Telugu Eravai Okato Shathabdhamloki - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఇరవె ఒకళుక కం 'భ ఎ" సహజకవి మల్లెమాల | షు $ మనసుపడి మక్కువతో సేకరించిన న గ ల [ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం (న 1 ౫౪ ల" + _ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి | అలు [ఆనందంతో బహూకరిస్తున్నాం. సే! ల మల్లెమాల కుటుంబం ం డా. అంతీటినరసింహం భవా న
ఆరవై వకఠరుక చశేతాబ్దంఠతుకకె ( కథన (వచన) కవితలు ) డా. అంతటి నరసింహం
ప్రధమ ముద్రణ - జూన్, 2000 సర్వహక్కులు రవయితవి చ వం. వెల: రూ. 60/- ద లా టల డా. అంతటి నరసింహం 4, సంతోష్ డీలక్స్ అపార్ట్మెంట్స్, మెహిదీ పట్నం, "హైదరాబాదు - 500 028 ఫోన్ : 3513564 / గ్శి| వర్మ గ్రాఫిక్స్, స్ "హైదరాబాద్ . ఫోన్ : 6575841 గ గ [ పా క! లి "బి క షై ఈ మ దొరకు చోటు : స్ట న. కం బు ప్రా ర్. ల విశాలాంధ్ర బుక్ పబ్లిషింగ్ హౌస్, ప్వ్యూట్ల తం. బాంక్ ఫ్రీట్స్ హైదరాబాదు. లేజర్ టైప్ సెట్టింగ్ : వియాన్స్ గ్రాఫిక్స్, గాంధినగర్, "'హ్తాదరాబాద్ - 500 0860 ఫోన్ : 7675197 " |]
కృతా స్వీకల్త
వాస్తుశిల్నీ డా॥ వి. యన్. రెడ్డి శన.
ధనసేకరణయ్రందు తేటి బి.యన్. రెడ్డి
దాని వితరణమునందు మేటి వేలుపు గిడ్డి
- ఘనరసగ్రహణమున హంస బి.యన్. రెడ్డి
రస సేచనమునందు అభ్రరూపపు వడ్డి
కవుల మేళనమందు ఆశుకవితల శిల్పి
అట్టి సద్యస్ఫూర్తి మూర్తి కీ కృతినిత్తు
1
ఈ కథన (ఎచన్సా కవిత గురించి
సదవిత్రాలు, భావ చిత్రాలు రచించడం నాకూ తెలుసు. కాని, నేను వాటిని ఎక్కువగా పొటించను. చాలామంది యువకవులు ఆఫీడ్ చేస్తూ వుంటారు. వారి ప్రజ్ఞను నేనూ మెచ్చుకుంటాను. వారి ప్రతిభకు అబ్బుర పడుతూ వుంటాను.
నా దృష్టిఅంతా సంఘ సంస్కరణ పైనే. సమాజంలో మోసపోయినవారు, దగాబడ్డవారూ, వంవితులూ, బాధితులూ, ఎక్కువ. వారి ఉద్దరణ కోసం కలం పట్టిన వాళ్లో నేను. నేను నవలలు రాసినా, నాటకాలు రాసినా, కవితలు రాలినా, చదవగానే అర్హమయ్యేలా వుండాలని నా ఆదర్శం. చదవగానే అరటిపండు వాలిచి నోట్లో
వేసుకునేటంత సులభ సేవ్యమానంగా వుండాలి. ద్రాకపండు నోట్లొ వేసుకున్నంత స్వాద్యమానంగా వుండాలి. ఆ పదద్ధతే కవితలలో గూడా అనుసరించాను నేను.
నేను స్వతహాగా పద్యకవిని. అసలు కవిత్వం అంటేనే పద్యంగదా! సంస్కృతంలో శ్లోకాలూ, తెలుగులో పద్యాలూ, కవితా రచనకు మూలాలు. పద్యం కంటే గేయం సులభంగా అర్ధం అవుతుంది గాబట్రై చాలామంది కవులు గేయ కవిత్వం రాస్తున్నారు. గేయంలో మాత్రా ఛందస్సు పాటింప బడుతుంది. అది మాత్రా బద్దం. ఆదిలోనో అంతంలోనే యతి ప్రాసలు గూడా వుంటాయి సాధారణంగా. అయితే అంతకంటే గూడా సులభంగా అర్ధమయ్యే కవిత వచన కవత. ఈ వచన కవితలో వర్ణణాత్మక శైలీ, (జిలయఫైుకళల) కథనాత్మక్షైలీ గాజాజ[ాల) అని రెండు నడక లుంటాయి. వర్ణనాత్మక శైలిలో అర్హం కాని భాగం ఎక్కువ వుంటుంది. కథనాత్మక్షశెలి. అందుకే నాయీ కవితలకు కథన (వచన) కవితలు అనిపేరు పెట్టాను. అంటే నా వచన కవితలనే కథన కవితలు అని అంటున్నారు.
కథన కవితలన్నా వచన కవితలన్నా - వ్యాంగ్యోక్తులతోనూ, నర్మ గర్పోక్తుల తోనూ కూడుకొని వుంటాయి. అలాకాక పోతే అది కేవలం సొధారణ వచనంగానే వుంటుంది గదా! కవిత్వం అనిపించుకోవాలంటే వ్యంగ్యమూ, నర్మగర్చిలా, ఆఅక్షేపణా, వుండాలి. పై గుణాలు వచన కవితలే గాదు, పద్యగేయ కవితలకు గూడా వుండారి.
ఈ కథన కవితలను సద్యస్స్పూర్తితో ఆశుకవితలు దొర్లించే డ్యాక్టర్ బి. యన్. రెడ్డి గారికి అంకితం ఇస్తున్నాను., ఆయనకు నా కృతజ్ఞతలు.
ఈ కవితలను ప్రింట్ చేసిన వర్మ (గ్రాఫిక్స్ వారికి , లేజర్ టైప్ సెట్టింగ్ చేసిన వియాన్స్ (గ్రాఫిక్స్ వారికి నా ప్రతి గ్రంథాన్ని ఆవిష్కరించడంలో సహాయం చేసేటటువంటి యువకళావాహిని వారికీ నా కృతజ్ఞతలు.
నన్ను అన్ని విధాలా ప్రోత్సహించి సహాయం అందిస్తున్న మా శ్రీమతి అంతటి అపరాజిత కు ప్రత్యేక కృతజ్ఞతలు.
1౪
విషయ సూచిక
పేజి మాఆంధ్రం షై మారిన వేదం 3 గోడలకు వేలాడే నీతులు 6 కెటాలిస్టు 13 సురాసురామృత మధనం కక కః చండాలః 24 దొంగాటకం 26 చాతక పక్షులు 29 చిరంజీవి - కవి ౩4 ప్రజా స్వామి 4౦ వైవేద్యం 46 చెయ్యి రావడం లేదు త్త ఉషస్వప్నం 51= సంక్రాంతి నేపధ్యం 53 తల్లి చేలో మేస్తే 57 మేధా(త్రావులు 58 చచ్చేదాకా దరిద్రసేవ 60 మామాలు 61 అనాది బంధం 63 పులి స్వామ్యం 67 తెల్ల (నల్ల) మార్కెట్టు 67 చలి చెలి 659 చచ్చినా తీరని దాహం 69 అభివృద్ధి 69 లాఠీ కన్నీరయిన వేళ 70 పిరికివాడి కల 702 రాజ్యాధికారం వస్తే గాని 79 అర్హ రాత్రిలో ఆడవాళ్లు 84 అంతే! 87 కిరసనాయిలు కీ(లీలలు 89 ఇరవై ఒకటో శతాబ్దంలోకి 90
౪
డా! అంతటి దచనటలు కణతలు శ్రైలజు కంకాళ రాత్రి హంసల దీవి పద్యమంజరి నవ సృష్టి శాంల[(తక నవలలు ఇప్పుడే (ప్రతీకారం) శ్రీకృష్ణ దేవరాయలు కాలవేదం రామరాయలు (అ) వన మహోత్సవం మహాత్మ పంచకం ముక్కంటి సందేశం బుద్ద పరమాత్మ తుంగాపానం మహాత్మా గాంధీ కలిపురాణం మహాత్మా జోతిరావు పులే అవతారాల మోసాలు శ్రీ నారాయణ గురు రామాయణంలో స్త్రీలు మహాత్మా అంబేడ్కర్ కథన కవితావల్లరి అంతముకాలు సమరసత్వ్యం బాలల నవలలు సహజీవ న కోట వీరన్న సాహసం మౌనవత్వం ఉదయగిరి పోలన్న పరిష్కారం మంత్రాల రామన్న ఎక్కడి గొంగడి అక్కడనే కవిగారి బాల్యం మహీళా మహస్సు కవిగారి హైస్కూలు చదువు వేలం వెర్రి శవలలు భువన విజయం నిత కల్వాణి ఆదర్శం వను లతోనే ప్రేమ భిక్ష భావం శృత్వేనంళికలు (లేడీ లెక్సరర్ స్వగతం ముక్కంటి ముక్కోణం శంపొాలత చీకట్లో కాంతి రేఖలు కతొమద్మ ఆప్ బీదీ (టీందీ ప్రబంధములలో' ప్రకృతి వర్థనలు( ][6ఏ) మండే చంద్రుడు ౪
తం 90[భథం మా ఆంధ్ర ప్రదేశం మహనీయ గుణాలయం భరతమాత పుత్రికా మణీగతైక తిలకం ““మాఆంధ్రూ' అరివీరభయంకర వీ రాంధభ్రరాజ సామ్రాజ్యం శకమే స్టాపించినట్టి శాలివాహనుల రాజ్యం “మాఆంధ్రి” జైన బౌద్ధ వీరైవ మత సహనానికి నిలయం "హైందవ, ముస్లీం, క్రైస్తవ మత సహజీవన సదనం “మాఆంధ్రి” కొత్తరాహ దాక్షిణాత్య సంగమ మీ దేశం ద్రావిడ సంస్కృత భాషల కలధ్వనుల సౌభాగ్యం “మాఆంధ్రి* అమరావతి శ్రీపర్వత హంపీ శిల్పారామం స్తంభాలను సరిగమలను పలికించిన నైపుణ్యం “మాఆంధ్ర”
2 డా. అంతటి నరసింహం నన్నయ పెద్దన తిమ్మన భట్టుమూర్తి సాహిత్యం హిమవన్నగ శిఖరోన్నత సర్వకళానైపుణ్యం “మాఆంధ్ర? వేమన పోతన్నల వే దాంత సారకేదారం అన్నమయ్య త్యాగరాజు గానకళామాధుర్యం “మాఆంధ్రాః కృష్ణా గోదావరీ క వోష్ట జలం తాగి తాగి తుంగభద్ర జలముల మాధుర్యమ్మును క్రోలిక్రోలి "పెన్నానది సారమైన పన్నీటిని పీల్చి పీల్చి రాజభోగ సురభిళ సుమ ధుర ధాన్యం పండించే భారత ధాన్యాగారం మా ఆంధ్ర ప్రదేశం “మాఆంధ్రి”
మారిన వేదం 3 యంఠలిన వేదం “కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచని” ఇది గీతాబోధన “పనిచెయ్యడం మీవంతు ఉత్పత్తులపై అధికారం మావంతు” ఇది పెత్తందార్ల వాదన నాడూ-నేడూ - ఇదే ఆచరణ అజ్ఞానం వల్ల నాడు లేదు, ఏ బాధా వైతన్యం వల్ల వచ్చింది, నేడు తగాదా, భూస్వామ్య - ధన స్వామ్య ్రతినిధనాయకత్వం తీరుస్తున్నది తూటాలతో తగాదా! ““యథ్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతాః రమన్తే? ఇది మను ధర్మశాస్త్రం మాట మన ధర్మ శా(స్త్రం మాట అదే చోట (స్త్రీని - నీచాతి నీచంగాశిక్షంచ మన్నది అదేనోట! అదే ధర్మశా(న్హ్రం అదేం ధర్మ శాం! తర్వాత నర సమాజం మొదటి అర్జాన్ని వదిలేసింది! నిజం! రెండవ భావంతో ఆడుకుంటున్నది నారీలోకంతో అంతే! ఆడది (ఆటది) ఆటవస్తువై పోయింది
జీ డా. అంతటి నరసింహం ఆడపిల్లను దానం చేసే హీనస్టితికి అంతేగాదు - ఆడదాన్ని అమ్మే స్టితికి సాంతం దిగ జారిపోయింది సమాజం వస్తువును కొనుక్కున్నవాడు వస్తువును లాగే అనుభవిస్తాడు అంతేగాని మనిషిలాగా గౌరవిస్తాడా? నే నాట వస్తువును గాదూ - అని తిరగబడితే ఆమెదే తప్పంటుంది నరధర్మశా(న్హం కన్యాశుల్కకాలంలో అమ్ముడు పోయిన 'స్త్రీస్పానం వరవిక్రయ వరకట్నాల కాలంలో ఎంతో ఎదిగి పోవలసింది మరఠి, యేం జరిగింది! ఇంకా దిగజారి పోయింది నాడేమో కన్యను కొన్న యజమాని ననుకున్నాడు నేడేమో, పురుష ప్రతిపత్తి పెరిగి అంచెలంచెలుగా విలువ ఆకాశాన్నంటిందంటున్నాడు ఈనాడు జరుగుతున్న భూణహత్యలూ (స్త్రీహత్యలూ, ఆత్మహత్యలూ అవమానాలూ, మానభంగాలూ ఇంకా ఎన్నెన్నో అవన్నీ గూడా స్త్రీ తప్పువల్లనే అంటున్నది నరసమాజం! వారేవా - నర - సమాజం వారే, వానర సమాజం
మారిన వేదం ర్ అన్నం పర బ్రహ్మ స్వరూపం “అన్నం బహుకుర్వీత తద్ర్వతం! “అన్నం ననింద్యాత్ - తద్ర్వతం! అన్నం న పరిచక్షీత - తద్ర్వతం! ఇత్యుపనిషత్ అన్నదానం గొప్ప దంటూనే, అందకుండా దాచుతున్నారు - పరాన్నభుక్కులు - పరాన్న భుక్ వ్యాపార్డు. అంతకంతకూ ధరలు త్రివిక్రమా'[క్రమంలో ఆకాశాన్నంటి నక్షత్రాలై కూర్చున్నవి ఆహారాది పదార్జాలన్నీ నల్లబజార్ల చీకట్ల కటకటాల్లో కన్నుపాడుచుకున్నాకానరాకుండా - దాగిపోతున్నవి అయ్యో: అన్నోత్పత్తి కారులే అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నారు టసత్యాశ్న ప్రమది తవ్యం! మాహింస్యాత్ సర్వానిభూతాని - ఇత్యుపనిషత్ “సత్యానికి ప్రమాదం రానీయకండి ఏ ప్రాణినీ హింసించకండి” - ఇదీ దాని మతలబు సత్యమూ, అహింసా- ఒకే నాణేనికి బొమ్మాబొరుసులు ఆనాడుగూడా వాటిని కేవలం సాహితీ పదాలు గానే చూశారు! నేడంటారా - ఇంకా విడ్డూరం ఆచరణాత్మకంగా - 'సత్యాన్నీ - అహింసనూ గాంధీనీ కట్టగట్టి తగుల బెట్టారు.
6 డా. అంతటి నరసింహం గోడలకు వలాదే నతులు “అసత్యం న బ్రూయాత్! అబద్దాలాడరాదు ఇది వేద వచనం ఆ వేదాల్లోని హరిశ్చంద్రుడే నిత్యం అబద్దాల కోరు దేవతల వంచించిన వాడు పంచమ వేదంలోని పాండవా [గ్రజుడు నిత్య సత్య వచనుడు ప్రాణభంగ శంకతో అశ్వత్చామ హతః (కుంజరఖ అన్నాడు అతని నోట అసత్యం రాదన్న నమ్మకంతో వున్న ద్రోణుడు అన సన్యాసం చేసి ఆత్మ హననం చేసుకున్నాడు “ప్తీలను గౌరవించడం మన సంప్రదాయం వాళ్ల స్టానాల్లో వాళ్లను కూర్చోబెట్టండి” ఇది జీవిత ప్రయాణంలో నిత్యం కనిపించే బోర్డు సంప్రదాయం మీద మాకూ శ్రద్ద వుందండీ బాబు! వాళ్లే కూర్చోడం లేదు గాని పురుషులను గౌరవించీ గౌరవించీ వాళ్లే నిలబడి పోతున్నారు, అంతే! అప్పుడప్పుడూ - ఎప్పుడో
గోడలకు వేలాడే నీతులు 7
సంప్రదాయక రక్షక భటులు
కనిపిస్తూ ఉండేవారు కొంత కాలం
అవసరం లేదనుకున్నారేమోఇప్పుడు ఆ జోలే లేదు (స్త్రీలను గోరవించడం మాకూ తెలుసండి! అదేదో పురాణంలో సుమతీ అనే ఆమె ఉండేది చీము కార్లూ ఉన్న కుష్టురోగి భర్తను బుట్టలో పెట్టుకొని రంకుటిళ్లకు మోసుకు పోయే మహా పతివ్రత అలాంటి సంప్రదాయాన్ని మీరు కాల దన్ను కోగలరా చెప్పండి! అలాంటి భార్యే కావాలని ప్రతి మగవాడూ కోరుకుంటాడు
మరొక పతివ్రత వుంది
చేతగాని భర్త ప్రాణం కోసం
సూర్యోదయాన్నే ఆపింది రెన్నాళ్లు
ఆలాంటి భార్యే కావాలని
ప్రతి సాంప్రదాయకుడూ కోరకుండా వుంటాడా చెప్పండి గతంలోని వేద హరిశ్చంద్రుణ్ణి చూశాం ఇప్పుడు మరొక హరిశ్చంద్రుడున్నాడు కాలం మార్పుతో హరిశ్చంద్రుడిలోనూ మార్పు వచ్చింది ఈ పురాణ హరిశ్చంద్రుడు నిత్య సత్య వచనుడు తర్క బద్దం గాని ఒక మాట కోసం 'పెళ్లాన్నే అమ్మేశాడు ఆవుతో పాటు దూడను అమ్మినట్టుగా భార్యా బిడ్డల్నే అమ్మేశాడు
8 డా. అంతటి నరసింహం స్త్రీ అనగానే గుడ్డిగా గౌరవించి తీరాల్సిందే అనను గాని నాతి చరామి, నాతి చరామి అని అగ్ని సాక్షిగా పెళ్లాడిన స్త్రీని బానిసను లాగా, మార్పిడి వస్తువును లాగా అమ్ముతాడా అండీ
అయితే ఈ రోజుల్లో గూడా ఆ ఆదర్శాన్ని అమల్లో పెట్టేవాళ్లు లేరనడానికి వీల్లేదు నలుడనే రాజొకడుండేవాడు వంటా వార్చుల్లో భార్యకు సహాయంగా ఉండేవాడు దుర్వ్యసనాల వల్ల రాజ్యం పోగొట్టుకున్నాడు అడవికి పారిపాయాడు సభార్యుడుగ అర్జాంతరంగా అడవిలో భార్యను వదిలేసి పారిపోయాడు ఆయన గూడా, నేటి కొందరికి ఆదర్శమే! కొందరికి అది గూడా సంప్రదాయమే ఇంకొక ప్రఖ్యాత పురుషుడున్నాడు ఆయన పేరు శ్రీరాముడు (స్త్రీ! అంటే, వ్యభిచారికి గూడా అనుమానమే గదండీ కట్టుకున్న భార్య అయితే మరీనూ, అ సీత, రావణాసురుణ్ణి చెంతకే చేరనీ లేదు పైగా గడ్డీపోచ కింద జమకట్టింది అయినా సరే అగ్నీ ప్రవేశం చేయాల్సిందే అన్నాడు ఆ రాముడు పాపం చచ్చినట్లు చేసింది
ఆయన అనుమానం పోలేదు
నిండు చూలాల్ని మోసం మాటలు చెప్పి
ఆడవులకు తోలించేశాడు
అమె అభిమానంతో భూమిలోకి కృంగి పోయింది
ఆత్మహత్య చేసుకుంది
గోడలకు వేలాడే నీతులు 9 దీనికంతా నానా కతలు అల్లారను కొండి మన మేధావులు అయినా దాన్ని గూడా సంప్రదాయంగానే ఆచరిస్తున్నారు పురుషులు కొందరు ఇంతగా సంప్రదాయాలను పాటించే మాకు మాటి మాటికి “స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం” అని నిత్యమూ బోర్డు చూపించడ మెందుకండీ!
