Telugu Dharma dandam - anilvaranasi/indianlanguages GitHub Wiki
జగ్గ్మక్ష్య్లు ఫ్ బో | చ్ స్ట కి | ్రా ర ల మని న | ళో _ సహజ కవి మల్లెమాల , (/ న = మనసుపడి మక్కువతో సేకరించిన శ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం శే | సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి , - ఆనందంతో బహూకరిస్తున్నాం. "| శే | - మల్లెమాల కుటుంబం శ ॥ కో త పో! [ వు జీ నా న్ శ్ [స "కోడూరి విష్లు నందన్
ండం క్ష శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము వై న్ న న కోడూరి విష్ణునందన్ క్ 1... న్ క్ష ప్రాక్తన పుణ్యలేశమున బద్యములల్లుచునుందు బాండితీ సై న శక్తియు నావగింజ మరి సంస్కృత మేథయు సున్న భారతీ, జ స సక్తుడనైతి, ఛాందసపు జాడలెరుంగని వాడ జూడగన్ ! స్ ఈ 1?! ఏ. ఈ జీ లో
ధరదండం వ్ -ధ్య జగద్గురు త్రీ ఆది శంకరాచార్య చరిత్రము = ప్రథమ భాగం తానో | ళ్ బా కోడూరి విష్ణనందన్ ఫమడాళ వన సస్తో (6 జూలై, 2003) శ ల భ్‌శులు వ 1000 ముఖపత్రాలంకరణ : నరేంద్రగ్రాఫిక్స్ హైదరాబాద్. ప్రతులకు ౩; ఆధ్యక్తుడు, సూరన సారస్వత సంఘం, బైర్‌మల్ వీధి, నంద్యాల 518 501 కోడూరి శేషఫణి శర్మ 113, సంజీవనగర్, నంద్యాల 518 501 మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో అక్షర కూర్చరి 2 ఆరవేటి వెంకటసుబ్బయ్య ( శ్రీవాసవీ (గ్రాఫిక్స్, చిక్కడ్‌పల్లి 061: 98484-53726) ముద్రణ వ ఆకృతి చిక్కడ్‌పల్లి, 27664525 వెల ఏ రూ.50/. (0)
ని౦౧68 : (04112) 222115 మ రాండే- 0ం6ం62643.605104.12. గ్‌ఖ :224305 6/1 100407001640/8 |011010: $1 $8౧000 తీ$60006+66006000106/0 00/0706/096116 శీం010౯౧66 $00/09౧0019 [119 [1011౧698 571 గడగింగ| గడగా2కం౪ దం964%010200| ]46406411264 521 5౫49 గ0క4ం ళీ 8811641 90026201 ప్20050012202100 0.1, 52181 57069ఓ కవినిం6గిం?8గ౧) - 631 502. || గ్ ౧౬16: ర్ న్‌రి న్! య" [గం అసం (/ సం [19 ఇవ (12౬ కలం కరంగా .. 1 91౮తఊ/! ప. గోరాంంటలగంఆరడటయె /ు టల ల హ్ టం ల గు అమలిన ఉం మ స సలం ౨౬౭౬టవాలోం క వాన వ గ. రం (ఇ అగూంలా ౨ కదు.
గ సు కెంథత ౪7 ళో 2 న్యా పాపో మీరేయజరెడ, ఎంవి ౧లుట న (0 ఎంఏ ఏపాచ్‌డి డితిబ్ స! ౫.1 వ మ ళా ఆంధ్రప్రదేశ్ ద్రభుత్యం న స. ర్ కళాభవన్ హైదరాబాదు - 500 004 [2 ఉట ఈ ఫోన్ (అ) 3214803 (ఇ) 3548451 ఫాక్స్ (ఆ) ౩2145603 అభినందన
ధార్మిక ప్రవచనాల ద్వారా, అసాధారణ వ్యక్తిత్వ విశేషాల ద్వారా ఆసెతు శీతాచలం సుప్రతిష్టులైన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. వైద్య విద్యా పట్టభద్రులైన డా! కోడూరి విష్ణునందన్‌గారు ఆదిశంకరుల జీవిత చరిత్రను 'ధర్మదండం' పేరిట పద్యకావ్యంగా రచించారు.
ఆదిశంకరుల జీవన యానంలోని ముఖ్యవుట్టాలను వద్యాకృతిలో ప్రచురించారు. దాః విష్ణునందన్‌గారు. విష్ణునందన్‌గారికి (ప్రౌఢ పద్యరచన పట్టుబడింది. పద్యాలతో పాటు ఈ కావ్యంలో ధారాధురీణంగా సాగే దండకం పొందుపరచడం విశేషం. ఆదిశంకరుల జీవన రేఖలతో పాటు వారి సంస్కృత శ్లోకాలను మూలసమ్మితంగా అనువదించడం గణనీయ విషయం.
ప్రాచీన పరిణత పద్యకవుల రచనలను తలపించే ఈ 'ధర్మదండం” కావ్యం రచించిన దా! కోడూరి విష్ణునందన్‌గారికి నా హార్ధికాభినందన.
(దా. సి. నారాయణరెడ్డి) (|)
తివానందలహరి “శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయమ్ నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్”
శంకరులు జగద్గురువులు. ప్రపంచంలోని మతాలన్నింటిలో శంకర భగవత్సాదులచే 'ప్రతిష్థాపించబడిన అద్వైతతత్త్వం అనన్య సామాన్యం. ఆ మహితాళ్ళుడు బాల్యంలోనే సన్యసించి, అసేతు హిమాచలం పర్యటించి, ముప్ఫై రెండేళ్ళలోనే పరమత ఖండనం, స్వీయమత వ్యాపనం, బహుగ్రంథ వ్యాఖ్యా రచనం, శంకరమఠ స్టాపనం, శిష్యబోధా సంప్రదాయ ప్రవర్తనం మొదలైన మహా విషయాలను స్థాపించి, సనాతన ధర్మ పరిపోషణాన్ని చేసిన పూర్ణ పురుషుడు. 57 ఉపదేశ ప్రకరణ గ్రంథాలూ, 72 స్తవస్తోత్ర గ్రంథాలూ, 24 భాష్య (గ్రంథాలు రచించిన మహామనీషి. శంకరుల ప్రస్థానత్రయం ప్రసిద్ధం. శ్రుతి స్మృతి పురాణాది మహాగ్రంథ పరమార్థాలను తన కృతులలో స్థాపించిన అద్వైత మతాచార్యులు ఆదిశంకరులు.
భారతీయ మతాచార్యులలో శంకరులు అగ్రగణ్యులు. శంకరుల జీవిత చరిత్రం మహాపురాణాలకు సమమైన మహాకావ్యంగా భారతీయులు భావిస్తారు. సంస్కృత భాషలో శంకరాచార్య జీవిత చరిత్ర - శంకర విజయం, శంకరాభ్యుదయం మొదలైన పేర్లతో అనేక కావ్యాలు వెలువడ్డాయి. ఇక దేశ భాషలలో చెప్పనక్కరలేదు. అంతేకాదు భారతీయ భాషా సాహిత్యాలలో వివిధ రూపాలలో, బహు ప్రక్రియలలో వెలువడిన ఆచార్య చరిత్రలలో శంకర చరిత్ర ఒకటి. “బ్రహ్మ సత్యం జగన్నిధ్యా జీవో బ్రహ్మైవ నాపరఃొ - అన్నది (ప్రస్థాన శత్రయసారం. శంకరుని వాదతాత్పర్యం. శంకరుల జీవిత చరిత్రకంటె వారి ప్రతివాడ విజయోత్సవ చరిత్రం విస్తృతం. దానితో తెలుగులో శంకర విజయం పేర విజయ కావ్యపరంవర వెలువడింది పద్యంలో, వచనంలో, కవితా భూషణ వెంపరాల సూర్యనారాయణ శాస్తి గారి ఆంధ్ర శంకర విజయం ఇప్పటివరకు వెలువడిన శంకర కావ్యాలలో ఉత్తమమైనదిగా పండితులు ప్రశంసిస్తారు.
విద్వన్మిత్రులు దాక్టర్ కోడూరి విష్ణునందన్ రచించిన శ్రీ శంకరాచార్య చరిత్రం పద్యకావ్యం (నిర్వచన కావ్యం). దీనికి 'ధర్మ్శదండం' అనే పేరుంచటం విశేషం. ఒక మహత్తర సన్వ్యాస దీక్షావత జీవిత ప్రస్థానానికి ధర్మదండం ప్రతీక. శీర్షిక ప్రతీకాత్మకంగా ఉండటం ప్రతిభా చిహ్నం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పంచకల్యాణాలవంటి లక్షణాలతో కూడి ఉండటం గమనిస్తాం. శంకరాచార్య చరిత్ర ఇటువంటి పురాణం వంటి కావ్యం. అందువలన ఇటువంటి కావ్యాలలో పురాణశైలీ, కావ్యశ్రైలీ నీరక్షీర న్యాయంతో శోభిల్లుతూ ఉండటం సహజం. అ బెచిత్యాన్ని గుర్తించి డాక్టర్ విష్ణునందన్‌గారు అటువంటి మిత్ర రచనా వైభవాన్ని (ప్రదర్శించారు.
తిరుపతి వేంకటకవులు ఆశుధారా కవిత్వ ధోరణిని తెలుగు కావ్యాలకూ, పురాణాలకూ సహజ న్వభావంగా అలవరచి ఒక కక్రొత్తదైన మధురఫణితిని కల్పించారు. అది చాటు కవితా మాధుర్యాన్నీ సరళ ప్రబంధ రచనా సౌందర్యాన్నీ సంతరించుకొన్న ప్రసన్న శైలిని తెలుగు కవితకు అందించింది. నేటి వద్యకావ్య రచనకు అ శైలి జీవనాధారంగా రాణిస్తూ అబాలగోపాలాన్ని అలరిస్తున్నది.
(౪)
డాక్టర్ కోడూరి విష్ణునందన్‌గారు ఆ శైలిని ఈ కావ్యంలో ఆమూలా(గ్రం పోషించారు. అందువలన జ్ఞానతత్వార్ధ బోధకు ఆలవాలమైన శంకరుల జీవిత చరిత్ర మధుర మధురంగా ఆస్వాదనీయంగా అవతరించింది.
“ధర్మదండం' కావ్యాన్ని రెండు భాగాలుగా వ్రాయ సంకల్పించారు డా॥ విష్ణనందన్ గారు. ఈ విభాగం పారకులకు కూడ సౌలభ్యాన్ని కలిగిస్తుందనడంలో అనుమానం లేదు. ఇది మొదటి భాగం.
“ఒక పులకింత, యొక మధురోహ; యొకానొక (ప్రేరణమ్ము వే రొక పరిస్ఫూర్తి గాంచితి బుధోత్తమ కావ్య శుభానుశీలనో త్సుకత జరించి, నా కలము దోహలమంది స్వయమ్ముగా నొకా నొక మహనీయ కావ్యరచనోద్యమ భావన మొందె నాదటన్”
ఈ పద్యం అలవోకగా వెలువడ్డ ఆశుధారలా అందగించింది. కావ్య స్ఫురణలో కలిగే అంతరంగ స్పందనలను హృదయగమ్యంగా ఆవిష్మరించటంలో రసభావవ్యక్తీకరణ చాతుర్యం రాణించింది. కలం దోహలమందటానికి వరుసగా పులకింత, మధురోహ, (ప్రేరణ, స్ఫూర్తి, కావ్య శుభానుశీలనోత్సుకత - అనే అంతరంగావస్థలను చిత్రించి, కావ్యరచనోన్ముఖుదైన ఒక కవి చిత్తవృత్తిని విశ్వజనీనంగా వెలువరించిన వైఖరిలో చాటుకవితా ప్రతిభ ప్రదర్శితమౌతున్నది. ఈ గుణం డాక్టర్ విష్ణునందన్‌గారి కవిత్వ సామాన్య గుణం.
అకృతులకంటె గుణాలకు (ప్రాధాన్యమిచ్చి వర్షించే వైభరి శంకర జీవిత చరిత్రకు నవచైతన్యస్ఫూర్తి నిచ్చింది. భారతదేశాన్ని భారతాంబగా వర్ణించి ఆమె వైభవాన్ని ఇలా కీర్తించారు కవి.
“శ్రీ విలసిల్ల సుశేయోయుతంబై వి నూత్న కాంతుల నీను రత్నగర్భ;
జ్ఞానామృతమ్ముతో ధ్యాన దుగ్ధములతోం బొల్బెడు కుదురైన పూర్ణ కుంభ;
సర్వవిద్యాధన సముపార్దితంబైన పేశలమ్మగునట్టి కోశయుక్త
అసమాన వీరత్వ మసహాయ శూరత్వ మధిగతమ్మైన శౌర్యప్రవీణ;
అటుల నిటులని చెప్పగా నెటుల? సకల రంగములలోన దీవించు రాజసమున;
నిత్యసంతోషవదన బెద్ధత్యలలన సారమకందలీన యీ భారతాంబ!”
'ప్రసాదగుణ భూయిష్టమైన రచన సర్వరస సమర్థమని లాక్షణికులంటారు. దాక్టర్ విష్ణునందన్‌గారి కవిత అందుకు సాక్ష్యం.
ఈ కృతి అనువాదం కాదు. అయితే, కథ ప్రసిద్ధం. కథను వర్ణించిన సంస్కృతాంధ్ర కావ్యాలు అనేకమున్నాయి. కథను స్వీకరిస్తే అనువాదం కాదు. కథను తీర్చిదిద్దిన విధం కావ్యస్వభావాన్ని నిర్దేశిస్తుంది. ఈ కవి చిత్రించిన కథ స్వతంత్రం. అందువలన ఇది స్వతంత్ర కావ్యమే. అయితే శంకర వాజ్మయంలో
(4)
అనువాద రూపాలు కనపడవచ్చు. అవి కథలోని భాగం కావు. ఆ మూలాలను మార్చటం బెచిత్యం కూడా కాదు. “అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ సదా బంధనం నైవ ముక్తిర్న్షబంధః చిదానంద రూపం శివో౭_. హమ్ శివో హమ్” దీనికి కుదురైన తెలుగు పద్యం “నిర్వికల్ప నిరాకార నియతుడేను జ్ఞాన కర్మేంద్రియాది సంగతుడగాను నేను నిర్బంధుడను మోక్షవిరతి లేదు చిన్మయుండ్రన వాదనే శివుడ! శివుడ!” అయా సందర్భాలలో ప్రాచీన కవుల కవితా ప్రభావం ఈ కవి పద్యరచన మిద కనపడుతుంది. ఒకేచోట కనపడే ఈ క్రింది రెండు పద్యాలూ పోతన శ్రీనాథుల కవితా ప్రతిబింబాలు! “దనుజస్తోమ వినాశకారిణి! నమోదాక్షాయణీ! పావనీ! అనిమేషస్తుతి రూపిణీ! వితత భక్తానంద సంధాయినీ! జననీ! నిత్యయశస్వినీ! శతసహ(్రాదిత్య సంభాసినీ! ఘన సౌజన్య మనస్వినీ! ప్రణతి! సాక్షాద్వేద చిద్రూపిణీ!” “అక్షయ్యంబగు నన్నపానముల నోయమ్మా! ప్రసాదించుచున్ మాక్షుద్బాధల దీర్చు దీవటులె సమ్యక్ జ్ఞాన సంయుక్త థీ భీక్షాదానము జేసి సత్మరుణతో వీక్షింపుమమ్మా! విశా లాక్షీ! రక్షిత భక్త సంతతి! సదా లక్ష్మింతు నీ 'ప్రేముడిన్” తెలుగులో ఎంత మధురంగా కవితలల్లగలరో సంస్కృతంలో కూడా అంత రుచిరంగా రచన చేయగలడు ఈ కవి చూడండి. శివుడంటే ఈ కవికి శినమెత్తుతుంది. కవిత్వం దానికి తగ్గట్లు కురంగలిస్తుంది. “వందే లోక శుభంకరమ్ భవహరమ్ వాత్సల్యవారాన్నిధిమ్ వందేభూత గణాదిసేవిత విభుమ్ వందే భవానీ పతిమ్ వందే నచ్చిదనంత రూప కలితమ్ భాస్వంత గంగాధరమ్ వందే చంద్రకలాధరమ్ స్మరహరమ్ వందే శివం శంకరమ్” ఆ పరమ శివుడు ఆదిశంకరుల కావ్యాన్ని సంపూర్ణంగా ఈ కవిచేత రచింపజేసి అఖండ కీర్తిని ప్రసాదింప జేయాలని మనసారా కోరుతున్నాను. ఈ సుకృతి శివానందలహరి. శుభం భూయాత్ ! జి.వి. సుబ్రహ్మణ్యం వైస్ చాన్స్‌లర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
అభినందన ధర్మదండంబునందు పద్యంబులెల్లం బంచకల్యాణి గుర్రాల పగిదిందనరె నాశు వేగోక్తి కాశ్చర్యమందినాను విష్ణునందన! శుభమస్తు! వృద్ధిరస్తు! భావమునందు నార్నతయు ంబల్కులయందున నార్దవమ్ము గా ధా విధమందు ంగ్గుప్త్రతయుం దర్శ సహిష్టుత వాక్యవైఖరీ ధీవిభవంబులందు 6బ్రణుతిక్షమ సత్మనితాగుణంబు స ర్వావ్యయవంబులందు - నిటులైదువ నీ కృతి విష్ణునందనా! చదివిన వచ్చునే కవనచారిమ? యయ్యది పూర్వపుణ్యసం పదంబడి రావలెన్ లలితభారతి సత్కృపమైన రావలెన్ పదనుగ నేలంజీల్చుకొని వచ్చెడి సారణివోలె రావలెన్ ముదముగ విష్ణునందన! యమోఘము నీ కవనంబిు నీ గతిన్ నీకున్ నీ కవితా కలాపమునకున్ నీ శక్తికిన్ నీ పరీ పాకోన్ముద్రిత భావనా సరళికిన్ వైద్యంపు సద్వత్తికిన్ నీ కామ్యంబుల కిష్టగమ్యములకున్ దీర్చాయురారోగ్య సు శ్రీ కల్యాణ యశఃప్రకాస్తి వినుతుల్ సేకూరుతన్ మీరుతన్ బేతవోలు రామబ్రహ్మం (411)
అభినందన సువర్ణ సూత్రమ్
చిరంజీవి కోడూరి విష్ణునందన్ రచించిన “ధర్మదండమ్” కావ్యాన్ని ఆద్యంతం ఆసక్తితో పరించాను. ఆనందం ఒకవంక ఆశ్చర్యం మజొకవంక. ఇంత చిన్నతనంలో కావ్యనిర్మాణ కౌశలము పట్టుబడినందులకు ఆశ్చర్యం. ఇది పురాక్ళత సుకృత విశేషం. మటతొౌకృవైపు జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారి జీవన చిత్రణమును కమనీయ కవితా కల్పకంగా రూపొందించినందులకు ఆనందం. అది ఆ అవతార మూర్తి సంకల్పం. ఈ కవి అదృష్టం అనల్బం.
వైద్యవృత్తి చేపట్టనున్న ఈ కవికుమారుడు భౌతిక శరీరమునకు రోగ నివృత్తి నిమిత్తం చికిత్స చేయడమే కాదు భవరోగ నివృత్తి కోసం ఆధ్యాత్మిక పరమౌషధమును కూడ అందించి అపర ధన్వంతరిగా కవితా సంజీవనిని అందించ బూనడం అభినందనీయం. ఇది ఈశ్వరేచ్చ. మహేశ్వరుడు శంకరాచార్యుల వారికి ప్రత్యక్షమై “ధర్మదండమున్ కేల ధరించి ధర్మగుణకేతనమున్ వెలయింపు మీ భువిన్” అని ఆదేశించిన మాటలో కావ్యంపేరు రూపుదిద్దుకోవడం గమనిస్తే ఇది ఈశ్వరేచ్చ అని అనిపించింది.
కవి ఇవ్వుడివ్వుడే సాపాత్య రంగాన (వవేశిన్తున్నవాడు. కాని నిర్వహించదలచుకొన్న శ్రీశంకర భగవత్పాదుల వారి జీవిత కథా నిర్మాణ వ్యవహారము బహుముఖ ప్రజ్ఞాశాలి చేపట్టదగ్గది. ఐతే సరస్వతి ఈ చిరంజీవి కలంలో కవితా సుధను జాలువార్చింది. కవి పండిత ప్రశంసలకు పాత్రుణ్ణి చేసి అనుగ్రహించింది. ఒకవైపు సాహిత్య రంగము - మతొక వైపు ఆధ్యాత్మిక దృక్పథము. కవి ఈ రెండింటికి నమయానుకూలంగా నమన్వయాన్ని నంధిన్తూ నవ్యసాచిదవైై రచన సాగించవలసియున్నది. నాణెమునకు ఇరువైపులా ఉన్న బొమ్మ - బొరుసులలో ఏ ఒకృవైపు రూపురేఖలు సరిగా లేకున్నా - చెదిరిపోయినా అ నాణెం చెల్లదు. ఇది లోకం తీరూ ఆధ్యాత్మిక విద్యకు కవితా గంధం పూసి కవి ఈ కావ్యరచనలో కృతకృత్యుడు కాగలిగినాడని ఘంటాపథంగా చెప్పగలను.
సత్మవి, సారస్వత సవనాంచిత హోత అయిన జనకుడు శ్రీ కోడూరి శేషఫణి శర్మ గౌరి సూచన ఒక పేరణ. ఆ సూచనతో (0)
చం॥ ఒక పులకింత, ఒక్క మధురోహ, ఒకానొక (ప్రేరణమ్ము వే రొక పరిస్ఫూర్తి గాంచితి బుధోత్తమ కావ్య శుభానుశీలనో త్సుకత చరించి; నా కలముదోహల మంది స్వయమ్ముగా నొకా నొక మహనీయ కావ్యరచనోద్యమ భావనమొందె” (పద్యం - ప్రస్తావనం) అని కవి మధుర సంకల్పంతో ముందుకురికినాడు. శ్రీ శంకరాచార్యులవారి పూర్వీకులను ఉటంకిస్తూ శ్రీవారి తాత విద్యాధిరాజును గూర్చి “పలుకు వెలది చేతి చిలుక అతడు” అని పరిచయం చేస్తూ భవిష్యత్తరములో ఈ వంశీయులచే శారదాపీఠము వెలయగలదని ధ్వనిగా సూచించాడు. శ్రీవారి తండ్రిని శివగురుని పరిచయం కావిస్తూ “పులి గర్భమునందెటు పిల్లి పుట్టెడున్” అని అలంకార పూర్వకముగా శివగురుని జన్మవిశిష్టతను ధ్వనిగా ధ్వనింపజేసిన కవి క్రావ్యశిల్పమును పుణికి పుచ్చుకున్నాడనక తప్పదు. ఇది ఏ జన్మ పుణ్యపరిపాక ఫలమో కదా!
శ్రీ శంకరుల వారి అమ్మ - నాయన స్వరూప స్వభావ చిత్రణలో “మనసు వెన్న మాట మణి మథిమృదువుగా తేట తెనుగు వోలె తేనెచిందు” (పద్యం - 19) అంటూ అలతి అలతి పదాలతో అనల్పార్ధ రచన గావించిన కవి ధన్యజీవి.
ఈ కావ్యరచనలో నుడి పొంకము; పద్యం కూర్చులో బింకము - రస బంధం = కథా కథన రచనానుబంధం - వప్రశంననీయాలు - సోదాహరణముగా వివరించాలని నాకు కుతూహలం వుండిందిగాని అభిప్రాయాన్ని సంక్షిప్తంగా అందించండి అని కోరడం వల్ల నాకు చేతులను కట్టివేసినట్టైనది. నా భావనాలహరికి అద్దుకట్ట వేసినటైనది. కానిండు.
ఈ చిరంజీవి ఈ కావ్యమును సంపూర్ణం గావించి మున్ముందు మథిన్ని కృతుల రచించి జాతిని జాగృతం చేయాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూన్నాను.
కం1॥ సర్వాంగ సుందరిగ అ
గీర్వాణీదేవి నీదుక్కతి మూలమునన్ పేర్వడయు విష్ణునందన! ఉర్విన్ నీ కీర్తి దిక్ సమున్నతమగుతన్ గండ్లూరి దత్తాశత్రేయ శర్మ, శతావధాని, దోను (00
ఆపస్తవాక్యం
ఆర్ప్వసంప్రదాయ అఖండజ్యోతి చేతబూని ఆ
నిజౌజ్బాల్యమాన కాంతికిరణాలను ఆ సేతుశీతాచలం ప్రసరింపజేసి, పరతత్తాన్ని గూర్చిన భిన్న తత్త్వాలతో (దృక్పథాలతో) అలుముకున్న అజ్ఞానాంధకారాన్ని తొలగచేసి, సృష్టిస్టితి లయల నిగూఢ రహస్యాలను ఛేదించి, అతిపిన్న వయసుననే అఖండ భారతావనిని పాదచారియై సంచరించి, అపర శంకరావతారమైన ఆదిశంకరుని చరిత్రను, ఈ కాలంలో చి విష్ణునందనుడు తన తొలి ప్రయత్నంగా ఇట్టి మహత్తర వస్తువును న్వీకరించి నత్మావ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆత్మీయులకు అనందదాయకం.
“బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా
జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ
వైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పై బడ్దనా
కేలల్లాడదు బంధులార! నిలుడీ క్రిందన్ బ్రమోదంబునన్” (భాగవతం)
అని సమస్త గోకులాన్ని గోవర్ధనగిరి క్రిందికి రప్పించి కాపాడిన బాలకృష్ణుడిలా (కొండంత) ధర్మదండం అండలో వేదధర్శ్మ ప్రచారానికి కంకణం కట్టకొన్న వైద్య కర్మానుసారి ఈ చిరంజీవి. తొలి ప్రయత్నమే ఇంత సాహసమా! అని అనిపించినా, కావ్య పఠనానంతరము, సంవూర్ణదైవకృవ ఈ కావ్యరచనను సానుకూల పరిచిందనిపిస్తుంది. సమర్భడే యువకవియని భవిష్యద్వాణి చెబుతున్నట్లుంది.
“వాసిన రామచంద్రుకథ వ్రాసితివంచనిపించుకో వృథా
యాసము కాక కట్టు కథలైహికమా! పరమాయటంచు దా
(00)
చేసిన తండ్రియానతియు జీవుని వేదన రెండునేకమై
నా సకలోహవైభవ సనాథము రామకథన్ రచించెదన్”
“రామాయణ కల్పవృక్షము” కావ్యావతారికలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు పలికిన పై పద్యము ఈ కవి రచనకు అక్షరాలా వర్తించింద నిపిస్తుంది. తండ్రి ఆజ్ఞమేరకు ఆచార్య శంకరుని జీవిత సంగ్రహమిలా ఛందోబద్ధం చేయడం తన వంశంలోని తాతముత్తాతలందరిని చరితార్భులను చేయుటయే!
వదాల ఎన్నికలో, పద్యాల నడకలో సందర్భోచితమైన పద్యఛందస్సు సంస్కృత శ్లోకాలను అర్ధవంతంగా అనువదించుటలో, అప్పుడప్పుడు శంకరుని పరంగా ప్రస్తావించిన విషయాలు తనకు కూడ వర్తించేలా శ్లేషించడంలో ఇలా చాలా విషయాలలో కవి తన ్రతిభావిశేషాలను అక్కడక్కడ పాఠకుని మనసును హత్తుకునేలా చేశాడు. పూర్వకవుల పోకడలెన్నిటినో పుక్కిటపట్టి తనదైన శైలిలో ప్రకటించగలిగే చాకచక్యము, నవీన భావాలు కలవాడనని (ఛాందసపు జాడ లెరుగని వాడు), అవతారికలో ప్రకటించడం, వచన కవితా, మినీకవిత, దళితకవిత, స్రీవాదకవిత..... యిలా ఉద్యమాల హోరు తుఫానులా ముసురుకున్న ఈ పరిస్థితులలో సనాతన సంప్రదాయ వస్తువును న్వీకరించి, వెయ్యేళ్ల తెలుగు వద్యమణి వారానికి మరో మణివూస చేర్చేందుకు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయము.
ఈ కావ్యం మా నంద్యాల సూరన సారస్వత సంఘం నుండి ప్రచురింపబడటం నంద్యాల సాహిత్యాభిమానులందరికీ గర్వకారణం.
దాః జి. సహదేవుడు
అధ్యక్షుడు,
సూరన సారస్వత సంఘము, నంద్యాల 01)
అలంకరణం
“అలం - తవలేఖనాయ కరణోపయోగం” అని నాకు నేనే చెప్పుకో తగిన శీర్షిక హూడా కావచ్చునిది!
ఎందుకంటే ఇది ఒక బాలకవి చేతి 'ధర్శదండమ్”
ఒక విభునిచేతి ధర్మదండమో, ఒక కవీంద్ర హృదయ భావ ధర్మదండమో అయితే వాని 'ననలంక్రియగ్లా మార్చవచ్చు.
ఇక్కడలా కాదు. అలాచేసే వీలే లేదు. ఎందుకంటే - ఎంతగా నా పదమల్లికలతోనో, శబ్బరత్నాలతోనో, స్వరాభరణాలతోనో ఈ బాలకవి ధర్మదందాన్ని అలంకరించబోతే ఇవే ఫన్నబడిపోతాయి. నల్లబడిపోతాయి. పలచబడిపోతాయి.
ఇది పరోక్షస్తుతి కాదు. ప్రత్యక్ష సత్యం. ్రత్యక్షర నిజం!
పూర్వలాక్షణికులంటారు, “విశ్వశ్రేయణావ్యం” అని
ఈ ధర్శ్మదండం అందుకక్షరాలా నిదర్శనం
“క్రావ్యం యశసేర్ధకృతే వ్యవహారవిదే - శివేతర క్షతయే...
సద్యః పరనిర్భతయే...” ఇత్యాదిగానూ అన్నారు లాక్షణికులు.
ఈ ధర్మదండం అందుకూ అక్షరాలా సంపూర్ణోదాహరణం.
అసలీ కావ్యావతారిక నుండి, ఈ కావ్య పూర్వభాగాంతం వరకూ ప్రతిపద్యమూ చదువుతూ పోతుంటే కావ్యలక్షణ [గ్రంథాలు చెప్పిన జనోపయోగ సల్లక్షణాలేవో అవన్నీ అందులో దర్శనమిస్తాయి.
ఎలా దర్శనమిస్తాయంటే - ఈ బాలకవిని గురించీ, అతని కావ్యరచనారీతిని గురించీ, పదప్రయోగవైచిత్రి, శబ్దార్ధాలంకార నిర్మాణశైలీ, లలిత, దీర్సమాస బంధురత్వం, శబ్లాధికార వైశద్యం, కథన ్రణాళికాచాతుర్యం, సంభాషణా నైపుణ్యం, వర్ణనా వైదగ్ధ్యం, వృత్తిరీతీ పాకగుణ సమాశ్లేషణ గౌరవం - అనువాద పాండిత్యం, అనుసరణ వైవిధ్యం - స్వకీయముద్రా భద్రపథ ప్రదర్శనం.
వీటన్నిటి గురించి నేను చెప్పబోయే పదాలన్నీ, అ ప్రాశస్త్యం ప్రాయోగిక ప్రాజాపత్యం ముందు దిగదుడుపే అవుతాయి అలా!
అందుకే నేను చేసిన శీర్షికానామకరణం - తత్ష్రథమనిద్దేశితార్థం నాకే అతుకుతుంది.
అయినా నాలుగు మాటలలో ఈ ధర్మదండాన్ని అలంకరించకుంటే నేనీ బాలకవి శరణ్యమే కోరాల్సి వుంటుంది. బాలవ్యాకృతి పరిశీలించాల్సి వస్తుంది.
