Telugu Bhavdhamu andhramu - anilvaranasi/indianlanguages GitHub Wiki

' 'జౌొద్దము - ఆంధ్రము ఆచార్య బి.యస్‌. యల్‌. హనుమంతరావు $ | . హాము - టో ఖీ శటపనా స | - 6 (ఛం గ ॥ సమ హ్‌ గ (భో | ఏకమెళ య్‌ తెలుగు విశ్వవిద్యాలయం పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి _ | . హైదరాబాద్‌ - 500 004

బౌదము-ఆంధ్రము యఖ (వ్యాస సంకలనము) ఖ్త సౌజన్యం ట్టి క్షీ; శ్రే ఆచార్య హారి శివకుమాకే రివైర్డ్‌ ప్రొఫెసర్‌, తెలుగు డిపాక్తిమంటో కాకనీంృ విశ్వవిద్యాలయం, వఠంగళ్ళి ఆచార్య బయస్‌్‌యల్‌ హనుమంతరావు టయ “ణి [ తెలుగు విశ్వవిద్యాలయం పబ్లిక్‌గార్డెన్స్‌, నాంపల్లి హైదరాబాదు-500 00%

20౮0091404 ౮-4019041౧41410 6/ ౧౧౦1. 9.5.ఓ.140౧600౧2౧004 [౧౭౦ ననన తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల సంఖ్య-154 ప్రతులు-2000 ప్రథమ ము(ద్రణ-1995 (అ తెలుగు విశ్వవిద్యాలయం .. టా వెల: రు. 23/- ర్ట ఫా గా (ప్రతులకు: (01 రిజిస్ర్రార్‌ ర్డీ తెలుగు విశ్వవిద్యాలయం ర్ట పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి ౮ "హైదరాబాదు-500 004 గ/ ము(ద్రణ: ఫాంట్‌లైన్‌ గ్రాఫిక్స్‌ బాగ్‌లింగంపల్లి ణం 'హైదరాబాదు-44 6ధాలయ గ్‌ లై శా న్‌... 6 కో గీ టో జ్‌ లా ననా 1

చేసిన వైనం ఈ వ్యాస సంపుటిలో స్పష్టంగా కనిపిస్తున్నది. బౌద్దమత సంపర్కంతో మన శిల్పకళ ఎట్లా సంపన్నమైందీ, మన శిల్పాలు, శిల్పులు ప్రపంచ శిల్పరీతికి ఏ రకంగా ఒరవడి దిద్దిందీ ఇందులో (ప్రముఖంగా చెప్పబడింది.

రెండు భాగాలుగా సాగిన ఈ (గ్రంథరచన కేవలం బౌద్దమత ప్రాశస్యాన్నే గాక, ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతులి (ప్రాభవాన్ని కూడా సహేతుకంగా వివరించింది.

ఈ (గ్రంథ రచయిత ఆచార్య బి.ఎస్‌,.ఎల్‌. హనుమంతరావు గారు సుప్రసిద్ద చరిత్ర పరిశోధకులు. మరుగుపడిన చారిత్రకాంశాలనెన్నింటినో వెలుగులోనికి తెచ్చిన విద్యాంసులు, ఆయన ఇంతకుముందే తెలుగులోను, ఆంగ్రంలోను పెక్కు రచనలు చేసినారు. విద్యాశాఖలో వివిధ పదవులను నిర్వహించి పరిశోధనకు, బోధనకు ఇతోధికమైన సేవలు అందించినారు. వీరి సేవలను గుర్తించి నాగార్జున విశ్చవిద్యాలయం వీరిని బౌద్దమత అధ్యయన పీఠానికి ప్రత్యేక ఆచార్యులుగా నియమించి గౌరవించింది. ఆంధ్రదేశంలోని చారిత్రక పరిశోధకులలో వీరికి ప్రత్యేక స్థానమున్నది. వీరి (గ్రంథం 'బౌద్దము - ఆం(ధ్రము' తెలుగు విశ్శవిద్యాలయం ద్వారా ప్రకటించి వెలుగులోనికి తీసుకొని రావడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఇది విద్యార్థులకే గాక అధ్యయన శీలురందరిక్షీ ఉపయుక్తం కాగలదని మా విశ్వాసం.

ఈ అమూల్యమైన (గ్రంధాన్ని మాకు అప్పగించి, ము(ద్రైించడానికి వీలు కల్పించిన డా॥ హనుమంతరావు గారి సోదరులు శ్రీ బి.ఎన్‌,ఆర్‌.ఆంజనేయళర్మ గారికి మా కృతజ్ఞతలు. ఇది ప్రచురింపబడడానికి ముఖ్యకారకులు, మాకు (ప్రేరణ కలిగించిన వారూ సాహితీ ప్రియులు శ్రీ సి,ఆంజనేయరెడ్డి, ఐ.పి.ఎస్‌. గారు. వారికి మా ధన్యవాదములు ల

3 హైదరాబాద్‌, (పేర్వారం జగన్నాథం) తేది: 26.1.1995,

ఇందులో... మొదటి భాగము 1 రత్నత్రయ సందేశము 2. బౌద్దము-ఆం(ధ్రము 3. బౌద్ధము-ఆంధధ్ర శిల్ప కళాసంప్రదాయాలు 4 బౌద్దమతము బోధించిన సమతా ధర్మము 5. బౌద్దయుగ వాస్తువు 6. ఆంధ్రదేశంలో ప్రసిద్ద బౌద్ధక్షేత్రాలు 7. (ప్రాచీన ఆంధ్ర నగరాలు-భట్టిప్రోలు 8. (ప్రాచీన ఆంధ్ర నగరాలు-విజయపురి రెండవ భాగము

  1. ఆంధ్రుల విశాల దృక్పథం
  2. ఆంధ్ర సంస్కృతీ వికాసము-కాకతీయ యుగము
  3. ఆంధ్రదేశములో సంస్కరణ-హేతువాద ఉద్యమాలు
  4. ఆంధ్ర దేశములో కులాల పుట్టుక-పెరుగుదల 5, గాధ-పీరికా వ్యాసము-కమ్మవారి చరిత్ర "6. ఆంధ్రులలో ప్రముఖ వ్యక్తిత్యాలు-కవిరాజు
  5. ఆం(ధ్రులలో (ప్రముఖ వ్యక్తిత్వాలు-మల్లంపల్లి సోమశేఖరశర్మ
  6. దేశదేశాలలో ఆంధ్ర సంస్కృతి

మొదటి భాగం

  1. 'రత్నత్రయ'” సందేశము

మానవునిలో అంతర్గతంగా ఉండే హేతువు నుండే 'మతం” ఉద్భవించింది. ప్రకృతి వైపరిత్యాల తాకిడి నుండి రక్షించుకోవటానికి ఆది మానవుని మేథ తాప్రత్రయపడింది. వైపరిత్యాల కారణాలను పరిశీలించి రక్షణకై శోధించిన మానవ సామర్థ్యం మతాన్ని రూపొందించింది భూమిపై మూనవుని సుఖజీవనానికి ఉద్దేశించిన అద్భుత సృష్టే మతం. కాల(క్రమంలో అన్ని వ్యవస్థలకు పట్టిన చీడ మతానికి కూడ సోకింది. మతము (ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసికొని పీడించే స్వార్ధపరుల సొత్తు అయింది. (ప్రజూజీవితాన్ని సుగమము, సుఖమయము చేయవలసిన సాధనం పీడించి అణగద్రొక్కే పాశవిక ఆయుధంగా రూపాంతరం చెందింది. అటువంటి పరిస్టితులు తలెత్తినప్పుడల్జా జొరాస్టరు, గౌతమ బుద్దుడు, జీససు (క్రీస్తు మహమ్మదు, శంకరాచార్యుడు మున్నగు ప్రవక్తలు ఉద్భవించి తమదైన పంథాలో మార్గనిర్దేశకులైనారు. సుఖము, ఉదాత్తము అయిన జీవన విధానాన్ని రూపొందించి మతాన్ని పునరుద్ధరించారు.

ప్రపంచంలో అతి ప్రాచీనము ఉదాత్తము అయిన మతాలలో 'బౌద్దం' ఒకటి. ప్రగతి దిశలో సంఘాన్ని నడిపించే తాత్విక చింతన బౌద్ధం. నిజానికి బౌద్దం 'జీవితదర్శనం', బౌద్దమత ప్రవక్త అయిన గౌతమ బుద్దుడు క్రీపూ. ఆరవ శతాబ్దంలో జీవించాడు. అప్పుడు భాథత జనజీవితం అతలాక్షుతలంగా ఉంది నైతికంగా, సామాజికంగా పతనావస్థలో ఉంది; జాతి వైషమ్యూలు సామాజిక అసమానతలు సంఘాన్ని పీడిస్తున్నాయి. రాజకీయంగా ఆర్జికంగా సంక్షిష్ట పరిస్థితి నెదుర్కొంటున్నది. మతం బలిపీఠం అయింది; మూఢవిశ్వాసాలకు భయంకరమైన ఊహలకు ఆటపట్టయింది. (క్రూరమైన ఆలోచనలకు ఆచరణకు వ్యతిరేకంగా స్పష్టంగా నిర్దుష్టంగా బుద్దుడు తన గళాన్ని విప్పాడు. మానవ జీవితాన్ని సంపూర్షంగా పునర్వ్యవస్త్రీకరించే హేతుబడద్దమైన జీవన విధానాన్ని జాతిముందుంచాడు. అప్పటికి లభ్యమైన తాత్విక చింతనను - అనుభవాలను

బౌద్దము - ఆంధ్రము సమన్వయించి సమకాలీన సమస్యలకు సమాధానంగా దర్శనంగా రూపొందించాడు. అన్ని గొప్ప మతాలకు పట్టిన దుర్గతే బౌద్దానికి కూడా పట్టింది. కాల(క్రమంలో బుద్దుని ఉపదేశాలకుచ(క్రభాషాలు వెలిసినాయి. అతని మౌలిక ఉపదేశాలకు బౌద్దులు, బౌద్దులు కానివారు కూడ అన్యాయం చేశారు. దురాశాపరులైన పూజారులు, నీతిబాహ్యులైన రాజులు, రాజకీయవేత్తలు ఈ నాటకంలో ప్రధాన దుష్ట పొత్రధారులు. ఉదా: మధ్య ఆసియాలోని భయంకర రక్తసిపాసుడైైన చెంఘీజ్‌ఖాన్‌ కూడా బౌద్దమతస్టుడే అనే స్థాయికి ఈ నాటకం చేరింది. అవధులు లేని (ప్రేమ, కరుణల మతమైన బౌద్దానికి ఇంతకు మించిన అన్యాయం ఉండదు! తరువాత కాలంలోని బౌద్దమత వ్యతిరేకులు తథాగతుని గురించి, బౌద్ధమతాన్ని గురించి దుష్ప్రచారం చేశారు. 'బుద్దిహీనుని', 'మందబుద్దిని' బుద్ధ శబ్దానికి పర్యాయ పదాలుగా వాడారు. జ్ఞానం బుద్ధిహీనత గాను, అజ్ఞానం (బ్రహ్మానందంగాను, గుర్తించటం ఎంతటి ఆశ్చర్యకరమైన పరివర్తన! దురాశపరులు సార్ధపరులు సుఖ సౌఖ్యాలతో తులతూగటానికి సామాన్యజనులు అజ్ఞానం అంధకారంలో ఉండటం అవసరం: బుద్దుడు ప్రజల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానవంతులను చేయాలని (ప్రయత్నించాడు. దీనితో అవకాశవాదులు స్థానం కోల్పోయారు. అందుచేతనే బుద్దునిపై, బౌద్ధమతంపై వారి ఆగ్రహం, దుష్ర్రచారం. బుద్దుని జీవితమూ, ఆయన జీవితంలోని విశిష్ట సంఘటనలు అందరికీ తెలిసినవే. కాని ఒక ముఖ్యమైన విషయంపై అందరూ మరింత అవగాహనతో దృష్టి కేంద్రీకరించాలని నా అభిప్రాయము. అది బుద్దుని మహాభి నిష్క్రమణ - పదవీ త్యాగం. నేటి రాజకీయ వేత్తలు ప్రజాసేవ చేయటానికి అధికారాన్ని ఆళిస్తున్నారు. హస్తగతం చేసికోవాలని అన్ని మార్గాలు త్రొక్కుతున్నారు. జ్ఞాని అయిన సిద్దార్డునికి అధికార పరిధులు తెలుసు. మానవ సేవకై సింహాసనాన్ని త్యజించాడు. నిజంగా ప్రజాసేవా తత్పరతే నేటి రాజకీయవేత్తల ఆశయమైైతే గౌతమ బుద్దుని జీవితం నుండి ఈ ఉత్తమ పాఠాన్ని నేర్పటం చాల అవసరం, (“అధికారం ' అవినీతికి మార్గం, సర్వాధికారం సర్వత్రా అవినీతినే మిగులుస్తుంది” - అని ఆక్షన్‌ ప్రభువు అంటాడు. సుమతీ శతక కారుడు 2

'రత్నత్రయ' సందేశము అధికార వ్యాధి పీడితుడు బధిరుడు అంధుడు అవుతాడని పేర్కొంటాడు.) గౌతమ బుద్దుడు ఆచరణ బద్దుడైన దార్శనికుడు. మానవాళి తక్షణ అవసరాలపై దృష్టి కేంద్రీకరించాడు. తన దర్శనంలో తర్క వితర్కాలకు, వితండవాదనకు తావు ఇవ్వలేదు. బౌద్ధం నీతిశాస్త్రం, తర్కశాస్తం, మనోవిజ్ఞానాల సమన్వయ ఫలితంగా ఆవిర్భవించిన దర్శనము అని రాధాకృష్ణ పండితుడు పేర్కొన్నాడు. నిజమైన దర్శనానికి అంతిమ లక్ష్యం మరణము కాదు - ప్రాణము'. 'భగవంతుడు కాదు .- మానవుడు' అని బుద్దుడు గుర్తించాడు. 'విషశస్తపీడితుని ఉపాఖ్యానము' (౧౭౯2016 0౬116 ౧౦౧౦౧66 ఉగాంఖిలో గుర్తింపు చక్కగా విశదీకరించబడింది. 'మజ్జినికాయ'లో బుద్దుడు మాలుంక్య పుత్రునికి ఇల్లా చెబుతాడు. 'సృష్టి పరలోకము, దైవము, నిత్యము (6[8/౧|)-మున్నగు సమస్యలన్నిటికీ వివరణలు లభించినప్పటికీ ప్రపంచంలో దుఃఖము, బాధ, వృద్దాప్యము, నిస్పృహ మరణము మున్నగు సమస్యల పరిష్కారం లభించదు. విషబాణ పీడితునికి బాణాన్ని తీసివేసి బాధోపశమన చర్యలతో చికిత్స చేయటమే వైద్య నిపుణుని కర్తవ్యము; ఆ వ్యక్తి పేరు, కులము, మున్నగు వివరాలతో కాలహరణము చేయతగదు. అదే విధముగా నిజమైన దార్శనికుడు దుఃఖము బాధల నుండి మానవుని విముక్తుని చేయాలి”, బుద్దుడు ఎంత యధార్థవాదో అంత ఆశావాది. మానవుని భవిష్యత్తుపై అతనికి ఎంతో నమ్మకం. మానవుని బుజువర్తనపై అతనికి అచంచల విశ్వాసం. దళారి అయిన పూజారి అవసరం లేకుండా, శిక్షించబడతాననే భయం లేకుండా, ఏ బహుమతినీ ఆశించకుండా తన నిర్వాణాన్ని మానవుడు సాధించుకోగలడని బుద్దుడు చెప్పాడు. తన భవిష్యత్తు నిర్దేశకుడు వ్యక్తేనని చెబుతూ (ప్రపంచాన్ని చెదలా పీడిస్తున్న దుఃఖానికి, బాధకు కారణాన్ని నివారణను కనుగొన్నాడు. అయితే దుఃఖానికి హేతువేమిటి? మానవుడు బాధనుండి నివృత్తి ఎందుకు పొందలేక పోతున్నాడు? బుద్దుడు పలాయనవాది కాదు. ప్రపంచాన్ని ఆవరించి ఉన్న దుఃఖము, బాధ '“మిధ్య' అని తన పృచ్చకులను ఠలాయించలేదు. సత్యాన్వేషి కనుక మానవ జీవితంలో వికారమైన నగ్నసత్యాలుగా తె

బౌద్దము = ఆంధ్రము వాటిని గుర్తించాడు. కారణాలను లోతుగా శోధించి పరిష్కార మార్గాన్ని కనుగొన్నాడు. ఆతని సమాధానం 'అవిద్య' (అజ్ఞానం) అన్ని చెడులకు, పాపాలకు కారణం. అజ్ఞానాన్ని జయించటమే పరిష్కారం.

బుద్దుడు హేతువాది. కార్యానికి కారణం ఉంటుంది. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అన్ని గహ్రింపు గలవాడు. బుజువర్తనతో మంచి కార్యాలను ఆచరించటం ద్వారా మానవుడు జీవన స్థాయిని పెంచుకోగలడు; లక్ష్యాన్ని చేరగలడు; బాధనుండి విముక్తుడు కాగలడు అని చెప్పాడు. వ్యక్తి బొన్నత్యానికి చాలా సులువైన నైతిక సూత్రాలను - అష్టాంగ మార్గాన్ని - బోధించాడు. అష్టాంగ మార్గాన్ని క్టుప్తంగా శీలము, సమాధి, (ప్రజ్ఞ అను మూడు ప్రధాన సూత్రాలుగా పేర్కొనవచ్చు. శరీర వాంఛలను అదుపులో ఉంచటం (శీలము), మనో చాంచల్యాన్ని అదుపు చేయటం (సమాధి) ద్వారా మానవుడు జ్ఞానాన్ని (ప్రజ్ఞ పొందగలడు... ప్రజ్ఞావంతుడు కావటమే అజ్ఞానాన్ని (అవిద్య) జయించటం. అట్టి మానవుడే 'అర్హతుడు' అంటే నిర్వాణాన్ని పొందినవాడు. నిర్వాణాన్ని పొందిన వ్యక్తి అన్ని కర్మల నుండి విముక్తుడు అవుతాడు. అద్వయాన్ని (గ్రహించిన ఆనందస్థాయియే నిర్భాణము. అన్ని ప్రాణులను బంధించే మౌలిక సూత్రం 'జీవము*. జీవము అవిభాజ్యము. ఆ (గ్రహింపే అద్వయము. అప్పుడే మానవుడు ఇతర (ప్రాణులతో తాదాత్మ్యం పొందగలడు. ఆ మానసిక స్థితే 'కరుణ” పెల్టుబకటానికి కారణం అవుతుంది. కరుణ న్యాయాలకెల్లా న్యాయం. మానవజాతి మనుగడకు కరుణే ఆధారము.

బౌద్ధమతం అంధ విశ్వాసాలతో విద్వేషాలతో కూడిన మార్గం కాదు; ప్రేమ జ్ఞానం నిండిన మార్గం, ఆత్మత్యాగము, ఆత్మన్యూనత దాని లక్ష్యం కాదు. వ్యక్తిత్వ వికాసము, జొన్నత్యము దాని లక్ష్యం. ఆ ఉన్నత మార్గాన్ని అనుసరించి అంతిమ. లక్ష్యమైన నిర్వాణాన్ని పొందటానికి కులము, వర్ణము, ఏ మతము, వృత్తి ప్రతిబంధకాలు కావు. ఇతర మతాలపై అసహనము, విద్వేషము బౌద్ధమతంలో లేవు. మ్లేచ్చ, 0౭49 మతవిరోధి - ద్వేషి వంటి పదాలు బౌద్ద నిఘంటువులో లేవు,

తాను నిర్దేశించిన మార్గము చాల కరినమైనదని బుద్దునికి తెలుసు (సుత్తనిపాత)

క్త

'రత్నత్రయ' సందేశము విజయానికి అడ్డదారులు, దొడ్డిదారులు, డొంకదారులు ఉండవని బుద్దుని ఉపదేశము. అదే సమయంలో తాను చూపిన మార్గవిషయమై అతడు మొండిపట్టు కలవాడు కాదు. తన శిష్యగణాన్ని బుద్దుడు “అధికారంతో ఆదేశించిన దానిని తు.చ. తప్పక ఆచరించవలసిన పనిలేదు” అని హెచ్చరించాడు. (ఆధునిక విజ్ఞానశాస్త్ర పితగా గుర్తించబడిన బేకన్‌ కూడ ఇలాంటి హెచ్చరికనే చేశాడు) స్వర్ణకారుడు బంగారును కొలిమిలో వేసి నాణ్యాన్ని నిర్దారించినట్టు ఏ ్రవచనాన్నయినా మీ అనుభవమనే కొలిమిలో వేసి చూడండి. మీకు సమాజానికి ఉపయోగపడుతుంది అనే నమ్మిక కలిగినప్పుడు మాత్రమే ఆ ప్రవచనాన్ని నమ్మండి” అన్నాడు. కల్లబొల్లి ఊహలతో ఎవరూ 'స్వచ్చతను పొందలేరు అని 'సుత్తనిపాత'లో వివరిస్తాడు. చివరి ప్రవచనమైన “మహా పరినిభానసుత్తలో బుద్దుడు ఇలా చెబుతాడు; “మీ నిర్వాణాన్ని మీరే నేర్పుగా, సున్నితంగా రూపొందించుకోండి. ఇతరుల సహాయ సహకారాలు ఆశించవద్దు. ఓ పరివ్రాజకులారా! మీ జ్ఞానజ్యోతిని మీరే వెలిగించుకోండి”. ఏ కాలంలోనూ, ఏ మతప్రవక్త ఇంతటి హేతుబద్ధమైన (ప్రవచనాన్ని వెలువరించలేదు,

బౌద్ద దార్భనికతనంతటినీ 'రత్షత్రయా'ల రూపంలో వెల్లడించవచ్చు. నంఘం శరణం గచ్చామి బుద్దం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి “నేను ్రార్థనలకై దేవాలయాలకు పోను. తపస్సుకై అరణ్యములు చేరను. నా సహచర మానవుల సంఘటిత శక్తిని శరణు వేడెదను. తాదాత్మ్యత పొందెదను”. “నేను దళారులైన పూజారులను ఆశ్రయించను. అంధ విశ్వాసాలకు బందీని కాను. జ్ఞానమును జ్ఞానవంతుల శరణు జొచ్చెదను” “నేను క్రతువుల, యజ్ఞాలను ఆచరించను; న్యాయానికెల్లా న్యాయమైన ధర్మానికి సర్వవ్యాపిత కరుణకు విధేయుడనై ఉంటాను,”- = ర్‌

బౌద్దము - ఆం(ధ్రము ఈ విధంగా బుద్దుడు హేతువు, జ్ఞానాల (ప్రాధాన్యతను గుర్తించాడు, వివరించాడు. మూఢవిశ్వాసము, అజ్ఞానము, భయము అనే ఊబినుండి నైతికతను ఉద్దరించాడు; స్వర్గము దైవముల నుండి నిజజీవితాలనైపు మానవుని దృష్టి మళ్ళించాడు; స్వశక్తిపై మానవునికి నమ్మకం కలిగించాడు, జీవితాన్ని పునర్నిర్మించుకోవటానికి అవకాశం కల్పించొడు; బుజునైన, ఉన్నతమైన జీవితంపై ఆశను రేకెత్తించాడు; సుఖమయ జీవితాన్ని సాటి మానవులతో పంచుకునే నైతిక సామర్ధ్యాన్ని 'పెంపొందించాడు. 2,500 సం; నాటి దర్శనమైనప్పటికీ, రత్నత్రయం ప్రతిపాదించిన జీవన విధానం ఆధునిక మానవువి ఆశలు ఆశయాలకు అనువుగా తీర్చిదిద్దబడింది. 1. బౌద్దం ప్రజాస్వామిక విలువలున్న దర్శనం. సమతా సమాజాన్ని ప్రతిపాదించింది; ధనిక-పేద, ఉన్నత-అధమ, మతస్థులు-మతద్వేషులు, 1గ౧.51ఆ6- 151665 1౧655 - తీగ [౧- 5 అనే కృత్రిమ.విభజనలకు అందులో తావులేదు. వ్యక్తిని దైవానికో, ఆర్ధిక వ్యవస్థకో బొనిసను చేయదు. వ్యక్తిత్వ వికాసమే దాని ప్రాతిపదిక, 2. హేతువు విజ్ఞానశా(స్తము బౌద్దానికి పునాదులు. అసంబద్ధ ప్రమాణాలతో కూడిన వాజ్మయాన్ని తృణీకరించింది. హేతువు, అనుభవము జీవితానికి మార్గదర్శకంగా పేర్కొంది. ప్రగతిపై విశ్వాసాన్ని కలిగించింది. 3. బౌద్ధం ఏకైకము, అవిభాజ్యము అయిన మానవ బంధాన్ని ద్రువపరిచింది. మానవతా దృక్పథాన్ని స్పష్టం చేసింది. 4. దానినుండి ఉద్భవించిన 'కరుణ' క్లిష్టమైన (ప్రపంచ శాంతి సమస్యను తొలిగిస్తుంది. రత్నత్రయం (ప్రతిపాదించిన జీవన విధానం జ్ఞానం. హేతువు, (పేమ, కరుణ, శాంతితో కూడి ఉన్నది. అజ్ఞానం, మూర్ధత్తం, అంధవిశ్వాసం, ద్వేషాలకు అందులో తావులేదు. రత్న(త్రయ మార్గం మానవ జాతికి నాగరిక జీవన విధానాన్ని (ప్రతి పొదిస్తుంది. అందుకే ప్రస్తుత పరిస్థితులలో మానవాళి శ్రేయస్సుకు పురోగతికి, మరేయితర జీవన విధానాని కన్నా రత్నత్రయ మార్గం అనుసరణీయం. టు కడా ర

