Telugu Cinare Gajallu - anilvaranasi/indianlanguages GitHub Wiki
॥ ౫ ను ఫా వ్ 4 శ వటి ని ళ్శ ఈ (1 // మం న సు ఇ 1కే తత. . య. శ (జీ న ల న... [! స లీ | సలు అయాసం శ నీ పు ( సట న స . ష్ ల్లో “ల్ | ావమైో " ( మో ఓ. ట్. లే | క (| న. జీ. సహజ కవి మలైమాల ( ళు సక్ నై మనసుపడి మక్కువతో సేక్రల్రంచ్ర్యు ఫ్ ప... ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం శ స స “సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి |. లలా . శేజ క్రీ ఆనందంతో బహూకరిస్తున్నాం, . స్ కా - మల్లెమాల కుటుంబం ఖో హ్. న. వా . నక మాలి సి గ = సా భో -
ల్సా అనాం గజళ్లు డా, సి. నారాయణ రెడ్డి మనస్వినీ ప్రచురణలు హైద్రాబాదు
6114[2క 6421౬1౮ క 9౯ 6.916/60/616 గింయయ/ శ ఈ ఖే సి” గ 564110౧ 29 )౮0/ 1995 ఫ్106 గె. 50/- ః వశనలమ్నూ య అ 66గ౧866 న్ ల వత వైర్! (60౪౭౯ 08518౧ * నా. యగ కంగ[0౯ గ గ్ గం? 600185. గీ ౪19616౧60౧ కింపి!13%109 [0౮56 , జీ-1-435, రింగ! 517861 [౬ 19౧0౧ 8%6౪6%, (1/66/0566. 500 00] 6౧4 113 86౧౦65 6౧6 నన క 00! 1౦-48 [11౧086౯ 60101), ౪51166 11119 '/రఆ'65006 6౦గ౧౦:66 61 కింగ౧106 97690165 1/66/6066 - 44 ౧౧. 660000 ౧౧186 61 తీగ౮ది6గ006 1౧165 గరం/6000 - 28 ₹%. 39]364
అంకితం అమ్మలాంటి మా అవమ్హూాయి
గంగకు మళ్లీ జన్మిస్తే నా తల్లి గంగ కావాలి. కన్నతల్లి బుచ్చమ్మే గంగైై దిగిరావాలి. నన్నే కన్షయ్యగ తన కన్నుల ఒడిలో పొదిగిన గంగకు అర్చ్పింతును నా గజళ్లు ఎదలోన మడిచి. బుణవిముక్తికై చేసిన కృతి సమర్పణం కాదిది. తల్లినోట ముద్దలిడే పిల్లవాని చాపల్యం.
కృతజ్ఞతలు
నలభయ్యెదేళ్లుగా తెలుగు కవితా రంగంలో నిరంతర కవిగా నిత్య ప్రయోగశీలిగా ఉన్న జ్ఞానపీర పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డా॥ సి,.నారాయణంెడ్డిగారు తమ సాహితీ వ్యాసంగంలో ఒక విశిష్ట భాగంగా తెలుగు గజళ్ల రచన చేస్తున్నారు. ఆయన ఇటీవల రచించిన ఓ 35 గజళ్లతో ఈ పుస్తకం మీ ముందుకు వస్తున్నది. ఇది వరకు వచ్చిన “తెలుగు గజళ్లు” పుస్తకాన్ని కూడా ప్రతులు చెల్లిపోవడం వల్ల దీనితో కలిపి వెలువరిస్తున్నాం. ఈ రకంగా సినారె గజళ్లన్నీ ఒక చోట ఉంటాయని మా ఉద్దేశం. “తెలుగు గజళ్లు'లో కొన్ని సినారె స్వయంగా గానం చేయగా క్యాసెట్ల రూపంలో వచ్చాయి. అలాగే అనేక వేదికలపైన ఎందరో గాయకులు గానం చేసి వీటి వ్యాప్తికి తోడ్పడుతున్నారు. ముఖ్యంగా విజయనగరానికి చెందిన ప్రముఖ గాయకుడు గజల్శ్రీనివాస్ వీటిని తన విశిష్టమైన బాణీలో పాడి అన్ని వర్గాల వారి ప్రశంసలందుకుంటున్నారు.
ఈ గ్రంథ ప్రచురణకు దోహదం చేసిన బెంగుళూరు వాస్తవ్యులు, సాహితీ ప్రియంభావుకులూ అయిన ఎ.రాధాకృష్ణరాజుగారికీ, వి.శ్రీనివాసరాజు గొరికీ మా హార్దిక కృతజ్ఞతలు.
రాధాకృష్ణరాజుగారు అజంతా మూవీస్ ద్వారా ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించి, ఎన్నెన్నో చిత్రాలను పంపిణీ చేసిన చలన చిత్ర ప్రముఖులు. “ఆంధ్ర కళా సమితి' వ్యవస్థాపకులుగా కర్ణాటకలో తెలుగువారి సంక్షేమానికీ, సాంస్కృతిక వికాసానికీ తోడ్పడుతున్నారు. అఖిలభారత తెలుగుమహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ప్రధాన పాత్ర వహించారు. ప్రస్తుతం బెంగుళూరులో ప్రతిష్టాత్మకమైన తెలుగు విజ్ఞాన సమితికి అధ్యక్షులుగా వున్నారు.
శ్రీనివాసరాజు గారు విదేశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్దించిన ఉన్నత విద్యావంతుడైన పారిశ్రామిక వేత్త, 'నవచేతని, “నవనిర్మాణ” వంటి సంస్థల ద్వారా సంఘసేవకూ, ధార్మికకార్యకలాపాలకూ పేరెన్నిక గన్నవారు. బెంగుళూరులో చిరకాలంగా స్థిరపడినా నిరంతరం తెలుగు భాషను అధ్యయనం చేస్తూ తమ ఉపన్యాసాల్లోనూ ప్రముఖ తెలుగుకవుల కవితలను విశేషించి - డౌ॥ సి.నారాయణరెడ్డిగారి “ప్రపంచ పదులను, ద్విపదులను ఉదాహరిస్తూ జనరంజకంగా ప్రసంగించడం వీరి విశిష్టత.
ఈ పుస్తకానికి ముఖ పత్రాన్ని డిజైన్ చేసిన హరిశంకర్కూ, టైప్సెట్ చేసిన యార్లగడ్డ నిర్మలకూ, అనుపమ ప్రింటర్స్వారికీ ఇంకా చిరంజీవులు ఎన్.చైతన్య, కె.విష్ణులకూ మా కృతజ్ఞతలు. హైదరాబాద్ మనస్వినీ ప్రచురణలు. 20.7.95
నామాట
ఇది ప్రధానంగా వచన కవితాయుగం. నేను ఒక వైవు వచన కవితా రచనలు చేస్తూనే గేయప్రక్రియకు చెందిన “ప్రపంచ పదులు, ద్విపదులు, గజళ్లు రూపొందించడం తెలుగు పారకులకు తెలుసు. ఇటీవల నేను రాసి, పత్రికల్లో ప్రచురించిన 35 గజళ్లను 'సినారె గజళ్లు' పేరుతో వెలువరించడానిక్రీ మనస్వినీ ప్రచురణల నిర్వాహకులకు ఆమోదం తెలిపాను. “తెలుగు గజళ్ళు" పుస్తకాన్ని కూడా దీనితో కలిపి వెలువరించాలనే ప్రచురణ కర్తల ఆలోచన కూడా నచ్చి అందుకు అంగీకరించాను.
నా గజల్ రచనా వ్యాసంగంలో 'తెలుగు గజళ్లు తొలి దశ, ఈ “సినారె గజళ్ళు" మలిదశ. తొలి దశలో పల్లవి, చరణాల పద్ధతిని ఒరవడిగా పెట్టుకొని అంత్యప్రాస నియతిని పాటిస్తూ కాఫియా, రదీఫ్ల విషయంలో కొంత స్వేచ్చను అనుసంధిస్తూ గజళ్లు ప్రయోగించాను. మలిదశలో ఊర్చూ గజల్ మౌలిక ధాతువులను అనుసరిస్తూనే మత్తా మొదలుకొని మక్తా వరకు అన్ని పాదాల్లోనూ మాత్రాసంఖ్యా సమత్వాన్ని పాటించాను. కాఫియా
స్వరూపంలో మాత్రం కొన్నిచోట్ల కాస్తా స్వేచ్చ తీసుకున్నాను. నా ఇతర గేయ రచనల్లో ఉన్నట్టుగానే ఈ గజళ్లలో కూడా చాలావరకు యతి నియమం ఉండడం గమనించదగ్గ అంశం. ఈ గ్రంధం రూపొందడంలో కృషి చేసిన వారందరికీ నా అభినందనలు. నారాయణరెడ్డి 'హైబ్రాబాదు 20.7.95
విషయ సూచిక 1 ఎదురుగ క్షీర సముద్రాలునా 1 2. నీటిని ఎంతగ మధించినా 2 3. చిన్నదీపమని అనుకోకు 3 4. ఇంతటి సౌజన్యనిధులు ర్ 5. కవిత రాయకుంటే (| 6. పూలదండ అని అందుకుంటె 9 7. అవని రూపు పరమాణువునడిగి 11 8. ఎవరో ఏదో అన్నారని 13 9. గాను గెద్దులా తిరుగుతుంటె 15 10. జనముంటే తరగని ఉత్సాహం 17 11. చిరునవ్వులాంటి మనసుంటే 19 12. కొండంత ఎత్తుకెదిగిన 21 13. సూక్ష్మదృష్టి లేదంటే 23 14. విరిసే వచ్చదనంలో 24 15. చినుకు పడగనే 26 16. శక్తికి పదునెక్కుతుంది 28 17. చుట్ట చుట్టి తనువును 30 18. కుదురుకుంటుందా సమాజం 32 19. మనసులోన రొద గాండ్రిస్తుంటే రశ
- మరీ అంత సుఖమైతే 36
- చుట్టూ వంచన పెరుగుతువుంటే 38
- ఎగరగలిగినన్ని ఎత్తులెన్నో 40
- జీవితం ఓర చూపులా 42
- మంచిని గుర్తించాలంటే 44
- పోటెత్తిన సాగరం 46
- నీ మాటకు విలువే లేకుంటే 48
- ముల్లు గుచ్చుకుంటుందని 49
- మాటకు దండం పెడతా 51
- వేళ్లలోకి నాలుకొచ్చి 653
- సరికొత్తగాలి వీచగనే ర్& 31 నీపై బురదను చల్లిన వాళ్లే 56
- జీవితం వసివాడుతుంటే 58
- ఆకాశం పట్టుకు వేలాడితె 59
- గాలి మారిపోతున్నది 61
- ఎక్కడివారో 63
సినారె గజళ్లు గ న్న
ఎదురుగ క్షీరసము(ద్రాలున్నా హృదయానికి దాహం కరిగే తొలకరిమేఘాలున్నా గగనానికి దాహం, తీర్చిన సభలో తలలే అలలై తెగ ఊగేస్తున్నా రసికత ఒలికే చెవి లేదేమని రాగానికి దాహం. తన రాక కొరకు సమస్తలోకం తారాడుతువుంటే చెరిగే చీకటిసిగ నిమరాలని కిరణానికి దాహం. ఎన్ని చూపులో తన చుట్టుగా భ్రమిస్తూనేవున్నా అనువైన తనువు లభించలేదని అందానికి దాహం. ఒడినిండా జలసంపదలెన్నో ఉరకలు వేస్తున్నా చేరిన అల తనతో నిలవాలని తీరానికి దాహం. తన ముంగిటిలో వెలకందని సొందర్యరాసులున్నా ఊహా ప్రేయసి కనపడదేమని దేహనికి దాహం.
2 సినారె గజళ్ళు విశాలసాగర పధాలలోపల విహరిస్తూవున్నా గిరిదాటి మట్టిలో ఆడాలని కెరటానికి దాహం. వేనవేల (ప్రాణాలను హరించి విసుగేసిందేమో మనిషిగా క్షణం జీవించాలని మరణానికి దాహం. అదృశళ్యశక్తులు జీవిత గతులను అవరోధిస్తుంటే కాలాన్ని జయించాలని “సినారె కావ్యానికి దాహం.
