Telugu Dhivyalochana Shethakamulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

(. షీ సహజ కవి మల్లెమాల కట! , మనసుపడి మక్కునతో సేకరించిన త. నే కో ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం - టా . సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి . నా సజ అ... ఆనందం బహూకరిస్తున్నాం, | న్న ల - మల్లెమాల కుటుంబం (4౮ స్స

తక , దివ్యలోచన శతకములు | | ( | డా డవ గవ రావు /

వ.

11001848 $5%4841స8810 దివ్యలోచన శతకములు ప్రథమ ముద్రణ: డిసెంబరు 2006

పీలు : 1000 న ఇ. సర్వహక్కులు (గ్రంథకర్తవి. ౬8% 0 0.5. 62౧20౧2౪41 గ౭౦, ౧1.0. 2/2 1160102! ౧6౧16! వానావాలలాలాం. ౯12 ని౭గం౧26 ౮౮౧౦కర్లాడ ధొలయ్య సీ 2౧౧2౧10612 స్థారయ్య (గ్రం ఖ్‌ 192020202౧ - 520 రజో (౮ ఖ్‌

శ్‌ డీ 0.000 శ

వెల : అమూల్యము *ఇీ సో 0000185: జం హో 0 0.5. 62౧౭౧౭౮1 ౧౭౦ | ౯12202, ౪1912 2౧126 గ్‌ ౧66౭ ౪/2121 ౮౮౧౦౪౦౧, (6 +28/38౧292/ ౧౭1206 ఓ2/0061 +19210%20202గ) - 530 017. న౧౦౧6: 0891 - 2539917 ౮6॥: 98491 29917 ముద్రణ : సత్యం ఆఫ్‌సెట్‌ ఇంప్రింట్స్‌ డోర్‌ నెం. 46-18-10 మండావారిపేట, దొండపర్తి విశాఖపట్నం - 530 016 ఫోన్‌ : 0891-2735878, 6648538

నామాట

శ్రీ అలవేల్మంగ వేంకటేశ్వరుల దయవల్ల ఎప్పటినుంచో అనుకుంటున్న రవిశతకం ఇన్నాళ్ళకి పూర్తయింది. సూర్య భగవానుడి మీద పద్యాలు వ్రాయలని అనుకోవడానికి ఓ కారణముంది. నేను శ్రీ వినాయక చవితినాడు పుట్టడం వల్ల గణపతి రావు అని పేరు పెడదామనుకున్నారట. అయితే చిన్నతనంలో నేను తరచూ అనారోగ్యానికి గురికావడం వల్ల మా మామ్మ శ్యామలాంబగారు సూర్యనారాయణుడి పేరు కూడా కలిపి సూర్య గణపతి రావు అని నామకరణం _చేయించాక నా ఆరోగ్యం కుదుటపడిందట. ఈ నాటికి ఆరోగ్య ప్రదాతా, జ్ఞానప్రదాతా అయిన శ్రీ సూర్య నారాయణుడి మీద శతకం వ్రాసి సమర్పించ గలిగాను.

రవి శతకం వ్రాస్తున్నప్పుడు కొన్ని భావాలు చంద్రుడి పరంగా చెబితే బావుంటాయనిపించింది. పాపం తెలుగు కవులంతా పని గట్టుకొని మరీ చంద్రుణ్ణి తిట్టిపోశారు. ఎక్కడో ఒకటో అరో *వలిమలయల్లు వాడు”... లాంటి పద్యాలున్నాయి. ఇదే మాట మా అమ్మతో అంటే చంద్రుడి మీద వంద పద్యాలు వస్తాయా? అంది. ఇదిగో వచ్చాయి. నాకు తెలుసున్నంత మటుకు తెలుగులో చందమామ మీద ఇదే మొదటి శతకం. దీనిని అదృష్టం కొద్దీ నాకు తారసిల్లిన ఒక విశిష్ట వ్యక్తికి బహుమానంగా ఇస్తున్నాను.

కోరిన వెంటనే శ్రీ గరికిపాటి నరసింహారావు గారు ఈ పుస్తకానికి ఓ మణిహారం అలంకరణగా దయచేశారు. వారికి అనేక వందనాలు. అలాంటి వారు భుజం తడితే చాలు మళ్ళీ నాలో కవితా సాగరం ఘోషిస్తుంది. మళ్ళీ మధనం మొదలు.

ఈ పుస్తకానికి చక్కటి ముఖచిత్రం అందించిన శ్రీ బి.మన్లీశ్వర రావు గారికి కృతజ్ఞతలు.

చక్కగా ముద్రించి ఇచ్చిన సత్యం ఆఫ్‌సెట్‌ ఇంప్రింట్స్‌, శ్రీకుమార్‌ గారికి అభివాదాలు. విశాఖపట్టణం భవదీయుడు 20.11.2006 సూర్య గణపతి రావు

విషయసూచిక పేజీలు క్షే సూర్యమణి - చంద్రహారం .......000200000000000000060444 క్షే 2. రవి శతకము అలరి లిల వలి రిల 6వ ర000600600666020050000066ఏ000 50006600 త్‌ 8. చందమామ శతకము .......0000000000000004004424 లిక్‌

ాలాాాా4 దివ్యలోచన శతకములు సూర్యమణ - చంద్రహారం

ముందుమాటైనా మొహమాటం లేనిమాట. ఈ మధ్యలో ఇంత మంచి శతకాలు చూడలేదు. ఈ కవి తెలుగు అధ్యాపకుడు కాడు. 'తెలుగు పండితుడివయ్యా”' అన్నా ఆయన ఒప్పుకోడు. వృత్తి రీత్యా వైద్యుడు. వైద్యవృత్తి సాహిత్య ప్రవృత్తితో కలిసేదికాదు. పైగా “సంగీతము వలన బేరసారము లుడిగెన్‌ొ అన్నట్లుగా సాహిత్య కాలక్షేపాల వల్ల వైద్యం దెబ్బతిని నిక్షేపంలాంటి డాక్టరు గారు పేషెంట్‌ అయిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇన్ని ప్రతిబంధకాల మధ్యలో రెండు శతకాలకోసం రెండు వందల పైచిలుకు పద్యాలు రచించడం మామూలు విషయంకాదు. ఇదివరలో "త్రివేణి అనే పేరుమీద మూడు శతకాలు వేశారు. ఆ అనుభవం కాస్త వేగంగా ఈ పద్యాలు నడిపించగలిగి ఉండవచ్చు. అయినా ఆ వేగ ప్రవాహంలో పడి భావుకత కొట్టుకు పోలేదు. సంతోషం.

ఎందరో దేవతల మీద ఎన్నో శతకాలున్నాయి. కాని రవి చంద్రుల మీద సంస్కృతాంధ్రాల్లో ఒక్క మయూరుని సూర్యశతకం తప్ప మరొక్కటి ఏదీ ఉన్నట్లు కనబడదు. అందువల్ల ఈ సరిక్రొత్త సాహసాలకు గణపతి రావుగారిని అభినందించి తీరవలసిందే.

సాహసానికి పూనుకోవడమే కాదు; దాన్ని సమర్థవంతంగా నిర్వహించినందుకు మరో అభినందన. శక్తిలేనివాడు సాహనం చేసినా ... పాల ళు అాాాా...ా

దివ్యలోచన శతకములు అాాాాలాాాాా

“సగమైతివి హరిచూపుకు.

నగవైతివి గగనమునకు నల్చిక్కులకున్‌,

దిగులైతివి కలువలకును

పగలైతివి తిమిరమునకు వందనము రవీ (8) వంటి పద్యాలు రచించలేడు. ఈ కవి ఊహలు, భావనలు చాలా క్రొత్తవిగా ఉండి శరీరాన్ని మనుస్సును పులకింపజేస్తాయి.

శ్రీ మహావిష్ణువు నలుపు కదా! అచ్చం తనరంగులోనే ప్రకాశిస్తున్న చీకటిని చూచి క్రోధంతో తన సుదర్శన చక్రాన్ని విసిరాడట. అలా విసిరిన చక్రమే సూర్యుడట. ఎంత మనోహర భావన (22)

సూర్యుడు నీరసించిపోయిన వాళ్లకి కూడా ఉత్సాహం కల్పిస్తాడట. అంతుదరిలేని ఆకాశమార్గంలో తొడలేలేనివాడు తోలుతుంటే, ఒకే చక్రం ఉన్న రథం మీద నేను ధైర్యంగా నా కర్తవ్యం నేను చేయడం లేదూ? అలాగే మీరు ఆత్మను, పరమాత్మను నమ్ముకొని ముందుకు సాగండంటూ సాధనాలు లేవని వంకపెట్టి పని మానేసే వారిని ఉత్సాహ పరుస్తున్నాడట ప్రత్యక్షదైవం. ఎంత పౌరుషం కలిగిన ఆలోచన!

“ఆడుదాని జూడ నర్ధ్థంబు జూడగా' అనే సామెతను సూర్యునికి కూడా అంట గట్టారీ కవిగారు.

వాటముగ వాన కన్యక

పైట చెరగు రెపరెపలవి పైపై తాకన్‌

బైటపడె నసలు రంగులు

నీటుగ హరి విల్లనంగ నిక్క్మముగ రవీ (48) ాాలడ్తై లా

లాటి దివ్యలోచన శతకములు

అంటూ మొత్తం మీద ఇంద్ర ధనస్సును మన్మథుని విల్లు చేసేశారు. ఇలా ఎన్నో చమత్కారాలు! అన్నీ విని ఆనందించాలంటే రవి శతకం పూర్తిగా వంద పద్యాలూ చదవాల్సిందే.

