Telugu Edhe Dharmama - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఇదే ధర్మమా? క్; లి ం / . || న్‌్ న్ య" గే సహజకవిమల్లిమాలం చిన
- భా. శ చునసుపది మక్కువతో సరల కోసం ప శన ॥ ఈ పుస్తకాన్ని సాహాత్యాబి హాం స స... ఆనందంతో బహూకరిస్తున్నాంి ! స్ట 1 [' ఫి య. చా 0 // [1 111 న్ ల విగ.
కా రమయ
ఇదే ధర్మమా? గణ ఇం కథల సంపుటి ఎల్న్ ఖాను రః గంటి భానుమతి శల లి ప్రథమముద్రణ : అఆగప్టు 2006 (' శ్ క్షే క మ్య [9ిళాలలి. శ్ (ప్రతులు ౧00 చత పస్ట్ టై (కా
వెల ః ౯₹65/= స్ట రోగ ప్రతులకు ;. శ్రీమతి గంటి భానుమతి
1 - 205, మేఫ్లవర్ పార్కు అపార్ట్‌మెంట్స్,
మల్లాపూర్,
'హైదరాబాదు-500 076.
ఫోన్ ః& 27151439
ట్
సోల్ డిస్టిబ్యూటర్స్
నవయుగ బుక్ హౌస్
4-5-317, క్లాక్ టవర్ ఎదురుగా,
సుల్తాన్ బజార్, హైదరబాద్-95.
ఫోన్ ౩; 040-24754688 ముద్రణ ః దీప్తి టెక్నీకలర్ ప్రింటర్స్,
సి-15, బాలాజీ టవర్స్,
గాంధీనగర్, హైదరాబాద్-80.
ఫోన్‌ః 040- 27670357, 21557124
అంకితం ఎకశరీలు రాయడానికి, అరి ఫ్పస్త్కకూరం ద్క్యాడానికి అన్నిరిధాయిగా నహొశరించినీ నొ ఖిర్తీ గంటి ఫేతిశాస్త్రినారికి.
విషయసూచిక ఓ. ఇదే ధర్మమా? కే 2 చిరంజీవి శతాయుష్ను క0 8& జీవితాన్ని ప్రేమించు [7 4 ఇంట్లో విగ్రహాలు 27 5 కొత్తరెమ్మలు రిక్ ఈ ఏనుగు అను ఓ అమ్మోరికథ 47 శ భగవాన్! అమెను కాపాడు 59 8& బంధం 67 9. కూలిపోయిన సామ్రాజ్యం ౯₹ర్ర్ 10. మాతృప్రేమ 79 11. తెలిసి చేస్తున్న తప్పు 90 12. త్రిశంకు జీవితం 98 13. నేను చేసిన తప్పు నువ్వు చేయకు 106 14. ఒన్ టైట్ సమ్మర్ మార్నింగ్ 113
ముందుమాట
- మల్లాది వెంకటకృృష్ణమూర్రి శ్రీమతి గంటి భానుమతి వివిధ పత్రికల్లో రాసిన కథల సంకలనం ఇది. తక్కువ నిడివితో ఎక్కువ స్పాన్‌తో రాసిన ప్రతీకధ పారకునికి ఆకర్షించే విధంగా వున్నాయి. కోనసీమలోని ఓ మధ్యతరగతి మహిళ, తనకి దాపురించిన మొగుడ్ని వదలలేక, ఉండలేక పడే బాధని వివరించే “ఇదే ధర్మమా?” స్త్రీ స్వేచ్చ మన సమాజంలో ఎండమావి అని తేల్చి చెప్తుంది.
ఏక్సిడెంట్‌లో మరణించిన తన భర్త కళ్లు, గుండె దానంచేసి, అతన్ని అమరుద్ని చేసిన భార్య కథ 'చిరంజీవి శతాయుష్పు. -
నిరాశావాది అయిన భర్త ఉరితీసుకుని మరణిస్తే, ప్రవీరాజుయుద్దంచేసి, పిరికితనాన్ని పారద్రోలాలన్న పాఠాన్ని నేర్చుకున్న భార్యకథ “జీవితాన్ని ప్రేమించు.
'మహిళలు, అధికారాలు” మీద ఓ సభలో మాట్లాడాల్సిన ఓ రచయిత్రి, కుటుంఐ బాధ్యతల వల్ల అలా మాట్లాడే అధికారం కోల్పోవడం గురించి గమ్మత్తయిన కథ “ఇంట్లో విగ్రహాలు'.
ఆశావాదాన్ని నూరిపోసే కథ 'కొత్త రెమ్మలు. “గణపతిని ఆదర్శంగా పెట్టుకో, లాభంగా ఆలోచించడానికి పెద్దతల. కొత్త ఏజెషన్స్ వినడానికి పెద్ద చెవులు, చుట్టపక్కల విషయాల్లో కెలుకూతూ ఎక్కువ నేర్చుకోడానికి పెద్దముక్కు తక్కువ మాట్లాడదానికి చిన్ననోరు ...”
ఇంకా లింకన్ విజయగాధని, ఫైవ్'డీ'స్ గురించి - డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్కిమినేషన్, డిటర్మినేషన్ లాంటివి కథలో చొప్పించి ప్రతిభావంతంగా రాసారు రచయిత్రి.
'ఏనుగు అనే ఓ అమ్మోరి కథ స్వంతబిడ్డని మనీమెంటింగ్ మెషీన్‌గా వాడుకునే దయనీయతని వివరిస్తుంది.
“భగవాన్! ఆమెని కాపాడు'లో స్లీపింగ్ పిల్స్‌మింగి వాస్పటల్ పాలైన నీహారికకి మెలకువ వచ్చాక ట్విస్ట్‌తో ముగిసే చక్కటి కథ.
౪
హాస్పిటల్ బయటవదిలిన రెండురోజుల పసికందుని పెంచుకోవాలనుకునే
లేడీడాక్టర్, వద్దనే ఆమె భర్తల మధ్య సాగే కథ “బంధం”.
వంటింల్లు ఎవరి ఆధిపత్యంలో ఉంటే, ఆ ఇంట్లోని ఆడది మహారాణి, తన ఆధిపత్యంలో ఓ వంటిల్లుండాలని కోరుకునే ఓ స్త్రీ కథ 'కూలిపోయిన సామ్రాజ్యం'.
(పేమ వివాహం దెబ్బతిన్న కన్నకూతుర్ని తిరిగి అక్కున చేర్చుకున్న తల్లితండ్రుల కథ “మాతృప్రేమ. “నువ్వెళ్ళిన రోజు ఆగిపోయిన జీవితం తిరిగి నీ రాకతోనే మొదలవుతుంది” అన్నది ఈ కధలోని చక్కటి వాక్యాల్లో ఒకటి.
అడిగిందల్లా ఇచ్చి. తమ కుటుంబ ఆర్థిక పరిన్ఫితిని, పిల్లలనించిదాచితే ఏమవుతుందో వివరించే కథ 'తెలిసిన చేస్తున్న తప్పు”.
భార్య ఉద్యోగం నేపధ్యంలో, మేల్ చవనిస్ట్ పిగ్‌క్ ప్రతీక అయిన భర్తగల ఓ ఇల్లాలు పడే బాధని వివరించే కధ “త్రిశంకు జీవితం).
తన భర్తనించి విడిపోయిన ఓ భార్య, వివాహమైన తన కూతురు కూడా తను చిక్కుకున్నలాంటి పరిస్థితుల్లో చిక్కుకోబోతోందని తెలిసీతల్లిగా పడే ఆవేదనని తెలియచేసే కధ 'నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు' పాజిటివ్ ఎండింగ్ ఈ కథకి మంచి బలాన్నిచ్చింది.
ఓ రైల్లో కూపేలో, తన కాబోయే భర్తతో ఒంటరిగా ప్రయాణించే ఓ అమ్మాయి జీవితగమనాన్ని ఓ పిచ్చివాడి చేతిలోని తుపాకీ మార్చివేయ గలిగింది. “ఒన్ టైట్ సమ్మర్ మార్షింగ్' చాలా చక్కటి కథ.
రచయిత్రి ప్రధానంగా మధ్యతరగతి పాత్రలతో, వారి ఆలోచనలు, దృక్చథాలతో మలచిన పాత్రలన్నీ చదువరులకి ఎంతో చేరువగా ఉన్నాయి.
హోప్‌దిస్ మేక్స్ ఏన్ ఇంట్రెస్టింగ్ రీడిండ్ టు ఆల్. ౪
సందేశాత్మక కథలు
= అబ్బూరి ఛాయాదేవి ఎన్నో కథలు చదువుతూంటాం. చదివిన కథలన్నీ గుర్తుండవు. బాగా పేరున్న రచయితవో రచయిత్రివో కొన్ని కథలు ప్రఖ్యాతి చెందినవి మాత్రమే గుర్తుంటాయి సాధారణంగా. కొన్ని కథలు వాటంతటవి గుర్తుండిపోతాయి - రచయిత ఎవరో గుర్తులేకపోయినా, ఆ కథల్లోని వస్తువో, కథనరీతో ఏదో గుర్తుంచుకునేలా చేస్తుంది. అలా నాకు గుర్తుండిపోయిన ఒక కథని 'నవ్య' వారపత్రికలో నేను 'కాలమ్' రాస్తున్నప్పుడు ఒక సందర్భంలో ప్రస్తావించి, రచయిత ఎవరో గర్హులేదని రాశాను. ఆ 'కాలమ్' చదివిన శ్రీమతి గంటి భానుమతి నా టెలిఫోన్‌నంబరు కనుక్కుని, నాకు ఫోన్‌చేసి, ఆ కధని తనే దాదాపు పదిహేనేళ్ళక్రితం రాసినట్లు చెప్పారు! నాకు భానుమతిగారితో పరిచయం ఆ విధంగా జరిగింది. కథా రచయిత్రిగా ఆమెపేరు సుపరిచితమైనా, ఆమె కథలు కొన్నిటిని
ఒకేసారి చదివే అవకాశం ఇప్పుడు కలిగింది.
ఈ నంపుటిలో 14 కథలూ ఏదో ఒక సందేశంతో కూడిన కధలే. కుటుంబనంబంధాల గురించి విశ్లేషణాత్మకంగా, పిల్లల పెంవకం గురించి వినేచనాత్మకంగా రాసిన కథలున్నాయి ఇందులో. దాదాపు అన్నీ మధ్యతరగతి ఆధునిక 'ప్రీల అనుభవాల ఆధారంగా రాసినవే. వీటిలో పది కథలు ఉత్తమ పురుషలో 'నేను' అంటూ రాసినవి. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలూ, అనమానతలూ గురించిరాసినా, ఈనాటి యువతుల ఆవేశాలూ, ఆత్మాభిమానాలూ గురించి రాసినా, కథల ముగింపులో ఒక ఆశావాద దృకృథమో, జీవితంపట్ల ఒక అవగాహనో, ఒక సమన్వయ లక్షణమో కనిపిస్తుంది. అందులోనే రచయిత్రి తన ప్రధానపాత్రలో పరిణత మనస్తత్వాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది. దాదాపు అన్నికథల్లోనూ రచయిత్షి వివేచనా శక్తి ప్రస్ఫుటమవుతుంది. వ్యక్తిస్వేచ్చ, కుటుంబ బాధ్యతల మధ్య ధర్మాధర్మ విచక్షణా, వివేచనా ప్రదర్శించిన కథలు - 'ఇదే ధర్మం”, 'జీవితాన్ని శ్రేమించు”, “ఇంట్లో విగ్రవాలు', శొత్తరెమ్మలు”, 'బంధంి, 'త్రిశంకు జీవితం.”
న!
ఆడపిల్లల్ని సంప్రదాయబద్ధంగా పెంచినా, ఆధునికంగా స్వేచ్చనిచ్చి పెంచినా, సమస్యలు తప్పడంలేదు తల్లిడండ్రులకీ పిల్లలకీ కూడా. ఎంత క్రమశిక్షణతో పెంచినా, ఎంత ఆదర్శప్రాయంగా పె ఎనా, పరిసరాలూ పరిస్థితులూ యువతని ప్రభావితం చేసి, తల్లిదండ్రుల ఆశల్ని తలక్రిందులు చేస్తాయి. అటువంటి సంక్షిష్ణ సమయాల్లో పెద్దలూ, పిల్లలూ ఎలా ప్రవర్తించాలో సూచించిన కథలు - 'మాతృ(ప్రేమి, 'తెలిసి చేస్తున్న తప్పు' ఆధునికత, ప్రపంచీకరణ '్రభావాల్లో పడిన ఈనాటి చాలామంది తల్లిదండ్రులకి వర్తిస్తుంది. అందరికీ ఒక గుణపారం నేర్పుతుంది, నేర్చుకోదలచుకుంటే. మొత్తంమీద తల్లిదండ్రుల్నీ, పిల్లలన్నీ వైతన్యవంతుల్ని చేసే ప్రయోజనాత్మకమైన కథ.
వంటిట్లో తమ సామ్రాజ్యం, సర్వస్వంఅనుకునే గృహిణులకి కనువిప్పు కలిగించే కథ “కూలిపోయిన సామ్రాజ్యం. ఏ ఆశకయినా, మమకారానికైనా హద్దు ఉండాలనీ, ఎన్ని సంపదలూ సౌకర్యాలూ సమకూర్చుకున్నా, వాటివల్ల మాత్రమే నంతోషం కలుగుతుందనుకోవడం భ్రమఅనీ తెలియజెప్పే కథ ఇది.
ఈనాటి మూధవిశ్వాసాలకీ, మౌధ్యానికీ గురవుతూనే ఉన్నారు అనేకమంది. దేవుళ్ళూ, దేవతలూ, అమ్మవార్లూ అంటూ అమాయకురాళ్ళని దోపిడీ చెయ్యడం, బలిచేయడం, ప్రజల్చి మోసం చేసిడబ్బు చేసుకోవడం జరుగుతున్న వైనాన్ని చిత్రించిన కధకూడా ఒకటి ఈ సంపుటంలో ఉంది.
ప్రేమించి పెళ్ళిచేసుకున్నవాడు ఒక దుర్హటనలో హఠాత్తుగా మరణిస్తే, దుఃఖంలో కూరుకుపోయే బదులు, అతని అవయవాల్ని సహృదయంతో దానంచేస్తే ఎంతోమంది ద్వారా అతను చిరంజీవిగా నిలుస్తాడని చెప్పిన కథ “చిరంజీవి శతాయుష్ను”
వైవిధ్యపూరితమైన, ప్రయోజనాత్మకమైన కథలతో, వివేచనా పూరితమైన సంభాషణలతో, వ్యాఖ్యలతో సంపన్నమైన సంపుటి ఇది.
శ్రీమతి గంటి భానుమతిగారికి అభినందనలు! ౪11
కథచెప్పడంలో...! = శారదా అళలోక వర్ధన్ కథ చెప్పడం, ఆకట్టుకునేలా చెప్పడం ఒక కళ. అందులోనూ మనిషి కనిపించకుండా, తన మనోభావాలను కాగితంమీద పెట్టి చదివి అర్ధంచేసుకోండి, ఆలోచించండి అనడం రచయిత(తు)లు చేసేవని. అలా రచనలను చదివి స్పందించగలిగితే పాఠకుడు, ఆ రచయిత కృతకృత్యుడయినట్టే! కధ కాల్పనికమై వుంటుంది. కానీ, అది చెప్పేది సత్యాలు. అంటే కథ మానవ జీవితానికి సంబంధించిన కాల్బనిక కథ. వాస్తవాన్ని వాస్తవంగా ఉన్నదున్నట్టు చిత్రిస్తే అదికధకాదు. చరిత్ర అవుతుంది. రచయితలు వస్తువును సమాజంనుంచి స్వీకరిస్తాడు. తన కల్చనాపఠిమతో ఆ వస్తువును పఠనీయంగా, వినోదాత్మకంగా విజ్ఞానాత్మకంగా లేదా ఉదాత్తంగా అవిష్కరిస్తాడు. కథను నడిపించడానికి సంఘటనలనూ పాత్రలనూ సృష్టిస్తాడు. పాఠకుడికి ఆ పాత్రలన్నీ తన చుట్టూఉన్న వాళ్ళలాగా, తనకి తెలిసినవాళ్ళలాగా అనిపిస్తాడు. కధలకుగానీ నవలలకుగానీ చదివించే గుణం అతిముఖ్యం. సరళమైన శ్రెలి, తేలికభాష ముఖ్యంగా పాటించాలి. అవి పుష్కలంగా వున్నాయి ఈమెలో! వస్తువైవిధ్యాన్ని చక్కగా చూపడం ఈమె ప్రత్యేకత. భానుమతి మంచి భావుకురాలు. ఏ అంశాన్సైనా, మనస్సుకి హత్తుకునేలా చెప్పగలిగిన నేర్పరి. ఆమె భావాలు ఆధునికతతో సృజనాత్మకతతో ముందుకు సాగేవిగా వుంటాయి. పురుషాధిక్యసమాజంలో స్త్రీల స్థితిగతుల్ని చక్కగా వివరించింది భానుమతి “'ఇంట్లోవిగ్రహాలు'అన్న కథలో! చాలామంది ఆడవాళ్ళు బయట ఎంత(ప్రతిభావంతులైనా, “ఇంట్లో విగ్రవాల్లాంటివారే!' ఇదే కథపేరుకూడ! ఎంత చక్కగా ఉదహరించారు. ఈ కథలో ఆడవాళ్ల పరిస్థితిని చూడండి. “మనదేశంలో ఆడవాళ్లు విగ్రహాలు మాత్రమే. పూజచెయ్యడానికి మాత్రమే పనికొస్తారు. ప్రేమించడానికి కాదు. అరచెయ్యి పైకెత్తి ఆశీర్వదించే ముద్రలో వుంటే, ఏమన్నాచలించని బొమ్మలా వుంటే, దండం పెడతారు. న!
ఆడజన్మకి మరో అర్ధం లేదా?” అని ప్రశ్నిస్తారీమె.. ఎంత వాస్తవమో ఇది ఆలోచిస్తే అర్ధమవుతుంది. అలాగే ధర్మబోధలన్నీ, ఆడవాళ్లకేనా? అని అనేక కథల్లో అనేకసార్లు, మానవత్వం అంటే ఇదేనా? ధర్మం ఇదేనా? అని ప్రశ్నిస్తారు. స్వార్ధంతో, అసమానతల ఈశక్వేషన్స్‌తో, నడుస్తున్న నేటి సమాజంలోని కుళ్లును కడిగేయాలనుకున్న ఈ రచయిత్రి తాపత్రయం, ఆవేశం, ఆందోళనా ప్రశంసనీయం. భానుమతి కలంనుండి మరిన్ని మంచి కధలు రావాలని ఆశిస్తూ, ఆమె నాకు సాహితీబంధువేకాక బంధువుకూడా అయినందుకు ఆనందిస్తూ, ఇంత చక్కటి కథలను రాసిన ఆమెను మనసారా అభినందిస్తున్నాను.
701, అమర్‌చంద్ కాంప్లెక్స్ సర్దార్ పటేల్ రోడ్ సికింద్రాబాద్-500003
గ ఎ
అభిప్రాయం = అరుణా వ్వాస్ కోనసీబు ఇంటి ఆడపడువైన గంటి భానుమతి కథల్లో కోనసీమ కొబ్బరినీళ్ళ తేటదనం, కోనసీమ ఆవకాయ ఘాటుదనం, కోనసీమ పనసకాయ కూర వగరుదనం కలబోసి కనిపిస్తాయ్. మనని చదివిస్తాయ్. కధల్లో ఆడవాళ్ళు బలీయమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, మగవాళ్ళు చాలా వరకూ బలపహీనులూ, వలాయనవాదులూ, అహంకారులూను. అందుకే మాటిమాటికీ మగవాడిపంతమే చెల్లుతుంది. ఇది యుగయుగాలనాటినుండీ చర్వితచర్వణం అవతున్నదే! ఓల్డ్‌వైన్ ఇన్ న్యూ బాటిల్. కథచెప్పేతీరూ, విధానం, శైలీ కథలకి అందాలని తొడిగాయి. సువాసనలని పులిమాయి. పైగా వస్తువైవిధ్యం కథలని అలంకరించింది. కథల్లోకి వద్దాం. దిగువ మధ్యతరగతిలో ఎవరికైనా రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. అలాంటప్పుడు తల్లీతం(డ్రీలేని ఆడపిల్ల బరువై, బరువును దింపేసుకోవాలనే అనుకుంటారు పక్కా తోడూకూడదా. డబ్బూ, చదువులేని ఆడపిల్లలు కలలు కనకూడదు. పేకాటలో దబ్బుతగలేసి అప్పులు తీర్చలేకపారిపోయిన శంకరం తండ్రికొరవి పెట్టడానికి వస్తాడు. అతని భార్యమాధవి అతను భర్తగా తన ధర్మం విస్మరించినా, కోడలిగా అత్తకీ ఇంటిల్లిపాదికీ చేదోడుగా తన ధర్మం పాటిస్తుంది. ఇదే “దేనాధర్మం”. కులాంతర వివాహం - పెద్దా, చిన్నా అంతరాలు అద్దురాలేదు వాళ్ళ పెళ్ళికి, కాని విధి యాక్సిడెంట్ రూపంలో మొగుడి జీవితాన్ని మింగేస్తుంది. అతని అవమానాలనీ డాక్టర్లు అవి కావలసిన రోగులకి అమర్చడానికి భార్యే ఒప్పుకొంటుంది. మనిషిపోయినా నలుగురికీ ఎలా పనికి రావొచ్చో చెబుతోంది “చిరంజీవి శతాయుష్పు”. సోమిదేవి కోనసీమలో సోదెమ్మ, సోదెప్ప అవుతుంది. కథలో సోమిదేవి నవీనంగా సౌదామిని అయ్యింది. ఆమెపేరూ, ప్రతిష్టా, సంఘంలో స్థానం వున్న రచయిత్రి. కానీ ఆవిడ భర్త గీసిన గిరిదాటదు. అతని పెద్దనాన్న మనవరాలి పెళ్ళిచూపులకి తాను వప్పుకున్న మీటింగు మానుకోమంటే మానుకుంటుంది. ఎంతపెద్ద గుమ్మడైనా కత్తిపీటకు లోకువ. మొగుడు వద్దన్నది తనుచేస్తే తన జీవితం రుంగులు విడుస్తుందని ఆమెకు తెలుసు. ఇది “ఇంట్రోవిగ్రహాలు”సంగతి. | స
“పేమ” మీద పుంఖానుపుంఖాలుగా కావ్యాలూ, నాటకాలూ, వచనాలూ వచ్చాయి. అలాంటి (ప్రేమ ఒక అనుకోని అవాంతరంతో కరిగినీరవడమేం విచిత్రం. పిల్లాడి పుట్టుక తల్లిదండ్రులలో కుతూహలం, ఉత్సాహం పుట్టించి వాళ్ళబంధాన్ని గట్టిపరచాలి. కాని జన్యులోపకారణంగా పుట్టిన పిల్లాడు భర్తలో నిర్లిప్తతా, నిర్తక్ష్యం భార్యలో ఆవేదనా, ఆక్రోశం పుట్టించి బంధాన్ని తెంపేసి పైలోకాలకి వెళ్ళిపోతాడు. మిగతా అబ్బాయిలు ఇలాగే పుట్టే అవకాశం ఉందని తెలుసుకుని భర్త విడాకులు తీసుకుంటాడు. ఒంటరిదైన భార్య అనాథశరణాలయంలోని పిల్లల్లో (ప్రేమను వెతుక్కుంటుంది. అవి “క్రొత్తరెమ్మలు”.
మనకి “అమ్మోనర్లుకీ 'అయ్యోర్లుకీ కొదవలేదు. పిచ్చిప్రజల మూఢనమ్మకాలు ఊతచేసుకొని తమబతుకులనీ, తమవారి బఐతుకులనీ సాఫీగాలాగించేసే ఘనులు వీళ్ళు. పుట్టుకలోపం కారణంగా కూతురు ఎదుగూ, బొదుగూ లేకపోతే ఆ అమ్మాయిని 'అమ్మోరి'ని చేసిదేవతలా ఆరాధింపజేశాడు తండ్రి. చూసేజనం ఇచ్చేకానుకలతో పబ్బం గడుపుకునేవాడు. ఆడపిల్ల సహజంగా పూవైవిరసి, సహజపరిమళాన్ని వెదజల్లాలని చేసిన ప్రయత్నం ఆమెను నేలవేసి కాలరాయించింది. ఆ పిల్లపోయినా ఆ పిల్లఫోటోకి నిత్యార్భనలు, జపం సమర్పించే కానుకలు యధావిధిగా సాగుతున్నాయి. అదీ “ఏనుగు అను అమ్మోరికథ”.
అనాధపిల్లని పెంచాలనే తపన తల్లిది, వద్దని తండ్రి అంటాడు. తల్లి పెంపకం అనుబంధంలోని తీపినేర్పిస్తుంది కొడుక్కి పాసనుపెంచుకుందామా అని అడిగితే “చెల్లైలిగానా” అని ఒన్‌అప్ మన్ విష్ చూపాడు అమ్మానాన్నలమీద. మానవత ఇంటిగోడలనుంచీ బయటికి పారిపోయింది. అదీ 'బంధం'.
కొంతమందికి ఇంటిని సర్దుకోవడం అలంకరించుకోవడం చాలా ఇష్టం. దిగువ మధ్యతరగతి జీవితవూం సంప్రదాయమూ కలల్ని పండించలేదు. జీవితం సంధ్యవాకిటి తలుపు తడుతున్న సమయాన తన కిచెన్‌ని డిజైనర్ కిచెన్‌గా మలుచుకొంది ఒకగృపొణి. ఆ కిచెన్ నిండా తొను కోరుకున్న అధునిక సదుపాయాలన్నీ నమకూర్చుకుంది. కొడుకూ కోడలూ వచ్చి భోజనాలయ్యాక తుడిచి, శుభ్రంచేస్తే హారివిల్లునందుకున్న అనందం ఆవిడకి. కానీ కోడలి దృష్టిలో ఆవిడ జీతం, బత్తెంలేని పనిమనిషి అవిడ కదిపిడుగుపాటు, “అదే ఆవిడ కూలిపోయిన సామ్రాజ్యం”. గ్॥
పిల్లలని సహజంగా వాళ్ళమానాన వాళ్ళని పెరగనివ్వాలి. అంతేగాని తమ భావాలకి, కోర్కెలకు అనుగుణంగా మూసెలో పోసి తయారుచేస్తే ఫలితం ప్రతికూల మవుతుంది. తల్లి కూతుర్ని తన ఆశయాలకీ, ఆశలకీ అనుగుణంగా పెంచుతుంది. కూతురు తన ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. తప్పటడుగులు వేస్తుంది. తన సుఖం, సంతోషం తన ఇల్లే - హోమ్ స్వీహోమ్ -అని తెలుసుకుంటుంది -తల్లి ఆదరిస్తుంది “మాతృ(పేమ”కదా!
అమ్మానాన్నలకి ఒకృర్తే కూతురు. ఆ కూతురు కోసం కొండమీది కోతైనా తెల్చిస్తామంటారు. వాళ్ళగారాబం పరిథి అంత ఎత్తు. వాళ్ళ ప్రతీపైసా ఆ అమ్మాయి కోసమే అన్నట్లు వారుంటారు. వాళ్ళ డబ్బు ఎప్పటికీ తనదే అనే మితిమీరిన ధీమాతో అ అమ్మాయి ఉంటుంది. రిటైరవుతారు తండ్రి. అయినా తన ఖర్చులకి తల్లిని లక్షలు అడుగుతుంది. వాళ్ళ డబ్బుఇబ్బందులు ఆ కూతురికి పట్టవు. ఆ అమ్మాయికీ, అమ్మకీ మధ్య బంధం ఆప్యాయత, అనురాగం కాదు - ఆర్థిక బంధం. అది ఆ తల్లి “తెలిసి చేసిన తప్పు”.
మొగుడూ పెళ్ళాలన్నాక సినిమాల్లోలాగా డ్యూయెట్లు పాడుకోరుగా.. కాసేపు చిర్రుబిర్రులాడుకుంటారు. కాసేపు నవ్వుకుంటారు. ఎవరూ ౫౧1016 చెప్పిన '200901418 ?9గ661 గ౫౧ ఉందదు. ఒకసారి ఒకరిది తప్పైతే, మరొకసారి మరొకరిది. సంసారం అనే బండి లాగించడానికి సర్దుబాటు ఓపిసరు సహనం కావాలి. లేకపోతే శీలూడి చక్రం పడిపోతుంది. ప్రేమించే, తెలివితక్కువతనంతో కాపరంలో నీళ్ళుపోసుకున్న తల్లి కూతురు జీవితం తనలా కాకూడదని విరిగే కాపరాన్ని అతికిస్తుంది. ఆవిడ పదేపదే అనుకోనేది అది “నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు.”
కథలకి కొన్ని టైటిల్స్ అంతగా నప్పినట్లు లేవు. సూచన ప్రాయంగా రాసివుంటే బాగుండుననిపించింది. కొనిచోట్ల పాత్రలని ౧0౮1 ౧1౦63 గా చేసుకొని తన భావాలని చెప్పటానికి ఒక వేదికగా చేసినట్లనిపిస్తుంది. అప్పుడు కథ 0164664 ఉంటుంది.
కథలన్నీ చాలా బాగున్నాయి. వస్తువు వివిధ రీతుల్లో ఉండటంవల్ల పాత్రలూ, వాతావరణమూ, [కథకు సంబంధించినది), భాషా, కొత్త అందాలతో అలరించాయి.
॥114
భానుమతి కొన్ని పదగుంఫనాలనీ, పదాల కూర్చులనీ, వాక్యాలనీ అందంగా కూర్చింది... మచ్చుకి £ 'సంపదల కత్తులు” (మకరపట్టు, ఉభయచేతులా, అన్నట్టు, సంస్కృతం తెలుగూ కలిపిన సమాసం. కానీ భావం బాగుంటుంది).
“ప్రీ స్వాతంత్ర్యం కొబ్బరికాయ అటక ఎందుకు ఎక్కుతోంది?'
'అగాధాలనిశ్ళబ్దం' “కొట్టెక్కబుట్టలు” - ఇవి కోనసీమలో ఒక వర్గంవారు చేసుకొనే ఇట్లాంటి పిండివంట. పనసాకులతో త్రికోణాకారంతో చేస్తారు.
మనదేశంలో ఆడవాళ్ళు విగ్రహాలు మాత్రమే. పూజచేయదానికి పనికొస్తారు. ప్రేమించడానికి కాదు. “ఎవరిమాటలు వాళ్ళే మింగటం అంత అజీర్ణం మరొకటి లేదు”. ఇలాంటివెన్నెన్నో
ఒక చక్కటి కధల సంపుటి చదివాంమన్న తృప్తి, హాయి కలుగుతాయి భానుమతీ కథలపుస్తకంలో. భావం, భాషా పోటీ పడుతూ కధలని పరుగెట్టిస్తాయి. %
అభిప్రాయం = కొమ్మునావల్లి గణవతిరావు న్రీల వ్యధల్ని వ్యాద్యమైన కదలుగా మలచడంతోబాటు, ఓడిపోయాననుకునే నాయకపాత్రల్ని భానుమతిగారు ప్రతి ఇంటి బహుమతి. ఈ కథల సంపుటి అనేటంత మంచిస్థాయిలో రాయగలిగారు. గ
కృతజ్ఞతలు
ఏ కళకయినా వెలితిలేని నిండుదనాన్ని ఆపాదించడం సాధ్యం కాదు. దోషాలు లోపాలు ఉంటాయని తెలుసు. నేను అందుకు భిన్నం కాదు కాబట్టి క్షమిస్తారని అనుకుంటున్నాను.
ఆదర్శాలు వల్లివేస్తూ ఊహలో తెలిపోయే భావాలతో రాసినా వుస్తువుని యిచ్చిన సమజూనికి, వార్తాపత్రికలకి సదా బుణపడి ఉంటాను.
నేను రాయగలను అన్న నమ్మకాన్ని కలిగించిన పట్రికలవాళ్ళకి కృతజ్ఞతలు. బహుమతులు రాకపోయినా ప్రోత్సాహక బహుమతులు పొందిన కొన్ని కథలు యిందులో చోటుచేసుకున్నాయి.
అన్ని విధాలా సహకరించిన కుటుంబ సభ్యుల అభిమానంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా
కోరగానే, ఓరిమితో పున్తకంమీద అభిప్రాయం _రాయడానికి ఒప్పుకున్న గౌరవనీయులు, నేను అభిమానించే మల్లాది వెంకట కృష్ణమూర్తిగారికి, అబ్బూరి ఛాయాదీవిగారికి, శారదా అళోకవర్ధన్‌గారికి, అరుణా వ్యాస్‌గారికి, కొమ్మనాాపల్లి గణపతిరావుగారికి నా కృతజ్ఞతలు.
చివరిగా, సకాలంలో పుస్తకాన్ని ముద్రించి ఇచ్చిన దీప్తి టెక్సికలర్ ప్రీంటర్స్‌వారికి నా కృతజ్ఞతలు.
= గంటి భానుమతి
నా
ఇదే ధర్మమా? 'బాబు,శంకరం,
మీనాన్నగారు నీమీద బెంగతో మరణించినారు. కర్మకాండలు కాశీలో జరుపుటకు నిశ్చియించినాము. నీవు ఎక్కడున్నా ఈ దిగువ యిచ్చిన అ(డ్రసుకు ఎనిమిదో తారీఖునాటికల్లా రాగలవు. డబ్బు గురించి దిగులు పడకు. పరిస్టితి అంతా సద్దుకుంది. ఇక్కడ నిన్ను ఎవరూ ఏమీ అనరు.
నీతల్లి, మేనమామలు నీభార్య, పిల్లలు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు.
అన్ని పేపర్లో ఫొటోతోసహ వేయించి, మావగారు పోయిన నాలుగోరోజున అస్థికలు తీసుకుని అమలాపురంనుంచి రాజమండ్రి వచ్చి, అక్కణ్ణించి విజయవాడ, అక్కడ కాళీ వెళ్ళే రైలెక్కాము.
“నేను కాశీ ఎలాగూ చూళ్ళేదు. కనీసం నా బూడిదైనా గంగలో కలపండి" అని పోయేముందు మావగారు అన్నారు. 'అలా అవుతే .... కాశీ వెళ్ళాల్సిందే లేకపోతే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. “డబ్బుకోసం చూడకండి ఆమడిసి ఉన్నన్నాళ్ళు కాశీ వెళ్ళాలని... ఊ... ఏక.... కొట్టుకుపోయారు. వెళ్ళాల్సిందే. శంకరం వస్తే వాడి ధర్మం వాడు నిర్బర్తిస్తాడు. లేదా! భాస్మరం ఉన్నాడాయో! ఎలాగు ఒడుగు కూడా అయిందాయె! “ఇంతకీ శంకరం ఉన్నాడంటారా!”
పేకాట్లో డబ్బు పోగొట్టుకున్నాడు గదా! అంతె. మరిటు రాందే! అట్నించి అటే పారిపోయాడు. ఇప్పటికి నాల్గు నెల్లయింది.”
“ఉన్నాడుట మా పాలేరు సూరిగాడికి ఆ మధ్య అప్పన్నపిల్లిలో, వెంకన్న బాబు గుళ్ళో కనపడ్డాట్ట. సూరిగాడు అన్నాట్ట కూడా, బాబూ, మీనాన్నగారి వొంట్లో బాగోలేదండి మీరొచ్చీండని,'నూ పద, నే వెనకాలేవొస్తా' నన్నాట్ట." “వాచ్చాడామరి!”
“ఏడీ, రాందే!”
“ఓ చదువా, దిబ్బా! వెధవది నోరిప్పితే ఈ కోనసీమ తెలుగుతప్ప మరో భాషయినా రాదాయే. ఇక్కడే ఏ లంకల్లోనే ఉండి ఉంటాడు. మరో నెలయితే అన్ని రోగాలు కుదుర్తాయి అయ్యగార్మి ఆపళంగా యుంటికొచ్చీడూ.”
“ఓ బాద్దెతా! ఏవన్నానా! వాడికేం? ఎం చేసినా చెందినా దీంది. పాపం. నాలుక లేదు నోట్లో, నగుం ఏత్తకుండా ఎంత పనయినా చేసెస్తుంది. ఏమిటో దేవుడు చంచివాళ్ళకే పరీక్షలు పెద్దాడు.”
యిలా అందరి మాటల మధ్య కాశీకి ప్రయాణం కట్టాం మేమంతా.
కలలు కనడానికే పనికొస్తాయి. నిజం కావడదానిక్కాదు అని శంకరంతో పెళ్ళాయ్యాకా తెలిసింది.
స్రీ స్వాతంత్ర్యం కొబ్బరి కాయల అటక ఎందుకెక్కుతోంది? అన్న విషయం మీద ఓ పోటీలో పాల్గోని నా వాక్ స్వాతంత్రానికి ఓ గుర్తింపు తెచ్చుకుని పైజు తెచ్చుకున్నాను, కానీ, ఆ స్వాతంత్ర్యం అంతవరకే. పోటీలు వేరు జీవితం వేరు. థియరి ఎంతబాగా వచ్చినా ప్రాక్షికల్స్‌లో ఓడిపోతున్నాను సినిమాలు చూసి, పుస్తకాలు చదివి, పెళ్ళి గురించి, మొగుడిగురించి ఏన్నో ఊహించుకున్నాను. ఊహలు వాస్తవాలుకావడం నాలాటి బీదవాళ్ళకి అందనిపళ్ళే. తల్లి ఎప్పుడో పోయింది. తండ్రికి అన్నయ్యలు చదువులు అక్కల పెళ్ళిళ్ళు చేసేప్పటి ఉన్న ఇల్లు తప్ప, కొబ్బరి, ఊడ్పు కూడా పోయాయి. అక్కడా ఇక్కడా దింపులు తీయించడం, వదులు రాయడం ఇలాంటివి చేస్తూ కాలం వెళ్ళబుచ్చేస్తున్నారు.
అలా వెళ్ళిపోతున్న జీవితంలో నాతండ్రీ హఠాన్మరణం నేనూహించలేదు. పెద్ద దెబ్బ, నాన్నగారు పోయిన రోజున.... కాకినాడలో ఉన్న పెద్దన్నయ్య, హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరున్నయ్యలు, యలమంచిల్లో ఉన్న పెద్దక్క బండార్లంకలో ఉన్న చిన్నక్క వచ్చారు.
నా ప్రమేయం లేకుండా, నా ఎదురుగానే అందరూ కలిసి ఎలాగైనా నా పెళ్ళి చేసెయ్యాలని నిశ్చయించేశారు.
“డబ్బు లేదు, కానీ, పెళ్ళి చెయ్యాలి. నాన్నగారుంటే అది వేరే విషయం. ఆయనే ఏవో తంటాలు పడేవారు. కానీ యిప్పుడు ఎలాగా! ” వేళ్ళని పెదాలకానించుకుని ఊపుతు అన్నాడు.
“నాకు పెళ్ళి వద్దు. నేను పెళ్ళి చేసుకోను. నాలుగునెల్లుపోతే రెండో సంవత్సరం అయిపోతుంది. ఆ తరువాత ఒక్క ఏడాదేగా! నా వి.కాం.అయిపోతుంది. నేనుద్యోగం చేసి...”
'డబ్బు సంపాయించేసి.. ఊళ్ళు ఏలేసి... వ్యంగ్యంగా అంది రెండో అక్క
“నవ్వూరుకో” అంటూ అక్కని కనీరి నావైవుకి తిరిగాడు. “నతే, చదువుకుంటానంటున్నావ్! ఎక్కడుంటావేంటీ అన్నాళ్ళు?” ఊహించని ఈ ప్రశ్నకు నేను సమాధానం వెతుక్కోడానికి చాలాసేపే పట్టింది.
“మీ ఎవరి యింట్లోనైనా....”మెల్లగా అన్నాను.
అందరూ నిశ్శబ్దంగా నాకేని చూస్తూండిపోయారు. ఏడో అనకూడని మాటన్నానా!
“చూడు, మధు! నీమీద మాకే కోపం లేదు. కానీ, మనలాంటి దిగువ మధ్యతరగతి జీవితాలు డబ్బుతో ముడేసుకుని ఉంటాయి. మా బొటాబొటి జీవితాల్లోకి ఇంకో మనిషి ఉండటం అన్నది మొయ్యలేని బరువు. నీ తోడబుట్టినవాళ్ళు చెడ్డవాళ్ళని అనుకోకు. పరిస్థితి అలావుంది. నువ్వు అర్ధం చేసుకోవాల్సిందే.” పెద్దక్కయ్య కలగ చేసుకుంది.
“బ్వహ్ర ద్రాన్తో మాట్లాడి లాభంలేదు. సాయంత్రం కుంటి కాంవన్న మేష్టార్ని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను. ఈ పక్క పేరి వాళ్ళకి చుట్టంట, గోత్రం కలిసింది. మూలా వాళ్ళు పిల్లాడిపేరు శంకరం. ఇరవయి రెందేళ్ళుట.' పెద్దగా చదువుకోలేదుట. భద్దిర్రాజుగారి కొఖ్బరికాయలకొట్లో పద్దులు రాస్తాదుట. దింపులు తీయిస్తూంటాడుట. ఇతనే పెద్ద కొదుకుట. ఈ పిల్లాడి తర్వాత మరో నలుగురున్నారుట. తండ్రి సోంవైలుగారికి పౌరోహిత్యమట. పెద్ద యిల్లు. ఐదెకరాల కొబ్బరి, మూడెకరాల వరి పిల్లాడు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి కట్నం అదీ ముఖ్యం కాదన్నారట.”
“అయితే ఇంకేం! చేసేద్దాం. దాన్నిల్లా అత్తవారింటికి పంపేసి మనం మన ఇళ్ళకెళ్ళిపోదాం.”
వె
“త్రూ .. తూ... మంత్రం పెళ్ళి చేయించినా ఓ ముప్పై వేలయినా లేకపోతే పెళ్ళి కాదు. పోనీ ఇల్లమ్మేద్దాం %?
“నేను ఈ పెళ్ళి చేసుకోను”గట్టిగా ఏడుస్తూ అన్నాను.
“నోర్ముయ్! చేసుకోదుట పెళ్ళి. పెళ్ళి చేసుకోక ఏం చేస్తావ్!”
“దాన్ని అడగడం ఏంవిటీ? ఇదిగో మధూ! ఈ పెళ్ళి చేసుకోవాలి. లేకపోతే ఛావు. అంతే కానీ, మా ఇళ్ళకి వస్తానని అనకు...” నాలిక్కరుచుకుని “పెళ్ళయ్యాకా, రా” అని అన్నాడు చిన్నన్నయ్య,
“నువ్వు చదువుకున్నావు. శంకరం చదువుకోలేదు. ఇదే నీ అభ్యంతరం అయినా ఈ పెళ్ళి జరుగుతుంది జీవితం నీ చేతుల్లోనే ఉంది. సుఖం.దుఃఖం, అన్నీ కూడా ..నీ ఇష్టం తెలివి ఉపయోగించుకో”.
“దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈనకి సెలవు లేదు. ఓ వారంలో అన్ని జరిగిపోతే మేం వెళ్ళిపోతాం. పిల్లల్ని వదిలి వచ్చాం. ఎన్నాళ్న్లంటాం యిక్కడ?”
అందరూ కలిసి నాన్నగారి మాసికం లోపు నా పెళ్ళి శంకరంతో చేశారు. 'హమ్మయ్య' అనుకున్నారు. బాద్యత తీరిపోయింది. కన్యాదాన ఫలం దక్కింది అనినా తోబుట్టువులూ, ఊళ్ళోవాళ్ళు కూడా అనుకున్నారు. సంతోషించారు కూడా.
ఆ మార్నాడే అత్తగారింటి కొచ్చాను. ప్రతీ మనిషికి స్వభావాన్ని ఐట్టి, తన సంస్కారాన్ని బట్టి, తన భార్యను గురించి, ఓ ఆశ, ఓ ఊహ, ఓ కల ఉంటుంది. కానీ, శంకరానికదేం లేదు. పేకాట అతని జీవితం. పొద్దున్నే బుచ్చాయమ్మగారింట్లోని మెస్‌లో ఇడ్డెన్లు తినేసి మధ్యాహ్నం ఒంటిగంటకి బోయినానికి వస్తాడు. వెళ్తాడు. రాత్రి ఆరు, ఏడు ప్రాంతాల్లో వస్తాడు. గుడి అరుగుల మీద, పోలం గట్లమీద, పొలంలోని పాకల్లో ఎక్కడో అక్కడ పేకాడి, డబ్బు పోగొట్టుకుని ఆ కోపం ఇంట్లో నామీద చూపిస్తాడు. రోజుకి ఎన్ని వెధవల్ని, వెధప్పీనుగుల్ని చేస్తాడో లెక్కలేదు. పరాయి వాళ్ళున్నాసరే, తిట్టేస్తాడు. మొదట్లో ఏద్బేదాన్ని. ఆ తర్వాత ఆ అవమానాలు అవీ అలవాటయిపోయింది. అది వేరే విషయం.
చదువుకొనే రోజుల్లో ఎంత అభిమానం ఉండేది! ఎవరైనా ఏదైనాఅంటే ఎంత పౌరుషం వచ్చేది! మీద పడి కరచినంతగా చేసి దెబ్బ లాడేదాన్ని? ఏది ఆ అభిమానం? అ పౌరుషం ఏదీ? ఎందుకు పడుతున్నారు? ఎదిరించలేకపోతున్నా నెందుకు? ఇదేం పెళ్ళి! ఇదేం జీవితం! ఇంతేనా?!
జ
నా నిస్సహాయత్వం నా నోరు మూసేసింది. నా భయం నా పౌరుషాన్ని చంపేసింది. తల్లితండ్రి లేకపోవడంతో అభిమానం కూడా పోయింది. ఆర్థికస్వాతంత్ర్యం లేకపోవడం, తోబుట్టువులతో సంబంధాలు గాజుముక్కల్లా ఉండడం నా మొగుడికి నచ్చాయి. వెధవప్పీనుగ ఎక్కడికి పోతుంది! అది శంకరం ధీమా.
ఏదో కాపురం చేశాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. మా అత్తగారే నాకు అమ్మగా మారిపోయారు. నన్ను నా పిల్లల్ని మిగిలిన పిల్లల్తో బాటు తన కొంగుకింద లాక్కున్నారు. అవిడొక్కరే చిన్న ఒయాసిస్సు నా జీవితానికి.
“అమ్మా! ఆకలి” కుదుపుతున్న పిల్లల్ని చూసి ఉలిక్కిపడ్డాను. కిటికీకి గాజు తలుపువేసి పిల్లల్ని కూచోపెట్టి అత్తగారి దగ్గరికెళ్ళాను.”
“పిల్లలిద్దరూ ఆకలంటున్నారు...”
“పనస బుట్టలున్నాయి కదమ్మా! నన్నడగాలా! అమ్మలూ! అ కొట్టెక్క బుట్టలు తీసి వీళ్ళిద్దరికి పెట్టు. అన్నయ్యలు మాంవయ్యలు తింటారేమో కనుక్కోండి. మాధవీ! కొబ్బరికాయి మాంవిడికాయి పచ్చడి, కొత్తావకాయి సీసాలున్నాయి అందరికీ అవి తీసి పెట్టెయ్యి.”
“మజ్జిగ తెచ్చావామ్మా, మాధవీ?”
“తచ్చాను బాబాయి.”
