Telugu Bodisalaha - anilvaranasi/indianlanguages GitHub Wiki

బోడిసలహా శత క్ష | ఒ౯6/6 భీ | డా (9గకిన్ట్‌ ్రపపషూలె

సు. త్‌

వ బోడిసలహా ౯ (పిల్లల ఠథలు-బామ్మలతో) డా! గంగిశెట్టి శివకుమార్‌

| గై కిళాలంత్త పబవాగ పతన ఇ |

రే క్రి నా ల్‌

కాలకలలులులులుకలాలతుాలకాన్మి 80611 5231303 (6౧||6/6౧'5 560గ65 ౪/0) 1105460౧09) 0/ 0/63౧6156611 51౪4 గ4ంగ3? (ప్రచురణ సంఖ్య 2 2350/21 హెచ్చరిక: ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ, ప్రతుల సంఖ్య వ 1000 శొంతగానీ కాపిరైట్‌ హోబ్దరు ప్రచురణకర్తల నుండి ప్రథమ ముద్రణ ౩ ఏప్రిల్‌, 2004 ముందుగా. రాత మూలకంగా అనుమతి రి డా గంగిశెట్టి శివకుమార్‌ య ర పొందకుండా ఏరూపంగా. వాడుకున్నా కాపీరైట్‌ బైటిల్‌ డిజైన్‌ &లోపలి బొమ్మలు: జ్యోతి 6" చట్టరీత్యా నేరం. వెల : రూ. 20-00 భల ఫ్రత్తుక్త : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ రం విజ్ఞానభవన్‌, బ్యాంక్‌ స్ట్రీట్‌ ం ల్భ రిం. హైదరాబాద్‌ - 500 001. (1 కంస ర్ట ల్‌ గ్‌ కగ311: ౪15313300౧/౧20౧6/2గ౦౦.60గ) ఖీ గండ క | ల! / ఖ్‌ (అబిడ్స్‌, సుల్తాన్‌ బజార్‌), హైదరాబాద్‌, (౮. థం. / ఢా అనంతపురం, విజయవాడ, విశాఖపట్టణం, శ్‌ చో య. హన్మకొండ, తిరుపతి, కాకినాడ, గుంటూరు. (| 0( ౮ + ఇందులోని కథలు... 1 దురాశ .......006 0000ల లలల లలల లలల లలల లలల లలల కే 2. దొంగబతుకు ..........00 0000ల టల లల లం లం టీ 5. అష్టరుచులు ...........000 266660 ల లలల ల లలల కేడీ 6. వింతసంఘటన............౨౨౨ ౨౦౦౬4౨ ల లం కర 7 ఇరుగుపొరుగు ........౧౦౨ ౨౦౦౯46 ళ ల లం లలల 19 10. మోసపోవడానికి కారణం? ......... ౨౨౨౦౨౨౦౦౦౨ 28 నటట టట టకటకా ల లన నో

ఆ ఊర్లో వున్న ధనికుల్లో రామశర్మ ఒకడు. రామశర్మకి సోమళర్మ ఒక్కగానొక్క కొడుకు. ఒకరోజు పేరంటానికి వెళ్ళిన రామశర్మ భార్య నీలవేణి ఆదరా బాదరాగా ఒక వార్త మోసుకొచ్చింది. వస్తూనే, “ఏమండోయ్‌! మీకంటె బయట వాళ్ళేనయం” అన్నది. రామళర్మ ఏదో గొంతుమీద కొచ్చిందనుకొని 'ఏం?” అన్నాడు.

ప గ (| గ్‌ నో! గ న స్క జాయ శి అలో [నా

మనవాడికి పెళ్ళీడు వచ్చింది కదా! ఆ విషయమేమైనా మీకు షట్టిందా? అన్నది. అలా అంటూనే పొరుగింటి మీనాక్షి సోమశర్మకి ఒక సంబంధం చూసిందని, కట్నం యాఖైవేల వరహాలని చెప్పింది.

క్షే

“యాభైవేలే! ఆశ్చర్యపోయాడు రామశర్మ,

“అయితే మనం ఎప్పుడు అమ్మాయిని చూడడానికి వెళ్ళాం?” అన్నాడు రామశర్మ,

“అయ్యో రామ, ఇంక మనమేమిటండి అమ్మాయిని చూచేది. 'మేము అమ్మాయిని చూడక్కరలేదు. అబ్బాయిని చూడాలనుకుంటే వాళ్ళనే ఒక రోజు రమ్మను' అంటూ మీనాక్తికి చెప్పి వచ్చేశా! ఓ మంచిరోజు వాళ్ళే వస్తారు. అప్పుడన్ని విషయాలు మాట్లాడుకుందాం” అన్నది నీలవేణి.

భార్య తెలివితేటలకి మరింత ఆశ్చర్యపోయాడు రామశర్మ,

అమ్మాయి తరపున వాళ్ళు వచ్చేరోజు రానే వచ్చింది. అయితే అంతకు ముందురోజే ఒక విశేషం జరిగింది. ఆ వేళ దుకాణందగ్గరనుండి రామళర్మ ఉరుకులు పరుగులమీద ఇల్లు చేరుకుని, “ఏమేవ్‌ ఇలారా అంటూ నీలవేణిని పిలిచి, ఈ రోజు నా బాల్య స్నేహితుడు మణివర్మ ఈ వూరొచ్చి విఫణి వీధిలో నన్ను కలిశాడు. వాడికి ఓ వయసొచ్చిన పిల్లుందట. ఆ పిల్లను మనవాడికివ్వాలని సంబర పడుతున్నాడు” అంటూ చెప్పుకుపోతూవున్న రామశర్మని ఆపి నీలవేణి, “అదెలా జరుగుతుంది. ముందే వేరేవాళ్ళకు మాట ఇచ్చాం గదా!” అన్నది. “ఆ మాత్రం నాకు తెలియదా అయితే ఏంచేస్తాం? మణివర్మ కట్నంగా అరవై వేల వరహాలు ఇస్తానన్నాడు తెలుసా?” అన్నాడు రామశర్మ,

“అరవై వేలే!” ఆశ్చర్యపోయింది నీలవేణి. తేరుకొని, “ఇప్పుడెలాగండి వాళ్ళను రమ్మని మాట యిచ్చాం. ఇలా జరిగింది. మాటమీద నిలబడితే పదివేలు నష్టం. డబ్బు చూసుకుంటే పరువు నష్టం. పెద్ద చిక్కేవచ్చిందే. వచ్చే మహానుభావుడు కాస్త ముందుగా రాకూడదా!” అన్నది.

రామశర్మ కొంచెం ఆలోచించి, “కంగారు వడకే! మంచి ఉపాయం దొరికిందిలే, నిశ్చింతగా వుండు నీవిక” అంటూ నీలవేణి చెవిలో గుసగునలాడాడు.

మరుసటి రోజు అమ్మాయి తరుపువాళ్ళు వచ్చారు. మాటలమధ్యలో నీలవేణి ఒళ్ళు విరుచుకు పడిపోయింది. అందరూ సపర్యలు చేశారు. వచ్చిన వాళ్ళలో ఒక పెద్దమనిషి “ఇదేమిటి మూర్చరోగంలా వుందే?” అన్నాడు. కొంతసేపటికి నీలవేణి తేరుకొంది. వచ్చిన వాళ్ళు ఛాందస్సులు.

“శుభమా అని వస్తే ఇలా అయ్యిందేమిటి?” అనుకొని ఏదో నాలుగు కుంటిసాకులు చెప్పి ఉడాయించేశారు. తరువాత వారివద్ద నుండి ఎటువంటి కబురు రాలేదు. రామశర్మ, నీలవేణి తేలికగా గాలిపీల్చుకున్నారు.

2

తరువాత రామశర్మ తన మిత్రునికి “తాము అమ్మాయిని చూడనవసరం లేదని వాళ్ళువచ్చి అబ్బాయిని చూచుకొని మాట్లాడుకొని వెళ్ళవచ్చునని ' కబురుచేశాడు. రామశర్మ మిత్రుడు వచ్చేలోపల మరో విశేషం జరిగింది.

ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్య రొప్పుకుంటూ రామళర్మ యింటికి వచ్చి, “మీ కొడుక్కి ఒక సంబంధం తెచ్చా” అన్నాడు. “సంబంధం వద్దు, గింబంధం వద్దు. అంతా ఇంతకుముందే కుదిరిపోయింది” అన్నారు దంపతులు.

“అలాగంటే ఎలా తల్లీ! ఇది అటువంటి ఇటువంటి సంబంధంగాదు. కట్నం ఎంతో తెలుసా?” అన్నాడు పేరయ్య. “ఎంతేమిటి?” అతృతగా అడిగారు దంపతులు.

“లక్ష అన్నాడు పేరయ్య.

దంపతులిద్దరి ముఖాల్లో దీపాలు వెలిగాయి. దంపతులు కొంతసేపు తటపటాయించారు. రామశర్మ చివరికి పేరయ్యతో “సరే, ఓ మంచిరోజు వాళ్ళను రమ్మను అన్నీ మాట్లాడుకుందాం” అన్నాడు. పేరయ్య వెళ్ళిపోయాడు.

