Telugu Bhramarageethamu - anilvaranasi/indianlanguages GitHub Wiki
॥ ఇ _ కాతావనాణదినదదండా ల రాసనాలననననానినిననననుననాను నననతపాననననననాననుకునాతా ననన నానా ననన నని ననననననననననననననననననననని టల = లక ను క్ నీ ; స క స. గి | ॥ భ్ న్ , 1. - న కే జ ష్ ర్ 1 గ్ మో సా ననే స ర్న కో ల టు ల్ని | నై మా యం న స. న న నాన జీ / 14 - కీ ౮! [| భి " (| స్రవా చ్ / ఖా ో శ /| క్ స స మ ఉక. . ల. ఇ టు - * జ టో. న్ ల 1 డు క! / ల, | ర్. 2 ర్ మో వ పం న్న ప గ్ కరా టో. చ వ్ (| 41 వ - మ ని చ్చు ప్ ్ల న 2. మ మ... లర. 4“. / స సమ్. ] |. ల ో // ౫ ్ట/ గ శ్ ట్ (2. 1 1 టా శ / నీ శో కన్ ల! న గ్గ క! గ ( 1 లం క ్ శ స్ అప ము అన సీ (తానా లం ననన 6 4 క్రో. శ లీ ౮ న షో రాయ శయ ట్ న్ జ. గ య్. | న లో నీ గ స! న పై! ద ర్య టు టన. న స క. సా. చల షట. సరే పి న. న ర?
ఉత్పల రచనావళి -60 భ్రమర గీతము శ్రీదళమన్కంధంలోని నలభై నీడన అధ్యాయానికి గోపీనయనోత్పలార్దిత వ్యాఖ్య ఉత్పల సత్యసారాయణాచార్య ప్రచురణ పోతన కీర్తి కౌముది 330 అలకాపురి, రోడ్ నెం.10 'హైదరాబాదు-35
“వ్రెటగాశ4గం 6౮౭477౪” ల రా7747 64/4 వందింగ47౧0౧౦౫౧౧04400/6, గ 7272012264 7068 4౧4 172267 4 ౦00౧627020” 22 220484 ౭40//28 (0 ౧2౯ 47/4 ౮08౧0467 ల వగ744 8౧4క్రింండ/6 - ర? దిడూంగాడాలణంగడ%4 - రరం7?- 2 ౧26 67/60 | 6040) 42467 026 2/6 064 కొళంంగ?” ం౫ర/టణిండీ 6౮౨౭740 2 లం తండంాం కొలింంగాగ 6660. సా 6640246 00 కొగర్సిగ్ 162 12260202 వణలింగ4ం0ు4 వంగగడ. కార్లంంి సి ర రిగర్సగతు వ470022260%000.. 0౭౧౧౧౦౫ ౧ 6722006462 గంం/446 5౧ 6. గిం/4ంంండ. గిండడంు 2074 00 క గంగం4 7౭౦౧07 ౧ వడగాంాగ తీంయడంగటు తరడం/0ర04 7% బి 7ల0సణండో 0౫ 20 గం౪ం7లింగ 2005 ల “026424 కంం//%/ గడంజ%441 కడ6ం7454డ4 ౮ గ హం 041401 : 11.11.2005 ల్ అ484001 . ళా టో టొరాల ణ్ ॥ ఖా వం శన లై66 ఏ మె. 75/- లా ఎం, ఆళి గం 561028 : వ లో 200000 ౮0మయ5 వెలా పా గో క4లా026-44 9% : 27660్రుర్తటైల్. లాడ్య0 సో జు వార66 26: ఛ్ 01 541 6౫1103, కు కృరలజ0264-27 1 : 27560543 వో 000టజ 02) 06 1264 షం : రథిజ* 330, తీ!12క£2001, ం24 ౦. 10, 60ల2026-35 ఛ+ం21206412 0011046003 - 4&11 3400063 206272 9001 ంటం6, 164 ఉగ/& ముఖ స4జ060 కజయికైం62 రేల8026. ౨% : 24652387
ప్రకాశకీయము
పోతన కీర్తికొముది పక్షాన వెలువడుతున్న నురొక భాగవతీయ వ్యాఖ్యాన (గ్రంథమిది. శ్రీ ఉత్ప్చలవారి రచన,
'ఆంధ్రభూమి' సచిత్రవార పత్రికలో 'వ్యాసభూమి' శీర్షిక క్రింద ధారావాహికంగా (ప్రచురితమైన ఈ *భమరగీతము” మరింత పరిపూతమై పుస్తకాకృతితో చదువరుల కరకమలాలను అలంకరింప నున్నందుకు ఆనందిస్తున్నాము. ఈ శుభ సందర్భంలో ఆంధ్రభూమి వారపద్రికా సంపాదకులు శ్రీమతి ఏయస్. లక్ష్మిగారికి, డక్కన్ క్రానికల్ పత్రికా సముదాయ అధినేత, ప్రధాన సంపాదకులు, మాన్యులు శ్రీ టి. వెంకట్రామ్ రెడ్డి మహోదయులకు (ప్రప్రథమంగా సాంజలి కృతజ్ఞతలను తెలుపుకొంటున్నాము.
భాగవతీయమైన ఈ సుమధుర రసమయ వ్యాఖ్యా గ్రంథాన్ని సత్సాహిత్య ప్రోత్సాహకులు, బహు(గ్రంథకర్తలు, సంపాదకులు, సంతత పరోపకారచింతనులు అయిన 'ప్రొః వజ్జల వేంకట సుబ్రహ్మణ్య శర్మ మహోదయులకు, వారి జన్మ దినోత్సవ శుభవేళ ఆప్యాయంగా సమర్పించడం సహృదయ విద్వల్టోకానికి అత్యంత ముదావహమైన సత్రియగాను, మాకు బహుమాన్యతగొను భావిస్తున్నాము.
ఈ (గ్రంథ ద్వారబంధానికి లేత మామిడాకు మంగళ తోరణంగా “ప్రవేశికను క్షైసీసిన శ్రీకృష్ణానుగృహ్తలు, సుగ్భహీత శుభ నామధేయులు, కాకతీయ విశ్వవిద్యాలయ భూతపూర్వ ఆంధ్రభాషా శాఖాధ్య్షులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య మహోదయులకు హార్షికమైన మా కృతజ్ఞతాంజలులు సమర్పిస్తున్నాము.
తాము భద్రపరచుకొన్న 'వ్యాసభూమి' పేపరు కటింగులు అందజేసిన రచయిత్రి శ్రీమతి డి. తారాబాయి, ఎం.ఏ. గారికి ఎంతో (శ్రమకోర్చి శ్రద్దాసక్తులతో డి.టి.పి, చేసిన ఫాంట్లైన్ (గ్రాఫిక్స్ అధినేత్రి శ్రీమతి యార్లగడ్డ నిర్మల గారికి శ్రీమతి పాఠం సునీత గారికి శ్రీమతి పఖినాల పద్మావతి గారికి సర్వదా కృతజ్ఞాలము.
ఈ యాంత్రిక యుగంలో జనులు అనేక క్షేశాలతో సంతప్రమవుతుంటారు. జీవితంలో సమస్త విపత్తులను, క్షేశాలను తప్పించుకోవాలనే ఇచ్చ గలవారు శ్రీమద్భాగవత భక్తి రసాయనాన్ని సేవించక తప్పదు. స్వాస్మ్యప్రదమైన, సులభమైన మహౌషధం లోకంలో ఇది తప్ప మరొకటి లేదు. శ్రీ ఉత్పలవారి సుమధుర రసమయమూ, గోపీనయనోత్పలార్చితమూ అయిన భాగవతీయ వ్యాఖ్యా (గ్రంథము అందుకు పర్యాష్తమైనదన్న విషయం సర్వజన విదితమే.
“హరిస్కృతిః సర్వవిపద్విమోక్షణమ్” (శ్రీమదా. 8-10-55) సాయం బసవలింగప్ప, ఎంఏ. అధ్యక్షులు, పోతన కీర్తికౌముది విశ్రాంత ఆర్థికశాస్త్ర శాఖాధ్యక్షులు సర్దార్ పటేల్ కాలేజి, సికింద్రాబాదు సడల0ల 0501101101 300160 క్పరీలఅ20ష6
౧ 07612 540125920020210/2 'కముమటాం4స4 క₹70[63901 0221028 (6164. 9.1-190, 6102161 228/4 ౮౧1౪6910 00౧ : 4640112 ౧6౩66 ₹14224[-506002 20: 0870-2437999 ప్రవేశిక
కేచిత్ పరామేన వదంతి లక్ష్మీం
లీలేతి కేచిత్ కిల తత్ త్రికాయాం
అవ్లాదినీ శక్తిరితి శ్రుతిః సా
శ్రీరాధికాఖ్యా వ్రజచంద్ర కాంతా ,
పరాత్పరుడైన శ్రీకృష్ణదేవుని హ్హాదినీ (ఆహ్లాదినీ) శక్తి శ్రీరాధాదేవి. ఆమె వైభవమే మొత్తం శ్రీకృష్ణ వాజ్బయం అంతా పరివ్యాప్తమై ఉన్నది. శ్రీమద్భాగవతం గోపికారూపంలో ఆమెను చెప్పకుండానే చెప్పింది. 'అవయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వరః' అన్న మాటలో రాధా నామం గూఢంగా ఉన్నదనీ, శ్రీశుకదేవుని తమ ఉపాస్యదైవతం పేరును అలా సూచించారనీ సం(ప్రదాయం. 'అనాదియైన పురుషుడు ఒకడే. ఆతడే సాకారుడై సర్వరసములనూ ఆహరిస్తాడు. తానే నాయికారూపం ధరించి సమారాధన తత్పరుడౌతున్నాడు. ఆ నాయికను అందుకే రసికానందయనీ, రాధిక అనీ వేదవిదులంటున్నారు' అని సామరహాస్యోపనిషత్తు చెప్పుతున్నది. ఒక విధంగా శ్రీమద్భాగవతం అంతా 'శ్రీరాధికాయాః చరితం మహతో అనుకోవచ్చును. పరమమోహకమైన మన్మథ మాన్మథమైన శ్రీకృష్ణోపాసనకు క్షీం బీజం నిర్దిష్టుయింది. దీనిని రాధాకృష్ణుల సమష్టీ ఆనందస్వరూపంగా వ్యాఖ్యానించటమూ ఉన్నది. భాగవతంలో కృష్ణానుభవం సమగ్రంగా పొందిన పారు గోపికలు. వారి కోసమే పరమాత్ముడు గోకులంలో జన్మించారు. “జయతి తే౭_ధికం జన్మనా వ్రజ: శ్రయత ఇందిరా శశ్వదదత్ర హి ఇటువంటి గోపికల మహాభావానికి వశుడై భగవంతుడన్నాడు - 'మీ బుణం ఎన్నియుగాలైనా తీర్చుకోలే'నని. భాగవత రూపమైన పారమహంస్య సంహిత భక్తి సంప్రదాయాలకు కల్పవృక్షం. తాత్వికపరిణతికి
శిభరాయమాణమైంది. కావ్య సౌందర్యానికి విశ్వవిశాల విపణి, ఆ భగవంతుడేమో - బృందావనం విడిచి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళడని భాగవతం చెప్పింది. ఆ గోపికల తాదాత్మ్యం ఎంతటిదీ అంటే ఆయన వారి చెవులకు కలువపూవై, కళ్ళకు కాటుకలై, వక్ష్యస్టలాన ఇం(ద్రలీలమణిహారమై
(ప్రకాళించినారట. ఇంతగా అవినాభావ సంబంధం పొందిన గోపికలు ఉండే బృందావనం వైకుంఠమే కాక మరేమౌతుంది?
నాడు పోతన్న, సూరదాసు లెట్టాగో, ఈనాడు భాగవత నిత్యమననం చేస్తూ తన జీవనపరమార్థసాధనకు. నిచ్చెనగా దాన్ని ఏర్పరుచుకొని, వాజ్మయోపాసన ద్వారా ఆ
శ్యామసుందరుని. చేరుకునే ప్రయత్నం చేస్తున్న పరమభాగవతకవి. శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్యులు. జీవిత చరమాంకాన్ని శ్రీకృష్ణ భావమయం చేసుకొని సాహిత్య సౌందర్య పరిమితులు దాటి బృందావన వేణుగీతికామాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తెలుగు సారస్వతాన్ని సంపన్నం చేస్తున్నారు. ఆధునికాంధ్ర సాహిత్యంలోకి వంగభాషావాజ్మయాల ద్వారా చైతన్య మహాషఫ్రభువు భక్తి సంప్రదాయం ప్రవేశించి భావకవిత్వాన్ని మాధుర్యసరస్సుగా రూపొందించింది. రాయప్రోలు, కృష్ణశాస్త్రీ బసవరాజు అప్పారావు, విశ్చనాథ సత్యనారాయణ ఇలా ఆ కవులందరూ ఇంచుమించుగా కృష్ణభక్తిలోకి తన ప్రణయ భావనను సంగమింప జేసినారు. జీవిత పరభాగంలో రాయస్రోలు వారు రాసపంచాధ్యాయిని తెలుగులోకి పరివర్తింపజేయగా, విశ్వనాథ శ్రీకృష్ణ భావనలో భ్రమరగీతము గోపికాగీతము, శ్రీకృష్ణ సంగీతము. ప్రద్యుమ్నోదయము మొదలైన కావ్యాలు నిర్మించారు. (భ్రమర గీతము, గోపికా గీతలు భాగవతంలోని ఆయా ఘట్టాల (ప్రేరణతో ఆత్మానుభవ పర్యవసాయులుగా తీర్చిదిద్దబడ్డ కొవ్యాలు. గోపికాగీతాలలో చింతాఖండము, అన్వేషణాఖండము, సాక్షాత్కార ఖండమని మూడు వందల పద్యాలు. 'నా వాక్కున గోపికా కృతిని వానిని (శ్రీకృష్ణుని) మోసము జేసినాడి అంటాడు కవి. (భ్రమర గీతలు కూడా వంద పద్యాలలో విస్తరించిన కావ్యం. శ్రీకృష్ణ సంగీతం నూట ఎనిమిది మంది గోపికల అనుభూతులను విస్తరించిన కావ్యం.
ఆ భక్తిభావ పరంపరను విస్తరిస్తూ నేటికి శ్రీకృష్ణ కావ్య సందోహాన్ని వ్యాఖ్యానాలను సృష్టించి యిస్తున్నారు ఉత్పలవారు. సంపూర్ణంగా ఈ మార్గంలో వెలిగి వచ్చింది 'రాసపూర్షిమ' కావ్యం 1995లో, దీనిలో ఫలవిక్రయిణి పుళిందవృద్దురాలను స్వామి ఆనుగ్రహించిన వృత్తాంతం ప్రధానం. ఈ గాథను పోతన్న స్పృశించలేదు. ఆమె తుదకు బృందావనంలో రాస(శ్రీడలో చేరి గోపీభావం పొందింది. మంజరి స్థితిని పొందింది.
రెండవ కావ్యం “శ్రీకృష్ణ చంద్రోదయం.” మూడువందల పద్యాలతో సాగిన ఈ కావ్యం. దీనిలో రాధాదేవి శిశువుగా శ్రీకృష్ణుల సన్నిధానం చేరుకోవటమనే నూతన వృత్తాంతం కూడా
ఉన్నది, ఉత్పలవారి పద్యం కరుణశ్రీ మొదలైన కవులు తెలుగు పద్యానికి సమకూర్చిన సారళ్యానికి తోడుగా మాధుర్యం జతకూర్చుకున్నది. -
ఉత్పలవారి కావ్య నిర్మాణం సాగుతున్న తీరులోనే భాగవతంలోని ప్రముఖ ఘట్టాలు - శ్రీకృష్ణ సంబంధమైనవి గ్రహించి విపుల వ్యాఖ్య పండిత పామర రంజకంగా తీర్చిదిద్దుకున్నాయి. ఇతఃపూర్వమే వేణు గీతం, గోపీగీతం మొదలైనవి, తెలుగులోని శ్రీకృష్ణ శతకానికీ విపుల వ్యాఖ్యానం వెలయించారు.
ఉత్పలవారి వ్యాఖ్యానాలలో ప్రత్యేకాంశం క్లిష్టమైన భాగవత తాత్పర్యాన్ని పూర్వాపర సన్నివేశాల వివరణలతో, అనేక సమాన భావ సంపుటుల ఉదాహరణలతో, సూక్ష్మసూక్ష్మ పదపదార్థ వివేచనతో మనను ఆకట్టుకునే స్వభావం ఉన్నది. వారి వ్యాఖ్యలలో పొండిత్యపు లోతులైతే ఉంటాయికాని, ఆ పాండిత్య ప్రకటనం ఉండదు. ఆత్మీయంగా - ఇంకా చెప్పాలంటే సఖీసమ్మతంగా ఒక ప్రీతి సల్హాపం వలె సాగి పోతుందీ వ్యాఖ్యాధోరణి.
మా పితామహులు ఉభయ వేదాంత (ప్రవర్తనులు శ్రీమాన్ కోయిల్ కందాడ రంగాచార్య స్వామివారు శ్రీ మద్రామాయణాన్నీ. భగవద్విషయాన్నీ (శ్రీ శఠగోపుల తిరువాయ్ ముళి వ్యాఖ్యానం) (ప్రవచింపగా చిన్న వయస్సులోనే కొంతకొంత విన్న అనుభవం నాకు ఉన్నది. ఆ కాలక్షేపగోస్టి ఒక గగనధునీశీకరముల చెమ్మలాగా అహ్హాదం కలిగించేది. చెప్పినట్టు ఉండకుండానే అనేకానేక విషయాలు ్రసక్తాను ప్రసక్తంగా వచ్చేవి. ఆ ప్రవచనం విద్వద్దోస్టి కాదు. ఆకీ గయ చైతన్య ప్రస్తారం. తనను తాను విస్తరించుకున్నట్టుగా సాగిపోయిన తత్త్వసుధా (ప్రవాహం.
శ్రీ కులశేఖరులను గురించి ఒక గాథ ప్రచారంలో ఉన్నది. శ్రీమద్రామాయణ కాలక్షేపం జరుగుతున్నది. సీతాపహరణ ఘట్టంలో తల్లి దగ్గర ఎవరూ లేరు రావణునితో తలపడేందుకు. ఆ దైన్యాన్ని విన్నప్పుడు ఆయన తమ సేనాపతితో ల౦కమీదకు దండ యాత్రకు బయలుదేరమని ఆజ్ఞాపించినారట. అంతటి తాదాత్మ్యం కలిగించే ప్రవచన గోస్టి అది!
ఉత్పలవారు గోపీగీతంలోను, వేణుగీతంలోనూ, ప్రకృతం సమర్సించుతూ వున్న (భ్రమర గీతంలోనూ ఈ తాదాత్మధోరణి ప్రకటంగా ఉన్నది. లోపలికి కొంచెం దూరం ప్రవేశించగానే మనము బృందావనంలో, గోపికా సమూహంలో ఒకరమై, శ్రీరాధాదేవి సఖులలో ఒకరమై, ఆ అనుభవసముద్రంలో మునిగితేలుతూ వున్నట్టుగా అనిపించుతుంది.
'వ్రజభూమి (ప్రేమభూమి. భగవంతుని లీలాభూమి. అక్కడి (ప్రతిరజఃకణమూ సంపూర్ణ రసమయమయిందే. అక్కడి (ప్రత్యణువులోనూ అనంతానందధారలు నిర్భరితమై ఉన్నాయి."
ఇలా సాగి పోయే వివరణ మనకు బృందావనాన్ని ప్రత్యక్షీకరించటం లేదా? శ్రీ ఆండాళ్ తమ పాశురాలలో బృందావనం వర్ణనలో 'నిండైన పాదుగుల నెటినొప్పు ఆలు కుండల నిండ పాల్గురిసెడి అలు' అని వర్షించిన సన్నివేశం గుర్తుకు వస్తుంది. (మూడవపాశురంలో)
ఈ గోపికలందరూ ఎవరు? 'గోపజాతి ప్రతిచ్చన్నా దేవా గోపాలరూపిణః ఈడిరే కృష్ణ రామౌచ నటా ఇన నటం నృప" భగవంతుడు బృందావనంలోనికి సపరివారంగా దిగివచ్చాడు. ఇదంతా నాటకం. మహారాసం. గోలోకంలోని అనుభవాన్ని భూలోకంలో ప్రతిఫలింపజేయటం. అందువల్ల బృందావనంలో నాటి నుంచీ ఎప్పుడూ దేవతలు, శ్రీకృష్ణ చంద్రుడూ ప్రత్యక్షంగానే నెలకొని ఉన్నారు. ఈనాడూ బృందావనానికి వెళ్లితే వేణుగానాన్ని వినగలిగిన గోపీభావం పొందిన మహాభక్త కోటి ఉన్నది. మధురకేగినా స్వామి దూరం కాలేదు. 'మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద' అన్న భగవద్వాక్యమే దీనికి ప్రమాణం.
ఈ అంళం ఉద్దవుని వంటి జ్ఞానికి, బృహస్పతి శిష్యునికే అర్ధం కాలేదు. ఉద్దవుడు శ్రీకృష్ణ తనూవర్షము కలిగి పీతాంబర వనమాలాదులతో వచ్చాడు. శ్రీగోదాదేవి (ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళిలో స్వామి ధరించిన వస్త్రాన్ని ధరించుతామనీ, విడిచిన పూలమాలలను అలంకరించుకుంటామనీ పేర్కొనటం గమనించ దగిన విషయం, ఆత్యంతిక భక్తి సాధనలో సారూప్యముక్తి కలుగట౦ ఒక స్టాయి. నిత్య సూరుల స్టితి కావచ్చు. ఉద్దవుని యందు స్వామి అను[గ్రహం తావత్పర్యంతమే. అయితే గోపికలది అలాంటిది కాదు వారు ఆయననే తమ చిత్తములో, ఆత్మలో ధరించుకుంటున్నారు. ఆ అలంకారం స్వామికి ఆత్యంత ప్రీతి పాత్రమయింది. కాబట్టే తాను తాల్చిన మాలను యిచ్చిన చిన్నది - ఆయనకు దేవేరి స్థానాన్ని పొంద గలిగింది. ఇందుకు మూలం శ్రీగోదాదేవి చేసింది గోపీభావ సాధనమే. అమె సఖీగణం గోపీకలందరూ శ్రీరాధాదేవి విభూతి విశేషాలైన దేవేరుల గణమే.
(భ్రమరగీతలలోని శ్రీ కృష్ణోపాలంభనం అంతా శ్రీకృష్ణాయత్తజీవికలైన గోపికల అనురాగోల్బణ (ప్రకటనమే. వాళ్ల అనుభవం రాసక్రీడానుభవ స్మరణమే. కలహాంతరితనాయికా చిత్రణమే ఇది.
ఈ గోపీజనులు (శ్రుతిరూపిణులు. వాళ్లు ఆయన మహిమను వర్షించలేక అప్రాప్యమనస్కుడని అంటున్నారు. కాళియుని భార్యలు కూడా ఆయన వైభవానికి పరవశలై కింకరుల మని చెప్పుకున్నారు. మహాలక్ష్మి ఆతని విడువక సేవిస్తున్నది. 'సద్మాచరణ రజ ఉపాస్తే యస్య భూతి; ఆ జగన్మాతకైనా ఎరుగ రాదు ఆయన విభూతి సంపూర్షంగా, ॥ శిక్షాష్టకంలో శ్రీచైతన్య మహాప్రభువులు చెప్పారు. 'తృణంకంటే అణగిఉండి, వెట్టవలె వాతొతపాలను సహించగలిగీ, అభిమానం (అహంబీజం) లేని, ఇతరులను గౌరవించగలిగినవారే
హరిని భజించవలెనని, రాసపంచాధ్యాయి. ఆరంభంలో గృహారామ బంధుభర్శవుత్రాది మమకారబంధాలన్నీ వదలి - కేవలం వేణుగానలహరి చేత కొట్టుకొని ప్రవహించి వచ్చినవారీ గోపీజనం. 'యం ఏన ఏష వృణుతే తేన లభ్యః్ అన్న ఈశ్చరుని చేత ఎన్నుకోబడిన పరమ (ప్రేమాయత్తలైన గోపికాగణం యిది. నారు వందించినా నిందించినా ప్రీతి పర్యాయతయే. సాధారణ కథలో భర్మ్యభావం చెప్పబడినా - 'ప్రేమైవ గోపరమణాం కాను ఇత్యగమత్ ప్రధా - అది ప్రథమే కాని వాళ్ళలో కామం లేశమైనా లేదు. ఎందుకంటే వారు దేహపరిమితులలో ఎప్పుడూ జీవించటం లేదు. అంతఃకరణంలోని మనోబుద్ధ్యహం కారాలను దాటి, జీవునికి అత్యంత సన్నిహితమైన చిత్తస్థితిలో ఎప్పుడూ - 'చిత్త నిత్యస్థిత శ్రీకృష్ణులు' గా ఉన్నవారు ఆ గోపికాజనులు. (భ్రమర గీతలలో ఉన్న (భ్రమరం కూడా చిత్తభ్రమరమే. సాధనలో ఒక దశ- దళవిధానాలు వినబడే స్థితి. వాటిట్లో భ్రమర నాదం ఒకటి. ఆ భ్రమరంచేసే మధురనాదంలో ప్రణవం వికసిస్తుంది. (భ్రమర శబ్దంలోని భకార రకారాలు వాసుదేవ ద్వాదశాక్షరిని, నారాయణాష్టాక్షరినీ సూచిస్తున్నాయి. 'ప్రియసఖ పువరాగాః ట్రేయసా ్రేషిత..కిలి ఈ (భ్రమరాగమం గోపికలకు (ప్రీతిని కలిగించింది. వః కింకరీణాం - బీవుల కైంకర్య స్పృహ ఇక్కడ సూచితమైంది. సాలోక్య సారూప్యాది ముక్తులకంటే ఈ లోకంలోనే ఈశ్వర సేవ చేయటమే పరమార్హమని భక్తి సిద్దాంతం ప్రవచించింది. ముకుందమాల - 'నా2_హం వందే తవచరణయోర్వ్యంద్వ మద్వంద్వహేతో: నిత్యభావన, నిత్యచింతన, నిత్యధ్యానము, నిత్యవియోగము, నిత్యవేదనము, నిత్యసాక్షాత్కారము, నిత్యశ్రైంకర్యము, నిత్యసాన్నిధ్యము, నిత్యతన్మయీ భవనము - ఇలా అనంత వలయాంతర్వలయ విలసితమైన స్టితి వైకుంఠములో నెక్కడిది? వారి దృష్టిలో ముక్తి 'నిదురవంటిది రాయి వంటిదియు' కాదు. శ్రీ శఠగోపులు భగవంతుని లీలా విభూతిలోని బహుభక్త సంగతిని ఇక్కడి భగవత్సేవానందాన్ని 'క్రందోంకందోంకందోర' అని విశిష్టంగా కీర్తించి చిత్రించినారు. ఈశ్వర చైతన్యము భూమి మీదకు అవతరించే తత్త్వము కేంద్రబిందువుగా సాగిన శ్రీమద్భాగవత తత్మ్యసారము ఇదే. 'భుజనుగురు సుగంధ మూర్జ్యధాస్యత్ కదాను'. 'అగురు సుగంధ భరితమైన ఆయన తన హస్తాన్ని మా శిరస్సుల మీద ఎప్పుడు నిక్టేపించునో' అని ఆర్తి పొందుతున్నారు. గంధము స్పర్శ ఈ రెండు ఇంద్రియాల దాకా ఆ దివ్యానుభవం దిగి రావటం
- ఈశ్చరుణ్ణ్లే ఇంద్రియ. పరిమితులలోనికి తెచ్చుకుంటున్నారన్నమాట. యోగాదులలో ఇంద్రియాలను, మనస్సును దాటి ఉన్మనీదశదాక జీవుడు ప్రయాణిస్తే - భక్తిమార్షంలో ఈశ్వరుడే పరవ్యోమము నుండి ఉన్మనీ, మనోదశలలో నుండి ఇంద్రియాల దాకా దిగివస్తాడన్న మాట. ఇదే మౌలికమైన అవతార తత్త్యము.
ఉత్పలవారి రచన ఎంత రసభావస్పోరకంగా సాగిందో ఒక ఉదాహరణ చూడవచ్చును - “ఆమె దివ్యమైన ఉన్మాదానికి వశమయింది. కళ్లు మూసుకున్నది. కనురెప్పల లోపల శ్రీకృష్ణుడే నిండినట్టున్నాడు. (ప్రేమ వివశత రూపుదాల్చినట్టుగా ఉంది రాధ" - కళ్లు మూసుకుంటే కనురెప్పలలోపల స్వామి నిండి ఉన్నాడట! ఈ మహాభావస్థితి శరణాగతి కంటే పరమోత్తమమైన స్టితి. అందుకే ఉద్దవుడన్నాడట. 'ఈ సర్వాత్మభావానికి మీరు మాత్రమే ఏకైక అధికారిణులు" అని. భక్తి రసపారవళ్యంలో గోపికలు ఎక్కిన శిఖరాన్ని ఎట్లా కొలువగలం?
- తత్త్యం చెప్పినప్పుడూ మాధుర్యాన్ని పోగొట్టుకోలేదు ఉత్పలవారు. 'మధురాధిపతే రఖిలం మధురం' అని కదా.
“తీవ్రమైన విరహమే (ప్రేమాధిక్యమును తెలుపుతుంది... 'విరహం లేనిదే (ప్రేమకు స్వతంత్ర (ప్రతిపత్తిలేదు'... (ప్రేమ ఒక అంకురం దాన్ని పెంచి పోషించే జలం వంటిది విరహం' 'పేమ ఒక దీపిక. దానికి వత్తివంటిదే విరహం”. (శే. 60) .
'గోపికలు బహిరంగంలో వియోగినులుగా కనిపిస్తారు. కాని వారు అంతరంగసంయోగం కలవారు కనుకనే వారిది మహాభావమని పేర్కొనబడింది”. “వారికి కలిగిన విరహానుభూత్రి భగవదను(గ్రహ విశేషమయింది' (ఢే.64)
“రాసకేళి యందు మీరు (గోపికలు) సశరీరలై రాలేదు కదా. చిన్మయరూపంలో వచ్చారు, కనుకనే నన్ను శీఘ్రంగా పొందగలిగారు" (శు. 65)
-పాండిత్యపు సీమలను దాటి పోయి చైతన్యంలో అనుభవం స్టిరమైనప్పుడే ఇంత సారళ్యం రచనలో సిద్దిస్తుంది.
ఈ భక్తి యోగ సాధనకు మానవులే కానక్కరలేదు. జడములైనవీ అధికారులే, గోవర్ధనగిరి హరిదొసవర్యుడని పేరు పొందినవాడు భాగవతంలో. ఆతడు రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోదం పొందినవాడు. ఉత్ప్సలవారు ఆ గిరిరాజు వృత్తాంతాన్ని విపులంగా వర్షించారు.
ఉద్ధవుడు బృందావనం నుంచి తిరుగు ప్రయాణం చేయబోతూ - 'వందే వందవ్రజస్త్రీణాం పాదరేణు మభఖీక్షళః యాసాం హరికథోర్గీతం పునాతి భువన త్రయమ్' అని పరమ భాగవతులయిన గోపికలకు శరణాగతి చేయటం భాగవత తాత్పర్యాన్ని వెల్లడిస్తున్నది. శ్రీవైష్ణవం
ప్రతిపాదించే చరమావధి దాసత్వం'” ఇదే. " భారతదేశ్పు తాత్పిక జిజ్ఞాసలో శ్రీకృష్ణ తత్త్యావిర్భావం పరమోజ్జలమైన ఘట్టం. గీత, భాగవతం మన తాత్సిక బహుముఖీనతలోని మౌలికమైన ఏకత్వాన్ని వ్యాఖ్యానించాయి. భగవద్గీత
సర్యోపనిషత్సారం అయితే భాగవతం నిగమ కల్పతరువున పండి రాలిపడిన మధుర ఫలం, అయితే భాగవతం వరకు సాగివచ్చేప్పటికి తాత్పర్యం 'భక్తిరీవ గరీయసీ” అన్నదే. ఇలా సాగిపోయింది గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్యానం (భ్రమరగీతలకు. ఆయన ఈ పేరు పెట్టడంలోనే వెల్లడవుతున్నది - ఆయన ఆత్మమాధుర్యం. భాగవత వ్యాఖ్యలు కృష్ణభక్తి తతశాఖల భాష్యాలు. రూపగోస్వామి మొదలైన ఆలంకారిక విద్వాంసుల క్షుణ్మమార్లాలు, భక్తస్తోత్ర మంజరులలోని సౌందర్య శంపాద్యుతులు- శ్రీవిష్ణు బ్రహ్మవైవర్త పురాణాలు ఎన్నింట్సినుంచో - ఇలా శ్రీకృష్ణభక్తి సాహిత్యమంతా సముచితస్టలాలలో సౌందర్యభావుకతల ఉన్మీలనంగా ఈ వ్యాఖ్యానాలలో క్రుమ్మరింపబడింది. ఇది ఒకవిధంగా కావ్యపాఠం, కావ్యగర్భంలోనికి ప్రవేశించటం. దాని అంతస్తత్వాన్ని (గ్రహించటం. శబ్దార్థ జ్ఞానమాత్రం కావ్యంతో సామరస్యం కలిగించారు. ఒక రసభావాభిముఖమైన చిత్తవృత్తి సంప్రదాయపరిజ్ఞానము, కావ్య తత్త్వవివేకము, ప్రక్రియా సౌభాగ్య సం[గ్రహణము ఇవన్నీ అవసరం. అయితే సొమాన్య కావ్యాల విషయంలో ఈ అంశాలు పర్యాస్తాలు కావచ్చుకాని, 'భాగవతము నెతిగి పలుకుట చిత్రంబు శూలిక్రైన తమ్మి చూలికైన'. దానికి శ్రీశుకదేవుల అనుగ్రహం కావాలి. శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులయందు ఆ అను(గ్రహం పుష్కలంగా ఉన్నదనటానికి వారి గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్యలు ఉదాహరణాలు. పోతన్నకు మనం బుణ పడి ఉన్నాం. అట్లాగే ఈ వ్యాఖ్యలు వ్రాసిన ఉత్పలవారికీ. పోతన్న బుణం చిన్న నాటి నుంచీ ఆకావ్య పఠన పాఠశాలలో కొంచెం తగ్గించుకున్నా, ఉత్పలవారి బుణం కొంతైనా తీర్చుకునేందు కోసం ఈ ముందు మాటలు వ్రాసే అవకాశం వారే కల్పించారు. ఎప్పుడో కృష్ణరళ్మి అన్న కావ్యంలో ఇలా (గ్రాసుకొన్నాను - కదలని మూలమందు చిరుగజ్జైల మైతల “నందునిల్లు' చి త్పదమున వెల్లెడున్ 'మధురి భావరసాకృతి క్షీరవార్ధియై పొదలును యోగసాధన విభూతికి లక్ష్యము “ద్వారకాపురం' బదు కొనరింపనే చిలుకవై మనసా, యదువల్లభాప్తికై ఈ “భ్రమర గీతము' చదువుకోగలుగటం ఈ మనస్సు చేసుకునే అదికించుకునే క్రమంలో ఒక భాగమే, శ్రీకృష్ణం వందే జగద్గురుమ్ వరంగల్లు కోవెల సుప్రసన్నాచార్య 26.9.2005
మహోదార చరితులు వరమాత్మీయులు తెలుగుగోష్టి అధ్యక్షులు శ్రీ వబ్లరి వేంకట సుబ్రహ్మణ్యశర్మ మహోదయులకు అగి సమర్పణము ఇ . పుణ్యుడు వల సుబ హ్మణ్యుండు మహామనస్వి, మహనీయుడు సా మాన్యుడుగా తోచు నసా మాన్యుడు పూర్వాం(్ర పారమార్డికులటై.
తన చాతుర్యము కట్టిపెట్టి, నిజసత్కారంబు విస్తారితం బొనరింపంగలవాడు లోకమున పూజ్యుండౌను, దేవాదిదే వునకున్ ప్రీతికరుండగున్, సుజనసేవ్యుండౌను, ఈ దృగ్గుణో పనతున్ మెచ్చెద వజ్ఞభ్రాన్నయుని సుబ్రహ్మణ్యుం బుణ్యాత్మునిన్ దీరుడు పుణ్యశీలుడు సుధీమణి వజ్షలశర్మగా రసా ధారణకార్య నిర్వహణ దక్షతగన్న మహాశయుండు సా ధారణబుద్దు లెంతటి యుదారులనైనను తమ్ముబోలు సా ధారణులట్ల యెంతురు యథార్థమెజింగెడివార లౌదురే! నేనిటువంటివారి మహనీయత, మానవతా మహోన్నతా ఖ్యానము నుచ్చకోటి శిఖరా[గ్రము చేరిచి చాటిచెప్పగా బూని కలంబు గొంటి. కృతపుణ్యుడు వజ్ఞంై వంశరళ్న వీ దీనునికిన్ లభించెను నుతించెద శాబ్దిక వర్షతూలికన్ తా నుపవాసముండియును దాచిన ద్రవ్యము పేదవారికిన్ దానము చేయుచుండిన వదాన్యుడు వజ్జలశర్మ, జాషథం బైనటువంటివాడు ఫలమన్యుల కిచ్చును, తాను (స్రుక్కినం గాని చలింప డింత వెనుకాడడయా! నయమార్గమందునన్ అమలోదాత్తమనీషి సింహపురి దివ్యఖ్యాతి సంవర్టకుం డమరుం డా జయరామశాస్తి కృత పుణ్య[గ్రంథ ముద్రామహో ద్యమముంజేకొని శాస్తిపాదుల దిగంతఖ్యాతికిన్ శాశ్ళత తము కల్సించిన వజ్ఞల్రాన్నయుని సుబ్రహ్మణ్యుం గీర్తించెదన్
ఎన్నా బవంతులున్నవి మజెన్నియొ బాంకులలోన పెక్కె కౌం ట్టున్నవి ఏమిలాభము? పరోపకృతిస్పృహ లేని మూర్థ సం పన్నుల వల్ల? విద్వదభిమాని, ఉదారచరిత్రుడైన వ్యు త్పన్నుని వజ్ఞల్రాన్నయుని (ద్రవ్యము అవ్యయమై ప్రవాహిలున్
తానెంత వగచి పరునికి
ఆనందము కలుగజేయునతడు మహాత్ముం
డౌనందురు, శ్రీ శర్మయు
పౌనఃపున్యముగ నట్టివాడే సుమ్మా!
పుచ్చుకొనెడివాడు బొజ్జపెంచెడి భోగి
పరులకిచ్చువాడు పరమయోగి
బంధనము పరార్థ భక్షణంబే యౌను
ముక్తియనిన స్యార్ధమోక్షణంబె! పేదల నుద్దరింతుమని పెద్దలు నాయకులై కుబేరులై పోదురు, పల్పొగడ్తలకు పొంగుచు పౌండ్రకవాసుదేవులై పోదురు, పోవనిమ్ము! హతబుద్దులతో నుపయోగమేమియున్ లే దిల శర్మవంటి సుచరిత్రులె మేలొనరిండత్రు జాతికిన్
విద్యాధికుండయ్యు విజ్ఞవీగ డతండు
ఎవరేమి చెప్పిన నవధరించు తనకు నచ్చక పోయిననుగాని, పెజువాని ధాటికి పల్లెత్తు మాట అనడు
స్వగృహమందునుగాని సభలయందునుగాని ॥ గొప్పలు తనుగూర్చి చెప్పికొనడు జేబులో డబ్బున్న చెయిసాచువారిని వీక్షించి వెజచి తప్పించుకొనడు ఎవడు లోకహితము తన హితముకంటె గొప్పుదని యెంచునో వాడు కోవిదుండు, సాధువతడు, మహోదార చరితు డతడు - సాధుతకు మచ్చుతునుక శ్రీశర్మగారు ఏతర్గీత సమర్పణంబునకు నెంతే బ్రీతుడై దీవెనల్ (బ్రాతింగా గురియించినట్టి బుధు సుబ్రహ్మణ్యునిన్ తత్సతీ సీతాలక్ష్మిని తత్సుతాళిని కృపాసింధుండు శ్రీకృష్ణు డు ద్భూ తైశ్చర్య చిరాయు రున్నతుల బెంపొందించి రక్షించుతన్. హన ననా
స్వీకారము
మహాకవి శ్రీమాన్ ఉత్సల సత్యనారాయణాచార్యులుగారు శ్రీకృష్ణ భక్తిభావనారసహృదయులు, రాసపూర్లిమ, శ్రీకృష్ణదం ద్రోదయాది రసవత్తరకావ్యకర్తలు. కేంద్ర సాహిత్య అకాడెమి, తెలుగు విశ్శవిద్యాలయ విశిష్ట పురస్కార (గ్రహీతలు.