2 బౌ ద్దము - ఆంధ్రము 'పప్రధమంగా బౌద్దానికి స్వాగతం పలికి, బుద్దుని ఉపదేశాలను ఆదరించి ఆచరించిన భారతీయులలో ఆంధ్రులు ఒకరు. అశోకుని మూడవ బౌద్ధ సమావేశానికి (1౧1౦ 806091 6౦౮౪౧౦1) ముందే ఆంధ్రదేశంలో బౌద్దం ఉనికిని వాజ్యయము, పురాతత్వ విశేషాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రదేశంలో బౌద్దము నాటికే విశేషజనాదరణ పొంది స్టూపనిర్మాణం జరిగిందని చెప్పవచ్చును. తూర్పున విజయనగరం జిల్లాలోని శాలిహుండం నుండి (ప్రకాశం జిల్లాలోని రామతీర్థం వరకు, పడమర కరీంనగర్‌ జిల్హాలోని ధూళి కట్టనుండి, కడప జిల్లాలోని ఆదాపూర్‌ వరకు అనేక బౌద్ధక్షేత్రాలు బయల్పడినాయి. 600 సంవత్సరములకు (శ్రీపూ. 300 నుండి క్రీ.శ 300 వరకు) పైగా ఆం(ధ్రప్రజాజీవితంలోని అన్ని కోణాలను బౌద్దం ప్రభావితం చేసింది. ఆం(ధ్రబౌద్ద శ్రమణకులను 'అంధకులు” అని అనాడు పిలిచేవారు. అంధకులు బౌద్ద దర్శనాన్ని సుసంపన్నం చేసారు. దక్షిణ దిశలోని శ్రీలంక, ఉత్తరాపథంలోని గాంధార తూర్పు సముద్రంలోని సువర్షభూమి మున్నగు సుదూర ప్రాంతాలకు బౌద్దమత సందేశాలైన మైత్రి, “'కరుణ' లను తీసుకువెళ్లారు. బౌద్దం ఆంధ్రదేశానికి విస్తరించిన సమయంలో ఆంధ్రులు 30 తెగలుగా (జాతులుగా) ఉండేవారని, దుర్ఫేధ్యాలయిన 30 దుర్గాలు ఉండేవని మెగస్తనీసు వ్రాసినాడు. మరో 'గ్రీకురచయిత ఆంధ్రులకు పట్టణాలతో, గోప్పసైన్యంతో కూడిన 30 రాజ్యాలు ఉన్నాయని శ్రాసినొడు. అశ్చకులు (నిజామాబాదు), శబికులు (కరీంనగరు) మహిశకులు (నల్గొండ), నాగులు (ధాన్యకటకం) యక్షులు (భట్టప్రాట) సోమకులు(వడ్డమాను) బహుశః కళింగులు (గోదావరి ముఖద్వారము) మున్నగు ఆం(ధ్రతెగలను వాజ్కయము పురాతత్వ విశేషాలు (ధ్రువపరుస్తున్నాయి. ధాన్యకటకంలోని ప్రాచీన శాసనాలలో స్థానిక రాకుమారుల ప్రసక్తి 7

బౌద్దము - ఆంధ్రము ఉంది. (బ్రాహ్మణ వాజ్మయం ఆంధ్రులను మ్రేచ్చులుగా (గ్రామాల వెలుపల ఉండవలసిన వారుగా నిర్లేశించింది. ఆర్థికంగా సంపన్నులు, రాజకీయంగా చైతన్యవంతులు అయిన ఆంధ్రులు (బ్రాహ్మణ వాజ్మయ నిర్దేశాలకు వ్యతిదేకంగా బౌద్దమతాన్ని ఆదరించటంలో ఆశ్చర్యం లేదు. ఆంధ్రులు బౌద్ద సంస్థలను ఉదారంగా పోషించారు. బౌద్దం భిన్న తెగల మధ్య అడ్డుగోడల్ని ఛేదించింది, బలమైన ఆం(ధ్రజాతిని తీర్చిదిద్దింది: ఒకే జూతి స్పృహను వారిలో కలిగించింది. ఒకే గొడుగు క్రింద చేరాలనే ఆకాంక్ష కలిగిన ఆంధ్రులు ఏకచ్చత్రాధిపత్యానికి పువాదులు వేసారు. తిరిగి ఏనాడు పొందలేనంత రాజకీయ (సార్వభౌమిక) అధికారం సాతవాహనులకు దక్కింది. బౌద్దయుగంలో ఆంధ్రులలో సామాజిక ఉదారభానం (ప్రబలంగా ఉండేది అప్పటికి కులవ్యవస్త్ర పటిష్టపడలేదు. (బ్రాహ్మణులు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉండేవారా? లేదా? అనేది అనుమానాస్పదం పాలక్షులు, సామాన్యులు (బ్రాహ్మణ పండితులకు పూజారులకు దానాలు ఇచ్చిన శాసనాధారాలు అరుదు. గౌతమ, వశిష్ట మున్నగు (బ్రాహ్మణ గోత్రీకులు తమ పుత్రికలను సాతవాహనులకు వివాహం చేయటాన్నిక్షి ఉళత్య్ళాహం చూపేవారు. కధాసరిత్సాగరం, సింహాసన ద్యాత్రింశక, సాతవాహనులను హీనకులజులుగొాను, ఇక్ష్వాకులను స్టానిక తెగలుగాను (౧౮6౮౪౧౦౩ 90060 పేర్కొంటున్నాయి. ఆ విధమైన వివాహబంధాల ద్వారావైదికమచ పునరుద్ధరణోద్యమానికి రాజాదరణను వారు ఆశించారు. తద్వారా బౌద్ధమతానికి గల (ప్రజాదరణను అరికట్టటం వారి ధ్యేయం. సాతవాహనులు బౌద్ధం పట్ట కృతఘ్నతనే చూపారు. మనకు తెలిసినంతవరక్తు (బ్రాహ్మాణ రాణికి జన్మించిన మొదటి సాతవాహన రాజు - గౌతమీ పుత్ర శాతకర్ణి అతడు వైదికముతంపై కృతజ్ఞతతో సమాజాన్ని 'ఆగమ'” పద్ధతిలో పునరిర్మించాలని (ప్రయత్షించాడు కానీ సఫలీకృతుడైనట్టు ఆధారాలు లేవు. కారణం- రాజు బొక్కసాన్ని నింపే గహపతులు (100 ౧9౦౭౧1) కమరులు (వృత్తిపనివారు) ్రేష్టులు (సేట్టివణిజులు) బౌద్దాన్ని అదరించారు, కుల సాంకర్యాన్ని అరికట్టినట్టు అతడు గర్వంగా చెప్పుకున్న మాటలు కూడా నీటిమూటలే. అతని కుమారుడు వొళిస్టీప్లుత్ర శివశ్రీ శక్ర (మ్లేచ్చ) రాకుమారి శి

బౌద్దము - ఆం(ధ్రము రుద్రదమనికను పెండ్లాడాడు. వైదిక రాజుగా కొనియాడబడే ఇక్ష్వాకు వంశస్థుడయిన శ్రీ, ఛాంతమూలుని కుమారుడు వీరపురుషదత్తుడు కూడా శక రాకుమారిని పెండ్డాడాడు. కుల చైతన్య చిహ్నలు ఆనాడు ఏ రూపంలోనూ లేవు, సమస్త మానవాళితో తాదాత్ముతను మహాయాన బౌద్ధ నైతికసూత్రాలు ప్రతిపాదించాయి. ఆ సూత్రాలకు ఆంధ్రులు కట్టుబడే ఉండేవారు. వారిచ్చిన బహుమతులు సమస్త మానవజాతి కల్యాణానికి ఉద్దేశింపబడేవి. యు ఆచార్య నొగార్జునుడు తన 'లోకతితస్తవ' ఇలా ముగిస్తాడు. యదానాప్తం మయావుణ్యం న్తువత్యం నుతి భాజనం అనిమిత్త బంభనాపీరం భూయాల్‌ తేనా ఖిలం జగత్‌. సామాన్య ప్రజలు కూడ ఇదే స్పూర్తితో ఉండేవారని జగ్గయ్యపేట శాసనం వెల్లడిస్తోంది. ఒక వణిక ప్రముఖుడు అందులో ఇలా అంటాడు. తేనవుణ్యేన లోకోయాం నిర్వాణ మధిగచ్చతు. బౌద్ద మతం (ప్రతిపాదించిన సామాజిక సమతాభావాన్ని, విశ్చ ఉదార స్ఫూర్తిని అమరావతిలోని ఒక శాసనం ద్వారా మనం [గ్రహించవచ్చును. 'విధికు'డనే చర్మకారుడు సకుటుంబంగా స్తూపాన్ని దర్శించి బహుమతులు ఇచ్చినట్టు ఆశాసనం వెల్లడిస్తోంది. నేటి లౌకిక(?) భారతదేశంలో కూడా ఒక వైదిక సంస్పలో అలా జరగటం ఊహించలేము. బౌద్దం క్షీణించి 'ధర్మమహారాజు'లు రాజకీయాధికారులై లౌకికతత్వముపై స్వేచ్చగా తమ కృపాణాలను సంధించిన తరువాతనే అస్ఫూర్తి అంతరించింది; ఆంధ్రదేశంలో కులాలు ఘనీభవించి కులవైతన్యం ప్రబలింది; సాంఘిక అసమానతలకు, విద్వేషాలకు ఆం(ధ్రులు గురయినారు. 9

బౌద్దము - ఆం(ధ్రము బౌద్దమతము ప్రజలను బద్ధకస్తులుగా చేస్తుందనీ, దేశ ఆర్థిక మాంధ్యానికి కారణమవుతుందనీ అనటం కేవలం అపోహ. ఆనాడు వ్యవసాయము, వాణిజ్యము, పరిశ్రమలు ఆంధ్రదేశంలో సర్వతోముఖంగా వృద్దిచెందాయి. గోదావరి ముఖద్వారం రేవుపట్టణంగా ప్రసిద్ధిచెంది లాభదాయకమైన నౌకావాణిజ్యానికి ఆటపట్టయింది. కృష్ణాజిల్లా వరిపండే సారవంతమైన భూమి. అనంతపురం కర్నూలు (ప్రాంతాలు బంగారు గనులకు ప్రసిద్దిచెందినాయి. ్రేష్టులు తీరప్రాంతము, పీఠభూమి ప్రదేశాలలో ధాన్యము, జౌళివ(స్తాలు, అటవీసంపద, పశుసంపదతో వర్తక సంబారాలు నిర్వహించేవారు. సువర్షభూమి, ఇతర దూరప్రాంతాలకు మహానావికుల సడవలతో వాణిజ్యం నెరపేవారు. వీరు గడించిన లాభాలతో పర్వత సమానమైన ఉన్నత చైత్యాలను (వైత్యశాలలను) ధాన్యకటకము, భట్టిప్రోలు ఘంటసాల మున్నగు ప్రదేశాలలో నిర్మించారు. ఆంధ్రదేశం నాలుగు చెజగులా రోమను నాణాలు లభించాయి. శాతవాహనుల, ఇక్ష్యాకుల నాణాలు అనాటి ఆంధ్రదేశ సిరిసంపదలను వెల్లడిస్తున్నాయి. సువర్ష భూమిలోని ఆంధ్రవాణిజ్య స్థావరాలు అన్నేయ ఆసియాలో బౌద్ద సంస్కృతీ విస్తరణ కేంద్రాలుగా విలసిల్లినాయి. బౌద్ద శ్రమణకులు కొండలలో అడవులలో నివసించే వారు కారు; ప్రజలలో ఒకరుగా ఉండేవారు. మతపునాదులు పటిష్టము, విశాలము చేస్తూనే సామాజిక నైతికతకు, వ్యక్తివికాసానికి, ఆధ్యాత్మిక జౌన్నత్యానికి పాటు పడేవారు. ఆం(ధ్రశ్రమణకుల మేధాసంపద సూత్రవాబ్మయాన్ని సుసంపన్నం చేసింది, మహాయాన విప్లవానికి నాంది పలికింది. (ప్రాచీన కాలం నుండి ఆంధ్రులు శుద్ద సాంప్రదాయ వాదులు కాదు; సంస్కరణోద్యమాలలో ముందుండే వారు. వైదికముత పునరుద్దరణోద్యమ కారణంగా జనజీవితం మార్చు చెందసాగింది. ఆంధ్ర బౌద్దులు కూడా తమ మతంలోని కట్టుబాట్లను సడలించే ప్రయత్నం చేసారు. మత పునాదులను విశాలం చేసారు. కృష్ణా ముఖ ద్వారంలోని విహారాలు మేధా చైతన్యవంతాలయినాయి. “ద్వితీయ సంగీతి' లో తాను ప్రతిపాదించిన సూడ్రాల కారణంగా సంఘంలో విభజన తెచ్చిన మహా దేవభిక్షు ధాన్యకటక చైత్యశాలలో నివసించేవాడు. “ద్వితీయ సంగీత తర్వాత మహాసాంఘికులకు ధాన్యకటకం నెలవయింది. 10

బౌద్ధము - ఆంధ్రము వారు తమని చైత్యకులు, శ్రైలులు అని పిలుచుకునేవారు. బుద్దుని ఉపదేశాలపై విశేష పరిశోధనలు చేసారు. సూత్ర వాజ్ఞయం పలువిధాలుగా వృద్ధిచెందింది. 'ప్రజ్ఞాపారమిత, వైపుల్య వెలసి మహాయాన బౌద్దానికి పునాదులయినాయి. సూత్రాలను విశదీకరించే శాస్త్ర వాజ్మయం కూడా వృద్దిచెందింది. శాస్త్ర సంహితలలో ఉద్దండులయిన ఆచార్య నాగార్జునుడు, అతని శిష్యుడు ఆర్యదేవుడు శ్రీపర్వత ధాన్యకటక విహారాల్లో నివసించేవారు. వీరే మహాయానాన్ని ఒక దర్శనంగా మత శాఖగా తీర్చిదిద్దారు. ఆచార్య నాగార్జునుని మేధా సంపద అసమానం. భారతీయ దర్శనము తత్వచింతనలపై అతని కృషికి ఆతనీ ప్రత్యర్థులే తలలు వంచేవారు. నాగార్జునుడు, ఆర్యదేవుడు (వీరి తరువాత బుద్ధపాలిత, భావవివేక్క దిజ్నాగ, ధర్మక్షీర్తి మహాయాన బౌద్ధానికి పుష్టిని చేకూర్చారు. వీరి భిన్న దృష్టిని, మేధా వైశాల్యాన్ని, వీరి (వ్రాతలు బుజువు చేస్తున్నాయి. అంధ్రజిజ్ఞాసువులు, భారతీయ దర్శనానికి, ప్రధానంగా తర్కశాసస్తానికి చేసిన కృషిచాలా ఉన్నతమైనదని వారి (ప్రత్యర్థులే క్షీర్తించారు. ఆచార్య నాగార్జునుని సృహల్లేఖ, రత్నావళి,(ఏటిష్టమైన) ప్రభుత్వ యం[త్రాంగము, సుఖమైన సామాజిక జీవనము మున్నగు లౌకిక సమస్యలను నిశిత దృష్టితో పరిశీలించాయి: నాగార్జున, ఆర్యదేవ అసంగ, వశుబంధు, దిజ్బాగ, ధర్మకీర్తి అనే ఆరు వజ్రాలతో భరతవర్షము ఆలంకరింపబడినదని టిబెట్‌ వాజ్ఞ్యయం తెలియ చేస్తోంది. ఆ ఆరువజ్రాలలో నలుగురు ఆంధ్రులు కావటం గర్వించవలసిన విషయం, మహాయాన బౌద్దానికి ఆంధ్రదేశం జన్మస్థలం. థేరవాద బౌద్దానికి ఆంధ్రుల సేవ అపారము. ధాన్యకటకము మహాయానానికి ఆయువుపట్టు: నాగార్జున కొండ ప్రాంతంలోని పల్లబొగ్గ థేరవాద బౌద్దానికి నెలవు. థేరవాద బౌద్దానికి మూలకేంద్రమైన శ్రీలంకతో సంబంధాలు కలిగియుండేది. శిహలవిహారము, మహిశాసన విహారము, వనవిహార, వళివిహారము మున్నగు ఆరడజనుపై బడిన నాగార్జున కొండ (ప్రాంతములోని విహారాలు ధేరవాద విహారాలుగా ప్రసిద్ధి చెందాయి. క్రీశ; మూడవ శతాబ్ది మధ్యకాలంలో శ్రీలంకకు వెళ్లిన వైతుల్యకుల (వైత్యకులలో ఒక తెగ) సై శ్రీలంకబౌద్దులలో తీవ్ర 1

బౌద్దము - ఆంధ్రము వ్యతిరేకత వ్యక్తం అయింది. పాళి సంస్కృతిని రక్షించే ఉద్దేశ్యముతో శ్రీలంకలోని మహావిహారవాసినులు థేరవాద పునరుజ్జీననానికి ఉద్యమించారు. స్మృతి పథం నుండి దూరమైన పాళీ సంస్కృతి తిరిగి పొందేందుకు ఆం(ధ్ర మహావిహారవాసినులు బుద్దఘోషని శ్రీలంకకు పంపారు. డి.&. కోశాంబి, సుకుమారదత్తు మున్నగు చరిత్రకారులు పల్నాడులోని కోట నెమలిపురి - గోడలూరు (మొరందకేతక) బుద్దఘోషుని నివాసస్థలంగా గుర్తించారు. శ్రీలంకనుండి తిరిగివచ్చిన బుద్ధ్రఘోషుడు నాగార్జున కొండలోని కులధమ్మగిరి, శిహలవిహారములోని బోధివృక్షధాయలలో 'విశుద్ధమగ్గ' ను (వ్రాశాడు. అది థేరవాద బౌద్దంపై ప్రామాణిక నిఘంటువు. ఆం(ధ్రబౌద్దుల సృజనవాజ్మయానికి మాత్రమే పరిమితం కాదు. బౌద్ధం ప్రవేశించేనాటికి ఆంధ్రులు భూతవాదులు (0౧ ౧౧59) పూర్వీకుల భౌతికకాయాల పై నిర్మించిన రాక్షసీ గుళ్లను (1460౧111౧౦ 10గ౧౧౨9) పూజించేవారు. బౌద్దమత ప్రవేశంతో ఈ సంస్కృతి కొత్తరూపు రేఖల్ని దిద్దుకుంది. రాక్షసిగుళ్ల స్ఫూర్తితో మహాజ్ఞాని అయిన బుద్దుని ధాతువులపై (అవశేషాలు) పెద్ద చైత్యాలు స్తూపాలను నిర్మించారు. కృష్ణాముఖద్వారములోని మజేరిక దేశంలోని ధాతుచైత్యాల వివరణ ప్రాచీన సింహళ దేశ చరిత్ర (గ్రంథాలు మహావంశ, దలదవంశలలో లభించింది. స్థానిక వాజ్యయము, శాసనాలు ఆ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ధాన్యకటకము, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, ఘంటశాల, నాగార్జున కొండ, గుడివాడ, గోలి, వడ్డమాను, పేదగంజాం మున్నగు ప్రదేశాలలో పర్వత సమానమైనస్తూపాలుండేవి. చిన్న స్తూపాలున్న ప్రదేశాలనేకము. ప్రతి చైత్యము ఒక వాస్తుకళా విశేషంగా రూపొందింది. నాటి ఆంధ్రబౌద్దులు సర్వప్రాణుల మంచిని సుఖసంతోషాలను ఆశించారు. వారి విశ్ససమభావము ఆత్మసౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ఆత్మసౌందర్యమే సృజనాత్మక మేథకు స్ఫూర్తినిచ్చి, అమరావతి, నాగొర్జునకొండలోని ఆంధ్రశిల్సాన్ని సృజించింది. అసమాన్య వైతన్యం ఉట్టిపడుతూ ఆంధ్ర శిల్పకళ విశిష్టస్టానాన్ని పొందింది. వైశాల్యము శిల్పకళా సంపదల దృష్ట్యా ప్రపంచంలోని సమకాలీన బౌద్దస్టూప విశేషాలలో కెల్లా ధాన్యకటక స్తూపము ఉత్తమమయినదిగా క్రీర్తింపబడింది. అమరావతిక్షళలో 12

బౌద్దము - ఆంధ్రము స్తబ్దత లేదు; వృక్ష సంపద, జంతుజాలము, మానవ (ప్రతిమలు జీవంతో తాణికిసలాడుతాయి. అమరావతి శిల్పాలు వివిధ భంగిమలతో మృదువుగా మలచబడి (౧౮౩10 &గ్గు సజీవంగా దర్శనమిస్తాయి. శిల్ప కళాప్రపంచంలో అమరావతి శిల్పము 'మచ్చుతునకి అని నిపుణుల అభిప్రాయం. ఆంధ్రులు బౌద్ధధర్మాన్ని భౌగోళికంగా విస్తరించారు. శ్రీలంక, బర్మా మలయా, ఇండో చైనా దేశాలు బౌద్ద ధర్మంతో పాటు ఆంధ్ర సంస్కృతీ వైశిష్ట్యాన్ని కూడా రుచి చూసాయి. భూటాను, చైనా, జపాను. టిబెట్‌ దేశాలు ఆచార్య నాగార్జునుని కీర్తిస్తాయి. బర్మా, శ్రీలంక దేశాలు బుద్దఘోషుని గౌరవిస్తాయి. సాంఘిక, ఆర్డిక, రాజకీయ, సాంస్కృతిక కళారంగాలను నిష్టాక్షిక దృష్టితో నిశితంగా పరిశీలించి చూస్తే ఆంధ్రుల చరిత్రలో బౌద్దయుగం స్వర్ణయుగమనదగినది. డాని 113

  1. బౌద్దము - ఆంధ్ర శిల్పకళా సంప్రదాయములు మహాదేవ, ఆచార్యనాగార్జున, ఆర్యదేవ, భవ్య, దిజ్ఞాగ, బుద్దఘోష ధర్మక్తీర్తి వంటి దిగ్ధంతాలైన దార్శనికులు బౌద్ధదర్భ్శనాన్నేగాక భారతీయ తత్వ తార్కిక ఆలోచనావిధానాన్ని సుసంపన్నం చేసినారు. ఆంధ్ర శిల్పులు తమ తమ సౌందర్య భావనకు సృజనా సామర్థ్యాన్ని జోడించి జగద్విఖ్యాతమైన శిల్ప ప్రపంచాన్ని సృష్టించి భారతీయ శిల్పకళాచరిత్రలో అద్వితీయమైన స్టానాన్ని ఆక్రమించి అజరామరమైన కీర్తిని గడించినారు. నిజానికి బౌద్దయుగంలో ఆంధ్ర దేశంలో జరిగినంతటి తాత్విక చింతన దార్శనిక సారస్వత సృష్టి కళాసృష్టి మరేయుగంలోనూ జరగక పోవడం ఆశ్చర్యం కలిగించడమేగాక ఆలోచనీయమైన చారిత్రక సమస్య. చాళుక్య యుగంలో, కాకతీయ విజయనగర యుగాల్లో ఆంధ్రదేశంలో శిల్వసృష్టి జరగక పోలేదు. అయితే బౌద్దయుగ శిల్ప కళే ఆంధ్ర శిల్చ సంప్రదాయం అని రూఢిగా వాస్తుశిల్పచారిత్రక (గ్రంథాలలో నమోదు కావడం గమనార్హమైన అంశం. అందుకు కారణం అందలి విశిష్ట సౌందర్యం వ్యక్తిత్వమేనని చెప్పవచ్చు. బుద్దుని కాలంలోనే ఆంధ్రులు బౌద్ధానికి నివాళులర్పించి ఆదరించినారనడానికి ఆధారాలున్నాయి. బావరి కధ - సుత్త నిపాతం - విమాన వత్చాకధ, సింహళ చరిత్ర మహావంశాపల్లవ బొగ్గ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సుప్రసిద్ద బౌద్ధ క్షేత్రాలలో అశోకుడు శిలాస్తంభాలు ప్రతిష్టించినాడు. ఆందుచే ధాన్యకటకం నాటికే బౌద్ద క్షేత్రం అయిఉండవలే. భట్టిప్రోలు, జగ్గయ్య 'పేటలలోని స్తూపాలు క్రీపూ. 200 నాటికే ఏర్పడినవనడానికి నిదర్భనాలున్నాయి. వీనిని బట్టి నాటికే బౌద్దం ఆంధ్ర దేశంలో విశేషజనాదరణపాంది స్టూపనిర్మాణం జరిగిందని చెప్పవచ్చు. నాటి ప్రజలు చివ్నారాధకులని 7016గ౧10 11065 - మృతులకు రాక్షసీగుళ్లు అనే సమాధులు నిర్మించేవారని న!

