి.యస్‌ దాక్టరు కూడా ఉండేవాడు. కాని తల్లికి హాని కలుగకుండా గర్భ(ప్రావం చేసే సౌకర్యం అప్పుడే కాదు, కొన్నేళ్ల క్రితం వరకు లేదు. పైగా గర్భ(స్రావాలపై నిషేధం ఉండేది. పల్లెటూళ్లలో నాటువైద్యులు ఏదో ఆకు పసరుపోసి గర్భస్రావం జరిపించేవారు. మా అమ్మకు ఒకసారి బాగానే జరిగిందట. రెండవసారి 'ప్రాణాంతకమైంది. ఆ రోజులలో సరైన వైద్యసౌకర్యాలులేక ఇలా ఎందరో మహిళలు అర్భ్థాయుష్ములుగా చనిపోతుండేవారు. ఇంకొందరు ప్రసూతిసమయంలో చనిపోతుందేవారు. ఇవాళ్ల మాతాశిశు సురక్షాపథకాల వంటివి అమలు జరుగుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునే విషయంలోనే ఇంకా తగినంత చైతన్యం జనంలో తీసుకురావలసిన అవసరం ఇప్పటికీ ఉన్నది. నాన్‌ ముల్మీ! గో బ్యాక్‌! నేను ఇంటర్‌ రెండవ సంవత్సరంలో ఉండగా 1952లో ఒకరోజు కాలేజీకి వెళ్లేసరికి విద్యార్థులంతా గేటు దగ్గరే గుమిగూడి ఉన్నారు. “నాన్‌ ముల్మీ! గో బ్యాక్స్‌ గోర్వాలా కమిటీ ముర్దాబాద్‌గ” అని నినాదాలు చేస్తున్నారు. ఉద్యమంలో భాగంగా ఊరేగింపు తీస్తున్నామన్నారు. ఊరేగింపు హైకోర్టు, నయా పుల్‌ల మీదుగా అప్టల్‌ గంజ్‌ చేరేసరికి పోలీసులు అటకాయించారు. రాళ్లు రువ్వడం మొదలైంది. చివరకు పోలీసులు కాల్పులు జరపడం వరకు వెళ్లింది. విద్యార్థులం వీలైన సందుల్లోకి పరుగెత్తి 86 జియస్‌. వరదాచారి

అటునుంచే ఇళ్లకు వెళ్లిపోయాం. మర్నాడు కాలేజీకి వెళ్లేసరికి గేటువద్ద ముందు రోజు పరిస్థితే. పోలీసు కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు చనిపోయారని, వారి శవాలను విద్యార్థులకు అప్పగించాలని కోరుతూ, మళ్లీ అష్టల్‌గంజ్‌ వరకు ఊరేగింపు తీశారు. ఉస్మానియా ఆస్పత్రి గేటు ముందు విద్యార్థుల ధర్నాకు దిగారు. ఏమవుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితి. అప్పుడు పద్మజానాయుడు వచ్చి విద్యార్థులను ఉపశమింపజేయడానికి ప్రయత్నించారు. పోలీసులతో మాట్లాడీ సమస్యను పరిష్కరించారు. అప్పటికి ఆమె ఏ పదవిలో లేరు కాని, సరోజినీనాయుడు బిడ్డగా ఆమె మాటకు విలువ ఉందేది. అప్పుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి. ప్రతాప్‌ గీర్జీ కోఠీలో తెలుగు సభలేవో జరుగుతున్నాయి. ఆ రోజు మహిళాసాహిత్యకారుల సమావేశాలు జరుగుతున్నాయి. సాహిత్యసభలంటే ఇష్టం గనుక ధర్నాస్థలంనుంచి మా మిత్రబృందం అక్కడికి చేరుకున్నాము. ఆ నాటి సభకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి సతీమణి వచ్చారు. అరగంటసేపట్లో విద్యార్థుల పెద్ద గుంపు సభాస్థలికి వచ్చింది. అరుపులు విని మేము బయటకు వచ్చాము. ముఖ్యమంత్రి కారు చూచి ఆందోళనకారులు సభలో ఆయన ఉన్నారనుకున్నారు. ముఖ్యమంత్రి బయటకు రావాలని నినాదాలు చేశారు. కారుమీద దాడిచేసి అద్దాలు పగులగొట్టి నిప్పంటించారు. తర్వాత ముఖ్యమంత్రి లేరని తెలుసుకొని వెళ్లిపోయారు. ఆ రోజులలో ముఖ్యమంత్రికీ, ఆయన భార్యకు కూడా ప్రభుత్వ కారు ఒక్కటే దిక్కు ఇవాళ్డి మందత్రుల వైభోగంతో పోల్చలేని పరిస్థితి. ఉర్దూ మాధ్యమం టెన్స్‌ చివరి బ్యాచి సందర్భం వచ్చింది గనుక రామకృష్ణారావు గురించి చెప్పాలి. రామకృష్ణారావు బహుభాషాకోవిదుడు, పరిపాలనదక్షుడు అని అందరికీ తెలుసు. హైదరాబాద్‌ రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత కొంతకాలం మిలిటరీ ప్రభుత్వం ఉండేదనీ తెలుసు. ఆ తర్వాత 1948లోనే వెల్లోడి ముఖ్యమంత్రిగా ఏర్పాటైన పౌరప్రభుత్వంలో, తెలంగాణ [ప్రాంతం నుంచి మండ్రులైన వారిద్దరిలో రామకృష్ణారావు ఒకరు. వల్లూరి బనవరాజు మరొకరు. మరాఠ్వాడ, కర్ణాటక ప్రాంతాలనుంచి మరో ఇద్దరు మం(క్రులుందేవారు. బూర్గులవారు రెవెన్యూ, విద్యాశాఖలను నిర్వహిస్తుందేవారు. ఆ రోజు ఆయన తెచ్చిన భూసంస్కరణలు దేశంలోకెల్లా ప్రగతిశీలమైనవని కొనియాదబడ్డాయి. విద్యారంగంలో కూడా ఆయన మౌలికమైన మాతృభాషలో బోధన అనే సంస్కరణను ప్రవేశపెట్టారు. పాఠ్యపుస్తకాల, అధ్యాపకుల కొరతలేకుండా చేసి జ్ఞాపకాల వరద 87

ఎనిమిదవ తరగతివరకు బోధనభాషను మార్చివేశారు. అప్పుడు నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నాను. తర్వాత దశలవారీగా రెండేళ్లలో తొమ్మిది, పదవ తరగతులలో మాతృభాషలో బోధన అందుబాటులోకి వచ్చింది. ఆ విధంగా ఉర్దూ మాధ్యమంగా హెచ్‌.ఎస్‌.సి. పూర్తిచేసిన తెలుగు విద్యార్థుల చివరి బ్యాచి మాదే అయింది.

నేను ఇంటర్‌ రెండవ సంవత్సరానికి వచ్చాక నర్సమ్మగారి ఇంట్లో భోజనం వసతి ఏర్పాటుచేసుకొని, రాఘవేంద్రరావు అనే ఇంటర్‌ ప్రథమసంవత్సరం విద్యార్థి దిగాడు. ఆయన అప్పుడే కొత్తగా ఏర్పాటైన సైఫాబాద్‌ సైన్సు కాలేజీలో చేరాడు. మెదక్‌ జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపురం గ్రామ కరణంగారి అబ్బాయి. నర్సమ్మ ఇంట్లో ఒక గది ఖాళీగా ఉంటే, దాన్ని అద్దెకు తీసుకున్నాడు. పరిచయమైన కొద్ది రోజులకే నేనంటే ఎంతో అభిమానం పెంచుకున్నాడు. నాకు విడిగా గది లేదనే విషయం గమనించాడు. తనతోపాటు ఉండుమని బలవంతం చేశాడు. నేను అద్దెలో భాగం పంచుకోలేననీ, ఉచితంగా ఉంటే చులకనవుతాను గనుక ఉండనన్నాను. ఆయనకు బాల్‌రెడ్డి అనే నల్లగొండ జిల్లానుంచి వచ్చిన మరో విద్యార్ధి జతగూడాదు. ఇద్దరూ కలిసి తమ గదిలోకి మారుమని వెంటబడ్డారు. నేను నరసమ్మగారి ఇంట్లో అందరూ కలిసి వాడుకునే మనశాలలో ఉంటుందేవాడిని. మనశాల అంటే ఇంగ్లీషులో లివింగ్‌ రూమ్‌ వంటిది. ఈ మాట ఇక్కడ చేరే వరకూ నాకూ తెలియదు. మా ప్రాంతంలో వాడుకలో లేదు. ఇక్కడ వాడుతారు. నరసమ్మ ఇంటికి, భోజనానికి, హోటల్‌ తిండి ఇష్టపడనివారు చాలామందే వచ్చేవారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన తహసీల్దారు ఒకరు ఆఫీసు పనిమీద తరచుగా వస్తుండేవాడు. పరిచయం చేసుకొని కబుర్లు చెప్పండేవాడు. అలాగే ఇతర పెద్దలు, నర్సమ్మ బంధువులు మనశాలలోనే సేదదీరేవారు, దానివల్ల ఏకాంతం ఉండేది కాదు. నేను చివరకు మిత్రుల గదిలో చేరడానికి అది కూడా ఒక కారణమైంది. సంతోషించదగిన విషయమేమంటే, యేడాది కలిసి ఉన్నా మా మధ్య భేదాభిప్రాయాలు రాలేదు. రాఘవేంద్రరావుతో నా స్నేహం, చదువులు అయిపోయి ఉద్యోగాలలో ఎక్కడెక్కడో ఉంటున్నప్పుడు కూడా కొనసాగింది. రాఘవేంద్రరావు ఉపాధ్యాయుడుగా పదవీవిరమణ చేసి హైదరాబాద్‌లో కొడుకు దగ్గర విశ్రాంతజీవితం గడుపుతున్నాడు. బాల్‌రెడ్డి చదువైపోయాక స్వగ్రామం జానకీపురం వెళ్లి రాజకీయాలలో చేరి సర్పంచు అయ్యాడని తెలిసింది. తర్వాత సమాచారం ఏదీ తెలియదు. 88 జియస్‌. వరదాచారి

జీవనోపాధిగా రేసులాట .

నరసమ్మ ఇంటికి ఏటా రెందుసార్లు క్రమం తప్పకుండా వచ్చేవాళ్లలో మరింగంటి వెంకటాచారి ఒకరు. ఆయన రేసుల పంటర్‌. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడమెందుకంటే, జూదమాడటంలో కూడా క్రమపద్ధతి పాటిస్తే నష్టపోకుండా ఉండవచ్చు అని ఆయన రుజువు పరచాడు. ఆ రోజులలో రేసులు సికిందరాబాద్‌లోని జిమ్‌ఖానా మైదానంలో జరిగేవి. వర్షాక్రాలపు రేసులు, శీత్రాకాలపు రేసులకు ఆయన వచ్చేవాడు. రేసులు ముగిసేవరకు మూడు నాలుగువారాలు నర్సమ్మ ఇంట్లోనే ఉండేవాడు. విన్‌, ప్లేస్‌, ట్రిపుల్‌, క్వినెల్లా అనే పందేలేవో ఆడేవాడు. రేసురోజుకు ముందు అరచేతి వెడల్పు ఉండే రేసుల సమాచారం పుస్తకాలు వస్తాయి. అవి తెచ్చుకుని లెక్కలు వేస్తుండేవాడు. “నువ్వు లెక్కల విద్యార్థివి కదా. ఇదంతా గణితమే” అనేవాడు. గుర్రం వయసు, దాని బరువు, నడిపే సైసు బరువు, అన్ని గుర్రాలకు సమానావకాశాలు ఉండేటట్టు వాని మీదవేసే అదనపుబరువు, గత రికార్డులు ఏవో లెక్కలు పరీక్షకు సిద్ధమైనట్టు వేస్తుందేవాడు. లెక్క తప్పేది కాదు. అత్యాశకు అంటే జాక్‌ పాట్‌ జోలికి పోయేవాడు కాదు. సీజన్‌ ముగిసేసరికి పది పన్నెండువేలు సంపాదించేవాడు. బెంగళూరు రేసులకు కూడా వెళ్లేవాడు. అలా యేదాదిలో ఇరవై - ఇరవైఐదు వేలు సంపాదించుకొని దాచుకొని, నెలనెలా ఖర్చులకు పొదుపుగా వాడుకొంటూ సుఖంగా బతికేవాడు. రేసుల్లో ఆస్తులు పోగొట్టుకున్నవారు చాలామంది ఉంటారు. నాకు తెలిసిన ఒకరిద్దరు సుప్రసిద్ధ సినీకవులు, పత్రికాసంపాదకులు, కొమ్ములు తిరిగిన పంటర్లము అనుకునేవారు రేసులలో నష్టపోయి ఇండ్లు అమ్ముకున్నవారు ఉన్నారు. అందుకు భిన్నంగా క్రమశిక్షణ పాటించి జూదాన్ని జీవనోపాధిగా మార్చుకున్నవాడు, నాకు తెలిసి వెంకటాచారి ఒక్కడే. మెస్‌ పెట్టాలనే ఆలోచన

అప్పుడు హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీ వాస్టళ్లతోపాటు రెడ్డి వాస్టలు, పద్మశాలి వోస్టలు మాత్రమే ఉండేవి. రెడ్డి హాస్టలు ప్రసిద్ధమైంది, చాలా పెద్దది కూడా. పద్మశాలి హాస్టలు కుటీరపరిశ్రమ లాగా ఉండేది. పద్మశాలి హాస్టల్‌లో ఉండే మా సహవిద్యార్థి ఒకతను హాస్టల్‌ దేకు రమ్మని తీసుకు పోయాడు. మా ఊరి విద్యార్థులు చాలా ముంది హైదరాబాద్‌లో పెద్దచదువులు చదువుతున్నారు. రెడ్డయితే వెతుక్కోవలసిన అవసరం లేకుండా వచ్చి గెడ్డి హాస్టల్లో చేరిపోతుందేవారు. మా నాయన శిష్యుడు ఆర్భూరులో పెద్ద వకీలు నలూరు వెంకటరెడ్డి కొడుకులు ముగ్గురు రెడ్డి హాస్టలులో జ్ఞాపకాల వరద 89

ఉండి న్యాయశాస్త్రం, వ్యవసాయశాౌస్త్రం చదివారు. మా క్లాసు మేట్లు మరో ఇద్దరు వ్యాపారస్తుల పిల్లలైనందున హైదరాబాద్‌లో కాపురాలు పెట్టి, చదువు సాగిస్తుందేవారు. ఆర్ధికపుష్టి లేని 'బ్రాహ్మణవిద్యార్థులు దొరలను ఆశ్రయించి వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి చదువు సాగిస్తుండేవారు. ఈ విషయంలో వెలమదారల బెదార్యాన్ని మెచ్చుకోవాలి. మా బంధువులలో నలుగురు అలా దొరల ఇళ్లలో ఉండి చదువుకున్నారు. ఈ అవకాశాలైనా కొంత పేరు ప్రఖ్యాతులు కలిగి గురుస్థానంలో ఉన్న అయ్యగార్ల పిల్లలవరకే పరిమితం. తెలివితేటలుండి, ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరికఉిండి పలుకుబడిలేని వారికి ఈ అవకాశాలు ఉండేవి కాదు. ఇలాటివారు ఒకరిద్దరు హైదరాబాద్‌లో అవస్థలు పడుతుండటం నేను చూచాను. ఇంటర్‌తో మేమెవరమూ చదువు ఆపము. మరో రెండేళ్లు డిగ్రీ పూర్తిచేసే వరకైనా కానసాగిన్తాము. పద్మశాలి హాస్టలు చూశాక ఇలాటి వారందరం కలిసి ఒక మెస్‌ ఏర్పాటు చేసుకొని, చదువుకోవచ్చునన్న ఆలోచన కలిగింది. మా 'ప్రాంతంవాడు అప్పుడు పిహెచ్‌డి. చేస్తున్న లక్ష్మణరావును సంప్రదిస్తే, ఆయన తానూ మరో రెండేళ్లయినా నగరంలో ఉండవలసి ఉందిగనుక మీతో చేరుతానన్నాడు. అలా ఆర్మూరు పరిసర (గ్రామాలవారు, వారి బంధువులు పన్నెండుమంది లెక్కతేలారు. పరీక్షలకు ఇంకా నెలరోజులు గడువు ఉంది. వేసవి సెలవుల్లో ఊరికి వెళ్లేముందు మెస్‌ గురించి వర్పాట్లు చేసుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నాము. పరీక్ష తప్పే ప్రయత్నం __ నా ఇంటర్‌ పరీక్ష అనూహ్యంగా గందరగోళంలో పడింది. ఇంగ్లీషు, తెలుగు పరీక్షలు బాగానే వ్రాశాను. భౌతికశాస్త్రం పరీక్ష చెడగొట్టాను. అంటే ఇంజనీరింగ్‌లో సీటువచ్చే అవకాశాన్ని చెడగొట్టుకున్నానన్నమాట! ఆ రోజులలో ఎంట్రెన్స్‌ పరీక్షలు లేవు. ఇంటర్‌ ర్యాంకును బట్టి సీటు ఇచ్చేవారు. సరైన మార్కులు రాకపోతే సీటు రాదు. ఆ రోజులలో ఇం'్రవ్‌మెంటు పరీక్షలు వ్రాసే పద్ధతి కూడా లేదు. ఫెయిలైలేనే మళ్లీ ఆ పరీక్ష వ్రాయవచ్చు. బాగా వ్రాసి మంచి మార్కులు సాధిస్తే ఇంజనీరింగ్‌లో సీటూ నంపొదించవచ్చు. ఇదొక విషమవరిన్థితి. నేను పరీక్ష తవ్పడానికే నిర్ణయించుకున్నాను. కాని పెద్దవారేమంటారోనని భయం. అన్నయ్య సలహా అడగాలి. ఆ రోజులలో ఫోన్లు కూడా లేవు, ఓ పోస్టు కార్డు వేసి పరీక్షలు వ్రాస్తూ పోయాను. థియరీ పరీక్షలన్నీ అయిపోయాక అన్నయ్య దగ్గరినుంచి సమాచారం అందింది. నీకు నమ్మకం ఉంటే అలాగే చేయమన్నాడు. దానితో నేను ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు 90 జి.యస్‌. వరదాచారి

కాలేదు. నా దగ్గర ఫిజిక్స్‌ పుస్తకం కూదా లేకుండింది. క్లాసులో వ్రాసుకున్న నోట్స్‌ మీద ఆధారపడి పరీక్ష వ్రాశాను. అది చాలదని పుస్తకం కొని తెచ్చుకున్నాను. ఊరికివెళ్లి శద్ధగా చదువనారంభించాను. ఐదారు వారాలు గడిచాక నాయన చెల్లెలిని తీసుకురావడానికి వెళ్లమన్నారు. ప్రతీ వేసవి సెలవుల్లో అందరు కొడుకులు, కోడళ్లు, బిడ్డలు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లను ఇంటికి పిలిపించుకొని వారం పది రోజులు గడపటం నాయనకు అలవాటు. నేను బావ ఉద్యోగం చేస్తున్న నస్రుల్లాబాద్‌ వెళ్లాను. అక్కడ ఆయన నిజాం సాగర్‌ కాలువ పనులు చూస్తున్నారు. నేను వెళ్లినరోజే మధ్యాహ్నానికల్లా కాలువ పనుల గుత్తేదారు హైదరాబాద్‌నుంచి వచ్చాడు. బావగారికి స్వీటు ఇచ్చి కంగ్రాచులేషన్స్‌ చెప్పాడు. దేనికి అని ఆయన ఆశ్చర్యపోతుంటే, “మీ బావమరిది ఇంటర్‌ పాసయ్యాడుగదా!” అన్నాడట. “ఆయన పరీక్ష వూర్తిగా రాయనేలేదు. ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించాలనే పట్టుదలతో చదువుతున్నాడు. మీరేదో పారపాటుపడ్డారని అన్నారట బావ. “కాదండి మీరిచ్చిన నంబరే పేపర్లో చూశా”నన్నాదా గుత్తేదారు. ఆ రోజుల్లో టెన్స్‌ ఇంటర్‌, డిగ్రీ పరీక్షల ఫలితాలు పత్రికలలో అచ్చువేసేవారు. టెన్త్‌ ఫలితాల కోసమైతే పత్రికలు ప్రత్యేకసంచికలు అచ్చువేసేవి. విపరీతంగా అమ్ముడు పోయేవి. గుత్తేదారు పేపరు కూడా కొని తెచ్చాడు. “మీరు మరచినట్టున్నారు. పోయినసారి మీరు నంబరు చెప్పినప్పుడు వ్రాసుకోవలసిన అవసరం లేదు నా కారు నంబరే అన్నాను. వస్తుంటే రిజల్డ్‌ పేపర్‌ అమ్ముతున్నారు. కొని చూశాను. అందుకే స్వీటుకూడా తెచ్చాను” అన్నాడు. హాల్‌ టికట్‌ రాగానే రోల్‌ నంబరు దగ్గరి వాళ్లందరికీ తెలుపడం మాకు అలవాటు. బావకు కార్టు వ్రాశాను. అప్పుడు గుత్తేదారు కారునంబరు అదే కావడంపై చర్చ జరిగిందట. “గమ్మత్తుగా ఉందే! ఆయన ఇక్కడే ఉన్నాడు. పిలుస్తాను ఉండండి” అని బావ నన్ను పిలిచారు. నేను భౌతికశాస్త్రం పేపరు చెడగొట్టాను గనుక ప్రాక్టికల్స్‌ వదిలేస్తే ఆ ఒక్క పేపర్‌లో తప్పి పరీక్ష ఫెయిల్‌ అవుతానని సప్లిమెంటరీకి సిద్ధమవుతున్నాను. కొని నా అంచనా తప్పింది. ప్రాక్టికల్స్‌ చేయకున్నా అన్ని పేపర్లలో పాస్‌ మార్కులు వచ్చి మూడవ శ్రేజిలో ఉత్తీర్ణుడనయ్యాను. ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితి! చెల్లెలిని తీసుకొని ఆర్భూరు వెళ్లిపోయాను. ఎస్‌.వి. మెస్సు స్థాపన

ముందు కార్యక్రమమేమిటో తేలిపోయింది. అంటే డిగ్రీలో చేరడమేనని తేలిపోయింది గనుక, దృష్టి మెస్‌ పెట్టడంవైపు మళ్లింది. అంకాపురంలో ఉంటున్న జ్ఞాపకాల వరద రై

బంధువులు రిజల్ట్స్‌ తెలిసి నా దగ్గరకు మాట్లాడటానికి వచ్చారు. వారి బంధువు ఒకతను వంట వైష్ణవుడుగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాదని చెప్పారు. మరో ఇద్దరు టెన్స్‌ పాసై పై చదువులకు ఏం చేయాలో ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దగ్గరి గ్రామం చేపూరులో ఉండే నా పాత క్లాస్‌ మేటు తమ్ముల్లిద్దరు ఒకేసారి టెన్స్‌ పూర్తి చేశారు. పెద్దాయన టీచరైపోదామని నిర్ణయించుకోగా, చిన్నతను మాత్రం ఇంజనీరు కావాలన్న పట్టుదలతో ఉన్నాడని, వాదికి నీవే ఏదో దారి చూపించాలని మా క్లాస్‌ మేటునా దగ్గరకు వచ్చాడు. మేమిద్దరం కలిసి పిహెచ్‌.డి. చేస్తున్న లక్ష్మణరావును సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నాము. ఆయన అధ్యక్షుడుగా ఉండటానికి ఒప్పుకున్నాడు. నేను కార్యదర్శి. హైదరాబాద్‌ వెళ్లగానే బడీ చావుడీ వెనుక రామ్‌కోట్‌లో ఆరు గదులు, వంటిల్లు, స్నానాలగది, శౌచాలయం, చిన్న అరుగు, మధ్యలో వాకిలి ఉన్న ఇల్లు వెతికి రెందేళ్లకు అద్దెకు మాట్లాడి 1952 జూలైలో కాలేజీలు తెరవడానికి ముందే చేరిపోయాము. నేను మ్యాక్స్‌, అప్లయిడ్‌ మాత్స్‌, స్టాటిస్టిక్స్‌ ఐచ్చికాలతో ఆర్ట్స్‌ కాలేజీలో బి.ఏ. లో చేరాను. నాతో కలిసి తిరిగిన సీతారామాచారి బి. కాంలో చేరాడు. ఆయన తమ్ముడు గోపాలమూర్తి చేపూరు జగన్నాథాచారి, ఆర్మూరు టీచర్‌ కొడుకు గంగాధర్‌ ఇంటర్‌లో చేరారు. కరీంనగర్‌ నుంచి మరో ఇద్దరు వచ్చిచేరారు. ఒక్కొక్కరి నుంచి నలభై రూపాయలు తీసుకొని మెస్‌ నడిపేవారము. టీ, టిఫిను, భోజనాలకయ్యే ఖర్చుకన్నా ఒక్కొక్కరి మీద ఇంటి అద్దె భారమే ఎక్కువ. అంటే 11 రూపాయలు పడేది, నెలాఖరుకు కొంత చిల్లర మిగిలితే అవి కూడబెట్టి పిక్చిక్‌లు, మెస్‌ డే పోటీలు నిర్చహిస్తుందేవారం. రెండేళ్లు హాయిగా ఉత్సాహంగా గడిచిపోయింది. ఆ సమయంలోనే “| తి టినా” ఎన్‌ వి మెన్‌ నఖ్వులు కొందరితో 92 జియస్‌. వరదాచారి

వైశ్యా హాస్టల్‌ భారీయెత్తున ఏర్పాటు అయింది. గౌడ హాస్టల్‌కూడా అప్పుడె వచ్చింది. డిగ్రీ పరీక్షలు అయిపోయాక మాలో ఎక్కువమందిమి ఏదో ఉద్యోగం చూసుకోవాలి. మా మెస్సులో ఉన్న విద్వార్థులలో ఇద్దరు ఈ అండ లేకపోతే పై చదువులకు వచ్చేవారే కాదు. ఆ ఇద్దరూ ఇంటర్‌ తర్వాత ఒకరు బి.ఇ, ఇంకొకరు బి.టెక్‌ చేసి ఉద్యోగాల్లో ఎంతో ఉన్నతిని సాధించారు. ఒకరు కేంద్రంలో అటామిక్‌ ఎనర్జీశాఖలో సలహాదారుగా ప్రభుత్వ పనుపుపై విదేశాలకు వెళ్లి పనిచేసి వచ్చాడు. అందుచేత వైష్ణవవిద్యార్థులకు ఉన్నత విద్యకు వెళ్లాలంటే హైదరాబాద్‌లో ఇలాటి అండ ఉన్నది అన్న ధైర్యం కలిగించాలి. అప్పుడు పేదవారెందరో మంచి చదువులు చదివి పైకి రాగలుగుతారు. గనుక ఏమైనా చేయాలన్న ఆలోచనలో పడ్డాము. 60 ఏళ్ల తర్వాత నిజమైన కల! హైదరాబాదులో శ్రీవైష్ణవ మహాసభఅనే పెద్ద సంఘం ఒకటి ఉన్నదని తెలుసు. వారు చొరవ తీసుకొంటే నిశ్చింతగా ఉంటుంది. వైష్ణమహానభకు డాక్టర్‌ రంగాచార్యులు అధ్యక్షులుగా ఉండేవారు. ఆయనకు ఫీల్‌ ఖానా (అంటే ఏనుగుల శాల) ప్రాంతంలో గొప్ప ప్రాక్టీసు గల వైద్యాలయం ఉండేది. ఆయన తమ్ముడు నరసింహాచార్యులు నగర డిప్యూటీ మేయరుగా పనిచేశారు. ఆ డాక్టరుగారిని మెస్‌ డేకు ముఖ్యఅతిధిగా పిలిచి మా అనుభవాన్ని అవనరాలను తెలిపి, శాశ్వత 'ప్రాతిపదికపైన హాస్టలో, మెస్ప్ఫో ఏర్పాటు చేయాలని కోరడానికి నిర్ణయించాము. ఆయనను కలిసి ఆహ్వానించగానే వెంటనే అంగీకరించి వచ్చారు. మా విన్నపాలు విని సుముఖంగా స్పందించారు. వెంటనే సంఘ కార్యనిర్వాహకవర్గ సమావేశం సీతారాం బాగు దేవాలయప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఆ సభ సంప్రదాయపరుల అసహనంవల్ల రసాభాస అయి వాయిదా పడింది. తర్వాత కూడా ముందుకు సాగలేదు. అరవై ఏళ్ల కింద మేము కన్న హాస్టల్‌ కల ఇప్పుడు నిజమైంది. 1998లో హైదరాబాద్‌లోని శ్రీవైష్ణవప్రముఖులు సమావేశమై, శ్రీవైష్ణవ సేవాసంఘమనే పేరుతో ఒక నంవాూన్ని ఏర్పాటుచేశారు. యువకులలో నంవప్రదాయవిజ్ఞానాన్ని పెంపొందించడంతోపాటు, ఆధునికవిద్యావ్యాప్తికి తోడ్చడటం కూడా లక్ష్యంగా పనిచేయనారంభించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థికసహాయం ఇవ్వడమేకాక శ్రీవైష్ణవ విద్యార్థులకు వసతిగృహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. శ్రీవైష్ణవ సదన్‌ అనే పేరుతో ఎల్‌,బి. నగర్‌ చౌరస్తా సమీపంలో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవనానికి శ్రీ కండ్లకుంట యాదగిరాచార్యులు దాదాపు జ్ఞాపకాల వరద 983

500 చదరపు గజాల భూమిని విరాళంగా ఇచ్చారు. సంఘ సలవాదారులుగా కె.వి. రమణాచారి ఐ.ఎ.ఎస్‌. ను, మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాలా చార్యులను పెట్టుకున్నారు. వారి స్ఫూర్తిదాయకమైన నేతృత్వంలో, కార్యనిర్వాహకవర్గం అకుంఠితదీక్షతో ముందుకు సాగినందున, పలువురు వైష్ణవులు, వైష్ణవాభిమానులు భూరివిరాళాలిచ్చారు. సకలవసతులతో భవనం సిద్ధమైంది. నన్ను కూడా కొంతకాలం ఒక సలహాదారుగా పెట్టుకొని గౌరవించారు. మంచి (గ్రంథాలయం ఒకటి ఏర్పాటు కావలసి ఉన్నది. మిస్టర్‌ ఇంటెలిజెంట్‌ పోటీ సరే. మా రోజులలో డిగ్రీ చదువు రెందేళ్లే. డిగ్రీలో నరసింహారెడ్డి మళ్లీ నా క్లాసులోనే చేరాడు. హనుమంతరెడ్డి, వెంకటేశ్వరరావు, నేను - నలుగురిదొక బృందం. అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధానంతర (ప్రపంచస్థితిగతులను పరిశీలించడానికి బర్మూడాలో అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాధినేతల సమావేశం బిగ్‌ ఫోర్‌ మీట్‌ అనే పేరిట జరిగింది. మేము నలుగురం ఎప్పుడూ కలిసి తిరుగుతుండటంతో ఎవరో జోక్‌ చేస్తూ “మీరు బిగ్‌వోరే!” అన్నారు. మేమూ సరదాగా ఆ మాటే చెప్పుకుంటూ ఉండేవారం. డిగ్రీలో మొదటి సంవత్సరంలో ఉండగా ఒకరోజు మధ్యాహ్న భోజన విరామం తర్వాత తరగతి గదిలోకి వెళ్లబోతుంటే, నోటీసు బోర్డు వద్ద జనం మూగి ఉన్నారు. ఏమిటో చూద్దామని మేమూ వెళ్లాం. రెండు గంటలనుంచి ఫలానా గదిలో మ్యాథమాటికల్‌ ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌ జరుగుతుందని ఉంది. అలవాటు ప్రకారం “మనం లేకుండా టెస్టా?ా అన్నాను నేను. రెండవుతున్నది. నేరుగా టెస్ట్‌ జరిగే గదిలోకి వెళ్లిపోయాము. చాలా మందే ఉన్నారు, బి.ఏ., ఎం.ఏ., బి.ఎస్‌సి., ఎంఎస్‌సి. మొదటి, రెండవ సంవత్సరాల విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రయత్నిద్దాం అని వెళ్ళి కూర్చున్నాము. అన్నీ గణితసంబంధమైన క్విజ్‌ ప్రశ్నలు. ఉదాహరణకు వెంటనే గుర్తుకు వచ్చిన ఒక ప్రశ్న చెబుతాను. సైప్రస్‌కు చెందిన ఒక నౌకలో 40 మంది సైనికులు ఉన్నారు. నౌకకు చిన్న చిల్లి పడింది. సగం బరువు తగ్గించాలి. నౌక కేప్టెన్‌ గ్రీకు దేశస్థుడు. సైనికులలో సగం మంది గ్రీకులు, సగం మంది తురుష్కులు. ఆయన సైనికులందరినీ వర్తులాకారంగా నిలబెట్టాడు. ఒకడిని నౌకలోంచి సముద్రంలోకి దూకమన్నాడు. తర్వాత ప్రతి ఐదవవాడినీ దూకమన్నాడు. అలా సగంమంది దూకుతూ పోతారు. 94 జియస్‌. వరదాచారి

చివరికి తురుష్కులందరూ సముద్రం పాలవుతారు. గ్రీకులందరూ బతికిపోతారు. ఆయన వారిని ఎలా నిలబెట్టాడు? అనేది ప్రశ్న దీనికి ఇంగితమే తప్ప సూత్రమేదీ లేదు. నేను వర్తులాకారంలో చుక్కలు పెట్టి మొదట ఒకచుక్క దగ్గర తు అని గుర్తుపెట్టి తర్వాత ప్రతి ఐదవ చుక్క దగ్గర తు అని గుర్తిస్తూ పోయాను. రెండవ చుట్టులో తర్వాత చుట్లలో తు అనే గుర్తులున్నవాటిని వదిలి లెక్కపెట్టాను. మిగతా చుక్కల దగ్గర గ్రీ అని వ్రాశాను. ఇలా గ్రీకు తురుష్కుల మధ్య వైషమ్యం గురించిన లెక్క ఇవ్వడంలో ఆ నాడు బెచిత్యం ఉంది. సైప్రస్‌ మధ్యధరా సముద్రప్రాంతంలో గ్రీసు, తుర్కీ (తెలుగు పత్రికలు టర్కీ అని వ్రాస్తాయి. తెలుగువారు అలాగే ఉచ్చరిస్తారు.) దేశాల పొరుగునే ఉంది. ఆ దేశంలో సగం జనాభా గ్రీకులు, సగం తురుష్ములు. తుర్కీ దేశస్థులను తెలుగులో తురకలు అనీ, సంస్కృతప్రియులు తురుష్కులు అనేవారు. దేశంలో పెత్తనం కోసం వీరెప్పుడూ కలహిస్తూ ఉండేవారు. ఏజెన్సీ వార్తలలో ఏళ్ల తరబడి ఈ పరస్పరహననవార్తలు వస్తుండేవి. పత్రికలలో గ్రీకు సైప్రియట్లు, తురుష్క సైప్రియట్ల దాయాది కలహవార్త లేని రోజు ఉందేది కాదు. కనుక ఈ ప్రశ్నను ఎవరూ విడ్డూరమైందిగా భావించలేదు. మర్నాడు నోటీసు బోర్టు మీద క్విజ్‌ ఫలితం పెట్టారు. మిస్టర్‌ ఇంటెలిజెంట్‌ బహుమతి నాకే వచ్చింది. బహుమతిగా మెన్‌ ఆఫ్‌ మ్యాథమాటిక్స్‌ అనే పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో భారతీయ గణితశాస్రజ్ఞులలో ఒక్కరి ప్రస్తావన కూడా లేదు. నేదు ప్రపంచమంతా వాడుతున్న అంకెలు కనిపెట్టింది మనవారు. సున్న కనిపెట్టింది మనవారు. దశాంశపద్ధతి కనిపెట్టింది మనవారు. వర్గము, వర్గమూలము కనిపెట్టింది మనవారు. 'పై విలువ కనిపెట్టింది మనవారు. ఆ బోధాయనుడు లేడు. కాత్యాయనుడు లేడు. ఆర్యభట్టు లేడు. బ్రహ్మగుప్తుడు లేడు, భాస్మరాచార్యుడు లేడు. మనం మొదటి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినప్పుడు దానికి “ఆర్యభట్ట' అని నామకరణంచేసి నెహ్రూ ఆర్యభట్టును స్మరించుకున్నాడు. కాని మన పాఠ్యపుస్తకాలలో మన పూర్వికుల వైభవో పేతయథార్ధ విజయాలను చేర్చి మనపిల్లలలో జ్ఞానతృష్ణ పెంచుదామన్న ఆలోచన ఇప్పటికీ మన జ్ఞాన గుత్తేదారులకు రాకపోవడం భావి భారతపౌరుల దురదృష్టం!

సరే. మిస్టర్‌ ఇంటెలిజెంట్‌ పోటీలో బహుమతి నాకే వచ్చిందని చెప్పాను కదా. అప్పుడు వెంకటాచారి ఆర్ట్స్‌ కాలేజీలో గణిత శాఖాధిపతిగా ఉన్నారు. రావాడ సత్యనారాయణ సైన్స్‌ కాలేజి ప్రిన్సిపాల్‌, ఐహుమతి ప్రదానోత్సవానికి ఆయనకూడా వచ్చారు. నన్ను పరిచయం చేయగానే, వెంకటాచారిని “మీ వాడా? మా వాడా?” జ్ఞాపకాల వరద 95

అని అడిగారు. ఆయన “మా వాడే” అని నొక్కిచెప్పారు. రావాడ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వైస్‌-చాన్సలర్‌ అయ్యారు. అంత పెద్దవాళ్లు కూడా తమ విద్యార్థులు ఏదైనా సాధిస్తే సంబరపడటం చూచి నా సంతోషం రెట్టింపైంది. మాకు ద్వారకానాథ్‌ అని స్టాటిస్టిక్స్‌ పాఠాలు చెప్పే లెక్బరర్‌ ఉండేవారు. చాలా సరదా మనిషి ఆయన నన్ను మిస్టర్‌ ఇంటెలిజంట్‌ అని సంబోధిస్తుందేవారు. నాకూ సరదాగానే ఉండేది.

" డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలయ్యాక దిద్దిన సమాధానపత్రాలను విద్యార్థులకు ఇచ్చారు. ట్రిగ్నామెట్రీలో ఒక ప్రశ్నకు నేను సరైన సమాధానం వ్రాసినా, పట్మీ అనే లెక్చరర్‌ మార్కులు ఇవ్వలేదు. వెళ్లి అడిగాను. పుస్తకంలో అదే ప్రశ్నను ఉదాహరణగా పరిష్కరించి చూపారు. దాన్ని పట్కీ తరగతిలో ఇంకో విధంగా పరిష్కరించి చూపారట. నేను పుస్తకంలో ఉన్న పద్ధతిని అనుసరించాను. తప్పెట్లా అవుతుందంటే పట్కీ నేను చెప్పినట్టు నీవు చేయలేదు గనుక, సగం మార్కులే ఇస్తానని అలాగే చేశారు. లెక్చరర్లస్థాయిలో కూడా మంకు మనుషులు ఉంటారని బోధపడింది. గండిపేటలో గజ ఈత

డిగ్రీలో విద్యార్థులం ఒక రోజు గండి పేటకు విహారయాత్రకు వెళ్లాము. గండిపేట చెరువులోసల ఉత్తరదిశలో ఒక పార్కు ఉన్నది. మధ్యభాగంలో మరో పార్కు ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడికి చెరువులో ఈదుకుంటూ వెళ్లాలని ఎవరో పందెం అన్నారు. మనం లేకుండా పందెమా అని హనుమంతరెడ్డి, నరసింహారెడ్డి, నేను ప్యాంట్లు చొక్కాలు విడిచి నీళ్లలోకి దిగాము. వేరే విద్యార్థులు పదిమంది దాకా సిద్ధమయ్యారు. దూరం దాదాపు కిలోమీటరు ఉంటుంది. కొంచెం దూరం వెళ్లగానే సగంమంది మా వల్ల కాదని వెనుకకు తిరిగారు. ఇంకొంచెం దూరం వెళ్లాక ఇంకొందరు తప్పుకున్నారు. చివరకు నలుగురం మిగిలాము. నీళ్లలో గమ్యం దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గర పడుతున్నామని అనుకుంటున్నాము. కాని మా నరసింహారెడ్డి అలసిపోయాడు. డ్యాం గోడను చేరగలిగినా, గోడకు చెయ్యి ఆనిస్తే మునగకుండా ఉండవచ్చు. కాని అదీ అంతే దూరంలో ఉన్నది. ఈతలో చేయూత ఇవ్వడం కుదరదు. ఇద్దరూ ప్రమాదంలో పడవచ్చు. కనుక ఆయనకు జాగ్రత్తలు, థైర్యం చెపుతూ కష్టం మీద పార్కును చేరుకున్నాము. కట్ట మీద నిలబడి జనమంతా మా అవస్థ చూస్తున్నారు. హనుమంతరెడ్డి తాను తడి చెడ్డీతో కట్టమీద నడుస్తూ రాననీ, ఈదుకుంటూనే వెడతానని వెనుకదారి పట్టాడు. సంకోచిస్తున్న నరసింహారెడ్డిని వారించాను. నాకు మా ఊరి గుండ్ల చెరువులో 96 జి.యస్‌. వరదాచారి

గంటల తరబడి ఒద్దుకు రాకుండా ఈదే అలవాటు ఉన్నాా నిళ్లలో దుడుకుతనం అపాయకరమని తెలుసు. నీళ్లలో దూరం తెలియనట్టే లోతు ఎంత ఉందో కూడా తెలియదు. మోకాలుబంటి లోతుందనుకొని నడుస్తూ పోతే ముందు లోతైన గుంట ఉండవచ్చు. అడుగుతీసి ముందుకువేస్తే ఈత రానివారికి మునకే గతి! ఇటీవలి కాలంలో కాలేజీ విద్యార్థులు చాలామంది నదులలో, సముద్రంలో మునిగి చనిపోతున్న వార్తలు చదువుతున్నాము. నిప్పు నుంచి తప్పించుకోవచ్చుగాని నీటిలో ప్రమాదానికి లోనైతే బతికి బయటపడటం కష్టం! అందుకే నేను నరసింహారెడ్డిని తీసుకొని జనం మధ్యలో నుంచి నడుస్తూ అవతలి పార్కు చేరుకున్నా. దారిలో అక్కడి ఉద్యోగినని చెప్పుకున్న ఒకాయన, ఈ చెరువులో ఈతగొట్టడం నేరమని తెలియదా అని బెదిరించబోయాడు. “ఆ మాట ముందే చెప్తే మేము దిగేవాళ్లమే కాదు గదా!” అని మేమన్నాము. హనుమంతరెడ్డి సునాయాసంగానే ఈదుతూ అవతలికి చేరుకొన్నాడు. మరోసారి మా మెస్‌ సభ్యులం గోలకొండ కోటకు విహారయాత్రకు వెళ్లాము. కోట ప్రధానద్వారంవద్ద ఉన్న గుమిటీ (దాన్నే ఉర్జూలో గుంబద్‌ అంటారు) మధ్యలో నిలబడి చవ్చట్లు కొడితే కొండ శిఖరంపైన ఉన్న రాజు దర్నార్‌ వోలులో ప్రతిధ్వనిస్తుందని చెపుతారు. అందరూ కొట్టి చూస్తుంటారు. కాని రెండు ప్రదేశాలమధ్య ఎంతో దూరం ఉన్నందున దాన్ని ప్రత్యక్షంగా పరీక్షించి నిర్ధారించే అవకాశం ఎవరికీ లేదు. ఐతే కోటలోకి గొట్టాల ద్వారా నీరు సరఫరా చేసేవారన్నది నిర్ధారించుకోవడానికి అధారాలు కనబడుతాయి. అలాగే బాలాహిసార్‌ పైకి ఎక్కి నగరాన్ని విహంగవీక్షణం చేయవచ్చు. కోటదిగి కిందికి వస్తే సమాధుల సమూహం చూడదగిన కట్టడాలు. చాలా తెలుగు సినిమాలలో వాటిని దుండగుల స్థావరంగా వాడుకున్నారు. అలా తెలుగు (ప్రేక్షకులకు అవి సుపరిచితాలు. వాటిదగ్గరలోనే వాథియోం వాలా దరణ్డ్‌ ఉంది. ఆ ఉర్జూ మాటల అర్ధం ఏనుగుల చెట్టు అని. దాని ప్రత్యేకత ఏమిటంటే పది పన్నెండు అడుగుల ఎత్తు ఉండే దాని విశాలకాండం లోపల మేదరిబొంగులా బోలుగా బొయ్యారం ఉంటుంది. పైన ఉండే తొజ్జలో నుంచి దానిలోకి దిగవచ్చు. దానిలో ఏనుగు పట్టేటంత స్థలం ఉంటుంది. అది ఎప్పుడో దొంగల స్థావరంగా ఉండేదంటారు. చెట్టు మీదికి ఎక్కి దానిలోకి దిగవచ్చు కాని లోపలి నుంచి పైకి ఎక్కి రావడం కష్టం. మేము లోనికి దిగాము. కింద చదును చేసినట్టుఉంది. మధ్యాహ్నం పూట కూడా చల్లగా ఉంది. మేము పైకి ఎక్కి చెట్టు పైభాగంలో వెలుపలికి వచ్చాము. ఇక చెట్టు దిగాలి. మా అధ్యక్షుడు లక్ష్మణరావు “అక్కడి నుంచి దూకినవాడికి రూపాయి ఇస్తా, జ్ఞాపకాల వరద 97

పందెం” అన్నారు. నేను కింద చదునుగా ఉన్న స్థలం చూచుకొని జాగ్రత్తగా దూకేశాను. మా గోపాలమూర్తి “నేను దూకుదామనుకొన్నా” అన్నాడు. ఎందరు దూకితే అందరకి తలా రూపాయి చొప్పున ఇస్తానన్నారు లక్ష్మణరావు. గోపాలమూర్తి దూకాడు. కాని అదుపు తప్పి ఎడమ కాలు మెలిక పడింది. వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందవలసి వచ్చింది. పోటీలలో దిగడం తప్పు కాదు. కాని అలవి కాని పందేలకు పోగూడదన్నది గుణపారం. మా మెస్‌లో ఒక్కోగదిలో ఇద్దరే ఉండాలని నియమం పెట్టుకున్నాము. అధ్యక్షుడు మాత్రం గదిలో ఒకరే ఉండేవారు. చిన్నచిన్న తగాదాలు వచ్చేవి. ఒక గదిలో ఉన్న ఇద్దరిలో ఒకడు పదింటికే నిద్రకు ఉపక్రమించేవాదు. రెండో విద్యార్ధి పదకొండు పన్నెండు దాకా లైటువేసి చదువుకునేవాడు. నేనో, లక్ష్మణరావో సర్దుబాటు చేయవలసి వచ్చేది. నాయన ఇచ్చే డబ్బు మెస్‌కు జేబుఖర్చులకు సరిపోయేది. పుస్తకాలకూ నాయన ఇచ్చేవారు కాని, మనమూ కొంత సంపాదిస్తే కలిసివస్తుందిగదా అనిపించింది. దారల ఇంట్లో ఉంటూ చదువుకొంటున్న మా బంధువులు, దొరల పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారు. మోర్తాడు దొరవారి కొడుకు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. లెక్కలు, ఇంగ్లీషు చెప్పాలి, దొరవారు యాభై రూపాయలు ఇస్తారని మా వెంకటాచారి చెప్పాడు. ఒప్పుకున్నాను. నాకు ప్రతిదీ పాఠంచెప్పినట్టు చెప్పడం అలవాటు గనుక ట్యూషన్లు చెప్పడంలో ఇబ్బంది రాలేదు. ఆ విద్యార్థి అన్న ఇంటర్‌ చదువుతున్నాడు. అప్పుడప్పుడు వచ్చి పక్కన కూర్చుని గమనించేవాడు. చాలా సంతృప్తి చెందాడు. తన సందేహాలూ తీర్చుకునేవాడు. యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీకి వెళ్లాలంటే బడీ చావుడీ నుంచి నడుస్తూ కాచీగూడ స్టేషన్‌ వెళ్లాలి. అక్కడి నుంచి లోకల్‌ రైలు ఎక్కి జామె ఉస్మానియా స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి అడ్డదారిలో ఆర్ట్స్‌ కాలేజిదాకా నడవాలి. ఈ బాధను తప్పించుకోడానికి విద్యార్థులు మార్గం కనిపెట్టారు. వెళ్లేటప్పుడు జామె ఉస్మానియాలో దిగకుండా రైలు ఆర్ట్స్‌ కాలేజీ వెనుకదాకా వచ్చినపుడు గొలుసులాగి ఆపేవారు. గఐిగబా అందరూ దిగి కాలేజీకి చేరుకునేవారం. మరి వచ్చేటప్పుడు? కొందరు విద్యార్థులు సీతాఫల్‌ మండి స్టేషన్‌కు వెళ్లి రైలెక్కి ఆర్ట్స్‌ కాలేజి దగ్గరకు రాగానే గొలుసు లాగేవారు. అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న విద్యార్థులంతా ఎక్కివచ్చేవారు. దీనివల్ల రైల్వేవారితో తరచూ తగదాలు జరుగుతుండేవి. ఆర్ట్స్‌ కాలేజి వద్ద ఆ రోజులలో వాల్డ్‌ లేదు. అక్కడ ఎక్కినవారిలో సీజన్‌ టిక్కట్టు లేనివారు జామె ఉస్మానియా స్టేషన్‌లో 908 జి యస్‌. వరదాచారి

దిగి ప్లాట్‌ఫారంమీద ఉరుకుతూ టిక్కట్టు అమ్మే చోటికివెళ్లి టిక్కట్లు కానవలసివచ్చేది. ఇద్దరు ముగ్గురికి టిక్కట్టు ఇచ్చేసరికి రైలు కదిలేది. కాచీగూడలో స్వ్వాడ్‌ పట్టుకునేవారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఎదురుతిరిగేవారు. ఈ గొడవ చాలా ఏళ్లు సాగింది. ఆర్ట్స్‌ కాలేజి వద్ద ఆధికారిక హాల్టు ఏర్పడ్డాక ఈ సమస్య పరిష్కారమైంది. ఆ హాల్ట్‌ ఒక ఆర్ట్స్‌ కాలేజీకి వెళ్లేవారికే కాదు, మూడు సైన్స్‌ కాలేజీలకు, చాలా హాస్టళ్లకు, ప్రధాన (గ్రంథాలయానికి వెళ్లేవారికి కూడా అందుబాటులో ఉంటుంది. డిగ్రీ పరీక్షలో ఫెయిల్‌

డిగ్రీ పరీక్షలు సంతృప్తికరంగానే వ్రాశాము. సెలవుల్లో ఊరికి వెళ్లిపోయాము. కాని ఫలితాల రోజు పేవరులో చూసుకుంటే నా నంబరు లేదు. నేను ఫెయిలవడమేమిటీ? నమ్మబుద్ది కాలేదు. రెండు మూడు పేపర్లు చూడటం విద్యార్థి తాపత్రయం. కాని ఒక చోట లేనిది ఇంకోచోట ఉంటుందా? ఫలానా పేపరులో ఫెయిలై ఉంటానేమో అని ఊహించను కూడా లేకపోయాను. మెమొరాండం వచ్చాక చూస్తే ఇంగ్లీషులో తప్పాను. ఇంగ్లీషు పేపరును నేను తప్పేటంత ఘోరంగా వ్రాయలేదు. మా మిత్రబృందం అంతా “నీవు ఇంగ్లీషులో తప్పడమేమిటయ్యా?” అని ఆశ్చర్యపోయారు. ఐచ్చికాలన్నిట్రిలో హయ్యర్‌ సెకండ్‌ క్లాసు మార్కులు వచ్చాయి. తెలుగులో 76 మార్కులతో డిస్టింక్షన్‌ వచ్చింది. ఆ రోజులలో సమాధానపత్రం చూచి నాదేనని ధ్రువపరచుకొనే పద్ధతి లేదు. పునర్‌ మూల్యాంకనం కోరే ప్రవ్నేలేదు. ఒకసారి ఫెయిలంటే అంతే సంగతులు. సప్లిమెంటరీ పరీక్ష రాయడమే మార్గం. ఒక ఇంగ్లీషు పరీక్ష వ్రాసి గట్టెక్కవచ్చు. మిత్రులు అదే చెప్పారు. కాని మొత్తం పరీక్షలు వ్రాయాలని నా పట్టుదల. అలాగే వ్రాశాను. ప్రథమథ్రేణికి ఇంకొంచెం దరిదాపులోకి వచ్చాను. కాని ఒక సంవత్సరం వ్యర్థమైంది. ఇంజినీరింగ్‌ కుదరలేదు గనుక ఎం.వి. అయినా చేద్దామన్న కోరిక ఉండేది. డి(గ్రీపైన ఏదో ఒక అర్హత ఉండాలని గట్టి కోరిక. డిగ్రీలో చదివిన విషయాలనే పి.జి.లో తీసుకోవాలి. సీటువచ్చే అవకాశం రెండేళ్ల ఫలితాలమీద ఆధారపడి ఉంటుంది. ఆ సంవత్సరమే మా పెదతమ్ముడు రమణ పదవతరగతికి వచ్చాడు. నేను ఎం.ఏకు ప్రయత్నిస్తానంటే నాయన ఏదో ఉద్యోగం చూసుకోమన్నారు. వచ్చే యేడు తమ్ముడు కాలేజీకి వస్తాడు. ఇద్దరినీ హైదరాబాద్‌లో ఉంచి చదివించడం భారమవుతుందన్నారు. ఇంకో యేడాది గడువుంది గనుక ఉస్మానియాలో కొత్తగా ప్రారంభమైన జర్నలిజం కోర్సు యేడాది స్నాతకోత్తర డిప్లొమాలో చేరుతానని, దానికి ఆదరణ, గౌరవం ఉంటాయని చెప్పి ఒప్పించాను. ఒప్పుకున్నారు. జ్ఞాపకాల వరద 09

స్వతంత్రలో తాలివ్యాసం నేను పత్రికారచన కోర్సు వైపు మొగ్గుచూపేటట్టు చేసిన సంఘటన ఒకటి, సప్లిమెంటరీ పరీక్షలకు ముందు జరిగింది. హైదరాబాద్‌లో ఉండి పరీక్షలకు సిద్ధమవుతున్నాను. వివేకవర్ధనీ కాలేజీలో బాలసాహిత్యంపై సెమినార్‌ జరుగుతున్నట్టు పత్రికలలో వార్త కనబడింది. అలవాటు (ప్రకారం వివేకవర్ధనీ చేరుకున్నాను. అది బహుభాషా సెమినార్‌. మరాఠీ, కన్నడ, తదితరభాషల రచయితలు కిందటేదు తమ భాషలలో వచ్చిన ఉత్తమరచనలను ఉల్లేఖనలతో సహా వివరించారు. తెలుగుప్రతినిధి మాత్రమే తమ భాషలో గొప్ప బాలసాహిత్యమేదీ రాలేదన్నారు. నాకు చాలా నిరాశ్ళ బాధ కలిగాయి. సాయంత్రం ఇంటికి రాగానే నా ఆవేశాన్ని కాగితం మీద పెట్టాను. ఎత్తుగడ ఆవేశంలోంచి పుట్టుకొచ్చింది. 'మా అన్నయ్య కొడుకు మూడేళ్ల పిల్లాడున్నాడు, వాడికి కొంగ బొమ్మ చూపి, పావురం బొమ్మచూపి, మరోపక్షి బొమ్మచూపి ఇదేమిటి అని అడిగితే అన్నిటికీ 'అది ఒక పిట్ట" అని సమాధానమిచ్చినట్టు ప్రారంభించాను. అది విన్న మా బావ "వారెవా! సుబ్బారాయుడి నివుంటువువిరా" అన్నట్టు వ్యాఖ్యానించాను. అలాటి ఎత్తుగడ పారకునికి ఆసక్తిజనకంగా ఉంటుందని తెలిసీ తెలియని ఓ నమ్మకం. అలా తెలుగు నిఘంటువుల స్థితితో పొారంభఖించి, చిన్న కథలు, అనువాదాలు, కవిత్వం ఇలా అన్ని సాహిత్యప్రక్రియలలోనూ మనం వెనుకబడి ఉన్నామని తేల్చి, దేశభాషలందు తెలుగు లెస్స ఏ నాడో, అంటూ ముగించాను. ఇలాటి విమర్శను ఏ పత్రిక వేస్తుందని ఆలోచించగా నిరాశే మిగిలింది. సంపాదకుని లేఖల శీర్షికలోనైనా ప్రచురించాలని కోరుతూ స్వతంత్ర ప్రధానసంపాదకుడు ఖాసా సుబ్బారావుకు పంపించాను. కొన్నిరోజులు పోయాక ఒకరోజు నేనేదో పనిమీద బయటకువెళ్లి వచ్చేసరికి,

నాతోపాటు గదిలో ఉంటున్న సీతారామాచారి స్వతంత్ర పత్రికను చూపి, “నీ వ్యాసం వచ్చింది చదివి ఇచ్చేస్తాను” అన్నాడు. “నేనేమీ వ్యాసం వ్రాయలేదే!” అన్నాను. “నీ పేరుతో పత్రికవస్తే చూస్తున్నా. జి.యస్‌. వరదాచారిఅని నీ పేరుతో వ్యాసం కనబడింది. నువ్వు వ్రాయకపోకే నీ పేరుతో ఎట్లా వస్తుంది?” అన్నాడాయన. నేను సంపాదకలేఖ వ్రాస్తే వారికి నచ్చి దానికి “ఏ నాడో, దేశభాషలందు లెస్స, ఎదుగూ బొదుగూలేని తెలుగు భాష అని శీర్చిక పెట్టి 1955 ఆగస్టు2౦వ తేదీ సంచికలో (ప్రచురించారు. ప్రతిభను కనిపెట్టి ప్రోత్సహిస్తారని ఖాసాకు అప్పటికే పేరుండేది. 100 జి.యస్‌. వరదాచారి

ఈ వ్యాసానికి సంబంధించిందే మరో విషయం గోరాశాస్రి షష్టిపూర్తి సమయంలో బయటపడింది. షష్టిపూర్తి ప్రత్యేక సంచికకోసం వ్యాసాలను ఎంపిక చేస్తుండగా పై వ్యాసం శాస్రిగారి దృష్టికి వచ్చింది. ఆంధ్రభూమి ఆఫీసుకు తెచ్చి “ఈ వరదాచారి మీరేనా? అని అడిగారు. నేనే అన్నాక చెప్పారు. ఆ మరుసటి సంవత్సరంనుంచి యేటేటా ఉగాది సంచికలో తెలుగు సాహిత్యంలో వివిధప్రక్రియలలో క్రితం సంవత్సరం వచ్చిన రచనలన్నిటినీ సమీక్షించే 'సాహిత్య సింహావలోకనం' శీర్షికను ప్రారంభించారు. దాని ప్రచురణకు ఈ వ్యాసమే దారి చూపిందని చెప్పారు. యండమూరి శ్రీవాత్సవ ఆ శీర్షికను స్వతంత్ర ఉన్నంతకాలం దానిలో వ్రాశారు. అది మూతబడ్డాక కొంతకాలం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో కొనసాగించారు. ఎంతో సమర్ధ్థతతో, పాత్రికేయ నిష్పాక్షికతతో నిర్వహించారు. కొన్నేళ్లపాటు 'దిద్దుబాటు" శీర్షికను వ్రాసిన నాకు, ఇదెంత శ్రమతో కూడుకున్న పనో తెలుసు. జ్ఞాపకాల వరద 101

  1. జర్నలిజం వైపు మొగ్గు నాకు ఉపాధ్యాయవృత్తి అన్నాా పత్రికారచనావ్యాసంగమన్నా గౌరవం. రెండూ సమాజాన్ని సర్వశ్రేయోమార్గం దిశగా నదడుపుతాయని నమ్మకం. రెంటిలో జర్నలిజానిది కౌంత పైచేయి. కనుక జర్నలిజం వైపే మొగ్గాను. చివరకు రెండింటిలో సమాన పాత్రనే నిర్వహించాను. డిగ్రీ మాత్రమే కాక జర్నలిజంలో వృత్తిపరమైన అర్హత కూడా ఉంటే, ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని తోచింది. 1954లో ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పి.జి. డిప్లొమా కోర్సు ప్రారంభించారు. అమెరికాలోని ఇండియానాపాలిస్‌ విశ్వవిద్యాలయంలో జర్నలిజం (ప్రాఫెసర్‌గా ఉన్న డి. ఫారెస్ట్‌ ఓడెల్‌ శాఖాధిపతిగా వచ్చారు. దరఖాస్తు పెట్టుకుంటే ప్రవేశపరీక్షగా ఇంగ్లీషులో వ్యాసం (వ్రాయాలన్నారు. పన్నెండే సీట్లు. చాలా మంది వ్రాశారు. నేను బాగానే (వ్రాశాను. కాని ఇంగ్లీషు దెబ్బ తిని ఉన్నానుగదా, సీటు వస్తుందో రాదోనని జంకు. అప్పుడే ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రభుత్వప్రకటన వెలువడింది. దానికీ దరఖాస్తు పంపుకుంటే ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. వెళ్లాను. సేతు మాధవరావు అప్పుడు విద్యాశాఖ డైరెక్టరు. విద్యాశాఖను అప్పుడు ప్రజాబోధనల (పబ్లిక్‌ ఇన్స్‌ట్రక్షన్‌) శాఖ అనేవారు. నా మార్కులు చూచి ఆయన మొదటి ప్రశ్నగా “మీదే జిల్లా?” అని అడిగారు. “నిజామాబాదు” అని చెప్పగానే, “నిజామాబాద్‌లో ఎక్కడ వేయమంటావు” అని అడిగారు. నేను “హైదరాబాద్‌లో వేయం”డన్నాను. “నిజామాబాద్‌కు పో. నీకు అనుకూలంగా ఉంటుందని తర్వాతి అభ్యర్థిని పిలిచారు. వారంలో అపాయింట్‌మెంట్‌ ఆర్జరు కూడా వచ్చింది. జర్నలిజంలో సీటు రాకపోతే అదే దిక్కు అనుకున్నాను. కాని సీటు వచ్చింది. టీచర్‌ ఉద్యోగం ఆర్డర్‌ను పక్కనబెట్టి ఆర్ట్స్‌ కాలేజిలో జర్నలిజం కోర్సులో చేరిపోయాను. మా క్లాసులో అందరూ నాకంటే పెద్దవారే. కేంద్ర ప్రభుత్వ పంచవర్ష ప్రణాళికా 'ప్రచారాధికారి ఆంటోనీ, సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసరు శాంతికుమార్‌, అప్పటికే ఎం.ఏ. చేసిన పి.ఆర్‌. రెడ్డి ఇలా అందరూ అన్ని విధాలా పెద్దవారే. అరవిందన్‌ ఒక్కడే నా సమవయస్ముడు. నళిని రామ్‌చందానీ అని ఒకేఒక అమ్మాయి ఉండేది. ఓడెల్‌ తరగతిలో ట్యుటోరియల్‌ పద్ధతి పాటించేవారు. మూడు నాలుగు బల్లలను కలివి పొడుగ్గా వేసి, మధ్యలో తాను కూర్చొని, చుట్టూ విద్యార్థులందరినీ 102 జియస్‌. వరదాచారి

కూర్చోబెట్టేవారు. పాఠంచెప్పి ఎవరినీ వదలిపెట్టకుండా అందరినీ ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించేవారు. పత్రికారంగం ఉపేక్ష

జర్నలిజం తరగతులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు వరకు జరిగేవి. మెస్‌లో ఉన్నవాళ్లంతా చెల్లాచెదరయ్యారు. లక్ష్మణరావు డాక్టరేట్‌ పూర్తి చేసి నాందేడ్‌లో లెక్సరర్‌ ఉద్యోగంవచ్చి వెళ్లిపోయారు. సీతారామాచారి బి.కామ్‌ పూర్తి చేయకున్నా రామగుండం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో అకౌంట్స్‌ విభాగంలో ఉద్యోగంలో చేరిపోయాడు. నేను నారాయణగూడలో గది అద్దెకు తీసుకుని వంట చేసుకొని చదువుతుందేవాడిని. జర్నలిజం తరగతిగదిలో బోధించగలిగిన విషయంకాదని ఆ రోజులలో జర్నలిస్టులు కూడా చాలామంది భావించేవారు. కొన్ని పత్రికలు అలా వాదిస్తూ సంపాదకీయాలు కూడా వ్రాశాయి. ఆ నాటికి పూర్తి స్థాయి జర్నలిజం స్నాతకోత్తర కోర్సు ఢిల్లీలో ఉన్న పంజాబ్‌ యూనివర్సిటీలో ఉండేది. తర్వాత ఉస్మానియాలో ప్రారంభించారు. నాగపూర్‌లో హిస్లప్‌ కాలేజీలో కూడా అందుబాటులోకి వచ్చింది. మద్రాసు యూనివర్శిటీలో ఏదో కోర్సు ఉన్నట్టు గుర్తు. జర్నలిజం బాగా అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్‌, జపాన్‌ దేశాలలో చాలా యూనివర్శిటీలలో కోర్సులు ఉండేవి. ఉస్మానియాలో మా ముందు - అంటే మొదటి బ్యాచిలో - విద్యార్థి అయిన యూనివర్శిటీ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ మూర్తి ప్రథమశ్రేజిలో ప్రథములుగా ఉత్తీర్ణులై. జర్నలిజంలో ఉన్నత చదువుకోసం అమెరికా వెళ్లారు. ఆతని సహాధ్యాయి, శాఖాధిపతికి కార్యదర్శిగా పనిచేస్తున్న ఈపన్‌ ఆ మరుసటి సంవత్సరం అలాగే వెళ్లారు. తిరిగి వచ్చాక మూర్తి పుణె ఫిలిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి డైరెక్టరయ్యారు. ఈపన్‌ హిస్లప్‌ కాలేజీలో జర్నలిజం శాఖాధిపతిగా, ప్రొఫెసర్‌గా పని చేయడమేగాక, జర్చలిజం విద్యాత్మక విషయాలలో దేశంలోనే గొప్ప పేరు సంపాదించారు.

అమెరికన్‌లతో మనకు ఎక్కువగా సంపర్కం లేని రోజులవి. బిబిసి వార్తలు వినడంవల్ల బ్రిటిష్‌ ఇంగ్లీషు ఉచ్చారణ మనకు కొంత తెలుసు. అమెరికనుల ఉచ్చారణ మరింత జటిలం. అర్థం చేసుకోడానికి ప్రత్యేకశ్రద్ధ అవసరమయ్యేది. నేను మా ప్రొఫెసర్‌కు సరిగ్గా ఎదురు సీటులో కూర్చునేవాడిని. ఆయన మాటతీరును, యాసను పట్టేశాను. ఆయన ప్రతి బుధవారం ప్రొఫెసర్స్‌ క్వార్టర్స్‌లోని తమ నివాసానికి విద్యార్థులను ఇష్టాగోష్టికి పిలిచేవారు. ఆయన భార్య జర్చలిస్టుగా పనిచేశారు. ఆమె విద్యార్థులకు ఉపాహారం ఇవ్వడమేగాక, చాలా విషయాలపై స్పందిస్తూ ఉండేవారు. జ్ఞాపకాల వరద 108

ఆమెగొంతు ప్రీసహజంగా సన్నగా ఉంటుంది. గనుక దాన్ని అర్ధం చేసుకోవడానికి మరింత శ్రమపడవలసి వచ్చింది. ఒకరోజు ఆమె ఒక (ప్రశ్న అడిగారు. “భారతీయుల పేర్లన్నీ అర్ధవంతంగా ఉంటాయంటారు. నిజమా?” అని. శాంతికుమార్‌ అనే విద్యార్ధి పేరు ప్రస్తావించి దాని అర్ధమేమిటన్నారు. శాంతికుమార్‌ “ఏమో నాకు తెలియదు అని “వరదాచారి చెవుతాడన్నాడు. నేను ఇరకాటంలోవడద్డాను. ఎవ్చుడూ ఆలోచించలేదు.” ఆలోచనలో వడ్డాను. రాజకుమారులను (విన్స్‌ అంటారని గుర్తుకువచ్చింది. శాంతి అంటే పీస్‌, ' శాంతికుమార్‌ అంటే ప్రిన్స్‌ ఆఫ్‌ పీస్‌ అని అర్థమని దబాయించాను. శాంతికుమార్‌తో సహా అందరికీ నచ్చింది. మేడమ్‌ చాలా మంచి అర్ధమున్న పేరు అన్నారు. శాంతికుమార్‌ నా చెయ్యి నొప్పి పెట్టేంత గట్టిగా ఊపాడు. దీనివల్ల నాపై బాధ్యత పెరిగింది. నా పేరు అర్ధం అడిగారు. వరద అంటే వరాలు ఇచ్చేవాడని అర్థం. గివర్‌ ఆఫ్‌ బూన్స్‌. ఆమెకు నచ్చింది. ఒక బుధవారం గోష్టిలో మేడమ్‌ తాను బేగంబజారు వెళ్లి కొనితెచ్చిన గణపతి, లక్ష్మి, సరస్వతి విగ్రహాలను చూపి, వాటి వివరణలు (ధ్రాసి, ఇమ్మన్నారు. ఇచ్చాను. అమెరికన్‌ పేరులకు కూడా అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రొఫెసర్‌ పేరే తీసుకుంటే డీ ఫారెస్ట్‌ అంటే అడవులు నరికేవాడని అర్ధం. అమెరికాలో సుప్రసిద్దవ్యాపారవేత్త రాక్‌ ఫెల్లర్‌ ఉన్నాడు. అంటే కొండరాళ్లను పగులగొట్టేవాదని అర్ధం. మేము డిగ్రీలో చదివిన ఇంగ్లీషు నాన్‌ డిటేల్‌ రచయిత పేరు గమ్మత్తుగా జాన్‌ (డ్రింక్‌ వాటర్‌ అని ఉండేది. జోన్‌, నీళ్లు తాగుమని. ఢిల్లీ విజానయాత్ర

జర్నలిజం విద్యార్థులను యూనివర్సిటీవారు విజ్ఞానయా(త్రకు ఢిల్లీకి తీసుకువెళ్లారు. అప్పుడు ఎంపీగా ఉన్న స్వామీ రామానంద తీర్ధ క్వార్టరులో వసతి దొరికింది. మేము వెళ్లిన రోజే ప్రొఫెసర్‌ కూతురు అమెరికానుంచి వచ్చి దిగింది. ఆమె ఉచ్చారణ బొత్తిగా అర్ధమయ్యేది కాదు. దేశంలోకెల్లా (ప్రసిద్ధ ఆంగ్ర దినపత్రికలు హిందుస్తాన్‌ టైమ్స్‌, స్టేట్స్‌ మన్‌, ఇండియన్‌ ఎక్స్‌(యైెన్‌ కార్యాలయాలను సందర్భించాము. దూరప్రాంతాలకు వెళ్లే డాక్‌ ఎడిషన్లు మేకప్‌ కావడం చూశాము. ఆలిండియా రేడియో కార్యాలయానికి వెళ్లాము. అప్పుడు తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషలలో, వార్తలు ఢిల్లీనుంచే (పప్రసారమయ్యేవి. తెలుగు విభాగానికి వెళ్లి, గంభీరమైన గొంతుతో అద్భుతంగా వార్తలు చదువుతారని పేరున్న పన్యాల రంగనాథరావును చూడాలన్నాము. అందరినీ ఒక గదిలో కూర్చోబెట్టి ఆయనను 104 జియస్‌. వరదాచారి

తీసుకువచ్చారు. పొట్టిగా పిట్టంత ఉన్న ఆ మనిషిని చూచి ఈ మనిషిదా ఆ గొంతు అని ఆశ్చర్యపోవడం మా వంతైంది. పన్యాల తర్వాత కాలంలో హైదరాబాద్‌లో పనిచేశారు. రేడియోలోనే కాక దూరదర్శన్‌లో వార్తలు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది.

ఢిల్లీలో ఎర్రకోట, కుతుబ్‌ మీనార్‌ చూశాము. పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి భవన్‌ను బయటినుంచి చూశాము. ఢిల్లీలో ఆ నాటి అమెరికా రాయబారి జాన్‌ షర్మన్‌ కూపర్‌ మా బృందానికి డిన్నర్‌ ఇచ్చారు. అక్కడి అనుభవాల్లో నేర్చుకోదగిన అంశాలు ఉన్నాయి. భోజనం అనంతరం రాయబారి భార్య అందరికీ టీ ఇచ్చారు. అందరూ వరుసలో ఆమె కూర్చున్నచోటికి వెళ్తున్నారు. ఆమె హలో అని పేరు అడిగి టీలో మీకేమి కావాలని అడుగుతున్నారు. నా ముందున్న ఇద్దరు ఏమీ వద్దన్నారు. దాంతో ఆమె డికాక్షన్‌ మాత్రం పోసి కప్పు వారిచేతికి ఇచ్చారు. చాలా దేశాలలో టీ అలాగే తాగుతారు. మన అలవాటు వేరు. ఆమె అడుగుతున్నదేమిటో ఊహించాను. నేను మిల్క్‌ అండ్‌ షుగర్‌ అన్నాను. మిగతావారిలా అవస్థపడటం తప్పింది.

విజ్ఞానయాత్రలో విహారయాత్ర విడదీయరాని అంతర్భాగం. ఢిల్లీ వెళ్లినప్పుడు దారిలోనే ఉన్న ఆగ్రా, తదితర చారిత్రకప్రదేశాలనుచూడటం తప్పనిసరి. తాజ్‌ మహల్‌ను పున్నమి వెన్నెలలో దర్శించడం గొప్ప అనుభూతి అంటారు. కొన్ని గంటలలో అనేక కట్టడాలను చూచి ఆహా అనడం కంటే మరో మార్గంలేని పరిస్థితి మాది. వెన్నెలలో చూచే అవకాశమేదీ? వేకువజామున మంచు కురుస్తుంటే చూశాము. అదీ అద్భుత దృశ్యమే! దగ్గరికి వెళ్లిచూస్తే తాజ్‌ ఏమంత గొప్పగా అనిపించలేదు. లోపలికి వెళ్లాక చలువరాతి పలకలమీద చెక్కిన లతలు, పుష్పాలు, ఫలాలు, కమానులు నోరు వెళ్లబెట్టేలా చేశాయి. ఆగ్రా కోట, షాజహాన్‌ను బంధించిన చెరసాల చూశాము. తొజ్‌మహల్‌కు పోటీగా దానికంటే అందంగా ఉందేలా పాలరాతితో రాధాస్వామి ఆలయాన్ని కదుతున్నారు. ఆ ఆలయాన్ని చూశాము. రాధాస్వామీ సత్‌ సంగ్‌ అని ఒక ప్రార్థనా సమాజం. ఆ రోజులలో దేశమంతా దాని శాఖలు ఉండేవి. ఆర్మూరులో కూడా దాని శాఖ ఉండేది. ఆ ఆలయనిర్మాణం దశాబ్దాలపాటు కొనసాగడం అదొక విచిత్రం. ఆగ్రాకు కొంతదూరంలో అక్బర్‌ తన రాజధానిగా నిర్మించుకొన్న ఫతేపూర్‌ సిక్రీని చూశాము. అక్కడి బులంద్‌ దర్వాజా అనే సింహద్వారము ఎత్తులో సాటి లేనిది. రాచమహలు అంటే ఏమిటో దాన్ని చూస్తే తెలుస్తుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది జోధాబాయి మహలు, ఇది బీర్‌బల్‌ నివాసం, ఇక్కడ తాన్‌సేన్‌ జ్ఞాపకాల వరద 105

సంగీత కచేరీ చేసేవాడు అని గైడు చెప్పకముందే ఆ భవనాల వాస్తుశిల్పాన్నిబట్టి మనం ఊహించవచ్చు. కోటంరాజు రామారావుతో ఖేటీ తిరుగు ప్రయాణానికి ఢిల్లీ తిరిగివచ్చాము. సాయంత్రందాకా సమయముంది. కేంద్ర సచివాలయాన్ని చూడాలి. తెలుగువాడు, దేశంలో సాటిలేని గొప్ప సంపాదకుడు అయిన కోటంరాజు రామారావును చూడాలి. అప్పుడే ప్రధాని నెహ్రా పంచవర్ష ప్రణాళిక ప్రచార సలహాదారుగా ఆయన కోసమే కొత్త పదవిని సృష్టించి నియమించారు. సచివాలయంలో ఆయన కార్యాలయానికివెళ్లి ఆ కోర్కె తీర్చుకున్నాము. తర్వాత సుప్రసిద్ధ అమెరికన్‌ నవలారచయిత జేమ్స్‌ మిచ్నర్‌ను కలుసుకొని ఇంటర్‌వ్యూ చేశాము. ఆయన భారతదేశం నేపథ్యంగా కొత్త నవల వ్రాస్తున్నారు. దాని గురించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఉవఖండానికి వచ్చారు. ఏది వ్రాసినా, చెప్పినా ప్రామాణికంగా ఉండాలి. అంటే అధ్యయనం చేయాలి. మనం ఆ స్థాయికి ఎదగాలి. అప్పుడే తదనుగుణంగా మనకు గౌరవం దక్కుతుందని అర్థమైంది. " విద్యార్థిషత్రిక సంపాదకత్వం జర్నలిజం విద్యార్థుల అభ్యసన పత్రిక “ఉస్మానియా కొరియర్‌ అనిఉందేది. దానికి విద్యార్థి సంపాదకుడిగా నేనే వ్యాసరచన పోటీద్వారా ఎంపికయ్యాను. నాలుగు సంచికలు తీశాము. కొరియర్‌లో విద్యార్థి సంబంధమైన, విద్యాసంబంధమైన వార్తలు విద్యార్థులు వ్రాసినవి ప్రచురితమయ్యేవి. ఒక సంచికలో కవిత, మరో సంచికలో కార్టూను కూడా వేసినట్టు జ్ఞాపకం. మా గణితశాఖాధిపతి వెంకటాచారి మరణించారు. ఆయన నివాళి వార్త నేనే వ్రాశాను. ఈపన్‌ పర్యవేక్షకుడుగా ఉండేవారు. జర్నలిజం శాఖకూడా ఆర్ట్స్‌ కాలేజీ భవనంలోనే ఉందేది. ఆర్ట్స్‌ కాలేజీ ఆ రోజులలో నగరంలోని అవశ్యసందర్శనీయ కట్టడాలలో ఒకటిగా ఉందేది. ఎంట్రెన్స్‌ హాలులో ప్రవేశించగానే మయసభ తలంపునకు వచ్చేది, తళతళ మెరసే గచ్చు మీద ఎవరూ అడుగుపెట్టేవారు కాదు. ఎదురుగా పై ఉంతస్తులకు వెళ్లే మెట్లు. గోడకు రంగుటద్దాలు పొదిగిన కమాను. మధ్యలో ఉర్దూ బన్‌ అక్షరం పొదిగిన యూనివర్శిటీ చిహ్నం. డిగ్రీలో మా గణితశాఖ, తర్వాత జర్నలిజం శాఖ రెండూ రెండవ అంతస్తులో ఉండేవి. వైస్‌ చాన్సలర్‌ కార్యాలయం కూడా ఆర్ట్స్‌ కాలేజీ భవనంలోనే ఉండేది. తర్వాతి కాలంలో యూనివర్శిటీ (ప్రాంగణం నుంచి డిగ్రీ తరగతులను తొలగించారు. స్నాతకోత్తర తరగతులు, పరిశోధన 106 జియస్‌. వరదాచారి

ాజావాాంంాకాాడా. |. తరగతులకే పరిమితం చేశారు. వైస్‌ చాన్సలర్‌ 1 పా కార్యాలయంకోసం ప్రత్యేకభవనం నిర్మించి ఆర్ట్స్‌ కముభ్ర్య న గిరా రావట కాలేజీ నుంచి తరలించారు. ఆ రోజులలో సూరి మమమ నమమ. |. భగవంతం మా వైస్‌ చాన్సలర్‌, ఆర్ట్‌ కాలేజి ఎంట్రెన్స్‌ శతూణాడుంయుల: ౩బయ్‌.. " | హాలులో నటరాజ రామకృష్ణ వరిచయనభ ము 2/౧ ౧౯ ౧ంముం 10య బర అం 107 కొం ధిర పెట్టించారు. హాలు చెడిపోతుందేమోనని కొందరి పబ 1/8 ౯ 0)? 1౧ల ౧073 ఇహెనాలా ఆజ హాలళంయి.. , | గునగునలు వినివించాయి. కాని కువ్త శాం౪0 [007 కల కం ఆవ్వానోపన్యాసం ముగిసి, నటరాజు తన శ్రావ్యమైన బట్తవనననన రన | గాంతుతో ఆలాపన చేసి, కృష్ణలీలాతరంగిణి పదాలు దవయ! . | ప్రాడ్రుతూ, వేకవ్‌ లేకుండానే కూచివూడి _రగ లలా టంంగక్‌, | నృత్యరీతులను గంటకు పైగా అభినయించి చూపిన శు ళ్‌ త "| తీరు వీక్షకులను ముగ్గులను చేసింది. తర్వాత వం ప నెక 2తో | నటరాజ రామకృష్ణ హైదరాబాద్‌లోనే స్థిరవడి రాలా! ఎందరో గొప్ప కళాకారులను తయారుచేయడమే | వళయిః౦ం॥ 0౫ టకా శం వరాయుర | గాక, బహు(గంథరచన చేసిన సంగతి చరిత్ర. (| వాటలనం?” | ళా 8. 1. వష2ఆ౯ ౧1264 యి నాకు చిన్నప్పుడే ఫైలేరియా వచ్చిందని, ఉస్మానియా కొరియర్‌ సంపాదకత్వం _ వ్రడ్రమకాలు వాచిందని చెప్పానుగదా. నేను డిగ్రీలో ఉండగా ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టరు హెట్రాజాన్‌ అనే మాత్రలు వాడమన్నాడు. అవి మంచిఫలితాన్ని ఇచ్చాయి. పదేపదే కాలు ఉబ్బడం, జ్వరం రావడం తగ్గిపోయింది. మామూలుగా బోదకాలు అంటే కాలు పైనుంచి పాదంవరకు ఏనుగు కాలులాగ ఉబ్బి నిలిచిపోతుంది. పాదం కూడా అందులో కలిసిపోతుంది హెట్రాజాన్‌ వాడటంవల్ల నా కాలు అలా కాలేదు. ఎడమ పాదం మామూలుగానే ఉన్నది. బోదకాలు లక్షణాలు కనిపించవు. సీలమండ దగ్గర జాగ్రత్తగా గమనిస్తే లావు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే ఎందుకో ప్రతీ సంవత్సరం వార్షికపరీక్షలకు ముందు మలేరియా జ్వరం వచ్చేది. ఒక్కోసారి ఆస్పత్రిలో చేరవలసిన పరిస్థితి వచ్చేది. వైష్ణవ మాసపత్రిక జర్నలిజం చదువుతున్నపుడు స్వయంపాకమని చెప్పాను గదా. ఎనిమిదింటికే కాలేజీలో ఉండాలి. బస్సు ప్రయాణం అరగంట. అందుచేత పొద్దున టీ మాత్రం చేసుకొని తాగి రెండు గంటలకు తిరిగి వచ్చాక భోజనం చేసేవాడిని. ఒక చిన్న జ్ఞాపకాల వరద 107

బొగ్గుల పొయ్యి కొన్నాను. దానినిండా బొగ్గులు నింపి రాజవేసి చిన్న గిన్నెలో బియ్యం కడిగి తగినన్ని నీళ్లు 'శాడూనా. పోసి పాయ్యిమీద పెట్టి మూతవేని కాలేజీకి నాకనా వెళ్లిపోయేవాడిని. అన్నంమంచిగా ఉడికే సరికి బొగ్గులు ఆ. నం బూడిదయి పొయ్యి ఆరిపోయేది. అన్నమెప్పుడూ “అ మ అడుగంటడం, మాడిపోవడం జరిగేది కాదు. తిరిగి |. మవియూంాన వచ్చేటప్పుడు దారిలో మిఠాయి దుకాణంలో పకోడీయో, | ఖ్‌ వేయించిన పప్పో, బూందో కొనుక్కుని, పెరుగు కూడా తెచ్చుకొని, శాకంలేని కొరత తీర్చుకునేవాడిని. అప్పుడు కర్రీ పాయింట్స్‌, టిఫిన్‌ సెంటర్స్‌ లేవు, కనుక రాత్రికే శాకభోజనం. అప్పుడు మెస్సు మెదడులో మెదిలేది. నాలాగ అవస్థ పడుతున్న వారెందరో ఉన్నారు. ఇకముందు ఉంటారు. ఒక ప్రయత్నం ఫలించలేదు. మరో ప్రయత్నం చేయాలి. పాత మిజ్రులను కలిసినప్పుడు ఇదే చర్చ. శ్రీవైష్ణ్ర యువజన సంఘం అనే పేరుతో పెద్దల ముందుకు వెళ్లాలని అనుకున్నాను. అప్పుడే ఒక పత్రిక పెడితే బాగుంటుందన్న ఆలోచన కూడా నాకు వచ్చింది. కోటీలో జ్యోతి ప్రింటర్స్‌ అనే ప్రెస్సు ఉందేది. ఆ మేనేజర్‌ను కలిసి12 పేజీల మాసపడ్రిక వేయాలంటే ఎంత అవుతుందని ఆరా తీశాను. ఆ ప్రెస్‌ యజమాని కరీంనగర్‌లో ఫారెస్ట్‌ రేంజర్‌. ఆయన అక్కడే ఉన్నారు. జర్నలిజం విద్యార్ధి పత్రిక తేవాలనుకుంటున్నాడనే విషయం అర్థం చేసుకున్నాడు. పిలిచి “ఏం చదివావు” అని అడిగారు. గణితం (గ్రాడ్యుయేట్‌నని చెప్పగా, “నీ మాట తీరు నాకు నచ్చింది నేనొక ఆఫర్‌ ఇస్త్రొ ఆలోచించ్చు, అన్నాడు. చెప్పండి అంటే తనకు పదవ, తొమ్మిదవ తరగతులల్రో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనీ, వారికి లెక్కలు, ఇంగ్లీషు ట్యూషన్‌ చెపితే అందుకు బదులుగా కాగితంతో సహా 12 పేజీల పత్రిక ఐదు వందల కాపీలు అచ్చువేసి ఇస్తానన్నాడు. నేను వెంటనే వైష్ణవ అనే పేరుతో డిక్లరేషన్‌ దాఖలు చేసి సనదు తెచ్చుకున్నాను. ఆధ్యాత్మికవిషయాల మీద సామాన్యపాొఠకుడికి ఆసక్తి కలిగించే శైలిలో గం్ర తప్పకుండా వ్యాసాలు వ్రాయగలవారి జాబితా, నాకు తెలిసినంత వరకు తయారుచేసుకున్నాను. వారికి ఉత్తరాలు పంపించాను. అప్పుడు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న శిరిశినహళ్‌ వెంకటాచార్యులు నాకు సహాయపడ్డారు. టైటిల్‌ ప్రెస్సు మేనేజరే డిజైన్‌ చేయుంచి ఇచ్చాడు. 27 ఏప్రిల్‌ 1955 మొదటి సంచిక వెలువడింది. “ఆధ్యాత్మిక చింతన = విశ్వశాంతి” అని నేనే రెండు నిండు 108 జి.యస్‌. వరదాచారి

పేజీల సంపాదకీయం వ్రాశాను. దానిలో ఓ రెండు వాక్యాలు ఉటంకిస్తాను. “భౌతికంగా ఇంత వృద్ధిచెందిన మానవుడు నైతికంగా ఎంతో దిగజారిపోయాదు. మానవసహజమగు సంతోషాన్ని కోల్పోయాడు. ఆత్మభీతి పాలవుతున్నాడు. దీనికంతకు పదార్థవాదమే కారణం. పదార్థవాదమే రెండు ప్రపంచమహాయుద్దాలకు కారణమైంది. మళ్లీ ప్రపంచాన్ని యుద్ధపొలిమేరల్లోకి తెచ్చి వదిలినది. ఈ సారి అలాటి యుద్ధమే వస్తే ఈ ప్రపంచంలో జీవరాశియే లేకుండాపోవచ్చు...... ఆధ్యాత్మిక చింతనలో అనాదిగా అన్ని దేశాలకు ఆదర్శప్రాయంగా ఉంటూవచ్చిన భారతదేశమే నేడు ప్రపంచానికి శాంతిసందేశాన్ని ఇవ్వగలదు........ అప్పుడే మనమాశిస్తున్న సుస్థిర శాంతిస్థాపన, (శ్రేయోరాజ్యస్థాపన జరుగుతుంది. మా ఈ చిన్ని ప్రయత్నము అందులకు కొంతైనా సహాయపడితే సంతోషిస్తాము.” 'భగవద్రామానుజ చరిత్ర), “శ్రీరామానుజ మతతత్త్వము, 'విజ్ఞాన వికాసమునకు మొదటి సాధనము ఉపనయనము ఆ నాటి కొన్ని వ్యాసశీర్షికలు. ఇవి కాక “శ్రీరాజ యోగానంద స్వామి సేనాపతి నరసింహాచార్యులు అనే శీర్షికతో కోరుట్లలో వేదాంతవర్ధినీ సంస్కృతపాఠశాల నిర్వాహకుల జీవితచరిత్రను ధారావాహికంగా ప్రచురించాను. ఆయనతో కలిసి పనిచేయడమేగాక తర్వాత ఆ పాఠశాల ప్రధానాచార్యులుగా ఉన్న శిరిశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని దాన్ని మాకు వ్రాసి ఇచ్చారు. '“పదార్థయిక జీవనపరులు, విజ్ఞాననిధులు, ఆదర్శపురుషులు శ్రీరాజయోగానంద స్వామి” అని సేనాపతివారిని పరిచయం చేశారు. తర్వాత స్వయంబోధినీపద్ధతిలో సంస్కృతపాఠాలను కూడా శతావధానిగారే వ్రాసి ఇచ్చారు. పిల్లలకోసం 'వైష్ణవ బాల' అని శీర్షిక పెట్టాను. ఐదు వందల ప్రతులు అనేకమందికి చిరునామాలు సేకరించి ఉచితంగా పంపాను. చందాలు పంపితే పత్రికను మెరుగుపరచి కొనసాగించాలనే ఉద్దేశం ఉండేది. ఏ ఉద్యోగంలో చేరినా ఆ పని చేయవచ్చు. తొమ్మిది నెలల ట్యూషన్‌తో పత్రిక తొమ్మిది సంచికలు వెలువడింది.