సినారె గజళ్లు 8 2
నీటిని ఎంతగ మధించినా నవనీతం పుడుతుందా మూతి బిగించిన మనసుంటే సంగీతం పుడుతుందా. కొత్త ఊపు తరగెత్తుతుంది శిరసెత్తి నడిస్తేనే పీతలాగ ఉంటే పారుష జలపాతం పుడుతుందా. లోభుల కొలువున ఎన్నాళ్లున్నా లోకువ బతుకేలే చెమటగ రక్తం (స్రవించినా నెలజీతం పుడుతుందా. సమభావనతో తూచినప్పుడే సమన్వయం సాధ్యం దర్శనశక్త చీలిపోతె అదైతం పుడుతుందా, ఆ|ర్టమైన హృదయంలోనే విప్పారుతుంది స్నేహం చట్రాళ్లలోన ఏనాడూ జలజాతం పుడుతుందా. విసిగితె నసిగితె చెదిరిపోవులే ముసిరిన చీకట్టు పరిస్థితులు ఎరుపెక్కకపోతె (ప్రభాతం పుడుతుందా,
త్తే సినారె గజళ్లు ఎదిగే ఆశకు సార్ధక్యం 'సైకెగురగలిగినపుడే పాతరలో ఉంటే స్వేచ్చాసంకేతం పుడుతుందా. ఉరిమే వ్యక్తిత్వమే “సినారే” తిరగబడుతుందిలే చేతులు నలుపుతువుంటే విష్ణవగీతం పుడుతుందా.
సినాం గజళ్లు క్ ళా తె చిన్నదీపమని అనుకోకు అది చీకటినే కాల్చేస్తుంది జనమేం చేస్తుందని అనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది. ఎంత తెగించిన సాహసమో నినదించే ఊరేగింపులకు వట్టి పిడికిలే అనుకోకు అది చట్టాలను "పేల్చేస్తుంది. మన చుట్టంతా (ప్రశాంతమే హోరున తుఫాను వచ్చేదాకా వెర్రికేక అని అనుకోకు అది వివేకాన్ని కదిపేస్తుంది. కంటికగుపడే రూపంతో పసికట్టలేములే ఆంతర్యం పొడి యిసుకే అని అనుకోకు అది జడివానను పీల్చేస్తుంది. మిన్నుపొరల్లో దాచేస్తే లోనున్న రహస్యం దాగదులే కన్నేం చేస్తుందనుకోకు అది (గ్రహలనే ఒలిచేస్తుంది. స్వచ్చ శీలమే నీకున్నా వెదజల్లే బురదను మరవొద్దు పుకారుకేమని అనుకోకు అది పునాదులను తొలిచేస్తుంది.
6 సినారె గజళ్లు బుర్రకు తట్టకపోతె యెలా రాబోయే పరిణామాలేవో జల్టుకదా అని అనుకోకు అది వెల్లువలై ముంచేస్తుంది. ఎదుటివాని బలమెంతటిదో గమనించకపోతే ప్రమాదమే గాలేం చేస్తుందనుకోకు అది మూలాలను పెరికేస్తుంది. మత్తుపారలు విడిపోతేనే సరికొత్త వివేచన పెరిగేది 'ప్రశ్నేం చేస్తుందనుకోకు అది ప్రపంచాన్ని కుదిపేస్తుంది. కటికనిజం పలికే హృదయం లొంగదు సినారె ఏ ఒత్తిడికీ కవితేం చేస్తుందనుకోకు అది కత్తులనే నరికేస్తుంది.
సినారె గజళ్లు ళా ట్తే
ఇంతటి సౌజన్యనిధులు ఎలా తీసుకోను ఇన్ని చుక్కలొక్కసారి ఎలా దూసుకోను. గగనం నన్నే వరించి గదిలోపలికొస్తే ఈ తెరిచిన గుండెను నేనెలా మూసుకోను. ఎద అద్దంలో దృళ్యాలెన్నా మెరుస్తుంటే ఎప్పుడు నా ముఖమే నేనెలా చూసుకోను. ఆత్మము(ద్ర నిరూపించినపుడే సార్ధక్యం ఈ ఒంటికి ఆ వేషం ఎలా వేసుకోను. ఫలిస్తుంది ఊహ బుద్ది పరిపక్తత ఉంటే ఒలికే రంగుతో బొమ్మ ఎలా గీసుకోను. సహజరూపమే జన ప్రశంసలందుకోగా ఏ నకిలీ పూతలొ నేనెలా పూసుకోను.
8 సినార గజళ్లు చిందిన చెమటకు ఫలితం అందుకుంటె తృప్తి ఎవరో పెంచిన పైరును ఎలా కోసుకోను. వ్యక్తిత్వం లేని బతుకు వ్యర్థమో “సినారే” ఏ దిగుమతి రాతలొ నేనెలా రాసుకోను.
సినారె గజళ్లు రి ర్
కవిత రాయకుంటే నాకేమో కలచివేసినట్టవుతుంది చిరునవ్వాక్కటి కనపడకుంటే చెమటపోసినట్టవుతుంది. ఉన్న (ప్రణాళిక లాపివేసి ఏవో పధకాలను ప్రకటిస్తే నాటిన మొక్కలు పెరికి బొగ్గులను నాటువేసినట్టవుతుంది. శత్రువు తిడుతుంటే పోరా అని సాగిపోతాను దర్జాగా మి(షత్రుడు ముఖాన్ని చాటేస్తే ఎద మోద కోసినట్టవుతుంది. ఎంతో నేర్పుగ ఎదిగే ప్రతిభను ఏముందంటూ నిరసిస్తే పురులు విప్పుకుని ఆడే నెమిలిని తరిమివేసినట్టవుతుంది. ఆచరణకు ఏమాత్రం పొసగని ఆలోచనలకు తలపడితే బుద్దిముదిరి బూడిదలో రంగుల బొమ్మ గీసినట్టవుతుంది. స్వార్ధం కోసం ఓయి సినారే స్వజాతి పరువును ఆరేస్తే అంగడిలోపల కన్నతల్లినే అమ్మివేసినట్టవుతుంది.
10 సినారె గజళ్లు 6౮
పూలదండ అని అందుకుంటె అది పొడిచేస్తే ఏం చేయను
అంచుమోద నిలుచుంటె తీరమే ముంచేస్తే ఏం చేయను. ఎవరో అపకారం తలపెడితే ఎదిరించే వీలుందిలే
పెంచిన పాదే పెరిగే తీగను తెంచేస్తే ఏం చేయను. ఎదురుగా పుట్ట అగుపడితే తిప్పేసుకోవచ్చు అడుగును కౌగిట చేర్చిన నేస్తం తానే కాటేస్తే ఏం చేయను. మండుటెండ తలమాడ్చేస్తుందని ఉండిపోవచ్చు ఇంటిలో చెట్టు నీడ అని చేరితే సెగలు చిమే "స్తే ఏం చేయను.
ఏ సుడిగాలో విసిరి కాగితాలెగర గొట్టడం సహజమే చేతులు తామే రాసిన నీతులు చెరిపేస్తే ఏం చేయను. అనుకుంటామా కన్నకడుపు (ద్రోహానికి తలపడుతుందని వసంతరుతువే పచ్చని తోటను మసిచేస్తే ఏం చేయను.
సినారె గజళ్ళు శ్రే] నేర్పిన చదువుకు కృతజ్ఞతలు అందించే రోజులు కావులే శిష్యుడే గురువు పరువు వీధిలో చెరిగేస్తే ఏం చేయను. విశ్వాసంతోనే మనుషులు జీవిస్తారు ఆత్మతృప్తితో కాపలా కుక్క తన యజమానిని కరిచేస్తే ఏం చేయను. ఎవరాత్మీయులొ కాదో తెలియని వ్యవస్థలో ఉన్నాములే పసికందును ఊపే ఉయ్యాలే విసిరేస్తే ఏం చేయను. మాటను చెవికందించినప్పుడే పాటకు తీయని సోయగం స్వరకర్తలే పదాల గొంతులను విరిచేస్తే ఏం చేయను. పరహితార్థమే ధర్మనిధులు ఏర్పరిచేదీ ఓ “సినారే” సాగేనది తన నీటిని తానే తాగేస్తే ఏం చేయను.
12 సినారె గజళ్లు
గ
అవనిరూపు పరమాణువునడిగి తెలుసుకో
కడలిలోతు కన్నీరై కరిగి తెలుసుకో.
ఏ సిరులూ పొందని సంతృప్తి ఏమిటో
కళా సరస్వతుల కాళ్లు కడిగి తెలుసుకో.
నిట్టూర్పు సెగల్లో గీపెట్టే మౌనం
ఉబికే సుడిగాడ్పులోన ఒదిగి తెలుసుకో.
మనసు అడుగులో మెదిలే మాటల నైజం
కనుపాపల కొలనుల్లో మునిగి తెలుసుకో.
అన్నిటికీ తల వూపితె అదీ దాస్యమే
సరుకు విలువ ప్రశ్నలతో చెరిగి తెలుసుకో.
(గ్రహాల పుటలకు ఎక్కని రహస్యాలనూ
పుడమిని నీ కాగిలిలో పొదిగి తెలుసుకో.
సినారె గజళ్లు 13 ఎప్పుడు ఓటమి ఎవరికి చెప్పిరాదులే విరిగినపుడె నిలువెత్తుగ పెరిగి తెలుసుకో. పండిన చెట్టే ఎందుకు వంగుతుందలా? ఉద్దతుడా నువు కాస్తా ఒరిగి తెలుసుకో, అంత సులువుగా అందితె అతడు దేవుడా? ఎవరికి అందని ఎత్తులకెదిగి తెలుసుకో, పట్టువడదు అలవోకగ (ప్రతిది “సినారే” మౌలికతత్వం సలసల మరిగి తెలుసుకో,
కడ సెకాలె గజళ్ళు 8
ఎవరో ఏదో అన్నారని మూసేయకు మాయని జీవితం ఏవో'కలతలు పాకుతుంటె చించేయకు రాయని కాగితం. అపురూపం ఈ సన్నివేశమని ఆశ్చర్యపడకు మిత్రమా! కాకి అనుకరణ నేర్చుకున్నదోయ్ కాదది కోకిలకూజితం. త్యాగసుధల్లో తలంటుస్నానాలాడే గొప్పలకేమిలే ఎంత దక్కినా సొంత సంచికే ఇంకెక్కడిదోయ్ పరహితం. ఆసనాలపై తిస్టవేసుకుని అక్రమ లాభాలుండగా ముచ్చులు తవ్విన గోతిలోనపడి మూల్లుతోంది కష్టార్దితం. చిత్తశుద్ధి ఏపాటిదో పరీక్షించే ఓపిక ఎవరికోయ్ ఊగుతున్నాయి తలలు జోరుగా బాగావుంది సుభాషితం. పెదవులపై ముసిముసినవ్వులతో కదిలేవారే అందరూ కదిపి చూడవోయ్ తెలుస్తుంది ప్రతి హృదయం బాధాపీడితం.
సినారె గజళ్ళు క్షే చట్టాలెన్నో చట్రాలై ఈ సమాజం చుట్ళు నిలిచినా వ్యవస్థ పొదిగిన అద్దం మాత్రం అవినీతిధూళి దూషితం, ఎంతగ నగ్నంగా వంచన ఊరేగుతున్నదో 'సినారే' ఏ పొగలూ పొరలంటని మనసులకే ఈగితం అంకితం.
16 సినారె గజళ్లు 0
గానుగెద్దులా తిరుగుతుంటె అది గతి కాదంటాను జుమ్మని గుండెను కదపకుంటె అది (శ్రుతి కాదంటాను. బతికుండగ తన పేరిట జరిగే భజనలకేంగానీ మృతి అనంతరం మిగలకుంటె ఆది స్చృతి కాదంటాను. నిద్రలో తడితె తుల్లిపడాలోయ్ నిలువెత్తు జ్యాలలా మగత ఊబిలో కూరుకుంటె అది మతి కాదంటాను. ఏ దిక్కులేక బతుకును పాగలా ఈడ్చుకొని పోయినా చివరిదాక సెగలెగియకుంటె అది చితి కాదంటాను. రక్తం మరిగిన నియంతలకు సహనోక్తి రుచిస్తుందా తెగబడి పంజా విసరకుంటె అది ధృతి కాదంటాను. మాటలు పొందికగా కుదరాలోయ్ మనసుల కలయికలా అతుకులతో సరిపెట్టకుంటె అది యతి కాదంటాను.
సినారె గజళ్లు [7 కొడిగట్టని చైతన్యానికె జేకొాడుతుందోయ్ లోకం బితుకుబితుకుమని వెలుగుతుంటె అది ద్యుతి కాదంటాను. మెరిసే పదచిత్రాలను చూసీ మురిసేరు 'సినారే" సృష్టిలోతులను చూపకుంటె అది కృతి కాదంటాను.
18 సినారె గజళ్లు 10
జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. నేడు ముదురుతున్న రాజనీతి రంగుపడితే మునులకైన పదవీ వ్యామోహం పుడుతుంది పరిస్థితుల పంజా తనపైకి దూసుకొస్తే ఉత్తబు(ర్రలోనైనా వ్యూహం పుడుతుంది. అలా అలా తేలిపోతె అంతట దేవుళ్లే చూపు ఆత్మలోకి దిగితె 'సోహం' పుడుతుంది. సర్వం సొజన్యమయం సమదర్శనముంటే ఊహలు నలుపెక్కితేనె ద్రోహం పుడుతుంది. వీలుచూసి గత్తి మార్చే విలువలదేం విలువ చెదరని మనసుంటేనె స్నేహం పుడుతుంది.
