Telugu Bhugolamantha manishi bomma - anilvaranasi/indianlanguages GitHub Wiki
భూగోళమంత మనిషిబొమ ం యిబఒ"”ర్చ్యు న | సహజకవి మల్లెమాల నా... మనసుపడి మక్కువతో సేకరించిన | | / (1 ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం రాజక ఎలో ౫: సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి నాం = స్ , ఆనందంతో బహూకరిస్తున్నాం. . | క్ - మల్లెమాల కుటుంబం | , కి యళ గ న. ణి న్ ర హు? ః్ న. డా! సి, నారాయణరెడ్డి
భూగోళమంత మనిషిబొమ్మ కథితాసంపుటి డా! సి. నారాయణరెడ్డి మనస్వినీ ప్రచురణలు హైదరాబాద్.
1480121020 612 42018911 900011 (6౦16౦601 01 ంఅు9) ప? ౧ 6. 201202 ంరేరయ గళ ట్ గ్ 96 2యళంగ ళా 1996... చపపన సగ06 5, 50/- యు లో వా 607౪ 698౧ గ్ త వ య! గీ 01 6౦౦163: ల 1921206402 ౨0 ంటం్ర కం456 క్షీ-1-435, కజ01 5666 12020 క0జాజు, చరలజ024 - 500 001 జనర 16 211 02జ00160. జర ేట్‌డర257101 22యరుముం214 ౨101%0.48, కయిం28ై2% 0010% 40166 119, గేలు40264 - 500 034. ౬౦౫00౦5664 46: పం౧6006 6222110 కయేల2026 - 44. 0: 660000 క00066 97: తీ[12002 ర10615 రలడ026. 0: 391364
కృతజ్ఞతలు
కొన్నినంవత్సరాలుగా నారాయణరెడ్డిగారి 'ప్రతిజన్మదినం సందర్భంగా వారిరచనలను పుస్తకరూపంలో తీసుకురావడం పరిపాటిగావుంది. ఇటీవల 1994లో దృక్పథం (కవితాసంపుటి), 95లో 'సినారె గజళ్లు వెలువరించడం సహృదయ కవితాప్రియులకు తెలిసిన విషయమే.
ఆవరుసలోనే ఈసంవత్సరంకూడా వారి 65వ జన్మదిన సందర్భంగా 'భూగోళమంత మనిషిబొమ్మ' అనే ఈ కవితాసంపుటిని ప్రచురిస్తున్నాము.
ఈ అవకాశం మాకు కలిగించిన నారాయణరెడ్డిగారికీ,
ఎంతో సౌజన్యంతో ఈ సంపుటిప్రచురణకు సముచిత దోహదం చేసిన ఎన్.సి.ఎస్ (గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్. నాగేశ్వరరావుగారికీ,
ప్రింటింగ్ బాధ్యతను సమర్థంగా నిర్వహించిన ఫాంట్‌లైన్ (గ్రాఫిక్స్‌వారికీ, ముఖ్యంగా చిరంజీవి హరిశంకర్‌కూ, నిర్మలకూ
మా కృతజ్ఞతలు.
- మనస్వినీ ప్రచురణలు
విషయసూచిక అమ్మబొమ్మ 7 పాలచుక్కలా మెరుస్తూ 9 అప్పటికి అతడు మంచివాడే 12 అద్దంలా జీవించు 15 హింసను పీలుస్తూ 18 బరువు 20 జీవనదిలా 22 దీపవిస్ఫోటనం 24 జీవితం మరోకోణంనుంచి 26 వ్యక్తిత్వం 28 నిట్టూర్పులు భగ్గుమంటే 30 గుప్తలిపి 32 మ్యూజియంప్రాణి 34 అలల అరికాళ్లతో 36 ఊబి 38 తెరిచిన పుస్తకం శ] మనిషి మిణుగురై 43
సూర్యుడు వెలిసిపోడు 45 ఆ పక్షిలాగే తగ శ్వాసనిధులు 48 ఆకర్షణ 50 శాసనపర్వం 52 ప్రదర్శనావతారాలు 54 వాక్యాలు, వర్షిస్తే కరి జ్వాలలా శిరసెత్తి ర్‌రి అన్నీ దృశ్యాలే అయినా 60 సింహాస్త్రాలు 62 జరీవలయాల్లోంచి 64 సూర్యపదవి 67 మౌనగ్రహం 69 మా ఆయన 72 ఊర్థ్యముఖంగా 75 జెను పసివాజ్ణే అయ్యాను 78 సౌమనస్యాన్ని పీల్చుకుందాం 81 నిర్దేతా జాగ్రత్త 83 దిక్ భ్రాంతి 85 భూగోళమంత మనిషిబొమ్మ 88
డా! సి. నారాయణరెడ్డి 7 అమ్మబొమ్మ అమ్మ పోతూపోతూ తన బొమ్మ ఇచ్చిపోలేదు అసలు బొమ్మంటూ తీస్తేగదా ఇవ్వడానికి. అమ్మా బొమ్మ దిగవే అంటే ఆణిముత్యంలా నవ్వేసేది. నువ్వు నా బొమ్మవు కాదా నాన్నా అంటూ నన్ను తన అక్కున చేర్చుకున్నప్పుడు ఆకాశమే నాలో ఇమిడిపోయినట్టనిపించేది. అమ్మ రూపాన్ని భద్రపరుచుకునే అపరంజి గ్రేములమని ఇటీవలిదాకా నాకళ్లు తెగనీల్లేవి. ఇప్పుడు కళ్లముందుఎలాగూ అమ్మలేదు. కళ్లు మూసుకుని చూస్తే అమ్మబొమ్మ అలుక్కుపోతూంది చినుకులు పడ్డ రంగులచిత్రంలా. మిగిలిన ఆ కాస్తారూపం తుడుచుకుపోతే? దిగులుతో గుండె వణికిపోయింది వరదను పసికట్టిన లేగదూడలా. ఉదయం నిద్రలేచినప్పుడు
8 భూగోళమంత మనిషిబొమ్మ నా కళ్లలో కురులారబొసుకునే అమ్మరూపం మసకబారిపోతుందా? పొడిచేపాద్దులో ఉందేమో నన్ను నిద్రలేపిన అమ్మ ఆకృతి. ' ఆరుబయటవెన్నెల్లో నన్ను జోకొడుతున్నప్పుడు అమ్మఫోటో తీసివుంటాడు చందమామ. అతనిలో వుంది అమ్మబొమ్మేనేమో? నక్షత్రాలు నా భుజం తట్టి అంటూవుంటాయి తమ కళ్లన్నీ. అమ్మ ఆనవాళ్లేనని. అందమైన భ్రాంతిల్లోంచి తేరుకుని ఓ నిడుపాటి ఊర్పు చేదుకుని అమ్మపటం గీయాలనుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు చిత్రకారుణ్ణి కానని పదచిత్రణ మాత్ర జీవినని. ఎంత మెదిపినా ఈ కలం కుంచె అవుతుందా పదాలు రేఖలవుతాయా భావాలు రంగులవుతాయా కవినన్న గర్వం మంచుకొండ చరియలా విరిగి పడిపోయింది. పోగులుగా. విడిపోతున్న సృతిముద్రను మనసు చట్రంలో పొదుగుకుని అమ్మరూపం నిలుపుకుంటాను. జన్మమూలం పదిలపరచుకుంటాను.
డా॥ సి. నారాయణరెడ్డి 9 పాలచుక్కలా మెరుస్తూ శిఖరంమీద ఒక్కొక్క అడుగు మోపినప్పుడల్లా ఆకాశం నా తలను తడుముతుంటుంది. గాలిదయ్యాలకు జడుసుకునే వానమబ్బుల లేళ్లు నాకళ్ల ఆశ్రమాల్లో సేదదీర్చుకుంటూ వుంటాయి. ఎన్ని చిరునామాలు నాటానో నేను!
అవి కొమ్మల్త్లా వంగి నాతో కరచాలనం చేస్తుంటే స్మృతుల మట్టిపారల్లోంచి ప్రతిభాబీజాలు కృతజ్ఞతలు చెబుతున్నట్టుంటుంది.
నేను సరిదిద్దిన స్వరాలేనా ఇవి?
నన్ను అరిచేతిలోని పాదరసం గుళికలా లాలిస్తూ పారవశ్యం కొసఅంచుమీద కూచోబెడుతున్నాయి. విశాలగగనం ముందు నా శిరసు. శిశువైతే విస్తరించిన ఈ తరువుల తనువులన్నీ
నా వేళ్ల పాదుల్లో మొలిచిన పసికందులే. నాకంటే కొత్తగా పలికే గొంతు విన్నప్పుడు
నన్ను నేను పొగొట్టుకుంటాను.
10 భూగోళమంత మనిషిబొమ శై నిజంగా ఆ విలక్షణక్షణం
నా అసలు పుట్టుక కంటే గొప్పదేమో.
అంతటి నా విగ్రహం అలాఅలా కరిగిపోయి
ఓ పాలచుక్కలా మిలమిలా మెరుస్తుంది. నేను నడిచేముందే కాలంనేలమీద
చెదిరిపోని పాదముద్రల శిల్పాలున్నాయి.
ఆ ముద్రలను ముద్దుపెట్టుకోనిదే
నాపాదాలు ముందుకెలా సాగుతాయి? వసుధైకభావన రెక్కలెత్తే మెదళ్లలో
క్రిములు కదిలే అరలెందుకుంటాయో తెలియదు. చూడడానికి అది సన్నని ఈటె.
పర్వతమంత కాయాన్ని చీల్చేస్తుంది. పుట్టినప్పుడు ప్రతినదీ ఓ చిన్నారిపాయ. ప్రవాహ బాహువులు సాచి పుడమితల్లిని
తన ఒడిలోకి తీసుకుంటుంది. రాతిపలకలమీద నీటిఓనమాలు దిద్దుకున్న ఏటిబుడతలమే అందరం.
తొలినాళ్ల తడిమనసు ఇంకిపోతే
ఎన్నికొమ్ములు తిరిగి ఏం ప్రయోజనం? తలంబ్రాలు పోసుకుంటున్న దృశ్యం చూస్తుంటే బాల్యందోసిళ్లతో పిచ్చిగా చల్లుకున్న
ఇసుక గుర్తొస్తుంది నాకు.
డా॥ సి. నారాయణరెడ్డి 1] అర్థంచేసుకోగలిగితే అన్నీ క్రీడలే.
తొట్లె ఊగింపులనుంచి పాడె ఊరేగింపులవరకు.
మధ్యలో ఉంటాయి ఊరింపుల పర్వాలు.
వెలుగులు చిమ్మిన కృషి మసిగా మారినప్పుడు
పసితనంగుడ్డతో శుభ్రంగా తుడిచేస్తే
మళ్లీ ఉజ్వలిస్తుంది మౌలికవ్యక్తిత్వం.
పాతేసిన నమ్మకాల స్తంభాల్గాకాక
మార్చును పీల్చుకునే హరితమూర్తుల్లా జీవించినప్పుడే
మనం మనుషులమనిపించుకుంటాం.
12 భూగోళమంత మనిషిబొమ్మ అప్పటికి అతడు మంచివాడే
అప్పటికి అతడు మంచివాడే.
పెళ్లికాకముండు నేను నడిచివచ్చే రోడ్డును ఎదురుచూపులతో కొలిచినవాడే.
అనుకోకుండా తారసపడితే ఉలికిపడి చిరునవ్వుసాంబ్రాణితో నాకు ధూపంవేసినవాడే.
అతని మనసురంగు అప్పటికి తెలియదు గానీ మంచివాడుగానే కనిపించేవాడు.
నేనంటే పడిచచ్చే అతల్నీ చేసుకుని
అతనిముందు చచ్చిపడుండాలని అనుకోలేదు నేను. జీవితంలోని సుఖాల తీపినీ దుఃఖాల చేదునీ
కలిసి పంచుకునే అసలైన భాగస్వామి
అతనిలో ఉన్నాడనుకున్నాను.
ఏకాంతంగా కలుసుకుని మాట్టాడుకున్నప్పుడు తెలిసింది ఇద్దరిచూపులు సాగిపోయేదారి ఒకటేనని.
పెళ్లయిన కొత్తలో కౌగిళ్ల సీరియళ్లు ఆగేవి కావు
నెలలోని ఆ మూన్నాళ్లుకూడా.
డా! సి. నారాయణరెడ్డి 13 ప్రతిసాయంత్రం పడకగదిని
మళల్లెమొగ్గలతో వెలిగించేవాడు.
ఖరీదైన తన ఆప్యాయతను
కంచిపట్టుచీరెల్లో మడిచి తెచ్చేవాడు.
అప్పటికీ అతడు మంచివాడే.
ఆ మంచితనం కల్పించిన ఆవరణకు లోనై అలిసిపోయిన నా ఒళ్లు కాదంటున్నా
పడగెత్తిన అతని పచ్చికోరికకాటును ఆహ్వానించేదాన్ని. తల తిరిగిపోతున్నా ఆ కాసేపు బిగపట్టుకుని అతని నిషాకంపు ఊర్పులను భరించేదాన్ని.
ఆ సాయంత్రాలు క్రమంగా పాతబడిపోయాయి. ఆ మల్లెమొగ్గలు పడకెక్కడం మానేశాయి... ఎంతైనా మగాడు కదా!
అతని అనర్గళ మృగప్రవృత్తికి ఆనలేదేమో నేను. అర్ధరాత్రి తరువాతే ఆ బూట్ల అడుగులు నిద్రపోతున్న గదిని అదిలించేవి.
పక్కదొర్లించి పడుకునేదాన్ని
పోనీపాపం ఏ బురదలోనో పార్గొచ్చివుంటాడని. కాలం ఎదురుదెబ్బతీసింది.