“దాహం వేసేస్తుంది ఈ పనస బుట్టలు ఓ గ్లాసుడు మజ్జిగియ్యి,” ఆ తర్వాత మేం కూడా తినేసాం. ఎవరి బెర్తులు వాళ్ళకి సర్ది, నేను చిన్నాడి పక్కన సద్దుకున్నాను.
కిటికీలోంచి చల్లటిగాలి వీస్తోంది.
నేను అలాగే కళ్ళు మూసుకున్నాను. నిద్ర గగన కుసుమమే. శంకరం వెళ్ళిపోయాకా భవిష్యత్తు మీద భయం నిద్రని దూరం చేసింది. మనసు పొరల్ని విప్పుతోంది.
ఓ వైశాఖమాసం, పెరట్లో మొగ్గలుకోసి, గిన్నెలో నీళ్ళుపోసి అందులో వేశాను. మండువాలోని దక్షిణంవైపు పడిమీద కూచుని రెండుకాళ్ళు మండువాలోకి దింపాను. పక్కనున్న గంతలోంచి గాలివీస్తోంది.
నీళ్ళల్లోని మొగ్గలు చేపపిల్లల్లా వేళ్ళమధ్య జారిపోతూంటే అదోరకమైన అనందం అనుభవిస్తున్నాను.
శ్
“ఏం చెవుడా!” ఉలిక్కి పడ్డాను
“ఎప్పుడొచ్చారు?”” నాలుగు రోజులడ్రీతం కాకినాడ వెళ్ళాడు శంకరం.
“ఏం అంత మైమరపు! మెొగుడింటికొస్తే గమనించలేదంటే, రేపు ఏ దొంగాడొచ్చి ఇల్లు దోచేసినా అంతేకదా! మంచినీళ్ళు”
దుర్వాసులవారు, విశ్వామిత్రులవారు శంకరాన్ని తొందరగా ఆవహించేస్తారు.
మాల కడ్లూన్న ఆనందం వీస్తున్న గాల్లోకి ఆవిరి అయ్యి కలిసిపోయింది. నిశ్శబ్దంగా లేచి మంచినీళ్ళందించాను.
గ్లాసంరిస్తూ నా మొహంలోకి ఓసారి చూశారు.
“కాకినాట్నుంచి ఫిష్ కాజాలు తెచ్చాను. అన్ని తిలేయకండి. రాత్రికి నాకు అట్టేపెట్టు”. కళ్ళెగరేస్తూ వెళ్ళిపోయాడు. “మల్లెమాల కడ్డ్తున్నట్టున్నావు. అది కూదా...”
ఆ శ్లేష అర్థం కానంత వెర్రిదాన్ని కాదు.
ఛీ! నా జీవితం ఎంత చీప్! ఒక్కరోజున కూడా మంచిగా, నవ్వుతూ మాట్లాడడా? నా మనసులోకి తొంగిచూసాడా! నా ఆలోచనలు, అభిరుచులు, కోరికలు, ఊహలు తెలుసుకోవడానికి ప్రయత్నింవాడా! శుష్మజీవితం అంటే నాదే!
శంకరానికి రాత్రిళ్ళు మాత్రనే నేనందంగా కనపద్దాను. మిగిలిన టైములో నేను వండిన కూరల్లోనో, పచ్చళ్ళల్లోనో, పిల్లల ఏడుపు మొహాల్లోనో నా దరిద్రపు మొహం కనబడ్డుంది.
గృహిణిగా, భార్యగా, వంటామెగా, పిల్లల తల్లిగా మానసికంగా ఓడిపోయాను. అయినా జీవితం గడిపేస్తున్నాను.
ఒక్కోసారి అనిపిస్తుంది. నేనెందుకు చదువుకున్నాను? పరిశీలనగా ఆలోచించే శక్తి నాకెందుకుంది? అవేవీ లేకుండా ఉంటేనే బావుంటుంది. జీవితం అంటే! ఇలాగే ఉంటుందని సర్దుకుపోయోదాన్ని. అబద్దపు జీవితం గడిపేస్తున్నాను. నాది దొంగనీతి. దొంగబతుకు. ముసుగు బతుకు. ఎప్పుడో కళ్ళు మూతలు పడ్డాయి.
కాశీలోని సత్రంలో దిగిన కొద్ది సేపటికే శంకరం వచ్చాడు. అందరూ అన్నీ మర్చిపోయారు. ఈ నాలుగునెల్లు ఎక్కడికెళ్ళావ్? పెళ్ళాం పిల్లల్ని వొదిలేసి వెళ్ళడానికా నువ్వు పెళ్ళి చేసుకున్నది? ఎందుకెళ్ళావ్? లాంటి ప్రశ్నలు ఎవరూ అడగలేదు. శంకరాన్ని చూడగానే అంతా ఏద్చేశారు. శంకరం కూడా గంభీరంగా ఉండిపోయాడు. పెద్దకొడుకుగా తన బాధ్యత నెరవేర్చడానికి సింసిద్దుడయ్యాడు. 6
ఇదే నేను, ఈ శంకరం మీట విసుగొచ్చి, ఏడ్చి బాధతో ఓ నాలుగునెల్లు వెళ్ళిపోతే.. తిరిగి . వస్తే వీళ్ళంతా ఇలాగే ఉంటారా? ఎక్కడికెళ్ళావ్! శరీరం పవిత్రంగానే ఉందా! శీల పరీక్ష పెట్టడం ఎలాగా! అనే ఆలోచనల్లో మునిగి ఉండరా!
నాతో మాట్లాడ్డానికి ప్రయత్నించాడు. కానీ, అవకాశం యివ్వలేదు అన్ని కార్యక్రమాలు అయ్యాకా అలహాబాదులో రైలెక్కాము.
శంకరం నా ఎదురుగానే కూచున్నాడు
“చాలా సన్నబడ్డావు”
వినపడనట్లు, నన్ను కానట్లు బయటికి చూస్తుండిపోయాను.
ఈ నాలుగు నెల్లు అందినంత అప్పుచేసి యిల్లు వదిలి వెళ్ళిన మనిషి ఇదా, ఇల్లాగా అడగటం! భర్తగా ఆయన స్పందన ఇంతేనా! నా గురించి మంచి మాటలేదా! ఎలా నడిపావు సంసారాన్ని? పిల్లల్ని. పెద్దల్ని ఎలా సమర్ధింకుంటూ వచ్చావ్? నన్నసహ్యించుకున్నావా! ఏ పరిస్టితిలో యిల్లు వదిలానో నువ్వు అర్ధం చేసుకో”అని అంటే...
ఛ! ఏంవిటీ మనిషి? ఏం మొగుడు!
ఈయనకోసం శ్రావణమాసం నోములు, అట్లతదియలు, అన్నీ చేసానే! ఎందుకు చేసాను?
ఎక్కడికేనా ఓ నాలుగురోజులు ఈ మనిషి నుంచి ప్రస్తుతానికి వెళ్ళిపోతే బావుణ్ణు లేకపోతే యింటికెళ్ళాకా ఈయన పక్కన పడుక్కోవాలి! మూసిన రెప్పలక్రింద ఆయన మీద అసహ్యం ఉందో, అయిష్టం ఉందో, కోపం ఉందో తనకకృట్లేదు. నామనసు, నా భావాలు, నా ఆవేశం నా స్వాధీనంలోకి వచ్చేవరకు అయినా ఫర్వాలేదు. అడదానికి అత్తిల్లు, పుట్టిల్లు తప్పితే మరో యిల్లు రక్షణ నిచ్చేది ఏంవైనా ఉందా! నన్ను కొన్నిరోజులు ఎవరుంచుకుంటారు! అన్నయ్యలో, అక్కయ్యభదగ్గరికి... కేవలం కొన్ని రోజులు మాత్రమే.
తల్లితండ్రి ఉన్నప్పుడే అది పుట్టిల్లు. లేకపోతే అది పరాయిల్లే. శంకరం యింట్లోంటి వెళ్ళిపోయిన రెండురోజులకి దగ్గర్లో ఉన్న పెద్దన్నయ్య యిద్దరక్కయ్యలు వచ్చారు.
ఓ రెండు రోజులపాటు వాళ్ళ యిళ్ళకి తీసుకెళ్తారేమోనని అడిగాను.
“యిలా అంటున్నాని అనుక్కోకు. చిన్నప్పుడు అందరం ఒక్కచోట పెరిగినా పెద్దయ్యాకా, అందులో పెళ్ళయ్యాకా, ఎవరి జీవితాలు వాళ్ళవే. నాకు నా పిల్లలు, నా
7
కుటుంబం ముఖ్యం. దీనికి స్వార్ధం అని పేరు పెట్టకు. లోకం తీరు అనుక్కో ఏవైనా నీ యిష్టం. అలా జాలిగా చూసి నన్ను కట్టెయ్యకు. ప్లీజ్...నా వీక్నెస్ నాకుంది. దాన్ని నువ్వర్ధం చేసుకో. కష్టమో, నష్టమో, పెద్దకోడలుగా ఈ యింట్లో వాళ్ళకి నువ్వు, నీ పిల్లలకి వాళ్ళు దిక్కుగా, కలిసి ఉండిపోండి. ' యించుమించు యిదే అర్ధం వచ్చేలా అక్కయ్యలు అని అయోమయంగా ఉన్న భవిష్యత్తులోకి నాదారి నాదే అన్నట్లు చెప్పారు. యింక యిప్పుడు శంకరం వచ్చాకా అస్సలు తీసుకెళ్ళే ప్రసక్తేలేదు.
ఇద్దరు పిల్లల్ని పైన బెర్తుమీద పడుకోబెట్టి కళ్ళు మూసుకున్నాను. శంకరం సిగరెట్టు తాగడం కోసం తలుపు దగ్గరకెళ్ళినట్టున్నాడు.
మా అత్తగారు అవిడ తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు.
“సరిగ్గా సమయానికొచ్చేసాడు. పెద్దకొడుకుగా వాడి ధర్మం వాడు చేసాడు. అన్నీ సవ్యంగా జరిగిపోయిందక్కా”
ధర్మం! ఏంవిటో ధర్మం! పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోకపోవడం ధర్మమా! పేకాడేసి, అప్పుచేసేసి తీర్చలేని పరిస్థితి వస్తే ఇల్లు వదిలేయడం ధర్మమా! గుండులా ఉన్న తండ్రిని ఏడ్చించేసేంత హక్కుందా! లేకపోతే అది ధర్మమేనా!
మరి నాకు! నా ధర్మం ఏంవిటీ?
మౌనంగా, దేనిగురించి అడగకుండా జీవితం గడపడమేనా ధర్మం? పూజలు, నోములు, అభిషేకాలు, తద్దినం వంటలు చేస్తూ ధర్మపత్ని అనిపించుకోవడమేనా ధర్మం!
ఏ అన్యాయం జరిగినా ప్రతిఘటించకపోవడమేనా ధర్మం?
ఈ ధర్మాల మధ్య అభిమానం ఏనాడో చచ్చిపోయింది.
నాలా సగం సగం చదువుకున్న వాళ్ళకి నీతి, ధర్మాలు బంధాలు. నాలాటి థైర్యంలేని వాళ్ళని సులువుగా నీతిపేరుతో, ధర్మం పేరుతో బంధించెయ్యచ్చు.
'నేనీ మనిషితో ఉండను'అని అనగలనా! అది అధర్మం అవుతుందా!
నా యిష్టం నేను వెళ్ళిపోతాను అని నేను అనగలిగితే ఈ యిల్లు వదిలెయ్యాల్సి ఉంటుంది. కానీ వదిలేసి ఎక్కడికి వెళ్తాను? ఎవరాదరిస్తారు? తోడబుట్టినవాళ్ళు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. బయటి ప్రపంచంలోకి ఒకసారి అడుగు పెట్టాక నేను, నా పిల్లలు సురక్షితంగా ఉండగలమా! అదేదో సినిమాలో లాగా ఎక్కడికెళ్తే అక్కడ కుక్కలు 8
చింపేస్తే...హుం.. అంతకన్నా అభిమానించే గౌరవించే ఆడపడుచులు, మరదులు, ఆదరించే అత్తగారు ఉన్న ఈ యిల్లే నయం. ఈ బానిస బతుకే నయం...పరిస్థితికి లొంగి పోతున్నాను. 6€ ది నా దౌర్భాగ్యం. డబ్బులేని, చదువు ఎక్కువలేని నాకు స్వతంత్రం ఏం విటి? ఉలిక్కిపడ్డాను. నే వెళ్ళిపోతే...ఇల్లెలా గడుస్తుంది? అమ్మ కన్నా ఎక్కువగా ఆదరించిన అత్తగార్ని ఈ కష్ట్టమయంలో వదిలేయడం ధర్మమేనా! భర్తపోయిన దుః ఖంలో ఉన్న ఆవిడకి తోడుండడం మానవత్వం కదా! సుగరు బి.పి. రెండూ ఉన్న అవిడ కాశీలో రెండుసార్లు కళ్ళుతిరిగి పడిపోయారే, అలాంటిది ఆవిణ్ణి వదిలేయడం ధర్మం అనిపించుకుంటుందా! హుం... ఓ అత్తగారిగా కాకుందా, అమ్మలా నన్ను అన్ని సమయాల్లోనూ నన్ను ఆదుకున్న ఆవిడకి ఓ కూతురిలాగానే నేను ఆవిడ పక్కనుందాలి. వీళ్ళ దగ్గరుండి డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం చూసుకునే లోపు శంకరం మార్తాడు. ఇంటి బాధ్యత మనిషి మార్చేస్తుంది. అంతవరకూ నేను మానసికంగా బాగా ఎదగాలి. అ తర్వాత ఆలోచిస్తాను శంకరాన్ని వదిలేయాలా, వద్దా, అని. అ శక26ర్ఫా రోంద్రు వసు నజ లారీరర్తిత ఈ ల్రుళిళ్ళి ం
చిరంజీవి శతాయుష్న
ఆపరేషన్ థియేటర్ ముండు చాలామంది వున్నా శృశాన నిశ్శబ్దం. అచేతనంగా సుందరమ్మగారి మీద వాలిపోయి, మూసుకున్న తలుపులకేసి ఆశగా చూస్తోంది నీరజ.
కళ్లముందు అగాధాల చీకటి. కొన్ని వందల అమావాస్యల చీకటి.
జీవితానికి ఆశలు కల్పించిన యశ్వంత్, ఆ మూసిన తలుపులు వెనకాల ఒంటరిగా మృత్యువుతో పోరాటుతున్నాడు.
జీవితం ఇంత చిన్నదా!
తన కళ్లముందు ఏక్సిఎడెంట్! యశ్వంత్‌కే ఎందుకు జరగాలి?
ఒక్క క్షణంలో ఎంత మార్చు!
రెండు గంటల ముందు యశ్వంత్‌కి ఇప్పుడు యశ్వంత్‌కి ఎంత తేడా? యశ్వంత్‌కు ఏమయినా అయితే? ఆ ఊహ చాలా భయంకరంగా వుంది.
'దేవుడా! యశ్వంత్‌ని కాపాడు. బతికించు. నాకు జీవితంలో ఉన్నది యశ్వంత్ ఒక్కడే. ఇద్దరం కూడా అందరికీ దూరం అయ్యాం. నాకు ఎవ్వరూ లేరు. యశ్వంత్‌ని బతికించు' కళ్లు మూసుకుంది.
కళ్ళు తెరిచినప్పుడల్లా రెప్పల అడుగున నీటిలో జీవితం మసక మసకగా అగమ్యంగా కనిపిస్తోంది.
కళ్ళు మూసుకుంది. అంతకు ముందురోజు సాయంత్రం టాంక్‌బండ్ దగ్గర గడిపిన క్షణాలు గుర్తుకొచ్చాయి నీరజకి.
10
అర వెలుగు .అరచీకటి...
వీస్తున్న గాలికి ఎగిరిపోతున్న జుట్టుని సవరించుకుంటూ రంగు మారుళ్ను నీళ్లని చూస్తూ చుంచున్నారు యశ్వంత్, నీరజ.
“సత్యాన్ని కనుక్కున్నాను” హరాత్తుగా అన్నాడు.
పకాలున నవ్వింది నీరజ,
“భీక్సు తెలుసో లేదో కానీ సత్యాన్వేషికి సమాధానం స్క్వేర్ రూటాఫ్ మైనస్ వన్. మరి నువ్వు కనుక్కున్న సత్యం ఏమిటో?”
“అబ్బా! నీరజా! నన్ను ఎటో లాక్స్కెళ్లకు. మనిద్దర్ని మనవాళ్ళు వెలివేయడానికి కారణం?”
“ఓయబ్బో! పెద్ద సత్యాన్ని కనుక్కున్నావు. కొండంతా తవ్వి ఎలుకని పట్టినట్లుగా ఉంది నీ సత్యాన్వేషణ. నీ సత్యాన్ని ఏ చిన్నపిల్లాడ్ని అడిగినా చెప్పేవాడే. మన కులాలే కారణం ఆసంగతి నీకు తెలీదా?"
“ఈ కులాలన్నీ మనుషులు సృష్టించినవే. మనం వీటికి అతీతంగా ఉందాం. మనిద్దరం మనుషులం, మానవులం. మనిద్దరి మధ్య ఉండాల్సిన బంధం మనిషికి మధ్యన ఉండాల్సిన మానవతా బంధం. అ బంధం ఈ జీవితాంతం తెగకుండా కాపాడుకోవాలి. అందుకు మనిద్దరం కూడా కృషి చేయాలి.”
అలా పెళ్లి చేసుకున్న యశ్వంత్ ఈ విశాల ప్రపంచంలోకి నీరజని ఒక్కదాన్నీ వదిలేసి తన దారి తాను చూసుకుంటాడా?
నిన్నటికి ఇవ్వాల్లికి ఎంత తేడా?
నిన్నటి జ్ఞాపకం కోసేస్తున్నట్లుగా ఉంది. ఈ రోజు జీవితాన్ని అర్ధం చేసుకునే జ్ఞానం అయోమయంలో పడేస్తోంది.
అంతసేపు టాంక్‌బండ్ మీద కూచుని భావిజీవితం గురించిన కలలు, ఊహలు మాట్లాడుకున్నారే.... అవన్నీ అలా గతంలోనే ఉండిపోవాలా? యశ్వంత్‌కి ఏమీ కాకూడదు!
నిశ్శబ్దంగా ఉంది కారిడార్. చాలామంది వెళ్ళిపోయారు. 1
“తలకి పెద్దగా దెబ్బ తగిలింది. ఎముకలు బాగా విరిగాయి. రక్తం బాగా పోయింది. ఆపరేషన్ చేయాలి” డాక్టర్ ఆపరేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆపరేషన్ సరిగ్గా అవుతుందా!
కళ్లముందే యాక్సిడెంట్. ఒక్క తృటిలో... అరసెకండులో చూస్తుండగానే...
ఇద్దరూ ఆఫీసు నుంచి హీరోహోండా మీద వస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అప్పుడే ఎర(లైటు పడడంతో ఆగాల్సి వచ్చింది.
“యశ్వంత్! మామిడిపళ్ళు చాలా బాగున్నాయి. నేను కొని రోడ్డు దాటి ఆ కార్నర్‌లో వుంటాను నువ్వు సిగ్నల్ క్లియర్ అయ్యాక అక్కడికి రా”అంటూ హోండా దిగి ఫుట్‌పాత్ పక్కగా వున్న మామిడిపళ్ళ బండివైపు నడిచింది.
వెంటనే శబ్దం. ఉలిక్కి పడిండి నీరజ.
“వామ్మో ! లారీ గుద్దేసింది”
“అదేంటి! ఆ లారీ అలా వచ్చి కొట్టేసింది?” మామిడిపళ్ళవాడు ముందుకెళ్ళాడు.
వెనక్కి చూసింది. అరసెకండ్...యశ్వంత్ రూపు మార్చడానికి రక్తం మడుగులో యశ్వంత్.
ఒక్కసారి పెద్దగా అరుస్తూ ముందుకు పరుగెత్తింది.
వెంటనే దగ్గర్లో వున్న మట్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఎవరో కుదిపారు.
జయంత్, మంజుల వచ్చారు. ఆఫీస్ ఫ్రెంద్స్.
“అటు చూడు...” సుందరమ్మగారు. నీరజ భుజం తట్టి తల ఊపారు.
ఆవిడ చూపించిన వైపు చూసింది నీరజ.
యశ్వంత్ తల్లి... పెద్ద జరీ అంచున్న నేత చీర...కొంగు కప్పుకున్న విధానం ఏదో గర్వాన్ని చూపిస్తోంది.
అవిడ పక్కన ఇద్దరు మొగవాళ్ళు.
పెళ్లాయ్యాక ఆవిడ దగ్గరకెళ్లినప్పుడు గుమ్మం లోపలికి రానివ్వలేదు. ఎప్పటికీ రావొద్దని, సందింధం తెంచేసుకున్నాని చెప్పినావిడకి ఇప్పుడు ఇక్కడెందుకు? ఏం పని?
అ నిజమ్మీద ఈ అబద్దం కల్చర్ కావచ్చు ఆవిడ దృష్టిలో. కులం తక్కువ వాళ్లకి సంస్కారం ఉండదన్న ఆవిడని, చాలీ చాలని ఆవిడ ఎ ఆవిడని రెండు మెట్లు కిందకి లాగుతోంది.
12
ఇన్నాళ్ల కోపం ఏమయింది? సహజంగానేఉందావిడ ప్రవర్తన? నీళ్లది సంపదల. కత్తుల ప్రపంచం. వీళ్ళు చేసే పొరపాట్లకి క్షమాషణలుండవు.
ఇన్నాళ్ళ కోపం మీద ఇప్పటి ప్రేమ ఓ బిజిన్‌స్ అవుతుందా? ఏదైనా దబ్బు. కోసమా... అన్న ఆలోచన వస్తోందా ఆవిడకి? ఇన్సూరెన్స్ కోసమా?
మనిషి శాశ్వతంకాదు. ఈ డబ్బు పరువు శాశ్వతమా!
ఏదో అలజడి... ఏదోబాధ...లోపల యశ్వంత్ ఏ విధంగా వున్నాడో...ఎదురుగా ఈవిడ. ఈవిడని చూస్తుంటే యింకా అల్లకల్లోలం, బాధ.
కళ్ళు మూసుకుంది.
ఇప్పుడు మనసుని శాంత పరచుకోవడమే జ్ఞానం.
తలుపులు తెరుచుకున్నాయి.
ఒక్కసారి అక్కడున్నవారిలో చైతన్యం.
“సారీ! ఎవ్విరిథింగ్ వెంట్ రాంగ్. బ్రెయిన్‌కి రక్తం సరఫరా సరిగా జరగడంలేదు. ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే ఖైయిన్ డెడ్ అవుతుంది. వెంటి లేటర్స్ పెట్టడానికి (ప్రయత్నిస్తున్నాం”అంటూ వెళ్లిపోయారు.
ఒక్కసారి నిశ్శబ్దం.
'వెంట్...రాంగ్"అంటే యశ్వంత్ బతకదా!
గుండెల్లో అగ్ని ప్రజ్వరిల్లింది.
లోపల యశ్వంత్ ఎలా వుండివుంటాడో ఊహించుకుంటోంది.
ఒత్తుగా ఉన్న నల్లటి జుట్టుని తీసేసి ఉంటారు. అనవాళ్ళు పెట్టి కపాలం తీస్తారు. ఈ డాక్టర్లంతా అందులో తలలు దూర్చి జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా మెల్లగా ఓ ట్రైంబాంబుని డిప్యూజ్ చేస్తున్నటులగా చేతుల్సి వేళ్లని నాజూగ్గా కదిలిస్తూ...
మళ్లా డాక్టర్ బయటకొచ్చాడు.
“డాక్టర్!” ముందుకెళ్ళింది నీరజ.
అందరూ పక్కగా నుంచున్నారు.
“సారీ! ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయాం. అదే చెప్పాను కదా. రక్తం సప్లై అవలేకపోయింది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఆయనున్నారు. ఆర్గన్స్ అన్నీ పని చేస్తాయి. కానీ మరణించినట్లే లెక్క..”
న్
ఒక్కసారి మొద్దుబారినట్లుగా అయిపోయింది.
అలలన్ని అలా పైకెగిసి ఆగిపోయినట్లు అనిపించింది. కళ్ళు తిరిగిపోతున్నట్లుగా అనిపించి అలాగే ఒరిగిపోయింది.
“నీర్రూ,.. నీరజా!”
జీవితం ఇంత తొందరగా ముగిసిపోతుందా? కళ్లముందే...నా కళ్లముందే అంతా అయిపోయింది.
ఎన్ని కలలు...ఎన్ని ఆశలు... ఈ జీవితొన్నించి ఆశించాము. అన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోయాయి. మా ప్రమేయం లేకుండా జీవితం ఎలా కరిగిపోతోందో!” అనుకుంది నీరజ.
లోపలికెళ్లింది నీరజ ధైర్యం తెచ్చుకుని.
తలనిండా కట్లు, ట్యూబ్‌లు, రక్తం వున్న బాగ్.
“మానిటర్ కదులుతుంటే మనిషి బతికి వున్నాడని అనుకోకండి. ఈ మిషన్ పెట్టాం కాబట్టి అవయవాలు పనిచేస్తున్నాయి. మీరిక్కడ ఉండి ఏం లాభం లేదు. ట్రెయిన్ డ్‌త్ సర్టిఫికెట్ ఇస్తాము. ఇది మెడికో లీగల్ కేసు కాబట్టి పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తుంది.
అలా మంచం మీద పడుకున్న యశ్వంత్‌ని చూస్తుంటే ఏదో ఓ క్షణూన కళ్ళు తెరిచి 'ఏయ్ నీరూ” అంటాడనిపించింది.
'యశ్వంత్ ఇంకలేడు' అన్నది నిజం కాకుండా అబద్ధం అయితే బావుంటుందని అనిపించింది అందరికి.
ఏదో మిరకల్ జరగదా! ఆగిపోతున్న జీవితాన్ని కదిలించదా? ఇళింతలోపలే ముగ్గురు డాక్టర్లు వచ్చారు. అచేతనంగా వున్న వాళ్ల దగ్గరికి ఓ దాక్టర్ వచ్చి ించున్నాడు.
“చూడండి నీరజగారూ! ఓ మనిషి ప్రాణాలు మీరు తల్చుకుంటే నిలిబెట్టగలరు!”
“నేనా...హూ...నాకే ఆశక్తి వుంటే యశ్వంత్ ఇలా ఉండేవాడా? అతడీని బతికించుకోలేనా?” ఏడుపు గొంతుతో అంది.
“ొంత్రమందిని బతికించడానికి మనుషుల చేతలు చాలు. సోమాజీగూడాలో వున్న అలకా కార్డియాక్ ఇన్‌స్టిట్యూలో ఓ యాభైయేళ్ళ మనిషికి యశ్వంత్ గుండె పెట్టాలని
[4
అనుకుంటున్నాము. మీ భర్త గుండె ఇవ్వడానికి అనుమతి ఇస్తారా? మీరు ఇస్తారన్న నమ్మకంతోనే ఈ కేస్ రాగానే మిషన్ రెడీగా ఉంచాము. ఆర్టిఫిషియల్ మెధడ్‌తో గుండెని కొట్టుకోనిస్తున్నాం. మీరు సరే అంటారన్న నమ్మకంతో...”
అంటే యశ్వంత్ గుందె కొట్టుకుంటోంది.
ఆ గుండెలో గూడు కట్టుకున్న ఆశలు, ఊహలు, ఆశయాలు అన్నీ సమాధి అయిపోవడం లేదు. రెక్కలు విప్పుకుంటాయి.తల ఊపాను.
గుండె యశ్వంత్‌ది. రూపం ఎవరిదైతేనేం? మిషన్‌తో సహా యశ్వంత్‌ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు.
“ఇది ఆఖరుసారి. ఈసారి యశ్వంత్‌ని చూడడం నీర్టీవంగా...”అని అనుకుంది.
వెళ్ళేప్పుడు ఓ విధంగా నిర్జీవి. వచ్చేటప్పుడు క్లినికల్ దెడ్. ఆరుమంది డాక్టర్లున్న బృందం వెంటనే రేడీఅయిపోయారు. జర్నలిస్టులు, రిపోర్టర్లు, ఫోటోవాళ్ళు, వీడియో వాళ్ళు... వాళ్ళ వెనక్కాలే వెళ్ళారు.
“ఆపరేషన్ సక్సెస్' అనే వరకూ అంతా అక్కడే వున్నారు.
ఇంత మంచి యశ్వంత్‌కి ఒక్క గుండేనా విలువైంది? ఆ కళ్ళు లేవా?
ఆ కళ్లతో ప్రపంచాన్ని చూసి ఏవో కలలు కన్నాడు. ఆ చూపుల్లో, అ కలల్లో పాజిటివ్ యాటిట్యూట్స్. ఆ కళ్లని అలా-ముట్టిలో కప్పేయాలా? ఊహూ...
“దాక్టర్! ఏదైనా ఐ బాంక్‌క్ ఫోనే చేసి కళ్లని తీసుకోమనండి. ఇంకా ఆలస్యం ఎందుకండీ. నా యశ్వంత్ దృష్టికి అంతం ఉండకూడాదు.”
“అయితే నీరజగాహూ! ఎంతోమందికి ఎన్నో అవయవాల అవసరం వుంటుంది. అయితే అందరూ అన్ని అవయవాలు ఇవ్వరు. వాళ్ల సెంటిమెంట్స్ వాళ్లకుంటాయి. మీరు కళ్ళు తీసుకోమన్నారు కాబట్టి చొరవకొద్దీ చెబుతున్నాను. మీవారి కళ్లేకాదు, మూత్రపిండాలు, కాలేయం, ఎముకలు... ఆఖరికి చర్మంతో సహా అవసరం వున్న రోగులు చాలామంది వున్నారు. మీ అనుమతితోనే ఈ అవయవాలన్నీ ఇవ్వడం జరుగుతుంది.”
యశ్వంత్ తల్లి ఒప్పుకోలేదు.
“డాక్టర్! యశ్వంత్‌ని మరణం ఏమీ చేయలేదు. ఏం చేయలేకపోయింది. ఎంతోమందికి తన శరీరంలోని అమూల్యమైన అవయవాలిచ్చి వాళ్లకి జీవితాన్నిస్తాడంటే
కీ
నాకు అభ్యంతరం ఏమీలేదు. యశ్వంత్ తల్లిగారు అభ్యంతరం పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పాతకాలం మనిషి తర్వాత ఆవిడే అర్ధం చేసుకుంటారు.”
యశ్వంత్‌ని మృత్యువు తీసుకెళ్లింది. అతని అవయవాలు చిరంజీవులే”.
డాక్టర్లు అన్నీ తీసుకున్నాక మిగిలినదే తీసుకునేవరకూ అక్కడే ఉండిపోయింది నీరజ. ఏ కులం వాళ్లకిచ్చారని అడగలేదు. అవన్నీ ఏమతం వాళ్లకిచ్చారు అని అడగలేదు.
“థాంక్స్ నీరజా! నన్ను అమరుణ్జి చేసావు. ఈ మృత్యువు నాపై ఓ ముసుగేసిందేగానీ నిజానికి నన్నేం చేయలేకపోయింది. ఓ మృత్యువా! నీ గురించిన భయాలు చాలా ఉండేవి. కానీ ఇప్పుడేంలేవు. కెరటం చివరి అంచు వరకు తీసుకెళ్ళావు. కానీ ఏం చేయలేకపోయావు.”
వీస్తున్న ఫాన్ గాల్లోంచి తేలుతూ, హాస్పిటల్ తెల్లగోడల్లోంచి (ప్రతిధ్వనిస్తూ, జనారణ్యంలో ఒంటరిగా ఉండిపోయిన నీరజకి యశ్వంత్ చెవుల దగ్గర అంటున్నట్లుగా అనిపించింది.
- అక్టోబర్ 2004 ఆొంధ్తభూడి వామర్రక + ఛీచుత్సు
16
జీవితాన్ని ప్రేమించు
గాలికి కిటికీ రెక్కలు చప్పుడు చేస్తుంటే తెలివొచ్చింది. మెల్లిగా కళ్ళు తెరిచాను.
పండువెన్నెల, కదుల్తున్న పల్చటి తెరల్లోంచి పుచ్చపువ్వుల్ని గదిలోకి విసిరేస్తోంది.
ఆ వెలుగులో ఎదురుగా గోడకు, సాయిబాబా పక్కనే స్థానం సంపాదించుకున్న రమేష్ ఫోటో పెద్దగా కొట్టొచ్చినట్టుగా కనబడ్తోంది.
మామగారి మాటలు చెపుల్లో ఇంకా గింగురుమంటున్నాయి.
“చచ్చిపోయిన వాళ్ళని ప్రేమించడం, బతికి వున్నప్పటి కన్నా సులువు. ఎందుకో తెలుసామ్మా! గతానికి భవిష్యత్తుకన్నా క్లారిటీ ఎక్కువ. ఫోటోలు తప్పులు చెయ్యవు. తప్పు లెన్నవు. వాదించవు .....
“రోజులు గడిచేకొద్దీ .. రమేష్ తప్పులు మనం అంతా మర్చిపోతాం. గుర్తుచేసుకున్నప్పుడు వాడి తప్పులు పెద్దగా కనబడవు. అసలు వాటన్నింటినీ మర్చిపోతాం.... అయితే దానికి కొంత సమయం పడ్తుంది. కాలం చాలా అద్భుతమైనదమ్మా! ఎలాంటి లోత్రైన గాయం అయినా మానిపోతుంది. అది కాలానికున్న మహత్తు..... అన్నీ సర్దుకుంటాయి. అప్పుడు రమేష్‌లో ఇన్నాళ్ళు కనబడని మంచితనం కనిపిస్తుంది.... వాడు మరీ అంత చెడ్డవాడు కాదు..... భార్గవీ ....
రోజులు గడిచేకొద్దీ రమేష్ మంచివాడెలా అవుతాడు? చరిత్రలో పురాణాల్లో ఎంతోమంది చెడ్డవాళ్ళున్నారు. వాళ్ళంతా మంచివాళ్లల్లాగా అయిపోయారా? మనం మంచి వాళ్లల్లాగా వాళ్లని గురించి చదవడం లేదే !
17
సమస్యల వలయంలో, అప్పుల ఊబిలో నన్ను పడేసి చిన్నపిల్లలిద్దర్నీ వయసు మీరిన తల్లిదండ్రుల్ని, వాళ్ల బాధ్యతల్ని నా మీద వేసి .. నీ తంటాలేవో నువ్వు పడు... అని వెళ్ళిపోయిన రమేష్ పలాయనవాదం .... కాలంతోబాటు మారిపోతుందా?!
గుండెమూలల్లో తడి ఆరని మమత వాళ్లని అలా అననిస్తోంది. వాళ్లకి మాత్రం బాధలేదా! భర్తగా నాకు, కొడుకుగా వాళ్లకి అన్యాయం చేశాడు. కర్తవ్యం, ధర్మం, బాధ్యత... అన్నీ కూడా మర్చిపోయాడు.
నన్ను ఊరడించదానికి ఏదో అంటున్నారే కాని, ఆయన లోపల ఎంత కుమిలిపోతున్నారో... మాసికంగా ఎంత కృంగిపోతున్నారో గంటల తరబడి మౌనంగా శూన్యంలోకి చూసే విధానంలోనే అర్ధం అవుతుంది.
రమేష్ అగ్నిసాక్షిగా నన్ను పెళ్ళాడిన రమేష్ ఇదే గదిలో ఈ తిరుగుతున్న... ఇదే ఫాన్‌కీ... నా నైలాన్ చీరతో ఉరివేసుకున్నాడు....
ఒక్కసారిగా భయం వేసింది.
ఎలా పోతుంది నా భయం !
ఒక్కసారి శిరీష వస్తే బావుండును.
ఏడవడం ఒక్కటే నాకు మందు. అందుకు శిరీష భుజం కావాలి. కరువుతీరా ఏడవాలి.
కడుపులోని బాధ, గుండెల్లోని మంట.... బయటికి రావాలి.
మళ్ళా కళ్ళకి ఫాన్ కనిపిస్తోంది.
ఫాన్‌కి వేళ్లాడుతున్న శవం రమేష్‌ది.
ఓ వైపుకి వాలిపోయిన తల
వేళ్ళాడుతూ, ఊగుతున్న కాళ్లు, ఒళ్ళు జలదరించింది.
శిరీష నాకు ధైర్యం చెప్పి అడుగు ముందుకు వేయిస్తుంది.
“ఇండియా వస్తున్నాను .... ఓ పదిరోజుల్లో నీ ముందుంటాను. అంతవరకూ ధైర్యంగా వుండు. దానికి నీ చదువుని సార్ధకం చేసుకుంటానని అనుకుంటాను.”
శిరీష ... ఇంటర్ వరకూ నా క్లాస్‌మేట్, బెంగుళూరులో ఉంటోంది. ఇంజనీరింగ్ అక్కడే చేసింది. కొలీగ్‌తో పెళ్లయింది. ఉద్యోగరీత్యా, ప్రాజెక్టు పనిమీద అమెరికా వెళ్ళింది. రమేష్ పోయినప్పుడు యిక్కడ లేదు. 18
రెండురోజుల క్రితం మళ్ళా ఫోన్ చేసింది.
“బెంగుళూరు వచ్చాను. రేపు కానీ, ఎల్లుండి కానీ నీ ముందుంటాను.”
నా మనసు నాకన్నా శిరీషకి బాగా తెలుసు. వస్తుంది. వస్తుంది. ఆ ఓక్క మాటతోనే నాకు ఏదో మూల నుంచి తెలీని స్టెర్యం వచ్చినట్లని పించింది.
చేతో తడిమి తలగడ పక్కనే వున్న గడియారం తీసి, ఆ గుడ్డివెలుగులోనే టైము చూశాను.
ఐదు.
తెల్లారుతోందన్నమాట.
శబ్దం చేయకుండా లేచి మొహం కడుక్కుని వంటింట్లోకి వెళ్లి లైటేశా. ఈశాన్యంలో వున్న దేవుడి వైపు తిరిగి దండం పెట్టుకున్నాను.
రమేష్ ఆఫీసులోనే నాకు వచ్చిన ఉద్యోగంలో చేరడానికి కావలసిన ధైర్యం యివ్వమని ప్రార్ధించాను.
ఫిల్దర్ వేస్తుంటే, అత్తయ్యగారు లేచి లోపలికి వచ్చారు.
దేవుడికి దండం పెట్టి, ఫ్రిజ్‌లోంచి పాలపాకెట్ తీసి గిన్నెలో పోశారు.
మా ఇద్దరి మధ్యా మాటలు తక్షువే.
మా ఇద్దర్నీ పోషించేది రమేషే. ఆ కామన్ రమేష్ లేడు.
ఆ మాట రమేష్ పోయిన పదమూడో రోజునే అన్నారు.
“మన మధ్య వుండాల్సిన బంధుత్వం వుందంటే వుంది. లేదంటే లేదు. నేను, మీ మామయ్యగారు వెళ్ళిపోదామనుకుంటున్నాం....
ఉలిక్కిపడ్డాను.... “ఎక్కడికి?....”
చాలా కష్టం మీద మాటలు కూడదీసుకున్నారని నాకర్థం అయింది.
“మన వైపు.... ఏదో విధంగా కాలక్షేపం చేస్తాం....”
మా ఇద్దరికీ తెలుసు. కాలక్షేపానికి సరిఅయిన అర్థం.... ఎలా గడుస్తుంది? డబ్బెక్కడుంది? మాంవ గారికి ఆదాయం ఏం ఉంది?
అందుకే ఇద్దరం చాలా సేపు ఏడిచాం. ఆవిడ ఓ స్త్రీ. నేనూ ఓ స్త్రీ అదే మా ఇద్దర్నీ దగ్గర చేసింది.
“మనమిద్దరం ఇప్పుడు అత్తాకోడళ్ళం కాదు. నాకెవరూ లేరు. ఓ దిక్కు కావాలి. మీకు ఓ ఆధారం కావాలి. నేను మీ కోడల్ని కాకపోతానా? రమేష్ లేకపోతే
19
రమేష్ పిల్లలు మీ మనుమలు కాకపోతారా? ఇన్నాళ్ళ కష్టం, నష్టం, సుఖం పంచుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే వుందాం. ఒకళ్ళకొకళ్ళం. ఓ ఆలంబన, ఆ ఆశ్వాసన.
ఇంకేం అనకుండా నా దగ్గరే వుంటామన్నారు.
శిరీషకి ఫోన్ చేద్దామని అనుకుంటూండగానే, యింటిముందు ఆటో అఆగితో వంటింటి గుమ్మం లోంచే వీధిలోకి చూశాను.
శిరీష, బ్యాగులోంచి డబ్బు తీసి దైవర్‌కిస్తోంది.
ఒక్కసారి దాన్ని పట్టుకుని బావురుమన్నాను.
ఒకళ్ల కొకళ్లం చేతులు పట్టుకుని గదిలో మంచం మీద కూచున్నాం.
“అస్సలు నమ్మలేకపోతున్నాను. భార్గవీ! రమేష్ ఇలా చేయగలడా? ఏం జరిగింది? ఆఫీసు గొడవలా? ఇంట్లో గొడవలా? .... చెప్పు....
నా గొంతు పెగల్లేదు. రెండుచేతుల్లో మొహం కప్పుకున్నాను.
చాలాసేపటి వరకూ ఏం మాట్లాడలేదు.
“అడుగుతున్నానని అనుకోకు. అసలేం జరిగింది? ముందురోజు ఏవైనా పోట్లాడుకున్నారా! ఏవైనా అన్నావా?....
విస్మయంగా శిరీషని చూశాను.
“నవ్వుకూడా ... ఇది నువ్వు అంటున్నావా! లోకం, పోలీసులు, అందరూ అదే మాట అడిగినా నేను అంత బాధపడలేదు. కానీ .... నువ్వే...”
భుజం మీద చెయ్యేసి కొంగుతో నా చెంపలు తుడిచింది.
“సారీ ..... నిన్ను తప్పు పడ్డున్నానని కాదు. అంత డ్రాస్టిక్ స్టెప్ ఎందుకు తీసుకున్నాడో .... అని కారణాలు.... జస్ట్....
ఒక్కసారి డీలాపడిపోయాను.
శిరీష కూడా నా వైపు నుంచి ఆలోచించడం లేదు.
“ఏం అంటాను? అసలేం అనగలను? నేనోటి అంటే తనేం' ఊరుకోడుకదా! యింకో నాలుగంటాడు. చేజేతులా నా మనసుని క్షోభఫైట్టుకుంటానా?”
“మరి....”
అత్తయ్య రావడం చూసి నా నోరు మెదపలేదు.
ఆవిడ మౌనంగా కాఫీ అందించి వెళ్ళిపోయింది. మా ప్రైవసీకి అద్దురాకూడదని ఆవిచకి అనిపించి వుంటుంది. 20
“ఓ పెళ్ళాంగా 'ఎందుకు?' అని ప్రశ్నించే హక్కు భార్యకి లేదా? ఊళ్లో అప్పులు చేశారు. ఎలా తీరుస్తారు? ఎందుకు చేస్తారు అప్పులు? అని అడగటం తప్పా? పరిస్థితుల ఒత్తిడికి తట్టుకోలేక నా భర్త ఆత్మహత్య చేసుకుంటే నేనెల్లా బాధ్యురాల్ని అవుతాను? నువ్వే కాదు శిరీషా! అందరు అదే అనుకున్నారు. అదే అడిగారు.
“ఏం జరిగింది? పోట్లాదావా? సాధించావా? దెబ్బలాడావా? కొట్టావా? తిట్టవా? తన్నావా? ఎంత చీప్ అయిపోయాను? నా జీవితాన్ని తెరిచేసి, నలుగురి ముందు విసిరేసి, చదువుకోండి. ఆనందించండి.... అని వెళ్ళిపోయాడు. ఒకృష్లారి దుఃఖం పెల్లుబికింది.
అత్తయ్య నీళ్ళు శిరీషకిచ్చారు. శిరీష నా చేతికిచ్చింది. నీళ్ళ గ్లాసుని. నీళ్ళు తొగి, కాఫీగ్లాసు పక్కనే పెట్టాను.
“కళ్లున్న ప్రతివాడూ చూడడం లేదా ! చెప్పు ..... కాళ్లున్న ప్రతివాడు నడుస్తున్నాడు. నోరున్న ప్రతి వాడు అన్యాయాన్ని ఎదిరిస్తున్నాడు? నువ్వు చెప్పు శిరీషా! ఇన్నేళ్ళు ఊరుకుని ఇప్పుడు అడగడం తప్పయిపోయింది. ఎక్కడపడితే అక్కడ వైన్ షాపులు, బార్‌లు, ఏదో ఓ వంక పెట్టి తాగి, ఇంట్లో ఎదుగుతున్న పిల్లల ముందు అసహ్యంగా (్రవర్తించకండి అనడం తప్పా! సిటీబ్యాంకు వాళ్లు. మరో బ్యాంకు వాళ్లు యింటికొచ్చి పోతున్నారు అలా ఎందుకవుతోంది అని అనడం తప్పా?
“ఊరుకో! తప్పు నీదీ కాదు భార్గవీ! రమేష్‌దే ..... ఏడవకు. ముందు ఏం చెయ్యాలో దాని గురించి చూడు.... ఉద్యోగం ఇస్తానన్నారా రమేష్ కంపెనీ వాళ్లు....
కళ్లు తుడుచుకుంటూనే తలూపాను.
ఈ లోపల పిల్లలిద్దరూ లేచి, బుద్దిమంతుల్లాగా, కళ్ళు నులుముకుంటూ, ఆవలిస్తూ, గదిలోంచి బయటికెళ్ళిపోయారు.
“బయట అత్తయ్య వాళ్లకి స్నానం చేయిస్తుంది, బట్టలు వేస్తుంది అన్నం పెడ్డుంది. టిఫిన్ డబ్బాలు సర్ది ఇస్తుంది. మంచినీళ్లు సీసాల్లో పోస్తుంది. మామయ్యగారు స్కూలుకి తీసుకెళ్ళారు. ఎంత బాధ్యత ఈ వయసులో తీసుకున్నారో, తల్చుకుంటే ఏడుపొస్తుంది.
“అలాగా! ఆశ్చర్యంగా చూసింది.
“ఊం .... రమేష్‌లో వున్నది ఈ రక్తమే కాదా! కాళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు మర్చిపోయి నన్ను మించి వాళ్లు చూస్తున్నారే. ఈ రమేష్‌కి ఆ మాత్రం తెలీకపోయిండదే!
21
ఈ పిల్లలు తనకేం కారా! తనకేం సంబంధం లేదా? కుటుంబం అంటే రమేష్ లేకున్నా ఫర్వాలేదనా, ఏమో శిరీషా ! వీళ్ల చదువులు .... పెళ్లిళ్ళు ..... బాధ్యతలు... కుటుంబం నా ఒక్కదానికేనా, అసలు భర్తంటే ఎవరు? భరించేవాడు కాదా?
“వెంటనంటి, అన్ని విధాలుగా తోడుండాల్సిన మొగుడు తనదారి తాను చూసుకుంటే... ఈ పెళ్ళికి విలువేం లేదా. ఈ మంత్రాలకి అర్ధం లేదా? లేకపోతే అర్ధం మారిపోయిందా?.... అంటూ” మళ్లా శిరీష భుజం మీద తల అని ఏడవడం మొదలుపెట్టాను.
“కుటుంబాన్ని చిందరవందర చేసేసాడు. అల్లకల్లోలం చేశాడు”.