నీలవేణి భర్తవైపు చూసింది. “ఏముందే! మొన్న ఆడిన నాటకమే మళ్ళీ అడితే సరిపోతుంది. మొన్న నీవు బాగా నటించావులే!” అన్నాడు.

“ఈసారి నావల్లకాదు. మొన్ననే ఎక్కడ అసలు విషయం బయట పడుతుందోనని హడలి చచ్చాను. ఈ సారి మీరు నటించండి” అన్నది నీలవేణి. రామశర్మకు తప్పలేదు.

పెళ్ళికూతురు వైపు వాళ్ళు వచ్చినారు. మాటల మధ్యలో రామశర్మ ఒళ్ళువిరుచుకు పడిపోయి నానా హంగామా చేశాడు. “ఇదేం దరిద్రంరా బాబూ” అనుకుంటూ వచ్చినవాళ్ళు వచ్చిన దారినే వెళ్ళారు. రామశర్మ, నీలవేణి గుండెలనిండా గాలి పీల్చుకున్నారు.

తరువాత వాళ్ళిద్దరూ పేరయ్య చెప్పిన సంబంధం వాళ్ళ రాకకై ఎదురు చూడసాగారు. కాని వారి నిరీక్షణ వృధా అయింది. రామశర్మే మళ్ళీ మళ్ళీ కబురు చేశాడు ఫలితం శూన్యం.

చివరిగా తేలిందేమంటే, “పిల్లవాడి తల్లి దండ్రు లిద్దరికీ మూర్చరోగం. పిల్లవాడికి మాత్రం లేకుండా వుంటుందా? ఒక వేళ ఇప్పుడు లేకపోయినా తరువాత అయిన రాకపోతుందా?” అని అందరూ అనుకుంటున్నారని.

రామశర్మ నీలవేణి నివ్వెరపోయారు.

ఆఅ తరువాత వారు సోమశర్మ పెళ్ళి విషయమై అనేక తంటాలు పడ్డారు. కట్నం నంగతి దేవుడెరుగుకాని, చివరికి ఎదురు కట్నం ఇచ్చి ఓ పిల్లను తెచ్చి సోమళర్మకు ముడిపెట్టారు.

ఫీ శ 4 వ్ర

చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయిన ముకుందుణ్ణి వాడి బామ్మ పెంచి పెద్దచేసింది. ఆమె గారాబంతో వాడు సోమరిగా తయారయ్యాడు. ల్‌ గ టీ ల్‌ క్‌ ( క్‌ యా బామ్మ సంపాదిస్తే తినడం తప్ప పనిచేసి ఎరగడు ముకుందుడు. శక్తి వుడిగిపోయిన బామ్మ ఒక రోజు వాడిని ఛడామడా తిట్టి పోసింది. “ఇంతకాలం ఎలానో నెట్బకొచ్చాను. ఇక నావల్లకాదు. ఏ కూలోనాలో చేసి నాలుగు రూకలు సంపాదిస్తే సరీ! లేకపోతే పస్తే గతి” అంటూ గట్టిగా మందలించింది. తీ

వాడికారోజు రోషం ముంచు కొచ్చింది. “చూడవే బామ్మా! ఇక నీమీద ఆధారపడితేను! నేనే కష్టపడి సంపాదిస్తా" అంటూ బయలుదేరాడు.

వాడికి ఒకచోట కూలిపని దొరికింది. పొద్దున్నుండీ చీకటివడే దాకా వనిచేస్తే నాలుగురూకలొచ్చాయి. చేతికి. కానీ ఒళ్ళు హూనమయిపోయింది. ఎప్పుడూ కష్టపడని శరీరమైపోయే! బొబ్బలెక్కిన చేతులు మంటపుట్టాయి. వాడికి విరక్తి పుట్టకొచ్చింది. భీభీ ఏం బతుకు? వెధవబతుకు?" అనుకున్నాడు విసుగ్గా.

ఉదయం లేచేసరికి పక్కింట్లో నుంచి పెడబొబ్బలు వినిపిస్తున్నాయి. విచారిస్తే విషయం బోధపడింది. రాత్రి వాళ్ళింట్లో దొంగలుపడ్డారు. బంగారం, ధనం అంతా కలిపి పోయిన సాత్తు విలువ లక్ష వరహాలకు పైమాటే!

“లక్ష వరహాలే!' లోపల్లోపల విస్తుపోయాడు ముకుందుడు.

“ఒక్కరాత్రి కొంతసేపు కష్టపడితే లక్ష వరహాలు! పగలంతా వళ్ళు హూనం చేసుకుంటే నాలుగు రూకలు!!' వాడి మనను తప్పు దారిలో పరుగులు తీసింది.

బాగా ఆలోచించుకుని వున్నవూరు వదిలిపెట్టాడు బామ్మకి కూడా చెప్పాపెట్టకుండా.

ఉన్నవూర్లో దొంగతనం చేయడం ఎందుకో వాడికి మనస్కరించలేదు.

అలా బయలుదేరినవాడు దూరంగావున్న ఒక గ్రామం చేరాడు. పొద్దుపోయేదాకా ఊరి బయట పాడుపడిన గుడిలో వుండి, బాగా చీకటిపడ్డాక ఊరి మధ్యలో వున్న ఒక పెద్ద వీధిలోకి వచ్చాడు.

వీధమ్మట మెల్లిగా నడుస్తూ ఏ ఇంటిలో దూరాలా? అని ఆలోచిస్తున్నాడు.

అంతలో వెనకనుంచి ఎవరో పరుగెత్తుకువస్తున్నట్లు చప్పుడు వినిపించింది. వెనక్కు తిరిగి చూస్తే రక్షకభటుడు ఒకడు బల్లెం పట్టుకుని తనకేసి వస్తూండటం కనిపించింది.

నిజానికి వాడు వస్తున్నది ముకుందుడికోసం కాదు. ఆ రోజు కాపలాకాసేపనిలోకి వాడు రావడం ఆలస్యమైంది ఏదో పనివుండి. కొత్వాలు అలస్యానికేమన్నా అంటాడేమోనని వాడు వురుకులు పరుగులమీద పనిలోకి వెళ్తున్నాడంతే.

తనని అనుమానించే రక్షకభటుడు అలా వన్తున్నాడనుకుని ముకుందుడు కాలి సత్తువకొద్దీ పరుగెత్తి, వీధి మలుపు తిరిగి చిన్న సందులోకి వచ్చాడు.

ఎండాకాలం అవడంతో చాలా మంది ఆరుబయట దారిలో మంచాలు వేసుకుని పడుకుని వున్నారు. అందులో ఒకడికి దాహంవేసి నీళ్ళు తాగివద్దొమని ఇంట్లోకి వెళ్ళాడు.

న్‌

అఆ నమయంలో రక్షకభటుడి చూవునుంచి తప్పించుకోవాలన్న గాభరాలోవున్న ముకుందుడు చటుక్కున ఆ మంచం ఎక్కేసి ముసుగుతన్నేశాడు. రక్షకభటుడు అదే దారిలో తన హడావిడిలో తాను పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నీళ్ళుతాగి ఇంట్లోంచి వచ్చిన 'పెద్దమనిషికి తన పక్క మీద ఎవరో మునుగుతన్ని పడుకుని వుండటం కనిపించింది. అతని పెంపుడు కుక్క ఒక్కోసారి మంచం ఎక్కి పడుకొంటూ వుంటుంది. కర్రతో అదిలిస్తే, పోతూ వుంటుంది. అది అతనికి మామూలే! “మరీ విడ్డూరం! మామూలుగా మంచం ఎక్కే కుక్క ఈ రోజు ఏకంగా ముసుగే తన్నేసింది' అనుకుంటూ అతడు పక్కనే వున్న దుడ్డుకర్రతో నాలుగు బాదులు బాదాడు. కుయ్యో మొగ్రో అనుకుంటూ ముకుందుడు పక్కమిదినుంచి లేచి కాలికొద్దీ పరిగెత్తి పాడుబడిన గుడి చేరాడు. నడుం విరిగినట్టు అనిపించి ముక్కుతూ మూలుగుతూ ఆ రోజు రాత్రి గడిపాడు. ఆ రోజు రాత్రికి ఒక చిన్న గడ్డపార తీసుకుని బయలుదేరి, ఒక ఇంటి వెనుకకుచేరి గోడకు కన్నం వేయడం ప్రారంభించాడు. అదే సమయానికి ఇంటియజమానికి మెలకువ వచ్చింది. శబ్దం వస్తున్న గోడవైపు చూస్తే, ఎవరో అవతలివైపు నుంచి కన్నం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైంది. ఆయన వెంటనే తెలివిగా పక్కనే వున్న రోకలిబండ చేతిలోకి తీసుకుని గోడపక్కగా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తాను పట్టేంత కన్నం గోడలో ఏర్పడగానే ముకుందుడు ఇంటి లోపలికి ప్రవేశించడానికి తలను కన్నంలోకి దూర్చాడు. తల కొద్దిగా కన్నంలోంచి లోపలికి రాగానే రోకలిబండ వాడి తలమీద పడటం వాడు నాలుక బయటపెట్టేసి నేలను కరుచుకుపోవడం క్షణంలో జరిగిపోయాయి. స్నృహవచ్చేనరికి వాడు ఒక చెట్టుకు కట్టివేయబడి వున్నాడు. చుట్టూ జనం... తిట్టు, శాపనార్థాలు, తన్నులు... అంతలో రక్షకభటులొచ్చి కొత్వాలు దగ్గరకు వాడి తీసుకుపోయారు. ఆయన వంద కొరడా దెబ్బల శిక్ష విధించాడు. భటులు శిక్ష అమలు జరిపి తరిమేశారు. గాయాలు మానాక వాడిబుద్ధి మళ్ళీ దొంగతనం మీదకు పోయింది. ఈ సారన్నా అదృష్టం కలిసి రాకపోతుందా? అవి వాడు అర్థరాత్రి దాటాక వీధిలోకి వచ్చాడు. పెద్ద ప్రహరీగోడ వున్న 6