చండ ప్రచండంగా వెలిగేవాజ్జే అణువణువు తడిమితడిమి వర్ణించిన ఈ కవి చల్లగా వెలిగే చందమామను వదిలిపెడతాడా? ఆ క్షయరోగి మీద ఈయన అక్షయమైన వర్ణనలు చేశారు.

ఆకాశం ఒక జొన్నచేనట. చుక్కలన్నీ జొన్నకంకులట. మధ్యలో వేసిన మంచెయే చందమామట (9) ఎంత చక్కని ఊహ! “మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో”........అనే పాట గుర్తుకు రావడం లేదూ? ఇదీ మధుర కవిత్వం అంటే

చంద్రుడు పాలసముద్రంనుంచి తెచ్చిన పాలకోవాఅట. దానికి పట్టిన చీమలే చుక్కలట. ఎంత సరిక్రొత్త ఊహ! (2

చంద్రుడు మంచి శిష్యుడుకాదు. ఆ సంగతి మనందరికీ తెలుసు. అందుకే అతనికి చదువబ్బలేదట. ఎట్టకేలకు అదృన్టం వరించి శారదాదేవి శిరస్సుమీద చేరాడట. ఆవిడ దయవల్ల రెండంటే రెండే ముక్కలు వచ్చాయట. అవేవిటో తెలుసా? అరసున్న నిండు సున్నాలట. ఎంత చమత్కారం! ఎంతగడుగ్గాయి ఈ కవి! (22)

అప్పుఎగ్గొట్టడంలో చంద్రుణ్ణి మించినవాడు లేడట. సూర్యుని కిరణాలు అప్పుగా తీసుకొని తాను వెలిగి పోతూ ఆయనకు కనబడితే ఎక్కడ అప్పుతీర్చమంటాడోనని పగలల్లా మాయమై రాత్రిళ్ళు తక్కుతూ తారుతూ ప్రై లా

బివ్యలోచన శతకములు అ ఆకాశంలో తిరుగుతున్నాడట!(45) కన్న పాపానికి సముద్రుడు ఆ “అప్పును “నీటి” రూపంలో సూర్యునికి వాయిదాలు వాయిదాలుగా చెల్లిస్తున్నాడట! ఎంత సమాజిక భావన! ఇదీ ఈ కాలంలో రావలసిన పద్య కవిత్వం అంటే. విదియనాడు చంద్రుడు ఒరలోంచి తీసిన కత్తిలాఉన్నాడట! పున్నమి నాటికి గుండ్రంగా డాలులా మారిపోయాడట. “కత్తిపోయి డాలు వచ్చే ధాం ధాం ఢాం” అనే కథకి అర్థం ఇదేనట (81) ఎంత సరసమైన భావన! ఇలాంటి భావాలు ఈ రెండు శతకాలలో 70శాతం ఉన్నాయి. చదివిన వారికి చదివినంత ఆనందం. చివరిగా ఒక దిష్టిచుక్క ఈ శతకంలో అలవాటులో పొరబాటుగా దొర్లిపోయిన వాడుకభాష పదాలు సరిచెయ్యడానికి మా రామబ్రహ్మం గారు, నేను చాలా శ్రమపడ్డాం. అయితే ఆయనకు చందమామను అంకితం ఇచ్చారు. నాకేమో అన్ని పద్యాలు చదివే అవకాశం ఇచ్చారు. .నోచినవారికి నోచుకున్నంత. తృప్తో౭ స్మి! కాకినాడ గరికిపాటి నరసింహారావు 25-10-2006 ల య్ష్య్త్త్ర్ర అాాాాాాాాాాలా

న మ్చ్‌ ఉ్కృటో తు ళు ఖే చ్త నా శ్ర ళు ళ్‌ వ త్స బట్‌ కగు

య లు న్ని

జ ౧ క హక స

న [స్ట చ. న

న ఖే ఏ ప్టా.

శన: ఖత్‌ 0 అనలా ట్‌... ష్‌ |

| రే స ం న్‌ స్ట

వ జి వ్షు న బిల్లు ఉరట్లు స

సమర్పణం ఈ రవిశతకం అరసవిల్లిలో వేంచేసియున్న ప్రత్యక్షదైవం శ్రీ ఉష్క పద్మిని, ఛాయా సహిత సూర్య నారాయణ స్వామి వారికి భక్తితో సమర్పిస్తున్నాను.

లా దివ్యలోచన శతకములు 1 కం. శ్రీని తన హృదయమందున

పూనికతో దాల్చినట్టి మొనగాని నెదం

బూనగ జాలిన నీ పని

వాని తనంబునకు - నీకు వందనము రవీ! 2. కం. మృదువుగ నీ కరములు మా

గదిలోనికి సాచుచు తొలి ఘడియలలోనన్‌

కదిలించి లేపుచుందువు

వదిలింతువు నిద్ర మాకు వందనము రవీ! క. కం. హరి సర్వాంగమ్ములకున్‌

సరిపడు నగవైతి వీవు సందియ మేలా

అరుదైన ఈ యదృష్టము

వరియించెను నిన్ను - నీకు వందనము రవీ! ఓ కం, చిచ్చట రూపము, బండికి

పచ్చటి గుర్రాలు, మొండివాడట నడుపన్‌

వెచ్చటి చేతులు వేయట

వచ్చెదవట మమ్ము బ్రోవ వందనము రవీ!

బవ్యలోచన శతకములు అలాల 5. కం. వచ్చెను తూరుపు దిశగా పచ్చని గుర్రాల రధము పరువుల తోడన్‌ విచ్చెను తామర కన్నులు వచ్చెను మా మిత్రుడనుచు వందనము రవీ! 6. కం. పొంగెడు గగనాంబుధిలో లంగరు లేనట్టి ఓడలా తిరిగెదవో రంగుల కాంతుల వాడా! బంగరు కిరణాల వాడ! వందనము రవీ! 7. కం. చెంగట సిరితోడుగల శు భాంగుని హృదయమ్ము నందు పదిలపరచి - ఆ నింగిని ఊరేగించెడు బంగారు విహంగమవట - వందనము రవీ! 8. కం. సగమైతివి హరి చూపుకు నగవైతివి గగనమునకు నల్టిక్కులకున్‌ దిగులైతివి కలువలకును పగలైతివి తిమిరమునకు - వందనము రవీ! ాాాలాాాాళ షూ అాాాాలాాా

లాటి దివ్యలోచన శతకములు 9. కం. వడివడిగా మాచుట్టును సుడిగుండము వోలె తిరుగుచున్‌ కరచెడునా నిడువాటి కాలసర్చపు పడగలపై మణివి నీవు - వందనము రవీ! 10. కం. ప్రభవించి తూర్పు దిక్కున సభగా నీ జగము నెల్ల సంభావింపన్‌ నభమను సింహాసనమున ప్రభతో వెలుగొందు నీకు వందనము రవీ! 11. కం. అడుగడుగున నీ వేడిమి కొడబడి పట్టుదుము మేము గొడుగును, నీవో బుడి బుడి నదకల నటనల వడుగుకు గొడుగైతివయ్య - వందనము రవీ! 12. కం. సగుణాకారంబనగను అగుపించెడునట్టి నిర్గుణాకాశమునన్‌ సగుణాకారము దాల్చిన భగవంతుడవైన నీకు వందనము రవీ! ప్రై లాలా

బవ్యలోచన శతకములు అాాాాలతతతత 138. కం. నారాయణ రూపమ్మును నేరుపుగా హృదయమందు నిలుపుదువు రవీ! నారాయణ నామమ్మును పేరుకు తగిలించి వెలుగు వెలుగుదువు రవీ! 14. కం. కన్నెతి విష్ణునకు, తన కన్నును తను గాంచగ హరికైనను తరమే? కన్నెత్తి నిన్ను గనువా డున్నాడా జగములందు ఒకడైన? రవీ! 15. కం. ఆధారమేమి లేదని బాధలు నటియించు జనులు పరికింపదగున్‌ ఆధార రహిత పధమున సాధించిన నీగమనపు చందములు రవీ! 16.కం. స్వామీ! మా కిహ పరములు నీమాదిరి చూపగలుగు నేస్తము కలడే మాముందు నీవు కలవిక నీ ముందర కాగడా పనేముంది? రవీ! లా షు లాలా

లలా దివ్యలోచన శతకములు 17. కం. (గ్రహములునీ చుట్టుగనే సహజముగా తిప్పుకొనుచు సౌరకుటుంబం బహహా నిర్మించితివిది గృహస్టు నేర్వన్‌ వలసిన కీలకము రవీ! 18. కం. బారుగ ఆకులను పరచి తీరుగ చెట్లన్ని నిలచి దేహియనంగన్‌ నేరుగ కరములతో ఆ హారము వడ్డింతు వనుచు ననుకొందు రవీ! 19. కం. కపటత్వము కుటిలత్వము చపలత్వము కలిపి పేను జడతత్వములో జపతపములు మరచిన మము తపియించగ జేయునట్టి తపనుడవు రవీ! 20. కం. ముక్కోటి దైవతములను లెక్కించుట లెక్కకొరకు లేవయ్య రవీ! ఒక్కడు కనరాడయ్యా నిక్కువముగ కనబడియెడు నీవలెను రవీ! పైలా

బవ్యలోచన శతకములు అలా 21. కం. లెక్కల కొక్కడి వైనను

తక్కువ లేదయ్య, మేము ధన్యుల మయ్యా

ఒక్కొక్కరి కొకరూపై

చక్కగ కనిపించు నీవు చాలయ్య రవీ! 22. కం. తన రంగుకు పోటీగా

తనరెడు నిశిపైన కినిసి తన చక్రంబున్‌

దునుమగ హరి విసరెననుచు

ననిపించును నిన్నుజూడ ఆదిత్య! రవీ! 23. కం. కడలేనిది రహదారా?

