Telugu Cheekati nundi Swapnam daaka - anilvaranasi/indianlanguages GitHub Wiki
కొన్న ఐక స్వష్నం దాకొ ళు వ్యాస సంపుటి ఖ ౮ డా! తక్కోలు మాచిరెడ్డి
చశీకటె నుంచి అతను ఎత స్వప్నం దాకా
- వ్యాస సంపుటి + డా॥ తక్కోలు మాచిరెడ్డి అభ్యుదయ రచయితల సంఘం 5/39-2, ముత్తరాసుపల్లి, కడప - 516 002.
చీకటి నుంచి స్వప్పం దాకా (వ్యాస సంపుటి) న. " ఖః ల్ 1) ఆ రచయిత ధ్చి వో శ క. రి ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి 2006 ర్ య ఛెం బా వెల : రు. 80-00 టా ఈ శో ప్రతులకు (7 విశాలాంధ్ర బుక్ హౌస్, బ్యాంక్ ఫ్రీట్ / సుల్తాన్ బజార్ - హైదరాబాదు, హన్మకొండ, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం. ప్రజాశక్తి బుక్ హౌస్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్. ఆం ప్ర ప్రజాశక్తి బుక్ హౌస్ శాఖలు డా! తక్కోలు మాచిరెడ్డి, 5/39-2, ముత్తరాసుపల్లె, కడప - 516 002. ముఖచిత్రం = గణేష్ బాబు _ గ (ల్పిం వ్రశి లేజర్ టైవ్ సెట్టింగ్ . న! లో .కె గ్రాఫిక్స్ & ప్రన్స్, కడప - 1. ఆఆ" జ హెచ్చరిక : ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గాని, కొంత గాని కాపీరైట్ హోల్డరు & ప్రచురణకర్తల నుండి ముందుగా రాతపూర్వకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగా వాడుకున్నా కాపీరైట్ చట్టరీత్యా నేరం. - స్రిచురణకర్తలు
అంకీఠం... అమ్మ ఖీరమ్మకు నాన్న కొండారిడ్డికి న్ట్యాత్రో
గత 20-25 ఏళ్లుగా నేను తెలుగులో రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో వెలువడినాయి. వాటినీ, ప్రచురణకు పంపిన మరి కొన్ని వ్యాసాలనూ చేర్చి ఈ వ్యాససంపుటి వెలువరిస్తున్నందుకు సంతోషంగా వుంది. ఇక పోతే, నన్ను వామపక్ష భావాలవైపు మరల్చింది - 'సోవియత్ లిటరేచర్” అనే పత్రిక - నేను బి.ఏ., చదివేప్పుడు - అంటే, 1961 నాటి మాట. నాక్తు వామపక్ష రాజకీయ అవగాహన కల్గించింది ఎన్‌ఎస్ (నఠెడ్డీ శివరామిరెడ్డి గారు. మార్క్స్‌వాదంలో అభినివేశం కల్గించింది _- ప్రగతి ప్రచురణలు, రాదుగ ప్రచురణలు, మాస్మో ప్రపంచ గమనం, సౌందర్యశౌస్త్రం అర్ధం చేసుకునేందుకు నాకెంతగానో ఉపకరించాయి తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ సంస్థలు ప్రచురించిన వివిధ (గ్రంథాలు.
బెజిల్స్ వెనెజువెలా, ఉరుగ్వే, చిలీ, బొలీవియా లాంటి దక్షిణ అమెరికా దేశాల్లో వామపక్ష అభ్యర్థులు దేశాధ్యక్షులయ్యారు. ఇది ప్రపంచ జనావళికి శుభ సంకేతం. సోవియత్ పతనం తర్వాత సమాజవాదం ఏదీ, ఎక్కడుంది అనే వాళ్లకు ఇది గట్టి సమాధానం. "| మార్క్‌వాద అవగాహనతో రాసిన ఈ వ్యాసాల్ని పాఠకులు ఆదరిస్తారని
ఆశిస్తున్నాను. డా॥ తక్కోలు మాచిరెడ్డి
విషయ సూచిక క్ష కళలు, సౌందర్యం - మార్క్సిస్టు దృక్పధం గై క మనిషిని మరింత మానవీయం చేసే సౌందర్య చేతన 9 3, “సాహిత్యం - సౌందర్యం' - ఒక సమీక్ష 16 4. గియోర్లి లూకాచ్ సౌందర్యశాస్త్రం 20 ర్. క్రోచే సొందర్యశాస్త్రం 23 ర ముక్తిబోధ్ సౌందర్యశాస్త్రం 28 గా భావ బింబాల సౌందర్యం ఏ2 8 శ్రీశ్రీ భావ చిత్రాలు 35 రి నవలను గురించి గియోర్లి లూకాచ్ త్తే 10. కుమారన్ ఆశాన్ త్త న! భాషాదాస్యం పోవాలి ! తెలుగుకు సముచిత స్థానం రావాలి || నో 12 నూతన ఆలోచనా ధోరణి : సాహిత్యము ర5్2 1 ప్రపంచ విష్టవ పరిణామ క్రమంలో అంతర్భాగం అభ్యుదయ కవిత్వం ర్6 ఓ చీకటి నుంచి స్వప్నం దాకా... 70 క్షే అభ్యుదయ కవి ఆలూరి ఖైరాగి ౯75 16. శ్రీశ్రీ కవితార్లవం “మహాప్రస్థానం” 82 17. _ సాహితీ రంగంలో రా రా సూత్రీకరణలు 90 18 భావ చిత్రాల సౌందర్యం 95్ 19. _ కవిత్వంలో భావ చిత్రాలు - కొన్ని అభిప్రాయాలు ంం 20. కబీర్ సందేశం 102 21. నిబద్ధ విమర్శకుడు - నామ్‌వర్ సింగ్ 104 22. కాళ్ళీర్ సాహితి - సంస్క ఖతి 109 23. సంస్కృతి భూమండలీకరణ 113" 24 పరాయీకరణ అంటే ఏమిటి ? 6 25. జర శ్ ఫాసిజం - దాని పరిణామం 120 26. జాతి, భాష, దేశభక్తి అంతర్జాతీయత 122 27. _ పళ్చిమార్దగోళంలో తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఫిదేల్ కాస్తో 140 28. రాజకీయ సంకల్పంతోనే అందరికీ విద్య సాదంం క! 29. _ కులవ్యవస్ట కూలేదెప్పుడు? 148 30. అపండి ఈ పరాయీకృత విద్యను క్ష51
జీ కళలు, సౌందర్యం-మార్క్సిస్టు దృక్పథం నేడు మనం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. యుద్ధమూ శాంతి సమస్య, ఆకలీ పేదరికం సమస్య, భాష ప్రాంతీయతా సమస్య, జాతి - ప్రజాతి సమస్య - ఇలాంటివే మరెన్నో. 'ప్రపంచమంతటినీ కలవరపరచే నేటి సమస్య అణుయుద్ధ సమస్య. అణుయుద్దమంటూ వస్తే ఆపై యేమీ మిగలదు. అంతా శూన్యమవుతుంది. మన గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా శూన్యం. మన కళ, సాహిత్యం, విజ్ఞానం అన్నీ బూడిదపాలు. సౌందర్యాన్ని గురించి చర్చించేందుకు యెనరూ మిగలరు. అందుకే మనం మన ఆత్మిక సంపదనంతటినీ విశ్శశాంతికోసం దోహదం చేసేట్టు తీర్చిదిద్దుకోవాలి. ఈ నేపథ్యంలోనే మనం కళ, సౌందర్యం అనే అంశాలపై చర్చించాలి. సౌందర్యం అనుభవైక వేద్యం. దాన్ని గురించి విశ్లేేణ యేమిటి, చర్చ యేమిటి అనే ప్రశ్న రావచ్చు. సౌందర్య శాస్త్ర మీమాంస ఎక్కువగా జరిగిన రోజుల్లో మంచి కళ రాలేదనే విమర్శకూడ ఒకటివుంది. కాని, నేడు సౌందర్య విళశ్లేషణవల్ల కళాసృజన దెబ్బతినటం లేదు. కళ నూతన పోకడలుపోతోంది. సినిమా, దూరదర్శన్‌లాంటి బహు కళా రూపాల భాగస్వామ్యంతో రూపొందే సంశ్లిష్ట కళా సౌందర్యాన్ని ప్రఖ్యాత సోవియట్ సినీ కళావేత్త ఎఇసెన్ "స్పెయిన్ సమ్యక్ సౌందర్యం (5౪/౧469126109) అన్నాడు. కళతోపాటు కళావిమర్శ, సౌందర్యశాస్త్ర వివేచన పెంపొందినాయి. కళ సౌందర్యం, సౌందర్య శాస్త్రం సమానార్థకాలు కొవు యూరీబరేవ్ నిర్వచనం ప్రకారం కళ (ప్రపంచాన్ని గురించిన సౌందర్యాత ఖ్ ప్రజ్ఞానపు స్పిరరూపం. నిశ్చితరూపం. సౌందర్యాత్మక ఇతివృత్తమే కాకుండా ప్రపంచాన్ని వ్యక్తిత్వాన్ని గురించిన కళాత్మక భావన కూడ ఈ సౌందర్య సూత్రాలలో ఇమిడివుంది. వీటితోపాటు ప్రత్యేకమైన దార్శనిక సంవేదనాత శక అర్ధం స్పురింపజేసే భావ చిత్ర సంవిధానం ఈ సౌందర్య సూత్రాలకు ప్రాణం ప్రణవం. (&99426109 - యూరీ బరేవ్, పుట 33) 1]
కళ మానవ సృజన. జంతువు తన జాతి అవసరాన్నీ, ప్రమాణాన్నిబట్టే వస్తువుల్ని సృష్టించుకుంటుంది. కాని మానవునికి ప్రతి జాతి ప్రమాణం (ప్రకారం వస్తువుల్ని చేయడం తెలుసు. అంతేగాక, ఆయా వస్తువులకు సరిపడే సరికొత్త ప్రమాణాల్ని రూపొందించడం మనిషి స్వభావం. అందుకే మార్క్స్ మాటల్లో చెప్పాలంటే మానవుడు వస్తువుల్ని సౌందర్య సూత్రాల కనుగుణంగా కూడా సృష్టిస్తాడు. (క5ం00గ౦0గా౦ ౭౬౧౮ ౧౧ 0800౧16 !42౧౮9౦గ౦15
- 1844 - కార్ట్ మార్క్స్) కళాసృజనకు నిస్వార్థత ఆవసరం. మొదట కళ మనిషికి ఉపయోగపడ్డుందా లేదా అని చూసేవారు... కాని రాను రాను కళ వూహించని ప్రయోజనం కలిగిన సృజనాత్మక (ప్రక్రియగా రూపొందింది. అది ఉపయోగితావాదాన్ని అధిగమించింది. అన్ని రకాల కళలూ కలిసి 64 వుండేవని మన [ప్రాచీనులు పేర్కొన్నారు. ప్రాచీన గ్రీస్‌లో కళకూ. కళాకారునికీ ఒకే పదం 7501112 అని వుండేది. కమ్మరి, కుమ్మరి, వడ్రంగిలాంటి వారందరూ కళాకారులే, నేడు డిజైను పారిశ్రామిక కళగా పరిగణింప బడుతోంది. కళతోపాటు కళావిమర్శకూడ పెంపొంది, కళ మొత్తంమీద ముందుకే మున్ముందుకే అడుగిడి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది. కళా విమర్శకూడ ఈ కళాభివృద్దికి ఉపకరిస్తోంది. కళ్ళ ఆధునికతల మధ్య పరస్పర వైరుధ్యం లేదు. కళా వికాసాన్ని అడ్డుకొట్టేది అధునికత కాదు, అధునాతన వింతపోకడలనే ఆధునికతగా భావించి దానినే పరమావధిగొ పరిగణించే ఆధునికతావాదం కళా వికాసానికి ఆటంకం. కాని ఆణుయుద్ధ నీడల్లో మానవజాతి గుండెలు అరచేతిలో పెట్టుకొని జీవించే ఈ రోజున నిరాశ, నిస్పృహకు యెలాంటి భౌతిక ఆధారంలేదని, అవి కేవలం కళాకారుల అతిశయోక్తి మాత్రమే అని అనుకునే దానికి ఆస్కారం లేదు. పాప్ ఆర్ట్, అవ్ ఆర్ట్స్ ఎల్ ఆర్జ్‌లాంటి ప్రయోగ ప్రధానరీతులకు [ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా నైరాశ్య భావన ప్రేరణగా రచించే ఉత్తమ రచనలను సరిగా అంచనొ వేయాల్సిన అవసరం ఈనాడు యెంతైనావుంది. నేడు రామాయణం కంటే మహాభారతం అధిక సార్ధకతను సంతరించుకొనింది యుద్ద బీభత్సం తర్వాత గెలుపు ఓటమి అర్జ్హరహిత మవుతాయి. అందుకే మానవ జాతికి సంబంధించిన విషాదాంతాలు కళలో, సాహిత్యంలో ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నాయి. కళలో సాహిత్యంలో వాస్తవికత ప్రాధాన్యం వహిస్తుందనేది నిజం. కాని స్వైర కాల్పనికత, విష్ణవ కాల్పనికతలకు కూడా ఈనాడు కళలో గౌరవనీయమైన స్థానం వుందనేది దాగని 2
సత్యం. వర్ధమాన దేశాల్లో విమర్శనాత్మక వాస్తవికతావాదానికి (ప్రాముఖ్యం వుండనే వుంది. దీనితోపాటు సమాజవాదోన్ముఖ (5001 506౧160) కళకూ సాహిత్యానికి ఈ సమాజంలో (ప్రత్యేక అవసరం వుంది. ఆలాగే సోషలిస్టు వాస్తకవితలో అంతర్భాగంగా సోషలిస్టు విమర్శనాత్మక వాస్తవికతావాదానికి నేడు ఆస్కారం వుంది. సోషలిస్టు సమాజంలో సంభవించే లోపాల్ని పొరపాట్లను ఎత్తిచూపుతూ ఆ సమాజ స్టితిగతులలో భాగస్వాములయ్యిన రచయితల నిర్మాణాత్మక విమర్శనా దృష్టిని మనం ఆహ్యానించాల్సి వుంటుంది. మూసివేసిన గదికాదు సోషలిజం, నిరంతరమూ (ప్రవహించే నది అది.
కళ, సాహిత్యం సామాజిక చైతన్యపు రూపాలు. అంతేకాదు ఇవి ప్రత్యేకమైన సౌందర్యాత్మక కార్యకలాప విధానాలు కూడాను.
మనిషికీ మానవజాతికీ మధ్య సామరస్యం సాధించే దిశగా సామాజిక వైజ్ఞానిక, సాంకేతిక (ప్రగతిలో భాగంగా కళ తన బాధ్యతను నెరవేరుస్తుంది కళ ప్రధాన లక్ష్యం వ్యక్తిలో సమ(గ్ర వ్యక్తిత్వ వికసనం. ప్రముఖమైన కళా ప్రయోజనం ఏమిటంటే అది జీవిత వాస్తవికతను వ్యక్తీకరిస్తుంది. దాని వైరుధ్యాల ఆంతస్సారాన్ని అభివ్యక్తం చేస్తుంది. వాటిని అధిగమించేందుకు మనకు శక్తినిస్తుంది. విష్ణవ ప్రగమనంతో కూడిన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. (౯౯౦౦ ఆగ9 0100౧18౧10010౧/ గీ651%61 05 - వీక్తర్ వాన్‌స్లవ్ - పుట 87- గి౭౦౦& ౧40 9063, (4090040). +
కళ సాహిత్యం సామాజిక సంస్కరణలకూ దుర్మార్గాన్ని నిర్మూలించేందుకూ బాగా పనికొస్తాయి అని అనుకోవడం సహజమే. కాని వీటికి పరిమితులున్నాయి. 'గలివర్స్ ట్రావెల్స్” రాసిన జొనాధన్ స్విఫ్ట్ తన యీ రచనతో సమాజము సమూలంగా మారుతుందని భావించాడు. అలాంటిదేమీ జరగలేదు. నాజీ జర్మనీలోని కొన్ని యాతనా శిబిరాల్లో కొంతమంది సంగీతాన్ని 'ప్రేమించే” క్రూరులు గార్జులుగా ఉండేవారట. ఖైదీలతో పాటలు పాడించుకునేవారట. ఖైదీలు వారికి రసాస్వాదన కళ్ళిస్తే ఆ 'కళాభిమానులు” వారిని మృత్యుగహ్వరంలోకి తోసే వారట. కాబట్టి తేలేదేమిటంటే, కళకూ సాహిత్యానికీ వుండే మనిషిని మార్చేగుణం పరిమితం, అది పరిస్థితులు అనుకూలిస్తేనే సాధ్యం అనేది స్పష్టం. కళకు జన్మినిచ్చే స్పితిగతులను సర్వనాళనంచేసే వినాశకర శక్తులు లేనప్పుడే కళ, సాహిత్యం క్రియాశీల మవుతాయి, అలాకాక అమానుష శక్తుల చేతుల్లో పడితే కళ కేవలం పాము శిరసునవున్న మణిలాగే తయరవుతుంది. మానవతావాదం లేకపోతే కళాప్రగతి, సామాజిక ప్రగతి అసాధ్యం.
౩
కళకు లక్ష్మణరేఖలు లేవు. రచయిత గిరిగీసుకొని రచించిన రచన గొప్పరచన కానేరదు. సమకాలీన ప్రమాణాల్ని అధిగమించి సంగీతంలో పలుపోకడలు పోయిన బెథోవెన్‌ను ఆ కాలం వాళ్ళు పిచ్చివాణ్నిగా పరిగణించారు. కాని బెధోవెన్ పాశ్చాత్య సంగీతానికి ప్రాణమైన వినూత్న సింఫానీలనెన్నో రచించి కృతకృత్యుడయ్యాడు, అమరుడయ్యాడు. నవ్యత కళాస్వభావం. అందుకే కళాకారుని ప్రతిభను 'నవనవ్లోన్మేషశాలినీ ప్రజ్ఞ" అని భట్టతోతుడు అన్నాడు. కానీ మన కళ, సాహిత్యాలలో సంప్రదాయానికి తగు ప్రాధాన్యత వుండనే వుంది. రవీంద్ర సంగీతం, ఈమని శంకరశాస్త్రి వాద్య బృంద రచనలు నవ్యత, సంప్రదాయం రెండింటి సమ్మేళనంతో నిండి వుంటాయి. శ్రీశ్రీ కవిత్వంలో పౌరాణిక పదజాలానికి నూతన జవం, జీవం ఇచ్చిన సందర్భాలున్నాయి. జయళంకర ప్రసాద్ రాసిన “కామాయని” కావ్యం ఒక పురాగాధను ఆధారం చేసుకుని రాయబడిన ఆధునిక మహా కావ్యం. మనకు అందమైన జానపదగేయాల వారసత్వంవుంది. జానపద శైలిలో రాసిన నండూరి యెంకిపాటల్టో నవ్యత వుంది. యెన్నో యేళ్లుగా కొనసాగుతున్న జానపద గేయ2ైలిని సాంతంచేసుకుని పారకులను అమాయక జానపద లోకానికి తీసుకపోయే లయ వుంది. సవ్యమైన సంప్రదాయానికి సరికొత్త భావాలకీ మార్క్స్‌వాదం స్వాగతం పలుకుతుంది. ప్రగతిశీల అంశం వున్న ఏ సాహితీ కృతినీ మార్క్స్, లెనిన్ తిరస్కరించలేదు. కొంగ్రొత్త సృజనాత్మక కార్యకలాపం సం(ప్రదాయానికి బలికానవసరం లేదు. సరికొత్త భావాలు మనగలిగేందుకు సృజనాత్మక క్రియ అవసరం; ఊపిరితిత్తులకు గాలి అవసరమై నంతగా. | కన్నడ రచయిత గోపాలకృష్ణ అడిగ అంటాడు - 'కవిత వ్యష్టిగతం. దీని ప్రత్యేకతకు ముఖ్య కారణం లయ. వస్తువుతో కలసి సంచరించే లయ అర్జాన్ని అనుసరించే లయ. అనుభూతికి వచ్చిన ఆలోచన (౯8 171060౧0 తో కూడిన కవిత గంభీరమైన కవిత అవుతుంది. కేవలం మేధోనియంత్రిత భావోద్వేగం కేవలం ఉద్వేగంగానే మిగిలిపోతుంది”. (ఇండియన్ లిటరేచర్ మార్చ్ - ఏఫ్రిల్ 87) | భావోద్వేగం కంటే ఆనుభూతికే, బాహ్యాలంకారాలకంటే ఇతివృత్తానికే ప్రాధాన్యం వుండి తీరుతుంది సాహిత్యంలో అనుభూతికీ, ఆలోచనకూ ఒక రూపం యిచ్చేది భావచిత్రాలు. ఆధునిక సౌందర్య శాస్త్రంలో సౌందర్య భావన వస్తుగతమని భావిస్తున్నారు. సౌందర్య భావన సుందర వస్తువును ఆధారం చేసుకొనే రూపొందుతుంది. కనుక అది వస్తుగతం అని భావించబడింది. (ఇవాన్ అస్తహోవ్ - ౧౧౦౦ ౭గ౫9 01 [4066౯౧ శీం50[06009 - పుట 174 - ౧౧౦౮655 ౧౮౦ 5[6/౧5, 10500౪). ట్రీ
" భరతాది ప్రాచీన భారతీయ సౌందర్యవేత్తలు రససిద్దాంతాన్ని (ప్రతిపాదించారు. రససిద్దాంతాన్ని చర్చిస్తూ ఆనందవర్దనుడు ' లావణ్యాన్ని” రసస్పోరకమని వర్షించాడు. ఇది సొందర్యతత్వమే. అలాగే పండితరాజ జగన్నాధుడు రమణీయతా వాహినిగా రసాన్ని అభివర్షించాడు. రమణీయార్ధ 'ప్రతిపాదక శబ్దం కావ్యమ్ అన్నాడు. రామణీయకతను సౌందర్యాంశగానే భావించాల్సి వుంటుంది. అభినవగుప్పుడు రసాన్ని ధ్వనితో మేళవించి రసధ్వని సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. రసాత్మకతను ధ్వనితో సంధానించి కావ్యశాస్త్రంలో ఒక కొత్త తత్వాన్ని ప్రవేశపెట్టాడు అభినవగుప్తుడు. అభినవగుప్తుని శిష్యుడు క్షేమేంద్రుడు రస సిద్దాంత చర్చలో జాచిత్యతత్వాన్ని ప్రవేశపెట్టాడు. బౌచిత్యం కావ్య జీవితం అని ఉద్దోషించాడు. జౌచిత్య భావన సౌందర్య భావనే, బౌచిత్య సంపన్నమైన రససిద్దాంతం కేవలం కావ్యాలంకార శాస్త్రంకాక సౌందర్యశా స్తానికి గీటురాయిగా నిలిచింది.
నేటి సందర్భంలో ఎది జౌచిత్యమో, ఏది అనౌచిత్యమో తెలుసుకోవడం అవసరం. ఇంతవరకూ ఏది మంచి, ఏడి చెడు - ఈ విషయాన్ని తీసుకునే ప్రపంచ సాహిత్యం, కళ మంచి పక్షాన నిలబడి సమస్యను పరిష్కరించ బూనాయి. ఆణుయుద్దం ద్వారా విశ్వ వినాళాన్ని యెదుర్కొంటున్న ఈనాడు మన కెదురయ్యేది మరో సమస్య. శూన్యం ఆంటే యేమిటి! శూన్యం గురించిన మన అవేదన నేటి వాస్తవం (సెళ్లెయ్‌జెలీగిన్ ౧౯౦ 9౧౫౩ ౦/౯౧| 09000౫ గం. 4, 1986) అందుకే నేటి కళ సాహిత్య (ప్రయోజనం కొంత మారిందనే చెప్పాలి.
రారా అన్నట్లు సాహితీ లక్ష్యం ' ఉన్నత సంస్కృతీ ప్రమాణాలు నిరూపించడం, మానవ మనః ప్రపంచపు స్వార్ధదుర్గాలు (బ్రద్దలు కొట్టడం, నూతన సౌందర్య లోకాల దర్శనం చేయించడం, నూతన ఆనందమయ జీవిత వ్యవస్థకు మానవ హృదయాలను పరిపక్వం చేయడం” (సారస్వత వివేచన - విశాలాంధ్ర (ప్రచురణ పుట 11) మాత్రమే కాదు, జనాలమధ్య, దేశాలమధ్య స్నేహాన్ని ద్విగుణీకృతం చేయడం, సంఘీభావాన్ని పెంపొందించడం, విశ్వ్శశాంతికి దోహదం చేయడం నేడు కళ, సాహిత్యాల ముఖ్య ప్రయోజనం. గియోర్లిలూకాచ్ మాటల్లో చెప్పాలంటే మనిషి తన (శ్రమద్యారా మాననీయమయ్యే క్రమంలో భాగమే కళ. శ్రమ, శాస్త్ర విజ్ఞానం తదితర సామాజిక కార్యకలాపాల మాదిరే కళకూడా ఒక సామాజిక ఉత్పాదనే. ఆందుకే కళ సాహిత్యం బాధ్యతాయుతమైన సామాజిక చర్యలు. నేడు మన బాధ్యత సామాజిక ్రగతికోసం విశ్చశాంతికోసం కలంపట్టడం, కుంచెపట్టడం, గళమెత్తడం. మక్సీమ్ గోర్కి అన్నట్టు “ఒక కళాకారునికి ఆతని విసృత పరిశీలనలూ, పుష్కలమైన జీవితానుభవమూ, వాస్తవాలపట్ట అతని
ర్
సొంత దృష్టిని దాటిపోగల శక్తిని, అంటే వైయక్తికస్టితిని దాటిపోగల శక్తిని తరచుగా ఇస్తాయి. కళాత్మక భావనలు, కళాత్మక అభిరుచులు, కళాచైతన్యం రానురాను పెంపొందుతాయి. (ప్రజలంతా కళకు ఆత్మ వంటివారు. వారు సౌందర్యాత్మకంగాకూడా పురోగమిస్తారు. పెంపొందిన (ప్రపంచ చైతన్యాన్ని సాంతం చేసుకుంటారు. మేధోపరంగా ముందంజ వేస్తారు.” (మక్సీమ్ గోర్కి సాహిత్య వ్యాసాలు - రాదుగ ప్రచురణ, మాస్కో - పుట 138, 139).
సౌందర్యం అంటే యేమిటి అనే విషయమై శతాబ్దాలుగా చర్చ సాగుతోంది. సమస్వరత (4+ఇగాంగ్య ప్రముఖమైన సౌందర్యాంశం. హెరాక్షిటస్ ప్రకారం సమస్వరత స్థితిశీల సమతూకం కాదు, అది చలనశీలము, గతిశీలము. వైరుధ్యాల ఐక్యతకు సామరస్యత వుందని మనకు తెలుసు. సామరస్యతతోపాటు సమమితి (9/౧౫౭(౧౧) కూడ సౌందర్యాంశమే. విశ్శనిర్మాణం లోనే సమస్వరతా, సమమితి వున్నాయి. కొమ లోని చివురులో సౌందర్యముంది. అందులో సమమితి వుంది. మనిషి ముఖంలో ఒక (క్రమం వుంది. అంతేకాక ముఖంలో కన్పించే కాంతిని బట్టికూడ సౌందర్యాన్ని అంచనా వేయవచ్చు.
ఆలోచనల సంవేదనాత్మక వ్యక్తీకరణను సౌందర్యంగా నిర్వచించాడు హెగెల్. ఆయన అభిప్రాయం '్రకారం (ప్రకృతిలోని (క్రమబద్దత, సారూప్యత, సమస్వరత రంగు, ధ్వని ఇత్యాదులు (ప్రకృతి సౌందర్యం అనబడుతుంది. ఇది రెండో రకం సౌందర్యం అంటాడు హెగెల్. కళలో _ మాత్రమే సౌందర్య భావన ఆదర్శరూపంలో అభివ్యక్త మవుతుంది అని అంటాడు ఆయన. ఇది పారపాటు అభి[ప్రాయమని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.
యుగయుగాల తర్వాత మనిషి సొందర్యద్రష్టదైన కన్నూ, సౌందర్య (శ్రవణశక్తి కల్షిన చెవీ సాధించాడు. ప్రకృతి సౌందర్యాన్ని కించపరచాల్సిన అవసరం లేదు. చెర్నిషేన్‌స్కి (ప్రకారం సమానుషాతం, క్రమబద్దత, సమస్వరతల సంశ్లేషణ సౌందర్యం. ఇవి కళలోనే కాదు సాయం సంధ్యారాగంలో, సెలయేటిపాటలో, రకరకాల రంగుల పూదోటలో బాగానే కన్పిస్తాయి. సోవియట్ సౌందర్య వేత్తల అభిప్రాయం ప్రకారం (శ్రమద్వారా, సామాజిక ఉత్పాదన (క్రమంలో ఆత్మీకృతమై మానవ్లీకృతమై మానవజాతికి ఒక (ప్రయోజనాత్మక విలువను సంతరింపజేస్తూ వస్తుగతమైన అస్తిత్వం కల్గిన కొన్ని దృగ్గోచర విషయాల విలక్షణతను సౌందర్యం అనవచ్చు. (గ99109[03 - యూరీబరేవ్, పుట 53). చాలామంది అనుకొంటారు. మనం ఆస్వాదిస్తాము కాబట్టీ సౌందర్యం వుంది. లేకపోతే దాని అస్తిత్వం లేదు అని. ఇది పొరపాటు అభిప్రాయం. ఎంచేతనంటే, సౌందర్యం సుందర వస్తువులో, ఆ వస్తువు మనిషికి సంతరింపజేసే విలువలో
6
వుంది. అందుకే సౌందర్యం ఒక దృగ్గోచర విషయపు అతి విస్పృతమైన సామాజికమైన మానవ జాతికి ఒక ప్రయోజనాత శేకమైన విలువను సంతరించి పెడుతుంది.
జ్ఞానమీమాంస దృష్టితో, సామాజిక విలువల దృష్టితో సౌందర్యాన్ని పరిశీలించాలి. ఆవిర్భావము, ఇతివృత్తానికి సంబంధించినంత వరకూ సౌందర్యం వస్తుగతం. అది వాస్తవ (ప్రపంచపు వస్తువుల లక్షణాలను సంబంధాలను (ప్రతిబింబిస్తుంది. కనుక సౌందర్యం ఆంతరిక సమస్వరతను, వస్తువుల దృగ్గోచర విషయాల ఐక్యతను సంతరించుకొని వుంటుంది. జీవితపు సామాజిక, (ప్రయోజనాత్మక సూద్రం దీని చోదకశక్తిగా వుంటుంది. ఒక యువతి అందంగా వుంది అంటే అది ఆమె బాహ్యసౌందర్యం కావచ్చు. ఒక యువతి సౌందర్యానికి మారుపేరు అన్నామనుకోండి, దాని అర్ధం ఆమె కేవలం అందమైన యువతి అనేకాదు ఆమె సౌందర్యానికి నైతిక, ఆత్మిక పార్భ్యాలున్నాయి అని అర్థం. సౌందర్యాత్మక అభివర్గంలో సత్యం, శివం భావనలు కూడ చేరినప్పుడే అది సార్ధకమవుతుందనేది స్పష్టం. అందుకే మన ప్రాచీనులు సత్యం శివం, సుందరలను గురించి విడివిడిగా కాక సమన్విత దృష్టితో పరిశీలించారు
మనిషికి సౌందర్యం ఒక అవసరం. అతను సౌందర్యం కోసం తాపత్రయ పడతాడు ఆవళ్యకమైన, ఉపయోగకరమైన వస్తువుల్ని కూడ సృష్టిస్తాడు. మార్క్స్ మాటల్లో చెప్పాలంటే 'సౌందర్య సూత్రాల ప్రకారం” మనిషి వస్తువుల్ని సృబిస్తాడు. తేలేదేమిటంటే జౌచిత్యం, సమ్యక్ అనుపాతం అనన్య సామాన్య విశిష్టత (క్రమబద్ధత, వాస్తవ సంఘటనల సమస్వరత యివన్నీ సౌందర్యానికి భౌతిక ఆధారం సమకూరుస్తాయి.
చారిత్రక ప్రగమనంలో మనిషి సాధించిన వరం సౌందర్యాస్వ్యాదన. సౌందర్య సూత్రాల ఆధారంగా వస్తువుల్ని సృజించే శక్తి ప్రకృతి సౌందర్యాన్నీ, సామాజిక సంఘటనల్నీ, కళనూ సౌందర్యాత్మకంగా వీక్షించే శక్తి చారిత్రిక కాలగమనంలో మనిషికి లభించిన వరాలు.
సౌందర్యానుభూతి ఉపయోగితావాద వైఖరికి భిన్నమైనది. అంతే కాకుండా అది ఉపయోగితావాదం కంటే ఉన్నతమైనది (శ్రేష్టమైనది కూడాను. బూర్జువా సమాజంలో ప్రతిదాన్నీ ఒక సరుకుగా చూడటం జరుగుతుంది. అందుకే బూర్జువా సమాజం అసలైన కళ కవిత్వానికి వ్యతిరేకం అని మార్క్స్ భావించినాడు. ఈనాడు పాళ్చాత్య సౌందర్యశాస్త్ర వేత్తలు సౌందర్యాన్ని గురించి అంతగా చర్చించటం లేదు. వాళ్ల నిరాశావాదం కూడ దీనిక్కారణం కావచ్చు. పరిణామమేమిటంటే వికృతము, భయానకము, బీభత్సము, వికర్షకము అయిన వస్తువుల్ని, ఘటనల్ని సౌందర్యశాస్త్రంలో వారు ప్రస్తావిస్తున్నారు.
క్
మార్మిస్టు సౌందర్యశాస్త్రంలో సౌందర్యంతోపాటు, ఉదాత్తతను గురించి, విషాదాంతాన్ని గురించీ, సుఖాంతాన్ని గురించీ విశ్లేషించడం జరుగుతుంది. కానీ, వాటి కళాత శ్రైకతనే ఈ సౌందర్యశాస్త్రం పట్టించుకుంటుంది. అంతేగాని, బీభత్సమూ ఆతి వికృతమూ అయిన వస్తువుల్ని ప్రశంసించడం జరగదు. కారణం, సౌందర్యం అనేక యుగాల సాధన ఆనంతరం మానవజాతికి లభించిన ఒక ప్రయోజనాత శక విలువ అని మార్క్సిస్టు అవగాహన. సౌందర్యం కేవలం ఆలంకారం కాదు, జీవితంలో అంతర్భాగమే. జీవిత ప్రతిబింబన స్థితిని అధిగమిస్తూ జీవిత ప్రేరక శక్తిగా రూపొంది సామాజిక ప్రగతి కోసం, విశ్శశాంతి కోసం (ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషిచేసే మహత్తరమైన మానవీయ విలువ సౌందర్యం. ఎళాలాం్యదు ౨-౮-౪7 8
టి మనిషిని మరింత మానవీయం చేసే సౌందర్య చేతన
సౌందర్యానికి అనేక పర్యాయపదాలున్నాయి. సుందరం' అనే విశేషణానికి కింది పదాలు పర్యాయాలుగా ఇవ్వబడినాయి.
సుందరం రుచిరం చారు సుషనుం సాధు శోభనమ్
కాంతం నునోరమం రుచ్యం మనోజ్ఞం మంజు మంజుళమ్
అభిప్టేన భీప్పితం హృద్యం దయితం వల్లభమ్ ప్ర్‌యమ్ (అమరకోశం)
ఇవే కాకుండా లలితం, సుష్టు, కమనీయ, రమణీయ అనే విశేషణాలు కూడా ఉన్నాయి. (భారతీయ్ సౌందర్యశాస్త్‌కీ భూమికా - డా. నగేంద్ర పుట 31).
తెలుగులో అందానికి 100కి పైగా పర్యాయపదాలున్నాయి.. ఇందులో చాలభాగం వివిధ అర్ధఛాయలున్న పదాలు. ఉదాహరణకు అమరిక, చక్కదనము, చెన్ను, చెయికము, జిలుగు, పసిమి పొంకము, పోడిమి, రాణ, వాసి, విణ్నానము, సాంపు, సొగసు, పొబగు, సోయగము, పౌరు, హొయలు (పర్యాయపద కోశము - ఆచార్య జి.ఎన్ రెడ్డి. మన ప్రాచీనులు అందాన్ని వస్తుగతంగా తీసుకున్నట్టు ఈ పదాల్నిబట్టి తెలుస్తోంది.
సౌందర్యాన్ని గురించి ముఖ్యంగా మూడు రకాలైన వ్యాఖ్యానాలున్నాయి. 1. వస్తుగత వ్యాఖ్యానం, 2. భావవాద వ్యాఖ్యానం, కె ఆత శ్రవాద వ్యాఖ్యానం, సౌందర్యం వస్తుగతం౦ లేదా రూపగతం అనేవాళ్ళ తర్కం ఎమిటంటే అందం అనేది రూపం, ఆకృతి పై ఆధారపడి ఉంటుందని. రూపం మినహా మరేమీ అక్కరలేదు సౌందర్యానికి. రూపం ఆకృతి, అనుపాతం, అను'క్రమం, సమమితి (9౧౧౧౭౧౧, సమన్వితి, వర్షయోజన, దీప్తి కాంతిలాంటి లక్షణాలు
ర
కలిగివుంటుంది. ఆత్మవాదులు అనేదేమిటంటే సౌందర్యం పరమసత్తుయొక్క పారమార్థిక ఐక్యతకూ, సమన్వితికీ ప్రతీక అని. అయితే ఆత్మవాదులు భావవాదులు చెప్పేదాన్ని కూడా కొంతవరకు అంగీకరిస్తారు. సమన్వితిని అందరూ సౌందర్య నిష్పాదకంగానే భావిస్తారు.
భావవాదులు, భావాభివ్యక్తే సౌందర్యం అంటారు. సౌందర్యపు ప్రాణం ప్రణవం ఇచ్చ" అంటారు. భావవాదంలో ఆధ్యాత్మిక అంశాల ప్రసక్తిలేదు. సౌందర్యం వస్తుగతమా, భావగతమా ఆత్మగతమా అనే ప్రశ్న ఇపుడు అప్రస్తుతం. ఆత్మగతమనే వాదానికి కాలం చెల్లింది. విజ్ఞాన యుగంలో అధిభౌతిక అంశాలను, సత్యమనుక్రోవాల్సిన అవసరంలేదు. సౌందర్యం భావగత మనేది ఒక వాస్తవం. ఒక మనోనైజ్ఞానిక వాస్తవం. అలాగే సుందర వస్తువు లక్షణాలు వస్తుగతంగా పేర్కొనడం కూడా సత్యమే. ఈ లక్షణాలను వాస్తవిక లక్షణాలుగా జనం 'ప్రత్యక్షీకరణం (౧౯౧౦౯౫1౦) ద్వారా గ్రహించడం జరుగుతుంది. మనోవిజ్ఞానంలో అధునాతన ప్రయోగాలు వస్తుగతాన్ని భావగతంగా చేస్తున్నాయి. ఇందులో వైరుధ్యం లేదని నేననుకుంటున్నాను.
సౌందర్యానుభూతి (&క67౧౯|0 ౯౯౬౬ 16) క్రమంగా చారిత్రికంగా మనిషిలో వికసించింది. డార్విన్ కొన్ని జంతువులలో ముఖ్యంగా పక్షుల్లో సౌందర్యసంవేదన ఉందనే వాడు. స్త్రీ పురుషుల మధ్య ్రేమభావం సంపూర్ణ్షమానవ చరిత్ర యొక్క పరిణామం.
మానవునికి మాదిరే మానవుని భావనలకుకూడా చారిత్రిక వికాసం వుంది. (శ్రమ (ప్రభావం వల్ల, వస్తుగత క్రియాశీల సామాజిక సత్తు (38216) గా మనిషి ప్రభవించినాడు. భావనలో వికసించినాడు. సంగీతంవిని ఆనందించగలిగే చెవినీ, అందమైన ప్రకృతి దృశ్యాల్ని చూసి ఆస్వాదించే కంటినీ సంతరించుకున్నాడు మానవుడు.
అందమైన మానవీకరణల్ని గురించి మార్క్స్ అంటాడు : 'ప్రకృతిపట్ల (ప్రేమ లేనంత వరకూ ప్రకృతి అంటే భయం పోనంతవరకూ మనిషి తన (శ్రమతో ప్రకృతిపై మానవీయ భావన - ప్రకృతిపట్ట మానవీయ సంవేదన - అంటే, మనిషి యొక్క నైసర్గిక సంవేదన-వ్యక్తం చేయనంతవరకూ ప్రకృతికి సంబంధించి అందమైన మానవీకరణలు ఉదయించి ఉండేవి కావు.”
- ౧౪౧౦౧ 0810౧301 [౧1౭641౧6 006 6 ౧౦౬గ56 ౮౧ 1౧6/8 ౪/45 0౪810! [11204/6, ౮౧౬ 1140 ౧4౩ ౦0౪8౧౦౦౧౫6 ౧19 162” 0 ౧౬1౯6, 0౪౫ ౧ 5 11000
10
౧౧౦౦౮౦౬౦ ౧౪౧౬౧ ౧౯౬౬116 10౧౭146, 16 ౧౮౧౧౭౧ 5౯౫5౬ ౦114౮౧౬. ౭౧౮ 1౧61810/8 2 90 106 211/2 56౧59601 [4401 - 7౧6 [౧6 &[0౧5% ౧ 0614660 &౧ 0౦)69014౧6 గీ8301810 ౧6౪ ౧౩- ౪౬% గిం(200౪ ౧ న౧౦౦ 8౧౩ ౦ [40066౧౫ శీం51౧6[03 - ౧|౦౩/655 ౧౮౦ 30679, 1410900౪, 1969 (౧ 177)
మన దేశంలో ప్రకృతిపట్ట భయం కంటే (ప్రేమానురక్తి సంప్రదాయంగా వస్తోంది. కాళిదాసు ప్రకృతి చిత్రణ ఇందుకు ఉత్కృష్ట నిదర్శనం. ప్రకృతి, మనిషి సమరస భావనతో జీవించిన కాలమది. మనిషి ప్రకృతిలో ఒక అంతర్భాగం. కాళిదాసు శాకుంతలంలో ్రకృతికొక (క్రియాశీల సకారాత శక పాత్ర వుంది.
ఇక సౌందర్య నిర్వచనానికిసంబంధించి ఒక హెచ్చరిక. అన్ని నిర్భచనాలూ అసమగగ్రాలే. ఒక్కోవాదం ఒకోరకంగా సౌందర్యాన్ని నిర్వచించడం చూస్తున్నాం. వాస్తవమేమిటంటే ప్రతి నిర్భచనంలోనూ పాక్షిక సత్యం వుంది.
సౌందర్యం అంటే జీవితం ఎలా ఉండాలో అలాంటి జీవితం అని అన్నాడు నికోలయ్ చెర్నిషేవ్‌స్కి. ఆయన మానవతావాది. తన సిద్ధాంతవ్యాసం (వాస్తవికతతో కళకున్న సౌందర్యాత్మక సంబంధం)లో ప్రకృతి సౌందర్యాన్ని గూర్చిన తన అభిప్రాయాలు వ్యక్తీకరించాడు. ప్రకృతి అందమైనది, సౌందర్య సంపన్నమైనది. కళకంటే ఎక్కువ అందమైనది ప్రకృతి అనేవాడు ఆయన,
అరిస్టాటిల్ సౌందర్యానికిచ్చిన నిర్వచనం వాస్తవికతావాద నిర్వ్శచనం ఆయన అంటాడు. 1008064611 2 ౪౧౦౦౧62109 &0౧6 6౪9౧/ ౪/౧౦ 6 గొడ౦6 ౪6౧ 0/02గ3 ౧౧౮51 ౧౦10౧ ౫ ౧౧996౧4 0912 ౧ 0౧66 ౧ 18 &గ౭౧౦6౧౧6౧౦1 ౧౬గ౩, 06110 06 01 & 06గ౬౧ 66౧16 గొరిగి 166 868040/ 3 2 గ౧౧౭గ6౧౦౧5 26 ఇ౧6 0/669౯ ఇందులో కొంత సరళీకరణ వుందనేది దాచేస్తే దాగని సత్యం.
ఎడ్మండ్ బర్క్ అనే దార్శనికుడు తన సౌందర్య విశ్లేషణకు భౌతికవాదాన్ని ఆధారం చేసుకున్నాడు. అందంగా ఉండాలంటే ఒక వస్తువు తులనాత్మకంగా చిన్నదిగా వుండాలి. వివిధ భాగాలలో వైవిధ్యం వుండాలి. ఆ భాగాలన్నీ కలగలిసిపోయి వుండాలి, మృదువుగా వుండాలి దాని అంగాలు స్పష్టంగా ఉజ్వలంగా వుండాలి కాని ఘాటుగానూ, జ్‌గేలు మనేటట్టు గానూ వుండకూడదు. ౧౧౦౦ 6౧౩ ౦0? 00౧16౧0640” గి౭51౧9[09 -
111
గగ. 0౪౮/5 2౧౧ [0౪7 / ౧6౮8౬, [10500౪ (2. 99) హెగెల్ (ప్రకారం ప్రకృతి సౌందర్యం కళా సౌందర్యం కంటే కింది మెట్టుది. ఎందుకంటే అందులో ఆయన భావించిన 1616 వుండదు కాబట్టి, గోర్కి కూడా ఈ విషయంలో తప్పటడుగు వేశాడు. ఆయన (ప్రకటన (ప్రకారం ప్రకృతిలో అందం లేదు. మనిషి ఆత్మలో అందంవుంది. ఇది వాస్తవికం కాదు.
పోలెండ్‌కు చెందిన సౌందర్యవేత్త స్తానిస్టాన్ ఆసోవిస్కి తన సిద్దాంత (గ్రంధం (౯౧౦౪౧6౭10౧ 0౫ గీం5116109 = ౧౦|90 90 6౧€+6 ౧౪౦ 06210౧, */2౧28౪/2) లో ప్రకృతినీ మూడు రకాలుగా విభజిస్తాడు. ఎ. అపరిమితమైన విస్తారం గల ప్రకృతి, బి.పరిమితమైన భూతలం, ప్రకృతి దృళ్యాలు, సి. సంఘటిత ఉత్పాదితాలు, జీవకోటి: ఇక్కడ మానవుణ్ని (ప్రకృతిలో భాగంగా చూపడం జరిగింది. మనం ప్రకృతిని మానవీకృతం చేస్తాము. ప్రకృతి అభివ్యంజనాశక్తి వల్ల మనం ఎన్నో సౌందర్య సంవేదనలు సంతరించుకున్నాము. కొన్నివేళల్లో ప్రకృతి దృశ్యాలు మనకు కళాకృతుల్జా కన్పిస్తాయి. సంధ్య - క్షణక్షణం మారుతున్న సంధ్య - ఎన్నో కళాకృతులకు సమానం కాదా? మనం గొప్ప గొప్ప కళాకృతుల్ని చూసి పొందే ఆనందం గొప్పగొప్ప దృశ్యాల్ని చూసి కూడా పొందగలుగుతున్నాము.
సౌందర్యాత్మక దృష్టితో చూస్తే ప్రకృత తటస్థంగా వుండదు. అది ఒక సౌందర్య విలువ, (ప్రస్తుత దశలో ప్రకృతిని సంరక్షించేందుకు మానవత సమాయత్త మవుతున్నప్పుడు (ప్రకృతి విలువ మరింత పెరిగింది. సౌందర్యానుభూతి ఒక్కటే. అది ప్రకృతి సౌందర్యం కావచ్చు కళాసౌందర్యం కావచ్చు. కొన్నిసార్లు కళానుభూతి ప్రకృతి సౌందర్యానుభూతికి దగ్గరగా అన్పించవచ్చు. అందుకే సౌందర్య శాస్త్రం అంటే కళాసొందర్యమూల్యాంకనం మాత్రమే అని అనుకోవడం సమర్థనీయం కాదు. ఈ విషయాన్నే రూంగ్ రూవ్ ఈ విధంగా వ్యక్తం చేస్తాడు. సాహితీకృతి బల్లపై వుంచిన భూతల ప్రకృతిదృశ్యం; ప్రకృతిదృళ్యం ధరిత్రిపై వుంచిన సాహితీకృతి”
(డి ఓ19720౧/ ౪౦ 5 ఇ ౬2౧౮5౦4౧06 ౦0౧ (1౧9 1109. ౫ 12౧6502069 5 ౬ |16120/౪0660౧ 16 64గ౧) ౧౮౦1606 0౪ *6ఈ౪౮6౧ 2 28272ర9[80/2 - గిం5౧6103 2౧౮ ఓ19. (౧ 116). ఇందులో కొంత అతిశయోక్తి వున్నా దీని సారాంశం సత్యదూరం కాదనేది మన అనుభవం.
12
సౌందర్యపు తాత్విక పక్షాన్ని పరిశీలించాలంటే మనం ఆధునాతన మనోవిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. గెప్టాల్ట్ మనోవిజ్ఞానం చెప్పే తాత్వికత ఇలా వుంటుంది. (59006/08 :౮౦64గ౫౬ 01గ6906103 2౧౮ గగ 0/60 5౧ 60/౧9 1981) విశ్వం వివిధ విభిన్న శక్తుల పరస్పర (క్రియాశీలత వల్ల నడుస్తోంది. ఘన పదార్థాల వల్ల కాదు, ఫీల్ట్‌లో పనిచేసే కలిసే, పోటీపడే విడిపోయే, శక్తుల సమ్మేళనం ఈ విశ్చం యొక్క ప్రాథమిక మాధ్యమం. దీని ప్రకారం చాలా ఘటనలు ఒకేసారి జరుగుతాయి. మార్పు సాధారణం. అచలత్వం కంటే; వ్యక్తికీ బృందానికీ ఉందనుకునే ద్వంద్వం లేదు. వైయక్తికత ఒక 31401016" ఒక నిర్మితి, గెప్టాల్ట్ సిద్దాంతం (ప్రకారం కళాకారుడు ఒక ధోరణికి మాత్రమేగాక, వేర్వేరు ధోరణుల సమాహారంగా కూడా వుండవచ్చు. సెజా. ఇం్రెషనిస్టూ కాదు క్యూబిస్తూకాదు. అతని కృతి ఒక గెస్టాల్ట్ స్ట్రక్ఫర్. ఈ దృష్టితో శ్రీశ్రీ కవితల్ని మనం చూడవచ్చు
సౌందర్యానికి కొన్ని వస్తుగత గుణాలున్నాయని మనం చెప్పుకున్నాం. ఈ గుణాలు సౌందర్యానికి పాదార్థిక మూలాలు ఇవేమిటంటే సమ్మేయత (00గగ౪౧౩౮/29 0) నైప్పత్తికత పూర్షత, (క్రమబద్ధత సామరస్యం, ఇవి వాస్తవిక ప్రక్రియలు, ఈ గుణాల్ని ఒక సుందర సమాహారంగా ప్రత్యక్షీకరించుకునే సంస్కారం ఉండాలి, సౌందర్య సూత్రాల అవగాహన కూడా వుంటే మంచిది.
ఆధునిక సౌందర్యశాస్త్రంలో సమానుభూతి లేక తదనుభూతి (౯౧౧౧౭౫ 0 5౧6% ౮౧౦) అనే పదాన్ని వాడుతున్నారు. మనసు ద్వారా తన సంవేదనా స్థితిని బాహ్య వస్తువులోకి ప్రక్షేసించడం, అలా ప్రక్షేసించడం ద్వారా ఆ వస్తువుతో రసాత్మకంగా మమేకం కావడాన్ని తదనుభూతి (౬౫౦౬) అంటారు. ఈ 00౧090 ఆధారంగా, సౌందర్యాస్వాదం ఇలా నిర్వచించబడింది. శీం510910 6౧౦౧౧౪౧1 15 00160166 96 !- 6౧|౦౫౪గ|౧౭౧1 అని. ఆంటే సౌందర్యాస్వాదం వస్తునిస్టీకృత ఆత్మానందం (1౧౧8) (సౌందర్య శాస్త్రకే తల్న్ పుట 105) కాని సౌందర్యం సుఖం కలిగించేదే కానక్కరలేదు. (ప్రఖ్యాత సౌందర్యవేత్త రా. పాటణ్‌కర్ అంటాడు. "సుఖదత సౌందర్యపు ఆవశ్యక అంశం కాదని మనం అంగీకరించాల్సి వుంటుంది" అని (సౌందర్య మీమాంస అనే తన పుస్తకంలో = హిందీ అనువాదం చంద్రకాంత్ బాందివడేకర్, సాహిత్య అకాదెమ్నీ న్యూఢిల్లీ (పుట 217) కేవలం శారీరక సుఖం కలిగించేది సుందర వస్తువు కానక్కరలేదు. శారీరిక వాంఛ తీవ్రతరమైనప్పుడు సౌందర్య సంవేదన క్షీణిస్తుంది.
13
(సౌందర్య మీమాంస) (పుట 219) పాటణ్‌కర్ రస సిద్దాంతాన్ని ఆధునిక వైజ్ఞానిక దృష్టితో వ్యాఖ్యానించాడు. సంస్కృత కావ్యశాస్త్రంలో స్టాయీభావాలు, సంచారీ భావాలు సాత్విక భావాలు అని భావాల్ని వర్గీకరించడం చూస్తాం. సాత్విక భావాలు క్షణిక భావనాత్మక దశలు, సంచారీ భావాల్లో కొన్ని చింత, విషాదం లాంటి భావనల స్వరూపాల్లాగా వున్నాయి, కొన్ని హర్గ్దాది మనోదళల్చాగా వుంటాయి. కొన్ని సంచారీ భావాలు గర్వం, అసూయాలాంటి స్థిర (ప్రవృత్తులు, సాత్విక భావాల్లో కొన్ని (రతిలాంటివి) స్టిర ప్రవృత్తులనబడతాయి.
భరతుని వర్గీకరణలో కొన్ని భావాల్ని స్థాయి అనీ, కొన్నింటిని సంచారీ అని అనడం జరిగింది. స్ప్వాయీ భావాలు ్రధానమనీ, సంచారీ భావాలు గౌణమనీ భావించాల్సి వుంటుంది. ఈ వర్గీకరణ కేవలం నాట్యశాస్తానికి సంబంధించింది. సార్వత్రిక, సార్వకాలిక వర్గీకరణ కాదు.
భరతుని వళ్గీకరణలో మూడు వర్గాలున్నాయి. 1. సిర భావన, 2. క్షణిక భావన, తె భావోద్వేగంతో పాటు వుండే శరీర (ప్రక్రియ. భావనలు స్థిరంగా వుండాలి. అందుకని స్థిర భావన అనేచోట స్థిర ప్రవృత్తులు అంటే భావనాత్మక స్వభావ వైళిష్టాలు (7౬1౯౬౯౧44౬) అని భావిస్తే ఈనాడు కూడా ఈ వర్గీకరణ చాలవరకు సార్ధకం కాగలదు.
రసాస్వాద ప్రక్రియ అలౌకిక ఆనందం కాదు. జైన ఆచార్యులు రామచం(ద్ర గుణచంద్రగారు చెప్పినట్టు రసాలు సుఖాత్మకం కావచ్చు, దుఖాత్మకమూ కావచ్చు. శృంగార, హాస్య వీరు అద్భుత, శాంత రసాలు సుఖానుభూతి కలిగించేవనీ కరుణ, రౌద్ర, బీభత్స, భయానక రసాలు దుఖాత్మక రసాలనీ నిర్దారించి చెప్పారు వారు (రస్ సిద్దాంత్ - డా. నగేంద్ర (పుట 98). ఇది వాస్తవికతకు దగ్గరగా వుంది. ప్రముఖ హిందీ విమర్శకుడు ఆచార్య రామచంద్ర శుక్త కూడా దాదాపు ఇటువంటి నిర్దారణకే వచ్చాడు. ఆయన అంటాడు శ్రోత ప్రేక్షకుని హృదయంలో వేదిక పైన ప్రదర్శింపబడే భావోదయం కలుగక కేవలం ఆనందం మాత్రమే కలిగితే, సాధారణీకరణ ఎలా సాధ్యమౌతుంది. కోపము, శోకము జుగుప్పతో కూడిన వర్ణనలు (శ్రోత హృదయంలో ఆనందం మాత్రమే కలిగిస్తే ఆ శ్రోత సహృదయుడు కాడనీ, లేదా కవి ఈ భావాల్ని అనుభవించకనే వాటి రూపాన్ని మాత్రం వ్యక్తం చేశాడనీ భావించాల్సి వుంటుంది. (రస్ సిద్దాంత్ పుట-99)
సౌందర్యాస్వాద౦ విముక్తావస్థలోనే సాధ్యం దీనికై కొంతమేరకు అహం నిరసనం
114
(1౧౧౧6౧9౦౧౭ 'గ) మానసిక దూరం (29/01 0 ౪12౧06), నిస్పాంగత్యం (09120౧౧౪౧3 అవసరం. ప్రతిదాన్నీ లాభదృష్టితో బేరీజువేసి చూసే ప్రస్తుత వ్యాపార యుగంలో
సౌందర్యాస్వాదనకు అంత అనుకూల స్టితిలేదు. మన౦ ప్రయత్నించి స్టితిని అనుకూలం చేసుకోవాలి. మరి కొందరడగవచ్చు. సౌందర్యానుభూతివల్ల కలిగే ప్రయోజనమేమిటి? అని. దీనికి జవాబిస్తూ నికోలయ్ శిలాయెవ్ ఇలా అంటాడు. సౌందర్యానుభూతి వ్యక్తి బింబ రూపాయన శక్తిని ఇనుమడింపజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సౌందర్యానుభూతి మానవుణ్ని మనిషిగా చేస్తుంది. [౧6౧౧౬౧ 365
[120
“ఉదయం” దినప(ిక్క 2-12-923.
15
త త్తి జ్ సాహిత్యం - సౌందర్యం' - ఒక సమీక్ష సౌందర్యశాస్త్రంపై తెలుగులో వచ్చిన పుస్తకాలు తక్కువే. మార్క్స్‌వాద సొందర్యశాస్త్రంపై ప్రామాణిక (గ్రంధం ఒక్కటికూడా తెలుగులో కన్పించదు. శీలా వీర్రాజు గారి అందమైన కవర్ డిజైన్‌తో అచ్చయిన డా బి సూర్య సాగర్ గారి ఈ పుస్తకం 'సాహిత్యం - సౌందర్యం' ఈ లోటును తీర్చేదిగా వుంది.
'మార్క్సిజం' (మార్క్స్ వాదం) అనే పద ప్రయోగానికే అభ్యంతరం తెలిపిన కార్ల్‌మార్క్స్ మార్క్స్ వాద సౌందర్యశా(స్తం' అనే పదజాలాన్ని ఇష్టపడివుండే వాడుకాదు.
శాస్త్ర ద్వారాలు ఎవుడూ తెరిచే వుంటాయి. మూసివేయబడి వుండవు. సౌందర్యశాస్తమూ అంతే. సోవియట్ సౌందర్యశాస్రవేత్త యూరి బరేవ్ తన ఉద్షంథం 'సౌందర్యశాస్తంలో మార్క్స్‌వాద సౌందర్యశా(స్తం అని ఎక్కడా వాడలేదు. విజ్ఞానాన్ని ఒక వాదంతో బంధిస్తే అది కొన్నాళ్లకు పిడివాదంగా పరిణమించే ప్రమాదం వుంది.