ఇల్లు ఒకటి వాడికంట పడింది. ప్రహరీగోడ ఎక్కి ఒక్క ఉదుటున కిందకు దూకాడు. కిందపడ్డంతోటే మెత్తగా తను బురదలోకి కూరుకుపోతున్నట్ట వాడికి అన్పించింది. అయినా చేయగలిగిందేమీలేదు. అదృష్టవశాత్తూ ముక్కులవరకు బురద వచ్చేసరికి కాళ్ళకు నేల తగిలింది. లేకపోతే వూపిరాడక ప్రాణం పోయి వుండేది.

అసలు విషయం ఏమంటే అ ఇంట్లో ప్రహరీగోడ నానుకొని జలదారుగుంట వున్నది. అది నిండడంతో ఆ రోజు ఉదయమే దానిని శుభం చేయడానికి పనివాళ్ళను పురమాయించారు ఆ ఇంట్లోవాళ్ళు. జలదారుగుంట మీద రాళ్ళు తీసి పక్కనపెట్టి సాయంత్రందాకా పనివాళ్ళు బురద నీటిని పారబోశారు. ఇంకా సగం పని వుంది. మరుసటి రోజు మిగిలిన పని పూర్తి చేయవలసి వుంది. అంతలో ముకుందుడు అందులో కూరుకుపోయాడు. ఆ రాత్రంతా కంపు భరిస్తూ, బయటపడలేక అక్కడే గడిపాడు.

ఉదయాన్నే పనివాళ్ళు వచ్చి ముకుందుడ్ని చూసి “లీడైవడో దొంగబాపతు"” అనుకుంటూ గుంటలో నుంచి బయటకు లాగి దేహశుద్ధి చేసి రక్షకభటులకు అప్పగించారు.

భటులు వీడ్ని చూసి గుర్తుపట్టి “రే వీడికింకా బుద్ధిరాలేదు” అంటూ కొత్వాలు దగ్గరికి ఈడ్చుకుపోయారు.

కొత్వాలు విచారించి వెలరోజులు కఠిన కారాగారశిక్ష విధించాడు.

నెలరోజులు ఆ శిక్ష అనుభవించాక ముకుందుడిలో మార్చు వచ్చింది. తన ఆలోచనలమీద తనకే రోత కలిగింది. 'కూలిచేసి నాలుగు రూకలు సంపాదించిన రోజే ఎంతో తృప్తి కలిగింది. కాని ఇదేమిటి? దొంగతనం చేయటంలో ఎన్ని అవమానాలు? ఎన్ని తిట్లు? ఎన్ని కష్టాలు? తనేదో కష్టపడకుండా జీవితాన్ని నుఖంగా గడపవచ్చు దొంగతనం చేస్తే అనుకున్నాడు. అది ఎంత తప్పో ఇప్పుడు అర్ధమవుతోంది. దొంగబతుకు వెధవబతుకు, నీచమైన బతుకు అనుకున్నాడు. అలా అనుకున్నాక మనసు తేలికపడింది. హాయిగా అన్పించింది.

ఆ తరువాత తన గ్రామం వెళ్ళి కష్టపడి సంపాదిస్తూ బామ్మని సంతోషపెట్టాడు. తానూ నుఖపడ్డాడు.

థీ శ ఈ క

ఉత్తమ శ్రోత అమరగిరి రాజైన కేశవవర్మ గొప్ప నంగీత ప్రియుడు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవ సమయాల్లో ఆయన గాయకులను అహ్వానించి, గాన నభలు జరిపేవాడు. అందులో అందరికన్న గొప్పగా విద్వత్తు చూపిన గాయకుడికి పెద్ద బహుమానంతోపాటు, ఘనంగా నన్మానం జరుపుతూండేవాడు. 1 ఏం కలీ య హో (౮ గ్గ స్త్ర య ్టా (గ రీ ల్లో కదం తారం యం ఒక సంవత్సరం నారాయణభారతి అనే పరదేశ గాయకుడొకడు ఉత్సవాలకు వచ్చాడు. కేశవవర్మకు గానసభల్లో పాడిన వారందరికంటే వారాయణభారతి సంగీతం అద్భుతం అనిపించింది. 8

రాజు నిండు నభలో అతడికి విలువైన బహుమతులిస్తూ, “మీరు చాలా గొప్పగా పాడారు. మీ పాట వింటూంటే నాకు మైమరపు కలిగిందంటే నమ్మండి" అన్నాడు.

నారాయణభారతి రాజుకు తన కృతజ్ఞత చెప్పుకుని, “మహారాజా, అంతమంది జనం వున్న నభలో పాడుతున్నంత సేపూ, నన్ను ఒక సందేహం వట్టి పీడిస్తూనే వున్నది,” అన్నాడు.

“ఏమిటా సందేహం?” అని అడిగాడు కేశవవర్మ,

“నా పాట వింటూంటే తమకు మైమరపు కలిగిందన్నారు. కాని, శ్రోతల్లో మీరు తప్ప, మరెవరికీ నా పాట ఆనందం కలిగించినట్బలేదు. వాళ్ళల్లో కొందరు, నే పాడుతున్న మాటే మరిచి గునగునలాడుకోవడం కూడా గమనించాను,” అన్నాడు నారాయణభారతి.

రాజుకు తన పౌరుల్లో తనలాంటి నంగీత ప్రియులు లేరన్న నంగతి బాగా తెలును. ఇది ఆయనకు ఎంతో నిరుత్సాహ కారణంగా వుండేది. ఇప్పుడు పరదేశపువాడైన వారాయణభారతి మాటలు విన్న తరవాత ఆయనకు చాలా బాధకలిగింది.

కళలపట్ల, ముఖ్యంగా నంగీతం పట్ల తన ప్రజలకు ఆసక్తి కలిగించడం ఎలా? ఈ నమన్యను పరిష్కరించడం గురించి రాజు దీర్ధంగా ఆలోచించి, మరుసటి నంవత్సరం నవరాత్రి ఉత్సవాలకు కొంచెం ముందుగా రాజ్యంలో ఒక చాటింపు వేయించాడు. అదేమంటే, జరగనున్న నవరాత్రి ఉత్సవ నభల్లో గాయకుల పాట విని, అందరికన్న ఎక్కువగా ఆనందించే ఉత్తమ శోతకు వెయ్యి వరహాల బహుమానం యివ్వబడుతుంది.

తన మంత్రికి కూడా నంగీతమంటే, అంతగా యిష్టం లేదన్న నమ్మకంతో రాజు యీ చాటింపు విషయం ఆయనతో ముందుగా సంప్రతించకుండానే చేయించాడు.

మంత్రి యీ చాటింపు గురించి తన నౌకరుల ద్వారా తెలుసుకుని, రాజును చూడబోయి “మహారాజా, ఉత్తమ శ్రోతకు తమరు యివ్వబోయే బహుమానం సంగతి యింతకుముందే విన్నాను. వెయ్యి వరహాలంటే మనకు ఏమంత పెద్ద మొత్తం కాదనుకోండి. నా భయమల్లా పాట వినడానికి వచ్చే అంతమంది జనంలో ఉత్తమ శ్రోతను గుర్తించడం చాలా కష్టసాధ్యమని” అన్నాడు.

“కష్టసాధ్యమైనా ఫర్వాలేదు. ఈ బహుమానం కారణంగా మన ప్రజల్లో సంగీతంపట్ల ఆసక్తి పెరిగితే అంతే చాలు,” అన్నాడు రాజు.

ఉత్సవ దినం వచ్చింది. ఈ నంవత్సరం నారాయణభారతి రాలేదుగాని ఆయనకు సమ ఉచ్దీలయిన గాయకులు చాలా మంది వచ్చారు.