సినారె గజళ్లు 19 వకువలో కలిగేది వివేకమే 'సినారే ముసిరిన చీకటిలోనే మోహం పుడుతుంది.
2 సినారె గజళ్లు శ చిరునవ్వులాంటి మనసుంటే నా శిరసు వంచుతాను మోసం దాచిన ముఖముంటే ఆ ముసుగు చించుతాను. సభ్యత జార్చే ఒంటికుదుపుల (ప్రసారాలరికట్టీ వీధిలోన దరువేసే డప్పుకు విలువ పెంచుతాను. ఏమిచ్చినా కళాస్రష్టల బుణమెలా తీరుతుంది? హృదయాన్ని తీసి ఆ మహనీయుల ఎదుట ఉంచుతాను. ఎవరేమన్నా ఫల్రదంగా ఎదిగేవాణ్నికదా నాలుక చచ్చినవాళ్లకు కమ్మదనాలు పంచుతాను, సమతాదృష్టికి మసిపూసే దుస్తం్రాలెదిరించీ బిగిసిన వర్ష ద్వేషం కూకటివేళ్లు తెంచుతాను. [న్న కొందరి అరిచేతుల్లోనె తెలివి కులుకుతు వుండాలా? మిన్నుదిగని విజ్ఞానర్సురిని ఇలమోద దించుతాను.
సినారె గజళ్ళు డే మనిషికే కదా విషమ పరీక్షలు మానుకా 'సినారే! ఎన్నివలలు పైబడుతున్నా విదిలించి మించుతాను.
22 సినారె గజళ్లు శం
కొండంత ఎత్తుకెదిగిన బుద్దికి గుండెను అరువిస్తున్నాను కన్నీటికి యెంతటి పదునుందో కత్తికి బోధిస్తున్నాను. తోటకేమి కదలాడుతుంది ఏ తుమ్మెద రెక్కలు జుమ్మన్నా ఎడారి ఒడిలో గులాబీల గిలిగింతలు పలికిస్తున్నాను. ఎన్నెన్నిసార్లు పగిలిన హృదయం ఇట్టె అతుక్కుని పోలేదు ఎందుకు ఈ గాయం పచ్చిగ మిగిలిందా పరీక్షిస్తున్నాను. నకిలీ ముఖాలకే అడుగడుగున నజరానాలు లభిస్తుంటే కాలం అట్టడుగున మూళ్లే మూల్యాలను గాలిస్తున్నాను. చేసిన మేలుకు కృతజ్ఞతలు ఆశించలేదులే ఏనాడూ ఏరుదాటి తెప్పను తగలేసే తీరును గమనిస్తున్నాను. అవసరముంటే నాటోకేటో అన్నిటికీ వెలపెడతారు స్వార్థం తెరలో కులికే మనుషుల సంగతి పరికిస్తున్నాను.
సినారె గజళ్లు 23 చావుకు జీవితమంటే ఎందుకొ చచ్చేటంతటి విద్వేషం చిగురుకొమ్మ కీడేం చేసిందని చీడను (ప్రశ్నిస్తున్నాను.
ఈ కొన వూపిరిలోన 'సినారే' ఇంకెందుకు ఆలాపనలు సమాధిలో పాడాలని అభ్యాసం కొనసాగిస్తున్నాను.
2ైడ్తీ సినారి గజుళ్లు 13
సూక్ష్మదృష్టి లేదంటే సూదికి కోపం రాదా ఏదీ నీ గతమంటే బూదికి కోపం రాదా. చలువ గదుల్లో జరిపిన చర్చలపై పూతపూసి వేదికపై అభినయిస్తై వీధికి కోపం రాదా, కదిలే కాలంతో (శ్రుతి కుదరని మృత మూల్యాలను గాదెల్లో నింపేస్తై ఉగాదికి కోపం రాదా. పైపై అంతస్తుల వైభవ దృశ్యం వర్షిస్తూ ఆదినే మరుస్తుంటె పునాదికి కోపం రాదా. 'వేదసారమంతా (ప్రతిపాదంలో ఇమిడిందని సోదికి దిగితే కవితాస్వాదికి కోపం రాదా. స్వాభిమాన మమ్ముకున్న చవట తాను రుద్రుణ్నని కోతలు కోస్తే సినారె' క్రోధికి కోపం రాదా.
సినారె గబజిళ్లు 25 శ4
విరిసే పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం మెరిసిపడే చినుకుల్లో ఉన్నది మేఘం చేసిన సంతకం. జరిగిన సంఘటనలు ఎన్నెన్నో చరితలో చెరిగిపోయినా మృత్యువు దూరని పుటలో ఉన్నది సత్యం చేసిన సంతకం. చట్టాల చుట్టు తిరిగితేనె అరికట్టలేరు అక్రమాలను నైతిక పరిరక్షణలో ఉన్నది న్యాయం చేసిన సంతకం. ఒళ్లు నలగకుండా కబుర్లతో ఊరిస్తే నమ్మేదెలా ఆత్మార్సణలోనే బతికున్నది త్యాగం చేసిన సంతకం. అడుగు కదల్బక మాటిమాటికీ పిడికిలెత్తితే వ్యర్థమోయ్ శక్తి విజ్బంభణలో ఒదిగున్నది రక్తం చేసిన సంతకం. రాసే వేళ్లున్నాయని రాతలు రాసులుగా పోస్తేయెలా కదిలించే రచనల్లో ఉన్నది హృదయం చేసిన సంతకం.
2ర్ సినారె గజళ్ళు ఏ భాషలకూ అందని స్పందన ఏదో వుందని తెలియదా కనుగవ కలయికలో దాగున్నది (ప్రణయం చేసిన సంతకం, ఎవరికి వారే గీపెడితే ఆశించిన గమ్యం దారకదోయ్ సమైక్య సంఘర్షణలో ఉన్నది సంఘం చేసిన సంతకం. జూలు దులిపి మోసాలు దువ్వితే కాలానికి ఎగతాళిరోయ్ స్వాభిమాన సాధనలో ఉన్నది శౌర్యం చేసిన సంతకం. ఆలయాలలో కొలిచే ప్రతిమలు అత్మతృప్తికే 'సినారే” దయకురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం.
సినారె గజళ్లు 27 శే5్
చినుకు పడగనే ఉలిక్కిపడితే జీవితమెలా భరిస్తావు నిత్యం బిగుసుకు చస్తూవుంటే మృత్యువునెలా తరిస్తావు. మరీ అంత నాజూకుగ వుంటే మనుగడ సాధ్యం కాదు సుమా ఆర్తికి గిలగిలలాడే వాడివి కీర్తిని ఎలా ధరిస్తావు. చెరగని సంకల్పం కావాలోయ్ చెడును పెరికి వేయాలంటే చిత్తుగ తడిసిన అగ్గిపుల్లతో చీకటినెలా దహిస్తావు, ప్రసంగాలలో ని[గ్రహశబ్దం పదే పదే ప్రకటిస్తున్నా ఊరికే మనసు ఊరుతువుంటే కోరికలెలా జయిస్తావు. గాలికిపోయే ఆలోచనలకు కావ్యరూపం లభిస్తుందా కాలం నాడిని పట్టుకోనిదే కావ్యం ఎలా రచిస్తావు. అంతా సుఖమయమనిపిస్తుందోయ్ అలా అలా పైపైనుంటే లోతులు చూడకపోతే చిక్కుల రాతలు ఎలా పరిస్తావు.
28 సినారె గజళ్ళు న్యాయనిర్ష్ణయం చేసే అర్హత నడత స్వచ్చమై వున్నపుడే చేసిన పాపం తొలుస్తువుంటే శిక్షలు ఎలా విధిస్తావు. హేతువు పదునుగ చారబడితేనే ఏ నిజమైనా తెలిసేది సాధనమేదీ లేకుండానే మేధను ఎలా మధిస్తావు. గుండె మొండిపడిపోకుంటే దాగుండలేవు నీలో నీవే చేతులు రెండూ వణుకుతువుంటే మూతలు ఎలా బిగిస్తావు. అబ్బో యెంతటి దూరమో అంటె అందదు 'సినారె' తుదిగమ్యం పుటల సంఖ్యతో దిగాలు పడితే పుస్తకమెలా ముగిస్తావు.
సినారె గజళ్లు 29 16
శక్తికి పదునెక్కుతుంది సంఘర్షణలోనే అసలు నిజం తేలుతుంది అన్వేషణలోనే. ఉన్నదంత బట్టబయట ఒలికిస్తే యెట్టా అందం వెల పెరుగుతుంది ఆచ్చాదనలోనే. చూపులతో అంచులు తడిమే పద్దతి వ్యర్థం ఆత్మతృస్తి పెరుగుతుంది ఆస్వాదనలోనే. ఏముందని పెదవి విరిస్తే అంతా శూన్యం అణువణువూ బతుకుతుంది ఆకర్షణలోనే. నీళ్లు నములుతూ చూస్తుంటే ఫలితం అంతే సరుకెంతో తెలుస్తుంది సంభాషణలోనే. శాంతంగా పడివుంటే శవమనుకుంటారోయ్ ఆర్తి రెక్క విప్పుతుంది ఆందోళనలోనే.
30 సినారె గజళ్లు
ఏమిటి సాధించేది ముడేసుకు కూచుంటే
ఆజీ శ్రయత పలుకుతుంది అవగాహనలోనే.
మనసు చలించకపోతే మట్టి ముద్దకాదా
ఆర్రతపన రగులుతుంది ఆవేదనలోనే.
లోకం చెవిపెట్టదు లోలోన మూల్గుతుంటే
ఆకలిసెగ యెగుస్తుంది ఆ(క్రందనలోనే.
ఏ స్పందన లేకుంటే ఏం బతుకు “సినారే”
కాలం తలవూపుతుంది ఆలాపనలోనే,
సినారం గజళ్లు 31 శ
చుట్ట చుట్టి నీ తనువును నీవే శూన్యంలో విసిరేశావా రహదారులపై విరక్తిపుట్టి అరణ్యంలో సడకేశావా. తరుముకు వచ్చే వరద పడగపై తాండవించింది నీవేనా మనకెందుకులే ఆ పౌరుషమని మద్యంలో కలిపేశావా. ఎదురుదెబ్బలెన్నైనా భరించి తుదిగమ్యం చేరినవాడా చాలు చాలు గతవైభవమంటూ సౌఖ్యంలో మునకేశావా, ఎంతటి విషమ పరిస్టితిలోనూ ఎన్నడు తాణకని వ్యక్తిత్వం అలా పిచ్చిగా మోగుతోంది నైరాశ్యంలో (శ్రుతి చేశావా. పరువు గోడపై అలంకరించిన బిరుదులున్న పత్రాలన్నీ ప్రశ్నల దాడికి తట్టుకోని వైఫల్యంలో చించేశావా. ఏ ప్రలోభమో కళ్లుకప్పి నిన్నెక్కడికీడ్చుకు పోతోందో మాట కొరకు పడిచచ్చే తెగువను మార్గంలో ఒదిలేశావా.
82 సినారె గజళ్టు ఎంతటి శీలం పొదుగుకున్నదో ఏదీ ఆ జీవన చిత్రం మనసు కుంచెతో గీశావే ఉన్మాదంలో చెరిపేశావా. అంత తేలికా పెంచిన బంధాలన్నీ తెంచుకుపోవడం వాసనలేవీ కడిగేయక కైవల్యంలో అడుగేశావా. ఇప్పటి నీ ఎగపోతకు కారణమేమొ 'సినారె'కు తెలుసునులే పసిపొద్దును నీ మతి మాలిన చాపల్యంలో పిసికేశావా.
సినారె గజుళ్లు = 838 18
కుదురుకుంటుందా సమాజం అదుపు లేకుంటే కొత్తవేగం పెరుగుతుందా కుదుపు లేకుంటే. . ఒంటెలాగా ఈడ్చుకుని పోతుంటె ఏం బతుకోయ్? మెచ్చుకుంటామా కథను కొసమెరుపు లేకుంటే. ఉత్త ఉపదేశాలతో అభ్యుదయమొస్తుందా? పరుగిడదు జవనాశ్చమైనా చరుపు లేకుంటే. ఎదుటి వాదన లోతుగా గమనించకుంటె ఎలా? వీడిపోదు సమస్య పట్టూ విడుపు లేకుంటే. ఎన్ని మేధాశక్తులున్నా ఎక్కడో లోపం మహాకవి కాడేమొ కాస్తా మరుపు లేకుంటే. మృతగతాన్న కప్పుకుని విలపిస్తై ఏం లాభం? మారుతుందా కాలగతి ఏ మలుపు లేకుంటే.
ప్క సినారె గజళ్లు
గాలి తాకిడితోనె ఆకులు కదిలి పోయేదీ పలుకుతుందా స్వాభిమానం పిలుపులేకుంటే.