(01)
మాటికి 'బాలకవి' ప్రయోగమేమిటని శంక కలుగవచ్చు. వైద్యవిద్యార్థి - అందునా నాలుగు వత్సరాలు కడచనిన వాని వయసు! 'యువకవి” వాచ్యార్హుడవుతాడుగానీ బాలకవి ఏమిటని! నిజమే - “హ్రాక్తన పుణ్యలేశమున పద్యములల్లుచునుందు... ఛాందసపు జాడలెరుంగనివాడ...” అంటూ ఆరంభంలోనే తన వినయం ప్రదర్శించిన ఈ కవి.... నిజంగా 'ఛందస్సేమిటి, ఈ గణాలూ యతిప్రాసలూ అంటే యేమిటీ' అని తెలియని పసిప్రాయంలోనే, అసలీ మాటల ఎరుకే లేనినాళ్లలోనే.... పసివాడు కదా! అందునా ఏకైక కుమార రత్నమాయె - చనవుతోబాటు సహజమైన అల్లరీ తోడై - ఒకనాడు వంటింటి వాళ్లమ్మని విసిగిస్తూండిన వేళ, విసిగిన ఆయమ్మ “వెధవా... పో' అనగానే... విష్ణునందనుండు విజయకొడుకు” అంటూ 'అటవెలది'ని సందిటబట్టినవాడు. అప్పటికి నాల్గవతరగతి పసిబాలుడీతడు. అప్పటి నుండే సద్దంధ పఠనం, సాహిత్య సభా సందర్శనం, పరామర్శ, గోష్టీవివేచనం - దానితో పెరుగుతూ వచ్చిన రచనాసక్తి- ఇదంతా 'ప్రాక్తన పుణ్యవశముకాదా!” నాటినుండే కవితలల్లుతూ వచ్చిన ఈతడు 'బాలకవియే' - ముమ్మాటికీ అందుకే ఏతద్చిరుదపౌనఃపున్యోక్తి. ఇది పుణ్యోక్తి కూదా. ఈ బాలకవికి సద్ధంధ పఠనంలోనూ సల్లక్షణ లక్షితములైన పద్య[గ్రంథాల పరిశీలనలోనూ మక్కువ యెక్కువ. తదితరులున్నూ అందుకే తత్పఠన ప్రభావ ప్రసాదితాసాధితాలంకార చాతుర్యం అక్కడక్కదా కాదు - అడుగడుగునా సాక్షాత్మరిస్తూ - ఈ బాలకవి ఇంత మహాకవియా! అని విస్మయం కలిగిస్తుంది. సందేహమా? చూడండి - “శారద! శాస్త సంచయ విశారద! సారదయాసుధాభ్రమ (0౮4)
న్నీరద!...” అంటూ అవతారికారంభ దైవస్తుతిలో సరస్వతిని స్తుతించిన ఈ పద్యంలోనూ -
“వీణాపాణి! విరించిరాణి! జననీ ! వేదాంత విద్యాఖనీ!” అంటూ ఈ దైవాన్నే స్మరించిన చోటానూ -
పోతన “శారదనీరదేందుఘనసారమూ” “అంబనవాంబు జోజ్జ్వలకరాంబుజము” స్ఫురించటం లేదా?
అలనాడు కృష్ణ్ణాయలంటాడూ... “ముద్దుగ గండపెండెరము మోదమెలర్చగ కొమ్మ”ని అయితే “సంస్కృతాంధ్రముల సమానముగా ఆశువుగా కవితలల్లగల్లిన వారే” అని షరతున్నూ...
అల్లసానివాని వాగ్జార - ఆశువుగా” భారతీ వధూటీ తపనీయ గర్భ నికటీ భవదావన
“తిక్కన సమ్యక్కృత పద్యశిల్ప ఘనయజ్ఞ శ్లాఘ్యనిర్వాహకున్
ఎగ్రన సత్మావ్య మహాప్రబంధ రచనా ్రాగ్రేసరున్..
పోతన మందార మరందబిందు సమపద్య ్రొఢి సౌలభ్య శైలిని”
అంటూ ఒక మత్తేభమాలికను పూర్వకవి ప్రశంసపై ప్రయోగించిన తీరు అవశ్యం అ అలసానివాని పద్యమయానిలాలస సౌభాగ్యాన్నే అందిస్తుంది.
అసలా ఆదిశంకరుల చరిత్రమును ధర్మదండం అనుపేరున వ్రాయబూనటంలోనే ఈ కవి అంతర్యం ఏతత్క్మథా నాయకుని పట్ల ఎంత గాఢకౌతూహలత్వాన్నీ, ప్రగాఢ భక్తి భావగౌరవాదర మేదురత్వాన్నీ కలిగివుందో తెలుపుతున్నది.
మతాలూ మత(స్రష్టలూ ప్రవక్తలూ - ఉత్తములూ పండితులూ శాంతికాముకులూ అయినా తదనంతరానుయాయుల వెర్రిమొగర్రి వేషాలవలన (ప్రవచన [వ్రపాత దోషములవలన సమాజం ఎంత అనైతికంగా ధర్మభ్రష్టంగా, వావివరుసలు విడచిన పశుసమాజంగా మారిపోయిందో చూచి చలించిన శంకర భగవత్పాదులు పూరించిన అద్వైత వేదాంత శంఖం, ధరించిన దండం - స్ఫురించిన ఈ కవి తన కావ్యానికి 'ధర్మదండం' అనిన బెచిత్యాన్వర్ధ్థకమైన నామకరణం చేశాడు.
ధర్మదండధారియైన శంకరుడు మానవమానసిక వికార వ్యాపార ధర్మానుసారియెన అద్వైతమార్గ ప్రతిష్టాపనాచార్యుడై పూజ్యభగవత్సాదాచార్యులై అఖండ పాండితీ మండనుడై
(0౧)
అఖిల ప్రపంచా జ్ఞానాంధకార నిర్మూలన భాస్మరుడై అపూర్వ శేముషీ ధురంధరుడై విరాజిల్లినాడు.
ఎలా? ఏ రీతిగా?
వఏమాయన జన్మవిశేషాలు! ఏమిటాయన సత్తా! ఎంతటి దాతని మూర్తిమత్త?! తెలుసుకోవాలనే అందరికీ జిజ్ఞాన. ఎందుకుండదూ మరి! కేవలం ముప్పది రెండు వత్సరాల అతిస్వల్పాయుష్ముడై ఏకాదశవార చతుర్దిశా పర్యంత యావద్భారత సంచారం చేసీ) జీర్గోద్ధరణలూ, ప్రతిష్టలూ, లెక్కకుమించి గావించీ, వేలాది స్తోత్రాలూ, గ్రంథాలూ, వార్తికలూ, వ్యాఖ్యలూ, భాష్యాలూ రచించి -
ఇలాంటి జ్ఞానఖని, వేదాంతధుని నభూతో నభవిష్యతిగా మహనీయుడై వెలిగిన మహానుభావుడు కదా ఆదిశంకరుడు!
అపరశంకరావతారమే కాకుంటే ఆ చాతుర్మాస్య ప్రసృతాగమ సుధాధారాస్వాదకుడే కాకుంటే - ఆ సర్వవ్యాపి వైకుంఠుని తేజు ప్రసార ప్రభావితుడే కాకుంటే ఈ శంకరుల కీశంకలేవీ లేని ఈ సర్వవిద్యావశంకరత్వ మెక్కడినుండి వస్తుంది!
మరి ఈ మపొమాన్విత విశేషాలు తెలునుకోవాలని జిజ్ఞానువులు కాని పాఠకులెవరుంటారు?
ఈ కవి 'ధర్మ్శదండం' చదివిస్తుంది పాఠకుల్ని
“పద్యమా? పద్యకావ్యమా?” అని ట్రుకుటిముడిచి, పెదవి విరచి నిరుత్సాహ
“శంకరు భక్త సంచయవశంకరు; మోహలతా సమూల నా
శంకరు జ్ఞానవాబ్బయభృశంకరు... ఇలా ఆదిలోనే ఆదిశంకరుల మీద కవికున్న గాఢభక్తి, చదివించగల అంత్య[ప్రాసాలంకృత పద్యంతో ప్రస్ఫుటమవుతుంది.
ఇలా ఈ కావ్యంలో - చేమకూర, పింగళి సూరనలవలె పదచమత్కృతులు; పెద్దన పోతన శ్రీనాథ తెనాలి రామకృష్ణుల పదగుంభనలు - నన్నయ, ఎగర్రనాదుల లలిత లలితములైన దీర్చ - నాతిదీర్చ సమాసములు, తిక్కన, వేమనల గీతలూ అటవెలదులు-
సుమతి, శ్రీనాథుల కందమునడకలు; సహజ, సుందరంగా అతికిన అంత్యప్రాసలు; అనుప్రానలు; ఇతర శబ్దార్ధాలంకారాలూ - కావ్యగౌరవమును ఇనుమడింపజేసే “సంభాషణా చాతురీవిలసనములు”-
ఇదేమిటీ తిక్కనకంటె, సూరనకంటెనా! అని శంకయా! చూడండి - శంకరుడు గోవింద పాదయతిని సందర్శించిన వేళ-
(004)
“ఎటనుండి వచ్చితివీవు? “కాలడినుండి"
పేరా? - “శంకరుడని పిలుచుచుంద్రు;”
తల్లిదండ్రులెవరు? - “తల్లియార్యాంబ - శివగురువుతండ్రి దివంగతుండు;
దండకమండల ధారివైతివదేల? - సన్న్యాసమును గొంటి సంయమీంద్ర!” ఏమేమి చదివితివి? = “ఎల్లశాస్తంబుల;”
వాంఛితార్థంబేమి? - బ్రహ్మవిద్య"
అని సాగుతుంది వద్యరచన; ఇది పద్యమనుకుంటామా? 'వాకోవాక్యమనే' చమత్మ్కారకవితా ప్రక్రియకిదొక ఉదాహరణం.
ఇందులో ప్రశ్నలు యతీంద్రునివి;ి సమాధానాలు శంకరునివి.
ఈ 'కళ అలతికృన్నకు, నాటి సూరనకు దక్కెన్ - నేడు ఈ బాలకవికిన్నీ' ఇలా ఎన్నైనా ఉదహరించవచ్చును.
“ఇది యిటులుండ నొక్కెడ ప్రయీభువనాంతక జృంభణమ్మునన్
మదయుత దిబ్బంతంగవరమండలి బోలిన కారుమబ్బులున్”
అంటూ నర్మదా తీరమున నొకనాడు మొదలైన భీకర వర్నారంభ సన్నివేశ మొకటి వస్తుంది.
అందులో కవిరచనా ప్రతిభ మనకు ఎర్రన హరివంశంలోని “నిడుజడి దాకిన” వర్ణనను గుర్తుచేస్తుంది.
“గంగాభంగ తరంగ సంజనిత మాంగల్య ప్రమోదార్భటీ
సంగీత ప్రియభక్త బృందములు: భస్మవ్యాప్త సందీప్తోమై మనకు కనిపించి -
నాటి “గంగాసంగమమిచ్చగించునె మదింగావేరి దేవేరిగా ననిన రామకృష్ణుని శ్రైలినీ” ఆమందాకిని అత్రివేణివలనంబా బాహ్యకక్ష్యాస్థలంబును” చూపించిన శ్రీనాథ కవితారీతినీ స్మరింపజేస్తుంది.
మనీషాపంచకావిష్కృతికి కారణమైన మధుర ఘట్టములో ఒక పద్యం వ్రాసినాడు ఈ కవి -
“ర్రేర్రే! ధూర్తుడ! హీనజాతకుడ! నీ ప్రేలాపముల్ చాలు జా
లౌరా! కన్నులు నెత్తికెక్కినవె” మూఢా?” అంటూ శంకరుని శిష్యులు ఒక మధుపాయినీచుని మందలిస్తున్నట్లు.
(0/41)
ఎంతనైసర్గిక మనోజ్ఞమైన పదప్రయోగం! ఆ వెంటనే “రేరే! ఘూర్దర!” అంటున్న మూర్తికవిస్పర్శా” ఓ వలమాన మీనవసుధోపమ కైశిక; నీకు వంతలేలా!” అంటూన్న నందితిమ్మన భాషా గోచరించే వైనం!
శంకరులు వ్యాసమునికృత బ్రహ్మసూత్రములకు పాండితీహేలా ధారాధర్నితమైన మధురమనోహర శైలీరమ్య భాష్యాన్ని వ్రాసినాడు.
శిష్యగోష్టిలో దాని ప్రవచనాలు - పరమార్ధ వివరాలు - అలా అలా బ్రహ్మసూత్ర భాష్యమహత్త్వం నలుదెసలా ప్రచారం పొందుతూన్న సన్నివేశంలో - వ్యాసమహర్షియే సాక్షాత్తూ విని పులకింప వచ్చినాడు.
మొదట వృద్ధ బ్రాహ్మణ వేషంలో; శంకరుదా మహనీయుని గుర్తించినాడు. వ్యాసుడు నిజరూపంతో నిలువెత్తు ఎదుర నిలిచాడు. శంకరుదా గంభీర జ్ఞాన రూపాన్ని చూస్తున్నాడు. ఎలాంటివానిని?
“కమనీయ సితవర్ణ కబఐరీ భరమ్ముతో
ధూర్జటి బోలు నస్తోక సుగుణు; నిగమాగమోక్తి స్వనించు నెమ్మోముతో చతురాస్యుబోలు సంసారతరణు; మాయా నికృంతన మహిత తేజముతో హృషీకేశు బోలు వాశిష్ట రమణు; జ్ఞానవీచీయుత మానసార్హ్ణవముతో దేవర్షిబోలు నాస్తిక హరణు;
విష్ణుసేవా ప్రవణు - భక్తి విధి విహరణు...” డైన వ్యాస మునీంద్రుని!
ఈ పద్యంలో ఎన్ని చమత్మారాలు నిండి నిబిడీకృతమైనవో! “కనరాదు యామినీ కబరీభరమ్ములో....” అంటూన్న ఆధునిక కవిచంద్రుడు గుంటూరు శేషేంద్రుడు దర్శనమిస్తున్నాడు.
“కమనీయ కరపల్లవము మేనుగదియంగ నొయ్యన చాచిన నులికిపడును” అంటూన్న శ్రీనాథసీసపుటెత్తుగడా, నడా నాట్యం చేస్తూన్నది.
“వైకుంఠ మంగళద్వార తోరణ పారిజాత వాసన” లందించిన కవి సమ్రాట్ విశ్వనాథ శైలీ సాక్షాత్మరమవుతూన్నది.
“ఫనపుష్పచాంపేయ వనరాజి కాబోలు తనరుచున్నది శంభుతనువులీల” అంటూన్న పింగళి సూరన స్మితసితాస్యం గోచరిస్తూన్నది.
వీటన్నిటికి దోడుగా నిసర్ణ మధురంగా కుదురుకొనిన అలంకార రాజము. ఎంతో సార్థక్యాలంకృతిగా
అదనంగా పోతకవిరాజు అంత్యప్రాస సౌందర్యం;
ఇన్నింటా మరో క్రమశః చమత్కృతి
“సిత్రవర్ణ కబరీ భరము” కదా - ధూర్జటి
“నిగమాగమోక్తులు” కాన - చతురాస్యుడు
“మాయా నికృంతన[క్రియ” కావున - హృషీకేశుడు
“జ్టానవీచులు” అయినందున - దేవర్షి నారదమహర్షి
అహావా! ఇంత చిన్ని వయసు కవి - ఇంత మేధావితనము ప్రదర్భించుట అతని మాటల్లోనే “ప్రాక్తన పుణ్యలేశ ఫలమే” పురాకృత పుణ్యవిశేష మహిమమే.
అలా (త్రిమూర్తుల నామధేయాలను 'ఖచితం' చేయటంలోనూ ఒక జ్ఞాన భావనా మయ పదస్వీకార చాతుర్యం.
సితాంగరాగుడు శివుడగుట కతననే “ధూఃజటలవానిని”
వేదభాషణముల ప్రసక్తి వచ్చినదిగా “నాలుగు మొగములవానిని”' (నాలుగు వేదముల మొగములు)
మాయల ఛేదించుట కదా - “హృషీకముల జయించు మాధవునీ” జ్ఞాన వీచీప్రసారణార్థం - “దేవర్షి నారదునీ” (జగద్దాన వ్యాప్తుడు)
ఇలా ఎంత సాభిప్రాయ సముచితార్థ ప్రసాదక పదప్రయోగ వైశారద్యం!
ఇలా ఎంతని ఎంతవరకని వ్యాఖ్యానించగలమబ్బా! ఇంత మధుర మనోజ్ఞ లలిత సుందర సులభగ్రాహ్యమైన మహాకావ్యం ఇటీవల కాలంలో వెల్వడలేదన్నా అతిశయోక్తి కాదు.
మహామహాకావ్వాలు పరంపరగా వెల్లివిరిసిన కాలమిది. ఇటీవలి కాలంలో అదిన్నీ
ఒక జాబితా ఇవ్వవచ్చు ప్రొాధములు; దురవగాహ్యములు; అనవగాహ్యములు; పాండిత్య విలసితములు, పారమార్ధికాయోమయభావ సంకులములు - ఇలా ఎన్నెన్నో...
వేల వద్యములవీ, వందలకొలదీ వద్యములవీ, ఆశ్వాసోచ్చ్వాసాధ్యాయ భాగధేయములైనవీ ఎన్నెన్నో.
040
అర్జాత్ ద్రావిడ ప్రాణాయమ సంకట భరములైనవీ కొన్ని (నావంటి వారివి) అవి అస్మదాదుల పఠన పరిశీలనకున్నూ నోచుకొన్నవున్నవి. లఘుకావ్యమై, సులభచ్చందోబంధితమై పఠనయోగ్యతాధికారికమున్నూ అయి - బహువిధ కవిత్వ చమత్మార విలసితమైన “హనుమచ్చరిత” క్షావ్యానంతరం (డా॥ బచ్చు సత్యనారాయణ కృతి) ఆ కోవలో - అంతకంటెను సులభావగాహ్య పథంలో (బహుధా చమత్కొరములు లేనందున) ఒక బాలకవి మేధోజనిత అపూర్వ సృష్టిగా ఆధునికాంధ్ర సాహిత్య బృందావనంలో సాక్షాత్కరించిన సరస్వతీ కరదండం - ఈ “ధర్మదండం” ఇది స్వాభిమానోక్తీ - అత్యతిశయోక్తీ కాదు. కేవలం సహజాతిసహజ స్వభావోక్తి, ఒకే సందేహోక్తి వినబడవచ్చు. ఇంతవరకలంకరించినదేమిటని? మొదటే ఈ సందేహ నివృత్తి మూలకాఖి భాషణమున్నది. ఈ మాటలకవసరమగు “కరణం - తవ - అలం” అని చాలదు. ఈ బాలకవి ధర్మదండ విషయ, విశేష విషయ, అంతర్మార్మిక ధార్మిక విషయ వివేచనం చేయను - ఈ కలం చాలదు. ఇంతవరకు కవికృత కావ్య భౌతిక మనోజ్ఞ రూపదర్భనమే కావించినది. ఛందము, అలంకారములు, పదప్రయోగము, సమాసఘటనం - కావ్యలక్షణానుసృత విమర్శనమే. ఇది ప్రాచీన కావ్యవిమర్శా - సమీక్షా - వ్యాఖ్యా సాంప్రదాయమ్. అధునిక విమర్శారీతులలో - కావ్యము - కథ - కథనం - సామాజిక ప్రయోజనం - సమకాలీన జనజీవన ప్రదర్శనం - అంటూ చేయవలసిన, వివేచింపవలసిన, విమర్శింపవలసిన వింగడింపు
- ఇక్కడ అవసరమా? అన్నది ప్రశ్న అనవసరమని సమాధానం. ఎందుకంటే - కథానాయకుడు దాదాపు పదునైదు శతాబ్దాల క్రిందటి మహనీయుడు. కథాకాలంనాటి సామాజిక జీవనం - పాషండమత వ్యాప్తికతన (భష్టమైన సమాజం - అద్వైత భావనా ప్రాధాన్యం - తన్మతస్థాపనావసరం - తన్నిమిత్త సంభవ మహాపురుష జీవనం ” - కొవ్యంలో ఇతివృత్తం. (00)
కనుక - కథానాయకుని జననీజనకులు - గుణగణాలు - ధార్మికరీతి - దైవదర్శనం = వరప్రసాదం - శంకర జననం - బాల్యం - విద్యాభ్యాసం - గురుదర్భనం = మహిమం - భాష్యరచనం - కాశీయాత్ర - మనీషాపంచకం - మాండూక్య బ్రహ్మసూత్ర భాష్య రచనం - గౌడపాద - భట్టపాద దర్శనం - మాహిష్మతీయానం
ఇలా కథ సాగుతుంది.
ఈ కథను ముందుకు నడిపే తీరు, అదే “కథనరీతి” ఎంత సుందరంగా వున్నదీ చెప్పవలసినపుడు -
అదుగో పై భౌతికాలంకరణ సామగ్రీ సౌందర్య వివేచనమే ప్రధానాంశం -
కనుక అదే వివేచించబడింది. అదీ అతి క్లుప్తంగా ఎందుకంటే అలనాడు రఘునాథ నాయకమణి “ప్రతిపద్యమునంజమత్కృతి కలుగంగ చెప్పనేర్తు”వని చేమకూరవానితో అనినట్లు-
ఈ బాలకవీ - ప్రతి పద్యములో ఏదో ఒక “ప్రత్యేకతను” - అది చమత్మారమే కాబనిలేదు - పదమో, శబ్దమొ, భావమో, పరిణతార్థ్ధ ప్రాభవమ్మో' ఏదో యొకటి-
“అపురము తత్వభావాల కాపురమ్ము! ముక్తిపీఠాల గోపురమ్ము"
...నూవురమ్ము, మూపురమ్ము” అంటూ ఒకచోట మాపొవ్మతీ వురమును అలంకరిస్తాడిలా -
“ల్రేమా! కొమ్మా” అనిన పోతనవలె;” మధురసాధిక, పున్నాగ అనిన భట్టమూర్తివలె.
అందుకే - అందినంతవరకూ 'మదాస్వాదనోచ్చిష్టమిదంతా' అయితే కుతూహల పాఠకుల స్వకీయాత్మానంద హేతువుగా మిగులనదేముండునని - హొత్రైషిగా ఇతోదిక గుణకావ్యస్రష్ట భవిష్యత్తున నీ భిషబ్మణి కావలెనని ఆశీస్సహితాకాంక్షా శుభవచనాలందిస్తూ
ఇతిశమ్ 7. 122002 జీ. సుబ్రహ్మణ్యశాస్త్రి నంద్యాల. కార్యదర్శి, సూరన సారస్వత సంఘం (006)
సార సరస్వతీ కటాక్షమ్ మణివల్ల కంకణం; కంకణం వల్ల మణి, సువర్ణ మణిమయ కంకణం వల్ల చేయి శోభిస్తుంది. రాజుగారి వల్ల కవిగారికి, కవిగారి వల్ల రాజుగారికి; కవి, రాజుల వలన సభకు శోభ వస్తుంది అన్నారు ఒక ప్రాచీనకవి.
నంద్యాలవల్ల పింగళి సూరన మహోదయుడికి పేరు వచ్చిందో పింగళి సూరనవల్ల నంద్యాలకు పేరువచ్చిందో ఇప్పుడు చెప్పడం కష్టం. కానీ పింగళి సూరనగారి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆయన కళాపూర్ణోదయం.
అ రచనవల్ల కవికి పేరొచ్చిందో - కవివల్ల ఆ విషయానికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయో కొన్ని సందర్భాల్లో చెప్పొచ్చు. రామాయణ కల్పవృక్షం రచనవళ్లే కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగ్గారికి జ్ఞానపీఠ బహూకృతి వచ్చింది. వేయిపడగలు పేరు తెచ్చిపెట్టింది. అది రచనా విశేషం. ఆధునిక రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్‌కి తులసీదళం వల్లా, యద్దనపూడి సులోచనా రాణికి సెక్రటరీ వల్ల పేరూ ప్రఖ్యాతి వచ్చాయి.
కథావస్తువు విశిష్టమైనది అయినా - రచనా ప్రక్రియ అసాధారణమైనది అయినా ఆ రచనకు పేరొస్తుంది. ఇపుడు కోడూరి విష్ణునందన్‌కు ఆభాగ్యం అద్బష్టం దక్కాయి. గతంలో శ్రీమత్ శంకరభగవత్సాదుల జీవిత చరిత్ర ఎందరో కవులు రాశారు. గద్యపద్యాకృతులలో వెలసి విఖ్యాతి పొందాయి. ఆచార్య విజయం అనే పద్యకావ్యం పరిశోధనాంశంగా కూడా ప్రశస్తి పొందింది. ఈ నూతన సహస్రాబ్ది ప్రారంభం కాకముందే యీ రచనకు శ్రీకారం చుట్టటం వెయ్యేళ్ల తెలుగుపద్య వైభవ చిహ్నం. పద్యం మరో పది
శతాబ్దాలు గడిచినా పాతబడదని కాలం నిరూపించింది. శ్రీ జగద్గురువుల కరుణా కటాక్ష వీక్షణా ప్రసాదంగా 'ధర్మదండం' వెలువడుతున్నది. ఇది యిప్పటికీ (ప్రముఖుల అభినందనలు ప్రశంసలు అందుకున్నది. ఇక పద్యావిద్యాఖిమానుల మన్ననలు పొందాలి. పొందగలదని నేను నమ్ముతున్నాను.
కవితాకన్య మనింటి ఆడుపడుచా, కాకున్న యిల్లాల, లేక వశంబందున్న వారవధువా అన్నారు మా గురువులు బ్రహ్మశ్రీ మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్రిగారు. కోడూరి విష్ణునందన్ విషయంలో కవితా సరస్వతి - వీణాపాణి - విరించి రాణి అతన్ని పూర్తిగా మాతృ'ప్రేమతో కరుణించి కవిత్వ ప్రొఢి సంధించి జీవించింది. ధీరగంభీర వాగ్విభవ దివసమగ్ర మహతృవిత్వ కాసార రసాయనోల్ల సిత సారసమౌనట్లాగా కృతికి అకృతి
(0/10)
కల్పించింది. భక్తసషంచయ వశంకరు మోహలతా సమూల నాశంకరుడైన అదిశంకర భగవత్పాదులు జ్ఞాన వాజ్బయ భృశంకరుడుగా కరుణించి తనను కొలిచినందుకు ఫలంగా చక్కని ధార ధోరణి అనుగ్రహించాడు.
శ్రీమచ్చంకర భగవత్ పాదు లెలాటి వారో (చూడు ప్రస్తావన... కాషాయాంబర ధారి) చెప్పి; అతని చరిత్ర ఎంత పవిత్రమో చెప్పి జన్మజన్మల మహాపాపాళి విధ్వంసం కోసం పవిత్ర పద్యమయ కావ్యం ధర్మదండం రచించాడు కోడూరి విష్ణునందన్. శ్రీశంకర జన్మస్టలమై అంటూ కావ్యం మొదలవుతుంది కాలడి అగ్రహారం వర్ణనంలో
శ్రీలలనాలవాలము విరించి మనోహరి కాలయమ్ము శీ తాలయబాలికా నిలయమై ధనవిద్యదమేయ శక్తి సమ్మేళనమై
అంటూ సాగిన పద్యం ఎంతగా చక్కగా కుదిరిందో చూడండి...
శ్రీలలన లక్ష్మికి ఆలవాలము; విరించి మనోవారి సరస్వతికి ఆలయం, శీతాలయ బాలిక పార్వతికి నిలయం... గా ధనం, విద్య, అమేయశక్తికి సమ్మేళనంగా వుందట... లక్ష్మికి ఆలవాలం సరస్వతికి ఆలయం పార్వతికి నిలయం ఎంత ఉచిత పదప్రయోగం! ఇది పద్దెనిమిది సంవత్సరాల నూనూగు మీసాల నూత్నయవ్వనంలో చేసిన రచన! ఇది శంకర కృప.... విరించి రాణి వీణాపాణి కరుణ కాకపోతే ఎలా సాధ్యం?
ఆచార్యులవారి పితామహులు శ్రీ విద్యాధిరాజ చరిత్ర నాలుగు చిన్న పద్యాల్లో “ప్రవచించాడు”. ఆ నాలుగులో పలుకు వెలది చేతి చిలుక; వేదమాత పుట్టిల్లు, ఓరంతపొద్దు వంటి పదబంధాలు చేయి విరిగిన 'ప్రొాధకవిని తలపింపచేస్తాయి. ఆమె 'భువన భవన బంధు నివహమందు మృదుభాషి తల్లి పోలిక తనయుడికి రావడం అదృష్టం అంటారు. శంకరుడు కూడా మృదుమధురభాషి
శంకరుల జనన సందర్భంలోని పద్యం చూడండి. కొమ్మలార చిన్ని కొమరుని గనెనట, నచట 'నార్య' పుణ్యమలరుచుండ రండు! రండు! జన్మరాహిత్య మందగా వాని వారు “గోపికలు” కనుక 'మనయళోద... చూచి వత్తమమ్మ సుదతులార! అన్నారు. ఇక్కడ వీరు 'కాలడి' అగ్రహారీకలు కనుక భవిష్యత్తులో భవరోగ చికిత్సలో భవబంధాలు తెంచే మోహముధద్గరం కనుక యీ శిశువును జన్మరాహిత్యమందగా వాని కనులారా
(010
కానవలయునంటున్నారు. ఇదీ అనుసరించినా అందులో ప్రత్యేక ముద్ర వేసుకొనే ప్రౌఢకవి లక్షణం. వారి దృష్టికి తగ్గట్టుగా శిశురూప శంకరుడిలో వారికి శంకరరూపం కన్పించింది. (పద్యం 39)...
మాధూకరం చేసుకొంటున్న “శంకరుడు” ఒకానొక గృహిణి ముంగిట 'కనకామలక వర్షము” కురియించిన సందర్భంలో 'సంస్కృత' శ్లోకాలకు కవి పద్యానువాద వైఖరి విస్తృత వ్యాఖ్యానా పేక్షితం. రచన వేరు. అనువాద రచన వేరు కదా. అనువాదం 'కత్తిమీద సాము” ఇక్కడే కాదు తర్వాత్తర్వాత చేసిన “అనువాదరచన' కూడా ప్రస్తుతి పాత్రంగా వంది.
ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే అని సామెత. దానిని యీ సందర్భంలో ఎంత అందంగా కందంగా మలిచాదో చూడండి. (పు 31. పద్యం 92)
తల్లి కోసం శంకరుడు పూర్చానదీ ప్రవాహాన్ని యింటి ముంగిటికి ఎలా తెచ్చాడో - ఆ సందర్భంగా “జాహ్నవీస్తుతి' ఎంత చక్కగా వచ్చిందో - శివజూటాటవి వీడిరావె త్రిజగత్ (శ్రేయస్మ్కరీ జాహ్నవీ ఇంటూ సాగిన పద్యత్రయం చదివాక యిలా మరికొన్ని పద్యాలుంటే 'గాంగధారాస్తవం'గా నిలిచేవనిపిస్తుంది.
శంకర సన్వ్వాస స్వీకార నిర్ణయ ఘట్టంలో అతని మాటలు విన్న ఆర్యాంబ మాటలు రాక మొదలు నరకబడిన (మోడువోలె కూలబడింది. అది అమెకు - అశనిపాతమయ్యె నామాట తల్లికి, హృదయ శల్యమట్లు హింసపెట్టె, చేదు (మింగు రీతి చీకాకు పడి పెద్ద ప్రాణ సంకటమున పడతి నిల్చె అంటాడు కవి! తెలుగు పలుకుబడి పోవాళించిన తీరు చిత్తగించండి ఇందులో!
