Telugu Gnanam Parignanam Jeevithaniki O Vandanam - anilvaranasi/indianlanguages GitHub Wiki

అనువాదం: ఎం, రాజేంద్ర ఇజ్‌ న్‌ా ॥ స్క | కులిజాతనుర.

మహం ౧ శ₹బతా ౩్ట్రైం దనం... న షు గ” ఆ పాం... సగ్చె హం న ఈ. , ( ఉఅత్తారదా్య్యోళ్లా,/”

ఇగ జ్ఞానం - పరిజ్ఞానం

  • జీవితానికి ఓ వందనం - సుధామూర్తి అనువాదం: ఎం. రాజేంద్ర

కాపీరైట్‌ 2002ను ల్‌ో బో క ఏప్రియల్‌ 2003 స గారాంయ నై వెలురూ, గట్ట ణ్‌ 6 ఇం. లిన0ంం) శ లే న ర స్మ పైర్‌ కార్‌న్తడో ముద్రణ: ప్రగతి ఆఫ్‌సెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాదు - 500 004 ఈ40/220.00౧2

నాదేశమంటే ీమిటో నాకు నిజంగా తెలియబెప్పిన - భారతదేశంలో కూడూగుడా లేని నిరుపేద ప్రజలకు ఈ ఫుస్తకం అంకితం

సుధామూర్తి 1960లో ఉత్తర కర్ణాటకలోని హవేరి జిల్లా షిగ్గాంలో జన్మించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో ఎం.టెక్‌. చదివారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. కన్నడంలో ఏడు నవలలు, నాలుగు సాంకేతిక శాస్త్ర గ్రంథాలు, మూడు యాత్రా (గ్రంథాలు రచించారు. ఏడు నవలల్లో “డాలర్‌ సోన్‌ నవలను జీటీవీలో సీరియల్‌గా చిత్రించి ప్రసారం చేశారు. ఆమెకు ఇద్దరు సంతానం. నివాసం బెంగుళూరు.

తెలుగు పాఠకులకు ఒకమాట

నేను తొలుత ఆంగ్లంలో రచించిన 'వైజ్‌ అండ్‌ అదర్‌వైజ్‌ (గ్రంథం “జ్ఞానం-పరిజ్ఞానం' పేర తెలుగులో వెలువడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఇవన్నీ నా నిజజీవితంలో ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పొందిన అనుభవాలే.

చాలా సందర్భాలలో కల్పనకన్న యధార్థమే వింతగా ఉంటుంది.

ఈ పుస్తకం ఆంగ్లం నుంచి ఉర్పూ, కన్నడ, అస్సామీ, మరాఠీ, హిందీ, గుజరాతీ, తమిళం, మలయాళం, పంజాబి, కాశ్మీరీ, బెంగాలీ భాషల్లో ఇదివరకే అనువదించబడింది. ఇప్పుడు తెలుగు అనువాదం వెలువడుతున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను.

ఈ పుస్తూన్ని ఆంగ్రం నుంచి తెలుగులోకి అనువదించిన శ్రీ ఎం. రాజేంద్రకు నా కృతజ్ఞతలు.

  • ప్రూపులు దిద్దిన శ్రీ హనుమంతరావుకు, శ్రీమతి సీతాలక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అభ్యుదయ ఫౌండేషన్‌కు చెందిన మంచి దాత శ్రీ బి.ఎం. రావుకు నా ధన్యవాదాలు,

ఈ పుస్తకాన్ని ఇంత తక్కువ వ్యవధిలో, ఇంత తక్కువ ధరకు వెలువరించడానికి సహాయపడిన ప్రగతి ఆఫ్‌సెట్‌కు చెందిన శ్రీ నరేంద్రకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

చివరకు నా రచనల మంచి చెడ్డలను నిర్ణయించవలసినవారు పాఠకులే. మీ ప్రశంసలు, విమర్శలు రెంటినీ నేనెప్పుడూ స్వాగతిస్తాను.

సుధామూర్తి బెంగుళూరు

కృతజ్ఞతలు

నా కర్తవ్యనిర్వహణలో భాగంగా (గ్రామీణ భారతాన్ని పరిశీలించి చూసేదాకా నాదేశం గురించి నాకు అట్టే తెలియకుండా పోయింది. నేను అనేక రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి, వేయికి పైగా (గ్రామాలను సందర్శించాను. మానవుని బుద్ధిచాలా చిత్రమైంది. కొందరు నిరంతరం డబ్బు, పేరు ప్రఖ్యాతులు గురించి తపించిపోతుంటే, మరికొందరు చదువు సంధ్యలు లేకపోయినా ఎంతో పరిణతితో వ్యవహరిస్తుంటారు. ,

ఈ పుస్తకంలో ఉన్న కథనాలన్నిటినీ, నిజజీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగానే రాశాను. పేర్లు మాత్రం మార్చి, కాస్త వర్ణన కలిపాను. కొన్ని సందర్భాలలో, జీవితంలో అదృష్టం కలసిరాని సామాన్యులు నాకెన్‌్న్నీ పాఠాలు నేర్పారు. వాళ్ళను నేను నా గురువులుగా భావిస్తాను. వార్తాపత్రికలలో కాలాలు రాయగలనన్న ధైర్యం కలిగించిన 'ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎడిటోరియల్‌ అడ్వయిజర్‌ శ్రీ టి.జె.ఎస్‌. జార్జికి నాకృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకానికి ముందుమాట కూడా ఆయనే రాశారు. 'ది వీక్‌ పత్రికకు చెందిన శ్రీ ఎం. గోపాలకృష్ణన్‌, “ది హిందుస్తాన్‌ టైమ్స్‌'కు చెందిన శ్రీ వీర్‌సంఘ్వి, “ది హిందూకు చెందిన శ్రీమతి నిర్మలా లక్ష్మణ్‌ తమ వార్తాపత్రికలు, సంచికలలో వచ్చిన నా రచనలను పునర్ముద్రించుకొనడానికి అనుమతి ఇచ్చారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

చివరకు పాఠకుల ఆదరాభిమానాలు నాకెంతో ముఖ్యమైనవి. మీకే నా (ప్రేరణ. మీఫప్రోత్సాహం లేకుండా నేను రచయితగా మనలేను. బెంగుళూరు నుధామూర్తి మార్చి 02, 2002

ముందుమాట

మానవ స్వభావాన్ని మన సంప్రదాయం ప్రకారం సత్త్వ, రజస్‌ లేదా తమస్‌ గా పరిగణిస్తాం. ఇతర నాగరికతలకు సైతం పరిచితమైన ఈ అధ్యాత్మిక భావనను, భారతీయ నాగరికత పరమ సుందరంగా వ్యక్తంచేసింది. దేవుడు సృష్టించిన కోటానుకోట్ల జీవులలో మంచి-చెడుల విచక్షణా జ్ఞానం మానవునికి మాత్రమే ఉంది. తాను ఎంచుకొన్న మార్గాన్నిబట్టే మానవుడు ప్రతిఫలాలు అనుభవిస్తాడు. కొందరు అన్నీ తెలిసి సాత్త్విక కార్యానికి ఉపక్రమిస్తారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తమో జీవితాన్ని వాంఛిస్తారు. మరికొందరు మొదట తమో లేదా రజో జీవితం గడిపి, తర్వాత క్రమంగా ఉన్నతిని సాధించి సత్త్వ గుణానికి చేరుకుంటారు. ఇదంతా కర్మ అనే బృహత్‌ విశ్వప్రక్రియలో భాగంగా చెప్పడం జరుగుతుంది. జెన్నెద్‌జీ టాటాకు జీవితంపట్ల, చేసిన కృషిపట్ల కేవలం సాత్వికదృక్సథమే ఉండేదనిపిస్తుంది. తన దేశ పారిశ్రామికీకరణకు పునాదులు నిర్మించడం, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు ప్రారంభించడం, అప్పటి కెవరికీ అలాంటి ఆలోచనేరాని రోజుల్లో దాతృత్వ సంస్థల వ్యవస్థను నెలకొల్పడం - వీటిలో ఆయన సాత్త్విక దృష్టే కనిపిస్తుంది. కాగా, ఆల్రైడ్‌ నోబెల్‌ తన అపార ప్రతిభను విలయకారక సాధనాలు కాగల డైనమైట్‌ను, పొగరాని తుపాకి మందును, గిలిగ్‌నైట్‌ను కనిపెట్టడానికి ఉపయోగించాడు. తర్వాత, బహుశాతన జీవిత కాలమంతా పరిశోధించి సాధించిన వాటిదుష్పరిణామాలను చూసి కలతచెందినట్లుంది. అందుకే తన విజయాల ద్వారా ఆర్జించిన సంపదనంతా ఉదాత్తమైన కృషికి గుర్తింపుగా నోబెల్‌ బహుమతులు ఇవ్వడానికి దానం చేశాడు. తద్వారా తన ఐశ్వర్యాన్ని సాత్త్విక ప్రయోజనానికి ఉపయోగించాడు.

సుధామూర్తిది తన జ్ఞానాన్ని గృహిణిత్వానికి పరిమితం చేసే స్వభావం కాదు. ఆమెలో టీచర్‌ రక్తం ప్రవహిస్తోంది. విద్యాబోధన అంటే ప్రపంచాన్ని తీర్చిదిద్దగల వృత్తి. ఆ వృత్తి లక్షణాలు ఆమెకు చిన్నతనంలోనే సహజంగా అలవడ్డాయి. అలా అని ఆమె టీచర్ల గుంపులో తానూ ఓ సాధారణ టీచర్‌గా ఉండిపోలేదు. కంటికి కనిపించకపోయినా, మనసుకు తెలుస్తున్న శక్తులేవో ఆమెను అపరిచిత రంగంలో ప్రవేశపెట్టాయి. ఒక ముఖ్యమైన విశేషమేమిటంటే, సోషలిజం నరనరాన (ప్రవహిస్తున్న వ్యక్తిని ఆమె వివాహమాడారు. ఇంకో విశేషం వారికి క్యాపిటలిజం దీవెనలు ప్రాప్తించాయి. దాంతో సహజమైన టీచర్‌, సోషలిస్టు గుణాలు సమ్మిశ్రితమై వారిని ప్రజాసేవా పథం పట్టించాయి. టీచర్‌గా, భార్యగా, తల్లిగా ఉంటూనే సాధారణ మహిళగా కనిపిస్తూనే, సుధామూర్తి తానే ఓ సంస్థగా ఎదిగిపోయారు.

ఆమె మహాభవంతులేమీ నిర్మించలేదు. ఏపని తలపెట్టినా బహిరంగ (ప్రకటనలతో ఆర్భాటం చేయలేదు. ఆమె ఉనికిని చాటే విగ్రహాలు, శిలాఫలకాలు లేదా స్వాగతద్వారాలేమీ మనకు కనిపించవు. గిరిజనులు నివసించే అడవులను, పేదరికంతో తల్లడిల్లుతున్న మారుమూల పల్లెలను, కుగ్రామాలను, వ్యాధులతో క్షీణిస్తున్న తెగలు నివసించే ప్రాంతాలను ఆమె సందర్శిస్తారు. సహాయానికి అర్హులైన వారిని ఆమె స్వయంగా వెతికి పట్టుకొంటారు. ఎవరికి ఏ సహాయం అవసరమని తేలుతుందో ఆ సహాయాన్నే వారికామె అందిస్తారు. ఆశాభంగాలు, అవరోధాలు, జాష్యాలు ఆమె గమనాన్ని మందగించవు. తనసేవా కార్యక్రమాలను అమలు పరుస్తున్నప్పుడు

పదేపదే ఎదురయ్యే మానవ దురాశను చూసి, ఆమె వెనుకంజవేయరు. ఆమె చేసే కృషే ఆమె సందేశం. కర్మయోగి పంథాలో తన విధిని తాను నిర్వహించుకొంటూ వెళ్తారామె.

ఈ పుస్తకం ఆమె చేస్తున్న కృషిని, ఆక్భషిలో ఆమె అనుసరించే దృక్పథాన్ని విశదపరుస్తుంది. కన్నడంలో నిష్టాతురాలైన నవలా రచయిత్రిగా పేరుతెచ్చుకొన్న సుధ, మొదటిసారిగా 'ది న్యూ ఇండియన్‌ ఎక్సిపెసొ లో కాలమ్‌ను ప్రారంభించడం ద్వారా ఆంగ్లంలో రాయడం ప్రారంభించారు. రెండు వారాల కొకసారి ప్రచురించిన ఈ కాలమ్‌లో తన వ్యక్తిగత అనుభవాలు, తన పర్యటనలు, అసామాన్య ఆలోచనలుకలిగిన సొమాన్యులతో తాను సమావేశమైన సన్నివేశాలను ఆమె చిత్రించారు. ప్రారంభమైన వెంటనే ఆ కాలమ్‌ పాఠకులను ఆకట్టుకొంది. పసందైన జ్ఞాపకాలు, వివరణలోని స్పష్టత ఇందుకు దోహదం చేశాయి. ఆమెరచనలు కలం నుంచి కాకుండా అమె హృదయపు లోతులనుంచి వెలునడుతాయనడంలో సందేహంలేదు. చిన్నచిన్న ముచ్చటైన కథలలో వెల్లడయ్యే మానవ స్వభావపు లోతుపాతులకు జర్నలిజం కల్పించగల పరిధిచాలదు. ఆమె రచనలకు మరింత విస్తృతమైన పరిధి, కలకాలం నిలవగల రూపు అవసరమని ఆరంభంలోనే స్పష్టమైంది. “ఈస్ట్‌ వెస్ట్‌బుక్స్‌' ఆమె రచనలకారూపమిచ్చి పాఠకులకు సంతృప్తి కలిగించింది.

అయితే ఈ కథలు, వాటిని చదివి ఆనందించడానికి మాత్రమే ఉపయోగపడితే మరోవిధంగా జనాన్ని ప్రభావితం చేయలేకపోతే విచారించాల్సిందే. సుధామూర్తి జీవితమే ఇతరుల కొక సందేశం. ఇన్ఫోసిస్‌ విజయాన్ని దురదృష్టవంతులైన ప్రజలకు సేవచేయడానికి ఆమె ఉపయోగించారు. అటువంటి విజయాలు సాధించిన ఇతరులకు కూడా తన కృషిద్వాదా ఆమె దారి చూపించారు. సంపన్న దేశాలలో కార్పొరేట్‌ సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం, మేథాసరమైన సృజనాత్మక కృషికి నిధులు, సదుపాయాలు కల్పించడం సామాన్య విషయం. అటువంటి కంపెనీలు మనదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. పాశ్చాత్యదేశాలలో ఫోర్ట్‌, రాక్‌ఫెల్లర్‌, నఫీల్డ్‌ వంటి మహాసంపన్న కుటుంబాలు ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థలతో పోల్చితే, మనదేశంలోని సంస్థలు చెప్పుకోదగ్గవికాదు. పాశ్చాత్య సంస్థలలో మెక్‌ ఆర్ధర్‌ ఫౌండేషన్‌కు ఉన్నంత గౌరవం మకే సంస్థకూలేదు. ఆ సంస్థ ఇచ్చే అవార్డులు “జీనియస్‌ అవార్డ్‌” (ప్రతిభా పురస్కారాలు) గా వాసికెక్ళాయి. ఈ అవార్డుల గురించి కానీ, సంస్థ గురించికానీ ఎలాంటి ప్రచారం చేసుకోరు. . అందువల్ల వీటి గురించి ఎవరికీ తెలిసే అవకాశమేలేదు. ఆ సంస్థ చడీచప్పుడూ లేకుందా, గొప్పథ్రతిభావంళులు - వి.కె. రామానుజన్‌ వంటివారు - ఎక్కడున్నారా అని, అన్వేషించి పట్టకొంటుంది. వారికృషికి అవసరమయ్యే నిధులను అంతే రహస్యంగా అందించేస్తుంది. ఏజాతికైనా మహోత్కృష్ట ప్రతిభాపాటవాలే నిజమైన సంపద. ఆ ప్రతిభను పెంచిపోషించు కొన్నప్పుడే, ఆ జాతికి భవిష్యత్తు ఉంటుంది. భారతదేశమంతటా దాతృత్వ సంస్థలు నెలకొల్పే సంప్రదాయం పాదుకొన్నప్పుడే సుధామూర్తి కృషి సార్ధకమవుతుంది. పేదసాదలకు సాయంచేయడథానికి, మౌలిక ప్రతిభను గుర్తించి, గౌరవించడానికి అటువంటి సంస్థలు కృషిచేయాలి. బెద్ధిక పరిశోధనలకు దోహదం చేయాలి. మహత్తర ఫలితాలు సాధించడానికి జరిగే అన్ని కార్యకలాపాలకు ్రేరణ కలిగించాలి.

టి.జె.ఎస్‌. జార్జి " ఎడిటోరియల్‌ అడ్వయిజర్‌ ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌థైస్‌

విషయసూచిక కృతజ్ఞతలు ముందుమాట

  1. మనసే నిజాయితీ చిరునామా క్షే ల మానవ బలహీనతలు ర్‌

  2. _ నమ్రత నేర్పిన సహ్యాద్రి కొండలు 9 ల్తీ దుఃఖం కలిగించని మరణం క!

  3. _ ఆపరేషన్‌ థియేటర్‌లో హోరాహోరీ పోరు 18

  4. _ వయోవృద్దుని సర్వోత్తమ వివేకం |

  5. మనం మంచిని వదిలి చెడును స్వీకరిస్తాం 2డీ

  6. మారే లోకంలో జీవనయానం 29

  7. _పరితాపం కలిగించిన టెలిగ్రాం 35

  8. నీతిలేని కోతల రాయుడు 38 1ఓ రాఖీ నాడే దగా చేసిన బాంధవ్యం క!

  9. బికారి జీవితం నేర్చిన పాఠం శీర్‌

  10. మన చరిజే మనకు తెలియదు త్రి

  11. తలనొప్పి తెప్పించె తైలమిచ్చె ర్‌3ె

  12. స్టవ్వు పేలుళ్ళా? వరకట్న మరణాలా? ర్‌8ి

  13. ఊహాగానాలూ, యధార్ధాలు 62

  14. సెలవు కోసమేనా పర్వదినాలు 65

  15. కల్లాకపటం తెలియని రోజులు 68

  16. పేదరాలిచ్చిన మల్లెపూదండ గ

  17. దిక్మూమొక్కులేని నిర్భాగ్యులు 7త్తీ

  18. నచ్చితేచాలు తక్షణం పెళ్ళి 78

  19. మరపురాని పెళ్ళికూతురు 82 23, స్పందన రాహిత్యం 8ర్‌

  20. టు సర్‌ విత్‌లవ్‌ 88

  21. డబ్బివ్వకపోతే ఉరితీసుకొంటా! 90

  22. నమ్మకమిస్తున్న నవతరం 92

  23. సానుకూలంగా ఆలోచిస్తే అంతా సంతోషమే 95

  24. కొవ్వొత్తులు వెలిగించండి 98

  25. సొంతంగా ఆలోచించే మహిళ 100

  26. ఐ.టి. తెచ్చిన విభజన 109

  27. మరియప్ప వదాన్యత చిరస్మరణీయం 106

  28. విశ్వాస లోపం 108

  29. అసూయ తెచ్చిన అనర్థం ్షేషై1

  30. మహిళల గురించిన సత్యం 114

  31. గౌరవంగా జీవించే అవకాశం 116

  32. ఎందుకు రాస్తున్నానంటే ....? 118

  33. నోబెల్‌ భహుమతి 121 88 పెళ్ళికాని తల్లులు 128

  34. వరుడు కావలెను 125

  35. మెప్పించిన అభ్యర్థి 128

  36. సారీ, లైను బిజీగావుంది 130 42, ఇతరులపట్ల ధర్మంగా వ్యవహరించండి 138

  37. _బిస్తేరి అనుబంధం 136 4కు కుచ్‌బీ హోతాహై ం కేశవ 45, నమస్తే, టీచర్‌ 145

  38. నన్ను మనిషిగా చూడండి 150

  39. చెన్నై పౌరుని బెదార్యం 155

  40. జీవితమే ఓ పరీక్ష 159

  41. నాడబ్బు, నీ డబ్బు 164

  42. జీవితంలో ధర్మముందా? 169 51 ఉచితానుచితాలు 172

క్షే ఇక్‌, మనసే నిజాయితీ చిరునామా

మూ డేళ్ళ (క్రితం జూన్‌నెలలో ఒక ఉదయం పూట రోజూలాగానే కన్నడ వార్తాపత్రిక చదువుతున్నాను. ఆరోజే ఎస్‌.ఎస్‌,.ఎల్‌.సి. పరీక్షా ఫలితాలు ప్రచురించారు. లోపలి పేజీల్లో కాలాల కొలది రోల్‌ నంబర్లు నిండిపోయి ఉన్నాయి. ఇంచుమించు మొదటి పేజీ అంతా ర్యాంకులు తెచ్చుకొన్న వారిపేర్లు, ఫోటోలు ఆక్రమించుకొన్నాయి. ర్యాంకులు సాధించిన వారంటే నాకు మహా అభిమానం. ర్యాంకు ఒకవ్యక్తి తెలివి తేటలను మాత్రమే సూచిస్తుందనుకోరాదు. లక్ష్యసాధనకు ఆ విద్యార్థులు ఎంతకష్టపడి చదివారో, ఎంతటి పట్టుదలతో పరిశ్రమించారో కూడా ర్యాంకులు తెలియజేస్తాయి. ఒక ప్రొఫెసర్‌ కుటుంబంలోపుట్టి పెరిగిన నా నేపథ్యం, టీచర్‌గా నేను పొందిన అనుభవంతో

నేనీ విషయాన్ని నమ్మకంగా చెప్పగలను. కష్టపడితే తప్ప ర్యాంకులు రావు.

ఆ దినపత్రికలో ప్రచురించిన ఫోటోలన్నిటిలోకి ఒక బాలునిఫోటో నన్ను ఆకట్టుకుంది. అతని నుంచి నాదృష్టిని మరల్బలేకపోయాను. అతను బక్కపలుచగా, పాలిపోయినట్లున్నా అతని కళ్ళలోని మెరుపు ముచ్చట గొలుపుతోంది. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని పించింది. అతని పేరు హనుమంతప్ప అని, అతనికి 8వ ర్యాంకు వచ్చిందని చదివాను. ఇంతమాత్రమే తెలుసుకోగలిగాను.

మర్నాడు, ఆశ్చర్యకరంగా అతని ఫోటో మళ్ళీ ఇంటర్వ్యూతోపాటు ప్రచురించారు. అతనొక వ్యవసాయ కూలీ కుమారుడు. తానో పల్లెటూరిలో నివసిస్తున్నానని, తండ్రి రోజుకు కేవలం 40 రూపాయలు సంపాయిస్తాడని, పైగా అయిదుగురు పిల్లలలోతాను పెద్దవాడినని, అందువల్ల పైచదువుకు వెళ్ళలేకపోతున్నట్లు ఇంటర్వ్యూలో హనుమంతప్ప చెప్పాడు. వారో గిరిజన తెగకు చెందినవారు.

ఈ మెరికలాంటి పిల్లవాడి పరిస్థితి నాకు విచారం కలిగించింది. మనలో చాలా మంది ఖర్చుకు వెనుకాడకుండా మనపిల్లల్ని ట్యూషన్లకు, కోచింగ్‌ క్లాసులకు పంపిస్తాం. రిఫరెన్స్‌ పుస్తకాలు, గైడ్డుకొని పెడతాం. సాధ్యమైన సదుపాయాలన్నీ సమకూరుస్తాం. అయితే హనుమంతప్ప పరిస్థితి ఎంత భిన్నంగాఉందో చూడండి. రామ్‌పురా గ్రామంలో అతని ప్రాథమిక అవసరాలను తీర్చకపోయినా, చదువులో అందరినీ మించిపోయాడు.

లై జ్ఞానం - వరిజ్ఞానం పత్రికను అలాగే చేతిలో పట్టుకొని, ఆలోచిస్తుండగా, నా దృష్టి మాపక్కింటి ఆవరణలోని మామిడిచెట్టుపై పడింది. చక్కని కొమ్మలు, మంచు బిందువులుపడి మెరుస్తున్న పచ్చని ఆకులు, కొద్దిరోజుల్లో పక్వానికి రానున్న మామిడి కాయలతో ఆచెట్టు నిండుగా కనిపిస్తోంది. చెట్టుకు ఆవల కుండీలో పెంచుతున్న మొక్కకూడా కనిపిస్తోంది. ఆ మొక్క నాటినప్పుడు ఎంతుందో ఇప్పటికీ దాదాపు అంతేవుంది, ఎదుగూ బౌదుగూ లేదు.

అది ప్రశాంతమైన ప్రాతఃకాలం. చల్లని, స్వచ్చమైన గాలి. అలా ఆలోచిస్తూ కూర్చుండి పోయాను. ప్రెజర్‌ కుక్కర్‌ విజిల్‌ అదేపనిగా మోగుతుంటే అప్పుడు గుర్తొచ్చింది, అర్ధగంట గడిచిపోయిందని.

ఇంటర్వ్యూలో హనుమంతప్ప పోస్టల్‌ చిరునామా ఇచ్చారు. ఇక అట్టే ఆలస్యం చేయకుండా పోస్టుకార్డుతీసి అతనికి ఉత్తరం రాశాను. అతన్ని కలుసుకోవాలను కొంటున్నానని తెలియజేస్తూ, బెంగుళూరుకు రావడానికి వీలవుతుందేమో తెలపాలని కోరాను. రెండేలైన్లు రాశాను. సరిగ్గా అప్పుడే మానాన్నగారు వ్యావ్యాళినుంచి తిరిగొచ్చారు. ఆయనెప్పుడూ అచరణీయంగా ఆలోచిస్తారు. ఆయనా ఉత్తరం చదివి “ఇంతదూరం రావడానికి అతనికి డబ్బెక్కడ ఉంటుంది. అతనిక్కడికి రావాలని ఉంటే బస్సుఛార్జీలకు, ఒకజత మంచి దుస్తులు కుట్టించుకోడానికికూడా డబ్బు పంపించు” అన్నారు.

దాంతో అతని ప్రయాణానికి, దుస్తులకు డబ్బిస్తానంటూ మరొక వాక్యం చేర్చాను. నాలుగు రోజుల్లో పోస్టుకార్డు ద్వారానే జవాబు వచ్చింది. అందులో రెండే వాక్యాలున్నాయి. మొదటి వాక్యంలో నా ఉత్తరానికి కృతజ్ఞతలు తెలిపాడు. రెండో వాక్యంలో బెంగుళూరుకు వచ్చి కలుసు కొనడానికి అంగీకారం తెలియజేశాడు.

" వెంటనే కొంతసొమ్ము పంపుతూ మాఆఫీసు ఎక్కడుందో ఎలారావాలో వివరించాను. చివరికతను మా ఆఫీసుకు వచ్చినప్పుడు దారి తప్పివచ్చిన లేగలా కంపిస్తున్నాడు. అతను ఐహుశా మొదటిసారిగా బెంగుళూరు వచ్చినట్లున్నాడు. పరిశుభ్రంగా వున్న చొక్కా లాగు ధరించాడు. పాపిటతీసి దువ్విన జుత్తుతో ఎంతో వినయంగా కనిపించాడు. అతని కళ్ళలో మెరుపు ఇంక్షా అలాగేవుంది.

అసలు విషయానికి వచ్చాను. “చదువులో నువ్వు సాధించిన విజయం మాకు సంతోషం కలిగించింది. ఇంకా చదువుకోవాలను కొంటున్నావా? నిన్ను సంతోషంగా స్పాన్సర్‌ చేస్తాము. నువ్వు ఏ కోర్సులో చేరదలచుకొన్నా ఎక్కడ చదవాలనుకొన్నాసరే, ఫీజులు మేము భరిస్తాం.”

అతను పెదవి విప్పలేదు.

అప్పుడక్కడ నాతోపాటే సీనియర్‌ కొలీగ్‌ ఒకరు చిరునవ్వుతో నన్ను వారించారు. “అంత తొందరెందుకు. మీరు చెప్తన్నదేమిటో అతను అర్థం చేసుకోనివ్వండి. సొయంకాలంలోగా జవాబు చెప్పనిద్దాం” అన్నారు.

మనసనే నిజాయితీ చిరునామా త్ర

ఆ తర్వాత వెళ్ళేముందు హనుమంతప్ప మెల్లిగా అయినా స్థిరంగా ఇలా చెప్పాడు. “మేడమ్‌, బళ్ళారిలో ఉన్న టీచర్స్‌ టైనింగ్‌ కాలేజీలో చదవాలనుకొంటున్నాను. మావూరికి అదే దగ్గర”

వెంటనే సరేనన్నాను కానీ, అతనికి ఇంకేదైనా కోర్సు చదవాలన్న ఆశ ఉందేమో తెలుసుకోవాలని కాసేపు మాట్లాడాను. అతను ఏ కోర్సు ఎంచుకొన్నా, మేము ఫీజులు చెల్లిస్తామని స్పష్టం చేసే ప్రయత్నంచేశాను. అయితే తన మనసులో ఏముందో, తనకేం కావాలో అతనికి బాగానే తెలుసనిపించింది.

“న్పీళక్సు నెలనెలా ఎంతసొమ్ము పంపించమంటావు? ఆ కాలేజీలో వాస్టల్‌ సదుపాయం ఉందా?” అని అడిగాను.

వివరాలు తెలియవంటూ, తెలుసుకొని ఉత్తరం రాస్తానని చెప్పాడు.

నెలకు సుమారు 300 రూపాయలు అవసరమవుతాయంటూ, అతను రెండు రోజుల్లో తన చక్కని దస్తూరీలో ఉత్తరం రాశాడు. అతను, అతని మిష్రుడు కలిసి గది అద్దెకు తీసుకొని, సొంతంగా వంటచేసుకొని ఖర్చులు తగ్గించుకోవాలని నిశ్చయించు కొన్నట్లు తెలిపాడు.

వచ్చే ఆరునెలల ఖర్చుకోసం రూ. 1800 పంపిస్తే వెంటనే డ్రాఫ్సు అందిందని కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరం రాశాడు.

కొంతకాలం గడిచింది. హనుమంతప్పకు వచ్చే ఆరునెలలకు సొమ్ము పంపాలన్న విషయం ఒకరోజు హఠాత్తుగా గుర్తొచ్చింది. రూ. 1,800 లకు మరొక బ్యాంకు డ్రాఫ్టు పంపించాను.

ఈ సారికూడా అందినట్లు వెంటనే ఉత్తరం రాశాడు. అయితే కవరులో లేఖతోపాటు కాన్ని కరెన్సీనోట్లు ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. “మేడమ్‌, వచ్చే ఆరు నెలలకు మీరెంతో దయతో సొమ్ముపంపారు. అయితే గడచిన రెండు నెలలు నేను బళ్ళారిలో లేను. ఒకనెల మాకాలేజీకి సెలవులు, ఆతర్వాత నెలంతా సమ్మెతో గడచిపోయింది. అందువల్ల నేనీ రెండునెలలూ ఊళ్ళోనే ఉన్నాను. ఈ రెండు నెలల్లో నాఖర్చు తగ్గింది. అందువల్ల ఈ రెండు నెలల్లో మిగిలిన రూ. 3800 మీకు పంపుతున్నాను. దయచేసి ఈ సొమ్ము స్వీకరించండి” అని రాశాడు.

నేను నివ్వెరపోయాను. అంతపేదరికంలోనూ ఇంత నిజాయితీయా!

నేనేమీ అతని నెలసరి ఖర్చులకు లెక్కలు అడగనని హనుమంతప్పకు తెలుసు. అయినా మిగిలిన డబ్బును తిప్పిపంపాడు. నమ్మలేని నిజం.

ఖే జ్ఞానం - వరిజ్ఞానం

నిజాయితీ అన్నది ఏ ప్రత్యేక వర్గానికో సంకేతంకాదు. విద్యతోకానీ, సంపదతోకానీ దానికి సంబంధం లేదని కూడా నాకు అనుభవంలో తెలిసివచ్చింది. అది ఏ యూనివర్శిటీ లోనో బోధిస్తే వచ్చేది కాదు. ఎక్కువ మందిలో అది హృదయం నుంచి సహజంగా పెల్లుబుకుతుంది.

ఈ అమాయక గ్రామీణ బాలుని నిజాయితీకి ఎలా స్పందించాలో నాకు తోచలేదు. భగవంతుడు హనుమంతప్పకు, అతని కుటుంబానికి ఎప్పటికీ శుభం కలిగించాలని ప్రార్థించాను.

లో మః

౭ ల్ల మానవ బలటానతలు ఆఅ; ఏళ్ళ క్రిందట నేను చీఫ్‌ సిస్టమ్స్‌ అనలిస్టుగా పనిచేసేదాన్ని ఉద్యోగ విధుల్లో భాగంగా ప్రాజెక్టు పని నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వచ్చేది. ఒకోసారి చిన్న పల్లెలకు, ఒకోసారి దగ్గరి నగరాలు, పట్టణాలకు వెళ్ళాల్సి వచ్చేది. తరచుగా సెలవు రోజుల్లోకూడా ప్రయాణాలు తగిలేవి.

ఒక శుక్రవారం వారాంతపు సెలవుకోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. శని, ఆదివారాల తర్వాత సోమవారం ఏదో పండుగ ఉంది. అందువల్ల వరుసగా మూడు రోజులు సెలవులు కలిసి వస్తాయని అక్కా చెల్లెళ్చం మా స్వస్థలమైన షిగ్గాంలోని మాఅమ్మమ్మ ఇంటిలో కలసి సరదాగా గడపాలనుకొన్నాం.

శుక్రవారం ఎప్పుడయిపోతుందా అని తొందరపడుతున్నాను. ఆదివారం పౌర్ణమి. అందువల్ల పున్నమి వెన్నెలలో విందుచేసుకోవాలనుకున్నాం. ఉత్తర కర్ణాటక ప్రజలకు వెన్నెల్లో విందుభోజనాలంటే మహాఇష్టం. ఆరోజు ఆఫీసులో అందరం పని త్వరగా పూర్తిచేసుకొని బయటపడే ప్రయత్నంలోవున్నాం. సరిగ్గా అప్పుడే “కులకర్ణీ! ఒకసారి నా ఆఫీసులోకి రాగలరా” అని పిలుపు వినిపించింది.

అదిరిపడ్డాను. అది మాబాస్‌గొంతు. (కులకర్ణి అన్నది పెళ్ళికాక ముందు నా ఇంటిపేరు ఆయన కంఠస్వరాన్నిబట్టి అదేదో అర్జెంటు వ్యవహారమే అనుకొన్నాను. ఆఫీసు నుంచి బయటకు నడుస్తున్నప్పటికీ, సంగలేమిటో తెలుసుకుందామని ఆయన ఆఫీసులోకి వెళ్ళాను.

“మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు మన్నించాలి. అత్యవసరంగా మీరో వ్యవహారం చకృబెట్టాలో అంటూ నాకో ఉత్తరం అందించారాయన. రెండు రోజుల్లో నేనో ప్రాజెక్టు స్థలాన్ని సందర్భించాలని ఆ ఉత్తరంలో తెలిపారు. ఇబ్బందేమీలేదు సర్‌ ఆపని చూస్తాను అన్నాను. వారంలో అన్నిరోజులూ, రోజంతా పనిచేయడానికి అలవాటు పడ్డాను. అందువల్ల నాప్రయాణాన్ని రద్దుచేసుకొనడానికి నేనేమీ బాధపడలేదు. విందులు, విహారాలకంటే, నావిధి నిర్వహణే నాకు ఎక్కువ సంతోషం కలిగిస్తుంది.

మర్నాడు ఉదయం ్రాజెక్టపనిఉన్న పట్టణానికి బయలు దేరాను. పట్టణం చేరేసరికి, అప్పటికే మధ్యాహ్నం అయింది. అదో చిన్న పట్టణం. అక్కడి వాతావరణం అప్పుడే

గ జ్ఞానం - పరిజ్ఞానం తెల్లవారినట్లుగా ఉంది. దుకాణాలు అప్పుడే తెరుస్తున్నారు. జనం పనులమీద బయలు దేరుతున్నారు.

బస్‌స్టాండు నుంచి నడుస్తుంటే, ఒక కుర్రవాడు నావేపు పరుగెత్తుకుంటూ వచ్చి “క్షమించాలి, ఆలస్యమైపోయింది మేడం. నేను బస్‌స్టాండుకు రావాల్సింది” అన్నాడు. అతను మాఖాతాదారు ప్రతినిధి. నన్ను వారి ఆఫీసుకు పిలుచుకు పోవడానికి వచ్చాడు.

కొన్ని నిముషాల్లో ఆఫీసు చేరుకొన్నాం. అదో చిన్న కార్యాలయం. ఆధునికంగా లేదుకానీ, 'పాతఫర్నిచర్‌ను మరమ్మత్తులతో బాగుచేసి ఏదిఎక్కడుండాలో అక్కడ చక్కగా అమర్చారు. వాళ్ళంతా నాకోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ కుర్చీలో కూర్చునేసరికి ఏదో హాయిగా ఉన్నట్లనిపించింది. వాళ్ళిచ్చిన చల్లని మజ్జిగ మరీ హాయి కలిగించింది.

నా పని ప్రారంభించేముందు, చక్కని దుస్తులు ధరించిన ఒక యువకుని పరిచయం చేశారు. నాకు-సహకరించాల్సిన అతను మర్యాద తెలిసిన, ఆత్మవిశ్వాసంకల చురుకైన వ్యక్తిలా కనిపించాడు. అతని పనిలో నాణ్యత చూసి సంతోషించాను. కొంచెం ఆశ్చర్యం కూడా కలిగింది. అతని పనిలో వృత్తి నైపుణ్యం కనిపించింది. పుస్తక పరిజ్ఞానంలో అక్కడ అతన్ని మించినవారు. లేరనికూడా తెలిపారు.

అతను తాను చేసిన పనినంతా చక్కగా పత్రాల్లో నమోదు చేశాడు. అందువల్ల మా పనిని అనుకొన్నదానికంటే ముందుగానే పూర్తిచేయగలిగాం. ఇక కాసేపట్లో బయలు దేరతాననగా, మరచిపోకుండా అతన్ని అభినందించాను. నా పొగద్తతో అతను సంతోషంతో పొంగిపోయాడు. దగ్గర్లోనే ఉన్న వాళ్ళింటికివచ్చి టీ తీసుకోవాలని పట్టుపట్టాడు. అతని ఇల్లుకూడా శుభ్రంగావుంది. టీ తాగే సమయానికల్లా అతను తన వ్యక్తిగత విషయాలు చెప్పడం ప్రారంభించాడు. తనతల్లి తండ్రుల గురించి, మొదటి ఉద్యోగం గురించి మాట్లాడాడు. భార్యను, రెండేళ్ళ కుమారుని పరిచయం చేశాడు. భార్య పాకశాస్త్ర ప్రావీణ్యం,

  • ఆమె కంఠమాధుర్యం, పాఠశాల రోజుల్లో ఆమె సాధించిన విజయాల గురించి ఎంతో

ఆరాధనగా వివరించాడు. ఇక కుమారుని పిలిచేసరికి ఆ అబ్బాయి బిరవీరా వచ్చి ముకుళిత హస్తాలతో నా పక్కన నిల్చున్నాడు. అతనలాచేయాలని శిక్షణ ఇచ్చినట్లుగాఉంది. తండ్రి పాటపాదమనే సరికి సన్నటి స్వరంతో ఒక నర్సరీ గీతం అందుకొన్నాడు.

బాలుని పాటను మెచ్చుకొంటున్నట్లు తలవూపాను. కొడుకు ప్రతిభను నేను ప్రశంసించిన తీరు అతనికి సంతృప్తి కలిగించలేదు. గోడమీద వేలాడదీసిన పాత చిత్రపటంలోని వర్ణమాల అక్షరాలను చూసి చెప్పమన్నాడు. ఇలాంటి పనులు పిల్లలకు ఇష్టం ఉండదు కానీ, పెద్దలు వారిచేత బలవంతంగా చేయిస్తారు. పాపం చిన్నారులు!

చివరికా బాబు చిరాకు ప్రదర్శించేదాకా ఆ ప్రదర్శన అలా అరగంటసేపు సాగింది. తల్లి తెలివిగా బాబును వంటింట్లోకి తీసుకెళ్ళింది. చిన్నారికి ఏ బిస్కట్టో, చాక్లెట్టో బహుమతిగా అంది ఉంటుందని ఆశించాను.

మానవ బలహీనతలు గౌ

కుమారుని గురించి నేను ప్రశంసలు వినిపించాలని తండ్రి ఆశిస్తున్నట్లు గ్రహించాను. “వీ బాబుకు ఇంతచిన్న వయసులో అంత ప్రతిభ ఉండడం గొప్పసంగతి” అన్నాను.

“ఆశ్చర్యమేముంది? నేనిచ్చిన శిక్షణ అలాంటిది మరి” ఎంతో గర్వంగా చెప్పాడు. అతని వరస చూస్తుంటే, రెండేళ్ళ కుమారునికి పుట్టినప్పటి నుండే శిక్షణ ఇస్తున్నాడని పించింది.

అంటే శిక్షణ ఇస్తే పిల్లలు ఇలా తెలివిగా తయారవుతారంటారా? అని అడిగాను.

“ాదుకాదు, వారసత్వం, జీన్స్‌ ప్రభావంకూడా ఎక్కువగానే ఉంటుంది. నాకొడుక్కి నాలక్షణాలే వచ్చాయి” అతని మొహం గర్వంతో వెలిగి పోయింది. ఇంకా ఏమంటాడో వినాలనిపించింది. నాబస్సు బయలుదేరడానికి ఎలాగూ ఇంకో గంట బ్రైముంది.

“కాలేజీ రోజుల్లో మీరు మంచి విద్యార్థిగా రాణించారనుకుంటాను” అన్నాను.

“అవును, స్కూలు, కాలేజీ రోజుల్లో నాకెప్పుడూ మొదటి ర్యాంకే వచ్చేది” తనను తానే మెచ్చుకొంటున్నట్లుగా చెప్పాడు.

“మీరు ఏ కాలేజీలో చదివారు” ఆసక్తిగా అడిగాను.

“హృున్లీలో బి.వి.బి. ఇంజనీరింగ్‌ కాలేజీలో చదివాను.

నా కుతూహలం పెరిగింది. నాకు హుల్లీ, ఆ కాలేజీ కూడా బాగా తెలుసు. గ్రాద్యుయేషన్‌ ఏ సంవత్సరం పూర్తిచేసారు? అని అడిగాను.

“972లో. నాది మొదటి ర్యాంకు”

“మీకు గోల్డ్‌ మెడల్‌ కూడా వచ్చిందా?”

“అవును ఆ యేడాది నాకు గోల్డ్‌మెడల్‌ వచ్చింది” అని ఎంతో ఉద్వేగంతో సమాధాన మిచ్చాడు.

అప్పటికి నాకతని స్వభావం అర్ధమైపోయింది. విచారంకూడా కలిగించింది.

“నాకోసారి మీ గోల్డ్‌మెడల్‌ చూపిస్తారా?” అని కోరాను.

హఠాత్తుగా అతని తీరు మారిపోయింది. “ఎందుకూ? నామాటమీద మీకు నమ్మకం లేదా?” అంటూ తొట్రుపడుకూ అడిగాడు.

“అలాంటిదేమీ లేదు. మీరు 1972లో సంపాయించిన గోల్డ్‌మెడల్‌ను ఒకసారి చూద్దామనిపించింది అంతే” అన్నాను.

“అది నాకెంతో అమూల్యమైంది. అందుకని బ్యాంకు లాకర్‌లో ఉంచాను”

తి జ్ఞానం - వరిజ్ఞానం

నేను వదలిపెట్టదలచుకోలేదు “ఏ బ్యాంకులో?” అని అడిగాను.

“ఆ వివరాలన్నీ మీకు నేనెందుకు చెప్పాలి?” నా ప్రశ్చలతో ఉదికిపోతూ రెట్టించి అడిగాడు.

కథంతా తెలిసిపోయింది. అతనికీ తెలిసిపోయి ఉందాలి. స్నేహశీల వాతావరణం చెదిరిపోయింది. నా బస్సుకు ట్రైమవుతోంది. ఇక బయలు దేరాలి.

తలుపు దగ్గరికి నడుస్తూ అతనికి చెప్పాను. “మీ బ్యాంకు గురించికానీ, గోల్డ్‌మెడల్‌ గురించికానీ తెలుసుకోవలసిన అవసరం నాకేమీ లేదు. అయితే ఆ మెడల్‌ మీదగ్గర ఉండే అవకాశంలేదని నాకు స్పష్టంగా తెలుసు” |

“ఎలా చెప్తారు? మరీ అంత నమ్మకంగా ఎలా చెప్తారు? అప్పటికతను బాగా కోపంగా ఉన్నాడు. '

“ఎందుకంటే, 1972లో ఆ గోల్డ్‌మెడల్‌ను నేను సాధించాను. ఏడాదికి ఒక్క గోల్డ్‌మెడలే ఇస్తారు” అని బాధగానే చెప్పాను.

ఈ మాటతో అతను నిర్ధాంతపోయి, అయోమయంగా చూశాడు. నేనతనివైపు తిరిగి మృదువుగా అడిగాను. “మీరు చాలా తెలివైనవారు. విధినిర్వహణలో సమర్భులు. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇందువల్ల మీకేమొస్తుంది?”

నేను కాలు బయట పెట్టగానే తలుపు మూతపడిన శబ్దం వినిపించింది. నా ప్రశ్నలకు అదే అతని సమాధానం.

ఎ్జుస్మల

తి నమ్రతనెర్చిన - సహ్యాద్రి కొండలు ఒి (రల యాడాలంటే నాకు ఎంత ఇష్టమోచెప్పలేను. కుగ్రామాలు, నిర్మానుష్యమైన పర్వత శిఖరాలు, కాకులు దూరని కారడవులు, ఈజిప్టలోనో, చైనాలోనో ఉందే చారిత్రక ప్రదేశాలు. ఇలా అనేక ప్రదేశాలలో పర్యటించడం నాకెంతో ఆనందోత్సాహాలు కలిగిస్తుంది. ఒక పర్యాయం నేను కర్ణాటకలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న సహ్యాద్రి పర్వతాలకు వెళ్ళాను. ఆరోజంతా తుంపర పడుతోంది. వర్నాల్లో అడవుల్లో ప్రయాణం

  • చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా జలగలు విపరీతంగా ఉంటాయి. వాటితో చాలా ప్రమాదం. అయినా సరే అక్కడ వెల్లివిరిసే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే, ఆ ప్రాంతాన్ని వర్షాకాలంలోనే సందర్శించాలి. అపురూపమైన చెట్లు, పొదలు, పూలువెదజల్లే పరిమళాలు, రకరకాల పక్షుల కిలకిలా రావాలు, రివ్వున వీచే స్వచృమైనగాలి. ఈ ఆనందాలు పట్టణాలు, నగరాల్లో మనకెప్పుడూ అనుభవానికి రావు. అడవిలోతట్టు ప్రాంతంలోని ఒక గిరిజన (గ్రామంలో నడుపుతున్న పాఠశాలకోసం నేను ఇంతదూరం వచ్చాను. నాకు ప్రమేయం ఉన్న ఒక ధర్మసంస్థ ఈ పాఠశాల అభివృద్ధికి సహాయపదాలని సంకల్పించింది. గిరిజన సముదాయాలను తండాలు అంటారు. ప్రతి తండాలో సాధారణంగా ఒక కులపెద్ద ఉంటాడు. ఆ నాయకుని తండప్ప అని పిలుచుకుంటారు. తెగలో అందరికంటె వయసులో పెద్దవాడైన తండప్పను ఆ తెగవారు తమ సర్వోన్నత అధికారిగా, ఇంచుమించు దైవంగానే గౌరవిస్తారు. అతనికి అందరూ రుణపడిఉంటారు. తండప్ప బాల్యంలో తనకు బోధించిన ఆచారాలపట్ల పూర్తి విశ్వాసంతో నడుచుకొంటాడు. ప్రతివారూ ఆ ఆచారాలను విధిగా పాటిస్తారు. నేనా పల్లెకు చేరేసరికి పెద్దవర్షం పడుతోంది. ఆ వర్షం, ఎండిపోతున్న ఆకులు, అదవిపూల ఘాటైన వాసనలు, ఇవన్నీ నేను ఇంకేదో గ్రహంలో ఉన్నాననే భ్రమను కలిగించాయి. అయితే అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిననే భావం కలగలేదు. చాలా దూరం నడిచి స్కూలుకు చేరినప్పుడు కూడా నాకలా అనిపించలేదు. గిరిజనులందరూ నన్ను తేరిపార చూస్తూ నిల్చున్నారు. స్కూలుకు చేరడమే ఒక సాహసయాత్రగా మారింది. తలమీద ఒకదానిపై మరొకటిగా అమర్చిన మూడు నీటి కుండల్లో నీరు ఒక్కచుక్క చిందకుండా

70 జ్ఞానం - పరిజ్ఞానం జా(గ్రత్తపడుతూనే, లయబద్ధంగా అడుగులేస్తూ వెళ్తున్న ఒక మహిళను చూశాను. ఆమెను ఆపి, స్కూలుకు ఎలా వెళ్ళాలి అని అడిగాను. ఆమె ఆశ్చర్యం వ్యక్తంచేసే శబ్బమేదో చేసి, నన్నాక చూపుచూసి చక్కా పోయింది. కొత్తవారితో పట్టణంనుంచి వచ్చిన వారితో మాట్లాడ్డం ఆమెకు ఇష్టంలేదేమో, లేకపోతే బహుశా అమెకు నాభాష అర్ధంకాలేదేమో,

తర్వాత జానపదగీతం ఆలపిస్తూ వెదురుబుట్ట అల్లుతున్న ఒక పెద్దాయన దగ్గరకి వెళ్ళాను. ఆయన ఎదుట దగ్గరగా వంగి “స్కూలు ఎక్కడ ఉంది” అని స్పష్టంగా, బిగ్గరగా అడిగాను. ఆయన మొహమంతా ఉత్సుకత పరచుకొంది. రకరకాల ప్రశ్నలు అడిగేలా కనిపించాడు కానీ ఏమీ అడగలేదు. ఆయన తమ మాండలికంలో ఏదో చెప్పి,

పాఠశాల రెల్లుగడ్డి కప్పిన ఒక పూరిల్లు, బహుశా గిరిజనులే నిర్మించు కున్నట్లున్నారు. అదో ప్రాథమిక పాఠశాల, కొందరు పిల్లలు స్కూలు బయట ఆడుకుంటున్నారు. మరి కొందరు గుడిసెలాంటి కప్పుకింద ఆకులు, గడ్డిపోచలతో ఏవో తయారు చేస్తున్నారు.

లోపలికి వెళ్ళిచూస్తే, రెండు కుర్చీలు, రెండు బల్లలు, ఒక నల్లబల్ల దాని పక్కన ఒక నీటి కుండ ఉన్న గది కనిపించింది. విద్యుద్దీపాలు, ఫ్యాన్నవంటివేమీ లేవు. గోడకో తలుపులేని పెద్ద రంధ్రం ఉంది. అదేకిటికీ అన్నమాట. ఆగదికి గాలి, వెలుతురు . అందులోంచే రావాలి.

అది ఆఫీసుగదిలా ఉంది కానీ, అందులో ఎవరూ లేరు. టీచర్‌లాంటి వారెవరూ చుట్టుపక్కల కనిపించలేదు. ఎవరైనా కనిపించకపోతారా అని పరికించి చూస్తుంటే, ఓ పెద్దాయన దగ్గరికి నడిచొచ్చి పలకరించాడు. నేనెవరో చెప్పి, ఈ స్కూలుకు ఎలాంటి సహాయం చేయగలమో తెలుసుకోడానికి వచ్చానని తెలిపాను. అయితే ఆయన స్పందించిన తీరు అట్టే ప్రోత్సాహకరంగాలేదు. ముందతనికి కాస్త సమయమిస్తే మంచిదని, ఇక్కడ మీ జీవితం ఎలా ఉందంటూ మొదలుపెట్టాను.

అతనా స్కూలు ఆవరణలోనే నివసించే వాచ్‌మెన్‌-కమ్‌-ప్యూన్‌ అని తేలింది. ఒకోసారి టూర్‌గైడ్‌గా పనిచేస్తాడు. అయితే అతను స్కూలుకు కానీ, ప్రభుత్వానికి కానీ జీతం-బిత్తెం ఉండే ఉద్యోగికాదు. ఆయన మనుమడు ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. ముసలాయన సేవలకు ప్రతిఫలంగా మనుమనికి ఉచితంగా చదువు చెప్తున్నారు. ఇక్కడ ఎంతకాలంగా ఉన్నారని అడిగితే, “చాలా ఏళ్ళుగా” అని రెండే మాటలతో జవాబిచ్చాడు. పాఠశాల ఆవరణలోనే ఒక చిన్న గుడిసెలో అతను నివాసం ఉంటున్నాడు.

అప్పటికి నాపట్ల అయన వైఖరిలో కొంత మార్చుకనిపించింది. అందువల్ల సంభాషణను మెల్లగా స్కూలు వ్యవవారాలపైకి మళ్ళించాను. అది ప్రభుత్వ పాఠశాల అని, ఇద్దరు టీచర్లు ఉన్నారని, దగ్గరినుంచి దూరంనుంచీ వచ్చే విద్యార్థులు సుమారు 50 మంది ఉన్నారని చెప్పాడు. పిల్లలు యూనిఫారం ధరించాలనే నిర్భంధంలేదు.

న్యయతనేర్పిన సవ్వ్యోది కొండలు 77

స్కూలుకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య నాకు సంతృప్తి కలిగించింది. తల్లితండ్రులు

స్కూలుకు వెళ్ళినవారు కారు. అలాంటి కష్టమైన జీవిత పరిస్థితుల్లో వారు పిల్లలను చదివించడం గొప్ప సంగతి.

“ఈ స్కూలును నడపడంలో మీ ఇబ్బందు లేమిటి?” అని అడిగాను. ముసలాయన సమాధానం చెప్పకుండా నన్ను దగ్గరలోని ఒక కుటీరానికి పిలుచుకొనివెళ్ళి, తనకంటే వృద్ధుడైన వ్యక్తికి పరిచయం చేశాడు. ఆయనే తండప్ప. తొంభైవళ్ళు పైబడిన వయసు. నా రాకపట్ల సంతోషం ప్రకటించాడు. "

ఇక్కడ కూడా అదే ప్రశ్న అడిగాను “ఈ స్కూలు నడపడంలో మీ ఇబ్బందు లేమిటి” అని.

వర్షాకాలంలో పిల్లలు స్కూలుకు రావడం, పోవడం కష్టమవుతోందన్నాడు. పైగా వర్షాకాలం స్కూలుకు వేసుకువెళ్ళే దుస్తులు ఆరవు. సాదాసీదా సమస్యలు. నాపనిలో అనేక మంది నుంచి ఇటువంటి సమస్యలెన్నో విన్నాను.

అక్కడి మనుష్యులు, వారిజీవితాల గురించి చాలా వరకు అవగాహన చేసుకొని వారి సహకారానికి మరచిపోకుండా కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాను. పిల్లలకు కొన్ని గొడుగులు, దుస్తులు తీసుకొని ఆవూరు మళ్ళీ రావాలని నిర్ణయించుకొన్నాను.

మళ్ళీ వెళ్ళినప్పుడు అది శీతాకాలం. వానాకాలం ముగిసింది. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. భూలోక స్వర్గంలా ఉంది. ఎక్కడా బురదలేదు. కప్పల బెకబెకలు వినిపించలేదు. పిట్టలు కువకువలాడుతున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. అరుదైన రకరకాల పూలు వికసించి వున్నాయి. తండప్పను కలిసాను. ఆయన నన్ను గుర్తుపట్టి చిరునవ్వు నవ్వాడు. ఆయన కళ్ళు నన్ను సంతోషంగా స్వాగతిస్తున్నట్లు మెరిశాయి.

“ఇక్ష్మడి పిల్లలకోసం వీటిని తెచ్చాను. దయచేసి స్వీకరించండి. కిందటిసారి వచ్చినపుడు వారికేమివ్వాలో నాకు తెలియదు” అంటూ ఒక పెద్దసంచీని ఆయనకు అందించాను.

తండప్ప దాన్ని అందుకోడానికి సంకోచించాడు. ఆయనకు ఇబ్బందిగా ఉందేమో ననిపించింది. “మీరెలాంటి బహుమతి కోరలేదు. నేనే తెచ్చాను. ఇవి వర్షాకాలంలో పిల్లలకు ఉపయోగపడతాయి. దయచేసి వారిసైజుకు తగిన దుస్తులు కుట్టించండి” అన్నాను.

ఆయన ఒక్క మాటకూడా అనకుండా మౌనంగా కుటీరంలోకి వెళ్ళిపోయారు. ఆ

దగ్గర్లో నిల్చుని చూస్తున్న పిల్లలను మీరేం నేర్చుకోవాలను కొంటున్నారు అని అడిగాను. ఒక్కరు కూడా పెదవి విప్పలేదు. ఎంతో బుజ్జగించిన తర్వాత కొందరు పసివాళ్ళు నా దగ్గరికి వచ్చారు కానీ మాట్లాడ్డానికి సిగ్గుపడుతున్నారు. వారికి బోలెడు కబుర్లు చెప్పి

72 జ్ఞానం - పరిజ్ఞానం ప్రసన్నం చేసుకోడానికి తంటాలు పడ్డాను. ఎట్టకేలకు ఒక పిల్లవాడు నోరు తెరిచాడు. “మేము కంప్యూటర్లు గురించి విన్నాం కానీ వాటిని టీవీలో తప్ప ఇంకెక్కడా చూడలేదు. మాకు కంప్యూటర్ల గురించి తెలుసుకోవాలనిఉంది. మీదగ్గర కంప్యూటర్ల గురించి కన్నడంలో రాసిన పుస్తకాలేమైనా ఉన్నాయా?”

టీచర్‌ కుటుంబంలో పుట్టిపెరిగి, స్వయంగా టీచర్‌ అయిన నేనా పిల్లల మాటలకు మురిసిపోయాను. అలాంటి వెనుకబడిన ప్రాంతంలోని పిల్లల్లో ఇంతకొత్త, ఆధునిక భావాలు ఉండడం ఆశ్చర్యం కలిగించింది.

అలాంటి వుస్తకాలకోసం బెంగుళూరులో వెతుకుతానని చెప్పాను. ఎక్కడా దొరక్కపోతే, నేనే అలాంటి పుస్తకం ఒకటి రాస్తానని వారికి మాట ఇచ్చాను. వాళ్ళు భలే సంతోషించారు. ఇంతలో తండప్ప గుడిసెలోంచి తిరిగొచ్చాడు. ఆయన చేతుల్లో ఏదో ఎర్రని ద్రవపదార్థం నింపిన సీసా ఉంది.

ఆయనా సీసాను నాకు అందిస్తూ “అమ్మా! మీకేది ఇష్టమో, మీరు ఇంట్లో ఏమి తాగుతారో మాకు తెలియదు. ఇది చాలా ప్రత్యేకమైన పానీయం. ఈ అడవి ప్రాంతంలో మేం దీన్ని వేసవిలో తయారు చేస్తాం. కనీసం రెండు వానాకాలాలు చెడిపోకుండా ఉంటుంది. వేసవిలో ఇక్కడొకరకం ఎర్రని అడవిపండ్లు దొరుకుతాయి. ఆ పండ్ల నుంచి రసం తీసి నిల్వచేస్తాం. పంద్లరసంలో మరేదీ కలపం. ఇది ఆరోగ్యానికి మంచిది. కప్పునీటిలో ఈ రసం కొంచెం కలిపి కుదిపి తాగాలొ అన్నాడు.

ఇబ్బందిగా అనిపించింది. ఈ పేద ప్రజలనుంచి బహుమతి ఎలా తీసుకోగలను? వారికే తినడానికి, తాగడానికి చాలినంత లేదు. నేనిక్కడికి ఇవ్వడానికి వచ్చానేకాని తీసుకోడానికి రాలేదు. కాసేపు ఆలోచించి మర్యాదగా వద్దని చెప్పేశాను.

తండప్ప గంభీరంగా చెప్పాడు. “అమ్మా! అయితే మేంకూడా మీ బహుమతిని తీసుకోలేం. మా పూర్వీకులు తరతరాలుగా ఈ అడవిలోనే బతికారు. వాళ్ళు, వారి సాంప్రదాయాలను మాకు నూరిపోశారు. మీరు మాకేదైనా ఇవ్వదలచుకొంటే, మేము మీక్కూడా ఏదైనా ఇవ్వగలిగితేనే దాన్ని స్వీకరిస్తాం. మీరు మా బహుమతిని తీసుకొంటే తప్ప, మాకోసం మీరుతెచ్చిన వస్తువుల్ని తీసుకోలేం”

నేను దిగ్భాంతి చెందాను. ఇబ్బంది పడ్డాను. కించపడ్డాను. నా అనుభవంలో ఇలాంటి సన్నివేశం ఎన్నడూ ఎదురుకాలేదు. ధర్మ సంస్థలు ఏదైనా సహాయం అందజేస్తే ప్రజలు కృతజ్ఞతలు చెప్పడం రివాజు, ఎన్నో సందర్భాలలో ఫిర్యాదులు కూడా విన్నాను. ఎన్నో సమస్యలుంటే ఒక దానిని పరిష్కరిస్తాం. లబ్ధిదారులు మేముచేసిన సహాయానికి కృతజ్ఞతలు చూపేబదులు, సణగడం అసాధారణమేంకాదు. సహాయం చాలలేదని స్వీకర్తలు ఫిర్యాదు చేసిన సందర్భాలుకూడా ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులన్నిటినీ తేలిగ్గానే తీసుకొన్నాను కానీ బాధపడలేదు. స్పందనల్లో కాక ఇవ్వడంలోనే సంతృప్తిని అనుభవించాను.

నధ్రుతనేర్పిన నవ్వోద్రి కొందలు 73 ఇప్పుడీ సహ్యాద్రి అడవిలో ఒక వృద్ధుడు, చదువుకోని గిరిజనుడు - ఇవ్వగలిగితేనే స్వీకరించు, ఇవ్వకుండా ఏదీ స్వీకరించకు అనే అత్యంత నియమబద్ధమైన, జీవన తత్వాన్ని ఆచరిస్తున్నాడు. ఇది అత్యున్నత సంస్కారం. మేనేజిమెంటు కాలేజీల్లో ఈ సంస్కారాన్ని సంస్కృతిని బోధించరు. ఆ గిరిజనపెద్ద ఇచ్చిన బహుమతిని చిరునవ్వుతో, మర్యాదగా స్వీకరించాను. “స్వీకరించడంలోకూడా బెదార్యం ఉందో అని ఆయన వ్యాఖ్యానిస్తుంటే, నాదృష్టిలో ఆయన బెన్నత్యం మరింత పెరిగిపోయింది. లో ఆ్గ్లం

డ్తే దుఃఖం కలిగించని మరణం బెంంంం వంటి నగరజీవితాల్లో పనుల తొందర, ఒత్రిడి విపరీతంగా పెరిగిపోయి, మన పొరుగింట్లో ఎవరున్నారో కూడా తెలుసుకోలేక పోతున్నాం. ఎప్పుడూ పనీ, పనీ అంటూ బిజీగా ఉంటున్నాం. మనకు ఆలోచించే సమయం కూడా ఉండటం లేదు. ఇరుగు పొరుగు కుటుంబాలతో స్నేహసంబంధాల రోజులు పోయాయి. ఒకసారి మా పొరుగు కుటుంబంలో ఎవరో చనిపోయారని తెలిసింది. వాళ్ళెవరో నాకు అట్టే తెలీదుకానీ మా అమ్మేమో, నన్ను ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి రమ్మంది. మన సమాజంలో ఇది సంప్రదాయమంటూ ఆమె వాదించింది. సరేనన్నాను కానీ అనేక రోజుల వరకు, వాళ్ళింటికి వెళ్ళడానికి నాకు సమయమే చిక్కలేదు. పగలంతా ఎప్పుడూ పనుల ఒత్తిడి. తీరికే ఉండటంలేదు. మరి ఇటువంటి పరామర్శలు చేయడానికి రాత్రిపూట వెళ్ళడం ఉచితం కాదంటారు. అలా నా సంతాప సందర్శన పదేపదే వాయిదా పదుళూ వచ్చింది. అయితే వెళ్ళాలనే ఆలోచన మానుకోలేదు. దుఃఖంలో ఉన్న మా పొరుగు వారిని పరామర్శించి రావాలని అనుకొంటూనే ఉన్నాను. పది రోజులు గడిచిపోయాయి. అపరాధ భావం బాధిస్తూండటంతో, ఒక ఆదివారం ఏదిఏమైనాసరే వాళ్ళింటికి వెళ్ళితీరాలని నిర్ణయించుకొన్నాను. నాకా ఇంటి పెద్ద మాత్రమే, అదీ కొద్దిగా తెలుసు. వారి ఇంటిగేటు దాటి నడుస్తుంటే, జనం మెచ్చుకొనే ఒక కన్నడ సినిమాపాట తాలూకు సంగీతం బిగ్గరగా వినిపిస్తోంది. ఆవరణలోని విశాలమైన తోటలో పిల్లలు దాగుడు మూతలు ఆడుతున్నారు. గ్రామం నుంచి వచ్చినట్లున్న కొందరు స్తీ, పురుషులు తోటలో కూర్చుని చాలా కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక క్షణం, పొరపాటున వేరేఇంట్లోకి అడుగు పెట్టానేమో ననుకున్నాను. అరుదుగా అయినా అలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. (కొంతకాలం క్రితం నా విద్యార్ధి పెళ్ళికి వెళ్ళాలని బయలుదేరాను. జయానగర్‌లో అశోకస్తంభం దగ్గరున్న సాగర్‌గ్రూపు కళ్యాణమండపాల్లో పెళ్ళి. అక్కడ వరుసగా నాలుగు హాళ్ళున్నాయి. నా విద్యార్థి వివాహం ఏహాలులో జరుగుతుందో మరచిపోయాను. అయితే పెళ్ళికుమార్తె పేరు ఉష వధూవరుల పేర్లు పూలతో చిత్రించిన స్వాగత తోరణాలు చూసి ఆశ్చర్యంలో మునిగిపోయాను.

దుఃఖం కలిగించని మరణం ్‌

రెండు తోరణాల్లో వధువు పేరు ఉషఅని ఉంది. వరుని పేరు గుర్తులేదు. ఏమిచేయాలో దిక్కుతోచక, తెలిసిన మొహమేదైనా కనిపిస్తుందేమోనని చూస్తూ, అ రెండు హవాళ్ళమధ్య నిల్చున్నాను).

ఇప్పుడిక్కడ నా పొరుగింట్లో, అనూహ్యంగా సంగీతం విని, ఆ సంతోషకర దృశ్యాలు చూసిన తర్వాత, ఇంటికి వెనక్కివెళ్ళి మా అమ్మనడిగి కరెక్టు చిరునామా తెలుసుకొంటే మంచిదనుకున్నాను. సరిగ్గా, అప్పుడే ఆ ఇంటిపెద్ద బయటికి వచ్చి నన్ను చూశారు.

ఆయన ఉత్సాహపడిపోతూ “ఏమి ఆశ్చర్యం! రండి లోపలికి రండి. మీరు మా ఇంటికి మొదటిసారి వస్తున్నారనుకుంటాను” అన్నారాయన.

లోపలికి వెళ్ళక తప్పలేదు. ఆయనలోనికి వెళ్ళి, భార్యను పిలుస్తుంటే, నేనా పెద్ద ఇంటిని, ఇంట్లో వస్తువులు అమర్చిన తీరును పరికించి చూశాను. లివింగ్‌ రూము చాలా విశాలంగాఉంది. ఒకమూల వి.సి.ఆర్‌ తో టి.వి. సెట్‌ఉంది. వీడియో “కహోనా ప్యార్‌ హై” అన్న హిందీ సినిమాలోని పాట వినిపిస్తోంది. రూములో చాలామంది పిల్లలున్నారు. పెద్దదాపమీద, మూడు సోఫాలమీద, మొత్తం తివాచీ మీదంతా పిల్లలే కూర్చుని, సినిమా చూస్తున్నారు. మేము కూర్చునేందుకు చోటు కనిపించక పోయేసరికి, ఇంటి పెద్ద కొందరు పిల్లలను నేలమీద కూర్చోమని, నాకు చోటు కల్పించారు.

టెలివిజన్‌ తెరమీద హృతిక్‌ రోషన్‌ డాన్స్‌ చేస్తున్నాడు. పిల్లలు పాదాలతో తాళంవేస్తున్నారు.

నౌకరు ట్రేలో భక్ష్యాలు, ఒక కప్పులో టీ తీసుకొచ్చాడు. పరామర్శించడానికి వచ్చి స్వీట్లు తినడం ఏంబాగుంటుందన్న చింతతో నాకేమీ తోచకుండాపోయింది.

తినడం ఉచితం కాదనిపిస్తోంది కానీ, నిరాకరించడం అమర్యాదగా ఉంటుంది. “నేనింకా స్నానం చేయలేదు. ఇప్పుడు తినలేను” అంటూ తప్పుకో చూశాను.

అంతటితో నాసమస్య పరిష్కారం కాలేదు. ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొనిఉంది. ఎవరిలోనూ విచారం, దుఃఖం కనిపించడంలేదు. నా సానుభూతిని, సంతాపాన్ని ఎలా వ్యక్తం చేయాలి? వాళ్ళేదో పుట్టినరోజో, నిశ్చితాద్ధ కార్యక్రమమో చేసుకొంటున్నట్లు ఉల్లాసంగా ఉన్నారు. నేనేమో సంతాపం తెలపడానికి వచ్చాను.

నేనిలా ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా, ఇంటామె వచ్చింది. భార్యాభర్తలు నాకుర్చీ పక్కన సోఫాలో కూర్చున్నారు. సంభాషణ వాళ్ళే ప్రారంభించారు. “మీరు చేస్తున్న పనిగురించివిని మేం చాలా సంతోషించాం. మేం ప్రతిరోజూ మీగురించి మాట్లాడుకాంటుంటాం” అన్నారు.

25 జ్ఞానం - వరిజ్ఞానం

నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ప్రతిరోజూ నాగురించి ఎందుకు మాట్లాడుకోవాలి? నేను ప్రతిరోజూ ఎవరి గురించీ, నాభర్త గురించి కూడా మాట్లాడను. వాళ్ళు ఏపని గురించి మాట్లాడుకొంటారు? నా రచనలు గురించా? నా సంఘసేవ గురించా?

నా మౌనాన్ని వారు గమనించారు కానీ ఉద్వేగంగా మాట్లాడుతూనే ఉన్నారు. “మీ భర్తఎలా ఉన్నారు? ఆయన నిజంగా చాలా గొప్పమనిషి.

విచారంలో మునిగి ఉండాల్సిన ఈ కుటుంబ సభ్యులు నాభర్త గురించి మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగించింది.

భార్యా భర్తలు ఇంకా చాలా మాట్లాడాలని ఉత్సాహపడిపోతున్నారు.

“మొన్న మీరు ధరించిన చీర చాలా అందంగాఉంది. పటోలా చీర అనుకుంటాను. అది పటోలా చీరా, ఒరిస్సా చీరా? రెండింటి నేత ఒకే రకంగా ఉంటుంది” అని ఇంటామె చెస్తంటే, ఆమె ఏ చీర గురించి మాట్లాడుతోందో నాకు గుర్తు రాలేదు. “ఒరిస్సా చీర కావచ్చు” అని సందేహంగా చెప్పాను.

సంతోషంతో అమె మొహం చేటంతయింది. విజయ గర్వంతో ఉప్పాంగిపోతూ “చూశారా, నేనన్నదే నిజం. నేను సుమన్‌కు అదే చెప్పాను. ఆమె ఒరిస్సాలో చాలాకాలం పనిచేసారు కనుక ఆ చీర అక్కడే కొని ఉంటారన్నాను. రంగులకలయిక భలే అందంగా ఉందొ అన్నదామె.

ల ఇక భర్తవంతు, “మీ కంపెనీ చాలా బాగా నడుస్తోంది. డాట్‌కామ్‌ వ్యామోహంలో పడకుండా నిలదొక్కుకుంది. గత అరు నెలల్లో ఐ.టి. కంపెనీల తీరును ఆధ్యయనం చేయాలని నేను కొందరు మిత్రులకు చెప్పాను”.

ఇదె నాకు సంబంధించిన వ్యవహారం కాదు. కంపెనీల తీరు గురించి మా ఆయన ఏదైనా చెప్పగలరేమోకానీ, ఆయనిక్కడ లేరు.

ఇక భార్య అందుకుంది. “మీ కాలేజీలో అడ్మిషన్ల పద్ధతేమిటి? పదోతరగతిలో 85 శాతం మార్కులు వస్తే చాలా? అడ్మిషన్‌ దొరుకుతుందా?”

“ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి.లో కాదు ఐ.సి.ఎస్‌.ఇ .లో” అంటు భర్త వెంటనే సవరించాడు పాఠశాల విద్యకు సంబంధించిన వివిధ బోర్డులు గురించి కూదా ఆయన వివరించారు,

“నాకు తెలియదు. నేను అడ్మిషన్‌ కమిటీలో లేను” అని చెప్పాను. మా సంభాషణ అలా సొగిపోయింది. దానికి అంతమంటూ ఉన్నట్లు లేదు.

కొంతసేపు గడిచిన తర్వాత, అసలీ ఇంట్లో ఎవరు చనిపోయారా అని

. . యోచించసాగాను. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు, చనిపోయింది ఆయన తల్లి. ఆ ముసలామె మా అమ్మ స్పేపొతురాలు. అయితే ఆ విషయం ఎలా ప్రస్తావించాలో

దుఖం కలిగించని మరణం 7

తోచలేదు. ఒకవేళ చనిపోయినామె ఈవిడ తల్లి అయితే? అందువల్ల జాగ్రత్తగా మాట్లాడాలి.

నా మౌనాన్ని వాళ్ళు గమనించే ఉంటారు. కాని నన్ను ఏదో మాటల్లోకి దించాలని

ప్రయత్నిస్తున్నారు. మొత్తం వ్యవహారం నాకు ఇబ్బందికరంగా ఉంది. నా సంతాపం

తెలిపే అవకాశం ఇక ఎలాగూ రాదనిపించింది. అయితె వెళ్ళిపోయేలోగా, కర్రవ్యం నెరవేర్చాలనిపించింది.

ఎట్టకేలకు మేం గేటు దగ్గరికొచ్చినప్పుడు సంశయిస్తూనే “మీ అమ్మగారికి వంట్లో బాగాలేదని........”

నేనింకా వాక్యం పూర్తిచేయలేదు. భర్త సమాధానం చెప్పకముందే భార్య అందుకుంది. “అవును మాఅత్తగారికి చాలాకాలంగా వంట్లో బాగాలేదు. అయితే మేం చాలా కష్టాలు పడ్డాం. ఆమె చాలా పాతకాలం మనిషి పరిస్థితులతో సర్దుకుపోలేక పోయింది. పనిమీద బయటకు వెళ్ళిపోయే ఈ మగవాళ్ళకు ఇంట్లో ఆడవాళ్ళ కష్టాలు తెలియవు”.

భర్త ఏదో అపరాధం చేసినట్లు చూస్తుంటే, ఆమె అత్తగారి గురించి ఏమిటేమిటో చెప్పసాగింది.

ఒక దశలో 'ఆమె చాలా బాధను అనుభవించింది అంటూ ఆయన జోక్యం చేసుకొన్నాడు. _

“నిజ్రానికి బాధలన్నీ పడింది మేమూ” అంటూ భార్య దులిపేసింది. “ఇటీవల ఆమె పక్షవాతంతో మంచం పట్టింది. అలాంటి వాళ్ళను చూసుకోవాలంటే నౌకర్లు కావాలి. బెంగుళూరులో మంచి నౌకరు దొరకాలంటే ఎంత కష్టమో, ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసు. ఆమెకు సేవలు చేయలేక నేను విసుగెత్తిపోయాను. పీడావదిలింది” ఆమె కంఠం చాలా కఠినంగా ఉంది.