ఈ పుస్తకానికి చక్కటి 'ముందుమాట" రాశారు పాపినేని శివశంకర్. ఈ ముందుమాటలో ముఖ్యంగా రెండుచోట్ల విమర్శ కన్పడుతుంది భారతీయ అలంకార శాస్త్రాన్ని ఈ పుస్తకంలో 'వికృత రూపవాదం అనడం, అస్తిత్వవాదాన్ని పూర్తిగా నిరసించడం శివశంకర్ గారి విమర్శకు పాత్రమయినాయి. “వస్తునిక్లేశాన్ని రూపనిర్దేశాన్ని శాశ్వతంగా సూత్రీకరించిన భారతీయ అలంకారీ శాస్తం వికృతమైన రూపవాదమే " అని డా సూర్యసాగర్ అంటారు. పాపినేని శివశంకర్ దీన్ని తీవ్రమైన విమర్శగా పేర్కొంటూ, అంత తేలిగ్గా భారతీయ అలంకార శా(స్తాన్ని కొట్టిపారేయకూడదు అంటాడు. ఇది సబబన్పిస్తుంది. రస, ధ్వని, జొచిత్యం లాంటి గీటురాళ్లతో ఆధునిక సాహిత్యాన్ని విలువ కట్టడం కష్టమైనా, అసాధ్యం మాత్రం కాదు. ఈ " సిద్దాంతాల్ని సృజనాత్మకంగా అన్వయించి సత్ప్సలితం పొందిన ఒక సందర్భం వుంది. సిమ్హాలో జరిగిన ఒక సదస్సులో ఈ విషయం మీద సమర్పించిన పత్రాల్లో పాశ్చాత్య రచనలు భారతీయ
16
అలంకార శాస్త్రం ఆధారంగా అంచనా వేయబడినాయి. ఉదాహరణకు, కీట్స్‌కవిత 066౭10 2 19౧1౧8 రస, ధ్వని దృష్టితో పరిశీలించబడింది. ఈ పత్రాలు సాహిత్య అకాదెమీ (ప్రచురించింది. ౬£1511//951 061105 అనే శీర్షికతో, 1994లో. వీటిలో కొంత అతిశయం వున్నా, భారతీయ కావ్య శా(స్తాన్ని సంపూర్ణంగా “వికృత రూపవాది మనడం సరైంది కాదని అనుకుంటా
'ముందుమాట'లో పాపినేని శివశంకర్ మరో అంశం గూర్చి కూడా రచయిత తన దృక్పధాన్ని పునరాలోచించాలని సూచించారు.
అస్త్రిత్వవాదాన్ని గురించి రాస్తూ రచయిత డా; సూర్య సాగర్ 'అదిపరాయీకృత తాత్వికత అనీ, గతి తార్కిక దృష్టి లేనిదనీ నీతి-అవినీతుల సరిహద్దును తిరస్కరిస్తుందనీ' పేర్కొన్నారు.
శివశంకర్ ఈ విషయంగా మనం 081౪8 గా ఉండటం నేర్చుకోవాలనీ నిబిడ నిరాశ పరాయీకరణ, స్వేచ్చ, జీవిత నిరర్ధకత లాంటివి ఎదో ఒక సందర్భంలో చాలా మందిలో
- తమ అనుభూతి పరిధిలోకి వస్తాయనీ భావిస్తాడు. మార్క్స్ వాదానికి భిన్నమైన వన్నీ మార్క్స్
వాదాన్ని వ్యతిరేకించేవే అని అనుకోవాల్సిన అక్కర్లేదంటారు శివశంకర్ గారు.
జాంపాల్ సార్ట్ అస్తిత్వవాదాన్ని మానవతావాద రూపంగా చూశాడు. మనిషిని సామాజిక సంబంధాల సమాహారంగా నిర్వచించిన మార్క్స్, వ్యక్తిగతమైన విషయాలకు (ప్రాముఖ్యం ఇవ్వలేదు. ప్రస్తుత స్థితిలో కూడా సమాజవాద వ్యవస్థ కూలిపోవడంతో ఉత్పన్నమైన స్థితిలో కూడా నిబిడ నిరాశ నిరర్ధకత లాంటి భావనలు స్పందనశీల వ్యక్తుల్ని కలచి వేస్తున్నాయి. ఇటువంటి అంశాల్ని మనం పట్టించుకుంటే అది మార్క్స్‌వాద వ్యతిరేకత కింద లెక్కకట్టడం శాస్త్రీయం ఎలా అవుతుంది ?
సౌందర్యశాస్త్రాన్ని చాలామంది కళా సిద్దాంతం గానే చూస్తారు. అలా కళా సిద్దాంతంగానే పరిగణించడం సౌందర్య శాస్త్ర పరిధిని కుంచించి వేయడం అవుతుంది. కళా సాహిత్యాలలో సహా సకల వాస్తవికతతో మానవునికి గల సొందర్యాత్మక సంబంధాలను పరిశోధించే రంగంగా సౌందర్య శాస్త్రాన్ని నిర్వచించడం సరయినదిగా వుంటుందని రచయిత డొ సూర్యసాగర్ గారి అభిప్రాయం. అందుకే ఈనాడు పర్యావరణ సౌందర్యం టెక్నికల్ డిజైన్, కళా సాహిత్యాల సృజన, సౌందర్యాభిరుచి మొదలైనవన్నీ కలిసి సౌందర్యాత్మక సంస్కృతిగా రూపొందుతాయంటారు రచయిత
17
భావ చిత్రాలను గురించి రాస్తూ రచయిత, కళాత్మక భావచిత్రం లక్షణాలను కొన్నిటిని పేర్కొన్నారు. కళాత్మక భావచిత్రం వస్తుపర, ఆత్మపర అంశాల సంశ్రేషణగా రూపొందుతుందనీ, ఒక రచన మొత్తంగా ఒక గొప్ప భావ చిత్రంగా మన మనోనేత్రంలో ప్రకాశిస్తుందనీ అంటాడు. భావ చిత్రంలో వస్టు రూపాల పార్టక్యం వుండదని మనకు తెలుసు. ఈ అంశాన్ని కాస్త వివరించి ఉంటే బాగుండేది.
మార్క్స్‌వాదం అనగానే ఆర్థికాంశకు [ప్రాధాన్యముంటుందని ఎవరైనా భావిస్తారు. కాని మార్క్స్ కూడా ఉన్నత కళా (ప్రమాణాలకూ ఆర్టిక ్రగతికీ అట్టే సంబంధం లేదన్నాడు. కళకు సాపేక్ష స్వాతంత్ర్యం ఉండటం వల్లనే గొప్ప గొప్ప కళాకృతులు ఆర్థికంగా వెనుకబడిన యుగాల్లో రాగలిగాయి. మృచ్చకటికం, శాకుంతలం లాంటి రచనలు రాచరిక యుగంలో వచ్చాయి. ఈ సందర్భంగా కాల్ల్ మార్క్స్ చెప్పింది గుర్తు పెట్టుకోవడం అవసరమని రచయిత భావిస్తాడు. మార్క్స్ అన్నాడు ౫5 /92/65 ఇగ, + 9 ౪/9 -॥౧04/౧ 1౧21 80గ౧౧౭ ౦1 [3 09413 0౫ ౧౦ ౧౪౬౧౩ 06016300౧6 (0 116 6౧6౧2 6౮6౪6100౧1౭౧1 01 800 69/ ౧౦ రేం16/, 19/6810/9, 10 16 ౧౫౫19” & 5609100108 .
రూపం, సారం ఆధ్యాయంలో రచయిత కొన్ని మౌలిక సమస్యల్ని చర్చించారు. నిబద్ధతను రచనలో అంతర్భాగంగా గుర్తిస్తూ సాహిత్య లక్ష్యం సత్య ్రతిఫలన అని ప్రకటిస్తారు డా సూర్య సాగర్. నిబద్ధతపై మరికాస్త వివరించివుంటే బావుండేది. భారతీయ పునరుజ్జీవనం 17వ శతాబ్దం కవి వేమనతో ్రారంభమయిందని రచయిత పేర్కొనడం తప్పు. కబీర్ 15వ శతాబ్దంవాడు. కబీర్ పునరుజ్జీవనానికి ఆదికవి అనడం సముచితంగా వుంటుంది.
రూపాన్ని గురించి రాస్తూ గియోర్లి లూకాచ్‌ను ఉటంకించారు రచయిత. 'సాహిత్యంలో నిజమైన సామాజికాంశం రూపం' అని లూకాచ్ రూపానికి తగిన (ప్రాధాన్యం ఇస్తాడు వస్తువు రూపంగా, రూపం వస్తువుగా పరిణతి చెందుతాయని లూకాచ్ అంటాడు.
ఈ సందర్భంగా సూర్యసాగర్ తెలుగు ఆధునిక సాహితీ ప్రక్రియకు సంబంధించి ఒక అమోఘమైన తీర్పువిన్చిస్తాడు “ఏరూపాన్నీ బలవంతంగా నిలబెట్టలేము. గణబద్ద పద్య రూపం ఇంకా వునికిలో వున్నదీ అంటే దానికి ఆలంబన ఐన ప్యూడల్ సామాజిక సారం ఇంకా వున్నదనే అర్థం. అయితే పద్యం ప్రజాతంత్ర భావాల, సామ్యవాద భావాల వాహికగొ వుపయోగపడుతుందనడంగానీ, పద్యానికి భవిష్యత్తు వుందనడం గానీ ఛాందసం *.
'కళా సృజనాత్మక రీతులు అనే అధ్యాయంలో సవిమర్శక వాస్తవికతా వాదం, సోషలిస్టు
18
వాస్తవికతావాదాలను ప్రస్తావిస్తూ సోవియట్ రచయితల అభి(ప్రాయాల్ని వ్యక్తం చేస్తారు రచయిత. సవిమర్శక సోషలిన్స వాస్తవికతావాద౦ నరిదైన పాళ్లలో రాకపోవడం, వచ్చినా నొక్కివేయబడటందారుణమైన విషయం, 'అసమ్మతి' అనేదే వుండరాదనుకోవడం సమాజవాద ప్రజాస్వామ్యానికి చాలా క్షీడుచేసింది చివరికి వ్యవస్థ పతనం దిశగా పయనించింది. ఈ విషయం కూడా రచయిత పట్టించుకుని వుంటే బాగుండేది. సౌందర్యశాస్త్ర అభివర్గాలపై (0౬1880గ69 పై) చివరి అధ్యాయం వుంది. ఇందులో సౌందర్యం, విషాదం, హాస్యం అభివర్గాలపై విసృృతమైన చర్చ చోటు చేసుకుంది. కాని ఇందులో ఉదాత్తత అనే ముఖ్యమైన అభివర్లాన్ని గురించిన (ప్రసక్తి లేకపోవడం కొట్ట వచ్చినట్టు కన్పించే లోటని అన్పిస్తుంది.
మరో విషయం పుస్తకంలో వచ్చిన దాదాపు అన్ని రస్యన్ పేర్టూ తప్పుగానే ప్రచురించారు. ఉదాహరణకు, 'ఓస్టోవ్‌స్కే స్టానిస్టావ్‌స్కీ'ఫెడిన్, 'డాస్తవస్కీ "ప్లెఖనోవ్, లయోనిడ్ లియోనోవ్, 'టాల్‌స్టాయ్', ఫెడిన్, క్లెష్టకోవ్ లాంటి 'పేర్టు. రష్యను భాషలో ట, డలు లేవు. డాస్టవస్కీ' అనరు. 'దొస్తయేవ్‌స్కి' అని ఆంటారు. హంగేర్‌కి చెందిన ప్రసిద్ద సొందర్య శా(స్త్రవేత్త పేరు గియోగర్లి లూకాచ్. ఇది కాస్త జార్జిలూకాచో అయింది.
మొత్తానికి ఈ పుస్తకం, మన విశ్శవిద్యాలయాల్టో సొందర్యశా(స్త్రం పార్యాంశమైతే, దానికి ఒక పార్యగ్రంధంగా పనికొస్తుంది.
నీను సాపొతి ఫిబ్రవరి - వీసప్రిల్ 1996. 19
గియోర్లి లూకాచ్ సౌందర్యశాస్తం (౧) చ
గియోగర్లి లూకాన్ ప్రపంచ (ప్రసిద్ది చెందిన హంగేరియన్ సౌందర్యశా(స్తవేత్త. అతడు హంగేరియన్ భాషలో రాసిన 'సౌందర్య శాస్త్రం" ఇంకా మన భాషల్లోకి అనువదించబడలేదు. ఆంగ్ల అనువాదం కూడా ఇంకా రాలేదు. నేను ఆ 'సౌందర్యశాస్త్రం యొక్క భూమిక ఆంగ్భానువాదం మాత్రం చదవలిగాను. లూకాచ్ గురించిన కొన్ని ఇతర పుస్తకాలు చదవడం జరిగింది. ఆయన అభిప్రయాలు మీతో పంచుకుందామని ఈ నాలుగు నాక్యాలూ రాస్తున్నాను.
1930లో లూకాచ్ కళాసమస్యల్ని గురించి ఆలోచించాడు. స్తాలిన్ కాలంలో లూకాచ్ మాస్కోలో వున్నా, స్తాలిన్‌వాదాన్నీ ముఖ్యంగా ర్మ్రూనొవ్ సూ'త్రీకరణల్నీ, పిడివాదాన్నీ వ్యతిరేకించాడు. మార్క్స్‌వాదాన్ని సౌందర్య శాస్త్రానికి ఎలా అన్సయించాలి అనే అంశంపై లోతుగా ఆలోచించినాడు. సంప్రదాయాన్ని అర్హం చేసుకొని, దాన్ని అధిగమించాలి అని భావించినాడు. మార్క్స్‌వాదం సమస్త సంప్రదాయానికీ వ్యతిరేకం కాదని నమ్మినాడు. సమస్యను ద్వంద్వాత్మకంగా పరిశీలించినాడు. ఆలోచనల నిరంతరతన్తూ, నవ్యతనూ ఆహ్వానించినాడు.
కళాకృతి పట్లా, ప్రకృతి పట్లా మన వైఖరి ఎలా వుండాలో స్పష్టంగా విశదీకరించినాడు లూకాచ్: ప్రకృతి కంటె, చిత్రీకరిరిచిన (ప్రకృతి ఎక్కువ అందంగా వుంటుంది అనే వాదనలో పన లేదని అన్నాడు. (ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించలేని వ్యక్తి కళా సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించగలడు అని ప్రశ్నిస్తాడు లూకాచ్. సుందర వస్తువుల్నీ, అందమైన ప్రకృతినీ ఆస్వాదించే శక్తిని మనకు మానవ పరిణామ చరిత్ర ఇచ్చింది.
కళా ప్రయోజానాన్ని గురించి రాస్తూ లూకాచ్, కళ మనల్ని జాతి మతాలకు అతీతంగా వుంచుతుంది, దేశ కాలాలను అధిగమించేట్టు చేస్తుంది; జీవితంలో గొప్ప క్షణాల్ని ఇస్తుంది; కాబట్టి ఇది ఒక జీవిత. విలువ అయింది. అడవులూ, పర్వతాలూ, మనుషులూ జీవిత విలువలు కలిగి వున్నట్లే కళ కూడా జీవిత విలువల్ని సంతరించుకుంది. కళ సంతరించి పెట్టే
20
జీవిత విలువ అతి సంశ్తిష్టమైనది, లోతైనది, విశిష్టమైనదీను. కళను నిర్వచిస్తూ - రూపం సాయంతో ధ్వనియే కళ అవుతుందన్నాడు లూకాచ్. సరళంగానే వుండాలి కళ ఆని అతడు అనలేదు. కళకు ఏదో ఒక ప్రత్యేకత వుండాలి అంటాడు. సమగ్రత వుండాలంటాడు. సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఆరిస్ట్రోటిల్ నుండి హెగెల్ వరకూ వచ్చిన సంప్రదాయాల్ని మార్క్స్ ఖండించ లేదంటాడు లూకాచ్. కార్ల్ మార్క్స్ షేక్స్‌పియర్ నాటకాల్నీ కవితల్నీ బాగా మెచ్చుకొనేవాడు. ముఖ్యంగ డబ్బును ఒక వక్రీకరణ శక్తిగా వర్షించే షేక్స్‌పియర్ కవితను మార్క్స్ తరచుగా ఉటంకించేవాడు, ఆని అంటాడు లూకాచ్.
లూకాన్ ప్రకారం శ్రేష్టమైన కళ మానవ జీవిత సంపూర్లత్వాన్నీ సమ(గ్రంగా ప్రతిఫలించాలి. ఆయన ప్రతిపాదించిన సౌందర్య శాస్త్రంలో రెండు ప్రధానాంశాలున్నాయి. అవేమిటంటే ఒకటి ప్రతిబింబీకరణ, రెండు ్రాతినిధ్యీకరణ. ఆయన చెప్పే ప్రతిబింబీకళణ ఛాయాచిత్రం లాంటి ప్రతిబింబీకరణ కాదు. లేక భావవాద స్వీయాత్మక స్వస్టమూ కాదు. ఆది మానవ వాస్తవికతను వ్యక్తీకరించేది. 'యూరపు వాస్తవితావాద అధ్యయనం' అనే (గ్రంధంలో లూకాబ్ వాస్తవికతానాద౦ గురించి రాస్తూ వాస్తవికతావాదమే సంపూర్మ మానవ వ్యక్తిత్వాన్ని సమాజసాపేక్షంగొ 'ప్రతిబింబించగలదు అని అన్నాడు.
కళ ప్రయోజనం కేవలం భావ వ్యక్తీకరణ మాత్రమే కాదు. అది మనల్ని ఉదాత్తమైన పద్ధతిలో ఉదాత్తమైన మార్గంలో ఉత్తేజితుల్ని చేస్తుంది. అంతేగానీ, కళ అంటే కేవలం కళాకారుడు వ్యక్తం చేసే భావాల్ని (గ్రహించడం, లేక ఆస్వాదించడం మాత్రమే కాదు. కళాకారునికి (ప్రపంచదృక్సధం అవసరం. జర్మన్‌లో దీన్నే వెల్దన్ షవూంగ్ ఆంటారు. (1/6 12050026009). వెల్దన్‌షవూంగ్ అంటే కేవలం (ప్రపంచ దృకృథం కాదు, అది జీవిత దృక్పధం, సంవేదనతో, స్వచేతనతో, స్వానుభవంతో కూడుకున్న జీవిత దృక్సథం, (ప్రపంచ దృక్పధం.
సాహిత్యంలో, కళలో రూపం యొక్క స్థానం గురించి లూకాచ్‌కు నిర్ధిష్టమైన అభిప్రాయాలున్నాయి. “సాహిత్యంలో నిజమైన సామాజిక అంశం రూపమే” అంటాడు ఆయన. రూపం భావజాలానికి సంబంధించిన అంశమే, డా! సూర్యసాగర్ 'సాహిత్యం-సౌందర్యం' అనే తన పుస్తకంలో అన్నట్టు రూపం కూడా సామాజిక సారాన్ని ప్రతిబింబిస్తుంది. పద్యాలు రాచరికయుగానికి చెందినవే ఆధునిక యుగానికి చెందిన రూపం కాదు. విషయ నవ్యత, నూతన రూపాన్ని కోరుతుంది. శ్రీశ్రీ మహాప్రస్థానం'లో ఈనవ్యత వుందంటూ చలం అంటాడు
- 'ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వష్నాల్లు కంట్టూ, ధీనర్రిగ్గౌ పలవరించే
21
సమయాన ఉషాాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ హృదయం ఎలా కంపిస్తే అలా ఆ కంపనకి మాటల రూపాన్ని యివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ యీటెలూ, మంటలుగా మార్చడం అతనికే చేతనవును. రూపం పై సంపూర్ణ అధికారంతో రాశాడు శ్రీశ్రీ. నవ్య విషయం, నవ్యరూపం, (ప్రళభయంకర విషయం. మహాప్రళయంకర రూపం ఆయన సొంతం. మరి రూపం సామాజిక అంశమే, లూకాబ్ అన్నట్టు. | నిబద్ధతను గురించి రాస్తూ లూకాచ్ - నిబద్దతనూ, నిమగ్నతనూ వ్యతిరేకం చేసి చూడకుండా అవి సాహితీకృతిలో స్వతహాగా సహజంగా వుద్భవించాలి, అంతేకానీ వాటిని పై నుంచీ చొప్పించుకూడదు అంటాడు. సాహిత్యాన్ని గురించి లెనిన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీ సాహిత్యాన్ని గురించే కానీ, సృజనాత్మక సాహిత్యం గురించి కాదని (క్రూప్ప్కుయ అన్నట్టు ఆయన రాశాడు. ఈ విశదీకరణ అపోహల్ని తొలగిస్తుందని ఆశిద్దాం. మనిమి మూనవ్యతాకు ఆగను 2000 22
జి క్రోచే సౌందర్యశాస్త్రం
పాశ్చాత్య తత్వశాస్త్రంలో హెగెల్‌కు ఏ స్టానం వుందో సౌందర్యశా(స్త్రంలో బెనెదిత్తో క్రోచేకు అదే స్టానం వుంది. [క్రోచే గురించీ, అతని సిద్దాంతాన్ని గురించీ కొంత తెలుసుకుందాం,
బెనెదిత్తో క్రోచే ఇటలీలోని నేపుల్స్ నగరంలో 1866లో జన్మించాడు. 1952లో ఆయన మరణించాడు. ధనిక కుటుంబములో పుట్టి పెరిగాడు. ఏ ఆర్టిక ఇబ్బందులూ లేవు అతనికి. అందుకే తాత్విక చింతనకు ఈయనకు బాగా సమయం దొరికింది. ఇటలీ సెనెట్ (పార్లమెంట్ సభ్యునిగా తర్వాత మంత్రిగా కూడా పని చేశాడీయన.
1900వ సంవత్పరములో నేప్పుల్స్ నగరంలో సౌందర్య శాన్తం పై మూడు ఉపన్యాసాలిచ్చాడు క్రోచే. వాటి ఆధారంగా ఇతను గ85[1916 అనే ఊద్గంధం రాశాడు. 1902లో ఇది ప్రచురింపబడింది 1909లో దీని ఆంగ్భానువాదం అచ్చయింది
క్రోచేకు కాంట్, హెగెల్‌ల వారసత్వం లభించింది. కాంట్, హెగెల్ ప్రసిద్ధ తత్వవేత్తలు. సౌందర్య శాస్త్రంపై గ్రంధాలు రాశారు కాంట్‌రాసిన “రుచి నిర్ణయ మీమాంస”లో సౌందర్యాన్నీ ఉదాత్తతనూ గురించిన విశ్లేషణలున్నాయి. భావనలు (కానొసెఫ్ట్స్) అంత: ప్రజ్ఞ (ఇన్‌ట్యూషన్) లేకుంటే గుడ్డివి అంటాడు కాంట్. కాంట్ ప్రకారం అంతః ప్రజ్ఞాత్మక జ్ఞానం ఇంద్రియ జనిత జ్ఞానం అంతఃప్రజ్ఞకు దేశ కాలాలుంటాయని, మస్తిష్కంలో మేధోక్రియకు పూర్వం ఎర్పడే జ్ఞాన రూపం ఈ అంతఃప్రజ్ఞ అని అంటాడు కాంట్.
హెగెల్, తత్వశాస్త్రంలో ద్వంద్వాత్మక పద్దతి అవలంబించి ఒక త్రికమును (ప్రతిపాదించినాడు. స్టాపన, ప్రతిస్థాపన, సంక్షేషణ - 1106915 4౧౧1౧6౩ 8, 5/౧416515 అని. కళ స్టాపన, మతం ్రతిస్టాపన, తత్వశాస్త్రం సంశ్లేషణ అని అంటాడు హెగెల్. అలాగే అంతః ప్రజ్ఞ స్టాపన అనీ ్రాతినిధికత (రిఫ్రెజేంటేషన్) ప్రతిస్టాపన అనీ, ఆలోచించడం సంశ్లేషణ అనీ అంటాడు ఆయన. కానీ క్రోచే ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తాడు. (క్రోచే అనడం ఏమంటే,
23
హెగెల్ అసలు విరోధులకు (ఆపోజిట్స్‌కు), విశిష్టాలకు (డిస్టింగ్ట్‌కు) మధ్య స్పష్టమైన అంతరం చూడలేకపోయాడనీ, దాంతో కళ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించలేకపోయాడనీ. క్రోచే ప్రకారం మతం కళను నిషేధించదనీ, అలాగే ప్రాతినిధికత అంతః ప్రజ్ఞకు నిషేధం కాదనీ. శ్రోచే ఆత్మవాద దార్శనికుడు. ఆయన సిద్దాంతం ఏమంటే అంతఃప్రజ్ఞ అభివ్యక్తి అనీ, అభివ్యక్తి అంతఃప్రజ్ఞ అని. అంతః ప్రజ్ఞలో సాధారణంగా భావనలు అసలు వుండవనీ, ఒక చిత్రకారుడు వెన్నెలను చూసి ఒక చిత్రం గీస్తే అందులో ఏ భావన (కానొసెస్ట్) వుంటుంది అని ప్రశ్నిస్తాడు క్రోచే. అంతఃప్రజ్ఞ 'విదాత్మ' (స్పిరిట్ యొక్క శాశ్వత రూపం... కళకు సంబంధించిన ప్రక్రియ. కళ అంతః ప్రజ్ఞ అందువల్ల ఆత్మయొక్క శాశ్వత రూపం అది. అది సార్వజనిక౦ కాదు, వైయక్రీకం, దాని వస్తువు భావనాత్మకం కాదు. హెగెల్ చెప్పినట్టు అది సార్వజనిక౦ం, ఇంద్రియగత మాధ్యమం కాదు. అంతఃప్రజ్ఞ అభివ్యక్తి కల్పనల ద్వారా పొందే జ్ఞానం అంతః(ప్రజ్ఞాత్మక జ్ఞానం. ఇది వైయక్తికము, బింబాలను (1౧2865) ఉత్పత్తి చేసేది. క్రోచే ప్రకారం “జ్ఞానం రెండు విధాలు : అంతః ప్రజ్ఞాత్మకం, తార్కికం; కల్పన ద్వారా పొందే జ్ఞానం, మేధస్సు ద్వారా పొందే జ్ఞానము; వైయక్తిక జ్ఞానము, సార్వజనీన జ్ఞానము; వాస్తవంగా చెప్పాలంటే ఒకటి భావబింబాలను ఉత్పత్తి చేసే జ్ఞానము, నురొకటి భావనలను ఉత్పత్తి చేసే జ్ఞానము . (ఈస్థైటిక్ - వుట 1) అంతఃప్రజ్ఞ అనే పదం ఇన్‌ట్యూషన్ అనే అర్హంలో కేంద్రశాస్త సాంకేతిక పదావళి పరిషత్తు వాడింది. ఇది ప్రామాణికం. అందుకనే ఈ పదాన్ని విసృతంగా వాడుతున్నారు. (క్రోచే అభివ్యక్తి అనే పదాన్ని చాలా విశాలార్థంలో వాడాడు. సాహిత్యాభివ్యక్తి అనే అర్జంలోనే కాదు. కేవలం పదాలు కాదు, రంగు, రేఖ, స్వరము గతి లాంటి పలు మాధ్యమాలను ఇది అభివ్యక్తం చేస్తుంది. " అంతఃజ్ఞకు అరవిందుడు ఉన్నత్ర స్టానమిచ్చాడు. దాన్ని ఆధ్యాత్మిక అనుభూతి అన్నాడు. (ది లైఫ్ డివైన్ - పుట - 64) రూపాన్ని గురించిన ్రోచే అభిప్రాయాల్ని జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. కళ, సంగీతం, కావ్యం, పుస్తకాల్లో లేదు. అది కళాకారుని ఆత్మలో వుంటుంది అంటాడు. వస్తువులో కాదు, రూపంలో వుంది కళ అంటాడు క్రోచే. సొందర్యతధ్యం రూపమే. రూపం తప్ప ఇతరం కాదు అని అంటాడు (ఈస్టైటిక్ - పుట 16). కళ అంతరికం, అవిభాజ్యం అని అంటాడు దిశ
'క్రోచే. (ఈస్టైటిక్ -పుట 20) ఆయన ఇలా రాసింది 1902లో. తర్వాత 1948లో క్రోచే రూప వాదాన్ని ఖండిస్తాడు. రూపవాదుల కళా సిద్దాంతాల్ని నిరాకరిస్తాడు కావ్య కళలో వచ్చిన క్షీణ ధోరణిని నిరసిస్తాడు. నైరూప్యకళ ఒక రోగం, ఆది ఆరోగ్యకరమైన కళ కాదంటాడు. (సెమాంటిక్ ఫిలాసఫీ ఆఫ్ ఆర్ట్ - యౌగెనీ బాసిన్ - పుట 83) కానీ ఆధునికతావాదులూ నైరూప్యవాదులూ, అభివ్యక్తి వాదులూ, అధివాస్తవిక వాదులూ క్రోచే నుంచి ప్రేరణ పొందారన్నది ఒక వాస్తవం.
క్రోచే ప్రకారం కూడా అంతః ప్రజ్ఞ శూన్యం నుంచి వూడిపడదు. దీని రచనలో ప్రత్యక్షణల (౧౪|౦౪౧[౦౧౩) సంవేదనల దోహదం ఎంతో వుంది. జ్ఞానేంద్రియాలతో వస్తువుల ప్రత్యక్షణ జరుగుతుంది. ఆది సంవేదనగా అయి ఇంద్రియగత (ప్రభావాలు (ఇం్రెషన్స్)గా రూపొందుతుంది. ఈ సంస్కారాలే పప్రేరణాక్షణాల్లో ఆంత*వ్రజ్ఞగా స్ఫురిస్తాయి. రూపుదిద్దుకొంటాయి. అభివ్యక్తమౌతాయి. కళాత్మక బింబాలు ఏర్పడతాయి. అందువల్లే కళాకారుని (ప్రత్యక్షణ, సంవేదన ఎంత విసృతంగా, సూక్ష్మంగా, సంపద్వంతంగా వుంటాయో అతని కళ కూడా అంత ఉత్కృష్టంగా వుంటుంది,
(ప్రొఫెసర్ దేవేంద్రనాథ్ శర్మ విమర్శించినట్టు, ప్రతి అంతః ప్రజ్ఞా అభివ్యక్తి కాదు” కళ కాదు, కావ్యమూ కాదు. [క్రోచే సిద్దాంతం అతిళయోక్తి అని భావిస్తాడు ఆయన... క్రోచే సఫలీకృత అభివ్యంజన లేక అభివ్యక్తే సౌందర్యమని నిర్వచిస్తాడు. సఫలీకృతం కాని అభివ్యక్తి అభివ్యక్తే కాదంటాడు (ఈస్పెటిక్ - పుట 79),
సౌందర్యంలో పరిమాణభేదం వుండదంటాడు క్రోచే. అంటే అందంలో ఎక్కువ తక్కువలుండవని అర్ధం చేసుకొంటే ఇది వాస్తవానికి దూరమనే భావించాలి. కానీ క్రోచే అందవికారంలో (అగ్షినెన్‌లో) పరిమాణ భేదాలు వుంటాయంటాడు. ఒక విధమైన సమగ్రతావాదం ఇది. కళ అవిభాజ్య ఆంగిక పూర్ణత్వం అనేది అందుకనే. కళను ఇంద్రియ ప్రభావాల సంస్కారాల (ఇం'ప్రెషన్స్ యొక్క) అఖండ పరస్పర ప్రగాఢ సమ్మేళనంగా భావిస్తాడు 'క్రోచే. కళా ప్రక్రియకు నాలుగు దశలుంటాయంటాడు. అవి 1. ఇంద్రియగత (ప్రభావాలు (ఇం్రెషన్స్)' 2. అభివ్యక్తి: 3. సౌందర్యాత్మక ఆనందం; 4, సౌందర్యం భౌతిక రూపాల్లో అంటే ధ్వనుల్లో రేఖలో రంగుల్లో లయల్లోకి రూపాంతరం చెందడం. ఈ నాలుగు దశల్లో (ప్రముఖమైంది అభివ్యక్తే అని అంటాడు |క్రోచే. చాలా మంది అనుకున్నట్టుగా కాక (క్రోచే కళా (ప్రక్రియలోని దశల్ని గురించి ప్రస్తావించాడు
25
కళాకృతిని చూసి కళాకారుడు ఆనందభరితుడౌతాడు. సంస్కారాల అభివ్యంజనతో ఆనందపడతాడు. ఆత్మికంగా కళాకారునిలో సౌందర్యం జనిస్తుంది. సహృదయునిలో కళాకృతి ద్వారా జ్ఞానేంద్రియాల ఉద్దీపన జరుగుతుంది. అతనిలో కళాత్మక అంతఃప్రజ్ఞ పునరుత్పత్తి అవుతుంది. అంతేగాక సహృదయుడు ఆనందానుభూతి పొందుతాడు. దీన్ని మనవాళ్లు సాధారణీకరణ అన్నారు. రసానుభూతి అన్నారు. కళాత్మక సందృష్టి (ఆర్టిస్టిక్ విజన్) ఆంతరిక (ప్రక్రియ. దానికి బాహ్య రూపం ఎలా సమకూరుతుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. కళాకారునికి సంవేదన, అసంవేదన - రెండూ వుంటాయి. సంవేదన స్థితిలో బాహ్యపరిస్థితి ప్రభావం వుంటుంది. దీనివల్ల కళాకారుని జ్ఞానం విస్తృతం, అనుభవం సుసంపన్నం అవుతుంది. అసంవేదన ఒక ప్రశాంత స్థితి - క్రియాశీలత కన్పించదు. ఈ అసంవేదన స్థితిలో ఆత్మీకృతం చేసుకన్న సామా(గి ఒక రూపం సంతరించుకుంటుంది. సౌందర్య ఉత్పాదనకు కండీషన్స్ కొన్ని చెబుతాడు క్రోచే. అవేమిటంటే
-
- జాగరూక సంకల్పం - దీనివల్ల సందృష్టీ, అంతఃప్రజ్ఞలూ (ప్రాతినిధికతలు పరిరక్షింపబడతాయి - నాశనం కావు; 2. కళను వ్యక్తం చేసే ప్రక్రియలో శిల్పం మాత్రం వుంటుంది. శిల్పం అభివ్యక్తిలో కళాకృతిలో అంతర్భాగం; 3. మననం: సరిైన మాధ్యమ రూపాల ఎన్నిక చాలా అవసరం. కావ్యంలో సరియైన పదాలు ఎన్నుకొని సద్యఃస్భురణతో కావ్యీకృతం చేయడం జరుగుతుంది. దీనికి మననం ఆవసరం; 4. ప్రతిభ (జీనియస్) - కళోత్సాదన దీంతోనే సంభవం. దీని మరో పార్వం విమర్శ. విమర్శశనాశక్తి 'ప్రతిభలో అంతర్భాగం. రుచిని పెంచేది ప్రతిభయే. కళాకారుని ప్రతిభా, సామాన్య వ్యక్తి ప్రతిభల మధ్య పరిమాణాత్మక భేదం మాత్రమే వుంటుంది. ఇది గుణాత శకం కాదంటాడు కక్రోచే. ఇది చర్చనీయం. కళ దేశకాలాలలకు అతీతం అంటాడు (క్రోచే సంగీతం వింటున్న వాడు సంగీతం వింటున్నపుడు కాలం ఆగినట్టు వుండటం క్రోచే ఉదాహరణ. ్రోచే తీవ్రమైన భావవాది కనుక ఇలా భావించినాడు. కళాకారునికి రుచి అవసరమనీ విమర్శకునికి కళాకారుని అవసరమనీ అంటాడు క్రోచే. కళాకారుని సంవేదన తీవ్రతరమనీ, కల్పన విశదతరమనీ, అభివ్యక్తి రమణీయ తరమనీ వివరిస్తాడు. ప్రకృతి సౌందర్యాన్ని గురించి క్రోచే స్పష్టమైన భావాలు వ్యక్తం చేశాడు. కళాకారుని దృష్టితో చూసినపుడే ప్రకృతి అందంగా కనిపిస్తుందనీ ప్రకృతి సౌందర్యాన్ని జంతు శాస్తజ్ఞులూ, వృక్ష శాస్తజ్ఞులూ గుర్తించరని అంటాడు (క్రోచే ప్రకృతి సౌందర్యం ఆవిష్కరింపబడుతుంది
అని అంటాడు ఆయన. స్వతహాగా ప్రకృతి సౌందర్యం వుండదనీ, కల్పనాంశ లేకుండా ప్రకృతిలోని ఏ భాగమూ ఆందమైనది కాదని క్రోచే సిద్దాంతీకరిస్తాడు. ॥
క్రోచే దోహదం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆయన కాలం నాటికి అంటే 19వ శతాబ్దం చివరిలో యూరప్‌లో చాలామంది రచయితలు కళ కళ కోసమే అనే నినాదం యిచ్చారు. దీనికి తాత్విక పునాది కల్పించాడు [క్రోచే. క్రోచే సౌందర్యవాది. రోమాంటిక్ భావ ధోరణికి క్రోచే సౌందర్య తత్వం సరిపోయింది. రెంటికి పొసగింది.
'శ్రోచే విశ్లేషణలో సహృదయుడు ప్రస్తావించబడినా, ఉపేక్షింపబడినాడు. సం(ప్రేషణ (కమ్యూనికేషన్) కు సముచితస్టానం కల్పించలేదు క్రోచే. మన అలంకార శాస్త్రంలో మాదిరిగా వర్గీకరణ అనవసరమైనా వర్గీకరణను పూర్తిగా నిరాకరిస్తే అది సమంజసం అనిపించుకోదు. శ్రోచే అలా చేశాడు. కళను ఒక పరిపూర్ణ ప్రక్రియగానూ, సమ(గ్రమైనదిగానూ, సంశ్రిష్టమైనదిగానూ గుర్తించి కళా స్వభావము లోతుల్లోకి వెళ్ళాడు ్రోచే. కళాకృతిని అర్థం చేసుకోవాలంటే చారిత్రక పరిపార్యాన్నీ యుగ పరిస్టితుల్నీ అర్ధం చేసుకోవాలంటాడు క్రోచే. ఎందుకంటే, కళాకారుని వ్యక్తిత్వం రూపొందేది వీటి వల్లనే గనుక.
అంత్యంలో క్రోచే అన్న ఒకటి రెండు మాటల్ని మననం చేసుకోవడం అవసరం. కళకు ,అనువాద౦ం అసంభవం అంటాడు (క్రోచే. ఒక అభివ్యక్తిని మరో అభివ్యక్తిగా పునర్రూపొందించడమన్నమాట అనువాదమంటే - ఇది అసంభవం. ప్రతి అనువాదమూ మూలంతో పోల్చితే న్యూనంగానైనా వుంటుంది. లేదా ఆమూలాన్ని పాడుచేస్తుంది, లేదా కొంగ్రొత్త అభివ్యక్తిని సృజిస్తుంది. అపుడది మరో కళాకృతి అవుతుంది. అనువాదం కాదు అని అంటాడు కక్రోచే. మరో క్రోచే అభిప్రాయమేమిటంటే కళ కంటే యధార్డ జీవిత ఘనటలకే మనం ఎక్కువ స్పందిస్తామని. కళానుభూతి భాసమాన అనుభూతి. (అపారెంట్‌ఫీలింగ్ నిజమైన అనుభూతి కాదు రూపం మాత్రమే. మరి ఇదికూడా చర్చనీయాంశమే
మిసిమి నూనస(ిక్త నీస్రీల్ 2005 27
ఆ ముక్తిబోధ్ సౌందర్యశాస్త్రం దీర్ధ కవితలకు పెట్టింది పేరు ముక్తిబోధ్. *'వీకటిలో' అనే ఆయన దీర్ధ కవితను పద్యంలో గుఎర్నికా' అని పొగిడారు డా ప్రభాకర్ మాచ్వే. సాహితీ విమర్శ, సౌందర్య శాస్త్రం సమస్యల్ని ముక్తిబోధ్ ముఖ్యంగా తీసుకున్నాడు. సాహిత్యాన్ని ఆయన కళగా పరిగణించినాడు. కవిత్వాన్ని సాంస్కృతిక ప్రక్రియగా చూశాడు. దాన్ని కేవలం అనుభూతికి అభివ్యక్తిగా చూడలేదు. సౌందర్యానుభూతిని గురించి లోతుగా అధ్యయనం చేశాడు. సాహితీ కళ యొక్క సామాజిక పారం సమస్యను పరిశిలించినాడు. (ప్రగాఢ అనుభూతి, ఉదాత్తమైన చింతన, సామాజిక సందృష్టి (విజన్స్‌ల సమ్మేళనమే నిబద్దతకు మూలం అని ఆయన భావించినాడు. 'కామాయని'" అనే ఆధునిక మహాకావ్యాన్ని మార్క్సిస్టు పద్ధతిలో విమర్శిస్తూ మూల్యాంకనం చేశాడు. (ప్రాధమికంగా, ముక్తిబోధ్ ఒక కవి. ఆధునిక కవి. ప్రారంభ దశలో బెర్గ్‌సన్ తాత్వికత (ప్రభావం వున్నా, క్రమంగా మార్క్స్‌వాదం వైపు ఆయన ఆకర్షితుడైనాడు. పేదరికం, పటు నిరాశ, ఎవరో తనను వెంటాడుతున్నారనే భావన - వీటితో బాధపడినాడు. ఆయన ప్రగతిశీల ఆధునికుడు - రెండింటి సమ్మేళనం. సౌందర్యశాస్త్రం, సాహితీ విమర్శ పై ముక్తిబోధ్‌వి రెండు సంపుటాలు అచ్చయినాయి. కామాయని పునర్మూల్యాంకనం పుస్తక రూపంలో వచ్చింది. “చంద్రుని ముఖం వంకర' (దాంద్ కా ముహ్ టేఢా హై) అనే కవితా సంపుటి ఆయన అపస్మారక స్థితిలో వుండగా అచ్చయింది. తర్వాత 15 ఏళ్లకు 'భూరీ భూరీ ఖాక్ ధూళ్ అనే మరో కవితా సంపుటి వెలువడింది. ఆలూరి బైరాగిలా నిరాశ, వెలితి, పేదరికంతో మగ్గినాడు ముక్తిబోధ్. ఇపుడు ఆయన సంపూర్ణ రచనలు ప్రచురణకు నోచుకున్నాయి. ॥ చంద్రుని ముఖం వంకర" అనే కవితా సంపుటికి రాసిన భూమికలో ప్రఖ్యాత కవి శంశేర్ బహదూర్ సింగ్ ముక్తిబోథ్ జీవితం ఒక ఓటమి అనీ, కాని అతని ఆంతరిక జీవితం 28
అసమాన సాహితీ (ప్రతిభతో నిండివుందనీ అంటాడు. ముక్తిబోధ్ కవితలు ఒక సహచర భావనతో తొణికిసలాడుతుంటాయని ఆయన అంటాడు.
ముక్తిబోధ్ సమస్య ఇది -
ఉండేది ఒకే సమస్య
ఈ సభ్య నగరాల్లో గ్రామాల్లో
మనుషులందరూ
సుఖసంతోషాలతో, కొల్లగొట్టబడకురిడా
ఎప్పుడు జీవించగలుగుతారు?
ఇదే అసలు సమస్య
తార్ సప్తక్' అనే కవితా సంకలనంలో ఒక ప్రకటన చేస్తూ కవితలో తను మొదట చూసేది సౌందర్యం అనీ, ఆ తర్వాతే మానవజాతి సంక్షేమమనీ అంటాడు ముక్తిబోధ్. కాని, తదనంతరం మానవజాతి ప్రగతికి మొదటి స్థానం ఇచ్చినాడు. అతనో సృజనాత్మక సొమ్యవాది. పెడివాది కాడు ఆందుకే మార్క్స్‌వాదం మనిషి అనుభూతికి జ్ఞానాత్మక ఆదర్శ జ్యోతి నిస్తుందనీ అది అనుభూతికి ఆటంకం కానే కాదనీ, అనుభూతిని బోధయుక్తం చేసి దాన్ని సంస్కరించి ఉన్నతోన్నత స్టితికి తీసుకపోతుందనీ, మనిషి సంవేదనా సామర్థ్యానికి అది వ్యతిరేకి కాదనీ వక్కాణిస్తాడు ముక్తిబోథ్. కానీ, కవి ఏదో ఒక వాదానికి కట్టుబడి వుండడనీ, అతను ఒక (ప్రపంచ దృక్పధం కలిగి వుంటాడనీ దాన్ని 'వాదం' అనే కంటే, దృక్కోణం అనడం భావ్యంగా వుంటుందనీ అభిప్రాయపడతాడు ఆయన.
ఒకకవి కంటే మరోకవి గొప్ప అని ఎలా చెప్పగలుగుతాము అని ప్రల్షించుకుని జనాబిస్తాడు ముక్తిబోధ్ కవి ఏ తలం (సతహ్) నుంచి మాట్లాడతాడో దాన్ని బట్టి కవి గొప్పతనాన్ని అంచనా వేయవచ్చు నంటాడు. రవీంద్రనాథ్ టాగూరు ఏ విశాల జీవిత ఉన్నత శిఖరం మీద నిలబడి దేశదేశాల జన సముదాయాల్ని సంబోధిస్తూ తనను వ్యక్తం చేసుకుంటాడో, ఆయన్ను అనుసరించిన వారు, ఆనుకరించినవారు ఆ స్థానం పొందలేక పోయార్డు. ఆ తలాన్ని స్పృశించలేక పోయారు
కవిత్వాన్ని ఒక సాంస్కృతిక ప్రక్రియగా పేర్కొంటాడు ముక్తిబోధ్. దాన్ని కేవలం ఒక మనోవైజ్ఞానిక (ప్రక్రియగా చూడడు నవ్య కవులు బాహ్య ప్రపంచాన్ని గురించి తీవ్రంగా స్పందిస్తారు. కానీ, వారికి ప్రగతివాదుల కున్నట్టు ఒక తాత్వికత లేదు. హిందీ 'నఈ కవిత"
29
సంవేదనాత్మక సంజ్ఞానం, సంజ్ఞానాత్మక సంవేదనల పరస్పర అంతః[క్రియను వ్యక్తం చేస్తుంది. (ప్రపంచాన్ని గురించిన చైతన్యం లేకపోతే కవికి స్వీయచైతన్యం కూడా వుండజాలదు అని అంటాడు ముక్తిబోధ్.
సంప్రదాయం మన సంస్కృతిని తీర్చిదిద్దుతుందని అంటూ కాళిదాసు రచనల్ని పేర్కొంటాడు ముక్తిబోధ్. సాంస్కృతిక వారసత్వాన్ని గురించి గొప్పగా చెబుతాడు. 'స్వను అధిగమించి ఇతరుల హృదయాల్లోకి ప్రవేశించి సమానుభూతి (2౧౧౭) చెందడం కళాకారునితో పాటు సంవేదనశీలియైన ప్రతి వ్యక్తికీ సాధ్యమే అని అంటాడు. జీవితానుభవాలే సౌందర్యానుభూతిని కలిగిస్తాయనీ, ఈ సౌందర్యానుభూతే సృజనాత్మక కల్పన ద్యారా ఒక రూపం సంతరించుకుంటుందనీ అంటాడు. కవికి తన్మయత, తటస్టత - రెండూ వుంటాయంటాడు. స్వ నుంచి విముక్తి మనసులో రూపొందిన చిత్రాలకు స్పందించడం సౌందర్యానుభూతికి సోపానాలు. స్వానుభూత జీవితాన్ని కల్పన ద్వారా పునరి శ్రంచుకోవడమే కళ అని కళను నిర్వచిస్తాడు ముక్తిబోధ్.
సామాజిక పరిదృళ్యం (విజన్) కవిపై మోపబడుతోందని సౌందర్యవాదులు అంటారనీ, అయితే ఆ పరిదృళ్యం అలా మోపబడదనీ, అది కవి హృదయపు లోతుల్టోంచి వస్తుందనీ, అతని అంతప్టైతన్యాన్ని ఆలోకితం చేస్తుందనీ భావిస్తాడు ముక్తిబోధ్. మన ఆత్మ మన సమాజం ఇచ్చేదేననీ, మన సౌందర్యాభిరుచి కూడా సమాజ ఉత్పాదనే అనీ పేర్కొంటాడు. మనం భారతీయ సన్నివేశాన్ని చూడాలిగాని అల్బేర్ కామూ, కార్ల్ యాస్పర్స్‌లు మనకు ఆదర్శం కాదంటాడు ఆయన,
నిరాశా నిస్ప్రహలకు తావులేదంటారు ్రగతివాదులు. కానీ, ఏ భావజాలంలోనూ నమ్మకం లేని వాళ్లకు నిరాశా నిస్సహా సహజమేననీ ఆ నిరాశను వ్యక్తం చేసేందుకు (ప్రయోగవాదులు ప్రయత్నించడంలో తప్పులేదని వాదించినాడు ముక్తిబోధ్. సాహిత్యంలో నూతన [ప్రయోగాలను ్రగతివాదులు వ్యతిరేకించ కూడదు అని అభిప్రాయ పడతాడు. అభ్యుదయ సాహిత్యంలో సవిమర్శక వాస్తవికతావాదం కూడా ఒక భాగమేననీ అంటాడు ఆయన. సమాజవాద దేశాల్లో కూడా సవిమర్శక వాస్తవికతావాద రచనలు రావచ్చు. వాటిని సవిమర్శక సోషలిస్టు వాస్తవికత అని మనం భావించాల్సి వుంటుంది. జనసాహితి అంటే, జనం కోసం సాహిత్యమనీ తప్పనిసరిగా జనం యొక్క సాహిత్యం అయివుండాల్సిన అవసరం లేదనీ స్పష్టం చేస్తాడు ముక్తిబోధ్.
30
బాహ్య పరిస్ట్రితుల్ని, ప్రపంచ దృక్సధాన్ని ఆంతరికీకరించు (117౯౧4౬18౬ చేసు)కుంటాడు కవి. ఈ ఆంతరికీకరణ లేకుంటే కవిత సాంద్రతను సంతరించు కోలేదు. జయశంకర్ ప్రసాద్ రాసిన కామూయని' మహా కావ్యాన్ని విమర్శిస్తూ అందులోని మను బూర్జువా వ్యక్తివాదానికి నమూనా అనీ, నాయిక (శ్రద్ధ ఆదర్శవాదానికీ, ఊహా స్వర్గకల్పనకూ ప్రతీక అనీ, 'కామాయని ఒక ఊహా స్వర్గాన్ని ప్రతిపాదిస్తుందనీ దాంట్లోని మను వేదంలోని మను కాదనీ వాదిస్తాడు ముక్తిబోధ్. ఇదంతా సరిలైనదే అనుకున్నా ఊహస్వర్ల కల్సన కూడా విలువైందే నని మనం గుర్తిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవ్‌గెనియా జదావస్కయ రాస్తుంది. “సహజంగానే వూహాస్వర్గ ఆలోచనకు సంబంధించిన భావచిత్రాలు సౌందర్య పరిదృళ్యానికి (46510610 ౪9 0౧ కు) దగ్గరగా వుంటాయి. యుటోపీయా అంటే ప్రపంచపు భావజాల, సౌందర్యశా(స్రీయ సంశ్లేషణ యొక్క అనుభూతియే. భావచిత్రాలూ, భావనలూ ఆంగికంగా దీనితో పెనవేసుకొని వుంటాయి” (46511609, &గ ఇ౧6 ౬16 - రాదుగ ప్రచురణ, మాస్కో). కామాయని ఒక 'ఫ్యాంటసీ' అంటాడు ముక్షిబోధ్. ఈ అతికల్పన కూడా “రొమాంటిసిజం'లో భాగమే. భారతీయ సందర్భంలో రొమాంటిసిజం కూడా ప్రగతిశీలమే.
ముక్తిబోధ్ మార్క్సిస్టు పద్దతిపట్ల నిబద్దత వున్న కవి, విమర్శకుడు. పిడివాది కాడు. సృజనశీల సామ్యవాది. కొన్నేళ్ల పాటు ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ కార్డు కలిగిన సభ్యునిగా కూడా వుండినాడనే వాస్తవం మనం మరువ కూడదు,
2-22-2005 31
భావ బింబాల సౌందర్యం
వస్తువూ, రూపమూ వేరని సాధారణంగా అనుకోవడం జరుగుతుంది. భావచిత్రాల అధ్యయనం ఇది తప్పు అని నిరూపిస్తుంది. వస్తురూపసాల నిర్మాణాత 5 ఐక్యత ఆధారంగా ఈ అధ్యయనం కొనసాగుతుంది. సోవియత్ రష్యా సౌందర్యశా'స్త్రవేత్త బత్రకోవా వస్తువు, రూపం స్థానే, ఒక సౌందర్య భావన (6911610 662) ను ప్రతిపాదించింది. దీనిలో ఈ రెండింటి పార్టక్యం వుండదు. మనం విమర్శకోసం, విశ్తేషణ కోసం వేరుగా వున్నట్టు చూపుతాం. సౌందర్యశాస్త్ర దృష్ట్యా వస్తువు రూపాన్ని నిర్దారిస్తుంది. రూపం వస్తువు (ప్రేషణీయతనూ, సంవేదనీయతనూ విస్టృతపరుస్తుంది, ప్రగాఢం చేస్తుంది. భావ చిత్రాలు వస్తురూప పార్ధక్యాన్ని రూప్పుమాపుతాయి. దీనికి మంచి ఉదాహరణ 'భిక్షువర్షీ యసి”.
దారి పక్క చెట్టు క్రింద / కూర్చున్నది ముసల్దొకతె / మూలుగుతూ ముసురుతున్న / ఈగలతో వేగలేక / ఎముక ముక్క కొరుక్కుంటు / ఎమీ అనలేదు కుక్క / ఒక ఈగను పడవేసుకు / తొందరగా తొలగె తొండ / క్రమ్మె చిమ్మ చీకట్లు / దుమ్ము రేగె నంతలోన / ఇది నా పాపం కాదనె/ ఎగిరి వచ్చి ఎంగిలాకు (13.8.1934)
అనుభూతి తీవ్రతా, సహజమన్సించే శిల్పమూ, భావ చిత్రాల జౌచిత్యమూ ఇందులో చూడవచ్చు. అలంకారాలు మాత్రమే కాదిది కొల్లగొట్టుతనాన్ని వ్యక్తం చేసే ఎంగిలాకు. “ఇది నా పాపంకా' దనటంలో ఇదంతా వ్యవస్ట్రవల్లనే, వ్యక్తులవల్ల కాదు ఖనే ధ్వని వుంది. భావచిత్రాలు వస్తువులో భాగమైనాయి ఈ కవితలో.
భావిచి[త్రాల్ని భావ బింబాలనడం సబబుగా వుంటుంది. ఎందుకంటే, భావచిత్రాలు (శ్రవ్యబింబాలుగా కూడా వుండవచ్చు. ఆ మాటకొస్తే, ప్రతి కవితా (ప్రాథమికంగా ఒక శ్రవ్యబింబమే.
సంప్రదాయ బింబాల్ని నూతన సందర్భంలో వాడటం కూడా మన౦ చూడవచ్చు -
32
ఇవీ చాలా ప్రభావం నెరపేవిగా వుంటాయి. ధూమిల్ చిత్రించిన ఈ బింబం చూడండి.
(ప్రతి ముఖంలో భయం వుంది / ఇంటా బయటా విషాదమే మిగిలింది / ఈ ఊరు నరకానికి భోజ్‌పురీ అనువాదం అన్పిస్తోంది. నగర నాగరికతను గురించిన ఓ బింబం దాని కృత్రిమత్వాన్ని ఇలా వ్యక్తం చేస్తోంది - ముక్తిబోధ్ కవితలోని ఈ పంక్తుల్లో: “కన్పిస్తాయి నాకు తెల్లని లేత గులాబీ పొడరులో దాగిన పెద్ద పెద్ద మశూచి మచ్చలు సభ్యత మొహంపై”. పట్నంలో జీవితం వ్యర్థం అర్థరహితం అని అంటూ కేదార్‌నాథ్ అగ్రవాల్ ఒక బౌచిత్యపూరిత బింబంద్వారా ఇలా వ్యక్తం చేస్తాడు.
పట్నంలో / (ప్రజల జీవితం అధికాంశం / చెత్తబుట్ట జీవితం / చైతన్య రహితం, అర్హరహితం / చినిగిన తునకలా వ్యర్దం,
ఇ ధ్గా
కళకు (ప్రాణం బింబం - ముఖ్యంగా కవితకు, కవితలో ఒకే ఒక నస్వ్వర్థం వుండదు. అర్జఛాయలుంటాయి. సరస్సులో రాయివేస్తే అలలు వలయాలు వలయాలుగా ఎలా విస్తరిస్తూ పోతాయో, కవిత అర్ధం కూడా వికసనశీలం.
సంవేదననుబట్టి బింబాల్ని వర్గీకరించడం జరిగింది. దృళ్య బింబాలూ, (శ్రవ్య బింబాలూ, ఘూణ బింబాలూ - ఇలా. కాని చాలచోట్ల మనం ఒకే సంవేదన కాకుండా, సహసంవేదనాత్మక బింబాల్ని చూస్తుంటాం. ఇవి కవి శిల్పకారితనూ అనుభూతి ప్రగాఢతనూ వ్యక్తంచేస్తాయి. కేదార్‌నాధ్ అగ్రవాల్ కవితలోని ఈ సహసంవేదనాత శక బింబం చూడండి.
దీపం పెట్టేందుకు / రాలేదెవరూ అక్కడికి / రా మౌన తమోలోయల్లో / జ్యోతిగీతం విన్సిద్దాం. నారాయణబాబు, రాసిన ఈ పంక్తులు చూడండి / ఘల్టు ఘల్లు! / మట్టెల ధ్వని వెన్నెల వెన్నెలను మట్టెల ధ్వని అన్నాడు కవి.
ఉపమాన రూపంలో కూడా భావబింబాలు వుండవచ్చు - గిరిజాకుమార్ మూధుర్ రచించిన ఈ పంక్తులు చూడండి - వ్యక్తి ఒక నూతన వ్యక్తి / పుడతాడు / సూర్యుని శకలంలా / అలాగే, ఉపమానోపమేయ సంబంధాన్ని తెలుపుతూ కూడా కొన్ని బింబాలు వుండవచ్చు. ం
ఆకాశపు టెడారి/లో కాళ్లు తెగిన/ఒంటిరి ఒంటెలాగుంది జాబిల్లి,
ఉదాత్త భావబింబాలు అంతరిక్ష సంబంధితమో సముద్ర - సంబంధితమో అయివుండే అవకాశం వుంది. 1998లో అఫ్సర్ రాసిన 'స్వష్నాంతం లోని ఈ పంక్తులు చూడండి.
33
ఆకాశం నుదుటిని చుంబించే / ఎగరైర్రని కిరణాన్ని నేను / దిక్కులన్నిటినీ పడగొట్టి / నింగి హద్దుల్ని చెరిపేసిన కాంతి వలయాన్ని నేను / అన్ని దుఃఖ సముద్రాల చివరా / (ప్రాణంలా పదిలపర్చుకున్న చిరునవ్వుని / ప్రతి ఉదయాన్నీ / వెలిగించే సూర్య సంతకాన్ని.
అఫ్సర్ ఈ నిశ్చయాత్మక గొంతుతో ఒక్క క్షణం పోల్చి చూడండి బైరాగి 'నూతిలో గొంతుకలు' లోని ఈ పంక్తుల్ని.