శంకరులు సన్యసించిన తర్వాత గోవిందయతిని చేరి బ్రహ్మవిద్యను తృటికాలంలో చేర్చి గ్రంథరాజాలను వ్రాశారు. అది సేసంగా' పోతపోసిన విధానం అద్భుతం (పద్యం 172% అపై గురునానతి “వ్యాసరచన భాష్యం) వ్రాయడానికి ముందు గౌడపాదయతి దర్శనంలో గౌడపాదయతి వాక్యవైఖరి చూడండి (పు55 పద్యం 207) వారణాళి చేరాక అన్నపూర్ణ ప్రార్ధన చదవండి. "క్ల ప్రాసతో సాగిన శార్దూలం “శ్రీనాథుని” తలపిస్తుంది.
మోహముద్గరం - భజగోవిందం ఆవిష్కరణకు ముందు శంకరుల - వ్యాకరణ పండితుడి సంభాషణ చిత్రించిన సీసం కవికి పద్యవిద్యపై కలపట్టును నిరూపించింది. మాయా చండాలాటోపం ఘట్టం - ఆపై మహేశ్వర సాక్షాత్కారం అక్కడ దండక రచన చూస్తే ప్రపేదిరే ప్రాక్తన జన్మవిద్యా అన్న మాట గుర్తుకు రాకమానదు. అక్కడి సంస్కృత శ్లోక రచన (288, 289, 290) ప్రాచీనకవనవైఖరిని తలపింపచేస్తుంది. గీతాభాష్య
రచన సందర్భంలో - సూత్రోపనిషద్గీతా చిత్ర ప్రత్యేక వాగ్విశిష్ట ప్రస్థానత్రయ భాష్యము = అన్న పద్యం (304) కందం రాసినవాడే కవి అన్నమాట యధార్థం అనిపింపచేస్తుంది. శిష్యరేణువు ననుదరిజేర్చుగాక అనే పద్యపంచకం పద్మపాదయతి స్తోత్రం మాత్రమే కాదు. కవి యీ కావ్యగంగారచనోత్తర కార్యసం'్రార్ధనం. ఇక వ్యాసుడు వృద్ధ భూసురుడిగా వచ్చి పరీక్షించే ఘట్టం ఇక్షుఖండం. ఊరకరారు మహాత్ములు అనే సర్వసామాన్య పండితుడు; మండనుడు, వాగ్భండన భీముండు వైరివాది బుధులకున్ చండవిభీషణుడగు మార్తాండుండా బుధుని! శంకరా గెల్వవలెన్ ఇది మండన మి(శ్రుని - ఉభయఖారతీ భర్తను మూర్తికట్టించిన పదచి(త్రం. మాహిష్మతీ పురవర్ణనతో - మండన మిశ్రధామ పరిచయంలో ఈ ప్రథమ భాగం న ఇది - శ్రీమచ్చంకర పాదపద్మయుగ సంసేవా ఫలంచీ శుభక్షేమశ్రీయుతమైన కావ్యం. కావ్యం యశసే అర్ధకృతే ... అన్నారు కదా! ఇది కోడూరి విష్ణనందన్‌ను అసద్భశ యశశ్షీమంతుడ్డి చేస్తుంది! తథ్యం. వైద్యవిద్యా ప్రవేశార్హత అయ్యాక ్రవేశపూర్వ రంగరచన ఇది. చదువు సంధ్యలు మాని 'కవిత్వంలో పడ్డావా అనడం లోక రివాజు. చదువు సంధ్య మానకుండా ఈ అయిదేళ్లూ వైద్యవిద్య విజయవంతంగా పూర్తిచేసి 'డాన్టర్' కాబోతున్నాడు విష్ణునందన్. ఇన్నేళ్ళూ యీ రంగంలోనూ దారి తప్ప లేదనదానికి యీ (గ్రంథరచన విన్నపంగా రాసిన మనోగతంలోని వాక్యవైఖరి ప్రబల తార్భాణం. 'కవితారసపు జల్లు ఖద్దాల ఘలుఘలుఘల్లు” అన్నట్టుగా అటు వైద్యవిద్యా ఇటు పద్యవిద్యా పట్టభద్రుడైన కోడూరి విష్ణునందన్ స్నాతకోత్తర విద్యా పూర్తినాటికి ఈ ధర్మదండాన్ని పూర్తిగా అలంకరించగలడని ఇతన్ని ఆ శంకరుడు శ్రీమన్మంగళమంజులాశిష సువృష్టిన్ దన్పి రక్షించుగాత! ఇతి శివం... శంకరం... యామినీ సరస్వతి (00౧)
కృతజ్ఞతాభవందనములు
అష్టాదశవర్న ప్రాయంలో ఆరంభించి రెండుమూడు నెలల వ్యవధిలో రమారమి 400 పద్యాలతో ధర్మదండం (ప్రథమ భాగం రచన పూర్తిచేసి - ఇపుడు అటనట చిరుచిరు మార్పులతో ప్రచురిస్తున్న 'ధర్మదండం' ప్రచురణ విషయంగా మేము ప్రస్తావించగానే ఉదార హృదయంతో స్పందించి చేయూత నందించిన నంద్యాల వాస్తవ్యులు : (ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాధికులు శ్రీయుత కె.వి. నారాయణ, నంద్యాల శ్రీ నాగిరెడ్డి కేశవరెడ్డి, కేశవరెడ్డి విద్యాసంస్థలు, నంద్యాల డాః గెలివి సహదేవుడు, గెలివి నర్సింగ్ హోం, నంద్యాల ఒక సాహిత్య అభిమాని, నూనెపలె శ్రీ కటకం శ్రీరాములు అంద్ బ్రదర్స్, శక్తి మెడికల్స్, నంద్యాల మేడా లక్ష్మయ్య అండ్ బ్రదర్స్, పాండురంగ రైస్‌మిల్, నంద్యాల శ్రీ మినిస్కర్ శివరావు, శివజ్యోతి మెటల్ వర్క్, నంద్యాల శ్రీ వర్థంశెట్టి రాజారాం, ప్రముఖ పారిశ్రామికవేత్త, నంద్యాల భాగ్యవగరవాసులు ; శ్రీయుత జి. మురళీ'ప్రసాడ్, పారిశ్రామికవేత్త, చిక్కడ్‌పల్లి శ్రీ పి. కోటీశ్వరరావు, పారిశ్రామికవేత్త, సంజీవరెడ్డినగర్ శ్రీ నివర్తి మోహనకుమార్, చార్జర్ట్ ఎకౌంటెంట్, బాగ్‌లింగంపల్లి శ్రీ కత్తుల శ్యాంరాన్, కంచి శారీ శిల్ఫ్, చిక్కడ్‌పల్లి శ్రీ కె.వి. చలపతిరావు, అడ్యొకేట్, ముషీరాబాద్ శ్రీ బాబు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, హైదరాబాద్ శ్రీ వీనస్ జ్యువెలర్స్, చిక్కడ్‌పల్లి
గారలకు మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు కోడూరి శేషఫణిశర్మ యామినీ సరస్వతి సహాయ కార్యదర్శి, సూసాసం. సూరన సారస్వత సంఘం, నంద్యాల
(004)
మనోగతమ్ “సర్వజ్ఞ పీఠ సందీప్తమ్ సత్యాద్వైత ప్రబోధకమ్ వందేహమ్ శంకరాచార్యమ్ జగద్గురు పదస్థితమ్” శ్రీ కైలాసాంతర్గతవాస పరిత్యాగియై - లీలామానుష వేషధారియై - అసేతుశీతనగ పర్యంత యావద్భారత ధారుణీమండలయాత్రా సంతర్పిత కారణజన్ముడై - ఇహలోకాభిల జాద్య నివారక సఫల సన్వ్వాస దీక్షామతానుయాయియై - శ్రీషణ్మత స్థాపనాచార్య వర్యుడై _ అద్వైత విద్యాతత్వ మహత్వ పధ నిర్దేశక దేశిక పీఠోజ్బులత్ సూర్యుడై - సమస్త దుర్మత గతాజ్ఞానాసంబిద్ధ భావ నిర్మూలన ధురంధరుడై - సురుచిర దరహాస చంద్రికా ప్రసరణ మాత్ర నివారిత సంసృత విషాదాన్విత భక్రజనకోటియై - సర్వజ్ఞుడై..... విరాజిల్లు జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకర భగవత్సాదాచార్యులెక్కడ? నేనెక్కడ? _ న భూతో న భవిష్యతిగా పేర్గాంచినటువంటి ఆ మహనీయుని పరమ పవిత్ర జీవన చిత్రణము చేయుటకు నాకున్న అర్హతలేమి? సంస్కృతాంధ్రోభయ భాషా పాొండిత్యమా? కాదు! అసమాన కవిత్వ కల్పనా చాతుర్యమా? లేదు! జన్మతః సంసిద్ధ విశేష ప్రతిభావ్యుత్పత్తులా? ముమ్మాటికీ... లేవు! మరేమిటి? అతనిపై గల అచంచల ్రొఢ భక్తి..... అతని కరుణా కటాక్ష వీక్షా ప్రసాదిత రచనా శక్తి - ఏతద్గుణ ద్వయ సమాహారమే - యీ 'ధర్మదండమ్” 'ప్రాక్తన పుణ్యలేశ ఫలముననే యే మహాకవుల చేతనో విరచింపబడవలసిన పరమ పావన చరితము - కథా వస్తువుగా - యీ ఆధునిక కాలమున నాకు లభించినది. జగజ్జన కల్యాణ దాయకమై - సత్యాసత్య విద్యా విధాయకమై - అమోఘ నిర్వచనీయ పరమపద ప్రదాయకమై - వెలుగొందు తన్మహనీయుని జీవన కథా సుధ పద్యకావ్య రూపములో (ప్రకటితమగుటకు నేనుపకరణమైనాను ధన్యోఇ_స్ని! “శంకరశ్ళంకర స్సాక్షాత్' అని విపశ్చితాభిప్రాయము. పరమేశ్వరుడు ధరించు త్రిశూలమెంత (ప్రశస్తమైనదో శంకరులు ధరించు ధర్మదండమంత పునీతమైనది. (00౧/1)
యావద్విశ్వ ప్రజానీకమునకు దిశా నిర్దేశము చేయగల “ధర్మదండము' కుమత గణములను రాజదండమువలె శాసించింది. ఆస్తిక భావ తత్పరులను మంటత్రదండమువలె సమ్మోహితులను చేసింది. శ్రీ శంకరుల సమాజోద్ధరణ దీక్షా దక్షతలకు నిలువెత్తు ('ప్రమాణమై నిలిచింది. అందుకే ఆ సుగుణగణ సాంద్రుని మూర్తిమత్వ చిత్రీకరణమునకై యుద్దేశించిన యీ కావ్యమునకు సుమధురము - శుభంకరము - అయిన 'ధర్మదండము' నామముగా నిర్దేశింపబడినది.
అట్లే - కథా విషయ ప్రాధాన్యత దృష్ట్యా - అయ్యతి చంద్రుని జీవనము రెండు భాగములుగా విభజింపబడినది. జననాది మండన మశ గృహ సందర్శనము వరకు ప్రథమ భాగముగను - శంకర మండన మి(శ సంవాదము మొదలుకొని సర్వజ్ఞ పీఠాధిరోహణమూ, అవతార పరిసమాప్తి వరకు ద్వితీయ భాగముగను నిర్ణయింపబడినవి.
ఈ ధర్మదండ కావ్యమునకు సంబంధించినంతవరకు - ఇతివృత్తము ప్రాచీనము - శైలి ప్రాచీనము. కానీ రచనా' విధానము ఆధునికము. అధునిక పఠితృజన సౌలభ్యము కొరకు అర్జానుస్వార శకట రేఫలు - అటనట యడాగమద్రుత ్రకృతిక సంధులూ ఉద్దేశ్యపూర్వకముగా పరిహరింపబడినవి. సుధీజనులు మన్నింపగలరని సవినయముగా (ప్రార్ధించుచున్నాము.
అది 1994వ సంవత్సరము - మే 6,7,8 తేదీలు - నంద్యాల సూరన సారస్వత సంఘ నిర్వహణములో బ్రహ్మశ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మగార సంపూర్ణ శతావధాన కార్యక్రమము - అందులో పృచ్చకుడుగా పాల్గొనే మహదవకాశము నాకు లభించింది.
వరుసగా ..... వంద పద్యాలు అవధానిగారి నోట వెలువడడమూ, నేను వాటిని (గ్రంథస్థం చేయడమూ - యిలా అవధాన కార్యక్రమ పరిసమాప్తి సమయానికి - అంతకుమునుపు ఎనిమిదవయేట నాకు అలవడిన పద్య విద్య క్రొత్త మెరుగులు దిద్దుకొన్నది.
మళ్లీ ..... 1995వ సంవత్సరము - ఏప్రిలు 24 నుండి 29 తేదీలు. భాగ్యనగరములో (బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మగారి సంస్కృతాం(ధ్ర ద్విశతావధానము.
ఈసారి రెండు వందల పద్యాలు గ్రంథస్థం - ప్రతిపద్యమూ - కంఠస్థం....
ఫలితం - అశుకవన సౌభాగ్యం.
అ తరువాత మూడేండ్ల పాటు - ఐహికమూ, పరమూ కాని యేవేవో రచనలు-
1998లో వైద్య విద్యా ప్రవేశ పరీక్షయందు కృతార్ణుడనైన పిమ్మట లభించిన కొద్దిపాటి విరామ సమయమందు - ప్రాచీన సారస్వతానుశీలనాభిలాషతో - పలు గ్రంథములు చదువుతూ ఉన్నపుడు -
(0౧411)
నాకూ ఏదైనా మంచి కావ్యమొకదానిని రచింపవలెననిపించింది. కథావస్తు నిర్ణయ విషయకముగా సమస్య తలెత్తినపుడు మా నాన్నగారు పధ నిర్దేశము గావించారు. బహికాముష్నిక ఫల ప్రదాయక విషయమందించారు. ద్విగుణీకృతోత్సాహముతో రచన సాగించాను. మధ్యలో పలు విధాలైన ఆటంకాలు - అటు కళాశాలాధ్యయన నిరంతర పరిశ్రమా - ఇటు కావ్య నిర్మాణ విషయ మేథో పరిశ్రమా - రెంటి మధ్య సమన్వయము సాధిస్తూ... శ్రీ జగద్గురు వరేణ్యుల దివ్యానుగ్రహము వలన రచన పూర్తి చేయగలిగినాను. ఇచ్చట మరొక విశేషమున్నది. ఈ నిరంతర సాపాతీ యజనములో నంన్కృతాంద్రోభయ భాషా వదప్రయోగోచితానుచితములనూ - అర్భాన్నయ పరిక్రమమునూ - పద్యవిద్యా సౌందర్య రహస్యములనూ - వివరించి బోధించి, నందేవా నివృత్తి చేసి ప్రోత్సపొంచినవారు - శారదా ప్రసాదితాఖండ మేథాసంకలిత విద్వత్కవివతంసులూ, సదసద్విషయ విమర్శన కుశలురూ, ఉభయ భాషాప్రవీణులూ, అస్మద్గురు వరేణ్యులూ - మహా మహోపాధ్యాయ విద్వాన్ శ్రీగొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్రిగారు, పండిత కవులైన వారి అధ్యాపకత్వ సహిత మార్గ నిర్దేశకత్వమే లేనిచో ఈ కృతి యిలా తయారయి ఉండేది కాదు. పుంభావ సరస్వతులైన శ్రీశాస్రిగారికి నా పాదాభివందనములు. తరల యశఃప్రపూర్ణ మహితాయ మహాగురవే నమోనమః హోమ పవిత్ర సత్మవన భాగ్యయుతాయ సదా నమోనమః నిరత నితాంత ధార్మిక గుణీకృత ధీయుత మూర్తయే నమః నిరుపమ పండితాయ నవనీత మనః కలితాయ తే నమః ॥ ఇక ఈ రచన ముద్రింవడి వెలుగు చూడడానికి కారణమయిన వారు - బహువిధ సారస్వత ప్రక్రియా సమర్భులూ - అయిన శ్రీ యామినీ సరస్వతిగారు. ఈ (గ్రంథము నామూలాళ్రముగ పరిశీలించి, పరీక్షించి తగు సూచనలందించిన కవి (0000)
పండితులు. అనేక (శ్రమలకోర్చి ముద్రణ బాధ్యత స్వీకరించి యీ కృతికొక ఆకృతి కల్పించిన ఆ సారస్వతాకృతి కిదే నా నమస్కృతి.
అవిదంపూర్వ వినూత్నకావ్య రచనావిష్కార సంభాసినీ
కమనీయామృత వాగ్విలాస రస గంధ గ్రంథ సంధాయినీ
ఘన భక్తాప్త తరంగ సంగత లసన్మందాకినీ వాహినీ
పదవిన్యాస విలాసినీ విజయతే శ్రీ యామినీ లేఖినీ ॥
ఇక నేనీ కృతి రచిస్తున్న కాలంలో తమ సంపూర్ణ (ప్రేమాభిమానాలు వర్షించి నన్ను ప్రోత్సహించిన నా జననీ జనకులకు సాష్టాంగ ప్రణామములు.
మా కుటుంబ శ్రేయోభిలాషులు, ఘనులు, గౌరవనీయులు శ్రీ ఆత్మకూరు సుదర్శనం శ్రేష్టి అధ్యక్షులు, లయన్స్‌క్షబ్, నంద్యాల గారికి కృతజ్ఞతాపూర్వక అభినందన మందారమాల నర్పిస్తున్నాను.
కోరినంతనే అశీరక్షతలు అందించిన జగద్గురువులు పరమహంస పరివ్రాజకాచార్య శంకరాచార్య స్వామివారికి పాదాభివందనాలు 'అభినందన'తో అళీర్వదించిన జ్ఞానపీఠ (గ్రహీత డాః సి. నారాయణరెడ్డిగారికి,
“శివానందలహరితో ఆశీస్సులు అందించిన ఆచార్య జి.వి. సుద్రహ్మణ్యంగారికి, “అభినందన'తో పద్యవరహాలందించిన ఆచార్య బేతవోలు రామ(బ్రహ్మంగారికి, అభినందన సువర్ణ నూత్రమ్ బహూకరించిన శతావధాని శ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మగారికి “అలంకరణం'గా అభిప్రాయంతో కవితా కన్యకను సింగారించిన శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్రిగారికి, 'ఆప్తవాక్యం' పలికిన డా! గెలివి సహదేవుడుగారికి, 'సారసరస్వతీ కటాక్షంతో దీవించిన శ్రీ యామినీ సరస్వతిగారికి కృతజ్ఞతా పూర్వక నమోవాకములు అందించడం కన్న నే చేయగలిగిన సత్కృతి ఏమున్నది?
అలాగే ఈ గ్రంథ ప్రచురణ కాలంబనమైన నంద్యాల సూరన సారస్వత సంఘ సభ్యులకూ, రసజ్ఞులైన యావదాంధ్ర పాఠక లోకమునకూ సుహృన్నమోవాకములు.
“సమస్త సన్మంగలాని భవంతు” 5 0603 సుధీజన విధేయుడు కర్నూలు. కోడూరి విష్ణునందన్ (000)
శీకె.వి. నారాయణ ఎం.ఏ. సారస్వతాభిమాని ప్రముఖ వ్యాపారవేత్త వారి సతీమణి, నంద్యాల పుస్తక ముద్రణకు తోద్బడిన ప్రముఖులు (0006)
అంకితము నీకై వ్రాసిన ధర్మదండమిది - అందింతున్ ప్రభూ నీకు; ని న్నే కల్పాంతముదాక గొల్లు - భువిలో నీకన్న నర్దుండెవం డీ కావ్యమ్ము గ్రహింప? నీ కరుణచే నీ గాథ నిన్ గూర్చితిన్ స్వీకార మ్మొనరింపుమో యతివరా! చేతున్ నతుల్ శంకరా! (001)
ధర్మదండం 1 విఘ్నేశ్వర సంప్రార్థనమ్ సతతావిఘ్న మహాప్రసాదమునకై శ్లాఘించెదన్ వ్యాస భా గనే రత సత్మావ్య విలేఖకున్; గజముఖున్; ప్రజ్ఞాయశః కారకున్; ఇకో తత సేవ్యద్దణ నాయకున్; మహిత భక్తక్షేశ విధ్వంసకున్; శిత సంసేవక మూషికున్; సుకవితా శ్రీభావ సంధాయకున్! సరస్వతి శారద! శాస్త్ర సంచయ విశారద! సార దయా సుధాభ్రమ న్నీరద! జ్ఞాన భావ రమణీయ రమాప్రద! లోక శర్మదా! / ్ట ధీర గభీర వాగ్విభవ దివ్యసమ[గ్ర మహతృవిత్వ కా 41 గి సార రసాయనోల్లసిత సారసమౌనటు జేయుమీ కృతిన్ ళా , నల చం. వీణాపాణి ! విరించిరాణి! జననీ! వేదాంత విద్యాఖనీ! సలి! వాణీ! సుందర నీలవేణి! రుచిర స్వర్దాబ్ద సింహాసనీ ! క్షోణీ వ్యాప్త సుభక్తజాలనుత తేజో రూపిణీ! సర్వ గీ ర్వాణ స్తోమ శుభప్రదాయిని! కవిత్వ 'ప్రౌఢి సంధింపవే!
౯! ధర్వ్యదండం గాయత్రీ దేవి సీ, వేదాథీశ్వరి! సర్వవిప్రగణ సంవిదృవ్య సంపత్కరీ! సమో? స్వాదుఠ్రేష్ట మనోజ్జమూర్తి నిను సంశ్లాఘింతు; సేవింతు; నీ . న పాదద్వంద్వము గొల్చి యీ కృతిని గూర్భంజాలితిన్ పాఠకా స్తాపన. మోదమ్మున్ గలిగించుమో జనని! సంపూర్ణానురాగమ్మునన్ వేంకటేశ్వర స్తుతి ం సుర దిక్పాలక సర్వమౌనిగణ రక్షోయక్ష గంధర్వ కి ల్ న్నర కింపూరుష సేవితామల మహాజ్ఞాన స్వరూపా! నిరం మీకు సఖ తర సద్భక్త శుభక్రమాకలన సంధానా! విభో! వేంకటే ల శ్వర! నీ పాదయుగమ్ముగొల్తును మదాశాపూర్తి సంసిద్ధికై భరత భూమి శ్రీ సద్విద్యకు బాత్రులై మునిజన శ్రేష్టుల్: యతుల్; సతృ్మవుల్ ధీ సమ్రాట్టులు; రాజచంద్రులు; కళా తేజో నిధుల్స్ పండితుల్ వాసింగన్న వధానులున్; గురువరుల్; వైరాగ్య భావాన్వితుల్ వాసంబుండెడి యార్నభూమి భరత స్వర్భూమి నే గొల్పెదన్ ! జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు శంకరు, భక్త సంచయ వశంకరు; మోహలతా సమూల నా శంకరు; జ్ఞాన వాజజయ భృశంకరు; సార్వజనీన భవ్య సౌ ఖ్యంకరు; వేద విద్విష భయంకరు; దీవ్యదమోఘ మోక్ష సా ధ్యంకరు; సర్వపాప విలయంకరు గొల్తునభీష్ట సిద్ధికై !
ధర్మదండం 9
నంస్మ్కృత కవీంద్రాభవందనము వ్యాస వాల్మీకి భారవి భాస కాళి దాస భవభూతి శంకర దండి బాణ మాఘ పండిత రాయాది మహిత కవుల బుద్ధి బలమున కర్చింతు పూర్ణనతులు
'ఆంధ్ర' కవి ప్రశంసా మాలిక
మును తానాంధ్ర కవిత్వ భూజమున కామోదమ్ముతో బ్రేమతో ననురాగమ్మొనరన్ జలంబులిడి యాప్యాయమ్ముగా బాదు తీ సిన ధీశాలిని నన్నప్రార్యుని కవి(శ్రేష్టున్ మదిన్ గొల్చి; తి కృన సమ్యక్కృత పద్యశిల్ప ఘనయజ్ఞ శ్చాఘ్య నిర్వాహకున్ వినయంబొప్పగ సంస్తుతించి; విబుధున్ విస్తార విఖ్యాతు నె ర్రన సత్మావ్య మహాప్రబంధ రచనా ప్రాగ్రేసరున్ దల్చి; పో తన మందార మరందబిందు సమ పద్య ప్రొఢథి సౌలభ్య శై లిని సద్భక్తి భజించి; కీర్తి వనితాశ్లేషాప్త సద్భాగ్య శీ లిని శ్రీనాథ కవీంద్రు చాటు కవితా లీలా చమత్కార వా గ్ధను బూజించి; మహాంతరార్ధ్థయుత సత్కావ్యాను సంధాను బె ద్దన బాండిత్య నిధిన్ నుతించి; సుగుణోద్యత్ కీర్తి పాత్రున్ సుధీ జన చిత్తప్రియు రామకృష్ణకవి సంశ్లాఘించి; పేర్మిన్ మన మ్మున నత్యద్భుత భావసంయుత కళాపూర్ణోదయ (స్రష్ట సూ రన విద్వతృని, ద్వ్యర్థి కావ్యరచనా ప్రాజ్ఞున్ ప్రశంసించి భూ వనితా కాంతుని నాంధ్రభోజ బిరుదభ్రాజిష్టు శ్రీకృష్ణరా యని సంప్రీతి స్మరించి పూర్వకవి సమ్యక్ రీతి సారస్వతా రృన జేయన్ రమణీయ కావ్యమిది గూర్చందల్చితిన్ సమ్మతిన్!
శ ధర్మదండం కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ భద్రాలంకృత మూర్తివై సుకవితా వ్యాపార సంధాన ని ర్హిదాహంకృత కీర్తివై బహుముఖాన్వీతోజ్వలత్సాహితీ చిద్రూపమ్ము ధరించి యాంధ్రుల ప్రశస్తిన్ జాటినావయ్య ! శ్రీ మద్రామాయణ కల్పవృక్ష కవిసమ్రాట్ ! నిశ్వనాథా ! నతుల్ ! ప్రాచీనార్ష పథ ప్రబోధముల నర్వాచీన గాథోక్తిగా నాచంద్రార్మము నిల్బ 'వేయిపడగల్ ఆడించుచున్ వాజ్బయ (ప్రాచుర్యామృతమున్ (్రవించు ధిషణా వాగ్భోగ భోగీంద్ర! నీ ధీ చిహ్నమ్ములనెన్న నా తరమె? సంధింతున్ నమోవాకముల్! కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్తి తీయని పాలధారలును - తేనెల సోనలు - పూలవానలున్ హాయిని గూర్చు తెమ్మెరలు నల్లన పిల్లన గ్రోవివోలె నో హో! యనిపించు రాగములు నుల్లము నూయలలూపు భావముల్ మాయురె! నీ కవిత్వ రస మాధురిలో రవళించు సతృవీ! నీవు పద్యమ్ములను 'వ్రాయలేవు” స్వామి! నేత్ర పర్వమ్మపూర్వమౌ చిత్రములను గుంచెతో చిత్రకారుడు కూర్చుభంగి కలముతో 'భావచిత్రణ” సలుపగలవు! జననీ జనకులు వందే మాతరమిందు మూర్తి మమలామ్ ప్రత్యక్ష దైవాకృతిమ్ వందే మత్పితరవ్ కవిమ్ బుధవరమ్ శ్రీ సాహితీ బాంధవమ్ సౌఖ్య శ్రీయుత భోగ భాగ్య సుకృతం చారోగ్యమాయు స్త యో ర్లభ్యంతామ్ తిరువేంకటాద్రి విభువీక్షాదుగ్ధపాథోధినా!
ధర్మదండం క్ _పసావనము
వైద్య విద్యా ప్రవేశ విద్వత్పరీక్ష
వ్రాసి యుత్తీర్ణతను బొంది స్వాంతమందు
రమ్యసత్మావ్య పఠనానురక్తితోడ
గడపుచుంటిని విశ్రాంతి కాలమెల్ల! ఒక పులకింత; యొక్క మధురోహ; యొకానొక ప్రేరణమ్ము; వే రొక పరి స్ఫూర్తి గాంచితి బుధోత్తమ కావ్య శుభానుశీలనో త్సుకత జరించి; నా కలము దోహలమంది స్వయమ్ముగా నొకా నొక మహనీయ కావ్యరచనోద్యమ భావనమొందె నాదటన్ ! భావనమ్ము గలుగ ఫలమేమి? కావ్యమ్ము (వ్రాయ జకృనైన వస్తువేది? ధర్మ్శ్మమూర్తియై సదా పూజనీయుడౌ కావ్యనాయకుండు కావలెగద!
కవి, రచయిత, సారస్వత
సవనాంచిత హోత నాదు జనకుని తోడన్
వివరించితి విషయమ్మును
కవనాంశము బోధ జేయగా నే వేడన్
6 ధర్మదండం శ్రీమద్భారత పుణ్య సంస్కృతి మహోత్కృష్టోపదేష్ట స్థితిన్ క్షేమస్టైర్య గుణప్రదాయక శుభత్రీ సంప్రదాయాకృతిన్ రామాద్యద్భుత పుణ్యమూర్తి కృత ధర్మస్థాపనోద్యద్గతిన్ ప్రామాణ్యమ్ముగ జూపి తండ్రి సలిపెన్ వస్తూత్తమావిష్కృతిన్ “శ్రీ విలసిల్ల సశ్రేయోయుతంబై వి జ్ఞానామృతమ్ముతో ధ్యాన దుగ్ధములతో బొల్బెడు కుదురైన పూర్ణకుంభ; సర్వవిద్యాధన సముపార్ణితంబైన అసమాన వీరత్వ మసహాయ శూరత్వ మధిగతమ్మైన శౌర్యప్రవీణ) అటుల యిటులని చెప్పగా నెటుల? సకల రంగములలోన దీపించు రాజసమున; నిత్య సంతోష వదన; బెద్ధత్య లలన సారస మరంద లీన యీ భారతాంబ! శాత్రవులెందరో యిటకు సంపదలన్నియు కొల్లగొట్టగా నాత్రముతోడ వచ్చిరి మహాధనరాశిని సంగ్రహించుటన్ జైత్రులునైరి; జ్ఞానమను సంపద మాత్రము సుస్థిరంబుగా జీత్రము! నిల్చె నిచ్చటనె (శ్రేస్టతపోజన రక్షణంబునన్ !