“ఆమె మరణంతో మా అందరి సమస్యలూ తీరిపోయాయి. మా అమ్మ ఎట్టకేలకు బాధనుంచి విముక్తి పొందింది” అని ముగించాడు భర్త.

ఎంతో బాధతో, కలతతో ఇల్లు చేరాను.

మనజీవితాలు ఎంత బిజీ అయిపోయాయి? ్రేమాస్పదులైన వారు మరణిస్తే వారి ఉపయోగాన్ని బట్టే మన దుఃఖం ఆధారపడి ఉంటుందా?

లో జ్తం

త్‌ అట వల ఆపరేషన్‌ థియేటర్‌లో షి హోరాహోరీ పోరు మౌన్నాం డాక్టరు. వైద్యకళాశాల ప్రొఫెసర్‌గా చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు. ప్రసూతి, స్రీ వ్యాధుల సబ్టెక్టు బోధించేవారు. ఆయన సుద్‌ర్హ ఉపన్యాసాలతో విద్యార్థులను చికాకు పెట్టేవారు కాదు. తన లెక్చర్లను ఆసక్తికరంగా మార్చడానికి విద్యార్థులకు అప్పుడప్పుడు కథలు చెప్పేవారు. సాధారణంగా తన జీవితానుభవాలను కథలుగా మలిచి చెప్పేవారు. అందువల్ల ఆయన క్లాసులు ఉత్సాహంగా ఉంటాయని విద్యార్థులంతా హాజరయ్యేవారు. నేనొకసారి “మెడికల్‌ క్లాసులో మీరు కథలెందుకు చెప్తారు” అని అడిగాను. “పంచతంత్రను ఎందుకు రచించారో తెలుసా?” అని ఆయన నన్ను ఎదురు (ప్రశ్నించారు. “నైద్యశాస్తానికి, పంచతంత్రకు సంబంధమేముంది? ఆ కథలు స్కూలు పిల్లలకు చెప్పాలికాని, వైద్య విద్యార్థులకు కాదు” అని వాదించాను. మా నాన్న ఒప్పుకోలేదు. “కథలు ఉదహరించిచెప్తే, విద్యార్థులు సులభంగా అద్ధం చేసుకోగలుగుతారు. అంతేకాదు, పాఠం ఆసక్తి దాయకంగా ఉన్నా సరే ఏకబిగిన 45 నిముషాలసేపు విద్యార్భలను సావధానంగా ఉంచడం చాలా కష్టం. అందువల్ల మధ్యమధ్య కథలుచెప్తే, వాళ్ళు రెండు గంటలపాటు ఏకాగ్రతతో వింటారు.” ఆయన చెప్పిన కథల్లో ఈ కిందిది, ఇంగ్లాండులో నిజంగా జరిగిందని మానాన్న _ చెప్పారు. ఆపరేషన్‌ థియేటర్‌ను వైద్యపరిభాషలో “ఓ.టీ” అంటారు. ఓ.టీ. నర్సును ఆస్పత్రిలో చాలా బాధ్యతాయుతమైన, శక్తిమంతమైన వ్యక్తిగా భావిస్తారు. డాక్టర్లు, సర్జన్లు ఆమెను ఎంతో గౌరవంగా చూస్తారు. సాధారణంగా అనుభవంవున్న సీనియర్‌ నర్సులనే 'ఓ.టీ.” నర్భుగా నియమిస్తారు. ఒకసారి, చాలామంచి పేరున్న సీనియర్‌ సరన్‌ ఒకరు ఆపరేషన్‌ చేస్తున్నారు. ఆరోజు ఓ.టీ. నర్సు సెలవు పెట్టింది. అందువల్ల వేరే నర్సును ఓ.టీ.కి నియమించారు.

ఆవరేషన్‌ థియేటర్‌లో వోరావోరీ పోరు 79

ఆమె ఓ 22 ఏళ్ళ యువతి. కొద్ది రోజుల క్రితమే నర్సింగ్‌ స్కూలు నుంచి వచ్చిన అనుభవంలేని నర్సు. అయితే చాలా తెలివైంది. శ్రద్ధగా పనిచేసే మనిషి

ఆపరేషన్‌ మొదలుపెట్టే ముందు అక్కడ ఎన్ని పత్తికట్టలున్నాయో నర్సు లెక్కపెట్టాలి. పత్తికట్ట అంటే శుభ్రంచేసి గాజుగుడ్డ చుట్టిన కండె. ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత ఎన్ని కట్టలు వాడారో, ఎన్ని మిగిలాయో లెక్కించి వాడతారు. ఆపరేషన్‌ ప్రారంభంలో ఉన్న కట్టల సంఖ్యతో ఈ మొత్తం సరిపోవాలి. సర్జన్‌ పొరపాటున ఒక కట్ట రోగి శరీరంలో పెట్టి మరచిపోయే ప్రమాదాన్ని నివారించేందుకు ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటిస్తారు.

అపరేషన్‌ జయప్రదంగా పూర్తయింది. సర్జన్‌ ఇక కుట్లువేసి పొత్తికడుపును మూసేసే ప్రయత్నంలో ఉన్నాడు. నియమం ప్రకారం ఓ.టీ. నర్సును అడిగాడు, 'సెస్టిర్‌ పత్తికట్టల లెక్క సరిపోయిందా? సరిపోయిఉంటే సూదీ, క్యాట్‌గట్‌ ఇవ్వండి.”

యువనర్సు కట్టలు లెక్కించి “సారీ డాక్టర్‌! లెక్క సరిపోలేదు. ఒక కట్టతేడా వస్తోంది” అంది..

సర్జన్‌ రోగి పొత్తికడుపులో వెతకడం ప్రారంభించాడు. కట్టకనిపషించలేదు. “లేదు సిస్టర్‌, లోపలేమీలేదు” అనే సరికి నర్సు ఆపరేషన్‌ థియేటర్‌ అంతా గాలించింది కానీ, తప్పిపోయినకట్ట ఆమెకూ కనిపించలేదు.

ఆమె ఆందోళన పెరిగిపోయింది. పత్తికట్టల లెక్క సరిపోతే తప్ప సర్జన్‌ రోగి పొత్తికడుపును కుట్టడానికి వీల్లేదు.

సర్జన్‌కు కూడా ఆందోళనగానే ఉంది. కనిపించకుండా పోయిన కట్ట దొరకలేదంటే, మొదటి లెక్కే పొరపాటని వాదించాడు. కానీ లెక్కలో తప్పులేదని, ఎక్కడా పొరపాటు జరగలేదని నర్సు నమ్మకంగా చెప్తోంది.

సర్దన్‌కు సహనం నశించింది. “మనమింక సమయం వృధా చేయలేం. సూదీ, క్యాట్‌గట్‌ ఇలా ఇవ్వండి” అన్నాడు.

సిస్టర్‌ ఇవ్వనంది. ఎంతో మర్యాదగా దృఢంగా చెప్పింది. “ఇవ్వలేను సర్‌, కనిపించకుండా పోయిన కట్టదొరికితే తప్ప మీకు సూదీ, క్యాట్‌గట్‌ ఇవ్వలేను”

ఇక చేసేదేం లేక సర్జన్‌ కోపం అణచుకొని, మళ్ళీ పాత్తికడుపంతా గాలించాడు. తుదకు ఇలా లాభంలేదని "నేనిక్కడ సీనియర్‌ సర్జన్‌ని. నాకు బాధ్యత ఉంది. ఇప్పుడు సూది క్యాట్‌గట్‌ ఇవ్వాలని ఆదేశిస్తున్నాను” అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు.

నర్సు సందిగ్ధంలో పడింది కానీ తన వైఖరి మార్చుకోలేదు.

సర్జన్‌కు కోపం నసాళానికంటింది. “నా ఆదేశాలు పాటించకపోతే, ఆపరేషన్‌ కాగానే నిన్ను డిస్మిస్‌ చేస్తాను.” అని హెచ్చరించాడు.

20 జ్ఞానం - వరిజ్ఞానం

అప్పుడు నర్సుకు దిగులు పట్టుకుంది. తన కుటుంబంలో తాను ఒక్కరే సంపాదనా పరురాలు. తన ఉద్యోగం పోతే పరిస్థితి అధ్వానమై పోతుంది.

తానెంత క్లిష్టపరిస్థికిలో ఉన్నదీ ఆమెకు తెలుసు. అయినాసరే, తాను సరయిన దనుకొన్న వైఖరికే కట్టుబడింది. "క్షమించాలి సర్‌ సూదీ, క్యాట్‌గట్‌ మీకు ఇవ్వలేను” అని స్పష్టంచేసింది.

చాలా క్లిష్టపరిస్థితి అనుభవహీనురాలైన ఈ నర్సు ధిక్కారంతో సర్జన్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇప్పుడిక ఏం చేయాలో తోచలేదు. నిస్పృహతో కిందికి చూశాడు. ఆశ్చర్యం! ఆపరేషన్‌ థియేటర్‌ నేలమీద రక్తంతో నానిపోయివున్న పత్తికట్ట కనిపించింది. అదక్కడ యుద్ధరంగంలో గాయపడి నేలకొరిగిన సైనికునిలా పడిఉంది.

సమస్య పరిష్కారం కావడంతో ఆయన ఆదుర్దా సడలిపోయింది. “ఓ! ఇక్కడుంది పత్తికట్టొ అని ఆశ్చర్యం ప్రకటిస్తూ, “ఇప్పుడు లెక్కసరిపోయింది. ఇక ....” ఆయన వాక్యం పూర్తి చేయకముందే సూది, క్యాట్‌గట్‌ ఆయన చేతిలో ఉన్నాయి.

పనంతా అయిపోయాక సర్జన్‌ యువనర్సును పక్కకు పిలిచి ఆమెను ఎంతగానో మెచ్చుకున్నాడు. “సెస్టర్‌, మీమీద అతిగా ఒత్తిడి తెచ్చినందుకు విచారిస్తున్నాను. అవునూ... నేను మిమ్మల్ని డిస్మిస్‌ చేస్తానన్నప్పుడు మీరు బెదిరిపోలేదా? జరిగేదానికి బాధ్యత నాదేనని చెప్పినప్పుడు మీరు నన్ను నమ్మలేదా? అంత జఒత్తిడిలోనూ మీనిర్ణయం మీద అంత గట్టిగా ఎలా నిలబడగలిగారో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది”,

ఆమె సంకోచిస్తూనే *సరొ నేను కేవలం మా టీచర్‌ బోధించిన సూత్రాన్ని పాటించానంతే. పత్తికట్టల లెక్క సరిపోక పోతే సూది, క్యాట్‌గట్‌ సర్దనుకు ఇవ్వరాదని మాకు బోధించారు. అనుభవం ఉన్న టీచర్లు చెప్పారంటే, వారికి బలమైన కారణాలే ఉంటాయి. మా టీచర్‌ చెప్పినమాటలను నేను పాటించానంతే” అంది.

సర్జన్‌ అశ్చర్యచకితుడయ్యాడు. సంతోషించాడు కూడా.

ఈ కథ చెప్పి, అఖర్న మానాన్నగ్రారిలా అనేవారు. “ప్రతి రోగి ప్రాణమూ విలువైనదే. జాగ్రత్త! ఒకరోగి చనిపోతే డాక్టర్‌కు ఆస్పత్రుల్లో జరిగే మరణాల్లో అదొకటి. అయితే దురదృష్టవంతులైన ఆ కుటుంది సభ్యులకు అదాక శాశ్వతమైన లోటు. కుటుంబంలో ప్రతి సభ్యునికీ ప్రత్యేక అస్తిత్వం ఉంటుంది”

ఎంత విలువైన మాట!

లో అను

6 కే వయోవృద్యుని సర్వోత్తమ వివేకం

ంన్సు అంటే పరమసుందరమైన, దట్టమైన అడవులు, ప్రసిద్ధమైన చిల్కా సరస్సుతో అలరారే రాష్ట్రం. ఎన్నో గొప్ప దేవాలయాలకు పేరు పొందిన ప్రాంతం. పూరీ జగన్నాథ ఆలయం, కోణార్మ సూర్యదేవుని ఆలయం మహత్తరమైన ప్రాచీన భారత వాస్తు ప్రతిభకు ప్రతీకలు,

మా కంపెనీ కొత్తగా ఎక్కడ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించినా, అక్కడ మా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సేవలు కూడా అందించాలన్న నియమంనాది. అలా ఒరిస్సాలో ఫౌండేషన్‌ కార్యకలాపాలు చేపట్టాను. ఒరిస్సాలో ఉన్న పేదరికం ఇంతా అంతా కాదు. మరీ నిరుపేదలైన వారికి సహాయపడేందుకు అక్కడ దాదాపు 18,500 ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌.జి.ఓలు) పనిచేస్తున్నాయి.

ఒరిస్సాలోని మారుమూల ప్రాంతాల్లో, దుర్గమమైన అడవుల లోతట్టు ప్రాంతాల్లో గిరిజనులు అధికంగా ఉన్నారు. గిరిజన మహిళలు నిగనిగలాడే రంగురంగుల చీరలు ధరిస్తారు. ఎక్కువగా ఆకుపచ్చ, పసుపుపచ్చ, ముదురు ఎరుపు రంగులను ఇష్టపడతారు. ఒరిస్సా అడవుల్లో ప్రయాణిస్తున్నప్పుడు వారిని చూడటం ఒక ఆహ్లాదకరమైన అనుభవం.

ఒకసారి నేను కలహండి వెళ్ళాల్సి వచ్చింది. అది పట్పమూకాదు, నగరమూ కాదు. దానికెలాంటి ప్రత్యేకత అయినా లేదు. మజూర్‌భంజ్‌, కోరాపుట్‌ వంటి మరో గిరిజన జిల్లాలో అది మరోభాగం. +

స్వాతంత్ర్యానికి పూర్వం కలహండిని ఒక రాజు పరిపాలించేవాడని చెప్తారు. రాజు తమ సంరక్షకుడని, ఆయన సర్వశక్తిమంతుడని గిరిజనుల విశ్వాసం. ఇప్పుడు రాజులనేవారు లేరంటే నేటికీ నమ్మని అమాయకులువారు. ఇప్పటికీ అనాథ శిశువు కనిపిస్తే, తీసుకుపోయి. కలెక్టర్‌ బంగళాగుమ్మంలో వదిలిపెట్టి వస్తారు. వారిదృష్టిలో రాజే అంతిమ రక్షకుడు.

భవానీపట్టణం కలహండి జిల్లాకేంద్రం. అది మిగతా జిల్లా కేంద్రాల్లా ఉండదు. మా ధార్వాడ లాంటి జిల్లా కేంద్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. భవానీపట్టణం మరీ అంత చిన్నదిగా, నిద్రాణంగా ఉండడం చూసి విస్తుపోయాను.

ద రా... ల్‌ ఎధాలర్బ్యు జి ఎవ బా సై క జర్‌ 4 0. ౫ంట యను య షు

22 జ్ఞానం - వరిజ్ఞానం

అక్కడొక ఎన్‌.జి.వో. నేతను కలుసుకుందామని వెళ్ళాను. ఆయన అనాథల సంక్షేమంకోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అనాథ బాలల సేవలో పూర్తిగా అంకితమై పనిచేసే నిమిత్తం ఆయన అవివాహితుడిగా ఉండిపోయారు.

భువనేశ్వర్‌ నుంచి ఇక్కడికి దగ్గర్లోని కేసినకు రైల్లో ప్రయాణిస్తున్నపుడు గిరిజన ప్రజలను శ్రద్ధగా పరిశీలించాను. ట్రైను వచ్చి ఆగేవరకు వాళ్ళు ప్రశాంతంగా నిరీక్షిస్తారు. అనాన, అడవి అరటిపళ్ళు, బంగాళా దుంపల వంటి రకరకాల ఉత్పత్తులను తీసుకెళ్తున్నారు.

నాతో స్థానిక భాషతెలిసిన వ్యక్తికూడా వచ్చారు. ఆయన నా దుబాసిగా వ్యవహరించడానికి సమ్మతించారు. పల్లెల్లో పనిచేయాలంటే వారి భాష తెలియడం చాలా అవసరం,

ఈ గిరిజనుల గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుంది. నాగరికత వల్ల వారికేదైనా ఉపయోగం ఉందా, వారి జీవనశైలి ఎలా ఉంటుంది వంటి (ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి. గిరిజనులు సాధారణంగా బృందాలుగా నివసిస్తారని విన్నాను. కర్మకాండల విషయంలో వారు నాగరికులంత ఖచ్చితంగా వ్యవహరించరు. ఏవిషయంలో అయినా సూటిగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా వ్యక్తిగత అస్తి ఉండడం వారిలో అరుదుగా కనిపిస్తుంది. వారి గురించి ఇంకా అనేక విశేషాలు తెలుసుకోవాలను కున్నాను. వారి 'ప్రత్యేకతకు భంగం కలిగించకుండా, ఏదో రకంగా వారికి సహాయపడాలని నా ఉద్దేశం,

వారిని కలుసుకోవాలంటే రెండు మైళ్ళు నడిచి వెళ్ళాలని నా దుబాసి చెప్పాడు, వారి కుగ్రామాలకు కార్గువెళ్ళే రోద్డులేవు, నడవడానికి నేనెప్పుడూ సిద్ధమే.

చాలా దూరం నడిచి ఒక (గ్రామం చేరుకున్నాము. అక్కడొక మహిళను కలుసుకున్నాను. ఆమె వయసును ఊహించడం కష్టం. మాండలికంలో తేడా ఉండడంతో దుబాసి ఆమె మాటలను అనువదించడంలో ఇబ్బంది పడ్డాడు. ఆమె నల్లగా ఉంది, జుత్తుకూడా నల్లగానే ఉంది. ఆమెకు 70 ఏళ్ళు ఉండొచ్చు. కానీ జుత్తు నెరవలేదు. ఆమె జుత్తుకు రంగు వేసుకొనే అవకాశం లేదుకదా. అందువల్ల ఇందులో వదో రహస్యం ఉండాలి. దుబాసికి కూడా తెలియదు. మొత్తం గ్రామంలో ఒక్కరి నెత్తిమీద కూడా ఒక తెల్లవెంట్రుకైనా లేదంటే, గిరిజను లందరికీ ఏదో రహస్యం తెలిసి ఉండాలని పించింది.

ఆ తర్వాత ఒక వృద్ధుని కలుసుకొన్నాను. వృద్ధడని అంటున్నాను కానీ, మనిషిని చూసి వయసును ఊహించడం అసాధ్యం. మా మాటల్లో అతను చెప్పిన సంఘటనలు, సందర్భాలను బట్టి లతని వయసు 104 ఏళ్ళు ఉంటుందనుకున్నాం,

ఆ పెద్దాయనతో సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది. “మన దేశాన్ని ఎవరు పొలిస్తున్నారు?” అని అడిగాను.

వయోవ్చద్దుని నర్యోత్తమ వివేకం 23 అతని దృష్టిలో 'దేశం' అంటే కలహండి మాత్రమే. నా అజ్ఞానం అతనికి నవ్వు తెప్పించింది. ఆమాత్రం తెలియదా? మనదేశాన్ని కంపెనీ సర్మారు పరిపాలిస్తోంది అన్నాదు. కంపెనీ సర్మారు అంటే ఈస్టిండియా కంపెనీ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంగతే అతనికి తెలియదు. అతనికి నేను కొన్ని కరెన్సీ నోట్లు, వాటిమీది అశోకచక్రం చివ్నాం చూపించాను. మళ్ళీనవ్వాడు. “ఇదోకాగితం ముక్క అంతే. దీన్ని చూసి మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారో ఎలా చెప్తారు? మనల్ని గోరివాలి రాణి పరిపాలిస్తున్నారు” అన్నాడు. భారతదేశాన్ని ప్రస్తుతం గోరివాలి రాణి కానీ, ఇంగ్లాండుకు చెందిన 'సుందరమైన రాణి” కానీ పాలించడంలేదని నేనెంత చెప్పినా అతను నమ్మలేదు. గిరిజన ప్రజలకు వస్తుమార్చిడి పద్ధతి చాలా ముఖ్యమైనదని నాకు తెలుసు. దాని గురించి అడిగాను. *ఈ కాగితం ముక్కతో వంటచెరకు, అనేక చీరలు, ఉప్పుబిస్తాలు, అగ్గిపుల్లలు కొంత భూమికూడా కొనవచ్చునని తెలుసా?” నావేపు సానుభూతిగా చూసి చెప్పాడు *ఈ కాగితం కోసం జనం కొట్టుకుచస్తారు. మా పూర్వీకుల నేలనుంచి, మాఅడవుల నుంచి వెళ్ళిపోండి. మీ నగరాలకు వెళ్ళిపోండి. ఈ కాగితం ముక్కలేకుండా మేము సంపూర్ణ జీవితం గడపలేదా? మా పూర్వీకులుకూడా బతికారు. ఈ కాగితం లేకపోయిన్నా ఇక్కడేపుట్టి, ఇక్కడే స్థిరపడి సంతోషంగా బతుకుతున్న దేవుని బిడ్డలం మేము. ఇది దేవుని నేల, ఇదెవరి సొంతమూ కాదు. ఏ నదినీ మనం సృష్టించలేదు. ఏ పర్వతాన్నీ మనం మొలిపించలేదు. ఈ గాలీ మనమాట వినదు. భూమిని ఎలా అమ్ముతాం, ఎలా కొంటాం. నాకు అర్థంకావడం లేదు. ఏదీ మీది కానప్పుడు, అలాంటి లావాదేవీలు ఎలా చేస్తారు? మీ ఈ చిన్న కాగితం మాజీవితాలను నాశనం చేసేయగలదు”. జవాబు చెప్పడానికి నాకు మాటలు కరవయ్యాయి. ఇప్పటిదాకా, అతనికంటే నాకే ఎక్కువ తెలుసనుకొన్నాను. కరెన్సీ కదలికలు, రాజకీయ పార్టీల గురించి, బిల్‌గేట్సుకు, బిల్‌క్లింటన్‌కు ఉన్న తేడా గురించీ మనకు తెలుసు. ఈ పెద్దాయనకు అవేవీ తెలీదు కానీ, ఇంతకంటే లోతైన శాశ్వతసత్యాలు తెలుసు. భూమి, కొండలు, గాలి ఎవరిసొత్తూ కాదని అతనికి బాగా తెలుసు. కలహండి అడవిలో నివసించే ఆ వివేకవంతుడైన పెద్దమనిషా లేక ఇంటర్నెట్‌ నాడి తెలిసిన మనమా - ఎవరు నిజమైన నాగరికులు? వ్‌, అ్సస్థం

ల్‌ మనం మంచిని వదిలి - చెడును స్వీకరిస్తాం

0౮ రంలో సోమవారం మొదటి పనిదినం కనుక ఆఫీసులో అందరం పని ఒత్తిడితో హడావిడిగా ఉంటాం. వచ్చిన ఇ-మెయిల్‌ సందేశాలు, ఉత్తరాలన్నీ చూసి, సమాధానా లివ్వాలి. ఇతర ఆఫీసు కాగితాల పనిచూడాలి. సమావేశాలు జరపాలి. డైరీలో ఆరోజు కలవడానికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన వారిపేర్లుంటాయి. వారందరినీ తప్పనిసరిగా కలవాల్సి ఉంటుంది. మధ్యమధ్య అనుకోకుండా వచ్చే సందర్శకులు కూడా ఉంటారు. ప్రతి సోమవారం ఉదయం సెక్రటరీలు నానా అవస్థలు పడతారు.

అయితే, ఏవారం పని ఆవారం పూర్తిచేస్తేగాని, ఆదివారం సెలవురోజున హాయిగా గడపలేం. అందుకని ఒకసోమవారం సమయం వృధాచేయకుండా ఇ-మెయిల్‌ చూసుకొని, సమాధానాలిస్తున్నాను. ఇంథలో నా సెక్రటరీ టెలిఫోన్‌లో మాట్లాడుతూ, ఇద్దరు వ్యక్తులు అపాయింట్‌మెంట్‌ లేకుండా వచ్చి, నన్ను కలవాలంటున్నారని చెప్పింది.

“అపాయింట్‌మెంట్‌ లేనివారిని ఎందుకు అనుమతిస్తున్నారు? ఏమిటివారి ప్రత్యేకకా అని అడిగాను.

నా సిబ్బందిపట్ల, సందర్శకులను అనుమతించడంలో వారు అనుసరించే పద్ధతులపట్ల నాకు పూర్తి విశ్వాసంఉంది.

ఆమె గొంతు తగ్గించి మెల్లగా సమాధానమిచ్చింది. “మేడం, ఒకాయన చాలా ముసలాయన. బాగా నీరసంగా కనిపిస్తున్నాడు. ఇంకోవ్యక్తి మధ్య వయస్కుడు. చాలా అర్జెంటు పనిమీద వచ్చామన్నారు. వాళ్ళొచ్చి చాలా సేపయింది”.

సలే లోపలకు పంపమన్నాను.

వాళ్ళొచ్చి నాఎదురుగా కూర్చున్నారు. ముసలాయన వయస్సు 70 ఏళ్ళుంటుంది. చాలా బలహీనంగా అలసిపోయినట్లు, చిరాగ్గాఉన్నాడు. చేతిలో పాతసంచీఉంది. చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఆయన పక్కనున్న మధ్యవయస్కుడుకూడా చిరాగ్గా ఉన్నట్లు కనిపించాడు.

మనం మంచిని వదిలి చెడును న్వీకరిస్తాం 25 వెంటనే సంభాషణ (ప్రారంభించాను. “చెప్పండి, వమిటి విషయం?” ముసలాయన మాట్లాడకుండా మధ్యవయస్సుని కేసి చూశాడు. “మేడం, ఇతన్ని బస్‌స్టాప్‌ దగ్గర కూలబడి ఉంటే చూశాను. నా అన్నవాళ్ళెవరూ లేనట్లున్నారు. ఇతనికి ఆశ్రయం కావాలి. పాపం ఇతని దగ్గర డబ్బేమీలేదు” అన్నాడా మధ్యవయసు వ్యక్తి.

అతనింకా చాలాచాలానే చెప్పేట్లున్నాడు. కొందరంతే. అసలు విషయంలోకి రాకుండా ఏమిటేమిటో కథలు చెహ్హూపోతారు. వాళ్ళకు కావలసిందేమిటో సూటిగా చెప్పరు. ఇటువంటి వాటికి అలవాటు పడ్డాను. ఒకోసారి కటువుగా అనిపించినా, వారిమాటలకు అడ్డుపడక తప్పదు.

“నన్నేం చేయమంటారో చెప్పండి” అని అడిగేశాను.

“మీ సంఘసేవ గురించి చాలా చదివాను. మీరీ పెద్దాయన్ను ఆదుకోవాలని

“మీ కెవరైనా కావలసినవారున్నారా?” అని ముసలాయన్ని అడిగాను.

ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 'లేరు, నాకెవరూ లేరు అని గద్దద స్వరంతో సమాధానమిచ్చాడు.

“మీకుటుంబం ఏమైంది?”

“లేరు, నాకెవరూ దిక్కులేరు”

“ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవారు?”

నేను చాలా ప్రశ్నలే అడిగాను. చాలా వరకు సంతృప్తికరమైన సమాధానాలే ఇచ్చాడు. అయ్యోపాపం అనుకున్నాను. అతని దగ్గర డబ్బులేదు. ఆదుకొనే దిక్కులేదు. మేము తరచుగా సంప్రదించే వృద్ధాత్రయం గుర్తొచ్చింది. ఆ ఆశ్రయానికి టెలిఫోన్‌చేసి, నేనో వృద్ధుని పంపుతున్నానని, ఆయనకు మేము ఏమి చేయగలుగుతామో నిర్ణయం తీసుకానేవరకు అక్కడ ఉండనివ్వాలని కోరాను. ఇంతలో “మీరేం ఇబ్బంది పడకండి. ఇతన్ని నేనే అక్కడ వదిలిపెట్టి, అట్నుంచి అటే మా ఆఫీసుకు వెళ్తాను” అన్నాడు మధ్య వయస్స్ముడు.

తర్వాత వెళ్ళిపోయారు. ఆఫీసుపని, సందర్భకులు, ఓచర్హు బడ్జెట్లు వగైరా నాపనుల్లో నేను మునిగిపోయాను.

ముసలాయన సంగతి మర్చిపోలేదు. అప్పుడప్పుడూ ఫోన్‌చేసి ఎలాఉన్నాడో కనుక్కుంటూనే ఉన్నాను. అతను బాగానే ఉన్నాడని వాళ్ళు చెప్పేవారు. అతని గురించి ఇక ఇంతకన్న ఎక్కువ ఆలోచించే సమయం లేకుండా పోయింది. వృద్ధాశ్రయానికి ప్రతినెలా కొంత డబ్బుపంపేదాన్ని.

ర" జ్ఞానం - వరిజ్ఞానం

అలాగడుస్తూండగా, ఒకరోజు ఆశ్రయం కేర్‌టేకర్‌ ఫోన్‌ చేశాడు. ముసలాయన వాలా జబ్బుతో ఉంటే అస్పథ్రిలో చేర్చించామని తెలిపాడు. మీరు సాయంకాలం రాగలరా అని అడిగాడు. .

ఆ సొయంకాలమే ఆస్పత్రికి వెళ్ళాను. నిజంగానే చాలా అనారోగ్యంతోనే ఉన్నాడు. అతని పరిస్థితి క్లిష్టంగా ఉందని, అట్టేకాలం బతక్కపోవచ్చునని డాక్టర్లు చెప్పారు.

నాకెందుకో ఇలాంటి పరిస్థితిలో అతనెవరినైనా చూడాలని కోరుకోవచ్చు ననిపించింది. సొంత సంతానం కాకపోయినా, ఏ మేనల్లుడో, చెల్లెలో, సోదరుడో ఉండొచ్చుకదా. అందుకని “ఎవరినైనా చూడాలని ఉంటే చెప్పండి వారిని పిలిపిస్తాం. ఎవరిదైనా ఫోన్‌నెంబర్‌ ఉందా?” అనిఅడిగాను.

వజికేచేత్తో కాగితంమీద ఒక నంబరు రాసి ఇచ్చాడు. ఆనంబరుకు ఫోన్‌చేసి, ముసలాయన పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు తెలియజేశాము. కొంత సేపటి తర్వాత అతణ్జి చూడదానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా దుఃఖంతో, ఆదుర్దాపడుతూ సరాసరి ముసలాయన దగ్గరికి వెళ్ళాడు.

ఇతన్నెక్కడో ఇంతకు ముందు చూసినట్లని పించింది. ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. మరి తెలిసిన మనిషిలా ఎందుకు అనిపిస్తున్నాడు, బహుశా నా పర్యటనల్లో ఇతని పోలికలు ఉన్న వారినెవరినైనా కలసి ఉంటాను.

. ఇంతలో డాక్టర్‌ వచ్చి ముసలాయన అంతిమ శ్వాస వదిలినట్లు తెలిపాడు. చాలా బాధకలిగింది. అతనెవరో నాకు తెలియదు. అతనితో ఏ అనుబంధమూలేదు. అయినా నాకళ్ళలో నీళ్ళు తిరిగాయి.

కొద్ది నిముషాల్లో ఆ సందర్భకుడు కన్నీళ్ళతో బయటకు వచ్చాడు. మౌనంగా 'ఒక బెంచీమీద కూర్చుండి పోయాడు. అక్కడంతా విషాదం అలుముకొంది. లాంఛనాలు పూర్తయ్యే వరకు కేర్‌టేకర్‌, సందర్భ్శకుడు, నేను సందర్శకుల హాలులో నిరీక్షిస్తూ కూర్చున్నాం.

ఆయన దగ్గరొక సంచీ ఉండాలికదా, అదెక్కడుంది అని సందర్శకుడు అడిగాడు.

“సంచీ ఏమిటి?”

“ముసలాయన వృద్ధాశ్రయానికి సంచీతోనే వచ్చాడు” అన్నాడతను. -

నాకు మరింత ఆసక్తి కలిగింది. సంచీవున్నట్లు ఇతనికెలా తెలుసు?

వృద్ధా శ్రయానికి వెళ్ళి సంచీతీసుకురమ్మని ఒక నౌకరును పంపించాను. సంచీరాగానే, దాన్ని తెరవడానికి సందర్భకుడు ఆత్రపడ్డాడు. అతన్ని వారించాను.

“ముందు మీరెవరో చెప్పేదాకా సంచీ తెరవకండి. ఈ ముసలాయనతో మీ సంబంధమేమిటి? ఈ సంచీ గురించి మీకెలా తెలుసో చెప్పాలి”.

మనం మంచిని వదిలి చెదును స్వీకరిస్తాం 27

నా ప్రశ్నతో అతనికి కోపమొచ్చినట్లుంది. ఒక మహిళ తననలా ్రశ్చించడం అతనికి నచ్చలేదేమో. మనదేశంలో చాలా మంది ఇంతే. మహిళలు వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగితే పురుషులు చికాకు పడతారు. తామేం చేసినా మహిళలు ప్రశ్నించరాదను కుంటారు. అదృష్టవశాత్తు ఈ ధోరణి క్రమంగా మారుతోంది.

“ఈయనతో వెళ్ళి, ఆశ్రయంలో వదిలిపెట్టివెళ్ళింది నేనే” అన్నాడతను.

“మీరెవరో చెప్పండి” గట్టిగానే అడిగాను.

“నేనాయన కొడుకును”. |

నేనెంత దిగమచెంది ఉంటానో మీరువూహించవచ్చు. ఈ ముసలాయన తనకు బస్‌స్ట్రాప్‌లో కనిపించాదంటూ, ఆ సోమవారం మా ఆఫీసుకు వచ్చిన మధ్యవయస్ముడు ఇతడేనని హఠాత్తుగా గుర్తొచ్చింది.

నాకు చాలా కోపమొచ్చింది. “నాతో అబద్ధం ఎందుకు చెప్పారు?” అని అడిగాను.

అతనో కథ చెప్పడం మొదలుపెట్టాడు. “నాకు ఇంట్లో సమస్యలున్నాయి. మా నాన్నంటే మా ఆవిడకు ఇష్టంలేదు. నేను కావాలో, మీనాన్న కావాలో తేల్చుకోమని చెప్పేసింది. అప్పుడే మీ ఫౌండేషన్‌ గురించి చదివాము. డబ్బు అవసరం లేకుండానే మా సమస్య తెమిలిపోతుందనుకొన్నాం”. తాము ఉంటున్న ఇల్లు తనభార్యదేఅనీ, అందువల్ల ఆమెను సంతోషపెట్టడంతప్ప, వేరేమార్గం లేకపోయిందన్నాడు.

నాకప్పుడు కోపమొచ్చిందో, విచారం కలిగిందో చెప్పలేను. “మీ సమస్యను పరిష్కరించు కొనడానికి ఇదేనా మార్గం? మేం దిక్కులేని అనాథలకు సహాయ పడతాం, కానీ సంతానం ఉన్న అనాథలకు కాదు” అన్నాను.

తుదకు, సంచీని తెరిచినప్పుడు, అందులో మూడు జతల పాతదుస్తులు, కొన్ని మందులు, ఒక పాస్‌బుక్‌ ఉన్నాయి. పాస్‌బుక్‌ తెరిచి చూసి దిగ్భ్రాంతి చెందాను. ముసలాయన బ్యాంకు ఖాతాలో ఇంకా లక్ష రూపాయలకు పైగానే మిగులుంది. ఆ ఖాతాకు నామినీపేరు కూడా నమోదు చేయించాడు. కుమారుడే అ నామినీ. ఆయన్ను వదిలించుకున్న కుమారుడే. సొంత తండ్రిని వృద్ధుల ఆశ్రయంలో చేర్చించేందుకు, ఆయన్ను అనాథ అని నమ్మించిన హృదయంలేని పుత్రుడితడు. తండ్రి సొమ్ముకోసం ఇప్పుడిక్కడ తయారయ్యాడు.

ముసలాయన సంగతి చూడండి. కొడుకు ఆయన ఆలనాపాలనా పట్టించుకోలేదు. తనకెవరూ దిక్కులేరని తనచేతనే అబద్ధం చెప్పించాడు. అయినాసరే, తన డబ్బు ఆకొదుక్కే చెందాలని కోరుకున్నాడు. ఆ సొమ్మును, చివరి రోజుల్లో తనకు ఆశ్రయమిచ్చి ఆదుకొన్న వృద్ధాశయానికి ఇవ్వాలనే ఆలోచనే ఆయనకు రాలేదు.

28 జ్ఞానం - పరిజ్ఞానం

పాశ్చాత్యదేశాల్లో వృద్ధులు వృద్ధా త్రయాల్లో మరణిస్తే, తమ ఆస్తిపాస్తులు తమను చూసుకొన్న ఆశ్రయానికో, ఆస్పథత్రికో చెందొలని తమ వీలునామా రాసిపోతారు. ఇతర సీనియర్‌ పౌరులకు అవి ఉపయోగపడతాయి. తమసొమ్ము సంతానానికి చెందాలని రాయరు. రాస్తారని వారి సంతానం కూడా ఆశించరు. భ్రారతదేశంలో మనకు పాశ్చాత్య సంస్కృతిలోకెల్ల చెడుగుణం, భారతీయ సంస్కృతిలోని అతి చెడ్దగుణం అలవడ్డాయి. బిడ్డలు తల్లితండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. తల్లితండ్రులేమో యధావిధిగా తమ ఆస్తులను సంతానానికి వదిలిసోతారు. -

“కేవలం కొన్నివేల రూపాయలకోసం మీరూ, మీతండ్రీకలిసి ఇంత నాటకం ఆడిన తీరు సిగ్గుచేటు. మీలాంటి వాళ్ళవల్ల ఇతరులకు నష్టం జరుగుతుంది. రానున్న రోజులలో నిజంగానే దిక్కులేనివారెవరైనా వచ్చి సహాయంకోరితే వారిని నమ్మబుద్ధికాదు. మీ ఉదాహరణను అంత తొందరగా మరచిపోలేం”.

అతను సిగ్గుతో తలవంచుకున్నాడు.

లో జ్సా్గం

8 మారేలోకంలో జీవనయానం

మ; జీవితాలు, రోజులు నిజంగా విప్లవాత్మకంగా మారిపోయాయి. అయితే ఆ మార్పుల ప్రభావాన్ని మనం ఎప్పుడో అరుదుగా తప్ప గమనించనే గమనించం. పాతపద్ధతులు మారిపోయాయి. మన పండుగలు, ఉత్సవాలు మారిపోయాయి. మన వైఖరులు మారిపోయాయి. మన నియమాలు, ఆదర్భాలు, విలువలు, భావాలు - అన్నీ మారిపోయాయి.

ఇటీవల నేను పాలుపంచుకొన్న రెండు పండుగలు, నాకీ విషయాన్ని గమ్మత్తుగా అవగతం చేశాయి. ఈ రెండు సందర్భాలలోనూ మార్పు విస్తృతి నాకు సంభాషణల ద్వారానే తెలిసి వచ్చింది. వ్యక్తిగత అనుభవాలు కావడం వల్ల, మనజీవితాల్లో వచ్చిన మార్పుల మౌలిక స్వభావం స్పష్టంగా తెలిసివచ్చింది. మొదటిది దీపావళి పండుగ, రెండవది సంగీతోత్సవం.

మన దేశంలో దీపావళిని ఎంతో ఉత్సాహ సంరంభాలతో జరుపుకొంటాం. ప్రతివారూ కానుకలుగా ఇవ్వదగిన వస్తువులు కొంటారు. స్వీట్లు తయారు చేసుకొంటారు. మిత్రుల ఇళ్ళకు వెళ్తారు. సెలవుల వల్ల ఆఫీసులు రోజుల తరబడి మూతపదడతాయి. పిల్లలు టపాసులు కొంటారు.

కిందటి దీపావళి సమయంలో ఒక అడ్వర్దయిజ్‌మెంట్‌ చూశాను. కొన్ని అనాథాశ్రమాలు అనాథలే తయారుచేసిన స్వీట్లు విక్రయిస్తున్నట్లు అందులో తెలిపారు. అనాథా(శ్రమాలను ప్రోత్సహించడానికి ఈ స్వీట్లు కొనడమే మంచిపద్ధతి అనుకొన్నాను.

నేనుకొన్ని స్వీటొప్యాకెట్లు కొనుక్కొని, నాకెంతో ఇష్టమైన స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను. ఆమె పండుగ చేసుకొంటూ ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను. ఆమె ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన గృహిణి. ఆమె తండ్రికి గ్రామంలో పెద్ద వ్యవసాయక్షేత్రం ఉంది.

ఆమెలో ఆనందంలాంటిదేమీ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆమెతో కలిసి పందుగ చేసుకొందామనుకొంటే, ఆమెలో పండుగకు సంబంధించిన ఉత్సాహమే ఉన్నట్లులేదు.

“దీపావళికొక (ప్రత్యేకతే లేకుండా పోయింది” అందామె.

వం జ్ఞానం - వరిజ్ఞానం

నాకు నిజంగా ఆశ్చర్యమేసింది “అలా ఎందుకంటున్నావ్‌?” అని అడిగాను.

ఆమె తన కారణాలు చెప్పసాగింది. “నేను పెరిగిన చిన్నపట్టణంలో ఆహార విహారాలు నేటి తీరుకు భిన్నంగా ఉందేవి. ఆహారం సంగతే చూడు. ప్రతివారూ కుటుంబ ఆదాయంతో నిమిత్తం లేకుండా రోజూ రొట్టె, అన్నం, కూరగాయలతో సాధారణ ఆహారం తీసుకొనేవారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం. దసరా, దీపావళి లాంటి పండుగలప్పుడే స్వీట్లు తయారు చేసేవారు. అందువల్ల పిల్లలు పండుగలు ఎప్పుడొస్తాయా అని ఆత్రంగా ఎదురు చూసేవారు”.

నేనూనా చిన్ననాటి సంగతులు జ్ఞాపకం చేసుకున్నాను. నాబాల్యంలో ఇలాగే ఉండేది. ఆమె చెప్పినట్లు మేము మంచి ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం భుజించేవాళ్ళం.

అయితే ఈ రోజుల్లో అంటూ ఆమె మొదలు పెట్టింది. “ఆహారం అలవాట్లు మారిపోయాయి. ఇందుకు మనకు ఇద్దరే పిల్లలుండడం కూడా ఒక కారణం. ఇద్దరే ఉండడంతో వాళ్ళకు ఇష్టమైనదంతా పెట్టాలని చూస్తాం. వాళ్ళు అడిగించాన్ని వండలేకపోతే ఇలాంటి నగరాల్లో ఏ హోటల్‌ నుంచైనా తక్షణం తెప్పించుకోవచ్చు. అందువల్ల నేటి పిల్లలకు మనలాగా పండుగలకోసం, స్వీట్లకోసం ఎదురు చూడాల్సిన అవసరమేలేదు”,

అమె చెప్పింది నిజమే ననుకోండి, ఆహార అలవాట్లు మారిపోయాయి. ముఖ్యంగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో మరీ పూర్తిగా మారిపోయాయి. అయినా నాకో సందేహం లేకపోలేదు. దీపావళి పట్ల అసక్తి పోవడానికి, ఏదాది పొడవునా స్వీట్లు లభిస్తుండడమొక్కటే కారణమా? “కాదు. మొత్తం వైఖరే మారిపోయింది. జనం తమకు ఎలాంటి దుస్తులు కావాలంటే వాటిని ఎప్పుడు పడితే అప్పుడే కొనేస్తారు. వండుగదాకా 'ఆగరు. కుటుంబాలు దేశమంతటా, కొంతమంది విషయంలో ప్రపంచ మంతటా చెదిరిపోయాయి. బంధువులను కలుసుకోవడం సులభంకాదు. మిత్రులు కలుసుకోవాలన్నా కుదరదు. చాలామంది పండుగలకు వారి స్వగ్రామాలకు వెళ్తారు. అయితే రైలు, విమానం, ఆఖరుకు బస్సులో వెళ్ళాలన్నా రిజర్వేషన్‌ దొరకడం చాలకష్టమైపోయింది. అందువల్ల ఇంట్లో ఉండిపోవడమే మంచిదనుకుంటాం.”

ఎంత నిజం చెప్పింది! నేనొకసారి దీపావళి సెలవుల్లో నా ప్రయాణానికి నెలరోజుల ముందే టెకెట్లు కొనిపెట్టుకున్నాను. .

నా (ఫ్రెండు చాలా మౌలికమైన సమస్యను ప్రస్తావించింది. “అసలు దీపావళి ప్రాముఖ్యం ఏమిటో మనలో ఎంతమందికి తెలుసు? దీపాల పండుగంటే నిజమైన అర్ధమేమిటి? ఈ పండుగ గురించి మన పవిత్రమైన పురాణాలు, ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి? యదార్థమేమిటంటే అదంతా ఎవరూ ఆలోచించరు, తెలుసుకోరు. ఈ పండుగ గురించి మనదేశంలో ప్రతిరాష్రంలో ఒక ప్రత్యేక కథ వ్యాప్తిలోఉంది. అన్ని కథలూ మహాభారత పర్వాలలో, శ్రీకృష్ణుని ఇతిహాసంలో ఉన్నవే. అయినా వాటిగురించి ఎంతమందికి తెలుసు?”

నే క క కనే సనన వోట్‌ ఆమెకు పుట్టింటిమీద బెంగపట్టుకున్నట్లుంది. అందువల్ల ఆమెను కాసేపు ఎక్కడికైనా పిలుచుకెళ్తే మంచిదనిపించింది.

“రేణూ ఇంటికైనా, మృదుల ఇంటికైనా వెళ్దాం” అన్నాను.

వాళ్ళు మాఇద్దరికీ చాలాకాలంగా స్నేహితులు. చాలా మంచి మిత్రులు. ఈ రోజుల్లో చాలామంది నేను వారికి తెలియకపోయినా తమ స్నేహితురాలినని చెప్పుకుంటారు. రేణు, మృదుల విషయం వేరు. వాళ్ళను కలిస్తే నా మిత్రురాలి దిగులుపోయి కాస్త ఉత్సాహం వస్తుందనుకొన్నాను. కానీ రేణు ఊళ్ళోలేదని ఆమెకు ముందే తెలుసు,

“ఆమె కిక్కడ బోరెత్తి పోయింది. ఆమె ఇక్కడో పెద్ద కంపెనీలో హెచ్‌.ఆర్‌.డి. మేనేజర్‌గా పనిచేస్తోంది. దీపావళి సీజన్‌లో సందర్శకుల తాకిడి ఎక్కువుంటుందట. అందుకని వోయిగా గడపాలని గోవాకు వెళ్ళింది. ఇక, మృదుల ఏదో పుస్తకం రాస్తోంది తాను కంపెనీ గెస్ట్‌హౌస్‌లో ఉన్నట్లు ఎవరికీ చెప్పవద్దంది.”

ఎక్కడికో పారిపోవడం ద్వారానో, దాక్కోవడం ద్వారానో దీపావళి జరుపు కోవడం

= = ఇదంతా నాకు ఏదో కొత్తగా ఉంది.

నామిత్రురాలు అంతటితో ఆగలేదు. “ఇంకో తలనొప్పికూడా తప్పడంలేదు. బంధువులు ఏవో బహుమతులు తెస్తారు. మళ్ళీ వాళ్ళకు మనం బహుమతులివ్వాలి. ఇదో రాకెట్‌గా తయారైంది. పోయిన ఏడాది వచ్చిన బహుమతులన్నీ అలాగే ఉంచేశాను. ఈ డైప్రూట్‌ బాక్సులు, కొవ్వాత్తి స్టాండ్లు, స్వీట్‌ బాక్సులు చూస్తేనాకు రోత పుడుతోంది. మనం పెద్దవాళ్ళమై పోతున్నాం. ఈ స్వీట్లు గట్రా తినటం మంచిదికాదు.”

“అయితే వాటన్నిటినీ ఏంచేసావ్‌?” అనడిగాను.

“ఓ అనాథాశ్రమానికి ఇచ్చేశాను. పేదపిల్లలైనా తిని ఆనందిస్తారు”

ఆమె ఆ స్వీట్లను ఎవరికిచ్చిందో తెలుసు కోవాలనిపించింది. ఆమె ఓ ప్రసిద్ధమైన అనాథాశ్రమం పేరు చెప్పింది.

దీపావళి బహుమతిగా ఇచ్చే స్వీట్లు, కొవ్వాత్తులు ఏమౌతాయో నాకప్పుడు తెలిసింది. వాటికి ఏదో ఒక దాతృత్వ సంస్థ లేబుల్‌ అతికించి, మార్కెట్లో అమ్మేస్తారన్నమాట.

ఇదన్నమాట వాళ్ళు నిధులు సేకరించే పద్ధతి. పాపం అనాథాశ్రమాల పిల్లలకు దీపావళినాడు స్వీట్లుతినే అదృష్టమే లేనట్లుంది.

ఇక్క నా సంగీతోత్సవ అనుభవం ఇంకో రకం కానీ, అదీ ఆసక్తికరమైందే. కొంతకాలంగా, నన్ను సంగీతోత్సవమో, వేదాంత ప్రసంగాలో, దాతృత్వ ప్రదర్శనలో ప్రారంభించవలసిందని తరచుగా ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాలు నాకేమీ తెలియవు,

౩2 జ్ఞానం - పరిజ్ఞానం రాలేనంటే వారికి కోపమొస్తుంది. అందువల్ల నన్ను వేదిక మీదికి పిలవరాదనే షరతుతో, కొన్ని ఆహ్వానాలను అంగీకరిస్తుంటాను.

ఇటీవల ఇలాంటి ఉత్సవం ఒకదానికి వెళ్ళాను. కేవలం సంగీతాన్ని ఆస్వాదించాలని వెళ్ళాను. ఆలస్యంగా వెళ్ళి, వెనుక వరుసలో కూర్చున్నాను. నన్నెవరూ గుర్తుపట్టనందుకు చాలా సంతోషించాను. హాలంతా రిటైరైన ఆఫీసర్లు, మధ్య వయసు మహిళలు, వృద్ధ మహిళలతో నిండిపోయింది. యువతీయువకు లెవరూ నా కంటికి కనిపించలేదు.

సరిగ్గా నాముందే ఇద్దరు నడివయసు మహిళలు కూర్చున్నారు. వరుసలు మకీ దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకు స్పష్టంగా వినిపిస్తోంది.

ఇద్దరూ ధర్మవరం చీరలు ధరించారు. నెరిసిన జుత్తులో తాజా మల్లెపూలు అలంకరించుకొని అందంగా కనిపించారు. ఈ రోజుల్లో అమ్మాయిలకు పెళ్ళికొడుకులను పట్టుకోవడంలో ఉన్న కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు.

“ఈ సాఫ్ట్‌వేర్‌ విజ్బంభణవల్ల 28 ఏళ్ళు దాటిన పెళ్ళికొడుకులు దొరకడం చాలా కష్టమవుతోందొ అని ఒక మహిళ వాపోయింది.

“రెండో మహిళకూడా ఈ సమస్యపట్ల ఆసక్తి ప్రదర్శించింది. వాళ్ళకు సంగీతం కన్న పెళ్ళికొడుకుల అంశమే ఎక్కువ ముఖ్యంలా ఉంది. వాళ్ళ ధోరణి నాకు ఆశ్చర్యం కలిగించింది.

మొదటి మహిళ కొనసాగించింది. “ఇవాళ కుర్రాళ్ళు 22 ఏళ్ళకల్లా బి.ఇ పూర్తిచేసేస్తున్నారు. వెంటనే ఏదో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చేస్తుంది రెండేళ్ళు పనిచేసి, ఒక ఏడు విదేశాల్లో గడుపుతారు. అప్పటికి వారికి పాతికేళ్ళు వస్తాయి. వారిప్పుడు వారి తండ్రులు బ్యాంకు ఆఫీసర్లుగానో, ప్రొఫెసర్లుగానో పనిచేసి నప్పటికంటే ఎక్కువే సంపాయిస్తుంటారు. మరివారు వెంటనే పెళ్ళిచేసేసుకొని స్థిరపడిపోవాలనుకోవడంలో ఆశ్చర్యమేముంది చెప్పు?”

ఆమహిళ విశ్లేషణ, హేతుబద్ధమైన ఆలోచనలు నన్ను అకట్టుకున్నాయి. ఆమె తర్మశాస్త్రం ఇంకొంచెం నేర్చుకుంటే, నిస్సందేహంగా తానే మంచి ప్రోగ్రామర్‌ కావచ్చు.

తమమాటలు ఎవరైనా వింటున్నారేమోనన్న స్పృహే వారికి లేనట్లుంది. రెండో మహిళ ఏమైన అనేలోగా తన ప్రశ్నకు తానే సమాధానం చెప్పింది. “ఇలాంటి వారి తల్లితండ్రులేం సామాన్యులా? తమపుత్రరత్నాలకు సాస్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అమ్మాయిల కోసమే గాలిస్తారు. ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థుల్లో 50 శాతం అమ్మాయిలే ఉన్నారని విన్నాను. ఈ రోజుల్లో ఇంజనీరింగ్‌ కాలేజీ అంటే మనకాలంలో అర్ట్స్‌ కాలేజీలా అయిపోయింది. అబ్బాయిల తండ్రులు సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిలను ఇట్టే పట్టేస్తారనడంలో సందేహంలేదు. ఇలాంటి పెళ్ళి అన్ని విధాలా ఇద్దరికీ మంచిదే. విదేశంలో అతనికి తోడు ఉంటుంది.

మారే లోకంలో జీవనయానం న! వండిపెట్టి తనకు సేవచేసే మనిషుంటుంది. అమ్మాయికి కూడా ఇవే సానుకూలతలు ఉంటాయి. కనుక పూర్వకాలంలోలాగా ఈ యువకులకు 25 ఏళ్లకే పెళ్ళయిపోతుంది”.

ఈ విశ్లేషణకు ఆమెకు స్వర్ణపతకం ఇవ్వాచ్చనుకొన్నాను. ఇక రెండో మహిళ తన అభిప్రాయాలు చెప్పడం మొదలెట్టింది. ఆమె వైఖరి కొంత భిన్నంగాఉంది.

“ఈ సాఫ్ట్‌వేర్‌ విజ్బంభణ వల్ల ఒక రకంగా నష్టమే ఎక్కువ. ఇతరులమీద దీని ప్రభావం ఎలా ఉందో చూడు. ఇవాళ అమ్మాయిలు ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు, మెకానికల్‌ ఇంజనీర్లు, ఆఖరుకు డాక్టర్లను కూడా పెళ్ళిచేసుకొనడానికి ఇష్టపడ్డంలేదు. ఈ కుర్రాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు తక్కువ. వాళ్ళ జీతాలు కూడా అంత ఆకర్షణీయంగా ఉండవు. అన్నిటికన్న ముఖ్యమైంది, వారికి కుటుంబాల్లో గౌరవం ఉండదు.”

ఈ అఖరుమాటవిని నేను నిజంగా దిమ్మెరపోయాను. ఆమె వివరణకూడా వినాలనిపించింది. “అబ్బాయి విదేశాల్లో ఉంటే ఏ మూడు వారాలో సెలవు మీద వస్తాడు. బోలెడు కానుకలు తెస్తాడు. అందుకని అతన్ని అందరూ మెచ్చుకుంటారు.అయితే ఇంజనీర్లుకానీ దాక్టర్లుకానీ విదేశాలలో పనిచేయడానికి అందరికీ ఒకేలా అవకాశాలురావు. అంతేకాదు, కోడలు ఎప్పటికీ అత్తగారితోనే ఉంటే గౌరవం ఉండదు. ఈ రోజులలో ఏ అమ్మాయికీ అత్తగారితో ఉండటం ఇష్టం లేదు. అందువల్ల విదేశాలకు వెళ్ళడం మంచి పరిష్కారం. అయితే ఎప్పుడోకాదు, పెళ్ళయిన వెంటనే బయలుదేరిపోవాలను కొంటారు”.

“తర్వాతవెళ్తే ఏం?”

“తర్వాత అత్తవారింట ఉంటేనే బాగుంటుంది. తర్వాత పిల్లలుంటారు కదా! వారిని అత్తామామలే చూసుకుంటారు. ఏ దిగులూ ఉండదు. నౌకర్లమీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమైతేనే, అమెరికా-ఇండియాల మధ్య తిరిగే అవకాశం ఉంటుంది.”

ఇక ఊరుకోలేక పోయాను. ఈ రోజు నేనో కొత్త ప్రపంచం చూడగలిగాను. వాళ్ళెవరో తెలుసుకోవాలనిపించింది. చక్కని సంగీత కచ్చేరికి వచ్చి, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సాంఘికపార్య్వాలు గురించి చర్చించుకొంటున్నారు.

మర్యాదకాదని తెలిసినప్పటికీ, వారి సంభాషణకు అంతరాయం కలిగించకుండా ఉండలేకపోయాను. “క్షమించాలి. మీకు సాఫ్ట్‌వేర్‌ సాంఘికశాస్త్రం గురించి ఇన్ని విషయాలు ఎలా తెలిశాయో తెలుసుకోవాలనుంది” అన్నాను.

వాళ్ళిద్దరూ క్రుళ్ళిపడ్డారు. నావేపు తిరిగి చూశారు. నాప్రశ్న వారిని చిరాకు పరచి ఉంటుంది. తప్పువారిది కాదు. వారి అంతరంగిక సంభాషణలకు అడ్డుతగిలాను.

తెర జ్ఞానం - పరిజ్ఞానం మానాన్నంటే నాకు ప్రాణం. ఆయన థధగ్గర నాకు స్వేచ్చ ఎక్కువ. చాలాచాలా మాట్లాడుకొనే వాళ్ళం. అనేక అంశాలపై చర్చించుకొనేవాళ్ళం. కిందటివారం ఆయన్ను చూసినప్పుడు ఆయనెంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నారు. అనారోగ్య లక్షణాలేవీ కన్పించలేదు. ఏమైఉంటుంది? గుండెపోటా లేక పోతే ఏదైనా ప్రమాదమా? మా అమ్మెలాఉందో? ఆమెకెంత కష్టమొచ్చింది? ఆఫీసులో నాతో పనిచేసే ఒక సహోద్యోగికి ఇలాంటి టెలిగ్రామ్‌ ఏడాదికొకటైనా వచ్చేది. అందులో “నాయనమ్మ చనిపోయింది వెంటనే బయలుదేరు” అని ఉండేది. సెలవు కావాలంటే ఇదే మంచి పద్ధతని చెప్పేవాడునాతో. ఇది కూడా అలాంటి టెలిగ్రామే అనుకొని “మీకు చాలినన్ని లీవులు ఉన్నాయా?” అని అడిగాడతను. అతనలా అడుగుతుంటే నాకెంత కోపమొచ్చిందో చెప్పలేను. నా ప్రయాణం దుర్భరంగా సాగింది. మానాన్నతో గడిపిన నా బాల్యాన్ని కాలేజీ రోజులను తలచుకొన్నాను. మొదట్లో ఆయనో ఆదర్శనీయుడు. చాలా ప్రపంచం చూసిన తర్వాత హీరోగా కంటే మిత్రునిగా పరిగణించాను. నా బాల్యమంతా అయిపోయిందని బాధపడిన రోజులు గుర్తొచ్చాయి. నేనూ మా నాన్న ఏవేవో ప్రదేశాలు సందర్శించాలని, చాలా పుస్తకాలు చదవాలని కలలుకన్నాం, ఎన్స్న్నో విషయాలు చర్చించాలనుకున్నాం. నా కలలన్నీ చెదిరిపోయాయి. ఏదిఏమైనా జీవితం సాగిపోవాలని నాకు తెలుసు. అయితే ఆయన ఉంటే జీవితం మరింత ఆనందదాయకంగా ఉండేది. మావూరు చేరాను. బోలెడు మంది కజిన్స్‌లో (దగ్గరి బంధువులు) ఎవరో ఒకరు స్టేషన్‌కు వస్తారను కుంటే ఎవరూ రాకపోయేసరికి దుఃఖంతోపాటు కోపంకూడా వచ్చింది. అందరూ విచారంలో ఉంటారని సర్దిచెప్పుకున్నాను. అయినా నేనీటైన్‌లో వస్తానని వారికెలా తెలుస్తుందని సమాధానపడ్డాను. ఆటోలో ఇల్లుచేరాను. ఇల్లు దగ్గరపడుతుంటే, నాగుండె దడదడాకొట్టుకో సాగింది, అదే రోడ్డు, అదే ఇల్లు కానీ నా ప్రియమైన నాన్న లేని ఇల్లు. ఆటోదిగి చూస్తే, ఇల్లు నిశ్ళబ్దంగాఉంది. లోపల మనుషులున్న అలికిడేలేదు. ఆశ్చర్యపోయాను. మానాన్న చాలాపేరున్న దాక్టరు, ప్రొఫెసర్‌కూడా. అంతిమ నివాళి అర్పించేందుకు చాలామంది వచ్చేవారు. నా కజిన్స్‌ కూడా ఎవరూ కనిపించలేదు. లోపలికి వెళ్ళాను. ఇల్లంతా పూలు, మామిడాకులతో అలంకరించారు. ఏదో సంతోషకరమైన సందర్భంలా ఉంది. ఏం చేయాలో తోచక అలానిల్చుండిపోయాను. సరిగ్గా అప్పుడే మానాన్న గదినుంచి సందడి వినిపించింది. అటువేపు తిరిగిచూసి, నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను. అక్కడ నాన్న నావేపు చూస్తూ, ఆనందంగా, చిరునవ్వుతో నిల్చుని ఉన్నారు. కలా, నిజమా?

వరితావం కలిగించిన టెలిగ్రాం తా ఎంతో సంతోషంగా అన్నారాయన “నిశ్చితార్థానికి నువ్వెలాగైనా వచ్చేస్తావని నాకు తెలుసు. ఆమె నీకిష్టమైన కజిన్‌కదాకొ

“మ్సీరు దేనిగురించి మాట్లాడుతున్నారు?

“నిశ్చితార్థం గురించి. లత పెళ్ళి నిశ్చయమైంది. అబ్బాయి కుటుంబంవాళ్ళు ఈ సాయంకాలమే నిశ్చితార్థం జరగాలని పట్టుపట్టారు. అతను ఢిల్లీలో ఉంటాడు. పెళ్లి.”

ఆయన మాటలకు అడ్డు తగిలాను “టెలిగ్రాం ఎవరిచ్చారు? అలా ఎందుకు రాశారు? మీరు నాకు అబద్ధం ఎందుకు రాశారు? మీరే ఇలా చేస్తారా? మీరు అబద్ద్ధాలాడతారని కలలో కూడా అనుకోలేదు.”

నాకు చాలాచాలా చిరాగ్గా ఉంది.

అయితే నాన్నకు నేను చెప్పేదేమీ అర్థంకాలేదు. “ప్రై టెలిగ్రాం గురించి అదుగుతున్నావు? నువ్వురావాలని టెలిగ్రాం పంపామంతే.”

“అదే, ఇలాంటి టెలిగ్రాం ఎందుకిచ్చారని అడుగుతున్నాను?” ఆయనకు టెలిగ్రాం అందిస్తుంటే నా ఉద్వేగం కట్టలు తెంచుకొంది. నాన్న ఆశ్చర్యపడి దాన్ని నాకు పంపలేదన్నారు. .

అంతా అయోమయం. మరి దాన్నెవరు పంపినట్లు?

హఠాత్తుగా ఆయన మొహంలో చిరునవ్వు మెరిసింది. “వం జరిగుంటుందో నాకు తెలుసు. నిన్న నీ స్నేహితురాలు లత వాళ్ళనాన్న చనిపోయారు. నీకు తెలుసుకదా, ఆయన జబ్బుపడ్డారని. నీకాయనతో చాలా పరిచయంకదా. అందువల్ల నీకు లత టెలిగ్రాం ఇచ్చింది. ఇది కమ్యూనికేషన్‌లో జరిగిన లోపం. ఆమె మైఫాదర్‌ పాస్ట్‌ అవే “(మా నాన్న చనిపోయారు) అని రాయాల్సింది.” మై (నా) అనేపదం లేకపోవడంతో వచ్చిన అనర్థం ఇది.

ఆ టెలిగ్రాం నా మిత్రురాలు లత ఇచ్చిందని నాకిప్పుడు స్పష్టమైంది. ఇక ఇంట్లోయేమో నా కజిన్‌ లత నిశ్చితార్థ సంరంభం.

మా వాళ్ళు పంపిన ఇంకో టెలిగ్రాం తర్వాత అంది ఉంటుంది. దాన్నిచూసిన సహోద్యోగులు వమనుకుంటారో అని ఆలోచించసాగాను. ఆ టెలిగ్రాంలో “లత పెళ్ళి నిశ్చయమైంది, రేపు నిశ్చితార్థం” అని ఉంటుంది.

గో ఎస్జుస్షణ

10 నీతిలేని కోతల రాయుడు క్యా కిందట ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఇంకా శైశవదశలో ఉన్నప్పటి సంగతి. మేంచేయదలచిన కృషి గురించి జనానికి తెలియని రోజులు. మాసంస్థ గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా పనిచేసేది. మేమేవెళ్ళి వారిని కలిసి వారి సహకారాన్ని అర్ధించేవాళ్ళం. ఇన్ఫోసిస్‌ కంపెనీ అప్పటికి వ్యాపార రంగంలో పేరు తెచ్చుకొంది. కానీ ఫౌండేషన్‌ మాత్రం రెండే రెండు గదులకు పరిమితమైంది. ఇప్పటికీ అంతే. ఇన్ఫోసీస్‌ టవర్స్‌ మూడో అంతస్తులో మేమో బోర్జ్డుకూడా రాయించి పెట్టలేదు. అందువల్ల మా ఆఫీసు ఉన్నట్లు ఎవరికీ పెద్దగా తెలిసేదెకాదు. దాంతోమా ఉద్యోగులకు సెక్యూరిటీ సిబ్బందితో ఇబ్బంది ఎదురయ్యేది. ఇన్ఫోసిస్‌తో సంబంధం ఉన్న సంస్థకు తళతళలాడే పెద్దబోర్డు ఉండాలని వాళ్ళు వాదించేవారు. ఆదినుంచీ కూడా ఫౌండేషన్‌ గ్రామీణ ప్రజల, ముఖ్యంగా బాలల కష్టాలు తీర్చడానికే కృషి చేస్తోంది. పట్టణ (ప్రాంతాలవారి లాగా వారు కూడా మంచి భవిష్యత్తును ఆశించేట్టు అందుకు కృషిచేసేట్లు వారిని ప్రోత్సహించాలన్నదే మా సంకల్పం. మనదేశంలో పట్టణ ప్రాంతాల, గ్రామీణ ప్రాంతాల జీవన పరిస్టితుల మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉన్న సంగతి తెలిసిందే. నగరాల్లో మన పిల్లలు సాధారణ మనుకొనే సదుపాయాలు గ్రామీణ బాలలకు అందుబాటులో లేవు. టీవీ చూడడం, ఏహిందీ సినిమా పాటలో వినడం, ఆఖరుకు ఒక పుస్తకం చదవడం వంటి ఆధునిక జీవితపు సరదాలు వారికి తీరడంలేదు. పల్లెల్లో ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. (ప్రాథమిక అవకాశాలు కూదా లేకపోవడంతో పల్లెల్లోని బాలబాలికలు తమ సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తుంటారు. గ్రామీణ జీవనంలోని ఈ లోటును సన్నిపొతంగా పరిశీలించిన తర్వాత, ఫౌండేషన్‌ తన ప్రాథమిక లక్ష్యాలలో ఒకటిగా ఊరూరా గ్రంథాలయం పేర ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. రేపటి పౌరులైన బాలలకు (గ్రంథాలయాలవల్ల కలిగే మేలు ఇంతాఅంతా కాదు, నేనొక చిన్న పట్టణంలోని మధ్య తరగతి కుటుంబంలోపుట్టి పెరిగాను. అందువల్ల విద్యార్థి జీవితంలో, పుస్తకాల (ప్రాముఖ్యం నాకు బాగా తెలుసు. నా చిన్న తనంలో చాలా కొన్ని పుస్తకాలే నాకు అందుబాటులో ఉండేవి. పుస్తక ప్రపంచాన్ని అందుబాటులోక్తి తెచ్చే గ్రంథాలయాలు (ప్రారంభించడం అత్యవసరమని నేనారోజుల్లోనే భావించాను.

నీతిలేని కోతల రాయుడు పం ఫౌండేషన్‌కు నన్ను ట్రప్టీగా నియమించగానే, గ్రామీణ బాలలకోసం గ్రంథాలయాలు స్థాపించాలన్న నా ఆశయానికి రూపమివ్వడానికి నాంది పలికాను.

పుస్తకపఠనం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇది ఉపయుక్తమైన అలవాటే కాకుండా, చదువరులలో ఉత్తమ గుణాలను పెంపొందిస్తుంది. అందుకని, లైబ్రరీలు ప్రారంభించి వాటిని ప్రాంతీయ భాషా గ్రంథాలతో నింపాలని ట్రస్టీలు సంకల్పించారు. పిల్లలు స్కూల్లో చదివే పాఠ్యగ్రంథాలను వాటిలో ఉంచాల్సిన అవసరం లేదనుకున్నాం. ఎవరి సహాయమూ అవసరం లేకుండా చదవగలిగిన బొమ్మల పుస్తకాలు సులభమైన భాషలో రచించిన ఆసక్తిదాయకమైన పుస్తకాలను ఎంపికచేశాం. అలా కర్ణాటక (గ్రామాల్లో పుస్తకాలు చదివే అలవాటును ఫౌండేషన్‌ వ్యాపింప చేయగలిగింది.

చిన్న మొక్కగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, ట్రస్టు పోషణలో నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. రాష్ట్రంలో 4000కు పై చిలుకు గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. ఇవి (గ్రామీణ బాలల ఎదుట ఒక నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించి వారిజీవితాల్లో ఒక కొత్త వెలుగు నింపాయి.

ఒక మధ్యాహ్నంపూట, నా గదిలో కూర్చుని ఫౌండేషన్‌ (ప్రాజెక్టులకు కొత్తకార్యక్రమాలు రూపొందించే ప్రయత్నం చేస్తున్నాను. మధ్యలో ఒకసారి అలా తలెత్తిచూసేసరికి నా ఆఫీసు గాజు తలుపు కావల ఒక మనిషి నీడ కనిపించింది. గది అంతా పుస్తకాల దొంతర్హు, రకరకాల కాగితాలు నిండిపోయి ఉండడంతో ఆ మనీషెవరో సరిగా కన్పించలేదు.

మళ్ళీ నాపనిలో నిమగ్నమైపోయాను. అనుకొన్న పని పూర్తిచేయాలని ఆరోజు మధ్యాహ్న భోజనం, విశ్రాంతి సంగతి కూడా మరిచి పోయాను. ఇంతలో తలుపుమీద గట్టిగా తట్టి, నేను ఉలిక్కిపడేలా చేసి, కొత్తవ్యక్తి గభాలున లోపలికి వచ్చేశాడు. రావచ్చునా అని అడగనైనా లేదు. వచ్చీరాగానే “ఇదేనా ఫౌండేషన్‌ ఆఫీసు?” అనడిగాడు.

అవునంటూ తటపటాయిస్తూనే సమాధానమిచ్చి కూర్చోమన్నాను.

“మీరు ఫౌండేషన్‌ ఉద్యోగా?” అనడిగితే, తలూపాను. అతను ఆశ్చర్యంగా చూశాడు. ఇక్కడంతా ఆడంబరంగా ఉంటుందనుకొన్నాడేమో. నేనేమో సాదాసీదా కాటన్‌బీరతో ఉండడంతో నేనెవరో అతను వూహించలేక పోయాడు.

అతనొచ్చినప్పుడు కొత్త ప్రాజెక్టు పరిచయ వాక్యాలు రాస్తూనే, అత్యవసరంగా వెళ్ళాల్సిన కొన్ని బంగీలను పంపేహదావిడిలో ఉన్నాను. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఇలా నిరాడంబరంగా ఉంటుందని అతను ఊహించి ఉండడు. తాను కలవ దలచిన వ్యక్తి ఎలాంటి అలంకరణా లేకుండా ఒక చిన్న క్యాబిన్‌లో పుస్తకాలు, కాగితాలమధ్య దర్శన మిస్తుందనే తలంపే అతనికి వచ్చి ఉండదు. అతను పరిచయాలతో సమయం వ్యర్థ పరచకుండా, సంచీ తెరిచి, కరపత్రాల్లా కనిపిస్తున్న రెండు కన్నడ పుస్తకాలు బయటికి తీశాడు.

శం జ్ఞానం - నరిజ్ఞానం

“ఇవి పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. నేను ఎన్నో ఏళ్ళు (శమించి వీటిని రాసి ప్రచురించాను. వీటికి కర్ణాటక అంతటా విపరీతమైన గిరాకీ ఉంది. వీటిని మీరు మీ లైబ్రరీ ప్రాజెక్టకోసం కొనుక్కోవచ్చు” అన్నాడు.

విన్నాను కానీ, ఆ పుస్తకాల నాణ్యత, ధర గురించి, ముఖ్యంగా వాటిలో ఉన్న విషయమేమిటో తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోలేను. ముందుగా పుస్తకాలు చూసి, అవి గ్రామీణ బాలలకు ఉపయుక్తంగా, ఆసక్తికరంగా ఉన్నాయోలేవో చూడాలి.

నా మౌనం అతనికి చిరాకు కలిగించినట్లుంది. “సుధామూర్తి, నారాయణమూర్తి నాకు బాగా తెలుసు. ఫౌందేషన్‌ ట్రస్టీ సుధామూర్తిగారు రమ్మంటేనే వచ్చాను. లేకపోతే, ఇలాంటి సేల్స్‌మేన్‌ పని ఎందుకు చేస్తాను? మా సాన్నిహిత్యంవల్ల, ఆమెకు సహాయపడాలని వచ్చాను.

నాకు నవ్వొచ్చింది. “సుధామూర్తి మీకు చాలాకాలంగా ఎలా తెలుసు?” అనడిగాను.

అతనొకృక్షణం కూడా సంకోచించకుండా “సుధ నాకు చాలా కాలంగా తెలుసు. ఆమె నా బాల్య స్నేహితురాలు” అన్నాడు:

అరే, తమాషాగాఉంది. నేను మొదటిసారిగా చూసిన వ్యక్తి, నేనతని బాల్య స్నేహితురాలినంటున్నాడు!

చిలిపిగా అడిగాను “సుధది ధార్వాడ. మీరేమో బెంగుళూరు వ్యక్తిలా ఉన్నారు, అమె మీకు బాల్య స్నేహితురాలు ఎలా అవుతుంది?”

ఆశ్చర్యంగా అడిగాడు “మీ పై అధికారిని మొదటిపేరుతో పిలుస్తారా? అది మర్యాదకాదు. ఆమె ధార్వాడ అయితే ఏం? ఆమె వాళ్ళ పిన్నిఇంటికి చాలా తరచుగా వచ్చేది. మాపక్కిల్లే, ఇప్పటికీ అక్కడే ఉన్నారు.”

ఇదేం చోద్యం! మా వాళ్ళెవరూ పాతమైసూరు రాష్ట్రానికి, ఉత్తర కర్ణాటకకు మధ్య ప్రవహించే తుంగభద్ర నదిని దాటి ఎరుగరు. అందువల్ల ఇతని పొరుగింట్లోఉన్న 'పిన్ని గురించి విని విస్తుపోయాను.

అంతటితో ఆగలేదతను. “సుధ నన్నెప్తుడూ వాళ్ళ అన్నలానే చూసేది. ఆమెకు అన్నదమ్ములెవరూ లేరుకదా! మూర్తి ఇన్ఫోసిస్‌ పెట్టదలచినప్పుడు ఆమె నా సలహాకోసం వచ్చింది. నా పుస్తకాలు ఒక్కొక్కటి వంద కాపీలు కొంటానని చెప్పింది. ఆమెకు నా సత్తాతెలుసు. ఈ పుస్తకాలు ఇచ్చేసి సొమ్ముకీసుకు పొమ్మని చెప్పింది. నేనిప్పుడు కన్నడ సాహిత్యసభకు వెళ్ళాలి. అందువల్ల దయచేసి నన్ను తొందరగా పంపించండి.”

