Telugu Dornadula Akshara Sathakam - anilvaranasi/indianlanguages GitHub Wiki
1 ౯ ం "భ్ న. లి? న్ 7. , టీ... (చం నయ్. సలల జ ర. గ ల స స వం సట!
వ పో ముం లో న్ చ 0 20 న 1
“ ర న మం సే నర లి మ చయయ నం క 0 న!
_ సున్ వసుత నం అ సార € స, ట్రా / టం యుప వరుంల. సత. న తను రనడే యానా తరత యో. సల్ తత య రాల వ టే త.
₹ టోర్నాదుల అక్షర శతకం ల్టే క్ట "గస ల ల? జక స. (అఆజళఈ ల రవళి) క్ పచ నుం న స్త న క. 1 | క [వి రే ప యస శో క్ట | జే పల త్ నం ల్. 1 న తం
వ /| ల!
శీ న, కై ౧౩
శ! | నం... ౬ స్ట శ | శ గహ ౯! వు. (యా కా గ నా... పాగా నా టై ఖల నా 1 ౯! [| ॥ శ గ! ం గం తననన భారా నాననా | కా కా న కదడమాల... టే లన నం.
(అఆఇఈ ల రవలి) న న న! నీరు ననే న నటట” భ్ జ్ .
= ( తల నుం లం చం సుల “గ . దోర్నాదుల అక్షర శతకం (౫ ట్వ రే ఖే. టల స్టో వము ట్ స నయనం తనొక 1 శీ? 2 హీ రే ను న ర న యు... ల్ క న ీ షే. ప న. =. . ఇ తట! (రా ఫులతుం.. వము లు మను మాటు చోర్నాదుల సుబ్బమ్మ
తయన్సగ కిల ఏర. ఉ కడగి! గటడఉరుడి-28 హయ. “9 0 అం ప 0 ౧ 69 _ అంకాల నల౮9 క్ 11044 సాం ర్ ్లా ఉంంచటంలాం (011016 విపటళ మ! ల డం కళ 961401 గ నః న్వు వ 00+ 65188 రలు? ఆంధాల నిగం గ. 70/- ఉ్శ్న్భ్యా క0 00014 ఖై కై ౯ ె త్త లీ ౬ ఒడి విన్నిర్రి | . న్యగ1264412 5800200012, ల... తటుయిుం, ష్ష్ కడస్టం ల *ర10గూ 0౩౪00 ల్ 5 5%4ష0)01 9115050106 110౮51, 2౦-5-30, 100 026, 0 టతటోరుంలత4 - 520 002. లత్తాచండ4/ లగగంయాడ 2ఈ47/2గ్యూ- '్వాజ/2ద2రో2ల2 వి0016 ఏ 0866 = 2434932
లి గులునే ళు బ్రతుకు తీపికోను౦ ఎ శ్రులు ఆ మ్ న. | యల. న. చ. న న య మ స ద హస. న సు వ న. మ వ నతు న న న ప. వ. హస న ము సం. క న .. స ఇలాన్తోనో ల మ మ న యయ సత ( .. సల న. న. మో మగా ల్ జ న న. టం” ప సో స స స్ | న ల్ల ఖ్ స్తై శే న స మ స వ ప్ర భి గ్రుమతో....
ఇ మాతృ మూర్తి ఆశీస్సులు ఈ పుస్తకాన్ని గురించి చెప్పేంత శక్తి నాకు లేదనే అనుకొంటున్నాను. కాని ముందుమాట నీదే కావాలి... నీకు ఏం తోస్తే అదే... చెప్పమన్నపుడు వాకింత ఆశ్చర్యం, ఆనందం కల్గాయి. పుస్తకాలు చదివే అలవాటున్న నాకు కవిత్వం గుణగణాలు తెలీదు. అయితే చదువుతున్నంతసేపూ, అందరూ తెల్పుకోవాల్సినవిగా, అనుసరించేవిగా, యింటింటా వుండదగిందిగా, చదివితే సంతృప్తి కల్గుతుందని ఖచ్చితంగా చెప్పగలను. దాహంతో వచ్చిన వారికి పానశాలగా, ఆకలితో వచ్చిన వారికి పాకశాలగా, అవకతవకల్లో వచ్చిన వారికి పాఠశాలగా, ప్రయోగశాలగా వుంటున్న ఆ యిల్లు, ఆ దాంపత్యం సంగతి ప్రత్యేకించి చెప్పేదేమీలేదు. తను తెలిసినవాళ్ళందరికీ ప్రియ భావన కల్గించే ఆ చేతినుండి నాకోసంగా శద్భగా అందించిన ఈ వృన్నకరూవం చూన్తుంటే నా జన్మ ధన్యమైందనిపిస్తోంది. ఇంతకంటె నాక్కావల్సింది, అమూల్యమైంది ఏదీ లేదనిపిస్తోంది. కళ్ళముందు కన్నబిడ్డ కళకళ్ళాడ్తూ తిరగాలని, పలువురిచేతా యింకా (ప్రశంసింవబడాలని, ఆయురారోగ్యాభి వృద్దితో చిరకాలం, సుమంగళిగా వుండాలని ఆశీర్వదిస్తూన్నా... సంతోషం ఎక్కువై మాటలురాని పరిస్థితిలో వున్నా..మరోసారి, ప్రియాతి ప్రియంగా భవిష్యత్తు సాగిపోగలదని నమ్ముతూ, నా పిల్లలు, వారి పిల్లలు విశ్వానికే మణిపూసల్లాటి వారని భావిస్తూ, మూడోతరానికి చెందిన చిరంజీవులందరికీ దీవనలందిస్తూ ఎనభై వస సమీపిస్తును.. సంతాలను సమీపిస్తున్న. “ఆ మ ఖై కుజ్టా రాజమ్మ
౪1 తోబుట్టువుల అక్షరాంజలి “అమ్మ తర్వాత స్థానం ఆమెదే. ఆమె అండ మాకు ఎల్లవేళలా అందుబాటులో వుంటూ మార్గదర్శకమైన వారి దాంపత్యం మా భవిష్యత్ ప్రణాళికలకు చేయూత కాగల్లుతుందని ఆశిస్తూ, మా మనసుల్లోని ఆరాధనాభావన వొక్కమాటలో చెప్పాలంటే మా అందరికీ 'సేదతీర్చే బోధి వృక్షం ఆమె!' ఆమె వెనుక వేము జన్మించినందుకు వమురోసారి అదృష్టంగా తలున్తూ నదా వమునఃపూర్వక ప్రణామాలందిస్తూన్న........ వినమతతో క్ష తోబుట్టువులు”
ఫేదుబంధాన్ని తెంచిచ్చిన ... మా తుమ్మ గురించి. కప్పుడు మా అమ్మకి నమస్కరిస్తున్నాను.............
“అమ్మ గొప్పతనాన్ని చిత్రించడానికి ఆకాశాన్ని కాన్వాసుగా చేసి సముద్రమంత సిరాతో పొడవాటి కొబ్బరిమానంత కలాన్ని తీసుకుని చిత్రించినా సరిపోదు”... అని ఎక్కడో చదివిన జ్ఞాపకం.
నాకు రెక్కలాన్తున్నప్పుడు...నా రెక్కలక్రింద చేతులేసి ఎన్నిసార్లు సహనంతో ఎగురవేసిందో. చిన్నప్పుడే చెయ్యెత్తి ఆకాశాన్ని చూపెట్టింది. అమ్మ రెక్కలక్రింద రూపుదిద్దుకున్న బాల్యం ఈ రోజు నా వృద్ధాప్యాన్ని ఓదారుస్తుంది. అప్పుడెట్టా (ప్రేమించిందో గమ్మత్తుగా ఇప్పుడూ అట్లానే. మాతృప్రేమకు పాతదనం ఉంటుందా?
ఇంత జరిగాక ఆకులు రాలిపోయిన చెట్టులా “అమ్ము అనుభవాల గాయాలు ఎలా భరించిందో ! బ్రతుకుని ఎలా తీర్చిదిద్దుకున్నదో! జీవితాల అర్జాలనే మార్చేసే ఈ (బ్రతుకుతో ఎలా పోరాడిందో.
అందుకే సూర్యుడి క్రింది భూమిమీద అమ్మ పాదాలకు నమస్కరిస్తున్నాను.
గ్రేమనంతా మా అందరికీ పంచిచ్చేసిన తర్వాత ఖాళీ గుండెతో మూగబోయిన గొంతుకతో ఇప్పుడు.... అమ్మ
ఇప్పటికీ నా దుఃఖాన్ని తన ఖాళీ గుండెలో మోయగల్లిన అమ్మని మరలా కనాలని వుంది.
రోజూ “రాముణ్ణి” చూస్తే ఏముంది... జన్మనిచ్చిన తల్లిని చూడు. దుఃఖపు చీకటి రాత్రుళ్ళు భళ్ళున పగిలి వేకువలోకి మరలా జన్మిస్తావ్. మరొక్కసారి అమ్మ చెట్టుకి కనీసం ఆకై పుడ్డావ్.
| ఈ దేహానికి ఎముకల్సి, రక్తాన్ని, మాంసాన్ని పొందుపర్చినప్పుడు బాధని అనందంగా భరించింది అమ్మ అందుకే మా అమ్మ పాడిన నిష్పుాలపాటకి నమస్కరిస్తున్నాను. ఈ వయసులో నాలాంటివాళ్ళకి చెప్పకోవడానికి అమ్మలాంటి తోడుకావాలని కోరుకుంటాను. అమ్మ స్వప్న వృక్షాన్ని కాపాడుకుంటాను. మరొక భవిష్యత్ చిత్రపటం గీస్తాను. అమ్మనే కాదు అమ్మ త్యాగాల్నీ పూజిస్తాను, ధేమిస్తాను. ఒక విరబూసిన పూలబెట్టులా అమ్మ కదుల్తుంటే ఆ సువాసనల్ని పీల్చుకున్నదాన్ని ఇప్పడు కదలలేని అమ్మని కళ్ళనిండా నింపుకుంటాను అపురూపంగా. మనిషి రూపంలో ఉండే ఆ దేవతనే పూజిస్తాను. దుఃఖాశ్రువులు రాల్బుకున్న అమ్మకళ్ళలో వెలుగైపోతాను. నా తనువు శాఖల'క్రింద అమ్మని సేదతీరమంటాను. అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనస్పూర్తిగా (ప్రేమిస్తున్నాను.... నాకు బ్రతుకు నిచ్చినందుకు.... జీవితాన్ని పంచిచ్చినందుకు. మా అమ్మ పేరు “రాజమ్మ” తన పద్నాలుగో యేటనే అవిడ పొట్టలో నాకు జన్మనిచ్చి జీవాన్ని పోసింది. వయసు పిల్చీపిలవకముందే మా నాయన “సుబ్బరామిరెడ్డి” ని కట్టుకొని, నాకు నా యనక పుట్టెనోళ్ళకు అమ్మగా మారిపోయింది. వాకు జన్మనిచ్చిన మా అమ్మని కన్నోళ్ళు సుబ్బమ్మ-తాతిరెడ్డి. ఒక రకంగా మా అమ్మ అభినవ యశోధర అయింది. అమ్మ దిద్దించిన ఒక్కో అక్తరం ఇప్పుడు పరిమళించి సువాసనల్ని వెదజల్లుతూ నక్షత్రాలకిమళల్లే మెరుస్తున్నాయి. ఈ ప్రాపంచిక బాధల్లో విసిగిపోయిన అమ్మని ఓదార్చలేకపోయానేమోననే బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. మేమంతా అనాది స్నేహితులం. కానీ ఈ వయసు మీదపడేకొద్దీ మమకారాల
1% తలుపులు కాస్తా... ..... కాస్తా మూసుకు పోతున్నట్టు గమనించా. అన్నీ గమనించినా గమనించనట్టు నటించడం మొదలు పెట్టా. మూడుముళ్ల మూగ సిద్ధాంతపు చక్రంలో ఇరుక్కుని ... నిశ్శబ్ద నదిలో ఈదుతూ...... ఇదిగో ఇలా ఇప్పుడు. ఎ
ఇన్నాళ్ళ నిగ్రహం ఇప్పుడు కట్టలు తెంచుకుంది. నా ఊలిరి ఆగక ముందే నాతల్లి చనుబాలబుణం కొంలతైనా తీర్చుకోవాలి.
ఇప్పుడు అఖండ వ్యక్తిత్వమయిన మా అమ్మ పాదాలముందు మోకాళ్ళ మీద నిలబడి నమస్కరిస్తున్నాను.
జీవితమన్నది గొప్పకల... దాన్ని వాస్తవం చేసుకోవడమే నీపని అని భుజం తట్టి ప్రపంచం ముందు నన్ను నిలబెట్టిన మాల్మిక మనిషి ఆవిడ. నాకూ మా అమ్మకు మనసులోనూ, వయసులోనూ పెద్ద తేడా ఏం లేదు. వివాహమంటే అది ఉత్త మూడుముళ్ళేసే తంతుమాత్రమే కాదు... నీ అభిరుచిని ప్రతిఫలించే అద్దం అనేది. జీవితంలో పోరాటాన్ని బాధ్యతా యుతంగా నిర్వర్తించాలన్నది. బ్రతుకు సముద్రాన్ని ఈది... ఈది అలసి పోయాక స్రీ మమత కోసం వెదికే విధంగా అమ్మమా కోసం వెతుక్కునేది. వండి వడ్డించడంలో సగం జీవితం కరిగిపోయినా పట్టెడన్నంతో నల్లురికీ పోట్ట నింపానన్న ఆత్మ సంతృప్తి చాలనేది. ఆకలి కడుపుకి అన్నం పెట్టడం కంటే పుణ్యం మరొకటి లేదని ఆకల్ని చల్తార్చే ప్రయత్నమే గొప్పదని, ఆత్మవిమర్శకు మించినది లేదని చెప్పేది. నేర్వాల్సినన్ని అక్షరాలే నేర్వని అమ్మకు ఆకాశంలో ఉన్నన్ని నక్షత్రాల అక్షరాలు అబ్బేయి.
ఆమె విరామమే ఎరుగని సాహసి. ఓర్చుని, నేర్చుని ఆభరణాలుగా ధరించి సౌశీల్యాన్నీ సౌహాద్రతని చుట్టుకుని మా అందరి గుండెల్లో దేవతే అయ్యింది.
గ
కష్టాలు, కన్నీళ్ళ గురించి చెప్పిందేగానీ..... కుట్రలు, కుతంత్రాల గురించి చెప్పనేలేదు. భయంతో భక్తితో దేవుణ్ణి నమ్మింది గానీ, బాధల్ని మాత్రం ప్రేమించటం మానలేక పోయింది.
బ్రతుకు సమరంలో గెల్బినా ఓడినా.... చిరునవ్వుతో ఆహ్వానించడం నేర్చడమే ఆవిడ మాకిచ్చిన కానుక, జీవితం అనేది సిద్ధాంతాల గని... చురుకు దనంతో తవ్వుకొన్న వాడే జ్ఞాని అనేది.
(ప్రేమనంతా నా ఒక్కదానికే కాకుండా నా తర్వాత తన కడుపులో తొమ్మిది మందిని మోసి పెద్దింటి ఇల్లాలై పోయింది. కలలు కన్న జీవితం అందకపోయినా కలల్ని నిర్మించటం మానలేకపోయింది.
మమ్మల్ని చదివించి, ఈ స్థాయిలో ఉంచి బ్రతుకులో మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన అవిడ కృషి శ్చాఘనీయం.
మమ్మల్ని ఆశల వపల్లకీమీద మోన ఆవిడ మాత్రం పల్లేరు కాయలమీద నడిచిన ధీరురాలు .
ఒకే చెట్టుకి పూసిన పూలన్నీ ఒక్కవాసనతో ఉన్నప్పుడు పుట్టిన వల్లలంతా ఒకే లక్షణాలతో ఎందుకుండరోనని తర్కించుకునే
అమాయకురాలు. సిద్ధాంతాన్ని జోలపాటగా పాడి కర్తవ్యపు ఉయ్యాలలో ఊగించిన సాహసికురాలు ఆమె
పెన్నమ్మగలగలల్ని దీపావళి ధగధగల్ని సమానంగా ఆస్వాదిస్తుంది.
అయినా ఈ చరాచర వవంచం మొత్తం శూన్యం. “తల్లి” అనేది ఈ ప్రపంచం పుట్టుకతో బతికినంతకాలం శాశ్వతం. జీవించడానికి కావలసిన ముఖ్యలక్షణం జీవితంమీద నమ్మకం. అటువంటి నమ్మకాన్ని మా అందరికీ ఇచ్చింది. మా అమ్మ మా ముంగిట ఏ రేఖలు గీయలేదు. దేన్నీ అతిక్రమించ వద్దని శాసించనూ లేదు. మమ్మల్ని మానవ కక్ష్యలోకే ప్రవేశ పెట్టింది. స్త్రీగా ఉండటమంటే అర్ధం ఏమిటో తెల్పింది. వయోభారంతో ఎదిగిన బిడ్డల మధ్య అమ్మ ఇప్పుడు ఏకాకి
క ( అయినట్లుంది. నన్ను అక్కున చేర్చుకోవడానికి, ప్రేమించడానికి ఇప్పటికీ నాకు అమ్మ ఉంది. కానీ మా అమ్మకే అమ్మలేదు. ఒంటరి యుద్దంలో అలసిపోయి చక్రాల కుర్చీలో అవసరమైన ఇప్పుడు అమ్మ...
అమ్మతో చేయికలివీ భూవిం మొత్తం చుట్టు కురాలేని అనహవాయురాలనయిపోయాను. అవూల్యవుయిన సావాచర్యవు అనుభూతిని ఈ వయసులో అమ్మకు అందించలేకున్నాను, నేనిప్పుడు ఎన్ని కన్నీళ్ళు కార్చితేనేం అమ్మ దాహాన్ని తీర్చగలనా. అమ్మ చీర చెంగుల్లో దాక్కున్న నా బాల్యాన్ని మరలా... మరలా.... చూసుకోగలనేమో గానీ నుదిటిమీదే నిల్చిపోయిన అమ్మ రెక్కల కష్టాల గుర్తుల్ని చెరి పేయగలనా? అసాధ్యమేనేమో.
అమ్మని పలుకరించగానే గొంతు మూగబోతోందిప్పుడు. అమ్మనా చెవుల్లో జారవిడిచిన జోలపాట నన్నిప్పుడు కలవర పెడుతోంది. తనను తాను పునర్నిర్మించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తున్నప్పుడు నాకు నేనే నిలువునా చీల్చబడుతున్నాను.
అమ్మ చనుబాల చుక్కలతో ఇప్పుడు గుండెనిండా కన్నీటి గాట్లు... అమ్మా!
నిన్ను హృదయంనిండా ఒంపుకోలేని అశక్తురాల్ని నువ్వు అందించిన (ప్రేమలో లక్షోవంతయినా నీకిన్వలేని ఈ స్వార్ధపరురాల్ని క్షమించు......! అని ఒకానొక దుఃఖసాయంత్రం అమ్మ ఒడిలో తనివితీరా ఏడ్వాలనుంది. అమ్మా!
కన్నీటితో నింపుకున్న ఈ కళ్ల ఉప్పునముద్రం సాక్షిగా......... నీ నడకకోసం నేనిప్పుడు విస్తరించిన మార్గాన్నవుతాను,
నేను పుట్టినప్పటినుంచి యిప్పటిదాకా నావల్ల నువ్వెప్పుడయినా ఓడిపోయావేమో అని అనుకునేదాన్ని. అప్పుడప్పుడూ నన్నీవిషయం బాధిస్తూనే ఉండేది. నుదుటిమీద కుంకుమ పెట్టనిదే నువ్వు పొద్దువైపు చూసే దానివి
న. కాదు. తడారిన నా గొంతుకలో మనసు చిత్రించిన సృృతులతో నిన్ను అభిషేకించలేని అసహాయురాలిని .... కానీ నీతో సహా ఈలోకం లోని అమ్మలందరూ మాన్యచరిళులే. జీవితపు కుటీరంలో ధైర్యంగా బ్రతకడమెలాగో నేర్పినందుకు నీకు ఏమిచ్చి నీ బుణం తీర్చుకోగలను. జీవితపు సంపూర్ణత్వం ఇచ్చినందుకు బదులేమిచ్చుకోగలను? ప్రీ స్వేచ్చావిహంగం కావడం కంటే, స్వచ్చంగా బ్రతకగట్లడం కంటే ఎక్కువయిన సంతోషం, సంతృప్తి మరొకటి లేదన్న స్వచ్భమైన స్తీ వాదివి నువ్వే.. అమ్మా! నా నృతుల సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టి ఈ అక్షరాభిషేకం చేస్తున్నాను... నువ్వు స్వీకరించి....... నన్ను ఆశీర్వదిస్తావని నిన్ను... కోరుకొంటూ...... వేడుకుంటూ..... ప్రార్థిస్తూ......... నీ దోర్నాదుల సుబ్బమ్మ
న శఆక్షరనత్యాల దర్పణం - అక్షర శతకం సామాజికమైన స్పృహను కలిగించడానికి, వైయక్తికమైన మార్గదర్శక నూత్రాల్ని చెప్పడానికి, లోళజ్ఞానాన్ని అన్నికోణాల్లో పప్రబోధించడానికి, సంస్కృతం, తెలుగుభాషల్లో ప్రాచీన సాహిత్యంలో ఉన్నంత కవిత్వం బహుశః ఏ విదేశభాషల్లోనూ లేదనుకుంటాను. బిర్చృవారి, వేవున, సుమతీశతకకారుడు - అతి కొద్ది ఉదాహరణలు మాత్రమే. ఇలాటివారి పద్యాలన్నీ ముక్తకాలుగా ఉండి, నోటికి రావడానికీ పదేపదే గుర్తు చేసుకోవడానికీ సందర్భానుసారంగా ఉదాహరించడానికీ అనువుగా ఉంటై. ఈకాలంలోనైతే, ఆంగ్లభాషాధివత్యం, దానికి మాతవే వ్యాపార విద్యాలయాల్లో ఎక్కువ అవకాశం కల్పించే పాలకవర్గ శాసనాలు, పైరీతి కవిత్వానికి శాపంగా పరిణమించివై. అదివరకు ప్రతి బాలుడికీ ఏవో కొన్ని పద్యాలైనా నోటికివచ్చే పరిస్థితి మారిపోయింది. ఈ వాతావరణంలో, ఎంతోమంది ఆధునిక కవులు పైన చెప్పిన వేమనాది కవుల అడుగుజాడల్తో, ఎంతో ఆవేదనతో, అసంఖ్యాకంగా పద్యాలు, మినీ కవితలు - ఇంకా అలాటి అనేక ప్రక్రియల్లో ముక్తకాలు రాస్తున్నారు. ఉర్జూభాషనుండి ప్రభావితులై రుబాయీలుకూడా రాస్తున్నారు. పైన చెప్పిన కవుల పరంపరలోకి ఇప్పుడు దోర్నాదుల సుబ్బమ్మగారు తన ప్రత్యేకమైన స్వరంతో ప్రవేశిస్తున్నారు. ఆమె “అక్రరశతకం' లోని ముక్షకాలన్నిటిలో పై నేపధ్యం తాలూకు స్ఫూర్తి నిండుగా ఉంది. బహుశః కవయిత్రుల్లో ఇలాటి ప్రయత్నం ఈనాడు చేసింది దోర్నాదుల సుబ్బమ్మగారే అనుకుంటాను. అక్షరశతకంలో సుబ్బమ్మగారు అనుసరించిన మార్గానికి కొన్ని ప్రత్యేకతలున్నై . ఇవన్నీ నాలుగు ప2ంక్తులుగల ముక్తకాలే. రుబాయీని గుర్తుచేస్తెగాని, రుబాయీ ఛందస్సు అనుసరించలేదు. అయితే 1, 2, 4, పాదాల చివరి అంత్యప్రాసగంధం రుబాయీని గుర్తుచేస్తుంది. యతిని అనుసరించలేదు గాని, నాలుగు పొదాలకీ ప్రాసాక్షరం ఒకటే ఉంటుంది.