తలక౩ిక్కిన నల్లడబ్బుమత్తు బట్టబయలై నలుగురిలో ఎత్తిన తలను దించేసింది. ఊడిపోయిన ఉన్నతోద్యోగం
క్షత భూగోళమంత మనిషిబొమ్మ దెబ్బతిన్న అతని అహంచుట్టూ పాగ రాజేసింది. మసకపట్టిన ఆ మనసుముందు అంతా విపరీతమే. ఆఫీసునుంచి నేను ఆలస్యంగా వస్తే ఆ కొడిగట్టిన కళ్లలో అసహనం నుసి రాలేది. బురదలో పొర్లే అలవాటున్న ఆ మగదున్న నా శీలంమీద బురద చిమ్మేది. చేతకాని బూతులు నాపైన చేయిచేసుకునేవి. పొరలెత్తిన పురుషాహంకారాన్ని చీల్చేసే అపాటి. సత్తా నాకూ లేకపోలేదు. పశువును వంచడానికి పశువైపోవాలా? ఒక్క చురుకుచూపు కొరడా చాలదూ? “ఒరేయ్” అనే ఒక్క ఉరుము చాలదూ? మతిలేని పసరంమీద ఏ ప్రయోగాలూ ఎందుకులే అనుకున్నాను. ఆ యింటిని శాశ్వతంగా వదిలేస్తూ కత్తిఅంచులాంటి కొత్తనిర్ణయం తీసుకున్నాను. అద్దంలా స్వచ్చంగా వున్న సహచరుడితోనే అత్మీయంగా కలిసి నడవాలని; కాకుంటే నిప్పుకడ్డీలా ఏ పురుగులంటకుండా బతకాలని.
డా సి. నారాయణరెడ్డి 15 అద్దంలా జీవించు
నీ పుట్టుక నాకు తెలుసు.
నేను లోకాన్ని వడబోస్తున్నప్పుడుకదా నువ్వు కన్నువిప్పింది. అప్పుడప్పుడే విచ్చుకునే నీ రెండు పెదవులపైన అక్షరాలెరుగని పొలలిపిని చూశాను.
నీ ఆవులింతల జిలుగు అద్దాల్లో
ఉభయసంధ్యల ప్రతిబింబాలు గమనించాను. తపోవనాల్లోని ధ్యానస్వచ్చ్భత
నీ పసిపాదాలరేకుల్లో పరిమళించేది.
ముఖంమీద ఈగ వాలితే నీకు
చెట్టుమీద చిలక నిలిచిన అనుభూతి కలిగేది.
ఎప్పుడైనా నీగొంతు గలగలమంటే
రప్పున ఎగిరిపోయే పావురాళ్లరెక్కలు నవ్వినట్టుండేది.
నీ కలల తోరణాలకు వేలాడేవి
మచ్చలు కడిగిన పున్నమి జాబిలిగుత్తులే.
నాపాట పురివిప్పి ఆడినప్పుడల్డా
నీ ఒంటినిండా మయూరస్పర్శలే.
16 భూగోళమంత మనిషిబొమ్మ నొక్కితే రసంచిమ్మే మొక్కలాగా నువ్వు. పండిన నా అనుభవంలో ఆ లాలిత్యాన్ని నింపుకునే నేను. ఎదిగేమొక్క ముదరకుండా ఉండదుకదా. నువ్వూ అంతే. అభివృద్ధికి కొలమానం ఇంద్రియగోపనం కాగూడదు. శరీరం బెరడుకడితే గుండె బండబారిపోవాలా? తీయని పదాలొచ్చి మునివేళ్లతో తడితే నీ చెవులు వాటిని చించిపడేస్తున్నాయి. తొలకరిచినుకులతో మేలుకున్న మట్టిపరిమళాలను నీ ముకుపుటాలు దులపరించుకుంటున్నాయి. ఎందుకలా బిగుసుకుపోతావు. దహించే అగ్నికి కూడా గ్రహించే గుణముంటుందే. సందెమబ్బు గీసిన బొమ్మ కనుబొమ్మలను చూస్తే ఇప్పటికీ నా పిచ్చికళ్లు తమ అస్తిత్వాన్ని మరిచిపోతాయి. రాలిపడ్డ ఆ రంగుల అన్వేషణలో రాత్రంతా వియోగుల్లా పరిభ్రమిస్తుంటాయి. గులకరాయి విసిరితేచాలు జలహృదయం స్పందిస్తుంది. పలికే తరగలను వింటే తెలుస్తుంది ఆ పారవశ్య పరిభాష. ఎలా వున్నావని ఎలుగెత్తి పిలిస్తే నోరులేని గుహకూడా బదులిస్తుంది.
డా॥ సి. నారాయణరెడ్డి క్ష వాకిళ్లు తెరుచుకున్నప్పుడే హృదయానికి పలుకొస్తుంది.
విశ్వాన్ని ఒడిలో చేర్చుకున్నప్పుడే
మనిషిశిరస్సు మబ్బుల్ని స్పృశిస్తుంది.
నీ జన్మసాక్షినైన నేను కోరుకునేది
అంబరంలా నువ్వు అంచెలంచెలుగా పెరిగిపోవాలని.
సాగరంలా బాహువులు సాచి
ఆత్మీయతాతీరం చేరుకోవాలని.
18 భూగోళమంత మనిషిబొమ్మ
హింసను పీలుస్తూ
పక్షికీ హృదయముంటుంది.
అది దడదడా కొట్టుకుంటుంది
వేటగాని బూటువాసన కొట్టినప్పుడు.
ఆకుల కనురెప్పలతో
పక్షిగుడ్డును కప్పేయాలని
కొమ్మలు ఆరాటపడుతుంటాయి.
ఏ ట్రిగ్గర్ మతి తప్పుతుందో
ఎన్ని గుండెకాయలు నెత్తురుగుజ్ఞులవుతాయో. పక్షులెప్పుడూ నేలమీద గూళ్లు కట్టుకోవు ధరాక్రమణదారులు ఏడ్చిచస్తారని.
గూటిగడప దాటితే అవి క్యూలు తీర్చేవి కొమ్మలకోవెలల్లోనే. ప్రభాతప్రార్థ్ధనలు ముగించుకుని కిరణాల పొరలమీద నడక సాగిస్తాయి చంకలకు స్వార్థం వేలాడని తీర్థయాత్రికుల్లా. అనుకోని బ్లోబొట్ల వింతకంపును
డా॥ సి. నారాయణరెడ్డి [9 రెక్కలముక్కులు పసికడితే
ఆకాశంజఒడిని ఆశ్రయిస్తాయి. స్వచృ్చవాయుమండలంలోంచి
సరికొత్త శ్వాసలను చేదుకుంటాయి.
ఏనాడూ ఆకాశాన్ని ఆక్రమించుకోవు పక్షులు. సాయంత్రం గొంతులోంచి అమ్మపిలుపు విని గూళ్లకు చేరుకుంటాయి బుద్ధిగల విద్యార్థుల్లా. హింసను తిత్తులకొద్ది పీల్చిపారేసే నాటువేటగాళ్లకు వాటి మంచితనమంటేనే పడదు.
ఇంతో అంతో వాడిముక్కులున్నా అవి ఎప్పుడూ మనుషుల్ని పొడవవు. పాలనురగల్గాంటి పసికందులను ఉయ్యాలల్లోంచి ఉడాయించుకుపోవు, అందుకే పక్షులంటే మంట వేటగాళ్లకు.
పక్షి అలికిడి వినపడితే చాలు
వేటగాళ్ల వేళ్లు తూటాలవుతాయి.
గూళ్ల పాత్తికడుపుల్నించి
ప్రాణాలు బొట్టుబొట్టుగా రాలుతూవుంటే పండగ చేసుకున్నట్టుంటుంది
ఆ కసికడుపులకు.
20 భూగోళమంత మనిషిబామ శ్ర బరువు ఈ బరువు ఇలాగే ఉండనీ భూమ్మీది పర్వతంలా మేధావి వ్యక్తిత్వంలా. కొన్నిటిని దించుకోలేం. ఉన్మాదాలు ఎత్తిపోసుకునే ఘీంకారాల మధ్య మనసుపొరలో నాటుకున్న మౌనాన్ని పెరికేయలేం. క్షణాలు అక్కడికక్కడే పాతుకుపోతూవుంటే మనపైని నీడకూడా బరువెక్కుతుంది. చెట్టు పచ్చదనం చెరిగిపోతుందా కొమ్మల బాహువులతో విదిలిస్తే. చుక్కలు రాలిపడ్డప్పుడల్లా ఆకాశం తన బరువు వదిలించుకున్నట్టా? ఎండలో గుండులా దొర్లిపడే శరీరానికి చెమటబిందువులు తూకంరాళ్లా? మూగఅలలు కాల్లీడ్చుకుంటూ పోతుంటాయి ఏ ఉక్కుగొలుసులో వెనక్కి లాగేస్తున్నట్టు. గాలి చెమరుస్తూ ఒగరుస్తూ వస్తుంది
డా సి. నారాయణరెడ్డి 21 కూలీ బస్తాలు మోస్తున్నట్టు.
తీయని భ్రాంతి తలనిమురుతూవుంటే
ఊహలు విహంగాలవుతాయి.
పోగమంచు ముసుగులు విచ్చుకుపోయి
కంట్లో తొలికిరణం గుర్చుకున్నప్పుడు తెలుస్తుంది కనపడే కాంతి బరువెంతో.
కన్నీట తడిసిన పాటొచ్చి ఎదుట కూర్చుంటే గదిని విడిచిపోదు కాలం.
పాట అలాగీ స్వరాలముంగురులు సర్దుకుంటూవుంటే వానమబ్బు ఊపిరి నింపుకున్నట్టుంటుంది.
కొన్ని వర్ణచిత్రాల్లో చిక్కుకున్న రంగులు
గడ్డకట్టిన సంధ్యాజలాల్లా ఉంటాయి.
నిశ్వాసాల వేళ్లతో తడిమితేచాలు అవి బొట్టుబొట్టుగా కరిగిపోతాయి.
నురగలతోపాటు తేలిపోతూవుంటే
నీటివాటం తెలుస్తుందా?
అట్టడుగును ముట్టేలోతే అసలైన బరువు నీలిసముద్రంలోనైనా నిత్యజీవితంలోనైనా. బరువుగా పండిన అనుభవాలను వేలికొనమీద తిప్పే పరిణతమతి అల్బపీడనలకు చలించదు. అవకాశవాదప్రలోభాలకు శిరసువంచదు.
22 భూగోళమంత మనిషిబొమ్మ జీవనదిలా
బతకడానికి రోజూ చావాల్సిన పనిలేదు.
చిరిగిన చొక్కాకాదు ఉపిరి
కుట్టువేసుకుంటూ గడపడానికి.
కుర్చీకాలు విరిగితే అతికించొచ్చు
కూర్చున్నగుండె అనుక్షణం పొడిపొడిగా రాలుతుంటే ఎలా? పైన తిరుగుతున్న ఫ్యాన్ విరిగిపడుతుందని అరగంటకోసారి లైటేసి చూసుకుంటే
అది జడుపుకత్తితో చేసుకునే నిరంతరనిద్రాహత్య. జాగ్రత్తగా వెళ్లుబాబూ అంటూ అమ్మ సాగనంపే బడిపిల్లలం కాదుగదా మనం.
ఏదిక్కునుంచి కాల్పులొచ్చినా ఎదురొడ్డే సాహసకవచధారులం కావాలి.
ఏలినవారు ఎక్కుపెట్టిన కనుబొమ్మలకు బితుక్కుమని స్వాభిమానశిరస్తాణం తీసి
వాళ్ల పాదపీఠాల ముందుంచాలా?
చూస్తూనే వున్నాంకదా
డా॥ సి. నారాయణరెడ్డి వ రెండుపక్కలా నిక్కపొడిచి నిలిచిన తుపాకుల మధ్య తమ ప్రాణకోశాలను తడిమి చూసుకునే భయభూతగ్రస్తపదవీవాహకులను.
గోవుకూడా కొమ్ములెత్తుకునే నడుస్తుంది
కంఠంలో కసాయికత్తి దిగేవరకు.
ఇక్కడే ఎక్కడో చావుముల్లు పొంచుందని
అరికాళ్లు అరచేతిలో పెట్టుకోవాలా?
నిజంధ్వజం పట్టుకుని సాగే జీవితం
జననమరణాల గట్టమధ్య
కదనుతొక్కాలి నిర్భయంగా.
జలధార అలిసిపోయినా
గట్టుమోద విశ్రాంతితీసుకోదు జీవనద్ది. మురికిగుంటలుంటాయని తెలిసినా
విసురుగా దాటుకునిపోతుంది పసవున్నగాలి, అందరం కాలంవిత్తులోంచ్చి పొడుచుకొచ్చిన మొక్కలమే. కొరికేసే కోరలున్నాయని జడుసుకుని
తిరిగి మట్టిపారల్లో తలదాచుకుంటామా?
పుట్టిన తరువాత పెరగడంపైనే మనహక్షు, పతికూలపరిస్థితుల అసురశక్తులను తరిమికొట్టి స్వచ్చందంగా స్వచ్చంగా ఎదగగల్రిగ్లిత్రే
మరణం మనచేతిల్రోన్సి ఆటబంతి.
డై భూగోళమంత మనిషిబొమ్మ దీపవిస్ఫోటనం
అవతారాలెత్తడం అదివిష్ణువుకే కాదు
చీకటికీ బాగా తెలుసు.
పగలంతా ఏ బొరియల్లోనో గుహల్లోనో దాక్కోదది. రకరకాల చమ్మిదుస్తుల్తో చౌరాస్తాల్లో ఊరేగుతుంటుంది. జీవితపత్రాలమోద సంతకాలుపెట్టే వేళ్లసందుల్లోంచి లంచంచీకటి. అక్షరాలై రాలుతుంటుంది.
సీట్లస్వీట్ల పంపిణీలో తనవాటా పెంచుకోవాలని కులంచీకటి నిరాహారాలడేరాలు వేసుకుంటుంది. పులిమిన విశ్వాసాలరంగు వెలిసిపోతుందని మసీదుముసుగులోనో గుడిగొఢుగుకిందనో
మతంచీకటి అసురతాండవం చేస్తుంటుంది.
ఉతికిన తెల్లచొక్కాలా వున్న శీలాన్ని చూసి
ఓర్వలేని చీకటి బురదై చిమ్ముతుంది.
ఎక్కడ ఏ చిన్నదీపం వెలిగించినా
చీకటివీపు చురుక్కుమనే. రోజులు పోయాయి.