తొడలే లేనట్టి వాడు తోలెడి తేరా?

నడుచుట కొకటే 'వీలా”?

నడుచుటయే దైవలీల నావాడ రవీ! 24. కం. చిరుగుంటల నింకింతువు

మరి సాగరములను విడచి, మా 'సీ.బి.ఐ

చిరు చేపల పట్టుకొనుచు

బిరుదైన తిమింగిలాల విడిచినటు రవీ! సాం అాాాాాాాాాా

వాటి దివ్యలోచన శతకములు 25. కం. చాలము నిను తెలియగ, కన

జాలము నీ మాయ ఇంద్రజాలము పగిదిన్‌

తేలికగా చిక్కెదమీ

కాలమనెడు నీదు చేతి గాలమున రవీ! 26. కం. దిన దినమును పయనంబే

దిన దినమును జలము లందు దిగ్బంధంబే

దిన దినమొక గండవమ్మౌ

మనుగడ నీదైనదన్న మార్తాండ! రవీ! 27. కం. ఎద్దెక్కు పరమశివునకు

ఉద్దిగ నుండగ గోరి ఒద్దికతోడన్‌

ఎద్దెక్కి సంచరించెడు

విద్దియ నేర్చితివి నీవు వృషభయుత! రవీ! 28. కం. ఉప్పటి సంద్రపు నీటిని

చప్పుడు కాకుండ త్రావి, చక్కని మేఘా

లొప్పుగ సృజించి వానల

దప్పిక తీర్చెదవు మాకు దయతోడ రవీ! లాలా లాలా

బవ్యలోచన శతకములు అాాాలాలాలాాాాాా 29. కం. గతుకులు లేనిది మార్గము వెతికిన నడ్డంకి లేని వీధిని పయనం బతివేగంబే దోషము గతిచెడి సంద్రాన పడుట (గ్రహపాటు రవీ! 80. కం. కన్యారాశిని జొచ్చెడు విన్యాసము నీకు కూసువిద్యయట గదా! కన్యామణి కుంతి, అసా మాన్యుడు కర్టుడును సాక్షి మార్తండ! రవీ! 31. కం. అణువును ఛేదించుటయును అణువుల కలుపుటయు మాకు అలవడె నిపుడే అణువిజ్ఞాన మనాదిగ అణువణువున నింపుకొన్న ఆద్యుడవు రవీ! 82. కం. పుట్టెదవు సంద్రమందే గిట్టైదవయ సంద్రమందు - గీతార్థమిదే ఎట్టుల పుట్టిన జీవికి అట్టుల మరణంబు (ధ్రువము ఆదిత్య! రవీ! లా ష్త్రై అాాాా

తపాలా బివ్యలోచన శతకములు 88. కం. తులనీకు తూగుటుయ్యెల ఇలపై నిను కొలుచు వారి నెక్కించుటకై కలిగించి సిరుల నాయ్యన తుల తూగించెదవు నీవు తులలేని రవీ! 84. కం. రుజువులు లేనిది నమ్మము నిజమైనను నిత్యమైన నీశ్వరునైనన్‌ రుజున్నది నీవేగా బుజు మార్గపు వర్తనమున బుతుకర్త రవీ! 85. కం. నిలుచుటకు నీడ, పిలిచిన పలుకుటకొక తోడు, డెక్క పట్టిన నీరున్‌ కొలుచుటకు బంటు లేనిది అలుపెరుగని నీ ప్రయాణమాదిత్య! రవీ! 86. కం. నీ కరములద్దు తరువుల కాకుల వడ్డించి ఇత్తువాహారంబున్‌ నీ కెగ్గొనరించిన నున్‌ నీ కృప కురిపింతు వీవు నిక్కముగ రవీ! ప్రా లా

బవ్యలోచన శతకములు అలా 37. కం. వెతుకంగా కనిపించెడి గతితప్పని దైవమొండు కలడే మాకున్‌? వేతుకకనే కనిపించెడి ధృతిమంతుడవైన నీవు దేవుడవు రవీ! 38. కం. (గ్రహగతుల కారణముగా (గ్రహణంబులు పట్టు నీకె గ్రహపాటన - మా (గ్రహపాట్లెట్టుల దీర్తువా? అహహా వివరింపుమయ్య ఆదిత్య! రవీ! 39. కం. తలయెత్తి ఎవ్వరైనను నిలబడి నే పొడుగటంచు నెన్నగ తరమే? నిలువెత్తు కొండకైనను నలుపును వెనకాల రాసి నవ్వుదువు రవీ! 40. కం. దాగని తేజము నీదే వేగ నిరోధములు లేని వెలుగుల తోడన్‌ సాగెడి రధమ్ము నీదే ఆగని గుర్రాల తోడ నాదిత్య! రవీ! లాయ అాాాాాాాాాాాా

అలాటి దివ్యలోచన శతకములు 41. కం. నీ కిరణమ్ముల వేగము మాకొక కొలబద్దయయ్యె మాన్యత తోడన్‌ లోకమున దాని మించెడు పోకడ తెలియంగ రాదుపో మాకు రవీ! 42. కం. తారాహారము లల్లితి నీ రాకకు వేచి వేచి నిలబడితినిరా తీరా నీవరుదెంచగ తారకలివి కానరాక తడబడితి రవీ! 43. కం. రంగగు రోదసిలో బహు భంగుల చెలువొందెడి భగవంతుని మైోలన్‌ బంగారు కాంతు లీనే మంగళహారతివి నీవు మార్తాండ! రవీ! 44 కం. తిరుగుదురట నీ చుట్టును సురగురుడును, అసురగురుడు సుజ్ఞాన నిధీ వర విజ్ఞానము ముందర పరికింపరు తమ విరుదులు పండితులు రవీ! సాం యూ అాాాాలాలాలాలాాా

ఐవ్యలోచన శతకములు తా 45. కం. తారకల పూలు జల్లితి తీరుగ నెలవంక (ప్రమిద దీపమునుంచన్‌ తీరిచితి, నింతలో నీ వారువముల రవములు వినబడె నాకు రవీ! 46. కం. మర్కట బుద్ధులు పోయి,కు తర్మాంధ తమస్సు వీడి, తత్వార్ధ సుసం పర్మము సిద్ధించును, నిను నర్మా! యని పూజసేయ ననిశంబు రవీ! 47. కం. రంగుల లోకము జనులక నుంగవ కొసగితివి నీవు నుతుడవు, కనుకన్‌ “రంగుల టీవీ ఘన స త్సృంగము వీడవుర కనులు - సన్నుతులు రవీ! 45. కం. వాటముగ వాన కన్యక 'పైట చెరగు రెపరెపలవి పైపై తాకన్‌ బైట పడెనసలు రంగులు నీటుగ హరివిల్లనంగ నిక్కముగ రవీ! ాాాాాాలష్ట్రా అలా

లారా 6 దివ్యలోచన శతకములు 49. కం. శ్రీకరమౌ జ్ఞానంబున

కాకరమౌ నీదు చరణ కమల యుగళమున్‌

ఈ కరముల బట్టుకొనగ

మాకందని గగన కుసుమమైతివిర రవీ! 50. కం. ఎన్నికల చిహ్నమైతివి

“వెన్న పరిపాలనమ్ము సేయంగ రవీ!

చిన్ని తెర 'ఛాన' లైతివి

వన్నెల నీరంగులన్ని వడ్డించ రవీ! 51. కం. రోజులలో పెరిగి మురిసి

రోజులలో కరిగి తరిగి రోదించెడి - ఈ

రాజులతో పని లేదిక

రాజిలు నీవున్న మాకు రక్షణగ రవీ! 52. కం. కొలతవు వేగంబునకును

కొలతవు దూరంబునకును కొలువంగ రవీ!