గోపీనయనోత్న్సలార్చితమైన భాగవతీయమగు ఈ (భ్రమరగీత వ్యాఖ్యాగ్రంథమును నా జన్మదినోత్సవ సందర్భమున కృతి ప్రదానము చేయుచున్నందులకు ఎంతగానో సంతోషించుచున్నాను. ఇది నేనూహింపని భాగ్యము.
కీర్తిశేషులు (బ్రహ్మశ్రీ చదలవాడ జయరామ శాస్తిపాదులు, సంస్కృతభాగవతమునకు, నాచనసోమనాథుని ఉత్తర హరివంశమునకు రచించిన వ్యాఖ్యానగ్రంథములకు నేను 'ప్రచురణబాధ్యత వహేంచుటను చూచి ఉత్పలవారు నా కృషిని ఎంతగానో శ్ఞాఘించి యున్నారు. ఆ విషయమే తమ కృతి సమర్పణ పద్యాలలో కూడ తెలిపి నన్ను చరితార్జుని చేసి యున్నారు. అందుకు నేను ఈ కృతిని స్వీకరించుటకు మరింత సంతోషపడుచుంటిని. శ్రీ శాస్రిపాదులకు నేను చేసిన సేవ కించిన్మాత్రమే అయినను దానిని బహుధా ప్రశసించి, “స్వల్ప మప్యస్య ధర్మస్యత్రాయతే” అను గీతావాక్యమును నా స్మరణకు తెప్పించి నన్ను ధన్యుని గావించినారు.
ఇట్టి సహృదయ కవివతంసులైన ఉత్పలవారికి నేనేమీయ గలను? వారి ఇష్టదైవమైన శ్రీకృష్ణభగవానుడు. వారికి ఆయురారోగ్య విశ్చర్యములను ప్రసాదించుగాక యని హృదయపూర్వకముగా ఆకాంక్షించుచు ఆశీర్వదించుచున్నాను.
క, ఓ ట్రూల్ల స్య విశ్రాంత ప్రభుత్వ డిగ్రీకళాశాలాధ్యక్షులు
సికింద్రాబాదు-26 ఫోన్ : 27715148 తేది : 11.11.2005
00 క. 20212, 114. ౧1.0. 0116060 51031518 ఉంషరలం) క/60ల1016
తీ 615600019%66 90[012% 2 46౪70166 ౪/00 ౧88 రగు౧! రం60 116 ౧6౦120['5గ 1రక00241114' జర 2006 0జూలంం0116006. 6 3 '౮రుజడ'
- & గంజి - & వెషంం[లటూ, & సగం 0901121 12665 ౧16 0£ 16 0[%0/51021 16210 ౦0 2 ౧064ల 2౧6 0016 1 ్పరల2026 - దీ సంస212 (2863 026 01116 6౧1 [6210 0101080 ౦0916 1866- 082 ఓలి ౪10 కంల జుణండా402, మరం [౧2 00010. ౮16 ౧20 ౪19021- 156 6౪7లా/ ౧౧౦౧ల 206 ఆలం ౦0116 10 019 3౦06202062 ఆ౭ంమ౫1 - . (21213 ౯00 | 06 కటాలండగ7002042642470 015 006౬15 2 20016 12641401 0 056 100006120]16 72131022 5000126 216 066 ౪/00 ఇగ6లప1006 206 90082 46 8100” ౦ 16 016. 06 805061 01013004 జొ6 ౧19 ౫౦82 ౧2౪76 902626 21] 07౪ (16 ౪౦౫6 (062% 1069060676 0 6 023966 206 011006. 511 ౧212 వ్20/జాబాజ/2020020/2 ౧23 16606%66 000361 ౪161 అఆ6౧/ 6054 24016 2980014666 ౪10 16 1016. ₹10) 0136 ౪72160 0% 1272024, తొాడడాడాడ భాంఠ జం00815, అహారం 206 136000. 16 547274 - ౮2౧౭47277462 విగడగిగ/ 620069 10 106 పమంంగ2], ౧21 00165 0 16 1౬016. ౫12 2 912010” 5051676 906 ౪/10 15 01166 ర 6జగగ8 2 95౪6661016 1 2 ౪౦16. 16 15 008 2 జగ 0046072677 ఇర 103 2ర6యిణం 8 5840802 15 92226202. 1000040263. 5801 రేల/0- 1669 రం ౧06 ౪201 సెశం[504 - 102600 - ౧19 15 లడట్రిట॥?డ లి7డ/7004274.
తీగిరల!26652 18 0165566 ఇరు 6 ఏలయం[ 08 0 2 తొగిగ౭7247277ల%6 00 గంలూ[ 5గ5జ1జు. 506 18 0000108 ళం 10521 06 0౯52060201240004 19 416 01696106 01242110 బ్రు 002. గౌర నెచ211025 - 2000ల జూం గొయి[. 516 0096006 (0 మ 16 ల ౧౧1 ౧46 13 (047472476874 - “౦ “0126003 01 115 ౧200-
01098 066 020 [6 [686 హు ₹16 ౧6జ1 0621089 0£ 116 10౪6 10౧ 001120. గౌగం చయం 13 & 2128072. 1613 ఇయంర006206 9౪/66ఓ గౌగ6 9098 ఏ $661) 262% 20076 16 ౨4ల44 226 27424. 50126672 616 1036 ౧621 0626020. (0214 వ2040జఖాజ20200జు/2 ౧6216 లయ. 3 290121 10౪6 115 రంల 0610641005 ౪౦1066 108102 1166 లాం 1611 206 118 263960 8211 14౪76 అంం2/066 110) 60 910822 60016. మ3 ౧068౯10? ఉలంజ 10౪7601016 షం002 13 00606108. 2149 0660 14/06% 119 జుం 107 61080 161002 2౧6 ౧16 1076 జ16 ౪%6ల5(2064108 05209161 12020226 - 211 1636 26 06౧- ౧66 జుంటగ6 016 13094 కం గంటం, 101021 169004 & 1019112 (106 ౮/4౧౮౫4౧2. [6 90016 10/6 1008 (0 6జ0౧/ 0౪1 ౧౦ 8౬006 ౪0౧ 01 6611౪01118 6 8090061 01 511 మ19002102002000102 204 1128804064 16/23 10 116 6౦0౧0206 091084 1206. 800320 01 5100060 కనా ఇం ల ఇంయానళా-. ర! [స+ స. 11-10-2005 న్ ననన
భ్రమర రీతము ఉద్దవుని ఆగమనము అది మధురానగరం. సాయంసంధ్యాసమయం౦. యమునానదీ తీరాన శ్రీకృష్ణుడు ఒంటరిగా కూర్చున్నాడు. యమునా (ప్రవాహంలో పసిడినిగ్గుల చంపక పుష్పుం ఒకటి నల్లని నీటి తరగల మీద తేలుతూ ఒడ్డు దరికి వస్తున్నది. దాన్ని చేత్తో అందుకొన్నాడు కృష్ణుడు. ఆ పువ్వు బంగారు చాయ. రాధిక శరీరచ్భ్చాయ గుర్తుకు వచ్చింది. దాని సౌగంధ్యం కూడా రాధికదే, సౌగంధ్యం చల్లదనం రెండూ కలిసే ఉంటాయి. శ్రీకృష్ణుని ముఖం మీద విచారచ్చాయలు అలముకొన్నాయి. తాను యశోదానందనుడు, దేవకీసుతుడు కూడా, తన జన్మకర్మల దివ్యత్వాన్ని తత్త్వతః లోకం (గ్రహించడం కష్టం. తాను బృందావనాన్ని వదలిపెట్టి చాలా కాలమయింది. రాధాదిగోపికలను కూడా వదలి మధురకు వచ్చాడు. ఇక్కడ తాను చేయవలసిన పనులెన్నో ఉన్నాయి దేవకీవసుదేవులకు, మధురానగరవాసులకు సుఖసంతోషాలను కలిగించడం, అక్రూరుణ్ని హస్తినాపురికి పంపడం మొదలైన పనులు కృష్ణుని కళ్లముందు మెదిలాయి. బృందావనవాసులైన మాతాపితల స్మృతులు, గోపికల (ప్రేమలు అనుక్షణం గుర్తుకు వచ్చి వ్యాకులపెట్టాయి. కృష్ణుడు మధురనుంచి తాను త్వరలో తిరిగి వస్తానని గోపికలకు చెప్పాడు. కానీ అక్కడికి వెళ్లలేకపోతున్నాడు. బృందావనానికి ఎవరినైనా యోగ్యుణ్ని పంపి తల్లిదండ్రులను, గోసికలను ఓదార్భాలనుకొన్నాడు. మరుక్షణమే ఉద్ధవుడు చేతులు మోడ్చుకొని శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చాడు. ఉద్దవుడు వసుదేవుని తమ్ముడైన దేవభాగుని పుత్రుడు. (వ్రజవాసులకు పూర్వ పరిచితుడు. తన విచారాన్ని తెలుపుకోవడానికి, నందయకోదలకు, (వ్రజగోపికలకు సాంత్వనం కలిగించడానికి ఇతడు అర్హుడని భావించాడు కృష్ణుడు. అంతేకాదు అతబణ్జే జ్ఞానయోగం నుంచి భక్తియోగానికి మరల్పదలిచాడు.
20 ('బభ్రమరగీతము
వృష్ణీనాం ప్రవరో మంత్రి కృష్ణస్య దయితః సభా
శిమ్యి బృహస్పతేః సాక్షాత్ ఉద్దనో బుద్దిసత్తమ: (శ్రీమద్చా. 10-46-1)
ఉద్ధవుడు శ్రీకృష్ణునికి దయితః సఖా” ప్రియమైన సఖుడు. కృష్ణానుగ్రహంతోనే అతడు బృహస్పతికి శిష్యుడై బుద్ధిసత్తముడైనాడు.
బృందావనంలోని గోపికలు శ్రీకృష్ణుడు మా వాడని" సంపూర్ణంగా విశ్చసించినవారు. ఆనగా మదీయత్యాభిమానం కలవారు. వారు విరహవిహ్యలలు, వియోగసంతప్తలు అయినప్పటికి ప్రాణాలు ధరించే ఉంటారు. మదీయాభిమానుల హృదయాలలో శ్రీకృష్ణుడు సర్వదా విరాజిల్లుతుంటాడు.
శ్రీకృష్ణునికి తాను నందగోపకుమారుడనిపించుకోవడమే ఇష్టం. బ్రహ్మమోహం- వత్సాపహరణలీలలో, శ్రీకృష్ణుడెనరో తెలుసుకొని ఆయన్ను “లక్షశ్రియే చృుదుపదే పశుపాంగజాయ” (శ్రీమద్బా.10-14-1) అని స్తుతించాడు (బ్రహ్మ. (వళూన్ పాలయతి ఇతి పశుపః తప్య అంగజాయ) గోపాలాత్మజుడు అని అర్థం,
“నందగోపకుమారాయ గోవిందాయ నమో నను£ొ
మరొక అర్ధం “గా వేదలక్షణా: పొతీతి గోప” వేదాంతవేద్యుడు గోవిందుడు. ఉపనిషత్తుల దృష్టితో చూస్తే వ్రజమనగా గోష్టము. శ్రుతిరూపిణులైన గోవుల నివాస స్థానము గోస్టము. బృందావన కృష్ణునికి గోవింద, నందగోపకుమార, గోపీజనవల్లభ (వ్రజనాథ, గోపాల నందన నామాలే సర్వాధిక ప్రియమైనవి.
శ్రీకృష్ణుని యందు గోపికలకు మదీయత్వాభిమానం, గోపికల పట్ట శ్రీకృష్ణునికి మదాత్మికత్వాభిమానమూ అనగా “గోపికలకు ఆత్మ అయినవాడను నేను” వారందరూ నా స్వరూపులు అనే అభిమానం ఉంది. అలాంటి భగవద్భక్తి సంపన్నలైన గోపికలను సందర్శిస్తే ఉద్ధవుడు బుద్దిసత్తముడే కాదు, తన జ్ఞానాభిమానానికి స్వస్తి చెప్పి భక్తియోగసత్తముడవుతాడన్న ఉద్దేశంతో అతణ్ణి బృందావనానికి పంపాలనుకొన్నాడు శ్రీకృష్ణుడు,
తా నున్మనస్కా మత్రాణా మదర్డే త్యక్తదైహికాః
మామేవ దయితం ్రేష్ట మాత్మావం మనసాగతాః
యే త్యక్తలోక ధర్మాశళ్చ మదర్థే తాన్ బిభర్మ్యహమ్ _ (శ్రీమద్భా10-46-4)
ఉద్ధవా! ఆ గోపికలు “మన్మనస్కలు” నా యందే మనసుంచినవారు. “మత్సాణాగా వారి శ్యాసప్రాణాలను నేనే. “మదక్థే త్యక్త దైహికాగ్ నా కోసమే
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 21 వారు తమ శారీరక క్రియలను వదలుకొన్నారు. లోకధర్మాలను కూడా త్యజించారు. వారి భరణపోషణలు నా కర్తవ్యాలు. వారికి నేను దూరమైనప్పటికి వారు అనుక్షణం నన్నే స్మరిస్తుంటారు. అందుకే వారి పట్ట నాకు అమితమైన ప్రేమ. వారితోపాటు నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేవాణ్ణి ఇప్పుడు వారు ఆ సంగతులను గుర్తుకు తెచ్చుకొని బ్రతుకును వెళ్లదీస్తున్నారు. ఇదెంత దుర్భాగ్యమో చూడు. వారి (ప్రేమానురాగాలను నేనే మరవలేకున్నాను. వారెలా మరచిపోగలరు?
గోపికలు శ్రీకృష్ణుణ్మి మరచిపోవడానికి అనేకవిధాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకొని నారదమహర్షి ఒకనాడు వారి దగ్గరికి వెళ్ళాడట. అక్కడొక గోపిక (ప్రాణాయామం చేస్తున్నదట. ఇంకొక గోపిక ఆసనాలు వేస్తున్నది. మరొకామె శీర్దాసనం వేసిందట. వేరొక గోపిక పొట్ట అక్కళించి, వెన్నెముకను నిటారుగా నిలిపి ధ్యానం చేస్తున్నదట.
నారదుడు గోపికలను సమీపించి “మీరు ఏమిటి చేస్తున్నారు? శ్రీకృష్ణ భగవానుణ్ణే మీ హృదయంలో. స్థిరంగా పదిలపరచుకోవాలని ఈ యోగం (ప్రారంభించారా?” అని ప్రశ్నించాడు. ం
“ఓ మహర్షీ ఆ ఫేరెత్తవద్దు. ఆ పేరెత్తితే మా సాధన భగ్నమైపోతుంది. ఆ 'పేరుగలవాణ్లి మా హృదయంలో నుంచి బైటికి వెళ్ల గొట్టటానికే మేము ఇదంతా చేస్తున్నాము” అన్నది ఒక గోపిక, ఆ మాట విని నారదుడు నిశ్ళేష్టుడయ్యాడు.
మహాయోగులు యమ-నియమ-.ప్రాణాయామ-ప్రత్యాహారాదుల ద్వారా, ధ్యాన- ధారణ సమాధ్యవస్థల ద్వారా, అప్టాంగయోగం ద్వారా ఈ సంసారం నుంచి తమ మనస్సును తొలగించి శ్రీమన్నారాయణన్వరూపాన్ని ఒకక్షణంపాటు చిక్కించుకోడానికి ప్రయాస పడుతుంటారు. కాగా, ఈ గోపికల = సాధనతోనే తమ మనస్సులో స్థిరపడిన శ్రీకృష్ణభగవానుణ్ణి తాలగించుకొని సంసార తాపత్రయంలో పడటానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే, శ్రీకృష్ణవిరహజన్యమైన మానసిక వేదనను తట్టుకోలేక, దానిని తొలగించుకొని క్షణం సేపైనా విశ్రాంతిని పొందాలని...
“.యస్యస్ఫూర్తిలవాయ హంత హృదయే యోగీ సముత్కంకతే
ముగ్టేయం బత! పళ్య తస్య హృదయాన్నిమ్మాంతి మాకాంక్షతి”
ళడరయ$ (గంధాల్య్య హం లాగ ఇను కధ 1 ల న్
22 (భ్రమరగీతము
ఆ గోపికలు “తా మన్మనస్కాః” ఆ శ్రీకృష్ణుని యందే మనసు నిల్పిన వారు. తమ సంకల్పాలు, వికల్పాలు అన్నీ కృష్ణుని యందే నిలుపుకొన్నవారైనందున వారింతగా వ్యధ పడవలసి వచ్చింది. ఆహా! వీరు శ్రీకృష్ణభగవానుణ్మి తమ హృదయంలో ఎంత గాఢంగా స్టాపించుకొన్నారో గదా! ఆశ్చర్యపడ్డాడు నారదుడు.
శ్రీకృష్ణుడు ఉద్ధవునికి మరికొన్ని విశేషాలను తెలుపవలసి వచ్చింది.
“ఉద్ధవా! నీవు నాకు ఆతీ గ్మయుడనవు. దేవగురువు బృహస్పతి అను[గ్రహం పొందిన బుద్ధిశాలీవి. నా జన్మకర్మల దివ్యత్వాన్ని కొంత కొంత ఎరిగినవాడవు నీవు. అధికంగా నీకు చెప్పవలసింది లేదు.
గోకులంలో నేనవతరించిన కొన్నాళ్లకే దుష్టకంసుని పంపున పూతన రాక్షసి వచ్చింది. అదీ దాదిరూపంతో వచ్చింది. విషపు పాలిచ్చి నన్ను హతమార్చాలనుకొన్నది. అసురీయ (ప్రకృతికి నేనెవరినో ఎలా తెలుస్తుంది?
ఆ పూతన జన్మలన్నీ నాకు తెలుసు. ఆమె ఒక జన్మలో బలిచక్రవర్తి కూతురు రత్నమాల. వామనుడుగా నేనవతరించినపుడు ముగ్టసుకుమారమైన నా బాలరూపం చూచింది. మాతృభావం ఆమె హృదయంలో పాంగిపార్లింది. నాకు చనుబాలివ్వాలని మనసుపడింది. ఆ పవి(త్రమైన వాత్సల్యభావం నా మనసుకెక్కింది.
ఉద్ధవా! నేను పుణ్యాలను, వాత్సల్యాది సద్గుణసద్భావాలను మాత్రమే స్వీకరిస్తాను కదా! నేను (త్రివిక్రముడనై బలిచక్రవర్తి శిరసుపై కాలు మోపినపుడు రత్నమాల రోషించి నన్ను హతమార్చాలనుకొన్నది. ఆ ద్వేషభావంతోనే చనిపోయింది. ఈ జన్మలో ఆమె పూతనరాక్షసి అయింది.
ఆ పూతన విషపు పాలతోపాటు ఆమె ప్రాణాలను క్రోలి ఆమెకు పునర్జన్మ రహితమైన పరమపద ప్రాప్తి కలిగించాను. నన్ను ద్వేషించే వారికే నేను మాతృగతిని చేకూర్చి మోక్షమిచ్చినవాణ్ణి గదా! నన్ను ఎంతగానో లాలించి ప్రేమించిన నా తల్లి యశోదమ్మను వదలి నేనిక్కడుండటం తగునా? ఆమె ('ప్రేమవాత్సల్య పాశాలతో నన్ను ప్రాకృతబాలునిగా భావించి రోటికి బంధించింది. అదెంత సుందరమైన ఘట్టం! నేను సామోదదామోదరుడనయ్యాను. ్రేమానంద సాగరంలో తేలియాడాను.
రోటికి బంధితుడనై ఉన్న నన్ను చూచి నా తండ్రి నందగోపుని (ప్రేమభరిత హృదయం ద్రవించిపోయింది. నన్ను కట్టివేసిన త్రాళ్లను విప్పుతూ ఆయన కన్నీళ్లు కార్చాడు. ఆ ప్రేమను, వాత్సల్యాన్నీ మరచిపోగల్ననా?
గోషీనయనోత్పలార్చిత వ్యాఖ్య 23
ఉద్దవా! నీవు బృందావనానికి వెళ్లి ముందుగా నా తల్లిదండ్రులను ఓదార్చు. ఇక్ గోపికల విషయం కూడా చెబుతాను విను.
ఉద్ధవా! నీవు జ్ఞానివి. గోపికలు భక్తియుక్తలు. జ్ఞానాభిమానుల జ్ఞానం ఏనాటికీ సంపూర్షమైనదై ఉండదు. జ్ఞాని గంగను ఒక తీర్ణంగానే భావిస్తాడు. భక్తుడు గంగను దైవతంగా భావించి ఆరాధించి ధన్యుడవుతాడు. జ్ఞానికి భక్తునికి గల తారతమ్యం ఎలాంటిదో నీవు బృందావనానికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. జ్ఞానుల కంటె యోగులు అధికులు. “జ్ఞానిభ్యాశ్చాధికో యోగీ” (గీత. 6-46) యోగులైనప్పటికి వారికి భగవద్భక్తి లేకపోతే యోగం వల్ల ప్రయోజనం శూన్యం.
“సోహం సమామ్నాయనుయ స్తపోమయ:
ప్రజాపతీవా మభివందిత: పతిః
ఆస్థాయ యోగం నిపుణం సమాహిత
స్తం నాధ్యగచ్చం యత అత్మ సంభవః (శ్రీమద్భా2-6-34)
తన జన్మకు కారణమైన భగవంతుణ్డై తాను ్రాప్తించుకోలేకపోయానని (బ్రహ్మదేవుడే ఇలా పరితపించాడు. కర్మ జ్ఞానయోగులకు భక్తి లేకపోతే వారికి భగవత్రాప్తి ఉండదు. “అన్యేషామపీ కర్మజ్ఞాన యోగినాం తద్భక్తిమిశ్రత్వం వినా మాంగళ్యాభావాదితి భావో (విశ్చనాధ చక్రవర్తి వ్యాఖ్య)
ఆ నలివాక్ష నందనుడనయ్యు, ప్రజావతివయ్యు, యోగ వి
ద్యా నిపుణుండ నయ్యును, పదంసడి మజ్జనవన ప్రకారమే
యేను వెజుంగ, నవ్విభుని యిద్ధ మహత్వ మెలుంగ నేర్తునే?
కానబడున్ రమేశ పరికల్పిత విశ్వము కొంత కొంతయున్
(పోతనగారి భాగవతం)
“నేనే ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేకపోయాను. ఇక నాచేత సృష్టింపబడిన ఈ జీవులు ఆయన్ను ఎలా తెలుసుకోగలవు?” అన్నాడు (బ్రహ్మదేవుడు.
గోపికలు (ప్రేమభక్తియుక్తలైన పరమయోగినులు. వారిచేత ఉపాసింపబడినవాడు పురుషోత్రముడు. అతడే ఈశ్వరుడు. అనగా జగన్నియంత. అతడెవరో నీవు కూడా తత్త్వతః తెలుసుకోవాలి.
యోగులు సాధనసిద్దులు. దండకారణ్య వాసులైన పరమయోగులు, మునీశ్చరులు భక్తియుక్తులై షడ్డుభైశ్చర్య సంపన్నమైన నా రూపాన్ని దర్శింపగోరారు.
లక 'భమరగీతము అంతేకాదు, వారిలో గూఢంగా ఉన్న (స్త్రీ భావం చేత నా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని పొందగోరారు. వారికి ముక్తి ఆరచేతిలోనిది అయినప్పటికి ఈ కోరిక వల్ల అనేక సంవత్సరాలు నా నరాకృతి పరబ్రహ్మ రూపదర్శనానికి వారు వేచి యుండవలసి వచ్చింది. ద్యాపరయుగావసాన కాలంలో వారందరు స్త్రీ దేహాలను పాంది భక్తి క్షేత్రమైన బృందావనంలోనికి (ప్రవేశించారు.
ఆ గోపికలకు భర్తలున్నారు. వారికి నా పట్ట అసూయా ద్వేషాలు ఏమాత్రమూ తేవు, హ్లాదినీశక్తి మూలప్రకృతి, పరమలక్ష్మీస్వరూప రాధికగా నాకు తోడుగా అవతరించింది. ఆమె బృందావన స్వారాజ్య పట్టమహిషి. గోపికలందరు ఆమె కాయవ్యూహంలోని వారయ్యారు. వారిది పరిశుద్దమైన (ప్రేమ. సంపూర్ణమైన త్యాగశక్తి వారి (ప్రేమకు ఉన్నది. అట్టి ప్రేమే కామాన్ని నాశనం చేస్తుంది. తను మనస్సును తనువును, లోక పరలోక సుఖాలను త్యాగం చేసి వారు పవిత్రమైన గోపీభావాన్ని పొందారు. అయితే ఆ గోపికలు పరస్రీలని లోకంలో ప్రతీతి ఉంది. పరకీయత్వంలో విశేషాన్ని (గ్రహింపగలిగినవారు చాలా తక్కువమంది ఉంటారు.
లోకంలో (ప్రేమించినవారిని కలుసుకోవడంలో ఎన్నో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. పరకీయత్తమే ప్రియుని పట్ట అనురాగాన్ని అధికం చేస్తుంది. లోకళాస్త్ర మర్యాదలను ఆతిక్రమైంప జేస్తుంది. వారణత్వ - దుర్లభత్వ - ప్రచృన్నకాముకత్వాలు (ప్రేమాభిలాషకు ఉత్కర్జను కల్గిస్తాయి. అవే మన్మథునికి బలమైన ఆయుధాలవుతాయి.
తదేవ సంచబాణవ్య మన్యే సరమ మాయుధమ్
పరమస్వీయలైన రాధాదిగోపికలు బృందావనంలో ఉజ్జ్వల రసవైచిత్రిని, ప్రీతిని అనుభవింపజేయడానికి ప్రకటలీలలో పరకీయలయ్యారు. నిజానికి గోపికలందరూ నాకు నిత్య (ప్రేయసులు, పరమ స్వీయలు. ్రాకృతనాయకునితోడి పరకీయా సంబంధం లోకనిందితమూ ధర్మవిరుద్దమూ అవుతుంది.
అఘాసురుని వధించిన నన్ను పరీక్షించడానికి బ్రహ్మదేవుడు బృందావనంలోని గోపకుమారులను, గోవులను మాయం చేసి ఒక గుహలో సంవత్సరంపాటు బంధించాడు. (బ్రహ్మమాయను తెలుసుకొని నేనే సకల గోపబాలురుగాను, గోవులుగాను రూపొంది (వ్రజవాసులకందరికి కుమారుడనయ్యాను. నా ప్రేరణతో (వ్రజకులాచార్యుడు గర్గుడు గోపకుమారుల కందరికి తక్షణమే సామూహిక
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 25 వివాహాలు జరిపించాడు. ఆ సందర్భంలో (వ్రజ వధువులకందరికి నేనే వరుణ్ణి అయ్యాను. గోవర్టనోద్దరణ సందర్భంలో ఈ విషయం ఎరుకపరిచాను.
“తస్మాన్మ చృరణం గోష్టం మన్నాథం ముత్పరిగ్రహమ్” (శ్రీమద్భా 10-25-18) అని. భక్తులను ఆకర్షించడానికి “రసోవై సహో శ్రుతి వాక్యానుసారంగా రసస్వరూపుడనై బృందావనంలో రాసఖేలనం జరిపాను. అమృతస్వరూపమైన పరమానందమే దివ్యమైన రసం. జ్ఞాన ప్రజ్ఞాన ఖనివి నీవు. నీకు అధికంగా చెప్పవలసిన పని లేదు. గోపికలను ఓదార్చి రమ్మని చెప్పాడు కృష్ణుడు.
శ్రీకృష్ణుని సందేళాన్ని విని ఉద్దవుడు రథమెక్కి బృందావనానికి బయలుదేరాడు. కృష్ణుడు కొంతదూరం దాకా వెళ్లి అతణ్ని సాగనంపాడు.
సాయంకాలమయింది. గోధూళివేళు గుజ్జాల గిట్టల నుంచి లేచిన పరాగం సంధ్యారాగం రెండూ కలిసి నలుదెసలు ధూసరవర్షములయ్యాయి.
రథం బృందావనంలోనికి ప్రవేశించింది. మెల్లగా లోనికి పోగా పోగా పుష్పఫలభరితమైన నమ్రతరుశాఖలు, లతానికుంజాలు, పుష్పస్తబకాలు, సురభిళ పవనాలు, పచ్చిక మేస్తున్న లేళ్ళు. నృత్యం చేస్తున్న నెమిళ్లు! సౌందర్యానందరస (ప్రవాహంగా కనిపించింది (ప్రజవాసుల బృందావనం - అది శ్యామసుందరుని క్రీడాభూమి, ఉద్దవుని దృష్టి ఏ చోట పడిందో ఆ చోటనే అతని దృష్టి నిలిచిపోతున్నది. పుష్పిత - ఫలిత - సురభితమైన బృందావనాన్ని యాచించి బుతురాజు తనకు కావలసిన ఐశ్చర్యోపకరణాలను అక్కడ సంపాదించుకొని ఉంటాడు!
అక్కడి. గోపికలు (ప్రొద్దుటే యమునానదిలో స్నానం చేసి నదీదేవతకు నమస్కరిస్తారు. ఈ రోజు శ్రీకృష్ణదర్శనం కలిగించమని వేడుకొంటారు. ఇళ్లకు చేరిన తర్వాత వ్రజవాసులందరు తమ ఇళ్లను శుభ్రం చేసుకొని, వాకిళ్లను అలంకరించుకొని ఈరోజు మధుర నుంచి కృష్ణుడు వస్తాడని అమితసంతోషంతో రోజంతా గడుపుతారు. కృష్ణునికి ఇష్టమైన వెన్నమీగడలు, హైయంగవీనంతో చేసిన మధుర పదార్దాలు సిద్ధం చేసుకొంటారు.
శ్రీకృష్ణునిపై ఇంత ప్రేమగల (వ్రజవాసులు తమకోసం అ కృష్ణుణ్ని ఏమీ కోరరు. శ్రీకృష్ణావిర్భావంతో బృందావనం రమాదేవికి క్రీడా స్థలమయింది. చింతామణి నిర్మితగృహాలు, లక్షలాది కల్పవృక్ష సమాలంకృతమైన బృందావనం కామధేనువుచే
26 ('భ్రమరగీతము పాలింపబడుతున్నవ్సుడు (వ్రజవానులకు తీరని కోరికలు ఏమి ఉంటాయి? (వ్రజభూమి (ప్రేమభూమి. భగవంతుని లీలాభూమి. అక్కడి ్రతిరజఃకణమూ సంపూర్ణరసమయమైనదే. అక్కడి ప్రత్యణువులోను అనంతానందధారలు నిర్భరితమై ఉన్నాయి. అక్కడి సాధారణ లతలు. లతలా అవ్వి! మృదులతలు! వృక్ష పంక్తులు రసిక జన విశ్రాంతులు! అక్కడి నదులు ్రేమామృత (ప్రవాహాలు!
(వ్రజభూమిలోని గోవులు సాక్షాత్తు ఉపనిషత్తులు. అక్కడి గోరసం బ్రహ్మరసమే. ఎందుకంటే అక్కడి గోగోప గోపిక లందరు శ్రీకృష్ణుని అంగభూతలే. శ్రీకృష్ణుడే (జరూపంగా అవతరించాడు. (వ్రజమయుడైనాడు. శ్రీకృష్ణుయమైనది వ్రజభూమి. అక్కడ (ప్రేమ- ఆనందం - శాంతి తప్ప ఇతరమైనవి ఏవీ ఉండవు.
గోధూళివేళ గోగణాలు బృందావనం వైపు సాగిపోతున్నాయి. వాటి వెనుక గోపబాలకులు శ్రీకృష్ణునిలీలలను ఆడుతూ పాడుతూ వెళుతున్నారు.
ఒక గోపబాలుని దృష్టి వెనుక వస్తున్న రథం మిద పడ్డది. రథం రథికుడు రథ్యాలుకూడా గోధూళిలో మునిగి పోయాయి. ఎవరో కనిపించడం లేదు. ఒరే చూడరా! మధుర నుంచి మన కృష్ణుడు వస్తున్నట్టున్నాడు. ఆ రథం అదే కావచ్చు. గోధూళిలో ఆతడెవరో తెలియడం లేదు అన్నాడొక గోపబాలుడు. గోపకులందరు ఆగి పోయారు. రథం సమిపించింది. కాని, అతడు శ్రీకృష్ణుడు కొడు. కృష్ణుని వలె అంగీ తొడుక్కొన్నాడు. పాడుగుపాటి పుష్పమాల, పీతాంబరం ధరించాడు. ఇతడు కృష్ణుడు కాడు. (వ్రజభూమికి కృష్ణుడు ఒక్కడే ఎందుకు వస్తాడు? బలరామునితో పాటువస్తాడు కాని, అనుకొంటూ ఉండగానే ఆ రథం దగ్గరికి రానే వచ్చింది. ఇతడు కృష్ణుడు కాడు. ఇతడు ఎవరై ఉంటాడు? కొంచెం సేపు గోపబాలకులు ఆలోచించారు. ఇతడెప్పుడో ఒకసారి కృష్ణుని వద్దకు వచ్చివెళ్లాడు. ఆయనకు సేవకుడు. ఇప్పుడు కూడా ఆ కృష్ణుని దగ్గర నుంచి ఏదో రహస్య సందేశం తెచ్చినట్టున్నాడు. ఇంతలో ఉద్ధవుడు రథం దిగి వినయసం([భ్రమంతో ఆ గోపబాలకుల దగ్గరికి వచ్చాడు. వారికి నమస్కరించాడు. అతని నమస్కారాలకు ఆబ్బురపోయారు గోపబాలకులు. ఇతడు మన కృష్ణునిలాగానే శ్యాముడు. ఆయన లాగానే
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 27 వస్త్రభూషణాదులు ధరించాడు. అని పరిశీలనగా చూస్తుండగా ఉద్ధవుడు ఇలా అన్నాడు.
“నేను మధురనుంచి శ్రీకృష్ణుని ఆదేశంతో మిమ్మల్ని కలుసుకోడానికి వస్తున్నాను. మధురలో కృష్ణుడు క్షేమంగా ఉన్నాడు. పేరుపేరున మో క్షేమం ఆడిగాడు. మిలో శ్రీదొముడెవరు? అడిగాడు ఉద్ధవుడు.
“నేనే” అని గుండెమోద చేయివేసికొని చెప్పాడు సంతోషంతో శ్రీదాముడు.
స్తోకకృష్ణుడెవరు? అనగానే నేనే నేనే అని ఉద్దవుని ముందుకు వచ్చాడు స్తోకకృష్ణుడు.
వీడు అంశుడు, వీడు సుబలుడు, వీడొక అర్జునుడు, విశాలుడు వీడే. బుషభుడు, వీడు తేజస్వి, వీడు దేవప్రస్టుడు, విరూధపుడు వీడే అని శ్రీదాముడు శ్రీకృష్ణుని మిత్రులనందరిని పేర్కొని పరిచయం చేశాడు.
వారి వేషభాషలను చూచి ఉద్దవుడువారందరు గోపబాలురు అనే భావిస్తున్నాడు. దేవతలు నటులవలె గోపబాలుర రూపంలో వచ్చి శ్రీకృష్ణుణ్ని సేవిస్తుంటారని ఉద్ధవునికి తెలియదు.
“గోపజాతి ప్రతిచ్చన్నా దేనా గోపాల రూపిణః
ఈడిరే కృష్ణరామౌచ నటా ఇన నటం నృవ” (శ్రీమద్భా 10-18-10)
సాయంకాలం గోష్టాలలో గోదోహనమంగళద్వనులు వినిపిస్తున్నాయి. గోవులు పాలపాదుగులతో తమ సంతానాన్ని వెతుక్కొంటూ తిరుగుతున్నాయి. లేగ దూడలు తమ తల్లుల దగ్గరికి చెంగుచెంగున పరుగిడుతున్నాయి. వృషభగర్జనలు ్రతిద్వనిస్తున్నాయి.
గృహాలలో గోపస్రీలు శ్రీకృష్ణబలరాముల మంగళమయగుణాలను గానం చేస్తున్నారు. బృందావనం మరింత శోభాయమానంగా సౌందర్య సీమగా, సౌరభ్యసీమగా, సౌభాగ్య సీమగా కనిపిస్తున్నది. కృష్ణుడు బృందావనం విడిచి మధురకు రావడం వల్ల ఆది కళాహీనమై ఉంటుందేమో అనుకొన్నాడు ఉద్ధవుడు. అదేమీ లేదిక్కడ.
'గాయంతీభిళ్చ కర్మాణి శుభాని బల కృష్ణయోః
స్వలంకృతాభి ర్లోపీఖి: గోపైళ్చ సువిరాజితమ్' (శ్రీమద్భా: 10-6-11)
గోపగోపికలందరు రంగురంగుల చక్కని వలువలను ధరించారు. గోపికలయితే మణిఖచితసువర్ణాభరణాలను సంపూర్ణంగా ఆలంకరించుకొన్నారు. ఈరోజు
28 ('భ్రమరగీతము బృందావనానికి శ్యామసుందరుడు వస్తాడు. పాతవి, మురికివి, నలిగినవి దుస్తులు ధరిస్తే అతడు నొచ్చుకొంటాడని. కృష్ణుడు ఎప్పుడు వచ్చినా అతనికి ఆందంగా కనబడటానికి సర్బాలంకారశోభితలై, సంతోషస్వాంతలై కనిపిస్తారు గోపికలు. దైన్య వదనాలతో కనిపిస్తే కృష్ణుడు పరితపిస్తాడని, సంతతోల్దాసంతో శ్రీకృష్ణుని శుభచరితం గానం చేస్తుంటారు.
శ్రీకృష్ణుడు బృందావనంలో లేకపోయినప్పటికి, (వ్రజవాసులు. తాము కృష్ణవరహంతో వ్యధ చెందుతున్నప్పటికి, తమ గృహాలలో నిత్యకర్మలను, అసికార్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. సూర్యదేవునికి అర్హ్యమివ్వడం, అతిథులను సేవించడం, గోబ్రాహ్మణ దైవ పితృపూజలను యథావిధిగా నిర్సర్తిస్తూనే ఉన్నారు. ఇంటింట ధూపదీప నైవేద్యాలకు చెందిన సువాసనలు, అగరుపాగల సుగంధాలు గుబాళిస్తూనే ఉన్నాయి.
'అన్బ్య ర్కాతిథిగో విప్ర పితృ దేవతార్చనాన్వితైన
ధూపదీపైశళ్చ మాల్యైళ్చ గోపవాసై ర్మవోరమమ్' (శ్రీమద్భా: 10-46-12)
ద్యారబంధాలు పుష్పమాలాలంకృతములై (ప్రతిగృహమూ పర్వదినాన్ని స్ఫురింపజేస్తున్నది, ఉద్దవుడు బృందావనంలోని తరులతా నిభృత నికుంజాలను చూచాడు.
“పర్వతః పృష్పితననం ద్విజాళికులనాదితమ్
హం సకారండవాకర్షి: పద్మఖండైశ్చ మండితమ్” _ (శ్రీమద్భా. 10-46-13)
తరులతా నికుంజాలు పుష్పించాయి. పన్షులు కలనాదం చేస్తున్నాయి. సరోవరాలలో హంసాది జలపక్షులు విహరిస్తున్నాయి.
శ్రీకృష్ణుడు బృందావనంలో లేనప్పటికి ఆ (వ్రజభూమి వన్నై తగ్గకుండా ఉండటం, ఆందరు సంతోషభరితులై ఉండటం చూచి ఉద్దవుడు వింతపడ్డాడు. (చ్రజవాసులందరు ఇచ్చకాలవారని అనుమానించాడు. కృష్ణబలరాములు బృందావనంలో ఉన్నప్పుడు ఆ (ప్రదేశం ఎంత శోభాయమానంగా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. అక్కడి వారు ఇంతకుముందు ఎంత సంతృప్తిగా ఉండేవారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఏమాత్రం మార్పులేదు. ఎవరి ముఖంలోను దైన్యం, వైవర్య్యం కనిపించడం లేదు. ం
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 29
(వ్రజవాసుల దైన్యాన్ని కృష్ణుడు అంతగా తనకెందుకు చెప్పాడో ఉద్దవుడికి బోధపడలేదు. అతడు బృహస్పతికి శిష్యుడైనా ఇందుకు కారణమేమిటో (గ్రహింపలేకపోయాడు. తాను బృందావనాన్ని వదలిపోవడం వల్ల అక్కడివారందరు దిగులుపడుతుంటారనీ, విరహవ్యధతో అకర్మణ్యంగా ఉంటారనీ కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ అదేమీ లేదు. బహుళ అది కృష్ణుని అంతరంగవేదన ఏమో అనుకొన్నాడు.
నందభవన (ప్రాంగణంలో రథం ఆగింది. గోపవృద్దులు కొందరు రథం దగ్గరికి వచ్చి చూచి మౌనంగా వెళ్లిపోయారు. మరికొందరు కృష్ణుడు వచ్చాడేమో అని గబగబ వచ్చి, ఆ వచ్చినవాడు కృష్ణునిలాగానే ఉన్నాడు కాని, కృష్ణుడు కాడని అతణ్ని పలుకరించకుండానే వెళ్లిపోయారు.