ం్ర

రాజు నమక్షంలో ఒక వ్రసిద్ధ గాయకుడు పాడనున్నాడని తెలియడంతో నభా ప్రాంగణమంతా జనంతో, కిక్కిరిసిపోయింది. గాయకుడు పాట ప్రారంభించి ఒకటి, రెండు నిమిషాలు గడిచేసరికి జనంలో ప్రతి ఒక్కడూ తలలు ఊపుతూ, చప్పట్లు చరుస్తూ హర్షధ్వానాలు చేయసాగారు.

ఇది చూసి రాజుకు ముందు ఆశ్చర్యమూ, ఆ తరవాత విపరీతమైన కోపమూ కలిగాయి. తాను ప్రకటించిన వెయ్యి వరహాల బహుమానం కోసం ప్రతి ఒక్కడూ ఉత్తమ (శ్రోతగా నాటకమాడుతున్నాడన్న మాట. ఇలా అయితే పాటకచేరీ రసాభాస అవుతుంది!

రాజు పక్కనే వున్న మంత్రితో యిప్పుడేం చేస్తే బావుంటుందన్న విషయమై సంప్రతించాడు. మంత్రి దీనికి విరుగుడు తనకు తెలుసునని చెప్పి, సభికులతో, “మహారాజుగారికి ప్రతి ఏటా ఉత్తమ గాయకుణ్ణి ఎలా ఎన్నిక చేయాలో తెలిసినట్టే, ఉత్తమ శ్రోతను కూడా ఎలా ఎన్నిక చేయాలో తెలుసు. కనక, గాయకుడు పాడుతున్నంతసేపూ సభికులెవరూ హర్షధ్వానాలు చేయడంగాని, తలలు ఊపడం గాని చేయగూడదు. అందుకు భిన్నంగా ప్రవర్తించిన వాళ్ళ తలలు ఎగిరిపోగలవు” అన్నాడు.

అటు తర్వాత గాయకుడి పాటకు సభికులు తలలూపడం మానారు. కాని, వాళ్ళల్లో ఒక్కడు మాత్రం తల ఊపుతూనే వున్నాడు.

మంత్రి అతడి కేసి కోపంగా చూస్తూ, “నీకు తల వుండడం యిష్టంలేదా ఏం?” అని అడిగాడు.

దానికివాడు తొణక్కుండా, “తియ్యని సంగీతం వినబడుతూ వుంటే, తన్మయత్వంతో ఊగని తల వుంటేనేం, పోతేనేం!” అన్నాడు.

మంత్రి, రాజు కేసి తల తిప్పి, “మహారాజా, మనకు ఈ సంవత్సరం సన్మానించదగిన ఉత్తమ శోత లభించాడు!” అన్నాడు.

రాజుతోపాటు గాయకుడు కూడా ఆ ఉత్తమ శ్రోత కేసి చూస్తూ మందహాసం చేశాడు.

ఖీ శ ఖీ [0

బోడిసలహా టమైోనాక్తి ఇద్దరు అన్నల మధ్య గారాబంగా పెరిగిన పిల్ల, ఆ పిల్లకు నయను వచ్చినప్పటి నుంచీ, ఆమె అన్నలు అమెకు ఫెళ్ళి చెయ్యాలని సంబంధాలు చూడసాగారు. వారికి రామాపురానికి చెందిన గుణశేఖరుడు అనేవాడి తమ్ముడు సోమశేఖరుడు నచ్చాడు. మోనాక్షిని సోమశేఖరుడికి ఇచ్చి పెళ్ళి చేసిన అనంతరం ఆమె అన్నలిద్దరూ తాము కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సోమశేఖరుడుకి ఏ లోటూ లేదు. అతడు అన్నివిధాలా యోగ్యుడు. అతని వ్యాపారం లాభసాటిగా జరుగుతున్నది. అతనికీ, అతని అన్నకూ మంచి అస్తిపాస్తులున్నాయి. కాపరానికి అకున్‌ న శై

వచ్చిన మీనాక్షి అన్ని విషయాలలోనూ తృప్తి పడింది. కొని ఇంటి పెత్తనమంతా తన తోడికోడలిది కావటం ఆమెకు నచ్చలేదు. తోడికోడలు తనపట్ల ఎంత ఆదరమూ, ఆప్యాయతా చూపినప్పటికీ, మోనాక్షికి కావలసినవి అవికావు. ఆమెకు కావలసినది పెత్తనం!

మీనాక్షి తన కోరికను భర్తకు సూటిగా చెప్పకుండా, డొంకతిరుగుడుగా చెప్పి చూసింది. సోమశేఖరుడు అర్ధం చేసుకోని వాడిలాగా ఉండిపోయాడు. చివరకు మీనాక్షి పట్టలేక, “మనం వేరీ కాపురం పెడదామండి!”' అనేసింది.

సోమశేఖరుడు మొదట నివ్వెరపోయి, తరవాత, “నన్ను ఆలోచించుకోనీ!”” అని మీనాక్షితో అన్నాడు.

ఇంతలో అతను వ్యాపారం నిమిత్తం శోణాపురం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మీనాక్టి “దారేగదొ? శోణాపురం నుంచి వచ్చేటప్పుడు మా అన్నలను తొంగి చూసిరండి,” అన్నది.

సరేనని సోమశేఖరుడు బయలుదేరి వెళ్ళాడు.

అతను తిరిగి వచ్చినాక మీనాక్షి తన అన్నలు ఎలా ఉన్నారని అడిగితే, సోమశేఖరుడు, “మీ అన్నల కేం? బాగానే ఉన్నారు. మీ వదినెల పద్ధతే బాగా లేదు,” అన్నాడు.

“ఏం?” అన్నది మీనాక్షి

“మీ అన్నలను వేరు పడమని మీ వదినెలు పోరుతున్నారట. వాళ్ళకేమో వేరుపడటం ఇష్టం లేదట. ఏం చెయ్యమంటావని నన్ను సలహా అడిగారు” అన్నాడు సోమశేఖరుడు,

“ఏం చెప్పారు మీరు?” అని మీనాక్షి అడిగింది.

“మననులు కలవనప్పుడు వేరు పడటమే మంచిదని చెప్పాను. ఇంకేం చెప్పనూ?" అన్నాడు సోమశేఖరుడు.

“మా బాగా చెప్పార్లెండి, బోడిసలహా!” అన్నది మీనాక్షి తన అన్నలు విడిపోవటమన్న ఆలోచనే ఆమెకు కడుపులో దేవినట్బ అనిపించింది. ఆమె ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయింది.

తరవాత కొద్ది రోజులకు మీన్గాక్షి తాము వేరేకాపురం పెట్టే విషయం భర్తకు జ్ఞాపకం చేస్తూ, “అ విషయం ఏం తేల్చారు?” అని అడిగింది.

“శేల్చేదేమున్నదీ? నువు చెప్పినట్ట చెయ్యదలచుకోలేదు,” అన్నాడు సోమశేఖరుడు.

“దేనికనీ?” అని మీనాక్షి గదమాయించి అడిగింది.

శ?

“అది బోడిసలహా గనక!” అన్నాడు సోమశేఖరుడు. “నా సలహా మీకు బోడిసలహా అనిపించిందా?” అన్నది మీనాక్షి ఎంతో బాధగా. “నేను మీ అన్నలకు ఇచ్చినది బోడిసలహా అయితే, నువు నాకు ఇస్తున్న సలహా కూడా అదేగా?” అన్నాడు సోమశేఖరుడు. మీనాక్షికి చెంపదెబ్బ తగిలినట్టయింది. ఆమె మళ్ళీ వేరుకాపురం మాట ఎత్తలేదు. శీ ఈ 4 కే3

అ అష్టరుచులు శో ణగిరి జమీందారిగారి కూతురి పెళ్ళి నిశ్చయమైంది. తీరా పెళ్ళిరోజు దగ్గరపడేసరికి దివాణంలోని వంటవాడు ఆరోగ్యం బాగాలేక మంచం పట్టాడు. కాబోయే వియ్యంకుడు చిన్నవాడు కాకపోయే! సాక్షాత్తూ రత్నపురం సంస్థానాధీశుడు! పెళ్ళి ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి లోపం జరగడానికి లేదని ఆయన ముందే చెప్పాడు. ప్రత్యేకించి భోజన ఏర్పాట్లు! పైపెచ్చు ఆయన భోజన ప్రియుడు! అనుకున్నదే తడవు మంచి వంటవాడు దొరకడం అంటే మాటలు కాదు. దిగులు పట్బకుంది జమీందారుగారికి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు దివాణంలో పనిచేసే రత్తయ్య కొడుకు సాంబయ్య మంచి వంటవాడని తెలిసింది. ఆయన అతడిని పిలిపించి, “ఏరా, మ్‌ టో [ఈ “త యు (1 న ల్‌ వహ్‌ భ్‌, క్షత

అమ్మాయి పెళ్ళికి వేల మంది అతిథులు రాబోతున్నారు. నలభీమపాకంలా వంటలు చేసి, మెప్పించగలవా? లేదంటే చెప్పు మరొకరిని ఎవరినైనా చూసుకుంటాం” అన్నాడు.