“ఊరుకో! భార్గవీ... ఎంతసేపు ఏడుస్తావు..... ఊరుకో ... పిల్లలొచ్చారు”
పిల్లలిద్దరు తయారయిపోయి, స్కూలు బ్యాగులతో సవా నా దగ్గరి కొచ్చారు.
ఇద్దర్ని ముద్దు పెట్టుకుని చెయ్యూపాను.
శిరీష కూదా అలాగే చేసి, కాడ్‌బరీస్, చాక్‌లెట్లు యిచ్చింది.
“పిల్లలకి జరుగుతున్నది. జరిగిపోయింది అర్ధం అవుతోందా? స్కూల్లో....”
ఒక్కసారి కళ్ళు తుడుచుకొని, మళ్లీ మంచినీళ్లు తాగాను.
“ఆ విషయంలో మాత్రం నేనదృష్టవంతురాల్నే శిరీషా! ఎవరూ ఏమీ అనలేదు. స్కూల్లో టీచర్లు యింటికొచ్చి పిల్లల్ని బాగా చూసుకుంటామని, మెంటల్‌గా ఏ విధమైన భారం లేకుండా చేస్తామని అన్నారు. మామయ్యగారు వాళ్ల చదువులు చూస్తున్నారు. సాయంత్రం ఇక్కడే ఓ స్కూల్లో ట్యూటర్‌గా చేరారు. ఇక్కడే వున్న ఓ సెమీ రెసిడెన్షియల్ స్మూలుకి పచ్చళ్ళు అందించడానికి అత్తయ్యగారు ఒప్పుకున్నారు..... ఆర్థికంగా ఎంతో కొంత నాకు సాయం పద్డామన్న వాళ్ల తపన, తాపత్రయం చూస్తుంటే ఏడుపొచ్చేస్తుంది.
“కన్నవాళ్లు, నీ తంటాలు నువ్వు పడు. మేమే కొడుకుల మీద ఆధార పడ్డవాళ్ళం. నీకే విధంగానూ సాయపడలేము అని చెప్పి వెళ్లిపోయారు... ఇప్పుడు నాకున్న పెద్ద దిక్కు వీళ్లే... వచ్చేవారం రమేష్ కంపెనీ కెళ్లాలి. ఈ నెలరోజులు వీధి గుమ్మం చూళ్లేదు. అలాంటిది ఒక్కసారిగా... నలుగుర్లోకి వెళ్ళి ....” మళ్లీ ఒక్కసారి భోరుమన్నాను.
“ఊరుకో భార్గవీ! రమేష్ గురించి ఆలోచించకు. తనో పిరికివాడు....”
“అందరూ అదే అంటున్నారు పిరికివాడు.... పిరికివాడు. అని పిరికివాడు ఎందుకవుతాడు? చాలా ధైర్యం ఉన్నవాడే. ఎంత ధైర్యం లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు?
22
“రమేష్ చూపించిన నరకాన్ని భరించలేక ఒక్కోసారి చచ్చిపోదామనిపించేది. పిల్లల మొహాలు చూస్తే, ధైర్యం అంతా కన్నీళ్లలాగా మారిపోయేది. నేను పిరికిదాన్ని చావడానికి ధైర్యం లేనిదాన్ని ఈ అనుభవం ఎన్నోసార్లు. నా చావు రమేష్‌ని మారుస్తుందో లేదో కాని, పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తుంది. వాళ్ళు పాడయిపోతారు. అలాంటప్పుడు నేను చచ్చి పోవడం ఎవరికి మేలు చేస్తుంది? అనవసరంగా బాధ్యతారహితులుగా పిల్లల్ని తయారు చేసి సమాజం మీదికి వదిలేసినదాన్ని అవుతాను .... ఇలా ఆలోచించి ఆత్మహత్య చేసుకోవడమనుకునేదాన్ని. నేనూ పిరికిదాన్ని .... రమేష్ కాదు...
“వద్దు భార్గవీ! అనవసరంగా ఆ ఆలోచన రానీకు. ఎంత పిచ్చిగా అయిపోతున్నావో! తల్లిగా నీ బాధ్యత ఏం లేదా! వాళ్ల బాల్యాన్ని చూడు. నీకన్నామీ అత్తగారు, మామగారు నయం పిల్లలు బాధ్యత ఈ వయసులో కూడా. ఎంత సులువుగా అంగీకరించారో. నువ్వు ఇంకా రమేష్‌ని అనడంలోనే రోజులు గడిపేస్తున్నావు. రమేష్‌కి ముందుచూపు లేనట్లే. నీ క్కూడా ముందుచూపు మందగిస్తోందా? వర్తమానంలోకి రా!... ధైర్యం తెచ్చుకో....”
“ఏం ధైర్యం .... ఏం చూసి తెచ్చుకోమంటావు? నా ఆనందాన్ని నా జీవితాన్ని ముక్కలు చేసే హక్కు ఈ రమేష్‌కి ఎవరిచ్చారు?” అని గట్టిగా అరిచాను.
అత్తయ్య కొంగుకి చేతులు తుడుచుకుంటూ గబ గబా వచ్చారు.
“ఏం జరిగింది?” అంటూ శిరీషని చూశారు.
“* మానవ హక్కులు మానవ హక్కులు అంటూ ప్రపంచం అంతా దాని వెనకాలే పద్దోంది. ఆ హక్కులు కేవలం మొగవాళ్లకేనా? పిల్లలకేనా? ఆడ వాళ్లకి లేదా? మానవుల్లో స్రీలని చేర్చలేదా? ఇక్కడ ఆడమొగా తేదాలా? చెప్పు... ధైర్యం అని అందరూ తేలిగ్గా
ఏదో అంటున్నాను. నాకే స్పష్టత లేదు. నాకు పిచ్చెక్కుతోందా? ఎందుకు ఆగలేకపోతున్నాను? ఏం మాట్లాడుతున్నాను?
“ఊర్కో... ఏమిటి పిచ్చి? యిద్దరు చిన్నపిల్లల్ని వాళ్లజీవితాల గురించి ఆలోచించు.... * అంటూ కోపంగా భుజం ఊపింది.
“రోజు మేం ఇదే చెప్తున్నాం. ఫ్! వినడం లేదు. ఎలాగో ఏమో అర్ధం కావడం లేదు. వచ్చేవారం ఉద్యోగానికెళ్లాలి. నలుగురిలో తిరగాలి. ఎంతోమంది చూస్తారు. ఎన్నో అనుకుంటారు. ఎంత వచ్చజెప్తన్నా, వినిపించుకోవడం లేదు. మాపాటి
23
గుండె దిటవుదానికి లేకపోతోంది. నువ్వేదాన్ని మామూలు మనిషిని చెయ్యి.... అత్తయ్య మాటలకి ఆశ్చర్యపడ్డాను. నేను మామూలు మనిషిగా లేనా? మానసిక రోగినయిపోయానా! నాకేం తెలీదే!
“లే 1 భార్గవీ! టైమ్ పదయింది. స్నానం చెయ్యి. తర్వాత మాట్లాడదాం” అంటూ శిరీష నా చేతిని లాగి మంచం దిగడంలో నాకు సాయం చేసింది. ఆగిపోయాను. శిరీషని ఆపాను.
“శ్రిరీషా! వుండు. ముందు నాకీమాట చెప్పు....” అంటూ ఆమె మొహంలోకి చూశాను.
“నేను మాములుగా లేనా!”
“ఊహుం... కొంచెం డిప్రెషన్‌లో వున్నావు. అందుకని....”
కళ్లు మూసుకున్నాను.
“కావచ్చు... కొంచెం డిప్రెషన్ నన్ను అలా మాట్లాడిస్తోందేమో? కానీ,పిచ్చిదాన్ని కాదు. బాధ. అయోమయం ... కన్‌ఫ్యూజన్... ఏం చెయ్యాలో తెలీని స్థితి ....
అందుకే.. .”
“నిన్ను మేమంతా బాగా అర్ధం చేసుకున్నాం. అందుకే నిన్ను మామూలు మనిషిని చెయ్యాలని అనుకుంటాం. నాకన్నా ఎక్కువ మీ అత్తగారికి మామగారికి వుంది.”
మళ్లా మంచం మీద కూచుండిపోయాను.
“నిజమే, శిరీషా! అత్తగారు చాలా మంచి అవిడ.”
“అర్ధం అయిందా! ఒప్పుకున్నావు కదా. ఆవిడ మంచి మనిషి అని ... మరి అవిణ్తి కూడా ఎందుకు బాధపెడ్దావు? అందరూ కలిసి పిల్లల్ని తీర్చిదిద్దండి....”
మౌనంగానే అన్నీ ముగించుకుని మంచం ఎక్కి గోడకి ఆనుకుని కూర్చున్నాను.
చాలా సేపటికి శిరీష నా గదిలోకి వచ్చింది.
“ఏంటాలోచిస్తున్నావ్?” నా పక్కనే గోడకి చేరబడి కూచుంది.
“యింకేం ఆలోచిస్తాను చెవు... ఈనమయంలో నాకేముంటుంది ఆలోచించడానికి? మిగిలిపోయిన జీవితం గురించి....”
భుజం మీద చెయ్యివేసి చిన్నగా ఓ దెబ్బ వేసింది.
24
“నిజమే ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిందదే. కానీ అందులో నీ పిల్లలు ఓ భాగం..... అది నువ్వు భాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ల గురించి కూడా ఆలోచించు. వాళ్ల చదువులు. .. భవిష్యత్తు... బాద్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే కదా!.... స్వార్ధంతో నీ గురించే ఆలోచించకు. వాళ్లు నీ జీవితంలో ఓ భాగం....
“అదే కదా శిరీషా! నా బాధంతా అదే. నేనొక్కదాన్నే అయితే....”
“ఛ...అలా అనకు....” నా తలని తన భుజానికి ఆనించుకుంది. నా కళ్లలోంచి నీళ్ళు కారిపోతున్నాయి. సెల్ఫ్‌పిటీ. నా మీద నాకే జాలి.
ఏవిటిది భార్గవీ! ఎందుకిలా అయిపోతున్నావు? ఎన్ని రోజులు ఇలా ఏడుస్తుంటావు. జీవితం నీ ఒక్కదానివే కాదన్నావు. నీ వెనకాల పిల్లలున్నారు. ధైర్యం తెచ్చుకోవాలి. నిజమే... రమేష్ బాధ్యతారహితంగా ప్రవర్తించి మీ జీవితాల్ని అస్తవ్యస్తం చేశాడు ... నిజమే.. కాని... నువ్వు .. నువ్వేం చేస్తున్నావు.... పరిస్థితులకి సరెండర్ అయి పోవడం లేదా?
జీవితం స్మూత్‌గా ఎవరికీ వుండదు. (ప్రతిరోజూ ఓ యుద్ధం చెయ్యాల్సిందే. పోరాటం చేసినంత మాత్రాన గెలిచిపోతామా? అలా అనుకుంటే అది అవివేకం కాదా? చదువుకున్నదానివి. అయినా ఏం లాభం? ధైర్యం... ఆత్మస్థైర్యం రెండూ లేదు. ఏడ్చి .... బాధంతా గుండెల్లో అలా వుంచేస్తే పిచ్చి పడ్తుంది.
“నాకు తెలీకుండానే పిరిఠిదాన్నయి పోతున్నాను.”
నా మొహంలోకి చూస్తూ నా కళ్లూ, చెంపలు తుడిచి జట్టు సవరించింది.
“సోక్రటీస్ ప్లాటోకి, ప్లాటో అరిస్టాటిల్‌కి. అరిస్టాటిల్ అలెగ్జాండర్‌కి జ్ఞానాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే... నువ్వు పిరికితనాన్ని పలాయన వాదాన్ని రమేష్ నుంచి నేర్చుకున, నీ నుంచి, నీ పిల్లలకి అదో పెద్ద హరిటేజ్‌లాగా ట్రాన్స్‌ఫర్ చేయడానికి సిద్ధంగా వున్నావు. వాళ్లు శాడిస్ట్‌ల్లాగా, మానసిక రోగుల్లాగా తయారయితే... వాళ్ల జీవితాల్ని...” నువ్వు క్రికెట్ మాచ్ చూస్తున్నట్లుగా ఓ పేక్షకురాలిలాగా అయిపోతావు. ఇలా వుంటుంది వాళ్ల భవిష్యత్తు. నువ్వు కనుక అస్తమానం ఏడిచేసి రమేష్‌ని గట్టిగా తిట్టిపోస్తుంటే... ఆలోచించుకో ... వాళ్ళ భవిష్యత్తు. వాళ్ల బాధ్యత నీ చేతిలో వుంది. నీ పిల్లల భవిష్యత్తుకి నువ్వు కస్టోడియస్‌వి.
25
నువ్వు నీ బాధ్యత మర్చిపోతే, రేపు నిన్ను వాళ్ళు క్షమిస్తారా? పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతారో .... అలాంటిదే నేర్చుకుంటారు. నువ్వు పొగిడితే. అ(స్రిషియేట్ చెయ్యడం నేర్చుకుంటారు. నువ్వు ప్రోత్సపాస్తే ఆత్మ విశ్వాసం పెంచుకుంటారు. నువ్వు సెక్యూరిటీనిస్తే నమ్మకం ఏర్పరచుకుంటారు. నువ్వు లాలిస్తే అది నీ చేతిల్లో వుంది కష్టాలకి, సుఖాలకి మధ్య సన్నవంతె నుంటుంది. అదినీ వ్యక్తిత్వం. దాని మీద ఆధారపడి వుంటుంది వాళ్ల భవిష్యత్తు.
తనని తాను గౌరవించుకోలేనివాడు. తన మీద సానుభూతి పెంచుకుంటాడు. సెల్ఫ్ పిటీ, అదే నువ్వు ప్రస్తుతం చేస్తున్నది. చేస్తున్నావు. అందరూ నిన్ను గురించే అనుకుంటారూ అనుక్కోకు. ప్రపంచంలో అందరికీ వాళ్ల పన్లు వాళ్లకుంటాయి. ఒకవేళ పనిలేని వాళ్లు వున్నారనుకో.. నిన్నెవరు అనరు కదా...
అయినా అందరికీ కూదా అస్తమానం అనేంత తీరిక వుండదు. ఒక వేళ అన్నారనుకో అనుకొంటే. అనుకోని ఈ సమయంలోనే నువ్వు రాటు తేలాలి. కష్టమే దైవం ..... వైఫల్యమే గురువు. ఈ రెండు ఇచ్చినంత, నేర్చినంత అనుభవం మరేది నేర్పదు.
అయిపోయిన గతంతో జీవితాన్ని ఎందుకు సమాధి చేస్తావు? జీవితం అంటే నిన్నా ఇవ్వాళా కాదుగా. రేపు కూడా జీవితమే. ఇవ్వాళ చీకటిగా వుందని తిట్టుకోవడం అవివేకం కదా! ఈ చీకటి శాశ్వతం కాదు. రేపు సూర్యోదయం అవుతుంది. దానికోసం ఈనాటి చీకటిని భరించు. అక్కడే నీ ధైర్యం పనిచేస్తుంది... ఆలోచించుకో... ఆ పైన నీ ఇష్టం....”
రెండు రోజులు నిశ్శబ్ధంగా గడిచిపోయాయి. బెంగుళూరు వెళ్ళిపోవడానికి తయారవుతోంది శిరీష చేతులు పట్టుకున్నాను.
“థాంక్యూ.... శిరీషా! ఓ మంచి 'స్నేహితురాలివనిపించావు. నెగటివ్ ఆలోచనలని తీసేయడానికే ప్రయత్నిస్తున్నాను. నా పిల్లల జీవితాల్ని నా జీవితంతో, నా అలోచనలని వాళ్ల ఆలోచనలతో కావలించుకుంటాను. జీవితాన్ని కావలించు కుంటాను. రమేష్ లాగా ఉరితాడుని కాదు. చావుని కావలించుకోను....”
జ శి $12006 న్యు నబ! లారీ రర్పిత ఈ
రసు ఇంట్లో విగ్రహాలు ఫోన్ మోగుతుంటే బద్ధకంగా, వెచ్చదనం ఇచ్చిన రజాయిని పక్కన నెట్టి, లేచి ఫోన్ తీసుకున్నాను.
“హలో!” అంటూ గోడ గడియారం కేసి చూసాను. మూడుంపావు. గోరువెచ్చటి ఎండ కిటీలోంచి ఏటవాలుగా గోడ మీద పడుతోంది.
“సౌద్రామినిగారేనా?”
“అవును.”
“నమస్కారమండి. నా పేరు సరళాదేవి. జాగృతి మహిళామండలి ప్రసిడెంట్‌ని. *
“నమస్కారమండి. మీరు, మీ ప్రోగ్రాంలు, మీరు నిర్వహించే కార్యక్రమాలు, గోప్టులు చూసాను. విన్నాను. మీరు చాలా సేవ చేస్తున్నారు. చాలా సంతోషంగా వుంది.” -
“ఏదో నాకు చాతనైనంత... పది హేనేళ్లక్రితం మావారు పోయాక సమాజసేవ చెయ్యాలని నిశ్చయించుకున్నాను. ఆ దారినే ప్రయాణిస్తున్నాను. ఈ సంస్థే నా ఇల్లు. నా దైవం. నా ఒంటరి బ్రతుకుకి తోడూ నీదా...అవన్నీ వదిలేయండి. మీతో చిన్న పనుంది.”
“ఆం...ఏం లేదు. మా జాగృతి పెట్టింది హైదరాబాద్‌లోనే అయినా, ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవాడలో జరపడానికి నిశ్చయించుకున్నాము. అ సందర్భంగా, ఓ పదిమంది రచయిత్రుల్ని కవయిత్రుల్ని పిలిచి సన్మానం చేద్దామని అనుకున్నాము. అందులో మీరు ఒకరు.”
27
“నాకు సభలు, సమావేశాలు ఇలాటివాటికి వచ్చే అలవాటు లేదండి. నన్నాదిలేయండి.”
“అహల...మీరు రావాల్సిందే. కాదనకండి.”
నసిగాను.
“క్రాదనకండి ప్లీజ్.”
“అలాగే... వస్తాను.”
“మరో విషయం. సౌదామినిగారూ, మీరు 'మహిళలు-అధికారాలు”అన్న విషయం గురించి మాట్లాదాలి. ఆం...తర్వాత ఆ రోజున జరిగే కార్యక్రమాల' గురించి మా కార్యకర్తల్లో ఒకరు మీకు అన్నీ వివరంగా చెప్తారు. అయినా మీకు వాణిగారు తెలుసా! సంగీత విద్వాంసురాలు కళ్యాణిగారి కూతురు.”
“కళ్యాణిగారి గురించి విన్నాను. స్రీ జాతికే గౌరవం. ఈ మధ్యనే ప్రతిభా పురస్కారం, పద్మభూషణ్ కూడా అందుకున్నారు. మన తెలుగువారికి గర్వంగా వుంది. అలాటి కళ్యాణిగారి కూతురు వాణి మీ సమాజంలో మెంబరా?”
“అవును. విజయవాడలో కార్యక్రమాలు ఆవిడే చూస్తారు. ఇంకా చాలామంది వస్తారండి. ్రోగ్రాం సక్సెస్ అవాలంటే మీ అందరి సహకారం వుండాలి.”
“స్తీలంతా ఏకం అయితే గర్వగాధలే వుంటాయి. కార్ల్‌మార్చ్ ఏవన్నాడు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మీరు పోగొట్టుకునేదేం లేదు సంకెళ్లు తప్ప. కానీ నేనంటున్నాను, ప్రపంచ మహిళల్లారా ఏకం కండి, పోయేదేం లేదు మీ బానిసత్వం తప్ప” ఆవేశంగా అన్నాను.
“చాలా బావుంది. సౌదామినిగారూ... ఇలాగే ఆవేశపూరితమైన స్పీచ్ ఇవ్వండి. వచ్చినవాళ్లంతా మంత్రముగ్గులై పోవాలి. ఉంటానండి. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు చాలా థాంక్స్.”
నేను మళ్లీ రజాయిన్ లాక్కుని ఓ పక్కకి ఒత్తిగిలి కళ్లు మూసుకున్నాను. మళ్లీ ఫోన్ మోగింది.
“హాలో” అన్నాను.
“ఆయ ఏం సోదెప్పా! అంతా కులాసానా?” మా పెద్దమామగారి గొంతు.
నన్ను సోదెమ్మ, సోదెప్ప అని పిలిచేది మా అత్తగా3 వైపు వాళ్లు. నా పేరు సౌదామినిగా స్కూలు రికార్డుల్లో వున్నా ఇంకా మా అత్తింటివారికి ఆ పేరే అలవాటు. 28
మా తాతగారు యజ్ఞం చేసిన తర్వాత నేనుపుట్టాన్తు. తాతగారు సోమయాజి అయితే, నానమ్మ సోదెమ్మ అయింది. నాకు నానమ్మ పేరు పెట్టినా సోదెమ్మ, సోదెప్పా అని అంటం మొదలెట్టారు. పెద్దనాన్నగారికి పుట్టిన అబ్బాయికి సోమయాజులు అని పెట్టారు. మా ఇంట్లోవాళ్లు సౌదామిని అనే అంటారు.
“శంకరం లేదా!”
“లేరు. జగ్గయ్యపేట వెళ్లారు.”
“ఉప్పుడొస్తాడా?”
“రారు. రేపు వస్తారు.”
“సరేలే. వాడి నంబరియ్యి...”
“మనవరాలు బావుందా? కాలేజీ కెళ్లోందా? ఏవిటో మొగపిల్లాడియితే వేరు. దీన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు చేర్చించారు? నన్నడిగితే...”
“అమ్మాయి అయితే మటుకు ఇంజనీరింగ్ చదివించగూడదా?” ఉక్రోషంగా అన్నాను.
“అది నీ ఇంట్లో చుట్టం మాత్రమేగా. సరేలే, నా సలహా ఎవరిక్కావాలిలే. వుంటాను. ఆరోగ్యం అదీ చూసుకోండి. మరిఉంటా!”
ఇంట్లో దివ్య లేదు. ఉంటేనా పెద్ద తాతగారితో దెబ్బలాడేది. నేను కొడుకుని, నేనే కూతుర్ని. మా నాన్నగారి ఉత్తరాధికారిని నేనే అంటూ గొడవ పెట్టేది.
కానీ దానికేం తెలుసు? మనదేశంలో ఆడవాళ్లు విగ్రహాలు మాత్రమే. పూజ చెయ్యడానికి మాత్రమే పనికొస్తారు. పప్రేమించడానిక్కాదు. అరచెయ్యి పైకెత్తి ఆశీర్వదించే ముద్రలో ఉంటే, ఏవన్నా చలించని బొమ్మలా ఉంటే దండం పెడతారు. అదజన్మకి మరో అర్ధం లేదా!
ఎన్నేళ్లయినా, ఏ యుగం అయినా ఆడవాళ్లని చూసే కోణంలో ఏ మాత్రం మార్పులేదు.
చిన్నగా నిట్టూర్చి పుస్తకాల బీరువా దగ్గరికెళ్లాను. రోమిల్లా రాసిన థోపర్ “ప్రాచీన భారత సమాజంలో మహిళలు” తీళాను. వరసగా నాలుగురోజులు పుస్తకాలు చూడడంలో ఉండిపోయాను.
29
తలుపు కొట్టిన శబ్దం. అంటే శంకరం అన్న మాట. రేపుకదా రావాల్సింది! ఎవరైనా కాలింగ్‌బెల్ నొక్కుతారు. శంకరం మటుకు తలుపు కొడతాడు.
ఉత్సాహంగా తలుపు తీశాను.
“ఉన్నావా! ఎక్కడికైనా వెళ్లి వుంటావేమోనని ఫోన్ చెయ్యలేదు”అంటూ లోపలికొచ్చాడు శంకరం. చేతిలో వున్న బ్రీఫ్‌కేస్‌ని టీపాయ్ మీద పెట్టి “రండి లోపలికి” అంటూ రెండడుగులు ముందుకేశాడు.
తల పక్కకి వంచి గుమ్మంకేసి చూశాను. ఆ స్వాగతం ఎవరికా అని.
మా పెద్ద మావగారు, ఆయన కొడుకు గోపాలం, గోపాలం కూతురు మాణిక్యం.
“రండి” అంటూ ఆహ్వానించాను.
వీళ్లంతా రేపుంటారా, వెళ్లిపోతారా, నాకు వెళ్లడానికి అవుతుందా లేదా అని మనసులో సందేహాలు మొలుస్తున్నాయి. పైకి చిరునవ్వుతో వాళ్లని చూశాను.
“కూచోండి. కాఫీయా, టీనా, లేకపోతే నిమ్మరసం.”
“ఈ టైములో కాఫీ టీలు ఏవిటీ? నిమ్మరసం తీసుకురా! ఏదీ మనవరాలు కనపడదేం?” రక్కున అన్నారు పెద్ద మావగారు.
“రేపు కాలేజీలో ఏదో డిబేట్ వుందిట. అందుకోసం ఈ పక్కనే వున్న స్నేహితురాలింటి కెళ్లింది ప్రిపేర్ అవడానికి.”
“ఏవిటో, అలా చీకటి పద్దాకా అటూ ఇటూ వెళ్లడం అంత మంచిది కాదు. మీ ఇష్టం ఏదో నా మటుకు తోచింది నేను చెప్పాను.”
లోపలికెళ్లాను నిమ్మరసం చెయ్యడానికి.
నా వెనకాలే వచ్చాడు శంకరం.
“భేపు మాణిక్యాన్ని చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు...”
“రేపా! రే పెలా కుదుర్తుంది?” గబుక్కున అన్నాను.
“కుదరదానికి నీ ఇష్టం ఏమిటి? రేపు మంచి రోజు. మధ్యాహ్నం వస్తున్నారు. గోపాలం పిల్లని తీసుకొచ్చాడు. మనిల్లు మొగపెళ్లివారింటికి దగ్గర కాబట్టి మనింట్లో పెళ్లి చూపులకి ఏర్పాటు చెయ్యమన్నారు. సరే అన్నాను. నీకేవిటీ ప్రాబ్లం?”
ఆ తీవ్రతకి భయపడ్డాను.
“అబ్బే, నాకేవిటీ ప్రాబ్లెం! ఏంలేదే!” రేపు నేను ఎక్కడికో వెళ్లాలని చెప్పడానికి భయపడ్డాను.
30
“నీక్తు తెలుసుగా, పెదనాన్నగారు డయాబెటిక్. ఎనిమిది గంటలకల్లా ఆయనకి భోజనం తయారు చెయ్యి. రెండు పుల్కాలుకూడా. పెరుగుందా, బయటికెళ్లి తేవాలా?”
“తీసుకురండి. ఉన్నది అందరికీ సరిపోదు.”
“క్రేప్పు టిఫిన్ అదీ చేస్తావా? బయటి నుంచి కొంటే మంచిదా?”
“పెద్దాయన్ని అడగండి.”
క్షణంలో వెళ్లి వంటింట్లోకి మళ్లీ వచ్చారు.
“ఓ ప్వీటు నిన్ను చెయ్యమన్నారు. మరో స్వీటు, సమోసాలు, మిక్చరు తెప్పిద్దామన్నారు.”
“సోదెప్పా! అరటిపండ్లు, తమలపాకులు, వక్కలు తెప్పించు. ముగ్గురు ఆడవాళ్లు వస్తారు” ముందు గదిలోంచి అన్నారు.
“అలాగే...”
“నేన్సు రేపు 'ఆడవాళ్లు-అధికారాలు' గురించి మహిళా దినోత్సవ సందర్భంగా మాట్లాడాలి. నేను ఐదుగంటలకల్లా నన్నయ కళారంగం దగ్గరుండాలి”అని
ఏమయినా అంటే, నా వాళ్లంటే ఇష్టం లేదు అని గొడవ చేస్తే, వచ్చినవాళ్లముందు నా పరువేంకాను?
ఈ లోపల దివ్య వచ్చింది.
“ఏంటమ్మా ఇది? నాన్నగారు అఆ అమ్మాయిని బ్యూటీ క్లినిక్‌కీ తీసుకెళ్లమంటున్నారు? రేపు కాలేజీ వుందికదా! పైగా డిబేట్ 'బిగ్ ఫైట్'లాగా వుంటుంది. మంచి పదాలు, మంచి వాక్యాలు కావాలి. ఆ ప్రిపరేషన్ కోసం నేను రేపు తప్పకుండా వెళ్లాలి. పార్లర్‌కి నేనెల్లా తీసుకెళ్తాను. ఏవైనా అంటే తిడతారు. నువ్వు చెప్పమ్మా!”
“ఊరుకో, నేను వున్నాగా!” అన్నట్లు కళ్లతో చేతుల్లో సైగలు చేశాను.
“ఆం వొదినా! ఏం వండుతున్నాన్? దివ్యా! మీ అమ్మకి సాయం ఏవిటీ నువ్వు! వంట వచ్చా!” అంటూ గోపాలం వచ్చాడు లోపలికి.
“పెద్దగా రాదు”
“మా-మాణిక్యం అద్భుతంగా వంటచేస్తుంది” పెదిమలు విరిచికళ్లు ఎగరేస్తూ గర్వంగా అన్నాడు.
31
ఎవరి పిల్లలు వాళ్లకి గర్వం.
దివ్య వెళ్లిపోయింది.
“వొదినా! అన్నయ్య చెయ్యాల్సింది వాడు చేశాడు. నీ వంతు స్వీటు అది చేస్తావు ఎలాగూ. ఆపని నీక్షుంది. కాకపోతే మరోటి నువ్వు చెయ్యాలి” చూపుడు వేలు ఊపుతూ.
*ఏవిటో?”
“అబ్బాయేమో హైదరాబాద్‌లో వుంటున్నాడు. మా పిల్ల ఎలాగైనా ఒక్క రవ్వ పల్లెటూరి వాటంగా అనిపిస్తుంది నువ్వు గనుక దివ్యని ఈ ఛాయలకి రాకుండా చేస్తే...” తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.
“అర్ధం అయింది. మీరు నిశ్చింతగా వుండచ్చు. అది పొద్దున్నే కాలేజీకి వెళ్లిపోతుంది.”
“నే త్రీసుకెళ్తాగా...”
అందరి భోజనాలు అయ్యి నేను పక్కమీద వాలేసరికి పదకొండు అయింది. శంకరం వచ్చినవాళ్లకి పక్కలు వేసి వచ్చాడు.
“రేపు మహిళా దినోత్వవం”అన్నాను మెల్లిగా.
“ఏమంటావయితే?”
“నన్నయ కళారంగంలో ఫంక్షన్ వుంది.”
“ఎన్ని గంటలకి?”
“ఐదు గంటలకి”
“నాలుగున్నరకి పెళ్లిచూపులు కదా!” ఆశ్చర్యంగా అన్నాడు.
“అదే అంటున్నాను” నసిగాను.
“అంటే నువ్వుండవా! దానర్ధం అలాగే వుంది.”
“గోపాలం పెళ్లాం రావడానికి వీలవక రాలేదు. నామీద కొండంత నమ్మకంతో మరో ఆలోచన లేకుండా, రాజమండ్రి నుండి వచ్చారు. ఇల్లు వాళ్లమీద వదిలేసి అలా వెళ్తానంటావా?”
నోట మాట రాలేదు.
32
“నీకు మా పెద్దనాన్నగారు చేసిన త్యాగం గురించి తెలీదు. ఆయన మా నాన్నగార్ని కాకినాడలో వుంచి చదివించారు. ఆయనమటుకు అలాగే వైదీకం కంటిన్యూ చేశారు. ఓసారి నాన్నగారి ఫీజుకి డబ్బు లేకపోతే మా పెద్దమ్మ కాళ్ల కడియాలు, గొలుసులు అమ్మేశారు. నాన్నగారు ఇంగ్లీషు చదువులు చదవాలన్న ఆశ, కోరికా అలాంటిది. మా నాన్నగారు ఎప్పుడూ అంటూంటారు, అన్నయ్య బుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని. అలాటిది, ఈ రోజున అంత పెద్దాయన ఇంటికొచ్చినప్పుడు...”
“మీ కెప్పుడు తెలుసు రేపు పెళ్లిచూపులన్న సంగతి?”
“వారం క్రితం...”
“మరి నాకెందుకు చెప్పలేదు? తెలిస్తే వాళ్లకి నేను మాట ఇచ్చేదాన్ని కాదుకదా! నా ఇంట్లో జరిగే కార్యం నాకు తెలీకూడదు. కానీ నేను మటుకు దగ్గరుండి ఏ లోటూ రాకుండా జరిపించాలి. భలేవారండి.”
“ఏదో మర్చిపోయాను. దానికి రాద్ధాంతం చేస్తావేం?”
“రాద్ధాంతం కాదు, నిజం. కనకదుర్గ గుడి చూడ్డానికి మా అమ్మానాన్నా నెలరోజుల ముందు నుంచి ష్లాను వేసుకున్న సంగతి మీకు తెలుసు. అయినా పనుందని వెళ్లిపోలేదూ! అమ్మానాన్నలే కాదు, నావాళ్లెవరొచ్చినా మీ బిహేవియర్ మారిపోతుంది.
“ద్రానికీ దీనికీ సంబంధం ఏవిటీ?” గట్టిగా అన్నాడు.
తనతో ఏదో వాదించాలని, ఒప్పించాలన్న ఆవేశం వచ్చింది. కానీ సనాతన దారిలో పోయే శంకరాన్ని ఒప్పించే శక్తి నాకు లేదు. నేను పంతానికి పోతే శంకరం దిగజారవచ్చు. ఇంటికొచ్చినవాళ్ళు ఏవనుకుంటారు? పరాయి వాళ్లముందు పిల్లల్ని ఓ మాట అనడానికి నేను జంకుతాను కానీ, నన్ను పరాయివాళ్ల ముందు అనడానికి ఏమాత్రం వెనకాడడు శంకరం.
“వ్యక్తిత్వాలూ, అభ్యుదయాలు, అధికారాలు, ఉపన్యాసాల్లో విండానికి బావుంటాయి. రేపు నువ్వుందాల్సిందే...”
“సాంత తల్లి తన పని మానుకుని రాలేదే? నేను వాళ్లకిచ్చిన మాట తప్పి వెళ్లకపోవడం...”
“స్టాప్. రేపు నువ్వు ఇంట్లోనే వుంటావు. అంతే. ఇంక నోర్మూసుకో.”
33
కళ్లల్లో నీళ్లు. లైటార్చి కళ్లు మూసుకున్నాను. నా ఇంట్లో నాకే అధికారం లేదు.
ఎన్ని ఆశయాలున్నా, ఎన్ని ఆశలున్నా, ఎంత అభిమానం వున్నా, సమాజంలో నేను ఎంత గౌరవింపబడుతున్నా నా భర్తకి మటుకు గడ్డిపరకని. దూదిపింజ కన్నా తేలిక.
ఈ విషయంలో నేను ఏ మాత్రం ముందుకెళ్లినా, తన అహాన్ని తృప్తి పరుచుకోవడం కోసం విడాకులు ఇవ్వడానికి కూడా వెనకాడడు... ఎమోషనల్ దెబ్బ. స్త్రీకి అధికారం వుందా! దేనికి? ఏం అనే అన్నదానికి అధికారం! ఎందుకు? అని ప్రశ్నించే అధికారం వుందా!
మర్నాడు యధాప్రకారంగా పనులు చేసుకుంటున్నాను. పొద్దున్న పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది.
“సౌదామినీ! నీకే ఫోన్”అన్నాడు శంకరం వంటింట్లోకి వస్తూ.
అప్పుడే మొదలు పెట్టాను కాబట్టి పాయ్యి ఆపాను.
“సౌదామినిగారేనా! సాయంత్రం గాలుగున్నరకల్లా రెడీగా వుండండి. కారు వస్తుంది. మా కార్యకర్తలిద్దరిని పంపిస్తున్నాను మిమ్మల్ని తీసుకురావడానికి”
ఒక్కక్షణం కళ్లుమూసుకుని పెదమలు బిగపట్టాను.
“మన్నించండి సరళాదేవి, సాయంత్రం నేను రాలేకపోతున్నాను.”
“అరెరే! ఏవైంది? మీలాటి రచయిత్రి కూడా మాట్లాడితే బావుంటుంది.”
'నేను వస్తే నా సంసారంలో ఉవ్వెత్తున తరంగాలు లేచి నన్ను, నా జీవితాన్ని ముంచేస్తాయి' మనసులో అనుకున్నాను.
“అవుననుకోండి. కానీ, అనుకోకుండా అతిధులొచ్చారు.”
“వాళ్లని కూడా తీసుకురండి. కానీ, మీరు ఎలాగైనా రావాల్సిందే.”
“నన్ను మన్నించండి, రాలేనండి” నిస్సహాయంగా రాలుతున్న కన్నీళ్లు,
“పర్వాలేదులెండి. మీ ఉపన్యాసం వినాలన్న మా ఆశ తీరలేదు మరోసారి.”
ఈ త-4-2004 ఆంధ్ర భూడి నబి! లారీ కడ 14 ట్ట ట్ట ట్ట వశ
లిష్ట్‌కోసం వెయిట్ చేస్తూంటే నీరజ వచ్చింది నవ్వుతూ, “కంగ్రాట్స్!” వస్తూనే అంది.
ఆశ్చర్యంగా ఆమెను చూశాను. ఈ లోపల లిఫ్ట్ రావడం, మేము దానిలోకి వెళ్ళగానే, ఆపరేటర్ మూడు అంకె నొక్కేయడం ఒక్కసారి జరిపోయింది.
“ఎందుకూ?”
“నిన్న నువ్వు రానందుకు. ఆ మాత్రం సస్పెన్స్‌తో నిన్ను పనిష్ చేయ్యడ్డా! నీకు చేతనయితే గెస్ చెయ్యి. లేకపోతే బాస్ వచ్చేవరకూ ఆగు!” అంది.
ఇద్దరం ఎవరి స్లేస్‌ల్లోకి వాళ్ళం వెళ్ళిపోయాం. రెడ్డి, విజిత కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పి వెళ్ళిపోయారు కానీ కారణం చెప్పలేదు.
మేడం “బాస్ పిలుస్తున్నారు” అంటూ పోచయ్య వచ్చాడు.
నీరజని చూశాను.
“వెళ్ళు అన్నట్లు కళ్ళతో చెప్పింది.
నవ్వుతూ రెడ్డి తల గట్టిగా ఊపుతున్నాడు.
“మిమ్మల్ని డి.జి.ఎం.గా ప్రమోట్ చేశారు” యశ్వంత్ నవ్వుతూ లెటర్ నా చేతికందిచ్చాడు.
ఆశ్చర్యం... ఆనందం... కళ్ళల్లో పల్చగా నీటి తెర.
“పార్టీ ఇవ్వాల్సిందే”
35
“పూర్!”
“ధాకంక్యూ! మీరే లేకపోతే, నేనే స్థితిలో ఉండేదాన్నో. బహుశా ఓ పిచ్చాసుపత్రిలో. .”
“ఓ. .కమాన్!” నో పాస్ట్. వెళ్ళు, వెళ్ళి పార్టీకి ఎరేంజ్‌మెంట్ చూడు!”
నా సీట్లోకి రాగానే గబగబా అంతా చుట్టు ముట్టేశారు.
ఆనందంగా ఉంది.
ఈ నాటి ఈ ఆనందానికి కారణం యశ్వంత్. యశ్వంత్ లాంటి బాస్ దొరకడం నిజంగానా అదృష్టం. ం
చంటి పిల్లాణ్ణి పోగొట్టుకుని, తల్లితండ్రులకు దూరమ్వై, ఓదార్చేందుకు దగ్గర వాళ్ళు కరువైనప్పుడు యశ్వంత్ ఇచ్చిన ధైర్యంతోనే మామూలు మనిషి అయ్యాను.
నా భర్త నుంచి విడాకులు తీసుకున్న రోజున కూడా, యశ్వంత్ ఫిలాసఫీని జీవితానికి ఏ విధంగా అపై చేయాలో చెప్పాడు. తండ్రిలాగా ఓదార్చాడు. స్నేహితుడిలాగా నా బాధలన్నీ అర్ధం చేసుకున్నాడు. జీవితాన్ని ఏ కోణం లోంచి చూస్తే స్లైస్ ఫ్రీగా ఉంటుందో చూపించాడు.
"నిజానికి యశ్చింత్ చిన్న వాడు కాదు. రిటైరవదానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా అందరినీ 'యశ్వంత్ అని పిలవమని అంటాడు.
మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆఫీసు వాతావరణాన్ని తన మాటలతో, చేతలతో మార్చి చాలా ఉన్నతి స్థితికి తీసుకెళ్ళాడు.
నీరవ్ గురించి, బాబు గురించి బాధపడుతుంటే ఓసారి చూశాడు. “క్షియోపాత్ర ముక్కు చిన్నది కాదు, అందమైనది కాబట్టే హిస్టరీ అడ్డం తిరిగింది. ఏది జరగాలో అది = జరిగిపోతుంది. అయిన దాని గురించి ఆలోచనలు, నిద్ర పోగొట్టుకోవడం... ఊహుం, నీ వరస బాగాలేదు. (స్టెస్ ఉంటే లాభం లేదు.”
మామూలుగా ఉండడానికి ప్రయత్నం మొదలు పెట్టాను. (స్టైస్ ఫ్రీ లైఫ్ గురించి పుస్తకాలు ఆఫీసులోనే ఉన్నవి చదవడం మొదలు పెట్టాను.
ఏదైనా పొరపాటు జరిగితే...
“పొరపాట్లు సహజం. ఒక్కసారే పర్‌ఫెక్ట్ అవలేవు. ఎంత దూరం ప్రయాణం అయినా ఓ చిన్న అడుగుతోనే మొదలు పెట్టాలికదా! అడుగుల్లో కాన్(స్టేషన్, కాషన్ 36
రెండూ ఉందాలి. ఈసారి నుంచి కొంచెంపని మీద కాన్‌శ్రేషన్ ఉంచు. నీలో వెతుకుదామన్నా తప్పులు కనపడవు.
“జీవితం గ్రైండింగ్ స్టోన్ లాంటిది. నిన్ను కిందైనా ఉంచి గైండ్ చేస్తుంది. లేదా చక్కగా పాలిష్ చేసి పైకి తెస్తుంది. అయితే అదంతా నీ చేతుల్లోనే ఉంది.”
నిజమే, ఇది నా జీవితం.
నేనే మలుచుకోవాలి.
“నీ పనిలో క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీలో ఐదు 'డిలు ఉండాలి. డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్కిమినేషన్, డిటర్మినేషన్.”
అంతే. నేను వెనక్కి తిరగలేదు.
“చూడు, గణపతిని నీకు ఆదర్శంగా పెట్టుకో. పెద్దతల-పెద్దగా, ప్రాఫిటబుల్‌గా ఆలోచించడానికి, పెద్ద చెవులు - కొత్త ఐడియాలు, కొత్త సజెషన్స్ వినడానికి, చిన్న కళ్ళు - చురుగ్గా చూస్తూ, చేతిలో పనిని తొందరగా చెయ్యదడాననికి, పెద్ద ముక్కు - చుట్టుపక్కల అన్ని విషయాల్లో కెలుకుతూ, ఎక్కువ నేర్చుకోవడానికి, చిన్న నోరు - తక్కువ మాట్లాడడానికి,”
సేల్స్ ప్రమోట్ చెయ్యడానికి ఏం చెయ్యాలో సలహాలిస్తూండేవాడు.
“అన్నింటికీ బ్రూస్, స్పైడర్ కధ పనికిరాదు. మన సేల్స్‌కి ద్రైక్కర్ కధ పనికివస్తుంది. ఒకటి రెండు సార్లు ఫెయిలయితే మూదోసారి వేరేది చెయ్యి. అంతేకాని, అన్నింటికీ లైఫ్ అండ్ దెత్ క్వొళ్చన్‌గా ఆలోచించకూడదు.”
ఎంత ముందు కెళ్ళానో.. ఈనాటి ప్రమోషన్ - డి.జి.ఎం.గా ప్రమోషన్‌తో తెలిసింది.
జోక్స్, సేల్స్, మార్కెటింగ్, అద్వర్దయిజింగ్, ఇన్సిడెంట్స్, మధ్యమధ్య యశ్వంత్ కొటేషన్స్, నవ్వులు...హాయిగా జరిగిపోయింది పార్టీ. చీకటి పడిపోయింది. అందరం ఇంటి మొహం పట్టాం.
నా ఫ్లాట్‌లోకి వెళ్ళి లైట్ వేశాను. చీకటి పరుగెత్తింది మూలకి. అలసటగా సోఫాలో వాలిపోయాను.
ఎంత నిశ్శబ్దం!
అగాధాల నిశ్శబ్దం.
37
ఇంతవరకూ గడిచిన క్షణాలకి, ఈ క్షణానికి ఎంత తేడా? ఇందాకటి నా నవ్వులు నా వెనకాలే ప్రతిధ్వనిస్తున్నాయి.
నా నవ్వులు, నా సంతోషం పంచుకోడానికి ఎవరూ లేరు.
ఎవరికీ అక్కర్లేదు.
కృంగిపోతున్నాను. నా ధైర్యం పోతోంది.
ఏదో చెయ్యాలి. లాభం లేదు. నా ధైర్యం పోయిందంటే నేనెలా బతగ్గలను?
చాలా రోజుల తర్వాత నా ఒంటరితనం నా ముందుకొచ్చింది. ఆ వెనకాలే నీరవ్. ఆ వెనక్కాలే గతం.
“ఇవాళ దాక్టరు దగ్గరికి వెళ్ళాను. నవంబరు నెలాఖరుకి డెలివరీ అవుతుంది అన్నారు. అన్నీ నార్మల్ హాయిగా నవ్వుతూ అన్నాను.
“ఇంకా నాలుగు నెలలు ఆగాలి. టెస్ట్ చేయించకూడదా, పాపనో, బాబో తెలిసిపోతుంది” నవ్వుతూ అన్నాడు.
“ఉహూం. సస్పెన్స్ లాస్ట్ మినిట్ వరకూ ఉంటేనే తెలుస్తుంది. అయినా, ఏదైనా మెటోబోలిక్ డిసార్డర్స్, కన్‌జెనిటల్ డి ఫెక్ట్స్ ఉంటేనే చేస్తారు. అయినా అవసరం ఉంటే డాక్టరే చెప్తారు. మనకి ఎవరైనా పరవాలేదుగా? అలాంటప్పుడు టెస్ట్ ఎందుకు? కదా! ఏమంటావ్?”
అప్రసన్నంగా మొహం పెట్టాడు.
జన్టీ ఇష్టం.”
మనస్సు చివుక్కుమంది.
నిజమే అని ఎందుకనలేదు. అహం దెబ్బ తింటుందనా?
ఇరవై రోజులు బిజీ. కొత్త ఛెయిర్మన్, వైస్ ప్రెసిడెంట్ కమర్షియల్, ఫైనాన్స్ వస్తున్నారు. ఎక్కువ సేల్ అయినందుకు అవార్డులు, ఆ పార్టీలు...ఇంత బిజీలో నేను పపెగ్నెంట్ అన్న విషయం కూడా మరిచిపోయాను. నీరవ్ జూనియర్ మేనేజ్‌మెంట్ టైనింగ్‌కోసం నాసిక్ దగ్గర దేవలాలి వెళ్ళాడు.
“ఖేబీ నార్మల్‌గా అనిపించడం లేదట, ఏమిమో సెంటిసిస్ చెయ్యాలన్నారు' నీరవ్ వచ్చాక అన్నాను.
38
“అంటే...నార్మల్ కాదా?” గబుక్కున దగ్గరికొస్తూ అన్నాడు.