అతణ్జి కేకలేయాలో, ఈ తతంగం ఇలాగే సాగనివ్వాలో నాకు తోచలేదు. చివరికి ఈ ప్రహసనం ఎక్కడిదాకా నడుస్తుందో చూద్దామనుకొన్నాను.

నీతిలేని కోతల రాయుదు శే

“సుధామూర్తి ఎలాంటి మనిషి?” అనడిగాను.

తన స్నేహం గురించి చెప్పుకోడానికి అవకాశమొచ్చిందని చాలా సంతోషించి నట్లున్నాడు. “నెమ్మది మనిషయినా, చాలా సున్నితమైన స్వభావం అమెది. అమె ఎం.ఏ. చదివే రోజుల్లో సుధ అంటే ఎవరోకూడా క్లాసులో ఎవరికి తెలీదు. ఊరికే ఇంట్లో కూర్చుని సమయం వృధాపుచ్చకుండా ఏదైనా సంఘసేవ చేయమని నేనే చెప్పానామెకు. నేనే ఆమెను మూర్తికి పరిచయం చేసి, వాళ్ళ పెళ్ళికుదిర్భాను.”

“ఆమెది పెద్దలు కుదిర్చిన పెళ్ళంటారా?”

“నిస్సందేహంగా! వాళ్ళజూతకాలుకూడా నేనే సరిచూశాను. అందుకనే భార్యాభర్తలకు ఇప్పటికీ నేనంటే చాలా ఇష్టం. చాలా గౌరవంగా చూస్తారు. ఆమెనేడీ స్థితిలో ఉందంటే అందుక్కారణం నేనే కదామరి!”

ఇంక చాలు. ఇతనికి అబద్దాలు చెప్పేతెలివి కూడా లేదు. ముందూ వెనుకా ఆలోచించకుండా నిర్లక్ష్యంగా వాగేస్తున్నాడు. నాది (ప్రేమ పెళ్ళి. మేమెవరం జాతకాల సంగతే ఆలోచించలేదు. నేనెంతో కలివిడిగా ఉండేదాన్ని నా మొత్తం కాలేజీరోజుల్లో క్లాసులో నేనొక్కదాన్నే ఆడపిల్లను. అందువల్ల నేను ఎవరికీ తెలీకుందాపోయే ప్రసక్తేలేదు. నేను ఎం.ఏ కాదు, ఎం.టెక్‌. చదివాను. ఇక సాంఘిక సేవగురించి, నేనూ, మూర్తీ స్నేహితులుగా ఉన్నప్పటినుంచే ఆలోచించేవాళ్ళం.

అతని అబద్ధాలు భరించలేకపోయాను. ఇక నోరుమూయించడం మంచిదనుకొన్నా నేనెవరో చెప్పేయకపోతే, ఇంకా ఏమేం కూస్తాడో చెప్పలేం కదా!

చాలా కటువుగానే చెప్పాను. “మిస్టర్‌! మీ అబద్దాలు ఇక కట్టిపెట్టాలి. నేను నారాయణమూర్తి భార్య సుధామూర్తిని. నేను మిమ్మల్ని కలవడం ఇదేమొదటిసారి. నాగురించి ఇలా మాట్లాడ్డానికి ఎంత ధైర్యం మీకు? మీ పుస్తకాలు ఎంత గొప్పగాఉన్నాసరే ఎప్పటికీ కొనరాదని తీర్మానించుకౌన్నాను. రచయిత ఆలోచనలు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి. మీరెలాంటివారో నాకిప్పుడు తెలిసిపోయింది. మీ పుస్తకాలు ఉచితంగా ఇస్తానన్నా తీసుకోను. నీతీ, నిజాయితీ ఉన్న మనిషే మంచి రచయిత కాగలదని గుర్తుంచుకోండి",

ఇక అతని నోటమాట రాలేదు. అతనికింకేమీ అవకాశమివ్వకుండా, మనలోకం ఇంత ఘోరంగా తయారైందా అని చిరాగా విసుగ్గా ఆఫీసు నుంచి నిష్ర్రమించాను.

వగ ఆ్లాన్షం

క్ష రాఖీనాడే దగాచేసిన బాంధవ్యం

ఆన: మంది మహిళలు తమ తప్పుకానీ, పొరపాటుకానీ లేకపోయినా కష్టాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌లో నాకార్యకలాపాల్లో భాగంగా ఇలా బాధపడుతున్న మహిళల్లో చాలామందిని నేను ప్రత్యక్షంగా కలుసుకున్నాను. వారిలో చదువులేనివారు, ఇతరుల స్వార్ధానికి గురయినవారు ఎక్కువగా కనిపించారు. ఇటువంటి దురదృష్టవంతులైన మహిళలకు కూడా శక్తిమేరకు సహాయం అందించాలని మా ఫొందేషన్‌ సంకల్పించింది.

పడుపు వృత్తిలో దిగబడిపోయిన వారిలో ఇంచుమించు అందరూ అమాయకులే, వీరిలో ఎక్కువ మందిని చిన్నవయస్సులోనే దుర్మార్గులెవరో బలవంతంగా ఇందులోకి నెట్టేశారు. విధిలేని పరిస్థితుల్లో ఒకసారి ఈ కూపంలోకి ప్రవేశించాక, ఇక బయటపడటం చాలా కష్టం. బయటపడాలని చాలా మందే అఖభిలషిస్తారు కానీ అది ఇంచుమించు అసాధ్యమని తెలుసుకుంటారు. చిన్న వయసులోనే ఈ వృత్తిలో పడిపోవడంవల్ల వారు ఇతర పనులేవీ నేర్చుకోలేకపోతారు. అందువల్ల ఉద్యోగాలకు పనికిరారు. వేరే జీవనాధారాన్ని చూసుకోలేరు. అరుదుగా ఎవరైనా ఒక మహిళ ఈ నికృష్ణ జీవితం నుంచి బయటపడినా మనసమాజం వారిని దగ్గరికి రానీదు, ఆదరించదు.

గడచిన కొన్నేళ్ళల్లో ఇటువంటి దురదృష్టవంతుల సేవలో కొన్ని విషయాలు తలుసుకొన్నాను. మొదట్లోవాళ్ళు నన్ను కలుసుకొనడానికి, మాట్లాడ్డానికికూడా నిరాకరించేవారు. చాలా సార్లు వెళ్ళిన తర్వాత క్రమంగా సంకోచం వదిలిపెట్టి, నాతోమాట్లాడ్డం ప్రారంభించారు. వారు చెప్పిన కథలు హృదయవిదారకమైనవి. ఒకోసారి ఏమనాలో ఎలా స్పందించాలో కూడా నాకు తోచేదికాదు. వారి వేదన నన్ను కలతపెట్టింది.

అలాంటి సందర్భనల్లోనే ఒక ఆలయంలో నాకు తార పరిచయమైంది. ఈ మధ్య వయసు ఘర్వాలీ (సెక్స్‌ కార్మికురాలు) కాస్త ప్రత్యేకంగా కనిపించింది. ఆమెను చూస్తే, యౌవనంలో చాలా అందంగా ఉండేదనిపించింది. ఇప్పటికీ ధైర్యంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది.

తారకు చదవడం, రాయడం రాదు. నేనొక స్కూలు టీచర్‌ననుకొని నాసహాయం కోరింది. ఆమెకు చదువుకోవాలనుంది. మేము మొదటిసారి కలుసుకొన్నప్పుడు “మీకు మరెవ్రైనా లేడీటీచర్‌ తెలిస్తే చెప్పండి చదవడం, రాయడం నేర్చుకోవాలను కొంటున్నాను” అని అడిగింది.

రాఖీనాదే దగాచేనిన బాంధవ్యం శూ

“ఆమెను మా ఇంటికి రమ్మని కోరను. టీచర్‌ నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను” అంది.

విద్య నేర్చుకోవాలన్న ఆమె ఉత్సాహం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నాను. ఒకటి రెండుసార్లు ఆ (ప్రస్తావన తెచ్చాను కానీ, 'తన గురించి మాట్లాడ్డానికి ఇష్టపడలేదు. ఎప్పుడూ ఎంతో విచారంగా కనిపించేది.

అది రాఖీపండుగ రోజు. ఉత్తర కర్దాటకలోనూ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ రోజును నారళి-పూర్ణిమ అంటారు. నారళి-పూర్ణిమ అంటే, కొబ్బరికాయలతో పున్నమి పండుగ చేసుకోవడం. ఆ వారమంతా నేను మాగ్రంథాలయ ప్రాజెక్టు పనిలో (గ్రామీణ పాఠశాలలను సందర్శిస్తూ, ఆ ప్రాంతంలోనే గడిపాను.

మళ్ళీ తార కనిపించింది. నాకింకా జ్ఞాపకంఉంది, ఆరోజు మంచి ఎండలో తార గాజులు కొంటూ కనిపించింది. ఆమెతో మాట్లాడాలనిపించింది.

ఆమెను ఎలా పిలవాలా అని ఆలోచించాను. ఆమె నాకంటే పెద్దదికనుక 'అక్కా' అని సంబోధించాలని నిశ్చయించుకొన్నాను.

అక్క అంటే కన్నడంలో కూడా జ్యేష్ట సోదరి అనే అర్థం. కొంతసేపటి తర్వాత తార ఆలయం మెట్లమీద కూర్చునిఉంటే, దగ్గరికి వెళ్ళాను. ఆమె నన్నుచూసి చిన్నగా నవ్వింది. ఆమె విచారంగా ఉన్నట్లనిపించింది.

నేనూ చిరునవ్వు నవ్వి సంభాషణ ప్రారంభించాను. “తారా అక్కా నారళి-పూర్ణిమ వల్ల జనం ఎక్కువగా వచ్చారు. ఇక్కడికి రావడానికి నీకు చాలాసేపు పట్టింది.”

హఠాత్తుగా ఆమెమొహంలో రంగులు మారాయి. ఆమె కళ్ళలో కోపం తొంగిచూస్తోంది. నన్ను కేకలేయడం ప్రారంభించింది. “టీచర్‌, నన్ను అక్కా అని పిలవకండి. ఆపదమే నాకు ఇష్టంలేదు. అన్న తమ్ముడు, అక్క చెల్లెలు ఇలాంటి సంబంధాలన్నీ కేవలం మీ ప్రపంచంలోనే ఉంటాయి. నా ప్రపంచంలో కాదు. నన్నలా పిలవకండి. తార అనో తారాబాయి అనో పిలవండి కానీ అక్కా అనకండి. నా ప్రపంచంలో ఉన్నదల్లా ఒకే ఒక సంబంధం. అది ప్రీ-పురుష సంబంధం”.

నా కళ్ళనుండి అశ్రువులు రాలాయి. ఆమె మాటలవెనుక ఉన్న చేదు నిజం నాకు అర్ధమైంది. నాతోవచ్చిన వాలంటీర్లలో ఒకతను కలవరపడిపోయాడు. నేనెవరో తారకు చెప్పాలని ఉద్యుక్తుడైతే అతణ్జి వారించాను.

“తారా నిన్ను బాధపెట్టి నందుకు -విచారిస్తున్నాను. నువ్వు నాకంటె పెద్దదానివి కనుక అక్కా అనేపదం వాడాను. నీకు కోపం తెప్పించిఉంటే క్షమించు.”

హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. తార ఏడవసాగింది. ఆమె ఆకుపచ్చ

న. జ్ఞానం - వరిజ్ఞానం ఇర్మల్‌ చీరకొంగు కన్నీటితో తడిసిపోయింది. ఇందాక కొన్న గాజులు ఒకచేత్తోపట్టుకొని, ఇంకోచేత్తో కన్నీరు తుడుచుకొంటోంది. నేనేం మాట్లాడకుండా నాచేయి ఆమె భుజంమీదవేసి కూర్చున్నాను. మాటలకంటే మా మౌనమే ఎక్కువ సాంత్వన కలిగించింది. కాసేపటికి ఆమె ఏడ్వడం ఆపేసింది. కానీ, ఇంకా దుఃఖంలోనే ఉంది. ఆమెకోసం ఒకకప్పు టీ తీసుకురమ్మని మా వాలంటీర్‌ను పంపించాను. మరికొంతసేపట్లో తార శాంతించింది.

“టీచర్‌, మొరటుగా మాట్లాడినందుకు క్షమించండి. మీపొరపాటేమీలేదు. నన్ను అక్కా అని పిలిచి మీరు నాపట్ల గౌరవం చూపారంతే. ఈ రోజుదాకా నన్నెవరూ అంతమంచి మాటతో సంబోధించలేదు. జనం నన్ను రకరకాల పేర్లతో పిలుస్తారు. వాటిని మీకు వినిపించను కాన్మీ అక్కా అనగానే నన్ను బాల్యస్మృతులు వెంటాడాయి.”

తార మాట్లాడ్డం మొదలు పెట్టింది. తన పేదరికం గురించి, అంటువ్యాధి ప్రబలినప్పుడు తల్లితంగ్రుల్ని పోగొట్టుకోవడం గురించి చెప్పింది. అప్పుడామెకు ఒక తమ్ముడు మాత్రం మిగిలాడు. తానే పసిపిల్ల అయినా, అతణ్ణి అభిమానంగా చూసింది, అతని పోషణకోసం కూలిపనిచేసింది. అయితే ఆమెకు పన్నెండేళ్ళు, అతనికి పదకొందేళ్ళు ఉన్నప్పుడు, అతడామెను రెడ్‌లైట్‌ ప్రాంతం (వేశ్వావాటిక) లో అమ్మేశాడు. సంతకు వెళ్ళామనిచెప్పి, అక్కడికి పిలుచుకెళ్ళాడు. అది నారళి-పూర్ణిమ రోజు.

గుడిమెట్లమీద కూర్చుని ఆమె. అనుభవించిన వేదన ఏమిటో నాకిప్పుడు తేటతెల్లమైంది. ఇది మళ్ళీ నారళి-పూర్ణిమ రోజు. నేను అక్కా అనేసరికి ఆమె: మరచిపోవాలను కొంటున్నదేదో ఆమెమనసును కెలికేసిఉంటుంది. రాఖీ అంటే కేవలం ఒక సోదరుడి చేతికి సోదరి కట్టే దారం కాదు. అది సోదరీ-సోదరుల మధ్య ఉండే అనుబంధాన్ని చాటుతుంది. అయితే, తారను ఆమె తప్పేంలేకపోయినా, సొంతతమ్ముడే భయంకరమైన జీవితంలోకి తోసేశాడు. అదీ ఒక రాఖీ పండుగనాడు ఆ దుర్శార్గానిక్షి ఒడి గట్టాడు. |

వ్ల

112 బికారి జీవితం నేర్పిన పాఠం | లా స్నేహితురాలు మీనా జీవిత భీమా సంస్థ (ఎల్‌ఐసి)లో పనిచేస్తూ మంచి జీతం తెచ్చుకొంటోంది. ఆమె ధోరణి విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడూ ఎందుకో విచారంగా ఉంటుంది. ఆమెను కలిసి నప్పుడల్లా నన్ను కూడా నిరుత్సాహం ఆవరించేస్తుంది. ఆమె ఉదాసీనత, నిరాశా, నిర్వేదాలకు ఇతరులకు వ్యాపించే లక్షణాలున్నట్లున్నాయి. మీనా ఎన్నడూ ఏ విషయం గురించీ, ఎవరి గురించీ ఒక్కమంచి మాట చెప్పలేదు. ఉదాహరణకు నేను “మీనా నీకు తెలుసా, రాకేష్‌ స్కూలుకంతా ఫస్టువచ్చాడు” అంటాననుకోండి. ఆమె దాన్నో చిన్న విషయంగా తీసిపొరేస్తుంది. వాడి నాన్న స్కూలు టీచరు, ఫస్టురాకేం చేస్తాడు అంటుంది. “శ్చ్యేత చాలా అందంగా ఉంటుంది కదూ” అన్నా సహించదు. “గ్వర్రం కూడా చిన్నప్పుడు అందంగానే ఉంటుంది. వయసు మహిమ. కొన్నాళ్ళకు శ్వేత అందరికన్న వికారంగా తయారైపోతుంది” అనేస్తుంది. “వినా ఈరోజు వాతావరణం చాలా ఆమ్షాదకరంగాఉంది. అలా సరదాగా నడిచొద్దాం పదో “వద్దు, ఎండమాడిపోతోంది. నడిస్తే అలసిపోతాను. అసలు నడక ఆరోగ్యానికి మంచిదని ఎవరు చెప్పారు నీకు? అందుకు రుజువేం లేదూ” అదీ మీనా ధోరణి. ఆమె తల్లితండ్రులు ఢిల్లీలో ఉంటారు. తానొకృతే ఒంటరిగా ఇక్కడో అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. వాళ్ళకు ఈమె ఏకైక సంతానం. అన్నిటికీ విసుక్కోవడం, అసంతృప్తి ప్రకటించడం ఆమె నైజం. అందువల్ల సహజంగానే ఆమెతో మాట్లాడ్డం ఎవరికీ ఇష్టముండదు. ఇంటికి కూడా ఎవరూ వెళ్ళరు. ఇలా ఉండగా, మీనాను హఠాత్తుగా ముంబాయికి బదిలీచేయడంతో మేం ఆమె సంగతే మరచిపోయాం. చాలా ఏళ్ళ తర్వాత ముంబాయి వెళ్ళినప్పుడు ఫ్లోరా ఫౌంటెన్‌ దగ్గర వర్షంలో చిక్కుకు పోయాను. వర్షం కుండపోతగా కురుస్తోంది. నాదగ్గర గొడుగైనా లేదు. వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని చూస్తూ అక్బరల్లీ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ దగ్గర నిల్చుండిపోయాను.

శే జ్ఞానం - పరిజ్ఞానం

అప్పుడు హఠాత్తుగా మీనా కనిపించింది. నాకు మొదట వర్షంలో అయినాసరే ముందక్కడి నుంచి పారిపోవాలనిపించింది. ఆమె కంటపదకపోతే బావుణ్ఞనుకొన్నాను. ఆమె ఫిర్యాదులు వినే ఓపికలేదు. ఆయితే తప్పించుకొనే వీలే లేకుండాపోయింది. మీనా నన్ను అప్పటికే చూసేసింది. గబగబా వచ్చి ఎంతో ఆప్యాయంగా నాచేయి పట్టుకొంది, అంతేకాదు ఆమె మంచి హుషారుగాటింది.

“ఏయ్‌! నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పాత(ఫెండ్సును కలవడం గొప్ప అదృష్టం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?”

ముంబాయికి ఆఫీసు పనిమీద వచ్చానని చెప్పాను.

“అయితే ఈ రాత్రికినాతో ఉండిపో. కబుర్లు చెప్పుకుందాం. పాతవైన్‌, పాతమిత్రులు, జ్ఞాపకాలు అమూల్యం, అపురూపం అని నీకు తెలుసా?”

నమ్మలేకపోయాను. ఈమె నిజంగా మీనాయేనా? కలా, నిజమా అని నన్ను నేనే గిల్లుకొని చూశాను, కలకాదు. మీనా నా ఎదురుగా నిల్చుని, నాచేయినులిమేస్తూ, చిరునవ్వులు చిందిస్తోంది. చాలా సంతోషంగా కనిపిస్తోంది. ఆమె బెంగుళూరులో ఉన్న మూడేళ్ళలో ఆమె మొహంలో ఇలాంటి చిరునవ్వును ఒక్కనాదైనా చూడలేదు. ఆమె జుత్తు అక్కడక్కడా నెరిసింది. మొహంలో చర్మం ఒకటి రెండుచోట్లముడుతలు పడింది ఆయినా అమె ముందుకంటే ఎంతో అందంగా ఆకర్షణీయంగాఉింది.

చివరికి “లేదు మీనా, ఈరోజు రాలేను. ఈ రాత్రికి నేనో విందుకు వెళ్ళాలి. నీ విజిటింగ్‌ కార్డుంటే ఇవ్వు. నిన్ను మరిచిపోను. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను. ఈలోగా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు". అన్నాను.

ఒక్కక్షణం మీనా నిరాశ చెందినట్లు కనిపించింది. అంతలోనే “సరే, ప్రస్తుతానికి ఇక్కడెక్కడైనా టీ తీసుకొందాం పద” అని పట్టుపట్టింది.

[

“ఎలా మీనా, వర్షంజోరు తగ్గడంలేదు”

“అయితే ఏం? గాడుగొకటి కొనుక్కుని, గ్రాంద్‌ హోటల్‌కు వెళదాం” అంది.

“ఈ వర్షంలో టాక్సీ దొరకదు” అని గొణిగాను. మీనా వినిపించుకోలేదు.

“దొరక్కపోతే పోనీ! నడిచిపోదాం”

నా ఆశ్చర్యానికి అంతేలేదు. ఈ మీనా వేరు. నాకు తెలిసిన ఆమీనా వేరు.

గ్రాండ్‌హోటల్‌ చేరుసరికి తడిసి ముద్దయిపోయాం. అన్నిటికీ విసుక్కుంటూ, విచారిస్తూ ఎప్పుడూ నిరాశలో మునిగితేలే ఈమెను ఎవరు మార్చారో లేదా ఏది మార్చిందో తెలుసుకోవాలని నేను తహతహలాడిపోయాను.

బికారి జీవితం నేర్పిన పాఠం త

“ఇప్పుడు చెప్పుమీనా, ఎవరా రాకుమారుడు? ఏమా కథ? నిన్నింతగా ఎలా మార్చేశాడు చెప్పు?”

ఆశ్చర్యపోవడం అప్పుడు మీనా వంతయింది. “లేదులేదు అలాంటిదేం లేదు” అంది.

“మరి నీ ఉత్సాహ రహస్యమేమిటి?” అని అడ్వర్టయిజ్‌మెంట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ అడిగినట్లు అడిగాను.

“ఒక యాచకుడు నా జీవితాన్ని మార్చేశాడు” అంటూ నవ్వింది.

నేను తెల్లపోయి చూసేసరికి “అవును బిచ్చగాడే” అంటూ జరిగినదంతా చెప్పసాగింది. “అతనో ముసలతను. అయిదేళ్ళ మనవరాలితో పాటు మాఇంటిముందే ఉండేవాడు. నీకు తెలుసుకదా, నేను నిరంతర నిరాశావాదిని. ఎవర్నీ నమ్మేదాన్నికాదు. అయితే, ప్రతిరోజూ మిగిలిపోయిన అన్నంఉంటే అతనికి ఇచ్చేదాన్ని. నేనెప్పుడూ అతన్ని పలకరించలేదు. అతనూ మాట్లాడేవాడుకాదు.

“అలా ఉండగా ఒకవర్నంరోజు, నాపడకగది కిటికీలోంచి చూసి వర్షాన్ని తిట్టసాగాను. వర్షం నానెత్తిమీదే పడకపోయినా, ఎదుకు తిట్టానో నాకే తెలీదు. బిచ్చగానికి, అతని మనవరాలికి రోజూ పెట్టే అన్నం పెట్టలేకపోయాను. వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటారనుకున్నాను.

“అయితే, కిటికీలోంచి కనిపించిన దృశ్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ట్రాఫిక్‌ లేకపోవడంతో బిచ్చగాడు, అతని మనవరాలు ఎగిరెగిరి ఆడుకుంటున్నారు. వాళ్ళు తామేదో స్వర్గంలో ఉన్నామనుకొంటున్నట్లు నవ్వుతున్నారు. చేతులు చరుస్తున్నారు. సంతోషం పట్టలేక అరుస్తున్నారు. ఆకలి మరచిపోయి వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. పూర్తిగా తదిసి ముద్దయిపోయి పరమానందంతో ఆడుకుంటున్నారు. జీవితంపట్ల వాళ్ళ అనురక్తిని చూస్తే, నాకు ఈర్చ్యకలిగింది.

“ఆ దృశ్యం నాజీవితం గురించి అలోచించుకొనేలా చేసింది. నాకు అనేక సౌకర్యాలున్నాయి. వారికొక్కటీలేదు. అయితే అన్నిటికన్న ముఖ్యమైనది, నాకు లేనిదీ వారికి ఉంది. ఏది ఉన్నా లేకపోయినా సంతోషంగా జీవించడమెలాగో వారికి తెలుసు. నిజంగా సిగ్గుపడ్డాను. నాకు ఉన్న లేని వాటి జాబితా రాయడం ప్రారంభించాను. చాలా మంది ఊహించనుకూడాలేని సౌకర్యాలు, అనుకూలతలు నాకున్నాయని (గ్రహించాను. ఆ యాచకుని ఆదర్శంగా తీసుకొని, జీవితంపట్ల నా దృక్పథాన్ని మార్చుకోవాలని ఆరోజే నిశ్చయించుకొన్నాను.”

చాలాసేపు అలా సంభ్రమంతో కూర్చుండి పోయాను. చివరికి, మారడానికి ఎంతకాలం పట్టిందని మీనాను అడిగాను.

శ్‌ జ్ఞానం - వరిజ్ఞానం చట

“జ్ఞానోదయం అయింతర్వాత, పూర్తిగా మారడానికి రెండేళ్ళు పట్టింది. ఇప్పుడు దేనికీ బాధపడను. అసంతృప్తిలేదు. ప్రతిచిన్న విషయంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి వ్యక్తిలో నాకు సంతోషం కనిపిస్తుంది.”

“వీ గురువుకు ఏదైనా గురుదక్షిణ ఇచ్చావా మరి” అని అడిగాను.

“న్రేద్రు, దురదృష్టవశాత్తు, పరిస్థితి నాకు తెలిసే సరికే అతను చనిపోయాడు. అయితే అతని పట్లగౌరవసూచకంగా అతని మనవరాలిని బోర్టింగ్‌ స్కూలులో చేర్చించి చదివిస్తున్నా”.

ల జ్స్‌్ణం

18 మన చరిక్రే మనకు తెలియదు మ దేశ చరిత్ర అంతా ఎందరో అమరవీరులు, దేశభక్తుల గాథలతో నిండిఉంది. వారికి మనం ఎల్లప్పటికీ రుణపడిఉండాలి. వారికి మనం గౌరవసూచకంగా శిరస్సువంచి ఛద్దాంజలి సమర్పించాలి. మనదేశంకోసం పోరాడుతూ వీరమరణం పొందిన మహిళల గాథలు తరతరాల వరకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. వారిలో చాలామంది విద్యావంతులు కాకపోయినా శతృవుని ఎదురొడ్డిపోరాడి నిరుపమానమైన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చిత్రదుర్గ జిల్లాకు చెందిన ఒబ్వవ్వ ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన కిట్టూర్‌ చెన్నమ్మ, బరాందిల్లి బలవాడీ మామ్మ - ఇలా ఎందరో వీరనారీమణులు - వీరిని మనం గౌరవప్రపత్తుల సంస్మరించు కోవాలి. పూర్తిగా ఆయుధధారులై వచ్చిపడిన శతృసైనికులను ఒబ్వవ్వ కేవలం వంటింట్లోని రోకలితో ఎదురొడ్డి నిలిచి పోరాడింది. ఇలాంటి మహిళల వీరగాథలను నేటి తరం తెలుసుకోవాలి. చారిత్రక నాయకీమణుల్లో రూన్సీరాణి లక్ష్మీబాయి సాహసకృత్యాలు మనబారి చరిత్రలో ఒక మహోజ్వలఘట్టం. సంతానం లేని ఈ యువ వితంతువు మహాశక్తి మంతమైన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని సవాలుచేసి గడగడ లాడించింది. ఆమె పోరాటపటిమ చూసి శతృవులు అచ్చెరువాందారు. ఈ థీరవనితను శ్లాఘిస్తూ ఎందరో కవులు కవితలల్లారు. సైన్యంలోకెల్ల ఆమె ఒక్కరే 'మగధీరుడ' నే పొగడ్త ఆరోజుల్లో వ్యాప్తి ష్‌ వచ్చిందంటే, ఆమె ధైర్యసాహసాలు, పోరాటపటిమ ఎంతటవో అర్థమవుతాయి. ఆ చరిత్ర నేడు ఎంత మందికి తెలుసు? ఇటీవల ఒక భోపాల్‌ సంస్థ నాకు ఓజస్వని అవార్డు ప్రకటించింది. ్త్టీలో జరిగిన సభలో ఆ అవార్డును ప్రదానం చేశారు. అవార్డుతో పాటు జ్ఞాపికగా చతి ఖడ్గంతో గుర్రం మీద స్వారీ చేస్తున్న రాణీలక్ష్మీబాయి ప్రతిమను బహూకరించారు. ఆ శిల్పాన్ని మహాసుందరంగా తయారుచేశారు. ఆ ప్రతిమను మరీ పెద్దదిగా ఉన్నా విమానంలో నాతోపాటే ఉంచుకొని బెంగుళూరు

వి జ్ఞానం - పరిజ్ఞానం వచ్చాను. సామాన్లతో ఉంచితే విరిగిపోతుందేమోనన్న భయంతో హేండ్‌బ్యాగేజిగా వెంట తెచ్చుకున్నాను. ఢిల్లీ విమానాశ్రయంలో, నేనిచ్చిన వివరణతో సంతృప్తి చెందిన సెక్యూరిటీ

సిబ్బంది ఎంతో దయచూపారు. విగ్రహాన్ని మెటల్‌డిటెక్టర్లతో పరీక్షించి విమానంలోకి తీసుకెళ్ళడానికి అనుమతించారు.

జెట్‌ఎయిర్‌వేస్‌ సిబ్బందికూడా ఎంతో మర్యాదగా చూశారు. ఎకానమీ క్లాసులో ఉండడంతో (ప్రతిమను ఒడిలో ఉంచుకోలేకపోయాను. పైనున్న లాకర్‌లో ఎలాగూ పట్టదు. ఎయిర్‌హోస్టెస్‌ నా ఇబ్బందిని గమనించి, ప్రతిమను తీసుకెళ్ళి, ఫస్టుక్లాసులో ఇఖాలీగాఉన్న సీటుమీద ఉంచింది. యోధురాలైన రాజీలక్ష్మీబాయికి అర్హమైన గౌరవం లభించిందనుకొన్నా.

అందరి సహాయంతో అంతా సవ్యంగా సర్జుకోవడంతో, ఇక హాయిగా కూర్చునాను, ఈ తతంగాన్నంతా మిగతా ప్రయాణీకులు ఆసక్తిగా గమనించారు. విమానం గాలిలోకి లేవగానే నన్ను కుళూహలంగా చూశారు. ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

ప్రయాణీకుల మధ్య సంభాషణలు గురించి స్వానుభవంతో నేనో అభిప్రాయం ఏర్పరచుకొన్నాను. పరిమాణాత్మకంగా చెప్పాలంటే 'సంభాషణ”' ఆర్థిక హోదాకు విలోమానుపాతంలో ఉంటుంది. మీరు బస్సులో ప్రయాణిస్తుంటే, మీ పక్కనున్నవాళ్ళు మీతో వెంటనే సంభాషణ ప్రారంభించేస్తారు. వారికేం సంకోచాలుండవు. అదే మీరు టైనులో ఫస్టుక్సాసులో ప్రయాణిస్తుంటే, తోటి ప్రయాణీకులు కొద్దిపాటి సంకోచం ప్రదర్శిస్తారు. ఇక విమానంలో అయితే ప్రయాణీకుల మధ్య సంభాషణ చాలా అరుదుగా జరుగుతుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణంలో అయితే, 24 గంటలు గడిచినా, మీ పక్కనున్న ప్రయాజీకునితో ఒక్కమాటకూడా ఉందకపోవచ్చు.

ఢిల్లీ-బెంగుళూరు విమానంలో నా పక్కన నవయౌవనంలోవున్న ఒక అమ్మాయి, మరో అబ్బాయి కూర్చున్నారు. వాళ్ళు చాలా ఖరీదైన (బ్రాండెడ్‌ జీన్స్‌ ధరించారు. ఇద్దరూ జుత్తు కత్తిరించుకొని ఒకేలా కనిపిస్తున్నారు. వారి మధ్య ఒకే తేడా ఉంది. అమ్మాయి చెవులు కుట్టించుకొని ఉంది. చూయింగ్‌గమ్‌ నములుతూ, ఎం.పి 8 ప్లేయర్‌ 'ప్రవంచంలోవారు నిమగ్నమైపోయారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చారని తైలుస్తూనేఉంది. ఇతర్లతో అలాఉంచి అసలు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొనే ఉద్దేశంలో లేరు. సంగీతం, చూయింగ్‌గమ్‌ ఉండగా ఇక వారికి మనుషులతో ఏంపని?

కాసేపు గడిచాక వారితో ఎలాగైనా మాటలు కలపాలనుకున్నాను. కాలేజీలో టీచర్‌ను కనుక కుగర్రకారుతో హాయిగా మాట్లాడ్డం నాకు అలవాటే. ఆ వయసులో వాళ్ళకు సాధారణంగా మాయా మర్మం, లౌక్యం తెలియవు. నిష్కపటంగా, స్వేచ్చగా, మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడతారు.

మన చరి(డ్రే మనకు తెలియదు భ్‌ చిన్నచిన్న ప్రశ్నలు, సమాధానాలతో ప్రారంభమైన సంభాషణలో వారు బెంగుళూరు కాలేజీ విద్యార్థులనీ, వాళ్ళు కజిన్స్‌ (దగ్గరి బంధువులు) అనీ, ఢిల్లీలో వాళ్ళ అవ్వా, తాతలను చూసొస్తున్నారని తెలిసింది. , చివరికి అమ్మాయి థైర్యచేసి అడిగింది. “ఇందాక ఒక నల్లగుర్రం మీద స్వారీ చేస్తున్న మహిళ ప్రతిమ చూశాను. బొమ్మ బాగుంది. అలాంటిది బెంగుళూరులో దొరకదా? దాన్ని మీరు చాలా కష్టపడి మోసుకొస్తున్నట్లున్నారు. ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా?” “అది ఆడుకొనే బొమ్మకాదు. అదో అవార్డు” అన్నాను. ఇక అబ్బాయి మొదలెట్టాడు. “మీకు గుర్రాలంటే అంతిష్టమా?” విస్తుపోయాను. “అసలీ మధ్య ఎక్కడా గుర్రాలే కనిపించడంలేదు” అన్నాను. “మరి, రేసులంటే ఇష్టమేమోమీకు!” నేను జీవితంలో ఎన్నడూ రేసులకు వెళ్ళలేదు. కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాను. సాయంకాలం ప్రయాణం కదా చీకటిపడుతోంది. వాళ్ళు నామొహం చూడలేదు. అబ్బాయి అంతటితో వదిలిపెట్టలేదు. “ఈ అవార్డు రేస్‌కోర్సులో వచ్చిందా? ఆ అందమైన గుర్రం మీద ఒకమహిళ కూర్చుని ఉంది”. నా బహుమతిని చూస్తే, వాళ్ళకు గుర్రాలు, రేసులు తప్ప ఇంకేమీ గుర్తొచ్చేట్లులేదు. సైనిక దుస్తుల్లో అశ్వారూఢురాలైన మహిళ గురించి వారికేమీ తెలీదు. వీళ్ళకా కథ చెప్పడం మంచిదేమో! “మీరోసారి అలావెళ్ళి, ఆ విగ్రవాన్ని చూసి, మీకేమనిపించిందో చెప్తారా?” అని అడిగాను. “విగ్రహంచూశాం, అందుకే అడుగుతున్నాం” అన్నారు. మరింత ఆశ్చర్యం వేసింది. టీచర్ని కనుక వాళ్ళకు లక్ష్మీబాయి గురించి తెలియచెప్పాల్సిన బాధ్యత నామీద ఉందనిపించింది. (ప్రతియువతీ, ప్రతి యువకుడు నాకు విద్యార్థిగానే కనిపిస్తాడని, అవకాశం వస్తే చాలు పాఠం చెప్పేస్తానని మా అబ్బాయి నన్నెప్పుడూ ఆటపట్టిస్తూంటాడు. “ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి విన్నారా?” అని అడిగాను. అమ్మాయి జవాబిచ్చింది. “భారతీయులకు, బ్రిటిష్‌వారికి మధ్య జరిగిన పోరాటంపై తీసిన 1942-ఏ లవ్‌స్టోరీ సినిమా చూశాము. మనీషా కొయిరాలా అద్భుతంగా నటించింది”. క ౮ ర ఏ ఫస ఖగ ౮% | ల ఆజం ర్ట ణు!

క్‌2ై జ్ఞానం - వరిజ్ఞానం

“అది కాదు. అది క్విట్‌ ఇండియా ఉద్యమం. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంతకు వందేళ్ళ కిందట జరిగింది. ఆయుద్ధంలో మనం ఓడిపోయాం” వారేం మాట్లాడలేదు.

“ఖిటిష్‌ వారితో 1957లో జరిగిన యుద్ధమది. రూన్సీ రాజ్యాన్ని పాలిస్తున్న రాణీలక్ష్మీబాయి తన సేనలకు స్వయంగా నాయకత్వం వహించి వారిని ఎదుర్కొంది. ఆమె ఊరుకుంటే, బ్రిటిష్‌ ప్రభుత్వంవారు ఆమెకు రాజభరణం ఇచ్చేవారు. ఆమె సుఖంగా జీవించి ఉండొచ్చు. అయితే ఆమె అలాంటి పిరికి మనిషికాదు. గొప్ప దేశభక్తురాలు. వీరోచితంగా పోరాడింది. ఆమె సేనా నాయకత్వ పటిమ చూసి బిత్తరపోయిన బ్రిటిష్‌: సైనికులు ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అప్పటినుంచి శౌర్యపరాక్రమాలకు, భారత ప్రజల స్వాతంత్ర్యాకాంక్షకు ఆమె ప్రతీకగా నిలిచింది. మనకు స్వేచ్చ్భాజీవితాన్ని ప్రసాదించడానికి ఆమె తన ప్రాణాలు అర్చించింది”

వాళ్ళు ఒకృమాటైనా మాట్లాడకుండా ఆసక్తిగా విన్నారు. అంతసేపూ చూయింగ్‌గమ్‌ సంగతికూడా మరచిపోయారు.

ల అ్లైస్లల

కడ . తలనొప్పితెప్పించె, కైలమిచ్చె ఇల్లి న్హ్రైయార్తాల చాలా అనందం కలిగిస్తాయి. ప్రయాణాల్లేని చదువు సంపూర్ణంకాదు. త్రలు, పర్యటనలు మన విజ్ఞానాన్ని ఇనుమడింపచేస్తాయి. అందుకనే మనపెద్దలు దేన్నయినా చూసి తెలుసుకోవాలంటారు. మనదేశానికి అనేక ప్రత్యేకతలున్నాయి. మనకు విభిన్న భాషలు, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు, స్థానిక వలపుష్పాలు, జంతుజాలాలు ఉందే. అనేక రాష్ట్రాలున్నాయి. భారతదేశంలో పర్యటిస్తుంటే, మనకు అనేక దేశాలను చూస్తున్న ఆనందానుభూతి కలుగుతుంది. బిస్సులోకాని, ట్రైన్‌లో రెండో తరగతిలోకాని ప్రయాణిస్తే, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన రకరకాల ప్రజల్ని కలుసుకోవచ్చు. బస్సులోనో, టైన్లోనో తోటి ప్రయాణీకులతో మాట్లాడ్డం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. హుబ్లీ ప్రయాణం వంటి అనేక ప్రయాణాల్లో నేనీ విషయాన్ని రుజువు చేసుకున్నాను. ఒకసారి పగటిపూట నడిచే ట్రైన్‌లో బెంగుళూరు నుంచి హుల్లీకి వెళ్తున్నాను. ఇలాంటి ట్రైన్‌లకు సాధారణంగా రిజర్వేషన్ల అవసరం ఉండదు. పగలు కనుక కిటికీలోంచి చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. రకరకాల మనుషుల్ని కూడా బెంగుళూరులో మధ్యాహ్నం 2-80 గంటలకు రైల్లో బయలుదేరాను. హుబ్లీ చేరేసరికి రాత్రి 10-00 గంటలవుతుంది. కంపార్ట్‌మెంట్‌లో ఒక్కతెనే ఉన్నాను. రెండు రోజులు ప్రాజెక్టుపనిమీద నిర్విరామంగా పనిచేయాల్సివచ్చింది. బాగా అలసిపోయి ఉన్నాను. నాకిప్పుడు విశ్రాంతి అవసరం. కిటికీ పక్క సీట్లో కూర్చుని కునుకు తీద్దామని కాళ్ళుచాపి కళ్ళు మూసుకోబోయాను. సరిగ్గా అప్పుడే ఎవరో ఒకామె కంపార్ట్‌మెంట్‌లో ప్రవేశించి నాపక్కనాచ్చి కూర్చుంది. పాతికేళ్ళ యువతి. కాటన్‌ చీర ధరించింది. రైలు అందుకొసడానికి ఆఖరి క్షణంలో పరిగెట్టుకుంటూ వచ్చిందేమో ఆమెకు చెమట్లు పోస్తున్నాయి. ఆమె వొంటిమీద ఎలాంటి ఆభరణాలు, అంకారాలు లేవు. సాధారణ మధ్యతరగతి కుటుంబం అమ్మాయని తెలిసిపోతూనే ఉంది.

వ్‌ల్లే జ్ఞానం - వరిజ్ఞానం

సర్జ్దుకు కూర్చుని జేబురుమాలుతీసి మొహం తుడుచుకొని, పర్సుకున్న అద్దంలో చూసుకొంది. మంచినీళ్ళుతాగి, కాస్తతేరుకొని నావేపు తిరిగింది. ఆమెను చూస్తుంటే పరీక్షకు చక్కగా తయారైవెళ్ళే విద్యార్థులు గుర్తొచ్చారు. స్నేహపూర్వకంగా నవ్వి, ఇక సంభాషణకు ఉపక్రమించేలా కనిపించింది.

అందర్గాగానే “ఎక్కడిదాకా వెళ్తున్నారు?” అని ప్రారంభించింది.

“హృన్లీ* అన్నాను.

“హృన్లీలో ఎక్కడికి?”

సమాధానమివ్వడానికి తటపటాయిస్తూనే “విశ్వేశ్వరయ్య నగర్‌. అదెక్కడుంటుందో మీకు తెలుసా?” అనడిగాను.

“ఆ... తెలుసనుకుంటాను” అంది.

“నేను శాంతి కాలనీకి వెళ్ళాలి”

“శాంతి కాలనీలో ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే రెండు శాంతి కాలనీలున్నాయిీ,

ఆమెకు అన్ని వివరాలు తెలిసి ఉండడం ఆశ్చర్యపరచింది. “రైల్వేలైన్ల దగ్గరా అని సమాధానమిచ్చాను.

“రెండూ రైల్వేలైనద్యురే ఉన్నాయి. ఉత్తర శాంతికాలనీ, దక్షిణశాంతి కాలనీ అంటారు,

“డిత్తర శాంతి కాలనీ అని వివరించాను.

ఆమె అంతటితో తృప్తిపడలేదు. ఇంకేమీ ప్రశ్నలు అడగదని, నేనింక విశ్రాంతి తీసుకోవచ్చునుకొన్నాను.

స్వభావరీత్యా నేను కలుపుగోలు మనిషిని. ఎవరితో మాట్లాడ్డమైనా నాకు ఇష్టమే. అయితే ఈరోజు అలసిపోయి ఉన్నాను. మాట్లాడే ఉత్సాహం లేదుకానీ, ఆమె అంతటితో వదిలేలా లేదు. “మీరు ఉద్యోగం చేస్తున్నారా? అని మళ్ళీ మొదలెట్టింది.

ఇక ఆమె మళ్ళీ అడిగే అవకాశం ఇవ్వకుండా అన్ని వివరాలు చెప్పేద్దామని

౧

“అవును ఓ కాలేజీలో పనిచేస్తున్నా. మాకిప్పుడు సెలవురోజులు, మాది హున్లీ. అందుకనే వెళ్తున్నాను”.

నేను పొరబడ్డాను. ఆమె అంతటితో ఆగలేదు. “ఓహో! ప్రాఫెసరన్నమాట. ఏమేం సబ్జెక్టులు బోధిస్తారు మీరు?” అని చిరునవ్వుతో అడిగింది.

మాటలు ఇష్టపడేవారు మాట్లాడ్దానికేమీ లేకపోయినా ఏదో రకంగా సంభాషణ కొనసాగించగలరు. మాటలు ఇష్టంలేని అంతర్ముఖులైతే, అం ఊం అని ఒకటి రెండు మాటలతో సంభాషణ తుంచేసి ఊరుకుంటారు.

తలనొప్పి తొప్పుంచె, తైలమిబ్చె న్‌్‌

కొందరు తమగురించి ఒక్కముక్క చెప్పకుండానే అవతలివారి గురించిన

సమాచారమంతా రాబట్టేస్తారు. ఈమె అలాంటి మనిషేనని గ్రహించాను. నా నిద్ర,

చిరాకు ఎగిరిపోయాయి. చూద్దాం, ఈమె ఎన్ని ప్రశ్నలు అడగ్గలదో చూద్దామను కొన్నాను. “నేను క్రిస్ట్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ బోధిస్తాను” అన్నాను.

ఇక (ప్రశ్నలు వేయడం ఆమెకు చేతకాదన్న నా ఆశ ఫలించలేదు. నేను ముందే ఊహించాల్సింది.

“ఓహో! కంప్యూటర్బా! ఈ రోజుల్లో కంప్యూటర్‌ లేని చోటేలేదు. కంప్యూటర్లు తెలియకపోతే మనల్ని నిరక్షరాస్యులుగా చూసేరోజులు వచ్చేట్లున్నాయి. వమంటారు?”

ప్రశ్నలు పుట్టించి నన్ను సంభాషణలోకి దించగల ఆమె సామర్భ్యాన్ని మనసులోనే మెచ్చుకోసొగాను.

“అదంతా అక్షరాస్యతకు మనమిచ్చే నిర్వచనాన్ని బట్టీ ఆధారపడిఉంటుంది.” అని మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ స్థాయిలో సమాధానమిచ్చాను.

“అక్షరాస్యుడు కావడానికి, విద్యావంతుడు కావడానికి మధ్య చాలా తేదాఉందని నా అభిప్రాయం. అక్షరాస్యత అంటే ప్రాథమికజ్ఞానం కలిగి ఉండడం. విద్యావంతుడంటే, తెలిసినదానిని అర్థంచేసుకొన్నవాడు. ఈ నిర్వచనం ఎలా ఉందంటారు?”

ఈ మహిళ గురించి వమనుకోవాలో నాకు తోచడంలేదు. అప్పటికి ట్రైను బెంగుళూరు నగర సరిహద్దులు దాటి తూంకూరును సమీపిస్తోంది. కిటికీలోంచి చూస్తే ప్రకృతి శోభాయమానంగా ఉంది. వర్షాకాలం మొన్ననే ముగిసింది. నిండిన చెరువులు, పచ్చదనం పరుచుకున్న నేల కనుల పండువగా ఉన్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఎయిర్‌ కండిషనింగ్‌కానీ, ఫ్యాన్లుకానీ అవసరంలేనంత చల్లగా ఉంది. ఆడా, మగా పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. పశువులు తృప్తిగా మేస్తున్నాయి. దూరాన కొండలు ఠీవిగా అకాశాన్నంటుతున్నట్లు కనిపిస్తున్నాయి.

-.. ఈమెనిలా మాట్లాడనిస్తే ఈ ఆరేడు గంటలు భరించలేమనిపించింది. నన్నిలా వదిలిపెడ్తే విశ్రాంతి తీసుకొంటానని మర్యాదగానే స్పష్టంగా చెప్పేద్దామనుకొన్నాను. కానీ, అలా నిర్మొహమాటంగా చెప్పలేకపోయాను. ఆమె చాలా అమాయకురాలిలా కనిపించింది. ఆమెలో ఉత్సాహం ఉట్టిపడుతోంది. ఆమె మొహంలో అరమరికలు లేని అసక్తి ద్యోతకమవుతోంది. నా క్లాసులో నా విద్యార్థులు ప్రదర్శించే అత్రతే ఆమె కూడా కనబరుస్తోంది. అందువల్ల మనసులోని మాటపైకి చెప్పలేక చిరునవ్వు నవ్వాను.

“చిరునవ్వు అరోగ్యానికి మంచిది” అంటూ మౌనాన్ని ఛేదించింది. “మీరు చిరునవ్వు నవ్వితే, మీతో ప్రపంచం కూడా చిరునవ్వు నవ్వుతుంది, మీరు ఏడిస్తే మీరొక్కరే ఒంటరిగా ఏడ్వాలి”. నిజం కాదంటారా?

వ్‌ర్‌ జ్ఞానం - వరిజ్ఞానం

ఇక చేసేదేం లేదని “మీ కొటేషన్‌ బావుంది” అన్నాను.

“కృమాటలు నావికావు. అమితాబ్‌ బచ్చన్‌ సంభాషణల్లో ఇదొకటి. అమితాబ్‌ అంటే మీకిష్టమేనా?”

ఆమెను కాస్త ఉడికించాలనిపించి “నాకు హృతిక్‌రోషన్‌ అంటే ఇష్టం” అన్నాను.

“నిజమే, చాలా అందంగా ఉంటాడు అని ఒప్పేసుకుంది. ఆమె భక్తి అమితాబ్‌ మీది నుంచి హృతిక్‌ మీదికి క్షణాల్లో మారిపోయింది. “హృతిక్‌ మొహంలో కొంచెం సిగ్గులాంటిది తారట్లాడుతుంటుంది. అందుకే అంత అందంగా కనిపిస్తాడు. అబ్బాయికానీ అమ్మాయికానీ మొహంలో సిగ్గుపడే లక్షణం లేకపోతే మరీ సాదాగా కనిపిస్తారు. అక్షయలో కూడా అలాంటి బిడియం కనిపిస్తుందికదూ!?”

“అక్షయ్‌ అంటే ఎవరు?” అనడిగాను. ఇంతసేపూ నాకు ఆమె ప్రశ్నలకు జవాబులివ్వడంతోనే సరిపోయింది. ఇప్పుడు నేనే అడిగాను. నాకే తెలియకుండా మాటల్లో పడిపోయాను. కబుర్లంటే సుడిగుండం లాంటిదే. మనకు తెలియకుండానే అందులో పడిపోతాం.

“అక్షయ్‌ అంటే తెలీదా? అక్షయ్‌ అంటే అక్షయ్‌ఖన్నాా అక్షయే కుమార్‌ కాదు. అక్షయ్‌ఖన్నా వినోద్‌ఖన్నా మొదటి భార్య కొడుకు. తాళ్‌ సినిమాలో ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాడు. ఇక అక్షయ్‌కుమార్‌ అంటే ఇటీవల నటి ట్వింకిల్‌ఖన్నాను పెళ్ళి చేసుకొన్నాడే అతను.”

ఆమె చిత్రపరిశ్రమ పరిజ్ఞానం నాకు విస్మయం కలిగించింది.

ఉదయం కొద్దిగా ఉన్న తలనొప్పి, ఇప్పుడు తిరగబెట్టింది. ఎడతెగని మాటల ఫలితమేమో! ఒక్కచిన్న (ప్రశ్నకే ఇంతపెద్ద సమాధానం వినాలంటే, హుబ్లీచేరే సరికి శోషవచ్చేస్తుందేమో. గంటన్నర నుంచీ ఆమె ప్రశ్చలైనా అడుగుతోంది, లేకపోతే అదేపనిగా మాట్లాడుతోంది.

ఇకచాలు బాబోయ్‌ అనుకున్నాను. నిద్రపోవాలని చెప్పేద్దామని నిశ్చయించుకొన్నాను. నాతల బద్దలైపోయేలా ఉంది. అనుకోకుండానే చేతుల్తో నుదురు రుద్దుకోసాగాను.

ఆమె నావాలకం చూసీచూడగానే “ఏమండీ, వంట్లో బాగోలేదా? అని ఆదుర్దాగా అడిగిందా.

“ఉదయం నుంచీ తలనొప్పిగా ఉంది” ఆన్నాను. ఆమె ్రశ్చలతో ఆ నొప్పి పెరిగిపోయిందని చెప్పలేదు.

“ఫ్పీద్రగ్గరేం మందులేదా?” అని ఆరాతీసింది.

తలనొప్పి తొవ్పించె త్రెలమిచ్చ వ్‌ కర్చేద్ర్రు” ఆమె తక్షణం చేతి సంచీలోంచి ఒక తైలంసీసా తీసి ఇచ్చింది. “ఇదో కొత్త అంజనం. దీనిపేరు నీరాంజన బామ్‌. తలనొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది. వాడింతర్వాత మీరెంతో హాయిగా, ఉల్లాసంగా ఫీలవుతారు. పరిమళ భరితమైన ఈ అంజనం ఒళ్ళునొప్పులు కూడా పోగొడుతుంది. ఇది జిద్దులేని ఆయుర్వేద తయారీ. బ్రాండెడ్‌ అంజనాల కంటే ఖరీదు తక్కువ. ఎక్కువ ఫలితమిస్తుంది. టోకుగా కొంటే డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఇది శాంపిల్‌ సీసాయే!” అప్పుడు నేనడిగాను కుతూహలంగా “మీ రెక్కడ పనిచేస్తున్నారు” అని. “నీరాంజనబామ్‌ కంపెనీలో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తున్నా” అంటూ చిరునవ్వు నవ్వింది. నిజమే చిరునవ్వు ఆరోగ్యానికి మంచిదే! పో జ్త్హ

కేం అింలి చ. ళా స్పవ్వుపేలుళ్ళా వరకట్న మరణాలా? ముం సంస్కృతంలో ఒకసూక్తి ఉంది. “యత్రనార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాఖో (మహిళలను గౌరవించే చోట దైవం ఉంటాడు). నిజజీవితంలో పరిస్థితి అలాలేదు. మనదేశంలో ఆర్థిక స్వాతంత్ర్యం, చదువుకొనే అవకాశం, భర్తలను ఎంచుకొనే స్వేచ్చ చాలా కొద్దిమందికే లభిస్తోంది. ఎక్కువమంది మహిళలు అణచివేతకు గురవుతున్నారు. మహిళల దయనీయ స్థితికి వారికి చదువులేకపోవడం ఒక ముఖ్యకారణం. చదువులేకపోతే ఆర్థికస్వాతంత్ర్యం సాధ్యంకాదు. ఆర్ధిక స్వాతంత్ర్యంలేకపోతే మహిళల జీవితం దుర్భరంగా తయారవుతుంది. ఒకసారి నా స్నేహితురాలైన దాక్టర్‌తో మాట్లాడుతుంటే ఆడశిశువుల హత్యలు గురించి ఆమె అనేక విషయాలు చెప్పింది. ఆమె ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తోంది. అందువల్ల సమస్య ఎంత తీవ్రరూపం దాల్చిందో ఆమెకు తెలుసు. “మహిళలు ఎదుర్శొనే అత్యంత దయనీయస్థితి గురించి తెలుసుకోవాలంటే, ఇప్పుడే వెళ్దాం, బయలుదేరండి చూపిస్తాను” అంటే వెళ్ళాను. అమె నన్ను ఆస్పత్రిలో కాలిన గాయాలకు చికిత్సచేసే “బర్చ్స్‌వార్డొ కు తీసుకెళ్ళింది. ఢిల్లీ ఎర్రకోటలో వినిపించే సూక్తిని వ్యతిరేకార్థంలో తిప్పిచెప్పాలంటే “భూమిమీద నరకమంటూ ఉంటే అది ఇక్కడే ఉంది” అనిపించేలా అక్కడంతా ఏషాదం అలుముకుని ఉంది. రోగుల్లో ఇంచుమించు అందరూ మహిళలేఉన్నారు. వారిలో అత్యధికుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉంటుంది. ఎక్కువ మంది పేద, దిగువ మధ్య తరగతివారే. కాలినగాయాలతో బాధను భరించలేక మూలుగుతున్నారు. అందరూ ఒకలాంటి కథే వినిపిస్తారు. “వంటచేయాలని స్టవ్‌ ముట్టించాను. అదిపేలిపోయి, నా నైలాన్‌ చీర కొంగుకు నిష్పంటుకుంది. పొరపాటు నాదే. నాభర్త చాలా బుద్ధిమంతుడు. నా అత్తమామలు నన్ను కన్నబిడ్డలా చూసేవారు.” మనదేశంలో ప్రతిరోజూ ఎందరో మహిళలు స్టవ్‌పేలుళ్ళలో దుర్మరణం పాలవుతున్నారు. ఈ స్టవ్వులు తయారుచేసే కంపెనీల మీద ఎవరూ కేసు పెట్టడం లేదు, ఎందుకని? సమాధానం మనకు తెలిసిందే. ఇవి స్టవ్‌ ప్రమాదాలుకాదు, వరకట్న హత్యలన్నది పచ్చినిజం. దుర్గను పూజించే, మహిళలను “శక్తిగా పరిగణించే సమాజంలో

స్రవ్వ పేలుళ్ళ్లా, వరకట్న మరణాలా? క్‌ి మన చెల్లెళ్ళను దయాదాక్షిణ్యం లేకుండా మంటలకు ఆహుతి చేస్తున్నారు. ఇదంతా తలచుకొని, నామనసు బాధతో మూలిగింది. కళ్ళలో నీళ్ళు ఉబికాయి. నరకప్రాయమైన ఆ వార్డు మధ్యలో ఒక గర్భిణీ స్రీ కనిపించింది. 24వ నెంబర్‌ బెడ్‌మీద పదుకోబెట్టిన ఆమెకూడా స్టవ్‌ పేలుడు బాధితురాలే. ఆమె బతికే అవకాశాలు లేవని నా డాక్టర్‌ (థ్రెండ్‌ చెప్పింది. ఆమెతో మాట్లాడదలచుకొంటే మాట్లాడమంది. నొప్పితో గిజగిజలాడుతున్న ఆ యువతితో మాట్లాడే ధైర్యంలేదు. ఆ దృశ్యాన్ని చూడ్డమే చాలా బాధాకరంగా ఉంది. అయినా మాట్లాడాలని పించింది. నేను మాట్లాడదలచినట్లు ఆమె ఊహించింది. తానే మొదలుపెట్టింది.

“అమ్మా! నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. కొన్ని విషయాలు మీకు చెప్పాలనిపిస్తోంది. నా తల్లితండ్రులు నన్ను చదివించిఉంటే, నాకో ఉద్యోగం ఉంటే, నా తల్లి తండ్రులకు ఇంతమంది పిల్లలు లేకుంటే నాకీ పరిస్థితి దాపురించేది కాదు.” ఇక మాట్లాడలేక పోయింది. నొప్పి ఎక్కువై భరించలేక రోదించసాగింది. ఆమె బాధచూడలేక, బయటికివచ్చి మెట్లగదిలో మెట్లమీద కూర్చుండిపోయాను. నామనసు మొద్దుబారిపోయింది.

కొన్ని నిముషాల తర్వాత, ఒకమూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న వృద్ధురాలిని చూశాను. ఆమె ఏడ్చిఏద్చి అలసిపోయి నిస్సహాయంగా కూలబడిఉంది. అమె దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగాను.

“నేను ఇందాక మాట్లాడిన రోగి తల్లిని. ఆమెను బతికించవద్దని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను”.

కూతుర్ని మరణించనివ్వమని ప్రార్ధిస్తోందంటే ఆమె పడుతున్న బాధ, కూతురు బాధకు తక్కువ కాదనిపించింది.

ఏడ్పుతగ్జించింది కానీ, ఆమె కళ్ళనుంచి అశ్రువులు రాలుతూనే ఉన్నాయి.

సముదాయించేయత్నం చేస్తూ “స్టవ్వు ఎలా పేలింది?” అని అడిగాను.

“అసలు వాళ్ళింట్లో స్టవ్వేలేదు. అంతా అబద్ధం, మాకు అయిదుగురు కుమార్తెలు. ఈమె అందరికన్నా పెద్దది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆమెను చదువు మాన్సించేశాం. బాగా చదువుకొనేది. అయినా వేరే దారిలేక మాన్చ్సించాము. వంటలోనూ, చిన్నపిల్లలను చూసుకోవడానికి ఆమె సహాయం కావాల్సివచ్చింది. తానే చిన్నపిల్లయినా, చెల్లెళ్ళను చూసుకోడానికి స్కూలుకు వెళ్ళడం మానుకోవాల్సివచ్చింది. ఆ తర్వాత రెండేళ్ళకు ఆమె పెళ్ళిగురించి ఆలోచించాము. మావేపు ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళయిపోతాయి. సకాలంలో పెళ్ళిచేయకపోతే ఇతరులేమంటారో అన్న భయం. మాశక్తిమేరకు మంచి కట్నమిచ్చి పెళ్ళికూడా బాగాచేసి పంపించాం”.

60 జ్ఞానం - పరిజ్ఞానం

ఎవరి కథవిన్నా ఇదే. దాంతర్వాత చెప్పబోయే సంగతులేమిటో కూడా మనం ఊహించినట్లే ఉంటాయి.

“వాళ్ళు తృప్తిపడలేదు. భర్త, అత్తగారు ఇంకా డబ్బు తీసుకురమ్మని వేధించసాగారు. వాళ్ళపోరు భరించలేక మాదగ్గరకొచ్చేది. ఆమెను బాధిస్తున్నారని తెలిసీ, ఏదో ఒకటిచెప్పి అత్తవారింటికి పంపేసేవాళ్ళం. పెళ్ళికావాల్సిన ఆడపిల్లలున్నారు. ఈ కూతురొచ్చి ఇంట్లో కూర్చుంటే, వారి భవిష్యత్తేం కావాలి? అంతేకాదు మంచో, చెడో పెళ్ళి తర్వాత ఆడపిల్ల భర్త ఇంట్లో ఉండాల్సిందే కదా! కాదంటారా?”

తరతరాలుగా పాదుకుపోయిన అభిప్రాయాన్ని ఎవరు కాదంటారు?

“మీ భర్త ఏం చేస్తారూ అని అడిగాను.

అతను వడ్రంగిపని చేస్తాడని చెప్తూ “మనకో మగబిడ్డ ఉండాలంటాదాయన. కొడుకు తప్ప ఇంకెవరూ మన జీవితాలను బాగుచేయలేరంటాడు.”

మనదేశంలో మానవ జీతవితాలను శాసించే అభిప్రాయాల్లో ఇదొకటి! ఇప్పటికీ అనేకమంది ఇలాగే భావిస్తారు.

ఆమె దుఃఖం కాస్త ఉపశమించింది కానీ, ఆ కళ్ళలో ఇంకా కోపం పోలేదు. ఆమె మిగతాకథకూడా ఊహించినట్లే కొనసాగింది. “ఆమెకు పిల్లలు పుడితే, అంతా సవ్యంగా సర్దుకుపోతారనుకున్నాం. ఆమె గర్భందాల్చినప్పుడు పుట్టబోయేది ఆడపిల్ల అని అత్తగారు తెలుసుకుంది. ఇంక నాకూతుర్ని కడతేర్చేయాలని నిశ్చయించుకొన్నారు. నా కూతురు మరణవాగ్మూలం ఇచ్చింది. అర్ధరాత్రిపూట ఆడబిడ్డ తనచేతులు కట్టేస్తే భర్త తనవొంటిమీద కిరోసిన్‌ కుమ్మరించాడని, అత్త అగ్గిపుల్లగీసి ముట్టించిందని అందులో తెలియజేసింది. బొమ్మలాంటి నాబిడ్డ క్షణాల్లో కర్బూరంలా మండిపోయింది.”

ఆమె దుఃఖం కట్టలు తెంచుకొంది. కన్నీరు వరదలా ప్రవహించింది. ఆమెను ఎలా ఊరడించాలో నాకు తోచలేదు. “ఏద్వకు, చట్టం ఊరుకోదు. వాళ్ళకు శిక్ష పడుతుంది” అని గొణిగాను.

అయికే ఆ దుష్టులు అప్పటికే జాగ్రత్తపడ్డారు. నిజంచెప్తే, నీచెల్లెళ్ళ బతుకులు నాశనం చేసేస్తాం, వారికి పెళ్ళిళ్ళు ఎలాఅవుతాయో చూస్తాం అని భర్త బెదిరించాడు. దాంతో ఆమె ఆ మరణ వాంగ్మూలాన్ని వెనక్కి తీసేసుకుంది.

అలా నేరస్తులు సురక్షితంగా ఉండగా మరో బాలిక సమాజంలోని స్వార్ధానికి బలయిపోయింది. ఆమె మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. చదువుకొనిఉంటే ఏదో ఉద్యోగం చూసుకొని భర్తను వదిలిపెట్టగలిగేది. తల్లి తండ్రులకు తక్కువమంది పిల్లలుంటే

స్టవ్వ పేలుబ్బా, వరకట్న మరణాలా? ౮2 వాళ్ళామెను ఇంట్లో ఉండనిచ్చి ఆదరించేవారు. తల్లితండ్రులకు తమబిడ్డకు రాబోయే కష్టం కంటే, తమగురించి ఇతరులేమనుకుంటారో అన్నదే ముఖ్యమైపోయింది.

ఈ గర్భిణీ మహిళకేసు కూడా, ఇతర స్టవ్‌పేలుళ్ళ కేసుల్లాగే ముగిసిపోవచ్చు. భర్త విడుదలైపోతాడు. మళ్ళీపెళ్ళి చేసుకొంటాడు. ఇలాంటి సంఘటనలు జరిగిపోతూనే ఉంటాయి. నేరస్థులకు వెంటనే శిక్ష పడదు కనుక సమస్య ఇలాగే కొనసాగుతుంది. కేసులు నమోదైనా, అవి కోర్టుల్లో ఏళ్ళతరబడి దేకుతాయి. జనంలో ఇంకా ఇంకా ఏవేవో వస్తువులు కావాలన్న ఆశ, ధనాశ పెరిగిపోయేకొద్దీ, సులభంగావచ్చే కటంకోసం ఎంతకైనా తెగిస్తున్నారు.

యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే.... ఈ సూక్తిమరోసారి నామనసులో మెదిలింది. నాకు తెలియకుండానే నాకళ్ళలో నీళ్ళు నిండాయి.

ఇంతలో డ్యూటీలో ఉన్న సిస్టర్‌ వచ్చి నిర్లిప్తంగా ప్రకటించింది. “24వ నెంబర్‌ బెడ్‌మీది రోగి చనిపోయింది".

లో క

16 ఊహాగానాలూ, యథార్ద్థాలు వల పాతమిత్రులమంతా ఒకచోట సమావేశమయ్యాం. మామహిళాబ్బందంలో ఉన్నవారంతా చిన్నప్పటినుంచి ఒకరికొకరం తెలిసిన వాళ్ళమే. మా పెళ్ళిళ్ళు జరక్క్మముందు మేం తరచుగా సమావేశమయ్యేవాళ్ళం. మా పెళ్ళిళ్ళయి, తల్లుల మయ్యాకకూడా ఆ సంప్రదాయం కొనసాగిస్తున్నాం. మా పిల్లల వివాహాల్లో తప్పక కలుస్తూంటాం. వయసు (ప్రభావం లేకపోలేదు కానీ, ఏదోలా ఎక్కడో ఒకచోట సమావేశమై అనుభవాలు కలబోసుకుంటూఉంటాం. మాలో ఒకరిద్దరు అనేక ఏళ్ళ తర్వాత మాసమావేశాల్లో (ప్రత్యక్షమవుతూంటారు. అలాంటివారు వచ్చినప్పుడు పాతకబుర్లన్నీ మళ్ళీఒకసారి చెప్పుకుంటాం. గడచిన పాతికేళ్ళలో ఎన్నోమార్చులు వచ్చాయి. మునువు ఊపించనైనా ఊహించలేని మార్పులుకూడా వచ్చాయి. మేమెన్నో కలలు కన్నాం, ఎన్నో ఆశలు పెట్టుకొన్నాం. కానీ వాటిలో కొన్నే సాకారమయ్యాయి. మేం కాలేజీలో చదివేరోజుల్లో విమల చాలా అందంగా ఉండేది. ప్రతివారూ ఆమెను ఎవరో సినిమా తార అయివుంటుందనుకొనేవారు. తన సౌందర్యం గురించి ఆమెకు తెలుసు. అందుకే చాలా గర్వంగా ప్రనర్తించేది. మేం 25 ఏళ్ళ తర్వాత కలుసుకున్నప్పుడు ఆమె విమల అంటే నమ్మలేకపోయాను. ఆమె పొడవాటి నల్లని జుత్తు ఏమైపోయింది? శరీరఛాయ, వర్భస్సు ఏమైపోయాయి? ఇప్పుడు ముడుతలు పడిన చర్మంతో పీపాలా కనిపిస్తోంది. జుత్తునెరిసి, పలచబడింది. పైగా పొట్టిగా కత్తిరించుకాంది. విమల ఏదో వేదాంత ధోరణిలో మాట్లాడింది. అందం కలకాలం ఉండదు. అశాశ్వతమైంది. యౌవనంలో ఉన్నప్పుడు మన అందం ఎప్పటికీ అలాగే ఉంటుందనుకుంటాం కానీ అందం తెలివిలాంటిదికాదు. తెలివైనవాళ్ళు ఎప్పటికీ తెలివైన వారిలాగానే ఉంటారు. అలాసాగింది ఆమె సంభాషణ. నా ఇంకో (ఫ్రెండ్‌ వినుత, విమల సిద్ధాంతం తప్పని రుజువు చేసింది. వినుత మాకాలేజీలో చాలా తెలివైన అమ్మాయిగా పేరు పొందింది. ఉత్తమ విద్యార్థుల్లో ఒకరిగా ఆమె గురించి తప్పక చెప్పుకొనేవాళ్ళం. ఆమెను మినీ-కంప్యూటర్‌ అని వర్ణించేవాళ్ళం. అన్ని విధాలా అదృష్టవంతురాలే. ఆమెలో అందం, ప్రతిభ, మంచితనం కూడా ఉన్నాయి.

ఊవోగానాలూ, యథార్ధాలు రా

పైగా గర్వం లేదు. మేమందరం వినుత ఎవరిని పెళ్ళిచేసుకొంటుందో అనుకొనే వాళ్ళం. ఇంతచక్కని అమ్మాయికి అంత చక్కని అబ్బాయి దొరకడం కష్టంకదా!

అలాంటి వినుత కాలేజీలో ఉండగానే మంచి అబ్బాయిని ఎంచుకొంది. అతను చాలా చురుకైన వ్యక్తి. వినుత పార్థా దాంపత్యం చాలా సంతోషంగా సాగుతుందని, ఒకరి (ప్రతిభకు మరొకరు గర్విస్తారని మేమంతా భావించాం. ఎంత పొరపాటుగా ఆలోచించామో!

చాలా ఏళ్ళ తర్వాత కలసిన వినుతలో ఉత్సాహమే కనిపించలేదు. ఏదో పోగొట్టుకున్నట్లు కనిపించింది. కాలేజీలో ఉన్నప్పుడు ఆమెలో ఉత్సాహం ఉరకలు వేస్తుందేది. కాలేజీ వార్షికోత్సవంకానీ, వంటలపోటీకానీ, క్విజ్‌లో కానీ, అందరికన్నా ఉత్సాహంగా పాల్గొనేది. ఎప్పుడూ దెప్పిపొడుస్తూండే భర్త సాంగత్యంలో ఆమె ఉత్సాహమంతా హరించుకుపోయింది.

సందర్భం లేకపోయినా “నీకు ర్యాంకు వచ్చిందా?” అని అడుగుతాడు. తరచుగా ఇంత చిన్న విషయం అర్ధంచేసుకోలేవా? అని పరిహిసమాడుతాడు. లేకపోతే “ఈ లెక్క వేయడానికి నువ్వెంత సమయం తీసుకొంటావో, నేనెంత సమయం తోసుకొంటానో చూద్దాం” అని సవాలు చేస్తాడట.

వినుత తన తెలివే తనకు శాపం అనుకోవడం ప్రారంభించింది. మనది చాలా చిత్రమైన సమాజం. మహిళ తన భర్త గొప్పతనం, కీర్తి. ప్రతిష్టలను తలచుకొని పొంగిపోతుంది. మగవాళ్ళు ఎక్కడో అరుదుగా అలా భావిస్తారు. భార్యల ప్రతిభను మెచ్చుకోలేరు.

రత్నది ఇంకోరకం కథ. ఆమె అన్ని విషయాల్లోనూ సాదాసీదా అమ్మాయి. ఇలాంటి ఏ ప్రత్యేకతాలేని అమ్మాయిలను సాధారణంగా ఎవరూ గుర్తుంచుకోరు. చాలా మంది మధ్య తరగతి లేదా దిగువ మధ్యతరగతి వారిలాగానే రత్చ డిగ్రీపూర్తిచేసి, పెళ్ళిచేసుకొని జీవితంలో స్థిరపడిపోయింది. ఆమె భర్త రఘు ఏదో ఆఫీసులో గుమాస్తా. చాలా పిరికి మనిషి

ఒక ఏడు మా సమావేశానికి వచ్చిన రత్ననుచూసి మేమందరం అదిరిపోయాం. ఆమె చాలా మారిపోయింది. ఇప్పుడామె చాలా పెద్ద మహిళా వ్యాపారవేత్త. అనేక అవార్డులు కూడా తెచ్చుకుంది. వేషభాషల్లో చాలా ఆధునికంగా కనిపించింది. ఆమె మారిపోయిన తీరుచూస్తే మాకు కాసేపు మాటలు రాలేదు. చివరికి నీ కథేమిటో చెప్పమని విమల అడిగింది.

“నాకేం లంకెల బిందెలు దొరకలేదు. కిందిస్థాయి నుంచి ఒక్కో దశా దాటాను. పెళ్ళయింతర్వాత నాభర్త ఎవరేం చెప్పినా శ్రద్ధగావిని, విధేయంగా పనిచేసే రకమే తప్ప నాయకుడు కాదని గ్రహించాను. ఇంట్లో పెత్తనమంతా మాఠఅత్తగారిదే”.

రశ జ్ఞానం - వరిజ్ఞానం

తల్లిదండ్రులు నిరంకుశంగా వ్యవహరిస్తే, వారి పిల్లలు అవిధేయంగా, అదుపు లేకుండా అయినా తయారవుతారు, లేకపోతే మరీ పిరికి వారుగా, అణిగిమణిగి పడిఉండే రకంగా అయినా తయారవుతారని మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు. రత్నభర్త ఈరెండో తరగతి వ్యక్తిలా ఉంది.

రత్న తన విజయగాథను వివరించింది. “నా విషయాల్లో నేనే నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే మా అత్తగారి దగ్గర శాశ్వతంగా బానిసలా పడిఉందడాల్సి వస్తుందని గ్రహించాను. ముందుగా ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలనుకున్నాను. మీకు తెలుసుకదా, నాకు ఎందులోనూ

  • నిపుణత్వంలేదు. చదువులోకూడా సగటు మార్కులతోనే పాసయ్యాను. అందువల్ల ఉద్యోగం దొరకడం కష్టం. నాకు తెలిసిన ఒకే ఒకపని దుస్తులు కుట్టడం. అందుకని, ఇంట్లోనే కుట్టుపని (ప్రారంభించాను. (ప్రారంభంలో వస్త్రంతో దుస్తులు కుట్టేదాన్ని. తర్వాత తోలు దుస్తులు వరైరాకు మారాను. వ్యాపార మెలుకువలు తొందరగానే తెలుసుకున్నాను. ఖాతాదారుల అభిరుచులనుబట్టి నా కార్యకలాపాలు విస్తరిస్తూ వెళ్ళాను.”

“పచ్చళ్ళూ ఇలాంటివాటికి ఎప్పుడు మారావు?” అని అడిగాం.

“దుస్తుల తయారీలో విజయం సాధించగానే, గృవావసర పదార్థాల వ్యాపారంకూడా ప్రారంభించాను. ఒక రంగంలో విజయం సాధిస్తే ఇక వరసగా విజయాలే. నేనెప్పుడూ ఖాతాదారును దైవంగా భావిస్తాను. ఖాతాదారును సంతృప్తి పరచడానికే కృషిచేస్తాను. వ్యాపారంలో ఈ సూత్రం ఫలితాలనిస్తుంది. జీవితమే గొప్ప టీచర్‌. నేను ప్రతీదీ అనుభవం ద్వారానే తెలుసుకున్నాను. నేను చేసిన (ప్రతిపొరపాటునుంచీ, అలాంటి పొరపాటు మళ్ళీ జరక్కుండా చూడడమెలాగో నేర్చుకున్నాను.”