లోపలనుంచి నందగోపుడు కూడా తన కుమారుడే వచ్చాడని సంతోష సంభ్రమంతో వెలుపలికి వచ్చాడు. తీరా చూస్తే అతడు ఉద్దవుడు. చేయిపట్టుకొని అతణ్ను తన భవనంలోనికి తోడ్కానిపోయాడు.
“కన్నయ్యా” ఆంటూ వచ్చి చూచింది యశోద. అక్కడ ఉద్దవుణ్ని చూచేసరికి అమెకు నోట మాట రాలేదు. కళ్లల్లో నీరు నిండింది. అలా చూస్తూనే (మ్రాన్పడిపోయింది.
“అహా ఎంత వాత్సల్యం! పరమపురుషుడైన శ్రీకృష్ణచంద్రుని మీద ఎంత ప్రగాఢమైన (ప్రేమ ఈ తల్లికి యశోదను చూచి ఆశ్చర్యపోయాడు ఉద్ధవుడు. నందుడు యశోదకు స్వస్థత కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓదారుస్తున్నాడు.
“మన కన్నయ్య వద్దనుంచి వచ్చాడు ఉద్దవుడు. కన్నయ్య మధురలో బాగానే ఉన్నాడట. ఆందోళన పడవద్దు. అంతా శుభవర్తమానమే. నిన్ను చూచి రమ్మన్నాడట కన్నయ్య వచ్చాడు ఉద్దవుడు” ఇలా మరీ మరీ ధైర్యం చెబుతున్నాడు నందుడు.
“కన్నయ్యా! నా నీలమణీ! ఇంకా ఎప్పుడు వస్తావు? నిన్నెప్పుడు చూస్తాను!” విలవిల విలపిస్తూ పలవరిస్తున్నది యశోద.
అఖిలలోక గురువు సర్వేశ్వరుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుని యందు ఎంతటి (పేమ! ఎంతటి వాత్సల్యం! కృష్ణ బలరాములు ఈ విశ్వానికి పరముకారణులు, (ప్రధానపురుషులు. సమస్త ప్రాణులకు పరమాన్వేషణీయులు. పరమజ్ఞానానికి అధీశ్వరులు. వారే పురాణపురుషులు, వారిని ఈ తల్లి తన కుమారులనుకొన్నది. ఈ త్రిభువనాలలో గొప్ప తల్లి ఈమె ఒక్కతే” అనుకొన్నాడు ఉద్ధవుడు.
30 'బభ్రమరగీతము “మరణవేళ చివరిక్షణంలో ఎవరిని ఒక్కసారి స్మరిస్తే ఏ ప్రాణి అయినా కర్మబంధనం నుంచి తప్పుకొని జనన మరణ చక్రం నుండి విడివడిపోయి పరమ (ప్రకాశరూపమైన (బ్రహ్మపదవిని తక్షణమే కైవసం చేసుకొంటుందో ఆ నిఖిలాత్ముడు, సర్వకారణకారణుడు, నరాకృతి పరబ్రహ్మమునందు వీరికి ఎంత దృఢమైన వాత్సల్య భక్తిభావమో! నందబాబా! యశోదమ్మ తల్లీ! మీరు మహాత్ములు. ఇంకమీరు చేయదగిన సత్కార్యం గానీ, పుణ్యశేషంగానీ ఈ లోకంలో మిగిలి లేదు. సమస్త పుణ్యాల, సకలసాధనాల ఫలం మీకు చేకూరింది తల్లీ!” అంటూ వివశుడై సాష్టాంగపడ్డాడు ఉద్ధవుడు. ఆ రాత్రి నందుడు ఉద్దవునికి పాయసాదులతో భోజనాది అతిథిసపర్యలు సంతృప్తిగా జరిపాడు. చక్కని శయ్యమీద పరుండజేశాడు. 'భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపొ సుఖం గతశ్రమం పర్యపృచ్ళన్ పాదసంవాహనాదిభి:” (శ్రీమద్భా: 10-46-15) మహా విద్వాంసుడు, యదు వంశక్షత్రియుడు కనుక ఉద్దవుని కాళ్లు పిసికి, విసనకట్టతో విసరి నందగోపుడు అతని మార్గాయాసాన్ని పోగొట్టాడు. తర్వాత నందుడు మెల్లగా అడిగాడు. “నా సోదరుడు శూరసేన పుత్రుడు వసుదేవుడు కుశలమే కదా! బంధముక్తుడయ్యాడు. ఆత్మీయ న్వజనులతో, పుత్రులతో సుఖంగా ఉన్నాడు కదా! కంసుడు తన అకృత్యాలుకు తానే హతమారిపోయాడు. కంసపీడ అందరికి వదలిపోయింది. ఉద్దవా! మా కన్నయ్యను గూర్చి చెప్పు. వినాలని ఉంది. మమ్మల్ని గుర్తు చేసుకొంటున్నాడా? మమ్మల్ని చూడటానికి కన్నయ్య ఇక్కడికి వస్తే బాగుంటుంది. మేము మధురకు వెళ్లటం బాగుండదు. ఇప్పటికి ఒక రహస్యం వెల్లడయింది. తన తల్లిద౦డ్రులు దేవకీవసుదేవులని, మేము కాదని కన్నయ్య తెలుసుకొని ఉంటాడు. మమ్మల్ని ఎన్నో సంకటాల నుంచి రక్షించాడు. అతని అద్భుత[క్రీడలు, మాటలు తలచుకొన్నప్పుడు మా పనులన్నీ మూలపడిపోతాయి. రోజంతా మాకదే ముచ్చట! ఏమి చెప్పను? ఈ యమున, గోవర్టనగిరి ఒకటేమిటి? ఈ బృందావనమంతా అతని చరణచిహ్నాలతో నిండిపోయింది. ఆతని క్రీడాభూమియే ఈ(వ్రజధామం. గర్గాచార్యుల మాటలు గుర్తుక్తు వస్తుంటాయి.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 31
“తస్మాన్నందాత్మజో ఇయం తే నారాయణ సమోగుణైః
(శ్రియా కీర్యానుభావేన గోపాయన్వ సమాహితవి _ (శ్రీమద్భా 10-8-16)
మా కృష్ణుడు నారాయణ సముడట! అతని చేతిలో అసురులెందరో అవలీలగా హతమారిపోయారు.
నందుడు న్మర ణంలో మునిగిపోయాడు. “కృష్ణా! నిన్ను చూడనిదే (బ్రతుకలేనయ్యా!” గడ్గదకంఠంతో పలికి ఉత్తరీయంతో కన్నీళ్లు తుడుచుకొన్నాడు.
“ఆహా! అనురాగవాత్సల్యాలకు ప్రథమంగా ఉదాహరింవదగినవారు నందయశోదలే. అవధులను మించిన వారి ్రేమభావం కల్పనా జగత్తుకు కూడా అందేది కాదు” అనుకొన్నాడు ఉద్ధవుడు.
“కృష్ణుడు ఇక్కడికి వస్తాడు. వచ్చి మిమ్మల్ని ఆనంద పరుస్తాడు” ఈ ఒక్కమాటే నందునికి పూర్తిగా అర్హమయింది. అతని చెవులలో అమృతం పోసినట్టయింది. కానీ యశోద నయనాలు మళ్లీ సెలయేళ్లయ్యాయి.
“నిజమా? ఉద్దవా! కృష్ణుడు మళ్లీ ఇక్కడికి వస్తాడా?” రుద్ర కంఠంతో పలికాడు నందుడు. జీవించడానికి ఒక ఆశాసూ(త్రం లభించిందతనికి,
“శ్రీకృష్ణుడు సభామండపంలో దుష్టకంసుణ్ణి వధించినప్పుడే చెప్పాడు, నేను (వ్రజభూమికి వెళతానని. ఆ తర్వాత సాత్వతులందరూ ఉండగా కూడా చెప్పాడు. వారే ఇందుకు సాక్షులు. అయ్యా! నేను వచ్చేటప్పుడు కూడా నాతో త్వరలో వస్తానని చెప్పమన్నాడు” మళ్లీ తెలియజెప్పాడు ఉద్ధవుడు.
“ఉద్ధవా! నీ మాటలు భగవంతుని దయవల్ల సత్యం కావాలి” అన్నాడు నందుడు.
“సత్యమైన విషయం చెప్పినప్పుడే వీరు ఇలా భావిస్తున్నారు. అసత్యం చెబితే ఎంత ప్రమాదం జరుగుతుందో!” అనుకొని భయపడ్డాడు ఉద్ధవుడు.
అయ్యా! మీరు శోకించవద్దు. ఆ కృష్ణుడు సర్వత్ర ఉన్నాడు. సకల ప్రాణులలోను ఉన్నాడు, కాష్ట్రంలో అగ్ని విద్యమానమైనట్టుగా. ఆయనకు లోకంలో ప్రియమైనవారుగానీ, ఆప్రియమైనవారు గానీ లేరు. ఆయన కంటె ్రేష్టుడూ కనిష్టుడూ లేడు. ఆయన సర్య(త్ర సమదర్శనుడై ఉన్నాడు. ఆయనకు తల్లిల్లేదు. తండ్రి లేడు. ఆత్మీయులు అసలే లేరు. శత్రువులులేరు అయనకు దేహం లేదు. జన్మలేదు. సాధుజనపరిత్రాణం కోసం జన్మను స్వీకరిస్తాడు. ఆయన్ను భక్తితో కొలిచి మీరు కృతకృత్యులయ్యారు.
32 బ్రమరగీతము 'యచ్చకించి జగత్సర్వం దృళ్యతే శ్రూయతేపి వా అంతర్చహిశ్చ తత్సర్వం వ్యావ్య నారాయణ స్ట్ర్రితః
ఈ కనిపిస్తున్న వినిపిస్తున్న చరాచర జగత్తంతా ఆ నారాయణుని స్వరూపమే. ఆయన కాక్క ఈ విశ్ళంలో మరే పారమార్థిక అస్తిత్వమూ లేదు” అని చేతులు మోడ్చాడు ఉద్ధవుడు.
ఉద్ధవుని మాటలు విని నందుడు మళ్లీ అనుమానించాడు. కన్నయ్య ఇక బృందావనానికి రాడేమో అని, యశోద వైపు చూచాడు. ఉద్దవుని మాటలు అర్హం కాక మళ్లీ బోరున విలపించింది యశోద.
ఉద్ధవుడు తత్త్వజ్ఞాని. బృహస్పతి శిష్యుడు. సర్వశాస్త్ర విశారదుడు. (ప్రేమికుల దగ్గర శాస్త్రజ్ఞానానికి నిలువ లేదు. (ప్రేమికులకు హృదయం ఉంటుంది. శాస్త్రజ్ఞాని దగ్గర శబ్దభండారం ఉంటుంది. ఒక విద్వాంసుడు మరొక విద్వాంసుని వాదనను ఆంగీకరింపడు. ఏ విషయం లోను విద్యాంసులకు ఐకమత్యం ఉండదు. పదిమంది పండితులు ఒకచోట చేరితే వారిలో వారికి సమన్వయం కుదరదు. “విద్యా వివాదాయ' అవుతుంది. విద్వాంసులు దోషజ్ఞులుగా ఉంటారే కానీ, గుణజ్ఞులుగొ ఉండరు.
ఉద్దవుని జ్ఞానకాండ ప్రసంగం అనర్గళంగా సాగిపోతున్నది. నందుడు దుఃఖం ఆపుకొని చెవులప్పగించాడు. ఏమైనా తెలుస్తుందేమో అవి. ఏకాగ్రతతో వింటున్నది యశోద, కృష్ణుణ్ని గూర్చి ఇంకా ఏమి చెబుతాడో అని.
ఉద్ధవుడు వేదాంతమంతా ఏకరువు పెట్టి ఈ లోకంలో బ్రహ్మ తప్ప మరేమీ లేదని ఉద్దాటించి ఆవులిస్తూ చిటికెలు వేసి నిద్రలో మునిగిపోయాడు. నందయశళోదలు ఆతనికి నిద్రాభంగం చేయడం అనవసరమని ఊరకున్నారు.
రాత్రిశేషంలోనే [వ్రజధామంలోని గోపికలు నిద్ర లేచారు. ఇళ్లను ఊడ్చి, గోమయంతో అలికి ముగ్గులు పెట్టారు. స్నానాదులు ముగించుకొని సర్వాభరణభూషితలై దీపం వెలిగించి గడప మీద పెట్టి వాస్తుదేవతను పూజించారు. ఆ తర్వాత పెరుగు చిలకడం (ప్రారంభించారు.
“ఉద్గాయతీనామరవిందలోచనం (ప్రజాంగవానాం దినముస్పృళద్ ధ్వనిః
దద్నశ్చ నిర్మంధన శబ్దమిశ్రితో విరస్యతే యేన దిశామనుంగళమ్”
(శ్రీమద్భా : 10-46-46)
గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్య 33 కవ్వపు (త్రాళ్లు పట్టుకొని అరవిందాన్షుడైన శ్రీకృష్ణుణ్మి గూర్చి పాడుతూ సవిలాసంగా పెరుగు చిలుకుతున్నప్పుడు గడప మీద పెట్టిన దీపాల కాంతులు గోపాంగనల కపోలశోభలను వెల్లడిస్తున్నాయి. దధిమంధనకరకంకణధ్వని, వారి సుమధురకంఠధ్వని ఏకమై స్వర్గలోకానికి చేరినట్టుంది. ఆ స్వరలహరి నలువైపుల వ్యాపించి ఆఅమంగళాలను పారదోలుతున్నట్టుగా ఉంది.
అప్పటికి సూర్యోదయమయింది. గోపాంగనల దృష్టి నందభవన ప్రాంగణంలో నిలిచిన బంగారు రథం మీద పడ్డది.
“ఈ రథం ఎవరిది? మధుర నుంచే వచ్చినట్టుంది! దుష్టకంసుని హితవరి అక్రూరుడు మళ్లి ఇక్కడికి దాపురించాడా ఏమిటి?
అప్పుడు మాయమాటల చెప్పి మన కృష్ణుణ్మి మధురకు తోడ్కొనిపోయాడు. చచ్చిన తన ప్రభువుకు వ్రజాంగనల మాంసంతో పిండ (ప్రదానం చేయదలచి ఇప్పుడు మన కోసం వచ్చాడేమో!
“కిం సాధయిస్య త్యస్మాభిః భర్తుః (ప్రేతన్య నిష్కృతిమ్ ఇతి స్రీణాం నదంతీనా ముద్దనోఇగాత్ కృతాహ్నికః" (శ్రీమద్భా : 10-46-49)
“క్రూరాతిక్రూరుడైనవానినే అక్రూరుడని పేర్కొంటారేమో శబ్దశాస్త్రజ్ఞులు!” అని ఒకరి కొకరు చెప్పుకొన్నారు గోపికలు.
ఉద్ధవుడు వ్రజధామంలో దధిమంథన ధ్వనులతో నిద్రలేచాడు. కాల్యకృత్యాలు ముగించుకొని, స్నానం, సంధ్య, స్వాధ్యాయం అనుష్టానం పూర్తి చేసుకొన్న తర్వాత యమునా తీరానికి బయలుదేరాడు.
“ఎవరితడు? ఎక్కడో చూచినట్టుగా ఉన్నదే!” గోపాంగనలు ఉద్ధవుణ్ని పరిశీలనగా చూచారు. అందరు ఒక చోటికి హడావుడిగా చేరి, ఆతడెవరో (వ్రజభూమికి ఎందుకు వచ్చాడో ఆలోచింపసాగారు.
“ఎవరితడు? ఆజానుబాహుడు, నవయౌవననంపన్నుడు. చెవులకు మకరకుండలాలు, మెడలో పంకజమాల, పీతాంబరం ధరించి కృష్ణుడేమోయన్న (భ్రమ కలిగిస్తున్నాడు. కృష్ణుడు మధురకు వెల్లిన తర్వాత వేణువు పట్టడం వదలివేశాడేమో! శిరసున శిఖిపింఛమకుటం మాత్రం లేదు.”
రెడ 'భ్రమరగీతము 'రాజీవాక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు సీతాంబరుం డాజానుస్టిత బాహు డంబురుహు నూలాలంకృతుం డుల్లస ద్రాజత్కుండలు డొక్కవీరు.డిచటన్ రాజిల్లుచున్నాడు, నూ రాజీవాన్షుని భంగి నంచు గనిరా రాజాన్వయున్ గోపికల్ “కని లజ్ఞా సహిత హాస విలోకనంబులు ముఖంబునకు చెలువాసంగ” అని గోపికల అందాలను హావభావాలను మూర్తి కట్టించారు పోతనగారు ఈ సందర్భంలో. “ఎవరోనమ్మ ఇతడు? మన కృష్ణుడు విడచివైచిన శేషవస్తమైన పీతాంబరం కట్టుకొని వచ్చినవాడుగా కనిపిస్తున్నాడు. మెడలోని పంకజమాల అతడిచ్చినదే అయ్యుంటుంది. ఇప్పటికీ ఆది వాడకుండా ఉన్నదంటే ఆ మాల నిక్కచ్చిగా కృష్ణునిదనే చెప్పాలి. ఎందుకంటే శ్రీకృష్ణుని శరీరసాంగత్యం కలిగిన పుష్పం ఎన్నటికి వాడిపోదు. ఈ సుందర వేషం మన శ్యామసుందరునిదే” అన్నది ఒక గోపిక. శ్యామసుందరుని రూపమాధుర్యమునందే గోపాంగనల తుమ్మెదలవంటి నయనాలు సర్వదా లుబ్ధమై ఉంటాయి. గోపీనయనోత్పలార్చిత శరీరుడతడు. నీలిమేఘాన్ని చూచినా, తమాలవృక్షాన్ని చూచినా యమునా నదిని చూచినా గోపికలు శ్యామసుందరుడని భ్రమపడతారు. జడపదార్జాలను చూచి (భ్రమపడే గోపికలు సరిగా ఆ కృష్ణుని వలె వేషం ధరించినవాణ్ని చూచి భ్రమపడకుండా ఉంటారా? అదీకాక, ఆ ఉద్ధవుడు ధరించిన పంకజమాల, పీతాంబరము, అతని ప్రలంబ బాహువులు, అనన్ముఖారవిందమూ భగవద్విభూతిని వ్యంజిస్తున్నాయి. గోపాంగనలకు ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. కానీ ఇదంతా కృత్రిమ వేషమే అని వారి అంతరాత్మ ్రబోధిస్తున్నది. “శచిస్మితాః కోయ మసీచ్య దర్శవః కుతళ్ళ కస్యాచ్యుత వేష భూషణ (శ్రీమద్భా : 10-47-2) పై ఖ్రీకంలో గోపికలకు విశేషణంగా 'సుచిస్మితాః అనే పాఠం సరికాదని, సువిస్మితా? అనే పాఠాంతరం ఉందని శ్రీవిశ్చనాథ చక్రవర్తి ఎంతో బౌచిత్యవంతంగా తన వ్యాఖ్యానంలో చర్చించాడు. శ్రీకృష్ణవిరహంలో ఉన్న గోపికలు “శుచిః స్మితాః' తెల్లని తేట నవ్వుగలవారెలా అవుతారు? 'స్మెితం' సుఖదశకు ఉపలక్షణమవుతుంది.
గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్య రక్ గోపికలు సుఖంగా లేరు. కృష్ణుని వలె పంకజమాల, పీతాంబరం ధరించి బృందావనానికి వచ్చిన కృత్రిమ వేషధారిని చూచేసరికి గోపికలు విస్మయానికి లోనయ్యారు. “శుచి స్మితం” అంటే కామలోభాది వినిర్ముక్తమూ, శుద్దమూ ఆయన చిరునవ్వు అని అర్థం చెప్పినా జౌచిత్యవంతంగా ఉంటుంది. తమను మోసగించడానికి శ్రీకృష్ణుడు ఉపయోగించిన ్రగ్గంధ వాసోలంకారాలతో వచ్చాడితడు. (వ్రజస్రీలు తెలివితక్కువవారూ, అమాయికలూ కారు అని తెల్పడానికే వారు పరిహాసంగా నవ్వారు. విరహవ్యధలో ఉన్న యువతులను మోహపెట్టడానికి కాముకులు ఎన్నో వేషాలు వేస్తారు. వారి ఎత్తుగడలు తెలుసుకొన్న గోపికలు ఇతబణ్ని ఒక ఆటపట్టించాలనుకొని సస్మితలయ్యారు. “తం వీక్ష్య కృష్ణానుచరం ప్రజ స్ర్రీయః ప్రలంబబాహుమ్” (శ్రీమద్భా వ 10-47-2) 'ప్రజస్రియః' అంటే (వ్రజభూమిలో గల (స్రీలందరు అని భావింపరాదు. 'శ్రేస్టత్వేన యా ప్రసిద్ద: భగవత్ర్రేయసీ రూపాః స్త్రియ కృష్ణ గృహీత మూనపాః బృందావనంలో శ్రీకృష్ణునికి ప్రేయసులైన 'స్రీలే ప్రసిద్దురాండ్రు. వారే 'శ్రీకృష్ణ గృహీత మానసలు' రాధాదేవి, చంద్రావళి, లలిత, విశాఖ మొదలైనవారు అంతరంగ సఖులు. “ఇతిస్మ సర్వా పరివవ్రు రుత్పుకా: త ముత్తమళ్లోక పదాంబుజాశ్రయమ్" ఎవని యశస్సు .ఉత్తమమైనదో అతడు ఉత్తమళ్టోకుడు. అతడు శ్రీకృష్ణ భగవానుడు. అతనిచరణారవిందాలను ఆశ్రయించినవాడీ ఉద్ధవుడు, ఆ శ్రీకృష్ణుని అనుచరుడు, అంతరంగసఖుడు అని గోపికలు తెలుసుకొన్నారు. శ్రీకృష్ణుని సందేశమేదో తెచ్చాడని ఉత్కంఠితలయ్యారు. ఆత్యంతవినయంగా నుసుసిగ్గు నవ్వులతో, తియ్యనిమాటలతో మర్యాదలు చేసి, ఆతణ్ని ఏకాంతంలోనికి తోడ్కొనిపోయి ఒక పీళం మీద కూర్చుండబెట్టారు. “రహస్య ప్పృచ్చ న్నుపవిష్టమానవే విజ్ఞాయ సందేశహరం రమాపతే: (శ్రీమద్భా : 10-47-3) ఇక్కడ 'రమాపతి' పదప్రయోగం 'రాధాపతి' అనే అర్ధంలో ప్రయుక్తమయింది. (వ్రజధామం రమాక్రీడకు (లక్ష్మీదేవికి) ఆశ్రయస్థానమయింది. రాధాదేవి రూపంతో లక్ష్మీదేవి క్రీడించిందని అర్ధం.
36 (భ్రమరగీతము “బృందావనేతరస్టా సా లక్ష్మీ రూపా లక్ష్మీదేవి బృందావనంలో రాధారూపంతో, తక్కిన చోట్ల లక్ష్మీరూపంతోను ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇప్పుడు మధురలో ఉన్నాడు కాబట్టి 'రమాపతి" అని ఆయన్ను పేర్కొన్నాడు శ్రీ శుకదేవుడు. విశ్చనాథ చక్రవర్తి ఈ సందర్భంలో శ్రీ శుకదేవుడు. గోపికా పక్షపాతిగా పేర్కొన్నాడు. నిజానికి శ్రీశుకదేవుడు రాధాదేవ్యుపాసకుడు. తన ఉపాసనాదేవత పేరును చెప్పగూడదని శాస్త్రవాక్యాన్ని అనుసరించి ప్రకారాంతరంగా రాధాదేవిని స్మరిస్తాాయన, పై శ్లోకం భాగవతవక్త అయిన శ్రీ శుకదేవునిది కాబట్టి విశ్శనాథచ క్రవర్తి పరిశీలనకు సంతోషింపనివారుండరు. వేడుక రాధాభుజమున క్రీడాశుకమైనవాని శ్రీకృష్ణకధా ప్రొఢుని వైయాసకి యతి చూడామణి పరమహంస శుకునిన్ గొలుతున్ (రాసపూర్లిమ కావ్యం నుంచి)
“జానీ మస్త్వాం యదుపతేః సార్షదం సముపాగతమ్
భగ్రేహ ్రేషితః పిత్రోభవాన్ ప్రియచికీర్ణయా' (శ్రీమద్భా : 10-47-4)
'ప్రణయకోపాశ్రాంత స్వాంతయై ఉద్దవాగమానాన్ని అన్యథాకరిస్తూ గోపికలలో
ఒకతె ముందుకు వచ్చి మర్యాదగా ఇలా అన్నది. “మీరు ఉద్ధవులు కదూ! మీరు మా వ్రజనాథునికి, కాదు కాదు యదునాథునికి పార్షదులు కదూ? మీరు వారి ప్రక్కనుండేవారు కదా!”
('వ్రజభూమిని వదలి కృష్షుడు మధురానగరానికి వెళ్ళాడు. ఇక్కడి నందయశోదలను వదలిపెట్టి, అక్కడ వసుదేవదేవకీదేవుల పుత్రుడయ్యాడు. అందుచేతనే కృష్ణుణ్ని 'యదుపతి” అని వ్యంగ్యంగా పేర్కొన్నది గోపిక, కోపనివర్తనానికి చాటు కారిత్వం తోడ్పడుతుంది.
అయ్యా! మీరు “ఆ యదుపతి సందేశాన్ని తీసుకొని మీరిక్కడికి దయచేసినట్టున్నారు. అంతేనా? తమ తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలని
మీ స్వామి మిమ్మల్ని పంపారనుకొంటాను”.
(ప్రజనాథుడు యదుపతి అయ్యాడు. ఇక మధురాధిపతి కూడా అవుతాడు. గోపజాతికి చెందిన నందయశోదల పుత్రుడు మధురాధిపతి అయితే లోకం గర్హిస్తుందని ముందుగా తాను యదుపతిగా ప్రచారం చేసుకొంటున్నాడు కాబోలు
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 37 కృష్ణుడు. పాపం! నందయశోదలు కృష్ణుడు తమ పుత్రుడని జగమంతా చాటి చెప్పుకోలేరు. పుత్రవాత్పల్యం ఆ పని చేయనివ్వదు. ఒకవేళ వారు ఈ రహస్యం బైట పెడతారేమో అని, బుద్ధిలో బృహస్పతి వంటివాడే కాకుండా, సాక్షాత్తు బృహస్పతిశిష్యుడైన ఉద్దవుణ్ని కృష్ణుడు బృందావనానికి పంపాడు. ఈ ఉద్దవుడు నందయశోదలను సముదాయించడానికి వచ్చినవాడే కాని, గోపికల స్ట్రితిని విచారించడానికి పంపబడినవాడు. కాదు. "యదువతి” పదంలో ఇంతటి అర్హగాంభీర్యం ఉన్నది. ఈ పలుకులు గోపికలలో యూధనాయిక అయిన రాధాదేవివి అని భాగవతదార్శనికుల అభిప్రాయం.
భ్రమరరీతము క్ష “ఉద్ధవ మహాళయా! మీరు యదునాథుని పార్షదులనీ, ఆయన తన తల్లిదండ్రులకు సంతోషం కలిగించడానికి తమను ఇక్కడికి పంపించారనీ స్పష్టంగా తెలుస్తున్నది. గోష్టాలు, గోగణాలు గల ఈ వ్రజధామంలో మీ స్వామి స్మరించదగిన వస్తువులు ఇంకేవీ ఇక్కడ లేవు కాబోలు!” అన్నది రాధ. తల్లిదండ్రుల, బంధువుల రక్తసంబంధాన్నీ, స్నేహ సంబంధాన్నీ వదలుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. అడవులలో తపస్సు చేసుకొంటున్న బుషులకు, మునులకు కూడా అది సాధ్యం కాని పని. వీరుకాకుండా ఇతరులతో "స్నేహ సంబంధాలు నిజానికి అనుకరణలు. ఒక విధంగా వంచనలే అవుతాయి. ఒక పురుషుడు ఏ (స్రీయందైనా ప్రేమను (ప్రదర్శించాడంటే, తుమ్మెద ఒక పుష్పం చుట్టూ తిరిగిందంటే దానికి కారణం స్వార్ధమే. అవ్వేషు అర్ధకృతా మైత్రీ యావదర్థవిడంబనమ్ (శ్రీమద్భా 10-47-6 తల్లిదండ్రులతో తప్ప, ఇతరులతో సంబంధాలన్నీ స్వార్థంతో కూడినవే. ప్రాపంచిక సంబంధాలన్నీ ఇలాంటివే. పుష్పమధురిమలు అణగిపోగానే తుమ్మెదలు ఆ పువ్వును విడిచిపెడతాయి. ప్రభువు సమర్భుడు కాక పోతే ప్రజలు అతణ్ని వదలివేస్తారు. అధ్యయనం పూర్తి కాగానే శిష్యులు గురువును వదలివేస్తారు. యజ్ఞంలో దక్షిణ చేతికందగానే బుత్విజులు యజమానికి చెప్పకుండానే ఇళ్లకు చేరుకొంటారు. అతిథులు సుష్టుగా భోజనంచేసి గృహస్తు భుజించకముందే వెళ్లిపోతారు. (స్త్ర హృదయంలో ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ పురుషుడు తన కార్యం పూర్తికాగానే మళ్లీ మొగం చూపడు. ఉద్ధవ మహాశయా! లోకం తీరు ఇది. ఈ విధంగానే కృష్ణుడు మమ్మల్ని వదలి వెళ్లిపోయాడు - ఈ మాటలు పలుకుతుండగా అమె కంఠం రుద్ధమయింది. కళ్లల్లో నీళ్లు నిండాయి. “ఉద్ధవా! మేము దీనాతిదీనలమయ్యాము” అన్నది ఆ గోపిక.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 39 “అఆపేదిరే£.ంబరపథం పరితః సతంగా;: భృంగా రసాల ముకుళావి సమాశ్రయంతి, సంకోచమంచతి సరస్వ్వయి దీనదీనో మీనో ను హంత! కతనూం గతి మభ్యుపైతు” (భామినీ విలాస
ఓ సరోవరమా! నీవు జలభరితవైనప్పుడు తామర పువ్వులతో, కలువ పువ్వులతో కలకలలాడుతుంటావు. సారసాదిపక్షులు, తుమ్మెదలు నిన్నాశ్రయించి, నీ శోభను ఇనుమడింపజేస్తుంటాయి. కానీ, ఓ సరస్సా! ఎండాకాలంలో దురదృష్టవశాత్తు నీవు ఎండిపోయినప్పుడు పక్షులు నీ దగ్గరికి రానేరావు. తుమ్మెదలు నిన్ను విడిచి రసాల కళికలను ఆ'శ్రయిస్తాయి. పాపం! నీలో దీనాతిదీనములై పడియున్న చేపలు మాత్రం ఎక్కడికీ పోలేవు! ఆ సరస్సుతోపాటే అవీ దుఃఖసంతప్తమై అక్కడే ఎండి చస్తాయి. ఆ పక్టులు, తుమ్మెదలు రసికులు. తమ స్వార్థం కోసం మరొక దారి చూచుకొంటాయి. పాపం! చేపలు మరొక దారి లేనివి. రసికత కూడా లేనివి. |
ఈ గోపికలు కూడా చేపలవలె దీనాతిదీనలే. చేసలవలె వేరే మార్గం లేనివారే. కాని, రసికత లేనివారు మాత్రం కాదు.
ఆ గోపిక శ్రీకృష్ణయోగ సంతప్తయై ప్రణయకోపంతో “అన్వేస్వర్థకృతా మైత్రీ” మాతాపితృసంబంధం కంటె భిన్నమైన సంబంధం కలవారితో మైత్రి- స్నేహం స్వార్థపూరితంగానే ఉంటుందన్న, వారు ప్రేమను అనుకరిస్తారేకాని, వారిది నిజమైన (ప్రేమ కాదనీ అది ఆడంబరమూ విడంబనమూ మాత్రమే అని ధ్వనింపజేసింది.
గోపికల మనోవాక్కాయాలు శ్రీకృష్ణునియందే లీనమయినాయి. శ్రీకృష్ణుని దూతగా వచ్చిన మహాజ్ఞాని ఉద్దవుని ముందు ఇలా పలుకవచ్చునో, కూడటదో అనే సంగతి మరచిపోయారు. శ్రీకృష్ణుడు శైశవం నుంచి కిశోరావస్థవరకు చేసిన లీలలను వారు గుర్తుకు తెచ్చుకొని వర్షిస్తూ స్తుతిస్తూ శోకించకుండా ఉండలేకపోయారు. అత్మవిస్కృతిని పొందారు.
మహాభావ స్వరూపిణి, వృషభాను నందిని, ్రాదినీశక్తి ఆయిన రాధ మౌనంగొ కూర్చున్నది. గోపికల వ్యంగ్యోక్తులను ఆలకిస్తున్నది. మధురలో ఒక రమణికి కృష్ణునికి జరిగిన ముచ్చటను కల్పనా చక్షువులతో పరికిస్తూ ఆలోచిస్తున్నది. కృష్ణ సంగమాన్ని
40 (బ్రమరగీతము ధ్యానిస్తున్నది. మానసికంగా శ్రీకృష్ణ సంగమం (ప్రాస్తింపజేసుకొన్నది. పూర్వం (ప్రాప్తించిన కృష్ణసంగమసుఖాన్ని స్మరిస్తున్నది. మరల అట్టి ప్రియసంగమం ఎప్పుడు ప్రాప్తిస్తుందా అని ఏలపిస్తున్నది. నాగరస్త్రీలు ప్రగల్భలు. మేము బ్రూవిలాస హావభావాద్యనభిజ్ఞలము. వారి సంపర్కంతో కృష్ణుడు తనను మరచాడేమో అని, తమను సముదాయించడానికి ఈ ఉద్దవుణ్ని రాయబారిగా పంపాడని ఊహించి మండిపడుతున్నది రాధ. ఇంతలో ఒక గండు తుమ్మెద అక్కడికి చేరింది. శ్రీశుకదేవుడు “కాచిత్ మధుకరం దృష్టా” 'ఒకానాక గోపిక తుమ్మెదను చూచి' అన్నాడు కాని ఆమె ఎవరో పేర్కొనలేదు. శ్రీరాధ శ్రీశుకునికి ఉపాస్యదేవత. భాగవతంలో 'రాధ' లేదేమి అనేవారు ఈ విషయాన్ని (గ్రహించాలి. కాచిత్ - అంటే రాధ అని అర్థం. “కాచిత్ గోపాంగనా” అనగా అమె ప్రేమదేవత, భగవచ్చరణారవిందముల యందు ఎవరికైనా (ప్రేమానుభూతి కలిగిందనగా అది రాధా కృపా ప్రసాదమే “కం” (ప్రేమాత్మకం సుఖం భజనేషు క్షణేక్షణే ఆచి నోతి అభివర్ణయతి ఇతి కాచిత్” అని వ్యుత్పత్తి,
ఆ తుమ్మెద జుమ్మని శబ్లిస్తూ రాధాపాదసరోజ సౌరభలోభంతో వచ్చింది. అసలే ఈర్చ్యాసూయలకు లోనై ఉన్న పరమమానవతి రాధ తుమ్మెదను సంబోధిస్తూ కృష్ణునిగూర్చి అన్యాపదేశంగా ఇలా అన్నది.
మధుప కితనబంధో మాస్పృశాంఘ్రిం సపత్సాః: కుచ్ విలులిత మాలా కుంకుమను శ్మశ్రుభిర్న:ః వహతు మధువతి స్త న్మానివీనాం ప్రసాదం యదుసదపి విడంబ్యం యస్య దూతప్వ్యమీదృక్. (శ్రీమద్భా 10-47-12) “'మధుపం' అంటే తుమ్మెద. ఓయీ! నీవు మధుపమవా? మద్యపాయివా? నీవుకపటివి. ధూర్తులకు కార్యసాధకుడవైన బంధువవు. కాబట్టి నీవు కూడా ధూర్తుడవే సుమా! నీవు నా పాదాలకు (మైొక్కవద్దు. ఆ కపటికి దూతవై నీవిక్కడికి వచ్చావు. అతడు మహారాసంలో నా భుజం మీద తన పీతాంబరం ఉంచి, నీకు బుణపడ్డానని చేతులొగ్గి ప్రార్థించాడు. బుణం తీర్చుకొనేవాడైతే ఇలా పట్టణాలకు పారిపోడు. నీవూ మహాకపటివే. నీ ప్రభువు మధురకు వెళ్లే టప్పుడు ఏమని చెప్పాడు?-మధుర నుంచి వెంటనే తిరిగి వస్తానని చెప్పాడు.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య త్తే అదంతా అతని కపట నాటకం లోని భాగమే. బృందావనానికి తాను స్వయంగా రాకుండా మా వద్దకు ఒక దూతను, గాయం మీద కారం చల్లడానికి పంపాడు. ఓ మధుపా! నీవు నా దగ్గరికి రాకు దూరంగా ఉండు. నా కాళ్లకు మైక్కవద్దు. మీ యిద్దరికి నామైక్యమూ ఉంది. వర్షసామ్యమూ ఉంది,
ఓ మధుపా! మధురా నగరంలో నాగరిక యువతుల సంపర్కంలో నీ వనమాల నలిగిపోయింది. ఆ స్త్రీల పక్షస్థలం మీది కుంకమ చందనాలు అంటుకొన్నవి కాబోలు. నీ మోసాలు మెరుస్తున్నవి. నీ సవతుల అను[గ్రహ ప్రసాదాన్ని తెచ్చి మాకివ్వడానికి వచ్చావా ఏమిటి? దాన్ని పాపట మీద పెట్టడం ఉచితం. కాని పాదాల మీద పెట్టడం మద్యపుని ఉన్మాద విజ్బంభణమే అవుతుంది. మీ ప్రభువు మధుపతి, నీవేమో మధుపమవు మీ వరుస చాలా బాగుంది. ఈ ప్రసాదాన్ని జాగ్రత్తగా పట్టుకపోయి మీ ప్రభువుకే ఇవ్వు. యాదవసభలో చాన్ని దర్చంగా ధరించుకొంటాడు. ఇప్పుడాయన నిందలకు భయపడేవాడు కాడు. మధురాధిపతి అయినాడు కదా! ఇక ఆయనకు ఎవరివల్ల భయం? మా దగ్గరికి రావడం వల్ల ఆయనకు ఏమి ప్రయోజనం?
“మధుప! కితవబంధో![!” అనే భాగవత నాకం రాధాదేవి పలుకులని అభిప్రాయపడ్డారు. భాగవత వ్యాఖ్యాతలు సనాతన గోస్వామి ప్రభృతులు.
“భమరా! దుర్దన మిత్ర! ముట్టుకుము మా పొదాబ్దముల్ నాగర ప్రమదాళీ కుచ కుంకునూంకిత అస శ్రాణేశ దామ (ప్రసూ న మరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుగొ క మమున్నేప్పుచు పొరకొంతల శుభాగారంబులన్ నిత్యమున్" (పోతనగారి భాగవత౦)
“మధుష! కితవబంధు” సంబోధనకు పోతనగారు *భ్రమరా! దుర్దనమిత్ర” అని అనువదించారు. “భ్రమరం” అంటే మొదట చివర రెండు (రేఫలు) రకారాలు కలది తుమ్మెద అని అర్థం. 'మధుప' మధుపానం చేసేవాడు, లేదా “మధుపతి” మధురాధిపతి అనే పదాలకు సంగ్రహరూపం. త్రాగుబోతును, మోసగాడును అయినవానికి బంధువుడా! అని మరొక అర్థం.
తై ('భ్రమరగీతము “కితవ బంధు” కితవుడు అంటే ఉన్మత్తుడు, ధూర్హుడు అని అర్ధం. కితవునికి బంధువైన వాడు మరింత ధూర్హుడై ఉంటాడు. కృష్ణుడు ధూర్తుడు. అతని పంపున వచ్చినవాడు మరింత ధూర్తుడు అని వ్యంగ్యం. ధూర్తులతో తిరిగేవానికి ధూర్తలక్షణాలన్నీ అలవడుతాయి. అతడొక్కొక్కప్పుడు మహామర్యాదగా మాట్టాడుతాడు. కాళ్ళు పట్టుకొంటాడు. బతిమాలుతాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం ధూర్తులక్షణాలలో ఒకటి. వారు చంకదుడ్డు శరణార్జులు కూడా.
ఆ తుమ్మెద రాధ పాదాల దగ్గరికి వచ్చింది. "నీకు పాదాభివందనం చేస్తున్నాను. నన్ను క్షమించుమని వేడుకొంటున్నాను” అన్నట్టుగా. “ప్రణామాంతో నమూన” అనే అర్యోక్తి ఉంది. పాదాభివందనంతో ప్రియులు ప్రియురాండ్ర ప్రణయకోపాలను ఉపశమింపజేయడం కద్దు.