దానికి వాడు వినయంగా, “ప్రభూ మీరింత దయతో దివాణంలో ఉద్యోగం అనుగ్రహిస్తూ వుంటే నేనామాత్రం చేయలేనా? చూస్కోండి నా తడాఖా! అష్టరుచులతో వండి వడ్డిస్తా! అతిథులు విస్తళ్ళు వదలడానికి బాధపడాలంతే!” అన్నాడు మహా ఉత్సాహంగా.

“అష్టరుచులేమిట్రా? షడ్రుచులు అనే మాట విన్నాంగాని” అన్నాడు జమీందారు ఆశ్చర్యంతో.

“మీరే చూస్తారుగా అష్టరుచులంటే ఏమిటో? తినబోతూ, రుచి అడగడం దేనికి?” అన్నాడు వాడు తొణక్కుండా.

సాంబయ్య వంటవాడైపోయాడు దివాణంలో = పెళ్ళి బ్రహ్మాండంగా జరిగిపోయింది. పెళ్ళిలో ప్రతి ఒక్కడూ లొట్టలు వేసుకుంటూ భోంచేసినవారె! వియ్యంకులవారు కూడా జమీందార్సి ప్రత్యేకించి ప్రశంసించారు వంటల విషయంలో. సద్దుమణిగాక, చుట్టాలంతా ఎవరి దారిన వారు పోయాక, జమీందారు సాంబయ్య ను పిలిచి, వాడితో, “ఓరే! నీ వంటలు బాగానే వున్నాయి సరేగాని, నాకు అందులో కన్పించినవి షడ్రుచులేనే! అష్టరుచులతో వంటలు చేస్తానని డఉంభాలు పలికావు కదా! అలాంటిదేమీ నాకు కన్పించలేదే?' అన్నాడు సరదాగా.

“ప్రభూ! మీకు తెలియనిదేముంది? మీరన్నట్టు రుచులు ఆరే గాని ఎనిమిది లేవు. అయితే కొన్ని వంటకొలు వేడిగా వుంటేనే వాటిలో గుచి కన్పిస్తుంది. చల్లబడితే అంత రుచి ఎటుపోతుందో తెలియదు. ఇక పానీయాల సంగతంటారా, ఎంత చల్లగా వుంటే అంత బావుంటాయి. ఏ మాత్రం చల్లదనం తగ్గినా వాటిలో రుచి మిగలదు. అందులోనూ ఎండనపడి వచ్చిన అతిథులకు చల్లని పానీయాలు అమృతంతో సమానం. ఏ స్థితిలో దేన్ని ఇవ్వాలో ఆ స్థితిలో దాన్ని అతిథులకు అందివ్వడం వల్ల వారు షడ్రుచులను అనుభవించగల్లారు. ఆరు రుచులకు తోడు వేడిగా వుండటం, చల్లగా వుండటం అనే స్థితులను కూడా కలిపి అష్టరుచులని మీతో అన్నాను అంతే! తప్పు అయితే మన్నించండి” అన్నాడు సాంబయ్య వినమ్రంగా.

వంటల్లో వేర్పిరితనం, మాటల్లో చమత్కారం వున్న సాంబయ్యను జమీందారు తగిన విధంగా సత్కరించి, తన దివాణంలో వంటవాడిగా బహుకాలం వుంచుకున్నాడు.

శత శ ఈ కే

అల అల రీ వింత సంఘటన పూర్వం కళింగదేశాన్ని పాలించిన, ఆనందవర్థనుడికి చాలా కాలం సంతానం కలగలేదు. అందుచేత ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలానికే చిన్న రాణి గర్భవతి అయింది. రాజూ, ప్రజలూ కూడా అనందభరితులయారు. అదే సమయంలో పెద్ద రాణి కూడా గర్భవతి అయినట్బ తెలియ వచ్చింది. అందరి సంతోషమూ రెట్టింపు అయింది. ఈ లే ముడత తయో రాజు ఇద్దరు రాణులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. ఇంతలో ఒక విడ్డూరమైన వార్త రాజభవనంలో వినవచ్చింది. అదేమంటే, ఒక ఏనుగుకు గుర్రం పిల్ల 16

వుట్టిందట! అందరూ ఆశ్చర్యపడి, కలికాలంలో ఇలాంటివి జరుగుతాయి. కాబోలు ననుకున్నారు.

తరవాత ఇద్దరు రాణులూ ఏకకాలంలోనే ప్రసవించారు. పెద్ద రాణి చక్కని పిల్లవాణ్ణి కన్నది, కాని చిన్న రాణికి పిల్లి కూన పుట్టింది! మనిషికి పిల్లికూన పుట్టడం కూడా కలిమహిమే కాబోలు ననుకున్నారు. అయితే పెద్ద రాణికి కొడుకు కలిగినందుకు రాజు సంతోషించాడు.

ఇది జరిగిన కొద్ది రోజులకు రాజసభకు ఒక జ్యోతిష్కుడు వచ్చి, భూత భవిష్యత్తులు చెప్పగలనన్నాడు. రాజు. తన కొడుకు జాతకం చూడమని, అఆ జ్యోతిష్కుణ్ణి పెద్ద రాణీ మందిరానికి పంపాడు.

జ్యోతిష్కుడు పెద్ద రాణి మందిరానికి వెళ్ళి, ఆమె కన్నబిడ్డను చూసి, జాతక చక్రం వేసి, పెద్ద రాణితో, “అమ్మా, ఈ పిల్లవాడు కన్నతల్లి వద్ద కాక మరొక స్త్రీ వద్ద పెరుగుతాడు. అయితే ఈ పిల్లవాడు దురదృష్ట జాతకుడు కావటాన ఇతన్ని పెంచే మారుతల్లి ఎంతో కాలం బతకదు” అన్నాడు.

పెద్ద రాణి కలవరపడుతూ, “దీనికి విరుగుడు ఏమీ లేదా?” అని అడిగింది.

“అమ్మా, గ్రహశాంతులూ అవీ వొట్టి బూటకం. జాతకంలో రాసిపెట్టి ఉన్నది అక్షరాలా జరిగి తీరుతుంది. మిమ్మల్ని అబద్ధాలతో మోసగించి డబ్బు చేసుకునే జ్యోతిష్కుణ్ణి కాను నేను” అన్నాడు జ్యోతిష్కుడు.

“మరి ఎలాగ?” అన్నది రాణీ.

“ఇతన్ని పెంచబోయే స్త్రీ ఈ పిల్లవాణ్లి వదిలించుకుంటే ఆమెకు ప్రాణాపాయం తప్పుతుంది. అంతకన్న మరొక మార్గం లేదు” అన్నాడు జ్యోతిష్కుడు.

పెద్ద రాణి జ్యోతిష్కుడికి ఇయ్యవలసినది ఇచ్చి పంపించేసి, తన బిడ్డను తీసుకుని చిన్నరాణి అంత:పురానికి వెళ్ళి, విచారంగా కూర్చుని ఉన్న రాణిని చూసి,"చూడు, చెల్లీ! నీకు ఇలా అయినందుకు నాకెంతో బాధగా ఉన్నది. వీడు మన ఇద్దరికీ బిడ్డేకదా! నువే వీణ్ణి పెంచు, దిగులుపడకు,” అన్నది, తన బిడ్డను ఆమెకు అందిస్తూ,

చిన్న రాణి ఆవేశంతో, “నాకు అంతా తెలుసులే! ఆ దురదృష్ట జాతకుణ్ణి పెంచి నేనునా ప్రాణంమీదికి తెచ్చుకోనా?” అన్నది.

పెద్దరాణి పెద్ద చిక్కులో పడింది. ఇక అసలు విషయం బయటపెట్టడం ఆమెకు తప్పనిసరి అయింది. ఆమె ఇలా అన్నది:

7

“చెల్లీ, నన్ను నువు క్షమించాలి. ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డే! నాకు బిడ్డలు లేరని రాజుగారు నిన్ను పెళ్ళాడారు. నువు గర్భవతివని విని చాలా అసూయపడ్డాను. నువు రాజమాతవు అయితే నా గతి ఏంకాను? అందుకని నేను ఒక పథకం ఆలోచించి, నేను కూడా గర్భవతినని పుకారు లేవదీసి, ముందు ముందు నేను చెయ్యదలచుకున్న మోసం గురించి ఎవరికీ అనుమానం కలగకుండా, ఏనుగు గుర్రం పిల్లను కన్నట్ట ఒక వదంతి దివాణంలో ప్రచారం చేయించాను. తరవాత నువు ప్రసవించిన బిడ్డను నా పక్కలోకి మార్పించి, నీ పక్కలో పిల్లి కూనను పెట్టించాను. ఇలా ద్రోహం చేసి నందుకు పశ్చాత్తాప పడుతున్నాను. నన్ను క్షమించి, నీ బిడ్డను నువు తీసుకో.”