౪ లయబద్ధతను పాటించలేదు. ఏ పాదానికి ఆ పాదం ఒక్కొక్క వాక్యం. పద్యంలాగాని, మరో ప్రక్రియలాగాని, రాద్దామని అనుకోకపోయినా అప్రయళ్నపూర్వకంగా హృదయంలోంచి వచ్చిన మాటలు తమ రూపం తాము తీసుకోవడంవల్ల, ధారాప్రవాహ లక్షణం ఎక్కుడా అవరోధం కలిగించని విధంగా సాగిపోకై. చాలా సాధారణమైన భాష, నుడికారమూ, నంభాషణ లక్షణం కలిగి ఉండడంచేత, చదివిన బాలబాలికల హృదయాల్తోకిగూడా సూటిగా చాచ్చుకునిపోతై. పద్యం కాకపోయినా, పద్యంలా నోటికి వచ్చే తీరు ప్నెకారణాలవల్ల ప్రతి ముక్తకంలోనూ కనిపిస్తుంది. ముక్తకంలో ప్రత్యేక లక్షణాల్ని వైయక్తికంగా నియమించుకోవడం మాత్రంచేత, దానికి ధారా ప్రవాహలక్షణం రాదు. పైన చెప్పిన అంశాల నవే్మేళనంచేత మాత్రవే అది వన్తుంది. ఏ ప్రత్యేక ప్రక్రియనూ అనుసరించకపోయినా, “అక్షరశతకం'లోని కవితలకు ఆ ప్రత్యేకత రావడానికి కారణం యిదే. ఉదాహరణకు... “అద్దంలో బొమ్మ ఎదురుగా ఏది ఉంటే అదే గదా అద్దంలో బొమ్మ ఎప్పుడూ ఒకదానికొకటిగా కనడదుగదా అద్దంలో ప్రతిబింబంలాంటిదే నిజం అద్దం పగలగొట్టినంత సులభంగా నిజాన్ని పడగొట్టడం జరిగేదా?” వి ప్రబోధానికి ప్రధానంగా రెండు మార్గాలున్నై. మొదటిది 'ఇలాచెయ్యి” అని చెప్పడం, రెండోది “ఇలాచెయ్యకు' అని చెప్పడం. మొదటిమార్గం కంటె రెండోమార్గం ఎక్కువ ప్రయోజనకరం. సుబ్బమ్మగారు ఈ శతకంలో మొదటి మార్గంలో కొన్ని ముక్త కాలు రాసినా, రెండో మార్గం మీద ఎక్కువ కేంద్రీకరణ చేసినట్లు కనిపిస్తుంది 'ఇలాచెయ్యి' అని చెప్పేదానికి ఆచరణలో నూటికి నూరుపాళ్ళ తత్వం ఉండకపోవచ్చు. కాని “ఇలాచెయ్యద్దు అనేదానికి ఒక్కటే తత్వం ఉంటుంది. “పేమగా ఉండు” అనేదానికంటె, “ఎప్పుడూ
0/ ద్వేషించకు” అనేదానిలో ఎక్కువ ఆచరణసాధ్యత ఉంది. అంతేగాక చెయ్యకూడని వాటిని చెప్పడానికి, కవికి ఎక్కువ లోకావగాహన అవసరం. బహుశః అందుకే సుబ్బమ్మగారు ఈ మార్గం వైపు ఎక్కువగా మొగ్గుచూపారు. ఉదాహరణకి
“అభాసుపాలు కావొద్దు ఏ విషయంలోనైనా అభాసుపాలు చెయ్యాలని అనుకోకు ఎవరివిషయంలోనైనా అభాగ్యులంతా ఎప్పుడో ఒకప్పుడు మోసపోయినవాళ్లే అభాసుపాలైన వాళ్ళంతా నిరాశ చెందిన వాళ్ళే ఒక విషయంలోనైనా' చివరి రెండుపాదాలూ చెప్పడానికి ఎక్కువ అవగాహన కావాలనేది పై ముక్త కంలో స్పష్టమైన విషయం. 3 నుబ్బమ్మగారి కవితలు అలోచనమీదనించి వచ్చినని కావు, అనుభవంలోనించి వచ్చినవి; పాండిత్యంలోంచి వచ్చినవికావు, ప్రజాజీవితంలోంచి వచ్చినవి. అందకే ప్రజల్లోకి పోయే లక్షణం. వీటిలో నిండుగా ఉంది. “అవ్వనుండి రెండుతరాల జీవితకథల్సి తెలుసుకో అవ్వనుండి పనిచేసే ఆలోచనను ఎలా నేర్చుకోవాల్మో తెలుసుకో అవ్వ తాతలిద్దరినీ బువ్వకోసం విడదీయొద్దు అవ్వ తాతలిద్దరిలోనూనీ గురించిన తపనే ఉంటుందని తెలుసుకో' భారత దేశంలోని కుటుంబ వ్యవస్థపట్ల ప్రగాఢమైన అనుభవం ఉంటేగాని పై కవిత వచ్చే అవకాశం లేదు. ఇలా ఈ అక్షరశతకంలోని అన్ని కవితలకూ కవయిత్రి స్వానుభవంగాని, ఇతరుల అనుభవాల్ని గమనించడంగాని, మూల కారణమనే విషయం సులభంగా గమనించగలం. ట్రీ దోర్హాదుల సుబ్బమ్మగారు జీవితమంతా మహిళా (పగతికోసం
కృషిచేసినవారు, చేస్తున్నవారు. మహిళలకు సంబంధించిన భావాల్ని చెవృడంలో అవెంలో నంన్కరణాబిలాష ఉందిగాని, అందరాని సిద్ధాంతాలులేవు. సమతూకమైైన అలోచనలు ఉన్నైగాని, కావాలని చెప్పే కృత్రిమ భావాలు లేవు. నిజమైన 'సేవాకార్యక్రమ ఆచరణలో ఉన్నవారికి, జీవితానుభవ అనుకూలమైన సిద్దాంతాలేవో, అనుభవ అతీతమైన సిద్ధాంతాలేవో సులభంగా తెలుస్తుంది. ఊహాస్వర్గాల్లో ఉండేవారి సిద్ధాంతాల్లో సమతూకం ఉండదు. సుబ్బమ్మగారి ఆలోచనలన్నీ ఆచరణాత్మకాలే. “ఆడవారి సహనం కాపురానికి నిండుదనం ఆడవారి సహకారం పనులన్నిటికీ నిండుదనం ఆడవారి మాటలేనని కొట్టెయ్యడం మూర్ధత్వం ఆడవారంటే సభ్యత సంస్కారాలు చూపడం మంచితనం'” సంసారంలో ఆలుమగల సామరస్యాన్నిగూర్చి సుబ్బమ్మగారు చాలా కవితలు రాశారు. ఇవన్నీ సంసారపు ఉదాత్తతను కాపాడుకోవడానికి సహకరించేవే. ఈ సందర్భంలో ఎన్నో లోతైన పరిశీలనలనుకూడా ఆమె వెలువరించారు. ఈ క్రింది కవితను చెప్పడానికి ఎంత సమతూకమైన ఆలోచన కావాలో గ్రహించవచ్చు. “ఇంతి సలహాను తోసివెయ్యకు ఇంతి మాటల్ని బట్టి నిర్ణయాలు తీసుకోకు ఇంతిని నిర్లక్ష్యం చేస్తే సంతృప్తికరం కాదు ఇంతిని లేనిపోని పనుల్లో బేజారు చేయకు” ఒక మహిళగా కవయిత్రి చెప్పేభావాలు ఎన్నో ప్రయోజనకరమైన ఆలోచనల్ని కలిగిస్తె. ర్ మనోలక్షణం గురించిన ప్రబోధాన్ని చెయ్యడానికి, ఇతరుల్ని లోతుగా పరిశీలిస్తేగాని సాధ్యంకాదు.. అటువంటి పరిశీలనతో చెప్పిన
౫/1] కవితలెన్నో ఈ అక్షరశతకంలో ఉన్నై. ఇవి, వ్యక్తిత్వవికాసం, అనే అంశానికి బాగా సహకరిస్తె. అయితే సుబ్బమ్మగారు ప్రబోధించే వ్యక్తిత్వ వికాసం స్వార్ధపూరితమైన సమకాలీన “పర్సనాలిటీ డెవలెప్మెంటు” కాదు. ఈ నేలకు సంబంధించిన మానవ సంబంధాల్త్లోని త్యాగబుద్దిపూర్వకమైనది.
“ఇష్టప్రకారం జరిగిందాన్నే సంతోషమనుకోకు
ఇష్టప్రకారమే జరగాలని ఎల్లప్పుడూ భావించకు
ఇష్టప్రకారం జరగాలనడం నియంతబుద్ధి
ఇష్టప్రకారంగా జరిగినా మంచి చెడ్డలు తెలుసుకోకుండా ఉండకు" 'పై పాదాల్ని నిత్యజీవితంలోని సందర్భాల్లో అన్వయించుకుంటే ఎంతో వ్యాఖ్యానం చేసే అవకాశం ఉంది. ఇలాటి భావాలన్నీ మనోగమనాన్ని బాగా అవగాహన చేసుకోవడంవల్ల వచ్చినవే. “అక్షరశతకం' లో ఇలాటి కవితలు అసంఖ్యాకంగా ఉన్నై
6
ముక్త కాలకు బాగా బలమిచ్చేవి సరైన పోలికలు. ఈ విషయంలో వేమన ప్రసిద్ది జగద్విఖ్యాతం. దోర్డ్నాదుల సుబ్బమ్మగారు ప్రతి ముక్తకంలోనూ ఈరీతిని అనుసరించకపోయినా మంచి పోలికలు చెప్పిన కవితలు భావానికి శక్తి నిస్తునై,
“ఇంజనులో అన్ని భాగాలున్నట్లే ఉండాలి శరీరంలో కూడా
ఇంజన్లో ఏ ఒక్క భాగం కొరవైతే అది వెలితికూడా
ఇంజన్లో భాగాలన్నీ సరిగా ఉంటేనే సక్రమంగా నడుస్తుంది
ఇంజను సమస్యను తీర్చీదిగా ఉండాలికూడా' ఈ అక్షరశతకంలో మన సమాజంలో అనుభవంలో చూసే అతి చిన్న విషయాలకు కూడా (ప్రాధాన్యమిచ్చారు. ఇది శతకంలోని వస్తు వైవిధ్యానికి తోడ్పడుతుంది. అలవాట్లగురించి, ఆరోగ్యం గురించి, వస్తు లక్షణాల్నిగూర్చి, ప్రకృతిగురించి - యిలా ఎన్నెన్నో సామాన్యాంశాలుండటం ఈ శతకంలోని
0/11 విషయ విసృతికి దోహదంచేస్తోంది. / ఈనాడు చైతన్యవంతమైన సాహిత్య సంచలనానికి పేరుపొందిన అతి కొద్ది జిల్లాల్లో నెల్లూరూజిల్త్లా (ప్రాముఖ్యం అందరిచేతా గుర్పింపబడింది. ఈ జిల్లానుండి విశిష్ట ముక్తక సంపుటి “అక్షర శతకం' తెస్తున్న దోర్నాదుల సుబ్బమ్మగార్ని అభినందిస్తున్నాను. అందరూ సౌలభ్యంతో చదవగల ఈ ప్రబోధ కవితలకు ప్రజల్లో మంచి ఆదరణ తప్పక లభిస్తుందని భావిస్తున్నాను. ఈ కవయిత్రికి అమ్మతనంమీద ఉన్న గౌరవం అపారమైనది. ఒక కవితలో అన్నారు “అమ్మను మించిన ప్రపంచం నాకొద్దు అమ్మను మించిన గ్రంథం ఏదీ వొద్దు అమ్మ కంటె ఎవరూ ఏదీ అవసరం కాదు అమ్మే సర్వకాల సర్వావస్థల్లో కావాలి..యింకేమీ ఒద్దు" ఇందులోని ప్రతి అక్షరాన్నీ సార్ధకంచేస్తూ, “అక్షర శతకం" తన అమ్మగారికి, ఎనఖైఏళ్ళ కుర్రా రాజమ్మగారికి అంకితంచేసి , తన రచనా జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు దోర్నాదుల నుబ్బమ్మగారు. అమ్మగురించి ఆమె తన ముందుమాటలో రాసిన ప్రత్యక్షరం ఆర్ధతాపరిపూర్ణమే. “అక్షరశతకంి అనే ఒక విభిన్న శతకాన్ని రాసిన సుబ్బమ్మగార్షి మరోసారి అభినందిస్తూ, యింకా ఎన్నో వెలువరించాలని అశిస్తున్నాను.
- అద్దేపల్లి రామమోహనరావు
సం (ప్రోత్సావాకర్తలు సహృదయ ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావుగారి కలం, అక్షరరక్రవుంలోని కవితల్ని చూసీ, నవరణలు చేని తెలుగులో రుబాయిల్లాగున్నాయంటూ ప్రత్యేకత నాపొదించినందుకు, పుస్తకరూపంలో వస్తే కొత్త ప్రక్రియ అవుతుందని అమూల్యమైన సూచనలిచ్చినందుకు ప్రధమంగా కృతజ్ఞతలు.
స్పందన కాగితం మీదకు చేరడం ఒక ఎత్తయితే, కాగితం మీదనుండి నల్గురి ముందుకూ రావడంీఎంతో అవసరం. అప్పుడే న్పందించినందుకు సరైన న్యాయం జరుగుతుంది. అక్రరక్రమంలో వున్న కవితల్ని చూసి, యీలా వ్రాయడంలో ప్రథములు మీరేనంటూ డా॥ సోమిరెడ్డి(పెళ్ళకూరు) జయప్రదగారు, తన దగ్గరకొచ్చిన "పేషంట్లను వైద్యేతర కోణాల్లోంచి పరిశీలించడం, ప్రశ్నించడం, విశ్లేషించడం, నిజాన్నిచూడ్డం నిర్మాణాత్మకమైన మంచి పనుల పట్ల, ఉత్సాహపరిచేక్రమంలో, వ్రాసిన వాటిని మూలనేవుంచొద్దని చెప్పి, వారి కళాత్మకహృదయానికి తార్కాణంగా నెల్లూరుజిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగావుంటూ నాకు పేరణనిచ్చి
పుస్తక ముద్రణకు పురమాయించినందుకు మనఃపూర్వక అభివందనాలు. సాటీ రచయిత్రి వేమిరెడ్డి పద్మావతిగారు, మేటి రచయిత్రి ప్రతిమ, ప్రముఖ రచయిత స్కైబాబాగార్లు అక్షరక్రమంలో “క్ష వరకూ ్రాసినవాటిలో కొన్నింటినైనా పుస్తకంగా రావడం బాగుంటుందన్నారు. చల్గుతూంటేనే చలమలో స్వచ్చమైన జలం యింకాయింకా ఊరుకుందని, కాబట్టి ఈ కవితల్ని వరుసగా అన్నీ రావాలని, సామాజిక స్పృహ కలిగిన రచనలను ఏర్చికూర్చాలనే ప్రయత్నంతో నెల్లూరుజిల్లా రచయితల సంఘం కార్యదర్శి అయిన శ్రీ పెరుగు రామకృష్ణగారికి
కళాభివందనాలు.
ఆకాశాన్నయినా అరచేతపట్టుకోవచ్చంటూ, తన ఆలోచన్లా మంచివైనా, చెడ్డవైనా నిష్కర్తగా చెప్పి తనను తాను సమీక్షించుకోగల్లిన దిట్ట, సెలయేటి గలగల్ని కలకలల్ని మనిషి మనసు లోతుల్ని చూడగల్లిన యువరచయిత, ఈ కోవలో వున్న
ల్రరలగురించి అభిప్రాయం యివ్వడానికి తనకలాంటి కవితల్లో ప్రవేశం లేదని నుతారంగా తొలిగినా, నా సందేహాల్ని నివృత్తి చేయడంలో, నా మనోభావాల్సి, ఆదర్నాల్ని చిత్రించడంలో కావల్సిన సమాచారాన్నందిస్తూనే, జీవితకాలం చాలా చిన్నది...ఎంతో విలువైంది...కాబట్ట్ అభిమతాల్ని గౌరవించి ఆశల్ని సఫలీకృతం జీసికొనే భాగంలో పుస్తకం త్వరగా శోభను సంతరించు కోవాలని, నా అభివృద్దిని కాంక్షిన్తూన్న ఆత్మీయుడుగా సోదరుడు ఖాదర్షరీఫ్కు ఈ నందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు! | కొత్త ప్రక్రియకు రూపం దిద్దుతున్నానని, ప్రశంశలందించి, అచ్చులో అందరికీ అందుబాటులో రావాలని పదేసదే ప్రోత్సాహాన్నిచ్చిన, ఎస్. శ్రీనివాసులురెడ్డి (విపో, నీన్సమ్స్ మేనేజరు) గారికి, ఆత్మీయతకు మరోపేరుగా తలుస్తూ కళాహృదయంతో ప్రముఖ చిత్రకారుడు “రవి'గారు అట్ట మీద అమర్చిన సరికొత్త ఆలోచనాత్మకంగా రూపాొందించినందుకు సంతృప్తికర అభినందనలు! అసౌకర్యం, ఆలస్యం జరక్కుండా పుస్తక ముద్రణలో త్వరితగతిన పనిపూర్తి చేసిన గౌరవనీయులు, పెద్దలు శ్రీనివాసప్రింటర్స్ అధినేత శ్రీనివాసరావుగారికి ప్రత్యేక “అభివందనాలు! వాస్తవ సంఘటనల స్ఫూర్తి కొంత, ఊహాప్రపంచపుసొంపు కొంత ఆసక్తిగా కలిపిందే ఈ పద సమూహం... నా లోపలి ఆలోచన్లతో నిరంతర యుద్ధమే ఈ విశేషాల మాలిక....! “అక్షరాల్లో జీవించు డ్రేమించు అక్షరాలు నిన్ను చిరంజీవిగావుంచు అక్షరబద్ధమైన వాటిని జాగ్రత్తగావుంచు అక్షరాల వచ్చే గౌరవమే అన్నిటినీమించు..” అని విశ్వసిస్తూ..నాకు ప్రోత్సాహాన్ని సహకారాన్నందించినవారందరికీ ప్రణామాలతో.... దోర్నాదుల నుబ్బమ్మ.
2061 మననునవున్న మరికొన్ని.....
ఆడవిల్ల చదువుకి ప్రాముఖ్యత యివ్వని రోజుల్లో... ఆత్మకూరునుండి నెల్లూరులో కాలేజీ చదువుకి పంపే ప్రయత్నంలో అమ్మ ఆరాధనీయమైందని తల్చుకొంటూ (ప్రేమిన్తుంటాను. ॥
నా భావాలను, పనులను సమర్శిస్తూ, సహకరిస్తూ, (ప్రోత్సహిస్తూ, అడుగు ముందుకువెయ్యడానికి, నిలబడడానికి కారకులైన నా భర్త నాకు గర్వకారణంగా భావిస్తుంటాను.
నా మనసులో మనసైవున్న నా పిల్లలు...ఒక మనుమడు, ఇద్దరు మనుమరాళ్ళు వొకర్షిమించి మరొకరు తెలివి తేటల్లో పోటీపడ్లూ అందిస్తున్న కబుర్లువింటూ, మురిసిపోతూ, వాళ్ళే రేపటి పునాదిరాళ్ళు, నా ఆశాదీపికలని విశ్వసిస్తుంటాను.
“అమ్మి తర్వాతనే నాకందరూ.... అని నా కొడుకు నోటివెంట ఒకవుడు విన్నమాటలు నా గుండెల్లో యింకేవిధమైన కోరికకు బోటివ్వకుండా సంతోషంతో నిండిపోవడం మర్చిపోలేను.
మంచితనాన్ని అర్ధం చేసికోని మనుష్యులకోనం నువ్వేమో కష్టపడొద్దు. నువ్వు వశాంతంగావుండాలి. నీక్కావల్సిన వాటన్నిటికీ నేనున్నాను అంటూన్న కూతురు మాటలు వదేవదే గుర్హొన్తూ సంతృప్తినిస్తుంటాయి. తన వారికి తను బాధ్యత తీసుకొంటుంది.
రోజుకో వెయ్యి రూపాయలు సంపాదిస్తానిప్పుడు. ఎందుకో తెల్సా... నీకు ఫైట్ టిక్కెట్టు తీసి పంపుతాను....యిక్కడే వుండిపోవచ్చు..అని ఫోన్లో ముద్దుముద్దుగా పల్కిన మనుమరాలు “సాహితి మాటలు మధురస్కృకుటై నాశరీరానికి వృద్ధాప్యం వొచ్చినా...నాకు చురుకుదనాన్నే యిస్తుంటాయి.
నా! ముఖ్యంగా నేనంటే ఎంతోటప్రేమ, గౌరవం, వినయంతో, తల్లి తర్వాత స్థానాన్ని నాకిచ్చి మసలుకోనే నా తోబుట్టువులు నవరత్నాలు. అభిమానధనులు. సున్నిత మనస్కులు. నా శరీరంలో వొక్కోభాగంగా వొక్కొక్కరు నిళ్చిపోయి వున్నారు. ఒక్కొక్కరి గురించి వొకటిరెండు మాటలు ఇ ప్పాలన్పిస్తోంది.
నా తర్వాత మొదటి చెల్లెలు శేషమ్మ సాగరాన్ని ఈదగల శక్తి తనకుందని నిశ్చలమైన స్వభావంతో కాలాన్ని గడుపుతూవుంది. పి.యు.సి. తర్వాత హెల్త్ విజిటర్కోర్సు చేసింది.
మొదటి తమ్ముడు నారాయణరెడ్డి బి.వి.ఎస్సి. వెటర్నరీ డాక్టరుగా రివైరైనాడు. ఇద్దరాడపిల్లల తర్వాత మగపిల్లాడు పుట్టాడని ఇల్లంతా సంబరం నిండుకొంది ఆ పుట్టుకతో. ఏకసంతాగ్రాహి. ప్రతిరోజూ పది కథలు వ్రాయగల విజ్ఞానఖని. అతనో మేధావి. ఆ మేధస్సు లోకానికి బహిర్గతం కాబోతున్న తరుణంలో విధి వక్రించి మామూలు మనిషిగా మిగిబ్చి వాదిలింది.
రెండో తమ్ముడు హరనాథ్‌రెడ్డి బి.ఎన్. సి, ఎల్, సి. ఇ. హరనాథ్‌బాబా భజన చేస్తున్నందువల్ల ఆ తేజస్సు, పోలికలతో పుట్టాడంటూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళు పండోడా అని పిలున్తుంటే, వురికొందరు కూడా అలాగే ఏలిచేవారు. చదువులో, ఆటల్లో 'ప్రధముడుగావుంటూ పరీక్షల సమయంలోకూడా పరోపకార బుద్ధితో పక్క పిల్లలకు పరీక్ష "పేపరు న్రాసిచ్చి తను వెనుకబడేవాడని చదువుచెప్పిన గురువు బాధపడేవారు. అదృష్టాన్ని కోల్పోయి, బ్రతుకుదెరువుకోసం ఎంషాయ్మెంట్ ఎక్చేంజ్ గుమాస్తాగా ఉద్యోగంచేస్తూ, సెలవుపెట్టి వ్యాపారాలుచేన్తూ యిప్పటికీ ఆశించిన స్థానం అందుకోలేక పట్టు పదలని ప్రయత్నాల మధ్య వుంటున్న పరిస్థితి...జీవితంపట్ల నమ్మకం, ఆశావహం కల్గిన దృఢచిత్తం.
మూడవ తమ్ముడు కృష్ణారెడ్డి బి.ఎస్సి.బి.యిడి. టీచరు, 'హెడ్మాష్టరుగా విద్యార్థులు మర్చిపోలేని రీతిలో బోధిస్తూ ఆత్మీయత, స్వచ్ళత నింపుకొని, అందరి మనిషి, అందరికీ మనిషి అని అన్పించు కొంటూ, విధి వైపరీత్యంతో కాలచక్రం అనారోగ్య నెపంతో, తోక్కేసినందువల్ల కీర్తిశేషుడై పూరింపలేని లోటు మిగిల్బాడు.
రెండో చెల్లెలు “గిరిజ ఇంటర్మీడియట్, భర్తననుసరిస్తూ, భర్తకోసం జీవించడమే పరమావధిగా భావించే మనస్సుకల మహోన్నతురాలు.