పత్రిక తక్షణలక్ష్యం హైదరాబాద్‌లో వైష్ణవవిద్యార్థుల కోసం వసతిగ్భహం ఏర్పాటు గురించి సామాజికుల దృష్టిని ఆకర్షించడం. ఉద్యమించాలంటే దానికో సంఘముండాలి. కనుక అందుబాటులో ఉన్న నలుగురైదుగురితో శ్రీవైష్ణవ యువజన సంఘం అని ఏర్పాటు చేసుకున్నాము. పత్రిక తొలిసంచిక చివరిపేజీలో సంఘం ఆశయాలను 'స్వ విషయము అని వివరించాము. కోరిక ఉన్నా అవకాశాలు లేక ఉన్నతవిద్య విషయంలో మనం వెనుకబడి ఉన్నాము. రాజకీయ, ఆర్థిక, సాంఘికబలం కూడా అంతంతమాత్రమేనని గుర్తుచేశాను. కొంత కదలిక వచ్చింది. వైష్ణవ మహాసభవారు మరోసమావేశాన్ని ఏర్పాటు చేశారు. (ప్రధాన కార్యదర్శిగా బాధ్యత జ్ఞాపకాల వరద 109

ఇవ్వబోయారు. మా విద్యాభ్యాసం పూర్తికావస్తున్నది. ఏ ఉద్యోగంలో చేరుతామో, ఎక్కడ ఉంటామో తెలియదు. కనుక యువకుడు, అభ్యుదయభావాలు కలవాడు చిలుకమళ్డి శ్రీనివాసాచారికి ఇవ్వమన్నాము. శ్రీనివాసాచారి మరింగంటి నర్సమ్మ దత్తపౌద్రుడు. దైవయాజ్జికుడు. అభ్యుదయభావాలు కలవాడు. తిండీ తిప్పల గురించి తెలిసినవాడు. "రెండేళ్లు వారి ఇంట్లోనే కలిసి ఉన్నాము. దినప(త్రికాపఠనం అలవాటు ఉన్నవాడు. ప్రకాశం పంతులు యాఖభైల దశకం ఆరంభంలో క్రావ్విడి లింగరాజు సంపాదకత్వంలో వెలువరించిన 'ప్రజాపత్రికును అభిమానిస్తుందే వాడు. ఇవెందుకు చెపుతున్నానంటే, సంప్రదాయపరుడు కావడంతో పాటు ఆధునికజీవితావసరాలు తెలిసినవాడనీ, గనుక ఏదో చేస్తాడనీ అనుకున్నామని తెలుపడానికే. కాని అడుగు ముందుకు సాగలేదు. 'హిందూ' పత్రికలో ఇంటర్బ్‌షిప్‌ జర్చలిజం కోర్సులో భాగంగా విద్యార్థులు ఏదైనా పెద్ద పత్రికలో నెలరోజులపాటు ఇంటర్న్‌షిప్‌ చేయవలసి ఉంటుంది. అంటే ఎంపిక చేసుకున్న పత్రిక కార్యాలయానికి వెళ్లీ ప్రత్యక్షశిక్షణ పొందవలసి ఉంటుంది. దానివల్ల విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్న పత్రికారచన మూలనూత్రాలను, ధర్మాలను, విషయోచిత రచనావిధానాన్నిి సందర్భోచితభాషను, శైలిని ఆచరణలో పెట్టే నేర్పు అలవడుతుంది. నేను ఇంటర్న్‌షిప్‌ మద్రాసు (ఇప్పుడు చెన్నై) వెళ్లి హిందూ దినపత్రికలో చేయాలని నిర్ణయించుకున్నాను. అ విషయమే చెప్పగా, “జర్నలిజంలో బాగా రాణించాలని గట్టిపట్టుదలతో ఉన్నావన్నమాట!”” అని ఓడెల్‌ సంతోషించారు. హిందూ పత్రిక యాజమాన్యానికి మా విద్యార్థి ఇంటర్న్‌షిప్‌ నిమిత్తం రాదలచాడని, అనుమతించాలని లేఖ వ్రాశారు. వారి సమ్మతి కూడా వెంటనే లభించింది. ఇంటర్బ్‌షిప్‌తో పాటు విద్యార్ధి ఒక అధ్యయనపటత్రం కూడా సమర్చించవలసి ఉంటుంది. నేను తెలుగు పత్రికల చరిత్ర గురించి అధ్యయనపత్రం సమర్పించ దలచాను. మార్చి నెల మొత్తం మద్రాసులో ఉందాలి. అంటే నేను ఒప్పుకున్న ట్యూషన్లు ఫిబ్రవరితో పూర్తిచేయాలి. కొత్త ప్రాంతానికి వెడుతున్నాను గనుక తగినంత డబ్బు సమకూర్చుకోవాలి. మద్రాసులో వీలును బట్టి తెలుగు పత్రికల కార్యాలయాలను, సంపాదకులను, పత్రికారచయితలను, సాహిత్యకారులను, సినీ ప్రముఖులను కలవాలి. కన్నైమరా వంటి ప్రసిద్ధగ్రంథాలయాలు ఉన్నాయి. వీలునుబట్టి గ్రంథాలయాలకు వెళ్లి నా అధ్యయనపత్రానికి సమాచారాన్ని సేకరించుకోవాలి. అన్నిటికంటే ముందు 110 జి.యస్‌. వరదాచారి

వసతి ఏర్పాటు చేసుకోవాలి. తెలిసినవారు ఎవరూ లేరు. అన్నిటికీ హిందూ సంపాదకవర్గసభ్యుడు వి.కె. నరసింహన్‌పైనే ఆధారపడాలి. కాదనరనే ధైర్యంతో వారినే ఆశ్రయించాను. మా నాయన నెలనెలా ఇచ్చే దబ్బు అందింది. మిత్రుడు దాదాగారి కిషన్‌రావు కొంత సహాయం చేశాడు. అవసరమైతే టెలిగ్రాం కొట్టు, మనియార్దరు పంపుతానని ధైర్యం చెప్పాడు. జర్నలిజం శాఖవారు ఆధికారిక పరిచయ పత్రం ఇచ్చారు.

మార్చి ఒకటవ తేదీ ఉదయం సెంట్రల్‌లో దిగాను. నేరుగా మౌంట్‌ రోడ్డులోని హిందూ కార్యాలయానికి వెళ్లాను. వాచ్‌మన్‌ దగ్గరకు వెళ్లి నేనెవరో చెప్పి, “వి.కె. నరసింహన్‌ను కలవాలి, పెట్టె ఇక్కడ పెట్టుకుంటా. పదితర్వాతవచ్చి ఆయనను కలుస్తా” నన్నాను. వాచ్‌మన్‌ నన్ను “రిచీ ఫ్రీట్‌లో ఆ తెల్లవారు జామునే గృహప్రవేశం జరుపుకున్న (పెస్‌ క్షబ్‌ భవనంలో నరసింహన్‌ ఉన్నారు, అక్కడికి వెళ్లూమని పంపించాడు. వెళ్లి చూస్తే అక్కడంతా ఉత్సవవాతావరణం. నరసింహనే కర్త, ఉత్తరమిస్తే ఆయన ఎంతో ఆప్యాయంగా 'ఇక్కడే స్నానం చేసి టిఫిన్‌ చేయి. ఆఫీసుకు వెళ్లి చేరి పో. మధ్యాహ్నం వచ్చి అందరితోపాటు భోజనం చెయ్యి. రాత్రికి నీ వసతిగురించి చెపుతా” నన్నారు. అలాగే చేసి హిందూ ఆఫీసుకువెళ్లి న్యూస్‌ఎడిటర్‌కు లెటరిచ్చాను. ఆయన చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌కు పరిచయం చేసి, పని ఇవ్వమన్నారు. ఆయన వెంట తీసుకువెళ్లి నాకో కుర్చీ చూపించి పేపరు ఇస్తాడు, చూస్తూ ఉండమని వెళ్లారు. కొద్దిసేపట్లో అటెండర్‌ ఆ రోజు పేపరిచ్చి వెళ్లాడు. మరి కొద్ది సేపట్లో చీఫ్‌ సబ్‌ వచ్చి ఒక ఆర్టికల్‌ ఇచ్చి, తప్పులు ఉంటే దిద్ది మూడు నాలుగు లైన్ల పరిచయం (వ్రాయమన్నాడు. అది గాంధీ మహాత్ముని జీవితంలో ఆఖరిఘట్టం గురించి, ఆయన కార్యదర్శిగా పనిచేసిన ష్యారే లాల్‌ “లాస్ట్‌ ఫేజొ (ఆఖరి ఘట్టం) అనే పేరుతో వ్రాసిన వ్యాససంపుటి. ఇలాటి వ్యాసాలు ఎడిటోరియట్‌ పేజీలో వేస్తారు. ఎడిటోరియల్‌ పక్కనే పైభాగంలో వేసేదాన్ని ప్రధానవ్యాసం అంటారు. మూడు నాలుగు కాలాలకు విస్తరించే శీర్షిక ఇస్తారు. ఆఖరి ఘట్టం వ్యాసాలు కూడా సంపాదకీయం ఉండే పేజీలోనే వచ్చాయి. ఐతే సింగిల్‌ కాలమ్‌లోనే. కనుక నేను పరిచయవాక్యాలు సింగిల్‌ కాలమ్‌లో నాలుగైదు లైనులు దాటకుండా వ్రాశాను. గాంధీ మహాత్ముని జీవితంలో ఆఖరు ఘట్టాన్ని వివరించే వ్యాసపరంపంలో ఇది మొదటిది. మహాత్మునికి ఆఖరు రోజులలో కార్యదర్శిగా పనిచేసిన ప్యారే లాల్‌ వీటిని వ్రాశారు. నేటినుంచి ధారావాహికంగా ప్రచురితమవుతాయి అని వ్రాశాను. “సింపుల్‌గా బాగుంది” అని చీఫ్‌ సబ్‌ ఓ.కే చేశారు. ఆ రోజులలో సంపాదకీయం ఉండే పేజీకిఎదురుగా ఉండే పేజీ ఈ నాటి జ్ఞాపకాల వరద 111

ఫ్రంట్‌ పేజి. అంటే మొదటి పేజీలాటిదన్నమాట. ఆ రోజు ముఖ్యమైనవార్తలు దానిలో అమర్చేవారు. ఆ రోజులలో మొదటి పేజీలో వర్లీకృతప్రకటనలు ఉండేవి. నేను 15 రోజులు దెస్మ్‌లో పనిచేసి, ఆ తర్వాత 15 రోజులు రిపోర్టింగు చేద్దామని ముందుగా అనుకొని న్యూస్‌ ఎడిటర్‌కు అదే చెప్పాను. ఆయనకూడా అదే సరైన పద్ధతి అన్నారు. మొదటిరోజు పని ప్రారంభించింది మహాత్ముని వార్తతో. వేరే కొన్ని వార్తలను సబింగ్‌ చేసి శీర్షికలు ఇచ్చాను. మధ్యాహ్నం 15 రిచీ స్ట్రీట్‌ భవనంలోనే హిందూ సంపాదక సిబ్బందితో కలిసి వెళ్లి భోజనం చేశాను. 5 గంటల వరకు డ్యూటీ ఉంటుంది. నాలుగున్నరకు *వరదాచారి మీరేనా?” అంటూ ఒకాయన వచ్చాడు. “నరసింహన్‌ చెప్పారు, మీకు రూమ్‌ చూపమని. 5:15కు వెంట తీసుకువెళ్లి రూమ్‌ చూపుతా” నన్నాడు. అలాగే సాయంత్రం ఆయనతో పాటే ప్రెస్‌ క్షబ్‌ వెళ్లి అక్కడ తేనీరు సేవించి పెట్టె తీసుకుని ట్రిప్లికేన్‌ వెళ్లాము. తిరువళిక్కేణి అపభ్రంశమై ట్రిప్లికేన్‌ అయింది. అక్కడ ప్రసిద్ధ పార్ధసారథిస్వామి దేవాలయం ఉంది. గుడికి నాలుగువైపులా ఉందే వీథులను మేడా ఫ్రీట్స్‌ అనేవారు. దక్షిణమేడ ఫ్రీట్‌లో ఉన్న ఒక వసతిగృవానికి తీసుకువెళ్లాడు. నిర్వాహకుడు ఒక గదిలో వసతి చూపించాడు. అందులో అప్పటికే సౌరిరాజన్‌ అనే అతను ఉంటున్నాడు. ఆయన అభ్యంతరం చెప్పాడు. “ఎవరో ఏమో, చెప్పా పెట్టకుండా హైదరాబాద్‌వాడిని నాతో పెడితే ఎలా?” అని నిలదీశాడు. మేనేజరు బతిమిలాడి ఒప్పించాడు. రోజంతా బాగా గడిచింది. రూమ్‌ ప్రవేశమేమిటి ఇలా వివాదాస్పదమైంది

అనిపించింది. నేను ఇలాటి శకునాలను నమ్మను. సర్దుకు పోగలనన్న ధైర్యం ఉన్నందున నేనేం బెంగపెట్టుకోలేదు. వాళ్లు అంతా అరవంలోనే మాట్లాడారు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. గది చూపినతను వెళ్లిపోతూ “డి. తె. (ద్రవిడ కజగం) కార్యకర్త. వాదం పెట్టుకోకంొడని సలహా ఇచ్చాడు. నేను గదిలో ఒకమూల సర్దుకున్నాను. ఎనిమిదింటికి దగ్గరలో భోజనశాలకు వెళ్లి తినేసి వచ్చి పడుకున్నాను. నా రూమ్‌ మేట్‌ ఎప్పుడు వచ్చి పడుకున్నదీ తెలియదు. మర్నాడు తకెల్లవారకముందే ఆయన ఎవరితోనో గట్టిగా మాట్లాడుతుంటే మెలకువ వచ్చింది. నేను లేవడం గమనించి నా దగ్గరకు వచ్చి “నువ్వు హిందూలో పని చేస్తున్నావా?” అని అడిగాడు. బెనంటే “నీకు పత్రిక కాంప్లిమెంటరీ కాపీ వచ్చింది, సంతకమటచేసి తీసుకో” అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపడటం నా వంతైంది. అప్పటి నుంచి సౌరిరాజన్‌ అవతారం మారిపోయింది. నా అభిమాని అయిపోయాడు. తన స్నేపాతులను తీసుకువచ్చి పరిచయం చేశాడు. నాతో మెత్తగా మాట్లాడేవాడు.

112 జి.యస్‌. వరదాచారి

ద్వేషం వీడి మిత్రుడైన సౌరి

ఒకరోజు డి. కె. వారి ఊరేగింపు చూడటానికి రమ్మని తీసుకుపోయాడు. సాయంత్రం ఊరేగింపు వద్దకు ఇద్దరం వెళ్లాము. కజగంవారు ఏవో విగ్రహాలను వల్లకిలో ఊరేగిస్తున్నారు. “మీరు దైవవిరోధులు కదా, దేవతా వి(గ్రవోల సేవతీయడమేమిటి” అంటే “చూస్తూ ఉండూ” అన్నాడు. దగ్గర చౌరస్తాలో ఆఫార్డు. పల్లకిలోనే ఒక చెప్పుల జత ఉంది. ఒక్కొక్కరు ఓ చెప్పు తీసుకొని విగ్రహాలను కొట్టడం మొదలు పెట్టారు. ఈ విగ్రహాలు ఎక్కడివని అడిగితే మావే అన్నాదు. విగ్రహాలను మీరే కొని వాటికి పట్టు వస్త్రాలు కుట్టించి ఊరేగిస్తూ చివరకు ఉర్టూ సామెత 'నేకీ కర్‌ దర్యా మేం డాలొ అన్నట్టు ఇదంతా చేస్తే జనసామాన్యంలో భక్తిభావన పోతుందా? పోదు. అన్నా మీరు చేస్తున్నదానికి కూడా పౌరాణికులు ఏ నాదో వైరభక్తి అని చక్కటి పేరు పెట్టారన్నాను. జనాన్ని మోసం చేయడానికి సంప్రదాయవాదులు ఎన్ని కుతంత్రాలైనా పన్నుతారన్నాడు సౌరిరాజన్‌. ఆయన అభిప్రాయంతో ఏకీభవించనప్పుడు నేను ఊరుకొనేవాడిని కాదు. విరుద్ధ అభిప్రాయం చెప్పేవాడిని. కాని సత్యం బ్రూయాత్‌ ప్రియం (బ్రూయాత్‌ అనే నూత్రాన్ని పొటించేవాడిని. అంటే ముక్కు మీద గుద్దినట్టుగా కాకుండా మృదువుగా చెప్పేవాడిని. ఆయన ప్రశాంతంగా వినేవాడు. తనవాదం వినిపించేవాడు. అంత ఓపిక ఆయనలో రావడం పెద్ద మార్చే. చాలా సార్లు కలిసి బీచికి వెళ్లేవాళ్లం. ట్రిప్లీకేన్‌ బీచిని మెరీనా బీచి అంటారు. అది ప్రపంచంలోని పెద్ద బీచిలలో ఒకటి. “మీకు హైదరాబాద్‌లో ఇట్లాటిది ఉందా?” అన్నాడు. “మాకు విహారానికి ట్యాంక్‌బండ్‌ ఉంొదన్నాను. “మైలు పొడవు హుసేన్‌సాగర్‌ చెరువుకట్ట. పొద్దున, సాయంత్రం వందల మంది చల్లగాలికి విహారానికి వస్తారు. కార్లలో కూడా వచ్చి కట్టమధ్యలో పార్కు చేసుకొని నడక పూర్తి చేసుకొని వెడతారు. పేరులో సాగర్‌ ఉన్నా సముద్రంతో పోలిక చెప్పడంలేదన్నాను. సౌరి మా తమిళ అని పదేపదే వాడుతుండేవాడు. తెలుగువారికి గొప్పచరిత్ర లేదని చిన్న చూపు. అది మీకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్‌ పరిణామం అన్నాను, మరోసారి తమిళ సాహిత్యం గురించి ప్రస్తావించాడు. తెలుగు వైష్ణవులలో చాలా మందికి తిరుప్పల్లాండు, తిరుప్పల్లియెజుచ్చి, తిరుప్పావు వంటివి నిత్యపారాయణ (గ్రంథాలని చెపితే “నిజమా?” అని ఆనందించాడు. “మాది సంకుచిత స్వభావమంటావా?” అని అడిగాడు. “ఆత్మాఖిమానం హద్దు మీరితే సంకుచితత్వమవుతుం” దన్నాను. ఆయన కూడా “నేను వట్టిగా వాదంకోసం అలా అన్నానంతే. మరేమీ అనుకోకు” అన్నాడు. ఈ బంధానికి అందమైన ముగింపు ఏమిటంటే నేను తిరిగి వచ్చే రోజున జ్ఞాపకాల వరద 1198

సౌరిరాజన్‌ సెలవుపెట్టి నాతో గడపటమే కాకుండా సెంట్రల్‌ స్టేషన్‌కు వచ్చి నాకు వీడుకోలు చెప్పాడు.

ఆ రోజుల్లో ద్రావిడదేశంలో పెరియార్‌ రామస్వామి నాయకత్వంలో బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం ఉధృతంగా సాగుతున్నది. జంధ్యాలు తెంపడం, నామాలు, ఇతర బొట్లను తుడిచేయడం, పిలకలు కత్తిరించడం వంటి చేష్టలు నిత్యకృత్యాలయ్యాయి. రజాకార్ల దౌర్జన్యకాండలో ఇవన్నీ చూసినవాజ్జే గనుక నాకు ఇదెంతో కాలం ఉండే ఉధృతి కాదనిపించింది. ఇవాళ ద్రవిడ ఉద్యమానికి బ్రాహ్మణ మహిళ 'పురుచ్చి తలైవిగా కొనియాడబడుతుండటం చూస్తున్నాము. సమసమాజం రావాలంటే వర్గ వ్యతిరేకపోరాటాల ద్వారా రాదని, వర్గసామరస్య నిర్మాణం ద్వారానే అది సాధ్యమ వుతుందని నేను నమ్ముతాను. మన ప్రాచీనులు అటువంటి సమాజంలో మహోజ్వల జీవనం సాగించినట్లు సాంఘికచరిత్రలో గాథలే ఆధారాలు.

సౌరి రాజన్‌ ఒకరోజు నీతో కలిసి 'నహీన్‌” అనే హిందీ సినిమా చూడాలన్నాడు. “నహీన్‌ అనే పేరు ఉండదే?” అన్నాను. “అయ్యో, యేడాదిగా ఆడుతోంది” అన్నాడు. నాకు హిందీ సరిగా అర్దం కాదు. నువ్వు చెప్పాలన్నాడు. ఆయన నాగిన్‌ గురించి

చెపుకున్నాడని అర్థమైంది. అదే ద ద్‌ మ న్‌ లిపిలో అక్షరాలు తక్కువ. ఇంగ్లీషులాగే. క గ హ అన్నిటికీ ఒకే అక్షరం. లిపుల చర్చవచ్చినపుడు తమిళంలో మకాత్మా కాంతీ అని వ్రాసి సందర్భాన్ని బట్టి మహాత్మా గాంధీ అని చదువుతారని కొంత ఎగతాళిగా అంటుంటారు. అందుకే నాగిన్‌ను నహీన్‌ అన్నాడు. ఇంగ్లీషువారు వౌడే రోమన్‌ లిపితో ఇదే అవస్త, డ ద రెండిటికీ డి అనే ఒకే అక్షరం, అలాగే టత లకు టి ఆనే ఒక్తే అక్షరం ఉన్నాయి. దీనివల్ల రోమన్‌ లిపి ఆధారంగా మనకు పరిచయమైన నామ వాచకాలెన్నో భారతీయభాషలలో అపభ్రంశమై వాడుకలోకి వచ్చాయి. ఉదాహరణకు మన ప్రస్తుత దేశ ప్రధాని మోదీ పేరే మోడీగా వ్యవహారంలో ఉంది. మిత్తల్‌ మిట్టల్‌ అయ్యాడు. అంతేకాదు. ఇంగ్లీషులో ఏ అక్షరం వ్రాసినా లేక ఎన్ని అక్షరాలుండే పదం వ్రాసినా, దాన్ని ముందే ఎవరో నిర్ణయించిన ఉచ్చారణ ప్రకారమే పలకాలి. పుట్‌ బట్‌ లేదా రఫ్‌, త్రూ లాగా. ఒక ఇంగ్లీషు పదాన్ని నేర్చుకుంటే అర్థంతో పాటు ఉచ్చారణ కూడా నేర్చుకోవలసి వస్తున్నది. రాసేదొకటి పలుకేదొకటిగా ఉన్నభాషు సామాజికమాధ్యమాలు బాగా విస్తరించి ఎస్సెమ్మెస్‌ల భాష వాడుక పెరగడంతో పరిస్థితి మరింత క్షిషువుతున్నది. కాని ఆ భాషే ఇవ్వాళ ప్రపంచాన్ని ఏలుతున్నది. తమిళంకూడా సామాన్యమైంది కాదు. ప్రపంచంలో అన్నింటికంటే కేశ జి.యస్‌. వరదాచారి

ప్రాచీనభాషగా కొనియాడబడదుతున్నది. సంస్కృతాన్ని సైతం వెనుకబిదేసింది. తన ప్రాచీనసాహిత్యానికి వేదస్థాయిని సాధించింది.

నేను ఇంటర్నీగా రెండవ రోజు నిర్దీతసమయానికి 15 నిమిషాలముందే ఆఫీసులో ఉండేట్టుగా బయల్దేరి వెళ్లాను. అప్పటికే వచ్చి ఉన్న న్యూస్‌ ఎడిటర్‌, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌ ఏదో మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే “వచ్చావా? రా” అని పలకరించారు. పేపరు చూశావా అని అడిగిజే చూశానన్నాను. ముఖ్యవార్తలు ఉందే పేజీచూపి ఓ హెడ్డింగులో తప్పుంది. ఏమిటో చెప్పు అన్నారు. వైష్ణవ పత్రికలో తప్పులు నేనే దిద్దేవాడిని. ఉస్మానియా కొరియర్‌లో చివరగా తప్పులు లేకుండా నేను మరోసారి మొత్తం చదివేవాడిని. నేను ఇంటర్‌ చదువుతున్నపుడు మా పొరుగునే (స్ట్రగుల్‌ అనే ఇంగ్లీషు వారపత్రిక ఆఫీసు ఉండేది. యడవల్లి శివరామశాస్త్రి అనే లోహియా సోషలిస్టు నాయకుడు, అడ్వకేటు దాని నిర్వాహక సంపాదకుడు. ఒంటి చేతి మీదుగా నడుపుతుండేవారు. ఆ పత్రికలో సేవాభావంతో ్రూఫ్‌లు దిద్దేవాడిని. కనుక అచ్చు తప్పులు పట్టుకోవడం అలవాటుంది. అలాగే విషయపరమైన తప్పులు, వ్యాకరణ దోషాలు గుర్తించి దిద్దడం ఎడిటింగ్‌లో భాగంగా నేర్చుకున్నాను. తెలుగు కంపోజింగు కూడా నేర్చుకున్నాను. ఆ నాటి హిందూ పత్రిక పతాకశీర్షిక రాష్ర్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌కు సంబంధించింది. ఆ శీర్షికలో రెండవ డెక్‌లో ఎస్‌. ఆర్‌.సి. కమిషన్‌ వివరణ అని వచ్చింది. నేను వెంటనే దాన్ని చూపించాను. “పొడి అక్షరాలలో సి అనేది కమిషనే గనుక కమిషన్‌ అన్న మాట పునరుక్తి అయింది” అన్నాను. “అలర్ట్‌గానే ఉన్నావు” అని నవ్వారు. హిందూలో సీనియర్లు, ఆ మాటకు వస్తే తర్వాత కాలంలో మేముకూడా సబ్‌ ఎడిటర్లు పెట్టిన శీర్షిక తప్పు లేకుండా ఉంటే, మెరుగుపరచడానికి వీలున్నా మార్చేవాళ్లం కాదు. అలా చేస్తే సబ్‌ ఎడిటర్లు తామేమి (వ్రాసినా వారు దిద్దేస్తారు అని నిస్పృహకు లోనవుతారు. వారి సృజన శక్తి దెబ్బతింటుంది. అలా కాగూడదు. గొప్పవార్తలకు హెడ్డింగులు పెట్టవలసిన సందర్భాలలో అందరం కలబోసుకుని నిర్ణయానికి వచ్చేవారం. పత్రిక సమష్టికృషి ఫలితం. దాన్ని నిర్దుష్టంగా రూపొందించడం, దానిలో వకరూపత సాధించగలగదం గొప్ప విజయం.

డెస్క్‌లో నా పనితీరు చీఫ్‌ సబ్‌కు, ఆయన ద్వారా న్యూస్‌ ఎడిటర్‌కు సంతృప్తిని కలిగించింది. ఒకరోజు వారే నాతో అన్నారు. అప్పటివరకు నాకు తెలియదు. మద్రాసు యూనివర్శిటీ కూడా ఒక విద్యార్థిని ఇంటర్బ్‌షిప్‌కు పంపిందట. ఆయన రెండు సార్లు వచ్చి నమస్కారం పెట్టి హాజరీ వేయించుకు వెళ్లాడట. నా విషయం పత్రిక జ్ఞాపకాల వరద 11ేర్‌

సహసంపాదకుదైన ఎన్‌. రఘునాథ అయ్యర్‌ చెవినపడింది. కస్తూరి శ్రీనివాసన్‌ అప్పుడు సంపాదకులు. వారిద్దరిలో ఎవరినీ నేరుగా కలుసుకునే అవకాశం లేదు. శ్రీనివాసన్‌ను ఒకటి రెండు సార్లు లిఫ్ట్‌లో వెళుతుంటే చూశాను. రఘునాథ అయ్యర్‌ నాకు కనిపించనేలేదు. అచ్చయిన తొలి వార్త ఇంటర్బ్‌షిస్‌లో రెండవ భాగంగా రిపోర్టింగ్‌ చేద్దామనుకున్నాను కదా, న్యూస్‌ ఎడిటరే చీఫ్‌ రిపోర్టరుకు పరిచయంచేశారు. సీరియస్‌ విద్యార్ధి అని కూడా చెప్పారు. ఆయన నన్ను తన సీటు వద్దకు తీసుకువెళ్లి “ఒక్కోరోజు ఒక్కో సీనియర్‌ రిపోర్టర్‌తో వెళ్లి జాగ్రత్తగా గమనించు. పనితీరు తెలుస్తుంది” అన్నారు. మొదటి రోజు మునిసిపల్‌ కార్పొరేషన్‌కు వెళ్లాము. కమిషనర్‌ను కలిశాము. ఆఫీసుకు తిరిగివచ్చాక నేను రిపోర్టు టైపుచేయడం చూసిన చీఫ్‌ రిపోర్ట్దరు “ఎందుకు శ్రమ పదుతా” వన్నాడు. “మీరు దిద్ది ఇస్తే మెరుగుపరచుకోవడమెలాగో తెలుస్తుం”దన్నాను. ఆయన అలాగే చూసి పంపించేవారు. మర్షాడు నేను కనపడగానే “మద్రాసు పోర్టు చూశావా?” అని అడిగారు. పోర్టుకు వెడుతున్న రిపోర్టరుతో పంపించారు. పోర్టు మేనేజరు చాలా విషయాలు చెప్పారు. తిరిగి వచ్చాక యథా్రకారం రిపోర్టు టైపుచేసి ఇచ్చాను. కొంత సేపటి తర్వాత అటెండర్‌వచ్చి పిలుస్తున్నారన్నాడు. వెళ్లాను. “లీడ్‌లో పెట్టావు. ఈ వ్యాంగింగ్‌ బ్రద్దేమిటి?” అని అడిగారు. “మద్రాసు పోర్టులో నౌకవచ్చి ఆగినపుడు దాని పై అంతస్తులో నుండి ప్రయాణికులను పోర్టు భవనం మొదటి అంతస్తులోకి తీసుకురావడానికి వేలాడే వంతెన కడుతారట. వింతైన విషయం కదా!” అని లీడ్‌లో పెట్టానన్నాను. “అది సరే మేనేజరు చెప్పాడా” అని అడిగారు. “చెప్పాడు. దేశంలోనే ఇలాటీది మొదటిదని కూడా చెప్పా"డన్నాను. “దీని వల్ల (ప్రయాణికులు, సరుకులు ఒకేదారిలో రావడంవల్ల ఏర్పడే రద్దీని నివారించవచ్చు. అన్నీ వ్రాశానే” అన్నాను. ఆయన ఇంకేమీ మాట్లాడలేదు. అటెండరును పంపి వార్త ఇచ్చిన రిపోర్దరును పిలిపించారు. ఆయనకు నా వార్త చూపించి “ఏమిటిది?” అని అడిగారు. మొదటి వాక్యం చధువగానే ఆయన నాలుక కరచుకొని మరచిపోయానంటూ లేచి గబగబా వెళ్లటోయారు. “పూర్తిగా చదువండి. ఇది బాగుంటే ఇదే ఇచ్చేద్దా” మన్నారు. ఆయన చదివి “అన్ని పాయింట్స్‌ కవరయ్యా”యని అన్నాడు. అలా నేను వ్రాసిన వేలాడే వంతెన వార్త ప్రచురణకు వెళ్లింది. హిందూ పత్రికలో ప్రచురితమైన నా మొదటి వార్త అది. 116 జియస్‌. వరదాచారి

మర్నాడు నేను ఆఫీసుకు వెళ్తే “ఈ రోజు పొట్టి శ్రీరాములు జయంతి. సాయంత్రం 6 గంటలకు సౌందర్య మహలులో చెన్నై ఆంధ్రమహాసభ కార్యక్రమం ఉంది. నువ్వే వెళ్లి కనర్‌ చేసుకురా” అన్నారు చీఫ్‌రిపోర్టర్‌. సరేనని ముందు దగ్గరలోనే ఉన్న ప్రెస్‌ క్లబ్‌కు వెళ్లాను తోడురావడానికి ఎవరైనా దొరుకుతారేమో చూడటానికి. అక్కడ సుబ్బయ్య అనే మెయిల్‌ రిపోర్టరు, మరి కొందరు ఉన్నారు. సుబ్బయ్య తెలుగువాడు. వయోధికుడు. “నీ ఉత్సాహం నాకు ఉత్తేజం ఇస్తున్నదయ్యా!” అన్నాడు. “సభకు మీరు వస్తారా?” అని అడిగాను. “నేను రానయ్యా,. నీవు నాకో కాపీ పెట్టు” అన్నాడు. విలేఖరులు ఇట్లా సహకరించుకోవడం హైదరాబాద్‌లో చూశాను. నాకు కొంత నిరుత్సాహం కలిగింది. మధ్యాహ్నం హోటల్‌లో భోజనంచేసి ఆంధ్రపత్రిక ఆఫీసుకు ఫోను చేశాను. “నేను ఉస్మానియా జర్నలిజం విద్యార్థిని. హిందూలో ఇంటర్బ్‌షిప్‌ చేస్తున్నాను. మీ ఆఫీసు చూడటానికి రావాలనుకుంటున్నా”నని. సౌందర్య మహల్‌ ఆంధ్రపత్రిక ఆఫీసుకు దగ్గరలోనే ఉంటుందని తెలిసింది గనుక రెండు పనులూ అవుతాయని, వారూ ఎవరైనా వస్తే నా పని సులువు అవుతుందని ఆశు నాలుగు ఐదు మధ్య రమ్మన్నారు. అప్పుడు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ రెండూ సాయంకాల పత్రికలే. ఆరింటికి ముద్రణకు సిద్ధమయ్యేవి. రాత్రి తొమ్మిది గంటలకు పత్రికలను కలకత్తా మెయిల్‌ ద్వారా పంపితే తెల్లవారేసరికి ఆంధ్ర ప్రాంతాలన్నిటికీ చేరేవి.

నేను నాలుగింటికే తంబుచెట్టి ఫ్రీట్‌లోని పత్రిక కార్యాలయానికి చేరుకున్నాను. సంపాదకవిభాగానికి వెళ్లే మద్దాలి సత్యనారాయణ శర్మ, గండూరి కృష్ణ కలిశారు. పత్రిక ఆఫీసు పైన డాబామీద సంపాదక సిబ్బంది కాలక్షేపానికి క్షబ్‌లాటి గుడిసె ఒకటుండేది. కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. శర్మ చాలా విషయాలు అడిగారు. కాని సభకు రాలేనన్నారు. కృష్ణ కూడా సభ పట్ల ఆసక్తి చూపలేదు. అక్కడి నుంచి సౌందర్య మహల్‌ వెళ్లేదారి గురించి చెప్పారు. నేను దగ్గరలోనే ఉన్న సభాస్టలికి నడిచే వెళ్లాను. హాలులో కొందరు కూర్చొనిఉన్నారు. నేను కార్యకర్తలలో ఒకరిని కలిసి, హిందూ పత్రిక నుంచి వచ్చానని చెప్పగా పక్క గదిలోకి తీసుకువెళ్లి మోటూరి సత్యనారాయణకు పరిచయం చేశాడు. ప్రముఖ సినీనటుడు చిత్తూరు వి. నాగయ్య అక్కడ ఉన్నారు. మోటూరివారు నాగయ్యకు నన్ను పరిచయంచేసి “మర్యాదలు పాటించడంలో హిందూ వారికి వారే సాటొ అన్నారు. సభ బాగా జరిగింది. బాలానంద సంఘం పిల్లలు చక్కని నాటకాన్ని ప్రదర్శించారు. ఆఫీసుకు వెళ్లి అరపేజీ వార్త టైపు చేసి ఇచ్చాను. సుబ్బయ్యకు కాపీపెట్టాను. కాని ఆయన దొరకలేదు. హిందూలో మాత్రమే 'పొట్టి శ్రీరాములు రిమెంబర్డ్‌ అని సింగిల్‌ కాలమ్‌లో పది సెంటీ మీటర్ల వార్త వచ్చింది. జ్ఞాపకాల వరద 117

కస్తూరి శ్రీనివాసన్‌తో భేటీ దీని తర్వాత నీవు స్వతంత్రంగా కవర్‌ చేయగలవని సైదాపేటలో ఆది హిందువుల వార్షికసభకు వెళ్లమన్నారు. ఆది హిందువులంటే తెలుగు దళితులు. పారిశుద్ధ్యం పనిచేస్తారు. మునిసిపల్‌ పాలనశాఖ మంత్రి భాష్యం అయ్యంగారు నభకు ముఖ్యఅతిథిగా వచ్చారు. దీనికీ విలేఖరిగా వెళ్లింది నేనొక్కడినే. ఇక్కడి నా అనుభవం ఒకపాఠం. సభ ఆహ్వానం నుంచి వందన సమర్పణ వరకు అంతా అరవంలోనే సాగింది. నాకొక్క ముక్క అర్థం కాలేదు. నా పక్కకుర్చీలో మంత్రి పి.ఏ. కూర్చున్నాడు. తొనే పరిచయం చేసుకున్నాడు. నేను హిందూ నుంచి అని చెప్పాను. మంత్రి ఏదైనా మంచి ప్రకటన చేయవచ్చు. నాకు అరవం రాదు. సారాంశం చెప్పితే (వ్రాసుకుంటానని చెప్పాను. ఆయన సరే అన్నాడు. కాని మంత్రి ప్రసంగం మొదలు పెట్టేముందే ఆయనను వేదికపైకి పిలిచారు. ఆయన అటునుంచి అటే వెళ్లిపోయాడు. మరెవరు దొరుకుతారని చూస్తుంటే ఆ వార్డు కార్పొరేటర్‌ ముస్లిమ్‌ అని గుర్తుకు వచ్చి. పరిష్కారం దొరికిందనుకున్నాను. గబగబా వెళ్లి అయనకు ఇంగ్లీషులో నా బాధ చెప్పాను. ఆయనకు హిందూ, పేపర్‌ అనే మాటలు తప్ప ఇంకేమీ బోధపడలేదు. పేపరు వాడని అర్థమైంది. “నాకు ఇంగ్లీషు రాదే!” అన్నాడు. అది నాకు అర్ధమైంది. “ఉర్దూలో చెప్పు. నాకు ఉర్దూవచ్చు” అన్నాను. “నాకు ఉర్పూ తెలియదే!” అన్నాడు. తమిళనాడులో కేరళలో ముస్లింలకు ఉర్జూరాదు. వారు తమిళం, మలయాళమే మాట్లాడుతారు. కార్పొరేటరుకు వార్త ప్రాధాన్యం తెలుసు. నన్ను వెంటబెట్టుకొని పక్కనే ఇంగ్లీషు తెలిసిన వ్యక్తి ఉన్నాడని తీసుకువెళ్ళాడు. ఈయన అరవంలో ఆయనకు చెప్పడం, ఆయన ఇంగ్లీషులోకి అనువదించి నాకు చెవడంతో మంచివార్తే తయారైంది. నా ఈ కథలు రఘునాథయ్యర్‌కు చేరినట్టున్నాయి. నన్ను పిలిచారు. (ప్రేమగా మాట్లాడారు. “శ్రీనివాసన్‌ను చూశావా?” అని అడిగారు. లిఫ్టులో ఒకసారి చూశానన్నాను. “అలా కాదు” అని తన వెంట తీసుకువెళ్లారు. శ్రీనివాసన్‌ చాలా విషయాలు అడిగారు. “నీక్షు షార్ట్‌ హ్యాండ్‌ వచ్చా?” అని అడిగారు. విలేఖరికి షార్ట్‌వ్యాండ్‌ ప్రతిబంధకం అని మా అమెరికన్‌ ప్రొఫెసర్‌ సిలబస్‌లో పెట్టలేదన్నాను. బైపింగ్‌ వచ్చు అన్నాను. షార్ట్‌ హ్యాండ్‌ విలేఖరికి అదనపు సౌకర్యం. అది రావాలి అన్నారు. చివరకు “పరీక్ష ఫలితాలు రాగానే దరఖాస్తు పంపు” అన్నారు. ఆయనకు నమస్కరించి కొత్తఆశలతో బయటకొచ్చాను. డెస్కులో కొన్నాళ్లుగా పని చేస్తున్నవారిలో శ్రీనివాసన్‌ను కలువనివారు పలువురు ఉన్నారు. కొత్త కురాడ్రిని పెద్దలు పిలిచి మాట్లాడారని తెలిసి, కొందరు వచ్చి అభినందించారు. ఇంటర్నిషిప్‌ చివరి రోజున రఘునాథయ్యర్‌ సంతకంతో కే18 జి.యస్‌. వరదాచారి

క్రమం తప్పకుండా విధులకు వచ్చి ఎడిటింగు పని చేయడమేగాక కొన్ని న్థానికవార్తల రిపోర్టింగు కూడా చేశాడనీ, పత్రికారచనపట్ల అభిరుచి గలవ్యక్తి అనీ మంచి సర్టిఫికేటు ఇచ్చారు.

ఇంటర్న్‌షిప్‌ నెల రోజులలో నేను వీలు చిక్కినపుడల్లా కన్నెమరా లైబ్రరీకి వెళ్లి తెలుగు పత్రికల పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించి నోట్‌ బుక్‌ నిండా సమాచారం సేకరించాను. ఒకరోజు నార్లవారికి ఫోను చేశాను. నాలుగు గంటలకు రమ్మన్నారు. మౌంట్‌ రోడ్డులోని ఎక్స్‌ప్రెస్‌ ఎస్టేట్‌కు వెళ్లాను. గదిలోకి పిలిచారు. నీలంరాజు శేషయ్యకూడా ఉన్నారు. ఆయనకు పరిచయం చేశారు. “క్షమించాలి. మీరు రేపు వస్తే బాగుంటుంది” అన్నారు. సరేనని బయటకు వచ్చాను. ఇంకెవరైనా దొరుకుతారా అని చూశాను. విద్వాన్‌ విశ్వం ఉన్నారన్నారు. కలువవచ్చా అని అడిగితే రమ్మన్నారు. భాష గురించి - ముఖ్యంగా మాండలికాల గురించి - మాట్లాడుకున్నాము.

. అప్పుడాయన (ప్రభ వారపత్రికలో 'తెలుపు-నలుపు అనే ఫీచరు వ్రాస్తుందేవారు. ఇంతలో జి.యస్‌. ఆచార్య వచ్చారు. నన్ను పరిచయం చేశారు. ఆచార్య ఆంధ్రప్రభ వారపత్రికలో సినిమా వార్తలు చూసేవారు. కొన్ని స్టూడియోలను చూడటం, కొందరు సినీ ప్రముఖులను కలవటం కూడా నా కార్యక్రమంలో ఉన్నాయని చెప్పే, ఆయన సహాయం కోరాను. ఫోను నంబరు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుపై ప్రకటన

మర్నాడు నాలుగింటికి మళ్లీ నార్లకు ఫోను చేసి వెళ్లాను. నేను మద్రాసులో ఇంటర్న్‌షిప్‌లో ఉన్నప్పుడే, మార్చి 5వ తేదీ నాడు ప్రధాని నెహ్రూ నిజామాబాద్‌ పట్టణంలో ఆంధ్ర - తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ విశాలరాష్ట్రం ఏర్పాటు చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రం రావడం ఖాయమైంది. విశాలాంధ్ర అనే పేరును రెడ్డి వర్షం అంగీకరించదని పత్రికలలో చర్చ జరుగుతున్నది. చెన్నారెడ్డివర్గం రాజకీయాల గురించి నార్ల చాలా విషయాలు అడిగారు. తమ అభిప్రాయాలు చెప్పారు. విశాలాంధ్ర పేరుపై విభేదాలను గురించి అడిగారు. ఫజుల్‌ అలీ కమిషన్‌ ప్రస్తావించిన ఆంధ్ర తెలంగాణ పేరు బాగాలేదన్నారు. మహా తెలంగాణ అన్నా మాకు అభ్యంతరం లేదన్నారు. నేను “వాదనకు అంటున్నారు గాని ఇన్నాళ్లుగా వాడుకలో ఉన్న విశాలాంధ్రను ఇప్పుడు కాదనడమెందుకనే చర్చవస్తుం” దన్నాను. ఒప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ మధ్యప్రదేశ్‌ లాగా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు బాగుంటుందని అన్నారు. సంపాదకీయం వ్రాస్తానని కూడా అన్నారు. పత్రికలలో జ్ఞాపకాల వరద 119

ప్రబోధాత్మక సంపాదకీయాలని ఉంటాయి. ఓ పథకం అమలు పరచమనో, ఈ ప్రాజెక్టు కట్టమనో, ఫలానా సంస్మరణ తీసుకురమ్మనో ప్రభుత్వానికి సూచిస్తూ సంపాదకీయాలు వ్రాసే సంప్రదాయం అది. మర్నాదే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైనందున ఆయన, వ్రాశారో లేదో నేను గమనించలేకపోయాను. గోలకొండ పత్రిక వైఖరిని నార్ల “అగ్రెసివ్‌' అని అభివర్ణించారు. భిన్నాభిప్రాయాన్ని వినిపించాలనే ఉద్దేశంతోనే రావు వర్గం ఆంధ్రజనత పథ్రికను తెచ్చిందని నేను గుర్తు చేశాను. చందూర్‌ల విందు మాలతీచందూర్‌ కూడా నేను కలువాలనుకున్నవారిలో ముఖ్యులు, ఆం(ధ్రప్రభవారు ఆమెను ఇంటి దగ్గర కలవాల్సిందేనన్నారు. ఫోను నంబరు ఇచ్చారు. ఫోను చేస్తే ఎన్‌.ఆర్‌. చందూర్‌ మాట్లాడారు. మర్నాడు మధ్యాహ్నభోజనానికి రమ్మన్నారు. ఆయన జగతి అనే చిన్న మాసపత్రికను చాలాకాలం నడిపారు. మాలతీ చందూర్‌ ప్రమదావనం ఫీచర్‌ రచయిత్రిగా అప్పటికే ప్రసిద్ధులు. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉందేవారు. ఆయన అమ్మాయి అని పిలిస్తే ఆమె ఆప్యాయంగా మామయ్యా అంటుండేది. రెండు గంటలకు పైగా కబుర్లు చెప్పుకున్నాము. ఆమె తను శీర్షికలో చాలామంది ఇంగ్లీషు రచయిత్రులను పరిచయం చేస్తూ చక్కటి వ్యాసాలు (వ్రాశారు. అలాగే తెలుగు రచయిత్రుల గురించి పరిచయవ్యాసాలుు వ్రాస్తే బాగుంటుందని నేను సూచించాను. చందూర్‌ స్పందిస్తూ జర్నలిజం విద్యార్ధులైన మీకు అందులో బాధలు తెలియనివి కావు గదా అని నవ్వేశారు. నిజమే. ఇంగ్రీషువారి గురించి సిద్ధ సమాచారం దొరికినట్టు తెలుగువారి గురించి దొరకదు. ఒక్కో వ్యాసం వ్రాయడానికి ఒక్కో పిహెచ్‌.డి. చేసినంత శ్రమపదాలి. తమకు ఇంటి పేరును ఇచ్చిన చందూరు ఎక్కడుందని చాలా వెతికాను కాని దొరకలేదని మాలతి అన్నారు. నాకు తెలిసి నిజామాబాద్‌ జిల్లాలో ఒక చందూరు ఉన్నదని అమెకు చెప్పాను. మద్రాసులో ఉండేది ఇక రెందే రోజులు. అనుకున్నవారిని చాలా మందిని కలువలేక పోయాను. సినిమా స్టూడియోనైనా చూద్దామనుకున్నాను, జి.యస్‌. అంటే సుదర్శనాచార్వ్యకు ఫోనుచేస్తే రేవతి, భరణి, విజయా స్టూడియోలకు తీసుకువెళ్లారు. వాహినీలో షూటింగు లేదు. భరణిలో అర్ధరాత్రి నుండి ఉంది. రేవతిలో మేము వెళ్లేసరికి అకినేని నాగేశ్వరరావు మేకప్‌లో ఉన్నారు. దర్శకుడు ఎల్‌వీ, ప్రసాద్‌ షాట్‌ వివరిస్తున్నారు. షాట్‌ అయిపోగానే నాగేశ్వరరావుకు నన్ను పరిచయం చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన జర్బలిజం ఇంటర్నీ అని. నాగేశ్వరరావు తన సహజధోరణిలో 120 జి.యస్‌. వరదాచారి

“జర్నలిజానికి కోర్సు, పరీక్షలా?” అన్నారు. అవునండి ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా పెట్టారు అన్నాను. “అక్కడ పెట్టారేంటి? ఒక క్వాలిఫికేషన్‌ అంటూ లేనివాళ్లం మేమేనన్నమాటి' అన్నారాయన. “సర్టిఫికెట్టు లేకపోవచ్చుగాని మీకు క్వాలిఫికేషన్‌ లేకుండా ఎలా పోతుంది?” అని నేను సమర్ధించగా, బాగా చెప్పారని నవ్వేశారు.

హిందూలో ఆఖరు రోజు. రాత్రి తమ ఇంట్లో డిన్నర్‌ చేయాలని చీఫ్‌ రిపోర్టర్‌ పి. పార్ధసారథి ఆహ్వానించారు. డ్యూటీ అయిపోయాక రైలులో తనవెంట తీసుకువెళ్లారు. దారిలో ఆయన నంభాషణను బట్టీ నాకు అర్ధమైంది, వాళ్లు అమ్మాయిని చూపించదలచారని. నేను సందు దొరకగానే మా(ప్రాంతంలో చిన్నపుడే పెళ్లిళ్లు అవుతాయని, నాకు ఏడవ తరగతిలో ఉండగానే పెళ్లి అయిందని చెప్పేశాను. ఆయన ఏమీ నిరాశ చెందలేదు. వైష్ణవులు ఈ ప్రాంతంనుండి వెళ్లి అక్కడ స్థిరపద్డవాళ్లు చాలా మంది ఉంటారనీ, మంచివాడు, చదువు సంధ్యలు ఉన్నవాడు మీ బంధువులు, తెలిసినవారిలో ఎవరైనా ఉంటే చెప్పవచ్చు అన్నారు. నేను తలాడించాను. అమ్మాయి డిగ్రీ చదివింది. పరిచయం చేశారు. పాయసంతో సహా చక్కటి భోజనం పెట్టారు. పాయసం ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే శుభకార్యాల విందుల్లో పాయసం వడ్డించడం వారి ఆచారం. ఆయన స్టేషన్‌దాకా వచ్చి రైలు ఎక్కించారు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లల శలిదండ్రుల అవస్థ తెలిసివచ్చింది.

మార్చి 31 నాడు ఆఫీసుకు వెళ్లాను. పనేమీ లేదు. వీడుకోలు తీసుకోవడమే. రఘునాథ అయ్యర్‌ సంతకం చేసిన సర్టిఫికెట్‌ ఇచ్చి చీఫ్‌ రిపోర్టర్‌ “ఫలితాలు వచ్చాక దరఖాస్తు తప్పక పంపించు” అని సలహా ఇచ్చారు. లండన్‌లో హిందూ ప్రత్యేకప్రతినిధిగా పనిచేస్తున్న కె. ఎస్‌. షెల్వంకర్‌ ఆ రోజు అఫీసుకు వచ్చారు. నేను పరిచయం చేసుకోగా యూనివర్శిటీల్లో జర్నలిజం కోర్సు చదివిన యువకులు వృత్తిలోకి రావడం (ప్రమాణాల మెరుగుదలకు తోద్బ్చడుతుందన్నారు. బ్రిటన్‌, అమెరికా, జపాన్‌ దేశాల్లో అలాటి అర్హతలున్నవారికి ప్రాధాన్యమిస్తారన్నారు. వెంకన్న దర్శనం నేను వసతి గృహానికి వచ్చి పెట్టె సర్టుకొని సౌరిరాజన్‌తో కలిసి కాఫీ సేవించి, తిరుపతికి ప్రయాణమయ్యాను. తిరుపతిలో దిగాక డబ్బు లెక్క చూసుకుంటే బొటాబొటిగా సరిపోయట్టు ఉంది. రైలు స్టేషన్‌లోనే క్లోక్‌ రూములో పెట్టె భద్రపరచి స్టేషన్‌లో బెంచిమీదే సేదదీరాను. ముందు రిజర్వేషన్‌ కౌంటరుకు వెళ్లి హైదరాబాద్‌కు జ్ఞాపకాల వరద 121

టిక్కట్టు కొనుక్కున్నాను. దైవదర్శనానికి పోతున్నాం గనుక ఏమీ తినకుండా కాఫీ మాడ్రం తాగి రోడ్డు మీదకు వచ్చాను. ఎదురుగా వస్తున్న అతడిని గుడికి దారి ఎట్లా అని అడిగాను. “ఏ గుడి? ఇక్కడ ఎన్నో గుడులున్నాయి” అన్నాడు. “వేంకటేశ్వర స్వామి పెద్దగుడి” అన్నాను. “తిరుమల కొండమీదకా?” అని ఎదురుగా ఉన్న చౌల్టీ గేటుచూపి లోపల చివరదాకా పోతే అక్కడ బస్సులుంటాయన్నాడు. నడిచి పోరాదా అంటే పోవచ్చు, రెండుమూడు గంటలలో చేరుకోవచ్చునన్నాడు. నేను తిరుపతికి రావడం అదే మొదటిసారి. తిరుమల వేరు తిరుపతి వేరు అన్న సంగతి తెలియదు. ఇదేదో గడబిడగా ఉంది. బస్సులన్నారు గదా అక్కడికి పోయి చూద్దాము తెలుస్తుందని వెళ్ళాను. కండక్టరుతో మాట్లాడితే విషయం తేటతెల్లమైంది. మళ్లీ డబ్బు లెక్క పెట్టుకున్నా రైలు టిక్కట్ట కొనేశా. కొండమీదికి బస్సులో పోను రాను టిక్కట్టు ధర తీసేస్తే మూడు రూపాయలు మిగులుతున్నాయి. నడిచిపోయే ప్రసక్తి లేదు. ఐదు గంటల రైలును అందుకోవాలి. ఒకరూపాయి దేవుడి హుండీలో వేయవచ్చు. రెండు రూపాయలతో "హైదరాబాద్‌ చేరుతాము. ఇంకేం, అందరితో పాటు గోవిందా గోవింద అని కిరుమల చేరుకున్నాను. స్వామి పుష్కరిణిలో స్నానంచేసి మహాద్వారం గుండా గుడిలోకి వెళ్లాను. అప్పుడు వైకుంఠం నిరీక్షణ గదులు, క్యూలు లేవు. గరుడస్తంభానికి మొక్కి అక్కడి ద్వారం దాదీ మఖ్యాలయమంటపంలోకి వెళ్లే కటకటాల తలుపులున్న చోటికి చేరాను. లోపలికి (ప్రవేశిస్తే కుడి దిక్కు గరుదాళ్వారు, ఎడమ దిక్కు ద్వారపాలకులు ఉన్న చోటు. అక్కడ జవాను టికృట్టు అని అడిగాడు. టికృట్టు లేదన్నాను. ధర్మదర్శనం టైమ్‌ అయిపోయింది. దర్శనం టిక్కట్టు ఉండేవారికే (ప్రవేశమన్నాడు. నేను కొంత బిక్కసోయినా, తమాయించుకొని రద్దీకూడా లేదుగనుక ఆ జవానుకు నా విషయం వివరించాను. ఆయన అనుకూలంగా స్పందించాడు. “ఐతే పక్కన నిలబడు. దర్శనానికి వచ్చే కుటుంబాలలో మంది తక్కువ ఉన్నవారితో కలిసి వెళ్తువు” అన్నాడు. “థాంక్స్‌ కాని నీకేమన్నా ఇవ్వాలన్నా నా దగ్గర డబ్బులే” దన్నాను. ఆయన “నాకేమీ ఇవ్వొద్యూ అన్నాడు. ఇంతలో ఓ వృద్ధజంట వచ్చింది. వారిని అడిగాడు. “ఈ కుర్రాడు మీ వెంట దర్శనానికి రావచ్చా?” అని, వారు సరేనన్నారు. మూడు ద్వారాలు దాటి మూలవిరాట్టును ముట్టుకోగలిగినంత దగ్గరికి వెళ్లి ఇష్టమైనంత సేపు గర్భగుడిలో గదపగలిగాను. ఆ వృద్ధదంపతులతో ఎలాటి అనుబంధమోకాని, స్వామివారిని చౌలిసారే తృప్తిగా దర్శించుకునే భాగ్యం కలిగింది. గుడిలో తీర్ధం కూడా పెట్టారు. 122 జి.యస్‌. వరదాచారి

బయటికి వస్తుంటే ఇచ్చిన ప్రసాదమే కడుపు నింపింది. కొండమీద ఇంకేమీ చూడలేదు. వరాహ నరసింహ స్వామిని ముందుగా దర్శించుకోవాలనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. కిందికి వచ్చి నేరుగా రైలు స్టేషన్‌కు చేరాను. క్లోక్‌ రూములో పెట్టె తీసుకుని ప్లాట్‌ఫారంమీద సిద్ధంగా ఉన్న హైదరాబాద్‌ రైలులో జాగా దొరికించు కున్నాను. తెల్లవారే సరికి హైదరాబాద్‌లో ఉన్నాను. రాత్రి కాఫీ మాత్రమే తాగి మిగిల్చిన డబ్బుతో స్టేషన్‌నుంచి రిక్షాలో ఇంటికి చేరుకున్నాను.

నిత్య కృత్యాలు తీర్చుకుని చాయ్‌ పెట్టుకుని తాగి, పొరుగు మిత్రుడి దగ్గర పది రూపాయలు అప్పుచేసి ఆలుగడ్డలు, టమాటలు, పెరుగు కొని తెచ్చుకుని, వంటచేసుకొని తృప్తిగా భోజనం చేశాను. అప్పుడనిపించింది. మన ఇల్సు మన అన్నం మనకుండాలి. ఉపవాసమున్నా సరే, స్వతంత్రంగా ఉండాలని. ఆ రోజు సోమవారం కలిసి వచ్చింది. పైగా ఏదో సాధించాననే ఉబలాటం. ఆర్ట్స్‌ కాలేజీకి వెళ్లి హెడ్డును కలుసుకొని హిందూవారిచ్చిన లేఖ ఇచ్చి, సంతృప్తికరమైన నా అనుభవాలు కొన్నిటిని వివరించాను, ఆయన చాలా సంతోషించారు. ఒకరిద్దరు సహాధ్యాయులు కూడా కలిశారు. అనుభవాలను పంచుకున్నాము. ఏట్రిల్‌లోనే పరీక్షలు. క్లాసులు ఉండవు. ఏదైనా అడగాలనుకుంటే ్రొఫెసర్‌ను ఎప్పుడైనా కలువవచ్చు. పరీక్షకు సిదమవడంతోపాటు అధ్యయనవత్రాన్ని టైవుచేని పరీక్షకు ముందే సమర్పించాలి. ఇక ఆ పనిలో నిమగ్నమైపోయాను. ముందు వ్రాయాలి. తర్వాత కాలేజీకి వెళ్లి అక్కడ ల్యాబ్‌లో ట్రైపుచేసుకోవాలి. ఇప్పటిలాగా ఆలోచనలను నేరుగా ట్రైపుచేయడం అప్పుడు చేతకాదు. అయినా 76 పేజీల అధ్యయనపత్రాన్ని సకాలంలో సిద్ధంచేసి సమర్పించాను. పరీక్షకూడా బాగానే జరిగింది. ఊరికి వెళ్లి కుటుంబసభ్యులతో కొన్నిదినాలు గడిపి వస్తే ఉద్యోగప్రయత్నంలో పడవచ్చు. అప్పటికే సమాచార, ప్రజాసంబంధాల శాఖలో గెజిటెడ్‌ హోదాతో జిల్లా ప్రజా సంబంధాల అధికారి ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రచారం జరుగుతున్నది. జర్నలిజం చదివిన అభ్యర్థులు వాటికి అర్హులని కూడా అంటున్నారు. నాకెందుకో పత్రికలో పనిచేయాలనే తప్ప ప్రభుత్వోద్యోగంలో చేరాలని లేదు. మే నెలంతా ఊళ్లో గడిపి జూన్‌ మొదటివారంలో హైదరాబాద్‌ వచ్చాను. మెస్సులో నాతో ఉన్న మిత్రులు కొందరు విఠల్‌వాడిలో ఉంటున్నారు. నారితో చేరి పోయాను. జ్ఞాపకాల వరద 128

4 ఉద్యోగపర్వం తమ్ముని రాక మా పెద్ద తమ్ముడు గోవర్ధన రమణాచారి పదవ తరగతి పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. జూన్‌లో స్కూలు తెరవగానే టి.సి., మార్కుల మెమొరాండం తీసుకున్నాడు. తనూ నా వెంట హైదరాబాద్‌ వచ్చాడు. ఇద్దరం మా మెస్సు మిత్రులు ఉంటున్న అద్దె ఇంట్లో తాత్కాలికంగా చేరాము. ఆ సంవత్సరమే ఇంటర్మీడియట్‌ కోర్సు తీసేశారు. దానికి బదులు ప్రీ యూనివర్చిటీ కోర్సు(పి.యు.సి. ) అని సంవత్సరం కోర్సు, దాని తర్వాత ప్రీ ప్రొఫెషనల్‌ కోర్సు (పి.పి,సి.) అని మరాక సంవత్సరం కోర్సు రెండింటిని తాత్మాలికంగా ప్రవేశ పెట్టారు. మరో పక్క స్కూలు విద్యను మల్టీపర్పజ్‌ అనే పేరుతో పన్నెండేళ్లకు పెంచారు. అంటే రెండేళ్ల తర్వాత నుంచి విద్యార్థులు సూలు విద్య కాగానే నేరుగా యూనివర్సిటీలో డిగ్రీ తరగతిలోగాని, వైద్యం, ఇంజనీరింగ్‌, తదితరవృత్రివిద్యా కోర్సులలోగాని చేరిపోవచ్చునన్నమాట. అప్పుడు పి.యు.సి, పిపి.సి. కోర్సులు తీసేస్తారన్నమాట. మా తమ్ముడికి సిటీ కాలేజీలో, నిజాం కాలేజీలో కూడా సీటు వచ్చింది. నాకూ యాఖైలో సీటువచ్చినా బంధువులైన సేనియర్లు చేరనివ్వలేదు. ఆ కొరత తీర్చడానికన్నట్టు రమణయ్యను నిజాం కాలేజీలోనే చేర్చించాను. తర్వాతి కాలంలో నాకు. సన్నిపితమిత్రుడు, విశాలాంధ్ర దినపత్రిక సంపాదకుడు అయిన సి. రాఘవాచారి పియు.సి. లో అతని క్లాసుమేటు. జర్నలిజం చదువుతున్నప్పటి నుంచే స్థానిక గోలకొండ పత్రిక కార్యాలయానికి తరచూ వెళ్తుండేవాడిని పత్రికాప్రతినిధులతోను,పత్రికాకార్యాలయం పనితీరుతోను పరిచయం ఏర్పరచుకోవాలని. గోలకొండ పత్రికకు అప్పుడు నూకల నరోత్తమరెడ్డి సంపాదకులు. దేవులపల్లి రామానుజరావు సంపాదకీయాలు వ్రాస్తుండేవారు. సంపాదకవర్గంలో చెళ్లపిళ్లాచార్య (వీరు సిహెచ్‌, ఆచార్యగా ప్రసిద్ధులు), పి.ఎస్‌.ఆర్‌, ఆంజనేయశాస్త్రి కంబాల తాతారావు ఉండేవారు. వీరిలో తాతారావు జర్నలిజం మొదటి బ్యాచిలో సర్టిఫికెట్‌ కోర్సు విద్యార్థి. మా ఢిల్లీ విజాునయాత్రకు ఓడెల్‌ ప్రత్యేక అనుమతితో వచ్చాడు. అప్పటి నుంచి నాతో సన్నిహితంగా ఉండేవాడు. అతనితోపాటు మొదటి 124 జి.యస్‌. వరదాచారి

బ్యాచ్‌లో డిప్లొమా చదివిన ముద్దసాని రామిరెడ్డి కూడా కొత్తగా గోలకొండలో చేరాడు. ఆయన లక్ష్యం సమాచార శాఖలో డి.పి.ఆర్‌.వో. ఉద్యోగం సంపాదించడం. మిత్రులం కలిసినప్పుడల్లా ఉద్యోగాల గురించి చర్చ జరుగుతుండేది. రెండేళ్ల కాంట్రాక్టు కాలం ముగిసినందున ఓదెల్‌ స్వదేశానికి వెళ్లిపోతున్నారు. మొదటి బ్యాచ్‌ విద్యార్థులతో కలిసి మేమూ అయనకు వీడ్కోలు సభ ము. కు కంగా! పాఠ్యప్రణాళికలో భాగంగా ఇంగ్లీషు లేఖనసూత్రాల పాఠం చెప్పిన కె.ఆర్‌. చంద్రశేఖరం జర్నలిజంశాఖ తాత్కాలిక అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆర్ట్స్‌ కాలేజీలో ఇంగ్లీషు విభాగం అధిపతిగా ఉన్నారు. మాకు వార్తారచన సూత్రాలు బోధించిన ఈశ్వరరాజ్‌ మాథుర్‌ కూడా వీడ్కోలు సభకు వచ్చారు. ఆయన సమాచార ప్రజా సంబంధాలశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టరుగా పని చేస్తుండేవారు. అప్పటికి మా పరీక్షా ఫలితాలు రాలేదు. సహజంగానే చర్చ ఉద్యోగావకాశాలపైకి మళ్లింది. ప్రభుత్వం తలపెట్టిన డి. పి. ఆర్వో ఉద్యోగాలు రావడానికి కొంత సమయం పట్టేటట్టు ఉందని చెప్తూ మాథుర్‌, తెలుగు జర్నలిజంలోకి వెళ్లదలచుకున్న వారికి 'ఆంధ్రజనత'లో వెంటనే అవకాశాలు ఉన్నాయన్నారు. “మీరేమైనా సహాయంచేస్తారా?” అని ఎవరో అడిగితే, ప్రభుత్వాధికారులు, మంత్రి స్థాయిగల నాయకులకు సిఫార్సులు చేయగూడదన్నారు. వి.బి. రాజుగారి ఫోను నంబరు ఇచ్చారు. “ఫోను చేసి వెళ్లి మీరే మాట్లాడుకోవా” లన్నారు. మేము ఆ ప్రయత్నాలలో ఉండగానే ఫలితాలు వచ్చాయి. ఇద్దరమే ఉత్తీర్ణులమయ్యాము. అరవిందన్‌ ప్రథమ థ్రేణిలో, నేను ద్వితీయ ్రేణిలో. మొదటి బ్యాచిలో తప్పి మాతో మళ్లీ పరీక్ష వ్రాసిన మరో ఇద్దరు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో పి.ఆర్‌. రెడ్డి ఒకరు. ఈయన నా లాగే చివరి దాకా జర్బలిజంలోనే కొనసాగారు. ఎక్స్‌ప్రెస్‌ గ్రూపులోచేరి ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక విలేఖరిగా పనిచేశారు. పరీక్షాఫలితాలు వచ్చిన రోజు ఉదయమే నేను రాజుగారికి ఫోను చేశాను. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న తమ కార్యాలయానికి 11 గంటల ప్రాంతంలో రమ్మన్నారు. నా సాహిత్యవ్యాసం, గల్పిక అచ్చయిన స్వతంత్ర పత్రిక ప్రతులు, నా కథ అచ్చయిన సిటీ కాలేజి మ్యాగజిన్‌ పట్టుకు వెళ్తాను. కబురుచేయగానే లోపలికి రమ్మన్నారు. నమస్మారంచేసి ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పి.జి. డిప్లామా కోర్సు పూర్తిచేశానని, ఇవాళే ఫలితాలు వచ్చాయని, ద్వితీయశశ్రేజిలో పాసయ్యానని చెప్పాను. రాజుగారు వెంటనే జర్నలిజం క్లాసు రూములో చెప్పదగిన విషయం కాదన్నారు. ఆంధ్రజనతలో ఈ విషయంపై సంపాదకీయం కూడా వచ్చింది. అప్పుడు మేము చర్చించుకొని సంపాదకునికి లేఖ కూడా వ్రాశాము. "కాదండీ జర్చలిస్టులు జ్ఞాపకాల వరద 125

తెలుసుకోవలసిన చాలా మౌలిక విషయాలు పాఠ్యప్రణాళికలో భాగంగా చెప్తన్నా” రన్నాను. వార్తారచన, ఎడిటింగ్‌ సూత్రాలు, న్యాయపరమైన అంశాలు, నిర్దిష్టత, క్లుప్తత, ముఖ్యాంశాన్ని మొదట చెప్పడం వంటి వృత్తిలో ఉపయోగపడే విషయాలు చాలా చెప్పారన్నాను. “డెస్కులో పనిచేస్తూ తప్పులు దిద్దుకునే పద్దతిలో ఇవన్నీ నేర్చుకునే బదులు ముందే తెలునుకొని ఉంటే వులుకదా” అన్నాను. “అంతవరకు ఉపయోగకరమేలే” అన్నారు. స్వతంత్ర పత్రికలో నా కథ అచ్చయిందని చూపబోతే “200 మాటలు వస్తే మంచి కథ వ్రాయవచ్చు. కాని జర్నలిజంలో విషయం మన చేతిలో ఉండదు. ఆకాశమే హద్దు. రేపు కొత్తగా కనిపెట్టిన విషయాన్ని గురించి (వ్రాయవలసి రావచ్చు” నన్నారు. నేను వ్రాసిన సాపొత్యవ్యాసం కూడా స్వతంత్రలో అచ్చయిందని పత్రిక చేతికిస్తూ “సూటిగా, సరళంగా, చదివించే విధంగా వ్రాయగల శైలి ఉన్నదని చూపడానికే ఇవి తెచ్చా” నన్నాను. ఆయన వ్యాసాన్ని విహంగవీక్షణంగా చూశారు. నేను అవకాశం తీసుకుని “ఇవాళ 24వ తారీకు, వారం రోజులు చూడండి, ఫస్టునాడు ఏ విషయమూ చెప్పండి” అన్నాను. రాజుగారు నవ్వి “నువ్వు నాకు నచ్చావోయ్‌!” అన్నారు. ఎడిటరుకు ఫోను కలిపి “వరదాచారి అనే కురాట్రిని పంపుతున్నాను. సబ్‌ ఎడిటరుగా వేసుకో” అన్నారు. “నేరుగా ఆఫీసుకే వెళ్లి చేరిపో అని నాతో అన్నారు. నా తొలి ఉద్యోగం ఇంటర్‌వ్యూ గురించి చాలాసార్లు చాలామందితో చెప్పాను గనుక, నాకు ఇవన్నీ గుర్తుండిపోయాయి. ఈ మధ్య 1956 డైరీ కనిపించింది. దానిలో ఆ నాడు ఈ విషయాలు వ్రాసుకున్నాను. రాజుగారు ఆ నాడు ఇచ్చిన సలహాకూడా దానిలో ఉంది. రెండు విషయాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకొమ్మని ఆయన ఇంగ్లీషులో ఇలా చెప్పారు 'ఒబిడియెన్స్‌ టు ది సుపీరియర్స్‌, డివోషన్‌ టు ది కాజ్‌. ఇవి నాకు కొత్త విషయాలేం కావు. కాని చెప్పిన సందర్భం చిరస్మరణీయమైంది. నేను సికిందరాబాద్‌లో గాంధీ విగ్రహం దగ్గరలోఉన్న ఆంధ్రజనత ఆఫీసుకు వెళ్లాను. ఎడిటరుగారిని కలిస్తే “రాజుగారు చెప్పారు. రాత్రి డ్యూటీకి రా” అన్నారు. ఏడు గంటలకల్లా ఇక్కడ ఉండాలన్నారు. సరేనని వచ్చేశాను.

నేను కిరాయి సైకిలు తెచ్చుకొని సాయంత్రం ఆరు గంటలకే ఆంధ్రజనత ఆఫీసు చేరుకున్నాను. ఎడిటరుకు కనబడదామని ఆయన గదివరకు వెళ్లాను. అక్కడ వాతావరణం బాగా లేదు. ఎడిటరుతో ఎవరో ఒకాయన గట్టిగా వాదిస్తున్నాడు. నేను వెనక్కివచ్చి ఎడిటోరియల్‌ సిబ్బంది గదిలోకి వెళ్లి కూర్చున్నాను. పగటి షిఫ్టులో ఉన్న అజంతా వెళ్లిపోయారు. టెలి ప్రింటర్‌మీద వార్తల చుట్ట పెద్దగా కనబడుతున్నది, మాకు విద్యార్థులుగా పి.టి.బ. టెలిప్రింటరు వార్తలు పరిచయమే. గనుక చుట్టనుతీసి 126 జియస్‌. వరదాచారి

వార్తలను వేరుచేసి ఎక్కువ పేజీలున్న వార్తలకు పిన్నులు పెట్టి ఓ పద్ధతిలో పెట్టాను. ఇంతలో ఆ కొత్తాయన “నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో” అని గట్టిగా అరుస్తూ వెళ్లిపోయాడు. అప్పటికి ఏడు గంటలు కావచ్చింది. కొంచెం సేపైనాక ఎడిటరు నేనున్న గదిలోకి వచ్చారు. కొంచెం కలవరం చెంది -ఉన్నారు. నైట్‌ డ్యూటీలో ఉన్న గౌరినాథ్‌ అకస్మాత్తుగా ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడని చెప్పి, కుదుటపడేంత వరకు కూర్చొని, “మీరు వార్తలు సర్దిపెట్టండి. నేను ఇంటికివెళ్లి స్నానం చేసి వస్తాను? అన్నారు. నేను వార్తలు సార్జుచేసి పెట్టానని చూపించి, “మీరు భోజనం కూడా చేసి ప్రశాంతంగా రండి. నేను వార్తలు వ్రాసి, శీర్చికలు కూడా పెట్టి ఉంచుతాను” అన్నాను. “శీర్షికలు ఉంచండి కాని వార్తలు కంపోజింగుకు వెంటదివెంట పంపించండి” అని చెప్పి వెళ్ళారు. నేను అట్లాగే చేశాను.

ఎడిటర్‌ వదింటికి వచ్చారు. వార్తలు (పెన్సుకు జావ్యం లేకుండా అందుతున్నాయని ఆయనకు తెలుసు. ఆ విషయం కొత్త సబ్‌ ఎడిటరును చూసి వార్తలు తీసుకుపోదామని వచ్చిన ఫోర్మన్‌ చెప్పాడు. (ప్రెస్సు పక్కనే ఎడిటరు ఇల్లు. అందుకే హడావిడి పడలేదు. ఆ నాటి ముఖ్యవార్తలు అడిగారు. నాకు తోచిన రెండు మూడు వార్తలు ఇచ్చాను. ఆయనే ఒకటి బ్యానరుగా సెలెక్టు చేసి శీర్షిక ఇచ్చారు. బ్యానర్‌ అంటే పత్రికాపరిభాషలో పతాకశీర్షిక. పత్రిక పేరు కింద ఎడమ నుంచి కుడి చివరి వరకు విస్తరించి ఉండే శీర్షిక. ఆ రోజుల్లో తెలుగు పత్రికలలో రోజూ ఎనిమిది కాలాల నిడివికి విస్తరించే శీర్షిక ఇవ్వడం పరిపాటి. తర్వాత ఆ పద్ధతి మారింది. ఎంతో పెద్ద సంఘటన జరిగినపుడే అంత పెద్ద శీర్షిక వాడుతున్నారు. వ్రాతపని పూర్తయింది. పేజీలు అమర్చడానికి ప్రెస్సుకు వెళ్లాము. మొదటి పేజీ మేకప్‌ ఆయనే చేయించారు. చివరి పేజీ నేను చూశాను. సమయానికి పేపరు ప్రింటింగ్‌కు వెళ్లింది. నేను అచ్చయిన పత్రిక ఒకటి తీసుకొని ఇంటికి వచ్చి నిద్రపోయాను. ఇది మా నాయననుంచి వచ్చిన అలవాటు. మా ఊళ్లో సైకిళ్లు ఉన్న తొలితరం వ్యక్తులలో నాయన ఒకరు. పురాణకాలక్షేపానికిగాని, మరేదైనా పనికోసం కాని ఆయన పొరుగూళ్లకు సైకిల్‌ మీదనే వెళ్లేవారు. ఎంత రాత్రయినా, మర్షాడు కూడా వెళ్లవలసి ఉన్నా ఇంటికి తిరిగి వచ్చేవారు.

మర్నాడు నేను ఆంధ్రజనతలో పనిచేస్తున్న వారందరినీ కలిసి పరిచయం చేసుకోడానికి, ఉదయం 11 గంటలకల్లా ఆఫీసుకు వెళ్లాను. ముందు ఎడిటరు కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యంను కలిసి వచ్చిన పని గురించి చెప్పాను. మంచిదే అందరనీ కలవండన్నారు. పక్క గదిలోకి వెళ్ళి అజంతాను కలిశాను. ఆయన మాటలను జ్ఞాపకాల వరద 127

బట్టి రాత్రి జరిగినదంతా ఆయనకు తెలిసినట్టు అర్ధమైంది. గౌరీనాథ్‌ వ్యవహరించిన తీరును ఆయనా తప్పు పట్టారు. ఏ విషయంలోనైనా ఎడిటరుదీ, ఆయనదీ ఒకేమాట అని నేను జనతలో చేరకముందే జర్నలిస్టు మిత్రులు అంటుంటే విన్నాను. నాకు తప్పేమీ కనిపించలేదు. గౌరీనాథ్‌ గురించి అప్పటికి నాకు ఏమీ తెలియదు. ఆయన ఆంధ్రపత్రిక సంపాదకుడు శివలెంక శంభుప్రసాద్‌ మేనల్లుడు. తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో అనుభవమున్నవారు. సుబ్రహ్మణ్యంతో కలిసి సికిందరాబాద్‌ నుంచే వెలువడే చిన్న ఇంగ్లీషు దినపత్రిక డైలీ న్యూస్‌లో పనిచేశారు. ఇంగ్రీషు జర్నలిజంలో వేతనవృద్ధి, పదోన్నతి అంటే (ప్రమోషన్‌ అవకాశాలు ఎక్కువ ఉంటాయని నమ్మేవారు. ఆ రోజులలో అది నిజంకూదా. ఇంగ్లీషు పత్రికలలో పనిచేసేవారికీ, దేశభాషా పత్రికలలో పనిచేసేవారికంటే ఎక్కువ వేతనం ఉండేది. జర్నలిస్టుల ఉద్యోగస్థితి గతులను (క్రమబద్ధీకరించే వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టం, దాని ప్రకారం చట్టబద్ధంగా పర్పాటైన వేతన నిర్ణాయక మండలి సిఫార్సులు వచ్చేవరకు అదే పరిస్థితి కొనసాగింది. దాని గురించి ఉద్యమాలు చేయవలసి వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు ఆ వివరాలు చెపుతాను. గౌరీనాథ్‌ గురించి చెపుతున్నాను. ఆయనకు కలకత్తాలో ఇంగ్రీషు పత్రికలో ఉద్యోగం వచ్చింది. వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లవచ్చు. గొడవ ఎందుకు వచ్చిందో తెలియదు. కలిసి పని చేశామన్న చనువుతో వెంటనే రిలీవ్‌ చేస్తారని ఆశించి ఉండవచ్చు. అలా జరుగలేదు. ఫలితం ఘర్షణ! అజంతా గురించి అప్పటికే నాకు కొంత తెలుసు. ఆయన “స్వప్న లిపిలో కొన్ని ఖండికలు వ్రాశారు. దానికి మిత్రవర్గంలో మంచి స్పందన వచ్చింది. మద్రాసులో జర్చలిస్టుగా పనిచేశారు. శ్రీ శ్రీ అభిమాని. ఆరుద్ర, రమణ సహచరులు. ఎక్కువ మాట్లాడరు. కలుపుగోలుతనం తక్కువ. ఏకాంతం ఇష్టం. నచ్చనివారు ఎదురుపడితే ముఖం తిప్పుకుపోయే స్వభావం. ఆయన వద్ద సెలవుతీసుకొని చివర ఉన్న మేనేజరు సత్యనారాయణ గదిలోకి వెళ్లాను. ఆ గదిలో మేనేజరు కాక అడ్వర్దయిజ్‌మెంట్లు చూసే ఫార్సీ శేషగిరి రావు, సర్కులేషన్‌ పని చూసే గాంధీ ఉన్నారు. సత్యనారాయణ రిటైర్డ్‌ హెడ్‌ మాస్టరు. రాజుగారికి నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడంటే జీతాల సమయంలో బ్యాంకులో డబ్బు లేకపోయినా, రాజుగారు కూడా అందుబాటులో లేకపోయినా తన ప్రావిడెంటు ఫండు డబ్బుతెచ్చి సర్దుబాటు చేయగలిగినంత నమ్మకస్తుడు. నిర్ణీత రోజున జీతాలు అందకపోతే వేతనజీవులు ఎన్ని సమస్యలు ఎదుర్శొంటారో తనకు తెలుసుననేవారు. వీరుకాక పగటి, రాత్రి షిఫ్టలలో పనిచేసే మొత్తం నలుగురు అటెండర్లు ఉన్నారు. నలుగురు ప్రూఫ్‌ రీడర్లు అంటే అచ్చుఅక్షరాలు 128 జి.యస్‌. వరదాచారి

కూర్చేటప్పుడు తప్పులు జరిగితే సరిచేసేవారు ఉన్నారు. వీరి పని ప్రెస్సులో ఉంటుంది గనుక అక్కడే కూర్చుంటారు. కాని వీరు సంపాదక సిబ్బందిలో భాగం. (ైస్సు స్వంతం కాదుగనుక కంపోజిటర్లు, ప్రింటర్లు పత్రిక సిబ్బంది కారు. వారు (ప్రెస్సు యజమాని ఉద్యోగులు. ఆ నాడు ఈ చిన్న పత్రికలు వేటికీ విలేఖరులు లేరు. సబ్‌ ఎడిటల్లే తమకు ఇష్టమైన సభలకు, సమావేశాలకు వెళ్లి వార్తలు వ్రాసేవారు. అడ్లూరి అయోధ్య రామకవి అనే మరో సబ్‌ ఎడిటర్‌ ఉన్నాడన్నారు కాని సెలవులో ఉన్నాడేమో, వారం రోజుల తర్వాత కాని నాకు కనిపించలేదు. ఇదీ ఆ నాటి ఆంధ్రజనత సిబ్బంది సర్వస్వం. ఈ నాటి పత్రికా కార్యాలయాలతో పోల్చలేము. గోలకొండ పత్రికకు స్వంత ్రెస్సు ఉండింది. విశాలమైన కార్యాలయప్రాంగణము ఉండేది. దానికీ విలేఖరులు లేరు. ఆ నాటివన్నీ కుటీర పరిశ్రమలు. ఇవాళ తెలుగు పత్రికలు ప్రపంచంలోని ఏ దేశం, ఏ భాషాపత్రికలతో నైనా వార్తారచనలో, ప్రత్యేక వ్యాసాలు అందించడంలో, పుటల సంఖ్యలో, అక్షరాలు, చిత్రపటాలు పంచరంగులలో నయనానందకరంగా ముద్రించే విషయంలో సరితూగగల స్థితిలో ఉన్నాయి. అరుదైన అవకాశం

రెండవ రోజు నేను రాత్రి డ్యూటీకి వెళ్లేసరికి ఎడిటరు మా గదిలో కూర్చొని సంక్షిప్తవార్తలు వ్రాస్తున్నారు. నేను వెళ్లగానే పిటిఐ వార్తలన్నీ నాకు ఇచ్చారు. నేను ఒక్కొకటే తీసుకొని వ్రాయటం మొదలుపెట్టాను. కొంత సేపటి తర్వాత ఆయన ఎన్పీర్రు వార్తలు వ్రాసి పంపండి. “గాన్‌ విత్‌ ది విండ్‌' సినిమా ఇవాళే ఆఖరు రోజు. నేను రెండవ ఆట చూసి పేజి మేకప్‌ సమయానికి అందుకుంటానన్నారు. నేను అలాగే చేశాను. వార్తలు వ్రాయడమైపోయింది. ఆయన రాలేదు. ఫోర్మన్‌ వచ్చి బ్యానర్‌ హెడ్డింగు ఇస్తే కంపోజు చేసి పెడతానన్నాడు. వ్రాసి ఇచ్చాను. మళ్లీ వచ్చి “టైం అయిపోతున్నది. పేజీలు మొదలు పెడదా” మన్నాడు. పేజీలు పెట్టడం కూడా అయిపోయింది. మ్యాటరు యంత్రం మీద బిగించాడు. మొదటి ప్రతి అచ్చయి వచ్చింది. సమయం ఒకటిన్నర దాటింది. సినిమా చాలా పెద్దదని ఆలస్యం కావచ్చునని చూసినవారు అన్నారు. ఇంతలో ప్రెస్సు యజమాని పక్కనే ఉన్న తమ ఇంటినుంచి వచ్చాడు. ఇంకా ప్రింటింగు మొదలు పెట్టలేదెందుకని ఫోర్మన్‌ను గద్దించాడు. కొత్త కుర్రాడు ప్రింట్‌ ఆర్జరు ఇవ్వడానికి జంకుతున్నాడన్నాడు. “ఏమయ్యా?” అంటూ బాల్‌రెడ్డి నా దగ్గరకు వచ్చాడు. “నిన్ననే ఉద్యోగంలో చేరాను. రెండవరోజే నేనే సర్వమైనట్టు ప్రవర్తిస్తే పెద్దలకు కోపం రావచ్చు” నన్నాను. “ఎక్కడా ఏ తప్పూ లేదని జ్ఞాపకాల వరద 129

నమ్మకంగా చెప్పగలవా?” అని ఆడిగాడు. “తప్పకుండా” అన్నాను. అయితే నేను

  • 'ఫ్టయిక్‌ అర్దరు ఇస్తాను అని ప్రింటయిన పేపరు మీద ఫ్టయిక్‌ అని వ్రాసి సంతకం చేశాడు. వార్‌ఫెడల్‌ ముద్రణ యంత్రం పెద్దగా చప్పుడు చేస్తూ నడవటం ప్రారంభించింది, మరో పది నిమిషాలలో ఎడిటరు వచ్చారు. మంచిపని చేశారన్నారు. ఫోర్మన్‌ ఒక పత్రిక ఆయన చేతికి అందించి 'స్టయిక్‌ ఆర్డరు రెడ్డిగారు ఇచ్చారని చెప్పాడు. పేపరు అంతా తిరగేసి బాగుందన్నారు. దాంతో నా ధైర్యం, పరువు కూడా పెరిగాయి. కొత్త కాపురం నేను ఊరినుంచి వచ్చేటప్పుడే ఉద్యోగము, ఇల్లు దొరకగానే వచ్చి సరోజినిని తీసుకుపోతానని చెప్పాను. ఉద్యోగంలో చేరాను. ఇల్లు కూడా విఠల్‌వాడిలో మిత్రుడొకరి సాయంతో దొరికింది. కాపురం పెట్టాము. రెండు గదులు. ఒకటి పెద్దది. అదే వంట షల్లు, మా పడక గది. రెండవది చాలా చిన్నగది. ఐదడుగుల చతురస్రం. మా తమ్ముడు రమణ గది. దానిలో వాడైనా ఐమూలగా పడుకోవలసిందే తప్ప కాళ్లుచాపి పడుకోవడానికి లేదు. ఒక సౌకర్యం ఏమిటంటే గదుల ముందు విశాలమైన వాకిలి ఉంది. మధ్యలో జామ చెట్టు. అవసరమైతే దానినీడలో కూర్చొని పనులు చేసుకోవచ్చు. నల్లా స్నానాలగది, తదితరసౌకర్యాలు అన్నీ ఉన్నాయి. నెలకు 12 రూపాయలు అద్దె. కోమట్ల ఇల్లు. వాళ్ల నివాసం, కిరాణ దుకాణం కూడా అదే ఇంట్లో ముందుభాగంలో ఉన్నాయి. అదీ ఒక సౌకర్యవే. కాని మీరు ఇవన్నీ వాడుకుంటున్నారని ఇంటి యజమాని ఎప్పుడూ గునుస్తుందేవాదు. ఇంకో పక్క ఉన్న గదిని ఎవరో వంటవాళ్లకు అద్దెకు ఇచ్చాడు. వాళ్లు వాకిట్లో గాడిపొయ్యి పెట్టి ఏవో గింజలు ఉడికించి, రుబ్బి గసగసాల నెయ్యిలాగా కనబడే కల్తీ నెయ్యి తయారు చేస్తుండేవారు. అదీ రాత్రిపూట. మేము వద్దన్నా పట్టించుకునేవాడు కాదు. పదవ తరగతిలో నా క్లాస్‌ మేటుగా ఉండిన కృష్ణస్వామి అప్పుడు హెల్త్‌ ఇన్‌స్పెక్టరుగా మా ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన నన్ను స్కూలులో చేర్పించిన రఘువెంకటస్వామి మేనల్సుడే. ఆయన ఈ కల్తీ వ్యవహారంచూసి నోటీసు ఇచ్చి వారిని పట్టించాడు. దానితో మేము భద్రతకోసంవేరే ఇల్లు వెతికితే, బడీ చావుడీ పోలీసు స్టేషన్‌ వెనుక మోతీ సింగ్‌ గల్లీలో సేనాపతి శ్రీనివాసాచారి వకీలు ఇంట్లో రెండు మంచి గదుల ఇల్లు దొరికింది. మేము రెండేళ్లు నడిపిన మెస్సు ఆ పరిసరాలలోనే ఉండేది. అప్పుడే వకీలుగారు పరిచయమయ్యారు. మా ప్రయత్నాలను ఆయనా 180 జి.యస్‌. వరదాచారి

బలపరుస్తుండేవారు. వకీలు సాబ్‌ ఇంట్లో ఉన్నప్పుడే అభినవ పోతన వానమామలై వరదాచార్యులు, వారి సోదరుడు వానమామలై జగన్నాథాచార్యులు పరిచయమయ్యారు. జగన్నాథాచారి కూడా పేరొందిన కవి. రైతు రామాయణం వంటి కావ్యం వ్రాశారు. వారు వకీలు సాబ్‌ బంధువులు కూడా. హైదరాబాద్‌ వస్తే ఆయన ఇంట్లో బసచేసేవారు. జర్నలిస్టును గనుక నన్ను ఆదరంగా చూసేవారు.