చిన్న రాణి తన బిడ్డను తీసుకుంటూ, “అక్కా, విచారించకండి. జరిగినదేదో జరిగింది. నాకు మొదట మీ మీద అనుమానం లేదుకాని, నాకు పిల్లికూన పుట్టిందన్న తరవాత మీమీద అనుమానం కలిగింది. వెనక్కు తిరిగి చూసుకుంటే, నాతోబాటే మీరూ గర్భవతి కావటమూ, ఏనుగు గుర్రంపిల్లను కన్నదన్న పచ్చి అబద్ధం ప్రచారం కావటమూ నా అనుమానాన్ని బలపరిచాయి. నిజం బయటికి లాగాలన్న ఉద్దేశంతో నేనొక జ్యోతిష్కుణ్ణి ప్రయోగించాను. నిజానికి అతను జ్యోతిష్కుడు కాడు. నేనిచ్చే బహుమానానికి ఆశపడి, నేను చెప్పమన్నట్ట చెప్పాడు. అతని ద్వారా నేను ఆడిన నాటకం సఫలమయింది. మీ రన్నట్ట వీడు మన ఇద్దరికీ బిడ్ద. అందుచేత మీరు పశ్చాత్తాప పడనవసరం లేదు. మీరొక నాటకం ఆడితే నేను ఇంకో నాటకం ఆడాను. అందుచేత నాకు మీమీద ఏమీ కోపంలేదు,” అన్నది.

ఫీ శ + 18

జఒకప్పుడు మునిపల్లెలో గోవిందుడనే పేదవాడుండేవాడు. గూడుబండిని తోలుకుంటూ జీవనం గడిపేవాడు. పల్లె నుండి పట్నంకు పనిమీద వెళ్ళేవారికి వాడి గూడుబండితో అవసరం వుండేది. గ నో [నో నం ఒకసారి బాడుగకుపోయి, పట్నం నుండి తిరిగి వస్తూండగా దారి మధ్యలో గుంటలో చక్రం పడి, బండి యిరుసు విరిగిపోయింది. ఎలాగో ఒకలాగ బండిని పల్లె చేర్చాడు. దాన్ని మరమ్మతు చేయించడానికి వాడి దగ్గర సరిపడా డబ్బుల్లేవు. క్షం

ఆలోచిస్తే పారుగింటి ధనికుడు రత్నయ్య వాడికి గుర్తొచ్చాడు. ఆయనతో వాడికి ఓ మోస్తరు పరిచయం వుంది. రత్స్మయ్య యింటికి గోవిందు వెళ్ళేసరికి అతని మిత్రుడు ధర్మయ్య వచ్చివున్నాడు రత్నయ్యతో వ్యాపార విషయాలేవో మాట్టాడటానికి,

గోవిందుడు రత్న్మయ్యతో వచ్చిన విషయం చెప్పి, “ముప్పయి వరహాలు యిచ్చారంటే, బాబయ్యా! బండి బాగుచేసుకుంటాను. బాడుగలో రోజూ ఒక వరహా చొప్పున చెల్లువేస్తాను"” అన్నాడు.

దానికి రత్న్మయ్య యింతెత్తున ఎగిరిపడి, “ఇక్కడేమన్నా, డబ్బులు చెట్లకు కాస్తున్నాయట్రా? అసలే వ్యాపారాలు సరిగా సాగక ఇబ్బందులు పడుళూ వుంటే” అన్నాడు. గోవిందుడు ముఖం వేలాడేసుకుని ఇంటిదారి పట్టాడు.

ఇదంతా గమనిస్తున్న ధర్మయ్య మిత్రుడితో, “ఏమిట్రా? నీది మరీ కాపీనంగాని, ముష్ఫయి వరహాలు నీ దగ్గర లేవట్రా?” అన్నాడు. “చాల్లే వూర్కోరా. ఇలాంటివారికి ఇచ్చే అప్పులు గోడకి వేసిన సున్నంలాంటివి” అన్నాడు రత్న్మయ్య. “పోనీ నువ్వన్నట్లు తిరిగిరావనే అనుకుందాం. ఏదో బతుకుతెరువు అంటున్నాడు. అదీగాక నీ పొరుగున వున్న పేదవాడు. దానం అనుకుని ఇవ్వవచ్చు కదా?” అన్నాడు ధర్మయ్య. “ఇక ఆపరా! నువు చెప్పేంత దానగుణం నాకు లేదు” అంటూ ఆ విషయాన్ని అంతటితో ఆపేశాడు రత్న్మయ్య. ధర్మయ్య తన పని తాను చూసుకుని ఇంటికి వెళ్ళాడు.

వారం రోజుల తర్వాత ఒక రోజు రత్న్మయ్య భార్య, కొడుకు దగ్గరలో వున్న కొండ మీది గుళ్ళో తిరునాళ్ళు జరుగుతూ వుంటే చూద్దామని వెళ్ళారు. ఇంటికి కావలాగా రత్నయ్య' వుండిపోయాడు. అర్ధరాత్రి అతడికి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. గ్రామంలో వున్న నాటువైద్యుడు చూసి తనవల్ల కాదని పెదవి విరిచాడు. అలస్యం గాకుండా పట్నం వెళ్ళాలన్నాడు. అప్పటికి చుట్టపక్కలవాళ్ళు వచ్చి గమిగూడారు రత్తయ్య ఇంటి ముందు. అ గుంపులో వున్న గోవిందుడు అప్పటికప్పుడు గూడుబండి సిద్ధంచేసి, భుజాన రత్తయ్యను ఎత్తుకొని బండిలో పడుకోబెట్టుకొని ఆఘమేఘాల మీద పట్నం చేరాడు. పట్నంలో రత్తయ్యకు తగిన వైద్యం లభించింది. ఉదయానికి కోలుకున్నాడు. “సమయానికి రాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రాణానికి ముష్పు వచ్చేది” అన్నాడు పట్నం వైద్యుడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని గూడుబండిలో రత్న్మయ్య ఇల్లు చేరేసరికి, తిరునాళ్ళ నుంచి తిరిగొచ్చిన ఆయన భార్య, కొడుకు, మిత్రుడు ధర్మయ్య ఆందోళనతో వున్నారు. ఆరోగ్యంతో ఇల్లుచేరిన రత్స్వయ్యతో ఆయన భార్య, కొడుకు “ఎంతో గాభరాపడిపోయాం. దేవుడి దయ, మీరు కోలుకున్నారు” అన్నారు ఆనందంగా.

20

“దేవుడి దయకాదే, అంతా గోవిందుడి దయ” అంటూ కృతజ్ఞతగా గోవిందుడి వైపు చూస్తూ, ఏదో గుర్తుకొచ్చినవాడిలాగా, “ఒరే! అది సరేగాని, బండి యిరుసు విరిగిందన్నావే, ఎప్పుడు చేయించావురా మరమ్మతులు” అన్నాడు రత్న్మయ్య.

“నా దయ ఏం లేదు బాబయ్యా! అంతా మీ మిత్రుడు ధర్మయ్య దయ! ఆ రోజు మీరు డబ్బులు లేవనగానే నేను యింటికి వెళ్ళాను. తరువాత కొద్దిసేపటికి మీ మిత్రుడు ధర్మయ్య వచ్చి, ముప్పయి వరహాలు నా చేతిలో పెట్టి 'బండి మరమ్మతులు .చేయించుకోరా! నీ చేతిలో వున్నప్పుడే నాకు చెల్లువేస్తువుగాని' అన్నాడు. లోకంలో ఇలాంటివారు కూడా వుంటారా? అనుకుంటూ బండికి ఆ వేళే మరమ్మతులు చేయించాను. మీ మిత్రుడు నాకు చేసిన మేలు తిరిగి అది మీకు మేలుగా మారింది అంతే. పోతే నేను కొంత శ్రమ తీసుకున్నాను. అదేం గొప్ప కాదు. పారుగువాడిగా నా బాధ్యత” అన్నాడు గోవిందుడు. అక్కడ చేరిన జనం అందరూ గోవిందుడి మంచి మనసును మెచ్చుకుంటూ వెళ్ళిపోయారు.

అందరూ వెళ్ళాక సిగ్గుతో తల వంచుకుని వున్న రత్మయ్యతో ధర్మయ్య, “ఇరుగు పారుగుల పట్ల మనం ఎప్పుడూ మంచి మనసుతో వ్యవహరిస్తుండాలి. ఎవరితో అవసరం ఎప్పుడు పడుతుందో చెప్పలేం. డబ్బు విషయంలో జాగ్రత్త మంచిదేగాని కాపీనం మంచిదికాదు. అందరి మేలు మనం కోరితే, భగవంతుడు మన మేలు కోరుతాడు. మనిషికి రూక బలం ఎంత అవసరమో మూక బలం కూడా అంతే అవసరం” అన్నాడు.

అ తర్వాత రత్నయ్య గోవిందుడ్ని మంచి బహుమానం ఇచ్చి సత్కరించడమే కాక, తనకున్నంతలో పదిమందికీ సాయం చేయడం కూడా అలవాటుచేసుకున్నాడు.