అది ఈమధ్య అస్తమానం ఆపాదమస్తకం
డా సి, నారాయణరెడ్డి 265 లోహకవచంతోనే తిరుగుతుంటుంది.
ఏడాదికోసారి మట్టిదివ్వెలను ముట్టించుకునే ముంగిళ్లమోద ఓ కుళ్లునవ్వు విసిరిపోతుంటుంది. కిక్కిరిసిన జనమున్న మహాసభంటే ఒళ్లుమండి చెప్పులరూపంలో స్టేజపైకి ఎగిరి దూకుతుంది.
పబ్లిగ్గా చీకటి ప్రదర్శించే సీరియల్ చిత్రాలే స్వాతంత్ర్యయోధుల పేరిట కేటుసర్టిఫికెట్లు జలదానంచేసే ప్రాజెక్టులకు పలికే గోల్‌మాల్ టెండర్లు పందిని నందిగా భజించే పత్రికాప్రకటనలు
పదవుల బేరాలు కుదరని రాజీనామాల మేజువాణీలు. వెలుగుతోపాటు పుట్టిన చీకటి
జీవితాన్ని అంటుకు తిరిగే మృత్యువులాంటిది.
ఉన్న చిక్కల్లా వెలుగుమాస్క్ వేసుకుని
తారుచీకటి. వెండితెరవేల్పులా చెలామణికావడం.
నేటి చీకటిభూతం దివ్వెలు వెలిగిస్తే వారిపోయేది కాదు ఒక్కొక్క దీపజ్యోతిని ఐస్‌ఫ్రూట్‌లా చప్పరిస్తూ' రక్కసిరుచులు జుర్రుకుంటుంది.
కాంతి యివ్వడానికి కరెంటు బల్బులున్నాయి. ఇప్పుడు ముట్టిస్తున్న ఓ మట్టిదీపాల్లారా! ఒక్కుమ్మడిగా పేలిపోండి తూటాల్లా.
అప్పుడైనా తాత్కాలికవిముక్తి లభిస్తుంది
అవతారాలు మరిగిన ఈ దగాకోరు చీకటినుంచి.
26 భూగోళమంత మనిషిబొమ్మ జీవితం మరోకోణంనుంచి బకతుళంటేనే నిరంతరప్రయోగం.
కళ్లుమూసుకుని వల్లించే గుణింతం కాదది. రహదారి అనుకుని నడిస్తే ఎడారి యెదురువుతుంది. ఎంత లోతుల్లోకెళల్లినా ఇసుకఒంటిమాద చమురుచుక్క చెమరించదు.
చెట్టులా నిల్చున్న నిళ్ళ్శబ్దానికి
కలలగుత్తులు వేలాడుతుంటాయి.
మనవేళ్లలో అవి గిలిగింతలు గిలుకుతుంటాయి. అందుకోబోతే భయంకరంగా ఉఓేలిపోతాయి.
ఒళ్లో పావురాళ్లున్నాయని ముచ్చటపడతాం.
నెత్తిమోద తిరిగే రాబందులు
మనం మాగన్నుతో వున్నప్పుడు తన్నుకుపోతాయి. ఒక్కొక్కప్పుడు అద్దంలో మనముఖాలు కనిపించవు. బీరువాలో పెట్టి మరిచిపోతాం.
అయినా మందలో కొట్టుకుపోయే తలకాయల్ని ఎవరు గమనిస్తారని?
డా॥ సి. నారాయణరెడ్డి 27 మనకు రోడ్డుమోద నడ్డివిరుచుకు నడవాలనే వుంటుంది. మన కాళ్లదృష్టి మాత్రం
సందులమోద షార్టుకట్స్ మోద.
మనం అనుకున్నవన్నీ సాఫీగా సాగిపోవు జుంజురుజుత్తుకు పాపట కుదరనట్టు.
దార్లో కొన్ని నైలాన్‌నీడలు తగులుతుంటాయి తిరిగిచూస్తే అవి దొర్లిపోతున్న గజకళేబరాలు. అనుస్వారంలేని సుదీర్ధవాక్యం మన ప్రయాణం. విశ్రాంతి కామాలాంటిది.
కొందరు కామాబెంచిమోద కూర్చుని
నిద్రరీళ్లు చూస్తూ రాత్రుళ్లను తాగేస్తుంటారు. కుశలప్రశ్నలకిచ్చే గులాబీవన్నె జవాబులు పెదవుల కృత్రిమోత్పత్తులు.
జారిపడని కాలుంటుందా?
గాయపడని గుండెవుందని ఎవరైనా అంటే
అది రబ్బరుముద్ద మాత్రమే.
సంకెళ్లు తొడుక్కున్న గొంతుకల్లోంచి శబ్బాలెగిసిరావు సకిలింతలు తప్ప. ప్రయోగమంటేనే జడుసుకుంటారు కొందరు చల్లగాలిలోకెళ్తే జలుబుచేస్తుందన్నట్టు.
పాొగలా ఏళ్లతరబడి మూల్గడమెందుకు
నిప్పులా కొన్నిక్షణాలైనా గుప్పుమనాలిగానీ,
28 భూగోళమంత మనిషిబొమ్మ
వ్యక్తిత్వం
ఎన్నోక్షణాలు చూశాను.
నా వీపుమోద బాకుమొన మోపి
ముఖంమోద కుశలప్రశ్నలు చిలకరించే క్షణాలు. చిన్నప్పటి సంఘటనల చిత్రాలను స్క్రతులరీళ్లమోద తిప్పిచూపి
వర్తమానవ్యక్తిత్వ ధవళగోపురం మోద ఎత్తిపాడుపుల రెట్టలు వేసే క్షణాలు.
కాలనది మోద పేలాల్తా తేలిపోయే బోలునురగల్లాంటి క్షణాలు.
గాలివాసన సోకితేనే అవి గజగజ వణికిపోతాయి. చలనశీలచైతన్యంతోనే నా భేట్. చరిత్రపుటలను తరగలుగా తొడుక్కుని నిత్యనిర్ధరిలా సాగే అఖండకాలంతోనే కదా పోటీ. మాజీకీర్తిని నుదుట తగిలించుకుని తాజావార్తలపై ఊరేగే శుష్కమూర్తులను చూస్తే
డా॥ సి. నారాయణరెడ్డి 29 కలిగేది స్పర్ధకాదు ఓరకం సరదా.
అరుదైన కొన్ని క్షణాలుంటాయి
శిఖరం శిఖరం కలుసుకుని చేతులు కలుపుకున్నట్టు. రెండు మహావృక్షాలు పక్కపక్కనే నిల్చుని
ఎదిగిన కొమ్మలతో పలకరించుకున్నట్టు.
మొత్తం నీలాకాళాన్ని పిండితే
రాలే పాలవెన్నెల బొట్లు
ఒక్క చిరునవ్వుతో సరితూగుతాయా? ముఖాలున్నవి మొసళ్లలా ముడుచుకోటానికి కాదు పసినవ్వుల పావురాళ్లను ఎగరేయడానికి. కరిగిపోయే ఆ క్షణాల గుండెలమోద
చెవిపెట్టి వింటే వినిపిస్తాయి
అవ్యాజసౌజన్యం మిగిల్చిన ఆర్రస్పందనలు. సూర్యుల్ని ప్రసవించే మాతృమూర్తి తూర్ప్చయితే అజ్ఞాతసూర్యుడికి ఆశ్రయమిచ్చే
అడివితల్లి పడమర.
ఏదిక్కును కాదంటావు
ఏ ఉనికికి మూలభూమిక లేదంటావు. మట్టికుదుట శిర సెత్తిన చెట్టయినా
మబ్బుజుత్తును నిమిరే గిరిశిఖరమయినా
సాంత సంతకమున్న వ్యక్తిత్వముంటే
ఏ కసివేళ్లూ రక్కసినోళ్లూ దానిని చెరిపేయలేవు,
30 భూగోళమంత మనిషిబొమ్మ నిట్టూర్పులు భగ్గుమంటే నిట్టూర్చ్పులకూ కాళ్లు మొలుస్తాయి. అవి ఊబిఅంచుపైన బలంగా అడుగులు నాటుకుంటూ నడుస్తాయి. కొండైనాసరే అడ్డుతగిలితే ఆ కొండముక్కులో దూరి బయటపడతాయి. నోట్లోనుంచే కాదు నిట్టూర్పులు నొసటిలోంచీ ప్రసవిస్తాయి. క్షుభితసంకల్పాలతో కాగే నొసళ్లు ఎగజిమ్మేవి నిట్టూర్చుల్నే కదా. ఓటమినొప్పుకోని చిట్లిన చీలమండలు నిట్టూర్పులు. అవి ఇసుకను మింగుతూనే ఈడ్చుకుపోతుంటాయి. నిజమైన నిట్టూర్పులు జగమొండివి. తమను తెగ్గోయాలని దూసుకొచ్చే కత్తులగొంతుకలను పిసికి పారేసి నిర్భయంగా తరలిపోతాయి.
ఊపిరికి ముడులుపడితే ప్రాణం
డా॥ సి. నారాయణరెడ్డి 311 ఒడ్డునపడ్డ చేపపిల్లలా కొట్టుకుంటుంది.
ఆ ముడులను ఒలిచేసుకుని నిట్టూర్పులు బుసకొట్టే పడగల్లా ఊగిపోతుంటాయి.
చేతికందే కొత్తదుస్తులు కొట్టుకుపోయినప్పుడు కుట్లేసుకుని తొడుక్కునే చిరిగిన బట్టలు నిట్టూర్పులు. గోడకుదిగే మేకులు గుండెలోకి దిగితే
బుగబుగ పాడుచుకొచ్చేవి నెత్తురుబుడగలే.
ఎంత నిస్సహాయునికైనా
కన్నీళ్లుంటాయి గానీ నెత్తురునీళ్లుండవు. రోడ్డుమోద చిందినా రక్తం ఎరుపు విరిగిపోదు.
పీక నులుముతున్నా ఊర్చు నిడివి తరగ్గూడదు. క్షణాల కొలమానాలతో నిట్టూర్పులను కొలవలేరు. అవి విరామచిహ్నాలు లేని సుదీర్థపాదాలు. విశ్వాసంవెన్నెముక విరిగినప్పుడు
ఆశను నడిపించే ఉతకర్రలు నిట్టూర్పులు. చప్పగా చల్తారే నిప్పుకాదు నిట్టూర్పు. బూదిపోగులనంటుకుని సాగే గుప్తజ్వలనధాతువది.
తిరగబడ్డ కన్నీటిసుడిగాలి
వంచనలపొగలను ఊదేస్తే
భగ్గుమనే కార్చిచ్చు నిట్టూర్పు.
32 భూగోళమంత మనిషిబొమ్మ గుప్తలిపి
ఇసుక ప్రసవిస్తుంది కొబ్బరిశిశువుల్ని.
గీపట్టి ఏడ్చే మొక్కలపాపలకు
చినుకులలాలి పాడుతుంది గుండె చెమ్మగిల్లిన గాలి.
మబ్బులు శవాల్తా వేలాడుతాయి నింగిచూరుకు.
హఠాత్తుగా కరెంటు ఊపిరి ఆగిపోయినప్పుడల్లా
గదిగొంతుకను పిసికేసినట్టవుతుంది.
రోడ్డుపక్కన కుప్పల్లా కూర్చున్న కంకరరాళ్లు
గతుకుల్లో విరిగిన వెన్నెముకల సంఖ్యను నమోదుచేస్తుంటాయి. _.దుమ్మును కప్పుకొచ్చిన గుంపులు
ఒక్కుమ్మడిగా తలలు విదిలించుకుని
నినాదాల నగ్నశరీరాలను పైకెగరేస్తుంటాయి.
ఇంట్లో తెరుచుకున్న కిటికీ విసిరినచూపు
అమ్ములా దూసుకుపోయి
అక్కడెక్కడో ఆవురుమనేదూరాలను వెంటేసుకొస్తుంది. నగరంనిండాఎండమావులు నడుస్తుంటాయి
ఆశల జలాశయాలను అడుగడుగునా మెరిపిస్తూ.
డా! సి, నారాయణరెడ్డి 33 అప్పుడప్పుడు కొళాయిల పొదుగులు చేపుతుంటాయి బిందెల లేగదూడల మూతుల్లో కమ్మనిరుచులు ఊరిస్తూ. గడియారంముళ్ళకంపలో చిక్కుకుపోయి కాళ్లుపెరుక్కోలేక పెనుగులాడుతుంటుంది కాలం. సూర్యుడికీ చెమటపోస్తుంటుంది
సృష్టిసూక్ష్మాలను కిరణాలచేటలతో చెరిగిచెరిగి. సంధ్యలచెలియలికట్టలను కుమ్ముకుంటూరావడం అరాచకచీకటికి పరిపాటిఅయింది.
అంతటా దురాక్రమణమే.
ఎక్కడికక్కడే హేతువును తిప్పేసిన భ్రమవలయం. ముడులువేద్దామంటే ప్రశ్నలకొసలు చేతివేళ్లకందని ప్రకీర్ణప్రకంపన వాతావరణం.
అసంగతచిత్రాల పసరుగుత్తులను
పిండితే రాలేవి వగరు అనుభూతులే.
అసలు మనిషిపుటకే ఓ భయానక హాస్యఘటన. ఏంచేస్తాం పుటకను తిప్పిపంపలేం.
భరిస్తూవుండాలి ఒగరుస్తూనైనా
ప్రకృతి రాసుకుంటున్న గుప్తలిపిని
పరిపూర్ణంగా మనసు అర్ధంచేసుకునేవరకు.
34 భూగోళమంత మనిషిబొమ్మ మ్యూజియంప్రాణి అతడెప్పుడూ మూసిన తలుపులు తెరవడు. తెరిస్తే గొనవాయువులు గదిలో చొరబడతాయని. గానం పంచప్రాజాలను అరిచేతులమీద తీసుకెళ్తుందే. ఆ సుఖయోగం అతనికి అక్కర్లేదా? అతని గదినిండా ముక్కిపోయిన పూలదండల వాసనలే. ప్రభాతకిరణాల్లో తడిసిన పసిగాలికి పసరుపరిమళముంటుందని అతనికి తెలియదా? ఉదయంపూట కిటికీలైనా కాస్త తెరిస్తే - అమ్మో! రోజుల తరబడి కాపాడుకుంటున్న పిత్రార్జితంలాంటి ముక్కవాసన అడ్డమైన రోడ్డుపాలైపోదూ! అక్కడే తాను ఒక్కడేవుంటూ ఆ మాగుడువాతావరణంలో కాలాన్ని నంజుకుంటూ ఏకాంతాన్ని కప్పుకుని నిశ్చింతగా పడుకుంటాడు. పొరపాటున కన్నంటుకున్నప్పుడు ఖర్మకాలి అతనికి ఒకలొచ్చింది.