కొలతవు కాలంబునకును

కొలతవు సర్వంబునకును -కొలిచెదను రవీ! డ్రై లాలా

దివ్యలోచన శతకములు అలా 58. కం. నీరాకను దర్శింతుము నీరూపము నాత్మయందు నిలుపుదుము రవీ! నీరూప తేజములకే తీరుగ గొడుగులను పట్టి తిరుగుదుము రవీ! 54 కం. తేజము నప్పుగ జే కొని రాజుగ వెలుగొందు నొకడు రాత్రిన్‌ ధాత్రిన్‌ రాజుకు తేజము లిచ్చుట రాజిల్లెడి నీకె చెల్లు రారాజ! రవీ! 55. కం. మును మత్స్యంబైన హరికి కనుగొన కన్నెన కతన కలకాలంబున్‌ అనిమేషుడవై మమ్ముల నను క్షణము గాచుచుందు వనుకొందు రవీ! 56. కం. కళలున్నను రాజగునా కళలన్నను పెరిగి పెరిగి కరుగుట యేనా కళలకు ఆధారంబౌ తళతళలవి నీవికావె తధ్యముగ రవీ! లాాాాాోసోాం అాాాాాాాాాాాాాా

లాటి దివ్యలోచన శతకములు 57. కం. పరుగులు పెట్టెడి నదముల తరగలకు తళత్తళలును - తరగలు చిందే నురుగులకు వెండి మెరుగులు మురువులుగా నిత్తు వీవు ముచ్చటగ రవీ! 58. కం. శ్రీకర సుజ్ఞాన గవీ! మాకిలపై మార్గదర్శి మాకంటి ఛవీ! చీకటి పాలింటి పవీ! వేకువనే వెలుగుపూలు విసరేటి రవీ! 59. కం. నీయెండ తట్టుకొనుటకు సాయంబై గొడుగు మాకు సాధనమయ్య్యెన్‌ ఏయెండకు ఆగొడుగును వేయుట నేర్పినది నీవె వేయేల రవీ! 60. కం. తెల్లని దుస్తులు వలదని తల్లుల విసిగించు అంబుదార్భక తతికిన్‌ మెల్లగ కరములతో తను వెల్లను రంగులను దీర్తు వింపుగను రవీ! పాాాాోోసాా6 అలా

దబవ్యలోచన శతకములు అాలాలాలాాలాాలా 61. కం. మా చేతమునకు చేతన

నీ చేతి స్పర్శ చేతనే కల్లు రవీ!

(బోచెడి నీ తాలి చూపులు

మా చూపుల ప్రొద్దు పొడుపు మార్తాండ! రవీ! 62. కం. రుద్రుని జడలో పుట్టిన

భద్రుడు కొట్టంగ నీకు పళ్ళూడినవా?

రౌద్రా! పరమాన్నము నీ

కై ద్రవరూపమున నిత్తు గ్రైకొనుము రవీ! 63. కం. తూరుపు కొండకు వెనుకన్‌

నేరుపుతో మర ఫిరంగి నెవరో పేల్చన్‌

నేరుగ ఆకాశంబును

చేరిన గుండేమొ నీవు చింతింప రవీ! 64 కం. మేలు కొలుపులే ఎప్పుడు

మేలుగ నిన్నెవరు విశ్రమించ మనరయా

చాలిక నిదురించ వయా

జోలలు పాడుదును నీకు జోకొట్టి రవీ! లాల షా అలాల

పతం దవ్యలోచన శతకములు 65. కం. గొప్పదగు కాంతివేగము

చెప్పెదరయ మాకు కొలత చెప్పంగ రవీ!

కొప్పరపు కవుల వేగము

చెప్పెదరయ ఆశుకవిత చెప్పంగ రవీ! 66. కం. నల్లని మబ్బుల దుప్పటి

తెల్లని నీకాంతిపైన తెరవలె పరచన్‌

చిల్లులు చేసి - కరంబులు

చిల్లులో దూర్చి వెలుగు చిమ్ముదువు రవీ! 67. కం. కలవెన్నో పెను (గ్రహములు

నిలబడునే తేజమందు నీ ముందు రవీ!

అలవడునే పెద్దరికము

తలపండిన మాత్రముననె తలపంగ రవీ! 68. కం. నీ కాంతులు నిక్కంబని

లోకంబులలో ప్రతీతి లోకేశ రవీ!

పీక తెగ జయద్రధునకు

నీకాంతులు నమ్ముకొన్న నిక్కముగ రవీ! లాలా ప్రు లాలా

ఐవ్యలోచన శతకములు అలాల 69. కం. నీ గమనపు దిశ కొలుచుట కాగగనము వైపు డేగ కన్నన జాలే లాగునను (ప్రొద్దు తిరుగుడు పూగుచ్చము కలదు మాకు పొందికగ రవీ! 70. కం. నీలోగల హరి ఉదరము లోలోపల నుండు సకల లోకమ్ములకున్‌ వీలుగ ప్రదక్షిణమ్ముల మేలుగ చేయించు భూమి మేలెంతు రవీ! 71. కం. తేజమున దినదినమ్మును రాజును తెరమరుగు జేసి రాజిల్లంగన్‌ రాజుకొనిన పగతో నిను రాజద్డుకొనంగ నీకు గ్రహణంబు రవీ! 72. కం. తనతో పవలంత గడపి ఇనుడు తనను విడిచి రేయికేగుచునుందడన్‌ దినకాంతామణి కోపము మిను ముట్టెననంగ సంజ మెరయునుర రవీ! లాల షూ కాలా

లాటి దివ్యలోచన శతకములు

"773. కం. అందాలను చిందెడి అర

విందాలకు నిండు విందు వెలుగొందు రవీ!

మందేహులకున్‌ దేహము

డిందింపగ జేయు వెలుగు డిండిమము రవీ! 74. కం. సర్వంబును కాంచెదనని

గర్వంబా నీకు ? నీవు కాంచం గలవే

సర్వంబును (మింగుచుపై

బర్వెడు చీకటిని సుంత పరికింప రవీ! 75. కం. నిను నిన్నను కోల్పడితిని

పెను చీకటి అంజనమును వేసి వెదకితిన్‌

దినమణి నీరూపు కడకు

కనుగొంటిని తూరుపు కడ కనులార రవీ! 76. కం. మానడదకలు, మా నటనలు

మౌనముగా మేము చేయు మా పనులెల్లన్‌

కానగ నీవున్నావయ

మానవులకు సర్వసాక్షి మాన్యుడవు రవీ! లాలా ప్రా లాలా

ఐబవ్యలోచన శతకములు అాాలాలాలాలాలాలాాాాాాాాాాాా 77. కం. రాజుకు పున్నమ కాంతులు రాజిల్లగ నప్పునిచ్చి రాబడి కొరకై “ఫీజులు వడ్డీలు కలిపి రోజును చిరువాయిదాలలో గెనెదు రవీ! 78. కం. తారకలు పేరుకొన్నవి దారికి నడ్డంబు కాగ దట్టముగ రవీ! ఏరి తొలగించినాడను తేరును నడిపింపుమయ్య తీరికగ రవీ! 79. కం. తను కదలుచు కదిలించుచు కనురెప్పల తెరలు తెరచి కనువిప్పగుచున్‌ "పెను నిద్దుర వదిలించుచు కనబడు నీ రూపు వలయు కవితకును రవీ! 80. కం. 'సెలవన్నది లేకుండా అలుపెరుగక తిరుగుచుందు వందరి కొరకున్‌ సెలవెరుగని నీ వారము సెలవుగ చేకొందు మయ్య చిత్రముగ రవీ! ప్రై లా

సా బవ్యలోచన శతకములు 81. కం. నటుడు తెర వెనుక నిలబడి

అటుపైపున నుండి విసిరి అగ్గిబరాటా

నిటువైపున పట్టిన సం

ఘటనగ కనిపించు నీదు గమనంబు రవీ! 82. కం. చేసెడి పని తప్పొప్పులు

చూసుకొనుడు మీకు మీరె - చూపునుతోడై

వాసిగ మీ నీడని - జత

చేసితివయ మాకు నీడ చిత్రముగ రవీ! 838. కం. జగముల నేలం జాలెడు

జగ మెరుగులు గల్గినట్టి జగబెట్టివి - ఈ

గగనపు టెదారి లోపల

ఒగరుచుచు చరింపనేల ఒంటివలె రవీ! 84. కం. తెల్లని చుక్కల రాశిని

నల్లని అంబరములోన ననువుగ తాల్చన్‌

పొల్లులు చెల్లి వెలుగు సం

ధిల్లగ మిగిలితివి నీవు దినమణిగ రవీ! లాల రసా అలాల

బవ్యలోచన శతకములు అాలాలాలాలాలాాాాాా 85. కం. మాయామేయ జగంబున నాయా పాత్రముల తోడ నతి సహజముగా వేయించి నాటకంబును “ఛాయా చిత్రములు తీయు చతురుడవు రవీ! 86. కం. అనుదినము హడావుడిగా కనిపించని దేని కొరకు గాలింతువయా? కనుగొనెద చెప్పు! రవి గాం చనిచో కవి గాంచు ననుచు సామెతయ రవీ! 87. కం. ఇరుల కురులలో తారక సరములు చూపించు సరసిజానన నుదుటన్‌ సిరిబొట్టుగ నిను చూపును తిరుగుటలో రేయి పవలు దీపించ రవీ! 88. కం. ముచ్చట గొలిపెడి కాంతులు పచ్చటి బంగారు రంగు పండువు కాగన్‌ ఇచ్చట ్రాచీగిరిపై విచ్చెను కిరణాల పువ్వు వెచ్చగను రవీ! లాలా అాాాాాాాాా

సట దివ్యలోచన శతకములు 89. కం. నలుగురు నడిచిన బాటను

మొలవదు గడ్జెన మొక్క మొటికైన రవీ!

బిలబిల నీవును, శళి, తా

రలు నింగిని పుంతజేసి రాఖరుకు రవీ! 90. కం. పోసిరి మరిగిన వెండిని

మూసగ మార్తాండ బింబమును జేసి రవీ!