అదే పనిగా చిము శతుంటే అవి నినాదాలే
ఎదను మోటదు కవిత మాటల పొదుపు లేకుంటే.
ఏదొ ఒక గురిపైన చూపుంటేనె ఉల్దాసం
ఉలికిపడుతుందా మనసు ఏ బులుపు లేకుంటే.
ఓటమికి భయపడి ఉసూరని దాటుకుంటారేం
నిలువలేడు 'సినారె' రోజొక గెలుపు లేకుంటే.
సినారె గజళ్లు తెర్ యం మనసులోన రొద గాండ్రిస్తుంటే మౌనాన్ని పదునుపెట్టుకో దారి ఊబిలా లాగేస్తుంటే ధైర్యాన్ని ఎక్కుపెట్టుకో. అవరోధాలేవీ లేకుంటే అది జీవితమే కాదులే సమస్యలే తెగ కురుస్తువుంటే సహనాన్ని తలకు చుట్టుకో. విషమక్షణాలు వేగిపోనిదే వేచిన ఫలం లభించదోయ్ ఎదురుగ ఉదయం నిలిచేదాకా హృదయాన్ని చిక్కపట్టుకో. వేసే బాణం; పది శిరసులతో విరోధి ఎదురైనప్పుడే కుత్సితులెవరో మొరుగుతువుంటే (క్రోధాన్ని అదుపుపెట్టుకో. కసి ఉమిసే నిందలకు జడుసుకుని కలతపడితె ఏం లాభమోయ్ ధూర్తుల నాలుకలూడేదాకా దుఃఖాన్ని పాతిపెట్టుకో, ఎక్కిన పీఠానికి సార్థక్యం ఎదకు చూపులున్నప్పుడే ముచ్చట్ల పూలజల్టుకు మురియక మూలాన్ని వెతికి పట్టుకో.
36 సినారె గజళ్లు పచ్చినిజాలు భరించలేక పైపై వైరాగ్యాలెందుకోయ్ బాకులు చుట్టూ దిగుతూవున్నా లోకాన్ని అంటిపెట్టుకో. తప్పుకాదు 'నా' అనే తపన; ఆది తన పరిధిలోన నిలిస్తే సంఘాన్నే మింగేసే కపట స్వార్థాన్ని అదిమిపట్టుకో, మంచితనాన్ని ప్రబోధించే ప్రతి మనిషికి పరీక్ష తప్పదోయ్ దుర్మతులెందరు పోట్టు పొడిచినా ధర్మాన్ని చేతపట్టుకో. కడదాకా నీ అడుగులె నీతో నడిచిరావులే “సినారే” కావలసినవారే వెళిపోతే కాలాన్ని వెంటపెట్టుకో,
సినారె గజళ్లు 2 20
మరీ అంత సుఖమైతే మనుగడకే ప్రమాదం ఆత్మశుద్ధి కపుడప్పుడు అవసరమే విషాదం. అచ్చమైన 'స్నేహనికి అద్దంలా నిలిచినా దుమ్ములా తనంతతానె కమ్ముతుంది విరోధం. మనుషుల్లో సామరస్యమన్నది మృగత్వస్షరోయ్ గొప్ప గొప్ప స్యాములకే తప్పలేదు వివాదం. తన మనసుకు నచ్చినదేదైన ప్రీతి పాత్రమే పోకిరి మనవడు జుత్తును పీకుతుంటె వినోదం. ఎదుటివాని ఎదుగుదల రుచించదోయ్ అసూయకు సూర్యోదయమవుతుంటే చూడలేదు నిశీధం. అంత సులువుగా హితోక్తి అంటుకోదు గుండెలో ఒక్క చిటికలోన నెత్తికెక్కుతుంది నినాదం.
38 సినారె గజళ్లు (ప్రపంచమే ముంగిట్లో పచారు చేస్తుండగా ఇరుగు పొరుగు ఇళ్లమధ్య ఎందుకంత అగాధం. వద్దంటే దానిపైనె ముద్దు పెరుగుతుందిరోయ్ ఎప్పటి వరసే తెరలో; ఇంకెక్కడి నిషేధం, దేవుడైన ఊరికె స్పందించడోయి 'సినారే' అను[గ్రహం లభిస్తుంది అందితేనె ప్రసాదం.
సినారె గజళ్ళు 39 2కే చుట్టూ వంచన పెరుగుతువుంటే చూస్తూనే ఉన్నారా తీరం మునుగుతువుంటే రాగం తీస్తూనే ఉన్నారా. ఏదీ ఆ వాగ్దాన లక్ష్మి కనిపించదు ఎన్నేళ్లయినా లు లొ చేస్తామంటూ మెత్తని కోతలు కోస్తూనే ఉన్నారా. చెదలంటని శీలంతోనే వికసిస్తుందోయ్ వ్యక్తిత్వం మేసిన కుప్పలు చాలక ఇంకా మేస్తూనే ఉన్నారా. రాశికొస్తుంది చిత్తశుద్దితో చేసిన చిన్నపనైనా పొద్దంతా వేదాంతరసం వడబోస్తూనే ఉన్నారా. యధార్థాన్ని ముందుంచకుంటె న్యాయానికి మనుగడ ఏదీ 'హేతువుకందని రగడలకే దరువేస్తూనే ఉన్నారా. 'ప్రతిభాచక్రం తుప్పు పడుతుంది పరివర్తన లేకుంటే ఎప్పటి పాత్రలనే బతుకంత నటిస్తూనే ఉన్నారా.
త్తం సినారె గజళ్లు మట్టిలోని పిసరంత విత్తనం మహావృక్షమౌతుందే ఎదగని బెత్తెడుతోకల్లా జీవిస్తూనే ఉన్నారా. రు. అధి అడుగడుగున నది జడుస్తుంటె ఆ నడక సాగేదెలాగా చావు రాకముందే ప్రతి నిమిషం చస్తూనే ఉన్నారా. శుభ్రంగా జీవించాలంటే సూటిదనం కావాలోయ్ చేసిన తప్పును ముసుగులోన దాచేస్తూనే ఉన్నారా. రచనకు కొత్తదనం లేకుంటే రుచి ఏముంది 'సినారే” రాసిన రాతలు సిరా మార్పుతో రాస్తూ నే ఉన్నారా.
సినాం గజళ్ళు త్తే 22
ఎగరగలిగినన్ని ఎత్తులెన్నో చూశాను ఎదుటపడని నక్కజిత్తులెన్నో చూశాను. పదునెక్కిన మాట్రతేఎదను కదుపుతుంది ఎగిరిపడే మొండి కత్తులెన్నో చూశాను. ఎంత చమురు పోసీ ముట్టిస్తే ఏముంది ఏ వెలుతురు లేని వత్తులెన్నో చూశాను. రూపానికి ముసలితనంతో పనేమిటంట వన్నె వెలిసిపోని జుత్తులెన్నో చూశాను. స్వచ్చ హృదయసమర్పణకు సన్మానం గుర్తు ఏమార్చే పూలగుత్తులెన్నో చూశాను, చేస్తున్న ప్రచారమేమొ చెట్టంతటిదైన ఎందుకు కొరగాని విత్తులెన్నో చూశాను.
శ2 సినారె గజళ్లు పాళ్లు తెగక పెద్దతలలు పట్టువదలకుంటె ళా లు ఎలుకల పాలైన సొత్తులెన్నో చూశాను. చిత్తశుద్దిలేనిదె ఏంచేస్తే ఏముంది ఎదుగు లేని మరమ్మత్తులెన్నో చూశాను. చిటికెడు పుచ్చుకుని ఏమి నటనలో 'సినారె ఇంత కంటె దొంగ మత్తులెన్నో చూశాను.
సినారె గజళ్ళు త్రై 23 జీవితం ఓర చూపులా బులిపిస్తుంది చెంగు జారుస్తూ మెత్తగ ఉడికిస్తుంది. ఎంతగా 'స్నేహపరిమళం పంచుతు వున్నా ఎందుకో ద్వేషం పాగలా వ్యాపిస్తుంది. పచ్చగా నిత్యం ఎదుగుతు బతకాలంటే చిచ్చులా సంశయమేదో జడిపిస్తుంది. ఊబిలా వ్యామోహం దిగలాగేస్తున్నా ఊతగా నిలిచి వివేకం నడిపిస్తుంది. హేతువును పాతరవేస్తే ఇంకేముందోయ్ భూతమే పీరమెక్కి పరిపాలిస్తుంది. గుండెలో మొండి సాహసం పొంగులెత్తితే కొండనైనా కుదుళ్లతో పెకిలిస్తుంది, ళా
క! సినారె గజుళ్లు మనసులో చల్లని భావన వీచిందంటే మౌనమే చినుకుల దరువులు పలికిస్తుంది. విలువలకు పట్టిన (గ్రహణం వీడేదెపుడో? విజ్ఞాలను (ప్రశ్న పుండులా వేధిస్తుంది. సూక్తి వినిపిస్తే ఎక్కదు చెవికి 'సినారే' సూటి అనుభవమే పాఠం నేర్పిస్తుంది.
సినారె గజళ్లు కో 24 మంచిని గుర్తించాలంటే స్పందించే హృదయం అవసరం వ్యక్తిగ పైకెదగాలంటే తలవంచని వినయం అవసరం. కెరటంలాగా రొమ్ము విరుచుకుని తిరిగితె పౌరుష చిహ్నమే అనురాగం చిలికేటప్పుడు రవ్వంతటి బిడియం అవసరం. అర్భకమతులను మంత్రించే పై అలంకారాలకేమిలే ఏ కృతికైనా బతుకులోతు చూపించే విషయం అవసరం. కుళ్లిపోయిన వ్వవస్థ్రను పట్టుకు వేళ్లాడితె అది వ్యర్థమే ల గీ చ ఆం కొత్తసృష్టి జరగాలంటే పోటెత్తే ప్రళయం అవసరం. లక్షల అడుగులు సాగేదీ తమ లక్ష్యశిఖరి చేరాలనే ఎంతటి ఓటమిలోనైనా ఒక అంతిమ విజయం అవసరం, ఇనుప కట్టలో అనుభూతులు బంధిస్తే అది ఏం గొప్పలే ఏదో ఒక దశలో గుండెను ఎగరేసే ప్రణయం అవసరం,
శీర సినారె గజళ్లు ఊహల ఎత్తుల్లో విహరిస్తూ ఉనికినే మరిస్తే ఎలా చుక్కల్లో కొలువున్నా తలదాచుకునే నిలయం అవసరం. ముంగిట ఉన్నది అందలేదనీ కుంగిపోతె ఏం లాభమోయ్ సూదిని మించిన చురుకున్నా కలిసొచ్చే సమయం అవసరం. ఎంత కాలమని చీకట్లను తాగేస్తుంటారోయ్ “సినారే” ఎక్కిన మత్తు దిగాలంటే ఎరుపెక్కిన ఉదయం అవసరం.
సినారె గజళ్లు త్త 25
పోటెత్తిన సాగరం ఒదిగి కూచుంటుందా అలలెత్తిన ఆ(గ్రహం క్షణం పడుకుంటుందా, ఏ వత్తిని వెలిగిస్తామని ఊరించారో ఆ వత్తి విసిగిపోతె కత్తి కాకుంటుందా, ఆ పక్కా ఇళ్లకు పక్కన పూరిగుడిసెలా? -ఈ పచ్చిదగాలకు విముక్తి లేకుంటుందా. మదమెక్కిన చీకటి గద్దెను దిగనంటుంటే ఎరుపెక్కిన వేకువ చీల్చుకు రాకుంటుందా? ఏ మూలుగు కొసవూపిరి పిసికేస్తున్నారో ఆ మూలుగు ఎలుగెత్తి ఒరే అనకుంటుందా? ఆ సహనం అసమర్ధత అని అణిచేస్తుంటే అట్టడుగు మట్టిటీడ్డ తిరగబడకుంటుందా?
డర సినారె గజళ్ళు ఏ వ్యవస్థ పీడితుల గొంతు నులిమేస్తుందో ఆ వ్యవస్త్రపై చావుదెబ్బ పడకుంటుందా? -ఈ వేషమెంత జూ(గ్రత్తగ పోషిస్తున్నా ఏనాడొా అసలు రంగు బయటపడకుంటుందా? ఎన్నెన్ని కొాలగతులను చూశావా 'సినారే' నీవన్న మాట తెరకెక్కక దాగుంటుందా?