“పతియే ప్రతత్యక్ష దైవం”
ఈ బోర్డు ఈ నాడు గోడలపై కనిపించడం లేదు
అరవై డెబ్బై యేళ్ల క్రితం
వీధి బళ్లో చదివే రోజుల్లో
గోడలపైన చూశాను
అంతే గాదు,
సుమతీ శతకమూ, కుమారీ శతకమూ
కంఠపాఠం గూడా చేశాను .
ఇప్పుడా బోర్డు గోడ కెక్కడం లేదు
ఆచరణలో పెట్టాక ఇక గోడెక్కడ మెందుకు కన్యాశుల్కం ఇచ్చి కన్యను కొనేవారు గత శతాబ్దం వరకు డబ్బిచ్చి కొన్నారు గాబట్టి పతిని ప్రత్యక్ష దైవంగా చూవేది (స్త్రీ పతిని సమాన ఫాయిదాలో చూచేవారు కొందరున్నారు వాళ్లని అలగా జనం అన్నారు ఆ జ్ఞానవంతులు
దైవ మంటే మనకంటే గొప్ప వాడే గదా
అందుకే లక్షలు పోసి కొంటున్నారిప్పుడు
పతి దైవాన్ని పోటీల మీద
10 డా. అంతటి నరసింహం విద్య పెరిగి మోసాలు పెలగి, మాన భంగాలు పెరిగి అగ్నీ సంస్కారాలు జరుగు తున్నాయి ఇవన్నీ దైవ లీలలు “జీవ హింస చేయరాదు ”* ఇది కూడా గోడ మీద బోర్డే మనది వేదమతం యజ్ఞయాగాలు వైదిక కర్మలు మేకలూ, ధేనువులూ నిత్యము అగ్నిలో కాలాల్సిందే కాలిన వపను సోమపానంతో పాటు నంజుకోవాల్సిందే ఈనాడు గూడ అందరూ యాజ్జికులే! సోమ పీధులే పెద్దల సంప్రదాయం శిరోధార్యం గదా! “యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతాః రమన్తే”” ఎక్కడ (స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నర్హిస్తారు ఇది మను ధర్మ శాస్త్రం “న స్రీ స్వాతంత్ర్య మత స్తీ, స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు - ఇది కూడా అదే మనువు నోటిదే (స్తీ) శూద్ర విద్యా నిషేదం రోజుల్లో ఇది పకడ్పందీగా అమలు అయ్యింది “అందరికీ విద్యః” అన్న ఈ రోజుల్లో గూడా స్తీ స్వాతంత్ర్యం పూజ్యమే ఆడవాళ్ల క్లబ్బుల్లో బహిరంగ సభల్లో
గోడలకు వేలాడే నీతులు 11 (స్తీ స్వాతంత్ర్యం గురించి ఉద్రేకోపన్యాసాలు - ఆ స్వాతంత్ర్యం గూడా, ఆ మర్యాద గూడా - శ్రబ్బులకు రాగల యోగ్యత వున్న స్రీలకే వాళ్లు గోజి గోజి ఇచ్చే అల్ప జీతానికే పాచిపోయిన కూడు కూరలకే చాకిరీ చేసే పని మనుషుల కోసం గాదు కూలీ నాలీ చేసుకొనే శ్రమ జీవుల కోసం గాదు అక్కడ మాత్రం న స్త్రీ, స్వాతంత్ర్య మృర్లతి “దేవుని స్మరింపుము?” ఇది భేషయిన బోర్డు ఇది మట్టి గోడలపై నుండి చలువ రాతి గోడలెక్కింది శ్రమ జీవులయిన బహు జనులు రాత్రులు స్నానం చేసి ప్రమిద వెలిగించి దండం పెట్టు కుంటారు. అంతే! త్రి సంధ్యల్గో సంధ్య వార్పాలని ఒక మతం వారంటే ఏడు సార్లు ప్రార్దనలు చెయ్యాలని మరొక మతం అంది ఈ రెండు తెగలు శ్రమ జీవులు గారు ఈ నాడు పరాన్న భుక్కులు మరీ ఎక్కువయ్యారు భోగ భాగ్యాలు ఎక్కువయ్యే కొద్దీ 'ప్రార్దనా కాలం ఎక్కువ చేసుకున్నారు ఖరీదయిన ప్రార్ధనా మందిరాలు నిర్మించుకున్నారు అహరహం చేసే పాపాలు పరిహరించమని నిత్యమూ స్రార్టిస్తూ వుంటారు
12 డా. అంతటి నరసింహం “విద్యలేని వాడు వింత పశువు
ఇదొక వింత బోర్డు
బహుజనులకు విద్యను నిషేధించాకనే ఈ బోర్జు వెలవడం ఒక వింత మానవుడు గూడా జంతువే
పశువుకు ఒక (క్రమ బద్ద జీవితం వుంది
రుతు బద్ధ జీవితం వుంది
ఆ జ్ఞానం లేదు గాబట్టే మానవుడు వింత పశువయ్యాడు ఆపాత రోజుల మాటకేం గాని
ఈనాడు గూడా
విద్య నేర్చిన వారు చాలా తక్కువ మందే
నిజంగా “అందరికీ విద్య** అవసరం లేదట
ఇది పెద్దల మనసులోని మాట
అవుని మరి!
అందరికీ విద్య వస్తే, పల్లకీ మోసే వారెవరండీ
ఇది అసలు మతలబు
వయోజన విద్య, అక్షర రశ్శి, సార్వత్రిక విద్య
ఎన్నో కోట్లు చేసే ప్రోగ్రాములు - అమలు -
కొండను తవ్వి ఎలుకను పడుతున్నారు
అయినా, యిది డబ్బు దండగ చేసే పనికాకపోతే
పసిషిల్లల వదిలేసి, రాని పెద్ద మొద్దుల కెందుకండీ అక్షరజ్ఞానం ఆ నీతులన్నీ మట్టి గోడలపైన
వేలాడే నీతులు
కెటాలిన్ట్ 13 కెటాలప్స్ నిన్ను గురించి వ్రాద్దామని ఒకటే తపన నిన్ను సరిగ్గా నిర్వచించే పదం కోసం గాలిస్తున్నా నేతి నేతి అనుకుంటూ బ్రహ్మపదార్జాన్ని అన్వేషించి నట్టుగా నిన్ను నిర్వచించే పదం కోసం అన్వేషిస్తూనే వున్నాను 'బ్రహ్మపదార్హం అంది అందక దూరమవుతున్నట్టే నీ నిర్వచన పదం గూడా అస్పష్టంగా ఉంది గాలించి గాలించి ఆఖరికి పట్టుకున్నాను అదీ అదీ నివు కెటాలిస్టు కుల కెటాలిస్టు నీ నుండి కొన్ని మంచి పనులూ మరన్ని చెడ్డ పనులూ జరుగుతూనే ఉన్నాయి నీవు కొట్టించిన వాళ్లూ, చంపించిన వాళ్లూ తగుల బెట్టిన యిళ్ళ్లూ చెరిచిన యిల్లాళ్లూ ఎంతెంత మంది!! నీవు మాత్రం తరగడం లేదు నీవేకాదు నీ దోపిడీకి గురవుతున్న బలహీన వర్గాలూ తరగడం లేదు
114 డా. అంతటి నరసింహం కాసిన్ని కూలి డబ్బులకే కక్కుర్తిపడి కావలసినన్ని వోట్లేస్తున్నారు అవశత్వంతో జండా పట్టుకు తిరుగుతున్నారు నీకు జై అంటున్నారు అవతలి వాళ్లు కొడితే ఓర్చుకుంటున్నారు కాల్బేస్తే చస్తున్నారు అయినా తరిగి పోవడం లేదు నీవు నడుపుతున్న ఫ్యాక్టరీల్లో మూల ధాతువులు ఎన్నో కరిగి పోయి కొత్త సంపదలు సృష్టిస్తున్నాయి ఆ మూల ధాతువులు, ఏమిటి? బలహీన వర్గాల వారి వోట్లు
ఎంతో సంపద సృష్టించబడుతోంది
నీవూ నీ వాళ్లూ అంతకంతకూ బలుస్తున్నారు
నీ సంఖ్య పెరుగుతున్నది
ఉదారత్వంతో
నిస్వార్ధంతో
బలహీన వర్గాల సంఖ్యాభివృద్దికి
తోడ్చడు తూనే వున్నావు
నీవు తత్వవేత్తవు
అంతా అశాశ్వతం అంటూంటావు
వాళ్లకు మాత్రం అధికారం యివ్వవు
ఆ చెంతకే రానియ్యవు
నిన్ను మించుతారని భయం
నీకు మొగుళ్లవుతారని భయం
కెటాలిస్ట్ 15 వోటివ్వక పోయారో వోటున్న చెయ్యి బెట్ వోట్ల బూతుకు రాకుంటే వున్న కాలు అవుట్ అనుమానం వస్తే అసలా కాళ్లనే కదల నివ్వవు ఎదటీ వారికి వేస్తే అసలుకే మోసం! వోటు అజేయమైన ఆయుధం అన్నావు అమాయకులు అవునని నమ్మారు నీదగ్గర అంతకంటే గొప్ప ఆయుధాలున్నాయని తెలియదు జయించే ఆయుధాలున్నాయని తెలియదు ఆస్తులూ, బలుపులూ, అధికారాలూ, అహంకారాలూ అన్నీ నీవే అని నీవు అనుకున్నా నిజానికి అవన్నీ నీవి కావు అని తెలుసుకో అవన్నీ బలహీన వర్గాల నుండి సం 'క్రమించినవే అని యిష్టుడిప్పుడే కన్ను తెరుస్తున్నారు దధిచిని చంపి వెన్నెముకతో వజ్రాయుధాన్ని చేసి దాంతో ఇంద్రుడు అందర్నీ చంపినట్లు తలవైపు పట్టి విషజ్వాలల కోర్చి క్షీరసాగరం చిలికి సృష్టించిన అమృతాన్ని కష్టిస్తూన్నట్లు నటించిన తోక సాములకు పంచినట్ట్లు నిదానంగా తెలుసు కున్నారు మోసాన్ని తెలివిగల వాళ్లేగారు. తెలివిలేని వాళ్లు గూడా కనిపెట్టగలరు
16 డా, అంతటి నరసింహం
దరిద్రసేవే నీ ధ్యయం అన్నావు,
దరిద్ర సేవ ఏం సమాసం బాబూ
తత్పురుషమే బాబూ
కర్మధారయంగాదు . ఏమి నినాదాలు బాబూ నీవి దరిద్రులే దేవుడన్నావు దరిద్రులుండేది దేవాలయమన్నావు ఆ దేవుళ్లకు ఇంత నైవేద్యం పెట్టడం నీ విధి అన్నావు ఎంత పీనాసితనం బాబూ మాటల్లో నయినా కడుపు నిండా పెడతా ననవు
కాస్తంత నైవేద్యమే గిల్లి పెడతా నంటావు
ఏమయితే నేమి
సత్యం స్రాకృతికం
అది నీ హృదయంలో నుండే
స్వస్వరూపంతో బయట కొచ్చింది. అంతే అయితే బాబూ వక్కమాట ఆకలితో అవిద్యతో మండి పోతున్న హృదయాగికి ఈమీ చేష్టలు ఆజ్యం భగ్గున మండి నిన్నూ నీ మంత్రి సామంతులనూ ఒక్క పెట్టున దహించి వేస్తుంది నీ కార్లూ, మేడలూ, అధికారాలూ, అట్టహాసాలూ అన్నీ మండి బూదిదై పోతాయి
1/7 బుంంనసుంాంచ్చుత్ మథనం మానవ చరిత్రా మద్యపాన చరిత్రా వేరు వేరు కావు తమ్ముడూ వేదకాలంలోని సోమపానమే పురాణకాలంలో సురాపానం సోమపానం అన్నా, సురాపానమన్నా అది కేవలం - మద్యపానం కులాలు పుట్టకముందూ అంతేగాదు పురాణకాలానికి ముందూ అుదరూ తాగే వారే వురాణకాలంలో శుక్రాచార్యుడు సురాపానాన్ని శపించాడు అయితే మాత్రం ోలాజులూ, రాజ బంధువులూ, రాజు గురువూలూ యజ్ఞయాగాల "పేరుతో మద్య మాంసాదుల వదల్లేదు మద్య యుగాల్లోనూ వదల్లేదు ముఖ్యంగా ముస్లిముల కాలంలో గానా, పీనా బజానా, మజా యోరెక్కువ
16 డా. అంతటి నరసింహం శుక్రుడు అసుర గురువు అసురనీతి మనకు పట్టదు మనమంతా సురల పక్షం తమ్ముడూ సురల నీతికీ అసులరల నీతికీ ఎపుడూ ద్వంద్వ యుద్దమే! ఏదో ఒక మోసంతో సురల నీతికే జయం అసురనీతి వోడిపోయింది సురా పానం మరి విజృంభించింది '్రీలకిపుడు విద్యా నిషేధం లేదు మొక్కుబడి ప్రభుత్వ మొక్కుబడి సాయంతో దళితులు గూడా చదువు కుంటున్నారు బలోపేత వర్గాలూ, బలహీనవర్గాలూ గూడా మనోబలోపేతులవుతున్నారు మాతృవర్గం కన్ను తెరిచింది సురాపానం పైకి అసురాటోపంతో విజృంభించింది సురాపాన స్టావరాలను నిరాసం చెయ్యాలనీ సురా వ్యాపారం గత స్కృతిగా చెయ్యాలనీ తిరుగుబాటు జెండా యొత్తింది దండయాత్ర చేసింది సురాసుర యుద్ధం జరిగింది సురాభాండా గారాలు విధ్వంస మయ్యాయి పానశాలలు పటాపంచలయ్యాయి సుడరక్షకులూ సురేశ్వరులూ ఊడ్చి వేయబడ్డారు
సురాసురామృత మధనం 19 ఓడి పోయారు మద్యపాన నిషేధం అన్నారు జనం వూపిరి పీల్చు కున్నారు వింటున్నావా తమ్ముడూ ఓడిపోయిన సురలూ సురేశ్వరులూ సుర రక్షకులూ వూరుకుంటారా! సుర సభ జరిగింది సురేంద్రుడూ దిక్పాలకులూ సుర రక్షకులూ ఆలోచించారు మద్యపాన నిషేధం అంటే సారానిషేధమే అన్నారు సురాపాన జిహ్వలు గదా అవి ఎపుడూ మెలికలు తిరిగే వుంటాయి అందుకే మద్య పాన నిషేధంలో మెలిక ఎంతో పుణ్యధనాన్ని ఆర్టిస్తేగాని సురేంద్ర పదవీ, దిక్పాలక పదవులూ సిద్దించవు గదూ
- వాళ్లూ-వారి.సామంతులూ - బంధువులూ - బంధు సంబంధులూ వాళ్లను రక్షించే గూండా తండాలూ - రౌడీలూ హాయిగా అమృతాన్నం భుజించాలంటే, సురాపాన మత్తులో తూగాలంటే - ఎండకూ వానకూ లెక్కించకుండా క్షీరసాగర మధనం చేసే పుణ్యజనులు కావాలి, వారి శ్రమ ఫలాన్ని భుజించాలి వారి స్వేద సారాన్ని తాగాలి
20 డా. అంతటి నరసింహం ఏమంటున్నావు తమ్ముడూ సురలు, అసురులు, సురేంద్రుడూ, దిక్పాలకులూ అమృతాంధసులూ - పుణ్య జనులూ - ఏమిటీ భాష అంటున్నావా? ప్రతీక వాదం చాలించమంటున్నావా? సూటిగా చెప్పమంటున్నావా - సరే! ఆడవాళ్లకు భయపడి మద్యనిషేధం చెయ్యలేదన్నారయ్యా అమృతాంధసులు అరె! మళ్లా ఆ భాషే వస్తున్నదేమిటి? ముఖ్యమంటత్రులూ, మంత్రులూ, సామంతులూ అధికార సలవాదార్లూ - కాంట్రాక్షరేంద్రులూ రక్షకభటులూ, భక్షక స్వాములూ అందరూ ఈ సారానిషేధం, మానీతిసారమే - అన్నారండీ పోన్కీ అనుకోనీలే - అనుకున్నారు జనమంతా అంతటితో ఆ సురేశ్వరులూరకున్నారా? కుటిలతాసారమైన పాతనీతి సారాన్ని బయటపెట్టారు ఈ దుర్చల దౌర్భాగ్య జన రక్తసార రూపమైన ధనాసారం ఆగిపోతే ఈ బీదజనాన్ని ఉద్ధరించేదెలా? ఆ సాకుతో తమ ఆశ్రిత బంధుజనాల ఉద్ధరించేదెలా? సురల నీతికీ - అసులుల నీతికీ
సురాసురామృత మధనం 21 ఎపుడూ ద్వంద్వయుద్దమే, ఏదో ఒక మోసంతో సురలనీతే జయించేది జయించింది గూడా సురాపానం విజృంభించింది గతంలోని సురేంద్రులు అబ్బా! మళ్లా అదే భాష ముఖ్యమంత్రులూ, మంత్రులూ ఎన్నిన్నో పన్నులు పెంచారు వచ్చిన ధనాన్నంతా అభివృద్ది కార్యక్రమాల పేరుతో సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాజబంధువులే భోంచేసి మేడలు, అంతస్థులు పెంచుకున్నారు ప్రజా సంక్షేమాన్ని ఆగిపోనీరుగదా! మళ్లా పన్నులు వెయ్యక తప్పలేదు మనిషి నడిస్తే పన్ను, బ్రిడ్డిఎక్కితే పన్ను ఇసుకపై పన్ను, రాతిపై పన్ను గుడిసె కట్టుకుంటే పన్ను తాగేనీీళ్లపైనా, కరెంటుపైనా 'పెట్రోలుపైనా, తినుబండారాల పైనా - పన్ను - పన్ను ఊపిరి పీలిస్తే పన్ను, బ్రదికి వున్నందుకు పన్ను ఎన్నెన్నో పన్నులు పన్నుల సారాంశాన్నంతా ఆపోశన పట్టారు అది ఎడారిలో నీరింకి పోయినట్లయిపోతున్నది రాజబంధువుల విలా సజీవితాలకే చాలక వస్తున్నది అమృతాంధసులు మళ్లా మెదడుకు పదును పెట్టారు మరొక రూపంలో తాగుడుపై పన్ను వెయ్యాలనుకున్నారు
22 డా. అంతటి నరసింహం కల్లూ సారాయీ తాగే దౌర్భాగ్యులే - ఆ కల్లూ సారాయీ లేకుండా చేసినపుడు - బ్రాందీ విస్కీలకెగబడతారని తెలుసు వేలకొలదీ బ్రాందీ షాపులను వేలం పెట్టారు “ముల్లు తీసి కొర్రడిచినట్లు” ఎవరమ్మా అది! కాటుక కంటినీరు మొలకట్టు పయింబడయేల యేడ్చెదో బూటక పాలకాధముల పోకిరి చేష్టల బాధితా బలా ఏమంటున్నావు! కాటుకెక్కడిదీ అంటున్నావా? కంట్లో నీరక్కడిదీ అంటున్నావా? నిన్నటి కన్నీటి సారాంశమంతా నేటి బ్రాందీగా మారుతున్నదంటావా? తప్పదు తల్లీ! బిడ్డలకని బుద్ది చెప్పే మాతృమూర్తివి నీవే గదమ్మా అలాంటి దుర్మార్గులనూ, చోరులనూ కులస్వార్టులనూ కన్నా వేంటి తల్లీ కన్నావు ఇపుడేంచేస్తావు నీవే చెయ్యాలి యేదయినా చేస్తావా? అయితే విజ్బంభించు మళ్లా విజ్బంభించు నీ సోదరీ మణులతో కలిసి విబ్బంభించు అంతేగాని అన్నల సాయం కోరకు
సురాసురామృత మధనం 23 కొందరు అన్నలు అప్పుడే పంచెలు ఎగగట్టి ఇదిగో వస్తున్నాం అంటున్నారు నమ్మకమ్మా వారి నిక నమ్మకు ఆ అన్నలే, - ఇదివరకు ఇదివరకు వారుణీ వాహిని ప్రహింపదజేసినవారు కోటి ఆదాయాన్ని పదికోట్లకూ నూరుకోట్లకూ, వెయ్యి కోట్లకూ పారించినవారు వారే ఈ కోట్లవల్ల సమాజ సంక్షేమం అవుతుందా తల్లీ అరచేతిలో వైకుంఠం చూపే మాంత్రికులు తల్లీ మీ జీవితాలనూ మీ సంతాన జీవితాలనూ అధమస్టాయికి దిగ జార్చుతున్నవారు వారే వారిని దరి చేరనీయకు తెలుగన్నలేగాదు, కాంగీ అన్నలేగాదు! బీ.జే.పీ. అన్నలేగాదు - అందరూ అందరే దొంగలే ఇంకెవరు చేరినా ఉద్యమానికి సానుభూతి సున్న (స్త్రీలందర్నీ పోగు చేసుకో విజ్బంభించు - ఈకులపాలకుల ధ్వంసించు ఈ కుల పాంసుల ధ్వంసించు విజయీ భవ! విజయీభవ! దిగ్యజయీభవ
24 డా. అంతటి నరసింహం క£ చంటంలలుకి నీవు పీఠాధిపతివి - సన్యాసివి నీచుట్టూ మూడు వందల మైళ్ల పరిధిలో సర్వులూ మేధా వర్టకాహారాలు భక్షిస్తున్నారు నీవు కేవలం పూరి 'మేస్తున్నావు సన్యసించిన సన్నాసికి కులం మతం యేమిటి స్వామీ! మరిచాను పీఠాధిపతుల పని కులవ్యవస్టాపరి రక్షణమేగదా పోనీ! హరిజనుల జోలెందుకండీ వాళ్లు చండాలురు కులం అంటే ఏమిటి స్వాములూ అనాదిగా జన్మను బట్టే గదా కులం! అంటే క్షేత్రాన్ని బట్టి అన్నమాటే గద! నీవు బ్రాహ్మణ కేత్రజుడివి మరి చండాలు రెవరంటారు? వాళ్లూ బ్రాహ్మణ క్షేత్రజులే అదేమిటి తమనేత్రాలు జ్వాలలు కక్కుతున్నాయి? అంతెత్తు ఎగిరారేమిటి? ఏమన్నావ్ అని రొప్పుతున్నారా? బ్రాహ్మణుడూ ఛండాలుడూ ఒకటేనా అని గద్దిస్తున్నారా? తమరు చదువు కున్నారనుకుంటాను బుద్ధికి పదును పెట్టండి పూర్వాశ్రమంలో మీరు టీచరని విన్నాను కనీసం అమరమన్నా చదివారా స్వామీ
కః చండాల; 25 ఈ రోజుల్గోఅలాంటివి చదవరు గదూ ““చండాలస్తుజనితో బ్రాహ్మణ్యాం వృషలే నయః* అరం తెలుసా స్వామీ! ఏమిటీ? అదేమిటో నీవే చెప్పిచావు అంటున్నారా! బ్రాహ్మణ (స్త్రీ యందు శూద్రునికి పుట్టినవాడు చండాలుడు అయితే యేమిటంటా అని అంటున్నారా ఏమీలేదు ఆ చండాలుడూ తమరూ బ్రాహ్మణ క్షేత్రజులే - ఈ మాట అంటున్నది నేను గాదు నిఘంటు పండితులు బ్రాహ్మణ పండితులు సూత్రకారులు ఇలా అన్నానో లేదో హుం అని మంత్రబద్ధ భుజంగం లాగా బుసలు కొట్టి కనిగుడ్డు నెత్తి కెక్కించి రొప్పుతూ కూచున్నాడు స్వాములవారు బుసలు కొట్టి కనుగుడ్డు నెత్తి కెక్కించి రొప్పుతూ కూచున్నాడు స్వాములవారు కులపీఠాల స్టాపకులు శంకరులు యేమన్నారో విన్నారా స్వామీ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషామనీషామమ - అన్నారు వింటున్నారా? అదేమిటి అబుద్ధ్దమొగం పెట్టారు
26 డా. అంతటి నరసింహం . దొికిం౧ంటకం
ఎందుకు భాయీ దొంగాటకం!