“అలాగే అనిపిస్తూందట” తప్పు చేసినట్లుగా,
“నీ కెంత నిర్లక్ష్యం! నేను అప్పుడే అన్నాను టెస్ట్ చేయించమని. అప్పుడే చేయించి ఉంటే బాగుండేది. ఇప్పుడు చూడు...అసలు నీకు నా మాటంటే వాల్యూ లేదు!” తీవ్రంగా అంటూ బయటికి వెళ్ళిపోయాడు.
అపళ(శ్రుతి...
అబ్నార్మల్‌గా ఉన్నాడు లోపల బాబు.
టెర్మినేట్ చేయడానికి లేట్ అయిపోయింది.
“అప్పుడే నా మాట విని ఉంటే టెర్మినేట్ చేయించి ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు, అనుభవించు!”
ఒక్కసారి అని ఊరుకుంటే బాగుండేది రోజూ అంటుంటే నీరవ్ అంటే అసహ్యం పుట్టింది. దూరంగా ఉండడం మొదలు పెట్టాడు.
మా ఇద్దరి మధ్య చీలిక రోజురోజుకీ ఎక్కువైపోయింది.
ఇంట్లో ఉంటే ఆలోచనలు ఎక్కువైపోతాయని ఆథీ నుకెళ్ళడానికే నిశ్చయించుకున్నాను.
ఈ నీరవ్‌ని నేను (ప్రేమించాను. ఇప్పుడు ఆ (ప్రేమ ఏది?
రోజూ ఆరున్నర అయ్యేటప్పటికి స్కూటర్ తీసుకుని నా ఆఫీసు ముందు హాజరయ్యేవాడు. అలాంటిది ఈ రోజున ఎడమొహం పెడమొహం.
రోజూ ఓ (్రెజంటేషన్. ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ ఏవి? ఓ కప్పుకింద ఉండడం మొదలు పెట్టాక అన్నీ ఒక్కసారి... అలా గాల్లోకి ఎగిరపోయాయా?
నా ప్రమేయం లేకుండా రోజులు గడుస్తున్నాడు.
ఆఫీసులో నీరజ, యశ్వంత్, రెడ్ది లేకపోతే నేను దాదాపు పిచ్చిదాన్నే అయ్యేదాన్ని
'ప్రేమించడంలో ఫెయిలయ్యాను.
“జీవితంలోని అత్యంత ముఖ్యమైన నిర్ణయంలో పొరపాటు జరిగిపోయింది.” పెళ్ళికి ముందూ నాకూ, నీరవ్‌కి మధ్య ఉన్నది కేవలం శారీరకాకర్షణ మాత్రమేనా? ఎన్నో ఒట్లు వేశాడు. ఎన్నో ఆశలు కల్పించాడు. వాటన్నిటికీ వాల్యూ లేదా? ఇంత చదువు చదువుకునీ మామూలు, అతి సామాన్యమైన ఆడది చేసే తప్పే తనూ చేసింది.
39
అంటే తన చదువు తనని మానసికంగా ఎత్తుకి ఎదగనీయలేదా? ఆఖరికి ఎంతో మధురంగా ఉంటుందని అనుకున్న ఈ ప్రెగ్నెన్సీలో కూడా అపశ్రుతి.
అబ్బార్మల్ బాబు. అంటే పెద్ద తల, పెద్ద కళ్ళు, చట్టిముక్కు ఎత్తు నుదురు ఇలాగే బంటాడా” ఊహించలేకపోతున్నాను. ఏదో ఓ క్షణాన ఈ లోకంలోకి చన్త్హైడు ఎలా బతగ్గలడు? బుద్ధి సరిగా ఉంటుందా? నడక వస్తుందా? నీరవ్...సొంత తండ్రికే వాడి మీద అభిమానం లేదు. ఎలా అయినా వాడిని నేను బాగా చూడగలను.. నేనే తండ్రిగా, తల్లిగా ఉండగలను. ఆ ధైర్యం నాకుందా?
అత్తగా ఎ వచ్చారు. అంతవరకూ మా మీద ఉన్న కోపం పోయిందట.
ఆ రోజు రానే వచ్చింది. నెలలు పూర్తిగా నిండకుండానే అర్ధరాత్రి... ప్రకృతి, లోకం అంతా ని(ద్రపోతున్నప్పుడు.
నాకు తెలివి వచ్చేసరికి అత్తగారూ, నీరవ్ మాట్లాడుకుంటూ కనిపించారు.
నేను కదలడం చూసి నీరవ్ నా దగ్గరికి వచ్చి జుట్టు సరిచేశాడు. ఆ చిన్న పనికి, గూడు కట్టుకున్న దుఃఖం తెంచుకుని బయటికొచ్చింది. ఆ చిన్న ఆప్యాయతకోసం ఎన్నో రోజులనుంచి తపించి పోతున్నాను.
“ఏడవకు. బాబుని ఇన్‌క్యుబేటర్‌లో పెట్టారు.”
“ఎలా ఉన్నాడు? చాలా అబ్నార్మల్‌గా ఉన్నాడా? నేను చూడాలి.”
“ముందు కాఫీ తాగు. ఇడ్లీ కూడా తినొచ్చన్నారు.”
నీరవ్ మొహం మారింది. నిన్నటివరకూ మొహంలో ఉన్న భావాలు వేరు. టక మనిషి, రెండు మొహాలు.
“ఎలా ఉంది?” ఆ ఆప్యాయత అసహజంగా ఉంది.
బాధ, దుఃఖం, అందులోనే నిద్ర.
ఎక్కడో మాటలు...అందులో నీరవ్ గొంతు. మత్తు... కళ్ళు తెరవాలనిపించడం లేదు.
“పిల్లవాడు బతకుతాడా?”
“బతకడని అనేశారు. ఎన్ని రోజు_.ంటాడో చెప్పలేరట.”
బలవంతంగా కళ్ళు తెరిచాను. లత్రగారితోపాటు మరో నలుణీరు ఆడవాళ్ళు
నా మూడేళ్ళ వైవాహిక జీవితంలో వాళ్ళను నేనెప్పుడూ చూళ్ళేదు.
40
కళ్ళు మూసుకున్నాను
“వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇలా పుట్టారా?”
“ఏమె... ఏం తెలుసు? మా కిష్టం లేని పెళ్ళి ఇది. ఇన్నేళ్ళు వాళ్ళు మా ఇంటికి రాలేదు ఆ సంగతి మీకు తెలియదా? మేమూ వెళ్ళలేదు. తీరా ఇలా అయ్యాక మేమే రాజీ పడి వచ్చాము. చూస్తే...పిల్లాడు ఇలా పుట్టాడు. ఏం రాసి పెట్టి ఉందో వాడి మొవాను”
“అసలు మనవాళ్ళు ఎందుకన్నారు - అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పిల్లని తెచ్చుకోవాలని. ఎందుకు? ఇదిగో ఇందుకు ”
“ఇదిగో నీరవ్! ఇందాక దాక్టరు అన్నారు కూడా - మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా పుట్టారా అని. అంటేఇది వాళ్ళ వంశంలోంచే నన్నమాట. ఆ రక్తంలోనే ఉందేమో, మనింట్లో లేదు.”
ఊపిరి బిగబట్టాను. నీరవ్ ఏమంటాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.
నీరవ్ ఏమీ అనలేదు! ఆఖరికి, 'అంతా నీ చాదస్తం'అని కూడా అనలేదు. ఆశ్చర్యం,
ఏడు పొచ్చేనింది. ఒంటి దాన్నయినందుకు, నా వంశ చరిత లాగుదామనుకుంటున్నందుకు.
“పెడిగ్రి అనాలసిస్ చేస్తారుట. ముందు ముందు పిల్లలు కావాలో, వద్దో దాన్ని బట్టి మనం తేల్చుకోవాలిట, నీకు తెలిసినది చెప్పు వాళ్ళకి.”
“నాకు మా వాళ్ళగురించి ఏమీ తెలియదు. మేం ఉన్న ఊళ్ళో సరైన కాలేజీ లేక నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను. నే నెలా చెప్పగలను?”
మర్నాడు మెల్లగా నడుచుకుంటూ, నీరవ్ సాయం రాగా బాబుని చూడటానికి
గాజు పలకలోంచి చూశాను.
ఒళ్ళంతా కట్లు, ప్లాస్టర్స్, ట్యూబ్స్...
ఎ(ర్రగా...కదలకుండా ఓ పక్కకి ఒత్తిగిలి పడుకుని ఉన్నాడు.
ఈ లోకంలోకి ఏ ఆశతో వచ్చాడు? ఎందుకొచ్చాడు? అఆ చిన్ని కళ్ళలో కలలు ఉండి ఉంటాయా? అమ్మ ఒళ్ళో పడుకోవలసినవాడు, ఒక్కడూ జీవితంతో
జ!
పోరాడుతున్నాడు. నీరవ్ లాంటి మనుషులు రంగులు ఎలా మారుస్తారో తెలియచేశాడు. నాకో పారం నేర్పాడు - దగ్గరి వాళ్ళుకూడా అవకాశవాదులేనని, ఈ బాబే పుట్టకపోతే, ఈ సె౬ ( రవ్‌తో ఇంకా కాపురం చేస్తూ ఉండేదాన్ని. ఎన్నీ రోజులుంటాడు? - ఆ ఊహ రాగానే గిల్బ "చ్చేశాను.
జీవితం ఆ నట్టుంది.
ఏదో ఓ క్షణాన... ఆ రోగం అలాంటిదట, అది జీన్స్‌లోంచే వచ్చిందట...తలో మనిషితలోమాట. బిలబిలమంటూ మీడియావాళ్ళు వచ్చేసారు. “రీసెర్చిల వాళ్ళు, బ్లడ్ శాంపిల్స్ కావాలిట. డి.ఎన్.ఎ.కి మెటీరియల్‌ట.”
“మీ ఇంట్లో ఎవిరికైనా...”
“ప్లీజ్! నన్నూ నా బాబుని వదిలేయండి. మీ కావాల్సింది డిఎన్‌ఎ మెటీరియల్‌కదా! నేను చెప్తా -
“కేరళ వెళ్ళండి. కొబ్బరి నూనె వాడినా అసలు గుండె జబ్బు అనేది రాని వంశంలోని ఓ కుటుంబం ఉందిట. వెళ్ళి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి.
“అందరికీ మలేరియా వస్తున్నా, మలేరియా రాని కొన్ని కుటుంబాలు అస్సాం, మణిపూర్ ప్రాంతాల్లో ఉన్నాయట. చార్మినార్ దగ్గర ఓ యింట్లో కొంతమందికి నాలుగు వేళ్ళు ఉన్నాయట. ఆ జీన్స్ ని సెపరేట్ చెయ్యండి. ప్రైజులు తెచ్చుకోండి.
“నన్ను, నా బాబుని వదిలేయండి...”
“చాలా డిస్టర్చ్‌డ్ స్టేట్‌లో ఉంది...”అంటూ వాళ్ళందరినీ పంపేసి, నన్ను మెల్లగా పట్టుకుని రూమ్‌కి తీసుకొచ్చి పడుకోబెట్టాడు.
“ఈసారి ఆడపిల్లయితే చెప్పులేరటకాని, మగపిల్లాడు అయితే ఇంతేనట! అని డాక్టరుగారు అన్నారు” నా ఎదురుగానే అత్తగారు ఎవరితోనే అంటున్నారు.
“మన వాళ్లలో పిల్లలే లేరా? మా ఖర్మ!” అందరితోనూ ఇదే మాట.
నీరవ్ కూడా తల్లి మాటలకే సపోర్ట్ చేస్తున్నాడు. తను (ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు బాధుపదుతున్నాడని ఆ మౌనం చెప్తోంది. .
ఈ మనిషిని ఎలా నమ్మాను? ఎన్ని నీతులు మాట్లాడాడు. ఎన్ని మాటలు చెప్పాడు? అన్నీ పైపైనేనా? అభిమానం చంపుకుని నీరవ్‌తో గడపనా? ఎక్కడికైనా వెళ్ళనా? పుట్టింటికెళ్తే... మమ్మల్ని కాదని పెళ్ళి చెసుకున్నావు, మా ఇంటికి ఏ మొహంతో శై
వస్తున్నావ్ అని అంటారా? ఇంతమంది ఉన్న ప్రపంచంలో నాకు ఎవరూ లేరా? ఒంటరిదాన్నా? మాట సాయం కూడా లేదా? ముసలిదాన్నయ్యాక అయినా ఒంటరితనం తప్పదు కదా? పిల్లలు చూడరు. మొగుడు వయసుపైబడిపోతాడు. అప్పుడైనా ఒంటరితనం అనుభవించక తప్పదు. అది ఇప్పటినుంచే ఎందుకు ప్రాక్టీసు చెయ్యకూడదు?
ఆఫీసులో వాళ్ళు అంతా వచ్చారు. ఉద్యోగం మానేయద్దు, అనవసరమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అన్నారు.
“నా గతం, నా వర్తమానం అస్తవ్యస్తంగా ఉంది. పాడైపోయింది అని తెలివి తక్కువాడు అనుకుంటే, భవిష్యత్తు ఇంకా ఉంది అని తెలివైనవాడు అనుకుంటాడు. రేపటి భవిష్యత్తుకి ఈ రోజు నుంచే పునాది వెయ్యి.” యశ్వంత్ ధైర్యం చెప్పాడు.
“ఇదా జీవితం అనుకోవడంలోనూ, ఇదే జీవితం అనుకోవచంలోనూ తేడా తెలుస్తోందా? ఎవరో ఏదో చేస్తారనుకుంటే ఎలా? నీ జీవితం నీ చేతుల్లో ఉంది.”
రెండు రోజుల పిల్లాడు తనకి మించిన శక్తితో జీవితంతో పోరాడుతుంటే నే నెందుకు ఆ పని చెయ్యలేను? నాలో శక్తిఉంది. అది బయటికి రావాలి. ఎత్తెన కొండ ఎక్కాలంటే మొదట్లో చిన్న అడుగులే వెయ్యాలి. ఈ సత్యం నేను తెలుసుకోవాలి.
మరో రెండురోజులు జీవితంతో పోరాడి, అలసిపోయి ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు.
ఇంటికొచ్చే వాళ్ళతో నీరవ్, అత్తగారు, మావగారు బిజీగా ఉంటే, నే నొక్కదాన్నేగదిలో నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయాను.
“చీకటి పడిందంటే మరో ఉదయం వస్తోందని కదా! ఇవాళ ఈ తలుపు మూసుకుందని బాధపడితే ఎలా? మరో తలుపు తెరుచుకుంటుంది.
“కష్టాలు మనుషులకే వస్తాయి. ఎవరికి రావు అంటే శృశానాల్లో సమాధి అయిపోయిన వాళ్ళకి రావు. వాళ్ళకి, మనకి తేడా ఎక్కడ? లైఫ్...బీయింగ్ ఎ లివింగ్ థింగ్! సంతోషించు నువ్వు మనిషివని.”
యశ్వంత్ తను చదివిన పుస్తకాల్లో కొటేషన్స్ చెప్తూ ధైర్యం చేస్తున్నాడు. మామూలు మనిషిని చేయడానికి టై చేస్తున్నాడు.
త్ర
యశ్వంత్ చిన్నవాడే అయితే తప్పకుండా మమ్మల్ని నీరవ్ అనుమానించేవాడు. చిన్న మనవడూ, మనవరాలూ ఉన్న వయసు. నా తండ్రి వయసువాడే. స్వంత తండ్రి ఓదార్చలేక పోయాడు. “నా ఫెండ్స్ ఏమనుకుంటారు? మన వాళ్ళు ఏమనుకుంటారు” ఇవే తన తండ్రి మాటలు. ఒకళ్ళకోసం తన రక్తాన్ని కూడా లెక్క చెయ్యనంత అహంకారమా మనిషికి.
పెద్దవాళ్ళుంటే సలహాలు, ఇవ్వాలా. వద్దా? కష్టం వచ్చినప్పుడు ఆఖరికి మాట సాయం చెయ్యని ఈ పెద్దరికం ఎందుకు?
మెల్లమెల్లగా నీరవ్ అంతరార్థం తెలిసింది. అత్తగారి ఆలోచనలు అర్ధం అవుతున్నాయి. “రెస్ట్ తీసుకో! విశ్రాంతి నీ కవసరం!” అంటూ నా గదిలోకి రావడం మానేశాడు.
ఈ మనిషిని ఎలా నమ్మాను? పిల్లల్ని కనదానికేనా నేను? పూర్వం...పాత మనుషులు... చదువులేని వాళ్ళు అంటే అర్ధం ఉంది. ఈ యుగంలో కూడా...ఇంత చదువుకుని కూడా...అవే ఆలోచనలా?
పెళ్ళికి ముందు స్నేహం, ప్రేమ...అంతా మోసమా? నా భ్రమా?
ఆఫీసుకు వెళ్ళడం మొదలు పెట్టాను.
“పడవలు ఒద్దున ఉంటే సురక్షితంగా ఉంటాయి. అంతమాత్రాన పడవల్ని పనీపాటా లేకుండా ఒడ్డునే ఉంచేస్తామా? సముద్రం మీదికి తీసుకువెళ్ళమా? లీవ్‌కన్నా ముందే ఆఫీసులో జాయినై మంచి పని చేశావ్!”
“పెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడం అంతటి నష్టం మరొకటి లేదు. బి బ్రేవ్!”
నిజమే. నేను ధైర్యంగా ఉందాలి.
నా భర్త నన్ను భార్యగా చూడకపోతే నేను జీవించలేనా? నన్ను ఓదార్భకపోతే _.. మామూలు మనిషిని అవలేనా?
నా తల మీద చేయి వేసి ధైర్యం ఇవ్వకపోతే ఏం?
ఇది నా జీవితం.
దానికి సంపూర్ణత్వం నా నుంచే రావాలి.
ఈ ఆస్తి, ఈ వంశం అంటూ మధన పడుతున్న అ కగారితో. నీరవ్‌తో అన్నాను
- “ఎవరినైనా పెంచుకుందాం” అని. శ్వ
“అదెలా కుదురుతుంది? ఎవరో రక్తం...ఎలా పెంచుకుంటాం?”
“పోనీ స(ర్రోగేట్...” నా మాట పూర్తి అవలేదు.
“ఎవరో అమ్మాయి డబ్బుకోసం నా పిల్లల్ని మోయడం...”
అంటే ... మరో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడా?
స్వార్ధం ఏ విధంగా మనిషినిదిగజార్చిందో నీరవ్‌ని చూస్తే తెలిసింది.
“అంటే... నీఉద్దేశ్యం...” బాధతో గొంతు పూదుకుపోయింది. గబగబా గదిలోకి వెళ్ళాను.
“అది కాదు...”అంటూ సంజాయిషీ ఇచ్చుకోడానికి నా వెనకాలే వస్తాడని ఎదురు చూశాను. కానీ రాలేదు.
ఎవరి మాటలు వాళ్ళే మింగడం అంత అజీర్ణం మరొకటి లేదు.
అందుకే విడాకులు తీసుకుందామని అన్నాను.
నీరవ్ అద్దు చెప్పలేదు.
అసహ్యం వేసింది.
భార్య అంటే...నీరవ్ డిక్షనరీలో అర్ధానికి.
జీవితంలోని అత్యంత ముఖ్యమైన మలుపులో తీసుకోవాల్సిన నిర్ణయంలో పెద్ద పొరపాటు జరిగిపోయింది.
'ఫెయిలయిపోయాను.
ఆఫీసులో అదే అని గట్టిగా ఏద్బేశాను.
అందరూ ఓదారుస్తున్నారు.
“నేను చెప్పేది వింటావా, అలా ఏడుస్తూ ఉంటావా?”
కళ్ళు తుడుచుకున్నాను.
“లింకన్ గొప్పవాడు అని ఒప్పుకుంటావా?”
నేనేం మాట్లాడలేదు.
“లింకన్ బిజినెస్‌లో ఫెయిలయ్యాడు. పెళ్ళాం పోయింది. స్పీకర్‌గా ఓడిపోయాడు. కాంగ్రెస్‌కోసం నుంచుని ఓడిపోయాడు. ఎలక్షన్లలో ఓడిపోయాడు. సెనేటర్‌గా నుంచుందామనుకుని అందులో కూడా ఓడిపోయాడు. వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీచేసి ఓడిపోయాడు. ఆఖరికి యాభై ఒకటో ఏట ప్రెసిడెంట్‌గా గెలిచాడు. ఆయన జీవితంలో గెలుపులకన్నా ఓటమి ఎక్కువ. నీలా ఏడుస్తూ కూర్చున్నాదా?”
శ్
“అంతెందుకు, యుద్ధ చేసిన ముఖ్యమైన యుద్ధాల్లో నెపోలియన్ చాలాసార్లు పరాజయం పొందాడు. అందుకని యుద్దాలు మానేశాడా? ఇంకొకళ్ళ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకో!
“ఏ విధంగా నువ్వు అన్నీ మరిచిపోతావో అది నీ చేతుల్లో ఉంది. నీ మైండ్‌ని బిజీగా ఉంచు. ఎన్నో పనులు కల్పించుకో.”
“ఎంతలా చేసినా రాత్రి అయ్యేటప్పటికి ఒంటరిదాన్ని అన్న సంగతి భయపెడుతోంది.” వేసే ప్రశ్నలకి కూడా జవాబులు సిద్ధం చేసుకో! బ్యాంకులో డబ్బుదాచు. అది చూసే ఏదైనా సంస్థ వాళ్ళో, హాస్పిట్‌ల వాళ్ళో నీకు పిల్లల్ని ఇస్తారు. నీ ఈ ప్రెజెంట్ స్టేజ్‌లో నీకు ఎవ్వరూ ఏ అనాధ శరణాలయాల వాళ్ళు కూడా పిల్లాణ్తికాని, పిల్లనికానీ ఇవ్వరు.
“పెంచుకో దలచినప్పుడు ఎవరి తాలూకు, వాళ్ళలో జీన్స్, వాళ్ళ రక్త శుద్ధి గురించి, కులగోత్రాల గురించి అడగకు. జీన్స్ ఏదైనా, పెరిగిన ప్రభావం మనిషిమీద చాలా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా హెల్తీ వాతావరణంలో పెరిగేవాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు. నీ చదువు, విజ్ఞానం, తెలివి - అన్నీ కూదా ఆ పిల్లల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగించు. బెస్టాఫ్ లక్!”
చాలారోజుల తర్వాత గతం ముందుకొచ్చింది.
నీరవ్ గురించిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఇవ్వాళే ఈ ఆలోచనలు అఖరు.
ఒక్కదాన్ని ఇటుపైన జీవితం గడపడం కష్టం. కాగితం,పెన్ను తీసుకున్నాను. నా ఉద్యోగం, ఆదాయం, ఆస్తి, చదువు, వయస్సు - అన్నీ వివరంగా రాస్తూ ఇద్దరు పిల్లల్ని పెంచుకోవడానికి ఇవ్వమని ఉత్తరం రాశాను - నిర్మలా అనాధ శరణాలయానికి.
ఈ 2297 రొంద్రు రాఖీ తారీరర్తిత ఈ. ఆళ్ళ ల 4ీగ్ర
ఇంకా బాగా తెల్లారలేదు. చీకటి చీకటిగా వుంది. అ సమయాన పచ్చటిపట్టుచీర, ఒంటినిండా నగలు, నీళ్ళు కారుతున్న జట్టుతో గబగబా పెరట్లోని బాత్రూము దగ్గరకెళ్ళి తలుపుకొట్టింది వీరమ్మ.
“అమ్మగారూ! స్నానం అయిపోతే వచ్చేయండి. అంతా మీ రాకకోసం ఎదురు చూస్తున్నారు.
ఒక్క సెకండు తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. అమ్మగారు బయటికొచ్చి, ఎడంవైపుకి చూశారు.
చెట్లకి నీళ్ళు పెడ్తున్న వెంకటేశు, అదే సమయానికి చూసాడు.
వీరమ్మ విసుగ్గా వెంకటేశు వైపుచూసి 'నీ పని చేసుకో'అన్నట్లు చెయ్యి ఊపి నడిచింది ఇంటివైపు.
అమ్మగారు మౌనంగా వీరమ్మ వెనకాలే వెళ్లారు. అమ్మగారికి ఎర్రటి పట్టుచీర, నగలు వడ్డాణం అది పెట్టి అలంకరించింది. పిలుపు వచ్చాకా అమ్మగారు భక్తులంతా వున్న హాల్లోకి వెళ్ళి ఆసీనులవుతారు. అదీ రోజూ జరిగేదే.
పక్కగానే వున్న వాలు పెద్ద లైట్లతో పట్టపగలులా వుంది.
భజనలు అవుతున్నాయి. గంటలు మోగుతున్నాయి.
వీరయ్య, తన ఎర్ర బరంపురం వంచని, పైన వున్న పట్టు వ'స్తాన్ని సవరించుకుంటూ చేతిలో వున్న పూలసంచిని, ఓ పక్కగా వున్న ముత్తయిదువులకిచ్చి దండలు వెయ్యమని సైగచేశాడు.
శ
అ హాల్లో ఓ వైపున తెర వుంది. అది సంత్రారంగులో వున్న సిల్కు బట్టతో కుట్టినది.
అ తెర లాగారు.
వెండికాళ్ళున పీఠం ధగధగ మేరిసిపోతూ దేవతలు మీద కూచున్న అమ్మగారు అందరికీ దర్శనమిచ్చారు.
భజన జోరు హెచ్చింది.
“అయ్యగారు” అన్నాడు వీరయ్య.
వివిధాకారాల్లోవున్న హారతి పళ్ళాల్ని నేతి వత్తుల్తో అలంకరెస్తున్నాడు. చేస్తున్న పని ఆపి వీరయ్యవైపు చూశాడు ఆ అయ్యగారు.
“ఈరోజు శుక్రవారం. భక్తులు ఎక్కువమంది వస్తారు. దర్శనం మొదలెట్టాకా మనిషికి ఐదు నిమిషాలకన్నా ఎక్కువ యివ్వద్దు”
“అలాగేనండి”అన్నాడు.
వీరయ్య పిలిచిన అయ్యగారు, నిజానికి వీరయ్య కొడుకు. పూర్వనామం భిక్షపతి.
ఓ నల్లప్యాంటు, ఓ ఎ(ర్రటీవర్భు, లేకపోతే అడ్డచారల టీవర్చుతో సందయ్‌దత్‌లాంటి జులపాల జుట్టుని నీళ్ళు వేసి దువ్వి యింటినుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో వున్న ఆడపిల్లల స్కూలు దగ్గర కాసేవాడు.
అది ఒకప్పుడు.
ఇప్పుడు - కార్డంచు జరీ పంచ, పిలక, నుదుట వీబూతి...గంబీరంగా తనపని చేసుకుపోతున్నాడు. కారణం కొత్త అవతారం.
అమ్మగారు అనబడే ఆమె వీరయ్య పెద్దకూతురు శారద,
ఆమె పుట్టినపుడు బాధపడ్డ తలిదండ్రులు యిప్పుడు వాళ్ళ అదృష్టానికి సంతోషపడ్డున్నారు. వాళ్ళ చీదరింపులు, ఛీత్కారాలు భరించి, బదులుగా కోటి వరాలిస్తోంది. ఆమె ఓ కల్పవృక్షం. ఆమె ఓ కామధేనువు.
ఈనాటికీ వీరయ్యకి బాగా గుర్తు... శారదపుట్టిన రాత్రి...ఆ రాత్రి పెద్ద గాలీ,
వీరమ్మ గదిలో నొప్పులు పడ్డూంటే వీరయ్య బయట బీడి తాగుతూ పచార్లు చేసు&తన్నాడు.
4
శేర్ మన్న ఏడుపు.
లోపలికెళ్ళి చూశాడు ఆత్భతగా.
అస్తవ్యస్తంగా వున్న వీరమ్మ పక్కన బిడ్డ. .ఆడపిల్ల...నన్నగా చేతివేళ్ళంత సన్నగా కాళ్ళు చేతులు, పెద్ద తల, కప్పలాగా ఉబ్బిన కళ్ళు.
తల పట్టుకున్నాడు వీరయ్య.
వీరయ్యలోని శక్తి అంతా ఆ పురుటి కందు లాగేసింది.
“వీరయ్యా! ఏం బాధపడకు. ఇలాంటి పిల్లలు రోజుల్లెకృపెడ్తూ జీవిస్తారు."
ఆరోజునుంచి పిల్లపోయింది అనే మాటల కోసం ప్రతిరోజూ ఎదురుచూడ్డం మొదలుపెట్టాడు.
అయితే నిరాశే మిగిలింది.
రోజులు గడుస్తున్నాయి. నెలలు గడిచాయి. ఏళ్ళు వెళ్తున్నాయి. శారద తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టారు. వాళ్ళంతా బాగున్నారు. అందరూ కూడా సరిగా. సహజంగా పెరుగుతున్నారు. కానీ శారద మాత్రం అలాగే ఏ మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా వుండిపోయింది. వీరయ్య, వీరమ్మ శారదని అసహ్యించుకున్నా, నిస్సహాయంగా పెంచుకుంటున్నారు.
అలాంటి సమయంలో ఓరోజు పంచాయితీ టీవిలో వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరికింది.
నేపొలులో ఓ కన్యని, దేవతలాగా అలంకరించి ఊరేగించడం. పరిష్కారం కనపడింది.
ఊపిరి పీల్చుకున్నాడు. టివికి దండం పెట్టుకున్నాడు.
రెండురోజులు వీరయ్య, వీరమ్మ మంతనాలు జరిపారు.
కూతురు శారదని పిలిచారు. పదేళ్ళ శారద నాలుగేళ్ళ అమ్మాయిలాగా వుంది.
“ఇవ్వాళ నుంచి నీపేరు అమ్మ. అమ్మగారు. అమ్మోరు అర్ధం అయిందా. మేం కూడా అలాగే పిలుస్తాం. నేనేం చెప్తానో అదే చెయ్యి, నోరెత్తకు. చెయ్యకపోతే ఏం
మూడేళ్ళ పిల్లలాగే భయపడింది. అసలే పొడుచుకొచ్చిన కళ్ళు. భయంతో యింకా పెద్దగా చూసేటప్పటికీ వీరయ్యకే భయం వేసింది.
త్త
నాలుగు రోజులు శారదకేం చెయ్యాలో చెప్పారు. నేర్పించారు.
వార్త వ్యాపించడం మొదలెట్టింది.
“మా పిల్ల అన్నం తినదు. నిద్రపోవడం లేదు. మాట్లాద్దం మానేసింది. ఎప్పుడు చూసినా దేవుడి పటం ముందు కూచుని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఎంతో భయంగా వుంది” అంటూ ఇరుగమ్మకి పొరుగమ్మకి చెప్పి వాళ్ళ నోటితోనే శారదని అమ్మవారు ఆవహించింది అన్న ప్రచారం చేయించారు.
నిజమో కాదో చూద్దామని ఊలళ్ళోవాళ్ళు రావడం, వచ్చాకా ఆశ్చర్యపడడం. ఆకారం చూసి వయసు అంచనా వెయ్యలేకపోయారు. ఇంత చిన్నపిల్లకి ఇంత నిష్ట ఏమిటనుకున్నారు. ఈ జ్ఞానం ఎలా వచ్చిందబ్బా! అంత దేవ* మహత్యం అనుకున్నారు.
రోజు రోజుకి సంఖ్య ఎక్కువవడం మొదలయింది.
సమయం చూసుకుని ఊగిపోయేది. భయంతో దూరం వెళ్ళిపొయ్యేవారు. వీరయ్య, వీరమ్మ వేపమండలు పూపుతూ శాంతించమని వేడుకునేవారు. కొబ్బరికాయలు కొట్టేవారు. గుమ్మడికాయలు కొట్టేవారు. నీరసంగా శారద పడిపోయేది. పళ్ళరసం యిచ్చి మామూలు మనిషిని చేసేవారు.
శారద అమ్మోరి అవతరాం అని అందరూ నమ్మారు.
పక్క ఊళ్ళ వాళ్ళకి తెలిసింది.
మొదట్లో ఏవిటో చూద్దామని ఉత్త చేతులతో వచ్చినా. రాను రాను ఏదో ఒకటి తెచ్చి యివ్వడం మొదలెట్టారు.
కొంతమంది ఎవో ప్రశ్నలు వేసేవారు. తోచినది చెప్పేది. దానికే అంతా ఎంతో తృప్తిగా వెళ్ళిపోయే వారు.
ఇంటి వాతావరణంలో మార్పు, భాషలో మార్చు, వేషధారణలో మార్పులు వచ్చాయి. తగ్గు స్థాయిలో మాట్లాడం మొదలెట్టారు.
వాళ్ళు, వీళ్ళు యిచ్చిన మిఠాయిలు, కొబ్బరికాయలు, పళ్ళు అందరికీ పంచేసేవారు. మంచి అభిప్రాయం ఏర్పడేలాగా (ప్రవర్తించారు.
నిస్వార్ధులని, మంచే చేస్తున్నారని అందరూ అభిప్రాయపడ్డారు. హారతిలో డబ్బులు వెయ్యడం మొదలెట్టారు. రోజుకి ఓ పది పదిహేను సార్లు హారతివ్వడం మొదలు పెట్టారు. మరి అన్నిసార్లో ఉగ్టిపోయి పడిపోయేది.
50
మంగళవారం, శుక్రవారం జనం బాగా రావడం మొదలెట్టారు. టైములో చూసినా, ఎవరు చూసినా కళ్ళు మూసుకుని వుంటుంది.
ఇటు ఖమ్మం అటు నల్గొండ మరో వైపు విజయవాడ ఈ మూడు జిల్లాలకి చేరువగా వుంటడంతో, వచ్చినవాళ్ళు ఒక్కోసారి రాత్రికి వుండి పోయేవారు. పని అయిపోతే పెద్ద దూరాలు కాదుకాబట్టి వెళ్ళిపోయేవారు.
యిల్లు సరిపోక, యింటిముందు తాటాకుల పందిరి వేసారు. అదికూడా సరిపోలేదు. పక్కవాళ్లున్న యిల్లు కొనేసారు.
యింటికి పక్కగా వున్న స్థలాన్ని పంచాయితి వాళ్ళని అడిగి చవగ్గా కొనేసాడు వీరయ్య. అక్కడ ఓ చిన్న హాలు కట్టించాడు. యింట్లోంచి ఓ తలుపు హాల్లోకి పెట్టించాడు
వీరయ్య వీరమ్మలకి, భక్తుల్ని, వాళ్ళ కానుకల్ని సమర్ధించడం కష్టం అయింది. ఆడ పిల్లల స్కూలు దగ్గర కాపుకాసే పెద్దకొడుకు భిక్షపతికి పట్టం కట్టారు జుట్ట తీయించుకున్నారు తండ్రీకొడుకులు. చిన్నపిలకలుంచుకున్నారు. పెద్దయ్యగారు, చిన్నయ్యగారుగా మారారు.
యింటికి దారితీసే రోడ్డు బాగయిపోయింది. రోడ్డు చివరన ఆగె బస్సుల్ని వీరయ్య యింటివరకూ లాగిస్తున్నారు.
వీరమ్మ పెద్దమ్మ అయింది. పెద్ద జరీ చీరలు, నగలతో హుందాగా మారిపోయింది.
శారదమ్మతల్లి అదే అమ్మోరులో ఏమార్చు లేదు. శరీరంలో మార్పులేదు అంతే పొట్టి. అదే సన్నం. కాకపోతే, ప్రకృతి సహజమైన మార్పులొచ్చాయి. పద్దెనిమిదేళ్ళు వచ్చినా, వదేళ్ళమ్మాయిలా వుంది. వహోర్మోన్లు మటుకు వయసుకు తగ్గట్టుగా పనిచేస్తున్నాయి.
ఇంతమందిని సంతృప్తి పరిచింది.
యింట్లో వాళ్ళకి బోల్టు డబ్బు, ఆస్తి, నగలు సంపాదించి యిచ్చింది. అందరి జాతకాలు మార్చేసింది. యింటిని మూడంతస్తుల బంగళాలాగా మార్చేసింది. రాతలు మార్చేసింది.
అయితే, ఆ అమ్మోరు తృప్తిగా వుందా. అని ఒక్కసారయినా ఆ యింట్లో
/ో శ్ర న్! స పా ల్లో డో )
అమ్మోరు మనసులో ఏముందో తొంగిచూశారా... మనిషి వామనావతారమే.. కానీ మనసు...
మనిషి వికారం భక్తులు కాళ్ళు గట్టిగా పట్టుకుని దండం పెట్టేసుకుంటూంటే, ఏదోలాగా అనిపించింది. గట్టిగా కళ్ళు మూసుకునేది విగ్రహాల్లో వుండి పోయిన అమ్మోర్ని తలుచుకుంటూ మనిషి అందంగా లేకపోతేనేం అందమైన (స్రీత్వం వుందిగా.
శరీర ధర్మాల్ని యధావిధిగా చేసుకుపోయే స్త్రీత్వం.
ఏవో 'కలలు, ఏవో కోరికలు.
అమ్మోరికి తెలుసు ఆమె కలల్ని కోరికల్ని పెద్దమ్మ, పెద్దయ్యగారు నిజం కానీయ్యరు
వాళ్ళకి ఆమె మింటింగ్ మెషిన్,
ఆమెమీద అధికారం ఆమెకి లేదు. పెద్దయ్యగారికి వుంది.
ఓరోజు -
వీరమ్మ బాత్రూం వైపు నడిచింది. అమ్మగారిని పిలవడానికి వెంకటేసు అక్కడే నుంచున్నాడు వీరమ్మని చూసి అక్కణ్ణించి మెల్లగా వెళ్ళిపోయాడు. అనుమానంగా వాడివైపు చూసింది
“అమ్మా! స్నానం అయితే బయటికొచ్చేయండి. భక్తులంతా వచ్చేసారమ్మా”
టక్కున తలుపు తీసి బయటికొచ్చింది శారద..కాదు అమ్మోరు.
తడిజుట్టుని అలాగే వదిలేసింది. |
ఎర్ర పరికిణి, ఎర్ర పట్టు జాకెట్టు పైన ఎర్రచీర చుట్టుకుని గదిలోకి వచ్చింది. వీరమ్మ ఆమెని నగలు అదీవేసి అలంకరించింది. చీర అందంగా జరీ మడతలు వేసి కట్టింది. వడ్డాణం పెట్టి, ఆఖర్న కిరీటం పెట్టింది.
గది తలుపులు తీసుకుని హాల్లో వున్న తన ఆసనం మీద కూచుంది.
పెద్దయ్యగారు పరదా తీశారు.
చిన్నయ్యగారు హారతి పళ్ళెం పట్టుకున్నారు.
భజన మొదలైంది.
భక్తుల్లో ఊపు మొదలైంది. అమ్మోరు కూడూ ఊగటం మొదలెట్టింది.
గబగబా హారతి ఇచ్చారు. 52
“అమ్మ! తల్లి శాంతించు” అంటూ వేప మండలతో అమ్మోర్ని శాంతింప చేస్తున్నారు. గుమ్మడికాయలు తెచ్చి పగలకొట్టారు.
గబగబా కొబ్బరికాయలు కొట్టారు.
గంటలు గణగణా మోగించారు.
అమ్మవారు శాంతించారు. పక్కనే వుంచిన పళ్ళరసం తాగించారు. కళ్ళు మూసుకున్నారు.
“పేపరు వాళ్ళు వచ్చారమ్మా ఇంటర్వూ ఇస్తారా?”
మైకు దగ్గరికి పోయి గట్టిగా అనౌన్స్ చేసాడు. “అమ్మవారు ఇంటర్వ్యూ నిమిత్తం దర్శనాలు ప్రస్తుతం ఆపేస్తామని” తెర వేశారు.
కెమెరాతో ఓ యువకుడు, పుస్తకం పెన్నుతో మరో యువకుడు వెంటరాగా పెద్దయ్యగారు లోపలికి వచ్చారు.
“మీ పేరు”
“అమ్మవారు. అమ్మోరు” పెద్దయ్యగారి సమాధానం.
“అసలు పేరు”
“క్షమించాలి. అమ్మవారు మౌనవ్రతం. ఆవిడ ఎవరితో మాట్లాడరు. మీ ప్రశ్నలకి నేను జవాబిస్తాను.
“మీరెవరు”
“ఇహలోక బింధం అంటే తండ్రిని. లేకపోతే భక్తుణ్ణి”
“అలాగా! మీకెవుడుు తెలినీంది మీ అమ్మాయిలో
“అంతకు ముందు రెండేళ్ళ నుంచి ఈ జిల్లాలో వర్నాల్లేక, పంటలు పండక ప్రజలు, రైతులు అత్మహత్యలు చేసుకుంట్ను సమయంలో అమ్మోరు పుట్టడం, వర్షాలు రావడం జరిగాయి. ఆ తర్వాత ఎప్పుడూ పూజలు చేయడం, ఎవరితో మాట్లాడక పోవడం, అమ్మోరు, అంత చిన్నగా వున్నా ఆవిడ అలా చేయడం అమ్మోరి మహిమ కాదాండి” వచ్చిన వాళ్ళకి అమ్మోరు వయసు అదీ తెలీదు.
“అబద్ధం” అంటూ అమ్మవారి హృదయంలోంచి ఆక్రోశం.
నాన్నా! అంతా అబద్ధం. నన్ను కురూపి, పొట్టిపిల్ల, శని, పిశాచం, దరిద్రం లాంటి మాటలతో నన్ను పొడిచేశావు. అప్పుడు నా గొప్పతనం గుర్తురాలేదా నాన్నా.
53
యింత గౌరవం, భక్తి నామీద నీకు కలగడానికి కారణం మనిద్దరికీ తెలుసు. తెలియందీ మూర్థలోకానికి.
“అమ్మగారి దినచర్య ఏమిటి?”
సూర్యోదయానికి ముందే లేవడం. అభ్యంగన స్నానం, కొంచెం పాలు, భక్తులకి దర్శనం, ఎక్కణ్ణించైనా లేఖలు వస్తే వాటికి జవాబులివ్వడం. భజనలు, సాయంత్రం దేవుళ్ళ మీద ప్రసంగాలు.
“మరి ఆవిడ అన్నం అదీ తినరా?”
“తిండి, నిద్రా ఆవిడకీ ఆమడ దూరం. అవన్నీ మనలాంటి సామాన్యుల కోసం. అమ్మోరు వీటికి అతీతం. ఆవిడ శక్తి అలాంటిది.
అదుగో మరో అబద్ధం. నాన్నా! ఆకలికి ఆగలేక మొదట్లో అడిగి అడిగి విసిగిపోయాను ఏద్చేదాన్ని. తిని కూచుంటే లావయిపోతానని నీ భయం. కడుపులో ఏమీ లేకపోతే నిద్ర ఎలా పద్డుంది? నాన్నా! నీకిది న్యాయమా. చెప్పు నాన్నా. నీ కూతుర్ని మాద్చేస్తున్నావు. అన్నం తినని అబద్ధం చెప్పకు. ఒక్కోసారి ఎంత ఆకలేస్తూందంటే మీరెవరూ చూడకుండా ఏదైనా తిందామా అని అనిపిస్తుంది. కానీ, ఏదో భయం.
ఫోటోలు తీశారు. ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. నీరసంతో కళ్ళు వాలిపోతున్నాయి. బలవంతంగా తెరిచింది. ఎదురుగా వెంకటేశ్ నుంచుని వున్నాడు.
ఏదో శమన. ఏదో ఊరట. ఎంతో హాయి. ఏదో మైమరుపు.
కూచుని కూచుని తుంటి ఎముకలు తొడలు నొప్పి పెడ్తున్నాయి. కాళ్ళకింద వున్న చిన్న ముక్కాలిపీట మీదఆనించింది కాళ్ళు.
వెంకటేశు అక్కడే వుండటం వాళ్ళకి నచ్చలేదు.
“ఉ” అని గట్టిగా అన్నాడు పెద్దయ్య,
అమ్మోరు కోపంగా పెద్దయ్యగార్ని చూశారు.
వెంకటేశు అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
చీకటి పడ్డాకా వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు.
ఖమ్మం, నల్గొండ ఈ రెండు జిల్లాల దారిలో అమ్మోరు ఊరుండడం వల్ల గే
అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు రాత్రిళ్ళు ఉండకుండా వెళ్ళిపోతున్నారు. దూరాలనుంచి వచ్చి వెళ్ళకుండ ఉన్నవాళ్ళు హాల్లో సర్దుకుంటున్నారు.
అమ్మవార్ని లోపలికి తీసుకెళ్లిపోయారు. లోపలి గదిలోకి వెళ్ళాకా అమ్మవారు మామూలు ఆడపిల్లగా అయిపోయినట్లు అనిపించింది. తెలిగ్గ అయింది శరీరం.
కొంచెం పళ్ళరసం, బాదం పిస్తాలు తిన్నాకా చల్లగాలికి గదిముందున్న లతా మండపం దగ్గర నుంచుంది. వెంకటేశు కోసం వెతికింది. వెంకటేశు వచ్చి ఆమెదగ్గర నుంచున్నాడు. ఆమె చేతిలో చేయి వేసాడు. విద్యుత్తు పారుతోంది.
అదే సమయానికి స్నానం కోసం వచ్చిన భఛిక్షపతికి, పూజసామాను అంతా తెచ్చిన వీరమ్మకి ఏదో అర్ధం అయినట్టుగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.
వెంటనే అమ్మోర్ని లోపల గదిలోకి పిలిచి తలుపులు వేసిర నిలదీశారు.
“ఏవిటీ వ్యవహారం? నీ మనసులో ఏవుంది?” వాడి చేయి అలా పట్టు కుంటావా!
మౌనం.
“అమ్మగారు! ఇది తమరికి తగదు. మీరు అందరికీ అమ్మ. ఇలాంటి తుచ్చమైన విషయాలకి మనసు మళ్ళకుండా చూసుకోవాలి.”
“మౌనం.”
“సంసారిక కర్మలపట్ల ఉత్సాహం చూపకూడదు.”
“ఎందుకు? నేనాడపిల్లను కానా? నాలో కోరిక లుండవా?”
“కానీ నువ్వు అమ్మవారివి”
“నేను అమ్మగార్ని కాదు. అయ్యగార్ని కాదు” విసురుగా మంచం మీద కూచుంది.
“హుష్! మెల్లగా మాట్లాడు” వీరమ్మ అమ్మోర్ని శాంతింపచెయ్యదానికి అంది.
మళ్ళీ మంచం మీదినుంచి లేచింది
“ఎండుకు మాట్లాడాలి. ఎందుకు మెల్లిగానే మాట్లాడాలి. అందరు వింటారని భయమా. వింటే వినని. అర్ధం అవని. విన్నవాళ్ళందరికి తెలుస్తుంది. నేనో మామూలు అమ్మాయినని. నాపేరు శారదని. నేను అమ్మోర్ని కానని అందరికీ చెప్తాను.”
“నువ్వలా చెయ్యడానికి వీల్లేదు”
“నేనీ అవతారం వేసి వేసి, చేసి చేసి అలసిపోయాను. నేను అందరిలాటి మామూలు అమ్మాయిని”
క్5్
“నీ లోపం నీకు తెలీదా?”
“నేను పొట్టిదాన్ని ఇదే నా లోపం. కానీ, ఈ లోపం ఆ వెంకటేశుకి ఎందుకు కశపళ్ళేదు ఈ పద్దెనిమిదేళ్ళలో ఏ రోజునైనా, ఏ క్షణాన్నైనా నాతో ఆప్యాయంగా, (ప్రేమగా మాట్లాడిన క్షణాలున్నాయా? ఈ వెంకటేశు నిరక్షరాస్యుడు కావచ్చు. మన డర పనిచేసేవాదే కావచ్చు. కానీ నేను ఆడపిల్లను అన్న ఓ అనుభూతిని నాకిచ్చాడు.