రత్న ధైర్యం, పట్టుదల, ఆమె జీవితంలో వచ్చిన మంచి మార్చు గురించి తెలుసుకొని మేము చాలా సంతోషించాము. వినుత జీవితం జయప్రదంగా సాగుతుందని, .రత్న జీవితం సామాన్యంగా సాగిపోతుందనుకుంటే, జరిగినవి అందుకు భిన్నంగా ఉన్నాయి. 20 ఏళ్ళ వయసులో ఆదర్శవాదులుగా ఉన్న మేము, 40 ఏళ్ళొచ్చేసరికి యదార్థవాదులమైపోయాం.

లో జాం

  • క్షే? వ్‌ అ సెలవుకోసమేనా పర్వదినాలు

ఆను 15 మనందరికీ పర్వదినం. ఎందరో పోరాటం జరిపి, ప్రాణాలు అర్చించిన తర్వాత 1947లో ఆరోజే మనం స్వాతంత్ర్యాన్ని సముపార్షించుకొన్నాం. బాలబాలికలు, మహిళలు, వృద్ధులుసైతం ఆ పోరాటంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారు. అయితే వారిలో చాలా మందిని నేడు స్మరించేవారే కరవవుతున్నారు. వారి విగ్రహాలు ఎక్కడా కనిపించవు. వారి త్యాగాలను కీర్తించే రచనలు రావడంలేదు. వారు విస్మృత వీరులు. మనకు స్వేచ్చాస్వాతంత్ర్యాలు ప్రసాదించడానికి వారు తమ ప్రాణాలను అర్చించారు.

స్వాతంత్యదినాన్ని ప్రభుత్వం జాతీయ సెలవు రోజుగా ప్రకటించింది. ఆగస్టు 15న మృతవీరులను సంస్కరించి, స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలి. సాధారణంగా ఆరోజు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్రోద్యమంపై ఉపన్యాసాలు, సదస్సులు ఏర్పాటు చేస్తారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశభక్తిగీతాలు ఆలపిస్తారు. ఈ ఉత్సవాల్లో బాలలు ఉత్సాహంగా పాల్గొని ఆరోజు విశిష్టతను గుర్తు తెచ్చుకుంటారు.

ఒక స్వాతంత్ర్యదినంనాడు నేను పర్యటనలో ఉన్నాను. అప్పటికి వారం రోజులుగా కర్ణాటకలోని ఒక [గ్రామీణ ప్రాంతంలో పర్యటిస్తున్నాను. ఆయేడు ఆగస్టు 15 శుక్రవారం వచ్చింది. కొన్ని స్కూళ్ళు సందర్శించి బాలలతోపాటు ఉత్సవాల్లో పాల్గొనాలనుకున్నాను.

ఆరోజు ఒకపట్టణంలో ఉన్నాను. అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలోని గ్రామీణ పాఠశాలకు వెళ్ళామని బస్‌స్టాంద్‌ చేరుకున్నాను.

నేను సందర్భ్శించాలనుకొన్న కొన్ని పాఠశాలల్లోని, ఒక పాఠశాల హెద్‌మాస్టర్‌ను బస్‌స్టాండ్‌లోనే కలిశాను. అతను నన్నుచూసి సంతోషంగా పలకరించాడు. ఆయన భావాలు మొహంలో ్రతిఫలిస్తున్నాయి. కొంతమంది మొహాలు చూసి వారి భావాలేమిటో తెలుకోలేం. అటువంటి వారిలో హృదయానికి, బుద్ధికి సంబంధం ఉండదు. అలాంటి వారు ఏమాలోచిస్తున్నారో ఊహించలేం. నగరాల్లో ఇలాంటివారే ఎక్కువగా కనిపిస్తారు. చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల ప్రజల్లో అరమరికలు ఉండవు. తమ భావాలను దాచుకోరు.

హెడ్‌మాస్టర్‌ ఎక్కడికో వెళ్ళేతొందరలో ఉన్నట్లు కనిపించారు. “మేడమ్‌, మీరు బెంగుళూరు వెళ్తున్నారా?” అని ఆసక్తిగా అడిగాడు. నేనేమీ అనక ముందే వివరణకూదా ఇచ్చాడు. “మీకు శనివారం పనిచేసే అవసరం లేకపోతే, సెలవురోజులు కలిసొస్తాయి. అందువల్ల ఇక్కడ ఉండేబదులు బెంగుళూరుకు వెళ్తున్నారనుకున్నాను.”

రర జ్ఞానం ఆ వరిజ్ఞానం

“లేదు, బెంగుళూరు వెళ్ళడంలేదు. ఇక్కడే ఓ వారం రోజులు పనుంది” అన్నాను.

అతని మొహంలో నిరాశ తొంగిచూసింది. కారణం తెలుసుకోవాలనిపించింది.

“మీతోపాటు ప్రయాణం చేయోచ్చనుకున్నా, నేను బెంగుళూరు వెడుతున్నా” అన్నాడు.

“ఒక్క క్షణం ఆగండి. ఈ రోజు ఆగస్టు పదిహేను. మీస్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడంలేదా? పతాకావిష్కరణ, కవాతు, దేశభక్తి గీతాలాపనతో టీచర్లు, విద్యార్థులు ఆనందంగా గడిపేరోజు కదా ఇది.”

అతనిలో అలాంటి ఉత్సాహమేమీ కనిపించలేదు. “ఆం ్రతివటా ఇదో ఆచారం. సమయం వృధా కావడం తప్ప ఇందులో ఏముంది? ఎప్పుడూ అదే డ్రిల్లు, అవే గీతాలు. నా 20 ఏళ్ళ సర్వీసు, పది బదిలీల్లో ఈ జాతీయ సెలవు రోజులతో నాకు మొహం మొత్తిపోయింది. స్కూలు మూసేసేవీలుకూడా లేదు. విద్యాశాఖ ఆదేశాలమేరకు ఈ కార్యక్రమాలన్నీ జరపక తప్పదు. దీపావళికి, క్రిస్మస్‌కు ఇచ్చినట్లు పూర్తి సెలవిచ్చేస్తే బాగుండేది”.

అతను చాలా చిరాగ్గా ఉన్నట్లు తేలింది. "బెంగుళూరుకు ఎందుకు వెళ్తున్నారు?” అని అడిగాను.

“అక్కడో రెండురోజులుండి, జిల్లా కేంద్రానికి నాబదిలీ గురించి ఎవర్ని పట్టుకోవాలో తెలుసుకోవాలి. మా అమ్మాయి కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలంటోంది. కంప్యూటర్‌ సైన్స్‌ చదివి, ఉద్యోగం చూసుకోవడం మంచిది కాదంటారా? అమ్మాయి కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేట్‌ అయితే, పెళ్ళి కావడం సులభం కదా!”

హెడ్‌మాస్టర్‌ కంటే తండ్రిగానే ఎక్కువ ఆలోచనలు చేస్తున్నట్లున్నాడు. నేనింకా స్వాతంత్ర్యదినం గురించే ఆలోచిస్తున్నా అందువల్ల అతను చెప్పింది నాకు పూర్తిగా బురైకెక్కలేదు. “మరి ఈరోజు స్కూల్లో కార్యక్రమం అంతా ఎవరు చూసుకుంటారు?” అని అడిగాను.

నన్ను జాలిగా చూసాడు. “ఏముంది చూసుకోవడానికి? నా అసిప్టెంట్‌ మాస్టర్‌ను చూసుకోమన్నాను. ఈ ఉత్సవం కోసం ఇరవై ఏళ్ళ కిందట కొన్ని ఉపన్యాసాలు తయారు చేసుకున్నాను. ఏమీ మారలేదు. అతను వాటిలోనుంచి ఏదో ఒక ఉపన్వాసం తీసి చదివేస్తే సరిపోతుంది. నేను స్కూలుకే వెళ్ళలేదు. ఈ ఉపన్యాసాలు, ఉత్సవాల్లో విద్యార్థులకు ఉత్సాహమే లేదు. ఊళ్ళో టెంటు టాకీసులో ఏదో కొత్తసినిమా వచ్చింది. వాళ్ళు సినిమాకు వెళ్తారు కానీ, ఈ స్వాతంత్ర్యదినోత్సవం ఎవరికి పట్టింది?”

నేను ఆలోచనల్లో మునిగిపోయాను. ఇంతలో బస్సాచ్చింది. హెడ్‌మాస్టర్‌ జనంలో దూరి ఎలాగో బన్సులో నీటు నంపాయించేశాడు. అతను నావేవు తిరిగి చేయివూపుతూండగా, బస్సు దుమ్మలేపుతూ కదిలిపోయింది.

ఆ తర్వాత వారం బెంగుళూరు చేరుకున్నాను.

సెలవుకోనమేనా వర్వదినాలు 6౮7

ఒక (థ్రెండు బోజనానికి పిలిస్తే వెళ్ళాను. నాలాగే ఆమెకూడా టీచరు. మాకు అనేక విషయాల్లో, ఒకే రకమైన భావాలు, అభిరుచులు ఉన్నాయి. అయినా ఒకే నగరంలోఉన్నా కలుసుకోవడమే తక్కువ. మాకు తీరికే ఉండదంలేదు. కలవాలంటే వీలైనప్పుడు ఒక రోజు విందు చేసుకొని, కబుర్లు చెప్పుకోవడం మంచిదనుకున్నాం.

“క సారి మీస్కూల్లో ఆగస్టు పదిహేను ఎలా జరుపుకున్నారు చెప్పు” అనడిగాను.

ఆమె విచారంగా మొహం పెట్టింది.

“అధ్వానం అనుకో. టీచర్లందరం జెండా ఎగరేయదానికి ఉదయమే స్కూలుకు వెళ్ళాం. ఓ పెద్ద ప్రభుత్వాధికారిని ముఖ్యఅతిథిగా పిలిచాం. పాపం ఆయన పెద్ద ఉపన్యాసం ఒకటి తయారు చేసుకొని టైముకే వచ్చేసాడు. కానీ ...” ఆమె కాసేపు ఆగింది.

వారం రోజుల కిందట ఆ హెదడ్‌మాస్టర్‌తో జరిపిన సంభాషణ గుర్తొచ్చింది అందుకని “ఏం! హెడ్‌మిట్ట్రస్‌ రాలేదా?” అనడిగాను.

“అదేం లేదు. మాహెడ్‌మిస్టస్‌ చాలా మంచి మనిషి. జ్వరంగాఉన్నా టైముకు వచ్చింది. విద్యార్థులే రాలేదు. మాస్కూల్లో విద్యార్దులు వెయ్యిమందికి పైగా ఉన్నా, ఆరోజు కేవలం ఓ ఏఖైమంది వచ్చారు.”

“ఎందుకని?”

“వరుసగా మూడు రోజులు సెలవు కలిసొచ్చిందికదా. కొందరు పెద్దలు తమ పిల్లల్ని సెలవులకు పిలుచుకెళ్ళిపోయారు. బెంగుళూరులోనే ఉండే అనేక మంది విద్యార్దులు సినిమా థియేటర్ల దగ్గర కనిపించారు. వీడియో షాపుల్లో కూడా రోజంతా బాగా రద్దీగా ఉందన్నారు. మా ముఖ్య అతిథీ ఎదుట మేం తలొంచుకోవాల్సి వచ్చింది.”

“విద్యార్థులు తప్పక రావాలికదా. అటెండెన్స్‌ నమోదు చేస్తారు కదా!”

“నిజమే. పిల్లలను తప్పక పంపాలని తల్లితండ్రులకు నోటీసులుకూడా పంపించాం. ఉపయోగమేమిటి? అడిగితే తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్లు దాఖలు చేసేస్తారు. నాకోసారి అనిపిస్తుంది, ఆగస్టు 15కు, జనవరి 26కు సెలవు ప్రకటించకూడదు. స్కూలు మామూలుగా జరిపి, ఒకటి రెండు పిరియడ్స్‌ ఉత్సవానికి ఉపయోగించాలి. సెలవనేసరికి, స్వాతంత్ర్య యోధులను స్మరించే బదులు ఎక్కడో కులాసాగా గడిపేస్తున్నారు. ఏమంటావ్‌?”

నేనేమీ అనలేదు, ఏమనాలో తోచలేదు. ఏమంటాం?

మీరేమైనా సూచిస్తారా? ఈ సమస్యగురించి పాఠకుల ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని ఉంది. చాలా మంది టీచర్లుకూడా తెలుసుకోవాలనుకుంటున్నారు.

లో బ్సాహ్హ్‌

18 కల్లాకపటం తెలియని రోజులు

న్సే ఉత్తర కర్ణాటకలోని ఒక (గ్రామంలో పుట్టిపెరిగాను. ఆరోజుల్లో మనుషుల్లో అరమరికలు ఉండేవి కావు. మీకెవరైనా ఇష్టం లేకపోతే అతని మొహంమీదే ఆ సంగతి చెప్పేయొచ్చు. మీకు ఎందుకు కోపంగా ఉందో నిర్మొహమాటంగా బయట పెట్టొచ్చు. మీకెవరైనా సహాయం చేస్తే, అందుకు సంకోచం లేకుండా కృతజ్ఞతలు తెలియజేయొచ్చు. ఎవరైనా తప్పుచేస్తే న్యాయంగా ప్రవర్తించాలని స్పష్టంగా చెప్పేవాళ్ళం. దాపరికం లేకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసేవారం. అది నాగరిక లేదా నాజూకు ప్రవర్తన కాకపోవచ్చు. కానీ, నిష్కపటమైన సమాజం. ప్రజలు ప్రశాంతంగా నిరాడంబరంగా జీవించేవారు.

గ్రామాల్లో సామాజిక జీవితం ఇప్పుడెలా ఉందో తెలియదుకానీ నా చిన్నతనంలో గ్రామీణ సమాజాలు శాంతి సామరస్యాలు, న్యాయం, ధర్మంతో వర్ధిల్లేవి. మా ఆవు తప్పిపోయిన రోజు నాకింకా బాగా జ్ఞాపకంఉంది. దాన్ని గోపాల్‌ వాళ్ళ గొడ్లసావిడిలో కట్టేసారని తెలిసింది. వెంటనే పంచాయితీ పెద్దలు గోపాల్‌ను పిలిపించారు. గోపాల్‌ తనకున్న చిన్నకమతంలో కూరగాయలు పండిస్తాడు. వాటిని మార్కెట్‌లో విక్రయిస్తే వచ్చే ఆదాయమే తప్ప అతనికి వేరే జీవనాధారం లేదు. మా ఆవు అతని పొలంలోపడి కూరగాయలతోటంతా మేసేసింది. మేము అయ్యో అని విచారించి, గోపాల్‌ నష్టానికి పరిహారం చెల్లిస్తామని చెప్పాం. అతను వెంటనే సరే అని ఆవును వదిలిపెట్టేశాడు.

చట్టమేమంటుందా అని ఎవరూ చూడలేదు. వకీలును పిలిపించలేదు. పంచాయితీ ఒకనిర్ణయం తీసుకొని, నష్టాన్ని అంచనావేసి, సమస్యను సామరస్యంగా పరిష్కరించింది. ఇరు వర్ణాలమధ్య ద్వేషభావాలకు ఆస్మారమేలేదు.

ఇంకో సంఘటనకూడా నాకు జ్ఞాపకం ఉంది. మా పొరుగింట్లో ఒక అమ్మాయి అత్తగారితో ఇబ్బంది పడుతుండేది. అత్తగారి సతాయింపులు తరతరాలుగా ఉన్న సమస్యే భాష కులమతాలతో నిమిత్తంలేకుండా అన్ని సమాజాల్లోనూ ఉన్నవే. “పిల్లి, ఎలుక మధ్య ఎలా పొసగుతుంది?” అని చైనా భాషలో ఒక సామెత ఉంది. కొన్ని మినహాయింపులు ఉంటాయికానీ, సామాన్యంగా పిరిస్థితి ఇలాగే ఉంటుంది.

అ పొరుగింటి కోడలుపిల్ల నీళ్ళు తీసుకుపోవడానికి ఊరి కొలనుకు వెళ్ళేది. అమెకు ఇరవైవళ్ళయినా ఉండవు. చాలా సున్నితంగా, సుకుమారంగా ఉండేది. కొలను

కల్లాకవటం తెలియని రోజులు న!

గట్టుమీద ఒంటరిగా ఏడుస్తూ కూర్చునేది. ఇంట్లో పరిస్థితి దుర్భరంగా తయారైనట్లుంది.

పిల్ల ఏడ్వడం మా బామ్మ చూసింది. ఆమెకు సమస్య అర్ధమైంది. తిరిగి

రాగానే పౌరుగింటికి వెళ్ళి అత్తగారిని బయటికి పిలిచి, “కోడల్ని మరీ కఠినంగా చూసి

ఏడ్చించొద్దు. నీ కూతురుకూడా మరొక ఇంట్లో కోడలేనని మరిచిపోకు. నువ్వుకొత్త

పెళ్ళికూతురుగా ఉన్నప్పటినుంచి నాకు తెలుసు. తీర్పు చెప్పడానికి మనపైన దేవుడున్నాడు. నీ చేతలకు సంజాయిషీ చెప్పుకోవాల్సివస్తుంది” అని మందలించింది.

మరొకరి కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం తగదని, అది తనపని కాదని మా బామ్మ ఎన్నడూ అనుకోలేదు. ఒక యువతికి జరుతుతున్న అన్యాయం కేవలం వ్యక్తిగత వ్యవహారం కాదని ఆమె నమ్మకం. కొంత కాలానికి మా పొరుగింటావిడ తన ధోరణి మార్చుకొంది. ఇంకా ముఖ్యమైనదేమిటంటే, ఆమె మా బామ్మమీద కోపం పెట్టుకోలేదు. పెద్దల మాట పెడచెవిని పెట్టరాదని ఆ తరంలో అందరికీ తెలిసినట్లే ఆమెకూ తెలుసు. ఆరోజుల్లో న్యాయం, ధర్మం, నిజాయితీ, పెద్దలను గౌరవించడం ప్రాథమిక విలువలుగా అందరూ పాటించేవారు. చట్టాలు, నియమాలకంటే, సహజమైన, సామాన్య లోకజ్ఞానానికి ఎక్కువ ఆదరణ ఉండేది.

ఇటీవల మానాన్న కన్నుమూశారు. ఆయనపేరుతో ఒక వంటగ్యాస్‌ కనెక్షన్‌ ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత కనెక్షన్‌ను అలాగే ఉంచుకోవడం చట్టవిరుద్ధమనుకొన్నాను. అందుకని ఆ కనెక్షన్‌ను నాపేరుమీద మార్చవలసిందని కోరుతూ, ఆయన మరణధృవీకరణ పత్రం, నారేషన్‌కార్డుతోపాటు దరఖాస్తు పెట్టాను. ఒకరోజు గ్యాస్‌ ఏజన్సీ నుంచి పిలుపు వచ్చింది.

“మ్సీ దరఖాస్తు అసంపూర్తిగాఉంది. గ్యాస్‌కనెక్షన్‌ మీకు సంక్రమించాలని మీ తండ్రి విల్లులో రాసిన మాట నిజమే. అయితే ఈ గ్యాస్‌కు మేము అడగబోమంటూ మీ సోదరులు, అక్క చెల్లెళ్ళు కాగితంమీద రాసి, సంతకాలు చేసిన డాక్యుమెంట్‌ జతపరచలేదు. అలాంటి పత్రంలేకపోతే, కనెక్షను మీపేరుమీద మార్చడం చట్టవిరుద్ధమవుతుంది” మేనేజర్‌ చెప్పాడు.

నా సోదరి, సోదరుడు విదేశాల్లో నివసిస్తున్న అమెరికన్‌ పౌరులని, వారికీ గ్యాస్‌ కనెక్షన్‌లో ఆసక్తిలేదని తెలిపాను. అతనో ఉద్యోగి. ఉద్యోగిబుద్ధి పోలేదు. లోకజ్ఞానంతో పనిలేదు, రూల్సుముఖ్యం అతనికి.

“అమెరికానుంచి నోటరీ సర్టిఫికేట్‌ తెప్పించండి” అన్నాడు.

మానాన్న విల్లుదృష్యా ఇదేదో సులభంగా అయిపోయే పని అనుకొంటే, హఠాత్తుగా క్షిష్టంగా మారిపోవడం ఆశ్చర్యం కలిగించింది.

గ్ర జ్ఞానం - పరిజ్ఞానం

అదేమాట మేనేజర్‌కు చెప్పేసరికి అతని ధోరణి ఇంకా కటువుగా తయారైంది. “మేడం, చట్టానికి ఎవరూ అతీతులు కారు. వాళ్ళు అమెరికా పౌరులైతేమాకేం? వాళ్ళు రూల్సు పాటించి తీరాలి. దీనికోసం నేను తర్వాత చిక్కుల్లో పడదలచుకోలేదు” అని తేల్చేశాడు.

ఇంత చిన్న విషయానికి నోటరీ ధృవీకరణ సంపాదించడం చాలా కష్టం. అర్ధరోజు

సెలవుపెట్టి తిరిగితే తప్ప ఆపని పూర్తికాదు.

నా వాదనలేవీ మేనేజర్‌ దగ్గర పనిచేయలేదు. విసుగెత్తి వచ్చేశాను. నెలరోజుల

తర్వాత రీఫిల్‌ అడిగితే అతను మళ్ళీ రూల్సు వల్లించాడు. “మీ తండ్రిచనిపోయారు కదా. అందువల్ల ఆయన పేరుమీద మీకు సిలెండర్‌ ఇవ్వడం కుదరదు. అప్పుడని పించింది - మా నాన్నగారు పోయారని ఇతనికి చెప్పకపోతే అంతా = సజావుగా సాగిపోయేది. మనలో చాలామంది ఏదైనా చట్టబద్ధంగా, సక్రమంగా చేయాలని చూస్తాం. చివరికి మన వ్యవస్థలో అటువంటి రుజువర్తనకు చోటు లేదని గ్రహిస్తాం.

మా రోడ్డులో స్వీపర్‌గా పనిచేసే ఒక మహిళనాకు చాలాకాలంగా తెలుసు. మొన్నాకరోజు ఆమె ఏడుస్తుంటే చూశాను. పాపమని పించింది. ఆమె భర్త తాగొచ్చి కొడుతుంటాడు. వెళ్ళి ఆ భర్తకు కాస్త ఉపదేశం చేద్దామనుకున్నాను. మా బామ్మ ప్రభావం నామీద పనిచేస్తోందేమో! ఆమె ఏడ్వడం మా ఇరుగుపొరుగు అంతా చూశారు. ఒక్కరికీ భర్తతో మాట్లాడాలనిపించలేదు. వారు నాకంటె వివేకవంతులు కావచ్చు.

నేను వెళ్ళి ఆమె భర్తతో మాట్లాడేసరికి, “మేడం, నావ్యక్తిగత జీవితంలో జోక్యంచేసుకునే హక్కు మీకులేదు. ఇది భార్యాభర్తల మధ్య వ్యవహారం. నేనేమైనా కష్టాలు పెడితే నాభార్య వకీలు దగ్గరికి వెళ్ళొచ్చు. మీదగ్గరికి రావాల్సిన అవసరంలేదు” అని ఖచ్చితంగా చెప్పేశాడు.

ఇంకేమనాలో తోచలేదు. అతను చట్టం గురించి మాట్లాడుకుంటే, ఇక మనకు చట్టాలు ఎందుకు పనికొస్తాయని పించింది. సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్ది, సామాన్యులకు రక్షణ కల్పించేందుకే చట్టాలు చేశారు. మరి చట్టాలను అమలు పరచడం కష్టమైతే, వాటి ఉద్దేశమే నీరుగారిపోతుంది. అత్యుత్సాహపు ఉద్యోగులు తప్పుగా వ్యాఖ్యానించినా వాటి ప్రయోజనం నెరవేరకుండా పోతుంది.

ఈ విషయంలో సామాన్యప్రజలు చేయగలిగింది ఏముంది? మనం గ్యాస్‌ కనెక్షన్‌ దగ్గరినుంచి, తాగుబోతు భర్తలదాకా అనేక రకాల సాధారణ సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ దైనందిన సమస్యలకు న్యాయశాస్త్ర పారంగతులెవరైనా పరిష్కారాలు సూచించగలరా?

ళో కు

క్షం జ్‌ త పేదరాలిచ్చిన మల్లెపూదండ త;9ంంలి ఉన్నవారికి తరచుగా సన్మానాలు, సత్కారాలు జరుగుతుంటాయి. వారికి అర్హత ఉందా లేదా అన్నదానితో నిమిత్తంలేదు. వారిచేతిలో అధికారం ఉంటేచాలు. ఆ సన్మానం చేసినవారు సన్మానితుల నుంచి కొన్ని ఉపకారాలు ఆశిస్తారు. ఒకోసారి ఈ సన్మానాల తతంగం చూస్తుంటే, ప్రతి శాలువ, ప్రతి పూలమాల వెనుక ఏదో ఒక దరఖాస్తు ఉండే ఉంటుంది కనుక ఈ సన్నానాల్లాంటివేవీ జరక్కుండా చూడాలని పిస్తుంది. ఇన్ఫోసిస్‌ ఫౌందేషన్‌ మేము పనిచేసే ఒక రాష్ట్రంలో, అప్పటికే పనిచేస్తున్న ఒక (ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు భవనం నిర్మించి పెట్టింది. కర్ణాటకకు దూరంలో ఉన్న ఆ ఆస్పత్రి ఆవరణలో ప్రారంభోత్సవం ఏర్పాటయింది. ముఖ్యఅతిథిగా ఆరాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రిని ఆవ్వానించారు. సభను ఉదయంపూట ఏర్పాటు చేయవలసిందని ఉత్పవ సమన్వయ కర్తను అభ్యర్థించాను. సభ ఆలస్యమైనా తిరుగు ప్రయాణం భద్రంగా సాగిపోతుందని అలాకోరాను. కారులో రాత్రిపూట ప్రయాణం నాకు అలవాటు లేదు. అయితే సమన్వయ కర్త నామాట వినలేదు. ఉదయం సభ ముఖ్యఅతిథికి అనుకూలంగా లేదని, సాయంకాలం ఏడు గంటలకు ఏర్పాటు చేశారు. సభ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. వేదికమీద అనేక కుర్చీలు వర్పాటుచేశారు. డజనుకుపైగా మల్లె, బంతిపూలు, చందనం మాలలు, శాలువాలు, పండ్లబుట్టలు వేదిక మీద సిద్ధంగా ఉంచారు. పట్టుచీర ఉన్న ఒకపెట్టెను కూడా వేదికమీదికి చేర్చారు. వాటన్నిటికీ బాగానే ఖర్చుపెట్టారని తెలుస్తూనే ఉంది. ఈ హడావిడినంతా ప్రేక్షకురాలిలా చూస్తూకూర్చుండిపోయాను. మేం నిర్వహించే సంక్షేమ కార్యక్రమాల్లో, లబ్ధిదారులనుంచి మేమెలాంటి ప్రతిఫలం ఆశించం. మా సేవలు గురించి వారు రెండు మంచి మాటలు చెప్తేచాలు మేం తృప్తిపడతాం. ఆ రెండుమాటలే ఒకోసారి, మరో కార్యక్రమం చేపట్టడానికి ఉత్తేజం కలిగిస్తాయి. మా విరాళాల్ని లబ్ధిదారులు మెచ్చుకుంటే సంతోషిస్తాం. అక్కడి ప్రజలు మేం వారికోసం ఆస్పత్రి నిర్మించినందుకు ఎంతగా కృతజ్ఞత చూపుతున్నారో, మమ్మల్ని ఎంతగా సన్మానించాలనుకొన్నారో, వీరిదెంత గొప్ప సంస్మారమో అనుకుంటూ కూర్చున్నాను.

౯2 జ్ఞానం - వరిజ్ఞానం

వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది. జనం గుంపులు గుంపులుగా వస్తూనే ఉన్నారు. గంట ఆలస్యంగా మంత్రి రాగానే, చాలా మంది ఆయన పాదాలుతాకడానికి ఎగబడ్డారు. కొంతమంది దరఖాస్తులు పట్టుకొని మంత్రిని చుట్టుముట్టారు. కాసేపటికి అదోచిన్న దర్భారులా తయారైంది.

సభ ప్రారంభమైంది. వేదిక మీద నాకోమూల కుర్చీచూపించారు. ఉపన్యాసాలు పోరెత్తిపోయాయి. మంత్రి ఎంత సమర్భుడో, ఎంత గొప్ప నాయకుడో ఆయనకు ప్రజలంటే ఎంత అభిమానమో ఒకరితో ఒకరు పోటీపడి వర్ణించి, వర్ణించి చెప్పారు. ఆయన మహత్తర నాయకత్వంలో ఎవరో ఒకదాత ఆస్పత్రికి అదనపు భవనం నిర్మించి పెట్టారని ఒకరిద్ధరు ప్రస్తావించారు. దాతపేరుకానీ, కనీసం ఆస్పత్రి అవసరాలు గురించికూడా ఒక్కరూ ప్రస్తావించలేదు. మంత్రిని, ప్రభుత్వాన్ని మాత్రం అదేపనిగా పొగిడారు. ఇదో చిన్న పట్టణం. ఇక్కడి పేదలకు సహాయపడాలని తప్ప మాకు మరో ఆసక్తిలేదు. ఇది నిజంగా చాలా వెనుకబడిన ప్రాంతం. మేం చేయగలిగింది చేశాము.

తర్వాత మంత్రి లేచి భవనాన్ని ప్రారంభించారు. తనకు ప్రజాస్వామ్యంలో అపారమైన విశ్వాసం ఉందని, ప్రజలంటే తనకున్న (సేమ ఇంతా అంతాకాదని చెప్పారు. తన ఆరోగ్యం కంటే, ప్రజల ఆరోగ్యంపట్ల ఎక్కువ (శ్రద్ధ ఉండడం వల్లనే ఈ ఆస్పత్రికి అదనపు భవనం అవసరమనుకొన్నానన్నారు. ఇప్పటికీ తనకు సంతోషంగా లేదని, ఆస్పత్రికి ఇంకా అనేక సదుపాయాలు కల్పించాలని చెప్పారు.

తర్వాత నావేపు తిరిగి, “మేడం! మీనుంచి మొత్తం ఆస్పత్రికి ఫ్యాన్లు, పడకలు, బీరువాలు, దుప్పట్లు, మంచినీటి సదుపాయం వగైరా ఆశిస్తున్నాం. మీరివన్నీ అందిస్తారన్న నమ్మకం నాకుంది. వాటిని మా ప్రజలు సద్వినియోగం చేసుకొంటారని నేను మీకు హామీ ఇస్తున్నాను”.

నేను జవాబు చెప్పలేదు.

ఉత్సవంలో అఖర్న ఆస్పత్రి భవన నిర్మాణానికి సహాయపడినవారిని సన్మానించారు. జాతీయ గీతాలాపన తర్వాత సభ ముగిసింది. మంత్రి గబగబా కారు దగ్గరికి వెళ్తుంటే, జనం ఆయనవెంట పరుగెత్తారు. నేను ఒంటరిగా, ఆటతర్వాత మిగిలే గోల్‌పోస్టులా నిల్చుండి పోయాను.

ఆస్థలమంతా నిర్మానుష్యమైపోయింది. వేదికమీదంతా నలిగిపోయినపూలు వెదజల్లి ఉన్నాయి. పందిరిలో తప్ప వెలుపలంతా చాలా చీకటిగా ఉంది. వాడిన పూలదండ, చేతిసంచితో అక్కడే నిల్చున్నాను.

నాఎదుట, మాఫౌందేషన్‌ నిర్మించిన కొత్తభవనం రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో శోభాయమానంగా కనిపిస్తోంది. నేనొక్కర్తినే కాదు, వాస్తుశిల్పులు,

పేదరాలిబ్చిన మల్లైవూదంద గ్ర

వృత్తికళాకారులు, ట్రస్టీలు, ఇంకా అనేకమంది ఈ భవన నిర్మాణంలో కష్టపడి పనిచేసారు. ఉపన్యాసకులెవ్వరూ వారిపేర్లు ప్రస్తావించలేదు. మా ఫౌండేషన్‌ ప్రసక్తే ఎక్కడా రాలేదు. నన్నో అవాంఛిత అతిథిగా ఎంచి, కేవలం లాంఛనంకోసం పిలిచారు.

నన్ను నిరుత్సాహం ఆవరించింది. ఈ ఉత్సవం నా ఉత్సాహాన్ని నీరు గార్బేసింది. ఒక మహిళపట్ల చూపాల్సిన కనీస మర్యాదకూడా వారు చూపలేకపోయారు. చాలాదూరం నుంచి, ఒకధర్మ సంస్థ ప్రతినిధిగా వచ్చాను. ఇలా ఒంటరిగా వదిలేసి ఎవరిదాదిన వారు వెళ్ళిపోయారు. ఈ ఆరోగ్యమంత్రి ఆస్పత్రి కొత్తభవనానికి నిధులు కానీ, ఎలాంటి వనరులుకానీ అందించలేదు. ఇందులో ఆయన పాడ్రేలేదు. నిర్మాణం జరుగుతోందని కూడా ఆయనకు తెలియదు. అయితే తనకు సన్మానం జరిగేలా, అందరూ తనను పొగడ్తలతో ముంచెత్తేలా చూసుకున్నాడు. పూలమాలలు చాలావరకు ఆయనకేవేశారు. ఇదంతా రాజకీయాలా లేకపోతే నైతిక పతనమా?

మా, అంతిమ లక్ష్యం మంత్రులను, రాజకీయ వాదులను, ధనవంతులను అధికారంలో ఉన్నవారిని సంతోషపరచడం కాదని. గుర్తుకు తెచ్చుకున్నాను. కష్టాల్లో ఉన్న ప్రజల స్థితిగతులను మెరుగు పరచడానికే మేం అన్ని విధాలా కృషి చేస్తున్నాం. మాకు మంత్రికాదు, పేదప్రజల అభిప్రాయాలేముఖ్యం.

నావిచారం అట్టేసేపు ఉండిపోలేదు. .

చింపిరి బట్టలు ధరించిన ఒక వృద్ధ మహిళ నాదగ్గరకు వచ్చి చెప్పింది - “అమ్మా ఈ భవనాన్ని మీ కంపెనీ కట్టించిందని ఎవరో చెప్పారు. మీకు మేము రుణపడి ఉంటాం. చోటుచాలక పోవడం వల్ల మాలాంటి అనేక మందిని ఇందులో చేర్చుకోవడంలేదు. ఇప్పుడు మీరు, ప్రత్యేక వార్డులు లేని కామన్‌హాలు నిర్మించి ఇచ్చారు. స్పెషల్‌ రూములు పలుకు బడికలిగినవారికే ఇస్తారు. మాలాంటి వారికి ఇలాటి కామన్‌ హాలే మంచిది”.

తర్వాత ఇంకో అడుగు నడిచి దగ్గరకు వచ్చి “మీకు ఇవ్వడానికి నాదగ్గర ఏమీలేదు. నేను పూలు అమ్మి బతుకుతున్నాను. శాలువో, చీరో ఇవ్వలేను. ఈ మల్లెపూదండ ఇవ్వగలను. ఎంతో ప్రేమతో, అభిమానంతో ఇస్తున్నాను. మన దేశంలో మీలాంటివాళ్ళు చాలా మంది జన్మించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను”.

శాలువలు, పండ్లబుట్టల కంటె, ఈ మల్లెపూదండే ఎంతో విలువైంది. అపురూపమైంది.

పో, అస

20 దిక్కూమొక్కులేని నిర్హాగ్యులు కుషుం. దానిపేరు చెప్తేనే ప్రపంచంలో చాలా మందికి వణుకు పుడుతుంది. ఎవరినైనా 'కుష్టురోగి' అని పిలవడం తప్పని, ఆ పదాన్ని ఉపయోగించరాదనే అంతర్జాతీయ ఒప్పందంకూడా అమలులో ఉంది. కుష్టువ్యాధి సోకినవ్యక్తి అంటే మనకు సోధారణంగా ఏ బిచ్చగాడో, కొన్ని చేతివేళ్ళు లేదా కాలివేళ్ళు పోగొట్టుకున్న వ్యక్తో గుర్తాస్తాడు. కుష్టువ్యాధి

(గ్రస్థులను సమాజం చాలా వరకు వెలేసినట్లు చూస్తుంది.

అయితే కుష్టవ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే, చికిత్సచేసి దానిని పూర్తిగా పోగొట్టి స్వస్థత కలిగించవచ్చునని, అంగవైకల్యం కలగకుండా నివారించవచ్చునని గుర్తించాలి. సాధారణంగా చాలాకాలంపాటు చికిత్స చేయించుకోవలసి ఉంటుంది. రోగిచాలా నిబ్బరంగా, ఓపికగా మందులు తీసుకోవాలి. కుటుంబ సభ్యులు రోగికి అండగా నిలవాలి. ఈ వ్యాధి అంటురోగమని, వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని కొంతమంది భావిస్తారు. అవన్నీ తప్పుడు అభిప్రాయాలు. అన్నిరకాల కుష్టువ్యాధీ ఇతర్లకు సోకదు.

అజ్ఞానంవల్ల జనం ఆరంభదశలో కనిపించే రోగలక్షణాలను ఉపేక్షిస్తారు. ప్రాథమిక దశలో వ్యాధిలక్షణాలను ఎలా గుర్తించాలో సమాచార సాధనాల్లో అడ్వర్దయిజ్‌మెంట్లద్వారా తెలియజేస్తున్నారు. అయినప్పటికీ చాలామంది పట్టించుకోవడంలేదు. మనం ఇదేదో ఇతరులకు వచ్చేవ్యాధి మనకెందుకు వస్తుందని భావిస్తాం. వ్యాధి ఎవరికైనా రావచ్చు. వ్యాధులకు ధనికులు, పేదలు, స్రీలు, పురుషులు అనే సాంఘిక తారతమ్యాలు ఉండవు. కుష్టువ్యాధి మానవాళిని అనేక శతాబ్దాలుగా, జీసస్‌ క్రీస్తు కాలంనుంచి సైతం పీడిస్తోంది.

అనేక కార్యకలాపాలతోపాటు, కుష్ఫవ్యాధి పీడితులకు కూడా సహాయపడాలని మా సంస్థ కల్పించింది. ఈ రంగంలో అనేక సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. కొందరు రోగులు వారి కుటుంబాలతోనే నివసించాలని భావిస్తారు. మరికొందరు వారిని ప్రత్యేక కాలనీలో వేరుగా ఉంచాలంటారు.

నేను కుష్టురోగులకు విడిగా ప్రత్యేక కాలనీ ఉన్న మారుమూల ప్రాంతంలో పనిచేశాను. ఒకసారి మండు వేసవిలో వెళ్ళాను. కాలనీలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాలనీవాసుల్లో ఎక్కువమంది వారి వ్యాధితో, బాధలతో విసుగెత్తిపోయారు.

దక్కూమొక్కులేని నిర్భాగ్యులు 70

వారిపట్ల జాలిచూపడమో, దబ్బుపంచడమో మా ప్రాజెక్టు లక్ష్యంకాదు. రోగులకు ఆర్థికంగా పునరావాసం కల్పించాలనుకొన్నాం. వారేవైనా చిన్నచిన్న పనులుచేసి, సొంతంగా జీవనాధారం కల్చించుకోగలిగితే, అందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పాము. వారిలో ఆత్మవిశ్వాసం కల్పించడం ముఖ్యమని గుర్తించాము. ఆత్మ విశ్వాసం ఉంటే సమాజాన్ని ఎదుర్కోగలుగుతారని అభిప్రాయపద్దాం.

కాలనీలో ఉన్నవారందరూ పేదలు, నిన్సహాయులే. వారిని ఆర్థికంగా ఆదుకొంటేచాలదు. మానసికబలం కూదా కల్పించాలి. “దిగులుపడకండి, మీకు మేము అండగా నిలబడతాం” వంటి ఊరడింపు మాటలు సైతం వారికి ధైర్యం కలిగిస్తాయి. వారిని సమాజం దగ్గరతీస్తే, కొంత ఆర్థిక స్వాతంత్ర్యంకల్పిస్తే, వారిజీవితాలు మారిపోతాయి.

కాలనీలో ఉన్నవన్నీ గుడిసెలు. ఒకోగుడిసెలో ఒకో కుటుంబం ఉంటోంది. ప్రతికుటుంబంలో కనీసం ఒకరైనా వ్యాధితో బాధపడుతున్నారు. వాజొవరణం దుర్భరంగా ఉందికానీ, నాడ్యూటీ నేను చేయాలి. ఒక్కో గుడిసెకూవెళ్ళి వారిపరిస్థితిని అర్ధంచేసుకోవాలి. ఏ గుడిసెదగ్గరికి వెళ్ళినా, మహిళలు తమకష్టాలను వివరించారు. ఈ వ్యాధివల్ల వారికి ఉపాధి లభించడం లేదు. పనిమనిషి పనికూడా దొరకడం లేదు. కొంతమంది తమ తలరాత ఇంతేనని సమాధానపడిపోయారు. మధ్యాహ్నం కావస్తున్నా యువకులు ఇంకా నిద్రలో ఉన్నారు. పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు.

వృద్ధులపరిస్థితి మరీ దయానీయంగా ఉంది. రోగానికి వృద్ధాప్య సమస్యలు తోడైతే, సమాజం వెలివేస్తే, వారికి జీవితంమీద విరక్తిపుట్టదా? ఎందుకీ బతుకు, చస్తేపోతుందని యోచిస్తుంటారు. అలాంటివారు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా లేకపోలేదు.

అదొక మట్టిగోడల గుడిసె. ఒకవెదురు తడికను తలుపుగా ఏర్పాటు చేసుకున్నారు. కాలనీలో అందరికంటే ఎక్కువ వయసున్న వృద్ధురాలొకామె అందులో ఉంటోంది. ఆమె పేరు వీరమ్మ. ఆమెను బయటికి రమ్మని పిలిస్తే రాలేదు. ఆమెకు సరిగ్గా వినపడలేదేమోనని, నేనే లోపలికి వెళ్ళామనుకొన్నాను. తడిక తలుపు గట్టిగాతడితే పడిపోతుందేమోనని, జాగ్రత్తగా తట్టాను. ఆమె ఉలకలేదు, పలకలేదు. ఇక లాభంలేదని తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాను.

ఆగుడిసెలో పెద్దగాఏమీలేదు. కప్పురంధ్రాలగుండా కొంత గాలీవెలుతురూ వస్తున్నాయి. రెండుమూడు మట్టికుండలు, ఒకమట్టి కంచం కనిపించాయి. మూడు రాళ్ళుపెట్టి ఏర్పాటుచేసుకున్న పొయ్యి, ఒక చింకిచాప, రెండుమూడు ఉల్లిపాయలు, ఒక నీటికుండ కూడా నేలమీద ఉన్నాయి.

గుడిసెలో వీరమ్మ నాకంటికి కనిపించలేదు. ఆమెగాలిపీల్చుకోవడం మాత్రం వినిపిస్తోంది. ఎండవెలుతురు లోంచి వచ్చాను కనుక లోపలి చీకటికి నాకళ్ళు అలవాటు పడడానికి కొంతసమయం పట్టింది.

765 జ్ఞానం - నరిజ్ఞానం

“వీరమ్మా ఎక్కడున్నావు? నీతోమాట్లాడాలని వచ్చాను” అని మరోసారి మృదువుగా పిలిచాను.

“ఇక్కడున్నానమ్మా. నాదగ్గరకు రాకండి” అని సమాధాన మిచ్చింది.

అప్పుడు చూడగలిగాను. బక్కపలుచని శరీరం. ముడుతలు పడిన చర్మం. శరీరంలో కండంటూ ఉన్నట్లులేదు. చర్మంకప్పిన అస్థిపంజరంలా ఉంది. గుడిసెలో ఒకమూల, చేళులు ఛాతీకి అడ్డుగా ఉంచుకొని, కాళ్ళుకూడా పైకి ముడుచుకొని కూర్చుని ఉంది.

“అమ్మా, మీరుచాలాసార్లు పిలిచారని తెలుసుకానీ, బయటికి వచ్చిమీతో మాట్లాడలేక పోయాను. నేను స్త్రీని వయసు ఎంజైనా, బట్టలు లేకుండా ఇతర్లముందుకు ఎలా వస్తాను చెప్పండి,”

అప్పుడు గమనించాను, ఆమె వంటిమీద ఎలాంటి ఆచ్చాదనాలేదని.

మా సంస్థ కార్యకలాపాల పనిలో నేను, పేదలు నివసించే అనేక ప్రాంతాలను చూశాను. అనేక మంది పేదలను కలిశాను. అయితే ఇలాంటి మహిళను ఎక్కడా చూడలేదు. స్వాతంత్ర్యం వచ్చిన ఏథైవళ్ళ తర్వాత కూడా మనదేశంలో ఇంతటి అమానవీయ పేదరికాన్ని చూడవలసి రావడం సిగ్గుచేటు. ఒక వృద్ధమహిళకు ఒళ్ళుకప్పుకొనడానికో చింకిపాతకూడా లేదు. అయినా ఆమె ఎవరినీ నిందించడంలేదు. తనకేదో లేదని ఫిర్యాదు చేయడంలేదు. ఆరుగజాల చీర ధరించినందుకు నన్ను అపరాధభావం ఆవహించింది.

ఒక్క నిముషం, సిగ్గుతో తలవంచుకున్నాను. నాకు నోటమాట రాలేదు. ఆదృశ్యం నన్ను దిగ్భ్రాంతి పరచింది. డబ్బు, వస్తువులు ఇవ్వరాదన్న మా నియమాన్ని మరిచిపోయాను. ఈ దుస్థితికి తక్షణ పరిష్కారం అవసరం.

మా ధైైవర్ని పిలిచి, వెంటనేవెళ్ళి, కాలనీలో మహిళలందరికీ పంచడానికి వంద చీరలు కౌనుక్కురమ్మని పంపించాను. మహిళలకు వునరావాసనం కల్పించినా, కల్పించలేకపోయినా, ఒళ్ళు కప్పుకోవాల్సిన కనీసఅవసరమైనా తీర్చాలి. ఈ సహాయం వారి జీవితాలను మార్చలేకపోవచ్చు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితిని చూసినప్పుడు తక్షణం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. మనలో చాలామందికి భగవంతుడు చాలా మేలు చేసాడు. ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. వారి తప్పేమీలేకపోయినా దుర్భరమైన జీవితాలు గడుపుతున్న నిరుపేదలను అలాంటి అదృష్టవంతులు ఆదుకోవాలి.

భారతదేశం అంటే టెక్నాలజీ, ఫ్యాషన్‌, సినిమాలు, అందాల పోటీలు మాత్రమే అనుకొంటే పొరపాటు. నిజమైన భారతదేశం, మారుమూలల్లో, నిర్లక్ష్యానికి గురిఅయిన వెనుకబడిన ప్రాంతాంల్లోఉంది. పేదప్రజలు నిస్సహాయంగా, దుర్భరమైన పరిస్థితుల్లో

దిక్కూమొక్కులేని నిర్భాగ్యులు 77 జీవిస్తున్నారు. ప్రభుత్వ శాఖలేవీ వారిని పట్టించుకోవు. దేశసేవ అంటే ఇలాంటి వారి= సేవచేయడమే.

ఆ కుష్టురోగుల కాలనీని చూసిన తర్వాత, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా కనీసం పది చీరలు తీసుకుపోవాలని నియమం పెట్టుకున్నాను. బ్రా

వ

నచ్చితేచాలు తక్షణం పెళ

అబా త్రి క్యవవ్య్యూ సరిహద్దు ప్రాంతం ఒకప్పుడు పేదరికంలో మగ్గుతుందేది. మూడు దశాబ్దాలలో ఆ పరిస్థితి మారిపోయింది. చెరకుపంట అక్కడి జీవన పరిస్థితుల్లో మార్చుతెచ్చింది. కృష్ణా, మలప్రభ, ఘటప్రభ నదులనుంచి నిరంతరం నీరు సరఫరా అవుతుండడంతో, రైతులు చెరకు విస్తారంగా పండిస్తున్నారు. పదినెలలు పెంచి చక్కెర ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు. ఆప్రాంతంలో ఇప్పుడు అనేక చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవాళ అక్కడ దేనికైనా కొరత ఉందంటే అది సమయానికే. జనానికి తీరిక లేకపోవడంతో, వివాహాల నిర్వహణలో ఒక కొత్తశైలి రూపుదాల్చింది. ఈ పద్ధతిని

ప్రధానంగా జైనులు అనుసరిస్తున్నారు. దీన్ని 'యాదీమేంషాదీ' అంటారు.

అది చాలా నిరాడంబరమైన పద్ధతి. వయసులో ఉన్న బ్రహ్మచారికి తగిన అమ్మాయిని చూసుకోగానే, ఉభయపక్షాలూ కూర్చుని ఒకజాబితా రాస్తారు. ఈ జాబితాను హిందీ, మరాఠీ భాషల్లో 'యాది" అంటారు. నగదుకానీ, వస్తురూపంలోకానీ వధూవరులకు ఇచ్చే వాటిని జాబితాలో నమోదు చేస్తారు. ఆ సాయంకాలమే పెళ్ళి జరిగిపోతుంది. ఉభయపక్షాల కుటుంబిసభ్యులు మాత్రమే పెళ్ళికి హాజరవుతారు.

“సుమారు ముప్పైపఏళ్ళ కిందట పెళ్ళంటే, షడ్రసోపేతమైన వివాహ భోజనం చేయడానికి, ఐంధుమిక్రులను కలుసుకొనడానికి మంచి అవకాశం. ఆ శుభముహూర్తం కోసం ప్రతివారు ఆత్రంగా ఎదురుచూసేవారు' అని సంఘసేవకురాలు (ప్రేమలతారెడ్డి చెప్పారు. కర్ణాటకలోని అయినాపూర్‌, అత్నీ ప్రాంతాల్లో దాదాపు 70 యాదీమేంషాదీ ల నిర్వాహణకు ఆమె సహాయసహకారాలు అందించారు. “సిరిసంపదలు పెరగడంతో పెళ్ళిళ్ణ తీరుమారిపోయింది. వివాహ నిర్వహణ అంటే చాలా పనిఉంటుంది కానీ ఎవరికీ ట్రైములేదు.”

ఈ 'యాదీమేంషాదీ పద్ధతి మహారాష్ట్రలో చాలా కాలంగా ఆచరణలోఉందని ఆమె చెప్పారు. ఇప్పుడు కర్ణాటక సరిహద్దులోని చిన్నపట్టణాల్లో ఈ పద్ధతి క్రమంగా ఆమోదం పొందుతోంది. అటువంటి చోట్ల ఇంచుమించు అందరికీ ఒకరికొకరు తెలిసి ఉంటారు కనుక “యాదీ లో రాసిన వాగ్దానాలను నెరవేర్చకపోయే అవకాశాలు తక్కువని ఆమె అన్నారు.

నబ్చితేచాలు తక్షణం పెళ్ళి 79

వివాహాలకు హాజరుకావడమంటే సమయాన్ని వృధాపరచుకోవడమే అని ఇరవైయ్యేళ్ళ చంద్రవంటివారు భావిస్తున్నారు. “నా (ఫెండంటే నాకు నిజంగానే చాలా (ప్రేమ, గౌరవం ఉండొచ్చు. మరతను ఎక్కడో దూరంగా బెల్గాం వంటి ఊళ్ళో పెళ్ళిచేసుకొంటుంటే ఎలావెళ్ళాలి? అక్కడికివెళ్ళి మొహం చూపించి రావడానికే ఒకరోజంతా సరిపోతుంది” అంటాడతను. చంద్ర పట్టభద్రుడు. ఇరవై ఎకరాల చెరకు సేద్యంలో అతను వాళ్ళ తండ్రికి సాయపడుతుంటాడు. “ఆరోజు పొలంలో కూలీలు పనిచేస్తూంటారనుకోండి. అక్కడ నేనులేకపోతే పని పూర్తవదు” అని చంద్ర వివరించాడు.

చంద్రకు పెళ్ళిచేయాల్సిన సమయం వచ్చిందను కొన్నప్పుడు అతని తల్లితండ్రులు “యాదీమేంషాదీ పద్ధతినే ఎంచుకొన్నారు. అనేక సంబంధాలు వచ్చాయి కానీ, వాటిలో మూడు సంబంధాలు వారికి నచ్చాయి. అ ముగ్గురు అమ్మాయిల కుటుంబాల నేపథ్యం, ఆర్ధికంగా వారి అంతస్థు తమకు సరిపోతాయనుకొన్నారు. ఒకమంచిరోజుచూసుకొని చంద్రతోపాటు అమ్మాయిలను చూడడానికి వెళ్ళారు. మొదట చూసిన ఇద్దరు అమ్మాయిలు చంద్రకు నచ్చలేదు. మూదోఅమ్మాయిని ఇష్టపడ్డాడు.

అప్పటికే సాయంకాలం నాలుగు గంటలయింది. ఒకతను హుటాహుటిన రెండుపూలమాలలు, పెళ్ళికుమార్తెకోసం మంగళసూత్రం, మట్టెలు, పసుపుపచ్చని చీర, బ్లౌజు, పెళ్ళికుమారునికోసం పైజమా-షర్జు, ఉంగరం కొనడానికి దగ్గరున్న పట్టణానికి వెళ్ళాడు. మరెవరో రవ్వ, బియ్యం, చక్కెర వగైరా కొనడానికి వెళ్ళారు. భోజనం ఖర్చులను పెళ్ళి ఎవరింట్లో జరిగితే వారు భరిస్తారు. మిగతా అన్నిటికీ ఆకుటుంబమే ముందు ఖర్చుపెట్టినా, తర్వాత రెండుకుటుంబాలు చెరిసగం భరిస్తాయి.

వధూవరులు పెళ్ళికి సిద్ధమవుతుంటే, మహిళలు భోజనం ఏర్పాట్లు చేశారు. మగవాళ్ళు ఒకచోటచేరి 'యాది' తయారుచేశారు. ఈ రోజుల్లో ఇందుకు ప్రింటుచేసిన ఫారాలు కూడా లభిస్తున్నాయి.

వధూవరుల తల్లితండ్రులు కొత్తదంపతులకు తొము ఇవ్వదలచిన వస్తువుల పేర్లు రాశారు. అభిప్రాయభేదాలను పరిష్మరించుకొన్న తర్వాత తుదిజూచితాను సిద్ధం చేశారు. దానిమీద ఉభయపక్షాలవారూ, ఇందుకోసం ప్రత్యేకంగా పిలిపించిన పెద్దల సమక్షంలో సంతకాలు చేశారు. తర్వాత పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. 'యాది'లో పేర్కొన్న వస్తువులను ఇవ్వాల్సిన తేదీనికూడా అప్పుడే నిర్ణయించారు. సాధారణంగా ఈ తేదీ పంటకోతల తర్వాతవచ్చేలా నిర్ణయిస్తారు.

వివాహం ఇంటిముందే నిరాడంబరంగా జరిగింది. రెందు కుటుంబాల సభ్యులు, అప్పుడావూళ్ళోఉన్న కొద్దిమంది దగ్గరిబంధుమిత్రులు హాజరయ్యారు. బ్యాండుమేళాలు, స్వాగతసత్మారాల్లాంటివేమీ లేవు. పెళ్ళికొచ్చిన వారికి భోజనాలు పెట్టారు అంతే.

తిం జ్ఞానం - వరిజ్ఞానం ఇలాంటి వివాహాలను చాలామంది సమర్థిస్తున్నారు. అనేక ఆచారాలను పాటించరు కనుక ఉభయపక్షాలకూ (శ్రమ, ఖర్చు తగ్గుతాయి. జాతకాలు సరిచూసుకొనే బాధలేదు. వివాహోత్సవానికి ప్రత్యేకంగా ఒక ముహూర్తం చూసుకోనవసరం లేదు. పెళ్ళి రాత్రి కూడా జరగవచ్చు. ఈ పద్ధతికి పురోహితులు కూడా అభ్యంతరాలు చెప్పడంలేదు. “*యాదీమేంషాదీ' వివాహాలను సమాజం ఆమోదించింది. అయినప్పటికీ ఈపద్ధతిలో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. వరకట్న దురాచారాన్ని ఇప్పటికీ పొటిస్తున్నారు. ఎక్కడో అరుదుగా తప్ప 'యాది' లో పేర్కొన్న వాగ్దానాలను నెరవేర్చక పోవడమంటూ ఉండదు. బాలికను కేవలం పన్నెండు గంటల్లో పెళ్ళిచేసి, ఆమె ఇంటినుంచి, కుటుంబంనుంచీ పంపించేస్తారు. అందువల్ల బాలికకు మానసికంగా కూడా చాలా కష్టమవుతుంది. చెన్నప్పగౌడ అనే సంపన్న రైతు, తన ముగ్గురు తమ్ముళ్ళకూ ఇదే పద్ధతిలో పెళ్ళిళ్ళు చేశాడు. ఒక తమ్ముని పెళ్ళికి, ఊళ్ళోలేకపోవడంతో తానే హాజరుకాలేక పోయాడు. పెళ్ళయిన మర్నాడుకానీ ఆయనకా సంగతి తెలియలేదు. మీరు కుటుంబపెద్దకదా, మీకు కోపం రాలేదా అని అడిగితే, గౌడ చిరునవ్వు నవ్వారు. “కోపమెందుకూ? మా మేనమామలు, బాబాయిలు, అక్కలు, చెల్లెళ్ళు అంతా ఉన్నారు. పెళ్ళికూతురు కుటుంబం మాకు పదేళ్ళుగా తెలుసు. నేను లేకపోతే ఇబ్బంది ఏముంది? నాతమ్మునికి ఆ పిల్లనచ్చింది. అతను సంతోషంగా ఉంటే మేం చాలా అదృష్టవంతులమనుకొంటాం”. ఆ మూడు వివాహాలకు కలిపి గౌదకు రూ. 10,000 ఖర్చయింది. రెండు పెళ్ళిళ్ళు ఆయన ఇంటివద్దే జరిగాయి. “ఒక తమ్ముని విషయంలో, అమ్మాయి తన్లితం(డ్రులు ఆమెను మాఇంటికి పిలుచుకొచ్చారు. ఆ అమ్మాయి మాకు నచ్చింది. పెళ్ళి చేసేశాం” అన్నాడాయన. . ఇంకో పెళ్ళికి ఉభయులకూ సంబంధం నచ్చింది కానీ వధువు కుటుంబం “యాది' తయారుచేయడానికి వరుని ఇంటికే వస్తామన్నారు. “వాళ్ళు బహుశా మాగురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలను కొన్నారేమో! వాళ్ళకుమార్తెను మాఇంట్లో ఇస్తున్నారు కదా మరి” అని గౌడ సమర్థించారు. “యాదిలో పేర్కొన్న వస్తువులను పెళ్ళికుమార్తె కుటుంబం ఇవ్వకపోతే ఏమవుతుంది? “నూటికి 95 సందర్భాలలో అలా జరగదు. తల్లితండ్రులందరూ తమ కుమార్తెలకు ఏదైనా ఇవ్వాలనే కోరుకుంటారు. మోసగించాలని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా గ్రామాల్లో, చిన్నపట్టజాల్లో అలాచేస్తే వారికి గౌరవం వుండదు. 'యాదీ' తయారు చేసినా, చేయకపోయినా, పెళ్ళంటే ఉభయపక్షాల మధ్య నమ్మకం ఉండాలి. నమ్మకంలేకపోతే ఆ పెళ్ళేజరగదు” అని గౌడ వివరించారు.

నబ్చితేచాలు తక్షణం పెళ్ళి త్‌ నేను బెంగుళూరు చేరుకొనే సరికి, నాబల్లమీద అనేక పెళ్ళిపత్రికలు కనిపించాయి. కొన్నిటిని బంగారం మెరిసే అక్షరాలతో ముద్రించారు. కొన్నికార్టులను చేత్తో పెయింట్‌ చేసారు. కొన్నింటిలో ఫొటోలు కూడా ముద్రించారు. మరి కొన్ని సామాన్యంగా ఉన్నాయి. 'ప్రతికార్డులో పెళ్ళి ఏ కళ్యాణమండపంలో జరిగేదీ తెలిపారు. ఈ మందపాల్లో ఖరీదైన చామరాజు సత్రం నుంచి కాస్త చిన్న మండపాలదాకా ఉన్నాయి. ప్రతి రిసెష్షన్‌లోనూ ఆర్మెస్ట్రాలు, సినిమా సంగీతం ఎలాగూ ఉంటాయి. ఇదో ప్రత్యేక ప్రపంచం. వివాహాలు, రిసెప్పన్లు అంటే, వ్యాపార సంబంధాలు ఏర్పరచుకొనే అవకాశాలు లభించేస్థలాలు. మనహోదాలు, అంతస్థులను 'ప్రదర్శించుకొనే వేదికలు. పొందిన ఉపకారాలకు బహుమతుల ద్వారా కృతజ్ఞతలు తెలిపే సందర్భాలు. మనకు ఎంత గొప్పవారితో పరిచయాలున్నాయో చాటుకొనే సమయాలు. మనమేం చెరకు పండించే ప్రాంతానికి చెందిన వాళ్ళంకాదుకదా! అందువల్ల మనకు ఇవన్నీ తప్పవు. ఎ్లర్ణం

లల ఉలి మరపురాని పెళ్ళికూతురు అన్సన ఫౌండేషన్‌ ట్రస్టీగా నాకు కట్టల కొద్దీ ఉత్తరాలు వస్తుంటాయి. మేము అనేక అంశాలను పరిశీలించి, ఆర్ధిక సహాయం అందిస్తూంటాం. సహజంగానే ఆపదలో ఉన్నవారు, పేదవారితోపాటు, ఇతరులు కూడా ఉత్తరాలు రాస్తుంటారు. నా విధులన్నిటిలోకి, ఎవరికి సహాయం చేయాలో నిర్ణయించడమే అన్నిటికన్న కష్టమైనపని.

ఒక సోమవారం ఉదయం వచ్చిన ఉత్తరాలన్నీ ముందేసుకొని చదువుతున్నాను. ఇంతలో నా సెక్రటరీ అడిగింది. “మేడమ్‌, మీకో పెళ్ళిపత్రిక వచ్చింది, చూసుకున్నారా? పత్రికతోపాటు ఉత్తరంకూడా రాశారు. మీరీ పెళ్ళికి వెళ్తున్నారా?”

కాలేజీలో టీచర్‌గా పనిచేయడంవల్ల, నావిద్యార్థులనుంచి ఆహ్వానాలు వస్తుంటాయి. ఇదికూడా ఎవరో నా విద్యార్ధి పంపిందే అనుకొన్నాను. అయితే కార్జుచదివితే, పెళ్ళిచేసుకుంటున్న వధూవరుల్లో ఎవరూ గుర్తుకు రాలేదు.

“వేడమ్‌, మీరు పెళ్ళికిరాకపోతే, మాకా అద్బ్భష్టం లేదనుకుంటాం” అని ఉత్తరం రాసిజతపరచిన ఆ పెళ్ళిపత్రికను ఎవరు పంపించి ఉంటారా అని ఊహించే (ప్రయత్నం చేశాను.

పెళ్ళికుమార్తెకానీ, పెళ్ళికొడుకుకానీ పరిచయం ఉన్నట్లు స్పష్టంకాకపోయినా, ఆసక్తికొద్దీ పెళ్ళికి వెళ్ళాలని నిర్ణయించుకొన్నా. వర్షాకాలం, పైగా పెళ్ళిజరిగేస్థలం సిటీకి అవతలెక్కడో దూరంలోఉంది. ఒక క్షణం ఎవరోతెలియని వ్యక్తిపెళ్ళికి వెళ్ళకపోతే ఏం అనికూడా ఆలోచించాను.

అదికూడా అన్ని మధ్యతరగతి కుటుంబాల్లో జరిగేపెళ్ళిలానే ఉంది. వేదికను పూలతో అలంకరించారు. ఎవరూ వినకపోయినా స్పీకర్లద్వారా సినిమా సంగీతాన్ని వినిపిస్తున్నారు. వర్షంవల్ల పిల్లలు బయటకు వెళ్ళిఅడుకోలేక, హాల్లోనే దాగుడుమూతలు ఆడుతున్నారు. మహిళలు బెంగుళూరు సిల్కు మైసూరుక్రేప్‌చీరలు ధరించారు.

వేదికమీద నిల్చున్న కొత్త దంవతులను చూశాను. ఇద్దరిలో ఒక్కరినీ పోల్చలేకపోయాను. వీరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ నా విద్యార్థులై ఉంటారనిపించింది. ఏం చేయాలో తోచక అపరిచితుల గుంపు మధ్యలో నిల్చున్నాను.

మరవురాని పెళ్ళికూతురు న! ఇంతలో ఒక పెద్దాయన వచ్చి “వధూవరులను కలుసుకొని, శుభాకాంక్షలు తెలియజేయాలనుకొంటున్నారా?” అని అడిగాడు.

ఆయనతో కలిసి వేదికమీదికి వెళ్ళి, నన్ను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపాను. వాళ్ళు చాలా సంతోషించారు. పెళ్ళికొడుకు నన్ను డైనింగ్‌ హాలుకు పిలుచుకెళ్ళమని పెద్దాయనకు చెప్పాడు. అయినా వీళ్ళెవరో, పెళ్ళిపత్రికతో ఉత్తరం ఎందుకు పంపారో అప్పటికీ తెలియలేదు.

ఆయన నన్ను డైనింగ్‌హాలుకు వెంటబెట్టుకు వెళ్ళి, ఓ ప్లేట్లో భోజనం తీసుకొచ్చి అందించాడు. అప్పుడిక వీళ్ళెవరో తెలుసుకోకుండా భోజనం చేయరాదనుకున్నాను.

నా సంశయాన్ని కనిపెట్టిన పెద్దాయన చిరునవ్వు నవ్వాడు. “మేడమ్‌, నేను పెళ్ళికొడుకు తండ్రిని. మా అబ్బాయి ఈ పెళ్ళికూతురు మాలతి (ప్రేమలో పడ్డాడు. అందరం అంగీకరించాం. నిశ్చితార్థం జరిగిన తర్వాత అపిల్లకు ఒంటిమీద తెల్లమచ్చలు వచ్చాయి. మావాడు ఇంక పెళ్ళివద్దనేశాడు. మేం చాలా బాధపడ్డాం. మాలతికి పెళ్ళితర్వాత ఈ మచ్చలు వస్తే ఏంచేసేవాడివని అడిగాను. కానీ వాడు వినలేదు. ఆమె పెద్దలకేమో ఆమె భవిష్యత్తు గురించి విచారం పట్టుకుంది. మాకుటుంబంలోకూడా నిర్లిప్తత అలుముకుంది. ఇంట్లో వాతావరణాన్ని భరించలేక, మావాడు రోజూ లైబ్రరీకి వెళ్ళడం ప్రాంరంభించాడు. అలా నెలరోజులు గడచిన తర్వాత ఒక రోజు లైబ్రరీనుంచి తిరిగొచ్చి, మాలతిని పెళ్ళిచేసుకోవడానికి సిద్ధమే అన్నాడు. మాకు ఆశ్చర్యం కలిగింది. చాలా సంతోషించాం కూడాను. ఈ రోజు ముహూర్తం నిశ్చయించాం.”

అప్పటికీ నా ప్రశ్నకు సమాధానం లేదు. ఇందులో నాకేం ప్రమేయంఉంది? కాసేపట్లో పెళ్ళికొడుకు తండ్రి సమాధానం చెప్పాడు.

“మేడమ్‌, వాడు మీ 'మహాిశ్వేతి నవల చదివాడని తర్వాత తెలిసింది. మా అబ్బాయి పరిస్థితికూడా అదే. వాడా నవలను కనీసం పదిసార్లు చదివి, ఆ అమ్మాయి దుస్థితిని అర్ధంచేసుకున్నాడు. నెలరోజులు ఆలోచించాడు. చివరికి బాధ్యతను తప్పించుకొని, తర్వాత పశ్చాత్తాపపడిన మీనవలలోని పాత్రలా కారాదని నిశ్చయించుకొన్నాడు. మీనవల అతని ఆలోచనను మార్చేసింది”.

నన్నెందుకు పిలిచారో అప్పుడు బోధపడింది. తర్వాత పెళ్ళికుమారుని తండ్రి ఒకప్యాకెట్‌ తెచ్చిచ్చి ఆకానుక స్వీకరించాలని పట్టుపట్టాడు. నేను సంకోచిస్తుంటే, బలవంతంగా నాచేతుల్లోఉంచి “మాలతి ఈ చీరను మేకోసమే కొన్నది. తర్వాత మీతో మాట్లాడుతుంది” అన్నాడు.

వర్షం ఉద్ధృతమైంది. హాల్లోకి జల్లుకొడుతోంది. వర్షపుచినుకులు నామొహంమీద పడుతున్నాయి. నాపట్టుచీర తడిసిపోతోంది. అయినా నాకేం చిరాకనిపించలేదు. ఉల్లాసంగా

త్‌ో జ్ఞానం - పరిజ్ఞానం ఉన్నట్లనిపించింది. మొత్తం కథ చాలా సంతోషం కలిగించింది. నాలాంటి సాధారణ వ్యక్తి మరొకరి జీవితాన్ని మార్చగలదని నేనెన్నడూ కలలోకూడా ఊహించలేదు. నేనా చీర ధరించినప్పుడల్లా, సంతోషం నిండిన మాలతి మొహాన్ని 'మహాశ్వేత” ముఖచిత్రాన్ని తలచుకొంటాను. నాకున్న చీరల్లోకెల్ల ఇదే అత్యంత విలువైంది. లో

28

స్తు ఖు,

స్పందన రాహిత్యం ఠి ర్యబ్రవం నెలలో సాధారణంగా గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా అమెరికా నుంచి సెలవుల్లోవచ్చే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల హడావిడి వివాహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నెలలో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతూంటారు.

నాఫ్రెండ్‌ సుమ ఇల్లుకొనుక్కుంది. సన్నిహిత మిత్రులందరినీ గృహప్రవేశానికి తప్పక రావాలని ఆహ్వానించింది. చాలాకాలం తర్వాత మిత్రులందరం కలవచ్చుకదా అని మేం ఉత్సాహపడ్డాం.

ఉదయం నేను సుమ ఇల్లు చేరేసరికి పూజలు జరుగుతున్నాయి. మిగతా మిత్రులెవరూ ఇంకా రాలేదు. నేనో చోటుచూసి కూర్చుని, పూజాక్రమాన్ని గమనిస్తూ, మిత్రుల రాకకోసం ఎదురుచూడసాగాను. ఇల్లు పెద్దదే అయినా, పూజమాత్రం ఒకచిన్న హాలులో జరుగుతోంది. అతిథులు కూర్చోవడానికి ఓ రెండు తివాచీలు పరిచారు. సుమ పూజలో లీనమైంది. చక్కని పట్టుచీర ధరించి, జడలో పువ్వులు తురుముకొని మరింత ముచ్చటగా కనిపిస్తోంది.

మిగిలిన అతిథులు చేసేదేమీ లేకపోవడంతో కబుర్లు చెప్పుకొంటున్నారు. ఎదుగుతున్న పిల్లల సమస్యల నుంచి, ప్రధానమంత్రి వ్యవహారం దాకా, మాధురీదీక్షిత్‌, మిస్‌ఇండియా, ఉత్తమ బ్యూటీపార్లర్లు, తాజాఫ్యాషన్‌, జువెలరీ... ఇలా అనేక విషయాలు వాళ్ళ కబుర్లలో దొర్లిపోతున్నాయి. అయితే అత్తామామల వ్యవహారంలో మాత్రం చాలా మందికే ఆసక్తి ఉన్నట్లుంది. అదే ఎక్కువ చర్చనీయాంశమైంది.

ఆ సంభాషణలు వింటున్నానే కానీ, నేను వేరే మరో సమన్య గురించి ఆలోచిస్తున్నాను. గుజరాత్‌ భూకంపం సంభవించి ఇంకా వారంరోజులు కూడా కాలేదు. టీవీ ఛానల్స్‌ అన్నీ తాజాదృశ్యాలను, సమాచారాన్నీ ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తున్నాయి. బాధితులు నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినా, వారిదుస్థితిని తలచుకొంటే నాఒళ్ళు జలదరించింది. కళ్ళలో నీళ్ళు నిలిచాయి. నామనసులో నిరంతరం అదే మెదలుళోంది.

వారి కబుర్లలో నేను పాలుపంచుకొనక పోయినా, వద్దనుకున్నా వారిమాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి.

తిం జ్ఞానం - వరిజ్ఞానం

“స్పృమను చూడు, చాలా అదృష్టవంతురాలు. ఇంతమంచి అందమైన ఇంటిని, తక్కువ ధరకు సంపాయించింది. ఆ మహిళకంఠంలో అసూయ ధ్వనించింది.

“ఎంతకుకొంది?”

“ఆం 50 లక్షల కంటే తక్కువే. తొందరబేరంవల్ల చౌకగా కుదిరింది. ఈ ఇల్లు అమ్మినాయన నాకు తెలుసు.

“కొందరేమొచ్చింది?”

“ఆయనకో ఫ్యాక్టరీఉంది. అదిప్పుడు మాంద్యంలో చిక్కుకుంది. అందువల్ల ఫ్యాక్టరీమూసేసి, ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది". | “ఇల్లుచాలా అందంగా ఉంది. చలవరాతి ఫ్లోరింగ్‌, తొట్టెలున్న అటాళ్చ్‌ బాత్‌రూములు. ఆధరకు ఇది ఉచితంగా వచ్చినట్లే”.

“అదిసరే! మీ అమ్మాయి పెళ్ళి ఏర్పాట్లు ఎంతవరకొచ్చాయి?”

“కంచికి వెళ్ళి ఒకేసారి అన్నివీరలూ అకృడే కొనేయడం మంచిదనుకుంటున్నా అక్కడైతే కాస్త చౌక, పైగా రకరకాల కలర్‌ కాంబినేషన్ల నుంచి సెలక్ట్‌ చేసుకోవచ్చు”.

“మరి వెండిసామాన్లూ?”

“అదేం పెద్దసమస్యకాదు. చిక్‌పేటలో నాకు తెలిసినతను వెండిసామాన్లు తయారుచేస్తాడు. వంద వెండి కుంకుమ భరిణెలు, వంద వెండిగిన్నెలు తయారు చేయమన్నాను. దూరం బంధువులకు భరిణెలిస్తే సరిపోతుంది. దగ్గరి బంధుమిత్రులకు గిన్నెలివ్వొచ్చు”.

“క్యాటరింగ్‌ ఏంచేశావు?”

“భోజనాల సంగతి మరిచి పోవడానికి నాకేమైనా తిక్క? మా ఆయనతో, పిల్లలతో మౌట్లాడి ఒక పక్క పానీపూరీ, భేల్స్‌ ఛాట్‌స్టాళ్ళు, ఇంకోపక్క దక్షిణాది వంటకాలు ఉండాలనుకొన్నాం. కూల్‌డ్రింకులు, స్వీట్లుకూడా ఉంటాయి. మా అందరికీ గుజరాతీ స్వీట్లు చాలా ఇష్టం కానీ మా వంటమనిషి గుజరాత్‌ వెళ్ళాడు. కుటుంబంలో అందర్నీ పోగొట్టుకొన్నానన్నాడు. అతను పెళ్ళికి రావడం అశుభం కదా, అందుకని అతను రానవసరం లేదనుకున్నాంా.

“అన్నట్లు, భూకంప బాధితులనిధికి ఎంతిచ్చావ్‌?”

“మా ఆఫీసులో వసూలు చేస్తుంటే, ఇంకోచోట ఇచ్చానని చెప్పేశాను. మనదేశానికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. ఈ సమస్యలకు అంతేలేదు. అందువల్ల ఎందుకిన్వడం? ఆ ప్రాంతంలో నాకెవరూ బంధువులులేరు”.