బౌద్దము - ఆం(ధ్ర శిల్పకళా సంప్రదాయములు

తెలుస్తుంది. ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాల్లో రాక్షసిగుళ్లు అసంఖ్యాకంగా దొరికినాయి

  • దొరుకుతున్నాయి. ముఖ్యంగా ధాన్యకటకం, నాగార్జునకొండలలో, అంటే బౌద్ద న్షేత్రాలలో, రాక్షసిగుళ్లు ఉండటం గొప్ప విశేషం.

రాక్షసిగుళ్ల ద్వారా నాటి ప్రజలకు మరణానంతర జీవితంలో విశ్వాసం ఉన్నదని, పితృదేవతలను ఆరాధించేవారని, మృతులకు సమాధులు - స్మారక చిహ్నలు నిరి గంచే ఆచారం వారికి ఉందని తెలుస్తుంది. వారికి ఇనుము బంగారం వంటి లోహాల వాడకం తెలుసునని బోధపడుతుంది. ముఖ్యంగా ఇనుప పనిముట్ల వాడకంతో ప్రజల ఆర్థిక జీవితంలో విప్లవం వచ్చినట్టు చరిత్రకారులు అంగీకరిస్తారు. వ్యవసాయం చురుకుగా సాగి వ్యవసాయంపై ఆధారపడిన పరిశ్రమలు పెంపాందడానికి అవకాశం ఏర్పడింది. ఆంధ్రదేశం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్దికెక్కినట్టు భీమసేనజాతకం వంటి బౌద్దవాజ్యయం వల్ల (గ్రహిస్తున్నారు. ఆంధ్రదేశంలోని నగరాలను పశ్చిమతీర రేవులతో కలుపుతూ మచిలీ పట్టణం, వినుకొండ, ప్రాంతాలనుండి రహదారులున్నట్టు పరిశోధకులు కనుక్కున్నారు. నదీ మైదానాల్లో పంటలు విరివిగా పండి వస్తాది పరిశ్రమలు పెంపొంది వాణిజ్యం విస్తరించడం వల్లనే ఆంధ్రదేశంలో ముప్పది నగరాలేర్పడడానికి అవకాశం కలిగింది. అంటే ఆంధ్రదేశంలో హస్తకళాకారులు, వర్తకవర్గాలు ఐళ్చ్వర్యవంతములై సమాజంలో బలపడి ప్రముఖస్టానం ఆ(క్రమించినారు.

బౌద్ధమతం సామాన్య ప్రజానీకంలో ఒక కొత్త చైతన్యం కలిగించింది. వ్యయప్రయాసలు లేని ప్రవర్తనా సూత్రావళి ననుసరించి అత్మ సంస్కారం పొంది తద్వారా మానవ కల్యాణం సాధ్యమనే ఆత్మవిశ్వాసం కలిగించింది బౌద్ధం. బౌద్ధ దర్శనం ద్వారా కలిగిన నూతనోత్సాహంతో, నవచైతన్యంతో తాము సాధించిన ఆంతరంగిక సౌందర్యానికి ప్రతీకలుగా గంభీరము మనోజ్ఞము అయిన కళా ప్రపంచాన్ని బౌద్దులు సృష్టించారు.

ఆంధ్రదేశంలోని బౌద్దక్షేత్రాలన్నింటిలో సుష్రసిద్ధమయింది ధాన్య కటకం. దాన్నే అమరావతి అని ప్రస్తుతం వ్యవహరిస్తున్నాం. బౌద్ద జాతక కధలతో తేలివాసహనదికి దక్షిణాన ఉన్నట్టు పేర్కొన్న ఆంధ్ర నగరియే ధాన్యకటకం అయి ఉంటుంది. అమరావతి

15

బౌద్ధము - ఆం(ధ్రము

కంటే పూర్వమే భట్టిప్రోలు జగ్గయ్యపేటలలో ఆంధ్ర శిల్ప సంప్రదాయాలకు అంకురార్పణ జరిగిన సూచనలు లభ్యమవుతున్నప్పటికీ ధాన్య కటకం సుమారాక వేయి సంవత్సరాల కాలం బౌద్దమతానికి శిల్పసంప్రదాయాలకు నిలయం కావడమేగాక ఇచట ఆంధ్ర శిల్పుల సృజినా సామర్థ్యం పరాకాష్టకు చేరి యితర ఆంధ్రప్రాంతాల శిల్పులకు వరవడి అయింది. నాగార్జున కొండ, చందవరం, గుమ్మడి దుగర్రు, గోలి మొదలైన ఇతర బౌద్ద క్షేత్రాల శిల్పానికి అమరావతీ శిల్పం మాతృక కావడమేగాక దూర దేశాల బౌద్ద శిల్పాన్ని కూడ ప్రభావితం చేసినందున ఆంధ్ర శిల్ప సంప్రదాయాన్ని అమరావతీ శిల్ప పద్దతి అని పిలవడం వాడుక అయింది.

చైత్యం అనేమాట చితి నుండి, స్తూపపదం స్తూప్‌ పదం నుండీ ఏర్పడినాయి. స్తుప్‌ అంటే ్రోగుచేయుట. మహాపురుషుల శారీరక అవశేషాలపై స్తూపాలు నిర్మించడం బుద్దునికంటే (ప్రాచీనమైన సంప్రదాయం. ఉదయన, గౌతమ వేదుల స్తూపాలతో 'శ్రావస్తినగరం సుందరమైనదని బౌద్దమత (గ్రంధాలు ్రశంసిస్తున్నాయి. తనకు గూడ స్తూపం నిర్మించమని బుద్ధుడు శిష్యులకు సందేశం ఇచ్చినట్టు మహా పరినిర్వాణ సుత్తలో స్పష్టంగా ఉంది. 06 ౪40 ౦26 ౧౪ ౮౦౦ 0౧౦౧౫౧౦ - నన్ను చూచినవాడు ధర్మాన్ని చూస్తాడని బుద్దుడు చెప్పినాడు. కాబట్టి స్టూపం స్మృతి చిహ్నంగా ఉండి బుద్దుని మహాత్యాగాన్ని, ప్రపంచంలోని దు;ఖోపశమనానికి అతడు సూచించిన అష్టాంగ మార్గాన్ని ప్రజలకు గుర్తుతెస్తుందని అతని ఉద్దేశం - ఆ మహదాశయంతోనే బుద్దుని ధాతువులపై అశోకుడు దేశము నలుమూలలా 84 వేల స్తూపాలు నిర్మించినాడని ప్రతీతి. ఆంధ్రదేశంలో సమాధి నిర్మాణ సంప్రదాయం అనాదిగా ఉన్నదని పైన పేర్కొన్నాము. అందుచే చైత్య నిర్మాణ సంప్రదాయం ఆంధ్రులకు కొత్తగాదు. బౌద్ధవాజ్యయంలో యక్షులు, నాగులు సిద్ధహస్తులుగా వర్షింపబడినారు. వీరు ఆంధ్రజాతులలోని వారే. తత్ఫలితంగానే ఆంధ్రదేశంలో పెద్దపెద్ద ' చైత్యాల నిర్మాణం జరిగింది. భట్టిప్రోలు, అమరావతి, నాగార్జున కొండ, గుడివాడ, గుమ్మడి దుగ్రులోనివి చాలా పెద్ద స్థూపాలు. అయితే (ప్రథమదళలో ఇవి కేవలం నిరాడంబరములైన స్మారక చిహ్డాలు మాత్రమే. 16

బౌద్దము - ఆంధ్ర శిల్పకళా సంప్రదాయములు శిల్పాలంకరణ ఉండేది కాదు. దృశ్యకళలు ఇంద్రియాలను విషయవాంఛలను ప్రకోపింపజేసే (ప్రమాదం ఉన్నందున వాటిని బుద్దుడు బహిష్కరించాడు. “కామాహి చిత్రా మధురామనోరమా. విరూపరూపేన మధేంతి చిత్తం.” సుందర కావ్య నిర్మాణాన్ని కూడబౌద్దులు నిరసించినారు. కావ్యప్రయోజనం రసానుభూతి కాదు, ధర్మానురక్తి కలిగించటం. సనాతన బ్రాహ్మణ మతస్సులు సైతం “కావ్యాలాపాంశ్చవర్జయేత్‌” అన్నారు. మూలబౌద్ధంలో, అంటే తరువాతి మాటల్లో హీనయానంలోని క్రమశిక్షణ అంత కరినమైంది. అమరావతీ స్తూపచరిత్రలో శిల్పపరిణామ (క్రమంలో విమర్శకులు కనీసం మూడు దశలను స్పష్టంగా చూస్తున్నారు. క్రీపూ.మూడో శతాబ్ది చివరనుండి మొదటి శతాబ్ది మధ్య మొదటిదశ. ఈ దశలో స్టూపం నిరాడంబరమై అల్ప ప్రమాణం కలదిగా ఉండేది. చక్రాకృతిలోని వేదిక - వేదికపై అండం - దానిపై హర్మిక. హర్మికలో సార్వభౌమాధికార సూచకమైన ఛత్రము. వేదికకు నాలుగు దిక్కులా ఆయక వేదికలు. వానిపై ఐదేసి చొప్పున ఆయక స్తంభాలు మొత్తం ఇరవై ఉండేవని చెప్పవచ్చు. ఆయక వేదికలు - స్తంభాలు-ఆంధ్రదేశంలో ముఖ్యంగా కృష్ణా తీర స్తూపాలకు ప్రత్యేక లక్షణంగా భావిస్తున్నారు. ఈ ఐదు స్తంభాలు గౌతమబుద్దుని జీవితంలోని పంచకల్యాణాలను సూచిస్తాయి. పుణ్యక్షేత్రాలలో స్తంభాలను ప్రతిష్టించడం చాల పురాతన సంప్రదాయం. బుద్దుని జీవితంతో ముడిపడిన ఐదుప్రదేశాల్లో లుంబిని, కపిలవస్తు, బుద్దగయ, సారనాథ్‌ కుళి నగర - బహుశా స్తంభాలు నిలిపేవారు. ఆ ప్రదేశాలన్నిటినీ దర్శించడం సాధ్యంకాని వారు స్తూపాలకు అనుబంధంగా ఆయక స్తంభాలు నిలిపేవారని ఒక సూచన - కాని ఇవి దీపస్తంభాలని హర్మికలోని ధాతువులకు వెలుగునిచ్చే విధంగా ఈ స్తంభాలపై దీపాలుంచే వారని మరొక సూచన. ఏమైనా ప్రధమ దశలోని స్వల్ప శిల్పాలు బార్జ్హాత్‌, సాంచీ శిల్పాలకు సన్నిహితంగా ఉంటాయి. ఇటీవల అమరావతిలో దొరికిన ఒక శిల్పాన్ని విమర్శిస్తూ నాటి పురావస్తు శాఖాధ్యక్షుడైన ఎన్‌. ఘోష్‌ - బార్హాత్‌-కంటే ముందుగానే

అమరావతిలో శిల్చకళాసృష్టి (ప్రారంభమై ఉంటుందని సూచిస్తాడు. క్రమంగా బౌద్దంలో మార్పులు వచ్చాయి. బుద్దుని పరి నిర్వాణానంతరం వంద

[7

శోద్దము - ఆంధ్రము సంవత్సరాలకే బౌద్దసంఘం థేరవాద మహాసాంఘిక శాఖలుగా చీలి పోయింది. మహాసొంఘికుల్లో స్టానిక విభేదాలతో భిన్న శాఖలేర్పడినాయి. చైత్య నిర్మాణంలో నైపుణ్యం ప్రదర్శించిన ఆంధ్రదేశంలో చైత్యకవాదం ప్రబలింది. అమరావతి చైత్యకవాదానికి కేంద్రమయింది. బౌద్దసిద్దాంతాల్లో, విశ్వాసాల్లో, ఆచారాల్లో వచ్చిన మార్పులు ఆంధ్ర శిల్పంలో ప్రతిఫలించినాయి. స్మారక చిహ్నమైన స్తూపం ఆరాధ్య వస్తువైంది. దీనితో స్తూపాలంకరణ ప్రారంభమయింది. వైత్యక వాద ఆచార వ్యవహారాలకు లోకోత్తర వాదం తాత్వికమైన ఆధారం అయింది. తథాగతుడు - మార్గ దర్శకుడు అయిన గౌతమబుద్దుడు

  • లోకోత్తరుడు, మహాపురుషుడు, ఆరాధ్యుడు అయినాడు. గౌతమ బుద్దుని విగ్రహాలు (ప్రతిష్టించడం జరగలేదుకాని బుద్ధునికి చిహ్నంగా సింహాసనం, బోధివృక్షం, ధర్మచక్రం, 'త్రిరత్నం, బుద్దపాదాలు ఆరాధించడం ప్రారంభమయింది. ఆ చిహ్హాలతోటి శిలాఫలకాలు వేదిక చుట్టు అలంకరించ సాగినారు. వేదిక చుట్టూ ఉన్న శిలా కంచుకం (0౮౧9) ఈ యుగానిదే. ఈ యుగంతోనే బార్హాత్‌, సాంచీ సాంప్రదాయాలనుండి భిన్నమైన సంప్రదాయం అమరావతీ శిల్పులు రూపొందించసాొగినారు. సాంచీ, బార్హాత్‌' శిల్పాలలోని స్తబ్దతకు స్వస్తి చెప్పి చైతన్యవంతమైన సహజ సౌందర్యాన్ని రంగరించడానికి అమరావతీ శిల్పి పూనుకున్నాడు. బార్హా త్‌ శిల్పాల క్రింద ఆ శిల్పాన్ని వివరిస్తూ లేఖనం కనిపిస్తుంది. ఆమరావతి ప్రథమ దశలోనూ ఆ ట్టి లేఖనాలున్నాయి. క్రమంగా ఈ రెండో దశలో అమరావతీ శిల్పి ఆ లేఖనాలు (వ్రాయడం మాని శిల్పాలచేతనే మాటాడించినాడు. అంటే శిల్పం చూడగానే అందలి కథావస్తువు, భావం బోధపడేటంత సహజత్వం ఉట్టిపడేటట్లు శిల్పాలను మలచినాడు.

(క్రమంగా ్రీస్తుళకారంభ శతాబ్దాలలో మహాసాంఘిక, చైత్యకవాద సిద్దాంతాలు మహాయానంగా రూపొందింది. మహాయాన పరిణామం బౌద్దమత చరిత్రలో ఒక గొప్ప విప్లవం. ఆలోచనలో ఆచారాల్లో, ఆశయంలో బౌద్దులలో విప్లవాత్మకమైన మార్పుకు కారణమయింది మహాయానం. బుద్దుడు మహాదేవుడైనాడు. బోధిసత్త్య సిద్దాంతం ఏర్పడింది. తీర్ణయాత్రలు దానధర్మాల ద్వారా బుద్దుని కరుణ సంపాదించితే నిర్యాణం

18

బౌద్దము - ఆంధ్ర శిల్పకళా సంప్రదాయములు లభిస్తుందనే విశ్వాసం ఏర్పడింది. బోధిసత్వ సిద్దాంతం పునాది మీదనే అసంఖ్యాకమైన జాతకకథా సాహిత్యం ఏర్పడింది. ఒక్క మాటలో బౌద్దదర్శనం ఆకర్షణీయమైన మతంగా రూపొందింది. రాధాకృష్ణపండితుడు ర60609౧౧ ౪/63 6 (91010౧ 01 6|63563 00] ౧౦1౦/౧౧౮635.' అన్నాడు. కానీ ఈ అభిప్రాయం మహాయానానికి వర్తించదు. మహాయానం పామరుల మతం అయింది. మత విశ్వాసాల్లో వచ్చిన మార్పులతో నాటి నిర్మాణకార్య క్రమాల్లో శిల్చస్వభావంలో గొప్ప విష్టవం వచ్చింది. నాటి విశ్వాసాలకు అనుగుణంగా ప్రజలు బౌద్దస్టూపాలు నిర్మించడంలో వానిని అలంకరించడంలో అపూర్వమైన శ్రద్ద ప్రదర్శించినారు. అమరావతిలో ఈ యుగ శిల్పం శిలా ప్రాకారంలో కనిపిస్తుంది. ఈ (ప్రాకారాన్ని రెండో శతాబ్ది ఉత్తరార్హంలో నాగార్జునాచార్యుడు నిర్మించినాడని ప్రతీతి. పదమూడు అడుగులు ఎత్తుండే ఊర్హ్ష్యపట్టికలను కలుపుతూ, మూడు సూచీపట్టికలు, వానిపై మదురు ఉండేవి. ఈ కమ్మలు - మదురు పూర్తిగా శిల్పీకృతములే. (ప్రాకారాన్ని నాగార్జునుడే ఉద్దేశించినా ఇందలి వివిధ భాగాలను ప్రజలే దానం చేసినట్టు వానిపైని లేఖనాలవల్ల తెలుస్తుంది. ఆం(ధ్రదేశంలో మరే యుగంలోనూ మతసంస్థల నిర్మాణంలో పోషణలో ప్రజలు ఇంతటి (శ్రద్దాసక్తులు ప్రదర్శించలేదు. అందుచే మహాయాన శిల్పాన్ని ౧౦౧౮ ౨౫ 4|-ప్రజాశిల్బం అని చెప్పడంలో తప్పులేదు. మరో ముఖ్య విశేషం. మహాయాన ఆంధధ్రశిల్పులకు నిబంధనలు తొలగి స్వేచ్చలభించింది. వారి భావనా శక్తికి, సృజనశీలతకు శిల్ప నైపుణ్య (ప్రదర్శనకు అవకాశం అభించింది. కథావస్తువు కూడా అపారంగా లభించింది. జాతక కథలు, లలిత విస్తార - అశ్చఘోషని బుద్ధచరిత సౌందరనందకావ్యం, నాటికి బహుళ (ప్రచారం పొంది ఉంటాయి. అశ్చఘోషుని కావ్యాలలోని స్త్రీమూర్తులకు అమరావతీ శిల్పంలోని స్త్రీమూర్తులకు సన్నిహితమైన పోలికలున్నాయి. బుద్దుని జాతక కధలు - బుద్దుని జీవితంలోని వివిధ ఘట్టాలు - మాయాదేవి స్వప్నం మొదలు మహాసరి నిర్వాణం వరకు - ముఖ్యంగా పంచకల్యాణాలు శిల్పీకరించాడు. అమరావతీ శిల్నాలన్నీ లభించి ఉంటే బోధిసత్వ వ సౌజన్యం ౪ 9 స్ట్యశ్థేే ఆచార్య హరి శిపపమార్‌ రెక్స్‌ ప్రొఫెసర్‌, తెలుగు తీషార్టమెంట్‌

బౌద్దము - ఆంధ్రము చరిత్ర సమగ్రంగా బొమ్మల్లో ఉండేది. ప్రతి జాతక కథను ఒక దృశ్యకావ్యంగా మలచి నాడు అంతేకాదు ఆ కావ్యంలోని పాత్రలచే నటింపజేసినాడు. అమరావతి శిల్పంలోని ప్రత్యేకత 14109౧౧౪౧1 అని విమర్శకులంటారు. ఈ చైతన్యాన్ని భిన్న శరీర భంగిమల ద్వారా, అంగవిక్షేప చిత్రణల ద్వారా ముఖ భంగిమల ద్వారా సాధింప గలిగాడు. శరీరం ఎన్ని వంపులు తిరగగలదో ఆ వంపులన్నీ అమరావతీ శిల్చంలోని మూర్తుల్లో కన్పిస్తాయి. అందుచేతనే అమరావతీ శిల్పాన్ని దర్శించేటప్పుడొక నాటక (ప్రదర్శనను తిలకిస్తున్న భావన కలుగుతుంది. 106/1 ౧౪౮ అనే విమర్శకుడంటాడు - 16 ౧1965! ౧ ౧౪౧౦ంగిం ౦౫ ; ౧90100౮06౦ అని. మహాయానయుగ అమరావతీ శిల్పంలో ఆ లక్షణం స్పష్టంగా కన్పిస్తుంది. (ప్రేమ, జాలి, కరుణ, క్రోధం, అహంకారం మొదలైన భావాలను క్షిషములైన చిత్తప్రవృత్తులను శిల్పీకరించటంలో అమరావతీ శిల్సికి భారతదేశంలో మరే (ప్రాంత శిల్పికూడా సాటిరాడు. దీనితో శిల్పంలో సహజత్వం సాధ్యమవుతుంది. ౫|| ౧౦గ౧౫౬౪౭౧/ ౧9౦) 10 1950 0౧6౮ 0006 [59/0౧000౦౦ 6గ60 ని ౦0౧1౦ ద్వారా పరస్పర విరుద్దములైన భావాలను ఒకదాని ప్రక్క మరొకదాన్ని చిత్రించడం ద్వారా సాధించినాడు. ఇందుకు ఉదాహరణగా రెండు శిల్పాలను పేర్కొనవచ్చు. ఒకటి అళగిరి-దమనం రెండు మారధర్షణ శిల్పాలు. ఈ శిల్సాలలోనే మరొక ముఖ్య విశేష లక్షణం గమనించవచ్చు. కధను సంక్షిప్తంగా- $7౦010 1901గ౭౧1- ఒకే శిల్పంలోని రెండు ఘట్టాల ద్వారా కధ పూర్తిగా కన్నులకు గట్టినట్టు చెప్పడం. అమరావతీ శిల్పాలలోని ప్రీ పురుషులు నగరవాసులు, సౌందర్యమూర్తులు, తాము సుందరులమనే ఆత్మవిశ్వాసం ఉన్నవారు వారి ప్రతి భంగిమలోను పట్టణవాసంలోని సంస్కారం వెల్లివిరుస్తుంది. నగరజీవితంలోనిి సుఖాలపట్ట విలాసాల పట్ట ఆసక్తి స్పష్టంగా కన్పిస్తుంది. బార్హాత్‌ శిల్పం గ్రామీణ మని (౧౪౦ /96510॥0) అమరావతీ శిల్పం నాగరీకమని (6౧0౦౧) విమర్శకులంటారు. అందుకు కారణాలు 20

బౌద్దము - ఆంధ్ర శిల్చకళా సంప్రదాయములు దురూహ్యములుకాదు. ఈ శిల్పకేంద్రము మహానగరానికి సమీపంలో ఉంది. నగరజీవితం శిల్పికి నమూనా అయింది. రెండో కారణం శిల్పాన్ని పోషించినవారు వర్తక, హస్తకళాకార వర్గాలు ఐశ్చర్యంతో కలిగే సుఖాసక్తి భోగలాలసత్వం అమరావతీ శిల్పంలో ఉంది. భారతదేశ్రశిల్బం అంతటిలో అమరావతీ శిల్పం ౧౧౦5౪౦|101%4065 అంటాడు నీహర రంజన్‌రాయ్‌. అతని మాటల్లో “6 ఉగంయగ౧0౪/061౧1 9060119 0/601163. ౧౧019 011౧6 501గ* ౦౯౮౦1౧౮6 -0౧0160361] 1౧౦౧ ౦01 706 60101౧6 01 1౧౦౪6." అయితే ఒక విషయం గమనించాలి.. గౌతమ బుద్దుడు బోధించింది మధ్యమార్షము కఠోర నియమాల ద్వారా శరీరాన్ని హింసించడం (62౭1గ౧౦||1౦౦౮110౧) గాని విశ్చంఖల విలాస ప్రియత్వం (00 - గలంగ 9811 1౧౮౮1౮6౧౦౪) గాని కూడదన్నాడు. గృహస్థులను ప్రాపంచిక సుఖాలు వీడమని బోధించలేదు. అతడు సాధ్యాసాధ్యాలను దర్శించిన హేతువాది. మానవ జీవితాన్ని సుఖమయం చేయాలని తాపత్రయ పడిన మానవతావాది ఆ ధోరణిలోనే శిల్పి లౌకిక సుఖాలకు ఆధ్యాత్మిక శాంతికి సమతూకం సాధించడానికి ప్రయత్నించాడు, అమరావతీ ప్రభావం అనంతర దాక్షిణాత్యవాస్తు శిల్పాలు -1. సింహద్వారం 2. మకరతోరణం 3. వృత్తాశయ, ఆయితా'శ్రయ నిర్మాణాలకు నమూనాలు - కూడు, పంజర, శాల మొదలైన అలంకార విశేషాల - పైనే గాక, దేశాంతరాల - సింహళం, మలయా, ఇండోచైనా, ఇండోనేషియా మున్నగు దేశాలపై కూడా ప్రసరించింది. ఇండోవైనాలో అమరావతి, విజయపురి రాష్ట్రాలు ఉన్నాయి. ఇంతటి చైతన్యం, సృజనాత్మక సామర్థ్యం తరువాతి యుగాలలో ఏమయ్యాయి? సామాజిక శాస్త్రంలో, మతాల్లో, చరిత్రలో పరిశోధకులీ ప్రశ్నకు సమాధానం అన్వేషించాలి. న్‌ ఖు సౌజన్యం ₹ క్రీశ! అచార్య హరి శివకుమార 21 ర టైస్ట్‌ కొపెసర్క తెలుగు డిపొక్ట్‌మెంట్‌ కాకలీళ్యు ఏశ్వసిద్యాలయం, వరంగల్‌

  1. బౌద్దముతం బోధించిన డా సనుతాధర శ్రము బౌద్దం వాస్తవానికి ఒక మతరగా అవతరించినది కాదు. ప్రాయికంగా బౌద్దం ఒక దర్శనం. బ్రాహ్మాణ వాజ్మయంలో సయితం 'బౌద్ధదర్శన- మనేవ్యవహారం తరచు కన్పిస్తుంది. 'శా(స్తాలకు శాస్త్రం' అని దర్శనానికి నిర్భచనం. ఉపలభ్యమవుతున్న సమస్త విజ్ఞానాన్ని క్రోడీకరించి సమన్వయం చేయగా నేర్పడిన సిద్దాంతమే దర్శనం. సమకాలీక సమస్యలకు సమాధానాలు సూచిస్తూ వ్యక్తి జీవితానికి మార్గదర్శినిగా ప్రగతి శీలమైన నవసమాజ నిర్మాణ ప్రణాళికగా ఉపకరించటమే దర్శనానికి ప్రయోజనం. కాబట్టి దర్శనలక్ష్యం ఐహికమేగాని పారలౌకికం కాదు ఆనడం సమంజసం

బౌద్దం అవతరించిన కాలంలో- (క్రీపూ. ఆరోశతాబ్దంలో = సాంఘిక ఆర్థిక ఆధ్యాత్మిక రంగాల్లో అరాచకం ప్రబలి భారతదేశం క్లిష్ట పరిస్థితుల నెదుర్కొంటున్నది. సాంఘికంగా వివిధ స్థాయిల్లో సంఘర్షణ పెచ్చు పెరిగిపోయింది. వైదిక యుగంలో మొదలైన ఆర్య ఆనార్య జాతుల మధ్యవైరం సమసిపోలేదు. ఆర్యేతరులను దాసదస్యులని వైదిక వాజ్మయం వ్యవహరించింది. ఆర్యదాసదస్య పదాల్లోనే ఆర్యులు ఉత్తములని ఆర్యేతరులు అధములని అర్థం స్పష్టంగా ఉంది. ధర్మశాస్తాల్లోని "వైదేహికాదం[ధ్రమేదే బహిగ్హామ ప్రతిశ్రయై” అనే ఆవేశాలు ఆర్యజాతి అహంకారానికి నిదర్శనలు. ఇట్టి అహంకారాన్నీ ఆర్యుల ఆచారవ్యవహారాలని అనార్యులు (ప్రతిఘటించిన సందర్భాలు వైదిక వాబ్యయంలో తరచుగా కన్పిస్తాయి. ఈ (ప్రతిఘటనలో పర్గాజితులై నిస్సహాయులైన దాసదన్యులు పంచములుగా (గ్రామ బహి: ప్రదేశాల్లో నివసిస్తూ నీచవృత్తుల నవలంబిస్తుండేవారు. వీరిపట్ల అ(గ్రవర్థాల క్రూరప్రవర్తన మతంగ, కూటదంత మొదలైన

జాతక కథలనుండి తెలుస్తుంది.