“ఛీ! వినడానికే అసహ్యంగా వుంది” ఛీత్మరించాడు భిక్షపతి.
“వినద్దు. నన్నాదిలేయండి. నాకు స్వేచ్చనివ్వండి. మీకు దండం పెద్డాను. మీ కొళ్ళకి దండం. ఎకు ఓ దండం. నన్నాదిలేయండి”
“ఛత్! దండంట దండం. నీకు రోజు అందరూ దండాలు పెడ్తున్నారు. అది గుర్తుకు తెచ్చుకో నువ్వు పాపం చెయ్యకు. మాతోని పాపం చెయ్యనివ్వకు”
“పాపంట పాపం. మీరు చేస్తున్నదేవిటీ? మీరు నా మాట వినకపోతే నేను అందరితో చెప్పేస్తాను.”
వీరయ్య చెయ్యెత్తాడు కొట్టడానికి.
“తప్పుగొఅంది వీరమ్మ.
తండ్రి చెయ్యిని దించాడు భిక్షపతి.
ఒక్కసారి నిశ్శబ్దం.
వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. తన మంచం మీద వాలిపోయి వెక్కివెక్కి ఏద్చింది. ఎప్పుడు నిద్రపట్టిందో తెలీలేదు. హటాత్తుగా మెలకువ వచ్చి లేచింది. గదిలోంచి బయటికొచ్చింది.
తండ్రి గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి.
“దానికి (ప్రేమరోగం పట్టుకుంది. ఏదో ఓ రోజున ఆ వెంకటేశుని తీసుకునివెళ్ళిపోతుందేమో మనం నచ్చచెప్పడం, అది వినడం ఆ స్థితి దాటిపోయింది.”
“మరి యిష్పుడేవిటి మన తక్షణ కర్తవ్యం”
“అమ్మగార్ని అదే అమ్మోర్ని దేవతలున్న స్వర్గానికి పంపడమే మన తక్షణ కర్తవ్యం”
“ఒద్దు. దాన్ని ఏం చెయ్యద్దు” సన్నగా అరిచింది.
“వద్దంటే ఎలా. రేపు ఏదైనా జరిగి, ఈ రహస్యం బయట పడితే ఈ ప్రజలు మనల్ని బతకనిస్తారా? ఆమెని ఈ లోకం లోంచి పంపడమే మనందరికి మంచిది” 50
నిశ్శబ్దం. అందులోంచే కొన్ని వందల బాంబులు పేలినట్లుగా అనిపించింది అమ్మోరికి.
అమ్మగారి హృదయంలోంచి వస్తున్న ఆర్తనాదాలు ఆమెకే వినినిపిస్తున్నాయి. తండ్రి తమ్ముడు కలిసి తనని చంపుతారా?
తను వాళ్ళకేం కాదా? ఆ తండ్రికి తను కూతురు కాదా? వీళ్ళంతా రక్త సంబంధీకులు కారా? అసలు ఏ విధమైన సంబంధం లేదా” మరి యిన్ని రోజుల అనుబంధం కేవలం డబ్బుతో ముడివేయబడినదా? తన డబ్బుతో నేనా పని? తనతో ఏం అవసరం లేదు. తన ఉపయోగం ఏం లేదు. వనికిరాని పశువుని చంపినట్టు చంపేస్తారా?
వెళ్ళిపోవాలి. ఇక్కజ్ణించి వెళ్ళిపోవాలి. ఈ భక్తులు, ఈ భజనలు, ఉపవాసాలు వీటన్నింటికీ దూరంగా. వెంకటేసుని తీసుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏ క్షణాన్నయినా చంపచ్చు. వీలయినంత త్వరగా వెళ్ళిపోవాలి. త్వరగా ఏమిటి ఇప్పుడే
మంచం దిగింది. దిండులో రూపాయలు తీసింది.
పళ్ళు కోసే కత్తి తీసుకుని తలవైపు పరుపుని చేత్తో తడిమి కోసింది. వెల్వెట్టు సంచిల్లో దాచిన నగలు తీసుకుంది. తన నగలే అవన్ని నగలు తీసి దాచినా తల్లికి తెలీలేదు. అంత బంగారం వుంది ఆమెకు వచ్చిన వాళ్ళు తన ఒళ్ళో పడేసిన డబ్బుని తీసి దాచింది. అది కూడా తండ్రికి తమ్ముడికి తెలీకుండా, తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. అన్నీ ఓ చేతి సంచిలో సర్దుకుంది.
తలుపు తీసింది.
ఎదురుగా తండ్రి, తమ్ముడు.
తమ్ముడి చేతిలో గొడ్డలి. తండ్రి చేతిలో గోనె సంచి.
అర్ధం అయిపోయింది. ఒక్కసారి వెనక్కి వెళ్ళింది.
“నన్ను చంపద్దు. నన్ను చంపకు....” ఒక్కసారి తల వెనక్కి వంచి నోట్లో కుక్కిన బట్ట వెనకాల మాటలు వుండి పోయాయి. పారిన రక్తం దీనంగా జూలిగా చూస్తూ మెల్లగా కదలలేక కదల లేక కదిలింది. దేవతలకు స్వర్గంలో వున్న దేవుళ్ళకీ ఆమె పెనుగులాట కనపళ్ళేదు. అరుపులు వినపళ్ళేదు. రోజూ కొలిచే దేవత శిలలా ఉంటే ఏం వినపడ్డుంది?
57
“అమ్మగారు సమాధి చెందారు” “అమ్మోరు సమాధి అయినను”
అంతా ఇంటిముందున్న తాటాకు పందిరి కింద నుంచున్నారు.
“రాత్రి పదిగంటల ప్రాంతంలో అమ్మగారు నన్ను లేపారు. స్వర్గంలో పరిస్థితి చాలా అల్లకల్లోలంగా వుందని. సమాధిలోకి వెళ్ళిపోతున్నానని అన్నారు. పద్మాసనం వేసుకుని. రోజు కూచునే ఆసనం మీదే కూచున్నారు. అక్కడే సమాధి చెందారు”
వీరమ్మ ఒక్కసారి గొల్లుమంది.
“ ఓ మంచి కార్యం కోసం సమాధి చెందినప్పుడు కన్నీరు పెట్టకూడదు. అమ్మోరు ఇక్కడున్న ప్రతీ వస్తువులో వున్నారు. ఈ గాలిలో వున్నారు. ఈ నీటిలో వున్నారు. ఈ ఇసుక రేణువుల్లో వున్నారు. ఆమె మనకి చూపించిన ధర్మమార్గంలో నడవడమే మన కర్తవ్యం. ఆమె స్వర్గానికి చేరుకునే దారి సుగమం చెయ్యడానికి మనమందరం భజనలు చేద్దాం” అంటూ తెర దగ్గరికి వెళ్ళాడు. పెద్దయ్య గారు. సిల్ముపంచని సవరించుకుంటూ చిన్నయ్యగారు కూడా పెద్దయ్యగారి వెనుకగా వెళ్ళాడు.
సిల్కుతెర లాగారు.
వెండికోళ్ళు ఆసనం మీద అమ్మోరు లేరు. అవిడ ఫోటో వుంది. నిర్వికారంగా నుంచున్నారు. ఆ ముగ్గురు భజన మొదలైంది.
ఆ తర్వాత భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. ఆమె సమాధిని దర్శించుకోడానికి వచ్చే సంఖ్య ఎక్కువైంది.
ఏ ఏటికా ఏదు సంపదల మెట్లు ఎక్కేస్తున్నారు. ఆఅ యింటి ఆడవాళ్ళు బంగారు తొడుగులు చేయించుకున్నారు.
ఎవరూ కూడా ప్రాణంతో వున్న అమ్మగారి గురించి అడగడం లేదు.
ఒక్క వెంకటేసు మాత్రమే బెంగగా అమ్మగారి గదికేసి చూస్తూంటాడు. తన ఊహకందిన ఆలోచనలు చెప్పడానికి వాడు మూగవాడు. భజనల ఊపులో నిజాలు మౌనం వహించాయి.
ఈ ౧71౬2004 సు నబ! లారీ రప్పిడ )9 ట్రల్టి ట్టి నకి
భగవాన్! ఆమెను కాపాడు
రింగ్‌టోన్ సాధియా మ్యూజిక్‌తో సెల్ రిత్విక్‌ని మేల్కొల్పింది.
కళ్ళు తెరవకుండానే, సెల్ తీసుకుని “హలో” అన్నాడు.
“రిత్విక్”
“ద”
“నీహారిక స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ వేసుకుంది. ఇప్పుడు వాళ్ళింటి దగ్గరలోనే ఉన్న విజయా నర్సింగ్ హోంలో ఉంది. అకృ్కణ్ణించే మాట్లాడుతున్నాను. క్రిటికల్‌గా ఉందో ఏమో. డాక్టర్లేం మాట్లాడ్డం లేదు. ఎందుకీ స్టెప్ తీసుకుందో నీకేమయినా తెలుస్తోందా!”
ఒక్కసారిగా మత్తు దిగింది. మంచం దిగి పక్కగదిలోకి వెళ్ళాడు.
“ఏవిటి, నువ్వంటున్నది? నువ్వు దీక్షవేనా!” కంగారుగా ఆతృతగా అన్నాడు.
“అవును దీక్షనే, నాకు నీహారిక మదర్ ఫోన్ చేసారు.”
“డాక్టల్లేం అన్నారు?” భయంగా అడిగాడు.
“ఏమో! ఏమీ చెప్పలేం అంటున్నారు” అంటూ కట్‌చేసింది.
దాని తర్వాత భయంకరమైన నిశ్శబ్ధం. గదిలోకెళ్ళాడు.
భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది.
అయోమయంగా ఉంది మనసంతా, ఏం చెయ్యాలి? నీహారికకి ఏవైనా అయితే తనా బాధ్యుడు? తనెల్లా అవుతాడు?
వం
డిమ్‌గా ఉన్న లైటు కాంతిలో మంచం వైపు చూసాడు. గుడ్డి వెలుగులో ఓ వైపునకు ఒత్తిగిలి పడుకున్న లావణ్య తెల్లటి నైటీలో నందివర్దనం మొగ్గలా ఉంది.
టైం చూసాడు రెండున్నర. ఆమెను నిద్రలేపాలా వద్దా? ఎక్కణ్ణించి మొదలుపెడ్రే ఆమెకు అర్ధం అవుతుంది! లేపకూడదని నిశ్చయించుకున్నాడు. ఓసారి బట్టల వైపు చూసుకున్నాడు. వేసుకున్నది టెర్రికాట్ పఠాన్ సూట్. మడతలు ఎక్కువగా ఏం లేదు. (డ్రెస్ మార్చుకోలేదు. కారు తాళాలు తీసుకున్నాడు. ఇంటి తాళం పడిందో లేదో తిరిగి ఓసారి తలుపుని లాగిచూసి, లిఫ్ట్ వైపు నడిచాడు.
నర్సింగ్‌వోంకి వెళ్ళొకా నీహారిక ఎక్కడుందో రిసెష్షన్‌లో కనుక్కున్నాడు. రూం దగ్గరికి వెళ్ళేటప్పటికి మరో నలుగురున్నారు. నీహారిక తల్లి సుమిత్ర, చెల్లెలు తుషార, దీక్ష ఓ పైజామా లాల్చీ వేసుకున్న పెద్ద మనిషి
నీహారిక తల్లిని చూసి తల నిలువుగా ఊపాడు. ఆమె నిశ్చలమైన కళ్ళతో, వణుకుతున్న పెదవులతో టెన్షన్‌లో ఉంది.
తుషార, ఆ పైజామా మనిషితో ఏదో సీరియస్‌గా మాట్లాడుతోంది. అతను వింటున్నంత సేపు మొహం, మెడ, నుదురు, ఓ పెద్ద రుమాలుతో తుడుచుకుంటూనే ఉన్నాడు.
రిత్విక్‌కి ఏం చేయాలో తెలీక చేతులు కట్టుకుని ఓ కుర్చీలో కూచున్నాడు. రెండు అరచేతుల్లో గడ్డం పెట్టి తలవొంచుకున్నాడు.
రిత్విక్‌కి నీహారికతో పంజాగుట్టలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు పరిచయం అయింది. హలో, హాయ్ పరిచయం, రెస్టారెంట్‌లు సినిమాల వరకు వెళ్ళింది. మలుపు తిరిగింది. (ప్రేమంటే ఇదే అని తెలవదానికి పదహారు నెలలు పట్టింది. కానీ అది నిజమైన (ప్రేమ కాదు, ఓ ఆకర్షణ మాత్రమే అని లావణ్యని చూసాకా రిత్విక్‌కి అనిపించింది.
రిత్విక్‌కి మదాపూర్‌లోని ఓ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది. అక్కడే లావణ్యతో పరిచయం, ఇద్దరికీ నైట్ డ్యూటీలే. ఒకే కాబ్‌లో యిద్దరూ వెళ్ళడం, రావడం గంట ప్రయాణంలో ఎన్నో విషయాలు, ఎన్నో చర్చలు, ఎన్నో అభిప్రాయాలు. ఆమెలో ఓ గొప్ప ఆకర్షణ. ఆ అయస్కాంత శక్తికి తట్టుకోలేకపోయాడు.
తప్పులేకుందా నీహారికతో అన్ని విషయాలు చెప్పాడు దెబ్బతిన్నట్టు చూసింది. ఆ చూపుని ఈ రోజు వరకూ మర్చిపోలేదు. కానీ తప్పదు. లావణ్యని వదులుకోడం 60
చాలా కష్టం. “నీ మనసు కష్టపెట్టాను. కానీ నా చేతుల్లో ఏమీ లేదు. ఆమె ముందు నిస్సహాయుడ్డీ.”
ఆ తర్వాత దీక్ష ఎప్పుడైనా కలిసినప్పుడు నీవోరిక విషయాలు చెప్తుండేది. కానీ ఆమెని కలవడానికి ప్రయత్నం చెయ్యలేదు,
సరిగ్గా పదిహేను రోజులక్రితం, లావణ్యతో పెళ్ళి జరిగిపోయింది. నీహారిక, దీక్ష పాత ఆఫీసు వాళ్ళతోపాటూ వచ్చారు. సింగపూర్ హనీమూన్‌కెళ్ళి వచ్చి రెండే రోజులయింది. ఈ రోజున ఈ సంఘటన. పెళ్లి, హనీమూన్ ఆమెలో ఓ కక్ష కసిని పెంచాయా.
ఏమైనా అయితే... ఆ ఊహ చలా భయంకరంగా అనిపించింది. నేనే బాధ్యుణ్ణి... నా వల్లనే ఇదంతా జరిగింది. అందరూ అనుకుంటే'.
భగవాన్! నీవారికని బతికించు.
మొహాన్ని తుడుచుకుంటూ లేచాడు.
జరిగిన దాన్లో ఆమె తప్పేం ఉంది? నన్ను (ప్రేమించడమేనా? దానికి ఆమె ఎందుకు బలి అవాలి? అందుకే ఆ నిరాశ, నిస్ఫృహ, నిస్సహాయత ఆమెని ఆత్మహత్యకి పురికొల్పాయి.
దాక్టరు తలుపులు తెరుచుకుని బయటికొచ్చాడు. డాక్టరు ముందు నుంచున్నాడు.
“చెయ్యాల్సింది చేస్తున్నాం. వియ్ కెన్ వోన్లీ హోప్”
వెనక్కొచ్చి దీక్ష పక్కగా నుంచున్నాడు.
నీళ్లు నింజిన కళ్లతో రిత్విక్‌ని చూసి తల దించుకుంది దీక్ష
“ఇదినా మూలంగానే ...” అంది మెల్లగా.
అశ్చర్యంగా చూశాడు.
దీక్ష నీహారిక బెస్ట్ ఫెండ్.
“నువ్వు లావణ్యని (ప్రేమిస్తున్నావని అన్నప్పుడు హిస్టీరిక్‌గా బిహేవ్ చేస్తూంటే నేనే ఓదార్బాను. నువ్వు చేసింది ఏం బాగాలేదు. నేను ఓ కర్రలాగా సాయంగా ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతేనా...” అంటూ ఆరోజున అన్న దీక్ష ఈమె ఒక రేనా?
“ఏం జరిగింది?”
“నిన్న సాయంత్రం హాస్టల్‌కి ఫోన్ చేసింది, అర్జంటుగా కలవాలని. అప్పుడంత తెలీలేదు కానీ ఇప్పుడనిపిస్తోంది, ఆ గొంతులో చాలా నిరాశ ఉందని”
61
“కలిశావా?”
“లేదు. ఆఫీసుకెళ్లిపోతున్నాను. పొద్దున్న ఆరు గంటలకి మీ ఇంటికొస్తాను. బ్రేక్‌ఫాస్ట్ మీ ఇంట్లోనే చేస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం' అని అన్నాను. 'సరే' అని ఫోన్ పెట్టేసింది. పదకొండు గంటలకి నీహారిక వాళ్ల మదర్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది, నీహారిక స్లీపింగ్ పిల్స్ వేసుకుందని. అప్పుడు నా ప్రాజెక్ట్‌లో పార్టనర్ సందీప్. ఇంటి దగ్గర నన్ను దింపాడు. అప్పుడు నేనూ ఆంటీ కలిసి ఈ నర్సింగ్ హోమ్‌లో చేర్చించాము”
“ఏం జరిగి ఉంటుంది?” ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు.
“నాకు అదే అర్దం కావడంలేదు. పాపం నా మీద ఎంతో నమ్మకం ఉండేది. నేను నిలబెట్టుకోలేకపోయాను. నేను చాలా సెల్సిష్, మళ్లీ ఓసారి ఫోన్ చేసి మాట్లాడాల్సింది. ఏం తోచలేదు. ఈ ప్రాజెక్ట్ అయ్యాకా ఆస్ట్రేలియా ట్రీస్ ఉంది కాబట్టీ ప్రాజెక్ట్ మీదే కాన్‌సంటట్రేట్ చేశాను. జీవితం కన్నా ఇవన్నీ ముఖ్యమా? ఈ ఫిలాసఫీ ఎందుకు అర్ధం అవలేదు. నాకు ఏదో చెప్పామనిపించింది. ఏదో జరిగి ఉంటుంది నేను ఏమాత్రం ఆమెకు హెల్ప్ చెయ్యలేదు. దేవుడు నన్ను క్షమించడు” అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది.
అమె భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు రిత్విక్.
ఒక్కసారి గట్టిగా కళ్లు మూసుకుంది.
దేవుడా! ఆమెను కాపాడు. నా మూలంగా ఆమె చచ్చిపోకూడదు.
సుమిత్ర వాళ్లిద్దర్నీ చూస్తూ తన కళ్లు తుడుచుకుంది.
నీహారిక... ఇంత దారుణమైన అడుగు ఎందుకేసింది? నేనన్న మాట మూలంగానా! అందుకే అయితే నేను చాలా దుర్మార్గురాల్ని. చాలా సెన్సిటివ్ అయిన నా కూతురి గురించి తెలిసి కూడా నేనంత మాట ఎలా అనగలిగాను? వారం రోజుల కిందట జరిగినది కళ్ల ముందు మెదిలింది.
రిత్విక్ లావణ్యని ప్రేమిస్తున్నప్పటి నుంచీ నీ వారిక డిప్రెస్ అయింది. నీవారిక తుషార చాలా చిన్నగా ఉన్నప్పుడే తండ్రి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. వారానికోసారి, తండ్రిని కలవడం, ఏదో హోటల్‌కెళ్లడం, డ్యూటీలాగా ఉండే ప్రవర్తన, రాన్రాను ఆ సంబంధాన్ని బంధాన్ని పెంచుకోలేదు. దానికి తగ్గట్టుగా చదువులు, పార్ట్ టైం ఉద్యోగాలు. కూతురు చదివిన చదువుకి మంచి ఉద్యోగం వస్తుందని సుమిత్రకి తెలుసు. మంచి 62
ఉద్యోగం జీతం. దీక్ష సుమిత్రకి తెలుసు. మంచి ఉద్యోగం జీతం. దీక్ష ఫ్రెండ్‌షిప్‌లో. నీహారికలోని మార్పు చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.
ఈ ఉద్యోగం వదిలేసి, రిత్విక్ మాదాపూర్‌లో చేరాకా నీవారికలో మార్చు గమనించింది. దీక్షని కనుక్కుంటేనే తెలిసింది రిత్విక్ విషయం. కూతురి మీద జాలి వేసింది. ఓ ఫెండ్‌లా అన్నీ అడిగి తెలుసుకుంది. అయినా మనిషి మామూలుగా ఉండలేకపోయింది.
ఉద్యోగం మారింది. రంజిత్‌తో పరిచయం. కోఆర్టినేటర్‌గా హెల్ప్ చెయ్యడం. రంజిత్ తెలుగులో మాట్లాడే తప్పులు, అతని హడావుడి, చెప్తూంటే మనిషి మామూలుగా అవుతున్నట్టుగా అనిపించింది.
నీహారిక అతనంటే - శ్రద్ధ చూపిస్తున్నట్టుగా అనిపించింది. ఏదైనా పార్టీ అయినా వీకెండ్‌లో వెళ్లే పిక్నిక్‌లకి వెళ్లేటప్పుడు ఇంటికి వచ్చి, కారులో తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడు.
సరిగ్గా నాలుగు రోజుల క్రితం... రంజిత్ గురించి వివరాలు కనుక్కుంది. తల్లి తండ్రి కాలేజీలో పనిచేస్తున్నారు. చెల్లెలు ఇంనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మంచి మాచ్. జోడీ బావుంటుంది. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అడిగింది.
“రంజిత్‌కి పెళ్లయిందా?”
“బ్రేద్తు”
“మీ ెండ్‌షిప్ ఎలాటిందనిపిస్తోంది?”
“అంటే” ముఖం చిట్లించి అంది.
“మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?”
“మమ్మీ! ఏం మాట్లా డుతున్నావ్? నాకన్నా ఏడాది చిన్న రంజిత్. అయినా నువ్వు కూడానా... ఇంత చీప్‌గా ఆలోచించావా?”
అప్పట్నించి చాలా ముభావంగా ఉంటోంది. మధ్యలో ఓ రోజు దీక్ష రూంలో ఉంది.
సుమిత్రకి చాలా సిగ్గుగా అనిపించింది కూతురి కిష్టం లేని ఊహ కలిగినందుకు. తన మీద తనకే ఎలాగో అనిపించింది.
ఓరోజు దీక్షని తీసుకుని ఇంటికొచ్చింది. గదిలో తలుపులు వేసుకుని పాటలు పెట్టుకుంటూ ఉండిపోయారు. మధ్య మధ్యలో మామూలుగా ఉన్నా తనే చారవగా
63
వాళ్లలో ఇదివరకులా వెళ్లలేకపోయింది.. తప్పు చేసినట్టు గదిలో కంప్యూటర్ ముందు కూచుండిపోయింది.
యింతల్లాగా కానీ నీహారిక మనసులో తనన్న మాటలు ఇంకా ఇంకా ప్రభావితం చేసి ఆఖరికి ఆత్మహత్య వరకు దారి తీసిందా? తనంత ఘోరమైన మాట అందా? నీహారికకేవైనా అయితే అందరూ తనని ఓ క్రిమినల్‌గా చూడరా! ఇంత బ్రతుకూ బతికీ... ఇలాగే ఉంటుంది సింగిల్ పేరెంట్ రెస్పాన్సిబులిటీస్ అన్న మాటలు ఎన్ని వినాల్సి వస్తుందో! దేవుడా! దాన్ని బ్రతికించు. చిన్నపిల్ల. జీవితం అంతా ముందుంది. తప్పంతా నాదే. నా పెంపకంలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది. అందుకే ఇలా జరిగింది. ఇక ముందునా వల్ల ఏ లోటూ, రానీకుండా చూసుకుంటాను. భగవాన్! అమెని బితికించు.
అనిల్ భాయ్ షా దేవుణ్ణి ప్రార్ధిస్తూ ఉండిపోయాడు. చెమట తల్లోంచి చెవుల పక్కనుంచి ధారగా కాలిపోయింది. తుడుచుకుంటూ గాభరాగా ఉన్న మనసుని అదుపులో ఉంచుకోదానికి, కళ్లు మూసుకున్నాడు.
నా మూలంగానే... ఇదంతా... నిన్న నేను ఆ పింక్ స్లిప్ ఇవ్వకుండా ఉంటే ఈ పరిస్థితి నీహారికకి వచ్చివుండేదా? పూర్తి ఐటి ఇండస్ట్రీనే అలా ఉంది. మాన్‌పవర్ కట్ చెయ్యాలన్నారు. ఎంతో మందిని తీసేయాల్సి వచ్చింది, తప్ప లేదు. కాంట్రాక్ట్‌లు లేవు. ఒకళ్ల తర్వాత ఒకళ్లని తీసేస్తున్నాడు. నీహారిక బాగా పనిచేస్తుంది. నో డౌట్ కానీ తను హెల్ప్‌లెస్. అందుకని ఇంత భయంకరమైన స్టెప్ తీసుకుందా?
వెళ్లిపోయే ముందు కూదా ఏమీ అనలేదు. ఏమీ అడగలేదు. అవును. బిజినెస్‌లో ఇమోషన్స్‌కి చోటెక్కడా? రేపు ఏదైనా అయితే అందరూ తనని వేలెత్తి చూపిస్తూ వెనకాల చెవులు కొరుక్కుంటారు. తను బాధ్యుడవుతొడా?
ఎలాగా? దేవుడా! ఆమెను బతికించు.
ఎలాగైనా బతికించు.
గొంతు తడారిపోతోంది.
టైము చూళాడు.
మూడున్నర దాటింది.
పోలీస్ కేస్ అవుతుందా?
నర్స్ బయటికొచ్చింది. ౮4
అందరూ ఆశగా ఆమెను చూస్తూ రెండడుగులు ముందుకేశారు.
“ఏం భయం లేదు. ప్రమాదం లేదు. ప్రాణానికేం భయం లేదు” అందరూ లోపలికెళ్లారు.
పూర్తిగా తెలివి రాలేదు.
అయినా ఆ మత్తులోనే కళ్ళు అరతెరిచి అందర్నీ చూస్తూ నీరసంగా పెదవులు కదిలీ కదలనట్టు నవ్వింది.
అందరూ రిలీఫ్‌గొ ఫీలయ్యారు. పెద్ద బరువు మోసిన అందరి గుండెలు
ఓ ఐదు నిమిషాలు అయ్యాకా అందరూ వర్తమానంలోకి వచ్చారు.
రిత్విక్‌కి భార్యకి చెప్పకుండా వచ్చానని అనిపించింది.
అనిల్ షాకి ఒక్కసారి తన ఆఫీసూ, కాంట్రాక్ట్‌లూ, తీసెయ్యాల్సిన వాళ్ల లిస్టు కళ్ల ముందు రీల్‌గా కదిలిపోయింది.
వాళ్లిద్దరూ వెళ్లిపోయాకా, అక్కడే జోగుతూ ఉండిపోయారు మిగిలిన వాళ్లు.
మర్నాడు పొద్దున్న పదకొండు తర్వాత పూర్తిగా తెలివొచ్చింది.
“ఏవిటీ, ఎక్కడున్నాను?” అంది నీరసంగా.
“స్వర్గం” అంటూ ఆమె పక్కన కూర్చుంది దీక్ష
ఆశ్చర్యంగా, అర్ధం అవనట్టు, ప్రశ్నార్ధకంగా ఆమెను చూస్తోంది నీహారిక.
సుమిత్ర మంచం మీద కాళ్ల దగ్గర కూర్చుని కూతురి ముఖంలోకి చూస్తోంది.
“ఎందుకిలా చేసావ్?” దీనంగా అడిగింది సుమిత్ర.
“ఏమిటీ?”
“ఏం జరిగింది చెప్పు! ఇంత (డ్రాస్టిక్ స్టెప్ ఎందుకు తీసుకున్నాద్?”
“అంటే... నేనేం చేసాను? అసలేమయింది?” ఆశ్చర్యంగా చూసింది.
సుమిత్ర, దీక్ష అయోమయంగా ఆమెనే చూస్తూండిపోయారు.
“స్లీపింగ్ పిల్స్ ఎందుకు తీసుకున్నావ్?” లాలనగా అడిగింది.
“స్లీపింగ్ పిల్స్?” కళ్లు చిన్నగా చేస్తూ తల పైకెత్తింది.
“ఆ... అ... ఎందుకు?”
మెల్లిగా పైకి జరిగి దిండునివీపుకి ఆనించుకుంది.
“ఏం జరిగింది... నిన్న...” ఆలోచిస్తూ ఆగింది. గుర్తొచ్చింది “మామూలుగా
65
నాలుగ్గంటలకి ఆఫీసుకెళ్లాను. ఉద్యోగం పోయిందన్న విషయం వెంటనే తెలిసిపోయింది. వెంటనే అమీర్‌పేట ప్రియా ప్లేస్‌మెంట్స్ లోకెళ్లాను.
అక్కడినుంచీ బేగంపేట ప్రదీప్ దగ్గరికెళ్లాను, ఏవైనా చూస్తాడేమోనని. విరర్‌కి తెలిసిన వాళ్లివరికో పర్సనల్ కావాలని తెల్సింది. ఆ అడ్రస్ నీ దగ్గరుంది కదా అని నీకు ఫోన్ చేసాను. పొద్దున్న వస్తావన్నావు కదా అని, అక్కడే కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న మినతి దగ్గరికెళ్లాను. ఫాకల్టీ ఇష్టం అయితే వెళ్లమని దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్ డిపో దగ్గరున్న ఓ కాలేజ్ అడ్రస్ ఇచ్చింది...”
“దిల్‌సుఖ్‌నగర్ వెళ్లి రెస్యూం ఇచ్చి, ఇంటికొచ్చేటప్పటికి ఎనిమిదిన్నర దాటింది. దాదాపు ఐదు గంటలు కంటిన్యుయ్‌స్‌గా బయట తిరగడం నల్ల విపరీతమైన తలనొప్పి, కడుపులో తిప్పడం. నాకు ఏస్రోలు, క్రోసిన్‌లో వేసుకుంటే కడుపులో మంట, గుండెల్లో మంట వస్తుంది కదా, హోమియోపతిక్ పిల్స్ తలనొప్పి కోసంవి ఉన్నాయి. మంచం పక్కనే ఉన్న సైడ్ టేబిల్ సారుగులోని బాటిల్‌లోన్సి మాత్రలు వేసుకున్నాను. అది... మరి... అయితే... అయోమయంగా”అంది.
“అవి హోమియోపతిక్ సిల్స్ కావు” అంది సుమిత్ర.
“అయితే నేను వేసుకున్నది...” సగంలో ఆగింది.
“పిచ్చి పిల్లా! అవి నా నిద్రమాత్రలు. లేబిల్ చూడకుండా ఎలా వేసుకున్నావు?” అంటూ కాళ్ల మీద ఓ దెబ్బ చిన్నగా వేసింది.
ఆత్మహత్య అనుకున్నారు. “ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు.”
“నీ కూతుర్ని మమ్మీ! డాడీతో విడిపోయినా, జీవితం అయిపోలేదు అన్న ధైర్యం నీ శ్వాస. అదే ఊపిరి నేను కూడా పీలుస్తున్నాను.
అయాం డిఫ్రెస్ట్ బట్ నాట్ డిఫీటెడ్. ఛాలెంజ్, ఛేంజ్‌లు లేనిది జీవితమా! ఆశా జీవిని. మంచే జరుగుతుంది.
పాజిటివ్ ధింకింగ్ నీ దగ్గర్నుంచి నేను నేర్చుకుంటున్నాను”
దీక్ష సుమిత్ర నీళ్లు నిండిన కళ్లతో మసకబారిన చూపుని క్లియర్ చేసుకుని ఆమెను చూస్తూండిపోయారు.
ఈ ౫౦1200 భూరి వబ లారీ ర్తి ఈ శ్రిళ్ళిళ్ళా 66
బంధం
క్రింద ఏదో కలకలం. కాఫీ తాగుతున్న నేను పైనుంచి క్రిందికి చూసాను. హాస్పిటల్ సిబ్బంది అంతా గుంపుగా ఉండడంతో ఏదో జరిగి ఉంటుందని అనిపించింది.
నైటీ మార్చి చీర కట్టుకుని కిందకొచ్చాను.
నన్ను చూడగానే అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. గుమ్మం దగ్గర ఓ బట్టలో చుట్టి ఉన్న ఓ చిన్న బేబీ!
“ఎప్పుడు పెట్టినో ఏందో ఏమోనన్నా! ఐదు గంట్లకి ఎప్పట్లక్క లేచి తలుపు తీసి చూసిన. జల్టీ మానెమ్మని పిలిచిన. యిగ ఒక్కలెన్మ ఒకల్లు వచ్చిన.” యాదమ్మ జరిగిందంతా చెప్పింది.
నూర్యకిరణాలు యింకా భూమిని తాకక ముందే, బద్దకంగా ఉన్న ప్రకృతి పూర్తిగా ఒళ్ళు విరుచుకోకముందే, నర్సింగ్ హోంలో సంపూర్ణ చైతన్యం వచ్చేసింది.
పరీక్షగా చూసాను. రెండు రోజులు. అంతకన్నా పెద్దకావచ్చు, చిన్నా కొవచ్చు. బొడ్డు చుట్టు ఓ నూనె చుక్క కూడా రాసినట్లు లేదు. ఆమె ఆడపిల్ల, అదే అందర్నీ కలవర పర్చింది.
రెండు రోజుల గుద్దు. అలా వదిలి పోవదానికి అ తల్లి రెండు రోజులు ఆలోచించిందా! ఎంత నిర్జయురాలు. ఆ తల్లి ఎవరై ఉంటుందీ? స్టూడెంటా? చదువురాని అజ్ఞానురాలా? రేప్ ఫలితమా? క్షణికానందమా!”
“ఏదైనా యింత దూరం ఎందుకు రానిచ్చారో! కడుపు తీయించాల్సింది. ఇలా
67
నిశ్శబ్దంగా చూస్తున్నాను. నా పక్కనే ఆనంద్, నా భర్త నుంచున్నాడు. “ఏం చేయ్యాలి?' అంటూ ఆయా చేతిలోకి తీసుకుంది. ఉలిక్కిపడి, చేతులు పైకెత్తి సన్నగా శీర్ మంది, పొప.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతులు మారుతోంది. ఆఖరికి దైవాధీనం చేతిలోకి వచ్చింది. నల్లతుమ్మ చెక్కల్లా ఉన్న వాడి చేతుల్లో గులాబి రేకుల్లా ఉన్న గుద్దు. వాడి కళ్ళు ఆ పిల్లని పైనుంచి కిందివరకూ పరిశీలనగా చూస్తున్నాయి. నా ఆలోచనలు చాలా దూరం వెళ్ళిపోయాయి. అది విపరీతమా! ఏమో... నాకు తెలీదు... ఒకలాటి ఫీలింగ్... జుగుప్స.
ప్పింగ్‌లా ముందుకెళ్లాను.
“మానెమ్మా! పాలు పట్టి, స్నానం అదీ చేయించండి. మీరందరూ మీ పన్లు చూసుకోండి.” అని వెనక్కి తిరిగాను. అందరిలో చలనం వచ్చింది.
“ఇది చిన్న నర్సింగ్ హోం. యిలాటిది ఎప్పుడూ జరగలేదు. నువ్వు అంతలా డెసిషన్ ఎలా తీసుకున్నావ్! నన్ను అడగద్దా!” ఆనంద్ సీరియస్‌గా అన్నాడు, అందరూ వెళ్ళిపోయాకా.
నిశ్శబ్దంగా ఆనంద్‌నే చూసాను.
“నిజమే! కానీ, దైవాధీనం చేతుల్లో ఆ చిన్నపిల్లని చూసాకా ఎలానో అనిపించింది. స్పాంటేనియస్‌గా వచ్చిన మానవత్వపు స్పందన అది. అందుకే సడన్‌గా అనేసాను.”
“ఏమో! మనం యిక్కడేం పర్మనెంట్ కాదు. నాకు సౌదీలో ఆఫర్ వచ్చేటట్లుంది. ఏమో! నువ్వు ఎట్లా చూస్తావో! అయినా డాక్టర్ మాథ్యూస్‌తో మాట్లాడుతాను. ఇది వాళ్ళ హాస్పిటల్. నమ్ముతారో లేదో! ఏ అనాధాశ్రమంలోనో యిచ్చేద్దాం. అంతే కానీ, యిక్కడుంచకృళ్లేదు.”
' “అంతవరకూ యిక్కడే ఉండనీ.” అన్నానే కానీ, నాకూ బెంగగా అనిపిస్తోంది. ఏ ధైర్యంతో పాపని ఉంచెయ్యమన్నాను. నాకే తెలీదు.
ముభావంగా అనంద్ వెళ్ళిపోయాడు.
డ్యూటీ రూంలో నా టేబిల్ పక్కనే ఉయ్యాల్లో పడుకోపెట్టారు. దగ్గరగా వెళ్లాను. తెల్లటి జుబ్బాలో ముడుచుకున్న గులాబి మొగ్గలాగా ఉంది. అక్కర్లేదని విసిరి 68
పారేసిన ఓ ఆడపిల్లకి నీడనిచ్చాను. చూడ్డానికి ముద్దుగా ఉంది. రెండు చేతులు ఒణుకుతున్నట్లుగా కదిలించింది.
“సిస్టర్!” అని పిలిచాను.
“బాగా చలిగా ఉంటోంది. లైటు పెట్టండి” సిస్టర్ వచ్చాక అన్నాను.
మరు నిమిషంలో ఓ బ్లాంక్‌ట్ తెచ్చి ఉయ్యాల మీద వేసి లైటు పెట్టి వెళ్ళింది.
టైం ప్రకారంగా అంతా డ్యూటీలు వేసుకుని పాపని చూస్తున్నారు. ఆ మర్నాటి నుంచి విరోచనాలు. ఎందుకో భయంగా అనిపించింది. ఏమయినా అయితే! ఆనంద్‌ని అడిగి మా బెడ్‌రూంలోకే ఉయ్యాలని మార్చించాను. రాత్రింబవళ్ళూ నేనే ఆరారా నీళ్ళు పట్టి, మందులిచ్చి సేవ చేసాను. పువ్వులా, గాజుబొమ్మలా చాలా జాగ్రత్తగా అందరం చూసాం.
ఏనిమిదేళ్ళ మా బాబు కుతూహలంగా చూస్తున్నాడు. మధ్య మధ్య ఆనంద్ కూడా చూస్తున్నాడు. రెండు రోజులు గడిచాకా విరేచనాలు తగ్గాయి. క్రిందకి పాపని మార్చించాము. తెగకుండానే పాశం అల్లుకుంటోంది. ఈ బంధం ఎక్కడికి లాగుతుందో!
అద్దంలో మొహం చూసుకుంటూ జట్టుని సరిచేసుకుంటున్నాను. “రాత్రంతా సరిగా నిద్ర పోలేదు. చాలా టైర్డ్‌గా అనిపిస్తోంది.” అన్నాడు.
“చెప్పాల్సింది నాకా! కింద ఉన్న ఆ పాపకెళ్ళి చెప్పు!” అద్దంలోని నా ప్రతిబింబాన్ని చూస్తూ అన్నాడు. నా వెనకాలే నుంచున్న ఆనంద్.
ఎక్కడో కలుక్కుమంది.
“పాపని అక్కడా, యికృడా ఎందుకు? మనమే పెంచుకుందాం' అని నా మనసులో ఉన్నా అనలేకపోతున్నాను. ఎందుకు? నాకు ధైర్యం లేదా! లేకపోతే నా అభిప్రాయం చెప్పగలిగే స్వతంత్రం నాకు లేదా! ఈ స్వతంత్రం ఎవరో యిచ్చేదా! నా మీద నాకే నమ్మకం లేదా! లేకపోతే ఏ మూలో నేను చేస్తున్నది మంచి అవుతుందన్న నమ్మకం, విశ్వాసం లేదా! ఎన్ని వేల యుగాలైనా ఆడది ఆడదే. ఆలోచనలని కార్యరూపంలో పెట్టాలనుకున్నప్పుడు స్వతంత్రించలేకపోతోంది. కారణం ఏదైనా కావచ్చు.
“ఈ బేబీ ఎప్పుడూ మన బెడ్‌రూంలోనే ఉంటుందా!” అని రెండు మూడుసార్లు బాబు అడిగొనా ఆనంద్ నేను మౌనంగా ఉండిపోయాం.
69
“పాపం! మమ్మీ, డాడీ లేరు కదా! ముందు కొన్ని రోజులు వోస్పిటల్లో ఉంటుంది.” అన్నాను కానీ, ఆ తర్వాతేమిటి అని అనలేకపోయాను.
నాకు తెలీకుండానే ఆనంద్‌కి నాకు మధ్య ఓ గీత ఏర్పడింది.
పెద్దదయ్యి అగాధం అవుతుందా! గీత చెరిగిపోతుందా! కాలమే చెప్పాలి,
డెలివరీ కేసుంటే తెల్లారురూమున నాల్గుగంటలకే కిందకొచ్చాను. అదయ్యాకా ఓ రౌండు వేసి పైకి వెళ్ళాను.
బాబు పాలు తాగేసి స్కూలుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. బాబుకి ేక్‌ఫాస్ట్, అంచ్, సాయంత్రం స్నాక్స్ పాలు అన్నీ కూడా స్ఫూల్లోనే. అందుకే స్కూలు పది కిలోమీటర్ల దూరం అయినా అదే స్కూల్లో వేసాము.
కారు తాళాలు తిప్పుతూ, బాబుని తీసుకుని వెళ్తూంటే, ఎక్కడో నేనంటే నిర్లక్ష్యం కనిపించింది. ఈ పాప మూలంగానా! లేక పోతే నాదే తప్పా! ఏదైనా నా జీవితంలో అపశ్ళతి మొదలయిందనిపించింది.
ఆడపిల్ల కాబట్టి. తల్లి వదిలేసిందా! ఆడపిల్ల కాబట్టి బాధ్యత తీసుకోడానికి ఎవరూ ముందుకు రావడంలేదా! ఇదే మొగ పీల్లాడయితే... ఈ ఆయాలే ఎవరో ఒకరు యింటికి తీసుకుపోయేవారా! అసలు ఆ తల్లే యిలా గుమ్మం ముందు వదిలేసేది కదా! కనిపారేసిన తల్లిమీద, రెండు క్షణాలు సుఖాన్ని స్వంతం చేసుకుని జీవితకాల దుఃఖాన్ని ఈ చిన్నిప్రాజానికి దారపోసిన ఆ తండ్రి మీద కోపం - అసహ్యం.... అన్నీ మిళితమై ఒక్కసారి కలిగాయి.
“ఈ నెలాఖరికి నేను జెద్దా వెళ్ళాలి. డాక్టర్ మాధ్యూస్‌కి ఈ పాప సంగతి చెప్పాను. ఈ నర్సింగ్‌హోంలోనే పెరుగుతుంది అన్నారు.”
బాబుని దింపి వచ్చాకా యింకా దైనింగ్ టేబిల్ దగ్గరే ఉన్న నా ఎదురుగా కూచుంటూ అన్నాడు ఆనంద్.
“ఎంతకాలం?”
వింతగా చూసాడు.
“ఎప్పటికీ, యిక్కడే పెరిగి, పెద్దదయ్యి ఇక్కడే పని చేస్తుంది.”
“లోకల్ ్రాస్‌లాగా.”
“అలా నెగిటివ్‌గా మాట్లాడకు.” 70
“ఫాక్ట్. అనాధ ఆడపిల్లల బతుకులు అలాగే అవుతాయి. ఈ చిన్న పిల్లని అలా వదిలేయడం నాకు నచ్చడం లేదు.
“ప్లీజ్ మమకారం పంచుకోకు. నీ ఫీలింగ్స్ నాకర్థం అయ్యాయి. కానీ... మన పెర్మనెంట్ కాదు.” శాంతంగా, అనునయంగా అన్నాడు.
ఎదారిలో దిక్కుతోచక ఉన్న నాకు చల్లగా ఊతగా అనిపించింది. “కానీ, ఆమె జీవితాన్ని ఊహించడానికే భయంగా ఉంది.”
“అర్ధం లేని భయం. ఆమెని కన్నవాళ్ళకే లేదు ఆ ఊహ.”
“ఏమో! యిప్పుడు ఫర్వాలేదు. పెద్దయ్యాకా... ఏవైనా అయితే.... ఊహు...నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను.”
“ఒక్కటి అడుగుతాను. కన్నకూతురిలా పెంచగలవా!”
మౌనంగా కళ్ళెత్తి చూసాను.
“ మన బాబుతో సమానంగా చూడగలవా! ఏ వస్తువైనా ఒక్కటే ఉందనుకో. యిద్దరిలో ఎవరికిస్తాన్? సహజంగా నీకు పుట్టిన బాబుకే కదా! సహజం. అదే సవిత్తల్లి చృష్టి నీకుఎంత విశాల భావాలున్నా కొన్ని చిన్న విషయాల్లో ఈ భేదభావం కనపర్భవచ్చు. పరిస్థితిని చూసి జాలిపడి పెంచినంత మాత్రాన కూతురి హోదా యివ్వలేవని నా నమ్మకం.”
నిజమే అనిపించినా, ఒప్పుకోలేకపోతున్నాను.
“యిదివరకు అనేవాడిని, ఎవరినైనా తెచ్చి పెంచుకుందామని...”
“అది చాలాకాలం కిందటి మాట. మనకి బాబు పుట్టనప్పటి మాట. అప్పటి స్థితి వేరు. ఇప్పుటిది వేరు. ఆలోచించుకో.” తీవ్రంగా అన్నాడు.
ఆ గొంతులోని కారిన్యానికి కళ్ళల్లో నీళ్ళూరాయి.
తడిసిన కళ్ళని చూపించడం ఇష్టంలేక టేబిల్ మీద ఉన్న లిటరేచర్స్ చూడ్డం మొదలెట్టాను.
కేస్ వచ్చిందని ఫోన్ వచ్చింది.
నేను లేచి కిందకి వెళ్తూంటే ఆనంద్ చూవులు నన్నే వెంటాడు తున్నాయనిపించింది.
పది అవుతుండగా ఆనంద్ వచ్చాడు నారూంలోకి.
71
“చిన్న పిల్లలు అందులో మరీ చంటి పిల్లలు అందరూ ఇష్టపడే విధంగానే ఉందారు. ఈ పాప ఎక్సెష్స్‌న్ కాదు. ఏదో ఓ రోజున పాప నీ స్వంతం కాదు, ఎవరో పిల్ల అన్న భావం వచ్చినప్పుడు నీలో నీ ప్రేమలో మార్పుండచ్చు.”
“స్వంత కూతురిలాగా కాకపోయినా, పెంచి పెద్ద చేద్దాం.”
“అంటే నీకు చేతికిందగా, పనిపిల్లలాగా ఉంచుకోడానికా! అదింకా ఘోరం. నేరం. దేనికయినా' లీగల్‌గా వెళ్ళాలి. ఏదైనా అనాధాశ్రమంలో ఉంచేద్దాం. లేదా ఇక్కడే ఉంచేద్దాం. అయినా ఇక్కడే శామ్యూల్ ఈ ఆయాల దగ్గరే పెరగలేదా!”
“శామ్యూల్ మొగపిల్లాడు గుర్తుపెట్టుకో.”
“నెవ్వరెండింగ్... హు...” అంటు చివాలున వెళ్ళిపోయాడు.