ధర్మదండం 7
స్తుతి పాతంబగు నీ భా రత దేశంబిట్లు కీర్తి రాజిల్లగ దు రృతులైన ప్రజలు కొందరు కృతకంబులునైన కుమత కీలితులగుచున్ అకలంకంబగు హైందవమ్ము నతి దూష్యంబంచు మూఢధాత్ములై అకటా! బౌద్భులు జైనులాపయి ననేకానేక నీచాధముల్ ఎక సక్కెంబుల పాలు జేయుటకు నేమేమో ప్రయత్నంబులన్ సకలంబున్ సమకూర్చుకొంచు దమ సంస్మ్కారంబులన్ వీడుచున్ అధిగతోత్సాహులై మహోద్యమము పూని అర్న సంస్కృతి నిందా ప్రహర్చులైరి; హైందవము; కర్మసూత్రమే హైన్యమయ్యె! దేవతార్చన జేయు భావంబు నళియించె;
నిత్యాగ్నిమో త్రమ్మసత్యమయ్యె భక్తి నాశనమయ్యె ముక్తి కోరిక చచ్చె;
వర్ణాశ్రమ విధమ్ము జీర్ణమయ్యె కర్మకాండలు పోయె; ధర్మపథమ్మోదె;
విజ్ఞాన మార్గమ్మవేద్యమయ్యెః గురు వృద్ధ గణములు మరియాద గోల్పోయె;
వేద పఠనమన్న ఖేదమయ్యె భోగలాలసులై సుఖ సాగరమున మునిగి తేలెడి దుష్టులు - మూఢమతులు - దురిత మానసులల్పసంతోషయుతులు - ఖలులు - పలువురీ దేశాన గాననైరి;
రి ధర్మదండం
అ యజ్ఞాన మహాంధకారమును మాయామోహ పాశంబులన్ స్వీయామేయ తపోబలాన్విత మహాసిద్దాంత దీపంబుచే బాయంజేయగ ధర్మసత్వగుణ సద్భావంబులీ ధారుణిన్ ఖాయంబై విలసిల్లడేయుటకు జన్మంబందె నాచార్యుడై ! ఆతడనూన దివ్య మహిమాన్వితుడీ ధరణీ తలాన నా
సేతు హిమాచలమ్ము విలసిల్లగ జేసెను హైందవమ్ము; వి ఖ్యాత జగద్గురుండు; ఘన కారణజన్ముడు నీశ్వరాంశ సం జాతుడు శంకరుండు మనసా వచసా నుతియింతునాతనిన్ ! అమితోత్సాహముతోడ ధీరవరుడై యద్వైత సిద్ధాంత శం ఖము బూరించి సమస్త దుర్మతి మనః కాంతార గర్వాంధ కా రము దూరమ్ముగ బారద్రోలి నిగమ ప్రామాణ్య సంస్థాపనో ద్యమ సంరంభము జూపినట్టి గురు పాదద్వంద్వమున్ గొల్బెదన్ ప్రాచీనార్న పథమ్ము నింద్యమనుచున్ బౌద్ధప్రబోధంబుచే నాచారంబుల వీడి స్వప్రజ దురభ్యాసంబులంజిక్కి కా
లూ చేయాడక క్రుంగిపోవునెడ నా లోపంబు బాపెన్ గదా! ఆ చంద్రార్మము నిల్చు శంకరుని దీవ్యన్నామధేయంబిలన్ ! కాషాయాంబర ధారి; నిత్యవిలసత్కల్యాణ వేదోన్నతా శేషఖ్యాతి విశారదుండు, గుణ సచ్చీలుండు; చిన్ముద్ర సం తోష ప్రాప్త సుధీవరుండు; ఘన సంస్తుత్యుండు; క్రీర్తిందిరా శ్లేషానందిత సంయమీంద్రుడు గురు శ్రీ శంకరాచార్యుడున్ ! ఆతని చారిత్రమ్ములు
చేతోహరణమ్ములమృత సేచనములు; సం
గీత శ్రావ్యమ్ముల వి
ద్యా తరణి గ్రహణములు; సదా శుభగుణముల్ !
ధర్మదండం 9 చరితార్థంబగు నీదు జన్మ - మన యాచార్యోత్తమున్ శ్రీ జగ ద్గురు పీఠస్థిత ధర్మదండయుతహస్తున్ శంకరాచార్య థీ వరు గీర్తించు పవిత్ర పద్యమయ కావ్యం బొండు సద్భక్తి త త్పరతన్ గూర్చగ; జన్మజన్మల మవాపాపాళి విధ్వంసమౌ! కలమున్ బట్టుముచేత; కాగల మహత్మార్యంబునాచార్యుడే తిలకించున్! భయమేల? నీకతడె శక్తిన్ గూర్చు, తద్దత్త స ల్లలితాహ్లాద కవిత్వ తత్వసుధ (గ్రోలన్ జన్మరాహిత్యమున్ గలుగున్ నాయన! యంచు నాయనన సంకల్పించినానీ కథన్ నవనంది వేష్టిత నంద్యాల మా యూరు
భూరి ధీయుతులకు బుట్టినిల్లు; వేదవేదాంత సంవిన్మహాంబుధి రత్న మయిన కోడూర్యన్వయ ప్రశస్తి “బాదరాయణ” నామ వరగోత్ర కలితమౌ ఘన మహీసురకుల జనన మహిమ; 'మాశ్వలాయన' సూత్ర మార్ష బుగ్వేద శా భాధ్యయనాప్తి' యధ్యాత్మ విద్య “శేషఫణిశర్మ తండ్రి యశేష కరుణ “విజయలక్ష్మి నా తల్లి దీవెనల బలము గలిగి 'విష్ణనందనుడ' సత్మావ్యశైలి గ్యమ్ర ధర్శదండముగూర్చగలిగినాను!
10 ధర్మదండం కథాక్రమము కరక దశము - కాలడి
శ్రీశంకర జన్మస్థల మై శాశ్వత పుణ్యతీర్ధమై శ్రీకరమై ప్రాశస్త్యము గను కేరళ దేశమ్ము మహాపవిత్ర దేవాలయమౌ | వేదవేదాంగాది విద్యాధనము గల్లు
పండితులున్నట్టి దండి భూమి; అఘటన ఘటనా మహాశక్తి మళయాళ
మాంత్రికులున్నట్టి మహిత భూమి; సస్యలక్ష్మీయుత సంపదలను పొందు
కర్షకులున్నట్టి హర్షభూమి; ధర్మసంబద్ధ (ప్రతాప రూపముగల్లు
భూధవులున్నట్టి పుణ్యభూమి; అట్టి కేరళ దేశమ్మునందు ప్రచుర పుణ్య సంయుతమై యొప్పి 'పూర్ణ' పేర మించి ప్రవహించెడు నదీ సమీపమందు కాలడి యగ్రహారంబని కల్గెనొండు; 2
ధర్మదండం 11 శ్రీలలనాలవాలము; విరించి మనోహరి కాలయమ్ము; శీ తాలయ బాలికా నిలయమై ధన విద్వదమేయ శక్తి స మ్మేళనమై యశస్సధిగమించి సమంచిత ధర్మదేవతా పాలనమందు సర్వ విధ భాగ్యములొందు దద(గ్రహారమున్! 8 పచ్చపచ్చని పైర్తతో స్వచ్చమైన సౌఖ్య వాతావరణమున సంతతమ్ము ప్రీతినలరారు కాలడి రీతి జూడ జిత సురేంద్ర పురమ్మని చెప్పవచ్చు! శ్రీ ధీరులు, జ్ఞాన సంకలిత ధీవరులంచిత ధర్మవీరు లా చార పరాయణాన్వితులు; శాస్త్ర విశారదులార్నతత్వ వి స్తార గుణ ప్రచారకులు; సత్య నిబద్భులు; వేద వాజ్మయా కారులు తత్పురంబునను గాపురముండిరి పుణ్యశీలురై ర్ కసరి కొట్టరు యాచక వ్రజంబుల రోసి కొసరి వడ్డించుటే గుణముకాన; చీదరింపరతిథి చేర వచ్చినయంత నాదరించుటె నైజమయ్యె గాన; అదలింపరు పశుపక్ష్యాదుల బాధించి భూతదయయె వారి నీతి కాన; తొణకరు సంసార రణరంగమందున నణకువ మెల్లుటే ధ్యాస కాన; కనరు; వినరనబోరమంగళములెపుడు; చనరు పతి యాన మీరి యే సమయమునను; మనరు నీతి వీడి ఘటికా మాత్రమయిన; గాలడికి నలంకొరంబు గద గృహిణులు! 6
12 ధర్మదండం ఆ గ్రామ సమీపమున మ హాగ్రావము కల్గెను వృషభాచలమచటన్ ఉగ్రుండు భక్తజనము న నుగ్రహమున (బోచుచుండు నోము ఫలింపన్! 7 కోర్కెలడుగు ప్రజల కొంగు బంగారమై వరములిచ్చి ప్రోచు భవహరుండు వృషభ శిఖర పతికి వేరెవ్వరాకొ సాటి సకల ముఖ్యదైవ సంఘమందు! 8 ఇవ్విధమ్మున నా పరమేశ్వర కృప వరలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర నివహము పరస్పర సహాయ నిరతి తోడ 'ప్రభలనీనె సమైక్యతా భావ గరిమ! 9 తమతమ కులవృత్తులనే తమ కుల దైవములటంచు దాదాత్యముతో (శమమెరుగక సేవించెడి విమలాత్ముల నప్పురమున వీక్షింపనగున్ ! 10 ధర్మమచ్చట నాల్లు పాదాలపైన నడచి జనులకు జూపించు న్యాయపథము; ధార్మిక మత మహాధ్వజ స్తంభమయిన కాలడిని - కుమతమ్ముల గాంచలేము! క్ష
ధర్మదండం 13 విద్యాధిరాజ చరిత్ర
'ప్రాభవమ్మున విద్యాధిరాజు పేర
బరగు విప్రవరేణ్యుడా పురమునందు
గా పురంబుందిె; మిక్కిలి గౌరవంబు
బొంది వెలుగొందుచుండె నా పుణ్యమూర్తి; 12 సార్ధ్థకాహ్వయుండు; సారస్వత మరంద
పాననాభిమాన భ్రమరమతడు;
ఘనుడు; యాచకాళి కామధేనువతండు;
పలుకు వెలది చేతి చిలుక యతడు! 13 ఆతనిల్లు వేదమాత పుట్టిల్లగు
నామె ప్రీతిగ నదయాడునచట;
అలరి శారదాంబ ఆపాతమధురమౌ
విమల గీతి పలుకు వీణ పైన! 4 భారత భాగవతాదుల
నారంభాంతానురక్తి ననుపమయుిక్తిన్
ఓరంత ప్రొద్దులాతడు
చేరిన ప్రజకెల్ల తెలియుజెప్పున్ ప్రీతిన్ 1 15
శివగురుడు - ఆర్యాంబ
వివరముదెల్పనాతనికి వేదవిదుందని సుప్రసిద్దుడౌ
*శివగురు' నామధేయుడు; సుశీలుడు; ధార్మిక తత్వభావనా
నవరత చింతనుండయిన నైష్టికుడొక్కడు పుత్తుడయ్యె; లో
క విధము గాంచలేదె? పులిగర్భమునందెటు పిల్లి పుట్టెడిన్? 16
14 ధర్మదండం శివగురుడు గురుకులమందు చేరి న్యాయ తర్క వైశేషికాది శాస్త్రముల నేర్చి (బ్రహ్మచర్యాశమమ్మును వదలి పిదప కొనెను గార్హస్థ్ర ధర్మంబు గురుని యాజ్ఞ! [7 అరయగ శివగురునకార్యాంబ భార్యయై భర్తతోడ సత్ర్రవర్తనమున మెలగి పేరు గాంచె మృదుభాషిగా తాను భువన భవన బంధు నివహమందు! 18 మనసు వెన్న పలుకు మరి మరి మృదువుగా తేటతెనుగు వోలె తేనె చిందు; మాట యొకటి; వారి బాటయు నొక్కటే ధర్మమే సతమ్ము దలచుచుంద్రు! 19 తెలవారక మునుపె మెలకువగని ప్రీతి నభ్యంగన స్నాన మాచరించి నమక చమక మహోత్తమ మంత్రరాశితో నిత్యశివార్చనా నియతి పొంది అతిథులీశ్వర సములని సదా భావించి సత్కార సన్మాన సరణి సల్చి రమ్య పురాణ పారాయణ మ్మందున నాధ్యాత్మికానంద మందుచుండి - గో గణమ్ముల, విప్రుల, గురుల, బుధుల వేదమూర్తుల సతతమ్ము విధిగ గొలిచి లోక కల్యాణమే మదిలోన దలచి వారలాదర్భ్శనీయ జీవనము గనిరి ణు
ధర్మదండం 15 దంపతుల పరితాపము సర్వసౌఖ్యంబులున్నను శాంతిలేక సంతతి విహీనులై శోక సాగరమున దాము చిక్కి వగచిరి; పున్నామకమగు నరకమును దాటగా సాధనమ్ము సుతుడె! లై కోటి యజ్ఞఫలము గొమరుందుగా నెంచి ముద్దుజేసి వాని బెద్దజేసి వంశవృద్ధిగాంచ భావించుచుందురు తల్లిదండ్రులెపుడు ధరణియందు! జ తనయుండే మమకార భావనల సంధానించు నీ ధాత్రిలో తనయుందే యనురాగ సంపదల జెంతన్ జేర్చు సంట్రీతితో తనయుండే అతిలోక సౌఖ్యముల నిత్యంబంద జేయన్ గదా తనయుంగాంచని మానవుండెటుల పొందంగల్లు నీ భాగ్యముల్? 2 ఏ సిరులేల? రాజ్యములవేల? సపర్యల జేయుచుండు నే దాస గణంబులేల? నవధాన్యము లేల? (ప్రమోద చిత్తుడై భాసిలు పుత్రుడొక్కరుడు బంగరు పల్కులతోడ ముద్దులన్ రాసుల గ్రుమ్మరించుచు చిరంతన సౌఖ్యము గూర్చకున్నవో డడ శివ గురుడిట్లు పల్కె సతి జేరి - “పరాత్పరు బూజ సేయ నీ భువి నెటువంటి వారయిన పొందెదరీప్సిత సిద్ధిగాన మా నవ సుఖ దాయకుండు; శుభనామకుడా వృషభాద్రి నున్న భ క్త వరదుదైన శంకరుని ధన్యత గొల్తుమఖండ భక్తితో ణ్
16 ధర్మదండం “ఏ విభూతినైన నీ గల్లు నీశాను డతని సేవజేయ సుతుడుగల్లు
పరవశించిమున్ను వర పుత్రునొసగడే
తననుగూర్చి శౌరి తపముజేయ” రం అని తలపోసి దంపతులనంత శుభంకరుడౌ వృషాద్రి నా
థునిగని పూజసేసి తమ దోషములన్నియు సైచి వంశ వ
ర్ధనమును జేయు పుత్రుని నిరంతర భాగ్యనిధానునొక్కనిన్
ఘన కృప తోడ నిమ్మని ప్రగాఢ మనోరథ మా కపర్ట్దికిన్ 27 విన్నవించుచు నమిత సంప్రీతి తోడ
నర్చనమ్ములజేసి ఘోరాతిఘోర
తపము సల్పంగ దాన నత్యంత మోద
సంభృతుండయి భక్తవశంకరుండు - 28
శివగురు స్వప్న వృత్తాంతము
ఒక నడిరేయి స్వప్నమున “నో గుణశీల! సుభక్త! జ్ఞానియౌ
సకల విదుండు నాయువున స్వల్పుడు గావలెనా? చిరాయువై
వికల మనస్సుడై తెలివి వీసమునైనను లేని పుత్రు కో
రక దయజేయుమందొ? వివరించుమనెన్ గృప భక్తతల్లజున్ 29 వింతగ శివగురుడును ధీ
మంతుని దయజేసి కోర్కె మన్నింపుమనెన్
అంతట శివుడు 'తథాస్తని
యంతర్జితుడయ్యె నుదయమైనది కనగన్ ! 30
ధర్మదండం 17 సంతోషమొప్ప నా వృ త్రాంతము సతి జేర బిలచి తా వివరించెన్ కాంతకు గలిగిన ముదమున కంతమ్మే లేదు; చిత్తమలరగ ్రీతిన్ ! 31 కొంతకాలమ్ముగడచెను వింత గుణము లన్నియును పొడ సూపె నార్యాంబ యందు గర్భవతి యయ్యె; సరిక్రొత్త కాంతులీనె తీరె నాకాంక్ష యనుచు సంతృప్తి పొందె! 32 పలువిధముల శుభములకున్ నెలవాయెను తత్పురంబు నెల నెల 'పెరుగన్ విలువైన భాగ్యసంపద దులదూగుచు బురజనాళి దోహలమందెన్ 33 నవమాసంబులు నిండెను శివగురుడత్యంత మోద చిత్తుండాయెన్ భువి పులకించెడి కాలము శివుడే జన్మించు గడియ చేరువ యాయెన్ ! 34 శంకర జనన వృత్తాంతము నందన వత్సరమ్మందున వైశాఖ శుద్ధ పంచమి మహా శుభదినమున; భాను వారము పునర్వసు యుక్తమైనట్టి కర్మటమనెడి లగ్నమ్మునందు; నైదు గ్రహమ్ముల నత్యుచ్చదశయందు గల్గిన బహు పుణ్య కాలమందు; సకల సౌఖ్యప్రదాయకమౌచు సుకృత సం సర్గమై యొప్పెడి సమయమందు;
18 ధర్మదండం జననమందెను బ్రహ్మవర్చస్వియైన బాలుదాతని గాంచ నా పరమశివుడె భువికి దిగివచ్చి తాననుభూతి పొంద దలచె ననిపించు మధురమౌ తల్లి (పేమ! 85 పూర్ణాస్రవంతి సంపూర్ణ ప్రమోదంబు పొంది తరంగ ప్రపుల్లమయ్యె, ఫల పుష్ప భరములై పాదపమ్ములు పొల్చె; పరిమళమ్ముల దాల్చె పవనమెల్ల; దేవాలయంబులం దివ్యఘంటానాద మధుర సంగీతంబు మలయజొచ్చె; శుక పిక శారికా సుమనోజ్జ్ఞ గీతాలు కాలడిలోన సౌఖ్యంబు దెచ్చె; పాడి పంటలు వర్ధిల్లి పచ్చదనము నిండె, సంప్రీతి బులకించె నిఖిల జగతి; కుందె కుమత గణంబులు గుండెలదరి; శంకరుడు జన్మమందిన సమయమందు! 386 “కొమ్మలార! చిన్ని కొమరుని గనెనట నచట 'నార్య' పుణ్యమలరుచుండ రండు! రండు! జన్మ రాహిత్యమందగా వాని గన్నులార గానవలయు” 37 అని యొకరికొకరు తెల్పుచు వెనువెంటనె యువిదలెల్ల వేడుక తోడన్ గన వచ్చిరి పసిబాలుని జననీ హృదయాబ్ది రవిని: చంద్రవదనునిన్! 38
ధర్మదండం 19
ఒక చాన తిలకించె నోషధీశార్ధ ఖా
గము నా శిశూత్తమాంగంబు పైన; ఒక లేమ గణియించె ను(గ్రనేత్రమ్ము నా
బాలుని చిరు ఫాల భాగమందు; ఒక యింతి దర్శించె నురగ భూషణము నా
కడు ముద్దు కొమరుని కంఠమందు; ఒక కొమ్మ యూహించె నుత్తాల శూలంబు
నా చిట్టి పసికందు హస్తమందు; నొకతె గజ చర్మమును గాంచె నొంటిపైన; నొకతె క్యమరుద్రాక్ష మాలికల జూచె; నైక భాగ్యనిధాను దదేక దృష్టి ననిమిషులునై కనుంగొని రతివ లెల్ల! 39 బాలకుండైన యీశ్వర వదన సీమ చిన్నదైనంత సిగబంతి శీతకరుడు మెల్లమెల్లగ ముఖమాక్రమించి పండు వెన్నెలల నవ్వులో కురిపించినాడు 40 బాలకుని జాతకమ్ము దైవజ్జ్ఞవరులు కాంచి విసషయమొంది యీ ఘనుడు భావి సకల శాస్త ప్రవీణుడై సాంద్రకీర్తి చంద్రికల దాల్చుననినారు జనకుడలర! న! వివిధ గోదాన భూదాన విధి జరించి జాత కర్మాది సత్రియా సరణి సల్పి సురల భక్తినర్చించి భూసురుల గొల్చి నామకరణోత్సవము జేసె నైష్టికుండు! శై
20 ధర్మదండం జననమునొందె శంకర ప్రసాదముచే సుఖదాయకుండు నా తనికిని 'శంకరుండిని హిత్రెషుల బంధుల గూడి తండ్రి తా నునిచెను నామమాపయిన నొప్పెను బాలుడు నేత్రపర్వమై దిన దిన వర్థమానుడయి తేజము బొల్బెడు శుక్ల చంద్రుదై ! 4 చూపుకాదదియు త్రిశూలంబు మాడ్కిమ
హా నిశితంబుగా నలరుచుండు; పలుకు కాదదియు సస్వరమైన వేద వా
గ్దరియె మహాప్రీతి గరపుచుండు; నడక కాదదియు తాండవమట్టులొక లాస్య
భంగిమ దోపగ వరలుచుండు; నవ్వు కాదదియు పున్నమి చం(ద్రుడొకమారు
తళుకీను భంగిని దనరుచుండు; వింత గొల్పెడునట్టి వైవిధ్యభరిత వర్తనము వాని సొంతమ్ము ; వాని జూచు వారలను సౌఖ్యగంగా ప్రవాహమందు దేలియాడించు నాతని దివ్యమూర్తి న!
బాల్యము - విద్యాభ్యాసము
జన్నాది ప్రథమ వత్సరమందె సంస్కృత
కేరళాక్షరముల కేళి యాదె; పొందెనా భాషల పుస్తక పఠన చి
చ్చక్తి ద్వితీయ వత్సరమునంది; సరణి తృతీయ వత్సరమందె సాధించె
కావ్యపురాణ వ్యాఖ్యాన శక్తి నరయ నైదవ యేట నడుగిడ సంపూర్ణ
విద్యార్దన కళా ప్రవీణుడయ్యె
ధర్కదండం 21
అభిల సత్కావ్య ఘన పురాణాది శాస్త్ర వేత్తయెనట్టి సుతుగాంచి వేదృతోడ వీడు సాక్షాత్తు శివుడని విషయమున తల్లిదండ్రులు మనముల దలచినారు ! తర్ తల్లి చేసెడు పూజలో దాను కూడ
పాల్గొనును; తండ్రి సల్పెడు పండితాళి
పొలచు పరిమళమ్ముల పూవుపుట్టగానె! శం కాలము దొర్లుచుండె నధిక ప్రతిపక్ష విపక్ష దూరుడై
బాలుడు పేరుగాంచె; పురపండిత సంఘము విస్మయమ్మునన్
దేలుచునుండె; చిత్తముల దృష్తి జనింపగ దల్లిదండ్రులున్
వేల నమస్సుమాంజలుల వేల్పుల గొల్చిరి సంతసించుచున్ ! శ్ర? బుధులు విభ్రాంతి జెందిరి; పురములోని
శాస్త విదులెల్లరాశ్చర్య చకితులైరి
శివ గురుడు 'వీడు సద్దురు శిక్షణమున
నిశిత మేధావి యగుననని నిశ్చయించి తరి విద్యాబుద్ధులు నేర్ప్చగ
నాద్యంతము జ్ఞాన సారమందింపంగా
సద్యోగ్య గురువు గూర్చెను
సద్యస్సర్వజ్డుడైన శంకరునకొగిన్ ! 49
2 ధర్మదండం
గురువులు నేర్పింపగ నవ
సరమే లేదాయె; సకల శాస్త్రంబులలో
పరమార్ధముల నెరింగిన
స్థిర విజ్ఞుడు శంకరుండు; చిద్రూపుండున్ ! 50 “నేనేర్చించిన విద్యలేమియును లేనేలేవు; వీడున్ మహా
జ్ఞానహ్రాదిని సంచరించు కలహంస శ్రేష్టమే; వీడు నా
హా! నా పుణ్యపు శిష్యుడయ్యె నిక ధన్యంబయ్యె మీ జన్మ యం చానందంబున దల్లిదండ్రులకు దా నాచార్యుడే తెల్పెడిన్ ! ర్ విద్యజెప్పిన గురువులే వేయినోళ్ల
సంస్తుతించెడి శిష్యుడై శంకరుండు
దిట్టయయ్యెను; మున్ముందు నెట్టి ఘనత
పొందనున్నాడొ పాండిత్య పూర్ణ మహిమ! 52 వాణి చిందులాడు వాని నెమ్మోమును
గాంచి, శివగురుండు నంచితముగ
నొక దినంబు జేసె నుచితమై తనరారు
చింతనంబు తనదు చిత్తమందు! 53 “సుతుని స్తుతింపరాదనెడి సూక్తికి లోబడి యింతకాలమున్
ఇతరుల ముందు శంకరుని నే గణియింప నెరింగి చూడ నా
గతము గతమ్మె; తప్పదిక; కాదనలేమిది; వీడు శారదా
కృతి యని తోచునాకు, విచికిత్సలికేల యిదే నిజమ్మగున్ రశ
ధర్మదండం 23 వీని వయసేమి? వీని విజ్ఞానమేమి? సామరస్యమ్ము కుదరదీ సంగతేమి? అరయ నేక సంధాగ్రాహియైన వీని భాగ్యమెట్టిదోకద! బోధపడదు నాకు! ర్‌ర్ గురువు వీని మేథ గుర్తించి తానేమి నేర్చలేదటంచు నిజము బల్కె నద్భుతముగ దోచు నాబాల్య విజ్ఞాని వీనికెట్టులింత విద్య కల్లె? 56 ధూళి ధూసరితులై కేళి విహారులై క్రీడించు బాలల గీలుకొనడు; బాల్యచేష్టా ప్రకోప స్వాంతుడై మాతృ కార్యంబులకు నద్దుగాగ జనడు; అరచేత బట్టిన యంత మాత్రము దప్ప నాహారమెక్కువ నడుగబోడు; ఇట్టట్టుల పరిభ్రమించి సర్వగృహోప కరణంబు లేనాడు చెరుపటోడు; ఒదిగి యొకచోట గూర్చుండి యుత్సహించి కావ్యనాటకాలంకార కమ్రశాస్త పఠనమొనరించుచుండును బాలుడితడు పూర్వజన్మమ్మునందు నే పుణ్యగుణియొ? రా చదివెను వీడు సంస్కృతము; సంతసమొప్ప (గగ్రహించె కావ్యముల్ మదిగొనె యోగమార్గముల; మన్నన జేసెను నాటకమ్ములన్ బదిలముగా పురాణముల పారమెరింగెను వీనికింకపై ముదమున వేద విద్యల నమోఘ వచస్సుధ నేర్పగావలెన్ 5్‌రి
గరా ధర్మదండం
నేడీలోకమునందు వేదములకెంతేన్ హాని వాటిల్లె; కా
పాడంగాగల ధీరుడొక్కరుడు లేడా? ధర్మమున్నిల్పగా
రాడా? యంచు సమస్త భారతము తారట్లాడు కాలమ్ములో
వీదే శంకరుడే సమర్భడగు నిర్వేదమ్ము బ్రోద్రోలగన్! ర్9ి శంకరోపనయన సంకల్పము
ఉపనయనము జేయక వే
ద పఠనమును గూర్చరాదు; తప్పక శివ స
తృపతో శంకరునకు నే
నుపనయనము జేయవలె మహోత్సవరీతిన్ ” 60
అనుచు నిర్ణయించి ఆర్యాంబ బిలిపించి
ఆమెతోడ బల్కెనమృత వాగ్జార యే
చినుకునట్లు తేనె చిందునట్ను! 61
“గాయత్రీ మంత్రబలము
సాయంబున సుతుని మేథ సందీపించున్
జేయుద ముపనయన మఖి
ప్రాయము దెల్పుమ”నెనతడు పతిం గనుచున్ ! 62
ఆమె యంగీకరించెను; యజ్ఞమునకు
వలయు వస్తుసంభారాల ద్వరితగతిని
గూర్చుకొనుచుండె నా శివ గురుడు; ప్రీతి
నార్యమయు జరించెను గృహ కార్యనిరతి! య
ధర్మదండం 25 అటుల నానందముగ నున్ననా కుటుంబ మందున విషాద సంగీత మాలపించె గాలపురుషుడమృత రస ఘటమునందు విషపు బిందువు లొలికించె విధియు గినుక! 64 శివగురు నిర్యాణము సుతుని యభివృద్ధి గనులార జూడనెంచు శివగురుడు తన యీప్సిత సిద్ధికాక మున్నె యొక నాడు భవ బంధ ముక్తుడగుచు జనియె నా శివ సాన్నిధ్యమునకు దాను! 6ర5్ “అత్మ రూపంబు గనగ నిత్యంబు; సర్వ వ్యాపకంబు; సూక్ష్మంబనన్యంబు మరియు నదియు నంతర్చహిశ్ళ్శూన్యమైన దిట్టి యాత్మతత్వంబు నెరుగు మహా బుధుండు విరజుడై వర్ధిల్లును; మృత్యు భీతి గనడు 6 నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతర్భహిశ్ళూన్యమనన్యమాత్మన:ః | విజ్ఞాయ సమ్యక్ నిజతత్వమేతత్ పుమాన్ విపాష్మా విరజో విమృత్యుః 1॥ పరమ శాశ్వతమ్ము పరమాత్మ - అది సర్వ జీవతతి లయించు స్థావరమ్ము మాత కిటుల దెల్పి మాయాంతకుండైన శంకరుండొసంగె శమ దమములు 67
25 ధర్మదండం పతితోడిదె లోకమ్మని సతతము గణియించునట్టి సాధ్వీమణి సు స్పిత మతియై ధృతి గాంచెను సుతుని ప్రమోదమ్ముగోరి శోకము వీదెన్! 68 ఉపనయనము - గురుకుల వాసము సమ్మతి నార్యమ శాస్తో క్తమ్ముగ నుపనయన భవ్య కార్యమొనర్చెన్ ఇమ్ముగనతనికి; బంధుగ ణమ్ములు దీవించి వెడలె నయముగ వటువున్! 69 బలినడగింపగా భువికి వచ్చిన వామనుడో యనంగ; దో హలమున వైదిక ద్విషుల నంతమొనర్చు శుభాశయమ్ముతో నిల జనియించినట్టి పరమేశ్వరుడో యన నా వటూత్తముం డలరెను; చక్షురింద్రియ సహస్రము చాలదు వాని జూడగన్! 70 ఉపనయనమైన పిమ్మట నొక్కనాడు “సస్వరమ్ముగ నిగమశాస్తముల నేర్చి బ్రాహ్మణుని విధి చెల్లింపవలయుననుచు తల్లి ప్రేమతో బల్కె నందనుని తోడ! 71 లోకవిధమును బూని లోకైక గురుడు తాను సర్వజ్ఞుడైనను దల్లి కోర్కె దీర్చగా నెంచి నవ్వు చిందించి యొక్క గురుకులము జేరి గురువుల గొలువసాగె! 72
ధర్మ్షదండం 27
అట పురాకృత పుణ్య భాగ్యంబు వలన నేమొ? లేకున్న సకల దైవేచ్చ వలన నేమొ? కరతలామలకమై నెగడు భంగి విద్యలన్నియు శంకర వేద్యమయ్యె! 73 పనస జేప్పును; జటాఘనలందు నద్భుత
ప్రావీణ్యమొందె నీ బాలకుండు; బుజ్మంత్ర పూత పారీణతా శక్తి సం
పాదించె జిత్రమీ బాలకుండు; ఉపనిషత్సార నిరుపమాన భావంబు
వ్యాఖ్యాన మొనరించు బాలకుండు; స్మృతి పురాణాది విస్తృత శాస్త్ర చర్చ సం
వాదంబు జేయునీ బాలకుండు వాడు నారాయణుడొ లేక పరమశివుడొ కావలెను చూడ నన్యులీ కమమైన పాండితీ శక్తి గన నసంభవమటంచు దలపసాగిరి గురువులాదరము తోడ! 74 అరటిపందునొల్చి వడి నాస్యంబు నందు నుంచు భంగి శంకరుడు గుణోత్తమంబు నైన 'బాలబోధా సంగ్రహమ్ము' వ్రాసి తానె బోధించె దన సహాధ్యాయ తతికి! 75
౫ ధర్నదండం కనకామలక వర్షము అచట ననుదినంబును ఖిక్షకరిగి మాధు కరము గొని వచ్చుచుండె శంకరుడు విధిగ నాతడొక నాడు పేద బ్రాహ్మణుని యింటి కరిగి 'భవతి భిక్షాందేహి' యనుచు బిలిచె! 76 అంతనొక పేద బ్రాహ్మణి యరుగుదెంచి “నాయనా! నిండుకొనెను ధాన్యంబులింట; మీ కొసంగ నా వద్ద నేమియును లేదు; నన్ను మన్నింపుడ”ని వందనమ్ముసేసె! 77 అంతట శంకరు“డమ్మా! చింతింపకు మింట నున్న చిరుఫలమైనన్ అంతఃకరణ విశుద్ధి న నంత (పప్రేమంబుతోడ నందింపగదే” 78 అననామె గృహములోనికి జని యొక ఆమలక ఫలము సంతోషమునన్ గని దాని శంకరున క రృణ జేసిన 'దోం నమశ్శివాయ” యటంచున్! 79 ఆ సౌజన్య మనస్వి భక్తికి ననంతానందమేపార నా ధీ సంసర్ద సుళోభితుండు కరుణా దృష్టిన్ ప్రసారించి త ద్వాసంబందున గాంచనామలకముల్ వర్షింపజేయంగ ల క్ష్మీ సంస్తోత్రము సల్పి వారలకు సంక్షేమంబు గూర్చెన్ గృపన్ 80
ధర్నదండం ణి
“స్తీవక్రానీకమునకు విశేషకరుణ
సకల కామ్యార్థ సౌభాగ్య సంపదలిడు
నినుమురారి ప్రియను గొల్లు నే సతమ్ము
భక్తి త్రికరణశుద్ధిగా ప్రణుతిసేతు! న! యత్మ్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః | సంతనోతి వచనాంగమానసై స్త్వాం మురారి హృదయేశ్వరీంభణే 1
కమల! కమలాక్షురాణి! నీ ఘనదయాగర్ధ
దృక్కులను నాపయిన బ్రసరించుమమ్మ!