నందన రాపొత్యం త్‌

ఈ ఎగువ మధ్యతరగతనే వాళ్ళు గుజరాత్‌ ప్రజలకు ఏం చేస్తున్నారు? గుజరాత్‌ మనదేశంలో భాగంకాదా? చనిపోయిన వారికోసం ఎప్పటికీ ఏడుస్తూ కూర్చోవాలంటే కుదరదు, నిజమే, కానీ జీవితమంటే అంతా వెండికుంకుమ భరిజెలు, కాంచీపురం చీరలు, పెళ్ళిభోజనాలు మాత్రమేనా? మనల్ని చూసి పిల్లలు నేర్చుకొంటారు. మనమంతా ఇలా ప్రవర్తిస్తే మనతర్వాత తరం వారు కూడా ఇలాగే దయాదాక్షిణ్యాలు లేకుండా తయారవుతారు.

నాకో యువరాకుమారుని కథ గుర్తుకొచ్చింది. ఆయనకు అందమైన భార్య, కొడుకు ఉన్నారు. ఆయన తనకు బంధువుకాని జబ్బుమనిషిని, ఒక వృద్ధుని, మరొక మృతదేహాన్నిచూసి, లౌకిక జీవితాన్ని పరిత్యజంచి, సన్యాసిగా మారాడు. ఆయన సాంఘిక స్పందన 'సూచి' ఎన్నిపాయింట్లు ఉంటుంది? -

మన సంగతి చూడండి. ఆ సన్యాసి మరెవరోకాదు. గౌతమబుద్దుడు. బుద్ధుడు మనగడ్డమీదే ఉపదేశం ఇచ్చాడని మనం గర్విస్తాం. మరి ఆయన బోధనల నుంచి మనం నేర్చుకొన్నదెంత?

మో కు

బడీ అట టుసర్‌ విత్‌ లవ్‌

ఆ, 3న మహాళ్మాగాంధీ రోడ్డులో (ఎం.జి.రోడ్‌) షాపింగ్‌ చేస్తుంటే, ఒక వృద్ధుడు మావేపే నెమ్మదిగా నడుస్తూ రావడం కనిపించింది. ఆయనకు అరవై ఏళ్ళుండొచ్చు. జుత్తు నెరిసినా, మొహంలో ముడుతలు కనిపిస్తున్నా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆశవేపుచూసి చిరునవ్వు నవ్వాడు. ఆయన్ను గుర్తించిన సూచనలేవీ ఆమె మొహంలో కనిపించలేదు. ఆయనో క్షణం మాముందు ఆగి, వెళ్ళిపోయాడు.

ఆయనలా వెళ్ళగానే, “ఆశా, నువ్వాయనకు తెలుసుకదూ? నిన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆయనెవరో నీకు గుర్తుందా?” అని అడిగాను.

“అవును, తెలుసనుకో. స్మూల్లో ఆయన నా లెక్కల టీచర్‌. ఆయనకు పాఠం చెప్పడం రాదు. లెక్కల్లో నా ఆస్తినంతా పోగొట్టాడు. క్లాసులో చాలా కఠినంగా ఉండేవాడు. టెర్రర్‌ అనుకో. ఆయన నేర్చించిందేమీలేదు” ఆశ గొంతులో కోపం, విసుగు ధ్వనించాయి.

ఆమె మాటల్లో కాస్త అతిశయం ఉండొచ్చు.

నిజమే, కాలేజీ టీచర్లకంటే, స్కూల్లో బోధించే టీచర్లే మనచదువుకు మంచి పునాదివేస్తారు. గ్రాడ్యుయేట్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌ స్థాయిల్లో బోధించడం చాలా సులువు. పాఠశాలల్లో చాలా కష్టం. విద్యార్థులపట్ల టీచర్లకు ఎంతో (ప్రేమ ఉంటే తప్ప వారి బుగ్రకెక్కేలా చెప్పలేరు. టీచర్‌కు తెలివి ఉంటే చాలదు. విద్యార్థలకు (ప్రేమగా, నేర్పుగా చెప్పగలగాలి.

నాకు నా టీచర్‌ జ్ఞాపకం వచ్చారు. ఆయన రోడ్డుమీద ఎదురైతే, ఎలా స్పందించి ఉండేదాన్నో అని ఆలోచించాను. ఆయన నన్నెలా పలకరించేవారు? బహుశా “ఎం.జి. రోడ్డు మీద టైమ్‌ వృధాచేస్తున్నా వెందుకు? ఆఫీసుకు వెళ్ళు, లేకపోతే ఇంట్లో ఏదో ఒక పనిచెయ్‌! ముందుగా తయారు కాకుండా పాఠాలు చెప్పకు” అని మందలించే వారేమో,

నేనొకక్షణం కూడా ఆలోచించకుండా 'ఎస్‌సరొ అనేసి “మీరు ఎక్కడుంటున్నారు? తర్వాత ఎప్పుడైనా నేనొచ్చి కలవచ్చా” అని సంకోచిస్తూ అడిగేదాన్ని.

ఆయనేమో మామూలుగా విద్యార్థిగా ఉన్నప్పుడు చూపిన అనురాగంతోనే నాభుజం చరిచేసరికి, ఇద్దరం నవ్వేసేవాళ్ళం.

టు నర్‌ విత్‌ లవ్‌ తిం నా టీచర్‌ రాఘవేంద్ర వార్చేకర్‌ అన్ని విధాలా అసాధారణ వ్యక్తి ఆయనది మావూరే, అంటే హుబ్లీ. ఆయన చాలా నిరాడంబరంగా జీవించారు. ఆయనకు ఎలాంటి గుర్తింపు, అవార్డులు రాలేదు. (గ్రాడ్యుయేట్‌ కాకపోయినా వృత్తిలో అద్భుతంగా రాణించారు. లెక్కలు ఎంతబాగా నేర్చించేవారంటే, అది కష్టమైన సబ్టెక్టనే భావమే మాకు ఎన్నడూ కలగలేదు. గణితశాస్తాన్ని ఆయన శక్వీన్‌ఆఫ్‌సైన్స్‌' అనేవారు. మమ్మల్ని గణితమనే అద్భుత ప్రపంచంలోకి ప్రవేశపెడుతూ, “రండి రాణిగార్ని కలుసుకుందాం” అనేవారు. ఆయన లెక్కలు చెబుతుంటే మాకు సమయమే తెలిసేదికాదు. రేఖాగణితం (జామెంట్రీ)లో అనుబంధ (ప్రశ్నలు అసంఖ్యాకంగా ఉండేవి. బీజగణితం (ఆల్జీబ్రా లో వందలాది సమస్యలుందేవి. ఆయన ఎంతో ఓపికగా, మనసుపెట్టి బోధించేవారు. “ఇక్కడ నేనెందుకున్నాను? లెక్కలు బాగారావడం లేదనుకొనే వారికి నేర్చించడానికే ఉన్నాను. బాగా రావడం, రాకపోవడం అనేవి మనసులో ఏర్పడే భావాలే. మీరు కష్టపడి చదివితే, సబ్జెక్టును అర్ధంచేసుకోవాలన్న చిత్తశుద్ధిఉంటే, మీకు రాణిగారి దర్శనం లభిస్తుందొ అనేవారు. పాములు ఆడించేవాడు తన సంగీతంతో పాములను అకర్షించినట్లు, ఆయన విద్యార్థులను క్లాసులోకి ఆకర్షించేవారు.

ఆయన చివరి రోజుల్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక చిన్న కానుకతీసుకొని చూద్దానికి వెళ్ళాను. అర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఆయన నాకానుక తీసుకోలేదు.

“విద్యార్థికి జీవితాన్ని ఎదుర్శొనే విశ్వాసం కలిగించడమే టీచర్‌ కర్తవ్యం. జీవితంలో అనూవ్యామైన పరీక్షలు ఎదుర్మోనలసి ఉంటుంది. విద్యార్థులను తనకంటే మెరుగ్గా తీర్చిదిద్దడమే టీచర్‌కు అత్యంత ఆనందదాయకమైంది. నా కర్తవ్యాన్ని బాగానే నిర్వహించాను. నా విద్యార్థులు నేడు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాయించడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. వారి టీచర్‌గా గుర్తిస్తున్నందుకు గర్వంగా కూడా ఉంది” అన్నారు.

ఇంత సరళమైన జీవన తత్త్వాన్ని విని విస్తుపోయాను. ఈ తత్త్వాన్ని ఆచరణలో పెట్టడం చాలాకష్టం. ఆయన మరింత పెద్ద నగరంలో, మరింతపెద్దస్కూల్లో పనిచేసి ఉంటే, ట్యూషన్లు చెప్పి బోలెడు డబ్బు సంపాదించేవారు. లేకపోతే సొంతంగా ఒక స్కూలు ప్రారంభించేవారు. ఆయన అలాంటివేవీ చేయలేదు. ఆయన నియమాలకే కట్టుబడ్డారు. ఆయన జీవితం ఇతరులకు ఆదర్శనీయం. ఆయన్ను తలచుకొంటే నాకు కొవ్వాత్తి గుర్తుకొస్తుంది. కొవ్వాత్తి తాను కరిగిపోతూ, ఇతరులకు వెలుగునిస్తుంది.

ఈ రోజు వేదికమీద నిల్చుని ధైర్యంగా మాట్లాడగలుగు తున్నానంటే, జీవితంలో ఎలాంటి కష్టాన్నయినా, సమస్యనైనా ఎదుర్మోగలుగు తున్నానంటే అదంతా నా టీచర్‌ చలవే. ఎంతడబ్బుతోనైనా కొనలేని, ఎలాంటి కష్టాలూ సడలించలేని, ఏ యూనివర్సిటీ కలిగించలేని ఆత్మ విశ్వాసాన్ని నాకాయన ప్రసాదించారు.

లీ కు

లెగ్‌ 'ఉల్నో డబ్బవ్వకపొతే ఉరేసుకుంటా!

అన్సన ఫౌండేషన్‌లో మాకు ఏడాదికి సుమారు పదివేల ఉత్తరాలు వస్తుంటాయి. వాటినన్నిటినీ వేరుచేసి, చదివి, జవాబులు రాయడానికి నా సెక్రటరీలు నానా అవస్థాపడుతుంటారు. కొన్ని ఉత్తరాలు అనేక విషయాల్లో కనువిప్పు కలిగిస్తాయి. కొన్ని తమాషాగా ఉంటాయి. కొన్ని ఉత్తరాల్లో ఏమిటేమిటో తికృతిక్కగా రాసి ఉంటాయి.

ఒకరోజు కొంపలు మునిగిపోతున్నట్లు రాసిన ఎస్‌.ఓ.ఎస్‌. లాంటి ఉత్తరం ఒకటి వచ్చింది. ఒకమహిళ తన అయిదు పేజీల సుదీర్ధలేఖలో రెండు పేజీలు స్టాక్‌ మార్కెట్లలో నిలకడ లేకపోవడం గురించిరాసింది. తాను పొరపాటుగా ఎంచుకొన్న కంపెనీలపషేర్లుకొని సొమ్మంతా ఎలాపోగొట్టుకొన్నదో వివరించింది. అసలు విషయాన్ని మాత్రం చివరి రెండు వాక్యాల్లో బయటపెట్టింది. తెలివి తక్కువవల్ల తాను చేసిన అప్పులన్నీ నన్ను తీర్చమని కోరింది. “ఇది మీకో పెద్దమొత్తం కాదు. కేవలం అయిదుకోట్ల రూపాయలు అంతే” అని ముగించింది.

అమెవరో తెలియదు. అలాంటి ఉత్తరం రాసిన ఆమె సాహసానికి ఆశ్చర్యపడ్డాను. జవాబు రాయలేదు.

తర్వాత వారం ఆమె మరో అయిదు పేజీల లేఖ రాసింది. ఈ సారి తన కుటుంబ సమస్యలన్నీ వివరించి, నేనామెకు సహాయం చేయడం అత్యావశ్యకమని పేర్కొంది. నేను సొమ్ము పంపకపోతే తాను ఆత్మహత్య చేసుకొంటాననీ, అందుకు నేనే బాధ్యురాలి నవుతాననికూడా రాసింది.

అలాంటి ఉత్తరాలకు ఏమని సమాధానం రాయాలి? నేను రాయలేదు. రెండు వారాల తర్వాత మూడో ఉత్తరం వచ్చింది. నాది పాషాణహృదయమనీ, సాటి మనుషుల పట్ల నాకు (ప్రేమా, సానుభూతీ ఏమీలేదనీ నిందించింది. నాలాంటి వ్యక్తి ఒక దాతృత్వ సంస్థలో పనిచేయడమేమిటని ప్రశ్నించింది.

అటువంటి ఉత్తరాలు ఒకోసారి నొప్పిస్తాయి. ఇలాంటి వాదం నాకు నిజంగా అర్థంకాదు. అడిగిందే తడవుగా డబ్బివ్వకపోతే చెడ్డవాళ్ళమైపోతామన్నమాట. ఇస్తే చాలా గొప్పవాళ్ళమన్నమాట. అప్పుడప్పుడూ బంధువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటారు. “నీ సొంత మనుషులకే డబ్బివ్వకపోతే, బంధుత్వాలెందుకు? ఇంక నువ్వు ఇతరులకేం సహాయం చేస్తావు?” అని నిలదీస్తుంటారు.

దబ్బిన్వకపోతే ఉరేనుకొంటా! ల

సహాయం అనే పదం చాలా కొద్దిమందికే అర్థమవుతుంది. మన(ప్రజలకు,

మనదేశానికి మనం సహాయ పడాలి. బాగా ఉన్నవారికి డబ్బివ్వదడం సహాయం కిందికి

రాదు. ఉన్నది చాలక రెండో ఇల్లు కొనుక్కోడానికో, ఖరీదైన నగలు కొనడానికో, లేదా

వినోద పర్యటనలకు వెళ్ళడానికో డబ్బివ్వడం సహాయం కాదు. తొందరగా కూబేరులై

పోవాలన్న పేరాశతో ఎవరైనా స్టాక్‌ మార్కెట్లో సొమ్ముపోగొట్టుకుంటే, అతనికిగానీ, ఆమెకుకానీ, ఎవరైనా ఎందుకు సహాయం చేయాలి?

సహాయం కోరేవారికి కూడా కొన్ని లక్షణాలుందాలి. ఇతర మార్దాలేవీ లేనప్పుడు, చదువుకు, వైద్యానికి దబ్బు అవసరమైనప్పుడు మాత్రమే ఎవరినైనా విరాళం అడగాలి. అది తనసొమ్ము కాదని గుర్తుంచుకోవాలి. ఇతరులు సుఖంగా జీవిస్తుంటే, ఆ దాత తన వ్యక్తిగత సుఖాలను, కుటుంబ జీవితాన్ని త్యాగంచేసి ఉండొచ్చు. రాబ్రింబవళ్ళు పనిచేసి సంపాయించి ఉండొచ్చు. అంతేకాదు, ఎవరికి సాయపడాలో నిర్ణయించుకొనే హక్కు అతనికి ఉంది. పుచ్చుకొనేవాడి చేతికంటే, ఇచ్చేవాడి చేయి ఎప్పుడూ పైన్థాయిలోనే ఉంటుంది.

నన్నైవరైనా సన్నానిస్తే, శాలువాతోపాటే ఒక ధరఖాస్తుకూడా అందుతుంది. నన్నెవరైనా పొగడ్తలతో ముంచెత్తారంటే, చివర్న అతనేదో డిమాండు చేయడం ఖాయం. ఏమీలేనివారికి, మా సహాయంలేకపోతే బఐతకలేనివారికి సహాయం చేయాలని నేను నిశ్చయించాను. వాళ్ళే నా వాళ్ళు, వాళ్ళే నా బంధువులు. వారికులం, మతం, స్రీ పురుష భాష లేదా రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా మాకున్న నిధుల మేరకు వారికోసం పనిచేస్తాను. చేతనైన సహాయం చేస్తాను.

వారినుంచి నేనేమీ ఆశించను. ఒక చిన్న పుష్పగుచ్చం కూడావద్దు. వారి కళ్ళలో సంతోషం కనిపిస్తేచాలు. అదేనాకు నిజమైన బహుమతి.

ఆ మహిళ ఆత్మహత్య చేసుకొంటానంటూ బెదిరించిన తర్వాత, ఇకముందు అలాంటి ఉత్తరాలను నాకు చూపించకుండానే బుట్టదాఖలు చేయవచ్చునని నా సెక్రటరీలకు చెప్పాను. అందువల్ల ప్రస్తుతం కొన్ని ఉత్తరాలే నాదాకా వస్తున్నాయి. వాటిని చదివితే చాలు.

లగ పో నమ్మకమిస్తున నవతరం

ఈజ+ నేను పెద్దవారితో మాట్లాడినప్పుడల్లా పిల్లలు తమభావాలను గౌరవించడం లేదనే ఫిర్యాదే ఎక్కువగా వినిపిస్తోంది. వారు మొరటుగా ప్రవర్తిస్తున్నారని, ద్ధగా చదవరని అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.

ఇటీవలే ఈజిష్ట వెళ్ళాను. అక్కడి అత్యంత పురాతనమైన పిరమిడ్‌ను చూడాలను కొన్నాను. అది గిజాలో కాదు, కెయిరోకు 25 కిలోమీటర్ల దూరంలోని సక్కరలో ఉంది. అయిదు అంతస్తుల పిరమీడ్‌ను ఫారో జోషెయర్‌ కోసం నిర్మించారు. ఆ సమాధిని ఆకాలపు ఆత్యంత ప్రతిభావంతుడు, విజ్ఞుడయిన వాస్తు శిల్పి ఇమెంచొటెప్‌ నిర్మించారు.

నా ప్రయాణంలో ఒకగైడ్‌ను కూడా తోడు తీసుకొనివెళ్ళాను. అతను ఈజిప్టు పురాశాస్తాన్ని బాగా అధ్యయనం చేసిన విద్యార్థి. కొన్ని పిరమిడ్‌ల మీద ఉన్నరాతలను చదివి వినిపించాడు. కొన్ని రాతలను చూపుతూ వాటిని అనువదించి చెప్పాడు. “వచ్చేతరం పిల్లలు దుబారా చేస్తారు. అట్టే ఆలోచించరు. జీవితం గురించి పెద్దగొ తెలుసుకోరు. వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు నిజంగా తెలియదు. సూర్యభగవానుడు రా మాత్రమే వారిని రక్షించగలడు.”

దీన్ని వినిపిస్తుంటే, మనదేశంలో నవతరం గురించి పదేపదే వినవచ్చే ఫిర్యాదులు గుర్తుకొచ్చాయి. అప్పుడనిపించింది, ప్రతి తరానికీ వచ్చేతరంపై ఇలాంటి. ఫిర్యాదులే ఉంటాయని. ప్రపంచ వ్యాప్తంగా, కనీసం గడచిన 5,000 ఏళ్ళ నుంచి తరం తర్వాత తరం ఇలాగే భావిస్తూ వచ్చింది.

నేటి పిల్లలకు మనతరంతో పోల్చితే జ్ఞానం చాలా ఎక్కువగా ఉండి, ఓర్మి మరీ తక్కున ఉంటోంది. కొద్ది రోజుల క్రితం నేను నా టీనేజి కుమారునితో మాట్లాడుతూ యథాలాపంగా “ఈ శతాబ్దంలో మూడు అతిముఖ్యమైన విప్లవాలు, భావాలు వవో చెప్పగలవా?” అని అడిగాను.

అతనో నిముషం నాకేసి చూసి “నువ్వు ఇంట్లోకూడా టీచర్‌ ననుకుంటున్నాన్‌. ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన విష్లవాలు, భావాలు - అహింసా సిద్ధాంతం, హింసవల్లకలిగిన ఫలితం, కమ్యూనికేషన్‌ మీడియా (సమాచార, ప్రసార సాధనాలు) ప్రభావం అని నా అభిప్రాయం” అన్నాడు.

అతని జవాబు విని విస్తుపోయాను.

నా ఆశ్చర్యాన్ని గమనించి “నీకు వివరంగా చెప్తాను” అంటూ మొదలుపెట్టాడు. “మనం శతాబ్దాలుగా బానిసత్వంలో మగ్గిపోతూ, మన నిర్ణయాలు మనంతీసుకొనే అధికారం మనకు లేనప్పుడు, ఒక పలుచని, కొద్దిపాటి మనిషి రక్తపాతంలేని ఒక కొత్త తరవా ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయుధాలులేవు, నిధులు లేవు. ఉన్నదల్లా ఏమైనాసరే, మేం మీకు సహకరించం అనే సందేశం మాత్రమే. ఈ నూతన సిద్ధాంతంతో ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం ఆర్జించారు. ఆయనకు తప్పక నోబెల్‌ బహుమతి రావలసింది. ఆయన మనం జాతిపితగా పిలుచుకొనే మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ. ఆయన విప్లవాత్మక భావాలు, తమ ప్రజల స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాటంలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, నెల్సన్‌ మందేలా, ఆంగ్‌సాన్‌ సుకీ వంటి నాయకులను ప్రభావితం చేశాయి.

“రెండో సిద్ధాంతం దాదాపు అదే కాలంలో ్రతిపొదించిందే కానీ దానిది తల్లకిందుల దిశు అతను విద్వేష పంథాను విశ్వసించాడు. ఆయుధాలతో, హింసతో ప్రజలను పాలించవచ్చుననుకొన్నాడు. ప్రజలను పురుగుల్ని చంపినట్లు హతమార్చాడు. (ుమ, దయ అంటే వమిటో అతనెన్నడూ అర్ధంచేసుకోలేదు. అతను తన పద్ధతిలో శాంతిని సాధించలేకపోయాడు. రెండవ ప్రపంచ యుద్దానికి కారకుడయ్యాడు. అతనివల్ల, అతని విధానాల ఫలితంగా కోట్లమంది ప్రజలు కష్టాల పాలయ్యారు. దుర్భరమైన బాధ్ధలు అనుభవించారు. యుద్ధం, దురభిమానం, అసహనాలకు అతని జీవితమొక (పటిక. అతను అడాల్ఫ్‌ హిట్లర్‌”

మా అబ్బాయి చెప్పింది సహేతుకంగానే కనిపించింది కానీ, కంప్యూటర్ల బే శతాబ్దపు అతిముఖ్యమైన ఆవిష్కరణ అని నా అభిప్రాయం. ఈ పసివాడు ఒప్పు ం

“నామూహిక సమాచార, ప్రసార సాధనాలవల్ల నేడు ప్రపంచం చిన్నదిగా కనిపిస్తోంది. (ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నా కొన్ని సెకన్ల అండ తెలిసిపోతోంది. ఇందులో టెలివిజన్‌, ఇంటర్నెట్‌ తమ పాత్రను నిర్వహిస్తున్నాయా య వార్తలు, సందేశాలు, సమాచారాలు పంపడానికి అయ్యేఖర్చు తగ్గి, అవ ధా తొలగిపోతున్నాయి. వ్యాపార ప్రపంచంలోనూ, సాంఘిక జీవనంలోనూ దీని ప్రభావాి చూడవచ్చు. అలా అని మన ప్రాచీన సంస్కృతికి వచ్చిన ముప్పేమీలేదు కాని, ఇ సంస్కృతులు గురించి కూడా తెలుసుకొంటున్నాం.”

పెన్సిల్‌ ఎలాపట్టుకోవాలో నేను నేర్చించిన మా అబ్బాయి, ఇప్పుడు హింసా ప్రవృత్తి, శాంతి, కమ్యూనికేషన్‌ గురించి పెద్ద అనుభవం ఉన్న మనిషిలా మాట్లాడుతుంటే విస్తుపోతూ విన్నాను.

9ిశ్ల జ్ఞానం = వరిజ్ఞానం

అనేకమంది తల్లితండ్రులుకూడా ఇలాగే భావించి ఉంటారు. తమ పిల్లలు తమకంటే తెలివి మీరిపోయారని విస్తుపోయి ఉంటారు. “జ్ఞానాన్ని ఆర్జించిన వారిని, వారి వయసు, స్త్రీ పురుషులు, వర్ణాలతో నిమిత్తం లేకుండా గౌరవించాలని” మనధర్మశాస్తాలు వచిస్తున్నాయి.

మా అబ్బాయి చదువుకోసం విదేశాలకు వెళ్ళాలని ఉత్సాహపడుతున్నాడు. అతను ఈ చిన్న వయసులో అక్కడ ఒంటరిగా ఎలా నిభాయించుకొంటాడా అని ఆలోచిస్తున్నాను. ఈ సంభాషణ తర్వాత, ఈ పక్షిపిల్ల రెక్కలు దృఢంగా, ఆరోగ్యంగా తయారయ్యాయని (గ్రహించాను. ఈ పక్షికి. స్వేచ్చగా ఎగిరిపోయి, ప్రపంచాన్ని చూసే సమయం వచ్చింది.

లో జ్ల్రస్థం

లా జ్‌ సానుకూలంగా అలోచిస్తే త్న ప్తి అంతా సంతోషమే

మా దగ్గర గిరిజ అనే వంటమనిషి ఒకామె ఉందేది. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె, తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ మాట్లాడేది కాదు. కాటన్‌చీరలో, చక్కగా దువ్వుకున్న జుత్తుతో ఎప్పుడూ శుభ్రంగా, ఉల్లాసంగా ఉందేది. చాలా చురుగ్గా, సంతృప్తిగా ఉన్నట్లు కనిపించేది. వంటింట్లో పనిచేస్తున్నప్పుడు కూని రాగాలు తీస్తూ మాకేం కావలసినా చిరునవ్వుతో చేసి పెట్టేది. ఆమె వదనంలో నేనెప్పుడూ విచారం చూడలేదు. సణుక్కునే అలవాటులేదు.

ఆమె గురించి మాకు తెలిసిందల్లా, భర్త వదిలేశాడని, వాళ్ళకో కొడుకు ఉన్నాడని మాత్రమే. స్కూలుకు వెళ్ళి చదివిన చదువేమీ లేకపోవడంవల్ల, ఆ చిన్నపట్టణం ఉద్యోగం దొరకడం కష్టం కనుక వంటపనికి కుదిరింది.

వసంత్‌ అని మాకుటుంబ మిత్రుడొకాయన, పెద్ద బహుళజుతి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తాడు. ఆయన మాఇంటికి తరచుగా వస్తూండేవాడు. ఎప్పు ఏదో ఒక విషయంలో అసంతృప్తి (ప్రకటిస్తూ చిరాకు పదుతుండేవాడు. ఆయనలా వెళ్ళగానే, మాఇంట్లో ఏదో విచారం అలముకొనేది.

“మా అబ్బాయి. పన్నెండో క్లాసుకు వచ్చాడు కానీ సరిగ్గా చదవడంలేదు” అన్నాడోసారి.

ఆయన కొడుకు చాలా తెలివైనవాదనీ, కష్టపడి చదువుతాడని నాకు తెలుసు. మరి ఇలా ఎందుకు చెప్తున్నాడు?

“మావాడు ఐఐటి లో చేరాలి

ఈ పోటీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బెరాలజీ (ఐఐటి) లో చేరాలని లక్షలాది మంది పిల్లలు ప్రయత్నిస్తున్నారు. ఒత్తిడివల్ల ప్రవేశపరీక్ష అయిదు మార్కులు పోగొట్టుకున్నా ర్యాంకు ఎక్కడో కిందికి తగ్గిపోతుంది. పిల్లల్ని మనం బాగా చదవాలని చెప్పవచ్చు కానీ, ఇతరులకంటె ర్యాంకుల్లో ముందుండాలని వారిమీద ఒత్తిడి తీసుకురాకూడదు.

9ి్ర జ్ఞానం - వరిజ్ఞానం

వసంత్‌ మరోసారి వచ్చినప్పుడు, ఇంకో కారణంగా విచారంగా ఉన్నాడు. “అయిదేళ్ళ కిందట ఒక ఇంటిస్థలం కొన్నాను. ఇప్పుడు అమ్ముదామంటే, ధర ఘోరంగా పడిపోయింది. మార్కెట్లో మాంద్యం ఏర్పడింది. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడ్తే అదికాస్తా ముంచింది” అన్నాడు.

ఇది దేశమంతా ఉన్న పరిస్థిజే. మార్కెట్లో మాంద్యంవల్ల ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన వారందరూ సొమ్ము పోగొట్టుకున్నారు. ఈయన మినహాయింపుకాదు. తానొక్కడే దెబ్బతిన్నట్లు, మార్కెట్‌ తనొకృద్నే ముంచినట్లు మాట్లాడుతున్నాడు.

కొన్ని రోజుల తర్వాత వచ్చినప్పుడు బాగా అలసిపోయి కనిపించాడు. “బెంగుళూరు పూర్వంలాలేదు. ఇరవై ఏళ్ళ కిందట ఇక్కడ చాలా హాయిగా హిల్‌స్టేషన్‌లా ఉండేది. ఇప్పుడు ఎయిర్‌ కండిషనర్లు పెట్టుకోవాల్సి వస్తోంది. లేకపోతే ఏదైనా హిల్‌స్టేషన్‌కు వెళ్ళాలి” అన్నాడు.

భౌగోళిక వాతావరణం వేడెక్కడం వల్ల ప్రపంచమంతా ఇలాగే ఉంది. బెంగుళూరు ప్రత్యేక ప్రపంచమేమీ కాదు. అయినా మా మిత్రుడు సణుగుతూనే ఉంటాడు.

ఒకరోజు ఇంట్లో నేనూ గిరిజ ఇద్దరమే ఉన్నప్పుడు, యథాలాపంగా “గిరిజా, మీ ఆయన ఎక్కడున్నాడు? అతన్ని కలుస్తుంటావా?” అని అడిగాను.

ఆమె నాకేసి చూసి, కాసేపు ఊరుకొని “అతనిక్కడే ఇంకొక ఆమెతో ఉంటున్నాడు. మీ పొరుగింట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు” అంది.

విస్తుపోయాను. ఈమె రోజూ భర్తను చూస్తుంటుంది. అదీ మరో ప్రీతో!

“నీకు అతన్ని చూస్తే ఒళ్ళు మండదా?” అనడిగాను.

“కొత్తలో నిజంగానే ఒళ్ళు మండేది. ఇప్పుడు చూసుకోడానికి ఒకే బిడ్డ ఉండడం నా అద్భష్టమనుకుంటున్నాను. నా బిడ్డ చాలా తెలివైనవాడు. నామాట జవదాటడు. వాడి తండ్రి నన్ను వడదలిపెట్టాడని, నన్ను ప్రాణంగా చూసుకొంటాడు. నాకు పిల్లలు అసలే లేకపోయినా, ఎక్కువ మంది పిల్లలున్నా, నాబిద్డకు బాధ్యత తెలియక పోయినా, నాకు మరిన్ని కష్టాలు తప్పేవికాదు. దేవుని దయవల్ల నాకలాంటి కష్టాలేవీలేవు”.

“ఎందుకు దిగులు పడాలి? దిగులు పడితే సమస్యలు పరిష్కారమవుతాయా? మీ అమ్మగారు మేము ఉండడానికి ఓ బెట్‌హౌస్‌ ఇచ్చారు. నిజాయితీగా పనిచేస్తాను. మీరంతా సంతోషిస్తున్నారు. నాకేదైనా కావలిస్తే, మిమ్మల్నెవరినైనా అడగొచ్చు. ఆమాటకొస్తే, కోర్కెలకు అంతెక్కడ? నాకొడుకు నా కష్టాలుచూశాడు కనుక, వాడు పెద్దవాదైతే వాడి నాన్నలా తయారుకాడు. నేను స్కూల్లో ఎక్కువగా చదువుకోలేదు. జీవితాన్ని సానుకూలంగా

సానుకూలంగా ఆలోచిస్తే అంతా సంతోషమే 97 చూడాలని నాకు జీవితమే నేర్చింది. మీరు కులాసాగా ఉన్నారనుకొంటే, మీచుట్టూ ఉందేవారుకూడా హాయిగా ఉన్నానునుకుంటారు.”

నాకు చటుక్కున వసంత్‌ గుర్తొచ్చాడు. అతను తనకు లేనిదానిని గురించి ఆలోచిస్తూ జీవితాన్ని దయనీయంగా చేసుకొంటే, ఈ చదువులేని గిరిజ, ప్రతికష్టంలోనూ సానుకూల పార్య్వాన్ని చూద్దం, సంతృప్తిగా బతకడం నేర్చుకుంది.

ఇటీవల నేను బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు వాజరవడానికి హార్వర్డ్‌ మేనేజ్‌మెంట్‌ స్కూలుకు వెళ్ళాను. “మీరు సంతోషంగా ఉండాలంటే, అదెలా సాధ్యమో మీరే స్వయంగా తెలుసుకుంటారు” అన్నదే వారు నేర్చినవాటిలోకెల్ల ముఖ్యమైన పాఠం.

గిరిజ ఏ మేనేజిమెంట్‌ కోర్సూ చదవకుండానే నేర్చుకొని, ఆచరిస్తున్న సూత్రం అదే.

ల కున

28 ఎన్నివీలైతే అన్ని కొవ్వొత్తులు వెలిదించండి నేషు మానాన్నగారితోపాటు మహారాష్ట్ర సరిహద్దులోఉన్న లోతట్టు కర్దాటక (ప్రాంతాల్లో పర్యటిస్తూ ఒకగ్రామం చేరుకున్నాను. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, డాక్టర్‌కూడా అయిన మా నాన్నగారు ప్రయాణాల్లో మంచి తోడుగా ఉండడమేకాక, నా కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించేవారు.

ఆగ్రామంలో ఉన్న దేవతా ఆలయం చాలా (ప్రసిద్ధిచెందింది. ఆరోజు వారంలోకెల్ల శుభప్రదమైన శుక్రవారం కావడంవల్ల దేశమంతటినుండీ వచ్చిన మహిళలు అధికసంఖ్యలో ఉన్నారు. దేవతకు అర్పించడానికి తెచ్చిన ఫలపుష్పాలతో క్యూలో నిల్చున్నారు - కానీ నేనందులో చేరలేదు.

ఈ ప్రాంతంలో నివసించే దిక్కులేని పేదల పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చాను కనుక, ప్రజలతో మాట్లాడుతూ వేరుగా కూర్చున్నాను. వాళ్ళల్లో పంద్లుఅమ్మేవారు, గాజుల వ్యాపారులు, ఇతర విక్రేతలు ఉన్నారు. ఆ వీధి మనుషులనుంచి నేను ఎన్నోవిషయాలు తెలుసుకున్నాను. వాళ్ళు కులం, డబ్బు, రాజకీయాలు, మూఢనమ్మకాలు వంటి అనేక కఠిన వాస్తవాలను ఎదుర్కొన్నారు. పేదరికంపై జరిగే సదస్సులు, పి.హెచ్‌.డి. సిద్ధాంత వ్యాసాల ద్వారాకంటే, వారి అభిప్రాయాలు, సూచనల ద్వారానే నేను ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించాను. ఇది అతిశయోక్తికాదు.

అంతకుమునుపోసారి ఒక పదహారేళ్ళ బాభికతోపాటు, రిటైరైన ఘర్వాలి (కమర్షియల్‌ సెక్స్‌వర్కర్‌) ని కలిసాను. పొడవాటి జుత్తు, తీరైన ముఖం, మిలమిలలాడే సాగసైనకళ్ళు, మంచి శరీరఛాయతో బాలిక చాలా అందంగా ఉంది. అమాయకత్వం ఆమె మొహానికి మరింతకాంతి నిస్తోంది. అకుపచ్చ చీర ధరించి, చేతులకు గాజులు తొడుక్కొంది. జడలో దోసెడు మల్లెపూలు అలంకరించుకొంది. తానా అమ్మాయి అత్తనని ముసలామె చెప్పుకొంది. అత్తతో మాట్లాడుతున్నా నేనా పిల్లనే తదేకంగా చూస్తున్నాను. ఆ చిన్నపిల్ల అప్పుడే దేవదాసి (గుడికి అంకితమైన మహిళ) గా మారినట్లు తెలిసింది. మహిళలను దేవదాసిగా మార్చడంపై నిషేధం ఉందికానీ, మనదేశంలో ఇటువంటి చట్టవిరుద్ధమైన పనులు అనేకం జరిగిపోతుంటాయి.

ఎన్నివీీలైడే అన్ని కొవ్వొత్తులు వెలిగించండి గం

ఆ అత్తకేసి చూశాను. ఆమెకూడా దేవదాసియే. పొగాకు నమిలినమిలి పళ్ళుగార

పట్టినట్లు నల్లగా ఉన్నాయి. మనిషి ఘాటు వాసన కొడుతోంది. పెద్దపొట్ట, కళ్ళు ఎర్రగా

ఉన్నాయి. మొహంలో కాఠిన్యం, పేరాశ తొంగిచూస్తున్నాయి. సిల్కువీర ధరించి, గొజులు

తొడిగింది. ఓ నెక్లెస్‌కూదా అలంకరించింది. కానీ ఎంత బంగారమైనా ఆమెకు అందమివ్వదు.

  • ఈ ముసలి డొక్కుకు ఆ బాలికే బంగారు గని కాబోతోంది. పదహారేళ్ళ బాలిక ముప్పైవళ్ళ తర్వాత బహుశా అత్తలాగే తయారుకావచ్చు అప్పుడామెకూడా ఎవరైనా ఒక అమాయక బాలికను దొరకబుచ్చుకొని దేవదాసిగా మార్చి ఆదాయ వనరుగా వాడుకొంటుంది. పాపం, తనకేంగతి పట్టనున్నదో ఈ పిల్లకు తెలియడంలేదు.

నాకు తెలియకుండానే, నాకళ్ళలో నీళ్ళుఉబికాయి. హఠాత్తుగా వెక్కివెక్కి ఏడ్వసాగాను. ఏమైందాఅని నాచుట్టూ నిల్చున్నవారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళుబహుశా నేను వస్తువేదో పోగొట్టుకొన్నానని అనుకొని ఉంటారు. జీవితంలో మొదటిసారి నాభావాలను వ్యక్తంచేయడానికి మాటలు చాలలేదు.

కానీ, నన్ను కష్టపెడుతున్నదేమిటో మానాన్నకు వెటనే అర్థమైపోయింది. “పాతకాలం నుంచి ఉన్న సమస్యలను కన్నీళ్ళతో పరిష్కరించలేవు. మనం వాటిని తగ్గించడానికి మాత్రమే ప్రయత్నించవచ్చు. ప్రతి ఒక్కరి జీవితాన్ని నువ్వు మార్చలేవు. నీ జీవితకాలంలో నువ్వు కనీసం పదిమందికి పునరావాసం కల్పించగలిగితే, నేను తండ్రిగా గర్విస్తాను. పదిమంది నిస్సహాయ మహిళల జీవితాలను మార్చగలిగిన కుమార్తెకు నేను జన్మనిచ్చానని గర్విస్తాను” అన్నారు. "

ప్రతివారూ తన శక్తిస్తోమతలెంతటివో తెలుసుకోవాలి. తనకున్న పరిమితులుకూడా (గ్రహించాలి. మనబలాల కంటె బలహీనతలను గుర్తించడం చాలా కష్టం. మరీ పెద్దపెద్ద అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకోకుండా, ఆచరణీయ పథకాలతో ఒకపద్ధతి (ప్రకారం కృషిచేయాలి. మనచుట్టూరా ఇంతపేదరికం, దుఃఖం, చీకటి ఉన్నాయి. చీకటిలో మిగిలిపోయేబదులు ఒక కొవ్వొత్తి వెలిగించడం మంచిది. ఎన్ని కొవ్వొత్తులు వీలయితే అన్ని కొవ్వొత్తులు వెలిగించే ప్రయత్నం చేయండి.

20 ళా సొంతంగా అలోచించే మహిళ

ఆఅ: వర్షం పడుతోంది. మనజాతీయ నాయకుడొకరు మరణించడంతో ఆయన గౌరవార్థం స్మూళ్ళు, కాలేజీలన్నీ మూసేశారు. ఎవరైనా జాతీయ నాయకుడు మరణిస్తే విద్యాసంస్థలను ఎందుకు మూసివేయాలో నాకెప్పుడూ అర్ధంకాలేదు. ఆ వ్యక్తి మనకు సన్నిహితుదైతే సహజంగానే దుఃఖమొస్తుంది. సంతాపం వ్యక్తంచేస్తాం. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తాం. జాతీయనాయకుల మృతికూడా మనకు సంతాంపం కలిగిస్తుంది. వారిసేవలను గుర్తుకు తెచ్చుకొని (థద్దాంజలి ఘటించాల్సిందే. కానీ, ఇలా సంస్థలను మూసేస్తే పిల్లలు వీధుల్లో పడతారు. సినిమాలకు, షాపులకు వెళ్తారు. లేకపోతే క్యాంటీన్లలో వృధాగా గడిపేస్తారు. ఏడాదిచివర సిలబస్‌ పూర్తికాక, టీచర్లు పాఠాలు పూర్తయ్యాయనిపించేస్తారు. చివరికి విద్యార్థులే నష్టపోతారు.

నళిని బెంగుళూరులో కాలేజీ ప్రాఫెసర్‌గా పనిచేస్తోంది. చరిత్రలో పిహెచ్‌.డి. చేసింది. మంచి టీచర్‌గా, ఉత్తమ గృహిణిగా మేమంతా ఆమెను మెచ్చుకుంటూఉంటాం. అమెను కలిసి చాలా కాలమైందనిపించి, చూడ్డానికి వెళ్ళాను. నన్నుచూసి నిజంగా ఎంతో సంతోషపడిపోయింది. అప్పుడామె స్కూలునుంచి వచ్చిన కుమారునికోసం ప్రత్యేకంగా ఏదో వండుతోంది. వాళ్ళబ్బాయి. 12వ తరగతి పరీక్షలకోసం (శ్రద్ధగా చదువుకొంటున్నాడు. ఒక బహుళజాతి కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేసే ఆమె భర్త సతీష్‌ ఊళ్ళోలేదు. అందువల్ల మాకు తీరిగ్గా కబుర్లు చెప్పుకొనే అవకాశం చిక్కింది.

“నళినీ నువ్వెక్కడా కనిపించడమే లేదేమిటి? కొత్తవిశేషాలేవైనా ఉంటేచెప్పు”

“ఏంలేదు. సమీర్‌ పన్నెండో తరగతికదా, అందువల్ల వాడితో సరిపోతోంది”

“మరీ చిత్రంగా మాట్లాడుతున్నావ్‌ నళినీ, నువ్వేం పరీక్షలకు కూర్చోవడం లేదుకదా. ఇంట్లో ఉన్నప్పుడు వాడిక్కాస్త సహాయం చేస్తావు సరే, మిగతా ప్రపంచాన్ని మరిచిపోతే ఎలా?”

నళిని ఒప్పుకోలేదు. ఎందుకో చిరాగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది.

“ఏమిటీ సమస్య? మీ ఇల్లు నిర్మించే పని అయిపోయిందా?” అనడిగాను.

“అదంతా సతీష్‌ చూసుకొంటున్నాడు.”

నొంతంగా ఆలోచించే మపొళ 707

“కాత్తకారు కొనాలను కొన్నావుకదా? ఏమైంది?”

“సతీష్‌ కారు బదులు స్కూటర్‌ కొనాలను కొంటున్నాడు”

నిర్ణయాలన్నీ సతీషే తీసుకొంటాడన్నమాట

“మరి నీకేం ఇష్టాయిష్టాలు లేవా నళినీ?”

“అన్ని విషయాలూ సతీష్‌జే బాగా తెలుసు. అతనికి బయటి ప్రపంచం తెలుసు, చాలామందితో పరిచయాలున్నాయి. అందువల్ల ఎప్పుడూ అతని నిర్హయాలే బాగుంటాయి”

ఆమె సమాధానం విస్మయం కలిగించింది. సాధారణంగా చదువుకొని, ఉద్యోగం చేస్తున్న మహిళల్లో ఆత్మవిశ్వాసం ఉంటుంది. స్వతంత్రంగా వ్యవహరిస్తారు. సొంతంగా నిర్ణయాలు తీసుకొంటారు.

మర్నాడు ఒకపల్లెకు బస్సులో వెళ్తున్నాను. అదృష్టవశాత్తు బస్సురద్దీగాలేదు. నాతోపాటు ఎల్లమ్మ అనే పల్లెటూరి మహిళకూడా బస్సులోకి ఎక్కింది. నేనామె ఊరికి వెళ్ళినప్పుడల్లా ఎల్లమ్మ తాజా కూరగాయలు తెచ్చిచ్చేది. దబ్బిస్తే తీసుకొనేదికాదు. అందువల్ల ఆమెతో మంచి పరిచయం ఉంది.

ఎల్లమ్మకు 35 ఏళ్ళుంటాయి. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది. జుత్తుకు బాగా నూనెపట్టించి ముడేసింది. నల్లపూసలదండకు కూర్చినమంగళసూత్రం మెడలో పొందికగా అమరిపోయింది. బరువైన బంగారు కమ్మలు, ముక్కుపుడక, ఒకడజను పచ్చని గాజుగాజులు వేసుకొంది. వేరే అలంకరణలేవీలేవు. ఎరుపు, గోధుమ రంగులు కలగలిసిన మేని ఛాయకు ఆమె చక్కని చిరునవ్వు మరింత కాంతినిస్తోంది.

ఎల్లమ్మకు, ఆమె భర్తకు పల్లెలో కొంతపొలం ఉంది. అదేవాళ్ళకున్న పెద్దఆస్తి, అందులో కూరగాయలు పండిస్తారు. అదే వారి జీవనాధారం.

“ఈ రోజు నేను తొందరగా తోటకు వెళ్ళాలమ్మా” అందామె

“అంత తొందరపడి పోతున్నావేమిటి? తోట మీ ఆయన చూసుకోడా?”

“చూసుకొంటాడనుకోండి. ఈ రోజు నేనో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. అందువల్ల వెళ్ళక తప్పదు. వచ్చే మూడు నెలలకు అనువుగా ఉండే విత్తనాలు నాటాలి.

“ఆపనేదో మీ ఆయన రుద్రప్ప చేయొచ్చుకదా?”

“లేద్సు నేనే సొంతంగా నిర్ణయించుకోవాలి. రుద్రప్ప కూడా చాలా గట్టివాడే. అనుభవం కూడాఉంది కానీ, ఈ వర్షాక్రాలంలో అన్ని విత్తనాలనూ నాటలేం. అందువల్ల నేను కూదా నా అభిప్రాయం చెప్పాలి.

భరలశి టగంధాలయ ్‌ అంజం 10 వ్‌ గిన తీ

202 జ్ఞానం - పరిజ్ఞానం

ఆమె 'ఆత్మవిస్వాసం నాకు ముచ్చటగొల్పింది.

“మొదట్లో నా అభిప్రాయాలు చేస్తే, వాళ్ళు నవ్వేవాళ్ళు. అయితే, నేను గట్టిగా నిలబడకపోతే, నిర్ణయాలు తీసుకొనే అవకాశమే నాకు లేకుండా చేస్తారని (గ్రహించాను. నిర్ణయాలు తీసుకొంటే తవ్ప అనుభవం రాదు. అందుకని తోటలో ఒకమూల కూరగాయల విత్తనాలు నాటడం ప్రారంభించాను. మా అత్తగారుకానీ, మా ఆయన కానీ చూడని స్థలంలో ప్రయోగాలు చేశాను. కొన్ని ప్రయత్నాలు వివలమైనా, నేను వదిలి పెట్టలేదు. అలా ఏ కాలంలో ఏ విత్తనాలు నాటాలో తెలుసుకున్నాను. వాళ్ళిష్పుడు నా అభిప్రాయాలను గౌరవిస్తారు. నా నిర్ణయాలను కోరుతారు. ఈ యేడాది క్యారెట్లు, కాలీఫ్లవర్‌ వేద్దామను కొంటున్నాను. దిగుబడి బాగుంటుందని, మంచి ఆదాయం వస్తుందని నాకు నమ్మకముంది”.

నళిని కంటే, చదువూ, శిక్షణాలేని ఎల్లమ్మ ఎంతో స్వతంత్రంగా వ్యవహరిస్తోంది.

వో మః

తి0 ఐ.టి. తెచ్చిన విభజన అ౨వరైనా స్నేహితురాలు అస్వస్థతతో ఉంటే, వెళ్ళిచూసి పలకరించి రావడం మంచిది. ఆమెకు కొంచెం మార్పు ఉంటుంది. కొంత ఉల్లాసం, ధైర్యం కలుగుతాయి. అలాంటి వారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు పండ్లు, పూలు తీసుకు వెళ్ళడంకూడా మంచి అలవాటు. నా (ఫెండు స్వప్నకు మూడు వారాలుగా ఒంట్లో బాగులేదని, నాకు ఆలస్యంగా, చాలా రోజుల తర్వాత తెలిసింది. ఒకరోజు ఆఫీసుపని పూర్తవగానే, సాయంకాలం కావస్తున్నా అప్పుడేవెళ్ళి ఆమెను చూడాలనిపించింది. పండ్లు, పూలు తీసుకెళ్ళామనుకొంటే, వాటిని ఎక్కడకొనాలో తెలియలేదు. షాపింగ్‌ పనంతా సాధారణంగా మా అమ్మ, అక్క చూసుకుంటూ ఉంటారు. నా అసిస్టెంట్‌ రమేష్‌ను పిలిచి, పండ్తుపూలు దొరికేచోటు చూపించమన్నాను. స్వప్న ఇంటికి వెళ్ళే దారిలో అతనికొాకషాపు తెలుసు. అందుకని అక్కడే కొనుక్కోవచ్చను “కున్నాం. సాయంకాలం కావస్తున్నా ఇంకా మంచి ఎండగా ఉంది. స్వేదంతో ఒళ్ళంతా తడిసి, నా కాటన్‌చీర నలిగిపోయింది. మంచి (ఫ్రెండును కలవడానికి వెళ్తున్నాను కనుక పూల ఎంపికను రమేష్‌కు వదిలి పెట్టకుండా నేనే ఎంచుకోవాలనుకొన్నా షాపింగ్‌ సముదాయంలో ఐస్‌క్రీం స్టాల్‌లో వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. పిల్లలు ఎంతో ఉద్వేగంతో ముందుకు ఉరుకుతుంటే, తల్లులు వాళ్ళగురించి ఆదుర్దాపడుతున్నారు. పిల్లలకు సెలవురోజులు కావడడంతో వాళ్ళు తల్లుల బెదిరింపులు, హెచ్చరికలను ఖాతరు చేయడంలేదు. నాపిల్లలు కూడా ఇలాగే ఉత్సాహపడేవారు. ఆ బాల్యం రోజులు మళ్ళీ రావుకదా అని విచారించాను. అయినా బాల్యస్కృళతులు ఇప్పటికీ నన్ను ఆనందంలో ముంచెత్తుతుంటాయి. ఒక పూలదుకాణం ముందు నిల్చున్నాను. పండ్లుకూడా అక్కడే అమ్ముతున్నారు. రంగు రంగుల సువాసనలీనే పూలను ఎంతో అందంగా పేర్చిపెట్టారు. వాటిమీదినుంచి కళ్ళు తిప్పుకోలేకపోయాను. పరమళాలు వెదజల్లుతున్న రజనీగంధ పుష్పాలు, కాంతులీనే ఎర్రగులాబీలు, అరవిరిసిన మల్లెలు, ఇంకా అనేక రకాలపూలు దారినపోయే వారిని కూడా ఆకర్షిస్తున్నాయి. తోటనుంచి అప్పుదేవచ్చినట్లున్నాయి. రెమ్మలు కత్తిరించి, నీళ్ళల్లో ముంచి తీస్తున్నారు.

204 జ్ఞానం - వరిజ్ఞానం

మరోపక్క ముంబాయి నుంచి వచ్చిన మామిడిపండ్లు, బిజాపూర్‌నుంచి వచ్చిన (ద్రాక్ష అలహాబాద్‌ నుంచి తెప్పించిన జామకాయలు, నాగపూర్‌ కమలాపండ్డు గుట్టలుగుట్టలుగా చక్కగా పేర్చిఉన్నాయి.

అన్నీ కొనేయాలనిపిస్తూండడంతో, ఏదికొనాలో తేల్చుకోలేకపోయాను. షాపతనికి ఒక గులాబీల గుత్తి చూపించి ఏంతవుతుందని అడిగాను. పూర్తిగా విరిసిన గులాబీలు చాలా మనోజ్ఞంగా ఉన్నాయి. షాపతను నామాట వినికూడా, జవాబు చెప్పేప్రయత్నం చేయలేదు. మళ్ళీఅడిగాను.

ఈసారి నిర్లక్ష్యంగా ఎటోచూస్తూ, 'ఒక్కోగులాబీ మూడున్నర రూపాయలు. ఒక్కోగుత్తి లో 20 గులాబీలుంటాయి. అంటే మొత్తం 70 రూపాయలు అన్నాడు.

నివ్వెర పోయాను. చిరకాలం నిద్రించిలేచిన రిప్‌వాన్‌ వింకిల్‌లా ఆలోచించాను. పాత ధరలు గుర్తొచ్చి, ప్రతీదీ ఖరీదైపోయిందనుకొన్నా. మామిడిపళ్ళధర తెలుసుకుందామని, రత్నగిరి ఆల్ఫోంజాలను చూపించి డజను ఎంత అని అడిగాను.

దూకాణమతను “డజను 150 రూపాయలు అని కటువుగా జవాబీచ్చాడు. తర్వాత తనమిత్రునితో నాకు అర్ధంకాదనుకొని తమిళంలో మాట్లాడుతూ “వీళ్ళకు కానే స్తోమత ఉండదు కానీ, షాపింగుకు వస్తారు. ఊరికేచూసి ఆనందించే రకం! ఇలాంటి వాళ్ళకు జవాబులు చెప్పలేక చస్తున్నాను. నిజంగా కొనేవాళ్ళు ధర అడగకూడదు” అన్నాడు.

ఈలోగా రమేష్‌ తన షాపింగ్‌ పూర్తిచేసుకొని పూలదుకాణానికి వచ్చాడు. ఎప్పుడు చూసినా చక్కగా ్రెస్‌చేసుకొని చురుగ్గాకనిపించే రమేష్‌ కంపెనీ లోగోఉన్న టీషర్టు ధరించాడు. మెడలో అతని ఉద్యోగ గుర్తింపు కార్డు వేలాడుతోంది. ఇప్పుడు గులాబీలు, మామిడిపళ్ళ ధరలడగడం అతని వంతైంది.

అతన్ని చూసో లేక అతని టీ షర్టుచూసోగాని షాపతను మర్యాదగా జవాబు చెప్పాడు. “సార్‌, గులాబీలగుత్తి 100 రూపాయలు సార్‌. ఒకో గులాబీ అయిదు రూపాయలే. మామూలుగా అయితే రూ. 150 కి ఇస్తాము. మీకైతే రూ. 100 కే ఇస్తా. మామిడి పంద్లు చూడండి. వాటికి రూ. 200 అవుతుందంతే”.

రమేష్‌ ఏమీ అనలేదు. నేను ఊరుకోలేకపోయాను.

“అంతధర ఎలా చెప్పావ్‌? ఇప్పుడే రెండు నిముషాల క్రితం గులాబీధర రూ. 70, మామిడి పంర్లధర రూ. 150 చెప్పావ్‌. ఇంతలోనే పెంచేశావ్‌. అలా ఎలా చేస్తావ్‌?”

షాపతనికి కోపమొచ్చింది. “మీకు కొనే శక్తిలేకపోతే ఊరుకోండి అనవసరంగా గొడవచేయకండి. ఈయన చాలా పెద్ద కంపనీలో పనిచేస్తున్న వ్యక్తి. ఆయన బ్యాడ్జి

ఐ.టి. తొచ్చిన విభజన 705

కంపెనీ షర్టు కనిపించడంలేదా? ఆయన పనిచేసేది సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో.

వాళ్ళు ఎంతైనా భరించగలరు. బేరమాడరు. మీలాంటివాళ్ళవల్ల మాకు తలనొప్పితప్ప వచ్చేదేంలేదు”

రమేష్‌ అతనికి జవాబు చెప్పబోతే, నేనే ఆపాను. నాకుభలే ఆసక్తిగా ఉంది. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, పెళ్ళిళ్ళ పేరయ్యలు, ఇళ్ళ్యయజమానులు, ఉద్యోగాలు కుదిర్చే కన్సల్టెంట్లు లాంటివారు మా కంపెనీని 'సాఫ్ట్‌వేర్‌ కంపెనీగానో, ఐ.టి. (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) కంపెనీగానో వర్గీకరించడం విన్నాను. వాళ్ళ విషయం వేరు, ఇతని మాటలు వేరు.

“అయితే మాలాంటి సామాన్య జనంతో పోల్చితే, ఈ ఐ.టి. కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఎక్కున రేట్లు చెల్లించాలంటావా*”ొ అనడిగాను.

“అవును. నాది మంగుళూరు. ఒక వ్యక్తి ఐ.టి. కంపెనీలో పనిచేయడం ప్రారంభించగానే, అతని కట్నం రేటు కనీసం రెండు లక్షల రూపాయలు పెరిగిపోతుంది. వాళ్ళు బాగా సంపాయిస్తారు కదామరి. నాధర కేవలం 50 రూపాయలు పెంచితే తప్పేముంది?” అని ఘాటుగా సమాధాన మిచ్చాడు.

కారులో కూర్చుని, నిత్యజీవితంలోకూదా ఐ.టి., ఐ.టి. యేతర ఉద్యోగులుగా జనాన్ని “డిజిటలొ గా విభజించి, పాలించే విధానం గురించి ఆలోచించసాగాను.

లో కః

త్రై ఇట ఆట్‌

మరియష్ట వదాన్యత చిరస్మరణీయం క్‌ంం నన్నో కాలేజీ ఆడిటోరియం ప్రారంభించడానికి ఆహ్వానించారు. అది పెద్దదేం కాదు కానీ, కట్టినప్లాను, చాలా బాగుంది. ప్రారంభోత్సవం తర్వాత ఆడిటోరియం అంతా చూపించారు. ఎక్కడా ఒక్క అంగుళమైనా ఖాళీగా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. గోడలన్నిటినీ గ్రానైట్‌ పలకలతో అలంకరించారు. ప్రతిఫలకం మీద దాతపేరు, అతనిచ్చిన సొమ్ము మొత్తం అంకెను చిత్రించారు. గోడమీద అనేక ఫొటోలు వరుసలుకూడా ఉన్నాయి. అదంతా వింతగా కనిపించింది.

నా భావాల్ని నిర్వాహకుడు (గ్రహించారు. “మేడం, దీన్ని నిర్మించడానికి సహాయపడాలని మేము దాతలకు విజ్ఞప్తి చేస్తే చాలా కొద్దిమందే ముందుకు వచ్చారు. అప్పుడు బాగా ఆలోచించి, వెయ్యి రూపాయలకు మించి విరాళం ఇస్తే వారిపేరును గ్రానైట్‌ పలకమీద చెక్కిస్తామని ప్రకటించాలని నిర్ణయించాం. రూ. 5000 అంతకంటె ఎక్కువ ఇచ్చేవారి ఫొటోలను గోడమీద ్రదర్శిస్తామని కూడా అద్వర్టయిజ్‌మెంట్‌లో తెలియజేసామూ అని వివరించారు.

“రూ. 10,000 కంటే ఎక్కువ ఇచ్చేవారి విషయమేమిటి?” అని ఆసక్తిగా అడిగాను.

“వారి పేర్లను ఒక ప్రత్యేక చలవరాతి ఫలకం మీద చెక్కించి, ప్రవేశమార్గం వద్దే 'ప్రదర్శిస్తాం. మేము ఆశించినట్లే ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి సరిపోయేంత సొమ్ము వసూలు చేయగలిగాం. కొందరు చిత్రమైన దాతలు కూడా ఉన్నారు. వారు తమపేర్లు నాలుగు పలకల మీద కనిపించాలని వెయ్యేసి రూపాయల చొప్పున నాలుగుసార్లు విరాళాలిచ్చారు” అన్నాడాయన.

నిజవే, తాను కచ్ళవడి ఆర్జించిన సొమ్మును దానంచేనిన వ్యక్తిని గుర్తుంచుకోవలసిందే. కానీ ఇంతలాకాదు. ఇదంతా చూస్తుంటే నాకో మహనీయుడు జ్ఞప్తికొచ్చాడు. చాలా కాలం కిందటే అప్పటికింకా అలాంటి ఆలోచనలే లేని రోజుల్లో ఆయన _గొప్ప దాతృత్వాన్ని ప్రదర్శించారు.

బెంగుళూరులో సంపన్న వర్తకుడైన మరియప్పకు 1914లో పరోపకారం చేయాలనే తలంపు కలిగింది. ఆయన విద్యావంతుడు కాకపోయినా పేదవిద్యార్థులకు మహోపకారం చేశారు. విద్యార్థులకు తమ ఇంట్లో బోజనం పెట్టడమే కాకుండా వారి ఫీజులుకూడా చెల్లించేవారు.

మరియవ్సు వదాన్వత బిరస్థురణీయం 707

ఆయన విల్లురాసిన ఎనిమిది రోజులకే 1914 మార్చి 12న మృతిచెందారు. ఆ విల్లు ద్వారా భార్యకు మరణించే వరకు నెలకు 60 రూపాయలు పింఛను అందే ఏర్పాటు చేశారు. ఆదంపతులకు సంతానం లేదు. నగరంలోని నాలుగు దేవాలయాల్లో పూజల నిరర్వహణకోసం, నూనె సరఫరాకు కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇలా నిర్దేశించారు: “బెంగుళూరు నగరంలో 45 మంది పేద విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పించాలి. ఈ 45 మందిలో 15 మంది నగరత లింగాయత్‌లు, 15 మంది (బ్రాహ్మణులు, 15 మంది ఇతర కూలాల హిందువులు ఉండాలి.

ఈ అసాధారణ విల్లువల్ల ఆరోజుల్లో మరియప్ప బహుశా తీవ్రమైన ్రతిఘటననే ఎదుర్కొని ఉండొచ్చు. ఆయన వ్యక్తిగత జీవితం గురించిన వివరాలు పెద్దగా తెలియడంలేదు. బహుశా గొప్పగొప్ప పరోపకార పరూయణులు బిడియస్టులు, అంతర్ముఖులు అయిఉంటారు. తమ పనులు ప్రపంచానికంతా తెలియాలని వారు కోరుకోరు. కుడిచేత్తో ఇచ్చిన దానం గురించి ఎడమచేతికి తెలియరాదని వారి విశ్వాసం.

“మనిషి విత్తం ఆర్టిస్తాడు కానీ, దానిని సత్మార్యానికి దానం చేయకపోతే, అప్పుడది తప్పుదోవ పట్టిపోతుంది” అనే మంచిలోకోక్తి ఒకటి మనకు ఉండనేఉంది.

చామరాజపేట, మూడవ మెయిన్‌లో ఏర్పాటుచేసిన మరియప్ప హాస్టల్‌ను విభిన్న కులాలకు చెందిన 45 మంది పేదవిద్యార్థులతో అధికారికంగా 1921 జూలై 1న ప్రారంభించారు. ట్రస్టుకు ప్రజాహిత జీవనంలో ప్రముఖులుగా పేరొందిన ఆరుగురు గౌరవ ట్రప్టీలు ఉన్నారు.

మరియప్ప ఆస్తులన్నీ విక్రయించడానికి ఏడేళ్ళు పట్టింది. ఆ విధంగా సుమారు రూ. 1.45 లక్షలు లభించింది. ఆ రోజుల్లో అది చాలా పెద్దమొత్తం. సగం సొమ్ము స్ధలం కొనడానికి, హాస్టల్‌ భవన నిర్మాణానికి వినియోగించారు. మిగిలిన మొత్తాన్ని అప్పుడు కొత్తగా ప్రారంభించిన మైసూరుబ్యాంకులో మూలధనంగా ఉంచారు.

ఇటీవలే బి.కె. మరియప్ప హాస్టల్‌ 80వ వార్షికోత్సవాన్ని, వ్యవస్థాపకుని 120వ జయంతిని నిర్వహించారు. ఆ హాస్టల్‌లో ఉండి చదువుకొని, వివిధరంగాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న వారెందరో ఆ మహనీయుని దాతృత్వం వల్ల లభ్ధిపొందారు. ఆ దాత దాతృత్వకార్యం రూపదాల్బకపోతే వాళ్ళు తమ చదువు పూర్తిచేయడానికి ఎన్నో కష్టాలు పడవలసి వచ్చేది,

సంస్కారంలో కృతజ్ఞత అన్నది అత్యున్నత లక్షణం. అది యూనివర్శిటీలోనో, పుస్తకాలు చదవడం ద్వారానో అబ్బేగుణం కాదు. దీనిని కుటుంబంలో పెద్దలు, స్కూల్లో టీచర్లు, పిల్లలకు చిన్నవయసులోనే వారి మనసులో నాటాలి.

మరియప్ప, ఆధునిక కర్టుడా? అయితే, మనదేశానికి అలాంటివారు మరెందరో అవసరం. -

లో కః

తై రే ఉట విశ్వాసలోపం

లొ విద్యార్థుల్లో చారులత చదువులో చాలా అగ్రగామిగా ఉండేది. చదువైపోగానే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఓ ఇంజనీర్‌ను పెళ్ళిచేసుకొని జీవితంలో స్థిరపడింది. దంపతులు ఎప్పుడూ సంతోషంగా కనిపించేవారు. ఎప్పుడైనా, వీలున్నప్పుడు కలుస్తూ ఉండేది. మొదట్లో చాలా ఆనందంగా ఉత్సాహంగా కనిపించేదికానీ, తర్వాత రోజులు గడిచేకొద్దీ, ఏదో భారం మోస్తున్నట్లుగా ఉండేది.

ఒకరోజు ఉదయం చారూ మాఆఫీసుకు వచ్చింది. ఆమెప్పుడూ ఉదయంపూట వచ్చి నాపనికి భంగం కలిగించేదికాదు. అందువల్ల ఆశ్చర్యపోయాను. నన్ను చూడగానే ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది.

“మేడం, నా భర్తను నేనే ఎంచుకొన్నాను కదా, నాజీవితం చాలా సంతోషంగా సాగిపోతుందనుకొన్నా? అంటూ (ప్రారంభించింది.

ఏడీ ఆమె అనుకొన్నట్లు జరగలేదు. కొద్దిరోజులు ప్రేమగానేచూసి, భర్త, ఆమెతల్లి వేధించడం ప్రారంభించారు. బ్యాంకు పనికితోదు, ఇంట్లోపనంతా ఆమెకే అప్పగించారు. బ్యాంకుకు వెళ్ళేముందు, మళ్ళీ సాయంత్రం అన్ని పనులూ ఆమేచేయాలి. జీతమంతా తెల్చి భర్తచేతిలో పోయాలి, తనకు దబ్బుకావలిస్తే - ఆఖరుకు పదిరూపాయలు కావాలన్నా భర్తనే అడగాలి.

“పెళ్ళి మాఅత్తగారికి ఇష్టంలేకుండా జరిగింది కదా. అందుకని ప్రతిపనికీ వంకలు పెడుతూ సాధిస్తూ ఉంటుంది. మా ఆయన సురేష్‌ తల్లిమాట జవదాటదు. అతను మొదట తల్లి కొడుకు, తర్వాతనే చారూ భర్త, వాళ్ళు ఏపని చెప్పినా చేసి సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తాను. అయినా అసంతృప్తే వాళ్ళకు”.

మనదేశంలో చారులకలాగా బాగా చదువుకొని, మంచి ఉద్యోగాల్లో ఉన్న మహిళలు లక్షల సంఖ్యలో ఉన్నారు. పెళ్ళికాగానే వాళ్ళకష్టాలు మొదలవుతాయి. ఎప్పటికప్పుడు ఏవో సమస్యలతో వారికి జీవితమంతా బాధలే.

మహిళలను చదివిస్తే శక్తి సంపన్నులవుతారంటారు. కదా. మరి వాళ్ళిప్పటికీ ఎందుకు ఏడుస్తున్నారు? ఆర్థిక స్వాతంత్ర్యమే అసలైన స్వాతంత్ర్యమైతే, వారిప్పటికీ భాధల్లో ఎందుకున్నారు? ఈ ప్రశ్న నన్ను నిరంతరం వెన్నాడుతోంది. మహిళ ధైర్యంగా నిలబడాలంటే ఏం చేయాలి?

విశ్వాసలోవం 209

ఈ మహిళ లందరూ ఏవిధంగా చూసినా, సమర్భులైన వ్యక్తులే. ఇలాంటి మహిళలే కన్నీళ్ళు చిందిస్తుంటే, ఇక పల్లెల్లోని బాలికల గతేమిటి? అక్కడి యువతులు విద్యావంతులు కారు. ఆర్థికంగా ఇతరులపై ఆధారపడి బతుకువారు. బట్టలు కొనుక్కోవడం నుంచి భర్తను ఎంచుకొనేదాకా, వారి జీవితాల్లో ఏ విషయంలోనూ వారి మాటకు విలువలేదు. వారెంత బాధపడుతుంటారో మనం వూహించనైనా వూహించలేం.

ఓ టీచర్‌గా నా అభిప్రాయ మేమిటంటే, విద్యార్థులకు చదువుతోపాటు, జీవితానికి సంబంధించిన మౌలిక సూత్రాలనుకూడా బోధించడం అత్యవసరం. నా విద్యార్ధినులు తరచుగా పెళ్ళి, డబ్బు, ఉద్యోగాల గురించి చర్చించుకొంటూ ఉంటారు. స్వయం పోషకత్వాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించు కోవాలని వారికి నేను నూరిపోస్తుంటాను. పెళ్ళిచేసుకోవడం, పిల్లల పోషణ మహిళల అంతిమ లక్ష్యంకాదు. చదువు కొంటే, మంచి ఉద్యోగం రావచ్చు నిజమే. అయితే ఇంతకంటే ముఖ్యంగా వారు జీవితాన్ని జీవిత వాస్తవికతలను ఎదుర్మోగలగాలి. సమాజం తీరుతెన్నులను ఆకళింపు చేసుకోగలగాలి.

చారూ తన ఇబ్బందులు గురించి భర్తతోనూ, అత్తగారితోనూ నిర్మాహమాటంగా చర్చించాల్సింది. తన హక్కులకోసం పోరాడాల్సింది. అయితే ఆమె అణగిమజిగి పడిఉండి, వారిని సంతోషపెట్టడానికే ఇన్నాళ్ళూ ప్రయత్నించింది.

ప్రతివారిసీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే, చివరికి ఒక్కరినీ సంతృప్తిపరచలేం. ఇతరుల సంతోషం కోసం మనబీవితాలను వలాంగా మెట్టటేం. ఏ శాశ్చాత అనుజుంధం విషయంలో అయినా, మన అఖభిప్రాయాలన్నీ బయటపెట్టి, మనం ఎంతవచాలా మారగలమో, ఏ విషయంలో మారలేమో స్పష్టంచేయడమే మంచిది.

ఇటీవల నన్ను ఢిల్లీలో ఒక సదస్సుకు ఆహ్వానించారు. మహిళాసాధికార విని ప్రధాన చర్చనీయాంశంగా నిర్ణయించారు. ఆ సందర్భంగా కొందరికి అవార్డులు ఇచ్చారు. ముఖ్యమైన వక్తలలో కిరణ్‌బేడి కూడా ఉన్నారు.

కిరణ్‌బేడి అంటే నాకున్న గౌరవం, అభిమానం అంతా ఇంతా కాదు. అమెను నేను మహిళల అంతర్గతశక్తికి ప్రతీకగా భావిస్తాను. ఆమె హృదయంలోంచి, ఎం ఉద్వేగంతో, నిజాయితీగా ప్రసంగించారు. ఆశువుగా చేసిన ప్రసంగంలో ఆమె ఈ కింది సంఘటనను వివరించారు.

బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న ఒక_ అమ్మాయి, తనక్తాస్‌మేట్‌ (పేమలోపడి, పారిపోయి, అతన్ని గుళ్ళో పెళ్ళి చేసుకుంది. ఆమె మెడలో మంగళసూత్రం తప్పించి వాళ్ళు పెళ్ళిచేసుకొన్నట్లు రుజువుగా మరే అధారమూలేదు. రిజిస్టేషన్‌లేదు. ఫొటో అయినాలేదు. కొద్ది రోజులు కలిసి కాపురం చేశాక, అతను ఆమెను వదిలిపెట్టి పారిపోయాడు. ఈమె సహాయంకోసం ఎవరెవరి దగ్గరకో వెళ్ళి అర్ధించాల్సి వచ్చింది. అంత అజ్ఞానంలో ఉన్నందుకు కిరణ్‌బేడి ఆ అమ్మాయినే నిందించింది. పారిపోయినతన్ని

720 జ్ఞానం - వరిజ్ఞానం వెతకడం గురించి ఆమె ప్రస్తావించలేదు. ఆ అమ్మాయికి ఎలాంటి చదువు చెప్పారనే మౌలిక ప్రశ్నను చర్చించాలన్నారు. ఆమె అన్నేళ్ళు స్కూళ్ళు, కాలేజీల్లో గడిపి ఉపయోగమేమిటి? చదువుకొన్న యువతి ఆర్థికంగా స్వతంత్ర జీవితం గడిపిఉండొచ్చు. కానీ, ఇవాళ సహాయంకోసం రోదిస్తోందంటే, ఆవిషయాన్ని ఉపేక్షించలేమని కిరణ్‌బేడి అన్నారు. మన చదువుల్లోనే లోపం ఉందన్నారు.

చదునంటే, కేవలం మంచి మార్కులు తెచ్చుకోవడం, సర్జీఫికెట్లు సంపాయించడం కాదు. జీవితమనే పరీక్షకు పాఠ్యప్రణాళిక (సిలబస్‌) ఉండదు, ప్రశ్న పత్రాలుండవు. మాడల్‌ జవాబుల పత్రాలు ఉండవు. జీవితంలో అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. అవి ఏదిశ నుంచైనా రావచ్చు. వాటినుంచి పారిపోకూడదు. కష్టాలను ఎదుర్మొనడానికి, చదువు, ఆర్థిక స్వాతంత్ర్యం కేవలం సాధనాలుగా ఉపకరిస్తాయి. జీవితమంతా ఉండే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.

మీకు అందరికంటె మంచి (ఫ్రెండు మీరే. మీకు అందరికంటే పెద్ద శత్రువు మీరే! కాదంటారా?

లో అ్సం

తతి అసూయతెచ్చిన అనర్ధం

జీ విచిభ్రమైంది. అది అనేక రకాల వ్యక్తుల సమాహారం. కొంతమంది ఎప్పుడూ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతుంటారు. ఇతరులకు సంబంధించిన ప్రతికూల సమాచారాన్ని ఒకరికొకరు చెప్పుకోరాదని కాదు. ఎవరినీ ఎవరూ. విమర్శించరాదని నేను అనడంలేదు. అయితే ఆ విమర్శ నిర్మాణాత్మకంగా ఉందాలితప్ప, వోనికరంగా ఉండకూడదు. దురదృష్టవశాత్తు కొంతమంది మరీ మోటుగా వ్యవపారిస్తారు. విమర్శించడంలో చౌకబారు వ్యాఖ్యలు చేస్తుంటారు.

ఇటీవల ఒక సంఘసేవా కార్యకర్తకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన ప్రాథమికంగా నిజాయితీకల వ్యక్తి. నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఆయన ఈ అవార్డుకు నిజంగా అర్జ్హుడే. అయితే ఆయన గురించి నా (్రెండు పార్వతి చేసిన వ్యాఖ్య దారుణంగా ఉంది.

“అతనా! అతనికేం! పెద్ద ధనవంతుడు. అవార్డు కొనుక్కోడానికి బోలెడు సొమ్ము ఖర్చుపెట్టి ఉంటాడు. ఆ డబ్బంతా ఇంకేం చేస్తాడు? ఏదోకాంత డబ్బు దానంచేసి, పద్మత్రీ అవార్డు కొట్టేశాడు. నాకంత డబ్బుంటే ఇంకా ముందే ఆవార్డు తెచ్చుకొనే దాన్ని పద్మశ్రీ అంటే పెద్ద గౌక్సేంకాదు. కిందటి ఏడాది ఎవరెవరికి వచ్చిందో ఎవరికైనా జ్ఞాపకముందా? ప్రతిఏటా వందలాది మందికి వస్తుంది, ఈ యేడాది ఇతనికొచ్చింది. ” అంటూ పార్వతి రెచ్చిపోయింది.