దిక్కులన్నీ వెక్కిరింతలు
మొయిలు నొసలుననల్లత్రాచులు
ఈ నిరాళానిస్పృహే సామాజిక పారం సంతరించుకొని 'సంకేతం నీకు ఎరుపు' అని తర్వాత్తర్యాత అన్పించింది బైరాగికి,
తరతరాలుగా వంటింటికే అంకితమైపోయిన ఓ 'గృహిణి ని కూతురు ఇలా సరిగ్గా సరిపోయే బింబంతో పలకరిస్తుంది, పలవరిస్తుంది విమల రాసిన ఓ కవితలో.
“అసలు మా అమ్మే నడుస్తున్న
వంటగదిలా వుంటుంది”
కళాత్మక బింబాలు ఎప్పటికీ నవ్యంగానే వుంటాయి. వాటికి చావు లేదు. ఒథెల్లో లోని పళుబింబాలు ప్రసిద్దమే. ఇప్పటికీ సార్ధకమే.
ఆంధ్రభూమి, ౩-6-2002 34
శ్రీశ్రీ భావ చిత్రాలు
ఆధునిక కవితకు ప్రాణం భావచిత్రాలు. శ్రీశ్రీ కవితలో (మహా ప్రస్టానం సంపుటి) వస్తువు ముఖ్యమా, రూపం ముఖ్యమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఈ రెంటి మధ్యా శ్రీశ్రీ ప్రదర్శించిన సమతౌల్యం అతని భావ చిత్ర విధాన ఫలితంగా సాధ్యమయింది. ఆలోచన, అనుభూతి, కళాత్మకతల సమన్వయం వల్ల శ్రీశ్రీ కవితలో ఉత్కృష్టభావచిత్ర విధానం రూపు దాల్చింది. సందర్భానుసారంగా యిందులో కొన్ని చోట్ల (ప్రవాహం, శిల్పకారిత, అనుభూతి ('ప్రవణతగోచరమౌతాయి. అందుకే మలచినట్లు కన్పించినా భావచిత్రాలు కళాత్మకం ఐనాయి.
శ్రీశ్రీ అభ్యుదయ కవిగా ప్రసిద్దుడు. కాని ఆయన వాస్తవంగా అభ్యుదయకరమనిపించే పలు (ప్రగతిశీల ధోరణులకు [ప్రాతినిధ్యం వహిస్తాడు. పాశ్చాత్య 'అధివాస్తవికతావాదం, డాడాయిజంల ప్రభావం కూడా అతని కవితలో చూడవచ్చు. ఆయన కవిత ప్రగతిశీలమూ, ప్రయోగశీలమూ కూడా. వీటి రెంటి ద్వంద్వాత్మక ఘర్షణతో శ్రీశ్రీ కవిత మరింత కళాత్మకం కాగలిగింది. శ్రీశ్రీ కవితల్లో వాస్తవికతావాదం కంటె విప్లవ భావుకత, ప్రయోగశీలత వ్యాపించి వున్న కవితలే యెక్కువ అంటే సరిపోతుందేమో. 'అంధేరేమే౮ లాంటి కవితరాసిన ముక్తిబోధ్ యొక్క విష్టవ భావన, 'అజ్జేయ' కళా సౌందర్యం ఈ రెండు గుణాలూ మనం ఆయన కవితలో చూడవచ్చు. *
సంప్రదాయంగా వస్తున్న భావచిత్రాల్నే సంస్కరించి, సింగారించి, సముచిత రీతిలో ఆధునికత చొప్పించి ప్రయోగిస్తాడు శ్రీశ్రీ ఇది ఈ కవి ప్రత్యేకత. మనం అదే పనిగా పరిశీలిస్తే తప్ప, అతని భావచిత్రాలు సంప్రదాయ భావచిత్రాలు అన్పించవు. ఒక విధంగా అవి అతని కవితల్లో పునర్జన్మ పొందాయేమో అన్పిస్తుంది. శ్రీశ్రీ సంప్రదాయ భావచిత్రాల (ప్రత్యేకత ఎమిటంటే వాటిని భారతీయ పురాగాధల నుండి తీసుకోవటం - ఉదా :
35
యముని మహిషపు లోహ ఘంటలు మబ్బు చాటున ఖఇణీల్మన్నాయ్ ! నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి. ఉదయ సూర్యుని సప్త్రహయములు నురుగులెత్తే పరుగు పెట్టేయి... మరికొన్ని సంప్రదాయ భావ చిత్రాలు - 'రుద్రాలికనయన జ్వాలిక కలకత్తా కాళికనాలిక కానాలోయ్ నవ కవనానికి కనబడ లేదా మరో ప్రపంచపు కణకణమండే క్రేతాన్ని... అంతేకాకుండా, మౌలికమైన, అందమైన భావచిత్రాలు కొన్ని కవితల్లో (ప్రముఖంగా, (ప్రభావళీలంగ్యా అనుభూతి వ్యంజకంగా కన్పిస్తాయి. ఉదా : అకాశపు టెడారి లో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా గుంది జాబిల్లి | టా తన నవ్యసౌందర్య శాస్త్రం ప్రకారం జాబిల్లిని ప్రబంధైైలికి బహుదూరంగా ఆకసపు ఎడారీలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటె లాగుందంటూ మానవీయంగా మూర్తిమంతం చేశాడు శ్రీత్రీ పరిసరాల్ని చిత్రిస్తూ అలంకారాలతో కాకుండ, పూర్తిగా భావ చిత్రాలతోనే ధ్వనిస్తాడు కొల్లగొట్టుతనాన్ని - అద్భుతంగా నిరాడంబరంగా సామాన్యుని భాషలో 'భిక్షువర్షీయసి” కవితలో ళు ళల లొ వస్తువులోనే భాగమైన భావబింబాల్ని ఇలా మలిచాడు శ్రీశ్రీ : 36
ఎముక ముక్క కొరుక్కుంటూ
ఏమీ అనలేదు కుక్క
ఒక ఈగను పడవేసుకు
తొందరగ తొలగెతాండ
(క్రమ్మె చిమ్మచీకట్టు
దుమ్మురేగె నంతలోన.
“ఇది నా పాపం కాదొనె
ఎగిరి వచ్చి ఎంగిలాకు
ఇందులో ఒక డిజైను వుంది. కొల్లగొట్టుతనపు పాళవికతను ఈ పశుబింబాల ద్వారా కళాత్మకంగా చిత్రించగలిగాడు శ్రీశ్రీ. కుక్క, తొండ చీకటి స్టితిని తెలుపుతాయి. ఎంగిలాకు కొల్లగొట్టు తనానికి అద్దం పడుతుంది.
శ్రీశ్రీ మహాప్రస్టానపు అరవంలో హోరెత్తించే కవితలో ఒకటి 'కవితా! ఓ కవితా! ఇది విచిత్ర భావచిత్రమయం. ఇందులో కవితను గురించిన ఓ విజన్ వుంది - ఓ సందృష్టి వుంది
- కవితను 'ప్రభవింప చేసే భావచిత్ర విధానం వుంది. కధనంలోనే భావచిత్రాలు కన్పిస్తాయి. కవితను స్మరిస్తే శ్రీశ్రీకి కన్పించే దృశ్యాలు, విన్పించే నాదాలు ఇవీ -
మరి నిన్ను స్మరిస్తే
నాకగుపించే దృశ్యాలా ?
వినిపించే భాషాలా ?
అన్ని సరస్పున వికసించిన వజ్రం "
ఎగిరే లోహతశ్యేనం య
ఈ దృశ్య చిత్రాలేకాక కవికి విన్చించే శ్రవ్య బింబాలు ఉదాహరణీయాలు -
ఇంకా నేనేం విన్నానా
నడిరే నిద్దురలో
అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని
రుచిర స్వప్నాలను కాంచే
జవరాలి మనః ప్రపంచపుటానర్హాలు 1
శిశువు చిత్రనిదలో -
ప్రాచీన సృృతులూచే చప్పుడు 1
3/7
ఒక చిన్న భావచి(త్రం ద్వారా తీవ్రంగా ఆలోచింప.చేసే గుణం వుంది శ్రీశ్రీ కవితలో. ' తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ లెవ్వరు?” అని ప్రశ్నించడంతో సామ్యవాద సిద్ధాంతంలో సమస్త సంపదకూ కారకులు (శ్రామికులు అనే సూత్రాన్ని నొక్కి చెప్పినట్టయింది. పౌరాణిక భావ చిత్రాలు ప్రత్యేక అర్జాన్ని స్ఫురించేట్టు (ప్రయోగిస్తాడు శ్రీశ్రీ. ప్రతీకలు గానే కాకుండా, బింబరూపంలో ఈ (ప్రయోగం చాలా చోట్ల చూడొచ్చు. జగన్నాథ రధ చక్రాలు విముక్తి దాయకం అనే నూతన సామాజిక అర్థంలో ప్రయోగిస్తాడు. రథ చక్ర ప్రళయ ఘోషను భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అంటాడు. ఇక్కడ జగన్నాధ రథ చక్రాలు ప్రతీకార్థంలోనే కాక ఒక దృళ్య చిత్రంగా ప్రయోగించాడు. ఈ కవిత పతితులనూ, (భ్రష్టులనూ, బాధా సర్పదష్టులనూ దగా పడిన తమ్ముళ్లనూ సంబోధిస్తూరాళశాడు. | ఆధోజగత్సహోదరులు వీళ్ళు ఒక కవిగా ప్రగాఢ అనుభూతి సామర్ధ్యం వున్న కవిగా సమాజంలోని 'పతిత' 'నిర్గతిక' (శ్రేణులన్నింటినీ పలకరిస్తాడు శ్రీశ్రీ. ఇది సహజంగా జరిగింది. పల్లె విడిచి బతుకు తెరువు కోసం పట్టం పోతూ వున్న బాటసారి వ్యథ 'బాటసారి' అనే కవిత. అతని బతుకున కదే ఆఖరు అంటూ కవి సార్ధక భావ చిత్ర మాలిక నొకటి చిత్రిస్తాడు- అతని బతుకున కదే ఆఖరు గ్రుడ్డి చీకటిలోన గూబలు ఘూకరించాయి; వాన వెలసీ మబ్బులో ఒక మెరుపు మెరిసింది; వేగుజామును తెలియ జేస్తూ కోడి కూసింది; విడిన మబ్బుల నడుమ నుండీ వేగు జుక్కా వెక్కిరించింది; బాటసారి కలేబరంతో శీత వాయువు ఆడుకుంటోంది (ప్రకృతి చిత్రాలను భావచిత్రాలుగ మలచడం ఇందులోని ప్రత్యేకత. కవితకు శాశ్చతత్వం తెచ్చి పెట్టేది ఇటువంటి చిత్రీకరణే. ప్రతిజ్ఞ" కవితలో- 38
కమ్మరి కొలిమీ కుమ్మరి చక్రం
జాలరి పగ్గం,
సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింప జేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహప్రసవృత్తుల సమస్త చిహ్నలు-
నావినిపించే నవీన గీతికి
నా విరచించే నవీన రీతికి
భానం |
భాగ్యం! _
ప్రాణం!
ప్రణవం |!
(శ్రమ సాధనాలు భావాలుగ సంభావించడం చక్కగా అమరింది. సరళ బింబరచన సజావుగా సాగింది. గేయం రక్తి కట్టింది. (శ్రమ జీవుల పట్ల కవికుండే అభ్యుదయ దృక్పధం చక్కగా వ్యక్తమయింది,
ఈ యెగిరిన ఇనుప డేగ
చూర్లమాన
ఘూర్షమాన
దీర్ల్షమాన గిరిశిఖరాల్ -
ఇటువంటి విశేషణాలు బింబాత్మకంగా ప్రయోగించినాడు శ్రీశ్రీ.
“పేదలు' అనే కవితలో పేదల గుండెలు, కన్నులు, చేతుల్ని బింబీకరిస్తూ -
అంతేలే పేదల గుండెలు
అ్యశ్రువులే నిండిన కుండలు 1
శ్మశానమున శశికాంతులలో
చలి బారిన వెలి రాబండలు
39
అంతేలే పేదల కన్నులు వినమములు, నెతల వ్రణమ్ములు తుపానులో తడిసిన జడిసిన గోమాతల కన్నుల తమ్ములు అంతేలే పేదల చేతులు శ్రథశైశిర పలాశరీతులు విశుష్కములు సరిపాండురములు నిచలించెడు విషాదహేతులు ఇలా శ్రీశ్రీ భావచిత్రాలు అనుభూతి స్ఫోరకము, కళాత్మకమూ; ఇందుకు అనుగుణంగా భాషలో శ్రీ శ్రీది రురీ'ప్రవాహతైలి. మినీమి మానవ్యతిక్తు జ్యూర్ 7999 ఉగ
నవలను గురించి గియోర్లి లూకాచ్
మన యుగపు ప్రతినిధి కళారూపం నవల అని గియోర్లి లూకాచ్ అభిప్రాయం. లూకాచ్ హంగరీకి చెందిన గొప్ప సౌందర్య శాస్త్ర వేత్త
'నవలా సిద్దాంతం' (1915) అనే తన గ్రంధంలో గియోర్లి లూకాచ్ మహాకావ్యం (ఎపిక్) స్థానంలో ఆధునిక యుగంలో నవల వచ్చింది అని ప్రకటించాడు. మహాకావ్యం జీవిత సంపూర్షత్వానికి రూపం ప్రసాదిస్తుంది. నవల, దాగివున్న జీవిత సంపూర్షత్వాన్ని వెలువరిస్తుంది, రచిస్తుంది.. ఒక పద్దతి (ప్రకారం ఇది జరుగుతుంది. నవలలో వాస్తవికత ఆవిష్కరింప బడుతుంది. యధార్థ జీవితానికీ, భావనల వ్యక్తీకరణ పద్దతికీ మధ్య వుండే దూరం నవలలో దృశ్యమానమౌతుంది. వాస్తవికతావాదం వస్త్యాశ్రయత్వానికీ, వ్యక్తివాదానికీ (ఆత్మాశయ వాదం) మధ్యవుండే మధ్యేమార్గం కాదంటాడు లూకాచ్.
నవలా రచనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. స్వాభావికంగా నవల గేయాత్మకతనూ నాటకీయతనూ సంతరించుకునే ప్రమాదం వుంది. వాస్తవికతను కుదింపజేసి వర్ణనలకు (ప్రాధాన్యం ఇస్తే ఆ శవల కాలక్షేప నవలగా మిగిలి పోతుంది.
సాహితీ ప్రక్రియల్లో నవల పరిపక్వతకు నిదర్శనం అంటాడు లూకాబ్.. నైతిక విలువలకూ సౌందర్యశాస్త్ర విలువలకూ మధ్య వుండే సంబంధం నవలా ప్రక్రియలో విశిష్టం. అందువల్ల మిగతా అన్ని రూపాల కంటే ఇది భిన్నం నవలలో నైతికాంశం ప్రతి ఘట్టంలోనూ దృశ్యమానమవుతూంటుంది. అందుకే నవలా నిర్మాణంలో నైతిక ఉద్దేశ్యం అంతర్భాగం అంటాడు లూకాచ్. మిగతా సాహితీ రూపాలకంటే నవల ఎక్కువగా భవతి (8660౧ ౧౦) ప్రశ్రియలో భాగమవుతుంది.
నవలను 'అర్హకళ గా అభివర్షిస్తాడు లూకాచ్ అర్హకళ ఐనా నవల కరినమైన చాలా కళా నియమాల్ని పాటించాల్సి వుంటుందని ఆయన భావిస్తాడు.
జీ]
కాలక్షేపనవల నవలా లక్షణాలన్నిటినీ కలిగి వున్నప్పటికీ దాని విలువ శూన్యమే. క్షుద్ర రచనలు అసలు సాహిత్యమే కావు. అస్తి (56 ౧౩), భవతి (3600౧౧౧౦) ల మధ్య డోలాయమాన సమతూకం స్టాపించగలుగుతుంది నవలా ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో ఈ
. సమతూకం స్టిరత్వం సంతరించుకుంటుంది. 4
నవలా ప్రక్రియ సమస్యాగ్రస్త వ్యక్తి తనను తాను ఆవిష్కరించుక్షునే మాధ్యమంగా కన్పిస్తుంది. "
నవలను కొన్ని భావాల, భావనల వ్యక్తీకరణకు సాధనంగా భావించాడు లూకాచ్. నవలకూ జీవిత ముందంటాడు.
జర్మన్ భాషలో ఒక పదముంది - '/612090%0204౧03 అని. దీని అరం “ప్రపంచ
రు దృక్సధం' అని మాత్రమే చెప్పుకుంటే సరిపోదు. ఆ దృక్పధం చాలా సంవేదనాయుతంగా వుండాలి. ప్రపంచం పట్ల బౌద్దికంగా, మానసికంగానే కాకుండా, అనుభూతితో, స్పందనతో కూడిన దృక్పధం, మమత్వంతో కూడిన దృక్పధం ఇది. ఇది నవలకు చాల అవసరం. ఇది కేవలం అమూర్తం కారాదు. పాత్రలు, ఘటనలలో మూర్తరూపం దాల్చాలి.
(ప్రతి ఘట్టానికి రచయిత స్వీయాత్మక (ప్రతిచర్యను వ్యక్తీకరిస్తూ పోతే అది పాఠకుణ్ని అలరించగలదేమో గానీ ఆ రచన గంభీర పారకుణ్ని ఆకట్టుకోలేదు, నగిషీలు రచనకు పనికిరావు. రచయిత తన రచన పట్ల నిర్మమంగా వుండగలగాలి. అపుడే మనిష్ని యొక్క
" పరాయీకరణ వస్యాశ్రయంగా వ్యక్తం కాగలదు.
నవలను గురించి లూకాచ్ 1915లో వెల్లడించిన ఈ అభిప్రాయాలు ఇప్పటికీ
సందర్భోచితమే. త2
కుమారన్ ఆశౌన్
మలయాళ మహాకవి కుమారన్ ఆశాన్ పేరు తలచుకుంటేనే గుర్తొచ్చేది అతని కావ్య ఖండిక - 'ఒరువీణపూవు" (రాలిన పువ్వు). ఇది 1908లో వెలువడింది. ఒక సంచలనం రేకెత్తించింది. అనతికాలంలో అందరి ప్రశంసలనందుకొంది. మహాకవి కేరళవర్మ కృషి ఫలితంగా పాఠ్యాంశంగా కూడా చేరింది.
"ఒక విశిష్టమనస్టితిలో ఈ కవిత రాశాడు ఆళాన్: 1908లో పాలఘాట్‌లో కొన్ని
రోజుల పాటు నిర్బంధింపబడినపుడు, ఆ ఒత్తిడికి లోనై రచించిన ఖండిక ఇది.
నారాయణ గురు ఆశాన్‌కు గురుతుల్యులు. 1902లో 'శ్రీ నారాయణధర్మ పరిపాలనా యోగం” అనే పేరుతో ఒక సంఘం ఆనాటికి వెనుకబడిన ఈజవ కులం వారి అభ్యున్నతికై ఏర్పడింది. దీని అధ్యక్షులు నారాయణగురు, ప్రధాన కార్యదర్శి కుమారన్ ఆశాన్. ఈ సంస్థ కృషి ఫలితంగా ఈజవ కులం వారు ప్రభుత్వ సాయంతో నడిచే పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రవేశం పొందే హక్కు, సార్వజనీన దేవాలయాలన్నింటిలో ఆరాధించే హక్కు పొందగలిగారు. “ఈజవ గెజెటో అని పేరుపొందిన 'వివేకోదయం' (స్వామి వివేకానందపై అభిమానంతో పత్రికకు పెట్టిన పేరు) అనే పత్రిక సంపాదకత్వ బాధ్యతను ఆళాన్ సమర్థవంతంగా నిర్వహించినాడు.
'రాలిన పువ్వు" రాసేందుకు ఒక ఘటన కారణమైంది. నారాయణ గురు గారికి కలరా సోకింది ఆయనకు సేవచేసిన ఓ శిష్యుడు కలరాతో మరణించినాడు. అందరూ భయపడ్డారు. నారాయణ గురు గారిని పాలఘాట్‌లోని డా కృష్ణన్ ఆసుపత్రికి తీసుక వెళ్ళారు. అక్కడే ఆయనకు చికిత్స జరిగింది. అసుపత్రి ఆవరణలో పూలచెట్టు దండిగా వుండేవి. గురువుగారి రుగ్షస్ట్రితీ అక్కడ రాలిన పూలనూ చూసిన ఆశాన్ భావయుక్తంగా పువ్వును ప్రతీకగా తీసుకొని 'రాలిన పువ్వు అనే ఈ కావ్యఖండికను రచించినాడు.
43
ఒకప్పుడు మహోజ్జ్వలంగా ప్రకాళించిన పూవు నేడు రాలిపోయి కాంతిహీన అయింది. పువ్వు బాల్యాన్ని వర్షిస్తూ కవి - తీగ నిను ప్రేనుతో కన్నది మృదువైన తన ఆకుల గుండెల్లో హత్తుకొని నిను సంప్రీతితో "పెంచి పెద్దదాన్ని చేసింది మందసమీరంతో కదిలిన ఆకులు నచ్చీరాని మాటలతో మెల్లగా మెలమెల్లగా జోలసాట పాడాయి ఆ బాల ఎదిగింది. అలా అలా పెరుగుతూ నీ రూపు రేఖలు మనోజ్ఞమైన అందాలను విరజిమ్మూయి వీ ముఖాకృతి మెల్లగా మారింది నీ చెంపలపై వెలుగు నచ్చింది ఓ పుష్పమా, నవోదిత కొంతితో కొత్తగా పుట్టుకొచ్చిన చిరునవ్వు ప్రసరించింది నీ బుగ్గల మీదుగా 'ప్రేయునిగా ముదురు నీలపు రంగులో వుండే కీటకాన్ని ఎంపిక చేసుకుంది ఆ పుష్పం, కడకది రాలిపోయింది. మృత్యువు కౌగిట్లోకి జారిపోయింది. పూవు అలా రాలిపోవడం చూచి ప్రకృతి స్పందించింది. నీవు రాలిపోయానన్న దుఃఖాతిశయంతో ఆకసాన చుక్కలు హిమబిందువులనే అ(శ్రువులను రాల్బాయి బేటీ
దట్టమైన ఆకులున్న చెట్లపై
కూర్చున్న పిచ్చుకలు
నీవు మరణించావన్న వేదనతో
నేలమీదికి దిగి వచ్చి
నీ చుట్టూ గుమిగూడి
కిచకిచలాడుతూ
కీచుమని అరుస్తూ
ఎడతెగకుండా రోదించాయి.
ముగింపు పంక్తులిలా వున్నాయి. విషాద భరితంగా, కానీ ప్రశ్నిస్తూ,
ఓ కను రెప్పలారా
చెమర్చిన కన్నులను
మూయండి
వికసించిన ఈ పూవు
క్షణంలో ముడుచుకు పోతుంది
కుళ్లి మట్టిలో కలిసిపోతుంది
అందరికీ ఇదే గతి
కన్నీటివలన ప్రయోజన మేమిటి?
మన జీవితమే ఒక కల సుమా!
నళిని లీల లాంటి కధా కావ్యాలు రాసిన తర్వాత వచ్చిన కవితల్లో ప్రముఖమైనవి (ప్రరోదనమ్, 'చింతావశిష్టయాయ సీత". |
చింతావశిష్టయూయ సీత లో కొన్ని పంక్తులు మినహా అంతా సీత స్వగతమే. మహిళకు జరిగిన అన్యాయానికి రాముణ్ని నిందిస్తుంది సీత. (ప్రజలేమనుకుంటారో అని సీతను. పరిత్యజించిన రాముణ్ని ఇలా ప్రళ్నిస్తుంది ఆమె -
రాజ్యమును పాలించడానికి
ఆయనకు వీరులు శూరులు అయిన తమ్ముళ్లు లేరా?
పెళ్లాడిన భార్యతో కాపురం చేయడానికి
అడవిలో ఆయనకు తగిన చోటే లేదా?
జర్
కాని, వెంటనే తేరుకొని తనను మన్నించమని భర్తను కోరుతూ వీడ్కోలు పలుకుతుంది. ఇలా -
(ప్రియా, రాఘవా, నీ కిదే వీడ్కోలు
నీ బాహువుల ఆలంబనాన్ని వీడి
తుదకు భయరహితవై
“స్వేచ్చా జీవినై
ఉత్తుంగ స్వర్గలోకాలకు
ఎగసీ పోతున్నాను.
చక్కని, చిక్కని భావప్రదీప్త ేయం చింతావశిష్ణ్టయాయ సీత.
1924 జనవరి 16. అష్టముడి సరస్సులో పడవ ప్రయాణం చేస్తున్న ఆశళాన్ నిద్రలోనే చివరి శ్వాస పీల్చాడు. పడవ ప్రమాదంలో అసువులు బాశాడు. 51 ఏళ్ల వయసులోనే ఆయన రచనాత్మ వేరయింది శరీరం నుంచి.
(ఆధార (గ్రంధాలు : 1. కుమారన్ ఆశాన్ - కెయం. జార్జి, 2. గి 80౧/ 01౧6 20 192049, 1911-1956 - 55? గంగా౭! 0890
2&.2.2ల06 4
అలి కరపత్రం అలి భాషా దాస్యం పోవాలి ! జి తెలుగుకు సముచిత స్టానం రావాలి || “వచ్చే సంవత్సరం నుంచి మా స్కూల్లో కూడా ఇంగ్లీషు మీడియం ప్రారంభించండని వత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థుల తల్లిదం[డ్రులు' అని ఆ మధ్య ఒక వల్టెటూరులో విజయవంతంగా నడుస్తున్న ఒక తెలుగు మీడియం హైస్కూలు
(ప్రధానోపాధ్యాయుడు అన్నాడు. ఇదీ చేదైన ఒక వాస్తవస్థితి. ఈ స్థితి మారాలంటే...
1 మన జాతీయ భాషలైన హిందీ, తెలుగు, బాంగ్లా లాంటి భాషలకు అమెరికా సంయుక్త రా[ష్ట్రాల్సో (బ్రిటన్‌లో, ఆస్ట్రేలియాలో ఏ స్థానం ఉందో అదే స్థానం ఇక్కడ మన దేశంలో ఆంగ్లానికి ఉండాలి.
ఓ మన విద్యా విధానం ఒక జాతీయ విషాదాంతం. ఇక్కడ ఆంగ్లం స్నాతక స్థాయి వరకు అనివార్యం. ఇది పల్లెటూరి రైతుకూలీ విద్యార్థులను చదువులకు దూరంగా ఉంచడానికి సంపన్న వర్గాలు చేసిన కుట్ర. దీన్ని ఛేదించాలి.
రె ఈ మధ్య ఇంగ్లీషు మీడియం (ప్రైవేటు పొరశాలల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇది మన సమాజానికి పట్టిన దీర్షకాలిక రోగం.
- మరో విషాదం ఏమిటంటే, తెలుగు చదువులు అధ్యాన్నంగా ఉండటం, ఇప్పటి కింకా స్నాతకోత్తర తెలుగు పార్యప్రణాళికలో (గ్రాంధిక భాషకు వ్యాకరణం ఒక పాఠ్యాంశంగా ఉండటం శోచనీయం. ఇది తెలుగుపట్ట ఒక విధమైన వికర్షణకు దారి తీస్తోంది. వ్యాకరణం చదవాల్సిందే. కాదనం, కాని, అన్ని ఆధునిక భాషల్లో లాగే, తెలుగులో
కూడా ఆధునిక ప్రామాణిక తెలుగు భాషకు వ్యాకరణం చదవాలి. తెలుగు భాషావేత్త ప్రొఫెసర్ గూరొవ్ అనే ఒక రష్యా జాతీయుడు రాసిన తెలుగు - రష్యన్ నిఘంటువు భూమికలో ఆధునిక తెలుగు వ్యాకరణం క్లుప్తంగా ఉంది. ఇతరులు రాసిన వ్యాకరణ 47...
(గ్రంధాలు కూడా ఉన్నాయి,
-
_ ఇంగ్లీషు బోధించేందుకు కేటాయించే సమయం ఇప్పటికీ తెలుగుకంటే ఎక్కువుంది. కాలేజీల్లో తెలుగు కంటే ఇంగ్రీషుకు ఒక గంట ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అంటే దీని పర్యవసానంగా తెలుగుకంటే, ఆంగ్ల అధ్యాపకులు ఎక్కువ సంఖ్యలో వున్నారన్నమాట. ఇది అక్షమ్యమైన మన బానిసమానసికతకు ఒక నిదర్శనం.
-
_ ఆంగ్లం ఏ స్థాయిలోనూ - అంటే, పాఠశాల స్థాయిలోనూ, ఇంటర్‌లోన్తూ, స్నాతక స్థాయిలోనూ, ఏ దశలో కూడా అనివార్యం కాకూడదు. దాన్ని విద్యార్దులపై రుద్దరాదు. ఐచ్చికంగానే అభ్యసించాలి.
7... బోధనా భాషగా ఇంగ్లీషును పాఠశాల స్టాయులో అనుమతించకూడదు. కళాశాల స్థాయిలో నిరుత్సాహపరచాలి. విశ్వవిద్యాలయ స్లాయిలో ఒక నిర్తీత గడుపులోపః ఆంగ్లం నుంచి విముక్తమయ్యేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి.
-
_ రాష్ట్ర అధికార భాష తెలుగు అమలుకై అన్ని చర్యలూ చేపట్టాలి. వీటిలో భాగంగ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీ అధికారులను నియమించినట్టే, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అధికారులను నియమించాలి.
-
_ మన దేశ జనాభా ఇపుడు వంద కోట్లకుపైనే. అంటే, మన జనసంఖ్య కంటే, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఇండాల జనాభాలను కలిపినా తక్కువే. ఇంత పెద్ద దేశానికి ఒక చిరుద్వీపం భాషగా ఉద్భవించిన ఆంగ్లం పట్ల మోజెందుకో అర్హం కాదు. “తెలుగులో పదాలు లేవు కొత్తగా రూపొందించిన పదాలు కృతకంగా వుంటున్నాయి. కాబట్టి ఇంగ్లీషే బోధనా భాషగా కొనసాగాలి అనే వితండవాదం ఒకటుంది. శాస్త్ర సాంకేతిక విషయాలకు సంబంధించి ఇంగ్రీషులో వాడే పదావళి లాటిన్ - (గ్రీక్ పదావళి. ఇక్కడ కూడా మనం తెలుగు నుడికారం చెడకుండా సంస్కృత ధాతువుల నుంచి శాస్త్ర సాంకేతిక పదావళి రూపొందించుకుంటున్నాము. ఇది సరైన పద్దతే. తెలుగు పదాలు సులభంగా అర్జమౌతాయి. ౧౩౦౮౮౧౫౬ ఏమైనా అర్ధమయిందా ? చట్ట రీత్యా అని దీని అర్ధం 14047[5 - 11౮7401018 అనే పదం ఉంది. దీని అర్ధం అవళ్యక పరివర్తనల సహితంగా అని. అలాగే 5౯ 0౧౮4 ౧౦|| - దీనికర్ధం అనివార్య షరతు అని ఇంత సులభంగా తెలుగు వుంటే, ఆంగం సరళమనడం సబబుకాదు చిక్కేమిటంటే, మనం ఒక దారికి అలవాటు పడ్డాము. అది ప్రజల
ఉర
దారికాదు. అధికారవర్గాల దారి. ప్రజాస్వామ్యానికి ఇది పనికిరాదు. పరాయి భాషలో ప్రజాస్వామ్యానికి అర్ధం లేదు.
-
భాషలకు సంబంధించి ఒక సరళీకరణ వుంది. తెలుగును ప్రాంతీయ భాష అనీ, హిందీని జాతీయ భాష అనీ మనం తరచూ పేర్కొంటుంటాము. నిజమేమిటంటే, హిందీ ఒక్కటే కాదు. రాజ్యాంగంలో పేర్కొన్న, సాహిత్య అకాదెమీ గుర్తింపు పొందిన అన్ని భాషలూ జాతీయ భాషలే. ఇకపోతే అంతర్జాతీయ భాష విషయానికొస్తే, (ప్రపంచమంతా వాడే ఒకే ఒక సంధాన భాష అంటూ ఏదీ లేదు. ఐరాస లో ఆంగ్లంతోపాటు రష్యను, చైనా భాష, ఫ్రెంచి లాంటి భాషలు అధికార భాషలు. కొని ఐ.రా.స. సాధారణ సభలో తప్పని సరిగా ఈ భాషలే వాడాలని నియమం లేదు. అందుకే మన ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించారు. దానికెవరూ అభ్యంతరము చెప్పలేదు. ఫ్రాన్స్‌లో సర్వత్రా ఫ్రెంచ్ భాషే ఒక్క నోటీసు బోర్డు కూడా ఆంగ్లంలో కనిపంచదు. అక్కడ బోధనా భాష, అధికార భాష థఫ్రెంచేనని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జర్మనీలో ఏ కార్యాలయం వెళ్ళినా విద్యా సంస్థ కెళ్లివా జర్మను భాషే కన్పిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో ముందంజ వేసిన జపాన్‌లో బోధనాభాష జపానీ భాషే రష్యాలో రష్యను, చైనాలో చైనాభాష ఇండొనేషియాలో బాషా ఇండొనేషియా, అనే ఆ దేశ జాతీయ భాష, వియత్నామ్‌లో విఎత్‌నామీ భాష అధికార భాషలుగా, బోధనా భాషలుగా వుంటున్నాయి.
-
జరిగిందేమిటంటే పాలకులు మన దేళంలోని జాతి సమస్యను, భాషా సమస్యను సరిగా అవగాహన చేసుకోలేక పోయారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి చేసుకోవాల్సిన అవసరం లేకుండానే, కాంగ్రెస్ తీర్మానం (ప్రకారమే, భాషా (ప్రయుక్త రాష్ట్రాలు స్టాపించి వుండవచ్చు. కాని అలా జరగలేదు. ఎమి జరగాలన్నా ఇక్కడ ఆందోళన చేయడం అవసరం అయింది. అందుకే మన భాషకు మన రాష్ట్రంలో సముచిత స్టానం ఇప్పించాలంటే కూడా ఒక ఉద్యమం అవసరం.
-
_ వ్యవసాయ శాస్త్రం విధిగా ప్రాంతీయ 'భాషల్లోనే బోధించాలి. అంతే కాకుండా వ్యవసాయ విద్యార్థులకు వాళ్ల తరగతుల్లోనే రైతులను గూర్చిన సరియైన ఆవగాహన కలిగేట్టు చేయాలి. విద్యకు వుండాల్సిన సామాజిక నిబద్దతను దృష్టిలో పెట్టుకొని మన విద్యార్డుల్లో
4కి
ఆ నిబద్దత చాలా సహజంగా అలవడేట్టు చూడాలి.
- మనదైన ప్రతి ఒక్కటీ ఈసడించుకోదగ్గదే అని నూరిపోశారు మనకు మనల్ని మన సాంస్కృతిక వారసత్వానికి దూరం చేశారు. ఒక రకమైన సాంస్కృతిక పరాయీకరణకు మనల్ని గురిచేశారు. ప్రపంచమంతా ప్రశంసించిన ఉపనిషత్తుల్ని మన విద్యాలయాల్లో ఎందుకు చారిత్రికంగా అధ్యయనం చేయకూడదో,ఎందుకు వాటిని విద్యార్థులకు బోధించరో అర్ధంకాదు. దీనికి సంస్కృత భాష వచ్చి వుండనక్కర్రేదు. అనువాదాలు చదవవచ్చు.
1ఓ మన రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో తెలుగు ప్రధమ నిర్భంధ భాషగా ఉండాలి. ద్వితీయ భాషగా సంస్కృతం, హిందీ, ఉర్దూలేక ఆంగ్లం ఉండవచ్చు. మూడు భాషలు నేర్చడం అవివేకం, అశాస్త్రీయం.
15... ఈ మధ్య ఇంగ్లీషు బోధనా భాషగా వుండే ప్రైవేటు పారశాలల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇంగ్లీషులో ఎంత చక్కగా మాట్లాడితే అంత గొప్పగా భావించడం జరుగుతోంది. ఆంగ్రం ఇప్పుడు ఒక సామాజిక విలువ అయింది. ఆంగ్లం మాట్లాడటం సరిగా రాదనే నెపంతో ఇంటర్‌వ్యూల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేయడం లేదు. ఈ స్టితి పోవాలి. ప్రజలు తమ భాషను గౌరవించడం నేర్చుకోవాలి. భాషా వలసవాదానికి స్వస్తి చెప్పాలి.
-
సృజనాత్మకంగా ఆలోచించడం మాతృభాషలోనే సాధ్యమని విద్యాశా(స్త్రవేత్తలంటున్నారు. మనకు తెలుసు, పరాయి భాషలో పిల్లలు ఆలోచించలేరని. మనం ఆలోచించలేని, స్పందించలేని, అంటే ప్రాణం లేని సరాయిభాష పెత్తనం పోవాలి.
-
న్యాయస్థానాల్లో ఇంకా 'తెల్లదొరల' భాషే కొనసాగుతోంది. చిన్న చిన్న కోర్టుల్లో కూడా న్యాయవాదులు ఆంగ్లంలో వాదిస్తున్నారు. మొగల్ కాలంలో పారసీ భాష వుండేది. (బ్రిటన్ పాలనతో ఇంగ్లీషు వచ్చింది. పారసీ భాష,ఇపుడు మనకు అధికార భాషకాదు. అలాగే ఇంగ్లీషు మన కోర్టు భాష కాకూడదు. న్యాయస్థానాల్లో తక్షణం తెలుగు ప్రవేశ పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి. దేశభక్తి తెలుగులో
వాదించగల్లిన సామర్థ్యము వున్న న్యాయవాదులు తమ వాదాన్ని తెలుగులో విన్పించి, నేరస్తునికి తన కెందుకు శిక్ష పడుతుందో అతని భాషలోనే తెలుసుకొనే అవకాశం కల్పించడం న్యాయం.
50
మానినాదాలు : భాషా నలస వాదాన్ని తరమినేయండి. మాతృభాషకు నుహోన్నత స్టానం కల్పించండి ప్రపంచ భాష అంటూ ఏది లేదు అన్ని భాషలూ సమానమే సాంత ఆలోచన స్వభాషలోనే సాధ్యం. విశాలాంధ్ర - ఆదివారం వ[-2-29990 51
నూతన ఆలోచనా ధోరణి : సాహిత్యము సమకాలీన ప్రపంచంలో ఒక నూతన ఆలోచనా ధోర్రణి చోటు చేసుకుంటోంది. ఈ ఆలోచనా ధోరణికి కేంద్ర బిందువు ప్రపంచం ఏకాత్మకం (1019912), ప్రపంచం పరస్పరాధీనం (1౧19 ౮9060060 అనే భావన, యుద్దం వచ్చినా, పర్యావరణంలో ప్రమాదకర పరిస్థితి యేర్చడీనా, వాటి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వుంటుందనే భావన. మానవ మనుగడకు అన్నిటికన్నా మించిన (ప్రాధాన్యం ఇవ్వాలనే భావన. ప్రపంచ ఉనికిని సంరక్షించుకోవాలనే నిబద్ధతకు నాంది ఇది. ఈ నిబద్ధతను దృష్టిలో పెట్టుకొని మనం సాహితీరంగంలో ఏం చేయాలో ఆలోచిద్దాం, + (ప్రపంచ సాహిత్యాన్ని గురించి మనం నేడు గట్టిగా పట్టించుకోవాలి. ఈ సాహిత్యం దేశదేశాల భాషల్లోకి ఇతోధికంగా అనువోదం కావాలి, కానీ ఇది సులభమైన పనేమీ కాదు. ఇది సాధ్యం కావాలంటే ఎక్కువ అనువాదాలున్న ఇంగ్లీషు భాషను మనం దూరం చేసుకోకూడదు. కాని, ఇం్టీషుతోబాటు రష్యన్, స్పానిష్ లాంటి ఇతర అంతర్జాతీయ భాషల్ని మనం ్రోత్సహించాల్సి ఉంటుంది. దేశంలో పలుచోట్ల ప్రపంచ సాహితీ సంస్థల్ని స్థాపించాల్సిన అవసరం వుంది. ప్రపంచ సాహిత్యంలో, ముఖ్యంగా ఆధునిక యుగంలో వచ్చిన వివిధ ధోరణుల తులనాత్మక అధ్యయనాలు జరగాలి దీనితోపాటు సాహిత్యంలో ప్రాంతపరమైన అధ్యయనాలు పెరగాలి. ఈ విషయంలో దేశాల సరిహద్దుల్ని అధిగమించాల్సి ఉంటుంది. వర్హమాన దేశాల సాహితీ అధ్యయనం, పరిశోధనల కోసం ఒక ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పాలి. రాజకీయరంగంలో ఈ దేశాలు దగ్గరయ్యాయి, కాని సాధారణంగా ఒక దేశ సాహిత్యాన్ని గురించి మరో దేశంలో ఎరుకలేదు. వాస్తవమేమిట౦టే భాషలన్నీ సమానమే. కొన్ని తెగల భాషల్లో కూడ అనువదించ వీలుకాని అనేక పదాలున్నాయని తేలింది. ప్రతి భాషకూ కొన్ని విశిష్ట గుణాలుంటాయి. అవకాశాలు కల్పిస్తే అన్ని భాషలూ సమానంగా అభివృద్ది చెందుతాయి. మనదేశంలో హిందీని 52
మాత్రమే జాతీయ భాషగా పేర్కొంటారు. ఇది పొరపాటు. హిందీతోపాటు దేశంలో ఎన్నో జాతీయ భాషలున్నాయి. మైథిలి, మణిపురి, రాజస్థానీ, కొంకణి లాంటి జాతీయ భాషల్ని రాజ్యాంగం గుర్తించాలి. ప్రజల భాషలకు దేశమంతటా గౌరవం లభించాలి. దక్షిణాది ర్యాష్టాల వాళ్ళు హిందీ మాత్రమే కాకుండా బెంగాలీ, పంజాబీ లాంటి మిగతా ఉత్తరాది భాషల్ని కూడ నేర్చుకోవడం ప్రారంభించాలి. అలాగే, హిందీ ప్రాంతాల వాళ్లు దక్షిణాది హిందీయేతర భాషల్ని నేర్చుకోవాలి. దీనికి అవకాశాలూ, ప్రోత్సహకాలూ కల్పించాలి. ప్రజల సంవేదనను పరిగణన లోకి తీసుకుంటూ అనువాద సాహిత్యాన్ని పాఠ్యాంశాల్లో చేర్చేట్లు చూడాలి. అన్ని భాషల్లోనూ అనువాద సాహితీ అంశాలు ఇతోధికంగా చోటు చేసుకోవాలి. అపుడే ప్రపంచంలోని ఇతరేతర భాషలన్నిటినీ గౌరవించడం జరుగుతుంది.
నూతన ఆలోచనా ధోరణి ప్రకారం యుద్ధం ఇక ఎంత మాత్రమూ రాజకీయాల కొనసాగింపు కాదు. బలప్రయోగంతోనే విష్ణవం సాధ్యమనేది తప్పని సరయిన నియమమేమీ కాదు. వర్గపోరాటాలతో పాటు విశ్వజనీన ప్రయోజనాలను కూడ దృష్టిలో పెట్టుకొని రచనలు చేయాల్సి వుంటుంది. శ్రామికజన పక్షం వహించడమే కాకుండా - మధ్యతరగతి జనాల, అలగా జనాల సామాజిక సమస్యల్ని వాస్తవికంగా సాహిత్యంలో ప్రతిబింబించడం కూడ అభ్యుదయ సాహితి పరిధిలోకే వస్తుంది. సవిమర్శక వాస్తవికతావాదం ఇంకా సార్ధకమే. వర్గపోరాటాల్ని సమర్జిస్తూనే, హింసతోనే విష్టవం సాధ్యం అనే పిడివాదాన్ని ఖండించాల్సి వుంటుంది. విప్లవం సాధించుదామని హింసామార్లాన్ని చేపట్టి సాయుధ పోరాటానికి సన్నద్ధమయ్యే యువతరం నిజాయితీని శంకించకుండానే, శాంతియుతమారానికి వాళ్ళను ఆకర్షించాల్సి వుంటుంది.
మానవతావాదం ఇంతకు ముందెన్నడూ లేనంత (ప్రాధాన్యం సంతరించు కొనింది. అభ్యుదయ సాహితీ పరిధిని మరింత పెంచి గతంలో లాగానే మానవతావాద అంశమున్న ప్రతి కృతినీ అభ్యుదయ రచనగా భావించాల్సి ఉంటుంది. అది అభ్యుదయవాద రచన కాకపోవచ్చు. కాని మానవాళి మనుగడను దృష్టిలో పెట్టుకొని చూస్తే అది 'అభ్యుదయా రచనే అవుతుంది. ప్రాచీన సాహిత్యాన్ని అభ్యుదయ దృక్పధంతో చూస్తున్నపుడు వీరకైవత్వం పనికిరాదు. రామాయణాన్ని, మహాభారతాన్ని, పురాగాథల్ని పూర్తిగా ఖండించడం మానెయ్యాలి. మానవీయ సంబంధాల్ని వాటిలో వివిధ రూపాలలో యెలా వ్యక్తం చేశారో జనానికి తెలియ జెప్పాలి. పురాగాధల్ని ఇండించే బదులు వాటి ఉత్పత్తికి దారితీసిన కారణాల్ని వివరించాలి. మనిషీ పరిణామక్రమంలో దేవుళ్ళనీ, దేవతల్నీ ఎలా స్పజించాడో విశదీకరించాలి. మానవజాతి శ్రైశవ
ర5్3
సాహిత్యం అది. ఆ దృష్టితోనే దాన్ని పరిశీలించాలి.
అలాగే వివిధ సాహితీ ధోరణులను చారిత్రక నేపథ్యంలో చూడాలి. భావకవిత ఆ నాటికి 'ప్రగతిశీల' ధోరణియే. హిందీలో ప్రసిద్ద భావకవి జయశళంకర ప్రసాద్ రాసిన 'కామాయని” ఒక వూహాస్వర్లాన్ని (యుటోపియాను) చిత్రిస్తుంది యుటోపియన్ సోషలిస్టులు కూడ సోషలిస్టు ఆలోచనకు కొంతదోహదం చేసినట్టే 'కామూయని' కూడ కల్పనాత్మక కావ్యమైనప్పటికీ సాహిత్యాన్ని ఒకడుగు ముందుకు నడిపింది.
అభ్యుదయ సాహిత్యానికి కాలం చెల్లింది. ఇపుడు కొంగ్రొత్త ధోరణులు వచ్చాయనడం తరచుగా వింటుంటాము. హిందీలో అభ్యుదయ కవిత్వం తర్వాత వచ్చిన కావ్యధోరణుల్ని “'ప్రయోగవాద్, 'నయీ నవిత' అని పిలుస్తారు. కొని వాస్తవ మేమిటంటే 'నయీకవిత*లో కూడ ముక్తిబోధ్ లాంటి అభ్యుదయ కవులున్నారు. అభ్యుదయ కవిత ఒక ఉద్యమంగా లేక పోయినప్పటికీ అది చావలేదు. కొంత స్తబ్దత వచ్చింది. మరలా (ప్రస్తుతం నవాభ్యుదయ కవిత హిందీలో తాజాగా వస్తోంది. తెలుగులో 'నయీ కవిత” ఒక ఉద్యమంగా రాలేదు. అభ్యుదయ కవితలు కొనసాగాయి, అభ్యుదయ కధాసాహితి కొనసాగింది.
నేడు కోకొల్లలుగా వ్యాపార సాహిత్యం వస్తోంది. సెక్స్, హింస క్షుద్ర శక్తుల సాహిత్యం వస్తోంది. జీవిత వాస్తవాల విస్మరణకు ఉద్దేశించిన కామోత్సవ ్రీడాసాహిత్యం వస్తోంది. జీవితానికి (ప్రత్యామ్నాయంగా వస్తున్న పచ్చి పలాయన వాద సాహిత్యం ఇది. క్షుద్రవిలువల క్షీణ సాహితి ఇది. ఇదికాక మరోవైపు వూహా సమస్యల్ని, చిరు సమస్యల్ని జీవిత సర్వస్వంగా చిత్రించే కాలక్షేప సాహిత్యం వస్తోంది. క్షుద్ర సాహిత్యానికి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం జరపాలి. అభ్యుదయ రచయితలు, అభ్యుదయ విమర్శకులు ఇతోధిక రచనాయుధాలతో ఈ పోరాటం జరపాల్సి వుంటుంది. సవిమర్శక వాస్తవికతావాదాన్ని, సోషలిస్టు వాస్తవికతా వాదాన్ని కరదీపికలుగా స్వీకరించాల్సి వుంటుంది.
సమాజంలో చోటుచేసుకున్న అమానుషత్వాన్ని, వస్వీకరణనూ చిత్రించే విమర్శనాత్మక వాస్తవికతా వాదానికి భారతీయ నేపథ్యంలో కాలం చెల్లలేదు, ఇంకా ఈ ధోరణి అవసరం వుంది,
సోషలిస్టు వాస్తవికతావాద రచనలు సమాజంలో అట్టడుగున పడి నలిగే జనావళి విమోచన కోస౦, సకల పీడిత ప్రజల ్రగతికోసం పాటుపడే వ్యక్తుల్ని వాళ్ళ పోరాటాల్నీ, వాళ్ళ సాహసాన్నీ ప్రతిబింబిస్తాయి. నూతన ఆలోచనా ధోరణి ప్రకారం ఈ పోరాటాల్లో
ర్
వుండే భావజాల, కార్యాచరణ లోపాల్ని, వ్యక్తుల స్వార్థాన్ని, అహంభావాన్ని కూడ రచం వ్యక్తీకరించాలి. ఇదో సాహసోపేతమైన మలుపు. సోషలిస్టు వాస్తవికతావాదానికి సవిమర్శకతను జోడిస్తే సాహిత్యపు విశ్శసనీయత పెరుగుతుంది. సోషలిజం కోసం పోరాడే ప్రతి వ్యక్తీ ఏ పారపొట్ట్లూ చేయడని హామీ ఏమీలేదు. రచయిత బాధ్యత - నిజాయితీగా సామాజిక సత్యాన్ని ప్రతిబింబించడం. అందుకే మనమో నూతన ధోరణికి - సోషలిస్టు విమర్శనాత్మక వాస్తవికతా వాదానికి (5062 (510/102 [68 9౧౧కి) స్వాగతం పలకాలి. జీవితాన్ని నలుపు తెలుపుల్లోనే చూసే పద్ధతికి స్వస్తి చెప్పాలి. ఇదే సాహితీరంగానికి నూతన ఆలోచనా ఛోరణి ఇచ్చే సందేశం. అభ్యుదయ మానససటిక్తు ఫిబ్రవరి 1989. 55
ప్రపంచ విప్లవ పరిణామ క్రమంలో బ్రపంచ విప్లవ పరి క్రమం అంతర్జాగం అభ్యుదయ కవిత్వం వర్తమాన యుగంలోని విప్లవ ఆందోళనల సమాహారమే ప్రపంచ విప్లవ పరిణామ్రమ సారాంశం. దీనికి కొంత చారిత్రిక నేపధ్యం వుంది ఆందుకే ఈ (క్రమంలో పారిస్ కమ్యూన్ (1871, అక్టోబర్ సమాజవాద విప్ణవం (1917), ఆ విష్టవంతో ప్రేరణపొంది పెల్లుబిక్కిన అంతర్జాతీయ శ్రామికవర్గ పోరాటాలు, తూర్పు యూరప్‌లోని జనసామాన్య ప్రజాస్వామ్యూలు, జాతీయ విమ్ముక్తి ఉద్యమంలో భాగంగా సామ్రాజ్యవాదాన్ని సాయుధంగా ఎదుర్కొని సమాజవాద విష్ణవాలుగా పరిణతి చెందిన దేశభక్తి పూరిత పోరాటాలూ, సమాజవాద దిశగా పురోగమిస్తున్న మరి కొన్ని వర్ధమాన దేశాలూ, జాతీయ ప్రజాస్వామిక పరివర్తన, హింసావాదానికీ, నిరంకుశత్వానికీ వ్యతిరేకంగా జరిగే ప్రజాపోరాటాలూ, రకరకాల దురహంకారాన్ని నిరసించటం, దేశభక్తినీ అంతర్జాతీయతా భావాన్ని పెంపొందించటం, వలస వాదాన్ని, నయావలసవాదాన్ని గర్హించడం, (ప్రపంచ శాంతికై దేశ దేశాల ప్రజాభిప్రాయాన్ని మలచడం కొల్లగొట్టుతనాన్ని వ్యతిరేకించే పీడితులపట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేయడం, నిష్కారణంగా నిరుద్యోగుల, వర్గచ్యుతులై, సంఘంచే బహిష్కృతులై, తిరస్కృతులైన దళితులూ దరి[ద్రులూ, వ్యవస్టను గురించి అవగాహన లేక ఇద౦చా 'మన ఖర్మ" అని సర్దుకుపోయే నిమ్మ మధ్య తరగతి జనాన్నీ, అలగాజనాన్నీ పోరాట మార్గం పట్టించే ప్రయత్నం చేయడమూ, నిరాశా నిస్పృహలతో విసిగి వేసారి “ఇదెక్కడ మారుతుందిలే' అనే ప్రగాఢ అవిశ్యాసవాదాన్ని చారిత్రిక ఆశావాదంతో ఎదుర్కొనడం, బూర్డువా అమానుషత్వాన్ని క్రియాశీల మానవతావాదం ద్వారా, సమాజంలో అమ్ముడు సరుకులుగా మిగిలిపోయిన విలువల్ని సృజనశీల కళ సంస్కృతి, సాహిత్యాల ద్వారా గుణాత్మకంగా మార్చేయత్నం చేయడం, మనిషిని అమానవీయం చేసే సామాజిక ఆర్థిక పరిసరాలను మానవీయం చేయటం ద్వారా మనిషిని మనిషిగా చూడటం వీలయే పరిస్టితి కల్పించడం - ఇవన్నీ అంతర్భాగాలే (ప్రపంచ విప్లవ పరిణామ(క్రమంలో. ప్రపంచ విష్ణవ పరిణామక్రమ కమలానికి ఇవే కాడలు, 56
ఆకులు, రేకులు సకలజన సంతోషం ఈ విష్ణవస్రమ పరిమళం.
పెట్టబడివాదం తన వినాశనానికి హేతువు కాగలిగిన శ్రామిక వర్గాన్ని ఎలా సృష్టిస్తుందో బూర్జ్డువా విద్యా సంస్కృతి కూడా ఆ అమానుష ఉపరినిర్మాణాన్ని ఎదుర్కొంటూ దాని పునాదియైన పెట్టుబడి దారీ సమాజ వ్యవస్థ కూకటి వేళ్ళను కదిలించే కవులనూ, కళాకారులనూ సృష్టిస్తుంది. ఈ (ప్రక్రియలో భాగమే సకల ప్రగతిశీల సాహితీ ఆందోళనలూ విష్ట్ణవ సాహితీ సమరశంఖారావాలూ. ఈ కవుల్లో రెండు ప్రధాన అభివర్గాలు (01830 63) కన్పిస్తాయి. సమాజంలోని దైన్యం, హైన్యం విషాదం, విధ్వంసం, (క్రూరత్వం ఆశాహీనత్వం, అవిశ్వాసం నిష్కియత్వం, సామంతవాద అవశేష రూపాలైన కులం, మతం, భూస్వాముల పెత్తనం, అన్నిటికీ మించి పెట్టుబడిదారీసమాజపు నాడిమైన ధనాన్ని దైవీకరించడం, వస్తువులే సర్వస్వమని మనిషిని హీనంగా చూడటం, మానవ సంబంధాలు వికృతం కావడం, వికటించడం, మనిషే ఒక అమ్ముడు సరుకు అయి అలా అయినాననే బాధాకర స్వచైతన్యం - ఇవి అన్నీ కవితా వస్తువులవుతాయి కొందరు కవులకు" వీరు సామాజిక చైతన్యాన్ని సంవేదనతో స్పందింపచేసే భావబింబాల ద్వారా వ్యక్తం చేస్తారు. ఈ భావాలకు బంచీలైై కవి నిరాశావాది కాకుంటే ఈ రకం కవిత్వమూ సహృదయుణ్ణ కదిలిస్తుంది, ఆతని అవగాహనను పెంచుతుంది అనుభూతిని పంచుతుంది. మరో రకం కవులు చైతన్య దీప్పులై ఈ సమాజాన్ని మార్చే శక్తుల్ని ఐక్యం చేస్తారు, ప్రోత్సహిస్తారు. అవసరమైతే పోరాటంలో పాల్గొంటూ అందులో కవితను చూస్తారు కవిత్వంలో పోరాటాన్ని చిత్రిస్తారు లేక కవిత్యం మానసిక ఆహ్హాదం కోసం కూడా రాసుకుంటారు. హోచిమిన్, ఆగస్తినానెతో, నాజిం హిక్‌మత్ లాంటి విష్ణవ కవులు నిమగ్నతకు దారితీసే నిబద్ధతా భావోద్దీప్తమై నిమగ్నతను డిమాండ్ చేస్తే కని పోరాటంలో భాగస్వామి అవుతాడు. అలాంటి నిమస్టత వల్ల నిబద్ధత మరింత (ప్రగాఢమై సుదీర్హ పోరాటానికి కావాల్సిన ధైర్యం సమకూరుస్తుంది. నిబద్ధత నిమగ్నతలను ద్వంద్వాత్మక దృష్టితో చూడాలి. సరళీకరిస్తే లేక పరమ సత్యంగా (4500 ౮136) చేసి చూస్తే నివారించగలిగే భేదాభిప్రాయాలు విష్టవ పరిణామ (క్రమానికి దోహదం కాదు, ద్రోహం చేస్తాయి. అనైక్యత ప్రగతికీ విష్ణవానికీ ప్రధమ శత్రువని ప్రతి రచయితా గుర్తించాలి. మహామనీషి విష్ణవ విజ్ఞాన ఆచార్యుడు కార్ల్‌మార్క్ ఒకప్పుడు (ప్రేమగీతాలు రాసుకొన్నవాడు పారపాట్టు చేసినా చైనా విష్ణవంలో నిర్ణాయకమైన లాంగ్ మార్చ్‌లో ప్రధాన పాత్ర వహించిన మావో లూషాన్ కనుమ దాటేందుకు జరిగిన పోరాట సమయంలో అక్కడే రాసిన ఒక కవితలో ప్రకృతిని మరిచిపోలేదు-
57
“ఈ కనుమ ఇనుప కవచంతో కప్పబడి నట్టుంది
కాని మా శక్తినంతా చూపీ ఈ రోజు దాటుతాం ఈ కనుమ మేం ! పర్వతాలు నీలిరంగుతో వున్నాయి సాగరంలా
అస్తమిస్తున్నాడు సూర్యుడు రక్తారుణిమ చిందిస్తూ”
- ఆఫ్రికా అగ్రశ్రేణి కవి అగస్తినానెతో, క్యూబా విష్ణవానికి బీజం నాటిన జోస్ మార్తి _ చిలీదేశపు విష్ణవకవి పాబ్గానెరూదా, అక్టోబర్ విష్టన శిశువును కళ్ళారా కాంచి పెంచిన వ్లదీమిర్ మయకోవ్‌స్కి, వలస దేశాల జాతీయ విముక్తి ఉద్యమంలో భాగంగా సామాజిక న్యాయం కోసం కవిత్వం రాసిన తిరుగుబాటు కవి నజ్రల్, విష్ణవ కవి శ్రీశ్రీ జలపాత శైలిలో విష్ణవ పరిణామాలకు పౌరాణిక బింబాలు వాడిన మహాకవి సుబ్రహ్మణ్యభారతి, పాశ్చాత్య సభ్యతను
- అదే ఆఫ్రికా మానవుల్ని వేటాడి పట్టుకొచ్చి సంతలో పాటపాడి కొనేసి బానిసలుగా తీసుకెళ్ళిన అనైతిక అమానుష సభ్యతను - ఎదిరించే వుద్దేశంతో తమ సంస్కృతికీ తమ సామాజిక వ్యవహార సరళికీ (ప్రత్యేకత వుందని “16071466 (నీగ్రోతనం) అనే భావాన్ని ప్రతిపాదించి, కవిత ద్వారా ఆఫ్రీకాలో ప్రచారం చేసిన లియోపాల్డ్ సెడార్ సెంగోర్, చీకటి ఆవరించిన ఆ,ఫ్రికాను గురించి కవిత రాసిన రవీంద్రనాధ్ రాకుర్, వియత్‌నామ్ పై సానుభూతితో స్పందించి చక్కని కవిత అందించిన అలూరి బైరాగి, శాంతి కోసం సంఘీభావం కోసం కవిత్వం రాసిన రాబర్ట్ రోజ్టెసెన్‌స్కి, శంశేర్ బహదూర్ సింగ్ వీళ్ళంతా విష్ణవ పరిణామ (క్రమంలోని సామాజిక
- సాంస్కృతిక పార్శ్వాన్ని పీడితుల పక్షం వహించి కవిత్వం రాసిన మహనీయులే. ;
(ఫ్రెంచ్ మహా విప్లవం నుంచి పారిస్ కమ్యూన్ వరకూ ఒక చారిత్రిక యుగమైతే అక్టోబర్ సోషలిస్టు విష్ణవకాలం (1917) నుండి మరో చారిత్రిక యుగంగా భావించాల్సి వుంటుంది పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి సమాజవాదదశకు పరిణామం చెందడం ఈ యుగం ప్రధాన లక్షణం - అంతస్పారం. జాతీయ విముక్తి పోరాటాలు ఆ తర్వాత పెట్టుబడి దాకీ విధానేతర పంధా అవలింబిస్తూ సమాజవాద దిశగా పురోగమిస్తున్న దేశాలు సమాజవాద వ్యవస్థ్ర పక్షాన నిలబడతాయి. జాతీయ విముక్తి పోరాటం తర్వాత ఆర్థికంగా వెనుకడివున్నా
58
సామ్రాజ్యవాద కిరాతక చర్యల 'పుణ్యమా' అన్నట్టు వియత్‌నామ్‌లో సమాజవాద విప్లవ పరిణామం తీసుకువచ్చేందుకు దారి తీసింది. సారవంతమైన వియత్‌నామ్ పొలాల్లో లక్ష టన్నుల విషపూరిత రసాయనాలు వెద జల్లినారు, ప్రజాస్వామ్యానికి తామే ఛాంపియన్‌లమని పోజుపెట్టే అమెరికా పాలకులు, ఇప్పుడు లెక్కలేస్తే వియత్‌నామ్ కంపూచియా లావోస్‌లలో జరిగిన రకరకాల యుద్దాల్లో అమెరికాదించిన సైన్యం సంఖ్య ఇరవై లక్షలు, సమాచార సామ్రాజ్యవాదం దాచాలని యత్నించినా దాచేస్తే దాగని సత్యం ఇది. ప్రజాస్వామిక వియత్‌నామ్ ఎర్పడ్డ తర్వాత శత్రువులను ఎదుర్కొనేందుకు సాధనంగా కవిత్వం వియత్‌నామ్ పౌరులకు తమ పోరాటంలో ఆయుధమయింది. గెరిల్బాల ప్రస్థానానికి ప్రేరక శక్తిగా, శ్రమజీవుల జీవన వ్యక్తీకరణకు సాధనంగా సామాజ్య్యవాద దళ్ళర్యల నిరసనకు జనవాణిగా కవిత్వం వియత్‌నామ్‌లో విషాద కాలంలో జీజీవిషనూ, జీవితం పట్ట ప్రేమనూ వ్యక్తీకరించింది =
“మా పొలాలు పచ్చని పైర్లతో-
ధాన్యపు గింజలతో నిండాయి -
మా జీవిత రక్తాన్ని సమర్పించాం మేం
మా దారులు ఉత్తర దక్షిణాల్ని కలుపుతున్నాయ్”.