ఆ తుమ్మెద రాధాదేవి పాదాలు పద్మాలని భ్రమపడి వచ్చిందేమో! అది మధుపం కదా! తన బుద్ది పోనిచ్చుకోదు. వ్రజసుందరీ జల్సితమాధుర్యాన్ని ఆస్యాదించడాని (భ్రమరరూపంతో వచ్చాడేమొ శ్రీకృష్ణుడు,
ఏమైనాగాని, రాధ తన పాదాలను ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ “నీవు చెప్పదలచు కొన్నదేదో చెప్పు. వింటాను కాని, నా పాదాలను తాకవద్దు. మైలపడవలసి వస్తుంది” అని తెలిపిందామె.
ఓ తుమ్మెదా! ఆ ధూర్హునికి నీవు తగిన చుట్టానివే సుమా! మీ యిద్దరిలో భేదం ఏమాత్రం లేదు. కాని, నీవు ధూర్తత్వంలో బరి తెగించినట్లుగా కనిపిస్తున్నావు. కుంకమలిష్తమైన నీ శ్మశ్రువులు (మీసాలు గడ్డాలు) చూస్తుంటే వీ 'గ్రామ్యకర్మ వెల్లడవుతున్నది. అందుచేతనే నా పాదాలను తాకవద్దని చెబుతున్నాను. ఆతడు దూతగా పంపేటప్పుడు నిన్ను పరిశుద్దుని చేసి పంపాలి కదా. అలా చేయలేదు. అతడూ నీ వంటివాడే. మధుపానాది కర్మానుష్టాన క్షముడైనవాడు వివేకవంతమైన దౌత్యానికి ఎలా యోగ్యుడవుతాడు? ఆ ధూర్హాధిరాజు మమ్మల్ని అపహాస్యం చేయడానికి కుంకుమలిప్త శ్మశ్రువులుగల నిన్ను పంపాడు.
మధుపానం చేసేవారు, మధువును అమ్మేవారు ఒకరికొకరు తోడ్పడుతూ సుఖం కలిగిస్తూ ఆత్మబంధువులై ఉంటారు. త్రాగుబోతు తన దుర్వాసనను కప్పి పెట్టుకోవాలనుకొంటాడు. కాని, ఆ దుర్వాసన అతనికంటె ముందే బయలుదేరుతుంది.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య డ్రె బయటికి పొక్కకుండా కష్టపడి కప్పిపెట్టుకోదగినవాటినే చేతబట్టుకొని వచ్చే నీవంటి నిర్షజ్ఞితులను గూర్చి ఏమని చెప్పాలి? విప్రలంభశ్చంగారరసవద్ధట్టంలో దూతనాయకుల నిద్దరినీ అన్యాపదేశంగా దూషించడం రసపోషణమే అవుతుంది. రసశా(స్రానుగుణమే అవుతుంది. (ప్రచ్చన్న కామునికి దగ్గరికి ఒక నాయిక కుజ్జదైన తన దూతికను పంపిందట. తిరిగి వచ్చిన దూతిక యందలి సంభోగ చిహ్నాలను చూచి నాయిక ఇలా అన్నది. “నిశేషద్యుత చందనం స్తనతటం, నిర్చష్టరాగోధరో నేత్రే దూర నునంజనే, పులకితా తన్వీ త వేయం తనుః మిధ్యావాదిని దూతి, బాంధవజనస్యాజ్డాత పీడాగమే వాపీం స్నాతు మితో గతాస, న పున స్రస్యాధమస్యాంతికమ్” -అమరుక౦ం “నీ ఒంటి మీది చందనం పోయింది. పెదవి రంగు తరిగింది. కళ్ల కాటుక తొలగింది. ఒళ్లంతా పులకరించి ఉంది. ఎందుకు అబద్ధమాడతావు? నీవు బావి దగ్గర స్నానానికి వెళ్లావు కానీ, ఆ అధముణ్ని పిలుచుకరావడానికి వెళ్లలేదు” విపరీత లక్షణచే ఆ అధమునితో శ్రీడించడానికి వెళ్లావు అని వ్యంగ్యం. దూతికా సంగమంతోనే తృప్తిపడే ఆ నికృష్ణుని దగ్గరికి మళ్లీ వెళ్లవద్దు అని ఒక హెచ్చరిక. ఇక్కడ "కితవబంధు” అనడం దూషఃమే కదా!
బ్రమరగరీతము జి సకృదధరసుధాం స్వాం మోహినీం పాయయిత్వా సుమనస ఇవ సద్య స్త త్యజే౬ స్మాన్ భవాదృక్ పరిచరతి కథం తత్ పాద పద్మంతు పద్మా హ్యపి బత హృతచేతా ఉత్తమశ్లోకజల్లై:” (శ్రీమద్భా 10-47-13) “మధుపం ఒక పుష్పాన్ని వదలి మరొక పుష్పం మీదికి వెళ్లినట్లుగా మీ కృష్ణుడు కూడా మా లాలసతను, తల్లీనతను పెంపొందించడానికి తన అధరామృతాన్ని మాచేత అన్వాదింపజేశాడు. తాను మోహినీరూపం ధరించి దేవతల పట్ట పక్షపాతంతో వారికి అమృతం అందించినట్టుగా. ఆ మోహినీ మాయను ప్రదర్శించే మాచేత కూడా బలాత్కారంగా ఆధరామృతపానం జరిపించాడు. ఆ మోహినీమాయ వివేకాన్ని నశింపజేసి దురంతలాలసతను ఉత్పన్నం చేస్తుంది. మేము బేలలమయ్యాము. మమ్మల్ని వదలి పెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి పాదపద్మాలను లక్ష్మీదేవి ఏ కారణంతో సేవిస్తున్నదో బోధపడటం లేదు. ఆమె ఈతని అబద్దాల మాటలకు అకర్షితురాలై ఉండవచ్చు. కాని, మేము ఆ లక్ష్మీదేవివలె విచక్షణారహితలము కాము సుమా!” పాపం! ఆ లక్ష్మి జడనిధిలో (సముద్రం)లో జన్మించింది. కాబట్టే ఆమెకు జడత్వంతోపాటు విచక్షణారాహిత్యం ఏర్పడ్డది. మేము మనుష్యులం. ఆందులో గోసేవచేసే పుణ్యాత్ములం. గోపకులం వాళ్లము. గోసీవ చేసిన పుణ్యమహిమ వల్ల మాకు పవిత్రతతోపాటు విచక్షణాజ్ఞానం కూడా అబ్బింది. లక్ష్మీదేవి సమస్త స్త్రీ మూర్తులయందు అధిష్టించి ఉంటుంది. తన శుభగుణాలలో అత్యంత (శ్రేష్టమైన సుగుణంతో తన భర్త శ్రీచరణ కమలాలను సేవిస్తుంటుంది. ఆమె నిత్యానపాయినియై నిరంతరం భర్తను అనుసరిస్తుంటుంది. ఆమె నిజంగా సరళస్వభావురాలు. ధూర్తజనుల నయవంచకత్వం ఎరుగని అమాయికురాలు.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య త్తీక్
శ్రీకృష్ణుణ్ని ఉత్తమళ్లోకుడని ప్రశంసిస్తారు. ఉత్తములచేత ప్రశంసింపబడేవాడని అర్ధం. లక్ష్మీదేవి అతడు ఉత్తమళ్టోకుడన్న నామమాత్రాన్నే అభిలషించి అతణ్ని అనుసరిస్తుంటుంది. అతనికి ఉత్తమళ్ళోకుడనే విశేషణం కేవలం జల్పితమే. మిథ్యాకథనం మాత్రమే. అతని మిథ్యాకీర్తిని పాపం! ఆమె నమ్మింది!
ఆ కృష్ణుని మధురాధర౦ నుంచి వెలువడిన మురళీనినాదాన్ని విన్నవారు సాంసారిక భోగాలను, సమస్త కామనలను, తమకు ప్రియాతిప్రియమైన పదార్జాలనన్నిటినీ తృణప్రాయంగా త్రోసిపుచ్చి అతని వెంటబడతారు.
పూర్వం సుమనసులకు అనగా దేవతలకు అమృతం 'త్రాగించినట్టుగానే కులవతులమూ, సుమనస్కలమూ అయిన మాచేత కూడా తన ఆధరామృతాన్ని బలవంతంగా ఆస్వాదింపజేశాడా కృష్ణుడు. దాని పరిణామమే మాకీ దుఃఖం. అతని అధరసుధలో ఏదో మోహినీనూయ రహస్యంగా దాగి ఉంది. అది మా బుద్దిని కూడా చెడగొట్టింది. మంచి- చెడులను గ్రహింపనీయకుండా చేసింది. ఆ కృష్ణుని పట్ల ప్రబలమైన ఆకర్షణను కలిగించింది. ఓ (భ్రమరమా! మీ ప్రభువును కీర్తిస్తూ అనేకులు బైరాగులైపోయారు. ఆతని సుఖం కోరుకొని, తమ సుఖాలను వదులుకొని దేశ దిమ్మరులయ్యారు. మేమే ఇలా అయినప్పుడు పాపం! ఆ లక్ష్మి సంగతి చెప్పేదేముంది!
బృందావనాన్నీ, తమను విడిచి మధురకు వెళ్లిన శ్రీకృష్ణుని గూర్చి గోపాంగనలు 'ప్రణయకోపంతోను, అసూయతోను, (ప్రేమాతిశయంతోను దోషాలను ఒకటొకటి అనుసంధిస్తున్నారు. శ్రీకృష్ణునికి వారి ఆనురాగాతిశయం తెలుసు, వియోగంలో వారెంతగా వ్యధపడుతుంటారో తెలుసు. తనను ఎంతగా నిందిస్తుంటారో కూడా తెలుసు.
రాధికాహృదయరసామృతసింధువులో విభిన్న భావతరంగాలు ఉవ్వెత్తున లేచాయి. సామాన్యదృష్టితో చూస్తే ఇది అత్యంత లౌకికంగానే కనిపిస్తుంది. కానీ, లోతుగా పరిశీలిస్తే ఇది సర్వేశ్వరుడైన నందనందనుని పట్ట గోపికల ప్రేమభక్తికి మహత్తరమైన అభివ్యంజన.
గోపాంగనల దోషారోపణలు నిజానికి యథార్జాలు కావు. అవి కేవలం జల్సాలు. అనగా దబ్బరలు - అబద్ధాలు. ప్రణయకోపంతో తనను నిందిస్తున్న గోపికల వ్యంగ్యోక్తులకు భగవానుడు ప్రియపడతాడేమో! భ్రమరరూపంతో అక్కడికి విచ్చేశాడు.
కీర 'భ్రమరగీతము త్రీ విష్ణువు మోహినీ రూపం ధరించి, అసురులను వంచించి, దేవతా శ్రేణులకు అమృతం (త్రాగించిన విషయం సత్యమే. ఆ మోహినీమాయతోనే శ్రీకృష్ణుడు తన అధారమృతాన్ని గోపికలచేత 'పాయయిత్వా' బలవంతంగా త్రాగించాడనడం జల్ప్సమే అవుతుంది. గోపికలు ఆసక్తితో శ్యామసుందరుని అధరసుధలను ఆస్వాదించారు. కాని, బలవంతంగా 'త్రాగించినవాడనడం పొసగదు. ప్రణయకోపంతో పలికే లోకవిరుద్దమైన అబద్దాలివి! తన్మనస్కలైన గోపికల జల్పాలను విని ఆనందిస్తాడు శ్రీకృష్ణుడు. వాటిని వినడానికే తగిన రూపంతో వారి సమక్షానికి వచ్చాడు.
ఓ దుర్దనమిత్రా! నీవు నీ స్వామికంటె నాలుగాకులు ఎక్కవ చదివినవాడవు. మీ యిద్దరికి స్వామిభృత్యభావం కలిగించి ఆ బ్రహ్మదేవుడు ఉచితజ్ఞుడయ్యాడు! అన్నది రాధ.
ఈ ఫ్టోకంలో శ్రీకృష్ణుని నిర్భయత్వ, శఠత్వ, చాపల్యాలను ఏకరువుపెడుతూ రాధిక తన విలక్షణత్వాన్ని వెల్లడించుకొన్నది. పై భావాలను స్ఫురింపజేస్తున్న పోతనగారి హృద్యమైన పద్యాన్ని చిత్తగించండి,
ఒకపువ్వందలి తేవె ద్రావి మధుసా! ఉత్సాహివై నీవు వే
రొకటిం బొందెడు భంగి, ము మ్మధర సీయూషంబునం దేల్చినూ అకళంకోజ్వల యౌవనంబు గొని అన్యాసక్తుడయ్యెన్ విభుం డకటా! ఆతవి కెట్లు దక్కెసిరి? మిథ్యాక్తీర్తి నమ్మెన్ జుమీ!
భ్రమరగీతము 3 కీ మిహ బహు షడంధఘ్రే గాయసి త్వం యదూనా మధిపతి మగృహాణా మగ్రతో నః పురాణమ్ విజయసఖసభీనాం గీయతాం తత్ర్రపంగః క్షపితకుచరుజస్తే కల్పయంతీష్టమిష్టాః (శ్రీమద్భా 10-47-14) “ఓ షట్పదమా! మేము వనవాసినులము. వానప్రస్థలము. పరమ దుఃఖితలమైన మాకు ఇళ్ళూ వాకిళ్ళ్లూ లేవు. త్యాజిత పూర్వగ్భహావాసినులము. స్వగృహ భగవద్భహ విధురలము. నీకిన్ని నూకలుకూడా పెట్టలేని స్థితిలో ఉన్న మాయెదుట గానం చేస్తే నీకేమి లాభం? నీవు మా సమక్షానికి వచ్చి ఆ యాదవాధిపతుల పురాణగాథలను ఎందుకు ఏకరువు పెడుతున్నావు? మేము సంతోషిస్తామనుకొంటున్నావా? లేదు లేదు. అవి మా కేమి క్రొత్తవి కావు. ఆ మిథ్యా ప్రశంసలు మాకు రుచించేవి కావు. నీవిక్కడి నుంచి తక్షణం వెళ్లి తమ దగ్గర సర్యోత్కర్షంగా వర్తించి సదా విజయుడై నిలిచిన ఆ కృష్ణునికి ఇష్టురాండైన ఆ మధురా నగర ప్రొఢాంగనల సమక్షానికి చేరుకొని అక్కడ అతని గుణగానం ప్రారంభించు. వాళ్ళు (క్రొత్తవాళ్లు. అతని గురించి చాలా తక్కువగా తెలిసినవాళ్లు. ఇప్పుడు వాళ్లే ఆయనకు ప్రియసఖులు కూడా. వారి గాఢాలింగన క్షపితవక్షోజ రుజను నీ గానంతో ఉపశమింపజెయ్యి. మా దుర్దశను, వారి సౌభాగ్యాన్ని అక్కడ వర్షించావంటే మహాసంతోషపడతారు. వారు నీ చాటుకారిత్వాన్ని మెచ్చుకొని నీవు కోరిన బహుమతులిస్తారు. నీ మీద మేము కోపపడటంలేదు సుమా! వివేక శూన్యుడవై, గానోపజీవివైన నీకు బ్రతుకు తెరువుకు ఉపాయం చెబుతున్నాము. అంతే” పై శ్లోకానికి తాత్పర్యమిది. పోతనగారి అనువాదమిది. “భృంగా! కృష్ణుడు మంచివాడనుచు సంప్రీలిం బ్రశంసించె దీ సంగీతంబున నేము సొక్కుదుమె? తచ్చారిత్రముల్ వింతలే? అంగీకారము కావు మాకు, పురకాంతాగ్ర (ప్రదేశంబులన్ సంగీతం బొవరింపు నారిడుదు రోజన్ నీకు నిష్టార్థముల్”
తప్ ('భ్రమరగీతము సఖులారా! ఈ (భ్రమరం చాలా మొండిది. మనం వినిపించుకొనకపోయినా జుమ్మని గానం చేస్తున్నది. తన గానంతో మన మనస్సులను కరగించాలనుకొంటున్నది కాబోలు!
(భ్రమర మంటావేమిటి ఇది "షడం(ఘి” అని పేర్కొని మరొక గోపిక ఇలా అన్నది. “షడంఘ్రి” అంటే ఆరుకాళ్సు కలది అని అర్ధం. మనిషిని రెండుకాళ్లు, పశువుకు నాలుగుకాళ్లు. ఈ తుమ్మెదకు ఆరుకాళ్లు అంటే సార్హపశుత్వం కలది. ఇది పశువున్నర. కాబట్టే ఇది మహామూర్థమైనది. ఇతరుని మనసు తెలుసుకోకుండా మాట్టాడేవాడు మనిషయినా అతణ్ని 'పశువు' అంటాము. ఈ సార్ధ పశువు ఒకసారి పాడింది. విని ఊరకున్నాము. మళ్లీ మళ్లీ పాడుతున్నది. వద్దన్న కొద్దీ పాడుతున్నది. దీన్ని ఏమనాలి? నాలుగుకాళ్ల జంతువు కంటె హీనం. అందుచేతనే 'పశువున్నర" అంటున్నాను. దీని మూఢత్వాన్ని బట్టే భగవంతుడు దీనికి ఆరుకాళ్లు పెట్టాడు.
ఈ పశువున్నర మన యెదుట యాదవేశుని (శ్రీకృష్ణుని) కీర్రపురాణం గానం చేస్తున్నది. అతనితో దీనికి పూర్వపు సంబంధం ఉన్నదేమో! ఉంటే పూర్వసంబంధం గురించి గానం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది? ప్రస్తుతం రాజ్యమేలుతున్న ప్రభువును కీర్తించి వందిమాగభులు బహుమానాలను పొందుతారు. ఈ విషయం కూడా ఎరుగని మూర్ధమతి ఈ భ్రమరం.
స్తోత్రపాఠాలు చేసేవానికి ధనతృష్ట అధికంగా ఉంటుంది. అందుకు గృహస్థుల దగ్గరికి వెళ్లి గానం చేస్తే ప్రయోజనం ఉంటుంది. వారా గానోప ద్రవాన్ని తప్పించుకోడానికైనా తృణమో పణమా బహుమాన మిచ్చి పంపుతారు. ఇంతటి లోకజ్ఞానం కూడా లేనిది, స్థానాస్టాన వివేకం లేనిది ఈ భ్రమరం. '
లోకజ్ఞానం లేకపోయినా ఈ మధుపాయిక్షి కామశాస్త్రపరిజ్ఞానం మాత్రం పుష్కలంగా ఉన్నట్టు తోస్తున్నది, “యా సభఖ్యాః తాసాం అగ్రతః తత్ర్రసంగో గీయతాం” మధురానగరం లోని ప్రగల్ఫ్భస్త్రీలు సాక్షాత్తు అనుభవంలో కంటె శ్రవణంలోనే సుఖపారవశ్యాన్ని అధికంగా పొందుతారట! వారి యెదుట గానం చెయ్యి. నీ గానం వారికి (ప్రరోచనమవుతుంది. ఇలాంటి తుచ్చగీతులు వనవాసినులమూ జీవనతీరానికి చేరినవాళ్లమూ అయిన మా దగ్గర ఎందుకు పాడతావు? వారి దగ్గరికి వెళ్లు వాళ్లను రంజింపజెయ్యి.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య త్తం
“ఓ షట్పదమా! దయచేసి నీవు ఇక్కడి నుంచి వెళ్లు, రెండు కాళ్లు గలవాళ్లే బహుదూరం పోగలుగుతారు. నీకు ఆరుకాళ్లున్నాయి. నీవు ఇక్కడిక్కడే ఎందుకు తిరుగాడుతావు? మాకు దుఃఖం కలిగించడానికా?” అని మొగం చిట్లించి పలికింది గోపిక.
“ఈ ఉద్ధవుడు ఆ శ్రీకృష్ణుని పీతాంబరమే కాకుండా అతడు ధరించే ఆసాదలంబినియైన వనమాలను కూడా అలంకరించుకొని దయచేశాడు. ఆ మాల వెంట ఈ (భ్రమరం కూడా ఇక్కడికి వేంచేసి ఉండవచ్చు. ఇదంతా ఆ కృష్ణుని ప్రేరణే. సందేహం లేదు”. అన్నది మరొక గోపిక,
సంస్కృత భాగవత శ్లోకంలో *భ్రమర' శబ్దానికి పర్యాయపదంగా వాడిన 'షడం'్రి' శబ్దం ఇంతటి విశేషార్ధాన్ని వివక్షించింది. బ్రమరగీతంలోని ఎనిమిది శ్లోకాలు రాధికా వాక్కులని పెద్దల విశ్వాసం. శ్రీ శుకదేవుడు మహాయోగంలో ఉండి తన హృదయ బృందావనంలో సమస్తమూ అవలోకిస్తూ చెప్పిన విషయం కాబట్టి అది యథార్థమే.
భ్రమరగీతము ద్త్త
తుమ్మెద గోపికల చుట్టూ తిరుగుతున్నది (శ్రుతిరూప గోపిక దగ్గరికి వచ్చి తన గుంజారవాన్ని వినిపించింది. ఆ గోపిక ఆ తుమ్మెద విన్నపం ఏమిటో తెలుసుకోవాలని ఇలా అన్నది,
ఓ (భ్రమరమా! మమ్మల్ని అనుకరిస్తున్నావా? నీవెందుకో మహావ్యాకుల పడుతున్నట్టున్నావు? ఎవరికోసం నీ వ్యాకులత? నీవెందుకు ఇంతగా మొరపెట్టుకొంటున్నావు? మామీద దోషాలను ఆరోపిస్తున్నావా ఏమిటి? నీవెంతో వివేకం కలవాడవైనా ఆ శ్రీకృష్ణుని పట్ట ఎందుకింత ఆసక్తి చూపుతున్నావో బోధపడటం లేదు.
మీ ప్రభువు ఎక్కడెక్కడికి వెళతాడో అక్కడక్కడ పడిన అతని పాదధూళిని శిరసున ధరిస్తూ లక్ష్మీదేవి అతని వెంటపడి వెళుతుందని వాడుక. ఆ మహాదేవి ఇంకొకలాగు ఎలా 'ప్రవర్తించగలదు? తన భర్త ఎన్ని అవతారాలెత్తినా, ఏమి చేసినా ఆమె ఆయన్ను ఎలా పరిత్యజింపగలదు?
ఓ మహాశుద్ధ బుద్ధి! భ్రమరావతంసమా! ఆ మహాత్ముడు మొదట లక్ష్మీదేవిని కూడా ఇలాగే వశపరచుకొన్నాడు. ఓ ్రమరమా! మీ ప్రభువు మహాచతురుడు సుమా! అందర్నీ తనకు వశపర్హులను చేసుకోదలచినవాడు ముందుగా ఆతి ప్రధాన - ప్రధాన వ్యక్తులను తన వశం చేసుకొంటాడు. అలా వశపరచుకొన్న ప్రధాన వ్యక్తులను (ప్రమాణంగా చూపి తక్కినవారినందర్నీ సులభంగా చేజిక్కించుకొంటాడు. ఇందులో దాపరికమేముంది? ఇది లోక వ్యవహారం. దీన్ని శ్రీలక్ష్మీదేవి దగ్గరనుంచి కొనసాగింపజేస్తున్నాడు మీ (ప్రభువు.
ఈ మాయలో కీర్తికుమారి, శ్రీవృషభానునందిని, సౌందర్య సారళ్య సౌకుమార్య మహాభావమయి అయిన శ్రీ, రాధ కూడా పడిపోయింది. మేమూ ఆమెను అనుసరించాము. చివరికి మహాబాడబప్రచండవియోగం అనుభవిస్తున్నాము. ఆ విధంగా మాయా
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య క్ మోహితలమైనప్పటికి మేము మాత్రం పరమోత్తమ గుణ సంపన్నలమే. ఆతని మాయాబుద్ది మాకు అంటలేదు.
(భ్రమరా! మీ ప్రభువు బుద్దిని నీవు శంకించినవాడవైనప్పటికీ, అతని తత్త్వాన్ని నీవు (గ్రహించినవాడవైనప్పటికీ నీవు అతని పట్ట ఎందుకింత (శ్రద్ద చూపుతున్నావో బోధపడదు.
దివి భువి చ రసాయాం కాః స్రీయస్త ద్దురాసాః కపట రుచిరహాన భ్రూవిజ్బంభస్య యా స్స్యుః
చరణరజ ఉపాస్తే యస్య భూతిర్వయం కా హ్యపి చ కృపణపక్షే హ్యుత్తము శ్లోకళబ్ద:
ఇలా శ్రుతిరూపగోపిక పలుకుతుండగా ఆ తుమ్మెద రాధికా చరణ కమలాల కమనీయ పరిమళాలను ఆశిస్తూ, యాచిస్తూ క్రిందికి వచ్చింది. అది చూచి రాధిక కన్నులెజ్ల చేసింది. ఓర్! మూర్చుడా! నీవు మొదట ముఖస్తుతి చేస్తూ ముందు ముసరి, ఇప్పుడు నా చరణాలను ముట్టుకొంటావా? ఛీ! అవతలికి పో, మూకు కూడా తెలుసు- సామ దాన భేద దండోపాయాలు. జా(గ్రత్తగా మసలుకో. నీ పోగడ్తలు, ధూర్త వినయమూ ఇక కట్టిపెట్టు.
ఓ మూర్చుడా! కపటం గల వ్యక్తి కపటిగానే బ్రతుకును సాగించాలి. అతడు తన కపటాన్ని ఎక్కడా ప్రకటింపగూడదు. ఒకసారి తన కపటాన్ని బయటపెట్టుకొంటేచాలు, లోకంలో అతడు మోసగాడుగా, మిథ్యావాదిగా ప్రసిద్దికక్కుతాడు.
మీ ప్రభువు మమ్మల్ని త్యాగానికి పురికొల్పాడు. మేము మా సర్వస్వం త్యాగం చేశాము. ఇకనేమి? తన మాయాజాలంతో మమ్మల్ని తన అధీనం చేసుకొన్నాడు. మమ్మల్ని నిజంగానే స్వీకరించాడు. ఆ తర్వాత వెంటనే మమ్మల్ని అందరినీ ఇక్కడ దిగవిడిచి తాను వెళ్లిపోయాడు. ఆటువంటి వ్యక్తితో సంధి సంప్రతింపులు జరిపితే ఒరిగేది ఏముంటుంది? మేము దీనలమయ్యాము. .
'అ పి చ కృషణ పక్షే హ్యుత్తమళట్లేక శబ్ద? దీనులయందు దయగలవానికే ఉత్తమశ్లోకుడనే బిరుదం అన్వ్సయిస్తుంది. మీ ప్రభువు ఇంతకు ముందే ఆ బిరుదు ఎలాగో సంపాదించుకొని 'ప్రశస్తికెక్కాడు. ఆ ప్రశస్తిని విశ్శసించి లక్ష్మీదేవి తాను చంచల అయినప్పటికి అతని పాదాల దగ్గర ఆచంచలగా పడి ఉన్నది. స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో ఎందరు సుందరాంగులున్నారో వారిలో మీ కృష్ణునికి దుర్లభలైనవారు ఎవరైనా ఉన్నారా?
య్య గల ధా భ్ధందరర టట లాకయు క ల తి ఉజటం 2|| కరి వ . లో ణా
52 'భ్రమరగీతము 'పట రుచిర హాస భ్రూ విజృంభస్య యాస్యుః (శ్రీమద్బా : 10-47-15) ఆ నాగపత్నులు తన భర్త అయిన కాళీయుణ్ని చావ (త్రొక్కిన ఆ నందకిశోరశేఖరుని సౌందర్యానికి ఆకర్షితలై బహువిధాలుగా ఆయన్ను ప్రస్తుతించారు. అంతేకాదు. 'నిధేహి తే కింకరీణాం అనుష్టేయం తవాజ్జయా' (శ్రీమద్భా 10-16-53) మేము నీ దాసీజనులము. నీవు ఆజ్ఞాపిస్తే ఏ పనినైనా చేస్తాము అని వేడుకొన్నారు.
మీ ప్రభువు వద్ద ఏదో గొప్ప మాయ ఉంది. అతడు ఎదురుపడి ప్రియా! అని పిలువగొనే సర్వాంగాలు అతని వద్దకు పరుగెత్తిపోతాయి. ఇక చెవులను గూర్చి. కళ్లను గూర్చి చెప్పేదేముంది!
“న జానే పమ్ముఖాయాతే ప్రియాణివదతి ప్రియే సర్వాణ్యంగాని మే యాంతి శ్రోత్రతాం కిము నేత్రతామ్
వంశీ నినాదాన్ని అనుచరిస్తున్న మీ కృష్ణుని భ్రూవిలాన నయన భంగిమలను చూస్తూ విమానాలలోని దేవతా(్త్రీలు అతడు తమ వైపు ఎప్పుడు తలెత్తి చూస్తాడా అని ఉవ్మిళ్లూరుతుంటారు.
'శ్రుతిరూపగోపిక ఇలా అన్నది. 'చరణ రజ ఉపాస్తే యన్య భూతిర్వయం కాః?” ఆ మాయావి చరణధూళిని లక్ష్మీదేవియే సేవిస్తుండగా మేమెంత వాళ్లం? లక్ష్మీదేవి అనంత ఐళ్చర్య అధిష్టాత్రి. మేము శ్రుతులము. కేవలం లక్షణ ద్వారా, నిషేధం ద్వారా 'నేతి' 'న+ఇతి' అని అతనిని ప్రతిపాదిస్తాము. ఈ సభాసదులలో నీ భర్త ఎవరు? అని ఏ స్నేహితురాలైనా అడిగితే, కొత్తపెండ్తికూతురు ద్రేలితో అతణ్ని చూపించినట్టు, సాక్షాత్తు పరబ్రహ్మను గూర్చి (శ్రుతులమైన మేమే సంకేతింపజాలకపోయాము. నీవు షట్పదానివి. నీవతనిని గూర్చి ఏమి చెప్పదలచావో చెప్పు. వారు వీరు పలికిన పలుకులను ముక్కున పెట్టుకొని వచ్చి మౌ ముందర గీ పెట్టకు.
'సమదాళీశ్వర! చూడు ముజ్వలిత హాసభ్రూ విజ్బంభంబులన్ రమణీయుండగు శౌరిచే కరగరే రామల్ త్రిలోకంబులన్
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య క్3ె ప్రమదారత్నము లక్ష్మి యాతని పదాబ్బాతంబు సేవింప ని క్కము నే మెవ్వర మా కృపాజలధికిన్ కారుణ్యముం జేయగన్” (పోతనగారి భాగవతం) ఉత్తమశ్టోకుడు, కృపాజలధి అని మీ ప్రభువును పేర్కొనడం, కేవలం జల్పమే. డంబాలు పలకడమే. అతడు దీనలమైన మమ్ము కనికరిస్తాడా? కనికరించడం ఉత్తమ శ్లోకుల స్వభావం. అలాంటివారిని మహాశయులని భావిస్తాము. మావంటి నిష్కియజీవులను ఎందరినో వశపరచుకోగలిగిన ఏకైక నియంత మీ కృష్ణుడు. 'ఏకో వశీ నిష్కియాణాం బహూనొమ్” (శ్చేతాశ్ళతరోపనిషత్తు)
భ్రమరగీతము ప్ ఓ మధుకరా! నీవు నా పాదాల దగ్గర శిరసు వంచి ప్రదక్షిణం చేస్తున్నావు. మీ ప్రభువు పక్షాన క్షమాపణ వేడుకొంటున్నావని నాకు తెలుసు. ఇందుకు నీవెంతో అనునయాన్ని, వినయాన్నీ ప్రదర్శిస్తున్నావు. నీవు శ్రీకృష్ణుని పంపున వచ్చిన దూతవు మాత్రమే కాదు. ధూర్తుడవు కూడా. దూతల చమత్కారాలు, మాటకారితనాలు (గ్రహింపగలిగిన విచక్షణాజ్ఞానం మాకున్నది. (ప్రియోక్తి రచనాకుశలుడవు, (ప్రార్ధనాభిజ్ఞుడవు అని మాకు తెలుసు. నీ విద్వత్త మా దగ్గర ప్రకటించవద్దు. మా దగ్గర నీ పప్పులు ఉడకవు. మేము తెలివితక్కువ వాళ్లమనీ, 'గ్రామీణులమని, అమాయికలమని నీవు అనుకొంటున్నావు. మీ ప్రభువుకోసం మేమెన్నెన్ని త్యాగాలు చేశామో నీకు తెలియదు. త్యాగం చేయడం తెలివి తక్కువవారి పని అని నీ వనుకొంటే మాత్రం నీవు క్షమార్హుడవు కావు. త్యాగమనే మహత్తరమైన శబ్దానికి అపకీర్తి కలిగించేవారు లోకంలో మహాదుష్టులు - క్రూరులు అవుతారు. మేము ఈ శ్రీకృష్ణునికోసం మా సర్వస్వం త్యాగం చేశాము. అతనికి ఏమాత్రమూ కృతజ్ఞత లేదు. ఆతని పక్షాన రాయబారం జరపడానికి నీవు వచ్చావు. నిర్ణయత్వం, పరద్రోహిత్వం, (ప్రేమశూన్యత్వం, అనైతికత్వం ఇన్ని కలవానితోనా? సంధి చేసుకోవడం. శతులలో అగ్రగణ్యుడు సుమా మీ ప్రభువు! విస్సృజ శిరసే పొదం వేద్యహం చాటుకారై: అమనయ విదుషప్తే౬ భ్యేత్య దౌత్యై ర్ముకుందాట్ ఫ్వకృత ఇహ విసృష్టాపత్యపత్యన్యలోకా వ్యసృజద కృతచేతా; కిం ను సంధేయ మస్మీన్. (శ్రీమద్భా. 10-47-16) “రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు నీ నేరువుల్ చాలున్, మచ్చరణాబ్దముల్ విడువు, అస్మన్మాథ పుత్రాదులన్
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య ర్క్ లీలన్ బాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ మ్మేలా సాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెచ్తురే! ” (పోతనగారి భాగవత౦) రాధికాపాదధూళిని శిరసా వహించాలని ఆ మధుకరం (తుమ్మెద) ఆమె చరణార విందాల చుట్టూ తిరుగుతున్నది. బృందావనధామం రాధికా చరణారవింద సంచరణంతో పునీతమైనది, అలంకృతమైనది. అతులితమహామహిమాఢ్యతను సంపాదించుకొన్నది. శ్రీమధుసూదన సరస్వతిస్వామి నవద్వీపంలోని మహాపండితుడు అద్వైత వేదాంతి. నవద్వీపం నుంచి ఎందరో శ్రీకృష్ణభక్తులు 'రాధేశ్యామ్' అని కీర్తిస్తూ బృందావనానికి వెళ్లడం చూచి ఆయన ఆశ్చర్యపడుతుండేవారు. శ్రీకృష్ణునితో సమానంగా, అంతకంటె అధికంగా కూడా బృందావనంలో రాధికా ప్రశస్తి వినబడుతున్నది. ఈ విషయాన్ని ప్రల్నిస్తూ బృందావననివాసియైన శ్రీజీవగోస్వామికి ఒక లేఖ (వ్రాశాడు. ఆ లేఖ అందుకొని జీవగోస్వామి ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు. “అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మం అసంసేన్య బృందాటవీం తత్పదాంకం అనాభాష్య తద్భావ గంఖీర చింతాన్ కథం శ్యామసింధో రసస్యావగాహమ్?” రాధికాచరణారవిందయుగళాన్ని ఆరాధించకుండా, ఆమె చరణ కమలాలచే శోభాయమానమైన బృందావన చిహ్నాలను సేవించకుండా, ఆ రాధికాటప్రేమభక్తిలోని రహస్యాలను తలపోయకుండా శ్యామసింధు రసంలో అవగాహన చేయడం సాధ్యం కొదు.” “కృష్ణభక్తి ప్రదే దేవి రాధాదేవి నమోస్తు తౌ”
శ్రీకృష్ణభక్తి రాధాదేవి అనుగ్రహం వల్లనే కలుగుతుందని శాస్త్ర వచనం.
ఈ శ్లోకం తనకు అందగానే సహజంగా శ్రీకృష్ణానుశీలనం గల శ్రీమధుసూదన సరస్వతీస్వామివారు వెంటనే బృందావనానికి బయలుదేరారు. బృందావనమంతటా రాధాదేవి మహిమ. వెల్లివిరిసి ఉన్నది. స్వామివారి సంశయాలన్నీ తీరిపోయాయి. తనకు ఆధ్యాత్మగురువైన అవధూత చేసిన ఉపదేశం సత్యం-సత్యం-అని పొంగిపోయారు.
56 'భ్రమరగీతము “కృష్ణాత్ పరం కిముపీ తత్త మహం న జాన”
“శ్రీకృష్ణుని కంటె వేరైన పరబ్రహ్మము ఏమున్నదో నే నెరుగను” అని శ్రీకృష్ణపరమైన అనేక [గ్రంథాలు రచించారు. వాటిలో భాగవత వ్యాఖ్యానం, భగవర్గీత వ్యాఖ్యానం సుష్రసిద్దమైనవి.
బృందావనము రాధాక్షేత్రం. రాధికా ఆవిర్భావానికి పూర్వం ఎంతోకాలం నుండి ఆచోట ఎవ్వరూ అడుగుమోపలేదు. భక్తిబ్బందావన సామ్రాజ్యానికి పట్టమహిషి రాధాదేవి.
“స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం ధేహి పదపల్లన ముదారమ్” (గీతగోవిందం)
“ఓ రాధా! కామమనే విషాన్ని హరించునట్టిది, అనగా కామపీడా నివారకమైనట్టిది, నా శిరస్సుకు భూషణ మైనట్టిది అగు లేజిగురాకు వంటి నీ పాదతలాన్ని నా శిరసున మోపి నా కామతాపాగ్షిని చల్దార్చుము. అది నా శిరస్సుకు లోహితమూ, కోమలమూ, శీతలమూ ఆయిన ఆభరణమనవుతుంది” అని శ్రీకృష్ణుడు రాధికను వేడుకొన్నట్టుగా జయదేవుడు తన గీతగోవిందం' లో ఒక అష్టపది రచించాడు. దానినొకసారి తాను పాడుకొని, ఆలోచించి “అయ్యో! భావావేశంలో ఎంత అపచారం చేశాను! శ్రీకృష్ణభగవానుడు జగద్గురువు “యోగేళ్ళరాఖిలగురో భగవన్నమస్తే” అని కుంతీదేవియే ఆయన్ను ప్రార్ధించింది. ఆయన రాధికాపాదతలాన్ని తన శిరసున మోపుమని ్రార్థించడమా? ఇది దోష మని చెంపలు వేసుకొన్నాడట.
భగవత్రేరితమై జయదేవునికంఠం నుంచి వెలువడిన ఆ గీతాన్ని విని శ్రీకృష్ణుడు ఆనందించి, నాటి రాత్రి స్వష్టంలో దర్శనమిచ్చి “జయదేవా! ఆ కీర్తన అలాగే ఉంచు. అది నాకు టప్రీతికరమే కాక్త యథార్థమైన విషయం “కృష్ణేన ఆరాధ్యత ఇతి రాధా, కృష్ణం సమారాధయతి సదేతి రాధికా” నేను రాధను ఆరాధిస్తాను. అమె రాధికటై నన్నారాధిస్తుంది” అన్నాడట.
(ప్రేమ పరాకాష్ట స్థితికి చేరిన భక్తుడు భగవంతుని సాంగత్యం లేకుండా క్షణమైనా గడపలేడు. విలవిలలాడతాడు. అలాగే భగవంతుడు భక్తుని సాంగత్యానికి ఆరాట పడతాడు. భగవంతుడే తన భక్తునికి భక్తుడైపోతాడు.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య ర్7
రాధికాచరణపల్లవాలకు కృష్ణుడు తన శిరసు మోపడం అనన్య(ప్రేమమహిమకు, 'ప్రేయసీప్రియుల ఆనుకూల్యానికి ప్రతీక అభిమానవతియైన రాధ నాయిక హృదయ గతభావాన్ని మరుగుపరచి వక్రోక్తితో తన కోరికను ప్రకటించే మధురస్టితిని 'మాన' మంటారు. ఆమె ప్రొఢ. కృష్ణుడు అనుకూలుడైన నాయకుడు. కాబట్టి “ధేహి పదవల్లవ ముదారమ్” అనడంలో దోషం లేదు. “జయతి జయదేవకవి భారతీభూషితం”
“దాత్మై ర్ముకుందాత్ మ్యుక్తినిచ్చేవాడు ముకుందుడు-కృష్ణుడని అర్ధం. ఇది ముకుందుని దౌత్యం. పిల్లవాడు దేనికోసమైనా ఏడిస్తే తల్లి వాని నోటిలో ఏదో తాయిలం పెట్టి ఏడుపు మాన్పిస్తుంది. అతడు కోరిన వస్తువును మరపింపజేస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు మ్యుక్తినిచ్చేవాడే కాని, సప్రేమ భక్తి నిచ్చేవాడు కాదు.