దీనులంబ్రథముండగు మానవుడను;
నీ యనుగ్రహార్మడను; సంధింపుము కృప! 82 కమలే కమలాక్ష వల్లభే త్వమ్ కరుణాపూర తరంగితైరపాగైః ॥ అవలోకయ మా మకించనానామ్ ప్రథమమ్ పాశత్రమకృత్రిమమ్ దయాయాః ౫
చారు బిల్వాటవీ మధ్య సరసియందు
గల సహస్రదళాన్విత కమలమందు
తనరు స్వర్ణ ప్రసూన హస్తవుకదమ్మ!
పసిడి మైచాయ గల తల్లి! ప్రణతిసేతు! న! బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్ | అష్టాపదామ్భోరుహ పాణిపద్మామ్ సువర్డ వర్దామ్ ప్రణమామి లక్ష్మీమ్
ధనికవర నివాసముల చెంత నిలుచుకొని
వారి నర్ధింప వలసెడు బ్రహ్మవ్రాత
నీ చరణ కమలమ్ముల - నిలిపి యింట
మార్చివేయుము; కృప జగన్మాత! జోత! 84
30 ధర్మదండం కమలాసన పాణినాలలాటే లిఖితా మక్షర పంక్తి మస్య జంతో: ॥ పరిమార్థయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్టీమ్ 1 పొాలతి! తామరపూవు నీ పుట్టినిల్లు; మెత్తనగు హరి హృదయమ్ము మెట్టినిల్లు రమ్ము! నా హృదయారవిందమ్ము నీకు మహిత లీలా గృహమ్ముగా మలచుకొనుము 8్ అంభోరుహమ్ జన్మగ్భహమ్ భవత్యా: వక్షస్థ్రలమ్ భర్తృగృహమ్ మురారేః | కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహమ్ మే హృదయార విందమ్ ॥ అట్టి కనకధారాస్తవ మనుదినంబు నింపుగా నెవ్వరిల బరియింతురట్టి మానవులమిత సుగుణ సంపత్తినొంది వైభవోపేతులై భువి వాసి గాంత్రు! ఈ సప్తమ వర్షంబున సం (ప్రాప్త సుధీనిధిగ మారి బాలుండు యశో దీప్తి చెలంగగ స్వగ్భృహము దృప్తింజనె గురుని సమ్మతిన్ సంప్రీతిన్! 87 అటుల పుంభావ వాణిగా నలరి యిల్లు చేర వచ్చిన పుత్రుని జేరదీసి ముఖము ముద్దులతో నింపె ముదిత - కొమరు శిరము నిమురుచు నక్కున జేర్చుకొనియె! 88
ధర్మదండం 31 గురుకులపు విశేషమ్ముల జరిగిన సంగతులనెల్ల సవివరముగ శం కరుడార్యాంబకు దెల్పెను మరి మరి సంతసమునందు మాతన్ దేల్చెన్ ! 8 కనకధారా విషయమును వినియుగూడ తల్లి మాయా వశంబున దన కుమారు దేవ దేవునిగ నుతింప బోవదయ్యె దైవ కృప కలదని మాత్రమే వచించె! 90 కృష్ణలీలలను యళోద కేవలమ్ము కలయొ వెష్ణ్ర మాయయో కాదగునని తలచు రీతి నార్యాంబ యాత్మజుని మహిమ నెంచ దయ్యె, దైవమని స్తుతించదయ్యె! వ! పురమునకున్ రాజయినన్ చరాచర ప్రకృతి కొలుచు స్వామియె యైనన్ అరయగ దల్లికి గొమరుడె మురిపమ్ముల మూటగట్టు ముద్దుల సుతుడే! 92 పూర్ణా ప్రవాహ వివర్తనము పొలతి ప్రతిదినంబు పూర్ణా స్రవంతికి నేగి జలము దెచ్చునిల్లు చేరి యలసి సొలసి పోవు నల్లంత దూరంబు నడచి నడచి పడతి యిడుములొందు! 983
32 ధర్మదండం
శంకరుడిది గమనించి శు
భంకరమగు పుణ్యనదము భాగీరథినిన్
సంకల్పించి స్తవమ్ముల
నంకితమిడి వందనములనాద్భతి సల్పెన్! 904 “అవలోకింపుము మాతృకృత్చముల నమ్మా! దేవి! భాగీరథీ!
జవ సత్వంబుల గోలు పోయి శ్రమకున్ స్వాధీనయై దీనయౌ
నవనీతోపమ చిత్త మజ్జనని కానందమ్ము జేకూర్చనా
శివ జూటాటవి వీడి రావె! త్రిజగత్ (శ్రేయస్కరీ! జాహ్నవీ! రి్ భవదీయాద్భుత దివ్యభవ్య చరితల్ వర్ణింపగా నాది శే
షువె యైనన్ సరిచాలడంబ! దివిషద్ శుభ్రాపగా! వేగమే
భువికిన్ చేరగ రావె! యుద్ధృతముగా పొంగించు పూర్ణానదిన్
శివ జూటాటవి వీడి రావె! త్రిజగత్ శ్రేయస్మరీ! జాహ్నవీ! 96 లవలేశంబయినన్ శ్రమంబునకు దాళన్ లేని మాయమ్మ యా
రవి తీక్టంపు మయూఖ తీవ్రతకు ఘోరమ్మైన కష్టంబులన్
జవి జూచెన్ ఇక చాలు; సౌఖ్యముల దేల్చన్ న్యాయమామెన్; వెసన్
శివ జూటాటవి వీడి రావె! త్రిజగత్ (శ్రేయస్కరీ! జాహ్నవీ!” 97 మరునాడుదయమునకు శం
కర సద్మ సమీపమందు ఘనతర వేగ
స్ఫురితంబై పూర్చానది
చరియించుచు బురజనాళి జకితుల జేసెన్! 98
ధర్మదండం ప!
గలగల పారెడు పూర్ణా జలముల గమనించి గ్రామజన సంఘము దో హలమున నచటకు జేరెను
బిలబిలమని శంకరార్యు వినుతింపగన్ 99 అమిత దూర ప్రదేశమ్మునందు పారు
'పూర్ణ తమ సమీపమ్మున బొల్చ్బుకతన
కష్టములు తీరి కాలడి కాంతలెల్ల
సంతసించిరి మదిలోని చింతబాసి 100
రాజశేఖర సంప్రార్థనము - శంకరానుగ్రహము
అంత శంకరార్యుల మహిమాతిశయము
(గామ గ్రామాంతరంబుల (గ్రమముగాను
తెలియజొచ్చెను; కేరళాధీశుడైన
రాజశేఖరుడీ కథాశ్రవణమూని 101 అతని దర్శింపగా కుతూహలము నొంది
మంత్రివరు బిలిపించి ధర్మప్రణీతు
శంకరార్యుని మహిమల సంస్తుతించి
పంపె కాలడి శంకరు స్వాగతింప 102 ధన కనక వస్తువాహన
ఘన సంభారములతోడ గాలడికేగెన్
తన రాకకు గల కారణ
మును సచివుడు శంకరునకు ముదమున దెల్పెన్ 103
34 ధర్మదండం “దండమిదే వటూత్తమ! నితాంత యశస్సముదీర్ద! మత్త వే దండమదే కనుంగొనుము! తద్గజరాజమునెక్కి రాజ మా ర్వాండుడు; కేరళాధిపతి; రాజకులాగ్రణి; రాజశేఖరో ద్దండ విరాజమానునకు దర్శనమిచ్చి యను(గ్రహింపుమీ! 104 కాంచన భూషణమ్ముల, చకచ్చకిత ప్రభలీను పీతచే లాంచల సంచయమ్ముల, గజాశ్వ గణమ్ముల భక్తితో సమ ర్పించి తరించి మీ కృప జరింపగ నెంచిన రాజశేఖరుం డంచిత రీతి బంచెనను సాదృతి మిమ్ముల స్వాగతింపగన్! 105 అనవిని చిరునవ్వులతో సునిశిత సంభాషియై సుశోభిత మతియై వినయాంచితుని 'సుబుద్ధిని గని పల్కెను శంకరుండు కరుణామతియె! 106 “బ్రహ్మ చర్యాశ్రమంబున బరగుమాకు భూషణములేల? ధనమేల? భోగతృష్ణ చేరబోదు మా మానససీమ; సుమతి! వాహనమ్మధిరోహింప వాంఛలేదు! 107 జ్ఞానశ్రీ కమనీయ రూప విలసత్మల్యాణ సంధాన ని త్యానుష్టాన విధి వ్రతంబు గను మా కాటంకముంగూర్చు నీ యానంబంతియ కాక మాధుకరమే యాహార సంపాద్యమౌ దానింగూర్చి విచారణమ్ము గననౌ ధర్మజ్ఞ! ధీ సంయుతా!” 108
ధర్క్మదండం 3
అనుచు శంకరార్యుడావ్వాన విజ్ఞప్తి మృదువుగా తిరస్మరింప - మంత్రి మరలి వెడలి రాజ మార్తాండ సభ జేరి విషయమెల్ల విన్నవించి నిలిచె! 109 అంత నా రాజు చింతించె నమ్మవాత్ము
నిటకు రప్పింపబూనుట యెంత సాహ
సమది? నింగిని నేల జేరుమని పెక్కు
విన్నపమ్ముల జేయ వివేకమౌనె? 110 ఈ గతి భూధవుండు గణియించి తనంతట తానె యమ్మహా
యోగి వతంసు చిత్సుఖమయున్ గనులారగ గాంచ నప్పుర
మ్మేగెను; మున్ను తొను రచియించిన సంస్కృత నాటక త్రయ
శ్రీ గుణ సంపుటమ్ముగొని చేరెను శంకరు సమ్ముఖంబునన్! 111 చేరి యచటనంతేవాసి సేవితుడగు
జ్ఞాన మార్గ బోధకుని శంకరుని గాంచి
మైల సాష్టాంగపడి రాజు మొక్కె భక్తి
నతని దీవించె యోగి గాధానురక్తి 112 “వందనమ్ము నీకు ప్రణవ స్వరూప! నిన్
గొంచినంత దొలగు గల్మషములు
పాహి శ్రీకరా! శుభంకరా! శంకరా!
కావుమయ్య! నన్ను గరుణతోడ! 113
ఆ ధర్మదండం నారచించినట్టి నాటకత్రయమున సుగుణ దోషగణము జూపుమయ్య వాణి నీవె స్వామీ! వాచస్పతివి నీవె కవులలోన గొప్ప కవివి నీవె!” క్షేషత అని వేడి రాజు నాటక ఘన సంపుటి శ్రోతృసుజన కర్ణామృతమున్ వినిపించి శంకరార్యున కెనలేని ముదంబు గూర్చె నిష్టాగోష్టిన్! కే15 దాన సమ్మోద భరితుడై ధర్మవిదుడు (శిత శుభంకరుడా రాజ శేఖరునకు తుష్టి గల్గించగా నెంచి దురిత దూర వర్తనుండయి సల్పి సంభాషణమ్ము! 116 “శుభమగుగాక! నీ కురుయశోధన! నిశ్చల చిత్తధీ రమా విభవము కల్గుగాక! మహి విస్ఫురదద్భుత రాజ్యపాలనా ప్రభలు వెలుంగుగాక! ప్రజభాగ్యములొంది చరించుగాక! నీ కభిమత సిద్ధికల్లుననయమ్ము ధరాతలమందు భూవరా! 117 విబుధ సంస్తుతములై వెలయు నీ నాటక త్రితయంబు సత్యంబు క్షితిపతీంద్ర! చెవుల కిక్షురసంబు చవి జూపితివి నీవు సంతసమ్మయ్యె నీ చింతనడతు కృతుల గంటివి కాని సుతుల గాంచగ లేక నమిత మనోవ్యధ నందినావు; నా చెప్పిన విధంబు నడచుకొమ్ము నరేంద్ర భావి సత్సుత్రుని బదయగలవు!
ధర్మదండం 37 నా కొరకు దెచ్చినట్టి ధనంబులెల్ల విప్రవరులకు నర్చించి వినుతిజేసి ప్రీతి నొానరింపుమయ్య విఖ్యాతమైన పుత్రకామేష్టి యాగంబు పుణ్యమలర! 118 కొమరుడొక్కరుండు కులదీపకుండయి కలుగు నీకు నచిర కాలమందు వెళ్లి రమ్మటంచు వివరించి శంకరుం డభయ హస్తమెత్తి శుభముబలుక 119 “వేదవేద్య! నీకు పాదదాసుందనై సతముసేవజేతు శంకరార్య! వంశవర్ధనమ్ము వరలునుపాయమ్ము దెలిపినావు; ముదము గలిగెననుచు- 1200 ఆ సురుచిరమతి భూపతి భూసురులకు ధనముబంచి పురమేగి శుభా వాసంబగు యాగంబును జేసెన్స్ పుత్రకుని గనె నచిరకాలమునన్! [2 పారమార్ధికమైనట్టి పరమపదము నొసగు సాక్షాత్ మహేశానుడూహజేయ లౌకికమ్మగు సౌఖ్యమలభ్యమౌనె? కోరుకున్నది క్షణములో చేరకున్నె? 122
3౫8 ధర్మదండం
అంతట నాదేశపు పలు
ప్రాంతమ్ముల నుండి వచ్చు భక్త గణమ్ముల్
చింతల నదచుమటంచున్
సంతతమా విభునిగొల్వ సాగినవచటన్ 123 శంకర సన్యాస స్వీకార నిర్ణయము - మాతృ్ళవేదనము
కడచెను కొన్ని నాళ్లు; తన కారణ జన్మము గూర్చి సల్పె బా
లుడు మది జింతనమ్ము; “ఇహలోక గతమ్మగు బంధు బంధమున్
అడచిన గాని నాకు పరమార్ధమలభ్యము; మాతృసమ్మతిన్
వడిగొని సన్యసింపవలె; బంధ విమోచనమందగావలెన్! 124
నేనిచ్చోటనె యున్నచో నిగమవాణీ ధర్మ సంస్థాపనా
నూన ప్రక్రియ పెక్కు విఘ్నముల పొందున్; విశ్వ సంచారినై
జ్ఞానశ్రీ సుమ సౌరభమ్ములను పంచన్ దల్తు నీ భారతో
ద్యానమ్మందున వేదవాజయ మహాధ్యాయంబు సృష్టింపగన్! 125
అంతియగాక సతమ్మున్
పంతంబున కుమతులెల్ల వైదిక మతమున్
చింతాక్రాంతమ్మని నిం
దింతురు; నేనిట్టి దోష మీకొనవలెనే? 126
వారల ధాటికిన్ భరతవాక్యము బల్మెద; భారతొంబకున్
శ్రీరమణీయ ధర్మ తులసీ దళ దామమలంకరించెదన్
పారమెరుంగలేక భవ బంధ మహోదృత సాగరమ్మునన్
గూరుకుపోవు మానవులకున్ హితబోధల సంతరించెదన్ ! 127
ధర్మదండం 39 వ్యక్తిగత సర్వబాధా నివారణమ్ము పొంద నన్నిట జేరె నీ పుణ్య జనము; నేనిచటెయున్న సార్వజనీనమైన వేదనల తొలగింపగా వీలుపడునె? 128 క్రర్తవ్యమ్మిది, సన్యసించి భరతక్ష్మా క్షేమ సంధాన సం పూర్తిన్ జేయదగున్, మహత్వసమయ స్ఫూర్తిన్ ప్రయోగించి దు ర్వర్తుల్ జేసెడి దుష్ప్రచారముల లేవన్ రూపుమాపన్ దగున్; ఆర్తిన్ బాపి యిలాతలంబు పయి వేదార్థమ్ము నిల్బందగున్ !” 129 తనదు నిర్ణయమ్ము దల్లికి వివరించె సన్యసింపదలచి శంకరుండు కూలబడియె నామె నేల - మాటలు రాక మొదలు నరుక బడిన [మోడు వోలె; 180 అశనిపాతమయ్యెనా మాట తల్లికి; హృదయ శల్యమట్లు హింసపెట్టె; చేదు మింగురీతి చీకాకు పడి పెద్ద ప్రాణ సంకటమున బడతినిల్చి; క్షం1 కష్టసుఖమ్ములన్న నొక కావడికిన్ గల కుండలంచును తృృష్ట విరాగ భావముపదేశము జేయుచు నశ్వరమ్మె యీ సృష్టి సమస్తమంచు వివరించెడి పుత్రునిగాంచి య(శ్రువుల్ వృష్టియనన్ స్రవించె నపహృద్వచనమ్ముల నాలకించుచున్ ! 132
40 ధర్మదండం “అంయేమీ! పరిహాసమా? యిది నిజమ్మా? పల్ముమోవత్స! నీ ప్రాయమ్మేమి? విరాగభావయుతమౌ వాగ్జాలమేమీ? యఖభి
ప్రాయమ్మెందులకిట్టు లేర్పడియె నెవ్వాడిట్లు బోధించె? నీ
కీ యాలోచన మెట్లు గల్గెననకోయీ యిట్టి దుర్వాక్యములి! 133 కానక గాంచినాను; మమకారము పొంపిరివోవ నిన్ను నా
ప్రాణ సమానుగా దలచి రంజిలుచుందును; నా పసిండి కొం
దా! నిను బాసి యొక్క క్షణమైన ధరన్ మనజాల; జీవ సం
యానమడంగి పోవు; హృదయమ్మిది ఖండములై నశించెడిన్! 134 శ్రీ కల్యాణ గుణాభిరామ; సుమనస్సీమంతినీ నవ్య ది
వ్యాకారాన్విత చారుసీమ నొక కన్యారత్నమున్ గూడి సౌ
ఖ్యాకూపారము నందు దేలి మన వంశాఖండ వృక్షంబు మా
రాకుల్ వేయగ జేయుమయ్య! మదఖభీష్టాపూర్తి నో నందనా! 135 వత్స! మీ పితృపాదులు స్వర్గమేగి
తనదు జ్ఞాపికగా నిన్ను ధరణి నిల్చి;
నీవిపుడు సన్యసింపంగ నెట్టులోర్తు
వలదు నా మాట వినుమని” పలికె నామె 136 తల్లిమాటకడ్డు తా జెప్పలేక శం
కరుడు మిన్నకుండె; కాలగతిని
దైవమే మనోరథప్రాప్తి జేయంగ
గలదటన్న నమ్మకమ్ముతోడ! 137
ధర్మదండం 41 మాతృభక్తియు నొకవైపు; మాతృదేశ భక్తి యొకవైపు నెటువైపు పలుకవలయు? కాలమే యన్నిటికి పరిష్కారమగును పిదప నేమగునో యది విధి లిఖితము 138 మకర విన్యాసము - శంకర సన్యాసము (గగ్రామసమీపమందుగల రమ్య జలాన్విత 'పూర్ణ నామకం బై మహిత ్రసిద్ధిగని పర్వెడు నా నదిలోన స్నానముల్ తామెసగంగ జేతుమని తల్లియు శంకరుడేగిరా నదీ సీమకు నొక్కనాడు విలసిల్లగ భానుడు ప్రాబ్నగంబునన్ ! 139 స్నానము జేయగా దిగెను శంకరుడా తటినీ జలంబులన్ పూనిక నార్యమాంబ మది పొంగగ తీరము నందునిల్చి తా మానసమందు (్రేముడి సమస్తము పొంపిరివోవ జూచె సం ధ్యానియమ ప్రశస్త గుణధన్యుని సూనుని ధ్యానమగ్నునిన్! 140 నిశ్చలముగ నున్న నీటిలో నెద్దియో చలనమేర్చడంగ శంకరునకు ధ్యానభంగమయ్యె, దర్శించె నతిఘోర వికృత రూపియైన మకరినతడు! 14] భీకర కరాళ దంప్రా వివృత మహోగ్ర వక్రయైనట్టి నక్రమవాప్త శౌర్య భాతియైరేగి శంకర పాదమొండు పట్టి లాగంగ బూనెడు బలముతోడ! కే492
42 ధర్మదండం దాని దొలగంగ జేయగా దగిన శక్తి లేక పెనగులాడుచు 'దైవ లిభితమెవరు మార్చగాగలరనుచు” నెమ్మనమునందు భావనము జేసి తల్లితో బలికెనిట్లు! 143 “అక్కట! మకరి ముఖంబున జిక్కితి నేనెట్లు దీని చెర బాయుదు; హా! మిక్కుటమగు బలమున న న్నిక్కట్టల పాలుజేసి యీద్చెడు వేళన్! కేశ అమ్మా! సన్నాసమ్మున కిమ్మానతి నన్న నప్పుడీ కుంటివి; కా లమ్మయ్యెనిప్పుడైనన్ వమ్ముగ పోనీకు నాదు వాంఛన్ గరుణన్” 145 అని కొమరుండు పల్మగ మహాభయకంపితయౌచు సమ్మతిన్ జనని యొసంగె నంతనటు శంకరుడున్ బఠియించె దీక్షతో ననుగతమైన (్రైష విరజాది మహాద్భుత మంత్రరాశి, నె మృ్మనమున సన్యసించె; వెస మాయురె! నక్రము మాయమై చనెన్! 146 ఎంత యాశ్చర్యమ్‌ది! పాదమంతదనుక పట్టి లాగెడి మకరంబు తుట్ట తుదకు జలములోన నదృశ్యమై చనియె వేగ; దైవ లీలలు కడు విచిత్రములు సుమ్ము! కేశ?
ధర్మదండం గ్ సకల పంకిల మయము సంసార జలధి లోనికిన్ లాగు మాయా విలోల మకరి గెలిచి పావన సన్న్యాస ఫలమునొంది సంతసించెను శంకరస్వామి మదిని 148 అశ్వయుజ శుద్ధ పూర్ణిమ - అశ్వనీ యు తమ్ముగా నొప్పు నాసమయమ్ము నందు సన్యసించిన నవవర్ష సంయుతుండు శంకరార్యుండు శ్రద్ధతో జనని గొలిచి- 149 “ఏగుచునున్నాన”నగా “నాగతి యేమనుచు” దల్లి నందనునడిగెన్ ఆ గంభీరాత్ముండను రాగమ్మున బల్కె ప్రేమ ప్రసరించు గతిన్! 150 “నీవేకాలమునన్ స్మరించినను నేనీముందు ప్రత్యక్షమై నీ వేద్మన్ సకలంబు దీర్చుదిక నే నీ యంత్య కాలంబునన్ సేవాయత్త దయాగర్ధ మానసమునన్దేతున్ సమస్త క్రియల్ నీవే చింతల గ్రుంగకింక దయనన్దీవించి పంపించుమీ” 1651 అనుచు నింటిని వీడి దేశాటనమ్ము సలుపగా నెంచి తన కవసరములైన వస్తు సామగ్రి చేబూని భక్తితోడ నార్యమాంబకు వందన మాచరింప- 152
తశ ధర్మదండం “సర్వదా శుభమస్తని జనని పల్కి శంకరుని లేవనెత్తి బాప్పముల తోడ వీడ్మాలిపె నార్న ధర్మ సంవృద్ధియాగ నిర్వహణమున కేగు ధీనిధిని కరుణ! 153 అఖిల మతాశ్రమ సందర్శనము - అద్వైతేతర మత ధర్నణము నాటికి భారతమందున దీటుగ పెంపొంది జైన తీర్ధంకరులున్ గాటంబగు నాటోపము పోటీగా జూపినారు భువి బౌద్ద్భులకున్! 154 బౌద్ధ జైనాశ్రమాళి ప్రపంచమందు పుట్టగొడుగుల విధమున పొటమరిల్లె వీటితో బాటు దేశాన వివిధమైన యితర మతములు పెక్కు వర్తిల్లుచుండె! 155 శాక్తేయ మతము - ఆది శైవ మతంబును; చార్వాక మతమును; సాంఖ్యమతము; ప్రాభాకర మతంబు; పాశుపత మతంబు; వైశేషికంబును; భాట్ట మతము; మాధ్యమికమ్ము; మీమాంసక మతము, వై భాషిక మతమును, బ్రాహ్మమతము; ఐక్యవాది మతంబు, నక్షపాద మతంబు నేకేశ్వరంబు; లోకైక మతము;
ధర్హదండం తర్ లిన్నిమతములవారు మాదన్న మాది గొప్ప మతమని కలహించు కొనుచు నాశ్ర మమ్ము లేర్చరచిరి భారతమ్మునందు (ప్రజలలోన మతప్రచారమ్ము కౌరకు 156 వీనిని దర్శించి స్థిర జ్ఞాన ప్రతిపాద్య మతము సకల జనులకున్ దానే తెలుపగ మనమున బూనెన్ శంకరుడు తనదు పూర్ణప్రజ్ఞన్! 157 అన్నీ మతములలోన సర్వోన్నతంబు కనగ నద్వైత మనుచు శంకరుడు తలచి దాన విద్వత్తు నార్జించ దగిన బోధ జేయు గురువరు జేరగ జింతజేసె! 156 గోవిందయతి దర్శనము - బ్రహ్మవిద్యా సముపార్ణనము అభిల శాస్త విద్యలార్జితమౌగాక గద్యపద్య శక్తి కల్గుగాక! గురువులేని విద్య గ్రుడ్డి విధ్యయటంచు శంకరుండు మానసమున నెంచె 159 “అనురాగంబున జేర దీసెడు గురుండద్వైత భావంబుతో దన విద్యా మహిమా విశేషముల సంధానించునాచార్యుడీ ఘన విస్తార సమస్త భూతలమునన్ గాన్పించునే? యింకపై ననిశంబాతనికై ప్రయత్నముల జేయంబూనుదన్వేషణన్” 160
4 ధర్మదండం అని భావించిన శంకరుండు భరతవ్యాప్త ప్రయాణంబులో
జనె పుణ్యావహ నర్శ్మదాపగ సవేశంబందు పొల్పొందు స
జ్ఞన గోవింద యతీంద్రునాశ్రమము గాంచన్ దైవ సంకల్పమో?
తన యాత్రా సముపార్దితానుభవమో? ధన్యత్వ సాఫల్యమో? 161 సరగుననేగి సత్వగుణ సాంద్ర యతీంద్ర పదాంబుజంబులన్
శిరసున మొక్కి శంకరుడచేష్టితుడై వినయంబు జాటుచున్
గరములు (మోడ్చి మైమరచె; గన్గొని బాలుని సంయమీంద్రుడున్
బరవశుడౌచు మై నిమిరి భవ్య ముదంబును పొందెనాదటన్! 162 కొంత తడవుకాగ గోవింద సంయమి
పైకి లేవనెత్తె బాలయతిని
భక్తి శంకరుడనురక్తి నా గోవిందు
డొనరిరప్పు డొకరి నొకరు చూచి 163 నీవెవరని ప్రశ్నించెను
గోవింద యతీంద్రుడప్పు గుణమతి తన స్వా
భావికత దెల్పె స్థిరముగ
పావనమై తనరునట్టి పల్కుల తోడన్! 164 “నిర్వికల్ప నిరాకార నియతుడేను;
జ్ఞాన కర్మేంద్రియాది సంగతుడగాను;
నేను నిర్బంధుడను; మోక్ష నిరతి లేదు;
చిన్మయుండైన వాడ నే శివుడ శివుడ! 165
అహమ్ నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్! నవా బంధనమ్ నైవ ముక్తిర్నబంధః చిదానంద రూప శివోహమ్ శివో హమ్!
ధర్మదండం 47 దేహమింద్రియములుగాను; తెలుపబూన నంతరంగ మహంకార మసలెకాను, ప్రాణవర్గంబు బుద్ధికాదేను; క్షేత్ర విరసుడేను; దారాపత్య విత్తదూరు డేను; ప్రత్యగాత్ముడ శివుండేను సాక్షి? 166 నాహమ్ దేహో నేంద్రియాణ్యంతరంగః నాహంకారః ప్రాణవర్లో న బుద్ధిః | దారాపత్య క్షేత్రవిత్తాదిదూరః సాక్షీనిత్యః ప్రత్యగాత్మా శివోఇ హమ్ ॥ అని యీ గతి వచియించిన గనుగొని గోవింద బుధుడు కడు సంతసమున్ గని శంకరుతో సంభా షణ మిట్టుల సల్పె ప్రియ వచస్సుధలూరన్! 167 ఎటనుండి వచ్చితి వీవు? “కాలడి నుండి” పేరా? “శంకరుడని పిలుచుచుంద్రు” తల్లిదండ్రులెవరు? “తల్లి యార్యాంబ; శి వ గురువు తండ్రి - దివంగతుండు”; దండ కమండల ధారివైతివదేల? “సన్న్యాసమును గొంటి సంయమీంద్ర!” ఏమేమి చదివితి “వెల్ల శాస్తంబుల” వాంఛితార్ధంబేమి? “బ్రహ్మవిద్య” కష్టతరమౌను వత్స! శంకర! “వహింతు” శిష్యుడై నేర్చుకొందువా? 'సిద్ధమేను' తప్పకీడేర్తు నీ కోర్కె 'ధన్యుడౌదు” ననుచు వారిరువురు మాటలాడినారు! 16&
న! ధర్మదండం అంత గోవిందయతి తురీయాశ్రమమను ప్రచుర సన్యాస దీక్ష నా బాలయతికి నొసగి శంకరాచార్యుగా నుచితనామ ధేయమునిచెను యతి సంప్రదాయరీతి; 169 అటు పిమ్మట శిష్యునిగా నటజేరిన శంకరుడు మహా వినయముతో జటిలమగు (బ్రహ్మవిద్యను దృటి కాలమునందు నేర్చె దిట్టతనమునన్! 170 అచట శంకరార్యుడమిత విద్వత్తుతో నార్షధర్మ గుణ మయమ్ములైన (గ్రంధరాజములను వ్రాసి యోగ రహస్య విధి విధానములను వెల్లడించె! క్ష శుభదాయక “వివేక చూడామణి'-హిత “సా ధన పంచకమ్ము' - “ప్రాతః స్మరణము; “యతి పంచకమ్ము; 'మాయావివరణము'ను “పంచీకరణము'ను - 'వాక్యవృత్తి; “నర్మదాష్టకము' - సుందర “రాజయోగ భా ష్యమ్ము' - “నిర్వాణ దశకము మరియు - మహిత యోగజ్ఞాన సహిత దివ్యగ్రంధ సంపుటమ్ములు; స్తోత్ర సంచయములు జాలువారెను పెక్కులా శంకరయతి అమృత హస్తమ్మునుండీ మవాద్భుతముగ; వాని దిలకింప గోవిందు మానసమున తృప్తి జనియించె; ప్రేమ రెండింతలయ్యె! 172
ధర్మదండం 4ం నర్మదా జల విజృంభణము - ఘటాకర్షణము ఇది యిటులుందడనొక్కెడ తప్రయీభువనాంతక జృంభణమ్మునన్ మదయుత దిబ్మతంగ వర మండలి బోలిన కారుమబ్బులున్ మెదలి దివమ్ము గప్పికొన మింటికి మంటికి నేకధారయెై వదలక కుండ పోతలుగ వర్షము వచ్చెను శ్రావణమ్మునన్ 178 ప్రకటాద్వైత మతమ్మునందున మహాపాండిత్యముంగాంచి వీ డకటా! శంకరుడింక వాదమున ధ్యేయంబూని నిర్ణించు మా కిక దిక్కెయ్యది? యంచు దుర్శతులు శోకింపంగ నా బాష్పముల్ సకల క్షోణిని చుట్టు ముట్టినవి వర్షాంబు స్వరూపంబునన్! 174 ఫెళఫెళార్భటులావిర్భవించి భీతి గొల్పె; పిడుగు పాటుకు గుప్పగూలె పసులు; నర్శదాపగ పరవళ్ల నలగిపోయి జానపదమెల్ల దిక్కుతోచక నిలిచెను! 175 జడివాన తడిసి యిడుముల బడి వెడగును బూని జడిసి వడి సుడిగాలిన్ వదకుచు గోవిందుని తమ యడజడి నడగింప పౌరులడిగిరి జడిమన్! 176 అతడా క్షణమున యోగ స్థితి బ్రహ్మానందమున వసించుట కతనన్ వెతల బడు పొరగణదు ర్లతి గాంచడు సుంతయేని కడునియమాప్తిన్; 177
50 ధర్మదండం “గోవిందుండలనాడు ఛత్రముగనా గోవర్ధనంబెత్తి దై
న్యావృత్తాత్ముల గాచె గోపతతి దా నాపన్న రక్షారతిన్
గోవిందాహ్వయ! నేడు దీనులగు మాకున్ దిక్కు నీవే కదా!