ఆఫీసు పనులు గాడిలో పడ్డాయి. నాకు అజంతాతో సమానంగా 100 రూపాయల వేతనం, 15 రూపాయల రాత్రి డ్యూటీ అలవెన్సు నిర్ణయించారు. నేను వార్తలతో పాటు గల్పికలు, కథలు వవ్రాస్తుండేవాడిని. రిక్షావాళ్ల దీనస్థితి మీద నరపాహనాలు అనే ఫీచరు వ్రాశాను. ఆర్ధికాంశాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసినా, మానవీయకోణాన్ని మరువలేదు. ఆదివారం సాహిత్యానుబంధం చూసే అయోధ్య రామకవి ఇంగ్లీషు రాకపోయినా మంచి జర్నలిస్టు. చాలా బుర్రకథలు వ్రాశారు. కష్టపడి పనిచేసేవారు. “ఒకసారి ఈ వారం కథేమీ లేదు. ఒకటి వ్రాసి ఇవ్వమని ఎడిటరుగారు నిన్ను అడగమన్నారు” అన్నాడు. నా భార్యను తీసుకురావడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనకు కొంత కల్పన జోడించి, “దొరకని దొంగ” అనే కథ (వ్రాసి ఇచ్చాను.

అక్టోబరులో (ప్రవేశించాం. నవంబరు ఒకటినాడు ఆంధ్రప్రదేశ్‌ అవతరించ బోతున్నది. అన్ని పత్రికలూ ప్రత్యేక అనుబంధాలు ప్రకటించాయి. ఆంధ్రజనత పక్షాన 82 పేజీల అవతరణ దినోత్సవసంచిక ప్రచురించాలని నిర్ణయించారు. ఎడిటరు పర్యవేక్షణలో అయోధ్యరామకవే అనుబంధం పని చూస్తున్నారు. “నీవు అనుబంధానికి ఏమన్నా వ్రాసి ఇవ్వు, గుర్తింపు ఉంటుంది” అన్నారు. నేను జర్నలిజం కోర్సులో భాగంగా తెలుగు పత్రికల సమగ్ర చరిత్ర వ్రాశాను. దాన్ని తెలుగులో వ్రాసి ఇమ్మంటే ఇస్తానన్నాను. ఆయన ఎడిటరుకు చెప్పితే ఆయన ఆమోదించారు. నేను ఆఫీసులోనే కూర్చొని వ్రాస్తూపోయాను. ఆంధ్రదేశంలో పత్రికల పుట్టుక, పెరుగుదల, అభివృద్ధి అన్న ప్రధానశీర్షికతో, 'సుమారు వంద సంవత్సరాలు పత్రికారచనలో జరిగిన కృషి సమీక్షు అనే ప్రధాన ఉపశీర్షికతో ప్రచురించారు. దినపత్రికలో మూడు పేజీలకు విస్తరించింది. ఇంకా సమాచారం ఉన్నా అక్కడితో ముగించాము. పత్రికలకు పూర్వం, ఆరంభ పత్రికలు, ప్రథమాంధ్ర పత్రిక, వీరేశలింగ యుగపత్రికలు, దేశాఖిమాని ప్రథమ దిన పత్రిక, ఆంధ్రపత్రిక, పత్రికల భాష యేది, మహిళాలోకం, తెలంగాణ కృషి అనేవి ఇతర ఉపశీర్షికలు. తెలుగు పత్రికల చరిత్ర గురించి ఇంత సమ(గ్రంగా వెలువడిన వ్యాసాలలో అప్పటికి బహుశా ఇదే మొదటిది. దీన్ని 'వరద స్వర్గాక్షరి' జ్ఞాపకాల వరద 131

పేరుతో నా పాత్రికేయ జీవిత స్వర్ణోత్సవ అభినందన సంచికలో పునర్ముద్రించాను. మామూలు పుస్తకం సైజులో 18 పేజీలు వచ్చింది. దీనిలో ప్రథమాం(ధ్రపత్రిక గురించి నేను చేసిన వివరణ నిర్దేతుకం కాదనిపించినా, తర్వాత జరిగిన పరిశోధనలను బట్టి తెలుగులో సత్యదూత మొదటి పత్రిక అని నిర్ధారణ అయింది. ఆ మాట అధోలేఖనం కింద పుస్తకంలో వ్రాశాను. చిరస్మరణీయ ఉదంతాలు ఇక్కడొక చిరస్మరణీయసంఘటన గురించి చెప్పాలి. ఈ వ్యాసాన్ని ప్రముఖ పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ బెజవాడ రైలు స్టేషన్‌లో చూశారట. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, ఆంధ్రజనత ఆఫీసుకు వచ్చారు. ఎడిటర్‌ను కలిసి నా వ్యాసం చూపించి వీరిని కలవడమెట్లాగని అడిగారట. “ఈ కురాడ్రు మా దగ్గరే పనిచేస్తున్నాడు, పిలిపిస్తానుందండి" అని గంటమోగించగా, శర్మగారు “వద్దు, మనమే ఆయన వద్దకు పోదా”మన్నారట. ఇద్దరూ నేనున్న గదిలోకి వచ్చారు. శర్మగారు ఆప్యాయంగా పలకరించి ప్రధానంగా తొలి తెలుగుపత్రిక గురించి నేను వ్రాసిన దానిపై వివరణ అడిగారు. “శ్రీయక్షిణి తొలి తెలుగు పత్రిక అనడానికి సురవరంవారు వ్రాసింది కాక మరేదైనా ఆధారముందా?” అని అడిగారు. నేను సురవరం వారి మీదనే పూర్తిగా ఆధారపడ్డాను. కొంత చాపల్యానికి కూడా లోనై ఆ వ్యాఖ్య చేశాను. అదే చెప్పాను. శర్మగారు “కాలమానపరిస్థితులను బట్టి వివాదాస్పదం కాగల విషయాన్ని నిర్భారిస్తున్నపుడు, రెండవ ఆధారం ఆవశ్యక” మని చెప్పారు. తర్వాతి కాలంలో నేను బాగా ప్రచారంలోకి తెచ్చిన సత్యనిష్ట సూత్రాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. నా మనోబలాన్ని, వృత్తిపట్ల నిబద్ధతను పెంచిన మరొక సంఘటన గురించి చెప్పాలి. 1957 ప్రారంభం. ముక్కోటి తెలుగు ప్రజలను కలిపి ఆంధ్ర ప్రదేశ్‌ అంటూ ఓ రాష్ట్రం ఏర్పడింది గనుక, తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేసేందుకు ఒక సాహిత్య పరిషత్తు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన తెలుగు సాహిత్యకారులకు కలిగింది. అప్పటికే అంటే 1954లోనే కేంద్ర సాహిత్య అకాడమీ వర్పాటయి పని చేస్తున్నది. రాష్ట్రంలో అటువంటి సంస్థ లేదు. ప్రాంతీయ రచయితల సంఘాలు ఉన్నాయి. తెలంగాణ రచయితల సంఘం ఈ ప్రాంతంలో క్రియాశీలంగా ఉండేది. ఆ పరిస్థితులలో రాష్ట్రస్థాయి సంస్థ ఏర్పాటు గురించిన ఆలోచన రావడం సహజం. అందుకే హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని ఆంధ్రసారస్వత పరిషత్తు ఆవరణలో రెండు రోజుల మహాసభలు ఏర్పాటు చేశారు. ఎడిటరు నన్నీ సభలకు వెళ్లి విశ్లేషణాత్మకవార్త వ్రాయమన్నారు. 132 జి.యస్‌. వరదాచారి

“మీకు జర్నలిజం తరగతిలో విశ్లేషణాత్మక కథనాల రచన గురించి చెప్పి ఉంటారు గదా?” అన్నారు. నేను అలాగే రెండు రోజులూ వెళ్లాను. తల్లావజ్ఞల శివశంకరస్వామి అధ్యక్షతన జరిగిన సభలో విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, అబ్బూరి రామకృష్ణారావు, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య, సి. నారాయణరెడ్డి, పోతుకూచి సాంబశివరావు ఒకరేమిటి - తెలుగులో పేరున్న కవులు, కవయి(క్రులు, రచయితలు, రచయిత్రులు అందరూ పాల్గొన్నారు. నేను మొదటి రోజు అందరి ప్రసంగాలలో ముఖ్యాంశాన్ని పేర్కొంటూ, వాదోపవాదాలను తులనాత్మకంగా విశదపరుస్తూ, చివరకు భావప్రకటనా స్వేచ్చను ఆందరూ బలపరచిన విషయాన్ని ప్రస్తావించి కథనాన్ని ముగించాను. రెందవ రోజు ఎన్నికలు, మహాసభ తీర్మానాలే ప్రధానాంశాలుగా తీసుకుని వార్త వ్రాస్తున్నాను. ఎడిటరు ఇద్దరు ముగ్గురిని వెంటబెట్టుకుని నేనున్న గదిలోకి వచ్చారు. “వీరు నిన్ను చూడటానికి వచ్చారయ్యా” అన్నారు. పెద్దాయనను అబ్బూరి రామకృష్ణారావు అని, మరొకరిని అబ్బూరి వరదరాజేశ్వరరావనీ పరిచయం చేశారు. “నీ కథనం బాగుందయ్యా, భావస్వేచ్చను హైలైట్‌ చేశావు కుర్రాడివి గదా!” అని వరదరాజేశ్వరరావు మెచ్చుకున్నారు. సంప్రదాయవాదులు, అభ్యుయవాదులతో కలిసిన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య పరిషత్తు కార్యవర్గం ఏర్పాటైంది. దాని పనితీరుపై అప్పుడే భిన్నమైన అంచనాలు. కాని కొద్ది రోజులలోపలే బెజవాడ గోపొలరెడ్డి అధ్యక్షుడుగా ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఏర్పాటు కావడంతో అందరి దృష్టీ అటు మళ్లింది. కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా ప్రభుత్వ సహాయ సహకారాలతో పనిచేసే సాహిత్య అకాడమీ తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి ప్రశంసనీయమైన కృషి చేసింది. దీనికి చాలా కాలం విశ్వనాథ సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా, దేవులపల్లి రామానుజరావు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలుగు భాషలోని ప్రసిద్ధ గ్రంథాలన్నిటినీ పాఠకులకు సరసమైన ధరకు అందించేందుకు వీరు చేపట్టిన రెండు రూపాయల కో (గ్రంథం పథకం విప్లవాత్మకమైంది. వీరు ప్రచురించిన వృత్తిపదకోశాలు భాషాభివృద్ధికి తోడ్పడే అక్షయ ఖనులు! అసెంబ్లీ సమీక్ష నాదే!

ఇక్కడే నాకు లభించిన మరొక మహత్తర అవకాశాన్ని గురించి చెప్పాలి. అది ఆకాశవాణి కోసం అసెంబ్లీ కార్యక్రమాల సమీక్ష వ్రాసే అవకాశం. నేను అంతవరకు రేడియోలో ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ కార్యక్రమం నా ప్రతిభనో, అనుభవాన్నో బట్టి లభించింది కాదు. రాయప్రోలు రాజశేఖర్‌ అని ఆకాశవాణిలో అసిస్టెంట్‌ డైరెక్టరు ఉండేవారు. ఆయన అజంతాకు ఆ కాంట్రాక్టు ఇచ్చారు. అప్పుడు వారానికి ఒకసారే జ్ఞాపకాల వరద 1938

శనివారం రాత్రి, తెలుగువార్తల తర్వాత ఈ సమీక్షాకార్యక్రమం ప్రసారమయ్యేది . (వ్రాసి ఇవ్వడం జర్నలిస్టు పని. చదువడం వార్తావిభాగం వారి పని. శుక్రవారం అజంతాకు గుర్తు చేయడానికి ఆయన ఫోను చేస్తే అజంతా చేతులెత్తేశారు. ఆఖరు నిమిషంలో ఇలా చేస్తే ఇప్పుడు ఎవరు దొరుకుతారని ఆయన ఆందోళన పడితే, అజంతాయే నా పేరు చెప్పారు. నేను ఏదో పనిమీద వచ్చి అప్పుడు కార్యాలయంలో ఉన్నాను. “ఇక్కడ ఉన్నాడు మాట్లాడుతాడని ఫోను నా చేతికిచ్చారు. నేనునా అలవాటు ప్రకారం సరే వ్రాస్తానన్నాను. “శనివారం మధ్యాహ్నం నాలుగింటికల్లా స్కిస్ప తీసుకొని వచ్చేయండి. మీ పేరుతో కాంట్రాక్టు తయారు చేయిస్తాను. అప్పుడే సంతకం చేద్దురుగాని” అన్నారు. నేను వెంటనే కార్యరంగంలోకి దూకాను. దినపత్రికల ఫైలు తిరగేసి వ్రాయదగిన అంశాలను నోట్‌ చేసుకున్నాను. వార్త మాదిరిగానే లీడ్‌ ఒకటి గుర్తించాను. ఆ రోజు కొంత వ్రాసి, రాత్రి డ్యూటీ చేసి మర్నాడు పదింటికల్లా ఆఫీసుకు వెళ్లి, ఆ నాటి వార్తలలో చేర్చదగినవి చేర్చి పదిహేను నిమిషాలకు సరిపోతుందని ఐదు పేజీల ్మిఫ్ట తయారు చేశాను. రేడియో స్టేషన్‌కు తీసుకువెళ్లి రాజశేఖరును కలుసుకొని స్మిష్ట ఇచ్చాను. ఆయన చదివి అక్కడక్కడ దిద్ది వార్తావిభాగంవారికి ఇచ్చారు. నన్ను పరిచయం చేశారు. ఆ విధంగా రేడియోలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మొదటి సమీక్ష వ్రాసే అవకాశం నాకే దక్కింది. తర్వాత నేను రేడియోకు నాటకాలు వ్రాయడం వేయడం తప్ప, దాదాపు అన్ని రకాల వచనకార్యక్రమాలూ అందించాను. తర్వాత అసెంబ్లీ సమీక్షలు ఏ రోజువి ఆ రోజే ప్రసారమైనప్పుడు కూడా, చాలాసార్లు వ్రాసే అవకాశం దక్కింది. విమర్శనాత్మకంగా కూడా వ్రాసేవాల్ని. విమర్శ హద్దు మీరితే సభాధిక్కారమవుతుంది. నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. ఒకరోజు శాసనసభలో గొడవ మితిమీరింది. ఇటీవల రాజ్యసభలో నిత్యం మనం చూస్తున్న విధంగా పరిస్థితి మారింది. చేపలబజారును తలపించింది. జర్నలిస్టుల గ్యాలరీలో కొందరు ఆమాట అన్నారు కూడా. కాని సమీక్షలో, పైగా ప్రభుత్వ మీడియాలో ఆ మాటంటే ఇంకేమైనా ఉందా? మాట్లాడిన వారందరి పేర్లు చెప్పక పోతేనే హక్షుల తీర్మానం తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. నా సమస్యను వావిలాల గోపాలకృష్ణయ్య తీర్చారు. శాసనసభను చేపలబజారు కింద మార్చేశారని సభలోనే అన్నారు. నేను “శాసనసభలో ఈ రోజు వాతావరణం వావిలాల అన్నట్టుగా చేపల బజారును తలపించింది” అంటూ నా సమీక్ష ప్రారంభించాను. వ్యాఖ్య ఆయనకు ఆపాదించాను గనుక ఎవరికీ అభ్యంతరకరంగా తోచలేదు. 134 జి.యస్‌. వరదాచారి

వావిలాల ప్రస్తావన వచ్చింది గనుక, ఆయనతో సంబంధమున్న మరొక ఆసక్తికర సంఘటనను ప్రస్తావిస్తాను. లా కాలేజీ వార్షిక దినోత్సవం. అప్పుడు జి.సి.వి. సుబ్బారావు ప్రిన్సిపాలు. వావిలాలను ముఖ్యఅతిథిగా పిలిచారు. మాటలలో అసెంబ్లీ స్పీకరు ప్రస్తావనేదో వచ్చింది. “సభలో మాట్లాడనివాడే ఆయన. ఆయన్ని స్పీకర్‌ అన్నారెందుకో?” అని వావిలాల ధర్మసందేహం వెలిబుచ్చారు. నాకెందుకో వెంటనే మాట్లాడరు అనేమాట గుర్తుకు వచ్చి, అలాగే “ఇంగ్లీషు స్పీక్‌కు అరు తగిలించి స్పీకరు అన్నారేమో!” అన్నాను. “అరు అనే ప్రత్యయం తగిలించి ఆ మాట తయారు చేశారంటావు. బాగుంది” అని వావిలాల అనగా అందరూ నవ్వేశారు.

యాదృచ్చికమే. సందేహం లేదు. కాని చెప్పుకోడానికో సరదా ఉదంతం. రేడియోలో తొలి అసెంబ్లీ సమీక్ష వ్రాసినట్టే, హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రంలో 27 ఏళ్ల తర్వాత 1983 నవంబరు 14వ, తేదీన తెలుగు వార్తల ప్రసారం ప్రారంభమైనప్పుడు, తాలి బులెటిన్‌లో తొలి వోర్త వ్రాసే అవకాశం నాకే దక్కింది. పి.వి. సతీష్‌ పెక్స్‌గా, పన్యాల రంగనాథరావు ప్రొడ్యూసర్‌గా, పి.యస్‌. ఆర్‌. ఆంజనేయశాస్త్రి, నేను క్యాజువల్‌ న్యూస్‌ రైటర్స్‌గా పనిచేశాము. మొదటి వార్త అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సందేశం నేనే వ్రాశాను. శోభాశంకర్‌ చదివారు. ఆమె క్యాజువల్‌ న్యూస్‌ రీడరుగా వచ్చారు. రెగ్యులర్‌ న్యూస్‌ రీడరుగా అప్పటికే శాంతిస్వరూప్‌ నియమితులై ఉన్నారు. కాని ప్రొడ్యూసరు ఇందిరాగాంధీ సందేశాన్ని మహిళ చేత చెప్పిస్తేనే సమంజసంగా ఉంటుందని ఆమెకు ఇచ్చారు. శాంతిస్వరూప్‌ వేరే వార్తలు చదివారు. 156 నిమిషాల బులెటిన్‌లో 14 వార్తలు సింగిడిలా ఆకట్టుకున్నాయి. మర్షాడనుకుంటా, స్టూడియోలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో చూద్దామనిపించింది. ఇంజనీరును అడిగితే వెంటతీసుకుపోయి అన్నీ చూపిస్తున్నాడు. ఒక చోట స్తంభానికి ఉన్న ఒక మానిటరులో హిందీవార్తలు వస్తున్నాయి. ఇదెక్కడికి అని అడిగితే నాగపూర్‌కు ఎర్త్‌ రిసీవింగు స్టేషన్‌ లేనందున ఇక్కడ రిసీవ్‌ చేసి మైక్రోవేవ్‌ ద్వారా అక్కడికి పంపుతున్నామని ఇంజనీరు చెప్పారు. “మనమిక్కడ దీన్ని రికార్డు చేసుకోలేమా?” అని ఆయన్ని అడిగితే మీరు కావాలంటే చేసిపెడతానన్నారు. ఆ రోజు బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌ ఢిల్లీకివచ్చారు. ఆ స్వాగతద్భశ్యాల క్లిప్పింగ్‌ ఇవ్వుమన్నాము. ఇచ్చారు. దాన్ని ఆ రోజు తెలుగు వార్తలలో చూపించాము. ఢిల్లీ నుంచిరాత్రి 9 గంటలకు వచ్చే ఇంగ్లీషు వార్తలలో చూసే అవకాశమున్న దృశ్యాలను, తెలుగు వీక్షకులకు ? గంటలకే చూపించామన్నమాట. అప్పుడు దూరదర్శన్‌ డైరెక్టరుగా భద్రవ్రత ఉన్నారు. దూరదర్శన్‌ స్టూడియో సోమాజిగూడలో ఉండేది. డైరెక్టరు ఆఫీసు అరకిలో మీటరు దూరంలో కొండకింద ఉందేది. రాణి రాక దృశ్యాలు చూసి, ఆయన హుటాహుటిన స్టూడియోకు జ్ఞాపకాల వరద 135

వచ్చారు... ఈ విజువల్స్‌ ఎక్కడివి అని అడిగారు. తెప్పించామన్నాను నేను. “అదెలా సాధ్యం? కాని విషయమేమిటో చెప్పండి” అని అడిగారు. “పోనీ ఊహించండి అన్నాము. “ఊహకు అందని విషయం మీరే చెప్పండి” అన్నారు. అప్పుడు “ఢిల్లీ దూరదర్శన్‌ నుంచి మన ద్వారా నాగపూరు వెళ్తున్న దానిని వాడుకున్నామని చెప్పాము. మనకు అందుబాటులో ఉన్న సౌకర్యాలేమిటని తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకుందామన్న దృష్టి ఉంటే మార్గం దొరుకుతుంది. ఈ సంఘటనను నా పాత్రికేయ జీవిత స్వర్జోత్సవ సంచిక *వరద స్వర్దాక్షరిిలో వ్రాసిన వ్యాసంలో శాంతిస్వరూప్‌ 'ఆగిన గాలిపటాన్ని పరుగెత్తి పట్టుకున్న పిల్లాడిలా ఆయన - అంటేనా - ఆనందం వ్యవస్థతో మమేకం కావడానికి తార్కాణం” అని వర్ణించారు. మరోవైపు ఆంధ్రజనత పత్రిక (ప్రాచుర్యం తగుమాత్రం పెరిగింది. అదనపు సిబ్బంది చేరడం (ప్రారంభమైంది. బెల్లంకొండ రామదాసు వచ్చిచేరారు. నయాగరా కవులలో ఒకరుగా, నాటకరచయితగా, అనువాదకుడుగా అప్పటికే ఆయనకు పేరు ఉంది. 'మరదలు పెళ్లి అనే ఓ సినిమాకు రచయితగా పనిచేశారు. నయాగరా కవులంటే కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు. వీరి తొలికావ్యం 1944లో అచ్చయింది. అభ్యుదయ కవితాయుగంలో అచ్చయిన తొలికావ్యం అని వ్రాసుకున్నారు. నేను అప్పటికి దాన్ని చూడలేదు. తర్వాత ఎప్పుడో చూశాను. ముగ్గురు కవులు వ్రాసిన మూదేసి రచనలున్న చిన్న పుస్తకం. రామదాసు తర్వాత వచనంవైపు మళ్లారు. టాల్‌స్టాయ్‌, డికెన్స్‌, మపాసా, గోర్కీ ఆల్బర్ట్‌ మొరేవియాల రచనలు అనువాదం చేశారు. రామదాసు అంటే అజంతాకు అభిమానమే, నేనీమాట ఎందుకు చెపుతున్నానంటే, ఆయనకోసం జీతం తగ్గించుకుందామన్నారు. రామదాసుకు 100 రూపాయలే జీతం నిర్ణయించారు. పెద్దాయనకు మనకంటే తక్కువ జీతం బాగుండదు. మనం చెరిఐదు రూపాయలు తగ్గించుకొని ఆయనకు ఇద్దాం. మనతో సమానంగా. ఉంటుంది. ఆయనను కూడా మనతో సమానంగా రాత్రి డ్యూటీ చెయ్యమందామన్నారు. నేను సరేనన్నాను. రామదాసు ఎందుకో ఎక్కువ కాలం ఉండలేదు. బెజవాడలో అవకాశం వచ్చి వెళ్లిపోయారు. నాంపల్లికి మారిన ఆంధ్రజనత నేను చేరి యేడాది పూర్తయింది. మూడో రోజు పత్రిక రెండవ వార్షికోత్సవం జరిగింది. ఆ సందర్భంలో కార్యక్రమమేదీ ఏర్పాటు చేయలేదుకాని, పత్రిక నిలతొక్కుకున్నదని అందరం సంతోషించాము. రాజుగారు మంత్రి కావడం కూడా అందుకు దోహదపడింది. వార్తారచనలో, శీర్షికలు ఆకట్టుకునేటట్టు పెట్టడంలో, పేజీ 186 జియస్‌. వరదాచారి

విన్యాసంలో మేము ముందుండటంతో, పత్రిక అమ్మకాలు గోలకొండ పత్రికను దాటిపోయాయి. పత్రికకు స్వంత (ప్రెస్సు ఉంటే బాగుంటుందన్న ఆలోచన యాజమాన్యానికి వచ్చింది. రాజుగారు ఆ ప్రయత్నం ప్రారంభించారు.

కాని మిలాప్‌ అనే పేరుతో ఉర్దూ, హిందీ భాషలలో దినపత్రికలు ప్రచురిస్తున్న యుద్దవీర్‌, తెలుగులో కూడా అదే పేరుతో దిన పత్రిక తేవడానికి (ప్రెస్సు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆయన రాజుగారికి సన్పిహితులు.. తమవర్గానిదే ఒక పత్రిక ఉండగా, దానికి పోటీగా మరొకటి వాంఛనీయం కాదనుకున్నారు. మిలాప్‌ ్రెస్సులో ఆంధ్రజనతను అచ్చువేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దానితో సికిందరాబాద్‌ నుంచి ఆంధ్రజనత కార్యాలయం హైదరాబాద్‌కు మారింది. ఎడిటోరియల్‌ విభాగం మిలాప్‌ ఆవరణలోకి, మేనేజ్‌మెంట్‌ విభాగం దగ్గరలో ఉన్న గాంధీభవన్‌లోకి చేరాయి. యుద్ధవీర్‌ తన స్వంత గదిని మాకు ఇచ్చారు. ఎడిటరుతో సహా అందరం దానిలోనే కూర్చునేవారము. ఉర్దూ చదువడం, మాట్లాడటం వచ్చు గనుక యుద్ధవీర్‌కు నా మీద వాత్సల్యం. నౌ జవాన్‌ అని సంబోధించేవారు. ఆయన భార్య సీత్రాయుద్ధవీర్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీల సభ్యురాలు. రాజ్యసభకు పోటీచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆమెకు తెలుగులో ధారాళంగా మాట్లాడటం నేర్చమన్నారు. నేను రోజూ ఓ గంట హిందీ ఉర్దూ పదాలకు సమానార్ధ్థకాలు చెప్పి వాక్యాలలో ప్రయోగించడం అభ్యాసం చేయించాలి. దీనికి ఓ ప్రణాళిక సిద్ధం చేసి పాఠాలు వ్రాశాను. అవి యుద్ధవీర్‌కు నచ్చాయి. “నేను కూడా తెలుగు నేర్చుకుంటానయ్యా” అన్నారు. “వేరే సమయమివ్వ నక్కరలేదు. కనబడ్డప్పుడల్లా తెలుగులో ఏదో అంటా, తప్పులు దిద్దుతుండు” అన్నారు.

ఆ మర్నాడు నేను కనబడగానే 'ఏం గారూ" అంటూ ఏదో చెప్పబోయారు. “ఇదేం గారూ అన్నాను. తప్పా అన్నారు. మీరేమి చెప్పదలచుకున్నారని అడిగాను. ఎవరైనా కనబడగానే క్యా జీ అంటాంగదా. క్యా అంటే ఏమి జీ అంటే గారు అన్నారు. “ప్పేర్సుక్తు గారు తగిలిస్తే జీ అనే అర్ధం వస్తుందిగాని వంగారు అంటే కుదరదు ఏమండీ అనాలి” అన్నాను. “అబ్బో, తెలుగు చాలా క్లిష్టమైన భాషా అన్నారు. సీతాయుద్ధవీర్‌కు సమయం దొరకలేదు. యుద్ధవీర్‌ ఆసక్తి చూపలేదు. కనుక తెలుగు నేర్చడమనేది అటకెక్కింది. సీతాయుద్ధవీర్‌ అనుకున్న ప్రకారం రాజ్యసభ సభ్యులయ్యారు. యుద్ధవీరే తెలుగు పాఠాల గురించి మిలాప్‌ కార్యనిర్వాహక సంపాదకుడు షాకిర్‌కు, హరినామ్‌ సింగ్‌ అనే హిందీ ఎడిటరుకు చెప్పారు. వారికి నా ప్రణాళిక నచ్చింది. స్వయంబోధినీ పద్ధతిలో హిందీ మిలాప్‌లో పాఠాలు వేద్దామని ప్రారంభం చేశారు. కొన్ని వారాలు హిందీ ద్వారా తెలుగు నేర్చుకునే పాఠాలు వేశాము. ఆ పట్రిక జ్ఞాపకాల వరద 187

పాఠకులంతా తెలుగు వచ్చినవారే. కనుక ఇవి మాకెందుకు అన్నారు. ఆపివేశాము. మిలాప్‌ ఆవరణలో ఉన్నందున హకీమ్‌ మున్నాలాల్‌ మిశ్రా అనే మానసికవ్యాధుల వైద్యుడు పరిచయమయాడు. పాతబస్తీ వాసి. ఆయన ఉర్దూలో (ప్రపంచంలో ఎవరినీ పిచ్చివారుగా ఉండనివ్వను' అనే శీర్షికతో పుస్తకం వ్రాశాడు. దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి ఇవ్వమన్నాడు. 60 పేజీల చిన్న పుస్తకం. పిచ్చి 60 రకాలు అంటూ మొదలవుతుంది. ఉర్జూలో 60 పేర్లు ఇచ్చాడు. దానికి తెలుగు పేర్లు ఎట్లా? ఆయన్నే అడిగితే ఉర్జూవే తెలుగు అక్షరాలలో వ్రాయమన్నాడు. నేను అలాగే వ్రాసి ఇచ్చాను. తగు పారితోషికం ఇచ్చాడు.

ఆ నాటి మిలాప్‌ జర్నలిస్టులు వృత్తికుశలతకు పేరుమోసినవారు. (ప్రేమ్‌ ఛద్దా అని న్యూస్‌ ఎడిటరు ఉండేవాడు. ఏదీ ఆషామాషీగా తీసుకునేవాడు కాదు. ఒక సంఘటన ఉదాహరిస్తాను. మిలాప్‌, జనత (్రెస్సులు రెందూ పక్క పక్కన ఉండేవి. ఒక రాత్రి పత్రిక ప్రింటింగుకు ఇచ్చి ఆయనకు శుభోదయం చెప్పి, ఇంటికి వెళ్లి పోయాను. సుమారు రెండున్నర ప్రాంతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి అబూల్‌ కలామ్‌ ఆజాద్‌ చనిపోయినట్టు వార్త వచ్చింది. ఛడ్డా ఆఫీసులోనే ఉన్నాడు. తమ పత్రిక ముద్రణ ఆపి ఆవార్తను దానిలో వేయించాడు. తెలుగు పత్రికలో కూడా ఆ వార్త వేయాలని తాపత్రయం. ఆ పని ఉర్దూ పత్రికంత కష్టం కూడా కాదు. పత్రిక అచ్చవుతుండగా ఇలా ముఖ్యమైన వార్త ఏదైనా వస్తే ముద్రణ నిలిపి తాజా వార్త పేరిట రెండు మూడు వాక్యాలు వేసే పద్ధతి ఆ రోజులలోఉందేది. తెలుగు ప్రూఫ్‌ రీడరు ఒకడు అందుబాటులో ఉన్నాడు. ఆయనకు చెప్పి ఆజాద్‌ గతించారనే తాజా వార్త వ్రాయించి కంపోజు చేయించి, దాని (హ్రఫ్‌ చదివించుకొని విని, పేజీలోని పెద్దవార్తను కొంత తగ్గించి, అక్కడ దీన్ని పెట్టీ అచ్చు కొనసాగించారు. అంత శమ తీసుకున్నందుకు మర్నాడు ఛడ్దాను అభినందించకుండా ఉండలేకపోయాను. ఆజాద్‌ చనిపోయారన్న వార్త మర్షాడే క్లుప్తంగానన్నా వేసిన పత్రికలు మావే.

ఆ రోజులలో ఇంటిలో మాకెవరికీ ఫోన్లు లేవు. సందర్భం వచ్చింది గనుక ఇక్కడ ఒక విషయం చెపుతాను. తెలుగు పత్రికలు ఇప్పటికీ అబూల్‌ కలాం, అబ్బుల్‌ కలాం అనే రెండు పేర్లు ఉంటాయని గుర్తిస్తున్నట్టు లేదు. పేర్ల విషయంలో తెలుగు పత్రికలు మాత్రమే చాలా అశ్రద్ధగా తోచినట్టుగా వ్రాస్తున్నాయి. ఉచ్చారణ తెలుసుకునే

(ప్రయత్నం చేయడం లేదు. దేశీయ ప్రముఖుల పేర్ల సరైన ఉచ్చారణ పత్రికొ రచయితలకు తెలియకపోవడం సిగ్గుచేటు! మోదీని మోడీ అని, ఆడ్వాణీని అద్వానీ అనడమే ఉదాహరణ. అర్థం తెలియనక్కరలేదు. తెలిస్తే మరింత మంచిది. అబూల్‌ 138 జియస్‌. వరదాచారి

అంటే పూజనీయుడు అని అబ్బుల్‌ అంటే భక్తుడు అని, అర్ధం. చాలా భాషలలో తగినన్ని అక్షరాలు లేనందున ఉచ్చరించినట్టు వ్రాయడం సాధ్యం కాదు. దేవనాగరి, తెలుగు లిపులలో మాత్రమే నూటికి 99 పాళ్లు పలికినట్టు వ్రాయడం, వ్రాసినట్టు పలకడం సాధ్యమవుతుంది. ఆ విశిష్టతను మనం చెడగొట్టుకో గూడదు.

1957లో వార్తాప్రాధాన్యంగల మహత్తరసంఘటనలు చాలా జరిగాయి. తెలుగు సాహిత్యకారుల సభలు జరగడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఏర్పడటం గురించి ముందు చెప్పాను. ఇతరసంఘటనల గురించి చెప్పేముందు ఒక విషాద సంఘటన గురించి చెప్పాలి. ప్రకాశం పంతులు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారలాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశించింది. గాంధీభవన్‌లోని పెద్దహాలులో పార్థివశరీరాన్ని ప్రజలు దర్శించుకోడానికి ఉంచారు. తర్వాత ఆ హాలుకు ప్రకాశం హాలు అని "పేరుపెట్టారు. పార్ధివశరీరాన్ని అంత్యక్రియలకు అంబర్‌ పేట శృశానవాటికకు తరలించారు. ముందు పోలీసు బ్యాండు విషాదగీతాలు ఆలపిస్తూ నడుస్తుండగా, వారి వెనుక తుపాకులను అవనతం చేసి పట్టుకున్న పోలీసు దళాలు, వారి వెనుక మంత్రులు, రాజకీయనాయకులు, పత్రికాప్రతినిధులు, వారి వెనుక పార్ధివ శరీరాన్ని ఉంచిన అలంకృత సైనికశకటం, దాని వెనుక పెద్ద సంఖ్యలో జన సామాన్యం, వాన కురిసినా లెక్కచేయక, దాదాపు ఎనిమిది కిలో మీటర్లు గంభీర ముద్రవహపించి నడిచారు. ప్రకాశం గొప్ప రాజకీయనాయకుడు, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు. (ప్రకాశమంటే ఆంధ్రదేశం, ఆంధ్రదేశమంటే ప్రకాశం అన్నంతగా పెనవేసుకుపోయిన వ్యక్తిత్వం. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రి ఎవరని కాంగ్రెస్‌ నాయకులు ప్రధాని నెహ్రూను అడిగారట. ఇంకెవరు ప్రకాశమే అన్నారట నెహ్రూ. ఆయన మన పార్టీలో లేడండి అని వారు గుర్తుచేశారట. ఏ పార్టీలో ఉన్నా ముఖ్యమంత్రి పదవికి ఆయనే అర్హులని నిర్ణయం చెప్పారట. అంతటి వ్యక్తి మరణవార్తకు ఆయన గొప్ప వ్యక్తిత్వం ప్రతిఫలించే శీర్షిక పెట్టాలి. చావుకు మన భాషలో అనేకపర్యాయపదాలు ఉన్నాయి. మరణం, దుర్మరణం, హఠాన్మరణం, కాలధర్మం, అస్తమయం, నిర్యాణం, మహాప్రస్థానం ఇంకా చాలా ఉన్నాయి. చావు అనే మాట కూడా ఉంది. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు ఓ కన్నడ పత్రిక ఇందిరాగాంధి సావు అని తాటికాయంత అక్షరాలతో శీర్షిక పెట్టింది. విశేష (ప్రజాభిమానమున్న వ్యక్తులకు అలాటి శీర్షికలు పెడితే అగౌరవపరచినట్టుగా ఉంటుంది. పైన పేర్కొన్న ఇతరపదాలు కూడా సందర్భోచితంగా ఉండేట్టయితేనే పెట్టాలి. యువకుడి మృతిని కాలధర్మం అంటే పొసగదు. ఇక దేశమంతా కొలిచే మహనీయుల జ్ఞాపకాల వరద 139

విషయంలో సరైన పదాలు, పదబంధాలు వెతికితే దొరుకుతాయి. అంత కష్టపడలేని వారికి అస్తమయం వంటి పదాలు అందుబాటులో ఉంటాయి. ప్రకాశం వార్తకు నార్ల . వెంకటేశ్వరరావు ఉద్వేగపూరితంగా '(ప్రకాశహీనమైన ఆంధ్రప్రదేశ్‌ అని శీర్షిక ఇచ్చారు. నా దృష్టిలో అది ఆ నాడు వచ్చిన శీర్షికలన్నిటిలోకీ ఉత్తమమైనది. ప్రకాశం పంతులు లేరన్న అర్థమూ ఉంది, ఆ కారణంగా రాష్ట్రం వెలవెలబోయింది అనే ధ్వనీ ఉంది. మా పత్రికలో మేము మథనపదకుండా సంపాదకుడే అస్తమయం అని శీర్షిక పెట్టారు. మంచి శీర్షికలు నలుగురు మెచ్చుకునే శీర్షిక పెట్టాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. '్రకి రోజూ అన్ని పత్రికలలో వచ్చిన శీర్షికలను పోల్చి తర్జన భర్జన పడటం కూడా సామాన్యమే. ఏ పర్రికలోనైనా మంచి శీర్షికవస్తే మనకీ పదం తోచలేదే అనుకున్న సందర్భాలూ ఉంటాయి. కనుక మంచి మాటలను గుర్తుంచుకుని అవకాశం దొరికినప్పుడు ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. తప్పు లేదు. కాని బెచిత్యం పాటించడం చాలా ముఖ్యం. ఇలాటి ప్రయత్నమే మా జనతలోనే చేసి, ఒక సీనియర్‌ జర్నలిస్టు భంగపడిన సంగతి చెపుతాను. కళా వెంకటరావు మరణించినప్పుడు ఆయన “కళా విహీనమైన ఆంధ్రప్రదేశ్‌ అని శీర్షిక పెట్టారు. ఎడిటరుకు కాని, నాకు కాని చెప్పలేదు. పొద్దున పత్రిక చూడగానే నాకు జెచిత్యం దెబ్బతిన్నదని అనిపించింది. ఎడిటరు ఆ మాటే అన్నారు. అతడిని మందలించారు. కళా వెంకటరావు గొప్ప నాయకుడే. ముఖ్యమైన మంత్రి పదవులు నిర్వహించినవాడే. కోనసీమ మేధావిగా పేరొందినవాడే. ఆయన మరణం తీరని లోటే. కాని రాష్ట్రం కళావిపొనమైందనడంతో అత్యుక్తిదోషం అంటుకుంది. పత్రికారచనలో నిర్దిష్టతకు 'ప్రథమ'్రాధాన్యం ఇస్తాం. బెచిత్యం పాటించడం, .తరతమభీదాలను పాటించడం అందులో భాగాలే. చమత్మార శీర్చికలు పెట్టవచ్చు. శ్రీశ్రీ పోయినపుడు మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం అని పెట్టాము. బూర్గుల రామకృష్ణారావు 1957లో కేరళ గవర్నరయ్యారు. తిరువనంతపురం విమానాశ్రయంలో ఓ విలేఖరి “ఎంతో అనుభవం కల మీరు ఈ చిన్న రాష్ట్రానికి గవర్నరుగా వచ్చారేమిటి?” అని అడిగాడు. అప్పుడు బూర్జుల ఇంగ్లీషులో “షార్టెస్ట గవర్నర్‌ ఫర్‌ స్మాలెస్ట్‌ స్టేటొ అని సమాధానమిచ్చారు. దాన్ని నేను తెలుగులో కూడా (ప్రాస కుదిరేటట్టు “చిట్టి రాష్ట్రానికి పొట్టి గవర్నరు” అని శీర్షిక పెట్టాను. ఒక కేసు విచారణ జరుపుతున్న జడ్జి కోర్టులో వాదనలు వింటూ కునుకుతీశారు. మేలుకొని ఎక్కడున్నామని అడిగారు. వాదాలు పూర్తయ్యాయని వకీళ్ళచెప్పగా తీర్చు 140 జియస్‌. వరదాచారి

వాయిదా వేశారు. ఒక పక్షంవారు పై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు, జడ్జి నిద్రవల్ల న్యాయప్రక్రియకు అవరోధం ఏర్పడిందని. వాదనలను మళ్లీ వినాలని పైకోర్ట ఆదేశించింది. దానికి నేను నిద్రారాక్షసం అని శీర్షిక ఇచ్చాను.

కంచి కామకోటి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి 1994లో నూరవ యేట తనువు చాలించారు గోవిందరాజు చక్రధర్‌ ఉదయంపత్రిక నుంచి నాకు ఫోనుచేశారు. మంచి శీర్షిక పెట్టాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఒక పెద్దాయనను అడిగితే శివసాయుజ్యం అని పెట్టమన్నారట. చక్రధర్‌కు నచ్చలేదు. మంచి శీర్షిక చెప్పమని నన్ను అడిగారు. ఆరాధ్యులకైతే శివసాయుజ్యం, శివైక్యం సరిపోతుంది. కాని శంకరాచార్యులు అద్వైతి. అందుచేత “కంచి పరమాచార్య అద్వైతసిద్ధి అని పెట్టమన్నాను. ఉదయం సంపాదకులకు నచ్చింది. అలాగే పెట్టారు. విజ్ఞుల ప్రశంసలు అందుకున్నారు. పత్రికలలో అర్ధవంతమైన శీర్షికలపై కసిరెడ్డి వెంకటరెడ్డి ఒక పుస్తకమే వ్రాశారు.

1957లో మరో రెండు మహత్తరమైన సంఘటనలు జరిగాయి. ఒకటి భారత కమ్యూనిస్టు పార్టీ అమృత్‌సర్‌ మహాసభ. అంతవరకు తుపాకి గొట్టం ద్వారానే విప్లవం సాధ్యమని నమ్మిన ఆ పార్టీ, పోరాట మార్దాన్ని వదిలి ప్రజాస్వామ్యమార్డాన్ని చేపడుతున్నట్టు ఆ మహాసభలో ప్రకటించింది. దీన్ని నేను వార్త విలువను బట్టి ఎనిమిది కాలాల నిడివి పతాక శీర్షిక ఇచ్చి ప్రముఖంగా ప్రచురించాను. మర్నాడు ఎడిటరు అసమ్మతిని తెలిపారు. మన పత్రిక కమ్యూనిస్టు పార్టీని బూస్ట్‌ అప్‌ చేయడానికి కాదన్నారు. నేను దీన్ని పార్టీకి అతీతంగా కేవలం దేశరాజకీయరంగంలో గుణాత్మకమైన మార్పులకు దారి తీసే నిర్ణయమని భావించి అంత ్రాధాన్యమిచ్చానని సంజాయిషీ ఇచ్చుకున్నాను. ఆయన మిన్నకున్నారు. అదే సంవత్సరం అక్టోబర్‌ 4వ తేదీన సోవియెట్‌ యూనియన్‌ మానవనిర్మిత ఉపగ్రహం 'స్ఫుత్నిక్‌ను విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రకృతిపై మానవవిజయయాత్రలో ఇది సువర్దాక్షరాలతో లిఖించదగిన అంశం. దీనికీ వార్త విలువను బట్టి మేము ఎనిమిది కాలాల నిడివిదే కాక, మామూలుగా ఆ శీర్చికకు వాడే సైజుకంటే పెద్ద అక్షరాల శీర్షిక ఇచ్చి ప్రచురించాము. అన్ని భాషల పత్రికలూ ఈ వార్తకు అంతే ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి. గోలకొండ పటత్రికలో మాత్రమే పత్రిక పేరు పక్కన ఉండే ఇయర్‌ ప్యానల్‌ గడిలో వేశారు. మామూలుగా అక్కడ చందా రేట్లు వేస్తుంటారు. కనుక దాన్నెవరూ పట్టించుకోరు. దాని వల్ల వార్త ప్రాధాన్యం మరుగున పడిపోయింది. ఇవాళ ప్రపంచం ఒక పల్లెగా జ్ఞాపకాల వరద 141

మారిందంటున్నాము. ఆ ప్రస్థానంలో స్ఫుత్నిక్‌ ప్రయోగం తాలి ముందడుగు. ఉపగ్రహహ్రసార వ్యవస్థ ఇవాళ మన జీవనవిధానాన్నే మార్చివేసింది. ఇనుపకెర చాటున భద్రంగా ఉన్న కమ్యూనిస్టు వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి ప్రధానంగా కారణభూతమైంది. ప(త్రికారచనను సమకాలీన చరిత్రరచన అని కూడా అంటారు. కనుక సంఘటనలకు అక్షరరూపం ఇవ్వడమేగాక, వాటి ప్రాముఖ్యం కూడా బోధపడేటట్టు ప్రచురించడం అవసరమవుతుంది. 1957లో నేను ఉస్మానియా లా కాలేజీలో ఎల్‌ఎల్‌.బి. లో చేరాను. బొగ్గుల కుంటలో ఉన్న చాదర్‌ ఘాట్‌ కాలేజీలో ఉదయం ఎనిమిది గంటలనుండి 11 గంటల వరకు తరగతులు జరుగుతుండేవి. రాత్రి డ్యూటీ రోజులలో ఇబ్బందే లేదు. పగలు డ్యూటీ ఉన్నపుడు చివరి పీరియడ్‌ మానేసేవాణ్ణి. అయినా లా కోర్సులో చేరడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఎడిటరుకు దరఖాస్తు పెట్టుకున్నాను. డ్యూటీకి అడ్డం రానప్పుడు చదువుకోడానికి అభ్యంతరమేమిటి చేరిపొమ్మన్నారు. జర్నలిస్టుకు లా తెలిస్తే మంచిదేనన్నారు. యుద్ధవీర్‌కు కూడా ఈ సంగతి తెలుసు. ఏవైనా లా సంబంధమైన చర్చవస్తే “నౌజవాన్‌ తుమ్‌ బోలో” అనేవారు. “బిస్మిల్లా దగ్గరే ఉన్నాను. ఇప్పుడే ఏం చెబుతా” ననేవాణ్జి సరదాగా. ఇక్కడొక విషయం చెప్పాలి. ఈ లా కాలేజి పనివేళలు హిందూ ప్రికవారికి బాగా కలిసి వచ్చాయి. మద్రాసులో వారికిలేని సౌకర్యం ఇది. వారు కొన్నేళ్లపాటు లా చదువుకోదలచిన విలేఖరిని హైదరాబాదుకు బదిలీచేసి చదువుకునే అవకాశం కల్పిస్తూవచ్చారు. కొన్నేళ్లు సుప్రీం కోర్టులో వారి న్యాయ విలేఖరులుగా ఉస్మానియా న్యాయపట్టభద్రులే ఉండేవారు.

  • ఈ సమయంలో ఆంధ్రపత్రికలో పనిచేసి రిటైరైన సుబ్బయ్య జనతలో చేరారు. సుబ్బయ్యకు బండచెముడు. ఆయనతో మాట్లాడాలంటే కాగితం మీద వ్రాసి చేతికి ఇవ్వాలి. ఆయన చదివి సమాధానం చెప్పేవారు. ఇచ్చిన వార్తను (శ్రద్ధగా వ్రాసేవారు. ఎవరితో మాట్లాడే అవకాశం లేదు గనుక పని చేస్తూనే ఉందేవారు. ఐతే పగటి గాంధీ భవన్‌ వెనుకవైపు షెద్డువేసి దానిలో పెట్టారు. ఎడిటోరియల్‌ విభాగం గాంధీ భవనంలోకి మారింది. డిసెంబరు నెలలో పొత్తూరి వెంకటేశ్వరరావు వచ్చి చేరారు. నేను పగటి డ్యూటీలో ఉండగా మేనేజరు సత్యనారాయణ వెంటవచ్చి, వల్లూరి వెంకటేశ్వర్లు గారి బావమరది అని పరిచయం చేశారు. వెంకటేశ్వర్లుగారు వి.లి. రాజుగారి అన్న గొప్ప లాయరు. మాకు లా కాలేజీలో సివిల్‌ ప్రాసీజరు కోడ్‌ చెపుతుండేవారు. సంస్కృత పండితులు. సంస్కృతంలో “ధాతుప్రక్రియ' అనే గ్రంథం శేశ2 జి.యస్‌. వరదాచారి

వ్రాశారు. పొత్తూరి గుంటూరులో డిగీ చదివాడు. తాలింఖానాలో కసరత్తుకూడా చేసి కండపుష్టి సంపాదించాడు. పెళ్లి అయింది. నా ఈడువాడు. కనుక దగ్గరయాడు. జర్నలిజంలో రాణించాలనే కుతూహలం కలవాడు. చేరినరోజున డేట్‌ లైను వ్రాయడం కూడా తెలియదు. కాని నేర్చుకోవాలన్న పట్టుదల ఉండేది. నాకేమో అధ్యాపకుడిలాగా విడమర్చి చెప్పడం అలవాటు. అజంతా ఈ విషయం గమనించారు. “ఏమిటి ఆయనకు అంత (శ్రద్ధగా చెపుతున్నారు? రేపు మన నెత్తిన ఎడిటరై కూర్చుంటాడన్నారు. “నేర్చుకోవాలనుకున్న వాడికి మనం చెప్పకపోతే మానేస్తాడా? ఇంకో చోట నేర్చుకుంటాడు” అని నేను సమాధానం చెప్పాను. అజంతా అన్నట్టే పొత్తూరి రాజుగారి పత్రికలో కాదు గాని ఆంధ్రప్రభలో అజంతా చీఫ్‌ సబ్‌ ఎడిటరుగా పని చేస్తుండగా, ఎడిటరై కూర్చున్నాడు. పొత్తూరి ఎప్పుడూ నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. నేను ఎప్పుడూ ఆయన మంచిని కోరుకుంటూ ఉండేవాడిని.

ముగ్గురం విద్యార్థులమే!

1958 జూన్‌లో మా రెండవ తమ్ముడు గోవర్ధన రంగాచారి పదవ తరగతి రెండవ గ్రేణిలో ఉత్తీర్ణుడై పైచదువుల కోసం హైదరాబాద్‌ వచ్చాడు. వాడికి సిటీ కాలేజీలో పి.యు.సిలో గవర్నమెంటు పాలీటెక్సిక్‌లో ఎల్‌. ఎం.ఇలో రెండు చోట్లా సీటు వచ్చింది. ఇంజనీరింగ్‌ డిప్లామా చదివినవారికి తర్వాత బి.ఇ. లో ప్రవేశార్హత ఉంటుందని అప్పుడు ప్రచారంలో ఉండేది. నేరుగా ఇంజనీరింగ్‌ సీటుకోసం పదేపోటీ కంటే డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్‌ సీటు సంపాదించడం సులభమని అనుకున్నాము. అతను పాలీటెక్నిక్‌లో చేరాడు. అప్పుడది సచివాలయం వెనుక భాగంలో ఉన్న మింట్‌ కంపౌండులో ఉండేది. మా పెద తమ్ముడు రమణాచారి పి.పి.సి. కూడా ఫస్టు క్లాసులో ప్యాసైనా ఆ సంవత్సరం ఎం.బి.బి.యస్‌. లో సీటు రాలేదు. ఆ రోజులలో ఎంసెట్‌ టెస్టులు లేవు. పి.పి.సి. ర్యాంకును బట్టి సీటు ఇచ్చేవారు. అతను వెటర్నరీ సైన్స్‌ డిగ్రీ బి.వి.ఎస్‌సి. లో అంటే పశువైద్యం కోర్సులో చేరాడు. మరుసటి సంవత్సరం మళ్లీ ఎం.బి.బి.యస్‌. లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. ఎంట్రెన్స్‌ పరీక్ష అయితే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వ్రాసుకోవాలి. కనీసార్టత పరీక్ష మార్కులను బట్టి ఇచ్చే ప్రవేశాలకు ఎన్ని సార్లయినా దరఖాస్తు పెట్టుకోవచ్చు. కొత్త విద్యార్థులు కూడా వస్తారు కనుక పోటీ తీవ్రంగా ఉంటుంది. అయినా ప్రయత్నించి చూద్దామని దరఖాస్తు పెట్టుకుంటే రమణకు సీటు వచ్చింది. అతను ఎం.బి.బి.ఎస్‌. లో చేరాడు. ఒక సంవత్సరం వెటర్నరీ సైన్సులో వ్యర్థమైంది. జ్ఞాపకాల వరద కేశ3

నా ఎల్‌ఎల్‌.బి మొదటి సంవత్సరం కూడా అదే సంవత్సరం పూర్తయింది. పరీక్ష (వ్రాయాలి. వారం రోజులు సెలవు ఇమ్మని ఎడిటరుకు దరఖాస్తు పెట్టుకున్నాను. ఎడిటరు సెలవు ఇవ్వకపోగా అనుమతి లేకుందా ఇలా కోర్సులో చేరడం తప్పన్నారు. నేను దరఖాస్తు ఇచ్చిన విషయం, దానికేం భాగ్యం చేరుమని ఎడిటరు అన్నవిషయం గుర్తుచేసి, పరీక్షకు అడ్డుచెప్పడం అన్యాయమన్నాను. ఆఫీసులో జనం లేని మాట నిజమే, కాని పరీక్ష వ్రాయకపోతే ఏడాది వ్యర్ధ్థమవడమే గాక చదువే గందరగోళంలో పడుతుంది. రాత్రి డ్యూటీ చేసి పగలు పరీక్ష వ్రాసుకోడానికి అనుమతించాలన్నాను. అందుకు సమ్మతించారు. మొదటి సంవత్సరం ఎల్‌ఎల్‌. బి. పరీక్ష అలా వ్రాశాను. రెండవ సంవత్సరం ఎల్‌ఎల్‌. బి. పరీక్ష 1959 ఏప్రిల్‌లో వ్రాశాను. అప్పటికి సిబ్బంది కౌరత తీరినందున సెలవు సమస్య ఎదురుకాలేదు. కాని పరీక్షకు మూడు నాలుగు రోజులముందు తీవ్రమైన మలేరియా జ్వరం వచ్చింది. మా బంధువు వెంకటాచారి ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ఇంటర్‌లో, డిగ్రీలో నా క్లాసుమేటుగా ఉన్న నా మిత్రుడు నరసింహారెడ్డి, లా కాలేజీలో మళ్లీ నా క్లాసుమేటు. విషయం తెలిసి చూడటానికి ఆస్పత్రికి వచ్చాడు. జ్వరతీవ్రత ఇంకా తగ్గలేదు. “మరెట్లా? పరీక్ష రాస్తావా అని అడిగాడు. ఆ రోజు శనివారం. “డిస్బార్డి చెయ్యుమని రేపు డాక్టరును అడుగుతా. ఫైనల్‌ పరీక్షలు మధ్యాహ్నపూట ఉన్నాయి గనుక పొద్దున రెండు మూడు గంటలు చదువుకునే అవకాశం ఉంటుంది. కనుక పరీక్ష వ్రాస్తాానన్నాను. రెడ్డికి స్వంత కారు ఉండేది. “కారు తీసుకొని వస్తా. కలిసిపోదాం. ఓపిక ఉన్నంతవరకు రాయి. చేతగాకపోతే వచ్చి కారులో పడుకో” అన్నాడు. ఆదివారం పొద్దున డాక్టరు ఎన్‌.ఆర్‌.వి. స్వామి రౌండుకు వచ్చినప్పుడు అడిగితే “నార్మల్‌కు రాలేదు, పైగా జర్నలిస్టువి. డిస్పార్డి చేయొనన్నారు. సాయంకాలానికల్లా మలేరియా పేషెంట్లు కూములుగా వచ్చిపడ్డారు. మంచాల గొడవ మొదలైంది. అప్పుడు మళ్లీ డాక్టరును అడిగితే “రెస్టు తీసుకుంటానంటే డిస్పార్జి చేస్తానన్నారు. అలాగేనని బయటపడ్డాను. ఇంటికి వెళ్లాక రెడ్డికి ఫోను చేశాను. ఆయన అన్న ప్రకారం రోజూ కారుతీసుకుని మా ఇంటికి వచ్చాడు. కలిసివెళ్లాం. పరీక్ష వ్రాశాం. రెండవ శ్రేణిలో ఉత్తీర్ణులమయ్యాం. నాకు 56 శాతం మార్భులు వచ్చాయి.

నలుగురం అయ్యాం గనుక బడీ చావుడీ వెనుక భాగంలోనే మూడుగదుల ఇల్లు తీసుకున్నాము. వంటగది, పడక గది బాగానే ఉండేవికాని తమ్ముళ్లకు, అతిథులు వస్తే వాడుకోడానికి, ముందు గది కొంచెం ఇరుకుగా ఉండేది. దానిలోనే వాయవ్య దిశలో స్నానశాచాలయం ఉండేది. ఇంటి యజమానురాలు జగదంబ ఒకరై పై 144 జి.యస్‌. వరదాచారి

అంతస్తులో ఉండేది. మార్కెట్‌ దగ్గర. మోతీ సింగ్‌ గల్లీలోనుంచి పోతే కృష్ణదేవ రాయ భాషానిలయం కూడా దగ్గర. మా చిన్న తమ్ముడు పుస్తకప్రియుడు. అతను పుస్తకాలు తెచ్చేవాడు. నా భార్య కూడా చదివేది. చాలా చదివారు. నాకు వారం వారం నైట్‌ డ్యూటీలు కాక, చాలా డబుల్‌ డ్యూటీలు పడుతుండేవి. ఇద్దరు తమ్ముళ్లు ఉండటం ఎంతో సహాయకారిగా ఉందేది. సంపాదకీయాలు వ్రాసే అవకాశం

1959లో జర్నలిస్టులకు వేతన ట్రిబ్యునల్‌ సిఫార్సు చేసిన వేతన స్మేళ్లు అమలయ్యాయి. జీతాలు ఆ నాటి పరిస్థితిలో సంళృ ప్తికరకమనదగినట్టుగా పెరిగాయి. పత్రికల వర్గీకరణ, ఉద్యోగుల వర్గీకరణ ప్రాతిపదికగా అది జరిగింది. పత్రిక సంపాదకీయ విభాగంలో భిన్నస్థాయులలో పనిచేసే ఉద్యోగుల పేర్లు, వారి విధులు ఏమిటో కూడా ఇచ్చారు. చిన్నఉద్యోగికి ఇచ్చే జీతమిస్తూ, పెద్ద ఉద్యోగి చేయవలసిన పనిని చేయించుకోకుండా నిరోధించడానికి ఈ ప్రయత్నం జరిగింది. మా పత్రికలోనే ఎడిటరు ' తరచుగా సెలవులో వెళ్తుందేవారు. అప్పుడు సంపాదకీయాలు ఎవరు వ్రాయాలి? సీనియారిటీని బట్టయితే అజంతా ఆ పని చేయాలి. కాని “నాక్రీ లంపటం వద్దు” అని ఖండితంగా చెప్పేశారు. ఆయన నన్ను అడిగారు. నేను దాన్ని నాకు లభించిన అవకాశంగా భావించి సరేనన్నాను. చాలా ఎడిటోరియళ్లు వ్రాశాను. వివాదాస్పదం కాని జాతీయ, అంతర్జాతీయసమస్యలను తీసుకునేవాణ్ణి. ఒకసారి కాంగ్రెసులో ఎ.సి. సుబ్బారెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎడిటరు సెలవులో వెళ్లిపోయారు. రాష్ట్రదాజకీయాల జోలికి పోకండి అని చెప్పిపోయారు. రాజుగారు మంత్రి అయినప్పటినుండి, జనార్దనరావు దేశాయి జనత మేనేజింగ్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆఫీసు గాంధీ భవన్‌లోనే, మా ఆఫీసు గాంధీభవన్‌లోనే. రాజకీయ రచ్చ జరుగుతున్నదీ గాంధీ భవన్‌లోనే. పత్రికలో సంపాదకీయం రాదే. ఆయన (ట్రస్టు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న బి.ఎస్‌. రావును పిలిచి విషయమేమిటో కనుక్కొమ్మన్నారు. బి.ఎస్‌. రావు ఒకనాటి జర్నలిస్టే. నిజాం జమానాలో మందుముల నర్సింగరావు నడిపిన రయ్యత్‌ ఉర్జూ దినపత్రికలో సహాయసంపాదకుడుగా పని చేశారు. పాతవాసనల బట్టి ఆయన జర్నలిస్టులతో స్నేహంగా ఉండేవారు. ఎడిటరు లేరని తెలుసుకొని నా దగ్గరికి వచ్చి, సంపాదకీయాలు ఎవరు వ్రాస్తున్నారని అడిగారు. నేనే వ్రాస్తున్నానని చెప్పాను. పక్కనే ఇంత గొడవ జరుగుతుంటే దానిమీద వ్యాఖ్యలేదే మన్నారు. ఎడిటరు చెప్పిన జాగ్రత్త గురించి తెలిపి, మన పత్రిక విధానమేమిటో జ్ఞాపకాల వరద కేశీర్‌

నాకు తెలియకపోవడం కారణమని చెప్పాను. ఆయన నన్ను వెంటపెట్టుకు వెళ్లారు. దేశాయ్‌గారు ఏం వ్రాయాలో రెండు ముక్కలలో చెప్పారు. నేనునా శైలిలో దాన్ని అక్షరరూపంలో పెట్టాను. కంపోజు అయ్యాక ్రూఫు తీసి దేశాయ్‌గారికి ఇచ్చాను. బాగుంది అన్నారు. అలా ఓ కొరత తీరింది. నాకు అయోధ్య రామకవి వ్యాఖ్య ఒకటి గుర్తుకు వస్తున్నది. “సంపాదకీయాలు వ్రాయి, వ్యాసాలు వ్రాయి, కథలు వ్రాయి అంటున్నారంటే నిన్ను ప్రోత్సహిస్తున్నారనుకుంటున్నావేమో! నిన్ను వాడుకుంటున్నారని తెలుసుకో” అన్నారాయన. వారెందుకు చేసినా వాటి ఫలితంగానే మన పనితనానికి అక్షరసాొక్ష్యాలు మిగిలాయి అన్నది నా సమాధానం. ఉద్యోగుల వోదాల విభజన గురించి చెపుతూ శాఖాచంక్రమణం చేశాను. వేజ్‌ బోర్డు నివేదికలో చేర్చిన నిర్వచనాల ప్రకారం సహాయ సంపాదకులు అంటే సంపాదకీయాలు వ్రాసేవారు, న్యూస్‌ ఎడిటర్లు రెండవ శ్రేణి ఉద్యోగులవుతారు. సబ్‌ ఎడిటర్లు, విలేఖరులు మూడవ శ్రేణి, ప్రూఫు రీడర్లు నాలుగవ శ్రేణికి చెందుకారు. ఏ శ్రేణికి వర్తించే జీతాలు వారికి ఇవ్వాలి. అందుచేత పత్రికలో ఒక సహాయ సంపాదకుడి పదవి సృష్టించాలని, సబ్‌ ఎడిటర్లలో అందరికంటే సీనియర్‌ వ్యక్తికి ఆ పదవి ఇవ్వాలని ఒక మహజరు తయారు చేసి, అందరి సంతక్షాలు తీసుకుని ఎడిటరుకు ఇచ్చాను. అజంతా కోరకున్నా నేనే చారవ తీసుకుని ఈ పని చేశాను. “ఎవరి కోసమో నీ పైరవీ ఏమిటయ్యా!” అని పొత్తూరి అన్నారు. “అజంకాకు లభిస్తుందంటే ఎడిటరు వ్యతిరేకించరు. పదవి అనేది ఒకటుంటే రేపు ఎవరికైనా లభించవచ్చు” అని చెప్పాను. నేను అన్నట్టే ఎడిటరు చొరవతో అజంతా అసిస్టెంట్‌ ఎడిటరు అయ్యారు. కొద్ది రోజులకే అంటే 1960 జూన్‌లో ఆంధ్రప్రభలో ఉద్యోగం వచ్చి వెళ్లిపోయారు. అప్పుడు నేనే సీనియరును గనుక నాకా పదవిరావాలని దరఖాస్తు పెట్టుకున్నాను. ఊహించినట్టుగానే ఎడిటరు పేచీ పెట్టారు. “ఇది ప్రమోషనల్‌ పోస్టు కాదు, మెరిట్‌ను బట్టి ఇచ్చౌదన్నారు. “అలాగైతే పరీక్ష పెట్టండి” అని అడిగాను. ఇదంతా దేశాయి గారికి తెలిసింది. నన్ను పిలిపించారు. “పరీక్ష పెట్టమన్నావు. పేపరు దిద్దేదెవరు?” అని అడిగారు. “ఎడిటరే” అన్న నా సమాధానం విని చకితులయ్యారు. “ఆయనే కదా నీకు ఇవ్వడానికి అభ్యంతరం చెప్పింది! ఆయన దిద్దితే న్యాయం జరుగుతుందా?” అన్నారు. “లిఖితపరీక్షలో మార్కులు అన్యాయంగా వేస్తే పక్షపాతం అక్షరాలా బయటపడుతుంది గనుక ఎవరూ అట్లా చేయడానికి సాహసించోరన్నాను. ఆయన నవ్వి “సరే వెళ్లొమన్నారు. ఎడిటరుతో ఏమి మాట్లాడారో తెలియదుగాని, 146 జి.యస్‌. వరదాచారి

మూడవ రోజున అంటే 1960 ఆగస్టు 4వ తేదీన ఎడిటర్‌ నాకు ప్రమోషన్‌ ఉత్తర్వు అందజేశారు. అదీ అజంతా వెళ్లిపోయిన నాటినుండి అమలుచేస్తూ. వృత్తికుశలతే రక్ష!

1957 మార్చిలో ఆంధ్ర, హైదరాబాద్‌ జర్నలిస్టుల సంఘాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఏర్పాటైంది. నేను సభ్యుడుగా చేరాను. అప్పుడు కేంద్ర స్థాయిలో వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య ఒకటే ఉండేది. దానికి అనుబంధంగా రాష్ట్రంలో ఒకే యూనియన్‌ ఉండేది. సమాఖ్య స్థాపకాధ్యక్షులుగా మానికొండ చలపతి రావు ఉండేవారు. ఆయన చొరవతోనే 1952లో మొదటి ప్రెస్‌ కమిషన్‌ ఏర్పాటైంది. జర్నలిస్టుల పాలిట కల్పవృక్షంగా భావించబడే నివేదికను అందించింది. ఫలితంగా జర్నలిస్టుల ఉద్యోగస్థితిగతులను క్రమబద్ధీకరించే 1955 వర్కింగ్‌ జర్చలిస్టుల చట్టం వచ్చింది. దాని ఆధారంగానే జర్నలిస్టుల మొదటి వేజ్‌ బోర్డు ఏర్పాటై, వేతన స్మేళ్లను ప్రకటించింది. చెల్లించే స్తోమతను పరిగణనలోకి తీసుకోలేదని అభ్యంతరం లేవదీసి యాజమాన్యాలు సుప్రీం కోర్టువేత కొట్టివేయించాయి. అయినా సంఘశక్తి వేజ్‌ ట్రిబ్యునల్‌ ద్వారా 1959లో వేతనవృద్ధిని సాధించగలిగింది. జర్నలిజం మేధా సంబంధమైన వృత్తి. కనుక సమష్టిప్రయోజనాలు సాధించుకోవడానికి సంఘమున్నా వృత్తికుశలతను పెంచుకోవలసిన అవసరాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అఆ అంశానికి నియమావళిలో అ(గ్రస్థానమిచ్చింది. ఢిల్లీలో చంచల్‌ సర్కార్‌ నిర్వహిస్తున్న ఫెస్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో, జర్నలిస్టులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తుండేది. జర్నలిస్టుకు అతని నిర్దుష్టమైన పని తీరే ఉత్తమరక్షణ అని నేనెప్పుడూ సహచరులతో అంటూ ఉండేవాడిని. యూనియన్‌లో అన్నిరకాల పదవులు నిర్వహించిన అనుభవం తర్వాత కూడా నా అభిప్రాయమదే.

వేజ్‌ ట్రిబ్యునల్‌ సిఫార్సులను కూడా గోయెంకా వ్యతిరేకించారు. మద్రాసు ఎక్స్‌థ్రైస్‌ గ్రూపులో సమ్మె జరిగింది. ఆంధ్రప్రభ ఎడిటరు నార్ల వెంకటేశ్వరరావు కూడా సంపాదక సిబ్బందితో పాటు సమ్మెచేశారు. గోయెంకా గొలుసు పత్రికలు నడుపుతుండేవారు. చిత్తూరులో ఒక యూనిట్‌ పెట్టి గండూరి కృష్ణ ఎడిటర్‌గా ప్రభ ప్రచురణ (ప్రారంభించారు. 1960లో కె.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌, తదితర ప్రముఖులు కలిసి నార్ల సంపాదకుడుగా విజయవాడ నుంచి తెలుగు దినపత్రిక ప్రారంభించడానికి నిర్ణయించారు. ఆంధ్రజ్యోతి అనే పేరును, జులై ఒకటి విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ విషయం తెలియగానే గోయెంకా హుటాహుటిన విజయవాడలో జ్ఞాపకాల వరద [త్త

ఒక రోటరీ యూనిట్‌ పెట్టి తనకు అందుబాటులో ఉన్న జర్నలిస్టు వి.డి. ప్రసాదరావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ ప్రచురణ ప్రారంభించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌ నుంచి దక్కన్‌ క్రానికల్‌ ఆంగ్ల దినపథ్రిక ప్రచురణకర్తలైన మొదలియారు సోదరులు ఆంధ్రభూమి అనే తెలుగు దిన పత్రికను నడపదలచారు. 1988 నుంచి కానికల్‌ను నడుపుతున్న మొదలియార్లు 'తెలంగాణ' అనే పేరుతో తెలుగు పత్రికను కూడా నిజాం పాలనలో కొంతకాలం నడిపారు. అప్పుడు ఉర్దూ రాజ్యమేలుతున్నందున తెలుగు పత్రిక లాభసాటి కాదని మూసేశారు. ఇప్పుడు విశాల తెలుగు రాష్ట్రం వర్చడినందున రాజధాని నుంచి తెలుగు పత్రిక వెలువరిస్తే లాభసాటిగా ఉంటుందని ముందుకు వచ్చారు. ఆంధ్రపత్రిక నుంచి బయటకువచ్చి హైదరాబాద్‌లో సంజయ అనే వారపత్రికను నడుపుతూ కష్టపడుతున్న పండితారాధ్యుల నాగేశ్వరరావును సంపాదకుడుగా పెట్టుకున్నారు. విజయవాడలో కమ్యూనిస్టు పార్టీ పత్రిక విశాలాంధ్ర అప్పటికే ఉంది. ఆ విధంగా విజయవాడ 1960లో తెలుగు దినపత్రికల ప్రధాన ప్రచురణ కేంద్రంగా రూపొందింది.

ఈ వికాసదశలో ఆంధ్రజనతలో కొత్త సంపాదక సిబ్బంది పలువురు చేరారు. కాజ రాధాకృష్ణశాస్త్ర, ఆయన కృష్ణభక్తులు. అప్పటికే కృష్ణలీలాతరంగిణి అని బాలకృష్ణుని కథల పుస్తకం వ్రాశారు. ఒకరోజు గాంధీభవన్‌ నదవలో వస్తుండగా “హే కృష్ణా? అంటూ అరిచి మోకాళ్ల మీద కూర్చొని, నా కాళ్లను వాటేసుకొని కృష్ణా కృష్ణా అంటూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. పొత్తూరి, తదితరులు రిక్షాలో ఆయనను ఇంటికి చేర్చి వచ్చారు. తర్వాతి కాలంలో ఆయన సన్యాసం పుచ్చుకొని కృష్ణ దాస్‌జీ మహారాజ్‌గా శ్రీమద్‌ భాగవత సేవాసమాజం పేరిట చాలా (గ్రంథాలు ప్రచురించారు. ఎయల్‌. నరసింహారావు ఎం.ఎన్‌. రాయ్‌ అభిమాని. రాష్ట్రరాయిస్టు సొసైటీ కార్యదర్శి సున్నప్పంతులు అనే ముద్దు పేరుగల కోన లక్ష్మీనరసింహారావు ఎన్‌.జి. రంగా గారి వాపొనిలో పండితారాధ్యులవారితో కలిసి పనిచేశారు. బుద్ధవరపు విశ్వేశ్వరరావు, ఈయన క్రొవ్విడి లింగరాజుగారి దగ్గర శిష్యుడు. అందరూ వయసులో నాకంటే పెద్దవారే. నాకంటే ముందు నుంచి జర్నలిజంలో ఉన్నవారే. నన్ను అభిమానించేవారే.

సిబ్బంది సమకూరడంతో పత్రిక సర్కులేషన్‌ ఏడెనిమిది వేలకు పెరిగింది. పొద్దున ఆరుగంటలకల్లా పత్రిక మార్కెట్‌లో ఉండాలంటే రాత్రి పది గంటలకే వ్రాతవని, మేకప్‌ పూర్తిచేయవలసిన స్థితి వచ్చింది. సామాన్యంగా రాత్రి ఒంటిగంటవరకు వచ్చే వార్తలను మర్నాటి పత్రికలో అమర్చుతాము. ఆ అంతిమ గడువును ఇంగ్లీషులో డెడ్‌ లైన్‌ అంటాము. డెడ్‌ లైనును వెనకకు జరుపవలసిన అవసరం లేకుండా ముద్రణ 148 జి.యస్‌. వరదాచారి

సమయాన్ని తగ్గించాలంటే ఆటోమేటిక్‌ యంత్రం సమకూర్చుకోవడం ఒక్కటే మార్గం. ఆ అవకాశం కనపడటం లేదు. కనుక అందరి దృష్టి రోటరీ యంత్ర సౌకర్యమున్న దక్కన్‌ క్రానికల్‌ వారు తీసుకురాబోతున్న ఆంధ్రభూమిపైకి మళ్లింది. సున్నప్పంతులు పండితారాధ్యులవారితో తనకున్న పాతపరిచయంతో అందరికీ అక్కడ అవకాశం కల్పిస్తానని ఊరిస్తుండేవాడు. అందరం దరఖాస్తులైతే పెట్టుకున్నాం. ఎ.యల్‌., సున్నప్పంతులు, విశ్వేశ్వరరావు వెళ్లి చేరిపోయారు. బయటివారు పోలవరపు శ్రీహరిరావు, తదితరులు కూడా చేరారు. నేను న్యూస్‌ ఎడిటరు పదవి అడిగాను. తన తర్వాతి స్థానంలో ఆంధ్రపత్రికలో తనతో పనిచేసిన సూరంపూడి సీతారామ్‌ను తీసుకోవాలని పండితారాధ్యులవారి కోరిక. ఆయన రాలేదు. పత్రిక విడుదల ముహూర్తం దసరా వచ్చేసింది. క్రానికల్‌ ఆవరణలో ముఖ్యమంత్రి పత్రికను ప్రారంభించారు. ఇంటర్వ్యూలు - తీరుతెన్నులు

ఆంధ్రజనత ఆఫీసు గాంధీ భవన్‌లో ఉన్నప్పుడు సరిగ్గా దానికి ఎదురుగా సమాచార శాఖ డైరెక్టరు ఆఫీసు ఉందేది. నర్సింగ్‌రావు మాన్వీ డైరెక్టరుగా ఉండేవారు. డి. రామలింగం అనే అతను ఏదో సీనియర్‌ పోస్టులోనే దానిలో పనిచేస్తుందేవారు. ట్రాన్స్‌లేషను డిపార్ట్‌మెంట్‌ పక్కసందులో ఉండేది. బోయి భీమన్న డైరెక్టరు. అంతా మైసూరు కేఫ్‌ వద్ద బస్సుదిగి ఆ పక్క సందులోంచి నడిచి ఆఫీసులకు చేరేవారము. అలా వారు పరిచయమయ్యారు. అప్పటికి నాకు తెలియని ఉద్యోగార్థులు తెలుసు కోవలసిన విషయమొకటి రామలింగం నాకు చెప్పారు. అదేమిటంటే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వారి ఉద్యోగప్రకటనలు ప్రతి శనివారం పత్రికలలో వస్తాయని. ఇప్పుడూ అలాగే వస్తాయనుకొండి. వాటిని గమనిస్తూ ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. నేను ప్రభుత్వ ఉద్యోగం పట్ల నాకు ఆసక్తి లేదన్నాను. లేకున్నా మనం వాటిని గమనిస్తూ ఉంటే మరొక రకంగా ప్రయోజనం పొందవచ్చునన్నారు. వారు రెండు రకాల అర్హతలు కోరుతారు. వాటిలో ఎస్సెన్నియల్‌ అంటే తప్పనిసరిగా ఉండవలసినవి, డిజైరబుల్‌ అంటే అదనపుయోగ్యతగా పరిగణించేవి అని ఉంటాయి వాటిలో మొదటి రకంవి అన్నీ ఉండి, రెండవ రకంవి ఒకటి రెండు ఉంటే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూకు పిలుపు వస్తుంది. మనం పెద్ద ఉద్యోగాలకే దరఖాస్తు చేస్తాం గనుక రాను పోను ఫస్టు క్లాసు రైలు చార్జీలు, డి.ఎ. ఇస్తారు. ఉద్యోగం దొరికినచ్చితే చేరవచ్చు. లేకపోతే డిల్లీ చూచి రావచ్చు అని ఆశ జ్ఞాపకాల వరద 149

చూపారు. అంతటితో ఆగలేదు. మరుసటి వారమే భారతీయ వ్యవసాయ పరిశోధనమండలిలో తెలుగు వ్యవసాయపత్రిక సంపాదకపదవి కోసం దరఖాస్తులు కోరుతూ వచ్చిన ప్రకటన చూపించారు. “నేను దరఖాస్తు పెడుతున్నాను. నువ్వూ పెట్టు” అన్నారు. కలిసి వెళ్లివద్దాం అన్నారు. ఇంటర్వ్యూకు ఇద్దరికీ కాల్‌ వచ్చింది. ఆయనే ఢిల్లీలో వరంగల్‌ ఎం.పి. ఇటిక్యాల మధుసూదనరావు నివాసంలో ఉండటానికి ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూ 1959 అక్టోబరు 28 నాడు జరిగింది. పదిమంది దాకా అభ్యర్థులు వచ్చారు. నన్ను ఎరిగినవారు ఇద్దరున్నారు. శ్యామలరావు అనే అతను “హయ్యెస్ట్‌ క్వాలిఫికేషన్స్‌, డెయిలీలో ఎక్స్‌పీరియెన్స్‌, అనుమానమేముంది ఉద్యోగం నీదే” అన్నాడు. కాని అప్పటికే ఆ ఉద్యోగం రామలింగానికి రిజర్వ్‌ అయిపోయిందని నాకు తెలును. క్రితం రోజు రామలింగం కేంద్ర సమాచారశాఖ మంత్రిగా ఉన్న బెజవాడ గోపాలరెడ్డిని కలిసివస్తానన్నారు. నాకు అర్థమైంది. నేను వస్తానన్నాను. “మీరు ముందు మంత్రిగారిని కలిసి మాట్లాడినాక, నన్ను పిలిపించి పరిచయం చేయండి” అన్నాను. అలానే చేశారు. మంత్రిగారితో పది నిమిషాలు గడిపి వచ్చేశాం. కనుక శ్యామలరావు మాటలకు నా నవ్వే సమాధానమైంది. ప్రామాణిక తెలుగు ఒకటే యు.పి.ఎస్‌.సి చైర్మన్‌ మహాజన్‌, డి.ఎ.వి.పి అధికారులు ఇద్దరు, లాంగ్వేజి ఎక్స్‌పర్ట్‌ అంటే భాషానిపుణుడుగా కుందూరి ఈశ్వరదత్తు ఇంటర్వ్యూ కమిటీ సభ్యులు. ఈశళ్వరదత్తు ఆ రోజులలో దేశవ్యాప్తంగా ఇంగ్లీషు పత్రికారంగాన్ని ఏలుతున్న పలువురు ఆంధ్రజర్నలిస్టు ప్రముఖులలో ఒకరు. లీడర్‌, పయొనీర్‌ తదితరప్రికలలో పనిచేశారు. ప్రకాశం పంతులు నడిపిన ఆంగ్ల దినపత్రిక స్వరాజ్యలో కూడా పనిచేశారు. చైర్మన్‌ మహాజన్‌ ప్రశ్నలతో నా ఇంటర్వ్యూ మొదలైంది. ఆయన జడ్జిగా చేశారు గనుక “లా చేసి ప్రాక్టీసు ఎందుకు పెట్టుకోలే”దని అడిగారు. “ఇద్దరు తమ్ముళ్లు నా దగ్గర ఉండి చదువుకుంటున్నారు కనుక రిస్క్‌ తీసుకునే అవకాశం లే”దన్నాను. అధికారులిద్దరూ “దినపత్రికలో పని చేస్తున్నవాడిని అడిగేదేముంది?” అన్నారు. అప్పుడు భాషానిపుణుడి వంతు వచ్చింది. ఆయన ,ఇంగ్లీషులోనే ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. నేను ఇంగ్లీషులోనే సమాధానాలిభ్చాను. “ఆంధ్రజనత తెలంగాణలోనే ఎక్కువ అమ్ముడుపోయే పక్రికకదా?” అని అడిగారు. “యస్పర్‌” అని సమాధానమిచ్చాను. “అంటే మీరు తెలంగాణభాష వాడుతారన్నమాట” అన్నారు. “పత్రికాభాష ప్రామాణికమైంది వాడుకలో 1850 జి.యస్‌. వరదాచారి

ఉంది. అందరూ అదే వాడుతారు. ప్రాంతాలను బట్టి తేడాలు లే”వన్నాను. అప్పుడు 4మ్సికల్‌ ఫర్టిలైజరును తెలుగులో ఏమంటా”రని అడిగారు. నేను “రసాయనిక ఎరువు” అన్నాను. “రాఆఆఆఅఆంగ్‌!” అని గొంతుపెంచి సాగదీసి అరిచారు. “కాదండీ. నేను చెప్పింది సరైందే. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ కూడా అదే మాట వ్రాస్తున్నాయని ఖండితంగా చెప్పాను. “రైతుకు ఆ మాట అర్థమవుతుందా?” అన్నారు. “అవుతుం”దన్నాను. “నాకే కాలేదు అన్నారు. “మీరు తెలుగు దేశానికి దూరంగా ఉన్నారు. తెలుగుతో అంత సంపర్కం లేదు. కనుక మీకు అర్థం కాదులెండి” అన్నాను. అక్కడితో ఇంటర్వ్యూ ముగిసింది. ఉద్యోగం ఎలాగూ రాదని తెలుసు గనుక నేను అంత నిర్మాహమాటంగా మాట్లాడాననుకుంటున్నారు కదూ? సరికాదు. ఎవరు తప్పుచేసినా దాన్ని మర్యాద తప్పకుండానే సరిదిద్దడం నా స్వభావం. ఉద్యోగంపై ఆశ ఉన్నా అలాగే చేసేవాణ్ణి.