అని ఒక కవి గొంతెత్తి పాడితే, మరో కవి వాక్కు ఇలా వుంది-
“మా దేళ గేయాల ధ్వనులు - బాంబుల ధ్వనుల్ని ముంచెత్తి వేస్తాయి” ఇది జననాదమై రణనినాదమై నిలిచింది. చూసేందుకు బక్కగా అమాయకంగా అస్థిపంజరాల్టా పై కగుపించే వియత్ ప్రజల ధైర్య సాహసాలు సంవేదనా శీలియైన ప్రతి కవినీ కదిలిస్తాయి, రక్త కణాల్లో కలిసి (ప్రేరణ ఇస్తాయి. వియత్‌నామ్ ఎదుర్కొన్నది సామ్రాజ్యవాద సమష్టి సైన్యాల్ని, కసాయి మూకల్ని కిరాయి సేనల్ని, అందుకే నవియత్‌నామ్ విజయం అపూర్వం. వియత్‌నామ్ అంటేనే అమెరికన్లకు ఈ నాటికీ హడల్ - భయంతో కూడిన మనస్థితి (6౭౯ 00౧౧|ల0). బైరాగి పదశిల్పంలో “వియత్‌నామ్”
“ఆకలిచిచ్చు రగులు కొన్నది
బౌద్ద భిక్షుల ఆత్మార్పణపు ఆకలిచిచ్చు రగులు కొన్నది
విప్లన ప్రతీకారపు తీరనిచిచ్చు రగులు కొన్నది
ఆసియాలో ఆఫ్రికాలో లాటిన్ అమెరికాలో
అంతటా అనంత క్రాంతి జ్వాలలు రగులు కొన్నవి
నిమానాలు మిడుతల్లా కూలి రాలుతున్నవి ..”
59
“తెల్ల దొరలకు పట్టుకున్న మనాది వియత్‌నామ్
సామ్రాజ్యపు సైతానుకు సమాధి వియత్‌నామ్
ప్రాచీ దిగ్వధువు నాసట
తీర్చి దిద్దిన విజయ తిలకం వియత్‌నామ్”.
ఈ నాటి ఆణుయుద్ధ ప్రమాదాన్ని గురించి ఒక ఉదాత్త నవ కవితలో కధనం యిలా వుంది -
యుద్దం వచ్చి ఈ భూగోళం
ముక్కలు చెక్కలు కాక పోయినా
చెప్పండి -
ఇదేనా మనం (బ్రతకాల్సిన విధానం”
రష్యన్ కవి రోజ్టెస్పెస్‌స్కి రాసిన పై పంక్తులు 'శాంతిని గురించి అతను రాసిన సుదీర్హ కవితలోనివి.
ఇదీ ఒక జీవితమేనా, ప్రతి నెత్తినా 15 టన్నుల టిఎన్‌టితో అని సూటిగా ప్రశ్నిస్తున్నాడు
రోజ్టెసైస్‌స్కి యుద్ధం లేకపోవడమే కాదు శాంతికి అర్హం, ప్రగతి కోసం సహకారంతో కూడిన శాంతియుత సహజవీనం నేటి అవసరం.
“పైన ప్రశాంత రాత్రి
అగాధమైన రాత్రి
= ప్రేలుడు పదార్థ నిలయంలా.”
అని అణుయుద్ద ప్రమాదాన్ని సమర్థవంతంగా ధ్వనిస్తాడు ఆయన. సమస్త మానవాళికీ సంబంధించిన ఈ సమస్య ఈ కవికి వస్తువు కావడం యాదృచ్చికం కాదు. (శ్రమజీవులు సాధించిన విజయాలను వమ్ము చేయాలనే సామ్రాజ్యవాద దుస్సాహసాన్ని దుయ్యబట్టాలనే అతని సంకల్ఫం. ఈ మేరకు ఇదీ ప్రపంచ విష్ణవ పరిణామ క్రమంలో భాగమే, అందుకు దోహదమే.
పీడితుల పట్ట సంఘీభావం నజ్రాల్ ఇస్లామ్, నాజిమ్‌హిక్‌మత్, రవీం(ద్రనాథ రాకుర్, శ్రీశ్రీ భారతి, ఫైజ్: ముక్తిబోధ్ కవితల్లో స్పష్టంగా కన్పిస్తుంది. వీరందరిపైనా అక్టోబర్ సోషలిస్టు విష్ణవ ప్రభావం సుస్పష్టం. రవీర్వద్రునివలె మయకోవ్‌స్కి పీడితులతో తాదాత్మ్యం ప్రకటిస్తూ రాస్తాడు. 60
“ఎక్కడెక్కడ బాధవుందో
అక్కడక్కడ నేనున్నాను
కార్చిన ప్రతి కన్నీటి
బిందువులో నన్ను నేను
శిలువ వేసుకున్నాను..”
నజ్రాల్ కూలీ" అనే తన కవితలో ఇ్లలా అంటాడు -
“నకల దేశాలలోని సమస్త జనావళీ
అన్ని సమయాల్లోనూ
ఒకే ఒక మానవ సంగమమై
ఐక్యతా వేణుగానం విననీ -
ఏ ఒక్కడు గాయపడినా
ఆ బాధ అందరి హృదయాల్ని తాకుతుంది
ఏ ఒక్కనికి అనమానం జరిగినా
మానవ జాతినంతా అది కించ పరుస్తుంది
అందరినీ అవమాన పరుస్తుంది.”
అక్టోబర్ విష్ణవాన్ని దక్షిణాసియాలో కీర్తించిన మొదటి కవి సుబ్రహ్మణ్య భారతి. 'పుదియ రుషా" అంటే 'నవరష్యా' అనే గేయం 1917లోనే అచ్చయింది. కాళికాదేవి అక్కడి అన్యాయాలు, చెరసాలలు, వురికొాయ్యలు, సైబీరియా శీత ప్రవాసాలు సహించక ఆగ్రహంతో యమదేవుణ్లే కూల్చేస్తుంది. విప్లవం తర్వాత కృతయుగం ప్రవేశించిందని ఆనంద పడతాడు కవి. పౌరాణిక భావ బింబాల ద్వారా ప్రతి భారతీయునికీ అర్ధమయేట్లు రాస్తాడు. నొచే ఉన్ పార్ శ్యామా ' అనే కవితలో నిరాలా విష్ణవ కాళికాన్నత్యం అభివర్లిస్తాడు 1924 లోనే.
“చెలరేగిన అక్షోబర్
రుంరూనిల ధ్వానమ్ములు
జతగలిసిన మానవాళి
చైతన్యం జృంభించెను! అని అలెక్సీ సూర్కొవ్ పేర్కొన్నట్టు అక్టోబర్ విష్టవ వీచిక ప్రపంచమంతా వీచింది. శ్రీశ్రీ కవిత్వాన్ని కదిలించింది ఈ విష్ణవ చైతన్యమే. పాలాలనన్నీ హలాలదున్నీ ఇలా తలంలో
61
హేమం పండించే కర్షకుల్నీ, కార్మికుల్నీ పతితుల్నీ, (భ్రష్ణుల్నీ, బాధా సర్పదష్టుల్నీ సంబోధిస్తూ శ్రీత్రీ - “శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు” అని అన్నాడు. 1944లో వెలువడిన 'నయాగరా' కవుల్లో ఒకరైన బెల్లంకొండ రామదాసు ప్రపంచంలోని నిరాస్తిపరులకు అక్టోబర్ మార్గం చూపిస్తాడు. 'చెరసాల' శీర్షికతో రాసిన ఈ కవితలో - “మీకై ఈనాడొక అగ్జిపర్వతం సగులుతోంది చూచారా ! మీకై ఈనాడొక అరుణ పతాకం ఎగురుతోంది చూచారా |! మీకై ఈనాడొక నవ జగత్తు ప్రభవిస్తున్నది చూచారా 1 జాతీయ విముక్తి పోరాటాల్లో సామంతవాదాన్ని కూడ వ్యతిరేకించాల్సి వస్తుంది. మతీ ముఖ్యంగా మన దేశంలోని సామంత రాజ్యాలలో నిజాం పాలన ఎంత (క్రోరంగా వుండిందో ఈ జన కవితావాక్యం వివరిస్తుంది. “నైజాం సర్కరోడ నాజీల మించినోడ” - స్వాతంత్ర్య పోరాటంలో చెదురు మదురుగ దేశంలో కన్పించిన తిరుగుబాటు పంధా క్ | కోసి కవులను ఉత్తేజపరచింది. అల్లూరి సీతారామరాజు నాయకత్వాన జరిగిన మన్య విప్లవాన్ని ప్రస్తావిస్తూ కుందుర్తి - “మా చేసిన మన్య విప్తవం దేశానికి మార్గదర్శి 62
దిగివచ్చిన వెలుగుబాట మన్య నిప్షవం మా చరిత్రలో వీచిన యుంరూనిల వీచికొ అంటాడు. రవీం(ద్రనాధ రాక్షుర్ పేరు వింటూనే గుర్తుకొచ్చేది “గీతాంజలి '. కాని ఆయన రాసిన ప్రగతిశీల గేయాలు ప్రణయ గీతాలు ఉదాత్తభావ కవితలు “గీతాంజలి"లో లేనివి అసంఖ్యాకంగా వున్నాయి. 'అఫ్రికా' అనే శీర్షికతో రాసిన కవితలో రవీంద్రుడు పాశ్చాత్యుల అమానుషత్వాన్ని నిరసిస్తాడు - ఇలా సహాయ్ ఛాయావృతా, కొలో ఘోమ్‌టార్ నీచే అపరిచితొ ఛిలో తోమార్ మానవరూస్ ఉపేఖ్కార్ ఆవిల్ దృష్టితే. సభ్యేర్ బర్బర్ లోభ్ నన్న కర్‌లో ఆపన్ నిర్హజ్ఞ అమానుషతా _, తోమార్ భాషాహీన్ క్రందనే, బామ్సికుల అరణ్యపరధ్, సంకిల హలో ధూళి, తోమార్ రక్తే అశ్రుతే దిశే - చిరచహు దియే గేలొ తోమార్ అపమానిత్ ఇతిహాస. ఆఫ్రికా ఇప్పటికీ రగుల్కొంటూనే వుంది. ఆఫ్రికా దుర్దశపట్ట ఆవేదన మన దేశంలో వ్యక్తం కావడం సంఘీభావానికి చక్కని నిదర్శనం మలయాళంలో ఎన్.వి. క్రిష్ణవారియర్ ఒక కవితలో ఇలా అంటాడు. ౪/౧6/6౪61! [120 3 ౧౬౧69 2/9 161666, 6/9 ౧౧౫ ౧౭౧౮౩ &/6 ౧ ౧౫౧ (౧౧౧6౭ 112% 19 0౦౧౧౧౪౩8౦6 116/6 196 169 23% '౧/౧66 $12౧ 9౪000 63 10 86 ౮౧, 1౧6/6 ౪6 63
062 1153 ఉిగం ౧౫ 4౧6, 2౧౦6 | 0౧/ 06046136 01 ౧6? ఇం్ర0గ౪
(ఇది [౧64౧ [1912149 మాసపత్రికలో (౮౭౧౮౭౧/- ౮౮౧౪ - 1974) అచ్చయింది)
సామాజిక సంబంధాల్లో గుణాత్మకమైన మార్పు కోసం స్వాతంత్ర్య సంగ్రామ సమయంలోనే ప్రయత్నాలు జరిగాయి. శతాబ్దాల పర్యంతం సంఘానికి వెలిగా, కొల్లగొట్టు తనానికి బలిభై నలిగిపోయిన 'అంటరానివా'రనబడే పీడిత జనసందోహంతో మమేకమై -
'మంచి యన్నది మాలయైతే
మాలనే యగుదున్ ' అని గురజాడ స్పందించాడు.
జాషువా హరిజనుల ఆవేదన వ్యక్తం చేశాడు. మరారీలో దళిత సాహిత్యం ఉద్యమ రూపం దాల్చింది. అంటరాని తనాన్ని నిర్మూలించాలని, దేశ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహ పంధా అవలంబించి జనసామాన్యంలోకి అతి సహజంగా ప్రవేశించి జాతీయస్థాయిలో రాజకీయ కార్యాచరణవారికి ప్రేరణ యిచ్చింది గాంధీయే. ఆతని మార్గం సవ్యమా అపసవ్యమా అనేది కాదు ప్రశ్న; రాజకీయ విముక్తి మాత్రమే చాలదు; పోరాటాలు బుద్దిజీవుల గుత్త సొమ్ము కాదు అని అన్ని రంగాల్లో పోరాటాల్లో జనసామాన్యాన్ని ఇమిడ్చిన ఒకేఒక దేశనాయకుడు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. అతన్ని గూర్చి కవితలెన్నో వచ్చాయి. విష్ణవకవి సుబ్రహ్మణ్య భారతి గాంధీవాదాన్ని స్తుతిస్తూ గాంధీపంచకం' రాశాడు.
హింపాయుత దౌర్జన్యమార్గం
తిరుగులేని రీతిలో తిరస్కరించినావు
నీ అనుచరులకు మహత్తర మార్గం చూసపినావు
సత్యా[గ్రహంతో బానిసల సంకెళ్లు తెంచి
స్వాతంత్ర్యం సాధించగలమని అన్పించినావు.
మరి ఈ భూగోళం యుద్దాన్ని మరచిపోవాలి-
శాంతి మార్గాన పయనించడం నేర్చుకోవాలి.
అని ప్రబోధిస్తాడు భారతి.
రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు సోవియట్ యూనియన్‌పై మెరుపుదాడి చేస్తే సోవియట్ విమానాలు రంగంలోకి దిగినాయనే వార్తవిని, శ్రీశ్రీ ఒక [44/0౧ ౧ 50౧0 రాస్తాడు.
64
“గర్జించు రష్యా గాండ్రించు రష్యా పర్జన్య శంఖం పలికించు రష్యా...” అంటూ.
సోవియట్ యూనియన్ గెలిచి తీరాలనే (ప్రగతిశీల ప్రజానీకం ప్రగాఢ వాంఛకు పదరూపం
యిస్తాడు. నెలల కొలదీ దిగ్బంధనంలో వున్న లెనిన్ (గ్రాద్ నగరం - ఎముకలు కొరికే చలిలో
తినను తిండిలేక చనిపోతే పారేసే దిక్కులేక దీనంగా దుఃఖమంతా (త్రాగి మేల్కొన్న శవంలా వున్న లెనిన్ (గ్రాద్ నగరం - విముక్తమయిన సందర్భంగా రష్కున్ కవి యూరీవొరొనోవ్ రాసిన ఒక కవితలో ఒక అంశం -
“లెనిన్[గ్రాద్
ఖ్యాతిగాంచిన లెనిన్‌గ్రాద్ -
నీ సంతోషం అపారం
నీ బాధ వెల్లడయిన తీరు అమాయకం
అర్హ - లెనిన్ గ్రాద్ ! నీ బంధు మిత్రులు
చిరనిద్రలో మునిగి వున్నారు
ఆగదు ఈ గేయ వాహిని
కన్నీటిధార ఆగకపోయినా
ఈనాడు నగరానికి
పండుగ
కాని పౌరులకు మాత్రం
కన్నీటి గాధ”.
సోవియట్ విజయం ఫాసిజం పరాజయం స్టానిక గెరిల్లా పోరాట దళాల చొరవ - వీటి ఫలితం తూర్పు యూరప్‌లో అనేక దేశాల్లో జనసామాన్య (ప్రజాస్వామ్యాల జననం, పోలెండ్ బల్లేరియా చెకొస్టావేకియా, హంగరీ, యుగొప్లావియా, జి.డి.ఆర్., అల్బేనియా, రుమేనియా దేశాలు ఈ పరిధిలోకి వస్తాయి. ప్రపంచం, ముఖ్యంగా సోవియత్ రష్యా చేసిన పోరాటాల ఫలీతం యీ పరిణామం. (శ్రామికులూ, కర్షకులూ వున్నప్పటికీ బుద్దిజీవుల పాత్ర వీటిలో ఎక్కువ. కారణం వారి రాజకీయ అవగాహన సమరశీల స్వభావము. కాని బుద్ధి జీవులు ఒక వర్గం కాక పోవడంతో కొని వూగిసలాటలు సిద్దాంత వక్రీకరణలు చోటు చేసుకున్నాయి ఈ
65
దేశాల్లో. అందుకే బల్గేరియా కవి నికొలా వప్‌త్చారొవ్ ఒక కవితలో రొట్టె తయారు చేసే కర్మాగారంలో పనిచేసే కార్మికుని గురించి పట్టించుకోని మేధావుల్నీ. రచయితల్నీ గట్టిగా ప్రశ్నిస్తాడు. వాళ్ళను గురించి పట్టించుకోనినాడు ఆ (శ్రామికులూ బుద్దిజీవుల దగ్గరికి రారు; జీవితం కేవలం దినచర్యగా మిగిలిపోయి విసుగు జవిస్తుంది వారిలో అంటాడు. + విప్లవ పరిణాను (క్రమంలో జాతీయ విమోచనోద్యమం ముఖ్యమైన పాత్ర వహిస్తుందనేది వాస్తవం. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్హు వలసలో వలస వారి అవస్థ కవితల్లో వ్యక్తమయింది. తమ సొంత దేశం నుండి గెంటబడి శరణార్జులై దేశ దేశాల్లో తలదాచుకుంటూ యూదు దరుహంకారుల ఫాసిస్టు చర్యలకు తొణకకుండా బెణకకుండా యిప్పటికీ పోరాటం సాగిస్తున్న (ప్రజలు పాలస్తీనా ప్రజలు. వారెక్కడున్నా పాలస్తీనా వాళ్ళం మేం అనే చైతన్యం, గుర్తింపు వారందరినీ ఎకం చేస్తుంది. దేశ దేశాల నుండి సంఘీభావం కోరుతూ బెసిస్సా అంటాడు - “గ|ఆ౧ ఇగ౧౮ /0౧౧6౧ 01 16 ౪/0! ౮6 56౪/1 ౪5 ౧౦౪! 51206 4/౧8 ౧66౮ 6 0౪ గి2౦63 011169 ౪౦ 6 86౪0) ౮69 ౧౦౪౫... [౧0/౪6 904 ౪6౪04 116 రం౧|%/ ౦1 2౧ | 09 0110 6641160416 0 12౧ శిగిర 19 ౧౭౫6 ౦ [140 1 పాలస్తీనా కవయిత్రి ఫద్వాతుఖాన్ ఘాటైన భాషలో ఇలా అంటున్నారు - “కాల రాయబడిన మీ ఆశల నుండి శిలువ వేయబడిన మీ అభివృద్దినుండి అపహరింపబడిన మీ చిరునగవుల నుండి మీ పిల్లల చిరునవ్వుల నుండి విధ్వంసాల నుండి చిత్రహింసలనుండి నెత్తురు మరకల గోడలనుండి 66
చావు బతుకుల గొణుగుళ్ల నుండి
వెలుస్తుంది జీవితం
ఓ నా దేశమూ 1! పెనుగాయమా |
పేమానుబంధమనా |
పాలస్తీనా జాతికి - చారిత్రిక శకలాలుగ విడిపోయిన జాతికి తమదంటూ ఒక దేశం లేకపోవడం మానవజాతికే అవమానం. గుడారాల్లోనే ఒక తరం జీవితం గడిపారు. ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని పాలస్తీనా ప్రజల జన్మహక్కును సాధించేందుకు సహకరించేదిగా రూపొందేట్టు చూడాల్సిన బాధ్యత కవులకూ, కళాకారులకూ చారిత్రిక కర్తవ్యం అయింది. ,
- చివరన చెప్పవచ్చేదేమంటే కవితకు సరిహద్దుల్లేవు సంఘీభావానికి సంకెళ్ళు లేవు జైలులో నజ్రుల్‌లా, నాజింహికమత్‌లా తమ దేశ విముక్తికే కాదు, అణగారిన సమస్త మానవజాతి సంక్షేమం కోసం పోరాడుతారు, కవిత్వం రాస్తారు. దేశ భక్తికీ అంతర్జాతీయ భావనకూ మధ్య వైరుధ్యం లేదు. దీనికి నిదర్శనం శంశేర్ రాసిన 'అమన్ కా రాగ్ అనే శాంతి కవిత. క్యూబా కవి జోస్‌మార్తి తాజ్‌మహల్ సౌందర్యాన్ని వర్షిస్తోంటే, శంశేర్ బెధోవెన్ సంగీతాన్ని గురించి ప్రస్తావిస్తోంటే, సంఘీభావం తీర్మానాలకు పరిమితమై వుండక సంవేదనశీలురైన కవులందరి కలాలనుండి, మస్తిష్కం హృదయం రెండింటితో (శ్రమచేసే రచయితల రచనలతో సంఘీభావం నైరూప్య భావనగా కాక భావ బింబాల ద్వారా చిత్రీకరింపబడుతుంది. ఆకృతి ధరిస్తుంది.
అయినా ఇదంతా దేనికి? ఎవరికోసం? ఈ త్యాగం? ఎటువంటిదా సమాజం? ఏమిటి దాని రూపం? ఎచటికి ఈ మహా (ప్రస్థానం? ఏదీ ఆ మరో ప్రపంచం? - నైరూప్య సూత్రాల పట్టిక కాదు, ఆ సమాజ చి(త్రం కావాలి - సామాన్యునికి కూడా, అపుడు కాని అతని ఆశకు అర్థం వుండదు. అందుకే బైరాగి గీసిన ఆ రేఖాచిత్రం ప్రస్తుతం మీ ఆలోచనకై మీ ముందుంచుతున్నాను - రండి వెళదాం అ లోకపు సరిహద్దులకు బైరాగితోపాటు మనమూ - ఆ సమాజంలో ... *
“మనిషికీ మనిషికీ మధ్య సంఘర్షణ ఉండదింక
సహజీవన పావన హర్షం తప్ప
మనిషికీ మనిషికీ అమర్ష్శం ఉండదింక
6/7
సహజ సులభ స్నేహాకర్షణ తప్ప మనిషికీ మనిషికీ మధ్య గోడలుండవు గోతులుండవు అదృష్టం గీచిన గీతలుండవు సిరికి విరుగుడు కనిపెట్టాం భీషణ శోషణ యండత్రపు పండ్లచక్రాల ముండ్ల కంచెలు బ్యాంకులు పేర్ మార్కెట్టు; అంకెల గారడీలతో పేదవాని కడుపుకొట్టే లంకాసురుల రహస్య సొరంగాలు మాయా సింహాసనాలు అన్నీ కూల(ద్రోశాం, నేలపాలు జేశాం దౌర్భాగ్యపు నాగరికతల నిశాళ్మశానాట్లో తోడేళ్ళూ గుంటనక్కలూ తిరగ వింక రాబందులు ఎగుర వింక చిల్లర బేరాల నల్గులకూ, దోములకూ, జలగలకూ స్వస్తి- కరుగ బోసిన ఆయుధాలు పలుగులు, పారలయ్యాయి ట్యాంకులు (ట్రాక్టర్ల్షయ్యాయి విజ్ఞానపు జ్ఞానపు చెర విరగడ చేసి యుద్దానికి బుద్ది చెప్పాం మానవజాతి ఒకే ప్రాణం ఒకే గానం ఒకే ధ్యానం మానవులంతా సమానం న్యాయం తూచే తరాజు తప్ప వేరే రాజు లేడు యధాశక్తి శ్రమ చేస్తాం యధాభుక్తి అనుభవిస్తాం ఒక్కొక్కడు అందరి కొరకు అందరు ఒక్కొక్కరి కొరకు చెలిమిలోనే జనం కలిమి !
68
-_ చారిత్రక రాత్రిలోన కలలుగన్న కాంచన యుగం వుదయిస్తోంది గాయపడిన పేద భటుని విజయలక్ష్మి నరిస్తోంది తరతరాల తామసయాత్ర కడప్రాణం కొడిగట్టగ అడుగడున రాలిపడే నెత్తుటి చెమట లొడిగట్టగ చిరదినాల ఇరుల పారల నిరాశలకు మరణ శాసనం లిఖించి నేడుగదా మానవుడు చేరుకొన్నాడు కోరుకున్న విడుమరను (దష్టలూ యు[గ్రస్రష్టలూ సూచించిన వార్టత్త వసుంధరను.” అని స్పష్టంగా సామ్యవాద సమాజ రేఖా చిత్రం గీశాడు అలూరి బైరాగి. వర్టమాన దేశాల ఆకాంక్షనే కాకుండా సమాజవాద దేశాల్లో రానున్న పరిణామాన్ని కూడా, అంటే సామ్యవాద దళను కూడా చిత్రిస్తుందీ కవిత | ఇది ప్రపంచ విప్లవ పరిణామడక్రమ పర్యవసానం, చివరికి జరిగేది ఇదే ఇదే అని &556/1 చేస్తున్నట్టుంది ఒకనాటి అతిశయ సంశయభావ పీడితుడు 'నూతిలో గొంతుకలు" రాసిన ఆ ఆలూరి బైరాగియే. బహుశా అతను భారత జనమానసానికే సంకేత మేమో - ౫ చూడాలి మరి! “అభ్యుదయ” (2986 జూలై) 69
చీకటి నుంచి స్వప్నం దాకా... ఆలూరి బైరాగి ఆధునిక, (ప్రగతిశీల కవి. 'నూతిలో గొంతుకలు*లో అస్తిత్వవాద ఛాయలుంటే 'ఆగమగీతిలో అభ్యుదయ కవితలు కన్పిస్తాయి. బైరాగిపై ఎమ్.ఎన్, రాయ్ (ప్రభావం స్పష్టం, కానీ బైరాగి రాయిస్టుకాడు. కొన్ని కవితల్లో ధ్వంసవాదం చోటు చేసుకొంది, (ప్రత్యేకించి “చీకటి నీడలు' కవితల్లో... ఇది వాస్తవం. అనుభూతి ప్రేరకమైన భావబింబాలు బైరాగి ప్రత్యేకత. జలపాతవేగం బైరాగి కవితా లక్షణం. అస్తేత్వవాద మూలసూత్రాల్లో ఒకటి ౫15]. ఈ జర్మన్ పదానికర్ధం 'సంత్రాసం' అని. అస్తిత్వవాద తత్వవేత్త కీర్కె గార్డ్ ప్రకారం ఈ సంత్రాసం సహజమైన భయం కాదు. (ప్రత్యేకమైన భయమూ కాదు. మనం ఎదిరించగలిగే విపత్తును గూర్చిన భయం కాదిది. మనిషి కాళ్ళ కింద భూమి అమాంతంగా కుంగిపోతుంటే కలిగే భయం లాంటిది ఈ సంత్రాసం. సమస్త సంరక్షణా భావం అంతమయ్యే సందర్భమిది. “అంతా పరిసమాప్తమౌతోందిపుడు అనే భావన కలుగుతుంది. జా(ాల్ సార్ట్ ప్రకారం మనిషి ఒక నిరర్హకభావావేశం. మనం జన్మించడం నిరర్థకం, మనం మరణించడం నిరర్జకం ఈ నిబిడ నైరాశ్యం 'నూతిలో గొంతుకలు'లో కన్పిస్తుంది. బైరాగి మాటల్లో చెప్పాలంటే ముందున్నది క్షితిజం కాదు, “అంతం లేని సారంగం ఎక్కడున్నది ఆనందం ? “కుందన నందన గంధచ్చందం” (నూతిలో గొంతుకలు) బైరాగి తన 'నూతిలో గొంతుకలు కు భూమిక రాస్తూ ఇలా అంటాడు : “గొంతుకలు వస్తున్న నూతిలో నీళ్ళు లేవు. అదొక పాడునుయ్యి, పాడు నుయ్యి పతనానికీ, మరణానికీ సంకేతం. అందులో జీవనం ఉండదు. అందులో పడి వున్న వారికి వెలుగు గోచరించదు. పైకి (ప్రాకటానికి ఆధారం కన్పించదు. వారు కేకలు వేస్తారు. కాని వారి గొంతులు బయటి వారికి స్పష్టంగా వినిపించవు. భూగర్భపు లోతులు వారిని బాహ్య ప్రపంచం నుంచి వేరు పరుస్తవి. వారు యాత్రికులు కూడా కారు. వారి కొక గమ్యం లేదు చీకటి తప్ప వారికి తోడెవ్వరూ లేరు వారు గర్వాంధత వల్ల అభిశస్తలైన నహుషులు, కానీ ఆ 70
పాపం వారిదే కాదు. అందరిదీ" అది సమస్త మానవ కోటికీ వర్తిస్తుంది”. మానవ కోటి అనడం అతిశయోక్తి. మధ్య తరగతి మేదావులూ బుద్దిజీవులూ అని మనం అర్థం చేసుకోవాలి.
మన నాగరికతా ఖాండవవనం అస్లికి ఆహుతైపోతోంది. గాండీవికాపలా కాస్తున్నాడు. ఈ ఖాండవ దహనంలో పూర్వంలా మయుడు కూడా దక్కడు. నాగరికత తగలబడిపోతోంది. సంస్కృతి లోకాలు మండుతున్నె; మండుతున్నాయి నృత్యవాద్య గీతాలు. మనిషి దిక్కులేని తనాన్ని గురించి బైరాగి మాటలివి. టీ ఎస్. ఇలియట్ ప్రభావం బాగానే వుంది. వేస్ట్‌ల్యాండ్ కొంత భాగాన్ని బైరాగి అనువదించాడు కూడాను.
బైరాగి నైరాళ్యానికి నేపధ్యం ఇది. బైరాగి 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నాడు. కొనీ అది భగ్నాళకు దారి తీసింది ఎంఎన్ రాయ్ వైపు ఆకర్షిత్రుడైనాడు. రెండవ ప్రపంచ యుద్దం బైరాగిని ఒక వూపు వూపింది. ఆ యుద్దంలో చనిపోయిన కోట్టాది జనం బైరాగిని కలవరపెట్టారు. యుద్దవిభిషికను అనుభూతిలోకి తెచ్చుకున్నాడు. కనుకనే యుద్ధ పర్యవసానంగా ఏర్పడిన నైరాశ్యం సంత్రాసం, బైరాగి సొంతం చేసుకున్నాడు. ఈ నేపధ్యంలోనే అతను హ్యామ్రెట్ అర్జున పాత్రలను మలుచుకొన్నాడు రూపొందించుకున్నాడు. బైరాగి సృష్టించిన అర్జునుడు గీతలోని అర్జునుడు కాదు.
బైరాగి రూపం యిచ్చిన అర్జునునిలో భయం లేదు. విశాలదృక్పధంతో ప్రపంచ మానవాళి క్షేమాన్ని పట్టించుకుంటూ శాంతిని కోరుతూ అర్జునుడు అంటాడు
ఈ యుద్దం ఎవరికొరకు, ఎవరు గరళ ఫలభోగులు, ఎవరి కనుల కౌతుకమిది, ఎవరా మానస రోగులుయున్న ఇటు మరణించిన వారు ఏమిటి అనుభవిస్తారు, బ్రతికియున్నవారు మటుకు ఏమిటి అనుభవిస్తారు. మన నిర్ణయం సకల జనులకూ సంతోషదాయకంగా వుండాలంటూ ఈ మాటలతో విషాదయోగం ముగిస్తాడు బైరాగి.
వినూత్నమైన విశిష్టమైన భావబింబాలు బైరాగి ప్రత్యేకత. ఒంటరి డేగ' కవితనే తీసుకుందాం. మందలో తప్పిపోయిన లేగదూడ లాగా ఒంటరి డేగ అమ్మవంటి అర్థం కొరకు వెదుకుతోందట. రెక్కలు అలిసిపోయే దాకా నీలాకాశంలో సన్నని చుక్కయై కలిసిపోయే దాకా వెతుకుతోందట అర్జాన్ని నొచ్చిన ఆ డేగ రెక్కల కింద పిగిలే గుడ్ద్డులాగుందట ఈ భూమి. 'బాధల నెత్తుటి జీరల పచ్చసాొనతో పిగిలే గుడ్డులాగు భూమి' అని ఉపమిస్తాడు బైరాగి.
'హుసేన్‌సాగర్‌ో అనే శీర్షికన రాసిన కవితలో బైరాగి విశ్వజనీనతాభావాన్ని ఉదాత్త భావబింబాల ద్వారా వ్యక్తం చేస్తాడు. ఈ విశ్వం మనుజ శిశువుల పూలతోట అనీ, మెత్తని
71
పచ్చిక పరచిన ్రీడాస్టలి అని అంటూ మనిషిని మహోన్నత స్టానంలో కూర్చోబెడతాడు. సూర్యచంద్రులూ నక్షత్రాలూ మనిషికి పూల బంతులు ఆనీ మేఘాలూ, సాగరాలూ మానవచరణ స్పర్శ కొరకు వేచి వుండే పాలపుంతలనీ మనిషిని రారాజుగా అభివర్లిస్తాడు బైరాగి (ఆగమగీతి పుట 85). మంచితనానికీ, అందానికీ ప్రతీక కెందామర, 'ఆగమగీతిలో 'కెందామర' అనే శీర్షికతో వున్న కవితలో బైరాగి మంచివన్నిటినీ కళాత్మక భావబింబాల ద్వారా వ్యక్తం చేస్తాడు. ఆకాశపు సరసిలో సూర్వుడు ఒక కెందామర అంటాడు. నాడీనాళ శైవాలాలలమిన ఈ శరీర సరోవరంలో హృదయం ఒక కెందామర అంటాడు. కెందామర ఒక చక్కని ప్రతీక. బాధల అగాధంలోంచి, నిరాశల నిశీధ పంకంలోంచి అంకురించిన రుధిరాంకం, క్రాంతి ఈ కెందామర అంటాడు. కన్నీళ్ళ సరసులో పూచిన (ప్రేమ కెందామర అని కవితను ముగిస్తాడు బైరాగి. బైరాగి ప్రకృతి (ప్రేమ, ప్రకృతి పారవళ్యం తెలిపే చక్కటి కవిత వాన వెలిసింది. ప్రకృతి సౌందర్య పారవశ్యంలో వున్నపుడు మరణమన్నది ఉందని నమ్మలేనంటాడు బైరాగి. 'ఆగమగీతి కవితలో బైరాగి నవమానవుడు అపరాజేయుడు మానవీయుడు ఉదయిస్తాడని స్పష్టంగా చెబుతాడు. బైరాగి కవిత్వంలో ఒక (ప్రధాన ్రవంతి ప్రగతిశీల కవిత; కొన్ని కవితల్ని చూద్దాం. 'శాంతిపధం' అనే కవితలో విశ్శశాంతిని గూర్చిన బైరాగి భావన వెల్లడయింది. బైరాగి కోరేది విశ్శశాంతి. కాని ఇది న్మిష్కియశాంతి కాదు. క్రాంతితో కూడి క్షాంతివలన లభించే శాంతి. నరునికి మూలమం(త్రం (ప్రేమ అని ఈ కవితలో ఉద్దోషిస్తాడు కవి. త్యాగము ప్రేమ లేంది జీవితం లేదని చెబుతూ, శిలువ మోయలేని వాడు నవ్యజీవనార్హుడు కాడు అని అంటూ- “ప్రతి మానవుడొక తీర్థం” అని స్వర్శిమ పదాల్లో పౌరాణిక ధార్మిక పదచిత్రాల ద్వారా మానవుని మహోన్షతస్టానాన్ని వ్యక్తంచేస్తాడు బైరాగి. 'మహా ప్రస్థానంలో శ్రీశ్రీ ముఖ్యంగా సమస్యల్ని సాధారణీకృత రూపంలో చూశాడు. ఆ కాలం నాటి విశిష్ట సంఘటనలు, సంఘర్షణలను గురించి ఎక్కువ కవితల్లేవు అందులో; కాని, 'ఆగమగీతి'లో ఆనాటి మండుతున్న సమస్య వియత్‌నామ్” పై ఒక చక్కని కవిత ఉంది. మరే భారతీయ భాషలోనూ ఇంతటి చక్కని కవిత వియత్‌నామ్‌పై రాలేదేమో. 72
శాంతి క్రాంతివలన వస్తుందనే తన సిద్ధాంతాన్ని బలపరుచుకుంటూ, వియత్‌నామ్ ఆసియా భూఖండపు గుండెల పుండు అనీ, సామ్రాజ్య విషవృక్షపు మేడిపండు అనీ వర్షిస్తాడు.
అత్యంత సంవేదన శీలిలైన బైరాగిలో దేశమంటే అక్షరాలా మనుషులే. మాతృ భూమిని కీర్తిస్తూ కూలీలను, రైతులను, పాటక జనాన్ని ప్రస్తావిస్తాడు. సుజల సుఫల మాతృభూమినీ, అరుణ తారక తిలకాంకిత హిమగిరి శిఖరాన్నీ ఈ మంటిని పుట్టి పెరిగే మహాజనులను, అకించనులను క్షుధాఖనులను, గౌరవ గాధాధనులను క్రీర్తిస్తున్నానంటాడు బైరాగి. |
బైరాగి పూర్తిగా అంతర్జాతీయతావాది. మేధావుల్ని జనక్రాంతిలో భాగస్వాములను చేయాలనే తపన ఆయనకుండేది. తమతమ ప్రత్యేక విభాగాలనే అంటిపెట్టుకొని ఉండే మేధావుల్ని హేళన చేస్తూ, ముందుకు రండి, ఈ క్రాంతిలో పాలుపంచుకోండంటూ శ్తివంత౦గా, ఉద్వేగ యుక్తంగా, హృద్యంగా పిలుపిస్తాడు. అంతర్జాతీయతావాదం ఉట్టిపడేట్టుండే కొన్ని పంక్తులు 'ఆవాహన' అన్న కవిత నుంచి చూద్దాం.
'నల్లవారు, తెల్లవారు, పచ్చవారు, రంగురంగుల వారు / దేశభాషలు, వేషభూషల, జాతుల మతాల మధ్య వివక్షతలు / అజ్ఞానాంధ స్వార్థ ద్వంద్వపు దుర్గంధిత బంధవాలనధిగమించి / శ్రమించి, విశ్రమించి, మించి ముందుకు రండి'/
మార్క్స్ సూత్రాలు ఒక దళలో బైరాగిని బాగా ఆకట్టుకున్నాయి. అంతకంటేనూ వూహా స్వర్గ (౮7౦౧141) ఆలోచనల అనుభూతి తీవ్రంగా కన్పిస్తుంది బైరాగిలో. ఆయవ రాసిన 'వార్టత్త వసుంధర అనే కవిత ఒక చక్కని ప్రగతిశీల కవిత విష్ణవభావ కవిత. క్రాంతి విజయవంతమైతే తామేమి చేస్తామో చూపిస్తాడు బైరాగి. సోషలిస్టు దశ కూడా కాదిది. ఒకేసారి సామ్యవాద దశలోకి పయనిస్తున్నట్టు ఒక వూహాస్వష్నచిద్రం గీస్తాడు బైరాగి. సామ్యవాద తరహా వితరణ ఉంటుందని చెబుతూ ఆకలినీ చీకటినీ, అకాల మరణాన్నీ రద్దుచేశామంటాడు. ఆలోచనకూ [్రియాకూమధ్య సాధనకూ సాధ్యానికి మధ్య ఏ సంబంధం ఉండాల్నో స్పష్టపరిచామంటాడు. క్రియలేని ఆలోచనా ఆలోచన లేని క్రియాశీలత ఉండదింక అని ధీమాగా అంటాడు. సాధ్యానికెంత విలువ ఇస్తామో, సాధనకూ అంతే విలువ ఇస్తున్నాం అంటాడు బైరాగి. ఆయన పిడివాదానికి వ్యతిరేకం, మరో సామ్యవాద సూత్రం 'ప్రభుత క్రమేణా కృళిస్తుంది' అనేది ఇలా వ్యక్తమయింది బైరాగి కవితలో : ప్రప్రధమంగా అసలు ప్రభుత ఉండదు బానిసల నెత్తుటిదోగి విరియబూచిన విభుత ఉండదు”. ప్రభుత తగ్గాల్సింది
73
పోయి సోషలిష్టు దేశాల్లో నియంతృత్వం 'ప్రబలమవడం మనం చూశాం. దీన్ని బైరాగి ఆమోదించడు.
చీకటి వాస్తవం నుంచి ఊహాస్వప్షుం వరకు పయనించిన బైరాగి కవిత గంభీర కవిత్వమనీ, తపనతో, (శ్రమతో, అనుభూతి తీవ్రతతో రాసిన కవిత్వమనీ అట్టే గ్రహించవచ్చు. బైరాగి కవితలో ముక్తిబోధ్ లాంటి ప్రవాహ శీలత, స్వైర కల్పనా ఉన్నాయి. బైరాగి బింబాలు తాజాగానూ, అనుభూతి తీవ్రతను స్ఫురింపడేసేవిగానూ ఉన్నాయి. ముక్తిబోధ్‌లోని దురూహ్యత బైరాగిలో కనిపించదు.
ఇక మూల్యాంకనానికొస్తే బైరాగి శ్రీశ్రీ కంటే గొప్ప కవి కాడు. శ్రీశ్రీలో కళాకారుని కుండాల్సిన అన్ననయము, సంక్షిప్తత, సరళం కాకున్నా సామాన్య పాఠకుని ఆమించి, ఆకట్టుకునే శక్తీ ఉన్నాయి. ఏ ఒక్క పదమూ అతిశయమన్పించదు శ్రీశ్రీలో. బైరాగి ఈ విషయమై శ్రద్ద తీసుకోలేదు. శిల్పంపై ధ్యాస తక్కువ అందుకే ఆయన మేగ్గాషల కవి అయినాడు. అయినా, మనం ఏ మాత్రమూ ఉపేక్షించరాని ఆధునక (ప్రగతిశీల కవి ఆలూరి బెరాగి అనేది ఒక సత్యం.
ఉదయం దిన పథతిక - 29-10-92 7వ్మీ
అభ్యుదయ కవి ఆలూరి ఖైరాగి
మౌలికమైన మార్పులు కోరే మానవతావాది (రాడికల్ హ్యూమనిస్టు) బైరాగి. కాని 'నూతిలో గొంతుకలు" చూస్తే బైరాగి నిరాశావాది అనీ, అనుభూతివాది అనీ అన్పించవచ్చు. గాఢమైన అనుభూతి నుంచే బైరాగి కవితలు స్వతఃస్ఫూర్తంగా (3౯0114౬008 గా) ఆవిర్భవించాయి. ప్రగాఢ అనుభూతి ఏ కవికైనా సుగుణమే. అనుభూతికీ, అభ్యుదయానికీ మధ్య వైరుధ్యం లేదు. కవితకు సంవేదన, అనుభూతి, సౌందర్య చేతన అవసరం. ఈ మూడూ పుష్కలంగా వున్నాయి బైరాగిలో. ఆధునిక మానవుని దుర్దశను యీ విధంగా వర్షిస్తాడు బైరాగి -
“వేచదియున్ననాడే ప్రతి ఒక్కడు
మార్పు కొరకు, తీర్పు కొరకు
ఓర్పుగలిగి
చరమఘంటారావం కొరకు
తప్పిపోయిన భావం కొరకు
ప్రతి మనిషీ ఒక గదిలో
చెదపురుగులు ప్రతి గదిలో
ప్రతి మనిషీ ఒక నదిలో
సుడిగుండం (ప్రతి ఎదలో
ప్రతి మనిషీ ఒక మరలో
నుర మేకులు ప్రతి ఎదలో
ప్రతి నునిషీ ఒక సెగలో
పొగ గొట్టం ప్రతి మదిలో
బెబ్బులి రొద ప్రతి హృదిలో”
75
- కురుక్షేత్ర రణ రంగాన అర్జునుని విషాదాన్ని వర్షిస్తూ బైరాగి యుద్దాన్ని నిరసిస్తాడు.
“ఈ యుద్దం ఎవరి కొరకు? ఎవరా గరళ ఫలభోగుణ, 14% కమల కౌతుక మిది? ఎవరా మానసరోగులు?”
- అని అంటాడు అర్జునుడు. కీలకమైన ఒక సందర్భంలో అట్రో యిటో తేల్చుకోవాల్సిన సమయంలో అర్జునుడు ప్రశ్నిస్తూ జనులు సుఖించే నిర్ణయం త్రిస్పృక్రోవాలనుకుంటాడు,
“ఈ విషమ సమస్య నుంచి బయటపడే బాట చూప్పు / నా దుర్చల హృదయంలో - సంశయాల రూపుమాపు / బ్రతుకు చీలు బాటమీద నిలబడియున్నాను నేడు / ఎటుబోతే పూలతోట, ఎటుబోతే వల్లకాడు? / ఈ (ప్రళయ ముహూర్తంత్రో ఏమిటి నా కర్తవ్యం? / ఈ అగ్ని పర్వతంపై ఏ దిక్కున గంతవ్యం / దేనివలన జనులం౦దర్పు తరతరాలు సుఖిస్తారు / మన మహోచ్చ నిర్ణయాన్ని సంప్రీతిని స్మరిస్తారు?”
'దేని వలన జనులందరు తరతరాలు సుఖిస్తారు' - అని మానవాళి పట్ల 'కన్సర్ష్' చూపిస్తున్నాడు అర్జునుడు.
“బీళ్టటి వీడలు” అనే కవితా సంపుటిలో ధ్వంసవాద స్వరాలు విన్సిస్తాయి. “తాజ్‌మహల్ పడగొట్టండోయ్ అనడంలోనూ, ధనస్వాముల వినాశానికై తుఫానుకు పిలుపు యివ్వడంలోనూ ధ్వంసవాదం ధ్వనిస్తుంది. ఇది అతివాద దుందుడుకుతనమే. సాంస్కృతిక రంగంలో 'ఆగమగీతి'లోని అనేక కవితల్లో బైరాగి మానవతావాదం స్పష్టంగా, ఉదాత్తంగా, హుందాగా
"కన్పిస్తుంది.
మానవతావాదులెవ్వరూ మహాత్ముని స్మరించకుండా వుండలేరు. జాతీయ విముక్తి పోరాటానికి అధినేతగా, అహింసా వ్రతాన్ని అతి నిశితంగా పాటించిన మానవతావాదిగా మహాత్మా గాంధీని కొనియాడుతూ ప్రస్తుత సమాజం రాజ్ ఘాట్‌పై పూలమాలలు వేసేందుకు కూడా తరంగాదని అంటూ మతోన్మాదాన్ని నిరసిస్తాడు బైరాగి -
నరుని ఎముకల ఎరువులేని బెత్తెడు చోటు లేదు
నరుని నెత్తుట చిత్తడి కాని పేట లేదు
నెత్తుట తడిసిన మంటిని పూచిన పూలు
నెత్తుటి వాసనలే దాచిన పూలు నీకెందుకు? 76
బైరాగిని పలాయనవాది అని కొందరు చిత్రిస్తారు. బైరాగి కవితల్లో చాలాసార్హు పలాయన భావం ఎక్కడ నుంచి ఎక్కడికో కాస్త గమనించండి ఆయన పలాయనం
“ఈ పైరుకు పట్టుకున్న తెగులు నుంచి
జలగల విశ్వాసం నుంచి
రాబందుల ఆశ్వాసం నుంచి
తోడేళ్ల జాలి నుంచి
*, మొసలికన్నీరు నుంచి
నక్క వినయం నుంచి
కొంగ జపం నుంచి
తుమ్మెద ప్రేమ నుంచి
కుశల ప్రశ్నల నుంచి
'నైశభూమికి అనే కవితలో వాస్తవ జీవిత చీకటినే కాక పరివర్తనకు ప్రతీక ఐన (ప్రొద్దును సృష్టించే కొంతమంది వ్యక్తుల హృత్ స్పందనల గూర్చి రాస్తాడు బైరాగి. అంటాడు-
కాటుక కొండల కావల ప్రొద్దుందని అనేవారు
నిజంకాని నిజమొక్కటి చెబుతున్నారు
పాద్దున్నది చీకటి కొండల క్రింద గనుక ముందు
'పెకలించాలి కాటుక కొండలబారు
ప్రొద్దును సృష్టించాలి ఒక్కొక్క హృత్స్సృందనమిచ్చి
ఒక్కొక్క కిరణసూ(త్రమేర్చి
పరపీడన ప్రధానమైన డబ్బు సమాజంలో అభినయం పాత్రయెక్కువని పరిహసిస్తూ మానవ విలువలు తలకిందైన యీ సమాజంలో చిత్తశుద్దితో కవిత రాయడం కష్టమని చెబుతూ వైరాగి అంటాడు.
నేస్తం, ఇంక కవిత లేదు
ఏమని అడగవద్దు
77
హాసం హర్షాన్ని సూంచిచదు రోదనం విషాదాన్ని సూచించదు రోషం కోపాన్ని సూచించదు నరుని చరిత్ర అభినయమై జీవితం జీవితాన్ని సూచించదు. దిగజారిన విలువలు, పెరిగిన పరాయీకరణ భావన యీ వికృత పరిస్టితికి కారణాలు, 'పాంచజన్యం' అనే కవితలో బైరాగి కాళీమాతకు స్వాగతం పలుకుతాడు. ఆద్యశ్రీ యిక్కడ విప్టవానికి ప్రతీక. ఇందులో వ్యక్తమయ్యేది పురాతనత్వానికి అంతం పలకడం, నూతవత్వాన్ని ఆహ్వానించడం. ప్రాచీనతకు సమాధి కట్టడం అనేది మార్క్సిస్టు అవగాహన కాదు. ్రాభీన వారసత్వాన్ని పదిలపరచుకోవాలంటుంది మార్క్స్‌వాదం. కేవలం నూతనమైనంత మాత్రాన నవీనమైనదంతా ప్రగతిశీలమని భావించనక్కరలేదు. బైరాగి మాటల్ని అతిశయోక్తిగా తీసుకోవాల్సి వుంటుంది. ఈ కవితలో, జరుగుతున్న చెడును గురించి విసృతంగా వర్షించడం, ఆపైన దానికి విరుగుడైన విప్లవాన్ని గురించి సంకేతించడం రెండూ వున్నాయి ముఖ్యమైన యీ కవితలోని కొన్ని పంక్తులు = రామరాజ్యంలో నేస్తం, క్షానుం తప్ప క్షేమం లేదు నవభారత సంగ్రామం జరుగని (గ్రామవముంటూ లేదు ఎటుచూస్తే అటు చీకటి, ఎటుచూస్తే అటు శోకం ధరణీ గర్భాన శిరసు దాచుకొంది ఆలోకం అధికార దుర్మదాంధులు, తెల్ల గుర్రపు రౌతును కత్తిపట్టిన కల్కిని కానలేరు. అదిగో కదలి వస్తున్నది, అమ్మవారు, ఆద్యశక్తి కాళిక, కరాళ కాలనేత్ర జ్వాలిక చండిక కదలి వస్తున్నది ! 78
రక్షనయన, రక్తవసన, రక్తరసన జగద్దాత్రి !
జయం జయం జనతా హృదయ నేశ్రీ క్రాంతిధాత్రీ
సోదరులారా దీక్షగా ఏమిటి త్రవప్వుతున్నారు 1
పురాతన జగత్తుకు సమాధి !
వినూతన జగత్తుకు పునాది !
'ఆవాహన అనే కవితలో కవులు, రచయితలు మేధావులకు పిలుపు యిస్తూ సత్యం, శివం, సుందరంలను మోస్తూ వుంటే సరిపోదు రండి బయటికి ఆచరణ (ప్రపంచంలోకి అంటున్నాడు బైరాగి.
ఎక్కడున్నారు కవులు, రచయితలు, మేధావులు, బుద్ధిజీవులు
బూజుపట్టిన (గ్రంథాలయ గనుల్లో, పరిశోధనశాలల్లో / ఊహాస్మరణ శక్తుల అంతులేని చేలల్లో ఒంటరి సేద్యంచేస్తూ / సత్య సౌందర్యాల శైవ వైవేద్యంమోస్తూ, ఎక్కడున్నారు? / బయటికి రండి! ముందుకు రండి! విసృత వసుధమీదకు / కులం, మతం దేశం రంగుతో (ప్రమేయం లేకుండా / కార్మికులూ కర్షకులూ, ఐక్యమై కదలి రండి - అంటున్నాడు బైరాగి.
ముందుకు రండి కార్మికులు, కర్షకులు,
నకించనులు, క్షుధాధనులు, వ్యధాఖనులు
గనుల్లో, వనుల్లో రకరకాల పనుల్లో
వెచ్చని ఎడారుల్లో, పచ్చని మైదానాల్లో
కొండల్లో, లోయల్లో, అసంఖ్య జనపదాల
కోట్ల కొలది
ళా
నల్లవారు, తెల్లవారు, పచ్చవారు, రలగు రంగులవారు
కల్పితపు సరిహద్దుల ముళ్ల కంచెలు, గళ్ల తడికెలు దాటి 79
(శ్రమించి, విక్రమించి వామన చరణాల్లో
భూమిని ఆ(క్రమించి, మించి ముందుకు రండి. / జనానికి తిరుగుబాట్లు పిలుపు యిస్తున్నప్పటికీ శాంతి పధమే ఉత్తమ మార్గమని చెప్పాడు బైరాగి.
సామ్యవాద వూహా స్వర్గాన్ని చాలామంది వూహించారు. కవిగా బైరాగి కూడా సామ్యవాద దళలో మానవుడు ఎలా వుంటాడో, వూహిస్తూ ఇలా అంటాడు =
మనిషికి మనిషికి మధ్య సంఘర్షం వుండదింక
సహజీవన పావన హర్షం తప్పు,
మనిషికి మనిషికిమధ్య అమర్శ్షం వుండదింక,
సహజ సులభ 'స్నేహాకర్షణ తప్పు / మనిషికి మనిషికి మధ్య,
గోడలుండవు, గోతులుండవు, అదృష్టం గీచిన గీతలుండవు.
ఊహను వాస్తవంచేసి, వాస్తవాన్ని సుందర స్వష్ప్నంచేసి,
మేధకూ క్రియకూ మధ్య, ఆశయానికీ సంశయానికీ మధ్య
సాధనకూ సాధ్యానికి మధ్య పడిన నీడలు తుడిచివేశాం
, కరుగబోసిన ఆయుధాలు, పలుగులు పొరలయ్యాయి
టేంకులు (ట్రాక్టర్షయ్యాయి
విజ్ఞానపు జ్ఞానపు చెర విరగడచేసి, యుద్దానికి బుద్ది చెప్పాం
మానవజాతి ఒకే ప్రాణం, ఒకే గానం, ఒకే ధ్యానం
మానవులంతా సమానం
ఒక్కొక్కడు అందరి కొరకు
అందరు ఒక్కొక్కని కొరకు
చెలిమిలోనే జనుల కలిమి
80
ఈనాడు ప్రచృన్న యుద్దస్టితి లేదు. శాంతి దిశగా ఎన్నో చొరవలు తీసుకుంటున్నారు. మొదటిసారిగా ఆయుధాలను ధ్వంసం చేస్తున్నారు. బైరాగి కల విజయమయ్యే స్తితి రానుందేమో! నూతన ఆలోచనా బీజాలు బైరాగి కవితలో కన్పించడం బైరాగి అభ్యుదయ దృష్టికి ప్రబల తార్కాణం. విశాలాంధ్ర - 28-22-2990 81
6 అట ఆలి టో శ్రీశ్రీ కవితార్హవం “మహాప్రస్థానం
తెలుగు సాహితీ చరిత్రలో 'మహాప్రస్థానం' స్థానం అద్వితీయం. 1933-47ల మధ్య శ్రీశ్రీ రాసిన కవితల సంపుటి మహాప్రస్థానం. ఒక యుగానికి నాంది అది. అభ్యుదయ కవిత్వం ఉద్యమరూపం దాల్చింది ఈ కవితలతోనే, మరీ ముఖ్యంగా ఈ సంపుటి లోని విష్ణవ కాల్పనికతావాద కవితలతోనే.