దేవా! కావవెయంచు జానపదులెంతేన్ భీతి (బ్రార్ధింపగన్ 178 వారి యాలాపముల విన్న ధీరగుణుడు
శంకరుండొక్క ఘటము హస్తమ్మునందు
పూని యభిమంత్రణము జేసి “దీని వరద
నీట ముంచుడు; కష్టమ్ము దాటుననియె” 179 పటుతర ధృతి గట గటమని
ఘటమా జలరాశి గ్రోలె కష్టము తీరెన్
స్ఫుట మహిమాలయు శంకరు
నిటలాక్షునిగా స్తుతించె నిఖిల జగమ్మున్ 180 దీనిని విని గోవిందుం
దానందము కల్గగ పులకాంకురములచే
మేనెల్ల సంభ్రమింపగ
వానిన్ బ్రియ శిష్యుబిలిచి భాషించెనిటుల్ 181
గోవింద యతి నియతి
“మున్ను కైలాసగిరి సర్వ ముని గణమ్ము
చేరి సభజేసె; నచటకు జేరవచ్చె
ధర్మగుణమూర్తి వ్యాసర్ని ధన్యకీర్తి
నిఖిల వేద విభాగసన్నియత వర్తి 182
ధర్మదండం 51 “ఆర్య! కష్టమయ్యెనర్థంబు గ్రహియింష; బ్రహ్మసూత్రములకు భాష్యమొండు వ్రాసి వాని మహిమ వ్యాపింపజేయుమీ” యనుచు వ్యాస మౌనినడిగి నంత! 183 “ఇంత విచారమేలకొ? యతీంద్ర! సమీప దినమ్ములందు నీ చింత యడంగు, నీకు ప్రియశిష్యుడు; శంకర నామధేయుడ త్యంత యళో విభూషితుడు తప్పక సూత్ర సముచ్చయమ్మునా ద్యంతముగాంచి భాష్యమొకదానిని గూర్చు వివాదభేదియె! 184 ఆతనిచే నభిమంత్రిత మై తనరెడి ఘటము నర్మదాపగ జలమున్ ప్రీతిగ గోలును; వరదల భీతిన్ నశియింపజేయు; వినుమీ సంజ్జన్”; 185 వ్యాసుండీగతి బల్మెన్ ఈ సంగతి జూడ నాతడీవే యనుచున్ జేసితి నే నర్ణయమును నా సందేహము తొలంగినది ప్రియశిష్యా! 186 నాయన! శంకర! నీ కిదె నా యానతి; 'పూర్తి జేతునా? యని మదిలో నే యాలోచన నీవిక చేయక యీ కార్యమెల్ల శిష్యా వినుమా! 187 రదర య్య (గ్రందాల్వు కా యయ
నా ధర్వదండం హైందవ సద్ధర్మంబును నిందాపాత్రమ్ముగా ననేక విధములన్ కుందగ జేయుచునున్నవి సందేహము లేదు బౌద్ధ జైన మతమ్ముల్ 188 ఏ మతముననుసరించిన నా మోక్ష పదంబు జేరనగునని భువిపై సామాన్య జన సమూహం బే మునిగె విచార వారి; విదితమె నీకున్! 189 అద్వైత మతమునందున సద్వైదుష్యంబు నీవు సాధించితి వా విద్వత్తుతోడ హైందవ విద్వేష లతావళికి లవిత్రంబగుమా! 190 శ్రీమద్వేద విభాగ భాజనుడు; కాశీనాథ సద్వీక్షణ శ్రీమంతుండు; పురాణకర్త సకలోర్వీజ్ఞాన సంధాయక శ్రీమద్భారత దివ్యకావ్య రచనోత్కృష్పుండు; వ్యాసర్ని ; నీ వామౌనీంద్రుని బ్రహ్మ సూత్రముల మాహాత్యంబు నాలించితే? 191 వ్యాసుని వల్ల శ్రీ శుకుడు నాతని వల్లను గౌడ పాదుడున్ వాసిగ బ్రహ్మ సూత్రగత వాజ్బయసారము నేర్చినారు; నే జేసిన పూర్వపుణ్యమున శిష్యునిగా నను జేరదీసి వా ణీ సమ గౌడ పాదయతి నేర్చెను తత్సకలంబు నాకొగిన్! 192
ధర్మదండం క తత్వ భావనా ప్రదాయకములు; మోహ వారకములు; జ్ఞాన కారకములు; వ్యాస విరచితములు; బ్రహ్మ సూత్రంబుల వాసి దెల్బదరమె బ్రహ్మకైన! 193 నేడు లోకమున పునీతములగునట్టి సూత్రములు విపన్న సూచితములు- వానినుద్ధరించి వ్యాసర్ని దీవెనల్ పొందవయ్య! యెడద పులకరింప! 194 విపరీతార్ధమ్ములతో విపులార్ధ విలీన శబ్ద విజ్ఞానయుతా నుపమ మహా సూత్రములకు నపచారము సల్పుచుండిరకటా! మూర్చుల్! 195 సత్యసంయుత మగురీతి - సరళశైలి (బ్రహ్మ సూత్రములకు నీవు భాష్యమొండు (వ్రాసి కుమత ఖండన జేసి వ్యాసమునికి సంఘటించుము సాదరాంజలుల భక్తి! 196 శ్రీ కాశీపురి జేరి విఘ్నపతి సంసేవించి, చింతించి కం " రేకాలున్ మదిలోన; వ్యాసముని పాండిత్యంబు గీర్తించుచున్ సాకల్యావృత పుణ్యశీలివయి భాష్యగ్రంథ నిర్మాణమున్ లోకక్షేమముగోరి కూర్చవలె నాలోచింపుమా! శంకరా! 197
రక ధర్మదండం
గురువును మించిన శిష్యుం
డరయగ శంకరుడనంగ నార్జింపవలెన్
చిరకీర్తి” యనుచు బల్మెను
స్థిర నిర్ణయచిత్తుడై యతిశ్రేష్టుండున్! 198 అన విని శంకరుండు వినయాన్వితుడై వచియించె “మీ కృపా
ధనము సమృద్దిగా గలుగ దప్పక కూర్చెద సూత్రభాష్యమున్
జనిత సుభక్తి భావమున సజ్జన తాపము బాయజేసి సాం
త్వన గలుగంగ జేయ జనెదన్ భవనాశికి వారణాశికిన్! 199 పూజిత! మీ యాజ్ఞావిధి
నే జేసెద సూత్ర భాష్య నిర్మాణంబున్
రాజిల్లజేతు హైందవ
తేజమ్మీ భువిని సర్వదిశలెసగంగన్!” 200 ఇటుల బల్ముచు శంకరుండెదుట నిల్చి
హస్త యుగ్మంబు జోడించి యంజలింప
సజల లోచనుడై శుభాశంస జేసె
గోవిదుండైన గోవింద గురువరుండు! 201 “పరమగురు గౌడపాదర్ని నరసియతని
దీవెనలనంది పిమ్మట దివ్యమైన
భాష్యమును వ్రాతునతని యావాసమునకు
వెడలుదమి”ని శంకరుడు గోవిందునడిగె 202 వల్లె యనెన్ గురువర్యుం
డుల్ల సిలెన్ శంకరార్యునుల్లము; గుణ సం
పల్లీన చిత్తుడగు యతి
తల్లజునా గౌడపాదు దర్శించుటకున్! 203
ధర్మదండం క్ గొడపాదయతి సందర్శనము
గోవిందుడు శంకరుడున్ భావింపగ జేరినారు బదరీ వనమున్ పావనుని భక్తితత్పర తా వందిత యతిని గాంచి తరియింపంగన్! 204 వికచ బింబాకార వృత్త మస్తకముపై
కాషాయ వస్త్రంబు గప్పువాని; తీరైన నుదుటిపై త్రితయ తిర్య(గ్రేఖ
లను దాల్చినిత్యంబు దనరు వాని; ధ్యాన ముద్రాప్తి సుందర నిర్మలాస్యుడై
పూర్ణ ప్రకాశంబు బొల్చ్బువాని; అక్షమాలయుగేల గక్షపాలయు('మైోల
గలిగి యోగస్థితి నలరువాని; సతత డైదండ్యు సద్గుణ శ్లాఘనీయు శ్రీశుక మహర్షి శిష్యు సౌశీల్యచిత్తు గౌడపాద యతీంద్రు శంకరుడు, గురుడు పాదపచ్చాయ గన్లొని ప్రణుతిసేయ 205 అంతనతండు కన్‌దెరచి యారసి శిష్యుని బృచ్చజేసి వృ త్రాంతము నాలకించి బహుధా ప్రమదమ్మును బొంది శంకరున్ సాంతము జూచి యోగ్యుడని స్వాంతమునందు తలంచి సర్వసి ద్ధాంత నితాంత వేత్తయగు త్ర్యంబకుడంచు నెరింగి యిట్లనెన్! 206 “వరమై-లోక జనాళి సౌఖ్య కరమై - వాగర్థ సంధానమై గురులోక స్తుతి పాత్రమై - సుకరమై - గోవింద సమ్మోదమై పరమామ్నాయ పవిత్ర మంత్ర మహిమన్ భాష్యంబు నిర్మింపుమా స్థిరమై వెల్లగ నార్షధర్మ విలసత్తేజంబు నిర్విఘ్నమై ! 207
56 ధర్మదండం
అ ప్రస్థానత్రయ భా
ష్య ప్రకటన కదరుముందె యల్లుము వత్సా
నా ప్రతన (గ్రంధమమో
ఘ్రతి మాండూక్యకారికకు భాష్యంబున్!” 208
అని పలికి గౌడపాదుడు
కనికరమున శంకరార్యుగని కరమున త
ద్వినమిత శీర్షము నిమురుచు
గొనియాడెను మిక్కుటముగ గోవిందయతిన్! 209 మాండూక్య కారికాధిభాప్యము : గౌడపాదాశీర్వాదము
శంకరుడు కారికలకు భాష్యంబు గూర్చి
గౌడపాదుని కర్పించి గౌరవించె
పరమ గురు దక్షిణను దీర్చి ప్రణతిజేసె! 210
“దయతో దీని బరిగ్రహింపుడు ప్రభో! దాసానుదాసుండ - మీ
నియమమ్మూని భవత్కృతిన్ జదివి మౌనీ! భాష్యమున్ గూర్చితిన్
ప్రియమారంగ వరీక్ష సేసి గుణముల్ విన్యస్తమౌ దోష సం
చయముల్ చూపుము; సంతసింతును; మహా జ్ఞానాకృతీ! సద్యతీ! “|
కనగనీ సర్వ విశ్వమోంకార సంయు
తంబు; భూతాది కాలత్రయంబు తత్స
రూపమై యొప్పునోంకార రుచియ చూడ
జగతిలో (ద్రికాలాతీత సర్వసృష్టి! 22
ధర్మదండం 57 ఓమిత్యే తదక్షరమిదం సర్వం తస్యోపవ్వాఖ్యానం భూతం భవత్ భవివ్యదితి 1 సర్వమోంకార ఏవ యచ్చాన్యత్రి కాలాతీతం తదప్యోంకార ఏన 1
- మాంద్యూక్యోపనిషత్ ప్రథమ మంత్రం అట్టి సర్వము (బ్రహ్మమీ యాత్మ బ్రహ్మ మనబరగు జతుష్పాత్తునౌనాత్మ; దాన సర్వమగు (ప్రణవము (బ్రహ్మ జగతి (బ్రహ్మ మగునటంచును దెలియంగ దగును జ్ఞాని; 218 సర్వం హ్యేతద్ర్రహ్మా అయమాత్మా బ్రహ్మ సోజ_యమాత్మా చకుష్పాత్ ॥ = ద్వితీయ మంత్రము ప్రథమ పాదంబునై బహిర్సజ్ఞగల్లి తోచు సప్తాంగముల తోడ; ద్యుతిని బొల్పు ఐదియు దొమ్మిది ముఖముల (బ్రహ్మవిదుడు! 214 జాగరిత స్థానో ఐహిర్పజ్ఞః! సప్తాంగ ఏకోన వింశతి ముఖః స్థూల భుగ్వైశ్వానరః ప్రథను పాదః - తృతీయ మంత్రము ప్రాజ్ఞుడును ద్వితీయ పాదమగును సూక్ష్మభోక్త కైజసుండు నేకోన ఏం శతి ముఖంబులెనయ సతము నిల్చు! 211 స్వస్న స్థానోం&..ఈః ప్రజ్ఞః సప్తాంగ ఏకోన వింశతి ముఖః ప్రవివిత్త భుక్తెజసో ద్వితీయ పాదః - చతుర్ధ మంత్రము
58 ధర్మదండం ఎచట సుప్తుండు కామ్యంబు నిచ్చసేయ కుండు; స్వపష్నంబు దర్భింపకుండు నపుడు పిలువగా బడునది సుషుప్తి స్థితిగను అందునానంద మయుడు నానంద భోక్త తనరు ప్రాజ్జుండు ప్రజ్ఞాన ఘనుడు సతము 216 యత్రసుప్తో న కంచన కామమ్ కామయతే న కంచన స్వప్నమ్ పశ్యతి తత్సుషుప్తమ్ సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞాన ఘనః ఏవా&.నంద మయోహ్యానందభుక్ చేతోముఖ ప్రాజ్ఞః తృతీయ పాదః - పంచమ మంత్రము ఈ గతి ద్వాదశ మంత్ర వి భాగమునకు శంకరుండు భాష్యము వ్రాసెన్ యోగీంద్రుడాకృతిని నను రాగంబున జూచి తత్వరసమున్ గ్రోలెన్ లె7 అ (గ్రంథమెల్ల నామూ లాగ్రమ్ముగ గౌడపాదుడరసి ముదమునన్ సుగ్రాహ్యమౌచు భావ స మగ్రార్థముగల్లు కృతిని మరి మరి పొగదెన్! 218 అనందంబున బల్కె నీ గతి “భళారా! శంకరా! గౌరవ స్థానంబందెదవీవు; గీప్పతి సహాధ్యాయిత్వమే సల్పినా వో? నైమిత్తిక భారతీ సతివి నీవో? ప్రోచు నీ భాష్య వా ణీ నిశ్రేయస భక్తి భావయుత సందేశంబు సద్ధర్మమున్!” 219
ధర్మదండం 59 అనాటికి భారతమున నానాటికి పెచ్చరిల్లు నయవంచకులౌ జైనుల బౌద్భుల దుష్ట త్యానీకము దెలియజెప్పెనటుపై నతదున్! 220 “క్రాంచుచునుంటివా భువిని? కాలము చేసెడి మాయగంటివా? సంచిత భవ్యపుణ్య ఫలసారముం బారమునిచ్చు వేద వి ద్యాంచిత తత్వమేగతి రయమ్మున గ్రుంకుచునున్నదో - ధరన్ సంచలనమ్మొనర్చుగతి సత్యగుణాన్విత భాష్యవాణి సృ స్టించుము; భారతీయ జన చిత్తములందు సుధర్మమున్ (బ్రతి స్టించుము; వేద తత్వము వచించుచు దుర్మత భావబోధ ఖం డించుము; నాకు తుష్టి గలిగించుము; పెంచుము భక్తిభావమున్ మించెడు శ్రద్ధ నీ సకలమేదిని నీవిక సంచరించుచున్” 221 అని పల్కి కాశికాపురి జనుటకు నానతి నొసంగ శంకరుడు యతీ శుని గూర్చి మొక్కి గోవిం దుని దీవెనగొని ప్రయాణ తుష్టుండాయెన్! 222 కాశీవుర మాహాత్మ్యము యావద్భారత పుణ్యతీర్ధ సముదాయంబందు సద్గణ్యమై కైవల్యప్రదమై ధరాతలమునన్ గైలాస సారూష్యమై శ్రీవిశ్వేశ్వర నిత్యవాసమయి సాక్షీభూత శర్వాణియె యావృత్తోత్క్మట భక్త సంఘమయి విఖ్యాతిన్ గనెన్ గాశియున్! 223
ణు ధర్మదండం గంగాభంగ తరంగ సంజనిత మాంగల్య ప్రమోదార్భటీ సంగీత ప్రియ భక్త బృందములు; భస్మవ్యాప్త సందీప్త స ర్వాంగాన్వీత జన వ్రజంబులు నమందానంద సందోహముల్ పొంగారన్ జిరకీర్తి గాంచెధర సంపూర్ణంబుగా గాశియున్ 224 సద్యోగ్యమగు విశ్వవిద్యాలయంబను పాండిత్య నిధి గల్గు వారణాశి; బాటసారులకు పర్యాటకులకు సత్ర వాసంబులను గల్లు వారణాశి; అన్నార్తులగు ప్రజ కన్నపూర్ణను బోలు వరగృహిణులగల్లు వారణాశి; మహిత మంత్రము 'ఓం నమళ్శివాయిను బేర్మి బల్కు భక్తుల గల్లు వారణాశి; కాలభైరవ ధుంఠి విఘ్నగణదేవ భాసురాలయముల గల్గు వారణాశి శరణు శరణన్న మాత్రాన సంతసించు వరదు విశ్వనాథుని గల్లు వారణాశి; 225 విశ్వనాథుడు తన కృపావీక్షణముల భక్త సంఘంబు దనుప నాసక్తుడైన నతని సహధర్మచారిణి యైన గంగ వారి దనుపును తన పుణ్యవారి మహిమ! 226 యాతాయాత సమస్త భక్త తత దీవ్యత్ స్థానమై ద్వాదశ జ్యోతిర్లింగ వితాన మందునొకటై శోభిల్లు కాశీపురిన్ ప్రీతిన్ జేరిన శంకరుండు రసవద్రీతిన్ పిసాళించి ని ష్టా తాత్సర్యము తోడనచ్చట ననుష్టానంబు సల్పెన్ వెసన్ 227
ధర్నదండం ళీ
పిమ్మట నాలయమును శీ ('ఘ్రమ్ముగ శంకరుడు చేరి కాశీనాథున్ సమ్మతి సందర్శించి శు భమ్ముల జేకూర్చమంచు బ్రార్థించెనిటుల్! 228 “పాహి! మవాదేవా! దా సోహమ్మీశా! ప్రదోష శుభకాలమునన్ మోహాతీతుడవగు ని న్నాహా! కనులార గాంచనయ్యెన్ స్వామీ! 229 “విశ్వేశ్వరా+ యన్న విడిపోవు భవభయ
పాశంబు; మోహంబు నాశమౌను; *హాలలోచన “యన్న భస్మమై పోవును
జ్వరరోగపీడ; స్వస్థత లభించు; “శితికంధరా” యన్న సిద్ధించు సకల కా “క్రాశీపతీ” యన్న గల్లు బ్రహ్మజ్ఞాన
సద్విద్య పాపంబు సమసిపోవు; పాహి! శివ! విశాలాక్షీ మనోహర! భవ! భాష్యరచనా మహాకార్య భారళీలి నైతి గోవింద గురువర్యునాజ్ఞచేత మార్గదర్శకత్వము సల్పుమా! మహేశ” 230 అని వేడి యన్నపూర్ణన్ గని చేతులు మోడ్చి ప్రచుర కారుణ్యమునన్ దన కార్యసిద్ధి జేయగ వినయంబున సంస్తుతించె వేయి విధములన్ 231
౪2 ధర్మదండం “దనుజస్తోమ వినాశకారిణి! నమో దాక్షాయణీ! పావనీ! అనిమేష స్తుత రూపిణీ! వితత భక్తానంద సంధాయినీ! జననీ! నిత్య యశస్వినీ! శత సహస్రాదిత్య సంభాసినీ! ఘన సౌజన్య మనస్వినీ! ప్రణతి! సాక్షాద్వేద చిద్రూపిణీ! 232 వ్ అక్షయ్యంబగు నన్నపానముల నోయమ్మా! ప్రసాదించుచున్ మా క్షుద్బాధల దీర్చు దీవటులె సమ్యక్ జ్ఞాన సంయుక్త ధీ భిక్షాదానముజేసి సత్మరుణతో వీక్షింపుమమ్మా! విశా లాక్షీ! రక్షిత భక్త సంతతి! సదా లక్షింతు నీ ప్రేముడిన్” 233 అటుల (బ్రస్తుతించి యాలయమ్మును వీడి వారణాశి నతడు వాసముండి కాలఖైరవాది గణముల గొలుచుచు బండితులను గలసి వాదమూనె 234 శాస్త చర్చల సలిపెడు సమయమందు శంకరుని ప్రజ్ఞ పండిత సంఘమునకు దేట తెల్లంబునయ్యె నా దేశమందు గ్రమముగా విస్తరించె శంకరుని కీర్తి! 235 కాశీపట్టణ శత్రుపండిత మతంగ వ్రాత కుంభస్థిత ప్రాశస్త్య ప్రతిపన్న మౌక్తిక మణి'ప్రాష్యైక పంచాస్యుడై దేశవ్యాప్తయశః ప్రసిద్దుడయి సందీపించెనా శంకర శ్రీశుద్దాత్ముడఖండ నైప్టికుడు రాశీభూత విజ్ఞానియై 236
ధర్మదండం య సనందనాగమనము - సన్యాస ప్ప్వీకారము ఇటుల శంకరుడచట వసించుచుండ నొక దినమ్మున విప్రబాలకుడొకండు (బ్రిహ్మరేజంబునుంబొల్పు 'ప్రభలతోడ జేరి యతి పాద యుగళికి జేసెనతులు! 237 చకిత మనస్సుడై యతని శంకర సంయమిలేవనెత్తి “బా లక! యిదియేమి? నీవెవరు? లక్షణముంగన విప్ర సత్కుటుం బకుడవు గాగ తోచెడిని; వత్స! నివాసపురంబునేది? నీ సకల చరిత్ర దెల్పుము; విచారణసేయుదు నం”చు బల్మ్కగన్! ౭58 అప్పుడా బ్రహ్మచారి స్వీయకథనిట్లు మృదుమధురగళంబున జెప్పె మించు శ్రద్ధ దానినాలించుచుందె నౌత్సాహికుండు సంయమీంద్రుడు సర్వజ్ఞ శంకరుండు! 239 “ఆర్యా! దండము; విష్ణుశర్మను, మహాత్మా! మీకు దాసుండ; కా వేర్యుద్వేష్టిత చోళరాజ్య విలసద్విప్రండ వేదాంత మా ధుర్యంబంతయు నాకు దెల్చి నను సంతుష్టుండుగా జేయు నా చార్యశ్రేష్ణుల చెంతజేర మదిలో సంకల్పమున్ కల్లగన్ జం దేశదేశంబులన్నియు దిరిగినాడ; గోర్కెనీడేర్చు గురువులగోచరంబు కాగ నేటికి జేరితి గాశికిందు మీదు ప్రఖ్యాతి నేవింటి మిక్కుటముగ 241
654 ధర్మదండం
ఇహలోకాభిల జాద్యవారక భిషక్ శ్రీయోగ ధీసంయుతా!
మహితంటబౌ కృపజూపి నన్ను ఘన సంసారాబ్టి దాటించి స
న్నిహిత జ్ఞాన మహోదధిన్ సతతమున్ దేలింప బ్రార్ధించెదన్
సహజానంద సమాహితా! శుభయుతా! సారస్వతాలంకృతా 242 సంసృతి విషాద బాధా
సంసర్గా క్రందితులకు స్టెర్యమొసంగన్
సంసిద్భులు మీరె; పరమ
హంస (్రేష్టులును మీరె యాలోచింపన్!” 243 అనుచు బల్కెడు విషప్రవరుని సభక్తి
భావతత్పరతా వాగ్విభవము మెచ్చి
(బ్రహ్మ విజ్ఞాన తత్వసర్వంబు దెల్ప
సఫల సన్యాస మొసగెను శంకరుండు! 2శక పిదప శంకరుండు విష్ణుశర్మాఖ్యను
మార్చి శుభ 'సనంద' మహిత సంజ్ఞ
నొసగినాడు; తద్వినూతన నామంబు
దాల్చి విప్రవరుడు తనిసినాడు 24ర్ నాటినుండియునచట సనందనుండు
ప్రథమ శిష్యుండునై శంకరయతి మెచ్చ
జేయుచుందెను శు(శ్రూష్య జిత్తమలర
గురుని యానతి సతళమ్ము శిరముదాల్చి; 246
ధర్మదండం జ్ శశిబింబిమ్మును, ప్రాంశు శీతనగమున్ జంభారి కుంభీంద్రమున్ రశ చంద్రప్రభ, కల్పవృక్షము, శరన్మేఘంబు, క్షీరోదధిన్ వశవర్తీకృత శంకరాగణిత నిర్వ్యాజాప్త కీర్తిద్యుతుల్ దిశలెల్లన్ వెలుగంగ - జేరినవి యంతేవాసి సంఘంబులున్ 247 వేదవేదాంత సారమావిష్మరించి “నజ హమ”ని తెల్పి యజ్ఞాన మోహ ఖండ నమ్ము సలిపెడు సమయాన నలువరాణి శంకరుని నాల్మపైన సాక్షాత్కరించు 248 మోహముధ్గర ప్రబోధము ఈ గతి విద్యాబోధా యాగమ్మొనరించుస్వామి యనుదినమును దా భాగీరథికిన్ జనుచున్ సాగించెడు నాహ్నికంబు సత్కార్యంబున్ 249 ఒక్క దినమున శంకరుందడుత్సహించి విశ్వనాథుని వీక్షింప వెడలుచుండి కనె 'డుకృజ్‌కరణే'ల వ్యాకరణ పాఠ మభ్యసించు వృద్ధుని మార్గమందు - పిదప 250 “చిత్రమిదియు నవ్టాధ్యాయి సూత్రజాల మందుగల (శ్రద్ధ పరమార్ధమందు సుంత నుండెనేనియు నితడు ధన్యుండగున”ని స్వామి భావించి సల్పెనీ సత్యబోధ! 251
ప! ధర్మదండం “నీవేమి చదువుచుంటివి? చెప్పుమోయి” - అ ప్టాధ్యాయి సూత్రాల వ్యాకరణము ; *ఫలమేమి”? - నే గొప్ప పండితుడను పేరు సాధించెదను; “దాన సౌఖ్యమేమి?” అమిత సంపదలతో హాయినొందెదను - “ఎంత దనుక?” - నే మరణించుదనుక - “పిదప?” సాధింపవలెను శాశ్వత సుఖమ్ము” సత్యమే! “దానికై కృషి సలుపుటెపుడు?” ఇప్పుడే! “సరి! కాలమ్ము వృథ సలుపక భక్తివిజ్ఞాన వైరాగ్య భావనముల తత్వచింతన సాధింపదగును (భ్రాత!” 252 “కాలమాసన్నమయిన - వ్యాకరణ సూత్ర గత 'డుకృజ్‌కరణే' నిన్ను గావబోదు; భక్తిగోవింద! గోవింద! భజన జేసి మూఢమతి మహోన్నతమైన ముక్తిగనుము 258 భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృజ్ కరణే మూధమతి! ధనాగమ తృష్ణ మునుగబోకు; చిత్తమాశారహితముగ జేయవలయు; కర్మఫల లభ్యమగు ధనాగమన మొంది నీ మనస్సున తుష్టి సంధింపవలయు 254 మూఢ జహీహి ధనాగమ తృష్టామ్ కురు సద్భుద్ధిమ్ మనసి వితృష్ణామ్ ॥ యల్లభసే నిజ కర్మోపాత్తమ్ విత్తమ్ తేన వినోదయ చిత్తమ్ |
ధర్మ్శ్మదండం 67
స్త్రీల స్తనభర నాఖీ ప్రదేశములను
గాంచి యధిక మోవావేశ గతిని గనకు;
రక్త మాంసావయవ వికారమ్ములనుచు
నహరహమ్మును చింతింపుమాత్మయందు; 2556 నారీస్తన భర నాభీదేశమ్ దృష్ట్వా మాగా మోహావేశమ్ ఏతన్మాంసవసాది వికారమ్ మనసి విచింతయ వారమ్ వారమ్ |
తామరాకున బిందువు తనరునట్లు
జీవనమ్మతి చపలమీ భావనము ని
జమ్ము; వ్యాధ్యభిమాన యుతమ్ము సకల
లోకమిది సర్వదా బృహత్ శోక హతము 256 నలినీ దలగత జలమతి తరలమ్ తద్వజ్టీవిత మతిశయ చపలమ్ | విద్ధివ్యాధ్యభిమాన (గ్రస్తమ్ లోకమ్ శోకహతమ్ చ సమస్తమ్ 1
ఎంత దనుక తా విత్తమార్ణించునంత
దనుక నిజపరివారమాతనిని గొలుచు
నాపయిన జరావస్థలో నతని గోడు
నింటిలో నెవ్వరేని వినించుకొనరు; 257 యావద్విత్తోపార్ణన సక్త స్తావన్నిజ పరివారోరత్తః ॥ పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తామ్ కోజ పి నష్ఫచ్ళతి గేహే ॥
దేహమున ప్రాణమున్నంత తెలుసుకొనెద
వే నశించిన నా దేహ విధము గాంచి
వాని భార్యయే వడకును భయము నొంది 258
ఈ ధర్మదండం యావత్సవనో నివసతి దేహే తావత్సృచ్చతి కుశలమ్ గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యావిభ్యతి తస్మిన్ కాయే ॥॥
అరయుమిది - నిత్యమర్ధ మనర్ధకరము;
దానిచే సుఖలేశమ్ము గానలేమ్ము
తనయునే కాంచి భయమొందు ధనికవరుడు;
జగతినెల్లెడలీరీతి సంతరించు; 259 అర్ధమనర్థమ్ భావయ నిత్యమ్ నాస్తి తతస్సుఖ లేశస్సత్యమ్ । పుత్రాదపి ధనభాజామ్ భీతిః సర్వత్రెషా విహితా రీతిః ॥1
బాలతతి క్రీడలందు; యువక గణమ్ము
సతత కాంతా నిరతి; వృద్ధ సంఘమెప్పు
డుత్కృటమ్మగు చింతల నొనరుచుండు
నెవ్వరా పరబ్రహ్మ జింతింపబోరు 260 బాలస్తావత్ క్రీడాసక్త స్తరుణ స్తావత్తరుణీ సక్తః వృద్ధ స్తావచ్చి న్తాసక్తః పరమే బ్రహ్మణి కోజ పి నసక్తః ॥
భార్యయెవ్వరు? పుత్రులెవ్వరు? విచిత్ర
మైన సంసారమిది తత్వమరసి - యెవడ
వీవెచటినుండి వచ్చితి వెరుగవలయు
భ్రాంతిలో మున్గిపోవుట భ్రాత! వలదు 261 కాతే కానా కస్తే పుత్ర స్స్పంసారోజ య మతీవ విచిత్రః ।
"స్యత్వమ్ వా కుత ఆయాతః తత్వమ్ చిన్తయ తదిహ ్రాతః
ధర్మదండం 6
సరణి సత్సంగమందు నసంగ బుద్ది;
దాన గల్లు నిర్మోహత్వ తత్వమందు
నిశ్చలత్వమ్ము కల్గునా నిశ్చలత్వ
కారణమున జీవన్ముక్తి కలుగగలదు 262 సత్సల్లల్వే నిస్సంగత్వమ్ నిస్సజ్లత్వే నిర్మోహత్వమ్ | నిర్మోహత్వే నిశ్చల తత్వమ్ నిశ్చలతత్వే జీవన్ముక్తి: ॥
వయసు గతియింప కామభావనము నాస్తి
నీరు నశియింప కొలనను పేరు నాస్తి
ధనము క్షీణింప పరివార జనము నాస్తి
తత్వమంద - సంసారబంధమ్ము నాస్తి 263 వయసి గతే కః కామ వికార శ్ళుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తల్వే కస్సంసారః ॥
విత్తయౌవన మదముచే వి(ర్రవీగ
వలదు; క్షణములోన నశింప గలుగునవియు;
అఖిల జగతి మాయామయమనుచు దెలిసి
బ్రవ్మపదమును సాధింపవలయునయ్య! 264 మా కురు ధనజన యౌవన గర్వమ్ హరతి నిమేషాత్కాల స్సర్వమ్ ॥ మాయామయమిద మఖిలమ్ హిత్వా బ్రహ్మపదమ్ త్వమ్ ప్రవిశ విదిత్వా!