22

బౌద్దమతం బోధించిన సమతాధర్మము సవర్షజుల్లో అ(గ్రవర్ధాలైన బ్రాహ్మణులు క్షత్రియులు ఒక వర్గం, వైశ్యులు శూద్రులు మరొక వర్గం - హీనవర్గం. ఈ వర్షవ్యత్యాసాలు సహజంగా వైషవ్యూలకు కారణమైనాయి. దీనికి తోడు యజ్ఞాల పేర (బ్రాహ్మణులు పన్నులరూపంలో క్షత్రియులు, వైళ్ళ జూద్ర వర్ణాల సంపదను హరించడంతో ఉభయవర్గాల మధ్య సుహృద్భావం మృగ్యమై ద్వేషం పెరిగింది. తిరిగి అగ్రవర్దాల్గో బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య అంటే మతాధికారానికి, రాజకీయాధికారానికీ మధ్య సంఘర్షణ వైదికయుగంలోనే ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. వళిష్టవిశ్వామిత్ర, జమదగ్ని కార్తవీర్యులగాథలీ సంఘర్షణలోని కొన్ని ఘట్టాలను సూచిస్తాయి. కురు పాండవ యుద్ధం సయితం (బ్రాహ్మణ పక్షప్రాతులైన కౌరవులకు తద్వ్యతిరేకులైన పాండవులకు మధ్య జరిగిన పోరాటంగా వ్యాఖ్యానిస్తారు. వాస్తవానికి పాండవ పక్షం వహించిన వాసుదేవ కృష్ణుడు (బ్రాహ్మణ మతాన్ని వ్యతిరేకించిన క్షత్రియ వీరుడే ! నాటి సాంఘిక సమస్యలను ఆర్థిక పరిణామాలు క్ర్రప్రతరం చేసినాయి. క్రీవూ. ఏడు ఆరుళతాబ్దాల్మో కాంస్యయుగం నుండి అయోయుగానికి దేశం పరివర్తన చెందడంతోవ్యవసాయమూ పరిశ్రమలు, వాణిజ్యమూ వికసించాయి. విస్తరిస్తున్న భిన్న ఆర్థిక కార్య[క్రమాల్లో ఆర్యేతర ప్రజల సహాయ సహకారాలు అవసరమైనాయి. అందుచేత బౌద్ధ వాజ్మయంలో కన్పించే గహపతి, కమర సెట్టి వర్గాలలో ఆర్యేతరులు అధిక సంఖ్యలో (ప్రవేశించడం జరిగింది. వైదిక యుగంలో ఆర్యగణాలలో నిగూఢమైన రక్తసంబంధ భావన సమైక్యానికి సాధనమైంది. కానీ మారిన పరిస్థితులలో ఆర్యేతరులను సమాజంలో లీనం చేయడానికి రక్తసంగృఖధ భావన ఉపకరించదు. అందుచేత గణ పరిధులను అతిక్రమించిన విసృత మానవతా సంబంధమైన కొత్తభావన ఆవసరమయింది. ఈ సమస్యల ఫలితంగా నేర్చడిన అందోళనయే గౌతమ బుద్దుని జీవిత కార్యక్రమానికి నేపథ్యం అయింది. నాటి సాంఘిక సమస్యలకు పరిష్కారంగా జాత్యహంకారాలు, వర్షవ్యత్యాసాలు లేక సమతా ధర్మంపై నాధారపడిన శాంతియుత సహజీవనం సాగించగల సామాజిక వ్యవస్థను సూచిస్తూ, అట్టి ఆదర్శ సమాజాన్ని స్వయంకృషితో సాధించగల శక్తి సామర్థ్యాలు మానవునకు ఉన్నవనే ఆత్మవిశ్వాసాన్ని బుద్ధుడు కలిగించాడు. అదే 23

బౌద్దము - ఆం(ధ్రము దర్శనకారుడుగా బుద్దునిలోని వైళిష్టం; అతడు బోధించిన బుద్ధధర్మంలోని ప్రత్యేకత! బుద్దుడు సంఘసంస్కొరాన్ని ప్రబోధించలేదు అనేది వివేచనతో కూడిన విమర్శకాదు. సమకాలిక వైదిక సమాజానికి ఆధారమైన వర్ణవ్యవస్థలో ఆర్యజాతి అహంకారం ప్రతిఫలిస్తుంది. వైదిక యుగానికి పూర్వమే దేశంలో అమలులో ఉన్న వృత్తి విభజనకు భాతి పరమైన వర్లభావాన్ని జతపరచి ఆర్యులు వర్షవ్యవస్థను రూపొందించారు. వీరిలో అగ్రవర్ణాల వారు 'దేవబంధువులు' వారిలో (బ్రాహ్మణులు భూదేవులు! అందుచే వారికి ప్రత్యేక హక్కులుండేవి. వర్షభావనకు జన్మహక్కులు జోడించి వ్యత్యాసాలతో కూడిన ఈ వ్యవస్థ దైవనిర్ణయంగా 'ప్రచారంచేయడంతో బుద్దుని కాలానికే పరివర్తనారహితమై సంఘర్షణశాత్మకంగా బ్రాహ్మణ సమాజం రూపొందింది. గౌతమ బుద్దుడే సామాజిక వ్యవస్థను, దానికి పునాదులైన సిద్ధాంతాలను తీవ్రంగా విమర్శించి తిరస్కరించాడు. జాతి వర్షవిభేదాలను గురించిన చర్చలు విమర్శలు 'బుద్దవచనం'గా ప్రసిద్దమైన నికాయాది ప్రాచీన బౌద్దవాజ్కయంలోను, అశ్చఘోషాది తాత్యికుల రచనల్లోను -కన్నిస్తాయి. తన 'వజ్రసూచి'లో అశ్చఘోషుడు వర్ణాల ఉత్పత్తిని గురించి పురుష సూక్తం'లోని గాథను పరిహసిస్తూ ఒకే తల్లితండ్రులకు భిన్న జాతుల వారు జన్మించడం సాధ్యమా? పనస చెట్టు కొమ్మల చివర కాసేకాయలకు, మూలంలో కాసే కాయలకూ గుణంలో వ్యత్యాసం ఉండడం సంభవమా? మొదటివి (బ్రాహ్మణకాయలు, చివరివి శూద్రకాయలూ అవుతవా? అని ప్రల్నిస్తాడు. సమకాలిక బ్రాహ్మణ కుటుంబాల చరిత్రల ఆధారంగా వారి జన్మ పవిత్రతను అంబట్ట సూత్రంలో బుద్దుడు అవహేళన చేస్తాడు. బుద్దుని విశ్లేషణ (ప్రకారం సమాజంలో రెండే రెండు వర్ణాలున్నాయి. ఒకటి (ప్రభువర్షం. రెండోది పాలిత వర్షం. అయితే వీరికి జన్మహక్కులు లేవు. పరిస్థితుల (ప్రభావం వల్ల ప్రభువులు- పాలితులు: పాలితులు- ప్రభువులు కావచ్చును. కాబట్టి పరివర్తన సమాజానికి సహజం అని మర్ముమనికాయలో సద్దుడు వివరిస్తాడు. ధనికులైన శూద్రులు (బ్రాహ్మణ క్షత్రియులను సేవకులుగా యమించుకొన్న వృత్తాంతాలు బుద్దుని కాలంలో అనేకం కనిపిస్తాయి. మయ్మిమనికాయలోనే కోసలాధీశుడైన ప్రసేనజిత్తు ప్రశ్నలకు సమాధానమిస్తూ భిన్న ర

బౌద్దమతం బోధించిన సమతాధర్మము

జాతులకు చెందిన వంట చెజకునుండి లభించే వేడిలో భేదం ఉండనట్లే (బ్రాహ్మణ, క్షత్రియ, వైళ్య- శూద్ర వర్ణాలు సాధన ద్వారా పొందే నిర్వాణ స్వభావంలో వ్యత్యాసాలు ఉండవని బుద్దుడు వివరిస్తాడు. మానవుడు శారీరక మానసిక రుగ్మతలకు గురి అవుతాడు. జాతి, వర్షలేక గోత్ర దురభిమానం తఊవ్రమైన మానసిక జాడ్యం వ్యక్తి వికాసానికి లోక కల్యాణానికి ఆ రుగ్మతను పూర్తిగా తాలగించటం జరూరు కర్తవ్యమని అంగుత్తరనికాయలో బుద్దుడు బోధిస్తాడు ధమ్మపదలో

నజటాపొ! నగోత్రేన

నజచ్చావోతి/ బ్రాహ్మణో!

యమ్‌పా! నచ్చళ్ళ! ధమ్మేచ!

సో నుచీచ! బ్రావ్మాణో!

జడలు ధరించినంత మాత్రం చేత (బ్రాహ్మణుడు కాడు. గాత్రాన్ని బట్టిగాని, జన్మచేతగానీ (బ్రాహ్మాణుడనబడడు. సత్యంతో ధర్మంతో సుచియైనవాడే (బ్రాహ్మణుడు అని అంటాడు. ఈ విధంగా వర్ష వ్యవస్థలోని వ్యత్యాసాలకు మూలమైన జన్మహక్కుల సిద్దాంతాన్ని తిరస్కరించి వ్యక్తి సౌశీల్యానికి బుద్దుడు ప్రాధాన్యం ఇస్తాడు. శీలవంతులైన వ్యక్తులే ఆదర్శప్రాయమైన సమాజానికి మూలం!

“అమరకోశం” బుద్దుని అద్వయవాదిగా వర్షిస్తున్నది. తాత్పికపరంగా బౌద్దం అద్వయవాదం. ఈ వాదం ప్రకారం ప్రాణికోటికి జీవం ప్రధాన లక్షణం. జీవం అదయం; అవిభాజ్యం. అందుచేతనే జీవుల సుఖదు:ఖాలకు వ్యక్తి హృదయం స్పందిస్తుంది. మైత్రి, కరుణ, ముదిత మొదలైన భావాలు ఉత్పన్నమవుతాయి. అయితే వృక్షాల్లోను, పశుపక్ష్యాదులలోను, భిన్న జాతులున్నాయి. కానీ మానవ జాతి ఏకైకము. శరీర వర్షము, కేశస్వభావం నాసికా స్వరూపము వంటి నామమాత్రమైన బాహ్యలక్షణాలను బట్టి మానవజాతిని ఉత్తమ జాతులు ఆధమజాతులు అని వర్లీకరించటం శాస్త్రీయం కాదు అని సుత్తనిపాత'లో వళిష్ట భరద్వాజుల మధ్య జరిగిన చర్చలో బుద్దుడు హెచ్చరిస్తాడు. జీవ ఐక్యాన్ని గుర్తించడం వల్ల పరాత్మ సమత సిద్దిస్తుంది. ద్వేషరహితము, (సేమపూరితమునైన సమాజం ఏర్పడుతుంది.

తాను ఊహించిన సాంఘిక సమ సమాజానికి నమూనాగా బుద్దుడు బౌద్ద సంఘాన్ని

25

బౌద్ధము - ఆంధ్రము నిర్మించాడు. అందులో సభ్యత్వానికి జాతి వర్ల వివక్షలు లేవు. నేరస్తులు, వ్యాధిగ్రస్తులు మినహా అందరికీ అందులో ప్రవేశార్హత ఉంది. కొండబ్ఞ మొదలైన పంచవర్గీయులు బ్రాహ్మణులు, అనాధ పిండకుడు ్రేస్టి ఉపాలి మంగలి; ప్రథమ సంగీతిలో వినయపిటకాన్ని ఉపాలి సంకలనం, చేశాడు, ఆమ్రపాలి వేశ్య జీవకుడు వేశ్యాపుత్రుడు. ధీరగాధల్లో కన్పించే పున్నా, పున్నికా బానిసకన్యలు. దీరగాథల్టోని సువిశ వీధులూడ్చే కడజాతివాడు. అంగుళిమాలుడు పరమ కిరాతకుడైన దారిదోపిడి దొంగ. వీరందరికీ బౌద్ద సంఘంలో సమానమైన స్థానం ఉంది. సముద్రాన్ని చేరిన నదులు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లే బౌద్దంలో చేరిన వీరు తమ గత చరిత్రను కోల్పోయి కేవలం మానవులుగా మిగులుతారు. బౌద్ద ధర్మ (ప్రభావం సుమారు ఆరు శతాబ్దాల కాలం దేశ ప్రజలపై ప్రభుత్వాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ఇంచుమించు భారతదేశాన్ని సమైక్యం చేసే తన ప్రభుత్వానికి ధర్మాన్ని గీటురాయిగా చేసిన అశోకమౌర్యుడు దండ సమత వ్యవహార సమతా నెలకొల్పడాన్ని అంతే న్యాయం దృష్టిలో శిక్షాస్టృతి దృష్టిలో అందరూ సమానులేననే విధానాన్ని ప్రవేశపెట్టిన్లు అతని శాసనాలు చాటుతున్నాయి. బౌద్ధయుగంలో వర్షవ్యవస్త చిట్టెం గట్టిన. సూచనలు-లేవు. పరివర్తనకనువైన మార్దవం సమాజానికి ఉండేది. 1. బ్రాహ్మణులు సమాజంలో ప్రముఖ స్టానం వహించిన సూచనలు కన్పించవు. ప్రజలు తమ తమ కులాల పట్ల శ్రద్దాసక్తులు ప్రదర్శించిన వారు కాదు, నాటి దాన శాసనాల్లో దాతలు తమ తమ వృత్తులను మూత్రమే గాని వర్ణాలను (ప్రస్తావించినట్టు ల - ణి కన్పించదు. క్రీస్తు శకం ఒకటి రెండు శతాబ్దాలకు చెందిన ఒక ధాన్యకటక శాసనం (ప్రకారం విధికుడనే చర్మకారుడు - అంటే కడజాతి వ్యక్తి అచటి బౌద్ద క్షేత్రాన్ని సకుటుంబంగా దర్శించి మహావైత్యానికి పూర్ణఘట శిల్పఫలకాన్ని దానం చేశాడు. బౌద్దం ప్రబోధించిన ఆచరించిన సమతా ధర్మానికి ఇంతకు మించిన నిదర్శనం అక్కరలేదు, అందుచేత; బుద్దం శరణం గబ్బామి ధర్మం +రణం గచ్చామి నంఘం శరణం గ్‌చ్చ్బామి ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో 26

ఆర్ష 5. బౌద్దయుగ వాస్తువు భారతీయ వాస్తు చరిత్రలో హరప్పాయుగం తరువాత గణనీయమైైనది బౌద్ధయుగం. వైదికయుగంలోని నిర్మాణాలు దారు పటల నిర్మాణాలై నశించినందున వాని స్వరూప స్వభావాలు తెలియవు. ్రీస్తు పూర్వం మూడు నాలుగు శతాబ్దాలలో బౌద్దులు తమ ధర్మ ప్రచారానికి కళను పరిచారికగా చేయడంతో వాస్తు చరిత్రలో ఒక కొత్త ఆధ్యాయం ప్రారంభమయింది. మానవ కల్యాణార్హమై ధర్మప్రచారక చక్రవర్తిగా మారిన అశోక మౌర్యుడే బౌద్ధశిల్పానికి తద్వారా చారిత్రకంగా భారతీయ శిల్పానికి శ్రీకారం చుట్టినాడు. అది మొదలు ఒకవేయి సంవత్సరాలు బౌద్ధం భారతీయ కళారంగంలో సువర్ష యుగాన్ని సృష్టించింది. శాశ్యతమైన నిర్మాణమే లక్ష్యమైన బౌద్దులు తమ కళాసృష్టికి సైతం శాశ్వతత్వం చేకూర్చే ఆశయంతో దారువును విసర్జించి గండశిలను స్వీకరించినారు. ప్రాచీన కాలంలో ఈజిస్ట్‌, (గ్రీస్‌, రోమ్‌ దేశ ప్రజలు శిలావాస్తువులు నిర్మించినారు. కాని స్వతంత్రము పరిపుష్టమునైన భావనాశక్తిలోను, సృజనా వైవిధ్యంలోను నిర్మాణ కాశల్యంలోను భారతీయ బౌద్దులకు మరెవ్వరూ సరితూగలేరని పాశ్చాత్య విమర్శకులు "సైతం అంగీకరించిన విషయమే. శీల, సమాధి, ప్రజ్ఞలతో పరిపక్వమైన బౌద్దుల స్వరూప గాంభీర్యానికి అంతప్పాందర్యానిక్‌ (ప్రతినిధులుగా నిభిచినాయి. వారి వాస్తు శిల్ప కళాఖండాలు. బౌద్దుల నిర్మాణాలను స్తూపములు, చైత్య గృహాలు, విహారములు అని వర్గీకరించవచ్చు. తిరిగి ఈ త్రివిధ నిర్మాణాలలో కొండల్లో తాలిచినవి ఇటుకలతో నిర్మించినవి అని రెండు రకాలు. ఈ ఉభయ నిర్మాణాలలోను ముఖ్యంగా నాటి గుహాస్తూపములలో శిల్పులు ప్రదర్శించిన ప్రతిభా విశేషాలు అసాధారణమైనవి. కొయ్య నమూనాను క్‌

బౌద్దము - ఆంధ్రము ముందుంచుకొని పర్వత సానువుపై నుండి అదోముఖముగా గుహలను తొలిచే వారు. ఈ కార్యక్రమంలో నాటి. విశ్వకర్మల ఏకాగ్రత వారి పనిముట్ట నైళిత్యము చాల ప్రశస్తములు. ఇక ఇటుకలతో లాదులు లాగడంలోను అర్హవృత్త ద్వారాలను నిర్మించడంలోను నాటి తాపీ పనివారు సిద్దహస్తులనిపించుకొన్నారు. నాటి ఇటుకలు సైతం పెద్దఏి. భట్టిప్రోలు స్తూపంలో వాడిన ఇటుకల కొలతలు 14౫8౫4 అంగుళాలు. శంఖాకృతి ఇటుకలు, మూలల ఇటుకలు మొదలైన రకాలు ఉండేవి. గుహ నిర్మాణాలు మహారాష్ట్రంలో ఎక్కువ. ఇతర ప్రాంతాల్లో ఇటుకల నిర్మాణాలే ఎక్కువగా కన్పిస్తాయి. స్తూసములు: మహా వైత్యము దానిని పరివేష్టించిన చిన్న స్తూపముల్లు బౌద్దక్షేత్రాలలో ఆరాధ్యవస్తువులు. చితినుండి చైత్యము, స్తువ్‌ నుండి స్తూపము వచ్చినాయి. స్తువ్‌ అనగా పోగుచేయు అని అర్థము. ఈ మాటల నల్ల స్తూప చైత్యాలు శారీరక అవశేషాలపై నేర్చడిన- కట్టడాలు అని తెలుస్తున్నది. అదేకారణంగా వీనిని ధాతుగర్భాలు అనే వారు. ఈ-పదమే బర్మా సింహళాలలో 'డాగోబా” అయింది. శారీరక స్తూపములేగాక పారిభోజక, ఉద్దేశిక స్తూపాలను గూడ నిర్మించే వారు. బౌద్దాచార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించినవి పారిభోజకములు. కేవలం స్మృతి చిహ్నాలుగా నిర్మించినవి ఉద్దేశిక స్తూోపములు. బుద్ధ ధాతువులపై అశోక మౌర్యుడు ఎనభై నాల్లువేల స్తూపాలను నిర్మించినట్టు ప్రతీతి. వీనిలో సుప్రసిద్దములైన సాంచీ, సారనాథ్‌, బార్డుత్‌, భట్టిప్రోలు, అమరావత్రీ స్తూపాలు ఉండి యుండవచ్చు. స్టూపొన్ని గుండ్రని వేదిక మీద నిర్మించే వారు, వేదికలోసల ధర్మ చక్రాకృతిలోగానీ. స్వస్తిక రూపంలోగానీ గోడలు కట్టి వాని మధ్య ఖాళీస్టలంలో మట్టి కంకరపోసి దిమ్మెస చేసేవారు. వేదికపైన ఎత్తయిన అండం ఉండేది, ఇది బోర్లించిన భేరీవలె ఉంటుంది. అండంపైన హర్మిక, హర్మికలో ఒకటి గానీ అంతకు మించి గానీ ఛత్రములుండేవి. హర్మికలోనే ధాతువును నిక్షేపం చేసేవారు. స్తూపాన్ని పరివేష్టించి శ్రీవీథి అనే ప్రదక్షిణ పధము దాని చుట్టూ ప్రాకారము (ప్రాకారంలో నాల్లు దిక్కులా నాల్లు ద్వారాలు ఉంటాయి. ఒక అధిష్టానం మీద స్తంభాలు నిలిపి మూడు వరుసల అడ్డ కమ్మీలతో వానిపైన మదురు వంటి ఉష్ణీషంతో ప్రాకారాన్ని అమర్శేవారు. 28