డా॥ సి. నారాయణరెడ్డి తెర్ తానొక వీణగా మారిపోయినట్టు
తనను స్పాంజిఒడిలో పెట్టుకుని
ఏ చిగురాకువేళ్లో సుతిమెత్తగా మీటుతున్నట్టు.
కెవ్వున అరిచి చాపమీంచి దొర్లిపోయాడు.
గుండెదడలతో తనను తాను తడుముకుని చూసుకున్నాడు. ఫరవాలేదు ప్రత్యంగం పదిలం.
గానాన్నీ తాజాగాలినీ ఉదయకిరణాల్నీ
శాశ్వతంగా బహిష్కరించిన తానే
ఓ వీణగా మారిపోవడమా?
"పైగా ఏ పల్లనాంగుళులో మీటడమా?
మ్యూజియంలాంటి గదిలో భద్రపరుచుకున్న
తన విలువైన శరీరం వినియోగవస్తువు కావడమా?
ఈసారి అలాంటి కలేవస్తే గొంతుపిసికేస్తానని
పైకప్పు దద్దరిల్లేట్టు ఓ శపధం విసిరేసి
కళ్లురెండూ గట్టిగా మూసుకున్నాడు.
గదిని మూసేస్తే గాలీ వెలుతురూ రాకపోవచ్చు కళ్లుమూసుకుంటే కలలు రాకుండావుంటాయా?
36 భూగోళమంత మనిషిబొమ్మ అలల లఅరికాళ్లతో
ఏళ్లు పైబడుతుంటాయి కొందరికి కొమ్మనుంచి రాలిపడే పండుటాకుల్తా.
ఏళ్లు పచ్చగిల్లుతుంటాయి మరికొందరికి గుండెచెలమలో విచ్చుకునే ఊటరేకుల్తా. కాలాన్ని కాలిబంతిగా ఆడుకునేవారిని బాల్యం అచ్చుకొట్టిన మట్టిముద్రలు వదలవు. ఒక్కొక్క నిమిషంమీద స్వారీచేస్తుంటే పరిసరాలు జయహేషలై ధ్వనిస్తుంటాయి. పడుచుగొంతుకల కేరింతలు అడివినెమిలిపురులను ఆవిష్కరిస్తుంటాయి. ఎక్కడో పాతుకుపోయిన తీరం ఎదురొచ్చి నడుమును బెల్టులా చుట్టుకుంటుంది.
దారికి రెండువైపులా చెట్లచేతులు
గాలిఈతలు మొదలెడతాయి.
మెడమీది ముడతల్లో దూరి
ముదిమి తనముఖం దాచుకుంటుంది.
డా॥ సి. నారాయణరెడ్డి 37 చుక్కలు చీటీలు పంపుతాయి తమని కోసుకుపోయి
ముంగిట్లో నాట్టువేసుకొమ్మని. అసూయ నుసిలా మిగిలేది ఆరిపోయిన వత్తులకే.
పుట్టడమే విశేషంకాదు రోజూపుడతాయి కోట్లజీవులు మనుషుల్లా తోలుతొడుగులతో.
ఏ కొందరు మాత్రమో
దూరాలను నురగల్త్లా ఊదేస్తూ పోతుంటారు అలలెత్తే అరికాళ్లతో.
ఎవ్వరూ ధూళిని పీల్చుకోవద్దు. ప్రభాతకాంతిలో రంగరించిన ప్రాణవాయువుల్ని పీల్చుకోవాలి. ఆకాశంభూమీ కరచాలనం చేసుకునే ఐక్యవేదికమీద
గూబల గుసగుసలు వినిపించొద్దు. పావురాళ్ల కువకువల పరాగాలు ప్రసరించాలి మైత్రీచర్చలై. కుళ్లుబుద్భలుంటే
ఏ పెరళ్లలోనో పారేయడం మంచిది ఎరువుగానైనా పనికొస్తాయి.
38 భూగోళమంత మనిషిబొమ్మ ఊబి
ఊబి ఏదైనా సరే.
స్లోమోషన్‌లో దిగుతూవుంటే సుఖంగానే వుంటుంది. గొంతు పూడుకుపోతే తెలుస్తుంది
అది ప్రాణాంతకమని.
ఏ వ్యసనమైనా అంతే.
కొత్తలో తలదిండులా అమరిన వ్యసనం
క్రమంగా యూఫోమ్‌బెడ్డుగా పరుచుకుంటుంది.
ఏ పక్కన ఒత్తిగిల్లిపడుకున్నా
నురగల గుత్తులమీద ఉన్నట్టుంటుంది.
పగలుకు విడాకులిచ్చిన పచ్చిరాత్రి
తగులుకున్న ఆ తల్పాన్ని ఒదిలిపోదు.
మగతజిగి ముదిరిపోతే
కీళ్లలో కుదురుకున్న కొవ్వు జువ్వుమంటుంది. ధూపంలా రాజుకునే విచ్చుకొప్పును
దూదివేళ్లతో దువ్వమంటుంది.
అడుగులకు ససేమీ నేలపాడ గిట్టదు.
డా॥ సి, నారాయణరెడ్డి 39 అవి మంద్రస్వరంలో ప్రవచిస్తుంటాయి
కదిలితే గాలిలో ఈదినట్టుండాలని.
ఆ అనుగ్రహభాషణంతో పరవశించిన పడకకుర్చీ ఎగిసే పల్లకీగా మారిపోతుంది.
మట్టిలో చిక్కుకున్న మూగచెట్లను చూసి పరిసరాల చట్రాల్లో పరిభ్రమిస్తున్న అట్టడుగుమనుషుల్ని చూసి
అడి 'జోలెడు జాలిని రాలుస్తుంది.
ఊబి వుండేది భూమ్మీదేకాదు సుమా ఆకొశంలోనూవుంటుంది.
సౌఖ్యాల విద్యుత్తులంటించుకుని స్వప్పలంపటులు ఎగబడేది ఆ పైఊబిలోకే. మాదకద్రవ్యాలచేతుల్లో దొర్లీవి
మానవశరీరాలు మాత్రమే.
ప్రలోభాల ఖరీదైన రుచులు మరిగిన మనసులు పైపై మత్తులవరకే ఆగిపోవు.
అవి పదవుల పెదవులమీద
ప్రజాహిత ప్రసంగాలై పుష్పిస్తుంటాయి.
పదవిని మించిన పట్టుఊబి
ప్రపంచంలో ఎక్కడైనా వుందా?
ఒక్కసారి అంటుకుంటే చాలు
పంచేంద్రియాలు ఉడుకెత్తిన పడగలై ఊగిపోతాయి.
40 భూగోళమంత మనిషిబొమ్మ సగందాకా చొరబడితేచాలు
ఆత్మీయబంధాలు చిత్తుకాగితాల్లా ఎగిరిపోతాయి. మరింతగా దిగబడుతున్నకొద్దీ
అనిర్వచనీయ పరమార్థాలు
అరమూసిన కళ్లలోంచి చరమపంక్తులై పలుకుతుంటాయి. “ఈ జగత్తు అంతా “మిత్”.
ఎవ్వరూ వేరెవ్వరూ లేరు.
ఇప్పుడు నేనన్నదే నేనున్నదే.
అహం సర్వమస్మి
సర్వం అస్మి అస్మి అస్మి”
డా! సి. నారాయణరెడ్డి ర! తెరిచిన పుస్తకం
నాల్కపైనుంచి ఎగిరిదూకలేదు నిజం . మనం నలుగుతూ చూస్తుంటే.
బూటులోని యిసక గుచ్చుకుంటుందని
తొడగడం మానేస్తామా.
చేవవున్న లవంగాన్ని కొరికితే చురుక్కుమంటుంది.
ఏ వాస్తవమైనా అంతే.
చేతులు పిసుక్కుంటూవుంటే సమస్యలు మెత్తబడవు: సంఘర్షణలోనే కదా
సంఘటనల కవాటాలు తెరుచుకునేది.
ఒడ్డుకు తల తగులుతుందని తెలిసినా
విసురుగా విరుచుకుపడుతుంది కెరటం.
అక్షరాలు నోట్లో నానితేయెలా రోజులతరబడిగా ఆపని మెదడులో జరిగితేనే మెరుగు.
పొదిలో గుక్కిళ్లుమింగే అమ్ములు
చరమలక్ష్యాన్ని ఛేదించలేవు.
అందుకే నేను సానపెట్టిన సంకల్పాన్ని
నాలుగురోడ్డ కూడలిలో నాటుతాను ధ్వజంలా.
శ2 భూగోళమంత మనిషిబొమ్మ స్వార్ధంమరకలులేని ప్రతిజీవితం తెరిచిన పుస్తకం తనివితీరా చదువుకోనీ జననేత్రసహపస్రం.
ఆ ఆంతర్యాన్ని ఎందరు పంచుకున్నా
ఎంతగా తిరగేసి వొంపుకున్నా
సరుకున్న గ్రంధం ఖాళీఅయిపోదు.
పాఠకుల స్ఫూర్తితో అది యెదుగుతుంది. పదింతలు పదునెక్కి.
నిజమైన నిజానికి ఎప్పుడూ కాలదోషంపట్టదు. మబ్బుకమ్ముకుంటే సూర్యునికి మసక అంటదు. వ్యక్తిత్వం ఉబికిరావాలి
కొలిమినిప్పులోంచి శిరసెత్తే సెగలా. ముసురుపట్టిన పగటిముఖంలా
మూల్గుతూ బతకొద్దంటాను.
కుండపోతగా కురిసికురిసి
ఎండలా ఛాతీవిరుచుకుని సాగాలంటాను. సాగిపోయే అడుగులను గడ్జిముసుగుగోతులు కబళించాలని చూస్తుంటాయి.
మోగే కుత్తుకలను అంక్షలకత్తెరలు బెదిరిస్తుంటాయి. బహిరంగంగా తెరుచుకున్న పుస్తకం
తన పుటలను ముడుచుకుని పారిపోదు. కూడలిలో నిటారుగా నిలబడి
జనరక్తనాళాల్లో
తలవంచని అక్షరసైన్యాలకు కవాతునేర్చుతుంది.
డొ॥ సి. నారాయణరెడ్డి 43 మనిషి మిణుగురై
వాతావరణం నజ్ఞునజ్జుగా ఉంది.
ఆముదంలో స్నానం చేసినట్టుంది.
చెట్టుమీదవాలిన నిద్ర మధ్యమధ్య
ముదురుపచ్చగా ఆవులిస్తున్నట్టుంది.
పడక దిగడంలేదు గాలి.
నడక మానేసినట్టుంది.
షరామామూలుగా కలుసుకుంటున్న చేతుల్లో హృదయాలు పలకడంలేదు.
బోలుపెదవులు టపటపకొట్టుకుంటున్నాయి తాటాకులా. గడియారంముళ్లు క్రమంతప్పకుండా /” క్లాసులు తీసుకుంటున్నాయి.
అరిగిన పాఠాల రికార్డులే తిరుగుతున్నాయి. మూసినగదుల ముక్కుల్లోంచి
కాగితాల ముక్కవాసనలొస్తున్నాయి.
వేళ్లు ఆలోచనలను విరమించుకుని
కలాలను తోపుడుబళ్లలా తోసుకుపోతున్నాయి.
డడ భూగోళమంత మనిషిబొమ్మ ఎంతదున్నినా బుర్రల్లో
మెరుపులపంటలు పండడంలేదు.
అసలవి నాగళ్లా? మొనల్లేని ముడుసులు. రోజూ రోడ్డు ఈనుతూనే ఉన్నాయి తాటికాయలంత తలకాయల్ని.
ఒక్కటీ ఎదురుతిరగదే కాలంవిసురుకి. తెరుచుకున్న దుకాణాల పళ్లసందుల్లోంచి సరుకులునింపుకున్న పేగులసంచులు స్పష్టత కీచుమంటున్న సామూహికసమ్మర్దంలో ఎవరిది వారిదే ఏకాకిగోల.
కనిపించిన దృశ్యాలన్నిటినీ రుచిచూడాలని కళ్లనాలుకలకు ఆబ.
ఎక్కడికక్కడే ఓ స్వప్పలేపనం.
కప్పుకున్న కాంక్షలముసుగులో
ఆకాశం వెచ్చగా తగులుతున్న అనుభూతి. మరునిమిషంలో కసుగాయపండి ఒళ్ళోరాలాలనే ఆత్రం.
శరీరాలున్నాయి కదిలే బూదికుప్పల్తా. ఒక్కపౌరుషకణం రగిలితేచాలు
మడ్డికట్టిన వాతావరణం పేలిపోతుంది. మనిషి మిణుగురై జ్వలిస్తాడు
జ్వాలల పిడికిళ్లతో ఉద్యమిస్తాడు.
డా॥ సి. నారాయణరెడ్డి ఉద్ సూర్యుడు వెలిసిపోడు కెరటంలా రొమ్మువిరుచుకుని సాగే రురీమూర్తి ఎదురుగాడ్పులకు జడుసుకోడు.
నిరంతర సంఘర్షణశీలి ప్రలోభాలకు లాంగి ఎరుపెక్కిన ఆశయాల్లో ఊసరవెల్లిని కలుపుకోడు. ఎంతగా మబ్బుల్లో తడిసినా సూర్యుడు వెలిసిపోడు. అమ్ముల్లా దూసుకుపోయే కిరణాలను
పొట్టాల్లో మడిచి అమ్ముకోడు.
అజ్ఞాతవాసంలో వున్నా
సముజ్వలవ్యక్తిత్వాన్ని చంపుకోడు.