జీవితాలతో చెలగాటం
నీలో నాలో ఎదటి వాడిలో
అందర్గోది ఆ ఆత్మేనంటావు
జనన మరణాలూ ఆకలి దప్పులూ
అందరికీ ఒకటే అంటావు
మరి ఎందుకు భాయీ ఆషాఢ భూతి మంత్రాలు
జీవితాలతో చెలగాటాలు
_ నీమతం కంటే వాడి మతం తక్కువే అయితే
నీదేవుడు వాడి దేవుడి కంటే ఎక్కువే అయితే పరీక్షకు పెట్టకుండా వాదులాడుకుంటారేమిటి? నిరూపించి తేల్చకుండా కూర్చుంటారేమిటి?
అన్నం నుండే జీవుడుద్భ విస్తాడని తెలుసు
అన్నం లేకపోతే జీవుడు లేడనీ తెలుసు
అన్నాన్ని ప్రకృతి నుండే పొందాలనీ తెలుసు
మరి ఏ అల్లానో, యేసునో ఈశ్వరుణ్లో
అన్నంకోసం అడుక్కుంటావేమిటి?
అలా అడుక్కున్నంత మాత్రాన.
ఆకాశం నుండి వూడి పడుతుందా యేమిటి? అష్టకష్టాలు పడి అన్నోత్పత్తిని చేసుకోవాలని తెలుసు అష్టయిశ్వర్యాలు అనుభవించాలంటే కష్టజీవుల కడుపు కొట్టి తీరాలనీ తెలుసు మరెందుకు బాబూ! దేవుడిస్తున్నాడు అనే దొంగమాటలు పూర్వజన్మలో పెట్టి పుట్టామన్న మోసపు కూతలు!
దొంగాటకం 27
చూడు బాబూ! నాకళ్లల్లోకి చూచి చెప్పు
సూటిగా చూచి చెప్పు మనవూళ్లో ఆ రామన్నకూ పక్కవూళ్లోని రహీమన్నకూ, యేసన్నకూ సంతానం లేదని తెలుసు
కనిపించిన దేవుళ్లకంతా మొక్కారనీ తెలుసు
అన్నిమతాల సన్నాసులకూ మొక్కి
తాయెత్తులు కట్టుకున్నారనీ తెలుసు
ఆడవాళ్లు ఒక్క పొద్దులుండి
దేవాలయాల్లో దర్గాల్లో
వరపడ్డారనీ తెలుసు
అందరూ యేమన్నారు పాపం!
వాళ్లు గొ డ్రాళ్లన్నారు
దేవుడిస్తే గదా సంతానం అన్నారు
ఆఖరికి వాళ్లు
దేవుళ్లను వదిలేశాకనే
దేవుల్లిచ్చేది సున్నే అని
తెలుసుకున్నాకనే
సంతానవతులయ్యారు సిగ్గపడుతున్నావేంటి భాయీ! సిగ్గుపడవలసిందేమీ లేదిందులో మన పూర్వులు చాలామంది వారి పూర్వులు ఎంతో మంది రాజాధిరాజులూ మహీ గురువులూ అల్లా పుట్టిన వాళ్లే తమ్ముడూ
సిగ్గపడుతున్నావేంటి భాయీ!
సిగ్గు పడవలసిందేమీ లేదిందులో
28 డా. అంతటి నరసింహం నువ్వు వేదాలూ ఉపనిషత్తులూ రామాయణ భారతాలూ బైబిల్ ఖురాన్నూ అన్నీ చదివావు వింగడించి, విమర్శించి, తులన చేసి పాఠాలు గూడా బోధించావు
నిజం చెప్పు భాయీ! జన్మలు యెలా కలుగు తాయో!! నాకళ్లల్గోకి సూటిగా చూచి చెప్పు అంతేగాదు కష్టజీవుల కడుపు కొడితేగాని ఇష్టమృష్టాన్నాలు రావనీ గుడిసెల సంఖ్య 'పెంచితేగాని మేడల అంతస్టులు పెరగవనీ ఈ దోపిడీ అంతా మతం పేరుతో దేవుడి పేరుతో కర్మ పేరుతో చేస్తున్న మోసమనీ తెలుసు నీకు బాగా తెలుసు దేవుడు లేడనీ మతం మోసమనీ, నీవు దగా పడిన దుఃఖ సమయాల్లో నీవే రుజువు చేశావు ఈ సత్యాన్ని ఇదంతా వంచన అనీ పనిదొంగల మోసపు సృష్టి అనీ నీవే రుజువు చేశావు అయినా మూర్ధంగా వేషాలు వేస్తూనే వున్నావు స్వార్టంతో కావేషాలు ప్రదర్శిస్తూనే వున్నావు ఇంకయినా అపు, ఈ పబ్లిక్ మోసాలు చాలించు ఈ బూటకంపు వేషాలు
29 చంతక పక్షులు ఎంత వింత స్వప్నం! ఎంత సుఖాంత స్వప్నం! మెలకువ వస్తున్నది కవికి ఒకసారి సింహావలోకనం చేసుకున్నాడు గత దృశ్యాలంతా సింహ స్వష్నంగా సాక్షాత్కరించాయి పుంఖానుపుంఖంగా సాక్షాత్కరించాయి పుంఖాను పుంఖంగా అర్ద శతాబ్దం క్రితం అపుడే వచ్చింది స్వరాజ్యం అంతకు ముందూ, ఆ వెనుకా జరిగిన మతమారణ హోమం ఈనాటి వరకూ ఉపశమించని, నిత్యాగ్ని హోత్రం! ఏనాడో యాఖై శతాబ్దాల క్రితం ఈనాటికి పదపూోనువందల తరాల క్రితం ఆవిష్కృమైనది కులవ్యవస్తా స్వార్దం అజ్జానమో - స్వార్థ్హమో ఆ వ్యవస్థా పాలకత్వంలో అందరికీ వుంది భాగం! అందరూ పశ్చాత్తాప బడవలసిన పాపం! కులవిభేదం, మత విభేదం నిర్వాసిత హేతువాద ఫలం స్వార్దా జ్ఞాన భూయిస్టం దురా 'క్రమణ సంజనితం! శరీర పరిశ్రమ చేయకుండానే " షడ్రసోపేత ఆహారం కోసం భుజబల మేధా సంపన్న వర్గ - అపూర్వ స్వార్ద సృష్టి యీ కుల వ్యవసా విషఫలం
30 డా. అంతటి నరసింహం దేవుణ్ణి సృష్టించింది యీ మేధా సంపన్నవర్గం వెంటనే కర్మ సిద్దాంతాన్నీ సృష్టించింది ఆది వర్గం ఆ దేవుడి పేరుతోనే - కర్మ సిద్దాంత పునాదులతోనే సృష్టంచింది యీ వర్ణ వర్ల విభేదం!
సమాజం చీలి చీలి అనేకమై వేర్వేరై అనైక్యంగా అజ్ఞానంగా అతార్కికంగా అమానుషంగా వర్చిల్దుతున్నరో జుల్లో ప్రాణీ సమానతా ప్రాతి పదికగా హృదయ వాదం ఊపిరిగా ఉదయించింది బౌద్ధవాదం అది హేతువాద సంజనన అహింసావాదం కులవ్యవస్తా నిర్మూలక సామ్యవాదం అయ్యో అది ప్రజాస్వామ్యంలేని సామ్యవాదం ప్రజాస్వామ్యబలం లేని సామ్యవాదం పునాదులు లేని సామ్యవాదం కొద్దికాలం సాగిందో లేదో కలగని మేల్కొన్నట్టుగా విజృంభించింది మళ్లా కుల వ్యవస్థ మానవ రక్తం రుచి మరిగిన పులి గదా! చూస్తూ వూరుకో గలదా మేధావి వర్గం! కొట్టాకుండా వా తిట్టాకుండా ----- అన్నట్టు మేధాపూర్ణ స్వార్ద పాలక వర్గం చేసింది విద్యా నిషేధం నిరాటంకంగా సాగింది మళ్లా కులవిభేదం పర్యవసాన ఫలం అంటరాని తనం!
చాతక పకులు 31 అది సమానతా నిరాకరణం మానవతా నిరాసనం! ఇదే అన్యమతావలంనకు ఆద్యం మత విద్వేషాగ్నీకి ఆజ్యం ఒకవైపు మీరు వేరూ మేము వేరూ అంటూ మీరు అంటరాని వారంటూ పీఠ్రాధిపతులూ, మఠాధిపతులూ ఉచ్చనీచత్వాల బోధించి ఆచరిస్తూ వుంటే - పుట్టింది మొదలు చచ్చేవరకూ కులం మచ్చ మాయనివారూ నిత్యం హీనత్వాన్నే రుచి చూస్తూ వున్నవారూ కంటితో చూస్తై దేవుడు గూడా మైనపడిపోతాడని రాతి విగ్రహాలగూడా చూడ్డానికి నిరాకరింప బడ్డవారూ మంచి మాటకూ, కాస్తంత ఆదరణకూ నోచుకోని దయనీయ పామర జనాలూ చూపుల్లో సంబోధనల్లో నీచంగా చూడబడుతున్న మానవులూ, మంచి ఆహారం, మంచి వ(న్హ్రం, మంచి నివాసం, కోసం అనాదిగా మొగం వాచిన దరిద్రులూ సమత్వం అంటే యెలావుంటుందో అనాదిగా యెరుగని వారూ ఏదో ఒక నాటికైనా అవిలభిస్తాయన్న ఆశాలేశం గూడా లేనివారూ అవి యెలా లభిస్తాయా అని దారులు వెదకడం తప్పెలా అవుతుంది? అవి యిచ్చే జనంలో చేరడం తప్పెలా అవుతుంది?? అని సమరించు కుంటాడు కవి ఆ తప్పంతా మన కులవ్యవస్టదే - భీ1ీ! అంటాడు కవి ఆరు శతాబ్దాల్లో ముష్ఫయి కోట్ల అన్యమతస్టుల సృష్టించిన కులవ్యవస్టా పాలక మూర్చలను తలచుకొని మండి పడుతున్నాడు కవి ఈ జాతికి మతమే అవసరమైతే
32 డా. అంతటి నరసింహం ఏనాడో స్టాపించు కొని వుండేవారే మతమే స్టాపించుకొని వుండి వుంటే ఈ దేశానికి ఎత్తి వచ్చిన వారినందర్శీ ఇందులోకే లాగేసుకొని వుండే వారే అయ్యో అని తలపట్టు కొన్నాడు కవి అందరికీ విద్యార్హత లేని రోజుల్లో నిరాటంకంగా సాగిన కులమత తత్వం విద్యార్ల్ణత వున్న స్వరాజ్యంలో గూడా నిరాటంకంగా సాగుతున్నదంటే హేతువాదం చచ్చిన యీ విద్యాధికబ్రువులు ఇంతహీనులై పోయారేమిటా అని తలకొట్టుకుంటున్నాడు కవి మేధావులనబడే వారిని చూచి మండి పోతున్నాడు కవి ఒకనాడు గుడ్డిగా వున్న సామాన్య జనం ఈనాడు కన్ను తెరిచింది హేతువాద రహిత దౌర్జన్య పూర్ణ కులవర్గతత్వాన్ని నిరసిస్తూ “మాకూ సమాన హక్కులు” అన్న నినాదం లేవదీసింది ఆస్తులన్నీ ప్రజాపరం చెయ్యాలని నిలదీసి అడిగింది నాలుగు దశాబ్బాల్గో ఉన్న, అన్ని భూములూ కాంట్రాక్టులూ, వ్యాపారాలూ, ఫ్యాక్టరీలూ కొందరే సొంతం చేసుకుంటూ అన్ని రంగాల్లో అధిపత్యాన్ని సంపాదించుకుంటూ ఆర్టిక రంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని గుడిసెల సంఖ్యను విస్తారంగా "పెంచేస్తూ త్రివిక్రమ క్రమంలో పైపైకి పెరుగుతూవుంటే - సమాజం అట్టుడికి పోయి నానాకుల సంకుల సమరంగా సదమదమవుతూవుంటే - ఇక చూడలేక పోయాడు కవి
చాతక పక్షులు 33 పాపం! ఈ జనం! అణగా 5న ఈ జనం! మహారాజ పదవులు కోరడం లేదు కోటీశ్వరత్వం కోరడం లేదు కడుపునిండా అన్నం - కావాలని - అంతే తమదారి దాన్ని నిర్మూలించాలని మద్యపానాన్ని నిషేధిచాలనీ అందరికీ ఉచిత నిర్బంధ విద్య కావాలనీ అంతేగాదు కనీస మర్యాద గావాలని కాని మీసేవకే వుంటున్నామంటున్న ఈ కుహనా నాయయకులు వానకో యిలల్లాగా ఈ బీదల నోటి కాడ మెతుకులను గూడా హరిస్తున్నారే అనిదుఃఖిస్తున్నాడు కవి విస్తరిస్తున్నదోపిడీనీ విజృంభిస్తున్న దురా క్రమణత్వాన్నీ ధరల వీర విహారాన్నీ ఏ ధరకైనా కొనగలిగిన నియోరిచ్ దగా కోరుల స్వార్జాన్నీ ఎడతెగని సామాన్య జనదారి ద్యాన్నీ చూచి కుతకుత ఉడికి పోతున్నాడు కవి ఉదటుగా మేల్గొన్నాడు కవి హ్రస్వ ఉచ్చ్వాస నిశ్వాసాలు శబ్దంతో వెలువడుతున్నాయి శరీరమంతా 'స్వేదసిక్తమై కంపిస్తూవుంది శివమెత్తి పోతున్నాడు విజృంభించి రక్తనేత్రాలతో వీక్షిస్తూ శిలాక్షరాలు బరబరా రాశాడు అంబరంపై అంతయెత్తున “స్వార్ద దుర్మార్గులారా ఖబడ్దార్ పీడిత తాడిత జనం ద్లీర్ణ దేహులై త్రినే త్రులై వస్తున్నారు ఖబడ్డార్! అని.