పరిస్థితిని నేనర్ధం చేసుకోవడం లేదా! ఆనంద్‌కి అర్థంకావడం లేదా! నాది మొండితనమా! పట్టుదలా! చలించని మానవత్వమా!
లేచి కిటికీ దగ్గరికొచ్చాను. హాస్పిటల్ ఆవరణ, రోడ్డూ కనిపిస్తోంది. గుత్తులుగా ఉన్న తెలుపు, పసుపు, మెజెంటా బోగన్ విల్లాలు సన్నగా ఊగుతున్నాయి.
గేటు ముందు కొన్ని సైకిళ్ళు, స్కూటర్లున్నాయి. చెట్లకింద కూచుని పేషంట్లు, వాళ్ళ తాలూకు బంధువులు కబుర్లు చెప్పుకుంటున్నారు.
సన్నటి తార్రోద్దు ఊళ్ళోకి దారి తీస్తోంది. మూడు కుక్కపిల్లలు చాలా చిన్నవి పడుతూ, లేస్తూ అటూ యిటూ చూస్తూ రోడ్డు మీద నడుస్తున్నాయి.
ఎదురుగా యిసకలారీ వస్తోంది. ఆ డ్రైవర్ చూస్తాడా ఈ కుక్కసిల్లల్ని లారీకి ప్రాణం లేదు. యంత్రం. ఈ చిన్న కుక్క పిల్లలకన్నా కొన్ని వందల రెట్ల బలం ఉన్నది కానీ, బుర్ర లేదు. అనంతకోటి ప్రాణుల్లో లోకాన్ని ఇప్పుడిప్పుడే చూస్తున్న చిన్ని ప్రాణాలు. రోడ్డు మధ్యగా ఆగి దిక్కులు చూస్తున్నాయి. ప్రాణంలేని యంత్రం కదలికకీ ఈ జీవాలు కదుల్తాయా!
కళ్ళు మూసుకున్నాను. లారీ బర్రుమని శబ్ధం చేస్తూ వెళ్ళిపోయింది.
కళ్ళు తెరిచాను. బిక్కమొహాలేసుకుని రోడ్డు వారగా, హాస్పిటల్ గేటుకి దగ్గరగా నుంచుని యిటే చూస్తున్నాయి. ఈ స్పందనే చేతనాచేతనాల మధ్య వ్యత్యాసమా! బతకడంలోని వాటి స్వేచ్చ, వాటి తెలివి ఆ స్వేచ్ళకి దోహదం చేసాయి.
మరి నా స్వేచ్చ, బతకడం ఒకటేనా స్వేచ్చా! నా ఆలోచనని వార్యరూపంలో పెట్టలేనిదా నా స్వేచ్చ. ఎందుకని? 72
ఆనంద్ విసురుగా టకటక శబ్దం చేస్తూ నా దగ్గరికొచ్చి నుంచున్నాడు. “చూడు లతా! ఓ పాపని పెంచుకోవాలని మనిద్దరం నిర్ణయం తీసుకుంటే సరిపోదా! మనకో బాబున్నాడు. ఒబు చిన్నవాదని, వాడి అభిప్రాయం ఏమిటని అనుకోకు. చిన్నయినా, పెద్దయినా మనిద్దరి తర్వాత పాపకి యింపార్దెన్స్ యివ్వాల్సింది బాబు. ఆలోచించుకో...” ఎలా వచ్చాడో అలాగే విసురుగా వెళ్ళిపోయాడు. మూవర్స్ అండ్ పాకర్స్ వాళ్ళు వచ్చి సామానంతా సర్ది ట్రక్‌లో' పెట్టేసారు. అన్ని గదుదలు, అలమారాలు, పరుపుల కింద, దిండ్లకిందా మరోసారి చెక్ చేస్తున్నాను. ఒక్కొక్కటే తాళం వేసి, మెట్లు దిగుతుంటే గొంతుని ఏదో పట్టేస్తోంది. కిందకి, గుండెల్లోకి దిగని బాధ. హాస్పిటల్ స్టాఫ్ అంతా ఉన్నారు. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. నన్ను అడగడానికి ధైర్యం లేని ప్రశ్నలు వాళ్ళ మొహాల్లో, వాళ్ళ చూపులకి అర్ధం పాప. వాళ్ళ మొహాల్లోని ప్రశ్న పాష గిల్టీగా ఫీలవుతూ వాళ్ళ చూపుల్ని తప్పించుకుంటూ తాళాలున్న గుత్తి పట్టాభికిచ్చాను. ఏదో భయం, ఏదో అలజడి... ఏదో బాధ. నా డ్యూటీ రూంలోకెళ్ళాను. విశాలంగా ఉన్న అ గది నిశ్శబ్దంగా ఉంది. ఆకుపచ్చటి కర్టెన్లని తోసుకుంటూ లోపలికొస్తున్న ఎండ వెలుతురూ రెండూ కలిపి గదిని ఆకుపచ్చని రంగులోకి దింపాయి. పెద్ద టేబిల్. దాని పక్కనే ఉయ్యాల. అందులో ఈ లోకానికకృర్లేని ఓ నెల రోజుల గుడ్డు. ఒక్కత్తే ఉంది. ముందు ముందు కూడా ఒక్తత్తే కదా! దగ్గరికెళ్ళాను. నిశ్చింతగా నిద్రపోతోంది. ఈ నిశ్చింత ఎంతకాలం? జీవితాంతం ఉండదు కదా! మెల్లగా దగ్గరికెళ్ళాను. భుజాన ఉన్న బాగ్ లోంచి బాబు బట్టలు చిన్నప్పటివి, కొన్ని బొమ్మలు ఉయ్యాల్లో ఓ పక్కగా ఉంచాను. “నన్నుక్షమించు! నేను నీలాగే ఆడదాన్ని... స్వేచ్చా స్వాతంత్ర్యాలున్నా లేనట్లే...” కళ్ళు మసకలు బారాయి కన్నీళ్ళతో, గొంతులో బాధ. ఏదో బంధం అడ్డొస్తోంది. ఉలిక్కిపడి కాళ్ళు చేతులు కదిపింది. బొమ్మలు, బట్టలు అడ్డు రావడంతో బలవంతంగా కళ్ళు తెరచింది. 73
అందులో నా దగ్గర జవాబులేని ప్రశ్నలు. ఏదో తప్పు చేస్తున్న భావం నన్ను కదలనివ్వడంలేదు.
బూట్ల శబ్ధం, ఆనంద్, బాబు.
“కృమాన్ యార్, వియార్ గెట్టింగ్ లేట్” అంటూ నా పక్కగా నుంచున్నాడు. మళ్ళా మా మధ్యన అగాధాల నిశ్శబ్ధం.
“బాబూ! ఇలారా!” అంటూ పిలిచాడు.
“ఈ పాపని మనం తీసుకెళ్ళామా!”
ఆశ్చర్యంగా చూసాను.
“వై డాడ్?” కేర్‌లెస్‌గా అన్నాడు.
“పాపం, పాపకి మమ్మీ, దాడీ ఎవరూ లేరు. మనం తీసుకెళ్ళామా? మనింట్లోనే ఉంచుకుందామా!”
ఎలెక్ మై సిస్టర్?”
రెండు నిమిషాలు ఆలోచించాడు.
“ఓకే. నేనే పెద్దాను. నాకు నచ్చిన పేరు. కిరణ్ వాళ్ళ సిస్టర్ పేరు “మిల్లి ఏం బాలేదు. నేను మంచి పేరు పెద్దాను. చాలా మంచిది. వెర్రి బ్యూటీఫుల్ నేం” ఒత్తులు పెడ్తూ, చేతులు తిప్పుతూ అన్నాడు.
“ఓ.కే...” అంటూ బాబుని అనందంగా ముద్దుపెట్టుకున్నాను.
నా భుజం మీద ఆనంద్ అరచేత్తో గట్టిగా నొక్కాడు.
ఆ స్పర్శ నాకో రక్షణలా అనిపించింది. నా నిర్ణయానికి కవచంలా అనిపించింది.
మనిషికి మనిషికి మధ్యనుండే మానవత్వపు బంధం అది.
మా భార్యభర్తల బంధం కన్నా గట్టిగా అనిపించింది.
ఈ ము 206 రొంట్తు భూతు షవూహపర్తత + చట్టిట్టి 74
కూలిపోయిన సామ్రాజ్యం
మొదట్నుంచి కూడా నగలు, నాణ్యాలూ, మంచిచీరలు వీటికి నేను ఎప్పుడూ ప్రాముఖ్యం ఇవ్వలేదు వంటింటి అందాన్ని రెట్టింపు చేసే సామాన్లనే వీటినే ఎక్కువ ఇష్టపడేదాన్ని నాకు వంటిల్లు ఓ సామ్రాజ్యం. దాన్ని ఎలాగైన, ఏ కోణంలోంచి చూసినా అబ్బా! అనిపించేలా చెయ్యాలని నా తాపత్రయం.
నేను పుట్టింది పెరిగింది అమలాపురం దగ్గర ఓ పల్లెటూరు. అక్కడ మా ఇంట్లో వంటిల్లు, నట్టిల్లు అని రెండు పక్కషక్మగా ఉండేవి. ఆ రెండు కూడా మట్టినేలలు. వంటింట్లో పొయ్యి మట్టి పొయ్యి. మట్టిపొయిల్ని రోజూ రాత్రి కడిగి, ముగ్గు చేతిలో పోసుకుని మొట్టికాయలు వేసేదాన్ని. ప్రతి శుక్రవారం నట్టిల్లు వంటిల్లు అలికి, ముగ్గుని గుప్పెట్లో పోసుకుని, వేళ్లు మధ్యలోంచి సన్నగా జారుస్తూ గీతలు గీస్తూ పోయ్యేదాన్ని ఆ తర్వాత ముగ్గు గొట్టం కొన్నాకా ముగ్గు వెయ్యడం చాలా సులువు. ఈ పనుల్నీ ఎంతో ఇష్టంగా చేసేదాన్ని
“అమ్మా వంటకి గట్టు కట్టించుకుందాం. వోయిగా నుంచుని నీట్‌గా చేసుకోవచ్చు” ససేమిరా కుదర్దన్నారు. 'గ్యాస్ కొందాం. అందరిళ్లల్లో ఉంది" అంటే “చాల్లే రోజూ దేవతార్చన అదీ చేసుకునేవాళ్లం మడీ ఆచారం వాళ్లం. రోజు గ్యాస్ మీద ఎలా చేస్తాం నా ఉత్సాహం మీద నీళ్ళు పోసారు.
ఏదైనా అంటే, “నీకు పెళ్లయ్యాక, నీ వంటిల్లు నీకు నచ్చినట్లుగా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. అందుకే ఈ అమలాపురం, పలైటూళ్ళు వదిలి నీకు హైదరాబాద్ సంబంధం చూస్తున్నాం.
శ్
పెళ్లయ్యాకా హైదరాబాదొచ్చాను. ఆ ఇంట్లో వంటిల్లుంది. ఆ వంటిల్లు మా అత్తగారిదని తెలియడానికి ఎంతోకాలం పట్టలేదు. నా గది ఓ పడగ్గదీ మాత్రమే. ఆవిడకి సాయం చెయ్యడానికి నేనుండాలి. కానీ, ఏం ముట్టుకోవడానికి లేదు. ఓ రోజున ఎంతో ఉత్సాహంగా డబ్బాలు, సీసాలు, గాజుసామాన్లు అన్నీ సర్దాను. ఆవిడ వచ్చాకా నన్ను ఏమీ అనలేదు కానీ, ఇది వరకు లాగానే ఆవిడ పూర్వస్థితికి వంటింటిని తీసుకొచ్చారు. ఆవిడ అనుమతి లేకుండా ఆమెకి ఇష్టం లేకుండా ఒక్క చెమ్చా కూడా కదలకూడదు అని. సరే ఇంక ఏ పనీ లేనప్పుడు ఇంట్లో ఖాళీగా కూరోోవడం ఎందుకని ఉద్యోగంలో చేరాను. అత్తగారు పోయాకా వంటింటి సామ్రాజ్యం నా హస్తగతం అయింది. కానీ, డబ్బుకు కటకట. టైల్సువేయిద్దాం అని అనుకున్నప్పుడో, కడపరాయి సింకు తీసేసి స్టీలు సింక్ పెట్టించుకుందాం అనుకున్నప్పుడో, అలమారలు దుమ్ము కొట్టకుంటున్నాయి డెకొలం తలుపులు పెట్టించుకుందాం అని అనుకున్నప్పుడు డబ్బు ఖ్బుంది. ఏదో ఖర్చు, పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఎమ్ సెట్ కోచింగ్‌లు, చదువులు ఇలా ప్రతీసారి ఏదో ఖర్చు నా వంటిల్లు దొంగాట దోబూచులాటలే.
ఓసారి నాన్నగారికి ఒంట్లో బాగాలేదంటే ఊరెళ్ళాను. నేనొచ్చాను కదాని, పెద్దొదిన వాళ్ల నాన్నగారు పెరట్లో జారిపద్దారుట అని కబురొస్తే నేదునూరు వెళ్ళింది. మేనకోడలు అమెరికా నుంచి వచ్చిందని చిన్న వదిన నందంపూడి వెళ్లింది. నాలుగురోజులు అమ్మా నేను బోల్డు కబుర్లు చెప్పుకుంటూ నాన్నగారి దగ్గర కూర్చుని అడ్డాట, పేకాటాడుకుంటూ కులాసాగా గడిపేశాను.
“ఒక్క నాలుగురోజులు లేకపోతే వంటిల్లు తల్లకిందులైపోయింది. కాఫీపొడి దగ్గర, టీ పొడుం దగ్గర పోవు సామాన్ల డబ్బాలున్నాయి. నా చెయ్యికి వీలుగా, నేను అన్ని కుడిచేతివైపు పెట్టుకుంటే, అన్ని ఇటుదటు, అటుదిటూ చేసింది. వేరేవాళ్ళ ఇంటి వంటిల్లు ఇలా చెయ్యడంలో ఏం సంతోషం వస్తుందో.... ఏం ఆనందం వస్తుందో .... అర్ధం కాదు.” వదినలిద్దరి సణుగుడు నాకు వినపడింది.
ఎంత పిచ్చిదాన్ని నా పెళ్లాయ్యాక ఆ ఇల్లు పరాయి ఇల్లు అని తెలియడానికి ఇంతకాలం పట్టిందా! ఏంవిటో వంటిల్లు సద్దేసాను. నా వెర్రితనం.
నాకు, ఆయనకి ప్రమోషన్లు వచ్చినా, జీతాలు పెరిగినా నా మోడర్న్ వంటింటి కోరిక అలాగే వుండుపోయింది. పెద్ద పిల్లాడి చదువైంది. మంచి ఉద్యోగమే వచ్చింది. 76
ఆయన కూడా బాంక్‌లో చాలా మంది వి ఆర్ ఎస్ తీసుకున్నారంటూ తను కూడా తీసుకున్నారు.
మేమిద్దరం రోజు తెల్లవారు జూమున కాఫీ తాగుతున్నప్పుడు పిచ్చాపాటి వేసుకుంటూ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసేసుకుంటాం.
ఎప్పటిలా కాఫీ ఇచ్చి నేను వంటింటి గురించి అడిగాను.
“వంటింటిని మార్చాలి....”
“ఏదైనా వాస్తు గురించా, అయినా ఆగ్నేయంలోనే ఉందిగా”
“అది కాదు.... ఇల్లు కట్టినప్పట్నించి అడుగుతున్నాను. పెరిగే పిల్లలు, చదువుల మూలంగా వంటింటినీ అలాగే ఉంచేసాం.
ఇప్పుడు డబ్బు ఇబ్బందులేం లేవు. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది...”
“ఓ.కే. వంటింటిని రెనోవేట్ చేయించాలంటావ్. ఓ.కే. సాంక్షన్స్”
“ఉండండి...” మంచం మీంచి లేచి, పరుపు కింద దాచిన, ఫెమినా లోంచి, విమెన్స్ ఎరా లోంచి కట్ చేసినవి ఆయనకి చూపించా. ఆయన కూదా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత అన్ని చకాచకా జరిగిపోయాయి. కుకింగ్‌రేంజ్, ఎలక్టిక్ చిమ్నీ, లామినేటేడ్ కిచెన్ కౌంటర్, కిటికీ కి వేనీషియన్ ఖైండ్స్, క్రీపర్, ఒవెన్, మైక్రో ఓవెన్ అన్నీ అందంగా అమర్చడం అయింది. ఎన్నో ఏళ్లుగా వస్తువులు వాడనివి, గిఫ్టులు, సేల్‌లో కొన్న మిస్ట్ గ్లాసులు, క్రిస్టల్ గ్లాసులు, పెడస్టల్ గ్లాసులు, అన్నీ కూడా అందంగా, అద్దాల వెనకాల సర్దాను. పైరాక్స్ కాస్సెరోల్స్, బోన్ ైనావి అన్ని కూడా దొంతులుగా అందంగా సర్హాను. ఉద్యోగం కూడా మానేశాను.
రోజు వంటింట్లో తుడిచేపని, మైక్రోఓవెన్‌లో వంట చేస్తూ ప్రతీ నిమిషం ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నాను. అసలు ఎన్ని రోజులైందో నాకే తెలీదు. పైగా ఉత్సాహం రోజురోజుకి ఎక్కువై మానసికంగా పదేళ్ళు వెనక్కి నన్ను జార్చింది.
మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. అందరూ భోజనాలు చేసారు. మేము తిన్న వెండికంచాలు. గ్లాసులు, చెంబు కడిగి బట్టపెట్టి తుడుస్తున్నాను.
ఫోన్ మోగింది. కోడలు తన గదిలో పడుకుని ఉంటుంది అని అనుకుంటూనే వెంటనే రిసీవర్ ఎత్తాను. “హలో” అనే లోపలే అవతల నుంచి కోడలు గొంతు “వలో” అంది.
77
“ఏం చేస్తున్నావు?” అవతలి గొంతు.
“పక్కెక్కాను. ఏదో మాగజైన్ చదువుతున్నాను.” కిలాకిలా నవ్వులు
“నీకేంవే అద్భష్టవంతురాలివి. అత్తగార్ని వంటింట్లో కట్టేశావ్?”
“క్టోత్రికి కొబ్బరికాయ. ఎవరి పిచ్చి వాళ్లకొనందం” గలగలా నవ్వులు.
“నీకు చాలా తెలివుంది బాబూ! నాకో ఉపాయం చూపించకూడదు. నీలాంటి భోగం నాకు పట్టేందుకు....”
“అలంకృత వాళ్లు డిస్కౌంట్ ఇస్తున్నారట. మీ వంటింటిని డిజైనర్ వంటిల్లులా చేయించు. మా అత్తగారిలా, మీ అత్తగారు కూడా ఒక్కటే సర్దడం, తుడవడం, దులపడం, వీలైతే డిష్‌వాషర్ కూడా.... పనిమనిషిని మాన్పించవచ్చు....”
ఆగకుందా, పకపకా నవ్వులు.
తల తిరిగిపోతోంది. కళ్లు మూసుకున్నాను.
అంతకు ముందున్న ఉత్సాహం ఆవిరి అయ్యిపైకెళ్ళిపోయింది. నిర్వీర్యంగా, విస్తాణంగా అలాగే జారి కూర్చుండిపోయాను.
నా చిన్నప్పటి ఆశలు, నేను కన్న కలలు, నా సామ్రాజ్యం, ముక్కలు ముక్కలుగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మంటలు గేపేస్తూ చెదురుమదురుగా నా కళ్ల ముందు పడిపోతున్నాయి.
ఈ 2372002 రోంట్రు ఫుభవజిత్తు లరీ రిక + చ్థుస్టిట్టి 78
మాతృప్రేమ నిశ్శబ్ధం. ఎంతో నేర్చుకున్నాను, ఈ నిశ్శబ్దంలోంచి. నాకు నేనే ఓ విమర్శకురాలిలాగా మారిపోయాను. ఆలోచించే శక్తి వచ్చింది. విషాదంలో భాష మూగపోతోంది. అదే జరిగింది. మా విషయంలో. నిశ్శబ్దం. దానికింత శక్తి ఉందని, నీలిమ ఈ యిల్లు దాటాకే తెలిసింది. ఈ నిళ్ళబ్దం ఓ విశ్వ విద్యాలయం. ఇందులో ఉంటున్నది నేను, నిశాంత్ మాత్రమే. అయితే నాకు పుస్తకాలు, నిశాంత్‌కి మందు తోడు. ఒకప్పుడు నీలిమ ఉండేది. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు, అవి చేసిన గాయాలు కూడా మా నీడల్లాగా మా ప్రపంచంలో ఉంటున్నాయి. మాదంటూ ఓ అద్భుత ప్రపంచం ఉండేది. దాన్నిండా కలలు. అ ప్రపంచం అంతా నీలిమ. ఆమె ఓ కేంద్రం. మా జీవితాలు నీలిమ చుట్టూ తిరిగేవి. నీలిమ వెళ్ళిపోయాకా, మా జీవితాలు ఆగిపోయాయి. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఫోన్ మోగింది. పుస్తకం చేతిలో ఉంచుకునే ఎడం చేత్తో ఫోన్ తీసాను. ఒళ్ళంతా విద్యుత్ పొకినట్లుగా అనిపించింది. నీలిమ గొంతులాగా ఉందేంటే? లేకపోతే నాకలా అనిపిస్తోందా! భ్రమా! “మమ్మీ 1” కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించింది. బలవంతంగా వర్తమానంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాను. 79
గొంతువస్తుందా! మాట్లాద్దానికొస్తుందా!
అతి కష్టం మీద 'హలో' అన్నాను.
అవతలి వైపు నుంచి నిశ్శబ్దం.
మళ్ళీ హలో అందామని అనుకున్నాను అనలేదు. కట్ అయింది. అయితే, ఆ గొంతు నీలిమదే. ఎన్నేళ్ళయినా గుర్తు పట్టగలను. ఎలా మర్చిపోగలను. చిన్నప్పట్నించి వింటున్న గొంతు ఏది నీలిమ!
జీవితాన్ని ఎలాగైనా, ఎక్కణ్నించి అయినా మొదలు పెట్టచ్చు అని అనుకుందేమో, అందుకే యిల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళి ఎన్ని రోజులైంది? పద్నాలుగు నెలలు పదిరోజులు.
మళ్ళా ఫోన్
“మమ్మీ! .....” కట్ అయింది. మళ్ళా నిశ్శబ్దం.
ఈసారి నన్ను నేను అదుపులోకి తెచ్చుకున్నాను. హలో అని చాలా సార్లే అన్నాను. -కాని, లాభం లేకపోయింది.
నీలిమ కనపడ్తే ఎన్నో ప్రశ్నలు అడగాలకున్నాను. అవన్ని ఒక్కసారిగా నా ముందుకొచ్చాయి. ఎందుకు యింట్లోంచి అంత చీఫ్‌గా వెళ్ళిపోయావ్? మమ్మల్నెందుకు వదిలేసొవ్? నీ ప్రేమ గురించి మాకెందుకు చెప్పలేదు? మమ్మల్ని మోసం ఎందుకు చేసావ్?
ఏదో బాధ ఉండలు చుట్టుకుపోతోంది.
నీలిమ గురించిన రకరకాల భావాలు, ఆలోచనలు, జ్ఞావకాలు చుట్టుముట్తున్నాయి.. ఫోన్ పెట్టేసి అలాగే సోఫామీద, కళ్ళకి చెయ్యి అడ్డుపెట్టుకుని వాలిపోయాను.
జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు .....
ఆ రోజు.... నీలిమ యిల్లు వదిలి వెళ్ళడానికి ముందురోజు...
నీలిమ పుట్టిన రోజు.....
ముగ్గురం ఆఫీసులకి సెలవ పెట్టేసాము.
బీర్లామందిర్ కెళ్ళాము. లైఫ్‌స్టైల్ లో ఏవేవో కొన్నాము. 80
తానిష్క్‌లో ఓ సింపుల్ నెక్లెస్ కొన్నాము. అందులో ఉన్న వజ్రాల మెరుపు, నీలిమ మొహంలో ప్రతిబింబిస్తూంటే మురిసిపోయాము.
గ్రీన్ పార్క్‌లో లంచ్ చేసాము. యింటి కొచ్చేప్పటికి మూడు. ఫోన్ మోగుతూనే ఉంది. గ్రీటింగ్స్ వస్తూనే ఉన్నాయి.
“మా ఆఫీసులో వాళ్ళకి పార్టీ యిస్తున్నాను. సంగీత్‌లో పిక్చర్, బసేరాలో డిన్నర్”
జీన్స్, టీషర్ట్‌తో కారు తాళాలు ఊపుతూ అంది నీలిమ.
“ఓ.కే. బాయ్!” అంటూ చెయ్యూవింది. కూతుర్ని మురిపెంగా చూస్తూండిపోయాను.
రాత్రి పొద్దుపోయింది. నిశాంత్‌కి రోజు ముందు కావాలి, అది క పోతే
నిద్రపట్టదు. రోజు ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్‌తో బార్ కెళ్ళి తాగి వస్తాడు. సాయంత్రం ఫ్రెండ్స్ తో తాగకపోతే, యింట్లోనే గది తలుపులు వేసుకుని తాగుతాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. నాకు సీరియల్స్ ఉందనే ఉన్నాయి. ఛానల్స్ అన్నీ మారుస్తూ టీ.వీ. చూసి పదిన్నరకి లేచాను అక్కణ్ణించి.
అన్నం తినబుద్దీకాలేదు. మజ్జిగ తాగి, నిశాంత్ గదిలోకి తొంగి చూసాను. టీ.వీ. చూస్తూ, ఏదో తింటూ తాగుతున్నాడు.
“అన్నీ టేబుల్ మీద పెట్టాను. మీ యిష్టం ఎప్పుడు తిన్నా సరే”
తల తిప్పకుండానే “ఊం” అన్నాడు.
మందెక్కువయితే మాట్లాడడు. అర్ధం చేసుకున్నాను.
“నేను పడుక్కొంటున్నాను.” అంటూ గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరేసుకున్నాను. రేడియోలో శుభరాత్రి. విన్నాక పడుకొన్నాను.
“మమ్మీ! పడుకొన్నానా!” అంటూ నీలిమ వచ్చింది. అప్పుడే
“ఇప్పుడే పడుక్కుంటున్నాను. బాగా ఎంజాయ్ చేసావా!”
కారు తాళాలు, యింటి తాళం, తళాలున్న అరలో పెట్టింది.
“డాడీ పడుకున్నారా!”
“తన స్టడీరూంలోనే ఉన్నారు. గుడ్‌నైట్ చెప్పి పడుక్కో”
“ఓ.కే. గుడ్‌నైట్ మమ్మి,” అంటూ దగ్గరి కొచ్చి నా భుజం మీద్ చిన్నగా తట్టింది. నా చేతితో నీలిమ చెయ్యిని నొక్కాను.
నీలిమ వెళ్ళింది. మరో పావుగంటకి నిశాంత్ వచ్చి పడుక్కున్నాడు
మర్నాడు....
అలారం ఐదుగంటలకే మోగింది.
నిశాంత్‌ని, నీలిమని లేపాను. ఎవరి తాళాలు వాళ్ళు తీసుకుని వాకింగ్‌కి బయల్దేరాం. ఒకళ్ళకోసం ఒకళ్ళు ఎదురుచూడకుండా ఎప్పుడైనా యింటికెళ్ళడాన ఎ వీలుగా ఈ పద్దతి పెట్టుకున్నాం.
యూనివర్శిటీ రోడ్దు మనుషులతో, చెప్పుల చప్పళ్ళతో కోలాహలంగా ఉంది
'లావణ్యా! ఇవ్వాళ్ళెక్కువ దూరం వెళ్ళద్దు. నేను తొందరగా వెళ్ళాలి. ముంం నుంచి పిళ్ళ వచ్చి 'రఒ.దా'లో ఉన్నాడు. ఏడుగంటలకి వాణ్ణి పికప్ చేసుకుని ప్లాం.. కెళ్ళాలి. టి.పి. ఎం. సెమీనార్లున్నాయి.
“నేను కూడా తొందరగా వెళ్ళాలి. నిన్న పుట్టినరోజని వెళ్ళలేదు కదా, పెండింగ్ పని ఛాలా ఉంటుంది. “గబాగబా నడవడం మొదలెట్టింది నీలిమ.
'లా' కాలేజి వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసాము. నీలిమ గురించి పట్టించుకోలేదు.
వస్తూ వస్తూ, దార్లోనే ఆలోచించుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కట్టుకోవాల్సిన చీర గురించి.
యింట్లోకి వస్తూనే ఫ్రిజ్‌లోంచి ఇడ్లీ పిండి, కొబ్బరి చిప్ప బటయి పెట్టాను. రేడియో ఆన్ చేసాను. వందేమాతరం వస్తోంది. కాఫీ కలిపి, బాల్కనిలోకి వెళ్ళాను. అప్పటికే అక్కడ నిశాంత్ కూచుని ఉన్నాడు.
“రాత్రి పొద్దుపోతుంది. ప్రయాణం విసుగు. కానీ తప్పదు. -ఎండి కూడా వస్తే, ఆ పక్కనే ఓ చిన్న సిమెంట్ ఫాక్టరి చూడ్దానికెళ్ళాల్సీ వస్తుంది. పవర్ లేక, కోల్ లేక దాన్ని అమ్మేద్దామనుకుంటున్నారట. అక్కడికి కూడా వెళ్తే రాత్రి ఒంటిగంట అయిపోతుంది. ఈ విజయవాడ హైవే రోడ్లు చూస్తే వోర్రిబుల్ ఫప్ఫ్! ఒళ్ళు హూనం అయిపోతుంది. గుడ్డిలో మెల్ల ఇండికాలో వెళ్తున్నాం క్వాలీస్ కాదు " అంటు నిశాంత్ తన కష్టాలు చెప్పుకున్నాడు. 82
“భక్తిరంజని అయిపోయింది, ఈ పిల్ల రాలేదే! అంటూనే నే... చేల వంటంట్లోక్ వెళ్ళి మధ్యాహ్నానికి ఏం తీసుకెళ్ళాలా అని ఆలోచించాను. నిశాంత్‌కి లంచ్ అక్కర్లే... నీలిమకి మధ్యాహ్నం సూప్, సలాగ్. నా వంట అక్కర్లేదు. మరి నా ఒక్కదానికి ఎందుకు? నేను కూడా ఎక్కడో ఏదో తినేస్తాను. అని అనుక్కుని గదిలోకి వెళ్ళి బీరువా తెరిచి, తెలుపు గులాబి ప్రింట్ ఉన్న ఆర్గాండి చీర తీసి మంచం మీద పడేసి బాల్మనిలోకి వెళ్ళాను.
“నీలిమ రాలేదే !” అంటూ వంగి రోడ్డు వైపు చూసాను.
'వస్తుందిలే. కొంచెం కాఫీ యిస్తావా! తాగేసి షేవ్ చేసుకుంటాను"
“రోజూ ఈ టైముకి వచ్చేదేనే, ఇంకా రాలేదు. నాకేంవిటి, దానికే లేట్ అవుతుంది.”
“నీ కంతా కంగారు. లేడీస్ హాస్టల్ దగ్గర ఎవరైనా ఫ్రెండ్స్ కనవడ్తే మాట్లాడుతూండి పోయి ఉంటుంది. వస్తుందిలే.”
రెండుసార్లు బాల్మ్కని లోకి వచ్చాను.
రోడ్లో మనుషుల రద్ది ఎక్కువైంది.
కార్లు, స్కూటర్లు, ఆటోలు అటూ యిటూ రయ్యిమంటూ వెళ్ళిపోతున్నాయి. ఎందుకో నెగెటివ్‌గా ఆలోచనలు వస్తున్నాయి.
“నీ టైము వేస్టవుతోంది. నువ్వు తయారవ్వు... దాని దగ్గర కూడా కీస్ ఉన్నాయిగా. నువ్వు వెళ్ళిపోయినా, దాని దగ్గర తాళం చెయ్యి ఉంది కదా, నీ పని నువ్వు చేసుకో ! తనే వస్తుందిలే.”
నిశాంత్ మాటలు పట్టించుకోకుండా బెడ్‌రూం కిటికి లోంచి బయటికి చూసాను. నీలిమ కనపళ్ళేదు. ట్రైము ఏడు. ఎందుకు రాలేదు. ఏదైనా యాక్సిడెంట్ *...! ఉహుం ... అదే జరిగితే ... ఈ పాటికే తెలిసిపోతుంది. మార్నింగ్ వాక్ కి వచ్చేవాళ్ళంతా అంతో యింత పరిచయం ఉన్నవాళ్ళే. అది అయ్యి ఉండదు. ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద కూచుని ఏదో డిస్కషన్ చేస్తూండి ఉంటుంది. అయినా, ఈ రోజు ఆఫీసుకి వెళ్ళదా! “వెళ్ళను” అని ముందే చెప్తే ఇంత టెన్సన్ ఉండదు కదా!
నిశాంత్ తయారు అయిపోయి, బ్రీఫ్‌కేస్, కారు తాళాలు తీసుకుని తలుపు తియ్యబోతూ ఆగాడు.
83
“లావణ్యా! నీలిమ రాలేదు. నాకు ఎలాగో ఉంది. నువ్వు యింట్లో ఉండాల్సివస్తుందేమో! ఓ అరగంట తర్వాత ఫోన్ చేస్తాను. నాక్కూడా ఏం జరిగిందో తెలుస్తుంది. మరి నే వెళ్ళనా!” బెంగగా చూసాను. “చిన్న పిల్లకాదు. దానికేం కాదు. రమదా కెళ్ళంగానే ఫోన్ చేసాను. కారు ఆఫీసులో పెటాను. నాకు దార్లో ఎక్కడైనా కనపడ్తే తొందరగా యింటి కెళ్ళమని చెప్తాను. కంగారుపడకు” అంటూ వెళ్ళిపోయాడు. లలిత సంగీతం వస్తోంది ఎనిమిది అయిపోతుంది. ఎనిమిదన్నరకల్లా ఇంజనీరింగ్ కాలేజి బస్టాప్ దగ్గరుండకపోతే, ఆఫీసుకి టైముకి చేరడం కష్టం అన్నివోట్లా ట్రాఫికీ ఎక్కున. ఏం తినబుద్ది కాలేదు. అసలేం చెయ్యలేదు. జడ వేసుకుందామని అద్ధం ముందు నుంచున్నాను. చీరని పొందిగ్గా కట్టుకుని, ముందుకి వెనక్కి చూసుకుంటూ పొట్టి జుట్టుని క్లిప్‌లో బిగిస్తూంటే, టీ. వి మీద రెప రెప లాడుతున్న లేత గులాబి రంగు కాయితం కనపడింది. దాని మీద రూం రిఫ్రెషనర్ లేకపోతే, కిటికీ లోంచి వచ్చేగాలికి ఎప్పుడో ఎగిరిపోయేది. పొట్టి జుట్టుని అలాగే వదిలేసాను. గిరుక్కున వెనక్కితిరిగి, అ కాయితం తీసాను. నీలిమ రాత. గుండె జారినట్లుంది. ఏం రాసింది? ఎందుకు ఉత్తరం రాయాల్సి వచ్చింది? ఏం జరిగింది? గబగబా మా బెడ్‌రూంలోకి వచ్చాను. ఓ ఐదు నిమిషాలు కళ్ళు మూసుకున్నాను. నన్ను నేను స్వాధీనంలోకి తెచ్చుకున్నాను. ఉత్తరం చదవడం మొదలెట్టాను. మమ్మీ, డాడీ !
మిమ్మల్ని బాధపెద్దున్నాని తెలుసు. కానీ, నేనేం చెయ్యలేను. నా గురించి, నా పెళ్ళి గురించి మీరు చాలా పెద్ద ఊహలు పెంచుకున్నారు ఆశలు పెట్టుకున్నారు. నా నోటితో చెప్పి, మీరు బాధపడ్డూంటే చూడలేక ఉత్తరం రాస్తున్నాను. 84
నాకు మితేష్ అంటే యిష్టం. మితేష్ నాతో పాటూ జి.ఈ లో పనిచేస్తున్నాడు. మా షిఫ్ట్‌లో పరిచయం పెళ్ళి వరకూ వచ్చింది. మీరు నాకు అమెరికా సంబంధం చూస్తున్నారు. ఎన్ని లక్షలయినా కట్నం యివ్వదానికి సిద్దంగా ఉన్నారు. కానీ, నేను మీరు తెచ్చిన సంబంధం చే ఎకుని అమెరికా వెళ్ళడానికి సిద్ధంగా లేను. నేను వేరే ఎవర్ని భర్తగా ఊహించలేదు. మీకేమో మితేష్‌ని అల్లుడిగా చూడడం యిష్టం ఉండదు. మీరు అంగీకరించరు. నావల్ల, నా పెళ్ళి వల్ల మీరు అమెరికా చూడాలని మీ ఆశ. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా అమెరికా వెళ్ళి వచ్చినవాళ్ళే.
మీ (ఫ్రెంద్స్, వాళ్ళ అమ్మాయిల డెలివరీలకోసం అనో, పిల్లల్ని చూడడం కోసమో, బేబి సిట్టింగో, ఏదయితేనేం రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చారు. మీరు అమెరికా వెళ్ళాలన్న కోరిక నా అమెరికా పెళ్ళి సంబంధం వల్లనే అవుతుంది. అదే జరగాలంటే అతను మితేష్ అనకూడదు. సింపుల్ మీకు నా పెళ్ళి మితేష్‌తో అవడం యిష్టం ఉండదు. నన్ను ఇమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తారు. నాకదంతా యిష్టం లేదు.
మీకు నేను సంతోషంగా ఉండడమే కదా కావాల్సింది నాసంతోషం అంత మిలేష్. రెండు నెల్ల నుంచి వేస్తున్న ప్లాన్ యిది. నా బట్టలు అన్ని కొంచెం కొంచెంగా, అప్పుడప్పుడు తీసుకెళ్ళి మితేష్ ప్లాట్‌లో పెడ్తూ వచ్చాను. అందుకే పొద్దున్న వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు, ట్రాక్ సూట్ వేసుకోలేదు. (డ్రెస్ వేసుకున్నాను. నేను ఏ.పి.లో వెళ్ళిపోతున్నాను. పొద్దున్న కొంచెం దూరం నడిచి, ఆటో తీసుకుని స్టేషన్ కెళ్ళి, అక్కడ మితేష్‌ని కలుసుకుని, ఏ.పి.లో ఢిల్లి వెళ్ళి, అక్కణ్ణించి గుర్‌గావ్‌లోని జి.ఈ. లో నేను చేరుతాను మితేష్ ముందరే జాయినయిపోయాడు.
మీరు పోలీసులు రిపోర్టు యిచ్చి లాభం లేదు. కాబట్సీ యివ్వద్దు. నా యిష్టం మీదే వెళ్తున్నాను. నాకు నచ్చిన వాడితో వెళ్తున్నాను. నేను మేజర్నన్న సంగతి మరిచిపోవద్దు. నేనే మీకు ఫోన్ చేస్తాను. బాధ కలిగిస్తే క్షమించండి.
నీలిమ
మంచం మీద వాలిపోయాను.
ఓ మైనారిటీ తీరిన పిల్ల తనకు నచ్చిన వాణ్ణి, యింట్లో చెప్పకుండా, వెళ్ళిపోయి పెళ్ళిచేసుకుంటే, సినిమాలో బావుంటుందేమో, నిజ జీవితంలో ఎంత అవమానం ! మింగుడు పడని చేదుమాత్ర ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ధైర్యం చాల్లేదు.
85
ఆఫీసులో ఎంతో గర్వంగా, ఎప్పుడూ నీలిమ గురించే గొప్పలు చేస్తూ, అందరి కళ్ళల్లో ఈర్మ్య చూసి పొంగిపోయిన నేను, ఈ రోజునుంచి, హేళన, అపహాస్యం ఎలా చూడగలను?
ఇద్దరం ఉద్యోగాలు మానేసాం. మా యిద్దరి మధ్య మాటలే లేవు. ఎక్కడ జరిగింది తప్పు ?
హాయిగా సాగిపోతున్న జీవితాల్ని ఎందుకు చిందర వందర చేసింది?
టప్పున ఓ బండరాయిని విసిరేసి మూ జీవితాల్ని అల్లకల్లోలం ఎందుకు చేసింది?
నా జీవితాన్ని నేను, నాకు నచ్చినట్లుగా చేసుకునే అధికారం నాకే ఉంది. కేవలం నాకు మాత్రమే ఉంది. మీకే లేదు. అని పరోక్షంగా చెప్పి వెళ్ళిపోయిందా!
నిజం కూడా అదేనా!
ఎలా అయితే నీలిమ జీవితం బావుంటుంది? ఏం చేస్తే నీలిమ ఆనందంగా ఉంటుంది ! ఏది బెస్ట్! అందరి కన్నా ఓ మెట్టు పైనే ఉండాలనుకుని, ఎంతో ఖరీదయిన బట్టలు కొనేదాన్ని !
నీలిమ మా కలల ప్రపంచం. మా ఒక్కొక్క కలా ఆమె వల్ల తీర్చుకునే వాళ్ళం.
దాని యిష్టాయిష్టాలు ఏనాడూ అడగలేదు.
ఎక్కడ ఎస్సే రైటింగ్ పోటీ ఉన్నా, డిబేట్ ఉన్నా పెయింటింగ్ .ఉన్నాా క్విజ్ ఉన్న నేనే స్వయంగా తీసుకెళ్ళేదాన్ని అన్ని విధాల ప్రిపేర్ చేయించే దాన్ని . నీలిమకి (ఫ్రైజ్ వస్తే నాకు వచ్చినంతగా సంతోషపడేదాన్ని రాకపోతే దానికన్నా నేనే ఎక్కువ బాధపడేదాన్ని.
ప్రతీసారి, ఎండకాలం సమ్మర్ కాంపుల్లో చేర్చించే దాన్ని
'మా నీలిమకి రాని విద్య లేదు' అని అందరూ పొగడుతూ ఉంటే నా జీవితం పరిపూర్ణత చెందినట్లుగా అనిపించేది.
వ్యక్తిత్వ వికానం కోర్సులకి వంవించాను. కానీ, దాని వ్యక్తిత్వం, బూమరాంగ్‌లాగా నాకే తిప్పి కొడ్తుందని అనుకున్నానా!
రోజులు ఎప్పుడూ కూడా ఓ లాగానే ఉంటాయనుకోడం ఎంత తెలివి తక్కువతనం! 86
ఏ రోజున కూడా అనుక్కోలేదు. అసలు ఆ ఊహ కూదా రాలేదు. ఇది పెరిగి పెద్దదయి మా జీవితాన్ని తొక్కేసి ఓ మూలకి తో సేస్తుందని!
ఇంత నిర్దాక్షిణ్యంగా మా జీవితాల మీద సుంచి వెళ్ళిపోతుందని అనుక్కోలేదు.
ఎవ్వరి ముందు కూడా నీలిమకి కాంప్లెక్స్ రాకూడదని, ఎంత జాగ్రత్తగా పెంచామో.... అంత నిర్లక్ష్యంగా, కటువుగా, అందరిలో మా జీవితాల్ని చులకన చేసి వెళ్ళిపోయింది. అశాంతిలో అవమానాల్ని ఎదుర్మోమని వెళ్ళిపోయింది.
వెళ్ళిన ఓ నెలకి ఫోన్ చేసింది. బాగా తిట్టి ఫోన్ మరోసారి చెయ్యద్దని చెప్పి ఫోన్ పెట్టేసాను. ఆ తర్వాత చెయ్యలేదు. కానీ.... నేనే రోజూ నాకు తెలీకుండానే ఎదురు చూసేదాన్ని ఏదో ఓ రోజు ఫోన్ చేస్తుంది నా దగ్గరికొస్తుంది. అన్నింటికీ మమ్మీ .... నుమ్మీ అవే దానికి ఎంత ధైర్యం వచ్చింది? కారణం మితేష్ !
ఏ... నమ్మి అమితేష్‌తో వెళ్ళింది? మంచివాడేనా! ఎంత చదువుకున్నా. ఎన్ని తెలివి తేటలున్నా ప్రకృతిపరంగా స్త్రీ ఎప్పుడూ అబలే. అందుకే శారీరక రక్షణ ఒంటరిగా బయటికి, యిల్లు వదిలి వెళ్ళినపుడు కొంచెం తక్కువే. ఎలా ఉందో ...
ఎందుకిలా జరిగింది? వాస్తవ జ్ఞానం .... అసలు ఆ భాగం పని చెయ్యకపోతే యిలాగే ఉం..*యా పోకడలు ! ఈ సినిమా ప్రభావం యింత ఉందా ఈ పిల్ల మీద.
టీ వీ ఛానెళ్ళకి కళ్ళని కట్టేసి, మనసుని ఎదగక తనంతట తానుగా ఎదగకుండా చేసుకుంటే యిలాగే ఉంటుందా పర్యవసానం !
వ్యక్తిత్వం లేదు నిపుణత లేదు. దీని చదువు దీనికి ఏం నేర్పింది? ఏం చెయ్యాలో తెలియడం ఎంత జ్ఞానమో, ఏం చెయ్యకూడదో తెలీడం అంతకు మించిన విద్వత్తు,
మా జీవితంలో ఏం పోయింది? ఫీల్. మా అనుభూతులు పోయాయి. ఈ జీవితాన తలుపులు తట్టేవి నీలిమ జ్ఞాపకాలు మాత్రమే.
తన అనుభవ రాహిత్యంతో. ఆలోచనా శూన్యంతో మా జీవితా." ఓ పెద్ద ట్రేక్ వేసి, ఆపేసి వెళ్ళిపోయింది.
మా కన్నీళ్ళని మేమే తుడుచుకునే స్థితికి వచ్చేసాము. మనోశూన్యత. గతానికి, వర్తమానానికి వంతిన కట్టాలని చూస్తున్నా
87
మా యిద్దరి తప్పు ఎంతుంది? తల్లితండ్రులిద్దరూ ఉద్యోగం చెయ్యడం దానికి మితిమీరిన స్వేచ్చనిచ్చిందా! స్వేచ్చ అంటే మంచి చెడుకి అర్ధం లేకుండా ప్రవర్తించడమా!
వాస్తవంలోని వెలుగుని చూడ్డానికి శక్తి చాల్లేదు ఎంత నిర్వీర్యురాల్ని అయ్యానో!
విశబ్ధ్బ పాషాణంలా జీవితాన్ని దగ్గర్నుండి చూడ్డానికి ప్రయత్నిస్తున్నాను. మళ్ళా ఫోన్. కదల్లేదు.
ఫోన్ మోగుతోంటే.... నిశాంత్ గదిలోంచి పేపరులో సహ బయటకి వచ్చాడు.
ఫోన్ తియ్యమన్నట్లు చెయ్యూపాడు.
నన్ను నేను అదుపులోకి తెచ్చుకున్నాను
మెల్లగా రిసీవర్ తీసి “హలో” అన్నాను.
“మమ్మీ! నీలిమే .... సందేహం లేదు. నా చెవులకి సరిగ్గానే వినపడింది.
కోపం లేదు. మొదట్లో ఉన్న కోపం ఏదీ? గుండెల్లో యిన్నాళ్ళు పేర్కొన్న బాధ, కళ్ళలోంచి జారిపోతోంది.
“అమ్మా!” ఆ పిలుపు నా గుండెల్లోని లోతుల్ని స్పృశించింది అందులోని పసితనం కట్టేసింది.