సినారె గజళ్ళు త్తం బ2ె6
నీ మాటకు విలువే లేకుంటే అది మాట యెలా అవుతుంది తన మాటున పరువును దాచనిదే అది పైట యెలా అవుతుంది. కుసుమాలై విరిసే అందాలకు పహరాలు విధిస్తున్నారా ఏ తుమ్మెద అలికిడి లేకుంటే అది తోట యెలా అవుతుంది. సరదాగా విసిరే ఏ పదమైనా సాగేది చెవుల వరకే ఎదపై పులకింతలు నాటనిదే అది పాట యెలా అవుతుంది. బులిపించే ఆశల యెండమావి చూపించి దాటుకుంటారా జనకోటిని గమ్యం చేర్చనిదే అది బాట యెలా అవుతుంది. ఏవేవో గొప్పలు గాలిలోన గుప్పిస్తే సరిపోతుందా తానున్న చోటైన తడపనిదే అది ఊట యెలా అవుతుంది. ఎంతెంతటి బతుకైనా తప్పవులే ఎదురుదెబ్బలు 'సినారే" ఏ పోటీకైనా నిలవనిదే అది ఆట యెలా అవుతుంది.
ర్0 సినారె గజళ్లు 2/7 టి. ముల్గు గుచ్చుకుంటుందని తెలిసే ముట్టుకున్నాను పాము కాటువేస్తుందని తెలిసే పట్టుకున్నాను. మల్లెపువ్వులాగా జీవించే మనిషినే అయినా చుర చుర కాల్చే నిందలు తలపై చుట్టుకున్నాను. అప్పుడప్పుడూ కోరికలేవో గుప్పుమంటున్నా తహ తహలాడే చూపులదాడికి తట్టుకున్నాను. వెలకట్టలేని జరీకలలు నావెంట పడుతున్నా కాలాన్నే ఒక నూలు పంచెలా కట్టుకున్నాను. నా హితోక్తులను వినకుండానే నన్ను పొగిడేస్తే పెరిగే పేరును మడిచి సంచిలో పెట్టుకున్నాను. నలుగురిలో సెలయేటి నురగలా నవ్వుకుంటూనే నిట్టనిలువునా చీలిన గుండెను కుట్టుకున్నాను.
సినారె గజళ్లు ర్1 ళా లోకం ఆడే ఆట 'సినారే' నీకు తెలియనిదా కి త్. తెలిసి తలూపె దౌర్భాగ్యానికి తిట్టుకున్నాను. ర పిలాల వ ్ గ్ ఆ న స (| గ క్. లో నేల వైదాబాదాలో న
క్2 సినారె గజళ్లు 28
మాటకు దండం పెడతా పాటకు దండం పెడతా మాటను పాటను నమ్మిన మనిషికి దండం పెడతా. ఎంత రాచమొక్కైన సిమెంటులోన మొలవదురా సృష్టికి ప్రాణం పోసే మట్టికి హారతి పడతా.
చేతనైతె కాస్త మంచి చేసి చూపడం ధర్మం
గంజిని విషమొలికే నాగన్నల భరతం పడతా.
నీతి చచ్చిపోతె రాజనీతి ఉండి యేం లాభం? పులివేషం వేసిన నక్కలతోలు బయట పెడతా. అనుకుంటే జాగృతి; పడుకునివుంటే నిద్రాస్టితి పోటునడకతో సోమరి పొద్దుకు చురకలు పెడతా. పదును గుండెమంటమిద ముదిమియీగ వాలదులే మరో పదేళ్లయినా ఈ వరసలోనె పరుగిడతా.
సినారె గజళ్లు 53 అరువు తెచ్చుకున్న గొంతు అసలే సరిపడదు నాకు కడవూపిరిదాక స్వీయకంరంతో గ్పెడతా. అచ్చమైన ప్రతిభముందు అందరు ఒకటే 'సినారె" కదిలితె అట్టడుగుమనిషి కాళ్లకు గజ్జెలు కడతా,
ర్క్సీ సినారె గజుళ్లు 26
వేళ్లలోకి నాలుకొచ్చి అల్లరి పెడుతూవుంటే మాటమట్టిలో నుంచే పాటరెక్క పుడుతుంది. కమ్ముకున్న కలలేవో కడుపును మెలిపెడుతుంటే
శిల నుదుట తళుక్కుమనే చెమటచుక్క పుడుతుంది. మంచితనం పునాదిగా మనుషులెదుగుతూవుంటే మంటలపాదుల్లో సిరిమల్లెమొక్క పుడుతుంది. మేలుకున్న అశ దివ్విటీలా వెలుగుతువుంటే
తూగే శవరాత్రి నడుమ వేగుచుక్క పుడుతుంది.
మరీ గుడ్డిగా నమ్మకు మనవాళ్లని ఓ 'సినారె' గోరూపంలోనే ఓ గుంటనక్క పుడుతుంది.
సినారె గజళ్లు క్ర్ 30
సరికొత్తగాలి వీచగనే ముడుచుకునే వాళ్లు అలలెత్తే భవితవ్వాన్నే అణుచుకునే వాళ్లు, ఎదురీదలేరు చీకటి వెల్లువకు బారసాచి పొద్దెక్కిన తరువాత ఒళ్లు విరుచుకునే వాళ్లు. ఈనాటితరం గుండెల ఘోషలు వినలేరబ్బో ఏనాడో ఇంకిన ఘనతను తలచుకునే వాళ్లు. నిష్టుర పరిస్టితులకెదురుగ నిలువలేరు పాపం తమ పిరికితనం పానుపులా పరుచుకునే వాళ్లు. వర్దిల్లే ప్రతిభను చూస్తే కుళ్లుకు చస్తారు తమ ఎత్తును మాత్రం నిత్యం కొలుచుకునే వాళ్లు, పరమార్ధం పేరిట ఎంతటి నటన చూపుతారో ప్రతి అవకాశం స్వార్థానికి మలచుకునే వాళ్లు
5్6 సినారె గజళ్ళు బాణా(గ్రంలా ముకుసూటిగ దూసుకుపోలేరు బతుకంతా వంకరనడతలు నడుచుకునే వాళ్లు. జీవిస్తారు శవాలకు కప్పిన గుడ్డల్లాగా తమ విలువలన్నిటిని తామే ఒలుచుకునే వాళ్లు, (ప్రవహించే కాలంతో రాలేరులే 'సినారే' కంపించే తమ గద్దెలనే కరుచుకునే వాళ్లు.
సినారె గజళ్లు ట్7 తే నీపై బురదను చల్లిన వాత్తే నీపేరు జపిస్తున్నారు న! న్ నీ ఇంటిని కాల్చేసిన వాళ్లే నీతో నడిచాస్తున్నారు. పొగడ్రలన్నీ నిజమనుకుని ఉప్పాంగిపోతె అది బేలతనం బండబూతులను చిమ్మిన వాళ్లే బాకాలూదేస్తున్నారు. పిచ్చినమ్మకంలో పడ్డావా పచ్చి మోసమే గతి నీకు సంచికేమిలే; లోపల కల్తీ సరుకులు నింపేస్తున్నారు. అందమైన మర్యాదలు చూసీ ఆంతా మనవాళ్లనుకోకు చేతులు కలిపిన వాళ్లే చాటుగ గోతులు తవ్వేస్తున్నారు. గుళ్ల చుట్టు తిరిగేవాళ్లంతా గొప్ప భక్తులని అనుకోకు పరమాత్మునికే కళ్ళుకప్పి పాపాలు చలాయిస్తున్నారు. అది స్వకీయమో రాజకీయమో అంతుపట్టని వ్యవస్థ యిది క్రీర్తశేషుల పటాలను చూపీ కీర్తిని కొట్టేస్తున్నారు.
56 సినారె గజుళ్ల తడిమి తడిమి చూస్తే 'సినారె' ఎంతకు చేజిక్కని తంతుసుమౌా రంగుల వెలుగుల మాటున చీకటి రహస్యాలు దాస్తున్నారు.
సినారె గజళ్లు 59 32
జీవితం వసివాడుతుంటే చిగురులాగా ఎదిగిపో పిచ్చిమూకలు రెచ్చగొడితే చిచ్చులాగా రగిలిపో. అంత ఎత్తునవున్న లక్ష్యం అందుతుందా ఊరికే ఒరిగిపోతే రెండు రెక్కలు; ఊహలాగా ఎగిసిపో, ఏళ్ల తరబడి మొండి బతుకును ఈడ్చితే ఏముందిలే తనువు మట్టిని కలిసినా (ధ్రువతారలాగా వెలిగిపో. మెరుపులెన్నో చరుపులెన్నో తరలిపోయే యాత్రలో కాలగతులకు ఎదురునిలిచే కవితలాగా మిగిలిపో, నాల్గుగోడల నడుమ మత్తుగ మూల్లితే ఏం మనిషివోయ్ చురుకు నెత్తురు పెంచి తారాజువ్వలాగా ఎగిరిపో. ఏ అసూయల ముళ్లకంపలు ఎదను చీరుకు పోయినా ఈల వేస్తూ ఓ 'సినారే' గాలిలాగా కదిలిపో.
650 సినారె గజళ్ళు 33
ఆకాళం పట్టుకు వేలాడితె వాకిలికందదు ఆశయం అక్షరాలపై తేలితేనె మతి అంచులకంటదు వాజ శ్రియం, గాలి వాటుగా పడిపోతూ అది ఘనతగ భావిస్తే ఎలా ఎదురీతలు అపుడప్పుడైన లేనిదె పదునెక్కదు సాహసం. సరదాగా కాలాన్ని మొటుతూ తిరిగే (ప్రాణులకేమిలే అనుభవాల నాగళ్లు దుక్కిదున్ననిదే పండదు మానసం, జటిలపరీక్షల ఉచ్చులు తెంచుకు సాగే తెలివే తెలివిరా
, రగిలే నిప్పుల్లో కాగనిదే నిగనిగలాడదు కుందనం. వస్తుగుణం అవగతమవుతుంది పరిస్థితి బాగున్నప్పుడే పరిహాసాలకు గురైనవానికి పరిమళమివ్వదు చందనం. నలుగురి మెప్పుల కోసం జరిపే కలాపాలు సపైపైనివే తలమున్కలుగ శ్రమించనిదే ఫలితాలందించదు శోధనం.
సినారె గజళ్ళు 61 ఎత్తుమోద కూచున్నావని నీవృత్తి కలుషితం చేయకోయ్ అడుసుగుడిసె ఉరిమిందా ఒక గడియైనా నిలవదు ఆసనం. నెత్తుటితో చెయి కడిగే ముష్కరనీతి ముదిరితే 'సినారే' దమనకాండపై తిరగబడే జనధాటికి ఆగదు శాసనం.
రై సినార గజళ్లు చెడ
గాలి మారిపోతున్నది వేళ మారిపోతున్నది కనువెలుగే రంగుల చీకటిగ మారిపోతున్నది. ఏ పాదుగులు పితికితె నిండిందో ఈ పాలకుండ ఎవరు చిల్లి పొడిచారో ఇలా కారిపోతున్నది. ఏమి పిచ్చిపట్టిందో ఎగిరిపడే సుడిగాలికి దేశం పెట్టిన విగ్రహ దీపమారిపోతున్నది. తూటాలాగా రివ్వున దూసుకుపోయే వ్యవస్థ ఏ కొవ్వంటిందో మరి ఇలా ఊరిపోతున్నది. త్యాగధనుల రక్తంతో తడిసిన ఈ యెగ[ర్రనేల షోకైన సుఖాల ఊబిలోక జారిపోతున్నది. సర్వాంగంగా ఎదిగిన సామ్యవాద వృక్షానికి యుగదోషం అంటించిన తెగులు మోరిపోతున్నది,
సినారె గజళ్ళు 63 వీధిమానిసికి పీఠంవేసే చరమాంకంలో రాత్రిక్తి రాత్రే రాక్షసపాత్ర దూరిపోతున్నది. కోట్టప్రజలు ప్రాణంలా కూడబెట్టుకున్న ఫలం చిత్రంగా ఓ 'సినారె' చెయ్యి జారిపోతున్నది. (సోవియట్ రష్వా మవోవ్చక్షాన్లి సమూలంగా మెళ్లిగెన్తునువుడు మాస్కోలో (ప్రత్యక్ష సాక్షిగా ఉన్లునాటి వ్రతిన్సందన్సు
ర్క సినారె గజళ్లు తె5్ ఎక్కడివారో ఎంతటివారో ఒక్కచోట ముడిపడ్డారు కలిమికి లేమికి గడియలువేసీ కలం పూజలోపడ్డారు. తాము జనించిన దేశాలేమో తన్నుకు చస్తూనేవున్నా గొంతుకలన్నీ ఒకే వేదికగ సంతరించి నిలబడ్డారు. జన్మమూలాలు వేరైనా తమ చర్మవర్థాలు ఏవైనా కవితకంటిలో మెరిసే సూర్యముఖంలాగా కనపడ్డారు. ఎక్కడ ఎప్పుడు ఏ మాత్రం ఒక చక్కని భావం అగుపడినా సర్వం మరిచే గుండెలతో ఆస్వాదించగ ఎగబడ్డారు. రేపో మాపో ఎవరికి వారే రివ్వున ఎగిసే వారైనా ఈశస్తూగా" స్మృతి కావ్యపుటల్లో ఏం బాగా స్రిరపడ్డారు. పొద్దూ మాపూ పలకరింపులే ముసినవ్వుల చిలకరింపులే ఓయి “సినారే ఏమి మాయ ఇది ఒకరికొకరు లోబడ్డారు. (స్రూగా (యుగోస్తేవియ్రాలో జరిగిన విళ్చకవిసమ్మేళనంలో భారత దేళప్రతినిధికవిగా పాల్గొన్సుప్పుడు రాసింది)
తెలుగు గజళ్ళు డా. సి. నారాయణ రెడ్ది
ఈ సంపుటి గురించి ఉరూ భాషలో గజల్ ఒక కమనీయ కవితాలహరి. ఒక గులాబీల గుళుచ్భం. ఒక మత్తకోకిల రసాత్తకూజితం. సరసభావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు. అది జోల పాడుతుంది - జ్వాల రేపుతుంది. గజల్లో ఒకే విషయాన్ని చెప్పాలన్న నిర్బంధం లేదు. భావం ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉండొచ్చు. గజల్ పల్లవిని “మత్తా' అంటారు. చివరిచరణాన్ని 'మక్తా' అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. ' కొన్నిట్లో అంత్యప్రాసకు ముందు మరో ప్రాసపదం ఉంటుంది. వీటిని " రదీఫ్, కాపియా లంటారు. చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది. దీనిని *తఖల్లున్' అంటారు. నా 'తఖలుస్ 'సినార”. గజలంటే అనేకార్థాలున్నా న్థూలంగా “ప్రియురాలితో సల్దాపం”.