మూడో చెల్లెలు “విజయ' బి.ఎ.బి.యిడి. ఉద్యోగధర్మాన్ని నిర్వర్తిన్తూ, హెడ్మిష్టన్గా విద్యార్థులవట్ల మరింత శ్రద్ధానక్తులు కల్గివుండడమేకాక, అమ్మపెద్దకొడుకు దగ్గరవుండిపోవల్సిన సమయాల్లా, అమ్మమ్మ మంచంమీద నుండి లేవలేక పోయి వుంటే, అన్నీ తానై కుటుంబ బాధ్యత, బరువు మోస్తూ తన తర్వాత ముగ్గురి తమ్ముళ్లకూ అమ్మ ప్రేమను పంచిస్తూ వారి బాగోగులు చూస్తూ సంసారాన్ని తన భుజాలకెత్తుకున్న నవుర్శవంతురాలు. నాల్గవ తవ్య్ముడం వయర ళీకృష్ణా రెడ్మీ బి.కామ్.,ఎ.సి.ఎస్,డబ్లియు. ఏ సమస్యలైనా అవలిలగా దాటగలిగే నేర్చు, ఓర్చు, సాహసంకల మనస్తత్వం, హైదరాబాదు రెడ్డీల్యాబ్స్లో డిప్యూటీ జనరల్ మేనేజరుగా వుంటున్నాడు.
ఐదవ తమ్ముడు రాజశేఖర్‌రెడ్డి ఎ.ఎమ్.ఐ.ఇ. సకాలంలో పూర్తిచేసి, తన ధ్యేయాన్ని చేరుకొని, నీతి, నిజాయితీతో వృత్తినెపుణ్యంకల్లి ఆత్మసంతృప్తి వట్ల అభివూనం పెంచుకొన్న నంస్కారి. ఆరవ తవ్ముడు విజయరామరాజేశ్వర్ రెడ్డి ఎమ్.ఎ. పాలిటిక్స్ చదివి కంప్యూటర్ కోర్సు చేసి, నెల్లూరు రత్నం కాలేజీలో కంప్యూటర్ క్లాసులు తీసుకొంటూ, భవిష్యత్తుకి ఆశాజనకమైన ప్రణాళికల్ని జతపరిచేప్రయత్స్నంలో వున్నాడు.
(౪
జీవితంలో అప్పుడప్పుడు..అనారోగ్యం, నిర్లిప్తత చోటుచేసుకొన్నా నాలో ఊపిరి పోనుకొన్న నా పిల్లలిద్దరితోబాటు నా తోబుట్టవుల మాననీయత, మానవీయత, కలసి నాకు మానసిక సౌందర్యాన్ని, ధైర్యాన్ని యిచ్చి, నా అలసత్వాన్ని తరిమేసి చక్కటి ఆలోచన్లు అందించి ఎందుకు ఎలా దేన్ని వ్రాయాల్నో తెల్పుతుంటాయి.
స్త్రీలపట్ల విశాలమైన మనసులో వున్న నా ఊహాచిత్రాలు గొప్పగా ప్రాణం పోసుకొని నా ముందుకు రావాలని నిరీక్షిస్తూ, నేనొకపరి కొత్త అధ్యాయంగా అన్పించాలనే కోరికతో ఆశపడ్డూ...సోదరీమణుల జీవితాలు సంఘర్షణపాలు కాకూడదని, దగాకు గురికారూడదని, అణగారినతనం పోయి, స్వేచ్చగా, స్వచ్చంగా, జీవితమాధుర్యపు సంకేతాలుగా నిలవాలని ఆకాంక్షిస్తూ... ఆహ్వానిస్తూ... విశ్వసిస్తూ... (పేమిస్తూ..సూర్వ్యుణ్లి సుతారంగా నిద్రలేపుతున్న తూర్చుకీ..అటాడి ఆటాడి అలసి పోయి విజయగర్వంతో వెళ్తున్న పశ్చిమకాంతులికీ, ముగ్ధమనోహరాలను, ముద్దు మురిపాలను దాటివచ్చిన అరవైమూడు పసంతాలు..మరో నాల్గు కాలాలపాటు నాపై అమృతవర్షిణి కురిపించగలదని నమ్ముతున్నా...
-దోర్నాదుల నుబ్బమ్మ.
అమ్మ... అమ్మ... అనిర్వ్భచనీయం ... అసమాన మాననీయం ... అమ్మొక మధుర స్వప్పం ... కాదుకాదు మధురాతి మధురమైన వాస్తవరూవం ఏ జాతి అయినా ... ఏ మతం అయినా అమ్మమనసు ఒకటే ... జీవిత పుస్తకంలో అమ్మ అధ్యాయం ఒక్కటే మిన్న ... ! తానుచనిపోయినా బిడ్డ వాంటరికాకూడదని ... కిరోసిన్‌పోసి తగలెట్టిన మొగుణ్ణి క్షమించి, మరణవాజ్మూలంలో తనదే పారపాటంటుంది ... భార్యగా ఆనందతరంగాలలో తన్మయం కావడంకంటే .. అమ్మగా మారిన క్షణాలతోనే తరించాలనుకొంటుంది ... ! ఒంటరితనంతో రోదిన్తున్న అమ్మనుచూసి మౌనంవహించినా మాటల్ని తూటాలుచేసి వాదిలినా ... నువ్ నన్నడిగి కన్నావా ...? నువ్ లేకుంటే దేశం తల్లకిందులు కాదులే అన్నా ... అన్నీ నేరాలే ... బిడ్డకోసం నోచిన నోములమభధ్య కడదాకా అమ్మా అనే పిలుపు, ఆప్యాయతలకోసం నిరీక్షణమధ్య విధ్వంసం మొదలెట్టకు ... విభేదాలు రానీయకు ., బాధలు వస్తే మదర్స్‌డే తలొంచుకొని, తల్లడిల్లుతుంది ... క్షమించండి ... నాదొక చిన్నసందేహం ... స్వచ్చమైన అమ్మతనాన్ని కావాలనేనా ఈ సంబర సన్నాహాలు? ఖచ్చితంగా అదే నిజమైవుంటే అంతకంటె కావల్సిందేమా లేదు ... అమ్మతనం నింపుకొన్న కమ్మదనం కంటె కమ్మదనం ఏముంటుంది? అమ్మే బిడ్డకు ఊపిరి ...బిడ్డే అమ్మకు ఊపిరి ... అనుబంధాలన్నిటినీ మించిన అనుబంధం అది ... ! అమ్మజ్ఞాపకాలే విలువైన జ్ఞాపికలు... అమ్మే దీపిక కరదీపిక ... అమ్మతోనే తీపి కలయికని తెలుసుకోవడమే అమ్మలదినవు విశిష్టత ... ! అలా నడుచుకొంటానని ప్రతిజ్ఞ చేసిన బిడ్డను చూస్ ... అమ్మ తరిస్తుంది ... ! అంతకంటె మించిన వరమెందుకు అమ్మకి? బిడ్డ అకాలమరణం లేకుండా ... సంతోషంగా వుండడమే గొప్పవరం .. అమ్మకి! అమ్మకేదీ సాటికాలేదు ... రాబేదు ... ఏ నాటికైనా అమ్మకు అమ్మే సాటి ... ఏనాటికైనా... అమ్మకు అమ్మే సాటి ఎప్పటికీ ... ఎక్కడైనా ...
(౧4౦౫4525 తరి అమ్మల దినం అమ్మను విస్మరించక , స్మరించాలనే పవిత్రీకరణకు 'నాంది' అమ్మలదినం... అమ్మ సామ్రాజ్యంలో అంతరాలుండవు.... చెడుని నియంత్రించి, మంచిని మంత్రించడం అమలౌతుంటుందక్కడ అమ్మకు సరితూగే మమకారం ఏదీలేదు ... అమ్మ మనసుని తూచే ఏ పరికమూలేదు... అమ్మొక జీవన జీవవాహిని ... అమృత కలశం ... అద్భుత దీపం ... అమ్మ వొడిలో ఆనందానికి, అమ్మ చూపుల్లో చల్లదనానికి వెలలేదు ... కంటికి కనురెప్పలాంటిది అమ్మే... ఉచ్చ్వాస నిశ్వాసాలూ అమ్మే... బిడ్డ సుఖంకోసం నిరంతరం పన్టేసే ఆలోచనల యంత్రంగా... బిడ్డకు అకృతినిచ్చి ఊపిరిపోసే శరీర నిర్మాతగా ... చిడ్డనుండి ప్రతిఫలాన్నాశించని నిస్వార్ధ జీవిగా ... బిడ్డ శరీరంలో మురికిని తొలగిస్తూ, మురిపాలుచూస్తూ మురిసే మూర్తిగా ... బిడ్డలో భయాన్ని పోగొట్టి అభయాన్నిచ్చే ధైర్యశాలిగా బిడ్డకోసం సర్వస్వం త్యాగం చేసే త్యాగళీలిగా ... బిడ్డ మహనీయంగా ... మాననీయంగా వుండాలనే అభిమానధనురాలిగా.. పదొల్లో అక్షరంలా ... అక్షరాల్లో పదంగా ... తన ఉనికిని చాటే ఏకైక వ్యక్తి అమ్మే... ! అమ్మ అనుభూతుల్ని పంచుకొంటూ... అమ్మ కనుసన్నల్లో పెరుగుతూ... అమ్మను పర్యవేక్షిస్తూ , పరిరక్షించడంలో , కృతజ్ఞత తీర్చుకొంటూ, కృతార్ధత పొందడంలో, నిండిన గొప్ప తృప్తి = మరెందులోనూ లేదు ... ఈ సత్యాన్ని గుర్తించినవారే ధన్యులు ... నీకై శ్రమించే మాతృమూర్తి అపూర్వమని, ఆరాధనీయమని చాటిచెప్పే అమ్మలదినాన్ని శ్లాఘిస్తూ మహిళోన్నతికి శంఖారావాన్ని చూసి, విని సంతోషిస్తూ ... హారతులిస్తున్నా ... అమ్మ మనసు చొస్పించనని మాట యివ్వాడమే అమ్మలదినపు పరమార్ధం ... ప్రాముఖ్మం ...
[1 అక్షరశతకం
-
అంకమ్మ దేవతని రావిచెట్టుకి నైవేద్యం పెట్తారు అంకమ్మనే మనిషి, ఆకలైందని అన్నమడిగితే నెట్తారు అంకమ్మేకాదు మరేదేవతైనా సాటివారి నాదుకోవద్దని చెప్పరు అంకమ్మకు మంచి అర్ధాన్నిచ్చే పేర్లన్నీ ఆమెవేనని చెప్తారు
-
అంకితం చేసుకో సత్కాలక్షేపాలతో నీ జీవితాన్ని అంకితంచెయ్యి సత్కార్యాలు చేస్తున్నవారికే నీ పుస్తకాన్ని అంకితమివ్వడం నీ అభిమానానికి చిహ్నం అంకితభావం వున్నపుడే రాణిస్తుంది చేస్తున్నపని
3౩ అంగట్లో సరుకులన్నీ అనుభవించాలని తలంచకు అంగట్లో సరుకులన్నిటినీ అంచనాలేకుండా అమ్మకు అంగడి సరకులా మనుషుల్ని తలంచకిన్నడూ అంగట్లో సరకుల్నేవుంచు జీవితాన్నుంచకు
- అంచెలంచెలుగా ఎదగడం ఆలస్యమని త్వరపడిచేయకు అంచెలంచెలుగా ఎదిగినవారిని చులకనగా భావించకు అంచెలంచెలుగా ఎదగడంలోనే కష్టసఖాల నిలువ తెలుస్తుంది అంచెలంచెలుగా నీవు ఎదిగినసంగతి ఎల్లవేళలా మరచిపోకు
దోర్నాదుల సుబ్బమ్మ బై 5. అంజలి ఘటించు దైవత్వం సాధించిన వారికన్నడైనా అంజలి, ఘటించినంతమాత్రాన చులకనైపోవెన్నడైనా అంజలి ఘటించడంలో నీ సాధుత్వాన్ని పొందుపర్చు అంజలి ఘటించే తీరే తెల్చుతుంది నీ గుణాన్ని ఎన్నడైనా 6. అంటగట్టకు అమాయకులకు అపవాదులను అంటగట్టకు ప్రయోజనంలేని వస్తువులను అంటుకొంటూ తిరగకు కొత్తమనిషి పొందుకోసం అంటుకోకుండా మెలుగు కొత్తకొత్త రోగాలను 7. _అండగావుండు వాంటరిగా బాధపడేవారికి అండగావుంటూన్నట్టనిపిస్తూ ఆస్తికి ఎసరుపెట్టకెవ్వరికీ అండగావుండేవారు స్వార్ధరహితులైతేనే హితం కల్గుతుంది అండగావుంటున్నానని దండగమారిన పనులంటగట్టకెవ్వరికీ 8. అంతంచేస్తానని బెదిరించడంలో గొప్పరాదు అంతంచెయ్యడంలో సమస్య పరిష్కారం కారాదు అంతం అనేది క్రూరత్వానికే జరగాలని వాంఛించు అంతం మనిషిపట్ల జరిగితే హంతకులనే పేరు పోదు 9. అంతరాత్మను కాదని చేసేపని మంచి ఫలితాన్నివ్వదు అంతరాత్మ ఏకీభవించేపనే మంచి ఫలితాన్నివ్వగలదు అంతరార్థాలతో జీవితాలు తారుమారౌతుంటాయి వొక్కోసారి అంతర్జానాన్ని మహత్యంగా భావించవలదు
అక్షర శతకం 3 10. అంతరాలు అంతరాత్మకు వుండవు అంతస్తులు మాటలలో వుండగలవు అంతరిక్షంలోనే ఖగోళశాస్త్రవేత్త ప్రయోగాలన్నీ అంతర్మధనమే అంతర్భూతాలుకాగలవు 11. అంతకరణాన్ని మించిన సాక్షిలేదు అంతఃపురంలో స్వేచ్చకు దారిలేదు అంతంతమాత్రంగావున్న ఆరోగ్యంలో తప్పక థద్ధవహించు అంతంలేని ఆనందం రావాలనుకొంటేనే రాదు శ అంతరాత్మ స్థిరత్వమే మనిషికి బొన్నత్యం అంతరాత్మే నిజమైన న్యాయస్థానం అంతరాత్మలో నిజాయితీ గొప్పదైవుంటుంది అంతరాత్మలో చోటు చేసుకోలేదు మాలిన్యం 13. అందరికీ కూడా గుడ్డా కావాలనేది అసలైన రాజకీయం అందరిదీ తానే మూటగట్టుకోవాలనేది మోసపురొజకీయం అందరికీ తెలుసు స్వచ్భమైనరాజకీయం కరువైందిప్పుడని అందరూ కలిసి తుచ్ళమైన రాజకీయాల్ని తరిమెయ్యడం ముఖ్యం 14. అందమైన పేరు పెట్టుకోవడమేనా అందం ? అందమైన పేరు తెచ్చుకోవడమే అందం అందమనేది మనిషిలోనేగాదు చూడాల్సింది అందం మనసుక్కుడా వుంటేనే నిజమైన అందం
శ దోరాదుల సుబ్బమ్మ 15. అందరిలో (ప్రేమను నింపాలనుకోవడం అత్యాశకాదు అందరి(పేమను పొందాలనుకోవడం అభ్యాసంచేస్తే అసాధ్యం కాదు అందరికీ గ్రేమను పంచివ్వాలనడం అతిప్రయాస అందరినీ క్షేమంగా వుంచాలనుకోవడం అతిప్రయాసేకాని మరోటికాదు 16. అందరి శ్రేయస్సుని కాంక్షిస్తారు వివేకులు అందరి శ్రేయస్సుని భక్షిస్తారు అవివేకులు అన్ని ఖనిజాలు ఐశ్వర్యాన్నివ్వలేవు అన్ని రుచులూ అందరికీ యిష్టంకావు అవి భిన్నరీతులు 17. అందరినీ మర్యాదగా పిలవడం అలవాటుచేసుకో అందరితో మర్యాదగామెలగడం ముఖ్యమని తెల్సుకో అది.. యిది.. అంటూ పిలవడం చులకన అది.. యిచ్చిపుచ్చుకోవడం తెలీని మూర్చుడంటారని తెల్ఫుకో 18. అందరిముందూ తమాషాలు చేసి చూపించు ఫర్వాలేదు అందరిచేతా తమాషాలపొలుగాకు మర్యాదకాదు అందరిలో నగ్నంగా కన్చించాలనడం నాగరికంకాదు అందరినీ చీదరించుకొంటూ నువ్వే గొప్పనుకోవడం మానవత్వంకాదు 19. అందంతోనే పేరు ప్రతిష్టలొస్తాయని భావించకు అందంతో అణకువను జోడించు గర్వాన్ని 'పెంచకు అందరికీ ప్రేమను సంచడం మానవత్వం అందంకోసం ఆత్మాభిమానాన్ని జారవిడుచుకోకు
అక్షర శతకం క్ 20. అందంగా లేని వారంటే ఏహ్యభావం సెంచుకోకు అందాన్ననుభవించేందుకు అడ్డదారులు తొక్కబోకు అందరూ(పేమించేలా మెలగడం సాధుత్వం అందమంటే బాహ్యసౌందర్యమని భావించబోకు 21. అందంగా జీవితాన్ని వుంచుకో అందంగా అభిమానాన్ని పెంచుకో అందంగా మాట్టాడ్డంకూడా కళ! అందమే అనందం.. జీవిత మకరందంగా మల్చుకో 22. అందమైన అలోచన్లు జీవితానికి అందం అందమైన సులోచనాలు కళ్ళకు అందం అందలం కోసం అభిమానాన్ని చంపుకోవద్దు అందలంకోసం అభిమానులతో ప్రయత్స్నించేదే అందం 23. అందే పండుకోసమే ఎగిరగిరిపడు అందుత్తుందోలేదో ముందుగానే చూడు అందనిపండుకోసం ప్రయత్నించడం వ్యర్థం అందరి సంబరం పండుగనాడు చూడు 24. అంధునికి పగలైనా చీకటైనా వొక్కటే అంధకారం, పగలు కానేకావు వొక్కటి అంధుల్లోను మేధావులుంటారు అంధత్వం చేరలేని వాటిలో బంధుత్వం వొకటి
6 దోర్నాదుల సుబ్బమ్మ 25. అంపశయ్యను కావాలని కోరుకోరెవ్వరూ అంపశయ్యమీద సుఖపడలేరెవ్వరూ అంపశయ్య భరించలేని బాధాభరితమైనది అంపశయ్య మీద పరుండడమే పాపానికి శిక్షని తలుస్తారందరూ 26. అంబుధిలో నిధులకోసం ఆశల్ని పెంచబోకు అంబుధిలో నిధులన్నీ సుడిగాలితో వస్తాయని భ్రమించకు అంబలినైనా సంబరంగా తాగి తృప్తిపడు అంబలి తాగుతూనే మీసం మెలిదిప్పే పనులు చేయబోకు 27. అక్కరలేనిదాన్ని దాచాలనుకోకు అక్కరకు పనికొస్తున్నదాన్ని విసిరి కొట్టకు అక్కర గమనించి ఆదుకొన్నవాడే ఆత్మీయుడు అక్కర్లేదని యిరుగూపారుగుతో పోరు పెట్టుకోకు 28. అక్కరకు ఆదుకొననివాడు ఆప్పుడు కాలేడు అక్కర గమనించి తీర్చేవాడే ఆప్పుడు కాగలడు అక్కరలేదని యిరుగుపారుగువారిని నిర్లక్ష్యంగాచూడకు అక్కరతీరుస్తున్నా లెక్కలో నిక్కచ్చిగా వుంటే ఘనుడుగా మనగలడు 29. అకచాట్లు కొన్నివేళల్లో అందరికీ సహజం అకచాట్లు తీరాలని ఆలోచించడం తెలివైనవాని నైజం అకచాట్లు తీర్తాయని అడ్డమైనగడ్డి తినకు అకచాట్టు ముందుగా తెలిసిరావనేది నిజం
అక్తర శతకం 7 30. అఖండ కీర్తిని వాంఛించవచ్చు అఖండ కీర్తి కోసం అవసరమైంది చెయ్యొచ్చు అఖండ కీర్తి మాటల్లో వచ్చేది కాదు అఖండుల్ని అసాధ్యులనవచ్చు 31. అఖండజ్యోతి సూర్యుడొక్కడేనని చెప్పవచ్చు అఖండజ్యోతికి సమానమైంది భూమ్మీద లేదనిచెప్పవచ్చు అఖండఖ్యాతి ఒక్కరిస్తేనే వచ్చేది కాదు అఖండఖ్యాతికోసం అహన్నీశలూ శ్రమించమని చాటవచ్చు 32. అగ్నికి ఆజ్యాన్ని జోడించడమే భక్తి అనుకోకు అగ్నితో వ్యాజ్యాలను నివారించడం విముక్తి అనుకోకు అగ్గిమీద గుగ్గిలంలా మాటాడ్డం ఎవరూ మెచ్చరు అగ్నికి ఆహుతి అయితే సమస్య తీరుతుందనుకోకు 33. అఘాయిత్యం న్యాయబద్ధం కాదు అఘాయిత్యానికి పూనుకోవడం ఘనత కాదు అఘాయిత్యం చెయ్యకు ఆకతాయితనంతోనైనా అఘాయిత్యంతో కూడింది పరిష్కారం కాదు 34. అఘాయిత్యానికి పూనుకోవడం ఘనతకాదు అఘాయిత్యానికి గురైన స్రీ తప్పుమనిషి కాదు అఘాయిత్యం జరిపినంతమాత్రాన అనురాగం పొందలేవు అఘాయిత్యం చేసేప్పుడు వివేకం, విచక్షణ ముందుకు రాదు
ర దోర్నాదుల సుబ్బమ్మ 35. అజ్ఞానం ఎప్పుడూ రాణించలేదు అజ్ఞానం. ఎక్కడోవాకసారైనా మంచిపనికి దారివ్వలేదు అజ్ఞానమే అనర్భాలన్నిటికీ మూలం అజ్ఞానాన్ని కప్పిపుచ్చడం ఎంతోకాలం సాధ్యంకాదు 36. అచ్చుగుద్దినట్టన్న వ్రాత అందం అచ్చు నీ పోలికేననడం ఓరకమైన గొప్పదనం అచ్చుతప్పులుంటే అర్భాలు తారుమారౌతాయి అచ్చులు, హల్గులనేవి అక్షరాల్లో విభాగం 37. అచంచలమైన దీక్ష త్యాగ్గాన్నిస్తుంది అచంచలమైన కక్ష మంచిని మింగేస్తుంది అచంచలత్వం భవనాలకే కాదు మంచి భావనల్గోకూడావుండాలి అచంచలత్వానికి ధ్యేయం, త్యాగం కలిస్తే కీర్తివస్తుంది 38. అజరామరమైన పనిని తలపెట్టు అజరామరమైన మంచి పేరుని చేపట్ట అజరామరమైన కీర్తికోసం సాధనాన్ని ముందుగా ఎన్నుకో అజరామరమైన కీర్తితో వెల్గొందాలని పట్టుబట్టు 39. అట్టహాసం కోసం అప్పుల్లో మునిగిపోకు అట్టహాసంతోనే గొప్పలొస్తాయని అనుకోకు అట్టడుగు ప్రజల్ని ఆదుకొనే ఆలోచన చెయ్యి అట్టడుగు ప్రజల్గోనే అభిమానమెక్కువని మరువకు
అక్షర శతకం రి
-
అడవికాచిన వెన్నెల కానీయకు జీవితాన్ని అడవినకాచిన కాయలైనా తలపిస్తాయి ఆహారాన్ని అడవి కూరమృగాలకు నెలవై వుంటుంది అడవి యిస్తుంది ఆరోగ్యాన్ని కాపాడే మూలికల్ని.