“అమ్మా!” మాట్లాడవా ! ఎందుకో ఒంటరిదాన్నయినట్లుగా అనిపిస్తోంది. నీ భుజాన్ని ఆసరాగా యిస్తావా! ఏం అమ్మా! మాట్లాడవా !
ఉండలు చుట్టుకుపోతు . బాధ, గొంతుకలో అద్దుకుపోయింది.
నోట్లోంచి మాట రావడ.. "లేదు
“అనుమతి లేకుండా వెళ్ళింది. యిప్పుడు వస్తానంటోంది అని అనుకుంటావా!”
“కాదు.... కాదు .... లేదు.... ” బలవంతంగా అనగలిగాను.
“నేను... మితేష్ విడిపోయాం .... భిన్న వాతావరణంలో పెరిగిన మా యిద్దరికీ చధ్యనున్నది కేవలం ఆకర్షణ మాత్రమే అని తెలియకుడానికి యిన్ని రోజులు పట్టింది.” ఏదో సాధారణ విషయంలా చెప్పాలనుకున్నా ఆ గొంతులో వణుకు తెలిసిపోతోంది.
అ రోజున తెలీని జీవితంలోకి, అనుభవం లేని, తియ్యటి ఊవాల్లో వెళ్ళిపోయింది.
ఈ రోజున వైవాహిక జీవితం లోని, జీర్ణించుకోలేని చేదు అనుభవాల్లో వస్తోంది. 88
పిల్లలు ఏం చేసినా, ఎంత చేసినా, ఎంత బాధపెట్టినా, ఏంత అవమానించినా, ఎంత అసహ్యంగా ప్రవర్తించినా, ఎంత విచక్షణా రహితంగా ప్రవర్తించినా వాళ్ళని తల్లి ఒకత్తే క్షమించ “లదు. వేదాంత కాదు. ఇది వాస్తవం.
“వచ్చెయ్యి.... పర్మిషన్ అడగక్కర్లేదు .... నీకు తెలుసా నీలూ ... నువ్వెళ్ళిన రోజున ఆగిపోయిన జీవితం తిరిగి నీ రాకతోనే మొదలవుతుంది. నా భుజం కావాలనుకుంటావా! పిచ్చిదానివి, నా రెండు చేతులెందుకనుకున్నావ్? నేనూ, డాడీ నీ కండా దండా తిరిగి ఎలాంటి జీవితాన్ని ఆరంబించినా, మంచి మార్గాన్నే వెళ్ళదానికి మా మోరల్ సపోర్ట్ నీకుంటుంది. మాకు నువ్వు ..... సీకు నేను ... జీవితం అంటీ మితేష్‌తో పంచుకోవడం ఒక్కలే కాదు ..... ఎంతో ఉంది..... నీరాక కోసం ఎదురుచూస్తుంటాము.”
ప్రశ్నార్ధకంగా చూస్తున్న నిశాంత్‌లో అంది “నీలిమ ..... మన చీలిమ ...”
నిశాంత్ పెదవుల మీద చిన్న హాసం.
శంాటాలే పరారీం ఈ త్రుల్సుళు 89
ల్లా, అడి జడ తెలిసి చేస్తున్న తప్ప
నా నోట మాట రాలేదు.
ఏం అనాలో తెలీని స్థితి
దుఃఖం గొంతు దగ్గర, కన్నీళ్ళు రెప్పల దగ్గర ఆగిపోయాయి.
ఎందుకిలా జరిగింది? లోపం ఎక్కడుంది? నాదా ! నా పెంపకమా!
ఒక్కొగానొక్క కూతురని, పూర్ణిమని గారంగా, అపురూపంగా పెంచడం నేను చేసిన తప్పా!
పూర్ణిమ అడిగింది ఏదీ కాదనలేదు. అద్దు చెప్పలేదు.
అలాంటిది ఈ రోజున
పొద్దున్న ఫోన్ చేసింది.
“మమ్మీ! ఆవకాయి అయిపోయింది. ఓ సీసాలో తీసి ఉంచు. మధ్యాహ్నం చిన్నా, మున్నీని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు తీసుకెళ్తాను. నిన్న నువ్వు పెట్టిన గుమ్మడి వడియాలు బాగా ఎండితే ఓ డబ్బాలో ఉంచు. అవి కూడా తీసుకెళ్తాను.
“అలాగేలే .... ఏంవైనా టిఫిన్ చేసి ఉంచనా ....
“వొద్దు మమ్మి .... టిఫిన్ ఏం వద్దు. యింటికెళ్లు పిజ్ఞా హాట్ కెళ్తాం. చిన్న మొన్నటి నుంచి ఒకటే గొడవ పిజ్ఞా కోసం ఇవ్వాళ వెళ్తాం అని నచ్చచెప్పాను. నువ్వు ఆవకాయ వడియాలు తీసి ఉంచు. అవునూ, పొద్దున్న ఏం వండావు?
“మజ్టీగ పులుసు, కాబేజి కొబ్బరి కూర .... ”
౪0
“ఓకే మమ్మి . మజ్జిగ పులుసు కూడా ఓ చిన్న స్టీలు కారియర్‌లో వేసి పెట్టు. “వీక్సు తెలుసు కదా నకూలీ్‌కి మజ్జిగ పులుసంటే చాలా యిష్టం అని.
“అల గేలే, అన్నీ రెడీగా ఉంచుతాను ....”
స్కూటరేసుకుని వచ్చింది.
పూర్ణిమ పిల్లలిద్దర్ని మాయింటి దగ్గరున్న స్కూల్లో వేసింది.
పూర్ణిమ, మొగుడు నకుల్ నెలకి వారం, పదిరోజులు బయట ఊళ్ళోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టైములో పూర్ణిమ పిల్లల్ని తీసుకుని మా దగ్గరికి వచ్చేస్తుంది.
మాక్కూడా వాళ్ళిద్దరూ మంచి కాలక్షేపం ఎప్పుడైనా లేట్ నైట్ పార్టీలుంటే, సెకెండ్ 'షో' సినిమా ప్వాన్ వేసుకుంటే నేనే స్కూలుకి వెళ్ళి పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాను. నా దగ్గరే ఉంచుకుంటాను.
ఇలా చాలా ఆలోచించి పిల్లలిద్దర్ని దగ్గర స్కూల్లోనే వేసిందొ:
'మమ్మీ! మళ్ళా అఖరి క్షణంలో మర్చిపోతానేమో అన్నీ యిక్కడ 'టీపాయ్' ఉంచు. వెళ్ళేప్పుడు యింక మర్చిపోను....”
ఆవకాయ సీసా, వడియాలున్న పాలిధీన్ సంచి, మజ్జిగ పులుసున్న స్టీలు డబ్బా, అన్నీ లిపి ఓ పెద్ద బాగ్‌లో పెట్టి కూచున్నాను.
“మమ్మీ! .ంకొంచెం పెద్ర స్తాట్ కొందామనుకుంటున్నాం మా ఎదురుగా ఎల్లోరా టవర్స్‌లోనే, సెకెండ్ ప్లోర్‌లో ఉండేవాళ్ళు అమెరికాకి వెళ్ళిపోతున్నారు. ఇల్లు చాలా బావుంది. మూడు బెడ్‌రూంలు, బిల్టిన్ కబోర్డులు, వంటిల్లు, దేవుడి గడ .... అన్నీ సూపర్‌గా ఉంది.
“ముందు వాస్తు సంగతి చెప్పు .......”
“నాకు తెలిసిన వాస్తు నాలెడ్డితో చూసాను. అన్నీ బాగుంది. నువ్వు నాకో ఐదు లక్షలు యివ్వు.....” డిమాండ్.
“ఐదు లక్షలా! .....” నా నోటమాటరాలేదు. దుఃఖం.
“ఏంటి మమ్మీ!....” నువ్వు మరీను.... పది అడిగానా అలా మొవాం పెట్టావు. ఐదేగా అడిగాని. ...
“మా దగ్గరేం వుందే? దొడీ రిదైరయ్యారు....”
9||
“అందుకే అంత ధైర్యంగా అడుగుతున్నాను. పి.ఎఫ్. గ్రాట్యూటి, సిక్‌లీవ్ .... పి.ఎల్. అన్నీ ఎన్ కాష్ చేసారు కదా, అయినా నువ్వే అంటావు కదా, అంతా నాదే పని. మరి అడుగుతుంటే నువ్వివ్వాలి కదా!”
నా మాటలే నాకు బల్లెంలా పొడుచుకున్నాయి. బూమరాంగ్, మాట అన్నాను. అంత నీదే, మాకున్నదంతా నీకే. ఈ రోజున కూడా అంటాను కానీ .... మాకో బతుకుంది కదా! రిటైరయ్యాకా ఆ డబ్బుతోనే గడపాలి కదా ! నేనన్న మాటలు దానికి అద్ధం లేదా! మేం ఉన్నంత వరకూ మాది. ఆ తర్వాత దానిది. ఈ అర్ధం తోనే అన్నాను. కానీ .... ఆ అర్ధాన్ని తిరిగి దానికి వివరించడానికి నేనిష్టపడలేదు.
ఆలోచన తక్కువ. దాని వైపు నుంచే ఆలోచిస్తుంటే నేను చెప్పేది. దాని కర్థం కాదు. పైగా ఏడిచేస్తుంది. దాన్ని ఏడిపించి ..... ఫ్పె! ము.....
“అంత ఆలోచన ఏంవిటి? అంత డబ్బొచ్చింది అయినా మీరిద్దరే కదా! ఎంత కావాలేంటీ మీకు?” అంటూ లేచింది.
“బాబోయ్! మూడవుతోంది. నే వెళ్తాను” అంటూ టీపాయ్ మీద ఉన్న బాగ్ తీసుకుంది.
గేటు వరకు వెళ్ళి వెనక్కి తిరిగింది.
“ఎల్లుండి వచ్చి (డ్రాఫ్ట్ తీసుకుంటాను. సరేనా ... అయ్యో!” అంటూ కుడిచేత్తో నుదురు కొట్టుకుని వెనక్కి వచ్చింది.
ఏంవయింది అనే స్థితిలో లేను,
“ఈ కమింగ్ సండే, నలుగుర్ని లంచ్‌కి పిలిచాడు. నకుల్ ఫ్రెండ్స్. కంపెని మారి నోయిడా వెళ్ళిపోతున్నాడు. ఫామిలీలు కూడా వస్తారు. నువ్వు పొద్దున్నే వచ్చెయ్యి.”
రిటైరయ్యాకా, బిజిలైఫ్ లేక
ఒక్కొక్కటే మా దగ్గరి కొస్తున్నాయి.
నిన్న సడన్‌గా కళ్ళు తిరిగినట్లవుకే డాక్టరు దగ్గరికెళ్తే బి.పి. ఉందన్నారు. గబగబా నుడుస్తూంటే మో చిప్ప కలుక్కుమంది.
యివి దానితో చెప్తే అర్ధం చేసుకుంటుందా!
ఇదే పరిస్థితిలో ఓ అత్తగారు, కోడలు ఉంటే ..... 92
అత్తగారు బయట పద్దుంది. తల్లి బయటపడదు. అందుకే నేనూ బయట పడదల్బుకోలేదు.
“అలాగేలే .....”
“దాడీ వస్తానంటే యిద్దరూ రండి .... నే వస్తాను” అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది.
పూర్ణిమ పుట్టుకతో నా లోకం మారింది.
నొ ఆళలు, నా కోరికలు ఎక్కడ నిళ్చిపోయాయో, ఎందుకు నిళ్చిపోయాయో, అలాంటి పరిస్థితి పూర్ణిమకి రాకూడదని, నా మానసిక వ్యథ దానికి రాకూడదని, అలాంటి బాధ అది అనుభవించకూడదని, అది ఏది అడిగితే అది, ఏది నేర్చుకుంటానంటే అది నేర్పించాను.
“ఏంవిటి ఆ గారం? నీకొక్కదానికే కూతురుందా! మరీ అంత, యిది పనికి రాదు. మంచి చెడ్డా అన్నీ నేర్పించాలి. ఆ టెన్సీస్‌కి అంత ఖర్చు చేస్తున్నారు. అది పెద్దయ్యి ఆడుతుందనే నీ ఉద్దేశం ! అక్కడెక్కడో డాన్సంటే అంత దూరం తీసుకెళ్తున్నావు? దానిష్టం ఏంవిటి అది చూడు. కనుక్కో అంతే కానీ, నీకిష్టం అన్నీ నేర్పించేస్తే .....” అమ్మ, పిన్ని అంతో నన్ను మందలించారు.
“ఒకత్తె.... అయినా ఈ రోజుల్లో అన్నీ రావాలి. ప్రపంచం ఎలా ఉంది? ఎంత కాంపిటీషన్! చదువే కాదు, అన్నీ చూస్తారు సొసైటీలో ఎన్ని నేర్చుకుంటే అంత
బట్టలు, నగలు, అఖరికి పట్టుచీరలు .... అది ఏది కావాలంటే అది.
“మాకేంవయినా లోటా! మా దంతా దానిది కాదా !” అని నవ్వేసే దాన్ని నేను దానికి కొన్ని బంగారం, వెండి చూసి రాన్రాను పూర్ణిమకి కూదా అర్ధం అయిపోయింది. అందుకే ఏది కావాలన్నా నిస్సంకోచంగా అడిగేది.
నేను కూదా, ఏ రోజున కూడా డబ్బు వేస్టు చెయ్యకు ఆది అవసరం..... ఎన్నో... ఏ రోజున కూదా ఇన్ని చెప్పుల జతలు దేనికీ? ఏంవిటి పార్టీలు ! అని అనలేదు.
తి
దగ్గర్లో ఉన్న కోచింగ్‌కి వెళ్ళకుండా, (ఫెండ్స్ వెళ్తున్నారంటూ ఎక్కడో దూరంగా ఉన్న కోచింగ్‌కి వెళ్ళింది.
రోజూ ఆటో, రోజు సాయంత్రం ఏదో ఒకటి ఫాస్ట్‌ఫుడ్‌లో తినడం.
ఇవన్ని ఇంకొక్క కూతురు కానీ, కొడుకు కానీ ఉన్న పూర్ణిమకి సమకూర్చే వాళ్ళ కాదు. ఒక్కత్తే కాబట్టి రోజుకు వంద రూపాయలు ఖర్చవుతున్నా చదువుకుంటున్న పిల్లకి ఆ మాత్రం ఖర్చవుతుందని అనుకున్నాం.
మంచి రాంక్ రాలేదు. అయినా ఇంజనీరింగ్ కాలేజీ చదివించాలని మా కోరిక.
సిటిలో సీటు రాలేదు. ఊరికి నలఖై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలో సీటొచ్చింది. డబ్బు ఎక్కువే. బస్సుకి కూడా కలిపితే ఎక్కువే. అయినా బాధ పళ్ళేదు. నాలుగేళ్ళ ఫీజు ఒక్కసారే కట్టమంటే.... బరువవుతుంది అని అనుక్కోలేదు. అది మా ఖాధ్యత. మా అమ్మాయి ఇంజనీర్ అన్న ఓ చిన్న వాక్యం యిచ్చే ఉత్సాహం కోసం ఫీజు కట్టాం.
కాట్, జిమాట్, జి ఆర్ ఈ, టోఫ్‌ల్ అంటూ నాలుగో సంవత్సరం నుంచే అక్కడ కోచింగ్ యిక్కడ కోచింగ్ అంటూంటే డబ్బుయిచ్చేసాం. ఫీలవలేదు.
రోజులలా ఉన్నాయి. మా రోజులతో పోల్పాల్సిన పనే లేదు అని అనుకున్నాను.
అమెరికాలో యూనివర్శిటీల్లో అప్టై చెయ్యదానికి డబ్బు గురించి ఆలోచించలేదు. అది అమెరికా వెళ్తే మాకు సంఘంలో గొప్పగా ఉంటుందనుకున్నాం.
మంచి స్కోరు రాక, ఎయిడ్ దొరకకపోతే అమెరికా ప్రయాణం, మీద చాలా ప్రాక్టికల్‌గా, దాని గురించి ఆలోచించాము.
నెలకి లక్షల లక్షల రూపాయలు పంపగలమా! బ్యాంక్‌లు లోనులిస్తాయి కానీ, జరగరానిది ఏదయినా జరిగితే.....
పెళ్ళి చెయ్యాలి, మంచి మొగుణ్ణి తేవాలి. కట్నం ఎక్కువైనా పర్వాలేదు. అందుకని వెళ్ళీ ప్రయత్సం మాని పెళ్ళికొకుని వెతికాం.
మంచి సంబంధం కుదిరింది. వెండి, బంగారం, డబ్బు, లాంచనాలు, బ్రహ్మాండంగా పెళ్లి జరిపించాము. క!
ఉండేది ఊళ్ళోనే.
మొదట్లో బెంగ, తర్వాత వేవిళ్ళు, ఆ తర్వాత టెలివరి యిద్దరు పిల్లలు పుట్టారు. చిన్న పిల్లల్ని చూసుకోడం కష్టం, అత్తగారున్నా ఏం చెయ్యదు. 'సగం రోజులు మా దగ్గరే.
పండగలు, పబ్బాలు, వుట్టిన రోజులు మరోటి మరోటి. అయన రిటైరయి పోయారు. ఇది వరకులా జరగడం జరపడం కష్టం అని నాకు తెలుసు.
ఒక్కసారి ఆదాయం ఆగిపోయింది.
వచ్చిన పి.ఎఫ్. గ్రాట్యుటి బ్యాంక్‌లో వేసి, అ వడ్డీతో జీవితం గడపాలి.....
కానీ ...... ఈ రోజున
కన్నా కూతురే మా రక్షణని ఛేదిస్తోందా!
ఎందుకిలా జరుగుతోంది?
మమ్మల్ని అర్ధం చేసుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నం చెయ్యడం లేదు. ఎందుకని?
ఈ విషయంలో కొడుకూ కూతురూ ఒక్కలాగే ప్రవర్తిస్తారా!
మేము కూడా కొడుకులాగా ప్రవర్తిస్తే నోరుమూసుకుంటామా ! రిటైరయిపోయిన తల్లితండ్రుల్ని డబ్బులడిగితే ... పిల్లల తప్పవుతుందా! తల్లిదండ్రుల్ని అర్ధం చేసుకోలేకపోతే అది పిల్లల తప్పు అవుతుందా.... కాదు.... మాదే తప్పు .... నేనే మా అమ్మాయిని సరిగా పెంచలేదు. ఆర్థిక పరిస్థితిని నేనేనాడు చెప్పలేదు.
రెగ్యులర్ ఆదాయం .... కంపెని వాళ్ళీచ్చే సదుపాయలు నౌకర్లు... గొప్పగా గడిపిన జీవితంలో... రిటైరయ్యాకా ఏంవిటి ...... ఎలా ... అని ఆలోచించకపోవడం
మాతప్పుకాదు.... నా తప్పు.
నేనే. దోషిని
నాదే తప్పు.
నేను తల్లిని ... పూర్ణిమ కూతురు
మామధ్యబంధం అదేనా!
మా మధ్య బంధంలో ఎమోషన్స్ లెవు.
న్
నేనే నాడు ఇంటి ఆర్ధిక పరిస్థితి వివరించలేదు. అతి (పేమ, గారాబం మా మధ్య ఉన్న బంధాన్ని గట్టిగా పటిష్టం చేసింది. కానీ, ఉండాల్సిన భావనాత్మకమైన బంధం ముడి పడలేదు.
అందరికన్నా మా అమ్మాయి గొప్పది అన్నది చూపించోకోడానికి, అందరి ముందు ఈ నెక్లెసు మా అమ్మాయికి కొన్నాం. ఎలాగు పెళ్ళి కివ్వాలి కదా! డబ్బు దాచాం ఎలాగూ పెళ్ళి గ్రాండ్‌గా చెయ్యాలనుకుంటున్నాం. అయినా మా దంత దానిదే కదా! పెళ్ళికి ముందే వెండి కంచాలు, చెంచాలు, పూజసామాన్ను పూర్తి సెట్ .... రెండు రకాల నెక్షెసులు అన్నీ గొప్పకోసం చేసాను. రిటైరయ్యాకా మాకెల్లాగా అన్న ఆలోచన నాకు రాలేదు.
నాదే తప్పు...
నాన్నగారి డబ్బు దానిది కాబట్టి. అడిగింది ఇదే భావం నేనే దాని మనసులో చిన్నవ్పట్నించి వేసాను.
ఈ రోజున దాని ముందు బీదార్పులు ఎలా అరవగలను? అదే జరిగితే మేం చాలా సెల్ఫిష్ అని అమకుంటుందేమో! నలుగురిలో అది చిన్నబోతుంది. ఇక మళ్ళీ అదే భావనకి దాసోహం. అయిపోయాను. అదే గెలిచింది. నేను ఓడిపోయాను.
ఇది జరిగిన చాలా రోజులకు .....
మా పిన్ని కూతురు శ్రీలక్ష్మి ఢిల్లి నుంచి హైద్రాబాద్ ఎవరిదో పెళ్ళికి వచ్చి, అక్కణ్ణించి మా యింటి కొచ్చింది.
“మా కూతురికి సంబంధాలు చూస్తున్నాం. నలభయి తులాలు గోల్డ్ ముందే కొని ఉంచాను. కూకట్‌పల్లిలో వాటుంది. వెండి డిన్నర్ సెట్ కొన్నాం కట్నం ఎంతైనా ఫర్వాలేదు. యివ్వడానికి రెడి. ఏదయినా మనదంతా దానిదే కదా! .....
“అప్పుడే అనేయకూ ..... ఈ తరంలో మనమందరం చేస్తున్న తప్పు యిదే _..- కింగ్ లియర్ పరిస్థితే వస్తోంది. నాలుగు వందల యాఖై ఏళ్ళ క్రితమే పిల్లల మీద (ప్రేమతో అనాలోచితంగా చేసేసిన రాజు గురించి షేక్‌స్పియర్ రాసాను. అందులో ఎంతో నీతి ఉంది.
“చాల్లేవే...” మీ అమ్మాయి పెళ్ళయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎన్నైనా కబుర్లు చెప్తావు. నీతో .... కథలు అనకు. మా కున్నది అదొక్కతే ..... ఈ ఏడాది దాని త్ర
కదో లేవలేని స్థితి పస్తే రాత్రి వగలు ఆయాలు ..... ఇదే రిట్రైరయ్యాకా జీవితం అక్కడే అసలు జీవితం మొదలవుకుంది అందామనుకున్నాను. “శ్రీలక్ష్మి ఈ మావసికతని జక్కడితో అపేద్దాం. వీజాధారమైన కొమ్మని నువ్వు వరుక్కోకు...” యిదీ కూడా అందామనుకున్నాను. అనలేదు. -.... శ్రీలక్ష్మీ కూడా ఈ వమాజంలోవి ఓ మామూలు తల్లీ లాగా అలోచిస్తుంది. ప్రాక్టికల్‌గా కాదు. “వేమ చేసిన తవ్వ అది కూదా చేస్తోంద. శిబైరయ్యాణా, పేల్ల బాధ్యత ఉండదు కానీ, వమయను పై బడ్డ వాళ్ళకి రావాల్సిన బాఢలుంటాంజ. అది కూదా అలోరించకో .... అందుకే నీ శక్తి చూసుకుని వంజంధం వెతుకు. గొప్పలకు పోయి పెళ్ళికి ఎక్కువ ఖర్చు చెయ్యకు.” ఈ కట్నాలు, కానుకలు, దురాచారాలకి మవమే కారణం అందుకే ఎన్ని చట్టాలొచ్చినా ఈ దరాలారాన్ని మాపు లేక పోతున్నాం...” ఉ అ్బు హన పవక అక్తోజర్ + భువుత్రు తి
త్రిశంకు జీవితం “లేచి గంటయింది. కాఫీ ఇవ్వాలని తోచదా నీకు? నేను అడిగాక ఇద్దామనుకున్నావా?” ముందు గదిలోంచి విక్రాంత్ అరిచాడు. “అయ్యో! ఘీరు లేచింది చూడనేలేదు. వంట హడావుడిలో ఉన్నాను” అంటూ పరుగులు తీస్తూ కాఫీ అందించాను టీవీ ముందు కూర్చున్న విక్రాంత్‌కి. ఇంకొక పావుగంట టైముంది. నాది, బాబుది టిఫిన్ బాక్సులు సర్దాలి. చీర కట్టు కోవాలి. రాత్రి పని ముగించుకుని ఇంటికి పన్నెండు గంటలకి వచ్చాడు. ఆపని ఏమిటని నె. :డగకూడదు? ఎందుకాలస్యం అయిందని అనకూడదు. నిద్రకళ్లతో ఎదురుచూడ. *డదు..: /బెల్ వినపడగానే ఎదుర్తుచూన్తున్నంత ఉత్సాహంగా తలుపుతీయాలి. తనకేనా సరదాలు, స్నేహితులు నాకుండవా? కావాలంటే నేను కూడా ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇంటికి ఆలస్యంగా రావచ్చు. ఇదా పరిష్కారం? ఇద్దరం పడుకునేటప్పటికి పన్నెండు దాటింది. నేను మామూలుగా నాలుగున్నరకే లేచాను. మరి తను? నేను స్కూలుకెళ్ళే టైంకి లేచాడు? వంటింట్లోకి వచ్చి, కాఫీ తీసుకోవచ్చు కదా! ఏవిటీ అహంకారం? సంసారానికి ఇద్దరం సమానం కాదా! నామీద ఎంత చిన్నచూపు? ఎందుకంటే నా జీతం మూడు వేలబైదొందలు మాత్రమే. విక్రాంత్ జీతం ముప్ఫై వేలు కాబటి. 908
"బాబు టిఫిన్ డబ్బా, మంచినీళ్ళ సీసా, నాప్‌కిన్, ప్లాస్టిక్ బుట్టలో పెట్టి, డైనింగ్ టేబుల్ మీద వాడికి కనబడేటట్లు పెట్టాలి. లేకపోతే అటో అబ్బాయి కిందనుంచి హారన్ వేయగానే టిఫిన్ లేకుండానే వెళ్ళిపోతాడు. అన్నం తినడం అంటే ప్రళయం. “నాకు టిఫిన్ బ్యాగ్ కనబడలేదు” అంటూ ఓ సాకు చెప్తాడు
గంజి చీర కట్టుకునే టైం లేక, షిఫాన్ జార్దెట్ చీర కట్టుకున్నాను.
తినడానికి టైం లేదు. చిన్నగా నిట్టూర్చాను.
కాఫీ తొగిన గ్లాసు దైనింగ్ టేబుల్ మీద పెడ్తూ నావైపు చూశాడు.
“ఆ జుట్టు చూసుకో. ఎలా ఉందో? అద్దంలో ఓ సారి మొహం చూసుకుని స్కూలుకి వెళ్ళు" చీదరింపుగా అన్నాడు.
రెండు నిముషాల్లో ఓ చేతికి వాబీ, మరోచేతి భూజానికి బ్యాగ్ సర్దుకుంటూ చెప్పులు వేసుకోవడానికి ముందుగదిలో ఆగాను.
అంతకుముందురోజున ఆడిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ని మళ్ళీ చూస్తున్నాడు బాబు. ముందు పుస్తకాలున్నాయి. తయారవ్వలేదేం అని అడిగే-టైం లేదు.
తెలుగు పేపర్ అత్తయ్యగారు, ఇంగ్లీషు పేపర్ విక్రాంత్ చూస్తూన్నారు.
“వెళ్తున్నా” అంటూ తలుపుతీసాను.
“*భోంచేశావా?” పేపర్ కిందికి దించి పైనుంచి అత్తగారు అడిగారు.
కృతజ్ఞతగా ఆవిడనైపు చూశాను.
ఇందాకట్నించి ఉన్న ఆవేదన, విసుగు, బాధ అన్నీ ఒక్కసారి మాయమయ్యాయి. ఓ చిన్నమాటికి ఎంత బలం.
“లేదు. టైం లేకపోయింది”
“ఫోన్లే సన్నబడతావులౌ హేళనగా అన్నాడు విక్రాంత్.
మళ్ళా నామీద నాకే జాలి వేసింది ఆ మాటతో
లిఫ్ట్‌లో కిందకొచ్చాను.
గబగబా అడుగులు వేస్తూ రోడ్డు మీదకొచ్చాను. ఈసిఐఎల్ బస్సు ఇంకా రాలేదు. ఆ బస్సు ఎక్కేవాళ్ళు నుంచుని ఉన్నారు. ఈ బస్సు రాలేదంటే నేను సరిగ్గానే బయల్దేరానన్నమాట. ఆచార్య రంగా అ(గ్రికల్చ్బరల్ యూనివర్శిటీ బస్సు ఎదురొచ్చింది.
ఫర్వాలేదు. అడుగు మెల్లగా వెయచ్చు. ఈ రెండు బస్సులు నాదార్లో టైం చెప్పే గడియారాలు.
9ం
మరో వాలుగడుగులు వేయగానే శ్యామల చేతిలో సంచితో కనబడింది. శ్యామల మా స్వూల్గోనే ఫైమరీ క్లాసుల తెలుగు టీచర్. న్ఫూల్‌కి రావడం లేదస, అ వలిగిన చీక, చెదిరిన జుట్టా చూపి :..-చాను.
“స్పెషల్ క్లాస్ ఉందా టెంత్ వాళ్లకి?” అంది నడుస్తూనే.
్లోదే! ఏం?”
"అబ్బే. ఇవ్వాళ సెకెండ్ సాటర్‌డే న్యూల్‌కి సెలవు కదా. మవ్వు వెళ్తూంటే విలబవ్ ఏవైనా కంవ్సట్ చెయ్యమన్నారా అని అనుకుంటున్నావు”
శకున అగిపోయాము.
ఇవాళ రెండో శనివారమా! ఎలా మర్చిపోయామ.
అదేవిటనలు. సెలవురోజు కూడా గుర్తురానంత మెకానికల్ బ్రతుకైపోయిందా వాది. ఇంకా నయం.
పిచ్చిదాన్లా మ్యూల్ వరకూ వెళ్ళిపోయి. మూసేసిన గేటు :.. ఇంటికి రాలేడు.
వెవక్సి తిరిగి. ఇంటికెళ్ళి బెల్ నొక్మాను.
పౌవుగంట త్రీతం ఇంట్లోంచి వెళ్లినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. టీవీలో అలాగే ట్రికెట్ వస్తోంది. వుస్తకాలు బాబు ముందు అలాగే ఉన్నాం౫.
“అదేంవిట? ఇప్పుడే వచ్చావ్?”
“వాక షెకండ్ పాటర్‌డే సెలవు. వాకు గుర్తు లేదు. ఎలా మర్చిపోతున్నానో పెలవుల్ని కూడా ఏంటో తేదాల్లేకుందా మెకావికల్‌గా బతికేన్తున్నారు.” ఒక్కపారి కళ్ళల్లో పేళ్యూరాయి. గొంతు చిన్నగా వణికింది.
ఒక్క సెకను వాతావరణం విశ్శబ్దంగా మారింది.
“ఏం అంత మరచిపోయేంత మెకానికల్ లైఫ్ అని బాధవదెపోతున్నావు. అయినా వంటింట్లో పెద్ద పెద్ద నంబర్లున్న క్యాలెండర్ ఉందిగా, చూసుకోవద్దా? అది చంటింల్లో దేనికీ పాలు ఏ రోజున ఎంతెక్కువ పుచ్చుకున్నది. ఛామకోవదావితేవా ? శనివారాఖు, ఆదివారాలు, చూమకుందుకేలే” హేళనగా అన్నాడు.
“నవ్వడిగినా వేమ చెప్పే వాళ్ళిగా, అనవసరంగా నా బాక్సు అది రెడీ చేశావా! చద్దనేవాన్ళిణా నాలు కూదా వంతపాదాడు. ఓం9ి
నేనేడ్ ,వ తప్పు చేసినంతగ్నా వాళ్ళిద్దరూ అంటూంటే బాధ ఎక్కువైంది
“ఇవాళ ఎం రోజో, ఒక్కసారి కళ్ళెత్తి కాలెం డర్ని చూసుకోక పోవడం పెద్ద తప్పయిషోయింధి కళ్ళెత్తి చూసే టైం కూడా నాకు లేదు అంత బిజీగా వంట చెయ్యడంలో మునిగిపోయాను. ఎవరి కోసం మీ కోసం కాదా? అక్కడికి నాలుగున్నరకే లేచి ఛేస్తున్నాస్కూల్‌కీ తిండి తిని వెళ్లడానికి టైం లేకపోయింది ఉక్రోషంగా అన్నాను
టివీ ఆపేశాడు గబుక్కున.
“ఆ మాటలనకు. మానెయ్యి.. వెధవ ఉద్యోగం మానెయ్యి. నేనేం నిన్ను వెయ్యమని బలవంతం ఘెట్టలేదే 1 నీకుగా నువ్వే చేస్తున్నావు”
“నిజమే! నాకిష్టం అయ్యే నేను చేస్తున్నాను. అంత మాత్రానా ఇంట్లో వేను అన్నీ చేయకుండా వెళ్లడం లేదే. అన్ని అమర్చి వెళ్తున్నాను కదా చదువుకున్నాను కాబట్టీ ఉద్యోగం చేయాలనుకున్నాను. మీ సహకారం ఉంటుందని అనుకున్నాను కానీ... ”
“వాకు మోకాళ్ళనొప్పులు. వేను గబాగబా చెయ్యలేను ఏదో నువ్వు వెళ్ళాకా నేను మిగిలిపోయిన పనులు మెల్లగా చేస్తున్నాను” మెల్లగా అన్నారు అత్తగారు
“నీ సహ్హకారానిథి అర్థం ఏమిటో నాకర్థం కావడంలేదు. ఏదో కొంచెం సాయం చేస్తాను కానీ ప్రతీ పనికి వంతు పెట్టను. అయినా అంత పని పని అని ఒకటే ఇడై పోతున్నావు. పస్ అంటే వంటేగా? వంట ఆడవాళ్ళు చెయ్యడం అన్నది ఈనాటిది కాదు కడా. భూమి పుట్టినప్పట్టించి ఉంధి పెళ్ళయినా, కాకఫోయినా ఆడవాళ్లందరూ వంట చేస్తున్నారు. నువ్వొక్కదానివే ఈ లోకంలో వంటచెయ్యడం లేదు అది
“చేసిందానికి పేరు పెట్టకుండా ఉంటే నాకు సాయం చేసినంతగా షీలవుతామ...”
“ఇద్ర బావుంది. బావుంటే బావుందంటాను. బాగాలేకపోతే బాగా లేదంటాను. డానికి నీ ఉద్యోగానికి లంకె పెట్టేటయితే ఉద్యోగం మానెయ్యి వెధవ జీతం నా ఇంక్రిమెంట్ అంత లేదు. నీజీతం ....”
గదిలోకి వెళ్ళిపోయి, తలుపు దగ్గరగా వేసి మంచం మీద వాలి పోయాను. నాకు తెలీకుండానే ఎంత సేపు ఏడిచానో నాకు తెలీలేదు.
101
“లావణ్యా!” అత్తగారు తలుపులు తీసుకుని, వచ్చి మంచం మీద నా పక్కన కూర్చున్నారు.
“లేమ్మా! కళ్ళు తుడుచుకో, నా మాటవిని ఉద్యోగం మానెయ్యి. మా తరానికి, మీతరానికి తేడా చదువులో ఉన్నా మొగవాడి తత్వంలో తేదా లేదు.”
“ఏం చెయ్యమంటారు? ఎదిరించి లాభం లేదు. గట్టిగా నోరు పెట్టుకుని పక్క ప్లాట్లలో వాళ్ళకి వినపడేటట్లు అరుస్తారు. ఏం చెయ్యను?” ఏద్చేసాను నిస్సహాయంగా.
“ఏం చెయ్యకృళ్లేదు. ఉద్యోగం మానెయ్యి. చూడు ఏం జరుగుతుందో?”
“ఏం జరుగుతుంది. నా ఖర్చులకి, జాకెట్లకీ, లంగాలకి డబ్బడగాల్సి వస్తుంది. పైసా పైసా లెక్క చూపించమంటారు. తనెంత ఖర్చు చేసినా నోరెత్తకూడదు. ఈ గొడవలకి విసుగెత్తే కదా. ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు అది కూడా .... “ఏడుపు ఆగలేదు.
“పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. చదువులు, ఈ ఇంటికి నెలనెలా కట్టి వాయిదాలు, మా మందులు, పండగలు, వుట్టినరోజులు... అన్నీ వాడే చూసుకుంటాడు. అసలేం జరుగుతుందో చూద్దాం మానెయ్యి” అత్తగారు అన్నారు.
“రేపే మానేస్తాను. ఈ గొడవలు నేను భరించలేను రా(్రింబవళ్ళు”
మర్నాడు అన్ని పెండింగ్ వర్క్‌లు, పేపర్సు, టీచింగ్ నోట్స్‌లు, టీచర్స్ కాపీలు, క్వశ్చన్ పేపర్లు అన్నీ రెడీ చేసుకున్నాను సోమవారం స్షూల్లో ఇచ్చేయడానికి మేడమ్ ఏం అంటుందో అని బెంగగా ఉంది.
“ైండు నెలల్లో పబ్లిక్ పరీక్షలున్నాయి. బయాలజీ స్కోరింగ్. కొంచెం పర్సంటేజ్ పెరగడానికి ఇందులోనే ఆస్కారం. ఆ ఫిజికల్ సైన్స్‌న్‌లో తక్కువస్తున్నాయి కదా ఇంక నువ్వు కూడా ఈ టైంలో వెళ్ళిపోతే .... పిల్లలు నష్టపోతారు” అవిడ అంటుందో లేదో కాని నాకే గిల్జిగా ఉంది. కానీ ఏం చెయ్యను!
రోజురోజు గొడవ. ఉద్యోగం మానెయ్యి, మానెయ్యి అనీ ప్రతీసారి చిన్న చిన్న విషయాలకి ఉద్యోగంతో లంకె పెడుతూంటే మానెయ్యడమే మంచిది.
సోమవారం అన్ని పనులు చేసుకుని, ఏ విషయంలోనూ గొడవ రాకుండా జా(గ్రత్త పడుతూనే స్కూల్‌కి తయారయ్యాను.
102
గదిలోకెళ్ళాను.
టై కట్టకుంటున్నాడు.
మనిషి ఎంత చదువుకున్నా మనషే ఆకాశంలో పక్షిలా ఎగరగలడు.
నీళ్లల్లో చేపల్లో సమానంగా ఈదగలడు.
అయితే ఏం లాభం?
చదువుకుని ఉద్యోగం చేస్తున్న పెళ్ళాన్ని అర్ధం చేసుకోలేడు.
“నేనివ్వాళ రిజైన్ చేస్తున్నాను. రోజు రోజూ ఈ దెబ్బలాటలతో నాకు బిపి వచ్చేటట్లుగా ఉంది. నాకు పీస్‌ఫుల్ లైఫ్ కావాలి.....”
'ఆఖరికి సరెండర్ అయ్యావు కదా! రిజైన్‌కి కారణం అడిగితే నా పేరు మటుకు ఎక్కడా రానీకు....”
దెబ్బతిన్నట్లు చూశాను.
ఓ మొగాడి విజయం వెనుక ఓ స్రీ ఎలా ఉంటుందో, ఓ ఆడది వోయిగా, పీస్ ఫుల్‌గా నవ్వుతూ ఉద్యోగం చెయ్యాలంటే మొగుడి సహకారం ఉందాలి.
అస్తిత్వం నిలుపుకోవాలంటే కొన్ని వదులుకోవాలి. ఉద్యోగం చెయ్యడం అస్తిత్వం అనుకున్నాను.
కానీ అంతకన్నా ముఖ్యం పిల్లలు, కాపురం, అందుకోసమే ఈ అడుగు.
అవమానంగా అనిపించింది విక్రాంత్ మాటకి.
నిశ్శబ్దంగా స్కూలుకెళ్లాను.
ఫస్ట్ ఫిరియడ్ అయింది.
తర్వాత టెంత్ క్లాసుకి బయాలజీ. సిలబస్ అయిపోయింది.
ఫస్ట్ యూనిట్‌లో సందేహాలు తీర్చి, సాయంత్రం ఎక్‌స్ల్ట్రా క్లాసులో చిన్న టెస్ట్‌కి ఏం ప్రశ్నలు చదువుకోవాలో చెప్పాలి అనుకుంటూ పదో క్లాసులోకి అడుగుపెట్టబోతుంటే వెనక్కాల్నించి “టీచర్.... మీకు ఫోన్....” అన్నట్టు వినబడింది.
మళ్ళీ అరచెయ్యి చెవి దగ్గర టి “ఫోన్” అంది ఆయా.
నాకు స్కూల్‌కి ఎప్పుడు ఛాని రాల... ఎందుకో ఫోన్ అన్నది ఏ మూలో చిన్న భయం చోటుచేసుకుంది.
103
ఏమై ఉంటుంది? ఏక్సిడెంట్? అత్తగారికి ఏమైనా అయి ఉంటుందా?
ఊహకి అందలేదు.
కంగారుగా ఉన్నా కప్పిపుచ్చుకుని ఆఫీసులోకెళ్ళాను.
మిసెస్ జైన్ నవ్వుతూ రిసీవ్ అందించింది. హజ్బెండ్”
మనసు ఎలాగో అయింది.
“హలో!” నిరాసక్తితో అన్నాను.
“లావణ్య! రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేశావా?” కంగారుగా అన్నాడు.
'లేదు ఏం?”
నిటారుగా నుంచుండిపోయాను.
- మీ ఇష్టమేనా అన్నీ! ఓసారి మానేయమని, ఓసారి వద్దని, నేనుద్యోగం చెయ్యనుగాక చెయ్యను. ఇంట్లో, బయటా నేనెందుకు కష్టపడాలి? మీలాగే ఏదో ఒకటి చేస్తాను. మీరు ఆఫీసుకెళ్ళి డబ్బు తెండి. నేను ఇంట్లో రకరకాల వంటలు, టిఫినీలు చేస్తూంటాను
జీవితం తినడానికి అనే మీకు రకరకాలు చేసి అమర్చిపెడతాను. ఇన్నాళ్ళు ఈ చిన్న ఫిలాసఫీ తెలీక వెర్రిదాన్లా ఉద్యోగం చేశాను. వెధవుద్యోగం నా జీతం ఆహ్ర్రాల్ మీ ఇంక్రిమెంటంత లేదు. పిచ్చిదాన్ని సంపాదన, ఆర్ధిక స్వాతంత్రం అంటూ ఉబలాటపడుతూ ఉద్యోగం చేసి రోగం తెచ్చుకుని, మంచం ఎక్కితే గ్లాసుడు మంచినీళ్ళు కూదా అందివ్వరు ఆకాడికి నేనెందుకు చెయ్యాలి?' అని మనసులోనే అనుకున్నాను పెదిమలు బిగిస్తూ.
నా నిశ్శబ్దం నన్ను చూస్తున్న ఆఫీసు స్టాఫ్‌లో ఇంట్రెస్ట్ పెంచింది.
“వింటున్నావా? నా ఉద్యోగం పోయింది. సాయంత్రం అన్నీ మాట్లాడుకుందాం. రిజైన్ చెయ్యకు”
“వెంటనే వెళ్ళిపోమ్మన్నారా!”
“నెలరోజులు ట్రెమిచ్చారు. ప్లేస్‌మెంట్స్ ఆఫీసు కెళ్తున్నాను.”
వినదల్చుకోలేదు. ఫోన్ పెట్టేశాను చిరునవ్వుని అతికించాను మొహానికి.
“ఓకే ఏదో ఊరు అర్జెంట్‌గా వెళ్ళాలిట. బట్టలవి ఎక్కడ పెట్టావో అడగడానికి 104
ఫోన్ చేశారు. ఇంటికెళ్ళాలి. నేను లేకపోతే తనకి ఏం తెలీదు. ఏం కనబడదు. పక్కనే ఉన్నా చూసుకోరు.” నా మనస్సుని మోసగిస్తున్నాను. అబద్దపు బతుకు. దొంగబతుకు.
“వెళ్ళండి. హెచ్.ఎం. ని కలవండి. లీవులున్నాయా?” అని అడిగింది జైన్.
“వెళ్తాను” లేని నవ్వుని తెచ్చుకుని బయటికొచ్చాను.
ముసుగు బతుకు, అబద్దపు బతుకు హు. ఇది విజయమా? అపజయమా? గెలుపా &టవ్లూ? షందిగ్ధరలో ఉన నేమ రాలడానికి షిదంగా ఉను కన్నీటిని దాచుకొావదోనొక్రా వెళ్ళిలోటన్స్ర ోరలోకి జజ ను.
అప్పటికే కన్నీళ్ళు గొంతుకలోకి చేరిపోయి అక్కణ్ణించి గుండెల్లోకి జారిపోయి మోయలేని బరువుని గ్రుందెకి యిచ్చాయి.
శ జై 200ట ఆంద్ర బూర చూవర్పుడ శ విస్తాత్సు
నేను చేసిన తప్ప నువ్వు చేయకు
కారుని కింద సెల్లార్‌లోఆప్ నా పక్కనే వున్న సెల్‌ని, బాగ్‌ని చేతిలోకి తీసుకుని, కారుకి తాళం వేసి లిఫ్ట్ దగ్గరికెళ్లి బటన్ నొక్కి టైం చూశాను. రాత్రి ఎనిమిదిన్నర. నేను కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌ని, ఆ తర్వాత హిమాయత్ నగర్‌లోని స్పోకెన్ ఇంగ్లీషు ఇన్‌స్టిట్యూట్‌లో పార్ట్‌టైం ఉద్యోగం. ఇంటికి వచ్చేటప్పటికి రోజు ఎనిమిది, ఎనిమిదన్నర, ఈ లోపల లిప్ట్ వచ్చింది. మరో ఇద్దరు సరిగ్గా అదే సమయానికి గబగబా వచ్చారు.
మూడో అంతస్తులోని నా వ్లాట్ కెళ్ళి, తలుపు వేసి, సేఫ్టీ చెయిన్ తగిలించి బాగ్‌ని, సెల్‌ని సోఫాలో పడేసి బాత్రూంలో కెళ్ళి మొహం కడుక్కుని బయటి కొచ్చేటప్పటికీ ఫోన్ మోగుతోంది.
“హలో!” అన్నాడు.
“మమ్మీ! నువ్వేనా! ఎప్పట్నించో ట్రై చేస్తున్నాను నీ కోసం! ఆల్మోస్ట్ వన్నవర్! కాంటాక్ట్ చెయ్యపోతున్నాను. థాంక్ గాడ్! ఇప్పుడైనా దొరికావు!” అదుర్దుగా అంది క్షమ.
“ఏంటంత కంగారు! ఏం జరిగింది!” అంతకన్నా ఆత్రంగా అడిగాను.
“మమ్మీ!” అంటూ క్షమ ఏద్భేసింది.
“ఏమ్మా! ఏం జరిగింది?” నాకు భయం వేసింది. ఒక్కసారిగా తన ఏడుపు విని. అవును మరి ప్రాణాలన్ని క్షమ మీద పెట్టుకుని బ్రతికాను బతుకుతున్నాను.
“నేనీ ఇంట్లో ఉండలేను. అయాం ఫెడప్ విద్దీస్ పీపుల్. ఐ కాంట్ లివ్ హియర్”
106
“ఏమైంది! పిచ్చిగాని పట్టలేదు కదా! ఏమిటా మాటలు? అర్ధం అయ్యే మాట్లాడుతున్నావా!” కోపంగా అన్నాను.
“పిచ్చి నొక్కాదు. ఆ ఇంట్లో వాళ్ళకి. నేనింక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను. ఇక్కడెవరికీ నేనంటే ఇష్టం లేదు.” ఏడుపు.