పార్వతి నాకు చాలా ఏళ్ళుగా తెలుసు. ఎవరేం సాధించినా ఆమె బాధపదిపోతుంది. వారికి అర్హత లేదంటుంది. స్వార్ధపరురాలు, అహంభావి. ఎంతసేపూ తనగొడవే తప్ప, ఇతరులు వమనుకొంటారో అని ఒకక్షణం కూడా ఆలోచించదు.

మరో (ఫ్రెండు కుమారుడు మనీష్‌కు డిగ్రీ పరీక్షలో మొదటి ర్యాంకు వచ్చింది. వాళ్ళమ్మ సహజంగానే సంతోషంతో పరవశించిపోయింది. పార్టీలో పార్వతి ఎంతో విచార వదనంతో కనిపించింది. నన్ను పక్కకు పిలిచి తన అక్కసంతా వెళ్ళగక్కింది. “నా కూతురు మాలాతో పోల్చితే మనీష్‌ ఏమంత గొప్పతెలివైన_వాడుకాదు. ఆన్సర్‌పేపర్లు చూడ్డంలో ఏదో పొరపాటు జరిగి ఉందాలి. టీచర్‌గా నువ్వేమంటావ్‌?”

722 జ్ఞానం - నరిజ్ఞానం “నీదే పొరపాటు. మనీష్‌ మాలా ఇద్దరూ మంచి స్టూడెంట్సే. ఇక వాల్యుయేషన్‌లో కూడా పొరపాటేం లేదు. మనీష్‌ కష్టపడి చదివుంటాడు కాబట్టి ర్యాంకు తెచ్చుకొన్నాడు” అన్నాను. నేను ఆమె పక్షం వహించలేదని పార్వతి మొహం గంటుపెట్టుకుంది. ఎప్పుడు ఎవరేం సాధించినా పార్వతి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఊరుకోదు. కారణం అసూయే. కొద్దిరోజుల కిందట మార్కెట్‌లో కలిసింది. “నీ రచయిత ఎవరు?” అని అడిగింది. విస్తుపోయాను. “నా కోసం ఎవరైనా ఎందుకు రాయాలి? నేనే రాయగలను.” “అదికాదు, నీకు తీరిక ఉండదుకదా. అందుకని వంట మనిషిని కుదుర్చుకొన్నట్లే, రచయితకు కూడా డబ్బిచ్చి నీపేరుతో రాయిస్తున్నావనుకున్నాను” అంది. నాకు ఒళ్ళు మండిపోయింది. ఈమె ఇంతదారుణంగా ఎలామాట్లాడగలుగుతోంది? అసలు ఎవరైనా ఇలా ఎలా ఊహిస్తారు? నాకు కోపం తెప్పించానన్న విచారమైనా లేకుండా, వెళ్ళేముందు “సామాన్యంగా చాలామంది ఇలాగే రాయిస్తుంటారు. అందుకని అడిగాను” అని మరో విసురు విసిరి విసవిసా నడిచి వెళ్ళిపోయింది. చదువుకొన్నవారు ఇతరుల గురించి ఎలాంటి మాటలంటారో పార్వతి ఒక నిదర్శనం. వాళ్ళు తెలివంతా ఇతర్లను విమర్శించడానికే వెచ్చిస్తారు. ('ప్రతిదాన్లో ఏదో అక్రమం జరిగిందను కుంటారు. జీవితంలో ఎన్నోకలలు కంటాం కానీ, అన్నిటినీ సాకారం చేసుకోలేం. కష్టపడితే చాలదు, అనేకం కలిసొస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. తగిన అవకాశం రావాలి, మనతో కలిసిపనిచేయడానికి తగిన వ్యక్తులు దొరకాలి, తగిన సమయం కూడా రావాలి. అదృష్టం పాత్రకొంత ఉంటే ఉండొచ్చు. ఎందులోనైనా విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయాలి. తాను చేసే పనిలో విశ్వాసం ఉండాలి. చాలా సందర్భాలలో కష్టపడ్డా పెద్దగా ఫలితం లేకపోవచ్చు. అలాఅని విజయాలు సాధించినవారి కంటే వారు తక్కువ ప్రతీిభావంతులేంకాదు. నా కలను నేను సాకారం చేసుకోలేకపోజే, మరొకరు అలాంటిది సాధించవచ్చు. నా వైఫల్యానికి విచారించే బదులు, ఎవరో ఒకరు సాధించారని నేను సంతోషించడం మంచిది కదా. ఒకరి వైభవాన్ని చూసి మరొకరు ఆనందించగలగడమే అత్యుత్తమ సంస్కారం. మనకు వాస్తవిక దృక్సథం ఉండాలి. ఇతరులు సాధించిన విజయాలు చూసి అసూయపడే, లేదా నిరసించే ఐదులు మెచ్చుకోగలగాలి. ఇప్పుడు పార్వతి అంటే ఎవరికీ ఇష్టంలేదు. ఆమెకు (ఫెండ్స్‌ అంటూ ఎవరూ లేకుందా పోయారు. ఆమె మంచి అంతా తనకొక్కరికే జరగాలనుకొంటుంది. లోకంలోని

ల రెరినలుం టి అత్యుత్తమమైనవి పొందడానికి తనకొక్కదానికే అర్జ్దత ఉందని భావిస్తుంది. ప్రపంచమంటే తనకొడుకు, తన కూతురు, తన భర్తఉందే కుటుంబం మాత్రమే. మిగిలిన వారి ఉనికినే ఆమె గుర్తించదు.

అలాంటివారు జీవితంలో ఏమిసాధిస్తారు? నిజమైన స్పేహం లేదు, ప్రేమానురాగాలు లేవు, ఎవరితోటీ ఏమీ పంచుకొనే ప్రసక్తిలేదు. అంత అసూయతో జీవితాన్ని నిస్సారం చేసుకోవడమెందుకు?

మనదేశం సంగతి చూడండి. అసూయ మనదేశ చరిత్రగతిని మార్చేసింది, పాడుచేసింది. ఎందరో రాణులు, రాజులు కేవలం అసూయతో శత్రువులను తమ ఆస్థానాలకు ఆహ్వానించి, వారిని వంచనతో హతమార్చారు. తత్ఫలితంగా వారి రాజ్యాలు నాశనమయ్యాయి. ఇటువంటి అసూయను పరాయివారు ఆసరాగా చేసుకొని లాభపడతారు. మనం చరిత్రను చదువుతాం కానీ, దాన్నుంచి పాఠం నేర్చుకోం. అందువల్లనే చరిత్ర పునరావృతమౌతూ ఉంటుంది.

లో జ్హా్ణం

తడ వ్ప్తో మహిళల గురించిన సత్యం

మం మహిళలు ఓటుహక్కును సాధించుకోగానే, దాన్ని స్వేచ్చా, సమానత్వాలకు చిహ్నంగా పరిగణించారు. అయికే వాస్తవంగా వారి సామాజిక స్టాయిపెద్దగొ మెరుగుపడిందేమీ లేదు. అందుకే మహిళలపై - వధువులను తగులపెట్టడాలు, స్రీ, శిశువుల హత్యలు, తదితర అత్యాచారాలు ఇప్పటికీ జరిగిపోతున్నాయి. ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు వసిస్తారంటూ మన పురాణాలు మహిళల బెన్నత్యాన్ని

అయితే నిజ జీవితంలో పరిస్థితి భిన్నంగాఉంది.

ఇటీవల మహిళా సమస్యలపై జరిగిన ఒక సదస్సుకు హాజరయ్యాను. చర్చలో పాల్గొన్న ఒకవక్త చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని చదివి వినిపించారు. మహిళలు అన్ని విధాలా - ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్వేచ్చను అనుభవిస్తున్న దేశాల జాబితా కూడా సమాచారంలో ఉంది.

మహిళలు ఎక్కువగా విముక్తిపొందిన దేశాలపేర్లు జాబితాలో అగ్రభాగాన ఉండగా, మహిళకు సాధికారిత్వం కల్పించడంలో వెనుకబడిన దేశాలపేర్లు అడుగున ఉన్నాయి. నేను మనదేశం పేరు జాబితా మధ్యలో ఎక్కడో ఉంటుందని ఊహించాను. కానీ భారతదేశం పేరు జాబితాలో అట్టడుగునుంచి రెండోస్థానంలో ఉంది. మనకంటె వెనుకబడిన దేశం ఒకేఒక్కటుంది. నేను ఎంతమాత్రం ఊహించని నిజం, చేదునిజం తెలిసి ఆశ్చర్యపోయాను.

మొదటి మూడు దేశాలేవో తెలుసుకోవాలనిపించింది. ఇంగ్లాండు, అమెరికా పేర్లు అగ్రస్థానాల్లో ఉంటాయను కొన్నాను. మళ్ళీ పొరపాటు పడ్డాను. మూడు అగ్రదేశాలూ స్మాండినేవియన్‌ దేశాలే, అంటే - స్వీడన్‌, నార్వే డెన్మార్క్‌ సదస్సులో ఇంచుమించు అందరం విస్తుపోయాము. యూరప్‌లో ఒక మూలపడున్న అంత చిన్న దేశాలే మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చేదేశాలని తెలిస్తే ఆశ్చర్యం కలగదామరి.

స్వీడన్‌ రాజుకుటుంబంలో చట్టప్రకారం స్రీయా, పురుషుడా అన్న దానితో నిమిత్తం లేకుండా ప్రథమ సంతానానికే వారసత్వాధికారం సంక్రమిస్తుంది. నేటికీ అదేచట్టం వర్తిస్తుంది. నార్వేకూడా త్వరలో అటువంటి పరిస్థితినే అనుసరించనుంది. అదేశాల్లో మహిళలపట్ల వివక్ష ప్రదర్శించడం నేరమవుతుంది.

మసాళల గురించిన నత్యం ై్‌్‌

నేనోసారి స్టాక్‌హోం వెళ్ళినప్పుడు, రాత్రిపూట వోటల్‌కు చేరుకోవడం ఆలస్యమై పోయింది. చీకటిపడేసరికి హోటల్‌కు చాలాదూరంలో ఉండడంవల్ల, టాక్సీలో వెళ్ళాల్సివచ్చింది. హోటల్‌కు టాక్సీఛార్జీ 40 క్రోనా అవుతుంది. అయితే బాగా రాత్రి అయింది కనుక టాక్సీదైవర్‌ రెట్టింపుఛార్జి వసూలుచేస్తాడనుకొని, 100 క్రొనా నోటు ఇచ్చి, చిల్లరకోసం ఆగాను. అతను 80 క్రోనా తిరిగిచ్చాడు.

కారణమడిగితే “మీరు రాత్రి ఆలస్యంగా ప్రయాణిస్తున్న మహిళకదా! అందువల్ల మేం అసలు ఛార్జీలో సగమే తీసుకొంటాం” అన్నాడు.

ఆదేశాన్ని (స్వీడన్‌) మనసులో మెచ్చుకొన్నాను. మనదేశంలో అయితే, చీకటిపడ్డాక ప్రయాణం చేయదానికే సాహసించేదాన్నికాదు. ఒకవేళ ప్రయాణిస్తే టాక్సీడైవర్‌ అసలు ఛార్జీకి కాన్నిరెట్లు వసూలు చేస్తాడనడంలో సందేహంలేదు.

మనం వేదికమీద అడ్డూఅదుపూ లేకుందా ఉపన్యాసాలిస్తాం. దేవతలను పూజిస్తాం. మన రాజ్యాంగంలో పురుషులతోపాటు మహిళలకు సమాన హక్కులున్నాయని గర్వంగా చెప్పుకుంటాం. శివుని అర్ధనారీశ్వర రూపాన్నిబట్టి శివుడుకూడా సమానత్వానికి సమ్మతించినట్లు తేలుతోంది. మన పవిత్ర (గ్రంథాలు, మన చరిత్రకూడా ఎందరో అసాధారణ మహిళల ఉదంతాలు తెలియజేస్తున్నాయి. అయితే వాస్తవంగా మహిళలకు తమ భద్రతపై భరోసాఉందా? వారు నిజంగా స్వేచ్చను అనుభవిస్తున్నారా? సమాజంలో వారు సమానహక్కులను పొందగలుగుతున్నారా? ఏకొంతమందికో అటువంటి అవకాశాలు ఉండవచ్చు.

మహిళలను సాధారణంగా, ఫలానవ్యక్తి కుమార్తెగానో, భార్యగానో_ తల్లిగానో, పురుషులతో సంబంధం ఆధారంగానే గుర్తిస్తారు. చాలాకుటుంబాల్లో వ్యక్తిగత విషయాల్లోసైతం మహిళల అభిప్రాయాలకు విలువలేదు. వారిసేవలకు ప్రతిఫలంలేదు. వారి శక్తిసామర్థ్యాలకు మెప్పులేదు. పురుషాధిక్య సమాజంలో వారు అణకువగా జీవించాలి. చాలా సందర్భాలలో స్రీకి-ప్రీయే పెద్ద శత్రువు కావడం గర్హనీయం.

భారతీయ మహిళ ఇటువంటి పరిస్థితుల్లో జీవించడం అలవరచుకొని, అనేక రంగాల్లో రాణిస్తోందంటే, గర్వించదగిన విషయం. నేటి మహిళ అవరోధాలను అధిగమించి, సంతోషంగా పురోగమిస్తోందంటే, అందరు మహిళలకూ అవకాశాలు లేకున్నా గొప్ప విషయమే.

స్కాండినేవియన్‌ దేశాల్లో మహిళలు ఇతర దేశాల్లో కంటే చాలా గౌరవం పొందుతున్నారు. మనం మాట్లాడుతాం, వాళ్ళు ఆచరిస్తారు. “మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే, అక్కడ దేవతలు వసిస్తారు” అన్నసూక్తి ఆదేశాలకు మాత్రమే వర్తిస్తుంది.

మలో ఆన్ట్రిస్టం

తె5 గౌరవంగా జీవించే అవకాశం మెంగంంా బంగారంకాదు. తెల్లగా ఉన్నదంతా పాలుకాదు. కాషాయ దుస్తులు ధరించేవారంతా బుషులు కారు. ఈ ప్రాచీన సూక్తులు, ముఖ్యంగా చివరి సూక్తి ఈ నాటికీ వర్తిస్తుంది.

కాషాయ వస్త్రాలు ధరించిన చాలా మందిని మనం చూస్తుంటాం కానీ, వారిలో అందరూ నిజమైన అర్ధంలో సన్యాసులు కారు. తన అనుచరులను సన్మార్గంలో నడిపించేవాడే నిజమైన సన్యాసి.

ఇటీవల నేను మైసూరులో ఒక అనాథమహిళల ఆశ్రయం ప్రారంభోత్సవానికి హాజరయ్యాను. అత్యధిక సందర్భాలలో మహిళలు, అత్తమామల వేధింపులను భరించలేకనో, తాగుబోతు భర్తలుపెట్టే చిత్రహింసలు తట్టుకోలేకనో ఆశ్రయంలో చేరారు. సాంఘికా ఆర్థిక పరిస్థితులవల్ల ఆ బాధితుల తల్లి తండ్రులు కూడా వారిని చేరదీసి సంరక్షించలేక పోతున్నారు. కొంతమంది బాలికలు (ేమలోపడి, ఇంటినుంచి పారిపోయి, కొత్తమోజు తీరగానే ప్రియులు వదిలేయడంతో దిక్కులేని వారవుతున్నారు. ఇలాంటి అమ్మాయిలకు సాధారణంగా మళ్ళీ తల్లితండ్రుల వద్ధకు వెళ్ళే ధైర్యం ఉండదు.

ఈ దురదృష్టవంతులైన మహిళలు, బాలికలు కష్టాలను ధైర్యంగా ఎదుర్మొని మిగిలిన జీవితం గడపాలంటే వారు మానసికంగా దృధంగా ఉందాలి. పట్టుదలకూడా అవసరం. అలాంటివారు జీవనాధారంకూడా చూసుకోవచ్చు. మరీ దురదృష్టవంతులు వ్యభిచార గృహ నిర్వాహకుల నిర్భంధంలో చిక్కుకుపోతుంటారు. తెలిసో తెలియకో ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోకూడా దిగబడిపోతుంటారు.

విజయానికి కర్తనని చెప్పుకొనేవారు చాలామంది ఉంటారు. కానీ వైఫల్యాలకు ఎవరూ బాధ్యత వహించరనే లోకోక్తి నిజమే. మనకు ఆపదలో ఉన్న మహిళలు, వారిపిల్లలే కనిపిస్తారుకానీ, వారికష్టాలకు కారకులైనవారు ఎక్కడో తెరవెనుక దాక్కుని ఉంటారు. అందువల్ల బాధితులను పూర్తిగా నిందించలేం. తరచుగా పరిస్థితులు వాదిని అటువంటి చాకిరీలోకి నెట్టేస్తుంటాయి. ఏమైనా మనం వారికి సహాయం చేయాలి. పొరపాట్లు చేయడం మానవనైజమేకదా!

గౌరవంగా జీవించే అవకాశం 777

అటువంటి మహిళల సంక్షేమంకోసం కృషిచేసే వారిని సత్కరించడం లేదా బహుమతులిచ్చి గుర్తించడం చాలా మంచిపని. అయితే, ఇంతకంటే ముఖ్యంగా దారితప్పిన వారికి, జీవితంలో దెబ్బతిన్నవారికి సహాయాన్ని అందించడం అవసరం. ఇటువంటి కృషి చేసే వ్యవస్థ ఏదైనా ఉందా? ఒకటో, రెండో సంస్థలు అలాంటి వారికి ఆశ్రయమిచ్చి, పునరావాసం కల్పించడానికి కృషిచేస్తున్నాయి. అలాంటి స్థలంలో మహిళలు గౌరవంగా జీవించడానికి వీలుగా, జీవనాధారం కల్పించే పనులు నేర్పిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు.

మైసూరులో అటువంటి సంస్థను ప్రారంభించాలని ముందడుగు వేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? రాజకీయ అధికారం ఉన్న వ్యక్తో లేక కీర్తికోసం పాకులాడే వ్యక్తో కాదు. ఆ మొదటి వ్యక్తి సుత్తూర్‌ మఠం అధిపతి, స్వామీజీ బాగా చదువుకొన్న పండితుడు. కారుణ్యం అంటే ఏమిటో నిజంగా అర్ధంచేసుకున్న స్వామీజీ కనుక, పేదలకు, అనాథలకు సాయపడడం అవసరమని నిశ్చయించుకొన్నారు.

ఆయన తన మతసంబంధమైన విధులను నిర్వహిస్తూ, మఠం వ్యవహారాలు చూసుకొంటూ ప్రశాంత జీవనాన్ని గడిపిఉండొచ్చు. అయిజే ఆయనకు వేరే ఆలోచన కలిగింది. స్వామిజీ కోటి రూపాయలు విలువచేసే మఠానికి చెందిన ఒకటిన్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయన నిజమైన నాయకత్వ గుణాన్ని ప్రదర్శించారు. ఆదర్శనీయంగా వ్యవహరించారు. ఎలాంటి (ప్రతిఫలం ఆశించకుండా ఆయనీ మహత్మార్యాన్ని తలపెట్టడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మనలాంటి సామాన్యులు అలాంటి మహనీయులను మార్గదర్భులుగా స్వీకరించి, వారి అడుగు జాడల్లో నడవాలి.

మన పూర్వీకులు “ఆచార్యదేవోభవ” అన్నారు. మనం గౌరవించాల్సిన వారిక్రమంలో గురువు, టీచర్‌ లేదా ఆచార్యునిది తృతీయస్థానం. దైవాన్ని మనం గురువుద్వారానే అందుకోవాలి. దైవానుగ్రహం గురువు ద్వారానే ప్రాప్తిస్తుంది. సుత్తూర్‌ మఠానికి చెందిన స్వామీజీ కృషిలో ఈ సూక్తి నిజంగా ఎలా ్రతిబింబిస్తోందో! ఆయన కృషి అందరికీ ఆదర్భంకావాలి.

ఇన్ల్ణల

86 ఎందుకు రాస్తున్నానంటే...

ఆర్ష లె శ్రికలల్లో నేను కాలమ్‌ రాసినప్పుడల్లా, నారచన మీద పాఠకులు తమ అభిప్రాయాలు తెలియజేయడానికి వీలుగా నా ఇ-మెయిల్‌ ఐ.డి. ఇస్తుంటాను. పాఠకులు నా కాలమ్‌ గురించి మాత్రమే ఇ-మెయిల్‌ పంపాలని కూడా రాస్తుంటాను. అయినప్పటికీ నాకాలమ్‌కు సంబింధంలేని వ్యవహారాలపై అనేక ఇ-మెయిల్స్‌ వస్తూనే ఉంటాయి. కొన్ని ఇ-మెయిల్స్‌ కాలమ్‌లో రాసిన విషయాలను ్రశంసిస్తే, మరికొన్ని పరిహసించే ధోరణిలో ఉంటాయి.

“లాస్ట్‌వర్గొ అన్న కాలమ్‌లో నా వ్యక్తిగత అ్పుప్రాయాలు వ్యక్తంచేస్తుంటాను. ఎంతో సత్యనిష్టతో రాస్తుంటాను. సాధ్యమైనంత వరకు నా మనసులోని భావాలనే వెల్లడిస్తుంటాను. వరకట్న హత్యల బీభత్సం గురించి, అవినీతి పెరిగిపోవడానికి గల కారణాలను వివరించడం, నీతి నిజాయితీల ఆవశ్యకత గురించి ఉద్చోదించడం చాలా సులభం. ఆ మాటకొస్తే నీతులు ఎవరైనా ఉపదేశించవచ్చు.

అయితే ఎక్కువమంది పాఠకులు నావ్యక్తిగత జీవితంలోనో, నా మిత్రులలో ఒకరి జీవితంలోనో జరిగిన సంఘటనను వివరించాలని అడుగుతుంటారు. టీచర్ని కనుక ఏ అంశాన్నయినా సాదృశ్యాలు, ఉదాహరణలు ఉటంకిస్తూ వివరిస్తే అందరికీ విషయం బోధపడుతుందని నాకు తెలుసు. అందువల్ల నేను ఏ సమస్యను గురించి రాసినా, నా అనుభవాలు కొన్నిటిని వివరిస్తుంటాను. నాకుటుంబంలోనో, మిత్రుల జీవితాల్లోనో జరిగిన సంఘటనలు ఉదహరిస్తుంటాను. అంతేకాని నా కుమారుడు ఇలా అన్నాడు, నా మిత్రులు ఇలా చెప్పారని గొప్పచెప్పుకొనడానికి రాయలేదు. నిత్యజీవితంలో పొందే కొన్ని అనుభవాలను, తెలుసుకున్న విశేషాలను పాఠకులు తమ అనుభవాలతో పోబ్చిచూసుకొనే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే వివరిస్తుంటాను. అయితే, కొందరు పాఠకులు దీన్ని అపార్ధం చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి. అలాంటివారు తీవ్రమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఇ-మెయిల్స్‌ పంపి తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. వీటిలో మనసునొప్పించేవి కూడా ఉంటాయి.

నమ్మకం కలిగిస్తున్న నవతరం శీర్షికళో కాలమ్‌ రాసిన తర్వాత నాకో ఉత్తరం వచ్చింది. ఆ శీర్షిక కింద నాకుమారునితో జరిపిన సంభాషణను వివరించాను. నాకుమారుని కీర్తించడమో, నాగొప్పను చెప్పుకోవడమో ఆరచన ఉద్దేశంకాదు. అది రెండు తరాలమధ్య సంభాషణ. ఆ సంభాషణలో నా కుమారుడు వచ్చే తరానికి, నేను నా తరానికి ప్రాతినిధ్యం

ఎందుకు రాన్తున్నానంటే ... 779 వహించాము. ఇదే సంభాషణను వ్యక్తుల ప్రమేయం లేకుండా మిస్టర్‌ 'వ మిస్టర్‌ బి మధ్య జరిగినట్లుగా చిత్రించి, తరాలమధ్య అంతరంపై కొన్ని సూత్రీకరణలతో ఒక వ్యాసం పద్ధతిలో రాసి ఉండొచ్చు. అయితే నిజంగా జరిగిన దాని గురించి రాయడమే మంచిదనుకొన్నాను. అలారాస్తే మీ అబ్బాయి గురించి రాస్తావ్‌ అని విమర్శించారు.

ఒక పర్యాయం సామాజిక జడత్వం గురించి రాశాను. మన ప్రపంచంలో మనం గిరిగీసుకొని జీవిస్తూ, మన చుట్టురా ఏమి జరుగుతోందో పట్టించుకోవడంలేదు. అసలేం జరుగుతోందో కూడా తెలుసుకోవడం లేదు. ఈ విషయం ఇతర్లకు చెప్పాలన్నదే నా లక్ష్యం. మనకుటుంబాలపట్ల మనం తప్పుకుండా శ్రద్ధ వహించాలి. నేను కాదనను. కుటుంబం చాలా ముఖ్యమైనది. సొంతకుటుంబాన్ని అలక్ష్యం చేసి, ఎవరూ పరోపకారి కానవసరంలేదు. మనం కనీసం ఇతరుల గురించి ఆలోచించాలన్నదే నా ఉద్దేశం. ఆర్థిక సహాయం చేయడం, డబ్బివ్వడం అవసరమని నా ఉద్దేశంకాదు. నా అనుభవం నుంచి ఒక చిన్న ఉదాహరణను పేర్మొన్నాను. అయితే కొందరు పాఠకులు నేను కథచెప్పడాన్ని బుద్ధుని కీర్తించడాన్ని తప్పుపట్టారు. ఇతరులకు సహాయపడడానికి ఒక సున్నితవ్యక్తి చేసిన త్యాగానికి బుద్ధుని నేనొక ప్రతీకగా అఖభివర్జించాను. ప్రతివారూ బుద్ధుడు కాలేరు కానీ, కనీసం అటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాలి.

నా వ్యాసాల ముగింపు పాఠకుల ఆలోచనలకు అనుకూలంగా ఉంటే మెచ్చుకుంటారు. ఏదైనా ఒక వ్యాసం ముగింపు వారి భావాలకు వ్యతిరేకంగా ఉంటే ఇక విమర్శలు వెల్లువెత్తుతాయి. “మీనుంచి ఇలాంటి రాతలు ఆశించలేదు” అనో, “ఎప్పుడూ మంచి విషయాలే రాయండి” అనో ఉత్తరాలు వచ్చేస్తాయి.

నిజజీవితంలో, ఏ మనిషికీ అన్నీ మంచిగుణాలే ఉండవు. ఏమనిషీ జీవితానికి సంబంధించిన ప్రతివిషయంలో సఫలురు కాలేదు. ప్రతివ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి. వాస్తవానికి జీవితమంటేనే లాభనష్టాలు, మంచి చెడ్డలు, సుఖదుఃఖాలు, ఎగుడు దిగుళ్ళు, అనుకూల, ప్రతికూల సమాహారం. ప్రతికూలత కూడా జీవితంలో భాగమని, మనం దాన్ని ఉన్నదున్నట్లుగా గుర్తించి, సానుకూలంగా ఆలోచించాలని స్పష్టంచేయడం రచయిత కర్తవ్యం,

ఒకే సంఘటనను ఇద్దరు విభిన్న వ్యక్తులు, రెండు విభిన్న కోణాలనుంచి పరిశీలించవచ్చు. అందరికీ సంబంధించిన సమస్యలపట్ల నా నిజమైన భావాలను నా కాలమ్‌లో వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాను. నా గొప్పను ప్రదర్శించుకోవడమో, వ్యక్తిగత గొడవలను చిత్రించడమో నా అభిమతం కాదు. ఒక సంఘటనను వివరించి, పాఠకులలో ఆలోచనను రేకెత్తించాలని అభిలషించాను. పాఠకులు ఎవరి అనుభవాలను బిట్టివారు ఆలోచించుకొంటారని భావించాను. పాఠకుల నుంచి అందే నిష్పాక్షిక అభిప్రాయాలు, నేను ఆలోచించడానికి, నా కాలమ్‌ను మరింత మెరుగ్గా రాయడానికి దోహదం చేస్తాయి. నాకెంతో ఉత్తేజం కలిగిస్తాయి.

220 జ్ఞానం - వరిజ్ఞానం

రచనల ద్వారా వచ్చే డబ్బుకోసమో, కీర్తి ప్రతిష్టలకోసమో నేను రాయడం లేదు. ప్రజలను కటుసుకొనడంలో, వారిని అర్థంచేసుకొనడంలో, జీవితమంటే ఏమిటో గ్రహించడంలో నేను ఆర్జించిన అపారమైన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలన్న కోరికే నాచేత రాయిస్తోంది. అనేక సందర్భాలలో జనం అత్యాశ, అసూయవంటి భావోద్వేగాలకు లోనైపోయి, తటాలున తప్పులు చేసేస్తుంటారు. అందుకని వారిని దుర్మార్గులుగా భావించలేం. ఇవికూడా మానవ లక్షణాలే.

అందువల్ల, నా (ప్రేరణకు పాఠకులే ఆధారం. ఇదే నా విశ్వాసం.

వగ అసల

త్‌? నోబెల్‌ బహుమతి

కృథవల నేను కిందటి శతాఇపు ఆలోచనలలోకెల్ల గొప్పదైన - మనజాతిపిత మహాత్మాగాంధీ ప్రవచించి, ఆచరించిన అహింసా సిద్ధాంతం గురించి ఒక కాలమ్‌ రాశాను. అహింసా సిద్ధాంతాన్ని అనుసరించి ముగ్గురు వ్యక్తులు - మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, నెల్సన్‌ మందేలా, మైన్మార్‌కు చెందిన ఆంగ్‌సాన్‌ సూకీ శాంతికోసం కృషి చేసినందుకుగాను నోబెల్‌ బహుమతి పొందారు. ముఖ్యంగా మార్చిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ నార్వే రాజధాని ఓస్తోలో నోబెల్‌ శాంతి బహుమతిని స్వీకరించినప్పుడు మహాత్మాగాంధీని కీర్తించారు. హింసకు ఆలవాలమైన అమెరికాలోతాను అహింసా మార్గాన్నే అనుసరిస్తానని ప్రకటించారు. అయితే విచిత్రంగా, శాంతి కృషికి ఇచ్చే నోబెల్‌ బహుమతి గాంధీజీకే రాలేదు.

నా కాలమ్‌ చదివి “నోబెల్‌ బహుమతి డైనమైట్‌ (శులుడు మందు) కనిపెట్టిన వ్యక్తి ఏర్పాటు చేసిందేకదా! గాంధీజీకి ఆ ఐహుమతి రాకపోవడమే మంచిదైంది” అని ఒక పాఠకుడు వ్యంగ్యంగా రాశారు.

ఆల్రైడ్‌నోబెల్‌ గురించి ఎలా ఆలోచిస్తారో చూడండి. బహుశా యావత్‌ ప్రపంచాన్ని తనదిగా భావించిన మొదటి పరోపకారి ఆయనే కావచ్చు. నోబెల్‌ బహుమతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయిస్తారు. గడచిన వందేళ్ళలో ఏడు వందలమందికి నోబుల్‌ బహుమతులు (ప్రదానం చేసారు. విల్లును 1896లోనే రాసినప్పటికీ మొదటి విడత బహుమతులు 1901లో ఇచ్చారు. శతాబ్దకాలంలో స్వీడన్‌ దేశస్థులలో అతికొద్దిమంది మాత్రమే ఈ బహుమతి పొందగలిగారు. నోబెల్‌ జీవితకాలంలో ఎన్నడూ ఈ బహుమతులు ఇవ్వలేదు. నోబెల్‌ బహుమతి [గగ్రహీతలను ఇంచుమించు (ప్రపంచమంతటా గౌరవిస్తారు.

నోబెల్‌ గొప్పతనమేమిటి? అంటూ ఒక పాఠకుడు అడిగిన ప్రశ్న నేను నోబుల్‌ బహుమతి గురించి ఇదంతా రాయడానికి కారణమైంది.

నోబెల్‌ ఆరోజుల్లో సుమారు ముప్ప్ఫైలక్షల డాలర్ల విలువచేసే తన యావదాస్తినీ దానం చేయడానికి కారణమేమిటి? ఆయన తన అపార సంపదను బంధువులకో, ఏ మతసంస్థకో లేకపోతే తన దేశప్రజలకో ఇచ్చిఉందొచ్చు. అలో చేయకుండా, సాహిత్యం, శాంతి, భౌతికశాస్త్రం, రసాయన శాస్తం, వైద్యరంగాల్లో చేసిన కృషికి బహుమతులు ఇచ్చే ఏర్పాటు చేయాలని ఆయన ఎందుకు సంకల్పించారు? డైనమైట్‌ ద్వారా డబ్బు ఆర్జించినప్పుటికీ, ఆయనను యుద్ధపిపాసిగా అభివర్జించలేము.

22 జ్ఞానం = వరిజ్ఞానం

వంటింట్లో కత్తి అత్యవసరమైందే, అయితే అదేకత్తి ప్రాణాలు తీసే భయంకరమైన ఆయుధంకూడా కాగలదు. దాని ఉపయోగం అది ఎవరిచేతిలో ఉందన్న దానిమీద ఆధారపడిఉంటుంది. నోబెల్‌ డైనమైట్‌ కనిపెట్టినందుకు పశ్చిమ యూరప్‌, అమెరికా దేశాలు ఆయనకు రుణపడిఉన్నాయి. పర్వాతాలను తొలిచి, సొరంగాలు ఏర్పరచి, రైలు మార్గాలు నిర్మించడానికి డైనమైట్‌ ఉపయోగపడింది. రైలు మార్గాలు ప్రజలకు ప్రయాణ సదుపాయం కల్పించాయి. ఆ మార్గాలను ఎవరైనా యుద్దానికి ఉపయోగిస్తే అది నోబెల్‌ తప్పుకాదు.

నోబెల్‌ ఎన్నడూ ప్రచారంకోరుకున్నట్లులేదు. నోబెల్‌ మ్యూజియంలో ఆయన ఫొటోలు చాలా కొద్దిగానే ఉన్నాయి. ఆయనగొప్ప కార్యసాధకుడు. వ్యాపారం, పరోపకారం, ఏపనినైనా ఎంతో బాగా చేసారు.

వ్యక్తిగా నోబెల్‌ బిడియస్సుడు, శాంతి ప్రియుడు. ఇందుకు ఆయన విల్లే నిదర్శనం. “మానవాళి వికాసానికి ఏమిచేసినా గౌరవించాలి. బహుమతులివ్వాలి. అప్పుడే ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు లేకుండా తమ లక్ష్యాలను సాధించగలుగుతారు” అని ఆయన స్పష్టంగా రాశారు.

నోబెల్‌ బహుమతిని ముఖ్యంగా సైన్సులో చాలా కొద్దిమంది మహిళలకే ఇచ్చారనేది గమనార్హం. మహిళల విద్యను ప్రోత్సహించే దేశాలు చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. మహుమతులు అమెరికన్లు, యూరోపియన్లే ఎక్కువగా కైవసం చేసుకొంటున్నారు. సైన్సులో పరిశోధనలకు కావలసిన ఖరీదైన ప్రాథమిక సదుపాయాలన్నీ ఆదేశాల్లో ఉండడంవల్ల వరుసగా వారే బహుమతులు తెచ్చుకొంటున్నారు.

నోబెల్‌ బహుమతిని నిర్దేశిత రంగంలో ్రతివటా ఇవ్వాల్సిన అవసరంలేదు, అలాంటి నియమంలేదు. ఒక ఏడాది తగిన అభ్యర్థిలేడని నోబెల్‌ కమిటీ భావిస్తే ఆరంగంలో బహుమతి ఉండదు. ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత జీన్‌పాల్‌ సాగ్‌ నోబెల్‌ బహుమతిని తిరస్కరించారు. రసాయన శాస్త్రంలో మేడమ్‌క్యూరీకి రెండుసార్లు, ఆమె కుమార్తె ఇరైనీకు ఒకసారి బహుమతి ఇచ్చారు. మరో కుమార్తె ఇవా కూడా “యునెస్కో ప్రతినిధిగా నోబెల్‌ బహుమతిని అందుకొన్నారు. మహుశా ఒకే కుటుంబంలోని అందరు సభ్యులూ నోబెల్‌ బహుమతి స్వీకరించిన ఉదంతం ఇదొక్కటే కావచ్చు.

మానవాళికి సహాయం చేసే సంప్రదాయాన్ని నోబెల్‌ ప్రారంభించారు. ఆ తర్వాతనే 1910 ఆరంభంలో రాక్‌ఫెల్లర్‌, ఆ పిదప ఫోర్ట్‌ తమ ఫౌండేషన్లను ప్రారంభించారు.

'ప్రంవచ వ్యాప్తంగా నేడు అనేక రకాల కార్యకలాపాలకు ఎన్నెన్నో బహుమతులున్నాయి. అయితే అవేవీ నోబెల్‌ బహుమతికి సాటిరావు. నోబెల్‌ తన దాతృత్వం ద్వారా చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయారు. శాంతి ప్రియత్వానికి, మానవాళి అభ్యున్నతిపట్ల (శ్రద్ధకు ఆయనను ప్రతీకగా పరిగణించాలి.

క

తికి పెళ్ళకాని తల్లులు ళల కొ న్ని సంవత్సరాలకిందట నేను విద్యార్ధులకు కౌన్సెలర్‌ (సలహాదారు) గా వ్యవహరించాను. ఆ సమయంలోనే టీనేజర్ల-ముఖ్యంగా బాలికల సమస్యల గురించి తెలుసుకో గలిగాను. సాధారణంగా బాలికలు బిడియంగా ఉంటారు. నా విద్యార్థుల్లో సుమతి అనే అమ్మాయి పెళ్ళికి ముందే గర్భందాల్చింది. ఆ కుర్రాడు ఆమెక్తాస్‌మేటే కానీ, అతనికి ఆమెను పెళ్ళిచేసుకొనే ధైర్యంలేదు. సుమతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వాళ్ళు కంగారుపడిపోయారు. వాళ్ళు నన్ను కలిసినప్పుడు మొట్టమొదట చెప్పిందేమిటంటే “ఇతరులేమనుకుంటారు? సమాజాన్ని మేమెలా ఎదుర్మోవాలి?” అని. అబ్బాయి తల్లిదండ్రులు ఈ పెళ్ళికి సిద్ధంగా లేరు. చివరకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నా మనసు బాధతో మూల్గింది. నిస్సహాయంగా దిక్కులు చూశాను. మొదటిసారిగా నాకు మనసమాజంలో పెళ్ళికాని తల్లుల సమస్యలు తేటతెల్లంగా తెలిసి వచ్చాయి పెద్దపెద్ద మాటలు చెప్పడం సులభమే కాని, నిజజీవితంలో బాలికమీద, ఆమె కుటుంబం మీద ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఇటీవల నేను నార్వేను సందర్శించాను. నా నార్వీజియన్‌ (ఫఫెంద్‌ మార్తా నన్ను వాళ్ళింటికి భోజనానికి పిలుచుకెళ్ళింది. వారిది సాధారణమైన మధ్యతరగతి కుటుంబం, టీచర్లుగా పనిచేసే తల్లిదండ్రులకు మార్తా ఒకర్తే కుమార్తె. ఆమెకూడా హైస్కుల్లో టీచర్‌గా పనిచేస్తోంది. | అది వేసవికాలం. రాత్రి 8.00 గంటలైంది. సూర్యుడు మధ్యాహ్నం రెండు గంటలప్పటిలాగా మండిపోతున్నాడు. అందుకే నార్వేను “అర్ధరాత్రి సూర్యుడిదేశం' గా పిలుస్తారు. ఇల్లు నిరాడంబరంగా, శుభ్రంగా తళతళలాండుతోంది. అందరికీ ఇంగ్రీషు తెలుసు కనుక నాకెంతో మేలైంది. బల్లదగ్గర సాధారణ శాకాహార భోజనం వడ్డించారు. ఇంతలో ఒక అయిదేళ్ళ బాలుడు పరిగెత్తుకుంటూవచ్చి మారాను గట్టిగా కావిలించుకున్నాదు. చాలా కొంటె కుర్రాడే అయినా అమాయకంగా, ముచ్చటగా కనిపించాడు. నాపక్కనే ఒక ఎత్తుగాఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కాసేపయాక మార్తా కజిన్‌ మేరీవచ్చి మాతోపాటే భోజనానికి కూర్చుంది. అప్పుడోమాట ఇప్పుడోమాట మాట్లాడుకొన్నాం.

224 జ్ఞానం - పరిజ్ఞానం

మేరీ రాజకీయ శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థిని. నేనామెతో నార్వేలో రాజకీయ పరిస్థితులు గురించి మాట్లాడుతుంటే. ఆ చిన్న ఫిల్లవాడు మేరీస్కర్చు గుంజి “మామ్‌, నాకు ఇంకొంచెం బెడ్డు కావాలి” అన్నాడు. ఆమాటతో ఆశ్చర్యపోయాను. మేది సుమారు 24 ఏళ్ళ యువతి. ఇంత కుమారుడుందేంత వయసుకాదు. మాటల మధ్యలో మేరీని మీభర్త ఎక్కడ పనిచేస్తున్నాడని అడిగాను. ఆమె ఎలాంటి అపరాధభావంకానీ, బీడియం కానీ లేక్షుండా “నాకు పెళ్ళికాలేదు కానీ, జాన్‌ నాకుమారుడే. నేను పెళ్ళికాని తల్లిని” అని సమాధానమిచ్చింది.

భోజనం అయిన తర్వాత, మార్తా నన్ను వదిలిపెట్టడానికి వచ్చింది. నా కుతూహలాన్ని అణచుకోలేక పోయాను.

  • “మార్తా, మీరేమీ అనుకోకపోతే చెప్పండి. మేరీ సుఖంగా ఉందా? ఆమె తల్లితంద్రులే ఏమను కుంటున్నారు? కుర్రాడి తండ్రి ఎక్కడున్నాడు? మాదేశంలోని ఒక విద్యార్థికారణంగా అదుగుతున్నా అన్నాను.

అమెకు సుమతి కథంతా చెప్పాను. ఆ విషాదగాథవిని మార్తా బాధపడింది. “మేరీ డేనియల్‌ను ఒక వేసవి శిబిరంలో కలిసింది. వాళ్ళిద్దరూ అప్పుడు కేవలం పద్దెనిమిదేళ్ళ పసివాళ్ళు. మా ఇంటికి తరచుగా వచ్చేవాడు. వాళ్ళు ప్రేమలోపడితే, మేరీ పొరపాటున గర్భందాల్చింది. మాకు స్మూల్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నా పొరపాట్లు జరుగుతాయి. మేరీ గర్భవతి అయినప్పుడు దేనియల్‌ కాలేజీలో ఉన్నాడు. అందువల్ల పెళ్ళిచేసుకోదలచలేదన్నాదడు. అంతేకాక, ఈలోగా, తమ స్వభావాలు వేరుగా ఉన్నట్లు (గ్రహించారు. వాళ్ళొకవేళ పెళ్ళి చేసుకొన్నా. విడాకులతో ముగిసేది. విడిపోదామని నిర్ణయించుకొన్నారు. మేరీ తన గర్భాన్ని నిలుపు కోవచ్చనుకొంది. గర్భస్రావం చేయించుకోవడం ఆమెకు ఇష్టంలేదు. మగబిడ్డను ప్రసవించింది. ఏడాదిపాటు పెంచి ఇప్పుడు మళ్ళీ కాలేజీకి వెళ్తోంది. బహుశా వచ్చే ఏడాది కొత్త బాయ్‌(ఫ్రెండును పెళ్ళీచేసుకోవచ్చు. * నాకు అడగదానికి వేలకొద్దీ ప్రశ్నలున్నాయి. మేరీ తల్లితండ్రులు ఏమన్నారు? జాన్‌కు తన తండ్రితెలుసా? డేనియల్‌ ఎక్కడున్నాడు... వగైరా, మార్తా నా ఆసక్తిని కనిపెట్టిందేమో, అందుకే వివరించింది. “అది మేఠి నిర్ణయం కాబట్టి మా పిన్నీ బాబాయి కలతచెందలేదు. మాదేశంలో పెళ్ళికాని తల్లులు అనేకమంది ఉన్నారు. డేనియల్‌ బాబు పోషణకు డబ్బు చెల్లిస్తున్నాడు. అతనూ కొత్తసంవత్సరంలో తన గర్ల్‌[్రెండును పెళ్ళిచేసుకోవచ్చు. ఆ సంగతి జాన్‌కు తెలుసు. డేనియల్‌ మీద మేరీకి కోపమేమీలేదు.”

ఇదంతా నేను నమ్మలేకపోయాను. ఇక్కడో మనిషి పెళ్ళిచేసుకోకుండా కౌడుకును

  • కని ఆ విషయాన్ని జంకూగొంకూ లేకుండా చెప్పుకొంటోంది. కుటుంబం కూడా ఆ సంతానాన్ని అక్కున చేర్చుకొంది. ఇదే పరిస్థితి బహుతా ఇంతే వయసుకానీ దృశ్యంవేరు. మేరీ ధైర్యంగా, సంతోషంగా ఉంటే, పాపం సుమతి చనిపోయింది.

వ్ణ్థు

తప వరుడు కావలెను కౌంం ఎవంకోసమూ ఆగదు. మనమెవరం ఆపలేం. పాతికేళ్ళ క్రితం మేం మా మిత్రుల వివాహాలకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేమో వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు వాజరవుతున్నాం. కొద్దిరోజుల కిందట వాణి పెళ్ళికి వెళ్ళాను. వాణి నాఫ్రెండ్‌వనిత కూతురు. వనిత పెళ్ళికి హాజరు కావడం నాకింకా బాగా గుర్తుంది. అమెపెళ్ళి ముప్ఫెఏళ్ళ క్రిందట అద్వర్టయిజ్‌మెంట్‌ ద్వారా సెటిలైంది. వాళ్ళ నాన్న “ది హిందూ' పట్రిక మ్యాట్రిమోనియల్‌ కాలమ్‌ (వివాహ ప్రకటనలు) లో 'వరుడు కావలెను” శీర్షిక కింద వనిత వివరాలు తెలియజేస్తూ ఒక ప్రకటన వేయించారు. వచ్చిన సంబంధాల్లో నచ్చిన సంబంధాన్ని కుదిర్చేశారు. వివాహ ప్రకటనలు ఆ రోజుల్లో చాలా కొత్త. పెద్దలు స్వయంగా తిరిగి వారినీ, వీరినీ వాకబుచేసి వెళ్ళిచూసి, మాట్లాడి సంబంధాలు కుదుర్చుకొనేవారు. బంధువులు, మిత్రులు కాక పెళ్ళిళ్ళ పేరయ్యలు కూడా సంబంధాలు చూసిపెట్టేవారు. ఇక విధిలేని పరిస్థితుల్లో ఆఖరి ప్రయత్నంగా పేపర్లో ప్రకటన ఇచ్చేవారు. వనిత పొడగరి అమ్మాయి. అందువల్ల బంధువుల్లో ఆమెకంటె ఎక్కువఎత్తున్న అబ్బాయిని పట్టుకోవడం సులభం కాదు. ఇక లాభంలేదని వాళ్ళ నాన్నగారు అడ్వర్ణయిజ్‌మెంట్‌ వేయించాల్సి వచ్చింది. ఆ అద్వర్టయిజ్‌మెంట్‌ కూడా నాకు జ్ఞాపకం ఉంది. “సాంప్రదాయిక కుటుంబానికి చెందిన 24 ఏళ్ళ పొడగరి బాలికకు వివాహ ప్రతిపాదనలను ఆవ్వోనిస్తున్నాం. స్మార్త ఆశ్రేయ గోభ్రం అశ్వినీ నక్షత్రం, ప్రథమపాదం. బాలిక కామర్స్‌లో పట్టభద్రురాలు, బ్యాంకు ఉద్యోగిని, ఇంటిపనులు తెలుసు, ఉమ్మడి కుటుంబంలో అద్భుతంగా రాణించగలదు, పెళ్ళితర్వాత ఉద్యోగంలో కొనసాగడానికైనా, ఉద్యోగం వదిలి ఇల్లు చూసుకోడానికైనా సిద్ధం. ఎంబ్రాయిడరీ, కుట్టుపని తెలుసు. 29 నుంచి 84 ఏళ్ళలోపు వయసుకల, ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలకు మించిఉన్ను ఇదేకులానికి చెందిన వరులు, తమ తల్లితండ్రులద్వారా మాత్రమే దరఖాస్తులు పంపాలి. జాతకాలు జతపరచాలి. మంచి కుటుంబానికి చెందినవారై ఉండవలెను. వరుడు కనీసం పట్టఐబద్రుడై ఉండవలెను. బ్యాంకు/ప్రభుత్వరంగంలో పనిచేస్తుంటే మంచిది. వివాహం సముచిత రీతిలో చేయడానికి హామీ ఇవ్వబడుతున్నది. బాక్స్‌ నంబర్‌: ౨౦౮౯ కు దరఖాస్తు చేయండి”.

226 జ్ఞానం - విజ్ఞానం

వనితకు ప్రభుత్వరంగ సంస్థలో పనిచేస్తున్న ఇంజనీర్‌ భర్త దొరికాడు. వనితకులానికే చెందిన, ఉమ్మడి కుటుంబం వ్యక్తి. ఆమె మామగారు ఇరవైతులాల బంగారం, అయిదు పట్టుచీరలు, వరుడికి ఒకసూటు, మొత్తం పెళ్ళిబ్బందానికి రాను,పోను బస్సుఛార్జీలు అడిగాడు. మూడు రోజుల సంప్రదాయ వివాహం జరిపించాలన్నాడు. వనితకుటుంబానికి ఇదంతా భారమైనా ఒప్పుకొన్నారు.

వివాహసన్నాహాలంటే చాలా (శ్రమతోకూడిన వ్యవహారం. అనేక రోజులు వేరేపని చేయలేరు. మాబ్బందంలో పెళ్ళిచేసుకుంటున్న మొదటి అమ్మాయి వనితే కాబట్టి, మేంకూడా పెళ్ళివర్పాట్లలో పాల్గొన్నాం. ఆమెతోవెళ్ళి చీరలు, నగలు ఎంపికచేశాం. వంటవాళ్ళను కుదర్చడం, స్వీట్లు తయారుచేయించడంలాంటి పనులు పెద్దవాళ్ళు చూసుకున్నారు.

ఇప్పుడు అనేక ఏళ్ళ తర్వాత వనిత కూతురు పెళ్ళి. విందు సమయంలో కొత్త దంపతులు వాణి, ఆమెభర్త, చాలా కాలంగా ఒకరికొకరు తెలిసిన వాళ్ళలా, నవ్వుతూ కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు. విందులో వడ్డన పనులన్నీ క్యాటరర్లు చేస్తున్నారు. వనితవచ్చి నాపక్కనే కూర్చుంది. అలసిపోయినా, చాలా సంతోషంగా ఉంది.

నాకు వనిత పెళ్ళిరోజులు గుర్తొచ్చాయి. ఆ పెళ్ళి వివరాలన్నీ నాకు తెలుసు. ఈ పెళ్ళి హఠాత్తుగా ఏర్పాటయింది. అందుకని వివరాలు అడిగాను.

వనిత చిరునవ్వు నవ్వి “ఇదీ నా పెళ్ళిలానే “ది హిందూ' ఆదివారం సంచిక మ్యాట్రిమోనియల్‌ కాలమ్‌లో ప్రకటిస్తే కుదిరింది. అయితే ప్రకటన తీరువేరు.”

మే నెలకదా, చాలావేడిగా ఉంది. వనిత పట్టుచీరకొంగుతో చెమట తుడుచుకొంటూ, పర్సుతెరచి పేపర్‌కటింగ్‌ చూపించింది. “దీన్ని వాణిపెళ్ళి ఫోటోల ఆల్బంలో అతికిస్తాను.” అంది.

ప్రకటన చదివాను “ఆధునిక కుటుంబానికి చెంది, విదేశాలకు వెళ్ళడానికి మొగ్గుచూపుతున్న చురుగ్గా, నాజూకుగా అందంగా ఉన్న 22 ఏళ్ళ పాష్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అమ్మాయికి వివాహహ్రతిపాదనలు కోరబడుతున్నవి. బాలిక కాన్వెంట్‌లో చదివింది. చిన్నకుటుంబాన్ని ఇష్టపడుతుంది. కలుపుగోలు వ్యక్తి. కరాటే బ్లాక్‌బెల్ట్‌. పాశ్చాత్యసంగీతం, పర్యటన ఇష్టం. 22-25 ఏళ్ళలోపు చక్కని అబ్బాయిలు దరఖాస్తు పంపవచ్చు. మంచి పరిచయాలు, సంబంధాలు కలిగి ఉద్యోగంలో స్థిరపడి ఉండాలి. సాష్ట్‌వేర/ఎం.యన్‌.సి అయితే మంచిది. చిన్న కుటుంబానికి చెంది ఉండాలి. వరులు నేరుగా దరఖాస్తు చేయవచ్చు. జాతకాలు అవసరంలేదు. కులంతో నిమిత్తంలేదు”.

కుమార్తె పెళ్ళి వారం రోజుల్లో ఎలా నిశ్చయమై పోయిందో వనిత వివరించింది.

ఉద్రిక్తత, ఒత్తిడి, చిక్కులేమీలేవు. ఎక్కడెక్కడి నుంచో సుమారు వంద దరఖాస్తులు వస్తే, వాటిలోంచి వాణి అయిదింటిని మాత్రం ఎన్నిక చేసింది. అయిదుగురు

నరుడు కానలెను 727 అబ్బాయిలనూ వేర్వేరుగా పిలిపించి కలిసింది. వారిలో ఇద్దరికి ఆమె నచ్చలేదు. మరో ఇద్దరు ఆమెకు నచ్చలేదు. తుది ఎన్నిక అలా జరిగిపోయింది. ఆ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వాణి కాలేజీలో చివరి సంవత్సరంలో ఉండగానే పాస్‌పోర్టు సిద్ధంచేసుకొంది. ఆమె కెమికల్‌ ఇంజనీర్‌ అయినా, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు గిరాకి ఉందని తెలుసు కాబట్టి అవసరమైన శిక్షణ పొందింది. సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలోకూడా చేరిపోయి పనిచేస్తోంది. ఈత, ఎయిరోబిక్స్‌ (వ్యాయామం) నేర్చుకుంది. న్యూట్రిషన్‌ (పౌష్టికాహారం), డైట్‌ (సాధారణ ఆహారం) గురించి కూడా అధ్యయనం చేసింది. .

అమెరికా వెళ్లోంది కదా, అందుకని, ఆమెకు వంటచేయడం వచ్చా అని అడిగాను.

“రావలసిన అవసరం లేదు. అయితే పాొస్టా, సూప్‌, న్యూడిల్స్‌, పిజ్జాలు చేయడం వచ్చు. రాకపోయినా ఫరవాలేదు. వాడకానికి సిద్ధంగా ఉండే మిశ్రమాలు (రెడీ-టు- యూజ్‌ మిక్సెస్‌) మార్కెట్లో దండిగా దొరుకుతాయి. వాటితో వంటిల్లు నడిపేస్తుంది”.

_ “నగలు, చీరలు దండిగా కొన్నావా?”

“లేదు ఈ రోజుల్లో వరుడి పెద్దలు నగలూ, కట్నాలు ఆడగడంలేదు. వాటి బదులు పెళ్ళికుమార్తె మొదటి విమాన ప్రయాణానికయ్యే ఖర్చు మాత్రం అడుగుతారు. అసలు నాకూతురికే ఎక్కువ చీరలు కొనడం ఇష్టంలేదు. చీరలు అట్టే వాడదు. డబ్బు దండుగని రెండే చీరలు కొనుక్కొంది. ఎక్కువగా ఉపయోగపడతాయని ఆరు సల్వార్‌ కమీజ్‌ సెట్లు, పదిసెట్ల వెస్టర్న్‌ (పాశ్చాత్య) దుస్తులు కొనుక్కొంది”

రోజులు ఎలా మారిపోయాయో అని ఆశ్చర్యపడ్డాను. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళలో కూడా మార్పులు వచ్చినట్లు, పత్రికల్లో వచ్చే వివాహహ్రకటనలు చదివినా తెలిసిపోతుంది. జీవితంలో మార్పు తప్పదు, అవసరం కూడా. ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తులు పరిస్థితులను బట్టి మారడం సహజం. మార్చుతప్ప మరేదీ స్థిరంకాదనే మాట నిజమేకదా మరి!

లో కః

త్త౦ి మెప్పించిన అభ్యర్ది వం ఒకచిన్న సంస్థకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నియామకానికి ఏర్పాటుచేసిన సెలెక్ట్‌ కమిటీలో పనిచేసాను. ఇంటర్వ్యూలో అనేకమంది నవయువకులు, యువతులు వచ్చి తమవంతు కోసం ఆదుర్దాగా నిరీక్షిస్తున్నారు. వాళ్ళందరూ 21 నుంచి 24 ఏళ్ళ వయసులో ఉన్నారు. వారిలో చాలామందికి అదే మొదటి ఇంటర్వ్యూ కావచ్చు. అందుకని ఉద్విగ్నంగా కనిపించారు. అందరూ కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్లే కనుక వారి సాంకేతిక పరిజ్ఞానం సౌస్టవంగా ఉంటుందనడంలో నాకేమీ సందేహంలేదు. అదొక కుర్రాడి వంతు. అతని ప్రవర్తన మంచి మర్యాదగా, హుందాగా ఉంది. గదిలోకి రాగానే తన సర్టిఫికెట్లు అందజేశాడు. అన్నిటికంటె పైనున్న సర్టిఫికెట్‌ జావా, జి.డబ్బు. బేసిక్స్‌ సి++ మొదలైన వాటిలో అతని పరిజ్ఞానాన్ని ధృవీకరిస్తోంది. కొత్త కంప్యూటర్‌ భాష నేర్చుకోడానికి నీకు ఎంతకాలం పడుతుందని యథాలాపంగా అడిగాను. “అర్నల్లకన్నా ఎక్కువ పట్టదు” అని జవాబు చెప్పాడు. హఠాత్తుగా నా ఆలోచనలు పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాయి. అప్పుడు ఇదే వయసు యువకుని ఇలాంటి సందర్భంలోనే కలిశాను. ఇలాంటి ప్రశ్నే అడిగాను. అయితే అప్పుడొచ్చిన సమాధానం వేరు. అప్పుడు కలిసిన యువకుడు “కంప్యూటర్‌ గురించి కానీ వాటి భాష గురించి కానీ నాకేమీ తెలియదు. అయతే నాకు నాలుగు నెలలు టైమివ్వండి. కంప్యూటర్ల గురించి అర్ధంచేసుకోడానికి ప్రయత్నిస్తాను. అప్పుడొచ్చి వాటి భాష నేర్చుకొనడానికి ఎంతకాలం పడుతుందో చెప్తాను” అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. అతని ఆత్మవిశ్వాసం, నిజాయితీ నన్ను అబ్బురపరచింది. ఆ మొత్తం దృశ్యం ఇప్పటికీ నాస్మృతి పథంలో మెదలుతోంది. అది ముంబాయిలో జరిగింది. నేను ఇంటర్వ్యూ చేసేవారిలో ఉన్నప్పుడు, ప్రధానంగా సివిల్‌ ఇంజనీర్‌ అయిన ఆ యువకుడు ఇంటర్వ్యూకు వచ్చాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగంకోసం ఇంటర్వ్యూ చేస్తున్నాం. చాలామంది సంతృప్తికరంగా సమాధానాలిచ్చారు. అతను చివరి అభ్యర్థి. ఇంటర్వ్యూ గదిలోకి చాలా స్పష్టమైన

మెవ్చుంచిన అభ్బర్ధి 720 ఆలోచనతో వచ్చి, సూటిగా సమాధానాలిచ్చాడు. కంప్యూటర్లతో సంబంధంలేని తర్మశాస్త్రానికి సంబంధించిన ఒక సమస్య ఇస్తే క్షణాల్లో పరిష్కరించాడు. తాను కంప్యూటర్‌ జ్ఞానంఉన్న వ్యక్తినికాదని చాలా స్పష్టంగా తెలియజేసాడు. అయితే నేర్చుకొనడానికి సంసిద్ధత ప్రకటించాడు. తాను అర్హుడని తేలితే, ఉద్యోగం ఇస్తారని ఆశించాడు.

అతనికి ఉద్యోగం వచ్చింది. నిర్విరామంగా కృషిచేసి, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని నేర్చుకుని వచ్చి “వభాషయినా సూచించండి, పదిరోజుల్లో నేర్చుకుంటాను. దానిలో నైపుణ్యం సాధిస్తాను. కంప్యూటర్‌ భాష కేవలం ఒక సాధనం. “ప్రోగ్రామింగ్‌ సారమంతా లాజిక్‌ (తర్మశాస్తం) లో ఉంది. మంచి లాజిక్‌ అవసరం. అందులో నేను ప్రావీణ్యం సాధించాను” అన్నాడు.

కొంతకాలానికి అతను నిజంగానే అనేక భాషల్లో నైపుణ్యం సాధించి, అత్యంత సమర్థులైన ప్రోగ్రామర్లలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అతను జూనియర్‌ అయినప్పటికీ, నాతోసహా చాలా మంది సీనియర్లు అతని అభిప్రాయాన్ని అడిగేవాళ్ళం. కంప్యూటర్‌ సిస్టంమీద కంటే, డస్ముమీదే హోంవర్క్‌ ఎక్కువగా చేసేవాడు. ప్రోగ్రామింగ్‌ ప్రారంభించాడంటే, ఇక అందులో ఒక్కలోపం కూడా ఉండేదికాదు. పనిలో అతని శ్రద్ధచూసి ముచ్చటపడేవాళ్ళం.

నేటికీ ఎవరైనా కంప్యూటర్ల గురించి మాట్లాడితే, ఆయువకుడు గుర్తుకొస్తాడు. నేర్చుకొనడానికి సంసిద్ధతను ప్రకటించి, నిజాన్ని, నిజాయితీగా వెల్లడించి, అతను మమ్మల్ని మెప్పించిన తీరు ఎన్నటికీ మరపురాదు. మనకాలేజీలన్నీ అతనిలాంటి మరెన్నోమంది విద్యార్థులను తయారు చేయాలని కోరుకొంటున్నాను.

ఖ్జు్ణు

క! సారీ, లైను బిజీగా ఉంది

రౌశః. నేనూ న్మూలునుంచి కాలేజీదాకా ఒకే క్లాసులో చదువుకొన్నాం. మాకుటుంబంలో ఒకరిగా అతను, వాళ్ళకుటుంబంలో ఒకరిగా నేను బాగా కలసిపోయాం. తర్వాత పెద్దవాళ్ళమైపోయి, వేర్వేరు వృత్తులు ఎంచుకొని, విడిపోయాం. అన్ని విధాలా స్థిరపడ్డాం. అతని కుటుంబం అతనికి ఉంది. నాకూ సొంత కుటుంబం ఉంది. మా 'ప్రపంచాల్లో మేము నిమగ్నమైపోయాం. ఇద్దరం ఒకే నగరంలోఉన్నాా తరచుగా కలుసుకోవాలని కోరుకొంటున్నా ఎప్పుడోకాని కలవలేకపోతున్నాం.

రాకేష్‌ పుట్టినరోజు నాడు గుర్తొచ్చి, అతనికి శుభాకాంక్షలు తెలపాలనుకొన్నా. కానీ, అతని టెలిఫోన్‌ లైన్లు ఉదయంనుంచీ ఎప్పుడు ప్రయత్నించినా బిజీగానే ఉన్నాయి. అతని జన్మదినంకదా చాలా మంది అభినందిస్తున్నారనుకొన్నా. తర్వాత చూద్దామని, వేరే పనిలో పడ్డాను. తర్వాత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతని లైన్లు బిజీగా ఉన్నాయి. వాళ్ళు ఫోన్లు సరిగా పెటలేదేమోనని అప్పటికా ప్రయత్నం విరమించాను.

రాత్రి బాగా పొద్దుపోయాక ప్రయత్నించినా, లైను దొరకలేదు. ఇక లాభంలేదు, లైన్లు పాడైపోయాయని తీర్మానించుకొన్నాను.

నెలరోజుల తర్వాత రాకేష్‌ ఒకపార్టీలో కలిశాడు.

ఒకడ(ైైండ్‌ వుట్టినరోజున టెలిఫోన్లో అయినా పలకరించలేనంత బిజీ అయిపోయావంటూ, వ్యంగ్యంగా మాట్లాడ్డం మొదలు పెట్టాడు. అతనికి కోపం రావడంలో ఆశ్చర్యంలేదు.

నేను ఫోన్‌చేసినా, అతని లైన్లు పగలు, రాత్రికూడా నిరంతరం బిజీగా ఉన్నాయని నన్ను నేను సమర్ధించుకొన్నాను. అతను విస్తుపోయాడు.

“ఈ రోజుల్లో టెలిఫోన్లను నమ్మలేం. ఎప్పుడూ ఏవో మరమ్మతులుంటాయి. లైన్లెప్తుడూ పనేచేయవు”

ఇంతలో రాకేష్‌ భార్య తార అద్దుతగిలింది.

“అనవసరంగా తప్పంతా టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌మీదకి తోయకండి. అసలు పొరపొటంతా మనింట్లోనే ఉంది”.

సారీ, లైను బిజీగా ఉంది 797 తార ఎప్పుడూ చాలా న్యాయంగా మాట్లాడుతుంది. అందువల్ల ఆమె మాటలు ఆశ్చర్యం కలిగించాయి. “ఇంట్లో ఏదైనా సమస్యా?” అని అడిగాను.

“అవును, మాకు ఇద్దరు టీనేజ్‌ పిల్లలున్నారుకదా. మేము టెలిఫోన్‌ ఎప్పుడు వాడాలని చూసినా, వాళ్ళిద్దరూ ఫోన్లు కిందపెట్టరు. రెండు లైన్లు బిజీగా ఉంటాయి"

ఆమె మాటలు నమ్మలేక “మొత్తం రోజంతానా?” అని అడిగాను.

“అవును, పూర్తిగా రోజంతా! వాళ్ళగదుల్లో సమాంతర లైన్లున్నాయి. భౌతిక సంపద మా మామూలు జీవితాలను చెడగొట్టింది”.

ఆమె చాలా చిరాగ్గా ఉన్నట్లు తెలుస్తూనేఉంది.

“మనందరికీ ఒకరిద్దరు పిల్లలే ఉండడంతో, వాళ్ళను నెత్తికెక్కించుకొంటున్నాం. గారంచేసి పాడుచేస్తున్నాం. నాకూతుర్లను చూడండి. వాళ్ళకు రెండు వేర్వేరు గదులున్నాయి. రెండు టెలిఫోన్లున్నాయి. మనం నీళ్ళువాడినట్లు, వాళ్ళు టెలిఫోన్లు వాడుతారు”.

నాలెక్కల బుద్ధి ఎక్కడికి పోతుంది? “మీ టెలిఫోన్‌ బిల్లులు ఎలావస్తున్నాయి”

“టెలిఫోన్‌ బిల్లుల గురించి ఎవరు ఆలోచిస్తారు? అది అన్ని కార్పొరేట్‌ సంస్థలూ కల్పించే సదుపాయం అని పిల్లలకు తెలుసు. టెలిఫోన్‌ బిల్లులు కంపెనీ చెల్లిస్తుంది. వాళ్ల ప్రవర్తనకు అది కూడా ముఖ్యకారణమే. వాళ్లు అడ్డూ ఆదుపూ లేకుండా (ఫెండ్స్‌తో మాట్లాడ్తుందడమే నాకు చీకాకు కలిగిస్తోంది. వాళ్ళు లెక్కల సమస్యలు కూడా టెలిఫోన్‌ ద్వారానే పరిష్మరించుకుంటారు. టెలిఫోన్‌లో జోకులు చెప్పుకుంటారు. ఆఖరుకు పుస్తకాలు కూడా ఒకరికొకరు ఫోన్లో చదివి వినిపించుకుంటారు.”

“నిజమా? ఇలాంటివి నేనెప్పుడూ వినలేదే!” అని తన ఇంట్లో ఏమి జరుగుతోందో తెలియని అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు రాకేష్‌ “అవును మామూలుగా వాళ్ళు బిగ్గరగా మాట్లాడుతారు. టెలిఫోన్‌లో మాత్రం గొంతు తగ్గించి ఇంచుమించు గుసగుసల్లా మాట్లాడుతారు. జాగ్రత్తగా వింటేగాని వాళ్ళేమంటున్నారో తెలుసుకోలేం.”

“టెలిఫోన్‌కు తాళమేసేస్తే వమవుతుంది?”” అని సూచించాను.

“దానివల్లేం ఉపయోగంలేదు. అప్పుడు వాళ్ళథ్రెంద్సే ఇంటికి ఫోన్‌ చేస్తారు. టెలిఫోన్‌లైన్లు బిజీగానే ఉండిపోతాయి.”

“రాత్రిపూట ఏంచేన్తారు?”

“మిగతా సమయంలో కంప్యూటర్‌ ద్వారా ముచ్చట్లు తెలుపుకొంటారు. టెలిఫోన్‌ను కంప్యూటర్‌కు తగిలిస్తారు. ఇంక అంతే సంగతులు. మనమేం చెప్పినా వాళ్ళు అర్ధం చేసుకోరు”.

32 జ్ఞానం - వరిజ్ఞానం

తార అంతటితో ఊరుకోలేదు. “అతిగా వాగితే అతి నష్టం తప్పదు. టెలిఫోన్లు కమ్యూనికేషన్‌కు ఉపయోగ పడతాయి. మరి వాటిని అత్యవసర పరిస్థితిలో కూడా వాడుకోలేక పోతే చిరాగ్గా ఉంటుంది. ఒకసారి విసుగొస్తుంది. ఇప్పటి పిల్లలు వారికి అందుబాటులో ఉన్న వనరులను దుర్వినియోగం చేస్తున్నారు. అదికావాలి, ఇదికావాలని పించే వారికోరికలను ఎలా అదుపులో ఉంచుకోవాలో వాళ్ళకు తెలియదు” అని బాధగా నిట్టూర్చు విడుస్తూ ముగించింది.

మనలో అనేకమంది తారలున్నారనడంలో నాకు సందేహంలేదు. రోజులు మారాయి కానీ, తార మాటలు నిజమే. వాళ్ళ పెద్దలు ఎంతో అనుభవంతో సలహాఇస్తారని కొత్తతరం పిల్లలు అర్ధం చేసుకోరు. వాళ్ళు తామే తల్లిదండ్రులైనప్పుడు గానీ మంచి మాట విలువను ఈ పిల్లలు అర్థం చేసుకోరు. వాళ్ళపిల్లలు తమమాట వినకపోయినప్పుడు మరింత బాగా. అర్థం చేసుకుంటారు.

వైగో ఇన్జీ్లం

తై అ

ఇతరులపట్ల ధర్మంగావ్యవహరించండి మూ పిన్ని నన్నోసారి వాళ్లలేడీస్‌ క్ల్షబ్బుకు పిలుచుకెళ్ళింది. అక్కడోకార్యక్రమానికి నేను అధ్యక్షత వహించాలని కోరింది. సభికులకు ఏఅంశం పట్ల ఆసక్తి ఉంటుందో తెలియదు కనుక, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రసంగించాలంటే ఇబ్బందిగా ఉంటుంది.

మేం క్షబ్బుకు వెళ్ళిన చాలాసేపటికికానీ కార్యక్రమం ప్రారంభం కాలేదు. నిర్యాహకుల మధ్య సమాచార లోపంవల్ల ఆలస్యమైంది. ఈ లోగా నన్ను హాలుపక్క గదిలో కూర్చోబెట్టారు. నేనింక చేసేదేమీలేక చుట్టూరా ఉన్నవారిని పరిశీలిస్తూ కూర్చున్నాను. ఒక పుస్తకం చదవడం కన్నా మనుషుల ప్రవర్తనను గమనించడం ఎక్కువ అసక్తి కరంగా ఉంటుంది. నాకు తరచుగా ఇలాగే అనిపిస్తుంటుంది. లేడీస్‌ క్లబ్బు బెంగుళూరులో సంన్నులు నివసించే ప్రాంతంలో ఉంది. ఆ క్షబ్బునోఉన్నత వర్గీయుల సంస్థగా భావిస్తారు. సభ్యుల్లో చాలా వరకు ఎక్కువ మధ్యతరగతివారే ఉన్నారు. వారంతా జీవితంలో అన్నివిధాల స్థిరపడి, దేశదేశాలు చుట్టివచ్చినవారే. వారు పట్టుచీరలనుంచి, నగరంలో తర్వాత ప్రదర్శించబోయే ఇంగ్లిషు సినిమాదాకా ప్రపంచంలోని సమస్త విషయాలు గురించి మాట్లాడుకుంటున్నారు.

మాపిన్ని ఆమె. (ఫ్రెండ్‌ శాంతతో కబుర్హు పెట్టుకుంది. పిన్ని కాస్త బిగ్గరగా మాట్లాడుతోంది. అందువల్ల నేను వారికి దూరంగా ఉన్నా వాళ్ళ మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

“నిజంగా తప్పంతా నీకోడలిదే” అని పిన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిలాగా తన తీర్చు ప్రకటించేసింది. తన తీర్చు పట్ల ఆమెకు అచంచలమైన విశ్వాసం. దీనికింక తిరుగులేదనుకుంటుంది కానీ, నా అభిప్రాయం తెలుసుకోవాలని నన్ను కూడా వాళ్ళ సంభాషణలోకి దింపింది.

“న్యాయంగా ఆలోచించి చెప్పు. ఆమె అట్లా ప్రవర్తించడం తప్పు కాదంటావా?”

“ఇంతకీ ఎవరామె?”

“శాంతకోడలు రష్మి. ఆమె ఏ బాధ్యతా లేకుండా సుఖంగా బతికేయాలనుకొంటుంది. స్మూళ్ళకు సెలవులొస్తేచాలు, ఏ వివారస్థలానిలకో వెళ్ళి సేదతీరాలనుకౌంటుంది. ఎక్కెడెక్కడో దూరంగా ఉన్న స్థలాలకు వెళ్ళాలంటుంది”.

న! జ్ఞానం - వరిజ్ఞానం

నాకేమీ అర్ధంకాక అయోమయంగా చూసేసరికి, పిన్ని సమస్య పూర్వాపరాలు వివరించడం మొదలుపెట్టింది.

“రష్మి అత్తవారు, అంటే శాంత కుటుంబం మంచి సంపన్న కుటుంబం. వాళ్ళు కష్టపడి సంపాయించి పోగేశారు. రష్మి సాధారణ మధ్యతరగతి కుటుంబంనుంచి వచ్చింది కాన్సీ డబ్బు ఖర్చుపెట్టి సుఖ, సంతోషాలు అనుభవించాలని ప్రయత్నిస్తుంది. ఆమె సంపాయించిందేమీ లేదు కానీ, ఉన్నదంతా ఖర్చుపెట్టేలా ఉంది. ప్రతినెలా కొత్తబట్టలు కొనాల్సిందే. భర్త ఇంటికొస్తేచాలు, సినిమాకో, మరెక్కడికో బయలు దేరదీస్తుంది. ఉదయం ఆలస్యంగా పడక దిగుతుంది...” ఆ జాబితా అలా అనంతంగా సాగుతోంది.

నాకు హఠాత్తుగా నా కజిన్‌ రాధిక గుర్తుకొచ్చింది. రాధిక మరెవరోకాదు. ఈ పిన్ని కూతురే.

రాధికను కూడా సంపన్న వ్యాపారకుటుంబంలో ఇచ్చారు. పెళ్ళికి ముందు రాధిక స్కూలు టీచర్‌గా పనిచేసింది. ఆరోజుల్లో ఆమె బాగా కష్టపడి పనిచేసేది. పెళ్ళితర్వాత,

ఒకసారి మా ఇంటికొచ్చింది. నమ్మలేనంతగా మారిపోయింది. బెలూన్‌లాగా ఊరిపోయింది. చాలా ఖరీదైన చీర ధరించింది. ఒళ్ళంతా నగలు దిగేసుకొంది. రాధిక తన దినచర్యంతా చెప్పుకొచ్చింది. “ఉదయం తొమ్మిదైతేకాని లేవను...”