నిన్న ప్రచండంగా వెలిగిన పగటిపుటకు జిరాక్స్‌కాపీకాదు ఇవాళ్చిరోజు.
అది ప్రతిదినం వికసిస్తుంటుంది
ప్రతిభనుదుట నిలిచే నేత్రంలా.
పడమటిదిక్కుకు తూర్చంటే యేడ్చు.
వొట్టి దిక్కుకాదుసుమా తూర్పు
అక్కడ మొక్కలామొలిచే సరికొత్త రక్తరీఖవుంది.
శీర భూగోళమంత మనిషిబొమ్మ ఆకాశంనుంచి నేలదాకా శాఖోపశాఖలుగా సాగే కాంతిప్రస్తారం వుంది.
సూర్యుని కంటిలోంచి చిమ్ముకుపోయే వజ్రకిరణం బండలకు గుద్దుకున్నా మొండిపడదు. బురదల్లోపడ్డా కూరుకుపోదు.
ముళ్లకంపల్లో చిక్కుకున్నా ముడుచుకుపోదు.
ఆ వెలుగుచేసే ప్రయాణం
అలిసిపోని సజీవప్రయోగం.
ప్రయోగశీలం పదునుతగ్గితే
ప్రసంగంగా మారుతుంది.
ప్రవాహపాదం సడలిపోతే
పడియల్లోకి దూరుతుంది.
పరిసరాల అగ్గిపుల్లలతో ముట్టిస్తే
పసవున్న ప్రతిక్షణం ప్రజ్వలిస్తుంది
కాలాన్ని నిలువెత్తుగా నిలబెట్టే జ్వాలలా. వెలవెలబోయేదీ వెలిసిపోయేదీ
అరువుతెచ్చుకున్న చంద్రుని పూతవెలుతురే. సూర్యకాంతిలాంట్ మౌలికచింతన
సృజనశక్తికి ప్రథమథ్రేరణ.
డా॥ సి. నారాయణరెడ్డి త్తే ఆ పక్షిలాగే
రోజూ చూస్తుంటాను
రెండురెక్కలూ చేతుల్లాసాచి ఆ పక్షి గాలిస్టూలుమీదెక్కి వ్యాయామంచేస్తుంటుంది. అలాఅలా ఏటవాలుగాప్రవహిస్తుంటుంది హఠాత్తుగా బాణంలా పైకిదూసుకుపోతుంటుంది. తిరిగి వాయువేదికపైన స్థిరపడిపోతుంది ధ్యానముద్రాలంకృత యోగిలా.
పక్షిచేసే అపురూపక్రీడలనుచూసి పసివాణ్నయిపోతుంటాను. .
గాలిలో రెక్కలమీద నిలబడే ఆ అద్భుతాన్నిచూసి నిలువునా కదిలిపోతుంటాను.
నాకూ అలాగే చేయాలనిపించింది
కిటికీలోంచి గాలిలోకి ఎగరబోతుంటే గుర్తుకొచ్చింది
నేలమీదే సరిగ్గా నిలబడలేని మనిషనని.
48 భూగోళమంత మనిషిబొమ్మ శ్వాసనిధులు రెక్కలు శ్వాసపీల్చుకుంటేనేకదా పక్షి ఎగిరేది. చచ్చుచేపల్డా కాలంఒడ్డున పడున్న శబ్బాల్లో శ్వాసపవనాలు చల్లగా రాజుకుంటే ఆ శబ్దాలకాళ్లకు గజ్జెలు మొలుస్తాయి. అప్పుడవి నృత్యమత్స్యాంగనలవుతాయి. మేలుకున్నశిలల్లో ఊపిరి కురులు విదిలించినప్పుడు అవి రూపరాగిణులై గుప్తలయలను పలికిస్తాయి. అందమైన రంగులబొమ్మను చూస్తుంటే మన చూపుమొనలను నులివెచ్చగా స్పృశించేవి కనిపించని కుంచె ఊపిరిఅంచులే. అక్షరాల వక్షస్సులమీద అర్థరత్నహారాలు చలించినా రంగుల మేలిముసుగులు కప్పుకున్న రేఖలు రసజగత్తును నిశ్శబ్దంగా నిమంత్రించినా మట్టికుదుళ్లలో రాతిపగుళ్లలో చిందిన చెమటచుక్కలు హరితజీవసంపుటులై లలితశిల్పసంచికలై ఆవిర్భవించినా అన్నిటికీ అదృశ్యచలనశక్తులు ఆ శ్వాసనిధులే.
డాః సి, నారాయణరెడ్డి త్తం వేళ్లతో ఉచ్చ్వసించే వృక్షాలేసుమా
కొమ్మలకొమ్ములతో గాలినికుమ్ముతూ నిలిచేవి. నక్షత్రాలనాడుల్లో శ్వాసగతులు స్పందించకపోతే
అవి రాలిపడ్డ బొగ్గుముక్కల్త్డా నేలపాలయ్యేవి. అడవులు పచ్చగా నిలబడివున్నాయంటే
సాగరాలు తారల గుడ్డివెలుతురులోనూ సంచలనపాఠాలను అధ్యయనం చేస్తున్నాయంటే
అవి నిత్యశ్వాసధారులు కాబట్టే.
శ్వాస పదునెక్కినప్పుడల్లా ఒక సంకల్పం అంకురిస్తుంది. ఒక విప్లవం జ్వాలార్తుంర్వులా విస్తరిస్తుంది. ముడులువేసిన దారంకాదు అసలైన శ్వాస.
సూర్యుని నుదుటిలోంచి చిమ్ముకునిపోయి
సూటిగా నేలరొమ్ముమీద వాలిన
అకుంఠిత సునిశితకిరణం అది.
చీకట్లోనూ అది ప్రవహిస్తుంటుంది
శరీరతంత్రిలోని విద్యుద్దారలా.
శ్వాసతో చేదుకోగలిగిన సత్తావుంటే
చైతన్యజలరాశులు పొంగుతాయి సహారాబొడ్డులో.
50 భూగోళమంత మనిషిబొమ్మ ఆకర్షణ
కొండకొమ్ముమీద నిలిపినచూపు
ఎంతోసేపు కుదురుగావుండదు.
ఆకుమీది మంచుబిందువులా జారిపోతుంది. లోయలో రాలిపడ్డచూపును
ఏటిపాయ ఉయ్యాలై ఎత్తుకుంటుంది.
తన మోకాళ్లను రాళ్లు డీకొనేదాకా . ఆచూపును పాపలా తీసికెళుతుంది. దూరానికి జడుసుకుని వానచినుకు మబ్బుగూట్లో ముడుచుకుకూచోదు.
ఒళ్లు తునకలైనాసరే నేలమీదికి దూకుతుంది. ఎక్కడిచూపు ఎక్కడిలోయ?
ఎక్కడిచినుకు ఎక్కడినేల?
ఆకర్షణ ఒక ఆంతరికశక్తి. ఎత్తూపల్లాలసూత్రాలకు కట్టుపడని విహంగచైతన్యస్ఫూర్తి.
డా॥ సి. నారాయణరెడ్డి క్ పొరలను విశ్లేషించిచూస్తే దొరికే నైజంకాదది. ఆవిరి తనచుట్టూ తానే పరుచుకుని పడుకోవాలనుకోదు. భద్రతలేని శూన్యంలోకి ఎగిరిపోతుంది. జన్మమూలాన్ని గాలికొదిలేసి వెళ్లిపోతుంది. స్వచ్చందంగా పరిభ్రమించే గ్రహాల్లో తొలుస్తుంటుంది పరస్పరాలింగనవాంఛ. ఎన్ని అనంతకాలాల ఒగర్పో అది. అంతటి జలరాశి పార్లిపార్లివస్తుంది పొడియిసుకను ముద్దాడాలని. ప్రగాఢచుంబనయోగం దక్కలేదనే ఆ కెరటాల నిర్ణిద్రరోదన. పరిశుభగగనసరోవరంలో ఉదయించిన తరుణకాంతిచరణాలకు ధూళిలో ముళ్లలో నడవాలనే తపన. ఉఊపిరీ రూపమూ అఆరిపోయినా సరీ న! మింటియింటికి తిరిగిపోని తెగింపు. యటం మొలిచినప్పటినుంచీ రెక్కలకు ఆరాటం తె ల రింరక (| స దిక్కుల చెక్కిళ్లను స్పృశించాలని. సలు! న. కంట |. రుతుగతులకు అతీతం ఆ విహరణవ్రతం. కరం. ఎవరు శాసిస్తే ఎగురుతాయి ఆ రెక్కలు. వ ఏ అంక్షలు ఎక్కుపెడితే తిరుగుముఖంపడతాయి. ఆకర్షణలో అవ్యక్తలాలనవుంది. ప్రవృత్తివైరుధ్యాల సశక్తమేళనముంది.
52 భూగోళమంత మనిషిబొమ్మ శాసనపర్వం రోడ్డమీద చెవులు ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. లౌడ్‌స్పీకర్లు తెగవూదే నినాదాలగ్యాసుతో చెవులఊపిర్లు అగిపోవడంలేదు. ఇళ్లు సుఖంగా కలలుకంటున్నాయి కిటికీలకళ్లు తెరుచుకునే. రొదలమేకులు కలల కనుపాపలను చితగ్గొట్టడంలేదు. కార్లమోకాళ్లను విరగ్గొట్టే కటౌట్టు కనబడ్డంలేదు. వెల్లవేసినగోడలు తమ అదృష్టానికి మురిసిపోతూ ఒళ్లు నిమురుకుంటున్నాయి కల్లబొల్లిరంగులరాతలు బల్లుల్లా అంటుకోనందుకు. అన్ని ముఖద్వారాలను మింగేసే బ్యానర్ణబకాసురుల ఆనవాళ్లు లేకుండాపోయాయి. రహదార్లంత పొడుగ్గా విస్తరించే వాహనాలతోకలు మూడుమూరలకు కుదించుకుపోయాయి. విమానాశ్రయాల అద్దాలు తమశీలం బద్దలుకానందుకు
డా॥ సి, నారాయణరెడ్డి 53 గుండెనిండా ఉచ్చ్వసిస్తున్నాయి. పదిగంటలరాత్రిగీసిన లక్ష్మణరేఖ దాటాలంటే ప్రసంగాల భిక్తుకవేషాలు జడుసుకుంటున్నాయి. బహిరంగసభల శిరస్సులమీద
వాగ్దానాల ముత్యాలవాన కురవడంలేదు. బలిసిన ఊరేగింపులతో బలప్రదర్శనచేసే కొవ్వెక్కినడబ్బు బిగించిన సంచుల్టోంచి బొట్లుబొట్లుగా కారిపోతున్నది.
తెగవాగుళ్లకు మరిగిన ముదురునాల్కలమీద అగుపించని కత్తెరల నిఘా ఉరుముతున్నది. అధికారయంత్రాంగవైజయంతికల రెపరెపలు అడ్డమైన దొడ్డిదారుల్లో అగుపించడంలేదు. సారాప్యాళెట్ట వీరంగాలు
నేలమాళిగల్లోకి తరలిపోయాయి.
పట్టణాలకు జ్వరంజ్వరంగాలేదు.
పల్లెలకు భయంభయంగాలేదు.
సమశ్రుతిలో సాగిపోతున్నది పౌరజీవనం
ఎక్కడో మారుమూలల్లో రేగే పాలికేకల్లోతప్ప.
“5డీ భూగోళమంత మనిషిబొమ్మ ప్రదర్శనావతారాలు
మరుగుజ్ఞులమధ్య మరీ అంత ఎత్తుగావుంటే ఎలా? చుట్టూ నంగిమాటల బొంగరాలు తిరుగుతూవుంటే సుదర్శనచక్రంలా ఉదాత్తస్వరమెత్తితే ఎలా? సదస్సుల సరస్సుల్లో పులులతోకలు
బాతుల్తా తేలిపోతున్నాయి.
రోజురోజుకూ విచ్చుకుత్తుకలు మూతబడుతున్నాయి. ఆత్మవిశ్వాసం చల్తారిన అక్షరాల్లోంచి
ఓహోకారాలు జల్లుల్లా రాలుతున్నాయి. మెరమెచ్చులమిరుమిట్ల వరదల్లో
చురకత్తుల చిరునామాలు కొట్టుకుపోతున్నాయి. క్లిక్కుననవ్వే కెమెరాణులముందు
బానిసల్లా ఫ్రీజవుతున్నారు ప్రచారలుబ్బమతులు. ఆశీర్ముఖాలతో ఐహికకీర్తికండూతిని గండూషిస్తున్నారు వేషమాత్రపరంజీవులు. పత్రికలఅద్దాల్లో అరముఖమైనా కనబడకపోతే ఆరోజు తలవున్నట్టే అనిపించదు.
చూస్తున్నాంకదా ప్రకటనల పుక్కిట్లో సంస్కృతితాంబూలం ఎలా నలుగుతున్నదో!
డా॥ సి. నారాయణరెడ్డి ఠ్‌ద్ అట్టడుగులోయ నయం
బాలనదితో కలిసి. స్వచ్చందంగా నడకలు వల్లిస్తుంది. కారడవి నయం
జ్వలనశీలాన్ని అగ్గిపాలతో రంగరించుకుంటుంది. కొండమీదున్న. మబ్బుకేమయ్యింది
కురవదే అనర్గళవకృృత్వంలా.
శిఖరాలమాటునదూరి నోరుగారిపోతుందే. రంగులపురులు విప్పి కుంచె నర్తించకపోతే
బొమ్మల కనురెప్పలు కదలాడుతాయా!
వెదురుకు చిల్లులుపొడిచింది
నాదం రోదసిలోకి చిమ్ముకుపోవడానికేకదా గుడిసెలగుండెలమీద వేటుపడ్డప్పుడు కుక్కిమంచాలుకూడా కన్నెర్రజేస్తాయే. ఆకలిడొక్కల్లోకి తుపాకులు గురిచూసినప్పుడు మూల్లులే తుఫానులై తిరగబడతాయే. తొాయిలాలకోసం ముఖంవాచినవాళ్లను
తాబేళ్లలా పడుండనీ.
వాళ్లు జోడించిన చేతివేళ్లలోంచి
విజ్ఞప్తలచొంగలు కారుతూవుండనీ.