34 డా. అంతటి నరసింహం ఇబరంజలు - కణ గతయుగాల మసక వెన్నైలల్లో మధురోహల తేలియాడుతూ గాలి కబుర్లు పోగుచేసి కవితలు రాశాను గత జీవిత బాధామయ గాధా పర్వాన్ని మూసిపెట్టి కవి శబ్బానికే కళంకం తెచ్చాను ఆర్యానార్యులు స్వార ద్వేషాగ్నులతో పరస్పరం యుద్దాలు చేసుకునే రోజుల్లో నేనూ కత్తీ కలమూ పట్టిన వాణ్ణే . ఆ వేదకాలమే మేలు గుడ్డిలో మెల్ల ఆ వెంటనే దాస బానిసత్వ వ్యవస్థలకు పునాదులు పడిన మాట నిజం పురాణాలకాలాల్లో వ్యవస్టీకృతమైన వర్ణకుల వ్యవస్థ ఒక మహావట వృక్షంగా జటాశాఖోప శాఖాంచ జ్బ్బాటమై జటిలోత్కటమై ఉత్కంపనలతో సర్వ వ్యాప్త అమానుష భేదాలకు ఆలవాలమై పోయింది నిజం! స్కృతుల కాలం మరీ కానా కష్టం విద్యా నిషేధం, (స్త్రీ, బానిసత్వం పురోహిత అహంకారం స్వర్గ నరక భయప్రచారం దేవుణ్ణి గూడా త్రోసిరాజన్న కర్మ సిద్దాంత ప్రచారం - ఎన్ని అనర్జాలో!! నా విష్ణుః పృథివీ పతిః - బ్రాహ్మణో భూమి సురః - ఎంత ఎకీకృత అహంకార క్రూరత్వం!
చిరంజీవి - కవి 35 ఎంత నిరంకుశత్వం! ఎంత ప్రజా అకించనత్వం పాలకుల వైభవాలూ విశ్చంఖల ప్రవర్తనలూ ప్రజాబానిసత్వాలూ అస్పృశ్యత, సర్వవ్యాప్తదారిద్ర్యాలూ - ఈ దురంతాలన్ని చూస్తూనే వున్నాను పేగులు కదిలి కరుణ రసం పొంగి కలంపట్టాను - నిజం ఎవరో నా చేతులు ఒడిసీ పట్టారు చూశాను ఇంకెవరు? స్మృతి కర్తలు జాగ్రత్త ఇవన్నీ తెలియజెప్పే ప్రజల్ను రెచ్చ గొట్టావో మన ఆధిక్యం, ఆధిపత్యం సున్నాలవుతాయని తెలుసుకో” అంతే గాదు ఇంకా యేవేవో చెవుల్లో వూదారు వెయ్యి విదిలించుకున్నాను కలం ర్వుళిపించాను సాంఖ్య వైశేషికాలూ జైన బౌద్ద చార్వాక హేతువాద సామ్య వాదాలూ ప్రచారం చేశాను కొన్ని శతాబ్దాల పర్యంతం చేశాను అంతా నిరర్దకమైంది బూడిదలో పోసిన పన్నీరై పోయింది జనమంతా నిరక్షరకుక్షులు పాలకులు నిరంకుశులు విద్యాధికులు స్వార్ధపరులు అంతా కలిసి నా ప్రచారం నిష్ఫలం చేశారు నాకు నిర్వేదం మాత్రం మిగిలింది ఆ|క్రోశించాను
36 డా. అంతటి నరసింహం పాలకులనూ పురోహితులనూ గొప్ప జేసి పొగిడితే వాళ్లు కావించిన దుశ్శాసనాలను ్రచారంచేస్తే ష్యడ్రసోపేత ఆహారాలూ, వైభవోపేత జీవితాలూ - నమ్ము ప్రలో భ పెట్టారు నాలోని కవిని జోకొట్టారు కాని. ఎక్కడో అసంతృప్తిగానే వుంది నాలోని కవి, నిద్రపోలేదు మళ్లా ధ్వజమెత్తాను రాచరిక నిరంకుశత్వాల దుయ్యబట్టాను రాజ పురోహిత కుతంత్రాలను బయట పెట్టాను ఒకవైపు ద్వైతా ద్వైత విశిమ్టాద్వైతాల వ్యాప్తి మరొక వైపు వైష్ణన్ వీర శైవమత విజృంభణవ్యాప్తి గతంలో కులదొంగలు బౌద్ధంలో దూరినట్లే కుల దొంగలు పరకాయ ప్రవేశం చేశారు వీటిల్లోకి మళ్లా కులాలు, శాఖలు ఉచ్చనీచాలు దైవం, స్వర్గం, పాపం, నరకం . మోక్షం, బొందితో కైలాసం దానాలూ, ప్రాయశ్చిత్తాలతో పాప ్రక్షాళనాలూ, ఎన్నెన్ని, ఎన్నెన్ని ఆత్మకు కుల భేదాలు లేవంటూనే నిత్య జీవితంలో వాటిని చిత్త శుద్ధితో పాటించడం - ఈ దొంగలు ఈ వంచకులు బ్రదికి వుండగా వర్గకుల భేదాలు వదలనీయరు రబ్బరు లాంటి యీ కుల తత్వం సాగదీసింత సేపే . మళ్లా యధాస్థానం కుక్కతోక వంకర తీవ్రంగా ఆలోచిస్తున్నాను ఇంకా తీన్రంగా విమర్శిస్తున్నాను
చిరంజీవి - కవి 37 ఈ సమాజ వంచకులు మళ్లా మీద పడ్డారు పట్టుకున్నారు ఏదో విభూతిని నాపైన చల్దారు అదేదో గమ్మత్తు వాసన ఆనందమా నిరానందమా! నిద్ర ముంచుకొస్తున్నుది మత్తుగా వైతన్యావైతన్య ప్ల పడిపోయాను సుప్త వైతన్యం మనసు పని చేస్తూ నే వున్నది అర్ర నిద్ర ఏవో స్వప్నాలు, సుందర స్వప్నాలు
ఎక్కణ్ఞుంచో తెల్లవాళ్లు వచ్చారు
నయవంచనతో
నమస్కార మస్కాలతో
వ్యాపార కేంద్రాల స్టాపనతో
దేశాన్ని దిగ్బంధనం చేశారు
దేశీయ దుర్మార్గ పరిపాలకులు కావించే పరస్పర యుద్ధాల్లో దూరారు
క్రమక్రమంగా దేశాన్ని దిగమింగారు
పిల్లుల, తగాదా, కోతి తీర్చింది
కొతొక వింత
రాజరిక వ్యవస్టకాదని ప్యార్గమెంటు ప్రజాపాలన స్టాపనమైంది ఐశ్వర్యాన్నంతా కొల్లగొట్టి మూటలు గట్టారు
కాని ఒక్క లాభం
ఎంతోమంది మముబోటి కవులూ సంస్కర్తలూ యుగయుగాల పర్యంతం చేయలేనిపని -
అదే సర్వహిత విద్య -
మనవాళ్లు విద్యను దాచివేస్తే
వాళ్లు విద్యను బహిరంగం చేశారు సర్వజనసామాన్యం చేశారు
ఆ యింగ్లీషు విద్య ఫలం. జాతిలో జాగృతి, దాని గఘ్యం
స్వాతంద్ర్య సాధన
36 డా. అంతటి నరసింహం వందే మాతరం అన్నారు ఇండియన్లు తెల్లవారు తెల్లటోయారు బానిసలు తిరుగుబాటు చెయ్యడమా! వినగూడని దేదో విన్నట్టుగా ఊహించని విపరిణామం సంభవించినట్లుగా కోపాహంకారో ద్రిక్తులె లాఠీలతో బాదారు గుర్రపు డెక్కలతో తొక్కించారు తుపాకులతో కాల్చారు బ్రదికినవారిని బైళ్లల్లోకి తోసేశారు బంతిని ఎంతబలంగా నేలకేసి కొడతామో అంత యెత్తున 'పైకిగురుతుంది అంతే జరిగింది అయితే ఫలితం? + నిరంతరం తెల్ల దొరల తుపాకీ మోతలు
చిత్రాతి చిత్ర సన్నివేశం ఒక విచిత్రవ్యక్తి రంగం పై ప్రత్యక్షం కొల్లాయి బట్టతో బడుగు శరీరం చిత్త శుద్ధికి పర్యాయపదం మూర్తీభవించిన శాంతం ఆకృతినందిన సత్యాగ్రహం బడుగుజీవుల ప్రాతినిధ్యం "సేవా గ్రామంలో నివాసం హరిజన వాడల్లో మకాం అజేయ సత్యాగ్రహాన్త ప్రయోగం సూర్యుడు క్రుంకని అనంత రాజ్య ప్రకంపనం రక్తపాత రహిత స్వారాజ్య సంసిద్ది నల్లదొరలపైశాచిక తాండవం గాంధీజీ అడ్డును తొలగించడం గాంధీయిజాన్ని అధఃపాతాళానికి త్రాక్కడం
చిరంజీవి - కవి 39 ప్రజాస్వామ్య సమసమాజవాద జపాన్ని వల్లిస్తూ దేశాన్నీ సమాజాన్నీ దోచుకొడం - దేశాన్నీ సమాజాన్నీ దోచుకోవడం పాడుచరిత్ర మళ్లా పునరావృతమైంది కులత్వం - కుల సంకుల సమరాలూ . మతతత్వం - మత పిచ్చి ద్వంద్వ యుద్దాలూ - సర్వవిధ అక్రమాలూ - దౌర్జన్య దురాక్రమణలూ ధరల ఆకాశయానాలూ, దారిద్రవ్యాప్తులూ మేడల అంతస్టుల ఆకాశయానం గుడిసెల కప్పులు సైతం భూపతనం ఆకలి చావులు /' శ్రత్ర శతాబ్దాల అస్పృళ్యత ఎటు జూచినా చదువులూ ఉద్యోగాలూ లంచాలూ మోసాలూ కార్లూ బేకార్లూ పరపీడకులూ పరాన్న భుక్కులూ వోటర్ల ఉద్దరణకోసం లక్షలు పెట్టి పదవులు కొనడం, కోట్లు కోట్లు దోచి అందకుండా దాయటం, అదేమన్న ప్రశ్నలకు లాఠిల తూటాల జవాబులూ _ మానభంగాలూ - గృహదహనాలూ హాహాకారాలూ - ఆక్రందనాలూ తుముల భీషణ ధ్వనులూ ఉదటుగా మేల్కొన్నాను తుపాకీ అందుకున్నాను ఒక్క క్షణం ఆలోచించాను మరొక చేతో కలం గూడా అందుకున్నాను ఇదం క్షాత్రం ఇదం బ్రహ్మం
40 డా. అంతటి నరసింహం [తుఖాం ఇచెల్వెము యేడు కోట్ల ఆంధ్రులకు అన్నవంటావు నువ్వు నోరువిప్పితే ప్రజాస్వామ్యము, సామ్యవాదము అఆటావు బీదలు బీదలు అంటూ గొంతు చించుకుంటావు వాళ్ల నుద్దరించమని అడిగితే, బీదరుపులు అరుస్తావు నిన్న ఎంత మంచి వార్త చదివానన్నా. మంత్రివై కూడా నీవు స్వార్టాన్ని వదిలేసిన సన్నాసివి చిన్ని మనవణ్ణి ఒళ్లో పెట్టుకుని బంగారు గొన్నె తిరుపతి స్వామీ ఆశీర్వాదానికి పెట్టి బంగారు నాణెంతో ముద్దుల మనవడికి పాల పొంగలి తినిపించావు ఇంతవరకూ ఆ ఆలయంలో అన్న ప్రాశనం చేసి అపవిత్రం చేయలేదట యెవరూ అంటే అంటారు లేన్నా సన్నాసులు. అన్న ప్రాశనం శుభ ప్రారంభమన్నా నిజంగా మాకానందం కలిగిందన్నా ఏనాడో ఒకనాడు కోట్ల కోట్లు నీ బీద షిల్లల కంతా అలాగే బంగారు గిన్నెల్లో, బంగారు నాణేలతో పాలూ అన్నమూ తినిపిస్తావని నమ్మకమున్నా ఎందుకంటే నీవు నోరు తెరాస్తే నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్లు నా యేడు కోట్ల ఆంధ్ర ప్రజలు అంటూ 'అరుస్తావు గదన్నా
అంతే గాదన్నా
నీవు ఎన్నో సార్టు, నేను కమ్యూూనిష్టునే -
అంతేగాదు - ఒకాకు ఎక్కువ చదివిన వాళ్డో
అంటూ ఉంటే విని అందరమూ ఆనందించాం ఒకాకు ఏమిటన్నా నూరాకులు ఎక్కువ చదివిన వాడివి వాళ్లు స్టూల శరీరానికి ఇంత పడేస్తామంటారు నీవో నీవు సూక్ష్మ శరీరానికి ఎంతెంతో మేత వేస్తూ వుంటావు నిన్ను తల్చుకుంటుంటేనే ఆనందమన్నా తిరుపతి స్వామి దర్శనానికి సంతానంతో, మందీ మార్చలంతో వెళ్లావు ఆదర్శంగా ఉండాలని టిక్కెట్లు కొన్నావు, మూడే అనుకో
ముక్కోటి దేవతలకు అన్న ఆ తిరుపతి స్వామి
నీవు రెండు ముక్కోటి ఆంధ్రులకు అన్నవు ఆయన కంటే మిన్నవు అయినా కొనుక్కున్నావు టికెట్టు అదనంగా గూడా రెండు కొన్నావు అంత డబ్బు మాత్రము నీకెక్కడిదన్నా,
ఏ మున్నది నీ దగ్గర
అర! విభూతికి టిక్కెట్లు దొరకు తున్నాయన్నమాట
ఆదర్శాన్ని ఆచరించడంలో మేటివన్నా
టిక్కెట్టుతో క్యూలోనే నిలబడ్డావు
నా అజ్ఞానం గానీ
నీముంధు క్యూ ఎందుకుంటుందన్నా
వం డా. అంతటి నరసింహం నీటుగా నడచి వెళ్లావు గానీ నీ వెనుక వచ్చిన నీ వాళ్లందరికీ, ఆ అరవై మందికీ టిక్కెట్లేవన్నా? ఎంతో దొంగలన్నా! నీ సార్దక అనుచరులు అంతా దొంగ దర్శనాలు ప్రత్యేక స్వేచ్చా దర్శనాలు నిజం చెప్పొద్దూ, మాకు నిజంగా అసూయ గలిగింది నీ అనుచరుల్లో తావు లేకుండా పోయిందని నీదగ్గర బూడిదన్నా ఉంది మా దగ్గర అది కూడా లేదన్నా యేదీ లేని మేము ఉద్దరి దర్శనానికి పోతే క్యూలో తోపుళ్ళాడి తోపుళ్ళాడి దర్శన స్టలం సమీపిస్తే నామాల కళ్లు వీదరింపుగా చూచి మా నెత్తిన చిప్ప బోర్లించి కసరు కొని తరుము తారన్నా అద్నష్టమంటే నీదేనన్నా అదేమో దేవుడు నీబోటి వాడు గాదు' అందర్నీ ఒకటిగా చూడడు నిన్ను చూచిన కంటితో నీ తమ్ముళ్లనూ, నీ వెల్లెళనూ చూడడన్నా
ప్రజాస్వామి తం నీకు వామ పక్షాలంటే మంటన్నా ఒకనాడు వాళ్లు ప్రజల మనుషులు ఈనాడు ఆ ప్రజల్ను వదిలేశారు ఆ బీదల్ని వదిలేశారు ఎందుకంటే ఆ ఫక్షాల్లో బీదకులాల వాళ్లు లేరు అందుకు నిండా సంతోషం బీదల సేవ జీవితాంతం వరకూ చేస్తానన్నావు ఎంత ఆనందం కలిగిందను కున్నావ్? ఎందుకంటే నీవు జీవించి వున్నంత కాలం ఆ బీదలుండాలని, బీదలు లేకపోతే నీవు ఎవర్నుద్దరిస్తావ్ అందుకే, నీ సేవ అందు కోడం కోసం బీదరికం దిర్దాయుష్షుగా వుండాలి నీవు నూరేళ్లు జీవించాలన్నా నీ సేవలతో మాకు నూరేళ్లు నిండుతాయి. నీ వందంగా వుంటావన్నా నీ ముక్కే మూడు కోట్లు చేస్తుంది మున్నూరు కోట్లీశ్వరుడివి దేవేంద్రుడి వేషం వేసినా దేవదేవుడి వేషం వేసినా రాముడి వేషం వేసినా రావణాసురుడి వేషం వేసినా ఏ వేషం వేస్తే యేమన్నా అంత అందంగా వుంటావు
తే డా. అంతటి నరసింహం ఆ దేవుడే అనిపిస్తావు అందర మనసులూ దోచుకున్నావు పై పై అందాల్ని చూసి అందల మెక్కించే అతి తెలివి ఆం(ధ్రులకూ, అరవలకే వుంది ఇంత ముఖ్యమంత్రి పదవిలో గూడా వేషమే అనుకుంటున్నారు అమాయకులు ఆనాడు నాయకుల వేషాల్లో మహోపన్యాసాలు చేసావు ప్రతిపక్ష వేషోపన్యాసాల్గ్లొో ఊదర కొట్టావు తమాషా ఏమిటంటే నీవు ముఖ్యమంత్రి అనే విషయం మరచి లోగడలాగే హావ భావోపన్యాసాలు దంచుతూ వుంటావు అప్పోజిషన్ లీడర్ లాగా హుంకరిస్తావు అయ్యో అయ్యో, నా తమ్ముళ్లారా! మీ కడుపులు కాలు తున్నాయి మిమ్మల్ని దుర్మార్గులు దోచుకుంటున్నారు అంటూ నీ పొట్ట పట్టుకుని ఉద్రేకంగా ఉపన్యసిస్తూ ఉంటే ఆ బీదలే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు ఆ ఫ్రితి చూస్తే నాకు జాలి వేస్తుందన్నా ఎందుకంటావా! అప్పోజిషన్ లీడర్ ఉపన్యాసాలు ఫలించనట్టే నీ ఉపన్యాసాలూ ఫలించవు గాబట్టి అందుకే అందరికీ జాలి! (స్వర్గీయ ]1.].. కు సగౌరవ వందనాలతో)
45 ఐవెవేద్వం దేశభక్తులొస్తున్నారు ప్రజాసేవకులొస్తున్నారు పారా హుషార్ హారతులు పట్టండమ్మా మనకోసం వాళ్లు చేస్తున్న త్యాగాలు మనకోసం మనం గూడా చేసుకోం ఆత్మహనన పాపానికి గూడా సిద్ధపడి మారణాయుధాలూ బాంబులూ .... మన క్షేమం కోసం ప్రయోగిస్తూ బ్రదికి బయటపడి మనసేవకోసం పడి చస్తున్నారు దారివ్వండి బాబూ హారతులు పట్టండమ్మా ఎంత ప్రజా భక్తి ఎంత సేవాసక్తి వాళ్ల ప్రజా భక్తి శ్రద్దలకు ఎవళ్లో పోటీ పడుతున్నారని వాళ్లను కసిగా కత్తులతో పొడిచి గొడ్డళ్లతో నరికి, ఈటెలతో క్రుమ్మి రక్త సిక హస్తాలతోనే మనైంకర్యం కోసం వస్తున్నారు దండలు వెయ్యండి బాబూ హారతులు పట్టండమ్మా
46 డా. అంతటి నరసింహం సన్న నోట్ల పలుచని హారాలు మనమెడల్లో వేసి నోళ్లకు సారా నీళ్లూ, కాళ్లముందు నీరా వారబోసి కోళ్ల పుంజుల తలకాయలు తుంచి మనకు దిప్టితీసి దోసిళ్లాగ్గి వోట్లనోట్లు అడుక్కొని జైత్ర రధాలను మన వాళ్లచేతనే లాగించుకుంటూ వూరేగి వస్తున్నారు జయ జయధ్వానాలతో హారాలు వెయ్యండి బాబూ హారతులు పట్టండమ్మా వాళ్ల మొగాలు చూడండి బాబూ మనందరి ముఖ ప్రకాశాన్నితోడేసుకొని వాళ్ల మొగాలనిండా పులుంకొని గద్దె లెక్కుతున్నారు మహా థీవిగా జైకొట్టండి బాబూ! హారతులు పట్టండమ్మా చూస్తున్నారేమమ్మా మంగళం పాడి దిష్టితీయండమ్మా ఈ కణం వరకూ వాళ్లకు మనం దేవుళ్లం మనకునై వేద్యం గిల్లీ పెట్టి మిగిలిన నైవేద్యంతోపాటు దేవుళ్లను గూడా మింగేస్తారు ఆలా చూస్తారేం బాబూ! ఈ నైవేద్యం చాలదా దీంతో సరిపెట్టుకోండి బాబూ! మిగిలింది నీళ్లు తాగినింపుకోండి ఇక అయిదేళ్లవరకూ మనకింతే నైవేద్యం
త్త చెయ్యి రావడం లేదు
ఏం రాయను తమ్ముడూ ఏం రాస్తే యేమో అన్న అనుమానం యేమీ రాయకపోతే యెలాగో అన్న దిగులు రాత్రంతా మేలుకొనే ఆలోచిస్తున్నాను
దోపిడీ దొంగల గురించి రాద్దా మని పించింది
వాళ్లు కావించే క్రూర హింసల చూవీ -
వాళ్ల హింసకు గురి అయిన
నిస్సవాయుల ఆక్రందనాలు వినీ -