ప్రాయికంగా ఇది శృంగారపరం. కొన్నిటిలో తాత్విక స్పర్శ్ణలూ ఉంటాయి. కానీ నా గజళ్లలో ప్రణయానికి బదులుగా మానవీయ దృక్పథాన్నీ, ప్రగతి శీలాన్నీ మెత్తని అధిక్షేపాన్నీ ప్రవేశపెట్టాను.
పదం నాదంగా, భావం రాగంగా, అనుభూతి స్వరరితిగా గుండెతో నేను పలికించినవి ఈ గజళ్లు. 16.11.66 సినారె
విషయ సూచిక 1నా హృదయం ! 2. ఎంత చీకటి కాల్చెనో 2 3. పరులకోసం క! 4. ఏవో ఏవో బాధలు తీ 5. ఆత్మలను పలికించేదే ర్ 6. ఇందరు మనుషులు 6 7. పలుకున్న కావ్యం 7 8. అమ్మ ఒక వైపు 8 9. గులాబీ పువ్వు రి 10. గదిలో మూల్గుతున్నావా 10 11. విసుగొచ్చిందా జనమంటే 11 12. వికసించిన కుసుమం 12 13. మనసైన స్నేహం 13 14. మరణం నను వరించి వస్తే గత 15. సుఖమైనా దుఃఖమైనా 15 16. ఒకే ఒకసారి 16 17. ఇప్పుడిప్పుడే తెలిసింది 17 18. కనుదారుల ముసిరే 18 19. నీటినిలేచే ఆవిరికీ 19
- చిరునవ్వును పలికించే 20
- మబ్బుకు మనసే కరిగితే 21
- మంచు పాగలుండేవి 22
- ఎదలొకటైెతే 23
- మనసుంటే చెవికి 24
- ఎవరయ్యా 25
- మోడు కలవరిస్తున్నది 26
- ఎవరేమని తిడుతున్నా 27
- పిడుగులేవా పడతాయని 28
- ఎటుపోతున్నది దేశం 29
- జీవిస్తున్నాను 30
- కంటిముందు 31
- నిలబడి చూస్తుంది 32
- నన్ను దాటి 33
- ఏమి చెప్పను నాది 34
- గజలంటే 35
తెలుగు గజుళ్లు గ యా శ నా హృదయం చలించిపోగానే నడకలు నేర్చుకుంది ఆకాశం నా నయనం భ్రమించిపోగానే నవ్వులు రాల్బుకుంది మధుమాసం. తనలో తాను నీడ చూసుకుని తననే తడిపి ఆరవేసుకుని ఎదలో తనకు చోటు చాలదనీ పెదవిని చేరుకుంది దరహాసం. వీచే గాలి పిలుపు గమనించీ పూచే నేల ఎరుపు పరికించీ పెదవుల బాసలింక చాలుననీ పిడికిలి కోరుకుంది అవేశం. (బ్రతుకే ఆటలాగ భావించీ పగలే కాగడాలు వెలిగించీ ఆఖరి జాములోన చితిలోన అశ్రువు లేరుకుంది పరిహాసం. ఎదురుగ ఎండమావి రమ్మన్నా ఇదుగో చేదబావి అంటున్నా కదలని ఓ 'సినారె' నిను చూసీ కాలం మార్చుకుంది తనవేషం.
2 తెలుగు గజళ్లు ౭ ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక, కాలమేమో బరువు బరువు కంటికేమో నిదుర కరువు ఎంత చేదును మింగెనో ఇంత తీయని కోరిక. సూదిపోట్టకు గుండె సాచీ బాధలకు భాష్యాలు వ్రాసీ ఎంత కీర్తిని మోసెనో ఇంత మెత్తని మాలిక. కాంక్షలేమో- కదలిపోగా ఆంక్షలెన్నో ఎదురురాగా ఎంత ఓర్పు వహించెనో ఇంత తీరని వేడుక. మంచుదాడులు జరుగుతున్నా మండుటెండలు రగులుతున్నా ఎంత మట్టిని పీల్ళెనో ఇంత పచ్చని వాటిక. ఏరు దాటితె ఎవరు వారే ఏమి లోకం ఓ 'సినారే'! ఎంత నటన భరించెనో ఇంత పల్చని జీవిక.
తెలుగు గజళ్ళు ఏ3 తె
పరులకోసం పాటుపడని నరుని బతుకు దేనికని? మూగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని? తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా పలికెను మన సంస్కృతి జల్టుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని? ఆదర్శాలకు నోళ్లు చాలవు ఆశయాలకు ఫైళ్లు చాలవు పదపదమంటూ పలుకులెగానీ కదలని అడుగు దేనికని? జలవిద్యుత్తుకు కరువే లేదు జనసంపత్తికి కొరవే లేదు అవసరానికీ మీట నొక్కితే అందని వెలుగు దేనికని? శిశుహృదయానికి కల్లలు లేవు రసరాజ్యానికి ఎల్లలు లేవు లోపలి నలుపు 'సినారె' కు తెలుసు పైపై తొడుగు దేనికని?
తీ తెలుగు గజళ్ళు టీ ఏవో ఏవో బాధలు భరించె మూగజీవితం ఎన్నో ఎన్నో గీతలు ధరించె తెల్లకాగితం. సుతకోటి హితకోటి వున్నా గతవైభవం చాటుతున్నా ఎంతో ఎంతో వేదన సహించె మాత్పభారతం,. చిరునవ్వు జలతారులున్నా సరదాల రహదారులున్నా; జానా జానా |! లోకమే అనంత శోకపూరితం. పొరలేని తత్వార్థమున్నా భువిలోని వృత్తాంతమైనా ఐనా ఐనా కావ్యమే అనూన కల్పనామృతం. ఇది వాపు-అనుకోకు బలుపు; ఇది ఊపు- రాలేదు మలుపు. అంతే అంతే సంఘమే అనాది వ్యాధి పీడితం. తన గొంతు తడి ఆరుతున్నా మునుముందు ఏ కొండలున్నా ఏరై పారే జాతికే “సినారె” గీతి అంకితం.
తెలుగు గజళ్లు తె 5
ఆత్మలను పలికించేదే అసలైన భాష ఆ విలువ కరువైపోతే అది కంఠశోష వేదం ఖురాను బైబిల్ వీధిలోన పడతాయా? మతమేదైనా ఒకటేలే ప్రతీమనిషి శ్వాస, అవినీతికి పట్టంకట్టీ అభ్యుదయం పూడ్చిన జాతీ! ఇకనైనా కళ్లు నులుముకో ఇది రక్తఘోష నానాటికి ఏమీ పతనం నాలో ఒక తీరని మధనం (ప్రభుత్వాలు ఏమైతేమి పైసాపై ధ్యాస. తల నెరిసిపోతే దిగులు తనువూరిపోతే దిగులు అది దిగులు కాదు సినారే తుది జీవితాశ
6 తెలుగు గజళ్లు 6 ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు? ఇన్ని మనసులూ గీతికలైతే ఎందుకు వేరే కోయిలలు? దూసినకొలదీ దోసిలి చాలదు; పరచినకొలదీ పానుపు చాలదు ఇన్ని మమతలూ ఘుమఘుమ లాడగ ఎందుకు వేరే మల్లియలు? దయ కురిపించే తలపే తీయన; లయ పలికించే చూపే తీయన ఇన్ని మధురిమలు ఎదలో నిండగ ఎందుకు వేరే తేనియలు? పగలూ రేయీ రెప్పవాల్బక పక్షపాతమూ అసలే ఎరుగక ఇన్ని కనులు నా యింట వెలుగగా ఎందుకు వేరే వెన్నైలలు? అలిసినవేళల చలువజోలలై తలచినవేళల రాగమాలలై ఇన్నిగాలులు 'సినారె ను ఊపగ ఎందుకు వేరే ఊయలలు.
తెలుగు గజళ్ళు [7
గో
పలుకున్న కావ్యం అనంతం అనంతం
ప్రతిసారి నవ్యం వసంతం వసంతం,
కాలాని కెదురీది కదలాడుతుంటే
కన్నీటి పయనం సుఖాంతం సుఖాంతం.
ఎదలోన విశ్వాన్ని సాదిగించుకుంటే
గదిలోకి రాదా దిగంతం దిగంతం.
చిరునవ్వుతో లేమి చేదించగలిగే
నిరుపేద హృదయం ప్రశాంతం ప్రశాంతం,
గతకాల మృతభావ కథలెన్నినాళ్లు
కానీ అవశ్యం యుగాంతం యుగాంతం,
అనురాగమే జీవమైతే “సినారే”
పెనుళైలమైనా లతాంతం లతాంతం.
| తెలుగు గబిళ్లు 8
అమ్మ ఒక వైపు-దేవతలంతా ఒక వైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు. ఈ బండి చూడరా నాన్నా ఈ గు(ర్రమింక నీదన్నా తెగమంకుతో చిననాడు దిగలేదు అమ్మమూపు. రొదలలో మౌనపారంలా వ్యధలలో జ్ఞానపీరంలా నా బాల్యమంతా తానే నడిపింది అమ్మచూపు. చీకటికి చం(ద్రబింబంలా ఆకలికి పూర్ణకుంభంలా నిలువెల్ల మమతల వెలుగై నిలిచింది అమ రూపు. మెరిసే ప్రభాతకిరణంలా విరిసే వసంతకుసుమంలా పెరిగే 'సినార” బ్రతుకులో దొరికింది అమ్మప్రాపు.
తెలుగు గజళ్ళు త్త ం
గులాబీపువ్వు చూడగనే బలేగా మురిసిపోబోకు కనపడని ముళ్ళు ఎన్నెన్నో-ఓ మనసా! మరిచిపోబోకు. మహలులటో కాపురాలున్నా మజాగా తిండి తింటున్నా కునుకు కరువైన బతుకులను-ఓ మనసా! మరిచిపోబోకు. వలచిచూస్తే వసంతాలు అలిగిచూస్తే అగాధాలు కనులకెంతెంత పదునుందో - ఓ మనసా! మరిచిపోబోకు. చెట్టు పూచిందా ఉల్చాసం చేను పండిందా సంతోషం మట్టిలో ఎంత విలువుందో- ఓ మనసా! మరిచిపోబోకు. నింగిలో తాను కాలువుంది నేలపై జాలిపడుతుంది మబ్బుకెంతెంత మనసుందో- ఓ మనసా ! మరిచిపోబోకు. పగటి కలలుండి ఏంలాభం? ప్రగతికే ఎంత అవరోధం. క్షణం చేజారితే అంతే-ఓ మనసా | మరిచిపోబోకు. మంచుమలపైన నీవుంది పొంచి ఒకలోయ చూస్తుంది. 'సినారే' మాట లోతెంతో- ఓ మనసా ! మరిచిపోబోకు.
10 తెలుగు గజళ్లు 10
గదిలో మూల్నుతున్నావా విశాలగగనమా
రొదలో నలుగుతున్నావా రసైకహృదయమా! కుళ్లిన బురదనీట వేళ్లను సారించుకొనీ
అల్లన ఎదుగుతున్నావా (ప్రపుల్లకమలమా! పండిన వెన్నెలనూ (ప్రకృతికి అర్పించుకొనీ
పాపం తరుగుతున్నావా పప్రపూర్ణచంద్రమా! కలతల చీకటులను కళ్లలో కుదించుకొనీ
కలకల వెలుగుతున్నావా (ప్రసన్న వదనమా! పచ్చని ఆశయాల పగుళ్లు లెక్కించుకొనీ బతుకును అడుగుతున్నావా ప్రశాంతమరణమా! వాలే ఆకుల నిశ్వాసలు పూరించుకొనీ లోలో పెరుగుతున్నావా వసంతపవనమా! మండిన ఈ “సినారె గుండెను అంటించుకొనీ మంచై కరుగుతున్నావా మనోజ్ఞకవనమా!