సుందరోషస్సులును; బుతు శోభలెన్నా
వచ్చి పోవుచుండును కాల వలయమందు;
ఆయువంతరించెడిని; ఆశకంతులేదు” 265
గు ధర్మదండం దినయామిన్యౌ సాయమ్ ప్రాత శిశిర వసంతౌ పునరాయాతః | కాల క్రీడతి గచ్చత్యాయు స్తదపి న ముబ్బత్యాశానాయు:ః ॥| మాయా చండాలాటోపము - అద్వైత విద్యా స్వరూపారోపణము ఒక్కదినము స్వామి యుదయకాలంబందు శిష్యగణము వెంట జేరిరాగ సంతసమ్ముతోడ సంప్రదాయమ్మైన శాస్త చర్చ గొనుచు సాగుచుండ - 266 కారుమబ్బును బోలు కాయంబుతోడ వి కారంబు గల్గించు కటికవాడు; కరకుటమ్ములబోలు కాళ్లు సేతుల తోడ రోత బుట్టించెడి రూపువాడు; నిష్పుకణికల బోలు నేత్రద్వయంబున సహ్యంబు బొల్బు కసాయివాడు; ఖర రవంబును బోలు కంఠస్వరముతో జు గుప్స పల్కుల నింపి గుల్మువాడు; ఊరకుక్కల నాల్గు (ప్రేమార వెంట దీసికొని పెడబొబ్బల వేసికొనుచు కల్గుక్తుండయు మాంసపు ముల్లెగల్లి త్రోవనెదురయ్యె జండాల ధూర్తుడొకడు; 267 శిష్యులంత నొసలు చిట్లించి చండాల జాతివాని మేను జలదరింప బల్మిరిట్లు ద్వేష భావాంతరంగులై నిగ్రహమ్ము వీడి యాగ్రహించి- 268
ధర్మదండం 71 “ర్రేరే ధూర్తుడ! హీనజాతకుడ! నీ (ప్రేలాపముల్ చాలు జా లౌరా! కన్నులు నెత్తికెక్కినవె? మూఢా! పొమ్ము దూరమ్ముగన్ సారాచార పరాయణాన్వితులు సాక్షాత్ శంకరాచార్య ధీ పారావారులు వచ్చుచుండిరిట గైవారంబులాలింపవో?” 269 అనుచు నదిలించు శిష్యులనరసివాడు లెక్కజేయక నాయాజ్ఞ ధిక్కరించి ముందడుగు వేసి శంకర ముఖ కమలము సూటిగా జూచి భాషించె దీటుకొనుచు; 270 ఎంత యద్భుతమెంతటి వింత! తత్వ సారమంతయు గాచి యాస్వాదనమ్ము సల్పినట్టి సుధీవర శైలివాడు సంస్కృతాభిభాషణమును సంతరించె! 271 “నీ యాకారము జూడ న మేయ(ప్రజ్ఞానియైన మేథావిగ నే నా యుల్లమందు దలచితి నా యాలోచన యసత్యమని తెలిసె యతీ! 279 నీవు చదువుకొన్న నిగమాంతములలోన నంటరాని తనము నరసినావె? తొలగిపోవనేది దూరమ్ముగా నీకు దేహమనెదా? లేక దేహి యనెదొ? 273
72 ధర్న్షదండం దేహమంటివేని దేహంబులన్నియు
నన్నమయము భేదమరయలేము
దేహి యంటివేని స్థిరమై ప్రకాశించు
ప్రత్యగాత్మ భేద పథముగనదు! 274 'బ్రాహ్మణుండు వీడు శ్వపచుండు వీడని
ప్రత్యగాత్మ గూర్చి పలుకనగునె!
పొల్చుచంద్రికలను పూర్ణ శశాంకుండు
విప్రునింట; శూద్రవేశ్నమందు; 2765 సారసజాతి భేదమున సౌరులు మీరి విభిన్నరీతిలో
హారశతంబు గొనబడునైన తదంతరమై యదృశ్యమౌ
దారమదొక్కటే కద! నిదానముగా బరికింపుమయ్య! యీ
తీరున నుండు గాదె మన దేహములందలి యాత్మ యేకమై! 276 పాంచ భౌతికమైన ప్రపంచమందు
నుచ్చ నీచ గుణంబు లెట్లుండగలవు?
నీ మహాద్వైత భావ పాండిత్య నిధిని
గంగ పాల్టేతువేల? ప్రజ్ఞాని వర్య! 277 సిద్ధాంతముల వచించుచు
రాద్ధాంతము జేయదగదు; బ్రాహ్మణ వర్యా!
శుద్దాత్మ నిరతిగని స
ద్చుద్ధిన్ గార్యాచరణము బూనిక గొనుమా! 278
ధర్మదండం గ
చెప్పనేమి ఫలము? శ్రీరంగనీతులు చేసి చూపవలయు జీవితమున ఆత్మయొక్కటె యను నద్వైత సూత్రంబు నాచరించి తెలుపుమయ్య ప్రజకు! 279 పరమేశ్వర గత మాయా పరికల్పిత లీలలందు బండితులైనన్ బిరతంత్రులగుట బాధా కరమ”ని శ్వపచుండు చేసె ఘనవాదంబున్! 280 అంతట శంకరుండనె “మహాశయ! కర్ణరసాయనంబుగా సంతత సత్యమున్ దెలిపి చక్కని బోధల జేసినావు; నా భ్రాంతియె కాని యాత్మకు నభావ్యము భేద గుణంబు; జీవనా ద్యంతము నిత్యమై పరగు నాత్మ విశుద్ధము; ధర్మబద్ధమున్! 281 (బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులలోన
విన్యస్తమైన చైతన్యశక్తి; పాంచభౌతిక మయ ప్రకృతి సర్వంబున
ధన్యమై యొప్పు చైతన్యశక్తి వేదవేదాంతజ్జ విప్రకాయంబున
మాన్యమై వెల్లు చైతన్యశక్తి మందమతియగు పామర దేహమందున
దనరారునట్టి చైతన్యశక్తి నేకరూపంబుగా నిరూపించినట్టి వాడు ద్విజుడైన జండాల వర్గుడైన వంద్యుడని లెస్స తెల్పిన బ్రహ్మవేత్త! నిఖిల విజ్ఞాన శాస్త్రప్రణీత ! ప్రణతి! 282
74 ధర్మదండం ఓ మహాత్మ! నీవు సామాన్యుడవుకావు; మందమతిని; గరుణ జిందజేసి- నీ యుదంతమెల్ల నిజము దెల్పుమ”టంచు శంకరుండు బల్కు సమయమందు- 283 మహేశ్వర సాక్షాత్కారము - మనీషాపంచకావిష్కారము సురనిమ్నగా జటా జూటంబుతోడ శీ ర్వన్యస్త శశిధర ప్రభలతోడ; ఫాలనేత్రముతోడ ఫణిభూషణము తోడ హస్తి చర్మోత్తరీయంబు తోడ; భస్మాంగ రాగ విభ్రాజితాంగముతోడ లంబితంబగు కపాలంబు తోడ సునిశితంబైన (త్రిశూలాయుధము తోడ ధమఢమ ధ్వని యుక్త ధక్క తోడ; ఘన కకుద్యుక్త నందివాహనముతోడ పావన కటాక్ష వీక్షణ ప్రథితుదైన పరమ శివుడంత జండాల సరణి వీడి తనరి శంకరునెదుట ప్రత్యక్షమయ్యె! 284 ఇట్లు ప్రత్యక్షమైన మహేశుగాంచి భక్తి విస్మయ వినయ సంభ్రమ హృదంత రాళుడై శంకరుడు వినమప్రపత్తి సల్సె సాష్టాంగ వందన సహిత నుతులు- 285 “వందే లోక శుభంకరమ్ భవహరమ్ వాత్సల్య వారాన్నిధిమ్ వందే భూత గణాదిసేవిత విభుమ్ వందే భవానీ పతిమ్ వందే సచ్చిదనంత రూప కలితమ్ భాస్వంత గంగాధరమ్ వందే చంద్ర కలాధరమ్ స్మరహరమ్ వందే శివమ్ శంకరమ్! 266
ధర్మదండం 75 శ్రీ మన్మహాదేవ! దేవేశ!. లోకేశ! సద్భక్త మందార! విశ్వంభరాధార! నీ లీల వర్ణింప నేనెంత వాడన్ మహాకాల! దేవాదిదేవా! భవా! యింతకున్ మున్ను నా దేవతల్ రాక్షసుల్ పూని పీయూషమున్ పొందనా వాసుకిన్ త్రాడుగా జేసి యా మంధరన్ గవ్వమున్ జేసి యా క్షీర రత్నాకరమ్మున్ మధింపంగ దావానల జ్వాలలన్ బోలు హాలాహలమ్మున్ జనింపంగ లోకమ్ము ఖీతిల్లి నీ రక్ష గోరంగ నా యాపదన్ దీర్చి యా కాలకూటంబు సేవించి విశ్వంబు రక్షించి శ్రీకంఠ నామంబునన్ గీర్తి బొల్పొంది దక్షాధ్వరమ్మెల్ల విధ్వంసమున్ సల్పి కందర్ప దర్చంబు భస్మంబుగా జేసి యా యర్జునాధ్యున్ ద్వదీయాద్భుతాస్త ప్రసాదమ్ముతో దన్చి సర్వప్రజానీకమున్ నిచ్చలున్ సౌఖ్యవారాశి దేలించు గంగన్ దలన్ దాల్చి ఫాలానలాక్షిన్ బ్రకాళించి మై బూది దట్టించి కాళంబు కంఠంబునన్ నిల్చి శూలంబు వాన్తంబునన్ బూని భక్తావళిన్ బోచు నీ దివ్య రూపంబు త్రైలోక్య దీవంబు దర్భ్శింపగాజాలినన్ దొల్లవే పాపముల్ - తీరవే మోహముల్ - పాయవే విఘ్నముల్ - కల్గవే పుణ్యముల్ - డాయవెే క్షేమముల్ - విశ్వేశ నీ పాదదాసున్ గటాక్షించి యజ్ఞాన గర్వాంధకారమ్ములన్ ద్రుంచి స్వామీ! మదీయాల్పబుద్ధిన్ విదారించి నన్ గాచి ప్రజ్ఞాన దానంబు సేయన్ నరుల్ సర్వులున్ ఒక్కటే యంచు దెల్పన్ మహోత్కృష్ట కార్యంబు సంధింప మార్గంబు జూపింప చండాల రూపుండవై వచ్చినావా! హరా! శంకరా! వేదవేదాంత విద్యాస్వరూపా! ప్రభో! పాహిమాం! లోకనాథా నమస్తే నమస్తే నమః 1287 అనంతమ్ త్వదీయమ్ చిదానంద రూపమ్ న జానామి శంభోహమజ్ఞాన చిత్తః విభో త్వత్కృపా దివ్య వీక్షా ప్రసాదమ్ మహేశాహమిచ్చామి శంభో! ప్రసీద! 288 అవిద్యాతపాయస్త చిత్తాన్వితోజ. హమ్ త్వదీయాద్భుత జ్ఞాన పీయూష వార్భౌ పవిత్రం హితం స్నానభాగ్యం మహేశ! సదా పాలయాఖీష్ట దాతః ప్రసీద ॥ లసచ్చారు గాత్రమ్ లలాటస్థ నేత్రమ్ దయాభావనాన్వీత సౌజన్య చిత్తమ్ మహాజ్ఞాన వంతమ్ గురూణామ్ గురుమ్ త్వామ్ నితాంత ప్రసిద్ధమ్ భజేజ_ హమ్ భజేఓ.హమ్ | 289
76 ధర్వదండం
భుజంగేంద్ర హారమ్ విభూత్యాప్త దేహమ్ శశాంకావతం సేన సందీప్త శీర్నమ్ ।
పరమ్ దైవతమ్ మోహ విచ్చేదకమ్ త్వామ్ తవామోఘ కీర్తిమ్ స్మరామి స్మరామి ॥ 290 జీవుండీశ్వరుడున్ విభిన్నమని విశ్లేషించి యజ్ఞాన భా
వావిర్భావము గల్లజేసెడిని మాయాశక్తి చిద్రూపమై
దైవంబై పరమాత్మ వర్ధిలు నభేదమ్మౌను జీవాత్మతో;
దేవా! సత్యము బోధ జేసితివి సందేహమ్ములన్ దీర్చుచున్” 201 శంకరుండీ గతిని శంభు సంస్తుతించి
కూర్చె మాయాప్రకల్పిత గుణములైదు
క్యమమగు మనీషా పంచకమ్ముగాను
శ్లోక సంపుటి కాంచెను సుప్రసిద్ధి! 292 అంత మహేశ్వరుండు కరుణార్దవచోనిధి పల్కె “వత్స! వే
దాంత పవిత్ర భావయుత తత్వమెరింగితి వీవు, మిక్కిలిన్
సంతసమంది తేను, గురు సమ్మతి గైకొని సూత్ర భాష్యమున్
సాంతము గూర్చగా ప్రతిన సల్పితి వింతకుమున్ను శంకరా! 293 కాలము చేరువయ్యెనిక కార్య నిమగ్నమనః ప్రవృత్తి నీ
వాలము జేయబోక నిగమాంత చిరంతన ధర్మతత్వమా
మూలము దెల్పి సర్వజన మోదము గూర్చగ ధర్మదండమున్
గేల ధరించి ధర్మగుణ కేతనమున్ వెలయింపుమీ భువిన్” 294 అని బోధజేసి పశుపతి
చనె నంతర్థానుడగుచు, జకితుండగుచున్
దన శిష్యగణము తోడుగ
జనె భాగీరథికి వేగ శంకర గురుడున్ 295
ధర్మదండం 77 అచట స్నానాది నిత్య కృత్యంబులైన పిమ్మట సనందనుంగని వేడ్క మీర పరమ శివ దర్శన ప్రాప్త పరవశుండు శంకరాచార్యుడిట్లు భాషణము సల్బె! 206 “శిష్య! పరమేశ్వరుండు శాసించినాడు బ్రహ్మ సూత్రంబులకు నేను భాష్య బోధ గూర్చవలెనని, మున్ను మా గురువరుండు చేసె నిర్దేశమిదె నన్ను జేరబిలిచి! 297 ఇక నొాలస్యము జేయరాదు; వినుమోయీ సూత్ర శబ్దార్ధ చి త్రకళారీతుల దేట తెల్లముగ సంధానించి నా జన్మసా ర్ధకతన్ గాంచెద, వాక్సుధారస మహద్దారా తరంగంబులన్ సకల క్షోణిని దన్సి శీఘ్రముగ సంస్థాపింతునద్వైతమున్! 298 అని యాశ్రమమ్ము జేరి సు దినమున శంకరుడు కార్యదీక్షాపరుడై వినుతించె గణేశుని; వ్యా సుని మానసమందు దల్చె;, శూలికి మొక్కెన్! 299 సూత్రోపనిషద్లీతా భాష్య రచనము
పదరమ్య వైచిత్రి; వరభావ విక్రాంతి;
తాత్విక సంపత్తి; ధార్మికోక్తి; అద్వైత సూక్తి దీవ్యత్సాండితీ శక్తి
వ్యాఖ్యాన సద్యుక్తి, వాదరక్తి వాకృమత్కృతి, సూత్ర వాక్యార్థ విస్తృతి;
మోహ విప్రతిపత్తి; దేహముక్తి; ఆతత భక్తి, జ్ఞానామృత సంసిద్ధి;
ప్రవచిత నీతి, సుగ్రాహ్య రీతి;
78 ధర్మదండం కలిపి రంగరించిన భంగి కమ్రశైలి
(బ్రహ్మ సూత్రాంతరార్థ సద్భాష్య కావ్య
రాజమొకదాని విరచించె ప్రాజ్ఞవరుడు
ద్వాదశాబ్ద సమంచిత ధార్మికుండు! 300 పండితులకునైన పామరులకునైన
బ్రహ్మవిద్య గరపి భవ విముక్తి
జేయు సూత్రములకు శ్రీభాష్యకావ్యంబు
రూపుదిద్దుకొనియె రూధికెక్కి 301 ఉపనిషదంతరంగ విషయోద్ధరణ క్రియయందు దన్ను దా
నుపకరణమ్ము వోలె మదినూహలు జేసి తదంతరార్థమున్
విపుల గుణమ్ములన్ దెలుప విశ్వజనీన శుభాభి భాష్యమున్
శపథము జేసి శంకరుడు సంకలనమ్మొనరించె భక్తితోన్ ! 302 భారత సారభూత, భగవత్పరిభాషితయైన గీతకున్
సార పునీత భాష్యమును శంకరుడాదట గూర్చి దుఃఖ సం
సార విహార మానవ విషాద నికృంతనజేసి తత్వ ధీ
సార సుధారసాయన విశాల తటాన్విత జేసె ధారుణిన్ 803 సూట్రోపనిషద్గీతా
చిత్ర ప్రత్యేక వాగ్విశిష్ట ప్రస్థా
న త్రయ భాష్యము సంస్తుతి
పాత్రంబుగ శంకరుండు వడి విరచించెన్! 304
ధర్కదండం 7 నిజ గురూత్తము గోవిందు నియమమూని గౌడపాదుని యాజ్ఞను గౌరవించి పరమశివ శాసనంబును శిరముదాల్చి సంతరించెను త్రివిధ భాష్యంబునతడు! 805 శిష్యాగమనము - చివ్యయ విద్యా బోధనము
“దేవ! అద్వైత విద్యా స్వభావమెల్ల మాకెరింగించి తత్వ సంభారమతుల జేయ ్రార్ధింతుమ”నెడి స్వశిష్యతతిని గాంచి సదయాంతరంగాన మించు శ్రద్ధ 806 శంకరాచార్యుడద్వైత సంప్రదాయ విధము - కంటను వత్తిని బెట్టుకొనుచు బోధ జేయంగ భాష్య సంపూర్ణ మహిమ తెలియవచ్చెను భారతదేశమెల్ల! 3807 ఒకరా! యిద్దర! ముగ్గురా! నలుగురా! యుత్కృష్ట శిష్య ప్రజా నికురంబాతని చెంతజేరి తనరెన్ వేదాంత నిక్షిప్త తా త్విక భావంబున; శ్రీ జగద్దురునిగా విస్తార విఖ్యాతుడై సుకృతింగాంచెను శంకరార్యుడు చరత్ (శ్రుత్యంశ సద్రూపమై! 808 క్షుత్తప్త వత్సముల్ సురఖి జేరిన యట్లు
మునులు కైలాసంబు జనినయట్టు; అర్థి సంఘము రాజు నరయ బోయినయట్లు
విరులు దైవపదంబు కరుగునట్లు; అమరగణంబులిందద్రాప్తమై చనునట్లు
దాహార్తులు సరస్సు దరియునట్టు పథికబ్బందము పాదపచ్చాయ జనునట్లు
సెలయేళ్లు వాహిని జేరినట్లు;
ఠం ధర్మదండం
వరగురుడు శంకర యతిప్రవర సనీడ
మునకు శిష్యబృందము జేరి మోకరిల్లె
వరదుదై శంకరాచార్య వరుడు పంచె
భాష్యవాణీ ప్రసాదంబు శిష్యతతికి; 809 “శిష్యులార! కార్యసిద్ధి దీక్షా మహా
దక్షులార! జ్ఞాన సాక్షులాఠ!
దీక్ష మోక్ష పదమపేక్షించు మిమ్మాది
భిక్షువు సతతమ్ము రక్షసేయు 310 “తత్త్వమసి” వాక్యమందలి 'త్వమ్' పదార్థ
మును వివేకించి తెలియుట మోక్షపదము
జేర ప్రథమ సోపానంబు శిష్యులార!
వినుడు 'త్వమ్” శబ్ద పరమార్ధ విషయమిపుడు 311 మహి 'శరీరంబు' గన దృశ్యమాన పాంచ
భౌతికంబు నశుద్ధతా పరము; నశ్వ
రంబునై యొప్పుచుండు నీ క్రమము గాంచ
నీవు 'దేహంబు' కావు సందేహమేల? 312 దృశ్యరూప జాతి విహీన తేజమీవు; -
ఇం(ద్రియంబులు కరణంబులీవు కావు;
ఇంద్రియ (ప్రేరకుండ వీ వెంచి చూడ
'గర్త యొన్నడు '“గరణంబు” కాడు నిజము” 313
ధర్మదండం కో
ఈ రీతిని శంకర ధీ వారిధి తత్వోపదేశ భాగ్య నిధానం బారోపించెను శిష్యుల సారన్య హృదంతరముల; సంధించె రహిన్ 314 అట్టి శిష్య సంఘమునందు తొట్టదొలుత జేరిన సనందనుడు గురు చిత్తమెరిగి సత్ర్రవర్తనంబున భక్తి సత్చథమున మెలగి నిత్యంబు శంకరు మెప్పు పొందె! 315 సరిజేయును; సేవజేయు; సమకూర్చును స త్వరముగ గుర్వవనరముల బరగు సనందనుడు సతము భక్తిన్ (శ్రద్ధన్! 316 స్నాన ఘట్టమునకు సామి చేబూని
తన గురు ననుసరించును సతమ్ము
జపతపాదుల వస్తుసమితి గూర్చు; నిత్యకర్మసహిత నియమితానుష్టాన
కార్యంబులన్ సహకారమూను; భయథభక్తులన్ గురు పాద సంవాహనం
బును జేయు విశంతి బొల్బువేళ; గురుని యాజ్జలకై నిరంతరము శ్రద్ధ తోడ వర్తించు నా సనందుండటన్న శంకరాచార్యులమిత సంసక్తి బొంది సంచితాభిమానము బ్రకటించుచుండె! 317
82 ధర్మదండం
అతనిపై శంకరాచార్యులమితమైన
ప్రేమ జూపించుచుండ నప్రియమునొంది
యీర్న్యచే సనందను భక్తి నెరుగలేక
యితర శిష్యాళి కుందెను వెతలతోడ! 318 తనకు లభించనట్టి సుక్కతంబితరేతర మానవుండు సా
ధన సమకూర్చుకొన్నయెడ దగ్ధ మనస్కుడు కళ్ల నిప్పులన్
గనకన మందజేసెడు ప్రకారము శిష్య వితానమా సనం
దను పయి మచ్చరమ్ముగొని తాల్మినశించి యసూయ పొందెడిన్! 319 అ సనందను పైనసూయాస్వభావ
మున్న యితర శిష్యుల మనంబెన్నికగొని
దాని దొలగంగ జేయగా దగిన ఘటన
శంకరాచార్యులొకనాడు సంతరించె; 320 గంగ కవ్వలివైపున గార్యముండి
చనియె గుర్వాజ్ఞ నా సనందనుడు నాడు
గంగకీవల విబుధ ప్రకాండుడితర
శిష్య సంఘంబు చర్చల జేయుచుండె రా! అంత శంకరార్యుడాగు! సనందనా! శీఘ్రమిచటకీవు చేరవలయు నొనుచు నా సనందు నాపాదమస్తకం బదరిపడదెడు భంగినరచి పిలిచె! 3922
ధర్మదండం 6 “ఉన్నది గంగ కట్టెదుట; నోడలు లేవు సమీపమందు నే మన్నన జేయగా నితరమార్గము లేదు; గురుండు పిల్చె గా నున్నది కాకమానదు, మహోద్ధత సంసరణార్జవమ్మునే కన్న దరింపజేయు గురురాద్దయ చాలదె గంగదాటగన్!” 8203 తలచి యాతదా నిమ్నగా తలముపైన పదములుంచెను; మాయురే! ప్రతి పదమ్ము క్రింద పద్మమ్ములునిచె సరిత్తు: భువిని పుణ్యమూర్తుల సేవింపబోని దెవరు? 824 “ఎవడు ప్రణవస్వరూపుడై భువన భవన సృష్టి సంస్థితి లయ కార్యశీలియగునొ అతని సత్కృపా వీక్షా మహత్వఫలమె శిష్యరేణువు నను దరి జేర్చుగాక! 825 అది మధ్యాంత రహితుదై వ్యాప్తి జెంది పంచ భూతాత్ముడై కాచు (బ్రకృతినెవ్వ డతని సత్క్భపా వీక్షా మహత్వఫలమె శిష్యరేణువు నను దరిజేర్చుగాక! 326 ఎవడు వాచామగోచరుండెవడు నిఖిల తత్వవిజ్ఞాన సార నిధాన చిత్తు డతని సత్కృపా వీక్షా మహత్వ ఫలమె శిష్యరేణువు నను దరి జేర్చుగాక! 2827
8 ధర్మదండం
నిర్గుణుండు నిరాకార నిర్వికల్ప
నియమి యెవ్వడు నిగమాంత నిత్యపూజ్యు
డతని సత్కృపా వీక్షా మహత్వఫలమె
శిష్యరేణువు నను దరిజేర్చుగాక! 328 చిన్న్మయానందుడెవడు విశేష బుద్ధి
కుశలుడెవ్వడు శ్రీజగడ్డురువరేణ్యు
డతని సత్కృపా వీక్షా మహత్వఫలమె
శిష్యరేణువు నను దరి జేర్చుగాక!” 829 పరిసరములను సనందుడు
మరచి జగద్గురుని మహిమ మరలన్ మరలన్
సరళమ్ముగ గీర్తించుచు
పరవశుడై దరికి జేరి స్వామికి మొక్స్కెన్! 330 పరుగులతోడ పద్మములపై పదపద్మములుంచి చేరె శం
కర గురు సన్నిధానమును; కార్యము దెల్పుమటంచు మొక్కె నా
వరగుణళీలి; వాని గురుభక్తి నెరింగి యసూయ వీడి సం
ఐరమును పొందె శిష్యతతి; వాకొనె నాతని ధన్యజీవిగన్ ! 331 “స్వార్ధభావమ్ము పరమార్ధ పరమపదము
జేర గొడ్డలిపెట్టగు శిష్యులార!