బౌద్దయుగ వాస్తువు సాంచీ స్తూపానికి వేదిక మీద మరొక ప్రాకారము వేదికను చేరడానికి సోపాన పంక్తి ఉన్నాయి. ప్రాకార శిలపై కమలము, పూర్ణకలశము, బౌద్ద జాతక కధలూ మనోహరంగా చెక్కేవారు. ఉత్తరదేశ స్తూపాలకు ఆంధ్ర స్తూపాలకు కొన్ని అంశాలలో వ్యత్యాసం కన్పిస్తుంది. సాంచీ స్తూప ద్వారములు నాలుగూ శిలాతోరణాలతో నేర్చడినవే. వీనిపైనున్న శిల్ప సంపద చాల అద్భుతమైనది. ఆంధ్ర స్తూపాలలో తోరణాలు అరుదు. కాని ద్వార స్తంభముల మీద సింహము అధిష్టించి ఉంటాయి. 'సింహద్వారము' అనే మాటకు ఈ సంప్రదాయమే కారణమై ఉంటుంది. సింహద్వారముల కెదురుగా స్తూపవేదిక నంటియుండిన దిమ్మెపై బుద్దుని జీవితములోని పంచ కల్యాణములను సూచించు ఐదేసి ఆయక స్తంభములను నెలకొల్పే వారు. ఆయక వేదికలు, ఆయక స్తంభములు ఆంధ్ర స్తూపములలోని ప్రత్యేక విశిష్ట లక్షణము, స్తూపముల ప్రమాణంలో సైతము చాల వ్యత్యాసములున్నాయి. గోలిస్తూపము ఎత్తు ఎన్మిది అడుగులు మాత్రమే. సారనాత్‌లోని ధర్మరాజ స్తూపము నూరడుగుల ఎత్తున్న కట్టడము. భారతదేశ స్తూపములన్నింటిలోనూ పెద్దది అమరావతీ స్తూపము. ఆరువందల అడుగుల (ప్రాకారంతో 138 అడుగుల వ్యాసంప్టై నూరడుగుల ఎత్తునకు నిర్మింపబడి అపార శిల్ప సంపదతో. విరాజిల్లిన అమరావతీ స్తూపం బౌద్ద ధర్మ మహోన్నతికి తార్కాణమై దేశీ దేశాంతర తైర్జిక హృదయాలలో చెరగని ముద్ర వేసింది, ఏకశిలా స్తూపాలు చాలా వరకు ఉద్దేశిక స్తూపాలే, ఇట్టివి భాజా, సంఘరములలో ఉన్నాయి. సంఘరంలో ఒక కొండను ఉద్దేశిక స్తూపాలుగా మలచివేసినారు. ఇదే జావాలోని బొరొబుదురుకు నమూనా అయిన లింగాలమెట్ట! చైత్య గృహాలు: బౌద్దుల పూజామందిరాలే చైత్య గృహాలు. వీనిలోని పూజా వస్తువు చైత్యమైనందున వీనికా పేరు వచ్చింది. వీనిలో కూడ కొండల్లో తొలిచినవి, ఇటుకలతో కట్టినవి రెండు రకాలు ఉన్నాయి. 29

బౌద్దము - ఆం(ధ్రము మొట్టమొదటి ఇటుకల చైత్యగృహం, అశోకుని కాలం నాటిది, రాజస్థాన్‌లో బైరాట్‌ చెంత బయల్పడింది. ఇటుకల వైత్యగృహాలు ఆంధ్రదేశంలో పలుచోట్ల బయల్పడినాయి. కాని వాస్తు వైశిష్ట్రం ఉన్న కళాఖండాలుగా ప్రసిద్ది చెందినవి గుహాలయాలే. వీనిలో చాలా భాగం మహారాష్టలోనే ఉన్నాయి. బుద్ధగయ చెంత బరాబర్‌ కొండల్లో అశోకుడు తొలిపించిన సుదామ లోమళశబుషి గుహలే మన దేశంలో మొదటి గుహలు. అదే కాలానికి చెందినవి గుంటుపల్లి గుహాలయాలు. క్రమంగా గుహాలయ వాస్తువు భాజా, బేడ్చ, జన్నార్‌: విఠల్‌కోరా, కన్‌హేరీ, కార్డాలలో వికసించి అజంతా ఎల్జోరాలలో పరిణతి పొందింది. గుహాలయాలన్నింటిలో తలమానికం వంటిది కార్గా చైత్యాలయం. చైత్య గృహంలో మూడు భాగాలుంటాయి. మొదటిది ద్వారప్రవోష్టం; దాని వెనుక ఆంతరాళం వంటి దేహాళి; ఆ తరువాత చైత్యాలయం, సాధారణంగా చైత్యగృహం దీర్హగోళాకృతిలో ఉంటుంది. పైకప్పు గూడువలె ఉండి కమ్ములు గలిగి ఉంటుంది. కొన్ని చోట్ట కప్పులో కొయ్యపలకలను అమర్శేవారు. చైత్యగృహం నిడివిని స్తంభ పంక్తి మూడు విభాగాలుగా చేస్తుంది. మధ్యభాగము గర్భాలయ విభాగము; ఇరువైపుల స్తంభముల కావల వసారావంటి ప్రదక్షిణ పథము. కార్దా చైత్యాలయంలో ఈ స్తంభాలు మూలంలో కలశంతో శిరమున గజములు సింహములతో సర్వాంగ సుందరంగా ఆలయానికి (ప్రత్యేక శోభను చేకూరుస్తున్నాయి. దేహళి నుండి గర్భాలయంలో నికి మూడు ద్వారాలున్నాయి. మధ్య ద్వారము గర్భగుడిలోనికి, పార్టుద్వారములు ప్రదక్షిణపథంలోకి దారితీస్తాయి. చైత్యాలయం మధ్యలో ఏకశిలా నిర్మితమైన చైత్యం ప్రత్యేకంగా నిలిచి ఉంటుంది. హీనయాన చైత్యాలు నిరాడంబరాలు. అయినప్పటికీ స్తూపంలో వేదిక, ప్రాకారము అండము, హర్మిక కన్పించేటట్టు మలచి హర్మికలో దారు ఛత్రాన్ని అమర్చేవారు, మహాయానులు స్తూపముఖంలో బుద్దుని ప్రతిమను రచించేవారు. అజంతాలో మహాయాన 30

బౌద్దయుగ వాస్తువు గుహ లెక్కువ ఉన్నాయి. చైత్యగృహంలో మిక్కిలి ఆకర్షణీయమైనది గుహ ముఖం. అందులోనూ ద్వారానికి పైభాగంలో గు(ర్రపునాడా లాగా ఉండే చైత్యవాతాయనం, చైత్యాలయంలోనికి గాలీ వెల్తురు (ప్రసరించడానికిది చక్కగా ఏర్పాటు. వాతాయన ద్వారం మీద పడగవంటి చూరు ఉండటంచేత వానగానీ సూర్యరశ్మిగానీ లోపల ్రవేశించదు. ఈ వాతాయనం అనేక పరిణామాలు పొంది 'కూడ” అనే ఆకారంలో హిందూ దేవాలయాలపై అలంకారంగా (ప్రత్యక్షమయింది. కార్చా గుహాలయానికి ఎదురుగా రెండు సంహ స్తంభాలు మలచబడినాయి. నేటి ధ్వజస్తంభానికి మాతృకలై యుండవచ్చును. విహారములు: విహారములు బౌద్ద భిక్షువుల వర్జాక్రాల నివాసాలు. సాధారణంగా వీనిని మహానగరాలకు అనతి దూరంలోను శాశ్ళతమైన నీటి వనరులకు సమీపంలోనూ నిర్మించే వారు, బుద్ధుని కాలంలో వర్షావాసాలు ఆరామాల మధ్య ఉండేవి. నాటి జేతవన, వేలువన విహారాలు చాల ప్రసిద్దములు, క్రమంగా పర్వతాల మీదకు నదీ తీరాలలోను విహారాలు నిర్మించడం ప్రారంభమయింది. ఒకే (ప్రాకారంలో పెక్కు నిర్మించడం (ప్రారంభమయింది. ఒక్తే ప్రాకారంలో పెక్కు విహారాలున్నప్పుడు మహావిహారం అనేవారు. అమరావతి, శ్రీపర్వతం, నాలందాలలోనివి మహా విహారాలు. మహారాష్టంలో నాసిక్‌, కన్నేరి, కార్లా అజంతా, ఎల్జోరాలలోనూ ఆంధ్రదేశంలో గుంటుపల్లి సంఘరములలోను గుహావిహారాలున్నాయి. వీనిలో హీనయాన విహారాలు చాల నిరాడంబరాలు. మధ్య విశాల (ప్రాంగణమూ - దానికి మూడువైపులా భిక్షువుల నివాసములతో, ఆ విహారాలు హరప్పా ఇండ్లను గుర్తుకు తెస్తాయి. గదుల గోడలలోనే సెజ్జలు, తలగడలు, నీటికుండ్లు అమర్చేవారు. మహాయాన విహారాలలో మధ్య [ప్రాంగణం స్తంభ మంటపంగా మారిపోయింది. రెండు మూడు అంతస్తుల విహారాలు కూడా ఉన్నాయి. ఎల్టోరాలోని దోతల్‌ తీన్‌తల్‌ విహారాలు చాల పెద్దవి. ఇటుకల నిర్మాణాలైన విహారాలు దేశంలో అనేక ప్రాంతాల్లో బయల్పడినాయి. విహార నిర్మాణంలో సైతము ఉత్తర దక్షిణ దేశాల మధ్య భిన్నత్వం కన్పిస్తుంది. ఉత్తరాపథ తే

బౌద్దము - ఆంధ్రము విహారాలలో స్తూపానికి దక్షిణంగా భిక్షు నివాసాలూ ఆ రెంటికీ మధ్య ఉద్దేశిక స్తూపాలూ, భిక్షు నివాసాలకు పశ్చిమంగా సభా మంటపమూ ఉండేవి. ఆంధ్రదేశ విహారాలలో ఒక మహాచైత్యము దానికి ముందు ఇరువైపులా చైత్యాలయాలు వీని ముందు స్తంభమంటపము లేదా చతుళ్ళ్శాల వీనికి మూడు వైపులా భిక్షకుల గదులు ఉండేవి. గదులకు ముందు వరండా, ప్రతిగదికి ముందు సోపానాలు చంద్రశిల అమర్చే వారు.

రమణీయమైన ప్రశాంతమైన ప్రకృతి ఒడిలోని ఈ విహారాలలో నివసిస్తూ (ప్రపంచాన్ని శివంకరం చేసే సత్యాన్వేషణలో బౌద్దులు సాధించిన ప్రతి అంశము సుందరతరమై భావి తరాలకు వెలుగుబాటలు దిద్దింది. వారి నిర్మాణాలే మధ్యయుగ హిందూ వాస్తువుకు నమూనాలు కావడం అందుకొక నిదర్శనం. అంతటిలో కోత్తర కళాప్రపంచాన్ని సృష్టించిన బౌద్ద స్తపతులకు జోహార్లు.

చెబపకూ ఇకక చావా వానా 32

లికి, 6. ఆంధ్రదేశంలోని ప్రసిద బౌద్దక్షేత్రాలు యణ య

ఆం(ధ్రదేశంలో అసంఖ్యాకంగా బయల్పడిన బయల్పడుతూ ఉన్న బౌద్ద నిర్మాణ శిథిలావశేషాలు బౌద్దమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. బుద్దుని జీవిత కాలంలోనే బౌద్దానికి నీరాజనాలిచ్చి ఆదరించిన వారు ఆంధ్రులు. అశోకునకు పూర్వమే మహాచైత్యాలు నిర్మించి మహాయాన సిద్దాంతానికి మూలమైన చైత్యక వాదాన్ని సృష్టించినారు. బౌద్ధ ధర్మంగూడ ఆంధ్ర జాతిని సమైక్యమొనర్చి వారిలోని కళాదృష్టికీ సృజనా సామర్ధ్యానికి నిర్మాణ నైపుణ్యానికి తాత్త్విక జిజ్ఞాసకు అపారమైన అవకాశం కల్పించింది. సుప్రసిద్ద దార్భనికులైన నాగార్జునాచార్య ఆర్యదేవ భావవివేకులకు నివాస భూమి అయింది. థేరవాదులకు మగధవలె మహాయాన బౌద్దులకు ఆంధ్రదేశం పవిత్ర యాత్రాస్థ్టలమయింది.

బౌడ్డ భిక్షువులు దేశసంచారం చేస్తూ ధర్మ ప్రచారం సొగించినారు. వర్షాకాలంలో మాత్రం విహార సంఘారామాల్లో స్పిరనివాసులై సిద్దాంత చర్చలు జరిపేవారు. ఆరాధన నిమిత్తమై విహార సంఘారామాల్లో స్తూపాలు చైత్యాలయాలు నిర్మించుకున్నారు. స్తూపాల్లో ధాతుగర్భ, పారిభోజక, ఉద్దేశిక అనే మూడు రకాలున్నాయి. బుద్దునివి గానీ ప్రముఖ ఆచార్యులవి గానీ అవశేషాలపై నిర్మించినవి ధాతుగర్భములు. భిక్షాపొత్రాది వస్తు గర్భితములు పారిభోజకములు. ధాతు రహితములైన స్మారక చిహ్నాలు ఉద్దేశిక స్తూపాలు. మహాపురుషుల అవశేషాలపై నిర్మితములైన స్తూపాలు పుణ్యక్షేత్రాలయి దూరభూముల నుండి సైతము భక్తులను ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు. (క్రమంగా అట్టి స్తూపాలతో కూడిన విహారాలు తాత్షిక సిద్దాంత చర్చలకు, ధర్మనిర్హయానికి కేంద్రాలుగా విద్యాకళా పీఠాలుగా ప్రజాసేవకు దీక్షా సదనాలుగా ప్రసిద్ది చెందినాయి.

అసంఖ్యాక 'వైత్యవిహారాలతో మౌర్యయుగం నాటికే ఆంధ్రదేశం బౌద్ద ధర్మానికి

33

బౌద్దము - ఆం౦ం(ధ్రము పట్టగొమ్మ అయింది. ఆంధ్ర తీర్చాలలో ' అధిక భాగం కృష్ణానదీ ముఖద్వారంలోనే వెలసినాయి. అందుకాప్రాంత భూములు ఐశ్చర్యవంతాలు కావడమేగాక స్టానిక నాగ యక్షజాతి ప్రజల ఆదరాభిమానాలు కూడ కారణం. ఆ ప్రాంతంలో రాజ్యం చేసిన సాతవాహన ఇక్ష్వాకు చక్రవర్తులు (బ్రాహ్మణ మతోద్దారకులైనప్పటికీ వారి మహారాణులు మాత్రం బౌద్ధ ధర్మాన్నే పోషించినారు. బౌద్ధయుగంలో కృష్ణాతీర వర్తకులు విదేశ వాణిజ్యం సాగించి ఐశ్చర్యవంతులయి తమ ధనాన్ని బౌద్ద ధర్మ ప్రచారానికి వినియోగించినారు. ఆంధ్రదేశంలోని బౌద్ద నిర్మాణాలలో అధిక భాగం వర్తకులు పాటకజనము సామాన్య ్రజానీకము ప్రదర్శించిన ధర్మాసక్తి ఫలితమేననడంలో సందేహము లేదు. సర్వజనాదరణీయమై బౌద్ధం మహోజ్జుల ప్రజా ఉద్యమంగా వరిల్లింది. భట్టిప్రోలు ఆరిధ్ర బౌద్ద క్షేత్రాలన్నింటిలో బహుళా మిక్కిలి (ప్రాచీనమైనది భట్టిప్రోలు. చైనుల

ధర్మామృత కావ్యంలోని (ప్రతీపాలపురమే భట్టిప్రోలని చరిత్రకారుల నిర్ణయం. ఐనచో నిది 'ఇక్ష్యాకుల నాటి మహానగరం. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దిలో ఇచట కుబేరుడనే రాజుప్రముఖుడు 'నిగమసభ' సింహగోష్టీల సలహా సహకారాలతో రాజ్యపాలన సాగించినాడు. అతని పోషణలోనే ఇచట మహావైతన్యాన్ని నిర్మించినారు. 'బుద్ధశరీరరాణి నిక్షేప్తుం, 'బుద్ధశరీరాణి మహానీయాని శర్మణే' అనే శాసన వాక్యాలవల్ల ఈ మహావైతన్యం బుద్ద ధాతువు మీదనే నిర్మాణమైన దనడంలో సందేహం లేదు. ఇంత పవిత్రమైనప్పటికీ (ప్రాచీన యుగంలోనే భట్టిప్రోలు బౌద్దుల స్పృతిపథం నుండి చెరిగిపోయినట్టు కన్పిస్తుంది. అందుకు ఏదో ప్రబలమైన కారణం ఉండి యుండవలెను,

గుంటుపల్లి

భట్టిప్రోలుకు సమాకాలీనమైనదే గుంటుపల్లి. ఇది పళ్చిగోదావరి జిల్లా కామవరపు కోటకు సమీపంలో ఉంది. ఇచట కొండమీద చైత్య గృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. ఇందొక స్తూపంలో ధాతుకరండం దొరికింది. గుంటుపట్టి వైత్యాలయం 34

ఆంధ్రదేశంలోని ప్రసిద్ధ బౌద్దక్షేత్రాలు బుద్ధగయ చెంత అశోకుడు తొలిపించిన లోమశరుషి సుదామ గుహలను బోలి చాలా (ప్రాచీనమైనది. ఈ తీర్చం భక్తులను విశేషంగా ఆకర్షించేది అనడానికి ఇచట కన్పించే పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనము. అమరావతి దక్షిణాపథ బౌద్ద క్షేత్రాలన్నింటికీ తలమానికము అమరావతి, అమరావతిని బౌద్ద సారస్వతము, శాసనాలు, ధాన్యకటకం అని వ్యవహరిస్తాయి. శాతవాహనులకు రాజధానిగా భావింపబడే ధాన్యకటక నగరంలో స్తూప ఆరామ శోభితమైన (ప్రాంతం 'అమరావతి'గా వ్యవహరింపబడి క్రమంగా అమరావతిగా రూపాంతరం చెంది స్టిరపడిందని బావించవచ్చు. (ఈ.ధాన్యకటకవైత్వే జినధాతుర్ధరేభువి అనే మంజుశ్రీ మూలకల్ప వాక్యము, అమరావతిలో దొరికిన మౌర్యలిపిలోని శాసనాలు ఆధారంగా అశోకుడు నిర్మించిన అసంఖ్యాక స్తూపాలలో ధాన్యకటక మహావైత్యం ఒకటి అని కొందరి అభిప్రాయం. అశోకునకు పూర్వమే ఇచట స్తూపం ఉండి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. తృతీయ సంగీతి అనంతరం మహిష మండలంలో బౌద్ద ధర్మ 'ప్రచారార్థమై అశోకుడు పంపిన మహాదేవభిక్షు ఆమరావతినే కేంద్రంగా' చేసికొని ప్రచారం సాగించి ఉండవచ్చు. (క్రమంగా అమరావతి మహా సాంఘిక శాఖయైన వైత్యకవాదానికి ప్రధాన కేంద్రమయింది. చైత్యకవాదంలో పూర్వశైల, అపర్హైల లేక అపర మహావిన్హైల, ఉత్తర శైలశాఖ లేర్పడినాయి. ఆర్య మంజుశ్రీ నివాసంగా “గండవ్యూహ' పేర్కొన్న చిత్రమాలా ధృ్యజవ్యూహ విహారమే పూర్వశైలమని అది అమరావతేనని కొందరి అభిప్రాయము. చైత్యకవాదమే మహాయన సిద్దాంతానికి పునాది అయింది. మాధ్యమిక వాదంపై మహాయానాన్ని సుప్రతిష్టితం చేసిన బోధసత్త్య నాగార్జునాచార్యుడు అమరావతీ స్తూపానికి శిలాప్రాకారాన్ని నిర్మించినాడు. మహాయాన దళలోనే ఆంధ్రదేశంలో బౌద్దం మూడు పూవులు ఆరుకాయలుగ వర్ధిల్లింది. అమరావతి బౌద్దవిజ్ఞానానికి పీఠమై ప్రపంచ ఖ్యాతి నార్జించింది. చైనా యాత్రికుడైన హుయాన్‌సాంగ్‌ తాను ధాన్యకటక విహారంలో అభిథమ్మ 25

బౌద్దము - ఆం(ధ్రము పీట్రకాన్ని అభ్యసించినట్టు వ్రాసుకున్నాడు. ధాన్యకటక విద్యాపీఠం నమూనాగా టిబెట్‌ రాజధాని లాసాలో డాపంగ్‌ విశ్శవిద్యాలయరి నిర్మించినారని దానిలో సుమారు ఎనిమిది వేల మంది విద్యాభ్యాసం చేసే వారని లామాతారానాథుడు (వ్రాసిన దాన్ని బట్టి తెలుస్తుంది.

కళాన్షేత్రంగా అమరావతి ఆర్జించిన కీర్తి అజరామరం. ఆ మహావైత్యం ఆంధ్రుల నిర్మాణ కౌశల్యానికి గీటురాయి. స్తూప ఉపరితలాన్ని అలంకరించిన పాలరాతి పలకలు శిలా ప్రాకారంలోని సూచీ పట్టములు, ఉస్లీషము మనోజ్ఞ శిల్ప సంశోభితాలు. పశుపక్షిలతాదులను, స్త్రీపురుష మూర్తులను దర్శించడంలో అమరావతీ శిల్సి సాధించిన చైతన్యయుత సౌందర్య భావన ఆ భావనను శిలలో సాక్షాత్కరింప చేయడంలో అతడలవరుచుకొన్న సామర్హ్యము ,అద్వితీయములు. విశిష్ట లక్షణములతో అమరావతీ రీతిని సృష్టించి భారతీయ శిల్ప చరిత్రలో ఆంధ్రశిల్పి సుస్టిరమైన ఉన్నత స్టానాన్ని హాందగలిగినాడు. అమరావతీ శిల్పరీతియే ఆంధ్ర రీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్ప్చులకు వరవడియై మలయా, జావా, సమత్రా, సింహళాది దేశాలపై తన వైజయంతికలను (ప్రసరింపజేసింది. జగ్గయ్యపేట

అమరావతికి ఇరవై మైళ్ళ ఎగువన సాలేరూ కృష్ణా నదుల సంగమ స్థలానికి సమీపంలో ఉన్న వేటి జగ్గయ్యపేట సుప్రసిద్ధ ప్రాచీన బౌద్దక్షేత్రము. ఆ రోజుల్లో దీనిని ఎలగిరి అనే వారు. శాసనాలలోని ఉత్తరైైలం ఇదే అయివుండవచ్చు. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దిలోనే ఇచట మహావైత్య విహారాదులు వెలసినాయి. ఈ మహావైత్యాన్ని అలంకరించిన శిల్పాలు ఆమరావతీ రీతికి చెందినవే. వీనిలో పుణ్య శాలాశిల్పము మహామల్లపుర రాతిరథాలను, (స్త్రీ పురుష మూర్తులు అజంతాకుడ్య చిత్రాలను స్ఫురణకు తెస్తాయి. నాగార్జునకొండ

మహాయాన సిద్ధాంతకర్త బోధిసత్వ నాగార్జునునికై శ్రీయజ్జ శాతకర్ణి శ్రీపర్వత

36

ఆంధ్రదేశంలోని ప్రసిద్ధ బౌద్దక్షేత్రాలు మహావైత్య విభారాలను నిర్మించినాడు. శ్రీపర్వృత పశ్చిమ పాదంలోనే ఇక్షాకుల రాజధానిదైైన విజయపురి విలపిల్దుతూ ఉండేది. శ్రీపర్సత విజయపురి ప్రాంతమే నేడు నాగార్జునకొండగా (ప్రశస్తి వహించింది. ఇచటి మహావైత్యం బుద్ద ధాతువుపై నిర్మితమైనట్టు శాసనాధారం దొరికింది. శ్రీపర్వత్స విహారాన్నే 'పారావత' విహారమని. చైనా యాత్రికుడు షాహియాన్‌ పేర్కొన్నోడు. ఇది పర్వతసానువులో తాలిచిన ఐదంతస్తుల భవనమనీ, ఇందు విశ్వవిద్యాలయాన్ని (గ్రంథాలయాన్ని నాగార్జునాచార్యుడు నెలకొల్సినాడనీ వివరించినాడు. బౌద్ద ధర్మంతో బాటు నాగార్జున విద్యాపీళంలో ఆయుర్వేదము, రసాయనిక ఖగోళ శాస్త్రాలు బోధించేవారు. ఇందుకు నిదర్శనంగా ఇచటి (త్రవ్వకాలలో రసాయనిక శాస్త ప్రయోగాలకు ఉపకరించే పరికరాలు లభించినాయి. శ్రీపర్వత విహారం ఇక్ష్వాకు చక్రవర్తి వీరపురుష దత్తుని కాలంలో మహాక్షేత్రమయింది. అతని అంతఃపురాంగనలు స్తూపవిహార చైత్యాలయ శిలామంటప చతుశ్శాలలనేకం నిర్మించి శ్రీపర్వత క్షేత్రానికి నూతన శోభను చేకూర్చినారు. ఈ స్తూపాలు అమరావతీ రీతిలో మలచిన శిల్పాలతో అలంకృతములై నాగార్జున కొండను అమరావతికి మించిన కళాక్షేత్రంగా మార్చినాయి. ఇచటి విహారాలలో మహాయాన శాఖలకేగాక థేరవాదులకు సైతం నివాస సౌకర్యాలుండేవి. సింహళ విహారం ప్రత్యేకించి సింహళ థేరవాదులకు ఉద్దేశించినది. బౌద్దాంద్రుల ఉదార మత నహిష్ణుతకు, ఇంతకు మించిన నిదర్శనమక్కరలేదు. శ్రీ పర్వత శిఖరాల నుండియే మహాయాన ధర్మజ్యోతులు ఛైనా, గాంధార, సింహళాది. దూర దేశాలకు ప్రసరించినాయి. వేంగి పళ్చిమగోద్రావరి జిల్లాలో వేంగి ఆంధ్రుల మరొక రాజధాని నగరం. వేంగినే హుయన్‌సాంగ్‌ పింగ్‌ - కీ - లో అని ఉచ్చరించినాడు. పింగ్‌ - కి - లో సమీపంలోనే అచల అర్హతుడు ఇరవై సంఘారామాలు నిర్మించినాడనీ వానిలో మూడు వేల మంది బౌద్ధ భిక్షువులు నివసించేవారనీ కూడా (వ్రాసినాడు. ఈ ఆరామాలకు సమీంలోనే ఒక 37