“ఎందుకంత ఆలస్యం?”

“మాకు ఇంట్లో బోలెడుమంది సేవకులున్నారు. పనంతా వాళ్ళే చూసుకుంటారు. నేను త్వరగాలేచి చేసేదేముంది? పెళ్ళికి ముందు చాలా కష్టపడ్డాను.

“మహేష్‌ చాలా బిజీగా ఉంటాడు. అందుకని అతను ఆఫీసునుంచి వచ్చేదాకా ఆగుతాను. రాగానే, సినిమాకో, షికారుకో వెళ్తాం. నేను ప్రపంచాన్ని అట్టే చూడలేదు. ఇద్దరు పిల్లల్ని ఏడాది ఫాడవునా చూసుకోవడం కష్టమవుతోంది. ఇకమీదట ప్రతి సెలవులకూ విదేశాలకు వెళ్చామని మహేష్‌కు చెప్పాను. స్కూలుకు సెలవులిచ్చినప్పుడు, నేపాల్‌కానీ, శ్రీలంక కానీ పదో ఒక విదేశంలో పర్యటించాలి”.

రాధిక మాటలు గురించి ఆలోచిస్తూ “పిన్నీ ఇంతకూ రాధిక ఎలా ఉంది?” అంటూ ఆమె మాటలకు అద్దుతగిలాను.

“బావుంది. పాపం దానికి ఎంతకష్టమొచ్చిందో! రాధికను అత్తగారు ఎప్పుడూ సతాయిస్తూనే ఉంటుంది. ప్రతిదానికీ దెప్పుతూ ఉంటుంది. రాధికలాంటి కోడలు దొరకడం ఆమె అదృష్టం. ఆమెకు రష్మిలాంటి ఇంకో కోడలుంటే, అప్పుడు తెలిసొచ్చేది నాకూతురు విలువ”.

ఇతరులవట్ల ధర్జంగా వ్యవవారించంటి 735 ఉసూరుమనిపించింది. ఈ పెద్దవాళ్ళు చదువుకొని ఉండీ, నర్సరీ పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. కూతురు ఏంచేసినా సర్రైందే అంటారు. అదేపని కోడలు చేస్తే తప్పంటారు. అసలు ఏం చేసినా తప్పుపడతారు. ఒకరు సొంతకూతురు, అవతలామె ఇంకొకరి కూతురు కదా. అందుకని కొలబద్దలు వేరుగా ఉంటాయి. అంతసేపూ నేను సమావేశంలో దేనిగురించి మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడాలో ఇప్పుడు స్పష్టమైపోయింది. ఇతరులపట్ల ధర్మంగా, న్యాయంగా వ్యవహరించండి అన్న అంశం గురించి ప్రసంగించాలనుకున్నాను. జీవితంలో పెద్దగా ఏమీ సాధించలేకపోయినా, ఇతరులపట్ల ధర్మంగా, న్యాయంగా వ్యవహరిస్తేచాలు. అదేగొప్ప అని మనం [గ్రహించాలి. లో ముస

త్తే జే. బిప్లేరి అనుబంధం

గుం: కచ్‌ప్రాంతంలో జనవరి 26న సంభవించిన విపత్తు గురించి అందరికీ తెలిసిందే. ఆ రోజు భూమాత ముందుగా ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే, ఉన్నప్రాటున నోరుతెరిచి అక్కడి ప్రజలను కబళించి వేసింది. వారి ఇళ్ళు నేల మట్టమయ్యాయి. ఇళ్ళలో ఉండేవన్నీ ధ్వంసమైపోయాయి. సంపన్నులు సైతం క్షణాల్లో ఉన్నదంతా పోగొట్టుకుని వీధుల పాలయ్యారు. అలాంటి దయనీయ పరిస్థితిలో కచ్‌ (ప్రజలు ప్రదర్శించిన నిబ్బరం శ్లాఘనీయం. వాళ్ళాఘోర విపత్తును ధైర్యంగా ఎదుర్శొని, తమ జీవితాలను తిరిగి దారిలో పెట్టుకొనదానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు.

సహాయ, పునరావాస కార్యకలాపాల్లో సమాచార సాధనాలు చేసిన కృషిని అభినందించాలి. ఆ భయానక భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే, అన్ని వార్తాపత్రికలు, టెలివిజన్‌ ఛానెళ్ళు ఆ దుర్వార్తను (ప్రపంచానికంతా తెలియజేశాయి. ప్రజల కడగండ్లను బయటి ప్రపంచం దృష్టికితెస్తూ, తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించడంతో, ఆ దురదృష్టవంతులను ఆదుకొనడానికి ఎక్కదెక్కడివారో వచ్చి రంగంలోకి దిగారు.

టీ.వీ: సిబ్బంది, ఇతర సమాచార సాధనాల ప్రతినిధులు నిష్కమించేలోపునే, (ప్రభుత్వేతర సంస్థల కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగులు గుంపులు గుంపులుగా రాసాగారు. ప్రజలు నెమ్మదిగా కాలూచేయీ కూడదీసుకొని, మళ్ళీ మామూలు పనులు చూసుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రచారం పోరు తగ్గిన కొంతకాలానికి, యధార్థ పరిస్థితులను చూని తెలుసుకోవాలనిపించి గుజరాక్‌ వెళ్ళాను. అప్పటికి భావోద్వేగాలు మందగించి, యధార్థ పరిస్థితులను ఆకళింపు చేసుకొని, చేయగలిగిందేమిటో చేయవలసిన సమయం వచ్చింది.

అహ్మదాబాద్‌-భుజ్‌ (ప్రధాన రహదారికి దూరంగా, బాగా లోతట్టునున్న అనేక (గ్రామాలు భూకంపం తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. దారీతెన్నూ తెలియని ఒక మారుమూల ప్రాంతంలో వెళ్తుంటే, నా జీపు టైర్లలో ఒకటి పగిలిపోయింది. దాన్ని బాగుచేయించి, మళ్ళీ తగిలించాలంటే చాలా సమయం పదుతుంది. మా దైవర్‌ ఆ టైరు తీసుకొని, బాగుచేయించు కొస్తానని వెళ్ళాడు.

ఖిన్తేరి అనుబంధం 97

గుజరాత్‌ రాష్ట్రం, ముఖ్యంగా కచ్‌ ప్రాంతం మహిళలకు భద్రమైన ప్రాంతంగా పేరుపొందింది. ఒంటరిగా గడపలేక బోరుకొట్టింది. దగ్గర్లో కాన్ని టెంట్లు కనిపించాయి. అవన్నీ నీలిరంగు ప్లాస్టికిషీట్లు కప్పి తయారుచేసిన తాత్కాలిక షెడ్లు. ఆ ప్రాంతంలోని బాధితులకు వాటిలో తాత్నాలిక ఇళ్ళు, స్కూళ్ళు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసారు. అలాంటి గుదడారాళల్తో హోటళ్ళు కూడా నడుపుతున్నారని తర్వాత తెలిసింది.

జనం హడావిడిగా తిరుగుతున్నారు. ఎవరి పనులు వారు చూసుకొనే సన్నాహాల్లో ఉన్నారు. వర్షాకాలం కావడంతో ఆడామగా పొలాల్లో పనిచేస్తూ కనిపించారు. విచిత్రంగా అనిపించింది. కచ్‌లో చాలా ఏళ్ళుగా పెద్దగా వర్షాలు పడలేదు. ఈయేడాదే మంచి వర్షం కురిసింది. రైతులకు పంట పుష్కలంగా పండింది. ప్రకృతికి తన సొంతన్యాయ విధానమేదో ఉన్నట్లుంది. ఒకచేత్తో ఏదో తీసేసుకొని, మరోచేత్తో ఇంకేదో ప్రసాదిస్తుంది. చిన్నపిల్లలు మట్టిలో సంతోషంగా ఆడుకొంటున్నారు.

ఒక టెంటు దగ్గరికి వెళ్ళి, లోపలికి తొంగిచూశాను. సుమారు 14 ఏళ్ళ అమ్మాయి ధాన్యం చెరుగుతూ, వంట (ప్రయత్నాలు చేస్తోంది. ఆమె నన్ను చూడగానే, లేచి నిల్చుని “రండి రండి - వచ్చి కూర్చోండి” అని చిరునవ్వుతో ఆహ్వానించింది.

వాళ్ళు అందులో ఎలా జీవిస్తున్నారో చూడాలని, లోపలికి వెళ్ళాను. ఆ పిల్లనాకో కుక్కిమంచం చూపించి కూర్చోమంది. టెంటులోపల అంతా శుభ్రంగాఉంది. మధ్యలో ఒక పాతచీర అడ్డంగా కట్టి టెంటును రెండు గదుల్లా విభజించారు. ఆమె మాటలనుబట్టి ఆమెకుటుంబానిది కచ్‌ ప్రాంతం కాదని తెలిసింది.

ఆమె గ్లాసులో మంచినీళ్ళు తెచ్చిచ్చింది. వర్షాకాలమైనా ఎండవేడిగా ఉంది. నీళ్ళు తాగడానికి కాస్త తటపటాయించాను, నీళ్ళు శుభ్రంగా లేకపోతే, అతిసారం, హెపటైటిస్‌-బి, పచ్చకామెర్లు వంటి వ్యాధులు తప్పవు. నీళ్ళు వద్దంటే ఆ అమ్మాయి బాధపడుతుంది. అందుకని గ్లాసు అందుకొన్నాను కానీ, ఆ నీళ్ళు తాగలేదు.

ఆమెకో చిన్న చెల్లెలు ఉంది. ఆ పాపకు 12 ఏళ్ళుండొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు సొంతంగా తయారుచేసిన ఉయ్యాలలో పడుకోబెట్టిన పసిపిల్లవాడు నిద్రలో ఉన్నాడు. ఆరుబయట ఏర్పాటుచేసిన పొయ్యిమీద కూర ఉడుకుతోంది. పెద్దమ్మాయి గోధుమపిండిని ముద్దగా తయారు చేస్తోంది.

“నీ భాషను బట్టి చూస్తే, మీరు గుజరాతీల్లా లేరు. ఎక్కడి నుంచి వచ్చారు?” అని ఆసక్రిగా అడిగాను.

చిన్నపిల్ల చిన్నగా నవ్వి, “మాది గుజరాత్‌కాదు, ముంబయి నుంచి వచ్చాం” అంది.

“ఇక్కడి కెందుకు వచ్చారు? బంధువులను చూడ్డానికి వచ్చారా?”

738 జ్ఞానం - వరిజ్ఞానం

“లేదు, మాకిక్కడెవ్వరూ బంధువులు లేరు. ఈ ఇల్లుమాదే. మేము, మా పెద్దవాళ్ళందరం ఇక్కడికే వచ్చేశాం”.

ఇదేదో ఆశ్చర్యకరంగా ఉంది. ఇలాంటి విపత్తులు జరిగిన ప్రాంతాలనుంచి మామూలుగా అయికే జనం పారిపోతారు. మరి వీళ్ళేమో ఇక్కడికి వలస వచ్చారు.

“బ్బక్ష్మడ్త మీనాన్న ఏం చేస్తారు?”

ఇద్దరమ్మాయిలూ సమాధాన మివ్వదానికి ఉత్సాహపడ్డారు. “మానాన్న ముంబాయి 'మాహిం” సముద్రపాయ వద్ద ఉన్న చర్చి దగ్గర బిచ్చమెత్తేవారు. మా అమ్మ చర్చిగేటు దగ్గిర కొవ్వొత్తులు అమ్మేది”

“మరి ఇక్కడికి ఎందుకొచ్చారు?”

“రక రోజు మేం టీ.వీలో వార్తలు చూసి, ఇక్కడ భూకంపం వచ్చిందని తెలుసుకొన్నాం. ఆ వార్తలు కార్చర్‌ షాపులో ఉన్న టీ.వీలో గంటగంటకూ చూపించేవారు.

మానాన్న వెళ్ళాం పదండి! అన్నారు. మేం వచ్చేశాం”.

“టిక్కెట్లు ఎవరు కొనిచ్చారు?”

“ఎవరూ కొనివ్వలేదు. టికెట్లు లేకుండానే వచ్చేశాం. మొత్తం టైనంతా జనమే. మాలాంటివాళ్ళు చాలామంది వచ్చారు. స్టేషనంతా జనంతో కిటకిటలాడిపోయింది. రైల్లో టికెట్‌ కలెక్ట్లీలేరు”.

“ఈ ్రాంతానికెలా వచ్చారు?”

“మాకెవరూ తెలియదు కానీ, స్టేషన్‌కు, భుజ్‌కు మధ్య బోలెడు బస్సులు తిరుగుతున్నాయి. విదేశీయులు కూడా చాలామంది ఉన్నారు. బస్సులు క్రిక్కిరిసిన జనంతో వెళ్తున్నాయి. ఎలాగోలా ఒకబస్సులో దూరి, మెయిన్‌ రోడ్డులో దిగిపోయాం”

ఆశ్చర్యంగా ఉన్నా ఇదంతా నిజంగా జరిగిన కథే

“ఇక్కడికెలా వచ్చారు?”

“మెయిన్‌రోడ్డు నుంచి పల్లె పల్లెకూ జీపులు వెళ్తున్నాయి. బాధితుల సహాయంకోసం రకరకాల సరకులు నింపిన లారీలు డజన్ల కొద్దీ వచ్చాయి. లారీలవాళ్ళు తెచ్చిన

సరకులన్నీ రోడ్డుకు ఈపక్క ఆపక్క దించేసి వెళ్ళిపోయేవారు. లేనివారంతా వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. మేం కూడా కొన్ని తీసుకొన్నాం”

“రోడ్డు పక్క ఏమేం సరకులు దించారు?”

“ఆహార ధాన్యాలు, ఏపిల్‌ పంద్దు, బిస్కెట్‌ ప్యాకెట్లు, దుస్తులు, బ్వాంకెట్లు, ఇంకా ఇలాంటివే అనేకం వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఎన్ని వీలయితే అన్ని తీసుకు రావాలని

ాాలాాాలీనేరితనులంధం 0 మానాన్న చెప్పారు. చాలానే తెచ్చుకొన్నాం. మా ముంబాయి జీవితంలో ఇన్ని సరుకులు మేమెప్పుడూ చూడలేదు. అన్నీ పుష్కలంగా ఉన్నాయి”

పిల్లలు అమాయకులు. పెద్దవాళ్ళయిపోయి, వారిజీవిళాల్లోకి అబద్ధాలు చొరబదేదాకా అంతా నిజమే చెప్తారు. గొప్పలు చెప్పుకోడానికి, లేని గుణాలు ఆపాదించుకొనడానికి పెద్దవాళ్ళు అసత్యాలు చెప్తారు. పిల్లల్లో సహజంగా ధైర్యం, నమ్మకం ఉంటాయి. లేని గొప్పలు చెప్పుకోరు. ముంబాయి బిచ్చగాడి కూతురు, అదేదో చిరస్మరణీయమైన ఉదంతం గురించి చెప్పినట్లు, జరిగింది జరిగినట్టుగా వర్ణించి చెప్పింది.

పెద్దమ్మాయి. ఇంకా చాలా విషయాలు చెప్పింది. “మేమొచ్చినప్పుడు జనం రోదిస్తున్నారు. గాయాల నొప్పి భరించలేక ఏడ్చేవాళ్ళను చూశాం పిల్లలను పోగొట్టుకొన్న తల్లితండ్రులు, తల్లి తండ్రులను పోగొట్లుకొన్న పిల్లలు, ఎక్కడ చూసినా విషాద దృశ్యాలే. అయితే సహాయం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డాక్టర్లు రాత్రీ పగలూ 'సేవచేశారు. స్వామీజీలుకూడా సామాన్యుల్లా పనిచేసి మందులు పంపిబీచేశారు. సైనికులు వచ్చి కూలిపోయిన ఇళ్ళ శిథిలాలను తొలగించారు. రాత్రికీ, పగలుకీ తేడాలేదు. పేదవారా, ధనవంతులా అన్న భేదంలేదు.

“మా పరిస్థితి మెరుగు. మావాళ్ళెనరూ చనిపోలేదు. మాకెప్పుడూ ఏమీలేదు. కాబట్టి మాకు పోయిందేమీలేదు. ఏదో కొంత ఉన్నవారికి అదిపోతుందేమోనని భయం ఉంటుంది. పోగొట్టుకొనడానికి ఏమీలేనివారికి భయమేముంటుంది? మా అమ్మా, నాన్న (ప్రజలకు సహాయ పడ్డారు. మారుమూల గ్రామాల్లో సహాయం చేసేవారెవరూ లేరని తెలిసింది. మెయిన్‌ రోడ్డుకు, పల్లెలకు మధ్య జీపులు నిరింతరం తిరుగుతున్నాయి. మేమో జీపులో ఎక్కి ఈ (గ్రామానికి చేరాం. కొన్ని సంస్థలు వెదుళ్ళు, గుదారాలవంటి పైకప్పుకు వాడే వస్తువులు సరఫరా చేశాయి. ఇళ్ళు కోల్పోయినవారికి అన్నీ ఉచితంగా ఇచ్చారు. మాకు అసలు ఇల్లేలేదు కనుక అన్ని వస్తువులూ మాకూ ఉచితంగా ఇచ్చారు. ఒకక్యూలో మా అమ్మ, మరోక్యూలో మానాన్న నిల్చునే వారు. ఆందువల్ల చాలా వస్తువులు, పదార్థాలు మాకు రెండింతలు దొరికాయి”.

“ఏమేం దొరికాయి?”

“దండిగా ఆహారం. మేం ప్రతిరోజూ తృప్తిగా తింటున్నాం. క్యూలో నిల్బోలేనివారికి కొంత ఇచ్చాం. ఆకలంటే ఎలా ఉంటుందో మాకు తెలుసు"

“ఇక్కడే ఎందుకు స్థిరపడిపోయారు?” "

“ముంబాయిలో ఉన్నప్పుడు మానాన్న ఆస్మా (ఉబ్బసం) తో బాధపడేవారు. అనేక రోజులపాటు ఆయనకు ఊపిరి పీల్చుకోవడం కష్టమయ్యేది. కాలుష్యం వల్లనే అలాంటి సమస్యలు వస్తాయని ఎవరో చెప్పారు. అదే నిజం కావచ్చు. ఎందుకంటే, ఇక్కడికి

740 జ్ఞానం - వరిజ్ఞానం వచ్చిన తార్వాత ఆయన ఆరోగ్యం బాగుంది. ఇక్కడ కాలుష్యం లేదుకదా! అసలిప్పుడు మేమిక్కడ ఇల్లుకూడా కట్టుకొన్నాం. అందువల్ల ఇక్కడే స్థిరపడిపోదామనుకొన్నాం”

“ఇక్కడ మీనాన్న చేసే పనేమిటి? ఇంకా అడుక్కుంటున్నాడా?”

"లేదు. మాకిప్పుడు కావలసినంత ఉంది. ఇక్కదే దగ్గరి పొలంలో కూలిపని చేస్తాడు. రోజుకు రూ. 100 సంపాయిస్తాఢు. మా అమ్మకూడా ఆపనే చేస్తుంది. అలా మాఆదాయం రెండింతలైంది. మేం సుఖంగా (బ్రతుకుతున్నాం. భూకంపం మాకు వరంలా వచ్చింది”.

చెల్లెను టీ, బిస్కెట్లు తెచ్చి పెట్టమంది. ఏ టీ ఇష్టమని అడగలేదు కానీ, ఏ బిస్కెట్లు కావాలని మాత్రం అడిగింది.

“చాలా రకాలున్నాయా మీదగ్గరి అని ఆశ్చర్యంగా అడిగాను.

ఆమె తెరలాగేసరికి, అవతలున్న రకరకాల బిస్కెట్‌ ప్యాకెట్లు, బిస్లేరీ మినరల్‌ వాటర్‌ బాటిళ్ళు నింపిన అట్టపెట్టెలు, పాత్రసామాన్లు, స్టీలు ట్రంకులు, వగైరా చూసి అవురా అని విస్తుపోయాను.

“భూకంపం వచ్చిన రోజునుంచీ మే చాలా మంది బిస్తేరి నీళ్ళేతాగుతున్నాం. ఏదో విదేశీ కంపెనీ ఓ నౌకనిందా ఈ బాటిళ్ళు పంపినట్లుంది. మీకు ఇచ్చింది కూడా మినరల్‌ వాటరే”

.. ఇక ఎలాంటి సంకోచం లేకుందా గ్లాసునీళ్ళూ తాగేశాను. వ అ్శస్షం

క! కుచ్‌బీ హోతాహై

ళం ఆదివారం ఉదయం మా ఇంటికో అసాధారణ అతిథి వచ్చాడు. నాకతను బాల్యం రోజులనుంచీ మంచి స్నేహితుడు. అప్పుడు మాపక్కింట్లో ఉండేవాడు. గడచిన 85 ఏళ్ళుగా మేమెప్పుడూ కలుసుకోలేదు. ఇప్పుడు చెప్పాపెట్టకుండా హఠాత్తుగా కుమారునితోపాటు (ప్రత్యక్షమయ్యాడు. 85 ఏళ్ళంటే సుదీర్ధకాలం. మేం కిందటిసారి కలిసినప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్చు ఇంతాఅంతా కాదు. అప్పుడు నేనెరిగిన చక్కని టీనేజి అబ్బాయి ఇప్పుడు బట్టతల, పెద్దబొజ్జతో, డస్సిపోయి, పొట్టిగా కనిపిస్తున్నాడు. ఎంతో ధైర్యంగా, ఎప్పుడూ వదోవాగుతూ ఉండే మనిషి కాస్తా ఇప్పుడు బిడియంగా, అధైర్యంగా కనిపిస్తున్నాడు. ఉత్సాహంలేదు. అట్టేమాట్టాడలేక పోయాడు.

అతన్ని కలుసుకోవడం నాకు సంతోషం కలిగించింది. చిన్నప్పుడు మేం ఎంతో అనందంగా గడిపాం. బరువు బాధ్యతలు, చీకూ, చింతా లేకుండా స్వేచ్చగా ఆటపాటలతో గడిపిన కాలం నా స్మృతిపథంలో మెదిలింది. అందుకే ఒకోసారి “ఓ కాగజ్‌కీ కష్టి జెర్‌ బారిష్‌ కీ పానీ...” అన్న చిత్ర, జగ్టీత్‌సింగ్‌ పాడిన గజల్‌ కళ్ళలోనీళ్ళు తెప్పిస్తుంది.

నా (ఫెండు తన కుమారుని పరిచయం చేశాడు. ఆ 22 ఏళ్ళ యువకుడు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బి.ఇ చేశాడు. చాలా ఉదాసీనంగా మామాటల్లో ఆసక్తిలేనట్లు కనిపించాడు.

యథాలాపంగా, చదువైపోయింది కదా, ఏంచేస్తున్నావని అడిగాను.

అప్పుడొచ్చిందతనికి ఉత్సాహం. “ఏదైనా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోచేరి, తర్వాత అమెరికా వెళ్ళామనుకొంటున్నా అక్కడ ఐదేళ్ళుండి, తిరిగొచ్చి సొంతంగా కంపెనీపెట్టి, పైస్థాయికి చేరాలనుకొంటున్నా. రూ. 10,000 పెట్టుబడితో ఒక పెద్దసామ్రాజ్యం నిర్మించవచ్చని నాకు తెలుసు. కాదంటారా ఆంటీ?”

కంపెనీ ప్రారంభించాలంటే, చాలా తంటాలు పడాలి. కష్టనష్టాలు ఎదుర్శొనాలి. ఇంతాచేస్తే సాధిస్తామన్న నమ్మకం లేదు.

“ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావ్‌?”

“ఎక్కడా చేయడంలేదు. ఏదైనా మంచి సాస్ట్‌వేర్‌ కంపెనీలో చేరాలని చూస్తున్నా”

242 జ్ఞానం - వరిజ్ఞానం

“*ప్రోగ్రామింగ్‌లో శిక్షణకానీ, అనుభవంకానీ ఉందా?”

“లేదుకానీ, నేను తొందరగా చేర్చుకోగలనన్న నమ్మకం ఉంది. ప్రస్తుతానికి మరేఉద్యోగం చేయదలచుకోలేదు. సాప్ట్‌వేర్‌ ఉద్యోగం కాకుండా, వేరే ఉద్యోగంలో చేరిజే అయిదారు వేలరూపాయలకు మించిరాదు. పైగా సైట్‌మీద ఉండాలి. అదేం పెద్దమొత్తం కాదు. అందుకని ఏపనీ చేయడం లేదు”.

నా మిత్రుని పాలిపోయిన మొహంలో కనిపిస్తున్న వేదనకు కారమేమిటో ఇప్పుడు తెలిసింది. అతను నేడోరోపో రిటైరవబోతున్నారు. ఈ పుత్రరత్నమేమో ఉద్యోగం సద్యోగం లేకుండా పెద్దపెద్ద కలలు కంటున్నాదు. కలలు కనడం ఎప్పుడూ మంచిదేకానీ, వాటిని సాకారం చేసుకోవాలి. అందుకు కష్టపడాలి.

టిస్కో (టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ) ఛైర్మన్‌ జె.జె. ఇరానీ మాటలు గుర్తొచ్చాయి. “కృషిలేని ఆశయం కలగా మిగిలిపోతుంది. ఆశయం లేని కృషి కాలక్షేపంలా వ్యర్థమైపోతుంది. ఆశయం, కృషి రెండూ ఉంటే ప్రపంచాన్నే మార్చవచ్చు”.

టీచర్‌గా నాకు సలహాలివ్వడం అలవాటై పోయింది. అందువల్ల, అతనికి ఇష్టమున్నా లేకున్నా, అతను అడిగినా, అడగకపోయినా నా మనసులో మాట చెప్పేశాను. అతను మొహం చిన్నబుచ్చుకొన్నాడు. తండ్రితోపాటు వెళ్ళిపోతూ నాతో వెళ్ళొస్తాననైనా చెప్పలేదు.

మనదేశానికి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. తరతరాల వారసత్వంగా సంక్రమించిన ప్రాచీన భవనాలు అనేకం ఉన్నాయి. ఇంత సాంస్కృతిక, భౌగోళిక వైవిధ్యం ఉన్నదేశాలు ప్రపంచంలో అతి తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు జఒరిస్సాను చూడండి. ఆ రాష్ట్రంలో కనిపించే ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వారసత్వం మనల్ని మైమరపిస్తాయి. కోణార్క ఒడిస్సీ నృత్యం, పూరీ రథయాత్ర, పటచిత్ర పెయింటింగులు ఎంతో ప్రసిద్ధమైనవి.

మనలో చాలామంది ఒరిస్సాలో వీటికిమించి వేరే టూరిస్టు ఆకర్షణలేవీ లేవను కుంటారు. మరో అత్యంత సుందరమైన ప్రదేశం గురించి ఎక్కువ మందికి తెలియదు. బంగాళాఖాతానికి అభిముఖంగా ఉంటుంది చాందీపూర్‌ పట్టణం. అక్కడ సందర్శకులతో సముద్రం దాగుడు మూతలు ఆడుకొంటుంది.

అక్కడ సముద్రం ప్రతిరోజూ అయిదు కిలోమీటర్ల దూరం వెనక్కివెళ్ళి పోతుంది. ఆ నేలమీద హాయిగా నదవచ్చు, ఆడుకోవచ్చు. జీపుకూడా నడపొచ్చు. కొన్ని గంటల తర్వాత సముద్రం మళ్ళీ ఏమీ జరగనట్లే ఎగసిపడుతూ ముందుకొచ్చేస్తుంది. సముద్రం వెనక్కితగ్గి, మళ్ళీముందుకురికే ఈ అద్భుతాన్ని సందర్శకులు తీరంలో నిల్చుని తిలకించి అబ్బురపడిపోతుంటారు. అంతటి అద్భుత దృశ్యం మరెక్కడ కనిపిస్తుంది?

కుబ్‌లీ వోతాహై “ఖం

చాందీపూర్‌, భువనేశ్వర్‌ నుంచి రోడ్డుమార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడో గెస్ట్‌హాసకూడా ఉందికానీ, వచ్చే సందర్శకులు తక్కువ. స్థానికంగా మత్స్యకారులు చాలా మందే ఉన్నారు. ఒక పర్యాయం నేను సముద్రం వెనక్కు తగ్గాక అప్పుడు సముద్రం ఆక్రమించిన నేలమీద నడవాలని ఒడ్డున నిల్చుని నిరీక్షిస్తున్నాను. సముద్రం నెమ్మదిగా వెనక్కి వెడుతోంది. ఇంకావెనక్కి తగ్గితే తప్ప నేలమీద నడవలేం.

మత్స్యకారులు చాలా బిజీగా తమపని తాము చేసుకొంటున్నారు. సముద్రం వెనక్కి తగ్గడం ప్రారంభించగానే, ఇసుకలోంచి ఎర్రటి పీతలు బయటికొస్తాయి. కాస్తవయసొచ్చిన పిల్లలు వాటిని ఏరి బుట్టలో వేసుకొంటుంటే, చిన్నపిల్లలు గవ్వలు సేకరిస్తున్నారు. బక్కపలుచగా, నల్లగా ఉండి చీరలు ధరించిన మహిళలు చేపలు పట్టడానికి వలలు విసురుతున్నారు. ఒద్దున చాలామంది కనిపించారు.

చేపలు పట్టి జీవించే వారి జీవితం మనకన్నా చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు మండుటెండలో సముద్రంలో ఒంటరిగా గడపాల్సి ఉంటుంది. అనేక ఇతర వృత్తుల్లో ఇంత ఒంటరిగా పనిచేయాల్సి ఉండదు. నేనక్కడికి ఆదివారం ఉదయం వెళ్ళాను. టూరిస్టులు సముద్రం దగ్గరికి రావడానికి బద్ధకించి నట్లున్నారు. దూరం నుంచే చూస్తున్నారు.

అప్పుడో పదిపన్నెందేళ్ళ బాలుడు వల పట్టుకోవడంలో తల్లికి సహాయపడుతుంటే చూశాను. తల్లి అలసిపోతే సహాయం చేస్తూ, మిగతాసమయంలో పీతలు సేకరిస్తున్నాడు. అతను నడిచేతీరు చూస్తేచాలు కుర్రాడిలో ఉత్సాహం, సంతోషం పొంగిపొరలుళున్నట్లు తెలిసిపోతుంది. అతను ఒద్దుకొచ్చినప్పుడు, నేనో కొనుగోలుదారుననుకొని, తాజాపీతలు కొన్ని అమ్మజూపాడు. నేను పీతలు తినను కానీ నీతో మాట్లాడాలని ఉందన్నాను.

కుర్రాడొచ్చి, ప్రత్యేకంగా సందర్శకుల కోసం నిర్మించిన మెట్లమీద నాదగ్గర కూర్చున్నాడు. అతన్ని జాగ్రత్తగా చూశాను. బక్కపలుచగా, నల్లగా ఉన్నాడు కానీ, కళ్ళు మాత్రం రాత్రిపూట మెరుస్తున్న వజ్రాల్లా ఉన్నాయి. అతని ఉత్సాహం చూస్తే ఇతరులకూ ఉత్సాహమొచ్చేలా ఉంది. నిక్కరు మాత్రమే తొడుక్కొని, పూర్తిగా తడిసిపోయున్నాడు. అయితే అందువల్ల అతనికేమీ అసౌఖ్యం ఉన్నట్లులేదు. అనలు తడిశానన్న స్పృహేలేనట్లుంది. తాజా పుష్పంలా సహజంగా కనిపించాడు. అతని చిరునవ్వు కూడా ఇతరులకు పాకేలా ఉంది.

అతని కుటుంబం గురించి అడిగాను. తండ్రి రిక్షాలాగి రోజుకు రు. 50 సంపాయిస్టాడని, తల్లి చేపలు, పీతలు పట్టి కుటుంబానికి అదనపు ఆదాయం ఆర్జించి పెడుతోందని తెలుసుకున్నాను. ఈ బాలుడు జావెద్‌ స్కూల్లో చదువుతూ, క్లాసులో ప్రథముడుగా రాణిస్తున్నాడు. ఇంట్లో అతనికి చెల్లెలు కూడా ఉంది.

244 జ్ఞానం జా వరిజ్ఞానం

నువ్వెంత సంపాయిస్తావ్‌? నీ దినచర్య ఏమిటి? అని అడిగాను.

“ఉదయం సముద్రం వెనక్కి తగ్గినప్పుడు పీతలు పట్టి మా అమ్మకు సహాయంగా పనిచేసిన తర్వాత ఇంటికి వెళ్తాను. స్నానంచేసి, అమ్మ కష్టం తగ్గించడానికి కొంత వంటపని చేస్తాను. తర్వాత స్కూలుకు వెళ్తాను. సాయంకాలం హోంవర్క్‌ పూర్తిచేస్తాను. రాత్రిపూట సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు మళ్ళీ పీతలు పడతాను. అల్లా మానేలను కరుణించాడు. మన దేశంలో ఇలా సముద్రం వెనకివెళ్ళి, అట్టే కష్టంలేకుండా రోజుకు రెందుసార్లు పీతలు పట్టుకోగలిగిన చోటు ఇదొక్కటే అని విన్నాను” అన్నాడు.

బహుశా ఆతను రోజుకు అయిదో పదో సంపాయిస్తాడు. అంతకష్ణానికి ఇంతేనా ఫలమని విచారించాను.

“అయిదూ, పది రూపాయలేనా, జావెద్‌. దాంతో ఏమొస్తుంది? ఈపాటి సంపాదనకోసం ఉదయం అయిదుకే లేస్తావు. మళ్ళీ రాత్రి 11కు గానీ నిద్రపోవూ అన్నాను.

ఈ ప్రశ్నతో అతని ఉత్సాహం ఏమీ తగ్గలేదు. చిరునవ్వు నవ్వి చెప్పాడు. “మేడం, ఏమీలేనిదానికంటే 5 రూపాయలు పెద్దమొత్తంకాదా? “పాంచ్‌రూపేమే కుచ్‌బీ హోతాహై ఉప్పు కొనుక్కోవచ్చు, మిరపకాయలు కొనుక్కోవచ్చు. పనీపాటా లేకుండా కూర్చుంటే అవికూడా కొనలేం. వందలు వేలల్లో ఎవరూ డబ్బివ్వరు. బొట్టుబొట్టు నీరు చేరి ఓ సముద్రమవుతుంది. గింజాగింజా చేరుస్తూపోతే ధాన్యాగారం అవుతుంది”

జావెద్‌ జవాబుతో అబ్బురపడ్డాను. ఈపేద చాపలు పట్టే బాలుడు జావెద్‌ నాకు “చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే, ఒక చిరుదీపం వెలిగించడం మంచిది” అన్న లోకోక్తిని జ్ఞప్తికి తెచ్చాడు. "

పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ, టైమంతా వ్యర్థపరుస్తున్న నా (థ్రెండ్‌ కుమారుడు కూడా గుర్తొచ్చాడు.

మో బ్సాస్థం

శీర్‌ నమస్తే టీచర్‌

రౌ కంటే టీచర్‌ ఎక్కువ శక్తి మంతుడుగా వెలుగొందిన రోజుల సంగతి. టీచర్‌ విద్యార్థులను మిక్కిలి (ప్రేమగా చూసేవాడు. వారు తప్పు చేస్తే దండించేవాడు. వాళ్ళు పది పన్నెండేళ్ళు ఆయన ఇంటనే ఉండి, ఆయన పనులన్నీ చేపిపెట్టేవారు. టీచర్‌ వాళ్ళను సొంత బిడ్డల్లానే చూసుకొనేవాడు. ఆ విద్యావ్యవస్థను గురుకులం అనేవారు. టీచర్‌ను గురువుగా, విద్యార్థులను శిష్యులుగా పరిగణించేవారు.

ప్రాచీన కాలంలోని ఆ విద్యావ్యవస్థలో రాకుమారునికీ, నిరుపేదకూ మధ్య వ్యత్యాసం చూపేవారు కాదు. అయితే ఈ గురుకుల వ్యవస్థలో చదువు అందరికీ అందుబాటులో ఉండేదికాదు. దీనికి ఇధొక్కటే ప్రతికూల అంశం. కొందరు ముఖ్యమైన వారికే విద్యావకాశం ఉందేది. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత, గురువును, గురుపత్సిని గుర్తుంచుకుని, వారిని జీవితాంతం గౌరవించేవారు. వాళ్ళు తమ తర్వాతి జీవితంలో ఆర్టించేదానిలో గురువుకు కొంతనాటా ఇన్వాలనే, రాతపూర్వకంకాని నియమ మొకటి అమలులో ఉండేది. గురువు తన విద్యార్థుల పురోభివృద్ధి చూసి గర్వించేవాడు. గురువు ఎన్నడూ సంపద పోగేసుకోలేదు. ఆయన సంపదంతా ఆయన శిష్యులే.

తన విద్యార్థులు జ్ఞానార్షనలో తనను మించిపోవాలని గురువు దేవుని ప్రార్థించేవాడు. అదే ఆయనకు అమితానందం కలిగించేది. 'శిష్యాదిచ్చేత్‌ పరాజయం” విద్యార్థులు టీచర్‌కన్నా మిన్నగా ఉండాలి. విద్యార్థులు తమ గురువులను ఎంతో గొప్పగా గౌరవించేవారు.

ఒకప్పుడు ఓ మహాశక్తిమంతుడైన రాజును ఎవరో అడిగారు, * మీరు మహాశక్తి, సిరిసంపదలు, విశాలమైన రాజ్యం, బలమైన సైన్యం ఉన్న మహారాజులు. మీ గురువు పేదవాడు. సొంతంగా ఒక జానెడునేలైనా లేదు. అయినా మీరాయన్నుకలిసినప్పుడు, వంగి దుమ్ము, ధూళి ఉన్న ఆయన పాదాలను స్పృళిస్తారు. ఆయనకన్నా దిగువకూర్చుని, ఆయన మాటలను అంత భక్తిశ్రద్దలతో ఆలకిస్తారు. ఆయన్నే మీ ఆస్థానానికి రప్పించవచ్చుకదా? ఎందుకు రప్పించరు?”

రాజు ఒక చిరునవ్వు విసిరి చెప్పాడు. “నువ్వెంత బుద్ధిహినుడవయ్యా? నాగురువే అందరికన్నా ఐశ్వర్యవంతుడు. నువ్వు చెప్తున్న భూభాగాన్ని యుద్ధంలో గెలుచుకోనూవచ్చు, పోగొట్టుకోనూ వచ్చు. రాజు శక్తిసంపదలన్నీ అతను యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నంత

246 జ్ఞానం - వరిజ్ఞానం కాలమే నిలుస్తాయి. అతని ధనాన్ని ఖర్చుపెట్టేయొచ్చు, ఎవరైనా దోచుకుపోవచ్చు, ధ్వంసంచేయొచ్చు. గురువు సంగతి ఆలోచించు. ఆయనకు జ్ఞానం ఉంది. ఆయన ప్రతియేటా శిష్యులకిస్తారు. ఇచ్చేకొద్దీ ఆయన జ్ఞానసంపద పెరుగుతుందే కానీ తరగదు. ఆయన వివేకాన్ని, జ్ఞానాన్ని ఎవరూ దోచుకుపోలేరు. బలవంతంగా కానీ, దౌర్జన్యం చేసి కానీ ఆయన్నుంచి తీసుకుపోలేరు. ఆయన జ్ఞానం ఏయేటికాయేడు వృద్ధిచెందుతూనే ఉంటుంది. ఆయన మహనీయుడు కాదంటావా? ఆయన శిష్యులందరూ ఆయన పిల్లలవంటివారే. పిల్లల సంపద పెరిగినప్పుడు, తండ్రి ఐశ్వర్యవంతుడు కాకపోతాడా?” ఆరోజుల్లో టీచర్లు ఎంతటి గౌరవాదరాలు పొందేవారో, వారెంత జ్ఞానసంపదతో వెలుగొందేవారో, విద్యార్థులతో వారికి ఎంతటి అనుబంధం ఉండేదో, ఈ ఉదంతం వెల్లడిస్తోంది. మన భారతీయ సమాజంలో మనం భక్తి శ్రద్ధలు ప్రదర్శించవలసిన అత్యున్నత వ్యక్తులలో, తల్లి, తండ్రి తర్వాత టీచర్‌కు తృతీయస్టానం ఇస్తారు.

తన విద్యార్థులు చెడిపోతుంటే, వారిస్ట్థాయితో నిమిత్తం లేకుందా, వారిని సరిదిద్దే హక్కు టీచర్‌కు ఉండేది.

ఈ రోజుల్లో అటువంటి వ్యవస్థలేదు. అవకాశంకూడా లేదు. మన ప్రభుత్వం ఎంతో కృషిచేసి, నిధులు ఖర్చుపెట్టి, గ్రామాల్హో నగరాల్లో ఆధునిక విద్యాసంస్థలను అసంఖ్యాకంగా నెలకొల్పింది. వేలాది మందికి శిక్షణ ఇప్పించి టీచర్లుగా నియమించింది. ఈ టీచర్లు వివిధ సబ్జెక్టులను ఎలా భోధించాలో శిక్షణ పొందారు. వారికి మంచి జీతాలు కూడా ఇస్తున్నారు. విద్యార్థులను రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే టీచర్ల (ప్రధాన కర్తవ్యం. అందువల్ల టీచర్లకు శిక్షణకాలంలోనే జీవిత విలువల గురించి అవగాహన కలిగిస్తారు.

మేం చిన్నప్పుడు, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే వాళ్ళం. ఇందుకోసం మా ఊరునుంచి అనేక పట్టణాలకు వెళ్ళేవాళ్ళం. మాతోపాటు మాటీచర్‌కూడా వచ్చేవారు. ఎప్పుడూ హోటళ్ళలో దిగలేదు. నక మమ్మల్ని తన చెల్లెలింటికి తీసుకెళ్ళేవారు, అందరం అక్కడే ఉండేవాళ్ళం, ఈ పోటీలవల్ల ఆయనకు వచ్చేదేమీలేదు కానీ మమ్మల్ని సొంతబిడ్డల్లా చూసుకొనేవారు. ఆయన చెల్లెలు మాకు వసతికల్పించి భోజనంకూడా వండిపెట్టేవారు. ఇప్పుడాలోచిస్తే మన వ్యవస్థ ఎంతగొప్పదో అనిపిస్తుంది.

ఇటీవల పనిమీద ఒరిస్సా వెళ్ళాను. మనదేశంలో అనేక ప్రాంతాలు తరచుగా

" ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఉంటాయి. 1999 అక్టోబర్‌లో అనూహ్యంగా ఒరిస్సాను తుపాను తాకింది. తుపానులో చెట్లు నేరకొరిగాయి. అనేక ఇళ్ళల్లో కప్పులు ఎగిరిపోయాయి. అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. పంటలు నాశనమయ్యాయి.

ప్రతిఏటా వరదలు, తుపానులతో ప్రజలు తమ కొంపాగోడూ కోల్పోయి నిరాశ్రయు లవుతున్నారు. ప్రతి విపత్తు తర్వాత, అనాథలు, వికలాంగులు, మానసికంగా దెబ్బతిన్నవారి

నమన్తే, టీచర్‌ 47 సంఖ్య పెరిగినట్లు గణాంక వివరాలు వెల్లడిస్తున్నాయి.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించగానే అనాథాశ్రమాలు క్రిక్కిరిసిపోతాయి. చాలామంది పెద్దలు వికలాంగులైన, మానసికంగా దెబ్బతిన్న తమ పిల్లల్ని దిక్కులేకుండా వదిలేస్తారు. తమ పేదరికంలో వీరిని అదనపు భారంగా భావించి, ఎక్కడో వదిలేసి వచ్చేస్తారు. వరదల తర్వాత నీటికాలుష్యం, పారిశుద్ధ్య లోపం వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో రోగుల సంఖ్య మూడురెట్లు పెరిగిపోతుంది. దాక్టర్లు, ప్రభుశ్వేతర సంస్థల కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగులు సహాయకార్యక్రమాల్లో ఎంతకష్టపడి పనిచేసినా, ఒకోసారి జరిగిన విధ్యంసం విపరీతంగా ఉంటుంది. ఎంత (శ్రమించినా అందరినీ ఆదుకోలేకపోతారు.

ఏ ప్రభుత్వానికైనా, ప్రతి ఏటా స్మూలుభవనాలను మరమ్మత్తు చేయాలంటే కష్టమవుతుంది. పూర్తిగా ధ్వంసమైన భవనాల స్థానంలో కొత్త భవనాలు కూదా నిర్మించాల్సి ఉంటుంది. అందువల్ల ఒక నదిసమీపాన మా ఫౌండేషన్‌ నిర్మించదలచిన స్మూళ్ళను, కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో నిర్మించాలని నిర్ణయించాం. ఎత్తులో ఉంటే వరదల సమయాల్లో బాధితులు స్మూళ్ళల్లో తలదాచుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో మేం స్కూలు టీచర్లకు కూడా ప్రమేయం కల్పించాం. వాళ్ళస్మూళ్ళే కావడంతో, టీచర్లు చాలా ఉత్సాహంతో సహకరించారు. టీచర్లు పాల్గొనడంవల్ల మా కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయింది.

ఒరిస్సా మారుమూల ప్రాంతంలో నిర్మించిన అలాంటి స్కూలు నొకదాన్ని. ప్రారంభించడానికి వెళ్ళాను. అప్పుడే తెల్లవారింది కానీ అప్పటికే ఊరంతా పండుగ వాతావరణం వెల్లివిరుస్తోంది. స్కూలు నిర్మాణంలో మాకు సహాయపడిన టీచర్‌ను పక్క ఊరికి బదిలీ చేశారు. ఆయనకూడా వీలుచేసుకొని ప్రారంభోత్సవానికి రావడం సంతోషం కలిగించింది.

ప్రారంభోత్సవానికి ముందు, విద్యార్థులతో మాట్లాదాలనిపించింది. నేను క్లాసుకు వెళ్ళేసరికే ఆగది పిల్లలతో నిండిపోయింది. చాలామంది విద్యార్థులు నేలమీద కూర్చున్నారు. క్లాసులో బెంచీలు తక్కువగా ఉన్నాయి. ఆపక్క గదికేసి చూస్తే, అదీ అలాగే ఉంది. బయటికొచ్చి చూస్తే వేపచెట్టుకింది క్లాసు నడుస్తోంది. గదులు చాలవని స్పష్టమైంది.

నేను అనుకొన్న సమయానికన్నా ముందే స్కూలుకు చేరుకొన్నాను. కొత్త హెగ్‌మిస్రెస్‌ రాగానే, నా దగ్గరకొచ్చి క్షమాపణ చెప్పింది. ఆమె మధ్యవయసులో, ఆరోగ్యంగా కనిపించింది. క్రమశిక్షణను పాటించే వ్యక్తిలా కనిపించింది కానీ, రూపురేఖలను బట్టి గట్టిగా ఒక అభిప్రాయానికి రాలేం. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో బిజీగా ఉండి తొందరగా రాలేకపోయానంది. ఆమె మాట్లాడుతుంటే, అదే ఆవరణలో ఓ మూల మరోభవనం కనిపించింది. భవనం ముందు ఒక చీర మరికొన్ని బట్టలు తాడుకు వేలాడుతున్నాయి. ఉతికి, ఆరడానికి తాడుమీద వేశారు.

748 జ్ఞానం = వరిజ్ఞానం ర్‌ి నేనూ టీచర్నే కదా. మాకు మాట్లాడే అలవాటు ఎక్కువని తెలుసు. అందుకని అమె మాటలకు అద్దుతగిలి, చీరకేసి చూపిస్తూ, అ భవనంలో ఎవరుంటున్నారని అడిగాను. ఆమె నివ్వెరపోయి, “అదా, దాన్ని ఆశ్రయంకోసం నిర్మించారు” అని తడబడుతూ జవాబిచ్చింది. “సహాయ ఆశ్రయాన్ని స్కూలు ఆవరణలో ఎందుకు నిర్మించారు?” “మ్సీ భవనంలాగానే. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఆళత్రయంగా ఉపయోగపడుతుంది. మిగతా కాలంలో స్కూలుగా ఉంటుంది”. “ఇప్పుడేదైనా వైపరీత్యం ఉందా?” “శ్రుపానొచ్చింది” “ెండేళ్ళ కిందటకదా తుపానొచ్చింది. అప్పటి జనంఇంక్షా అందులోనే ఉన్నారా?” ఆమె గొంతుమారిపోయింది “లేదుకానీ ఆ తర్వాత వచ్చిన వరదల్లో నష్టపోయినవారు )ందులో ఉంటున్నారు” అమాటకూడా నిజంకాదు. వరదలు తగ్గిపోయి చాలా రోజులైంది. ప్రారంభోత్సవానికి ఆలస్యమైపోతోంది కనుక, ఇక ఈ విషయంపై చర్చిస్తూ సమయం వృధాచేయరాదని హెడ్‌మిస్టెస్‌ వాదించింది. అయితే, అందులో ఎవరు నివసిస్తున్నారో తెలుసుకోవాలని నాకు పట్టుదలగా ఉంది. ఇక విధిలేక ఆమెకూడా నాతో నడిచింది. మంచి భవనం. లోపల బెంచీలు చాలానే ఉన్నాయి. వాటిని దగ్గరచేర్చి మంచంలాగా ళల ఏర్పాటుచేశారు. పాత్రల, ట్రంకు పెట్టెలు కనిపించాయి. ఒకమూల పేర్చిన వంటచెరకును చూసి అక్కడెవరో వంటచేసుకొంటున్నట్లు నిర్ధారించుకొన్నాను. “ఇక్కడ ఎవరుంటున్నారు?” అనడిగాను. ఆమెకు చిరాకెత్తిందికానీీ బయటకు కనిపించనివ్వలేదు. “కొందరు ఆదివాసీ విద్యార్థులు ఉంటున్నారు. ఇది వారికి హోస్టల్‌గా ఉపయోగపడుతోంది” అంది. ఇది మరీ పచ్చిఅబద్ధం. బాలుర వోస్టలయితే, మహిళల దుస్తులు ఎందుకున్నాయి? అదీకాక విద్యార్థుల వస్తువుల్లాంటివేవీ అక్కడ కనిపించలేదు. ఆ విషయమే అడిగేసరికి ఆమె పెదవి విప్పలేదు. కాసేపు ఆలోచించి “ఇదేమంత మంచి భవనంకాదు. మా టీచర్లు చాలామంది | పేదవాళ్ళు. చాలాదూరం నుంచి రావాలి. అందుకని తాత్కాలికంగా ఇందులో "

నమస్తే, టీచర్‌ 249 ఉండనిచ్చాను” అని చెప్పింది. నేను నమ్మలేకపోయాను “ఈ రోజుల్లో టీచర్లకు జీతాలు బాగానే ఇస్తున్నారు. వాళ్ళకు ఇంటద్దె భత్యం కూడా వస్తుంది. స్కూల్లో ఎందుకు ఉండాలి?” నా వెనుక నుంచి గుసగుసలు వినిపించాయి. చిన్న పిల్లలు కళ్ళుపెద్దవి చేసి నన్నే చూస్తున్నారు. పిల్లల్నడిగితే నిజం తెలిసిపోతుంది. వాళ్ళు నిజమే చెప్తారు. ఎవరి సంతోషం కోసమైనా అబద్దాలు చెప్పరు. అందుకని ఒక బాలుణ్ణి దగ్గరికి రమ్మని “బాబూ, ఇందులో ఎవరుంటున్నారో చెప్తావా?” అని అడిగాను. బాలుడు వేలితో 'హెడ్‌మి(్టెస్‌ను చూపించాడు. ఆమె సిగ్గుతో తలవంచుకొంది ఆమె దగ్గరికెళ్ళి చెప్పాను. “మీరు అబద్ధం ఎందుకు చెప్పారు? నాలుగు కారణాలతో నాలుగు సార్లు అబద్ధం చెప్పారు. మీరు అబద్ధం చెప్తే, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. వాళ్లకు మీరు ఆదర్శంగా ఉండాలి. పిల్లలకు చెప్పే నీతులు టీచర్లు ఆచరించి చూపాలి. మీరో మహిళ. మహిళ అంటే కారుణ్యమూర్తి. క్లాసురూము చాలక పిల్లలు అవస్థపడుతుంటే, మీరు క్లాసురూమును మీ ఇల్లుగా మార్చుకున్నారు. ఇది వాళ్ళ భవనం. మీరు తల్లిలాగా ఆలోచించండి. మీ బాబుకూడా అదేక్సాసులో ఉంటే, మీకు కష్టమనిపించదా? ఇప్పుడు మీరో టీచర్‌గా పనిచేస్తున్నారు. విద్యార్థులపట్ల ్రద్ధ, శ్రేమ ఉందాలి. టీచర్‌కు ఉండాల్సిన డే ౮ మేలునే కోరుకోవాలి. ముఖ్యమైన గుణం అదే. నేను కూడా టీచర్నే మనం విద్యార్థుల మేలు ఇది వ్యాపారకేంద్రం కాదు. వచ్చే తరానికి శిక్షణనిచ్చే పవిత్రస్థలం. పిల్లలకు అన్యాయం జరిగినా వారు నోరు తెరవలేరని, మీ ఇంటద్దె భత్యాన్ని మిగుల్చుకోవాలని, వాళ్ళచోటులో తిష్టవేశారు. పిల్లలు చోటుచాలక బాధపడుతుంటే, ఎలా సహిస్తున్నారు? ఈ మారుమూల ప్రాంతానికి ప్రభుత్వాధికారులెవరూ వచ్చి తనిఖీ చేయరు. ఈ పిల్లలు, పెరిగి పెద్దవాళ్ళయినప్పుడు, మిమ్మల్ని వవిధంగా జ్ఞాపకం ఉంచుకుంటారు? ఇది ఎందరో మహోపాధ్యాయులు, గురువులు జన్మించిన దేశం. ఆసంగతి మరచిపోకండి జవాబులేదు. మాలో అన్జాస్ష

శ్తేట్రి నన్నుమనిషిగా చూడండి " కొథవల నేనో ఏదాదిబాలుడి పుట్టినరోజు వేడుకకు హాజరుకావలసి వచ్చింది. ఆ పార్టీని చాలా ఖర్చుతో ఓ ఫైవ్‌-స్టార్‌ వోటల్‌లో గొప్పగా ఏర్పాటు చేశారు. నేను, నా (ఫ్రెండుతో కలిసి బయలు దేరాను కానీ, అంతచిన్న బిడ్డకు ఎలాంటి కానుక ఇవ్వాలో తోచలేదు.

ఈ రోజుల్లో కానుకలు ఇవ్వడం, పుచ్చుకోవడం పెద్ద వ్యాపారమైపోయింది. సంపద పెరిగేకొద్దీ మానవ సంబంధాలు మారిపోతున్నట్లున్నాయి. కొత్త విలువలు పాదుకొంటున్నాయి. ఇప్పుడు మీరిచ్చేకానుక, మీ సంపాదనకు తగినట్లుండాలి. కానుక అంటే మనప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా ఇచ్చేదనే అర్థానికి కాలం చెల్లిపోయింది.

గుజరాతీ భాషలో ఒక సామెత ఉంది. “హిషాబ్‌ కవడీమా, బక్షీస్‌ లాభ్‌మా”. అంటే లెక్కతీర్చేస్తుంటే, చివరిపైసాదాకా తీర్చేయాలి. చిన్న మొత్తాన్ని కూడా ఉపేక్షించకూడదు. అయితే ఎవరికైనా కానుక ఇస్తుంటే మాత్రం కానుక ధర ముఖ్యంకాదు. మీరు దాన్నెంత ప్రేమగా ఇస్తున్నారన్నది ముఖ్యం. ఎవరైనా ఓ ఖరీదైన కానుక ఇవ్వొచ్చు కానీ అది (ప్రేమతో ఇస్తున్నది కాకపోవచ్చు. మరొకరిచ్చిన చిరుకానుక అపారమైన (ప్రేమతో ఇచ్చినది కావచ్చు.

ఏడాది బిడ్డకు అన్నం తినే గిన్నె ఓ స్పూను ఇస్తే ఉచితంగా ఉంటుందని పించింది. దుకాణంలో వాటిని ఎంచుకొని తీస్తుంటే, నా (శ్రెండు నవ్వింది. ఇబ్బందులు తెచ్చుకొంటావ్‌. వాళ్ళు నువ్వు చాలా పెద్దకానుక ఇస్తావని ఆశిస్తారు. కొనేముందు ఇంకోసారి ఆలోచించు అని హెచ్చరించింది.

అమెకు గుజరాతీ సామెతను వినిపించి అదే కొన్నాను.

మేం హోటల్‌కు చేరేసరికి చాలామంది ఉన్నారు. నగరంలో ఇంతోఅంతో పేరున్న వాళ్ళందర్నీ ఆహ్వానించినట్లున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అన్నివయసులవాగు ఉన్నారు. సొసైటీ మహిళలు, వ్యాపారులవంటి ఉన్నత వర్గమంతా అక్కడే ఉంది. ఎక్కడచూసినా కంచిపట్టు, పటోలా, షిఫాన్‌ చీరలు, వాటికి జోడైన వజ్రాలు మిరుమిట్లు గొల్పుతున్నాయి. ముంబాయిలో టక్రిభువన్‌దాస్‌ భీమ్‌జీ జవేరి అనే పెద్ద జువెలరీ దుకాణం ఉంది. ఆదుకాణంతో పోల్చితే, ఈ మహిళలు ధరించిన బంగారం మొత్తం చాలా ఎక్కువ వుంటుంది.

నన్ను మనిషిగా చూడండి |

కార్యక్రమాలన్నీ మామూలే. తల్లిదండ్రులు కేక్‌కోయడం, తండ్రి మొదటి కొవ్వొత్తిని

ఊది ఆర్పడం, బేబీకి తల్లి కేక్‌ తినిపించడం, వీడియో చిత్రీకరణ, బెలూన్లు పగలకొట్టడం,

“హేపీ బర్త్‌డే. పాడడం - అంతా మామూలే. ఇక కానుక లివ్వడం ప్రారంభమైంది. ఆ తర్వాత విందు.

సూటూబూటులో ఉన్నవాళ్ళు కొత్తపరిచయాలు గురించి తంటాలు పడుతుంటే, మహిళలు తాజా ఫ్యాషన్లు గురించి కబుర్లు చెప్పుకొంటున్నారు. టీనేజీ బాలబాలికలు సంగీతం వింటూ, దాన్స్‌ప్లోర్‌వేపు దూసుకెళ్తున్నారు. వృద్ధులు పాతకాలపు మంచి రోజుల గురించి మాట్లాడుకుంటూ, ఇప్పటి పరిస్థితులపట్ల అసంతృప్తి ప్రకటిస్తున్నారు. జబ్బులు గురించీ, చికిత్స గురించి ఒకరినాకరు అడిగి తెలుసుకొంటున్నారు. బిద్దఠల్లులు పిల్లలతో సతమతమవుతున్నారు.

పుట్టినరోజు పిల్లవాడు ఏడుపు లంకించుకొన్నాడు. కొత్తబట్టలు బిగుతుగా ఉండి వాడిని కష్టపెడుతున్నాయి. వాడికి తొడిగిన బంగారు అభరణాలు నొప్పిపెడుతున్నాయి. ధగధగలాడుతున్న లైట్లుచూసి బెదిరిపోతున్నాడు.

కానుకలకేసి చూశాను. ఖరీదైన వెండి సామాన్లు, బంగారు గొలుసులు, నగదు, ఓ ల్యాప్‌టాప్‌ కంప్యూటర్‌ కూడా ఉన్నాయి. అంతకు ముందు పరిచయం కూడాలేని అనేక మంది, నాదగ్గరకొచ్చి, తమ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి వివరించడం మొదలెట్టారు. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, వీలవుతుందా? మీకు తీరికున్నప్పుడే వస్తాను. మాకు డబ్బేమీ అవసరంలేదు. మీసలవో కావాలి అనడిగారు ఇంచుమించు అందరూ ఇలాగే అడిగారు.

ఎవ్వరూ మొదటి సమావేశంలో డబ్బడగరని అప్పటికే అనుభవంలో తెలిసి వచ్చింది. చాలామంది నాకు పూర్తిగా సంబంధంలేని వ్యవహారాల్లో నా మార్గదర్శకత్వం కోరుతారు. కొందరు, వాళ్ళమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. కొందరు వాళ్ళబ్ళాయికి ఉద్యోగం ఇప్పించమంటారు. కొదరు వాళ్ళ సొంఘిక సంస్థలకు రకరకాల సహాయం కోరుతారు. కొందరు నగదు సహాయం అడిగితే, కొందరేవో వస్తువులు అడుగుతారు. ఇవేవీ కాకపోతే ఏదో సమావేశంలో ్రసంగించాలని అహ్వానిస్తారు.

అలాంటి సందర్భాల్లో తరచుగా “నన్ను మీకు ఉపయోగపడే ఓ యంత్రంగా చూడకండి. నన్నో మనిషిగా చూడండి” అని అరిచి కేకలేయాలనిపిస్తుంటుంది.

ఓ సారి ఏదో పనిమీద అహ్మదాబాద్‌ వెళ్ళాను. అక్కడి 'లాగార్డెన్‌ రోడ్డు లవ్‌ గార్డెన్‌ ప్రాంతంగా పేరుపొందింది. అక్కడ చిన్నచిన్న షాపులను సాయంకాలం బాగా పొద్దుపోయాక కానీ తెరవరు. రాత్రి 11.00 గంటలకు గానీ మూయరు. రోడ్డుమీద బల్లలు, కుర్చీలువేసి ఏర్పాటుచేసిన ఆరుబయలు రెస్టారెంట్లు కూడా చాలానే ఉన్నాయి. అదంతా చూస్తే నాకు పర్యాటకుల స్వర్గమైన పారిస్‌ గుర్తొచ్చింది. యువ టూరిస్టులు

752 జ్ఞానం - పరిజ్ఞానం సాయంకాలం బాగా పొద్దుపోయాక ఈ ప్రాంతానికి చేరుకుంటారు.

షాపులు చిన్నవైనా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిలో గుజరాత్‌ కళాకారులు చేతిపనితో తయారుచేసిన వస్తువులు విక్రయిస్తారు. కచ్‌వర్క్‌ చనియాచోలీ వంటి ఎంబ్రాయిడరీ వస్త్రాలకు, బెడ్‌షీట్లు, పిల్లో కవర్లకు గుజరాత్‌ ప్రసిద్ధి గాంచింది. గ్రామీణ డిజైన్లతో తయారుచేసిన వెండి పెండెంట్లు, ఇతర వెండి ఆభరణాలు విక్రయించే దుకాణాలు కూడా ఉన్నాయి. ఈ ఆభరణాలు చాల చౌకధరలకు లభిస్తాయి. కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని చూస్తే వాడినా, వాడక పోయినా కొనేయాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటాయి.

ఒక సాయంకాలం (ఫ్రెండ్స్‌తో కలిసి ఊరికే చూసి ఆనందించాలని ఆ ప్రాంతానికి వెళ్ళాను. అలా వీధుల్లో దుకాణాలు చూస్తూ, నడుస్తూంటే, మిర్రర్‌వర్క్‌ (అద్దాలతో కుట్టిన) చేసిన చాలా అందంగా ఉన్న పర్పొకటి నన్ను ఆకర్షించింది. దాన్ని ఇష్టపడి, ధర అడిగాను.

ఆషాపునో యువ దంపతులు నడుపుతున్నారు. ఈ రెండు మూదేళ్ళలోపునే పెళ్ళాడినట్లున్నారు. అమ్మాయి ముచ్చటగా, ఆరోగ్యంగా చక్కని చిరునవ్వుతో ఉల్లాసంగా కనిపించింది. సాదా కాటన్‌ చీర ధరించింది. మెళ్ళో నల్లపూసల దండ, చేతులకు గాజు గాజులు తప్ప మరే ఆభరణాలు అలంకరించుకోలేదు. మహిళ ఆరోగ్యంగా ఉండి, చిరునవ్వులు చిందిస్తుంటే, ఆభరణాలు లేకుండానే అందంగా కనిపిస్తుంది.

భర్త ఆమెకన్నా కాస్త పెద్దవాడు. 25 ఏళ్ళుందొచ్చు. సన్నగా, ఎత్తుగా ఉన్నాడు. పర్పుధర వంద రూపాయలు చెప్పాడు.

అహ్మదాబాద్‌కు చెందిన నా ఫ్రెండు, మరీ ఎక్కున చెప్తన్నాడంది. బేరం చేద్దామంది. సరిగ్గా అప్పుడో అసాధారణ దృశ్యం నాకంటపడింది. షాపు దగ్గర, పుట్‌పాత్‌కు ఆనుకొని ఏర్పాటుచేసిన ఉయ్యాలలో ఓ పసిపిల్లాడు పదుకొని ఉన్నాడు. ఏడాది వయసు ఉంటుందేమో. సాదాసీదా కాటన్‌ దుస్తులు తొడిగారు. నేను చూసినప్పుడు ఓ కర్రబొమ్మతో ఆడుకొంటున్నాడు. మంచి ఆరోగ్యంగా, ఉల్లాసంగా కనిపించాడు. పెద్దవాళ్ళెవరూ ఉయ్యాల దగ్గర లేరు.

ఉయ్యాల్లో ఉన్నదెవరని షాపమ్మాయిని అడిగాను.

“మాబాబే” అని మురిసిపోతూ సమాధానం చెప్పింది.

ఆమె చిరునవ్వుచూసి, ఆమెతో మాట్లాడాలనిపించింది.

“బిడ్డను మార్కెట్‌కు ఎందుకు తెచ్చావు? ఇంట్లో ఎవరికైనా అప్పగించి రావచ్చుకదా? లేకపోతే పక్కింటి వాళ్ళు చూసుకోరా?

నన్ను మనిషిగా చూదండి శతా సంకోచిస్తూనే చెప్పింది. “ఇంట్లో ఇంకెవరూలేరు. ఇరుగుపొరుగు వాళ్ళదంతా ఇదే వ్యాపారం. ఎవరి షాపుకు వాళ్ళు వెళ్ళిపోతారు.”

నేనెప్పుడూ ఇలాంటి మహిళలతో మాట్లాడి వాళ్ళ జీవన విధానాన్ని ఆకళింపు చేసుకోడానికి ప్రయత్నిస్తాను. నా మనసులోంచి కచ్‌పర్సు అదృశ్యమై, ఈ చిన్న బిడ్డ ప్రవేశించాడు.

“బిడ్డను చూసుకుంటూ పనెలా చేస్తావ్‌?”

“ఉదయం తెలవారకముందే లేచి ఎంబ్రాయిడరీ పని, ఇంటిపని అన్నీ పూర్తిచేస్తాను. బాబును మా ఆయన చూసుకుంటాడు. మధ్యాహ్నం ఆయన ఎంబ్రాయిడరీ పనిచేస్తే నేను బిద్దను చూసుకొంటాను. సాయంకాలం షాపును, బిడ్డను ఇద్దరం చూసుకొంటాం.”

“=ప్పేప్రర్‌ చదివే అలవాటుందా? టీ.వీ. చూస్తావా?” ఈ ప్రశ్నలు అసంగళమైనా, తెలుసు కోవాలని అడిగాను.

॥ “మాకు టీ.వీ. లేదు. అరుదుగా పక్కింటికి వెళ్ళి చూస్తాము. మా బస్తీకి వచ్చే ఒకేఒకగుజరాతీ పత్రికను మాఆయన చూసి నాకు వార్తలు చెప్తారు. అయినా ప్రతిరోజూ పెద్దగా వార్తలేముంటాయి? దేశాన్ని ఏదో రాజకీయ పార్టీ ఏలుతోంది, ఎవర్నో ఎవరో చంపేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉంటాయి. వాటికీ, మాజీవితాలకూ సంబంధమేం లేదు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పటినుంచీ ఒకేలా ఉన్నాం. ఇప్పుడు మాఆయన చేసేపనే అప్పుడు కచ్‌లో మానాన్న చేసేవాడు”

“చదవడం వచ్చా? ఎప్పుడైనా స్కూలుకు వెళ్ళావా?”

“లేదు. స్కూలుకు అసలే వెళ్ళలేదు. నాకో సవతితల్లి ఉండేది. ఆమె మమ్మల్నెప్తుడూ స్కూలుకు పంపలేదు. మేం కచ్‌నుంచి వచ్చాము. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మేం స్కూలుకు వెళ్ళేబదులు ఎంబ్రాయిడరీ పని నేర్చుకోవలసివచ్చేది. మా ఆయన నాలుగో తరగతి వరకు చదివాడు. గుజరాతీ పేపర్‌ చదివేంత చదువొచ్చు”

“మీ బిడ్దవయసెంత?”

“ఏడాదయింది. ఈరోజువాడి పుట్టిన రోజు. ఇంక పిల్లలు వద్దనుకొన్నాం. మేం చదువుకొనకపోతే పోయింది. వీడినన్నా చదివిస్తాం. వీడికోసం కష్టపడి పనిచేస్తాం”

అప్పటికి బేరం ముగిసింది. షాపతను ధర తగ్గించలేదు. నా ఫ్రెండు పర్సు కొనలేదు. మేం బయలు దేరడమే తరువాయి.

మరోసారి బిడ్డను చూశాను. ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ రోజు వాడి పుట్టినరోజు, హఠాత్తుగా ఆ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ పుట్టినరోజు వేడుక గుర్తొచ్చింది. సంపన్న కుటుంబంలో పుట్టిన వారెవరూ వారి ప్రయత్నం ద్వారా పుట్టలేదు. అది

“వశ జ్ఞానం - వరిజ్ఞానం కేవలం యాదృచ్చికం. ఈ బిడ్డ ఇక్కడ పుట్టాడు. అతనికేదైనా కానుక ఇవ్వాలనిపించి, ఓ వంద రూపాయలనోటు తీసి వాడి చేతిలోఉంచి, ముందుకు కదిలాను.

వాడి తల్లి నావెనుకే పరిగెత్తుకొచ్చింది. “దయచేసి మీడబ్బు మీరు తీసుకోండి. మేం బిచ్చగాళ్ళంకాదు. మీరెవరో మాకు తెలియదు. మాకు డబ్బివ్వదానికి మీరెవరు?”

ఆమె మొహంలో ఆగ్రహం కనిపిస్తోంది.

“అది మీకోసం కాదు. ఈ రోజు బిడ్డపుట్టినరోజుకదా. మొదటి ఏడాది పూర్తిచేసుకొన్న బిడ్డకు ఏదైనా చిన్న బహుమతి ఇవ్వడం మా ఆచారం. మీతో ఇంతసేపు మాట్లాడాను కదా. నువ్వునాకు తెలుసు. ఈ డబ్బు బిడ్డకు నా ఆశీస్సులుగా ఇస్తున్నా వద్దనకు” అన్నాను.

ఈ మాటలతో ఆమె ఆగ్రహం కాస్త తగ్గింది. ఒకనిముషంలో ఆమె కళ్ళలో మళ్ళీ వెలుగొచ్చింది, మొహంలో చిరునవ్వు విరిసింది. వెనుతిరిగి వెళ్ళిపోనుండగా, ఆమె నాకుడిచేయి పట్టుకొని పర్సు అందించింది. విస్తుపోయాను, వద్దనీ చెప్పాను.

“నేను బిడ్డకు కానుకగా ఇచ్చిన దానికి మారుగా దీన్నిస్తున్నావా?”

“లేదు 'బెన్‌' (అక్కా ఈ మొత్తం వ్యవహారం నాకు అబ్బురంగా ఉంది. మా షాపుకు చాలామంది కస్టమర్లు వస్తుంటారు. వాళ్ళెప్పుడూ బేరం సంగతి తప్ప మరొకటి మాట్లాడరు. ధర అడుగుతారు. తర్వాత బేరమాడుతారు. డబ్బిచ్చి, ప్యాకెట్‌ తీసుకొన్న తర్వాత, ఇకతిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు. ఒక్కసారికూడా మాతో ఎవరూ ఇలా మాట్లాడలేదు. వాళ్ళు మమ్మల్చెష్తుడూ వ్యాపారులుగా చూస్తారు తప్ప మామూలు మనుషుల్లా చూడరు. మేమెలా బతుకుతున్నాం, ఏంచేస్తున్నామని ఎవరూ అడగరు. మమ్మల్ని మనుషుల్లా చూసిన మొదటి వ్యక్తిమీరే. మేం చాలా సంతోషించాం. దీన్నిస్తున్నందుకు కోపగించుకోకండి. ఇది నాబిడ్డ మీకు ఇస్తున్నాడు. నావూరు నుంచిరాని, మాభాష తెలియని, మాకు పరిచయంలేని ఓ వ్యక్తి, నాబిడ్డ మొదటి పుట్టినరోజునాడు వాడిని ఆశీర్వదిస్తోందని చాలా సంతోషించాను. ఆమెను మా శక్తిమేరకు గౌరవించడం మావిధికాదంటారా చెప్పండి? ఈ ఖాళీపర్సును నింపేంత సొమ్ము నాకు దేవుడు ఇవ్వలేదు. కానీ, ఇలాంటి అనేక పర్సులు నిండేంత ధనం దేవుడు మీమీద వర్షించాలని ప్రార్థిస్తున్నాను.”

ఏదో అనామక యంత్రంలాకాక, తననొక మనిషిగా చూడాలన్న ఆమె కోరిక పూర్తిగా నాకోరిక లాంటిదేనని గ్రహించాను. కానుకను సంతోషంగా స్వీకరించాను. బిడ్డ, చేతిలో నోటుతో చిరునవ్వు చిందిస్తూనే ఉన్నాడు.

మో, జ్సం

కీ చెన్నైజారుని బెదార్యం

ఆతవుంకాలో నిధులసేకరణ కార్యక్రమాలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. మంచిపని కోసం సేకరిస్తున్నారని భావిస్తే ప్రజలు చాలా ఉదారంగా విరాళాలిస్తారు. రాజకీయ పార్టీలు కూడా ఉపన్యాసాలు, విందుల ద్వారా విరాళాలు సేకరిస్తాయి. యూనివర్సిటీలు, దాతృత్వ సంస్థలలో ఇందుకోసం ప్రత్యేక డిపార్భమెంట్‌లే ఉంటాయి. వాళ్ళు రకరకాల పద్ధతులద్వారా ధనవంతులను, కంపెనీలను పట్టుకొని తమ యూనివర్సిటీలు లేదా సంస్థలకు విరాళాలు రాబడుతూంటారు. ఈ పద్ధతి ఇప్పుడిప్పుడే మనదేశంలో కూడా వ్యాప్తిలోకి వస్తోంది.

నా '్రెండు మైథిలి ఓ ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌.జి.ఓ) కోసం పనిచేస్తోంది. ఆ సంస్థనిర్వహించే ప్రజాసేవా కార్యక్రమాలకోసం ఆమె నిధులు సేకరిస్తుంటుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మైథిలి మంచి మాటకారి, చురుకైంది. ఒకరోజు ఉదయం ఆమె నాకు ఫోన్‌చేసింది. నగరంలో అత్యంత ధనవంకుల్లో ఒకరుగా పేరుపొందిన మహిళను కలుసుకోడానికి వెళ్తున్నానని చెప్పింది. వాళ్ళింటికి నేనుకూడా ఆమెతో రావాలని కోరింది.

మెథిలి ఆమెను చాలాకాలంగా తరచుగా కలుస్తూ విరాళం ఇవ్వాలని కోరుతోంది. ఎట్టకేలకు అంగీకరించింది. అయితే నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఫార్మ్‌హౌస్‌కు వస్తే ఇస్తానంది. ఒంటరిగా వెళ్ళడానికి సందేహించి మైథిలి నన్ను తోడు రమ్మని కోరింది.

ఆ రాజప్రాసాదంలాంటి భవనానికి చేరుకొన్నాం. ఇరవైఅయిదెకరాలుండే ఓపెద్ద తోట మధ్యలో ఉందా భవనం. దాన్ని సాంప్రదాయిక కుటీరం నమూనాలో కట్టారు. కట్టు దిట్టమైన సెక్యూరిటీ ఉంది. కాపలాదార్లు మమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడిగారు. ఆఖరికి ఇంటర్‌కామ్‌లో అడిగి ధృవీకరించుకొన్న తర్వాతగానీ మమ్మల్ని లోపలికి వదలలేదు.