'మహాప్రస్టానం' కవితల్ని మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు - సౌందర్యానుభూతి కవితలు, వాస్తవికతావాద కవితలు, విప్లవ కాల్పనికతావాద కవితలు. విష్ణవ ప్రేరణయేమిటో దాని భావం, రూపం, ప్రయోజనంయేమిటో అనేక విధాల చిత్రీకరిస్తూ శ్రీశ్రీ చాలా కవితలురాశాడు. కాదేదీ కవిత కనర్హం' అంటూ బుక్కులు రచించాడు. కాలదోషం పట్టినకావ్యసం ప్రదాయాల్ని హేళన చేశాడు. కాని కావ్యానుభూతికి సంబంధించి రాస్తూ శ్రీశ్రీ ప్రానీన అలంకారశాస్త పదజాలన్ని 'కవితా! ఓ కవితా!' అనే కవితలో విరివిగా వుపయోగించుకున్నాడు. “'బ్రహ్మానుభవం' 'దివ్యానుభవం' అనేంతవరకూ వెళ్లాడు. దీన్ని ఒక అతిశయోక్తిగా తీసుకోవాల్సి వుంటుంది. ఇందులో (ప్రధానం శ్రీశ్రీ భావుకత. అంతేగాని శాస్త్రీయ విశ్లేషణ కాదు. కవితను మానవీకరిస్తూ ఆమెను స్మరిస్తే తనకు కన్పించే దృశ్యాల్ని, వినిపించే భాష్యాల్ని ఇలా వివరిస్తాడు శ్రీశ్రీ-
“మరి నిన్ను స్మరిస్తే
నా కగుపించే దృశ్యాలా ?
వినిసించే భాష్యాలా ?
అన్ని సరస్సున వికసించిన వజ్రం |!
ఎగిరే తోహక్యేనం !
ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం 82
ఉరితియబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం !
కళాత్మక భావచిత్రాలతో వాస్తవికతా వాద శ్రవ్య బింబాలతో చక్కగా సాగిన చిత్రీకరణ ఇది. కొవ్య ప్రయోజనం యేమిటో 1937లోనే శ్రీశ్రీ ఇలా స్పష్టం చేశాడు -
“నేనేదో విరచిస్తానని,
నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘూర్షిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా ('మైోగించాలని” శ్రీశ్రీ భావించాడు. అ భావన నిజమయింది. నిజంగానే తెలుగు జాతి జనులు పాడుకొనే మంత్రాలుగా నిలిచాయి మహా ప్రస్థానం” కవితలు.
శ్రీశ్రీ సౌందర్యశాస్త్రం వేరు. 1933లోనే “ ఆకాశపుటెడారిలో కాళ్లుతెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి” అని అనగలిగాడు శ్రీశ్రీ. ఈ భావచిత్రం పూర్తిగా వినూత్నం. ఎంతో అర్థస్పోరకం. కారుణ్య జనకం.
కవిత్వానికి ఆత్మ యేది అనే అంశం పై పూర్వం మీమాంస జరిగింది. కవితకు (ప్రాణం ప్రణవం యేమిటో వివరిస్తూ శ్రీశ్రీ -
“తిలోకాలలో / త్రికాలాలలో,
(శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
కష్ట జీవులకు, / కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ
స్వస్తివాక్యములు సంధానిస్తూ
స్వర్ణవాద్యములు సంరావిస్తూ
వ్యధార్థ జీవిత యధార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీననాదములు
83
జగచ్తుకంతా చప్పులిస్తానోయ్,
కన్మురి కొలిమీ, కుమ్మరిచక్రం,
జాలరి సర్గం / సాలెల మగ్గం,
శదీరకష్టం స్పురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహ్రవృత్నుల సమస్త చివ్నాలు ....
నావినుతించే, "
నా విరుతించే,
నా వినిపించే నవీన గీతికి,
వో విరచించే నవీన రీతికి,
భానం! / భాగ్యం!
ప్రాణం! / ప్రణనం[౯ొ
అనిచాటి చెబుతాడు. కళ పీడితుల పక్షం వహీంచాలనే వాదం శ్రీశ్రీ నిబద్దతను వ్యక్తం చేస్తోంది. ఇక్కడ వృత్తులను మాత్రమే పేర్కొనడం జరిగింది. పారిశ్రామిక కార్మికులను కాదు అని వాదించడం సబబుకాదు. ఈ కవిత రాసింది 1937లో అని మనం గుర్తుంచుకోవాలి. ఈ కవితలో పీడితుల పట్ట శ్రీశ్రీ ప్రగాఢ సంవేదన వ్యక్తమయింది. దీన్ని సందేహించడం అన్యాయం. మరింత అనేశంతో “నవ కవిత"లో శ్రీశ్రీ వివిధ భావచిత్రాలద్వారా మారిన పరిస్థితిలో మారిన మానసికతకు అనుగుణంగా కవిత్వం రాసేందుకు ఏమేమి కావాలో సంకేతిస్తాడు. స్విన్‌బర్న్ కవికి నివాళులర్పిస్తూ ఆతనికవిత “ఎర్ర కాంతుల ఇనోదయంి, “రెక్కవిప్పిన రివల్యూషన్ " అని ఆంటాడు.. "శైశవ గీతి , 'గంటలు", “మానవుడా” లాంటి కవితల్లో పదవిన్యాసం ప్రదర్శిస్తూ అమాయకత్వంతో కూడిన అందమైన కవిత్వం అందిస్తాడు శ్రీశ్రీ,
“మహాప్రస్థానం”లో వాస్తవికతానాద కవితల సంఖ్య హెచ్చు. వాటిలో 'బాటసారి, భిక్షువర్షీయసి', 'ఆకాశదీపం', 'పేదలు' సంధ్యాసమస్యలు' కవితలు ముఖ్యమైనవి. 'బాటసారొలో కష్టకాలంలో కూటికోసం, కూలికోసం పల్లే విడిచి పట్టణంలో బతుకుదామని వెళ్తున్న ఒక కష్టజీవి మార్గమధ్యంలోనే చనిపోవడం చి్రించబడింది ఇప్పుటి కింకా పల్లెల్నుంచి పట్నాలకెళ్లే జనం సంఖ్య సేరిగిందే కాని తరగ లేదు. ఆనాడు రవాణా సౌకర్యాల, ఆరోగ్య సౌకర్యాల కొరత కొట్ట వచ్చినట్టుండేది, ఈనాడు సట్నాలలో పనులు దొరకక, దొరికినా సరియైన వసతికి నోచుకోక దిక్కుతోచని స్థితిలో వుండేవారు కోట్ట సంఖ్యలో వున్నారు.
వ
“ఆకాశదీపం” కవితలో మరణించిన ఒక దురదృష్టజీవి గదిని గురించి, అక్కడి దీపం గురించి విచిత్రమైన భావచిత్రాలతో వర్లనవుంది. గదిలో ఎవరూ లేరు. కపాల గణముల కనుకొలకులలో ఒకటివలె చూపులేని చూపులతో తేరిచూస్తున్నది గది అని అంటాడు శ్రీశ్రీ, ఆ గదిలోనే ఉదయం ఆరున్నరకు ఒక దురదృష్ట జీవి ఆరిపోయాడు. సాయంత్రం ఆరున్నరకు గది నిళ్ళబ్దంగా వుంది. గదిలో ఎవరూ లేరు. ఒక దీపం తప్ప ఆ దీపమూ ఆరిపోయింది. తారగా మారిపోయింది అని ఆంటాడు శ్రీశ్రీ. తనవారంటూ ఎవరూ లేని ఒక దురదృష్టజీవి మృత్యువు ఎంత ఘోరంగా వుంటుందో ఆ గదిని గురించిన శ్రీశ్రీ భావచిత్రం వ్యక్తం చేస్తోంది.
వాస్తవికతావాద కవితల్లో తలమానికం లాంటిది “భిక్షువర్షీయసి జబ్బు చేసి అడుక్కునే శక్తిలేక దారిపక్క చెట్టుకింద కూర్చొనివుంది ఒక ముసలామె. బతుకంటే కోర్కె సడలి బండరాతి లాగ పడివున్నది ఆమె ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని ప్రశ్నిస్తూ వెళిపోయింది వెర్రిగాలి. సమాజం సామాజిక వ్యవస్త దీనిక్కారణం అనిధ్వని. ఎమీపట్టనట్టు ఎముకముక్క కొరుక్కుంటున్నది ఒక కుక్క. ఒక ఈగను పడవేసుకొని తొందరగా తాలగె తొండ చీకటి కమ్మింది, దుమ్ము రేగింది. ఎగిరివచ్చి ఒక ఎంగిలాకు పడింది. కుక్క, తొండ సమాజపు పశుత్నానికి సంకేతాలు, సార్ధక భావచిత్రాలు.
(ప్రపంచం మిధ్య అని భావించే మిథ్యావాదం హిందూ వేదాంతంలో ఒక అంతర్భాగం. ఇటువంటి భావాలున్న వేదాంతుల్ని ప్రశ్నల తూటాలతో ఎదుర్కొంటాడు శ్రీశ్రీ -
జమీందారు రోల్ఫు కారు
మాయంటావూ ? బాబూ
ఏమంటావు ?
మహారాజు మనీపర్పు
మాయంటావూ ? స్వామీ
ఏమంటావు ?
పాలికాపు నుదుటి చెమట,
కూలివాని గుండె చెరువు,
బిచ్చగాని కడుపు కరువు
మూయంటావూ ?
85
'వాడు' అనే కవితలో నిజమైన కష్టాలు వెల్లడించిన కార్మికులమీద దౌర్జన్యం సాగించే యజమానుల ఆక్రమాన్ని వ్యక్తం చేస్తాడు శ్రీశ్రీ. దౌర్జన్యంతో కొల్లగొట్టుతనాన్ని కొనసాగించే యాజమాన్యాన్ని నిరసిస్తాడు. 'వ్యత్యాసం' అన్న కవితలో వర్షపోరాటాన్ని వస్తువుగా తీసుకుంటాడు శ్రీశ్రీ వున్నవాళ్లను వడ్డించిన విస్తరి మీ జీవితం" అని హేళన చేస్తాడు. ఈ కవిత (ప్రకటనల కవిత. కవితకు కేంద్రబిందువు ఈక్రింది ప్రకటన.
“అలజడి మూ జీవితం
ఆందోళన మా ఊపిరి
తిరుగుబాటు మా వేదాంతం”
ఇది పీడితుల వాదన, పీడితుల వేదాంతం, పీడితుల ప్రతిజ్ఞ,
అప్పులవాళ్లు పెట్టే బాధలు భరించలేక బిడ్డల ఆకలిచూస్తూ సహించలేక వురిపోసుక చనిపోవడమా, సముద్రమున పడి చనిపోవడమా అనేది సమస్యగా ఘనీభవించిందాక సంసారికి “సంధ్యా సమస్యలు' అనే కవితలో. ఈ భావ చిత్రంతోపాటు మరో రెండు దృళ్యచిత్రాలున్నాయి. ఒక విద్యార్థికి ఏ పిక్సృరు చూడాలనే సమస్య, ఒక ఉద్యోగికి హోటల్‌లో దేనికి ఆర్జరివ్వాలనే సమస్య ఎదురౌతాయి. అవీ వాళ్లకు సమస్యలే. కాని, ఒక పేద సంసారి సమస్య ఆత్మహత్య ఎలాచేసుకోవడమా అని. మధ్య తరగతి విద్యార్థి, ఉద్యోగి సమస్యలు అసలు సమస్యలే కావు. సమస్యల్ని పోల్చి చూపడం ద్వారా కవిత వ్యంగ్యాత్మకంగా తయారయింది.
మరో వాస్తవికతావాద కవిత “నీడలు. ఇది 19-6-1947న రాయబడింది. అంటీ 'జగన్నాథుని రధచక్రాలు' రాసిన తర్వాతన్నమాట. విప్ణన కాల్పనికతావాద కవితలు ఒకపక్క రాస్తున్నా శ్రీశ్రీ వాస్తవికతా వాదాన్ని వదిలిపెట్టలేదు. “మహాప్రస్థానం” కవితల్లో అన్నిటికన్నా అఖిర్న రాసిన ఈ కవితలో పేదవాళ్ళ పరిస్థితిని అనేక భావ చిత్రాలతో శక్తివంతంగా చిత్రిస్తాడు శ్రీశ్రీ పొగమేడలు, పూలులేని కాడలు, ఎడారిలో ఓడలు లాంటి భావ చిత్రాలతో పేదల దైన్యాన్ని వర్లిస్తాడు. కాని కవి నిరాశావాది కాడు. '“అభ్యుదయం' కవితలో నవజీవన శుభసమయానికి స్వాగతం పలుకుతాడు. విష్టవం తర్వాత వచ్చిన శుభసమయం, అభ్యుదయం!
ఆ విప్లవంలో మరణించిన యువయోధుల ఇంకిన, తెగపోయిన, కొన్నెత్తురు విపంచికలను స్పందనతో సంవేదనతో స్ఫురణకు తెచ్చుకుంటాడు. కొల్లగొట్టుతనానికి వ్యతిరేకంగా 'వాడు' అనే కవితలో పనిమానివేసిన, జీవనానికి ఆసరా చూపించమని అడిగిన కష్టజీవులమీద యజమానులు చూపే దౌర్జన్యాన్ని వర్షిస్తాడు శ్రీశ్రీ. శ్రమజీవుల్ని పీడించడంవల్లనే కొల్లగొట్టుతనం ఫెరిగేది అనే సత్యాన్ని ఈ కవిత ద్వారా వెల్లడిస్తాడు.
86
'నిజంగానే' (1941?) అనే కవితలో శ్రీశ్రీ మానవతా వాదం స్పష్టంగా వ్యక్తమయింది. శ్రీశ్రీ ఆశావాది. అయినా భవిష్యత్తులో విష్టవాత్మక మార్పు నిజంగానే వస్తుందా అని ప్రశ్నిస్తాడు. దారుణ ద్వేషాస్లి పెంచే దానవత్వం నశిస్తుందా అని సందేహిస్తాడు. 1941లో నిజంగానే దొనవత్వం నశించలేదు. నిజంగానే దానవులైన నాజీలు తెచ్చిన రెండవ ప్రపంచ యుద్ధంలో ఏడు కోట్టమంది బలి అయినారు.
చరిత్రను గురించిన శాస్త్రీయ అవగాహన అవసరం, రాజులూ రాణులూ కాదు చరిత్రను సృష్టించింది; చరిత్రను నడిపించేది జనం. వర్షపోరాటాలద్యారా చరిత్ర ముందుకు నడిచింది. ఒక దేళ చరిత్ర అంటే అర్దం కేవలం చారిత్రిక తారీఖులు దస్తావేజులు కాదు; ఏ దేశం ఏ కాలంలో సాధించిందేమిటి ? సాహిత్య రంగంలో కళారంగంలో విజ్ఞానరంగంలో ఆ సమాజం సాధించిందేమిటి ? ఇది కూడ చరిత్రలో అంతర్భాగమే దీన్ని గురించే శ్రీశ్రీ “దేశ చరిత్రలు” అనే కవిత రాశాడు.
“ని దేశ చరిత్ర చూచినా
ఏ మున్నది గర్వ కారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరిపీడన పరాయణత్వం”
బలవంతుల దుర్చలజాతిని బానిసలు కావించారు. హింసతో కాలానికి కత్తుల వంతెన కట్టారు. కాని 1917లో అక్టోబరు విష్ణవంతో కాలం మారింది. ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ ఒక జాతిని వేరొక జాతీ పీడించే సాంఘిక ధర్మం ఆంతరించి సమసమాజానికి మార్గం సుగమం అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీశ్రీ అంటాడు -
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా 2 ఇక పైసాగదు
ఈ కవిత 1938లో రాశాడు శ్రీశ్రీ. సోషలిస్టృ దేశాల సముదాయం లేదానాడు. కాని శ్రీశ్రీ వూహించాడు. భవిష్యత్తులో కొల్లగొట్టుతనం సమసిపోతుందనీ సాంఘిక న్యాయం అందరికీ సమకూరుతుందనీ, జాతుల అణచివేత ఆగిపోతుందనీ ఆశించాడు. వలసపొలన అంతం అవుతుందని ఈ కవితలో ఆశాభావం వ్యక్తం అయింది. చరిత్రను గురించిన అభ్యుదయ
8/7
దృక్పధం ఇది. ఈ అవగాహనతో శ్రీశ్రీ ముందుచూపు స్పష్టమవుతుంది. విష్ణవం వస్తుందనీ, జనం విష్ణవాన్ని సాధిస్తారనీ, పీడితులకు తాడితులకు బుద్దిజీవులు తోడ్పడతారని భావిస్తాడు శ్రీశ్రీ. ఈ రాజ్యం దగాపడిన తమ్ములవళం కావాలని మనసారా కోరుకుంటాడు. మరో ప్రపంచాన్ని వూహిస్తాడు. మరో ప్రపంచం వైపు జనం పురోగమించాలనీ, భావవేగమున 'ప్రసరించాలనీ, ప్రలయ ఘోషతో ముందుకు సాగాలనీ, దారిలో వచ్చే ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించాలనీ ఉద్బోధిస్తాడు. 1934లో రాసిన 'మహాహప్రస్టానం గేయానికి ఇది వస్తువు. విప్ణవ కాల్పనికతావాదానికి వూపిరి. ఇది జనగీతం, విప్లవానికి పిలుపు. జన 'సైన్యవు మార్చింగ్ సాంగ్. . 'జగన్నాధుని రధచక్రాలు (1940) అనే కవిత శ్రీశ్రీ విప్లవ కాల్పనికతకు మచ్చుతునక, పతితులు, పీడితులు బాధాసర్పదప్టులకు పూరడింపు సర్వస్వం పోగొట్టుకున్న ఈ అలగాజనాన్ని పట్టించుకునే వాడులేడు. శ్రీశ్రీ వీళ్ల పక్షం వహిస్తాడు సంవేదన శీలియైన ఒక కవిగా వీళ్లందరినీ క్షుద్రవర్గంగా భావించి కొట్టిపారవేయలేదు. బాధించబడే సకల జనానికి వర్తిస్తుంది ఈ కవిత. కారుణ్య భావం ఇందులో ప్రధానం. ఊరవతల నీరింకిన చెరువుపక్క, చెట్టునీడ - గోనెలతో, కుండలతో, ఎటుచూస్తే అటు చీకటి అటు దుఃఖం, పటునిరాశ చెరసొలలు, ఉరకొయ్యలు, కాలునలో ఆత్మహత్య |! దగాపడిన తమ్ములార | మీ బాధలు నే నెరుగుదును... వీరందరికోసం కలం పట్టానని జగన్నాధుని రధచక్రాల్ని భూమార్గంపట్టిస్తానని మాటిస్తాడు శ్రీశ్రీ జగన్నాధుని రథచక్రాలొస్తున్నాయనీ, దగాపడిన తము గళ్లు ఇక యేడ్వకూడదనీ అంటూ రధచక్రాలొచ్చేశాయ్ ఇక “ఈ శాజ్యం మీదేనండి! మీ రాజ్యం మీరేలండి!' అని పట్టరాని ఆవేశంతో భరోసా ఇస్తాడు. దీని కోసం బాధా సర్పదష్టులైన జనం ఐక్యంగా కలసిరావడం (ప్రధానమని కవి భావం. 'మహాప్రస్థానం'లో 'పదండి ముందుకు' అని నినదించిన శ్రీశ్రీ 88
జగన్నాథ రథచ్రాలొచ్చేశాయ్ “ఈ లోకం మీదేనండి మీ రాజ్యం మీరేలండి" అంటూ నిజంగానే జనానికి మహాషప్రస్టాన ధ్యేయం నిర్దేశిస్తాడు. ఇది శ్రీశ్రీ కవితార్షవ ప్రస్థానం. ఇంతటితో ఆగలేదు శ్రీశ్రీ. మరొకడుగు ముందుకు వేశాడు. విష్ణవ కాల్పనికతతో ఆగక విసృతార్థంలో సోషలిస్టు వాస్తవికతను స్పృశించాడు. రెండవ (ప్రపంచ యుద్దంలో నాజీలు సోవియట్ యూనియన్‌పై దురాక్రమణ చేసినపుడు సోవియట్ వైమానికదళం రంగంలోకి దూకింది ఆ వార్త విని శ్రీశ్రీ 1941లో ఉద్వేగంతో 'గర్టించు రష్యా అనే అద్భుతమైన కవిత రాశాడు. పతిత నిర్ణతిక ప్రపంచత్రాతా' అని సోవియట్ రష్యాను సంబోధించాడు. పుష్కిన్, చేహొన్, తొల్‌స్తోయ్ పుట్టిన దేశాన్ని, ప్రపంచ సాహితీ ప్రగతికి ఎంతగానో దోహదం చేసిన రష్యాను, లెనిన్ సారధ్యంలో విప్లవం సాధించిన రష్యాను ్రశంసిస్తాడు శ్రీశ్రీ. పోరాటంలోకి దిగిన సోవియట్ రష్యాతో సమస్త 'ప్రగతిశీల శక్తుల తరపున పూర్తి సంఘీభావం వ్యక్తం చేస్తాడు. పదాలు ఎర్రజెండాలై ముందుకు కదుల్తాయి. సోవియట్ యూనియన్ ఈ సమరంలో విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తాడు. అదే నిజమయింది. నాజీలు నాశనమైనారు. 1941లో రాసిన ఈ గేయం అనాటి శ్రీశ్రీ చారిత్రిక యధార్థతత్వం ఎరుకను తెలియచేస్తుంది. సోషలిస్టు వాస్తవికతకు బాటవేస్తుంది ఈ కవిత.
వాస్తవికతావాద, విప్టవ కాల్పనికతావాద కవితలతో సోషలిస్టు వాస్తవికతావాద స్పర్శతో అజరామరమైన రచన 'మహా్రస్థానం'. ఈ కవితార్షవం నిత్యనూతనం అన్పిస్తుంది గేయైలి వుంది. సంభాషణ శైలి వుంది. ప్రకటన కవిత్వం వుంది. ఈ సమస్త రూపాలు ఈ కవితార్షవపు అలలే.
అభ్యుదయ నూసపత్రిక్త జూన్ 1988, 89
ఇని సాహితీ రంగంలో రా రా సూత్రీకరణలు రారా గొప్ప మేధావి - మార్కిస్టు మేధావి. రారా గొప్ప విమర్శకుడు - మార్క్సిస్టు విమర్శకుడు. సాహిత్యానికి సంబంధించి ఆయనకు స్పష్టమైన అభ్యుదయ అవగాహన ఉంది. ఆయన సాహిత్యాన్ని ఆస్వాదిస్తాడు, విళ్లేషిస్తాడు, అంచనావేసి వర్గీకరిస్తాడు. ఈ (క్రమం ఆయన చేసిన అనేక పుస్తక సమీక్షల్లో, సాహితీ విమర్శల్లో మనం చూస్తాం. ఈ సందర్భంగా ఆయన కొంతమంది రచయితలను గూర్చి, కొన్ని సాహితీ ధోరణులను గూర్చి చేసిన సూత్రీకరణల్ని పరిశీలించే ప్రయత్నమే ఈ వ్యాసం. మొదట మహాకవి గురజాడనే తీసుకుందాం. గురజాడ గొప్పతనాన్ని పూర్తిగా గుర్తించి కూడ, గురజాడ సాహితీ పరిమితుల్ని గుర్తుచేస్తాడు రారా. గురజాడ గొప్పతనాన్ని గూర్చి రాస్తూ రారా అంటాడు - “గురజాడ గొప్పతనం ఆయన శిల్పంలో లేదు. అది ఆయన రచనల్లోని జీవిత వాస్తవంలో ఉంది, విప్లవాత్మక భావనలో ఉంది.” యుగద్రష్ట గురజాడ ముందుచూపును గురించి రారా భావుకమైన శైలిలో ఇలా ఆంటాడు
- “ఆయనది యెంత ముందుచూపు అంటే, తన సమకాలిక ప్రగతి ఉద్యమాల పట్ట సానుభూతి చూపలేనంత ముందుచూపు; తన సమకాలిక ప్రగతిశీలురలోని లోటుపాట్లను బహిర్గతం చేయడమే తన నాటకాలలోనూ, కధలలోనూ ఇతివృత్తంగా పెట్టుకునేంత ముందుచూపు; అదే ఒక దుర్గుణంగా తమయారయిందా అని అనిపించేటంత బలంగా ఉండింది ఆ ముందుచూపు”. రారాకు గురజాడ రచనల పరిమితులు కూడ తెలుసు గురజాడ కవిత్వాన్ని గూర్చి నిద్ద్వంద్వంగొ ఇలా సూత్రీకరిస్తాడు - “గురజాడ రాసిన ఖండికల్లో విష్ణవాత్మక భావ సంపద వున్నంతగా కవితా సౌరభం లేదని గుర్తించడం వల్ల మహోన్నతమయిన ఆయన వ్యక్తిత్వానికి జరిగే నష్టమేమీ లేదు.” గురజాడను సరిగానే ఆంచనా వేసినాడు రారా కాని గురజాడతో పోలుస్తూ వీరేశలింగం 90
పంతులు గారికి ఆధునికతత్వం ఒంటబట్టలేదనీ, మనుస్మృతీ, పరాశర స్మృతీ, యాజ్ఞవల్క్య స్మృతీ పరించిన తర్వాత గానీ బాల్య వివాహాల గురించీ, కన్యాశుల్కం గురించీ ఒక సిరమైన అభిప్రాయానికి రాలేకపోయినాడు వీరేశలింగం పంతులు అని రారా అంటాడు. (స్త్రీ విద్యకూ, వితంతు ఫునర్వివాహానికీ, బాల్య వివాహ వ్యతిరీకతకూ జీవితమే అర్చించిన వీరేశలింగం పంతులు స్మృతులను తన ధ్యేయానికి సాధనంగా వాడుకొన్నాడు. ఛాందసుల నోరు మూయించేందుకు ఇది అవసర మయింది సం'ప్రదాయవాదుల్ని సంప్రదాయ సాహిత్యం ఆధారంగా ఖండించడం వీరేశలింగం పంతులు గారి ఉద్దేశం. దీని కోసం స్మృతుల్ని చదవడం సబబుగానే వుంది. ఆధునికతను పూర్తిగా వ్యతిరేకించిన వాడు విశ్శనాధ సత్యనారాయణ" సనాతన, సంప్రదాయవాద శక్తులకు ప్రాతినిధ్యం వహించినాడు విశ్చనాథ. అతన్ని రారా జగదేక తిర్యక్ బుద్ది” అని పేర్కొనినాడు సంప్రదాయంలో విశ్వాసం వున్న డా రాధాకృష్ణన్ విశ్ళనాధ కంటె మెరుగు, ఉదారవాది; రాధాకృష్ణన్ ౧013812౧ అయితే విశ్చనాధ 0200 6 ఛాందసుడు అని పోల్చి చెప్పినాడు రారా ఆయన మాటల్లో చెప్పాలంటే హిందూమతంలో సర్వేపల్లి బూర్జువా హేతువాదానికి ప్రతీక కాగా విశ్చనాధ ప్యూడల్ మూరత్వానికి ప్రతీక.' ఈ సూత్రీకరణ బౌచిత్యంతో కూడుకొని ఉంది. సంప్రదాయాన్నీ, ఆధునికతనూ గూర్చి చర్చిస్తున్నపుడు టాగూర్‌ను గురించి రారా రాసిన వాక్యాలు జ్ఞాపకం రాకమానవు. టాగూర్‌ది దైవీకృత, సౌందర్య వాదం (౧౭166 తీం811610 8౧) అని సూత్రీకరించాడు రారా. ముఖ్యంగా ఆంగ్లంలో వచ్చిన టాగూర్ “గత్రాంజలి” చూసి ఇలా రాశాడాయన. టాగూర్ ప్రముఖంగా ఒక కవి. నేను కవిని, - “అమి కబి అని నొక్కి చెబుతాడు టాగూర్. వైరాగ్య సాధనలో నాకు ముక్తి లేదు అని - బైరాగ్య సాధనే ముక్తి? సే ఆమార్ నయ్” అనే కవిత ద్వారా ప్రకటిస్తాడు “అమి తోమాదేర్ లోక్' అంటే 'నేను మీలో ఒకణ్ళి అని జనాన్ని సంబోధిస్తూ అంటాడు టాగూర్. 1905లో వంగవిభజన సమీపిస్తున్నపుడు సమానాంతర ప్రభుత్వాన్ని స్థాపించాల్సిందిగా పిలుపు ఇస్తాడు టాగూర్ కలకత్తా టౌన్‌హాల్‌లో జరిగిన ఒక సభలో పత్రం సమర్పిస్తూ. దేశ పునరుజ్జీవనం (౧6౧49౩4౧౦9) దశలో టాగూర్ సాంస్కృతిక రంగంలో (ప్రముఖ పాత్ర వహించాడనేది దాచేస్తే దాగని సత్యం. ఆతని ప్రేరణతో దేశంలో పలు (ప్రాంతాల్లో పలు భాషల్లో భావకవిత వివిధ రూపాల్లో వచ్చింది. తెలుగులో కృష్ణశాస్త్రి, హిందీలో నిరాలా టాగూర్ ప్రభావంతో భావకవిత్వం రాసిన వారే, భావ కవితను గూర్చి రారా విమర్శ ఇలా సాగింది - “కవిత్వపు ఆనందం వ్యక్తిని (ఆటు కవినీ ఇటు పారకునీ) మత్తులో ముంచి, (క్రియారహితుణ్ని చేస్తుంది : 91
సామాజిక జీవితం నుండి విడదీసి ఒంటరివాణ్నీ చేసి, నిశ్చేష్టుద్ని చేస్తుంది” రారా ఇలా సూత్రీకరిస్తాడు.. భావ కవిత్వం ఆనందం ద్యారా (ప్రమత్తతా పర్యవసాయి . భావ కవిత్వాన్ని ఇలా అంచనా వేయటం అవైజ్ఞానికం. రారా టాగూర్షి 19వ శతాబ్దం వాడు అని అంటాడు. ఇది ఖచ్చితంగా పొరపాటు అవగాహన. ఈ పొరపాటే భావకవితా నిరసనకు దారి తీసింది. సాహిత్యంలో ఒక ధోరణి పోయి మరో ధోరణి వచ్చినపుడు ఆ గతించిన ధోరణిని తెగనాడడం మనం చూస్తున్నదే. కాని ఇన్నేళ్ల తర్వాత మనం భావ కవితను గూర్చిన సరిమైన సమగ్రమైన అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. | = హిందీలో భావకవితా ధోరణిని గురించి రాస్తూ ప్రముఖ విమర్శకుడు (ప్రొఫెసర్ నామ్‌వర్ సింగ్ అంటాడు “ఆత్మీయత, ప్రకృతిపట్ల ప్రేమ, సౌందర్య భావన సంవేదనా శీలత, నిరంతర జిజ్ఞాస, జిజీవిషు జీవితాన్ని ఉన్నతం చేయాలనే తపన, వీటన్నిటి కోసం పోరాడేందుకు కావాల్సిన ప్రేరణ భావ కవిత శాళ్ళుత సందేశం. భావ కవిత మనల్ని రసమగ్నం చేసి నిష్కియుల్నిగా చేయదు, అది మనల్ని జాగృతం చేసి క్రియాశీలురుగా చేస్తుంది అది మన భావనలను విస్తృతం చేస్తుంది మన అనుభూతిని ప్రగాఢం చేస్తుంది: మన భావాల్ని సంస్కరిస్తుంది, మన భావాల్ని మార్చుతుంది ' ఈ మాటల్లో రారా విమర్శకు జవాబు వుంది. నేడు రెండు శక్తులమధ్య తీవ్రమైన వైరుధ్యం నెలకొని వుంది. ఆధునికతకూ, వివిధ రకాల పురాస్రామాణ్యవాదాలకూ అంటే [౧౫౧6౬౧౭౧1౭ 5098 కూ మధ్య, జిజీవిషకూ మారణళక్తులకూ మధ్య వున్న వైరుధ్యాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ స్థితిలో పునరుజ్జీవనాన్ని (౧౯4 8841108 ను) ప్రతిబింబిస్తూ జిజీవిషనూ భావుకతనూ వ్యక్తంచేసే భావకవితను మనం అభ్యుదయాత్మకంగానే పరిగణించాల్సి వుంటుంది. నేటి నూతన ఆలోచనా ధోరణికి అది అనుగుణంగా వుంది. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు చలాన్ని సరిగానే అంచనా వేశారు. చలం సాహిత్యాన్ని స్టితిశీలముగా కాక, గతిశీలముగా గుర్తించి చలం సాహితీ పరిణామాన్ని పరిశీలిస్తాడు రారా. చలం సాహిత్యం (క్రమంగా శరీరం, హృదయం, ఆత్మ అనే మూడు దశలుగా అభివృద్ది చెందిందంటాడు ఆయన. ఈ మూడు దశల్లోనూ స్వసుఖవాదం (11౯0౦ 51) ప్రబలంగా వుందని నిరూపిస్తాడు. అలా అని రారా చలాన్ని తక్కువగా అంచనా వెయ్యలేదు. చలం నిజాయితీనీ, ఆయన ఇచ్చిన కొత్త చైతన్యాన్నీ, నూతన సౌందర్య లోకాల్ని చాలా మెచ్చుకుంటాడు 92
రారా. ఇది ఆయన సమతుల్య (88 &ఇ౧౦66) దృష్టికి నిదర్శనం,
ఇటీవలి వరకు ఆలూరి బైరాగిని గురించి పట్టించుకున్న వాళ్లు లేరు. బైరాగి, ప్రతిభలో శ్రీశ్రీతో పోల్చదగిన కవి. 'నూతిలో గొంతుకలు", 'ఆగమ గీతి" లాంటి కవితా సంపుటాలు అరుదుగానే వస్తుంటాయి. అరసం కూడా బైరాగిని నిర్లక్ష్యం చేసింది. 'ఆగమగతి'లో బైరాగి రాసిన “వాగ్ధత్త వసుంధర” లాంటి గొప్ప అభ్యుదయ కవితలు వున్నాయి. ఇవి చూడకముందే, 'నూతిలో గొంతుకలు చదివి రారా బైరాగిని గూర్చి ఇలా రాస్తాడు - “బైరాగ్షి 'నూతిలో గొంతుక్రలు' తెలుగు కవిత్వంలోని ఏకైక తాత్విక కావ్యం. అంద్యులోని సిద్ధాంతాలూ, తాత్విక సూత్రాలూ మానవ హృదంతరాళంలోని గాఢమైన ఆరాటం నుండి, తీవ్రమైన అవేదన నుండి ఉద్భవిస్తాయి. జిజ్ఞాసువు హృదయంలోని తపన, అన్వేషి గుండెలోని ఆర్తి - అవే తాత్విక చర్చల రూపం ధరిస్తాయి. అందుకే అది తెలుగు సాహిత్యంలో ఒక అప్పురూపమయిన కొవ్యమయింది.”
సొదుం జయరామ్ రాసిన “వాడిన మల్లెలు" అనే కధల సంపుటిని సమీక్షిస్తూ రారా రూపొందించిన సూత్రం ఇది : “శిల్పం అనేది ఒక సాధనం మాత్రమే. శిల్చం ద్వారా సాధించ వలసింది కళ. కళ అంటే నేరుగా హృదయాన్ని తాకేది. కళ అంటే అనుభూత్తి. అనుభూతి లేని రచన గొప్ప 0[౧4౯| ౩44115111౧ (శిల్పనైపుణ్యం) అనిపించుకోవచ్చుగానీ కళ అనిపించుకోదు.” మరొక చోట అనుభూతిని గూర్చి రాస్తూ రారా అంటాడు - “అనుభూతికి ఉపకరణంగా వున్నంతవరకే ధ్వనికి విలువ. లేకపోతే దానికి దమ్మిడీ విలువ లేదు.”
అనుభూతి, శిల్పాలను గూర్చిన ఈ స్పష్టమైన అవగాహనతో రారా శ్రీశ్రీ గేయాల్ని మెచ్చుకుంటాడు. మార్క్టిస్టు భావజాలం అర్ధం చేసుకోలేని అద్దేపల్లి శ్రీశ్రీని గురించి చేసిన పొగడ్తల్ని ఎద్దేవా చేస్తాడు రారా. 'దేశ చరిత్రలు' లాంటి కవితల్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రను గురించిన శాస్త్రీయ అవగాహన కొంతైనా అవసరం. అద్దేపల్లికున్న అరకొర జ్ఞానం 'దేశచరిత్రలు' లాంటి కవితల్ని అర్థం చేసుకోనివుదు ఆస్వాదించనియ్యదు, అని రారా భావన,
తీశ్రీ కవిత్వం మీద దారుణమైన విమర్శలొచ్చాయి. వీటిని ఖండిస్తూ రారా అంటాడు
- శ్రీశ్రీ కవిత్వం ఒక నూతన సమాజ చైతన్యంలో భాగం. ఒక సామాజిక విస్ణవోద్యమానికి ప్రతినిధి. అందుకనే అది పుట్టినప్పటినుండీ దానిమీద పరపీడనపరాయణులూ, వాళ్లు వుంచుకున్న నటవిటగాయక గణికలూ పగబూనినారు. వీళ్లు చేసే విషప్రచార రూపాంతరమే అద్దేపల్లి గారి శ్రీశ్రీ పొగడ్తల ఉద్యమం. “అద్దేపల్లి శ్రీశ్రీని ఇండించడు. (ప్రాచీన కావ్యశాస్త్రం
93
ఆధారంగా అర్జాలు లాగి పొగడుతాడు”. నిపరీతార్జాలు తీస్తాడు. దీన్ని రారా నిరసించినాడు. దిగంబర కవుల్నీ, వాళ్లు రాసినదాన్నీ గురించి కుండబద్దలు కొట్టినట్టు రారా ఇలా సూత్రీకరిస్తాడు : "వీళ్ల కోపం అంటే దిగంబర కవుల కోపం నిప్పులు గక్కుతున్నట్టు అర్ధమవుతుంది. కాని పాఠకులకు సమాజం మీద కోపం రాదు. ఈ కుళ్ళు సమాజం మీదా, ఈ కుళ్ళకు కారకులయిన వాళ్ళమీదా మనకు కొంతైనా కోపం కలిగితే అప్పుడు మాత్రమే
- అది కవిత్వమవుతుంది. అది లేదు గనుకనే వీళ్లు రాసింది కవిత్వం కాలేకపోతున్నది.” రారా రాస్తాడు “సమాజం కుళ్ళిపోయిన మాట నిజమే. సమాజం పతనమైన మాట నిజమే. విష్ణవాన్లి జ్వాలలో తప్ప సంస్కరించడానికి సాధ్యం కానంతగా పతనమైన మాట నిజమే. కానీ, ఎంత పతనమయిన్నా ఈ దిగంబర పైత్యాన్ని కవిత్వమను కునేటంతగా పతనమయిందా?” అని ప్రలిస్తాడు.
(ప్రపంచంలో పెచ్చరిల్లిపోతున్న పుఠాప్రామాణ్య వాదాన్ని (౯౮౦4115004 91 ను) ఎదుర్కొనేందుకు పదునైన ఆయుధం ఆధునికత, రారా అక్షరాలా ప్రగతిశీల ఆధునికతా నిబద్దుడు. ఆధునికతా శక్తులన్నీ ఏకమై అన్ని ఛాందసవాదాలను ఎదుర్కొని (ప్రగతిశీల (ప్రపంచంలోకి ఆడుగుపెట్టండి అనేది రాచమల్లు రామచంద్రారెడ్డి గారి సందేశం.
అభ్పూదయ మానవ్యతిక్తు డీసెందిరు 794% 94
భావ చిత్రాల సౌందర్యం
ఒక అమ్మాయి అందంగా వుంది అంటే మనకు వెంటనే అర్థం స్ఫురిస్తుంది - అందం అనే పదానికి నిర్వచనం తెలియకపోయినా, అర్థం అవుతుంది.
అలాగే జయశంకర్ ప్రసాద్ రాసిన 'కామాయని' కావ్య సౌందర్యం సాటిలేనిది అని అంటే కూడ మనం అర్ధం చేసుకుంటాం.
అందం, సౌందర్యం అనే పదాల్ని మనం సమానార్థకాలుగానే ఎక్కువ వాడుతున్నాం, సౌందర్యం అనే పదాన్ని ఎక్కువగా ప్రకృతి సౌందర్యాన్నీ, కళాసౌందర్యాన్నీ తెలియజేసేందుకు వాడుతున్నాం,
ఒక వస్తువు అందంగా వుందంటే దానికి కొన్ని గుణాలుండాలి. అవి యేమిటంటే దోషరాహిత్యము, ఉత్కృష్టత, (క్రమబద్దత, సామరస్యత, అనురూప్యత, బౌచిత్యము. అలాగే, ఒక కవిత సౌందర్యాత్మకంగా వుందంటే అర్థం ఆ కవితలో ప్రగాఢమైన అనుభూతి వుండి, జాచిత్యం సంతరించుకున్న సంవేదనాత్మక భావ చిత్రాలున్నాయి - అని అర్థం.
జీవితంలో అనుభవంలోకి వచ్చే అందం మిన్నా, లేక కళవల్ల కలిగే సౌందర్యానుభూతి మిన్నా - అనే ప్రశ్న చాలా కాలం నుంచీ వుంది. జీవితానికీ కళకూ వుండే పరస్పర సంబంధాన్ని పరిశీలిస్తే ఈ (ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. జీవితం కళను సృష్టిస్తుంది. కళ జీవితాన్ని మలుస్తుంది. మరింతగా సౌందర్యవంతంగా జీవించేందుకు తోడ్పడుతుంది. జీవితానికి కళళ ఒక జీవకళ. కళ లేకున్నా జీవితం ఉంటుంది కాని దాని గుణాత్మకత తక్కువ స్థాయిలో వుంటుంది. జీవితాన్ని సమున్నతం చేసేందుకు కళ ఆవసరం. జీవితంలో అందం వుంది. దాన్ని గుర్తించేందుకూ, ఇతోధికంగా అనుభూతి పరిధిలోకి తెచ్చుకునేందుకూ కళ తోడ్చడుతుంది. ఈ విధంగా కళ జీవిత స్థాయిని పెంచుతుంది. జీవితం కళకు ముడిసరుకు ఇస్తుంది. దాన్ని కళగా మార్చేందుకు అవసరమైన సౌందర్యం, చైతన్యం కూడా చారిత్రకంగా మనిషికి
95
ఒనగూడుతుంది. సౌందర్యచేతన వున్న వ్యక్తులు ఈ ముడిసరుకుకు అందం చేకూర్చి, సౌందర్య నియమాల ప్రకారం తీర్చిదిద్దుతారు. అది కళ అవుతుంది. జీవితానికి వ్యతిరేకంగా పోయేదేదీ కళకాదు. విషాదాంత కావ్యం కూడా మనిషి సౌందర్య చేతనను పెంపొందిస్తుందని- మనం గమనించాలి. మారిన పరిస్థితుల్లో సార్వజనీన విలువల్ని ప్రతిబింబిస్తూ సామాజిక న్యాయం పక్షాన నిలబడటం అభ్యుదయ లక్షణం. ఈ గతిశీలతను సంతరించుకొని వుంటాయి యీనాటీి భావచిత్రాలు. వీటిలో స్వీయ మానసికతా, వస్తుగత తత్వమూ కలగలసి ఉంటాయి. వీటి రెంటి మధ్య ఉత్కృష్టమైన సంతులనం ఏర్పడి వుంటుంది. రెండూ ఒక దానిలో ఇంకొకటి విలీనం చెంది వుంటాయి. అందుకే ఇవి అమరం నిత్యనూతనం అయి వుంటాయి. కళకు శాశ్చతత్వం సంతరించి పెట్టేది భావచిత్రాలే. భావానుభూతిని ప్రేరేపిస్తూ విస్పృతమైన అర్థ పరిద్, మరిన్ని అర్హఛాయలూ కలిగి వుంటాయి భావ చిత్రాలు. కవి హృదయాన్ని కదిలించిన మూల సంవేదనను భావయ్యుక్తంగా, స్పష్టంగా, విశ్చసనీయంగా స్ఫురణకు తెచ్చేది భావ చిత్రాలే, భావచిత్రం కేవలం పదచిత్రం, లేక మానసిక చిత్రం మాత్రమే కాదు. అది మొత్తం కవితను సంవేదనాత్మక స్వరంతో ఆవహించి వుంటుంది. అందుకే జొచిత్యంతో కూడుకున్న భావచిత్ర సౌందర్య స్ఫోరక సంభావ్యత ఎప్పటికీ తరగనిదీ, పరిమితి లేనిదీ. మంచి భావచిత్రపు మరో లక్షణం సంక్లిష్టత. ఇది తప్పనిసరియైన అంతర్భాగం కానప్పటికీ భావ తీవ్రతను కలుగ జేసేందుకు సంక్లిష్ట భావచిత్ర విధానం అవసరమవుతుంది. చక్కని భావ చిత్రానికి ఆలోచనలను సం(ప్రేషితం (00గ౧౫4౧ ౧౬9) చేయడం మాత్రమే ధ్యేయం కాదు. అనుభూతిసిక్తమై వుండాలి భావచిత్రం. 'అనుభూతమైన ఆలోచనా, ఆలోచితమైన అనుభూతీ' భావ చిత్రానికి అందం. అందుకే భావ చిత్రంలో మనం సంజ్ఞానాత్మక, సంవేదనాత్మక, సౌందర్యాత్మక అంశాల అవిభాజ్య ఐక్యతను చూడగలం. సంజ్ఞానం అంటే ఆలోచనతో కూడిన పరిజ్ఞానం అని అర్థం. కాని కేవలం ఆలోచనల, సూచనల వ్యక్తీకరణ కవిత్వం కానేరదు. సేంవేదనా, అనుభూతీ, ఆలోచనా తోడైతే కూడా భావచిత్ర సృజన జరగదు. దీనికి సౌందర్య భావన (4౬9571౯7 0 ౯౯౬16) అవసరం. భావ చిత్రాల కొక రూపం యిచ్చేది ఈ సౌందర్య భావనే. భారతీయ అలంకార శాస్త్రంలో భావ చిత్రాలకు దగ్గరగా వుండే అలంకారాల చర్చ కూలంకషంగా జరిగింది. అలంకారాల శోభాకారకత్వం' పాగడబడింది. ఆలంకారాలు 96
ముఖ్యంగా రెండు విధాలు. మొదటిరకం అనుభూతి జనితమైన ఉపమ, రూపకం లాంటివి. రెండవరకం : బుద్ది జనితమైన శ్లేష లాంటి అలంకారాలు. రూపకం చక్కని భావ చిత్రమే. కాని దాన్ని అలంకారంగా మాత్రమే చూస్తున్నారు. భావచిత్రాలకు స్వతంత్ర అస్తిత్వం వుంటుంది. రూపకంలో కూడ ఉపమనోపమేయాల (ప్రసక్తి తెస్తారు. కాని భావ చిత్రంలో వీటి రెంటిస్ట్రానే (ప్రత్యేకతను సంతరించుకున్న సంవేదనాత్మక చిత్రం ఒకటి వుంటుంది. ఇందులో ఉపమానోపమేయాల (ప్రసక్తి రాదు. రూపకంలో మాదిరి భావచిత్రాల్లో పోలికను తెలిపే పదజాలం సామాన్యంగా వుండదు. అలంకారంలో భావచిత్రం వుండొచ్చు కాని అన్ని ఆఅలంకారాలూ భావచిత్రాలు కావు. భావచిత్రంలో అలంకారం వుండొచ్చు కాని అన్ని భావచిత్రాల్లోనూ అలంకారాలు వుండనవసరం లేదు.
భావచి(త్రాల్ని ప్రతీకల (5ఈ/౧0019)తో పోల్చుతూ, రెండూ ఒకటే అనేవాళ్లున్నారు. కాని వీటిమధ్య భేదం స్పష్టం. ప్రతీక 06౧01126౪6, అంటే పూర్తిగా నిశ్చితమైన ఒక అర్జాన్ని కలిగి ఉంటుంది. కాని భావచిత్రం అలాకాదు. దానికి అర్థధాయలుంటాయి. వేరువేరుగా వాటిని వ్యాఖ్యానించవచ్చు. అంతేగాక, ప్రతీక విధానంలో భావచిత్రంలో మాదిరి అనుభూతికి కాక్క మేధస్సుకు ఎక్కువ పాత్ర ఉంటుంది. ప్రతీకకు సంప్రదాయ (ప్రదత్తమైన ఒక అర్ధం ఉంటుంది. మంచి భావచిత్రం ఏ సంఫ్రదాయానికీ లోబడివుండదు. తాజాగా ఉంటుంది. ఈ తాజాతనం (1/690౧0699) ప్రతీకలో పూజ్యం. భావచిత్రాలు రానురాను రూఢమై ప్రతీకలుగా మారిన సందర్భాలున్నాయి. ప్రతీకలకు సామాజిక గుర్తింపు ఉంటుంది. (ప్రతీకలు అర్హప్రధానం. భావచిత్రాలు చిత్ర ప్రధానం, సంవేదనా (ప్రధానం.
భావచి(త్రాలు సాహితీ ధోరణులనుబట్టి మారుతుంటాయి. 01259 65 లో ఉదాత్త భావచిత్రాలు ఎక్కువగా కన్నడతాయి. భావకవితలో భావచిత్రాలు యధేచ్చ కల్పనతో కూడి వుంటాయి. అభ్యుదయ కవితలో భావచిత్రాలు వాస్తవిక జీవితానికి దగ్గరగా వుంటాయి. అభ్యుదయ యుగభావనలకు అద్దం పట్టేవిగా వుంటాయి.
రచనా నిర్మాణాన్నీబట్టి భావచిత్రాలను చూస్తే సహసంవేదనాత్మక (5/౧౭9541610] భావచిత్రాలు గొప్పగా ఉంటాయని నిర్షంద్వంగా చెప్పొచ్చు. వీటిలో రెండు మూడు సంవేదనల మిశ్రమం - అందమైన మిశ్రమం వుంటుంది. శ్రీరంగం నారాయణబాబుగారి క్రింది పంక్తులు ఉత్తమ సహసంవేదనాత్మక భావచిత్రానికి చక్కని ఉదాహరణ.
ఘల్లు! ఘల్లు!
మట్టెల ధ్వని వెన్నెల!
97
ఒకే సంవేదనను సరళభాషలో వ్యక్తం చేసే భావచిత్రం సరళ భావ చిత్రం. 'దివో దుహితా ఉషా' అన్న బుగ్వేట వాక్కు సరళభావ చిత్రానికి మంచి ఉదాహరణ. 0౦౧౧౧ 1 ని అందంగా తెలిపే సంక్లిష్ట భావచిత్రాలు వున్నాయి. ఒక కృతిలో చాలసార్జు వచ్చే భావచిత్రాన్ని [9౦౮౪౯ ౧8 గొడం్రం (ప్రత్యావర్తి భావచిత్రం) ఆంటారు. 1120061) లో రక్తం దీనికి ఉదాహరణ. విరిగిన భావచిత్రాల్ని కూడ మనం చూస్తుంటాం కవితల్లో, అవి విరిగిన మన నాగరికతకు ప్రతిబింబాలు. అయినా భావచిత్రాలది సౌందర్యలోకం. అక్కడ విరిగిన ' నాగరికతకూడా సౌందర్య పూరిత భావచిత్రాలను సృష్టిస్తుంది. భావచిత్రాల సాతత్యాన్ని (00౧౧౪౮౫ ను) భావచిత్రమాల అనవచ్చు. కల్పనలో వూహాలోకాల్లో విహరిస్తూ భావచిత్రమాలను రూపొందించడం ఒక ఫ్యాషను. కాళిదాసులాంటి వారు భావచిత్రమాలను సృష్టించినా, అది పూర్తి జొచిత్య సంపన్నమై ఉంటుంది. అలాకాక స్టైలుకు పోయి ఆడంబరంగా భావ చిత్రమాలను నిర్మిస్తే అది కృతకంగా వుంటుంది. భావచిత్రాలు - సంవేదన, అనుభూతితో కూడిన తాజా భావచిత్రాలు - జీవకళ .. వుట్టిపడే భావచిత్రాలు - కవితకు అలంకారం మాత్రమే కాదు; అవి కవితకు రక్తం అని చెప్పాల్సి వుంటుంది. అబ్బుదయ మానవ్యతిత్ర అక్టోబడు 7990 98
కవిత్వంలో భావ చిత్రాలు- కొన్ని అభిప్రాయాలు
మనం దేన్ని గురించి రాస్తుంటామో దాన్ని అతిగా చెప్పుకోవడం జరుగుతూంటుంది. బింబ రచనను (భావచిత్రాల్ని) గురించి రాస్తున్నపుడు దాన్ని కావ్యాత్మ అని కొందరు అన్నారు. మిహ-ఈల్‌అవ్సియాన్నికోవ్ బింబరచనను గూర్చి వెల్లడించిన అభిప్రాయం అలాంటిదే. ఆయన అన్నాడు - “తన ఆత్మ, అంతస్పారం, ప్రధాన లక్షణం బింబరచనే కావటం వల్ల కళ దాన్ని త్యజించ జాలదు.” ఇపుడు మనం కళాత్మక బింబాల లక్షణాలేమిటో చూద్దాం.
కళాత్మక బింబాల్లో ఉద్వేగ పూరిత స్వరం (5౧౧౦0౧౬ 10౧9) ఒకటి వుంటుంది.
బింబరచన వస్తుగతమూ, ఆత్మగతమూ కూడాను. ఇది ఒక సంక్లిష్ట నిర్మాణం. బింబము అర్ధాన్ని వికసింపజేస్తుంది. కళాత్మక బింబాలు ఎపుడూ తాజాగానే వుంటాయి. కొత్తవి వచ్చినా పాత బింబాలు తమ సార్జకతనూ, ప్రాధాన్యాన్నీ కోల్పోవు. ఒక ఉదాహరణ :
వాల్మీకి రామాయణం లోని ఈ శ్లోకం చూడండి,
రాముడు వనవాసంలో వాలిని చంపి సుగ్రీవునికి పట్టాభిషేకం చేసి మాల్యవత్పర్వతం మీద నివసిస్తూ లక్ష్మణునితో ఇట్టంటాడు :
సంధ్యారాగోత్సితై స్తామై: అంతేష్వధిక పాణురైః
స్నిగ్టై రభ్ర పటశ్ళేదైః బద్దవ్రణ మివాంబరమ్.
సంధ్యారాగం చేత మధ్య ఎ(ర్రగాను, చివర్డు అతి తెల్లగాను ఉన్న తడి మబ్బులనే గుడ్డ ముక్కలతో పుండుమీద కట్టు కట్టబడినట్టు ఉంది ఈ ఆకాశం.
99
పూర్తి కవితే ఒక బింబం కావచ్చు. ఒక కవిత లోనే అనేక బింబాల సమాహారం వుండొచ్చు. బింబరచనలో శబ్దార్ణ తాదాత్మ్యం వుంటుంది. సౌందర్యానుభూతి - సామర్థ్యం బింబ రచనా శక్తిని ఇనుమడింపజేస్తుంది.
గద్యంలో కూడా బింబాలుండవచ్చు. బీనాదేవి నవల “పుణ్యభూమీ కళ్లు తెరు” బింబ - బహుళ నవల, కాని కవిత్వంలో లాగా కాకుండా వీటిని మరో విధంగా కూడా వ్యక్తీకరించవచ్చు.
బింబరచన, అలంకారాలు -
ఉపమ, ఉత్రేక్ష అతిశయోక్తి లాంటి అలంకారాల్లో బింబం వుండే అవకాశం వుంది. ఉపమానోపమేయాలు సాధర్మ్య్యమున్నా, 'ఒకటి" కావు గనుక, వీటిల్లో బింబం ఆంగికం (0౧64110) కాకుండా కాస్త వేరుగా వుంటుంది. రూపకాలంకారం ఒక బింబ పద్దతి. యమకం, శ్లేష లాంటి అలంకారాల్లో కవిశిల్పకారిత కన్పిస్తుంది. రూపకం, ఊశ్రేక్ష లాంటి అలంకారాల్లో కవి సంవేదనశీలత, కమనీయ కల్పన కన్పిస్తాయి.
రూపకేతర అలంకారాల్లో వచ్చే బింబాలు అలంకార చేతన కారణంగా విశుద్ద బింబాలతో సరితూగలేవు.
ప్రతీకలు వస్వ్యర్థకాలు - ఖచ్చితంగా “08౧౦11౪6. బింబము అలా కాదు. బింబరచనలో ఒక విధమైన అనిశ్చితత్వం, ప్రవాహశీలత కన్పిస్తాయి. ప్రతీకల్లో నిర్దిష్ట అర్ధమే
౮౯౮ ౧౬౧ |
స్ఫురిస్తుంది. బింబాల్లో అలా కాదు - అవి సదా నూతనార్థస్పోరకాలు.
వస్తురూపాలను వేరుచేసి చూడటం అలవాటయింది మనకు. బింబరచన రూపము, వస్తువు కూడాను. సౌందర్యశాస్త్ర రీత్యా అది సంశ్లేషణ (5/౧165 9). సోవియట్ సౌందర్య శాస్త్రవేత్త బత్రకోవా వస్తు రూపాలస్టానే సొందర్యభావం (గ౭51౧910 1062) అనే భావనను (ప్రతిపాదించింది. ఇందులో వస్తురూపాలు దాదాపు అభిన్నాలు. శ్రీశ్రీ 'భిక్షువర్షీయసి” లాగా.
సాహిత్యం భావ సంప్రేషణం (00గ౫౫౫౪౧ ౦౭0౧) కోసమేనని చాలమంది అనుకుంటుంటారు. ఇది తప్పు. కళాత్మక బింబాల ఉద్దేశం సంప్రేషణం మాత్రమే కాదు: పాఠకుని మనసులో అర్హతరంగాల్ని రేకెత్తించడం. సంప్రేషణ అనేకారకంగా వుండదు. కాని బింబాలు అనేక అర్థఛాయలతో కూడీ వుంటాయి.