కలంకత్తిని రుళిపీస్తూ చెయ్యెత్తాను వాళ్లు ఆదోపిడీ దొంగలు - అక్రమ చేష్టల రక్షక భట మిత్రుల చూపింవీ - అనునిత్యమూ ్రజల రక్తాన్ని పీలుస్తున్న ప్రజాపరిపాలక జలూక జాతుల వేలెత్తి చూపీంవీ - ఏమంటావ్ అని గద్దించినపుడు బడా దోపిడీ గాళ్ల చూపించినపుడు అవాక్కునై పోతున్నాను నక్సలైట్ల ఆకలిని చూచీ వారి రక్త దాహాన్ని చూలీ విచక్షణారహిత హింసాకృత్యాల చూవీ
48 డా. అంతటి నరసింహం
వారి ఆత్మ హనన సాహసాన్ని చూవీ -
కరుణా భరిత మనోవ్యధా సహిత కోపంతో
కలంకత్తి నెత్తాను
వాళ్లు -
ఆ నక్సలైట్లు -
నిత్య పీడిత దరిద్రుల చూపించీ
అందర్నీ దగా చేసి
దోచుకొని దాచుకుంటున్న భటాచోరుల చూపించీ వాళ్లకు అండగా వుండే ప్రజా ప్రతినిధి బ్రువులనూ నిష్కియాపర ప్రభుత్వాధికార్గనూ చూపించీ రెచ్చగొట్టే మోసపుయెన్ కౌంటర్లలో పొట్ట కూటికోసం ఉద్యోగానికి వచ్చిన ఒక బీదపోలీసు శవాన్నీ బంగారు భవిష్యత్తుగల పదిమంది నక్సలైట్ యువ శవాలనూ, చిత్రించిన పేషర్ల ఫోటోలనూ చూపించి తర్జనిస్తూ దీనికే మంటావ్ అని గర్జించినపుడు అవాక్కునై పోతున్నాను నివ్వెర పోతున్నాను
పబ్బం గడుపుకొనే వంచనతో
దొంగ వాగ్దానోపన్యాసాలతో
బెల్లించీ, బెదిరించీ
దొంగ వోట్లన్నీ దండుకొని
గద్దె లెక్కి
ప్రజా సంక్షేమాన్నీ సామ్యవాదాన్నీ
చెయ్యి రావడం లేదు తం గాలికీ నీటికీ వదిలేసి కొసనాలుకతో కరుణోపన్యాసాలకుమ్మరిస్తూ తాము చేసిన చట్టాలను తామే ఉల్లంఘిస్తూ చూవీ చూడనట్లు వూరుకొనే పయోముఖ విషకుంభాలపై కలం సంధించాను వాళ్లు - ఆ ధనబలం కులబలం గల అహంకారులు - ఆ ప్రజా ప్రభుత్వ ప్రతినిధులు - కుబుద్దితో కుతర్కంతో - అదంతా గత ప్రభుత్వాల క్రియా శూన్య పరత్వమే అంటూ తాము చేసీన ఐదు శాతం పనిని నూటాయిరవై శాతంగా నిరూపిస్తూ ఆ గారడీ మాటల మేధావులు ఆ పరాన్న భుక్కులు వాగ్దానాల పునాది రాళ్ల సాక్ష్యంగా తమ పోషిత రౌడీ గూండాల సాక్ష్యంగా సమర్ధంగా సతార్కికంగా యేమాంటారంటే మీరంటున్న యీ సామాన్య ప్రజానీకం గూడా తోడు దొంగలే అని నిరూపించినపుడు నోరెత్తలేక పోయాను ఇంకేమని రాయను తమ్ముడూ విసిగి వేసారి పోయిన నేను ఇంకేమి రాయను తమ్ముడూ
50 డా. అంతటి నరసింహం
అడుగు బయట పెడితే కనిపించే దృశ్వమూ
నిరాసక్తంగా వున్నా వినిపించే ప్రతివాక్యమూ
అత్యాచారాల సాక్షిగా
'సురాపాన భాండాగారాల సాక్షిగా
కులమత ఉగ్రవాద మూర్ధ ప్రచారాల సాక్షిగా -
నిస్సహాయ బలహీన మహిళల మానభంగాల సాక్షిగా - క్షణం క్షణం పైకి పెరుగుతున్న ధరల చూస్తూ చూస్తూ శూన్య భవిష్యత్ సుఖ జీవితాల కలలకంటూ . కనీసావసరాల వస్తువుల గూడా కొనలేని దుస్టితిలో వున్న నిర్వేద భరిత నిర్భాగ్యుల సాక్షిగా
నా గుండెలు మండిపోయి
దహన జ్వాలలు కళ్లల్లో చిమ్మిరేగగా
రక్తం పొంగి నరాలు బిగిసి
విసురుగా కలం ఈటెతో ఒక దెబ్బ వేశాను ఠపీమన్న శబ్దంతో కళ్లు తెరివి చూశాను ఇది కలా - నిజమా
పైదంతా కలేనా?
కలంకొసను అంటుకొని వున్న దిన పత్రిక నిండా
వోడుతున్న పచ్చి రక్తం చారికలు మాత్రం
నిజం'॥!।
51 చక్కు స్వ్వప్పుం
మొన్న అంబేడ్కర్ జయంతి సభ అధ్యక్ష స్టానం నుండి ఒక పొలికేక అక్కడెక్కడో కర్టాటక ప్రాంతంలో కులాహంకార బధిరాంధక కీచకులు మానవతా విహీన సవర్డులు మలభక్షణ చేయించారు - హరిజనుడిక్షి - అని విన్నాను నిన్ననే మయింది! మాషప్రక్క వూరి సవర్ణ భూస్వాములు తెగబలిసిన పరాన్న భుక్కులు కసితో యెవరిమలాన్నో బల వంతంగా భక్షింపించారు - హరిజనుడొ కడికి ప్రాణభయంతో - మానాన్ని గూడా దిగజార్చి కన్నీటి జలంతో పాటు మలాన్ని మింగుతున్నాడు పాపం!
దయా విహీన కర్కాటకుల
దానవ దౌష్ట్యాన్ని చూస్తూ
దయాపర బలహీనులు
సాను భూతితో అశ్రువులు రాలుస్తూ నిలబడ్డారు హరిజన గిరిజన కూలీల నమమ. మలమూత్ర స్వేద లాలా జల దూషికా దూషిళాలైన్సగసంద రము 'టైందాల్లై భూసార ఫలాల నో రారా/ భక్షిస్తున్న ఆసవర్డులు | గేట్. తమ అులమే సమాజంగా - గ్రామమే విశ్వంగా (( న. ) భావెందె. అ అజ్బాన సవర్డులు మాం సవర్ణ నపుంసక ప్రభుత్వ భయం ఆవంతాలేని.సవర్గులు “మో
52 డా. అంతటి నరసింహం పళ్లు కొరుకుతూ అతని వైపే అహంకార క్రూరంగా చూస్తున్నారు హఠాత్సంఘటన పరుల మలం బలాత్కారంగా, గొంతు దిగకుండానే అసహ్యంగా వాంతి ఎగదన్ను కొచ్చింది పేగుల్లోంచి, దాంతో పాటు అభిమానమూ, క్రోధమూ ఎగదన్ను కొచ్చాయేమో ఇప్పటికి, ఆ హరిజనుడు మెరుపు మెరిసినట్టుగా హఠాత్తుగా ఎగిరి ఎదటివారి చేతుల్లోని కత్తిని చటుక్కున లాక్కుని ఒక్కక్షణంలో వాళ్ల నలుగురి పొట్టలపైనా బలంగా వేసి పరపరా చీల్చాడు కసుక్కుమని వాళ్ల పేగులన్నీ తెగి పొట్టల్లో నుండి రుధిరమలమూత్రాలు భళ్లున వారి పాదాలపైన్నే పడ్డాయి వాళ్ల శరీరాలు తూలి హరిజనుడి పాదాలపై పడ్డాయి హాహాకారాలు చేస్తూ కొందరు అతన్ని చుట్టుకున్నారు ఆశ్చర్యం! అతని అభిమాన పేగులూ తెగి అతని కాళ్ల పైన్నే పడ్డాయి అతని శరీరం తూలి ఆశవాల పైన పడ్డది ఇది కలా అవును కాదు అయితే పై సగం మాత్రమే కల
53 సం[ాంతి నేపథ్యం కవులు వట్టి అల్ప సంతోషులు కాసింత పూల హారానికే కావళ్లు కావళ్లుగా కవితా రసం కుమ్మరిస్తారు ఉగాది అన్నారనుకొండి వెంటనే కోయిలలై పోతారు కుహు కుహూ నాదాలు వినిపిస్తారు గాలి స్తంభించి ఉక్క పోస్తున్నా! మలయ పవనాలు వీస్తున్నట్టే సోలిపోతారు నగర నీటి సరఫరా సమ్మెచేసినా చెమటకంపే మలయజ గంధ వాసన ల్లాగా పీలుస్తూ సాక్కి పోతారు మామిడి చిగురాకులను మన్మధ బాకుల్లాగా మనకళ్లల్లో పొడుస్తారు చంద్ర దర్శనం అరుంధతీ దర్శనమే అయినా వసంత వేళా జ్యోత్స్నా స్నానానంద క్రీడా పరవశ మదవతుల వీడియోతో మీకు శ్రవణ నేత్రానందం కలిగిస్తారు
రడ డా. అంతటి నరసింహం ఇక సంక్రాంతి అన్నారనుకోండి క్రాంతి లేకపోయినా సర్వక్రాంత దర్శనం చేయిస్తారు తాము ఏనాడూ చూడని గంగిరెద్దుల నాట్యం మీకు కళ్లకు కట్టిస్తారు ముగ్గులూ గొబ్బెమ్మలూ కేవలం వినికిడి పదాలే అయినా మీ కళ్లకు కట్టేలా విక్రాంతంగా వర్ణిస్తారు హరిదాసు ఎలా వుంటాడో తెలియక పోయినా హరిదాసు పాట భూపాల రాగంలో మీ వెవులపై మొత్తుతారు నేను అలాటి కవినే గాను నేనీనాడు సంక్రాంతి పాట పాడలేను నాకు క్రాంతి కనిపించడం లేదు చుట్టూరా విభ్రాంతికర దృశ్యాలే కనిపిస్తున్నాయి భయ భభ్రాంతుల పీడ్రలే పీడకలలే కనిపిస్తున్నాయి జీవితం పై పైమెరుగులు కాదు దర్శించాల్సింది! జీవన నేపధ్యంలోకి చూడాలి ఎవడీిది ఏకులమో ఏమతమో ఎవడి నొసటిపైనా రాయలేదు ఎవడి వీపు పైనా ముద్రించలేదు
సంక్రాంతి నేపధ్యం 5్5్ ఫలానా అని తెలిసిన వాడే తెలిసిన వాణ్ణి బాకులతో కుమ్ముతున్నాడు శరీర కష్టం దొంగ మరిగిన మన పెద్దలు పరాన్న భుక్కులైన సోమరులు మన పూర్వులు సృష్టించిన సోమరి ప్రార్ధనలతో కట్టుబాట్లతో, చీలికలతో మేము వేరు మీరు వేరు అని అనుకుంటున్న కులమత మూఢులో మూర్చులో చేసుకుంటున్న పరస్పర హననాలే కనిపిస్తున్నాయినాకు నేను సంక్రాంతి పాటను పాడలేను కూలీనాలీ జనాలు శమ సారమంతా సారాకు పోసి సంసారాన్ని నిస్సారం చేస్తే వారి కామ సారఫలాలైన పిల్లలు అన్న వస్త్రాలకు నోచుకోక - అక్షరాలకు నోచుకోక యే సుఖాలకూ నోచుకోక - కలిగిన వారికి పని షిల్లలుగా సుఖదాతలుగా - వారింటి టీవీల్లో మాత్రం నోరూరించే తినుబండారాల ప్రకటనల చూస్తూ లొట్టలు వేస్తూ వాటి కోసం కలలు కనే
56 డా. అంతటి నరసింహం దౌర్భాగ్య నేత్రాల యెండ మావులే కనిపిస్తున్నాయి నాకు నేను ఎలా సంక్రాంతి పాటను పాడను?
శరీర కష్టం చెయ్యకుండా దూరంగా ఎక్కడో కూర్చుని అల్ప వేతనుల అధిక శ్రమతో సృష్టించిన ఉత్పత్తులపై అధిక లాభ దృష్టితో ధరల పెంచి ఉత్పత్తి కారక శ్రమజీవులకే అందకుండా చీకట్లో దాచుకున్న లంచగొండి, దోపిడీ వర్గాల చోరులను చూస్తూ - వారిని కాపాడే అ్రజా ప్రతినిధి దోషుల చూస్తూ కాందిశీక దృష్టితో వున్న నేను సంక్రాంతి పాట ఎలా పాడను! ఒకటి గాదు - వందగాదు - సవాలక్ష సమస్యల దండయాత్రలకు ఉక్కిరిబిక్కిరై - నిర్విర్యులై - షండులై - కాతర దృష్టితో - లేని దేవుణ్ణి దేబెరిస్తూన్న మూఢ మూర్ధ జనాన్ని చూస్తూ ఏమని సంక్రాంతి పాటపాడను!!
తల్లి చేలో మేస్తే 57 ఉల్లి చేలశ మస్తే ఆఫీసర్లూ పెద్దలు అనునిత్యం తాగుతుంటె తల్టులేమి అనకుండా అల్లా చూస్తూ వుంటే షిల్లలు తాగుడు మరగక ఎల్గ్లాగా ఊరుకుంద్రు తల్లే చేలో మేస్తే దూడ మేయునా గట్టున ? ఎక్రాజు డిపార్టుమెంటు ఎల్లరునూ తాగుతుంటె కేసు పెట్టు పోలీసులు కూడా తాగేస్తుంటే తాగుబోతులైన ప్రజలు తాగకుండ ఎట్టుందురు? టీచర్లూ కాలేజీ - టీచర్లూ పబ్లిగ్గా తొగుతుంటె చూస్తూ విద్యార్ధులూరకుంటారా ఆఫీసుల్లోనె పెద్ద ఆఫీసరు తాగుతుంటే గుమాస్తాలు, ప్యూన్లు తాగకుండా వుండుట యెట్లా సంఘ సంస్కరణకు గానీ - సంక్షేమానికి గానీ తల్లిగాను భార్యగాను - (స్త్రీయే మూలం కేంద్రం అటు భర్తకు ఇటు పుత్రుని తాగకుండా చూస్తే - స్త్రీ! నశిస్తుంది తాగుడు ఇది అందాకా సమసి పోదు .
658 డా. అంతటి నరసింహం ముథా([ళా) వులు
ఎంతదొంగలు బాబూ! ఈ చదువు కున్నవాళ్లు!!
ఎంత మోసగాళ్లండీ |! ఈ చదువు కున్న వాళ్లు ॥
ఆనాడూ యీనాడూ గూడా
చదువుకున్న వాళ్ల వల్లే సమాజానికి మోసం ఎంత నయవంచకులు ఈ మేథావులు | కులం లేదంటూనే వుంటారు దూరాన్ని పెంచుతూనే వుంటారు
ఇక, ఈ మతాధికృార్గంటావా!
మత భేదాలు లేవంటూనే వుంటారు
అన్నిటి గమ్యము ఒకటే అంటారు
ఎవరి కుంపటి వాళ్లు ప్రజ్వరిల్ల జేస్తూ
నిత్యాగ్నీ హోమాన్ని మండిస్తూనే వుంటారు నోరు లేని మానవులేమో శలభాలై పోతూనేవుంటారు వారు మాత్రం కెటాలిస్టులు లాగా అవ్యయంగా ఉండి పోతారు ఎంత దుర్మార్గులు బాబూ! ఈ స్వార్ద రాజకీయ కీచకులు
సాధ్వీ స్వాతంత్ర్య భారత ద్రౌపదిని
కులమత ప్రగ్రహాలతో బంధించి
చితిని రగిలించి సతిని చేయాలని-చూస్తున్నారు
మేధా(తా్రావులు 59 కవి గాండీవుల్లారా! శ్రామిక భీమసేనుల్లారా! లేవండి కదలండి, విజృంభించండి సవ్వసాచులై గదాధారులై కిరాత కీచకుల బంధించండి దుశ్చ్శాసకులను నిరస్తం గావించండి కుల మతాల సింహాసనాలను కదిలించి సామ్యవాద సమవేదికను సిద్ధం చెయ్యండి . కుల సమాజం ఒక పీతల బుట్ట మతాల సమాజం ఆకర్షణ చచ్చీ చావని అయస్కాంత పేటిక
60 డా. అంతటి నరసింహం చచ్చేదాకా దల[ద్రసేవ ప్రజల యొక్క దారిద్ర్యం బాపాలని నాయకమణి పోటీపడి ప్రమాణాలు ఇల్లాగా చేస్తున్నడు ఆదివాసుల సంస్కృతిని పదిలం చేస్తాడంట వాళ్లు నాగరికులైతే ఎల్లా సంస్కృతి రక్షణ? పల్లెల్లో అందరికీ యిళ్లను నిర్మిస్తాడట మేడల కాంట్రాక్ట్షరుచే గుడిసెల నిర్మిస్తాడుట పల్లెల్లో పేదరికం అల్లాగే ఉండాలి లేకపోతె ప్రజాసేవ ఇక నెవరికి చెయ్యాలి “బౌొందిలోన ప్రాణముండునందాక దరిద్ర సేవి” అది ఎంతటి దరిద్రమో తుది దాకా తొలగి పోదు అందాకా శ్రీవారికి బొంది భద్రముగా నుండు
61 తయుతచుతణతి ““మూ*' అంటే మావాడు ““వూ” అంటే మరొకడు గూడా ఇద్దర్నీ కలిపి ““మామా”” లన్నాడు బో యి భీమన్న ఆయనకేమయిందోగాని అందర్నీ కలిపెయ్యాలన్న పేరాశ గలిగింది “మా లోనే యెన్నో భేదాలున్నాయి ఆ 'మాలో గూడా అన్నే భేదాలు వీళ్లల్లో వీళ్లు ఒకరి కొకరికి అంటరాని వారు అంటరాని వారంటే అంటరాని వారని మాత్రమే గాదు - ఒకరు తాకిన నీళ్లు మరొకరు ముట్టరు అని ఒక ““మా”” ముంచుకొన్న పారే నీళ్ల రేవులో సైతం మరొక '*'“మా ముంచుకోడు మరొక రేవు సృష్టించుకుంటాడు ఇదిరా అంటరాని తనం అంటే! మీరు మమ్ముల్ని ముట్టుకోరు మీలో మీకు అంటులేదు కాని **'మామాలు స్వయం పవిత్రులు ఒకరి అన్నం మరొకరు తినరు
60 డా. అంతటి నరసింహం చచ్చేదాకా దల(ద్రస్వ ప్రజల యొక్క దారిద్ర్యం బాపాలని నాయకమణి పోటీపడి ప్రమాణాలు ఇల్లాగా చేస్తున్నడు ఆదివాసుల సంస్కృతిని పదిలం చేస్తాడంట వాళ్లు నాగరికులైతే ఎల్లా సంస్కృతి రక్షణ? పల్లెల్లో అందరికీ యిళ్లను నిర్మిస్తాడట మేడల కాంట్రాక్టరుచే గుడిసెల నిర్మిస్తాడుట పల్లెల్లో పేదరికం అల్లాగే ఉండాలి లేకపోతె ప్రజాసేవ ఇక నెవరికి చెయ్యాలి ““జొంద్రిలోన ప్రాణముండునందాక దరిద్ర సేవి” అది ఎంతటి దరిద్రమో తుది దాకా తొలగి పోదు అందాకా శ్రీవారికి బొంది భద్రముగా నుండు
61 చయయుతయుంలు ““మవూ” అంటే మావాడు “మూ” అంటే మరొకడు గూడా ఇద్దర్నీ కలిపి ““మామా”* లన్నాడు బోయి భీమన్న ఆయనకేమయిందోగాని అందర్ని కలిపెయ్యాలన్న "పేరాశ గలిగింది “మా లోనే యెన్నో భేదాలున్నాయి ఆ *'మా”లో గూడా అన్నే భేదాలు వీళ్లల్లో వీళ్లు ఒకరి కొకరికి అంటరాని వారు అంటరాని వారంటే అంటరాని వారని మాత్రమే గాదు - ఒకరు తాకిన నీళ్లు మరొకరు ముట్టరు అని ఒక ““మా” ముంచుకొన్న పారే నీళ్ల రేవులో సైతం మరొక *మా ముంచుకోడు మరొక రేవు సృష్టించుకుంటాడు ఇదిరా అంటరాని తనం అంటే! మీరు మమ్ముల్ని ముట్టుకోరు మీలో మీకు అంటులేదు కాని “మామూలు స్వయం పవిత్రులు ఒకరి అన్నం మరొకరు తినరు
62 డా. అంతటి నరసింహం నీళ్ళుగూడా అంట రంటిని గదా ఇది అంటరాని తనం అంటే! అందరూ ఒకటి కావాలన్నాను నేను నువ్వేమన్నావు? ముందూ “'“మామా” లను కలవనీ అన్నావు తర్వాత మేం కలిసి పోతామన్నావు ఎంత దొంగ కూతటల్రా అవి! “మామాలు మీకంటే తెలివైన వాళ్లురా? మిమ్మల్ని విడదీసిన కులమూర్చులే గదరా వీళ్లనీ విడదీసింది!! కులవ్యవస్థ పోతేగాని కలొసే మాటేలేదు హిందువులంతా మామాలళే ఇతర మతాలూ మామాలే! వీటికంతా ఆధారం దేవుడు దేవుణ్ణి అంటరాని వాణ్ణో చేస్తే!