బౌద్దము - ఆం(ధ్రము వైత్యగృహంలో నివసిస్తూ జనబోధిసత్తుడు తర్కశా'స్తం రచించినాడట. ఈ బోధసత్తుడే దిజాగుడు అని చరిత్ర కారులు భావిస్తున్నారు. మహాయాన శాఖయైన విజ్ఞానవాదానికి రూపం సంతరించిన మహనీయుడు దిజ్ఞాగుడే. నజ్రయాన కేంద్రాలు మహాయానంలో పూజాదికాలు (క్రమంగా వెర్రితలలు వేసి వజ్రయానంగా పరిణామం చెందింది. శాక్తేయ సంబంధమైన వామాచారాన్ని పోలిన చండత్రాలు వజ్రయానంలో (ప్రబలములయినాయి. ఆంధ్రదేశంలో రామతీర్దం, శాలిహుండం, సంఘరములలో వజ్రయాన చిహ్నాలు ఎక్కువగా కన్పిస్తాయి. వాస్తవానికి వజ్రయానానికి సయితం 'ధారణి కోట'గా ప్రసిద్దమైన అమరావతియే జన్మస్థలం. పై క్షేత్రాలను దర్శించినప్పుడు వజ్రయాన దుష్టాచార ఫలితంగా 'ప్రజాజీవితం నుండి బౌద్ధం బహిష్కృతమై పర్వత శిఖరాల నా(శ్రయించినదా అనిపిస్తుంది. అదే బౌద్దమత పతనావస్థలో చరమాంకము, “ఆరామతిర్హమే రామతీర్థమైనదని చెప్పవచ్చు. ఇది విశాఖపట్టణము జిల్లాలో విజయనగరానికి సమీపంలో ఉంది. ఇచటి గురుభక్తి కొండ, దుర్గకొండలసపై స్తూపవైత్యాలయాలతో ఆరు విహారాలు, పెక్కు ఉద్దేశిక స్తూపాలు ఉన్నాయి. శాలిహుండం (శ్రీకాకుళం జిల్లాలో వంశధారా నదిపై ఉంది. ఇచటి కొండపై స్తూపవిహారాదులు, తారా, మరీచీ మొదలైన వజ్రయాన దేవతా ప్రతిమలు బయల్పడినాయి. ఇచట విహారాన్ని 'కటవారామం' అనే వారని కొందరి అభిప్రాయం. సుమత్రా దీవిలోని విహారానికి గూడ 'టకహా' లేక 'శేదహ' అని పేరు. ప్రాచీన కళింగ రేవు పట్టణానికి చేరువలో ఉన్న శాలిహుండం నుండియే బౌద్ధం సునుత్రాకు పయనించి ఉంటుంది. సంఘరం అనే పేరు సంఘారామానికి బ్రష్టరూపమే. విశాఖపట్టణం జిల్లాలో అనకాపల్లికి రెండు మైళ్ళ దూరంలో బొజ్జన్నకొండ, లింగాలమెట్ట అనే రెండు కొండలమీద వెలసిన ఈ క్షేత్రంలో ఆంధ్ర బౌద్ధంలోని వివిధ పరిణామ దశలను గమనించవచ్చు. ఇచట గుహాలయాలు చాల ప్రాచీనమైనవి. కొండళిఖరాన్ని అధిష్టించి మహానైత్యము, దాన్ని 38

ఆంధ్రదేశంలోని ప్రసిద్ధ బౌద్దక్షేత్రాలు

పరివేష్టించి శిలాస్తూపాలు, వైత్యాలయాలు, బుద్దాలయాలు విహారాలు నిర్మించినారు. ధ్యానసమాధి, భూమిస్పర్శ ముద్రలలోనున్న బుద్ద ప్రతిమలున్న బుద్దాలయాలు ఇచటి ప్రత్యేకత.

బొజ్జన్న కొండ నానుకొని యున్నదే లింగాల మెట్ట. భక్తి తత్పరులైన బౌద్దభిక్షువులు కొండను వందలకాలది ఉద్దేశిక స్తూపాలుగా మలచి వేసినారు. ఈ లింగాలమెట్టయే జావాలోని బొరొబుదురు బౌద్ధక్షేత్రానికి నమూనా అయిందని ఒకవిమర్భ్శకుని అభిప్రాయం.

(క్రమంగా బుద్ధన్న బొజ్జన్న అయినాడు. ఉద్దేశిక స్తూప పర్వతమే లెంగాలమెట్టగా మారింది. ప్రజాదరణ కోల్పోయిన బౌద్దక్షేత్రాలు ఎంత సులభంగా శైవపరం చేయబడినవో ఈ పరిణామం వల్ల స్పష్టమవుతుంది.

ఆంధ్రదేశంలో బౌద్దం ప్రజా ఉద్యమంగా వర్రిల్లైనట్టు పైన పేర్కొన్నాము. అందుచేతనే పైన వర్ణించిన ప్రసిద్ద క్షేత్రాలేగాక గుమ్మడిదు[్రు, గుడివాడ, ఘంటసాల, విద్యాధరపురం, బుద్దాం, చినగంజాము, ఫణిగిరి, కొండాపూర్‌, మొదలైన తీర్చాలు అనేకం వెలయడంలో ఆశ్చర్యం లేదు. అమరావతితో సహా పంచారామాలు మొదట బౌద్దక్షేత్రాలేనని ప్రసిద్ది, మగధ విహార దేశం (బీహార్‌) అయినట్లే బౌద్దయుగంలో ఆంధ్రదేశం ఆరామ దేశమయింది.

వడా కడా

ఇటీవల పలనాడులో కేసానపల్లి దగ్గిర, ప్రకాళంజిల్దాలో చందవరం దగ్గిర, విశాఖపట్టణం సమీపంలో రెండు కొండలమీద స్తూప విహారాదులతో, బౌద్దక్షేత్రాలు బయల్పడినాయి. గుంటూరు సమీపంలో నాగార్జున విశ్చవిద్యాలయ ఆవరణను ఆనుకొని |క్రీ.ళ రెండో శతాబ్దికి చెందిన స్తూపశిథిలాలు, బుద్ధ విగ్రహాలు దొరికినాయి.

ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో 39

7, ప్రాచీన ఆంధ్ర నగరాలు - ధాన్యకటకము ఆంధ్రదేశ చరిత్రలో ధాన్యకటకానికి ఒక విశిష్టత, పవిత్రత ఉన్నాయి. (క్రీ: పూ॥ 3వ శతాబ్దం నాటి శాసనము ఈ ప్రదేశాన్ని 'ధమనకద' అని పేర్కొంది. ధొన్యకటక చరిత్ర విషయంలో ఇప్పటి వరకు లభించిన అతి (ప్రాచీన శాసనాధారం అదే. ధమనకద పదానికి పరిణతి చెందిన ఇతర పర్యాయ పదాలు 'ధనకద' 'ధనకటకో 'ధాన్యకటక' మధ్యయుగానికి చెందిన తాంత్రిక వాజ్యయాలయిన (అ) శేకోద్దేశతి' 'ధాన్యకటకాన్ని' (శ్రీధాన్య'గాను (ఆ) మంజాశ్రీ మూలతంత్ర 'శ్రీ ధాన్యకటక'గాను పేర్కొన్నాయి. టిబెట్టు వాజ్యయము బ్లూ ఆనల్స్‌ (866 4౧౧౫౩9) ధాన్యకటకాన్ని 'శ్రీస్టాన' అని పేర్కొంది. గౌతమి బాలథ్రీ నాసిన్‌ శాసనము 'సిరిథాన' కొండ గౌతిమీ పుత్రుని సామ్రాజ్యానికి ఆభరణము అని పేర్కొంది, బహుళ టిబెట్టు వాజ్యయము పేర్కొన్న శ్రీస్టానమే గౌతమీ పుత్రుని సాఘ్రాజ్యములోని సిరిథాన కావచ్చును. ప్రాచీన నగరమయిన ధాన్యకటకానికి పశ్చిను సరిహద్దులో నేడు 'ధరణి కోటి (గ్రామం ఉంది. దశబాల (బుద్దుడు) ధరణులను (మంత్రాలను) నిక్షిప్తము చేసిన ప్రదేశము కనుక 'ధారణికోటి (౧0 ౦ 01209) గా (ప్రసిద్ది చెందినదని సంప్రదాయము. ధారణికోట (క్రమంగా 'ధరణికోట'గా రూపాంతరం చెందింది. సుప్రసిద్ధ బౌద్దక్షేత్ర శిథిలాలపైన 18వ శతాబ్ది ఉత్తరార్హంలో నిర్మింపబడిన చిన్న పట్టణమే 'అమరావతి" ధాన్యకటక నామం పూర్తిగా మరుగున పడటానికి కారణాలు తేటతెల్లమే. మహాస్తూపము. స్తూపాన్ని అలంకరించిన మహోన్నత శిల్పసంపద కనుగొనబడినపుడు ఆ (ప్రాంతము అమరావతిగా పిలువబడుతోంది. అందువలన పురాతత్యవేత్తల చరిత్రకారుల రచనలలో 'అమరావతి స్తూపము", 'అమరావతి శిల్పము” అని చోటుచేసికొని ప్రసంచ ప్రసిద్ది గాంచినాయి. ధాన్యకటక నామము (ప్రజాస్కృతి డ్తీ0

ప్రాచీన ఆంధ్ర నగరాలు - ధాన్యకటకము నుండి దూరమయింది. ధాన్యకటకము వ్యవసాయ వాణిజ్య పారిశ్రామిక రంగాలలో ముందంజ వేసిన సంపన్నదేశము. బౌద్ద పరివ్రాజకులు ఆరామాలను విహారాలను సంపన్న నగరాల పమీపంలో నిర్మించే వారు. కారణం, నగర వాసుల ఆదరాభిమానాలే వారికి అండదండలు. అనేక ఆరామాలతో మహోన్నతమయిన బౌద్దక్షేత్రముగా ధాన్యకటకము విలసిల్లింది. 7700 విద్యార్థులతో విలసిల్లిన 'లాసా' విశ్చవిద్యాలయము ధాన్యకటక మహావిహార నమూనాపైననే నిర్మింపబడినదని లామా తారానాథుడు పేర్కొన్నాడు, ధాన్యకటకములోని ఒక భాగము అనేక ఆరామాలతో నిండియుండవచ్చుననీ, ఆ (ప్రాంతాన్ని 'ఆరామవతి' అనిపిలిచే వారనీ, ఆరామవతి (క్రమంగా అమరావతిగా రూపాంతరం చెందియుండవచ్చుననీ ఊహించటానికి అవకాశం లేకపోలేదు, కేవలము యిది ఊహాజనితమయిన అభిప్రాయము మాత్రమే. ధాన్యకటకములోని శైవ కేంద్రాన్ని గురించిన అతిప్రావీన శాసనాధారం క్రీ॥ 1 10వ శతాబ్ది నాటి తూర్పు చాళుక్యులది. ఈ శానసము దైవాన్ని (4010) 'అమరావతేశ్చరుడ' ని పేర్కొంది. అమరావతేశ్చర నామము 'ఏకా్రేశ్వర శబ్దాన్ని పోలి వుంది. విష్ణవ శైవ తెగ కాలాముఖులు అమరావతేశ్చరములో సింహపరిషత్తును స్థాపించి మత ప్రచారం చేసినట్టు ఆధారాలున్నాయి. కానీ, చేవతా ప్రతిమ ఉన్న పట్టణము అమరావతిగా పిలువబడలేదు. 'క్రీశః 640లో ఈ ప్రదేశాన్ని దర్శించిన చీనా యాత్రికుడు హుయాన్‌ సాంగ్‌ బౌద్ద విహారాలు నిర్మానుష్యముగా ఉన్నాయనీ, దేవునికి ఆలయాలు నెలుస్తున్నాయనీ వ్రాశాడు. ఈ ప్రదేశాన్ని (౭-౧౭-2-006-48) ధాన్యకటకము అని పేర్కొన్నాడు. అమరావతి అని ఎక్కడా (వ్రాయలేదు. అమరావతేశ్చరము (క్రమంగా 'అమరేశ్చరము' అయింది. అది ఒక దేవస్థానము మాత్రమే కానీ, (గ్రామ/ పట్టణ నామము కాదు. మధ్యయుగాల నాటి “కోట”

  • రెడ్డి రాజవంశీయుల శాసనాలలో ఆమరేశ్చర పదం తరచు కన్చడుతుంది కానీ 'అమరావతి' ఎక్కడా కన్పడదు..అమరేశ్చరుని భక్తులయిన కోట వంశస్థులు 'ధరణికోట
  • కోట వంశీయులు'గా చరి(త్రకెక్కారు గానీ “అమరావతి - కోట వంశీయులు'గా కాదు. (ధరణికోట అక్కడక్కడ 'దన్నలకోట'గా పేర్కొనబడింది) శ్రీలంక బౌద్ద బిక్షువు ధర్మకీర్తి న!

బౌద్దము - ఆంధ్రము

ధాన్యకటకములోని ఒక విహారాన్ని పునరుద్దరించినట్టు సిలోన్‌ కాండీ (0౬౧4) లోని ఒక

శాసనము ద్వారా తెలుస్తున్నది. కానీ ధర్మకీర్తి 'అమరావతి'ని ఎక్కడా ఉదహరించలేదు. 18ివ వతాబ్టీ ఉత్తరార్హములో జమీందారయిన రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు

అమరేశ్చరము (ప్రక్కన రాజుప్రాసాదాన్ని నిర్మించి వైజయంతీ మహల్‌ అని పేరు

"పెట్టాడు. ఇం(ద్రుని రాజ(ప్రాసాదము వైజయంతి, ఇంద్రుని పట్టణము అమరావతి. టె

అందుచేత తన రాజప్రాసాద పరిసరాల్గో అభివృద్ది చెందిన పట్టణానికి వెంకటాద్రి

నాయుడు 'ఆమరావతి' అని పేరుపెట్టాడు. అమరావతి నామచరి(త్ర యిది. విశిష్టచరిత్ర

కలిగిన ధాన్యకటక నామానికి గ్రహణం పట్టించిందీ అమరావతి నామమే.

ఆంధ్రుల చరిత్ర జన్మస్ట్రానంగా భట్టిప్రోలుతో సమానమయిన గౌరవ స్టానాన్ని

ధాన్యకటకము పొందింది. 'తేలివాహ' నది ఒడ్డున “ఆం(ధ్రవురి' ఉన్నట్టు: శేరివనిజ జాతకకథ' ద్వారా తెలుస్తోంది. సుప్రసిద్ద చరిత్ర కారుడు ౧6.౬౦ 0౧466%ఇగచేలివాహనది కృష్ణానదిగా గుర్తించాడు. (తేలివాహ = నూనెవలె నల్లగా ప్రవహించినది]. ఈ ఆధారము దృష్ట్యా ఆంధ్రపురి ధాన్యకటకమేననేది స్పష్టము, అశోక్షునిక్తి పూర్వమే ధాన్యకటకము బౌద్ధక్షత్రముగా విలసిల్లినట్టు ఇటీవలి పురాతత్త్య (త్రవ్వకాలు రుజువు చేస్తున్నాయి. ఈ కారణముగ అంధ్రపురి నామములో ధాన్యకటకము (ప్రాచీన బౌద్దవాజ్మయములో విశిష్ట స్థానాన్ని పాందటములో ఆశ్చర్యము లేదు. క్రీశ 300 నాటి ఒక శాసనము ఆంధ్ర పథానికి ప్రధాన కేంద్రముగా భాన్యకటకాన్ని పేర్కొన్నది. ఈ విధముగా ధాన్యకటకము ఆంధ్రదేశానికి ఆంధ్ర సంస్కృతికి కేంద్ర స్థానమయి విరాజిల్లింది.

(ఫ్రీపూః ౩వ శతాబ్దము నాటి ప్రామాణిక రచయితలు ఆంధ్రులకు 30 దుర్గాలున్నట్టు పేర్కొన్నారు; మరికొందరు ఆంధ్రులకు 30 రాజ్యాలున్హట్టు (వ్రాసారు. మహాభారత ఇతిహాసము ఆంధ్రాళ్ళి బహువః (ఆంధ్రులు అనేకులు) అని పేర్కొంది. ఈ ఆధారాలు దృష్ట్యా ఆంధ్రులు 30 తెగలుగా గణతంత్ర రాజ్యాలుగా ఉండేవారనీ ప్రతి గణతంత్ర దేశమూ ఒక దుర్గాన్ని (కోటను) పరివేష్టించి ఉండేదని స్పష్టమవుతోంది. దుర్గాలు

శై

ప్రాచీన ఆం(్ర నగరాలు - ధాన్యకటకము సంపదకు చిహ్నాలు. వ్యవసాయ పారిశ్రామిక వాణిజ్య రంగాలలో విశిష్ట కృషి ఫలితమే గణతంత్ర దేశాలు సిరిసంపదలతో తులతూగటానికి కారణము. అటువంటి దుర్గాలలో ధాన్యకటకము ఒకటిగా పురాతళ్ష్య (త్రవ్వకాలు, అనుమాన రహితంగా, స్పష్టంచేస్తున్నాయి. ధాన్యపు ఉనికి కీలకమయినది. సారవంతయయిన కృష్ణానదీ పరీవాహక డెల్టా ప్రాంతము; వరి ప్రత్తి మున్నగు అనేక ముఖ్య వ్యవసాయ వుత్పత్తులకు సుక్షేత్రం. సుదూర ప్రాంతాలను కలిపే ప్రధాన వాణిజ్య రహదారుల కూడలి. (1) సళ్చిమ దిశలోని 'పైదాన్‌. ఆపై ప్రాంతాలనుండి తెలంగాణా కుండా ధూళికట్ట, ఫణగిరి, నేలకొండపల్లి, జగ్గయ్యపేట (వేలగిరి) లను ఒక రహదారి కలుపుతుంది. (1 కళింగనుండి తూర్పుకోస్తా గుండా శాలిహుండం, రామతీర్థం, బావికొండ, గుంటుపల్లి, రామిరెడ్డిపల్లి, అల్లూరు లను కలిపే రహదారి. (11) & (1) వనవాసి, కంవి మున్నగు దక్షణాపథములోని పట్టణముల నుండి వేయబడినవి. వీటి అన్నిటి కూడలిగా ధాన్యకటకము (ప్రసిద్దిగాంచింది. వాణిజ్య సంబారాలకే కాక సైన్యాలకు కూడా ధాన్యకటకము రేపు పట్టణముగా వుండేది, ఆనందగో్రీకుడయ్యి ఒకరాజు ధాన్యకటక యుద్ధములో శతృవును (బహుశః చాణుక్య రాజును) ఓడించి గజఘటాలను (గజదశాలను) వశపరచుకున్నట్టు చెప్పుకున్నాడు” మధ్యయుగములో వేంగిపై దండెత్తిన చోళసైన్యము ధాన్యకటకము వద్దనే కృష్ణానదిని దాటింది. బహమనీ సుల్లాను అల్లావుద్దీన్‌ ధాన్యకటకము వద్దనే కృష్ణానదిని దాటి రెడ్డి రాజ్యముపై దండెత్తినాడు రెడ్డిరాజుల - వెలమరాజుల మధ్య అనేక యుద్ధాలను ధాన్యకటకము చవిచూసింది. ఒకవైపున కృష్ణానది, వేరొకవైపున చిత్రమూలాధ్వజారణ్యము ధాన్యకటకానికి అమరిన సహజ జల వన దుర్గాలు. సహజ రక్షణ కవచాలతో సురక్షితమయి అతిసంపన్న గణతంత్ర రాజ్యముగా ప్రాచీనకాలములో ధాన్యకటకము విలసిల్లింది. మజేరిక (42ల0మ) దేశములోని 'నాగగణతం(త్ర రాజ్యముగా ధాన్యకటకాన్ని సింహళ చరిత్ర (గ్రంథాలయిన 'మహావంశొ 'దలదవంశలు పేర్కొంటున్నాయి. భట్టిప్రోలు వలెనే ధాన్యకటకగణతంత్ర దేశము రాజు (౫ు పాలనలో వుండేది. పరిపాలన విషయంలో 'నిగమ' లేక 'వర్తక త్త

బౌద్దము - ఆంధ్రము శ్రేణి రాజుకు సహాయపడేది. ఇతర దేశాలతో ధాన్యకటక గణతం[త్రము జరిపిన వాణిజ్య సంబంధాలే ఆదేశ సిరిసంపదలకు (ప్రధానకారణము. వరి, ప్రత్తి అరణ్యపంపద జంతుసంపడ ముఖ్య ఎగుమతులు. ధాన్యకటకానికి సమీపంలోనే మరొక బొద్ద క్షేత్రము ఉచ్చస్థితిలో వుండేది; అదే వడ్డమాను (శాలిపుర). వరిధాన్యానికి ముఖ్య వ్యాపాఠ కేంద్రము వడ్డమాను అయివుండవచ్చును. క్రీస్తు పూర్వము 4వ శతాబ్దమునాటి నీటి మార్గపు అవశేషాలుపురాతత్త్య (త్రవ్వకాలలో బయల్పడినాయి. సముద్రము మీదుగా వచ్చే పెద్దపెద్ద ఓడలు నిలువటానికి అనువయిన స్థలము వరకు ధాన్యకటకము నుండి ఆ నీటిమార్గము వుండేది. ధాన్యకటకపు సిరిపంపదలు బౌద్ద భిక్షువులను విశేషంగా ఆకర్షించాయి. మగధదేశము నుండి కూడ బౌద్దశ్రమణులు ఇక్కడికి వచ్చినట్టు స్తూప పరిసరాలలో దొరికిన ఆధారాలు (80౪66) రుజువుచేస్తున్నాయి. బౌద్దపరివ్రాజకులు వందనామగోస్టి' ఏర్పాటు జేసి మేధాపరమయిన కార్యక్రమాలూ, మతప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలూ నిర్వహించేవారు. ప్రజల శాంతి సౌభాగ్యము, నైతిక బొన్నత్యము కౌరకు రాజు, నిగమ, గోష్టి సుహృద్భావంతో కలసిమెలసి పాటు పడేవారు. ధాన్యకటక ఆరామాలలోనే 'ప్రజ్ఞు పాఠమిత సూత్రాలు రూపు దిద్దుకొన్నాయి. అచార్యనాగార్జునుడు స్టానిక నాగనంశరాజు ద్వారా వాటిని పొంది యుండవచ్చును. ఆచార్య నాగార్జనుని మేధాసంపత్తి చివరి శాతవాహనరాజుల పోషకొదరణల వలన అంతకు పూర్వము. ఆ తర్వాత పొందలేనంత మహోజ్జల కౌన్నత్యము అసమాన గౌరవము విళిష్టతలను ధాన్యకటకము చవిచూసింది; వెలుగువెల్లునలతో ఓలలాడింది. ఆ ఘనతే ధాన్యకటకములోని స్తూపములో (ప్రతిఫలించింది; సమకాలీన స్తూపములలో కెల్ల విశిష్టుయిన స్తూప విశేషముగా ధాన్యకటక స్తూపము కొనియాడబడింది. స్తూపాన్ని ఆలంకరించిన + సొందర్యశోభితాలయిన చలువరాతి శిల్చ విశేషాలు భారతీయ చైతన్యకళారీతులలో (6016 64ని ఉత్తమ కళాఖండాలుగా ప్రసిద్దిగాంచినాయి. రానూ జనా తశ