రామలింగానికి ఆ ఉద్యోగం వచ్చింది. కాని ఆయన చేరలేదు. తర్వాత గోపాలరెడ్డి ఆయనకు మద్రాసులో ఫిలిం సెన్సార్‌ ఆఫీసర్‌ పదవి ఇప్పించారు. దానిలో చేరి చాలా కాలం పని చేశారు. వెళ్లేముందు నాకేదో సహాయం చేయాలని ఆయన కోరిక. పంచాయత్‌రాజ్‌ శాఖవారి పత్రిక ఒకటుండదేది. దానికి ఎడిటరును సూచించమని ఆ శాఖ ఇనస్పెక్టర్‌ జనరల్‌ సింవాద్రి అడిగారట. నా పేరు సూచించారు. అప్పుడు ఆ శాఖాధిపతిని డైరెక్టరు అనిగాని, కమిషనరు అనిగాని అనేవారు కాదు. పోలీసు శాఖాధిపతి కూడా ఇనస్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసే. డి.జి.పి. లు రాలేదు. పత్రికకోసం రూల్స్‌, జీవోలు తెలుగులోకి అనువదించవలసి ఉంటుంది గనుక, లా చదివినవాడు ఉంటే బాగుంటుందని ఆయన నా వెంటపడ్డారు. జీతం నాకప్పుడు జనతలో వస్తున్నదానికి రెట్టింపుకంటే ఎక్కువ ఇవ్వజూపారు. ఐనా నన్ను అకర్షించలేదు. వచ్చినప్పుడు చూద్దాంలే అని పట్టించుకోలేదు.

సింహాద్రి ఎడిటరు పదవి మంజూరికి, దానిలో సరైన వ్యక్తి నియామకానికి అనుమతి కోరుతూ ఫైలు పంపించారు. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పదవి మంజూరుచేసి, నియామకం నేరుగా కాక పేపరు ప్రకటన ఇచ్చి ఇంటర్వ్యూ ద్వారా జరపాలని ఉత్తర్వు చేశారు. అలాగే ప్రకటించారు. నేను దరఖాస్తు పంపలేదు. అయినా ఇంటర్వ్యూకు నాకూ కాల్‌ పంపారు. ఆ రోజు వెళ్లాను. “వచ్చావు సంతోషం. సెలెక్టు చేసేది నేనేగా” అన్నారు సింహాద్రి. ఎంపికైన అభ్యర్థి పేరుతో ఫైలును ముఖ్యమంత్రి వద్దకు పంపారు. ఆయన దానిమీద అపాయింట్‌ ఊట్ల కొండయ్య జ్ఞాపకాల వరద 151

అని వ్రాసి పంపారు. అప్పటికీ సింహాద్రి ఆశ చావలేదు. ఆ పదవి పేరు ఎడిటర్‌ కమ్‌ పీఆర్వో అని ఉండేది. పని ఎక్కువగా ఉంటుంది గనుక ఆ రెండు పదవులను విడదీయడానికి అనుమతి ఇవ్వాలని మరో ప్రతిపాదన పంపారు. దాన్ని ఆమోదిస్తూనే ముఖ్యమంత్రి అపాయింట్‌ గొట్టిపాటి సుబ్బరాయలు అని ఆర్డరు వేశారు. నేను ఆశించని ప్రభుత్వోద్యోగప్రయత్నమనే ఆ ఉపాఖ్యానం అలా ముగిసింది. తర్వాత వెంగళరావు పంచాయత్‌ రాజ్‌ చేంబర్‌ అధ్యక్షులుగా ఉన్నపుడు, మా ఆంధ్రజనత పూర్వసంపాదకులు సుబ్రహ్మణ్యాన్ని ఆ పత్రిక ఎడిటరుగా వేసుకున్నారు. ఆయన కోరిక మేరకు నేను చాలా ఉత్తర్వులను, నియమాలను తెలుగులోకి అనువదించి ఇచ్చాను. '“ఆంధ్రభూమి'లో చేరిక ఆంధ్రభూమి (ప్రచురణ మొదలై ఐదు నెలలు గడిచాయి. పండితారాధ్యుల నాగేశ్వరరావు పనిరాక్షసుడని ప్రతీతి. ఆయన వార్తలు, సంపాదకీయాలు, (ప్రధాన వ్యాసాల్సు, ఫీచర్లు వ్రాయడమే కాదు. చివరకు సంపాదకలేఖలు కూడా వ్రాసేవారు. పేజీ మేకప్‌ కూడా ఆయనే చేయించేవారు. అయినా ఒంటిచేతి మీద వత్రిక ఆశించినంత నిర్జుష్టంగా రాలేదు. ఒకరోజు పొద్దున్నే క్రానికల్‌ విజయవాడ విలేఖరి, ఇర్చలిస్ట్ర యూనియన్‌ సహాయకార్యదర్భి అయిన బి.వి. రామారావు మా ఇంటికి వచ్చాడు, అప్పటికి నేను యూనియన్‌లో క్రియాశీలంగా ఉన్నాను. నా పరోక్షంలో నన్ను కార్యవర్గసభ్యుడుగా ఎన్నుకున్నారు. యోగక్షేమాలు అయింతర్వాత రామారావు “నువ్వు ఆంధ్రభూమిలో చేరుతానన్నావుట మరెందుకు చేరడం లేదు?” అని అడిగాడు. “వాళ్లకు సీలాటివాడు చాలా అవసరమయ్యా, మంచి అవకాశముంటుంది. వెంటనే చేరిమం అన్నాడు. “వారు పిలువాలేదు, ఎలాటి పత్రమూ ఇవ్వాలేదు. ఎట్లా చేరేది?” అంటే “నేను ప్రట్మక్రాస్తా” అన్నాడు. “న్యూస్‌ ఎడిటరు వదవి అడిగాను. నియామకపత్రం తీసుకురా చేరిపోతా”నన్నాను. ఆయన అలాగే అద్దరు పట్టుకుని వచ్చాడు. ఆంధ్రజనత ఎడిటరు వెంటనే రిలీవ్‌ చెయ్యమంటే, “ఎట్లా? ఇక్కడా మందిలేరు? అన్నారు. అప్పుడు నేనే పగలొక చోట, రాత్రి ఇంకోచోట పని చేయడానికి ఒప్పుకొని, ఇర్వవ్యుర్సు సంపాదకుల అంగీకారంతో 1961 మార్చి 4వ తేదీనుండి జనతలో నన్ను రిలీవ్‌ చేసిన 2క్రవతేదీ వరకు 22 రోజులు రెండు చోట్ల పనిచేశాను. చాలా ఇరకాట పరిస్థితి. కొత్తగా చేరినచోట ప్రతిభచూపక తప్పదు. వదిలి పోతున్నచోట వెళ్లేముందు చెడగొట్టాడన్న చెడ్డ కేరు తెచ్చుకోగూడదు. నేను ఉభయులనూ మెప్పించగలిగాను. ఆంధ్రభూమిలో రాత్రి డ్యూటీలో చేరాను. సుమారు పదిగంటలకు 152 జియస్‌. వరదాచారి

ఎడిటరు నన్ను పిలిచి మీరు వచ్చారు. ఇవాళ ఇంటికి వెళ్లి పదుకుంటానన్నారు. ఫోర్మన్‌ సుబ్రహ్మణ్యం వచ్చి ఎన్నో రోజుల తర్వాత సారు ఇవాళ సుఖంగా నిద్ర పోతాదన్నాడు. జనతలో నెలాఖరున నన్ను రిలీవ్‌ చేస్తూ ఇచ్చిన లేఖలో కూచిమంచివారు నా వృత్తినిబద్ధత ప్రశంసనీయమని అభినందించారు.

పండితారాధ్యులవారు ఆంధ్రపత్రిక సంపాదకవర్గంలోచాలా కాలం కీలకపదవులు నిర్వహించినందువల్ల, ఆ నాటి ఆంధ్ర రాజకీయనాయకులందరికీ సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ వచ్చి, సంజయ అనే పత్రికను నడపడం ద్వారా అఆ పరిచయాలను దృఢపరచుకున్నారు. పైగా పత్రికాస్వేచ్చ విషయంలో రాజీపడని మనస్తత్త్వం. సంపాదకీయాలు ఘాటుగానే కాక కార్యాచరణకు (పేరేపించే విధంగా వ్రాయగల సమర్భులు. ఒకనాడు నేను ఎడిటరుతో ఏదో మాట్లాడుతున్నాను. యజమానులలో ఒకరైన పట్టాభిరామ్‌ గొణుగుతూ వచ్చారు. “మీరేదో రాస్తారు. ఆ మంత్రులు మా వెంటపడుతారన్నారు. ఇవాళ్టి సంపొదకీయాన్ని గురించి ఆర్థికమంత్రి గొడవ పెడుతున్నారన్నారు. అప్పటి వరకు ఆయన నిల్చునే మాట్లాడుతున్నారు. పండితారాధ్యులవారు ఆయనను కూర్చోమని కూడా అనలేదు. ఫోను చేశారు. నేను ఫలానా అనిచెప్పి మంత్రిగారితో మాట్లాడాలన్నారు. మంత్రి లైనులోకి రాగానే “ఆంధ్రభూమికి ఒక ఎడిటరు ఉన్నాడని, సంపాదకీయాలు ఆయన వ్రాస్తాడని మీకు తెలుసా?” అని అడిగారు. “ఆ సంపాదకీయాన్ని గురించి ఏదైనా అభ్యంతరముంటే ఆయనతో మాట్లాడాలి. యజమానిని బెదిరించడం కాదు. ఇంకెప్పుడూ ఇలాటి బుద్ధి తక్కువ పని చేయకు” అని ఫోను పెట్టేశారు. పట్టాభిరామ్‌ ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.

పండితారాధ్యులవారు ఆంధ్రభూమిలో యేడాది మాత్రమే ఉంటానన్నారు. 11 నెలలు పూర్తికాగానే యజమానులకు చెప్పేశారు, వేరే ఏర్పాటు చేసుకొమ్మని. వారు కూచిమంచి నత్యసుబ్రహ్మణ్యంనే సంప్రదించారు. ఆయన రావడానికి ఒప్పుకున్నారు. కొంత సమయం కావాలన్నారు. ఆయన వచ్చేదాకా కొనసాగమని నాగేశ్వరరావును అడిగారు. ఆయన ఒప్పుకోలేదు. “సుబ్రహ్మణ్యం వచ్చేవరకు వరదాచారి పేరు ఆక్టింగ్‌ ఎడిటరు అని వేసుకొని పత్రిక నడుపుకొండి. ఆయన చూసుకోగలడు” అని చెప్పారు. కాని సుబ్రహ్మణ్యం వద్దన్నారు. “వరదాచారి నాకు కావాలి. ఒకసారి పేరువేసి నేను వచ్చినాక తీసేస్తే వెళ్లిపోతాడేమో! కనుక మీ యజమానులలో ఎవరో ఒకరి పేరు వేసుకొని పని వెళ్లదీయండి" అని సలహా ఇచ్చారు. దానితో మొదలియారు సోదరులైదుగురిలోకి పెద్దవాడైన నందగోపాల్‌ ఆంధ్రభూమి జ్ఞాపకాల వరద 153

ఆక్టింగ్‌ ఎడిటరయ్యారు. నన్ను పిలిచి “సంపాదకీయాలు మీరు రాయండి” అన్నారు. “నేను న్యూస్‌ ఎడిటరును. ఆ పనే చేస్తాను” అని ఖండితంగా చెప్పాను. కనీసం క్రానికల్‌ ఎడిటోరియల్స్‌నైనా అనువాదం చేసే ఏర్పాటు చేయమని అడిగారు. ఆ పని ఎవరైనా చేయగలరని, నాగేశ్వరరావు వెళ్లే ముందు సబ్‌ ఎడిటరుగా చేరిన ఎస్‌.వి.ఎస్‌. సుబ్బారాయుడుకు ఆ పని అప్పగించాను. ఎడిటర్ల స్వతంత్రప్రతిపత్తికి భంగం కలుగుతున్నదని అప్పటికే చర్చ ప్రారంభమైంది. ఎడిటల్లే ఈ విధమైన సలహాలిచ్చి అతిక్రమణలను ప్రోత్సహించడం ఈ దుర్నీతికి బలం చేకూర్చిందని నా అభిప్రాయం. సుబ్రహ్మణ్యం మూజ్జెల్లయినా రాలేదు. ఒకరోజు మా జనరల్‌ మేనేజరు పి.ఎ. నా దగ్గరకు వచ్చాడు. “విశ్వనాథ సత్యనారాయణ, విస్సా అప్పారావు. అబ్బూరి రామకృష్ణారావు ఎవరు మన ఎడిటరుగా బాగుంటారు” అని అడిగాడు. “ఇది నువ్వ అడుగుతున్నావా లేక ఎవరైనా అదడగమన్నారా?” అని ఎదురు ప్రశ్చవేశాను. జి.ఎమ్‌. అడుగుమన్నారని చెప్పాడు. జి.ఎమ్‌. కూడా యజమానులలో ఒకరే. “ఇలాటి విషయాలు ఎడిటోరియల్‌ సిబ్బందిలో సీనియర్లను అదగాలేకాని పి.ఏ. లను కాదని చెప్పమన్నాను, జనరల్‌ మేనేజరు నన్ను పిలిపించారు. “కోపమెందుకు, వారిలో ఎవరు మంచివారో తెలుసుకుందామని అడిగా”నన్నారు. “ముగ్గురూ గొప్పవారే. విస్సా అప్పారావు వారం కిందటే చనిపోయారు. విశ్వనాథవారు కరీంనగర్‌ గవర్నమెంట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. జర్నలిజంతో సంబంధం లేనివారు. అబ్బూరి వారికి కూడా జర్నలిజంతో సంబంధం లేదు. వీరిద్దరూ రారు కూడా” అని చెప్పాను. “మరి మీరే తగినవారి పేరు చెప్పండి” అని అడిగారు. “స్వతంత్ర ఎడిటరుగా పనిచేసిన గోరా శాస్త్రి సికిందరాబాద్‌లోనే ఉన్నారు. చక్కటి ఎడిటోరియల్స్‌, వినాయకుడి వీణ లొటి గొప్ప ఫీచర్లు వ్రాస్తారు. మీరు సరేనంటే ఆయనను పిలుచుకువస్తాను. మిగతా విషయాలు మీరు మాట్లాడుకొండి” అన్నాను. గోరాశాష్త్రి స్వతంత్ర మూతబడిన తర్వాత ఆంధ్రప్రభలో స్పెషల్‌ కరెస్పాండెంటుగా పనిచేస్తున్నారు. మంచి ఉద్యోగం చాలా అవసరం. గోపాలశాస్త్రి అని గోరా శాస్త్రి మేనల్లుడు. సమాచారశాఖలో ఉద్యోగి. హాస్యరచయిత, అలా నాకు పరిచయం. ఆయనను తీసుకొని జీరాలో ఉన్న గోరావద్దకు వెళ్లి మాట్లాడాను. “డెయిలీ జర్నలిజం నాకు కొత్త.” “వీరు అండగా ఉండాలన్నారు. “అది ఉద్యోగధర్మం” అన్నాను. అలా గోరాశాస్త్రి ఆంధ్రభూమి ఎడిటరు అయ్యారు. 21 సంవత్సరాలు అరమరికలు లేకుండా పనిచేశాము. గోరా ఆంధ్రభూమి ఎడిటరుగా ఉండగానే 1982 మే ఒకటవ తేదీన పరమపదించారు. 154 జి యస్‌. వరదాచారి

పండితారాధ్యులవారు భూమిలో ఉండగానే ఆయనకు చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు నుంచి, కర్నూలు రెడ్డి వర్గం నుంచి తాము పెట్టబోయే కొత్త పత్రికలకు సంపాదకత్వం వహించాలనే ఆఫర్లు ఉండేవి. మూర్తిరాజు దగ్గరి నుంచి ఒకరోజు మాదల వీరభద్రరావు నా వద్దకు వచ్చారు. రాజు పెట్టబోయే పత్రికకు సిబ్బంది ఎంత అవసరమో ఒక ్రణాళిక వేసి ఇవ్వమన్నారు. ఆయన బలవంతం మీద రెండు పత్రికలలో నాకున్న అనుభవాన్ని బట్టి నేనో ప్రణాళిక ఇచ్చాను. ఆంధ్రరత్న అనే పేరుతో ఆయన పత్రిక తెచ్చారు. దానిలో నాగేశ్వరరావు చేరలేదు. నన్ను పిలువలేదు. మోచర్ల కృష్ణమూర్తిని ఎడిటరుగా వేసుకున్నారు. కాని అది మూణ్డాళ్ల ముచ్చటగా ముగిసింది. నాగేశ్వరరావు కొంతకాలం ప్రజాప్రభ నడిపి చివరకు బెంగళూరు ఆంధ్రప్రభలో చేరి, విజయవాడలో చీఫ్‌ ఎడిటరుగా పదవీవిరమణ చేశారు. సబ్‌ ఎడిటర్త కుప్పిగంతులు

గోరాశాస్త్రి ఆంధ్రభూమిలో చేరేనాటికి దానిలో పని చేస్తున్న సబ్‌ ఎడిటర్లలో పండితారాధ్యుల వీరాభిమానులు కొందరుందేవారు. జర్నలిజంలో పాతకాపులు. వారందరికీ నాగేశ్వరరావు చేరబోయే పత్రికలో ఉద్యోగాలు ఖాయంగా లభిస్తాయని ఆశ. ఆ వారం నాకు నైట్‌ ద్యూటీ. పగలు ఉన్నవారంతా సామూహిక సెలవు పెట్టారు. ఉదయం 11 గంటల సమయంలో ఒక ప్రూఫ్‌ రీడరును వెంటబెట్టుకుని గోరాశాస్త్రి మా ఇంటికి వచ్చారు. కొంచెం కలతచెంది ఉన్నారు. “ఏమిటండీ, వీళ్లిట్లా సమ్మె చేశా?” రన్నారు. “నాకూ తెలియదు. ఏం ఫర్వాలేదు. నేను వస్తాను పదండి” అన్నాను. ఆఫీసుకు వెళ్లగానే “మీరు సంపాదకీయం వ్రాసేపనిలో ఉండండి. మిగతాది నేను చూసుకుంటా”నని పనిలో పడ్డాను. సాయంకాలం ఆరు గంటలకు విశాఖపట్నం వైపు గోదావరి ఎక్స్‌'ప్రెస్‌లో వెళ్లే మొదటి డాక్‌ ఎడిషను నిరాటంకంగా వెళ్లింది. నేను మామూలుగా నైట్‌ డ్యూటీకి వస్తానని, ఒకరిద్దరు ఉపసంపాదకులు ఉంటారు గనుక ఇబ్బంది ఉండదని, పట్రిక మామూలుగా వెలువడుతుందని, నిశ్చింతగా ఇంటికి వెళ్లమని గోరాను పంపించాను. మర్నాడు పత్రిక యథాప్రకారం మార్కెట్లోకి వచ్చింది. సమ్మెచేసినవారు నివ్వెరపోయారు. నాగేశ్వరరావు వద్దకు వెళ్లారట. కొత్త పత్రికకు సమయం పడుతుంది గనుక, వెళ్లి వరదాచారితో పెట్టుకోకుండా, బుద్ధిగా పనిచేసుకొండని చెప్పి పంపించారు. మర్నాడు అంతా మామూలుగా డ్యూటీకి వచ్చారు. నీతో చెప్పకుండా ఏదో చేద్దామనుకుంటే బెడిసి కొట్టిందన్నారు. “నాతో చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు. మీకీ శృంగభంగం తప్పేది” అని నవ్వేశాను. కొత్త పత్రిక వచ్చేదాకా బుద్ధిగా ఉండి, అక్కడ ఉద్యోగం రాగానే వెళ్లిపోయారు. జ్ఞాపకాల వరద 155

ఈ సంఘటన జరిగిన మరుసటి ఆదివారం గోరాశాస్త్రి సబ్‌ ఎడిటర్లను తీసుకువస్తానని విజయవాడ వెళ్లారు. ఎక్కువ జీతం ఇస్తామంటే ఎవరైనా వస్తారని ఆశ. ఒకచోట స్టిరపడ్డవారు అంత సులభంగా వస్తారా? బెల్లంకొండ రామదాసు ఒక్కడు దొరికాడు. వరదాచారితో సమానంగా సౌకర్యాలు ఇవ్వమని అడిగారట. ఒప్పుకొని తీసుకువచ్చారు. దానితో ఇద్దరినీ న్యూస్‌ ఎడిటర్లన్నారు. ఇది పద్ధతికి విరుద్ధమని నేను చెప్పాను. అప్పుడు నాకు అసిస్టెంట్‌ ఎడిటరు అని ప్రమోషను ఇస్తామన్నారు. నాకు న్యూస్‌ ఎడిటరుగా ఉండటమే ఇష్టమని జీతం పెరగని ప్రమోషన్‌ వద్దన్నాను. రెండేళ్ల తర్వాత రామదాసు వెళ్లిపోగా, నా ప్రోద్చలంపై జనతను వదిలి భూమికి వచ్చిన పొత్తూరి వెంకటేశ్వరరావు కూడా అక్కడ అసిస్టెంట్‌ ఎడిటరుగా ఉన్నాడు గనుక, ఆదే స్కేలు వర్తించే న్యూస్‌ ఎడిటరు హోదాఅడిగారు. నేను అప్పుడూ అభ్యంతరపెట్టలేదు. పొత్తూరి చాలాసార్లు 'ప్రమోషను తీసుకొమ్మని సలహాఇచ్చారు గాని నేను న్యూస్‌ ఎడిటరుగా ఉండటానికే ఇష్టపడ్డాను. రామదాసు భూమిని వదిలి వెళ్లిపోవడానికి లేకలేక కలిగిన ఆయన కుమారుని అకాలమరణం కారణం అనుకున్నాము. కాని కొన్నాళ్ల తర్వాత ఆయన గోరా శాస్త్రికి వ్రాసిన ఉత్తరం అందరికీ బాధ కలిగించింది. “అబ్బాయి పోయాడు సెలవు కావాలంటే ఎడిటరు నాకూ ఇవాళ వాయిదావేయ వీలులేని పని ఉంది. అబ్బాయి ఇప్పుడే పోవడమేమిటండీ?” అని అన్నారని లేఖలో (వ్రాశారు. అంతటితో ఆగలేదు. “వరదాచారి అంటూన్నట్టుగా మీరు నిజంగానే నవజాతశిశువుల మెదడు మాంసం తిని బతికే అఘోరసన్యాసుల కోవకు చెందినవారు” అని ఆక్రోశించారు.

ఇక్కడ ఆ నాటి నా సరదా గురించి చెప్పాలి. నేను మా మిత్రవర్గంవారితో మాట్లాడేటప్పుడు పేర్లు మార్చి వాడుతుందేవాడిని. విశ్వేశ్వరరావును వైశంపాయనుడు అనేవాణ్డి. అలాగే గోరాశాస్త్రిని అఘోరనాథ శాస్తుర్లవారు అనేవాడిని. అఘోర సన్యాసులు బీవోర్‌, అస్సాం వరినరప్రాంతాలలో ఉంటారని తెలును. అవ్పుడు వారి వామాచారపద్ధతుల గురించి కథలు ప్రచారంలో ఉండేవి. కాని పేరు మార్చినప్పుడు నా దృష్టిలో ఉన్నది సరోజినీనాయుడు తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ. ఆయన నిజాం కాలేజి ప్రిన్సిపాల్‌గా ప్రసిద్ధులు. గోరా ఆ ఉత్తరాన్ని నాకు చూపించి “ఏమిటండీ, ఇంత ఘోరంగా రాశాడు?” అన్నారు. నాకూ ఈ సంగతి తెలియదన్నాను. గోరా, రామదాసు విపరీతప్రవృత్తి గురించి తెలిసినవారు గనుక నన్ను నమ్మారు.

ఆంధ్రభూమిలో నేను న్యూస్‌ ఎడిటరుగా 22 ఏళ్లు పనిచేశాను. ఈ కాలంలో చాలామంది చేరారు. కొందరు కొంతకాలం పనిచేసి వెళ్లిపోయారు. నాతో కలిసి 156 జి.యస్‌. వరదాచారి

పనిచేసినవారి లఘుపరిచయం చేస్తాను. బెల్లంకొండ రామదాసు పరిచయం చేశాను. రాయసం వీరభద్రశర్మకు జర్నలిజం పట్ల ఆసక్తి ఉంది కాని అనుభవం లేదు. వల్లూరి వెంకటేశ్వర్లు దగ్గర ప్లీడరు గుమాస్తాగా పనిచేస్తుండేవాడు. పుస్తకపఠనం, కవిత్వం రాయడం ఇష్టం. గండికోట సుందరయ్య రెవెన్యూ బోర్డులో పని చేస్తుండేవాడు. జర్నలిజమంటే పిచ్చి అభిమానం. ఆంధ్రజనతలో ఉన్నప్పటినుండి మా వెంట పడుతుండేవాడు. భూమిలో సబ్‌ ఎడిటరుగా చేర్చుకున్నాము. ఈయన ఆఖరు కోరిక గురించి చెప్పాలి. శ్మశానానికి తరలించే ముందు తన పార్ధివశరీరాన్ని నేలమీద దినపత్రికలు పరిచి పడుకోబెట్టాలన్నదా కోరిక. సంతపురి రఘువీరరావు సోషలిస్టు పార్టీ కార్యకర్త. భాట్టం శ్రీరామమూర్తితో కలిసి పార్టీ వారపత్రికకు సంపాదకత్వం వహిస్తుండేవాడు. పి.ఎన్‌. స్వామి ఆంధ్రజనతలో నర్య్యులేషన్‌ చూసేవాడు. ఎడిటోరియల్‌లోకి రావాలని ఉబలాటం. పెద్దాయన తుమ్మలపల్లి సీతారామారావు. కూచిపూడి నృత్యం శాస్రీయమైనదని ప్రచారం చేసి, నాట్యశాస్రజ్ఞులను ఒప్పించిన కళాసేవకుడు. గోపరాజు వెంకట రమణారావు ఆంధ్రరాజకీయాలు, రాజకీయ నాయకుల గురించి రెడీ రెకనర్‌. మరో పెద్దాయన వి.యస్‌. అవధాని. మంథనిలో వకీలు. యువకులతో సమ ఉజ్జీగా పనిచేసేవారు. ఎస్‌.వి.ఎస్‌. సుబ్బారాయుడు. పద్రికారంగానికి కొత్త, ఇంకా కరీంనగరంలో టీచరు ఉద్యోగంలో చేరడానికి వెళ్తూ సికిందరాబాదులో ఆంధ్రభూమిలో స్థిరపడిపోయిన కె.వి.ఎం.డి. శ్రీనివాసరావు, టంకశాల అశోక్‌, దయాసాగర్‌ రావు, లక్ష్మీ ఇద్దరు రంగాచార్లు వ్రాసుకుంటే పెద్ద జాబితాయే. తెలుగు పత్రికలలో స్టాక్‌ మార్కెట్‌ వార్తలను మొదట ఆంధ్రభూమిలోనే ప్రవేశపెట్టాము. ఫిలిమ్‌ వార్తల శీర్షికకు చిత్రభూమి, క్రీడావార్తలకు క్రీడాభూమి అని పెట్టినట్టుగానే దానికి వాణిజ్యభూమి అని శీర్చిక పెట్టాము. దాన్ని వ్రాసే విధానం రైల్వే ఉద్యోగి అయిన అయ్యగారి కృష్ణమూర్తికి నేర్చి అప్పజెప్పాము. ఆయన రోజూ రాత్రివచ్చి ఆ శీర్షిక వ్రాసేవారు. కాని అప్పుడు స్టాక్‌ మార్కెట్‌పట్ల తెలుగు పాఠకుడికి అంత రుచి లేకపోయింది. కొన్నాళ్ల తర్వాత ఆ శీర్షికను ఆపివేశాము. ఆం(ధ్రభూమిలో వనిచేనీ వెళ్లినవారిలో వలువురు ఉన్నతవదవులు నిర్వహించినవారు, కీర్తిప్రతిష్టలు ఆర్జించినవారు ఉన్నారు. ఆదిరాజు వెంకటేశ్వరరావు జిల్లా పరిషత్తులో ఉద్యోగం చేస్తుండేవాడు. అల్వాల నవకళాకేంద్ర నిర్వాహకుడు బక్షీ శ్రీరామ్‌ అనే మిత్రుని ద్వారా నన్ను కలిశాడు. గోరా కూడా వెంటనే సమ్మతించారు. సబ్‌ ఎడిటరుగా చేరాడు. కొన్నేళ్ల తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్లాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమవార్తలు వ్రాస్తూ ఉద్యమంతో మమేకమై జైలుకువెళ్లాడు. జ్ఞాపకాల వరద 157

పరిశోధనాత్మక వార్తారచనలో పేరు తెచ్చుకున్నాడు. తన కార్యరంగాన్ని ఢిల్లీకి మార్చుకొని పలు ఆంగ్ల పత్రికలలో పనిచేశాడు. తెలంగాణ ఉద్యమం గురించి తెలుగులో, ఇంగ్లీషులో పుస్తకాలు వ్రాశాడు. పి.వి., రాజీవ్‌లకు సన్నిహితుడై, ఆంగ్లంలో వారి జీవితగాథలు వ్రాశాడు. “మహాభారత్‌ టు మన్నోహన్‌ సింగ్‌ బృహత్‌ చరిత్ర (గ్రంథం వ్రాశాడు. చివరి వరకు జర్నలిజంలో ఉన్నాడు. ఉద్యోగం లేనప్పుడు తానే రాజధాని అని వార పత్రిక నడిపాడు. నాతో శీర్షికలు (వ్రాయించుకొన్నాడు. నా పొత్రికేయ జీవిత స్వర్జోత్సవ సంచికలో తనను '“పత్రికారంగం అనే ఈ మహాసముద్రంలోకి దింపి గజ ఈతగాడిగా” చేసిన ఘనుడు అని నాపై అభిమానాన్ని చాటుకున్నాడు.

పండిత పాత్రికేయుడు, బహుభాషా కోవిదుడు తిరుమల రామచంద్ర. ఉత్తరాదిలో ఇంగ్లీషు పత్రికతో రంగప్రవేశంచేసి ఆంధ్రపత్రిక, ప్రభలలో మహత్తరకృషి చేసిన మహానుభావుడు. వయసు మీరినా పనిచేయక గడవని స్థితిలో భూమిలో ఉద్యోగానికి వచ్చారు. గోరా “అంత పెద్దవాడు మనకెందుకు?” అన్నారు. “ఆయన మన పత్రికలో పని చేస్తున్నాడంటేనే అది మనకొక గౌరవం” అని నేను గోరాతో అంటుండగా, యజమానులలో పెద్దవాడైన నందగోపాల్‌ విన్నారు. ఎవరని ఆరా తీశారు. “అంతటివాడైతే కాదనడమెందుకు? ఉద్యోగమిద్దా'మన్నారు. గోరా సరేననడంతో, తిరుమల చేరిపోయారు. ఏ పని అప్పగించినా చక్కగా పూర్తిచేసి మన్ననలందుకున్నారు. మార్చు గోపీనాథ్‌ విశాఖలో ఈనాడులో పనిచేసి వచ్చాడు. తర్వాత సమాచారశాఖలో చేరాడు. జి. శ్రీరామమూర్తి తర్వాత ఆంధ్రపత్రిక, ప్రభ, సూర్య దిన పత్రికల సంపాదక బాధ్యతలు నిర్వహించారు. దేవులపల్లి అమర్‌ ఈనాడు నుంచి వచ్చిచేరాడు. జర్నలిస్టుల శ్రామికోద్యమంలో జాతీయస్థాయి నాయకుడుగా ఎదగడమే గాక అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రైస్‌ అకాడమీకి అధ్యక్షుడయ్యాడు. టంకశాల అశోక్‌, భూమిలో స్వల్చకాలమే ఉన్నా తర్వాత వార్త దినపత్రిక సంపాదకుడయ్యారు. అంతకు ముందు ్రభలో ఢిల్లీవెళ్లి ప్రత్యేకవిలేఖరిగా పంజాబ్‌, కళ్ళీర్‌, శ్రీలంకలలో ఉ(గ్రవాదకార్యకలాపాలపై పరిశోధనాత్మకవార్తలు (వ్రాసి పేరు గడించారు. మరొక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి. ఆమె వి.ఎస్‌. రమాదేవి. ఆమె ఆంధ్రభూమిలో “విపులా చ పృథ్వీ అనే ఫీచరు ్రాస్తుండేవారు. ఆమె ఆఫీసుకు వచ్చి గోరాశాస్త్రి గదిలోనే కూర్చొని ఫీచరు వ్రాసి ఇచ్చి వెళ్లేవారు. తర్వాత ఆమె కేంద్రంలో ఉద్యోగంలో చేరి రాజ్యసభ కార్యదర్శి అయి, స్వల్చకాలం పాటు కేంద్ర ఎన్నికల ప్రధానకమిషనరుగా ఉండి, ఆతర్వాత హీమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక రెండు రాఘమ్రైాల గవర్నరుగా పనిచేశారు. 158 జి.యస్‌. వరదాచారి

పోస్టాఫీసులో తాబేలు

విశ్వవిద్యాలయాలలో తెలుగు ఎం.ఏ. చేసి, ఉద్యోగం వచ్చేవరకు పత్రికలో కాలక్షేపం చేద్దామని వచ్చినవారూ కొందరున్నారు. వారిని ప్రస్తావించడం లేదు. మీడియాలో స్థిరపడాలని వచ్చినవారినే పేర్మొన్నాను. అలాంటివారిలో పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు అవశ్య స్మరణీయులు. ఉషశ్రీగా, రామాయణ (ప్రవాచకులుగా సుప్రసిద్ధులు. ఈయన గురించిన ఓ సరదా అనుభవం చెపుతాను. డ్యూటీలో ఉన్నా ఏదో వ్రాసుకుంటూ ఉండేవారు. మొదటి రోజు గడిచి పోయింది. నుర్దాడునా దగ్గరకు వచ్చారు. “నేను జర్నలిజం నేర్చుకుందామని వచ్చాను. నాకు ఇన్‌చార్జిగారు నిన్న వ్రాతపని ఇవ్వలేదు. ఇవ్వుమని చెప్పం”డని అడిగారు. నేను సుబ్బారాయుడిని పిలిచి అడిగాను. “ఆయనేదో వ్రాసుకుంటూ ఉంటే నేను పట్టించుకోలేదు అన్నాడు. “అట్లా వద్దు, ఆయన వ్రాయదగినవార్తలు చూసి ఇవ్వండి. అవసరమైతే సలహాకూడా ఇవ్వండి” అని చెప్పాను.

ఒక పోస్టుకార్డు ౩0 ఏళ్ల తర్వాత చిరునామాదారుకు చేరింది. గడికట్టి వేసే చమత్మారవార్త. ఉషశ్రీకి ఇచ్చాడు. ఆయన బాగానే వ్రాశారు. “ప్రోస్ట్రాఫీసులో తాబేలూ అని శీర్షికపెట్టారు. సుబ్బారాయుడుకు నచ్చలేదు. అది తెచ్చి నాకు చూపాడు. “శీర్షిక (ప్రతీకాత్మకంగా పెట్టాడు. బాక్సు వార్త కదా ఉండనివ్వండి” అన్నాను. మరి కొన్నాళ్లకు అలాటిదే మరో ఉత్తరం వార్త వచ్చింది. మళ్లీ ఉషశ్రీకే ఇచ్చాడు. ఆయన దానికి పోస్టాఫీసులో మరో తాబేలు” అని శీర్షిక పెట్టారు. “మొదటి శీర్షిక ప్రతీకాత్మకంగా సరిపోయింది కాని రెండవ దానిలో మరో అని విశేషణం వాడినందున భౌతిక తాబేలు అనే ధ్వనిస్తుంది గనుక ఆమోదయోగ్యం కా” దని చెప్పాను. ఆయన అర్ధం చేసుకున్నారు.

పాలకుర్తి మధుసూదనరావు భూమిలో చేరిన కొద్దికాలానికే ఆకాశవాణిలో పెక్స్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. పత్రికలో పనిచేస్తున్నట్టు టెస్టిమౌనియల్‌ కావాలని అడిగాడట. గోరాశాస్త్రి ఇవ్వనన్నారట. న్యూస్‌ ఎడిటరుగా నేను ఇస్తానని ఇచ్చాను. రేడియోలో ఉద్యోగం వచ్చింది. పదోన్నతులు పొంది, చివరకు హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రం డైరెక్టరుగా రిటైరయ్యాడు. జర్నలిజమంటే ఎనలేని మక్కువ కలిగిన వ్యక్తులు పి. కృష్ణమూర్తి నాయుడు, కె.ఎం. రావు. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం చూసుకొమ్మని గోరా సలహా ఇచ్చారు. నాయుడు రాష్ట్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనరుగా రిటైరయాడు. జ్ఞాపకాల వరద 159

రావు హెచ్‌ఎంటీలో పీఆర్వోగా పత్రికలతో తన సాన్నిహిత్యాన్ని నిలబెట్టుకున్నాడు. సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి, వి.వి. రావు ఇద్దరూ ప్రముఖజ్యోతిష్ములు. మరో ఇద్దరు జర్నలిస్టు ప్రముఖుల గురించి చెప్పి సహోద్యోగుల అంశాన్ని ముగిస్తాను. వారు ఎం. రాజేంద్ర, పొత్తూరి వెంకటేశ్వరరావు. ఇద్దరూ 1964లో ఒకే రోజు భూమిలో చేరారు. రాజేంద్ర పగలు డ్యూటీలో సబ్‌ ఎడిటరుగా చేరాడు. జర్నలిజంలో అనుభవం లేదు. కథారచయితగా గోరాతో ఉన్న పరిచయం ఉపయోగపడింది. తర్వాత ఆం(ధ్రజనతలో రిపోర్టరుగా ఐదేళ్లు చేశాడు. పొలి కేక వారపత్రిక సంపాదకుడయ్యాడు. రెండేళ్లలో అది ఆగిపోతే సొంతంగా జ్యోత్స్న మాసపత్రిక నడిపాడు. అదీ నిలబడకపోగా ప్రజాతంత్ర వార్తావారపత్రిక సంపాదకత్వం చేపట్టాడు. 1975లో ఈనాడు హైదరాబాదు ఎడిషన్‌ ప్రారంభమైనపుడు దానిలో చేరాడు. రెండేళ్ల తర్వాత పప్రభలో చేరాడు. అక్కడ దినపత్రిక వారపత్రికలలో పుష్మరకాలం పనిచేశాడు. తర్వాత ఇండియా టు డే తెలుగు వారపత్రిక ఎడిటరుగా పదేళ్లు పనిచేసి, సలహాదారుగా మరి కొన్నేళ్లు కొనసాగాడు. పొత్తూరి ఆంధ్రజనతలో నాతోపాటు పనిచేసిన విషయం ప్రస్తావించాను. రామదాసు వెళ్లిపోయాక నా ప్రోద్చలంపైనే వచ్చి ఆంధ్రభూమిలో న్యూస్‌ ఎడిటరుగా చేరాడు. దాదాపు పదేళ్లు ఉన్నాడు. ఈనాడు హైదరాబాద్‌ ఎడిషన్‌ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతుండగా, దానిలో ఒక ఎడిటరుగా చేరాడు. సంవత్సరం ముందు ఈనాడు విశాఖపట్నంలో ప్రారంభించినపుడు ఎ.బి.కె. ప్రసాద్‌ ఎడిటరుగా ఉండేవారు. హైదరాబాద్‌ ఎడిషన్‌ వచ్చేనాటికి రామోజీరావు పత్రిక మీద తన పేరే చీఫ్‌ ఎడిటర్‌ అని వేసుకున్నారు. రాంభట్ల కృష్ణమూర్తి, ఎ.బి.కె, టి.వి. కృష్ణ, పొత్తూరి, వి. హనుమంతరావు, చలసాని ప్రసాద్‌ ఆరుగురికి ఎడిటరు హోదా ఇచ్చారు. ఇది విన్నప్పుడు నాకు దాసు గోవిందరావు గుర్తుకొచ్చాడు. ఆయన ఆంధ్ర జనతలో ప్రెస్‌ మేనేజరుగా ఉండేవాడు. ఒకరోజు నేను ఆఫీసుకు వచ్చేసరికి “ఎడిటర్లైెవరూ రాలేదా? అని అటెండరును అడుగుతున్నాడు. అతను నా వైపు చూపించాడు. “ఎడిటర్లు అని బహువచనం ప్రయోగిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారికి కోపం వస్తుంరొదన్నాను. “ఎడిటింగ్‌ చేసే మీరంతా ఎడిటక్లే. ఆయన చీఫ్‌ ఎడిటరు” అన్నాడు. ఆయన మాట ఇరవై ఏళ్ల తర్వాత నిజమైందనిపించింది. సరే పొత్తూరి గురించి చెపుతున్నాను. రెండేళ్లలో ఆయన ఆంధ్రప్రభ హైదరాబాద్‌ ఎడిషన్‌ రెసిడెంట్‌ ఎడిటరుగా చేరాడు. తర్వాత ఎడిటరయ్యాడు. కొంతకాలం దినపత్రికతో పాటు వారపత్రికకు కూడా ఎడిటరుగా పని చేసి రిటైరయాడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ (వైస్‌ అకాడమీ అధ్యక్షులుగా కూడా పని చేశాడు. 160 జి.యస్‌. వరదాచారి

శుభోదయం

1962 మార్చి 380వ తేదీ. నేను జజ ఆంధ్రభూమి కార్యాలయంలో నైట్‌ డ్యూటీలో నా ము పెట్టిస్తున్నాము. గండికోట సుందరయ్య | ఉక సహాయంగా ఉన్నాడు. ఇంటి దగ్గరి నుంచి స్త మ్‌ య మా అక్కలక్ష్మమ్మ ఫోను చేసింది, నాభార్య (క్షా. నేను పేజి మేకప్‌ పని సుందరయ్యకు త! అప్పజెప్పి వెంటనే సైకిలు మీద ఇంటికి జ్ఞత్తతక. “ బయల్దేరాను. ఇంటికి చేరేసరికి మా అక్క [ఆ ఆన్న(తికి తీనుకువెళ్లే వన్తువులన్నీ తొలిలిద్ద శుభతో నరోజిని సర్టిపెట్టుకుని సిద్ధంగా ఉన్నది. వెంటనే రిక్షా తీసుకొని జజ్జీఖానా అంటే ప్రభుత్వంవారి ప్రసూతి ఆస్పత్రికి వెళ్లాం. అది నయా పుల్‌ దాటాక హైకోర్టు పక్కన ఉందేది. ఆ రోజులలో అదే స్రీల పెద్దాసుపత్రి. మాకు సంతానం కొంచెం ఆలస్యమైంది. కాపురంపెట్టి ఐదేళ్లు గడిచిపోయింది. అమ్మలక్కలు ఊరకుంటారా? కొందరు ఇక సంతానం కాదన్నారు. ఇంకొందరు డాక్టరుకు చూపించుకొమ్మన్నారు. మరికొందరు శ్రేయోభిలాషులు “మీ ఆయన నీతో సరిగా ఉంటున్నాదే?” అని ఇల్లాలును ఆరా కూదా తీశారు. మేమూ డాక్టర్లను సంప్రదించాం. డాక్టర్‌ జయశ్రీ అని జజ్జీఖానాలోనే పెద్ద డాక్టరు. మా ఆవిడకు చిన్న శస్త్రచికిత్సేదో చేసింది. నాకూ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో పరీక్షచేశారు. ప్రయత్నం ఫలించింది. ఫలితంగా ప్రసూతి ఆస్పత్రికి రాగలిగాము. ఆస్పత్రిలోకి సాయంత్రం సందర్శనవేళలో తప్ప పురుషులను రానివ్వరు. మా అక్కే తీసుకువెళ్లి చేర్పించింది. ప్రసూతిగదిలోకి తీసుకుపోయిన విషయం, ఇంకా నొప్పులు పడుతూనే ఉన్న విషయం అరగంటకొకసారి వచ్చి, చెప్పి పోతుండేది. తెల్లవారిన తర్వాత వచ్చి ఆడపిల్ల పుట్టిందని, తల్లీ, పిల్ల బాగున్నారన్న శుభవార్త చెప్పింది. పుట్టిన బిడ్డను శుభ్రపరచిన తర్వాత ఆయాలే తెచ్చి తండ్రికి చూపించి ఇనాము అందుకున్నారు.

అలా ఆ నాటి పరిస్థితులలో కొంత ఆలస్యమైనా శుభకృత్‌ నామ సంవత్సర ఫాల్గుణ శుక్ల తదియ, శ్రవజానక్ష్మత్రం సరియగు తేదీ 1962 మార్చి 31 నాడు జ్ఞాపకాల వరద 161

ఉదయం 7:15 గంటలకు నాకు తొలి సంతానం కలిగింది. శుభకృత్‌లో పుట్టింది గనుక శుభ అని పేరు పెట్టాము. వంశాచారం ప్రకారం లక్ష్మి అని పెట్టాలి. శుభ అన్నా అదే అర్థం. జర్నలిస్టు మిత్రులకు పార్టీ ఇద్దామన్న కోరిక కలిగింది. ఇల్లు చాలా చిన్నది. హోటల్‌ ఖర్చు మనం భరించగలమా అన్న సందేహం కలిగింది. మేము రోజూ టిఫిన్లకు వెళ్లే మైసూరు కేఫ్‌ యజమానిని అడుగుదామని ఆయన దగ్గరకు వెళ్లాను. మైసూరు కేఫ్‌ హోటళ్ల యజమాని సీతారామారావు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు. పెద్దాయన పురుషోత్తమరావు. ఆయన టిఫిన్త హోటల్‌ చూసేవాడు. ఆయనను వెంటపెట్టుకుని వెళ్తాను. జర్నలిస్టు, కూతురు పుట్టినందుకు తోటి జర్భలిస్టులకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాడని చెప్పాడు. సీతారామారావు ఎంతో అభిమానంగా స్పందించాడు. భోజనాల హోటలు గోల్డన్‌ ఢ్రెషహోల్డ్‌లో ఉండేది. దాని లానులో ప్రత్యేకంగా కుర్చీలు వేయించి పార్టీలాగా ఏర్పాటు చేస్తానన్నాడు. “మీరు ఎంతమందిని పిలిస్తే అన్ని భోజనం టిక్కట్లు కొనండి చాలు. అదనం ఏమీ ఇవ్వనక్కరలే” దన్నాడు. అలాగే చేశాను. జర్నలిస్టు పెద్దలను, ఆఫీసు సహచరులను మాత్రమే పిలిచాను. అందరూ సంతోషించి బిడ్డను ఆశీర్వదించారు. నాకు నలుగురు పిల్లలు. మొదట అమ్మాయి శుభ గురించి చెప్పాను. అది పుట్టిన రెండేళ్లకు నాకు బ్యాంకు ఫ్రీటులో అమృతనగర్‌ కాలనీలో అకామడేషన్‌ కంట్రోలర్‌ క్వార్టరు కేటాయించారు. ఏడవ నిజామ్‌కు ఆర్థిక సలహాదారుగా ఉన్న ఆరావముదు అయ్యంగారు కట్టించిన క్వార్టర్లు అవి. రెండు డజన్ల వరకు ఉండేవి. వాటిల్లో జర్నలిస్టులకు కోటా ఉండేది. అద్దె కూడా చాలాతక్కువ. నా మిగతా ముగ్గురు పిల్లలు ఆ కాలనీలో ఉండగానే పుట్టారు. మా పెద్దమ్మాయి ఎం.ఏ., ఎం.ఇడి. చేసి అమెరికా వెళ్లిపోయే వరకు టీచరు ఉద్యోగం చేసింది. మా పెద్దల్లుడు శిరిశినహళ్‌ నరసింహమూర్తి గణితం ఎం.ఎస్‌సి, ఎం.ఫిల్‌ చేసి, ఇసి.ఐ.ఎల్‌లో సాఫ్ట్‌ వేర్‌ ఫ్రోగ్రామర్‌గా ఉండేవారు. 2 కెవై ఊపులో అమెరికా వెళ్లారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. మా మనుమరాలు స్పిగ్ధ. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో మాన్‌హాటన్‌లో ఉద్యోగం. పెళ్లయింది. దానికో కూతురు. పేరు రీనా. అంటే నేను ముత్తాతనయ్యా నన్నమాట, మా మనుమడు సుధాంశు. అమెరికాలోనే ఎం. డి. చేశాడు. డాక్టరుగా పనిచేస్తున్నాడు. మా రెండవ సంతానం అబ్బాయి. పేరు శ్రీహర్ష 1967 సెప్టెంబర్‌ మొదటి తేదీనాడు నిలోఫర్‌ ఆస్పత్రిలో పుట్టాడు. పర్సనల్‌ మేనేజిమెంట్‌ పి.జి. డిప్లామా చేసి 169 జి.యస్‌. వరదాచారి

అవంతీ కాప్స్‌లో పర్సనల్‌ ఆఫీసరుగాచేరాడు. ఎస్‌ఓఎల్‌ ఫార్మసూటికల్స్‌కు మారాడు. అక్కడి నుంచి అపోలో ఆస్పత్రిలో చేరాడు. కృష్ణా ఒబెరాయ్‌ హోటల్‌లో తొలుత హైదరాబాదులో, తర్వాత ఆగ్రాలో సీనియర్‌ పదవులు నిర్వహించాడు. అపోలో ప్రతాప్‌రెడ్డి ఢిల్లీలో కలిసి ఆహ్వానించగా, వారి ఇంటర్నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డివిజన్‌ అధిపతిగా హైదరాబాదులో బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పుడు సర్వజ్ఞ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టరుగా కన్సల్టెన్సీ సంస్థను నడుపుతున్నాడు. కోడలు జ్యోత్సు సహాయ పడుతున్నది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి నవ్యశ్రీ, బి.టెక్‌ చేసి కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్నది. అబ్బాయి అభినవ్‌ బి.టెక్‌ చదువుతున్నాడు.

మారెండవ అమ్మాయి సౌమ్య 1969 ఆగస్టు 26న పుట్టింది. ఎం.ఎస్‌సి., పిజిడిసిఎ. చేసింది. జూన్లీ హిల్స్‌ భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ స్కూలులో కంప్యూటర్‌ టీచరుగా పనిచేసేది. 1998 డిసెంబర్‌లో పెళ్లయింది. భర్త తిరునగరి శ్రీధర్‌. ఎం.టెక్‌ చేశాడు. ఇద్దరూ అమెరికా వెళ్లిపోయారు. న్యూ జెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్లుగా పనిచేస్తున్నారు. వారికొక అమ్మాయి శ్రియ.

చివరివాడు మా చిన్నబ్బాయి శ్రీవత్స 1978 జూలై 15 గురు పౌర్ణమినాడు సుల్తాన్‌ బజారు గవర్నమెంట్‌ ఆస్పత్రిలో జన్మించాడు. ఎం.సి.జే, పి.జి. డిప్లామా ఇన్‌ రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు చదివాడు. ఎన్‌.ఎస్‌.ఎస్‌లో కొన్నాళ్లు రిపోర్టింగ్‌ చేశాడు. ఢిల్లీ ప్రెస్‌ వారి గృహశోభ మహిళల పత్రిక ఎడిటోరియల్‌ మేనేజరుగా పదేళ్లు పనిచేశాడు. ఇప్పుడు లయోలా అకాడమీ పి.జి. కాలేజీలో జర్నలిజం లెక్సరర్‌ గా పని చేస్తున్నాడు. అతని భార్యపేరు జయశ్రీ. ఆమె ఎం.ఏ. (ఇంగ్లీషు), ఎం.ఎస్‌సి (మైకో బయోలజీ) చదివింది. నిమ్స్‌లో అనాస్తీషియా టెక్సీషియన్‌గా పనిచేసేది. కాన్పుల సమయంలో మానేసింది. వాళ్లకు ఇద్దరు కుమార్తెలు మానస, వైష్ణవి. భార్యావియోగం

నా భార్య సరోజిని 2001 డిసెంబర్‌ 29వ తేదీ, వృషనామ సంవత్సర మార్గశిరశుద్ధ చతుర్దశి తెల్లవారు జామున బాత్‌రూముకు వెళ్లి వచ్చి “ఎలాగో ఉంది” అన్నది. మళ్లీ పడుకొని మాట్లాడుతూనే కన్ను మూసింది. “ఏమైందీ” అని కుదిపితే పలుకలేదు. వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లాము. డాక్టర్లు ప్రయత్నాలు చేశారు కాని ప్రయోజనం లేకపోయింది. పార్థివశరీరాన్ని ప్యాక్‌చేసి, 'బ్రాట్‌ డెడ్‌" అనే సర్టిఫికెట్‌ జ్ఞాపకాల వరద 1683

ఇచ్చి పంపించేశారు. అప్పుడు మా పెద్దమ్మాయి, పెద్ద మనుమరాలు హైదరాబాదుకు

వచ్చి ఉన్నారు. “వినా దైన్యేన జీవనం అనాయాసేన మరణం” అన్న లోకోక్తికి సరోజిని

తన బతుకుని దృష్టాంతంగా పెట్టి పోయింది. ఆమె గతించాక ప్రచురించిన “ఇలాగేనా రాయడం అనే పుస్తకాన్ని ఆమెకు అంకితమిచ్చాను. “మనసు పొరల్లోంచి అనే శీర్షికతో

“ఇలాగేనా రాయడం?” అనే ఆ పుస్తకం ఆమెకు ఎందుకు సరైన అంకితమో ఒక

పేజీలో విన్నవించుకొన్నాను. ఇది బుణం తీర్చుకోవడం కాదు. ఆమె బుణం తీరనిది!

ఆమె వ్యక్తిత్వాన్ని, జీవితానుభవాలను, కార్య శైలిని, క్రమశిక్షణను ప్రతిబింబించే

ఆ నాటి మనసు పొరల్లోంచి అనే స్పృతివచనాలను ఇక్కడ పునర్నుద్రిస్తున్నాను.

మనసు పొరల్లోంచి

  • _ ఆమెకు డిగ్రీలు లేకపోవచ్చు. కాని లోకజ్ఞానానికి కొదవ లేదు.

  • _ ఆమె జమీందారి కుటుంబంలో పుట్టి ఉండవచ్చు. కాని బూర్జువా మనస్తత్వ భేషజాలు లేవు.

  • _ ఆమె పసితనంలోనే తలిదండ్రులను కోల్పోయి ఉండవచ్చు. కాని అనాథ బాలల నావహించే దైన్యం ఏ కోశానా లేదు.

  • _ కాపురానికి వచ్చీ రాకముందే ఇద్దరు బాలుర (మరదుల) సంరక్షణభారం నెత్తిన వేసుకోగల వయసు ఆమెకు లేకపోవచ్చు. కాని విసుగు దరిచేయనీయని, భావి మాతృత్వపుభావనలోని మాధుర్యాన్ని ఆస్వాదించ గల హృదయవైశాల్యం ఉంది.

  • ఈమె కులీనకుటుంబ సంప్రదాయమర్యాదలకు కట్టుబడి ఉండవచ్చు. కాని వాటినే బంధనాలుగా మార్చుకొని అన్యాయాలను సహిస్తూ ఊరుకోగల నిస్సహాయత లేదు.

  • _ ఆమె సకలసంపదలతో తులతూగుతూ ఉండకపోవచ్చు. కాని నోములనీ, వ్రతాలనీ, అతిథిసత్మారాలనీ ఉన్నంతలో నలుగురికి పెట్టి తృప్తిపరచగల ఉదారబుద్ధి ఉంది.

  • _ జర్నలిస్టు భార్యగా ఆమెకు భర్తను కొంగున ముడివేసుకు తిరిగే అవకాశం దొరక్కపోవచ్చు. కాని భర్త తన వృత్తిలో ఎదుగుతుంటే ఆ ఆనందాన్ని మురిపెంగా దాచుకోగల నిండు మనస్సు ఉంది.

164 జి.యస్‌. వరదాచారి

  • _ అందరు ప్రీలకు మల్లె ఆమెకూ పట్టుచీరలు, బంగారు నగలపై మోజు ఉండవచ్చు. కాని వాటికోసం నిరర్ధకంగా తపించి బతుకు దుఃఖమయం చేసుకోకుండా పద్ధతి ప్రకారం అన్నీ సమకూర్చుకోగల ప్రజ్ఞ ఉంది.

  • మానవసహజమైన కోపతాపాలు, అలుకలు, మూగనోములు ఆమెను అంటలేదని కాదు. కాని జీవనసౌందర్యాన్ని మరింత ఆకర్షణీయం చేసే సాధనాలుగా వాటిని మలుచుకోగల యుక్తి ఉంది.

  • _ నలుగురు పిల్లలతో, వచ్చేపోయే బంధుగణంతో ఇల్లెంత హడావిడిగా ఉన్నా ప్రతిదీ పద్ధతిగా ఉండాలన్న నియమం, ఏ పనినీ వాయిదా వేయరాదన్న క్రమశిక్షణ ఆమె ఏ నాడూ వీడలేదు. పనిలో నిర్లక్ష్యాన్ని సహించలేదు.

  • ఆమె ఈ లోకం వీడి వెళ్లినప్పుడు కూడా ఆపకుండా ఈ శీర్షికను రాయడానికి ఆమె కార్యతత్చరతే కారణమైంది. మరో ఏదాదిన్నరపాటు దీన్ని నిరంతరాయంగా కొనసాగించడానికి దోహదపడింది. అందుకే “ఇలాగేనా రాయడం?” అనే ఈ పుస్తకం ఆమెకు అంకితం, కుటుంబగతవివరాలన్నీ తేపకు ఒకటి కాకుండా అన్నీ చెప్పేశాను గనుక,

ఇకపై వృత్తిపరమైన విషయాలకే పరిమితమవుతాను. నటీ | క్యా "ఈత తో యో 1.

“శత. | త

1 న నా క న్‌ా స

; గ్‌ మ! తత శశ

నా షష్టిపూర్తి సన్మానసభలో ఎం.వి. నారాయణరావు, కళాసుబ్బారావు, ఆనాటి విద్యామంత్రి పి.వి. రంగారావులతో

జ్ఞాపకాల వరద 165

న్‌ ప వ నా వష్టివూర్తి నమయంలో తీసిన మా దంవతుల ఫోటో ట్ర వ న పీ వ శే శతక మ అత నక సతయ మా పెద్దబ్బాయి శ్రీవార్ష అతని భార్చ జ్యోత్స కూతురు నవ్వ శ్రీ, కొదుకు అభినవ్‌ నన సున న మనన క వ బ్‌ పా క న న మ! అచ స్‌ ఆ లం సైనా పన ఖైనీ క. శ మా చిన్నమ్మాయి సొమ్వ వెద్ద్రమనుమరాలు నద పెద్దమ్యూయి శుభు ఆమె మనుమరాలు అంటీ నా మునిమనుమరాలు రీన్నా సౌమ్వు కూతురు (య, శుభ కోడలు నారిణివ్రీయ... 166 జి.యస్‌,. వరదాచారి

117 సం. |. .. . ఇ స నాతో మా చిన్నబ్బాయి శ్రీ వత్స, అతని భార్వ జయత్రీ, కూతుళ్లు శ్రీ మానన, శ్రీ వైష్ణవి చిన్న అల్లుడు పెద్ద అల్లుడు పెద్ద మనుమడు తిరునగరి శ్రీధర్‌ శిరిశినహళ్‌ నరసింహమూర్తి డాక్టర్‌ సుధాంశు ల ల. మ... ఇ . సష్టేం ఖమ. వాంర టా రస, ళు లు |. గు వ్‌. న |. [ యం నట హత. ॥ స. 1. వస సా మ న ల్‌" వరద నర్గాక్షరి నభకు వోజురైన మా చెల్లెలు, త , వాళ్ల కుటుంబాలు, మా విల్లలతో ప న్ను డు ల్లు జ్ఞాపకాల వరద 167

5, (శామికాభ్యుదయం 1957లో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్పుల యూనియన్‌ ఏర్పడిందని ముందు చెప్పాను. దాని తొలి అధ్యక్షుడుగా మంగళంపల్లి చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శిగా జి. రామారావు ఎన్నికైనారు. కార్యాలయం పెట్టుకోడానికి ప్రభుత్వం ఫతే మైదానం (అంటే ఇప్పుడు లాల్‌ బహాదుర్‌ స్టేడియం) లో ఒక ఖాళీ నాకా ఉంటే దాన్ని ఇచ్చింది. 150 పి. డబ్యు డి బిల్జింగ్‌, ఫతేమైదాన్‌, హైదరాబాద్‌-1 అనేది చిరునామా. అది ఇప్పుడు దేశోద్ధారక భవనం ఉన్న చోటికి దగ్గరలోనే ఉండేది. ముందు సగం వోలు. వెనుక సగంలో ఒకగది, పక్షనే బాత్‌ రూం వగైరా ఉందేవి. పత్రికాగోష్టులు, సమావేశాలు జరుపుకోడానికి, సభ్యుల కోరికపై ప్రభుత్వమే ఒక అస్పెస్టాస్‌ రేకుల షెడ్డు నిర్మించి ఇచ్చింది. దానిలో తరచుగా పథ్రికాగోష్టులు, పాత్రికేయులకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు జరుగుతుండేవి. 1960లో జర్నలిస్తుల సహకార గృహనిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను దానిలో చేరాను. దానిలో సభ్యత్వం పొందాలంటే 100 రూపాయలు వాటాధనం, ఐదు రూపాయల (ప్రవేశ రుసుము చెల్లించాలి, ఆ నాడు ఆ మొత్తం ఒకేసారి చెల్లించగలిగినంత జీతం నాతోపాటు చాలామందికి లేదు. నాలుగు వాయిదాలలో చెల్లించే సౌకర్యం కల్పించారు. చిన్న చిన్న అవసరాలను తీర్చడానికి జర్నలిస్టుల సహకార పరపతి సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నాం. క్రమంగా ఒక రేడియో, కొన్ని ఆటవస్తువులు సమకూడాయి. ఈ స్థితిలో 1963లో ప్రెస్‌ క్లబ్‌ ఏర్పాటుకు యూనియన్‌ కార్యవర్గం తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ను మేము రాష్త్రంలో జర్నలిస్టుల విభిన్నకార్యకలాపాలకోసం ఏర్పాటైన సమస్తసంఘాలకు మాతృసంస్థగా భావించేవాళ్లం. యూనియన్‌ వ్యవస్థ గురించి చెప్పాలి. దానికి అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఇద్దరు సహాయ కార్యదర్భులు, కోశాధికారి, ఏడుగురు సభ్యుల కార్యవర్గం ఉండేది. వీరిలో ప్రధానకార్యదర్శిని, సహాయ కార్యదర్భులలో ఒకరిని హైదరాబాద్‌లో పనిచేస్తున్నవారిని ఎన్నుకోవడం ఆనవాయితీగా ఉందేది. కార్యసొలభ్యం కోసం ఇది అవసరం. అలా హైదరాబాద్‌ నుంచి ఎన్నికైన యూనియన్‌ సహాయకార్యదర్శి 168 జియస్‌. వరదాచారి

పదవిరీత్యా (ప్రెస్‌ క్లబ్‌ కార్యదర్శిగా పని చేయాలని కార్యవర్గతీర్మానం. ఆ తీర్మానాన్ని అనుసరించి, నేను హైదరాబాద్‌ (ప్రెస్‌క్లబ్‌ స్థాపక కార్యదర్శినయ్యాను. యేజ్ఞర్ధం పనిచేశాను. మొదటి పనిగా క్లబ్‌లో గ్రంథాలయం స్టాపిస్తున్నామని, దానికి జర్నలిజంలో వివిధప్రకియలకు సంబంధించిన పుస్తకాలు వీలైనన్ని ఉచితంగా సరఫరా చేయాలని కోరుతూ, మద్రాసులోని అమెరికన్‌ కాన్సల్‌ జనరల్‌కు లేఖ వ్రాశాను. కొద్ది రోజుల్లోనే వారి ప్రతినిధి ఒకరు స్వయంగా వచ్చి, కట్టెడు పుస్తకాలిచ్చి, అమెరికన్‌ రిపోర్టరు, స్పాన్‌ తదితర వారి కాలికపట్రికలను క్రమం తప్పకుండా పంపుతామని హామీ ఇచ్చి వెళ్లారు. సోవియట్‌ యూనియన్‌ రాయబార కార్యాలయంవారు కూడా వారి సోవియట్‌ భూమి తెలుగు, ఆంగ్ల పత్రికలతో పాటు ప్రచురణయోగ్యంగా ఉండే వారి వార్తా బులెటిన్‌లను కూడా పంపనారంభించారు. దానితో ఒక పూర్తి స్థాయి గ్రంథాలయం ఏర్పరచాలని సంకల్పించాము. స్థానికవటత్రికలను ఉచిత ప్రతులు నరథరా చేయవలసిందిగా కోరితే, వారూ సరఫరా ప్రారంభించారు. క్రమంగా గ్రంథాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ రోజు ఉన్నట్టు ఆ నాడు అంతర్జాల సమాచార పంపిణీ వ్యవస్థలు లేవు. గ్రంథాలు, పత్రికలే అందుబాటులో ఉన్న సాధనాలు. చాలామంది సద్వినియోగ పరచుకునేవారు కూడా.

క్లబ్‌ అంటే సాయంథత్రం పూట విశ్రాంతికి, వినోదానికి నిలయమని సామాన్య భావన. ఎక్కువమందికి మందుకొట్టడమే విశ్రాంతి. పేకాటే వినోదమైపోయింది. నాకేమో వారి కుటుంబసభ్యులు కూడా అడపా దడపా కలుసుకొని పరిచయాలు పెంచుకునే అవకాశముండాలని కోరిక, ఒకసారి జూలాజికల్‌ పార్కుకు వనభోజనానికి తీనుకువెళ్లే ఏర్పాటు చేశాను. పిల్లలకు పాటలపోటీలు పెట్టాం. వాళ్లెంలో సంతోషించారు. మరొకసారి శ్రీశైలం యాత్రకు తీసుకువెళ్లాం. విద్యుత్‌శాఖ వార్తలు కవర్‌చేసే విలేఖరులు ప్రభుత్వం ఆతిథ్యమిచ్చే ఏర్పాటుచేసి తోడ్పడ్డారు. అందరూ (భ్రమరాంబా మల్లికార్జున స్వామిని దర్శించుకోవడమేగాక పాతాళగంగను, విద్యుత్‌ కేంద్రాన్నిచూసి ఎంతో సంతోషించారు. క్రమంగా క్లబ్బుకు వచ్చే సభ్యుల హాజరీ పెరిగింది. కొందరివెంట వారి జర్చలిస్టేతర మిత్రులు కూడా రావడం మొదలైంది. అప్పుడు నాకనిపించింది. క్లబ్బును స్వతంత్రప్రతిపత్తిగల వ్యవన్థగా మారిస్తే బాగుంటుందని. ప్రధానకార్యదర్శిగా ఉన్న వాడకట్టు హనుమంతరావుకు చెపితే ఆయన సరేనన్నారు. ఆయన నేతృత్వంలో నేను సభ్యుడిగా కమిటీ వేశారు. నియమావళి రూపొందించాము. అప్పటిదాకా జర్నలిస్టులకే ప్రవేశముండేది. సహాయసభ్యులని జ్ఞాపకాల వరద 169

పత్రికలలో పని చేసే అడ్వర్టయిజ్‌మెంటు సిబ్బందికీ, కంపెనీ పీఆర్వోలకు ఎన్నికలలో పోటీచేయవీలులేని సభ్యత్వావకాశం కల్పించాము. ఎన్నికలు నిర్వహించాము. తొలి అధ్యక్షుడుగా సియాసత్‌ ఉర్దూ దినపత్రిక ఎడిటరు ఆబిద్‌ అలీ ఖాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఆంధ్రభూమిలో చీఫ్‌ సభ్‌గా ఉన్న శర్మను కార్యదర్శిని చేశాం. శర్మ కొంచెం అనాసక్తుడుగా ఉంటే మేమే పూనుకొని అన్ని పనులు నిర్వహించేవారము. చాలా ఇష్టాగోష్టులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, రచయితలు, సినిమా కళాకారులు, టెక్నీషియన్స్‌తో నిర్వహించాము. అప్పటికి ఫిలిం క్రిటిక్స్‌ అసోషియేషన్‌ ఏర్పడలేదు. హైదరాబాద్‌లో సారథీ స్టూడియో ఏర్పడింది. నగరంలో సినిమా కార్యకలాపాలు పెరిగాయి. స్థానిక తెలుగు దినపటత్రికలు గోలకొండపత్రిక, ఆంధ్రజనత ఆదివారం సినిమా శీర్షికలు (ప్రవేశపెట్టాయి. శ్రీ శ్రీ, ఖ్వాజా అహమద్‌ అబ్బాస్‌ వంటి వారెందరో గోష్టులలో పాల్గొన్నారు. క్లబ్బుకు పేరువచ్చింది. భానుమతితో ఇష్ట్రాగోష్టి ఏర్పాటు చేసినపుడు సికింద్రాబాద్‌లోని జె.పి. ఎలక్షానిక్స్‌ యజమానులు తాము అప్పుడే మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న టి.వి. సెట్టును భానుమతి చేతులమీదుగా క్షబ్బుకు బహూకరిస్తామంటూ వచ్చారు. ఆ ఫొటోను వార్తగా పత్రికలకు విడుదల చేయడం తప్ప, అడ్వర్దయిజ్‌మెంట్లలో వాడరాదని షరతుపెట్టి, భానుమతి అందుకు అంగీకరించారు. ఆ వార్త ఫొటోతో సహా అన్నిపత్రికలలో ప్రముఖంగా ప్రచురణ అయింది. ఒకరోజు ప్రకటన విలువ లెక్కకట్టినా తక్కువేమీ కాదు. ఆ ఫొటోను గోడపత్రికంత పెద్దది చేయించి వారు చాలా కాలం తమ దుకాణంలో ప్రముఖంగా పెట్టుకున్నారు కూడా. వైనా దండయాత్రపై విశ్లేషణ

1962 వరకు భాయి భాయిగా ఉన్న చైనా, ఆ అక్టోబరులో మనదేశం మీద దండయాత్రకు ఒడిగట్టింది. దేశం స్వాతంత్ర్యం పొందేనాటికి ప్రవంచం రెండు సైనిక కూటములుగా చీలిపోయి ఉన్నది. తొలి భారత ప్రధాని నెహ్రూ ఏ కూటమిలోనూ చేరకుండా అలీనంగా ఉండాలన్న సరైన నిర్ణయాన్నే తీసుకున్నారు. కొత్తగా స్వతంత్రమైన చిన్న దేశాలన్నిటినీ కూడగట్టడానికి ప్రయత్నించారు. బాండుంగ్‌లో 1955లో సమావేశం ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న అతి పెద్ద దేశం చైనానూ విస్మరించ లేదు. దానితో కూడా అనాదిగా వస్తున్న స్నేహసంబంధాలను నెమరువేస్తూ పంచశీల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండొనీషియా నేత సుకర్ణో, ఈజిప్టు నేత 170 జి.యస్‌. వరదాచారి

నాసర్‌, యుగొస్తావియా నేత టిటో కలిసివచ్చారు. ఇంతలోనే చైనా టిబెట్టును కబళించింది. హిందీచీనీ భాయ్‌ భాయ్‌ నినాదం మారు మైోగుకున్నది. నెహ్రూ కల్పించుకోలేదు. తూర్పున అరుణాచల్‌తోపాటు పశ్చిమాన లద్దాఖ్‌లో మనకు చైనా సరిహద్దు దేశమైంది. తూర్పున బ్రిటిష్‌వారు పెట్టిపోయిన మక్‌మొహన్‌ రేఖ అనే నామమాత్రపు సరిహద్దు గుర్తింపు ఆనవాళ్లయినా ఉన్నాయి. పశ్చిమాన అదీ లేదు. అక్కడ అతిక్రమణలు జరుగుతు న్నాయని వార్తలు వచ్చాయి. అది పచ్చిగడ్డికూడా మొలవని (ప్రాంతమని ప్రధాని పార్లమెంటులోనే కొట్టిపారేశారు. అతిక్రమణలు ఆక్రమణలుగా మారడానికి ఎంతో సమయం పట్టదు. పార్లమెంటులో హేమాహేమీలైన ప్రతిపక్షనేతలున్నారు. తూర్పారబట్టారు. నెహ్రూ శ్రీలంక (అప్పుడు సింహళం) వెళ్తూ, చెన్నె (అప్పుడు మద్రాసు) విమానాశ్రయంలో విలేఖరులకు చిక్కారు. ఉత్తరాన అతిక్రమణలు జరుగుతుంటే మీ విదేశయాత్రేమిటని ఒకరు ప్రశ్చవేశారు. “వారిని బయటకు తోసేయమని (త్రో దెమ్‌ బెట్‌ మన సైన్యాన్ని ఆదేశించాను” అని నెహ్రూ గంభీరంగా సమాధానమిచ్చారు. దీన్ని యుద్ధప్రకటనగా చైనా భావించింది. రెచ్చిపోయింది. అదనపు సైన్యాన్ని దింపింది. అటు నేఫాలో, ఇటు లద్దాభ్‌లో చాలా లోపలివరకు చొచ్చుకువచ్చింది. పది రోజుల (ప్రత్యక్షయుద్ధం తర్వాత ఏకపక్షంగా యుద్ధవిరమణ (ప్రకటించి, ఈ గొడవకు ముందు తాము ఎక్కడున్నామో అక్కడి దాకా సేనలను ఉపసంహరిస్తున్నామని ప్రకటించి, కొత్తగా ఆక్రమించిన ప్రాంతాలనుంచి వెనక్కి వెళ్లి పోయింది.

ఈ ఘోరపరాజయం, పరాభవం మీద పార్లమెంటులో, పత్రికలలో సహజంగానే రచ్చ మొదలైంది. చర్చ దురుద్దేశపూర్వకంగా జరిగితే రచ్చ అవుతుంది. మనకు జర్నలిజంలో “వార్త పవిత్రం వ్యాఖ్య మీ ఇష్టం” అని నానుడి ఉంది. అంటే వార్తను వక్రీకరించవద్దని, వ్యాఖ్య మీ ఇష్టానుగుణంగా చేసుకోవచ్చని భావం. నేను దాన్నీ పకదృందీగా మార్చాను. వార్త ఆధారంగా చేసే వ్యాఖ్యలు కూడా సహేతుకంగా, తార్మికంగా ఉండాలన్నాను. పార్లమెంటులో, పత్రికలలో కూడా అలా ఉండటం లేదని నాకు తోచింది. నేను న్యాయమనుకున్న వాదాన్ని ఆంధ్రభూమి పాఠకులకు వినిపించాలనిపించింది. సంపాదకీయం ఆ పని ముక్తసరిగా ఎలాగూ చేస్తుంది. కొంచెం పూర్వాపరాలు వివరిస్తూ ప్రధానవ్యాసాలు వ్రాయాలనుకున్నాను. ప్రధానవ్యాసాల పరిధి ఎక్కువ. ఎడిటరు ఆమోదించారు. ప్రస్తుతపరిస్థితి: సామాన్యుని పరిశీలన అనే అంచె జ్ఞాపకాల వరద క్షే/ క్ష

శీర్షికలు పెట్టి 1) మన యుద్ధసన్నద్ధత నిజానిజాలు - కొన్ని వర్గాల ప్రచారం 2) మన తొలి పరాజయాలకు బాధ్యత ఎవరిది 3) యుద్ధతంటత్రం: రచ్చబండ చర్చ 4) కమ్యూనిస్టుల త్రిశంకు నరకం 5) మారవలసిన విధానాలేవి? అనే శీర్షికలతో ఐదు వ్యాసాలు వ్రాశాను. ముగింపు వ్యాసం సూచనలు, సలవాలతో వ్రాయాలి. కాని ఐదవ వ్యాసం వచ్చిన రోజున, గోరా ఈ ఐదువ్యాసాలలో నేను వెలిబుచ్చిన చాలా అభిప్రాయాలను ఖండిస్తూ సంపాదకీయం వ్రాశారు. సంపాదకీయాలు నిర్దిష్ట అంశంపై పత్రిక విధానాన్ని తెలుపుతాయి. ప్రధానవ్యాసాలు కూడా పేరుమోసిన సిండికేట్‌ రచయితలు వ్రాసినవి తప్ప పత్రిక విధానాన్ని వ్యతిరేకించేవిగా ఉండవు. రెంటి మధ్య వైరుధ్యం ఉండరాదు. కనుక నేను అంతటితో ఆ వ్యాసపరంపరను ఆపేశాను. మీరు వ్రాసేదేదో వ్రాయండి అని ఎడిటరు పురమాయించారు. కాని నాకే మనసొప్పక వ్రాయలేదు.

ఈ కథనం వ్రాస్తున్నప్పుడు ఆ నాటినా విషయ(ప్రతిపాదన, భాషాపాటవం ఎలా ఉందో చూద్దామనిపించి, నా దగ్గర ఉన్న పాత కత్తిరింపులను తీసి చదివాను. ముచ్చటగొలిపాయి. పాఠకులకు కొంత రుచి చూపిద్దామన్న కోరిక కూడా కలిగింది. మరో ఆలోచనా వచ్చింది. ఈ ఐదు వ్యాసాలను కలిపి లఘుపుస్తకంగా వేస్తే, కొత్త తరానికి పాత విషయాలు కొత్తగా తెలుస్తాయనిపించింది. చరిత్ర పరిశోధకులకు ఉపయుక్తంగా ఉంటుందనిపించింది. వయోధిక పాత్రికేయ సంఘం ఆ పని చేసింది. జర్నలిస్టేశరులకూ చట్ట ఫలాలు

జర్నలిస్టులకు 1959లో వేతన ట్రిబ్యునల్‌ సిఫార్సుల (ప్రకారం జీతాలు లభించడంతో, పత్రికలలో పనిచేసే జర్నలిస్టేతర సిబ్బందిలో ఆశలు అంకురించాయి. ఒక విధంగా జర్నలిస్టు నాయకులే అందుకు దోహదపడ్డారనాలి. జర్నలిస్టేతర పత్రికా సిబ్బందికీ ఒక వేతన నిర్జాయక వ్యవస్థ ఏర్పడాలంటే, వారికి జాతీయస్థాయిలో ఒక సంస్థ ఉండాలి. అందుకే వారిని కూడగట్టి ఆలిండియా న్యూస్‌ పేపర్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అనే పేరుతో జర్నలిస్టేతర పత్రికా సిబ్బంది సమాఖ్యను ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా వామవక్ష జర్నలిన్సు కవూర్‌ ఉండేవారు. (ప్రధానకార్యదర్శిగా జర్నలిప్టేతరులు ఉండేవారు, అన్ని రాష్ట్రాలలో అనుబంధశాఖలు ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రభ విలేఖరి, జర్నలిస్టు యూనియన్‌ క్రియాశీలసభ్యుడు కె. పూర్ణచంద్రరావు అధ్యక్షులుగా రాష్ట్రసమాఖ్య ఏర్పాటైంది. అంతకు ముందు పత్రికా క్షే72 జి.యస్‌. వరదాచారి

సిబ్బందికి కార్మికసంఘాలు లేవని కాదు. చాలా పత్రికలలో ఉన్నాయి. ఐతే వేజ్‌ బోర్డులో సభ్యత్వం సంపాదించాలంటే, జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ ఒకటి ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం. అప్పుడు అంటే 1969లో రెండవ వేజ్‌ బోర్డు ఏర్పాటు కోసం జర్నలిస్టులు ఉద్యమిస్తున్నారు. కనుక అత్యవసరంగా జర్నలిస్టేతర సిబ్బంది సమాఖ్య రూపకల్పనకు నడుంకట్టవలసి వచ్చింది.

ఆంధ్రభూమి యాజమాన్నానికే చెందిన దక్కన్‌ క్రానికల్‌లో ఐఎన్‌టియుసి నాయకత్వంలో బలమైన కార్మికసంఘం ఉందేది. భూమి సిబ్బంది అంటే కంపోజిటర్లు తమకో యూనియన్‌ ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. సికిందరాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుడు, బలహీనవర్షాల ప్రతినిధి, లా విద్యార్థి అయిన జి.ఎం. అంజయ్యను అధ్యక్షుడుగా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. నా సలవి కోసం వచ్చారు. నేను అప్పుడు జర్నలిస్టు యూనియన్‌ సహాయకార్యదర్శిగా ఉన్నాను. అంజయ్య ఆ నాడు వార్తలలో వ్యక్తిగా ఉన్నాడు. కంటోన్మెంట్‌ బోర్డు సమావేశంలో చైర్మన్‌ ట్రిగేడియర్‌ సయీద్‌ మీద కోడిగుడ్లు విసిరి వార్తకెక్కాదు. లోహియా సోషలిస్టు. అలాటి వ్యక్తి నాయకత్వంలో యూనియన్‌ ఉంటే చిక్కుల్లో పడవచ్చుననిపించింది. కాని అతడిని వద్దంటే కొత్త చిక్కులు రావచ్చు. పేరున్న వ్యక్తి. ఉపయోగపడుతాడు. నాకొక ఉపాయం తోచింది. అధ్యక్షుడుగా కాక, అంతకుపైన సలహాదారుగా పెట్టుకొమ్మన్నాను. అధ్యక్షుడుగా మన దగ్గరే సబ్‌ ఎడిటరుగా పని చేస్తున్న సంతపురి రఘువీరరావును పెట్టుకొంటే, ఈయనా సోషరిస్టే, ఇద్దరూ మంచిమిత్రులే గనుక కలిసి పనిచేస్తారన్నాను. వారు అప్పుడు గుడిసెల ఉద్యమం నడుపుతున్నారు. ఇప్పుడు జూబిలీ బస్‌ స్టేషన్‌ ఉన్న ప్రాంతం కంటోన్మెంట్‌ పార్కులో భాగంగా ఉండేది. తలదాచుకోడానికి గూడు లేనప్పుడు పార్కులెందుకని అక్కడ బడుగువర్ణాల చేత గుడిసెలు వేయించారు. తామూ ఆ గుడిసెలలో ఉంటున్న విషయం గుర్తుచేశాను. కాబోయే ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరుకు నా సలహానచ్చింది. ఈయన మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఆయన సహాయం అందుబాటులో ఉంటుంది. అలాగే కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అంజయ్య తర్వాత కాలంలో లాయరుగా పేరు తెచ్చుకున్నాడు. నాకు మంచి మిత్రుడయ్యాడు. లాయర్ల సమావేశాలలో సైతం కలిని పాల్గొన్నాం. దారి తప్పితే చెప్పాలి

ఒక ఉదంతం జ్ఞాపకం వస్తున్నది. ముస్లిం లాయర్లు కొందరు సంఘం పెట్టుకున్నారు. దానికి ముస్లిం లాయర్స్‌ ఫోరం అని పేరు పెట్టుకున్నారు. దాని జ్ఞాపకాల వరద 178

ప్రారంభోత్సవ సభను బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్షబ్బులో ఏర్పాటు చేశారు. నాకు సిటీ కాలేజీలో సీనియరు, తర్వాత ప్రసిద్ధ లాయరు అయిన గురునాథ ప్రసాద్‌ సళ్ఫేనా ముఖ్య అతిథి. అంజయ్య మరో అతిథి. మా సినీగోయర్స్‌ కార్యదర్శి బి. కిషన్‌ తనతో కలిసి ప్రాక్టీసుచేస్తున్న ముస్సిం అడ్వొకేటు వెంటవచ్చి బలవంతపెడితే, నేను పాల్గొనడానికి ఒప్పుకున్నాను. ప్రసంగాలు మొదలయ్యాయి. అందరూ బడుగు బలహీన మైనారిటీ వర్గాలు అంటూ ముగ్గురి సమస్యలు ఒకటే అయినట్టు గంభీరంగా మాట్లాడారు. నా వంకు వచ్చింది. నేను ఉర్దూలో ఎత్తుకున్నాను. ముస్లిం లాయర్స్‌ ఫోరం అన్న పేరే నాకు అర్ధం కాలేదన్నాను. “అంటే మీరు కేవలం ముస్లింల కేసులే తీసుకుంటారా, లేదంటే షరియత్‌ కేసులే పదుతారా?” అని అడిగాను. సభలో ఉన్నవారిలో చాలామంది కాదు కాదు అని ప్రతిస్పందించారు. “మరి జనానికి అదే అనుమానం వచ్చి మీ దగ్గరికి రావడానికి సంకోచిస్తారేమో ఆలోచించండి” అన్నాను. దాక్టర్లలాగే లాయర్లకు వృత్తి కుశలత ముఖ్యంగాని కులం, మతం కాదు. ఇటువంటి పేర్లు పెట్టుకుంటే లాభమా నష్టమా అన్నది ఆలోచించాలన్నాను. ప్రధానస్రవంతిలో ఉండే లాభాల గురించి వివరించాను. సభ అయిపోయిన తర్వాత చాలామంది లాయర్లు నా చుట్టూ మూగారు. చాలా మంచిమాట చెప్పారని అభినందించారు. ఆ ఫోరం కార్యకలాపాల గురించి మళ్లీ ఎక్కడా ఏమీ వినబడలేదు. ఏదైనా అవాంఛనీయ పరిణామం రూపుదిద్దు కుంటున్నప్పుడు మనకెందుకులే అని ఊరుకోగూడదు. సత్యం (బూయాళ్‌, ప్రియం బ్రూయాత్‌ అనే సూత్రాన్ని పాటించి అది సరికాదని చెప్పాలి. అదీ ప్రియంగా చెప్పాలి. నీతి బోధిస్తున్నట్టు కాకుండా మిత్రవాక్యంగా చెప్పాలి. నేను ఈ సూత్రాన్ని పాటించిన మరొక సంఘటన, తర్వాత ఎప్పుడో జరిగింది. దాని గురించి ఇక్కడే చెబుతాను. నిజామాబాద్‌లో జర్నలిస్టుల సభ ఏదో జరిగింది. మున్సిఫ్‌ ఎడిటర్‌ మహమూద్‌ అన్సారీని, నన్ను అతిథులుగా పిలిచారు. అన్సారీ కారులోనే ఇద్దరమూ వెళ్లాము. ఇద్దరికీ హోటల్‌లో ఒకే గది ఇచ్చారు. అన్సారీ సియాసత్‌ పత్రికలో జర్పలిస్టుగా ప్రారంభించాడు. తర్వాత స్వంతంగా మున్సిఫ్‌ పెట్టాడు. జాతీయ భావాలు కలవాడే. కాని వథత్రికను నిలబెట్టుకోడానికి మునిం సామాజికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాడు. నేనంటే అభిమానం. నేను ఆంధ్రభూమి వదిలి బయటకు వచ్చినపుడు స్వంత దినపత్రిక పెడదామని ఆలోచించాను. (ప్రెస్‌ కొనడం గురించి సలహాకు వెళ్లాను. అప్పటికే ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ యంత్రాలు దేశంలో తయారైనవి అందుబాటులో ఉన్నాయి. కాని పత్రిక నిలదొక్కుకునే క్షే7త్త జి.యస్‌. వరదాచారి

వరకు (ప్రెస్సు కొనడం వద్దన్నాడు. తన (ైస్సులో యేదాది పాటు పత్రికను ఉద్దెరకు అంటే అరువుగా అచ్చువేసి పెడతానన్నాడు కూడా. అది ్రస్తుతాంశం కాదు. జర్నలిస్టుల సభ ముగిశాక హోటల్‌కు వచ్చి బ్యాగు సర్దుకున్నాను. స్థానిక మజ్లిసె ఇత్తెహాదుల్‌ ముస్తిమీన్‌ నాయకులు వచ్చారు. అన్సారీ వారి సభలో ప్రసంగించడానికి ఆవ్వానిస్తే ఒప్పుకున్నాడట. ఒక గంటలో పూర్తి చేసుకొని పోదామన్నాడు. సరే వెళ్లిరమ్మన్నాను. కాని ఆయన వారి నాయకుడిని పక్కకు తీసుకువెళ్లి నన్ను సభకు ఆహ్వానించమని చెప్పినట్టున్నాడు. ఆయన నావద్దకు వచ్చి “ఒక్కరూ గదిలో కూర్చొని ఏం చేస్తారు? మీరూ రండి” అని పిలిచాడు. సరే సంగతేమిటో చూద్దామని వెళ్లాను. మేము సభాస్థలికి చేరేసరికి సాయంకాల నమాజు సమయం అయింది. నమాజుచేసి సభ మొదలు పెడదామని వారంటే అన్సారీ నావైపు చూశాడు. నేను ఉర్దూలో “మీరు మీవిధి నిర్వర్తించుకొండి. నాకేమి ఇబ్బందిలే”దన్నాను.