బింబాలు అనేక అంశాల ఆధారంగా వర్గీకరింపబడినాయి. కాని, బింబవర్షీకరణం
100
ఏదీ అంతిమం కానేరదు. సంవేదన ఆధారంగా బింబాల్ని దృళ్యబింబాలు, శ్రవ్య బింబాల్లు, (ఘ్రాణ బింబాలు, స్పర్శబింబాలుగా వర్గీకరించవచ్చు. దృళ్య బింబాలు, ప్రత్యేకించి వర్ష సంవేదన గల బింబాలు కవి వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. శ్రవ్య బింబాలు కవితల్లో ఎక్కువే. కవిత చదవగానే మొదట ఏర్పడేది |శ్రవ్యబింబమే. అలాకాక కవితలోనే శ్రవ్య బింబాలుండవచ్చు శ్రీశ్రీ రాసిన 'గంటలు” కవితలో లాగా. సహసంవేదనాత్మక బింబరచన (3/౧28512810 ౭86౧/) కవి పరిపక్స సంవేదననీ, ప్రగాఢ అనుభూతినీ అభివ్యక్తం చేస్తుంది. ఉదాహరణకు శ్రీరంగం నారాయణ బాబు రాసిన ఈ పంక్తులు చూడండి. ఘల్లు! ఘల్టు మట్టైల ధ్వని వెన్నెల! ఇందులో దృళ్య బింబమైన వెన్నెలకూ, (శ్రవ్వబింబమైన మట్టెల ధ్వనికీ మధ్య అన్వితి సాధించబడింది. మరో ఆధారంగా, బింబాల్ని అనుభూతి ప్రధానం, కల్పనాత్మకం అని వర్గీకరించవచ్చు. ఏది ఏమైనా, ఆధునిక కవితను అర్జం చేసుకోవాలంటే, ఆధునిక అనుభూతికి స్పందించాలంటే, బింబ అవగాహన చాలా అవసరం, మిసిమి నూసస(్రిక్కు అక్టోబరు 1996 101
కజీర్ సందేశం కబీరు మధ్యయుగానికి (15-16. శతాబ్దాలకు) చెందిన కవి, సంస్కర్త, శ్రాంతిదూత. 1518లో గోరఖ్‌పుర్ దగ్గర మగ్‌హర్ అనే వూర్జో చనిపోయాడు. కబీరు భక్తకవి. కాని, ఆతని భక్తితత్వం వేరు. విగ్రహారాధనకు ఆయన వ్యతిరేకి. ఏ మతంపట్లా ఆయనకు విశ్వాసం లేదు. కుల సంకెళ్లు తెగగొట్టాలని ఆయన తాపత్రయం. ఆయన యుగానికి చెందినవారే నానక్ రైదాస్, నామ్‌దేవ్ లాంటి సంస్కర్తలు, కవులు. విగ్రహారాధనను వ్యతిరేకించే ఈ కవుల జాబితాలోకీ వస్తుంది లాల్‌దెద్ అనే కాశ్మీర్ కవయిత్రి. వేమన కబీర్ తర్వాతివాడు, కబీర్ అంతటివాడు. జపం, తపం వల్ల (ప్రయోజనం శూన్యమని వీరందరి ఉద్దాటన. అస్పృశ్యత ఇప్పటికింకా పోలేదు. ఆ కాలంలో ఇంకా ఘోరంగా వుండేది. అందరి రక్తనాళాల్లో ప్రవహించేది రక్తమే. ఎవరి రక్త నాళాల్లోనూ పాలు ప్రవహించవు. అలాంటప్పుడు (బ్రాహ్మణులకు శూద్రులపట్ల వివక్ష ఎందుకు ? అని కబీర్ అంటాడు. ఈ వివక్షను వ్యతిరేకించింది కూడా ఎక్కువభాగం తక్కువ అని చెప్పబడే కులాల నుంచి వచ్చిన కవులే. కబీరు బట్టలు నేసే కులానికి చెందినవాడు. లాల్‌బేద్ పాక్షీపని చేసి బతికే కులానికి చెందిన కాశ్మీరీ కవయిత్రి. రైదాస్ మాదిగ కులానికి చెందిన కవి. కబీర్ ప్రభావం రవీంద్రనాథ్ ఠాకుర్‌పై స్పష్టంగా వుంది. రవీంద్రుడు కబీర్ కవితల్ని అనువదించాడు కూడాను. కభీర్ ఆడంబరాలకు వ్యతిరేకి. ఆత్మజ్ఞానం సాధించాలి, తోటి మనిషిలో దేవుణ్ణి చూడాలనీ అంటాడు. హృద్యంగా, ఇలా - నీటీనుధ్యలో చేపదప్పిగొనటమా = నా కొస్తుంది నవ్వు ఇంట్లోని వస్తువే కన్పించదా = వనాల్లో వెతుకుతా వెందుకు ? ఆత్మజ్ఞానం వినా జగత్తు అర్ధరహితం = మధురకు సో, కాశీకి పో ప్రయోజనం శూన్యం 102
కబీర్ కాగిత జ్ఞానానికి వ్యతిరేకి అనుభవ జ్ఞానాన్ని మెచ్చుకుంటూ అంటాడు కళ్ళతోచూసింది నే చెబుతా కాగితంపై రాసింది నువ్ చెబుతావు.
ఇతరుల బాగోగుల్ని పట్టించుకోవడం అనేది మంచి సమాజ లక్షణం. తన స్వార్ధం మాత్రమే చూసుకోవడం, మరి దేన్నీ పట్టించుకోకపోవడం చెడిన సమాజ లక్షణం. కబీర్ అంటాడు.
ఐసా కోఈ నా మిలై
- జాసాం రహిఏ లాగి సబ్ జగ్ జల్‌తా దేఖిఏ = అవ్న్ అన్న్ అగి
పరాయీకరణ భావనకు బీజాక్షరాలివి.
విగ్రహారాధనను వెక్కిరిస్తాడు కబీర్. ఇలా అంటాడు
“పాహన్‌పూజె హరిమిలే, తో మై పూజూం పహాడ్”. చిన్న రాతి విగ్రహాన్ని పూజిస్తే దైవం ప్రాప్తిస్తే నేను పర్పతాన్సే పూజిస్తాను' అని దీనికర్టం. కబీర్ ముస్లింలను కూడా వదల్లేదు. దేవుని కోసం అంత గట్టిగా అరుస్తారే. మీ దేవుడు చెవిటివాడా అని పరిహసిస్తాడు.
కబీర్ మాతృభాష భోజపురి. కాని ఆయన చాలా ప్రదేశాలు తిరుగుతూ తన అభిమతాన్ని ప్రచారం చేస్తుండేవాడు కాబట్టి భోజ్‌పురీ భాషతోపాటు రాజస్టానీ, పంజాబీ పదాలు కూడా కలిశాయి అతని కవిత్వంలో. ఆనాటి వాడుకభాషకు చాలా దగ్గరగా వుండే విధంగా కబీర్ తన రచనల్ని రూపొందించాడు. నిజంగా వ్యావహారిక హిందీభాషయే అది.
కబీర్ వేమనకంటే ముందువాడు. కవీర్‌తో వేమనకు ఎన్నో పోలికలున్నాయి. కబీర్‌ను ఒక విశిష్ట కవిగా తీసుకున్న వారికి ఎం.ఏ లో 100 మార్కుల ప్రశ్చపత్రమే వుంటోంది అనేక విశ్చవిద్యాలయల్లో. కాని తెలుగు స్టితి అలాకాదు. ఇక్కడ వేమన డిగ్రీస్థాయి తెలుగు పార్యాంశాల్లో కన్పించడు. పరాయీకరణకు ఇది పరాకాష్ట
విశాలాంధ్ర, 29-22-2000 103
నిబద్ద విమర్శకుడు - నామ్‌వర్ సింగ్ హిందీ సాహిత్యంతో పరిచయం వున్న వాళ్ళకు ప్రసిద్ద విమర్శకుడు ప్రోఫెసర్ నామ్‌వర్ సింగ్ పేరు తెలియకుండా వుండదు. తెలుగులో రారాకు వున్న స్థానం హిందీలో నామ్‌వర్‌సేంగ్‌కు వుంది. వామపక్ష భావాలు కలిగి, మార్క్స్‌వాద దృష్టితో సాహిత్యాన్ని - ముఖ్యంగా కవిత్వాన్నీ, కథా సాహిత్యాన్నీ, సాహితీ చరిత్రనూ పరిశీలించి, వివేచించి గత యాభైయేళ్లుగా హిందీ విమర్శనారంగంలో వికిష్ట కృషి చేసిన నిబద్ద విమర్శకుడు ప్రా. నామ్‌వర్‌సేంగ్. 'జన్‌యుగొ వార పత్రిక సంపాదకునిగా మొదట పనిచేశాడు. 'ఆలోచన'” తైమాస పత్రిక సంపాదకునిగా ఇప్పుడు ప్రసిద్ధులు. 'ఆలోచన' అంటే హిందీలో 'విమర్శ' అని అర్దం. [ప్రామాణిక విమర్శకు పెట్టింది పేరు 'ఆలోచన'. హిందీ కవిత్వం 'రాసో కావ్యాలతో ఆరంభమయిందని చెబుతారు. 'పృర్వీరాజ్ రాసో కావ్యభాషపై, అంటే అపభ్రంశ భాషపై పరివోధన చేసి డాక్టరేట్ డిగ్రీ పొందారు. నామ్‌వర్ సింగ్ 1959లో చకియా చందౌలీ నుండి లోక్‌సభకు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (భా.క.పా) అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. సాగర్ విశ్చవిద్యాలయంలో సహాయక ఆచార్యునిగా కొంతకాలం పనిచేశారు. తర్వాత 1960-65 మధ్య ఆయన రచయితగా స్థిరపడ్డారు 1967లో ఆలోచన పత్రిక సంపాదక బాధ్యత చేపట్టారు. 1971లో ఆయనకు కేంద్ర సాహిత్య అకాదెమీ పురస్కారం లభించింది. 'కవిత్వపు నూతన ప్రమాణాలు అనే ఆయన (గ్రంధానికి ఇది ఇవ్వబడింది. 1974 నుండి జవాహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (ఢిల్లీలో హిందీ (ప్రొఫెసర్‌గా 1987 వరకూ పనిచేసి పదవీ విరమణచేశారు. ఐనా, ఆయన మరో ఐదేళ్ల వరకూ అక్కడే పునర్షియుక్తులైనారు. 1993 నుండి 1996 వరకూ రాజా రామ్‌మోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో వుంటూ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన రాసిన ఇతర ప్రముఖ (గ్రంధాలు: ఛాయావాద్ (1955), ఇతిహాన్ జౌర్ ఆలోచనా (1957), కహానీ, నయీకహాని (1996) దూస్‌రీ పరంపరా 104
కీ భోజ్ (1982) వాద్ వివాద్ సంవాద్ (1989). ఆయన సంపాదకత్వాన వెలువడిన (గ్రంధాలలో కొన్ని : ఆధునిక రష్యన్ కవితలు (1978) నాగార్జున్ * ప్రతినిధి కవితలు (1987), రామ్‌చం(ద్ర శుక్ష్ సంచయన్ (1988), కార్ల్‌మార్క్స్ : కళ సాహిత్య చింతన్ (1991. హిందీలో 'నయీ కవిత" అంటూ ఒక కావ్య ధోరణి పెద్ద యెత్తున వచ్చింది. దీన్ని 5212 గ౪౧6 1.5 ఇలియట్‌ల కవితా నేపధ్యంలో చూడాల్సి వుంటుంది. ఇందులో ఆధునికతావాదం-చోటు చేసుకుంది. కాని, పూర్తిగా కాదు. ముక్తిబోధ్‌లాంటి ప్రయోగశీల, ప్రగతివాద మహాకవి ఈ ప్రవృత్తి నుండి వచ్చిన వాడే. ఆయన రాసిన 'అంధేరీ మేం (చీకటిలో) అనే సుదీర్హ కవితను కవితా రూపంలో వున్న 'గుఎర్నికా' అని అభివర్షించారు. ఈ కవితను డా నామ్‌వర్‌సీంగ్ బాగా మెచ్చుకున్నారు. దీనిపై ప్రత్యేకించి వ్యాసం రాశారు. ముక్తిబోధ్ కవిత్వంలో ఓ రకమైన నాటకీయ విన్యాసం వుంటుందంటారు ఆయన. ఇది అతని (ప్రత్యేకత అంటారు. ముక్తిబోథ్ 'డైరీ'ని గురించి రాస్తూ ఆయన అజ్జేయ్ ఆత్మకధ 'ఆత్మనేపదోను (ప్రస్తావిస్తాడు 'అత్మనేపదో ఒక 'సౌందర్యజీవి ఆత్మకథ - అమానుషత్వం అంచును తాకే కళాత్మక పార్టక్యం. కాని ముక్తిబోథ్ డైరీలో కన్పించే కవి వ్యక్తిత్వం సామాజిక స్థాయిలో అత్యంత సామాన్య నిమ్మ మధ్య తరగతి కుటుంబీకునిది. జీవనం గడిపే సంక్షిష్ట (ప్రక్రియలో అంతర్భాగం ఆస్తిత్వం కోసం పోరాటం, సాహితీ సృజనకోసం చేసే కష్ట ప్రదమైన పోరాటం. గొప్ప కవిత రాయాలంటే ఆ కవి కూడా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడై వుండాలంటాడు ముక్తిబోధ్. ఇది ఎంతమాత్రం సత్యమో మనం పరిశీలించాలి. 'విసృతార్థంలో ప్రతికవితా రాజకీయ కవితే. ఎదో ఒక రాజకీయ నిర్ణయమే అది. అలాగని రాజకీయ కవితలుండవని కాదు అని అంటాడు నామ్‌వర్‌సీంగ్. బెర్జోల్ట్ బైహ్హ్ గజ్జెల మల్చారెడ్డి రాజకీయ కవితలు రాశారు. మనికిది తెలుసు. వారి కవితల్లో భావచిత్రాలు, ప్రతీకలూ తక్కువే. వార్తపత్రికల్టో వచ్చే వార్తా ప్రచురణ ఉటంకింపు కూడా కవితలో భాగం కావచ్చునంటాడు నామ్‌వర్‌సీంగ్. కవిత పూర్తిగా విశుద్ధచింతన (౧49 00౧18౧10 &(0౧) కాకూడదంటాడు. విశుద్ధ సాహితీ విలువల పట్ట కూడా నామ్‌వర్‌కు నమ్మకం లేదు. స్వతః పూర్ణసత్తా'గా కవితను చూడడు ఆయన. కవిత్వం స్వతంత్ర సృష్టే కాని, ఈ స్వాతంత్ర్యం సమాజ సాపేక్షం అని ముక్తిబోధ్‌ను ఉటంకిస్తూ ఆంటాడు ఆయన. 105
తెలుగులో వచ్చినంత అభ్యుదయ కవిత్వం హిందీలో రాలేదు. హిందీలో ఒక శ్రీశ్రీ లేడు. కాని ఈనాడు హిందీలో అభ్యుదయ కవిత మూడుపూవులు ఆరు కాయలుగా వికసిస్తోంది. వామపక్ష భావాలు కలిగిన సాహితీ పత్రికలు ఓ డజన్‌కుపైగా హిందీలో వెలువడుతున్నాయి నేడు. హిందీలో వచ్చిన రొమాంటిక్ కొవ్య ధోరణిని “ఛాయావాద్' అంటారు. దీన్ని గురించి డా నామ్‌వర్ సింగ్ ఓ గ్రంధం రాశాడు. ఛాయాబింబాలలో బద్దమైన సామాజిక సత్యాన్ని ఛాయావాద కవులు వ్యక్తం చేశారని అంటాడాయన. వ్యక్తిని కేంద్రం చేసుకొని సంపూర్ణ సమాజ స్వాతంత్ర్య అభివ్యక్తికి మార్గం సుగమం చేసింది ఛాయావాట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగులో భావకవితను నిరసించినట్టు అక్కడ ఛాయావాద్‌ను నిరసించలేదు. 'యశోధరి 'సాకేత్ లాంటి అనేక కావ్యాలు ఖడీబోలీ హిందీలో రాసిన మహాకవి మైధిలీశరణ్‌గుప్త, ప్రగతివాద కవి త్రిలోచన్‌లపై ప్రా. నామ్‌వర్ సింగ్ రాసిన రెండు వ్యాసాలు ఆయన 'సంచయత' (ఏరిన రచనలు)లో వున్నాయి. మైధిలీశరణ్ రాసిన కవితల సంపుటి భారత్ భారతి ఉద్చోధనాత్మకంగా వుంది. ఈ కవితలు ఉన్నత శ్రేణికి చెందినవి కాకపోవచ్చు. కాని అవి నిర్ష్యంద్వంగా హిందీ నవజాగృతికి చెందిన ముఖ్యమైన దస్తావేజు అని అంటాడు. ఆయన దేశభక్తి కవితలు ఇందులో (ప్రధానం. “హమ్‌కౌన్ ధే, క్యాహోగయే హై... జార్ క్యా హోంగే అభీ / మిల్‌కర్ విచారేంగే హృదయ్ సేయే సమస్యాయే... సభీ....” లాంటి పంక్తులు ఇందులో కన్పిస్తాయి. కాని మైథిలీశరణ్ భారత్ హిందూ భారత్ అని అంటాడు. ప్రా. "నామ్‌వర్‌సింగ్. దీంతో నేను ఏకీభవించడం లేదు. ఇక అభ్యుదయ కవి త్రిలోచన్‌ను గురించి రాస్తూ అతను నాగార్జున్ కేదార్‌నాథ్ అ(గ్రవాల్‌ల కంటే ముందుగా అభ్యుదయ కవిత్వం రచించినా, నిర్లక్ష్యం చేయబడినాడు అని అంటాడు, ఆయన. ముక్తిబోధ్ అన్నట్లు (త్రిలోచన్ కవితలు “ప్రాచ్య క్లాసికల్ (ఫ్రైయిన్ పాశ్చాత్య (ప్రోజ్ టెల్టీక్‌ల సమన్వయం”. నామ్‌వర్‌సేంగ్ ప్రకారం 'నగ్‌ఈ మహ్రా' అనే శీర్షికతో త్రిలోచన్ రాసిన దీర్ధకవిత (గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. కధాసాహిత్యంలో (ప్రేమ్‌చంద్ ఎలా సమాజాన్ని ప్రతిబింబించాడో, త్రిలోచన్ కవిత ద్యారా అలాంటిదే సాధించాడు అని అంటాడు. *'నగ్‌ఈ మహ్రా' అతి సాధారణమైన గేయం, లేదా కవిత అని అనుకోవడం పొరపాటు అని అభిప్రాయపడతాడు. ఇది సాధారణ మన్సించే అసాధారణ కవిత అంటాడు రెండు పంక్తులు ఉటంకిస్తూ .. 106
“జీవన్ జిస్ ధరతీ కా హై, కవితా భీ ఉస్కీ
సూక్ష్మ సత్వ, తప్ హై, నహీం... చాయ్‌కీ చుస్కీ”
సుప్రసిద్ద హిందీ కధకుడూ, నవలాకారుడూ ఐన ్రేమ్‌చంద్‌ను గురించి రాస్తూ, ఆయన కధను చెప్తాడు, రాయడు అనీ, మన దేశంలో రైతుల జీవన గాధలను తెలిపే నవల లెక్కువ వచ్చాయనీ, (ప్రేమ్‌చంద్‌నవల 'గోదాన్' ఇందుకు మంచి ఉదాహరణ అనీ అభిప్రాయపడతాడు ఆయన. ప్రేమ్‌చంద్ నవలల్లో 'స్టానికత' లేదనే విమర్శ వుందనీ, ఆయన నవలా రూపం పాశ్చాత్యనవల నుంచే వచ్చింది కానీ విషయ వస్తువు సంపూర్ణంగా, ఖచ్చితంగా భారతీయమేనని నొక్కి వక్కాణిస్తాడు ఆయన. హిందీలో 'అంచలిక్ నవలలు (పూర్తిగా స్టానికతతో రాసినవి) వచ్చాయి. ఈ అర్థంలో ప్రేమ్ చంద్ నవలలు 'అంచలిక్ కాదు. కానీ, భారతీయ పారకుల నందరినీ ఆకట్టుకునే విధంగా ప్రేమ్‌చంద్ నవలలూ, కధలూ వున్నాయని అంటాడు ఆయన,
ముక్తిబోధ్ దీర్షకవిత “అంధేరే మే (చీకటిలో) పై రాస్తూ నామ్‌వర్‌సీంగ్ ఇలా వివరిస్తాడు ఇందులో 'నేను' అనేది రెండుగా విభక్తమై వుందనీ, ఒకడు కావ్యనాయకుడు (మై0, రెండవవాడు ఇతరుడు (వహ్). ఈ విభజన నాటకీయత కోసం చేసేంది కాదు. దీనికి నేపథ్యం ఆత్మ పరొయీకరణ (సెల్ఫ్ - ఏలియనేషన్). కావ్య నాయకుడు ఆత్మపరాయీకృత వ్యక్తి దొస్తాఏవ్‌స్కీ రాసిన 'అధోజగత్ మానవుడు" లాగే ముక్తిబోధ్ సృష్టించిన ఈ వ్యక్తి బాహ్యపరిస్టితులకు భయపడి గుహావాసం చేస్తాడు. నాటకీయంగా కవి ఆంటాడు :
జిందగీకే..../కమ్‌రోంమే€.... అంధేరే/
లగాతాహై చక్కర్ / కోయీ ఏక్ లగాతార్ / అంటే -
జీవితపు... / చీకటి గదుల్లో /
తిరుగుతూ వుంటాడు / ఎవడో వాడు ఎల్లప్పుడూ/
కాని ఈ రహస్యమయ వ్యక్తి కన్పించడు. కేవలం నడుస్తున్న శబ్దం విన్పిస్తుంటుంది. శవయా(త్ర, సైనిక పాలన, జనవిప్లవ ప్రారంభం - ఇవీ ముక్తిబోధ్ భావనలకు 001601౪6 00781౪63 _ చీకటి ఈ కవితలో (ప్రధాన పాత్ర వహిస్తోంది. ఇది వాతావరణాన్ని భయవిహ్వలమూ, రహస్యమయమూ చేస్తోంది అని వ్యాఖ్యానిస్తాడు నామ్‌వర్‌సేంగ్.
107
మార్క్స్‌వాదం గురించి ఆయన అభిప్రాయం - అది ఒక రాజకీయ సిద్దాంతం మాత్రమే కాదు, అదొక విశ్శదృష్టి- సమకాలీన వాస్తవికతను దాని సమగ్ర సంక్లిష్టతలో అర్ధం చేసుకోవడానికీ అవాస్తవికతను_మార్చడానికీ పనికొచ్చే విశ్వదృష్టి, రచయతలు దీన్ని పట్టించుకోవాలి కానీ,
రాజకీయ ఎత్తుగడలను కాదు. చివరిగా నామ్‌వర్‌సేంగ్ ఇచ్చిన థియోడోర్ అడోర్నో ఉటంకింపుతో వ్యాసం ముగిస్తాను. “కవితలోని ఏకాకితనంలో మానవతావాణి వినగలిగినవాడే కవితాసారాన్ని అర్ధం చేసుకోగలడు”. విళలాలంభో - 22-6-2004
108
వాం కాశ్మీర్ సాహితి - సంస్కృతి
స్వాతంత్ర్యం వచ్చింతర్వాత కాశ్మీర్‌ను పాకిసాన్ కబళింప చూచినపుడు మహజార్ అనే దేశభక్తి కవి స్పందిస్తూ ఇలా రాశాడు -
“నరభక్షక రాకాసి గద్దలు
పొట్టన పెట్టుకున్నాయ్ -
అనూయకుల్ని అసంఖ్యాకుల్ని -
మీర్జా అరిఫ్ అనే కాశ్మీరీ కవి రాస్తాడు -
“జీవిత విత్తులు మొలకెత్తుతాయి
- త్యాగంతో విదేశీ పాడాలకింద పడివుండలేం ఆ దైన్యంతో
కాశ్మీర్ భారతదేశ కిరీటం!
కాళ్మీరాన్ని భారతదేశ కిరీటంగా సంభావించాడు కవి. కానీ వాస్తవానికి కాళ్మీర్ మన దేశానికి మస్తకం!
అశోకుడు కట్టించాడు కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ను. ఆయన అనేక బౌద్ద (గ్రంథాల్ని సంస్కృతంలో రాయించాడు. కాశ్మీర్‌లో ప్రచారం చేయించాడు. మిగతా భారత దేశంలో బౌద్ద (గ్రంధాలు పాళీ భాషలో వెలువడ్డాయి. ఈ సంస్కృత (గ్రంధాల్ని అధ్యయనం చేసేందుకు హ్యఎన్‌త్సాంగ్ అనే చైనా సందర్శకుడు కాశ్మీర్ యాత్ర చేశాడు. ్రీస్తుళకం 6వ శతాబ్దిలో మాతృగుప్తుడు అనే రాజు మంచికవి, కళా పోషకుడు - కాశ్మీర్‌ను పరిపాలించాడు. సంస్కృతంలో అలంకార శొ(స్తం రచించిన భామహుడు 8వ శతాబ్దానికి చెందినవాడు - కాళ్మీరీయే. మలో
109
అలంకార శాస్త్రజ్ఞుడు - ఉద్భటుడు 'అలంకార సం([గ్రహం' (గ్రంధకర్త కాశ్మీర్‌ను పాలించిన జయవీరుని ఆస్ట్రానంలో వుండేవాడు. మరో అలంకార శాస్త్రవేత్త మహిమభట్టు, ధ్వని సిద్ధాంతకర్త ఆనందవర్థనుడు కాశ్మీర్ వాసులే. మరో సుప్రసిద్ద సౌందర్య శాస్త్రవేత్త, శైవ సాహిత్తీకర్త అభినవగుస్తుడు కాళ్మీరీయే. ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి. విమర్శకుడు, దార్శనికుడు, సంస్కృతంలో యాభై దాకా (గ్రంధాలు రాశాడు. అభినవ భారతి, ధ్వన్యాలోక లోచన, భగవద్గీ తార్థ సం([గ్రహమ్, ఈశ్వర ప్రత్యభిజ్ఞా విమర్శిని, అనుభవ నివేదనమ్ మొదలైనవి ఆయన (గ్రంథాల్లో కొన్ని. రస సిద్దాంతాన్ని నవీన రీతిలో వ్యాఖ్యానిస్తాడు అభినవగుస్తుడు. సౌందర్యానుభూతి వ్యక్తిని విశ్చజనీన స్థాయికి తీసుకుపోతుందని, అందులో విషయము రసజ్ఞుడూ రెండూ వేరువేరుగా వుండవన్నీ అది తురీయావస్టకు చేర్చుతుందనీ వక్కాణించాడు అభినవగుస్పుడు. 11వ శతాబ్దానికి చెందిన మరో సౌందర్యశాస్త్రవేత్త కుంతకుడు కూడా కాళ్మీరీయే. ఇతను 'వక్రోక్తిజీవతమ్' అనే అలంకార శాస్త్ర గ్రంధాన్ని రచించాడు. 'రాజతరంగిణి' రచయిత కల్హణుడూ కాళ్ళీరీయే! సుందర ప్రకృతికి ఆలవాలమైన గఢ్వాల్ ప్రాంతానికి చెందిన హిందీ కవి సుమిత్రానందన్ పంత్ అంటాడు - సుందర (ప్రకృతికి పరవశించే “కోయీ కవి బన్ జాయే సహజ్ సంభావ్య హై". కాళ్మీర్‌ను చూస్తే ఎవరైనా ఇదే మాట అనవచ్చు. కళలకు కాశ్మీర్ కాణాచి. సుల్తాన్ జైనుల్ అబెదీన్ ఆస్టానంలో శాస్త్రీయ, జానపద నృత్య కళాకారు లెందరో వుండేవారట. వీరిలో కర్నాటక సంగీత విద్వాంసులు, రాగకర్తలు కూడా వుండినారట. కాళ్మీర్ ప్రకృతి సౌందర్యాన్ని గురించి చెప్పనవసరమేలేదు. భూతల స్వర్గమన్నారు కదా. ఇక్కడి నదులూ, పర్వతాలూ, సెలయేళ్ళూ, ఉద్యానవనాలూ అన్నీ సమ్మోహకమే. నేటి జీలం నది ఆ నాటి 'ఏితస్త,, కాశ్మీరీ భాషలో దీన్ని వెతో అంటారు. చీనార్ చెట్టూ, సైన్ ఆడవులూ కాశ్మీర్‌ను ఆసియా క్రీడా క్షేత్రంగా సంభావింపచేస్తాయి. ఆకురాలుకాలంలో ఈ చెట్టూ అడవులూ రాగిరంగును సంరించుకుంటాయి. పచ్చిక బంగారు రంగుకు మారుతుంది. శీతాకాలం వస్తే అంతా మంచుతో పరివేష్టితం అవుతుంది కాశ్మీర్ పర్వతాల మయం, తూర్పున హరుఖ్ దక్షిణాన మహదేవ్, అమర్‌నాథ్; ఉత్తరాన నంగ్‌పర్వత్ పేర్కొనతగ్గవి. కాళ్ళీర్‌కు 64 కిలోమీటర్ల దూరంలో వున్న అనంత్‌నాగ్ ప్రాచీన నగరాల్లో ఒకటి. ఈ నగరంలో ఎక్కడ చూసినా నీటి వూటలే. కాశ్మీర్‌ను మూడు ప్రాంతాలుగా విభజించి చెబుతారు. జమ్మూ, కాళ్మీర్ లద్దాక్. జమ్మూలో వాడే భాష డోగ్రీ, కాళ్మీర్ లోయలో కాళ్ళీరీ భాష. లద్దాక్‌లో లద్దాకీభాష. కాళ్మీరీ భాష దర్డ్ భాషా కుటుంబానికి చెందిన భాష కాశ్మీర్‌లో కవయిత్రులు బాగా రాణించారు. లాల్‌దెద్, హబ్బాఖతూన్ అనేకవియిత్రులకు మంచి పేరుంది. మధ్య 110
యుగానికి చెందిన లాల్‌దెద్ అనేక 'వఖ్కలు” రాసింది.
ఉదాహరణకు -
“ఎందుకంత గొప్పలు పోతావ్
నీ దేహం గురించి, దాన్ని -
సదా అలంకరించుకుంటూ
పూజించుకుంటూ"
- చివరికి మిగిలేది
ఇంత బూడిదేకదూ ?”
మరో వఖ్
“సారవంతమైన భూములకే కాదు
సూర్యరశ్మి సోకు సకల దిశలకూ
గాలి ప్రవేశించు ప్రతి గృహంలోనికి
మాయల గారడీలతో దొరకడు ఈశ్వరుడు
సారించు నీ దృష్టి - తత్వంపై మానవా |!
మిత్రమా
కాళ్ళ్మీర్ కవయిత్రి హబ్బాఖతూన్ ఒక.రాణి. గుల్‌మర్ల్ పట్టణాన్ని నిర్మించిన శిల్ప మానసి. గొప్పగాయని “లోల్' గీత కారిణి. పారసీక భాషలోనూ ప్రవీణ. ఇప్పటికీ కాశ్మీర్‌లో ఈమె అబ్ధీకం జరుపుకుంటారు. హబ్బాఖతూన్‌పై సాహిత్య అకాడెమీ ఒక పుస్తకం (ప్రచురించింది కూడా. ॥
కాళ్మీర్‌లో జానపద గేయాలు విరివిగా పాడుకుంటారు. ఒక గేయంలోని కొన్ని పంక్తులు-
“తల్లితండ్రులు పేదోళ్ళు
కూతురికి భయం భయం
కరుణ చూపించు ఓదేవా
-ఈ పెళ్ళి జరిపించు ఓదేవా
మా పరువు దక్కించు ఓదేవా!?”
111
మరో జానపద గేయంలో ఓ యువతి తండ్రితో ఇలా అంటుంది -
“ప్రియమైన నాన్నగారూ!
నాదో విన్నపం వింటారా
కావాలి నాకు శ్రీరాముని లాంటి వరుడు
నాయత్నంలో మీరు సహకరిస్తారా?....”
కాశ్మీర్ ఒక గొప్ప పర్యాటక కేంద్రం. ఇది ఓ స్విట్టర్‌లాండ్ లా అందంగా వుంటుంది. శ్రీనగర్ దగ్గర మొఘల్ గార్డెన్స్ చూసేందుకు యూరప్ నుంచి యాత్రికులు వస్తుంటారు. నిషాత్‌బాగ్ మరో అందమైన ఉద్యావనం. దాల్ సరస్సు దగ్గర ఏడువందల మొఘల్ గార్డెన్స్ వుండేవట ఒకప్పుడు. జమ్మూకు దగ్గరలో వున్న వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు యాత్రికులు దేశం నలమూలల నుంచీ వెళ్తుంటారు. జమ్మూలోని రఘునాధ్ మందిర సముదాయం (ప్రసిద్ధం. యాత్రికులు విరివిగా వస్తుంటారు ఇక్కడికి. మూడు మతాల సమ్మేళనం కాళ్ళీరం. జమ్మూలో హిందూ మతం, కాశ్మీర్‌లో ముస్లిం మతం, లద్దాఖ్‌లో బౌద్దమతం. అయినా ఈ భూభాగం మత సహనానికి మారుపేరు. సంస్కృత సాహిత్యం, సౌందర్యశా(స్తం, సంస్కృతి వికసించిన గడ్డ. కాశ్మీరీలు ప్రకృతి జీవులు. ప్రకృతి ఒడిలో ఒదిగి అతి సాధారణ జీవనం గడిపే నిష్కల్మష మానసులు. మరి ప్రస్తుతం కాళ్మీర్ పరిస్థితి? పాక్ ముష్కరులు కాళ్ళీర్ కడుపున చిచ్చు పెట్టారు. అది రావణ కాష్ట్రంలా రగులుతూనే వుంది. కాశీ రీలు (ప్రస్తుతం పడుతున్న బాధలు చెప్పనలివికానివి, కాశీ ]6 పర్వతాలు ఒకవైవు ఫిరంగి మోతలతో మారు(మ్రోగుతూ వుంటే. మరోవైపు ఆర్.డి.ఎక్స్ పేలుళ్ళతో అక్కడి జీవనం అతలాకుతలం అవుతూవుంది.
ఆయిన్నా కాశ్మీర్ అగ్ని సరస్సున వికసించిన వజ్రమే.
ఎిళాలాంద్రు 8-త-20299 112
సంస్కృతి భూమండలీకరణ
(ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ (ద్రవ్యనిధి, ప్రపంచ వ్యాపార సంస ఆర్ధిక భూమండలీకరణను సుగమం చేశాయి. ఈ ఆర్థిక భూమండలీకరణ మన సంస్కృతిపై దాడి చేస్తోంది. కోకాకోలా, పాప్ సింగర్ మాదొన్నా, సి.ఎన్.ఎన్. వార్తలు భూమండలీకరణకు కొన్ని ఉదాహరణలు. సీడీలూ, సినిమాలూ, టీవీలూ, వీడియోలూ జాతుల ్రత్యేకతల్ని రూపుమాపుతున్నాయి. జాతుల గుర్తింపు ప్రమాదంలో పడింధి. వర్తమాన దేశాల మీద పెట్టుబడివాద పాశ్చాత్య దేశాల సాంస్కృతిక సామ్రాజ్యవాదం రాజ్యం చేస్తోంది. మరీ ముఖ్యంగా టీవీ కార్యక్రమాల తయారీ, వితరణ కంపెనీలు, టీవీ సెట్ల ప్రపంచ వ్యాప్త అమ్మకాలు, ఉపగ్రహ ప్రసారాలు - ఇవన్నీ వినోద పరిశ్రమను పెంచి పోషిస్తున్నాయి. మన (ప్రచార సాధనాలు వ్యాపార సాధనాలుగా మారిపోయాయి, మారి పోతున్నాయి. సంస్కృతి ఓ అమ్ముడు సరుకైంది. సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి ఇది ముడి సరుకు. సంస్కృతి పరిశ్రమ ఒక విలువల సరళిని =
. ప్రవేశపెడుతుంది, దాన్నే స్టిరీకరిస్తుంది. స్టానికులు కూడా దానినే అనుకరిస్తారు. కార్మికులూ
దీని ప్రభావ పరిధిలోకి వచ్చే అవకాశముంది.
ఇకపోతే భూమండలీకరణ ఏ ఏ రూపాల్లో వస్తుందో పరిశీలిద్దాం. బహుళజాతి సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఎవరు, ఏమి, ఎంత ఉత్పత్త చేయాలి, ఎక్కడ ఉత్పత్తి చేయాలి, ఎప్పుడు ఒక ప్రాంతం లేక దేశానికి లాభం కోసం మకాం మార్చాలి అనేది నిర్ణయిస్తాయి.
| 1997లో ప్రపంచ వ్యాపార సంస్థ చెపట్టిన టెలికాం ఒప్పందంపై 68 దేశాలు సంతకాల
చేశాయి. ఇలా సంతకాలు చేసిన దేశాల్లో మన దేశం కూడా వుంది. 60 వేల కోట్ల డాలర్ల టెలికాం సేవల మార్కెట్‌లో ఈ దేశాల వాటా 90 శాతం అని గుర్తుంచుకోవాలి.
మన దేశం పై పాశ్చాత్య ప్రచార సాధనాల ప్రభావం దారుణం. వారి క్షీణ సంస్కృతి మనకు అనుకరణీయమై కూచుంది. సెక్సు, నేరం, హింస, సామాజ్ర్యవాద పెత్తందారీ తనం,
113
ధనారాధనావాదం మన సమాజంలో చొచ్చుకుపోయినాయి. ఇది పొళ్చాత్య పెట్టుబడివాద దేశాల పుణ్యమే. ఎలెక్ష్రానిక్ ప్రసార మాధ్యమాలలో రేడియో అత్యధికంగా భూమండలీకృతం. అన్ని దేశాల్లోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి. సంగీతానికి సరిైన మాధ్యమం రేడియో. స్థానిక, జాతీయ సంగీతం స్థానే, పాశ్చాత్య పెట్టబడివాద దేశాల సంగీతం మార్కెట్‌లోకి వచ్చి పడుతోంది. సంగీత రికార్డుల తయారీ ఒక పరిశ్రమ, వీటి ఉత్సాదనలో అమెరికా సంయుక్త ర్యాష్ట్రాలదే ఆ(గ్రస్థానం. అవికసిత, వర్ధమాన దేశాలు కూడా దీన్నే అనుకరిస్తున్నాయి. స్టానిక సంగ్‌తైలులు క్రమేణా మృగ్యమైపోతున్నాయి. పాశ్చాత్య పావ్ సంగీతం రాజ్యం చేస్తోంది. మాదొన్నా, జెస్సీ జాక్సన్ సంస్కృతి నేతలు. ఇకపోతే సినమా రంగాని కొస్తే ఐ.రా.స. విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ సమాచారం ప్రకారం క్షీణ విలువల చలన చిత్ర ఉత్పాదనలో కూడా అ.సం.రా. దే అగ్రస్థానం. అమెరికా సంయుక్త ర్యాష్ట్రాలు, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, భారత్ సంవత్సరానికి 150కి సైగా చిత్రాలు నిర్మిస్తున్నాయి. యూరప్ దేశాలు ఒక్కొక్కటి 50కి మించి ఏటా విడుదల చేస్తున్నాయి. వీటిలో కొన్ని విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ వ్యాపారంలోనూ అ.సం.రా.దే అగ్రస్థానం. హాలీవుడ్ హింసకూ, సెక్సుకూ పెట్టింది పేరు. ఈనాడు ప్రచార మాధ్యమాలన్నిటిలోనూ టీవీదే అగ్రస్థానం. యూరప్‌లో పనిచేస్తున్న టీవీ ఛానెళ్ళ సంఖ్య 250. మన దేళంలో 50కి మించి ఛావెళ్ళున్నాయి. పాశ్చాత్య టీగి చానెళ్లు పెట్టుబడివాద విలువల్నీ, వాటి క్షీణ రూపాల్నీ వర్దమాన దేశాల మీద రుద్దుతున్నాయి ఈ దేశాల విలువల సరళులు మారిపోతున్నాయి. పిల్లలపై వీటి దుష్పరిణామం మరీ ఎక్కువ పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. నేడు మనం కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నాం. సమాచార రంగంలో వచ్చిన విప్లవానికి వర్షమాన దేశాల పాలకులు కూడా స్వాగతం చెబుతున్నారు. (ప్రపంచ వ్యాప్తంగా వెబ్ పనిచేస్తోంది ఆ.సం.రాకు చెందిన గుత్త పెట్టుబడివాద సంస్థ మైక్రోసాఫ్ట్ రాజ్యం చేస్తోంది. దీని బడ్జెట్ ఒక పెద్ద ఆసియా దేశపు బడ్జ్డెటుతో సమానం పెట్టబడివాద భూమండలీకరణ (ప్రక్రియలో సంస్కృతి అమ్ముడు సరుకుగా మారింది. దీన్ని బాగా జనప్రియం చేస్తున్నారు. అశ్లీలత దీని స్వరూపం. లాభాలకు అమ్మడం దీని యజమానుల పరమావధి, ఈ ధోరణిని తిప్పి కొట్టాలి. దీనికి నిబద్దత కలిగిన జనం అవసరం. 114
సమాజవాద దేశాలు ఈ దిశగా మరింత చారవ తీసుకోవాల్సి “వుంటుంది. అభ్యుదయ రచయితలూ, కళాకారులూ ఈ వ్యాపారీకృత సంస్కృతి - విషకన్య నుండి జనాన్ని కాపాడాలి. మన 'అస్మిత' (ఐడెంటిటీ)ను కాపాడుకోవాలి. సంస్కృతిని సంరక్షించుకోవాలి. మిసిమి మానసిక జూన్ 2001 115
పరాయీకరణ అంటే ఏమిటి ?
'ఎలియనేషన్' అనే ఆంగ్లపదానికి తెలుగు పర్యాయపదం 'పరాయీకరణ'. 'ఎలియనేషన్ అనే పదం లాటిను భాషకు చెందిన అలెన్సు నుంచి వచ్చింది. పరాయీకరణ అర్థంలోనే, 6342009009౧1 (సంబంధ విచ్చేదన) అనే పద౦ కూడా వాడతారు ఆంగ్లంలో పరాయీకరణకు సమానార్థకంగా హిందీలో 'ఆల్‌గావ్, పృధక్కరణ్' లాంటి పదాలు వాడుతున్నారు. 'పరాయా' అనేపదం హిందీలో వుంది కాబట్టి 'పరాయీకరణ్ అనే పదం హిందీలో కూడా వాడవచ్చని నా అభిప్రాయం. పరాయీకరణను సూచించేందుకు కార్ల్‌మార్క్స్ జర్మన్ భాషలో వాడిన పదాలు ౧8095696౧0, ౬౧8౧౧6౮౪౧౮, పరాయీకరణోే కాక, దూరంగా వుంచడం, విడిచి పెట్టడం, అమ్మడం, హస్తాంతరణచేయడం అనే అర్థాల్లో కూడా ఈ పదాలు వాడతారు జర్మన్‌లో,
హంగేరి దేశానికి చెందిన ఇస్తవాన్ మెస్టోరస్ అనే ఒక మేధావి పరాయీకరణపై ఒక (గ్రంధం రాశాడు. ఆయన చెప్పిన ప్రకారం, క్రీ.శ. 14వ శతాబ్దంలో ఈ పదాన్ని మతపరంగా వాడేవారు. దేవుని కృప పొందలేక పోవడాన్ని, దేవుణ్ని పూజించ నిరాకరించే స్టతినీ లేక దైవజ్ఞాన రాహిత్యాన్నీ ఈ పదం సూచించేది. 15వ శతాబ్దాంతంలో ఈ పదాన్ని అధికారం, ధనం, ఆస్తిని మరో వ్యక్తికి దఖలు పరచడం అనే అర్థంలో వాడేవారు. కానీ, ఎవరినైనా బలవంతంగా అస్తి నుంచి వేరు చేయడం అనే అర్థంలో ఎక్కువగా ఈ పదప్రయోగం జరిగేది. 19వ శతాబ్దం మధ్య నుంచి ఈ పదం కుటుంబం విచ్చిన్నం కావడం అనే అర్ధంలో వాడేవారు. తర్వాత్తర్వాత, ఈ పదం ఛక్తిహినత, అసమర్థత, ఆదర్శహీనత, ఒంటరితనం, పరాయితన౦ అనే అర్ధంలో వాడబడేది, మరీ ముఖ్యంగా ఆధునికతావాదులూ, అస్తిత్వవాదులూ ఈ పదాన్ని విరివిగా వాడారు, వాడుతున్నారు.
(ఫ్రెంచి పువరుజ్జీవనయుగానికి చెందిన దిదెరో, రూసో అనే ఇద్దరు తత్వవేత్తలు కొంతవరకూ పరాయీకరణను ఆర్థం చేసుకున్నారు. దిదెరో నీ” 'నా' అనే భేదం, పలువురి
116
సంక్షేమం ఏదో ఒక వ్యక్తిపై ఆధారపడటం, పరాయీకరణకు దారి తీస్తాయి అన్నాడు. దీనితో విరిగిన కోర్కెలు, కాల్పనిక అభిరుచులు, కృత్రిమ ఆవసరాలు ఉత్పన్నమవుతాయని చెబుతూ, అవసరాల్ని తగ్గించుకుంటే ఈ సమస్యలుండవని నైతిక హితవు చెబుతారాయన.
“ప్రకృతినుంచి మనిషి వేరవుతున్నాడనీ, సభ్యత మనిషిని (భ్రష్టు పట్టించిందనీ, సభ్యత రాక ముందు మనిషి ఆదిమ సహజ ప్రవృత్తులతో నైసర్గికంగా ప్రవర్తించేవాడనీ, ధనం రాకతో మనిషి తన సహజ స్వభావం కోల్పోయాడని, సహజ ప్రవర్తన, సభ్య అచరణల మధ్య వుండే ఆంతరమే పరాయీకరణ అని అంటాడు రూసో. ధనం, ఆస్తీ ఈ పరాయీకరణకు కారణం అని చెప్పాడు ఆయన. ఈ పరాయీకఠణకు పరిష్కారం అమ్ముడు పోకపోవడమే అనే నైతిక మార్గం చూపిస్తాడు రూసో నైతిక దృక్పధాన్నే మరింత ముందుకు తీసుకుపోయాడు మహాత్మాగాంధీ.
మార్క్స్‌కు ముందు హెగెల్ పరాయీకరణను ప్రస్తావించి విసృతంగా మార్చే ప్రక్రియలో పరాయీకరణ జనిస్తుందని అంటాడు. ఆత్మ చైతన్య వికాసానికి ఇది అవసరమని భావిస్తాడు. మనిషి మస్తిష్కం కొన్ని కృతులను సృజించినపుడు అది సృజనకర్త నుంచి వేరు పడి వస్తుగతం అవుతుంది. పరమ సత్ రూపాలే పరాయీకరణ నిష్పరాయీకరణ (06416౧410౧) లు అని అంటాడు హెగెల్. ం "
హెగెల్ భావనల్ని ప్యూయర్‌బాక్ అనే తత్వవేత్త విమర్శిస్తాడు, ప్రకృతికి హెగెల్ చెప్పిన నిర్వచనాన్ని పరాస్తం చేస్తూ దేవుడే ఆత శవపరాయీకృత (561-4 18౧21606) మానవుడు అని సిద్దాంతీకరిస్తాడు. తనకంటే ఉన్నతుడూ, ఉత్కృప్టుడూ అని తాను కల్పించుకున్న పరమసత్ అనే దేవునికి తానే బానిస యై పూజిస్తాడు మానవుడు. ఇది పక్కా పరాయీకరణ. దేవుని అస్తిత్వాన్ని నిషేధించినపుడు మాత్రమే దీన్నుంచి నిష్కృతి అంటాడు ప్యూయర్‌బాఖ్,
కార్ల్ మార్క్స్ ఈ భావనను ఖండిస్తాడు తన “అర్థిక తాత్విక రాతపత్రులు 1844లో మతపరమైన పరాయీకరణకు సంబంధించినంత వరకూ ప్యూయల్‌బాఖ్‌తో ఏకీభవస్తాననీ, కాని, ఇది అనేక రకాల పరాయీకరణల్లో ఒకటి మాత్రమేననీ అంటాడు మార్క్స్. మనిషీ (ప్రకృతీ అవాస్తవికమని తలచడమే తప్పు. సామ్యవాద సాధనకు మత నిర్మూలన లాంటి చర్యలు అక్కర లేదంటాడు ఆయన. కానీ దైవభావనతో మనిషి కొంతవరకూ పరాయీకరణకు గురవుతున్నాడనేది వాస్తవమే నంటాడు. దార్శనికత, కళ, నైతికతలాంటి రూపాల్లో ఆత్మికంగానూ, నరుకు, డబ్బు, పెట్టబడి రూపాల్లో సామాజికంగానూ మనిషి పరాయీకరణకు
11/7"
గురవుతున్నాడని అంటాడు కార్ల్ మార్క్స్
తన (క్రియాశీలతలోనూ పరాయితనం అనుభవిస్తుంటాడు మనిషి. జబర్‌దస్తీగా చేయించుకునే శ్రమ, గత్యంతరంలేక చేసే శ్రమ సౌందర్య నియమాల ననుసరించి జరగవు. కార్మికుడు (శ్రమకూ, తనకు తానూ పరాయివాడవుతాడు. పరాయీకరణ మనిషికి సహజ లక్షణమైన సౌందర్యానుభూతిని నాశనం చేస్తుంది. మనిషిని అమానవీయం చేస్తుంది. సౌందర్యనియమాలననుసరించి చేసే (శ్రమలో నిర్బంధం వుండదు. ఆహ్హాదరకమైన (శ్రమ అది. ఒక కళాక్సారుడు కళాస్పజనలో పొందే అనుభూతి అది.
మార్క్స్ పరాయీకరణను లోతుగా విశ్లేషించాడు. ఆయన ఆలోచనకు కేంద్రం మనిషి మనిషిలో మానవత్వ లోపం పరాయీకరణకు మూలం అనీ సమాజం సామ్యవాద దశకు చేరుకున్నపుడు పరాయీకరణ వుండదనీ సిద్దాంతీకరిస్తాడు ఆయన. పెట్టుబడివాద సమాజంలో కార్మికుడు ఒక అమ్ముడు సరుకు అయినాడనీ అతని నికృష్ట జీవితం అతని ఉత్సాదనకు విలోమ అనుపాతంలో వుందనీ సూత్రీకరిస్తాడు మార్క్స్, 1844లో రాసిన తన రాతప్రతుల్లో,
సంబంధ విచ్చేదన కార్మికునికీ అతను ఉత్పత్తి చేసే ఉత్సాదనకూ మధ్యనే కాదు, ఉత్పత్తి ప్రశ్రియలోనే ఆతను పరాయివాడవుతున్నాడు అంటాడు మార్క్స్. అదెలా అంటే, ఉత్సాదనే పరాయిదైనపుడు ఉత్పత్తి ప్రక్రియ కూడా పరాయీకరణే. అంటే కార్మికుని (శ్రమ పరాయీకృతమే, పరాయీకరణ ప్రక్రియే. ఎందుకంటే శ్రమ శ్రామికునికి బాహ్యమైనది, ఆంటే అది తన అంతరిక స్పందనతో చేసేది కాదు. స్వచ్చందంగా లేక ఇష్టంగా చేసే (శ్రమ వాదు. అది నిర్బంధ శ్రమ. అందుకే అది ఒక అవసరాన్ని తీర్చేందుకు చేసే పని కాదు, బాహ్య అవసరాలను తీర్చేందుకు ఉపయోపడే ఒక సాధనం మాత్రమే. ఆత్మను చంపుకొని చేసే శ్రమ. ఇతరుల కోసం చేసే శ్రమ పరాయితనంతో కూడిన (శ్రమ. చాలా యిళ్లలో స్త్రీలు వంట గదికి అతుక్కుపోయి యీ పరాయీకరణ అనుభవిస్తుంటారు.
ప్రకృతి నుంచి మనిషి పరాయీకరణ మనుష్యత్వం నుంచి పరాయీకరణే. అంతిమంగా పరాయీకరణ మనిషి నుంచి మనిషినీ, స్వజాతి ప్రాణి (5060 68 09 ౧౦) నుంచి సంపూర్ణ మానవ బాతినీ, సమాజాన్నీ వేరు చేసి, తన వలయం లోకి తీసుకుంటుంది.
పరాయీకరణ అనేది వ్యక్తులకు మాత్రమేనా, లేక సమాజానికి కూడానా అన్న ్రళ్ళీ తలెత్తింది. పరాయీకరణను వ్యక్తికి పరిమితం చేసే వాళ్ల వాదన ఎమిటంటే సమాజానికి సమాయోజతం (2669 కాకపోవడం పరాయీకరణకు దారి తీస్తుంది అని. ఎరిక్ ఫ్రోమ్
1186
లాంటి మేధావుల వాదన యేమిటంటే, సమాజమే రుగ్గదశలో వుండవచ్చుననీ, పరాయీకృతమై వుండవచ్చుననీ, అటువంటప్పుడు వ్యక్తి సమాజానికి అనుకూలుడు కాలేక పోయినంత మాత్రాన ఆ వ్యక్తి పరాయీకరణకు గురి అవుతాడని అనలేం అని. మరి కొందరు దీన్ని మనోవైజ్ఞానిక దృష్టితో పరిశిలించినారు. ఎరిక్ జోసెఫ్‌సన్, మేరీ జోసెఫ్‌సన్‌ల ప్రకారం పరాయీకరణ ఒక ఆనుభూతి. ప్రపంచంతోన్తూ, ఇతరులతోనూ, తన 'స్వ' తోనూ దూరమయ్యే మానసిక స్థితి, ఉద్యోగిస్వామ్యాలలో (బ్యూరోక్రసీస్‌లో) మనిషి పరాయీకరణను పొందుతాడు. వాటిలో పనిచేసే ఉద్యోగస్తులు కూడా నియమ నిబంధనలతో విసిగి వేసారి, అమానవీకరణకు గురవుతారు. అలాగే వేతనం కోసం పనిచేసే వేతనశర్మలు డబ్బు సంపాదించడమే సరమావధిగా పెట్టుకొని ధనోత్సాదన యంత్రాలుగా తయారవుతారు. ఇది పరాయీకరణే. విద్యా రంగంలో ఉపాధ్యాయులు క్లాసులో తమకు నచ్చని విషయాల మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి వారూ పరాయీకరణను తప్పించుకోలేరు. వీటన్నిటికంటే, కట్నం వేధింపులకు గురయ్యే (స్రీలు అనుభవించే అమానవీకరణ, న య్యే (స్త్రి నిక పరిపూర్ష పరాయీకరణ. భర్త అత్త విలన్షయినప్పుడు ఇంటి కోడలు అనుభవించే నరకా పరాయీకరణ పదం చాలదు. ప్రస్థానం, అక్షోబరు-డీసెంబరు 2004 119
స! అలి జర్మన్ ఫాసిజం - దాని పరిణామం జనవరి 30, 1933 జర్మన్ టెలిగ్రాఫ్ ఏజెన్సీ న్యూస్ ఫ్లాష్ : జర్మన్ రాష్ట్రపతి హిండెన్‌బర్గ్ నాజీపార్టీ అధినేత అడోల్ఫ్ హిట్లర్‌ను ప్రభుత్వాధిపత్యం చేపట్టాల్సిందిగా కోరాడు. బెర్లిన్‌లో ఆరోజు టార్చ్ పరేడ్ జరిగింది. హిట్టర్ అనుచరులు దీన్ని జాతీయోత్సవంగా జరుపుకున్నారు. జాతీయ సమాజవాద౦ం (నేషనల్స్ సోషలిజం) హిట్లర్ రాజకీయ సైద్దాంతిక సూత్రం. హిట్లర్ బూర్జువాలకు మాత్రమే కాదు, జర్మన్ కార్మికులకూ నాయకుడే. కారి గకులకు జాతివాదం నూరిపోశాడు. అంతే కాదు, కొన్ని చర్యలు, కార్మిక సంక్షేమ చర్యలు తీసుకొన్నాడు. జర్మన్ పెటీ బూర్జువా (మధ్యతరగతి) జనం హిట్లర్‌ను ఎక్కువగా అభిమానించడం మొదలెట్టారు. యూదు వ్యతిరేక 'ప్రజాసముదాయ విధానం" మార్చ్ 1933న మొగలైంది. యూదుల దుకాణాల్నీ, ఆస్తులనూ స్వాధీనం చేసుకున్నారు. వారి జర్మన్ పొరసత్వం రద్దు చేశారు. ఆ తర్వాత 1938 నవంబరు 9-10న లక్షలాది యూదులను హతమార్చారు, చిత్రహింసల పాల్టేశారు తర్వాత వచ్చిన ప్రపంచ యుద్దంలో రష్యా ఉక్రెయిన్, చెక్, స్టావాక్ దేశాల్లోని 120 లక్షల మంది యూదులను చంపి వుంటారని అంచనా. నాయకత్త సూత్రం నాబీ సిద్దాంతాల్లో ఒకటి. దీని ప్రకారం అధినేత అనుల్లంఘనీయుడు. విమర్శకు అతీతుడు. అతను చెప్పేదే వేదవాక్యం. అది ఎల్లప్పుడూ కరెక్టే. ప్రజాతివాదం నాజీ సిద్దాంతాల్లో ప్రముఖమైనది. దీని ప్రకారం ఆర్య ప్రజాతి (రేస్), అందులోనూ, జర్మన్ ప్రజాతి అతి శ్రేష్టమైనది. స్కాండినేవియా (నార్వే, స్వీడన్, డెన్మార్క్) జాతి, ఆంగ్రేయులూ ఆ తరువాత వస్తారు. (ఫ్రెంచి జాతీయులూ, స్పానిష్ జాతీయులూ తృతీయ, చతుర్ధ స్థానాల్లో వుంటారు. వీళ్ల తర్వాత ఇటలీవాళ్లు, రుమేనియా జాతీయులూ. వీళ్లందరి కంటే తక్కువ జాతి స్టాన్ జాతి. అంటే ముఖ్యంగా, రష్యన్గు, ఉశ్రెయినియన్సు, 120
చెక్‌స్టావాక్ దేశస్తులు. ఇక పోతే ఆసియా ఖండాన్ని తీసుకుంటే ఈ సిద్దాంతం ప్రకారం జాపనీయులు శ్రేష్ట ప్రజాతి, తర్వాతి స్థానంలో భారత జాతి, ఆ తర్వాత కొరియన్ దేశస్తులు, వీరందరి తర్వాత చైనీయులు. వీళ్లందరికంటే హీనం అరబ్బులు. ఈ సూత్రం ప్రకారం, జీవించడానికి కూడా అర్హత లేని జాతి యూదు జాతి. మిగతా (ప్రజాతుల్ని ఇది సంకరం చేస్తుంది. అందువల్ల యూదు జాతిని పూర్తిగా నిర్మూలించాలి. ఇదీ ఈ ్రజాతివాద అమానుష సిద్దాంతం. ॥ దురదృష్టం కొద్దీ ఇది ఏదో సైద్ధాంతిక చట్రంగానే మిగల్లా మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి, అసమాన షరతులతో దాని లొంగుబాటూ జర్మన్ జాతివాదాన్ని పెంచినాయి. శ్రేష్టమైన" జర్మన్ (ప్రజాతి కిది అవమానకర మన్సించింది. అందుకే హిట్లర్ పోలెండ్‌పై యుద్దం ్రకటించినాడు. రెండవ ప్రపంచ యుద్దానికి నాంది పలికినాడు. తూర్పున జపాన్ సైన్యవాదం, యూరప్‌లో ఇటలీ ఫాసీవాదం, హిట్టర్ నాజీవాదానికి తోడయ్యాయి. ఇక, రెండవ ప్రపంచయుద్ధం పరోక్ష ఫలితంగా బ్రైిటిషు వాళ్ల అసమర్థత, పాక్షికత కారణంగా వచ్చిన బెంగాల్ కరువులో 30 లక్షల మంది చనిపోయారు. మరి, యూరప్ యుద్దభూమిలో 5 కోట్లా 50 లక్షల మంది మరణించినారు. ఒక్క సోవియట్ రష్యానే 2 కోట్లా 70 .లక్షలమందిని పోగొట్టుకుంది. రష్యాకు చెందిన 1,710 పట్టణాలూ, 70,000 (గ్రామాలూ తుడిచిపెట్టుక పోయాయి. ప్రాన్స్ 6 లక్షల మందినీ, యుగొస్టావియా 17 లక్షల మందినీ, పోలెండ్ 60 లక్షల మందినీ పోగొట్టుకున్నాయి. ఆసియా యుద్ధ భూమిలో మన దేశస్తులు 24000 మంది చనిపోయారు, 64,000 మంది గాయపడ్డారు. లెక్కలు చెప్పడం కాదు గానీ, దాని వెనకాల వుండే అపారమైన టట్రాజెడీని మనం అవగాహన చేసుకోవాలి, ఇక ఇప్పటి సంగతి, ఇక్కడ కులాల హెచ్చుతగ్గులున్నాయి. - ఘోరంగా. అంటరానితనం పల్లెల్లో దారుణంగా (ప్రబలి వుంది. దళితుల అణచివేత తరతరాలుగా కొనసాగుతోంది. దళితుల్ని ఇక్కడ ఆది ఆంధ్ర అని కూడా అంటారు. అంటే అర్జం ఈ నేలకు చెందిన మూలనివాసులు అనే కదా! మరి, ఇప్పటి కింకా వూరు నేరు, వాడ వేరుగానే వున్నాయి. దీనికి మనందరం సిగ్గుపడాలి. కులాతీత, మతాతీత, లౌకిక (ప్రజాస్వామ్యం మన మార్గం. ఈ దిశగా మరింత పురోగమనం మన తక్షణ కర్తవ్యం. అదే ఫాసిజానికి భారతీయ సమాధానం. (స్రజాసాహితి, జూన్ 2005 121
జాతి, భాష, దేశభక్తి, అంతర్జాతీయత
మనం మన దేశాన్ని భారతదేశమనీ, భారతజాతి అనీ గౌరవంతో పిలుచుకుంటూ వుంటాము. ప్రపంచ పరిస్థితుల్నే తారుమారుచేసే ఘటనల (ప్రసక్తి వచ్చినపుడు మానవతావాద దృష్టితో 'మానవజాతి' మనుగడను గూర్చి ఆలోచిస్తాము, చర్చిస్తాము. ఇపుడు మనం “జాతి” అనే పదాన్ని విసృతమైన మానవజాతి అనే అర్హంలో కాకుండా [47101 లేక [4గ౦౦ అనే పదానికి పర్యాయంగా భావించి, విశ్లేషించేందుకు ప్రయత్నిద్దాం.