కంగారు పద్దాను.
“ఇదీ చెప్పు. నువ్వు నిశాంత్ పోట్లాదుకున్నారా! చిన్న చిన్న దెబ్బలాటలు చాలా సహజం.
అందుకోసం ఇల్లు వదిలేస్తానంటావా!”
ముక్కు ఎగపీల్చింది.
“ఆపేయ్! అందరూ నాకు పాఠాలు, నీతులు చెప్పేవారే. నువ్వొక్కదానివే నాకు తక్కువయ్యావు. నేనూ మామూలు అడదాన్నే. నా వీక్‌నొస్‌లు నాకున్నాయి. మీరంళా ఏదో సూపర్ హ్యూమన్ బీయింగ్స్ అయినట్లు మాట్లాడుతున్నారు. నేను చేసే 'శ్రతీ పనిలోను తప్పు వెతకడమే మీ అందరి పని. ఇంక నువ్వేం అనకు. ఆగిపొమ్మని అనకు. నేను వస్తున్నాను.”
“ఇంత రాత్రివేళ, ఒక్కదానివి, అక్కణ్ణించి రావడం..... సరీలే.... ఒకటి రెండు రోజుల్లో నీ మనసు కూడా మారచ్చు. అయినా ..... నేను కూడా ..... నిశాంత్‌కి నచ్చ
ఇంకా ఏదో అందామనుకున్నాను. ఈ లోపలే ఫోన్ పెట్టేసింది. చేతిలోని రిసీవర్ పెట్టి కిటికీలోంచి చీకట్లోకి చూస్తుండిపోయాను.
ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పట్నించి ప్రాణాలు దాని మీద పెట్టుకుని ఉంటున్నాను. అమెకి నేనూ, నాకు ఆమె, క్షమ కాకుండా నాకీ లోకంలో ఎవరున్నారు ఇంక!
క్షమతో అన్నాను కానీ, 'నిశాంత్‌కి నేము నచ్చచెప్పగలనొ! అ పని నేమ చెయ్యగలనా! నిశాంత్ వెర్షన్ నేమ అర్ధం చేనుకోగలనా! అమ్మ చంద్రాన్ని అర్ధం చేసుకోగలిగిందా! అప్పుడు ....
ఈ రోజున క్షమ మంచున్న రోడ్డు మీద ఇరవై రెండేళ్ళ క్రితం నెను మంచున్నాను. ఇలాగే, క్షమలాగానే, నేను కూడా ప్రతి చిన్న విషయం అమ్మి చెప్పేదాన్ని. అత్తగారింటి
407
వాచావరణానికి నేనప్ప్సులు .ఎద్గస్ట్ కాలేక. నా ఇగోని త్నప్తి పరచలేక అయోమయంగా కనబడ్డున్న జీవితాన్ని చంద్రాన్ని అర్ధం చేసుకునేంత పరిషక్వత లేక అమ్మ దగ్గరకెళ్ళి ప్రతిదీ చేరేపేడాన్ని అహంకారం. .... అందరికి అహంకారం .... ఆ అహంకారమే నాకూ చంద్ర మధ్య గోడలా నిల్చుండిపోయింది. మా జీవితాల్ని చెరోవైపుకి లాగింది. దూరం పెంచేస్తూ,
నామీద ప్రేమ అమ్మానాన్నలని వివేకశూన్యులుగా చేసింది. ఆభోచనారహితుల్ని చేసింది. ్రతీదానికి అమ్మకొంగులోకి దూరిపోవడం, నాన్న నీడలోకి జరిగిపోవడం చంద్రాని కస్సలు నచ్చలేదు.
క్షమలాగానే నేను ఇంటికి వచ్చేస్తానని, ఇంటికి వచ్చేశాను. నాన్నగారి అహంతాగం అమ్మ చూటబు పరిస్థితిని ఇంకా దిగజార్భాయి.. “నా కూతురు నాకేం ఐరువు కాదు! డానికి విలువ లేని ఇంట్లో అధెందుకుంటుంది? క్షోడల్ని గౌరవించలేని ఇంటిళీ నేనెబ్లా పంపిస్తాను.”
“చదువుండగానే. డబ్బుండగావే సరిగాదు. జీవితం నడవడానికి, అణుకువ. ఒద్దిక, మాటతీరు, పెద్దవాళ్ళంటే గౌరవం, మొగడంటే భయం ఉండాలి. అది నేర్పించండి. మీ. అమ్మాయికి మామగారి అహంకారం.
“నేను వెళ్లమనేదే! తనే వెళ్ళిపోయింది. అలాంటప్పుడు నెను రమ్మనమని ఎలా పిలుస్తాను?” చంద్రం పట్టుదల.
“వాళ్ళు పిళ్ళేవరక్షూ వువ్యెళ్ళకు” అమ్మ సలహా
నాకే అర్ధం అవనంతగా. వా జీవితం, శాతో సంబఇఢం లేకుందా అర్ధం పర్థంలేని షట్టుదల అహంకారాలు మధ్య నత్తలా నడిచింది.
నేనూ నువ్వు సమానమే, నేను నీ అంత సంపాదిస్తున్నాను అన్న నా అహంకారం ఏవైంది? ఈ జీవితం నాలో ఏం మిగిల్చింది? ఈ మొగవాళ్ళు ఎంత హృదయం లేని వాళ్లు. స్సున్నితంగా ఉండడం రాడా! ఫ్రాయిడ్ ఏ ఢోజున ఇగో, సైకో ఎనాలసిస్, ఇడ్ లిబిడో మొదటిసారిగా కనిపెట్టాగో.ఈ మొగ అనే.స్పీషిన్‌కి కరెక్ట్‌గా సరిపోతాయి. ఈ జాతి కారెక్టర్‌కి సరిపోతాయి.
చంటిలు డోజులు గడచిపోయాయి. నా తప్పేంటి? నేనేం తప్పు చేయలేదు. అన్ను మెట్టు నుంచి. తప్పు చేశానా! అన్న మెట్టుకి చేరాను. జలోచిస్తే ఎంత చిన్న 108
విషయం దానికింత వెలకట్టానా! ఎంత సంకుచితంగా ప్రవర్తించాను! మనుషులకు వీక్‌నెస్‌లుండవా! బ్రాడ్‌గా ఆలోచించడం మొదలెట్టాను.
బంధాలు, సంబంధాలు నిలుపుకోవడం కోసం ఉన్న గుప్పెడు వృదయాన్ని విశాలం చెయ్యాల్సిందే ! ఎదుటివాళ్ళు చేసిన తప్పు ఎలాటిదైనా క్షమించాల్సిందే ! నేనే వెళ్లిపోదామనుకున్నాను. అదే అన్నాను నాన్నగారితో. “చంద్రం రాకుండా నువ్వెగ్గడానికి వీల్లేదు. అతగాడికేనా పౌరుషం! మేమేం పౌరుషం లేని వాళ్ళం కాదే. అసలు మా తాతకెంత పౌరుషం ఉందో ఓసారి ధవళేశ్వరం వెళ్తే తెలుస్తుంది!
మా నాన్నగారెంతటివారో పిఠాపురం వెళ్తే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు! మా ముత్తాత సోవైయులు-గారు వీధుల్లోంచి శివాలయం వెళ్తున్నారంటే ఎక్కడివాళ్లక్కడ కిక్కురు మనకుండా ఉంటారు. అలాంటి భార్గవరాముడి అంశంలోంచి వచ్చినవాళ్ళం నేను చంద్రానికి తల ఒగ్గడమే! యింకేమైనా ఉందా!”
నేను అనేదాన్ని ఉన్నానన్న విషయం సంగతి ఆలోచించకుందా, లేని చంద్రం, అతని తల్లిదండ్రుల గురించి ఆడిపోసుకోవడం రాత్రింబగళ్ళు అదే గొడవ. రాన్రాను నాకు అమ్మానాన్నలంటే, వాళ్ళ మాటలంటే విసుగు, అసహ్యం కలగడం మొదలెట్టాయి. నాలో గుడుకట్టుకున్న గుబులు, రెస్ట్‌లెస్‌నెస్, నిద్రలేమి, చెలరేగే అశాంతి. జీవితానికి ఖాష్యం చెప్తున్నాయి. చంద్రం అంటే నాకు చాలా ఇష్టం. అతి చిన్న విషయాన్ని అజ్ఞానంగా ఇమ్మెచ్యూర్డ్‌గా ప్రవర్తించి నా జీవితాన్ని చిం పేసుకుంటున్నాననిపించింది. జీవితం ఒకసారి చిరిగిందంటే దాన్ని అతికించుకోడానికి, కుట్టడానికి జీవితకాలం సరిపోదు.
ధైర్యం చేసి ఉత్తరం రాశాను. “ఊహలు, వేరు , వాస్తవం వేరు, థియరీ చదవడానికి బాగున్నా ప్రాక్టికల్స్ నువ్వు నేనూ సరిగా చేయలేకపోయాం. మొగవాడి అహంకారం ముందు ప్రేమ ఓ అడుగు వెనక్కే నువ్వు నేను చాలా సాధారణ మనుష్యులం అని పెళ్లయ్యాక ఉదొహరణలతో ,సహా చదువుకున్నాను. అర్ధం చేసుకున్నాను. మనిద్దరిలోను లేనిది మానసిక పరిపక్వత. ఎన్ని ఎక్స్‌పీరియన్స్‌లుంటే అంత అనుభవం. ఎంత అనుభవం వస్తే అంత మెచ్యురిటీ. జరిగినదాంట్లో మనిద్దరి తప్పు లేదు. నేను నిన్ను మర్చిపోవడం ఇంపాజిబుల్ అన్న సంగతి నాకు అర్ధం అయింది. ఇంక జీవించడం
10౮9
అనేది అవుటాఫ్ క్వశ్చన్. మరి నీ సంగతేమిటీ?” నీ హృాదయంలోంచి నా బొమ్మని చెరిపేశావా!”
జవాబుగా మావగారి దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. నువ్వు వెల్లిపోయానన్న అనమానం భరించలేక, ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. నువ్వు వాణ్ణి మర్చిపోలేనట్ల. కూడా నిన్ను మర్చిపోలేదు. మీ అమ్మానాన్నలు మీ జీవితాల్లో తలదూర్చి. అతి నాజూకైన మానసిక బంధాన్ని లాగి, నీ జీవితాన్ని చిందరవందర చేశారు.”
వణికిపోయాను. నా వైవాహిక జీవితం ఇంత తొందరగా, ఇలా అగా హ్భాంగా అర్జాంతరంగా ముగిసిపోతుందని అనుకోలేదు. ఎక్కడుంది లోపం? పెళ్ళికి ముందున్న మా ప్రేమ పెళ్ళి తర్వాత ఎందుకు లేదు? వైవాహిక జీవితానికి కావాల్సిన బేసిక్ ఎలిమెంట్ నమ్మకం క్రమేపి తగ్గిపోయిందా! అమ్మానాన్నలను నమ్మినట్లు చంద్రాన్ని ఎందుకు నమ్మలేకపోయాను. ఇగో ప్రాబ్లంసా! నన్నో చిన్నపిల్లని చేసి అమ్మానాన్న నన్ను, నా జీవితాన్ని డామినేట్ చేస్తుంటే నేనెందుకూరుకున్నాను! అయిపోయింది. ఇక చంద్రంతో జీవితం, జరిగింది కల జరగబోయేది కల్ల. ఎక్కడున్నాడో! ఎలా ఉన్నాడో! ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో! నాకు కనీసం నెలల పాపయినా ఉంది. చంద్రానికది లేదు. ఎన్ని రాత్రిళ్ళు ఏడిచానో నా తలగడకే తెలుసు. ఏదో తెలీని భావం, తప్పు చేశానన్న భావన ఇంట్లోంచి బయటికి రాకుండా, నన్ను రానీకుండా అద్దుకుంటోంది. జూనియర్ కాలేజీలో లెక్సరర్‌గా చేరాను. నిరాసక్తత, నిరాండంబరం, నిర్వికారం జీవితాన్ని ఆక్రమింపచేశాయి. పుస్తకాలు, కాలేజ్, పాప ఇదే ప్రపంచంలో ఇన్నేళ్ళు (బ్రతికాను.
కాలింగ్ బెల్....
అప్పుడే క్షమ వచ్చేసిందా! అనాలోచితంగా, మొండిగా వచ్చేసిందా! నా కర్తవ్యం ఏమిటీ? నేనేం చెయ్యాలి? అసలు ఏం చెయ్యగలను?
చిల్లులోంచి చూశాను. జుట్టు క్రాపు సరిచేసుకుంటున్న పాలవాడు. పాలు పోయించుకుని ఫ్రిజ్‌లో పెట్టి, తలుపు మూస్తుంటే ఫ్రిజ్ పైన ఉన్న నవ్వుతున్న క్షమ ఫోటోని ఓసారి చూశాను.
దాని ఏడ్పుగొంతు యింకా నా చెవుల్లో అంగుమంటోంది. పాపం! ఎంత బాధ పడిందో! ఫోన్లోనే ఏడుస్తూ మాట్లాడింది. నిజంగానే నిశాంత్ బాధ పెట్టి ఉంటాడా! 110
లేకపోతే క్షమ నిశాంత్ తప్పుని హైలైట్ చేస్తోందా! తల్లిప్రేమ నన్ను, నా ఆలోచనల... వేరే దారి పట్టిస్తోందా! తల్లికి. తన కూతురు చేసింది తప్పుగా అనిపించదు. క్షమ మరో 'నేను' గా మారుతోందా! నేను మా అమ్మలా ప్రవర్తిస్తే ఒక్కసారిగా భయం వెసింది. ఊహూ....అమ్మ చేసిన తప్పు నేను చెయ్యను. నేను నిశాంత్ వైపునుంచి ఆలోచించడం మొదలెట్టాను. పెళ్లికి ముందు నుంచి నిశాంత్ నాకు తెలుసు. గండిపేట వాసవిలో ఇంజనీరింగ్ చేశాడు. ఇద్దరూ చెరో మూల ఉద్యోగం చేస్తున్నారు. వర్క్ టెన్షన్, టైంసెన్స్, టిఫిన్ బాక్స్‌లు బయట లంచ్ చెయ్యడం .... ఎన్నో కారణాలుండి వుంటాయి. నిశాంత్ ప్రవర్తన నాకేం విడ్డూరం కనపళ్లేదు. క్షమ ఎప్పుడూ వాళ్లత్రగారి మంచితనమే చెప్పేది. ప్రతీదానికి ఎడ్జస్ట్ అయ్యే మామగారి సంగతి ఆనందంగా చెప్పేది. అలాటిది ఈరోజున ఇల్లు వదిలి వచ్చేస్తానంటే ....
నేను వాళ్ల మధ్యలోకి వెళ్లాలా! నేను నిశాంత్‌కి నచ్చచెప్పగలనా! నిశాంత్ నేను క్షమని క్షమించను. తప్పు తనదే' అంటీ దాని జీవితం ఏమవుతుంది? మరో “నేను'లా అయిపోతుందా! నా ఆలంబనల్లో దాని జీవితం వాయిగో ఉంటుందా! క్షమకి నిశాంత్ అంటే ప్రేమ కాబట్టి ఏడుపు ధ్వనించింది. ఆమె మాటల్లో అదే లేకపోతే ఆ కంఠంలో నిర్దాక్షిణ్యం, కాఠిన్యం ఉండేది. రెండురోజులు పోతే వాళ్ల తప్పులు వాళ్ళే తెలుసుకుంటారు. ఈరోజు కాకపోయినా రేపయినా, దాని జీవితాన్ని సమర్ధించుకునే నేర్పు దానికి రావాలి. నా దగ్గరి కొచ్చేస్తానంటే ఎలా? ఈ ప్రపంచంలోని జీవరాశులన్నీ ఎడాష్టబులిటినెలా నేర్చుకుంటున్నాయి. ఫిట్టెస్ట్ సర్వైవల్. డార్విన్ ధియరీ. భాష భావప్రకటన ఉంది కాబట్టి క్షమ నిశాంత్ మీద కోపం ప్రదర్శిస్తోందా!
కళ్లు మూసుకున్నా ఏవో ఆలోచనలు, ఓ నిర్ణయానికొచ్చాను.
ఫోన్ ఒళ్ళో పెట్టుకున్నాను.
“హలో!” చాలా నెమ్మదిగా అన్నాను.
“హలో” నిశాంత్ గొంతు చాలా మామూలుగా ఉంది.
“ఆంటీ, మీరా! క్షమ గదిలో ఉంది పిలవనా!”
హమ్మయ్య బయల్ల్దేర లేదన్నమాట.
“ఆహాల... వొద్దొద్దు... షేక్‌స్పియర్ డ్రామాల మీద వారం రోజులు ఢిల్లీలో సెమినార్లున్నాయి. అందుకని ఢిల్లీ వెళ్తున్నాను.”
111
“అలాగా ఆంటీ.... ఎప్పట్నించి?”
“ఎల్లుండి బుధవారం ... నేనింట్లో ఓ పదిరోజులుండనని క్షమకి చెప్పెయ్యి!” నిశాంత్‌కి మరో మాటకి ఛాన్స్ ఇయ్యకుండా ఫోన్ పెట్టేసి, కనెక్షన్ తీసేశాను. సెల్ ఆఫ్ చేశాను.
టైం చూశాను. పది దాటింది.
కీరదోసకాయి తిని, పాలు తాగాను.
నిజాంకాలేజీలో జరిగిన బుక్ ఎగ్జిబిషన్‌లో నాన్‌ఫిక్షన్‌లో బెస్ట్ సెల్లర్ అయిన “ఫైట్ ఫం గట్ కొన్నాను. దాన్ని తీసుకుని మంచం ఎక్కాను.
జీవితం అన్నది ఒక్కటే. కానీ, ఎవరి జీవితం వాళ్లదే.
ఈ 292007 ఆంధ్ర రూభ నబి లారీ రర్సిత 1) యిల 112
ఒన్ బ్రైట్ సమ్మర్ మార్షింగ్
అప్పుడే తెల్లవారుతోంది. ప్రపంచానికి మరో ఉదయం మొదలవుతోంది. కానీ .... తనకీరోజు మామూలు రోజు కాదు.
తన జీవితంలో ముఖ్యమైన రోజు,
ముఖ్యమైన మలుపులోకి అదుగుపెద్తున్న రోజు, అని అనుకుంది క్షమ. పరధ్యానంగానే తయారైంది. టైం దగ్గరవుతున్న కొద్దీ. గుండె అతి వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. తెలీకుండానే భయం, ఆలోచనలు.
అతి కష్టం మీద మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది.
సూట్‌కేస్ తీసుకొని ముందు గదిలోకి వచ్చింది క్షమ.
అక్కడ చిన్నన్నయ్య తప్ప అంతా ఉన్నారు.
అందరూ తనకు బెస్టాఫ్‌లక్ చెప్పడానికి రెడీగా ఉన్నారు.
ఇంత మందిని మోసం చేస్తూ వెళ్తోంది.
ఒక్కసారి కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి.
“సుభ్రమణ్యం ఏడీ?” అంది మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ.
“అటో కోసం వెళ్లాడు. వాడు స్కూటర్ మీద నిన్ను స్టేషన్‌లో దింపుతానంటే వద్దన్నావు మరి!” అంది తల్లి నిష్టూరంగా.
“అవును! వద్దన్నాను. ఎందుకని వద్దన్నాను? అక్కడ స్టేషన్‌లో నా కోసం ఎదురుచూస్తున్న నిశాంత్‌ని సుభ్రమణ్యం చూసే .... రెండు నెలలుగా వేసుకుంటున్న ప్లాన్ తలకిందులయిపోతే .... అందుకని వద్దన్నాను” అని మనసులో అనుకుంది క్షమ.
113
“తులసెమ్మకి ప్రదక్షణం చేశావా?”
లేదన్నట్లు తలూపుతూ తల్లికేసి చూసింది.
“వెళ్ళి చేసిరా. ఇంటర్వ్యూ బాగా చేస్తావు?” అని ఆప్యాయంగా అంటున్న తల్లికేసి బెంగగా చూసింది.
పెరట్లోకి వెళ్ళి తులసికోటకి ప్రదక్షణాలు చేసి, ఓ ఆకు తుంచి తల్లో పెట్టుకుంది.
ఆటో వచ్చి ఆగిన శబ్ధం అయింది.
“వెళ్తున్నాను” అంది నీళ్ళు నిండిన కళ్ళతో.
“వెళ్ళొస్తాను అని అను” అంటూ మందలించింది తల్లి.
“ఊహుం....నేను తిరిగి రావడం లేదు. ఈ మాటలు మనసులోనే అనుకుంది క్షమ. అంతా ఏవో సలహాలు ఇస్తున్నారు. అవేవీ వినపడ్డం లేదు. నిన్న రాత్రి 'సవేరా” లో కాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు తియ్యగా మాట్లాడిన నిశాంత్ మాటలే చెవుల్లో వినబడ్డున్నాయి. తెలీకుండానే పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి.
“ఇప్పట్నుంచీ ఉద్యోగం వద్దంటే వినవు. వాయిగా చదువుకో అంటే వినడం లేదు. ఊం... క్షేమంగా లాభంగా రా!” తండ్రి మాటలకి తలూపింది.
నాగపూర్ నుంచి వచ్చేప్పుడు సంత్రాలు తీసుకు రా !” అన్నయ్య:
“ నేను తిరిగి వచ్చినప్పుడు కదా!” అని అనుకుంది క్షమ.
ఆటో ఎక్కింది. అంతా “బెన్టాఫ్‌లక్' చెప్పారు. చేతులూపారు ఆటో కదిలింది.
ఎక్కడో నరాల్లోంచి భయం.
తను ఏం పని చేస్తోంది?
తప్పటడుగు వేస్తోందా?
నేను నాగపూర్ ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదు. మన పక్కింటబ్బాయి నిశాంత్‌తో ధిల్లీ వెళ్తున్నాను. అక్కడ నిశాంత్ తల్లిదండ్రులు మా పెళ్ళి చేస్తారు. ఈ విషయం ఇంట్లో ధైర్యంగా చెప్పలేకపోయింది. అబద్ధం చెప్పి, ఇంట్లోంచి వెళ్ళిపోతోంది.
ఎందుకని?
తనకి పెళ్ళంటే ఇష్టం. పెళ్ళికావాలి. తనపైన ఉన్ననలుగురికి పెళ్ళిళ్లయ్యే దెప్పుడు? తనకి లైన్ క్లియర్ అయ్యేదప్పుడు? [114
“మేమిద్దరం పెళ్ళి చేసుకుంటున్నాం. ఆళ్వీరదించండి” అని అంటే ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరక్కయ్యలు, అన్నయ్య, ఇంజనీరింగ్ చదువుతున్న చిని ..య్య చూపులెలా ఉంటాయో ఊహించుకుని చెప్పలేదు ఇంట్లో.
“నీపై వాళ్ళకి పెళ్ళిళ్ళవలేదు. నీకు అప్పుడు పెళ్ళేవిటి? అని అనకపోయినా తల్లి చూపుల్లో అదే అర్ధం ఉంటుంది. అని ఊహించి చెప్పలేదు. ఏమీ అనకపోయినా తండ్రి చూపుల్ని అర్ధం చేసుకోగలదు.
అందుకే చెప్పలేదు. చెప్పలేకపోయింది.
అయితేనేం. అన్నీ కూడా వివరంగా ఓ ఉత్తరంలో రాసింది. కానీ ఆ ఉత్తరాన్ని ఏ టేబిల్ మీదా, దేవుడి పటం దగ్గర ఇంట్లో వాళ్ళకి కనబడే విధంగా పెట్టలేదు.
జాగ్రత్తగా సూట్‌కేస్‌లో పెట్టింది.
తనతో ఆ సూట్‌కేస్ తెచ్చుకుంది. ఏదో ఓ స్టేషన్‌లోనో, లేకపోతే ఢిల్లీలోనో పోస్ట్ చేద్దామని.
అటో సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆగింది. (డైవర్‌కి డబ్బిచ్చి సూట్‌కేస్ తీసుకొని లోపలికి నడిచింది.
నవ్వుతూ నిశాంత్ కనబడ్డాడు.
“'హమ్మయ్య' అని మనసులోనే అనుకుని నవ్వింది.
“బేడ్‌లక్ క్షమా!” రెండుసీట్లున్న కూపే దొరకలేదు.” అంటూ సూట్‌కేస్ నందుకున్నాడు.
క్షమ నిశాంత్ మాటలు వినలేదు.
“ఎందుకో భయంగా ఉంది నిశా” అంది మనుషుల్ని తప్పుకుంటూ నడుస్తూ.
“మీ వాళ్ళకి చెప్తానంటే వద్దన్నావు”
“నా భయం నాది”
“వద్దు. ఇంక భయం అనకు. నా మీద నమ్మకం ఉందా? నా తల్లిదం(్రుల్ని చూశావు కదా. వాళ్ళమీద నమ్మకం ఉందా?”
“ఉందన్నట్లు” తలూపింది క్షమ.
“మరి ఇంక భయపడాల్సిన అవసరం లేదు. చేస్తున్న తప్పు ఒక్కటే. మీ వాళ్ళకి తెలీకుండా వెళ్ళటం. ఇంకో రెండు రోజుల్లో ఎలాగూ తెలుస్తుంది. అయినా,
115
ఇంక దాని గురించి మాట్లాడుకోవద్దు. కొత్తజీవితానికి స్వాగతం పలకడానికి ఎదురెళ్తున్నాం.” అంటూ ఫస్ట్‌క్లాస్ కూపేలోకి వెళ్ళాడు.
పై బెర్త్ మీదున్న సూట్‌కేస్ ప్రక్కనే క్షమ సూటికేస్‌ని పెట్టాడు.
కిటికీ దగ్గరగా కూచుంది క్షమ, మనసులో ఏదో తెలియని భయం ఆమెని అవరిస్తూ ఉంటే.
ఎదురు కిటికీ దగ్గర నిశాంత్ కూచున్నాడు క్షమ వేసే తదేకంగా చూస్తూ,
రెండు కిటికీలకీ మధ్య చిన్న బల్లుంది. దాని మీద ఫ్లాస్క్ చిన్న చిన్న ప్యాకెట్లున్నాయి. తన కాళ్ళతో ఆమె కాళ్ళని తొక్కుతూ ముందుకు ఒంగాడు నిశాంత్.
“కొంచెం కాఫీ ఇవ్వనా?” చాలా మృదువుగా అడిగాడు.
తలూపింది.
ఫ్లాస్క్ మూతలో కాఫీ పోసి ఇచ్చాడు. పెదవులు విడకుండా నవ్వుతూ, కాఫీ అందుకుంటూ నిశాంత్ మొహంలోకి చూసింది.
“నా ఎన్నిక తప్పుకాదు. నిశాంత్ డబ్బున్నవాడు. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. తన లాగే (ఫ్రెష్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం ఇంకా రాకపోతేనేం. ఫరీదాబాద్‌లో వాళ్ళకి ఓ ఫ్యాక్టరీ ఉంది. పెద్ద ఇల్లుంది. తండ్రి బిజినెస్‌లోనే తనూ చేర్తాడు. తనంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులు వేరే అమ్మాయిని చేసుకోమంటున్నా వినకుండా వాళ్ళని ఒప్పించి తనని పెళ్ళి చేసుకోబోతున్నాడు, ఈ నిశాంత్. తన సుఖం కోరే మనిషి. తనేం తప్పు చెయ్యడం లేదు.
ట్రెయిన్ కదిలింది. ఇంకా సూర్యోదయం కాలేదు.
కిటికీలోంచి చల్లగాలి తగిలేటప్పటికి ఇద్దరికీ ఉత్సాహం వచ్చింది.
“స్పింగ్ ఎపెయిర్” అంటూ డోనాసమ్మర్ పాట పాడ్డున్నాడు. నిశాంత్. అ పాట తన కిష్టం. అందుకే పాద్తున్నాడు.
“నిజానికి నిశాంత్‌కి పాడటమంతగారాదు. కానీ తనకు నచ్చిన పాట కాబట్టి నేర్చుకుని మరీ పాడ్తున్నాడు.
ఒక్కసారి నిశాంత్ వంక ఓరగా చూసింది క్షమ ఓ క్షణం పాటు.
“జస్టేమిటి” అంటూ తను కూడా పాటనందుకుంది, తాగిన ఫ్టాన్స్ మూతని కడగడానికి లేస్తూ. 116
“వెయిటేమినిట్” అంటూ అదే రాగంతో పాడ్డూ ఆమె చేతిలోని ఫ్లాస్క్ మూతని తను తీసుకెళ్ళాడు.
క్షమకి ఏదో లోకంలో తేలిపోతున్నట్లుంది. అబ్బా! ఎంత ఆనందంగా ఉందో అనిపించింది.
ప్రేమా! పెళ్ళి, భర్త, జీవితం ఇంత హాయిగా ఉంటుందా? తిరిగివచ్చి కూపే తలుపువేసి క్షమ ప్రక్కనే కూచున్నాడు నిశాంత్. కొత్త ఆశలతో నిండిపోయిన అ ఇద్దరినీ, ఆ టైయిన్ కొత్త జీవితంలోకి ఇంకా ఫాస్ట్‌గా తీసుకెళోంది.
పదునుగా లేకపోయినా ఎండ ఒక్కసారిగా వచ్చేసింది. సమ్మర్ ఫీవర్ అంటూ ఇద్దరూ కలిసి పాడడం మొదలెట్టారు. మధ్య మధ్య పెళ్ళి గురించి, గడపటోయే కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటున్నారు.
తలుపుకొట్టిన శబ్దం.
విసుగ్గా లేచాడు, తలుపు తీయడానికి.
రెండు సీటున్న కూపే కానందుకు అ క్షణంలో చాల ఫీలయింది.
టీ.సీ. లోపలి కొచ్చాడు.
నిశాంత్ టిక్కెట్లు తీసి ఇచ్చాడు
“ఈ సీట్లలో వాళ్ళు.....” అంటూ ఎదురు సీట్లు చూపాడు.
“వాళ్ళు కాజీపేటలో ఎక్కుతారు” అనేసి టీ.సీ. వెళ్ళిపోయాడు.
తామిద్దరూ, ఒంటిగా ఈ కూపేలో .... అ అలోచనకే సిగ్గు పడిపోయింది క్షమ.
తలుపేసి, క్షమ ప్రక్కనే కూచున్నాడు.
“మొహబ్బత్‌కి రాహోమేం చల్‌నా సంబల్‌కే.
యవాం జోభీ ఆయా గయా వాథ్‌మల్‌నే!”
అంటూ క్షమ మెల్లగా పాదోంది.
కాస్సేపయ్యాక వాళ్ళ ఫాం హౌస్ గురించి చెబుతున్నాడు.
తన్మయంగా వింటోంది.
రేపట్నుంచి అంత పెద్ద ఇంట్లో తనూ ఓ భాగమైపోతుంది.
117
ఆ మనుషుల్లో తనూ ఒకటై కలిసిపోయింది.
స్వర్గానికి ఓ మెట్టు క్రింద విహరిస్తున్న ఆ ఇద్దర్నీ తలుపు చప్పుడు ఈ లోకంలోకి తీసుకొచ్చింది.
కాజీపేట వరకూ ఏ డిస్టర్బెన్స్ ఉండదు అని అనుకుంటే ...... ఈ తలుపు చప్పుడేమిటి?
కోపంగా, విసుగ్గా తలుపుతీశాడు నిశాంత్.
క్షణాల్లో దూసుకుంటూ లోపలికి కొచ్చాడు ఓ యువకుడు.
నిశాంత్‌ని ప్రక్కకి తోసి తలుపులు మూశాడు.
ఆశ్చర్యంగా, ప్రశ్నార్థకంగా, పరీక్షగా ఆ యువకుని కేసి చూశారు క్షమ, నిశాంత్‌లు.
ఆ యువకుని వాటం, చూవులు మామూలుగా లేవని, వాళ్ళకిద్దరికీ అర్ధమైపోయింది.
“ఎవర్నువ్వు” _ ౨ కూడదీసుకుంటూ అడిగారు నిశాంత్.
“కిటికీ తలుపులు వెయ్యి.” నిశాంత్‌ని చూస్తూ కరకుగా అన్నాడు ఆ ఆగంతకుడు.
“నిశాంత్” అంటూ భయంగా చూసింది క్షమ.
“కిటికీ తలుపులు వేసి కళ్ళు మూసుకోండి” అంటూ పెద్దగా అరిచాడు ఆ అగంతకుడు.
నిశాంత్ కదల్లేదు.
వెంటనే అతను పాంట్ జేబులోంచి రివాల్వర్ తీశాడు. అది నల్లగా మెరుస్తోంది. నిశాంత్ కేసి గురిపెట్టి “ఒక్క రెండు నిముషాల్లో మీరిద్దరూ చచ్చిపోతున్నారు అర్ధమైందా? కిటికీ తలుపులు వెయ్యండి” అన్నాడు.
క్షమ లేచి ఓ వైపు కిటికీ తలుపుదించుతున్న మిశతో గబుక్కున సీటు మీద కెక్కింది. గొలుసులాగుదామని చెయ్యి పై కెత్తింది. “చెయ్యి దింపు” అంటూ ఆమె వైపు రివాల్వార్ తిప్పాడు. నిస్సహాయంగా నిశాంత్ వైపు చూస్తూ కిందికి దిగింది క్షమ. నిశాంత్ పక్కన కూర్చోంది.
“వెరీగుడ్ .... ఇప్పుడు ఇద్దర్నీ చంపడం ఇంకా తేలిక” అంటూ నవ్వాడు, మెల్లిగా. 118
పక్క కూపేలో వాళ్ళకి వినబడేంత భయంకరంగా నవ్వలేదు.
క్షణాల్లో ఏం జరుగుతుందో తెలిసిపోయింది క్షమకి.
“డబ్బు కావాలంటే తీసుకో, మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాం. కానీ... మమ్మల్ని చంపకు.” అన్నాడు నిశాంత్ జాలిగా.
ఈ లోపల క్షమ సీటు మీదకి వంగి, ప్రక్క కూపేలో వాళ్ళకి వినబడేటట్లు కొట్టింది. -
“అలా కొడితే వాళ్ళకేం తెలుస్తుంది? ఇక్కడేదో జరుగుతుందని అనుకోరు. ఓ ఐదు నిమిషాలు ఆగకుండా కొడితే అప్పుడు తెలుస్తుంది. ఇకృదేదో ఘోరం జరుగుతోందని. సరే ఇంక కళ్ళు మూసుకో .... వన్ ...”
“ప్లీజ్! మమ్మల్ని చంపకు. నీకేం కావాలో చెప్పు.” అన్నాడు జాలిగా నిశాంత్.
“నాకేం అక్కర్లేదు. ఈ రివాల్వర్‌కి ఆకలేస్తుంది. ఊం ఇంక కళ్ళుమూసుకో.”
“వద్దు. నన్ను చంపకు మా వాళ్ళకు నేనొకృళ్లే! చేతులు రెండు అడ్డంగా ఊపుతూ అన్నాడు.
“సరే! ఈమెనే చంపుతో! వన్ .... టూ..... త్రీ...
“ఆమెను చంపకు. నొక్కాబోయే భార్య” అని అంటాడేమో అని నిశాంత్ కేసి చూసింది క్షమ.
ఆ గంతకుడు క్షమ కేసి గురి చూస్తున్నాడు.
“నా కింకా బతకాలని ఉంది. నన్ను చంపకు. నీకు పుణ్యం ఉంటుంది.” అని ఏడుస్తూ సీటుకు చేరగిలబడింది క్షమ.
ఈ విధంగా రైల్లో చావు వస్తుందని, కల్లో కూడా అనుకోలేదు.
ఎదురుగా పిస్తోలు రూపంలో మృత్యువు.
వణికిపోతోంది క్షమ.
మృత్యువు సమీపిస్తోంటే ఇంత భయంగా....
ఇంత భయంకరంగా ఉంటుందా?
ఎవరో ఈ మనిషి తనని చంమతానంటే ఈ నిశాంత్ ఏం చెయ్యలేకపోతున్నాడేంటి తనైనా అరవాలి గట్టిగా .... ఈ కంపార్ట్‌మెంట్ అంతా వినబడేటట్లుగా అరవాలి. తనని తానే రక్షించుకోవాలి.
119
“వన్” “నిశాంత్! ప్లీజ్ డు సంథింగ్” అంటూ ఒక్కసారిగా గట్టిగా నిశాంత్‌ని పట్టుకుంది. నిశాంత్ ఆమె చెయ్యి విదుల్చుకున్నాడు. క్షమ ఆశ్చర్యంగా నిశాంత్ వైపు తలెత్తి చూసింది. నిశాంత్ ఆ ఆగంతకుని వైపే చూస్తున్నాడు. బయట ఎవరో తలుపులు కొడ్డున్నారు ఓ అడుగుముందు వేసింది క్షమ, తలుపుతీద్దామని. “బయట ఆగని తలుపు చప్పుడు. “ఈ! త్వరగా... బయట ఎవరో తలుపు కొడ్డున్నారు కూడ. సరే... ఈమె చావనంటోంది. నువ్వు రెడీగా ఉండు.” అంటూ నిశాంత్‌కి దగ్గరగా వచ్చాడు. “వద్దు. అతన్ని చంపకు....” ఏడుస్తూ అంది క్షమ. నిశాంత్ క్షమకి దగ్గరగా కదిలాడు. క్షమ సీటు మీద నుంచి లేచి నిశాంత్ ప్రక్కగా నిల్చుంది. “తలుపుతీయ్యండి ..... తలుపు తియ్యండి” బయట గట్టిగా చప్పుడు. నిశాంత్‌కి, క్షమకి ఏం చెయ్యాలో తెలియటం లేదు. “వద్దు.... అతన్ని చంపకు ....” అంటూ ముందుకు రాబోయింది. క్షమని పక్కకి తోశాడు. ఈసారి క్షమ సీటు మీద పడలేదు. నిశాంత్‌ని పట్టుకుంది. వక్ర. ఆ క్షణానికే నిశాంత్ క్షమని అద్దుగొ, తన ముందుకు లాగాడు. పిస్తోలు పేలింది. 120
క్షమ భయంలో కళ్ళు మూసుకుంది.
బయట దబదబా చప్పుడు.
ఆ ఆగంతకుడు ఆ పిస్తోలుని పాంటులో దాచేసి తలుపుతీశాడు.
“ఆనందూ .... ఏం చేస్తున్నావురా? అంటూ లోపలికి ఓ పెద్ద మనిషి వచ్చాడు.
“ఇందాకట్నించి తలుపుకొడ్డున్నా తియ్యలేదేం? వినపళ్ళేదా?”
అతని వెనకే టీ.సీ., ఓ నడివయసావిదా ఉన్నారు.
“చూడండి ఈ అబ్బాయి..... అంటూ ముందుకొచ్చాడు నిశాంత్ వాళ్ళకేసి చూస్తూ,
“ఆనందూ! ఇంక రామ్మా!” అంటూ ఆ పెద్ద మనిషి అఆ యువకుని చేయిపట్టుకున్నాడు.
“చూడండి. ఈ అబ్బాయి పీస్తోలుతో ఈ అమ్మాయిని కాల్చాడు” అన్నాడు నిశాంత్ టీసీతో
“అదా .... అది దీపావళి పిస్తోలుతెండి. చూడండి ఆ అమ్మాయి కళ్ళు తెరచి ఇటే చూస్తోంది” అన్నాడు టి.సి.
“అంటే ఈ అబ్బాయి....” ఆగిపోయాడు నిశాంత్.
“కొంచెం”...... అంటూ కణతల దగ్గర చూపుడు వేలుని గాలిలో తిప్పాడు.
“అయితే కట్టెయ్యాలి కానీ .... ఇలా వదిలేస్తారా? ఎంత భయపెట్టాడు? ఎంత ఖంగారు పెట్టాడు?” కోపంగా అన్నాడు నిశాంత్.
“దానికి క్షమార్చణలు చెప్పుకుంటున్నాం. టీ.సీ.తో ఈ గుమ్మం దగ్గరే మాట్లాడుతున్నాం. ఈ ప్రక్క కూపేమాది. మీ కూపేలోకి వెళ్ళడం చూశాం. ఈటీ.సీ. నా చిన్నప్పట్నుంచి (ఫెండ్. ఈ ఆనంద్ గురించే మాట్లాడుకుంటున్నాం. సరిగ్గా ఐదు నిముషాలు అయిందో లేదో... సారీ...రా బాబూ” అంటూ ఆనంద్‌ని తీసుకెళ్ళారు. ఆనంద్ కూడా ఏమీ ఎరగనట్లు బుద్దిగా వాళ్ళవెంట వెళ్ళాడు.
తలుపువేసి ఎదురుసీట్లో కూర్చున్న నిశాంత్‌కేసి చూసింది క్షమ.
“క్షమా...”అంటూ ఏదో అనబోయాడు.
“ప్లీజ్,.*” అంటూ చేతులు జోడించింది.
121
“ఆ అబ్బాయి పిచ్చి; యు”
“చేతిలో ఉన్నది వామూలు బొమ్మ ఎస్తాలు కాబట్టి బ్రతికిపోయాను. లేకపోతే...అంతే...తను చచ్చిపోయేదే”
కానీ...ఆ స్వల్ప వ్యవధిలోనే జీవనగతిని మార్చేశాడు.
ఆ గడిచిపోయిన భయంకరమైన పదినిముషాలు తన భవిష్యత్ గురించి కన్న కలల్ని ఈ నిశాంత్‌ని గూర్చి, తన అభిప్రాయాల్ని మార్చేసింది. ,
“ఇంటర్ ఆఖరి నంవత్సరం నుంచి బన్‌స్టావులో వరిచయమైన నిశాంత్‌ని...బి.ఎన్సీ ఆఖరి నంవత్సరం వరకు స్నేపాతుడిగా ఉన్న ఈ నిశాంత్‌ని...చదువుయ్యాకా పెళ్ళిచేసుకుందాం అన్న ఈ నిశాంత్‌ని ఈ నాలుగేళ్ళలో బాగా అర్ధం చేసుకున్నా అనుకుందీ. కానీ తన అంచనాలు తప్పు.”
“ఇదొ ఇతని ప్రేమ. ఈ వ్యక్తినా తను ఎంతో ఉన్నతంగా ఊహించుకుంది? ఇలాంటి వాడికోసం (ప్రేమని, ఆప్యాయతని పంచి ఇచ్చే తన వాళ్ళనందర్నీ దూరం చేసుకుందామనుకుంది?
మూసిఉన్న కిటికీకి తల ఆన్బి కళ్ళు మూసుకుంది.
కొద్ది క్షణాల వరకు... ఈ నిశాంత్‌తో పంచుకోబోయే తియ్యటి జీవితాన్ని గురించి ఆలోచించింది. ఆ తియ్యటి జీవితాన్ని గూర్చి, ఇంకా మధురంగా ఊహించుకుంది. ఇద్దరూ కలిసి వేసిన దారి పూలదారి అవుతుందని అనుకుంది. కానీ...కలసి వేసిన మొదటి అడుగులో అపశ్రుతి పలికింది. కళ్ళు తెరిచింది.
తప్పు చేసినవాడిలా ఉన్న నిశాంత్‌ని చూస్తే అసహ్యం కలిగింది. ఉత్త అవకాశవాది.
కిటికి తలుపు తెరిచింది. వేడిగా, బైట్‌గా ఉంది బయట.
పైనుంచి పెట్టెతీసి, అందులోంచి ఉత్తరం తీసింది.
అ ఉత్తరం తల్లిదండ్రులకి రాసిన ఉత్తరం.
ఇంకా ఏదో ఓ స్టేషన్‌లోనో, ఢిల్లీలోనో పోస్ట్ చేద్దామనుకున్న ఉత్తరం.
ఆ ఉత్తరం ముక్కలు ముక్కలుగా చేసింది.
కిటికీలోంచి ఆ ముక్కల్ని బయటపదేసింది.
122
“ఘటకేసర్” స్టేషన్ దాటింది రైలు. పెట్టి మూసి ప్రక్కనే పెట్టుకుంది. కాజీపేట కోసం చూస్తోంది. కాజీపేట రాగానే రైలు దిగి, ఏదో ఓ ట్రైన్‌లోనో లేకపోతే బస్సులోనో హైదరాబాద్ తన ఇంటికి వెళ్ళి పోవాలనుకుంది. “శీనింకా చదువుకుంటాను... ఉద్యోగం చెయ్యాలని లేదు" అని ఇంట్లో అందరికి చెప్పాలని. ఎండ ముదిరింది. ఆ వేడిలోని సందేశంతో ఆమె నిశ్చింతగా కిటికీలోంచి బయటికి చూస్తోంది. ఈ జై శ లొంట్తు రభ లొరీ వర్తక ఈ వ్రీస్తీచు ట్కు టచ్ అ ద్స నీ క ల (౦ నర శ గి 0 ననన 123
గ్ ౮ | ల ఇద; ధర్మమా? క | ల! వ్ల ప. [మ్ తక్కువ నిడివితో ఎక్కువ స్పాన్‌తో రాసిన ప్రతీకథ పాఠకునికి ఆకర్షించే విధంగా 1 వున్నాయి. రచయిత్రి ప్రధానంగా మధ్యతరగతి పాత్రలతో, వారి ఆలోచనలు, దృకృథాలతో మలచిన పాత్రలన్నీ చదువరులకి ఎంతో చేరువగా ఉన్నాయి. | కథల ముగింపులో ఒక ఆశావాద దృక్పథమో, జీవితంపట్ల ఒక అవగాహనో, ఒక సమన్నయ లక్షణమో కనిపిస్తుంది. అందులోనే రచయిత్రి తన ప్రధానపాత్రలో , అనిల అలం ఆక్ లలి తా లీ శా కల న! ను లి పరిణత మనస్తత్వాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది. వైవిధ్యపూరితమైన, ప్రయోజనాత్మకమైన కథలతో, వివేచనా పూరితమైన సంభాషణలతో, వ్యాఖ్యలతో సంపన్నమైన సంపుటి ఇది.
- అద్య్బూరి భాయాదెేవి ప్రల వృధల్ని హృద్యమైన కధలుగా మలచడంతోబాటు, ఓదిపోయాననుకునే నాయకపాత్రల్ని గెలుపుదేపు నడిపించి స్ఫూర్తిని అందించడంద్వారా, గంటి భానుమతిగారు | ప్రత్ ఇంటి బహుడుతి. స్పార్టంతో. అసమానతల ఈక్వేషన్స్‌తో. నడుస్తున్న నేటి సమాజంలోని కుళ్లును | కడదిగెయాలనుకున్న ఈ రచయిత్రి తాపత్రయం, ఆదేశం, ఆందోళనా ప్రశంసనీయం. ళ్. రు | కథచెప్పుతరూ, విధానం, శైలి కథలకి అందాలని తొదిగ్థాయి. సువాసనలని గ్. ( లం | పులిమాయి... పైగా వస్తుడైవిధ్యం కథలని అలంకరించింది... వస్తువు వివిధ రీతుల్లో న జై / సా, టట బో వ న క బు (| జి | ఎంచటంచిల్ల పొత్రలూ, వాతావరణమూ. (కథకు సంబంధించినది), భాషా, కొత్త య, | _ న.
- అందాలతో అలరించాయి. ఒక చకృట్ కథల సంపుటి చదివాంచున్న తృప్తి పోయి న్ | 1: వలుగుతాయి. భాగుదుతి కధలచుస్తకంలో. భావం, ఖాషా పోటీ పడుతూ కథలని అణ" శ | లు జ
- అరుణా వ్యాగు రా,