-
అడుగులో అడుగువేసే మనిషి మమకారాన్ని వాదులుకోకు అడుగుకు చేరిన మలినాలను కలియపెట్టి కదలనీయకు అడుగుతప్పిన జీవితాన్ని తిరిగి తీసుకోవడం సులభంకాదు అడుసు తొక్కిన కాలును అలాగే వుంచాలనుకోకు
తై అడుగడుగునా కుతంత్రాలుపన్నే అలవాటుమానుకో అడుక్కుతిన్నప్పుడే ఆత్మాభిమానం చస్తుందని తెలుసుకో అడుగవచ్చు అసద తెల్చి ఎవ్వరినైనా సహాయంకోసం అడుక్కుతిని బతుకుతూనే డాబులు చెప్పడం మానుకో
- అడిగిన వెంటనే అప్పు తీర్చడం మంచి అలవాటు అడుగుతున్నా విన్సించుకోకపోవడం దురలవాటు
అడిగింది అనుకూలిస్తేనే అదృష్టముంటారు
అడుగడుక్కీ లాభాల్నే అంచనావెయ్యడం కాదు మంచి అలవాటు 44. అడ్డదిడ్డంగా నోటికొచ్చినట్టు మాట్లాడ్డం శ్రేయస్కరం కాదు
అడ్డదిడ్డంగా బిడ్డల్ని పెంచడం 'పెంపకమే కాదు
అడ్డంగా తిరిగి బిడ్డ చనిపోవడం దురదృష్టకరం
అడ్డదిడ్డంగా చేసే పనులకి న్యాయం సహకార మందివ్వలేదు
దోర్నాదుల సుబ్బమ్మ 10 45. అడ్డుతగలకు ప్రగతి నిర్మాణ సౌధాలకు అడ్డుతగులు ప్రగతి నిర్మూలన కార్యాలకు అడ్డుతగలడమే బలమని భావించవద్దు అడ్డుచెప్పే ప్రక్రియవుంది అప్టావధానంలో పలుకులకు 46. అడపాదడపానైనా అబద్దాల జోలికెళ్ళకు అడపాదడపానైనా తప్పువైపు మళ్ళకు అడక్కుండానే ఆత్మీయులకైనా అన్నీ యిచ్చెయ్యొద్దు అడకత్తెరలో పోకలా అపోహలో నలగకు 47. అణకువ సాధుస్వభావుల అందం అణకువ మేధావులకు బంధం అణిచెయ్యడంలో పరాక్రమం ఉంటుంది అణిచెయ్యడం పాగరుబోతులపట్ల న్యాయం 48. అణువణువూ ప్రేమను నింపుకొనేముందు అణుమాత్రం, గుణాన్ని గురించి ఆలోచనచెయ్యి ముందు అణువంత పరమాణువంతని విషయాలను తోసిపుచ్చకు అణువులు పరమాణువులవల్లే బాంబు తయారైందని తెల్పుకోముందు 49. అణువణువూ నిండివంటుంది అసలైన[గ్రేమ అణువణువూ విశ్వసిస్తుంది నిజమైన ప్రేమ అణువు, పరమాణువులతో విశ్వమంతా నిండివుంటుంది అణుమాత్రం అభిమానంవుంటే మొదలౌతుంది ప్రేమ
అక్రర శతకం 11 50. అత్తగారికి అనుకూలత కాపురానికి కాంతి అత్తగారి విముఖత యివ్వదు మనశ్శాంతి అత్తింట్లో అడుగుపెట్లూనే అధికారం కోరకూడదు అత్తింటిమీద గొప్ప ఆశలు పెట్టుకోవడం భ్రాంతి 51. అతిగా మాట్టాడ్డమే వాక్పటిమ కాదు అతిగా తిన్నందువల్లే బలంరాదు అళ్యున్నతి మంచిగా ప్రవర్తిస్తే వస్తుంది అత్యుత్తమ ఫలితం శ్రమపడకనే రాదు 52. అతికించగలవు పగిలిన పాత్రల్ని అతికించలేవు గుండె పగిలే చేతల్ని అళుకులేసే పనిలో తప్పదు జాగ్రత్త అతుకులో ఓర్చు, నేర్పుని బట్టే మునుపటిలా చేయగలవు పొత్రల్ని 53. అతిగా చూపకు నీ అభిమానాన్ని అతి నియమాలతో ఏడ్పించకు జీవనకాలాన్ని అతిగా ఆశల్ని పోనీయకు అతిక్రమించనీయకు నీ అనుమానాల్ని 54. అతికే అబద్దాలు చెప్పి పాడుచెయ్యకు బతుకుల్ని అతికేందుకు అవసరమైనవేచెప్పి బాగుచెయ్యి బతుకుల్ని అతికించడం అసాధ్యం విరిగిన మనసుని అకతికించగలవు నిజమైన పశ్చాత్తావంకళ్లిన మనసుల్ని
ః దోర్హాదుల సుబ్బమ్మ 55. అతిక్రమించనీయకు అతిసారాన్ని అతిగా మోయకు ఏ భారాన్నీ అతివేగంగా నడపకు ఏ వాహనమైనా అతి అలోచన్లు, ఆశలు తెస్తాయి ఎంతో భారాన్ని 56. అత్యంత సన్నిహితంగా అందరితోమెలగకు అత్యంత సున్నితంగా అందరినీ తలవకు అత్యవసర పరిస్థితిల్లోనే శత్రువునాదరించు అత్యవసర పరిస్థితుల్లోనైనా తనువప్పగించకు 57. అదేపనిగా అశుభాలు చెప్పకురా చేయకు అదేపనిగా ఎవ్వరినీ చూడకురా.. కలవకు అదేపనిగా చెప్పే నేరాలు వొక్కోసారి తిరగబడ్తాయి అదేపనిగా చేసే పనులక్కూడా అడ్డుతగుల్తుందని మరువకు 58. అదనపు బరువు శరీరానికి అనారోగ్యాన్నిస్తుంది అదనుచూసి మాట్టాడితేనే మాటకారిగా పేరొస్తుంది అదనపు శ్రమ చేయదగినంతే చేయి అదను చూసి వేసిన 'పైరే మంచి ఫలితాన్నిస్తుంది 59. అద్దంలో బొమ్మ ఎదురుగా ఏదివుంటే అదేగదా అద్దంలో బొమ్మ ఎప్పుడూ వొకదానికొకటిగా కన్చడదుగదా అద్దంలో ప్రతిబింబంలాంటిదే నిజం అద్దం పగలగొట్టినంత సులభంగా నిజాన్ని పడగొట్టడం జరిగేదా
అక్షర శతకం 13 60. అద్దంలా భావించు జీవిత భాగస్వామిని అద్దంలా భావించకపోతే బ్రతుకు వృధాయేను అద్దకం వేసిన గుడ్డలాగే మనను సమస్యల్ని తీసుకొంటుంది అద్దం పట్టగలదు అన్నివిషయాలనని తెలుసుకో అంతరాత్మేనని 51 అధరాలనుండి వచ్చే వాక్కే వుంటుంది సాక్ష్యాల్లో అధరాల్లో చోటిస్తారు అమృతానికి కవులు...కావ్యాల్లో అధములెప్పుడూ మంచిని జీర్ణంచేసుకోలేరు అధఃపాతాళానికి పక్కవారిని తొక్కాలనే వుంటుంది అధముల భావాల్లో ఈ2. అధికారం కొంతమందిని దూరంచేస్తుంది అహంకారాన్నిచ్చి అధికారం కొంతమందిని దగ్గరకుచేరుస్తుంది ఆదరాన్నిచ్చి అధికారం శాశ్వతమౌతుంది హితం, సన్నిహితం వున్నంతవరకు అధికారం పెంపుకు కృషిచెయ్యి యితరులకు గౌరవాన్నిచ్చి 63. అధికారదాహంతోనే అధికం కాలేవు అధికార వ్యామోహంతోనే అధికారివి కాలేవు అధికారం చేజిక్కించుకోవాలని కుయుక్తులు చేపట్టకు అధికారం చెలాయించి చెలరేగితే ఉద్యోగం నిలువుకోలేవు 64. అనుకరించినదాన్ని సొంతమని చెప్పకు _ అనుకరించింది అర్ధవంతమైనప్పుడు చెప్పుకో అనుకరించకు పులిని చూసి నక్కవాత పెట్టుకొన్నట్టు అనుకరించడం మాని స్వయంకృషికి పూనుకో
దోర్డాదుల సుబ్బమ్మ 114 65. అనుకొన్నవన్ని ఎవ్వరిపట్టా జరుగవు అనుకొనే కొన్ని అసత్యాలు దేన్నీ జరుగనీవు అనుకొన్నవి మంచివైతే ఆచరించడం తప్పుకాదు అనునిత్యపు ఆరాధనలు అన్యాయాల్ని జరగనీవు 66. అన్యాయాన్ని ఖండించు... అండగా నిలవొద్దు అన్యాయంతో, అమానుషాలతో ఏకీభవించొద్దు అన్యాయమౌతుంది ఎదుటివారి నోటిముందుది లాగడం అనుకోవమ్బీ మంచిని మంచిగా... మంచిని చెడుగా చెప్పాద్దు 67. అన్నగా అందరి మనసుల్లో స్థానంగొప్ప అన్నగా అందరి జీవితాల్లో ఉషస్సునింపడం గొప్ప అన్నగా పిలిపంచుకోవడమే ముఖ్యంకాదు అన్నగా ఆదరించి అభిమానించడం గొప్ప 68. అనురాగం ఉత్సాహాన్ని ఉత్పత్తి చేస్తుంది అనురాగాన్ని మించిందేదీ లేదనే భావన ఉరకలేస్తుంది అనుకూలంలేని పనికి పూనిక ఫలితాన్నివ్వదు అనురాగం హద్దుల్ఫో వున్నంతవరకే అందమొస్తుంది 69. అనుభవాల్ని భాషతెలిస్తేనే చెప్పుకో అనుభవాలనేవి అన్ని భాషల వారికుంటాయి తెల్సుకో అన్ని కులాలవారికీ అనువైంది అనుకూలమొక్కటే అన్ని కాలాల్లోనూ మారని కోరిక అదొక్కటే... దానినందుకో
అక్షర శతకం 15 70. అనుభవమనేది బెషధంలాంటిదే ఎప్పటికీ అనుభవమే బెషధం కాదు అన్నిటికీ అనునయించడంలో బాధలకు ఊరడింపు దొరుకుతుంది అనుకరించినదాన్ని సాంతమని చెప్పకు ఎన్నటికీ 71. అన్నిటికీ వొణికినట్టుండటం అతివినయం అన్నిటికీ వొణికిపోవడం అనారోగ్యానికి చిహ్నం అనుకోవచ్చు నీవెప్పుడైనా.. గొప్పగావుండాలని అనుకోకు నీవెన్నటికీ గోప్పవాడివికాలేనని.. అది నీకు పతనం 72. అపవాదులు పోగొట్టుకోవడం నేర్చు అపవాదుల్ని భరిస్తూండడం కాదు ఓర్చు అపభ్రంశంపాలు జేయకు జీవితాన్ని అపనమ్మకంతో జీవించాలనుకోవడం కాదు మంచి తీర్చు 73. అపకీర్తి వల్లనే అనర్థాలు. జరుగుతాయని తెలుసుకో అపకీర్తి రాకుండా నడుచుకోవాలని తెలునుకో అపనిందలతో అపజయాలు తోడౌతాయి అపనిందల్లో నిజం నిగూఢమైవుందని తెలుసుకో 74. అపనిందలు తొలగినప్పుడే నిజాలు బైటపడ్తాయి అపనిందలతో అపజయాలు తోడౌతాయి అపనిందలు నిప్పుకి నివురుకప్పడం వంటివే అపనిందలే కొన్ని నిజాల్ని బైటపెట్తానంటాయి
16 దోర్నాదుల సుబ్బమ్మ 75. అపస్వరాలు సంగీతానికి ఎబ్బెట్టు అపశకునాలకు కారణాల్ని చూపెట్టు అపవిత్రమనిపించుకోకు చేయరానిపని చేపట్టి అపవిత్ర అలవాట్లు జీవితానికి గొడ్డలిపెట్టు 76. అపకారం చేసేవారిని దూరంగావుంచు అపశకునాలనేవి మనసుకి దూరంగావుంచు అపశ్రుతులు సంగీతానికి సొంపునివ్వదు అపరబుద్ధిమంతులనైనా కాస్త దూరంగానే వుంచు. 77. అపరిమితమైన ఆనందానికైనా మంచిది హద్దు అపరిమితంగా ఆహారంతీసుకోవడం ముద్దుకాదు అపరిష్కృత సమస్యలతో కల్గుతుంది ముప్పు అపరిమిత సంభాషణవల్ల కీడుకల్లడం కద్దు 78. అపాయాన్ని ఉపాయంతో గబ్బెక్కడం మంచిదని భావిస్తారు అపాయం దాటిపోతే అదృష్టంగా భావిస్తారు అపాయాలొక్కోసారి జీవితానికి ముగింపు పల్కుతుంది అషాయాల్లోనే ఆప్షలెవరో'తెలుస్తారు 79. అపస్వరాలను అభ్యాసం చేసుకొనకు అపస్మారకాన్ని చూసి తొలగిపోవాలనుకొనకు అపవిత్రమైన ఆచారాలను తోసిపుచ్చు అపరాధివైతే నిరూపించుకోనని అనకు
అక్షర శతకం 17 80. అపథ్యం చేయడం రోగానికి బలం అపవాదులు వేయడం జనానికి సులభం అపార సంపథ సముద్రగర్భంలో 'దాగుంది అపార సంతోషం మనిషికి బలం 81. అబ్బాయి, అమ్మాయిల పుట్టుకతీరు వొక్కటే అబ్బాయి, అమ్మాయిల పెంపకపు తీరు వొక్కటే అబ్బాయి, అమ్మాయిల బాధ్యతలు వేరుగావుంటాయి అబ్బాయి, అమ్మాయి ఉనికిమాత్రం కాదు వాక్కటి 82. అబ్బురపడు నీశక్తికి మించింది అందితే అబ్బురపడకు నీశక్తికి తగింది పొందితే అబ్బో, అనేలా పలువురిప్రశంశలందుకొనేలా మెలగు అబ్బో..అబ్బో అనుకొంటూనే చేసెయ్యి చేయధల్సిన పనులందితే 83. అభ్యర్థిని చూసి అర్హుడౌనోకాదో తేల్చుకో అభ్యర్థినిపట్టి ఓటు వేయాల్నో లేదో తేల్చుకో అభిమానధనులెప్పుడూ చేయిచాచి యాచించలేరు అభ్యంతరాలు చెప్తే జరిగే అరిష్పాల్ని సోల్చుకో 84. అభిమానం పొందినప్పుడే చెప్పు నీ అవసరం అభిమానం పోగొట్టుకొని కూర్చుంటే తీరదు నీ అవసరం అభిమానం కోసం పరువుని వాదులుకోవద్దు అభిమానించలేదని తెలిస్తే చెప్పకు నీ అవసరం
18 దోర్నాదుల సుబ్బమ్మ 85. అభిమానంలేని బంధువులు ఉన్నా ఊడినా ఒక్కటే అభిమానంకాని బంధువులు ఉన్నా లేకున్నా ఒక్కటే అభిప్రాయభేదం వస్తే అన్నీ అనుమానాలే.... అపరాధాలే అభిప్రాయభేదం రానప్పుడు ఏదీఅనుమానం అపరాధంకాదు. మనస్సు ఒక్కటే 86. అభిమానంచూపు సమర్ధత కలవారిపట్ల అభినివేశం వుండొచ్చు మంచి పనిపట్ల అభిప్రాయ భేదాలతో చేసే సంసారం నరకం అభినయించి చూపు పెరుగుతుంది గౌరవం నీలోవున్న కళపట్ల 87. అభ్యాసం మంచి అలవాట్లకే మంచి అభ్యంగనస్నానం తలకు మంచి అబద్ధాలతో మంచిగా రోజులు గడుస్తాయని భావించకు అభియోగం ఎల్లప్పుడూ ఎదుటివారిమీద చేయుటకాదు మంచి 88. అభ్యంతరంచెప్పు కానిపనికి అభ్యంతరంచెప్పకు ప్రయోజనమైన పనికి అభ్యంతరంలో గల కారణాల్ని ఆలోచించు అభ్యంతరం చేయకు యితరుల శ్రేయస్సుకి 89. అభ్యర్థి స్తోమతే నియోజకవర్గ ప్రగతి అభ్యర్థి అసమర్శ్భడైతే నియోజకవర్గం అధోగతి అభ్యర్థి సమర్థత గుర్తించి ఓటు వెయ్యి అభ్యర్థికి సేవాభిలాషవుంటే చెయ్యి స్తుతి
- అభయమివ్వు ఆపద గుర్తెరిగి అభయమిచ్చినా ఆగని దుఃఖానికి కారణం గుర్తెరుగు అభయమిచ్చి ఆదుకోవడమే మనిషిగా చేసేపని అభయాన్ని ఏమేరకివ్వాలో యివ్వు దుర్భుద్ధిని గుర్తెరిగి
- అభాగ్యులంతా దుర్మార్గాలు చేసేవారు కాదు అభాగ్యులంటే దుర్మార్గానికి గురి అయినవాళ్ళూకారు అభాగ్యుల్ని చేరదీయి పనిచెప్పు బాధ్యతల్ని అప్పగించకు అభాగ్యులెప్పుడూ జీవనభృతి కోసం ఆరాటపడ్డుంటారు
- అభిప్రాయభేదాలతో చేసే సంసారం నరకం అభిప్రాయంలో కుట్రని కలిపి సలహాలివ్వడం అపరాధం అభిప్రాయం తీసుకొనేవారికి అభివృద్ధినే ఆకాంక్షించు అభిప్రాయంతీసుకో పలువురి సంక్షేమంకోసం
- అభ్యాసం చెయ్యి మంచి అలవాట్లకోసం అభ్యసించు గురువుదగ్గర మంచి విద్యకోసం అభ్యాసం మంచిదైతే అదే శ్రీరామరక్ష జీవితానికి అభ్యాసం ముఖ్యం నీవు ప్రకాశించేందుకోసం
- అబ్బాయి పుట్టుక సంతోషాన్నిస్తుంది ప్రస్తుతం అబ్బాయి చేతలు పెద్దయ్యాక సంతాపాన్నిచ్చేది అప్రస్తుతం అబ్బాయిలుతీసుకొన్నంత స్వేచ్చ అమ్మాయిలకుకొన్నింటికి ఆలోచించాలి అబ్బాయి, అమ్మాయిల పెంపకం సమానమవ్వాలనేదే నినాదం'ప్రస్తుతం
20 దోర్నాదుల సుబ్బమ్మ 95. అబద్ధాల్ని తమాషాగా చెప్పి నవ్వించు యిబ్బందిలేదు నీకు అబద్దాల్నే చెప్పి తమాషా చెయ్యాలనుకోకు అబద్భాల్ని రూపుమాపడం యిష్టపడు అబద్దాల్తో తమాషాగా బతికేదే బతుకనే ఊహల్ని రానీయకు 96. అభాసుపాలుకావొద్దు ఏవిషయంలో నైనా అభాసుపాలు చెయ్యాలని అనుకోకు ఎవరివిషయంలోనైనా అభాగ్యులంతా ఎప్పుడో వాకప్పుడు మోసపోయినవాళ్ళే అభాసుపాలైన వాళ్ళంతా నీరాశచెందినవాళ్ళే వొకవిషయంలోనైనా 97. అభయహస్తాలు ఆదరింపులు మామూలే ఎన్నికల్లో అభయమిచ్చి ఆదుకొంటారని బాధితునికి ఎన్ని కలలో అభయమివ్వడంలో ఆత్మసంతృప్తి దాగుంటుంది అభయమిచ్చి అడుగు తానుండేది ఎటువంటికష్టాలో 98. అమంగళం పలుకకు ఆశీర్వదించమని వచ్చిన విరోధినైనా అమంగళం జరగాలని ఎదురుచూడకు శుభకార్యం జరుపుకొనే విరోధినైనా అమానుషమౌతుంది అమంగళం కోసం ఎదురుచూడ్డం అమానుషనీయంగా వర్తించకు ఎంతటి విరోధంలోనైనా 99. అమ్మను మించిన ప్రపంచం నాకొద్దు అమ్మను మించిన గ్రంథం ఏదీవొద్దు అమ్మకంటె ఎవరూ ఏదీ అవసరం కాదు అమ్మే సర్వకాల సర్వావస్థల్లో కావాలి..యింకేమో వొద్దు
అక్షర శతకం 21 100. అమాయకులకోసం హృదిలో జాలిని పాదుచేసికో అమాయకుల్సి చూసి చేయూత నివ్వాలనుకో అమాయకుల్లో స్వచ్భమైన అకాంక్షలుంటాయి అమాయకులకెదురయ్యే చేదు అనుభవాల్ని తాలగించాలనుకో 101 అమాయకుల్ని మోసం చెయ్యొచ్చు సులభంగా అమాయకత్వాన్ని భావించకు చేతగొనితనంగా అమాయకంగా వున్నంత మాత్రాన సుఖం పాందలేవు అమాయకుల్లో నాటొచ్చో (పేమను, దయను సులభంగా 102. అమూల్యమైన కాలాన్ని నద్వినియోగం చెయ్యాలనుకో అమూల్యంగా అర్జాంగిని చూడ్డం చులకనకాదనుకో అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం కానీయకు అమూల్యమైన దానికోనం నిన్ను నీవు అర్చించాలనుకో 103. అమోఘమైన పని చేసినవారిని పోత్సహించు అమోఘంగా నీ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నించు అమోఘంగా పేరు పెట్టుకోవడంతో రాదు తెచ్చుకోవడంత్తో వస్తుంది అమోఘమైన పనిపట్ల ఉత్సాహం వుంచు _ల్లళ్కడరయ$ి ్యగంధాల్య్యు కో వం 104. అయ్యవారు గుడిలో అర్చన చేస్తారు ఈ([6 ర్ షమను జ | అయ్యవారు బడిలో అక్షరాలు నేర్చిస్తారు న స. అయ్య వొడి బతికే మార్గాన్నే అందిస్తుంది అయ్యవారులెప్పుడూ శుభాశీస్సులే అందిస్తారు
సుబ్బమ, 22 దోర్నాదుల సుబ్బమ్మ 105. అయ్యా..అనే పిలుపులో గౌరవం కలసి వుంటుంది అయ్యో అనే పరిస్థితిలో జాలి ఘోరం కలిసి వుంటుంది అయ్య వచ్చినా రాకపోయినా కాలం అగదు అయ్యా...అయ్యో...అని అర్ధించడలో దైన్యం వుంటుంది 106. అయిందేదో అయిపోయిందని సర్జుకోమని చెప్పకు అయిందానికి, కానిదానికి పేచీలు పెట్టకు అయినా కాకపోయినా ప్రతిపనికీ అంగలార్చవద్దు అయినీకే ఆడ, కాకపోతే మగ అని చెప్పడం తెలివనుకోకు 107 అయోమయంగా మాట్లాడుతారు మానసిక వికలాంగులు అయోమయంగా మాట్లాడ్డాన్ని మార్చలేవు సకల హంగులు అయోమయంగా చెప్తారు విషయాన్ని కొందరు మోసగాళ్ళు అయోమయాన్ని స్పృశిస్తాయి కొందరి కొంగులు 108. అరచేత వైకుంఠం కోసం అత్రుతపడకు అరచేతి అరటిపండులా జీవితాన్ని భావించకు అరుంధతి నక్షత్రం కన్పడ్డంలేదని పెళ్లిజంటలో చెప్పినవాళ్ళులేరు అరకొర పనులక్షు అరువు తీసుకోవాలనుకోకు 109. అర్భాకలితో లేచివెళ్ళకు తినేది ముందుంచుకొని అర్భాంగిని యిచ్చివెళ్ళకు వస్తువులా భావించుకొని అర్భాయుష్పుని కోరరు. అనారోగ్యమైనా అర్ధంకానిదాన్ని చెప్పకు నటిస్తున్నానని