ఇలాటిదే మరో అనుభవం చెప్పాలి. నా ఇల్లు కట్టిన గుత్తేదారు గనీ సాహెబు. ఒకరోజు సాయంకాలం మా ఇంట్లో నాతో ముచ్చటిస్తూ రెండుసార్లు గడియారం చూశాడు. మూడోసారి నేనిప్పుడు వెళ్లి అరగంటలో వస్తానని లేచాడు. “నేను నమాజు చదువడానికా?” అని అడిగి “మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే చదువుకోవచ్చు” నన్నాను. “మీ ఇంట్లో చదువవచ్చా?” అనడిగాడు. “దైవ ప్రార్ధనచేయడానికి అభ్యంతరమేమిటి, దానివల్ల వచ్చే పుణ్యంలో నాకూ కొంత దక్కుతుందన్నాను. ఆయన ముగ్గుడైపోయాడు.

నిజామాబాద్‌ సభగురించి చెపుతున్నా గదా. నమాజు తర్వాత సభ మొదలైంది. అతిథులను వేదిక మీదికి పిలిచారు. అన్సారీ నలహాపై నన్నూ పిలిచారు. వెళ్లికూర్చున్నాను. చాలామంది మాట్లాడారు. కొందరు వయోధికులు విషం కక్ళారు. అన్సారీ మృదువుగానే మాట్లాడాడు. నన్ను మాట్లాడమన్నారు. సరేనని లేచాను. సభలో చాలా మంది యువకులున్నారు. వారికి నాలుగు మంచి మాటలు చెప్పాలనిపించింది. ఉర్పూలో మాట్లాడితే ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని ఆ భాషలో ఎత్తుకున్నాను. వివాదాస్పద అంశాల జోలికిపోలేదు. యువతకు పత్రికారంగంలో, తెలుగు పత్రికలతోసహా చాలా అవకాశాలు ఉన్నాయన్నాను. ముస్లిం యువకులు పలువురు తెలుగులో చక్కని కవిత్వం, కథలు వ్రాస్తున్నారన్నాను. మా ఈనాడు పత్రికలోనే సలీమ్‌, రజాహుసేన్‌, కరీమ్‌ ముగ్గురు సీనియర్‌ పదవులలో ఉన్నారన్నాను. కావలసినదల్లా విషయావగాహన. భాషాసామర్థ్యం. తెలుగు రాకపోతే తెలుగు పత్రికలో జ్ఞాపకాల వరద 175

ఉద్యోగమెలా వస్తుంది? సభ తర్వాత యువకులు నా చుట్టూ మూగారు. నేను తెలుగు బగా వ్రాస్తానంటూ వివరణలు ఇచ్చారు. సాధారణంగా ముస్లిములు ఏ వయసువారైనా మతంకంటే గొప్పదేదీ ఉండదని నమ్ముతారు. మతవిశ్వాసొలకు విఘాతం కలుగకుండా సమాజంలో కలిసిఐతుకవచ్చునన్న స్పృహ వారిలో కలిగించాలి. కష్టమైన పనే. అయినా ప్రయత్నిస్తూనే ఉండాలి. దక్కన్‌ క్రానికల్‌లో బలమైన కార్మికసంఘం ఉందని చెప్పాను. దానికి చాలా కాలం ఐఎన్‌టియుసి అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి అధ్యక్షుడుగా ఉండేవాడు. ఆయన పనితీరు, ఆయనలాగే ఇతరవృత్తి కార్మికనాయకుల పనితీరు గురించి కొంత చెప్పుకోవాలి. ఒక పరిశమలోకాని, కార్యాలయంలోకాని ఉద్యోగికాకుండా అక్కడి సంఘంలో నాయకత్వ బాధ్యతలు నిర్వహించేవారిని వృత్తికార్మికనాయకులు అంటారు. _ వారు కార్మికుల శ్రేయస్సుకోసం పాటుపడుతారు. ఏ సమస్య వచ్చినా యాజమాన్యంతో సంప్రదించి పరిష్కరిస్తారు. వీరు సాధారణంగా లౌక్యం, చట్టం తెలిసినవారై ఉంటారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంవీలుగా పలుకుబడిగల హోదాలలో ఉండవచ్చు. స్వామికార్యంతోపాటు స్వకార్యము చక్కబెట్టుకోగల సమర్భులై ఉంటారు. సంజీవరెడ్డి ప్రతి సంవత్సరం ఉద్యోగులకు ఎంతో కొంత ఆర్థికలాభం చేకూరేట్టు చూసేవాడు. అందుకు ఉద్యోగులు ఆయనకు విధేయులై ఉండేవారు. జర్చలిస్టుల సమస్యలు ఆయన పరిధిలోకి రాకున్నా జర్నలిస్టులకూ వర్తించే బోనస్‌ నిర్ణయంలో ఆయన ప్రమేయం ఉండేది. ఆంధ్రభూమికి లాభాలు లేవు. గనుక నిర్బంధ కనీస బోనస్‌ వర్తించేది. కనీస బోనస్‌ను నిర్భంధం చేసినప్పుడే కేంద్రప్రభుత్వం బోనసుకు గరిస్టపరిమితి విధించింది. అయితే పరిమితి ఉన్నా, దాన్ని మించి బోనస్‌ నేను సాధించి చూపుకానని తిరువనంతపురంలో జరిగిన ఐఎన్‌టియుసి సమావేశంలో సంజీవరెడ్డి సవాలు విసిరారు. అలాగే దక్కన్‌ క్రానికల్‌లో 20 శాతం పైన ఎక్స్‌గ్రేషియా పేరిట అదనంగా సాధించారు. ఆంధ్రభూమి సిబ్బందికి కూడా కనీస బోనస్‌ మీద ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియా బేరమాడేవాడు. ఇలాటి విషయాలు మాట్లాడటానికి వెళ్లేముందు జర్నలిస్టు యూనియన్‌ నాయకత్వంలో ఉన్నందున తప్పనిసరిగా నన్ను కలిసేవాడు. నేను (ప్రతిసారీ ఎక్స్‌గ్రేషియా ఏకమొత్తంగా కాకుండా శాతంగా నిర్ణయించమని సూచించేవాడిని. సరేనని వెళ్లేవాడు. శాతం చొప్పునైతే ఎక్కువ జీతం ఉన్నవారికి కొంత ఎక్కువ మొత్తం వస్తుందని ఆశ. కాని ఏకమొత్తంగానే పరిష్కారం చేసేవాడు. అలా అయికేనే చిన్న జీతాలవారికి కొంత ఎక్కువ మొత్తం చేతిలో పడుతుంది. 176 జి.యస్‌. వరదాచారి

ఆంధ్రభూమికి కూడా ఇవే సూత్రాలు వర్తించేవి. ఫలితంగా ఆంధ్రభూమి సిబ్బంది సంఘం కూడా కొద్దికాలం తర్వాత సంజీవరెడ్డి నేతృత్వంలోకి వెళ్లిపోయింది. వేజ్‌ బోర్డు ముందు సాక్ష్యం

ఆళించినట్టుగానే 1968 చివరన జస్టిస్‌ జి. కె. షిందే అధ్యక్షుడుగా జర్చలిస్టులతో పాటు నాన్‌ జర్నలిస్టులకు కూడా వేతనమండలి ఏర్పాటైంది. గ్రామీణవిలేఖరులు అతిపెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి గనుక వేతనమండలికి సమర్పించే నివేదికలో గ్రామీణ విలేఖరుల స్థితిగతులు వారి అవసరాల గురించిన సమగ్రవివరాలను పొందుపరచే బాధ్యతను సమాఖ్య రాష్ట్రయూనియన్‌కు అప్పగించింది. అప్పుడు ఐఎఫ్‌డబ్యుజె ప్రధాన కార్యదర్శిగా ఉన్న మీనాక్షి సుందరం హైదరాబాద్‌కు వచ్చి, వేతనమండలికి సమర్పించబోయే మెమొరాండం స్వరూప స్వభావాలను, గ్రామీణవిలేఖరుల అధ్యాయం విషయపరిధిని వివరించారు. మా యూనియన్‌కు చాలాసార్లు అధ్యక్షుడుగా పనిచేసిన మంగళంపల్లి చంద్రశేఖరం అనుభవం మాకు కొండంత బలంగా ఉండింది. అందువల్ల.సమగ్రమైన నివేదికను సిద్ధం చేయగలిగాము. వేతనమండలి ముందు సాక్ష్యమిచ్చిన యూనియన్‌ బృందానికి ప్రధాన కార్యదర్శిగా నేనే సారథ్యం వహించాను. గ్రామీణ విలేఖరులకు రెగ్యులర్‌ విలేఖరులకు ఇచ్చే జీతంలో మూడోవంతు ఇవ్వాలని ప్రతిపాదించాము. సామాన్యంగా గ్రామీణ విలేఖరులు స్థానికంగా ఒక తెలుగు, మరో ఇంగ్లీషు పత్రికతో బాటు మరో జాతీయస్థాయి ఇంగ్లీషు పట్రికలో పనిచేసేవారు. మూడు పత్రికలూ మూడోవంతు చొప్పున ఇస్తే పూర్తికాల ఉద్యోగికి దొరికే వేతనంతో సరిపోతుందని మా వాదన.

ఐకే ప్రత్యక్ష నివేదనలో మేము గ్రామీణ విలేఖరుల వరకే పరిమితం కాలేదు. పత్రికలలో పనిచేసే సబ్‌ ఎడిటర్లు, న్యూస్‌ ఎడిటర్లు, ఎడిటర్లకు యూనివర్సిటీలలో లెక్సరర్లు, రీడర్లు, ప్రొఫెసర్ల స్థాయి వేతనాలివ్వాలని నేను సూచించాను. ఆ స్థాయి వేతనాలివ్వడాన్ని ఎలా సమర్దిస్తారని మండలివారు అడిగారు. సాధారణంగా ఏ డిగ్రీయో, డాక్టరేటో సంపాదించడంతో నియతవిద్య ముగుస్తుందనీ, అనియత విద్యమాత్రం పత్రికల ద్వారా యావజ్జీవితం కొనసాగుతూ ఉంటుందనీ, అందుచేత పత్రికలలోకి ఆ స్థాయాయోగ్యతలు కలవారు రావడాన్ని ప్రోత్సహించడానికి ఆ స్థాయి జీతాలివ్వాలన్నాను. వాదన బాగానే ఉందని మండలి సభ్యులు నవ్వారు. నాకీ ఆలోచన రావడానికి కారణం చెప్పాలి. కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో జరిగిన ఒకసభలో అప్పటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎం. టి. రాజు తమ ప్రసంగంలో ఈ నియత, జ్ఞాపకాల వరద క్షై/7

అనియత విద్య గురించి చెప్పారు. అది నాకు బాగా జ్ఞాపకముండిపోయింది. దాన్ని వేతనాలకు అన్వయించి చెప్పాను. షిందే వేజ్‌ బోర్డు 1966లో జర్నలిస్టుల వేతన సిఫార్సులను, 1967లో జర్నలిస్టేతర సిబ్బంది వేతన సిఫార్సులను సమర్పించింది. కాని అవి జర్నలిస్పులను అసంతృప్తికి గురిచేశాయి. నాన్‌ జర్నలిస్టుల వేతన సిఫార్సులనైతే చట్టబద్ధత లేదని ఎవరూ పట్టించుకోనేలేదు. పన్నెండేళ్ల తర్వాత పాలేకర్‌ వేతనమండలి గ్రామీణ విలేఖరులకు రెగ్యులర్‌ స్కేలులో మూడోవంతు ఇవ్వాలన్న సిఫార్సును తన నివేదికలో పొందుపరచింది. పాలేకర్‌ విప్లవాత్మకమనదగిన సిఫార్సులు ఇంకా చాలా చేశారు. పత్రికల వర్గీకరణసూత్రాన్ని మార్చారు. వేతనాలు గణనీయంగా పెంచారు. పట్టువీడని కార్మికసంఘాలు వాటి అమలుకోసం గట్టిగా పోరాడాయి. చాలా చోట్ల అవి అమలయ్యాయి. దానికి కొంతవరకు చట్ట సవరణ కూడా దోహదపడింది. పాలేకర్‌ వేతన మండలి నియామకానికి యేదాది ముందే, 1974లో కేంద్ర ప్రభుత్వం వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టంలో వేతన నిర్ణయానికి సంబంధించిన 18వ ఆర్షికల్‌లో నాన్‌ జర్నలిస్టులకు వర్తించే అదనపు క్లాజులు చేరుస్తూ సవరణలు చేసింది. దానితో సిబ్బంది సంఘాలకు బలం చేకూరింది. ప్రతిభకు ప్రోత్సాహం

ఏ సంస్థలోనైనా యజమాని నుంచి గేటువద్ద నిలబడే కాపలాదారు వరకు అంతా ఒక కుటుంబం అన్న భావన ఉంటే పారిశ్రామికశాంతి వెల్లివిరుస్తుంది. అట్లా భావించే అభ్యుదయభావాలుగల పారితశ్రామికులలో విజయవంతంగా సంస్థలు నడుపుతున్నవారెందరో ఉంటారు. వారిని అందుకు ఉద్యుక్తులను చేసే సలహాదారులు ఉంటారు. చిన్న స్థాయిలోనే అయినా అలాంటి బాధ్యత నిర్వహించే అవకాశం నాకూ దక్కింది. నేనెప్పుడూ, ఒక వృత్తిలో ఉందేవారు ఎప్పటికప్పుడు తమ వృత్తినైపుణ్యాన్ని పెంచుకోవాలని సలహా ఇస్తుంటాను. ఆంధ్రభూమిలో సబ్‌ ఎడిటరుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం డిగ్రీ కోర్సులో చేరుతానని, అనుమతి ఇప్పించాలని ముందుకు వచ్చాడు. ఏడాది కోర్సు. ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం రెండు వరకు తరగతులుండేవి. ఆయన హాజరవడానికి వీలుగా పది నెలలపాటు ఆయనకు మొదటి అంటే ఉదయపు షివ్పులో ద్యూటీ వేయకుండా మధ్యాహ్నం, రాత్రి షిష్టలలోనే వేసి, డిగ్రీ పూర్తిచేసే వీలు కల్పించాము. నేను అంఠటీలో ఆగలేదు. వృత్తిసంబంధమైన అదనపుయోగ్యత సంపాదించినందుకు, ఆయనకు రెండు ఇన్‌క్రిమెంట్లు ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టాను. యజమానులలో ఒకరు “మనమే 178 జి.యస్‌. వరదాచారి

చదువుకునే అవకాశం ఇచ్చి ఇన్‌క్రిమెంటు కూడా ఇవ్వాలా?” అన్నాడు. “మనసహాయంతో ఆయన అదనపుయోగ్యత సంపాదించాడు నిజమే. దానితో వేరేచోట ఉద్యోగం సంపాదించుకొంటే మనకేం లాభం? ఆ ప్రయోజనం మనకే చెందాలంటే ఏదో ప్రోత్సాహం ఉండాలన్నాను. అంగీకరించారు. ఇది చూసి క్రానికల్‌లో పనిచేసే ఇద్దరు ప్రూఫ్‌రీడర్లు జర్చలిజం డిగ్రీచేశారు. వారికీ రెండు ఇన్‌క్రిమెంట్ల ప్రోత్సాహకం ఇప్పించాము. అదొక సంప్రదాయమైంది. అలాటివారిలో ఒకరైన మానిక్‌ సింగ్‌ వర్మ ప్రమోషన్లు పొంది, చివరకు క్రానికల్‌ వైజాగ్‌ ఎడిషన్‌లో రెసిడెంట్‌ ఎడిటరుగా రివైరయాడు.

వృత్తిసంబంధమైన విషయాలలోనే కాదు, వ్యక్తిగత తప్పులవల్ల ఇబ్బందులలో పడిన ఇద్దరు జర్నలిస్టులకు యాజమాన్యం చేత సహాయమిప్పించిన రెండు సంఘటనల గురించి చెపుతాను. ఒకరోజు మధ్యాహ్నం మారెడ్‌పల్లి పోలీసు సబ్‌ ఇనస్పెక్టర్‌ వచ్చాడు. ఆయన వెంట ఒక లాయరు కూడాజన్నారు. ఆర్‌.వి.బి, శర్మను అరెస్టు చేయడానికి వచ్చామన్నారు. ఏం నేరం చేశాడని అడిగాను. నేరం కాదండి ఇది నివిల్‌ ఇంప్రిజన్‌మెంట్‌ కేసు అని చెప్పాడు. శర్మ కలకత్తాకు చెందిన స్టాండర్డ్‌ లిటరేచర్‌ కంపెనీనుండి వాయిదాల పద్ధతిలో ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా కొన్నాడట. వాయిదాలు కట్టలేదు. నోటీసులకు సమాధానమివ్వడు. దావా వేసినా పబ్టించుకోడు. సివిల్‌ అరెస్టుకు వారంటు తెచ్చారు. శర్మ చీఫ్‌ సబ్‌ ఎడిటరుగా పని చేస్తున్నాడు. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగాను. కోర్టు సమయం ముగిసే లోపల సగం డబ్బయినా కడితే, జడ్జిగారి అనుమతి తీసుకొని అరెస్టు ఆపేస్తామన్నారు. “సివిల్‌ కేసులో ఎవరినైనా జైలుకు పంపాలంటే దావావేసి గెలిచినవారు జైలులో ఖైదీపై ప్రభుత్వంచేసే ఖర్చులు భరించాలి. ఆ గొడవ లేకుండా మా దబ్బు మాకు వస్తే చాలూ అని వెంటవచ్చిన లాయరు అన్నాడు. సగం డబ్బయినా కట్టడం మా వల్ల అయ్యేపని కాదు. యజమాని దగ్గరకు వెళ్లాను. కుటుంబపెద్దగా మీరే ఆదుకోవాలన్నాను. నెలకింత జీతంలో మినహాయించుకోండన్నాను. మొదట విసుక్కున్నా క్యాషియర్‌కు చెప్పి డబ్బులిప్పించారు. శర్మకు అరెస్టు గండం అట్లాతప్పింది.

ఇలాగే కర్రా కృష్ణమూర్తి అనే (ప్రూఫ్‌ రీడర్‌ను ఆదుకున్నాము. రైల్లో ఆడవాళ్ల పెట్టెలో ఎక్కినందుకు అతనికి 50 రూపాయల జుర్మానా పడింది. తనలాగే శిక్షపడిన మరో వ్యక్తి జుర్మానా కట్టి విడుదలై పోతుంటే, బతిమాలి ఆయనద్వారా నాకు కబురంపాడు. నాలుగు గంటలలోపు రైల్వే మేజిస్టేట్‌ కోర్టులో సైను కట్టకపోతే జైలుకు పంపుతారు. రైలు కదులుతుంటే దగ్గరున్న పెట్టెలో చూసుకోకుండా ఎక్కానంటే ఎవరు జ్ఞాపకాల వరద 179

నమ్ముతారు? అప్పుడు మేమెవరమూ 50 రూపాయలు ఇవ్వగల స్థితిలో లేము. యజమానులే దిక్కు ఇచ్చారు. రైల్వే కోర్టుకు మా సిబ్బంది సంఘం నాయకుడు వెళ్లి విడిపించుకువచ్చాడు. ఇవి కార్మికసంఘం విధులుకావు. మానవసంబంధాలలో భాగాలు. సాటి ఉద్యోగి కష్టాలలో ఉంటే కుటుంబ భావన గలవారం చూస్తూ ఊరుకోలేం గదా! ఇంగ్లీషు తెచ్చిన తంటా 1968లో పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఆంధ్రభూమికి అప్పటికి విడిగా విలేఖరులు లేరు. దక్కన్‌ క్రానికల్‌ విలేఖరులు తాము కవర్‌ చేసిన 'ప్రతివార్త కార్బన్‌ కాపీ ఒకటి ఆంధ్రభూమికి ఇచ్చేవారు. దాన్ని తెలుగులో వ్రాసుకొని ఆంధ్రభూమిలో ప్రచురించేవాళ్లం. ఇంగ్లీషులో వ్రాసే విలేఖరులు సాంకేతికపదజాలం అర్ధాన్నికాని, పేర్ల ఉచ్చారణను కాని ఆ వార్త చెప్పినవారిని అడిగితెలుసుకోవచ్చు. ఆ అవస్థ ఏదో పాఠకుడి నెత్తిమీదికి తోసీయడం అలవాటైపోయింది. తెలుగుపత్రికకు తెలుగులో వార్త ఇచ్చే విలేఖరి లేకపోతే ఆ బాధ సబ్‌ ఎడిటరు నెత్తికి చుట్టుకుంటుంది. అర్భాలైతే వారు వెతుక్కుంటారు. పేర్లు తెలుగులో ఎట్లా వ్రాయాలి? మనకు అలవాటైన పేర్లయితే సరే. రామ, రమాలను ఆడా మగా తెలిస్తే సరిగానే వ్రాసుకుంటాము. కాని విదేశీయుల పేర్లు ఇంగ్లీషు (రోమన్‌) లిపిలో ఉచ్చరించని అక్షరాలెన్నో పెట్టీ వ్రాస్తుంటారు. మన సంప్రదాయమేమో వ్రాసిన ప్రతిఅక్షరాన్ని ఉచ్చరించాలన్నదాయె. వారు ఏదో వ్రాస్తారు. ఏదో పలుకుతారు. ఇది ప్రాంతీయభాషాపద్రికలను పీడిస్తున్న పెద్ద సమస్య. ఇంగ్లీషు అక్షరక్రమాన్ని బట్టి వ్యక్తుల, ఊళ్ల, దేశాల పేర్లను తప్పుగా (వ్రాస్తున్నాము. మన ప్రధానమంత్రి పేరునే మోదీ అనికాక మోడీ అని పలుకుతూ వచ్చాము. నేనే పనిగట్టుకుని మీడియా ప్రతినిధుల సమావేశాలలో చెప్పి మీడియా సంస్థలవారికి లేఖలు వ్రాసి చివరకు నిష్ణూరాలాడి మార్చించాను. ఇప్పటికీ కొందరు మోడీ అనే వ్రాస్తున్నారు. వెంకయ్యనాయుడు వంటివారు మోడీ అనే పలుకుతున్నారు. మీడియా ప్రభావం వల్లనే. తెలుగు మీడియాలోనే ఇలాటి తప్పులు ఎక్కువ జరుగుతుండటం మనకు బాధాకరమైన విషయం. ఈ కథంతా చెప్పడానికి కారణం, అరవై ఏళ్ల నుంచీ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నదని చెప్పడమే! దీన్ని ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చిన వార్త గురించి చెపుతాను. నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో జైనుల కాలం మంటపాలు బయటపడ్డాయి. మట్టిదిబ్బను జనం 180 జి.యస్‌. వరదాచారి

తవ్వుతుంటే కట్టడం కనబడింది పురాతత్త్వశాఖ వారు వెళ్లి తవ్వకాలు జరపగా, మంటపాలు వెలికి వచ్చాయి ఎన్నో ఏళ్లు పూర్తిగా మట్టిలో పూడుకుపోయి ఉన్నా, అవి గచ్చుతో నిర్మించినవి అయినందువల్ల చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆ శాఖ డైరెక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు విలేఖరుల గోష్టిలో చెప్పారు గచ్చుకు సామాన్య ఇంగ్లీషు పదం వాడక ఆయన లాటిన్‌ శాస్త్రీయనామం వాడారు ఆ వార్త వ్రాస్తున్న సబ్‌ ఎడిటరు దాని అర్ధంకోసం డిక్షనరీ చూస్తే ఆ మాటలేదు నన్నడిగితే నాకూ తెలియదు వార్త వ్రాసిన విలేఖరిని అడుగుదామంటే అతను వెళ్లిపోయాడు గోరాశాస్త్రి ఇంగ్లీషు బాగా వచ్చినవారు ఆయనను అడిగితే తనకూ తెలియదని, ఇలాటివి గోపాలశాప్రిని అడిగితే చెపుతాడని, ఆయన దగ్గర లాటిన్‌ డిక్షనరీ ఉంటుందన్నారు గొట్టు మాటలు వదిలేసి వార్త వ్రాయవచ్చు కాని ఈ వార్తకు అదే జీవం ఏళ్ల తరబడి మట్టిలో పూడుకుపోయి. ఉన్న కట్టడాలు చీపురు ఆడిస్తే తళతళలాడుతూ నిలబడ్డాయంటే, వాటిని దేనితో నిర్మించారో చెపితేనే కదా మన ప్రాచీనుల గృహనిర్మాణ కౌశలం బయటపడేది! జర్నలిజంలో “వెన్‌ ఇన్‌ డౌట్‌ కట్‌ జెట్‌ అని ఓ నానుడి ఉంది కాని దానికిముందు ఫైండ్‌ బెట్‌ అని కూడా అన్నారు. ఈ వార్తలో గచ్చు ఎట్టి పరిస్థితిలోనూ వదల వీలులేనిది రెండు గంటలు వెచ్చించాము. ఇంతలో ఆ విలేఖరి వచ్చాడు ఏమిటీ మాటకు అర్థమని అడిగితే తనకూ తెలియదన్నాడు పక్కన ఓ తెలుగు పత్రిక ఉంది విషయం చెపుతున్నది తెలుగువాడు గోష్టి ముగిశాక అడుగవచ్చు. ఫోను నంబరు ఇవ్వు, “నేనడుగుతా” అని విసుక్కున్నాను ఫోనుచేసి అడిగిే పుట్టపర్తివారు 'అదా? గచ్చు” అని నవ్వేశారు అపూర్వ అవకాశం

ఈ ఒక్క కారణంచేత కాదుగాని ముఖ్యంగా అత్యంతప్రముఖుల కార్యక్రమాలు జరిగినప్పుడు, వీలైనంత వరకు నేను స్వయంగా వెళ్లి ఆ వార్త వ్రాసేవొడిని నేను మొట్టమొదటగా ఉద్యోగంలో చేరిన కొత్తలో రాష్ట్రపతి బీదరు పర్యటన గురించిన వార్తను అలా (వ్రాశాను 1963లో పోచంపాడు ప్రాజెక్టుకు ప్రధాని జవాహర్‌ లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఇది మా ఆరమూరు (ఆర్మూరు) తాలూకాలో జరుగుతున్నది అలాటి చారిత్రకసంఘటనలో పాల్గొనాలనే సహజకుతూహలంతో ఎడిటరు అనుమతి తీసుకొని నేను వెళ్లాను జర్నలిస్టులను ఆర్‌టిసి బస్సులో తీసుకువెళ్లారు పొద్దున్నే శంకుస్థాపన యుప ఐ వార్తాసంస్థ తరఫున సీతారామ్‌ వచ్చారు నాకు ఆయన అవసరమైన సలహాలు ఇచ్చారు అప్పుడు ఆయన పక్కన ఉ జ్ఞాపకాల వరద 181

=. ళ్‌ జ న న. సట ? " తొలి భారత రాస్ట్రవతి బాబూ రాజేంద్రప్రసాద్‌ 1956లో దక్షిణాది మకాం సందర్భంగా బీదరు వర్వటనకు వ్లోనవుడు వెంట వ్లోన వ(త్రికా విలేఖరుల బృందంలో ఒకనిగా

న్నాడంటేనే అదొక ధైర్యం. శంకుస్థాపన, ప్రధాని ప్రసంగం తర్వాత సభాస్థలం పక్శనే భోజనాలు ఏర్పాటు చేశారు. జర్నలిస్టులకు సామాన్యంగా అత్యంతప్రముఖులకు దగ్గరలో భోజన ఏర్పాట్లు చేస్తారు. పళ్లెంలో పదార్థాలు వడ్డించుకొని తింటున్నాము, కొంత దూరాన నెహ్రూ, సంజీవరెడ్డి భోంచేస్తున్న టేబుల్‌ ఉంది. సీతారామ్‌ “రావయ్యా, నెహ్రూను పలుకరిద్దామంటూ ముందుకు కదిలారు. సీతారామ్‌ను ఎరిగిన వారందరికీ తెలుసు. పద్ధతులను ఆతిక్రమించడం ఆయనకు సరదా. నేను వెంట నడిచాను. మేము బల్లదగ్గరికి చేరుకుండగానే సంజీవరెడ్డి “సీనియర్‌ జర్నలిస్టు” అంటూ సీతారామ్‌ను పరిచయం చేశారు. సీతారామ్‌ నన్ను ఆంధ్రభూమి న్యూస్‌ ఎడిటరంటూ పరిచయం చేశారు. ఇక ఆయన ప్రశ్నలు సంధించారు. ఒకటి రెండు ప్రశ్నల తర్వాత నెహ్రూ “వై డోంట్‌ యూ సిట్‌?” అని తమ టేబుల్‌కు అటూ ఇటూ ఖాళీగా ఉన్న సీట్లు చూపించారు. రెండు నిమిషాలు కూర్చున్నాము. సమాచారశాఖ ఫొటోగ్రాఫర్‌ పరుగెత్తుకు వచ్చి ఫొటో తీశాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంతలో సీతారామే “మీరు కానివ్వండి, వీ డోంట్‌ వాంట్‌ టు డిస్టర్చ్‌ యు” అంటూ లేచారు. నేను లేచాను. నమస్కారం చేసి పాత్రికేయుల గుంపులో చేరాము. నేను నెహ్రూతో పాటు భోజనం టేబుల్‌ మీద కూర్చున్నానే కాని నోరు విప్పలేదు. చొచ్చుకుపోవడం అనేది అమెరికన్‌ జర్నలిస్టుల ప్రత్యేకత అని పుస్తకాల్లో చదివాం గాని, మనవారిలో 182 జియస్‌. వరదాచారి

సీతారామ్‌లోనే అది చూశాము కొందరు కుజ్జ్ఞవిలేఖరులు అలా చేయబోయి అభాసుపాలైన సంఘటనలు రెండు మూడు చూశాం మర్యాదలు పాటించకున్నా తప్పించుకోడానికి తగినవయసు, వ్యక్తిత్వం ఉండాలని కుజ్జికారు గ్రహించాలి ఇంటి టెలిఫోను

1964లో టెలిఫోను సలహా సంవుం ఏర్పాటైంది దానిలో జర్చలిస్టు యూనియన్‌కు కూడా సభ్యత్వమిచ్చారు ప్రతినిధి పేరు సూచించవలసిందిగా టెలిఫోను శాఖ లేఖ వ్రాసింది అప్పటి అధ్యక్షులు నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి అయిన హనుమంతరావుకు నా పేరు పంపించవలసిందిగా సూచించారు. నేను అప్పుడు సహాయకార్యదర్శిగా ఉన్నాను టెలిఫోను సలహాసంఘం పదవి కూడా నాకే ఎందుకు? మరొకరికి ఇస్తే వారూ క్రియాశీలంగా ఉంటారని చెప్పి పొత్తూరి వెంకటేశ్వరరావు పేరు సూచించాను ఆయన అలాగే పంపించారు కొన్నాళ్ల తర్వాత ఒక రోజు పొద్దున్నే టెలిఫోను శాఖవారు అమృత్‌నగర్‌ కాలనీలో మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు (మీ ఇంట్లో ఫోను పెట్టడానికి వచ్చాము ఎక్కడ పెట్టమంటారు?” అని అడిగారు “నేను ఫోనుకోసం దరఖాస్తు పెట్టుకోలేదే?” అన్నాను “లేదు సార్‌ మీకు మంజూరైంది ఎక్కడ పెట్టమంటారో చెపితే పెట్టేసి పోతా"మన్నారు సరేనని పుస్తకాల గూట్లో స్థలం చూపాను కనెక్షన్‌ ఇచ్చి లైన్‌మ్యాన్‌తో మాట్లాడించి వెళ్లిపోయారు. ఎవరితో మాట్లాడతాం? ఫోనున్న బంధువులెవరూ లేరు ఆఫీసుకు చేద్దామంటే ఇంకా సమయం కాలేదు పక్కింటి వాళ్లనడిగితే కాలనీలో ఇదే మొదటి ఫోను అన్నారు ఆఫీసుకు వెళ్ళాక పొత్తూరి ఫోన్‌ చేశాడు “ఫోను వచ్చిందా?” అని అడిగాడు ఆ ్రీతం రోజే సలహాసంఘ సమావేశం జరిగిందట. సమావేశం ముగిసినాక శాఖవారు ఆయనను మీ ఇంటి ఫోన్‌ నంబరు ఇవ్వండి అని అడిగారట ఇంట్లో ఫోను లేదని చెపితే, సలహా సంఘసభ్యుడికి ఫోను లేకపోతే ఎట్లా? మీ ఇంటి అడ్రసు చెప్పండని వ్రాసుకున్నారట మీరు ఇంకొకరికి కూడా ఫోను సిఫారసు చేయవచ్చునని వారు చెపితే ఆయన నా చిరునామా ఇచ్చాడట అప్పుడు ఫోను కనెక్షను కోసం వేచి ఉండవలసివచ్చేది మనకు అడుగకుండానే వచ్చింది అయితే ఉచితంగా కాదు 90 రూపాయల ఫీజు వసూలు చేశారు వాడినంత బిల్లు వాడకున్నా కనీస మొత్తం కట్టాలి అదొక అదనపు భారం ఏం చేయాలని ఆలోచించి, ఆంధ్రభూమి యాజమాన్యానికి దరఖాస్తు పెట్టుకున్నాను నాకు ఇంట్లో ఫోను ఉంది. న్యూస్‌ ఎడిటరుకు ఫోను ఉంటే సలహాసంప్రదింపులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండవచ్చు గనుక, ఫోను బిల్లు ఆఫీసు చెల్లించాలని కోరాను వారు అందుకు అంగీరించారు. జ్ఞాపకాల వరద 188

ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌లో నిజాం పరిపాలనకాలంలోనే ఫిలిం స్టూడియో ఉన్నట్టు సినిమాల నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడే నాటికి ఇక్కడ ఆ ఊసే లేదు. గోలకొండ పత్రిక ఆదివారం అనుబంధంలో పి. ఎస్‌.ఆర్‌. ఆంజనేయశాస్త్రి సినిమా శీర్షిక ప్రవేశపెట్టాడు. పరిశ్రమంతా మద్రాసులో ఉండేది. ఆయా సంస్థల పి. ఆర్‌. వోలు పంపించే ఉడికీ ఉడకని ప్రెస్‌ నోట్‌ వార్తల ఆధారంగా ఆ శీర్షిక నడిపేవారం. విడుదలైన సినిమాల సమీక్షలు గుణాత్మకంగా వ్రాసేవారం. ఆంధ్రజనత అలాగే చేసేది. ఇక్కడి స్వతంత్ర సమీక్షల విలువ తెలిసిన డిస్టిబ్యూటర్లు, సమీక్షకులను అభిమానించసాొగారు. తొలిరోజు ఆరుగంటల ఆటకు సమీక్షకులను ఆహ్వానించడం ప్రారంభించారు. ఇంతలో శ్రీసారథీ స్టూడియో వచ్చింది. జమున, గుమ్మడి, వారనాథ్‌ ముఖ్యపా(త్రధారులుగా మొదటి చిత్రం 'మా యింటి మహాలక్షి నిర్మాణం (ప్రారంభమైంది. పర్వతనేని గంగాధరరావు నిర్మాత. జి. రామినీడు దర్శకుడు. నటీనటులే కాక దర్శకుడు, సాంకేతికనిపుణులు అంతా మద్రాసునుంచి తరలి వచ్చేవారు. షూటింగ్‌ జరిగినంత కాలం ఇక్కడ అందుబాటులో ఉండేవారు. తర్వాత సారథీ స్టూడియో ఎన్‌.టి. రామారావు చిత్రాలకు పరిమితమైంది. అప్పుడూ ఇదే తంతు. అయితే స్థానికంగా వార్తల సేకరణకు, ఇంటర్‌వ్యూలకు, ఇష్టాగోష్టులకు అవకాశం ఏర్పడింది. సినిమా వార్తలు వ్రాసేవారు ఒక బృందంగా ఏర్పడ్డారు. వీరు సినిమాకు మాత్రమే అలీతో. క. ని అ పము సా 7 నల. య్‌ ౫ రం జంవుఖానా వరువుల మీద కూర్చొని భానుమతితో ఫిలిం జర్నలిన్టుల ఇష్టాగోష్టి క84 జి.యస్‌. వరదాచారి

పరిమితమైనవారు కారు దినపత్రికల ఉద్యోగులు పెన్‌ క్లబ్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు వీరుకాక సినిమా వార్తలకు మాత్రమే పరిమితమైన కొన్ని కాలిక పత్రికల ఉద్యోగులు రావడంతో, జర్నలిస్టుల సంఖ్య పెరిగింది

ఆ సమయంలో మద్రాసులో స్టూడియో పనివారు సమ్మెచేశారు అక్సినేని నాగేశ్వరరావు హైదరాబాదుకు తన నివాసాన్ని మార్చుకొన్నారు. తాను నటించే చలనచిత్రాల నిర్మాణకార్యక్రమాలన్నీ ఇక్కడే జరగాలని షరతు విధించారు నవయుగ ఫిలిమ్స్‌ కాట్రగడ్డ శ్రీనివాసరావుతో కలిసి సారధీ స్టూడియోను లీజుకు తీసుకున్నారు ఆ తర్వాత వారు వచ్చేవారే కాదో, వీరు ఇచ్చేవారే కాదోగాని, సారథీ స్టూడియోలో రామారావు చిత్రాల షూటింగు నిలిచిపోయింది ఐనా ఇక్కడ సినిమాలసందడి ఎక్కువయింది సినిమాల గురించి వ్రాసేవారి సంఖ్య పెరిగింది ఫిలిం జర్చలిస్టులకు వ్యవస్టీక్సతసంఘం అవసరమన్న నిర్ణయానికి వచ్చాం 1968 ఆగస్టులో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకున్నాం నగరంలో సినీవార్తారచనకు శ్రీకారంచుట్టిన ఆంజనేయశాస్త్రిని అధ్యక్షుడుగా, బాసాని సుదర్శనరెడ్డిని కార్యదర్శిగా ఎన్నుకున్నాము సంఘంపేరు ఆలోచించే క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అని పెట్టుకున్నాము. ఏది వ్రాసినా సూక్ష్మపరిశీలన చేసి, సాధికారికంగా గుణదోష ప్రాతిపదికనే వ్రాయాలనే హెచ్చరిక అందులో ఉంది రెండవ అధ్యక్షుడుగా ఎన్నికైన నేను, చాలాకాలం ఆ పదవిలో కొనసాగాను నగరానికి వచ్చిన సాంకేతికనిపుణులను క్లబ్బుకు ఆవ్వోనించి విభిన్నాంశాలపై వారిచేత సభ్యులకు వివరణలు ఇప్పించేవాళ్లం అచిరకాలంలోనే హైదరాబాద్‌ జర్నలిస్టులు వ్రాసిన వార్తలు, చిత్రసమీక్షలు సినీప్రముఖుల విశేషాదరణను పొందాయి అంతే కాదు, నంది అవార్డుల ప్రదానం రోజు ఉదయం అసోసియేషన్‌ ఆనవాయితీగా బ్రేక్‌ ఫాస్ట్‌ సమావేశాలు ఏర్పాటు చేసేది అవార్డుల సభలో మంత్రులకు, హీరోలకు తప్ప తక్కినవారికి మాట్లాడే అవకాశం ఉండదు ఆ లోటును ఈ సమావేశం తీర్చేది పరిశ్రమకు సంబంధించిన సమస్యలనే గాక, భిన్నవర్ణాల అవసరాలను కూడా ప్రభుత్వదృష్టికి తేవడానికి ఇది సరైన వేదికగా ఉపకరించేది అవార్డులుగా ప్రభుత్వం ఒకప్పుడు ఇచ్చిన ఎలుకంత నందులను గౌరవనీయమైన సైజుకు పెంచేట్టు చేయడానికి నటుడు మురళీమోహన్‌ ఈ వేదికనే వాడుకున్నాడు “్రైస్‌ క్లబ్బులో బ్రేక్‌ ఫాస్ట్‌ సమావేశం ఉంటుంది గదా, నేనూ వస్తున్నా” అని అవార్డు గ్రహీతలే ఒకరోజు ముందు మద్రాసు నుంచి ఫోనుచేసి చెప్పేవారంటే, వాటికి ఎంత ఆదరణ లభించిందో అర్ధమవుతుంది జ్ఞాపకాల వరద కేరిర్‌

భవననిర్మాణ ప్రయత్నం

ఫెస్‌ క్లబ్‌, ఫిలిం క్రిటిక్స్‌, సహకార గృహనిర్మాణ సంఘం, పరపతి సంఘం, స్పోర్ట్స్‌ జర్చలిస్పుల సంఘం -- వీటన్నిటికీ అప్పటికి ఉన్న భవనం చాలేది కాదు కనుక అక్కడే స్థలమిస్తే మేము స్వంత భవనం కట్టుకుంటామని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఒక సంకటం వచ్చిపడింది కంచికచర్లలో కోటేశు అనే హరిజన యువకుడిని భూస్వాములు సజీవదహనం చేశారు వ్యవసాయశాఖ మంత్రి తిమ్మారెడ్డి తన శాఖకు సంబంధించిన విషయాలేవో చెప్పడానికి పత్రికావిలేఖరుల గోష్టి ఏర్పాటు చేశారు. గోష్టి ముగిసి ఆయన వెళ్లబోతుంటే, ఒక కుజ్జ విలేఖరి “కంచికచర్ల ఉదంతంపై మీ వైఖరి ఏమిటి? అలా కాల్చడం సబబంటారా?” అని ప్రశ్నించాడు తిమ్మారెడ్డి వెనుదిరిగి “వాడు చేసిన పనికి కాల్బకపోతే ముద్దు పెట్టుకుంటారా?” అనేసి వెళ్లిపోయారు ఇది ఇక్కడి వారు వార్తాంశంగా తీసుకోరని ఆ విలేఖరికి తెలుసు

ఆ గోస్టికి సీతారామ్‌ రాలేదు సీతారామ్‌ యు ఎన్‌ ఐ వార్తాసంస్థతో పాటు ఢిల్లీ వామపక్ష పత్రిక పేట్రియట్‌కు కూడా పని చేస్తుందేవారు ఆయనకు చేరవేశాడు ఆయన వార్తాసంస్థలో ఎలాగూ ఇవ్వడానికి వీలుండదు పేట్రియట్‌కు వార్తగా పంపించారు వారు మొదటి పేజీలో మంత్రిగారి వ్యాఖ్య ప్రముఖంగా ప్రచురించారు అప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. సభలో గలభాకు దారి తీసింది “మంత్రి తప్పుకోవాలి!” అనే నినాదం మారుమోగింది

మరోవంక తెలంగాణలో అసమ్మతి రాజుకుంటున్నది ఒకవర్గం సీనియర్‌ పాత్రికేయులు ముఖ్యమంత్రికి కంటగింపుగా ఉన్నారు. వారే జర్నలిస్టు యూనియన్‌ కర్ణధారులుగా ఉన్నారు ముఖ్యమంత్రి ఈ ్రతికూలవాతావరణంలోనే బంజారా హిల్స్‌లో జర్నలిస్టు కాలనీకి స్థలమివ్వడమేగాక, వారి కోరికపై 1968 ఏప్రిల్‌ 8వ తేదీన పునాదిరాయి కూడా వేశారు అది జర్నలిస్తులందరికీ సంబంధించిన విషయం యూనియన్‌ భవనానికి స్థలమంటే ఆయన ఎలా స్పందిస్తారోనని జంకు. ఒక పరిష్కారం కనిపెట్టారు జర్నలిస్టులని, ముఖ్యమంత్రికి ముఖపరిచయముండి ఆయనకు అమిత్రవర్గంగా కనబడని నలుగురి బృందాన్ని పంపించాలని నిర్ణయించారు. దీనికోసం ఆంధ్రపత్రిక విలేఖరి అందరికీ గౌరవపాత్రుడైన పుల్లాభట్ల వెంకటరామ శర్మను (పివిఆర్‌ శర్మ లేదా ముక్కుశర్మగా (ప్రసిద్ధులు), యూనియన్‌ పూర్వాధ్యక్షుడు గుంటూరులో సీనియర్‌ విలేకరి బొడ్డుపల్లి సోమయాజులును, నన్ను, గుంటూరువాడు, 186 జి యస్‌ వరదాచారి

జర్చలిస్టు గృహనిర్మాణ సంఘం అధ్యక్షుడు అయిన పొత్తూరి వెంకటేశ్వరరావును ఎంపిక చేశారు మాట్లాడే బాధ్యత నాకు అప్పగించారు

అప్పటికే యూనియన్‌ కార్యాలయం వెనుక ఫతే మైదానంలో లాల్‌ బహాదుర్‌ స్టేడియం నిర్మాణమైంది ముఖ్యమంట్రి కాసు బ్రహ్మానంద రెడ్డి “అక్కడ భవనం నిర్మిస్తే, స్టేడియం అందం చెడిపోతుంది ఇంకెక్కడైనా స్థలం చూసుకొండి ఇస్తానన్నారు. నేను స్టేడియం అందం చెడకుండా నిర్మిస్తామనీ కావాలంటే మీరే ప్లాన్‌ వేసివ్వండి ఆ ప్రకారంగా నిర్మిస్తామని బీరాలీ పలికాను ఆయన నవ్వి “మీ దగ్గర ఎంత డబ్బుందేమిటి?”” అని అడిగారు చాలారంగాలకు చెందిన పలువురు పెద్దల వాగ్జానా లున్నాయన్నాను. ముందు ఒక లక్ష రూపాయలు మీ బ్యాంకు అకౌంటులో వేసి, అప్పుడు రండి చూద్దామన్నారు. మేము స్థలం దొరికినట్టే భావించి సరేనని వచ్చేశాము రాజేశ్వరరావు సంగీతోత్సవం

మా నాయకవర్గం కూడా నా అభిప్రాయంతో ఏకీభవించారు నిధి సేకరణకు నడుం బిగించాము మా ఫిలిం క్రిటిక్స్‌ కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతివారు “ఈ రేకుల షెడ్డు కాపురమేమిటండీ, మంచి భవనం కట్టుకొండి” మేము సాయపడుతాం అనేవారు ఎన్‌ టి రామారావు మమ్మల్ని మద్రాసుకు రమ్మన్నారు ఎస్‌ రాజేశ్వరరావు అంతకు ముందే సంగీతోత్సవ ప్రతిపాదనకు సమ్మతి తెలిపారు వెంటనే మద్రాసు (ప్రయాణానికి ఏర్పాటు చేశాము యూనియన్‌ తరపున బి నాగేశ్వరరావు, క్రిటిక్స్‌ పక్షాన ఆంజనేయశాస్త్రి, బాసాని సుదర్శనరెడ్డి, రెండింటిలో క్రియాశీలంగా ఉన్న నేను వెళ్లాము ఎన్టీ రామారావుకు ముందు ఫోను చేశాము ఆయన సహజగంభీర స్వరంతో “రేపు ఉదయం ఎనిమిదిన్నరకల్లా ఇంటికి రండి, మాట్లాడుకుందా”మన్నారు మేము సరేనని ఆ రోజు ఎస్‌ రాజేశ్వరరావును కలిసే ప్రయత్నంలో పడ్డాము ఇంతలో అనుకోకుండా అన్నపూర్ణ పిక్చర్స్‌ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు కలిశారు “మ్సీరేమిటిక్కడ?” అని అడిగారు విషయం చెప్పగా “రాజేశ్వరరావుతో నెగ్గడం మీవల్ల కాదు నేనూ వస్తా పదండి” అని అడుగకుండానే మాతో బయలుదేరారు ఆయన రావడం వల్ల రాజేశ్వరరావుకు మాపై అభిమానం మరింత పెరిగింది

అప్పటివరకు హైదరాబాద్‌లో సినీసంగీతోత్సవాలు జరుగలేదు అందుకే మూడు గంటల కార్యక్రమాన్ని పక్కాగా ప్లాను చేశాము ఘంటసాల, సుశీల, పి బి. శ్రీనివాస్‌, ఎస్‌ జానకి, మాధవపెద్ది, పిఠాపురం, కొత్త గాయని వసంత అంగీకారం పొందాము జ్ఞాపకాల వరద 187

కొన్ని పాటలు మేము ఎంపిక చేసి ఇచ్చాము. వీణ పాటలు తప్పకుందా ఉండాలన్నాము. అందరు కవుల పాటలకు రాజేశ్వరరావు స్వరకల్పన చేశారు గనుక ఎవరినో వదిలేశామనే ప్రశ్న రాదు. పాటకు పాటకు మధ్య వ్యవధి రెండు మూడు నిమిషాలకు మ్‌ంచరాదన్నాము. ఆ సమయంలోనే వాద్యకారులు (శ్రుతులు సవరించుకోవడం, వ్యాఖ్యాత పాటను పరిచయం చేయడం పూర్తి చేయాలని నిర్ణయించాము. కనీసం మూడు పూర్తి స్థాయి రిహార్సల్స్‌ జరపాలనీ కోరాము. మేము అడుగకుందానే దుక్కిపాటి రిహార్సల్స్‌ జరిపించే బాధ్యత తనదన్నారు. అంటే ఎవరూ సాకులు చెప్పి ఎగగొట్టకుండా చూడటంతోపాట్టు, వారి అవసరాలు తీర్చడంకూడా ఆయనే చేశారు. వ్యాఖ్యాతగా ఉండవలసిందిగా సి. నారాయణ రెడ్డిని కోరాము. ఆయన అప్పటికే ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు యేటా నిర్వహిస్తున్న ఆంధ్రాభ్యుదయోత్సవాలలో చక్కని వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నారు. మా ప్రణాళికంతా విన్న తర్వాత, వ్యాఖ్యాతగా రావడానికి ఒప్పుకున్నారు. వెరసి లేడీ హైదరీ క్లబ్బులో, బహిరంగప్రదేశంలో, డిసెంబరు చలిలో, ఆరువేలమంది శ్రోతలను మూడు గంటలసేపు విరామం లేకుండా ఉ(గ్రూత లూగించిన కార్యక్రమం సాకారమైంది. అలాటి అద్భుతమైన కళాత్మకసంగీత కార్యక్రమం హైదరాబాద్‌లో ఇంతవరకు జరుగలేదంటే అతిశయోక్తి కాదు. టిక్కట్టు ధర 10 రూపాయలే పెట్టాం. 65 వేల ఆదాయం వచ్చింది. కళాకారులు పారితోషికం తీసుకోలేదు. విమాన టిక్కట్లు మాత్రమే ఇచ్చాం. మాధవపెద్ది, పిఠాపురం వేరే ఏదో కార్యక్రమానికి వెళ్లి నేరుగా హైదరాబాద్‌ వచ్చారు గనుక, వారికి ఖర్చుల కింద తలా వెయ్యినూట పదహార్లు ఇచ్చాము, సంగీత కచేరీ మధ్యలో దుక్కిపాటి మధుసూదనరావు 2500 రూపాయలు, కాట్రగడ్డ శ్రీనివాసరావు 2500 రూపాయల విరాళాలు ప్రకటించారు. ఖర్చు విషయంలో పొదుపు పాటించాము గనుక 52 వేలు మిగిలాయి. ఎన్టీఆర్‌ నిస్సహాయత మద్రాసులో రామారావును, ఇతర సినీ ప్రముఖులను కలిసి ప్రెస్‌ క్లబ్‌ నూతన భవననిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రయత్నం గురించి చెపుతున్నాను. రామారావు మర్నాడు రమ్మనగానే, రాజేశ్చరరావును కలవడం సంగీతోత్సవం నిర్వహించడం దాకా మొత్తం చెప్పాను. మళ్లీ రామారావు విషయానికి వద్దాం. ఆయన ఇంటికి మర్నాడు చెప్పిన సమయానికి వెళ్లాము. మేము ముగ్గురం సుష్టుగా టిఫిన్‌ చేశాం. నాగేశ్వరరావు ఆలస్యంగా లేచారు. ఎన్టీఆర్‌ సమయపాలన గురించి విన్నాడు గనుక టిఫిన్‌ తింటే ఆలస్యమైపోతుందని పోదామన్నాడు. సమయానికి చేరుకున్నాము. పి.ఏ. ను కలిసి చెపితే కూర్చోమన్నాడు. “మేము వచ్చినట్టు కబురు చేయండి” అంటే, “అక్కరలేదు 188 జి.యస్‌. వరదాచారి

ే జ్‌ మ | గ్‌ మ్‌ ॥. త్య జ్త్‌

క టు.

ననా క మము శ టై క!

ఎన్టీఆర్‌తో ఆత్మీయ నంథావణ

నేను ఫలానావారిని రమ్మన్నాను. వచ్చారా? అని ఆయనే అడుగుతారు. అప్పుడు చెపుతాం” అన్నాడు. రామారావు పది గంటలకుగాని బయటకు రాలేదు. మమ్మల్ని చూచి “వచ్చారా రండి, కారులో పోతూ మాట్లాడుకుందామన్నారు. గోల్డన్‌ స్టూడియోకు వెళ్ళాం. అక్కడ దిగగానే ఎదురు వచ్చిన నిర్మాత గంగాధరరావుకు మమ్మల్ని చూపుతూ, “హైదరాబాద్‌ జర్నలిస్టులు. వీరికి బ్రేక్‌ ఫాస్ట్‌ మర్యాదలన్నీ చేయం”డన్నాడు. షూటింగు (బేకుల్లో మాట్లాడుకుందామని ఫ్లోరులోకి వెళ్లిపోయారు. గంగాధరరావుకు మేము పరిచయమే. సారథిలో మొదటి సినిమా తీసినాయనే. టిఫిన్‌ పెట్టించి “భోజనానికి బదులు అనుకొని తినండి. ఆయన ఎప్పుడు వదులుతాదో తెలియదు” అన్నాడు ముందు హెచ్చరికగా. టిఫిన్‌ అయ్యాక మేము లోపలికి వెళ్లి మాకోసం వేసిన కుర్చీలలో కూర్చున్నాము. షాట్‌ అయిపోగానే వచ్చి కబుర్లు మొదలు పెట్టేవారు. అసలు

విషయంలోకి రాకముందే షాట్‌ రెడీ అంటూ అసిస్టెంట్‌ డైరెక్టరు వచ్చేవాడు. లంచ్‌ (బేక్‌ అయింది. ఆయన ఏకాంతంగా భోంచేస్తారు. మాకు నిర్మాత తోడున్నాడు. తర్వాత అవకాశం చిక్కింది. రామారావు గొప్ప డైలాగు చెప్పారు. “మీకు తెలుసు. ఇటీవల నా సినిమాలు బాగా ఆడటం లేదు. గనుక పెద్ద మొత్తాన్ని ఇవ్వగల స్థితిలో లేను. చిన్నమొత్తం ఇవ్వడం బాగుండోదన్నారు. ఐతే తన పాత హిట్‌ సినిమాలు ఇస్తానని, ఒకవారం రోజులు ఫెస్టివల్‌గా ప్రదర్శించి వచ్చిన సొమ్ము తీసుకోండన్నారు. మాకు మాట రాలేదు. కొద్దిసేపైనాక నేనే తమాయించుకొని, అక్కడున్న మిద్దె సోదరులను చూపించి, “వారు నిర్మాతలేకాక విజయవాడలో ఎగ్జిబిటర్లు కూడా గనుక జ్ఞాపకాల వరద 189

వారికి ఆ బాధ్యత అప్పగించి, ఆఖరు రోజు మీరు వచ్చి మీ చేతులమీదుగా మొత్తాన్ని అందజేయండి” అని సూచించాను. కాని అదేమీ ముందుకు సాగలేదు. అక్కడి నుంచి తెలుగు చిత్రపరిశ్రమకు మకుటంలేని మహారాజైన డి.వి.ఎస్‌. రాజు దగ్గరికి వెళ్లాము. ఆయన కొంత ఆశాజనకంగా మాట్లాడాడు. తెలుగు జర్నలిస్టుల సంఘం హైదరాబాద్‌లో నిర్మించదలపెట్టిన (ప్రెస్‌ క్లబ్‌ భవనానికి తెలుగు సినీ నిర్మాతలు ప్రకటిస్తున్న విరాళాలు అని ఇంగ్లీషులో ఒక తెల్ల కాగితం మీద టైపు చేయించి దానిమీద మొదటి సంతకం రామారావుగారిచేత చేయించి తీసుకురమ్మన్నాడు. రామారావు అన్నమాట ఆయనకు చెప్పి “ఎంత వీలైతే అంత మీరే ఏదో చేయండి” అన్నాము. రామారావు చేవ్రాలు లేనిదే ఇక్కడ ఏదీ ముందుకు సాగదని, అమౌంటు వ్రాయకున్నా ఆయన సంతకం చేస్తే చాలని రాజు అన్నారు. మళ్లీ రామారావును కలిస్తే అది మర్యాద కాదన్నారు. దానితో మద్రాసు సినీ ప్రముఖుల వాగ్జానాలమీద ఆశ వదులుకొన్నాము. మా అధ్యక్షుడు నాగేశ్వరరావుకు ప్రముఖ ఆడిటర్‌ బ్రహ్మయ్య మీద ఏవో ఆశలు ఉండేవి. కాని తక్షణం సమకూరేదేమీ లేదని తెలియడంతో తిరిగి వచ్చేశాము. ఎంజిఆర్‌ విరాళం ఐదువేలు

మేము నగరానికి వచ్చే ప్రముఖు లందరినీ ప్రెస్‌ క్లబ్‌కు ఆహ్వానించేవారమని చెప్పాను. వారు రాజకీయనాయకులైతే యూనియన్‌ ఆధ్వర్యంలో, కవులో, సామాజిక కార్యకర్తలో ఐతే ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో, సినిమా వారైతే ఫిలిం క్రిటిక్స్‌ ఆధ్వర్యంలో సభ నిర్వహించేవారం. చర్చనీయాంశంలో ఆసక్తిగల వారందరూ పాల్గొంటూ ఉండేవారు. ముఖ్యకార్యకర్తలం ఎప్పుడూ క్రియాశీలంగా ఉండేవారం. ఫిలిం క్రిటిక్స్‌ తరపున మేము నిర్వహించిన కార్యక్రమాలు కొన్నిటి గురించి చెప్పాను. మేము ఆహ్వానించినవారిలో తమిళ సినీ దిగ్గజాలు కరుణానిధి, ఎం.జి. రామచంద్రన్‌, శివాజీ గణేశన్‌, కె. బాలచందర్‌, కన్నడ సూపర్‌ స్టార్‌ రాజకుమార్‌, హీరో వేషధారణలో గిన్నిస్‌ రికార్డు సాధించిన మలయాళీ అగ్రనటుడు (ప్రేమ్‌ నజీర్‌, హిందీ అగ్రనిర్మాత బి.ఆర్‌.ఛోప్రా, జర్చలిస్టు, రచయిత ఖ్వాజా అహమద్‌ అబ్బాస్‌, సముద్రాల రాఘవాచారితో సహా తెలుగు కవులు, సాంకేతికనిపుణులు, నటులు పిలిచిన ప్రతివారూ పాల్గొని మా కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఎం.జి. రామచంద్రన్‌ వస్తున్నారని తెలిసి ఫోన్‌ చేస్తే “వస్తానుకాని అద్ధగంటకంటే ఎక్కువ ఉండలౌనన్నారు. సరేనని నేను తీసుకు రావడానికి హోటల్‌కు వెళ్తే “ఇక్కడ లేపాక్షిలో ఫిలిగ్రీ వస్తువేదో నా భార్య తెమ్మంది మీరే దారి చెప్పా”లన్నారు. అది మా క్లబ్‌ పక్శనే నేను చూపుతానన్నాను. 190 జి.యస్‌. వరదాచారి

వు అన సధ. నట ల! వ.

న ఉస శా.

వ క తత న

స. (| శ నీ. య న. పాత (వెన్‌ క్లబ్‌ముందు పాత్రికేయుల బృందంతో ఎం, జి ఆర్‌

సికింద్రాబాద్‌లో వదో తమిళ సంఘం వాళ్లు పిలిచారు పోవాలన్నారు. అటు నుంచి విమానాశయానికి పోతానన్నారు. అప్పటికి ఇంకా ఆయన రాజకీయాలలోకి రాలేదు. గోస్టికి రాజకీయవిలేఖరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అరవం, తెలుగు, ఇంగ్లీషు మూడు భాషలలో విలేఖరులు ఆసక్తిగా ప్రశ్చలడుగుతుంటే ఎంజిఆర్‌ ముగ్భుడైపోయారు. పి.ఏ. వెళ్లి గడియారం చూపితే “షాపింగ్‌ క్యాన్సలొ అన్నారు. మరి కొంత సేపటికి దగ్గరకు పోబోతుంటే “మీటింగ్‌ క్యాన్సల్‌” అన్నారు. ప్రశ్నలను అవ్వానిస్తూ సమాథధానాలిస్తూ పోయారు. చివరకు ఆయనేచిత్ర పరిశ్రమంతా అండగా ఉందన్నారు. “మీకు ఈ రేకుల షెడ్డేమిటి?” అని మంచి ప్లాను వేయించుకొండన్నారు. అప్పుడు మా వారే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని గోడ వారగా ఉన్న ప్లాను, ఆర్కిటెక్టు వేసిన ఎలివేషన్‌ చిత్రం చూపారు. “మీ ప్రెసిడెంటు నాకీ విషయం చెప్పనేలేదే?” అన్నారు. అతిథులుగా వచ్చిన వారిని చందా అడగటం సంప్రదాయం కాదన్నాను. ఆయనే పి.ఏ. ను పిలిచి మాట్లాడి నేను ప్రిపేర్ట్‌గా రాలేదు ప్రస్తుతానికి టోకెన్‌గా ఈ ఐదువేలు ఇస్తున్నానని డబ్బు నా చేతిలో పెట్టటోయారు. నేను యూనియన్‌ కార్యదర్శికి ఇవ్వండని ఆయనను ముందుకు తోశాను. కెమెరాలు క్లిక్కుమన్నాయి. ఫొటోలు పేపర్లలో వెయ్యవద్దని వారించారు.

భానుమతితో సహా అతిథులను జంపుఖానా, పరుపుల మీద కూర్చోబెట్టడం చూచి, అక్కినేని నాగేశ్వరరావు ఫర్నిచర్‌ చేయించి పంపించారు. అన్నపూర్ణా స్టూడియో నిర్మాణం అప్పుడే ప్రారంభమైంది. హీరో చలం పత్రికాగోస్టిలో తన కొత్త సినిమా జ్ఞాపకాల వరద 191

“సంబరాల రాంబాబు బాగా ఆడుతున్నదంటూ రెండు వేలు విరాళమిస్తున్నట్టు ప్రకటించారు, మేము ప్రకటనలను నమ్మమని అంటే చిత్ర పంపిణీదారు వెంటనే రెండు వేల నగదు తీసి ఇచ్చారు దాసరి నారాయణరావుతో గోష్టి జరుగుతుండగా ఒకరోజు కరెంటు పోయింది మీకు జనరేటరు లేదా అని అడిగి నేను ఇస్తానన్నారు లాటరీ చూపిన దారి రాజేశ్వరరావు సంగీతోత్సవవిజయంతో మా నిధిసేకరణ ప్రయత్నం సగం సఫలమైంది రాజకీయనాయకుల వాగ్దానాలున్నాయి. కాని వెంటనే సఫలమయ్యే పరిస్థితులు లేవు, ఆ సమయంలో, మా కార్యక్రమాలకు అల్పాహారం తీసుకు వస్తున్న తాజ్‌మహల్‌ హోటల్‌ బెట్‌ డోర్‌ కేటరింగ్‌ సూపర్‌ వైజరు దివాకర్‌ ఒక ఆశాజనకమైన ప్రతిపాదనతో వచ్చాడు మేము కార్యక్రమాలకు పిలిచేవారంతా విఖ్యాతులే గనుక మేము వారికి పసందైన ఉపాహారం ఇస్తుందేవారం దానికి దివాకరే ప్రతీసారి వస్తుండేవాడు మా నిధిసేకరణ ప్రయత్నాల గురించి ఆయనకు తెలుసు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పుడు నిర్వహిస్తున్న లాటరీ టిక్కట్ల అమ్మకం మంచి ఆదాయ మార్గమని సూచించాడు అప్పటికే ఆయన స్వంతంగా ఆ పని చేస్తున్నాడు కూడా సెక్రైటేరియట్‌లో మంచి హోదాలోనే ఉద్యోగం చేస్తున్న రాకుర్‌ హరిప్రసాద్‌, లాటరీ డైరెక్టరుగా ఉందేవాడు రాకుర్‌ బాగా పలుకుబడి గలవాడు లాటరీ టికృట్ల కేటాయింపు నియమాలను సాంస్కృతిక సంస్థలకు లాభసాటిగా ఉందేవిధంగా మలిచాడు చిల్లర అమ్మకందార్లకు వందటిక్కట్లు 80 రూపాయలకు ఇస్తుంటే సాంస్కృతికసంస్థలకు 60 రూపాయలకే ఇచ్చే విధంగా, ముఖ్యమంత్రి సమ్మతితో నియమావళి రూపొందించాడు “ప్రెస్‌ క్లబ్‌ సాంస్కృతికసంస్థగా పరిగణింపబడుతుంది గనుక మీరు టిక్కట్లు తీసుకొనిఇస్తే నేను అమ్మిపెడతా”నన్నాదు దివాకర్‌ రాయితీగా లభించే 20 రూపాయలు చెరిసగం తీసుకుందానున్నాడు ఐదు లక్షల టికృట్లు అమ్మిపెడతానన్నాడు ప్రతిపాదన బాగానే ఉంది కాని మా ముందు జాగ్రత్త షరతులు కొన్ని ఉన్నాయన్నాను టిక్కట్ల ధర బ్యాంకులో కట్టి చాలాను ఆయనే తెచ్చిఇవ్వాలి మా వాటా సొమ్మును మా ఖాతాలో ముందే వేసి పే ఇన్‌ స్లిప్పు ఇవ్వాలి ఇవీ మా షరతులు “ఆ మాట నేనే చెపుదామనుకుంటున్నా” అన్నాడతను అంతేకాదు, తాను లాటరీ ఆఫీసుకు కాక ప్రెస్‌ క్లబ్‌కు కారు తీసుకొని వస్తానని, అదే కారులో మీ ప్రతినిధి వెళ్లి లాటరీ టిక్కట్లు డిక్కీలో వేయించుకునివస్తే సరాసరి విమానాశ్రయానికి వెళ్లిపోతానన్నాడు 192 జి యస్‌ వరదాచారి

నేను ఇంకాకొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాను: ఈ వ్యవహారమంతా కార్యవర్గంలో పెట్టి ఆమోదం పొందడం ఒకటైతే, టిక్కట్టు కొనడానికి అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరూ వెళ్లాలన్నది రెండవది. డబ్బు వ్యవహారం గనుక ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలి. నేనప్పుడు ఏ పదవిలో లేను. ఎవరున్నా చెడ్డపేరు రాకుండా ఉందాలనేదే నా కోరిక,

ఠాకుర్‌ను మా నాగేశ్వరరావు కలిసి ఒప్పించారు: ఠాకుర్‌ సామాజికకార్యకర్తగా ఇలాటి పనులు చేయడమే గాక, ఇండియన్‌ హెరాల్డ్‌ అనే ఇంగ్లీషు దినపత్రికను, సినీ హెరాల్డ్‌ అనే తెలుగు సినీవార పత్రికను కూడా నడిపారు. దివాకర్‌ మాట తప్పక నడుచుకొన్నాడు. కాని సాంస్కృతికసంస్థలకిచ్చే రాయితీ ప్రతిపాదన, ఠాకుర్‌తో పాటు ఆయనకూ ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పోలీసులు అరెస్టు చేశారు. మంత్రులు, పలువురు అధికారులు లాటరీ నిర్వహణ కమిటీలో ఉన్నందున, పనులన్నీ నియమాల ప్రకారమే జరిగినందున వారు బయటపడ్డారు. చివరకు లాటరీ నిలిచిపోయింది. లక్ష నిలువ చూపించాలన్న మా ప్రయత్నం నెరవేరింది. ఖాతాలో లక్షా పదిహేను వేల నిల్వతో కాసువారి వద్దకు వెళ్లాం, అప్పటికి తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. కాసువారికి ఏ క్షణంలోనైనా పదవీభ్రష్టత్వం సంభవించవచ్చునని అందరూ అనుకుంటున్నారు. బ్యాంకు పాస్‌ బుక్కు ఆయన చేతికిచ్చాము. ఆయన తన తలమీది గాంధీ టోపీని అలవాటు (ప్రకారం సవరించి చిరునవ్వు చిందించారు. ఎందుకు నవ్వుతున్నారంటే “మీరు లక్ష రూపాయలు పోగు చేయలేరని ఆ స్థలమే ఇస్తానన్నాను. మీరు సాధించారు. సరే స్థలమే కాదు మీకు మ్యాచింగ్‌ గ్రాంటుకూడా ఇస్తోనన్నారు. పి.ఏను పిలిచి మర్నాడు స్థలపరిశీలనకు ఏర్పాటు చేయుమని, స్పోర్ట్‌ కౌన్సిల్‌వారిని కూదా పిలువుమని చెప్పారు. మర్నాడు మా పాత భవనానికి కొన్ని గజాలు పశ్చిమంగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. చక్రవర్తి సంగీతోత్సవం

స్థలం దక్కింది కాని మేము నిర్మించదలచుకున్న మూడంతస్తుల భవనానికి అప్పటికి సేకరించిన సొమ్ము సరిపోదు. ఇంకా చాలా డబ్బు కావాలి. చక్రవర్తి సంగీతోత్సవాన్ని నిజాం కళాశాల మైదానంలో భారీగా ఏర్పాటు చేశాము. కొందరు రాజకీయప్రముఖులు కూడా వాగ్దానాలు ఎంతో కొంత పూర్తిచేశారు. ఆ ధైర్యంతో శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించాము. ఈ లోపల తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం ధరించింది. బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించాలని జ్ఞాపకాల వరద 193

అధిష్టానం నిర్ణయించింది. మేము ఆయననే శంకుస్థాపన చేయవలసిందిగా ఆహ్వానించడానికి వెళ్లాము. “నేనెందుకయ్యా? కొత్తగా వచ్చేవారితో చేయించుకొంొడని ఆయన తప్పించుకో జూచారు. “స్థలదాతగా మీరు చేయడమే సమంజసమని మా నిర్ణయ”మని చెప్పగా, అంగీకరించివచ్చారు. 1971 సెప్టెంబర్‌ 26 నాడు శంకుస్థాపన జరిగింది. ఇక్కడే ఆయన వ్యక్తిత్వాన్ని తెలిపే విషయమొకటి చెప్పాలి. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన కేంద్రంలో మంత్రి అయ్యారు. మంత్రిగా ఆయన తొలిసారి హైదరాబాదు వచ్చినపుడు, మా ఆచారం ప్రకారం ఆయనను ముఖాముఖికి పిలిచాము. అప్పటికి భవన కట్టడం మాత్రం పూర్తయింది. ముఖాముఖి తర్వాత ఆయన ఆంతా తిరిగి చూచి, ఇంకా చాలా డబ్బు కావాలి అని తానే మ్యాచింగ్‌ గ్రాంటు ఇస్తానన్న విషయం గుర్తు చేసి, ముఖ్యమంతత్రికో దరఖాస్తు పెట్టుకొని దాని నకలు నాకు పంపితే నేను సిఫార్సు చేసి, పంపుతానన్నారు. మేము అలాగే చేశాము. అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు కూడా ఉదారంగా స్పందించి సిఫార్సు లేఖకోసం ఎదురుచూడక గ్రాంటు విడుదల చేయడంతో, లోపలి అలంకరణలన్నీ పూర్తిేచేయగలిగాము. భవనానికి తెలుగు పత్రికారంగకులపతిగా నార్లచేత క్రీర్తింపబడిన కాశీనాథుని నాగేశ్వరరావు దేశోద్ధారక బిరుదును ఎంచుకొని దేశోద్ధారక భవన్‌ అని పేరు పెట్టాము. లోపల వంద సీట్లతో నిర్మించిన సభామందిరానికి తెలంగాణ పాత్రికేయ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి హాలు అని నామకరణం చేశాము. స్వగృహ నిర్మాణం ఒక పక్క యూనియన్‌ కార్యాలయభవనం పనులతో క్రియాశీలసభ్యులందరం తలమునకలుగా ఉన్నా ఉద్యోగజీవులం గనుక ఆ బాధ్యతలను యథావిధిగా నిర్వహించడంతో పాటు, స్వగ్భృహనిర్మాణం పనులను నిర్లక్ష్యం చేయలేదని చెప్పవలసిన పని లేదు. జర్నలిస్టుల సహకార గృహనిర్మాణనంఘాన్ని 1960లో ఏర్పాటు చేసుకున్నామని చెప్పాను. దానికి స్థలం కేటాయించవలసినదిగా ప్రభుత్వానికి మహజరు పెట్టుకున్నాం. అనేకస్థలాలు చూశాం. ప్రతీ ప్రభుత్వస్థలం వివాదగ్రస్తమైందే. చివరకు బంజారా హిల్స్‌ మూడవ నంబరు రోడ్డులో గొడవలు లేని ఆరెకరాల పైచిలుకు స్థలం దొరికింది. పంజాగుట్ట చౌరస్తా నుంచి జూన్లీ హిల్స్‌ వెళ్లే ఈ రోడ్డు కుడివైపున మొదట్లో ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ పెద్ద కొడుకు ఆజంజా ప్యాలెస్‌ ఉండేది. ఇప్పుడది నాగార్జునా హిల్స్‌గా మారింది. ప్రహరీ గోడ మాత్రమే బయటికి 194 జియస్‌. వరదాచారి

న్‌ లన్న శ్‌ మ న బంజారా పొల్స్‌ జర్నలిన్దు కాలనీలో మా ఇల్లు

కనబడేది. లోపల చెట్ల మధ్య భవనం ఎక్కడుందో కనబడేది కాదు. ఆ తర్వాత ఖాళీ స్థలం. దాని తర్వాత నిజాం చిన్న కొడుకు మోజంజా భవనం ఉండేది. అదీ లోపల ఎక్కడో కనబడకుండా ఉండేది. అది ఇప్పుడు సుల్తానుల్‌ ఉలూమ్‌ విద్యాసంస్థలకు నిలయమైంది. మధ్య ఖాళీ స్థలంలో ఒక పక్క వజీర్‌ సుల్తాన్‌ వారి స్థలము, మరో పక్క కుముదినీదేవి స్థలమూ, రెంటి మధ్యలో ప్రభుత్వస్థలం. దాన్ని గజానికి ఆనాటీ మార్కెట్‌ రేటు ప్రకారం ఐదురూపాయలు వెల నిర్ణయించి, జర్నలిస్టుల సహకార గృహనిర్మాణ సంఘానికి కేటాయిస్తూ ప్రభుత్వం 19. 9. 1968 జీవో జారీ చేసింది. డబ్బు కడితే భూమిని స్వాధీనం చేస్తారు. లే బెట్‌ తయారు అయితే కాని ఎవరెంత కట్టాలో తెలియదు. తయారు చేయడానికి ఆర్మిటెక్టును పెట్టుకున్నాము. కొన్ని నాలుగు వందల గజాలు, కొన్ని 350 గజాల ప్లాట్లు తయారు చేశాడు. మొత్తం 42 ప్లాట్లు వచ్చాయి. అంటే కొందరు 1750 రూపాయలు, కొందరు 2000 రూపాయలు కట్టాలి. అంతమొత్తం ఒకేసారి చెల్లించే స్తోమత చాలా మందికి లేదు. మళ్లీ ప్రభుత్వం దగ్గరికి పరుగెత్తక తప్పలేదు. డబ్బు 12 అర్ధసంవత్సర వాయిదాలలో కట్టడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ, 1968 జూన్‌లో జీవో జారీ చేసింది. అంతే కాదు, మొదటి వాయిదా కట్టగానే, భూమిని స్వాధీనపరచాలని కలెక్టరుకు ఉత్తర్వులు ఇచ్చింది. లే బెట్‌ తయారు చేసేటప్పుడు 40 శాతం భూమిని రోడ్లకు, సామూహిక ఉపయోగానికి వదలాలి. మొత్తం 42 షాట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి బ్రవ్మానందరెడ్డి చేత 1968 ఏప్రిల్‌ 8వ తేదీన కాలనీకి శంకుస్థాపన చేయించాము.

జ్ఞాపకాల వరద 195

మొదటి విడతలో సగంమందికి సహకార బుణాలు మంజూరైనాయి ఆ రోజులలో మధ్యతరగతి గృహాలకు 25 వేలు, అల్పాదాయవర్గ గృహాలకు 12,500 రుణమిచ్చేవారు ఇది 80 శాతం కింద లెక్క మిగతా 20 శాతం మన వాటాగా పెట్టాలి ప్లాట్ల కేటాయింపు నిర్వివాదంగా జరిగింది మూలరాళ్లు పాతి, నంబర్లు వేసి సభ్యులకు అప్పగించడమూ అయింది ముందు రోడ్లు వేస్తే కాని ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టిలేము మా విన్నపాన్ని మన్నించి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆ పని చేయడానికి అంగీకరించింది రఘునందన్‌ అనే యువ కంట్రాక్టరు పని త్వరగా నిర్ణష్టంగా చేశాడు ఆయన మాకో సహాయం కూడా చేశాడు రోడ్లకోసం మంజూరైన డబ్బు మిగిలింది దానితో భూగర్భ దైనేజీ వేసి పంజా గుట్ట చౌరస్తాలో మెయిన్‌ లైనులో కలుపవచ్చునన్నాడు మంజూరీ తెచ్చుకొమ్మన్నాడు తెచ్చాము దైనేజీ పూర్తయింది సంపు కట్టే బాధ తప్పింది బంజారా హిల్స్‌లో (దైనేజీ సౌకర్యంగల తొలి కాలనీ మాదే! సిమెంటు బస్తా ఏదున్నర

నాకూ తొలి విడతలోనే రుణం మంజూరైంది రుణమొత్తాన్ని మూడు విడతలలో విడుదల చేసేవారు సిటీ బిల్డర్‌ చేత ప్లాను గీయించుకొని, మునిసిపల్‌ అనుమతులు తెచ్చుకొని నిర్మాణం ప్రారంభించాను ఈ తరం వారికి ఆనాటి ధరలు ఆసక్తికరంగా ఉంటాయని చెపుతున్నాను అప్పుడు ఎసిసి సిమెంట్‌ బన్తా ధర వడున్నరరూపాయలు ఇసుక చిన్నలారీ 45 రూపాయలు స్టీలు లైసెన్స్‌ తీసుకొని కొనవలసివచ్చేది 12 ఎంఎం కడ్డీల ధర టన్నుకు 800 రూపాయలు అయినా ్రభుత్వమిచ్చే రుణంతో సరిసమానమైన మొత్తం మనం సమకూర్చుకోగలిగితే తప్పు ఇల్లు పూర్తి కాదు ఇల్లు జీవితంలో ఒక్కసారి కట్టడమే సామాన్యులకు గొప్ప గనుక, భవిష్యదవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్లాను వేయించుకోవడం సహజం అందుచేత ఎంత పొదుపుగా పోదామన్నా పెట్టుబడి పెరుగుతుంది అలంకారాలకు పోతే అదుపు తప్పుతుంది బ్యాంకులు ఆ రోజులలో గృహనిర్మాణానికి బుణాలు ఇచ్చేవి కాదు అందుకేరీ ఇన్‌ఫోర్సుడ్‌ స్తంభాలతో కాక గోడల ఇల్లు ఎంచుకున్నా ఇంతలో ఆంగ్రసంవత్సరం మారింది ఆంధ్రా బ్యాంకు వైర్మన్‌ కొత్తసంవత్సరం మొదటి వారంలో పత్రికాగోస్టి పెట్టి, క్యాలండర్లు, డైరీలు ఇచ్చి, క్రీతం సంవత్సరంలో తమ బ్యాంకు సాధించిన ఫలితాలను తెలుపుతూ ఉండేవారు ఆ సంవత్సరమూ పిలిచారు మామూలుగా వాటికి విలేఖరులే వెళ్తారు నేను ఇల్లు కట్టుకుంటున్నవారిని పోగుచేసి మనమూ గోస్టికి వెళ్లి రుణం 196 జియస్‌ వరదాచారి

ఇవ్వమని అడుగుదామన్నాను పలువురు వచ్చారు చైర్మన్‌గా గోపాలరావు చెప్పేది అయిపోయిన తర్వాత నేను రుణ ప్రస్తావన తెచ్చాను “ఇది ఒకరి సమస్య కాదు జర్నలిస్టులం ఇంద్లు కట్టుకుంటున్నాము ఈ వర్గానికి మీరేం సహాయం చేస్తారని అడిగాను “గృహనిర్మాణానికి రుణమివ్వలేంో అన్నాడాయన “గృహనిర్మాణం కాకపోతే వినియోగ రుణమనండి మరే పేరైనా పెట్టండి ఇల్లు కట్టుకుంటున్నవారందరికి జీతంతో ప్రమేయం లేకుండా పదివేల రూపాయల రుణమివ్వండి” అని అడిగాము “ఇది జర్నలిస్టు వర్గానికి మీరు చేస్తున్న సహాయమవుతుంది” అన్నాము ఏదో దారి కనిపెడతానన్నారు అందరికీ అలాగే ఇచ్చారు. భారీ వడ్డీతో ప్రైవేటు బుణాలు తెచ్చుకునే బాధ కొంతైనా తగ్గింది గృహప్రవేశం

వీలైనంత పొదుపుగా ఇల్లు కట్టుకుందామని ప్రయత్నించాను ధర్మపురిలో కలపధర తక్కువగా ఉన్నందున మరో ముగ్గురిని కలువుకొని అక్కడి నుంచి తెప్పించుకున్నాము అలాగే తక్కువ రేటుకు పనిచేసే బిల్డరును కుదుర్చుకున్నాం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పీఆర్వోగా, వారు ప్రచురించే "హైదరాబాద్‌ టుడే మాస పత్రిక ఎడిటరుగా ఉన్న రాజగోపాలాచారి, కార్పొరేషన్‌లో ఎ ఇ. గా పనిచేసి రిట్రరైన, గనీని కుదిర్చిపెట్టారు ఒకే చోట ఎక్కువ ఇళ్ల పని దొరికితే కలిసివస్తుందని ఆయన ఒప్పుకున్నాడు కట్టడం పూర్తయింది మల్లాల పనీ పూర్తయింది ఒక్క పడక గదిలో తప్ప షాబాద్‌ రాళ్లు పరవడం కూడా అయింది. గృహప్రవేశానికి మా నాయన 1970 ఆగస్టు 7వ తేదీనాడు ముహూర్తం నిర్ణయించారు అప్పటికి మా చిన్నబ్బాయి పుట్టలేదు ఇద్దరమ్మాయిలు శుభ, సౌమ్య, పెద్దబ్బాయి శ్రీహర్ష - అంతా పదేళ్లలోపు పిల్లలు అమ్మాయిలకు కలిసి వచ్చాయి గనుక వారు పుట్టిన సంవత్సరాల పేర్లు పెట్టాను రెండూ లక్ష్మీదేవి పేర్లే అబ్బాయి ప్లవంగ నామ సంవత్సరంలో పుట్టినందున ఆ పేరు పెట్టడం కుదరదు హర్ష సూచకంగా శ్రీహర్న అని పెట్టాను ఇల్లు ఎప్పుడూ హర్ష నిలయమే గనుక ఆ పేరే ఆహ్వానపటత్రికలో వ్రాశాను గృహప్రవేశం యథావిధిగా జరిగింది మిత్రుడు లింబారెడ్డి ఇల్లంతా తిరిగి చూస్తూ, మూసిఉన్న పడకగది చూస్తానన్నాడు “ఆ పడక గది చూశావు గదా, ఇదీ అలాగే ఉంది” అన్నాను ఐనా చూస్తానన్నాడు తెరిస్తే దానిలో ఫ్లోరింగు కాలేదు. “ఇదెందుకు ఇలా ఉంది?” అనడిగాడు “డబ్బు అయి పోయింది జీతం రాగానే పూర్తిచేస్తొనన్నా ఆయన హైదరాబాద్‌ ఆస్పెస్ట్రాస్‌లో ఇంజినీరు “నాకు ఇవాళ్లే బోనసు ఇచ్చారు రెండు వేలు జ్ఞాపకాల వరద 197

ఉంది. ఇమ్మంటారా?” అని జేబులో నుంచి తీసి ఇచ్చాడు. మా బిల్డరు గనీ అంటుండేవాడు. ఇంటిపనికి, పెళ్లి పనికి డబ్బు ఏదో విధంగా సర్దుబాటు అవుతుందని. ఏవో నమ్మకాలు అనుకున్నా మరో మిత్రుడు జియావుర్‌ రహ్మాన్‌ మరోసారి ఇలాగే అవసరసమయంలో డబ్బు సర్దుబాటు చేశాక యాదృచ్చికాలు పునరావృత్తమైతే నమ్మకాలు ఏర్పడుతాయేమో ననిపించింది. దేశంలో తొలి కాలనీ

కాలనీలో చాలా ఇండ్లు పూర్తయ్యాయి. (ప్రతీ సంవత్సరంవలెనే శీతాకాలం విడిదికోసం రాష్ట్రపతి వి.వి. గిరి సికింద్రాబాదు వచ్చి ఉన్నారు. ఆయనచేత కాలనీకి ప్రారంభోత్సవం చేయిస్తే బాగుంటుందని అందరికీ అనిపించింది. కట్టగట్టుకొని బౌలారం వెళ్లాము. రాష్ట్రపతి మేనల్లుడు అయిన సింహం, పూర్తి పేరు దిగుమర్తి నరసింవారావు సొసైటీ సభ్యుడు. ఈ కాలనీలో ఆయనకు పష్తాటు లేదు. ఐనా నేను మాట్లాడి పెడతానన్నాడు. అలాగే ప్రస్తావించాడు. అప్పుడు గిరి అన్న మాటలలో ధ్వనించిన ఆప్యాయత నేను మరచిపోలేను. 'ఒరేయ్‌! నేను రాష్ట్రపతిని రా! నా కార్యక్రమాలన్నీ మూడు నెలల ముందే నిర్ణయమైపోతాయి. నా చేతులలో ఉండదు. ఇప్పుడు కుదరదు. జర్నలిస్టు కాలనీ అంటున్నారు. నేను మళ్లీ వస్తాను. తప్పక ప్రారంభిస్తాను అన్నారాయన. అప్పటికి కొంత నిరాశ కలిగినా, కొన్నాళ్ల తర్వాత

కూ అం సైమళ! టా! గ్‌ కై ర] భ్‌ గ్‌

టు స. ము [ఓ

|. ల్‌ జ నె (| క్ట. 1 ఈ పను " | చో . ల ర! ీ య (్‌. ల్స్‌ ( ఎలా కు ళా “క ల్‌ ఐంజారా పొల్స్‌ జర్నలిస్టు కాలనీకి రాష్త్రవతి వి.వి. ౧౦ (ప్రారంభోత్సవం. వక్ళన ముఖ్యమంత్రి బ్రన్జోనందరెడ్టి.