మూసను కడలిని ముంచిరి

తీసిరి శశి బింబమనగ తెలివిగను రవీ! 91. కం. నీ కిరణ ప్రసరణములు

మా కడకున్‌ జేరుట కణమాత్రముగానో

కాక తరంగముగానో

మా కింకను తేలలేదు మార్తాండ! రవీ! 92. కం. పగలంతా మాకెప్పుడు

తగులును నీ తీక దృష్టి తగులును మాకె

న్న రాచదృష్టి రేయిని

మిగిలెను మా కమవసనిశి మీనుండి రవీ! 6 యష్త్రూ అాాాాాాాాాాలాలా

బత్యలోచన శతకములు అం 93. కం. చుక్కల చిరు చేపలు వల

చిక్కములో నుండి జారి చెక్కేయంగన్‌

చిక్కెను గగనపు వలలో

చక్కని బంగారు చేప చనలేక రవీ! 94. కం. సొగసుగ గడియారంబును

తగిలింతుము చేతికెపుడు తప్పని సరిగా

పగలైనా రాతైనా

గగనములో నిన్ను కొలువ గలుగుదుము రవీ! 95. కం. చేరగ రమ్మన్నామా ?

కోరక వచ్చితివి సెలవు కొమ్మన్నామా?

నేరుగ విచ్చేసి కడకు

తేరగ నడినెత్తి కెక్కు దేవుడవు రవీ! 96. కం. నీ గణములు 'నగలిగుటను

బాగుగ “ఉత్సాహ మిచ్చు వరుసగ పేర్చన్‌

నీ గణములు గణియించగ

నీ గలుగును సిరుల మాకు నిక్క్మముగ రవీ! లాాాాాాాాాాాాా4 అ

లాలా ప దివ్యలోచన శతకములు 97. కం. తూరుపు దిక్కున నెవరో నేరుపుతో తిమిరమునకు నిప్పంటించన్‌ బారకు బారకు పెరుగుచు మేరలు మీరినది నిప్పు మింటి పయి రవీ! 98. కం. వడగళ్ళ వానలైనను వడివడిగా నింకిపోవు పడగానె రవీ! తడివలె కల్పింతవయా ఎడారులకు ఎండమావు లెడనెడను రవీ! 99. కం. చుక్కల '్రోవులు పెట్టిరి ఎక్కువ శ్రమకోర్చి త్రవ్విరీ గగనంబున్‌ దక్కెను శ్రమకున్‌ ఫలితము చిక్కె నభోమణి వెలుగులు చిమ్ముచును రవీ! 100. కం. ఆకాశవాణి తెలుపును నీకు సమయమెంతయినదొ నిలయములోనన్‌ లేకున్న ఇంత సరిగా నీకు సమయమెట్లు తెలియు నికరముగ రవీ! సాం అాాాాాాాాలాాలా

దివ్యలోచన శతకములు అాాలాాాా 101. కం. చూపించెదనని వస్తివి చూపించిన దెంతమాకు చూపులకు రవీ! వ్యాపించిన ఈ రోదసి చూపక దాచితివి నీవు చోద్యముగ రవీ! 102. కం. నిను కన్నందుకు కడుపున పెను చిచ్చురగల్బ నీవు - బేలగ విలపిం చిన గగనపు కన్నీరో యన సాగర ముప్పతిల్లు నాదిత్య! రవీ! 103. కం. కిరణాల దారములతో అరుణాంబరమందు గూడునల్లి చరింపన్‌ సరిలేని లూతవీవని పరికింపగ నాకు దోచు - వందనము రవీ! అట్టడుగుకు మునిగిపోయినా ్రతిదినమున్‌ గట్టెక్కి మరల లేవవె పట్టుదలకు నీవు పేరు-వందనము రవీ! లపై లాలా

ాాాాా6 దివ్యలోచన శతకములు

  1. కం. బిగువుగ చిటికెన వేలికి

నగ కొన గగనంబు మాకు - నవ్వకుము రవీ!

గగనమునకు నగవైతివి

వగలుడుపుము మాకు - నీకు వందనము రవీ! 106. కం. పంతులువట మారుతికిన్‌

వంతుల పూజారి వంట పగటికిని రవీ!

దంతాలు లేని నీకా

పంతులు పూజారి పనులు-వందనము రవీ! 107. కం. ఎప్పుడు నిర్మించితివో

చప్పుడు లేకుండ నడుచు చక్కని రధమున్‌

చప్పుడు లేకుండగ మా

పప్పులుడక విప్పటికిని - వందనము రవీ! 108. కం. యుక్తిగ నీకలవడ్డది

శక్తిని నిలవుంచు నేర్చు చక్కగను రవీ!

శక్తి నిలవుంచు యుక్తిని

భక్తిగ మొక్కెదము నేర్పు వందనము రవీ! లాయ లాలా

ఐబవ్యలోచన శతకములు అలలా 109. కం. కాల విహంగము మెడలో

(వ్రేలాదెడి గంట నీవు వెలుగొందు రవీ!

నీలాల నింగి సుందరి

ఫాలమునను బొట్టు నీవు - వందనము రవీ! 110. కం. వెతలయ మెతుకుల కొరకే

వెతలయ మా బ్రతుకు తెరువు వెదకుట కొరకే

గతినీవే మైక్కెదమయ

బ్రతుకులలో వెలుగునింప వందనము రవీ! 111. కం. అందముగా కందములను

విందుగ నీరూపు చిందు వింతల కెల్లన్‌

చిందులు వేసెడి హృదయ

స్పందన లివి అందుకొనుము వందనము రవీ! 112. కం. నిందలు పడరట గానీ

వందనమున 'పడనివారు వసుధను గలరే

వందనములిష్టమౌనట

వందన శతమందుకొనుము - వందనము రవీ! హాం య్షైల్లూ అ

ాారాలాాాటి దివ్యలోచన శతకములు 113. కం. బలవంతుడు హనుమంతుడు

నలుదెసలను వెదకి విద్య నందుట కొరకై

కలిగినది జన్మ జన్మల

ఫలమని నమ్మినది నిన్ను - వందనము రవీ! 114. కం. మొదటను నీ పేరు గలుగ

గ, దేవగుప్తాపు సూర్యగణపతి రావున్‌

మెదలుము లోపల నీవే

వదలక నాలోన నుండి - వందనము రవీ! 115. కం. తన నెదలోపల నుంచిన

తన నాధుని హృదయమందు దాల్చిన నిన్నున్‌

గని అలమేల్మంగ తనిసి

అనిపించిన పద్యములివి ఆదిత్య! రవీ! లపై అలా

య. ( . ' ఛందకూడు శకకము. వ.

  • | శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు | సరుర్తీ సరుర్చఖం శ్రీ రామబ్రహ్మం గారికి నేను వ్రాసిన చిట్టిపొట్టి పద్యాలు / _పట్టుకువెళ్ళి “మేష్టారూ, కొంచెం చూసి పెట్టండి” అని ఇవ్వగానే వాటన్నింటికీ ఓపిగ్గా లాల పోస్సీ జుట్టు చిందరవందరగా ఉన్న వాటికి నున్నగా తలలు దువ్వీ, కొన్నింటికి బుగ్గచుక్క పెట్టీ, తప్పటడుగులు వేస్తున్న వాటికి నడకలు నేర్పీ - వాటిని తిరిగి నాకిచ్చేటప్పుడు రెండు పటికబెల్లం ముక్కల్లాంటి పలుకులు జోడించి ఇవ్వటం రివాజు. వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ' అందుకే నాశక్తి మేర ఈ బుజ్జి చందమామను వారి కీర్తి కిరీటంలో తురాయిగా అలంకరిస్తున్నాను.

చాపం బవ్యలోచన శతకములు 1తే శ్రీకి మునుముందు పుట్టిన చిన్నవాడు

పాల మున్నీటి తరగల వన్నెవాడు

శివుని తలపైన వికసించు చిన్న పువ్వు

అందముల విందు వెలుగొందు చందమామ! 2.ఆ నీవు నేత్రమౌటనే గదా చల్లగా

మమ్ము జూచుచుండు మాధవుండు

వసుధమీద జనులు బ్రతుకు టెల్లను నీదు

చలువ వలన కాదె చందమామ! 8.ఆ విందు కొరకు నిన్ను వెండి పళ్ళెము జేసి

చుక్కల మెతుకులను చుట్టునుమిసి

నింగి నింత పెద్ద ఎంగిలి మంగలం

బిందు జేసి రెవరొ చందమామ! శ్సీతే రాచ దృష్టికి పగిలిన రాయి షగిది

పగిలెనట పొట్ట నీచూపు తగులు సరికి

గణపతికి, నీకు రాజను ఖ్యాతి గలిగె

నందు వలననె అనుకొందు చందమామ! షై లాలా

దవ్యలోచన శతకములు అ. 5.ఆ జింకబొమ్మ మీద చిత్రమ్ముగా గల్లి వెండి మెరుగు గలిగి వింత వెలయు “నాణొమైన రూపు నాకాశమున జూప జనులు కోరుటరుదె చందమామ! 6.తే తరణి విష్ణుని నామమ్ము తనకు జేర్చి సూర్య నారాయణుండయి శోభగాంచె వెనుక నీనామమును జేర్చి వెలిగె రామ చంద్రుడై తాను విష్ణువు చందమామ! 7తే ఆట మొదటను '“టాసు'గా గోట మీట తిరుగు నప్పుడు కళల వైఖరులు జూపి మెల్లగా బొమ్మపడినట్లు మింటదోచె అందరును చూడు డల్లదే చందమామ! 8.తే అన్ని చుక్కలతో కూడి ఆకసాన బ్రతుకు యాతన భరియించు బహుకుటుంబి తరుగునను మాట సహజమే, తిరిగి పెరుగ జాలుచుండుటయే వింత చందమామ! ాాాలాాాోసా6ం అాాాాాాాాాాా