63 జణంది ఖంధభం దీన్ని నిద్రంటామా! ఏమో అదొక మత్తు నేను ఏ ఆకాశపు టెత్తుల్లో వున్నానో ఏ పాతాళలోతుల్లో వున్నానో అంతా వ్యక్తావ్యక్త స్టితి అప్పుడు నేను ఒంటరిగాలేను నా ప్రక్కన ముఖాముఖిగా అందాల బొమ్మ ఉబ్బిన సన్నని రబ్బరు బొమ్మ - పరస్పరం చూచుకుంటూ ఎంతకాలమో (ప్రేమబంధాల్లో వుండి పోయాం ద్వంద్వాతీతంగా నిర్భయంగా వుండి పోయాం అదేం దురదృష్టమో ఏ అన్యాయపు విధియో ఉన్నట్టుండి మేం విడదీయబడ్డాం విసిరి వేయబడ్డాం మావశంలో లేని
64 డా. అంతటి నరసింహం ఎడబాటులో పడ్డాం ఆమెదొక కులం అయిపోయింది నాదొక మతం అయిపోయింది ఇదొక వింత జీవితం ఎవరెవరం ఎక్కడెక్కడున్నామో తెలియకుండానే కాల ప్రవాహంలో కొట్టుకు పోతున్నాం ఎంత విచిత్రం ఎంత అదృష్టం ఆ కస్మికంగా ఒక జన ప్రవాహంలో ఆ అమ్మాయి కనిపించింది అందంగా ఆనందంగా మిత్రులతో సల్లాపంగా గబగబా వెళ్తున్నది నాకు ఆనందం పట్టలేదు గంతులేస్తున్న హృదయంతో గబగబా దగ్గరొకెళ్లాను ఆత్రంగా ఆత్మీయంగా చేయిపట్టుకొన్నాను గతంలో ఎన్నెన్నో యుగాల క్రితం మేమిద్దరమూ విడదీయరాని జంటగా వుండిన దినాలు జ్ఞాపకం చేశాను
అనాది బంధం 65 ఆనందంతో ఆమె కళ్లు వెన్నెలలు కురిశాయి దివ్య (ప్రేమ చంద్రికలు పరుచుకున్నాయి ఒక్కసారిగా ఆ(్రేమ బంధాను బంధ అమర (ప్రేమ లోకంలోకి ఇద్దరి ఆత్మలూ ఎగిరాయి ఆమెలోని ప్రతి అణువూ నాదే నాదివ్య (ప్రేమ జీవితానికి ఆమె వొక వరప్రసాదిని ఆమెలోని ప్రతి అణువూ నేనే కణక్షణం మాకలయిక అమరమైనదే! అయ్యో! సమాజ రక్షకుల మనే రాక్షసులు మా్రేమైక జీవితాన్ని హర్షించలేని దయా విహీనులు ఇక చక్కబడలేని నికృష్ట సామాజికులు మమ్మల్ని విడదీశారు మళ్లా విడదీశారు మాకులమతాలు వేరనీ మాకట్టుబాట్లు వేరనీ నిర్భయగా విడదీశారు మేము పుట్టకుండా వుంటే యెంత బాగుండేది
66 డా. అంతటి నరసింహం జీవితం భీ! అనిపించింది ఏమిటిది? హృదయం లేని యీ మరమనుషుల్లో కీలుబొమ్మల్లా జీవించడం భీ భీ! ఎంత కృపణత్వం! ఈ సమాజం ధ్వంసం కావాలి కులమత విద్వేషాలతో మండి పోతున్న యీ సమాజం విధ్వంసం కావాలి మరొక ప్రళయం ముంచుకు రావాలి ఈ నికృష్ట సృష్టిఅంతా ధ్వంసం కావాలి ఒకటీ రెండూ, నో మూడవ అణుయుద్ధం రానీ మరి రెండు అణుయుద్దాలు రానీ ఈ నికృష్ట మానవ సమాజం మండిపోనీ. భస్మమైపోనీ అప్పుడు మేమిద్దరమూ ఆదాం అవ్వగా పునర్జన్మ పొందుతాం కొత్త సృష్టిని కులమతాలు లేని సమాజ సృష్టిని ఎలాంటిదోపిడీలకూ తావులేని సమ సమాజ సృష్టిని క.
పులి స్వామ్యం 67 వుతి న్వామ్వం అబ్బో ఎంతెంత మేడ లమ్మో ఎన్నెన్ని కార్లు! ఆ మేడల చుట్టూరా అన్ని గుడిసె లేటి బాబు? ధన స్వామ్య కుల స్వామ్య ఫలితం అది బాబు! ప్రజల కొరకు పులులు చేయు ప్రజా రాజ్య ఫలం బాబు! ఆకిల్లు (నల్ల) మార్కెట్టు తెల్ల దొరల పాలనలో తెల్ల మార్కెట్టు నల్ల దొరల పాలనలో నల్ల మార్కెట్టు తెలుపు నలుపు చేయగలడు ప్రతినాయకుడు నలుపు తెలుపు చేయలేడు దేవుడు గూడ
68 డా. అంతటి నరసింహం చతు చెలి గట్టిగా పళ్లు కరచుకొని ఇంకా గట్టిగా కా గిలించుకొని హేమంత చలి చెలిని గట్టి గట్టిగా అదుం కొన్నాడు వీధిలో బిచ్చగాడు - పిచ్చివాడు. వాడి సర్వాంగాలూ స్పృశిస్తూ శరీరాన్నంతా ఒత్తి తడుముతూ విద్యుత్తులాగ చలివెలి లోలోపలికి చొచ్చుకొని పోతున్నది తీయకుండా చలిచెలి కురిసి కురిసీ వాణ్ణీంగా ముడుచుకొని పోయేలా లొంగ దిసింది వాడు తడిసి తడసీ చలి ముద్దగా బిగుసుకు పోయాడు - పోయాడు చలిచెలి వదిలివేసి పారిపోయింది
69 చచ్చినం తిరణు దామాం
చచ్చినా గూడా యీ నరుడికి
భూమిపై ఆశ చావడంలేదు
చచ్చి భూమిలోకి పాతుక పోతున్నాడు
భద్రంగా గోరిగూడా కట్టించు కుంటున్నాడు
ఇభివ్పభ్ధి
"వీనాడో పుట్టాయి యీ గుడిసెలు
బలుపెరుగని వీకులు
వాసీలో తరుగుదల
రాశిలో పెరుగుదల
70 డా. అంతటి నరసింహం అాఠి కణ్నిరయిన వేళ (నెల్లూరు ఒంగోలు జిల్లాల అబలలు బలోపేతులై సారా వేలం ఆపిన వేళ) ఆనాడు వ్యష్టిని - చేషమూత్రం క్రూరం ఈనాడు వ్యవస్టను - అయినా చేష్ట క్రూరమే మానవుడు జంతుజీవిగా ఉన్న రోజుల్లో నేను స్వతం శ్రుణ్ణి ఆ మానవుడు నాకరికుడై స్వార్ధ గర్భిత పరార్ద వేషుడై నటిస్తున్న ఈరోజుల్లో వ్యవఫ్రకృత అస్వతం క్రుణ్ణి (ప్రేరణ యెక్కడిదైనా క్రూర ప్రయోగం నాదే చేష్టల్లొ స్వతం క్రుణ్ణే శతాబ్దాలుగా దొంగలను బాదాను దౌర్జన్యాలు ఎదిరించాను దశాబ్దాలుగా రాజకీయుల కాపాడాను అరాజక శక్తులను బాది చెరసాల్లో క్రుక్కాను నాకు పూనకం వచ్చిందటే ఎదట వున్నది యెవరన్నది లెక్కలేదు ఆడామగా బాలావృద్ధ అన్న తేడా లేదు ఛార్జంటే ఛార్జే గర్జించిన క్రూరత్వమే ఇదేమిటీ నాడు ఈ అబలల గుంపేమిటి?
లారీ కన్నీరయిన వేళ 71 ఇసుళ్లులాగా అనుస్యూత ప్రవాహంలాగా అల లలలుగా ఉవ్వెత్తుగా ముంచేస్తున్నారేమిటి? వాళ్ల ఆక్రందనాల్లో సారావేశం నా ప్రయోగంలో సారాకైపు అందరూ ఆ(క్రందిస్తూన్నారేమిటి? అందరికోసమూ ఆక్రందిస్తూన్నారేమిటి? అన్నా అన్నా కొట్టవద్దన్నా అయ్యో అయ్యో క్రుమ్మ వద్దన్నా మీకోసంం, మీ భార్యాబిడ్డల కోసం సారా పీడితుల కోసం అరిస్తున్నామన్నా బాద వద్దన్నా మా కన్నీళ్లు మీయిళ్లల్లోని కన్నీళ్లేనన్నా మీ భార్యా బిడ్డల కన్నీళ్లన్నా ఆగాను చూస్తున్నాను ఆకన్నీళ్లల్లో ఆవశీకరణ యేమిటి? అవును - ఇవి స్వార్ధకన్నీళ్లు కావు ఏమయింది నాకు ఆగిపోయానేమిటి? ఊం - ఛార్జి ఛార్జి! లేవలేక పోతున్నాను విజృంభించిన నేను నిర్దీవునై పోయానేమిటి? చల్లబడి పోయానేమిటి? నై కన్నీరై పోయానేమిటి?
72 డా. అంతటి నరసింహం కెలకెబుంటె కల మళ్లా జీతాలు పెంచారు నా సర్వీసులో ఇది నాలుగోసారి నా జీతమూ కాస్త పెరిగింది ఎంత పెరిగినా గొర్రె తోక బెత్తెడే మాకేటగిరికి పెరగేదే అంత! అసలు సమ్మెలు చేసేది మేము శిక్షలు పొందేది మేము జీతాలు పెరిగేది ఫై ఆఫీసర్లకు గోరి కాడ నక్కల్లాగా ఆవురావురంటూ ఎగజూస్తున్న వ్యాపార్డు మళ్లా ధరలు పెంచేసారు వెంటనే పనిమనిషీ మళ్లా జీతం పెంచమంది ఇంటి అద్దె గూడా 'పెంచమన్నాడు కరెంటు ఛార్జీలు పెరిగాయి నీళ్ల ధరా పెరిగింది జీతాలు పెంచినపుడంతా ఇదే తంతు ప్రతి సంవత్సరం లాగే బడ్జెటు వచ్చింది పెట్రోలు ధరలు గూడా మళ్లా "పెంచింది దాని దెబ్బకు అన్ని వస్తువుల ధరలూ మండ సాగాయి స్కూటరు కొందామన్న కోరిక ఇప్పటికి యిరవయ్యేళ్ల నుండీ - వాయిదా వేసుకొస్తున్నాను
పెరికివాడి కల 73 నా కాళ్ల సత్తువే యింధనంగా నాపాత డొక్కు సైకిలే గతి ఇరవయ్యేళ్లనుండీ అదేగతి మొదటి సారి జీతాలు పెరిగి నపుడు మా ఆవిడా పెంచిందొక ఇంక్రిమెంటు రెండోసా6 పెరిగినపుడు మరొక ఇంక్రిమెంటు ఇచ్చింది ఇదికనబడని అధిక ఖర్చు 'పెళ్లయ్యేనాడే మానాన్న గట్టిగా నొక్కి చెప్పాడు స్కూటరు కోసం అలక పాన్సు వెయ్యమని ఆదర్శం కోసం పోయి అది వదులుకొన్నాను ఇప్పటికి యిరవయ్యేళ్లయింది ఇంకిపోయింది స్కూటరు కోరిక ఈ సంవత్సరం బడ్డటులో స్కూటరు ధర పెంచలేదు ప్రతిసారీ బడ్జెటును ఇది బీదల బడ్జెటు అని అనడం మామూలు కాని అవన్నీ బీదరికం పెంచే బడ్జెట్లే ఎవరికోరికలూ తీరవు పన్ను పోటు మాత్రం తప్పదు జీవితం ఇంకా నాసికట్టు ఎపుడు జీతాలు పెంచినా మా ఆవిడ ఒక ఇంక్రీమెంటు ఎక్కించడం రివాజు
74 డా. అంతటి నరసింహం ఇపుడు మళ్లా గతవారమే పెంచింది ఇద్దరాడ షిల్లల తర్వాత మగపిల్లవాడు కావాలని ఈ మూడో ఇంక్రిమెంటు కోసం ఎగజూపు
మేమున్నది జిల్లా కేంద్రం ఏ చుట్టానికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏమి జబ్బు చేసినా మా యింటి పైకి దండయాత్రే అసలు చుట్టాలు బీదలకే యెక్కువ ఆడపిల్లల డ్రెస్సుకూ ట్యూషన్లకూ బోలెడంత ఖర్చు మా కుటుంబంలో - మా బీదకుంటుంబలో - నేనే చదువు కొన్నవాణ్ణీ ఉద్యోగం చేస్తున్నవాణ్ణి మా అన్నయ్య పిల్లలిద్దరూ గూడా నాదగ్గరే మావూరి నుండి యేనాడుగూడా దమ్మిడీ గూడా రాదు బలకర ఆహారం గావాలనీ ఆహారంలో సమతౌల్యం వుండాలనీ మా ఆవిడకు డాక్షర్ల సలహా షీల్టలకు గూడా ఆదే సలహా
పిరికివాడి కల 75 ఆహారంలో లోటు బాషధాలలో లోటు ఆదర్శాలకు మాత్రం లేదు లోటు అప్పులు చెయ్యొద్దంటుంది మా ఆవిడ బండినిలాగే యెద్దుకు తెలుస్తుంది బరువు బండిలో కూర్చున్న వాళ్లకేం తెలుస్తుంది అధిక రాబడీ లేదు అప్పులూ చెయ్యగూడదు ఇక ఆత్మ హత్యే మిగిలింది ఆమాట పైకే గొణిగాను అయ్యో అదెంత పిరికి మాటండీ అంది మా ఆవిడ నేనేమన్నా నగా నట్రా కావాలన్నానా చీని వీనాంబరాలు కావాలన్నానా బాదం పప్పూ జీడిపప్పూ అపిల్పూ కావాలన్నానా! ఉన్నవాటితోనే తృప్తిగా చేస్తున్నానా అంటుంది మా ఆవిడ ఉన్నదిమాత్రం యేమిటి ఆ ఉన్నది మాత్రం యెలా వస్తుంది అంటాను నేను ఆర్జనా చాలదు అప్పులూ చెయ్యరాదు అప్పులు చేస్తే తీర్చీమార్గమూ లేదు ఇక లంచం తీసుకోవడమే మార్గం
76 డా. అంతటి నరసింహం ఏదో రకపు దోపిడీ లేక పోతే యెలా ఆమాటపైకే అన్నాను మా ఆవిడ నవ్వింది ఈ జనమంతా యెలా బదుకుతున్నారండీ నారుపోసినవాడు నీరు పోయడా అండీ అంది
లేదు, సరస్వతీ, లేదు నివు దైవవాదాన్ని తీసుకు రాకు నారు ఎవడూ పోయలేదు అది మనం పోసుకొన్నదే నీరూ ఎవడూ పోయడు అది మనం సంపాదించుకోవాల్సిందే తొలకరి చినుకులను భూమిపైన పడనీకుండా చాతక పక్షులు పై పైన్నే భక్షించినట్లు "పెద్ద పెద్ద అధికార్లూ రాజకీయ పెద్దలూ వ్యాపార్లూ కాం ట్రాక్టర్లూ అంతా మింగేస్తున్నారు ధరలు ఎంత పెరిగినా అంతధరా పెట్టి వాళ్లు కొనేసి భోగాలు అనుభవిస్తున్నారు అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి నీతి పలచబడిపోతున్నది
పిరికివాడి కల 77 నీతి పలచబడిపోతున్నది సమాజాన్ని గూర్చి ఆలోచన లేనప్పుడు అంతా స్వార్టమే ఎవడికి దొరికింది వాడీకే నేను ఒక్కళణ్ణే మడి గట్టుకు కూచుంటే సఫరయ్యేది నేనే నాసంసారమే నా ఆదర్శం కోసం నా అర్జాంగినే బఠిగొంటున్నాను నేనున్న సీటు చాలామంచి సీటు లంచాలకు ముఖ్యమైన సీటు నేను అంచగొండినిగాను అని నన్ను ఆ సీట్లో వుంచారు ఆఫీసర్లు ఆలోచిస్తున్నాను మొన్ననే మా ఆవిడకు ఆపరేషన్ కోసం పదివేలు కావాలన్నారు డాక్టర్లు ఆలోచించాను కౌపీనం బిగింపు సడలించాను నిన్ననే పదివేల రూపాయల లంచానికి బేరం కుదిరింది గృహారోగ్యం బాగుపడుతుంది మనసును చంపవుకున్నాను రేపే ఆపనికి శ్రీకారం రాత్రి హాయిగా నిద్రపోయాను