198 జి.యస్‌. వరదాచారి

సైనికాధికారులు కాలనీకి పరిశీలనకు రావడం మా కోరిక నెరవేరుతున్నదన్న సంతోషాన్ని కలిగించింది. మరి కొన్నాళ్లకు రాష్ట్రపతి 1971 ఏప్రిల్‌ 6వ తేదీనాడు ఉదయం 10 గంటలకు కాలనీని ప్రారంభించడానికి వస్తారని సొసైటీ కార్యదర్శికి అధికారసమాచారం అందింది. అప్పుడు ఆర్‌. శ్రీనివాసన్‌ కార్యదర్శి. పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షుడు. ఆ లేఖలోనే రాష్ట్రపతి వచ్చినప్పుడు పాటించవలసిన మర్యాదలను వివరంగా పొందుపరచారు. వేదికమీద ఎవరెవరు ఉంటారని అడిగారు. ప్రసంగాలు చేసేవారి జాబితా అడిగారు. ఎన్నేసి నిమిషాలో అడిగారు. రాష్ట్రపతి సతీమణి సరస్వతీగిరి కూడా వచ్చే అవకాశముందనీ, ఆమెకు రాష్ట్రపతి పక్కనే సముచితాసనం ఏర్పాటు చేసి రాష్ట్రపతితోపాటు ఆమెకూ పూలదండ సమర్పించాలని సూచించారు. సభావేదికకు మా ఇంటి దగ్గరలో ఉన్న ప్రదేశం అనువైనదిగా కార్యవర్గం నిర్ణయించింది. దాని వెనుకనే పదిహేను ఇరవై అడుగుల ఎత్తు పెద్ద రాయి ఉంది. అది కాలనీవైపు సమతలం కలిగి ఆవిష్కరణ ఫలకం ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంది. కాలనీకి సుప్రసిద్ధ సంపాదకుడు కోటంరాజు రామారావు పేరు పెట్టాలని నిర్ణయించి ఆ పెద్ద రాతిమీద సిమెంటు ఫలకాన్ని అమర్చినట్టుగా తీర్చిదిద్దాము. రాష్ట్రపతి దాన్ని ఆవిష్కరించే ఏర్పాటు చేశాము. సభ ముగిశాక మా ఇంట్లో రాష్ట్రపతికి ఉపాహారం ఇవ్వాలని నిర్ణయించాము.

సభకు ముందు రోజు స్థానిక సైనికప్రతినిధులు స్థలపరిశీలనకు వచ్చారు. సరస్వతిగారు రావడం లేదని చెప్పారు. వేదిక మీద రాష్ట్రపతితోపాటు ముఖ్యమంళి సొసైటీ అధ్యక్షుడు ఉండాలన్నారు. మా ఇంటికి వచ్చి ఉపాహారమిచ్చే స్థలాన్ని పరిశీలించి అతిముఖ్యులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని సూచించారు. కాలనీ ప్రారంభోత్సవం నిర్జీతకార్యక్రమం ప్రకారం ఠంచనుగా జరిగింది. జర్నలిస్తులకు కొన్ని పట్టణాలలో (ప్రభుత్వ గృహాలు కేటాయించిన దృష్టాంతాలు ఉన్నాయి కాన్‌, వారే ఒక సొసైటీగా ఏర్పడి నిర్మించుకున్న మొదటి కాలనీ ఇదేనని రాష్ట్రపతి అభినందించారు. సభ ముగియగానే రాష్ట్రపతి తమ వాహనం ఎక్కివెళ్లిపోయారు. అల్పాహారానికి రాలేదు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి, రెవెన్యూ మంత్రి వి.బి. రాజు, అధికారులు మాత్రమే వచ్చి అల్పాహారం సేవించారు. " భార విమోచన

కొత్త ఇంట్లో సంతోషంగానే ఉన్నాం. కాని కులాసాగా కాలం గడుపుతున్నామంటే పూర్తి సత్యం కాదు. ఇంట్లో ఇంకా కొన్ని పనులు పూర్తికానేలేదు. సహకార రుణం జ్ఞాపకాల వరద 199

కిస్తులు చెల్లించవలసిన సమయం వచ్చేసింది కాని ముందు చేబదుళ్లు, ఎక్కువ వడ్డీకి తెచ్చిన ప్రయివేటు బుజాలు తీర్చాలి సహకార రుణం సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇలాటి ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా ఒకరోజు మా పక్క స్థలం యజమానురాలైన కుముదినీదేవి మా ఇంటికి వచ్చారు తన స్థలాన్ని ప్లాట్లు చేసి అమ్మదలచానని ఏడు రూపాయలకు గజం రేటున ఇస్తానని చెప్పారు మా వాళ్లు ఐదు రూపాయలే ఎక్కువంటున్నారు ఏడు రూపాయలంటే ఎవరు తీసుకుంటారని నేనన్నాను అప్పుడామె మేమెవరమూ దృష్టి పెట్టని విషయమొకటి చెప్పారు మీరు 'ప్రజోపయోగం కోసం వదిలేసిన 40 శాతం భూమిని కలుపుకొని మొత్తం ఆరెకరాల పైచిలుకు స్థలానికి ధర చెల్లిస్తున్నారు అంటే మీ ఇంటి జాగాకు గజానికి “మీరు 8 రూపాయల 20 పైసలు చెల్లిస్తున్నారన్నమాట నేను మీకు అంతకంటే తక్కువ ధరకే ఇస్తానంటున్నా” అన్నారామె మా వాళ్లకు చెపుతానని ఆమెను పంపించాను

జర్నలిస్టులలో ఇంకా కొనేవారెవరూ లేరు మా కాలనీలోనే మూడు ప్లాట్లు మిగిలి పోయాయి గోరాశాస్త్రిని అడిగితే 'ఐ డోంట్‌ బిలీవ్‌ ఇన్‌ ఓనింగ్‌ ప్రాపర్టీ అన్నారు

గండూరి కృష్ణ ప్రవేశ రుసుము కూడా కట్టలేనంటే చెక్కుతీసుకుని ప్రవేశమిచ్చి, రుణమిచ్చి ప్లాటు ఇచ్చారు ఆయన ఆ రుణ మొత్తాన్ని అత్యవసరఖర్చులకే వాడుకొని చివరకు ప్లాటును వాపసు ఇచ్చారు పిటిఐ లో పని చేసే జియావుర్‌ రహమాన్‌కు అలాగే మూడో ప్లాటు ఇస్తే ఆయన బుద్ధిగా ఇల్లు కట్టుకొన్నారు ఆయన వారసత్వంగా ఇల్లు ఉద్యోగం సంపాదించిన ఆయన కుమారుడు కలీముర్‌ రహమాన్‌ దాన్ని తర్వాత వృద్ధిపరచి ఇప్పుడు సుఖంగా ఉంటున్నాడు పక్క ప్లాట్లు కొనడం కాలేదుగాని కుముదినీదేవి చెప్పిన లెక్కతో నాకో కొత్త అలోచన తట్టింది రోడ్లు ఇతర అవసరాలకోసం వదిలేసిన స్థలాన్ని మినహాయించవలసినదిగా ప్రభుత్వాన్ని కోరాలని

మా సీనియర్‌ నాయకులలో ఒకరైన జి రామారావుకు చెపితే ఆయన సమర్థించడమేగాక వెంటనే బ్రహ్మానందరెడ్డిని కలిసే ఏర్పాటు చేశారు కలిసి అదనపుభారం గురించి

చెప్పాము ఏం చేయమంటారని అడిగారాయన “అన్ని ఇండ్లు దాదాపుగా

తయారయ్యాయి కాంపౌండ్ల లోపల ఉన్న స్థలాల విస్తీర్ణం లెక్కించి ఎవరెంత కట్టాలో

నిర్ణయించండి” అన్నాము ఆయన సమ్మతించారు సర్వేయరును నియమించి అందరి

ప్లాట్లను కొలిపించారు. ఐతే 1971 సెప్టెంబర్‌ 25న ఆయన ముఖ్యమంత్రి పదవికి

రాజీనామా చేశారు 197] నవంబరు 18న మేము దబ్బు చెల్లించవలసిన స్థలవిస్తీర్దాన్ని మేము కోరినట్టు తగ్గిస్తూ జీవో వచ్చింది అలా ఐదు రూపాయలకంటే ఎక్కువ ధర

చెల్లించే భారం తప్పింది

200 జి యస్‌ వరదాచారి

ఇదే కాదు, వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చక్రవడ్డీ భారం నుంచి విముక్తి కల్పించారు 1975 నుంచి 1978 వరకు నేను జర్చలిస్టుల సహకార గృహనిర్మాణసంఘానికి అధ్యక్షుడుగా ఉన్నాను చేబదుళ్లు, (ప్రైవేటు బుణాలు తీర్చడానికి ప్రాధాన్యమివ్వడం వల్ల సహకార రుణం కిస్తులు ఎక్కువమంది సభ్యులు సకాలంలో చెల్లించలేక పోయారు. అవి జీవితబీమా సంస్థ నిధులు రాష్త్రం తనపరంగా గృహనిర్మాణ బుణాలుగా ఇస్తుంది కిస్తులు బాకీ పడ్డప్పుడు చక్రవడ్డీ పడుతుంది ప్రభుత్వం బీమా సంస్థకు నియమం ప్రకారం కిస్తులు కట్టేస్తుంది గనుక, ప్రభుత్వం చక్రవడ్డీ చెల్లించవలసిన అవసరం ఉండదు రుణ గ్రహీతలు చెల్లించాలి అది రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది మళ్లీ సీనియర్లను కదిలించాము రామారావుకు సహకార సంఘాల రిజిస్ట్రారు కుమారస్వామి రెడ్డి బాగా పరిచయం ఆయనను కలుసుకొని విషయం వివరిస్తే ఆయన అనుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రిని కలిశాం. మా వాదం విని మీరేమంటారని రిజిస్రారునడిగారు ఆయన ఒక మార్గం చెప్పారు చక్రవడ్డీని మాఫీచేయడం కాకుండా కిస్తులు చెల్లించవలసిన తేదీని 1978 మార్చి 31 నాటికి పొడిగించడం అలాచేస్తే చక్రవడ్డీ పడే ప్రసక్తి రాదు వెంటనే ఆ జివో ఇచ్చారు ఇన్ని ప్రయత్నాల తర్వాత, అందరూ బాకీ మొత్తాలు పూర్తిగా చెల్లించాక, 1994 నవంబరు 8వ తేదీన ఇండ్లు మా పేరిట రిజిస్టరయ్యాయి

సర్మారువారు జర్నలిస్టులను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికే ఇళ్ల స్థలాలు ఇచ్చారని అప్పుడే కొంత ప్రచారం కూడా జరిగింది జర్నలిస్టులతో నవా ఏ వృత్తివర్గానికైనా ఆరోగ్యసేవలు అందించడం, గృహవసతి కల్పించడం సంక్షేమ కార్యక్రమాలలో భాగం అవుతుంది మెహర్చానీయో, ప్రలోభపరచడమో కాదు జర్చలిస్టులు పాఠకులకు విధేయులై సత్యనిష్టతో పని చేస్తారు చెయ్యాలి ప్రలోభాలకు లొంగరు ప్రస్తుత తెరాస ప్రభుత్వం కూడా జర్చలిస్టుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది ప్రతిఫలాపేక్షతో కాదు ప్రజాహిత పథకాలలో భాగంగా మాత్రమే ఎవరికైనా అమిత, అనుచిత లాభం కలిగిస్తే తప్పవుతుంది దేశంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి. నిజమే కాని ప్రతి దాంట్లో ఏదో అక్రమాన్ని వెతకబూనడం సరైన పద్ధతి కాదు పత్రికారచయితలు సమయసందర్భాలను విస్మరించరాదు జర్నలిస్టు కాలనీవచ్చిన పాతికేళ్ల తర్వాత (ప్రముఖ స్థానిక ఆంగ్లదినపత్రిక మొదటిపేజీలో దిగువ భాగాన ఐదుకాలాల నిడివిగల పెద్ద శీర్షికతో ఓ కధనం ప్రచురించింది లక్షలు విలువ చేసే భూమిని (ప్రభుత్వం కారు చౌకగా జ్ఞాపకాల వరద 201

జర్నలిస్టులకు ధారాదత్తం చేసిందని అప్పుడు బంజారా హిల్స్‌లో గజం భూమి మార్కెట్‌ ధర ఎంత? కుముదినీదేవి రెండేళ్లలో పెరిగిన ధర చెప్పారు ఇప్పుడు లక్ష రూపాయలు ఉంటే ఉండవచ్చు అన్ని ధరలూ పెరిగాయి. ఇప్పటి ధరలను 50 ఏళ్ల కిందటి ధరలతో పోల్చి ఏదో అక్రమం జరిగిపోయిందని వ్రాస్తే అనైతికమవుతుంది యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నిక 1980లో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ ఎన్నికలు వచ్చాయి నాతో ఆంధ్రభూమిలో పనిచేసిన ఎస్‌ వి ఎస్‌ సుబ్బారాయుడు, ఒకరోజు నలుగురు మిత్రులతో నా వద్దకు వచ్చాడు ఎన్నికలలో తమ వర్గం పోటీ చేయదలచిందని చెప్పాడు మా ప్యానల్‌లో మిమ్మల్ని అధ్యక్షుడుగా పెట్టాలని నిర్ణయించామని, మీరు అంగీకరించాలని కోరారు తెలుసుకుందామని అవతలి పోటీదార్లు ఎవరని అడిగాను గుంటూరుకు చెందిన పివివి గోపాలస్వామి అధ్యక్షుడుగా, తాను కార్యదర్శిగా, జి రామారావు ఒక ప్యానల్‌ తయారు చేశాడని, చెప్పారు “అంతా సన్నిహితమిత్రులే. పైగా నేను పోటీలకు దూరంగా ఉంటున్నాను నన్ను వదిలేయంొడన్నాను “త్వరలో కొత్త వేజ్‌ బోర్డు రాబోతున్నది గతంలో మీరు నివేదికలు సిద్ధం చేసి, సాక్ష్యాలు ఇచ్చారు మీరు ఉంటే బాగుంటుందని బలవంతపెట్టారు సరేనని సంతకం పెట్టాను. నామినేషన్లు వేశారు ఒకరోజు రామారావు ఫోన్‌ చేశారు “నీవు పోటీ చేయాలనుకుంటే మా ప్యానల్‌లోనే పెట్టేవాళ్ళం కదా! నీవు తప్పుకుంటే బాగుంటురాదన్నారు “నామినేషన్లు వేసే గడువు అయిపోయింది ఇప్పుడు నేను తప్పుకుంటే ఎలా కుదురుతుం”దన్నాను ఆరా తీస్తే రామారావు ప్యానల్‌ గెలువు నా వల్ల సందేహాస్పదమైందని, ఎవరినడిగినా వరదాచారి ప్యానల్‌కే వోటు వేస్తామంటున్నారని తెలిసింది రామారావు మంచి వ్యూహకర్త గొప్ప ఎత్తుగడ వేశారు తమ అధ్యక్షుడిని ఉపసంహరింపచేశారు అధ్యక్షుడుగా నేను పోటీలేకుండా గెలిచాను ఫలితాలు వచ్చిన రోజున అందరూ రామారావు ప్యానల్‌లో వారే నెగ్గారు “నువ్వు రాజీనామా చేస్తావా?” అని (శ్రేయోభిలాషులు అడిగారు చెయ్యనన్నాను నేనెవరితోనైనా కలిని పనిచేయగలనన్నాను. అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగాను రామారావుకు నాతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరము ఉండదని నాకు తెలుసు వేజ్‌ బోర్డు పనికూడా చక్కగా పూర్తి చేశాము 202 జి యస్‌ వరదాచారి

జర్నలిస్టులకు పింఛను

జర్నలిస్టులతో పాటు భవిష్య నిధి సభ్యత్వం కలిగిన కార్మికులందరికీ లాభం చేకూర్చిన పింఛను పథకం తొలుత నా మెదడులోనే మొక్కతొడిగింది మా అన్నయ్య పదేపదే రిటైర్మెంటు బెనిఫిట్స్‌ గురించి ప్రస్తావిస్తూ ఉండేవారని- చెప్పాను కదా పింఛనుకు బదులు మాకు (గ్రాట్యూటీ రూపంలో ఏకమొత్తంగా తగినంత సొమ్ము లభిస్తుంది గనుక అది ఆధారంగా ఉంటుందని ధైర్యం చెపుతుండేవాడిని కాని ఈ గ్రాట్యూటీకి పదేళ్ల సర్వీసు నిబంధన ఉంది అంటే ఒక సంస్థలో పదేళ్లు పనిచేసినవారే (గ్రాట్యూటీకి అర్హులవుతారు. తిరుమల రామచంద్ర వంటివారు, జీవితాంతం జర్నలిజంలోనే ఉన్నా ఎక్కడా నిలకడగా పదేళ్లు ఉండనందున, గ్రాట్యూటీకి నోచుకోలేక పోయారు వారి అనుభవం నాలో ఆలోచనను రేకెత్తించింది దీనికితోడు ముఖ్యమంత్రి వెంగళరావు ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యూటీ కూడా వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీచేశారు దానితో మనమూ పింఛను కోరడంలో అత్యాశ ఏమీలేదని అనిపించింది ఇది కేంద్రప్రభుత్వ అధీనంలోని అంశం మన యూనియన్‌ నాయకులకు చెపితే “ఆచరణ సాధ్యం కానివి చెప్పకు” అని తోసిపారేశారు

ఇంతలో జర్నలిస్పుల సమాఖ్య నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నమావేశం ఢిల్లీలో జరుగుతుందని నోటీసు అందింది. నేనూ కౌన్సిల్‌ సభ్యుడినే సమావేశానికి వెళ్లి జర్నలిస్టులకు పింఛను సౌకర్యం కల్పించాలని కోరే తీర్మానాన్ని ప్రవేశపెట్టాను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తమ ఉద్యోగులకు కల్పించిన అదనపు లబ్ధి గురించి చెప్పాను ఇప్పుడు ఉద్యోగి సంస్థలుమారినా భవిష్య నిధి కొనసాగుతున్నట్టుగానే దీనినీ నిర్వహించవచ్చునని చెప్పాను అప్పుడూ కొందరు ఇతర రాష్ట్రాల సభ్యులూ నవ్వారు బొంబాయికి (ఇప్పుడు ముంబై) చెందిన సీనియర్‌ సభ్యుడు మధు షెట్యే జోక్యం చేసుకొని “వరదాచారి ఒక మంచి సూచన చేస్తుంటే నవ్వతారెందు"కని గట్టిగా (ప్రశ్నించాడు “ఎలా సాధ్యమో కూడా చెపుతున్నాడు, ఆలోచించండి అన్నాడు దానితో సభ గంభీరంగా మారింది మద్దతుదారులు పెరిగారు తీర్మానం ఆమోదం పొందింది దీన్ని పోస్టులో పంపితే ఎవరూ చూడరని, సమాచార మంత్రికో, ప్రధానికో ఒక బృందంగా వెళ్లి కలిసి ఇస్తే బాగుంటుందని కూడా సూచించాను ఢిల్లీ సభ్యులు ప్రధానికే ఇద్దామన్నారు అవి ఎమర్జెన్సీ రోజులు. ప్రధాని ఇంటర్వ్యూ దొరుకుతుందా అని ఎవరో సందేహం వెలిబుచ్చారు ఢిల్లీ సభ్యులే మార్గం చెప్పారు. ఇంటర్వ్యూ అక్కరలేదు బృందంగా వెళ్లి ఆమె నివాసం ముందు “ఇందిరా గాంధీ జిందాబాద్‌!” జ్ఞాపకాల వరద 208

అంటూ ఐదు నిమిషాలు నినాదాలు చేస్తే, ఆమే బయటకు వస్తారని చెప్పారు. అలాగే చేశాం. ఆమె వచ్చారు. విజ్ఞాపన అందుకొన్నారు. దీనిని టి.ఏ. పాయ్‌కి అప్పగిస్తానన్నారు. కొత్తగా ఆలోచించే వ్యక్తిగా పేరున్న పాయ్‌ అప్పుడు జీవిత బీమా సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన చేతిలో ఇది ఫలప్రదమవుతుందని సంతోషంగా వచ్చేశాము.

ఈ వార్త పత్రికలలో వచ్చింది. దానితో బలమైన శక్తులుగా ఉన్న ఐ.ఎన్‌.టి. యు.సి., ఎ.ఐ.టి.యు.సి., తదితర సంఘాలలో కదలికవచ్చింది. పింఛను కొందరికే ఎందుకు? భవిష్యనిధి వర్తించేవారందరికీ ఇవ్వాలనే డిమాండ్‌ ముందు కొచ్చింది. కోరిక న్యాయమైందే. కాని పరిస్థితిని జటిలం చేసింది. కొద్ది రోజులకే పాయ్‌ కేంద్రమంత్రివర్గ సభ్యుదయ్యారు. ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఈ ప్రతిపాదన వెనుకబడిపోయింది. ఐదారేళ్ల తర్వాతచాలా నీరుగారిన స్థితిలో అమలులోకి వచ్చింది. హైదరాబాద్‌లో పింఛను పథకం అమలును ప్రకటించడానికి సభ పెట్టారు. నేనూ వెళ్లాను. రెడ్డిగారు కమిషనరు. ఆంధ్రభూమిలో నాతో పనిచేసిన కృష్ణమూర్తి నాయుడు విశాఖలో ప్రాంతీయ కమిషనరు. ఆయనా వచ్చారు. అది జర్నలిస్టుల కోసం మొదట్లో ప్రారంభమైందని, తర్వాత కార్మికులందరికీ వర్తింపజేశారని ఉపన్యాసాలలో చెప్పారు. తెలుగు జర్నలిస్టులే కారకులని వారికి తెలియదు, ఎవరికీ తెలియదు. మన జర్నలిస్టులకన్నా చెపుదామని నేను యూనియన్‌ పత్రిక 'ప్రతిస్పందనికు ఈ (శ్రేయస్సు మన యూనియనుకే దక్కుతుందంటూ వ్యాసం వ్రాసి పంపించాను. కాని ప్రచురణకు నోచుకోలేదు. నమ్మకం కుదరలేదేమో! చరిత్రలో చీకటి రోజులు

దేశచరిత్రలో హేయమైన ఘటన 1975లో జరిగింది. అత్యవసర పరిస్థితి విధింపు. అవినీతిచర్యలకు పాల్పడినందువల్ల లోక్‌సభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సామాన్యపరిస్థితిలోనైతే అలా వ్యతిరేక తీర్పుకు లోనైనవారు తమ పదవికి రాజీనామా చేస్తారు. ఇందిర ఆ తీర్పుపై స్టే కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందిగాని, చాలా షరతులు పెట్టింది. ఇందిరకు; ఆమె భజనపరులకు అది నచ్చలేదు. 1975 జూలై 25వ తేదీనాడు అత్యవసర పరిస్థితి విధించారు. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌తోపాటు అన్ని ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకులను, సీనియర్‌ జర్నలిస్టులను, తమకు ్రతికూలురు 204 జి.యస్‌. వరదాచారి

అనుకున్న కవులు, కళాకారులు, ఇతరరంగాల ప్రముఖులను నిర్విచక్షణగా జైలులో పెట్టారు పత్రికల పైనా సెన్సార్‌షిప్‌ విధించారు ఎమర్జెన్సీ అనుశాసనాన్ని ఎలా అమలు చేయాలో దక్షిణాది రాషమ్ర్రాల ముఖ్యమంత్రులకు సూచించడానికి, మన ముఖ్యమంత్రి వెంగళరావును నియోగించారు ఆయన ప్రత్యేక విమానంలో రాత్రంతా రాజధానులకు తిరిగి ఇందిర ఆజ్ఞలను అందరికీ అందజేసి వచ్చారు ఈ విషయం ఆయనే ఎమర్జెన్సీ విధించిన రోజు పొద్దున, హైదరాబాద్‌లో ఒక సినిమా సభకు వచ్చినప్పుడు చెప్పారు అయితే చిత్రంగా మన రాష్ట్రంలో ఆయన ఎవరినీ అరెస్టు చేయించలేదు

నేను ఆఫీసుకు వెళ్లిన కొద్దిసేపటికి గోరాశాస్త్రి ఇంటినుంచి వాళ్ల అమ్మాయి ఆందోళనగా ఫోను చేసింది గోరాశాస్త్రి అప్పుడు ఊళ్లో లేరు ఉత్తమసంపాదకులకు జమీన్‌ రైతు పద్రిక ఇచ్చే రామానాయుడు అవార్డు అందుకోవడానికి నెల్లూరు వెళ్లారు నాన్నను అరెస్టు చేయడానికి వారంట్‌ జారీ అయిందని తమ బంధువైన ఎసి.పి చెప్పాడనీ, ముఖ్యమంత్రిని కలిసి ఆపివేయిస్తే మంచిదన్నాడనీ తెలిపింది నేను వెంటనే సీతారామ్‌కు ఫోన్‌చేశాను “అవునట నాకు కూడా జారీ అయిందటొ అని ఆయన అన్నాడు “ముఖ్యమంత్రిని కలుద్దాం నేనూ వస్తానన్నాను “వస్తే రా గాని, నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను ఆయన జర్నలిస్టులను అరెస్టు చ్రేయడమేమిటని పోలీసులను మందలించారని చెప్పాడు వారంట్లు రద్దయ్యాయి ఆ రోజు విజయవాడలో ఎమర్జెన్సీ వ్యతిరేకసభలో మాట్లాడబోతున్న నీలం సంజీవ రెడ్డిని కూడా వెంగళరావు అరెస్టు చేయించలేదు సభకు ముందే కారులో ఎక్కించి అనంతపురం తీసుకువెళ్లి ఆయన ఇంట్లో దింపేశారు వారంటుకు కారణమైన సంపాదకీయం

ఇంతకీ గోరా మీద వారెంటు ఎందుకు జారీ అయిందో తర్వాత తెలిసింది, ఎమర్జెన్సీ ప్రకటనకు ముందు రోజు ఆంధ్రభూమిలో వచ్చిన సంపాదకీయం ఇందిరకు వ్యతిరేకంగా ఉండటం కారణమని 'షరతుతో స్టే అనే శీర్షికతో (ప్రచురితమైన ఆ సంపాదకీయం నేను వ్రాసింది అది వ్రాస్తున్న సమయానికే ఏ క్షణంలోనైనా ఎమడర్జెన్సీ రావచ్చునని తెలిసిపోయింది కనుక తార్మికంగా తీర్పు ఆంతర్యాన్ని వివరించడం తవ్ప దానిలో కరోరవ్యాఖ్యలేవీ చేయలేదు. పైగా విషయం గంభీరమైనదైనప్పుడు భాష నిగ్రహంగా, నిర్దిష్టంగా ఉండాలన్న నియమం అందరికీ చెప్పేవాడిని కనుక, కచ్చితంగా పాటించాను ఇలా ప్రారంభించాను' “స్పప్రీం కోర్టు జ్ఞాపకాల వరద 205

తీర్చు వెలువడింది శ్రీమతి ఇందిరాగాంధీ అభ్యర్థించినట్టు సంపూర్ణమైన, నిర్షిబంధమైన స్టే మంజూరు చేయలేదు *” తర్వాత తీర్పు అంతర్భావవివరణ చేసి ముక్తాయింపుగా “ఏది ఎలా ఉన్నప్పటికీ తాము ప్రధానమంత్రిగా కొనసాగడానికే శ్రీమతి గాంధీ నిశ్చయించుకున్నట్టు ఆమె ఇటీవల చేసిన అనేకప్రసంగాలను బట్టి వెల్లడవుతున్నది రాబోయే పరిణామాల కారకు నిరీక్షించాలి అని ముగించాను అదే అధికారులకు ఆక్షేపణీయంగా తోచినట్టుంది

ఇక్కడ ఓ విషయం చెప్పాలి పత్రికలో ప్రచురించిన విషయాలన్నిటికీ సంపాదకుడిదే ప్రత్యక్ష పరోక్ష బాధ్యత వార్తలు, వ్యాసాలు వ్రాసినవారి పేరుతో ప్రచురిస్తే అతని బాధ్యత కూడా ఉంటుంది సంపాదకీయాన్ని పేరుతో ప్రచురించే సంప్రదాయం లేదు గనుక దాని మంచిచెడులు ఎడిటరు ఖాతాలోకే పోతాయి ముఖ్యమంత్రి సవ్యంగా ఆలోచించడం వల్ల జర్నలిస్టులకు బాధ తప్పింది వార్తల 'ప్రచురణ విషయంలో కూడా మేము పెద్దగా ఇబ్బందులు ఎదుర్మోలేదు. సెన్సారు అధికారి వచ్చినా పత్రిక మొత్తం చదివే సమయం ఎక్కడుంటుంది? మేము వార్తలకు అమాయకపు అంటే ఇంగ్లీషులో లేబుల్‌ హెడ్దింగు అంటారే అలాంటి శీర్షికలు పెట్టేవాళ్లం వార్తలో సమాచారం దాచకుండా ఇచ్చినా సెన్సారువారు పట్టుకోలేక పోయేవారు

ఈ ఎమర్జెన్సీలో 1975 డిసెంబరు నెలలో '“ఈనాడు' దినపత్రిక హైదరాబాద్‌ ఎడిషన్‌ ప్రారంభమైంది అంతకు ముందు సంవత్సరమే ఈనాదు విశాఖపట్నం నుంచి ప్రచురణ ప్రారంభించింది సాయంత్రం వరకు ఏ పత్రికా దొరకని ఆ ప్రాంతంలో స్వల్పకాలంలోనే చెప్పుకోదగిన సర్కులేషన్‌ సంపాదించింది పత్రిక ఉత్పత్తి వ్యయం దాని అమ్మకం ధరకన్నా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక అడ్వర్దయిజ్‌మెంట్లు కావాలి ఎక్కడో మారుమూలలో వెలువడే పత్రికకు అద్వర్థయిజీమెంట్లు రావు కనుక రాజధాని నుంచి కూడా ప్రచురితం కావడం వ్యాపారావసరం “ఈనాడు” హైదరాబాద్‌ నుంచేకాక తర్వాత విజయవాడ, తిరుపతి ఎడిషన్లు కూడా ప్రారంభించింది స్వంత కార్లలో మారుమూల గ్రామాల పారకులకు కూడా సూర్యోదయానికి ముందే పత్రిక అందించడం మొదలు పెట్టింది మార్కెట్‌ సర్వే చేసి శాష్రీయపద్ధతిలో ఏజెన్సీలు ఏర్పాటుచేసి, మిగతావారు అనుసరించేటట్టుచేసి, గొప్ప మార్పును తీసుకు రాగలిగింది మా ఆంధ్రభూమిలో పని చేస్తున్న పొత్తూరి వెంకటేశ్వరరావు నలుగురు సీనియర్లను తీసుకొని వెళ్లి దానిలో చేరిపోయాడు హైదరాబాద్‌ ఎడిషను ప్రారంభోత్సవసభకు 206 జి యస్‌ వరదాచారి

గోరాశాస్త్రి, నేను యజమానుల వెంట వారి కారులోనే వెళ్లాం తిరిగి వస్తుండగా నేను రామోజీరావు మార్కెటింగ్‌ విధానం వల్ల, అవసరమైన ఖర్చుకు వెనుకాడని స్వభావం వల్ల పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పి, మనమూ జాగ్రత్తపడటం అవసరమని వివరించాను యజమానుల్లో ఒకరైన పట్టాభిరామ్‌ తన స్వాభావిక ధోరణిలో “ఆయనకు అంటే రామోజీరావుకు మార్గదర్శి ఉంది మాకు అలాటి సత్తా లేదు పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్లు తాగడమే మేలని మేమనుకుంటాము” అన్నారు నెల అయినాక ఒకరోజు నేను కనబడగానే “ఏదో భయపెట్టావు మన సర్ములేషన్‌ ఏమీ తగ్గలే” దన్నారు ఈనాడు సర్భులేషన్‌ 40 వేలకు పెరిగిందట అది మనం వదిలేసిందేనని నేను అన్నాను ఆంధ్రభూమి అంటే తెలంగాణ పారకులకు ఆ నాడు ఎనలేని అభిమానం ఏజెంట్లు వచ్చి పది పేపర్లు పెంచమంటే పెంచేవారు కాదు మీరైనా చెప్పండని మమ్మల్ని అడిగేవారు సర్ములేషన్‌ పెరిగి అడ్వర్థయిజ్‌మంట్లు పెరగకపోతే నష్టం పెరుగుతుంది ఈనాడు, ఆంధ్రజ్యోతి కొత్త సర్కులేషన్‌ సంపాదించుకున్నా చాలా కాలంవరకు కరీంనగరు, మంధెన, మహబూబ్‌నగర్‌లలో అన్ని పత్రికలకంటే భూమి సర్భ్కులేషనే అధికంగా ఉండేది

ఆంధ్రభూమి పట్ల పారకాభిమానం విశేషంగా ఉండటానికి ప్రధానకారణం 1969 తెలంగాణ ఉద్యమంలో అది నిర్వహించిన పాత్ర అనవచ్చు అది కొక భూమి అనగానే గోరాశాపస్రి సంపాదకీయాల కోసమే ఆంధ్రభూమి చదువుతున్నా మనేవారు ఆ రోజులలో చాలామంది ఉందేవారు గోరా సంపాదకీయాలు, అడపా దడపా వ్రాసే వినాయకుడి వీణ చాలా ఆకర్షణీయంగా ఉండేవనడంలో సందేహం లేదు గోరా వాటిని శిల్పం చెక్కినట్టు తీర్చిదిద్దేవారు మొదట తోచినమాటను న్రాసిపారేసేవారు కాదు సరైన, సందర్భోచితమైన పదం కోసం కసరత్తు చేసేవారు వీటికి తోడు వార్తలు, శీర్షికలు సరి కొత్తగా ఆధునిక ప్రామాణికశైలిలో ఉందేవి

కొత్త కవులను, రచయితలను ్రోత్సహించేవారం. పరిశోధన వ్యాసాలు వ్రాసేవారిని ఆదరించి వారి రచనలను అవసరమైతే మలిచి, మలిపించి, మార్చి, మార్చించి ఉభయతారకంగా 'ప్రచురించేవారం ఆ రోజులలో హనుమకొండ స్నాతకోత్తర కేంద్రం అధిపతిగా ఉన్న బిరుదురాజు రామరాజు స్కాలర్లకు చెప్పి నా వద్దకు పంపించేవారు వారికి పిహెచ్‌.డిలో సీటు రావాలంటే, కొన్ని ప్రామాణిక పత్రికలలో ప్రచురితమైన వ్యాసాలు దాఖలు చేయవలసి ఉంటుంది పరిశోధనకే అంకితమైన కాలికపత్రికలు అప్పుడు లేవు ఆంధ్రభూమిలో అచ్చయినవాటిని వారు జ్ఞాపకాల వరద 207

ప్రామాణికమైనవిగా గుర్తించారు. అలా భూమిలో అచ్చయిన వ్యాసాలతో డాక్టరేట్లు సంపొదించినవారిలో కొందరు విద్యారంగంలో ఉన్నతపీఠాలను అలంకరించారు.

సినిమా వార్తల పేజీ చిత్ర భూమికి పాఠకులలోనేగాక పరిశ్రమ వర్జాలలో కూడా విశేషఆదరణ ఉందేది. నేను వ్రాసే చిత్రసమీక్షలు అందరి మన్ననలు అందుకునేవి. కొందరు (ప్రేక్షకులు ఫ్యాన్‌ క్లబ్‌గా ఏర్పడి చర్చించేవారు. అలాగే నేను చాలాకాలం వ్రాసిన లఘువ్యాఖ్యలు వ్యంగ్య ధోరణిలో సాగిపూర్వాపర సమాచార సమృద్ధి కలిగి జనాన్ని ఆలోచింప జేస్తుండేవి. అలా విభిన్నప్రక్రియలలో విశిష్టసేవ లందించింది గనుకనే లోకప్రియంగా ఉందేది. అంధ్రభూమి యాజమాన్యం మార్పు

-మొదలియారు సోదరులు తమలో అనైక్యత, అపనమ్మకం వల్ల బంగారుగుడ్లు పెట్టే బాతులాంటి తమ దక్కన్‌ క్రానికల్‌ సంస్థను అమ్మకానికి పెట్టారు. ప్రముఖ గుత్తేదారు తిక్యవరపు చంద్రశేఖరరెడ్డి 1977లో దాన్ని కొన్నారు. ఈ వ్యాపారం తమకు కొత్త గనుక ఉద్యోగుల సహకారం కోరారు. దక్కన్‌ క్రానికల్‌లో సబ్‌ ఎడిటరుగా పనిచేస్తున్న తమ తోడల్లుడు కందనాతి చెన్నారెడ్డికి జనరల్‌ మేనేజరు పదవి ఇచ్చారు. చెన్నారెడ్డి నాకు సన్నిహితుడుగా ఉండేవాడు. నన్ను ఎడిటోరియల్‌ వ్యవహారాలలో, అద్వర్టయిజ్‌మెంట్‌ మేనేజరు డి.ఎన్‌. గుప్తాను వ్యాపారవ్యవహారాలలో తోడుగా ఉందాలని అడిగాడు. మేము సరేనన్నాము. నెల గడువక ముందే ఒకరోజు నాకో పేర్లజాబితా చూపాడు. దండుగమారివాళ్లు అన్నాడు. గొప్పగా పనిచేయకున్నా వారు సమస్యగా మాత్రం లేరు. ఎందుకు తుట్టె కదల్చడం అని నేను వారించాను. అప్పటికి ఊరకున్నాడు కాని తన ప్రణాళికలను త్వరలోనే అమలుపరచడం మొదలుపెట్టాడు. మొదట్లో భూమి జోలికి రాలేదు. ఆంధ్రజ్యోతి ఎడిటరుగా నండూరి రామ్మోహనరావు పదవీబాధ్యతలు చేపట్టినరోజున, నాతో మనమెప్పుడు చేద్దాం ఈ పని అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. గోరా పత్రికకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు. పత్రిక సర్ములేషన్‌ పెంచాలనుకుంటున్నాము. ఈ సమయంలో ఈ గొడవేమిటని వారించాను. అప్పటికి ఊరుకున్నాడు. కాని కొద్ది రోజులకే ఎ.బి.కె. ప్రసాద్‌ను తీసుకువచ్చాడు. నాకు పరిచయం చేసి నీ గదిలోనే ఆ పక్కన కూర్చుంటాడన్నాడు. ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఆర్దరు ఇవ్వలేదు. హోదా ఏమిటో చెప్పలేదు. విజరీ రిజిస్టరులో పేరు వ్రాయలేదు. అడిగితే దాటవేశాడు. ఏడాది గడిచింది. ఒకరోజు నన్ను చూడగానే రేపటి నుంచి రావద్దని ఎబికెకు చెప్పేశానన్నాడు. ఏదో చేయబోయాడు కాని కుదరక తగ్గాడు. 208 జి.యస్‌. వరదాచారి

గోరా. మనసులో అనుమానబీజం నాటాలని చెన్నారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నేను ఆయనకు వాస్తవం చెప్పి నమ్మించాను. 21 ఏండ్ల సహవాసం. ఇంగితమెరిగిన మేధావి. ఏ మనిషి ఎలాటివాడో పసిగట్టలేడా ఆయన? నాతో ఎప్పటివలెనే ఐదేళ్లపాటు అభిమానంగా ఉండిపోయారు. ఆరోగ్యమే సహకరించలేదు. 1982 మే ఒకటవ తేదీన గోరా మృతిచెందారు. అంత్యక్రియలు జరిపించి శ్మశానం నుంచి తిరిగివస్తుండగా, చంద్రశేఖరరెడ్డి “రేపు ఎడిటరుగా డిక్లరేషన్‌ ఫైల్‌ చేయడానికి సిద్ధంగా ఉండండి” అన్నారు. సరేనని ఆఫీసుకు వెళ్లి గోరాకు నివాళి అర్పిస్తూ, సంపాదకీయం వ్రాశాను. ఆయన నెలకొల్పిన ప్రమాణాలు, విలువలకు లోటు రానివ్వబోమని పాఠకులకు హామీ ఇస్తూ ముగించాను. ఇంటికి వచ్చేశాను. రాత్రి 11 గంటల సమయానికి షిఫ్ట్‌ ఇంచార్జిగా ఉన్న సత్యనారాయణ ఫోనుచేశాడు. చెన్నారెడ్డి వచ్చి ఎడిటరుగా తన పేరు పత్రికపేరు కింద పెట్టించాదని చెప్పాడు. అక్కడ ఉన్నాడా అంటే వెళ్లిపోయాడన్నాడు. అతని (ద్రోహబుద్ధి అప్పుడు అర్థమైంది. మర్నాడు ఆఫీసులో చం(ద్రశేఖరరెడ్డిని కలిస్తే ఆయన “నాకు ఇది కుటుంబసమస్యగా. మారిందయ్యా!” అన్నాడు. చెన్నారెడ్డిని కలువడం వ్యర్థమని పట్టించుకోలేదు. నిరసనగా రాజీనామా చేయవచ్చు. కాని ఆ సమయంలో దుందుడుకు చర్యకు పాల్పడితే నాకే నష్టం. సంయమనం పాటించాను. మర్నాడు చెన్నారెడ్డి నేలచూపులు చూస్తూవచ్చి ఏదో గొజిగి “పత్రికను అభివృద్ధి పరుద్దాం” అన్నాడు. “నీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటురొదనీ అన్నాడు. ఆయన మాటలకు నేను విలువ ఇవ్వలేదు. కాని ఎక్కడ పనిచేసినా పూర్తి శక్తియుక్తులు ధారపోసి పనిచేయాలని నమ్మేవాడిని గనుక అలాగే చేశాను. గోరాశాస్త్రి ఉన్నప్పుడైతే సంపాదకీయం (వ్రాయవలసి వస్తే ఆయన శ్రైలినే అనుకరించేవాడిని. ఆయన వీరాభిమానులు కూడా గుర్తు పట్టలేనంతగా సాధనచేశాను. ఆయన పోయిన తర్వాత అనుకరణల జోలికిపోక, నాదైన శైలిలో విషయవివరణకు, తార్మికవిశ్లేషణకు ప్రాధాన్యమిస్తూ వ్రాశాను. బాగానే వ్రాస్తున్నాడన్న మెప్పు పొందగలిగాను. ఆరు నెలలు గడిచాయి. పత్రిక అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఆంధ్రభూమికి రాజీనామా

1982 డిసెంబరు ' నెల. ఐదింటికి ఆఫీసులో నా వని ముగించుకొని వెంకటరమణ కాలనీ సరస్వతీ విద్యామందిరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు ఏర్పాటు చేసిన సభకు వెళ్లబోతున్నాను. ఆ నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌కార్యవాహ్‌ అయిన హెచ్‌. వి. శేషాద్రి ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న ఆ సభకు నన్ను విశిష్టఅతిథిగా ఆహ్వానించారు. కారు పంపించారు. గది ముందు నుంచి వెళ్తుంటే చెన్నారెడ్డి చూశాడు. అటెండరును పంపి జ్ఞాపకాల వరద 209

పిలిపించాడు గదిలోకి వెళ్లేసరికి మా సబ్‌ ఎడిటర్లలో ఒకడైన దేవులపల్లి అమర్‌ కూర్చొని ఉన్నాడు నేను కూర్చోలేదు “మీటింగుకు వెళ్లాలి, విషయమేమిటో త్వరగా చెప్పు” అన్నాను. “శుభవార్త చెపుదామని పిలిచాను మన సర్యుులేషను పెరిగింది తెలుసా?” అన్నాడు “తెలుసు అభివృద్ధి చూపితే నాకేదో చేస్తానన్నావుగదా అది చెప్పు” అన్నాను “ఇదంతా నీ వల్ల జరిగిందా?” అన్నాడు ఎగతాళిగా “పత్రిక అమ్మకాలు దానిలోని సరుకునుబట్టే పెరుగుతాయి. వ్రాసిందీ, వ్రాయించింది నేను నాకు గాకపోతే ఆ కీర్తి ఇంకెవరికి దక్కుతుంది?” అన్నాను “అదేం కాదు” అన్నాడు “సరే ఒక తెల్లకాగితమివ్వు” అన్నాను ఎందుకన్నాడు “టైం లేదు ఇవ్వ అంటే ఇచ్చాడు నేను అప్పుడు కూర్చొని స్వర్హకరచాలనం అంటే “గోల్డన్‌ షేక్‌ ష్యోండ్‌' పథకం కింద రాజీనామా చేస్తున్నానని వ్రాసి చేతికి ఇచ్చాను “ఇదేమిటి, ఎక్కడైనా చూసుకున్నావా?” అన్నాడు “అది నీకెందుకు?” గౌరవం లేనిచోట ఉండగూడదన్నది నా విధానం” అని వెళ్లిపోయాను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ చాలా బాగా జరిగింది నా ప్రసంగానికి కూడా మంచి స్పందన వచ్చింది

గోల్డన్‌ షేక్‌వ్యోండ్‌ గురించి చెప్పాలి అవసరానికి మించి ఉన్న సిబ్బందిని సామరస్యంగా తొలగించుకోడానికి ఆ రోజులలో చాలా వాడుకలో ఉన్న పథకమిది దీని ప్రకారం రాజీనామా చేసే ఉద్యోగికి రెట్టింపు పరిహారం ఇస్తారు భూమిలో నాకు 22 నెలల వేతనం పరిహారం కింద వస్తుంది నేను మర్నాడు ఆఫీసుకు వెళ్లిన కొద్దిసేపటికే చీఫ్‌ అకౌంటెంట్‌ సభాపతి నా వద్దకు వచ్చాడు “ఏమిటండి ఇది? నాకు చాలా బాధ కలిగించింది” అంటూ చెక్కు చేతికి ఇచ్చాడు అంటే కిందటి రాశ్రే లెక్కచేయించి సిద్ధంగా ఉంచారన్నమాట సంతకం చేసి చెక్కుతీసుకొని లెక్క చూసుకుంటే ఆదాయం పన్ను కోశారని బయటపడింది రిట్రెంచ్‌మెంట్‌ పరిహారం మీద ఆదాయం పన్ను ఉండదని, కావాలంటే మీ లాయరును అడిగి ఆ మొత్తం కూడా ఇవ్వండని చంద్రశేఖరరెడ్డికి చెపితే, ఆయన వెంటనే లాయరును సంప్రదించి కోసిన మొత్తం ఇప్పించాడు ఆంధ్రభూమితో 22 ఏండ్ల అనుబంధం ఆ విధంగా ముగిసింది కొంత వేదనాభరితమైన పరిస్థితే కాని 11 నెలల అదనపుజీతం సాధించానన్న ధైర్యం, బెంగ దరిచేరనీయకుందడా కాపాడింది పితృవియోగం

ఈ పరిస్థితిలోనే నాయన ఆరోగ్యం చాలా క్షీణించినదనే కబురు వచ్చింది ముందు ఊరికి వెళ్లి నాయనను చూద్దామనిపించింది రోజూ కిందవేయడం, ఆయన వద్దు వద్దంటూ దీనంగా సైగలు చేయడం, మళ్లీ మంచం మీదికి మార్చడం చాలా 210 జి యస్‌ వరదాచారి

బాధాకరంగా ఉందేది మంచంలో చావగూడదనేది సంప్రదాయపరుల్లో ఆచారం ఈ వ్యక్తి నిష్టాగరిష్టుడు మా తమ్ముడే వైద్యం చేస్తున్నాడు ఆతను వద్దన్నా మా పినతండ్రి వింటాడా? “అంతటి ఆచారసంపన్నుడికి మంచం చావా? అని తుంగ చాప పరిచి కింద వేయించేవాడు లేకపోతే అపచారం చేసిన వాళ్లమవుతామనేవాడు ఇప్పుడు ఆస్పత్రిలో రోగి ఆయుష్నముగిసినపుడు మంచంమీదే పోతున్నాడు ఇళ్లలో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు కొన్ని రోజులకు ఆరోగ్యం మెరుగు పడింది నేను రెండు వారాలుండి హైదరాబాద్‌కు వచ్చాను ఏదో ఉద్యోగం చూసుకోవాలి గదా. ముందు రేడియో స్టేషనుకు వెళ్లాను వార్తావిభాగంలో అందరూ సన్మిత్రులే పైగా వారు వ్రాతపనిగాళ్ల అవసరంకలిగి ఉన్నారు వెంటనే వారం రోజులు వార్తలువ్రాసే కంట్రాక్టు ఇచ్చారు అంతకు ముందు నేను రేడియోలో వార్తావిశ్లేషణలు, అసెంబ్లీ చర్చల సమీక్షలు వ్రాయడం, కధలు చదువడంతో పాటు చాలా కార్యక్రమాలు చేశాను కాని వార్తలు వ్రాయడం, చదువడం చేయలేదు చదువడానికి వ్రాయడం, వినడానికి వ్రాయడంలో తేడాలు చాలా మందికి తెలియవు నేను జర్నలిజం కోర్సులో రేడియో జర్నలిజం ఐచ్చికాంశంగా చదివాను పైగా ఉస్మానియాలో తెలుగు జర్నలిజం పారాలు చెప్పాను కనుక చదివేదెవరైనా తడబాటుకు ఆస్కారం లేకుండా సాఫీగా చదువగలిగేట్టు వ్రాసే నేర్పు ఉంది 1988 ఫిబ్రవరి 28వ తేదీన రేడియోలో డ్యూటీ చేస్తున్నాను ఇంటినుంచి ఫోను వచ్చింది, నాయన పోయారని దుందుఖి నామసంవత్సరం అధిక ఫాల్గుణమాసం శుద్ధ విదియనాడు ఆయన పరమపదించారు ఏదో గంభీరమైన విషయమేనని పక్కవారికి అర్ధమైంది విషయం తెలుసుకొని, “ఊరికి వెళ్లాలి కదా! వెళ్లండని పంపించేశారు

ఆ రోజులలో పార్ధివదేహాన్ని రోజుల తరబడి శీతలపేటికలో భద్రపరచి ఎవరికోసమో వేచి ఉండే పద్ధతి లేదు వ్యక్తి గతించినరోజునే సూర్యాస్తమయానికి ముందు అంత్యక్రియలు పూర్తిచేసేవారు. రాత్రిపూట శవాన్ని ఉంచవలసి వస్తే రాత్రంతా భజనచేస్తూ జాగారం చేసేవారు మా నాయన అంత్యక్రియలకు ఊరిపెద్దలు అన్ని కులాలవారూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుండ్లచెరువు కట్ట పక్క శ్మశానంలో చితికి అన్నయ్య నిప్పంటించాడు అపరకర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించాం వైష్ణవులలో 18వ రోజున వియ్యల్‌ నిర్వహిస్తారు భాగవతోత్తములను దేవాలయంనుంచి ఇంటికి ఎదుర్శొని వచ్చి దానాలు ఇచ్చి, వారిలో ప్రముఖుడికి స్వర్గపొత్ర ఇచ్చి పంపుతారు తర్వాత అందరూ కలిసి భోజనాలు చేస్తారు స్వర్గస్థుని కుమారులకు వారివారి అత్తవారు లేదా దగ్గరి బంధువులు మేమున్నామని ధైర్యం చెప్పడానికి కట్నాలు పెట్టీ, స్వస్థలాలకు జ్ఞాపకాల వరద వ

వెళ్లిపోతారు. మా విషయంలోనూ ఈ తంతు అంతా జరిగింది. మా ఏడుగురు అన్నదమ్ములలో అప్పటికి ఆరుగురికి పెళ్లిళ్లయ్యాయి. మరో రెండు రోజులుండి నేను భార్యాపిల్లలను తీసుకొని, హైదరాబాద్‌ వచ్చేశాను. నా జీవితంలో వ్యాకులపడిన సమయం ఏదైనా ఉందంటే ఇదే. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. నాయన పోయారు. సరైన ఆదాయం లేదు. తిండికి తిప్పలు లేవు. రేడియో కంట్రాక్టు కొనసాగింది. ఉస్మానియాలో జర్నలిజం బోధనకు పిలిచారు. ఫిలిం అవార్డుల కమిటీ సమావేశాలు కలిసివచ్చాయి. కొన్ని నెలలు గడిచి పోయాయి. స్థిరమైన ఆదాయం లేకపోయినా ఎంతో కొంత సొమ్ము వస్తూనే ఉంది. మానసికంగా కూడా కుంగిపోలేదు. సినిమావారు ప్రదర్శనలకు ఆహ్వానిస్తూనే ఉన్నారు, వాటికి మామూలుగా హాజరవుతూనే ఉన్నాను. అక్కడ అట్లూరి రామారావు కలుస్తుందేవారు. ఆయన పూర్వ జర్నలిస్టే కాక అప్పుడు ఉషాకిరణ్‌ మూవీస్‌లో నిర్వాహకనిర్మాత. నేను ఆంధ్రభూమికి రాజీనామా ఇచ్చానని ఆయనకు తెలుసు. ఆయనకు నా మీద ఎనలేని అభిమానం. సినిమా చూచి ఇంటికి చాలాసార్లు ఆయన కారులోనే వచ్చేవాడిని. ఒకరోజు “మీరొకసారి రామోజీరావుగారిని కలువండి” అన్నారు. రామోజీరావు నాకూ చిరపరిచితులే. కాని హరి పురుషోత్తమరావు మాటలు నన్ను సంకోచంలో పడేశాయి. ఆయన రామోజీరావు బంధువే. లెక్సరరు నుంచి సినిమా నిర్మాతగా మారాడు. 'మా వదిన), ఇంకేవో సినిమాలు తీశాడు. చిల్లర దేవుళ్లు ప్కీన్‌ప్లే వ్రాయడంలో దాశరథి రంగాచారికి సహాయ పడుతుండేవాడు. నా చిత్రసమీక్షలను విశేషంగా ఇష్టపడు తుండేవాడు. నాకు సన్నిహితుడు, ఆస్తడూ అయ్యాడు. నేను చెప్పకుండానే నా విషయం రామోజీతో మాట్లాడాడట, ఆయన “నాకు కావలసింది ఎడిటరు, ట్రేడ్‌ యూనియన్‌ నౌయకుడు కాదు” అని అన్నాడట. నేను ఈ విషయం రామారావుతో చెప్పి, “ఐనా కలువుమని మీరంటే కలుస్తో నన్నాను. ఆ తర్వాతివారం సినిమాలో కలిసినపుడు ఆయన మళ్లీ కలువమన్నాడు. పరిస్థితి సానుకూలంగా ఉన్నట్టు ఊహించాను. అప్పుడు దూరదర్శన్‌లో వార్తలు వ్రాసే పని చేస్తున్నాను. రామోజీరావుకు ఫోను చేస్తే మరుసటిరోజు సాయంత్రం ఐదు గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఈనాడులో ఉద్యోగం మర్నాడు కూడా దూరదర్శన్‌లో నాకు వని ఉంది. వెళ్లాను. పన్యాల రంగనాథరావు వార్తల ప్రొడ్యూసరు. కంట్రాక్టు పద్ధతిమీద పనిచేస్తున్నారు. ఆయనకు విషయం చెప్పి ఐదు గంటలకు ఇంటర్‌వ్యూకు వెళ్లి వస్తానంటే సంతోషంగా 212 జియస్‌. వరదాచారి

వెళ్లమన్నాడు ఆయన రామోజీ సినిమా పత్రిక సితారలో పనిచేశారు. రామోజీని బాగా ఎరిగినవారు ఈనాడుకు వెళ్లగానే రామోజీ ఆదరంగా పలకరించారు అక్కడ ఎందుకు మానెయ్యాల్సి వచ్చిందని మొదట అడిగారు జరిగింది దాపరికం లేకుండా చెప్పాను రెండవ ప్రశ్న ఎంత జీతం ఆశిస్తున్నారని అడిగారు మూడు వేలని చెప్పాను సరేనన్నారు ఇంకేమిటన్నారు. ఎడిటరు పదవి అన్నాను అలా ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అసిస్టెంట్‌ ఎడిటరు ఇస్తామన్నారు నేను మౌనంగా ఉండిపోయాను ఇంకా అన్నారు ఇంటి ఫోను, ఇంటికి పత్రికలు అడిగాను సరే అన్నారు ఇంకా అంటే ఇంకేముంది ఏం లేదన్నాను ఎప్పుడు చేరుతారని అడిగారు రేపేనని చెపితే వర్మ అని ఉంటాడు పది గంటలకు వచ్చి ఆయనను కలువండి మీ సీటు చూపుతాడన్నారు. సెలవు తీసుకొని దూరదర్శన్‌కు వెళ్లాను పన్యాలకు చెపితే ఎంతో సంతోషించారు కనపడ్డవారికల్లా తానే ఈ విషయం చెప్పారు, మూడు వేల జీతం అని విశేషంగా చెపుతూ

మర్నాడు అంటే 1988 నవంబరు 21వ తేదీ ఉదయం వెళ్లి వర్మను కలిశాను రామోజీరావు కూర్చునే గదికి ఎదురుగా అందరు సరదాగా ఎడిటర్స్‌ గ్యాలరీ అని పిలుస్తుందే నడవలో సీటు చూపించాడు నా ఎడమ పక్కన రామానుజం నీటు ఆయన న్యూస్‌ టైమ్‌ ఆంగ్ల దినపత్రికకు ఎడిటరు. నాకు పూర్వపరిచితుడే ఈనాడు తరఫున ఆయన, ఆంధ్రభూమి నుండి నేను, అమెరికా సంస్థవారు ఏర్పాటుచేసిన కేరళ టూరుకు కలిసి వెళ్లినప్పుడు సాన్నిహిత్యం ఏర్పడింది రామోజీ ఆంతరంగికులలో ఒకడని పేరుండేది నాకు కుడి పక్కన అన్నదాత ఎడిటరు డాక్టరు వానిరెడ్డి నారాయణరావు, ఆయన పక్మన అట్లూరి రామారావు, ఆయన పక్కన చలసాని ప్రసాదు సీట్లు ఉండేవి కుడి వైపు రామానుజం పక్కన న్యూస్‌ టైమ్‌ ఫైనాన్స్‌ ఎడిటరు, స్పోర్ట్స్‌ ఎడిటరు సీట్లుండేవి. వాకాటి పాండురంగారావు నేను చేరినరోజునే న్యూస్‌ టైమ్‌ కల్చరల్‌ ఎడిటరుగా చేరాడు కొండవీటి వెంకట కవి వంటివారికి అదొక పేరోలగాన్ని స్ఫురింపజేస్తుందేది

రామోజీరావును ఆఫీసులో ఎక్కువమంది చైర్మన్‌గారు అని సంబోధించేవారు వర్మ కూడా వైర్మన్‌ సెక్రెైటేరియట్‌ అనే విభాగానికి ఇంచార్జిగా ఉండేవాడు చైర్మన్‌ ఎడిటోరియల్‌ విభాగానికి చేసే సూచనలను ఆయన ఎవరికి ఉద్దేశించినవి వారికి పంపేవాడు ఈనాడులో నేను చేరక ముందే ఎం.వి ఆర్‌. శాస్త్రీ ఉన్నాడు. నేను, ఆయన, సహవాసి అనే కలంపేరుతో రచయితగా (పనిద్భలైన జంపాల జ్ఞాపకాల వరద 213

ఉమా మహేశ్వరరావు ముగ్గురికీ సంపాదకీయాలు వ్రాసే బాధ్యత అప్పగించారు తెలుగు పదత్రికలలో రోజూ ఒక సంపాదకీయమే ఉంటుంది మామూలుగా సంపాదకులే వ్రాసుకుంటూ ఉండేవారు ఇంగ్లీషు పత్రికలలో మొదట్లో మూడు ఉండేవి మూడోది హాస్య, వ్యంగ్యధోరణిలో సరదాగా సాగి అలరించేది అలా మూడు వ్రాయడానికి ఒకరికి మించి లీడర్‌ రైటర్లు ఉంటారు ప్రత్యేకాంశాలపై సాధికారికంగా వ్రాయగలిగిన సత్తా కలిగి ఉంటారు ధర్ట్‌ ఎడిటోరియల్‌కు రోజూ విషయం దొరకకనో, (వ్రాయడం కష్టమయ్యో దాన్ని చాలా పత్రికలు మానేశాయి ఆ పద్ధతిని తెలుగులో ఆదివారం సంపాదకీయం రూపంలో రామోజీ ఈనాడులో ప్రవేశ పెట్టారు ఇంకా సాగుతున్నది ముగ్గురు సంపాదకీయాలు వ్రాసే పద్ధతి కూడా ఆయన ఆలోచనే ఒక్కొక్కరికి విషయాలు కేటాయించి అధ్యయనం చెయ్యమన్నారు దేనిమీద ఎవరు వ్రాయాలో సూచించేవారు నాకు కేటాయిస్తే వి సి అని వ్రాసేవారు సంపాదకీయం వ్రాయని రోజున ప్రధాన వ్యాసం వ్రాసుకొమ్మనేవారు

సంపాదకీయం ఎవరు వ్రాసినా అందులో విషయానికి ఎడిటరుదే బాధ్యత అని చెప్పాను గదా రామోజీరావు జర్నలిజం సిద్ధాంతాలు బాగానే అధ్యయనం చేసినట్టున్నారు మొదటిరోజే చెప్పారు మీరు వ్రాసే సంపాదకీయం కంపోజింగుకు పంపే ముందే నేను చదువుతాననీ, ఏవైనా మార్పులు అవసరమనుకుంటే చెప్పుతాననీ, అవి సరికాదనుకుంటే మీరు నన్ను ఒప్పించవచ్చుననేవారు నా సంపాదకీయాల విషయంలో అలాటి అవసరం ఏర్పడలేదు పంజాబులో ఖలిస్తాన్‌ ఉద్యమనాయకుడు భింద్రాన్‌వాలె తన అనుచరులతో స్వర్ణమందిరప్రాంగణంలో తిష్ట వేసి పలు అకృత్యాలకు పాల్పడుతున్నప్పుడు వ్రాసిన సంపాదకీయం విషయంలో భిన్నాభిప్రాయం వచ్చింది ఆకిందటి రోజే ప్రార్థన ముగించుకొని వెళ్తున్న అమృత్‌సర్‌ ఎస్‌ పి ని ఉగ్రవాదులు హర్మందిర్‌ (ప్రాంగణంలోనే హతమార్చారు మందిరప్రాంగణంలోంచి వారిని గెంటివేయడానికి సైన్యాన్ని పిలవడంవంటి తీవ్రచర్య తీసుకోవాలా అనే చర్చ కూడా జరుగుతున్నది అప్పటికే ప్రాంగణంలోని గదులన్నీ ఆక్రమించుకొని తాగడం, తినడం, మజా చేయడం వంటి అపచారాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి ఇక తాత్సారానికి ఆస్కారం లేదు సైన్యాన్ని పంపి వారిని తరిమివేయవలసిందే! అని వ్రాశాను స్వర్ణమందిరంపై సైనికచర్య చాలా తీవ్రపరిణామాలకు దారి తీసే విషయం అని రామోజీ సంకోచం వ్యక్తపరచారు అప్పుడు మాతో పాటు ఆ గదిలో ఉన్న ఈనాడు చార్టర్డ్‌ అకౌంటెంటు, అకౌంట్స్‌ మేనేజరు ఇద్దరూ నాకంటే ముందే కలుగ జేసుకొని, ల2ైయత్త జి యస్‌ వరదాచారి

ఇంకో మార్గం లేదన్నారు. ఇక్కడున్న నలుగురిలో ముగ్గురి అభిప్రాయం అదే అయినప్పుడు సరే కానివ్వండని పంపించేశారు. మూడోరోజు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఈ అంశంపై సంపాదకీయం వ్రాసింది. ఆ రెండింటినీ కలిపి ఎవరికైనా చదువమని ఇస్తే టైమ్స్‌ సంపాదకీయాన్ని ఈనాడు కాపీ చేసిందంటారు.

తర్వాత సైనికచర్యకు ప్రధాని ఇందిర ఆదేశాలు జారీచేశారు. ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ పేరిట 1984 జూన్‌ 3న ప్రారంభమైన మందిరప్రక్షాళనకార్యక్రమం 8న ముగిసింది. భింద్రాన్‌వాలె హతమైనాడు. అకాల్‌తళ్ల్‌ ధ్వంసమైంది. అకాల్‌ అంటే వారి భాషలో కాలాతీతుడైన భగవంతుడని అర్థం. అతని తళ్డ్‌ అంటే సింహాసనం. సిక్కుల గురుపరంపరలో చివరివారైన హరిగోవింద సింగ్‌ దీన్ని ఏర్పాటు చేశారు. ఆ నాటినుండి గ్రంథసాహెబే సిక్కులకు గురువు. వారి మత సంబంధమైన హుకుం వామాలన్నీ తళ్హ్‌ పక్షానే జారీ అవుతాయి. అది దెబ్బతినడం సమస్తసిక్కు జాతికి బాధాకరం. అందుకే “అనివార్యమైన చర్య అన్న శీర్షికతో నేను మరో సంపాదకీయం (వాశాను. వెంటనే సాంత్వనచర్యలు (ప్రారంభించాలన్నాను. న్వర్ణమందిర 'ప్రాంగణంనుంచి సైన్యాన్ని ఉపసంహరించి, దాన్ని వారి ప్రబంధక కమిటీకి అప్పగించాలని సూచించాను. కాని ప్రభుత్వం అకాల్‌ తళ్ల్‌ భవనాన్ని పునర్‌నిర్మించి ఇవ్వాలని అది వారిని సాంత్వనపరుస్తుందని ఆలోచించింది. సిక్కులు ఇలాటి దైవకార్యాలను కూలీలద్వారా కాకుండా కార్‌సేవ (తెలుగు పత్రికలు కరసేవ అని వ్రాస్తుంటాయి) ద్వారా చేయాలనుకుంటారు. ఇది ప్రభుత్వానికి తెలుసు. అందుకే తమకు అనుకూలుడైన బుడ్డా సింగ్‌ అనే సిక్కును నియోగించి కార్‌సేవ జరుగుతున్నట్టు కథ నడిపారు. *ఇది కాదు సాంత్వనపద్ధతి' అని మరో సంపాదకీయం వ్రాశాను. ఐనా (ప్రభుత్వం కొత్త అకాల్‌ తభ్హ్‌ భవనాన్ని పూర్తిచేసే వారికి అప్పగించింది. స్వాధీన పరచుకున్న తర్వాత ప్రబంధక కమిటీవారు దాన్ని నేలమట్టం చేసి, సిక్కు సమాజంలోని అన్నివర్గాల కార్‌సేవ ద్వారా పునర్‌నిర్మించుకున్నారు.

ఇందిరపై సిక్కు తీవ్రవాదులు ్రతీకారానికి తలపడుతారని ఆ నాటినుంచి అన్ని వర్గాలవారికీ అనుమానంగానే ఉండేది. కాని ఆమె రక్షణకవచం దుర్భేద్యమైందని తెలిసినవారు చెపుతుండేవారు. దాన్ని మరింత పటిష్టం చేయడానికి ఆ నాటి హోంమంత్రి పి.వి. నరసింహారావు, ఆమె అంగరక్షక దళంలో చాలా కాలంగా ఉన్న సత్వంత్‌ సింగ్‌, బేఅంత్‌ (బియాంత్‌ కాదు) సింగ్‌ అనే ఇద్దరు సిక్కులను బదిలీచేశారు. జ్ఞాపకాల వరద ॥ ౭2165

అది చర్చనీయాంశమైంది తన సంతానంలాగా ఎన్నో ఏళ్లుగా తనతో తిరుగుతున్నవారు తనను చంపుకారా అని ఇందిర పి.వి ని చీవాట్లు పెట్టి, వారిని తిరిగి తన అంగరక్షక దళంలోనికి రప్పించింది రెండు నెలల తర్వాత వారే ఇందిరను 38 తూటాలు పేల్చి ఘోరంగా హతమార్చారు ఆధికారికంగా సాయంత్రం దాకా ఆమె చనిపోయినట్టు ప్రకటించకున్నాా తక్షణమరణం సంభవించినట్టు ప్రపంచమంతటికీ క్షణాలలో అర్థమైంది ఆ రోజులలో ఇలాటి అతిముఖ్యమైన సంఘటనేదో జరిగినప్పుడు పత్రికలు ప్రత్యేకసంచికలు ప్రచురిస్తుండేవి మేము వెంటనే ఏర్పాట్లు మొదలుపెట్టాము ఏం చేసినా అద్వితీయంగా ఉండాలని ఆలోచించే రామోజీరావే, పత్రిక పైసగభాగంలో ఇందిర ఐస్ట్‌ ఫొటో వేద్దామని సూచించారు అప్పటికే ఫొటో తెప్పించారు ఫొటోకు సరితూగే వార్తాకథనంతో వెలువడిన ఆ ప్రత్యేకసంచిక పారకుల మన్ననలందుకున్నది ఒలింపిక్‌ కవరేజికి ప్రశంస

నేను వార్తల ఎడిటింగు కూడా చూసేవాడిని అవసరమైతే రాత్రి డ్యూటీ చేసేవాడిని ఒకరోజు రాత్రి ఎడిటోరియల్‌ విభాగం పనితీరును పరిశీలిద్దామని వెళ్లాను శంకర నారాయణ షిన్ల చూస్తున్నాడు సబ్‌ ఎడిటర్లు తక్కువ ఉన్నారు నాకూ కొన్ని వార్తలివ్వండి వ్రాస్తానన్నా ఆయన క్రీడావార్తల కట్ట ఇచ్చాడు అన్నీ తెలుగులో వ్రాసి శీర్షికలు పెట్టి ఇచ్చాను శంకరనారాయణ నవ్వుతూ “సార్‌, క్రీడావార్తలు నేనేం రాస్తాను, ఇంకేవైనా ఇవ్వుమంటారనుకుంటే, మీరు అన్నిచక్కగా రాసిపారేశారు” అన్నాడు నేను ఆయనకు చెప్పాను, జర్నలిస్టుకు ఏదైనా వ్రాయదగిన నేర్పు ఉండాలని అప్పుడు ఒలింపిక్‌ క్రీడలు రాబోతున్నాయి. వాటికి తగిన ఏర్పాట్లు చేయుమని, అవసరమైతే షార్ట్‌ బైముగా ఎవరినైనా ఏర్పాటు చేసుకొమ్మని రామోజీరావు చెప్పారు నేను మా సబ్‌ ఎడిటర్లలో క్రీడావార్తలు వ్రాయగలిగినవారి గురించి ఆరా తీశాను ముగ్గురు దొరికారు బయటివారు అక్కరలేదని చెప్పాను మనవద్ద ఉన్నవారితో మంచి కవరేజి ఇవ్వవచ్చునన్నాను ఆయన “మీ ఇష్టం ఏ లోపం జరిగినా మీదే బాధ్యత” అన్నారు రోజువారీ క్రీడల సమీక్ష వ్రాసి పంపడానికి ఢిల్లీలో ఒకరిని కుదిర్చారు ఒలింపిక్స్‌ జరిగినన్ని రోజులూ నేను రాత్రి డెస్కులో పనిచేసేవాడిని సబ్‌ ఎడిటర్లు వ్రాసిన వార్తలన్నీ చదివి, అవసరమైతే దిద్ది, అచ్చుకూర్చడానికి పంపేవాడిని సమీక్షను రోజూ నేనే అనువదించేవాడిని తెలుగు పత్రికలన్నిటిలోకి ఈనాడు ఒలింపిక్‌ కవరేజి ఉత్తమంగా ఉందని క్రీడాభిమానులు ప్రశంసిస్తే రామోజీరావు నన్ను అభినందించారు 216 జియస్‌ వరదాచారి

రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆగమేఘాల మీద పబ్లిక్‌ గార్డెన్‌లో బహిరంగ చలనచిత్ర ప్రదర్శనశాల లలిత కళాక్షేత్రం నిర్మింపజేశారు. చిత్రోత్సవం కవరేజిలో ఈనాడే ముందుండాలని తగిన ఏర్పాట్లు చేయుమని రామోజీరావు ఆదేశించారు. అప్పుడు ఈనాడు దినపథ్రికలో సినిమా పేజీ లేదు. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మనకు సితార ఉందిగదా అనేవారు. సితారవారు ఎలాగూ విశేష కవరేజి ఇస్తారు. దినపత్రిక పాఠకుల కోసం నేను గుడిపూడి శ్రీహరి, ఆంజనేయశాస్త్రి సహకారం కోరాను. ముగ్గురం కలిసి బాగా చేశారనిపించుకున్నాం. గుడిపూడి శ్రీహరి ఈనాడులో చాలా కాలం హరివిల్లు అనే పాఠకాదరణ పొందిన శీర్షిక కూడా వ్రాశాడు.

ఇక్కడ రిపోర్టింగు మెలకువలకు సంబంధించిన విషయమొకటి చెప్పాలి. హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. అనుసూచిత జాతుల రిజర్వు నియోజక వర్గాలు 22 ఉండేవి. కనుక మేయరు పదవికి జరిగే ఎన్నికలో వారి పాత్ర నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఇది ఆలోచించి మజ్లిస్‌ ఆ నియోజక వర్గాలలో దళితులకు తమ పార్టీ టిక్కట్లు ఇచ్చి పోటీకి నిలబెట్టింది. తమ అభ్యర్థిని మేయరుగా గెలిపించుకోడానికే వారిని వాడుకుంటారా లేక వారిలో అర్హులైనవారికి ఆ పదవిని ఇచ్చే అవకాశముందా? ఇది అందరి మదిలో అప్పుడు మెదులుతున్న ప్రశ్న సీనియరు విలేఖరి కృష్ణారావు మజ్లిస్‌ నాయకుడు సుల్తాన్‌ సలాహెద్దీన్‌ (ప్రెస్‌ కాన్ఫరెన్సుకు వెళ్తున్నానని చెప్పడానికి రామానుజం వద్దకు వచ్చాడు. దళిత మేయరు ప్రశ్నవేసి ఆయనను కట్టిపడేసే ప్రయత్నం చేయాలని నాకు తోచింది. రామానుజం ఆ మాటే చెప్పాడు. కృష్ణారావు ఒవైసీ చేత తప్పక ఇస్తామనిపించాడు. ఆయన కట్టుబడి ఉండేటట్టు చేయడానికి ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాము. ఎన్నికల ఫలితాలు వచ్చాక మేయరు పదవి దక్కించుకోడానికి మజ్లిస్‌కు కాంగ్రెసు మద్దతు అవసరమైంది. కాంగ్రెస్‌ నాయకుడు వెంకటస్వామి దళితుడికి మేయరు పదవి ఇస్తేనే మద్దతు ఇస్తామన్నారు. రెండవ సగంలో ఇస్తామన్నా ఒప్పుకోలే. అలా అల్లంపల్లి పోచయ్య తొలి దళిత మజ్లిస్‌ మేయరు అయ్యాడు. అసాధ్యం అనిపించే ఒక మంచి పనిని సాధించడంలో మీడియా అప్రమత్తత తోడ్చడుతుందని చెప్పడానికే ఈ ప్రస్తావన. మీడియా వివాదాలు సృష్టించడం కాదు, విలువలను పోషించాలి. వివాదాలను ప్రజాహితం కోసమైతే సృష్టించవచ్చు. విలువలు ఎప్పుడూ ప్రజాహితం కోరేవే గనుక సమస్యే ఉండదు. జ్ఞాపకాల వరద (1

శిక్షణకు ప్రాముఖ్యం పత్రికల ఆఫీసులలో మామూలుగా ఎంతో కొంత భాషాజ్ఞానం ఉన్నదనుకున్న వారిని ఎంపిక చేసుకొని, వార్తారచనలో మెలుకువలు చెపుతూ, అవసరమైన దిద్దుబాట్లు చేస్తూ, తమ కలంయోధుల బలగాన్ని పెంచుకోవడం పరిపాటి ఆంధ్రజనతలో, ఆంధ్రభూమిలో నేను ఆ పనికి చాలా ప్రాముఖ్యమిస్తుందే వాడిని ఎడిటోరియల్‌ గది కార్యశాలగా ఉండేది అది చూచి పొత్తూరి నాకు ప్రొఫెసర్‌ అనే మారుపేరు పెట్టాడు నీ బోధన పద్ధతిచూసి అలా అనాలనిపించిందన్నాడు ఈనాడులో కూడా నాపద్ధతి మానుకోలేదు నేను చేరిన కొత్తలోను, మరుసటి సంవత్సరంలోను ముగ్గురు నలుగురు చొప్పున చేరారు అలాటి వారిలో నున్నా వేణుగోపాలరావు ఈనాడులో చాలా కాలం ఉన్నాడు తర్వాత కాలంలో మా తెలుగు భాషా చైతన్య సమితి" ఉపకార్యదర్శిగా భాషాసేవ చేశాడు కందుల రమేష్‌ ఇప్పుడు ప్రభుత్వ పత్రిక 'ఆంధ్రప్రదేశొ ఎడిటరుగా ఉన్నాడు కిషోర్‌దాస్‌ తర్వాత టీవీలో వంటల కార్యక్రమాల యాంకరుగా ప్రసిద్ధికెక్కడమే గాకుండా రెండు సినిమాలలో హాస్యనటుడుగా రాణించాడు ఇట్లా ఇద్దరు ముగ్గురుగా కాకుండా, 1986లో ఒకేసారి బహుశా పదిమందిని (ట్రెయినీ సబ్‌ ఎడిటర్లుగా తీసుకొని వారికి ప్రత్యేకంగా సమగ్రశిక్షణ ఇచ్చే ఏర్పాటు చేశారు దానిలో రిపోర్టింగ్‌, ఎడిటింగ్‌, శీర్షికారచన, భారతరాజ్యాంగం, పత్రికాచట్టాలు, తదితర జర్నలిజానికి సంబంధించిన అంశాలన్నిటినీ బోధించే అవకాశం నాకు ఇచ్చారు ఆర్ధిక, సామాజిక, వ్యవసాయ విషయాలపై ఆయా రంగాల నిపుణులచేత పారాలు చెప్పించారు అలా శిక్షణ పొందిన పలువురు ఈనాడులో మంచి పదవులలో స్థిరపడిపోయారు తర్వాత ఏర్పాటు చేసిన ఈనాడు జర్నలిజం కళాశాలకు బూదరాజు రాధాకృష్ణ తర్వాత ప్రిన్సిపాల్‌ అయిన ఎం. నాగేశ్వరరావు ఈ బ్యాచిలోనివాడే అలాగే పర్వతం మూర్తి ఈనాడులో సంపాదకీయ రచయితగా పనిచేస్తున్నాడు ఎ ఎస్‌ ప్రసాద్‌ ఈనాడు నుంచి ఇండియా టుడే తెలుగు వార పత్రికకు వెళ్లి సంపాదకుడుగా ఎదిగాడు వై ఎస్‌ ఆర్‌ శర్మ ఆంధ్రప్రభ ఎడిటరయ్యాడు చెప్పదలచుకున్న విషయమేమిటంటే, కొత్తవారికి సీనియర్లు అవసరమైన మెలకువలు నేర్పితే సమర్ధులైన రెందవతరం అందుబాటులోకి వస్తుంది కొందరు సీనియర్లు తమవల్లనే అన్ని పనులూ సవ్యంగా సాగుతాయనీ, లేకుంటే అస్తవ్యస్తమై పోతాయని భ్రమ కల్పించజూస్తారు తాము చెప్పకపోతే ఎవరూ నేర్చుకోరనుకుంటారు జిజ్ఞాసువులను ఎవరూ ఆపలేరు మనవంతు సాయం చేయడమే సరైన పద్ధతి మనం ఉన్నప్పుడు పని ఎంత చక్కగా జరుగుతుందో, గైర్‌ హాజరీలోనూ 218 జి యస్‌ వరదాచారి

అంతే బాగా సాగేటట్టు సుశిక్షితబ్బందాన్ని తయారుచేయడమే నాయకత్వ లక్షణమని పించుకుంటుందని నా నమ్మకం అరచేతిలో సమాచారం

ఈనాడులో సంపాదకీయం వ్రాయాలన్నా మరో పరిశోధనాత్మకకధనం (వ్రాయాలన్నా సైళ్లనిండా సమాచారం అందుబాటులో ఉండేది నేను ఉన్నప్పుడే రామోజీరావు అనుభవజ్ఞుడైన లైబ్రేరియన్‌చేత పరిశోధన, పరామర్శ విభాగనిర్మాణం (ప్రారంభించారు అది ఇవాళ దేశంలోని కొన్ని పెద్ద పత్రికలలోని అలాటి విభాగాలతో సరితూగుతుంది నిజం చెప్పాలంటే పత్రికలకు సమీక్షార్థం వచ్చే గగ్రంథాలతోనే మంచి సమాచార భాండాగారం నిర్మించుకోవచ్చు కాని ఎందుకో ఎక్కువమంది త్‌ద్ధ చూపడంలేదు సంపాదకీయాలను నేను పార్యాంశంలో భాగంగా చెప్పడానికి నాలుగు రకాలుగా విభజించాను వివరణాత్మకం, విమర్శనాత్మకం, విశ్లేషణాత్మకం, ప్రబోధాత్మకం అన్నాను మొదటి మూడు రకాల ప్రయోజనం పారకుడి అవగాహనను పెంచడం. నాలుగవది మనం ఎంచుకున్న ప్రజాహిత విషయంపై అధికారవ్యవస్థను కార్యాచరణకు ఉద్చోధించేది ఉదాహరణకు అవినీతి నిర్మూలన 1984 జనవరిలో దీనిమీద నేను వ్రాసిన సంపాదకీయం ప్రస్తావనార్దమైంది అవినీతి నిర్మూలన కష్టమైనా, క్రమపద్ధతి ప్రకారం ప్రయత్నిస్తే సాధ్యమేనని ఆ నాటి దేశీయాంగ మంత్రి ఒక ప్రకటన చేశారు దానిమీద సంపాదకీయం వ్రాసే పని నాకు అప్పగించారు అవినీతి ఎలా వేయి పడగలు విప్పిందో వివరించి, దాన్ని అదుపు చేయడానికి ఏమేమి కృషి జరిగిందో చెప్పి, అవకాశాలు ఆహ్వానిస్తుంటే రాజకీయులు, అధికారులు నిగ్రహంగా ఉండాలని ఆశించడంలో అర్ధం లేదనీ, అక్రమంగా ధనరాశులను పోగు చేయదంలోగల ఆకర్షణను నిర్మూలించడమొక్కటే మార్గమనీ నిర్ధారించాను. దానికేం చెయ్యాలో సూచించాను అక్రమంగా ధనం ఆర్జించినట్టు రుజువైతే దాన్ని బినామీ ఐదిలీలతో నిమిత్తం లేకుందా జప్తు చేయడానికి అందరికీ వర్తించే కరినచట్టం తేవాలన్నాను కేవలం కొన్నాళ్ల జైలు శిక్ష విధించినందువల్ల ప్రయోజనం ఉండదనడానికి రుజువులు చూపాను. శిక్ష అనుభవించి వచ్చాక కూడా ఆ ధనరాశులతో సుఖంగా బతికే వీలులేకుండా చేయాలన్నాను అక్రమంగా ధనరాశులు పోగుచేయడంలోగల ఆకర్షణను నిర్మూలించాలి జస్టిస్‌ జీవన్‌ రెడ్డి తర్వాత లా కమిషను చైర్మనుగా ఉన్నప్పుడు ఇలాటి అభిప్రాయమే ప్రకటించి, ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధపరచినట్టు పత్రికలలో వార్త వచ్చింది జ్ఞాపకాల వరద 219

గోయెంకా పిలుపు

ఈనాడులో ఏదో వ్రాతపనిలో ఉండగా, మధ్యాహ్నం పూట అప్పుడు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రెసిడెంట్‌ ఎడిటరుగా ఉన్న పి.ఎస్‌. సుందరం నుంచి ఫోను వచ్చింది. పత్రిక యజమాని మనోజ్‌ కుమార్‌ సొంతాలియా నన్ను కలువ దలచాదని, బంజారాలో రాథ్రి డిన్నరు సమావేశానికి రమ్మని పిలిచాడు. సుందరం నాకు చిరకాలమిత్రుడు. మా జర్నలిస్టు కాలనీలోనే ఉంటాడు. నేను ఇంటికి వచ్చి తీసుకుపోతానన్నాడు. రాత్రి వెళ్లాము. ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటరుగా రమ్మన్నాడు. ఆంధ్రప్రభ అప్పుడు ఈనాడుతో పోలిస్తే వెనుకబడి ఉన్నా ఒకనాటి అగ్రశ్రేణి పత్రిక. పైగా ఎడిటరు అని పత్రిక ముఖపత్రం మీద పేరుపడుతుంది. ఈనాడులో ఆ అవకాశం లేదు. ఐతే ఈనాడులో నాకు ఏ ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా ఉంది. సొంతాలియా అడిగిన ప్రశ్చలలో మీరు వస్తే ఈనాడునుంచి ఎంతమందిని వెంట తెస్తారనేది ఒకటి. ముందు నేను చేరి అక్కడి అవసరాలను కనుక్కాన్న తర్వాత అవసరమైనంతమందిని తెచ్చుకోవచ్చునన్నాను. ఆయన మరో విషయం చెప్పారు, ఢిల్లీకో, ముంబైకో వెళ్లి పెద్దాయన రామనాథ్‌ గోయంకాను కలువవలసి ఉంటుందని, సరేనని వచ్చేశాను. రెండు నెలల తర్వాత ఈనాడులో ఉండగా సుందరం నుంచి ఫోను వచ్చింది. గోయెంకా హైదరాబాదులో లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌసులో ఉన్నాడని, ఆరు గంటలకు వెళ్లి కలువమన్నాడు. వీలవుతుందంటే ఆయనకు తెలియపరుస్తానన్నాడు. సరేనన్నాను. పత్రికారంగంలో చరిత్ర సృష్టించిన వ్యక్తిని కలిసి మాట్లాడటం మంచి అవకాశం అనుకొన్నాను. నేను కబురు పంపగానే ఎస్‌. గురుమూర్తి వచ్చి లోనికి తీసుకువెళ్లాడు. గురుమూర్తి వృత్తిరీత్యా చార్జర్డ్‌ అకౌంటెంట్‌ అయినా మంచి కాలమిస్టు. గోయెంకా తాను ఎక్స్‌(ెస్‌ను తెలుగువారి కోసమే ప్రారంభించానంటూ మొదలుపెట్టి, అనేక ప్రశ్చలడిగారు. మధ్య మధ్య గురుమూర్తి కూడా చాలా విషయాలు ప్రస్తావించాడు. సంభాషణ గంటన్నరకు పైగా సాగింది. గురుమూర్తే గుర్తుచేశాడు, ఎన్టీ రామారావు అపాయింట్‌మెంట్‌కు సమయమవుతున్నదని. సొంతాలియా అన్ని ఏర్పాట్లు చేస్తాడని చెప్పి గోయెంకా కరచాలనంచేశారు. పొత్తూరి అప్పుడు ప్రభ ఎడిటరుగా ఉన్నాడు. ఈ విషయం ఆయనకు చెపుదామని ఫోను చేశాను. తిరుపతి వెళ్లాడని వాళ్లావిడ చెప్పింది. తర్వాత గోయెంకా అస్వస్థుడైనట్టు తెలిసింది.