థీ శ శీ ౯ |

పె కొడు యఎగునారి కులు ఒకప్పుడు రత్నపురం అనే నగరంలో ధనగుప్తుడనే వర్తకుడుండేవాడు. అతడు చాలాకాలం వర్తకం చేసి, లక్షలు ఆర్జించాడు. అయితే, అతడు అతి పిసినారి కావడం చేత, తను సంపాదించినదంతా అలాగే నిల్వచేశాడు. అతనికి యిద్దరు కొడుకులు. ఆ యిద్దరూ తండ్రి పెంపకంలో, తండ్రికన్నా పిసినారితనంలో రెండాకులు ఎక్కువ చదివిన వాళ్ళుగా తయారయ్యారు. ని మ్న్‌ ॥ శి గస బో ఆ కో సరో నో కొంతకాలం గడిచాక, ధనగుప్తుడికి ముసలి తనంతోపాటు, ఆరోగ్యం కూడా బాగా చెడీ, మంచం పట్టాడు. 22

ఒకనాడు ధనగుప్తుడి పెద్దకొడుకు, తమ్ముడితో, “నాన్న ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది తమ్ముడూ! ఎవరికన్నా వైద్యుడికి చూపిద్దొామా?” అన్నాడు.

దానికి చిన్నవాడు, “ముసలితనం అంటూ వచ్చాక రోగాలు రాకుండా వుంటాయా అన్నయ్యా? ఎందుకు వైద్యుడికి చూపించటం? ఉబ్బు దండగ. వైద్యుడుమటుకు పోయే ప్రాణాన్ని కాపాడగలడంటావా?” అంటూ వేదాంతిలా మాట్లాడాడు.

దానికి పెద్దవాడు, “నువ్వన్న మాటా నిజమే. కానీ లోకం కోసమైనా నాన్నని వైద్యుడికి చూపించాలి గదా,” అనే 'సందేహం వెలిబుచ్చాడు.

చివరకు అన్నదమ్ములు కూడబలుక్కుని, ఊరూ పేరూ లేని ఒక వైద్యుణ్ణి పిలుచుకు వచ్చారు.

అ వైద్యుడు ధనగుప్తుణి పరీక్షించాక అన్నదమ్ములతో యిలా అన్నాడు:

“ఈయన మరింకెంతో కాలం బతక డనుకుంటాను. ప్రస్తుతానికి నేను వాడమన్న మందులు కొని, వాడుతూ వుండండి.”

దానికి అన్నదమ్ములు వైద్యుడితో, “అయ్యా, పోయే ప్రాణం ఎలాగూ పోతుంది గదా! మళ్ళీ యీ మందు లెందుకు, డబ్బు దండగ,” అన్నారు.

వైద్యుడు వాళ్ళ పిసినారితనం గ్రహించి, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

తనకు సరైన వైద్యం చేయించడానికి, తన యిద్దరు కొడుకులూ డబ్బు దండగ అని ఊరుకోవటం, ధనగుప్తుడి హృదయాన్ని కలచివేసింది. అతడిలో రకరకాల ఆలోచనలు కలిగాయి. బహుశా తనెంతోకాలం బతక్కపోవచ్చు. జీవితంలో సుఖం అనేది లేకుండా తను ధనం సంపాయించాడు. తన చేత్తో ఎప్పుడూ ఒక ఏర్రని ఏగాణి దానం చేసి ఎరగడు. తను సంపాయించిన డబ్బు ఎలానూ తనతో రాదు. ఈ సత్యాన్ని తను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. కనీసం తన కొడుకులనైనా బాగుపరచాలి!

ఒకనాడు ధనగుప్తుడి కొడుకులు, న్యాయాధికారిని వెంటబెట్బకుని తండ్రీ వద్దకు వచ్చి, ఆస్తిని పంచమని అడిగారు.

ధనగుప్తుడు, తను సంపాయించిన అస్తిని గురించి చెప్పి, వాళ్ళకు రావలసిన భాగాలు వివరించి, చివరకు యిలా అన్నాడు, “నాయనలారా! నా ఆస్తి అంతా మీకు సమంగా పంచాను. కొని, నా వద్ద అతి విలువచేసే మూడు వజ్రాలను మాత్రం పంచలేదు. మీకు చెరొక వజ్రం

23

పంచితే, ఒకటి మిగులుతుంది. దాన్ని ఎవరికి యివ్వటం? దాన్ని సగానికి కోద్దామంటే, వజ్రం విలువ తరిగిపోతుంది. అందుకని ఒక ఉపాయం ఆలోచించాను.”

“ఏమిటది?” అని యిద్దరు కొడుకులూ ఒకే మారు అడిగారు.

“మీకు ఇనప్పెట్టె తాళాలు యిచ్చేస్తాను. వారంరోజుల్లో మీ యిద్దరిలో ఎవరెక్కువ ఖర్చుపెడతారో, వారికి అఆ వజ్రం దక్కుతుంది” అన్నాడు ధనగుప్తుడు, తను ముందే ఆలోచించిన ఉపాయాన్ని చెబుతూ,

ఈ విచిత్ర పరీక్షకు కొడుకు లిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తండ్రికి మతిగాని చలించలేదుగదా అనుకున్నారు ఆ అన్నదమ్ములు.

వాళ్ళ ఆలోచన పసిగట్టినవాడిలా ధనగుప్పడు, “అబ్బాయిలూ, కేవలం డబ్బు సంపాయించటమే కాదు, దాన్ని సక్రమంగా ఖర్చు చెయ్యటంగూడా తెలిసుండాలి,” అన్నాడు.

చేసేదిలేక యిద్దరు కొడుకులూ “సరే'నన్నారు.

వారం రోజులు గడిచాక యిద్దరూ తండ్రి వద్దకు వచ్చారు.

ముందు పెద్దవాడు, “నాన్నా! డబ్బు ఖర్చు చెయ్యాలంటే ఎందుకోగాని నాకు గుండె దడగా వుంది. ఎలాగో అతికష్టం మీద రెండు వందల వరహాలు ఈ వారంలో ఖర్చు చెయ్యగలిగాను,” అన్నాడు దిగులుగా ముఖం పెట్టి.

“ఎలా ఖర్చు పెట్టావురా?” అని అడిగాడు తండ్రి, కుతూహలంగా.

“రోజూ, మునుపెన్నడూ తినని పిండి వంటలూ, చక్కని భోజనం చేయించుకుని తిన్నాను, మంచి దుస్తులు కొనుక్కున్నాను” అన్నాడు.

అప్పుడు తండ్రి చిన్నవాడికేసి, “నువ్వేం చేశావు" అన్నట్టు చూ+ాడు.

“నాన్నా! అన్నలాగా మంచి భోజనం చెయ్యాలన్నా ఆడంబరంగా వుందామన్నా నాకు మనస్కరీంచలేదు. ఎలా డబ్బు ఖర్చు చెయ్యాలా అని దిగులుపడుతున్న సమయంలో మన పాలేరు వచ్చి, తన భార్య చావు బతుకుల మధ్య వున్నదని, ఒక వంద వరహాలు అడిగాడు. ఆలోచనలో వున్న నేను, వద్దంటున్న మనసును నొక్కి పట్టి, వాడికి వంద వరహాలు యిచ్చాను,” అన్నాడు రెండవవాడు,

“భేష్‌! నువ్వేరా, అ వజ్రానికి సాంత దారుడివి,” అన్నాడు తండ్రి.

“ఇది అన్యాయం నాన్నా! అ వజ్రం నాకేదక్కాలి. తమ్ముడికంటే నేనే ఎక్కువ ఖర్చుపెట్టానుగదా,” అన్నాడు పెద్దకొడుకు.

24

“పెద్దబ్బాయ్‌! నీ స్వార్ధంకోసం నువ్వు రెండువందల వరహాలు ఖర్చు చేశావు. నువ్వు పిసినారివి కాబట్టి, అది నీకు గొప్పకావచ్చు. చిన్నవాడు అలా కాక, తనకు యిష్టం వుండో, లేకనో యితరులకొరకు వందవరహాలు ఖర్చు పెట్టాడు. తన నుఖాలకోనం తను ఖర్చు 'పెట్టకోవడంకాదు, కొద్దో గొప్పో యితరులకూ సహాయపడటమే గొప్ప. అదే అసలు వ్యయం," అని చెప్పాడు తండ్రి.

తండ్రి మాటల్లోని అంతరార్థాన్ని అప్పుడు కొడుకు లిద్దరూ గ్రహించారు.

మరీ అంత పిసినారితనం పనికిరాదు. ఉన్నదాంట్లో కొంత కష్టాలలో వున్నవారి కోసంగూడా ఖర్చుపెట్టాలి. వీలైనంత దానధర్మాలు చెయ్యాలి. ఈ విషయం అనుభవ పూర్వకంగా ఆ అన్నదమ్ములు తెలుసుకున్నారు. ఆ తరవాత వాళ్ళు తంగ్రిని పెద్ద వైద్యులకు చూపించి, చాలాకాలం పాటు తండ్రిని దక్కించుకోవటమేకాక, తమకున్నదొంతో నలుగుర్నీ ఆదుకుంటూ, సుఖంగా కాలం గడిపారు.