“ముక్తిం దదాతి కర్షిచిత్స్మ న భక్తి యోగమ్” (శ్రీమద్భా 5-6-16) సద్రేమభక్తి ఆ భగవంతునిచేత వరింపబడిన గోపికలవంటివారికే లభిస్తుంది. శరీర పతనానంతరమే ముక్తిసుఖం లభిస్తుంది. సప్రేమభక్తి ఈ దేహం ఉన్నప్పుడే శ్రీకృష్ణలీలా ధ్యానంలోను, స్మరణంలోను, శ్రవణంలోను అలౌకికమైన సుఖాన్నీ ఆనందాన్నీ ప్రసాదిస్తుంది. శ్రీకృష్ణకథాసుధాసాగరంలో విహరించేవారికి ధర్మ-అర్థ-కామ-మోక్షాలు తృణప్రాయాలు.
ఓ భ్రమరమా! మీ ప్రభువుకు సేవాసుఖం కలిగించడానికి మేము వేదధర్మాన్నీ, కులధర్మాన్నీ, లోకధర్మాన్నీ త్యాగం చేశాము. స్వజనులను కూడా పరిత్యజించాము. ఆతని పట్ల మా కర్తవ్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చాము. ఆయన సర్వసమర్థుడైనప్పటికి మా కోసం తానేమి చేశాడు? మీ ప్రభువు మమ్మల్ని అందర్నీ పరిత్యజించి వెళ్లిపోయాడు. అది ఆయన గొప్ప! మీ ప్రభువు అకృతజ్ఞ చూడామణి. అట్టివానితో సంధి చేసుకోవడమా! అందుకు నా చరణధూళిని యాచిస్తావా? నా పాదాల దగ్గరకు రాకు రాకు” అని రోషంతో పలికింది 'ప్రొఢనాయిక రాధ.
భ్రమరగీతము 6
ఉద్ధవుడు జ్ఞానియే జ్ఞానాభిమానియే కాని, గోపికల జన్మరహస్యం అతనికి తెలియదు. రాధిక వృషభానుని పుత్రికగా తలచాడేకాని, ఆమె శ్రీకృష్ణభగవానుని ఆహ్లాదినీ శక్తి అంతరంగిక అని ఎరుగడు.
రాధిక '్రేమమయి, శ్రీకృష్ణుడు ఆనందమయుడు. ఆనందం ఉన్నచోటనే (ప్రేమ ఉంటుంది. అనందరససారఘనీభూతమూర్తి శ్రీకృష్ణుడు, 'ప్రేమరససారఘనీభూతమూర్తి రాధిక. కాబట్టి వారిరువురికి విచ్చేదం ఎన్నటికి సంభవించదు. ఆ రాధాకృష్ణులకు సుఖసంతోషాలను కలిగించి, వారి ప్రసన్నతను పొందడమే ముఖ్యమైన కర్తవ్యంగా కలవారు తక్కిన గోపీజనులు, వారందరు రాధికా కాయవ్యూహ రూపిణులు. సమస్త దేహాలకు మూలదేహమే కాయవ్యూహం. ఇది భిన్నభిన్న రూపాలతో ఉంటుంది. అట్టివారే గోపికలు. రాధ యూధనాయిక.
తుమ్మెద మీద వంక పెట్టి పరిహసిస్తూ రాధాదిగోసికలు పలికే పలుకులు కేవలం జల్పితాలు. అంటే ఊరకే పలికిన పలుకులు. అవి కృష్ణునికి ప్రియమైనవే. కూరిమి గల దినాలలో ఎన్ని తప్పులు చేసినా అవన్నీ ఒప్పులే అవుతాయి. ఆ కూరిమి విరసమైతే అన్నీ తప్పులే! కాని ఇక్కడ విరసమేమీ లేదు. ఇదొక సరసమే. శ్రీకృష్ణుడు బృందావనకక్రీడను చాలించాడు. తన సచ్చిదానందస్వరూపాన్ని మరుగు పరచి తన ఈశ్చరీయతను అనగొ విచి త్రానేకశక్తిమత్వాన్ని ప్రకటించాడు. అయినా శ్రీకృష్ణుడు బృందావనంలో సర్వదా గోపికా వల్లభుడుగానే ఉంటాడు. వారిని విడువడు. భగవంతుడు శరణుచొచ్చినవారిని ఎన్నటికి విడువడు.
తస్మాన్మచ్చరణం గోష్టం మన్నాథం మత్పరిగ్రహమ్ _ (శ్రీమద్భా 10-25-18)
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య ర్ం “ఈ సమస్త గోకులమూ నన్ను శరణుచొచ్చినది. నేనొక్కడనే వీరికి రక్షకుడను” అన్నాడు కృష్ణుడు. అలా చెప్పిన కృష్ణుడు తమను విడిచి మధురకు వెళ్లేసరికి గోపికలు వియోగవ్యధకు లోనయ్యారు. ఒక గోపిక ఇలా అన్నది. సఖీ! మన వియోగతాపం తీరడానికే ఏమో అప్తుడు ఎంత నమ్మబలికాడో చూడు ఆ నల్లనివాడు! “పాయని గేహ శృంఖిలలు బాసి నిరంతర నుత్చరత్వమున్ చేయుచునున్న మీకు ప్రతిసేయ యుగంబులనైన...” “నవపారయే౭ హం నిరవద్య సంయుజాం స్వసాధు కృత్యం విబుధాయుషాపే వి (శ్రీమద్భా 10-32-22) ఓ ప్రియమైన గోపికలారా! మీరు నా కోసం గృహస్థతా శృంఖలలను త్రెంచుకొని వచ్చారు. మహనీయులైన యోగులు కూడా చేయజాలని మహత్తర త్యాగం చేశారు. నేను అమరజీవినై మీ ప్రేమకు, మీసేవకు, మీ త్యాగానికి బదులు తీర్చుకోడానికి అనంతకాలం పాటుపడినా బుణవిముక్తుణ్ణి కాలేను సుమా! జన్మ జన్మలకు మీకు బుణపడి ఉంటాను” అన్నాడు కృష్ణుడు. సఖీ! ఈ పలుకులే మనకు మాటి మాటికి గుర్తుకు వస్తాయి. ఆనాడు ఎంత మధురంగా పాడాడో ఈ పాట! అవునే అది చాలా చక్కని పాట! అడవిలోని లేళ్లు చక్కని పాట వినిపిస్తే ఆవి చెవులు రిక్కించుకొని ఆ గీత మాధుర్యానికి పరవశించి నిలబడిపోతాయి. వేటకాని వలలో పడతాయి. అవి అనపకారులైనప్పటికి స్యోపకారానికి వధిస్తాడు వేటకాడు. అలనాడు బృందావనిలో శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తుండగా లేళ్లన్నీ పరుగెత్తుకొని రావడం మనం చూచాము కదా! ఇప్పుడు మనం లేళ్ల మయ్యాము. ఆనాడు కృష్ణుడు పాడిన *న పారయేఇహం' పాటకు మనం ముగ్ధలమైపోయాయి. ఆ కృష్ణుని వలలో చిక్కుకొన్నాము. అది లేళ్లను పట్టే వేటకాని గీతమని మనం ఇప్పటికి తెలుసుకొన్నాము. ఇప్పుడు మనం సిగ్గుపడితే ఏమి లాభం? అంతా జరిగిపోయింది!
60 (భ్రమరగీతము ఈ ఉద్దవుడేమో శ్రీకృష్ణుని మంత్రి పుంగవుడు. ఈ నల్లతుమ్మెద ఉపమంత్రి! ఆహా! కృష్ణుడు తన వర్ధానికి, స్వభావానికి తగినట్టుగా మంత్రులను నియమించుకొన్నాడు! తాను నల్లనివాడు. ఈ తుమ్మెద నల్లనిది. కోయిల నల్లనిది. నల్లనివాళ్లను నమ్మకూడదు. ఈ నల్లతుమ్మెద పూవులో తేనె ఉన్నంత వరకు ఆ పూవును అంటిపెట్టుకొని తిరుగుతుంది. మధువు అయిపోగానే ఆ పువ్వుముఖం చూడదు. నల్లకోయిల మహా చమత్కారం కలది. అది తన (గ్రుడ్లను కాకి దగ్గర సెట్టి పొదిగిస్తుంది. పాపం! కాకి అమాయికురాలు. అది కోయిల (గ్రుడ్తను పొదిగి పిల్లలను చేసి జాగ్రత్తగా కాపాడుతుంది. ఆ పిల్లలకు నోరు, రెక్కలు వచ్చాక అవి కోయిలలలో కలిసిపోతాయి. తల్లికాకి మొగమైనా చూడవు. తుమ్మెద-కోయిల సంగతులెందుకు? నల్లనివాళ్తందరు నిష్టురులే, ఈ కృష్ణుడు ఇంతకు ముందు దశరథ పుత్రుడు శ్రీరాముడుగా అవతరించాడు. అప్పుడూ అతడు నల్లనివాడే. అతడూ అబలా వధతోనే పేరులోక్తి వచ్చాడు. ఇతడూ పూతన ప్రాణం తీసి పేరులోకి వచ్చాడు. వారి బాల్య చరిత్రమే స్రీహనన నిర్ణయము. ఇక యౌవన చరిత్రను గూర్చి చెప్పేదేముంది! మృగయురివకపీంద్రం వివ్యధే లుబ్దధర్మా ప్రీయమకృత విరూపాం ప్రీజితః కామయానామ్ బలినుపే బలిమత్త్యావేష్టయద్ ధ్వాంక్షనద్య స్తదలమసీత సఖ్యైర్దుస్త్య జ స్తత్కథార్థః (శ్రీమద్భా 10-47-17) శ్రీరాముడు తన భార్య సీతకు వశపర్తి అయ్యాడు. ఆమె ఎడబాటుతో బోరున దుఃఖించాడు కూడా, భార్యావశుడై తనను మోహించి వచ్చిన శూర్చణఖ ముక్కు చెవులు ఖండించి పంపించాడు. అతనిది ఎంత (మ్రూరప్రకృతి! భార్యావిరహ(క్రోధంతోనేమో వానరరాబైన వాలిని వేటకాడు చంపినట్టుగా హతమార్చాడు. అంతగా ((స్తీజితుడు) సీకి వపుడయ్యాడా? అనాడు, ఇప్పుడు తన ప్రియలనందర్నీ వదలిపెట్టి పోయాడు. స్రీజితుడని సీతాదేవి పట్ట కూడా అసూయాభావాన్ని వ్యక్త పరిచింది రాధిక్ష భగవానుని అంతరంగిక (ప్రియ రాధిక,
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 6]
మరొక గోపిక రాధిక మాటకు అడ్డువచ్చి, నీలమేఘళ్యాముడైన శ్రీరామునిది ఏమంత తప్పుకాదు. అంతకు ముందు మన మహాత్ముడు కృష్ణుడు వామనుడుగా అవతారమెత్తాడు గదా. అప్పుడేమి చేశాడో చెబుతాను విను.
పేరు వామనుడు అందమైనవాడని అర్థం. అప్పుడు కూడా శ్యామవర్షంతోనే అవతరించాడు. అతనికి నలుపు ఆంటే ఎంతో ఇష్టమేమో! మనకు కూడా నలుపే ఇష్టం కాబోలు! ఆ కృష్ణుణ్ని చూడగానే మన బుద్ది నశిస్తుంది.
ఆ వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. అతని రూపమాధుర్యాన్ని చూడగానే బలిచ(క్రవర్తి బుద్ది నశించింది. ఆ వామనుడడిగిన మూడడుగులు భూమిని ఇస్తానని శపథం చేశాడు. చేతిలో దానజలం దర్పంగా ధారపోశాడు. వెంటనే వామనుడు త్రివి[క్రముడై స్వర్ణ్గమర్శ్యలోకాలను ఆక్రమించాడు. మూడవ అడుగుకు చోటు చూపించుమని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి తన శిరసు వంచి మూడవ అడుగు తన నెత్తిమీద పెట్టమన్నాడు. వెంటనే వామనుడు బలిశిరసున తన పాదముంచి అతణ్ని పాతాళానికి క్రొక్కివేశాడు. తాను బలిభుక్కయ్యాడు. బలిభుక్ అంటే కాకి అని కూడా అర్హం ఉంది. కొకి నలుపే కదా.
వాళిం జంపెను వేటకాని పగిదిన్ వంచించి దైత్యానుజన్
లోలన్ బట్టీ విరూప జేసెను, బలిన్ లోభంబుతో గట్టి యీ
్రైలోక్యంబు మొజంగిపుచ్చుకొనియెన్ ధర్మజ్జుడే మాధవుం
డేలా షట్పద! యెగ్గు మా వలన నీ కెగ్గింపగా నేటికిన్
(పోతనగారి భావగతం)
మరొక గోపిక ఇలా అన్నది, ఆ నల్లనివాడు అందగాడే సుమా!
“నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారనంబు పై
జల్లెడువాడు మౌళిపరిసర్పితసింఛమువాడు నవ్వురా
జిల్లెడు మోమువాడు-” ఏమైనా ఎంతచేసినా అతణ్ని మరచిపోలేము అని.
భ్రమరగీతము [| రాధికాచరణమంజీరధ్వనులను అనుకరిస్తూ భ్రమరం అవ్యక్తమధురధ్వనులతో పైకి లేచింది. రాధిక చెవి దగ్గరికి చేరింది. రాధిక రెండు చేతులతో చెవులు మూసుకొని తత్తరపాటుతో అక్కడి నుంచి నాలుగడుగులు వెనక్కు వెళ్లింది. భ్రమరం తనకు చెప్పే విషయమేదో రాధిక అర్ధం చేసుకొన్నది.
“ఒ బృందావనేశ్వరీ! ఇంతసేపు నీవు మా ప్రభువును గురించే మాట్లాడావు. ఈ చర్చను అవిరళంగా సాగిస్తుండటం చూస్తుంటే నీవన్నీ పైపై మాటలే అనిపిస్తున్నాయి. లోపల మా (ప్రభువు పట్ట అపరిమితమైన అనురాగం కలదానవని బోధపడుతున్నది. మా ప్రభువుపట్ల నిజంగా నీకు ఆసక్తిలేక పోతే ఆయన ప్రసక్తి ఇక వదలిపెట్టు, అతడు నల్లనివాడుగదా, కపటి గదా! ఇంకెందుకు ఆయన ఊసు? వామనుడు గాని, శ్రీరాముడుగానీ ఒకరికంటె నొకరు సౌందర్యవంతులు. నీలమేఘశ్యాములు. ధర్మస్వరూపుడైన శ్రీరాముని మీదనే నీవు
- దోషారోపసణం చేయడం' విడ్డూరంగా ఉంది.” ॥
ఆ మాటలకు నవ్వి రాధిక “ఓ భ్రమరమా! నీవు నీ ప్రభువుకు కొత్తదాసుడులాగా ఉన్నావు. నీకేమీ తెలియదు. ఆ రాముడు క్షత్రియుడు గదా. క్షత్రియధర్మం వదలిపెట్టి వ్యాధుని ధర్మం ఆవలంబించదగునా? వ్యాధులు (క్రూరమృగాలను స్యోపకారార్థం వేటాడుతారు కాని అభక్ష్యములైన కోతులను వేటాడుతారా?”
('భ్రమరమా! నీవన్నట్లు వామన రామాది పూర్వ పూర్వ జన్మల నుంచి వచ్చి వచ్చి మీ (ప్రభువు ఇప్పుడు పౌర్ణమాసీ ముఖుడయ్యాడు. అందంలో చందంలో, కపటంలో కాఠీన్యంలో నిగ్గుతేలాడన్నమాట!
ఓ భ్రమరమా! నీవొక కీటకానివి. మీ ప్రభువైన ఆ మధురాధిపతిని గూర్చి నీచేత చెప్పించుకొనే దుస్థ్రతి మాకు లేదు. జన్మజన్మల నుంచి ఆ మహానుభావుణ్ని ఎరిగిన వాళ్లం మేము. నీకు ఆయనకు కొంచెం వర్షసామ్యం ఉంది కదా అని మహాజ్ఞానివలె మాట్లాడుతున్నావు. విజ్ఞవీగుతున్నావు. మీ ప్రభువు నరాకృతి పరబ్రహ్మమని మాకు క్షుణ్జంగా
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 63 తెలుసు. అ(ప్రాకృత ప్రాకృత స్వరూప రూప గుణ విభవ ఐశ్చర్యవంతుడన్న విషయం కూడా మాకు తెలుసు.
(భ్రమరమా! నీవు ఈ సమయంలో మా వద్దకు రావడం వల్ల మాకిన్ని భావాలు కలిగాయి. నీవిక్కడికి రాకపోతే మీ ప్రభువును ఒక చిన్నమెత్తు మాట అనే వాళ్లం కాదు. మా ఏడుపు ఏదో మేము ఏడ్చుకొనే వాళ్లం. దీనికంతకు కారణం నీవు, ఈ పాపం నీదే సుమా!
యదనుచరితలీలా కర్షపీయూష విఫ్రుట్ సకృదదన విధూత ద్వంద్వ ధర్మా వినష్టాః సపది గృహకుటుంబం దీనముత్పృజ్య దీనా బహన ఇహ విహంగా ఖిక్షుచర్యా చరంతి (శ్రీమద్భా 10-47-18)
ఆ వ్రజేంద్రనందనుడు బృందావనచం[ద్రుడు అయిన శ్రీకృష్ణుని కథాలీలలను విని మహామునీం(ద్రులు, యోగీంద్రులు సైతం మాయా వళశులవుతారు. అతని కథ గృహాస్ట్రధర్మాన్నీ, దాంపత్యసంపత్తిని అనుభవించేవారి భోగవిలాసాలను నిర్మూలనం చేస్తుంది. ఐహికమైన వారి అభీష్ట్రాల నన్నిటిని తుడిచిపెడుతుంది. పుత్ర మిత్ర కళత్ర బాంధవ యుక్తమైన చక్కని గృహస్థ్రజీవనాన్ని పరిత్యజింపజేసి, వారిని బికారులను చేస్తుంది. ఆతి దీనులను చేస్తుంది.
“తృణాదపి సునీచేన తరోరపి సహిష్టునా” గడ్డిపరకలవలె అణగి మణగి బ్రతికేవారిని చేస్తుంది. చెట్టువలె సమస్త బాధలను సహింపజేస్తుంది.
ఈ బృందావనంలోగల చెట్టు - వాటి శాఖలును వేదాలు - వేదశాఖలే. ఆ కొమ్మలమీద మౌనంగా కూర్చున్నవారు పక్షిరూపులైన మహామునులే. శ్రీకృష్ణకథాసుధారసంలోని ఒక బిందువో అరబిందువో వారి కర్షపుటాలకు అందింది కాబోలు, అప్పటినుంచి వారు ఈ విధంగా బృందావనవృక్షశాఖలను ఆశ్రయించి శ్రీకృష్ణలీలా చింతనంలో మునిగిపోయారు.
బహన ఇన విహంగా భిక్షుచర్యా చరంతి పెక్కండ్రు పెద్దలు పక్షులవలె భిక్షుచర్యను (సన్న్యాసి వర్తనను) అవలంబించి ఎలాగో ప్రాణాలను నిలుపుకొంటున్నారు. విహాయసం (ఆకాశం)లోకి వెళ్లేవి విహంగాలు శ్రీకృష్ణకథాశ్రవణం, మననం, ధారణం చేసినవారు ముక్తులై 'బ్రహ్మస్టానానికి వెళతారు. అంతరిక్షమే బ్రహ్మస్థానం. ఉత్పత్తి-స్టితి-లయాలు జరిగే చోటది. శ్రీకృష్ణథా శ్రవణంతో పవిత్రులైనవారు “చిదాకాశేన గచ్చంతి భూతాకొళో విహాయసా” భూతాకాశం నుంచి చిదాకాశానికి ఎగిరిపోతారు. అనగా వారు పరమహంసలవుతారని
రడీ భ్రమరగీతము అర్థం. హంసలు పక్షులే. అయితే అవి సారాసార వివేకం కలవి. అందుచేత అవి పక్షిజాతిలో (శ్రేష్టమైనవి. పరమహంసలకు ప్రకృతిలోని చేతనత్యాన్నీ, జడత్వాన్నీ వేరుపరచే అసాధారణ మైన గుణం ఉంటుంది. సన్బ్యాసులలో అత్యుత్తమమైన అధికారం కలవారు పరమహంసలు. జడ-చైతన్యాలను వేరుపరచడం మాత్రమే కాదు, ఆత్మ-జీవాత్మాలను వేరుపరచి పరమాత్మను దర్శించి ప్రబోధించేవాడు శ్రీపరమహంస. వ్యాసపుత్రుడు, శ్రీమద్భాగవత వక్త శ్రీ శుకదేవుడు శ్రీపరమహంస. ఆ మహాత్ముడు శ్రీకృష్ణ భగవానుణ్ని సందర్శించి, సంపూర్ణంగా భగవత్తత్యాన్ని (గ్రహించి భాగవత ధర్మాన్ని లోకోపకారార్థం వెల్లడించాడు. ఆయన దర్శనం సుదుర్లభం. వారు భిక్షు ధర్మాన్ని అవలంబిస్తారు. శ్రీకృష్ణ లీలా చింతనులై తమ సంసారాలను విడిచి బృందావనానికి వెళ్లిపోతారు. వారు మహా విరక్తులు, గోస్వాములు (ఇంద్రియాలను వశపరచుకొన్నవారు) వారిలో కొందరు పరమహంసలు. గోపికలనందర్నీ శ్రీపరమహంసలని పేర్కొనవచ్చు.
ఓ భ్రమరమా! శ్రీకృష్ణ లీలా చింతనులు మా మాదిరిగానే స్వజన-బంధువులను విడిచిపెట్టుకొని నిర్భయులవుతారు. తమ కుటుంబాన్ని దీనదశకు వదలిపెట్టి తాము పక్షులవలె వెళ్లిపోతారు. మృత్యువుకు తిలాంజలి సమర్పించి భగవదిభిముఖులై సాగిపోతారు.
మేము నిరంతర శ్రీకృష్ణ లీలా చింతనలమే కాదు, మా కళ్లతో ఆ (వ్రజకిశోరుని చూచినవాళ్లము. మేము అతణ్ని విడువగలమా? ఏమంటున్నావు నీవు?
'్రవణసుఖం లేళ్లకు హాని కలిగిస్తుంది. స్పర్శసుఖం ఏనుగులకు హాని కలిగిస్తుంది. దర్శనసుఖం పక్షులకు పీడ కలిగిస్తుంది. మేము శబ్ద స్పర్శ రూప రస గంధాలతో సేవించి శ్రీకృష్ణునివల్ల ఈ దురవస్త్రకు చేరుకొన్నవాళ్లము. శ్రీకృష్ణ థామధురామృతం గొప్పదేకాని, అది బంగారు పాత్రలో పిండిన ఆడసింహం పాలు సుమా! ఆ పాలు విరక్తులకు మాత్రమే ప్రాప్తిస్తాయి.
| “పమ్నగ మింటిపై కెగసి పాలు విహంగములైన వీనులం
దన్నాక మాటు విన్న గృహ దార సుతాదుల బాసి విత్త సం పన్నత డించి సంసరణ పద్దతి బాపెడువాడు నిత్య కాం క్ష న్నెజీనున్న మా బ్రతుకు సైచునె? ఏల మధువ్రతోత్తనూ!” (పోతనగారి భాగవతం)
భ్రమరగీతము 8
వేటకు కూడా ఒక శాస్త్రం ఉంది. పశువుల వేట, పక్షుల వేట అని వేట రెండు రకాలు. అందులో పశువుల వేట ఏదువేట, గంట వేట, తెరవేట అని మూడు రకాలట. ఇవికాక వేటకాండ్రు జింకలను వేటాడటానికి అనేక ఉపాయాలు చేస్తారు. వేటకాడు మగజింక లాగా కూత పెడతాడు. ఆది మగజింక అరుపే అని నమ్మి అమాయికమైన ఆడజింకలు చప్పున నిలబడిపోతాయి. అప్పుడు వేటకాడు బాణంతో కొట్టి వాటిని వధిస్తాడు. లేదా వలవేసి పట్టుకొంటాడు. వేటాడేవారు వాటి కూతలను అభ్యసిస్తారు. లేకుంటే లేళ్లు దొరకవు. ఇక వాటి పరుగును వేటకాడు అందుకోలేడు.
జింకలను వేటాడే పద్ధతులలో ఒకటి ఇది. తమ స్టితి కూడా ఆడజింకల చందమే అయిందని వగచింది ఒక గోపిక.
ఓ ఉపమంత్రి సత్తమా! అనాడు శ్రీకృష్ణుడనిన మాటలను (న పాఠ యేఇఒహం నిరవద్య సంయుజాం) నమ్ముకొన్నాము. దాని యందే మనసుంచి (శ్రద్దాసక్తలమయ్యాము. చివరికి వేటకాని కూతలు విని నమ్మి మోసపోయిన ఆడజింకల మయ్యాము. రాసలీలానంతరం తాను చెప్పిన ఆ మంచి మాటలు మమ్మల్ని ఇలా వధించడానికేనేమో! ఇది ఎవరికి చెప్పుకోలేక దుఃపడుతూ, సిగ్గుపడుతూ కాలం గడుపుతున్నాము,
ఆ శరద్రాత్రి మీ ప్రభువు ఆలపించిన వేణుగీతిని విని రాసలీలకు పరుగు పరుగున వచ్చిన మమ్మల్ని చూచి ఎంతగానో సంతోషించాడు. ఆ సందర్భంలో మీ ప్రభువు ఏమన్నాడో మళ్లీ ఒకసారి నీకు ఎరుక పరుస్తాను. ఇలా ఎరుకపరచుకోవడంలో మాకు ఏకొంచెమైనా ఊరట లభిస్తుందని ఆశ,
న పారయే౬హం నిరవద్య సంయుజాం స్వసాధుకృత్యం విబుధాయుషాపి వః
66 (భ్రమరగీతము యా మాభజన్ దుర్దరగేహ శృంఖలా: సంవృత్చ్య తద్ వః ప్రతియాతు సాధునా” _ (శ్రీిమద్భా. 10-32-22) ఇది అనాడు కృష్ణుడు మనోజ్ఞంగా పాడిన పాట. చిరకాలం గుర్తుండేది. ” “వయమృతమివ జిహ్మన్యాహృతం శ్రద్దధానాః కులికరుతమివాజ్ఞాః కృష్ణవధ్యో హరిణ్యః దదృశు రసకృదేతత్తన్నభి స్పర్భ తీవ్ర స్మరరుజ ఉిపమంత్రిన్ భణ్యతామున్యవార్తాొ (10-47-19) “కృష్ణవధ్యో హరిణ్య?' కృష్ణసారములు ఆంటే నల్లజింకలు అని అర్థం. ఓ ఉపమంత్రీ! మేము ఆ నల్లజింక భార్యలమైన లేళ్లము. వేటకాని కూతకు చెవులప్పగించి స్తబ్ద్బంగా నిలిచిపోయిన లేళ్లను బాణాలతో కొడతాడతడు. మీ ప్రభువు “తన్నఖ స్పర్శతీవ్రస్మరరుజ” తన నఖక్షతాలతో గాయపరచి మమ్మల్ని మరపురాని మధన వేదనకు గురిచేశాడు. ఆతని బింబాధరం చూస్తేనే మాకు మతిపోతుంది. బింబమంటే దొండపండు. “సద్యో బుద్దిహరా బింబా” అనేది ప్రసిద్దమే కదా! మాకు మదనతాపం అధికాధికం చేశాడు. ఒక్కసారి స్మరించుకొంటే అదే మాటిమాటికి అనుభవానికి వస్తున్నది. మరచిపోలేనివాళ్లమయ్యాము. ఆ వేటకాని శరాఘాతాలు ఎలాంటివో మీ ప్రభువు నఖస్పర్శలు కూడా అలాంటివే. ఆ లేళ్లు కృష్ణసార వధువులు. మేము కృష్ణ వధువులము. అయితే ఓ ఉపమంత్రీ! ఒక్క మాటవిను. మేము ఆ ఆడజింకలంతటి అమాయికలం కాదు. మాకు విజ్ఞత ఉంది. అలాంటి కృష్ణునితో మళ్లీ ఎలా సఖ్యం చేయగలం? గోపికల కృష్ణ ప్రేమను కామమని పేర్కొంటారు కొందరు. అది అపప్రథ మాత్రమే. “ప్రేమైన గోపరమణాం కామ ఇత్యగమత్ ప్రధా” గోపికలది విశుద్ధమైన ప్రేమ. శ్రీకృష్ణ దర్శనానికి మూర్తిమతులైన లాలసలు, కృష్ణవిరహ విభ్రమలు వారు. గౌరవర్షయైన రాధిక, కృష్ణవర్జుడైన గోవిందుడు కలుసుకొన్నప్త్పుడు మన్మథునికి (అనంగునికి) ప్రవేశం ఉండదు. అనగా కామగంధం లేశమైనా ఉండదు. గోపికల ్రేమాధిక్యంలో జ్ఞానదశ ఉండదు. జ్ఞాన నియమాలన్నీ తొలగిపోయిన భావదళ వారిది. అందుచేతనే రాధికను మహాభావ స్వరూపిణిగా భావిస్తారు. గోపికల చరణధూళిని
గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్య 67 (బ్రహ్మ తన శిరస్సున ధరింపగోరుకొన్నాడు. వారి పదధూళ్ళికే అట్టి మహత్వమున్నది. వారు పరమార్థపథంలో ముక్తినే తిరస్కరించి చాలా ముందుకు పోయారు. ఉద్ధవుని గూర్చి, ఉపమంతత్రి అని సంబోధించి భ్రమరంతో వారు పలికిన పలుకులన్నీ చిత్రజల్పాలు, సుజల్సాలు, సంజల్పాలు, పరిజల్సాలు అనగా ఎత్తిపొడుపు మాటలలోని భేదాలు. హృదయపూర్వకంగా పలికినవి కావు. వారి ప్రేమ ధ్వంసరహితమైనది. ధనం నష్టమైనా, రూపం మారిపోయినా, సుగుణాలు దుర్గుణాలుగా పరిణమించినా, ఆదర సత్కారాలు కజవయినా, క్షణ క్షణమూ తిరస్కార భావం ఎదురైనా, వెయ్యి దోషాలు ఉన్నప్పటికి నష్టం కానిది (ప్రేమ. ఇంతటి ప్రేమాధిక్యత గల గోపికల మాటలు కేవలం జల్సాలు, వ్యర్థాలాపాలే. అవి గోపికావల్లభునికి వినోదప్రదాలు!
శ్రీకృష్ణ విరహ వ్యధతో వేగుతున్న గోపికల చెవులకు (భ్రమర గుంజారావాలు మరింత కర్ణకటువులయినాయి.
“ఓ భ్రమరమా! “ఓ ఉపమంత్రీ! వేటకాని కూతను తమ జాతి జింక కూత అని (భ్రమించి, అమాయికలైన నల్లజింక (కృష్ణ వధువులు) భార్యలైన లేళ్లు ఏ విధంగా వేటకాని బాణాలకు గురియై గాయపడి బాధను అనుభవిస్తాయో, అలాగే మేము మీ కృష్ణుని కుటిలవాక్యాలను నమ్ముకొని ఒకసారి అతని నఖస్పర్శతో మన్మథతాపానికి లోనయ్యాము. ఈ అనుభవం ఇలాంటిది కదా అని (గ్రహించాము. దుఃఖదాయకమైన ఈ చర్చ ఇక చాలించు. ఇవి ఎవరికి సుఖం కలిగిస్తాయో వారికి చెప్పు” అన్నది గోపిక
కమనీయంబగు వేటకాని సలు కాకర్షించి, నిక్కంబుగా తను చిత్తంబుల జేర్చి చేరి హరిణుల్ తద్చాణ నిర్భిన్నలై అమితోగ వ్యధ నొందు భంగి హరి నూయాలాసముల్ నమ్మి దుః ఖములంజెందితి మంగబాస్త్రజనితోగ్రశ్రాంతి విందిందిరా! (పోతనగారి భాగవతం) ఇవి కాక మరేవయినా సంగతులుంటే చెప్పు వింటాను అని చెవి యొగ్గింది రాధ.
భ్రమరరీతము 0
ప్రణయకోపంతో, విరహవేదనతో రాధ [భ్రమరాన్ని నెపంగా చేసుకొని శ్రీకృష్ణుణ్ని బహువిధాలుగా ఆక్షేపించింది. అనేక ఆరోపణలు చేసింది. వ్యర్థ ప్రలాపాలు సాగించింది. చివరికి తానే మోకాళ్ల మీద తలవాల్చుకొని బోరున ఏడుస్తూ కూర్చున్నది. ఆమె దుఃఖభారాన్ని చూస్తున్న తక్కిన గోపికల కళ్లల్లో నీళ్లు నిండాయి.
రాధ దివ్యోన్మాదంలో మునిగిపోయింది. భ్రమరం జుమ్మని ధ్వనిస్తూ ఎటో వెళ్లిపోయింది. చప్పున రాధ తలెత్తి చూచింది. భ్రమరం లేదు. తన (ప్రభువును అక్షేపించడం చూచి సహింపలేక భ్రమరం మధురకు వెళ్లిపోయిందేమో అనుకొన్నది. భ్రమరం అదృశ్యం కావడం చూచి గోపికలందరూ వచ్చి రాధ చుట్టూ కూర్చున్నారు.
ఒక గోపిక రాధ దగ్గరికి వచ్చి “మనం పొరపాటు పడ్డాము. కృష్ణుణ్ని ఎంతగానో నిందించాము. ఆ నిందలు వినలేక కాబోలు భ్రమరం వెళ్లిపోయింది. అది మధురకు వెళ్లి మన మాటలన్నీ కృష్ణునికి పూసగుచ్చినట్టు చెబుతుంది. మనవైఖరి కూడా ఎరుకపరుస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత మళ్లీ ఇక్కడికి కృష్ణుడు రాడేమో! అప్పుడు మన గతి ఏమిటి?” దీనంగా అడిగింది.
ప్రియుని పట్ల ఆగ్రహంతో కలహించి అవమానించి పంపిన తర్వాత పశ్చాత్తాపపడే శృంగార నాయికను కలహాంతరిత అంటారు. కలహానంతరం నాయిక మనఃస్థితి ఎలా ఉంటుందో లాక్షణికులు వర్ణించారు. “కోపాక్రాంతం సరాభూయ పశ్చాత్తాస సమన్వితొ = కలహాంతరితా” అని.
జయదేవ మహాకవి 'గీతగోవింద' కావ్యంలో రాధను కలహాంతరిత నాయికగా వర్షించడానికి మూలమైన శ్లోకం భాగవతంలో ఉంది.
గీతగోవిందంలో కలహాంతరితయైన రాధ దగ్గరికి ఒక సఖి వచ్చి ఇలా చెబుతుంది.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 69 “హరి రభిసరతి వహతి మధు పవనే కి మపర మధిక సుఖం సఖి భవనే మాధవే నూ కురు మానిని! మానమయే”
“సఖీ! మాధవుని పట్ట కోపం వద్దు. ఈ వసంతవేళ శ్రీకృష్ణుడు మన సంకేత స్థలమైన మధువనానికి వచ్చాడు. ఇంతకు మించిన సుఖం నీకు ఈ వనంలోకాక నీ భవనంలో లభిస్తుందా? నీ సౌందర్యాన్ని సార్ధకం చేసుకో. నీకెన్నో సార్టు చెప్పాను. ముగ్ధముకుందుణ్ని ఆక్షేపించడం మంచిది కాదని. ఇప్పుడు నీవు బేలవై దుఃఖిస్తుండటం చూచి సఖులందరు నవ్వుకొంటున్నారు. ఇకనైనా లేచి ఆ కృష్ణునితో సరససల్దాపాలను సాగించు, ఆనందానుభవం పొందు. అదే మాకు సంతోషం.”
ఈ సన్నివేశం గీతగోవింద కావ్యంలో శృంగారరసబంధురంగా వర్షితమైంది. దీని వ్యాఖ్యాతలు కుంభనృపతి, వనమాలిభట్టు, నారాయణభట్టు, గోపాలభట్టు, శంకరమిశ్ర ప్రభృతులు ఒకరినిమించి ఒకరు దీన్ని అత్యంత రసోజ్జులం చేశారు.
ప్రియసఖి పునరాగాః ట్రేయసా ప్రేషితఈ కిం వరయ కి మనురుంధే మాననీయో౬సీ మేం9.గః నయసి కథమిహాస్మాన్ దుస్యజద్వంద్వ సార్ట్వం సతత మురసి సౌమ్య శ్రీనధూ: సాకమాస్తే (శ్రీమద్చా 10-47-20) కొంచెం సేపైన తర్వాత ఆ తుమ్మెద తిరిగి వచ్చింది. రాధ సంతోషంతో లేచి, భ్రమరమా! నీవు మా ప్రియతమునికి సఖుడవు. మాకు మానవీయుడవు సుమా! అతనికి నీవు అంతరంగసఖుడవు కాబట్టి నిన్ను భగవదీయుడని పేర్కొంటాము. అతని వలెనే నీవు కూడా మహిమోపెతుడవే. భగవద్దర్శనం ఎంత దుర్లభమో నీవంటి భగవద్భక్తుల దర్శనం కూడా అంత దుర్లభమే సుమా!
రాధ ఎంతో ప్రసన్నమైన చిత్తంతో (భ్రమరాన్ని ఆశీర్వదిస్తూ ఇల్లా ఇంకా అన్నది. “భ్రమరా! నీవు ప్రియదర్శనుడవు. శిష్టుడవు కూడా. కనుకనే మా కటువచనాలను మర్మమెరిగి క్షమించావు. కృష్ణుని కలుసుకొని మా నిష్టురవాక్యాలను చెప్పలేదనుకొంటాము. నీ వంటి ఉత్తములు అలాంటివి చెప్పరు.
70 'బ్రమరగితము
'భ్రమరమా! నీవు మధురలో ఉన్న కృష్ణుని వద్దకు వెళ్ళావా? అక్కడికి వెళ్లకుండానే ఏదో అనిష్టశంకతో తిరిగి వచ్చావా? నీవు మాకు సుహృత్తువు. సుహృత్తుల మనస్సులు స్వాభావికంగా అనిష్టాన్ని శంకిస్తుంటాయని పెద్దలు అంటారు.
(భ్రమరమా! నీవు మధురకు ఎందుకు వెళ్లినట్టు? మళ్లీ ఎందుకు తిరిగి వచ్చినట్టు? మమ్మల్ని అతని వద్దకు తోడ్కొని పోవడానికి వచ్చావా? మాకు నీవు మాననీయుడవు. నీ మాట మేము కాదనము. మా (ప్రియతముడు కృష్ణుడు (ప్రేమసాగరుడు. శుభగుణమకుటమణి. అందుచేతనే మా క్షేమం తెలుసుకొని రమ్మని నిన్ను పంపించాడు. అవునా?
ఓ ్రమరమా! అక్కడ కృష్ణుడు కూడా మా వలెనే విరహవ్యధతో వేగుతున్నాడంటావా? “పృథివి నధిపులు నూతన ప్రియులు గారె” మధురా నగరంలో మదవతులకేమి కొదవా?”
“మీరు అలా అనవద్దు. మధురలో ఆయన వద్ద ఎవ్వర్తీ లేదు. ఆయన ఒంటరిగా ఉన్నాడు” అంటావా?
ఓ (భ్రమరమా! నీకు తెలియదు కాబోలు. అతని వక్షస్థలంలో నిరంతరం లక్ష్మీదేవి విరాజిల్దుతుంటుంది. ఆమె '“దేవి' కదా! ఎల్లవేళల వివిధ భంగిమలతో క్రీడిస్తూ ఉంటుంది. నీలనీరదం మీద సౌదామినీ రేఖలాగా, తమాలపల్లవం మీద వ్రాలిన సీతాకోకచిలుకలాగా. ఆ మహానుభావుని సన్నిధానం ఏ క్షణమూ దాంపత్య శోభితం కాకుండా ఉండదు. ఆ చోటికి మేము వచ్చి ఎలా మసలుకోగలమో నీవేచెప్పు? ఐశ్చర్యశక్తి ఉండే స్థానమది. మా బృందావనం మాధుర్యశక్తిసమన్వితమైనది. జ్ఞాన వైరాగ్యాలకు ఇక్కడ కించిత్తయినా గొప్పతనం ఉండదు. (ప్రేమాతిశయం వల్ల కలిగిన కృష్ణప్రీతియే ఈ (వ్రజధామంలో సర్వాధికమహత్వం కలది. ఆ వైకుంఠం కంటె ఈ వనవైకుంఠమే ఆనంద (ప్రదమైనది. ఆయన ఆనందైకసుఖస్వామి. అయినా మేము అక్కడికి వెళితే మళ్లీ తిరిగి రావడం జరుగదుకదా! అది ఆ ప్రభువుండే పరమధామము.
“యం ప్రాప్య న వివర్తంతే తద్దాను సరమం మను” (గీత)
“భ్రమరసంగీతాన్ని ఎందరో విని ఆనందిస్తారు. ఓ రాధారాణీ! నీవెందుకు సంతోషపడవు? అంటావా? (భ్రమరా! ఆయతే చెబుతాను. విను” ఇలా అన్నది రాధ.