మరో రెండు అనుభవాల గురించి చెప్పాలి. వాటికి నేను అంత ప్రాముఖ్య మివ్వలేదు. కాని ఆశపడే వాళ్లకు హెచ్చరికగా ఉంటుంది. మొదటిది. ఎవరో రాజుగారు భూపతి కృష్ణమూర్తిని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. తెలుగునాడి అని ఈనాడులాటి 220 జియస్‌. వరదాచారి

పత్రిక పెట్టదలచామనీ మీరు ఎడిటరుగా ఉండాలని ఆహ్వానిస్తున్నామని చెప్పాడు. ఒక పెద్ద తళతళలాదే పళ్లెంలో ఆహ్వానపత్రం కవరు, తాంబూలమూ పెట్టి మఖ్మల్‌ బట్టకప్పి తెచ్చాడు అప్పటికి నేనింకా ఈనాడులో చేరలేదు. ఈ ప్రయత్నం మూర్తిరాజు తరఫున చేస్తున్నామన్నారు దోమలగూడలో కార్యాలయం చూడటానికి రమ్మన్నారు. భూపతి కృష్ణమూర్తి పేరు తెలుసు వెళ్లిచూస్తే పోయేదేముందని వెళ్లా అదొక నివాస గృహం ప్రెస్‌ ఎక్కడ పెడతారంటే వెనుక పెరడు చూపారు హాండ్‌ కంపోజింగ్‌ రోజులవి ఆ స్థలం ఏ మాత్రం సరిపోదు వారిది ఆషామాషీ వ్యవహారమని అర్ధమైంది రెండవది నేను ఈనాడులో చేరిన తర్వాత జరిగింది మేచినేని కిషన్‌రావు “సమయం అని పేపరు పెడుతున్నా మీరే మా సంపాదకులని ఫతేమైదాన్‌ క్లబ్బులో కలిసి చెప్పారు *నేను అక్కడ సుఖంగాటిన్నా నాకెందుకీ బాధ?” అంటే “కాదు కాదు రావలిసిందే” నన్నాడు ఈనాడులో సబ్‌ ఎడిటరుగా పని చేస్తున్న రాజశేఖరును న్యూస్‌ ఎడిటరుగా వేసుకున్నాడట ఆయన తిరుపతి వెళ్లి ఈనాడు ఆఫీసులో మిత్రులతో కొత్త పత్రిక రాబోతున్నదని, తాను న్యూస్‌ ఎడిటర్ననీ, మన వరదాచారే ఎడిటరనీ చెప్పాడట ఇంతలో ఒకరోజు కిషన్‌రావు ఫోనుచేసి పత్రిక విడుదల తేదీ నిర్ణయించాననీ, గవర్నరు కుముద్‌ బెన్‌ జోషీ రావడానికి ఒప్పుకున్నారనీ చెప్పాడు (పెస్సు ఎప్పుడు పెట్టారంటే ఏదో (ప్రెస్సు అచ్చువేస్తుందన్నాడు మర్నాడు పన్యాల ఫోను చేశాడు, ఆ పత్రికలో ఉద్యోగమిప్పించమని. నేను చేరడం లేదన్నాను ఐలేనా పేరు సిఫార్సు చేయమన్నాడు “నేను రానన్నాక నా మాట వింటాడా? మీరే కలిసి తేల్చుకొండొ అన్నాను పన్యాల చేరాడు ప్రకటించిన రోజున గవర్నరు జోషీ పత్రికను ఆవిష్కరించారు సిరా అలుక్కుపోయినట్టు అచ్చయింది రెండవ సంచిక వచ్చినట్టు నాకు గుర్తు లేదు ప్రొఫెసరు, శాఖాధిపతి

అప్పుడే తెలుగు విశ్వవిద్యాలయంవారు తెలుగు మాధ్యమంలో పత్రికారచన కోర్సు పెట్టాలని నిర్ణయించి ప్రవేశపరీక్ష నిర్వహించారు నేను ఉస్మానియాలో జర్చలిజం విద్యార్థులకు పాఠాలు చెపుతున్నపుడు, అవకాశం దొరికినప్పుడల్లా తెలుగు మాధ్యమంలో సమాంతర తరగతులు నడుపాలని పోరుపెడుతుండేవాడిని. ప్రముఖ భాషాశాస్త్రవేత్త చేకూరి రామారావు అప్పుడక్కడ డీన్‌గా ఉండేవారు ఇంగ్లీషులో ప్రవేశపరీక్ష వ్రాసి ఎంపికై, ఇంగ్లీషు మాధ్యమంలో చదివి, ఇంగ్లీషులో పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడైనవాడు, తెలుగులో ప్రావీణ్యం కొరవడి తెలుగు పత్రికలకు ఉపయోగపడటం లేదనేవాడిని జ్ఞాపకాల వరద 221

“ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో కోర్సు పెడుతున్నాం వచ్చి నిర్వహించ”మన్నారు చేకూరి నేను ఆయనకు చిరపరిచితుడనే గాక ఆయన అభిమానాన్ని చూరగొన్నవాడిని “నాకు పి జీ. డిగ్రీలౌదన్నాను “మీ డిగ్రీలు ఎవరిక్కానాలి? పత్రికారంగంలో మీ విశేష కృషిని గుర్తించి యూనివర్సిటీ ఆవ్వానిన్తున్నది అంతే”నన్నారు. హరి పురుషోత్తమరావుని వెంటపెట్టుకుని మా ఇంటికి కూడా వచ్చారు తొందరగా తేల్చమన్నారు ఈనాడుకంటే తక్కువ జీతమైనా మీరు ఒప్పుకోవలసిందేనని హరి పట్టుబట్టాడు కారణమేమిటో తెలియదుకాని రామోజీరావు ఒకరోజు పరోక్షంగా ఉద్యోగప్రస్తావన తెచ్చారు “ఆఫరు ఉంది, త్వరలో తేలుస్తా” అన్నాను ఆ మర్చాడే చేకూరికి నా అంగీకారం తెలిపాను ఆయన వైస్‌ చాన్సలరు తూమాటి దొణప్ప దగ్గరికి తీసుకువెళ్లారు రిజిస్ట్రారు శివరామ మూర్తికూడా చేరారు అప్పటికే వారు నిర్ణయానికి వచ్చారు విజిటింగ్‌ ప్రాఫెసరుగా నియమించి శాఖాధిపతి బాధ్యతలు అప్పగించారు అప్పటి ప్రొఫెనరు ప్రారంభవేతనాన్ని ఏకమొత్తం జీతంగా నిర్ణయించారు ఇంటి ఫోను బిల్లు, ఇంటికి అన్ని పెద్ద తెలుగు పత్రికలు ఇచ్చే ఏర్పాటు చేశారు 1988 డిసెంబరు 22వ తేదీతో నియామకపత్రాలు ఇచ్చారు అదే రోజు సుప్రసిద్ధ ఉర్జూ పత్రికా సంపాదకుడు ఆబిదలీఖాన్‌ పత్రికా రచన, విషయ(్రసారశాఖను (ప్రారంభించారు కమ్యూనికేషన్‌ను విషయ(ప్రసారమని తెనుగీకరించారు అంతా భాషాశాస్త్రజ్ఞులే ఆంగ్ల పేర్లు వాడేవారు కాదు కులపతి, శౌచాలయం వంటి నామఫలకాలు కనిపించేవి నేను మర్నాడే ఈనాడుకు రాజీనామా సమర్చించాను ఈనాడు సంప్రదాయం ప్రకారం వెంటనే రిలీవ్‌ చేసి, రావలసిన దబ్బుకు చెక్కు ఇచ్చారు. నేను “అక్కడే రిటైర్‌ అయిఉంటే గ్రాట్యూటీ వచ్చే”దని అంటే, ఆ మొత్తం కూడా ఇచ్చారు ఎడిటరు కావాలన్న కోరిక తీరనందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు కారణం పత్రిక మీద పేరు పడకున్నా ఎడిటరుకు దక్కే మర్యాదలన్నీ నాకు దక్కడమే ఇప్పుడు యూనివర్సిటీ ఈ ఉన్నతపదవులు అప్పగించడం మరింత తృప్తి నిచ్చింది ఉస్మానియా యూనివర్సిటీవారు జర్నలిజం శాఖాధిపతిగా హిందూ పత్రిక సంపాదకవర్గసభ్యుడైన గోవిందరాజన్‌ను నియమించిన దృష్టాంతం నాకు గుర్తుకు వచ్చింది డిగ్రీ పేరు మార్చు జర్నలిజం శాఖ మొదట్లో తెలుగు విశ్వవిద్యాలయంలో భాషాభివృద్ధి పీరంలో భాగంగా ఉండేది నేను చేరినప్పుడే శ్యామసుందర్‌, కె సుధీర్‌కుమార్‌ లెక్బరర్లుగా 222 జి యస్‌ వరదాచారి

చేరారు అప్పటికే ప్రవేశపరీక్ష పెట్టి పేపర్లు దిద్దడం పూర్తయింది నాతో పాటు ఈనాడులో పనిచేసి తర్వాత భాషాశాస్త్ర శాఖలో లెక్బరరుగా చేరిన కాచినేని రామారావు జాబితాను సిద్ధంగా ఉంచాడు విద్యార్థులు చేరగానే తరగతులు ప్రారంభించాము పార్యప్రణాళికను, డిగ్రీ పేరును ఉస్మానియా జర్నలిజం ప్రొఫెసరు పి.యల్‌ విశ్వేశ్వరరావు నిర్ణయించారట డిగ్రీని బ్యాచిలర్‌ ఆఫ్‌ తెలుగు జర్పలిజం (బి.టి జె) అన్నారు పార్యప్రణాళికలో కమ్యూనికేషన్‌ పార్యాంశం లేదు ఈ రెండూ వెంటనే సవదించవలనిన (ప్రతికూల అంశాలని నాకు అనిపించింది అప్పుడు అన్ని విశ్వవిద్యాలయాల్లో జర్నలిజం కోర్సులు బి సి.జె, ఎం సి జె లుగా వాడుకలో ఉండేవి మా విద్యార్థులు ఉన్నత చదువుకు పోవాలంటే కమ్యూనికేషన్‌ అంశం లేకపోవడం అనర్హతకు దారితీస్తుంది అలాగే మాధ్యమం తెలుగు అయినంత మాత్రాన డిగ్రీ సేరులో టి అనే అక్షరంచేర్చవలసిన అవసరం లేదు దానివల్ల ఉద్యోగార్హత కుదించుకుపోయే (ప్రమాదం ఉంటుంది విసి ః రిజిస్ట్రారుల దృష్టికి తీసుకువెళ్తే మార్పునకు అనుమతించారు తరువాత బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ధ్రువీకరించింది అప్పుడు జర్నలిజం తరగతులు ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న తెలుగు భవనంలో జరుగుతుండేవి (గ్రంధాలయం అప్పటినుంచి అక్కడే ఉంది హాస్టలు అక్కడే ఉండేది. విద్యార్ధులు క్రమం తప్పకుండా విజరయేవారు మొదటి బ్యాచి ఆలస్యంగా ('ప్రారంభమైనందున వారి తరగతులు కొనసాగుతుండగానే, విద్యాసంవత్సరొన్ని క్రమబద్దీకరించడానికి రెండవ బ్యాచిని లాంఛనాలు పూర్తిచేసి జూన్‌లోనే మొదలు పెట్టాము మొదటి బ్యాచి విద్యార్థులకు వారి బోధనకాలం పూర్తయిన తర్వాత పరీక్షలు పెట్టాము మంచి ఫలితాలు సాధించారు చాలా మందికి ఉద్యోగాలు దొరికాయి ఉన్నత చదువుకు పోవాలనుకునే వారు ఉస్మానియాలో ఎం సి జె ప్రవేశ పరీక్షేవాసి మెరిట్‌లో సీట్లు సంపాదించారు చాలా సీట్లు అలా మావాళ్లు దక్కించుకుంటుండటంతో ఉస్మానియా జర్నలిజం శాఖాధిపతి రహీం మీరు ఎంసి.జె పెట్టుకొందని పోరుతుందేవాడు దొణప్ప తర్వాత వైస్‌ చాన్సలరుగా డాక్టరు సి నారాయణరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టారు జర్నలిజం విద్యార్థులకోసం తెలుగులో పార్య, వరనీయ[గ్రంథాలు సిద్ధపరచడానికి ఆయనకు ప్రణాళిక సమర్ప్చించాము. అందులో భాగంగా ఒక 'సెమినారు పెట్టి దానిలో సంపాదకులు సమర్పించే ప్రసంగపత్రాలను గ్రంథస్థం చేస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని సూచించగా, ఆయన ఆమోదించారు విశ్వవిద్యాలయం బాధ్యతలలో బోధన, పరిశోధన, ప్రచురణ మూడూ ఉంటాయి జ్ఞాపకాల వరద 228

పత్రికలు వార్తలను సత్యనిష్టతో అందిస్తూనే నవ్యతకోసం యత్నిస్తుంటాయి. కనుక 'శెలుగు పత్రికలలో కొత్త ప్రయోగాలు, పరిణామాలు" అనే శీర్షికతో సెమినారు పెట్టాం. మేము కోరిన ప్రకారం సంపాదకులు, ఇతర పత్రికారచయితలు ప్రసంగవ్యాసాలు సమర్పించి, గోప్టిని ఫలప్రదం చేశారు. విశ్వవిద్యాలయ ప్రచురణల విభాగం వాటిని పుస్తకంగా తెచ్చింది. పునశ్చరణ తరగతులు

తెలుగు యూనివర్సిటీలో విస్తరణ సేవావిభాగం అని ఉంది. దాని కార్యక్రమాలు దానికి ఉన్నాయి. దాని (ప్రేరణతో నాకో ఆలోచన తట్టింది. పాఠాలు చెప్పి భావి పత్రికారచయితలను తయారు చేస్తున్నాం సరే. కాని జర్నలిజంలో ఇదివరకే ఉన్నవారి కోసం విస్తరణ సేవగా ఏమైనా చేయాలి. ఓ వారం రోజుల పునశ్చరణ తరగతుల శిబిరం నిర్వహిస్తే ఉపయుక్తంగా ఉంటుందనిపించింది. నారాయణరెడ్డిగారికి చెపితే “బాగుంటుంది పెట్టమన్నారు. “యూనివర్సిటీ నిర్వహించే తరగతులు కనుక విమర్శలు రాకుండా చూడాలన్నారు. అంటే అన్ని పత్రికలకు, అన్ని ప్రాంతాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని అర్థం. మొదట పత్రికాకార్యాలయాలకు వ్రాస్తే స్పందన రాలేదు. దరఖాస్తులు ఆహ్వానిస్తూ పత్రికాప్రకటన ఇచ్చాము. హైదరాబాద్‌లో తరగతులు, (ప్రముఖులతో ఇంటర్‌వ్యూలు, పరిశ్రమల సందర్భన, ప్రత్యక్ష అనుభవం కోసం కార్యశాల పెట్టాము. మేము ఊహించినదానికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఆరేళ్లు ఆరు శిబిరాలు నిర్వహించాము. ముగింపు సభలో మంత్రిచేతనో, విద్య, పాలన, పత్రికారంగాల ప్రముఖులచేతనో సర్టిఫికేట్లు ఇప్పించాము. ఆరవ బ్యాచినాటికి (ఫెస్‌ అకాడెమీ ఏర్పాటైంది. ముగింపు సభకు - అకాడెమీ అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాం. ఆయన తన ప్రసంగంలో ఇన్నాళ్లూ అకాడెమీ చేయవలసిన పని యూనివర్సిటీ చేసినందుకు అభినందించారు. ఇకపై ఆ బాధ్యతను అకాడెమీ చేపడుతుందన్నారు. మహిళలకు సీట్లు

బి.సి.జె. కోర్సులో ప్రవేశానికి అమ్మాయిలు ప్రవేశపరీక్ష వ్రాస్తుండేవారు. పరీక్షలో ఉత్తీర్డులైనా పోటీలో ఎవరికీ సీటు దక్కలేదు. అప్పటికి మహిళల రిజర్వేషన్లు రాలేదు. చర్చ జరుగుతున్నది. మూడవ సంవత్సరం ్రవేశపరీక్షలో ముగ్గురు అమ్మాయిలు ఉత్తీర్ణులయారు. కాని ఎవరికీ సీటువచ్చే అవకాశం లేదు. మెరిట్‌ ప్రకారమే సీటివ్వాలి 224 జి.యస్‌. వరదాచారి

గనుక ప్రత్యేకసదుపాయంగా మూడు అదనపు సీట్లు మంజూరుచేసి ముగ్గురికీ ఇద్దామని ప్రతిపాదన పంపాను. వి.సి. ఆమోదించారు. ప్రగతి, వనజ, విశాలాక్షి ముగ్గురికీ సీట్లు ఇచ్చాము. ముగ్గురూ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురూ పత్రికలలో చేరారు. వనజ బస్తరు ఆదివాసీల బతుకుపోరు గురించి పరిశోధనాత్మక కథనం వ్రాసి, రామనాథ్‌ గోయెంకా అవార్డు సాధించింది. జర్నలిస్టుగా కొనసాగుతున్నది. శ్యామసుందర్‌ పదోన్నతి అవకాశాలు ఎక్కువ ఉంటాయని 1990లో ఉస్మానియా యూనివర్సిటీకి మారాడు. ఆ స్థానంలో వి. సత్తిరెడ్డి చేరాడు. సత్రిరెడ్డి ఉస్మానియా గోల్డ్‌ మెడలిస్టు. కొంతకాలం దక్కన్‌ క్రానికల్‌లో పనిచేశాడు. 2005లో ధార్వాడ్‌ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌.డి. కూడా చేశాడు. మరో రెండేళ్ల తర్వాత సుధీర్‌ తెలుగు విశ్వవిద్యాలయంనుంచి భాషాశాస్త్రంలో పిహెచ్‌.డి చేశాడు. మా ముగ్గురితోటే పత్రికారచనశాఖ 22 ఏళ్లు నడిచింది. మరొక ప్రొఫెసరును, ఇద్దరు లెక్చరర్లను ఇవ్వాలని ప్రతిపాదన పంపాము. కాని నియామకాలు జరుగలేదు. 1997 నాటికి జర్నలిజంను రెండేళ్ల స్నాతకోత్తర కోర్సుగా నిర్వహించాలని యు.జి.సి. నిర్దేశించింది. ఆ ప్రకారం రెండేళ్ల ఎం.సి.జె. తరగతులు ప్రారంభించాము. తర్వాత ఎం.ఫిల్‌. పిహెచ్‌.డి పెట్టారు. వీటి కోసం చాలా ముందునుంచే ఒత్తిడి ఉండేది. మా రెండవ డీన్‌ రామకృష్ణారెడ్డి 1990లోనే ప్రీ పిహెచ్‌.డి పరీక్షపెట్టారు కూడా. దానికి నన్నే ఎగ్జామినరుగా పెట్టారు. నేను సమాధానపత్రాలు కూడా దిద్దాను. కాని దానికి సాంకేతిక అనర్హత అడ్డం వచ్చింది. పిహెచ్‌.డి. పట్టా లేని నేను, యోగ్యత ఉన్నా పరీక్షకుడుగా ఉండటం నియమాలు ఒప్పుకోవు. తులనాత్మక అధ్యయనకేంద్రం ఎం.ఫిల్‌ ప్రవేశపరీక్షకు 1991లో కేంద్రాధిపతి గంగిశెట్టి లక్ష్మీనారాయణ నన్ను పరిశీలకుడుగా పెట్టుకున్నారు. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయంవారు వారి తేలుగు ఎం.వ, ఫైనల్‌ పరీక్షలో భాగంగా 'ప్రయోజనాత్మక భాష - పత్రికారచని అనే పేపరుకు పరీక్షకుడుగా పెట్టుకున్నారు. వరంగల్‌లోని చందా కాంతయ్య స్మారక పి.జి. కాలేజివారు ఎం.ఏ. తెలుగులో పాఠ్యాంశమైన తెలుగు జర్నలిజంలో భాషాపరిణామము, వార్తారచన, వ్యాఖ్యారచనవిధానాలు, శ్రైలీభేదాలు వంటి విషయాలమీద విస్తృతస్థాయి ఉపన్యాసాలు ఇవ్వడానికి ఆవ్వానించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఉర్జూశాఖ కూడా హైదరాబాద్‌లో జర్నలిజం వికాసం అనే అంశంపై విస్తరణోపన్యాసం చేయడానికి ప్రొఫెసరు బషీరొద్దీన్‌ సలహాపై ఒకసారి పిలిచారు. ఉర్జూ శాఖ గనుక ఉర్దూ పత్రికల గురించి విశేషంగా చెప్పాలి. ఆబిద్‌ అలీఖాన్‌ నాకు ఉర్పూ జర్నలిజం గురించి తయ్యబ్‌ జ్ఞాపకాల వరద 2265

అన్సారీ వ్రాసిన ఓ పుస్తకాన్ని “నాన్‌ ఉర్జూ జర్నలిస్టులలో ఇది చదువగలిగినవాడివి నువ్వు ఒక్కడివౌ అంటూ ఎప్పుడో ఇచ్చారు. దాన్ని మరోసారి తిరగవేసి ఇంగ్రీషు, తెలుగు పత్రికల గురించే కాక ఉర్జూ పత్రికల గురించి వారిని ఆకట్టుకునే విధంగా ప్రసంగించాను. పైగా ఉర్దూలో ప్రసంగించడం వారిని అబ్బురపరచింది. దూరవిద్య ద్వారా ఎం.సి.జె

2006లో తెలుగు విశ్వవిద్యాలయంలో దూరవిద్య పద్ధతిలో ఎం.సి.జె. కోర్సు పెట్టాము. అప్పుడు ఆవుల మంజులత వైస్‌ చాన్సలరుగా ఉన్నారు. కోర్సు కో- ఆర్జినేటరుగా సత్తిరెడ్డిని నియమించారు. విద్యార్థులకు పాఠ్య సామ(గ్రి ముందే అందించవలసి ఉంటుంది. నేను రెండు కోర్సులకు సంపాదకుడుగా పనిచేశాను. సంపాదకత్వ బాధ్యతలతో పాటు ఏడు యూనిట్లు స్వయంగా వ్రాశాను. 2007లో కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం దూరవిద్యాపద్ధతిలో జర్నలిజం కోర్సు పెడుతున్నామని బోర్డు ఆఫ్‌ స్టడీస్‌లో ఉండవలసినదిగా ఆహ్వానించారు. ఆంధ్రా యూనివర్సిటీలో జర్నలిజం లెక్సరర్ల ఎంపిక కమిటీ సభ్యుడుగా పిలిచారు. అప్పుడు మేము ఎంపిక చేసిన బాబీవర్ధన్‌ తర్వాత ప్రొఫెసరుగా, శాఖాధిపతిగా ఎదిగారు. ఆకాశవాణివారు న్యూస్‌ రీడరు సెలెక్షన్‌కు పిలిచారు. రచన జర్నలిజం కళాశాలలో సుదీర్ధ కాలంపాటు పాటు పాఠాలు చెప్పాను. సాక్షి జర్బలిజం స్కూలులో తొలి రెండు బ్యాచిలకు పాఠాలు చెప్పాను. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ప్రజాశక్తి దినపత్రిక, విజయవాడ విశాలాంధ్ర జర్నలిస్టులకు, టీవీ 9లో రెండు బ్యాచిలకు పాఠాలు చెప్పాను. ఎక్కడ జర్నలిస్టుల సమావేశాలు జరిగినా, ఒకరో ఇద్దరో వచ్చి పరిచయం చేసుకొని, “మీ విద్యార్థిని సార” అంటే మనోల్లాసంగా ఉంటుంది. గౌరవ డాక్టరేట్‌

ఆంధ్రభూమి తర్వాత రెండు దశాబ్దాలకు మించి నేను తెలుగు విశ్వ విద్యాలయంలో వనిచేయగలిగానంటే కారణాలు రెందు. మొదటిది వైన్‌ చాన్సలర్లందరికీ నా పట్ల సదభిప్రాయముండటం. దొణప్ప, నారాయణరెడ్డి గారలే కాక, తర్వాత వచ్చిన పేర్వారం జగన్నాథం, నాయని కృష్ణకుమారి, గోపి, జి.వి. సుబ్రహ్మణ్యం, ఆవుల మంజులత నా పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. మంజులత హయాంలో 2007 ఫిబ్రవరి 26 నాడు తెలుగు విశ్వవిద్యాలయం పదవ స్నాతకోత్సవం జరిగింది. దానిలో ప్రముఖ కథారచయిత కాళీపట్నం రామారావు, గుజ్జం జాషువా 226 జి.యస్‌. వరదాచారి

కుమార్తె, ప్రముఖ సామాజిక కార్యకర్త హేమలతాలవణం, కర్టాటక ఆంధ్రా అసోషియేషన్‌ అప్పటి అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తితో పాటు నాకూ డి.లిట్‌ గౌరవపురస్కారం ప్రదానం చేశారు. చాన్సలరు, రాష్ట్ర గవర్నరు రామేశ్వర ఠాకూర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ అందుకోవడం మరపురాని అనుభవం. “పొత్రికేయునిగా, అధ్యాపకునిగా తెలుగుకు వెలుగునివ్వడంలో ఐదు దశాబ్దాలు అనవరతం పాటుపడినందుకు ఈ గౌరవ డిలిట్‌ ప్రదానం” అని ఆ నాటి పరిచయప్రశంసలో పేర్మాన్న మాటలు, నన్నెప్పుడూ కార్యోన్ముఖుణ్ణి చేస్తుంటాయి.

యూనివర్సిటీలో నా సేవలు 12వ ఏడాదిలో ప్రవేశించినప్పుడు వైస్‌ చాన్సలరుగా వచ్చిన గోపి, “నేనున్నంత కాలం మీరూ ఉండా”లన్నారు. సరేనన్నాను. “ఇన్నేళ్లుగా విజిటింగ్‌ ప్రొఫెసరు, శాఖాధిపతిగా కొనసాగుతున్నాను. ఇకపై పాఠాలు చెప్పే విజిటింగ్‌ ప్రొఫెసరుగా కొనసాగుతాను. శాఖాధిపతి పదవిని నా తర్వాత సీనియరు అధ్యాపకుడైన సుధీర్‌ కుమారుకు ఇవ్వ” మంటూ వి.సి. గోపికి ప్రతిపాదన పంపించాను. శాఖాధిపతి పదవిని తడవకొకరికి ఇచ్చే పద్ధతి అప్పుడప్పుడే ఆచరణలోకి వస్తున్నది. గోపికి ఇది నచ్చింది. “అడిగితేనే కొందరు అలుగుతారు, అలాటిది మీరే ఈ ప్రతిపాదన చేయడం బాగుం”దన్నారు. 2000 సంవత్సరం జనవరి 19వ తేదీనాడు సుధీర్‌కుమార్‌ శాఖాధిపతిగా బాధ్యతలు చేపట్టాడు. అప్పటినుంచి వరుసగా మారే పద్ధతి అమలులోకి వచ్చింది. స్మారకోపన్యాసాలు

యూనివర్సిటీలు, వారు బోధించే అంశాలతో సంబంధమున్న రంగాలకు చెందిన ప్రముఖుల గురించి స్మారకోపన్యాసాలు ఏర్పాటుచేస్తుంటాయి. ఉపన్యానకులుగొ ఆ రంగంలో పేరు గడించినవారిని పిలుస్తుంటారు. అలా డాక్టరు బి.ఆర్‌. అంబేద్యర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంవారు యేటేటా నార్ల స్మారకోపన్యాసం ఏర్పాటు చేస్తుంటారు. 2018లో 18వ నార్ల స్మారకోపన్యాసం చేయడానికి నన్ను ఆహ్వానించారు. నేను “కాలం మారినా వార్త విలువలు మారవు” అనేది ఇతివృత్తంగా తీసుకొని ప్రసంగించాను. ఇటీవలి కాలంలో పత్రికారంగంలో సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సాంకేతిక హంగులు, రంగులు ఎన్ని ఉన్నా మీడియా ప్రాచుర్యం పాత్రికేయ రచనాపాటవం మీద ఆధారపడి ఉంటుందని నా వాదం. అంటే సత్యనిష్టతో వార్తా రచన, పాఠక సుబోధకమైన సరళ, సలక్షణమైన వాక్యనిర్మాణం, ప్రజాహితలక్ష్యం జ్ఞాపకాల వరద 227

న ల్‌ ము... ఎప్పుడూ శిరోధార్యంగా ఉండాలి. రచనాచమత్కారం భీ. స కోసం విషయాన్ని బలి ఇవ్వ వద్దు. కాలం మారినా / (వ సు ప! వార్త విలువలు మారవు. అవి చిరస్థాయిగా ఉండే ప. లో గా కాకతీయ విశ్వవిద్యాలయం వారు వరంగల్‌ (ము | ప్రాంతంలో పదత్రికారచనలో కొత్తదారులు తొక్కి చరిత్ర శ (| సృష్టించిన ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు, నాతల స్వాతంత్ర్య సమరయోధుడు ఎం.ఎస్‌. ఆచార్య ప్రథమ స్మారకోపన్యాసం చేయడానికి, 2014 మే 2వ తేదీన నన్ను ఆహ్వానించారు. తెలంగాణలో పత్రికారచనావికాసం అనేది విషయం. “1958లో ప్రారంభమైన “జనధర్మ నిరాటంకంగా నడిచిందంటే ఆచార్యులవారికి అంగబలం, అర్థబలం సమృద్ధిగా ఉన్నందువల్ల కాదు. తెలంగాణ సాహిత్యానికి, సొంస్కృతిక వారసత్వానికి సముచిత గౌరవప్రాభవాలను కల్పించాలన్న కొండంత పట్టుదల కారణం” అన్నాను. “ఇక కుమారుడు మాడభూషి శ్రీధర్‌తో కలిసి వరంగల్‌వాణి దినపట్రికను ప్రారంభించడం పెద్ద సాహసమే. దాన్ని ఆచార్య సామాజిక సమస్యలను చర్చించడానికి, పరిశోధనాత్మక వార్తాంశాలను గుప్పించదానికి, సమకాలీన సంకర విలువలను ఎండగట్టడానికి వేదికగా మలుచుకొన్నారన్నాను. ఈ రెండు ప్రసంగాలు విజ్ఞుల మెప్పు పొందడం నాకు ఆనందదాయకం. ఎన్నికల కోలాహలం తెలుగు విశ్వవిద్యాలయ విద్యాత్మక సిబ్బందికి తమకో సంఘం పెట్టుకుందామనే ఆలోచన కలిగింది. వివిధశాఖలకు చెందిన అధ్యాపకులు కలిసి నా దగ్గరకు వచ్చారు. ఎన్నికల నిర్వహణాధికారిగా ఉండమని అడిగారు. నేను సరేనన్నాను. తరచుగా కలుస్తుందేవారితో సంప్రదించి కార్యప్రణాళిక సిద్ధం చేశాను. భాషాశాస్త్రశాఖలో పనిచేసే మిత్రుడు రామచంద్రరావు, ధర్మసందేహాలు లేవనెత్తడంలో దిట్ట. “ఓటరు జాబితా తయారు చేశారా? ఎలా చేశారని అడిగారు. నేను అప్పటికే నా దగ్గరకు వస్తుండేవారిని అడిగాను. వారు ఇప్పుడు తయారు చేద్దామన్నారు. “అలా చేస్తే కొత్త అభ్యంతరాలు వస్తాయి. కనుక మొదటి ఎన్నికలకు యూనివర్సిటీలో ఉన్న విద్యాత్మక సిబ్బంది అందరూ వోటరులే. రిజిస్ట్రారును వారి జాబితా ఇమ్మని అడుగుతానన్నాను. తెలుగు 228 జి.యస్‌. వరదాచారి

విశ్వవిద్యాలయానికి హైదరాబాద్‌తో పాటు శ్రీశైలంలో, రాజమండ్రిలో, కూచిపూడిలో, వరంగల్లులో ప్రాంగణాలు ఉన్నాయి. నాలుగు చోట్ల విద్యాత్మక సిబ్బంది ఉన్నారు రిజిస్త్రారు ఆ 62 మంది జాబితా ఇచ్చారు కూచిపూడి, వరంగల్లులో ఒక్కొక్కరే ఉన్నందున వారు హైదరాబాదు వచ్చి వోటువేసే ఏర్పాటు చేసి హైదరాబాద్‌, రాజమండ్రి, శ్రీశైలప్రాంగణాలలో పోలింగు ఆఫీసర్లను నియమించి, ఎవరికీ అభ్యంతరం లేకుండా నిర్వహించే ఏర్పాటు చేశాను వచ్చేసారినుంచి రిజిస్ట్రారు జాబితాలో పేరు ఉండటమేగాక, వార్షిక చందా చెల్లించిన వారికే వోటు హక్కు ఉంటుందని నిర్దేశించాను ఇదంతా ఎన్నికలలో ఆసక్తిని పెంచడానికి జరిగిన స్నేహపూర్వక వాదులాటే తప్ప కల్మశంతో కూడింది కాదు నేను ఎలాగూ పోటీచేయను గనుక, నేను అక్కడ ఉండగా జరిగిన అన్ని ఎన్నికల నిర్వహణ బాధ్యత మిత్రులు నాకే అప్పగించారు నేను కూడా వాటిని సార్వత్రిక ఎన్నికలు నిర్వహించినంత కట్టుదిట్టంగా నిర్వహించాను

తెలుగు విశ్వవిద్యాలయంలో నేను చేరిన కొన్నేళ్లకే యు జి సి స్మేళ్లు అమలు పరచారు విద్యాత్మక సిబ్బంది జీతాలు గణనీయంగా పెరిగాయి. నాకు అప్పటికే పదవీవిరమణ వయసు రావడం, ఏకమొత్తం జీతం పొందుతుండటంతో నా జీతం పెరగలేదు అడిగితే నామమాత్రంగా పెంచారు నాలాగ ఏకమొత్తం జీతం పొందుతున్నవారు మరికొందరు ఉండేవారు అందరికీ కలిపి విధాననిర్ణయమేదో చేస్తామన్నారు కాని అవేవీ కార్యరూపం దాల్చలేదు. నేను జీతానికి ఎక్కువ ప్రాముఖ్య మివ్వలేదు విశ్వవిద్యాలయంలో, బయటా గౌరవంగా చూసేవారు ఏదో వ్యాపకం ఉండాలని కొనసాగుతూ వచ్చాను నా పదవీకాలం ముగిసినప్పుడల్లా, మరో తడవ పొడిగిస్తున్నా మంటూ ఉత్తర్వులు జారీచేస్తుందేవారు కాని డివి సుబ్బారావు రిజెస్త్ట్రారుగా ఉన్నప్పుడు ఏం తోచిందో, నిరవధికంగా పొడిగించారు. జ్ఞాపకాల వరద 229

  1. రచనలు - పురస్మారాలు

పటత్రికారచయితలు అనుదినం వార్తారచనలో భాగంగా పుంఖానుపుంఖాలుగా రచనలు చేస్తుంటారు. వాటి ్రాసంగికత అతిస్వల్బకాలం ఉంటుంది. కాని వాటి అధారంగా వ్రాసే విశ్లేషణలు, సమీక్షలు, సంపాదకీయాలు, ప్రధానవ్యాసాలు, వ్యంగ్య హాస్యశీర్నికలు, లఘువ్యాఖ్యల వంటివి ఎన్నో ఉంటాయి. వాటి పఠనీయత ఎక్కువకాలం ఉంటుంది. వీటిలో కొన్ని మౌలికరచనలు అనదగ్గవీ ఉంటాయి. వాటి రచనకు ప్రత్యేకనైపుణ్యం అవసరమవుతుంది. అలాటి నేర్పు అభ్యాసం వల్ల సమకూడుతుంది. అందుచేత నిష్ణాతులు తమ అనుభవాలు, జ్ఞాపకాల గురించి ప్రత్యేకంగా వ్రాసిన (గంథాలతోపాటు ఈ రచనలను కూడా పుస్తకాలుగా (ప్రచురించాలి. పాఠక ప్రయోజనంతో పాటు భావితరాల జర్నలిస్టుల అవసరాలనూ తీర్చడానికి ఇవి ఉపయోగపడుతాయి. ఈ కోవకు చెందినది కాదు గాని, జర్నలిస్టులకు ఉపయోగపడే “జర్నలిస్ట్‌ హాండ్‌ బుక్‌ నేను 1966లో యూనియన్‌ తరపున ప్రచురించాను. అప్పుడు నేను యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా ఉంటిని, హైదరాబాద్‌లో జర్నలిస్టుల నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించాము. ఆ సందర్భంగా ఓ సోవనీరు వేశాము. అడ్వర్టయిజ్‌మెంట్ల రూసంలో వచ్చిన డబ్బు కాన్ఫరెన్సు ఖర్చులు పోగా మిగిలింది. దానితో వర్మింగ్‌ జర్నలిస్టుల చట్టం, నియమాలు, వేజ్‌ బోర్డు సిఫార్సులు వంటి జర్నలిస్టులకు ఉపయుక్తమైన సమాచారంతో హాండ్‌ బుక్‌ వేశాను. ఇంకా డబ్బు చాలా మిగిలింది. దాన్ని పత్రికాపరిభాషాప్రమాణీకరణ కోసం ఉపయోగించాలని తీర్మానం చేయించి పెట్టాను. అప్పుడే ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు బెజవాడ గోపాలరెడ్డిని, ఇతర కార్యవర్గసభ్యులను ఇష్టాగోష్టికి పిలిచాము. మా పథకాన్ని గురించి చెపితే, “ఇది బృహత్‌కార్యం. అకాడెమీ చేయదగింది” అని వారు అన్నారు. అకాడెమీ చేస్తే సహకరించడానికి మేము సిద్ధమని తెలిపొము. ఆ కార్యక్రమం ఎందుకో ముందుకు సాగలేదు.

1986లో అప్పటి హైదరాబాద్‌ జర్నలిస్టుల యూనియన్‌ వారు “మీడియా హాండ్‌ బుక్‌ ప్రచురించారు. దానిలో మీడియాలోని వ్యక్తుల, సంస్థల సమాచారం, టెలీఫోను 280 జి.యస్‌. వరదాచారి

నంబర్లు ఇవ్వడంతో పాటు, పత్రికలకు వర్తించే దాదాపు ఇరవై చట్టాల గురించీ, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నా చేత ఇంగ్లీషులో పాఠం వ్రాయించారు. ఇదే (గ్రంథస్థమైన నా తొలి రచన. తెలుగువిశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత, తెలుగులో విద్యార్థులకు పాఠ్య పఠనీయగ్రంథాలను రూపొందించడానికి నేను పడ్డ తాపత్రయాన్ని ముందు వివరించాను.

నేను మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన మూడు పత్రికలలో రకరకాల రచనలు చాలా చేశాను. వాటిలోనుంచి కొన్ని ఎంపిక చేసి ఓ వంద పేజీల పుస్తకం వేద్దామనే ఆలోచన కలిగింది. నా రచనల కత్తిరింపులు చాలావరకు నా వద్ద ఉన్నాయి. వాటిలో ప్రచురణార్హమైనవి ఎంపిక చేయడమెలా? “ఈనాడులో నా సహోద్యోగి, నేనంటే అభిమానమే తప్ప దురభిమానం లేని విద్యాధికుడు శంకరనారాయణ అందుకు సరైనవాడని నాకు అనిపించింది. ఆయన మిత్రపక్షప్రాతానికి లోనుగాకుండా తనబాధ్యత నెరవేర్చాడు. దాన్ని నా మాటి అనే పేరుతో 1990 ఆగస్టులో నా మొదటి పుస్తకంగా ప్రచురించాను. అప్పటి మా వైస్‌ చాన్సలర్‌ సి. నారాయణరెడ్డి, నా చిరకాల సహచరమిత్రుడు, ఆంధ్రప్రభ ఎడిటరు పొత్తూరి ముందు మాటలు వ్రాశారు. ముద్రణ రేటు గురించి నేను ప్రింటరుతో బేరమాడుతుంటే ఏదో పనిమీద వచ్చిన వంశీ ఆర్ట్‌ ధియేటర్‌ అధినేత రామరాజు కల్పించుకొని, “దీన్ని ప్రచురించే అవకాశం మా సంస్థకు ఇవ్వండి” అని, వెయ్యి ప్రతులు ముద్రించి 800 నాకు ఇచ్చాడు. “సంపాదకీయాలు, ప్రధానవ్యాసాలు, ప్రత్యేకవ్యాసాలు, వ్యాఖ్యలు విమర్శలు, చిత్రసమీక్షలు వంటి విభిన్నప్రక్రియల గురించి సోదాహరణంగా వివరించిన మొదటి తెలుగు పుస్తకం ఇదేనేమో!” అన్నారు పొత్తూరి. ఆయాఫ్రక్రియలకు నేను ఎంపిక చేసుకున్న నా రచనలే ఉత్తమ ఉదాహరణలన్న దురథిమానం నాకెంతమాత్రం లేదని నేను స్పష్టం చేశాను. పుస్తకం ధరపై జరిగిన ఆసక్తికరచర్చ గురించి చెప్పాలి. ఎంత ధర పెట్టమంటారని ప్రింటరు అడిగాడు. అందరికీ అందుబాటులో ఉండేటట్టు పదిరూపాయలు పెట్టమన్నాను. అది విక్రేతకు నచ్చలేదు. “మేము నాలుగు రూపాయలు కమిషన్‌గా తీసుకుంటాము మీకువచ్చేది ఆరు రూపాయలే అన్నాడు పరిచయస్టుడైన విక్రేత. “నాకు డబ్బు ఆశ లేౌదన్నాను. కాని “మాకు గిట్టుబాటు కాదన్నాడు. “నలుగురు వచ్చి అడుగుతారు. వెతికి తెచ్చిఇస్తే ఒక్కడు తీసుకుంటాడు. ధర వ్యాపార దృష్టితో నిర్ణయించా” లన్నారు. ఇప్పుడు విక్రేతలు కమిషన్‌గా 50 శాతం తీసుకుంటున్నారు. జ్ఞాపకాల వరద 231

1976లోనే వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ ద్విదశాచ్చి ఉత్సవాలు జరిగాయి. అప్పుడు రాష్ట్రం విభిన్నరంగాలలో సాధించిన అభివృద్ధి గురించి ప్రభుత్వం చిరు పుస్తకాలు వ్రాయించి ప్రచురించింది. నన్ను సినిమా రంగం గురించి (వ్రాయమన్నారు. “చలనచిత్ర పరిశ్రమి అనే పేరుతో పుస్తకం వ్రాసి ఇచ్చాను. వంద రూపాయల పారితోషికం ఇచ్చారు. ఫిలిం సబ్సిడీ కథ

1976లోనే జరిగిన మరొక గమ్మత్తయిన సంఘటన గురించి చెప్పాలి. మేమెందుకో సచివాలయానికి వెళ్ళాము. సమాచారశాఖ మంత్రి పిడతల రంగారెడ్డి విలేఖరుల గోష్టిలో మాట్లాడుతున్నారు. వెళ్లి కూర్చున్నాము. రాష్ట్రంలో నిర్మాణమైన చలన చిత్రాలకు ప్రభుత్వం 50 వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడానికి నిర్ణయించినట్టు మంత్రి ప్రకటించారు. చిత్రం నిడివి 12 వేల అడుగులకు తగ్గకుండా ఉండాలి. 80 శాతం రాష్ట్రంలో షూటింగు జరుపుకొన్నదై ఉండాలి. సెన్సార్‌ అయి ఉండాలని నియమాలేవో చెప్పారు. నేను కనీస ప్రమాణాలు ఉండాలని, లేకపోతే సబ్సిడీ దుర్వినియోగమవుతుందన్నాను. “అదెట్లా?” అన్నారు మంత్రి. నేను దొంగను పట్టిన పోలీసు అనే కథ చెప్పాను. “నేను పోలీసు. మా బావమరిది దొంగ. చార్మినారు దగ్గర పర్సుకొట్టేసి మా వాడు పారిపోవడంతో షూటింగు మొదలు పెడతా. వెనుక పోలీసుగా నా పరుగు. పజ్ధర్‌గట్టి, సిటీ కాలేజి, హైకోర్టు నయా పుల్‌, ఇటు ఉస్మానియా దవాఖాన, మోజం జాహి మార్కెట్స్‌ టాంక్‌ బండ్‌, చివరకు సికిందరాబాద్‌ స్టేషను ముందు సుభాష్‌ విగ్రహం వద్ద దొంగను పట్టేస్తా. ఆఖరు సీనులో పోలీసు కమిషనరు మెచ్చుకొని నీ పేరు పోలీసు మెడల్‌కు సిఫార్సు చేస్తా అనడంతో శుభం పలుకుతా. 12 వేల అడుగులే నెగెటివ్‌, అంతే పాజిటివ్‌ ఫిల్మువాడుతా. ఆ రోజులలో 30 వేల రూపాయలకు మొదటి ప్రింటు వచ్చేది. అభ్యంతరకరమైన అంశాలేవీ లేవు గనుక సెన్సారు క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇస్తుంది. మీ నియమాలన్నీ పాటించాం గనుక సబ్సిడీ 50 వేలు వస్తే 20 వేలు రిలీజుకు ముందే లాభం.” “ఆ సినిమాను ఎవడు చూస్తా?” దన్నారు మంత్రి. “సీనిక్‌ బ్యూటీ కోసం జనం చూడవచ్చు. చూస్తే అది అదనపు లాభం. చూడకపోతే ప్రింటు పక్కన పెట్టి మరో సినిమా మొదలు పెడతా” అన్నాను. ఇలా నెలకో సినిమా తీయవచ్చు. అందుచేత కనీస ప్రమాణాలు ఉండాలన్నాను. అంతా నవ్వి “ఇదేం పితలాటకం?” అన్నారు. మంత్రిగారు కమిటీ వేద్దామన్నారు. “సలహా ఇచ్చిన నువ్వూ సభ్యుడుగా ఉండాలి” అన్నారు. బెజవాడ గోపాలరెడ్డి 232 జియస్‌. వరదాచారి

అధ్యక్షుడుగా, నేను, ముదిగొండ శివప్రసాదు, బిల్మీజ్‌ అలావుద్దీన్‌ సభ్యులుగా, సమాచారశాఖ డైరెక్టరు సభ్యకార్భదర్శిగా ఫిలిం సబ్సిడీ కమిటీ వేశారు. కమిటీ మూడేళ్లు ఉంది. ప్రతి నెలా నాలుగైదు చిత్రాలు చూసేవారం. నేను చెప్పినట్టు కాదుగాని, హైదరాబాద్‌ పోలీసు కమిషనరు నంబియార్‌ కొడుకు ఎన్నో మలయాళీ చిత్రాలుతీసి సల్సిడీ అందుకున్నాడు. మా కమిటీ గడువు ముగియ బోతుండగా రంభ ఊర్వశి మేనక అనే చిత్రం ప్రదర్శనకు వచ్చింది. అప్పటివరకు కమిటీ పని సినిమా చూడటం, టిఫినో, భోజనమో చేయడం, శాఖవారు తయారుచేసిన సిఫార్సు పత్రంమీద సంతకం పెట్టడంగా ఉండేది. ఈ సినిమా చూశాక నేను గోపాలరెడ్డిగారితో “సంతకం ఇప్పుడే పెట్టకండి” అన్నాను. “ఏమీ? చిత్రం అన్ని రకాల బాగానే ఉందిగా?” అన్నారు. “కథాంశం అభ్యంతరకరంగా ఉం”దన్నాను. “పక్కింటివాడి పెళ్లాన్ని లోబరచుకోవడ మెలాగో చెపుతున్నది. కథానాయకుడు చాలా నేర్చుతో ముగ్గురు నాయికలను లోబరచుకొని అనుభవించి హత్య చేస్తాడు. అలాటి చిత్రానికి నబ్సిడీ ఇచ్చి 'ప్రోత్సహించడమా అనేది ఆలోచించాలన్నాను. “సన్సిడీ నిరాకరించవచ్చా?” అని ఆయన అడిగారు. “కేంద్ర రాష్ట్ర అవార్డులు పొందిన చిత్రాలకు సబ్సిడీ నిరాకరించ రాదు అని నియమముంది. పరిశేష న్యాయసూత్రప్రకారం మరి దేనికో నిరాకరించ వచ్చునని అర్ధం కదా!” అంటే అంగీకరించారు. “నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం అన్నీ ఆకట్టుకొనేట్టు ఉన్నాయి. కనుక మరీ ప్రమాదకరం. సబ్సిడీని పూర్తిగా నిరాకరించకుండా 10 వేలు కోతపెట్టి ఇద్దామని సూచించాను. అప్పటికి సబ్సిడీని లక్ష రూపాయలకు పెంచారు. మా సిఫార్సును ప్రభుత్వం లెక్కపెట్టలేదు. నిర్మాత తన పలుకుబడి ఉపయోగించి లక్ష సాధించుకున్నాడు. తర్వాత జరిగిన సమావేశంలో నిరసనగా రాజీనామా చేద్దామని నేను ్రతిపాదించాను. కాని “మన గడువే దీంతో ముగుస్తుంది. ఇప్పుడు నిరసనలు, రాజీనామాలెందుకని గోపాలరెడ్డి వద్దన్నారు. “ఏదో విధంగా మన అనమ్మతిని తెలపా”లని నేను అన్నాను. “ఎలాగూ ముగిసిపోయేదాన్ని త్యాగం చేశామనడం గొప్పా అనే విమర్శ వస్తుందన్నారు. అదీ నిజమే. తర్వాత ప్రభుత్వం కొత్త సబ్సిడీ కమిటీని వేయలేదు. పత్రకార్‌ శిరోమణి

1976 నవంబరులో పశ్చిమ బంగ నాగరీ ప్రచారిణీ సభవారు తొలి హిందీ వార్తాపత్రిక '“ఉదంత మార్తాండ్‌” 150వ స్థాపనదినోత్సవాన్ని పురస్కరించుకొని కలకత్తాలో మూడు రోజులు సర్వ భాషా పత్రకార్‌ సమ్మేళనం ఏర్పాటు చేశారు. జ్ఞాపకాల వరద 233

దానిలో వివిధభాషల పత్రికారచయితలను 'దేశానికి విశిష్ట సేవలు” చేసినందుకు పత్రకార్‌ శిరోమణి బిరుదుతో సత్కరించారు. తెలుగు పథత్రికా రచయితలలో హైదరాబాద్‌ నుంచి తిరుమల రామచంద్ర, నేను వెళ్లాము. ఎమర్జెన్సీ రోజులు. బెంగాల్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వముంది. ముఖ్యమంత్రి తదితరులు ఇందిరను, ఆమె విధించిన ఎమర్జెన్సీని సమర్ధించేవారే. అలాటివారు సభకు వచ్చి సత్మరిస్తామంటే ఒప్పుకోమన్నారు ఆహూతులు కొందరు. అది పరోక్షంగా ఎమర్జెన్సీని బలపరచినట్టవు తుందన్నారు. మేమూ ఎమర్జెన్సీ వ్యతిరేకులమే. బహిష్మరణవాదులతో కలిశాము. వారిదే మెజారిటీ అయింది. చివరకు నిర్వాహకులు ప్రఖ్యాత బెంగాలీ రచయిత బిమల్‌ మిత్రాచేత బిరుదప్రదానం చేయించడంతో, సమ్మేళనం సుఖాంతమైంది. అసలు ఆ సభను జర్బలిస్టుల చేత ఎమర్జెన్సీకి ఆమోదముద్ర వేయించుకోడానికే నిర్వహించారని కొందరన్నారు. అది దురాశ. కాదంటే అత్యాశ. ఆ నాటి జర్నలిస్టులలో అలా శాలువల కోసం విలువలు త్యజించేవారు నూటికొక్కరు కూడా ఉండేవారు కాదంటే అతిశయోక్తి కాదు. ఐతే కొసమెరుపుగా ఒకటి చెప్పాలి. ఈ సమ్మేళనం కన్వీనరుగా వ్యవహరించిన డాక్టరు రత్నాకర్‌ పాండే, తర్వాత కాంగ్రెసు అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడయ్యాడు. ప్రెస్‌ కమిషన్‌కు మోనోగ్రాఫ్‌

ఎమర్జెన్సీ కాలంలో పత్రికలమీద సెన్సార్‌షిప్‌ విధించిన ఇందిర ఏమి ఆలోచించారో కాని, 1977లో జస్టిస్‌ పి.కె. గోస్వామి అధ్యక్షతన రెండవ ్రెస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సర్వోదయ నాయకుడు వినోబా భావే ఎమర్జెన్సీని అనుశాసనపర్వం అని వర్ణించడంతో భ్రమలో పడ్డారు. దేశంలో (ప్రజాభిప్రాయం ఎలాఉందో తెలుసుకునే మార్గం తానే మూసివేశారు గనుక, తన భజనపరులు చెప్పిందే సత్యమనుకొని ఎన్నికలు ప్రకటించారు. ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయారు. కొత్తగా అధికారం చేపట్టిన జనతా ప్రభుత్వం జస్టిస్‌ కె.కె. మాథ్యూస్‌ అధ్యక్షుడుగా ప్రెస్‌ కమిషన్‌ను పునర్‌నిర్మించింది. జస్టిస్‌ రాజాధ్యక్ష అధ్యక్షతన ఏర్పాటైన మొదటి ప్రెస్‌ కమిషన్‌, జర్నలిస్టుల పాలిటి కల్పవృక్షంగా వర్ణించబడిన నివేదికను 1954లో సమర్పించింది గనుక, ఆ తర్వాత తెలుగు పత్రికల పురోగతిపై కమిషన్‌ నివేదిక కోరింది. గోరాశాస్ట్రికి ఆ బాధ్యత అప్పగించగా ఆయన నాకు బదలాయించారు. నేను తెలుగు పత్రికలు వెలువడుతున్న ప్రధానపట్టణాలన్నిటికీ వెళ్లి సంపాదకులు, సీనియరు పక్రికారచయితలతో మాట్లాడి సమ(గ్రనివేదిక సమర్పించాను. గందరగోళ పరిస్థితులలో ఏర్పాటై, అధ్యక్షులు మారిన ఈ కమిషన్‌ సిఫార్సులకు, పెద్దగా గుర్తింపురా లేదు. 234 జి.యస్‌. వరదాచారి

షష్టిపూర్తి సన్మానం

1980 మార్చిలో కిన్నెర ఆర్ట్‌ ధియేటర్స్‌ కార్యదర్శి రఘురామ్‌ సన్మానం చేస్తానంటూ వచ్చాడు తర్వాత డి జి పి అయిన పోలీసు అధికారి ఎం వి నారాయణ రావు అప్పుడు కిన్నెర అధ్యక్షులు రఘురామ్‌ ఇద్దరు జర్నలిస్టులను వెంటబెట్టుకు వచ్చాడు వృత్తిధర్మంగా వార్తలు వాసే జర్చలిస్టులకు సాంస్కృతిక సంఘం సన్మానం చేయడమేమిటని నేను సంకోచించాను "ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌, ప్రెస్‌ క్లబ్‌ ద్వారా మీరు చేస్తున్న కృషికి గుర్తింపు” అని బలవంతం చేస్తే సరేనన్నాను చక్కటి సన్మానపత్రం సమర్పించారు ఆ తర్వాత 1992లో నా షష్టిపూర్తి సన్మాన సభనుకూడా కిన్నెరవారే నిర్వహించారు ఆ సభకు ఆ నాటి విద్యాశాఖమంత్రి పి వి రంగారావు ముఖ్యఅతిధిగా వచ్చారు ఇతర ఆత్మీయ అతిధులుగా నాకు సంబంధం ఉన్న విద్య, సాహిత్య, సాంస్కృతిక, సినిమా, పరిపాలన, పత్రికారంగాలనుంచి జి వి సుబ్రహ్మణ్యం,

జర్నలిస్టుగా కిన్నెర నంస్థ తొలి నన్భానం మవోకవి దాళరథి చేతుల మీదుగా

నా వస్ట్రీవూర్తి నభలో తిరుమల రామచందకు, గందూరి తృ్టకు మా దంవతుల నన్నానం

జ్ఞాపకాల వరద 2835

కెవి. భాస్మరరావు, కళా సుబ్బారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, కె.వి. రమణాచారి, పి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయశాస్తి పాల్గొన్నారు. రఘురామ్‌కు నేనొక ప్రతిపాదన చేశాను. “మా దంపతులకు సన్మానం చేయడానికి ముందు, మేము నాకంటె పెద్దవారై ఇంకా క్రియాశీలంగా ఉన్న ఇద్దరు జర్నలిస్టులకు నూతనవ'స్తాలు సమర్చించి సత్మరిస్తాం. ఆ తర్వాతే మాకు సన్మానం.” అందుకు సప్తతి పూర్తిచేసుకున్న గండూరి కృష్ణను, అశీతి పూర్తి చేసుకున్న తిరుమల రామచంద్రను ఎంపిక చేశాను. మేము వారిద్దరినీ సత్కరించాకే వేదపండితుల ఆశీర్వచనాల మధ్య మంత్రి మా దంపతులకు సన్మానం చేశారు. మంచి సన్మానపషత్రం సమర్పించారు. దానిలో భాగంగా 'పత్రికా రచనాచార్వ'" అనే బిరుదు కూడా ప్రదానం చేశారు. రేపు ఇంకెన్ని బిరుదులు లభించినా పత్రకార్‌ శిరోమణి, పత్రికారచనాచార్య అనే రెండు మాత్రమే సార్ధకమైనవని, వాటిని వాడుకొనడానికి బిడియపడవద్దని తిరుమల రామచం[ద్ర సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే నా తెలుగు లెటర్‌ హెడ్‌ మీద ఈ రెండు బిరుదులతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చిన డాక్టరేటును అచ్చువేయించి ఉత్తరప్రత్యుత్తరాలకు వాడుతున్నాను. జనం మెచ్చిన సినిమా సమీక్షలు

నా చిత్రసమీక్షలకు పాఠకులనుంచే కాక సినీ పరిశ్రమ వర్ణాల నుంచి మంచి ఆదరణ ఉండేదని చెప్పాను. భూమికోసం చిత్రం గురించి ఆంధ్రభూమిలో నేను వ్రాసిన సమీక్షను కె.బి. తిలక్‌ 10 వేల ప్రతులు అచ్చువేయించి థియేటర్లలో పంచడం అందుకొక ఉదాహరణగా పేర్కొనవచ్చు. అంతే కాదు, నటీనటులతో పాటు నన్ను నల్లగొండ భువనగిరి థియేటర్లకు తీసుకువెళ్లడాన్ని కూడా చెప్పవచ్చు. అలాగే 'తీర్చు” చిత్రం విజయోత్సవసభలో నిర్మాత యు. విశ్వేశ్వరరావు మాకూ షీల్డులు ఇవ్వడం. ఆ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి పిడతల రంగారెడ్డి షీల్డు ఇచ్చే ముందు నన్ను ఆపి స్కైలైన్‌ ఆంగ్ల దినపత్రికలో మీ చిత్రసమీక్షలు చదువుతున్నానని, బాగుంటున్నాయని, నా ప్రశంసను తెలుపుకోడానికి ఈ దండ వేస్తున్నానని దండవేసి, షీల్టును చేతికి అందించారు. స్మైలైన్‌ పత్రికను డి. సీతారాం అనే జర్నలిస్టు మిత్రుడు నడుపుతుండేవాడు. మంత్రి దానికి వెన్నుదన్నుగా ఉండేవారు. నేనూ నా వంతు సహాయంగా దానిలో వారం వారం సినిమా ఫీచరు వ్రాస్తుందేవాడిని. దానికి మంచి స్పందన వచ్చింది.

నేను చిత్రసమీక్షల విషయంలో శంకర్స్‌ వీక్లీ శైలిని అనుసరించాను. గుణదోష చర్చ నిజాయితీగా, తార్మికంగా చేసేవాడిని. మొదట్లో ఏ చిత్రాన్ని గురించి వ్రాశానో 286 జియస్‌. వరదాచారి

వారు సంతోషించడమో బాధపడటమో చేశారు కాని క్రమంగా అందరో సమీక్షలంటే ఇలా ఉండాలనడం మొదలుపెట్టారు 1980లో కె విశ్వనాధ్‌ దర్శకత్వం వహించిన “శంకరాభరణం చిత్రం జాతీయస్థాయిలో “ఉత్తమ విలువలు కలిగిన బహుళ జనాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా స్వర్ణకమలం అవార్డు పొందింది అప్పుడు పేట్రియట్‌ ఇంగ్లీషు దినప(్రిక (గ్రూపునకు చెందిన లింక్‌ వారపత్రికవారు, తెలుగు సినిమాను పరిచయం చేస్తూ ప్రత్యేకవ్యాసం వ్రాయమన్నారు “ది డార్మెంట్‌ జెయంటొ అనే శీర్షికతో రఘుపతి వెంకయ్యతో మొదలుపెట్టి, విశ్వనాథ్‌ వరకు తేలుగు సినిమాకు కీర్తి తెచ్చినవారందరి కృషిని వివరిస్తూ సుదీర్థమైన వ్యాసం వ్రాశాను. హిందీ తర్వాత అత్యధికసంఖ్యలో చిత్రాలు నిర్మిస్తున్నా అప్పటి వరకు ఒక్క స్వర్ణకమలం కూడా సాధించలేకపోయిన స్థితిని మహాబలుని నిద్రాణస్థితితో పోల్చే శీర్షిక పెట్టాను నాకు తృప్తినిచ్చిన ఆ వ్యాసాన్ని 'వరద స్వర్దాక్షరిలో పునర్ముద్రించాము ముక్తాయింపుగా ఒక విషయం చెపుతాను ఎస్వీ రంగారావు ఒకసారి అడిగారు “మీ సమీక్షద్వారా పేక్షకులను సినిమాచూడకుండా ఆపగలరా?” అని ఆపలేనని సమాధానమిచ్చాను “ఐతే నా సమీక్షల ద్వారా రెండు మూడు వందల మందినైనా థియేటరు దాకా వచ్చి మంచి సినిమాను చూసేటట్టు చేయగలొనన్నాను దాసరి స్వర్షపతకం

వంశీ రామరాజు 1980ల ఆరంభంలో దాసరి నారాయణరావు సహకారంతో ఉత్తమ ఫిలిం జర్నలిస్టుకు స్వర్ణపతకం ఇవ్వడం ప్రారంభించారు తొలి పతకాన్ని తొలి తెలుగు సినిమా పత్రిక సంపాదకుడు ఇంటూరి వెంకటేశ్వరరావుకు ఇచ్చారు 1986లో నాకు ఇచ్చారు అప్పుడు డి వి యస్‌. రాజు జాతీయ చలనచిథౌభివుద్ధి మండలి అధ్యక్షులుగా ఉన్నారు. వారి స్రిన్స కమిటీలో సభ్యునిగా ఉండమన్నారు. మండలి నియమాల ప్రకారం వ్యాపారధోరణిలో కాక, కళాత్మక విలువలతో నిర్మించే చిత్రాలకు మండలి పెట్టుబడి పెట్టేది మూదేళ్లు సభ్యుడిగా ఉన్నానేమో ఒకే ఒక ప్కిఫ్ట వచ్చింది అది మామూలు రొడ్డ కొన్ని మార్పులు చేయమన్నాము ఆ నిర్మాత మళ్లీ కనబడలేదు కొత్తవారూ ఎవరు రాలేదు

1999లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు జర్నలిజం విభాగంలో ఇచ్చే ప్రతిభాపురస్కారాన్ని నాకు ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం 2006 విజయ ఉగాదినాడు విశిష్టపురస్మారాన్ని ఇచ్చింది ఢిల్లీ తెలుగు అకాడెమీ విశాల భారతీ గౌరవపురస్మారాన్ని జ్ఞాపకాల వరద 287

ఇచ్చింది. 2012లో చెన్నై ప్రధానకేంద్రంగాగల ప్రపంచ తెలుగు సమాఖ్య వి.ఎస్‌.ఆర్‌. కృష్ణ స్మారక జర్నలిజం అవార్డు ఇచ్చింది. 2018లో కిన్నెర సంస్థ తిరుమల రామచంద్ర శతజయంతి పురస్కారాన్ని ప్రదానం చేసింది. అదే సంవత్సరం కృష్ణాజిల్లా రచయితల సంఘం ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారం అందజేసింది. 2015 జులై 9వ తేదీన తెలంగాణలో పటత్రికోద్యమ వైతాళికుడు త్రీ సురవరం ప్రతాపరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతీ పురస్కారాన్ని ఇచ్చారు. అదే సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషాదినోత్సవ సందర్భంగా గిడుగు రామ్మూర్తి స్మారక పురస్కారం అందుకున్నాను. శివానందమూర్తి గారి సనాతన చారిటబుల్‌ ట్రస్టు, ఏటేటా శ్రీరామనవమి రోజున వివిధ సాహిత్య సాంస్కృతిక రంగాలలో విశిష్ట కృషి చేసినవారికి ప్రతిభాపురస్మ్కారాలు ఇస్తుంది. 2014 జయనామ సంవత్సరానికి అవార్డులు అందుకున్నవారిలో నేనూ ఒకడిని. వీరు 30 వేల నగదు బహుమతి ఇవ్వడం చెప్పుకోదగిన విశేషం. జీవిత సాఫల్య పురస్కారం

ఏ రంగంలో వారికైనా తమ రంగానికి చెందిన అత్యున్నతపురస్మ్కారం దక్కితే కలిగే ఆనందం సాటిలేనిది. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'నార్ల జీవిత సాఫల్య పురస్కారం? అలాటిదే. ఏర్పాటైతే చేసింది కాని, ఇవ్వడంలో ప్రభుత్వం బద్ధకం చూపుతుండేది. 2009లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, 2004 నుంచి 2007 వరకు నాలుగేళ్ల అవార్డులు ఒకేసారి ఇవ్వడానికి నిర్ణయించారు. కమిటీని వేశారు. వారు పొత్తూరి వెంకటేశ్వరరావును, నన్ను, ఐ. వెంకటరావును, కె. శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశారు. 2005వ సంవత్సరపు అవార్డు నాకు ఇచ్చారు. అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్‌ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాను. మిగతా ముగ్గురు ప్రెస్‌ అకాడెమీ పూర్వాధ్యక్షులు. ముఖ్యమంత్రికి తీరుబాటు లేకపోతే అసెంబ్లీ స్పీకరు సురేశ్‌ రెడ్డి చేత అవార్డులు ఇప్పించారు. అవార్జ్డులో భాగంగా మూడు లక్షల రూపాయల నగదు పారితోషికం ఉండటం, దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా మార్చింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొదట బి. నాగేశ్వరరావు పేరిట జర్నలిస్టులకు జీవిత సాఫల్య పురస్కారం 10 వేల నగదు బహుమతితో ఏర్పాటు చేసింది. తర్వాత నగదును పాతిక వేలకు పెంచింది. ఆ తర్వాత నార్ల పేరు పెట్టి పారితోషికాన్ని మూడు లక్షలు చేసింది. మాకు అవార్డులు ఇచ్చే నాటికే మరి రెండేళ్ళ అవార్డులు బాకీ పడిఉన్నాయి. ప్రభుత్వం కమిటీని వేసింది. దానిలో నన్నూ సభ్యునిగా వేసింది. 288 జి.యస్‌. వరదాచారి

| జే హతే కొల్‌కతాలో 2976 లో నర్వభాషా వత్రకార్‌ నవ్మేళనంలో విఖ్యాత బెంగాలీ కథకుడు బిమల్‌ మిత్రా నుంచి వత్రకార్‌ శిరోమణి వురస్కారస్వీకారం [స భన. స పదాల ఆత ఏజ్‌ మ నీ న... అవిభక్త ఆం(ధ్ర(నదేళ్‌రాస్ర (ప్రభుత్వం వారు ఉత్తమ ఉర్నలిన్దులకు ఇన్తూ జింటిన నార్ల లైఫ్స్‌ట్రామ్‌ అబీవ్‌ మెంట్‌ అవార్డును 2006 నంవత్సరానికి న్ఫీకర్‌ నురేష్‌ రెడ్డి చేతులమీదుగా అందుకున్నవ్చటి చిత్రం న్‌ న్‌్‌ గో శ న | య్‌ శ సమ్‌. న 1. ము. గౌరవ దాక్టరేట్‌వ్రదానం చేస్తున్న తెలుగు విశ్వవిద్ధాలయం చాన్సలర్‌ రాష్ట్ర గవర్నరు రామేళ్వర ఠాకూల్స్‌ వక్సన వైస్‌ చాన్సలరు ఆవుల మంజులల జ్ఞాపకాల వరద 239

విజేతల జాబితా ఇచ్చాము. ప్రభుత్వం ఆమోదించింది. విజేతలను అభినందిస్తూ లేఖలు కూడా వ్రాసింది. కాని రాష్ట్రలో అనిశ్చితపరిస్థితి వల్ల ప్రదానోత్సవం జరుగలేదు. జీవిత సాఫల్య పురస్కారాలు పొందిన ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురైనారు. వయోధిక పాత్రికేయ సంఘం చారవతీసుకొని, ఒకరికి ఆస్పత్రిలో, ఇద్దరికి ఇంటివద్ద సనదు, జ్ఞాపిక, బహుమతి మొత్తం ఇప్పించింది. ఇద్దరు చికిత్స పొంది కోలుకొన్నారు. ఒకరు కాలధర్మం చెందారు. ఇంతలో రాష్ట్రవిభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తక్కిన అవార్డులు సందిగ్ధంలో పడ్డాయి. అసలు అవార్జ్డులే ఉంటాయా అనేది (ప్రశ్చార్ధకమైంది. పరిపాలన, న్యాయ పదకోశం

1966లో రాష్ట్రప్రభుత్వం తెలుగును అధికారభాషగా గుర్తించింది. అందుకు అవసరమైన పారిభాషికపదాలను రూపొందించే బాధ్యతను తెలుగు అకాడెమీకి అప్పగించింది. అకాడెమీ 1976లో పరిపాలన, న్యాయపదకోశం రచనకు నమూనా పథకం రూపొందించింది. దాని ప్రకారం 460 పేజీల ఇంగ్లీషు - తెలుగు ముసాయిదా ప్రతిని తయారుచేసింది. దానిని మెరుగు పరచడానికీ, తెలుగు - ఇంగ్లీషు వరుసలో మరో కోశనిర్మాణానికి పథకం సిద్ధపరచడానికీ, 1981లో ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 25 మందితో కూడిన ఆ సంఘంలో నాకూ సభ్యత్వమిచ్చింది. చాలా సమావేశాలు, ఉపయోగకరచర్చలు జరిగాయి. తర్వాతి కాలంలో మా జర్నలిజం వృత్తినిర్వహణలో భాగంగా నూతనపదనిర్మాణంలో అనుసరించదగు సులువులు తెలిశాయి. ఈ కోశానికి నిర్వాహకసంపాదకులుగా ఉన్న డా. ముకురాల రామిరెడ్డి మంచి మిక్రులైనారు. సాంస్కృతిక సలహా మండలి

1981లో మలేషియాలోని కౌలాలంపూరులో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ సభలకు హాజరవాలనుకునేవారు, పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో ్రోగైనారు. వారిలో చాలామంది సంగీత నృత్య కళాకారులే. కొంత తొక్కిసలాట జరిగింది. పలువురు వెళ్లలేకపోయారు. నేనూ వెళ్లలేదు. తిరిగి వచ్చాక ముఖ్యమంత్రి అంజయ్యకు ధర్మసందేహం కలిగింది. సాంస్కృతిక బృందం అంటే “పాడేటోళ్లు, ఆడేటోళ్లేనా?” అని. “అసలు మన సాంస్కృతిక విధానమేమిటి?” అని ఆయన విలేఖరుల గోష్టిలో ప్రశ్నించారు. ప్రభుత్వానికి సాంస్కృతికవిధానమంటూ 240 జి.యస్‌. వరదాచారి

లేదని అప్పుడు తేలింది. అంజయ్య ఆ సంవత్సరం ఆగస్టు నెలలో రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల సలహా మండలిని ఏర్పాటు చేశారు. దానిలో దండిగా 49 మంది సభ్యులను వేశారు. సాంస్కృతికశాఖ మంత్రి పదవిరీత్యా అధ్యక్షుడు. మరో ఎనిమిది మంది మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరు అకాడెమీల అధ్యక్షులు, నలుగురు ఆస్థాన విద్వాంసులు, ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులు, ఎండోమెంట్‌ కమిషనరు, ఉస్మానియా, ఆంధ్రా, హైదరాబాద్‌ యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు, ఇంకా కొందరు కార్పొరేషన్ల చైర్మన్లు పదవి రీత్యా సభ్యులు. వ్యక్తులుగా సభ్యత్వమున్నవారు ముగ్గురున్నారు. వారు పద్మశ్రీలు ఎన్‌.టి. రామారావు, అక్ష్మినేని నాగేశ్వరరావు, జర్బలిస్టు జి.యస్‌. వరదాచారి. ఈ కమిటీ మొదటి సమావేశం జరిగింది. విధివిధానాలు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక విధానమేమిటో తెలుసుకోవాలని నిర్ణయించారు. అప్పుడు తెలిసింది, కేంద్రానికి కూడా నిర్జీత సాంస్కృతికవిధానమంటూ ఒకటి లేదని. రాష్ట్ర కమిటీ తర్వాతైనా విధానమేదీ రూపొందించలేదు. రాష్ట్ర సాంస్కృతిక సలహామండలి కాలగర్భంలో కలిసి పోయింది. పత్రికా చట్టాలపై పాఠ్య గ్రంథం

డాక్టరు బి.ఆర్‌. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1994లో ప్రసార మాధ్యమాలకోసం తెలుగులో రాయడం అనే పి.జి. డిప్లామా కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కోర్సు డైరెక్టరుగా నియమితులయ్యారు. పలువురు అనుభవజ్ఞులైన జర్నలిస్టులను, అధ్యాపకులను పాఠరచయితలుగా ఎంపిక చేశారు. ఆరవ ఖండం మొత్తం వ్రాసే బాధ్యత నాకు అప్పగించారు. ఇందులో 88 పేజీలకు విస్తరించిన ఐదు భాగాలు ఉన్నాయి. 1 భారత రాజ్యాంగం - పత్రికా రంగం 2. పత్రికామండలి, పత్రికాశాసనాలు, పత్రికాస్వేచ్చ 8. వార్తాసంస్థలు 4 పాత్రికేయ చట్టాలు, యూనియన్లు, వేతనబోర్డులు ర. పాత్రికేయులు - నైతిక విలువలు. ఇది పథత్రికాశాసనాలు, విలువలకు సంబంధించిన సమగ్రగ్రంథంగా రూపొందింది. దీన్ని కోర్చులో చేరినవారికి మాత్రమే ఇస్తారు. బయట అమ్మరు. కాని దొరికినవారికి ఇదొక కరదీపికగా ఉపయోగపడుతుంది. ఇది 1997 సంవత్సరంలో ప్రచురణ అయింది. ఆ క్రితం సంవత్సరం ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీవారు తమ పాఠ్యాంశంలో భాగమైన 'లా ఆఫ్‌ డిఫమేషన్‌ అండ్‌ జర్బలిస్టిక్‌ డిఫెన్సెస్‌” అనే పాఠాన్ని నా చేత వ్రాయించుకొన్నారు. ఈ కోర్సు కో-ఆర్జినేటరుగా జ్ఞాపకాల వరద బ్రతక

ఉన్న మాఖన్‌ లాల్‌ చతుర్వేదీ, జర్నలిజం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ త్రిఖా, “చట్టాలను గురించిన పాఠాలను కూడా ఇంత సరళంగా వ్రాయవచ్చునని మీ రచన చూశాకే తెలిసింొదన్నారు. దిద్దుబాటు: దారి దీసం

నా రచనలలో బహుళప్రశంసలు పొందినది, పుస్తకంగా ప్రచురించిన తర్వాత న్వల్పకాలంలోనే రెండవ ము(ద్రణకు వచ్చింది 'దిద్దుబాటు. పేరును బట్టి అర్ధమవుతున్నట్టుగా పత్రికలలో దొర్లే అపశబ్బాలను, అపప్రయోగాలను సరిదిద్దే ప్రయత్నం. ఇంగ్రీషులో మీడియా వాచ్‌ కాలమ్‌ అనే ఈ శీర్షికలు ఎం.వి. కామత్‌, జియస్‌. భార్గవ, డామ్‌ మొరేస్‌ వ్రాసినవి ప్రసిద్ధమైనవి ఉండేవి. తెలుగులో ఇటువంటి శీర్షిక లేదు. వ్రాయాలని నేనే కొన్నేళ్లుగా అనుకుంటున్నాను. ఈ వ్యాసాలు ఎలా ఉండబోతాయో తెల్పడానికి నమూనాగా రెండు వ్రాసి, సంపాదకులకు చూపాను కూడా. సొటి పత్రికలలో తప్పులు పడితే లేనిపోని గొడవ అనుకున్నారేమో. ముందుకు రాలేదు. 'ఈనాడు'లో నా సహోద్యోగి ఎం.వి.ఆర్‌. శాస్త్రి ఆంధ్రభూమి” దినపత్రిక ఎడిటరు బాధ్యత చేపట్టాక మా పత్రికకు ఏదైనా శీర్షిక వ్రాయమన్నారు. ఆయన ఆంధ్రప్రభ వార పత్రికలో ఉండగా 'పాతపాళీ పేరిట నా చేత పాతకాలపు అనుభవాల గురించి రెండు వ్యాసాలు వ్రాయించారు. ఆయనకు నా వ్రాతతీరు తెలుసు. నేను వ్రాయాలనుకుంటున్న శీర్షిక గురించి తెలుసు. కనుక మీరేం వ్రాసినా వేస్తానన్నారు. దానితో 1997 ఏప్రిల్‌ 6వ తేదీ నుండి వారం వారం 'దిద్దుబాటు” శీర్షిక వ్రాయడం

(చ| జరం కి లం. + “త (1 జ 1. స్ట! త స? టు... మ రచన జర్నలిజం కళాశాల ప్రచురించిన నా దిద్దుబాటు” వుస్తకాన్ని అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్ణురించినవ్పటి దృశ్చుం

ఇత్సలై జి.యస్‌. వరదాచారి

ప్రారంభించాను. దాదాపు మూదేళ్లు వ్రాశాను. అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నాను. పత్రిక పేరు, చేసిన తప్పు, దాన్ని పునరావృత్తం కాకుండా చేయడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు మిత్రవాక్యంగా చెప్పాను. విషయం ఎంత గంభీరమైందయితే పదప్రయోగం అంత నిగ్రహంగా ఉండాలని విద్యార్థులకు చెప్పాను, స్వయంగా పాటించాను. పత్రికా రంగంలో అందరూ మిట్రులే. సహృదయతతో “దిద్దుబాటు లక్ష్యాన్ని గుర్తించారు. ఆదరించారు.

రచన జర్నలిజం కళాశాల వారు 1999 జూన్‌లో అప్పటికి ఆంధ్రభూమిలో (ప్రచురితమైన 70 వ్యాసాలను తమ తొలి ప్రచురణగా వెలువరించారు. దీనికి ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ముందు మాట వ్రాశారు. చివరి రెండు వాక్యాలు ఉటంకిస్తాను. 'దిద్దుబాటులాటి పుస్తకం ఇంతకు ముందు పత్రికారంగంలో రాలేదు. యువకులైన పత్రికారచయితలందరూ దీన్ని చదివి ఆచరణలో పెట్టడం అవసరం”. మరొక భాషాశాస్త్రవేత్త చేకూరి రామారావు పుస్తకం చదివాక “న్పీర్సు పత్రికా భాషకే పరిమితమై దిద్దుబాటు బ్రాశారు, నేను తెలుగు వచనం మొత్తానికి ఇలాటి పుస్తకం వ్రాస్తొనన్నారు. అన్ని పత్రికలు మంచి సమీక్షలు వ్రాశాయి. “వార్త దిన పత్రిక వివరణాత్మకసమీక్షలోని ముగింపు వాక్యాలను ఉల్లేఖిస్తాను; 'తాముచేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుసుకోడానికీ, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో (గ్రహించడానికి, జర్నలిస్టులు మాత్రమే కాకుండా తెలుగు రాసేవారంతా విధిగా చదువవలసిన మంచి పుస్తకం దిద్దుబాటు. ఇండియా టుడే ఇలా వ్రాసింది “పత్రికారచన ఆషామాషీ వ్యవహారం కాదని, ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన వృత్తి అని వరదాచారి భావిస్తారు.... సమాచారం అందిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందీ ఆయన సోదాహరణంగా వివరించారు.” ప్రముఖ సంపాదకులు నండూరి రామమోహనరావు వార్త పత్రికలో వ్రాసిన సంపాదకలేఖ ఈ సందర్భంలో తప్పక పేర్కొనదగినది. 'వార్తలో వరదాచారిగారి 'దిద్దుబాటు”పై సమీక్ష చదివాను. చాలా బాగుంది. ఒకరి దగ్గర బారో చేసి పుస్తకం చదివాను.... కొత్తగా జర్నలిజంలోకి ప్రవేశిస్తున్నవారికి, అవి ఎంతో ఉపయోగపడతాయి? భాషోద్యమనాయకుడు సి. ధర్మారావు దిద్దుబాటు ఓ క్లాసిక్‌ అన్నారు. సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అధినేత డా.ఎన్‌. భాస్మరరావు దిద్దుబాటు యువతరంలో మీడియా విలువల పట్ల నిబద్ధత పెంచుతుందన్నారు. కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ “వార్తారచనలో తప్పులను మూడో కన్నుతో చూసే శక్తి వరదాచారి కలానికి ఉంది” అంటూ, 'లోతున్న చూపు, చూపున్న కలం' ఆయనది అన్నారు. జ్ఞాపకాల వరద 248

ఇలాగేనా రాయడం?

దిద్దుబాటు వంటి శీర్షికను అనంతంగా కొనసాగించవచ్చు. కాని వ్రాయడానికి ముడి సరుకు సేకరణకు ఎక్కువ సమయం, శ్రమ అవసరమవుతుంది. కనుక రెందేళ్లు దాటాక కొంత విరామమీద్దామనుకున్నాను. అప్పుడే 'జనసందేశ్‌ నిర్వాహకుడు పి. వేణుగోపాలరెడ్డి తమ పత్రికలో అలాటి ఫీచరే వ్రాయమన్నారు. అప్పుడు నాకో ఆలోచన తట్టింది. 'వార్త పవిత్రం, వ్యాఖ్య వ్రాసేవారి ఇష్టం” అని పత్రికారచనలో ప్రసిద్ధమైన నానుడి ఉంది. అంటే వార్తను వ్రాసేవారు తమ ఇష్టానిష్టాలతో సంబంధంలేకుండా, వాస్తవాన్ని అదీ తరతమఖేదాలు పాటిస్తూ చెప్పాలి. వ్యాఖ్యలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకోవచ్చు అని భావం. దిద్దుబాటు (ప్రధానంగా మొదటి అంటే వార్తభాగానికి పరిమితమై వ్రాసింది. ఈ సారి రెండవ భాగం అంటే వ్యాఖ్యలలో అపవాదాన్ని ఖండిస్తూ వ్రాద్దామనిపించింది. వ్యాఖ్యలు కూడా వాస్తవాల ఆధారంగానే చేస్తున్నాం గనుక అవీ హేతుబద్ధంగా, తార్మికంగా ఉండాలి. పాత్రికేయ నిష్పాక్షికతకు లోబడి ఉండాలి. కాని ఇవాళ వ్యాఖ్యాతలు నేలవిడిచి సాము చేస్తున్నారు. రాజకీయపక్షాలకు పార్టీగత స్వార్ధం ఉండవచ్చు. గనుక వారు ప్రతిదాని గురించి తమ దృక్కోణంలోనే స్పందించవచ్చు. పత్రికలు ప్రజాహితమే పరమలక్ష్యంగా పనిచేయాలి గనుక వ్యాఖ్యలోనూ పాత్రికేయనిష్పాక్షికత ప్రతిఫలించాలి. అందుచేత “దర్చణం” అనే పేరుతో జన సందేశ్‌లో కొత్త శీర్షిక 1999 నవంబరులో ప్రారంభించాను. దీనిలో రాష్ట్రంలోని తెలుగు, ఇంగ్లీషు పత్రికలు సమకాలీన అంశాల మీద వ్రాసిన సంపాదకీయాలలో, వ్యాసాలలో, వ్యాఖ్యలలో, ప(త్రికారచయిత సర్వదా పాటించాల్సిన కచ్చితత్వ సూత్రాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారో విశదీకరించాను. వీటిలో 85 వ్యాసాలను రచన జర్నలిజం కళాశాలే కళాజ్యోతి ప్రాసెస్‌ అధినేత సహకారంతో “ఇలాగేనా రాయడం? అనే పేరుతో సర్వాంగసుందరమైన పుస్తకంగా ప్రచురించింది. ఈ కాలమ్‌ వ్రాస్తుండగా నా భార్య సరోజిని కాలధర్మం చెందింది. కనుక ఈ (గ్రంథాన్ని ఆమెకు అంకితమివ్వడం సముచితంగా ఉంటుందని మిత్రుడు చక్రధర్‌ సూచించగా, అలాగే చేశాను. కుటుంబవివరాలు చెప్పిన భాగంలో ఆ విషయం తెలిపాను. ఈ పుస్తకంపై ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ఈవారం పుస్తకం శీర్షిక కింద సుదీర్ధమైన విమర్శనాత్మకసమీక్ష వ్రాసింది.