బయటినుంచి పల్లెటూరి కుటీరంలా కనిపిస్తుందికానీ, లోపలి హంగులు, అలంకరణలు చూసి మేము అదిరిపోయాం. లోపలంతా ధగధగాయ మానంగా, ఆధునికంగా వెలిగిపోతోంది. గోడలన్నిటినీ లేతరంగుల్లో పెయింట్‌ చేశారు. హాల్లో ఓ చిన్నకొలను మధ్య ఏర్పాటుచేసిన ఫౌంటెన్‌ సుగంధం వెదజల్లే నీటిని చిమ్ముతోంది. ఆహాలులో ప్రకృతి సౌందర్యాన్ని సృష్టించే ప్రయత్నంలోనే కొలను, ఫౌంటెన్‌లాంటివి

756 జ్ఞానం - వరిజ్ఞానం ఏర్పాటుచేశారు. వోలు చాలా విశాలంగాఉంది. ఉదెన్‌ఫ్తోరింగ్‌, అడుగడుగునా ప్రాచీన కళాఖండాలతో చాలా శోభాయమానంగా ఉంది. భవనం కప్పుమీదకూడా గార్దెన్‌ ఉంది. ఇంటామె తళతళలాడుతున్న గొలుసులకు వేలాడదీసిన ఉయ్యాలలో కూర్చునిఉంది. గొలుసులు ఇత్తడితో తయారుచేశారో, బరగారంతో చేశారో చెప్పలేం. షిఫాన్‌చీరలో, ష్లాటినమ్‌ ఆభరణాలతో మహిళ తళతళలాడుతోంది. మేమింకా దూరంలో ఉండగానే మమ్మల్ని కూర్చోమని చేత్తో సైగచేసింది. ఆమె వయసు ఏఖై, అరవై ఏళ్ళ మధ్య ఉంటుంది కానీ చిన్న వయసు మహిళలా కనిపిస్తోంది. హాలంతా చందనం పరిమళాలు వెదజల్డుతోంది. పూలకుండీల్లో పువ్వులు తాజాగా ఉన్నాయి. చురుగ్గా కనిపిస్తున్న ఇద్దరు సెక్రటరీలు ఆమెకు చెరోవేపు నిల్చున్నారు. మైథిలి, నేను ఇద్దరం కూడా ఇబ్బందిగా ఫీలయ్యాం. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన చిరునవ్వు, ఆదరణ లుప్తమైనప్పుడు మిగిలిన అలంకరణలు వెలవెలపోతాయి. ఎవర్నీ ఆకర్షించలేవు. ఆ వాతావరణంలో ఎవరూ అట్టేసేపు కూర్చోలేరు. ఆఅతీథేయులు పెట్టే ఆహారం, వాళ్ళు అలంకరించుకొన్న అభరణాలు, ఇంటి అందచందాలు అతిథుల్ని ఆనందింపజేయలేవు. వారి చిరునవ్వు, ఆదరణ మాత్రమే అతిథులకు హాయిగాలిపి, అంతస్తు, వయసు, భాషలతో, స్రీయా, పురుషుడా అన్న దానితో నిమిత్తం లేని స్నేహ, సొవోర్జాలకు దోహదం చేస్తాయి. మైథిలి తన ఎన్‌.జి.ఓ. కార్యకలాపాలు గురించి అతిశయోక్తులతోనే అనుకోండి = అమెకు వివరించింది. మైథిలి లక్ష్యం సాధించాలికదా, అందుకని సంస్ధ గురించి గొప్పలుచెప్పి, ఆమెను మెప్పించే ప్రయత్నం చేయక తప్పలేదు. సాధారణంగా అతిగా గొప్పలుచెప్తే, వినేవారు ఎక్కడో ఓచోట పట్టేస్తారు. కానీ ఈ ధనవంతురాలు ఓపిగ్గా విన్నది. ఆమె మొహంలో ఎలాంటి భావాలూ వ్యక్తం కాలేదు. మధ్యలో ఎక్కడా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. వినేవారిలో స్పందన లేకపోతే, మాట్లాడేవారి నోరు మూతపడి *ప్రోత్రుంది. తెలివైన వాళ్ళు తమ ఆలోచనలు బయటపదడనివ్వరు. అమాయకులు చాలాచాలా మాట్లాడేసి, మనసులో ఉన్నదంతా వెల్లడించేస్తారు. ఇప్పుడు మైథిలి చేసిందదే. ధనవంతురాలు తాను ఏమనుకుంటోందో వెల్లడించలేదు. ఆమె మౌనాన్ని భరించలేకపోయాం. చాలాసేపటితర్వాత “మీ విజ్ఞాపన పత్రం, ఇతర పత్రాలు నా సెక్రటరీకి ఇవ్వండి. వాటినిచూసి, తర్వాత మీకు తెలియజేస్తాను” అని తేల్చేసింది. మా ఉత్సాహం నీరుగారిపోయింది. గాలితీసిన బెలూన్లలా అయిపోయాం. ఆమె ఈమాట మాకు ముందే ఫోన్లోచెప్పవచ్చుకదా. మళ్ళీఅంతదూరం డైవ్‌చేసుకుంటూ రిక్తహస్తాలతో తిరిగొచ్చాం. అర్ధరోజు వృథా అయిపోయింది.

చెన్నైపొరుని బొదార్వం 27

తర్వాత నెలరోజులకు ఓ స్కూలు ప్రారంభోత్సవంలో మైథిలి కలిసింది. ఆ దొరసానే ముఖ్య అతిథి. విరాళం సంగతి ఏమైందని మైథిలిని అడిగాను.

మైథిలి నన్ను పక్కకు తీసుకెళ్ళి, గుసగుసగా చెప్పింది. ఆమెదగ్గరి నుంచి డబ్బురాబట్టడం చాలా కష్టం. తనకోసమైైతే ఎంతైనా ఖర్చుపెట్టుకుంటుంది. ఏదైనా మంచిపనికి పదిరూపాయలివ్వాలన్నా పదివేలసార్లు ఆలోచిస్తుంది. నెలరోజులు అదేపనిగా వెంటపడి ఒప్పిస్తే ఆఖరుకు రూ. 10,000 ఇవ్వడానికి అంగీకరించింది. అదీ ఈ సభకు ఆమెను ముఖ్యఅతిథిగా ఆహ్వానించి, ఆమెఫొటో పేపర్లో వేయించి, ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసే షరతుతో అంగీకరించింది.

“ఆమెను అంత చిన్నమొత్తం ఎందుకడిగావ్‌?”

“౬ ఎన్‌.జి.ఓ. కు నిధులు సేకరించడం కష్టమనే సంగతి మరిచిపోవద్దు. నీకు అనుభవంలేదు. ప్రతిరూపాయీ ముఖ్యమే. ప్రతి నీటిబొట్టూ చేరితేనే సముద్ర మవుతుందని తెలుసుకదా. ఏదో ఒకప్రతిఫలం ఆశించకుండా ఎవ్వరూ సొమ్మివ్వరు. నిధుల సేకరణలో నేను నేర్చుకొన్న పాఠంఇదే.”

నిధుల సేకరణలో నాకు అనుభవం లేకపోవడంతో, మైథిలి మాటలతో ఏకీభవించ వలసి వచ్చింది. ,

వారం రోజులు సెలవులో ఉండి, నేను లేనప్పుడు పేరుకు పోయిన ఉత్తరాలు, ఇ-మెయిల్స్‌ను తలచుకొని బయపడుతూ ఆఫీసుకు వచ్చాను. ఉత్తరాలను సర్దుతుంటే, నా సెక్రటరీ ఓ చిన్న కవరుపైకి తీసింది. ఆమె మొహంలో ఆశ్చర్యం తొంగిచూసింది.

“అంత ఆశ్చర్యం కలిగించడానికి ఆ కవర్లో ఏముంది?”

ఆమె చేతిరాతతో ఉన్న ఓ చిన్న కాగితం చూపించింది. అందులో ఇలా ఉంది. “నేనెవరో మీకు తెలియదని నాకు తెలుసు. మీరు చేస్తున్న మంచిపనులు గురించి వార్తాపత్రికలలో చదివాను. మీరచనలు కూడా చదివాను. జీవితాన్ని అనుభవిస్తే తప్ప రచయితలు జీవితం గురించి రాయలేరు. భాష ఓ సాధనం మాత్రమే. భాష బావున్నంత మాత్రాన రచన పఠసీయమైపోదు. ఒక రచన ఆసక్తికరంగా ఉండి, పాఠకునిచేత చదివింపజేయాలంటే తగిన భాషతోపాటు వ్యక్తిగత అనుభవం ఉండాలి. మీ అనుభవాల గురించి చదివి మీరెలాంటి కృషి చేస్తున్నారో, ఎంత ఉత్సాహంతో పనిచేస్తున్నారో...”

నేను బిజీగాఉండి ఇకచదవలేక దాన్ని సెక్రటరీకి తిరిగి ఇచ్చేస్తూ “అతిగా పొగుడుతూ రాస్తుంటారు కదా కొంతమంది. ఇదీ అలాంటి ఉత్తరమే. సైల్‌చేస్తేచాలు. ఇలాంటివన్నీ నాకు చూపించాల్సిన అవసరంలేదు. ఆఫీసులో ఉదయంపూట సమయం చాలా విలువైంది కదా అన్నాను.

7౮5 జ్ఞానం - వరిజ్ఞానం

నాక్కొంచెం అసహనంగా ఉంది.

“వ్పేడ్రమ్‌, మీరు పూర్తిగా చదవలేదు. ఇది అలాంటి ఉత్తరం కాదు”

సరే చూద్దామని చదివాను. “నేను పెద్దవాడిని. మీలాగ ప్రయాణాలు చేయలేను. నేను కొంతసొమ్ము పొదుపు చేసాను. దాన్నిమీరు మంచిపనులకు ఖర్చుపెట్టగలరని, మీకు ఇవ్వదలిచాను. మీకు చాలా సంపద ఉండొచ్చు. కానీ దీన్ని మీ మంచి పనులకోసం ఇస్తున్నాను. దీన్ని మీరు ఎవరికిస్తారు, ఎలా ఖర్చుపెడతారని అడగను. మీమీద నాకు నమ్మకముంది”

ఆ కాగితానికి నాలుగు లక్షల రూపాయల బ్యాంకు డ్రాష్ట్ర జతచేసి ఉంది.

ఇప్పుడు నా సెక్రటరీ కంటే నేనే ఎక్కువగా ఆశ్చర్యపోయాను. నా ప్రజాహిత జీవితంలో ఆర్థిక సహాయం కోరుతూవచ్చే వందలాది ఉత్తరాలు, ఇచ్చిన సొమ్ము చాలలేదంటూ వచ్చే అనేక లేఖలు అందుకొన్నాను. అయితే ఈ వ్యక్తి నాసేవా కార్యక్రమాలకోసం డబ్బిస్తున్నాడు. ద్రాఫ్టును సూర్యునికి ఎదురుగా పెట్టిచూశాను. చీకటి ఆకాశంలో మెరిసే నక్షత్రంలా కనిపించింది.

అయన ్రత్యుపకారమేమీ కోరలేదు. ఆ వ్యక్తి నీకు తెలుసునా అని సెక్రటరిని అడిగితే తెలీదంది. దాత తన గురించి ఒక్కముక్కకూడా రాయలేదు. చిరునామా లేదు. పోస్టుముద్రను బట్టీ చెన్నైనుంచి వచ్చిందని మాత్రం తెలుసుకో గలిగాం.

అజ్ఞాత దాతకు వినయపూర్వక నమస్కారం. అబూబెన్‌ ఆదం గురించిన పద్యం జ్ఞాపకం వచ్చింది. ఆయన గుంపువృద్ధిచెందుగాక (మే హిజ్‌ ట్రైబ్‌ ఇంక్రీస్‌)

నా ఆలోచనలు విరాళం కోసం మైథిలి వెంటాడిన సంపన్న మహిళమీదికి మళ్ళాయి. ఈ ఇరువురు దాతల మధ్య ఎంత వ్యత్యాసముందో చూడండి!

వో క

శేరి ల్‌ జీవితమే ఓ పరీక్ష ప.

మృ ఈ చిన్నమాట ప్రతి ఒక్కరినీ భయపెడుతుంది. అతడు రాజు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, నిరుపేదకావచ్చు, బికారి కావచ్చు. ఎవరైనా మృత్యువును తప్పించుకోలేరు.

ప్రత్యేకంగా ఒక కుటుంబంలో పుట్టడం మనచేతిలోలేదు. ఒకరు ధనవంతుని కుటుంబంలో పుట్టినా, మరొకరు నిరుపేద ఇంటిలో పుట్టినా అవి యాధృచ్చికంగా జరిగినవే. అయితే ఎవరు ఎక్కడ పుట్టినా మృత్యువు తప్పదు. మనహూర్వీకులు ఈయకథార్థాన్ని అర్ధంచేసుకొని, ఓ వ్యక్తి తన జీవితయాత్రను సవ్యంగా సాగించడానికి ఉపకరించే కొన్ని నియమాలను ఏర్పరిచారు. వారు జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. వాటిలో చివరి రెందుభాగాలైన వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం చాలా ముఖ్యమైనవి. మనిషి జీవితయాత్రలో ఏళ్ళు గడిచే కొద్దీ ఒకో దశనే చేరుకోగలుగుతాడు.

సమిత్ర, సురేష్‌ నేనూ ఒకే క్లాసులో చదువుకొన్నాం. సుమిత్ర వయసులో ఉన్నప్పుడు చాలా తెలివిగా, చురుగ్గా ఉండేది. చాలా హుషారుగా, కాస్త దూకుడుగా కూడా కనిపించేది. చదువులో ఎప్పుడూ ఆమెదే అగ్రస్థానం. సుమిత్ర అంత చురుకుదనం లేకపోయినా సురేష్‌ చాలా మంచివ్యక్తి. వాళ్ళు ఒకరినొకరు (్రేమించి పెళ్ళిచేసుకున్నారు. సురేష్‌ వ్యాపారంచేసి బాగా సంపాయించాడు. వ్యాపారంలో నుమి(ళశ్రకూడా అతనికి చేదోడువాదోడుగా నిలిచి సహాయపడింది.

వాళ్ళు బాగా సంపాయించి వెనకేసుకున్నా సుమిత్ర ఎప్పుడూ అనవసరంగా ఖర్చుపెట్టదు. ఆమెకు డబ్బువిలువ, ఛమవిలువ కూడా తెలుసు.

వాళ్ళను ఎప్పుడో ఓసారి కలిసేదాన్ని. వాళ్ళింట్లో ఏదైనా పార్టీ జరిగినప్పుడు కూడా పిలిస్తే వెళ్ళేదాన్ని, వాళ్ళ ఆతిథ్యం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళతోటలో కూర్చుని మా బంగారు కాలాన్ని జ్ఞాపకం చేసుకొనేవాళ్ళం.

వాళ్ళుపైకి సంతోషంగా, ఉత్తమ దంపతుల్లా కనిపించేవారు. ఆజంటను చూసి అందరూ ముచ్చటపడేవారు. కానీ వాళ్ళలో కాస్త విచారధాయ లీలగా కనిపించేది. వాళ్ళకు సంతానం లేదు. ఎవర్నీ దత్తత తీసుకోరాదని నిశ్చయించుకొన్నారు. కారణాలేమిటో వాళ్ళకే తెలియాలి. అపార్థాలకు దారితీయవచ్చు కనుక, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చరాదని నానమ్మకం. అందుకని అడగలేదు.

760 జ్ఞానం -'వరిజ్ఞానం

ఒకరోజు సుమిత్ర ఫోన్‌చేసి “సాయంకాలం భోజనానికి రాగలవా?” అని ఆహ్వానించింది.

వాళ్ళు అప్పుద్దుడూ పిలుస్తున్నట్లే, ఈసారికూడా భోజనానికి పిలిచారనుకొన్నాను. అయితే నేను వాళ్ళింట్లో అడుగు పెట్టినప్పుడు అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరిలో ఎవరూ మామూలుగా లేరు. ఎందుకో దిగులుపడుతున్నట్లుగా కనిపించారు.

నన్ను చూసేసరికి సుమిత్రకు దుఃఖం కట్టలు తెంచుకొంది. “ఈరోజు మెడికల్‌ చెకప్‌కు వెళ్ళాను. ఏడాదికో రెందేళ్ళకో ఓసారి చెకప్‌ చేయించుకొంటూ ఉంటాను. ఈసారి కూడా సమస్యలేమీ ఉండవనుకొన్నా. అయితే, డాక్టరుగారు నా మూత్రపిండాలతో ఏదో సమస్యఉందన్నారు. నాకు నిజంగా విచారం పట్టుకుంది.”

వారలా దిగులు పడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు. కిందటేడాదే సురేష్‌కు గుందెపోటు వచ్చింది. వాళ్ళు పూర్తిగా ఒకరిపై ఒకరు ఆధారపడ్డారు. ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు, ఒకరికోసం ఒకరు ఆలోచించేవారు. ఇప్పుదు ఎన్నాళ్ళు బ్రతుకుతారో తెలియని పరిస్థితిలో పడ్డారు.

జీవితంలో ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదు. ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించవచ్చు. ధనముంటే, మందులు కొనుక్కోవచ్చు. సదుపాయాలు కల్పించుకోవచ్చు. సంతోషాన్ని కానుక్నోలేం. వాళ్ళు తమభయాలు, సందేహాలన్నీ నాకు వినిపించాలనుకున్నారు. నేను హృదయపూర్వకంగా విన్నాను.

సురేష్‌ ఎంత బాధలో ఉన్నా ఆచరణీయంగా ఆలోచిస్తాడు. సుమిత్ర వేపు తిరిగి చెప్పాడు. “మనమిప్పుడు మిగిలిన కాలంలో డబ్బు ఎలాఖర్చుపెట్టాలో ఆలోచించాలి. మనం విల్లు రాసేయడం మంచిదనిపిస్తోంది. విల్లు రాసేస్తే తర్వాత బంధువుల మధ్య గొడవలుండవు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఏ బంధువూ ఆదుకోలేదు. వాళ్ళలో ఎవరికీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు".

సురేష్‌ చెప్పింది నిజమే. ఓ వ్యక్తి కష్టపడి సంపాయిస్తే, అతని వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. పనిచేయకుండా డబ్బు వారసత్వంగా పొందిన వ్యక్తికి బలమైన వ్యక్తిత్వం ఉండదు. అందువల్లనే సురేష్‌ ఇలాంటి నిర్ణయం తీసుకొన్నాడు.

అయితే సుమిత్ర అభిప్రాయం వేరుగా ఉంది. సుమిత్ర భర్తతో విభఖేదించడం మొదటి సారి ఇప్పుడే చూశాను. ఆ రాత్రి వాతావరణం చల్లగా ఉన్నా, వాళ్ళ వాదోపవాదాలతో గది వేడెక్కినట్లనిపించింది. వాళ్ళ చర్చలో నేను కల్పించుకోలేదు. నాలాంటి బయటి వ్యక్తి ఎలా జోక్యం చేసుకొంటుంది? అసలు ఇలాంటి పరిస్థితిలో అక్కడ ఉండడమే మంచిది కాదనుకొన్నాను.

జీవితమే & వరీక్ష 767 నేనిక బయలు దేరబోతుంటే, సుమిత్ర ఆపింది. “నువ్వేదైనా సలహాలిస్తావని పిలిచాం. నువ్వు మమ్మల్ని ఎంతో (ప్రేమగా, ఆదరంగా చూశావ్‌. నువ్వెప్పుడూ మమ్మల్ని సమంగా చూశావ్‌. నువ్వు మాకు పరాయివ్యక్తికాదు. అలా ఎప్పుడూ అనుకోవద్దు” ఇక అక్కడే ఉంది వాళ్ళవాదనలన్నీ వినాల్సివచ్చింది. “నేనెప్పుడూ నా సొంతానికి ఖర్చుపెట్టలేదు. ఇంక ఎంతకాలం బతుకుతానో తెలియదు. అంచేత నాకు ఇష్టమైన రీతిలో జీవితాన్ని అనుభవిస్తాను. ఆనందంగా గడిపేయాలనుంది.” ఇదీ సుమిత్రవాదన. ఆరోజు నిర్ణయాలేమీ జరగలేదు.

రోజులు గడచిపోతున్నాయి. దంపతులమధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. సురేష్‌ కంటె సుమిత్రనే ఎక్కువసార్లు కలిశాను. ఆమె గురించి ఇతరుల ద్వారా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. తనకు నప్పుతాయా, నప్పవా అని చూసుకోకుండా చాలా ఫ్యాషన్‌గా ఉండే దుస్తులు కొనడం ప్రారంభించింది. దబ్బు విచ్చల విడిగా ఖర్చుపెడుతోంది. దినపత్రికల సొసైటీ పేజీల్లో ఆమె ఫొటోలుకూడా చూశాను.

ఒకరోజు ముంబాయి నుంచి వస్తుంటే ఆమె విమానాశ్రయంలో కలిసింది. నా కళ్ళను నేను నమ్మలేక పోయాను. ఈమె ఆ సుమిథ్రేనా అనిపించింది. పొడవాటి జుత్తు, చక్కటి దుస్తుల్లో ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉండే సుమిత్రలో ఎంతమార్చు? పారదర్శకంగా ఉండే వెష్టన్‌ దుస్తులు ధరించింది. ఆమె కదిలితే వజ్రాలు రాబేలా ఉంది. ఎన్ని వజ్రాలో! వజ్రాల గాజులు, వజ్రాల కంకణాలు, వజ్రాల చెవిరింగులు, వజ్రాల గొలుసులు - అన్నీ వజ్రాలు పొదిగినవే. మొహానికి ఒత్తుగా మేకప్‌ చేసుకుంది. అత్తరులో మునిగితేలినట్లుంది.

ముంబాయికి ఎందుకొచ్చిందో చెప్పింది. “ముంబాయికి హార్స్‌రేసుకోసం వచ్చా. నేను ఇంతకు ముందెప్పుడూ గుర్రప్పందాలు చూడలేదు. అందుకని ఇదికూడా చూసి ఆనందించాలనుకొన్నా ఇక్కడినుంచి చెన్నై వెళ్తున్నా అక్కడ ఓ సినిమా నిర్మాత కూతురు పెళ్ళికి హాజరుకావాలి.”

“సినిమా (ప్రొడ్యూసర్ల గుంపులో ఎప్పుడు పడ్డావ్‌?”

“కొంతకాలంగా సినిమాలకు పెట్టుబడి పెడుతున్నా. ఈ ఫీల్డులో చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇంతకాలం నాకా సంగతే తెలియదు. ఏమీ అనుభవించకుండానే జీవితమంతా గడిపేశాను. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను”

“సురేష్‌ ఎలా ఉన్నాడు?”

నావ్రశ్న ఆమెకు నంతోషం కలిగించలేదు “మామూలే, వ్యాపారంలో 'మునిగితేలుతున్నాడు.

కోరం షమెన తీరులో వారుబతుకుతున్నారని నాకు అర్ధమైపోయింది. ఇద్దరూ ఎవరి ఆస్ట సంస్తలు గురించి అడిగేదాడు. నాకున్న సురేష్‌ ఎప్పుడైనా ఫోన్‌చేసి, కొన్ని విద్యాసంస్థలు అనుభవంతో, నాఅభిప్రాయాలు నిజాయితీగా చెప్పేదాన్ని కొద్ది రోజుల తర్వాత సురేష్‌ న్యాయవాది ఫోన్‌ చేశాడు. "సురేష్‌ విల్లు సిద్ధంచేశాడు. మీరు ఎగ్జిక్యూటర్‌గా ఉండాలని కోరుతున్నాడు. మీకు సమ్మతమేనా?”

సురేష్‌ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. నేనతని బంధువును కాను. అతనితో

వ్యాపార సంబంధాలు కూడాలేవు. వాళ్ళింటికి వెళ్ళి మాట్లాదాలనుకున్నా. జీవితంలో ఇతరుల డబ్బు వ్యవహారాలు నిర్వహించడమంత కష్టం మరోటుందదు. మనసొన్మును పోగొట్టుకుంటే ఫరవాలేదు. కానీ, ఏదైనా ట్రస్టుకు ట్రస్టీగా ఉంటే, మీ బాధ్యతలు వెయ్యిరెట్లు పెరుగుతాయి. ప్రపంచంలో విశ్వాసం చాలా అరుదుగా కనిపించే విశిష్టమైన గుణం.

సురేష్‌ను కలిశాను. సుమిత్ర ఢిల్లీ వెళ్ళింది. నేవెళ్ళేసరికి లాయర్‌తో చాలా ఉల్లాసంగా మాట్లాడుతున్నాడు. విల్లుచదివి విస్తుపోయాను. స్కాలర్‌షిప్‌లు ఇచ్చే యేర్చాటు చేయాలని, విద్యాసంస్థలు, గ్రంథాలయాలు, కంప్యూటర్‌ కేంద్రాలకు విరాళాలివ్వాలని అతను అభిలషించాడు. ఎక్కడా తనపేరు ్రస్తావించరాదని కోరాడు. అన్ని విరాళాలు సుమిత్ర పేరుమీదే ఇవ్వాలని రాశాడు. అతనికేపి ఆశ్చర్యంగా చూశాను.

“అవును. మా అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చుకానీ, ఆమె సహాయం లేకపోతే, నేను వ్యాపారాన్ని ఇంతగా పెంచగలిగే వాడిని కాదు. ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉన్నాయి. అయితే నా పద్ధతి ఇలాగే ఉంటుంది.”

“ఈ విల్లు గురించి సుమిత్రకు తెలుసా”

“తెలియదు. దయచేసి మీరుకూడా చెప్పకండి”

వారంరోజుల తర్వాత సుమిత్ర ఆరోగ్యం క్షీణించినట్లు తెలిసింది. నేను ఆస్పత్రి చేరేసరికే ప్రాణంపోయింది. ఆమె బ్యాంకు ఖాతాలో ఒక రూపాయికూడా మిగల్లేదనికూడా

తెలిసింది,

సురేష్‌ తాను ప్రాణప్రదంగా చూసుకొన్న భార్యమరణం కలిగించిన దుఖం నుంచి కోలుకొని నిలబడ్డాడు. వాళ్ళనైవాహిక జీవితాన్ని చాలాకాలం ఆనందంగా గడిపారు. ఆమెలేని జీవితం సురేష్‌కు ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్ధంచేసుకోగలను. ఏడాది తర్వాత సురేష్‌ న్యాయవాది ఫోన్‌ చేసి, సురేష్‌ నిద్రలోనే కన్ను మూసినట్లు తెలియజేశాడు. అలా నాకున్న ఇద్దరు మంచి మిత్రుల జీవితాలు ఒక్కఏడాది కాలంలోనే ముగిసిపోయాయి. సుమిత్రస్శారక బహుమతిని చూసినప్పుడల్లా, జీవితం విచిత్రమైందేమో అని సందేహం కలుగుతుంటుది. తాము ఎక్కువ కాలం బతకమని ఇద్దరికీ తెలుసు కానీ, వేర్వేరు

జీవితమే & వరీక్ష 753 మార్గాలను ఎంచుకొన్నారు. సురేష్‌ కంటే సుమిత్రే చాలా తెలివైంది కానీ, జీవితాన్ని నుబేష్‌ అర్భంచేనుకున్న విధంగా అర్ధం చేనుకోలేదు. ఆమె జీవితాన్ని అనుభవించాలనుకొంది. సురేష్‌ ప్రజోపయోగ పనులు తలపెట్టాడు. ఒకే రకం పరిస్థితులు ఇద్దరు భిన్న మైన వ్యక్తులనుంచి రెండు వేర్వేరు ఫలితాలు రావడానికి కారణమయ్యాయి.

మ్‌ జ్యా

డ్రి నాడబ్బు, నీడబ్బు నొవయసు ఎంతైనా మనసులో నేను పసిదాన్నే అనుకుంటాను. నేను టీచర్ని కావడమే ఇందుకు కారణమని చెప్పాలి. యువతరంతో నేను సులభంగా కలిసిపోతాను. వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉంటారు కదా. వాళ్ళ ఉత్సాహం చూస్తే, నాలో అనందం ఉరకలెత్తుతుంది. వాళ్ళు నాతో తమ రహస్యాలు కూడా చెప్పుకుంటారు. నా విద్యార్థు నాకు ్రేరణ. కాలేజీ టీచర్‌గా ప్రతి బ్యాచిలోనూ ఎంతో మంది విద్యార్థులను కలిశాను. కాలేజీ వదిలిన తర్వాత కూడా వాళ్ళలో అనేకమంది ఎక్కడో ఓచోట కలుస్తుంటారు. కాలం గడిచేకొద్దీ వారిపేర్లు నాకు జ్ఞాపకం రాకపోవచ్చు కానీ, వాళ్ళు మాత్రం నన్ను చూడగా గుర్తుపడతారు. అనేక ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు నాకు సహాయపడ్డారు. హోటల్‌లోనో, విమానాశ్రయంలోనో రిజర్వేషన్‌ లేక నేను అవస్థపడుతుంటే చూసి ఆదుకొన్నారు. నాపొత విద్యార్థులను కలుసుకోవడం, వారితో మాట్లాడ్ణం చాలా అనందదాయకమైనవి. పదేళ్ళకిందట నేను పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌ బోధించేదాన్ని ఆ బ్యాచిలో ప్రతిభావంతులైన విద్యార్థులు అనేకమంది ఉండేవారు. వారిలో అశోక్‌ను, అనితను చాలా అభిమానించే దాన్ని చాలాశ్రద్ధగా, కష్టపడి చదివేవారు. పోస్టు (గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు టీచింగ్‌ వృత్తిలో చేరాలనుకొని, నా సలవో అడిగారు. “నీకు టీచింగ్‌ ఇష్టమైతే, టీచర్లమే కావాలన్న కోరిక బలంగా ఉంటే, చేరండి. ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో అయితే సంపాదన బాగుంటుంది. అంతంతజీతాలు ఏకాలేజీ ఇవ్వదు. కానీ, టీచింగ్‌లో లభించే సంతృప్తి, సంపాదనలో లభించదు. టీచింగ్‌ అంటే ప్రత్యేకంగా ఇష్టం లేకుండా చేరితే మాత్రం, తర్వాత విచారించాల్సి వస్తుంది. డాక్టర్‌ పొరపాటు చేస్తే, రోగి భూమిలో ఆరడుగుల లోతుకు వెళ్టిపోఠాడు. జడ్జి పొరపొటుచేస్తే, ఆ వ్యక్తి భూమినుంచి ఆరడుగుల ఎత్తుకు వెళ్తాడు. టిచర్‌ పొరపాటు చేస్తే ఆ మొత్తం క్లాసు విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది.” అని చెప్పాను. చివరికి అనిత, ఆశోక్‌ ఇద్దరూ టీచింగ్‌ వృత్తినే ఎంచుకొన్నారు. కొన్నాళ్ళకు పెళ్ళి చేసుకొన్నారు. నేను వారి పెళ్ళికి వెళ్ళి, సృదయపూర్వకంగా ఆశీర్వదించి వచ్చాను. అప్పటికింకా వాళ్ళు నాలాగానే టీచర్లుగా పనిచేస్తున్నారు.

నా దబ్బు, నీ దబ్బు 265

తర్వాత కొంతకాలానికి వారికోపాప పుట్టింది. ఆశోక్‌ స్కూటర్‌ కొన్నాడు. చిన్న

అద్దింట్లో చీకూచింతా లేకుండా సంతోషంగా ఉండేవారు. చాలా మధ్యతరగతి వారి

మాదిరిగానే వారిదీ చిన్న కుటుంబం. వితంతువైన అశోక్‌ తల్లి వారితోనే ఉండేది. మొత్తం మీద వాళ్ళ జీవితం ప్రశాంతంగా, హాయిగా సాగిపోతోంది.

అనిత, నేనూ ఒకే కాలేజీలో పనిచేస్తున్నా మాపని వేళలువేరు కావవడంతో చాలా అరుదుగా మాత్రమే కలిసేవాళ్ళం. ఒకరోజు కంప్యూటర్‌ ల్యాబ్‌లో కనిపించింది. ఆమె. వ్యాకులతతో, విచారంగా ఉంది. “మేడమ్‌, మా ఇంటతను ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. వేరే అద్దింటికి వెళ్ళినా, కొంతకాలానికి అదే అవుతుంది. సొంతిల్లు ఉంటే ఈ చిక్కులుండవు. మా పాప కూడా నడవడం ప్రారంభించింది. నర్సరీ స్కూల్లో పేరు నమోదు చేయించాలి. టైమింగ్స్‌ వేరు కాబట్టి స్కూటర్‌ మీదవెళ్ళి వదిలి పెట్టిరాలేను. మాఅత్తగారు. పెద్దామె, పైగా కీళ్ళనొప్పులు. మేమో పనిమనిషిని కుదుర్చుకోవాలి. ఆర్థికావసరాలు పెరిగిపోతున్నాయి” అంది.

ఆమె సమస్యనాకు అర్ధమైనట్లు తలూపాను. ఈ సమస్యలన్నీ నేనూ ఎదుర్శొన్నవే. చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బందులే చూశాను. ఆమె అంతటితో ఆపలేదు.

“నేనో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాలని నిర్ణయించుకొన్నాను. వాళ్ళయితే జీతం ఎక్కువిస్తారు. అశోక్‌ తనకు టీచింగ్‌ వృత్తే సంతృప్తికరంగా ఉందంటున్నాడు. మారడం ఇష్టం లేదని తేల్చేశాడు. కానీ మాలో ఎవరో ఒకరం ఇంతకంటే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో చేరక తప్పదు. ఎవవరు చేరినా మంచిదే. మా మధ్య గొడవేం లేదు. ఇద్దరం ఒకే కుటుంబానికి ఖర్చు పెద్దాం కదా! ఎవరు ఎంత సంపాయిస్తారనే ప్రసక్తి లేదు. ఆశోక్‌ భర్తగా నన్ను అర్ధంచేసుకొని, ఆసరాగా ఉంటాడు. మా అత్తగారు చాలా గొప్ప మహిళ. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు దరఖాస్తులు పంపడం మొదలెట్టాను. మీపేరు రిఫరెన్స్‌ ఇవ్వచ్చునా మేడం?”

ఆమె చాలా హేతుబద్ధంగా, ఆచరణీయంగా ఆలోచించింది. నాపేరు రిఫరెన్స్‌గా ఇవ్వడానికి సరేనన్నాను. ఆమెకు ఉద్యోగంరాగానే, ఫోన్‌చేసి థాంక్స్‌ చెప్పింది.

మూడేళ్ళ తర్వాత ఆమె నుంచి ఇ-మెయిల్‌ వచ్చింది. గృహప్రవేశానికి ఆహ్వానించింది. ఆమె ఇల్లు కట్టుకున్నందుకు సంతోషించి, ఫంక్షన్‌కు వెళ్ళాను. మూడు పడక గదులు, అన్ని ఆధునిక సదుపాయాలతో ఇల్లు పొందికగా బావుంది. అనిత చాలా సంతోషంగా ఉంది. నేను ఆఖరి అతిథిని. అందువల్ల ఆమెకు నాతో మాట్లాడ్డానికి వీలైంది. “మేడం, ఇది నాశ్రమ ఫలితం. ఈ ఇంటికోసం ్రతిరూపాయి పొదుపు చేశాను. ఇప్పుడు ఇల్లు కట్టాను. ఇక ఇక్కడినుంచి మమ్మల్నెవరూ ఖాళీ చేయించలేరు.” ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతోంది.

“ఉద్యోగం ఎలా ఉంది?”

శరర జ్ఞానం - వరిజ్ఞానం

“బావుంది. ఒత్తిడి ఉంటుంది కానీ, నాకు నచ్చింది. మూడేళ్ళకే (గ్రూప్‌ లీడర్‌ చేశారు. అయిదుగురు ఉద్యోగులు నాదగ్గరే పనిచేస్తారు. చాలా గంటలు పనిచేస్తాను. కంపెనీ రెండు సార్లు అమెరికా పంపింది. ఒకో పర్యాయం మూదునెలలున్నాను”

“పాపను చూసుకుంటూ, ఇన్నిపనులు ఎలా సమాళించుకౌంటావ్‌?”

“పాపను అత్తగారూ, పనిమనిషీ చూసుకుంటారు. మా పనిమనిషి అత్యంత సమర్భురాలు. అజమాయిషీకి అశోక్‌కూడా ఉంటాడనుకోండి”

కౌంతకాలం తర్వాత ఆమెను జయానగర్‌లో “అత్యంత సమర్భురాలైన పనిమనిషితో పాటు 'ఓపల్‌అస్ట్రా కారులో చూశాను. పనిమనిషి చక్కగా ముస్తాబయింది. అనిత కూతురు చేతిని పట్టుకొని కూర్చుంది. అనిత నన్ను చూసి సంతోషించింది కానీ ఆమె వేషం ఆశ్చర్యపరచింది. ఖరీదైన చీర, వజ్రాలు పొదిగిన లోలకులు, సుమారు డజను బంగారు గాజులు ధరించింది. మొహంలో మేకప్‌ కిందినుంచి కొద్దిపాటి గర్వం తొంగిచూస్తోంది. అది మితిమీరిన ఆత్మవిశ్వాసమో, అహం తాలూకు నీడో బోధపడలేదు.

“మేడమ్‌, కంపెనీ నాకు ఎంప్లాయీస్టాక్‌ ఆప్షన్‌కింద షేర్లు ఇచ్చింది. వాటిలో కొన్ని షేర్లు అమ్మేసి కారుకొన్నాను. కుటుంబంతో సింగపూర్‌ వెళ్ళొచ్చాను. పనిమనిషిని కూడా తీసుకెళ్ళాం. ఈ సారి పాపతోపాటు అశోక్‌ను కూడా నాతో అమెరికా రమ్మన్నాను. ఎలా అయినా డిపెండెంట్సు ఖర్చు కంపెనీయే భరిస్తుంది. గొప్ప విషయం కదూ!” అని ఉత్సాహంగా చెప్పింది.

అవును గొప్ప సంగతే, అయితే ఆమె మాటల్లో ఎదో వెలితి కనిపిస్తోంది.

“అశోక్‌ ఎలా ఉన్నాడు?”

కాస్త విచారం కలిసిన గొంతుతో జవాబు చెప్పింది. “ఇంకా కాలేజీలోనే అవేపాత పాఠాలు బోధిస్తున్నాడు. కొద్దిరోజుల కిందటే (ప్రమోషన్‌ వచ్చింది. కొద్దిగా ఓ అయిదు వందల రూపాయలు జీతం పెరిగింది. అతను కాలేజీలో 'బెమంతా వృథా చేసుకుంటున్నాడని అశోక్‌కు మీరు చెప్పాలి మేడం.

“అతనికి నాకన్నా మంచి ఉద్యోగం వస్తుంది. అశోక్‌ నాకన్నా చాలా తెలివైనవాడు. ఎందుకో నామాట వినడంలేదు. పరిశ్రమలో పనిచేసేవారు దూకుడుగా ఉంటారు. విద్యారంగం అతనికి చొరవ లేకుండా చేసినట్లుంది.”

“అనితా, అందరూ పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళకేం కావాలో వాళ్ళకు తెలుసు” నా మాటలు ఆమెకు రుచించలేదు. వాళ్ళ

ఆ తర్వాత ఓ టీచర్ల శిక్షణ శిబిరంలో అశోక్‌ను కలిశాను. మధ్యాహ్నం లంబ్‌ సమయంలో కాస్త తీరిక దొరికింది.

నా దబ్బు, నీ దబ్బు 67

“నా వ్యక్తిగత సమస్యతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. అయితే అనితకూ నాకూ చాలా కాలంగా బాగా తెలిసిన వారు మీరొక్కరే ఉన్నారు. విద్యార్థులుగా, సహోద్యోగులుగాకూడా మమ్మల్ని చూశారు. నాకు మీసలహా, మీఅభిప్రాయం చాలా ఉపయోగపడతాయి”

“నాతో మాట్లాడమని నీకు అనిత . చెప్పిందా?”

“లేదు ఈ పెళ్ళి నాజీవితంలో సంతోషాన్నంతా తుడిచి పెట్టేసింది. ఇలాగే పడుందడాలో, విడిపోవాలో తేల్చుకోలేకపోతున్నాను”

“అశోక్‌ మరీ అతిగా ఆలోచించకు. దంపతుల మధ్య, ముఖ్యంగా చిన్న వయసులో అభిప్రాయ భేదాలు సహజం. ఎవరైనా మామధ్య అభిప్రాయ భేదాలు లేవంటే, వాళ్ళు భార్యా భర్తలు కారను కోవాలి. అని వాస్యమాడాను. హాస్యంతో ఉద్రిక్తతను సడలించాలను కున్నాను. అయితే అశోక్‌ మీద నా వాస్యమేమీ పనిచేయలేదు.

“అదికాదు మేడమ్‌. ఇప్పుడు అనిత ధోరణి మారిపోయింది. తనదే చాలా పెద్ద ఉద్యోగమనుకొంటోంది. ఇతర్లను చాలా హీనంగా చూస్తుంది. అన్ని టికీ నేను, నేను అంటూ ఉంటుంది. ఈ ఇల్లు నా డబ్బుతో నేను కొన్నాను. నా పేర్లతో కారు నేను కొన్నాను. ఎంతసేపూ ఇదే ధోరణి. ఆమె పేర్లు అమ్మితే వచ్చే డబ్బుతో ప్రతీదీ కొనగలనన్నట్లు (ప్రవర్తిస్తుంది. ఐ.టి. కంపెనీల షేర్లధర పెరిగితే, కంపెనీ ఇచ్చిన షేర్లు ఉద్యోగులకు పెద్ద వరమే అనడంలో సందేహం లేదు. అయితే అది కుటుంబంలో చిచ్చు పెడుతోంది. ఆమెకిప్పుడు మా అమ్మ అన్నా గౌరవం లేకుండా పోయింది.”

తెలివి తక్కువగా 'ఎందుకూ' అనడిగాను.

“ఎందుకేమిటి? ఆమెకు సమర్భరాలైన పనిమనిషి దొరికింది కదా, ఇక మాఅమ్మతో అవసరమేముంది? నా ఏడాది జీతమంతా కలిసి ఆమె షేర్ల్గంత చేయదనుకొంటుంది. అన్నీ అవసరంలేదు, కొన్ని షేర్లమ్మితే చాలనుకొంటుంది. నాకన్నా తానే గొప్ప అని పదేపదే చెస్తుంటుంది. ఇటువంటి భార్యతో కలిసి బతకలేను మేడమ్‌”

“అయితే నువ్వే ఆమెస్థానంలో ఉంటే, అప్పుడేసమస్యా ఉండదా? ఇదంతా ఎందుకు, నీ భార్య నీకన్నా ఎక్కువ సంపాదించడం ఇష్టంలేదా చెప్పు? మనది పురుషాధిక్య సమాజం కదా. అంచేత నీ అహం దెబ్బతింటోందేమో!”

అశోక్‌ కాసేపు ఆలోచించి చెప్పాడు, “కొంతవరకు మీ మాట నిజమే కావచ్చు. అంతేకాదు, మేం ఒకరిస్థానంలో మరొకరుండి, నేను ఎంతసేపూ నాడబ్బు, నాడబ్బు అంటూంటే, ఆమె తప్పకుండా బాధపడేది. భార్య భర్తల మధ్య ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ లాంటి అంతరాలు, స్థాయిలు ఉండకూడదు. కేవలం అతని లేదా ఆమె సంపాదన ఎక్కువ కనుక ఒకరిని మరొకరు గౌరవించాల్సిన అవసరంలేదు. ఆమె నా ఆసరా లేనట్లే

7268 జ్ఞానం - నరిజ్ఞానం ప్రవర్తిస్తుంది." అదే నన్ను ఎక్కువ బాధపెడ్డుంది. స్వల్పవ్యవధిలోనే బోలెడు డబ్బొచ్చిపడితే, చాలామంది ఇప్పుడు అనిత ప్రవర్తిస్తున్నట్లు ప్రవర్తిస్తారు. డబ్బుక్రమంగా చాలాకాలంపాటు రావాలి. అలా వస్తేనే, డబ్బంటే గౌరవం ఉంటుంది. “మగవాడైనా, మహిళ అయినా చాలా తక్కువ కాలంలో అతి ఎక్కువగా డబ్బు సంపాయించడం, అతిగా సేవించిన మద్యంలాగానే హాని చేస్తుంది”

నేను జవాబు చెప్పలేకపోయాను. ఆలోచనల్లో మునిగిపోయాను. డబ్బు రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. పండుకోయడానికి, మనిషిని చంపడానికి కూడా ఉవయోగవడుతుంది. డబ్బు నంపాయించడం ముఖ్యమేకాని, దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నది ఇంకా చాలా ముఖ్యమైంది. అనితకు పరిణతి ఉంటే తనకు సహకరించిన తన వారందరికీ కృతజ్ఞతలు తెలిపేది. "నేను అనే బదులు 'మనంి అనేది. “నాభర్త ఆసరాతో ఈ ఇల్లు కట్టించాను' అని చెప్పేది.

ఇది కేవలం నా అభిప్రాయం కావచ్చు.

అనుభవంలేని వారిజీవితాల్లోకి డబ్బుఎలా '్రవేశిస్తుందో, వారి సంతోషాన్ని ఎలా కబళించి వేస్తుందో నాకు నిజంగా తెలియదు.

గో ఖ్సా్థణ

త్‌0 జీవితంలో ధర్మముందా?

ఓ వ్యక్తి శారీరకంగా అస్వస్థుడైతేనో, గాయపడికేనో అతని లేదా ఆమెపట్ల అందరూ సానుభూతి ప్రదర్శిస్తారు. అదే, ఎవరైనా మానసిక వ్యాధితో బాధపడుతుంటే, మనదేశంలో జనం ఇంకోరకంగా చూస్తారు. మన సమాజంలో మానసికజబ్బు గురించి మాట్లాడ్డం నిషిద్ధమే. అలాంటి వ్యాధిగ్రస్థులను వెలేసినట్లే చూస్తారు. మానసిక ఆరోగ్యంకూడా, శారీరక ఆరోగ్యమంత - ఆ మాటకొస్తే ఇంకా ఎక్కువ ముఖ్యమని మనం (గ్రహించడం లేదు.

నేను కొంతకాలం ఓ సైక్రియాట్రిస్ట్‌ (ూనసికవైద్య శాస్త్రవేత్త) తో కలిసి పనిచేశాను. రోగులకు పునరావాసం కల్పించడంలో ఆమెకు సహాయపడ్డాను. వారికి చికిత్స చేసి పంపేస్తే చాలదు. వారూ మామూలుగా జీవించేట్లు చూడాలి. ఎవరికైనా మానసిక వ్యాధిసోకితే, ఇక అతన్నెప్పుడూ మానసిక రోగిగానే చూస్తారు. మన సమాజంలో మానసికవ్యాధితో బాధపడేవారిని పిచ్చివాళ్ళుగానే పరిగణిస్తారు.

సుప్రసిద్ధ కన్నడ రచయిత్రి త్రివేణి శరపరంజర పేరుతో మంచి నవలొకటి రాశారు. సమాజం అలాంటివారిపట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందో ఆ నవలలో చిక్రించారు. ఆ నవలను తర్వాత సినిమాగా కూడా తీశారు.

నా దాక్టర్‌ (ప్రెండ్‌ కుసుమ అటువంటి ఉదంతాల గురించి చాలా చెప్త్పంటుంది. యదార్ధంగా జరిగిన కొన్ని కథలు హృదయ విదారకంగా ఉంటాయి. కొన్ని నవ్వుతెప్పిస్తాయి.

కుసుమ ఓ పార్టీలో సమాజంలో పేరుప్రతిష్టలున్న మహిళను కలిసింది. అంతకు కొన్ని ఏళ్ళక్రితం ఆమె మానసిక రుగ్మతతో బాధపడుతుంటే, కుసుమ చికిత్స చేసి పూర్తిగా బాగుచేసిందట. ఆమె కనిపించే సరికి కుసుమ చాలా సంతోషించి పలకరిద్దామని దగ్గరికెళ్ళింది.

కానీ, ఆమె కుసుమను చూసీ చూడగానే, విసవిసా నడిచి వెళ్ళిపోయింది. ఎంతో ఆదరం చూపుతుందనుకొంటే, ఆమె అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోయే సరికి కుసుమ నిర్దాంతపోయింది. కాసేపటి తర్వాత పార్టీ ఇచ్చినామె అతిథులందరినీ పరిచయం చేస్తుంటే, ఆమె కుసుమ మొహమే ఎన్నడూ చూడలేదన్నట్లు ప్రవర్తించింది.

770 జ్ఞానం జా వరిజ్ఞానం "

పార్టీ అయిపోయిన తర్వాత వచ్చి క్షమాపణ చెప్పుకొంది. “డాక్టర్‌గారూ, ఉదాసీనంగా కనిపించినందుకు క్షమించాలి. మీరు నాకు నూతన జీవితం ప్రసాదించారు కానీ, అంతమందిలో మిమ్మల్ని గుర్తించడం ఇష్టం లేకపోయింది. మీరు సైక్రియాట్రిస్ట్‌ అని అందరికీ తెలుసు. వాళ్ళు నన్ను మీ పేషెంట్‌గా ఊహించి, ఇంకా పిచ్చిదాన్నే అనుకొంటారని భయపడ్డాను”

కుసుమ నిస్సహాయంగా చూస్తూ నిల్చుండిపోతే, ఆమె కన్నీళ్ళతో నిష్క్రమించింది.

నేనోసారి, మానసిక రోగులకు ఉపాధి కల్పించగల ప్రాజెక్టు గురించి కుసుమతో చర్చించాలని ఆమె క్లినిక్‌కు వెళ్ళాను. అదో తక్కువస్థాయి టెక్నాలజీ ప్రాజెక్టు. కుసుమతో చర్చిస్తేతప్ప తుది నిర్ణయం తీసుకోలేమనుకొన్నా లోపల పేషెంట్‌ ఉంది కాబట్టి కాసేపు ఆగాలని రిసెష్టనిస్టు చెప్పింది. వెయిటింగ్‌ రూములో నా పక్కన కూర్చున్న వృద్ధదంపతులను చూశాను. వాళ్ళమొహాల్లో కాంతిలేదు. చాలా బాధపడుతున్నట్లున్నారు. వాళ్ళ దుస్తులు చూస్తే, బాగా ఉన్నవారిలానే ఉన్నారు. పేషెంటు వారి కూతురేమో. డబ్బు కంటె పిల్లల ఆరోగ్యమే పెద్దలకు మిక్కిలి సంతోషం కలిగిస్తుందను కొన్నాను. పాపమీ తల్లితండ్రులకా అదృష్టంలేదేమో.

కొంతసేపటికి, రోగి వెలుపలికి రాగానే, నేను కుసుమ గదిలోకి అడుగు పెట్టాను. ఆ దంపతుల పరిస్థితి గురించి ఆలోచిస్తూ, నా ప్రాజెక్టు సంగతి మరిచిపోయాను. వాళ్ళ సమస్యేమిటని కుసుమను అడిగేశాను. నమ్మకం వమ్మవుతుంది కనుక ఆమె వాళ్ళగురించి చెప్పలేదు. పేషెంటు ఎవరో తెలుసుకోవడానికి వీలు లేకుండా, పేర్లు మార్చి కొన్ని ఉదంతాలు చెప్పింది.

“నా పేషెంట్లలో మాయ అనే ఆమె మంచి సంస్కారం గల కుటుంబం నుంచి వచ్చింది. బాగా చదువుకొన్నప్పటికీ, సంస్మ్కారంలేని కుటుంబంలో ఇచ్చి పెళ్ళిచేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అటువంటి పెళ్ళిళ్ళలో సంస్కారం సంగతి పట్టించుకోకుండా, వరుని ఉద్యోగానికే ప్రాముఖ్యమిస్తారు. మాయభర్త జగదీష్‌ చాలా పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు కానీ అతనికి తల్లంటే హడల్‌. ఆతివినయంగా ఉంటాడు. అతని తల్లి, చెల్లెళ్ళుకూడా ఆమెపట్ల క్రూరంగా ప్రవర్తించేవారు. తల్లయితే కోడల్ని సతాయించడమే పనిగా పెట్టుకుండి. జగదీష్‌ ఆతల్లి కొడుకుగా తప్ప మాయ భర్తగా ఆలోచించలేదు.”

“కుసుమా, చాలా ఇళ్ళలో ఇదే పరిస్థితి ఇలా ఎంతమంది బాధపడ్డారో!”

“నిజమే, సామాజిక ఒత్తిడి విపరీతంగా ఉంది. ఈ సినిమాలు, టీ.వీ. సీరియల్స్‌ పెళ్ళికి, వరాన్వేషణకు అతిగా ప్రాముఖ్యం ఇస్తున్నాయి.”

“మరి మాయ ఏం చేసింది?”

జీవితంలో ధర్హముందా? 7

“ఇతర భారతీయ నారీమణుల్లాగానే, అందరితో సర్దుకుపోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. వారితో సత్సంబంధాలు ఏర్చరచుకోడానికని కష్టపడి పనిచేసింది. అత్తింటివారు ఎప్పుడో ఒకనాటికి మారకపోతారా అని ఆశించింది. కానీ, ఇక భర్త ఎన్నటికీ తనపక్షం వపహించడనిపించే సరికి, మనోవ్యాధికి లోనైంది. ప్రతి మహిళా భర్ర (ప్రేమను కోరుకుంటుంది. ఆ (ప్రేమకోసం ఎన్ని కష్టాలైనా పదుతుంది. అయితే, అదిఇక దక్కదనుకుంటే, పూర్తిగా నిరాశపడిపోతుంది”

ఆ కష్టాలన్నీ భరిస్తున్న మాయ నా ఊహలో మెదిలింది. మానసిక వేదననుంచి కోలుకోడానికి సమయం పడుతుంది. కుసుమ దగ్గరికొచ్చి ఎన్నిసార్లు రోదించిందో?

“ఆమెకు నువ్వు చేసిన చికిత్సేమిటి?”

“జగదీశ్‌ను, అతని తల్లిని పిలిపించాను. మాయ ఆరోగ్యం బాగుపడాలంటే, ఆమెకు డబ్బుకాదు. (ప్రేమ, ఆదరణ అవసరమని చెప్పాను. వాళ్ళు అర్థం చేసుకోలేదు. అతనో కాలేజీ ్రిన్సిపాల్‌ కానీ, సాధారణమైన (ప్రేమతత్వమే తెలీదతనికి. ఓ గొప్ప టీచర్‌గా బయట పేరు తెచ్చుకొన్నాడు కానీ, ఇంట్లో భార్య మానసికరోగి. మాయ తల్లితండ్రులను పిలిపించాను. జగదీశ్‌ వాళ్ళ కూతుర్ని బాగా చూసుకుంటాడన్న ఆశ ఇకలేదని చెప్పాను. మాయ భర్తప్రేమ మీద ఆశవదలుకొని, సొంత జీవితం చూసుకోవాలన్నాను. ఆ పరిస్థితితో సమాధానపడడం వాళ్ళకు చాలా బాధాకరమేకానీ, నిజం చెప్పడం డాక్టర్‌గా నా కర్తవ్యం కదా”

“మాయ ఇప్పుడెలా ఉంది?”

“చాలా కాలంపాటు, స్వేచ్చగా మాట్లాడించడం, ధైర్యం చెప్పడం, సలవాల్విడం ద్వారా, మందుల ద్వారా చికిత్స చేశాను. ఇప్పుడు బావుంది. తల్లితండ్రుల దగ్గర ఉంటోంది.”

“ఇది అధర్మం కాదా కుసుమా? జగదీశ్‌ చెడ్డవాదైతే, చికిత్స మాయ చేయించు కోవాలా? రోగానికి కారకుడైనవాడు సుఖంగా ఉన్నాడు. తన తప్పేమీ లేకపోయినా మాయ బాధలు పడాలి. ఇంకా అధ్వాన మేమంటే, లోకం మాయ భర్తను వదిలేసిందంటుంది”

“అవును, జీవితం ధర్మబద్ధమైందని ఎవరంటారు? జీవితం ఎప్పుడూ అధర్మమైందే. న్యాయం, ధర్మం ఏమీలేవు. నువ్వు కావాలంటే ధర్మబద్ధంగా మార్చుకోవచ్చు”.

లో అ్జుస్షం

త్‌1 ఉచితానుచితాలు శభ ంకాలం కిందట నేనో విద్యార్థుల హాస్టల్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను. ఎవరో ఓ పుణ్యాత్ముడు నిర్మించిన ఆ హాస్టల్‌లో పేదవిద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. భోజనం, బస ఉచితమే కాని, కాలేజీ ఫీజు, దుస్తులు వంటి ఖర్చులు విద్యార్థులే భరించాలి.

నా చిన్నప్పుడు అనేక కుటుంబాలవారు ఆర్థికంగా వెనుకబడి చదువులో ముందుండే విద్యార్థులను ఆదుకౌనేవారు. వారి ఫీజులు చెల్లించేవారు. లేదా దుస్తులు కుట్టించేవారు. చాల మంది భోజనంకూడా పెట్టేవారు. ఆరోజుల్లో ఇంచుమించు అన్ని కాలేజీలు పెద్దపెద్ద పట్టణాలు, నగరాల్లోనే ఉండేవి. చదువుకోసం ఎక్కడెక్కడి నుంచో పట్టణాలకు వచ్చే విద్యార్ధులకు అటువంటి కుటుంబాల్లో ఆశ్రయం లభించేది. వారిని ఇంటివారు కుటుంబంలో ఒకరిగా చూసుకొనేవారు. ఇల్లాళ్ళు దాన్నో సత్యార్యంగా భావించి, పేదవిద్యార్థలకు హృదయపూర్వకంగా సహాయపదేవారు. ఇప్పటి పరిస్థితివేరు. ఇప్పుడు చిన్న పట్టణాల్లో సైతం స్మూల్బు, కాలేజీలు వచ్చేశాయి. దాంతో ఆ సంప్రదాయం అంతరించిపోయింది.

ఆ వేదికమీద కూర్చుని గతాన్ని తలచుకొంటూ, హాస్టల్‌ నిర్మించిన వదాన్యుని అభినందించాను. ఆ సత్మార్యం నేడు అనేకమంది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతోంది.

హాస్టల్‌లో ఉంటున్న కొందరు విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకొన్నా, కాలేజీ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని హాస్టల్‌ కార్యదర్శి చెప్పారు.

“మేడమ్‌, ఈ యేడాది వివిధ కోర్సుల్లో ముగ్గురు హాస్టల్‌ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ముగ్గురూ చాలా పేదవిద్యార్థులే. ఇంకో ఏడాది చదివితే తప్ప వారి డిగ్రీలు పూర్తికావు,”

“వాళ్ళు చదువుతున్న చదువేమిటి?”

“ఒక అబ్బాయి మెడిసిన్‌ చేస్తున్నాడు. రెండో అబ్బాయి ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. మూడో అతను కామర్సు”

ఉచితానుచితాలు శూ

“వాళ్ళను నేను సమావేశం తర్వాత కలుసుకోవడానికి వీలవుతుందా?”

కార్యక్రమంలో పెద్దగా ప్రత్యేకత లేదు. ఇటువంటి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిని అతిగా పొగడ్తలతో ముంచెత్తడం మామూలే. వాళ్ళు ఒకోసారి ముఖ్య అతిథికిలేని గుణాలను, సాధించని విజయాలను ఆపాొదించేస్తుంటారు కానీ, వాళ్ళు మనం చెప్పేది వినిపించుకోరు. అందువల్ల నా చెవులను మానసికంగా మూసేసుకొని, వాళ్ళు నన్ను కాదు వేరే ఎవర్నో పొగుడుతున్నారనుకొంటాను.

అనవసరంగా కీర్తించడం ఒకరకంగా అవినీతే అని నా అభిప్రాయం. ముఖ్యఅతిథి మీద అతిగా పొగడ్రలు కురిపిస్తే, చాలామంది బోల్తాపడి, తాము నిజంగానే గొప్ప వాళ్ళమనే భ్రమలోపడిపోతారు. అందువల్లనే 12వ శతాబ్దపు కర్ణాటక విష్లవనేత బసవేశ్వరుడు, పొగడ్తను బంగారపు ఉరికంబమని తన ్రబోధాల్లో హెచ్చరించాడు.

కార్యక్రమం అనంతరం, హాస్టల్‌ కార్యదర్శి చెప్పిన ఆ ముగ్గురు ్రతిభాశాలురైన విద్యార్థులను కలుసుకొన్నాను. వాళ్ళు కాస్త విభ్రమంగా, బిడియంగా కనిపించారు. కాస్త భీతిల్లుతున్నట్లు కూడా కనిపించారు.

ముగ్గురిదీ ఒకటే కథ. తండ్రి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఊళ్ళో కుటుంబం పెద్దది. భూమీ, పుట్రాలేదు. చదువులో రాణించాలన్న దీక్షే వారు అన్ని అవరోధాలను అధిగమించి ఇంతదూరం వచ్చేలా చేసింది.

వారి పరిస్థితి విచారం కలిగించింది. అనేకమంది పెద్దలు తమపిల్లలకు ఫీజులు చెల్లించి, ట్యూషన్లు పెట్టించి, ఎన్నెన్నో పుస్తకాలు సమకూర్చి ఉత్తమమైన విద్యను అందించదానికి నానా అవస్థాపడతారు. వీళ్ళేమో ఫీజులు కట్టడానికే అవస్థలు పడుతున్నారు.

బహుశా చదువుల తల్లి సరస్వతి వీరిని కరుణించి ఉంటుంది.

“జూన్‌ నెలలో ఓ సారి కలవండి. ఫీజు చెల్లించే ఏర్పాటు చేస్తాను” అని వాగ్దానం చేశాను.

వారిలాంటిది ఆశించినట్లు లేదు. వారి మొపోల్లో సంతోషం తాండవించడం చూశాను.

ఇచ్చిన మాట ప్రకారం, వారి ఫీజులు చెల్లించి, ఇక ఆ ఉదంతాన్ని మరచిపోయాను.

కొన్ని ఏళ్ళ తర్వాత విదేశాలకు వెళ్తూ, అక్కడి నొఫ్రెండుకో చీరకొందామను కొన్నాను.

విమానాశ్రయానికి వెళ్తున్నప్పుడు ఆ సంగతి జ్ఞాపకంవచ్చి, దారిలో ఓ చీరల దుకాణం దగ్గర ఆగాను. మధ్యాహ్న భోజన విరామసమయం కావడంతో, షాపు నిశ్శబ్దంగాఉంది. ఒకరిద్దరు సేల్స్‌మెన్‌ మాత్రం కనిపించారు. నేను తొందర్లో ఉండి,

274 జ్ఞానం - పరిజ్ఞానం ప్రదర్శనగా తగిలించిఉన్న వాటిలో ఓ చీరను ఎన్నికచేశాను. దాన్ని సేల్స్‌మేన్‌కు చూపించి, అలాంటి చీరొకటి ప్యాక్‌చేసి, బిల్లుతోపాటు ఇవ్వమన్నా. హఠాత్తుగా అప్పుడో యువకుడక్కడ ప్రత్యక్షమయ్యాడు. చక్కని దుస్తులు ధరించి, నవనాగరికంగా, తళతళలాడుతున్నాదు. నాకేసిచూసి, చిరునవ్వునవ్వి, తన క్యాబిన్‌లోకి రమ్మని ఆహ్వానించాడు. ఇతనెవరో నాకు తెలియదు. నాపాత విద్యార్ధికావచ్చుననుకొన్నా. చాలా సందర్భాలలో ముఖ్యంగా వాళ్ళు ఆండర్‌[గ్రాడ్యుయేట్‌ విద్యార్థులైతే నాకు వారిపేళ్లే జ్ఞాపకం ఉండవు. అతని గదిలోకి వెళ్ళాను. చాలాబావుంది. మంచి ఫర్నిచర్‌, గాజుకుండీలో తాజాపూలు, చలువరాతి ఫ్లోరింగ్‌, గోడలకు ఆధునిక చిత్రకళా చిత్తరువులు, ఎలక్షానిక్‌ పరికరాలు - ఒక్కముక్కలో చెప్పాలంటే అదో ఐశ్వర్యనిలయంలా ఉంది. “ఎయిర్‌పోర్టుకు వెళ్లే తొందరలో ఉన్నా, ప్యాకెట్‌వెంటనే కావాలి” అన్నాను. కూర్చోకుండా, నిల్చునే పర్సుతెరిచి చీరకు డబ్బులిచ్చి, నేను వెంటనే వెళ్ళాలని స్పష్టంగా చెప్పేశాను. యువకుడు చిరునవ్వు చిందిస్తూనే “ఒక్కక్షణం కూర్చోండి మేడమ్‌, ప్యాకెట్‌ వచ్చేస్తుంది” అన్నాడు. అతను మా కాలేజీలో చదివినవాదేమో అనుకోసాగాను. “మీరు నాక్లాసులో ఎప్పుడు చదివారు?” ఏ బ్యాచి విద్యార్ధి అయివుంటాడా అని వూహించే ప్రయత్నం చేస్తూనే అడిగాను. “నేను మీస్టూడెంట్‌నికాదు మేడమ్‌” “మరి నేను మీకు తెలుసా?” “తెలుసు మేడమ్‌. మిమ్మల్ని కొన్ని సంవత్సరాల క్రితం విద్యార్థుల హాస్టల్‌లో కలిశాను” నాకు జ్ఞాపకం రాలేదు “మీరు ముఖ్య అతిథిగా వచ్చారు. నేను, మరో ఇద్దరు మిత్రులతోపాటు మిమ్మల్ని కలిశాను. మీరు నాఫైనల్‌ ఇయర్‌ బి.కామ్‌. ఫీజు చెల్లించారు. అప్పటికి గుర్తొచ్చాడు. అప్పుడు ముగ్గురూ భయంభయంగా కనిపించారు. అప్పటికీ, ఇప్పటికీ ఎంతలేడా! చాలా సంతోషమేసింది. ఇప్పుడేం చేస్తున్నారని అడిగాను.

ఉచితానుచితాలు నట్‌

“ఈ చీరలషాపుకు నేను మేనేజర్చి భాగస్వామిని కూడా. దేవుడు దయామయుడు. మా వ్యాపారం బాగుంది”

“మీ కుటుంబం ఎక్కడుంది?

“పెళ్ళిచేసుకొని స్థిరపడ్డాను. ఇద్దరు తమ్ముళ్ళు నాదగ్గరే ఉండి చదువు కొంటున్నారు. చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళయ్యాయి. మా అమ్మా, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు.”

ఇంతలో నా ప్యాకెట్‌ తెచ్చివ్వడంతో, లేచి బయలు దేరాను.

అతను కారుదాకా వచ్చి నన్ను సాగనంపాడు. ఆలస్యమైపోతూండడంతో, హడావిడిగా వెళ్ళి, ఆఖరు నిముషంలో విమానం అందుకున్నా

విమానం పైకిలేవగానే, చీర బాగుందోలేదో చూద్దామని బ్యాగ్‌ తెరచి చూసి విస్తుపోయాను. ఒకటి కాదు రెండు చీరలున్నాయి. ఒకటేకొనాలని ఒక్కవీరకే డబ్బిచ్చాను. రెండు చీరలు మాత్రమే కాదు, నేనిచ్చిన డబ్బుకూడా బ్యాగ్‌లోఉంది. దాంతో ఓ చీటీకూడా ఉంది.

“మేడమ్‌, నన్ను తెలియకపోయినా మీరు నాఫీజు చెల్లించడం గొప్పసంగతి. మీరలా ఎందుకు చేశారా అని ఆలోచించేవాణ్ణి. నేను మీకు పూర్తిగా అపరిచితుణ్ణి. మీ బంధువుని కాను. నానుంచి మీరేమీ ఆశించలేదు. ఇప్పుడు నేను నాతో బంధుత్వం లేనివారికి సహాయపడ్డం ఓ లక్ష్యంగా పెట్టుకొన్నాను. నా ఈ చిరుకానుకను స్వీకరించండి. ఇది మీకో పెద్ద వస్తువుకాదు కానీ, ఎంతో గౌరవంతో, కృతజ్ఞతతో ఇవ్వదలిచాను. మీరు నా జీవితాన్నే మార్చేశారు”

అతని మాటలు నన్ను చలింపచేసి, కన్నీళ్ళు తెప్పించాయి.

ముంబాయి చేరాను. ఏదో సాంకేతిక సమస్యతో అంతర్జాతీయ విమానం ఆలస్యమైంది. అందుకని, శాంతాక్రజ్‌ మార్కెట్‌లో తినడానికేదైనా కొందామనుకొన్నా నా (్రైండ్‌తోపాటు ఫుట్‌పాత్‌మీద నడుస్తూ, కాలుజారిపడిపోయాను. పాదం కొద్దిగా ఉబ్బింది. లోపలి ఎముక విరిగిందేమోనని ఆందోళన వట్టుకొంది. నా (ఫ్రెండ్‌ ముంబాయిలోనే ఉంటుంది కనుక నగరం బాగా తెలుసు. దగ్గర్లో ఉన్న ఓ డాక్టర్‌ దగ్గరికి పిలుచుకెళ్ళింది. అతను ఫీజు ఎక్కువ తీసుకొంటాడు కానీ, చాలా మంచి డాక్టరని ఆమె ధైర్యం చెప్పింది.

డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాం. క్లినిక్‌ అధునాతనంగా ఉంది. రెసెప్షనిస్ట్‌ చాలా తెలివైందిలా ఉంది. డాక్టర్ని కలవడానికి ముందుగా అనుమతి తీసుకొన్నారా అని ప్రశ్నించింది. లేదంటే, కాసేపు ఆగమంది. డాక్టర్‌తో ఫోన్లోమాట్లాడి నన్ను లోపలికి పఖిపింది.

డాక్టర్‌ పిన్న వయస్కుడు. అతని ఆత్మవిశ్వాసం చూసి తేలిగ్గా ఫీలయ్యాను. అతని

275 జ్ఞానం - పరిజ్ఞానం చిరునవ్వు మరింత ధైర్యమిచ్చింది. నా పాదాన్ని పరీక్షిస్తూ, మాటలు కలిపాడు. “మేడమ్‌, నేను మిమ్మల్ని ఇదివరకోసారి కలిశాను. మీరిప్పుడు పెద్దవారిలా కనిపిస్తున్నారు” “ఇది వరకు ఎక్కడ కలిశాం?” “నేను విద్యార్థుల హాస్టల్‌లో ఉండేవాడిని. మీరు ముఖ్యఅతిథిగా వచ్చారు. . కార్యక్రమం తర్వాత ఇద్దరు మిత్రులతోపాటు మిమ్మల్ని కలిశాను.” అతనెవరో ఊహించగలిగాను కానీ, ఇంకోసారి ధృవపరచుకోవాలనుకాన్నా. “మీ ఫ్రెండ్సు ఎక్కడున్నారు?” | “ఒకరు బెంగుళూరులో చీరల దుకాణంలో పార్ట్‌నర్‌. ఇంకొకతను అమెరికాలో ఉన్నాడు. మీరు ఇక్కడికెలా వచ్చారు?” కారణం వివరించాను. ఈలోగా అతను నాకాలికేమైందో తేల్చుకున్నాడు. “వర్రీ కాకండి. ఫ్రాక్సరేం లేదు. నరం దగ్గర కాస్త చీరుకు పోయింది. మందులతో నయమైపోతుంది”, అ కుర్రాడు వృద్ధికి వచ్చినందుకు, నా కాలు ్రాక్చర్‌ కానందుకు సంతోషించాను. బయలుదేరేముందు పెళ్ళయిందా అని అడిగాను. అదే విశ్వాసంతో, చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. “అయింది. నాభార్యకూడా డాక్టరే. ఇక్కడే స్థిరపడ్డాం” _ నేను వెలుపలికి వచ్చీరాగానే రిసెప్పనిస్స బల్లమీది టెలిఫోన్‌ మోగింది. రిసెష్టనిస్టతో డాక్టరేదో మాట్లాడుతున్నట్లున్నాడు. ఫీజు తీసుకోవద్దంటున్నాడేమోకానీ, నేను చెల్లించాలనుకున్నాను. సంపన్నులు నివసించే కాలనీలో క్రొత్తగా ప్రాక్టీస్‌ ప్రారంభించి, పెళ్ళికూడా చేసుకున్నాడు. అతన్ని ప్రోత్సహించాలికదా అనుకొన్నా నేను పర్సుతీసే సరికి రిసెష్టనిస్టు “రూ. 300 ఇవ్వండి” అంది. “చాలా ఎక్కువకదా” అని ఆశ్చర్యంగా ప్రశ్నించాను. నాచేయి ఇంకా పర్సులోనే ఉంది. “కాదు మేడమ్‌, ఎంత తీసుకోవాలో దాక్టరుగారే చెప్పారు. మీరు అపాయింట్‌మెంట్‌ లేకుండా వచ్చారు కదా”

చఉచితానుచితాలు శ్‌ బిల్లు చెల్లించి బయటికొచ్చాను. నేను ఏమీ ప్రత్యుపకారం ఆశించకుండా ముగ్గురికి ఒకేసమయంలో సహాయం: చేశాను. వాళ్ళ ధోరణులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఒకతను నా సహాయాన్ని కృతజ్ఞతతో తలచుకుంటూ, నాలాగే తానూ ఇతరులకు సహాయపడాలను కొంటున్నాడు. మరొకతను నా సహాయం సంగతే ప్రస్తావించలేదు. కృతజ్ఞతాలేదు, నామీద కనికరమూ లేదు. బొత్తిగా తెలియని వారిని చూసినట్లే నన్నూ చూశాడు. విభిన్న వైఖరులున్న వాళ్ళు, ఒకే పరిస్థితిని ఎదుర్కొంటే, విభిన్నంగానే వ్యవహరిస్తారు. అమెరికాలో ఉన్న ఆమూడో వ్యక్తిని కలిసే అవకాశం నాకు ఇప్పటికీ రాలేదు. వు ందీ లా లా ఖా శ వే థ్‌ గ నక ర క... వౌ ( న్‌. యా , జీవీ 1 ్స న ా స పాదా తడ ష్టం 90

1 శ్రీమతి సుధామూర్తి మనదేశంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో | న... / భ్రమదమాదులకోర్చి విసృతంగా పర్యటించారు. జీపులో, బస్సులో, య. ౯ కాలినడకన కూడా మారుమూల పల్లెలకు వెళ్ళి అదృష్టాలు, య. స అవకాశాలకు నోచుకోని పేదప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు / కల్పించారు. ఆమె తన ప్రజాసేవా కార్యకలాపాల్లో పాల్గొంటూ - / ముంబాయి నుంచి తమ నివాసాన్ని భూకంపం తాకిడికి దెబ్బతిన్న గుజరాత్‌కు మార్చిన బికారి కుటుంబం, వరకట్న దురాచార న. బాధితురాలి తల్లి, ద్రాఫ్టద్వారా పెద్దమొత్తాన్ని విరాళంగా పంపిన జ్జ | గుప్తదాత వంటి వివిధ రంగాలకు చెందిన అసాధారణ వ్యక్తుల గురించి గ /

  1. _ తెలుసుకొన్నారు. అలాంటి వారెందరో తమ హృదయవిదారకమైన ; గాథలు వినిపించి, మానవ జీవితంలోని లోతుపాతులపై వెలుగును | ప్రసరింపజేసి, జీవితాన్ని అర్థంచేసుకొనే అవకాశం కల్పించారు. | 1 టీచర్‌గా, సంఘసేవా కార్యకర్తగా తాను గడించిన అనుభవాలను 1 ఆమె మనతో పంచుకొంటున్నారు. హాస్యం, సహజవివేకం నిండిన ఈ పుస్తకం శ్రీమతి సుధామూర్తి కృషిని, ఆమె జీవన తత్త్వాన్ని. / | ' తేటతెల్లంగా వెల్లడిస్తాయి. 7 "| ॥ | / ( | | | | / / | / | | ॥ | | , | | | | | | 1 1 ॥ | | | + 1 ॥ ॥ | ॥