ాలాలాలాసారాసాంా ఛి దివ్యలోచన శతకములు 9.ఆ చూసి నంతమేర జొన్న కంకులవోలె మెరయు చుక్కలన్ని పరుచుకొనియె మంచె కట్టినట్టు మధ్యలో నీవుంటి వందు కాపునుంచి చందమామ! 10.తే నిలిచి నీరూపు చూడగ నిండుసున్న తెలియ నీరంగు తెస్పోడు తెలుపురంగు ఇన్ని చుక్కలు ఎగబడు నిన్ను జూచి చాల వింతగ దోచును చందమామ! 11తే ప్రళయ కాలంతమున వటపత్రమందు జలధి శయనించు చినవాని చందమగుచు ముచ్చటగ జూచువారల మురియజేసి అందముగ దోచు నీమచ్చ చందమామ! 12.ఆ వెలుగు నప్పు జేసి వేడిమి తగ్గించి జగతి కిత్తు వీవు చల్లబరచి అప్పుజేసి ధనము అర్భుల కీయవే జాలిగుండె నీది చందమామ! లాల ప్రై లాలా

బివ్యలోచన శతకములు అాాంాతతతతతతతతతతతతతతం 18.తే నింగిలో నీవు పెద్ద దానిమ్మపండు

పెచ్చు దీసిన పడెపైన పెద్దమచ్చ

దరిని పడినట్టి గింజలు తారలెల్ల

విందుగా కొందు మింకను చందమామ! 14ఆ సవిత సృష్టిజేయు సప్తవర్ణములందు

హాయి లేదు సుంత, రేయి యందు

తెలుపు నలుపులున్న తెలివెన్నెలే హాయి

సాటి లేరు నీకు చందమామ! 15.ఆ గంజి గుంటలోన గంజిపోసిన వారు

చుట్టు పక్క చుక్కలట్టె వదిలి

పోయినారు, గంజిపోయగా నిండితి

వందు నిన్ను జూచి చందమామ! 16.ఆ ముద్దులొలుకు మంచి ముత్యమొక్కటి చాలు

తళుకు బెళుకు రాలు తట్టెదేల?

చుక్కలెన్ని యున్న చూపులు నీపైనె

చక్కనైన వాడ చందమామ! సంత అాాాాాాాాాాలాాా

లలాట దివ్యలోచన శతకములు 17.ఆ తెల్ల చుక్కలున్న నల్లచీరను కట్టి రాత్రికన్య వచ్చె రమ్యముగను ఇరుల కురులు ముడిచి మరుమల్లెగా నిన్ను పొందుపరచెనామె చందమామ! 18.ఆ సకల జగములేలు సార్వభౌముని తల మీద నెక్కితనుచు మిడిసి పడుచు “కొమ్ములొచ్చె” నీకు మమ్మేల జూతువు చాలు చాలు పొగరు చందమామ! 19.తే చుక్క తుమ్మెదలన్నియు సుధను (గ్రోల మూగి జాబిల్లి పువ్వును ముట్టడించె మధువు అడుగంటి జాబిల్లి మాయమయిన జాలిగా మిన్ముమనుచుండె-చందమామ! 20.తే వెన్నెలల వేడి మంటకు వేగ లేక ఎందరో నాయికామణు లేడ్చునపుడు సరసముగ మేటి రాగాల సంగతులను అందముగ నేర్ప్చినావట చందమామ! ప్రల

ఐబవ్యలోచన శతకములు అాలాాలాాా 21.ఆ పాలకడలి నుంచి పాలకోవా దెచ్చి చిన్న ముక్క కొరికి మిన్నుపైన పెట్టి రెవరా చీమలిట్టె పట్టెననంగ అందు చుక్కలమరె చందమామ! 22,తే శారదాదేవి తలపైన జేరినావు అమ్మ దయవల్ల నబ్బె రెండక్షరములు నీకు-అరసున్న మరియును నిండుసున్న చదువులందున ఘనపాఠి చందమామ! 28.తే నింగి మూకుడుగా జేసి నిండుగాను పోసి నూనెను మరగించ బుడగలనగ అమరెచుక్కలు, మధ్యలో అప్పడమన జాలి నీవొప్పు చుందువు చందమామ! 24.ఆ చందమామ రావె జాబిల్లి రావెయ నగను పిల్లలెల్ల నవ్వు చుంద్రు పిల్ల పాపలకును బుల్లి బుజ్జాయివా చనవు దొరికె నీకు చందమామ! లాలా అాాాాాాాాాాాాా

లాట దివ్యలోచన శతకములు 25.తే మినుకు మినుకను తారల చినుకులన్ని రాలుచుండెను నింగి సంద్రమ్ములోన పడగ నాల్చిప్పలో నొక స్వాతి చినుకు అందముగ ముత్యమైతివి చందమామ! 26.తే ఆది దంపతులిద్దరు అందముగను కళలు గల నిన్ను ధరియించు కతన గాదె మొదటనే 'కలాభ్యామ్‌” అను పదముతోడ శంకరుల నతులందిరి చందమామ! 27.తే పిండి రేణువు లనగను నిండె నింగి పైన చుక్కలు, ఎవ్వరో దానిపైన ఒత్తుచున్న పూరీవలె ఒప్పు దీవు విందునకు ముందు చెన్నాంద చందమామ! 28.తే ప్రత్తి పండించు రైతులు ఫలము లేక ప్రాణములు వీడుచున్నారు (బ్రతుక లేక చక్కగా నీకు నూలు పోగొక్కటైన సరిగ నివ్వంగ లేమయ్య చందమామ! సాం అాాాాాాాాాాా

బవ్యలోచన శతకములు అలా 20.తే జలజలా పారు మిన్నేటి జాలులోన తేలు చుండెడి కలహంస లీల దోచు అంబుదంబులు పరిగిడు నపుడు నీదు కందువల రూపు కనుగొన్న చందమామ! 80.తే అడవి, సాగరము, చెరువు, మడుగు, బావి గుడి, గుడారము, సౌధము, జడము, మనిషి పడుచు, ముదుసలి, జంతువు, బండ నైన సమముగా జూచు నీ దృష్టి చందమామ! 31.తే _ రాతిలోపల చైతన్య రహిత యగుచు రఘు కులేశుని పదముల రాక కొరకు వేచిన మునిపత్ని యనగ దోచు, తనువు నందుగల మచ్చ కనుగొన చందమామ! 32.తే. దండయాత్రకు రధమెక్కు తరణి వోలె మింటినంతయు నీ వాక్రమించ బోవు వేల చుక్కలతో మింట వెలిగెదీవు అందుకే రాజువైనావు చందమామ! ఆలా అాాాాాాాాా

లాలా దివ్యలోచన శతకములు 33.తే నింగి యనియెడు పెనమున నేర్చుతోడ

నిన్ను పెసరట్టుగా వేసి పేయి రాన

పైన ఉప్మాను పరచిన భాతిదోచు

అందులోనున్న నీమచ్చ చందమామ! 84.ఆ మసక వెలుగులోన మసలెద వదియేల?

మాస్కు కట్టి మోము మరుగు పరచి

మాఫియా గణాల మాదిరిగా నీవు

సంచరించు టేల? చందమామ! 85.తే చూడ పగటి పిశాచమ్ము జుట్టు పట్టి

ఈడ్పుకొని వచ్చి మట్టిలో పూడ్చుకొరకు

నిన్ను సీసాను జేసి, దాని కొనివచ్చి

అందులో నుంచి మూసిరి చందమామ! 86.తే _ దేవతలు రాక్షసులు కూడి దేనికొరకు

కడలి తరచిరా అల్లదే కదలి రాగ

పాల బుడగను కొన్నారు వారు నిన్ను

చాల తెలివైన వారయ! చందమామ! లాలా ప్రా లా

బవ్యలోచన శతకములు అలా 87.ఆ పాలనురుగు రంగు, పాలకోవా రూపు వెండి కళల వెలుగు చుండు నీవు పైన మెరుగులున్న పాషాణమని నమ్మ జాలమయ్య మేము చందమామ! 88.ఆ నింగి చేనులోన వంగొని చుక్కలు పైరు పనులు జేయ, పైన గట్టు మీద కూరుచుండి మీసాలు మెలివేయు చుందువయ్య నీవు చందమామ! 89.తే అంబరంబున తారా గణంబు తోడ పెట్టు నీ కాపురంబది బట్ట బయలు ఇంత సుధగల్లి ఇందరి కిచ్చు నీవు సౌధమును కట్ట జాలవె చందమామ! 40. _ తెల్లబుడగ లోన నల్లకుందేటిని లోన బెట్టి ఊది, దానిమూతి కట్టి, ఎగురవేయ ఇట్టె నింగిని జేరి అందులోన వెలుగు చందమామ! ప్రై లా