యధార్థాలను నాల్కలమడతల్లో నాన్నేవాళ్లు యధాస్థితిలో వేలాడుతూవుండనీ.
నీ ఎదిగిన యెత్తునుమాత్రం ఉవ్వెత్తుగా నిలబెట్టుకో వీధిలో నువ్వు నడుస్తున్నా
వేదికలు నిన్ను భజిస్తున్నా
56 భూగోళమంత మనిషిబొమ్మ వాక్యాలు వర్షిస్తే నోటిబురఖా దాటని నాలుకళిలక ఆకుపచ్చని వాక్యాలను తెగవర్సిస్తుంది. దానికేం? దొరసానిలా మేడదిగిరాదు. సేద్యంచేసేది చేతులూకాళ్లేకదా. మాటలు వెదబల్లితే లక్ష్యాలవృక్షాలు మొలకెత్తవు. నాగళ్లతోనేకాదు కాళ్లతోనూ దున్నినప్పుడే చెమటబొట్లు ధాన్యంగింజల్ని రాలుస్తాయి. చిలకపలుకుతుంటే తమాషాగానే వుంటుంది ఆకాశం నల్లపలకమీద అపరంజి మెరుపుతీగ గీసుకుపోతే వున్నట్టు. వగలొలికే విద్యుల్లత వర్షించదుగదా కురిసేవానకుముందుగానే కులుకులాలికి వెళ్లిపోతుంది. ఎప్పుడూ నమ్మొద్దు మెరుపుమాటలను. మట్టికడుపులోని పేగులమూల్లుల్ని విని నిలువునా నీరైపోయి.
ర్ డా॥ సి, నారాయణరెడ్డి నేలను గుండెకు హత్తుకునే మబ్బుమనసే మనసు. ఎక్కడో ఎడారి పిచ్చితల్లి ప్రసవించిన ఖర్జూరశిశువులకుకూడా పాలిచ్చే మనసది. ప్రకటనల ప్లాస్టికపాదుగుల్లోంచి పాలచుక్కలు రాలవు పచ్చి అబద్ధాలు రాలుతాయి. ఎంత లేగదూడలైనా అమ్మెవరో బొమ్మెవరో తేల్చుకోవడానికి ఎంతోకాలం పట్టదు. పదునెక్కే పసితలల కొమ్ముల్నిచూసి గోరూపవంచకులకు పలాయనం తప్పదు.
58 భూగోళమంత మనిషిబొమ్మ జ్వాలలా శిరసెత్తి
ఉగచేతనలో రాజుకున్న ఆగ్రహజ్వాల ఓదార్పునీళ్లు చల్లితే ఆరిపోయేదికాదు.
భూగర్భశిలానాభుల్లోకి చొచ్చుకుపోయాయి
ఆ జ్వాలవేళ్లు.
నరికేస్తే చిగుళ్లగోళ్లతో పైకి పాడుచుకొచ్చే
అక్షత జీవవృక్షంలాంటిదది.
ఏ ఎదురుగాడ్పులూ పెళ్లగించలేని మూలబలం దానిది.
దోపిడిమరిగిన ధూర్తవృత్తులకు
నిటారుగా వెలిగే మంటనుచూస్తే కళ్లమంట. వాళ్లు కోరుకునేది అవులించే కమురుపాగలను. మట్టిని కరుచుకుని నిట్టూర్చే బూడిదకుప్పలను. జ్వాలంటే నిరసనశబ్దం విప్పిననోరు.
చెప్పుకింద అణీగున్న నిప్పుకణికలు ఒక్కటై గొంతుకలు గుప్పించి పెట్టినహోరు. దోపిడినోటికి రుచులతేడాలుండవు
డా॥ సి. నారాయణరెడ్డి 59 పొదుగు పితికితే కురిసే పాలైనా
పొట్టలో పొడిస్తే చిమ్మే నెత్తురైనా.
ఒక్క తన వికటహుంకారం తప్ప
మరే స్వరం సయించదు దోపిడిక్షి.
తాను కదిలితే రగిలేకాష్ట్రం కదిలినట్టే.
మరో హరితకాంతి అగుపించకూడదు దానికి. ఉలికులికిపడి చూసే చీకటి కనుగుడ్డకు ఉదయకిరణాలు గుండుసూదుల్తా కనిపిస్తాయి. పిరికినరాలుకదా అవి
ముడుచుకుపోయి దిక్కుల కలుగుల్లో దూరిపోతాయి. అదునుచూసి అలిసిపోయిన సూర్యుణ్ఞి కావేసి
కసి ఆర్బుకుంటాయి.
తరలివస్తున్న నదీపాదాలను విరిచేయాలని పాషాణమతులు పన్నాగాలు పన్నుతాయి. దూసుకొచ్చే ప్రవాహం వెనక్కి తిరిగిపోతుందా? అడ్డొచ్చిన బొడిగుట్టల పక్కయెముక్రలన్సు పాొడిప్రాడ్రిగా విడగ్గొాడుతూ
అలలజెండాలూప్పుత్తూ సాగిపోతుంది.
నదికాళ్లు విర్రిచేయ్రాలన్సి
మెరిస్సే సూర్యుడి ఉనికిని తుడిచేయాలని
' వేళ్ళు తన్నుక్సృన్సి వృక్షంలా ఎదిగిపోయిన ఆగ్రహజ్యాలన్సు
ఎదురుగాడ్సుల గొడ్డళ్లతో నరికేయాలని దుష్టశక్షల్పచ్చశ్స కుతంత్రం ధూళిలో క్రల్పస్వ
న నుంది, అ౦ఘట్రిత్ర జనచైతన్యం సముజ్వలంగ్లా నిలుస్తుంది
60 భూగోళమంత మనిషిబొమ క్రై అన్నీ దృశ్యాలే అయినా
కళ్లలో జాగాలేదని
కొత్తదృశ్యాలు నింపుకోవడం మానుకోము. చర్మపరిధులుంటాయా
ముఖంలో అచ్చైన ఆ అపారసరోవరాలకు? అక్కడ మండుటెండల తరగలమీద పండువెన్నెల నురగలు విరబూస్తుంటాయి. బింబాల పెదవులమీద
ప్రతిబింబాల చిరునవ్వులు చిటికలేస్తుంటాయి. ఒకోదృశ్యం పచ్చనిఆకుల పక్షాలతో ఎగిరిపోయే పక్షిలా అగుపిస్తుంది.
అది ఒంటరిగా వెళుతుందా
రెక్కల కదలికల్లో మన ప్రాణాలను అంటిపెట్టుకునిపోతుంది.
ఓ పొగమంచు కురులార్చుకుంటూ ఎదురైతే క్షణకాలం ప్రాణస్తంభన జరుగుతుంది.
చైతన్య విద్యుత్‌చక్రాన్ని స్థగితంచేసే
డా॥ సి. నారాయణరెడ్డి 61 స్తంభనకాదది. మనసుపొర పక్కమార్చుకునే సుసూక్ష్మ కాలవ్యవధి. సలసలమరిగే అహాన్ని అణుచుకోలేక సముద్రం లోతులు శిఖరాలై పైకి చిమ్ముకొస్తాయి. | ప్రతియెత్తూ ఊర్ప్వముఖంగా సాగినలోతే రూపాల స్టూలరేఖలనుబట్టి ఆంతర్యంలో మునకేయలేం. కళ్లమీద చీకట్లను కప్పుకున్నా విచిత్రదృశ్యాల లలితవిస్ఫోటనం ఆగదు. పొంతనలేని రంగురంగుల కలలదొంతరలు దొర్జుతూనేవుంటాయి. విశాలవర్ణచిత్రాలెన్నో “దిక్కుల ముంగిళ్లలో మబ్బులతోరణాల్తా వేలాడుతుంటే ఎడారిదారిలో ఎగిసొచ్చే గాలిగుర్రాల్లా కదలాడుతుంటే కనుపాపలు మెరుస్తుంటాయి బాలనక్షత్రాల్హా. అన్నీ దృశ్యాలే - అయినా తప్పిపోయిన పాపను ఎదకు హత్తుకునే తల్లి అరమోడ్పుకళ్లలోని చేపులతీపిని ఏ దృశ్యం ఆవిష్కరిస్తుంది?
62 భూగోళమంత మనిషిబొమ్మ ల్ని ఆలి సెంహాస్తాలు రెక్క విచ్చుకోవడమంటేమాటలుకాదు మట్టికి ఊపిరి ఉభికొచ్చినట్టే. ముద్దలా పడివున్న జీవసంపుటి కెరటంలా పక్కదొరలించినట్టే. కాగితాలను కప్పుకుని సుఖంగా పడుకొమ్మంటే నిద్రపట్టని అక్షరాలు వినిపించుకుంటాయా? కంఠవేదికలకెక్కి స్వరాలపురులు విప్పుతాయి. తొక్కే కాళ్లకింది ఇసుకరేణువులు అదునుచూసుకుని కళ్లమీద తిరగబడతాయి. తూర్పుజఒడిలో వున్నప్పుడు తొలిపొద్దు నెత్తుటికందులాగే వుంటుంది. అ పరిధిదాటిపోతే భూమ్యాకాశాలను కరతలంమీద ఆడిస్తూ నడుస్తుంది. పిల్లలులేని ఇల్లులా బావురుమనే ఆకాశంలో మబ్బుల కేరింతలతో మాతృత్వం చేపుతుంది. ఆ బృందనాదంలో తమ గొంతుల్ని జోడించాలని నక్షత్రాలకు పిచ్చెక్కే తపనపుడుతుంది.
డా॥ సి. నారాయణరెడ్డి 63 ఏద్ స్తబ్ధంగా వుండాలనుకోదు:
ఏదీ శబ్దాన్ని వెలివేయాలనుకోదు.
విత్తుకుత్తుక మొక్కై పలకాలనుకుంటుంది. భూమిపొరల చెరను విదిలించుకున్న నీటిబుగ్గ ప్రవాహకరవాలం ర్వుళిపిస్తూ ప్రస్థానిస్తుంది.
శ్వాస కాస్త బలంగా అడితేచాలు
ఆకుల తలలు పతాకల్త్లా రెపరెపలాడుతాయి. కొమ్మలను అంటుకునివున్న గూళ్లు | పక్షులతోపాటు ఎగిరిపోవాలని తహతహలాడుతాయి. పంజరాల చువ్వలకుమాత్రం నిద్రపడుతుందా బందీలమూల్లులు డొక్కల్లో కదులుతుంటే. గుహలపాదుగుల్లో ఒదిగుంటాయా సింహాస్త్రాలు అడవుల అగాధాల్లోకి దూసుకుపోనిదే.
పడగలకు పారవశ్యం
పుట్టల అంత;పురాల్లో పరమభద్రవాసంకంటే హోరుగాడ్పులమీద ఊరేగినప్పుడే.
ఒంటిని ఆచ్చ్భాదించాలని అంటిపెట్టుకునే నురగల్ని ఒడ్డుకి విసిరికొట్టే సముద్రంలో
వస్తసన్యాస స్ఫూర్తిలేదూ?
ఏరూపంలోవున్నా జడతంటే మగతే.
ఎవరిని ఆవరించుకునివున్నా ముసుగంటే విసుగే. కాలం నిత్యసంచలనశీలం.
స్వచ్భ్చందపురోగతికి సహజగమ్యం సంశక్రమణచైతన్యం.
64 భూగోళమంత మనిషిబొమ్మ జరీవలయాల్తోంచి
వాంఛల జరీవలయాల్లోంచి బయటపడాలంటే
మరిగిన (ప్రాణానికి సయించదు.
అది తెట్టెమీది తేనెటీగలా
అక్కడక్కడే తిరుగుతూవుంటుంది.
కొల్లలుకొల్లలుగా కొల్లగొట్టిన రుచులు చాలవు.
సుఖాల స్పాంజితివాసీలు మెత్తగా హత్తుకోకుంటే అడుగుల రొమ్ముల్లో హాయి సలపరించదు.
మధ్యలో పట్టిన మాధుర్యదశకదా
మనసుతీపులు జాస్తి.
ఓ క్షణం కరెంటు ఊట ఆగిపోతే
మేఘశయ్యమీంచి జారిపడ్డంత చికాకు. మండుటెండాకాలం మధ్యాహ్నం బీభత్సంలో
ఉక్కపట్టిన ఇరుకుగది తన ఒళ్లంతా పట్టించిన చెమటబంకను మరిచినట్టుంది ఆ ప్రాణి.
అనునిత్యం వీచే స్తోత్రపత్రాల గులాబీవింజామరలముందు ఆ మురికికంపుఅనుభవాలు గుర్తుంటాయా?
డా॥ సి. నారాయణరెడ్డి 65 ఇప్పటి వైభవంవేరు.
తాను కళ్లు నులుముకున్నప్పుడే ఉషోదయం. మైకులో చిలకరించే తనమాటల తుంపరలే చెవులదోసిళ్లతో ఆస్వాదించే సందేశతీర్టోదకాలు.
ఏవైపు తనచూపు తిరుగుతుందో
ఏ పదవీభిక్షువుపై తన అనుగ్రహం
అరమోడ్చువేళ్లతో ఒరుగుతుందో
నిరంతర నిరీక్షణల క్యూలు.
పేరుమత్తు నెత్తికెక్కినప్పుడు
నేలబారు నిజాలు కనిపించవు.
సమస్యల రాళ్లకుప్పలకింద గొంతుకలు పోగొట్టుకున్న అట్టడుగురొదలు వినిపించవు.
తనకగుపించేవన్నీ
ఒకే శ్రుతిలో గానంచేసే సవర్ణదృశ్యాలే.
వాకిట్లోంచి అడుగు కదిపితేచాలు
తనవెంట అతివినయాన్ని దొర్లించుకుపోయే
తాబేదార్ల కార్లబార్డు.
ఎంతటి నడమంత్రపుసిరిలో జోగుతున్నా
గతస్కృతుల చేదుబిళ్లలు చప్పరించకుంటే కాలమనే న్యాయపీఠం ఓ కుదుపు కుదుపుతుంది. అప్పుడు హఠాత్తుగా మైకప్పు ఊడిపోయి " అసలురంగు బయటపడుతుంది.