నీ గానం కొంతమందికి, ముఖ్యంగా ఆ మధురానగర వాసులకు బాగుండవచ్చు. మా కృష్ణుణ్ని నీవ యదుపతి అనీ యాదవేంద్రుడు అనీ కీర్తిచడం మాకు రుచించదు. నీవేమో
గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్య 7] ఒక తుమ్మెదవుకదా! పరమహంసలు కూడా ఈ (వ్రజధామంలో మా కృష్ణుణ్ని రాధికావల్లభ, గోపీరమణ, బృందావనచం(ద్ర, నిత్యనికుంజేశ్వర, శ్యామసుందర 'గోపవంశావతంసమ' అని ఆంతరంగికంగా, హృదయమార కీర్తిస్తారు. నీవేమో అతని బహిరంగస్వరూపాన్ని కీత్తిస్తే ఇక్కడ ఎవరు వింటారు? భక్తులైనవారు భగవంతుని అంతరంగస్వరూపాన్నే కీర్తిస్తారన్న విషయం నీకు తెలియక పోవచ్చు. నీకు తెలిసినంతమట్టుకు నీవు క్రీర్తిస్తున్నావు. అందుకు నీ మీద మాకేమీ కోపం లేదు. రాధ తన ప్రక్కనున్న ఉద్ధవుణ్ని దృష్టిలో పెట్టుకొని, అతనికి నొప్పి కలుగకుండా ఇలా (ప్రారంభించింది. “అది సరే కాని, బ్రమరా! మాకు తెలియజెప్పు, “అపి బత మధుపుర్యా మార్యపుత్రో థునా౭_ స్తే” స్మరతి స పితృగేహాన్ సామ్య బంధూంశ్చగోపొన్ క్వచిదపీ స కథా న: కీంకరీణాం సృణీతే భుజమగురు సుగంధం మూర్హ్యధాస్యత్ కదాను" (శ్రీ మద్భా 10-47-20 “ఇప్పుడు ఆర్యపుత్రుడు మధురలోనే సుఖంగా ఉన్నాడా?” అని రాధ శ్రీకృష్ణుణ్ని ఆర్యపుత్రుడని పేర్కొన్నది. భర్తను మాత్రమే భార్య ఆర్యపుత్రుడని సంబోధిస్తుంది. ఆర్యపుత్రుడంటే భర్త అని అర్థం. రామాయణాది(గ్రంథాలలో భర్తను భార్య ఆర్యపుత్ర అని సంబోధించినట్టుగా ఉన్నది. ఈ సంబోధనను ఉత్తరరామచరిత, కుందమాల మున్నగు నాటకాలలో ఆయా కవులు ఉపయోగించుకొని, దానిని శాస్తసమ్మతం చేశారు. ఆర్యశబ్దం పూజ్యవాచకం. సరళస్వభావం కలవానిని ఆర్యుడంటారు. నందగోపుడు ఎంతో సరళస్వభావం కలవాడు. అక్రూరుని కపటగుణం కనిపెట్టులేనంత మంచితనం అతనిలో ఉంది. నందగోపుని అజ్జానరూపసరళత్వం ఎంతగొప్పదంటే, అది ఆతని _(ప్రాణప్రియపుత్రపరిత్యాగంగా పరిణతమయింది. ఆ అక్రూరుడు నందగోవుణ్ని నమ్మించి మా కృష్ణుణ్ని మధురకు తోడ్కొని పోయాడు. ప్రజవాసులమైన మా దుఃఖానికి అసలు కారకుడయ్యాడు. ఆ అక్రూరుణ్ని నందమహారాజు తిన్నని స్వభావంతో నమ్మిన ఫలమే మేమిక్కడ అనుభవిస్తున్నామని ఒక్క మాటలో చెబితే సరిపోతుంది. తన తండ్రివలెనే మా
లాం (భ్రమరగీతము కృష్ణుడు కూడా చాలా సరళ స్వభావుడు. కనుకనే “కాదు, కూడదు" అనకుండా మధురకు వెళ్ళాడు. ఆ మధురానగరవాసులు అక్రూరుని వలెనే మహాకపటులుగా కనిపిస్తున్నారు. వారి మాటలు నమ్మి మా కృష్ణుడు అక్కడే ఉండిపోయాడు. “స్మరతి స పితృగేహాన్ సౌమ్య! బంధుశ్చ గోపాన్”
ఓ సౌమ్యుడా! చంద్రునిలో తెల్లదనం ఎంతగా తళతళలాడుతుంటుందో, ఓ తుమ్మెదా! నీ నల్లదనం అంతగా నిగనిగలాడుతుంటుంది. కనుక నీవు సౌమ్యుడవు, చంద్రసామ్యుడవు సుమా!
పరమవాత్సల్యమయి (వ్రజరాజ్ఞియశోద తన కుమారుణ్ని ఒక్కక్షణమైనా వదలి ఉండలేనిది, అక్రూరుని వెంట ఎలా పంపించిందో! భర్శసారళ్యమే ఆమె అలవరచుకొన్నది. ఆ అక్రూరుడు ఏమేమి చెప్పే ఆమెను ఒప్పించాడో! పాపం! ఆ తల్లి మహాసరళచిత్త,
(బ్రమరమా! ఎన్నడైనా శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులను న్మరిన్తుంటాడా? నందమహారాజును, యశోదమ్మతల్లిని తలపోసుకొంటూ ఉంటాడా? బంధువులను, తన స్నేహితులను జ్ఞాపకం పెట్టుకొంటాడా?
శ్రీకృష్ణునికి ఉపనయనసంస్కారం జరిగిందట. మాకు పిలుపులేదు. (వ్రజభూమికి దగ్గరలోనే ఉంది మధురానగరం. మమ్మల్ని పిలిస్తే వెళ్లేవారమే. వారు రాజబంధువులుగదా! కృష్ణుడు విద్యార్దనకు ఉజ్ఞయినీనగరానికి వెళ్ళాడట. అక్కడ సాందీపని దగ్గర చదువుకొన్నాడట. ఆ శ్రీకృష్ణునికి రాని చదువేమున్నదో మాకు తెలియదు. మేము .(గ్రామీణ జనులము. గోస్టవాసులము. చదువుల సంగతి మాకేమి తెలుస్తుంది? చదువుకొన్నవాళ్లకు తల్లి, తండ్రి బంధువులు, స్నేహితులు గుర్తుండరు కాబోలు!
అని రాధిక ఒక నిట్టూర్పు విడిచింది. కోపం దిగమ్రింగింది కన్నీళ్లు తుడుచుకొన్నది. ఇటు (భ్రమరాన్ని, ఆటు ఉద్ధవుణ్ని చూచింది. తలవంచుకొని ఇలా అన్నది. “క్వచిదపే స కథా సః కింకరీణాం గృణీతే”
“శ్రీకృష్ణుడు ఎప్పుడైనా ఈ దాసీజనులను గుర్తు చేసుకొంటాడా?” అన్నది రాధ సంకోచంతోను, బిడియంతోను.
“కింకరీణాం” దాసీజనులలో నిమ్నశ్రేణికి చెందినవారు కింకరులు. ఇదివరకే గోపికలు తాము జీతంబత్తెం లేని దాసీజనులమని మొత్తుకొన్నారు.
గోపీనయనోచ్చలార్చిత వ్యాఖ్య 73
“ఓ బ్రమరమా! ఆ కృష్ణుడు తాంబూలసేవనంలోగానీ, చిత్రపటనిర్మాణంలోగానీ, వాదిత్ర
నృత్య గీతాదులలో గానీ ఈ కింకరీజనులను స్మరిస్తాడా? బృందావనగోపాంగనలు
సంగీతంలో పారంగతలని ఆయనకు తెలుసు. కానీ మధురానగర స్త్రీలు విభిన్న కళలలో
నేర్చరులై ఉండవచ్చు. వారి దగ్గర మా ప్రసక్తి తప్పకుండా రావచ్చు. అట్టి సందర్భంలోనైనా మమ్మల్ని గురించి చెబుతాడా?” అని ప్రచ్నించి రాధిక ఎంతో ఉత్కంఠతో “భుజ మగురు సుగంధం మూర్చ్య ధాస్యత్ కదాను”
ఓ భ్రమరమా! శ్రీకృష్ణుడు చందనాద్యగురుసుగంధయుక్తమైన తన హస్తాన్ని మా మస్తకం మీద మళ్లీ ఎప్పుడైనా నిక్షేపిస్తాడా? అన్నది.
ఇలా సోత్కంఠంతో అడిగిన విషయాన్ని సుజల్బమంటారు.
ఈ ్లోకంలోని నాలుగు వాక్యాలలో మొదటి వాక్యంలో ఆర్జవం, రెండవ దానిలో గాంభీర్యం, మూడవ దానిలో దైన్యం, నాల్గవ వాక్యంలో అక్కడుండి వింటున్న ఉద్ధవుడు ఏమి చెబుతాడో అనే ఉత్కంఠ వ్యంజితమవుతున్నది. ఉత్కంఠ వల్ల దైర్యం సన్నగిల్లిపోతుంది. మంచి మాట ఏదైనా చెవినిపడుతుందేమో నన్న చాపల్యం అధికమవుతుంది.
రాధ అనన్యప్రేమ ఎంతగాఢమో శ్రీకృష్ణునికి తెలుసు. శ్రీకృష్ణుని ప్రేమానురాగాలు రాధకు తెలుసు. ్రేమతత్త్యమహిమ ఏమంటే, జీవులు భగవత్రేమతత్పరులై తమ అల్పజ్జత్వాన్ని మరచిపోతారు. అలాగే భగవంతుడు కూడా రాధాది ('ప్రేమభక్తులకు వశుడై తన సర్వజ్ఞత్వాన్ని మరచిపోతాడు. తన ప్రియాంగనల క్షేమం తెలుసుకోవడానికి ఒక దూతను కూడా పంపిస్తాడు.
“యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్” (గీత ఉట ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తారో, వారిని అదేవిధంగా నేను భజిస్తాను. భజనఫలం (ప్రసాదిస్తాను. అన్నాడు భగవానుడు గీతలో. బంధుల బిడ్డలన్ మగల (భ్రాతల తల్లుల తండ్రులన్ మనో జాంధత జేసి డించి శరణందిన మమ్ము వియోగ దుర్దశా సింధువులోన దోచి యిటు చేరకపోవుట పొడిగాదు, వు స్పంధయ! మీ అధీశునకు పాదములం బడి యొత్తి చెప్పవే! (పోతనగారి భాగవతం)
భ్రమరరీతము కేఅ
శ్రీకృష్ణుణ్ని- దర్శించాలని గోపికలు అత్యంతాసక్తితో ఉన్నారు. ఎప్పుడెప్పుడా యని కలవరపడుతూ నిరీక్షిస్తున్నారు.
రాధ భ్రమరం ఎదుట తన మనోవ్యధనంతా వెళ్లబోసుకొని దివ్యోన్మాదానికి లోవైపోయి కూర్చున్నది.
ఉద్ధవుడు రాధిక మాటలు విన్నాడు. ఆమె వ్యాకులపాటును చూచాడు. అమె మాటలు పైకి జల్పాల వలె తోస్తున్నప్పటికి వాటిలో ఆత్మకు గోచరించే వాస్తవమున్నదని [గ్రహించి ఉద్ధవుడు విభ్రాంతుడయ్యాడు. ఇంతకు ముందు అతడు ఎవ్వరినోట ఇట్టి మాటలు విన్నవాడు కాదు. ఇంతటి (స్రేమానురాగయుక్తులైన అమృత స్వరూపులను చూచినవాడును కాదు.
రాధతో మాట్లాడి, ఆమెను ఓదార్భాలనుకొన్నాడు ఉద్ధవుడు. అమె దివ్యమైన ఉన్నాదానికి వశమయింది. కళ్లు మూసుకొన్నది. కనురెప్పల లోపల శ్రీకృష్ణుడే నిండినట్టున్నాడు. (ప్రేమ వివశత రూపుదాల్సినట్టుగా ఉంది రాధ.
రాధతో మాట్టాడటానికి వీలుకాక, ఉద్దవుడు గోపికలతో ఇలా అన్నాడు.
“అహో! యూయం స్మ పూర్ణార్ణా భనత్యో లోక పూజితా (శ్రీమద్భా 10-47-23)
గోపికలారా! మీరు చరితార్థలు. మీజీవనం సఫలమైంది. మీరు సమస్తమానవకోటికి పూజనీయలైనారు. శ్రీకృష్ణభగవానుని దర్శించడానికి మూర్తీభవించిన లాలసలు మీరు. దానం, (వ్రతం, హోమం, జపం, స్వాధ్యాయం, సంయమం మొదలైన శ్రేయస్కర కర లన్నీ కేవలం శ్రీకృష్ణభక్తి వల్లనే సిద్ధిస్తాయి. భక్తి అనేది ఒక ధర్మం కాదు. అది ధర్మానికి ఫలమవుతుంది. “కృష్ణే భక్తిర్హి పాధ్యతే” (శ్రీమద్భా 10-47-24) ప్రేమభక్తి ఫలాత్మకమైనది. అదే పంచమ పురుషార్థము అంతేకాదు. అది రసాత్మకమైనది. అంతేకాదు అది భగవత్స్వరూపాత్మకమైనది. భగవత్స్యరూపమే భక్తి ఆని చెబితే సత్యం చెప్పినట్లవుతుంది.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 75
ఎందరో భక్తులు తమ మనస్సును భగవంతునికి సమర్చించినవారున్నారు. కానీ, మీ వలె మనస్సును, ఆత్మను, తమ సర్వస్వాన్ని భగవదర్చణ చేసినవారిని నేను ఇంతకు ముందు చూడలేదు. శత్రిభువనాలలో మీకంటె పూజనీయలైన భక్తిమతులు లేరని నిస్సంశయంగా చెబుతున్నాను. యజ్ఞ యాగాది కర్మకాండ వల్ల భగవత్రాప్తి కలుగదు. స్వర్గభోగాలు ఎప్పుడో ఒకప్పుడు '్రాప్తించవచ్చు. ఆ భోగాలు కూడా క్షణభంగురమైనవే అవుతాయి.
గోపికలారా! మీ భక్తి విలక్షణమైనది. సర్యోత్తమమైనది. మహనీయమూ, మంగళ ప్రదమూ అయిన ఇట్టి శ్రీకృష్ణ భక్తిని లోకంలో (ప్రప్రథమంగా ప్రవర్తిల్లజేసిన ఆద్యగురువులు మిరే సుమా! మీరు అనుష్టించిన ఈ రాగానుభక్తి సమస్త మానవులకు మంగళప్రదమైన మార్గాన్ని చూపుతుంది.
అమ్మలారా! గత జన్మలో నేను చేసుకొన్న పరమపుణ్యం వల్ల నాకు మీ దర్శనభాగ్యం కలిగింది. మీరు ఈ సాంసారిక బంధాలనన్నింటిని ఛేదించుకొని, పరమపురుషుడు, సర్వేశ్చరేశ్చరుడైన శ్రీకృష్ణుణ్ని ప్రాణవల్లభునిగా వరించారు. (ప్రేమించారు. సర్వస్వరూపమూ, పరిపూర్ణమూ అయిన మమతాస్పద మహాభావము మీది. సూర్యుని ప్రకాశం, చంద్రుని చల్లదనం సమస్త జగత్తుకు వ్యాప్తమైనట్టుగా మీ మహాభావం ఇక సర్వలోక పరివ్యాప్తం కాగలదు. ఈ మహాభావధర్మప్రభావం వల్ల ఇప్పుడు నేను కూడా పరమ భాగ్యానుభవాన్ని పొందుతున్నాను. ఈ సర్వాత్మ మహాభావానికి మీరు మాత్రమే ఏకైక అధికారిణులు. శ్రీకృష్ణ భగవానునిచే (ప్రదత్తమైన అధికారమిది. మీ విరహాన్ని తనదిగా చేసుకొని భగవానుడు మీ పట్ల చూపిన అనుగ్రహమిది. శ్రీకృష్ణ భగవానుడు మీ వలె విరహతస్తుడు కాకపోతే, మీ వద్దకు నన్నెందుకు పంపుతాడు. మీ క్షేమం కోసం తానెందుకు పరితసిస్తాడు. తాను జగచ్చక్షువు కదా! జగన్నాథుడు కదా! సర్వజ్ఞుడు కదా!
గోపికలారా! మీ విచిత్ర జల్పాదులతో కూడిన మహాభావాన్ని నేను సంపూర్ణంగా అవగాహన చేసుకొన్నాను. మీరు నా పట్ట అనుగ్రహంతోనే ఈ రాగానుగభక్తి మార్గాన్ని (ప్రకారాంతరంగా నాకు బోధించి నన్ను ధన్యుణ్ని చేశారు” అని చేతులు మోడ్చాడు ఉద్ధవుడు.
అతని మాటలు విని ఒక గోపిక" అయ్యా! మహాభావ స్వరూపాన్ని నీవు వర్షించినందువల్ల, మమ్మల్ని ప్రశంసించినందువల్ల మాకేమీ ప్రయోజనం లేదు” అని చెబుతూ నీవు మమ్మల్ని
76 'బ్రమరగీతము ఓదార్చడానికి మధుర నుంచి వచ్చిన వాడవు గదా! మా దుఃఖాన్ని శమింపజేయడానికి నీవు ఆ కృష్ణుని దగ్గర నుంచి తెచ్చిన సందేశమేదో బయటపెట్టు. శుష్కవేదాంతం మాకు చెప్పవద్దన్నది. “అమ్మా! నేను శ్రీకృష్ణునికి గుప్తచరుడను, సన్నిహితుడును. ఆయన నాకు చెప్పి, మీకు వినిపింపమన్న సందేశమిది” అని జ్ఞానోపదేశ ప్రసంగం ప్రారంభించాడు ఉద్ధవుడు. మహాయోగేశ్చరుడైన శ్రీకృష్ణుడు గోపికల విరహాన్నిని చల్దార్చడానికి జ్ఞానామృతాన్ని గోపికలమీద చల్లేసరికి వారి విరహాగ్ని మరింత విజ్బంభించింది. విరహాన్నితోపాటు ఆ చల్లిన అమృతం కూడా భగ్గున మండిపోయింది. శ్రీకృష్ణుడు మహారాసప్రారంభంలోనే గోపికలకు కర్మయోగ ప్రాశస్త్యాన్ని ప్రబోధించాడు. అది భక్తుల (ప్రేమప్రాబల్యాన్ని ప్రతిపాదించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తాము పండితులము, జ్ఞానులమని విజ్ఞనీగే మందబుద్దులకు ప్రేమ మహిమ తెలియకుండా ఉండేందుకే జ్ఞానబోధ చేశాడు. (ప్రేమ పరమరహస్యమైన వస్తువు. పరమభక్తులకు భగవంతుడు ్రేమామృత (ప్రదానం చేసి వారిని పాలిస్తాడు. అభక్తులకు జ్ఞానసురాప్రదానం చేయించి వారిని వంచిస్తాడు. శ్రీకృష్ణుని (ప్రేమస్వరూపంలోని ఒక స్వల్ప పరమాణువే ఈ లోకంలో సమస్త హృదయాలలో, ప్రేమభక్తుల అంతరంగాలలో, అఖిల (ప్రియ పదార్జాలలో 'ప్రవిష్టమై సమస్తజగత్తును రసమయం చేస్తున్నది. గోపికలు సన్యాసవేషంలో ఉండక పోయినా, గృహాలను, సంబంధాలను, కర్మకాండను వదులుకొన్నవారు, కర్మాధికారం నుంచి నివృత్తి పొంది, పరమాత్మస్వరూపంలోకి చేరుకొన్నారు. ధర్మార్ధకామ మోక్షాలను వదులుకొని జ్ఞానాధికార నివృత్తులై భగవ(త్రేమభక్తిలో మహానందానుభవాన్ని పొందుతున్నారు.
బ్రమరగీతము క్షే
తీవ్రమైన విరహమే (ప్రేమాధిక్యతను తెలుపుతుంది.
విరహంతోనే (ప్రేమ బలపడుతుంది. కుండను అగ్నితో పరిశుద్దం చేసినట్టుగా హృదయ కుహరంలోని అహంకారాదులను విరహగ్షితో తుడిచిపెట్టాలి. ఆ విధంగా చేసినప్పుడే హృదయభాండంలో ప్రేమ సుధారసం నింపడానికి వీలవుతుంది. విరహాన్హతో శరీరం బంగారశలాకగా (ప్రకాశిస్తుంది. మనస్సునందలి వాసనామలినాలను విరహం నశింపజేసి తాను పరిశుద్దమవుతుంది.
విరహం లేనిదే ప్రేమకు స్వతంత్ర ్రతిపత్తిలేదు. విరహం లేనిదే ప్రేమకు స్థిరత్వం ఉండదు. అలాగే ప్రేమలేనిదే విరహానికి తావుండదు.
(ప్రేమగలచోటనే విరహముంటుంది. విరహం (ప్రచండవాయువువలె, విజృంభించి 'ప్రేమాగ్షిని ప్రజ్వలింపజేస్తుంది. (ప్రేమ ఒక అంకురం. దాన్ని పెంచి పోషించే జలం వంటిది విరహం.
ప్రేమ ఒక దీపిక, దానికి వత్తివంటిది విరహం. అదే దీపాన్ని ప్రకాశింపజేస్తుంది. విరహం ఎంతో సుఖప్రదమైనదైనప్పుడు విరహులు రాత్రింబవళ్లు ఎందుకు దుఃఖిస్తుంటారు?
అది అడగకూడని (ప్రశ్న. ఆతి ప్రళ్ల. నిజానికది పతిపల్నీ సౌభాగ్యం.
విరహవేదన మాధుర్యవంతమైనది. విరహంలో దుఃఖించడం కూడా రుచికరంగా ఉంటుంది. తనకు దూరమైపోయిన ప్రియుణ్ని తలపోసుకొంటూ ఉంటే హృదయంలో నుంచి ఒక జ్వాల బయలుదేరుతుంది. ఆది కూడా 'ప్రియుణ్ని ధ్యానింపజేస్తుంది.
దూరమైపోయిన ప్రియుని గూర్చి చేసిన తలపోత విరహదహనంతో అది చందన కర్పూరాలకంటె ఎంతో చల్లగా ఉంటుంది. అలాంటి దహనంలో దర్రం కావడానికి ప్రేమికుని హృదయం సదా ఆరాటపడుతుంది. విరహదశలో సమస్తలోకమూ తమ వలెనే దురపిల్లుతున్నదనుకొంటారు. ప్రేమికులు. అందరిముందు తమ హృదయాన్ని
78 'బ్రమరగీతము అవిష్కరిస్తారు. విరహానికి ఇంతటి మహత్తరశక్తి ఉన్నదని వేదాంత పండితుడైన ఉద్ధవుడికి ఏమి తెలుసు? విరహంలోని మాధుర్యాన్ని అతడు గుర్తెరుగగలడా?
రాధాదిగోపికల విరహవ్యధా ప్రలాపాలను విని విభ్రాంతుడయ్యాడు ఉద్దవుడు. వీరు (గ్రామీణయువతులు. వివేకం తక్కువ. వీరిని కర్మజ్ఞాన మార్గాలలో (ప్రవేశపెట్టడం మంచిదనుకొన్నాడు. వెంటనే జ్ఞాన కర్మలను బోధించడం సాధ్యం కాదు. వీరికి మానసిక పరిస్థితి, శరీరపరిస్టితి చక్కగా. లేదు. కాబట్టి వీరికి (ప్రథమంగా అప్టాంగయోగం అభ్యసింపజేయడమే మంచిదనే నిశ్చయించాడు ఉద్దపుడు. విరహవేదనతో శుష్కించి పోయిన వీరికి శరీర సౌష్టవం కలిగించడానికి, వివేకం కలిగించడానికి సమర్థమైనది అప్పాంగయోగమే.
“యమ నియమాసన ప్రాణానూయ ప్రత్యాహార ధారణాధ్యావ సమాధియః అష్టా అంగాని
అష్టాంగయోగంలో వీరికి శిక్షణ యిచ్చినట్టయితే వీరికి సంపూర్ణమైన ఆరోగ్యం ఏర్పడుతుంది. మనోవ్యాధి తొలుగుతుందనుకొన్నాడు ఉద్ధవుడు. యమా-నియ మాది సాధనల ఆవళ్యకతను గూర్చి ఉపన్యసించాడు. ప్రాణాయామ - ధ్యాన - ధారణ - సమాధ్యవస్థల స్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఆ తర్వాత కైవల్య పాదాన్ని గురించి, నానావిధ సిద్దులను గురించి గోపికలకు చెప్పాలనుకొన్నాడు ఉద్ధవుడు. మందత్రశాస్త్రం, ఆ తర్వాత తంత్రశాస్త్ర రహస్యాలు తెలియజెప్పి, వారికి అద్భుతశక్తులు కలిగించాలనుకొన్నాడు. కాని, వారు తన ప్రదర్శనలను చూచి ముసిముసి నవ్వులు నవ్వుకోవడం గమనించి అప్రతిభుడయ్యాడు. ఒక గోపిక వామకరావరోధంగా నవ్వాపుకొని ఇలా అన్నది.
అయ్యా! ఉద్దవ మహాశయా! యోగళాస్త్రపారంగతా! మేము శ్రీకృష్ణవిరహంతో తపిస్తున్నమాట నిజమే. కానీ మేము వియోగినులము కాము. మాకు కృష్ణునితో వియోగం ఎన్నటికీ సంభవించదు. మేమిక్కడ నిరంతరం శ్రీకృష్ణ సంయోగ సుఖ సరోవరంలో మునిగి తేలుతున్నాము. తాము బోధించి, (ప్రదర్శింపనున్న యోగం మాకు ఏమాత్రం ఉపయోగించదు.
మా కృష్ణుడు ఈ బృందావనంలో మా కళ్లకు కనిపించనివాడైతే తాము బోధించిన ధ్యానవిధానాన్ని మేము అభ్యసింపవలసి ఉంటుంది. ఆ కృష్ణుడు మా కళ్ల ఎదుటనే బృందావన నిభృతనికుంజాలలో విహరిస్తూనే ఉన్నాడు. అతడు మమ్మల్ని, ఈ బృందావనాన్నీ విడిచి ఒక్క అడుగైనా వెలుపలికి వెళ్లడు.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 79 “బృందావనం పరిత్యజ్య స క్వచిన్నైవ గచ్చతొ
మూ కృష్ణుణ్ను ధ్యానంలో దర్శింపవలసిన ఆవశ్యకత మాకు లేదు. కళ్లు మూసుకొని చూడవలసిన అవసరం అంతకంటెను లేదు. కంటికి కనిపిస్తున్నవాణ్ని కళ్లు మూసుకొని చూచునంతటి మూర్ధజనులం కాము.
అయ్యా! మీ వేదాంత (గ్రంథాలను మా వద్ద తెరవవద్దని మనవి చేస్తున్నాము. మేము నఖశిఖ పర్యంతమూ శ్యామసుందరులము. ఇక మాకు వియోగ వ్యధ ఎలా కలుగుతుంది?
“*శ్రవసోః కువలయం, అక్ష్మోరంజనం, ఉరసో మహేంద్ర మణిదామ బృందావన రనుణీనాం మండన మఖిలం హరే ర్ణయతి”
మేము కర్ణాభరణాలుగా ధరించినవి నీలోత్సలాలు. కళ్లకు పెట్టుకొన్నది నల్లని కాటుక. మా వక్షఃస్టలాభరణమైనది ఇంద్రనీలమణిహారం. బృందావనరమణీమణులకు సకలాభరణ స్వరూపుడు ఆ శ్యామసుందరుడే.
ఆ శ్యామసుందరుని ముఖపద్మాన్ని మా నయనాలతో వికసింపజేయలేనివాళ్లమైతే, తాము చెప్పినట్టుగా యోగాభ్యాసం తప్పకుండా చేస్తాము. మా కృష్ణుడు మా వద్దకు వస్తాడు అనే ఆశ వదలుకొన్నవాళ్లమైతే, తాము పేర్కొన్న మంత్రశాస్త్రమో, తం(త్రళాస్త్రమో చదువుకొంటాము. మాకు ప్రాణాయామంతో పనేమిటి? కర్మకాండతో పనేమిటి? సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు మమ్మల్ని వదలి క్షణమైనా నిలువలేనివాడ్రయుండగా ఇకమౌకు జ్ఞానకాండతో ప్రయోజనమేమిటి?
“ఉద్ధవమహాశయా! ఈ గ్రామీణజనులు ఏమీ తెలియనివారని తాము మమ్మల్ని శిష్యులనుగా చేసుకోదలచారా?” అని రాధ అనేసరికి ఉద్ధవుడు తలవంచుకొన్నాడు.
ఉద్దవ మహాశయా! తాము సందేహించవద్దు. మా కోసమే శ్రీకృష్ణుడు సాత్వతవంశంలో ఆవిర్భవించాడు.
“సబ ఉదేయివాన్ సాత్వతాం కులే" (శ్రీమద్భా 10-31-41) సాత్వతవంశంలో అవతరించి మమ్మల్ని భార్యలనుగా స్వీకరించాడు. కనుక మా రక్షణభారం ఆయనదే. మమ్మల్ని వదలిపెట్టి ఆయన ఎక్కడికి పోడు అని మాకు తెలుసు. తమకెందుకు విచారం? మమ్మల్ని ఓదార్చడానికి వచ్చి తామే మాచేత ఇలా సాంత్వనం పొందడం వింతగా ఉంది” అన్నది రాధ.
భ్రమరగీతము కేజు భక్తిసుధారసంలో ఓలలాడుతున్న వ్యక్తులు సంసారంలోని కష్టాలతో, నష్టాలలో: ఈతిబాధలతో పరితప్పులవుతున్నప్పటికి వారు ముక్తిని మాత్రం కోరరు. దాని యందు ఆసక్తిని కూడా చూపరు. వారు పరమభక్తులు. భక్తి ప్రభావంతోనే వారు సకల పురుషార్జాలను పొందుతారు. భక్తితోనే సంసారాన్ని జయించి భగవత్రాప్తిని పొందుతారు.
ముక్తికంటే భక్తి గొప్పది. భుజించిన పదార్థాలను జఠరాగ్ని భస్మం చేసినట్టుగొ అహైతుకమైన భక్తి మనుష్యుని కర్మసంస్కారాలను భస్మీపటలం చేస్తుంది. “జరయత్యాశు యా కోశం నిగీర్గమునలో యథా” (శ్రీమద్భా 3-25-33) మరి భగవద్భక్తి ఏ విధంగా లభిస్తుంది? భగవంతుడు ఎవరిని వరిస్తాడో వారికి భక్తియోగాన్ని ప్రసాదిస్తాడని శ్రుతి చెబుతున్నది. “యమేవైష వృణుతే తేన లభ్యఫొ (కఠోపనిషత్తు) భగవంతుడు తొను వరించినవారికి తన యథార్థ స్వరూపాన్ని దర్శింపజేస్తాడు. వారికి ప్రాప్తిస్తాడు అని అర్ధం.
భాగవతంలో శ్రీ శుకదేవుడొక సందర్భంలో ఈ విషయమే చెప్పాడు.
“ముక్తిం దదాతి కర్షివిత్ స్మ న భక్తియోగమ్” (శ్రీమద్భా 5-6-18)
“తనను సేవించినవారికి భగవంతుడు ముక్తినిస్తాడు. కాని, ఎవరికీ భక్తినివ్వడు” అని.
మరి భక్తిని ఎలా సంపాదించుకోవాలి? దానికి మార్గమేమిటి?
వివిధమంగళసాధనల ద్వారా భక్తిని సాధించడానికి 'ప్రయత్నింపవలసి ఉంటుంది. దానం, (గ్రతం, జపం, తపం, హోమం, స్వాధ్యాయం, సంయమాదుల ద్వారా శ్రీకృష్ణభక్తిని పొందడానికి (శ్రమించాలి.
“దాన వ్రత తపో హోమ జపస్వాధ్యాయ సంయమైః”
ఈ కర్మలన్నిటిని శ్రీకృష్ణార్చణబుద్దితో చేయాలి. శ్రీకృష్ణుని యందు భక్తిని సంపాదించడమే సంపూర్ణ సత్కర్మల ఫలమై ఉండాలి. అలా కాకుండా చేసే దానవ్రతాది కర్మలన్నీ బాహ్యాడంబరాలు, దాంభికాలే అవుతాయి. వాటి వల్ల ప్రయోజనం ఉండదు.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య రి గోపికల భక్తి స్వతం[త్రమైనది. వారు ఆధ్యాత్మిక జగత్తులో ఒక నూతన భక్తి మార్గాన్ని (ప్రవర్తిల్లదేశారు. వారి భక్తిమహిమను చూచి ఉద్దవుడంతటి వేదాంతవేత్త విభ్రాంతుడయ్యాడు. ఓ గోపికలారా! శ్రీకృష్ణవిరహంతో పరితప్తలైన మీరు ఇంద్రియాతీతుడైన నరాకృతిపరబ్రహ్మను రాగానుగభక్తితో అహరిశలు కొలుస్తున్నారు. సర్వత్ర ఆయన్ను దర్శింప గలుగుతున్నారు. లోకులకు కళ్యాణకారకమైన ఒక వినూతన శిక్షణ యిస్తున్న ఉపదేష్టలు మీరు. ఇంతటి మహాభక్తురాండ్రను దర్శింపగలగడం నా భాగ్యం. ఇంతటి 'ప్రేమవతుల దర్శనభాగ్యంతో నేను భక్తితత్తాన్ని తెలుసుకొని ధన్యుడనయ్యాను. శ్రీకృష్ణభగవానుణ్ని మీరు సర్వాత్మభావంతో, అనగా మహాభావమగ్నలై ఆరాధించారు. “కృష్ణాఖ్యం పురుష పరమ్” (శ్రీమద్భా 10-47-26) పరమపురుషుడైన శ్రీకృష్ణుణ్ని వరించడం దుష్కరమైన విషయం. శ్రీకృష్ణుడు సర్వజనులకు పరమపతి, యథార్ధంగా కూడా పతి. ఆయనతోడి సంబంధం అవిచ్చిన్నంగా కొనసాగుతుంది. కాబట్టి ఆయన అవిచ్చిన్నపతి. గోపికలు బహిరంగంలో వియోగినులుగా కనిపిస్తారు. కాని, వారు అంతరంగ సంయోగం కలవారు కనుకనే వారిది మహాభావమని పేర్కొనడం జరిగింది. ఈ మహాభావాన్నే భాగవతవ్యాఖ్యాత శ్రీధరస్వామి “ఏకాంత భక్తి" అని పేర్కొన్నారు. గోపాంగనల విరహతాపానుభూతికి కారణమైన ఏకాంతభక్తి కూడా వారికి దాస్యం చేసింది. భగవద్వియోగం ఎరుగని జీవులకు భగవద్విరహ తాపానుభవం ఎలాంటిదో తెలియదు. గోపికలు అలాకాదు. వారికి మొదట భగవంతునితో సర్వాంగీణమైన సంశ్హేషం ప్రాప్తించింది. అందుచేత వారికి కలిగిన విరహానుభూతి భగవదను([గ్రహ విశేషముయింది. ఉద్దవుడు శ్రీకృష్ణుని గూర్చి చెబుతూ, అతడు పురుషుడు, అనగా పరమపురుషుడు, పురుషోత్తముడు, ఇంకా అతడు అధోక్షజుడు అనగా ప్రత్యక్షం చేసుకోవడానికి అశక్యమైనవాడు. అట్టివానిని సర్వాత్మభావంతో మీరు ప్రేమించారు. భగవంతుని చేత వరింపబడినవారు కనుక మీకింతటి అధికారం కలిగింది. మీరు దివ్యోన్మాదంలో చిత్రవిచిత్రజల్పాలు చేశారు. అది మీ మహాభావానికి చెందిన రహస్య విషయం. శ్రీకృష్ణుడు మీకు తెలుపుమన్న విషయం మరొకటి వినండి.
82 (బ్రమరగీతము గోపికలారా! మీకు వియోగమనేది లేదు. ఏ కొంచెమూ లేదు. నాతో వియోగం మీకు ఎలా కలుగుతుంది? నేను సర్వాత్మస్వరూపుణ్ని. తన ఆత్మతో ఎవరికైనా వియోగం కలుగుతుందా? కలుగదు. నేను సర్వాత్ముణ్ని. అనగా సర్వప్రేమాస్పదుణ్ని. మీ జీవన సర్వస్వాన్ని నేను, మీరు నన్ను అనుమానించవద్దు. మీ నయనాలలోని ధ్రువతారను నేను. నేను పరమాత్మరూపంలో మీ మనస్సులో, ఇంద్రియాలలో, (ప్రాణంలో సర్వదా వ్యాపించి ఉన్నాను. మీరు నాకు నిత్యసుఖస్వరూపలైన ప్రేయసులు. కన్నుల యెదుట నిలిచిన ప్రియతముడే దూరదేశగతుడై నప్పుడు అతని భార్య నిశ్చలభావంతో అరాధిస్తుంది. అట్టి ఆరాధన మీకు కలిగించడానికే నేను మీకీ బహిరంగలీలను ప్రకటించాను. భక్తులకిది ఆదర్శం కావాలని ఈ పని చేశాను. కాని అంతరంగంలో నేను మీ వద్దనే ఉన్నానన్న విషయం మీకు తెలుసు. మీరు చేసిన ఉపాలంభనలు, అక్షేపణలు, జల్సాలు అన్నీ బహిరంగ ప్రకటనలే కానీ, అంతరంగ ప్రకటనలు కావని నాకు తెలుసు. మీకు కూడా తెలుసు. రాసకేళికి మీరు సశరీరలై రాలేదు కదా. చిన్మయరూపంతో వచ్చారు. కనుకనే నన్ను శీఘ్రంగా పొందగలిగారు. మీ ఈ విరహం కూడా అలాంటిదే” అని శ్రీకృష్ణ సందేశాన్ని పూర్తిచేశాడు ఉద్ధవుడు. సంసారంలో విరక్తి చెందిన అదృష్టవంతునికి పరమాత్మధ్యానం అలవడుతుంది. గోపాంగనలకు శ్రీకృష్ణసన్నిధానం ప్రాప్తించింది. రసానుభూతిని పాందారు. ఆ తర్వాత విరహం ప్రాప్తించింది. రసానుభూతి లేని విరహం సిద్దప్రదమైనది కాదు. లోకంలో భగవంతుణ్ని వదలి బహిర్ముఖులైనవారున్నారు. వారికి రసానుభవమంటే ఏమిటో తెలియదు. వారికి విరహమే ఉండదు. రసానుభవం కలిగినవారికే విరహావస్టలో కూడా రసానుభూతి కలుగుతుంది. వారికి విరహం ఒక వరమవుతుంది.
భ్రమరగీతము 13 గోపికల భక్తి ఫలాత్మకమైనది - రసాత్మకమైనది. అంతేకాదు, భగవద్రూపాత్మకమైనది. అనగా భగవత్స్వరూపభక్తిగా పరిణతమైనది. అదే నారద శాండిల్య భక్తిమాత్రాలలో నిబంధితమయినది. గోపికల సాధన మహామునీశ్యరులకు కూడా సాధ్యమయ్యేది కాదు. “భగవత్యుత్తనుళ్లోకే భవతీభి రనుత్తమా భక్తి: ప్రవర్తితా దిష్ట్యా మునీనామపి దుర్లభా” (శ్రీమద్భా 10-47-25) దానాలు, (వ్రతాలు, తపస్సు, హోమాలు, జపాలు, స్వాధ్యాయ సంయమాలు మొదలైన పుణ్యకర్మలను అనుష్టించడం ద్వారా శ్రీకృష్ణభక్తిని లోకంలో సాధిస్తుంటారు. ఉత్తమళ్లోకుడైన శ్రీకృష్ణుని యందు మునిజన దుర్లభమైన (ప్రేమభక్తిని గోపికలు ప్రవర్తింప జేశారు. ఇది మహాభాగ్య సూచకం. దీనితో గోపికలు లోకపూజితలైనారు. గోపికలు తమ పుత్రులను, భర్తలను, దేహాలను బంధువులను గృహాలను వదలి పరమ పురుషుణ్ని వరించారు. సన్యాసులు తమ వస్తుసముదాయాన్ని, స్వస్థానాన్నీ పరిత్యజించి, బంధుమిత్ర సంబంధులను పరిత్యజించి పరమాత్మస్థితిలో సుస్టితులైనట్టుగొ, గోపికలు చతుర్వర్గసంబంధాలను వదలుకొని, కర్మాధికార -జ్ఞానాధికారాలను వదలుకొని పరమాత్ముని పట్ట రసానందభక్తిని ప్రవర్తిల్లదేశారు. “హిత్వా వృణీత యూయం యత్ కృష్ణాఖ్యం పురుషం పరమ్” (శ్రీమద్భా 10-47-26) శ్రీకృష్ణుడు ఆదిపురుషుడు మాత్రమే కాదు, పరమపురుషుడు. పరాత్పరుడైన పురుషుడు. పురుషోత్తముడు. దేవతలు మానవ కళ్యాణప్రదమైన ఏ రహస్యాన్ని ఆపుకోలేరు. ధరాతలం మీద సర్వేశ్చరుడు దేవకి అష్టమ గర్భమై ఆవిర్భవించనున్నాడని ఆకాశవాణి ఉండబట్టలేక బట్టబయలు చేసింది.