  1. ప్రాచీన ఆంధ్ర నగరాలు - భట్టిప్రోలు

భట్టి ప్రాలుకు ఆంధ్రజాతి చరిత్రలో ఒక వైళిష్టం వుంది. ఆంధ్రుల చరిత్ర భట్టిప్రోలులోనే (ప్రారంభమైనదా అనే అభిప్రాయానికి మంచి' అవకాశం వుంది. 'పట్టావళి' మొదలయిన జైనగ్రంధాలలో యదార్హ చారిత్రకాంశాలున్నాయని పండితుల అభిప్రాయము. ఆ చారిత్రకాంశాలు ఆధారంగా తరువాతీ కవులు కావ్యాలు వ్రాసారు. క్రీ శ 8వ శతాబ్దివాడయిన జైనకవి నయసేనాని 'ధర్మామృతకావ్యం' లో ్రతీపాలపుర ప్రసక్తి కన్పిస్తుంది. ఆ వృత్తాంతాన్ని బట్టి యశోధరుడనే ఇక్ష్వాకు రాకుమారుడు దక్షిణదేశానికి వలస వచ్చి వేంగి రాజ్యంలోని పప్రతీపాలపురం రాజధానిగా రాజ్యపాలనసాగించినాడు ఇది వసుపూజ్యాచార్యుని కాలంలో, అంటే క్రీస్తు పూర్వం ఐదోశతాబ్దంలో జరిగింది. 'ప్రతీపాలపురమే భట్టిఫ్రోలు అని చరిత్రకారులు గుర్తిస్తున్నారు. కళింగాధీశుడైన 'ఖారవేలుడు' (క్రీపూ 170) తన హరిగుంఫ' శాసనంలో 'అవరాజ నిర్మితమైన ప్రిధుడనగరాన్ని' "పేర్కొన్నాడు. టాలెమీ అనే గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త (క్రీ.శ 130) మైసోలియా ప్రాంతంలోని 'పిరిండ్ర' నగరం వస్త్ర పరిశ్రమకు వాణిజ్యానికి కేంద్రం అని వర్షించాడు మైసోలియా అనేమాట కృష్ణాముఖద్వారానికి వరిస్తుంది. దీనినే సింహల(గ్రంధాలయిన మహావంశ దలిదవంశాలు శుజెరికా అని వ్యవహరిస్తున్నాయి. నేటికీ భట్టిప్రోలులో వేయి కుటుంబాలకు పైగా వస్రపరిశ్రమపై ఆధారపడివున్నట్టు తెలుస్తోంది. అందుచే ప్రిధుఢ పిరిండ్ర భట్టిప్రోలు అనేవి ప్రతీపాల పురానికి రూపాంతరాలని చెప్పటానికి సందేహించనక్కరలేదు. ఇక 'అవ" అనే మాటను పురాణాల్లో 'ఆం(ధ్ర' పర్యాయపదంగా వాడినట్టు తెలుస్తోంది. యశోధరుని కాలంలో వేంగిలేదు. కాని నయసేనుని కాలంలో ఈ (ప్రాంతం అంతా వేంగి చాణక్య రాజ్యాంతర్భాగమయినందున ప్రతీపాలపురం వేంగి రాజ్యంలో నున్నట్టు అతడు వ్రాసాడు. ధాన్యకటకం ఆం(ధ్రజనపదానికి కేంద్రమని క్రీ శ 3వ శతాబ్దానికి చెందిన శాసనాలు ఉదహరిస్తున్నాయి. జాతక కథల్లోని తేలివాహ నది దక్షిణ తీరంలో ఆం[ధ్రనగరం

శ్‌

బౌద్ధము - ఆంధ్రము ఉన్నట్టు పేర్కొన్నారు. ఆ ఆంధ్రనగరమే ధాన్యకటకము. 'ప్రతీపాలపుర ప్రాంతం కూడ ఆ రోజుల్లో ఆం(ధధ్రాజనపదంలో భాగమైనందున ఖారవేలుడు ప్రతీపాలపురాన్ని ఆం(ధ్రరాజులు నిర్మించినారని పేర్కొని వుంటాడు. భట్టిప్రోలు సారవంతమైన మైదానంలో కృష్ణా తీరంలో సము(ద్రతీరానికి సమీపంలో వుంది. పాడిపంటలు పుష్కలంగా పండే ప్రాంతం, వరి'ప్రత్తి విస్తారంగా పండుతూవుండేవి. ఇచట బయల్పడిన పెద్దపెద్ద ఇటుకలతో నిర్మించిన 'చైత్యశైలం' నాటి (ప్రజలు భవన నిర్మాణ శాస్త్రంలో సాధించిన నైపుణ్యానికి నిదర్శనం. టాలెమీ ఇచటి వస్త్ర పరిశ్రమను పేర్కొన్నాడు గదా! ఇచటి స్తూపంలో దొరికిన స్ఫటిక కరంగాలు, స్వతపుష్పాలు, వెండిరేకుపై లేఖనం మొదలయిన వానివలన నాటి ప్రజలు పలురకాల చెతి పరిశ్రమల్లో ఆరితేరినట్టు కన్పిస్తున్నది. కృష్ణానదిలో అమరావతి వరకు నౌకాయానం జరిగిన నిదర్శనాలున్నాయి. భట్టిప్రోలు సమీపంలో కృష్ణానదిలో పోతవరలంక వుంది. 'పోతవరలంక అంటే పెద్దపడవ అనీ, సము(ద్రం నుండి అంతవరకు పెద్దనొకలు వచ్చేవని చరిత్రకారుల అభిప్రాయం. అందుచేత భట్టిప్రోలు నుండి వరిధాన్యం పాడి, దినుసులు, వస్త్రాలు విరివిగా ఎగుమతి అవుతుండేవి. పారిశ్రామిక, వాణిజ్య కేంద్రమయిన భట్టిప్రోలొక్ర పెద్దనగరమై క్రీ పూ నాలుగో శతాబ్దిలో మెగస్తనీస్‌ పేర్కొన్న 30 ఆంధ్రదుర్గాల్లో ఒకటిగా (ప్రసిద్ది చెందివుంటుంది. ధర్మామృతకావ్యసమాచారప్రకారం యశోధరుని వంశంలో జన్మించిన ధనదుడు బైనమతాభిమాని. కాని, అతని భార్య కమలశ్రీ. ఆమె తండ్రి సంఘశ్రీ బౌద్దమతం స్వీకరిస్తాడు. అందుచే చారణ రుషులు సంఘత్రీని 'అంధుడవుకమ్మని” శపిస్తాడు, నాటినుండి ఆరాజ్యాన్ని 'అంధక విషయం'గా వ్యవహరించసాగినారు. ఆంధ్ర బౌద్దులను బౌద్దుల పాళీవాజ్మయం 'అంధకులు' అని వ్యవహరించడం ఈ సందర్భంలో గమనార్హం. 'ప్రతీపాలపురంలో జైన బౌద్దాలమధ్య సంఘర్షణ జరిగి అందులో బౌద్దం విజయం పొందినట్టు ఈ వృత్తాంతం చూపిస్తున్నది, ధనదుడు చారిత్రక వ్యక్తివలె కన్సిస్తున్నాడు. ధనదుడనే రాజ కృష్ణాముఖద్వారంలోని కర్ర

ప్రాచీన ఆంధ్ర నగరాలు - భట్టిప్రోలు దివి మొదలయిన ప్రాంతాలలో జనావాసం ్రోత్సహించినాడని కాకతీయ గణపతిదేవుని గణపేశ్చర శాసనం వర్షిస్తున్నది. భట్టిప్రోలుకు సుమారు 15 మైళ్ల దూరంలో ధనదపురం 'ప్రసిద్దనగరంగా వర్షిల్లింది. ఆ ధనదుడే తన పేర ఆ పురాన్ని నిర్మించి వుండవచ్చును. దనదపురం - సవరంపురం - సనదు్రోలు అనే రూపొంతరాలుచెంది చివరకు “చందోలు'గా మారి మధ్యయుగంలో వెలనాటి దుర్ట్భ్మయ రాజులకు రాజధాని అయింది. భట్టీప్రోలులో దొరికిన అతి ప్రాచీన శాసనాల్లో సవేరపుత్రుడైన కుభిరక రాజు ప్రసక్తి కన్పిస్తుంది. కుభిరక అనేది 'కుబేర' రూపాంతరమని సమ్మతిస్తే కుబేరునకు ధనదుడనే నామాంతరం వున్నందున, అతడే గణపేశ్వర శాసనంలోని వ్యక్తి అని, ధనదపుర నిర్మాతయని భావించడం పూర్తిగా ఆశాస్రీయంకాదు. భట్టిప్రోలు శాసనాలు కుభిరక రాజుతో బాటు సిహగోరి (సంహగోష్టి ని, నిగమ (సభ) ను పేర్కొంటున్నాయి. ధాన్యకటకంలో 'పందనామగోరి' వుండేది, గోష్టి అనేది బౌద్దసంఘ స్థానిక శాఖ అయివుంటుంది. 'నిగమ' అనేది వర్రకశ్రేణి. కుభిరకుని గోప్టి ప్రముఖుడని శాసనం వర్లిస్తున్నది. దీన్నిబట్టి ఉపాసకులను సంఘంలో చేర్చుకొని వారిని నాయకులుగా బౌద్దులు అంగ్‌కరించేవారని తెలుస్తుంది. ఇది మహాసాంఘికుల సంప్రదాయం. గోష్ట నిగమ సభల సహాయంతో కుభిరుడు భట్టిప్రోలు స్తూప విహారాలను నిర్మించి గొప్ప బౌద్ద క్షేత్రాన్ని రూపొందించినట్లు స్పష్టమవుతున్నది. కుభిరకుని అనంతరం అచిరకాలంలోనే కాలగర్భంలో కలిసిపోయిన భట్టిప్రోలు చారిత్రక (ప్రాశస్త్యం క్రీ శ 1870 నుండి వెలుగులోకి రాసాగింది. ఇంగ్రీషు వర్తక సంఘ ఉద్యోగులైన బాస్వెల్‌, సర్‌వాల్టర్‌ ఎవియట్‌ అనంతరం రాబర్ట్‌ సూయిల్‌ మొదలయిన వారీ చవిటి దిబ్బలలో బౌద్దక్షేత్ర శిధిలాలు నిక్షిప్తములైవున్నట్టు గుర్తించారు. వీనికి చినలంజ దిబ్బ పెదలంజదిబ్బ, విక్రమార్కుని కోట దిబ్బ అని పేర్టుండేవి, నజయానం వల్ల బౌద్ద భిక్షుకీ భిక్షుకులలో అవినీతి (ప్రబలినందున ప్రజలాప్రదేశాలనా విధంగా పిలిచేవారని పండితలోకంలో ప్రచారంలో వున్న అభిప్రాయం. భట్టిప్రోలులో వజ్రయానం ప్రబలిన నిదర్శనాలు లేవు. కాని, బౌద్దక్షేత్రాలకు లంజదిబ్బ పదం సర్వసామాన్యమైనందున త్త

బౌద్దము - ఆం(ధ్రము ఈ దిబ్బలకు కూడా ఆపదమే వర్తించింది. ఇక్కడ ప్రస్తుతం కాకపోయినా ఒక అంశం విచారించవలె. మధ్య యుగారంభంలో తంత్రం అఖిలభారతీయ మాధ్యమంగా విస్తరిల్లింది. హిందూమతంలో కూడా తాంధత్రికాచారాలు ప్రబలినాయి. నేటికీ హిందువుల్లో వామాచార సంప్రదాయాలకు గౌరవమర్యాదలు లేకపోలేదు. నేటికి బయల్పడిన బౌద్ధక్షేత్రాలనుండి నాటి భిక్షుకీ భిక్షుకుల అవినీతి ప్రవర్తనకు (ప్రత్యక్ష నిదర్శనాలు లభించవు. కాని, భువనేశ్వర్‌, కోణార్క, ఖుజరహో దేవాలయాలు హిందూ తాంటత్రికాచారాలకు 'ప్రత్యక్షసాక్షులు. వానిలో ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క 'బూతుమహాకావ్యం' అయినా అవి దర్శనీయాలు, ఆదరణీయాలు, పరమపవి(త్రాలు. కానీ బౌద్ధక్షేత్రాలు మాత్రం లంజదిబ్బలు! ఈ వర్షనకు కేవలం బౌద్ధంపట్ల హిందూమతోద్యమ నాయకుల్లో ప్రబలిన ఆ(గ్రహద్వేషాలే కారణం! అనారోగ్యకరమైన ద్వంద్వ నైతిక ప్రమాణాలకు నిదర్శనం! రాబర్జ్‌సూయల్‌ దర్శించేనాటికే ఈ దిబ్బలనుండి పాలరాతి శిల్పఫలకాలు, ఇటుకలు త్రవ్వి తీసి రోడ్డు, వెల్లటూరు కాల్వపై తూములు నిర్మించడంలో వాడినారు. అలెగ్జాండరు ఆ 1892లో త్రవ్వడం ్రారంభించేనాటికి స్తూపంలో అధికభాగం నష్టపడింది. అయినా (త్రవ్వకాలలో చక్రాకార పునాదులపై నిర్మించిన బృహత్‌ స్తూపం బయల్పడింది. స్తూపవ్యాసం 132 అడుగులు, స్తూపం మధ్య ఆమూలా(గ్రంగా ఇటుకలతో అమర్చిన రంధ్రం వుంది. రం(ధ్రం చుట్టూ ఇటుకలను పద్మాకారంలో అమర్చారు. ఇందులో స్తూపాగ్రాన వుండే భద్రపుకాడను నిలిపీనారు. శిలాఛత్రశిథిలాలు స్తూపం ఆవరణలో దొరికినాయి. స్తూపంచుట్టూ ప్రదక్షిణ పథము దాని అంచున పాలరాతి ప్రాకారం వుండేది. (ప్రాకారవ్యాసం 148 అడుగులు. ప్రాకారస్తంభాలు కొన్ని బయల్పడినాయి. స్తూపం ఆవరణ వైశాల్యం మొత్తం 1700 చ. అడుగులు. స్తూపం మధ్యనున్న రంధ్రంనుండి మూడుశిలామంజూషికలు ఒకదాని దిగువన మరొకటి లభించినాయి. శిలామంజూషికలపైనా వానిలోని స్ఫటిక కరండాల మీద లేఖనాలున్నాయి. వీని లిపిని గురించి చాలతర్జన భర్జనలు జరిగినాయి, జరుగుతూవున్నాయి. లేఖనాలను మొట్టమొదట పరిశీలించిన బూలర్‌ పండితుడు ఇవి అశోకుని కాలానికి శ్రి

ప్రాచీన ఆంధ్ర నగరాలు - భట్టిప్రోలు చెందినట్టు, దాక్షిణాత్య బ్రాహ్మిలిసి యైనట్టు నిర్ణయించినాడు. ఇటీవలి పండితులు ఆ లేఖసాలలోని కొన్ని అక్షరాలలో అశోకుని తర్వాత లిపి లక్షణాలు కన్పిస్తున్నాయని, క్రీపూ: 100 సంవత్సరాలకు చెందినట్టు సూచిస్తున్నవనీ, దాక్షిణాత్య బ్రాహ్మిలిపి అని ప్రత్యేకించి లేదని వాదిస్తున్నారు. వాస్తవానికి అశోకుని శాసనాల్లో ఒకే అక్షరంలో వ్యత్యాసాలు (ప్రాంతీయ భేదాలు) లేకపోలేదని, ఈ వ్యత్యాసాలు స్టానిక లేఖలవల్ల వచ్చినవని ఆ పండితులు అంగీకరిస్తూనే వున్నారు. భట్టిప్రోలు లేఖనాల్లో ప్రత్యేకంగా కన్పించే అక్షరాలు అశోకుని ఇతర శాసనాల్లో కన్పిస్తున్నాయని కూడా వారు ఒప్పుకుంటారు. అంతేకాక, లేఖనాలున్న శిలామంజూషికలపై అశోకుని యుగానికి చెందిన విలక్షణమైన మెరుగు (పోలిష్‌ ఉన్నట్టు పరిశీలించడం జరిగింది. లేఖనాల్టోని 'బుద్దశరీరాణి నిక్షిప్తం” (శాసనంలోని (ప్రాకృతానికి సంస్కృతం) అనే వాక్యాన్ని బట్టి భట్టిప్రోలు స్తూపం యధార్థమయిన బుద్దధాతువుపై నిర్మించినట్టు స్పష్టంగా తెలుస్తుంది, చరిత్రకారుల్లో ఒక అభిప్రాయం బలంగా వుంది. అశోకుడు నిర్మించిన స్తూపాల్లో వున్నవేయధార్థమయిన బుద్ధధాతువులు; ఇతరత్రా లభించిన ధాతువులు బుద్దునివికావు. శాసన వాక్యాన్ని బట్టి, లేఖనాల లిపిని బట్టి, శిలామంజూషికపైని మెరుగును బట్టి భట్టిప్రోలు స్తూపం అశోకుని కాలంలోనే నిర్మించటం జరిగింది అనడం సముచితమైన నిర్ణయం. పూర్తిగా ఇటు కలుపయోగించి నిర్మించిన పద్దతి, ఇందు లభించిన విద్దాంక (పంచోమార్‌క) నాణేలు సయితం స్తూపం ప్రాచీనతను బలపరుస్తున్నాయి. ప్రాచీన లేఖనాలతో బాటు మంజాషికలలో ఆసక్తిదాయకము, అమూల్యము, చారి(త్రాత్మకమునైన పురావస్తు సంపద లభించింది. మొదటి మంజూషికలో రాతిబరిణ, అందులో స్ఫటిక కరండం వున్నాయి. ఈ కరండంలోనే ధాతువును నిక్షేపించినారు. ధాతువును పీతాంబరంలో భద్రపరచిన చిహ్నాలున్నాయి. ధాతువు చుట్టూరాగి, బంగారు పుష్పాలు, బంగారు రేకులో మలచిన త్రిరత్నచిప్నోలు, ముత్యాలు, సృటికమూ, స్వస్తిక్‌ ఆకారంలో పేర్చిన 24 వెండి విద్దాంక నాణేలు వున్నాయి. స్ఫటికంపై రెండు పంక్తుల లేఖనం వుంది. ధాతువును భద్రపరచడంలో జాగరూకతతో బాటు ధాతువుపట్ట త్తం

బౌద్దము - ఆం(ధ్రము భక్తిశ్రద్ధలు స్పష్టమువుతున్నాయి. రెండో మంజూషికలో స్తూపకారంలో వున్హ సృటికకరండం వుంది. ఇందు ధాతువు వున్న నిదర్శనాలు లేవు. కానీ, 164 స్వర్ణ పుష్పాలు పూసలు, ముత్యాలు, లేఖనం వున్న పల్చని వెండి రేకు వున్నాయి. మూడో మంజూపికలో సృటికపు బరిణ, అందులో పచ్చలో మలచిన ధాతుకరండం, అందులో మూడు శల్యశకలాలు వాని చుట్టూ బంగారుపూలు ముత్యాలు పూసలు వున్నాయి పవిత్రతలో ప్రాచీనతలో పరిమాణంలో ధాన్యకటక స్తూపంలో తులతూగినది భట్టిప్రోలు బౌద్దక్షేత్రం. భట్టిప్రోలు నగరం సముద్రతీరానికి సమీపంలో వుండి విదేశవాణిజ్యానికి కేంద్రమై ఐశ్వర్యవంతవముయింది. ఇంతటి పవిత్రము ఐశ్చర్యవంతమూనైన ఈ క్షేత్రం ఆంధ్ర సంస్కృతీ చరిత్ర పుటలనుండి అదృశ్యంకావటానికి బలమైనకారణం వుండి వుండవలె. కళింగాధిపుడైన ఖారవేలుడు గొప్ప విజేత; జైనమతాభిమాని. అనేక పర్యాయములాతడు తీరాంధ్ర (ప్రాంతాలపై దాడులు జరిపినట్టు హరిగుంఫ శాసనం చాటుతోంది. రెండోరాజ్య సంవత్సరంలో అతని సైన్యాలు కబ్లబెణ్ఞా (కృష్ణవేణా) నది వరకు నడిచి ముషిక నగరాన్ని హడలగొట్టినాయి. పదకొండోరాజ్య సంవత్సరంలో ప్రిధుఢనగరంపై దండెత్తినాడు. (ద్రవిడ కూటమిని కూడ ఓడించినట్టు ఖారవేలుడు చెప్పుకున్నాడు. బహుశా ఖారవేలుని ఎదిరించడానికి ప్రిధుఢ నగర పాలకులు పొరుగున వున్న ద్రవిడరాజుల సహాయం అర్జించినారని, వారందరిని ఖారవేలుడు ఓడించినాడని చెప్పవచ్చు. విజయం సాధించిన తరువాత, పూర్వం జైనమతానికి జరిగిన పరాజయ పరాభవాలకు ప్రతీకారంగా ఖారవేలుడు ద్రిధుఢ నగరాన్ని 'గార్హభలాంగ' లాలతో దున్నించి వేశాడు. ప్రతీపాలపురానికి ఆచటి బౌద్ధస్తూపవివారాలకు పునరుద్దరణకు గాని పునర్నిర్మాణానికి గాని అవకాశం లేన్సి విధంగా తీవ్రనష్టం సంభవించింది. భట్టిప్రోలు (ప్రశస్త క్రమంగా కాలగర్భంలో జీర్షించిపోయింది. న టా ఇక్లాడా- 50

ఇఒల్జీ

౦ ప్రాచీనాంధ్ర నగరాలు - విజయపురి (ప్రాచీనకాలము నుండి నగరాలే నాగరికతా సంస్కృతులకు వికాస కేంద్రాలుగా

ఉంటూ వచ్చినై, 'నాగరికత' అనే మాటకు నగర జీవితవిధాన మనియే అర్థం. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దిలోనే ఆంధ్రులకు ముప్పది నగరాలు ఉన్నవన్న మెగస్తనీస్‌ మాటలు ఆంధ్ర నాగరికతా ప్రాచీనతకు నిదర్శనము. ఈ నగరాలలోనివే ధాన్యకటకం ్రతీపాలపురం, తామ్రాస కొండాపూర్‌ మొదలైనవి. ఆంధ్ర నగరాలలో అధికభాగం నదీ మైదానాలలో నదీతీరాలలోను ఉండడం గమనింపదగిన విశేషము. ఇందుకు ముఖ్యకారణం ప్రాచీరాం[ధ్రులు సాగించిన విదేశవాణిజ్యము. నదులే ప్రయాణ

సాధనాలుగా నుండడం రెండో కారణం, మెగస్తనీస్‌ పేర్కొన్న ప్రాచీన నగరాలలోనిది కాక పోయినప్పటికీ ఆంధ్రుల చరిత్రలో అద్వితీయ స్థానం ఆక్రమించింది విజయపురి నాగార్జునకొండగా సుప్రసిద్ధమైన శ్రీపర్వత పశ్చిమపాదంలో ఉత్తరవామినియైన కృష్ణానదీ తీరాన వెలసినదీ నగరం (శ్రీపర్వతం సుప్రసిద్ధ బౌద్ధక్షేత్రమే గాక శిల్పకళాక్షేత్రము. ఇచటి మహాచైత్య సంఘారామాలను యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించి నాగార్జునాచార్యులకు బహూకరించినట్టు ఐతిహ్యము, యజ్ఞశ్రీ అనంతరం విజయ శాతకర్ణి వైశాఖ పూర్షిమనాడు తన పేరనే విజయపురిని నిర్మించి అచట తనకు సామంతులుగా ఇక్ష్యాకులను నెలకొల్పి ఉంటాడు. ఇది క్రీస్తుశకం రెండు వందల సంవత్సరాల (ప్రాంతంలో జరిగింది. పళ్చిమ దిళలో కృష్ణానది తూర్పున శ్రీ పర్వతము, దాని నానుకొని మహారణ్యము ఉండి జలగిరి వనదుర్గాల సౌకర్యంతో దుర్ఫేద్యమైనమహానగరంగా రూపొంది ప్రశస్తమైన చరిత్రకు రంగస్థలమైనది విజయపురి, ఈ నగర చరిత్ర కేవలం ఐదారు పురుషాంతరాలకు మాత్రమే పరిమితమైన స్వల్ప చరిత్ర; కాని అది ఆంధ్ర సంస్కృతీ పరిణామంలో ముఖ్యమైన తొలిఘట్టాల చరిత్ర. ఆ ర్ట గ్రంధాల ద లల ము

  • (ఉ0౫౦మకవయేం ఇ నగ వలా చల యో

బౌద్దము - ఆం[ధ్రము స్వల్బకాల వ్యవధిలోను దక్షిణాపధ రాజకియ విష్ణ్లవాలలో క్రీలకషా[త్రను నిర్వహించింది విజయపురి. శాతకర్ణి పోషణలో విజయపురి బొద్దనగరంగా అవతరించింది. కాని అచిరకాలంలోనే ఇక్ష్వాకు వంశాదీశుడైన శ్రీ ఛాంతమూలుడు సౌతవాహన నంశళాన్ని నిర్మూలించి ఇక్ష్వాకు స్వాతరత్ర్య పతాకతోబాటు విజయపురిలో వైదిక మత విజయపళతాకను గూడ ప్రతిష్టించినాడు. ఆశ్చమేధాది వైదిక (క్రతువు లొనర్చినప్పటికీ ఛాంతమూలుడు మహాసేన విదూఫాక్షపతి భక్తుడు, గోళశతసహ(్ర హలశతసహ(్రములను దానంచేసి విజయపురి ఐశ్వర్యన్రేభవాలకు దోహదం చేసినాడు. మహాకారుణిక సిద్దాంతానికి (ప్రతీక అయిన చౌద్ద స్తూపచ్చాయలో నీతడు నిర్మించిన అశ్వమేధ వేదిక మత సహనానికి నిదర్శనంగా చరిత్రకారులు పేర్కొంటారు, శ్రీ ఛాంతమూలుని కుమారుడైన వీరపురుషదత్తుని అభిమానమతం ఏదో తెలియదుగాని అతని రాణివాసం వివిధ బౌద్దమత శాఖలను పోషించినారు. తిరిగి శ్రీపర్వత 'ప్రాగ్భాగం వివరాలతో స్తూపచైత్యాలయాలతో దూరదేశాగత తైర్దికులతో కళకళ లాడింది. నొగార్జునాచార్యుల మహాయాన సందేశం దేశాంతరాలకు ప్రసరించింది. కాని వైదికముతంలో భక్తి ప్రవేశించి కర్మకాండలు వెనుకాడినట్టి బొద్దంలో శీల సమాధి 'ప్రజ్ఞల స్థానాన్ని భక్తి ఆక్రమించింది. ఉభయమతాలకు సమానధర్మమైన భక్తి హిందువుకు బౌద్డులకు సాన్నిహిత్యం చేకూర్చే వారధి అయింది. ఇది భారత దేశ చదీత్రలోనే విశిష్టమైన పరిణామము, వీరపురుషదత్తుడు పూర్వ అంధ్ర సామ్రాజ్య వైభవాన్ని పునరుద్దరించడానికి ప్రయత్నించినాడు. ఉత్తరాన ఉజ్ఞయిని మొదలు దక్షిణాన బనవాసి వరకు ఉన్న రాజలోకం ఇక్టాకులతో బంధుత్వం కలుపుకున్నారు. విష్ణుకుండిన చాళుక్యాదులు వారికి సామంతులైనొరు. నిష్ణుకుండినులు శ్రీపర్వత స్వామి పాదభక్తులు; చాళుక్యులు హారీతి పుత్రులు హారీతి బౌద్దుల సంతాన దేవత. నాగార్జున కొండ లోయ (ప్రవేశంలోనే విజయపురిని తిలకిస్తూ హారీచి దేవాలయం ఉంది. ఈ అలయము ఇతర శాసనస్ట్ర క్‌2

ప్రాచీనాంధ్ర నగరాలు - విజయపురి

సమాచారము చాళుక్యుల జన్మస్థలం విజయపురి (ప్రాంతమేనని నిర్దారణ చేస్తున్నది. దక్షిణాపధ ఆధిపత్యానికి సాతవాహన ఇక్ష్యాకువంశాలకు వారసులైనారు చాళుక్యులు.