తెలుగు గజళ్లు 1 కక!
విసుగొచ్చిందా జనమంటే వెర్రివాడా! ఆ జనమె నిను నడిపించే అడుగుజాడ, కునుకొచ్చిందా చదువంటే కు(ర్రవాడా! చదువేరా నిను లాలించే చల్లనినీడ. దడపుట్టిందా (ప్రేమంటే పడుచువాడా! (పేమేరా నిను ఒడిచేర్చే వెన్నెలమేడ , మోజుడిగిందా బతుకంటే ముసలివాడా! ఆ బతుకే నిన్నూగించే ఆశల ఊడ. బెరుకొచ్చిందా చావంటే పిరికివాడా! ఆ చావే ఓయి 'సినారే' ఆఖరి ఓడ.
12 తెలుగు గజళ్లు శం
వికసించిన కుసుమం నిలిచేదీ ఒక రెన్నాళ్లంటాను వెలకందిన మురిపం వెలిగేదీ ఒక మూన్నాళ్లంటాను. మతిచెదిరే మలుపులు బులిపిస్తున్నా ప్రతి మజిలీలోన గతి తప్పని బతుకే పయనించేదీ నూరేళ్లంటాను. జన్మించిన జీవికి మృతి తప్పదనే సత్యం కాదనను చరితార్జుల "పేరే జీవించేదీ వేలేళ్లంటాను. మనసాపని శోకం చీల్చుకువస్తే ఆపకు ఆవేగం కనుపాపల పొరలను వెలిగించేవీ కన్నీళ్లంటాను. జనకోటికి అందక కాగితాలపై సాగుతూంది (ప్రగతి ఆ ప్రగతి 'సినారే' ఎండమావిలో పరవళ్ల్తంటాను.
తెలుగు గజళ్ళు 13
13
మనసైన స్నేహం మరుమలైైచెండు
ఎదలేని మోహం అది గాలిదిండు.
నేనున్న నేటిసంఘం 'పైపైని మేలివర్షం
ఇక విప్పనేలా ఇది మేడిపండు.
అడుగేస్తై ఏమి అలుపో నడకంటె ఎంత జడుపో
హోరెత్తదేమీ ఆ రామదండు.
ఆశించి చేరుకున్న అమృతాల దీవికన్న
అనుకోక అందే ఆ తీపి మెండు.
మదిలోని మూగగాయం వ్యధరేపితే “సినారే
చిన ముత్యమైనా పెనురాతిగుండు.
క్షత తెలుగు గజిళ్లు శశ
మరణం నను వరించివస్తే ఏమంటాను- నేనేమంటాను? పాలుపట్టీ జోలపాడీ పడుకోమంటాను. లంచం నను భజించివస్తే ఏమంటాను- నేనేమంటాను? తిరుమలగిరి హుండీలో చారబడమంటాను. కామం నను కలవరపెడితే ఏమంటాను-నేనేమంటాను? అలిగివున్న పడుచుజంటతో కలబడమంటాను. క్రోధం నను కవ్విస్తూంటే ఏమంటాను- నేనేమంటాను? పసచచ్చిన పేడిజాతిలో బుసలిడమంటాను. లోభం నను బులిపిస్తుంటే ఏమంటాను- నేనేమంటాను? తెగఒలికే కవిపలుకుల్లో దిగబడమంటాను. అహంకార మెదురైవస్తే ఏమంటాను- నేనేమంటాను? నరుని వదిలి కొండనెత్తిలో స్టిరపడమంటాను, కాలం పులిలా గాండ్రిప్తే ఏమంటాను-నేనేమంటాను? దిగులెందుకు ఓయి 'సినారే' తెగబడమంటాను,
తెలుగు గజళ్ళు క్షే5్ 15
సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన సఖుడైనా శత్రువైనా ఒకటే నా దీవన. బతుకంతా పాడుకుంటా మృతిలోనా నవ్వుకుంటా వెలుగైనా చీక్షటైనా ఒకటే నా స్పందన. ఎగిసిందీ హోరుకడలి ఎదురేగే నావ నాది గెలుపైనా ఓటమైనా ఒకటే నా సాధన. ఏ శిలలో నాదముందో ఏ ఉలిలో ఊపిరుందో జడమైనా జీవమైనా ఒకటే నా శోధన. సెగలాగ కంటినీరే రగిలిందా ఓ 'సినారే క్షుధభైనా (క్రోధమైైనా ఒకటే నా వేదన.
16 తెలుగు గజళ్లు 16
ఒకే ఒకసారి నా చూపు ఎకాయెకి ఆగిపోయింది కలవరం చిలికే చలికాలం నిలువునా కాగిపోయింది. ఏమిటీ వింతచైతన్యం ఎక్కడిది ఇంతసౌజన్యం? కొమ్ములను వంచని గిరిశిఖరం కొమ్మలా ఊగిపోయింది. గొంతులో మూగపొగరుందో గుండెలో తీగచిగురుందో మోడులా నిలిచిన నామౌనం మురళిలా మోగిపోయింది. నిరాశల చీడ తగిలిందా నరాలకు వేడి తగ్గిందా? కత్తిలా మెరిసే యువరక్తం వత్తిలా తూగిపోయింది. గోతులా నీతినిలయంలో? గోడలా జాతిహృదయంలో? “సినారే” లోని శిశహృదయం చిచ్చులా రేగిపోయింది.
తెలుగు గజళ్లు శ క గ
ఇప్పుడిప్పుడే తెలిసిందీ కాటేసే పొదరిళ్లున్నాయనీ ఇప్పుడిప్పుడే తెలిసిందీ కాల్చ్ఫేసే వడగళ్లున్నాయనీ. పలకరించిన (ప్రతిచూపూ వెన్నెల చినుకే అనుకున్నాను ఇప్పుడిప్పుడే తెలిసిందీ విషమెగజిమ్మే కళ్లున్నాయనీ, (బ్రతుకూ నటనా వేరువేరనీ భావించాను ఇన్నాళ్లూ ఇప్పుడిప్పుడే తెలిసిందీ నటియించే కన్నీళ్లున్నాయనీ. ఎదురుపడగనే చేతులుకలిపే ఎన్నిసందడులు చూశానో ఇప్పుడిప్పుడే తెలిసిందీ వంచించే కౌగిళ్లున్నాయనీ. అడవుల్లోన నడిరేలైనా నడిచాను నే పదిలంగా ఇప్పుడిప్పుడే తెలిసిందీ జడిపించే వాకిళ్లున్నాయనీ. కోరిన గమ్యం అందెననీ అనుకున్న 'సినారె' కు చిత్రంగా ఇప్పుడిప్పుడే తెలిసిందీ విసిరేసే పరవళ్లున్నాయనీ.
18 తెలుగు గజళ్లు 18 కనుదారుల ముసిరే చీకటిలో ఒక మిణుగురుపురుగే చాలు. కణమైనా కదలని వేకువలో ఒక గునగున పరుగేచాలు. చెలరేగే రౌద్రసము(ద్రంలో శివమెత్తిన పొంగులకేమి చలచల్లని పాపల పెదవులపై ఒక తెల్లని నురుగేచాలు. పయనించే ఒంటరి పధికునికీ భ్రమకాలిపే దృశ్యాలెన్నో తియతీయని పిలుపులు రమ్మన్నా వెనుదీయని అడుగేచాలు. చిగురించిన నందనసీమలలో నివసించే సంపదలున్నా సెగలేవో రగిలే విరహులకూ చెలిపయ్యెద గొడుగే చాలు. మృదుష్పుదువుగ చేసే బోధలతో కథనడవదు ఓయి 'సినారే' మదమెక్కిన జగతిని అదిలించే పదునెక్కిన నుడుగేచాలు.
తెలుగు గజళ్లు 119 10 నీటిని లేచే ఆవిరికీ నింగిని మూగే కోరిక నింగిని పూచే జాబిలికీ నేలను సాగే కోరిక . శిరసులనూపసే చేలున్నా చేతులుకలిపే పూలున్నా పదమాగని పసిగాలులకూ వెదురున మోగే కోరిక. పిలుపులు గళమున పుడుతున్నా పెదవుల తలుపులు తడుతున్నా మౌనం వలచిన మమతలకూ మదిలో మూలళ్లే కోరిక. చలువగదులలో తామున్నా చదువూ సుఖమూ తమకున్నా అలజడి రగిలే గుండెలకూ అడవుల దాగే కోరిక. పచ్చని ప్రాయంలో వున్నా పయనించే విధి తమదైనా నిజం '“సినారే' కొందరకీ నిలబడి తూగే కోరిక,
20 తెలుగు గజళ్ళు 20 చిరునవ్వును పలికించే స్వరకల్పనలెన్నెన్నో హృదయాలను ఒలికించే మృదుచి(త్రణలెన్నెన్నో. శిలలాగా పడివున్నా తెలవారని బ్రతుకైనా అగుపించక ఎగిసిపడే ఆ స్పందనలెన్నైన్నో. -ఆ కంఠం ఏదైనా ఆ పారం చేదైనా రసహృదిలో రవళించే శిశుభావన లెన్నెన్నో. ఏకాంతం ఒడిలోన ఏదో అలజడిలోన నయనాలు సమర్పించే (పప్రియభాషణలెన్నైన్నో. మునుముందుకు పోలేక క్షణమైన నిలువలేక కెరటాలై ఘోషించే చిరవేదనలెన్నెన్నో. ఆ మాటే విషమైనా ఆ మనిషే వెగటైనా కసి మాటున సాగించే కరచాలనలెన్నెన్నో, వికసించిన (ప్రతి కుసుమం ప్రకటించదు తన హృదయం అరుదైన 'సినారే' పై ఆరాధనలెన్నెన్నో.
తెలుగు గజళ్ళు 21 లశ
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం ! జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫల మేముందనకు. ఇసుకల గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషీ మృగమూ ఒకటనీ అనుకుంటే వ్యర్థం. మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష హిమగిరి శిరసులు మాడితే అది యేరవుతుంది. బిరుదులు పాందే వ్యాప్తికీ విలువేమి 'సినారే” చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.
22 తెలుగు గజళ్లు 22
మంచుపాగలుండేవి మరికొన్ని నిమిషాలే ఆ పిదప నిండేవీ అదిత్యకిరణాలే. ముళ్లు కాటేస్తున్నా జలు జడిపిస్తున్నా కడదాక నడిచేవీ తడబడని చరణాలే. మనిషి పశువవుతుంటే మతం విషమవుతుంటే మమతలను పంచేవీ మడిలేని హృదయాలే. ఎదలలో సెగలున్నా ఎదుట ఏ పొగలున్నా దయను కురిపించేవీ తడివున్న నయనాలే, కాలమే చీకటిలా కళ్లలో చొరబడినా ఓ 'సినారే' నీవీ ఉరిలేని ఉదయాలే.
అలుగు గజళ్లు 239 23
ఎదలొక్షటైతే ఎక్కడవున్నా దూరం కాదంటాను అలిసిరితీగకు నిలువెల్లపూలున్నా భారం కాదంటాను. ఎవరి బతుకులో ఎన్ని కడలులో ఎంత ఈదినా ఎన్నిమునకలో మునిగే చేయీ ముట్టినదల్లా తీరం కాదంటాను. మనసును కలబోసి మనకందించే గరికపువ్వైనా తరగని కానుక మనసు ముడుచుకుని మణులు కూర్చినా హారం కాదంటాను్ను. ఇది బహుతీపని ఇది కడుచేదని ఈ రుచివాదం ఎందుకోసమని నచ్చిన హృదయం ఇచ్చిన మిరియం కారం కాదంటాను. మణులున్నాయి మట్టికడుపులో; మునులున్నారు మూఢజగతిలో మాయావాదం వేదాంతానికి సారం కాదంటాను. ధర్మం పగలే దారితప్పగా దమనవిధానం నోరు నొక్కగా చేయి విసిరితే ఓయి 'సినారే నేరం కాదంటాను.