84 భ్రమరగీతము
(బ్రహ్మదేవుడు ధరాదేవి కోరిక మేరకు పరమపురుషుడు భూతలంమీద అవిర్భవిస్తున్నాడని దేవతలకు ఇలా తెలిపాడు.
వపుదేవగ్భహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః (శ్రీమద్భా 10-1-23) వసుదేవుని యింటిలో, అనగా చెజసాలయే అయినా భార్యాసహితంగా ఉంటే, అది గృహమే అవుతుంది కదా! ఆ గృహంలో షడ్డుణైశ్చర్యపరిపూర్జుడైన భగవానుడు అనగా “పురుషు పరః” పురుషోత్తముడగు శశ్రియఃపతి భూతలం మీద అవతరిస్తున్నాడు. ఆయన పత్నియైన శ్రీలక్ష్మి సముద్రంలో అవతరించినట్టిది. అప్పరసలు కూడా సముద్రంలో అవతరించినట్టివారే. కాబట్టి, దేవతాస్త్రీలు ఇప్పుడు సర్వసౌందర్యపురస్సరలై తమకు యోగ్యమైన స్థానాలలో ఉద్భవించి స్వజన్మసాఫల్యార్థం, భగవత్రీత్యర్థం గోకులంలో జన్మించవలసింది.”
ఈ సందర్భంలో కూడా శ్రీకృష్ణునికి భగవచ్చబ్దం, “పురుషు పరః” (ప్రకృతి పురుషుల కంటె విలక్షణమైనవాడు) విశేషణంగా చెప్పబడింది. సమస్తంలోను ఆనుగతమైన పరుడు, పరమాత్ముడు అతడే పాలించేవాడు, పోషించేవాడు, బలాన్నీ స్పూర్తినీ ప్రసాదించేవాడు అయిన పరమ పురుషుడు. స్వయం ్రకాశచిదానంద స్వరూపుడు. “పురుషు పరః” “సాక్షాద్ భగవాన్” అనే పదాల వల్ల శ్రీకృష్ణుడెవరో స్పష్టమవుతుంది. అటువంటి పూర్షబ్రహ్మ సనాతనుడైన పరమాత్ముని పట్ట గోపికలకు సర్వాత్మభావం కలిగింది.
ఉద్దవుడన్నాడు గోపికలారా! మీకు శ్రీకృష్ణుడు చెప్పమన్న విషయం ఇంకొక్కటి మిగిలి ఉన్నది. చిత్తగించండి.
ఏకాంతభక్తి కలిగిన మీతో నాకు వియోగం ఎన్నటికి సంభవించదు. నేను అందరికి ఆత్మ అయినవాబ్ని ఎవ్వరికి ఆత్మనుంచి వియోగం తటస్టించదు. నేను అందరికి పరమ(ప్రేమాస్పదుణ్ని. మీరు నన్ను ప్రేమించిన మరుక్షణంలోనే నేను మీ హృదయంలోనికి
చొరబడ్డాను - కార్యానికి ఉపాదానకారణమైనట్టుగా,
ఉపాదానం అంటే కార్యరూపం సిద్దంచడానికి కారణమని అర్థం. కుండను
తయారుచేయడానికి మట్టీ ఉపాదానకారణమవుతుంది. మీరు నన్ను (ప్రేమించారు. మీ అణువణువున నేను వ్యాపించాను.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 85 గోపికలారా! నదుల పర్యవసానం సాగరంలో కలియడం. సమస్త సాధనల పర్యవసానం పరమపురుషుణ్న పొందడం. అలాగే మీ మనసులన్నీ పరమాత్ముడనైన నాలో సంగమించాయి. నేను మీకళ్లకు దూరం కావడం ఎందుకంటే “మనసః సన్నికర్దార్రమ్” “మదనుధ్యానకామ్యయా” (శ్రీమద్భా 10-47-34). ప్రియుని మనస్సన్నికర్షం వలన (ప్రేమోత్కర్హం ఉత్కటమవుతుంది. గోపికలారా! మీరు సందేహించవద్దు. మీ నయనాలలోని (ధ్రువతారను నేను. నేను మీకు దూరంగా ఉండటానికి కారణం అహర్నిశలు మీకు సన్నిహితంగా ఉండటానికే సుమా! మీ మనసులో మనసునై ఉంటాను. “మదనుధ్యాన కామ్యయా” నన్ను అనుక్షణం ధ్యానిస్తారన్న సదాశయంతోనే మీకు మానసికంగా మరీ సన్నిహితుడనయ్యాను. నేను శరత్నూర్షిమనాడు బృందావనంలో ్రీడించే సమయంలో స్వజనుల అవరోధం వల్ల రాసకేళికి రాలేని గోపికలు, నాతో సమ్మిళితం కాలేని (ప్రేమికులు నా లీలలను మనస్సులో స్మరించడం చేతనే నన్ను పొందుతారు. అట్టివారు నిరాశపడవలసినది లేదు. వాస్తవానికి భగవానుని శ్రీచరణారవిందాలు అలభ్యలాభాలు. అవి ప్రాప్తించిన తర్వాత (ప్రాప్త్రవ్యమనేది ఏదీ లేదు. “యా నుయా శ్రీడతా రాత్ర్యాం వవేష్మిన్ వ్రజ అస్టితాః అలబ్ధరాసా; కళ్యాణ్యో మా౭_ ౭ పుర్మపుద్వీర్య చింతయా” _ (శ్రీమద్భా 10-47-37) (ప్రియుడు దూరదేశంలో ఉన్నప్పుడు అతని చింతనమే అధికంగా ఉంటుంది. ఈ భావాన్నే పోతనగారి పద్యంలో చూడండి. “చెలునల్ దవ్వుల నున్న వల్లభులపై చిత్తంబులం గూర్తురు. తృలికం జేరువ వారికంటె నదియుం గా కెప్పుడున్ నన్ను మీ రలు చింతించుచునుండ గోరి యిటు దూరస్థత్వముం బొందితిం దలకం బోలదు, వన్ను గూడెదరు విత్యధ్యానపారీణలై”
బ్రమరగీతము క్షత,
ఉద్ధవుని ద్వారా గోపికలు తమ ప్రియతముడైన శ్రీకృష్ణుని సందేశాన్ని శాంతంగా విన్నారు. ఇంతకుముందు మాదిరిగా ఏ గోపిక తన కోపాన్ని ప్రదర్శించలేదు. రాధ మాత్రం మౌనంగా కూర్చున్నది.
“తా ఊచురుద్దవం ప్రీతాస్త తృందేశాగత స్పృతీవో
(శ్రీమద్భా : 10-47-38)
ఉద్దవుని మాటలు విని శ్రీకృష్ణుని స్వరూపమాధుర్యాన్నీ, లీలా మాధుర్యాన్నీ గుర్తుకు తెచ్చుకొన్న ఆమె ఆలోచనాలోచనాలు ఆనందభరితములయ్యాయి.
శ్రీకృష్ణుని వద్దనుంచి తమకు సందేశం తెచ్చిన ఉద్దవుని మీద గోపిలకందరికి ఇప్పుడు అభిమానం, ఆదరభావం కలిగింది.
“ఉద్ధవ మహాశయా!” అని నవ్వుతూ పలకరించింది ఒక గోపిక యదువంశీయులను బాధించే పాపిస్టి కంసుని పీడ, అతని అనుచరుల అఘాయిత్యాలు సమసిపోయినందుకు సంతోషిస్తున్నాము. మాకు మరొక సంతోషకరమైన విషయమేమంటే, శ్రీకృష్ణుడు తన బంధువుల, పెద్దల కోరికలను నెరవేర్చి వారిని పూర్ణకాములను చేయడం, వారితో సుఖంగా (ప్రొద్దుపుచ్చడం.
మరొక గోపిక మెల్లగా ఉద్ధవుణ్ని సమీపించి, “మహానుభావా! మమ్మల్ని ఒక సందేహం పీడిస్తున్నది. తాము నివృత్తి చేయగలరా?
మధురానగర యువతులు రసశాస్త్రప్రవీణలై ఉంటారు. వారు మన్మథమన్మథుడైన శ్రీకృష్ణుణ్ని చూచిన తర్వాత మోహించకుండా ఉండలేరు. వారి వలలో పడకుండా ఉంటాడా మా కృష్ణుడు? బృందావనంలో శరత్నూర్షిమ నాటి రాసలీలను ఎన్నడైనా స్మరిస్తాడా? మేము (గ్రామీణజనులము కాబట్టి ఆనాడు అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణుణ్ని మధురానగరానికి తోడ్కొనివెళుతుండగా చూస్తూ కళ్లల్లో నీళ్ళు కుక్కుకొని ఉండిపోయాము. ఆ మధురానగర
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 87 (స్రీలయితే శ్రీకృష్ణుణ్ని మళ్లీ బృందావనానికి చేరనిస్తారా? రథ చక్రాలకు అడ్డుపడకుండా ఉంటారా? ఇమ్ములనున్నవాడె హరి ఇక్కడి కెన్నడు వచ్చు? వచ్చి నూ ఉమ్మలికంబు పాపునె? ప్రియుండిట నచ్చెదవన్న సైతురే అమ్మధురావురీరమణు లడ్డము వత్తురుగాక చెల్లరే. = మమ్ము విధాత నిర్ణయుడు మన్మథ వేదన పొలుచేసెనే!
- పోతనగొరి భాగవతం ఉద్దవమహోదయా! బృందావనంలో కృష్ణుడు మమ్మల్ని పలుకరించే వలపుచూపులతోనే మధురానగర(స్త్రీలను కూడా అలరిస్తున్నాడా? మామీద చూపిన (ప్రేమనే వారిపట్ల కూడా చూపుతున్నాడా?” అని ఒక గోపిక అడగగానే మరొక గోపిక ఇలా అన్నది. “ఇదేమి పిచ్చి ప్రశ్న ప్రజరాజా, వలరాజు, విద్భ్రచూడామణి రతివిశేషజ్ఞుడు. అతడు నాగరిక స్రీలకు ప్రియమైనవాడు కాకుండా ఎలా ఉంటాడు. నగర (స్త్రీల చతురోక్తులకు, విలాసాలకు ఆసక్తుడు కాకుండా ఎలా ఉంటాడు?” అని ఎదురు ప్రశ్న వేసింది. ఇతర గోపికలు ఉద్దవుని వద్దకు వచ్చి వినయంగాను, అనునయంగాను ఇలా అన్నారు. “అయ్యా! మీరు శ్రీకృష్ణునికి ఆంతరంగికులమని తామే సెలవిచ్చారు. నిరంతరం ఆయన సాంగత్యంలో ఉండేవారు మీరు. చెప్పండి. మధురానగర మదవతుల గోఫ్టిలో తియ్యతియ్యగా మాకృష్ణుడు మాట్టాడేటప్పుడు ప్రసంగవశాత్తు మా (ప్రసక్తి ఏ కొంచెమైనా వస్తుందంటారా?” అని అడిగే లోపలే రసోద్రేకంతో నర్తిస్తూ మరొక గోపిక హొయలొలుకబోస్తూ ఇలా గానం చేసింది. తాః కిం నిళాః స్మరతి యాసు తదా ప్రియాభిః బృందాననే కుముద కుంద శశాంక రమ్యే రేమే కృణచ్చరణ నూపుర రాస గోష్ట్యాం అస్మాభిరీడిత మనోజ్ఞ కథ: కదాచిత్ (శ్రీమద్భా : 10-17-43) తెల్లని కలువపువ్వులతో, మత్తుగొలిపే మల్లెలతో, చల్లనిచంద్రుని వెన్నెలతో అత్యంత రమణీయమైన బృందావనంలో మా చరణనూపురాలు రుణరుణమని (మైగుతుండగొ,
88 (భ్రమరగీతము రాసమండలమందు ఆ కృష్ణునికి ప్రియురాం(డ్రమైన మేము అతని మనోజ్ఞ శరత్సూర్షిమా చరితలను పొగడుతూ నృత్యం చేసేవాళ్లము. ఆ మధుర రాత్రులలో ఏ ఒకదానినైనా స్మరిస్తుంటాడా? మా కృష్ణుడు.
గ్రీష్మసంతప్తమైన వనాన్ని దేవేంద్రుడు వర్షం కురియించి చిగిరింపజేసినట్టుగా నందనందన విరహశోక సంతప్తలమైన మమ్మల్ని తన హస్త స్పర్శలతో (బ్రతికించడానికి
కృష్ణుడు ఇక్కడికి వస్తాడా?” అని అడుగుతున్న గోపికల దగ్గరికి వచ్చి మరొక గోపిక ఇలా అన్నది.
“ఏమి అడుగుతున్నావు? శ్రీకృష్ణుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? అతడు శత్రువులను జయించాడు. రాజ పదవి లభించింది. రాజకన్యలను అంగరంగ వైభవంతో పరిణయమాడతాడు. తన చుట్టు పరివేష్టించిన రాజకన్యాసమూహంలో చుక్కల్లో చంద్రుడులాగా శోభిల్లుతుంటాడు. ఇక ఆ కృష్ణుడు ఈ పల్లెపడతుల దగ్గరికి ఎలా వస్తాడనుకొంటారు?”
అవును. అది యథార్థమే అంటూ నేరొక గోపిక "ఆ కృష్ణుడు సర్వ సంపదలకు అధిష్టాత్రి అయిన లక్ష్మీదేవికి అధీశ్ళరుడు. అతడు ధీరస్వాంతుడు. ఆప్తకాముడు, పురుషోత్తముడు. ఆయనకు బృందారణ్య గోపికలతోను, మధురానగర రాజకన్యలతోను ఏమి పని?
నేను చెప్పేమాట ఒకటి వినండి. పూర్వం పింగళ అనే వేశ్య అనుభవ పూర్వకంగా చెప్పిన నీతి అది. వేదవిదుడు చెప్పినా, వేశ్య చెప్పినా నీతికి న్యూనత ఆంటదు. ఆ నీతి ఇది.
“ఆశా హి పరనుం దుఃఖం, నైరాశ్యం పరమం సుఖమ్”
“ఆశయే అన్నిటికంటె దుఃఖకరమైనది. నిరాశయే అన్నిటికంటె సుఖకరమైనది” పరపురుషునియందు ఆశతో పింగళావేశ్య మహాదుఃఖిత అయింది. ఆ విషయంలో నిరాశను అలవరచుకొని పరమసుఖాన్ని పొందింది. ఈ నీతి మనకు కూడా వర్తిస్తుంది”
అని వాదిస్తున్న గోపికకు అడ్డు వచ్చి “నీవు చెబుతున్న సామ్యం తప్పు” అని మరొక గోపిక ఇలా అన్నది.
ఆ వేళ్ళ నిరాశ చెందింది. నైరాశ్యంలో దుఃఖం దాగి ఉంటుంది. శ్రీకృష్ణుణ్ని కలుసుకోగలమనే ఆశ ఉన్నంతవరకు దుఃఖానికి, కరుణరసానికి ఆస్కారం లేదు. మనది
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 89 విప్రలంభ శృంగారం. (ప్రేమించుకొన్న యువతీ యువకులకు ఏదో ఒక కారణంతో ఎడబాటు కలుగవచ్చు. అది విప్రలంభ శృంగారమవుతుంది. “స విప్రలంభో విజ్ణేయ: సంభోగోన్నతి కారకా
విప్రలంభం లేనిదే సంభోగానికి ఉన్నతి చేకూరదని రసశాస్త్రం చెబుతున్నది. బట్టకు రంగు గాఢంగా అద్దాలంటే ఆ బట్టను వేడినీళ్లల్లో ఉడకబెట్టాలి. ఆలాంటి ఉడుకే విప్రలంభంలోని వ్యధ.
గోపికల జీవనంలో కరుణరసానికి తావు లేదు. శ్రీకృష్ణుడు వారి దగ్గరికి ఇకరాడు అనడానికి వీలులేదు. శ్రీకృష్ణుని శుభాగమనమే గోపికల జీవితాశ వారు సర్వత్ర శ్రీకృష్ణుణ్నే చూస్తుంటారు. వారికి అతడు అదృశ్యుడు కాడు. బృందావనాన్ని విడిచి అతడెక్కడికి పోడు. సమీపంలోనే ఉన్న మధురకు గోపికలు ఎందుకు పోలేదు? శ్రీకృష్ణుడు బృందావనానికి ఎందుకు రాలేదు? గోపికలకు స్వసుఖకల్పన లేదు. త్యాగమే వారి వృత్తి వారు తమ ప్రియతముని సుఖమే తమ సర్వస్వంగా భావించారు. గోపికలది భావజగత్తు, వారికెన్నటికి వియోగం ఉండదు. కలుసుకోవడాలు, విడిపోవడాలు (ప్రాపంచిక జగత్తులోనే ఉంటాయి.
గోపికలది కామం కాదు. ప్రొకృతమైన కామం పురుషోత్తముడైన శ్రీకృష్ణుని యందు కలిగితే అది పవిత్రమైన ప్రేమగా పరిణమిస్తుంది. శ్రీకృష్ణుడు వారి ప్రేమను అంగీకరించాడు. అదే ఆయన వారికిచ్చిన పురస్కారం. ఈ పురస్కారమిచ్చి శ్రీకృష్ణుడు గోపీపదపల్లవాన్ని చేతులు చాచి యాచించాడు.
బ్రమరగీతము కేర్ “శ్రీకృష్ణుడు ఏ చోట ఉన్నప్పటికీ ఆయన్ను మరచిపోవడం ఎవరికి సాధ్యం కాదు. ఆ కృష్ణుడు ఎన్ని రూపులెత్తినా లక్ష్మీదేవి ఆయన్ను విడిచిపెట్టిందా ఏమిటి? ఒక్క క్షణమైనా తనభర్తను వదలక నిత్యానపాయిని, నిరవద్య, దేవదేవదివ్య మహిషి అని కీర్తింపబడినది ఆ మహాతల్లి. అమె ఐశ్చర్యదేవత” చెప్పసాగాడు ఉద్దవుడు. ఉద్దవమహాశయా! ఆమె సంగతి మాకెందుకు? మేము (వ్రజ సస్త్రీలము. మా కృష్ణుడు (ప్రజేశ్చరుడు. ఆయన ఏదో రాచకార్యం మీద మధురానగరానికి వెళ్లినంత మాత్రాన ఆయన్ను ' మేము మరచిపోగలమా? కృష్ణుడు మాతో ఎంత ముచ్చటగా, ఎంత మధురంగా మౌట్టాడేవాడో మేము మరచిపోగలమా? సాయంవేళల ఈ నిర్భర యమునా తరంగణిలో కృష్ణునితోపాటు మేము నౌకా విహారం చేసేవాళ్లం. మేము కృష్ణుణ్ని గూర్చి పాడేటప్పుడు మా రాగ లహరికి యమునాస్వరలహరులు వంతపాడేవి. ఆ మనోజ్ఞ సంధ్యలను మరవగలమా? అదిగో! అది గోవర్దన గిరి. ఆ 'గిరిరాజు హరిదాసవర్యుడని పేరు పొందాడు. పాషాణ దేహధారి అయిన ఈ గిరిరాజు పరమధన్యుడు. పరమభాగవతుడు. రాధాకృష్ణుల చరణకమలాలను నిత్యమూ శిరస్సున ధరించేవాడు. ఆ కృష్ణుణ్ని అతడు మరచిపోడు. అతణ్ని ఆ కృష్ణుడూ మరచిపోడు. ఇక మేమా అన్నీ మరచిపోయే వాళ్ళం? “గోవర్ధనో జయతి శైలకులాధిరాజో యో గోపికాభిరుదితో హరిదాసనర్యః కృష్ణేన శక్రమఖ భంగ కృతార్చితో యః సప్తాహమస్య కరపద్మతలే౭_ప్య వాల్పీత్” ఇవే గోవులు ్రొద్దుట గుంపుగా వెళ్లడం చూచే వాళ్లం. తృప్తిగా మేసి మానసగంగలో నీళ్లు త్రాగి సాయంకాలం తమ గోష్టాలకు వచ్చేవి. వాటి వెంట గోపబాలకులు ఆడుతూ
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య “(| పాడుతూ వచ్చేవాళ్లు గోధూళిధూసరితకోమలగోపవేషంతో నీలాంబుద నుందర శ్రీనందకిశోరుడు వేణువూదుతూ గోకులాన్ని వ్యాకులం చేస్తూ వస్తూంటే చూడాలి అతని సొగసు! కళ్ళున్నందుకు ఫలమది! “అక్షణ్వతాం ఫలమిదం".
ఇంతెందుకు మహాశయా! ఈ బృందావనంలో ఒక్కొక్క ప్రదేశం, ఒక్కొక్క ధూళికణం ఆ శ్రీకృష్ణుని పరమరమణీయమైన చరణ కమలాలతో చిహ్నితమైనదే.
కాళిందీ మానస గంగా నదులు మా కంటె శ్రీకృష్ణునియందు అధికప్రేమ గలవి. శ్రీకృష్ణుని వేణుగీతిని ఆలకించి శతసహస్ర ఆవర్తాలుగా సుడివడి పోతాయి. అవి సుడులు కావు. వాటి హృదయ భంగిమలు. ఈ నదులు వేణుగానాన్ని మరవవు. వేణుమాధవుణ్ని మరవవు.
బృందావనంలోని నిధువనాన్నీ, దాని చరిత్రను ఎవరు విస్మరిస్తారు? రాధాకృష్ణుల రాసకేళిని దర్శించి శివపార్వతులు రాధాకృష్ణుల వేషాలతో '్రీడించిన రహస్య ప్రదేశాన్ని ఎవరు మరచిపోతారు? పూర్వమెప్పుడో (ధ్రువుడు తపస్సు చేసి శ్రీనారాయణ దర్శనాన్ని పొందిన మధువనాన్ని, శివ పార్వతులు యథేచ్చగా '్రీడించి, దాన్ని నిధువనం చేశారు.
అక్కడున్న పెద్దమజ్జిచెట్టే వంశీవటవృక్షం. అక్కడ నిలబడి శ్రీకృష్ణుడు శరత్సూర్లిమనాడు వేణుగానం చేశాడు. ఆ వంశీనాదం వినడానికి దేవతలు దిగివచ్చిన ప్రదేశమది. అద్భుతమైన విషయం ఏమంటే శరత్సూర్లిమనాడు ఇక్కడ ఇప్పటికి వేణుగానం వినిపిస్తుంటుంది. వామభుజం మీద వామకపోలం మోపి ఆకాశం వైపునకు చూస్తూ వేణువూదే మాధవుని సౌందర్యాన్ని మేము మరచిపోగలమా? ఆహా! సర్వాంగాలలో అలౌకికోన్మాదాన్నీ, మాధుర్యాన్నీ నింపే ఆ వంశీధ్వనిని ఎవరు మరచిపోగలరు! ఆత్మవంతులు ఆ వంశీద్వని ఏ వైపు నుంచి వచ్చిందో తెలుసుకొని పరుగెత్తిపోయి శ్రీకృష్ణుని చరణసన్నిధికి చేరుకొంటారు. ఆక్కడ మోకరిల్లుతారు! ధన్యులవుతారు.
కృష్ణుడెన్నటికీ ఈ బృందావనాన్ని మరచిపోడు. ఇది ఎంత మనోహరమైన ప్రదేశం! కమనీయ కుసుమ నిభృతనికుంజ స్థలాలు, శుకపిక విహగ కల కూబిత కాకలీ ప్రవాహాలు! కాళిందీ కలకల నినాదాలు! నిరీర్తురులు! మందసి శ్రంళో కూడిన బృందావనేశ్వరిని ఒకసారి తలచుకొంటే చాలు శ్రీకృష్ణుడు ఇక్కడికి పరుగుపరుగున వస్తాడు. ఈ బృందావన సౌందర్యానికి సమ(గ్రతను చేకూరుస్తాడు.
త్రై 'బ్రమరగీతము ఉద్దవమహాశయా! మేము అనునిత్యం నందనందనుణ్ని ఇక్కడ చూస్తూ ఉంటాము. అతని వేణుగానం వింటూంటాము. ఇక్కడి గిరులు, తరువులు, పశువులు, పక్షులు, పువ్వులు ఆకులు అన్నీ ఆ శ్యామసుందరుణ్ని తోడ్కొని వచ్చి మా కళ్లముందు నిలుపుతాయి. అయ్యా! మరొక మాట విను. ఏ కారణం చేతనైనా మృత్యువు మమ్మల్ని తరుముకొని వచ్చినప్పటికి మా కృష్ణుణ్ని విడచి మేమెక్కడికి పోము అని (గ్రహించు. ఆ బృందావనచరుని లలితగతులు, ఆ పీతాంబరధరుని విలాసపు చూపులు, ఆ రసస్వరూపుని సుమధుర మైన వాక్కులు ఓహో! అవన్నీ మా మనస్సులను హరించేవే! ఇప్పుడే కాదు, ఎప్పుడూ మా మనస్సు మా అధీనంలో ఉండేది కాదు. మా చూపులు, మనస్సులు, తలపులు అన్నీ ఆ కృష్ణునికే అర్పించాము. ఇంక ఆ కృష్ణుణ్ని మేమెలా విస్మరిస్తాము? ఇక ఈ లోకంలో మాకేమీ లేదు- లేదు. అని గోపికలు పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకొన్నారు. కాని, పొంగివచ్చే దుఃఖాన్ని దిగమింగ లేకపోయారు. బహిరంగంగానే... హే నాథ! రమానాథ! వ్రజనాథార్తి నాశన! మగ్న ముద్దర గోవింద! గోకులం వృజినార్హనమ్ (శ్రీమద్భా : 10-47-52) సకలైశ్చర్యయుక్తుడవైన శ్రీకృష్ణా! రమానాథ! సకలాభీష్టదాయినిత్లైన లక్ష్మీదేవి కోర్కెలను కూడా తీర్చే ఓ స్వామీ! వ్రజనాథ! గోపికలకు, గోపకులకు ప్రభువైన దేవదేవా! ఆర్తినాశన! కంసాది రాక్షసుల పీడను నశింపజేసినవాడా! గోకుల వాసుల దుఃఖాన్ని తొలగించినవాడా! వేదాలను మత్స్యావతారుడవై ఉద్దరించినట్టుగా ఈ గోకులాన్ని కూడా ఉద్దరించు. గోకులేంద్రా! గోవిందా! అని ఆ్రోశిస్తూ గోపికలు విలపింపసాగారు. ఉద్ధవుడు వారి అనన్యభిక్తిని (గ్రహించి అబ్బురపోయాడు. సర్వేశ్చరేశ్చరుడైన జగన్నాథుని ఈ విధంగా ఆరాధించడం ప్రపంచంలో ఈ బృందావనంలో మాత్రమే ఉన్నదని (గ్రహించి వ్రజధామానికి అప్రయత్నంగా చేతులు మోడ్చి నమస్కరించాడు ఉద్ధవుడు. “కృష్ణచంద్రవిహారప్య స్థానం బహుతరం స్మృతమ్ తతైన గోకులం బృందావనం పరమదుర్లభమ్'
గోపీనయనోత్పలార్భిత వ్యాఖ్య ఠి శ్రీకృష్ణుడు సర్వత్ర ఉంటాడు. కాని, గోకులంలోను, బృందావనంలో ను స్వప్రకాశ కిశోరరూపంతో విరాజిల్దుతుంటాడు. భగవద్దామాలన్నిటిలో గోకులం శ్రష్టం, బృందావనం 'క్రేష్టతరం- ఎందుచేతనంటే “సమ్మోహన తండత్రం' ఇలా చెబుతున్నది. “దేహేషు యౌవనం రమ్యం కైశోరం తత్ర దుర్లభమ్ కిశోరం యత్నతః కృష్ణం ధ్యాయే దానందవి[గ్రహమ్” యౌవనం రమణీయమైనదే కాని, అట్టి కిశోరరూపుడైన శ్రీకృష్ణుణ్ని ఆరాధించిన భాగ్యవతులు గోపికలు. బృందావనంలో గోపికలకు ఆరాధనీయుడైన శ్రీకృష్ణుడు నిత్యకిశోరరూపుడు. తత్కైశోరం తచ్చ వక్షారవిందం తత్కారుణ్యం తే చ లీలా కటాక్షః తత్పౌందర్యం సాచ సాంద్రస్మితశ్రీః సత్యం సత్యం దుర్లభం దైవతే£_పి స్వర్ణాది వైకుంఠ పర్యంతం గల దేవసమూహాలకు శ్రీకృష్ణునికి గల కిశోర వయస్సు, ఆతని ముఖసౌందర్యం, ఆతని కారుణ్యం, ఆ లీలా కటాక్షం ఆ సాం(ద్రస్మితశ్రీ దుర్లభం, సుదుర్లభం. ఈ భాగ్యం లక్ష్మీదేవికి ఏది? కేశచ్చవి తిలకచ్చవి నయనచ్చవి సుస్మితచ్చ్భవిభిః అధరచ్చవి బహురత్నాంచితకొాంచనకుండలచ్చవిభి: పరమ సుచిక్కణ కృష్ణాదిక నర్గాదిభిర్దిశళ్చిత్రాః కుర్వదమితమోహనం శ్రీముఖం స్మరత రాధికా బంధోః నవకిశోరుడై .శ్రీకృష్ణుడిక్కడ ఇన్ని కాంతులతో. దిక్ముఖాలను. చిత్రీకరిస్తూ సంచరిస్తుంటాడు. రాధాదేవి సౌభాగ్య విజయ దుందుభి ఇక్కడ మాజుమైోగుతుంటుంది. అందుచేతనే ఉద్ధవుడు (వ్రజధామానికి, వ్రజస్త్రీలకు పదే పదే నమస్కరించాడు. “శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమో
భ్రమరగీతము కే6
ఈ భూమి మీద గోపికలదే సర్వశ్రసమూ సఫల్ల్వమూ అయిన జన్మ. సర్వాత్ముడైన శ్రీకృష్ణభగవానునియందు పరమ (ప్రమమయమూ, దివ్యమూ అయిన మహాభావయోగంలో వారు నిత్యస్థితులైనవారు. సంసారభీతితో జన్మరాహిత్య రూపమైన మోక్షాన్ని కోరుకొనేవారికి ఈ మహోన్నతస్థితి ఎలా కలుగుతుంది? మహామునులు, ముక్తపురుషులు, భక్తజనులు సర్వకాల సర్యావస్థలలోను కోరదగిన విషయమిది.
ఇట్టి (ప్రేమమయదివ్యమహాభావంతో కాలం గడిపే భాగ్యం తనకు లేనందుకు విచారపడ్డాడు ఉద్ధవుడు. శ్రీకృష్ణ రూప గుణ లీలా కథారసాసక్తి గలవానికి కులీనతతో నిమిత్తం లేదు. ద్విజాతిసంస్కారం అవసరం కాదు. యజ్ఞయాగాది దీక్షలతో పని లేదు. గోపికలది గొప్పకులమూ కాదు, వారికి బ్రాహ్మణ క్షత్రియ సంస్కారమూ లేదు. దీక్షతో యజ్ఞయాగాదులు ఎన్నడూ జరిపినవారును కాదు. శిష్టజనోచితమార్లాన్ని వదలి, భగవంతుని పరమ'్రేమను ప్రాప్తింపజేసుకొన్నవారు గోపికలు. (శ్రుతులు, ఉపనిషత్తులు భగవంతుని పరమ(ప్రేమమయరూపిాన్ని _ వెదకుతూ, ఆయన్ను దర్శింపలేక, (ప్రాప్తింపజేసుకోలేక గోపికలనే ఆశ్రయింపవలసి వచ్చింది. వారే (శ్రుతిరూపగోపికలు.
రసస్వరూపుడూ, ఆనందమయుడూ అయిన భగవంతుని ప్రేమరసాస్వాదనలోనే సుఖలాభాన్ని పొందినవారు గోపికలు. వారిది పరిశుద్ద మైన (ప్రేమ. కామాసక్తి నశించిన తర్వాతనే ప్రేమ పరిశుద్ధమవుతుంది. ఇట్టి ప్రేమతోనే గోపికలు శ్రీకృష్ణునికి సంపూర్ణ సుఖాన్ని కలిగించారు. అట్టి గోపికలలో సర్వ'శ్రేష్టరాలైన శ్రీరాధ ఉన్నదని మనం మరచిపోగూడదు. అమె సునిర్మలపరమోజ్జ్వ్యల(ప్రేమరత్నాలకు తరగని గని. శ్రీకృష్ణునికి గల హ్రాదినీ సంధినీ సంవిత్ శక్తులలో ్రాదినీ శక్తియే రాధాదేవి. విశుద్ద ప్రేమతో శ్రీకృష్ణునికి సుఖం కలిగించాలనే దివ్యసంకల్పం కలది.
గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్య 9ి్ హ్రాదినీశక్తిసారం ప్రేమ. ప్రేమసారం భావం. భావానికి అంతిమదశ మహాభావం. రాధాదేవి పరమాహ్లాద మహాభావ స్వరూపిణి. లక్ష్మీదేవి, అష్టమహిషీ గణం, గోపికలు వీరందరు శ్రీకృష్ణుని - (ప్రేయసీగణాలు. రాధాదేవి చేత విస్తరింపబడినవారు. శ్రీకృష్ణుడు అసంఖ్యాక అవతారాలకు మూలమైనట్టుగా, శ్రీ రాధాదేవి అనంత శ్రీకృష్ణకాంతాగణానికి బీజరూపమూ మూలశక్తీ అయింది. లక్ష్మీగణము ఈ దేవి అంశ విభూతి. మహిషీగణము ఈ దేవి వైభవవిలాసము. గోపికలు ఈ దేవి కాయవ్యూహరూపిణులు. ఆమె యూధనాయిక. శ్రీకృష్ణ భక్తిని ప్రసాదించే పరమాను([గ్రహరూపిణి రాధ. గోపికలను ఆదర్శంగా చూపి భగవత్రేమతత్తాన్ని వెల్లడించడానికి ఉద్దేశించినవే గీతాభాగవతాలు, అవి రెండూ పరమార్ధ నిర్ణాయక శాస్త్రాలు. భక్తిశాస్తాలు. ముక్తిశా(స్తాలు. శ్రీమద్భాగవతం గోపికాభక్తిని విపులంగా వర్షించి చెప్పి - “తస్మాత్కే నా ప్యుపాయేన మనః కృష్టే నివేశయేల్ (శ్రీమద్భా వ 7-డ-3టే ఏ ఉపాయం చేతనైనా మనస్సును శ్రీ కృష్ణవింతనమందు లగ్నం చేసుకోవడం మంచిదని తెలిపింది. 'మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరన్పరమ్'. (గీత : 10-9) అనన్య భక్తులు భగవదనుగ్రహం వల్ల లభించిన బుద్దియోగంతో భగవన్నామ గుణరూప లీలాదులను గూర్చి ఒకరికొకరు చెప్పుకొని ఆనందిస్తుంటారన్నది గీత. 'కిం బ్రవ్మ జన్మభి రనంత కథా రసన్య? “(శ్రీమద్చా : 10-47-58) భగవంతుని అనుగ్రహం వల్లనే శ్రీకృష్ణకథారసమందు ప్రీతి జనిస్తుంది. కృష్ణకథారసం పట్ట ప్రీతిలేనివాడు బ్రాహ్మాణుడుగా పుట్టినా, బ్రహ్మగా ప్రతిస్టితుడైనా ఏమీ ప్రయోజనం లేదు. 'రసో వై సః అతడు రసస్వరూపుడు అని చెబుతున్నది వేదం, ఆ శ్రీకృష్ణ కథారసాసక్తీ లేనివాణ్ని ఏమనాలి? “అనంత కథాసు అరసస్య బ్రహ్మజన్నభి: కిమ్?” అనంతుడైన శ్రీశృష్ణుని నామరూపగుణలీలారసాన్ని అనుభవించలేని అరసికుడైనవాడు (బ్రహ్మదేవుడై జన్మించినా ఏమి (ప్రయోజనం? జన్మవల్ల ఉత్కష్టత, ఆపకృష్ణత కలుగదు. ఈ గోపికలు వనవాసినులు, సదాచారపరాయణలు కారు. వేదాంతజ్ఞానం కలవారు అసలే కాదు. కాని, శ్రీకృష్ణభగవానుని యందు అనన్యమైన ్రేమగలవారు. పురుషోత్తముడైన
96 'భ్రమరగీతము శ్రీకృష్ణుణ్ని ప్రేమించడానికి జ్ఞానంతో పనేమిటి? వారి (ప్రేమ పరిశుద్దమయినది. భగవంతునియందు ప్రేమ కలిగిన వెంటనే మనస్సు స్వతహాగా పరిశుద్దమవుతుంది. మరొక సందర్భంలో ఇదే విషయాన్ని శ్రీశుకదేవుడు మరింత గట్టిగా చెప్పాడు. “విప్రా ద్విషడ్లుణ యుతా దరనిందనాభ పాదారవింద విముఖాచ్చ్వపచం వరిస్టమ్” (శ్రీమద్బా : 7-9-10) సనత్సుజాతీయమనే [గ్రంథంలో బ్రాహ్మణునికి పన్నెండు సద్గుణాలుండాలని నిర్దేశించింది. అవి జ్ఞానం, సత్యం, దమం మొదలైనవి. ఈ పన్నెండు గుణాలు సంపూర్ణంగా ఉన్నప్పటికి బ్రాహ్మణుడైనవాడు శ్రీకృష్ణభగవానుని యెడ విముఖుడైతే అతడు శృపచునికంటె హీనుడవుతాడు (శృపచుడు = కుక్క మాంసం తినేవాడు). శృపచుడు తన మనస్సును, వచస్సును, కర్మను, ధనాన్ని, (ప్రాణాన్ని శ్రీకృష్ణునికి సమర్చించినవాడైనందువల్ల అతడు (ఢ్రేష్టుడు కావడమే కాదు, తన కులాన్ని పవిత్రం చేసుకొన్నవాడవుతాడు. తన దేశానికి కూడా ప్రశ్తేని కలిగిస్తాడు. (బ్రాహ్మణుడు తనకు విహితమైన శ్రీ కృష్ణకథారసాసక్తిని వదలివైచి, ద్వాదశగుణాలను, గొప్పతనాన్ని చూచుకొని గర్వించి తుదకు భ్రష్టుడవుతాడు. శ్రీకృష్ణ కథారసాసక్తి సర్వదోషాలను శమింప జేస్తుంది. అది శ్రీకృష్ణభక్తి మహిమ, లేదా శ్రీ కృష్ణకథారసాసక్తిలోని పరమ రహస్యం. నిజానికి, జ్ఞానానికి ఫలం కాదగినది భక్తి ఆ భక్తి గోపికలకు తెలియకుండానే అలవడింది. అది అమృతమని తెలుసుకోకుండానే అమృతపానం చేయడం భాగ్యమే కదా! మంగళప్రదమే కదా! గోపికలు ధన్యజీవనలు. భగవంతుని స్వరూపాన్నీ, భగవద్రహస్యాన్నీ తెలుసుకోకుండానే ఆయన్ను ప్రేమించారు. భజించారు. ధన్యజీవనలు, వాత్సల్య మధుర (ప్రేమ కల్పలతలు, నిరంతరాలింగిత శ్రీకృష్ణరూపకల్పలతికలయ్యారు. గోపికల నిరంతర భగవత్సరాయణతను గమనించి ఉద్ధవుడు తాను ఆర్టించినది శుష్కమైన జ్ఞానమనీ, తన పాండిత్యం నిష్టలమైనదని (గ్రహించాడు. జ్ఞానార్జనం ఎవరైనా చేస్తారు. జ్ఞానానుభవం గొప్పది. అదే భక్తి అది గోపికలకు అబ్బింది. భగవత్రాప్తి ముందుగా కలిగి, ఆ తర్వాత భక్తి ప్రాప్తించినట్టయింది. అన్నిట గోపికలు ధన్యలే అని మనసులో అనుకొన్నాడు ఉద్ధవుడు.
భ్రమరగరీతము కేట్
ఉత్తమ శ్ఞోకుడైన శ్రీకృష్ణుని రూపమాధుర్యాన్ని, లీలామాధుర్యాన్ని, ప్రియామాధుర్యాన్ని,
వేణుమాధుర్యాన్ని అపేక్షింపని వారెవరుంటారు? “క ఉత్సహేత సంత్యక్తు ముత్రమళ్లోకసంవిదమ్' అనిచ్చతో౭౬పి యస్య శ్రీరంగాన్న చ్యవతే క్వచిత్ (శ్రీమద్భా : 10-47-48)
ఆ కృష్ణుడు పూర్ణకాముడు. ఐశ్వర్య దేవతతో కూడా ఆయనకు ఎటువంటి నిమిత్తం లేదు. కానీ, ఆ దేవత ఆయన వక్షస్థలాన్ని క్షణకాలమైనా విడిచి యుండదు. తాను ఆత్మారాముడు, అప్తకాముడు అయినప్పటికి ఉదాసీనుడుగా, నిష్కాముడుగా ఉండడు. గోపికలకు బుణపడిపోయాడు. తాను సర్వసమర్భుడు, సర్రేశ్చర్యపరిపూర్ణుడు అయినప్పటికి అనన్యభక్తులను క్షణకాలమైనా విడువడు.