లాం దివ్యలోచన శతకములు 41తే లక్షణార్ధము “నాతిచరామి యనెడు

“ట్రిక్కు లందారి తేరిన టక్కులాడు

మరొక ఇద్దరు కన్యకామణుల పొంద

నింద నీ మీద మోపెను చందమామ! 4ల్పెతే తెల్లచుక్కల జింకలు తిరుగు నింగి

వంక వెళ్లెను నల్లని జింక యొకటి

పైన "సెర్చి లైటొవ్వరో పూనివేయ

అందులో వెల్లు చున్నది-చందమామ! శ43.తే తరణి కిరణాల తీక్టత పరిహరించి

సుంత చల్లార్చి అమృత మొకింత కలిపి

వాని కాహ్లాద గుణమును పూని జేర్చి

జగతి కందించు వాడవో చందమామ! 44తే. _ జగతి నేలెడి దొరగారు చతుర గతుల

ఉచిత విద్యుత్తు పధకమ్ము రచన జేసి

నింగి పయిన “జీరోబల్బు” నిన్నుజేసి

జనుల కిచ్చిరి కానుక చందమామ! లాలా అాాాాాాాాాాలా

బవ్యలోచన శతకములు అతత 45.తే తేజమప్పుచేసి తేరగా తిరుగుచు

తరణి అప్పుమాటె మరచి తీవు

తండ్రియగుట చేత తను దీర్చుచున్నాడు

సాగరుండు అప్పు చందమామ! 46.తే _ 'జెర్రి 'టామును ఏమార్చి చెలగితాను

నురగ సృష్టించి బుడగలో నొదిగి దూరి

ఎగిరి పోయెను నింగికి మిగిలె-టాము

సరిగ నీవని భ్రమియించి చందమామ! శీ7.ఆ పుట్టినంత అప్పు పుచ్చుకొనుట నీతి

అప్పు పుట్టకున్న అమవసనిసి

అప్పు తాత్త్వికతల నందమ్ముగాజెప్పు

చుందువీవు మాకు చందమామ! 48.తే _ మామ్మ తెలిబూది వెన్నెల కుమ్ములోన

తెల్లచిలగడ దుంపను తెచ్చి పెట్టె

చుక్క పిల్లలు బిలబిల చుట్టు జేరి

అందుకొన జూచుచుండిరి చందమామ! లాం అ

లాలన దివ్యలోచన శతకములు 49. ఆ ఆకసాన నీవు అరిగిననే చాలు వెన్నెల పరిమళము వెల్లు వెత్తు తాను అరుగునపుడు తన పరీమళమిచ్చు చందనమ్ము వోలె చందమామ! 50.ఆ చక్కనైన యట్టి చుక్కల ధాన్యమ్ము అంబరమ్ము నందు అందముగను కుప్పవోసి కొలువ కుంచమ్ము నినుజేసి సరస నుంచి రెవరొ చందమామ! 51.ద్విపద : నెలవంక తెప్పలో నేనెక్కుతాను ఒప్పదన్నా ఒప్పనో చందమామ! ఎన్నెలంతా పేని పన్నుతా వలను ఒప్పదన్నా ఒప్పనో చందమామ! నింగి సంద్రంలోకి నిలుసుండి ఇసిరి సుక్క సేపలు బట్టి సోద్దాలు సేసి తెప్పనిండా ఏసి తెచ్చుకుంటాను ఒప్పదన్నా ఒప్పనో చందమామ! లాలా అాాాాాాాా

ఐబవ్యలోచన శతకములు అాాలాాాాాాాా 52.ఆ పెరిగి పెరిగి పూర్ణ పురుషుడై ఏతెంచి

కనుల ముందు నిలిచె కన్నవాడు

అంచు నిన్ను జూచి ఆనందమున తాను

సాగరుండు పొంగు చందమామ! 58.తే నింగి పరచిన పరుపుపై నిండుగాను

వెండి చుక్కల దుప్పటి వేసినారు

నిన్ను మెత్తని దిండుగా నిలిపినారు

జగదధీశుడు నిదురింప చందమామ! 54ఉఆ కావుమనుచు వేడ కటిక చీకటి నుంచి

రాజముద్ర నొసగె రాజు మాకు

రాజముద్ర చూపి తేజంపు రాశి చే

కొందు మింక మేము చందమామ! ర5్‌ర్‌.తే పగలు మాకర్ణ పుటములు పగులునట్లు

రణగుణ ధ్వనులను జేసి రాత్రి ఎవరా

గప్‌ చుపుగ డప్పునుంచిరి గగన వీధి

యందు ననుకొందు నినుజూచి చందమామ! ల ష్రు లాలా

లాలా ఐబవ్యలోచన శతకములు 56.ఆ ఆకసమ్ము నందు చాకచక్యముతోడ

దినము కొక్కచోట తిరుగుదీవు

రాచరికములోన రాజు భద్రత కయి

చాల తిప్పలయ్య చందమామ! 57.తే అరయ పగలంత కట్టిన అంబరమును

“'సర్ఫు? లోపల నానించి సాపుజేసి

నురుగు చుక్కలు రాలంగ మరల నిన్ను

సబ్బుగా రుద్దు చున్నారు చందమామ! 5868.ఆ ఆకసంపు వీపు రాకాసి మంటతో

తరణి కాల్చినాడు దారుణముగ

వెన్నబోలు నట్టి వెన్నెల లేపనం

బందు వూసితీవు చందమామ! 59.తే అంబరపు చక్కిపై నిన్ను సంబరముగ

బంతి గావించి విసిరిరి పందెమనగ

చుక్క డబ్బులు కాసిరి చక్కిపైన

ఎందు నిలుతువొ ఉత్మంఠ చందమామ! లాల షు అలా

దివ్యలొచన శతకములు అలాల 60.తే ఆకసంబును కాలుష్య మావరించె

మిమ్ము చూడగ మాకు వశమ్ముగాదు

ఇపుడు ష్లానెటోరియమున కేగు దెంచి

అందు జూతుము మిమ్ముల చందమామ! 61.ఆ పాలవెల్లి లోన ప్రభవించి పాల బా

లెంత పాలు వలసినంత త్రాగి

పాలకుండ వైతి పాలపుంతకు నీవు

అందములను చిందు చందమామ! 62.తే నీదు ప్రతివింబమును జూచి మోదమందె

బాల రాముడై, కృష్ణుడై బాధనొందె

దృష్టి లోపమె కాని ఈ సృష్టి వస్తు

జాలమందు దోషము లేదు చందమామ! 68.ఆ పుచ్చపాదు నింగి పుంతలో కాయగా

పుచ్చకాయవైతి పొందుగాను

పుచ్చ పువ్వువోలె పూచెనీ వెన్నెల

లింధు అందముగను చందమామ! లాల ష్త్టటై అ

లతతతతతతతలలాడాడాంంాఖ దివ్యలోచన శకకములు 64తే రంగు రుచి వాసనల కప్పురంపు ముక్క చెలగి నింగిని వెలుగు వెన్నెలలు కాసె సూరనార్యుని భాషలో చూడనీవు చాల చక్కని కవితవు చందమామ! 65.తే నింగి ఉద్యాన వననమందు పొంగులెత్తి మిలమిలలు రువ్వి చక్కగా మెరయుచుండు చుక్క పిల్లలు ఆటల చొక్కు కొరకు జారు బల్లగా దోచెదు చందమామ! 66.ఆ ఒదిగి యుండు గుణము ఒంట బట్టుట లెల్ల పుట్టినపుడు మరియు పోవునపుడె మధ్యనొదుగ బోని మహరాజు లందరు సాక్షినీదు రూపె చందమామ! 67.తే నింగి ముంగిటిలోపల నింత పెద్ద ముగ్గు రచియించి రెవ్వరు ముదము తోడ? తెలిసె-నెలపట్టు పెట్టిరి దేవతలిట ముందు సంక్రాంతి ముచృట చం, వ. కాంతి మచ్చట కరన ర ట్ర్‌ అష్టా ఈ గ్‌ యయా) లీ

బవ్యలోచన శతకములు అలా 68.ఆ రూపు వంకరైన చూపు వంకరయైన

విలువ తగ్గలేదు వీసమెత్తు

కలిసి వచ్చునపుడు కనరావు దోషాలు

చాలు నీ బడాయి చందమామ! 69.ఆ తెలుపు రంగు మేన నలుపు జింకను దాల్చి

వెన్నెల వెలిబూది వన్నెలలది

నింగిలోన నున్న లింగమనగ దోచు

చుందువీవు మాకు చందమామ! 70.తే అంబుదమ్మును దిండుగా నమరజేసి

ఆకసంబున నిదురించు అందగాడ

వేదికల మీద నిదురించ రాదుసుమ్ము

అందునా నేతలకు నెందు చందమామ! 71.ఆ చుక్క పూలు తెచ్చి చక్కగా జడనల్లి

ఒత్తిచూచుకొన్న ఒప్పులాడి

మొనలు గల్లు నిన్ను మొగలి పూరేకుగా

సంతరించె నందు చందమామ! ల షై లాలా

లారా దివ్యలోచన శతకములు 72.తే కొబ్బరాకుల మాటున కొంత కొంత దాగి దోబూచు లాడేటి తరుణమందు నిలువు తీగల వీణియ నిలచి మీటి సంగతులు చెప్పునటు తోచు చందమామ! 739.తే ఆది దేవుండు శంకరు డంబతోడ చెలువు మీరంగ నరుదెంచి కొలువుదీర అమృత మభిషేకమును జేయ నమరినట్టి చక్మనైన ధారాపాత్ర చందమామ! 74తే శివుని తలపైన వెలుగులు చిందునీకు విష్ణునామంపు పోలిక వింత దోచు హరికి హరునకు భేదము నరయబోవు వందనము నీకు అందుకో చందమామ! 75.తే వెనుక వందల 'ఎక్‌స్టాలు' మినుకు మనగ ముందు బహుభంగిమలతోడ విందుజేసి నాయికామణి తెరపైన నాట్యమాడు చందమగునయ్య నీరూపు చందమామ! త షా అాాాాాా