2శీ తెలుగు గజళ్లు 24
మనసుంటే చెవికి తడుతుంది ప్రతిమాట మనోహరమై పలుకుంటే ఎదను తడుతుంది ప్రతిపాట సుధాకరమై. బతుకంటే మృత్యుబంధువని (ప్రతినిత్యం అనుకుంటే కాడైనా కంటపడుతుంది కణకణమూ శ్రీకరమై. మతమంటే ఒక అభిమతమనీ పప్రతిమనిషీ అనుకుంటే జగమంతా రూపుగొంటుంది సహజీవన మందిరమై. ఆరపొరలూ త్రుటిని తుడిచేసే ఒక చిరునవ్వు చిలికితే శిలసైతం పలకరిస్తుంది నవచేతన భాసురమై. మురిపెంతో చేత అందుకునీ జడముడిని తురుముకుంటే గరికైనా విరిసిపోతుంది మృదుపరిమళ బంధురమై. విలువేదీ అసలు తెలివికనీ చింతిలబోకు 'సినారే' వెలకడితే వెలిగిపోతుంది ప్రతీకెంపు (ప్రభాకరమై.
తెలుగు గజళ్లు లెద ఖర్ ఎవరయ్యా ఎందుకు మీరెందు కురుకుతున్నారు? ముళలాగ దిగిపోయిన కాళు పెరుకుతున్నారు. లు రా ఇటు నిరాశ అటు దురాశ ఏది ఏది మీ గమ్యం? కదురులేని మనసుమీద కలలు వడుకుతున్నారు. సన్నగిలైనా ధైర్యం? సల్లిపోయెనా శౌర్యం? రగిలే వేసవిలో ఇంతగా వణుకుతున్నారు. ఇరుకునుంచి బయటపడీ వెరపులోంచి కుదుటపడీ ఈ యెడారి పాదుగునుంచి ఏమి పితుకుతున్నారు? నేలమీద నిలువలేక గాలిలోన ఈదలేక రాలి పడిన ఇం(ద్రధనువు రంగులతుకుతున్నారు. ఉప్పెనలా ఉదయించి నిప్పుల్లో జీవించీ కీళ్లువాచి 'సినారె! గతకీర్తి గతుకుతున్నారు.
26 తెలుగు గజళ్లు 26
మోడు కలవరిస్తున్నది పువ్వై జీవించాలని నేడు కలవరిస్తున్నది రేపై జీవించాలని. మగతనుంచి తప్పుకునీ పొగదాడికి తట్టుకునీ కన్ను కలవరిస్తున్నది చూపై జీవించాలని. అంతులేని నీలిమలో గొంతుబంటి దిగిపోయిన మిన్ను కలవరిస్తున్నది మెరుపై జీవించాలని. పొదవేసిన మౌనశిక్ష కెదలోనే ఎదురుతిరిగి వెదురు కలవరిస్తున్నది పిలుపై జీవించాలని. ఎడారిలో ఎన్నాళ్లీ ఏకతార' లాంటి నడక? మనసు కలవరిస్తున్నది మలుపై జీవించాలని. కత్తుల ఒత్తిడిలో రక్కసి తొక్కిడిలో 'సినారె' కలం కలవరిస్తున్నది గెలుపై జీవించాలని.
తెలుగు గజళ్లు 27 భై ఎవరేమని తిడుతున్నా ఈ వేషం బాగున్నది ఎంతగ దిగబడుతున్నా ఈ దేశం బాగున్నది. కాళ్లురెండు విరిగిపోయి కదలని గతిలో వున్నా ముందుకు సాగండి అనే సందేశం బాగున్నది. అదిగో ఆకాశవాణి అందించే తేనెపాట ఇంకెందుకు దిగులయ్యా ఈ మాసం బాగున్నది. ఒక్క దండ చాలు గద్దెనెక్కిన మెడ వంచుటకై ఎవరోఅంటే విన్నా ఈ మోసం బాగున్నది. ఏలిన వారన్నారట ఎక్కువగా తినవద్దని ఇంత కొంచెమే అయినా ఈ (గ్రాసం బాగున్నది. నిన్న నిన్న - రేపు రేపు నేటిపైనె అసలుచూపు అందిందల్హా స్వాహా అవకాశం బాగున్నది. ఓయి 'సినారే' ఎందుకు ఉద్వేగం నీకు? సరే మంటల్లో చిక్కుకున్న మధుమాసం బాగున్నది.
28 తెలుగు గజళ్లు 28
పిడుగులేవా పడతాయని గడియ గడియకూ ఆగకు గంటను మెళ్లో కట్టుకు ఒంటరిగా ఊరేగకు. ఎదుట చూడు ఆకాశం ఎంత ఎగిరితే అంతగ జాగా కరువైనట్టుగ మూగినచోటే మూగకు. ఏది త్యాగనిరతి? లోకహితం కొరకు ఆత్మాహుతి మెప్పులకో గొప్పలకో నిప్పులలో పడిసాగకు. ఎంత దేశభక్తుడివో ఎరుకేలే అందరికీ జనగణమన పాడుతూంటె అనవసరంగా ఊగరకు, సారా తాగడమేదో నేరమనీ అననుగాని తాగేటప్పుడు గుండెను తగలేసి మదీ తాగకు. అంతటి నాయకుడివైతె గొంతెత్తుము నడివీధిని విరిగిన వ్యక్తిత్వంతో బురఖామాటున వాగకు. ఓయి 'సినారే' ఎందుకు ఉపదేశం అంటావా పిచ్చికి చైతన్యమనే పేరుపెట్టి చెలరేగకు.
తెలుగు గజళ్ళు 29
29
ఎటు పోతున్నది దేశం ఎన్నిసార్జు అడగాలి? న.
అడుగడుగున అంటుకునే అడుసునెలా కడగాలి? ఏది అసలు సరుకో తెలిసిందెపుడో అందరికీ కాకితోకలోన నెమిలి ఈకలెలా తొడగాలి? మాటలతో అణగారు సమస్యలు కావివి భాయీ! నీరుగారు కాంగులోన నిప్పులెలా ముడవాలి? పగలంతా సూర్యుడిలా ప్రవహిస్తా ఒళ్లు మరచి శవంలాంటి రాత్రి ఒక్క క్షణం ఎలా గడవాలి? చేరుకునే గమ్యానికి గోరీ కట్టిన సంగతి ఈ దారే చెబుతుంటే ఇంకెందుకు నడవాలి? ఈ దేహం కొత్తవెత్తురెక్కనిదే కదలదనే నిజం తెలిసి ఓ 'సినారె”! నేనెందుకు జడవాలి?
30 తెలుగు గజళ్లు 30
జీవిస్తున్నాను మృత్యుశిఖను పూలు ముడవాలని మరణిస్తున్నాను (బబ్రతుకుమంటలపై నడవాలని. పీక్షపైన గురిపెట్టిన బాకులు బెదిరిస్తున్నా గర్జిస్తున్నాను ఎత్తుగద్దెలన్ని జడవాలని. ఎన్నో కులగిరులు శిరసులెక్కు పెట్టి నిల్చున్నా ('ప్రవహిస్తున్నాను కాలపరిధులన్ని గడవాలం. ఇది విచిత్రవలయం ఇక ఇమడలేను; రెక్కలార్చి ఎగరేస్తున్నాను నన్ను ఈ లంకెలు విడవాలని. నిన్న నలుపు మొన్న యెరుపు నేడు పసుపు - రంగు మార్పు గమనిస్తున్నాను అసలు (గ్రంధమేమొ అడగాలని. ఎంత పేదవడిపోయిన వీ ప్రతిభాకరాంగుళులు ఊహిస్తున్నాను నుడుల ఉంగరాలు తొడగాలని. నాకు తెలుసు ఈ మురికి అనాది అనీ ఓ 'సినారె' ! కదిలొస్తున్నాను అగ్నిగంగలతో కడగాలని,
తెలుగు గజళ్లు 21 త్ర
కంటి ముందు గాలిరంగు కనిపిస్తే కొత్తదనం వేణువులో వీణగాంతు వినిపిస్తే కొత్తదనం, వెన్నెల తెలుపును చూస్తూ విసుగు పుట్టుకొస్తుంటే ఒక రంగుల చందమామ ఉదయిస్తే కొత్తదనం. పదేపదే ఆ కోకిల పాటేనా ? పిల్లకాకి గళంలోన ఖవ్వాలీ పలికిస్తే కొత్తదనం, మాటిమాటికీ నెమిళ్ల ఆటేనా? కోళ్ల ముద్దు గుమ్మలతో కూచిపూడి కులికిస్తే కొత్తదనం. హరిలొరంగహరి అంటూ అడుగడుగున దరువేసే జియ్యరు విష్టవగీతికి చిందేస్తే కొత్తదనం. ఈశ్చర్ అల్హా ఒకరని ఎన్నాళ్లని ప్రసంగాలు ముల్లాలు శివస్తుతులను వల్లిస్తే కొత్తదనం. గుడి మసీదు ఒకటేనని గొప్పలు చాలును 'సినారె' | పరమవైదికుడు ఖురాను ప్రవచిస్తే కొత్తదనం.
32 తెలుగు గజళ్లు 232
నిలబడి చూస్తుంది తెలుగు పలుకలేని కండగా ఉరమాలిక కంఠమెత్తి గురజాడే గుండెగా. అడ్డంకుల జడివానల అడుగు కదలలేని తెలుగు నడవాలిక జంగసాచి గిడుగు గొడుగు అండగా, వచ్చినాడు వచ్చాడూ వచ్చిండూ ఏదైతేం? పరిపాలనలోన తెలుగు పెరగాలిక నిండుగా. ఏమమ్మా తెలుగమ్మా ఎక్కడ ని చిరునామా? గుబాళించిపోనీ నీ కొప్పుమల్లై చెండుగా. పలురుచులను మరిగిన మా తెలుగుజాతి ఓ 'సినారొ! పులకించాలింక తెలుగు పలుకే కలకండగా.
తెలుగు గజళ్లు 383 త
నన్నుదొటి మిన్నుదాటి నామనసా ఎదిగిపో నడుమ నడుమ విషవాయువు పడగెత్తితె తొలిగిపో. ఇవి హిమగిరి శిఖరాలే - ఏదీ ఆరదు దాహం? అవసరమైతే జ్యభించి అణువణువుగ కరిగిపో. కనుగుడ్డను బానిసలుగ అణిచేసే చీకట్లో క్షణమైనా తిరగబడే మిణుగురులా వెలిగిపో. ఏంలాభం? ఈ వ్యవస్త్ర ఇంత బండబారిందని తప్పుకోక నిట్టూర్పుల నిప్పులైన చెరిగిపో, తెలిసింది 'సినారె'కు నీ నిలయం ఆకాశమనీ చుక్కల నాదిలేసి చమటచుక్కల్లో ఒదిగిపో,
తడ తెలుగు గజళ్టు ప్రత్త
ఏమి చెప్పను నాది ఎంత ఉన్మాదమో? ఏడ్పులో ఆ నవ్వు ఇంకా మిగిలివుంది. ఎన్ని నిట్టూర్పులో ఎన్ని వడగాడ్పులో ఇసుకలో ఆ పువ్వు ఇంకా మిగిలివుంది. విషపుచీకట్టు తొక్కిసలాడు నడిరేయి ఎదురుగా ఆ నీడ ఇంకా మిగిలివుంది. ఏమా జల'ప్రళయమేమి బీభత్సమది? ఎదలోన ఆ జాడ ఇంకా మిగిలివుంది. ఉరిమే తుపాకి సర్యోదయం పలికినా ఈయింట ఆ చిచ్చు ఇంకా మిగిలివుంది. కార్చిచ్చు తనువెల్ల కాల్ళేయగ “సినారె' 1 ఈకంట ఆ మంచు ఇంకా మిగిలివుంది.
తెలుగు గజుళ్లు తక్ తెర్
గజలంటే మనది కాదనే గబిబిబి నీకెందుకు? పరసీమల డిస్కోలంటే ఉరవడి నీకెందుకు? ఆకాశం గొడుగు అండగా ఆదర్శం ఎదుట ఉండగా కలకాస్తా చెదిరిందంటే అలజడి నీకెందుకు? ఇంటిలో అందిన మమత మింటిలో పొందని ఘనత; అంగాలను వేలంవేసే అంగడి నీకెందుకు? పువ్వేమో భాషరానిది పులకరింత యాసలేనిది. అందమెక్కడుందో తెలిసీ సందడి నీకెందుకు? ధ్యానమే ఒక అనుభూతి మౌనమే (వ్రాయని గీతి స్వరహృదయం వింటూ వేరే సవ్వడి నీకెందుకు? మనసులో శాంతం నిలిపీ తనువులో అమృతం నింపీ చూపులతో ఓయి 'సినారే' రాపిడి నీకెందుకు?
గ మ ను ళ్ళు సనత్ స ము న | (గ. ॥ ప సం న క. శం. ఎ నాశన హం. ఈష | 01౫|4|క 6020ల. " వెగంగయం/ంంగ6కెంటేర్త”. కకత న స సం ఘన స చ ల సు క్ష్. / /" ఉ న. వవ శ గ , ॥ స్ ః స ల్ న న | న. 4 ( | ॥ క. [| స | ” . | ల రు య్ | / | చ్ | ఏం “ ః ల | ఖః 1 శూ. య |