78 డా. అంతటి నరసింహం సౌండ్ స్రీప్ తెలవారబోతూవుంది ఉదటుగా మేల్కొన్నాను వాళ్లంతా చెమటలు చొక్కా అంతా తడిసిపోయింది శరీరమంతా ముద్ద అయిపోయింది మనసు నిండా పశ్చాత్తాపం ఎదురుగా సీ ఐ డీ వాళ్లు లంచం డబ్బులు పట్టుకొని సీరియస్గా కాగితాలపై సంతకాలు పెట్టమంటున్నారు నేను పదిరి పోతున్నాను వొణికి పోతున్నాను అస్పష్టంగా యేదో గొణుగుతున్నాను బాగా మెలకు(వు వచ్చింది చుట్టూ చూశాను ఏమీ లేదు - ఏమీ జరగ లేదు నేను పెట్టిన వె(ర్రికేకలకు మా ఆవిడ ఆదరా బాదరా వచ్చింది ఏమిటి ఏమిటి అంటూ సన్నబడ్డ చేతులతో వాణుకుతున్న నా చేతులను పట్టుకొంది ఏమీ లేదు అన్నాను అంతా పీడకల పిరికి వాడికల
79 రాజ్యాఖకారం వస్తే ౧౫౫) ఎంత ఉద్రేకం! ఎంత ఆక్రోశం! పూరి శంకరాచార్య యేదో అన్నాడని!! హరిజనులు అస్పృశ్యులేననీ వారిలో ఒక్కడయినా బ్రహ్మణుడికి సాటికాడనీ మత సూత్రాల ఆధారాలతో నేనంటున్నాననీ ఇంకా యేమోమో వాగాడట అత్యంతం మండిపడిన హరిజన యువజన విద్యాధికులంతా అంబేడ్కర్ విగ్రహ పాదసన్నిధిని హరిజనుడికి తల గొరిగించి, శంకరాచార్య వేషం వేసి పాత తోలు చెప్పుల తోరణాల చప్పరంలో నిలబెట్టి నిరసన నినాదాలతో బయలుదేరారు ఊరేగింపుగా తప్పుడు కూతలు కూయలేదు వారు అంత సంస్కారవంతులు కారువారు అంతకు ముందు రోజా అదే పూరీ శంకరుడు హైదరాబాదు మహానగరంలోనే అస్పృశ్యతనూ, హరిజన అధమత్వాన్నీ సతీ సహగమనాన్నీ సమర్దించాడు
80 డా. అంతటి నరసింహం ఆనాడు బాధపడి ఉడికి పోయి వూర కుండి పోయిన ఈ హరిజనులు దొంగలు పడ్డ ఆర్నల్లకు ..... అన్నట్లు యేడీ యెక్కడ అంటూ ఆక్రోశిస్తున్నారీనాడు హరిజనుడెవడైనా బ్రహ్మడికి సమానమవుతాడా అని ఎక్కడో అన్నాడని మండుతున్నారినాడు మండకండి బాబులూ మీ మీదేగాదు ఈ దెబ్బ బ్రాహ్మణులపైన గూడా దెబ్బే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే అన్నాడులే మరి తన లాంటి పరాన్న భుక్కుకు అన్నోత్పత్తికారులు హరిజనులు సాటి అవుతారా మరి! కారు, కాకూడదు అలాఅయితే మాత్రం హఠిజనులూ పరాన్న భుక్కులుగా మాఠిపోరా ఆ హరిజన శ్రమ జీవుల మలమూత్ర స్వేద లాలా జలాల పీల్చుకొని పండిన అన్నాన్ని నైవేద్యంగా భక్షించే యీ పరాన్న భుక్కులు
రాజ్యాధికారం వస్తే గాని 81 రాతి విగ్రహాలు, రంగు బొమ్మలు దేవుళ్లుగా భ్రమ పెట్టి శ్రమ జీవులు కట్టిన దేవాలయాల్లోకే ప్రవేశం లేదంటున్నారి మేధాహీనులు వద్దు వద్దు వీళ్లకక్కర లేదా దేవుళ్లు వీళ్లే అక్కరలేని ఆ దేవుళ్లు వీళ్ల కెందుకు? హైదరాబాదులో ఒక్క సతీ సహగమనం చేస్తే మంచినీటి సమస్య పరిష్కార మవుతుందన్నాడు ఆ మానవతా మూర్తి అందరూ సతీ మాతలయితే అదే పరిష్కారం! ఈ మఠాలు, పీఠాలు యెక్కడివి యెందుకని అంటున్నారీ హరిజనులు భలే ప్రశ్న! అమాయకులారా వినండి ఇవి నాలుగు వర్జాలవి పీఠ్రాలు పురోహీతులవి పల్లకీలు పాలకులవి పల్లకీల మోతలు శూద్రులవి అందరికీ ఆహోరోత్బత్తి కర్మలు హరిజనులవి
82 డా. అంతటి నరసింహం అంటరాని తనాన్ని ప్రోత్సహించే పీఠాలను పటాపంచలు చేస్తారట యీ హరిజనులు పగల గొట్టమనండి యేం జరుగుతుందో చూడమనండి
వీళ్లేమయినా శంకరాచార్యులా
రాజ్యాంగ పాలకులు చూస్తూ కూచోడానికి
వెంటనే లాఠీలతో తలలు పగల మోది
జైళ్లల్లో తోయక పోతే ఇది ఇండియా ప్రభుత్వమే గాదు - ఒట్టు కుల ద్వేషాల రెచ్చగొట్టే శాస్రాలను
చించి తగలెయ్య మంటున్నారీ హరిజనులు ఎంత అక్కసు! ఎంత ప్రతీకారం ! అంత ఆవసరం యేమొచ్చింది బాబు వాటిని వాళ్లే చదవడం లేదు మీరూ చదవకండి, చెదలుకు వదిలెయ్యండి వాటిల్లో యేముందో చదవకుండానే
మొరిగే కుక్కల నోళ్లల్లో కర్రలు పెట్టకండి
హరిజనులారా అరిజనులారా
యింకేం చేస్తారు
రాజ్యాంగ బద్ధంగా వూరేగింపులు జరిపారు వినతి పత్రాలందించారు
రాజ్యాధికారం వస్తే గాని 83
యీ అవమానాల మ్రింగి మునుపటిలాగే నిద్రపొండి
పుండు సెలవేసి నట్టుగా
అప్పుడప్పుడూ కంచె కచర్లలూ
పదిరి కుప్పలూ, కారంచేడులూ, నీరు కొండలూ, చుండూర్ల్లూ తటస్థ పడుతూ వుంటాయి అస్పృళ్య నర మేధ యాగాలు అప్పుడు మళ్లా మేలుకోండి మళ్లా మీటింగులూ, నివ్హులు కక్కే ఉపన్యాసాలూ నివేదికలు, విజ్ఞప్తులు
ఇంతే గదూ?
ఇంకేం జేస్తారు!
ఏమీ చెయ్యలేరు
రాజ్యాధికారాన్ని లాగేసుకుంటే తప్ప.
84 డా. అంతటి నరసింహం 2౨ర్హ రాతిలో ఆడవాళ్లు అర్టరాత్రి అర్దరాత్రి గూడా ఆడది నిర్భయంగా వెళ్లి రాగలగాలి ఆదర్శం బాగానేవుంది అసలు అర్దరాత్రి పూట ఈసమాజంలో యెందుకు వెళ్ళాలి బాబూ ఆదర్శు పరీక్షకా? పరుల వస్తువును ఎవరూ ముట్టగూడదు ఇతర్లెవరూ ముట్టగూడదు అది ఆదర్శం నీతి శాస్త్రం బంగారు నగను బైటపడవేసి చూడు దాన్ని దొంగిలించకపోతే అడుగు ఫలాన్నిచ్చే వృక్షాలకు కంచె వేసి కావలి వుండకుండా వుండు రాళ్లతో పడగొట్టి అయినా ఫలాన్ని రాల్చి అనుభవంచకులిడా పోతారేమో చూడు ఆడది అనావృతగా వున్న మాతృ స్వామ్య వ్యవస్థలో సైతం పురుషుని బాలాత్కొరానికి గురిఅయిన ఘట్టాలు అనేకం
అర్ధరాదత్రిలో ఆడవాళ్లు 85 అననుకూల పరిస్థితుల్లో అబల అయిపోయింది నిజం వివాహంతో స్వకుంటుంబ బలంతో కొంత బలాన్ని పుంజుకున్నది గూడా నిజం పాతివ్రత్యం పాతివ్రత్యం అవసరం అయ్యేకొద్దీ ఆడదాని చుట్టూ కంచె బిగిసింది తాను గూడా తన్నుతానే బంధించుకొంది (స్త్రీని దురాక్రమించడం నేరం అది మహాపరాధం ఈ నేరానికిక అనేక శిక్షలు విధించారు రాజులు దుర్చలస్య బలం రాజా గదా! అయితే - ఆ నిరంకు రాజులే రాజ బంధువులే అందమైన (స్త్రీలనెల్లా దురన్యాయంగా ఆక్రమించేవారు ఇక యధారాజా తధాప్రజూ గదా! సూత్రాలంటావా చాలానే చేశారు నారీ ద్వేషి మనువుగూడా యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నాడు ఈ దేశంలో (స్త్రీలు పూజింపంబడడం లేదు ఈ దేశంలో దేవతలు ఏనాడూ నర్తించడం లేదు
686 డా. అంతటి నరసింహం ముక్కు మూసుకుని కూర్చున్న మునీంద్రులు సైతం ఒంటరిగా కనిపించిన ఆడదాని వెంట బడక మానలేదు కనీసం మనసా అయినా - అది పురుషనైజం ప్రకృతి రహస్యం
ఆచరణలేని ఆదర్శం కేవలం మృషా వచనం బూతు మానవుడా అనవసరంగా నీతులు మాట్లాడకు ఈసదాదర్శాన్ని ఆచరించే చోటు చూపమంటావా? రండి ఆదిమ కాలానికి పయనించండి అందులో నుండేగదా ఇంతవరకూ వచ్చామంటారా అయితే పదండి రష్యా వైనాలకు పదండి సామ్యవాద దేశాలకు పదండి అక్కడ అదో అక్కడ ఆడవాళ్లు అర్ధరాత్రి సైతం నిర్భయంగా తిరుగు తున్నారు చూడండి అలా ఎలా ఆయిందో చూడండి అపుడు (స్త్రీ, గౌరవాన్ని గూర్చి మాట్లాడండి
8/7 29౦౩! చిలక పలుకులు వద్దు శుష్కప్రియాలు వద్దు ఆచరణాత్మకంగా ఆలోచించు సర్వోత్పత్తులనూ సృష్టివేస్తున్న - మీ సుఖ సౌఖ్య వైభవాలకూ ఆధారభూతులైన - ఈ శ్రమ జీవులను అమాంతం అంతస్తుల కెక్కించ మనడం లేదు వారి శ్రమ భారాన్ని తగ్గించ మంటున్నాను - అంతే అన్నార్తుణ్ణి - దరిద్ర దామోదరుణ్ణి అష్టయిశ్వర్యాలలో ముంచెత్తమనడం లేదు వాడికీ కొంత పంచి కుడువ మంటున్నాను రెండు పూటలా కాస్త తిండి లభించేలా చూడమంటున్నాను నీ ఐశ్వర్యంలో కాసింత తగ్గించు కొమ్మంటున్నాను - అంతే సూర్యచంద్రేంద్ర వరుణులు నిత్యం కావలి కాసే చీకు గుడిసె వాసిని రాజప్రాసాదాల్లోకి ఎత్తమనడంలేదు అయ్యో అని మొసలి కన్నీరు కారమనడం లేదు మేడల అంతస్టులు పెంచే యోచన మానుకొని ఎండా వానా నుండి వారికి తలదాచు కోగలిగే ఆవాసాన్ని కల్పించుకొనేలా చూడమంటున్నాను - అంతే దిగంబరుణ్ణి -
668 డా. అంతటి నరసింహం అర్హ నగ్న దిగంబరుణ్ణే చీని వీనాంబర ధారుణ్జీగా చెయ్యమనడం లేదు మానరక్షాదకమైన, వస్త్రం లభించేలా చూడమంటున్నాను అంతే! ఇదిగో, పారసైట్ తమ్ముడూ, ఒక్కమాట వాళ్లంతా నాలాగా బేరమాడ్డారనుకోకు వెంటనే ఆచరణలోకి దిగు దిగవా - చూడు! ఏతత్ శ్రమజీవీ ఆ అన్నాతురుడూ ఆ గూడూ నీడాలేని దిగంబరేశ్వరుడూ హృదయం మండి మంటలెత్తి గుంపులు కట్టి కట్టలు తెంచుకొని క్రక్కదలి వస్తున్నారు అగ్గిని పుక్కిలిస్తూ, విస్ఫులింగ వృక్షాల్లాగా ఆటులులేని పోటుల్లాగా హోరెత్తి ఉరికి వస్తున్నారు నిన్ను నిలువునా.దహనం చేసేసి బూడిది బుగ్గి చెయ్యకముందే తళ్లు తెరు - కళ్లు తెరు అంతే! అంతే!!
89 కెరసనాయిలు కీ (ఖు) అలు కోడలిపై కత్తికట్టి కసితో వెళ్లిన అత్తగారు క్యూలో కిరసన్ కోసం ఎగబడి నిలబడి విసుగెత్తి పోయారు తన వంతు వచ్చి ఆనందిస్తూ వుండగానే అయిపోయిందని షాపు మూసేసి పోయారు గ్యాస్ లీకేజ్ పేరుతో భార్య అగ్నీపునీత కావాలని గ్యాస్ రబ్బరుకు రహస్యంగా గంటుపెట్టి మాటేసి కూర్చున్నాడు భర్త రోడ్డుపైన అలవాటుగా అగ్గిపుల్ల గీచిన యిల్లాలు బ్రదికి పోయింది గ్యాసునిండుకొని మండల్ వ్యతిరేకులూ అనుకూలురూ ఆత్మహత్యలు మానుకున్నారు పరస్పరం తగలెట్టు కోవాలనుకున్నారు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు చూచి నిరధికంగా వాయిదా వేసుకున్నారు హైదరాబాదు నుండి ప్రశ్నపత్రాలతో బయలు దేరిన బండిలో ఆకతాయి బంధు విద్యార్థులు పెట్రోలు చల్లి అగ్గిపుల్ల విసిరారు కట్టలేమో నీటి ముద్దల్లాగా తడిసి పోయాయి హతవిధీ! వీళ్ల గుండెల్లోనే హతాశ జ్వాలలు లేచాయి
90 డా. అంతటి నరసింహం ఆరవై ఒకకుకే చరేతాబ్దంలుకేకె సరిగ్గా అరవై సెకండ్ల క్రితం తెలుగుకాల చక్రం షష్టుబ్ది పూర్తిచేసుకొని మళ్లా మొదటి కొచ్చింది ప్రభవలో ప్రజాన్యాయం జరిగి ప్రజాస్వామ్యంలో సామ్యవాదం నిలబెడుతుందనీ ఉపకీచక వినాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు విని విని విసిగి పోయిగూడా ఏదో వూడి పడుతుందనీ - భ్రమిస్తూ కూర్చున్నాను ఎనభై యేళ్లక్రితం పంజాబు జలియన్ వాలా బాగ్లో తెల్లదొరలు పంజాబీ సింహాలను పిట్టల్లాగా కాల్చిచంపారు పంజాబీతోడేల్లీనాడు పంజాబీలనే గొ ర్రెల్లాగా చేసి గొంతులు నములు తున్నారు బంగారు భవిష్యత్తుగల విద్యాధిక నక్సలైట్లు బీభత్సంగా చంపి చచ్చిపోతున్నారు ప్రజా ప్రభుత్వ వ్యాపార్లు పన్నులు పెంచి పెట్రోలు మంటలు మండిస్తున్నారు లేనివాడికొక న్యాయం, ఉన్నవాడికొక న్యాయం
ఇరవై ఒకటో శతాబ్దంలోక్తి 91 ఇలా అయితే
ఇరవయ్యొకటో శతాబ్దంలోకి
ఎలా? ....ఎలా?
అనాది నుండీ కవులే పథః ప్రదర్శకులు
వాళ్ల రాతలే ప్రమాణాలు
నిన్న ఎలెక్షన్లలో
నలుగురితో పాటు వోటర్ల దగ్గర కెళ్లాను అలవాటు ప్రకారం హావభావాలతో గంభీరోపన్యాసం చేశాను
ఇలావుంటే యిరవయ్యొకటో శతాబ్దంలోకి ఎలా పయనించగలం? అన్నాను
వోటర్లు బాగా ముదిరి పోయారు
హరిజన గిరిజనాది వోటర్లేమన్నారంటే మీవెంట యాభయ్యొకటో శతాబ్దంలోకిపోయినా సరీ - యనభఖై ఒకటో శతాబ్దంలోకి పోయినా సరే - మా టబ్రదుకులింతే -
గొ రైతోక జీవితాలే
నూ-బలహీన వర్గాలన్నీ కలిసి
హనుమంతిడి తోకయితే తప్ప
మా బతుకులింతే - అన్నారు
ఇంతలో మాలో నుండి ఒకచవట లేచాడు “ఎంత కృతఘ్నత! ఎంత కృతఘ్నత !
పాలు పోసిన చేతినే పామై కాటేస్తున్నార్రా ?