బవ్యలోచన శతకములు అతత 76.తే నింగి నిశికషాయమ్మును మింగు కొరకు తారలను పంచదారగ దాన కలిపె బెషధమ్మును సేవింప నమరెనేమొ చక్కనౌ రవితేజమ్ము చందమామ! 77తే మింట సురలకు కట్టిన వంట యిల్లు వంట యింటి కుందేలట పరువులెత్తు చుట్టు పక్కల చుక్కలై సురలు జేరి విందు కొనజూచు చున్నారు చందమామ! 78. _ నిన్ను చూడగానె నిదురవచ్చునదేమొ ఇత్తువేమొ నీవు మత్తుమందు చిత్తు జేతువయ్య మత్తులో మమ్ముల సగము జీవితమ్ము చందమామ! 79.తే _ కోటి చుక్కల సైన్యమ్ము కోరికాయ తెలిగుడారంబు నందు నిద్రించె రాజు ఏమి జరుగునొ తెలవార నెవరి కెరుక? శాశ్వతంబెవ్వ రిచ్చట? చందమామ! లాల ప్రై లాలా

ాాాాలాాాాాభి దివ్యలోచన శతకములు 80.ఆ ఎచటి చందమామ ఎచటి కలువభామ

ఏల కుదిరె జంట ఏమి వింత?

మాటలాడుకోక మనసులు కలియుటే

జాతకంపు మహిమ చందమామ! ర81.తే పుట్టినప్పుడు కత్తిని బోలు నీవు

కడకు డాలుగ మారితి, కత్తి పోయి

డాలువచ్చె ఢాం థాం ఢామటన్న రీతి

చాల చిననాటి కధవయ్య చందమామ! 82.తే ఆరుబయటను మంచాల బారువేసి

అందరము జేరి హాయిగా అంబరంపు

వింతలను ముచ్చటించిన వేళలేవి?

ఎందుబోయెనా రోజులు చందమామ! 88.తే తలచితిని నయాపైసగ తొలుత నిన్ను

కాదు పదహారణాలున్న కాసువీవు

నిండు రూపాయ వౌదువు నిక్క్మముగను

చాల విలువైన వాడవు చందమామ! ల ష్రా లా

దివ్యలోచన శతకములు అాలాలాలాాలాాాాాాాా 84.ఆ రాత్రి పూట పనికి రాక తీరదుగాన శాశ్వతమ్ముగాను సతుల కూడ వెంట దెచ్చుకొనెడు వెసులబాటును కొన్న చతుర మత్సివి నీవు చందమామ! 85.తే తరణి కిరణాల వేడికి తాళలేక “చందమామ” మార్చును జూచి చక్కనైన తెల్లచుక్కలు గలిగిన నల్లగొడుగు జగతి కొనితెచ్చి తాల్చెను చందమామ! 86.ఆ సెలవు దొరుకు నీకు నెలకొక్కసారైన 'సెలవు దొరకనట్టి కొలువు రవిది విసుగు లేదె వేల వేల వత్సరములు “జాబు” చేయమీకు చందమామ! 587.ఆ చుక్కలన్ని కదిలె చక్కని సేనగా వెండి గొడుగువైతి వీవు మధ్య వెండి గొడుగు క్రింద వేంచేయు వారెవ రందు కాన రారు చందమామ! లాల ప్రా లాలా

లా ఛి దివ్యలోచన శతకములు 89,తే నింగి మోమున మొటిమలు పొంగులార “వైటు ఆయింటుమెంటును పైన పూయ నింగి నిండెను చుక్కలనంగ దోచి సాపుగా మారె నుదయమే చందమామ! 90.ఆ కల్పతరువమృతము, కామధేనువు, నిన్ను స్వార్ధబుద్ధిలేక జగతి కిచ్చె పాలవెల్లి పేర వంశనామము లేక చంద్రవంశమేల? చందమామ! 91తే కడలి తరగల కడ చేరి కదలియాడు నిండు పున్నమ జాబిల్లి పండువగుచు అమ్మ ఒడిలోన కూర్చొని ఆటలాడు అందముల చిందు బుజ్జాయి చందమామ! 92.ఆ ఒక్కచూపులోన ఓషధి వృక్షాల పూయజేతువంట భూమి మీద మాకు తెలియదేమి? మాడబ్బు దోచును మందు కంపెనీలు చందమామ! లాలా ప్రా లాలా

దివ్యలోచన శతకములు అ 98.ఆ నింగిలోన నెవరొ నిలిచి టీ త్రాగగా పట్టుజారి కప్పు పడియె క్రింద ముక్కలైన కప్పు చుక్కలై కనుపట్ట సాసరస్లె మిగిలె చందమామ! 9డ4తే తెలుగు కవులంత తిట్టిన తిట్టు తిట్ట కుండ తిట్టి పోసిరి నిన్ను మండి పడక కోర్టు కెక్కక నీవోర్చుకొంటివయ్య వందనము సహనమునకు చందమామ! 95.ఆ చుట్ట చుట్టు కొనియె పట్టగా నింగిలో తెల్ల చుక్కలున్న నల్లతాచు ముడిచి విష్పునట్టి పడగవై నీవుంటి వందు మధ్యలోన చందమామ! 96.తే _ దోషమున్నది కనుకనే దొంగవలెనె తిరుగుచుందువు నిశియందు దొరకకుండ దొరకకున్నంత కాలమే దొరవు నీవు ముందు ముందున వమౌనొ చందమామ! పారం అాాాాాాాాాాాాాాాాా

ఆరోరా దివ్యలోచన శతకములు

97.తే ఎన్ని కల్పాలనుండియో యున్న నీకు

ఒక్కగుడి కట్టగాలేదు ఒక్కడైన

కోపగించక గుడికట్టు కొందువీవె

అందముగ నింగిలోపల చందమామ! 98. _ చేరి కధలు చెప్ప దూరమైన దటంచు

సుధలు చిందు మంచి కధల పుస్త

కంపు రూపు నొంది కలకాలమున్‌ మాకు

విందు చేయు కధల చందమామ! 99.ఆ నీవు కలవు మాకు మావంక నేమింక

లోటు కలదు మాకు లోకమందు?

తల్లి వంక వారు తగిన సొటి కనుక

సాటిలేరు మాకు చందమామ! 100.తే పనికి తెరలేపు వారము-పనికిరాదు

నీదు వారము నందెందు నింపులేదు

ఆదివారమె మాకు ఆమోదమయ్య

ఇందు మేమంత నిక్కచ్చి చందమామ! ప్రా లాలా

దివ్యలోచన శతకములు అలా 101. చందమామ మీద చక్కగా లేబెట్లు వేయుచుండి రపుడె విరివిగాను మూను మీద ప్లాటు నేను కొందునుగాక అందు కలుసుకొందు చందమామ! 102. సగము వెలుగు కవిత సవిత చెప్పి చనంగ పూర్తి జేసెదీవు స్ఫూర్తి తోడ కాంతులీను కవిత గగన సీమను జెప్పు జంట కవులు మీరు చందమామ! 108.తే కాముడంబ కనుబొమల కార్ముకమున అంబ తిలకంపు పువ్వును అంబకముగ గూర్చి తలపైన నినుజూచి కొట్టగడగె స్ఫటిక లింగమ్ము వనుకొని చందమామ! 10కఆ ..ఏదోసమున్న దనుచు దొంగవనుచు నిన్ను చ. నింగి బోనులోన నిలిపిరెవరు? టి .. "జదిగి ఓదిగి నీవు, ఉండుటెల్లరు జూచి లని బ.(ఖంధురున్నదనుచు చందమామ! న యా

లాలా దివ్యలోచన శతకములు 105.ఆ తరచి చూడ నీకు తరణితో నెయ్యమ్ము తండ్రిపాలు, రూపు తరుగు పెరుగు పాలపుంత ఇల్లు, పాలకోవా ఒళ్ళు విందు చేయు రుచుల చందమామ! 106.ఆ కొంత కొంత పెరిగి గుండ్రమ్ముగా మార దొర్లి పోయి నీవు దొరకవేమొ యనుచు సొట్ట కొట్టి ఆకాశమున నుంచు చుందురెవరు నిన్ను? చందమామ! 107. అచ్చమైన (ప్రేమ నలమేలు మంగమ్మ అన్నగారి వన్న ఆదరమున సంతసమున చేరి “చదివించె' పద్యాలు చదివినాను నేను చందమామ! ద గ మనకా ౧) గీఆ! (౮92 429656 ఏలి ఈ కస ాలాలాల ష్ట్ర అలా

వ వటం? [ల స గ్‌ (1 ' తా|| డి. ఎస్‌. రణపతి రావు లట " | ఖ * “ఇతర రచన: శ తివేణి - అలమల్మంగ శతకము ఎనక గం

  • ౨ శివ శతకము 1 . . - శారదాంబ శతకము . . స్ట్‌ " స ం (/ ప్రతులకు : దాః డి.ఎస్‌. గణపతిరావు. వైట్ల వేంటేజ్‌, ఫ్లాట్‌ నెం. 202 పెద వాల్తేర్‌ జంక్షన్‌, విజయనగర పేలస్‌ లే అవుట్‌, విశాఖపట్టణం - 17.