అక్రర-శతకం. 23 110. అలసి సొలసి పోకు అందనిదాని కోనం అలసి సొలసి పోకు చిన్నచీమంత విషయంకోసం అలసిపోయినా ఫలితం అందుకోవాలి అలిసిపోకు కలలు కనడంకోసం 11 అలల సౌందర్యాన్ని చూడ్డానికి గట్టునేవుండు అలల్లో సముద్రభాగ్యాన్ని వెదుకు ఈతరానప్పుడు గట్టునేవుండి అలలు సందేశమిస్తాయి నిరంతరం తమలాగే శ్రమించమని అలలుపైకి లేచి ఉట్లాసంగా కన్పడ్తుంటాయి చూడు 112. అలలు సముద్రం మోదున్నపుడే నీలంరంగు అలలు అరచేతిలో వున్నవుడు కోల్పోతుంది రంగు అలలిచ్చే సందేశం నిరంతరం శ్రమించాలని మరువకు అలలమాదిరే స్థానంతప్పితే కోల్పోతారు హంగు 113. అలల్ని నమ్ముకొని జీవించగలను అలల మధ్యనే వుండిపోయి జీవించలేవు అలల ఉఊల్తాసాన్ని ఆదర్శంగా తీసుకో అలలు అదృష్టాన్ని ఎప్పుడోగాని మోసుకురాలేవు 114. అవలీలగా దాటడానికి ముందుగా లోకు తెల్సివుండాలి అవలీలగా మాటలాడ్డానికి ముందుగా విషయం తెలిసుండాలి అవకతవకల్ని సరిదిద్దడం విజ్ఞత అవుతుంది అన హేళనల్ని నివారించడానికి అవగాహన కలిగుండాలి
ర్క దోర్హాదుల సుబ్బమ్మ 115. అవసరం ఎన్నో రకాలుగా వుంటుంది అవసరం ఎన్నో రూపాల్లో చేయిస్తుంటుంది అవసరమని ముందూవెనుకా చూడకుండా వెళ్ళకు అవసరాల్లో హానికరమ్రైనవాటిని తీసేస్తే బాగుంటుంది 116. అవలక్షణాలున్న కూతురైన్నా కొడుకైనా శిక్షార్హులే అవలక్షణాలున్న అల్జుళ్ళయినా శిక్షార్హులే అవలక్షణాలు అవివేకానికి సంకేతం అవ్వను లక్షణంగా చూడకపోయినా శిక్షార్డ్హులే 1 అవసరాలు తీర్చగలిగినవాడే నాయకుడు అవసరాల్ని తీర్చిననాడే భావించు నాయకుడు అవసరాలు ఆశ్రయింపజేస్తాయి నాయకుణ్ణి అవసరాల ముందు పూజించే దేవుడు వినాయకుడు 118. అవ్వనుండి రెండుతరాల జీవితకథల్సి తెలుసుకో అవ్వనుండి పనిచేసే ఆలోచనను ఎలా నేర్చుకోవాల్నో తెలుసుకో అవ్వ తాతలిద్దరినీ బువ్వకోసం విడదీయొద్దు అవ్వ తాతలిద్దరిలోనూ నీగురించిన తపనేవుంటుందని తెలుసుకో 119, అశుద్ధంతో ఆటలాడాలనుకోకు అశుద్ధంగావున్నా (విసర్జన కాకపోయినా) ఫర్వాలేదనుకోకు అవుద్ధమే శరీరానికి అవసరం లేనివన్నీ బైటకు నెడ్తుంది అశుభ్ర భోజనాన్ని తినాలనుకోకు
అక్షర శతకం 25 120. అశుభ్రత అన్ని రోగాలకు మూలం అశువుగా కవితలల్లడానికి అశుకవే మూలం అశ్రునయనాలు విషాదానికి వీడ్కోలు పల్కుతాయి అళుభ్రతగావున్న భోజనం తినకూడనిదానితో సమానం 121 అసలు సొమ్మొడదిలి వడ్డీకోసం విచారించకు అసలు సంగతి తెలీకుండా నోరు పారేసుకోకు అసలు సిసలైన బంధువు అస్వస్తతగా వున్నప్పుడాదుకొంటాడు అసలు పేరు ప్రఖ్యాతులకోసం వగ్రదారి నడవాలనుకోకు 122. అసంతృప్తిని వెలిబుచ్చకు అన్నింటిలో చీటికి మాటికీ అసభ్యంగా ప్రవర్తించకు సన్నిహితుల్తోనైనా మాటిమాటికీ అస్తవ్యస్తమైన ఆలోచన్లే అపజయాల్నిస్తుంటాయి. అస్తమానం గొణుగుతూంటే చీదరించుకొంటారు మాటిమాటికీ 123. అసూయ మనిషిని కృంగదీయగలదు అసూయ ఎదుటివారి ఎదుగుదలను మింగుడు పడనీయదు అసూయపరులెంత అంతస్సుల్లోవున్నా అధోగతికి చెందినవారే అసూయపరుల మనసు మంచికి సహకరించనీయదు 124. అసురులు, సురులు అని వాళ్ళ ప్రవర్తనబట్టే పిలుస్తూ వున్నారు అసురులు, సురులు మనమధ్యనే జీవిస్తూవున్నారు అసురసంధ్య వేళకే ఇంటికి చేరడం ముఖ్యం అసురులని పురాణాల్లోనే ప్రత్యేకించిన ఆకారాన్ని ఏర్పరచివున్నారు
జ దోర్నాదుల సుబ్బమ్మ 125. అస్తమానం గొణిగే వారెంత హోదాలో వున్నా చీదరింపే అస్తమానం అణగిమణగి వుండేవారికి లభిస్తుంది ఆదరింపు అస్తమానం నీ గొప్పల్ని నీవే చెప్పుకొంటే ఆలకించరు అస్తమానం గద్దించడం కాదు బెదిరింపు 126. అసభ్యంగా ప్రవర్తించకు సన్నిహితుల్లోనైనా అసభ్యంగా మాటడకు పరిహాసానికైనా అసభ్యకరమైన నడవడే అసహ్యించుకొనేలా చేస్తుంది అసభ్యకర దుస్తుల్ని ధరించకు శమాషాలకైనా 127. అహర్షిశలు కష్టపడు నీక్కావల్సిన వారికోసం అహర్నిశలు కష్టపడ్డప్పుడే ఎదురుచూడు ఫలితంకోసం అహర్నిశలు నిద్రపోతుండడం సోమరితనమేకాదు జబ్బులక్షణ౦కూడౌ అహర్నిశలూ దాంపత్యసుఖాన్ననుభవించడమేకాదు సుఖంకోసం 128. అహంకారం ఎప్పుడూ గెలుపునివ్వదు అహంకారం బంధుమిత్రుల్ని కలవనివ్వదు అహంకారికి అభిమానించేవాళ్ళుండరు అహంకారం సావధానమైన అలోచనలనివ్వదు 129. అహింసతో సాధిస్తేనే అవుతుంది ఘనత అహింస అమలైతే అందుకొనేది మమత అహింస వొక్కోసారి బతుక్కి రక్షాకవచం అహింస మార్గంలోనే వచ్చింది దేశ స్వాతంత్ర్యం
అక్రర శతకం 27 130. అహింసను పాటించడం చేతగానితనం గాదు అహింసను పాటించినవాళ్ళందరూ అసమర్భులుగాదు అహింసతో పూనుకొన్న దీక్ష అత్యున్నత మార్గం అహింసగురించి ప్రచారం లేకపోవడం మంచికి నిదర్శనం కాదు 131 అహా ఓహో అనుకొని సరిపెట్టకు అహా ఓహో అనుకోవడాన్ని చెడుతో ముడిపెట్టకు అహా ఓహో అనడంలోనే అద్భుతమేదో దాగుంటుంది అహా ఓహోలతో కలిసిన తృప్తి దేనితోనూ సరిపెట్టకు 132. అక్షరాలకు భాష కాపరి అక్షరాల్ని అర్థయుక్తంగావాడు కాగలవు అక్షరపాదుపరి అక్షరాలకు జీవంపోస్తే అవి నీకు జీవంపోస్తాయి అక్షరాలొక్కోసారి అవుతాయి ఉపకారి 133. అక్షరాలు అన్ని భాషలకు ఊపిరి అక్షరాలే అన్ని సంస్కృతులకు ఊపిరి అక్షరలక్షలు నువర్ణంకంటేమిన్న అక్షరాలు సుఖదుఃఖాలక్కూడా ఊపిరి 134. అక్షయపాత్రలా అభ్యుదయముంటే ఎంతో బావుణ్ణు అక్షయపాత్రలా ఆహారాన్నిచ్చేదుంటే ఎంతో బావుణ్ణు అక్షయపాత్రవంటిది నిత్యజీవితంలో తెచ్చేవారే అసమాన ప్రతిభావంతులు అక్షయపాత్రలా సద్గుణ సంపదవుంటే ఎంతో బావుణ్లు
న దోర్నాదుల సుబ్బమ్మ 135. అక్షరాల్లో జీవించు, ్రేమించు అక్షరాలు నిన్ను చిరంజీవిగావుంచు అక్షరబద్ధమైనదాన్నే భాషగా గుర్తిస్తారు అక్షరాలవల్ల వచ్చే గౌరవమే అన్నిటినీ మించు 136. అక్షరాలు వింటాయి కవులు చెప్పినట్టు అక్షరాలు చెప్తాయి కవులు చెప్పినట్టు అక్షరాల్గోనూవుంటాయి అబుబాంబుల్తాంటివి అక్షరాల్లో కన్చడ్తాయి మంత్రాలు, తంత్రాలు 137. అక్షరాంబుధినుండి అందుకోగలవు నిధి నిళ్లేపాలను అక్షరాంబుధినుండి పొందగలవు ఆపేక్షలు, ఆక్షేపణలను అక్షరాభ్యాసం ప్రకాశవంతమైన జీవితానికి నాంది అక్షరాలు కలుప్పు కొంటాయి ఎన్నెన్నో ప్రక్షిప్తాలను 138. అక్షింతలకు ఆశీస్సుల్లో ప్రధమస్థానం అక్షింతలది ఆశలు నెరవేర్చే స్థానం అక్షింతలకు పవిత్రత నాపాదించింది సంప్రదాయమే అక్షంతల కోసం తలవంచు..అదే వినయం
- ఆకతాయితనం చిన్నప్పుడే ముద్దు ఆకతాయితనానికి పెరిగిపెద్దయ్యేప్పుడు పెట్టు హద్దు ఆకతాయితనమేనని మౌనంవహించకు ముప్పుముంచుకొస్తున్నపుడు ఆకతాయితనంతో ముడీవెయ్యకు పద్దు....పొద్దు
- ఆకర్షణనేది పరుల్లో వుంటే మెచ్చుకో అకర్షించేందుకు ఏ సాధనకైనా పూనుకో అకర్షింపబడాలనుకోవడం మంచి లక్షణం అకర్షణనేది మనో సౌందర్యంతోకూడా. వస్తుందని తెలుసుకో
- అకలిగొన్న వారికే అన్నం పెట్టాలనుకో అకలి లేనివారికి బంతికి ఆహ్వానించడం మర్యాదనుకో ఆకలి మనిషిని అల్లాడిస్తుంది (ఆకలి రుచి శుచి చూడదు) ఆకలి తీర్చిన వారిని గుర్తుంచుకో
- ఆకారాన్ని మాత్రమే చూసి (ప్రేమించకు ఆకారంతోనే గొప్పలొస్తాయని భ్రమించకు ఆకారానికితోడు సద్బుద్ధి వుంటేనే అందం ఆకారంతోనే అన్ని సాగసులొస్తాయని భావించకు
- ఆకారాన్నివ్వగలరు దేనికైనా కళాకారులు ఆకారాన్నిస్తూ తన్మయం పొందుతారు కళాకారులు ఆకారాన్ని ఆకర్షించేలా రూపొందించడం కళలో ముఖ్యం ఆకారం జీవంపోసినట్టుంటేనే వస్తాయి పేరు (ప్రఖ్యాతులు
కం దోర్నాదుల సుబ్బమ్మ 144. అకాశగంగ పుట్టుక కొండల్లోనే ఆకాశమంత ఆలోచన పుట్టేది గుండెల్లోనే ఆకాశగంగలో జెషధగుణం వుంటుంది ఆకాశం సౌందర్యాన్ని నింపుతుంది కన్నులనిండుగానే 145, అకాశవాణ్రీ వాక్కులు తొలిదినాల్లో విచిత్రం ఆకాశవాణి అందించింది దూరదర్శన్‌కు మరోవిచిత్రం ఆకాశమిచ్చే దృశ్య శ్రవణ శక్తులు అనంతం ఆకాళాన్ని లొంగదీసుకున్నమనిషి జీవితమైనా బుద్భ్చుధం 146. ఆకాశానికి హద్దులు లేవు అకాశాన్ని ముద్దాడ లేవు ఆకాళాన్ని శోధించడం మేధావికిమాత్రమే సాధ్యం ఆకాశప్పుశోభల్ని కవివైతేనే ఆందుకోగలవు 147 ఆకులన్నిటి రంగు మాత్రం వొక్కటే ఆకుల ఆకొరం మాత్రం కాదు వొక్కటి ఆకులగుఇణం తెల్ఫుకొన్నాకే చెయ్యాలి వైద్యం ఆకులగుణంలాగే మనుష్యుల్లో కూడా గుణం కాదు వొక్కట్ 148. ఆకువక్క వేసుకోవడం కొందరికి అభిరుచి ఆకువక్క అలవాటు కొందరికి అభిరుచి ఆకువక్కసున్నం కొందరికి ఆరోగ్యాన్నిస్తాయి ఆకువక్కలిచ్చే ఆచారం శుభకార్యాలకు సూచి
అక్షర శతకం త 149. ఆకు వక్కల మోతాదులో వేసుకోకు సున్నం ఆకువక్కల్ని అదేపనిగానమిలితే ప్రయోజనం శూన్యం ఆకువక్క లేసుకోవడం ఆహారం తర్వాతనే మంచిది ఆకువక్క సున్నం కలిపి నమలడం ముఖ్యం 150. ఆకుకూరలు ఆహారంలో ముఖ్యం ఆకుకూరలు ఆరోగ్యానికి ముఖ్యం అకుకూరల్ని పెరటి సంపద చేసుకో ఆకుకూరలు వాడితే ఆరోగ్యం మెరుగుపడ్డం తధ్యం 151 ఆకులులేని చెట్టు పూలు పళ్ళివ్వలేవు ఆకులున్న చెట్లన్నీ తినగలిగే పళ్ళివ్వలేవు ఆకులు చెట్టుకి నిండుదనం ఇల్లాలు ఇంటికి నిండుదనం ఆకులికి పూలు శోభలా ఇల్లాలికి పిల్లలు శోభనియివ్వగలవు 152. ఆకురాయిది అరగదీసే లక్షణం ఆకు రాయి విడివిడి అయితే విలక్షణం ఆకురాయిలో అకుండదు, రాయి వుండదు ఆకు, రాయి పదాలు కల్సినపుడే తెలుస్తుంది దాని లక్షణం 153. అక్రందనలో నిస్సహాయత ప్రతిధ్వనిస్తుంది ఆక్రందన ఆపదను గుర్తింపజేస్తుంది ఆక్రందన చేసేవారికి అందించు నీ సహాయం అ(క్రందన విని దరికిజేరితేనే పరిస్తితి తెలుస్తుంది
తి దోర్నాదుల సుబ్బమ్మ 154. అక్రోశిస్తూ కూచోకు అస్తమానం ఆక్రోశిస్తేనే దొరకదు ఉపశమనం ఆక్టోశించే వాటికి కారణం తెల్సుకొనివుండు ఆక్రోశించడమేకాదు అన్నిటికీ పరిష్కారం 155. ఆఖరి ప్రయత్నం ప్రతిఫలిస్తుందనే ఆశవుంటుంది ఆఖరి 'ప్రయళ్నంలో మార్చు, చేర్చు వుంటుంది ఆఖరి ప్రయత్నంతోనే వొక్కోసారి ప్రతిఫలం దొరుకుతుంది ఆఖరి ప్రయత్నం అనేదీ పలుమార్లు ప్రయత్నించాకనే వుంటుంది 156. ఆఖరి శ్వాస వున్నంతవరకు వైద్యంచేస్తారు వైద్యులు ఆఖరి తీర్చు వచ్చేంతవరకు వాదనచేస్తారు న్యాయవాదులు ఆఖరి శ్వాస ఆగిపోయాకనే జరిగేది శవయాత్ర ఆఖరి చూపు కోసం వచ్చేవారివే అనుబంధాలు 157. ఆఖరిసారిగా చెస్పిచూడు మారకపోతే మానుకో అభిరిసారిగా ప్రయత్నించి చూడు ఫలితం లేకపోతే మానుకో అఖరిసారికూడా ప్రతికూలమైైతే మౌనం వహించడం మంచిది ఆఖరిసారి నీ మాటను లక్ష్యసాధనబట్టి వాడుకో 158. ఆఖరుబంతిలో కూచోవాలనుకోకు విందులో ఆఖరువరుసలోనే వుండాలనుకోకు చదువులో ఆఖరున వుండడం అణకువగా భావించకు ఆఖరులోనైనా మెలకువలన్నీ తెల్సుకొనివుండు' పనిలో
అక్తర శతకం 33 159. ఆగమాన్ని భాషలో మెప్పించేలా పొందుపర్చు ఆగమం మంచిమనిషిదైతే, జీవితం బాగుపర్చు ఆగమనం నిన్ను తోసిపుచ్చేవానిపట్ట చూపకు ఆగమనంలో వుండాలి అభిమానం పొందుపర్చి 160. ఆగంతకులకోసం అగచాట్లు వడాలనుకోకు అగంతకుల అభీష్టాలు తీర్చడం పుణ్యమనుకోకు ఆగంతకులు నద్భుద్దిగలవారైతేనే ఆహ్వానించు అగంతకులముందేీ ఆడంబరాలను చూపాలనుకోకు 191. ఆగిపో అరిష్టాలిస్తుందనుకొన్నదాన్ని జూసి ఆగిపోకు, ముందుగానే కష్టమనుకొంటూ ఊహించేసి ఆగిపోవడం మంచిది కుట్రతో కూడుకొన్న పెళ్ళి ఆగి, ఆలోచించి ప్రారంభించు మంచిదనుకొన్నదాన్నిచూసి 162. అగు... నిను పిలుస్తున్నదెవరో చూడు ఆగు... నీ సంబంధీకులైతే చూడు ఆగకు..... నీవు తలపెట్టిన మంచికోసం ఆగకుండా వెళ్ళే రైలు దిగాలనుకోకెన్నడూ 163. ఆగ్నేయాస్త్రాన్ని అడ్డుకొనేది వారుణాస్త్రం ఆగ్నేయ స్నానం చేసేప్పుడు తప్పనినరి వివస్త్రం ఆగ్నేయమూలలో వంటావార్పుల ఏర్పాటు '“వాస్తు' ఆగ్నేయ ఈశాన్యాల మూలలకు సూర్యుడి కదలిక అవాస్తవం
క దోర్నాదుల సుబ్బమ్మ 164. ఆగ్రహం ఎన్నో అనర్థాలకు మూలం ఆగ్రహం వొక్కోసారి అపార్భాలకు ఆలవాలం ఆగ్రహంతో కాలేవెన్నడూ గొప్పవాడివిగా ఆగ్రహమే కాదెన్నడూ కరవాలం
-
- ఆగ్రహాన్ని నిగ్రహించుకొంటే చుట్టున్నవారే స్నేహితులౌతారు ఆగ్రహంవల్లనే మిత్రులు శత్రువులౌతారు ఆగ్రహం విచక్షణకు తావివ్వదు ఆగ్రహం విడనాడినవారే ధన్యులౌతారు
- ఆఘాయిత్యంతో సాధించేది సాధుత్వం కాదు ఆఘాయిత్యంగా చెప్పేది, వినమనేదీ మృదుత్వం కాదు ఆఘాయత్యం చేసే వారిమీద సానుభూతి చూపరెవ్వరూ ఆఘాయిత్యమే అన్నివేళలా చలామణికానేకాదు
- ఆహఘాణించవచ్చు అన్ని సువాసనల్ని ఆఘ్రాణించాలనుకోకు అన్ని వాసనల్ని ఆగ్రహం తెప్పించకు నిన్ను అభిమానించేవారికి ఆగ్రహంవల్ల కళ్ళే ముష్పుతెలుస్తుంది దుర్వ్యసనాల్ని
- ఆచారాన్ని పాటించు మేలొనరిస్తూ ఆచారం, గౌరవాన్నిచ్చేదైతే వుండు పాటిస్తూ అచారం పేరుతో మూఢ విశ్వాసాల్ని పెంచకు అచారం పేరు అడ్డుంచుకోకు భ్రష్పపట్టిస్తూ
అక్షర శతకం 3ర్ 169. ఆచార్యపదవి అత్యున్నతం ఆచారి కులంతోనేరాదు అత్యున్నతం ఆచార్యులకైనా, ఆచారాలకైనా పని స్థాయినిబట్టే వస్తుంది గౌరవం ఆచార్యపదవి కులప్రసక్తిలేకుండా రావడం అత్యుత్తమం 170. ఆజ్యంపోసి వెలిగించే దీపానిది పూజ్య స్థానం అజ్యంపోసి రగిలించకు గుండెలో స్థానం ఆజ్యంతో చేసిన వంటకాలు రుచికరం ఆజ్యాన్ని మితంగావాడి నిరూపించు పొదుపు స్థానం 1/71. ఆజానుబాహువులు అందం ఆజానుబాహువులకు తగినట్టు అవయవాలన్నీ వుంటేనే అందం అజానుబాహువులున్న వారిని అదృష్టవంతులంటారు ఆజానుబాహువుల్తోబాటు ఆత్మ సొందర్యముంటేనే అందం 172. ఆంజనేయుడు స్వామిభక్తికి ప్రతిరూపం ఆంజనేయస్వామిభక్తుల్లో వుండకూడదు లోపం ఆంజనేయస్వామి తప్పుచేసినవారిని క్షమించరని ప్రతీతి ఆంజనేయుని రూపం పడగ్గదిలో వుంచితే కోపం 173. ఆటలు శరీరానికి, మనస్సుకి ఆనందాన్నిస్తాయి . ఆటల్లో కొన్ని డబ్బుని నాశనం చేస్తాయి ఆట గురించి తెలుసుకొన్నాకనే ఆటలో ప్రవేశించు ఆటలెప్పుడూ మనసుకి, మనిషికి ఆరోగ్యాన్నిస్తాయి
కం దోర్నాదుల సుబ్బమ్మ 174. ఆట విడుపు కావాలి ఆటగాళ్ళకు అట వొడుపుకావాలి ఆటగాళ్ళకు ఆటల్లో పందెముంటే సట్టుదల పెరుగుతుంది ఆటవిడుపుతో అలసట తీరి శక్తివస్తుంది ఆటగాళ్ళకు 1/5. అటవికుల్లో ఆటోపాలు, ఆరోగ్యసూత్రాలుండవు ఆటవికులకు నాగరికత నమూనాలుండవు ఆటవికుల్లో ప్రథమస్థానం కట్టుబాట్లకే ఆఅటవికుల మనస్సుల్లో కల్మషాలుండవు 176. ఆటుపోటులు సముద్రపు ఉనికిని మారుస్తాయి ఆటుపోటులు తగిలిన జీవితాలు లోటుపాట్లను గుర్తిస్తాయి ఆటుపోటుల్ని బట్టే లాభనష్టాలుంటాయి ఆటల పోటీల గెలుపుతో "పేరుప్రతిస్టలొస్తాయి 177. ఆటోపాలకోసం అవినీతికిపాల్పడబోకు ఆటోపాలతోనే గొప్పవైపోయావనుకోకు ఆటోపాలతో అందంగా సౌకర్యంగా వుండొచ్చు ఆటోపాలకోసం అప్పులుచేసి అమర్చుకోవాలనుకోకు 178. ఆడవారి సహనం కాపురానికి నిండుదనం ఆడవారి సహకారం సనులన్నిటికీ నిండుదనం అడవారి మాటలేనని కొట్టెయ్యడం మూర్ధత్వం ఆడవారంటే సభ్యత సంస్కారాలు చూపడం మంచితనం
అక్షర శతకం 37
-
ఆడుకోవచ్చు ఆటవస్తువులతో ఆడుకోరూడదు జీవితాలతో అడి, పాడి సంపొదించు సరైన అవకాశం వస్తే ఆడి ఆడి అలిసినా ఆనందమే గెలుపులతో
-
ఆడంబరంగా జీవించాలనే కోరిక తప్పుకాదు ఆడంబరంకోసం మించినభారం మొయ్యడం మెప్పుగాదు ఆడంబరాలకు పరిధిని నిర్మించుకోవడం మంచిది ఆడంబరాలన్నీ అవసరమేననిచెప్పడం వొప్పుగాదు
-
ఆణిముత్యమనిపించుకోవాలనే ఆలోచించు ఆణిముత్యమనిపించు కొనేందుకు మంచిచేసి చూపించు ఆణిముత్యమంటే గొప్పగా ప్రత్యేకతనుచాటు కోవడమే ఆణిముత్యంగా పేరొందాలని జీవితాన్ని మలిచి చూపించు
-
ఆతపత్రం (గొడుగు) లాంటివారే భార్యకు భర్త ఆతపత్రపుపని మరోదానితో కాదు భర్తీ అతపత్రం కాపాడుతుంది ఎండా వానలనుండి ఆతపత్రంలా భార్యకు రక్షణయిచ్చినవుడే భర్త
-
ఆత్మవున్న వారికి ఆత్మసాక్షికి మించింది లేదు ఆత్మశిక్షిస్తే అంతకంటె పెద్దశిక్ష లేదు ఆత్మయాత్రను అడ్డుకోవడం కష్టం ఆత్మను కాదని చేసేపనిలో తృప్తి రానేరాదు