1997లోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడెమీ మొదటి అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డికి పత్రికా పదకోశం ప్రచురించాలన్న చక్కటి ఆలోచన వచ్చింది. ప్రముఖ భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు ప్రధాన సంపాదకుడుగా నేను, సి. రాఘవాచారి, ఐ. వెంకటరావు, ర. జి.యస్‌. వరదాచారి

ఆర్‌ వి రామారావు సభ్యులుగా, తాను కన్వీనరుగా సంపాదకమండలి వేశారు పదకోశం తయారైంది కాని అది జర్నలిస్టులకు రోజువారీ పనిలో ఉపయోగపడే మంచి పదకోశం నిర్మించాలన్న లక్ష్యమేదైతే పెట్టుకున్నారో, తదనుగుణంగా రూపొందలేదు ఐతే తొలి ప్రచురణ ప్రతులన్నీ అమ్ముడు పోయాయి రెండవ ముద్రణను తగువిధంగా సంస్కరించి ప్రచురించాలని నిర్ణయించిన అప్పటి అధ్యక్షుడు వెంకటరావు, మరో భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ సహాయం కోరారు 2006లో సవరించిన కోశం వెలువడింది కాని జనరల్‌ డిక్షనరీకి భిన్నమైన పత్రికాపదకోశం రూపొందలేదు మరోసారి దీనిపై దృష్టి సారించవలసిన అవసరముంది పటత్రికాభాష

(ఫెస్‌ అకాడెమీ పత్రికారచనకు సంబంధించిన భిన్నప్రక్రియలపై జర్చలిస్టులకు దారిదీపాలుగా ఉపయోగపడే లఘుపుస్తకాలు ప్రచురించే పథకం చేపట్టింది నన్ను పత్రికాభాష గురించి వ్రాయమన్నారు నేను ఇరవై ఉపశీర్షికల కింద, పభ్రికారచయితల భాషావసరాలను దృష్టిలో ఉంచుకొని, వీలైనంత సులభశైలిలో, మెలకువలన్నీ చెప్పే ప్రయత్నం చేశాను ఇది మిత్రుల బహుళాదరణకు నోచుకుంది దీనిలో చరమ సూత్రం అనే ఉపశీర్షిక కింద వ్రాసిన వాక్యాలు ఉదాహరిస్తాను, “భాషలో వాడగూడని పదాలు, నుడికారాలు, సామెతలు, శైలులు ఏవీ లేవు విషయాన్నిబట్టి, పొరకులనుబట్టి భాషను, శైలీవైవిధ్యాలను వాడుకోవాలి తెలియనివాటిని తెలుసుకొని వాడుకోవాలి పదాల ఎంపిక సహజత్వానికీ, సంక్షిప్తతకు, విషయనిర్దిష్టతకు తోడ్బడే విధంగా ఉండాలన్నది సూత్రం ఇతరసూత్రాలన్నీ దీనికి అనుబంధమైనవే అయితే చరమ సూత్రం ఒకటుంది అవసరమైనప్పుడు అన్ని సూత్రాలను అతిక్రమించవచ్చునన్నదే ఆ సూత్రం అవసరమైనప్పుడు అనేమాటను గమనించాలి అవసరమైనప్పుడే, అదైనా బెచిత్యానికి భంగం రాకుండా ఉన్నంతవరకే * అమెరికా యాత్ర

మా అమ్మాయిలు ఇద్దరూ అమెరికాలో ఉంటున్నట్టు చెప్పాను అల్లుళ్లు సాఫ్ట్‌ వేర్‌ ప్రాగ్రామర్లు చిన్నమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగే వారు అందరు పిల్లలలాగే అమ్మానాన్నలకు అమెరికా చూపించాలని కుతూహలపడ్డారు కాని కుదరలేదు నా భార్య అకస్మాత్తుగా పోవడంతో నా మీద ఒత్తిడి పెంచారు దేశాలు తిరిగివస్తే ప్రశాంతత చేకూరుతుందని ఆశ ఇంతలో నూ పెద్దమ్మాయి కొడుకు సుధాంశు గ్రాడ్యుయేషన్‌ వేడుక వచ్చింది దానికి ఎట్టి పరిస్థితిలోను హాజరు కావాలని పట్టుబట్టారు నేను జ్ఞాపకాల వరద 24ీర్‌

స కిం అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో .. ళు త్తు పనిచేస్తున్నాను గనుక, వారి అనుమతి హ్‌ చను. స తీసుకొని, 2003 జూన్‌ 12వ తేదీన జ్‌, సేద త శ. ల బయాల్స్డేరి వెళ్లాను. 22 గంటల న ల సే ” బం. స్లో ప్రయాణం తర్వాత అక్కడి జూన్‌ 12వ ల్‌ క. మం. “| తేదీన న్యూ యార్క్‌లోని జె.ఎవ్‌.కె. తి గ “విమానాశ్రయంలో దిగాను. మా ఇద్దరు ల త న న అమ్మాయిలు, పెద్ద అల్లుడు వచ్చి రిసీవ్‌ . చేసుకున్నారు. మా చిన్నల్లుడు అప్పుడు మ | | ఇండియా వచ్చి ఉన్నాడు, తము లు అమ్మానాన్నలను తీసుకుపోవడానికి. నయాగరా జలపాతం దగ్గరగా వనన్దుదు... బ్ర్రదరం కలిని కొంతకాలం తదవకుందా రెయిన్‌కోటు ధరించి గడుపవచ్చని నేనూ అదే సమయంలో వెళ్లాను. వారి విమాన టిక్కట్లు రెండు రోజుల తర్వాత దొరికాయి. ముందు చేరుకొన్నందున, వారు వచ్చిన రోజున నాకూ స్వాగతం చెప్పే అవకాశం దొరికింది. అమెరికాలో మా బంధుమిత్రులు చాలా మందే ఉన్నారు. నేను వస్తున్నానని వాళ్లు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మా వాళ్లు అప్పుడు లాంగ్‌ ఐలండ్‌లో ఉండేవారు. బంధువులు ఎక్కువమంది న్యూ జెర్సీలో ఉన్నారు. మా అల్లుళ్లతో సంప్రదించి, పథకం ప్రకారం, చూడవలసిన ప్రదేశాలన్నిటికీ వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఉదాహరణకు అప్పుడు శ్రీమన్నారాయణ చిన జీయర్‌ స్వామి అమెరికాలో ఉన్నారు. ఆయన వాషింగ్టన్‌ సమీపంలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి శంకుస్థాపన చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉండే ఏర్పాటు చేశారు. దర్శనీయస్థలాలు చూసే మా కార్యక్రమాన్ని న్యూ యార్భులో ప్లెషింగ్‌లోని శ్రీవల్లభ గణపతి ఆలయసందర్భనతో మొదలు పెట్టాము. బ్రిడ్జివాటర్‌లో వేంకటేశ్వర ఆలయ సముదాయాన్ని చూశాము. బోస్టన్‌లో రంగనాథుని ఆలయంలో అర్చనలు జరిపించాము. న్యూ బృందావన్‌లో జగన్నాథుని స్వర్ణమందిరాన్ని దర్శించాము. అదే ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి, మరేదో దేవతలను కూడా ప్రతిష్టించారు. అక్కడ ఆలయ సముదాయాలే ఎక్కువ, ఒక్క పిట్స్‌ బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం మాత్రమే మన దేశంలో గుడుల మాదిరిగా ఒక్క దేవుడికి పరిమితమైంది. లాంగ్‌ ఐలండ్‌లోనే ఉన్న ప్రసిద్ధపత్రిక న్యూస్‌ డే కార్యాలయానికి వెళ్లాను. వారికి దిన పత్రిక, 246 జి.యస్‌. వరదాచారి

కాలికపత్రికలేగాక, రేడియో స్టేషన్‌ కూదా ఉంది. పి.ఆర్‌. అధికారి విన్సెంట్‌ అన్ని విభాగాలను వెంట ఉండి చూపించాడు. నేను వెంట తీసుకు వెళ్లిన 'ఈనాడు' దినపట్రిక ప్రతి ఒకటి ఆయనకు గుర్తుగా ఇచ్చాను. సర్ములేషన్‌ ఏంత ఉంటుందని అడిగాడు. 10 లక్షలని చెపితే “అబ్బో! చాలా పెద్ద పత్రికా అన్నాడు. న్యూ యార్క్‌ టైమ్స్‌ చూద్దామని (ప్రయత్నిస్తే ట్విన్‌ టవర్స్‌పై ఉ(గ్రవాద దాడి తర్వాత అతిథులను అనుమతించడం లేదన్నారు.

వాషింగ్టన్‌ వెళ్లి క్యాపిటల్‌ హిల్‌, వైట్‌ హౌస్‌, లింకన్‌ మెమోరియల్‌ చూశాము. న్యూ యార్క్‌లో ఎంపయర్‌ స్టేట్‌ బిల్జింగ్‌ ఎక్కి చూశాము. లిబర్టీ ఐలండ్‌ వెళ్లి స్థాచ్యూ ఆఫ్‌ లిబర్జీ ముందు ఫొటోలు దిగాము. మన్‌హటన్‌ వెళ్లి ఐక్యరాజ్య నమితి కార్యస్థానాన్ని తిలకించాము. భద్రతామండలి సమావేశ మందిరం వీక్షకుల హాలులో కూర్చొని పొటోలు దిగాము. టైమ్‌ స్వ్వేర్‌, వాల్‌ ఫీట్‌ చూశాము. బ్రాడ్వేకుపోతే పాతసుల్తాన్‌ బజారును చూసిన అనుభూతి కలిగింది. అట్లాంటిక్‌ సిటీలో తాజ్‌మహల్‌ క్యాసినోలో చిన్న మొత్తాలు జూదమాడాము. నయాగరా జలపాతాన్ని సందర్భించడం అద్భుతమైన అనుభవం. మోటారు బోటులో జలపాతంలో తడిసేటంత దగ్గరికివెళ్లడం ఒక ఎత్తయితే, హెలికాష్టరులో ఆకాశమార్గాన జలపాతంపై విహరించడం మరపురాని మధురానుభూతి! రెండు నెలలు ఉన్నందున బంధువులందరి ఇళ్లకూవెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించి, వారిని పాతజ్ఞాపకాలలో ముంచెత్త గలిగాను. ఆగస్టు 15వ తేదీన తిరుగు ప్రయాణమై, 22 గంటల తర్వాత ఇక్కడి ఆగస్టు 17వ తేదీ నాదు హైదరాబాద్‌ చేరుకున్నాను. మర్నాడు తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్లి విధులలో చేరిపోయాను. వరద స్వర్ధాక్షరి

2006 జూన్‌లో నేను జర్నలిస్టుగా ఉద్యోగంలో చేరి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. కాని నేను విద్యార్థిగా ఉన్నపుడే 1955లోనే స్వంతంగా వైష్ణవ పత్రిక నడిపినందు వల్ల జర్నలిస్టుగా 50 ఏళ్లు ముందే పూర్తయాయి. అదేమాట మిత్రులతో యథాలాపంగా అంటే అయితే సన్మానం చేయాల్సిందేనన్నారు. “సన్మానమని దండలు వేసుకొని, శాలువాలు కప్పుకొని, స్వీట్లు తినేసి వెళ్లిపోతే ఏం ప్రయోజనం? ఒక పుస్తకం వేస్తే చిరస్థాయిగా ఉంటుంది. భావితరాలకు ఉపయోగకరంగా ఉంటుం” దన్నాను. మిత్రుడు గోవిందరాజు చక్రధర్‌ ముందుకొచ్చాడు. పొత్తూరి వెంకటేశ్వర రావును సంప్రదించి ఆయన మార్గదర్శకత్వంలో ప్రొఫెసర్‌ ఎన్‌. గోపి, డాక్టరు సి.వి. నరసింహారెడ్డి, సమాచారశాఖ కమిషనరు కె.వి. రమణాచారి ఐదుగురితో జ్ఞాపకాల వరద లత?

కూడిన స్వర్ణోత్సవసంఘం ఏర్పాటు చేశాడు. ఒక అభినందన సంచిక ప్రచురించాలని నిర్ణయించి, నాతో సాన్నిహిత్యం కలవారందరికీ రచనలు పంపవలసినదిగా లేఖలు వ్రాశాడు. అందరూ సానుకూలంగా స్పందించి సమయానికి తమ రచనలు పంపారు. రచనలను కలగూర గంపగా కాక, తొమ్మిది విభాగాల కింద వర్గీకరించి ప్రచురించాము. ఆలోచన నాదే అయినా చక్రధర్‌ దాన్ని అమలు పరచినతీరు ప్రశంసనీయం. తొలి విభాగం “అభినందన చందనం”లో ఇద్దరు పీఠాధిపతుల మంగళాశాసనాలతోపాటు ఏడుగురు భిన్నరంగాల పెద్దల ఆశీఃపూర్వకవచనాలు, కవితలు వేశాము. రెండవ విభాగం “పాత జ్ఞాపకాలు'లో నాతో చిరపరిచయం గల 17 గురు ప్రముఖుల వ్యాసాలు వేశాం. “ఎడిటర్లు ఏమంటున్నారు?” అనే మూడవ విభాగంలో నలుగురు ఎడిటర్ల అభిప్రాయాలు చేర్చాం. “మీడియా మెరుపులు” అనే నాలుగవ విభాగంలో సినిమా, రేడియో, టీవీ. నాటకరంగాలలో నా పని తీరును ఎరిగిన ప్రముఖుల భావాలు ప్రచురించాం. “అక్షరార్చన” అనే ఐదవ విభాగంలో భాషావేత్తలు, విద్యావేత్తలు, భాషోద్యమకార్యకర్తలు నా రచనల మీద చేసిన విమర్శనాత్మక సమీక్షలు వేశాం. “మా మంచి మాస్టారు అనే విభాగంలో నా దగ్గర చదువుకున్న వారేగాక, నన్ను పరోక్షగురువుగా గౌరవించేవారి రచనలు వేశాం. “ఆత్మీయరాగాలు” కింద మా పిల్లలు, సమీపబంధువుల భావాలకు చోటు ఇచ్చాం. చివర “పల్లవించిన పాళో అనే శీర్షిక కింద నా మొదటి కథ, పాట, సాహిత్యవిమర్భ, ప్రధానవ్యాసం, ఊహా ఇంటర్‌వ్యూలు, ఎమర్జెన్సీ సంపాదకీయం, తెలుగు చలన చిత్రరంగాన్ని ఉత్తరాదివారికి పరిచయం చేయడానికి లింక్‌ ఆంగ్రపత్రికకు నేను వ్రాసిన వ్యాసం వేశాం. మధ్యలో ఈ సంపుటికోసం ఉడయవర్లు ప్రత్యేకంగా చేసిన ఇంటర్‌వ్యూను, “ఏరిన ముత్యాలు” శీర్మిక కింద నా రచనల్లోనుంచి చక్రధర్‌ ఎంపిక చేసిన ఉల్లేఖనాలను చేర్చాం. మొత్తం మీద అభినందన (గ్రంథాన్ని ఒక నమూనాగా తీర్చి దిద్దే ప్రయత్నం చేశాం. స్వర్జోత్సవ సభ

“వరద స్వర్జాక్షరి” గ్రంథావిష్కరణ, నా పాత్రికేయ జీవిత స్వర్ణోత్సవ సత్కార సభలో భాగంగా 2006 ఫిబ్రవరి 16న జరిగింది. సభాధ్యక్షుడుగా ఢిల్లీ నుంచి సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అధినేత ఎన్‌. భాస్మరరావును పిలిచాము. ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావు, విశిష్ట అతిథిగా బండారు దత్తాత్రేయ, ఆత్మీయ అతిథులుగా ఆచార్య ఎన్‌. గోపి, సీనియర్‌ పాత్రికేయుడు కె. రామచంద్రమూర్తి, సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, ప్రెస్‌ అకాడెమీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్‌, జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్షుడు కె. అమరనాథ్‌, నల్సార్‌ 248 జి.యస్‌. వరదాచారి

బహ ఇ యా న. గంస ల్‌ లీ! పాశ్రికేయ జీవిత న్వర్జోత్సవం, 'వరద న్వర్జాక్షరి' అభినందన (గ్రంథావివ్టురణ నథలో బండారు దత్తాత్రేయ, ర్యా సాంసృతిక శాఖమంత్రి ఎం. సత్యనారాయణ రాన, (పెన్‌ అకాడమీ అధ్యక్షుడు అమర్స్‌ ఆచార్య ఎన్‌. గోవీ, గుమ్మడి వెంకటేశ్వరరావు చేత నత్భారమందుకున్న ద్ధుళ్ళం నద్దురు శివానందమూర్తి యేటా శ్రీరామనవమికి ఇచ్చే బ్రతిఖాఫురస్పారాన్ని జయనామ సంవత్సరానికిగాను జస్టిన్‌ నరనింవోరెడ్డి చేతులమీదుగా అందుకున్న దృళ్చం ల యు సస . (పెన్‌ అకాడమీ వరిస్ట జర్నలిన్హుల జీవితవిశేషాలను “అడుగుజాడలు” పేరిట వీడియో రికారింగ్‌ చేనింది. వారిని నన్మానించి కేనెట్‌వ్రతులు అందింబింది. ముఖ్యమంత్రి రాజుకేఖర రెడ్డి నన్ను నత్మరిస్తున్న దృళ్ళం. జ్ఞాపకాల వరద 249

న్యాయవిశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎం. శ్రీధర్‌ వచ్చారు. నేను పాటించే నియమం (ప్రకారం ముందుగా నాకంటే పెద్దవారు, క్రియాశీలురు అయిన ఇద్దరు జర్నలిస్టులు పి. వామనరావు, వి. హనుమంతరావులను సత్మరించాను. తర్వాత నాకు మంత్రి చేతుల మీదుగా సన్మానం జరిగింది. మంచి జ్ఞాపికను అందజేశారు. “వరద స్వర్డాక్షరి” పుస్తకాన్ని ఆవిష్కరించారు. వరదకు సన్మానం జర్నలిజం విలువలకు సత్మారమేనని వక్తలందరూ పేర్కొన్నారు. పుస్తకాన్ని పరిచయం చేసిన శ్రీధర్‌ జర్నలిజం ప్రారంభ వికాసాల చరిత్రకు స్వర్దాక్షరి సాక్ష్యంగా ఉందన్నారు. ఈ వార్తకు పత్రికలు ఇచ్చిన రెండు మూడు శీర్షికలను పేర్కొంటాను. “పాత్రికేయ ద్రోణాచార్యులకు సన్మానం”. “అక్షరాయుధుడి కృషికి అద్దం, 'జ్ఞాపకాల దొంతర వరద స్వర్డాక్షరి. “పత్రికా స్వరాక్షరి వరద స్పర్దాక్షరి అన్నారు ఆంధ్రభూమిలో ముదిగొండ శివప్రసాద్‌. దిద్దుబాటు పుస్తకాన్ని ఎవరి దగ్గరో అడిగి తీసుకుని చదివానన్న నండూరి లేఖ గుర్తుకువచ్చి, ఆయనకు వరద స్వర్ధాక్షరి ప్రతిని పంపాను. ఆయన ఇంగ్లీషులో వెల్‌ ప్రొడ్యూస్ట్‌ అండ్‌ వెల్‌ గాట్‌ అప్‌ అని కార్డు వ్రాశారు. ఇంకా క్రియాశీలంగా ఉన్నందుకు హర్షిస్తూ శుభాకాంక్షలు అందించారు. నా దృష్టిలో వరద స్వర్డాక్షరి నా సన్మానసంచిక కాదు. నన్ను నిమిత్తమాత్రునిగా పెట్టుకుని పెద్దలందరూ జర్నలిజం విలువలను, జర్నలిస్టుకు ఉండవలసిన లక్షణాలను, నిబద్ధతను, రాజీపడని తత్తాన్నిఅనవరత అధ్యయనశీలిగా ఉండవలసిన ఆవశ్యకతను యువతరానికి గుర్తు చేసిన గ్రంథమని నమ్ముతాను. నార్ల జీవితచిత్రణ కేంద్ర సాహిత్య అకాదెమీ వారు భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శీర్షిక కింద వివిధ భారతీయ భాషలకు చెందిన సాహిత్యకారుల జీవితానుభవాల గురించి, వారి సాహిత్యకృషి గురించి తులనాత్మక అధ్యయన (గ్రంథాలను ఒక పద్ధతి ప్రకారం ప్రచురిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా 2008లో ప్రఖ్యాత జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు జీవితచరిత్ర వ్రాసే బాధ్యత నాకు అప్పగించారు. నేను నిర్ణీత గడువు ప్రకారం పది అధ్యాయాలలో జీవితవిశేషాలు, తొలి రచనలు, సంపాదకీయాలు, లఘువ్యాసాలు, పద్యాలు, నాటికలు, పౌరాణికనాటికలు, జీవితచిత్రణలు, ఇతరాలు అని విశ్లేషిస్తూ పుస్తకం పూర్తిచేసి సమర్చించాను. ప్రచురణకు ముందు రచనలన్నిట్రినీ ఆయా విషయాలలో నిష్టాతులైనవారి చేత సమీక్ష చేయిస్తారు. సమీక్షకుల సూచనల ప్రకారం సవరణలు చేసి పంపితే అప్పుడు ప్రచురిస్తారు. నేను వ్రాసిన నార్ల ప్రతిలో సమీక్షకుడికి సవరించదగిన అంశాలేమీ కనిపించలేదు. వారి నమూనా ప్రకారం కవరు డిజైను కూడా నేనే చేసి, శుద్ధప్రతి సమర్పించినందున, ఏప్రిల్‌ 2009 కల్లా 250 జియస్‌. వరదాచారి

నా పుస్తకం అచ్చయి వచ్చేసింది. నా రచన నార్ల అభిమానులతోపాటు, ఆయన నాస్తికదృక్పథం, (ప్రగతివాదం, హేతువాదం నచ్చనివారికి కూడా నచ్చింది. తన విమర్శకులు తన వాదనల గురించి ఏమనుకుంటారో నార్లకు తెలుసు. చాలా చోట్ల ప్రస్తావించారు కూడా. నేను వాటినీ ఉటంకించాను. చివరి మాట బలంగా వ్రాశాను. పుస్తకాన్ని 'పాత్రికేయ విలువల పరిరక్షణలో ఎంతటి ప్రతిబంధకాలనైనా సరకు సేయక నిశ్చలసత్యనిష్టతో ముందుకు సాగిన, సాగుతున్న అజ్ఞాత పత్రికారచయితలకు” అంకితమిచ్చాను. ఈ పుస్తకానికి కూడా తెలుగు, ఆంగ్ల దినపత్రికలలో మంచి సమీక్షలు వచ్చాయి. వీడియో చిత్రీకరణ

ఆంధ్రప్రదేశ్‌ పస్‌ అకాడెమీ 2008లో జర్నలిస్టులుగా విశేషఖ్యాతి గడించిన 20 మందిని ఎంపికచేసి “అడుగుజాడలు” అనే శీర్షికన వారితో వారి అనుభవాలు, జ్ఞాపకాలు చెప్పించి, వీడియో రికార్డింగు చేయించింది. అందులో నన్ను ఒకనిగా ఎంపిక చేశారు. మూడు గంటల ఇంటర్వ్యూను అలా భావితరాల ఉపయోగం కోసం భద్రపరచారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు (ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారింది) తెలుగు భాషాసాహిత్యాలకు గొప్ప సేవ చేసిన సంస్థ. “పర్రిబతవాణిొ అనే శీర్షికన ఆత్మాశయ ప్రసంగకార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. వీటికి ఎంపిక కావడమే గొప్ప గౌరవమని రచయితలు భావిస్తుంటారు. దానికి నన్నూ పిలిచారు. ఈ (ప్రసంగాలను అదే పేరుతో పుస్తకాలుగా ప్రచురిస్తారు. హైదరాబాద్‌ ఆకాశవాణి వారు “జీవనయానం” శీర్షికన రచయితలతో ముఖాముఖి సీరియల్‌ ప్రసారాలు చేసే కార్యక్రమం చేపట్టారు. టి. ఉడయవర్లు చేత నన్ను ఇంటర్వ్యూ చేయించి, నాలుగు వారాలు వరుసగా ప్రసారం చేశారు. జర్నలిజమే నా లోకం

నా రచనలు, నా ప్రచురణలు అన్నీ కూడా జర్చలిజం లేదా మీడియాకు సంబంధించినవే. 1976లో నేను తెలుగు సినిమా చరిత్ర గురించి సమాచార శాఖకు పుస్తకం వ్రాశాను. సినిమా మీడియాలో పార్వమే. నేను సాహిత్య అకాడెమీ కోరికపై నార్ల జీవితచరిత్ర వ్రాశానంటే అదీ ప్రఖ్యాత నంపాదకుడి గురించే. నా సహసంపాదకత్వంలో వెలువడిన మరో ప్రతిష్టాత్మకగ్రంథం “మహాత్మా గాంధీ మహోన్నత నాయకత్వం. ఇది అనువాదగ్రంథం. చాలాకాలం భారత రాయబార జ్ఞాపకాల వరద 251

కార్యాలయాలలో పనిచేసిన పాస్మ్కెల్‌ అలెన్‌ నజరేత్‌ ఆంగ్లంలో వ్రాసిన గ్రంధానికి తెలుగు సేత సర్వోదయ ఇంటర్నేషనల్‌ ట్రస్టు ప్రచురణ నలుగురు చేసిన అనువాదాన్ని పరిష్కరించి ఏకరూపత తేవడం సంపాదకుల బాధ్యత రచన విషయంలోనే కాదు, సందర్భోచితంగా బొమ్మలు, కార్టూన్లు అమర్చి ముద్రించిన తీరులోను ఇది చెప్పుకోదగింది ఇదీ జర్నలిస్టుకు సంబంధించినది కావడం కాకతాళలీయమే ఐనా, ఆనందదాయకం గాంధీ మహాత్ముడు ఆదర్శ పత్రికారచయిత ఆయన ఇండియన్‌ ఒపీనియన్‌, యంగ్‌ ఇండియా ఆంగ్ల పత్రికలకు, నవ జీవన్‌, హరిజన్‌ అనే దేశభాషాపత్రికలకు సంపాదకత్వం వహించారు సైంటిఫిక్‌ టెంపర్‌

జనసామాన్యంలో - ముఖ్యంగా విద్యార్థులలో - శాప్రీయదృక్కు (సైంటిఫిక్‌ టెంపర్‌) ఉండాలని ఎవరైనా అంటారు కొందరు దాన్ని అతిగా లాగి అపహాస్యం పాలుజేస్తుంటారు తమకు నచ్చని ప్రతిదాన్నీ పుక్కిటి పురాణమని కొట్టివేస్తుంటారు అది సరికాదని చెప్పడానికి, నాకు 1969లో ఒక అవకాశం చిక్కింది పత్థర్‌ గట్టిలో నానక్‌ రాం భగవాన్‌దాస్‌ సైన్స్‌ కాలేజీ ఉంది దానిలో తెలుగు శాఖ అధిపతిగా ఏటుకూరి ప్రసాద్‌ ఉండేవారు ఆయన తాపీ ధర్మారావు మీద పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందారు పత్రికారచయితలంటే అభిమానం నన్ను కాలేజి దే నాడు ముఖ్యఅతిధిగా పిలిచారు అంతకు కొద్ది రోజుల ముందే అమెరికా నీల్‌ ఆర్మ్‌ స్ర్రాంగ్‌ అనే రోదసియాట్రికుడిని చంద్రునిపై దింపింది అప్పుడు అమెరికా వార్తాసంస్థ ఎ పి ఇచ్చిన వార్త నాకు ఉపన్యాసానికి తగిన ఎత్తుగడను సమకూర్చింది “నూరేళ్ల కింద జూల్స్‌ వెర్న్‌ వ్రాసినట్టుగానే అమెరికా ఈ రోజు చంద్రుని పై మనిషిని దింపింది అంటూ ఆ వార్తను ప్రారంభించింది వెర్నీ పేర్కొన్నట్టుగా అమెరికా కూడా మూడంచెల రాకెటునే వాడింది అంటూ కొనసాగించింది అమెరికా శాస్త్రవేత్తలు, వ్యోమగాములు ఎన్నో ఏళ్లు పరిశోధించి, ప్రయోగాలు జరిపి విజయాన్ని సాధిస్తే, ఆ కీర్తిని మొదట ఊహించిన రచయిత వెర్చ్‌కు అంటగట్టింది వెర్న్‌ అమెరికన్‌ కూడా కాదు, (ఫైెంచివాడు “ఏ పథకమైనా ఆలోచనతో మొదలవుతుంది అది మనకు ఇష్టంలేని వారినుంచి వెలువడితే దాన్ని మనం తిరస్మరిస్తుంటాము సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించం ఒకనాడు మన పురాణాల్లో చెప్పిన అనేకవిషయాలు ఇవాళ మన అనుభవంలో ఉన్నాయి మనలో హేతువాదులమనుకునే కొందరికి మన పురాణాలంటేనే ఏవగింపు అందులో ఉన్నవేవీ ఒప్పుకోరు పరిశోధన సంగతి దేవుడెరుగు, అది సైంటిఫిక్‌ టెంపర్‌ 282 జి యస్‌ వరదాచారి

అనిపించుకోదు” అని చెపితే విద్యార్థులు హర్షించారు. కృష్ణుడు శిశుపాలుని పైకి చక్రం విసిరితే అది అతడు ఎటు పరుగెడితే అటు దిక్కులు మార్చుకుంటూ వెళ్లి సంహరించిందంటే, కొన్నేళ్ల క్రితం వరకు ఎవరూ నమ్మేవారు కాదు. ఇప్పుడు అలాటి క్షిపణులు అందుబాటులోకి వచ్చాయి. మన పురాణాలలో గజాననుడు, హయగ్రీవుడు ఉన్నారు. దక్షుడు యజ్ఞం తర్వాత తలను కోల్పోయి మేక తలను పొందిన ఉదంతం ఉంది. అలా కాకున్నా ఇప్పుడు మనిషి తలను మార్చే శస్త్రచికిత్స గురించి ప్రయోగాలు చేస్తున్నారు. కనుక దేన్నీ పుక్కిటి పురాణమని కొట్టిపారేయవద్దు, గుడ్డిగా నమ్మనూ వద్దు!

జ్ఞాపకాల వరద 258

  1. దొరకునా ఇటువంటి సేవ?

అది 2005 డిసెంబరు నెల. ఒక రోజు జర్చలిస్టు మిత్రుడు బి. మల్లికార్జునరావు మరో మిత్రుడు కొండా లక్ష్మణరావును వెంటబెట్టుకొని మా ఇంటికి వచ్చారు. మల్లిక్‌ విశాలాంధ్ర, న్యూ ఏజ్స్‌ సోవియెట్‌ భూమి పత్రికలలో పనిచేసి రిటైరైన తర్వాత, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆంధ్రమహిళా సభలో ఏవో పనులు చేస్తూ క్రియాశీలంగానే ఉన్నారు. కాని వయోధిక్యం వల్లవచ్చే రకరకాల ఆరోగ్యసమస్యలతో బాధ పడుతున్నారు. మందులకే నెలకు వేల రూపాయల ఖర్చు. కనుక ప్రభుత్వం అరవై దాటిన జర్చలిస్టులకు ఆరోగ్యసేవలు అందించే పథకం ఏదైనా అమలు చేస్తే బాగుంటుందని ఆలోచన. “దాన్ని సాధించడానికి ఒకసంఘం ఏర్పాటు చేద్దామని మీ సహాయం కావా”లన్నారు. “నేను తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నా శ్రామికోద్యమానికి దూరంగా ఉన్నాొనన్నాను. “కాదు కాదు, మీరు ఉంటే పుష్టిచేకూరుతుం”దని, “ఉండవలసిందే*నని అన్నారు. నేను పనిచేస్తున్నది యూనివర్సిటీలోనైనా జర్నలిజం శాఖలోనే గనుక జర్నలిస్టుగానే నాకు గుర్తింపు ఎక్కువ. నేనూ మల్లిక్‌ వయోవర్గానికి చెందినవాడినే. రేపు వారితో చేరవలసినవాడినే గనుక సరేనన్నాను. డిసెంబరు 26వ తేదీన దేశోద్ధారక భవనంలో సన్నాహకసమావేశం ఏర్పాటు చేశాం. తొమ్మిది మంది జమ్‌ మేమే మ. స్త్ర వ్‌ ఆ. వత ఉత టి. క రాన్ని?

వయోధిక పాత్రికేయ నంఘ నంస్థావక నమావేళశం. మధ్యలో కూర్చున్నవారు మళ్లిక్‌ 254 జియస్‌. వరదాచారి

హాజరైనారు. సభకు నన్నే అధ్యక్షుడుగా ఉండమన్నారు. ఏజ్జ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అనే పేరుతో లెటర్‌ హెడ్‌ కూదా తెచ్చారు. ఆ పేరు బాగులేదనీ యుద్ధంలో, ఒలింపిక్స్‌ క్రీడలలో పాల్గొని రిట్రైరైనవారిని వార్‌ వెటరన్స్‌, ఒలింపిక్‌ వెటరన్స్‌ అన్నట్టుగా మన వయోధికులను మనం వెటరన్‌ జర్చలిస్ట్‌ అందామని, గౌరవంగా ఉంటుందని నేను సూచిస్తే అంతా అంగీకరించారు. ఆ పేరుతోనే సంఘాన్ని ఏర్పాటు చేసుకోడానికి తీర్మానించాం. నియమావళిని తయారుచేసి, రిజిస్ట్రేషన్‌ చేయించడానికి కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. రెండవ సమావేశం 2006 జనవరి 2వ తేదీన జర్చలిస్టు కాలనీలో మా ఇంట్లో జరిగింది. ముసాయిదా నియమావళిని నమావేశం ఆమోదించింది. అంతేగాక కార్యవర్గాన్ని ఎన్నుకోడానికి 7న సర్వ సభ్య్వసమావేశం జరపాలని నిర్ణయించింది. నాటి సమావేశంలో నన్ను అధ్యక్షుడుగా, మల్లిక్‌ను ప్రధాన _ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇతర కార్యవర్గసభ్యులను కూడా ఎన్నుకున్నారు. 16వ తేదీనాడు సంఘం రిజిస్టేషన్‌ సర్టిఫికేట్‌ జారీ అయింది. మరో రెండు రోజులలో మా ఇంటికి చేరింది. లెటర్‌ హెడ్‌ అచ్చుకు ఇచ్చాం. సంఘం పేరు తెలుగులో కూడా ఉండాలి గనుక, తెలుగులో వెటరన్‌ వంటి పారిభాషికపదం లేదుగనుక, వరిష్ట అంటే రిటైర్డ్‌ అనే అర్ధాన్ని సూచించదు గనుక వయోధిక పాత్రికేయ సంఘం అని పేరు పెట్టాం. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలిసి ఇవ్వడానికి విజ్ఞాపనప్రం సిద్ధం చేసుకున్నాం. అపాయింట్‌మెంటు కోసం అడిగి, ఎదురుచూస్తున్నాం. కాని విధి బభలీయమంటారుగదా? 25వ తేదీన ఈ ప్రయత్నమంతటికీ కారకుడైన మల్లికార్జునరావు కాలధర్మం చెందారు. ఒక సిద్ధాంతానికి కట్టుబడిన కుటుంబం వారిది. అందుకే ఆయన కోరిక ప్రకారం భార్య అన్నపూర్ణ, ఆయన కళ్లను కంటి ఆస్పత్రికి దానం చేసింది. మల్లిక్‌ మృతి మమ్మల్ని మరింత కర్తవ్యపరాయణులను చేసింది. అప్పటివరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న జి. కృష్ణయ్యను ప్రధానకార్యదర్శిగా ఎన్నుకొన్నాము. ముఖ్యమంత్రిని కలిసి వయోధిక పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్‌ కార్డులు ఇచ్చి ఆరోగ్యసేవలు అందించాలని కోరాము. ఆయన సానుకూలంగా స్పందిస్తూ, తాను డాక్టరు గనుక ఆలోచించి, నిరుపేదలకోసం ఆరోగ్య శ్రీ అనే పథకం రూపాొందించానని, అది మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని, దాన్ని మీకు ఇస్తానని అన్నారు. మా విజ్ఞాపనను సమాచార శాఖ కమిషనరుకు పంపారు. అప్పుడు కమిషనరుగా ఉన్న సి. పార్థసారథి మేమిచ్చిన జాబితా ప్రకారం వయోధిక పాత్రికేయులందరికీ జ్ఞాపకాల వరద 2505

అక్రెడిటేషన్‌ కార్డులు ఇచ్చారు. ప్రభుత్వంలో పనులు తాబేటి నడక నడుస్తాయని చెప్పనవసరం లేదు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ 1 పథకాన్ని దారిద్ర్యరేఖ దిగువ వర్గాల కోసం 2007 ఏప్రిల్‌లో ప్రకటించింది. మరికొంత మెరుగు పరచిన ఆరోగ్యశ్రీ 2 పథకాన్ని మరో యేడాది తర్వాత ప్రకటించింది. మా అభ్యర్థన అలాగే ఉండి పోయింది. (పెస్‌ అకాడెమీలో ఏదో సభకు వచ్చిన ముఖ్యమంత్రిని నేను కార్డులు తొందరగా ఇప్పించండని కోరాను. అదే సభలో జర్చలిస్టు నాయకులు, రిటైరైన వారితో పాటు మిగతా జర్నలిస్టులందరికీ ఆరోగ్యశ్రీ వర్తింప జేయాలన్న కొత్త ప్రతిపాదన తెచ్చారు. అది మరింత కాలయాపనకు దారితీసింది. సంఖ్యలు తేలాలి, భారం లెక్క కట్టాలి. ఇవన్నీ ఓ శాఖ నుంచి మరో శాఖకు తిరగాలి. మేము అవకాశం దొరికినప్పుడల్లా అధికారులకు లేఖలు వ్రాస్తూనే ఉన్నాం. చివరకు 2009 ఫిబ్రవరిలో జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ వర్తింప జేస్తూ జీవో వచ్చింది. ఇక కార్డులు రావాలి. కాని అనుకోని సంఘటన జరిగింది. సెప్టెంబరు 2 నాడు రాజశేఖరరెడ్డి హెలికాష్టరు ప్రమాదంలో ఘోరమరణం పాలైనారు. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొణిజేటి రోశయ్య గాంధీ జయంతి నాడు మా సభ్యులతోసహా కొందరు జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. అక్రెడిటేషన్‌ వచ్చింది గనుక రైలు టిక్కట్లలో సగం రాయితీ కూడా లభించింది. వయోధికులందరకీ 40 శాతం రాయితీ ఎలాగూ ఉన్నదే. మరో పది శాతం వస్తుంది. ప్రతీసారి వయస్సు (ధ్రువపత్రం చూపే అవసరం ఉండదు. ఇక తక్కినవారికి కార్డులు ఇప్పించాలి. ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కొన్ని దక్షిణాది రా్ట్రాలలో ఇన్తున్నట్టు పింఛను కోసం కూడా ప్రయత్నించాలని కార్యవర్గం నిర్ణయించింది. ఈ విషయమై ముఖ్యమంత్రికి లేఖ(వ్రాసి కమిషనరుకు ప్రతి పెట్టాం.

కొందరు వయోధిక పాత్రికేయులు ఏ మాత్రం ఆదాయంలేక మందులు కూడా కొనుక్కోలేని దీనస్థితిలో ఉండటం గమనించాము. ఎప్పుడో ఏర్పాటు చేసిన జర్చలిస్టుల సంక్షేమనిధి ఒకటుందని చాలామందికి తెలియదు. దాని నుంచి అర్హులకు ఆర్థిక సహాయం అందిస్తారు. కాని అతిస్వల్పం. దేనికీ చాలదు. గండికోట సుందరయ్యకు ఇప్పించాము. ఎనఖైల పడిలో ఉన్న మరో జర్నలిస్టు బుద్ధవరపు వెంకటరత్నం ప్రమాదంలో కాలు పోగొట్టుకొని కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వ పింఛను కోసం యత్నిస్తూనే తక్షణసహాయంగా మా సంఘం నుంచి ఐదువేల రూపాయలు అందించాము. తర్వాత ఆయనకు సంక్షేమనిధి నుంచి పింఛను మంజూరైంది. ఇవి కంటితుడుపు చర్యలు. జర్బలిస్టులందరికీ కనీస అవసరాలు తీర్చే పింఛను పథకం అమలు జరపాలని (వ్రభుత్వాన్ని కోరాము. ప్రభుత్వం సొనుకూలంగానే ఉంది. ఆచరణలోనే 256 జి.యస్‌. వరదాచారి

తటపటాయింపు. ఎదురు చూస్తున్నాము. ఇంతలో మరో విషాదసంఘటన చోటు చేసుకుంది. పిల్లలతో కొంతకాలం గడిపి వస్తానని 2011లో అమెరికా వెళ్లిన మా కార్యదర్శి జి. కృష్ణయ్య అక్కడే ఆకస్మికంగా మృతి చెందారు. కొత్త కార్యదర్శిగా కొండా లక్ష్మణరావును ఎన్నుకున్నాము. లక్ష్మణరావు సంఘంలో సభ్యుడు కాకున్నా, మొదటి నుంచి అన్ని పనులలో సహాయపడుతూ వస్తున్నారు. ఆయనకు అరవై ఏళ్ల వయసు రాలేదు గనుక, మొదట్లో సభ్యత్వం పొందే అర్దత లేదు. ఇప్పుడాయనకు షష్టిపూర్తి జరిగింది. గనుక సభ్యుడదయ్యారు. ఆయన ప్రతిపనినీ చిత్తశుద్ధితో చేయడం చూచి సభ్యులు ఏకగ్రీవంగా ఆయననే ఇష్టపడ్డారు. లక్ష్మణరావు విశాలాంధ్రలో ఉద్యోగం చేశారు. మంచి కార్యకర్త. యూనియన్‌లోను, ఫిలిమ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌లోను క్రియాశీలంగా ఉన్నారు. వయోధిక పాత్రికేయ సంఘం పెట్టాలన్న ఆలోచన వచ్చిన నాటి నుంచి మాకు అండగా ఉంటున్నారు. తె.వి.వి. లో పదవీవిరమణ

నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఎవరూ ఊహించనంత దీర్జకాలం పనిచేశాను. రచన, బోధన రెండూ నాకు ఇష్టమైన అంశాలు. ఆ రెండింటికీ అక్కడ సమృద్ధిగా అవకాశం దొరకింది. నారాయణరెడ్డి నుంచి మంజులత వరకు వైస్‌ చాన్సలర్లు అంతా పూర్వపరిచయం ఉన్నవారే. అందరూ అభిమానించారు, ఆదరించారు. అక్కడేమీ సమస్యలు రాలేదని కాదు. అన్ని సమస్యలను పారదర్శకంగా ఫిర్యాదికి ఆక్షేపణ లేని విధంగా పరిష్కరించేవాడిని. రాజీపడేవాడిని కాదు. నియమవిరుద్ధంగా ఏ పనీ చేసేవాడిని కాదు. నా పనితీరుపై చేకూరి రామారావు ఒకసారి చేసిన వ్యాఖ్య చెప్పుకోదగింది; 'ఆయన (అంటే నేను) ఇంకా పత్రికల్లోనే పని చేస్తున్నాననుకుంటాడు. అందుకే మొండిపట్టు.” అదేం వింతో కాని, తగవుల మారి విద్యార్థులు కూడా నాకు మర్యాద ఇచ్చేవారు. వేతనమొక్కటే సంతృప్తికరంగా ఉండేది కాదు. కాని నేను దానికి 'ప్రాముఖ్యమివ్వలేదు. సుహృద్భావవాతావరణం నచ్చి అంతకాలం కొనసాగాను. కొత్త వైస్‌ చాన్సలర్‌గా వచ్చిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య కూడా నన్ను అభిమానంగానే చూశారు. నాకే ఇక మానేద్దామనిపించింది. నేను స్వచ్చందంగా పదవీవిరమణ చేయదలచానని, ఆమోదించాలని లేఖ ఇచ్చాను. ఆయన నవ్వి ఈ స్వచ్భంద పదవీ విరమణ ఏమిటన్నారు. మీరెవ్వరూ చాలు పొమ్మని అనడం లేదు కనుక స్వచ్చందంగా పోతానంటున్నాను అన్నాను. 2010 జూలై 21 నాడు వీడ్కోలు సభ ఏర్పాటు చేసి, సత్కరించి పంపించారు. వరదాచారి పత్రికారంగంలో మూడు దశాబ్దాలు పనిచేసి, జ్ఞాపకాల వరద 257

విశ్వవిద్యాలయంలో బోధనలో ఉన్నతప్రమాణాలతో సేవలందించారని కొనియాడారు భూమయ్య, జర్నలిజం శాఖాధిపతి సత్తిరెడ్డి మా అందరికీ మార్గదర్శకుడైన వరదాచారి పదవీవిరమణ చేయడం విశ్వవిద్యాలయానికి తీరనిలోటు అన్నారు. అధ్యాపక సిబ్బంది అత్యధికసంఖ్యలో సభలో పాల్గొని, తమ అభిమానాన్ని చాటుకొన్నారు. హెచ్‌.ఎం. టి.వి. లో తీర్చరి

తెలుగు విశ్వవిద్యాలయంలో నేను పదవీవిరమణ చేసినట్టు తెలియగానే కొత్తగా ప్రారంభమైన హెచ్‌.ఎం. టి.వి. ప్రధానసంపాదకుడు కొండుభట్ల రామచంద్రమూర్తి, తమ సంస్థ ఏర్పాటు చేయదలపెట్టిన జర్నలిజం స్కూలులో ప్రాొఫెసరుగా చేరమని ఆహ్వానించారు. రామచంద్రమూర్తికి నేనంటే అభిమానం. ఆయన వార్తారచన మీద వ్రాసిన పుస్తకానికి నాచేత ముందుమాట వ్రాయించుకున్నారు. 2010 అక్టోబరులో హెచ్‌.ఎం. టి.వి. లో చేరాను. జనవరి నెలలో హెచ్‌.ఎం. టి.వి. కి ఆంబుద్స్‌మన్‌గా ఉండమని కోరారు. ఒక వార్తా చానల్‌ ఆంబుద్స్‌మన్‌ను ఏర్పాటు చేసుకోవడం దేశంలో అదే మొదటిసారి. ఆంబుడ్స్‌మన్‌ను తెలుగులో నేను తీర్చరి అన్నాను. పత్రికలలో ఒక హిందూ ఆంగ్ల దినపత్రికకు మాత్రమే ఆంబుద్స్‌మన్‌ లాటి రీడర్స్‌ ఎడిటరు ఉన్నాడు. దశాబ్దాల కిందట టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఆంబుడ్స్‌మన్‌ ఉండేవాడు. తీర్చరిని నియమించుకోవడమంటే ఆ పత్రికో, చానలో స్వయం నియంత్రణకు సిద్ధమైందని అర్థం. ఈ విషయం రామచంద్రమూర్తి హిందూప(తికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో “మేము అంతర్వీక్షణానికి సిద్ధం”) అంటూ చెప్పారు. ఈ ప్రగతిశీలచర్య గైకొన్నందుకు జర్నలిస్టు యూనియన్‌ పత్రిక “ప్రతిస్పందన” ఆయనను ప్రశంసించింది. కాని ఇతరులు మన దారి తొక్కుతారన్న ఆయన ఆశ ఫలించలేదు. పత్రికలో లేదా చానల్‌లో అభ్యంతరకరమైన విషయమేదైనా వస్తే పాఠకుడు, లేదా వీక్షకుడు తీర్చరికి ఫిర్యాదు చేయవచ్చు. రేటింగు కోసం పడే తాపత్రయంలో ఇలాటివి జరుగుతుంటాయి. తీర్చరి విచారించి న్యాయం చేస్తాడు. హెచ్‌.ఎం. టి.వి. వారి జర్నలిజం స్కూలు ఫీజు లక్ష రూపాయలు పెట్టడం, ఉద్యోగ హామీలేక పోవడం వల్ల నడువలేదు. తీర్చరిగా మూడేళ్లు కొనసాగాను. అంతర్వీక్షణానికి సిద్ధపడినవారు తప్పులు చేయరు. కనుక తీర్చరి పని జర్నలిజం విలువలు, నైతికాంశాలను గురించిన చర్చకే పరిమితమైంది. మూడేళ్లు పూర్తి చేసి 2018 డిసెంబరు ౩1న తప్పుకొన్నాను. 258 జియస్‌. వరదాచారి

తెలుగు భాషాచైతన్యోద్యమం

నాకు తెలుగు భాషంటే అభిమానమని, ఇంగ్లీషు పత్రికలో చేరే అవకాశమున్నా కోరి తెలుగు పత్రికలో చేరినవిషయం, జర్నలిజం బోధన తెలుగు మాధ్యమంలో కూడా జరిపించడానికి చేసిన కృషి గురించి పునరుద్దాటించవలసిన పనిలేదు. కాని ప్రతీ భాషోద్యమాన్ని నేను వ్యక్తిగతంగా, జర్నలిస్టుగా బలపరుస్తూ వచ్చానని కచ్చితంగా చెప్పాలి. 1996లో మిత్రులు కాశీనాథుని నాగేశ్వరరావు, నడుపల్లి శ్రీరామరాజు మాతృభాషాసమితి ఏర్పాటుచేశారు. దాన్నే 2001లో తెలుగు భాషా, చైతన్య సమితిగా మార్చారు. ఈ రెండు సమితుల కార్యక్రమాలకు నేను సంపూర్ణ మద్దతునిస్తూ వచ్చాను. 2008లో అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఇప్పుడు గౌరవాధ్యక్షుడుగా ఉన్నాను. సమితి చరిత్రను పుస్తకంగా ప్రచురించాం. తెలుగు భాషాదినోత్సవం నాడు దాని ఆవిష్కరణ విజయవాడ సభలో జరిగింది. కేశవనగర్‌ సరస్వతీవిద్యామందిర్‌ పాఠశాలతో నా అనుబంధం సుదీర్ధమైనది. మా చిన్నబ్బాయి అక్కడే చదువుకున్నాడు. గత ఆరేళ్లుగా దాని ప్రబంధకారిణి అధ్యక్షుడుగా ఉంటున్నాను. మెదడుకు మేత

హెచ్‌.ఎం. టి.విలో పని చేస్తున్న కాలంలో కూడా వయోధిక పాత్రికేయ సంఘం కార్యకలాపాలను ముమ్మరంగా ముందుకు తీసుకువెళ్లాము. మా సంఘ ఆశయాలలో నవతరం పత్రికారచయితల వృత్తినైపుణ్యాన్ని పెంచడానికి కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యమైనది. ఇందులో భాగంగా నెల నెలా ఒక సీనియరు జర్నలిస్టుచేత అనుభవాలు

  • జ్ఞాపకాలు" అనే శీర్షిక కింద ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలని, జర్బలిస్టులకు ఉపయోగపడే (గ్రంథాలు ప్రచురించాలని కార్యవర్గం నిర్ణయించింది. ఉపన్యాస పరంపరను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చాలాకాలం పనిచేసి ఇప్పుడు అమెరికాలో స్థిరపడి, “ఇండియా ట్రిబ్యూన్‌” అనే పత్రికకు సంపాదకత్వం వపొస్తున్న జె.వి. లక్ష్మణరావుతో ప్రారంభించాము. సమయానికి ఆయన హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నందువల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాము. తర్వాత ఆదిరాజు వెంకటేశ్వరరావు, ఎం.ఎస్‌. శర్మ, అమెరికాలో స్థిరపడ్డ మరో ఇద్దరు తెలుగు జర్నలిస్టులు నరిసెట్టి ఇన్నయ్య, పి.వి.వి. గోపాలస్వామిల ప్రసంగాలు ఏర్పాటు చేశాము. ఇతరులతో కొనసాగిస్తున్నాము. (ప్రసంగపత్రాలను వ్రాసి ఇమ్మని అందరినీ కోరుతున్నాము. తగినన్ని అందగానే వాటిని పుస్తకరూపంలో ప్రచురిస్తాం. జ్ఞాపకాల వరద లిం

మన పాత్రికేయ వెలుగులు

ఇవికాక జర్నలిజంతో సంబంధం ఉన్న లేదా జర్నలిస్టులకు ఉపయోగపడే పుస్తకప్రచురణకు కూడా పకద్బందీ పథకం రూపొందించాం. సంపాదకవర్గం, ఎంపిక కమిటీ ఏర్పాటు చేశాం. మా కార్యదర్శి లక్ష్మణరావు సేకరించి ఉంచిన సమాచారాన్ని వినియోగించుకొని “మన పాత్రికేయ వెలుగులు” అనే బృహ(ద్గంథాన్ని ప్రచురించడానికి కమిటీ నిర్ణయించింది. తెలుగు పత్రికారంగం ఆరంభదశనుండి వర్తమానకాలం వరకు ఆ రంగంలో ప్రసిద్ధులైన వారందరి వర్ణచిత్రాలు, పరిచయాలతో రూపొందించిన ఈ (గ్రంథం ప్రతిష్టాత్మకమైనదేగాక, చాలా ఖర్చుతో కూడుకొన్నది. ప్రభుత్వ అడ్వర్టయిష్మైంట్ల ద్వారా కొత ఆదాయం వచ్చినా, ఖర్చులకు సరిపోను రాలేదు. మిత్రుడు శరత్‌ సూచించారు - “శాంతా బయోటెక్సిక్స్‌ వరప్రసాదరెడ్డి మీకు తెలుసుగదా. ఆయనను కలవండి” అని. నేను, మా సంఘం పెద్దలు ఎం.ఎస్‌. శర్మ, గుడిపూడి శ్రీహరి, లక్ష్మణరావు ముగ్గురిని వెంటబెట్టుకొని వెళ్లి అచ్చయిన కొన్ని పేజీలను చూపించి, “అద్వర్టయిజ్మెంటు రూపంలో సహాయం కోరడానికి వచ్చా”మన్నాను. “అడ్వర్దయిజ్మెంట్‌ కాదు కాని సహాయం తప్పక చేస్తొనని చెక్కు ఇచ్చారు. మేము ఆశించనంత, ఊహించనంత మొత్తం లక్షరూపాయలిచ్చి మమ్మల్ని అబ్బురపరచారు. (ప్రభుత్వ ప్రకటనల మొత్తం, ఎప్పుడో బిల్లులు పంపి మంజూరైనప్పుడు వస్తుంది. పుస్తకంలో ఫొటోలు ఎక్కువ గనుక ఆర్ట్‌ పేపరుమీద వెయ్యాలనుకున్నాము. ఇతరభాషలవారికి కూడా ఉపయోగవడుతుంది గనుక కొంత కుదించి, ఇంగ్లీషులో కూడా

స. లర. నా జ... మ న వయోధిక పాత్రికేయ నంఘం ప్రతిష్టాత్ళక ప్రచురణ మన పాభ్రికేయ వెలుగులును ఆవివ్టరించిన తమిళనాడు గవర్నర్‌ క రోశయ్య, వక్కన న్పీకర్‌ నాదెంద్ల మనోవార్‌

260 జియస్‌. వరదాచారి

జ [ల్‌ ల్‌ త (1. సళ లైస్టే. ల్‌ ఒం క్‌ యనా. వయోధిక పాత్రికేయ సంఘం మరో (ప్రతిష్టాత్సకవచురణ ఆంధ్రవ్రదేల్‌ బడ్జెట్ల లోట్లు - పోట్లు” తమిళనాడు గవర్నర్‌ ఆవివురించిన దృళ్ళం మ్‌. ల లా ఖీ ర న కేంద్ర సాపొత్య అకాదెమీతో కలిని తిరునముల రామచండ్ర శతజయంతి విద్వద్గోస్టిని నిర్వపొంబినవ్దుడు వలుకుబిడి-2 ఆవివ్పరణ ప్రచురించాలనుకున్నాం. మా సంపాదకవర్గసభ్యులు టి. ఉడయవర్లు తెలుగు పరిచయాలను, దాసు కేశవరావు ఆంగ్రపరిచయాలను మనోరంజకంగా (వ్రాశారు. పుస్తకానికి “అవర్‌ లెజెండ్స్‌ ఆఫ్‌ ది ఫోర్త్‌ ఎస్టేటొ అని పేరు పెట్టాము. ప్రింటరు తన డబ్బు తర్వాత ఇవ్వవచ్చు కాని కాగితం ఖరీదు ముందు ఇవ్వమన్నాడు. వరప్రసాదరెడ్డి ఇచ్చిన చెక్కు అలా సమయానికి ఉపయోగపడింది. గ్రంథంలో (ప్రచురించడానికి సేకరించిన ఫొటోలను ఫుల్‌ స్మేపు సైజుకు ఎన్‌లార్డ్‌ చేసి లామినేట్‌ చేయించి పెట్టాము. పుస్తకావిష్ణరుణకు ముఖ్యమంత్రి రోశయ్యను అహ్వానించాము. ఇంతలో ఆయన తమిళనాడు గవర్నరుగా నియమితులైనారు. ఆ పదవి స్వీకరణకు ఆయన వెళ్లే ముందే, తొలుత అనుకున్న (ప్రకారం 2011 ఆగస్టు 28వ తేదీన గ్రంథావిష్కరణ జరిపించాం. తెలుగు గ్రంథాన్ని రోశయ్య, ఇంగ్లీషు ప్రతిని అసెంబ్లీ స్పీకరు నాదెండ్ల మనోహర్‌ ఆవిష్కరించారు. ఫొటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాము, జ్ఞాపకాల వరద 261

సమాచారశాఖ మంత్రి డి.కె. అరుణ దాన్ని ప్రారంభించారు. గ్రంథాలను విక్రయానికి విడుదల చేయడానికి మరో నభ అక్షోబరులో ఏర్పాటు చేశాము. దానికి సి. నారాయణరెడ్డిని, అక్కినేని నాగేశ్వరరావును పిలిచాము. పాశ్చాత్యదేశాలలో ఇలాటి పద్ధతి ఉంది. పుస్తకాలను రాయితీ ధరకు అమ్మకానికి పెడితే 36 వేలరూపాయల రికార్డు అమ్మకాలు జరిగాయి. తర్వాత పుస్తకాల పరిచయ (అమ్మకాల) సభలు విజయవాడలో, గుంటూరులో, చెన్నైలో కూడా పెట్టాము. సంఘానికి కొంత నిధి సమకూరింది. అళీతి పూర్తి సభ

2012 అక్టోబరు 15కు నాకు ఎనభై ఏళ్లు నిండాయి. అంటే అశీతి పూర్తయిందన్నమాట. సంప్రదాయం ప్రకారమైతే ఇలాటి ఉత్సవాలన్నీ సతీసమేతంగా జరుపుకోవాలి. భార్య లేనివారు ఏం చేయాలి? పుస్తకావిష్కరణ జరుపుకోవచ్చు. నేను వివిధసందర్భాలలో వ్రాసి పదత్రికలలో వచ్చి పుస్తకరూపంలో రానివి, జర్నలిజం విద్యార్థులకు ఉపయుక్తంగా ఉందే రచనలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఎంపిక చేసి 'తెలుగు పత్రికలు - తీరుతెన్నులు అనే పేరుతో పుస్తకం వేశాను. వయోధిక పాత్రికేయ సంఘం దాన్ని ప్రచురించింది. డాక్టరు సి. నారాయణరెడ్డిచేత ఆవిష్కరింప జేసింది. సభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి అధ్యక్షత వహించారు. మా సంఘ ప్రచురణలలో బాగా అమ్ముడు పోయిన పుస్తకాలలో ఇదొకటి. దీనిలో

=. టైయావానక్ష్యో!./, | 4 శి య | నా ఆళీతి సందర్భంగా నా రచనల సంకలనం “తెలుగు వత్రికలు - తీరుతెన్నులు” (గ్రంథావిష్టురణ

262 జి.యస్‌. వరదాచారి

జర్నలిజం పరీక్షలలో చరిత్ర, భాష, నైతికాంశాలు, లేఖనసూత్రాలపై అడిగే ప్రశ్చలకు సమాధానాలు దొరుకుతాయి. నా ఆనవాయితీ ప్రకారం ఈ సభలో కూడా వయస్సులో నాకంటే పెద్దవారైన ఇద్దరు జర్నలిస్టులను సన్మానించడానికి నిర్ణయించాను. 90 ఏళ్ల ఎం.ఎస్‌. శర్మను, 87 ఏళ్ల డి. సీతారామ్‌ను ఆహ్వానించాను. సీతారామ్‌ అప్పటికే రెండు పెద్ద ఆపరేషన్లు అయి అస్వస్థులుగా ఉన్నారు. ఐనా తగ్గని ఉత్సాహంతో వస్తానన్నారు. శర్మగారు కూడా కాలేయ కేన్సరు ఆపరేషను జరిగినా కోలుకొని, తన పాత రచనలను పుస్తకంగా (ప్రచురించే ప్రయత్నం చేస్తున్నారు. 'తెలుగు పత్రికలు - తీరుతెన్నులు పుస్తకావిష్కరణ 2012 నవంబరు 9న జరిగింది. ఒకరోజు ముందు సీతారామ్‌ కాలధర్మం చెందారు. ఆ విషయం సభలో ప్రకటించి సంతాపం తెలిపి, శర్మగారికి హార్దికసన్నానం చేసి, ఆవిష్కరణకార్యక్రమాన్ని యథావిధిగా పూర్తి చేశాము.

తిరుమల రామచంద్ర శతజయంతి ఉత్సవ సందర్భంగా 2018లో ఆయన “శతజయంతి సంస్కృతి” గ్రంథం ప్రచురించాము. ఆయన మరో రెండు రచనలు పలుకుబడి 1, పలుకుబడి 2 ప్రచురించాం. అంతేగాక కేంద్ర సాహిత్య అకాడెమీతో కలిసి 2018 డిసెంబర్‌ 22వ తేదీన జాతీయ సదస్సు నిర్వహించాము. ఆ ప్రసంగ పత్రాలను సంపుటీకరించి ఇచ్చాము. అకాడెమీ ప్రచురించింది. ఇప్పటికి 11 పుస్తకాలు వేశాము. మరో రెండు అచ్చుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒకటి 1962 అక్టోబరులో చైనా మనదేశంపై దండయాత్ర జరిపినపుడు, నేను ఆంధ్రభూమిలో “సామాన్యుని పరిశీలన” అంటూ వ్రాసిన ఐదు వ్యాసాలతో కూడిన లఘుపుస్తకం. దీనిలో తొలి పలుకే కొత్తగా వ్రాసింది. వ్యాసాలు ఆ నాటీ కత్తిరింపులే. ఇటువంటి ప్రయోగమే మేము బాపట్ల మహాసభ గురించి ప్రచురించిన “ఆశ్రవసంతోత్సవం” అనే పుస్తకం విషయంలో చేశాము. 40 పేజీల ఆ పుస్తకం కూదా ఆ నాడు పత్రికలలో వచ్చిన వార్తలు, వ్యాసాలు, సంపాదకీయాలతో రూపొందించిందే. కొత్తగా వ్రాసినవి “శ్రాలి పలుకు, ప్రకాశకుల వాణి” అనేవే, నాటి చరిత్రను నాటీ దృక్పథంతో ఈ నాటి వారికి తెల్పడమే ఉద్దేశం.

మా ప్రచురణలే గాక ఇతర జర్నలిస్కుల ప్రచురణల ఆవిష్కరణకు తోద్పడుతున్నాం. ఇన్నయ్య “మిసిమి వ్యాసాలు? నాగసూరి విద్వాన్‌ విశ్వంపై ప్రచురించిన రెండు పుస్తకాలను, ఎ.బి.కె “కాలంతో కరచాలనం”, “గ్రంథాలు - కమామీషూ” గ్రంథాలను, మా సంపాదకవర్గసభ్యుడు దాసు కేశవరావు 'జర్బలిజం ఇన్‌ ఆంధ్రదేశ్‌ దెన్‌ అంద్‌ నౌ' అనే లఘుగ్రంథాన్నిి సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ జ్ఞాపకాల వరద 268

అధినేత ఎన్‌. భాస్కరరావు “క్రానికల్స్‌ ఆఫ్‌ ఎ విలేజ్‌ బాయ్‌ ఇన్‌ న్యూ ఢిల్లీ అనే ఆత్మకథాగ్రంథాన్ని పరిచయం చేసే సభలు ఏర్పాటు చేశాము. రాజ్యసభ, (క్రైస్‌ కౌన్సిల్‌, రాష్ట్ర కేంద్ర ఇన్‌ఫర్మేషన్‌ కమిషన్‌లలో సభ్యులుగా నియమితులైన జర్నలిస్టులు రాపోలు ఆనందభాస్మర్‌, కె. అమర్‌నాథ్‌, లక్ష్మణ్‌, పి. విజయబాబు, మాడభూషి శ్రీధర్‌లతో ముఖాముఖీలు ఏర్పాటుచేసి వారిని సత్మరించాము. యువ జర్నలిస్టుల అవగాహన పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. ఎక్కువ కార్యక్రమాలు వారికి అనుకూలంగా ఉండే సమయాల్లోనే వర్పాటు చేశాం. స్పందనే ఆశించినంత లేదు. మరి రెండు పాఠ్యగ్రంథాలు

హెచ్‌.ఎం. టి.విలో 2014 డిసెంబర్‌ ౩1తో నా గడువు ముగుస్తుంది. మూడు రోజులు ముందుగానే డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి కబురు వచ్చింది. వారు పెట్టబోతున్న మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డిగ్రీ కోర్సుకు ఒక పాఠ్యపుస్తకాన్ని ఎడిట్‌చేసి పెట్టాలని. నేను ఇదివరకు ఆ యూనివర్సిటీకే తెలుగులో పత్రికాచట్టాల పాఠాలు వ్రాశాను. ఈ సారి ఇంగ్లీషులో తేవాలి. వేరే ఎవరికో ఇస్తే వారు కాలయాపన చేయడంతో, నన్ను వెతికారు. పబ్లిక్‌ రిలేషన్స్‌ పితామహుడుగా పేరుగాంచిన నా డిగ్రీ సహాధ్యాయి దాక్టరు సి.వి. నరసింహా రెడ్డి నా పేరు సూచించారట. ఐదు బ్లాకులు, 20 యూనిట్లు, ఆరుగురు పాఠరచయితలు. అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. గడువు నిర్ణయించారు. నిర్దేశించిన (ప్రమాణాలకు తూగేట్టు, నిర్ణీత గడువు లోపల అందరూ పాఠాలు వ్రాసి ఇవ్వాలని కోరారు. నేను వెనుకబడినవాళ్ల వెంటబడి ్రిప్పులు తెప్పించి నిడివి, భాషవిషయంలో ఏకరూపత సాధించి, అవసరమైతే తిరగవ్రాయించి, బద్ధకించిన ఒక ఆచార్యుడి పాఠాన్ని నేనే నిర్జీతస్థాయికి పెంచి, ఎడిట్‌ చేసిన 236 పేజీల పుస్తకాన్ని గడువులోపల అందించాను. దీనిలో సహసంపాదకుడుగా నరసింహారెడ్డి నాకు తోద్పడ్డారు. మా పనితీరు సామాజికశాస్తాల విభాగం డీన్‌ వెంకటేశ్వరరావుకు నచ్చింది. దానితో ఇదే ఫ్కిప్ప తెలుగు అనువాదం సరిగా ఉందో లేదో చూసే పని కూడా నాకే అప్పగించారు. అంతటితో అయిపోలేదు. ఎం.ఏ. మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం డిగ్రీలకు పాఠ్యగ్రంథమైన 'రైటింగ్‌, రిపోర్టింగ్‌ అండ్‌ ఎడిటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా'ను కూడా ఎడిట్‌ చేసిపెట్టాలని కోరారు. ఇదీ ఐదు యూనిట్లు, 20 పాఠాలు, ఆరుగురు పాఠరచయిళతలు. దీన్నికూడా నిర్జీతప్రమాణాలకు అనుగుణంగా సిద్ధపరచి, గడువులోగా ఇచ్చేశాము. ఈ రెండు పుస్తకాలు ఆ కోర్సులలో 284 జి.యస్‌. వరదాచారి

చేరే విద్యార్థులకే ఇస్తారు. ఐబయటివారికి అమ్మరు.. కాని లేఖనకళలో ఆసక్తి గలవారందరికీ ఇవి అందుబాటులో ఉండదగినవి. జర్నలిస్టు హెల్త్‌ కార్డులు

జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చే పని అంత సునాయాసంగా జరుగ లేదు. తడవకు కొందరికి ఇచ్చారు. తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నవారికి వేరే కార్డు అక్కరలేదని, అదే ఆరోగ్యశ్రీగా పనిచేస్తుందని పేచీపెట్టారు. కాదంటే రేషన్‌ కార్డు రంగు మార్చించుకు రమ్మన్నారు. అప్పటికి పౌరసరఫరాల శాఖవారు గులాబి రంగు కార్డుల జారీని రద్దు చేశారు. ఇలా ఎటూ తెగని పరిస్థితిలో, 2014 జూన్‌ 2వ తేదీన రాష్ట్రవిభజన జరిగి తెలంగాణ వచ్చింది. మళ్లీ ఎవరు అర్హులు, ఎవరు కాదనే మీమాంస, హైదరాబాద్‌లో స్థిరపడిన వయోధిక పాత్రికేయులందరినీ స్థానికులుగానే పరిగణించాలని విజ్ఞాపన ఇచ్చాము. తెలంగాణ (ప్రభుత్వానికి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం అనే పేరే నచ్చినట్టు లేదు. దీన్ని వర్కింగ్‌ జర్నలిస్టు అండ్‌ రిటైర్డ్‌ జర్నలిస్టు హెల్త్‌ కార్డ్‌ స్మీమ్‌ అని పేరుమార్చారు. ఏమైతేనేమి, చివరకు మా సభ్యులు అందరికీ హెల్త్‌ కార్డులు జారీ చేయవలసినదిగా జూన్‌ 16వ తేదీన ఉత్తర్వులు వెలువద్దాయి. అందరికీ తెలంగాణ ప్రభుత్వ హెల్త్‌ కార్డులు అందాయి. ఇక కాన్ని దక్షిణాదిరాష్ర్రాలు ఇస్తున్నట్టు వయోధికులందరికీ కనీస అవసరాలు తీర్చేటంత పింఛను సాధించే ప్రయత్నాలలో పడ్డాము. సమాచారశాఖ కమిషనరుకు, (ప్రెస్‌ అకాడెమీ అధ్యక్షునికి విజ్ఞాపనలు ఇచ్చాము. ముఖ్యమంత్రి తలచుకుంటే కార్యం సుసాధ్యమవుతుంది. వెనుదిరిగి చూస్తే...

84 ఏళ్లు నిండాయి. పాత్రికేయ జీవిత షష్టి పూర్తి అయింది. వెనుదిరిగి చూస్తే నాకు నా జీవితం ఫలప్రదంగానే గడిచిందన్న తృప్తి ఉంది. నా బంధువులలో చాలామందికి చేతనైన మాట సహాయం, కొందరికి పదో పరకో డబ్బు సహాయం చేశాను. చదువుల ఎంపికలో మంచి చెడులు చెప్పాను. జర్చలిస్టుగా నా పదవిని కాని, పలుకుబడిని కాని దుర్వినియోగం చేయలేదు. నాకు కీర్తి వచ్చింది కాని దానికి తగిన పదవులు రాలేదని మిత్రులు కొందరు సానుభూతి చూపుతుంటారు. నేను చమత్మారంగా వారికి, నా చేతుల పదివేళ్లకూ శంఖువులే ఉన్నాయని ఒక్క చక్రంకూడ లేదని చెపుతుంటాను. “వక చక్రే మహాభోగీ”” అన్నారుగదా సాముద్రికశాస్త్రజ్ఞులు! పదవుల వల్ల కొందరికి కీర్తి వస్తుంది. పైరవీ వల్ల కొందరికి పదవులు వస్తాయి. జ్ఞాపకాల వరద 9265

అందరికీ అని అంటే అవివేకమవుతుంది. (ప్రతిభ ఉంటే ఆలస్యంగానైనా గుర్తింపు రాకుండా పోదు. ఇది ప్రచారయుగం కనుక ప్రచారం చేసుకోలేకపోవడం లోపంగానే పరిగణింపబడుతుంది. నాలో ఆ లోపముందని నాకు తెలుసు. నాకు ఎడిటరు పదవి దక్కక పోయిన సందర్భాలు ఐదున్నాయి. భూమిలో రెండు సార్న. (ప్రభలో రెండు సార్లు ఉదయంలో ఒకసారి, ఆ వివరాలు ఏకరువు పెట్టడం వ్యర్ధం. అత్మకథలో నిజాలే చెప్పాలని రచనాధర్మం తెలిసిన పెద్దలంటారు. నేను ఆ సూత్రాన్ని స్వభావసిద్ధంగా పాటించాను. నా వైఫల్యాలు చెప్పాను. నాకు లభించిన అవకాశాలను తెలిపాను. కొన్ని మొదటి పనులు నేనే చేశానని చెప్పుకొన్నాను. గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఎవరో వద్దంటే వచ్చిన అవకాశం నాకెందుకు అని తిరన్మరించవద్దని చెప్పడానికే. ఎలా వచ్చిన అవకాశమైనా సద్వినియోగం చేసుకోగలిగితే, అది తర్వాత మరిన్ని అవకాశాలకు దారి తీస్తుందని చెప్పడానికే. దీనిని తనదైన శైలిలో వివరిస్తూ జ్ఞానపీఠ పురస్కార (గ్రహీత రావూరిభరద్వాజ “వరద స్వర్దాక్షరి'లో నన్ను ఆపద్భాంధవుడు అని వర్ణించాడు. అది యథాలాపప్రశంస కాదు.

“పండిన అనుభవంతో మీరిప్పుడు మరిన్ని రీతులలో సమాజాన్ని చైతన్యపరిచే వ్రాతలు వెలువరిస్తారని' చినజీయరు స్వామి మంగళాశాసనం చేశారు. నాకూ వ్రాసే ఓపిక ఉంది. వ్రాయడానికి విషయముంది. ప్రచురణావకాశం దొరికినంత వరకు వ్రాస్తూనే ఉంటాను. ఇవాళ మీడియా విస్ఫృతి పెరిగింది. కొత్త విషయప్రసార మాధ్యమాలు అందుబాటులోకి వస్తున్నాయి. దానితో పాటే కాలుష్యం పెరిగే ప్రమాదం కూడా ఎదురవుతున్నది. తత్కారణంగా, సంప్రదాయ మీడియా బాధ్యత - ముఖ్యంగా వాస్తవాలను కాచి వడబోసి జనం కళ్లకు కట్టించే బాధ్యత - పెరిగింది. కాలం మారినా వార్తల విలువలు మారవు. సత్యనిష్ట సదా శిరోధార్యం. అక్షరానికి అంతం లేదన్నారు అగ్రజులు దాశరథి రంగాచార్యులు. ఆత్మకథకు కూడా అంతం ఉండదు. ఎక్కడో శుభం పలుకాలి. సర్వే జనా స్ఫుఖినో భవంతు అనేది మన స్వస్తివాచకం. సద్గురు శివానందమూర్తి దీనికి మెరుగు దిద్దారు. సర్వే జనాస్సుజనో భవంతు అని ముందు మరో వాక్యం చేర్చారు. ఆ తర్వాత సర్వే సుజనా స్సుఖినో భవంతు అనమన్నారు. తథాస్తు!

షల్లల4

266 జియస్‌. వరదాచారి

మరికొన్ని తీపిగుర్తులు క ఆల. ఉని బానార్‌ వ్వా, ఉ.లమి.విస్టి లోన ప్రమద కన్ష- ౮. చ . స. [జమా యానియన్‌ ప్రధమ యయ న దూ గానా విక ల ్రి వం ళా అంయెమదేత భాహాన్నన స బ్‌ అవను నం స్ప-2006 స్వీకర్త వాలుర్డ్‌ర్‌ మడునే వరదానాం మ! మా రుం ననే గాల సాధక క ల బుహనపనుయునచయు కయ యా టిర కాల ణపనామా దద | నన కక సడ న ల. న్‌ా అలలో సనన మదారళన మయో శాదినే వమనాననని అదనననవవనునే దానను రణ నిం్తా పద్టయాసల ధిక టకమ బాడవలో రురు కాలు చారంతియ అన్ను [కనాను వనత్రమ వ్యాయా కి దు (0 వావ నో. వ్‌ ఖాలి క్‌ ॥ మరద న ప లో వ హా గా హోం నే నాద న వా న యు. (న క నాము టి పష. లలా టు ర డడం దండు పదమ. 'నోజ్టా! ననన మ యరరాలు న చాన | కాత రర ల న యు దారుల వసు మ మా ము టంతో పాతలవ. క! న అరం అ విలనే! శ్రీజఎమ్‌ వరదాదారింం ద నాల పు మ మ ప్‌ యాలు గు జ్ఞాపకాల వరద 267

న న ఉత్తమ థిలిం జర్నలిన్దుగా దానరి నుంచి న్న్వర్హపతకం స్వీకరిస్తూ న టా బు 1 కం. 1 011 మయం యు, క క స హా త ఏ? 1. (వెస్‌ అకాడమీ నభఖ్యునిగా | 1! చు... "౧8 హైదరాబాద్‌ ఫుస్తకవదర్భనలో భాషానదస్సులో నవావక్తలు ప్రముఖ భాషాశాస్రవేత్ర భదిరాజు కృష్ణమూర్తి, రాజ్యనభ నభ్యుడు లక్ష్యణ్ఞతో 268 జి.యస్‌. వరదాచారి

న న న ర. మం ననా? | జో య ను శ్రీకాకుళంలో కథానిలయానికి వెళ్లి కాళీపట్నం రామారావు మాస్టారును కలినీనప్పుటి చిత్రం కుడివక్టృన గోవిందరాజు చక్రధర్‌ | ఇక. ఖ్తాస ( ా! ॥ ర ష్‌ ల ము వ గిడుగు రామమూర్తి 252వ జయంతినాడు తమిళనాడు గవర్నరు రోశయ్య నుంచి తెలుగు భాషావురసారాన్ని న్వీకరిన్తూ ల్‌ 1. ఇ న త న భారతీయ మాతృభాషావరిరక్షణ నమితి అంతగ్రాక్టీయ నదస్సు బెంగళూరులో జరిగినప్పుడు మండలి బుద్ధప్రసాద్‌ నుంచి నన్నానమందుకున్న దృశ్యం జ్ఞాపకాల వరద 269

న... ఫిలిమ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ రజతోత్సవంలో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్సుర రెడ్డీ చేత వూర్వాధ్యక్షుదుగా నాకు నత్సారం, అక్సినేని, ఆమని సహకారం మతు. సాము తను. స) ”ఇరారా తాను తా త వా వి. 06-10-2006 నాన. ట. నీ అలయన్స్‌ క్లబ్‌ వారు ఉత్తమ జర్నలిన్టులుగా నన్ను చ(్రధర్‌ను, తురగా జానకీ రాణిని నన్నానించినవుటి చిత్రం

? . స్స న. "త్త గ ఓ ల. హా న న విద్దత్ళువి దాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్యులు రబించిన “దాశరథి రుబాయీలు-గజుళ్లు” అనే (గ్రంథాన్ని అంకితం అందుకుంటూ

తం బలము 0 న బం యం రర నభ మం లీల సం టీ. మ న (గత (౩ ౨టీ . తూ . న . య. ళ్‌. ,, (య్‌ క _ కయ నాతోపాటు తెలుగు విశ్వవిద్యాలయ గౌరన దాక్టరేట్‌ వట్టాలు అందుకున్న రాధాళ్టృష్ణరాజ్లు హేమలతా లవణం, తాలీపట్నం రామారావులతో

  1. (| న... (014.0 య / 111 | [| (| | న. 1 ను! 1. 11 ॥ గ. 15 | తమ్‌... పు స్ట్ని య 41111111 జ్ఞానవీఠ వురస్కార (గ్రహీత దాక్టర్‌ ని నారాయణరెడ్డి నుండి వీఎన్‌ఆర్‌ ఆంజనేయశాన్తీ స్థారక వురస్కారాన్ని అందుకుంటూ స లను య్‌ ము. న స పాత్రికేయ జీవిత న్వర్జోత్సవ సందర్భంగా నా ఆనవాయితీ ప్రకారం నాచేత నత్సారం పొందిన వరిస్థ పాత్రికేయులు పెండ్యాల వామనరావు చై

పెద్దలకు దందాలు, పిల్లలకు దీవెనలు

ఈ ఆత్మకథ వ్రాయుమని నా వెంటబడి, పోరు పెట్టింది గోవిందరాజు చక్రధర్‌. వ్రాసిన తొలి భాగాలను రుచి చూసి, “బాగుంది కానివ్వండి” అని ముందుకు తోసిందీ ఆయనే. తొలి ముసాయిదాను ఆమూలాగ్రం చదివి అక్షర దోషాలు దిద్దిందీ చక్రధరే, ఆయన ఆలోచనను బలపరచిన మరో మిత్రుడు టి. ఉడదయవర్లు. ఇతను నన్ను పలు పర్యాయాలు భిన్నమాధ్యమాలకోసం ఇంటర్వ్యూ చేశారు. ఆకాశవాణిలో “నా జీవనయానం" పేరిట ధారావాపొకంగా ప్రసారమైన ప్రసంగకార్యక్రమ సమయంలో, ఇవన్నీ గ్రంథస్థమైతే కొత్త తరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్న సూచన చేశారు.

నేను కాగితం, కలం వాడకుండా నేరుగా కంప్యూటరులోనే టైపు చేయడం మొదలుపెట్టాను. అలా కూర్చిన దాన్ని పరామర్శకోసం కాగితం మీదికి మార్చడంతో సహా అవసరమైన సమస్త సాంకేతికసహాయాన్ని అందజేసిన మరో మిత్రుడు కొందా లక్ష్మణరావు. దిద్దుబాట్లను (శ్రద్ధగా పూర్తిచేసి శుద్ధ ప్రతిని అందించారు డి. నాగలక్ష్మి,

తెలుగు పత్రికారచయితలు, సాహిత్యవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాలలో (ప్రసిద్ధులు, అనుభవజ్ఞులైన వారి ఆత్మకథలూ, జీవిత చరిత్రలూ (ప్రచురిస్తూ ఉన్న ఎమెస్కో బుక్స్‌ ప్రచురణ సంస్థ అధినేత దూపాటి విజయకుమార్‌, ఈ [గ్రంథ ప్రచురణకు వెనువెంటనే తమ ఆమోదం తెలిపారు; ఎమెస్కో సంపాదకులు, తదితర సిబ్బంది చక్కగా సహకరించారు. వీరందరికీ నా నమస్సులు.

నేను నా దగ్గరున్న పాత హెచ్‌పి. నోట్‌ బుక్‌లో టైపు చేస్తూ కష్టపడుతున్నానని తెలిసి మా చిన్నమ్మాయి సౌమ్య న్యూ జెర్సీలో కొత్త ల్యాప్‌టాప్‌ కొని ఉత్తరదేశ యాత్రకోసం ఇండియా వస్తున్న పెద్దమ్మాయి శుభ, అల్లుడు నరసింహమూర్తితో పంపించింది. ఈ లోగా మా పెద్దబ్బాయి హర్ష తన వద్ద ఉన్న ల్యాప్‌టాపుల్లో ఒక దాంట్లో తెలుగు సాఫ్ట్‌వేర్‌ వేయించి. ఇద్భాడు,క్షగిప్యూటర్‌లో నాకు చేతకాని పనులు చేసి పెట్టడానికి వినర త వళ ఎనో బాటులో ఉండి తోద్బడ్డాడు. ఈ పిల్లలందరికీ నో వరన రష నో ॥ |

లూ, దూప

272 న జి.యస్‌. వరదాచారి

౧ “్జ్బమకాలవరసీ్‌

డా. జియస్‌. వరడాచారి

డ్నా ;జియస్‌. .వరదొచోరి గౌరు పత్రిక్షారచయితగా. సుదీర్టమైన జీవితం గడిపారు. అపొరమైన అనుభవం గడించారు: 'ఆ పరిజ్ఞానాన్ని, విత్వత్తును, భాషాపాండిత్యాన్ని అనుభవాన్ని తనకు: మాత్రమే పరిమితం చేసుకోకుండా ప్రసంగాల ద్వారానూ, రచనల ద్వారానూ తెలుగు పొఠకులకు పంచిపెట్టారు. ఈ జ్ఞానం సర్వపాఠకులకూ ఆవశ్యకమే _ అయినప్పటికీ పత్రికారచయితలికు విశేషంగా ఉపయోగపడింది, పడుతూ ఉందికూడా. పత్రికారచయితలు. తమ ఠచనాశైలిని *దిద్దుబాటు' చేసుకోవడానికి ఆదర్శం కల్పించాఠాయన. వరదాచారిగారు. 24-10-1952 న నిజామాబాదు. జిల్లా ఆర్మూరులో జన్మించారు. అంటే ఆయున బాల్యమంతా నిజాంపాలనలోనే గడిచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుకున్నారు. అనంతరం పి.జి. డిప్లమా ఇన్‌ జర్నలిజం చేశారు. తొలినాటి తెలుగు జర్నలిజంలో జర్నలిజం డిగ్రీతో ప్రవేశించిన అతికొద్ది మంది జర్చలిస్టులలో వరదాచారిగారొకరు. ఆంధ్రజనత, ఆంధ్రభూమి, ఈనాడు పత్రికల్లో జర్నలిస్టుగా ఆయన జీవితంలో సింహభాగం గడిచిపోయింది. ఆ న శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సుదీర్జకాలం జర్నలిజం బోధించారు. నిబద్ధత, నిజాయితీ గల జర్నలిస్టుగా వివిధ హోదాలలో సుదీర్ణకాలం పనిచేయడమే గాక తరువాతి తరాల జర్నలిస్టులను ప్రత్యక్ష బోధన ద్వారా, తన రచనల ద్వారా, జర్నలిజం కోర్సు పుస్తకాల ద్వారా తయారుచేసిన కీర్తి ఆయనకు దక్కుతుంది. జర్నలిస్టుల వృత్తి సంఘాలలోనూ ఆయన క్రియాశీలంగా పనిచేశారు. జర్నలిస్టుగా అనేక పురస్కారాలు పొందారు. వాటిలో “పత్రకార్‌ శిరోమణి”, 'నార్ల జీవిత సాఫల్య పురస్కారం” ముఖ్యమైనవి.

స రు, [5811 978-93-26327-80-2

షే ఎమస్కబుక్‌ ర రరఎ5ం| 202