కృష్ణుడు మధురలో ఉన్నప్పటికి గోపికలకు బృందావనంలోనే తిరుగుతున్నట్టుంటాడు. వారు పిలిస్తే పలికేటంత దూరంలో ఉంటాడు. వేణుగీతిని వినిపిస్తుంటాడు.
గోపికలు ఉద్దవుణ్ణి బృందావనంలో ఆయాచోట్లకు తోడ్కొని వెళ్లి, ఇదిగో! గోవర్హనగిరి, ఈ గిరి శిఖరం మీదికెక్కి శ్రీకృష్ణుడు వేణుగానం చేసేవాడు. నెమిళ్ళ్లు ఆయన చెంత చేరి నాట్యం చేసేవి, ఈ గిరిరాజు శ్రీకృష్ణునికి ఆయన పరివారానికి, గోవులకు ఎంత సేవ చేసేవాడో వర్షించలేము. గోవరనగిరి సమస్తమూ శ్రీకృష్ణునికి ఒక కుసుమాస్తరణ మలయ్య్యేది.
శ్రీమద్చాగవతంలో శ్రీశుకదేవుడు ఉద్ధవుణ్ని, కుంతీపుత్రుడైన యుధిష్టిరుణ్ని హరిదాసులని పేర్కొన్నాడు. గోవర్దనగిరిరాజును మాత్రం హరిదాసవర్యుడని పేర్కొని ఆ ఇద్దరి కంటె అధికుణ్ని చేశాడు. 'హస్తాయ మ ద్రిరబలా హరిదాసనర్యో యద్రామకృష్ణ చరణ స్పర్శప్రమోదః' (శ్రీమద్భా 10-21-18). 'హరిదాసస్య రాజర్షే రాజసూయ నుహోత్సవమ్” అని యుధిష్టిరుని గూర్చి, 'కృష్ణం సస్మారయన్ రేమే హరిదాసో వ్రజాకసామ్' అని ఉద్ధవుని గూర్చి చెప్పేటప్పుడు వారు హరిదాసులని పేర్కొనడం గమనింపదగిన విషయం.
98 'భ్రమరగీతము (త్రేతాయుగంలో శ్రీరాముడు సముద్రానికి వారధి నిర్మించే సమయంలో (వ్రజభూమి నుంచి హనుమంతుని చేత తేబడినవాడు ఈ గిరిరాజు తనకు శ్రీరామదర్శనం కలిగించాలని ఒప్పందం చేసుకొని హనుమంతుని చేతికి అత్యంత లాఫవమై వచ్చినవాడతడు. అయితే అప్పటికే వారధి నిర్మాణం పూర్తయింది. ఎక్కడ గిరులను అక్కడ పెట్టి రావలసిందని రామసు'్రీవులు ఆజ్ఞాపించారు. హనుమంతుడు గోవర్దనగిరిరాజును యథాస్టానానికి చేర్చవలసి వచ్చింది. గిరిరాజు ఖిన్నుడయ్యాడు. నీకు ద్వాపరయుగంలో భగవద్దర్శనభాగ్యం కలుగుతుందని శ్రీరామాజ్ఞను తెలిపి హనుమంతుడు గిరిరాజును ఓదార్చాడు, హనుమంతుడు రామభక్తులలో అగ్రగణ్యుడు. రామదాసు. ఆ దానుని చేత మోయబడినవాడు ఈ గిరిరాజు. కనుక అతడు మహాపుణ్యుడే. అదికాక, బృందావనంలో శ్రీకృష్ణునికి అతని పరివారానికి బహువిధ పరిచర్యలు చేసినవాడు కనుక గోవర్టన గిరిరాజును హరిదాసవర్యుడనడం సమంజసమే. అంతేకాక శ్రీకృష్ణుడు గోవర్టన గిరిరాజును తన చేతితో పైకి ఎత్తిపట్టి అతనికి ముల్లోకాలలో మహాప్రతిష్టను కలిగించాడు. హరిదాసవర్యుణ్ని చేశాడు. ఉద్ధవమహాళశయా! గోవర్టనగిరిసానువుల మీద విహరించడమే కాదు, బలరామకృష్ణులు ఈ నదులలో జల్రీడలాడారు. ఈ అడవులలో గోచారణ చేశారు. ఈ చల్లని సరస్సులలోని నీరు త్రాగారు. కృష్ణుడు తన వేణుగానాన్ని బృందావనం నలుమూలల 'ప్రతిధ్వనింపజేశాడు. ఆ వేణుగానం విని పులకింపని తరువుగాని, సరసిగాని లతానికుంజాలుగాని లేవు, అదిగో చూడు, ఆ చెట్టకొమ్మలు ఎంతగా వంగి ఉన్నాయో చూడు. గోచారణ చేస్తూ కృష్ణుడు నీడ కోసం తమ శాఖల క్రిందికి వస్తాడనీ, ఆ శాఖలపై పక్షిరూపాలతో అధివసించిన మహామునీళ్ళరులకు శ్రీకృష్ణదర్శనం సుకరమవుతుందనీ ఆ చెట్లకొమ శైలు ఇప్పటికి అలాగే వంగి ఉన్నాయి, చూడు! శ్రీకృష్ణుని పాదముద్రలు ధ్వజాంకుశ వజ్రాది చిహ్నాలు ఈ ఇసుక నేలల మీద ఇంకా చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి, చూడు. ఎందుకు చెదరిపోతాయి? భూదేవి భగవంతుని నిరావరణమైన పాదాలను తనమీద మోపి, తాను కోల్పోయిన శక్తులను పునరుజ్జీవింపజేయుమని (ప్రార్థించినందువల్లనే కదా స్వయం భగవానుడు (వ్రజధామంలో ఆవిర్భవించాడు!
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య త్రం భూః కాలభర్దితభగాపి యదంఘ్రిపద శై స్పర్శోత్చశక్తి రభివర్షతి నో౭_భిలార్జాన్ (శ్రీమద్భా 10-82-30)
ఈ పాదముద్రలు భూదేవికి పరమ ప్రీతికరమైనవి. వాంఛితార్హప్రదములైనవి సరే. వీటిని చూస్తుంటే ఎన్నెన్నో స్మృతులు కళ్లముందు మెదలుతున్నాయి. నందకిశోరుని ప్రియామాధుర్యాన్ని, ఏకాంత వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఆ ధ్వజాంకుశ చిహ్నాల మీద రాలిన రాధిక కొప్పులోని పూలు! ఆహా! కృష్ణుడు శ్రీధరుడైన చోటు మరచిపోగలమా? రాధనెత్తుకొని శ్రీకృష్ణుడు శ్రీధరుడైన చోటిది!
ఈ విధంగా ప్రతిదినమూ గోపికలు బృందావనంలో ఏదో ఒకచోటికి వెళ్లేవారు. అక్కడ గోపబాలక్తులతో శ్రీకృష్ణుడు 'శ్రీడించిన ప్రదేశాలను ఉద్ధవునికి వర్షించి చెప్పి ఆనందించేవాళ్లు, ఇలా బృందావనంలో ఎన్నో మాసాలు ఉద్ధవునికి క్షణకాలంగా గడచిపోయాయి. గోపికలకు అతడు పరమాత్మీయుడయ్యాడు. మహాభావస్వరూపిణులైన గోపికల ప్రేమభక్తికి అబ్బురపడి మనసులోనే వారికి నమస్కరించేవాడు.
ఈ ప్రపంచంలో వాస్తవానికి గోపికలు మాత్రమే సఫలమైన జన్మకలవారు. వారి పుట్టుక సార్ధకమయింది. సంసారభయంతో ముక్తిని కోరుకొనేవారికి, మహామునులకు, నావంటివారికి సర్వదా ఇటువంటి రూఢమైన శ్రీకృష్ణ ప్రేమభక్తి ఎలా కలుగుతుంది? శ్రీకృష్ణ లీలాకథారసం మీద ఆసక్తి ఉంటే కదా! ఇట్టి శ్రీకృష్ణ లీలా రసికత కలవారు ఏ కులంవారైనా సర్యోత్తములే. పరమపవి(త్రులే. నిరంతర శ్రీకృష్ణ నామరూపగుణలీలాకథల పట్ట ఈ గోపికల అనురాగం మహోత్కటమైనది. వారి జీవనం ధన్యమైనది. తపస్సు వల్లు, జ్ఞాన సంపాదన వల్ల ఏ ప్రయోజనమూ సిద్ధించదు. మనుష్యుడు భగవత్రాప్తిని పొందాలనే దృఢసంకల్పం గలవాడైతే ఈ గోపికలను ఆదర్శం చేసుకొనక తప్పదనుకొన్నాడు ఉద్ధవుడు. తాను క్షత్రియుడైనప్పటికి అభిజాత్యగర్వాన్నీ, జ్ఞానాభిమానాన్నీ విడనాడి గోపికల పాదాలకు 'ప్రణమిల్దాడు.
భగవత్స్యరూపం, భగవద్రహస్యం తెలియక పోయినప్పటికి, నామరూపగుణ లీలాదులను ప్రేమించి భజించేవారికి ఆ భగవానుడు తన కృపాళ్తితో పరమకళ్యాణాన్ని (ప్రసాదిస్తాడు.
100 బ్రమరగీతము “నన్వీశ్వరో౬ నుభజతో౬. విదుష్తోపి సాక్షాత్ శ్రేయస్తనోత్యగదరాజు ఇవోపయుక్తవ” (శ్రీమద్భా 2 10-47-59) భగవంతుని అను(గ్రహానికి కారణమైనది జ్ఞానం ఎన్నటికి కాదు. అందుకు (ప్రాధాన్యం వహించేది భగవద్భజనమే. అమృతమహిమ తెలియక పోయినా దాన్ని సేవించినవాడు తప్పకుండా అమరుడవుతాడు. అగదరాజమంటే అమృతమని అర్ధం. రాస[్రీడోత్సవంలో శ్రీకృష్ణుని భుజదండాలతో కంఠాలింగితలైన గోపికలకు కలిగిన ఆనందం ఎంత గొప్పది! అటువంటి ఆనందాన్ని నిరంతరవక్షస్థలాశ్రయయైన లక్ష్మీదేవి పాొందిందా? మరెవరైనా దేవతాస్త్రీలు పొందారా? ఇక తక్కినవాళ్ల సంగతి మనకెందుకు? ఆహా! ఈ గోపికలు ఎంత ధన్యలో గదా! అని అబ్బురపడ్డాడు ఉద్ధవుడు. “రాసోత్సవేఇ స్యభుజ దండ గృహీ్త కంఠ అబ్బాశిషాం య ఉదగాద్ వ్రజవల్లవీనామ్” (శ్రీమద్భా 10-47-60) ఆ గోపికలలో అభిప్రాయభేదాలు లేవు అందరికి ఏకైక దైవము, ఏకైక ప్రియతముడు శ్రీకృష్ణుడే. వారిలో వారికి దృఢమైన స్నేహసంబంధముంది. వారందరు స్వజనుల సంబంధాలను పరిత్యజించినవారే. అంతే కాక, వేదధర్మాలను, ఆర్యమర్యాదలను పూర్తిగా ఉపేక్షించారు. తన్మయత్వంతో, పరమ'్రేమతో భగవత్సాంగత్యాన్ని పొందారు. కృష్ణస్య తదృగవతశ్చరణారవిందమ్ న్యస్తం ప్తనేషు విజహుః పరిరభ్య తాసమ్ (శ్రీమద్భా 10-47-62) శ్రీలక్ష్మీదేవి సువర్షపుష్పాలతో స్వయంగా ఎవరిని పూజిస్తుంటుందో, బ్రహ్మేశానులు, దేవతాధిపతులు, పూర్ణకాములు, ఆప్తకాములు, మహాయోగీశ్చరులు తమ హృదయాలలో ఎవరిని ధ్యానిస్తుంటారో, స్మరిస్తుంటారో, లోలోన శీర్తిస్తుంటారో ఆ శ్రీకృష్ణ చంద్రుని చరణారవిందాలను రాసలీలామహోత్సవంలో ఈ గోపికలు తమ వక్షః స్థలం మోద భ(ద్రపరచుకొన్నారు. అశ్లేషసుఖాన్ని తనివితీర అనుభవించారు. శ్రీకృష్ణచంద్రుని అమృతచంద్రికలలో విహరించారు. తమ హృదయతాపాన్ని, విరహవ్యధను శాంతింపటేసుకొన్నారు. వేదాలు భగవంతుణ్ని అన్వేషించడానికి ప్రయత్నించాయి. సృష్టిలోని ష్రతివస్తువును పరిశీలించి న+ఇతి నేతి ఇది కాదు ఇది కాదు అని నిషేధిస్తూ తెలుసుకోడానికి శ్రమించాయి.
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 101 కాని, తెలుసుకోలేకపోయాయి. వేదశాఖ లెక్కి కొమ్ముకొమ్మ రెమ్మరెమ్మలను వెదికాయి. కాని లాభం లేకపోయింది. కనీసం గోపికలు కనిపెట్టిన ముకుందపదవిని చూడాలనుకొన్నాయి. అదీ సాధ్యం కాలేదు. ఎందుకంటే “యతో వాచో నినర్తంతే అప్రాప్యమనసా సహో మనసూ మాటా చేరజాలనిచోట ఉన్నాడు ఆ త్రీకృష్ణుసరబ్రహ్మ. వేద తరోః ప్రతిశాఖం మృగితం మిలితం న తద్రృవ్మ మిళితం మిళిత మిదానీం గోపవధూటీ పటాంచలే నద్దమ్
మరి ఆ పరబ్రహ్మ ఎక్కడ లభిస్తాడు? గోపాంగనల చేలాంచలాలలో లభిస్తాడని ఒక కవి చమత్కరించాడు.
“ఉపనిషదర్హం ఉలూఖలే నిబద్దమ్”
ఉపనిషత్తుల తాత్పర్య రూపుడైన పరబ్రహ్మ గోకులంలో యశోదా గృహంలో రోటికి కట్టి వేయబడి ఉన్నాడు. త్వరగా వెళ్లి చూడండి” అన్నాడు లీలాశుకుడు.
రమణీయమైన బృందావనమే (శ్రుతులలో వర్లితమైన (బ్రహ్మగోపాలపురము. అదే వన వైకుంఠం. “తాపసొస్తత్ర తే ద్రుమాగ్ అక్కడ తపస్సులు తరురూపాలతో ఉన్నారు. ఆ వనానికి ద్వాదశ వనమని పేరు. షట్ కోణాలతో షడంగాలతో షట్సదిలో (తుమ్మెద) వెలసినది శ్రీమదష్టాక్షరీ మంత్ర (ఓమ్ నమో నారాయణాయ) స్టానం బృందావనం.
ఆ బృందావనాన్నీ, ప్రోద్యన్నవయౌవనాకృతులు, కిశోరీ వయస్కలైన రాధాది గోపికలను విడువలేక కాబోలు శ్రీకృష్ణుడు (షట్పద) (భ్రమర రూపంతో వచ్చి, ఆ గోపికలు పలికిన నిష్ట్రరోక్తులను విని ఆనందించాడు. నిజానికి అవి నిష్టురోక్తులు కావు. గోపికలు అనురాగాతిశయంతో చనవుమెరసి పలికిన జల్పాలవి.
“పరిహాస విజల్సితం సఖే! పరమార్జేన న గృహ్యతాం వచః (అభిజ్ఞాన శాకుంతలమ్ 2-19)
“మిత్రమా! పరిహాసానికి ఏదో అన్నాను దీన్ని యథార్ధంగా తీసుకోకు” దుష్యంతుడు విదూషకునితో అన్నాడు. ప్రభువు మునికన్యమోహంలో పడ్డాడని విదూషకుడు రాజధానిలో చెబుతాడేమో అని దుష్యంతుడు నిజాన్ని అసత్యంగా తోపింప జేశాడు. అది విజల్పితం. గోపికలు అనురాగాతిశయంతో చనువుతో పలికిన పలుకులు అసత్యాన్ని సత్యంగా తోపింపదేయడం ఇది ప్రజల్పం.
యు ట్ంధాల భరమ బల [గ ౧ గ్ 1 జ శ1,6541 లో శ, ప ఆలాలర్తోవ్న్ల గ
102 ('బ్రమరగితము శ్రీకృష్ణుడు బృందావనంలో సర్వదా చిరకిశోరరూపుడు. రాధ కూడా నవకిశోరి. చారుసౌభాగ్యరేఖాఢ్య, నర్మపండిత, విశుద్ద, మహాభావ పరమోత్కర్ష తర్షిణి. శ్రీకృష్ణుడు తాను మధురకు వెళ్లి, త్వరగా తిరిగి రానందుకు రాధ ఏమని మేలమాడుతుందో వినాలనుకొన్నాడు. ఆమె నర్మపండితకదా! ఆమె జల్పాలను వినాలనీ, మహాభావ పరమోత్కర్ష తర్జిణి అయిన ఆమె అనురాగాతిశయమెటువంటిదో స్వయంగా చూడాలని భ్రమరరూపంతో బృందావనానికి వచ్చాడు. శ్రీకృష్ణుని తత్త్యం తెలిసినవారు లోకంలో రాధ కంటె మరెవ్వరుంటారు? క్షణంలో ఆ భ్రమర మెవరో తెలుసుకొన్నది రాధ. ఇకనేమి? తన మార్మికనర్మపాండిత్యవిదగ్టతను వెల్లడించి శ్రీకృష్ణుణ్ని ముగ్దుణ్ని చేసింది.
భ్రమరగీతము కేరి
ఉద్దవుడు బృందావనంలో రెండు రోజుల పాటు ఉండిపోదామని వచ్చాడు. కాన్ని, నెలరోజులకు పైగా అక్కడే ఉన్నాడు. రాధాదేవీని అనేక ప్రళ్ళలు వేసి సప్రేమభక్తి రహస్య జ్ఞానాన్ని పొందాడు. గోపబాలకులతోపాటు బృందారణ్యసీమలలో సంచరించాడు. నందయశోదల దగ్గర కూర్చుండి శ్రీకృష్ణలీలాసం కీర్తనగోస్టిలో పాల్గొని భగవన్నామ మహిమను స్వయంగా (గ్రహించాడు.
శ్రీకృష్ణ నామమే ఒక మహామంత్రం. ఆ నామాన్ని జపించినవారికి శ్రీకృష్ణునియందు (భావం) ప్రేమ కలుగుతుంది. శ్రీకృష్ణ ప్రేమే సరమ పురుషార్ధం. ధర్మ - అర్ధ - కామ - మోక్షాలు నాలుగు దాని ముందు తృణ(ప్రాయాలు. శ్రీకృష్ణ ప్రేమ పంచమపురుషార్ధం. అదొక 'ప్రేమానందామృతసాగరం. ఆ సాగరంలోని ఒక్క బిందువుకు సాటిరాదు మోక్షానందం, భగవంతుని అనుగ్రహం వలననే, పూర్వజన్మపుణ్యం వల్లనే శ్రీకృష్ణ ప్రేమభక్తి అలవడుతుంది. ఆ ్రేమభక్తి మనస్సునందు, తనువునందు ఒక విధమైన క్షోభను, శ్రీ కృష్ణచరణారవిందము లందు అమితమైన లోభాన్ని ఉత్పన్నం చేస్తుంది. అట్టి ప్రేమభక్తులు కంఠమెత్తి గొన౦ చేస్తారు. నాట్యం చేస్తారు. ఆనందసాగరంలో తేలియాడతారు. ఉద్దవుడు కూడా గోచారణ చేసే గోపబాలకులతో ఆడుకొనేవాడు. శ్రీకృష్ణునికి నీడ నిచ్చిన చెట్లను కౌగిలించుకొనేవాడు. లతానికుంజాలకు అంజలి ఘటించేవాడు.
ఉద్దవుని హృదయ వచ శృరీరాలు శ్రీకృష్ణ (ప్రేమభావంతో నిండి పోయాయి. రోమరోమంలో (ప్రేమభావమే నెలకొన్నది. ఉద్ధవుడు క్షత్రియుడైనా ఒక గోపబాలకుడయ్యాడు. అతని హృదయం గోపీభావమయమయింది. అతడు ప్రేమయోగి అయ్యాడు.
బృందలో అనేకఅరణ్యాలు కలిశాయి. అదే బృందారణ్యమయింది. ఉద్ధవుడు ఆ వనవీథులలో సంచరిస్తూ సుదూరంనుండి వేణురవాన్ని అలకించేవాడు తాను కూడా లయబద్ధంగా పాడేవాడు, అతనికి సంగీతశాస్త్రజ్ఞానం కూడా అబ్బింది. అతడు బోధించిన జ్ఞానం కంటె అతడు చేసిన గానం గోపికలకు శోకాపనోదకమయింది.
104 భ్రమరగీతము
“అసామహో చరణరేణుజుషా మహం స్యాం
బృందావనే కిమపి గుల్మలతౌషధీనామ్
యా దుష్యజం స్వజనమార్యపథం చ హిత్వా భేజు ర్ముకుంద పదవీం శ్రుతిభి ర్విన్చుగ్యామ్” (శ్రీమద్భా 10-47-61) శ్రీకృష్ణుణ్ని సర్యాత్మనా ఆరాధించే గోపికల జన్మ సార్ధకమైనదని గ్రహించాడు ఉద్ధవుడు. మహామునులు, యోగీశ్చరులు సంసారాన్ని మరచిపోవడానికి సమాధ్యవస్టలో నానా అవస్థలు పడుతుంటారు. కాని, సాఫల్యాన్ని పొందరు. వారి వృత్తి భగవత్పరమైనది కాజాలదు. అహా! ఈ గోపికలు ఒక క్షణమైనా సంసారచింతనకు లోను కారు. క్షణం సేపైనా శ్రీకృష్ణ చంద్రుణ్ని మరచిపోరు. గోపికలకు శ్రీకృష్ణుడు ఆత్మరూపుడు. ఆత్మను ఎలా మరచిపోతారు? శ్రీకృష్ణుడెవరో తెలుసుకోకుండానే ఆ దేవదేవుని ప్రేమించి ఆయన మనసు కెక్కిన ఈ గోపికలు ఎంత ధన్యలో! ఆయన శరీరస్పర్శతో కూడా పవిత్రతను, కృతార్హతను పొందారు. ఆహా! నేనీ బృందావనంలో మనుష్యుణ్నిగా కాకపోయినా, పశువునూ పక్షిని కాకపోయినా, చెట్టును చేమనూ కాకపోయినా తుదకు ఒక గడ్డిపోచను గానైనా పుట్టినట్ట్లుంటే ఈ గోపికల చరణధూళి నాకు కొంత ్రాప్తించి ఉండేది” అదృష్టవంతుడైన ఏ భక్తుడైనా ఈ గోపికల హృదయంలో తన హృదయాన్ని నిలుపు కొన్న వాడైతే, అతడు అనాయాసంగా
శ్రీకృష్ణసాన్నిధ్యానికి చేరుకొంటాడు” అనుకొన్నాడు ఉద్ధవుడు. శ్రుతులు ఏ పరమపురుషుని చరణచిహ్లాలను అన్వేషిస్తున్నాయో, ఈ గోపికలు ఆ పురుషోత్తముని పొంది, ఆయనతో ఏకమై ఆయన (ప్రేమలో తన్మయత్వం పొందుతున్నారు. వారిప్పుడు విరహావస్థలో ఉన్నప్పటికి శ్రీకృష్ణుడు వారికి తత్త్యత: మరింత సన్నిహితుడైనాడని (గ్రహించాడు ఉద్ధవుడు. అతడు గోపికల సాహచర్యంతో అసలైన జ్ఞానాలాభాన్ని పొందాడు. జ్ఞానం కంటె జ్ఞానానుభవమైన భక్తి శ్రేష్టం. ఉద్ధవుని భక్తిభావం జ్ఞానం వల్ల మరింత కూడా దివ్యత్వాన్ని సాధించుకొన్నది. రాధాది గోపికల మహానుభావతను (గ్రహించి, వారినీ బృందాననాన్నీ విడిచి పోవడానికి ఉద్దవునికి మనసొప్పలేదు. ఒకనాడు రాధాదేవి దగ్గరికి వచ్చి “అమ్మా! బృందావనేశ్వరీ! రాసేశ్చరీ! నేనిక మధురానగరానికి వెళ్లక తప్పదు. శ్రీకృష్ణుడు నా రాకకు నిరీక్షిస్తుంటాడు. నన్ను ఆశీర్వదించి, నాకు అనుజ్ఞను (ప్రసాదించు అని వేడుకొన్నాడు. రాధాదేవి చేయెత్తి ఉద్ధవుణ్ని ఆశీర్వదించింది. “శుభం భవతు మార్గస్తే కళ్యాణమస్తు సంతతమ్ జ్హానం లభ హరేః స్టానాత్ కృష్ణస్య ముప్రియో భవ”
గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్య 105
నీకు శుభమగుగాక! నీ మార్గం మంగళమయమగుగాక! శ్రీకృష్ణుని వలన పరమ డ్రేస్టమైన జ్ఞానాన్ని పొందుదువు గాక! సర్వదా శ్రీకృష్ణునికి ప్రేమపాత్రుడవౌదువుగాక!
ఉద్దవుడు రాధాదేవి పాదధూళిని తీసుకొని కళ్లకు అద్దుకొని శిరస్సున చల్టుకొన్నాడు.
“వందే నంద వ్రజ స్రీ ణాం పాదరేణు వభీక్షృళః యాసాం హరికథోర్గీతం పునాతి భుననత్రయమ్” (శ్రీమద్భా. 10-47-63)
బృందావన స్త్రీల పాదరజః కణములలో ఒక్కొక్క దానికి కోటికోటి నమస్కారాలను పరమాదరంతో ఘటిస్తున్నాను. సర్సపావన శక్తిమంతమైన శ్రీకృష్ణకథాసంకీర్తనమంత్రంతో ఆ స్రీలు బ్రహ్మాండాన్ని పవిత్రం చేస్తున్నారు. వారి హరికథా కీర్తనం ఉచ్నెర్గతిగలది. ఊర్హ్యలోకాలకు ప్రయాణించి భువనత్రయాన్ని సుపవిత్రం చేస్తుంది. కాబట్టి వారి పాదధూళికి నమస్కరిస్తాను. అంతకంటె నేను అధికమైన యోగ్యత కలవాణ్ని కాదు” అన్నాడు ఉద్ధవుడు.
ఇది గోపికా వియోగ లీల. వియోగం పొందిన సాధకులైన భక్తులకు ఒక మహత్తరమైన ఆదర్శాన్ని చూపాలనీ, జ్ఞానాధికుడ్రైన ఉద్దవునికి (ప్రేమభక్తి మహిమను ప్రత్యక్షం చేయాలన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణుడు ఈ లీలను జరిపాడు.
గోపికలకు శ్రీకృష్ణుడు దూరమయ్యాడు. అనగా వారిని వీడి మధురలో ఉన్నాడు. వారిని ఓదార్చడానికి, జ్ఞానబోధ చేయడానికి శ్రీకృష్ణుని పనుపున ఉద్ధవుడు బృందావనానికి వచ్చాడు. వచ్చి, జ్ఞాన బోధ చేయడానికి బదులుగా గోపికల దగ్గర ప్రేమభక్తిని నేర్చుకొని ప్రేమయోగి అయ్యాడు. శ్రీకృష్ణవియోగంలో కూడా జీవననిర్వహణ కొనసాగిస్తున్న గోపికల ప్రేమభక్తిని ఆదర్భం చేసుకొన్నాడు.
ఉద్దవుడు తాను మహాజ్ఞానినని, జ్ఞానానికి తర్వాత మరొకటేదీ ఉండదనీ అనుకొన్నాడు. భగవంతుణ్ని ప్రాప్తింపజేసుకోడానికి జ్ఞానమే చిట్టచివరిదని భావించాడు. కాని, ఇప్పుడు జ్ఞానోత్తర'ప్రేమభక్తి మహిమను ప్రత్యక్షంగా చూచాడు. నందయశోదల, రాధాదిగోపికల తీవ్రమైన శ్రీకృష్ణ ప్రేమను సంపూర్ణంగా అవగాహన చేసుకొని, వారి ప్రేమనిస్టను ప్రత్యక్షంగా చూచి ఉద్దవుడు తన జ్ఞానాభిమానాన్ని. ప్రేమాస్షితో దగ్రం చేసుకొన్నాడు. గోపికల జ్ఞానం సర్యోత్తమము. జ్ఞానానికి ఫలం పరతత్త్యవస్తువు నందు అవేశం. స ప్రేమభక్తి మాధుర్యాచేశమే సర్యోత్తమ జ్ఞానానికి నిదర్శనం. 'ప్రేమభక్తి లేకుండా జ్ఞానం నిరర్ధకమనీ, జ్ఞానంకంటె (ప్రేమ మహోన్నతమైనదనీ (గ్రహించాడు ఉద్దవుడు.
బ్రమరగీతము కేం ఉద్ధవుడు మధురకు బయలుదేరే ముందు వినయవిన(మ్రుడై గోపికల పాదధూళిని యాచించాడు. మధురానగరప్రయాణానికి అనుజ్ఞ ఇమ్మని ప్రార్థించాడు. ఈ విషయంలో తాను చదువు కొన్న నీతిశాస్త్ర వైదుష్యాన్నీ ప్రదర్శించాడు. గోపికలందరిలో అ(గ్రగణ్య, కృష్ణప్రాణాధిక అయిన రాధను, ఆ తర్వాత తక్కిన కృష్ణ (ప్రేయసులను అనుజ్ఞను కోరాడు. అనంతరం నంద యశోదలను దర్శించి సాష్టాంగదండ ప్రణామంచేసి ఆశీస్సులర్థించాడు. ఉద్దవుడు తన కుమారుని వద్దకు వెళుతున్నాడన్న సంతోషంతో నంద యశోదలు కృష్ణ బలరాములకు, ఇంకా అక్కడి వారందరికి బహువిధ ఉపహారాలను ఉద్దవునికిచ్చి, అతని రథంలో పెట్టించారు. నందుడు ఉద్దవునితో ఇలా అన్నాడు. “చిరంజీవి ఉద్ధవా! మా కృష్ణుడు మహా సౌందర్యశాలి, గుణశాలి. అయినా అతని పట్ట నా హృదయం మహా కఠినమై పోయింది. ఇప్పటికి అలాగే ఉంది. అతడు ఇక్కడున్నప్పుడు అతని పట్ల అంతులేని వాత్సల్యాన్నీ, (ప్రేమానురాగాలను చూపేవాణ్ని. అదంతా ఇపుడు నా నటన గాను, నా కపటపు బుద్ధిగాను తోస్తున్నది. పరమాహ్ధాదకరుడైన వుత్రుణ్ని విడిచి పెట్టి కూడా జీవింపగలుగుతున్నాను. లోకంలో పుత్రవాత్సల్యం గల తండ్రి ఒక్కడే ఒక్కడున్నాడు. అతడే దశరథమహారాజు! పుత్రుడైన శ్రీరాముడు ఇల్టు వీడగానే తాను ప్రాణం విడిచాడు. నాకు అలాంటి పుత్రవాత్సల్యం లేశమాత్రంగానైనా లేదనిపిస్తున్నది. అందుచేతనే కాబోలు సర్వజ్ఞుడు, సర్వజీవమనోభిజ్ఞుడు అయిన మా కృష్ణుడు తన తల్లిదండ్రులు అయోగ్యులని భావించి మమ్మల్ని పరిత్యజించి మధుకు వెళ్లిపోయాడు. ఉద్ధవా! నీవన్నట్లు అతడు నిఖిల భూతబాత యాథాత్మ్యం ఎరిగినవాడు. కాబట్టి తన తల్లిదండ్రులెవరో తెలుసుకొని, దేవకీవసుదేవుల దగ్గరికే చేరుకొన్నాడు. మాకు ఇంతవరకే ప్రాప్తి”.
గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్య 107 అని నందుడు తలపాగ చెంగుతో కన్నీళ్లు తుడుచుకొంటూ, ధుఃఖాన్ని దిగమ్రింగుతూ ఇంకా ఇలా అన్నాడు.
“ఉద్ధవా! మా కృష్ణుడు ఏ చోట ఉన్నప్పటికి మా మనః ప్రవృత్తులూ, మా సంకల్పాలూ అతని చరణకమలాలను ఆశ్రయించి అతని సేవలోనే నిరంతరం నిమగ్నమవుతాయి. మా వాక్కులు సర్వదా శ్రీకృష్ణనామాన్నే ఉచ్చరిస్తాయి. మా శరీరాలు అతని కైంకర్యం లోనే నిమగ్నమవుతాయి. నూకు ఎన్ని జన్మలు కలిగినా అతని యందే ప్రీతిని అంతకంతకు వృద్ది చేయమని భగవంతుణ్ని ప్రార్ధిస్తుంటాను.”
నందుడు రుద్దకంఠంతో ఇలా చెబుతుండగా గోపగోపికల హృదయాలలో దుఃఖం పెల్టుబికింది.
నందుని మాటలలో శ్రీ మద్భాగవతార్ధం సమగ్రంగా సమాహితమయింది. సంసారభోగాల పట్ల, విషయసుఖాల పట్ట విరక్తిని, శ్రీకృష్ణుని పట్ల ట్రీతిని ఉత్పన్నం చేసే పరమహంస సంహితయేశ్రీమద్భాగవత మని ప్రతిసన్నివేశమూ సాక్ష్యమిస్తుంది.
ఉద్దవా! నీవు కృష్ణునికి తప్పక ఇలా చెప్పాలి సుమా! మా మనస్సు సర్వదా నిన్నే స శిస్తుంటుందనీ, మా వాక్కులు సదా నిన్నే జపిస్తుంటాయనీ, మా దృష్టి అంతా నీ దర్శనం కోసమే అని దృఢంగా చెప్పు. ప్రారబ్ధ కర్మచేత మాకు మరొకసారి మానవజన్మ ప్రొప్తిస్తే ఏ పవి(త్రవైష్ణవగృహంలోనో జన్మింపడేయుమని భగవంతుణ్ని ప్రార్ధిస్తాను. అక్కడ నిరంతరం భగవన్నామ రూపగుణ లీలా (శ్రవణ లాభం మాకు సదా ఒనగూడుతుంది. దానితో మేము చరితార్జులమవుతాము. స్వామి సేవలో తరిస్తాము.”
నందుడు ఇలా అన్నందువలన శ్రీకృష్ణుని యందు అతనికి వాత్సల్యభక్తి సన్నగిల్లి ఈశ్వరీయజ్ఞానం ఉదయించిందని భావింపరాదు. శాంత, ధాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్యభావం కలవారి స్వభావం ఇలాగే ఉంటుంది. నిష్టామయ - సేవామయ - విశ్ళాస్షమయ - మమతామయ - ఆత్మసమర్పణమయమైన భక్తిగలవారు విరహంలో, వియోగంలో వివశులైందువల్లను, ప్రేమాస్పదుని ఉదాసీనతకు మహాదీనులైందువల్లను వారి స్వభావం అప్పుడప్పుడు విశ్షథమైనట్టుగా కనిపిస్తుంది. అంతమాత్రంచేత అది నిజం కాదు.
యశోద కన్నులలో నీరు (గ్రుక్కుకొంటూ ఉద్దవునితో ఇలా అన్నది.
108 (భ్రమరగీతము “మా కన్నయ్య ఇక్కడికి రావడం అతనికి సముచితంగా తోచక పోతే మాకోసం, మమ్మల్ని చూడటం కోసం ఇబ్బంది పడవద్దని చెప్పు. తనకు ఎక్కడ సుఖమూ ఆనందమూ కలుగుతుందో అక్కడే హాయిగా ఉండమని చెప్పు. మా సుఖం కోసం తాను, 'శ్రమపడనవసరం లేదు, అప్రతిష్ట పొందనవసరం లేదు. అక్కడే హాయిగా, సుఖంగా ఉండమని చెప్పు”. అని యశోద పలుకుతుండగా దుఃఖంతో ఆమె కంఠం రుద్దమయింది. కళ్లనుంచి అశ్రువులు ధారలు కట్టాయి. గోపగోపీజనులు గాని, యశోదానందులు గానీ బృందావన వాసులందరు శ్రీకృష్ణ సుఖైకజీవనులు. స్వసుఖం కోరు కొనేవారు కాదు. రాధ ఒక మురళిని, కంబళిని తెచ్చి ఉద్దవునికి ఇచ్చి, “వీట్రిని మేము ఏమిచేసుకోము? వీటిని తీసుకొనివెళ్లి ఆ కృష్ణునికే ఇవ్వు మళ్లీ కాళిందిమడుగులో కాలియగరళాన్ని జ్వలిస్తున్నదని చెప్పు చాలు” అన్నది. శ్రీమద్భాగవత౦లో ఈ కథనం చేసేటప్పుడు శ్రీశుకదేవుడు " “ఉద్దవః పునరాగచ్చ న్మధురాం కృష్ణపాలితాం” (శ్రీమద్భా 10-17-68) అన్నాడు. మధురకు కృష్ణుడు ప్రభువైనాడని ధ్వనింపజేశాడు. పాలకుడంటే ప్రభువే కదా! అంతటి ప్రభువుకు వెన్నమిగడలు పంపడం మర్యాదగా ఉండదనుకొని, గోపాంగనలు ఏవేవో కానుకలు కృష్ణులరాములకు, దేవకీవసుదేవులకు, ఉ(గ్రసేనమహారాజుకు పంపించారు. ఉద్ధవుడు అందరి పాదాలకు (మొక్కి మెల్లగా రథమెక్కాడు. (శ్రీకృష్ణ సందర్శనోత్సుకుడై బయలుదేరాడు. శ్రీకృష్ణోవై పరమో దైవతమ్, తం ధ్యాయేత్ - తం గసయేత్ - తం యజేత్ - ఇత్యోమ్ తత్ సత్. “త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర” “సర్వం శ్రీకృష్ణార్ణణమస్తు” రయి (గంధాల భంది యడ ఖా జ్ త “(౬ 0 77, ల్ ఫీ లో ణా సు నవా నో ద న ఎ అజో అల్ న్నీ , స్టైలో వాజ్.ర్ట00 స
8012404644 ౮174 5)” ౮4౦౭/2 [మా - / క. ళం. | కాత ( (సు ల [ఈఈ56% [1 నే న ్న్ 1 మో లేఖిని తరగని వజ్రాల గని. ఇంతకంటే మో నిరంతర రచనా చణత్వాన్ని ఏమని ప్రశంసించను? మో రచనలు మూల శ్లోకాలకు ప్రతి పదార్థ తాత్చర్య వ్యాఖ్యలైనా అవి కేవలం తిరగేసేవి కావు. మునకలేసి చూసేవి. పాండిత్యం, భావుకత్వం సమప్రమాణంలో మేళవించుకున్న | మో రచనా కౌశలానికి నా వాోర్జికాభినందన.
- ఆచార్య ని. నారాయణరెడ్డి . జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఉత్త్పలవారి వ్యాఖ్యానాలలో ప్రత్యేకాంశం క్లిష్టమైన భాగవత తాత్చర్యాన్ని పూర్వాపర సన్నవేశాల | వివరణలతో; అనేక సమాన భావ సంపుటుల ఉదాహరణలతో, సూక్ష్మ సూక్ష్మ పద పదార్థ వివేచనతో మనను ఆకట్టుకునే స్వభావం. ఉన్నది. వారి వ్యాఖ్యలలో పాండిత్యపు లోతులైతే ఉంటాయి కాని, ఆ పాండిత్య, ప్రకటనం ఉండదు. ఆత్మీయంగా - ఇంకా చెప్పాలంటే సఖీసమ్మతంగా జక ప్రీతి సల్లాపం వలె సారిపోకుందీ వ్యాఖ్యాధోరణి.. బ్రొః కోవెల నుప్రసన్నాచార్య గి 6156006015%66 90[012/ & 6670686 ౪/0 ౧25 6౧0౧౧ 6660 1౧8 ౧6౦6౭౧ ౦1 “5/1 119%08118 2౧6 20061 2౧6౫౦616౧౦. 6 19 '౮(41-4 '0100218' -4 '1|06412/, కి. [11106447 ౧౦050121 (269 08168 01 16 00751081 ౧6411) 0% 2 గ౧౧0(6| 2౧6 001106 1౧ 1668026 - 4011000212 12660 02/8 0106 ౧౧6౧౬౭| ౧6౭ 0161౪906 ౧6౦౧16 1966100
- 10 కగంం౧20998/2808, గగంగగ౧8 10010. నొంంగ గు గగగీ(4ఓ౬డీ, 4.4.. ౯|.0. | 01780107 52౧91610 402660 ౧/౦.