3కి దోర్నాదుల సుబ్బమ్మ 184. ఆత్మగతమైనవన్నీ చెప్పేయడం కాదు ముఖ్యం ఆత్మగతమైన వాటిలో కొన్నే ముఖ్యం ఆత్మసందేశం ఎప్పుడూ బెన్నత్యమే ఆత్మసందేశాన్ని పక్కదారి పట్టనీయకుండా వుండడం ముఖ్యం 185. ఆత్మదర్శనాన్ని గుప్పిట్లో వుంచుకొన్నవుడే ఘనత ఆత్మజ్ఞులు నియమాల్ని ఉల్లంఘించరనేదే ఘనత ఆత్మదర్శనంతో పొందే అనందం నిష్కల్మషంగావుంటుంది ఆత్మను తోసిపుచ్చి, పేడుని ప్రోత్సహించడం కాదు ఘనత 186. ఆత్మహత్య చేసుకొన్నందువల్ల సరైన ఫలితంరాదు ఆత్మను హత్యచేసి చేసేపని సాధనకాదు ఆత్మహత్య నిరాశా నిస్పృహల తుది నిర్ణయమే ఆత్మహత్యను సమర్ధించడం ఎన్నడూ మంచిదికాదు 187. ఆత్మవిశ్వాసంతో రాజకీయంలో ప్రవేశించు ఆత్మాభిమానులతో రాజకీయాన్ని నడిపించు అత్మసాక్షిని సర్వదా పరిశీలిస్తూవుండు అత్మాభిమానం నీ మంచిపనిలో కనిపించు 188. ఆత్మసంతృప్తి కల్గు ఆత్మీయులవల్ల ఆత్మసంతృప్తి కల్గు అనుకొన్నవి నెరవేరుటవల్ల ఆత్మసంతృప్తిని మించిన సంతోషం లేదు ఆత్మసంతృప్తిని పొందడం కాదు అందరివల్ల
-
అత్మీయత చేతులు కలిస్తేనే రాదు ఆత్మీయత చేతలు కలిస్తే కల్గుతుంది సందేహంలేదు ఆత్మీయతలో సంతృప్తి దాగుంటుంది ఆఅత్మీయతతో ఎంతటిదాన్నయినా సాధించడం అసాధ్యంకాదు
-
ఆతిధ్యమిచ్చి అతిధిని సంతుష్టిపరచవచ్చు ఆతిధ్యంతోబాటు నీ నేర్పుని కనబరచవచ్చు ఆతిధ్యం యిచ్చి అతిధిసమాగమనం కోరకెన్నడూ ఆతిధ్యంలో ఆత్మీయత కోరుకోవచ్చు
-
అత్మీయుల్ని ఆత్మబంధువులుగా భావించు ఆత్మీయుల్లో మమతానురాగాలు పెంచు ఆత్మీయులముందు, బాంధవ్యాలు వెనుక వుంటాయి ఆత్మీయతను నిజాయితీగానే వుంచు
-
ఆత్రుత కొన్ని విషయాల్లో సమయాన్ని బట్టీ చూపు ఆత్రుత చూపడంతో కొన్ని బాధలు మాపు ఆత్రుతతో హత్తుకోవడమే ఆత్మీయత కాదు ఆత్రంగా అందరినీ హత్తు కోవడం కలతల్నిరేపు
-
ఆది నిష్టూరం మేలు అంత్యనిష్టూరం కంటె ఆదిలోనే తెల్పు మేలు హంసపాదు పడకుండా వుంటే ఆదర్శాలను అమలుచేసి కీర్తిని పొందు ఆదర్శం నెరవేరు కావల్సినవారి అనుకూలత వుంటే
40 దోర్హాదుల సుబ్బమ్మ 194. ఆదరించు ఏ అధారం లేనివారిని
ఆదరించకు వివరాలు చెప్పనివారిని
అదరణ ఎల్సప్పుడూ మోతాదులోనే వుంచు
ఆదరించకు అల్బులనిపించుకొన్నవారిని 195. ఆదిలోనే వ్యాధినిర్ధారణ మేలొనరించు
ఆదిలోనే బాధలు చెప్పుకొనేముందు ఆలోచించు
ఆదిలోనే వివరణలిస్తే నిర్ణయాలకు సులభం
ఆది సరైరీదైతేనే కుట్ట బాగుంటుందని యోచించు 196. ఆదిశక్తి వై విజ్బంభించు అఘాయిత్యంపట్ల
అదిశక్తిలా కటాక్షించు అత్యాచారం జరిగినవారిపట్ల
అదిశక్తి ఆత్మభవుడు (మన్మధుడు) రూపంలో విరుద్ధం
_ఆదిలోనే తెలుస్తుంది నీ ఉద్దేశమేమిటో నీ ఉనికిపట్ల 197. అది దంపతులుగా పేరొందండి
అదిమకాలప్పు సంస్కృతిని రానివ్వకండి
ఆదివారంరోజు అయినా ప్రశాంతంగా గడుపు
ఆది దంపతులంటే అవ్యోన్యానికి సంకేతమనుకోండి 198. ఆధిపత్యం రావడానికి నిత్యం శ్రమించు
ఆధిపత్యం మరిచి సతిని ప్రేమించు
ఆధిపత్యం అనేది నీక్రై నీవు భావించుకోవడంలో లేదు
ఆధిపత్యం కోసం యుద్ధంలో శృతిమించు
అక్షర శతకం తే 199. ఆధ్యాత్మిక కీర్తనలతో ప్రశాంతత వస్తుంది అధ్యాత్మికతకోసం దేశదేశాలు వెళతకవలసి వస్తోంది ఆధ్యాత్మిక సంపద బజారు సరుకుకాదు ఆధ్యాత్మికత సాధనతోనే వస్తుంది 200. ఆనలతో ఆలిని లాలించినట్లను కోకు అనెలతో కాలిని నడిపించాలనుకోకు ఆనవాయితీ చేయాలనుకోకు బాధను ఆనవాయితీ అనుకొని దుర్గుజాలను సరిపెట్టుకోకు 201. ఆనందించు ఎదుటివారికి సాయపడి ఆనందించకు ఎదుటివారికి అడ్డుపడి అనందానికి గ్రేమ, వాత్సల్యాలే పరాకాష్టగావుండాలి ఆనందాన్ని పంచిపెట్టు పలువురికీ ఉపయోగపడి 202. ఆపదలో వున్న వారెవర్షైనా కాపాడు ఆపద గట్టెక్కే ఆలోచన్లు చేసిచూడు ఆపద ముసురు కొన్నపుడు పశ్చాత్తాపం బతికిస్తుంది ఆపదసమయంలో అవకాశం యిచ్చిచూడు 203. ఆపవద్దు ప్రజ్ఞాపాటవాలున్న విద్యార్థిని ఆపవచ్చు ఎంతకూ ఎక్కిరాని విద్యార్థిని ఆఅపకపోయినా జరిగిపోయేది కాలమొక్కటే ఆపవచ్చు గొడవల్ని సృష్టించే అభ్యర్థిని
తై దోర్నాదుల సుబ్బమ్మ 204. ఆపసోపాలుపడి గోరంత తప్పుని కొండంత చేయకు ఆపసోపాలుపడ్డూ ఫలితం. రాలేదని ప్రయత్నం మానకు అపసోపాలు పడ్డమే అసలు శ్రమపడ్డం కాదు ఆపసోపాొల్తోనే ధ్యేయం నెరవేరుతుందనుకోకు . 205. ఆప్యాయత నిండిన పిలుప్ప, పలుకు పెద్దరికాన్నిస్తుంది ఆప్యాయత అందుకొనేవారిమీద అధికారంవస్తుంది ఆప్యాయత "పెద్దవారి పెద్దమనసుకి ప్రతీశ్రైవుంటుంది తమ్మీయత చూపడం కొందరికి మెతకదనంగా తోస్తుంది 206; ఆప్పులకెప్పుడూ స్వార్ధంలేని సహకారాన్నందించు ఆప్పలెవరో నీ చుట్టున్నవారిలో గమనించు ఆప్పుల సహాయంతో ఆపదను గట్టెక్కించుకోవచ్చు అఆప్హలుగా నటించేవారి అసలు బుద్ధిగమనించు 207. ఆపే ప్రయత్నం చేయకు వస్తున్న వాంతుల్ని ఆపేప్రయత్నం చేయి కమ్ముకొస్తున్న ఆపదల్ని ఆపుకొని చూడు నష్టమొస్తున్న వ్యాపారాల్ని
- ఆపాలనుక్షో అనవసరమైన వ్యవహారాల్ని
- ఆభరణాలతో శరీరానికి అందమొస్తుంది ఆభరణాలెక్కువ ధరిస్తే సంపన్నురాలనిపిస్తుంది అభరణాలతో వచ్చే అందం చెప్పుకోదగిందికాదు అభరణాలకంటే ఆదరించే గుణం గౌరవాన్నిస్తుంది
అక్షర శతకం 43 209. ఆబ్బికం చనిపోయాకనే చేస్తారు అబ్దికం బ్రతికుండగానే తలపెట్టరెవ్వరూ ఆచ్బికం బ్రతికుండగా చేసుకొనేవారు అరుదు
- ఆచ్బికంతో పుణ్యలోకాల ప్రాప్తి జరుగునని విశ్వసిస్తారు
- ఆమని సోయగాలను ఆమనిలోనే చూడు ఆమనిలా జీవితం సాగాలని కోరుకొని సాధించిచూడు ఆమని కొత్తచివుర్లను చూపిస్తుంది అమనితో తాదాత్మ్యం చెందడం ప్రకృతీ (పేమికులకే సాధ్యపడు 211 ఆమ్రఫలం౦ రుచి అమోఘం ఆమ్రఫలం ఫలరాజం ఆ(మ్రపత్ర చివురు తిన్న కోయిలగాత్రం అద్భుతం ఆమ్రపత్ర తోరణం శుభసంకేతం
- ఆమ్లములన్నియు అగ్నిగుణం కల్గివున్నవే ఆమ్లములు శాస్తపరిశోధనకు అవసరమైనవే ఆఅమ్లములతో అతిజాగ్రత్తవహించాలి ఆమ్లములన్నీ మోతాదులో వుపయోగించేవే
- ఆముదపుచెట్టు భాగాలలో బెషధగుణం వుంది ఆముదపునూనెలో తలకు చలువచేసే గుణం వుంది ఆఅముదపుచెట్టుని, చెట్టు లేనిచోట మహావృక్షమంటారు ఆముదప్పునూనె, దీపాలలో నిదానంగా వెళ్లేగుణంవుంది
దోర్నాదుల సుబ్బమ్మ డడ
-
ఆమోదించు అనుకూలంగా వున్నదానిని ఆమోదించేముందు ఆలోచించిచూడు దానిని ఆమోదాన్ని తెల్చకు వినకుండానే... చూడకుండానే ఆమోదించకు అన్యాయమని తోచినదానిని
-
ఆయుధం చేతబట్టడం అన్నివేళలా కాదుమంచిది ఆయుధాన్ని చేతబట్టడం. రక్షించుకొనే సమయాల్లోనే మంచిది ఆయుధం అదనపుపనిచేసే అవయవమేననుకోవచ్చు ఆయుధం పదునైందైతేనే పని జరుగుతులీది
-
ఆయుధాన్ని చూపెట్టి బెదిరించు ఆయుధాన్ని ప్రయోగించే ముందు ఆలోచించు ఆయుధానికి రౌద్రం తోడైతే అరిష్టాలు జరుగుతాయి ఆయుధకర్మాగారంలోని వారంతా. కఠినాత్ములేనా యోచించు
-
ఆయుర్వేదవైద్యం నిదానంగా పనిచేస్తుంది ఆయుర్వేదవైద్యంవల్ల రోగం మెల్లగా మరుగౌతుంది ఆయుర్వేదవైద్య ప్రారంభకులు డా॥ శుక్రుత్ ఆయుర్యేదానికి ప్రచారం కొరవడింది
-
ఆయుష్పుగురించి సరిగ్గా చెప్పేవారు లేరు ఆయుష్షు అందరికీ సమానమేనని చెప్పేవారూ లేరు ఆయుష్మంతులు కావాలనే అందరికీ కోరికుంటుంది ఆయుష్పుకోసం తాపత్రయపడనివారెవ్వరూ ఉండరు
అక్షర శతకం త్ 219. ఆయుష్పు ఆరోగ్యం జీవిత నాణేనికి బొమ్మబొారుసులు ఆయుష్మంతులందరూ కాలేరు అదృష్టవంతులు ఆయుష్పులేని ఆరోగ్యం, ఆరోగ్యంలేని ఆయుష్షు నిష్ఫలం ఆయుష్పున్నపుడు మంచిపనిచేసి తెచ్చుకో పేరుప్రఖ్యాతులు 220. ఆయుష్మంతుడవౌతావు నీవు చేసేగొప్ప పనివల్ల ఆయుష్షుని హరిస్తుంది కానిపని చేసినందువల్ల ఆయుష్పుండేది మంచిచేసేందుకనే భావించు ఆయుష్షువస్తుంది తీసుకొనే జాగ్రత్తవల్ల 221 ఆయాసంగావున్నపుడు అమితంగా తినకు ఆయాసంగావున్నపుడు 'సుఖం' కోసం యోచన చేయకు ఆయాసంతో వుండడం కూడా జబ్బే ఆయాసపడి ప్రతి విషయాన్నీ ఆరా తియ్యాలనుకోకు 222. ఆరంభించు వెంటనే పలువురి సంక్షేమానికి పనికొచ్చేపని ఆరంభించకు ఎప్పుడూ పలువురి వినాశనం కల్గించేపని ఆరంభమనేది శుభకార్యాలకైతే సంతోషాన్నిస్తుంది _ ఆరంభం చేయబోయేపని గురించి తర్కించడం ముఖ్యమైనపని 223. ఆరంభశూరత్వంతోనే పని పూర్తికాదు ఆరంభళూరత్వంతో ఆగితే పనికి మంచిదికాదు ఆరంభళూరత్వం పని మంచిదిగా భావిస్తేనే జరుగుతుంది ఆరంభహరత్వం అన్నివిషయాల్లో పనికిరాదు
దుల సుబ్బమ,; 46 దోర్నాదుల సుబ్బమ్మ 224. ఆరంభించకు చెడుకార్యాలను అరంభించకు అతివాగుళ్ళను ఆరంభించు నలుగురు మెచ్చేకృషి ఆరంభించకు ఎదుటివారెలా చెడిపోయే అలోచనను 225. అరగించకు అతిగా, యిష్టమైన ఆహారాన్నైనా ఆరగించకు చెడువాసన వచ్చే ఆహారాన్ని ఆరబెట్టు విధిగా.. తడిగా వున్న బట్టలను ఆరబెట్టినట్ట చూపెట్టకు సంసారపు గుట్టమట్టుల్ని 226. ఆరాధన, సాధనతో వచ్చేదేకాని, కొనితెస్తే వచ్చేది కాదు ఆరాధన చుట్టూ మంచితనమే అల్లుకోనుండడం అసత్యంకాదు ఆరాధించరెవ్వరూ ఆజానుబాహుడైనంత మాత్రాన ఆరాధించడానికి ముందు, మనిషిగా వుంటేనేగాని సాధ్యంకాదు 227. ఆరాధిస్తూన్నట్టు నటించే వారిని నమ్మకు ఆరాతీయడమే పనిగా పెట్టకొన్నవారిని నమ్మకు ఆరాధన పనికిమాలినదని చెప్పకు ఆరాధిస్తేనే పనులన్నీ జరుగుతాయని నమ్మకు 228. ఆరామం మనశ్శాంతి విన్తుంది ఆరామం ప్రశాంత వాతావరణాన్ని స్ఫురింపజేస్తుంది ఆరామం నిర్మాణం ఆశయం, శాంతి కోసం జరుగుతుంది ఆరామం దుర్గుణాలను అంతం జేసేదిగావుంటుంది"
అక్షర శతకం శ 229. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించు ఆరోగ్యం పట్ల అశ్రద్ధే జీవితాన్ని ముంచు ఆరోగ్యమే మహాభాగ్యమని ఏనాడో తేల్చి చెప్పారు విజ్ఞులు అరోగ్యం తర్వాతనే అవసరాలన్నిటినీ వుంచు 230. ఆరోగ్యకరమైన ఆలోచన్లే అభివృద్ధినిచ్చు ఆరోగ్యకరమైన ఆహారమే పెరుగుదలనిచ్చు ఆరోగ్యాన్నివ్వదు అనవసరతిండితింటే ఆరోగ్యకరమైన పంచేంద్రియాలే సంతోషాన్నిచ్చు 231. ఆరోపణలు చేయకు కారణం తెల్సుకోకనే ఆరోపణలు నిజాన్ని కాదనలేవు ఏదీ తెల్సుకోకనే ఆరోపణలు అసూయకు పరాకాష్ట ఆరోపణలు చేసేది తన ఆధిక్యతను తెల్పాలనే 232. ఆరోహణతో సాహస కార్యక్రమాల్ని నిర్వహించాలి ఆరోహణ కీర్తి శిఖరాలధిరోహించాలి ఆరోహణ ఉన్నతమైన వాటికే చెల్లుతుంది ఆరోహణలు ఆత్మసంతృప్తి, స్టెర్యంతో వుండాలి 233. ఆర్తి మనిషిలో అభిమానానికి ఊపిరి ఆర్తితో చేసేపనే ఏకాగ్రతకు ఊపిరి ఆర్హికల్గినవారి స్వభావంలో కుట్రలుండవు ఆర్తి వున్నప్పుడే ఆప్యాయత వుంటుంది మరి
దోర్నాదుల సుబ్బమ్మ ఉరి
-
ఆర్యా అనే సంబోధన గౌరవప్రదం ఆర్యా అంటూనే గోతులుతవ్వడం కాదు ముదం ఆర్యులు తొలుత భారతదేశం వచ్చినారు ఆర్యాకు బదులు వొరే అనడం కాదు శుభప్రదం
-
ఆర్పు, తగలబడిపోతున్నదాన్ని ఆర్చకు మంటతో తయారౌతున్న వంటకాన్ని ఆర్బుకో తలస్నానం చేసిన తలను ఆర్పాలనుకోకు ఎదుటివారి సొభాగ్యదీపాన్ని
-
ఆర్ధతగల హృదయంతో ఆలోచించు ఆర్ధత నిండుకొన్న మనసుతో పలకరించు ఆర్ధత కొనుక్కొంటే వచ్చేది కాదు మనసునుండే వస్తుంది అర్ధతచూపే వారితో సున్నితంగా వ్యవహరించు
-
ఆలంబన పడిపోకుండా చేస్తుంది ఆలంబననేది సమయాన్ని బట్టి వుంటుంది ఆలంబనగావుండొచ్చు బాధితుల్ని ఆదుకొంటూ ఆలంబన దొరికితే భయం అందుకొనేలా చేస్తుంది
-
ఆలాపనలతోనే కేవలం కాలాన్ని వెళ్ళబుచ్చకు ఆలాపించు అప్పుడప్పుడూ రాగాలను మరువక ఆలాజాలంగా వుండాలనుకోవడమే జీవితంకాదు ఆలాజాలంగా వ్యాపారాన్ని చెయ్యాలనుకోకు
అక్షర శతకం తి 239. ఆలోచనలకు చురుకుదనం యివ్వాలి ఆలోచనలకు కరుకుదనం యివ్వడం మానాలి ఆలోచనల చురుకుదనం సంక్షేమాన్నిస్తాయి ఆలోచనల కరుకుదనం సంక్షోబాల్ని తెస్తాయనితెల్సుకోవాలి. 240. ఆలింగనాన్ని అంగీకరిస్తేనే ప్రేమకు చిహ్నమౌతుంది ఆలింగనంతోనే ప్రేమ పుట్తుందనుకోవడం పారపాటవుతుంది ఆళలింగనంలో (ప్రేమ అభిమానం కలిసుంటేనే ఆనందం ఆలింగనం సున్నితంగావుంటేనే ప్రేమ జనిస్తుంది 241. ఆలికోసం అశ్రమాలు చెయ్యొద్దు ఆలిని అనుమానిస్తూ సంసారంచెయ్యొడద్దు ఆలిని అజిచేయడమే భర్త గొప్పదనమనిపించదు ఆలి బెన్నత్యాన్నిచూసి అసూయపడొద్దు 242. ఆలించు చెప్పాచ్చేవారి బాధలు ఆలించకు అభాండాలతో కూడిన కథలు ఆలించక పోతే అవగాహన కల్గదు ఆలించి, అవసరమైతే చేయి హితబోధలు 243. ఆలస్యం అన్నిటికీ మంచిదికాదు ఆలస్యం కొన్నిటికే మన్నికౌతుంది ఆలస్యంచేస్తే కొన్ని సమయాల్లో అనర్థాలు కల్గుతాయి ఆలస్యానికి కారణం తెల్సుకోకపోవడం పద్ధతికాదు "
50 దోర్నాదుల సుబ్బమ్మ 244. అలుమగలు జీవితరధానికి చశక్రాలు ఆలుమగల మాటలు కాకూడదు వక్రాలు ఆలుమగలిద్దరూ సంతానానికి కారణభూతులు ఆలుమగలిద్దరూ సమాజానికి ప్రతిబింబాలు 245. అనరణాన్ని పచ్చదనంతో నింపు ఆవరణపు పచ్చదనమే ఇంటికి సొంపు ఆవరణంలోని మొక్కలు కంటికి, వొంటికి శ్రేష్టం ఆవరణాన్ని ఆహ్లాదంభరితంచేసేది మొక్కలపెంపు 246. ఆవహించిన, “మంచి” చెడు చేయదు ఆఅవగించిన కూర తెల్లవారికి చెడిపోదు వహించింది దేవతైన్సా దెయ్యమైనా కొత్తమాటలు మాట్లాడుతారు ఆవహించిందెవరో కంటికి కన్చడనే కన్పడదు 247. ఆవాలు జీర్ణశక్తి బెషధగుణం కల్గివుండు అవగింజంతయినా మేలుచేసే గుణం కల్గివుండు అవులిస్తే పేగులు లెక్కకట్టేవారు మేధావులు చురుక్రైనవారు ఆపకాయ ఊరగాయల్లో రుచిగావుండు 248. ఆవుపాలు పాలల్లో శ్రేష్టం అవు జంతువుల్లో క్రేష్టం ఆవువంటి సాధు జంతువృలను వధించకు ఆవు గృహహ్రవేశంలో శ్రేష్టం
అక్షర శతకం 51 249. ఆశయాల్లో జీవించు ఆశయం కోసం జీవించు ఆశయం ఉన్నతంగా వుంటుంది ఉదాత్తులైవుంటే ఆశయంలో పరుల ప్రయోజనాన్నివుంచు 250. ఆశయాలు పెద్దవైనంతమాత్రాన చాలవు ఆశయాలకోసం ఆలోచిస్తే శ్రమకు పూనుకోగలవు ఆశయాలు చిన్నవనుకొన్నా ఫలితాలు చేతిలో వచ్చివాలవు ఆశలుకీరే అనువైన దారిన నడిస్తేనే ఫలితాన్ని అందుకోగలవు 251. ఆశలు ఫలించి అకాశాన్ని జయించినప్పటికీ ఆశ ఫలించదు ఆకాశంలో కల్సినవాళ్ళను తెచ్చియివ్వడానికి ఆశలు కల్గించే చేష్టలు చేయకెన్నడూ ఆశావహమైన కోరికలే కోరుకో ఎప్పటికీ 252. ఆశ్రమం అంటే శ్రమను మరిపించేదిగావుండాలి ఆశ్రమవానం ్రశాంతతనిచ్చేదిగా వుండాలి ఆశ్రమంలో వున్నంతమాత్రాన వైరాగ్యం కల్గదు ఆశ్రమ ధర్మాలు పొటిస్తూ తృప్తి వడ్తూవుండాలి 253. ఆశీస్సులిస్తారు ఆయురారోగ్యాలు వరిల్లాలని ఆశీనులైనవారందరికీ వేదిక అలంకార ప్రాయం కావాలని ఆశుకవిత్వం కవులందరూ చెప్పలేరు ఆశుకవిత్వం కోసం ప్రయత్నిస్తారు సాంతం న. ల స . ఇ[ 0? 5 ఇషు! _
52 దోర్హాదుల సుబ్బమ్మ 254. అషామాషకైనా అబద్ధాలాడకు
ఆషామాషికైనా నిప్పుతో చెలగాటమాడకు
ఆషామాషికాదు మంచిగా పేరొందడం
ఆషామాషికైనా అకృత్యాల జోలికెళ్ళకు
- ఆసక్తి వొక్కొక్కరికి వొక్కోవిధంగా వుంటుంది
ఆసక్తి మంచివిషయాలనే వాడుకలో వుంటుంది
ఆసక్తి వున్నంత మాత్రాన అందదు ఫలితం
ఆసక్తి మనసులో స్పందన్ని బట్టే వుంటుంది
256, ఆసనానికి క్రమపద్ధతి వుంటుంది
ఆసన అభ్యాసంలో ఆరోగ్యం వుంటుంది
ఆసనాల్లో వొక్కోరకం వొక్కో మేలు చేస్తుంది
ఆసన మెప్పుడూ శరీరపరిస్టితిని నియంత్రిస్తుంది
- ఆస్థిఅంటె కేవలం డబ్బేకాదు అస్థిసంపాదించేమార్గాలు లేకపోలేదు ఆస్థిని పరువుగాసంపాదించినపుడే ఆస్థిపరుడంటారు అస్థికోసం అభిమానాన్ని తాకట్టుపెట్టవద్దు
- ఆస్థికులెప్పుడూ ఎక్కువగా దైవకైంకర్యంలోనే వుంటారు
ఆస్థికులనేవారు నిష్కల్మషమైన మనసుకలిగివుంటారు ఆస్థికులు తామే అధికమని భావించకూడదు ఎల్లవేళలా ఆస్థికుల్లో నిరాడంబరులే ఎక్కువగా వుంటారు.