సాధకునకు గావలయు టబ్రశాంతచిత్త
మాత్మశుద్ధియు నివికల్లనలరు బుద్ధి; 332
ధర్మదండం 8క్ పూర్వ పుణ్యకర్మ నిర్వహణమ్ముచే సాధకాళి బెక్కు స్థాయిలుండు; స్వ ప్రగతిని బేర్మి సాధింపవలెగాని పరుల ప్రగతి కీర్ష్య పడుట వలదు; గ అని బోధించి యతీశుడు తన శిష్యుని భక్తి భావ తాత్పర్యములన్ గొనియాడి (పేమభావము మనమున బెల్లుబుక పలికె మధుర వచస్సుల్ 834 “వత్స! నా యాజ్జవిని భక్తి భావమలర గంగ గణియింపబోక శీఘ్రముగ వచ్చు నిన్నుగని సంతసమ్మంది నీకు పద్మ పాళి నర్పించె నా నది పదములంచ; 385 కాన నేటినుండి నీ నామధేయంబు మార్చి 'పద్మపాద' మహిత సంజ్ఞ నొసగుచుంటి దాన నుర్వీతలంబుపై కమ కీర్తి పొందగలవు నీవు” 336 శంకరాచార్యుడీ గతి సార్థకముగ నామకరణంబు సల్పె నానాటి నుండి పద్మపాదుండు జ్ఞాన సంపన్మహితుడు శిష్యతతియందు గౌరవశీలియయ్యె! 337
ఈ ధర్మదండం శంకర - భూసుర సంవాదము
కాషాయ వస్త్ర సంకలితోత్తమాంగంబు;
తీక్ట భాను మయూఖ దృక్ ప్రశస్తి రుద్రాక్ష మాలా శిరోధి; దక్షిణ భుజా భాష్య కావ్యాన్విత వామహస్తంబు; చి
న్ముద్రాంక దక్షిణా మోఘ పాణీ; వ్యాఘాజినోపరి పద్మాసనస్థితి సకల విశ్వంభరాహ్లాద సంప్రయుక్త మహిత సుకృత సంధాన సమ్యగ్యతీశ సార్వభౌమ స్వరూపంబు సన్నుతింప దమ్మిచూలి కినైన సాధ్యమ్మె జగతి! 338 అట్టి స్వామి యానాడు నిర్వ్యాజ కరుణ గలిగి వేష్టితాంతేవాసి గణములందు భాష్య పాఠోపదేశ ప్రవర్తనమున సకల శంకొనివారణ సలుపు వేళ 3౮33 తిలక ధార్యమాణ లలాట దీప్తమూర్తి విమల గుణశీలిి యజ్ఞోపవీతధారి భాసురాస్యుండు నొక వృద్ధ భూసురుండు దండమూతంబుగా గొని తరలివచ్చె! 340
ధర్మదండం 87 “నీ వెవరవయ్య! యిచ్చట నీ వేదాంత ప్రబోధ నీ శిష్యతతిన్ రావించి సల్పుచుంటివి నీ వయసుకు మించు కార్య నియమాప్తుడవై ! తశ1 అనవుడు శిష్యులు పలికిరి “క్రన్సుగొనుమిదె! సూత్ర భాష్య కర్షృత్వ చిరం తన కీర్తిశాలి శంకర ఘన నామాంకితులు వీరు; కారణ జన్ముల్ 342 వ్యాససృష్టియెన (బ్రహ్మ సూత్రములకు విబుధ సమ్మతముగ వెలయునట్టి భాష్యగీతి వీరు ప్రవచించుచున్నారు సరళ సుందరముగ సాధువర్య! 343 “ఆహా! విచిత్రమిది! యో హోహో! యీ బాలకుండనూనంబగు నా సాహిత్యమునకు భాష్య మ్మూహించి రచించె నన్ననొదవును వింతల్ ! 344 బాలక! బ్రహ్మవేత్తవని, భాష్య మహోన్నత కర్తవంచు నిన్ జాల స్తుతించె శిష్య తతి; చాలు! వృధా కథలేల? బ్రహ్మసూ త్రాలఘు తత్వ చింతన విధంబున నేనొక ధర్మ సంశయా స్ఫాలిత మానసాన్వితుడ; సత్య నిరూపణ జేయ గల్లుదే?” 34ీర్
జి ధర్మదండం
ఇటుల వాగ్భాణముల బేర్చి కటువుగా ప్ర
వర్తిలెడు విప్ర వరు గాంచి వందనమిడి
మృదుల సలలిత భావనామృతము చింద
దిలికె శంకరార్యుడు శాంత నిలయుడగుచు 346 “వందనమో ద్విజోత్తమ ! వివాదములేల? సరస్వతీ కృపా
మంద కటాక్ష లబ్ధిగన మానవులందరు యోగ్యులీ భువిన్ ;
సందియమేల? భిన్న మత జాతివయోగత భేదమిందు కా
నం దగదయ్య! నిక్కమిది; నమ్మెదొ? వమ్మని కొట్టివేసెదో ? తశ? పిన్నవారి తప్పు ప్రేమతో సరిదిద్ది
వెన్నుదట్టి నడపు వెన్నవంటి
మనసు గలుగునతడు మహనీయ చరితుండు
పూజ్యుడతడు పూర్ణ పురుషుడతడు! 848 కయ్యానికి గాల్బువ్వగ
నయ్యా! పనిలేదు; సంశయము దెల్పుడు నే
వ్రయ్యల్ జేసెద పరసా
హాయ్యము గొననంచు శంకరాచార్యుడనన్ - 349 “ఐనచో తృతీయాధ్యాయమందు (బ్రథమ
సూత్ర భాష్యంబునెట్లు సంశుతముగాను
కూర్చితివొ తెల్పమయ్య సద్దురు వరేణ్య”
యనుచు బల్కెనా వృద్ధద్విజాగ్రసరుడు 850 (తదంతర ్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యామ్)
ధర్మదండం ౫ అనినన్ నిర్మల వాక్సుధారసము పొంగారన్ గభీర ధ్వనిన్ వినయ ్రేక్షణుదై; ముఖాంబుజము వాణీ సత్ఫపా పాత్రమై తనరన్ శంకరుడర్ధవంతముగ సంధానించె దత్సూత్ర సా ధనమున్ జైమిని గౌతమాది ముని తాత్పర్యాంతరార్థమ్ములన్ తిర్1 భూసురుండు దాన బొందక సంతృప్తి నెరసులెంచ బూనె నిష్టురముగ, శంకరోక్తి నతడు శతవిధమ్ములుగ వా గృండనమున సల్పె ఖండనమ్ము; 352 యతివరుడు, భూసురేంద్రుడ మిత విద్వ ద్ధీవిశేష మిశ్రితమై సం (శ్రుతమైన వాగ్వివాదా దృతి మించి చరించి రష్టదివసములంతన్ ! 858 ఆతడు ప్రశ్నంబడిగిన నీతండుత్తర మునిచ్చునీతని వాదం బాతడు ఖండించునిదే రీతిగ వాగ్యుద్ధమున జరించిరి వారల్ ! 8ర్& “ఈ మహాత్ముడే దివ్యుడో! యెంచి చూడ మాన్యుడీతండు, బుధు దసామాన్యుడితడు! వేదరాశిని విభజించి వినుతిగన్న వ్యాసభగవానుడిదె నిశ్చయమ్మ”టంచు 355
980 ధర్మదండం నమిత శిరస్కుడష్టమ దినంబున శంకరుడా మహీసురో త్తముని పవిత్ర విష్ణు పదదాసుడు వ్యాసుడుగా దలంచి “వం ద్యమగు నిజస్వరూప శుభదర్భన భాగ్యము గబ్దజేయవే విమల గుణావతంసగ”” యని వేయి విధమ్ముల సంస్తుతింపగన్ - 856 వ్యాసముని స్వస్వరూవ ప్రదర్శనము వ్యాసుడు; కమ కవిత్వ వి భాసుడు; శతకోటి సూర్య భాస్వరుడు; శుభా వాసుడు; సంతత హరిపద దాసుడు ప్రత్యక్షమయ్యె దరహాసముతో 357 కమనీయ సితవర్ణ కదిరీ భరమ్ముతో ధూర్జటి బోలు నస్తోక సుగుణు; నిగమాగమోక్తి స్వనించు నెమ్మోముతో జతురాస్యు బోలు సంసార తరణు; మాయా నిక్కంతన మహిత తేజముతో హృ షీకేశు బోలు వాళిష్ట రమణు; జ్ఞాన వీచీయుత మానసార్ణవముతో దేవర్షి బోలు నాస్తిక్య హరణు; విష్ణు సేవా ప్రవణు; భక్తి విధి విహరణు; భాగవత కథా కథన వి(్రాజమాను తత భవలతా నిశిత లవిత్రాయమాను; బాదరాయణు తాపసాభరణు గాంచి- 358
ధర్నదండం ర
హర్ష పులకితుడౌచు మహర్షి దివ్య
పాద పద్మ యుగ్మమునకు బ్రణతి సల్పి
భక్తి (శద్దాప్రపత్తుల బ్రణుతిజేసి
పలికె శంకరుడిటుల నంజలి ఘటించి; 859 దక్షుందెవ్వడిలా తలంబు పయి వేదవ్యాస పుణ్యాహ్వయా!
అక్షీణోగ్ర తపః ఫలంబు భవదీయామ్నాయ పాండిత్య న
ద్భిక్షన్ నాకు ననుగ్రహింపగదవే ప్రీతిన్ గృపామూర్తివై! 360 నా భాష్యమ్మున సద్దుణమ్ము లెటనున్నన్ వాని నీ ప్రజ్ఞగా
నే భావించెద నింక దుర్గుణము లేవేనిన్ గనుంగొన్న నా
దౌ భారమ్మని నిశ్చయించెద మునీంద్రా! తత్పరిష్మర్తవై
శోభన్ గూర్చి మదీయ భాష్యమును సంస్తుత్యంబుగా జేయవేగ” 361
సూత్రభాష్యామోదము : వరప్రదానము
అన వ్యాసుండొక యింతనవ్వి మధుర వ్యాహార సంవర్తియె
నెనరున్ జూపుచు “వత్స! శంకర! యొరుల్ నేర్పింపగానేల? నీ
కెన నీవే కద! సర్వశాస్త్ర కలిత శ్రీయోగ విద్వత్తులో
న”ని పల్కెన్ గరుణారసార్ల్హుడయి యాప్యాయంబు పెంపొందగన్ 362 “అసిధారావ్రతమే యనందగును భాష్య గ్రంథ నిర్మాణమున్
రస భంగమ్మొనరింపరాదు; మదభిప్రాయంబు మూలార్ధమున్ వెస మార్చన్ జనగూడ దన్వయము నిర్వీర్యంబు కాకూడదే దెస జింతించిననైన భాష్యమన నందింపన్ వలెన్ సత్యమున్ ! 363
రై ధర్మదండం
మరియు సూత్రంబులకు సూరి వరులు పెక్కు
భాష్యముల గూర్చిరందునే భాష్యమైన
నాకు రుచియింపలేదు సాంతముగ గాని
నీ రచనమేలు సత్యసన్నిహితమిదియ! 364
స్థిరమగు నీ భాష్యవాణి శ్రీకరమని సుం
దరమని యొల్లరు పొగడగ
నరయుదమని వచ్చితయ్య! అతి ముదమయ్యెన్ ! 365
మహితమతి! షోడశాయుః ప్రమాణునిన్ను
మరియు నొక షోడశాయుః ప్రమాణుజేతు
వర సుబోధల నజ్ఞాన భావ పాశ
ఐద్ధ కుమత ఖండన జేసి వాసి గనుముగొ 366
అమ్ముని వరుడంత నద్భ
శ్యమ్మయ్యె వరంబులొసగి; శంకరుడటుపై
సమ్మతి దేశాటనమున
కిమ్ముగ శిష్యులను గూడి యేగె తదాజ్ఞన్ ! 867 ప్రయాగ వుర సందర్శనము : వార్తా విశేష సంశ్రవణము
చని ప్రకృష్ణయాగ సతృలంబొసగెడు
శ్రీప్రయాగ జేరి శిష్యతతికి
క్షేతమహిమ తెలియజెప్పి శంకరుడంత
సంతసమున విడిది సల్పెనచట! 368
ధర్మదండం 93 పాలగలియు నీరు పాల గుణముగాంచు భంగి నమిత ఘోర పాపులైన నా ప్రయాగ జేరి యా త్రివేణీ నది మునిగి పుణ్యమొంది ముక్తి గాంత్రు! 369 శ్రీఫపయాగ పుర విశేషంబు లాలింప నచటి వింతలెల్ల నవధరింప సంతసమున నొక్క సత్రశాలకు జేరె ఛాత్ర సహితుడగుచు శంకరుండు! 870 నత్రాధికారి గని స చ్చాత్రుండు సనందనుండు సంక్షిప్తముగా సూత్రప్రాయముగా తమ యాత్రా వివరమ్ము దెల్చె నాచార్యాజ్ఞన్ ! 871 “నిఖిలలోక శరణ్య పండిత వరుండు సకల పండిత మండల చక్రవర్తి చక్రవర్తి సమర్చిత సహృదయుండు సహృదయ స్థిత గుణశీలి శంకరుండు 372 మా యాచార్యులు వీరలె; మా యావాసమ్ము కాళి; మదిలోన మహా ధ్యేయంబూని ప్రయాగకు మా యాత్రను సల్పినాము మహిత మననస్వీ! 873
ర ధర్మదండం
ఇచ్చటి విశేషముల మా
కిచ్చ గొలుపు మాటలాడి యొరిగించుడు వా
క్రుచ్చుడు మీ యభిమతమున్
నిచ్చలు మిమ్మోముగాక నిటలాక్షుండున్ 374
విని నిర్వ్యాజ మనః ప్రహర్షగత స(్రేమ స్వభావోక్తితో
తనువెల్లన్ పులకింప మ్రానువడి వింతల్ గొల్పగా వాడు చ
య్యన నా శంకర సంయమీంద్ర శుభపాదాంభోజ యుగ్మమ్ముపై
ననుమోదమ్మున వ్రాలి పాద్యమిడినాడానంద బాప్పమ్ములన్ 875
యతి వరుని నుచితాసన స్థితుని జేసి
పుష్పసంచయముల తోడ పూజ సల్పి
ఫలములందించి పాద సంవహన మూని
చెప్పె నధికారి నగర విశేషమిట్ను! 376 భట్టపాద ప్రసక్తి
“స్వామీ! ప్రస్తుత మీ ప్రయాగ నగర ప్రాంతమ్ములో చూడగా
నౌ ముఖ్యంబగు నొక్క సంఘటన; విఖ్యాత ప్రతాపస్ఫుర
ద్ధీమంతుండగు భట్టపాదుడు మహార్తిన్ బూని దావాగ్నిలో
దా మై కాల్చుకొనంగ సిద్ధపడె బాధాతప్త చిత్తారతిన్! 3౩77
దురిత స్వాంతముతోడ వర్తిలి గురుద్రోహంబు నేజేసితిన్
భరియింపన్ దగనీ దురంతమును నా పాపానికే నిష్కృతిన్
జరియింపన్ వలెసంచు దద్భుధుడు పశ్చాత్తప్తుడై వహ్నిలో
జొరబారన్ మదినిశ్చయించె నమిత క్షోభన్ గనన్ సర్వులున్” 378
ధర్మదండం ర్ అని యధికారి వచింపగ ఘన తాపము తోడ మేను కంపింపగ నె మ్మనమున జింత జనింపగ గనులన్ యళశ్రువులు రాలగా యతి నిలచెన్! 3౩79 “అం యేమీ! యిది! భట్టపాదుడు మహావ్యాలోల చిత్తంబుతో ప్రాయళశ్చిత్తముగోరి యగ్ని శిఖలన్ ప్రాయోపవేశంబు చే కాయంబున్ నశియింప జేయుటకు సంకల్పించెనా? నిక్కమా? యాయుర్ధాయము తీరెనే ! శివశివా! యాపుణ్య ధీమూర్తికిన్ 380 నా యద్వైత మత ప్రబోధల మహా నైపుణ్యమేపార నా (వ్రేయోమూర్తిని భట్టపాదుని వినిర్దింపంగ వాదమ్మునన్ భఖాయంబై విలసిల్లు నామతము; శంకాతంకముల్ దూరమౌ ; డాయున్ సర్వశుభమ్ములీ భువిని వేడ్కన్ గాంచుచుండన్ బుధుల్ 381 అని భావించితి మున్ను, నేడకట! నా యాళల్ వృధాయయ్యె ;నా ఘన వాదం బెవడాలకించు నిక! లోకవ్యాప్తి నే రీతి గాం చును నా దివ్వమతమ్మ”టంచు యతి సంక్షోభించి శిష్యాళితో చని యచటన్ తుషాగ్నిపయి సంహననాఖిల దగ్గ భట్ట పా దుని, పరివేష్టిత ప్రజల దుస్సహ శోక మహార్ణవాకృతిన్ గని యతి తల్లజుండు మదికల్లు వడంగ తపించి యమ్మహా త్నుని శుభ సన్నిధ్రానమున మైడ్చడి నిల్బెను నిష్మ్రయారతిన్ 388
086 ధర్శదండం
శంకర దర్శన వికసిత
పంకజ ముఖుదైన భట్టపాదుడు పూజా
నంకితమిడుమనుచు గోరె స్వాంతేవాసిన్! 384 “స్వామీ! యెంతటి భాగ్యమో యిది ప్రభూ! స్వపష్పమ్మునందైననే
నే మాత్రమ్ము తలంప లేదిటుల; నాకీ యంత్యకాలంబునన్
నీ మాహాత్వ్యము జూపి ముక్తి ఫలమందింపగ విచ్చేసి నా
వా? మోహాంతక! సౌఖ్యకారక! శ్రుతి వ్యాఖ్యాన సంధాయకా! 885 ఊరక రారు మహాత్ములు
మీ రాకకు హేతువేమి? మృదుల మనస్వీ!
ఆరాటమేల? మానుము!
కోరిక వివరింపుమయ్య కూర్మి జరింతున్! 886 అని భట్టపాదుడనగా
విని శంకర బుధుడు నవ్వి వివరించె నిటుల్
“మన యిరువురకొక్కటె గద
ఘన కార్యము - భువిని కర్మకాండలు నిలుపన్ ! 887 జగతి నీకు గలట్టి ప్రశస్తమైన
శిష్యసంఘంబు లితరుల చెంతలేవు;
కనుక వాదమ్మునందున నినుజయింప
వైభమ్మొందు భువిని యద్వైత మతము! 388
ధర్మదండం రౌ ఇటుల మనంబునన్ దలచి యే నిటు చేరితి నార్య! యింతలో కటువగు నిర్ణయమ్ముగొని కాయము నగ్నికి నాహుతిచ్చి సం కటమున నన్ను ముంచితివి; కాగల కార్యము దీర్చు దిట్ట లె చ్చట నిక నున్న వారలొ విచారణ సేయవలెన్ ధరాతలిన్ 1 389 హైందవ ధర్మ రక్షణకునై వ్రతకంకణ ధారివౌచు నా నందముతోడ బౌద్భుల వినాశనమున్ గనులారగాంచి మ ధ్యందిన భానుమండల విధంబున వెల్లెడి నీకిదేల యీ కొందలపాటు? తెల్పుమిది కోవిద వర్య! భవచ్చరిత్రమున్!” 890 భట్టపాద వృత్తాంతము అని యడిగెడు శంకరునకు వినయమ్మున నంజలించి వివరించెను సాం త్వనమొంది భట్టపాదుడు తన చారిత్రమ్మునెల్ల తగు మాత్రముగన్ 391 చేసిన పాపము జెప్పిన దోసము నశియించుననుచు దోహలమతియై వ్యాసక్తుడై గతమ్మున జేసిన దురితమ్ములెల్ల జెప్పె బుధుండున్ 392 “శంకర । బ్రహ్మసూత్ర శుభసంపుటికిన్ సుమనోజ్జ భాష్యమున్ సంకలనమ్మొనర్చితివి; స్వామి! భవత్రియ కార్యసిద్ధి కా టంకములేమి? నాకథ స్ఫుటమ్ముగ దెల్పుదు నాలకించి నా సంకటమెల్ల మాన్చుము; వశమ్మొన గూర్చుము ముక్తి పీఠమున్ 393
906 ధర్మదండం
గతమున బౌద్ధధాటికి కకావికలై నళియించె వేద సం
హితలిక కర్మకాండలను హీనముగా గణియించె నీ ప్రజా
తతి; యిదిగాంచి నా మది విదారితమయ్యెను; నాదు రక్తమున్
కుతకుత మండిపోయినది క్రోధము కట్టలు దాటి రేగగన్; 394 బౌద్దమతమునందు పాండిత్యమే లేక
వారినెటుల గెలవవచ్చు ననుచు
సందియమ్ము కలిగి చాటు మాటుగ వారి
మర్శ్మముల్ గ్రహింప మది తలంచి! 895 స్వామి! ఇందీవరాక్షుని శాఠ్యమెంచి
అతని నాదర్శముగగొని అతి వినయము
పొంగి పొరలగ లోలోన కృంగిపోయి
బౌద్ధ గురు సమీపము జేరి ప్రణతి నిడితి! 396 అత్మసణచుకొని మహాట్రీతి బౌద్దావ
శారమెత్తి “బౌద్ధ ధర్మములను
పూజనీయ! నాకు బోధింపుడ”ని నేను
వేడి నా నసత్య నూడినాను ! 897 (క్రమముగా తదంతరార్థమ్ములను నన్ను
విశ్వసించి గురుడు వెల్లడించె;
బౌద్ధ మతపు లోటుపాట్లను గ్రహియించి
సంతసించినాను స్వాంతమందు ! 298
ధర్మదండం 99 ఒక దినమున నొక బౌద్దుడు వికల మనః కలితుడగుచు వేద పథమ్మున్ సకలము పంకిల మయమని పక పక నగి గేలిసేసె వాచాలుండై ! 899 “వేదమ్మా? కాదది ని ర్వేదమ్ము సమస్త భువికి; వేయేల? శిరో వేదన యగు రోదనమది; భేదమ్మది” యనుచు బలుక భిన్నుడ నైతిన్ ! 400 పులిమీద పుట్రవోలెన్ తులువలు నా బౌద్భులెల్ల దోహలమున కా హళములు భేరీ రవములు పలుమారులు విన్చినారు; పక పక నగుచున్ త్త0క్షే సీసమును కరిగించి నా చెవులలోన పోసినట్టుల మదిలోన గాసి జెంది రుధిర ధారలు కనుల న(శ్రువులు రాల నమిత రోషానల జ్వాల సమిధనైతి ! 402 కూడదీ నింద వలదని కోరలేక ద్రోహినై వేదమాతను దూరలేక యెటుల వర్తింపవలెనొ నేనెరుగనైతి పోల్పనే నడకత్తెర బోకచెక్య 403
100 ధర్మదండం ఇది గని యాచార్యుండున్ మదిలో శంకించి బౌద్ధ మత ధర్మములన్ జదివించుట మాని మవీ పదలను గల్పించె నాకు బలు విధములుగన్ 404 ఒకనాటి నడిరేయి నొక మేడపై నేను నిద్రించుచుండగా; నీతిలేక వడినన్ను క్రిందకు పడద్రోసె నా బౌద్ధ ఛాత్రసంఘమ్ము మత్సరముతోడ; వేదమ్మె యొకవేళ విధి ప్రమాణమ్మైన నే బాధ పడక జీవింతుననుచు నెలుగెత్తి యరచితి పలుమార్లు క్రిందకు జారిపోయెడి నట్టి సమయమందు; సంశయాత్మకముగ శంకించితిని వేద కాన గోలు పోతి గన్నాకటి; యితర బాధ లేమి లేక (బ్రతికి నాడ! 405 సుగతుమతమ్ములోని పలు సూక్ష్మములన్ గ్రహియించి తీవ్రమై రగిలెడి నా మనమ్మున పరాభవకీలలు రేగుచుండ నా పగకు ప్రతిక్రియన్ జరిపి బౌద్భుల పీచమడంచ నెంచి యా తగవును దీర్చగా ప్రభు సుధన్వుని వేడితి; వాదమూనితిన్ ! 406 ధర్మమూర్తి యౌ సుధన్వుని కొల్వులో బౌద్ధగణమునిండి శుద్ధమైన తన్నరేంద్రు గలుషితమ్మొనగూరిచి వేదవాణి పట్ల విముఖుజేసె! 407
ధర్మదండం 101 వేదరాళి పట్ల విద్వేషముంజూపు రాజు మనసు నే మరల్చ నెంచి బౌద్ధ వేదమత వివాదమ్ములో నెగ్గు మతము గొలువుమనుచు నతని తోడ 406 పలికితిని; నాకు నా వేద పథముపైన నున్న యెనలేని విశ్వాసమెన్నిక గొని యంతరాంతరముల భక్తి చింతనంబు పల్లవింపంగ భూపతి వల్లెయనెను 409 రాజు సభదీర్చె నిగమశా'స్త ప్రమాణ సునిశిత కుఠారముంగొని సుగతుమతము వ్రయ్యలగునట్లు తత్పూర్వ పక్షమెల్ల చీల్చి చెండాడి వారల గెల్చినాను! 410 అనవుడు రాజు పల్కెను, “మహాత్మ! క్షమింపుడు! శాస్త్రచర్చలో ఘన విజయమ్ము ధీ విషయకమ్ముగ మీ ప్రతిభన్ వెలార్చు నై నను నిగమ ప్రమాణమున నమ్మిక పొందగలేను; దైవశ క్తిని నొకమారు నేను బరికింపవలెన్; బరికించి నమ్మెదన్ ! శే పర్వతము నుండి నేలపై బడియు నెవడు గొాయముల పాలుగాక సాక్ష్యమ్ము జూపు వాడె ఆదరణీయుండు వాని మతమె నాకు సమ్మతమనె జన నాథుడప్పు ! 412
102 ధర్మదండం
అనవిని పర్వతమునకుం
జని వేద మహత్తునెంచి సరగున భూమీ
-శుని యనుమానము దీర్చ న
వనికిన్ నే దుమికి నాను భయము నళింపన్ 413 గాయమ్ములు లేవాయెను
వేయి విధమ్ములుగ రాజు వేదము గొలువన్;
మాయా మంత్రౌషధములం
గాయము గాపాదుకొనియె గనుమనిరి ఖలుల్ ! 414 అంతనా రాజు కుపితుదై పంతమూని
కాళ సర్పమ్ము నొండొక ఘటమునందు
నుంచి “దీనిలో నేమున్నదో గణించి
తెలుపవలె, తప్పు జెప్పిన దలల తీతు!” శీ1ేర్ అనగ గడువు కోరితి మొక్కదినము; నాటి
రాత్రి నిష్టతో సూర్య సం'్రార్ధనమ్ము
జేయ ్రత్యక్షమై జ్ఞాన సిద్ధి గూర్చి
నాకు కర్తవ్యముందెల్పె లోకహితుడు ! 416 మరుదినమున బౌద్దులు ఖీ
కరమగు నురగమ్ము కలదు ఘటమున నన శ్రీ
హారి శేష శయనుడగుచున్
వరలు చునున్నాడటంచు వాక్రుచ్చితి నేన్ ! శ17
ధర్మదండం 10 ఎంత ఆశ్చర్యమిది? ఎంత వింత? త్రాచు మాయమై ఘటమున శేషశాయి పొల్చె ! దర్మమున కందగాలేని దైవ మహిమ దలచి నిశ్చేష్టితుండయి నిలిచె రాజు 1 418 “కాకుల జూచి కోయిలలుగా గణుతించితి నిన్నినాళ్ళు; వు జ్యాకర వేదమూర్తుల ననాదరణమ్మొనరించినాను; ని ర్వాకము చాలు! చాలు! శృతివాక్కు ప్రమాణము! బౌద్ధ ధర్మమున్ గూకటి వ్రేళ్ళతో పెరికి ఘోర మహాఘము బాపు కోవలెన్ 1” శ19 అటుచింతిల్లిన రాజు తద్గతిననేకానేక బౌద్దాళి సం కట మొందన్ వెదకించి చంపెను ప్రతిజ్ఞాపూర్తి గావించె నం తట వేదప్రతిపాదితాఖిల మహాధర్మంబులన్ గర్మలన్ స్ఫుటమై వెల్లగ జేసినాను ధరపై శోభాయమానంబుగన్ ! 420 కాని నా యంతరాత్మలో గలకలమ్ము నా గురుద్రోహమే నన్ను నలిపివేసె ! నాకు నిష్కృతి కలదొకో ! నాస్తి ! నాస్తి ! యగ్ని కావుతి కావలెననుచు దలచి శ21 ఈ తుషాగ్ని ప్రవేశించి ప్రీతితోడ దురిత పరిహారమగునని మురియుచుండ శంకరా! పాప హర ! ముక్తి సారమొసగ నీవె యేతెంచినావు! స్వామీ ! నమామి!” 42
104 ధర్మదండం
అని వినయంబగు పల్కుల
వినిపించెను భట్టపాద విబుధుండటుపై
తన చల్లని చూపులతో
ననలుని తీవ్రతను మాన్సె నాచార్యుండున్ ! శ23 “ఆర్య! ధర్మప్రచార కార్యార్ధివగుచు
భువికి దిగివచ్చినట్టి షణ్ముఖుడ వీవు
నీకు దురితమ్ములెటు కల్లు? నీకు మరల
జీవము నొసంగెదను; లేచిరావె ! వేగ] శ2ైక్ష నీవే నా భాష్యమునకు
గావించుము వార్తికమ్ము నగణిత మహిమన్;
ధావీ! నీ సముడు లేడు ధాత్రీ స్థలిపై !” 425 అనుచు నార్షధర్శ్మ ప్రచారాహవమున
నమిత బలశాలి; సర్వసైన్యాధికారి;
వీరవరుభట్టపాదుని వీడలేక
స్వామి యమ్మహా బుధునితో బలికినాడు 426 కరములు మోడ్చి సున్నితముగా దల (ద్రిప్పుచు పేర్మి మీర శం
కర గురు నాదరించుచు నిగర్వముగా నతడిట్లు పల్కె “ ఈ
మరణమె ముక్తి దాయకము; మత్రియ శిష్యుని వైదిక క్రియా
నిరతుని బండితాళి గణనీయుని మండన మి(శ్రు జేరుమీ ! శై
ధర్మదండం 105
పండితుడు; మండనుడు; వా గృండన భీముండు; వైరివాది బుధులకున్ చండ విభీషణుడగు మా ర్తాండుండా బుధుని శంకరా! గెల్వవలెన్! 428 వానిని జయింప జాలు నద్వైతమతము వాసిగాంచును; వానికి దాసులైన పెక్కు శిష్య ప్రశిష్యులు ప్రీతితోడ నీ మత వ్యాప్తి భువిని సంధింపగలరు” త్తం “వానికి భార్యయౌ యుభయ భారతి
సర్వకళా ప్రపూర్ణయె వాణికి వాణియై నిగమవాణి నెరింగిన
జాణ తత్వవి జ్ఞాన నిధానమైమెలగి న్యాయము
దత్సతియే వచించు; మీ మీ నియమమ్ములందెవరు మేటియొ?
యోటమి నెవ్వరొందిరో!” అని పల్కు భట్టపాదుని గని శంకర విబుధుడతని కర్ణములోనన్ ఘన తారక మంత్రమ్మును వినిపించి యొసంగె ముక్తి పీఠము గరుణన్ ! 430 పండిత ్రకాండు మండన మి(శ్రుని గలసి వాదమందు గెలువ నెంచి దోహలమున జేరె మాహిష్మతీపురి ఛాత్ర సహితుడగుచు శంకరుండు ! 431
1% ధర్మదండం మాహిష్మతీ వుర మాహాత్త్యము జప తపోధ్యాన సంసక్త నిర్మల చిత్త తీర్ధంబు మాహిష్మతీ పురంబు ! హోమ యాగామోఘ ధూమ వేస్టిత పుణ్య దేశంబు మాహిష్మతీ పురంబు ! నిత్యకర్మానుషంగిక దేవతార్చనా స్తిత్వంబు మాహిష్మతీ పురంబు ! వేద నాదామృత విద్యామతల్లికా రూపంబు మాహిష్మతీ పురంబు ! అ పురము తత్వభావాల కాపురమ్ము! ఆ పురము ముక్తి పీఠాల గోపురమ్ము ! అ పురము వాణి పాదాల నూపురమ్ము ! అ పురము ధర్మ వృషభము మూపురమ్ము ! 432 అ పురమ్ము జొచ్చి యా శిష్య బృందమ్ము మండనార్యునింట నుండి పనుల జక్కబెట్టునట్టి చానలు మువ్వరు కానరాగ త్రోవ గలసి కొనియె ! 438 గలయ వచ్చినాము కాన నాతని గృహ మ్మెచట గలదొ తెలుపరే ౯ యనంగ 1 434
ధర్మదండం 107 మండన మిశ్ర ధామ వర్ణనము
“వేదము స్వయం(ప్రమాణమో? వింగడింప
నదియు పరతః ప్రమాణమో యనుచు సతము
ద్వార నీడాంతరమ్మున బలుకునట్టి
శుకములున్నదె మండన సూరి గృహము ! 435 స్వతషప్రమాణం పరతః ప్రమాణం కీరాంగనా యత్ర గిరో గిరంతి ॥ ద్వారస్థనీడాంతర సన్నిరుద్ద్ధా జానీహి తన్మండన మిశ్ర ధామం *
కర్మ ఫలదమొ? ఫలదోష కారకమ్మె
యది యొకించుక చింతింప నగునటంచు
శుకములున్నదె మండన సూరి గృహము ! 436 ఫల ప్రదంకర్శ, ఫల ప్రదోష కీరాంగవా యత్ర గిరోగిరంతి ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ద్ధా జానీహి తన్మండన మి(శ్రధామం ౫
నిత్యమో? లేక జగతి యనిత్యమగునా?
యది యొకించుక చింతింప నగునటంచు
ద్వార నీడాంతరమ్మున బలుకునట్టి
శుకములున్నదె మండన సూరి గృహము” 47 జగద్రువం స్యా జ్ఞగదద్రువంస్యాత్ కీరాంగవా యత్ర గిరో గిరంతి ద్వారస్థనీడాంతర సన్నిరుద్ధా జానీహి తన్మండన మిశ్ర ధామం౫।
అని వారలు సలుకగనొ
య్యన శిష్యులు గురుని తోడ నమ్మహితాత్మున్
ఘన విద్వన్మండను మం
డన మి(త్రని జూడజేరి నారా గృహమున్ 438
106 మంగళాశాసనము శ్రీ మచ్చంకర పాదపద్మయుగ సంసేవాఫలంబీ శుభ క్షేమశ్రీయుతమైన కావ్యము మహాశ్రేయోవిభూత్యాప్తమై శ్రీమన్మంగళ మంజులాళిష సువృష్టిన్ దన్సి రక్షించుతన్ ! 439 బాదరాయణస గోత్రుడు, ఆశ్వలాయన సూత్రుడు కోడూరి విష్ణునందనకవి విరచిత ధర్మదండ నామకకావ్య ప్రథమ భాగమ్ సంపూర్ణమ్ శ్రీశ్రీశ్రీతీతీ మైల ల్
ల న్‌ా. జననం ః రౌద్రి అధిక కృష్ణ బహుళ అష్టమీ శుక్రవారం 1980 జూన్ 6 తల్లి దంద్రులు : కోడూరి శేషఫడి శర్మ , శ్రీమతి విజయ లక్ష్మీ నంద్యాల, కర్నూలు జిల్లా. శ్రీమతి కమలమ్మ రామతీర్థ కృష్ణాపురం, అళ్లగద్ద మండలం, కర్వూలు జిల్లా. మాతామహులు ; శుభ్రవేటి నారాయణ శాస్తి కళాశాల విద్య : శ్రీశ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, నంద్యాల. ,. . ఈకావ్యరచనాకాలం : 1998 ,