656 భూగోళమంత మనిషిబొమ్మ మౌలికవ్యక్తిత్వం వృక్షంలా ఎదగాలంటే
అతికించుకున్న నకిలీఆకుల భుజకీర్తులు
ఎందుకూ కొరగావు.
వేళ్లు కుల్లిపోకుండా వున్నప్పుడే - బిక్కచచ్చినట్టున్న మోడైనా
చిగురుతొడిగిన గోపురంలా శిరసెత్తి నిలబడుతుంది.
డా॥ సి. నారాయణరెడ్డి 67 సూర్యపదవి
ఈమధ్య సూర్యుడు మరీ వెలవెలబోతున్నాడు
పదవి కోల్పోయినవాడిలా.
అరిచేతిలో చూసుకున్నా కనిపించే తనముఖాన్ని తడివేళ్లతో తడివి చూసుకుంటున్నాడు.
ఊదితే దూదిపోచల్లా ఎగిరిపోయే మంచుపొగలుకూడా దాడిచేస్తాయి
కాలం కలిసిరానప్పుడు.
ఎన్ని హేమంతసీమంతాల్లోంచి
సిందూరరేఖలా దూసుకురాలేదు సూర్యుడు? చలిసందడి తనకు కొత్తకాదే.
కరిచే ఆ మొరటుచలినే శాలువాలా కప్పుకుని తూర్ప్చుదిక్కుమొనమీద నిక్కి నిల్చునేవాడు ఉన్నతపదవిలో ఉన్నవాడిలా.
గద్దెయెక్కగానే ఉజ్వలంగా వెలగడంలేదని దిగులా? కొందరికి పదవి వద్దన్నా మీదపడుతుంది వరూధినిలా మరికొందరికి సిక్సర్ సాధించిన క్రికెట్‌బంతిలా
68 భూగోళమంత మనిషిబొమ్మ ఒగరుస్తూ ఉరికినా అందదు.
పదవికి చిగురులా ఉండాలి యోగ్యత జిగురులా కాదు.
చీకట్లో చిరునామా కనిపించని సూర్యుణ్ని పదవీచ్యుతుడని అనుకోవద్దు.
పగటికీ పగటికీ మధ్య విరామనిశ్వాసం రాత్రి. ఉదయించే పొద్దుకూనను కొరుక్కుతినాలని పాగపురుగులు తెగమూగుతుంటాయి.
ఎర్రగా కనుగుడ్డు విప్పే బాలసూర్యుడిముందు అవి రెక్కలుకాలి రాలిపోతుంటాయి.
సృష్టికే దృష్టిని ప్రసారించే జగన్మిత్రుణ్ని
ఏ కొలమానాలతో కొలుస్తాం?
విశ్వసాక్షి అడుగుల్ని చూసే కాలం వెలుతురుగడియారాన్ని సరిచేసుకుంటుంది. ప్రభను మించిన పదవివుందా
ప్రతిభను మించిన పట్టావుందా
సూర్యపదవి చ్యుతిలేనిది
సహజప్రతిభ మృతిలేనిది.
డా॥ సి. నారాయణరెడ్డి 69 మౌనాగ్రహం
కత్తిమొనలాంటి ఆగ్రహాన్ని మింగుకోవడం
అతనికి కొత్తకాదు.
దాహమేసినప్పుడల్లా అతడు తాగేది సుడిగాడ్చుల్నే, ఎవడిమీద ఎక్కుపెట్టాలి ఆ విల్లు?
అన్నీ చీమతలకాయలే.
పదునుపెట్టిన పదం ప్రయోగించి ఏంలాభం కుళ్లుకునే రొచ్చుగుంటలమీద.
"పేగులు ఉడికిపోతున్నాయి
కడుపుచెరలోంచి చివ్వున తెంచుకునిపోయి
అవినీతి కొవ్వెక్కిన ఆ మెడకాయలకు
ఉఊరితాళ్లై బిగుసుకుపోవాలని.
నేలను కరుచుకుని పాకే అంగుష్టమాత్రులు
చెట్టంత కటౌల్లె చేతులూపుతుంటే
బతుకంతా త్యాగరక్తంలో పునీతులై నిలువెత్తుచేతికర్రలా నిటారుగా నడిచే సత్యమూర్తులు కార్టూనుఫిలింలో వేగంగా తిప్పితే ఉరికేబొమ్మల్తా
70 భూగోళమంత మనిషిబొమ్మ అపహాస్యం పాలవుతున్నారు.
శిలువకక్కిన దయామయుడు ఇక్కడ పరమపిచ్చోడిలా కనిపిస్తాడు.
చెమటతో తడిసి చివికిపోయిన అట్టడుగుమట్టిపడుచు రైకచిరుగుల్లో చొరబడి ఇక్కడి దున్నచూపులు సరదా తీర్చుకుంటున్నాయి. పశుత్వంనుంచి మనిషిని వేరుచేసే విలువలు పాఠ్యపుస్తకాల్లో తలదాచుకున్నాయి. అసందర్భంగా విచ్చుకునే పెదవుల పుటలు కృత్రిమదరహాసాలను అచ్చొత్తి చూపుతున్నాయి. మైకుల బకెట్లతో నినాదాల వేన్నీళ్లు కుమ్మరించి దుమ్ముపట్టిన దేశభక్తిఒంటిని శుభ్రంచేస్తున్నారు క్యాలెండర్ సూచనలను తు.చ. తప్పకుండా. మొదటిసారి పదవుల జపమాలలు తిప్పినప్పుడు అందరివీ అరమోడ్పుకళ్లే.
కాలంకెమెరామాత్రం సాక్ష్యంచెబుతుంది
వాటిలో ఓరగా చూసేవెన్నో
తిరిగే ఆ పూసలమాటున మరిగే ప్రచ్చన్నప్రలోభాలెన్నో. అధర్మానికీ చతుర్భుజాలుంటాయి. అలిసిపోయినప్పుడల్త్లా అవి
మోతమార్చిడి చేసుకుంటాయి.
ఏది నటనో ఏది బతుకో?
డా॥ సి. నారాయణరెడ్డి ౯ నిర్వచనాలనొసళ్లు నీరుగారిపోతున్నాయి.
వాగ్దానాల జరీవలల్లో చిక్కుకునేవి
ఉఊరపిచ్చుకల్తాంటి పిచ్చిగుండెలే.
పచ్చనోట్ట్ల ఆనకట్టలముందు
ప్రజాప్రవాహాలు చతికిలబడతాయా?
పిరికినరాలుండవు ప్రవాహాల పాదాలకు.
అవి ఊడ్చుకుపోతాయి.
కుటిలవ్యవస్థ కట్టిన పాపాలఖిల్లాలను.
72 భూగోళమంత మనిషిబొమ్మ మాఆయన మా ఆయన్ని తాగొద్దనలేదు తాగి అనవసరంగా వాగొద్దన్నాను. పుస్తకాలపుట్టల్లో తాను తలదూర్చినప్పుడు పాప ఏడిస్తే చిరాకత్తి పేపర్‌వెయిట్‌తో జడిపిస్తాడు. పానసమాధిలో ఉన్నప్పుడుమాత్రం యం.టి.వి. దయ్యాల ఘోషలకు నోరూరా చెవులర్చిస్తాడు. ఆ బృందఘోషలో తన మందుగొంతు రంగరించి “యా' అంటూ అరిచేస్తాడు. ఆ అరుపే నేను వద్దనేది. సోడా అందిస్తుంటే నాచెయ్యినొక్కి ఏమీ ఎరగనట్టుండే ఆ దొంగచూపుల్నే నేను అసహ్యించుకునేది. మాటల్లో ఆయన శృంగారం ఒలకబోసేది ఆ డి“వైన్” మూడ్స్‌లోనే.
డా॥ సి. నారాయణరెడ్డి 73 చిన్నప్పుడు తెలుగుక్లాసులను పుక్కిలించిన రోజుల్లో నాలుకకంటుకున్న ఆ నాలుగు ప్రబంధపద్యాలను 'ఒత్తులు మింగేస్తూ ఆలపిస్తాడు.
రసికారే తన రసికతను
రకరకాల భంగిమల్లో అభినయిస్తాడు.
సహపానం సమభావనకు సోపానమని
తాగే గ్లాసును నా పెదవులకు అద్దుతాడు.
వద్దండీ అంటూ తప్పుకుంటే
నన్నో ముతకసరుకులా చూస్తూ నా మొహంమీద ముసిముసినవ్వుల తుంపరలు విసురుతాడు. రోజులతరబడి సాగే ఆ నాటకానికి తెరదించాలనుకున్నాను.
ఓ రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చిన అతన్ని
“హాయ్ డియర్ అంటూ పలకరించాను మత్తుహత్తుకున్న కొత్తగొంతుకతో.
టేబిల్‌మీద కొనవూపిరితోవున్న సీసానుచూసి షాక్‌తిన్నట్టు అరిచేశాడు
“అయ్యో అరబాటిల్ ఖాళీచేశావా' అని. “సహజీవనానికి తొలిమెట్టు
సహపానంకదూ డియర్
అందుకే ఇలా పాలుపంచుకున్నా”నని అన్నాను ఖాళీసీసాను వేలికొవమీద తిప్పుతూ.
7డ్త భూగోళమంత మనిషిబొమ్మ మగధీరుడి ఒంటిమీదినుంచి నీరైకారిపోయింది
లోపల నింపుకొచ్చిన సరుకు.
ఇంకా కాస్తా ఉడికిస్తే ఇంకిపోతాడని
జాలిపడ్డాను.
“నటననుకూడా అర్ధంచేసుకోలేదా నా సామీ” అంటూ
నేను కొట్టిన మొదటి మొట్టికాయతో
పసివాడై పడిపోయాడు పాపం పతిదేవుడు.
డా॥ సి. నారాయణరెడ్డి ౯5 ఊర్వముఖంగా
దారంతో కదిపితే ఎగరడానికి
పటం కాదుకదా పక్షి
ఊర్థ్యయానం పక్షి సహజాతగుణం.
శూన్యఫలకంమీద లక్ష్యాల చుక్కలుంతవు.
నిర్వర్ణ నిశళ్ళబ్దాలుంటాయి.
అవి రెక్కల పెదవులమీద తొణికిసలాడే
మెత్తని పిలుపుల్ని ఏరుకుంటాయి.
తమమధ్య విధించిన దూరాలను చెరిపేయాలని నక్షత్రాలు తొక్కిసలాడుతుంటాయి.
కొందరికి అనిపిస్తుంటుంది
బతుకంటే పచ్చని కొమ్మలదే అని.
అవి పసరాకులవేళ్లతో పరస్పరం పలకరించుకుంటాయి. దారినపోయే గాలికి స్వాగతంచెప్పి
చెరిగిపోయిన దాని జుత్తును సరిచేస్తుంటాయి.
అది నిజమే అయినా -
ఎంత సుఖంగా ఉన్నా నిలిచివుంటే నిలువుపాతరే.
76 భూగోళమంత మనిషిబొమ్మ టపటపకొట్టుకుంటూ విశ్చంఖలంగా ఎగిసిపోయే సజీవ విద్యుత్‌పక్షాల వెల్లువల ముందు అవ్యక్తసీమలు తలలు వాల్చుకుంటాయి. అంతటి విశాలగగనం పక్షికంటిలో ఇంద్రనీలంలా ఇమిడిపోతుంది. పరుచుకుపడుకున్న పుడమిచూపంతా
తాన్సు వెళ్లలేని చోటికే.
మట్టిగుండెలో ఆరని ఆరాటం చిన్నిచిన్నిరణువులుగా రెక్కలకంటుకునైనా పుట్టుచెర ఒదిలించుకుపోవాలని. ఆలోచనలకుకూడా రుచించదు
సమతలంమీద సుశిక్షితంగా నడవాలంటే.
వాటి అరికాళ్లను మెరుపులు తొలుస్తుంటాయి. మెదడుఖైదులోంచి పారిపోయిన అలోచనలు ఊహల జరీదుస్తులు తొడుక్కుని
మబ్బులతో చేతులు కలుపుకుని
"స్వైరసంచారం చేస్తుంటాయి.
జడరూపాలకైనా సంకెళ్లు సరిపడవు. తెంచుకునిపోవడంలో ఉన్న అనుభూతి బిగుసుకుపోవడంలో ఉండదు. ఒరిగివుండమంటే గడ్డిపోదకూడా వినిపించుకోదు
డా॥ సి. నారాయణ)డ్డి 77 శిరసెత్తి నిక్కినిక్కి చూడాలనుకుంటుంది.
విత్తు చిట్లినప్పుడు చైతన్యం విచ్చుకునేది
పక్కల్లోకి కాదు పైపైకే.
బతికివున్నప్పుడే కాదుసుమా
మృత్యువు రెండుకళ్లు మూసినప్పుడూ
ప్రతిప్రాణి పయనం ఊర్థ్వముఖీనం.
78 భూగోళమంత మనిషిబొమ్మ బెను పసివాణ్నే అయ్యాను అంత పసివాణ్ని ఎలా అయ్యానో తెలియదు. ఆకాశంలోని అమ్మదిగొచ్చి పగిలిన నా గుండెను తన మీగడవేళ్లతో నిమరలేదే. చెట్టంతటి నాన్న కనిపించి చెదిరిన నాజుత్తును యెదకు హత్తుకోలేదే. అఆల అరిచేతులమీద నన్నాడించిన నా గురువు ఎదుటనిలిచి వాత్సల్యాన్ని వర్షించలేదే. మరి ఎందుకలా వణికిపోయాను? నిప్పుసెగకు వెన్నపూసలా కరిగిపోయాను. ఈదరగాలికి రావి ఆకులా ఎందుకలా కంపించిపోయాను? ఏం పొగొట్టుకున్నానని లేగదూడలా అరిచేశాను? గీతకు కొత్తగీతలు గీసిన నాధీరస్వాంతం అలా అలుక్కుపోయిందేమిటి? ఉక్కుకవచంలా నిలిచే ఒంటినిబ్బరం చేతుల్లోంచి నీరుగారిపోయిందేమిటి?
డా॥ సి. నారాయణరెడ్డి 79 ఇప్పుడు గుర్తొస్తున్నది నాకు
చుట్టూ పాతుకుపోయిన ఆ శీతలవాతావరణం. మధ్యమధ్య ఆనవాళ్లు పట్టలేని
నేను బాగా ఎరిగిన ముఖాలు.