ఆధునిక రాజకీయ సాహిత్యంతో మీకు పరిచయం వుంటే, మీరు జాతి అనే పదంతో పాటు ఉపజాతి (నరోద్‌నొస్త) లేక వివరంగా చెప్పాలంటే నృవంశదశను దాటి జాతిగా రూపొందక పూర్వం వుండే జనసముదాయాన్ని 'ఉపజాతి' అని పేర్కొనటం గమనించి వుంటారు.
జాతుల, ఉపజాతుల, అన్ని తెగల, జనసముదాయాల సమానత్వాన్ని లెనిన్ చాటి చెప్పాడని మనకు తెలుసు. సిద్దాంతరీత్యానే కాదు, ఆచరణలో కూడ లెనిన్ దీన్ని రుజువు చేశాడు. జారు కాలంలో రష్యా ఒక బహుళ జాతి సామ్రాజ్యంగా వుండేది. దాని జనాభాలో సగానికి పైగా రష్యనేతరులే. మధ్య ఆసియా, సైబీరియా, కాకేషన్ ప్రాంతాలు అర్హవలసలుగా అతిహీనంగా చూడబడేవి. “విభజించి పాలించు" అనే దుర్నీతి ఆధారంగా వివిధ జాతుల మధ్య వైషమ్యూలను రెచ్చగొట్టి, ఘర్షణలను 'ప్రోత్సహించేది ఆనాటి నిరంకుశ రాజ్య వ్యవస్థ. 1897లో జరిపిన జనాభా లెక్కల సేకరణలో రష్యన్ (“గొప్పరష్యన్) ఉతక్రెయినియన్ (చిన్న రష్యన్) బైలో రష్యన్ (తెల్ల రష్యన్) - ఈ మూటి మధ్యా తేడా గమనించకుండా మూటినీ రష్యన్ భాషకిందనే జమకట్టడం జరిగింది. దీనితో ఉక్రైయినియన్, బైలో రష్యన్ ప్రాంతాలలో జాతీయతా భావాలు పెంపొందసాగాయి.. ఇక మధ్య ఆసియా, సైబీరియా, దూరోత్తరం, దూర(ప్రాచ్యం సంగతి చెప్పనక్కర లేదు. ఆయా జాతీయ బృందాలకు గుర్తింపు వుండేది కాదు. అక్కడ అక్షరాస్యత దాదాపు శూన్యం. 1914-15కు జార్ కాలం నాటి రష్యాలో 105 ఉన్నత విద్యాసంస్థలుంటే, వాటిలో సగానికిపైగా మాస్కోలోన్లూ పెత్రోగ్రాద్‌లోనూ వుండేవి.
122
అప్పటికి జార్జియాలో కేవలం ఒక్క విద్యాసంస్థ వుండేది. బైలోరూస్, అజర్ భైజాన్, అర్మేనియా ఉబ్బెకిస్తాన్, కజకిస్తాన్ తుర్కుమెనిస్తాన్, తజకిస్తాన్ ప్రదేశాల్లో ఒక్క ఉన్నత విద్యాసంస్థ కూడ లేదు. విప్తవానికి పూర్వం ఉబ్బెక్ జాతికి చెందిన ఇద్దరు మాత్రమే ఉన్నత విద్య అభ్యసించినవారు వుండేవారు. అందుక్షే లెనిన్ రష్యాను 'జాతుల బందిఖానా"గా వర్షించాడు నిర్మొహమాటంగా. పరిస్టితి ఎంత ఘోరంగా వుండేదంటే రష్యనేతర ప్రాంతాల చారిత్రిక పేర్టు కూడా మార్చివేశారు. రప్యవేతర్లని విజాతీయులుగా, సంస్కారహీనులుగా పరిగణిస్తూ అవమానిస్తూ వచ్చారు రష్యన్ పాలకులు. అందుకే లెనిన్ అంతగా దుయ్యబట్టాడు రష్యన్ జాత్యహంకారాన్ని. జాతులకు స్వయం నిర్ణయాధికారహక్కు వుండాలని లెనిన్ ప్రతిపాదించాడు. కాని దీని అర్ధం, సర్వేసర్వత్రా అన్వ్నయిరిచి కార్మికవర్గాన్ని విడగొట్టేందుకు పనికివచ్చే వేర్పాటుతత్వం కాదు. అసలు సకల జాతులకు చెందిన (శ్రమజీవులు సమైక్యం కావాలనే సదుద్దేశంతో చేసిన సైద్దాంతిక (ప్రతిపాదన అతనిది. రష్యన్ జాత్యహంకారాన్ని నిరసిస్తూ జాతిపట్ట గౌరవ భావం వ్యక్తం చేస్తూ లెనిన్ నిర్షంద్వంగా చేసిన ఈ ప్రకటన గమనార్హం. జాతీయ గర్వం అనే భావం మనకు, వర్షచైతన్యం గల మహా రష్యన్ కార్మికులకు పరాయిదా? కానే కాదు! మనం మన భాషను (ప్రేమిస్తాం. మన దేశాన్ని ప్రేమిస్తాం, దాని (శ్రామిక జన సముదాయాలను (అనగా దాని జనాభాలో నూటికి తాంభై వంతులను) (ప్రజాతంత్ర సోషలిస్టు చైతన్య స్థాయికి తీసుకు రావడానికి చేతనైనదంతా చేస్తున్నాము. మా మహోజ్బలమైన దేశం పట్ల జారిస్టు కసాయి వాళ్ళూ, రాచరిక ప్రభువులూ పెట్టుబడిదార్లూ చేస్తున్న అపచారాలూ, పీడనా, అవమానాలూ చూసి మేము బాధపడినంతగా యెవరూ బాధపడరు. యీ అపచారాలకు నూ మధ్యనుండి, మహారష్యన్హ మధ్యనుండి ప్రతిఘటన యెదురైనందుకు మేము గర్విస్తున్నాము'. (ప్రొచ్య (ప్రపంచంలో జాతీయ విమోచనోద్యమం - ఏి.ఐ. లెనిన్ - ప్రగతి ప్రచురణ, మాస్కో.) అందుకే నేడు సోవియత్ యూనియన్ - సకల జాతుల వివిధ భాషల, సాహితీ సంస్కృతుల సమానత్వానికి ఒక మచ్చుతునకగా నిలిచి వుంది. కాని, సహజంగానే చాలమందికి కొన్ని అనుమానాలున్నాయి. జాతుల స్వయం నిర్ణయాధికారం పవిత్రమైన ప్రకటన మాత్రమేననీ, ఇంకా రష్యనీకరణ' జరుగుతోందనీ ఆరోపణలు చేస్తున్నారు అక్టోబర్ విప్లవం విజయవంతమైన 1917లోనే ఫిన్లాండు పార్లమెంట్ రష్యానుంచి విడిపోయే తీర్మానం ఆమోదిస్తే సోవియత్ రష్యా దాన్ని అమలుపరచింది. ఫిన్లండును సర్వసత్తాక స్వతం(త్ర దేశంగా గుర్తించింది. ఈనాడు చుక్చీలూ, చువాష్‌లూ, బష్క్‌ర్‌లూ, ఒస్సేతియన్‌లూ మొదలైన నృవంశబృ్బందాలకూ, ఉప జాతులకూ స్వయం ప్రతిపత్తి వుంది. ఉజ్బెకిస్తాన్ లాంటి వెనుకిబడిన ప్రదేశాలు యూరపు దేశాల స్థాయినందుకున్నాయి - 123
ఆర్థికంగా, సాంస్కృతికంగా; గుణాత్మకంగా తీసుకుంటే ఇక్కడి జీవితం అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీదేశాల కంటే ఎన్నో రెట్లు మిన్న రష్యన్ శ్రమజీవుల సహకార సంపర్క సత్ఫలితమే ఈ వెనుకబడిన జాతులు కొన్ని దశాబ్దాల్లోనే శతాబ్దాల ప్రగతి సాధించగలగడం ప్రస్తుతం (శ్రమజీవుల సోవియత్ దేశం లోని రకరకాలైన కర్మాగారాల్డో, కార్థానాలల్లో, కార్యాలయాలల్టో బైకాల్-అమూర్ మెయిన్ రైల్వే నిర్మాణం లాంటి పెద్దపెద్ద ప్రాజెక్టుల్లో, (శ్రమజీవుల పనిపాటల్లో వారు నివసించే వాడల్లో కలిసిమెలిసి వుండటం వల్ల ఒక నూతన సోవియత్ సమాజం ఆవిర్భవించింది. ఇది వివిధ జాతుల సంగమ స్థానమయింది. ప్రత్యేకతలను పోగొట్టుకోకుండా, పరస్పరం సహకరించుకునే విశిష్ట సోదర సమాజవాద దేశాల సంయుక్త సమాజంగా రూపొందింది. సోవియత్ యూనియన్‌కు సంబంధిరిచినంత వరక్తు, వాళ్లు కులాంతర, మతాంతర వివాహాల మాట మాట్టాడటం లేదు; వివిధ జాతుల మధ్య వివిధ భాషలు మాట్లాడే జనసముదాయాల మధ్య స్నేహం సద్భావం (ప్రేరణ కాగా ప్రేమలూ పెళ్లిళ్లూ అరుదుగా కాదు, తరచుగా జరుగుతూండటం మనం వూహించలేనంతగా వాస్తవం, అక్కడ. విష్ణ్టవానికి పూర్వం ఒక్క మేధావి కూడా లేని (ప్రదేశాల్లో ఇపుడు బుద్దిజీవుల సంఖ్య అద్భుతంగా పెరిగింది. పూర్వం లిపికూడ లేని భాషల్లో ఇపుడు రాస్తున్న రచయితలు 'ప్రపంచఖ్యాతి పొందగలిగారంటే అది సమాజవాద వ్యవస్థలో సాధ్యమైంది సమానత్వం నినాదం కాదు పచ్చి నిజమనే దానికి చక్కని నిదర్శనం. సమానత్వమంటే చదును చేయడం లేక సమతలీకరణం (16౪8 1౧9) అనుకుంటే, అలా అనుకునే వాళ్లు సరళీకరణకు బానిసలు, మార్క్స్‌వాదానికి, దాని సారరూపానికి శత్రువులు. అందుకే లెనిన్ చూపిన పంథాలో ఎన్నో కష్టాల నెదుర్కొంటూ, కొన్ని పొరపాట్టను సరిదిద్దుకుంటూ మొత్తానికి జాతుల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించగలిగారు సోవియత్ యూనియన్‌లో దీని ఫలితంగానే మాటల్లో కాకుండా నిజంగానే జాతులు తమదైన సాంతరూపం పొగొట్టుకోకుండా సమాజవాద సారాన్ని వస్తువును సంతరించుకోగలిగాయి. సం(ప్రదాయవాదుల్ని సాహసంతో ఎదుర్కొంటూ కూడా సత్సం(ప్రదాయాల్ని స్వీకరించి, పరిష్కరించి, నూతన సంప్రదాయాల్ని సృష్టించి సాంస్కృతిక విష్ణవాన్ని అసలైన అర్థంలో సాధించగలిగారు సోవియత్ యూనియన్‌లో. దీంట్లో రష్యన్హ పాత్ర ఎక్కువే వున్నిందనేది దాచేస్తే దాగని సత్యం. మరో కోణం నుంచి ఈ సమస్యను చూద్దామిపుడు. లెనిన్ నాటి జార్‌రష్టా వేరు, ఈనాటి పరిస్టితి వేరు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాడే వలసవాద దేశాలు ప్రత్యేక జాతులను అణచివేసే హక్కు - ఆ అనాగరికుల్ని తమ సభ్యతతో సంస్కరించాలనే 124
సదుద్దేశంతో యూరప్‌దేశాలు వాళ్లపై పెత్తనం చేయాలనే వితండవాదాన్ని గట్టిగా తిరస్కరించాడు మహామనీషి లెనిన్. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే చారిత్రిక దశలో అన్ని జనసముదాయాలూ, నృవంశబృందాలూ ఏకమై స్వాతంత్ర్యం కోసం, విమోచన కోసం సాగించే పోరాటంలో వారంతా కూడ కలియక తప్పదు. దేశమే ఒక్కటై పోరాడక తప్పదు. జాతీయ బూర్జువా శక్తులతో కార్మికవర్గం చేతులు కలపక. తప్పదు. అంతేకాదు, ఆ తర్వాత కూడ, జాతీయ విమోచన సఫలమై దేశం స్వతంత్రమైన తర్వాత కూడ “కార్మికవర్గాల బాధ్యత యేమంటే దీర్జకాలంగా పీడింపబడిన దేశాలలోనూ, జాతులలోనూ జాతీయ మమకారాల అవశేషాల పట్ల ప్రత్యేక (శ్రద్దతోనూ జాగ్రత్తతోనూ వ్యవహరించాలి.” (కార్మికవర్గ అంతర్జాతీయత - వి.ఐ. లెనిన్ - ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, పుట 86.) అని కార్మికవర్గ ఆంతర్జాతీయతా వాద సంస్కృతిని గురించి ప్రస్తావించే సందర్భంలో కూడ స్పష్టీకరిస్తాడు లెనిన్. జాతీయ చైతన్యాన్ని ప్రత్యేకతనూ గుర్తిస్తూ జాతిపట్ట అభిమానాన్ని ఆహ్వానిస్తూ కూడా జాతీయవాదాన్ని తిరస్కరిస్తారు మార్క్స్‌వాదులు. ఇందులో వైపరీత్యం ఏమీ లేదు. విమోచనోద్యమాల్లో నిర్మాణాత్మక పాత్ర వహించే యీ భావనలే ఇతర జాతుల పట్ల తృణీకార భావం, ద్వేషం కలుగజేస్తే అవి జాతీయవాద దుష్పలితాలే. ఇవి ఇంకొంచెం ముదిరి జాత్యహంకారం, జాతీయ దురహంకారభావం, జాతి(శ్రేస్టతా భావనకు దారితీస్తే ఏటిని తిరస్కరించడం, క్రియాశీలంగా వీటిని వ్యతిరేకించడం (ప్రగతివాదుల ప్రధమ కర్తవ్యం. జాతీయవాదంలోని జుత్యభిమానం, దేశభక్తి వాంఛనీయం. కాని దురహంకారం గర్హణీయం. దేశభక్తి అంటే కేవలం దేశంలోని కొన్ని విశిష్ట జాతీయ సముదాయాల్ని అభిమానించడం కాదు, దేశంలోని అన్ని జాతులను ఉపజాతులనూ మానవవంశ సముదాయాల్ని గౌరవంతో చూడటం ఆత్మీయతతో అభిమానించడం దేశభక్తి అన్నించుకుంటుంది. ఇది అంతర్జాతీయ వాదానికి వ్యతిరేకం కొనే కాదు, దానికి బదులు, అది సరిమైన అంతర్జాతీయ అవగాహనకు దారితీస్తుంది.
జాతికి తనదంటూ ఒక భాష వుండాలని కొందరు వాదిస్తూ వుంటారు. కాని ఈ వాదం వాస్తవానికి విరుద్ధం. స్పానిష్ భాష మాట్లాడే వారంతా ఒకే జాతి కాదు. స్విట్టర్‌లాండ్‌లో మూడు భాషలు మాట్లాడే జాతీయ సముదాయాలు (జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్) వున్నప్పటికీ, స్విస్ జాతి ఒకటి రూపొందింది. ఒకే దేశం, ఒకే జాతి. భాషలు భిన్నం.
జాతుల సమస్య పెట్టుబడిదారీ సమాజంలో, మరీ ముఖ్యంగా అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో ఇంకా సామరస్యపూర్వకంగా పరిష్కరింపబడలేదు అనేది ఈనాటి వాస్తవికత.
125
(బ్రిటన్‌లో జాతుల సమస్య యింకా మిగిలి వుంది. ఉత్తర ఐర్లండ్‌లో అక్రమంగా (బ్రిటిషు క్యాధలిక్కులు స్ట్రిరపడి "పెత్తనం చేయటంతో అక్కడి (ప్రొటెస్టెంట్ జనంలో వ్యతిరేకత తిరుగుబాటుకు దారితీసింది. ఐరిష్ జాతీయ భావనను అవమానించడం జరిగింది. స్పెయిన్‌లో ఫ్రాంకో నిరంకుశత్వం కారణంగా కాతలాన్లు గలీసియన్సు, బాస్క్‌ల మధ్య సామరస్య పూర్వక సంబంధాలుండటం లేదు. అసలు జాతికి పూర్వం ప్రజాసముదాయాల రూపాలు ఎలా వుండేవో కాస్త తెలుసు కొందాం. చారిత్రికంగా మొదటి రూపం రక్తసంబంధాల నుంచి ఉద్భవించిన కుటుంబము, తెగ. రక్తబంధుత్వం, లేదా తల్లివైపునుంచో, తండ్రివైపునుంచో వచ్చిన ఒకే మూల పురుషుని సంతతివారై వుండటం (గోత్రం) తమను కలుపుతున్నాయని ఒకప్పుడు ప్రజలంతా భావించేవారు. సాముదాయిక వ్యవస్టల్గో కలిసి జీవితం గడిపేవారు. ఈ సముదాయాల పరిమాణం పెరిగిన కొద్దీ బృందాలు వేరైపోసాగాయి. సంబంధ బాంధవ్యాలున్న సాముదాయిక వ్యవస్థ్ర తెగలుగా ఐక్యమయ్యాయి. ఇదొక దళ ఆచారాలు, భాష, ప్రాంతం తెగ ప్రత్యేకతలు. కుటుంబ యాజమాన్యం పెద్దలు నిర్వహించినట్లే తెగలను తెగసభల్లో ఎన్నికయిన సమితులు పాలించేవి. రానురాను, రక్తబాంధవ్యేతర తెగల్లో మైత్రీసంబంధాలు ఏర్పడసాగినాయి. రక్తబంధుత్వం అంశం క్రమేణ తగ్గిపోసాగింది. ఆ రక్తసంబంధ స్థానంలో (ప్రాదేశిక అనుబంధాల స్థాపన జాతీయబ్బందాలు రూపొందడానికీ తరువాత జాతుల ఆవిర్భావానికీ దారితీసింది. (రాజకీయ విజ్ఞాన మూల సూత్రాలు - సోవియట్ ప్రచురణ, 1983), 1960వ దళకంలో కాతలోనియా భాషలో పత్రికలు (ప్రచురించేందుకు అనుమతించక తప్పలేదు. బాన్క్ జాతీయ పోరాటం ఇంకా కొనసాగుతూనే వుంది. బలవంతంగా స్పెయినీకరించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాల ఫలితమే స్పెయిన్‌లో జాతిసమస్య పరిష్కరింపబడక పోవడానికి కారణం. ఇక ఆమెరికా అని తప్పుగా పిలవబడే ఆమెరికా సంయుక్త రా[ష్ట్రాలనే దేశం ఈ సమస్యను పరిష్కరించలేని దుస్థితిలో వుంది. సామ్రాజ్యవాదం నగ్నరూపంలో, కొన్నిసార్లు ప్రజాస్వామ్య ముసుగులో మానవవంళశ సముదాయాల్ని ఎలా దారుణంగా కొల్లగొడుతోందో స్పష్టంగా కన్పిస్తుంది ఆసం.రా.లో. గోర్డన్ అన్నట్టు వర్షసంబంధాలు కాదు ఆ.సం.రా.లో చోదకశక్తి: మానవ వంశవర్గాలు (౯111100.4589) (౯40౧౦౦౮142! ౧౦౦65393 8౧6 సీజ[0౧4& ౧౦౦9౧౧5 ౧ 6 స1ం0రంగ 0/06 *- ౧౧౦6౬65౩ 500 9069 1109004 1981 న 253) అక్కడ నిర్దాయక సామాజిక స్టాయినందు కున్నాయి. ఈ నృవంళవర్గ వ్యవస్థ ఒక విధమైన కులవ్యవస్టే, నీ(గ్రోలు, పోర్టారీకొవారు, 126
మెక్సికోవాళ్లు (వీళ్లందర్నీ కలిపి సామూహికంగా ముద్దుగా “చికానోలు” అని అంటారు) - వీరు ఈ వ్యవస్థలో అట్టడుగున పడినలిగే ఆర్తజనం. బ్రిటన్‌నుంచి వచ్చి స్థిరపడినవారిలో చాలమంది గనిపనివారైనారు. ఇక్కడ స్టిరనివాసంచేసే ఇటాలియన్సు ఎక్కువభాగం భవన నిర్మాణ కార్మికులైనారు. బేకరీలలో పనిచేసేవాళ్లలో ఎక్కువమంది గ్రీకులు కన్పిస్తారు. పోలెండ్ నుంచి ఇక్కడికి ప్రవాసం వచ్చినవారిలో అధికభాగం మోటార్ పరిశ్రమలో కన్పిస్తారు. అందరికంటే అధ్యాన్నస్టితి నీగ్రోలది. ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చి తమ సమస్తమూ దేశానికి అర్పించిన జనం అంటరానివారుగా మిగిలిపోయారు. 2 కోట్టకు పైగా వున్నా న్యాయపరంగా, వీరికి కొన్ని పౌరహక్కులు సం'క్రమించినా ఇప్పటికీ వారి పరిస్థితి శోచనీయంగానే వుంది. నగరాల్లోని మురికివాడల్లో వీరి నివాసం. వీళ్లు పోరాని హోటళ్లున్నాయి - వెళ్లరాని ప్రదేశాలున్నాయి. స్కూళ్లలో వీళ్లపై ఆంక్షలున్నాయి. స్కూలు గంటమోగితే అది నీ(గ్రోలకు కాదు. ముందు శ్వేత జాతీయులు బయటికి వస్తారు. వాళ్లంతా బయటికి వెళ్లిన తర్వాతే నీగ్రో విద్యార్థులు రూమ్ నుంచి బయటికి రావాల్సింది. “నా పై వుమ్మి వూసే వాళ్లు సిరా చల్లే వాళ్లు - నేను వాళ్లను మనుషులనుకోవడం లేద”ని ఆంది ఒక అశ్వేత విద్యార్థిని తన సహ విద్యార్థుల (తెల్టోళ్లును గురించి అక్కసు వెళ్లగక్కుతూ (సమాజ్‌వాద్ తధా పూంజీవాద్ కే అంతర్గత్ రొష్టీయ్ ప్రన్న్ - అలెక్సాంద్ర్ జెవ్‌లేవ్ - ప్రగతి ప్రచురణాలయం, మాస్కో 1978). ఇప్పటికింకా నీ(గ్రోవాడలు మురికివాడలుగానే వున్నాయి. నిరుద్యోగం వీరిలోనే ఎక్కువ. ఉద్యోగం వచ్చినా సమానవేతనం రాదు. అసలిదంతా రంగుభేదరి వల్లనే అనే దానికి లేదు. 'నీగ్రోలోకు నిర్వచనం మాళ్చేశారు. వ్యాపార వరిళోధనల్లో ఇటీవలి వరకు 1/8వ భాగం నీగ్రోరక్తం వున్న వాళ్లను నల్లవాళ్లు (3.%05) గా పరిగణించేవారు. ఇపుడేమొ 1/32వ వంతు నీగ్రోరక్తం వున్నా. వాళ్లనూ నల్లవాళ్లకిందనే లెక్కగట్టేటంతగా దిగజారింది అభివృద్ధిచెందిన అ.సం.రా. సమాజం. సామాజిక విలువల్ని సమాధిచేసేందుకు విజ్ఞానరంగ విజయాల్ని పనిముట్టుగా వినియోగించుకుంటూ ప్రజాస్వామ్య ఛాంపియన్‌గా వెలిగిపోతున్న ఈ అ.సం.రా.లో అందరికంటే అగ్రభాగాన వుండే సామాజిక తరగతి ఏదంటే, అస్తిత్వంలో లేని గీగం్రం-5ఖజ40గి జాతి; అమెరికాతనాన్ని' నూటికి నూరుపాళ్లు సంతరించుకున్న ఆ జాతిని క్లుప్తంగా ౪/45౧ అనీ, దీర్చంగా ౪/06 4౧6 ౦- 5జ40% ని౧౧19912015" అనీ అంటారు. (౯4౧౦6౪ 114 ౧౦౦65569 2౧6 [1200౧4 ౦0 6౧8 ౧ 46 [141069౧ /076 - ౧౯౦౦౯958 ౧౮౦ (906/3, [10500౪4 1984). అస్తిత్వంలోలేని ఈ మిధ్యాజాతిని గురించిన వీరి అవగాహన ఆర్యప్రజాతి (శ్రేష్టమనే హిట్లర్ ప్రజాతివాదంతో పోల్చదగిందిగా వుంది. 12/7
సరే. ఇంకా అధ్యాన్నమైన జాతి వెలి విధానం అనుసరించే దక్షిణాఫ్రికా, యూదుల ధ్వాన్న న్
జన్మస్థలం - పవిత్రమైన' ఇజ్రాయెల్ - అక్కడ పాలస్పీనావారు నివసించేందుకు హక్కులేదనే యూదువాదం (2101151) లాంటి కొన్ని సామాజిక రుగ్మతల్ని గురించి మరోచోట మాట్లాడుకుందాం. (ప్రస్తుతం బెల్టియమ్‌ను గురించి ఒక్కమాట. ఉత్తర యూరప్‌లో చిన్న దేశం బెల్జియం. అక్కడ 'స్టైమిష్ భాష మాట్లాడే స్లైమింగ్ ప్రజలకూ (వీరి సంఖ్య 50 లక్షలకు మించి వుంటుంది), ఫ్రెంచ్ భాషమాట్టాడే వలూన్స్ (సంఖ్య 40 లక్షలు) కూ మధ్య సత్సంబంధాలు లేవు. దక్షిణాన వలోనియా ఆధిక్యతాభావన ఉత్తరాదిన నివసించే సైమిష్ జాతినిరసనకు పాత్రమైంది. ఇప్పటికీ ఈ చిన్న దేశం సమైక్య బెల్జియమ్ జాతిగా రూపొందలేక పోయేందుకు కారణం అక్కడి సామాజిక - అర్థిక వ్యవస్ట్రేనని చెప్పక తప్పదు.
అసం.రాలో విషమించిన నీగ్రోల అవస్థను గురించి ప్రస్తావించాను కదా, ఇపుడు దీనికి పూర్తి విరుద్దమైన ఒక ఉదాహరణ ఇస్తాను. దక్షిణమెరికాలోని బ్రెజిల్‌లో రియోది జనీరియో నగరంలోని ఒక కూడలిలో ఒక నీగ్రో అమ్మ తన పాపకు పాలు యిస్తున్న శిల్పాన్ని మనం చూస్తాం. ఇది (బైజిల్ జాతీయ సామరస్యానికి ఒక కళాత్మక సంకేతం అసం.రా. అమానుషత్వానికి ఒక గుణపాఠం" కిరాయి పరిశోధనలద్వారా ఇప్పటికీ, అంటే, జీవవిజ్ఞానం (ప్రకారం అన్ని ప్రజాతి జాతి బృందాలూ, నృవంశ సముదాయాలూ సమానేమనని నిరూపించ బడినప్పటికీ, కొత్త కొత్త సిద్ధాంతాలతో అమ్ముడు సరుకులుగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు. మానసీక అసమానత అనే మూఢ నమ్మకానికి శాప్రీయ ముసుగు తగిలిస్తూ జనాన్ని దుర్‌జ్ఞానంతో వంచిస్తున్నారు; వర్ధమాన దేశాల్ని అవమానిస్తున్నారు
నృవంశపరంగా పరిశీలిస్తే ఈ క్రింది (ప్రక్రియల్ని మనం ప్రస్తుత ప్రపంచంలో గమనించవచ్చు.
- నృవంశీయ దృఢీకరణ (2౯౪౧0 00౧9౦ 62[0౧)
2 నృవంశీయ ఏకీకరణ (1210016 ౩9 ౫ 260౧)
- నృవంశీయ సమైక్యత (౬5౧౦ 1౧16012600)
నృవంశీయ దృఢీకరణకు ఒక చక్కని ఉదాహరణ పోలివ్‌జాతి, ఒక జాతిగా రూపుదాల్బడం. పాలోనియన్, మజోవియన్, సైలేషియన్ మరికొన్ని ఇతర పశ్చిమ స్టాన్ తెగల కలయికతో పోలిష్ జాతి రూపొందింది. ఈ తెగలన్నిటిమధ్య సమాన లక్షణాలెక్కువ - భాష సంస్కృతి, ప్రజాతి లక్షణాలు దాదాపు ఒక్కటే కావడంతో ఇవి జాతిగా రూపొందడం
128
సరళతరమయింది. నృవంశీయ ఏకీకరణకు ఉదాహరణగా మనదేశంలో హిందీమాట్టాడే ప్రాంతాల్లోని చాల మండలాల్లో మాట్టాడే మాండలికాలు వేరైనప్పటికీ, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని జనావళి నృవంశీయ ఎకీకరణకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. నృవంశీయ ఏకీకరణకు ఉదాహరణ బ్రిటిష్ జాతిలో వేల్స్ తన ప్రత్యేకతను పోగొట్టు కోవడం. వేల్స్‌లో ఇంగ్లీషువారు ఎక్కువమంది స్టిరపడటం, వెల్త్‌తో పాటు అందరూ ఇంగ్లీషు మాట్ట్లాడగలగటం ఈ ఏకీకరణను సులభతరం చేసింది. హిందీ మాట్లాడే (ప్రదేశాల్డో ఈ ఏకీకరణ స్పష్టం. అయితే ఈ ఏకీకరణ నిర్బంధంగా జరగకూడదు, అప్రయత్నంగా జరగాలి. లేని పక్షాన జాతివైషమ్యాలు తలెత్తవచ్చు. నృవంశీయ లేక జాతీయ సమైక్యతను మనం తరచుగా మనదేశ ఆవళ్యకతగొా పరిగణిస్తూండటం మీకు తెలిసిందే. మనదేశ స్థితిని సమైక్యత అనే పదాన్ని ఒక విశిష్ట అర్థంలో వాడుతున్నాం. నృవంశ సముదాయాల, జాతీయబ్బందాల, ఉపజాతుల ప్రత్యేక లక్షణాల్ని గౌరవిస్తూ అన్నిటినీ ఐక్యంచేసే రాజకీయ, సామాబికార్థిక లక్ష్యం ఈ సమైక్యతా భావా, నికి “ప్రాణం. కాబట్టి మనం ఇపుడు విఎత్‌నామ్‌ను జాతీయ సమైక్యతకు ఉదాహరణగా తీసుకోవచ్చు. సా(మ్రాజ్యవాదాన్ని ఎదిరించడం, సమాజవాదదిశగా దేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం విఎత్‌నామ్‌లోని విభిన్న తెగలనూ నృవంశ సముదాయాల్నీ అన్నిటినీ సమైక్యపరిచేందుకు, విఎత్‌జాతిని పటిష్టపరచేందుకూ విఎత్‌నామ్ సమైక్యతకూ తోడ్పడింది; మూడు భిన్న భాషా కుటుంబాలకు చెందిన అనేక భాషలు మాట్లాడే జనసముదాయాలు వున్నా ఇది సాధ్యమయింది. కొంతవరకూ మనదేశానికి కూడా ఈ సమైక్యతాభావన అన్వయిస్తుంది. ఇపుడిపుడే సా(మ్రాజ్యవాద వ్యతిరేకతా భావం జనచైతన్యంలో అంతర్భాగమైంది. భారతదేశం భారతజాతిగా, సమైక్యజాతిగా 'భిన్నత్వంలో ఏకత్వం” అనే సూత్రం ఆధారంగా రూపొందుతోందని భావించేందుకు అస్కారం వుంది. జాతీయ ప్రత్యేకతలు విలీనం కావు. కాని సమైక్యమై ఒక దిశగా అభిముఖమై దేశం పయనిస్తోంది. ఇది ఫలించవచ్చు. కొన్ని సందర్భాల్లో విఫలం కూడ కావచ్చు; సామ్రాజ్యవాద స్వభావమే దీన్ని విఫలం చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంది. మనదేశంలో ఈ అంశాలు కూడా గమనార్హం. కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇది మనకు కళ్లకు కట్టినట్టు కన్పిస్తుంది. మనదేశం ప్రాచీనకాలం నుంచీ ఒకే జాతి అనీ, 'భారతీయత' అందరిలోనూ వున్న సమాన లక్షణమనీ కొంతమంది భాష్యం చెబుతూ వుంటారు. సనాతన కాలంలో భారతదేశం అనేక తెగలకు, అనేక నృవంశ సముదాయాలకూ, అనేక భాషా కుటుంబాలకూ 129
అనేక రాజ్యాలకూ నిలయంగా వున్నా సాంస్కృతికంగా ఒకే జాతిగా వుండేది అనేది ఈ వాద సారాంశం. విశాల దృక్పధంతో చూస్తే మానవజాతి అంతా ఒకటే - మానవ సంస్కృతి ఒకటే
- కాని, వైజ్ఞానిక దృక్సథంతో ఈ అంశాన్ని పరిశీలిస్తే చరిత్ర చాటే సత్యం యేమంటే బ్రిటిషు వలసవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం (ప్రారంభమైనప్పటినుండీ భారతజాతికి చారిత్రిక గుర్తింపు వచ్చిందని. మతం జాతికి ప్రధానం కానప్పటికీ, బ్రిటిషు కుటిల రాజకీయాల కారణంగా మతం పాత్ర హెచ్చింది. దేశం ముక్కలయింది. మరలా అనైక్యతాశక్తుల్ని (ప్రోత్సహించే వారు క్రియాశీలంగా వున్నారు. ఎన్ని జాతులు ఉపజాతులు, నృవంశ సముదాయాలు వున్నా దేశసమైక్యత ఈనాటి చారిత్రిక అవసరం. కాని అన్ని భాషలనూ సమానంగా చూసి అన్ని జనసముదాయాలనూ గౌరవిస్తూ, శతాబ్దాల పర్యంతం అణచబడిన జనజాతుల, వెనుకబడిన కులాల ప్రగతి వేగం పుంజుకుని జనాల మధ్య వుండే వైషమ్యాలు తగ్గినపుడు మాత్రమే దేళ లేక జాతీయ సమైక్యతకు మార్గం సుగమం కాగలుగుతుంది. దీన్ని దృష్టిలో వుంచుకొనే జారుకాలంనాటి రష్యాను చూసి ఇది ఒక జాతి కాదు "రెండు జాతులు” అన్నారు అసహ్యించుకుంటూ. జాతి సమస్యను వర్గదృక్సధంతో చూడకుండా కేవలం నృవంశశాస్త్రపరంగా మాత్రమే చూస్తే ఈ సామాజిక అంతరాలకు అర్ధం అవగాహనకు రాదు. కులవ్యవస్థ కుళ్లి కంపుకొడుతుంటే, మతతత్వం పిచ్చిగా మారి మారణహోమానికి కాష్టం అవుతూవుంటే, మతం ఒక్కటే, కాని ఆ మతంలోనే కొంతమందిని ఇప్పటికీ, చట్టరీత్యా కాకపోయినా, వాస్తవంగా అంటరానివారనీ, వారు ఆలయ ప్రవేశం చేయరాదనీ ఆంక్షలు విధిస్తూ వుంటే మన జాతీయ సమైక్యతకు అర్థం ఏమిటి? ఇది కేవలం ఒక ఆశయమే కాని వాస్తవం కాదనే చేదు నిజం చెప్పాల్సి వస్తుంది. ఈ ఆశయాన్ని వాస్తవీకరించాల్సిన చారిత్రిక అవసరం ఎంతైనా వుంది ఇది ఆయాచిత సలహాకాదు, ఉపదేశం కాదు, వాస్తవస్థితిని అవగాహన చేసుకొని, సమాజవాదదిశగా దేశం నడవాలని కోరీ ఒక నాగరికునీ ఆశయం, ఆశ, ఆకాంక్ష, దేశాభిమానం యిచ్చే ఆదేశం. దేశభక్తి కేవలం వర్గదృష్టి కాదనేది ఒక సత్యం, విభిన్న వర్గాల కలయిక ఒకోసారి చారిత్రికంగా అవసరమవుతుంది. దేశం ప్రజలు అనే మాటల్ని అపుడు కేవలం (శ్రమజీవులు అనే అర్ధంలో తీసుకోరు. (శ్రమజీవుల అవసరాలనిది వ్యతిరేకించేదిగా వుండదు. దేశపేమ ఎంతగా అవసరమో, అంతర్జాతీయతా భావన కూడ అంతే అవసరం ఆసలు దేశభక్తికీ, విశ్చప్రేమకూ లేక అంతర్జాతీయతావాదానికీ మధ్య వైరుధ్యం లేదు. అలా అని కేవలం మాటల్లో అంతర్జాతీయతను గూర్చిన ప్రకటనలిస్తే ఒరిగేదేమీ లేదు. దాన్ని చేతల ద్వారా వాస్తవీకరింప చేయాలి. (4410౧3 &౧6 500 ద|౦/69౩ - 4. గ 0౧6౧60, ౧౧౦౭౬6౩౩ ౧౮౦ 180665 130
[౧0500౪ 1984 ౧.99).
ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాల్సిన అవసరం వుంది. వలసవాదం పుణ్యమా అని ఆ యా సామ్రాజ్యవాద దేశాల భాషలు అంతర్జాతీయ భాషలైనాయి.. కానీ డచ్ పాలనలో వున్న ఇండొనేషియాలో వలసపాలన ముగియగానే వలసవాదుల భాషకు కూడ వీడ్కోలు ఇవ్వడం జరిగింది. అక్కడ మలయ్ భాష అంతకు ముందే వ్యాపార వాణిజ్యాల భాషగా వాడుకలో వుండేది. దాన్ని ఆధారం చేసుకుని అభివృద్ధి చేసిన “భాసా ఇండోనేషియా”ను, అల్ప సంఖ్యాకుల భాష అయినా అధికారభాషగా చేశారు. అలాగే విఎత్‌నోమ్ నుంచి ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులు పలాయనం చిత్తగించిన వెంటనే విఎత్ భాష అధికారభాష అయింది సంధాన భాష అయింది కంపూచియాలో ఖే ర్ భాషకు ఆ స్టాయి లభించింది. అలాగే భారతదేశంలో ఇంగ్లీషు ప్రాధాన్యం కొంతవరకు తగ్గి హిందీ తదితర దేశీయభాషల వాడకం పెరుగుతోంది. దీన్ని అంతర్జాతీయతా భావనకు ముడిపెట్టి, జాతీయ సంకుచితత్వానికి ప్రోత్సాహకం అని అనుకోవటం పొరపాటవుతుంది. ఇది అణగారిన జాతుల సాంస్కృతిక సామాజిక పునరుజ్జీవనంగా భావించాలి. మన దేశంలోని కొన్ని భాషలకు గొప్ప సాహిత్యాలున్నాయి. దేశంలోని అన్ని భాషల్నీ మనం (ప్రోత్సహించాలి. నూరు పూలు పూసేందుకు దోహదపడాలి.
నూరు భాషలు వికసించేందుకు తోడ్పడాలి. భాష విషయం వచ్చింది కాబట్టీ ఒక అంశం ఈ సందర్భంగా స్పష్టం చేయదలచాను (ప్రపంచంలో భాషల పరిస్టితి ఈనాడు కేవలం భాషాశాస్త్రవేత్తలకే వదలాల్సిన అంళం కాదు. దీన్ని సామాజిక సందర్భంలో పరిశీలించాల్సిన అవసరం వుంది. ప్రపంచమంతా ఎన్ని భాషలు మాట్లాడతారు అనే అంశంపై కూడ ఏకాభిప్రాయం లేదు. “ప్రసంచ జనాభా అనే రష్యన్ పుస్తకం (1965) ప్రకారం అప్పటికి ప్రపంచ భాషల సంఖ్య రెండువేలకు మించి వుంటుంది. “రూ రూబెరుమ్” అనే రష్యన్.పత్రిక (సంచిక 16, 1969) నివేదిక ప్రకారం (ప్రపంచంలో మాట్లాడే భాషల సంఖ్య దాదాపు 2,976 అని ప్రపంచ భాషాళాస్త్రవేత్తల రెండవ మహాసభలో చదివిన పత్రంలో పేర్కొన్నారట (112[002] ఓ200౪౭063 ౧ 6 ౮౨3, ౧/05 9౧౫5 &గ౧6 50 610౧౩ - న॥౦౦/౪99 [౮౦ 906/5 - ౯.40). ఖచ్చితంగా సంఖ్య ఇవ్వలేనందుకు కారణం ఇప్పటికింకా కొన్ని భాషల్ని మాండలికాలుగా మాత్రమే భావించడం లేదా మాండలికాల్నే భాషలుగా పరిగణించడం. (ప్రపంచ నాగరికతను గురించి ప్రస్తావించేపుడు తప్పనిసరిగా 1ప్రపంచభాషల' విషయం రానేవస్తుంది. “ఎస్పిరాంతో” లాంటి ఒకటి రెండు కృత్రిమ భాషలు తప్ప (ప్రపంచమంతా వ్యాప్తిచెందిన భాష అంటూ లేదు. ఐ.రా స.లో గుర్తింపు పొందిన
131
భాషల్ని ప్రపంచభాషలుగా గుర్తిస్తే అవి యివి. రష్యన్ చైనా భాష ఇంగ్లీషు, ఫ్రెంచ్ స్పానిష్ ఇవికాక ఆంతర్రేశీయ భాషలున్నాయి. అరబిక్, హిందీ, తమిళం లాంటివి. తమిళం సింగపూర్‌లో ఒక అధికారభాషు మలేషియాలో కూడ ఎక్కువగానే ఉపయోగిస్తారు.
(ప్రపంచ ప్రజల్ని అర్ధం చేసుకోవాలంటే వాళ్ల భాషలు నేర్చుకోవడమూ అవసరమే. కాని భాష విషయంలో ఎప్పుడూ నిర్బంధం పనికిరాదు. రష్యన్ నేర్చుకోవడం అవసరం కాబట్టి సోవియత్ యూనియన్‌లోని చాల ప్రదేశాల్లో తమ రెండవ భాషగా రష్యన్‌ను నమోదు చేయిస్తున్నారు. భాషావిషయకంగా (ప్రపంచంలో ఇటీవలవచ్చిన పెనుమార్పులు - భాషా బోధనాపద్దతి ఆధునికం కావడం, సంచారవ్యవస్థ అధునాతనం కావడంతో, (ప్రపంచం చాల చిన్నది గా అయిపోవడంతో కొన్ని విదేశీభాషల అధ్యయనం దాదాపు ప్రతిదేశంలోనూ 'ప్రోత్సహింపబడటము. (ప్రపంచమంతా అర్హం చేసుకునే అంతర్జాతీయ ధ్వని లిపి రూపొందడంతో భాషల అధ్యయనం సరళం అయింది.
కాని భాష జాతి - ఈ అంశాలకు సంబంధించి ఆఫ్రికా, దక్షిణ అమెరికాల స్టితి కొంత భిన్నంగా వుంది. దీన్ని పరిశీలించడం అంతర్జాతీయ అవగాహనకు అవసరం, ఆఫ్రికాలో వందలాది భాషలున్నాయని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. కాని, పరిస్థితి ఏమంటే, స్వాహిలి, ఇబో, యొరుబా అమ్హారిక్ లాంటి కొన్ని భాషల్ని మినహాయిస్తే మిగతావి తెగల భాషలు. తెగలు అసంఖ్యాకం అందుకే ఇప్పటికీ అనేక ఆఫ్రికా దేశాల్లో యూరోపు భాషలకు అధికార భాషా స్థాయి యివ్వక తప్పలేదు. కాని, ముందే తెలిపినట్టు స్వాహిలీ, ఇబో, యొరుబాలాంటి
భాషల్ని (ప్రోత్సహించడం జరుగుతోంది.
భాషల విషయంలో సోవియత్ అనుభవం వినూత్నమయింది, అనుసరణీయమైంది. ప్రణాళికాబద్ధంగా, వున్నలిపిని సంస్కరించడం, కొన్ని భాషలను రోమన్ లిపిలో రాయడం, లేక కొత్త లిపుల్ని తయారుచేయడం అనుభవం నేర్పిన పాఠందృష్ట్యా మరలా కొద్దిమార్పులతో సిరిలిక్ (రష్యన్) లిపిని వాడటం, అంతిమంగా, దీన్నుంచి నేర్చుకొన్నారా అన్నట్టు పళ్ళిమ బెంగాల్ (ప్రభుత్వం సంధాలీ భాషకు 'అల్‌చికీ' అనే లిపిని (ఈ లిపిని తయారుచేసిన వారు శ్రీముర్ము) (ప్రామాణిక లిపిగా గుర్తించి, వాడటం మొదలెట్టారు. అంతకుపూర్వం పరిస్టితి యేమిటంటే, పళ్ళిమ బెంగాల్, ఒడిస్సా బిహార్‌లు కలిసే సంగమ స్థలంలో సంధాలీ మాట్లాడే ఆదివాసులు ఆ యా ర్యాష్ట్రాల లిపులను వాడేవారు. అంటే ఒకే భాషను మూడు లిపుల్లో రాసేవారన్నమాట. మనదేశంలో భాషలు అధికంగా వున్నాయి. అది అనైక్యతకు దారితీయగలదు
132
అనే అశాస్త్రీయమైన అభిప్రాయం ఒకటి వుంది అలాగే, లిపులనేకం వున్నాయి. అన్నిటికీ కలిపి నాగరీయో లేక రోమన్ లిపి వాడటమో జరగాలనే సూచనలున్నాయి. లిపి సమస్యను అర్ధం చేసుకోవడం ఎంత అవసరమో, దాన్ని పరిష్కరించాల్సిన అవసరమూ అంతే వుంది. మద్యయుగంలోనే సాహితీ భాషలయిన హిందీ తెలుగు, కన్నడ మొదలైన అనేక భాషలకు లిపులున్నాయి. దాదాపు భారతీయలిపులన్నిటికీ మూలం బ్రాహ్మీనే. లిపిని నేర్చుకోవడం పెద్ద కష్టం కాకూడదు. సోవియత్ యూనియన్‌లో సమస్య వేరు. లిపులే లేని భాషలకు ఏ లిపులు వాడాలో నిర్ణయించడం వాళ్ల సమస్య. మనదేశంలో కూడ కొంతవరకూ ఈ సమస్య వుంది. మణిపురీ భాష అభివృద్ది చెందిన భాషే అయినా దానికి సొంతలిపి లేదు. బాంగ్లాలిపిలో రాసి చదువుతారు. అలాగే, మ్రైధిలీకి నాగరీ లిపిని వాడుతున్నారు. దీనికి వ్యతిరేకత కూడ కన్పించడం లేదు. కానీ మైథిలీభాషలో ప్రయోగించే అన్ని ధ్వనులూ రాయవీలయేట్టుగా నాగరీని మలచాల్సి వుంటుంది. కన్నడ తెలుగు లిపులు దాదాపు ఒకేలాగా వున్నా, గురుముళీ, నాగరీ లిపులు దగ్గరగా వున్నా, లిపికి కూడ జాతీయభావనతో సంబంధం వుంది. పంజాబీలు గురుముఖి లిపి అన్నా పంజాబీ భాష అన్నా సమానంగా యిష్టపడతారు. జనవైతన్యంలో భాగమైన గురుముఖిపై వారికుండే మమకారాన్ని అర్ధంచేసుకోవడంతోనే ఆగక, అ భావనను గౌరవించాల్సిన అవసరం వుంది. యే దేశంలోనో ఏదో సందర్భంలో, ఏ అధినేత ఈ విషయంపై యేమన్నాడు అన్నది కాదు ప్రశ్న - అది మన కాలానికి, మన దేశానికి, మనస్థితికి ఎంతవరకూ అన్వయిస్తుందీ, అనేది మనం పరిశీలించాలి. మార్క్స్‌పట్ల ఎంత గౌరవమున్నా అెనిన్‌కు మార్క్స్ చెప్పిందంతా వేదం కాలేదు అందుకే అతడు మార్క్స్‌వాదాన్ని సృజనాత్మకంగా ముందుకు తీసుకుపోగలిగాడు. పిడివాదం మార్క్స్, లెనిన్‌లు చెప్పినధాని అంతస్పారానికే విరుద్ధం. భాషపైన జాతిసమస్యను గురించిన లెనిన్ ఆలోచనలను కూడ సృజనాత్మకంగా మనదేశానికి అన్నయించాల్సిన అవసరం వుంది. అలా అని దేశదేశానికి ఒకోరకమైన సామ్యవాద ఫార్ములా అంటూ వుండాలని నా అభిమతం కాదు. మౌలికమైన సారాంశాన్ని (గ్రహిస్తూ దాన్ని ఏ రూపంలో, ఎలా అన్నయించాలో ఎప్పటికప్పుడు ఆలోచించాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మార్క్స్‌వాద పార్టీలకూ, మేధావులకూ ఎంతైనా వుంది. వడ్డించిన విస్తరికాదు, సమాజవాదం సామ్యవాదాన్ని గురించిన మార్క్స్, ఏంగెల్స్, లెనిన్‌ల ఆలోచనా సరళి వైజ్ఞానిక వివేచనా పద్ధతి.
జాతి అనేది ఒకటి వుండాలంటే ఆ జాతీయులకు ఒక ప్రదేశం వుండాలనే నిర్వచనం ఒకటుంది. కాని, జిప్పీల విషయంలో, వారు సంచార జాతియైనా, ఎన్నో దేశాల్లో నివసిస్తున్నా,
133
వాళ్లకు 'మేము జిప్సీలం మా కీ కళలున్నాయి, నైపుణ్యతలున్నాయి' అని చేప్పుకోగలరు. మూల రూపంలో వీరు భారతీయ సంతతి వారైనా ఇపుడు వారిని ప్రత్యేక జాతిగా, ఒక ప్రాంతం అంటూ లేని జాతిగా గుర్తించితీరాలి. వారు మాట్లాడే భాషలోకూడ సామ్యంవుంది. పేర్టు వేరైనా, ఆ భాష వేళ్ళు భారోపీయ (ఇండో యూరోపియన్) కుటుంబానికి చెందినవి అని కనుగొనడం జరిగింది, ఆగ్నేయాసియాలో మలేషియా సింగపూర్ దేశాల్లో స్థితి అధ్వాన్నంగా లేనప్పటికీ, జాతి సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరింపబడిందని చెప్ప సాహసించలేము. మలయ్ భాషీయులు 50 శాతం వున్నా వ్యాపారం వైనీయుల చేతుల్లో వుండటంతో, తమిళులు ఇతర జాతీయులతో అంతగా కలిసిమెలిసి వుండలేక పోవటంతో మలేషియాలో స్టితి సంక్షిష్టంగానే వుంది. సింగపూర్‌లో భాషాస్ట్రితి ప్రత్యేకించి షేర్కొనదగింది. ఈ చిన్నదేశంలో మలయ్, చైనీస్, ఇంగ్లీష్ తమిళ్ - ఇన్ని భాషలు అధికారభాషలు. కాని ఇక్కడికి వచ్చి స్టిరపడిన చైనీయుల్లో భారతీయుల్లో ఐక్యత కొరవడటంతో జాతిసమస్యకు పరిష్కారం మరి కొంత క్షిష్టుయిందనే చెప్పాలి. ఇండొనేషియాలో లాగే, ఫిలిప్పైన్స్‌లో తగలోగ్ ఉపజాతికి చెందినవారు 40 శాతం మంది వుంటారు. దేళంలో అనేక నృవంశసముదాయాలున్నాయి. తగలోగ్ జనం మాట్లాడే భాషను ఆధారం చేసుకుని 'ఫిలిప్పినో అనే భాషను అభివృద్ది చేశారు కాని అది భాసా ఇండొనేషియాలాగా ప్రాచుర్యంలోకి రాలేకపోయింది. అ.సం.రా.తో ఫిలిప్పిన్స్ కున్న ప్రత్యేక సంబంధాలదృష్ట్యా ఇంగ్లీషు ప్రభావం అధికమయింది. ప్రజల భాషకు అన్యాయం జరిగింది. ఇక అరబ్ ప్రాంతాన్ని (ప్రత్యేకించి పేర్కొనాల్సిన అవసరం వుంది. భాష అరబిక్ అయినా, ఆయా దేశాలు ప్రత్యేక జాతులుగా రూసొందినాయి. సౌదీ ఆరేబియాలోనూ, లిబ్యాలోనూ మాట్లాడే భాష ఒకటే అయినప్పటికీ, ఆయా దేశాల జాతులు వేరుగానే గుర్తింపు పొందాయి. అరబిక్ సంస్కృతి, భాష ఇస్టాం మతంతో పాటు 8-11 శతాబ్దాల మధ్య ఉత్తర ఆఫ్రికాలో ప్రవేశించాయి. అక్కడి జీవితాన్ని ప్రభావితం చేశాయి - అక్కడి స్టానిక 'బెర్బర్ భాషలనూ, జాతులను నాశనం చేయడం జరిగింది. అసలు, ఆఫ్రికాకు గర్వించదగిన చరిత్ర వుంది, సంస్కృతి వుంది. 'శ్రీస్తుపూర్వం నాలుగైదు శతాబ్దాలకే నైలునదీతీరాన ఒక గొప్ప సభ్యత వర్పిల్లింది. ఈశాన్య ఆఫ్రికాలో ఆకసుమ్, ఇథియోపియా లాంటి రాజ్యాలు యేర్చడినాయి. సామ్రాజ్యవాదులు తమను వలసదేశాలకు నాగరికతను తెచ్చిపెట్టిన సంస్కృతీ ప్రదాతలుగా అభివర్షించుకొంటారు. ఆఫ్రికాను ఎలా కొల్లగొట్టారో వివరాల్లోకి పోతే వీరు తెచ్చింది సభ్యత కాదు, తెగలమధ్య ఎడతెగని అనైక్యత, ఘర్షణలు అని అర్ధమవుతుంది. అసలు ఆ(ఫ్రికావాసుల్ని 134
సమాన మానవులుగా పరిగణించని ఐరోపా దేశీయులు ఆఫ్రికాకు యిచ్చింది పేదరికం, దారిద్ర్యం, బానిసత్వం. కొల్లగొట్టి పట్టుకెళ్లింది (ఇపుడు సరికొత్త రూపాల్లో ఇది కొనసాగుతోంది) అమూల్యమైన ఇనిజసంపద; నాళనం చేసింది అటవీ సంపదను. బంగరుభూమి ఆఫ్రికా ఈనాడు తిండిలేక అల్హాడుతోందంటే అది వలసవాద దుష్ఫలితమే. పదార్జాలేకాదు అసలు ఆఫ్రికావాసులే అమ్ముడు సరుకులైనారు. వేటాడి పట్టుకొని వచ్చి, సంతలో పశువులను ఆమ్మినట్టు వీరిని ఆ ఆఫ్రికాలోనే కొన్ని తెగలవారు అమ్మేవారు. కొనేవారు కసాయి అమెరికా వర్తకులు; స్పెయిన్ నుంచి వెళ్లి స్థానికులను నాళనంచేసి దోచుకునేందుకు మధ్య అమెరికాలో
దక్షిణమెరికాలో “విజేత లుగా 'పేరొందినారు' స్పానిష్ జాతీయులు. అ.సం.రా.లో మధ్య అమెరికాలో కరీబియన్ ప్రాంతంలో మరీ ఎక్కువగా దక్షిణ అమెరికాలో తక్కువగా ఇలా అమ్ముడుపోయి. ఎగుమతియై ఆ దేశాల్లో నివసించి, దుర్భర అవమానాలు సహించి, ఆఖరికి ఆ జనాలతో సంపర్కం వల్ల ఆయాదేళ నిర్మాతలై అ.సం.రా.లో మాత్రం నీగ్రోలుగా అణగదొక్కబడీ, చర్మం రంగు నల్లగా వుండటమే ఈ సకల సామాజిక దురన్యాయాలకు మూలమనుకొని, బాధపడి, దానికి ప్రతిక్రియగా 'నీగ్రోతనం' (6061466) గొప్పదనే సిద్దాంతమే లేవదీసిన ఆఫ్రికా ముడిపదార్జాలకు మార్కెట్ కాదిపుడు - అనేక జాతులు, అనేక భాషలు, అనేక నృవంశ సముదాయాలు, నానారకాల తెగలు వలసవాదులు తమ ఇష్టానుసారం గిరిగీసిన సరిహద్దుల్లో వుంటూకూడా క్రమక్రమంగా ఐక్యమై, తప్పనిసరి కాగా సాయుధులై, అనేక దేశాల్లో అసమాన పోరాటాలు సాగించి సాగించి, చివరికి విదేశీ అక్రమ ఆక్రమణకారుల్ని స్వదేశానికి సాగనంపి స్వాతంత్ర్యం పొందినా, విదేశీ జోక్యం, నయావలసవాదం, నానావిధ పెత్తందారీతనం
అధిక రుణభారం, విదేశీ ప్రేరిత అంతఃకలహజన్యమైన అస్థిరత్వం లాంటివి శత్రువుల సరికొత్త
" ఆయుధాలు కాగా, కొండంత ధైర్యంతో సమాజవాద దేశాల సహకారం అస్త్రళస్తాలు కాగా
దిక్కుతోచక పోయినా దిగులుపడక, దీనులవక, అష్టకష్టాలకోర్చి అంతఃకలహాల్ని అధిగమిస్తూ క్రమంగా సమాజవాదపంధాను చేపడదామనే లక్ష్యంతో ఆ దిశగా నడిచే అంగోలా, ఇధియోపియా, తాంజానియా, మొజాంబిక్ లాంటి సమాజవాదోన్ముఖ దేశాలు ఆఫ్రికాకు ఆశాజ్యోతులయినాయి
అ.సం.రా.లాంటి దేశాలకు మానవత్వం పాఠాలు బోధించ గలిగే పసిదేశాలయినాయి; పశుత్వానికి విరుగుడు కనుక్కొన్న ఈ పరమ మానవీయ పసిపాపలు తప్పటడుగులు వేస్తున్నా, నడవడం, వడివడిగా నడవడం ఇపుడిపుడే నేర్చుకొని దురహంకార పీడిత దేశాలను వెనకేసి, తెగల సమస్యను జాతుల సమస్యను, భాషల సమస్యను, వలసవాద సం(క్రమిత అనేక రోగాలను అనేక లోపాలను ఎదుర్కొంటూ సర్దుకుంటూ ముందుకే, మున్ముందుకే వెళుతున్నాయి. ఒక
135
నవయుగానికి బ్రాట వేస్తున్నాయి. దీనిలో భాగమే ఈ నవస్వతంత్ర దేశాలు తెగల, నృవంశసముదాయాల సమస్యను తీర్చిన తీరు. అంగోలా, మొజాంబిక్‌లలో బంటూతెగలే ఎక్కువ. అనేక బంటూభాషలు మాట్లాడతారు (ప్రజలు. అంగోలాలో బంబుందు బకాంగో, ఒవింబుందు ఒలూచాబిలాంటి మానవ వంశ సముదాయాలున్నాయి పోర్చుగీస్ శతిరాతక పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం ఫలితంగా, ఇపుడు ఆక్రామకులకు వ్యతిరేకంగా, స్వదేశంలోనే విదేశీ కరాయిమూకల దుష్టచర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అంగోలా ఇపుడు ఒక జాతిగా రూపొందే స్టీతిలో వుంది. వాస్తవం వాళ్ల ఐక్యతకు ప్రాణం పోసింది. ఈ దేశంలోని వివిధ జన సముదాయాలు మాట్లాడే భాష ఒకటే చేతల భాష కూడ ఒకటే. దాదాపు ఇదే స్టితి మొజాంబిక్ వారసత్వం తాంజానియాలో కూడ పరిస్టితి మెరుగ్గానే వుంది స్వాహిలీ భాషకు అధికార స్టాయి కల్పించారు. అది అల్ప సంఖ్యాకుల భాష అయినా, దేశాభిమానంతో భాషను అభివృద్ది చేస్తున్నారు. అనుసంధానభాష కాబట్టి ఆదరిస్తున్నారు. ఇధియోపీయాలో కూడ అమ్హూరా ఉపజాతి మాట్లాడే అన్హూరిక్ భాషను అధికారభాషగా (ప్రకటించారు.