అక్షర శతకం 5్3 259. ఆస్థికుల్లో అచంచల విశ్వాసం వుంటుంది
ఆస్థికులకెప్పుడూ మంచి ఆలోచన వుంటుంది
ఆస్థికులు అస్థికత్వాన్నడ్డుంచుకొని అక్రమాలు చెయ్యకూడదు
అస్థికులకు ఆస్థికత్వమే అన్నిటికంటే మిన్నగా వుంటుంది 260. ఆస్థిపాస్తులు శాశ్వతం కావు
ఆస్థిచూపించి అకర్షించలేవు
ఆస్థిలో కొంతలో కొంత మంచికై వినియోగించు
ఆస్థికంటె మించింది మంచితనమంటే కాదనలేవు 261. ఆస్థివుందని విర్రవీగకు
ఆస్థిని దుర్వినియోగం చేయకు
ఆస్థితోనే రావు పేరుప్రఖ్యాతులు
ఆస్థిని చూస్కూంటూనే కాలయాపనచేయకు " 262. ఆహా అని యితరులు భావించేలా నడ్చుకో
ఆహా ఓహో అని నీకై నీవు పొగుడుకోకు
ఆహా అన్న పదంలో మర్యాద, మన్నన కల్ప్సుంటాయి
ఆహా అన్పించుకోవడం సులభం కాదని తెల్ఫుకో 263. ఆహారం పుష్టికరమైనదైనా మితంగా తీనుకో
ఆహారాన్ని నీవు కష్టపడి సంపాదించుకో
ఆహారాన్నిబట్టే ముఖ్యంగా ఆరోగ్యంవుంటుంది
ఆహారాన్ని భుజించడంలో వేళను పాటించాలనుకో
కడ దోర్హాదుల సుబ్బమ్మ 264. ఆహ్వానించు మంచివారైతే ఆహ్వానం పలక్కు అల్హాటప్పాగాళ్మెతే ఆహ్వానం విశిష్టతతో ముడిపడి వుంటుంది ఆహ్వానంలో అంతస్భులు చూపకు మంచిమనసైతే 265. ఆహుతి చేసుకొనకు జీవితాన్ని అనవసరంగా అహృతి ఎప్పుడూ వుంటుంది బాధాకరంగా ఆహుతి యిస్తే అనంత శక్తులొస్తాయనుకోవడం భ్రమ ఆహుతి గొప్పవుతుంది పరుల సంక్షేమం కోసంగా 266. ఆక్షేసించకు ఎదుటివారి ప్రగతిని ఆక్షేపించు వ్రగతినిరోధక శక్తిని ఆక్షేపణ చెప్పకు మంచి అలోచన్లకు ఆక్షేపణ చేయకు ప్రతిపనినీ 267. ఆక్షేపించడం చాల తేలికైనపని ఆక్రేపించకుండా జీవించడం తెలివైనపని ఆక్షేపణలు చేస్తూ మురిసిపోవడంలో కాలంగడపకు ఆక్తేపించినా తప్పుదిద్దగల్గికేనే సరైనపని 268. ఆందోళన కల్గుతుంది జీవితం పెక్కుసార్లు పరాభవంపాల్రైతే ఆందోళనపడకు వొక్కసారే పరాభవం పాలైతే ఆందోళనతో కూర్చునేకంటే తొలగించుకొనే యత్నం ముఖ్యం ఆందోళనతో ప్రయోగాలు చేయకు జీవితం ధుఃఖంపాలైతే
అక్షర శతకం కర్ 269. ఇంకాయింకా వినాలన్పించేలా మాట్టాడు ఇంకాయింకా చీదరించుకొనేట్టు గాకుండా మాట్టాడు ఇంకాయింకా ఆదరించగలిగినవారే గొప్పవారు ఇంకాయింకా చెప్పుకొనేట్టు చేసి చూపిస్తానని మాట్లాడు 270. ఇంకిపోనీయకు (ప్రేమను మనస్సుని ఇంకిపోనిచ్చి ఎండబెట్టకు నిండు పైరుని ఇంకిపోనీయకు నీలోనే విషాన్ని ఇంకిపోయిన బావిలో తవ్వు పిల్లబావిని 271. ఇంకుతో కాగితంమీద అక్షరాకృతియిస్తారు ఇంకుని గోడలమీద చిత్రాలకు వాడరు ఇంకు వున్నంతవరకే కలం పనిచేస్తుంది ఇంకుమాదిరే పప్రాణంవున్నంతవరకే మనిషనుకొంటారు 272. ఇంకుడుగుంట ప్రభుత్వపథకాల్లో కాక అమల్లో వుండాలి ఇంకుడుగుంట ప్రతియింట వుండేట్టు చూడాలి ఇంకుడుగుంటలు భూమిలో నీటిమట్టాన్ని పెంచుతాయి ఇంకుడుగుంటల ప్రయోజనాన్ని చాటి చెప్పాలి 273. ఇంగువకట్టిన గుడ్డని మంచిని పోలుస్తారు ఇంగువను ఊరగాయలో వాసనకోసం వేస్తారు ఇంగువపట్టు తలనొప్పిని అరికట్టుతుంది ఇంగువను మితంగా వాడకపోతే కీడుగా తలుస్తారు
కం దోర్హాదుల సుబ్బమ్మ 274. ఇంగితజ్ఞానం లేకుండా ఏపనీ తలపెట్టకెన్నడూ ఇంగితజ్ఞానం అన్నివేళలా కల్గివుండు ఇంగితజ్ఞానం లేనివారు మూర్తులు ఇంగితజ్ఞానంతో చేసేపనే సార్ధకత కళ్ళివుండు 275. ఇంగిలీకం గుణం తెల్సుకొని వాడు ఇంగిలీకాన్ని రుచిచూడాలనుకోకెన్నడూ ఇంగిలీకాన్ని మోతాదు మించనీయకు ఇంగిలీకంలో కూడా వుంది మంచి చెడు 276. ఇంగ్లీషు నేర్చుకొంటే ప్రపంచమంతా తిరగొచ్చు ఇంగ్లీషు నేర్చుకొన్నాకనే ప్రయోగించు ఇంగ్లీషు మాట్టాడ్డంోనే గొప్పవాడివైపోలేవు ఇంగ్లీషు భాషాక్కటే అన్ని భాషలకంటె కాదు హెచ్చు 277. ఇంచుమించుగా మంచివనుకొన్నవన్నీ చేసెయ్ ఇంచుమించు మంచివారితోనే పోల్చుకొనేసెయ్ ఇంచుమించుగా నచ్చినవన్నీ అమిళంగా తినకు ఇంచుమించు మంచిగాతోచేవారికి సాయమందించేసెయ్ 278. ఇంజన్లో అన్నిభాగాలున్నట్టే వుండాలి శరీరంలోకూడా ఇంజన్లో ఏ వొక్కభాగంకొరవైతే అది వెలితికూడా ఇంజన్లో భాగాలన్నీ సరిగా వుంటేనే సక్రమంగా నడుస్తుంది ఇంజను సమస్యను తీర్చేదిగా వుండాలి కూడా
అక్షర శతకం ర్7 279. ఇంటగెలిచి రచ్చగెలవడం మంచి ఇంటినొదిలేస్తే రచ్చబండ కాదు మంచి ఇంటికంతా నీ బాట, మాట మంచిదై వుండాలి ఇంటినుండి వెళ్ళినంతమాత్రాన జరగదు మంచి 280. ఇంట తిని పడివుండు పనిచేయలేనప్పుడు ఇంటింటికీ తిరిగి ఇంట్లో వారి గురించి చెడుగా చెప్పకెన్నడూ ఇంట తింటూనే ఇంటికే ఎసరుపెట్టకు ఇంటపడి తినేవారంతా ప్రయోజకులేనని నిర్ధారించుకోకెన్నడూ 281. ఇంటికిదీపం ఇల్లాలంటారు ఇంటిదీపానికి చమురు భర్తేనంటారు ఇంటిల్లిపాదికీ భార్యాభర్తల అన్యోన్యతే వెలుగు ఇంటివారందరికీ ఇల్లాలే ఆధారంగా మెలగాలంటారు. 282. ఇంటిగుట్టు గడపదాటనీయకు ఇంటికి గుట్టు, చేనుకి గట్టు లేకుండా చేయకు ఇంటి గుట్టుని ఆపద చుట్టుకొని ముంచేస్తుంటే దాచకు ఇంటికంటె గుడి పదిలమైందని అన్నివేళలా భావించకు 283. ఇంటి దీపమేనని ముద్దెట్టుకోకు ఇంటి చుట్టాన్ని ముద్దెట్టుకోవాలనుకోకు ఇంట్లో నిన్ను నొప్పించేవారి సలహా పొటించకు ఇంటింటికీ వెళ్ళి నీ గొప్పల్సి నీవు చెప్పుకోకు
కళ దోర్నాదుల సుబ్బమ్మ 284. ఇంటి దొంగను గుర్తించడం కష్టం ఇంటి దొంగను పట్టుకోవడమూ కష్టం ఇంటి దొంగనైనా శిక్షించు ఇంటిదొంగనే పేరు రూపుమాపకపోతే ఇల్లంతా నష్టం 285. ఇంటిపేరు గొప్పదైనంత మాత్రాన గొప్పవైపోవు ఇంటిపేరు గొప్పకానంత మాత్రాన గొప్పకాకపోవు ఇంటిపేరే ప్రధానం కాదు ఎదగడానికి ఇంటిపేరు చెప్తూ ఎల్లకాలం కాయలమ్ముకోలేవు 286. ఇంటిరంకు ఇల్లంతా చెరుపు (కంపు) ఇంటబొంకు ఇల్లంతా ముంపు ఇంటికంతా నియమాలుండితీరాలి ఇంటనీతి వున్నపుడే ఇల్లంతా సాంపు 287. ఇంట్లో ఈగల మోతకు ఆస్కారమీయకు ఇంట్లో ఈగలు హానికరం కాదని వాదించకు ఇంట్లోవారినైనా, బైటవారినైనా హాని కల్గించే స్వభావంతో ముప్పే ఇంటిని, మనసుని కలుషితం కానీయకు 288. ఇంట్లో ముసలివాళ్ళను కీడుగా భావించే వారికి తెలివితక్కువే ఇంట్లో పనిచేయలేకషపోయినా ముసలివాళ్ళ మాటకు బలమెక్కువే ఇంట్లో అనుభవజ్ఞులు ముసలివాళ్ళేనని తెల్సుకో ఇంట్లో ముసలివాళ్ళ సేవలోనే పరమార్ధమెక్కువ
అక్షర శతకం ర్ి 289. ఇంట్లోవాళ్ళు వేలుచూపితే బైటవాళ్ళు కాలుచూపిస్తారు ఇంట్లోవారికి ఆధారమైనప్పుడే నిన్ను గౌరవిస్తారు ఇంట్లోవాళ్ళు ఆశీస్సులిస్తే చైటవాళ్ళు ఆశీనులుకండంటారు ఇంట్లోవారి బాధ్యత నిర్వహిస్తే నలుగురూ నీకు ప్రాధాన్యతనిస్తారు 290. ఇంద్రజాలంతో వచ్చే ధనం నిలవదు ఇంద్రజాలం వాస్తవంతో కలవదు ఇంద్రజాలికులకు వాస్తవం తెలుసు ఇంద్రజాలం మోసాన్ని నీమ్మదు 291. ఇంద్రధనుస్సు సప్తవర్ణాల సమ్మిళితం ఇంద్రధనుస్సులా జీవితం, సంసారంలో మిళితం ఇంద్రధనుస్సుని గుప్తంగా దాస్తుంది కాంతి సతతం ఇంద్రధనుస్సు కాంతి కిరణంలో వొదిగుంటుంది 292. ఇంద్రుణ్ణి దేవతల్లో ఎందుకు ముఖ్యుడంటారు? ఇంద్రుణ్ణే ఎందుకు స్వర్గ సౌఖ్యాలకు అర్హుడంటారు? ఇంద్రుణ్ణి పతివ్రతలు ఎందుకు ఆదర్శంగా తీసుకొనరు? ఇంద్రభోగం కోసం ఎందుకు మునులు తపస్సు చేస్తారు? 293. ఇందిరాదేవిని అందరూ ఆహ్వానిస్తారు ఇందిరాదేవి సాన్నిహిత్యమే కష్టాల్ని తీరుస్తుందంటారు ఇందిరాగాంధిని ఎక్కువమంది అభిమానిస్తారు ఇందిరాగాంధి ధైర్యసాహసాల్ని పొగడ్తుంటారు
60 దోర్నాదుల సుబ్బమ్మ 294. ఇంద్రియనిగ్రహం వున్నపుడే మనిషి గొప్పవాడౌతాడు ఇంద్రియనిగ్రహం లేనప్పుడు తప్పుచేయగల్గుతాడు ఇంద్రియాలన్నీ సజావుగావుంటేనే సంతోషం ఇంద్రియాలు క్రమంతప్పితే వ్యసనపరుడౌతాడు 295. ఇంద్రియాల బలహీనతే అనారోగ్యం ఇంద్రియాలు శక్తివంతంగా వుంటేనే ఆరోగ్యం ఇంద్రియాన్ని బట్టే సంతాన ఫలితం వుంటుంది ఇంద్రియ పుష్టిని బట్టే వుంటుంది సుఖం 296. ఇంతి సలహాను తోసివెయ్యకు ఇంతి మాటల్నిబట్టే నిర్ణయాలు తీసుకొనకు ఇంతిని నిర్లక్ష్యంచేస్తే సంతృప్తికరంకాదు ఇంతిని లేనిపోని పనుల్లో బేజారుచేయకు 297. ఇంపు సొంపుగా వుండాలని అతిగా అలంకరించుకోవద్దు ఇంపుగా వుందని అదుపుతప్పి నడుచుకోవద్దు ఇంపు సాంపులనేవి వాక్కొక్కరికి వొక్కోరకం ఇంపుగా వుందని ఆయాసం కల్గేలా తినవద్దు 298. ఇక్కట్లు అందరికీ వాకేవిధంగా వుండవు ఇక్కట్లు తీర్చిన వారే నిజమైన బంధువు ఇక్కట్లు కలినపుడు ఆత్మహత్య ఆలోచన రానీయకు ఇక్కట్లు నీ తెలివితేటల్ని నిలకడగా వుండనీయవు
అక్షర శతకం 61 299. ఇగురుకొన్న అన్నం బలం ఇగురువేసిన కొమ్మలు అందం ఇగురుబెట్టుకొని మాడబెట్టకు ఇగురించే జీవితాన్ని చెడపడం పాపం 300. ఇచ్చకాలాడకు అపరిచితులలో ఇచ్చకాలాడు నీ హితం కోరేవారితో ఇచ్చకాలెప్పుడూ ఆనందంగానే సాగుతాయి ఇచ్చకాలని పీరెట్టకు చెయ్యరానీపనులతో 301. ఇచ్చకల్లి ప్రేమ గురించి ఆలోచించు ఇచ్చకల్గిన దానికోసం ప్రయత్నించు ఇచ్చను ముందూ వెనుకా చూసి బహిర్గతంచెయ్యి ఇచ్చ లేనప్పుడు బలవంతంచేస్తే కల్గును చిచ్చు 302. ఇచ్చ నేది ప్రతి మనిషికీ వుంటుంది ఇచ్చ ప్రీతి పాత్రమైతేనే ఆమోదం వుంటుంది ఇచ్చ అంటూ నీచమైనపనులు చేయకు . ఇచ్చ అనేది ఉచ్చ్భస్థానంలోనే వుంటుంది 303. ఇచ్చిపుచ్చుకోవడం తెలివైనపని ఇచ్చిపుచ్చుకోవడంలో వుండాలి సంతృప్తికరమైనపని ఇచ్చిపుచ్చుకొంటూ నల్లురి మెప్పూ సంపాదించు ఇచ్చిపుచ్చుకోవడంలో చేయకు విలువల్ని కోల్పోయేపని'
62 దోర్నాదుల సుబ్బమ్మ 304. ఇచ్చేవాడికి అప్పుపత్రం లేకపోయినా ఫర్వాలేదు ఇచ్చేవాణ్డి అడ్డుంచుకొని అడ్డమైన పనులుచేయడం మంచిదికాదు ఇచ్చేవాడెప్పుడూ దాతగానే పేరొందుతాడు ఇచ్చేవాడైనా యోచించాలి చేసేపని మంచిదో కాదో 3056. ఇచ్చేవాడికి యిస్తూండడమే సంతృప్తికరం ఇచ్చేవాణ్సి హతమార్చి అంతాసాంతం చేస్కోవాలనుకోవడం హానికరం ఇచ్చువాణ్ణి చూస్తే చచ్చేవాడికైనా ప్రాణం వస్తుంది ఇచ్చేవాడు పుచ్చుకొనేస్థితికి రావడం దురదృష్టకరం 306. ఇజం అనేది సత్కార్యంతో వుంటుంది ఇజం అనేది నమ్మి ఆచరించడంలో వుంటుంది ఇజాలన్నీ చెప్పేవి సూక్తియుక్తమే ఇజాలెప్పుడూ అందరి శ్రేయస్సుని కోరుతుంటుంది 307. ఇటుకల తయారీలో శారీరకశ్రమ వుంటుంది ఇటుకల తయారీకూడా ఉపాధి నిస్తుంది ఇటుకల గట్టిదనం మట్టి గుణాన్నిబట్టీ వస్తుంది ఇటుకల గృహనిర్మాణం అందంగా వుంటుంది 308. ఇడుములు చెప్పి రావు ఇడుములు పడితేనే గొప్పకావు ఇడుములు కొనితెచ్చుకోకు ఇడుములు పడినంతమాత్రాన చులకనకావు
అక్షర శతకం 63 309. ఇడ్డీ సులభంగా జీర్ణమౌతుంది ఇడ్జీ ఆవిరితోనే తయారౌతుంది ఇడ్జీ రోగాలెన్నిటికో పథ్యకారి ఇడ్జీ దక్షిణాది వారి ప్రత్యేక అల్పాహారంగావుంది 310. ఇతరుల జోలికి అనవసరంగా వెళ్ళకు ఇతరులనుకొనేవారి సరసకు వెళ్ళకు, సరసాలాడకు ఇతరులనే భావనే అత్మీయులుగా తోచనీయదు ఇతరుల మేలుచూసి ఏడుస్తూండకు 311. ఇతరులజోలికెళ్ళి అపార్భాలకు ఆస్కారమివ్వకు, ఇతరులనే భావన ఆత్మీయుల్లో రానీకు ఇతరులకు మేలు చేస్తేనే కీర్తిపాందగలవు ఇతరుల సాత్తుని ఆశించబోకు 312. ఇత్తడి తాత్కాలికంగా మెరిసినా స్వర్ణంతో పోల్చకు ఇత్తడి స్వర్ణాభరణాలుగా ధరించి వుండవు ఇత్తడి మెరుపంతా తాత్కాలికమే ఇత్తడి పాత్రలు పులుపు వంటకుపయోగించకు 313, ఇతిహాసాల్లో భారతం ప్రసిద్ధి ఇతిహాసాలనిండుగా నీళులకు '్రసిద్ధి" ఇతిహాసాల్లో లేని ధర్మం లేదు ఇతిహాసాల్ని బెపోసనపట్టితే వస్తుంది ప్రసిద్ధి
54 దోర్నాదుల సుబ్బమ్మ
-
ఇదిగో నేనున్నానంటూ చేయి అందించు వేస్తానికి ఇదేనా అంటూ చులకనచేయడం మంచిదికాదు నిజానికి ఇది నాది అది నీది అనే వేర్వేరుగా దంపతుల్లో భావించకు ఇది అది అనే విమర్శలోపించిన ఊహలే చేయూత చాదస్తానికి
-
ఇద్దరు భార్యలుండడం పెద్దతప్పుగా భావించరు ఇద్దరు భర్తలుండడం పెద్దతప్పుగా భావించితీరుతారు ఇద్దరిలో సఖ్యతవుంటే వేరొకరితో తప్పుచేయరు ఇద్దరిలోనూ సర్దకీటు లేనప్పుడే సంసారాన్ని కూలదోస్తారు
-
ఇనుము బంగారంతో ఎప్పుడూ సరిసమానం కాలేదు. ఇనుముకి బంగారానికి పోలికేలేదు ఇనుమును బంగారంగా మార్చాలనడం అత్యాశే ఇనుపవస్తువు బంగారువస్తువులా వాడకానికి రాలేదు
-
ఇనుముని కరిగించినట్టు మనసుని కరిగించలేం ఇనుమువిరిగితే అతకవచ్చు మనసుని అతకలేం ఇనుపగుగ్గిళ్ళు తయారుచేస్తారనడం అతిశయోక్తి ఇనుముని ఆహారంగా వాడుకోలేం
-
ఇనుపవస్తువు నీటి తడితో చెడుతుంది ఇనుపగుండెలో కన్నీటితడి జాలిని పుట్టిస్తుంది ఇనుడెప్పుడూ మార్చుకోడు పయనపు దిశల్ని ఇనుము ఆయస్కాంతం ఆకర్షణకు మారుపేరుగా నిల్చింది
అక్షర శతకం 65 319. ఇప్పుడిప్పుడే రోగంనుండి కోలుకొంటుండేష్టుడు నిర్ణక్యంచేయకు ఇప్పుడిప్పుడే స్థిరపడ్డున్న వారిని బెదరగొట్టకు ఇప్పుడిప్పుడే ఐశ్వర్యవంతులైనవారు మిడిసిపడ్తుంటారు ఇప్పుడిప్పుడే 'పేరుకొస్తున్న వారిని హేళనచెయ్యకు 320. ఇప్పటికిప్పుడు అప్పుగాయిచ్చింది రాదు ఇప్పటికిప్పుడు అప్పు ముప్పుని తొలగించలేదు ఇప్పటికిప్పుడు మంత్రాలతోనైనా, తంత్రాలతోనైనా ఎదిగిపోలేవు ఇప్పటికిప్పుడు ధనవంతులు కాహీలని 'లాటరీ” మార్గంమంచిది కాదు 321, ఇప్పకల్టు అడవిలో దొరుకుతుంది ఇప్పకల్గు ఆరోగ్యాన్ని మత్తునియిస్తుంది ఇప్పచెట్ల పెంపకం వృత్తిగా కొనసాగలేదు ఇప్పకల్లే తాటికల్లు, ఈతకల్గు, టెంకాయ కల్లుల్లో శ్రేష్టమైంది 322. ఇబ్బందుల్లో వున్నానని మాటిమాటికీ అనకు ఇబ్బంది కల్గనీయకుండా యితరులతో మెలగొలనుకో ఇబ్బందులనేవి అందరికీ సహజమే ఇబ్బందులున్నాయని చేయరాని పనులు చేయకు 323. ఇభము అందరి పెంపుడు జంతువుకాదు ఇభమునకు చచ్చినా బ్రతికినా విలువుంటుంది ఇభముమీది ఊరేగింపుని గొప్పగా భావిస్తారు ఇభము మావటీవాడి మాటే వింటుంది