మసకకమ్మిన మానవదృశ్యాలను చీలుస్తూ
ఏవో ఏడ్పుల గాడ్పుల రొదలు.
ఎక్కడ వాలిపోవాలని నాకాళ్లు
కార్లోంచి విసురుగా దూకొచ్చాయో
ఏది చూడాలని నా బిత్తరచూపులు
ఎదురుపడ్డ తలలమీంచి జారిపడ్డాయో
ఆ ముఖం కనిపించింది నాకు. మణిమకుటాలకు జనభాష్యం చెప్పిన ముఖం పదితలల రాజసాకృతిని
ఒకే అద్దంలో చూపిన ముఖం
మొత్తం చిరునవ్వులకళలను చంద్రుడికి అరువిచ్చి ముభావంగా పెదవులు ముడుచుకున్న ముఖం గర్జనలెక్కడ ఉబికొస్తాయో అని
కంఠాన్ని ఒత్తిపట్టుకున్న ముఖం
కదిపిన పెదవిపైన నా పాటను చిలకరించి కలిపినచేతిలో చిక్కని చెలిమిని రంగరించి
తన కనుపాప సింహాసనంలో
కవిగా నాకు అర్భాసనమిచ్చిన ఆ మహోన్నతనుజ
80 భూగోళమంత మనిషిబొమ్మ నిద్రకాని నిద్రలో నిశ్చల మృత్యుముద్రలో
అనూహ్యస్థితిలో మౌనంగా నన్ను పలకరించినప్పుడు
నేనెవరోనాకు గుర్తుంటే మనిషినెలా అవుతాను.
అందుకే ఆ క్షణంలో
దేవుళ్లను కూడా కలవరపరిచే
పసివాని రోదననయ్యానేమో!
డా॥ సి. నారాయణరెడ్డి 81 సౌమనస్యాన్ని పీల్చుకుందాం
పలుకున్న అక్షరాలను పూడ్చినా
'ప్రవచనాలై మొలుస్తాయి.
పల్గవకృతులై ప్రసూనాకృతులై
పరిమళభాష్యాలను ప్రసరిస్తాయి.
విభిన్నముఖాలను ఒక్కముడికెక్కించే వాక్కులు అసహనదుర్గంధాన్ని కక్కేస్తుంటే
సౌమనస్యాన్ని ఎలా పీల్చుకుంటాం?
మొన్నటి అచ్చుపుటలను ముక్కలుముక్కలుగా చింపేసి' కలగాపులగంగా కలిపేసి
చేతికందినవల్లా చదివేస్తే కలిగే విషమాన్వయం విద్వేషధాతు విస్ఫోటనం.
ఆ విషవృక్షాలను నాటిన చేతులు ఎక్కడున్నాయి? భూతకాలసమాధుల్లో బొమికలై పడివున్నాయి. బొమికలనుపట్టుకుని ధుమధుమలాడితే
పోగొట్టుకున్న మూల్యాలు ప్రాణం పోసుకుంటాయా? వర్తమాన కాంతిబిందువును
82 భూగోళమంత మనిషిబొమ్మ మసకలేని చూపులతో ఊదిచూద్దాం.
పొరలూ పాగలూలేని స్వచ్చ తేజోవలయంలోనే శిరోబింబాలను పొదుగుకుందాం. అచ్చమైనప్రతిశబ్దం ఒక అద్దం.
అందులో కనిపించేది అంతరంగప్రతిబింబం. అద్దం నాసిరకందైతే అన్నీ వికృతరూపాలే. వాతావరణకాలుష్యంలా మనోమాలిన్యం వ్యాపిస్తే మసిగుడ్డలాంటి మనుగడే మిగులుతుంది. గాలిని ప్రసరించనీయండి జీవవాహినిలా
గళ్లలో కుదిస్తే యెలా?
నీళ్లమెదళ్లను గుంటలుగుంటలుగా నిలిపేస్తే గులగులలాడేవి క్రిముల్లాంటి ఆలోచనలే. వాకిట్లో విశాలవిశ్వం దినపత్రికలా వాలుతూవుంటే ఖండమతులతో వీధివిన్యాసాలా?
అస్తమానం “నేను” అనేది గానుగలా తిరుగుతుంటే ఒక్కొక్క అర ఓ లోకమై నీల్గుతుంటే
సమిష్టిదృష్టికి అడుగడుగునా ఉరికంబమే. ఇరుకుగుణం హరితజీవితాన్ని ఎదగనీయదు వృక్షమూలాన్ని నొక్కిపట్టే రాతిగుండులా. ఎన్నికోరలను తప్పించుకుంటే ఒక శిశూదయం. ఎదిగిన హృదయం శైశవంలా స్పందిస్తే
సౌహార్దం శ్రుతితప్పదు. సంకల్పం లయతప్పదు.
డా॥ సి. నారాయణరెడ్డి 83 నిర్దేతా జాగ్రత్త
ఏడాదుల పొడుగునా
సుడిగాడ్పుల దొంగదాడులను చూసినకళ్ళకు ఈ దుమ్ము కొత్తేమీకాదు.
అది ఊరేగుతున్న వసంతంపైన విసిరిన పుష్పాడి అంటే చేసేదేమీ లేదు.
పిల్లులు గోడలుదూకడం మానేశాయి పెద్దమనుషులను చూసి.
కర్చీపులు మార్చినంత సులభంగా
విశ్వాసాల లేబుళ్లు మారుతున్నాయి. తాగడానికి గ్లాసెడు నీళ్లు పుట్టకున్నా
నోళ్ల కొళాయిల్లోంచి
వాగ్గలధారలు నిరంతరం వర్పిస్తున్నాయి. కరెంటుకోత ఉంటేనేం?
భారీనినాదాల ట్యూబ్‌లైట్లు మహోజ్వలంగా వీధుల్లో తగలబడుతున్నాయి.
నిఖార్సయిన పలుకువిత్తనాలు మొలకెత్తే
84 భూగోళుపంత మనిషిబొమ్మ నాల్కలపాదులు ఏమైపోయినట్టు? అంతటా సెవెంటీ ఎం.ఎం. సభలే. తిరుగుతున్న ప్రసంగాల రీళ్లన్నీ బహురూపుల్లో ముంచెత్తి చూపే భవితవ్యాలే. అబద్ధాల అలలు పొంగుతున్నాయి
గాలి పీల్చుకున్నంత సహజంగా. ముఖాలన్నిటిపైన ప్రముఖంగా తగిలించుకున్న రంగురంగుల అంచనాల పట్టికలు. అంతరాత్మగొంతు పిసికేసినవాళ్లకు
పెదవులు చిమ్మే ఆర్భాటాలే ప్రమాణాలు. వినేచెవులు ఎగబడి వింటూనే ఉన్నాయి. రోజులు దొర్లుకుపోతున్నాయి
స్వఘోషణల పరదూషణల పరిభ్రమణంలో. ఒడ్డుమీద నిల్చున్న శ్రోతా!
నిర్లిప్తత అంటే మరేమీకాదు వేదాంతంముసుగులోవున్న నిర్వీర్యత.
ఓ వర్తమానబాతిజాతకనిర్దేతా!
నీ హక్కును ఆయుధంగా ప్రయోగించు. జిగేలనిపించే నకిలీగోళాలను ఆర్పేసి మౌలికతేజోబింబాన్ని ఆవిష్కరించు.
డా॥ సి. నారాయణరెడ్డి 85 దిక్ భ్రాంతి
కుర్చీ యిటు జరిపినప్పుడల్లా
ఓ కొత్తదిక్కు కలంలోకి ఎక్కుతుంటుంది. "ెచ్చులుపెచ్చులుగా విచ్చుకుపోయిన నిశ్శబ్దాలు ఒకే వునాదిలో మునిగిపోయి
గోడల్తా గొంతుసవరించుకుంటూ నిలబడతాయి. వేలాడేగంటలకు మోగాలనివుండదు. తాటికాయల్లా కప్పును కరుచుకుని చూస్తుంటాయి. బారుచీమల వినతిపత్రాల సణుగుళ్లు
ఊరేగే ఏనుగుతొండాలకు మాత్రమే వినిపిస్తాయి. కొత్తదిక్కు చెవులకేమో తోచదు.
అవి టెలిఫోన్‌తీగల్లో దూరిపోయి రహస్యసంభాషణల జిరాక్స్ కాపీలను ఉత్పత్తిచేస్తుంటాయి.
సీల్‌వేసిన గోపురంముఖంలోంచి
రెప్పలు అరుస్తుంటాయి కనుపాపల కుత్తుకలతో. గూళ్లకు ఎప్పుడో తాళాలుపడ్డాయి.
86 భూగోళమంత మనిషిబొమ్మ నడివీధుల్లో అగుపించేది మృగసంచారమే. తోడేళ్లు గొంగళ్లుకప్పుకుని తిరుగుతుంటాయి. తడినేలమీద అహింసమార్కుల్ని ముద్రిస్తూ. గోతుల తలలపైన నిక్కిచూస్తుంటాయి జీవకారుణ్యం మొలకలెత్తిన కుండీలు. కొత్తదిక్కుకు గుబగుబగా వుంటుంది
తన అలికిడికే తలుపులన్నీ తెరుచుకోవాలని. ఎందుకు తెరుచుకుంటాయవి
లోపల దయ్యాలు దైవభాష రిహార్సల్స్ చేస్తుంటే. గ్లోవ్స్ తొడుక్కుంటే పంజాలను గుర్తుపట్టేదెలా? ప్రవచనాల క్షీరతీర్థాలముందు సమస్తం పవిత్రమే. ఉన్నట్టుండి నరరక్తవాసనలు గుష్పుమంటాయి ధ్యానాసనం వేసుకున్న వాయుమందిరంలో. కుర్చీమనసు చివుక్కుమని మరోపక్కకు తిరుగుతుంది. కొత్తదిక్కుకు ఏ దిక్కుతోచక
కుర్చీకాళ్లు పట్టుకుని భోరున ఏడ్చేస్తుంది.
ఆ దుఃఖంధాటికి తట్టుకోలేని రాబందులు పావురాబై వర్షిస్తాయి.
నోరువిప్పని గంటలు పీడితకంఠనాళాలై ఆర్తనాదబృందాలను కదిలిస్తాయి.
మనుషుల నెత్తుటి వాసనలు వీచినదారుల్లో మైత్రీధూపాలు పరిమళిస్తాయి.
డా॥ సి. నారాయణరెడ్డి 87 కుర్చీ అదే.
దిక్కు అదే.
ఉన్నతేడా అంతా
కాంతికీ భ్రాంతికీ మధ్య గీటుగీసి చూపే
88 భూగోళమంత మనిషిబొమ్మ భూగోళమంత మనిషిబొమ్మ ఈ భూమికడుపు కుమలిపోతున్నట్టున్నది. విత్తనాలు నాటితే మసిముద్దలు పేలుతున్నాయి. గాలివిసురుకు ఇక్కడి గడ్డిపోచలు నెత్తురుకార్చే వత్తులసెగలవుతున్నాయి. చెట్లవేళ్లకు నిదరపట్టడంలేదు పార్లిపడుతున్నాయి అరుపుల్త్లా కొమ్మలసందుల్తోంచి. నాభిలో మెలిపెట్టిన పసిబిడ్డలా వాతావరణం గిలగిల తన్నుకుంటున్నది. రొదలకుత్తుకలను ఎవ్వరో పిసికేసినట్టున్నారు. మూల్గులు వలసపోతున్నాయి కొనవూపిర్లను కొంగుల్లో బిగబట్టుకుని. అశాంతినీటిపారమీద ప్రాణకణాలు బుడగల్లా బితుకుబితుకుమంటున్న్హాయి. భయాలను పీల్చుకునే బతుకుల్లో మృత్యువిషం పొదరసంలా పరుగెడుతున్నది. దుర్గంధమని ముక్కుమూసుకోబోతే
డా॥ సి. నారాయణరెడ్డి 89 వేళ్లే కంపుకొడుతున్నాయి.
తింటున్నవి మెతుకులే అని తెలిసినా
నాల్కలకు పురుగుల్తా తగులుతున్నాయి.
తెగించి సాగిపోయే అడుగులు తెగిపడితే
ఎక్కడ తెచ్చేది వాటి గుర్తింపుకార్డులను. అలుక్కుపోయినట్టున్న రహదార్ల అద్దాలను
చూపుల తుండుగుడ్డలతో తుడుచుకుంటూపోవాలి. కాగితంముక్కలేకదా అని కాలుమోపితే గోతులదవడలతో లాగేసుకుంటున్నాయి.
ఈ అనిశ్చితి చెలూన్‌లా బద్దలైతే బాగుండేది.
ఈ దుర్వ్యవస్థ ఏ వరదకో కొట్టుకుపోతే బాగుండేది. అప్పుడు కొత్తశ్వాసలు మొలకెత్తుతాయి.
శరీరాలు తలలూపుతాయి స్వేచ్చగా
పచ్చగా ఎదిగిన పైర్లలా.
ఒకరినీడ మరొకరికి భూతంలా అగుపడే మనోవైక్షబ్యాల మసకలుండవు.
అప్పుడు ముసుగేసుకుని నడిచిపోయే విషమదశపట్టదు వెలుతురుకు.
వర్ణముద్రల కుంచితపరిధుల్లేని అచ్చతెలుపుహృదయాలు స్వచ్భంగా కలుసుకుంటాయి. కన్నీటిచుక్కలను రొట్టెముక్కలను
కలిసి పంచుకుంటాయి.
90 భూగోళమంత మనిషిబొమ్మ ప్రబోధాలపంజరాల్లో టపటపకొట్లుకునే మానవత రెక్కలెత్తి ప్రతిముంగిట్లో వాలుతుంది. సృష్టి ఎత్తిన నవయుగకేతనం మీద మనిషిబొమ్మ భూగోళమంత నిండుగా నిలుస్తుంది. ఎయడంయ్యు బంధ గ నా... .
మ. శిగంంంనాణ4 శక! 800404 0౧ ౧ సటనటుకుం బా | | ,
ః