ఫీ శ శ రైక

కనువిప్ప అనంగ దేశాన్ని ఏలే ఆనందవర్ధనుడికి వేట అంటే పిచ్చి. ఆయన తరచూ వేట నిమిత్తం అడవికెళ్ళి, అనేక జంతువులను వేటాడి తిరిగి రాజ్యానికి వస్తూండేవాడు. ర ర్డీ వా శ ఫ్‌ ఉనాననానికా. ఈ సయ క డడ (త ౫౫ వత మే ఒకసారి ఆయన వేటకు వెళ్ళి, చాలసేపు వేటాడి, గుర్రాన్ని వేగంగా నడుపుతూ, పట్బతప్పి, గుర్రం మీద నుండి పడిపోయాడు. తలకు బలమైన గాయం తగిలి స్పృహ తప్పిపోయాడు. అనుచరులకు ఏమీ తోచలేదు. అంతలో వారికి గుర్తుకు వచ్చింది. అక్కడికి దగ్గరలో ముని ఆశ్రమం ఒకటి వుందని. వాళ్ళు ఉరుకులు పరుగులమీద ముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన 26

ఒక్క వుదుటున రాజు పడివున్న చోటి వచ్చి, ఏదో ఆకు పనరు పూసి, తలకు కట్టకట్టాడు. కొద్దిసేపటికి రాజు స్పృహ వచ్చి లేచి కూర్చున్నాడు.

ముని రాజును తన ఆశ్రమానికి తీసుకుపోయి, తగినంత విశ్రాంతి యిచ్చి, గాయం మానడానికి తగిన మూలికలనిచ్చి రాజును సాగనంపారు.

అప్పుడు రాజు “స్వామీ! మీవల్ల నాకు ప్రాణగండం గడిచింది. మీ రుణం జీవితంలో తీర్చుకోలేనిది. నాకు పునర్జన్మ నిచ్చిన మహానుభావులు మీరు” అన్నాడు చేతులు జోడిస్తూ,

దానికి ముని అడ్డు తగులుతూ “లేదు నాయనా! వునర్ణన్మ యివ్వగలిగినంత మహానుభావుణ్ణి కాను నేను. ఏదో నాకు తెలిసిన చిట్కా వైద్యం చేశానంతే! నువ్వన్నంత శక్తి నాకే గనక వుంటే, నిన్నటి వరకు ఈ అడవిలో నాతో గడిపి, నేడు నీ వేటలో అనువులు బాసిన నా సహచర జంతువులను బతికించుకోగలిగేవాణ్ణి కదా!” అన్నాడు.

రాజుకు ముని మాటలు ఛెళ్ళున చెంప దెబ్బ కొట్టినట్టు అనిపించాయి. ముని మర్మగర్భంగా తన వేటని విమర్శించాడు. అందులో వుండే క్రార్యాన్ని, పాపాన్ని ఎత్తి చూపెట్టాడు. ప్రాణంమీద తీపి అన్ని ప్రాణులకూ ఒకటే!

తక్షణం రాజు ముని పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. ఆయన తిరిగి రాజ్యానికి వెళ్ళిన తర్వాత వేటను నిషేధించి, అ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేశాడు.

ఫీ ఈ ఈ 27

సవ క్రి మోసవ4వదాని కారణం? వేటగాడొకడు ఒకసారి అడవికి వేటకు వెళ్ళాడు. చాలా సేపు తిరుగాడిన మీదట అతడికొక జింక కనబడింది. బాణంతో కొట్టి అతడు దాన్ని చంపాడు. దాన్ని ఒక భుజాన వేసుకుని ఇంటికి పోదామనుకుంటుండగా దారిన పోతూవున్న దానయ్య ఒకడు చచ్చిపడివున్న జింకను, వేటగాణ్ణి చూసి, చూస్తే నువ్వు వేట జీవనాధారంగా గడి పేవాడివిలాగున్నావు. ఏదో నాకు తోచిన సహాయం నీకు చేయాలని వుంది. ఇక్కడకు బారెడు దూరంలో అడవిదున్నలు తమలో తాము కలహించుకుని, భీకరంగా పోరాడుకుని ప్రాణాలు విడిచాయి. ఎలాగో ఒకలాగా వాటిని ఇంటికి చేర్చుకున్నావంటే కొద్ది రోజులు నీ భుక్తికి లోటుండదు అన్నాడు. క్ష గ నాలు . ల శ | షష మ్‌ [|| శి ఇఇ య్‌ | /. రా 28

వేటగాడు ఆ మాటలు నమ్మి చచ్చిన జింకనక్కడే వదిలి చచ్చిన దున్నలను చూడబోయాడు. బారెడు దూరం వెళ్ళి దానయ్య చెప్పిన చోట చూస్తే దున్నల జాడే లేదు. ఒక్క ఉదుటున జింక చచ్చిపడివున్నచోటుకి వస్తే అక్కడ అదీ లేదు.

మోసం జరిగిందని రూఢి అయ్యాక వేటగాడు అక్కడే ఒక చెట్ట మొదట్లో కూలబడి తలపట్టకు కూర్చున్నాడు.

కట్టెల మోపుతో ఇంటికి పోతూ వున్న ముసలివాడొకడు వేటగాణ్సి పలకరించాడు. వేటగాడు తను మోసపోయిన సంగతి ముసలివాడితో చెప్పాడు. అందుకు కట్టెలు కొట్టేవాడు నవ్వి. “ఎక్కడ ఆళ వుంటుందో అక్కడ మోసం వుంటుంది. మనిషిలోని ఆశ అనే బలహీనత నాధారం చేసుకునే మోసగాళ్ళు వంచన చేస్తారు. మనిషి వున్నదానితో తృప్తిపడక దేనికొరకో అర్రులు చాస్తే బాధపడక తప్పదు. జింక పోయినా అనుభవం వచ్చింది కదా! ముందుముందు మోసపోకుండా అది ఉపయోగపడుతుంది. ఈ రోజు వేట వల్ల వచ్చిన ఆదాయం అదే అనుకో... పద పోదాం... పొద్దుగూకుతున్నది” అన్నాడు.

ఫీ శ శీ 29

తే (౫. వ్‌ (సట్‌ క తె

క స ల్‌ టు. న్‌. ( న ప ఆ చ న: సరిత ౧. / | వ మను పే సలటుతయయటత | |. య్‌ 1 7 వ లం లకి జ టా సజతపదపహాయాయానామనననిి స్‌ స క గ్గ న మ ద నం యల?! త్‌ | వం క టం నా ఇ మై న్న ప నాన ళ్‌ 1 క మ్‌ చ నుల కతలు అ న ల లానే నయ. న ౭] | . “సు న. వ. | ౯ ? | వ - నే గగ! న (క. ు పోటో! ] న్‌ డ్‌ . సలాం నున న ను స " క ల టం. ట్‌ _ రాయా ము లిం టల నాలా షన తూ త. . - మం ము ము టు వాం [స యు సైట్లే! సయ న భా రం వు త మాల. వ ర ప వ స . స _ న న ప య క క ఫె న ం అట నం. | న టాం టిం [లా అ ్‌ వ ః 2 లల వ మ్మ నన పంపన నచ నా నాళైల ప క టా న త

  • వ మం న టాంకు యల సన -. లు పదం నప వనం న జ న న్నయ్‌ న మ్‌! ఫలి సలం న మ న. న! నిల క కం కయప. టై .. ను మా. వ వ నన న న. (వ షో (మ పా ల్‌ న! శ ళ్‌ న మీ పిల్లలకూ, మీకూ విజానాన్ని, వీసోదాన్ని వికార్తాని, ఇద మాూపథరాలు మ న కకస. క స ర రాట్‌. కం క లు. బా లా కస న లు. షె . న్‌ నం ఎ టంళ 1. 2 వ న స తన నం ల 0 స్స స్ట న. క సా సా బీ న. టను వ నందిన | క [మ క వనం. హంతా తక. ల్‌ ఖీ జ్‌ ను గ్‌! లో కొట ఎ | శ జీ | . రేం సై శ గ ళ్‌ ్‌ /. త న్‌ క్ల క్ట య టై ౧/ 0 మళ్లల కథం)) |; క్‌ క త క రం! ౯ ( శ ఇభ 1% వక. వ. _ మో వ్‌ స ఇనా జ్ర సభా | అ హ్‌ లై క. గ! ల్‌ గ్‌ య యు , న . అవ, - ఈలేషంజి క -|| ఆ , = న . . | . స్తనాలు న. | గా ల అయా వా హా న గ. భా ( 7 ట్‌ లా స్వే నే లాం బుక్‌ హా న్‌లు. ప్రయా, వగక లతల.