॥ దోర్హాదుల నుబ్బమ్మ 324. ఇరుకు యిల్లుతో సరిపెట్టకోవచ్చు ఇరుకు స్వభావం అపోహల్ని సృష్టించవచ్చు ఇరుక్కొంటూ కూర్చోనైనా కూర్చోలేనివాళ్ళకు చోటివ్వు ఇరుక్కోవడం వల్ల ప్రయోజనం ఏమిటో ఆలోచించవచ్చు 325. ఇరుగుపొరుగుల గుట్టు ఆరాతీయడం వాదిలిపెట్టు ఇరుగుపారుగు ఆపదల్లో ఆదుకోవడం మొదలుపెట్టు ఇరుగుపొరుగుల చల్లదనం నీకూ చల్లదనం ఇరుగుపారుగులకు సాయంచెయ్యడం నీ ప్రగతికి మొదటిమెట్టు 326. ఇరువురు కలిసి మాట్టాడుకొంటేనే అనుమానించకు ఇరుపోటీలుగా కక్షలు పెంచుకొన్న వారిచెంత చేరకు ఇరుగుపొరుగు వారితో సఖ్యతగా మెలగు ఇరుగుపొరుగువారి పోరులో పాలు పంచుక్షొనకు 327. ఇలలో లేని సొఖ్యం మరెక్కడో వుంటుందనుకోకు ఇలలో లేనివాటిగురించి గొప్పలు చెప్పాలనుకోకు ఇల్లాలంటే ఇంటికి మంచి చేసేవారే ఇల్టాలికి హుందాతనం మాట, మన్ప్ననలతో వస్తుందనుకో 828. ఇల్లంటే కేవలం యిటుకలతో నిర్మించిందే కాదు ఇల్లంటే మమత మమకారాలతో నిర్మించిందేగాని మరొకటికాదు ఇల్గ్లాలితోనే యింటికి వెలుగొస్తుంది ఇల్లాలే జీవితానికి కన్నూ వెన్నూ అనేది అసత్యంకాదు
అక్షర శతకం 67 329. ఇల్లరికం వెళ్ళిచూడు యిబ్బందేమిటో తెలుస్తుంది ఇల్లుకట్టిచూడు కష్టమేమిటో తెలుస్తుంది ఇల్లరికం ఆనందం కాదు ఇల్లు కట్టడం సులభంకాదు ఇల్గుచూస్తేనే యిల్లాలు తీరు తెలుస్తుంది 330. ఇల్లలకగానే పండుగ కాదు ఇల్లాలికి వంట రాకపోతే పండుగన్పించదు ఇల్గాలితో కలిసి పనిచేస్తుంటే అన్యోన్యమౌతుంది ఇల్లాలికి చేయూత నివ్వడం చులకన 'కొనేకాదు 331 ఇల్లుచూడగానే యిల్లాలి పని తెలుస్తుంది ఇల్గాలివల్లనే యిలలో సుఖముంటుంది ఇల్లనే దేవాలయంలో ఇల్లాలే యిలవేల్పు ఇల్లే తీర్ధంగా భావించడంతోనే నుభించలేదు 332. ఇల్లాలు గుడ్డిదైతే యిల్లుకూడా అంధకారమే ఇల్లాలు మర్కటమైతే యిల్లంతా చిందవందరమే ఇల్లాలి మేధాతనమే ఇంటికి సౌభాగ్యం ఇల్లాలి అనుకూలతే ఇంటిల్లిపాదికీ సాఫల్యము 333. ఇల్లో నారాయణమ్మను ఆదర్శంగా తీనుకోకు ఇల్గుచెడగొట్టుకొని యిల్లిల్లూ తిరగాలనుకోకు ఇల్లు పడగొట్లాననకు కోపం కల్గిన వేళల్లో ఇల్లే సర్వస్వంగా భావించి మిగతావన్నీ వదిలేయకు
68 దోర్నాదుల సుబ్బమ్మ 334. ఇవ్వకు నీ శక్తికి మించిన డబ్బుని ఇవ్వకు కుళ్ళిపోయిన వస్తువుని ఇవ్వకపోయినా మంచిపనికైతే యిచ్చేదారి చూపు ఇవ్వబోయేముందుగానే ఆలోచించు అన్నిటినీ 335. ఇష్టమైనవారు ఏది చేసినా యిష్టమే ఇష్టం కానివారు ఏదిచేసినా అయిష్టమే ఇష్టాయిష్టాలు చేసేపనిని బట్టి వుండాలి ఇష్టాలనేవి యింటికి అరిష్టాల్ని కీల్గిస్తే భ్రష్ణుత్వమే 336. ఇష్టప్రకారం జరిగిందాన్నే సంతోషమనుకోకు ఇష్టప్రకారమే జరగాలని ఎల్లప్పుడూ భావించకు ఇష్టప్రకారం జరగాలనడం నియంతబుద్ధి ఇష్టప్రకారంగా జరిగినా మంచిచెడులు తెల్పుకోకుండా వుండకు 337. ఇసుకనేల ఎంతదున్నినా పంటకు పనికిరాదు ఇసుకలేనిదే సిమెంటు కట్టుబడికి పనికిరాదు ఇసుక సిమెంటు కలిస్తేవే గట్టిదనం ఇసుక నిష్పత్తిమించి వాడితే ప్రయోజనంలేదు 338. ఇసుకతిన్నెలు, ఇసుకగూళ్లు ఎంతపెద్దవైనా నిష్ఫలం. ఇసుమంత మంచి మతిలోవృంటే అదేపెద్ద ఫలం ఇసుక ఉపయోగం తెల్సుకొని వాడు ఇసుమంతయినా నమ్మకు చెడుకోరేవారిని ఫలితం శూన్యం
అక్షర శతకం 69 339. ఇసింటారమ్మని అందరినీ పిలువకు ఇసింటకొచ్చేవారంతా విశ్వాసపాత్రులేనని భ్రమించకు ఇస్తేపెళ్ళి ఇవ్వక పోతే పెటాకులు కోరేవారుంటారు గమనిస్తే ఇస్తూంటేనే మేలుకోరేవారికి అమితంగా యివ్వకు 340. ఇస్త్రీ చెయ్యని గుడ్డకు నాణ్యత తగ్గుతుంది ఇస్రీచేసిన గుడ్డకు నాణ్యత చేకూరుతుంది ఇస్రీచెయ్యాలంటే పెట్టె వేడెక్కితీరాలి ఇస్తీలేని మడతవల్ల వైనంమాత్రం వుంటుంది 341. ఇహలోకపు సౌఖ్యాలతో ముక్తిని పొందలేరు ఇహపరలోకాలంటూ కొందరే భక్తులు కాగలరు ఇహపరాలకు పనికిరాని పనులు చెయ్యకెన్నడూ ఇహం మెప్పీంచలేనివారు పరం సాధించలేరు 342. ఇక్షురసం నోటికి రుచి ఇక్షురసాన్నైనా మితం తప్పితే అరుచి ఇక్షురసాన్ని పిండకపోతే రాదు ఇక్తురసానికైనా తప్పదు శుచి
70 ఈ దోర్హాదుల సుబ్బమ్మ 343. ఈకలనే తొలి కలంగా వాడారు
ఈకల పరుపుని సకల రోగనివారిణిగా ప్రచారంబేశారు
ఈకలులేని పక్షి ఎగురలేదు
ఈక తోకలొచ్చాకనే ఎగరడం చూశారు
- ఈకలుతీసిన పిట్టలాంటిదే స్వేచ్ళలేని భార్య
ఈకల విసనకర్రగాలి హాయిగొలిపే చర్య
ఈకలన్నీ సున్నితంగానే వుంటాయి
_ఈకలేరడంకంటె మంచిది సిట్టల్నిపెంచే చర్య
- ఈగలు ముసిరిన పదార్థం తినకు
ఈగలవల్ల రోగవ్యాప్తి జరుగదని అనకు
ఈగలు హానిచేసే జీవులని తలంచవచ్చు ఈగలనివారణ చెయ్యి .వృద్ధికానీయకు
346, ఈగల్ని చంపడం ఆరోగ్యాన్ని కాపాడ్డం కోసం ఈగావారనేది ఇంటిపేరు గుర్తుకోసం ఈగలువల్ల హాని జరుగునేకాని మేలు కల్గదు ఈగల్నుండి జాగ్రత్త తీసుకోమనడం నీ ఆరోగ్యం కోసం 347. ఈగుపోనీకు ఎప్పుడూ నీ ప్రయత్నాల్ని
ఈగుపోతావని చీయకు నీ ఆలోచనల్ని ఈగుపోకుండా విజయం కోసమే ప్రయత్నించు ఈగలు వాలకుండా చూసుకో పదార్థాల్ని
అక్షర శతకం 71 348. ఈటెలౌతాయి వాక్కోసారి మాటలు ఈటెబట్టిన చేతిని గురితప్పనీకు చేతలు ఈటె ఆటవికుల ఆయుధం ఈటె చూపిస్తేనే కాదు బెదిరింపులు 349. ఈడుజోడు కుదిరితేనే అందం ఈడుకాని వాళ్ళతో మంచిదికాదు సంభోగం ఈడుజోడుతోబాటు, స్థితిమంతులైతేనే "ెద్దలంగీకరిస్తారు ఈడైనవాళ్ళందరి నుండీ కోరకు భోగం 350. ఈడుబోడు అంటే కంటికింపే కాదు ఈడుజోడు ఇంటిక్కూడా యింపుగుండాలి తప్పదు ఈడుకాని వారితో పరిహాసాలాడ్డం అనౌచిత్యం శఈడైనవారితో చతురులాడిత్తే నేర్వరనక తప్పదు 3513. ఈడేరనివాటికోసం దుఃఖిస్తూవుండకు ఈడేరుతాయని అన్నిటినీ భావించకు ఈడేరుతుంది నీ లక్ష్యం మంచిదైతే ఈడేర్చమని నీ కోరికల్ని అందరిముందుంచకు 352. ఈతకల్లు వేసవిలో శ్రేష్టం ఈతకల్లు మితంలేకపోజే ఓ వ్యసనం ఈతపళ్ళు, కల్గు కోసం చెట్టుదగ్గరే కాచుకోకు ఈతచెట్టు నీడలో విశ్రమించలేం
72 దోర్నాదుల సుబ్బమ్మ 353. ఈతచాపలల్లడం ఉపాధిమార్గం ఈతబెల్లం బెషధం దాని గుణం ఈతాకుని యింటి కప్పుకిళూడా వాడ్తారు 'ఈతచెట్టుకి ఖర్చు తక్కువ పెంపకం 354. ఈత రాకముందే ఈదాలనుకోకు ఈత వచ్చాక మునిగిపోతున్న వారిని చూస్తూండకు ఈత వచ్చినవాడు కాపాడకపోతే మనిషే కాడు ఈత వ్యాయామమే తక్కువనుకోకు 355. ఈతిబాధలు కోకొల్లలు ఈతి సమయంలో కోపం కొల్లలు ఈతిబాధల్ల్టోనే ఆదుకోవాలెవర్షైనా ఈతికి కారణం ప్రకృతి కన్పెర్రలే 356. ఈదరగాలికి కళ్ళు మూసుకో ఈదరగాలి వర్షపు మేఘాల్ని తరుముతుందని తెల్సుకో ఈదరగాలిని తేలిగ్గా తోసిపుచ్చకు చూసి ఆగు ఈదరగాలిని గమనిస్తూ పడవెయ్యాలనిగుర్తుంచుకో 357. ఈదుకొంటూనైనా ఏరుదాటాలనుకో అత్యవసరమైతే ఈదుకొంటూ సముద్రాన్ని దాటాలనుకొంటారు అంతిమ ఘడియైతే ఈదడానికి ప్రయత్నించకపోయినా కేకవేసి పిలువందరినీ ఈదగలిగేవారు ముందుకొస్తారు మునుగుతున్నట్లయితే
అక్షర శతకం 73 358. ఈనగాచి నక్కలపాలు జెయ్యకు సంటను ఈనగానే సంబరంకాదు దూడ పదిలంగావుంటేనే ఈనడంతోనే (ప్రేమను పశువుల్లోనై నా కనలగలం ఈనకమానవు ప్రాణానికి బాధాకరంగా వుంటూవున్నా 359. ఈనెలు తీసిన టెంకాయ ఈనెలు చీపురుకట్ట ఉపయోగం ఈనెలనే శరీరానికి నాడుల్లాంటివే పత్రానికి ప్రయోజనం ఈనెలుతీసిన తమలం నములుతుంటారు ఈనెగుణం తెల్పుకొన్న వారికే ఉపయోగం 360. ఈపి, 'పేనులున్న తల వేధించు ఈపిని చంపడం ఈర్పెన సాధించు శఈపినైనా తొలగించుకో తలనుండి ' ఈపిదళలోనే చంపే శ్రద్ధవహించు 361. ఈమునుండి నేర్చుకో కరిగి కలసిపోవడం ఈము అగ్ని విరుద్ధమైనా కరగడం ఖాయం ఈము భూమికి తెల్లటి తివాచీ అవుతుంది ళుము గాయంపైపెట్టు నాప్పి కాస్త మాయం - 362. ఈమె ఈమె అంటూ వేలెత్తి చూపకు ఈమె అనగానే మార్గదర్శకంగా తోచాలి మనకు ఈమెనుచూస్తూనే గౌరవం కల్గేలా వుండాలి ఈమెగుణం తక్కువదైతే “ఇది అన్పించుకోకతప్పదు తనకు
74 దోర్నాదుల సుబ్బమ్మ 363. ఈరిణపు భూమి గుణం వ్యవసాయశాస్త్రవేత్తలకు తెల్పు ఈరిణపు భూమి పనికిమాలిన మనిషిలోగేనని తెల్సు ఈరిణపు లక్షణాన్ని మార్చి మంచిదారికి తెచ్చుకో ఈరిణపు భూమి మారందే పంట దిగుబడి శూన్యమనితెల్సు 364. ఈర్వను తొలగించుకోవడమే ఘనత ఈర్ష్యతో వుంటూ మంచిగా నటించడం కాదు మమత ఈర్వ్వకు, తననుతాను దహించేగుణం మెండు ఈర్వ్యతో సాధించలేవు సమత 365. ఈర్చిపోస్తూ ఈపిని చంపు ఈర్చిపోస్తూన్నా పెరగనీయకు ఈపి పెంపు ఈర్చడంకూడా మెలకువతో చెయ్యాలి ఈర్చడం చేతగాని తనమే వెంట్రుక తెంపు 366. ఈలవేస్తూ పాటపాడడం మంచి అభ్యాసం ఈలవేసి కనుసైగ చెయ్యడం అపరాధం ఈలపాట మృదుమధురంగా పాడేవాళ్ళు అరుదు ఈలపాట కష్టతరమే అభ్యసించడం 367. ఈలపురుగు పారాడిందాన్ని తినడం మానెయ్ ఈలప్పురుగు నివారణకోసం బట్టల మధ్య గుళికల వేసెయ్ ఈలపురుగు కరిచేవికాదని అప్రమత్తంగా వుండకు ఈలపురుగు స్థావరాలను నిర్మూలన చేసెయ్
అక్షర శతకం 75 368. ఈలుగుముఖం కలవాడేమీ సాధించలేడు ఈల కరచక తప్పదు ఏ సమస్యయినా శక్తిలేనప్పుడు ఈలకరిచే సమయంలో సమయస్పూర్తితో మెలుగెప్పుడూ ఈలకరుస్తామనేది ఖాయంగా వుంటే దూరంగా వుండెప్పుడూ 369. ఈవినిబట్టే మంచితనం తెల్సుకోవచ్చు ఈవి మంచిదైవుంటే లక్ష్యం మంచిదనుకోవచ్చు ఈవిని శఈుడేర్చేవాడే భగవంతుడు ఈవిలేని మనిషే లేడని అనుకోవచ్చు 370. ఈవులమాను కళ్ళకు కన్పించదు ఈవులమాను మనసుకి మాత్రమే కన్పిస్తుంది ఈవులలో రకాల్ని చెప్పడం బహుకష్టం ఈవులమాను ఏ ఒక్కరి సాంతం కాదు 371. ఈవుల రతనం మంచినడవడికకే పేరు ఈవుల రతనంగా పేరొందడం వేరు ఈవుల్ని త్యజించడమే త్యాగం ఈవులన్నింటికీ మనసులోనే వుంటుంది వేరు 372. ఈశ్వరుడొక్కడే దేవుడని శైవుల నమ్మకం ఈశ్వరుడే జాలితో కోరికల్ని తీరుస్తాడని కొందరి నమ్మకం ఈశ్వరుడి నివాసాలు కైలాన౦, శ్మశానం ఈశ్వరుడి భార్య ఈశ్వరి ఏకైక శక్తి అని అందరి విశ్వాసం
న దోర్నాదుల సుబ్బమ్మ 373. ఈశ్వర విబూది సర్వసంగ పరిత్యాగానికి చిహ్నం ఈశాన్యపు దిక్కుకి వాస్తులో ప్రత్యేకం ఈశాన్యపు మూల పిదపే తూర్పు దిక్కు ఈశ్వరుని నాట్యమే పేరొందింది అమోఘం 374. ఈళుని గుణాలు భరించే భార్యకే తెలుస్తుంది ఈశుని అనుకూలం సంసారానికి నాణ్యత తెలుస్తుంది ఈశా పరమేశా పిలుపుని భజనవరకే పరిమితంచెయ్యి ఈశునికి గౌరవమర్యాదలనేవి భార్య సంస్కారం యిస్తుంది 375. ఈషాదంతం సాధారణ పెంపుడు జంతువుకాదు ఈషాదంతం పెంపకం సాధారణ ఖర్చు కాదు ఈషాదాంతపు వాహనం రాజులకాలంలో గొప్పకు సంకేతం ఈషాదాంతంపై ఊరేగడం అందరికీ వీలుకాదు 376. ఈషణ్మాత్రం జీవితం సుఖపడేదైవుండాలి ఈషణ్మాత్రం జీవితం న్యాయబద్ధమైవుండాలి ఈషణంతో దుర్భుద్ధిని జత చేయకు ఈషబ్మాత్రమైనా జన్మాంతం క్రమపద్ధతి కల్గివుండాలి 377, ఈసపిట్ట ఒకజాతికి చెందిన చేప ఈసపిట్టని పేరున్నా ఎగరలేదు అ చేప ఈసునిపోగొట్టుకోవడంలో తెలివిని చూపించు ఈసులేని' వయసేననేది పాప
అక్షర శతకం 77 378. ఈసు పెంచుకొని జీవించకు ఈసు మనసులోవుంచుకొని వేధించకు ఈసులేని వారు దైవసమానులు ఈసుతో యిరుగుపారుగుకి నష్టం కల్గించకు 379. ఈక్షణీకపు మాటలు మూటకట్టుకోకు ఈక్షణికమంతా పొట్టకూటి కొరకే ఈక్షణికపు మాటలు జాణతనానికి గుర్తు...సొత్తు ఊక్షణికం కూడా ఓ కనికట్టులాంటిదేననుకో _అహంిహిమో। ఈదప్రైల- రయి సగం ధాల సురా లాం ఖ్భా (| 3 ౯ ఉ(ం “ండిషడిగి ఓ లో స్ వం ఆ ో
వ |] | 1 కా గ క ఛ్ గ. ౨౦వ సకం సతు | య | “ఈ జీవితం పెద్ద చీకటి వెలుగుల దోబూచులాట " య. - కలల సంగ్రామం ఒక వైపు” . | వ కి. * కన్నీళ్ళనదులు మరొక వైపు " క్ | (| | (జ శా ర “దాటలేను, దూకలేను, జయించలేను, ఓడిపోయి మడమ తిప్పలేను " డ్! న్న నా ం ఉల క ఫె పూ సన్న అంటూ ఆవిడ నదచి, నదచి అలసిపోయి ఆగిపోయింది. _ లట - లం అని సందేశమిచ్చే అమ్మను విజేతగా భావిస్తూ. .... 5. అమ్మ అభిరుచిని తీర్చాలనే ప్రయత్నంలో సహస్రాంశమే ఈ అక్షరమాల. | [త ఉగ త! నెల్లూరు జిల్లా, ఆళ్మకూరు వాస్తవ్యులైన శ్రీ దూర్నాదుల సుబ్బమ్మ గారు 1958 లో రచనల ప్రారంభం - వివిధ వార, పక్ష మాస పత్రికలలో 120 కిపైగా కవితలు, కథలు, నవలికలు - ॥ “ఓ వువ్వు పూసింది " కథకు సింహపురి సాహితీ సమాఖ్య వారి మొదటి బహుమతి - “సారా తాగొద్దు |". “మానవతా ఆలోచించు " - రాష్ట్ర మనోరంజనీ వారి అవార్డు - వివిధ వార, మాస పత్రికలలో ప్రచురింపబదిన 50 మినీ కథలనుసంకలనంగా “తరుజీ తరంగాలు " అనే పేరుతో డాః బెజివాడ గోపాల రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ - ॥ వనితా జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడిన “ లేఖా సొహిత్యం “ 46 లేఖలతో “మరో వనంతం కోనం " అనే సంకలనం విదుదల - “జీవిత వున్తకంలోంచి జక పేజీ" అను కవితకు రంజనీ కుందుర్తి, హైదరాబాదు వారి అవార్డు - నెల్లూరు జిల్లాలోని ఆరుగురి కవుల సంకలనం “ శ్వేత నంతకాలు " లో బకరిగా సంతకాలు - ఆలిండియా రేడియో విజయవాడ, కడవ కేంద్రాల నుంది స్త్రీల సమస్యలపై ప్రసంగ వ్యాసాలు, హైదరాబాదు, దూరదర్శిని వారి కవి సమ్మేళనం - అమెరికా పర్యటనలో స్పందించి 40 దీర్జకవితలు వ్రాసి ఆ కవితలను అమెరికాలోని శ "మౌంటైన్ లేక్ లైబ్రరీ వాల్ "లో ఫాదర్స్ దే సందర్భంగా “ వొన్నల వినం - శుఫొకాంక్షలు " కవితా గానం - అమెరికాలోని కొన్ని పత్రికలలో వెలువద్ద కవితలు, కథలు - " న టాల్ గ ॥ సుబ్బమ్మ గారి సాహిత్య ప్రయాణంలో ఇంకా ఎన్నెన్నో మైలురాళ్ళు... జ్ ఇ