వలసవాద దుష్పరిణామాలు కొన్ని కొట్టవచ్చినట్టు కన్పిస్తాయి. అసలు వలస పాలకుల భావనను వ్యక్తం చేయాలంటే యునెస్కో కూరియర్ 1984 వే సంచికలో అల్బర్ట్ అదూబొయాహెన్ రాసిన ఉదంతాన్ని పేర్కొనక తప్పదు. 1959లో రోమ్ నగరంలో నీగ్రో రచయితల, కళాకారుల రెండవ మహాసభ జరిగిందట. అందులో (ప్రసంగిస్తూ ఒక వక్త అన్నాడట - “వలసవాద ఘాతుకాల్లో అత్యంత హేయమైనదీ వినాశకరమైనదీ యేదంటే, వలస ప్రజలకు సంస్కృతి అంటూ యేదీ వుండదు అనే సామ్రాజ్యవాద భావనో. కళ్లుంటే చూస్తీ, చెవులుంటే వినీ ఆనందించే సహృదయులే కావాలిగాని, ఆఫ్రికాలో కళలకూ, సౌందర్యానికీ కొదువలేదు. వారి సంస్కృతిలో, సంగీతంలో వున్న సజీవత్వం అంత కొట్టవచ్చినట్టుగా మరే ఇండంలోనూ కన్పించదు. అందమైన దారుశిల్పం, కాష్ట్రకిల్ప వైవిధ్యం, యుంయూమార్తుతంలాంటి వాళ్ల సంగీతం మెచ్చుకోని వారు జాతివాదరోగులైనా అయివుండాలి లేక హృదయహీన మేధోవ్యాపారులైనా అయివుండాలి. అలా అని అఫఫ్రీకాలో సమస్యలు లేవు ఆది భూతల స్వర్గమని వూహించడం అవివేకమవుతుంది నైల్, జంబేజి, కాంగోలాంటి' మహానదులున్నా అటవీసంపద పుష్కలంగా వున్నా, రత్నాలు బంగారు, యురేనియమ్, రాగి, జింక్ లాంటి అమూల్య ఖనిజ పదార్థాలకు నిలయం అయినా ఆఫ్రికా ఈనాడు తినను తిండిలేక అలమటించి పోతోందంటే దానిక్కారణం వలసవాదమే. దీనికి తోడ్పడింది ఆఫ్రికాలో చాలచోట్ట చెలరేగే
136
తెగమనస్తత్వం. ఈ తెగలలో ఘర్షణలను రెచ్చగొట్టింది, ఇప్పటికీ రెచ్చగొట్టేదీ సామ్రాజ్యవాద శక్తులే. నైజీరియా ఉదాహరణ చాలు దీనికి. కొన్ని తెగలు బానిసల వ్యాపారం చేసేవి. బ్రిటిష్ వలస కాలంలో ఇబో, ఎఫిక్ తెగలు ఈ వ్యాపారం ఎక్కువ చేసేవి. వాళ్లపై ద్వేషభావం మిగతా తెగల్లో ఇంకా వుంది ఈనాడు ఇబో జాతి బాగా అభివృద్ది చెందింది. దీనిలో జాతీయబూర్చువా, కార్మికవర్గం బుద్ధిజీవులు తయారయ్యారు. పళ్ళిమ నైజీరియాలో యొరుబా మాట్లాడే జాతివారున్నారు. కాని, అక్కడ కూడ ఎబోలాంటి నృవంశ సముదాయాలవారు యొరుబాల ఆధిక్యతను నిరసిస్తున్నారు. అమానుష బానిస వ్యాపారానికి భయపడి పరుగెత్తి పోయి పర్వత ప్రాంతాల్లో తలదాచుకుని జీవించిన జనసముదాయాలు ఇప్పటికీ ఇతర నృవంశ సముదాయాలతో కలియకుండా భయపడి జాతీయ జీవన స్రవంతికి ఇంకా దూరంగానే వున్నారు. ఆఫ్రికాలో తెగలు, ఉపజాతి, జాతి జాతీయ బృందాలు - వీటిలో దేనికీ చెందకుండ ఒక నృవంశీయ దళను దాటి మరో నృవంశీయ బృందానికి చేరువగా వుండే సంక్రమణ దశలోని (2౧౩ (0౧) జన సముదాయాలే ఎక్కువగా వున్నాయి. నిర్వచనానికి అందని జన సముదాయాలు ఇవి.
మధ్యఆఫ్రికాలో తెగమనస్తత్వం మరీ ఎక్కువ. దేశాల సరిహద్దులు తెగల లేక నృవంళ సముదాయాల సరిహద్దులతో సమంగా వుండకపోవటంతో స్వాతంత్ర్యం పొందినా తెగల మధ్య ఘర్షణలు తగ్గలేదు; కొన్ని ప్రదేశాల్లో పరస్పరద్వేషం వైమనస్యం తగ్గుముఖం పట్టలేదు. ఇదొక చారిత్రిక దుర్షటన. ఈ సందర్భంగా, బ్రజావిల్‌లోని సమాచార మంత్రిత్వశాఖ ప్రకటన గుర్తొస్తోంది. 'తెగతత్వం లేక తెగవాదాన్ని కాంగో చంపకపోతే, తెగతత్వమే కాంగోను చంపుతుంది ' (౧2౮౦65 &౧06 ౧6౦౧ 68 - ౧౧౦8౧6౩౩ ౧౪౦ 9౧9/5 [405004 19/74 ౧. 229)
వ్యాసాన్ని ముగించేముందు "ఈ సమస్యను గురించిన భావిదిక్‌చిత్రం మీరు వూహించుకునేందుకు అవసరమైన ఆలోచన ఇవ్వాలనుంది.
విశ్చయుద్దానికి అర్ధం భూమిమీది (ప్రాణికోటి అంతం అని ఈనాడు మీకు తెలుసు. అందుచేత, జాతులమధ్య, విభిన్న నృవంశ సముదాయాల మధ్య సత్సంబంధాల అవసరం, మైత్రిఆవశ్యకత ఎంతైనా వుంది. ఈ చారిత్రిక సందర్భంలో లెనిన్ ఇచ్చిన నినాదాన్ని ఇంకొంచెం విషతార్థంలో (గ్రహించాల్సిన అవసరం వుంది. జాతుల ఎడబాటునూ, జాతీయ దురభిమానాన్ని (ప్రచారం చేయడం బూర్జువాదృష్టి అని ఈసడించుకుంటూ జాతీయ సంస్కృతి" అనే నినాదాన్ని
137
వర్గాలతో నిమిత్తం లేకుండా పేర్కొనడాన్ని బూర్జ్చువాదగా ఆంటూ లెనిన్, కార్మికవర్గ నినాదం “ఆంతర్జాతీయ సంస్కృతి” అని నిర్షంద్వంగా (ప్రకటించాడు. (కార్మికవర్గ అంతర్జాతీయత - విఐ. లెనిన్ - (ప్రగతి ప్రచురణాలయం, మాస్కో పుట 86). ఈనాడిది కార్మికవర్గ నినాదం మాత్రమే కాదు, సకల (శ్రమజీవుల సకల బుద్దిజీవుల, సకల మేధావి బృందాల సమస్త ప్రగతిశీల ప్రజానీకం నినాదం. అలా అని దేశాలతో, జాతీయతతో నిమిత్తం లేని సార్వదేశికతాభావాన్ని (009గా౦౧౦ +12౧గ్ఫొ ఇక్కడ వుపదేశించడం లేదు. దేశాల జాతుల విశిష్టతకు అంతర్జాతీయతావాదం అడ్డంకి కాదని మాత్రమే నేననడం సమాజవాదోన్ముఖ దేశాల అనుభవం దీనికి చక్కని నిదర్శనం. వివిధ భాషలు మాట్లాడే ఇండియన్ తెగలు (ముఖ్యంగా మెక్సికో నుంచి వచ్చిన ఆజ్‌తెక్ తొల్‌తెక్ తెగలు) ప్రాచీననికరాగువాలో నివసించేవి అసలు నికరాగువా పేరే ఒక ఇండియన్ తెగనాయకుని పేరు (నికరావుక్) కు “అగువా అనే స్పానిష్ పదం చేర్చడం ద్యారా యేర్చడింది. నికరాగువా. అగువా” అంటే స్పానిష్ భాషలో నీరు అని అర్ధం. క్రీ.శ. 1522లో జరిగిన స్పానిష్ దురాక్రమణ దుష్పరిణామమే ఇండియన్ తెగల అణచివేత. తర్వాత స్పానిష్ భూస్వాముల తోటల్లో పనిచేసేందుకు నల్లజాతివారు తేబడినారు. ఆ (క్రూరవలస పాలన మూడు శతాబ్దాలు సొగింది. మిశ్రమజాతులు యేర్చ్పడినాయి. సొమోజానియంతృత్వాన్ని ఎదిరిస్తూ జరిపిన పోరాటాల్లో ఈ విభిన్న జనసముదొాయాల్లో భావాత్మక సమైక్యత బలపడింది. | ఇపుడు మెస్రిజోలూ ఇండియన్ తెగలమధ్య కూడ సద్భావం చోటుచేసుకొనింది, ప్రపంచశాంతి, సా(మ్రాజ్యవాద వ్యతిరేకత దేశభక్తి విభిన్న జన సముదాయాలను ఐక్యం చేస్తోంది. భాషల విషయంలో కూడ సమాజవాదోన్ముఖ దేశాలు జనవాదసూత్రాన్ని అమలు పరుస్తున్నాయి. అంగోలాలో పోర్చుగీసుతోపాటు ఆరు ఆఫ్రికా భాషల్లో కూడ నిరక్షరాస్యతా నిర్మూలన కార్యక్రమం ఆరంభమయింది. 4-5 యేళ్లలోనే నికరాగ్యాలో నిరక్షరాస్యతను 50 శాతం నుంచి 13 శాతానికి తగ్గించగలిగారు. స్వచ్చందంగా ఉపాధ్యాయులు ముందుకు రావటం ఇందుకు వుపకరించింది. విఎత్‌నామ్‌లో 12-50 యేళ్లమధ్య వయసున్న వారికందరికీ చదవటం రాయటం నేర్పించగలిగారు - విఎత్ భాషలోనే అది సాధ్యమయింది. తాంజానియాలో నవసాక్షరులకు ప్రత్యేకంగా నడిపే 8 పత్రికలు స్వాహిలీ భాషలో వస్తున్నాయి. వర్హమాన దేశాల్లో జనం తమ సొంతభాషల్లో చదివే సామ(గ్రిద్వారా, (ప్రపంచ సమస్యలపై ఆలోచించి సామాజిక ప్రగతికి తోద్పడగలిగితే ఆది అంతర్జాతీయ సంఘీభావం పటిష్టమయేందుకు 138
దోహదం చేస్తుంది. అలా కాకుండా, చదువులు జనభాషల్లో కాకుండా (అవి ఇందుకు పూర్తిగా ఉపయోగపడే స్టితిలో వున్నా), విదేశీభాషల్లో బోధిస్తే ఆది వలసవాద వారసత్వం సొంతం చేసుకున్న అధికారవర్గానికి ఉపకరిస్తుంది. కానీ జనసముదాయాలను జ్ఞానానికీ, విజ్ఞానానికీ తప్పక దూరం చేస్తుంది. 20-6-2985 139
పశ్చిమార్ధగోళంలో తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఫిదేల్ కాస ళల
ఫిధేల్ కాస్తో 1926లో జన్మించినాడు. అంతకు ఒక సంవత్సరం పూర్వం క్యూబాలో బలీనో, మెల్ల అనే నాయకులు మార్కిస్టు పార్టీని స్థాపించినారు. ఫిదేల్ ఒక పెద్ద భూస్వామి బిడ్డ. క్యాధలిక్ కాలేజీలో చదువుకున్నాడు. హవానా విశ్శవిద్యాలయంలో లా విద్యార్థిగా చేరాడు. లా చదివేప్పుడు ఆమెరికా సంయుక్త ర్మాష్ట్రాల అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో పాల్గొనేవాడు. మార్చ్, లెనిన్‌ల రచనలు చదివేవాడు.
క్యూబా చాలయేళ్ళు స్పెయిన్ వలసగా వుండేది. స్వతంత్ర మయిందో లేదో అది అ.సం.రా. చేతిలో పడింది. కొన్నాళ్ల తర్వాత పౌర ప్రభుత్వం రాజ్యం చేస్తున్నపుడు 1952 మార్చి 10న బాటిస్టా అనే క్రూరుడు క్యూబా నియంత అయ్యాడు. రాజ్యాంగాన్ని రద్దుచేశాడు. అంతకు ముందు తాను పెంచి పోషించిన కిరాయి సైన్యాన్ని తిరిగి ఉపయోగించుకొన్నాడు.
బాటిస్టా నిరంకుళ నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశభక్తులైన కొంతమంది యువకుల తోడ్చాటుతో మొంకాడ (011040) సైనిక శిభిరాలపై 1953 జూలై 26న దాడి చేశాడు ఫిదేల్ కాస్తో తాత్కాలికంగా వెనుకడుగు వేయక తప్పింది కాదు. కాస్తోకు కారాగార వాసకిక్ష విధించబడింది. 847 57% కోర్టుల్లో కాస్త్రోవాదన ఇలా వుండేది. 'నన్ను శిక్షించండి. దానికంత ప్రాముఖ్యం లేదు ఎందుకంటే చరిత్ర నన్ను నిరపరాధునిగా విడిచిపెడుతుంది”.
ఫిదేల్ జూలై 26 ఉద్యమం వ్యాపింపజేశాడు. (ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాడు. మోంకాడలో పట్టుబడిన యోధుల్ని విడిపించుకోసాగాడు.
1956 డిసెంబరు రెండవ తేదీన 82 మంది కేవలం 82 మంది తిరుగుబాటుదార్లతో ఫిదేల్ గ్రాన్మా (ఆగిఉ 444) అనే నౌకలో క్యూబా తీరప్రాంతానికి చేరి దాడిచేశాడు. కాని
140
ఓడిపోయి సియోరా మెయిసస్తా (5 £౧గ4-144267౧4) అడవులకు పారిపోయాడు. గెరిల్లా యుద్దంలో నిష్టాత ఐన కాస్తో సైన్యం ఆపర్వతాలను స్థావరంగా చేసుకొని బాతిస్తాకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించింది. శత్రువు నుంచి 80 చేల రైఫిళ్లు స్వాధీనం చేసుకుంది. తిరుగుబాటు దారుల సంఖ్య అప్పటికి మూడువేలే. వాళ్లకు (శ్రమజీవుల మద్ధతు వున్నింది
(శ్రమజీవులు దేశవ్యాప్తంగా సమ్మెలు చేశారు. 1959 జనవరి ఒకటోతేదీన ఈ వెల్లువ విష్ణవంగా రూపొందింది. విష్టవం విజయవంతం అయింది.
1959 మే 17వ తేదీన భూసంస్కరణల చట్టం అమలులోకి వచ్చింది. అ.సం.రా
ఆస్తుల్ని జాతీయం చేశారు. క్యూబా నవశకానికి సొంది పలికింది
జూదం, స్మగ్లింగ్ భిక్షం అడుక్కోవటం లాంటివి నిర్మూలించే దిశగా గట్టి చర్యలు చేపట్టారు. విలాసవస్తువుల దిగుమతిని ఆపుచేశారు. కాని అమెరికా ఆధిపత్యం కిందనే నడిచే ప్రసార సాధనాలు, విష్టవానికి వ్యతిరేకంగా ముమ్మరంగా పనిచేయసాగినాయి. క్యూబా భావజాలస్టాయిలో ఇంకా సోషలిస్టు పరివర్తనలకు అనుగుణంగా లేదు. ప్రజలు కూడా సోషలిజానికి సుముఖంగా లేరు. వారి ఆత్మికస్టాయి ఇంకా ఎదగలేదు. అమెరికా సామ్రాజ్యవాద ప్రభావం వల్ల భావజాలం విషయంలో క్యూబా ఇంకా వలసగానే వున్నది. జనాన్ని చైతన్యవంతం చేయడంలో ఫిదేల్ ఎంతో శ్రమించినాడు అతని వాగ్దాటిని జనం మెచ్చుకునేవారు. వీటన్నిటికీ మించి అమెరికా కొన నిరాకరించిన చక్కెరను సోవియత్ యూనియన్ కొనడం, పరిశ్రమలకు స్పేర్‌పార్ట్స్ అమెరికా ఇవ్వనిరాకరించినప్పుడు సోవియట్ యూనియన్ వీటిని ఇచ్చేందుకు ముందుకు రావడం, అమెరికా ఇవ్వ నిరాకరించిన చమురు పదార్థాలు సోవియట్‌యూనియన్ ఇవ్వడం - ఇంకా ఎన్నో విధాలుగా సోయవిట్ యూనియన్ సాయపడటంతో క్యూబా ఒక స్వతంత్ర దేశంగా, ప్రగతిశీల దేశంగా నిలదొక్కుకోగలిగింది. సామ్రాజ్యవాద పెరటిలోనే విస్టన గులాబీ విచ్చుకోసాగింది.
1961 ఏప్రిల్ ఆరవ తేదీన క్యూబన్ విప్లవం సోషలిస్టు విష్లవమని ప్రకటించినాడు ఫిదేల్ కాస్తో, అమెరికాలో శిక్షణ పొందిన విష్ణవ వ్యతిరేక కిరాయి మూకలు సాయుధ పోరాటానికి దిగారు. ఫీదేల్ నాయకత్వంలో విష్టవ సైన్యం గెలిచింది. విష్ణ్లవం ముందుకే మున్ముందుకే నడిచింది. దీంతో అమెరికా ఒక నిర్షయానికొచ్చింది. విష్ణవనాయకుడు ఫిదేల్ కొ(స్తోను చంపించాలని విశ్వ ప్రయత్నం చేసింది. సి ఐ.ఏ సాయంతో ఫిదేల్ తాగేచుట్టల్లో విషం పెట్టారు. ఫిదేల్ రాసే కలాలకు విషం పూశారు. ఫిదేల్ ఈతకు వెళ్లే దారిలో మందు పాతరలు పెట్టారు. కొంతమంది కిరాయి హంతకులను కాస్తోను హత్యచేసేందుకు నియమించారు.
14]
అయినా - కాస్తో విష్లవకార్యాచరణ అంతర్జాతీయ దృక్పధం పదను తగ్గలేదు. 1965 అక్టోబరు మూడున కొత్త భూసంస్కరణల చట్టం చేయబడింది: దీని ప్రకారం భూగరిష్ట పరిమితి 67 హెక్టార్డుగా నిర్ణయించారు. 67 హెక్టార్లకు మించివున్న మిగులు భూమిని నష్టపరిహారం చెల్లించకుండా జాతీయం చేశారు. 1965 అక్టోబరులోనే కేంద్రీయ కమిటీని ఎన్నుకునేందుకు జరిగిన సమావేశంలో ఫిదేల్ కాస్తో ఒక ప్రశ్న వేశాడు - “సంయుక్త పార్టీకి ఏ పేరు పెట్టాలి” అని. వెంటనే సమాధానం వచ్చింది “కమ్యూనిస్టు పార్టీ” అని. అదే పేరు పెట్టడానికి నిశ్చయించినారు. అప్పటికి పార్టీ సభ్యుల సంఖ్య యాఖైవేలు మాత్రమే. ఫిదేల్‌కి ప్రజలతో ఆత్మీయ సంబంధం వుండేది, వుంది. (ప్రజల అభిప్రాయాల్ని వినడమేకాదు. వాటిని ఆచరణలో పెట్టాలనే స్వభావం ఫిదేల్ కాస్రోది ప్రజలకు నచ్చచెప్పడంలో దిట్ట ఫిదేల్ కాస్తో. పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ యుగోస్టావియా నాయకుడు మార్షల్‌తితో, ఈజిప్టు ప్రెసిడెంట్ నాజర్, ఇండొనేషియా అధ్యక్షుడు సుకర్నోలతో సమానంగా ఫిదేల్ కా(స్తోబలమైన అలీనోద్యమాన్ని నిర్మించడానికి దోహదం చేయడమేకాక ఆలీనోద్యమం వెనుక వున్న సైద్దాంతిక పునాదిని పటిష్టం చేసేందుకు ప్తాటుపడినాడు. నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్త (దీని (ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలను కొల్లగొట్టడం వుండదు. అవి ఎగుమతి చేసే ముడిసరుకులకు గిట్టుబాటు ధర వుంటుంది. దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు తగ్గుతాయి అభివృద్ది చెందుతున్న దేశాల అప్పులను రిషెడ్యుల్ చేయడం (చెల్లించే విధానంలో మార్పు) జరుగుతుంది. ఎందుకంటే అవి (ప్రస్తుతం తమ భారీ అప్పులకు అయ్యే వడ్డీలను చెల్లించే స్టితిలో కూడాలేవు) నూతన అంతర్జాతీయ సమాచార వ్యవస్థ (ఇందులో వార్తలకై అమెరికా, (బ్రిటన్, ప్రొన్స్ వార్తా సంస్థలపై ఆధారపడాల్సిన స్థితి వుండదు. (ప్రస్తుతం పారుగుదేశంలో ఏంజరుగుతోందో తెలుసుకోవాలంటే కూడా సమాచారం ఖండాంతర వార్తాసంస్థద్యారానే పొందే అసౌకర్యం నేడుంది). ఈ రెండు వ్యవస్థల్ని స్థాపించేందుకు, అంతర్జాతీయ సంబంధాలను మౌళికంగా మార్చేందుకు అహర్నిళలూ ఫిదేల్ కాస్తో కృషి చేస్తున్నాడు. అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల్ని పట్టించుకొని చక్కగా విశ్లేషించి సాధ్యమైన పరిష్కారాలను సూచించిన రాజకీయ మేధావి ఫీదేల్ కాస్తో. క్యూబా రాజధాని హవానాలో జరిగిన 7వ అలీనోద్యమ శిఖరా(గ్ర సమావేశంలో అలీనోద్యమ సమస్యలపై విసృృతమైన రిపోర్టు ఇచ్చాడు ఫిదేల్ కాస్తో 1988లో ఇదే పుస్తక రూపంలో వెలువడింది. ఫిదేల్ రాజకీయ నాయకుడేకాదు. దూరదృష్టిగల గొప్పరాజనీతివేత్త అని ఆ పుస్తకం చదివినవారికి అర్థమవుతుంది. అభివృద్ధికి నోచుకోని 142
తృతీయ ప్రపంచదేశాలలో ఆకలితో అలమటించే యేఖై కోట్ట మందికి, సరియైన చికిత్సా సౌకర్యాలు లేక దిగులు పడే నూటాయేభైకోట్ల దీనులకు, ఉద్యోగం లేక, ఏమిచేసేదానికి దిక్కుతోచని యాభై కోట్లమంది నిరుద్యోగులకు, ఇంకా చదువు సంధ్యలకు నోచుకోని 81 కోట్లమంది నిరక్షరాస్యులకు, నూరుకోట్టమంది నిరుపేదలకు వాణి ఇచ్చాడు ఫీదెల్ కాస్తో ఆ పుస్తకంలో. ఈ సమస్యలతో తలపడటం అంటే జీవిత ప్రమాణాల్ని ఫెంచడమే అవుతుంది. అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా స్వదేశంలోనే కాదు, విశ్వస్థాయిలో పోరాటం సల్ఫే జననాయకుడు ఫిదేల్ కాస్తో, నవక్యూబా ప్రియతమ నాయకుడు ఫిదేల్ కాస్తో, మన
దేశానికి ప్రియమి(త్రుడు ఫిదేల్ కాస్తో, రైతులోకం, సెప్టెంబరు 2989
143
జ రాజకీయ సంకల్పంతోనే అందరికీ విద్య సాధ్యం
థాయ్‌లాండ్‌లోని జోమ్‌తిన్ పట్నంలో 'అందరికీ విద్య" అనే అంశంపై 1990లో ప్రపంచ సదస్సు జరిగింది. పేదిరక నిర్మూలన, మహిళల సాధికారికత, పిల్లలను హానికారక శ్రమ నుంచి కాపాడటం, మానవ హక్కుల్నీ, ప్రజాస్వామ్యాన్నీ పరిరక్షించడం, జనాభా పెరుగుదలను అరికట్టడం లాంటి లక్ష్యాల సాధనకు తోడ్చడే ఏకైక సాధనం విద్య అనే విషయంలో (ప్రపంచ దేశాలన్నీ ఏకాభిప్రాయానికి రావడానికి దోహదం చేసింది ఈ సదస్సు. కానీ, సదస్సు లక్ష్యాల్ని (ప్రపంచ దేశాలు చేరుకోలేకపోయాయి. ఉదాహరణకు 2000వ సంవత్సరానికల్లా అందరికీ ప్రాధమిక విద్య అందాలి అని ఆశించింది ఆ సదస్సు. కాని అది వాస్తవరూపం ధరించలేదు. ఇప్పటికింకా 100 కోట్ల మంది నిరక్షరాస్యులతో నూతన సహ్రొబ్టిలోకి అడుగిడినాం అని ఆ నివేదిక అంటోంది. ఈ నిరక్షరాస్యులలో మహిళల శాతం 75. మన దేశంలో సుమారు 85 కోట్ట మంది నిరక్షరాస్యులున్నారని మనం గమనించాలి.
విద్య అనేది పిల్లల విజ్ఞాన అవసరాల్ని మాత్రమే తీర్చేదిగా వుండకూడదనీ, అది పిల్లల భౌతిక, సాంఘిక, భావోద్రేక, నైతిక, ఆధ్యాత్మిక ప్రగతికి కూడా తోడ్పడేదిగా వుండాలనీ - పిల్లల హక్కుల అంతర్జాతీయ ఒప్పందం పేర్కొంటోంది.
పిల్లలు సృజనాత్మకతకూ, భ(ద్రతకూ, ఉత్తేజానికీ పాఠశాలలు కేంద్రాలుగా వుండాలి. అక్కడ రక్షిత మంచి నీరు, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు మాత్రమే కాకుండా పిల్లలకు ప్రేరణ ఇవ్వగల ఉపాధ్యాయులు, పిల్లలకూ ఉపాధ్యాయులకూ అనుకూలంగా వుండే బోధనా ప్రణాళిక వుండాలి. పారశాలల్లో పిల్లలు గౌరవింపబడాలి అని ఆ ఒప్పందం నిక్దేశించింది. కానీ, జరుగుతున్నదేమిటి? పిల్లల్ని తరగతి గదుల్లోనే కొడుతున్నారు. ఇదీ మన ప్రగతి.
మన దేశంలో పాఠ్యాంశాలు మోయరాని భారంగా తయారైనాయి. మోయరాని చదువు
144
మోస్తున్న పిల్లల్ని చూస్తే మన విద్యా విధానం మీద రోత పుడుతుంది. రష్యా లాంటి దేశాల్లో హోమ్ వర్క్ ఇవ్వరు పిల్లలకు. అసలు పుస్తకాలు స్కూల్లోనే పెట్టి ఇంటికి పోతారు ఆక్కడి విద్యార్డులు.. పార్యాంశాల చదువు పెరిగితే సృజనాత్మకత నశిస్తుంది. చిన్నప్పుడే మూడు భాషలూ మూడు లిపులూ తప్పనిసరిగా నేర్పడం అవివేకం, అవైజ్ఞానికం. ఇకపోతే మన పారశాలల దుస్థితి - మన దేశంలో ప్రతి వంద ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 63 పాఠశాలలకు ఒకే ఉపాధ్యాయుడు ఉంటున్నాడు. ప్రతి వంద పారశాలలకూ 60 పారశాలల్లో తాగునీటి సౌకర్యం వుండటం లేదు. నూటికి 89 స్కూళ్ళలో మరుగుదొడ్డి సౌకర్యం లేదు. మరి అందుకేనేమో, బడి మానివేసే వారి సంఖ్య చాలా ఎక్కువుంది. (ప్రతి వందమంది బాల బాలికల్లో కేవలం 62 మంది మాత్రమే ఐదో తరగతి చేరగలుగుతున్నారు. ఇది దారుణం. బడి మానేసేందుకు ఒక బలమైన కారణం పేదరికం. అమ్మా నాన్ష కూలికిపోతే తమ్ముని ఆలనాపాలనకై బడి మానేస్తుంది అక్క. ఇదీ వరస. ఉన్నత పాఠశాల విద్య కూడా ప్రోత్సాహకరంగా లేదు. పార్యాంశాలు బండెడు బోధనా విషయాలూ ఎక్కువే. ఉన్నత పారశాల స్టాయిలో విదేశీ భాష అయిన ఇంగ్లీషును ఎందుకు ఇన్నేళ్ళు తప్పనిసరి విషయంగా బోధించాల్నో అర్థం కాదు. ఇంగ్లీషు చదవడం అవసరమే. అది ఒక (గ్రంధాలయ భాషగా వుంటుంది. ప్రపంచంలోని ఎక్కువ దేశాలలో లాగే మన దేశంలో కూడా మాతృభాషకు ఇతోధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సంధాన భాషగా హిందీ చదవాలి. మూడు భాషలకు బదులు రెండు భాషలు నేర్చుకుంటే సరిపోతుంది. ఆంగ్లం హిందీ భాషల్ని ఐచ్చికం చేస్తే - అంటే ఈ రెండిట్లో ఏదో ఒక భాష మాత్రమే తప్పనిసరిగా చదవాలనే నిబంధన వుంటే పిల్లల మీద భాష భారం తగ్గుతుంది. విద్యార్థి మనసు సృజనాత్మకంగా ఆలోచించగలుగుతుంది. విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువైతే కంరస్థం చేసే పద్ధతికి అలవాటు పడతారు. ఇది మంచిది కాదు. విద్యార్థి మానసిక వికాసానికి ఇది విఘాతం కల్గిస్తుంది మన దేశం కంటే విద్యా రంగంలో శ్రీలంక ధాయ్‌లాండ్, విఎత్నామ్ చైనా లాంటి ఆసియా దేశాలు చాలా ముందున్నాయి. ప్రపంచంలో అందరికీ విద్య ఆందజేయాలంటే కనీసం 700 కోట్ట డాలర్జు కావాల్సి వుంటుంది. ఇది అ.సం.రా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు)లో 'ప్రీలూ పురుషులూ వాడే ఆలంకరణ సామాగగ్రికి ఒక సంవత్సరంలో పెట్టే ఖర్చు కంటే తక్కువ అట, అలాగే ఈ మొత్తం ఐరోపాలో ఐస్'క్రీములిపై పెట్టే ఖర్చు కంటే తక్కువ అని ఐరాస విద్యానిధి సంస్థ తెలిపింది. ఈ 700 కోట్ల డాలర్ల మొత్తాన్ని సేకరించడం కష్టం కాదు. దీని కోసం బలమైన రాజకీయ సంకల్పం అవసరం. 145
మన స్టూల తలసరి జాతీయోత్పత్తి 390 డాలర్టు కేవలం 290 డాలర్ల తలసరి జాతీయోత్పత్తి కలిగిన విఎత్నాం 94 శాతం అక్షరాస్యత సాధించింది. రాజకీయ సంకల్ప శక్తివల్లా ఉపాధ్యాయుల చిత్తశుద్ద్ధివల్లా తల్లిదండ్రుల సహకారంవల్లా ఇది సాధ్యమయిందీ. అక్కడ సాధ్యమైంది ఇక్కడ ఎందుకు అసాధ్యమవుతోంది? మన దేళంలో విద్యకై కేటాయిస్తున్నది జాతీయోత్పత్తిలో 3.5 శాతం. దీన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది. విద్యకై కేటాయించిన డబ్బును వృధా చేయకూడదు. అన్యత్రా తరలించకూడదు. మనకంటే చైనా శ్రీలంకలో విద్యకై కేటాయిస్తున్న డబ్బు తక్కువ శాతం. సమస్య కేవలం నిధులకు సంబంధించింది కాదు ఈ సందర్భంగా మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మన దేశంలో వున్నంత నిరుద్యోగిత మరే పెద్ద దేశంలోనూ లేదు. కొన్ని కోట్ట మంది చదువుకున్న నిరుద్యోగులు పల్లెల్లో పని లేక రచ్చబండ జీవితం గుడుపుతున్నారు.. కోట్ల సంఖ్యలో వున్న ఈ చదువుకున్న యువతీ యుకుల్ని సాక్షరతా సైన్యంగా మలచుకోవచ్చు - ఓ తక్కువ వ్యవధి - శిక్షణ తర్వాత. ఇది పూర్తిగా సాధ్యం. ఈ సాక్షరతా సైనికులకు నెలకు 500 రూపాయలు లేదా వెయ్యి రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వవచ్చు. ఇది ఒక వాస్తవికతావాద (ప్రతిపాదన. దీన్ని అమలు చేయొచ్చు. (ప్రభుత్వం, (ప్రజలు గట్టిగా అనుకోవాలి, ఆచరించాలి. శ్రీలంక మనకన్నా విద్యకు తక్కువ శాతం కేటాయిస్తోందని చెప్పుకున్నాం. ఐనా, అక్కడ 96 శాతం అక్షరాస్యత సాధించారు. చైనాలో ఒకటో తరగతిలో చేరిన వారిలో నూటికి 94 మంది ప్రాధమిక విద్య పూర్తి చేస్తున్నారు. ఇది గొప్ప సంగతే. మన రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణా జిల్లాల్లో బడి మానేసేవారి సంఖ్య విపరీతంగా వుంటోంది. అంతెందుకు కేరళతో పోల్చుకోండి. కేరళలో స్నాతకుడు లేక స్నాతకురాలు లేని కుటుంబాలు లేవు. విద్యలో చైనా కంటే ముందుంది కేరళ విద్యారంగంలో విప్లవం కోసం కొన్ని కీలకమైన మూలకాలు నిర్దారించారు. జీవితం కోసం చదువు అభ్యసించడం ఇందులో మొదటిది. రెండవ మూలకం విద్య అందుబాటు, నాణ్యత, సరళత; ఇప్పటికింకా కిలోమీటర్ల దూరం పోయి చదువుకోవాల్సి వస్తోంది కొన్ని చోట్ల. ఇది దారుణం. అందరికీ ప్రాధమిక విద్య ఆందేట్టు చూడాలి ఇప్పటికింకా బాలికలు
- ముఖ్యంగా ముస్లిం బాలికలూ, మారుమూల (గ్రామీణ బాలికలూ పాఠశాలలకు తక్కువ సంఖ్యలోనే వెడుతున్నారు. వెళ్ళిన వారు తర్వాత బడి మానేస్తున్నారు. ఇది శోచనీయం. ఈ స్థితి మారాలి. పిల్లల హక్కుల అంతర్జాతీయ ఒప్పందం విద్యా హక్కును అంతర్జాతీయ 146
న్యాయానికి కట్టుబడేలా చేసింది. (ప్రాథమిక విద్యను నిర్భంధం చేయాలి, ఉచితంగా అందించాలని ఈ ఒప్పందం నిక్టేశిస్తోంది. ఐనా, ఈ ఒప్పందంపై అమెరికా, సోమాలియాలు సంతకం చేయలేదు. మన దేశం కూడా ఈ నిర్దేశాన్ని పాటించడం లేదు. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రానికనుగుణంగా మనం విద్యను సార్వజనీనం చేయలేకపోయాం.
'ప్రాధమిక విద్యను సార్వజనీనం చేసినంత మాత్రాన సరిపోదు. అందరికీ విద్య అందించాలనే ఉద్దేశ్యంతో కొన్ని దేశాల్లో బహుళ శ్రేణి బోధనను ప్రవేశపెట్టారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ వయోపరిమితులకు, తరగతులకు చెందిన పిల్లలందరికీ ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు విద్య నేర్పే ఈ పద్ధతి కొన్ని దేశాల్లో సతృలితాల్నిచ్చింది. నిరుపేద దేశమైన కంబోడియాలో వివిధ (గ్రామాలకు చెందిన ఉపాధ్యాయులు సామూహిక పాఠశాలల్లోని వనరులనూ, వస్తువులన్నూ భావాలనూ, బోధనా నైపుణ్యాలనూ కలిసి పంచుకుంటున్నారు. పేద దేశాలకిది నిజంగా ఒక ఆదర్శం. అనియత విద్య గురించి ఇపుడు మనకందరికీ తెలుసు. దూర విద్య ప్రచారంలోకి వచ్చిందీనాడు. రేడియో ఇందుకొక ఉత్తమ సాధనంగా పనికొస్తుంది. కానీ మన దేశంలో రేడియో, దూరదర్శన్‌లను అవసరమైనంతగా ఉపయోగించుకోవడంలేదు. ఈ దిశగా ఆచరణాత్మక చర్యలు చేపట్టాలి. ఆకాశవాణి జనవాణిగా, విద్యావాణిగా మారాలి. ఆ రోజు వస్తుందనే ఆశిద్దాం.
ఆంధభూమి, 27-5-2002 14/7
ఆలి అలి కులవ్యవస్థ కూలేదెప్పడు? ౮ ఊరికి పొయినపుడు వీలైనపుడల్లా మాలాడా, మాదిగవాడా వెడతాను, నేను వాల్లేసిన మంచం మీద కూచుంటా, వాళ్లనూ కూర్చోమంటా. కూర్చోరు. కింద కూచుంటారు. పొయిన సారి నేను మాదిగవాడకు పోయినపుడు కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (ఒంటిమిట్ట మండలం) కార్యదర్శి (దళితుడు) కూడా వచ్చి వుండినాడు. అతనిని మంచం మీద కూర్చోమన్నాను. కూర్చోలేదు. అట్టయితే నేను వెళ్ళిపోతాను అని వెనుతిరిగినాను. అప్పుడతడు మంచం మీద కూర్చొన్నాడు నాతోపాటు. చెప్పాచ్చేదేమంటే, ఇప్పటికీ అంటరానితనం యెంత తీవ్రంగా వుందో కడపజిల్లా పల్లెటూళ్లకు పోతే తెలుస్తుంది. అక్కడ వూరు వేరు, వాడ వేరు. మరీ చెప్పాలంటే ఆ వాడలు కూడా రెండుంటాయి. మాలాడ, మాదిగవాడ అని. వాళ్లు చెప్పేదేమంటే, మీరేమో ఇలా మాట్లాడతారు, కానీ మేము రెడ్డు వచ్చినపుడు అరుగుమీద కానీ, మంచం మీద కానీ కూచుంటే, వారికి కోపం వస్తుంది. రెడ్డ కోపం మాకు శాపనువుతుంది. 21వ శతాబ్దంలో కూడా దళితులెందుకింత భయపడుతున్నారు? ఉన్నత అని చెప్పబడే కులాలవారు ఇప్పటికీ ఎందుకు అంటరానితనాన్ని పాటిస్తున్నారు? ఆర్థికంగా చూస్తే ఆ రైతులు పేద రైతులే. సన్నకారు రైతులే. సమస్య ఆర్థికం కాదు, సామాజికం - ఇది సామాబిక చైతన్య సమస్య. యుగ యుగాల సంప్రదాయాన్నెదిరించే సమస్య. అసలీ కులాల వర్ణాల కధా కమామిపేమిటి? కాస్త చూద్దాం. మాలమాదిగలు వర్ష వ్యవస్థలో భాగం కారు. అంటే వారు శూద్రులు కూడా కారు. కాని, వారు అది ఆంధ్రులు (మొదట్లో వుండిన ఆంధ్రులు). గీతలో కూడా నాలుగు వర్షాల గురంచి చెప్పబడింది. గీతలో చాతుర్వర్ల్యం మయా స్పష్టం గుణ కర్మ విభాగళః అన్నాడు కృష్ణుడు. వృత్తి ధర్మం బట్టే వర్గాలూ, కులాలూ వుండినాయి పూర్వం " ఆర్యులిక్కడికి వచ్చేప్పటికి వారిలో కులాలూ, వర్గాలూ లేవు. ఒక ఆర్యుడు అంటాడు: 148
'నేను కవిని, నా తండ్రి వైద్యుడు; నా తల్లి ధాన్యం దంచుతుంది. డబ్బుకోసం మేము వేర్వేరు వృత్తులవలంబిస్తాం.” (భారతదేశంలో కుల వ్యవస్థ - కమ్యూనిజం - అక్టోబర్ - నవంబర్ 1092 = పుట 15) హడప్పా మొహంజొదడో, లోధాల్ (గుజరాత్సిల్లో వెలువడిన నాగరికాతావశేషాలను పరిశీలిస్తే తేలిందేమిటంటే, అప్పుడు కూడా, అంటరానితనం పురోహిత పెత్తందారీతనం వుండినాయని. ఈ అభిప్రాయం ప్రాచీన భారత దేశ చరిత్ర కారిణి రొమీలా ధాపర్‌ది. కాని, బుగ్వేదం చూస్తే తెలిసేదేమ౮టే, అందులోనిదని, చెప్పబడే పురుష సూక్తం ప్రక్షిప్తం అని, ప్రక్షిష్తమంటే, తర్వాత చేర్చబడినది అని. అది ్రక్షిప్తమని చెప్పేవారిలో భండార్కర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ అధినేత ఆర్.ఎస్. దండేకర్ కూడా వున్నారు. ఆర్యుల, అనార్యుల మధ్య శతాబ్దాల తరబడి వుండిన సహకారం ఫలితమే వేదసాహిత్యం. కులాల మధ్య ఇపుడున్న కట్టుబాట్లు శేదకాలంలో లేవేమో అన్పిస్తుంది. వైదిక వాబ్మయాన్ని సంకలించిన వేదవ్యాసుని తల్లి కైవర్త ఒక బెస్త స్రీ. తండ్రి ఆర్యుడు. గా యత్రీ మంత్రాన్పిచ్చిన విశ్వామిత్రుడు క్షత్రియుడు. బుగ్వేద రుక్కుల్న రచించిన వారిలో 63 మంది (స్త్రీలున్నాయి. మహాభారతం అరణ్య పర్వంలో ఏకవర్ల మిదం పూర్షం విశ్చమాసీ ద్యుధిష్టిరణ అని చెప్పబడింది. అంటే విశ్చంలోని మానవులంతా ఒకటే అని. మధ్యయుగంలో కులం రాజ్యం చేసింది. కులపెత్తనాన్ని నిరసిస్తూ కవులూ, సంస్కర్తలూ (శ్రియాశీలులైనారు. బసవేశ్వరుడు 11వ శతాబ్దం వాడు. కబీర్: నానక్, తుకారాం వేమన, నారాయణగురు లాంటి అనేకులు కులవ్యవస్థను కాలదన్నారు. మన రాష్ట్రంలో (బ్రహ్మనాయుడు 'చాపకూడు'ను ప్రచారం చేశాడు. పోతులూరి వీరబ్రహ్మం కులమత వైషవ్యూన్ని ఉపళమింప చేశాడు. రచనాయుధంతో కులాన్ని ఎదుర్కొన్నాడు. జ్యోతిబాపూలె (1827-1890) సత్య కోధక్ సమాజ్ స్థాపించి అంటరానితనంపై యుద్దమే చేశాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ (అంబేడ్కర్ తప్పు, అంబేడ్కర్ కరెక్టు) దళితుల పక్షాన నిలబడి మన రాజ్యాంగంలో వారికీ రక్షణ కలుగజేశాడు. రిజర్వేషన్లు లేకపోయినట్లయితే ఎన్ని నియోజకవర్గాల్లో షెడ్యూల్డు కులాలవారు వచ్చి వుండేవారు? నిరుద్యోగమే లేకపోయినట్లయితే ఉద్యోగాల్లో రిజర్వేషన్ల సమస్యే వుండదు. నిరుద్యోగ నిర్మూలన మన (ప్రధాన ధ్యేయం కావాలి. కులాంతర వివాహాలు విరివిగా జరిగితే కులంగాడి పొకురణచవచ్చు. ఆర్థికంగా సామాజికంగా కొంత అభివృద్ది చెందినా కులాంతర వివాహాలు విరివిగా జరగక పోవడం 1409
శోననీయం. కమ్మ, రెడ్డి, రాజు, వెలమలు ఆర్థికంగా, సామాజికంగా ఒకే స్థాయికి చెందినా, వారి మధ్య వివాహ సంబంధాలు లేవు. దళితులైన మాల మాదిగల్లో అంతర్వివాహాలు లేవు. కమ్మరి, కుమ్మరి, చాకలి మంగలి లాంటి దాదాపు ఒకే ఆర్థిక స్థాయికీ, సామాజిక స్టాయికీ చెందిన కులాల్లో కులాంతర వివాహాలు దాదాపు శూన్యం. ఇదీ మన ప్రగతి నివేదిక! కులాంతర వివాహాలు విరివిగా జరిగితే వరకట్నం సమస్య కూడా పరిష్కరింపబడే అవకాశం వుంది. (ప్రేమ వివాహాల్ని ప్రోత్సహించడం ద్వారా కులాంతర వివాహాలు విరివిగా జరిగే పరిస్థితి యేర్చడవచ్చు. ఇప్పటికింకా తల్లిదండ్రులు కుదిర్చే వివాహాలే 99.9 శాతం వుంటున్నాయి. ఈ స్థితి మారాలి, ఈ విషయంలో మనం ఒక యుగం వెనుకబడి వున్నాం. ఆధునికీకరణలో భాగం కులాంతర వివాహం. ప్రస్తుత వ్యవస్టలో కూడా ఆధునికీకరణ సాధ్యమే. కులాంతర వివాహాలు విరివిగా జరగటానికి సమాజవాద సమాజం కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. యువతీ యువకులు - ధైర్యం, ఆత్మవిశ్వాసం, (ప్రేమించే గుణం కలిగిన యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఆశీర్వదించాలి. మనస్పూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. చేయూత నివ్వాలి. అంత్యంలో వివేకానందుడు అంటరానితనాన్ని ఎలా గర్జించిందీ గుర్తుచేస్తాను. ఆయన అన్నాడు “తాకవద్దు ' అనే దొక్కటే మన మతం. మన మతానికి ఉనికి వంట యింటి లోపల" వంట పాత్ర మన దైవం” 'నన్ను తాకొద్దు, నేను పవిత్రుణ్ని' అనేదే మన మతం. ఇలాగే మరొక శతాబ్దం గడిస్తే మనలో ప్రతివాడూ పిచ్చాసుపత్రిలో వుంటాడు.” (కులము సంస్కృతి సామ్యవాదము, పుట 48 - శ్రీ వివేకానంద స్వామి, అనువాదం * కందుకూరు మల్లికార్టున, శ్రీరామకృష్ణ మరం మైలాపూర్, చెన్హై ప్రచురణ.) 150
కరపత్రం అలి అట
ఆపండి ఈ పరాయీకృత విద్యను
వికృతంగా వున్న మన చదువులు వినాశకరమైన పరిణామాలకు దారితీసేవిగా వున్నాయి. పునర్వలసీకరణకు ఆహ్వానం పలికే దిశగా సాగుతున్నాయి. అంగ్లానికి ఆధిపత్యం ఇవ్వడం ద్వారా సామ్రాజ్యవాదానికి స్వాగతం పలుకుతున్నాము. నర్సరీల నుంచి పరిశోధన వరకూ అంతా ఆంగ్లంలోనే. ఇది విద్యార్థినీ విద్యార్థుల సృజనాత్మకతను నరికివేస్తోంది. కెన్యా దేశపు గొప్ప రచయిత గూగీ వ థియాంగా మాటల్లో చెప్పాలంటే, “తుపాకి శరీరాన్ని మాత్రమే లొంగదీసుకుంటే, భాష ఆత్మను వశపరచుకుంటుంది '. అక్షరాలా అది ఇపుడు మనదేశంలో జరుగుతోంది. ప్రపంచం అంటే మనకు, పూర్వం బ్రిటిషు వలసలుగా వుండిన దేశాలే. మనకు పక్కనున్న కర్నాటక రాష్ట్రంలోని కన్నడ సాహిత్యం కంటే బ్రిటిషు సాహిత్యం దగ్గరగా వున్నట్టు అనుభూతి చెందుతాం.
ఇకపోతే బోధనా భాషగా మాతృభాషే వుండాలని విద్యావేత్తలందరూ భావిస్తారు. ఆంగ్లంలో రాసిన 'గీతాంజలి'కి నొబెల్ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాధ్ రాకుర్ బోధనాభాషగా అన్ని స్థాయిల్గోనూ మాతృభాషే వుండాలని కోరాడు. (గ్రామాల్లోకి సంస్కృతి చేరాలని 'శ్రీనికేతన్' స్థాపించినాడు. మన విశ్వవిద్యాలయాలను గురించి రాస్తూ రవీ[ర్రదుడన్నాడు. “ఇక్కడ విశ్వ విద్యాలయాలు చీకటి ఆవరించిన (గ్రామాలను దాటుకొని పోతున్న వెలుతురున్న రైలుబండి కంపార్టుమెంటు లాంటివి”. మనం ఆంగ్లానికిస్తున్న ప్రాధాన్యం పల్లెల్నుంచి వచ్చే రైతుబిడ్డల్ని, వ్యవసాయ కార్మికుల సంతానాన్ని వెక్కిరించి నట్లుంటుంది. మనకు కావల్సింది ఇం(ద్రియాలను బుద్దిని మాత్రమే ఉత్తేజపరచే విద్యకాదు, భావానుభూతుల్ని బోధించే, ఉన్నతీకరించే ఉదాత్త విద్య మనకు కావాలి.
151
సాంకేతిక నైపుణ్యానికే ప్రాధాన్యం ఇచ్చే నేటి విద్య సరియైనది కాదని భావిస్తాడు ప్రసిద్ద ఆలోచనాశీలి జిడ్డుక్రిష్ణమూర్తి. విజయాన్ని ఆరాధించమని పిల్లవాని కెప్పుడూ బోధించ కూడదంటాడు ఆయన. నేడు ఏం జరుగుతోంది? పరీక్ష తప్పినవాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది దారుణం. మార్కులు జీవితంతో ముడివడి లేవు. జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షించే మన విద్యావిధానం స్థానే ఎగిరే పక్షుల్ని, కదిలే మేఘాల్ని అవలోకించడానికి విద్యార్థికి అవకాశం ఇచ్చే విద్యావిధానం రావాలి. అది విద్యార్థినీ విద్యార్థుల సంవేదనశీలతను పెంచే విధంగా వుండాలి అంటాడు జిడ్డు క్రిష్ణమూర్తి,
శ్రమకు - ఉత్పాదక (శ్రమకు విలువ ఇచ్చే విద్య కావాలంటారు మహాత్మాగాంధీ, మావోజేదోంగ్. ఉపాధ్యాయులు కార్మికులనుంచి, కర్షకులనుంచి నేర్చుకోవాలంటాడు మావో. ఆలోచనాయుత కార్యాచరణ (నిగగు(9) కు ఎక్కువ ్రాధాన్యమివ్వాలంటాడు ఇటలీకి చెందిన సామ్యవాద యోధుడు ఆన్‌తొనియో గ్రాంచీ. మన విద్యాసంస్థల్లో శ్రమకు విలువ ఇవ్వడం లేదు. ఈ సందర్భంగా మన వైమానిక దళానికి చెందిన ఒక ఇంజనీరు అన్న ఈ మాటలు గుర్తొస్తున్నాయి, బాధాకరంగా. బాంగ్లాదేశ్ యుద్ధమప్పుడు మనకు సోవియత్ రష్యా సాయపడుతూ, ఆ దేశం నుంచి మిగ్ విమానాల్లూ విమాన చోదకులూ వచ్చారు కదా పాకిస్తాన్‌ను ఎదిరించేందుకు. మీ అభిప్రాయమేమిటి వాళ్ల పనితనాన్ని గురించి అన్న నా ప్రశ్శకు ఆయన ఈ విధంగా జవాబిచ్చాడు - అదో రకంగా, అయిష్టంగా, “ఆ వచ్చారు లెండి పైలట్టు. వారేం మనుషులండి - 'పైలట్టు కూడ విమానం కింద దూరి చిన్న చిన్న రొపేర్టు చేస్తారు. మేమైతే తగుల్హామా? మెకానిక్సు ఆ పని చెయ్యాలి. ఇంజనీర్హు కాదు. పైలట్టు కొదు” అంటే ఇంజనీర్హు కష్టపడకూడదన్ఫ మాట,
మన దేశంలో 35 కోట్టమందికి (అంటే ఆఫ్రికా జనాభా అంత) చదవనూ రాయనూ రాదు. ఇది అవమానకరం. మరో పక్క కోట్ల సంఖ్యలో నిరుద్యోగులైన, ఉపాధిలేని యువతీ యువకులున్నారు. వీళ్లను నెలకు 500 లేదా వెయ్యి రూపాయల జీతంతో సాక్షరసైన్యంగా మార్చవచ్చు. నిరక్షరాస్యతను నిర్మూలించవచ్చు. దృఢమైన సంకల్పం, ప్రజల నుంచీ వత్తిడీ అవసరం - ఇది జరగాలంటే.
చైనా ఆస్నేయ ఆసియా, ఆఫ్రికా దక్షిణ అమెరికా దేశాలను గురించి మన పాఠ్యాంశాల్లో ఏమీ వుండదు. ఇప్పటి కింకా చరిత్రను వలసవాద దృష్టితోనే చూస్తున్నాం. యూరపు, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రే మనకు ప్రపంచ చరిత్ర. ఈ ధోరణి మరణించాలి.
152
మనకు పార్యాంశాల బరువెక్కున. మూడు భాషల స్టానే రెండు భాషలే నేర్పాలి విద్యార్థులకు పారశాలలో. మాతృ భాష ఇంగ్లీషు / హిందీ. పార్యాంశాల పరిమాణం తగ్గాలి. (ప్రమాణాలు పెరగాలి.
(ప్రైవేటు పాఠశాలలు - ఇంగ్లీషు బోధనాభాషగా వుండే (ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఇతోధికంగా పెరిగింది. ఇది దారుణం. తెల్తుగ్గు, బోధనా భాషగ్లా ప్రభుత్వమే ఎక్కువ పాఠశాలల్ని నడపాల్సిన అవసరముంది. తాహా హుసేన్ అనే ఈజిప్టు విద్యావేత్త అన్నట్టు సమానత, సామాజిక న్యాయం సాధించడం విద్య ధ్యేయం కావాలి. విద్యా సంస్థలు సంస్కృతి సభ్యతలకు ఆలవాలంగా వుండాలి. (ప్రాధమిక విద్య బోధించేవారు కనీసం మాస్టర్స్ డిగ్రీ కలిగిన వారై వుండాలి. మనిషికి ఆహారం నీరు ఎలా అవసరమో విద్య కూడా అంతే అవసరం. శుభ్రమైన నీరు, శుభ్రమైన ఆహారం ఆరోగ్యానికి అవసరం. అలాగే మంచి విద్య, సృజనాత్మకమైన విద్య మనకు అంతే అవసరం. పరాయీకృత విద్య కాదు.
న్ కు... శా | వం యన్. , ఈ ఈ ర్ ళ్ బ్ క లి భ్ " శ లం లో ల యూ 153
సా? తా తక్కోలుజూఆలెక్లి న. ల్ డై జే సబ ఘు. [/.ష. ౧౧.౦. " శ ల్ని " కడప జిల్లా, ఒంటిమిట్ట మండలం, ఇబ్రహీంపేట గ్రామంలో
- 21-08-1943లో జననం. . ఇలాహాబాద్ విశ్వవిద్యాలయంలో హిందీలో ఎం.ఏ, (1964-66) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. 1967లో ఆకాశవాణిలో ప్రవేశం. పరిశోధన కోసం ఉద్యోగానికి రాజీనామా. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ - పరిశోధనాంశం: "ఆధునిక హిందీ, తెలుగు కవిత్వంలో భావచిత్రాలు' (ప్రచురితం). 1971లో మళ్ళీ ఆకాశవాణిలో ఉద్యోగం. జగదల్‌పుర్ (ఛత్తీస్‌గఢ్), రామ్‌పుర్ (ఉత్తరప్రదేశ్, మడికేరి (కర్నాటక) తదితర ఆకాశవాణి కేంద్రాల్లో - వివిధ హోదాల్లో - అనేక ప్రగతిశీల కార్యక్రమాలు సమర్పిస్తూ - కడప ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్‌గా పదవీ విరమణ, కేంద్ర సాహిత్య అకాడెమీద్వారా ప్రచురితమైన రచనలు:
- నిరాలా- హిందీ నుంచి తెలుగులోకి అనువాదం (పొట్టి శ్రీరాములు తెలుగు భా విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ అనువాద పురస్కారం పొందిన గ్రంథం) జీ౫
- శ్రీశ్రీ _ (ఇంగ్లీషు/తెలుగు నుంచి హిందీలోకి అనువాదం) | *ఇరారా (తెలుగు) న! వివిధ అంశాలపై విశ్వవిద్యాలయ, జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ. ; ప్రస్తుతం కడప జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షత. అభిరుచి : భారతీయ సాహిత్యం, సౌందర్యశాస్త్రం.