92 డా. అంతటి నరసింహం అన్నాడు ఇన్నిమాటలూ గట్టిగానే అన్నాడు చ(ర్రున అంతెత్తు ఎగిరారు అవతలివారు మాకింకా ఆమాత్రం భాష తెలియదనుకుంటున్నారా పాలు పోసిన చేతిని పామై కాటేస్తున్నామా? తిన్న యింటి వాసాలు లెక్కిస్తున్నామా? మీరు మేధావులా మీ బుద్ది ఏమయిందిరా? ఆసలు పాలు మావిరా - మావి పాములు మీరు పుట్టలు మావి అనుభవాలు మీవి అని రొప్పారు మావైపు నుండి ఒక పరాన్నభుక్కు అన్నాడుగదా - "పెట్టుబడి అంతా మాదే అని వ్యంగ్యంగా చూశాడు వాళ్లంతా విషపు నవ్వు నవ్వి ఏంబాబూ! ఆ పెట్టుబడి ఆకాశం నుండి వూడి పడిందా? మాచెమట ఫలాన్ని మీరూ మీ పూర్వులూ ఎన్నాన్నో రూపాల్లో దోచి దాచు కున్నది గాదా - అన్నారు మెత్తని రబ్బరు చెప్పు ప్రహారం లాగా వుందా జవాబు ఈ పరాన్నభుక్కుల తోలు మందం మరి మీకంతా రిజర్వేషన్గూ ఆదర్శ పాఠశాలలూ
ఇరవై ఒకటో శతాబ్దంలోకి 93 ఆశ్రమ పాఠశాలలూ వోస్టళ్లూ యిళ్లూ ఇవన్నీ యెలా వచ్చాయి - అన్నారు అప్పటికే చాకలీ, మంగల్సీ కుమ్మర, కమ్మరీ, వడ్రంగి బలిజా, గీతా నేతా గొల్లా గానుగా అంతా బిలబిలా వచ్చారు ముందుకు అందరూ కీసి ఐక్యకంఠంగా తుముల నాదంగా అరవడం మొదలు పెట్టారు నేను మాట్లాడ బోయాను నన్ను అపార్టం చేసుకున్నారు నన్ను మాట్లాడనీ లేదు శాలువా గుడ్డకూ అర్రనూట పదహార్లకూ పెత్తందార్ల కొమ్ములు కాసే స్పార్టులు మీరు మీ వ్రాతలు చదివి చదివీ సెప్టిక్ అయిపోయింది జాతి పది[గ్రామాలు కొల్లగొట్టి వైభవోపేత జీవితం జీవించే దొంగపాళెగాడు చతురోదధిపరిత భూవలయ రక్షాదక్షుడు మీకు పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చేవాడు మానినీ మానస చోరుడు మీకు
94 డా. అంతటి నరసింహం
భూనాధుడూ, భూదేవుడూ
నరేశుడూ మానవనాధుడూ
నావిష్ణః పృథివీ పతిః
బ్రాహ్మణో భూమి సురః అని రాసి
మీ అకించనత్వాన్నీ దాస్యభావాన్నీ
ప్రదర్శించిన భావదరిద్రులు మీరు
ఆఅడవాళ్లనంతా పతివ్రతలుగా వుండాలని వ్రాసింది మీరే
రాజును జూచిన కంట
మొగుణ్ణి చూడలేనట్ట్లు అని వ్రాసిందీ మీరే
అంటూ ఎద్దేవా చేశారు! ఇంతలో కొందరు భూస్వాములూ అధికారూ వ్యాపార్లూ, కాం ట్రాక్టర్లూ విద్యావేత్తలూ, మేధావులూ ముందు బడి వచ్చి నాభుజం తట్టి నిలబడ్డారు ఒక్కసారిగా యిలా అన్నారు ఏమన్నారు
'ప్రజాఫ్రభుత్వాల బౌడార్యం వల్ల
మీరిప్పుడిప్పుడే అక్షర జ్ఞానులవుతున్నారు
బుద్ది యింకా బాగా వికసింపలేదు
అర్దం చేసుకొనే సంస్కారం అలవడలేదు
మనకు గొప్ప సంస్కృతి వుంది
గొప్ప వారసత్వం వుంది
వేదాలూ ఉపనిషత్తులూ పురాణాలూ కళలూ
ధర్మ శాస్త్రాలూ ఇంకా ఎన్నో ఎన్నో వున్నాయి
ఇరవై ఒకటో శతాబ్దంలోకి రక ప్రపంచం మేలుకోక పూర్వమే మేలుకొ న్న జాతి మనది సర్వేజనాస్సుఖినోభవన్తు అన్నజాతి మనది మా హింస్యాత్ సర్వాని భూతాని అన్న అహింస జాతి మనది తత్వమసి, అహం బ్రహ్మాస్మి త్వమేవాహం అని నేర్పిందీ మనవారే - ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో ..... ఇంకా యేదో అనబోతూ వుండగా ఠపీమని అడ్డుపడ్డారు వారు ఎవరు? ఈ బలహీనవర్గాలవారు వేదాలూ గీదాలూ గీతలూ కోతలూ పక్కన బెట్లండి ఈ సమాజంలో అనాది నుండీ బ్రహ్మణా ధిక్యతా, వర్ణకుల వ్యత్యాసాలూ మత విద్వేషాలూ, అంటానితనాలూ వున్నాయా లేవా? నిజంగా ప్రజాప్రేమ వుండే మీరిలా మాట్లాడుతున్నారా? వట్టి చిలక పలుకులు పలుకు తున్నారు! నీవు వేరు నేను వేరు అనేది గూడా సంస్కృతేనా! కులాహంకారాలూ, (స్త్రీ, శూద్ర విద్యా నిషేధాలూ, శూద్రులకు అమానుష శిక్షలూ, అంటరాని తనాన్ని కసిగా సృష్టించి పాటించి వారికి అస్తి సంచయనం నిషేధించి పశువులకంటే అధ్వాన్నంగా ఊరికి దూరంగా జీవించేలా చెయ్యడం గూడా సంస్కృతేనా! శరీర పరిశ్రమకు దొంగ మరిగి అడుక్కుతినడం గూడా సంస్కృతేనా? నీతులు వల్లిస్తూ బూతులు ఆచరించడం సంస్కృతా?
06 డా. అంతటి నరసింహం (స్తీ బానిసత్వామూ, బహు పత్నీవ్రతమూ,
ముక్కు పచ్చలారని పసిషిల్లల వివాహాలూ, కన్యా శుల్కాలూ సతీ సహగమనాలూ
విధవా చాకిరీలూ సంస్కృతా?
ఆత్మా పరమాత్మా అంటూ మోక్షం నిర్వాణం అంటూ నిష్కియా పరత్వం నేర్పడం సంస్కృతా!
పూర్వజన్మ పునర్జన్మ అంటూ
పాపాలూ పుణ్యాలూ అంటూ
స్వార్ధం కోసం ఎంతెంతనీచ కార్యాలు చెయ్యడానికి గూడా
జంకక పోవడం గూడా సంస్కృతా?
గొడ్డు మాంసం తినే అప్రాచ్యులు ఆవిష్కరించిన
'సైకిళ్లూ కార్టూ విమానాలూ, బాంబులూ
మిసైళ్లూ రాకెట్ట్లూ, స్పుత్నిక్కులూ
దూరదర్శిని, దూర శ్రవణాలూ
అన్నీ
మన వేదాల్లోనే వున్నాయష
అని మృషా వచనాలు అహంకారంగా
పలకడం సంస్కృతా!
అన్నారు
ఎన్ని మాటలు నేర్పారండీ
జవాబులు లేని ప్రశ్నలు అవి
ఒక్కక్షణం అందరి నోళ్లూ మూతలు పడ్డాయి
ఒక్కమాట బాబూ!
ఒక్క క్షణం ఆపి వినండి
ఇరవై ఒకటో శతాబ్దంలొకి 07 మీకోసం ప్రభుత్వం యేం చేసిందో తెలీదా! స్కూళ్లు పెట్టించారు, హాస్టళ్లు పెట్టించారు ఇళ్లు కట్టించారు రిజర్వేషన్లు ఇచ్చారు ఇంకా యెన్నెన్నో చేశారు, చేస్తున్నారు ఏమీ చెయ్యలేదనడం కృతఘ్నత గదా అన్నారు అలా అనకపోయినా బాగుండేది వాళ్లంతా అమాంతం విరుచుకు పడ్డారు అరిచారు, కేకలు వేశారు, అంతా అస్పష్టం అందులో యెన్నో దుర్చాషలు ఒక్కక్షణం నిశ్శబ్దం ఈ టెల్లాంటి మాటలు నాటుకున్నాయి చెవుల్లో ఏమిటీ రిజర్వేషన్లా నూటికి యనఖై అయిదు వంతులున్న మా మెజారిటీకి - సర్వోత్పత్తులూ సమకూర్చే మీ భోగదాతలకు - మాకు రావలసివి వాటా అంతా మీరే అనుభవిస్తూ మాకు ఎంగి మెతుకుల్లాగా కాసింత రిజర్వేషన్లు విదిలిస్తారా మమ్మల్ని నోరులేని వాళ్లుగా చేసి మా హక్కులపై దురాక్రమణ చేస్తారా? అసలు మీ స్వల్ప జనాభా ననుసరించి అంతే శాతం రిజర్వేషన్ మీకు న్యాయంగా మేమిస్తాం తొలగండి రాజ్యాధికారం మాకు వదలండి ఇప్పుడే తొలగండి ఆలోచించాను
98 డా. అంతటి నరసింహం ఒకక్షణం ఆలోచించాను
వీళ్లకు మంచి గుళిక వెయ్యాలను కున్నాను. కవినిగదా! బాబూ! వినండి
రామరాజ్యానికి బాటలు వేస్తున్నాం
రాజ్యం సుభిక్షం కావడానికి అదేమార్గం
ఆ రాజ్యంలో మీరూ మేమూ సుభిక్షంగా వుండగలం అన్నాను, అలా ఎందుకన్నానో అన్నాను
వాళ్లు ఎగిరి పడ్డారు
రామరాజ్యమా!
ప్రజాస్వామ్యంలో వుంటూ రామరాజ్యమా నిరంకుశరాజులు ఏలే రాజ్యంగదా అది ప్రజాస్వామ్యంలో గూడా రామరాజ్య మంటారా? ప్రపంచానికకంతా మీ రామరాజ్యమేనా!
అవును ఇది రౌడీల రాజ్యం
గూండాల రాజ్యం
ఎన్నెన్నో నేరాలు చేసీన వారికి టిక్కెట్లిస్తే
వచ్చే ప్రతినిధులు నేరగాళ్లు, గూండాలూ,
కాకపోతే వేరే వారెలా వస్తారు?
రామాయణం తెలుసా మీకు?
వాల్మీకి రామాయణం చదివారా
పోనీ, ఎవరన్నా చదివితే విన్నారా?
దాని నిండా స్త్రీ శూద్ర అకించనళ్వమే
గో బ్రాహ్మణ రక్షే
చాతుర్వర్హ్యరక్ష కోసమే -
ఈమాటలన్నది ఎవరు? మీ రాముడే
తాటక వధా ఘట్టంలోనూ
ఇరవై ఒకటో శతాబ్దంలోకి 09 దండకారణ్య రాక్షస యుద్ధంలోనూ రాముడే - తన నోటనే - పలికిన మాటలు ఇవి శంబుకుడు అనే శూద్ర తపస్విని కులగురు వసిష్కుడు చంపమంచే చంపాడు మీ శ్రీరాముడు రైతులందరి మీదా పన్ను అధికంచేసి బంగారు రూపంలో చెల్లింయమన్నాడు మీ రాముడు ఆ రాజ్యం మన కొద్దు బాబూ! దగా కోరులయిన మీ రాజ్య మైనా ఫరవాలేదు ప్రజాప్రభుత్వమే కావాలి మాకు ఒక పార్టి తప్పులు చేసి ప్రభుత్వానికి వస్తే మరొకపాక్టి వుంటుందితప్పులు పట్టడానికి. ఒప్పులు చెయ్యడానికి ప్రజారాజ్యమే కావాలి మాకు రామరాజ్యం వద్దు రామరాజ్యం వస్తే చాతుర్హ్యవ్యవస్ట వస్తుంది ఆవ్యవప్టే కావాలని ఉత్తరాదిని ఒక ఉన్మాది ఉపన్యాసం యిచ్చాడిటీవలే మాకు రామ రాజ్యమూ వద్దు రావణ రాజ్యమూ వద్దు రాముడు మీకు దేవుడు ధనుర్భాణ ధరుడు మీ దేవుడు అయితే వారే ఆయుధాలు ధరించే వాడు దేవుడెట్లా అయ్యాడు రా
100 డా. అంతటి నరసింహం మీ శివుడు త్రిశళూలధరుడు
మీ విష్ణువు చక్రాయుధుడూ, ఖడ్గభురుడూనూ
మీ రాముడు ధనుర్భాణధరుడు
మీ కృష్ణుడు చక్రాయుధుడు
మీ దేవుళ్లేగాదు
గ్రీకు దేవుళ్లూ అంతే అనుకోండి
వీళ్లు దేవుళ్లెల్లా అయ్యారురా
జన్మించడాలూ, పెళ్లాడడాలూ
ఒక్కొక్కరికి ఇద్దరూ ముగ్గురేసి భార్యలూ సంతానాలూ
జన్మమరణాలూ
వీళ్లంతా దేవుళ్లేమిటిరా! , హిందువులకు దేవుడు కాని వస్తులేమయినా వుందిరా? రాళ్లూ రప్పలూ చెట్లా చేమలూ
చేపలూ, తాబేళ్లూ, పందులూ సింహాలూ
కోతులూ అన్నీ దేవుల్లే
రామరాజ్యమే వస్తే కులాల రాజ్యమేనన్నమాట అంతేగాని అది ఒక మత రాజ్యం గూడా గాదు
మనది మతం గాదు గదా
మనది మతమే అయివుంటే
ఎత్తివచ్చిన ముస్లీములను
మన మతంలోకి లాక్కుని వుండే వారం
ఆవచ్చిన ముఫ్లిములంతా ఒకే మతం
వాళ్లకు కులభేదాలు లేవు మనకులాల్లోని అస్పృశ్యులనూ,
ఇరవై ఒకటో శతాబ్దంలోకి 101 వెనుకబడిన వారినీ దగా బడ్డవారినీ అందర్నీ తమ మతంలోకి లాక్కున్నారు సమ మర్యాద ఇచ్చారు ఆనాడు ఇండియా వచ్చిన ముస్లిములు కొద్ది వందలు / ఈనాడు ఇండి యాలో ముస్లిములు పదారుకోట్లు పాకిస్టాన్ బంగ్లాదేశాల్టోని ముస్టీములంతా ఇండియా వారే ఇంతమంది శత్రువులను పుట్టించుకొన్న ఘనత మన వర్ణధర్మ హిందూమతందే అంతేనా! తర్వాత క్రైస్తవులు వచ్చారు వాళ్లు అనేకులయిన అస్పృళశ్యులను మతం మార్చారు పల్లెలకు పల్లెలే మార్చారు మతం మారి పోతూ వుంటే మనలో ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు అదేమిటి అనలేదు ఇంతలో మా వెనుక నుండి ఒక తిక్కవాడు అన్నాడుగదా! ఈనాడు మతమార్పిడి ఆపుతున్నాంగదా అని ఆపుతున్నార్రా
102 డా. అంతటి నరసింహం ఆపుతున్నారు
ఆగడానికి పరిస్టితలులు కల్పిస్తున్నార్రా?
మన సమాజంలో అస్పృశ్యత పోలేదు
కులాల హెచ్చుతక్కువలు పోలేదు
భూస్వాముల పెత్తనమూ
పురుషుల పెత్తనమూ పోలేదు
అందరికీ సమాన మర్యాద లేదు
అవన్నీ కల్పించిననాడుగదా
మతం మార్పిడి అగి పోయేది
వూరకూరకేపిచ్చి కూతలు కూస్తే ఆగి పోతుందా! హిందువులంతా ఒకటే అనీ
నీవు హిందువుఅయిందానికి గర్వించు అనీ హిందువులం బంధువులం అనీ
ఆచరణ రహితపు పలుకులు -
అక్కసుతో కూడిన పలుకులు -
పలికితే సరిపోతుందా?
ఆమాట అన్నవాడెవ(ర్రా?
నలుగురి వెనుక దాగి కాదురా
ముంధు కొచ్చి మాట్లాడు ఆమాట ఈ హరిజనుడొకడు
బ్రాహ్మణ్ణీ పట్టుకొని మనం బంధువులం అవుతామా అని నిలదీసి అడిగితే జవాబేమిటి? జవాబేమిట్రా?
ఇరవై ఒకటో శతాబ్దంలోకి 103 బంధువులం ఎలా అవుతామో చెప్పు అని నిలదీసి అడిగితే జవాబేమిటి? ఇంతలో మరొక తిక్కవాడు అన్నాడు గదా! ఏమి తర్కం! ఎంత తర్కం ! ఇవన్నీ ఎపుడు ఎక్కడ చదివా[ర్రా? మేము చెప్పిన విద్యనే మాపైన ప్రయోగించడానికి ఎత్తి వచ్చార్రా మావేళ్లతో మా కన్నే పొడుస్తున్నారా? మా చర్యలే మాకు అప్పగిస్తున్నారు? అన్నాడు ఇవన్నీ'మీరు చెప్పిన చదువులు కావురా మీరు (స్త్రీ, శూద్రులకు విద్యా నిషేధం చేశారు గత శతాబ్దం వరకూ ఆ పరిస్టితి వుండేది క్రైస్తవ మిషనరిలు విద్యనేర్పార్రా? మాకూ మీకు గూడా వాళ్లే విద్యనేర్పార్రా! అంతవరకూ మీ వేళ్లతో మాకళ్లే పొడిచారు ఈ మిషనరీలు వాళ్లవేళ్లతో మీ కళ్లు పొడిచారు అందుకే వాళ్లంటే మీకు మంట మీరు శుష్క వాదానికి దిగుతున్నారు ఆవరణలోకి దిగడం లేదు సమత తీసుకు రావడం మీవల్లగాదు మాకు వదలండి ప్రభుత్వాధికారాన్ని అపుడు చూడండి అన్నారు.
104 డా. అంతటి నరసింహం
బుద్దితక్కువ ఉడుకుమోతు తనంతో
మా వెనక నుండి ఒకమాట అన్నాడొకడు
ఇది ప్రజాస్వామ్యం
అందరికీ వోటు హక్కుంది
పోటీ చెయ్యండి
శీట్లుగెలిచారంటే - చూద్దాం
మీరు పేరుకు బలహీన వర్గాలే
మీరంతా ఒకటిగాదు
మీలో మీరు ఒకటి గాదు
మీరు గెలవలేరు
ప్రభుత్వాన్ని పట్ట లేరు అన్నారు
వాళ్లకు కోపం వచ్చింది
అందరూ ఒకే శబ్బంగా అరిచారు
మమ్మల్ని ఆపలేరు
మేము సాధించి తీర్తాం
మా బలాన్ని నిరూపిస్తాం
మిమ్మల్ని తొలగిస్తాం 111
ఒక్కసారిగా పాత పాదరక్షలు పతాంగాల్లాగా
వేదిక మీద పడ్డాయి | ఇది నాంది | విక్రమణకు నాంది ల యూ న్
డడ
త | లే జననం1925. కడప జిల్లా వెంక ట్రాజుపల్లిలో. తెలుగు, యం.ఏ: హింది విశారద. *'ప్రబంధములలో ప్రకృతి వర్ణము పైన యస్. వి. యూనివర్శిటీలు డాక్టరేడ్ సంపాదన. 1974లో సర్వోత్తమ మైనదిగా బహుమతి. అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక వృత్తి. ప్రిన్సిపాలు 1976 నుండి సెక్రైచేరియట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతచిక వ్యవహారాల ప్రత్యేకాధికారి. 1962 నుండి వెనుకబడిన తరకతుల సహకార అట్టిక సహాయ సంస్థ అభివృద్ధి అధికారి. ఎ.ఫ. ._ వాషగ్మొన్ ఫెడరేషన్ మొదటి చైర్మన్. హ్ఞస్కూలో రోజుల నుండి, ల్బృశ్యతా నివారణ కుల నిర్మూలన స్తీ విద్య .. మొదలయిన అనేక సంఘ సంస్కరణ కార్యకలాపాల్లో ఆచరణాత్మక అవిరళకృషి = తతృ్సంబదిక సాహిత్య సృష్టి. అనేక పద్య గేయ, వచన కవితా కావ్యాలు, ౨) నృత్యనాటికల్లూ, మొదలయినవి నలఖై దాకా అచ్చుఅయినవి. అచ్చు కావలసినవి . ఇంకా వున్నాయి. | 1950 నుండి అనేక హైస్యూశళ్లలోనూ, కాలేజీల్గోనూ అనేక సన్మానాలు, .. 2987లో ఘనంగా షష్టిపూర్తి సన్మానం. అవా ర్హులు 1. మేజర్ బలరామిరెడ్డి స్మారక మెడల్ (౦౯16 06646313 (1974) 54 *అ21050/22 ౮౪/లు0ం) 2. పొయిట్రీ అవార్డు - తెలుగు యూనివర్శిటీ, 1993 3. ధర్మనిధి పురస్కారం తెలుగు యూనివర్శిటీ 1998 4. శ్రీ నారాయణగురు అవార్డు. (కేరళ) 1999 డాక్టర్ అంతటి పైన రిసెర్చి: 1. డా. పి. చెన్నకేశవులు, యం.పిల్. 1994 | 2. ఏ. చూడామణి యం. ఫిల్, 1998 అమె పిహెచ్డి కూడా చేస్తున్నది. (యస్. వి.యూనివర్శిటీ)