హారీతిని చాళుక్యులు తమతోబాటు హిందూమతంలో కలిపినట్లు కనిపిస్తుంది. సంతానార్జులైన స్రీలు హారీతికి గాజులు సమర్పించేవారు. హారీతిని విస్మరించి ఆంధ్ర ప్రీలోకం నేటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఉంది.

వీరపురుషుని కుమారుడైన ఎహువలుని కాలానికొక వైశిష్ట్రం ఉంది. అతని కాలంలో విజయపురిలో దేవాలయ నిర్మాణం విరివిగా సాగింది (కశ 275) వానిలో సర్వ దేవాధివాసం అనే పుష్పభద్రాలయం సు్రసిద్ధము. ఈతని కాలంలోనే ఇక్ష్యాకులకు అభీరులతో మైత్రి ఏర్పడింది. ఆభీరులు వైష్ణవులు, ఆభీరవసుసేనుని సేనాపతి విజయపురిని దర్శించి అచట అష్టభుజనారాయణుని ప్రతిష్టించినాడు. విష్ణుమూర్తి విరాట్‌ స్వరూపమే అష్టభుజస్వామియని భాగవత పురాణం నుండి తెలుస్తున్నది. ఈ వీధంగా అంధ్రుల రాజధాని అయిన విజయపురిలో భాగవతమతం సుప్రతిస్టితమయింది. హిందూబౌద్దాలతో బాటు శైవవైష్ణవాలకు సహజీవన సూత్రాన్ని నేర్చింది విజయపురి.

ఎహువలుని కాలంలో (ప్రారంభమైన ఇక్ష్యాకు పల్లవ సంఘర్షణ అతని కుమారులైన రుద్రపురుష వీరపురుషుల కాలంలో తీవ్రరూపాన్ని దాల్చింది. తమకు ప్రత్యర్థులైన కదంబులకు సాయము చేశారనే సాకుతో పల్లవులు దండెత్తి వచ్చి ఇక్ష్వాకు వంశాన్ని తుదముట్టించి విజయపురిని సరశురామప్రీతి గావించినట్టు కన్పిస్తుంది. అంతటితో శ్రీపర్సత విజయపురి ప్రతిష్ట అంతరించింది.

క్రమంగా నామరూపాలులేక కాలగర్భంలో కలిసిన విజయపురి పేరు నాగార్జునకొండ శాసనాల ద్వారా 1970 ప్రాంతంలో చరిత్ర పుటలకు ఎక్కింది. నాగార్జున సాగర్‌ పధకంతో 1952నుండి సాగిన పురాతత్త్యఖననాల ఫలితంగా విస్పృతమైన శిథిలాల రూపంలో తిరిగి ఆవతరించింది విజయపురి. ఈ శిథిలాల నుండి (ప్రాచీన విజయపురి స్వరూపాన్ని స్పష్టంగా గుర్తించడం కష్టం. ఐనప్పటికీ ఈ శిధిలాలను లౌకిక, మత

53

బౌద్దము*- ఆం(ధ్రము

నిర్మాణాలుగా వర్గీకరణ చేయవచ్చు. లౌకిక నిర్మాణాలు చాలభాగం శ్రీపర్సత పశ్చిమ పాదంలోని దుర్గంలోనే ఉన్నాయి. దుర్గరక్షణలో నాగార్హునకొండ, పెద్దకుందేళ్ళగుట్ట శీలకములైనట్టు కనిపిస్తుంది. దుర్గప్రాకారంలో నాల్లువైపులా శిలాతోరణాలతో ద్వారాలు వానిని పరిరక్షిస్తూ కార్తికయాలయాలు ఉండేవి. రాజుప్రాసాదాలు శత్రుదాడులలో పూర్తిగా ధ్వంసమైనవని చెప్పవచ్చు. మిగిలిన నిర్మాణాలలో గమనింప దగింది రంగస్థలం లేక ప్రక్షాగారం. దుర్గానికి వెలుపల కృష్ణానదిపై గల రేవు ప్రాంతము, దాని సమీపంలోనే ఉన్న గోదాములు విజయపురి సాగించిన వాణిజ్యానికి నిదర్శనాలు.

మతనంబంధమైన నిర్మాణాలలో బౌద్దహిందూ వర్గీకరణ కన్పిస్తుంది. బౌద్దుల చైత్యవిహారాలను గురించి శిల్ప ప్రాభవాన్ని గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కాని వారి మహావిహారము, దానికి బహుశా అనుబంధంగా వెలసిన స్టేడియంవంటి స్నాతక సదస్సు, విశిష్టమైన నిర్మాణాలు.

బౌద్ధనిర్మాణాల -నమూనాపైనే నిర్మింపబడినప్పటికీ హిందూ ఆలయాలలో ఆలయవాస్తువు పరిపక్షతనంది భావితరాలకు మార్గదర్భకమయింది.

ఈ విధంగా శిధిలాల రూపంలో నున్నప్పటికీ నాగార్జున కొండలోని నిర్మాణాలు విజయపురి రాజకీయ జొన్నత్యాన్నే గాక లౌకిక ధార్మిక ఆధ్యాత్మిక రంగాలలో నాటి ఆం(్రులు సాధించిన విజయపరంపరలను 'ప్రతిఫలింపజేస్తూ ఉన్నాయి. ఒక్కమాటలో ఆంధ్ర సంస్కృతి ఆటాపాటా నేర్చిన గురుకులమే విజయపురి,

వా ఇక్తడా- ల ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో ర్‌త్తీ

రండవ భాగం

  1. ఆంధ్రుల విశాల దృక్పథం

ఆంధ్రుల ఉద్రేకం తాటాకు మంటతో సమానం అనే విమర్శను అభినందనగానే అంగీకరించవచ్చు ఏ కార్యసాధనకైనా ఉద్రేకం అవసరమే: కాని కేవల ఉ(ద్రేకంవల్ల వివేచన నశించటమేగాక జాతి త్వరలో నీరసించే ప్రమాదం ఉంది వివేకంతో ప్రబుద్ద మైనప్పుడే జాతీయ ఉద్రేకం ఉదాత్త సాంస్కృతిక విలువలను రూపొందింపగలుగుతుంది; అనుభవ వైవిధ్యంతో వివేకం పెంపొందుతుంది. గుణ(గ్రహణ సమర్థమైన వివేచన, సమరస దృష్టి సమన్వయ పాటవమూ వివేకానికి ముఖ్య లక్షణాలు. ఈ. గుణాలవల్లనే విశాల దృక్పధం ఏర్పడుతుంది. ఆంధ్రుల ఉద్రేకాన్ని ఆదుపులో ఉంచి వారి సంస్కృతికి మెరుగులు దిద్దినది ఆంధ్రులలోని విశాల దృక్సథమే!

ఆలోచనాశక్తి మానవత్వానికే సహజలక్షణం ఐతే అనుకూల భౌతిక సొకర్యాలవల్లనూ, చారిత్రక పరిణామాల వల్లనూ కొన్ని కొన్ని జాతులలో వివేచనాశక్తి పుష్టిని సంతరించుకొని విశాల దృక్పధానికి కారణమౌతూ ఉంటుంది ఆం(్రజాతికి అనాదినుండీ అట్టి సౌకర్యాలు అనేకం లభించడం ఒక గొప్ప విశేషం.

ఆంధ్రజాతి నిర్మాణంలోనే ఒక వైశిష్ట్రం ఉంది. ప్రాచీనకాలానికే దక్షిణాపధంలో ఇరుగుపొరుగున నివసిస్తూ ఉండిన నాగు యక్ష్మ ములక, పహ్హావ దరద గుహ,శబర, ఆంధ్రాది పలు తెగల సమ్మేళనం ద్వారా ఆంధ్రజాతి యేర్సడింది అందుచేతనే మహాభారతం 'ఆం(ధ్రాశ్చబహవః' అంటూ వర్లిస్తున్నది ఈ తెగల జీవిత విధానాల, మత సాంఘిక సంప్రదాయాల సముదాయమే, అంధ్ర సంస్కృతికి పునాది ఆయింది. చారిత్రక యుగంలో కూడ తమిళ, కర్ణాటక, కళింగ, మహారాష్ట్ర ప్రాంతాల నుండి వలస వచ్చిన శరణార్జులకు ఆతిధ్యమిచ్చి తమ సంపదను వారితో పంచుకొని అనుభవించినవారు ఆంధ్రులు. వారిలోని సహనానికీ సహజీవన స్వభావానికీ, కౌదార్యానికీ ఇంతకంటే వేరే

ర్‌ర్‌

బౌద్దము - ఆం(ధ్రము నిదర్శనం అక్కరలేదు. ఈ చారిత్రక పరిణామాలవల్లనే భారతీయ సంస్కృతిలో వలెనే ఆంధ్ర సంస్కృతిలో సైతం భిన్నత్వంలో ఎకత్యం ముఖ్య లక్షణమైంది. భౌగోళికంగా ఆంధ్రదేశం ఆర్యనాగరికతా ప్రసార కేంద్రమైన ఉత్తరాపధానికీ ద్రావిడ నాగరికతా పీరమ్రైన దక్షిణాపధానికీ మధ్య వారధిగా శీలకస్టానంలో ఉంది (ప్రాబీన కాలంలో ఉత్తర దక్షిణాపధాల మధ్య సుగమమైన మార్గం కూడా తూర్పు తీరప్రాంతంలోనే అంటే ఆంధ్రదేశం గుండానే ఎర్బడింది. ఉత్తరదేశ చతక్రవర్హులు ఈ మార్గాన్నే దక్షిణ దిస్విజయ యాత్రలు సాగించారు. ఇక మహారా॥ష్ట్రం మీదుగా శకయవనాది జుతులు ఆంధ్రదేశంలో ప్రవేశించారు అందుచే ఆంధ్రదేశం సాంస్కృతికంగా త్రివేణీ సంగమమై ఆం(ధ్రులలో సంకుచితత్వాన్ని నిర్మూలించింది. తాము ఆర్యులా ఆర్యేతరులా, అన్జ సందేహం ఆం(ధ్రులలో ఉదయించడానికి బలవత్తరమైైన వివిధ సాంస్కృతిక ప్రభావాల ఫలితమేననడంలో పొరబాటు లేదు.

ఆంధ్రదేశానికి సుదీర్థమైన తీరరేఖ ఉన్నందున ఆంధ్రులు అనాదిగా నౌకాయానంలో ఆరితేరి ్రాకృశ్చిమ దూరదేశాలతో వాణిజ్యం సాగించారు. నూతన భావాలతో నాగరికతలతో పరిచయ మేర్చరచి విదేశ వాణిజ్యం ఆంధ్రులలో మానసిక వికాసాస్టా సమతాభావాన్నీ కలిగించింది.

ఈ విభిన్న అనుభవాలనూ వివిధ సాంస్కృతిక ప్రభావాలనూ జీర్లించుకొనటంలో ఆంధ్రులకు మరొక మహత్రరశక్తి తోడ్పడింది అదే తధాగతుడు బోధించిన బొద్దసిద్దాంతం. శాంతి అహింస సమతా సూత్రాలపై ఏళ్ళ సౌందర్య నిరా జై ప్రణాళికయే బొడ దర్శనం. అట్టి బౌద్ధానికి ప్రప్రథధమం నుండి ఆంధ్రులు నివాళి పట్టారు. తమ దేశాన్ని ఒక "పెద్ద బౌద్ద ధర్మ కేంద్రంగా చేశారు. బౌద్ద ధర్మామృత సేచనతో ఆం(ధ్రులలో సంకుచితమైన అహంకారాలు పూర్తిగా సమసినాయి. ఉదారభావ (ప్రబోధితులై సమన్వయ సూత్రంపై నూతన జీవిత విధానం రూపొందించుకొని సమైక్య జాతిగా తయారైనారు. నాడు ఆంధ్రజాతి సాధించిన ఆంతరంగిక సౌందర్యానికి ప్రతిబింబాలే అమరావతీ నార్తునకొండ శిల్పాలు. స్ట

ర్‌ర్ర

ఆంధ్రుల విశాల దృక్పధం

సర్వాంగ సుందరమైన అమరావతీ శిల్పం వలెనే ఆంధ్ర భాష ఆంధ్రుల జౌదార్యానికీ హృదయ మార్షవానికీ దర్చణమైంది. సంస్కృత భాషా పదాలనేగాక విదేశీ పదాలను సైతం స్వీయ ఛందస్సులలో మలచి తన సౌకుమార్యాన్ని అలవరచి (శ్రవణపేయంగా రూపొందించగల మార్దవ గుణం తెనుగుభాష (ప్రత్యేకత, అందుచేతనే బ్రౌన్‌ వంటి పాశ్చాత్య విద్వాంసులు ఆంధ్రభాషకు బ్రహ్మరధం పట్టారు భారతదేశానికి జాతీయ భాషకాగల అర్హత తెనుగుభాషకే గలదంటూ జె బి ఎస్‌ హాల్డేన్‌ వంటి శాస్త్రకారులు చాటి చెప్పడానికి గూడ అదే కారణం,

చరిత్రోదయ కాలం నుండీ, ఆంధ్రదేశంలో అనేక మత సాంస్కృతిక ఉద్యమాలు జరిగినై. ప్రగతిశీలమ్లైన ఆంధ్రుల సమరసభావమే ఆ ఉద్యమాలకు కారణమైంది. పలు రకాల సంకుచితతత్వాల నుండి జాతికి విముక్తి ప్రసాదించటమే వాని లక్ష్యం.

బౌద్ద మతాన్ని పునరుజ్జీవితం చేసి విసృత (ప్రజాదరణ చేకూర్చిన మహాయాన సిద్దాంతానికి ఆంధ్రదేశమే జన్మ భూమి. “లోకాస్సమస్తాస్సుఖినోభవంతు” అనే ఉదాత్త ఆశయంతో విశ్శకల్యాణ సాధనకై (శ్రమించాలనే దీక్షను ప్రబోధించే మహాకారుణిక సిద్ధాంతమే మహాయానం. భక్తికీ జ్ఞానానికీ, విశ్వాసానికీ - వివచనకూ సమన్వయం సాధించింది మహాయానం.

అదేవిధంగా హిందూమతం పునాదులను విసృతమొనర్చి సర్వజనాంగీకృతం చేయగల మార్దవాన్ని చేకూర్చిన పౌరాణిక మతోదయం జరిగింది ఆంధ్ర సాతవాహన చక్రవర్తుల సోషణలోనే. వైదిక దేవతలైన ఇంద్రాది లోకపాలకులతో బాటు సంకర్షణ వాసుదేవాది ఆగమిక దేవతల ప్రార్థనతో (ప్రారంభమైన నానాఘట్‌ శాసనంతోనే బ్రాహ్మణ మత సంస్కరణోద్యమానికి ప్రారంభోత్సవం జరిగింది. ఈ శాసనాన్ని వేయించిన నాగనికా అశ్వమేధ రాజసూయాది వైదిక (క్రతువులొనర్చి దక్షిణాపధపతియైన శ్రీ శాత కర్ణి మహారాణి. శాతవాహనులకు వారసులైన ఇక్ష్యాకు చక్రవర్తులు యజ్ఞాదులొనర్చి వైదిక మతోద్ధరణ సంకల్పించారు. వారి మహారాణులు మహాయాన బౌద్ధాన్ని పోషించారు తాము చేసిన పుణ్య కార్యాల ఫలం విశ్చమానవ సముద్ధరణకు తోడ్పడాలని ఆశించారీ మహారాణులు!

ర్‌?

బౌద్దము - ఆంధ్రము తత్ఫలితంగా నాగార్జున కొండలోయలో ఒకవైపు అష్టభుజ, పుష్పభద్ర, కార్తికేయ సర్వదేవాది వాసములు, మరొకవైపున చైత్య విహార సంఘారామాలు, బుద్దధాతు గర్భిత మహావైత్యచ్భాయలోనే అశ్చమేధ వేదిక వెలసినాయి. ఆంధ్రజాతి జీర్లించుకాన్న సహనానికీ సహజీవన శీలానికీ నాగార్జునకొండ అపురూపమైన చిహ్నంగా చారిత్రకులు పేర్కొంటారు. మధ్యయుగంలో వీరశైవ, వీరవైష్ణవ ఉద్యమాలకు ఆటపట్టు అయింది ఆం(ధ్రదేశం. మతంలోనూ, భాషలోనూ సమూలమైన మార్పులను ఉద్దేశించిన ఈ ఉద్యమాలు వీరవైష్ణవానికి నాయకుడైన పలనాటి బ్రహ్మన్న చాపకూడు. పంచమ దేవాలయ ప్రవేశము, వర్ణాంతర వివాహాలు మున్నగు విష్టవాత్మక సంస్కరణలు చేశాడు. పంచములకు “దాసరు' లని నామకరణం చేసి గాంధీ మహాత్ముని 'హరిజన' పదాన్ని.నాడే ఊహించాడు. (బ్రహ్మన్న సంస్కరణలు యావద్భారతంలోనే నాటికి అపూర్వాలనడం నిర్వివాదాంశం. ఐతే ఈ సంస్కరణలు వైదిక భక్తి మార్గాల మధ్య సామరస్యం మొ శ్చే ఉద్యమ ప్రభావం వల్ల నీరసించినాయి. భక్తిమీద వలపు (బ్రహ్మంబుతో పొత్తు బాయలేను నేను బసవలింగ అంటూ కర్ణాటక వీరైవోద్యమ నాయకుడైన బసవేశ్చరునకు ఆం(ధ్రనాయకుడైన మల్లికార్జున పండితారాధ్యుని సమాధానము. అదే నాటి ఆంధ్ర (ప్రజాభిప్రాయానికి దర్శణం. ఒకవైపు భక్తి బ్రాహ్మణ విధానాలకు, మరొకవైపు శైవ వైష్ణవాలకు సమన్వయం, సామరప్యం హాధింపబడినాయి. “విష్ణురూపాయ నమళ్ళివాయ' అంటూ కవిబ్రహ్మ తిక్కన (ప్రచారం న హరిహరతత్వం ఆం(ధ్రదేశంలోనే గాక దూర ప్రాచ్యదేశాలలో సైతం వైదికధ్యాయతను నెలకొల్పింది. సంఘర్షణ ఆంధ్రుల స్వభావానికే విరుద్ధం; సామరస్యం వారి నైజగుణం తిరిగి అక్బర్‌ పాదుషా కాలానికి తారస్తాయి నందిన హిందూముస్లిం సామరస్య ఉద హో సో గ్‌ సమం ఆంధ్రుల హృదయాల్లో సానుభూతి తంత్రులను మీటినదనడానికి జగన్నాధ పండితరాయల “ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా' ని, ఆర్భి నాదమే నిదర్శనము. తెనుగుల సహన సౌశీల్యమే, కుతుబ్‌ షాహీలకు పట్టుబడింది. 58

ఆంధ్రుల విశాల దృక్పధం మాలిక్‌ ఇబ్రాహీం కుతుబ్‌ షాను తెనుగు కవులు 'మల్మి. భరాం' అని కీర్తించారు. అతని వంశీయుడే ఐన తానీషా రామభక్తుడై భద్రాద్రీశునకు ముత్యాల 'తలంబ్రాలు' పోసే కట్టడి చేశాడు. ఇంతటి ఉదాత్త సహజీవన ఫలితంగానే తురకలను హిందూ సమాజంలో ఒక కులంగా పేర్కొన్నాడు హంస వీింశత్‌ కావ్యకర్త, పందొమ్మిదోశతాబ్లి ఆరంభంలోనే దేశంలో నవచైతన్యానికి, విజ్ఞాన పునరుజ్జీవనం అవసరమని ప్రబోధించిన గాజుల లక్ష్మీనరసింహశెట్లిని 'మ(ద్రాస్‌ రామమోహన్‌రాయలు” అని కీర్తించారు. ఆ తరువాత జాతీయ స్వాతంత్ర్య సం[గ్రామంలోనూ సంఘసంస్కరణోద్యమాలలోనూ, ఆం(ధ్రులదే అగ్రతాంబూలం! గాంధీజీ ఆదేశానుసారం, దేశస్వాతంత్ర్యంపై దృష్టిని కేంద్రీకరించి ఆంధ్రరాష్ట్ర సమస్యను వాయిదా వేయడంలో ఆంధ్రులు ఎంతో త్యాగాన్ని సౌజన్యాన్నీ ప్రదర్శించారు. స్వరాష్ట్ర సిద్దికై శ్రీ పొట్టి 'శ్రీరాములొనర్చిన అపూర్వ ఆత్మార్పణం సత్యాగ్రహ సమర విధానానికి పరాకాష్ట మద్రాసు, గంజాం బళ్ళారి, సమస్వల పట్ట ఆంధ్రుల వైఖం వారి శాంతి కాముకత్వానికి ఉదాత్త రాజకీయ చైతన్యానికీ గీటురాయి. ఇంతటి ఉదారగుణ సంపన్నమైనందునే దక్షిణ దేశవాసియ్రైన అప్పయ్య దీక్షితులు సైతం ఆంధధ్రత్వమాం[్ర భాషాచ (ప్రాభాకర పరిశ్రమః తత్రాపియాజుషీశాభా నాల్బస్యతపసః ఫలమ్‌” ఆంటూ ఆం(ధ్ర జాతీయతకు జోహారులను ఆర్చించినాడు. “్తావ్లోలా కడా ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ర్‌9

అడద్ష బి ఆ( అ 11. ఆంధ్ర సంస్కృతీ వికాసము - కాకతీయ యుగము

ఆంధ్రుల రాజకీయ జీవితంలో తెలుగు సంస్కృతీ పరిణామ చరిత్రలో కాకతీయ యుగానికి ఒక వైశిష్ట్యం ఉంది. అన్మకొండ - ఓరుగల్హు ప్రాంతంలో చిరకాలం సామంతులుగా ఉంటూ తమ సార్వభౌములైన చాళుక్యులు బలహీనులైనంతనే విజృంభించి ఆంధ్రదేశానికి కాకతీయులు ఏకచ్చత్రాధిపత్యం వహించినారు. ఈ వరశంలో ముఖ్యంగా గణనీయులైన రుద్రదేవ, గణపతిదేవ, రుద్రాంబ, ప్రతాపరుద్రులు పన్నెండో శతాబ్దం మధ్యనుండి పదునాల్లో శతాబ్దంలో రెండున్లుర దశాబ్దాల వరకు పరిపాలించినారు. ఈ రెండు శతాబ్దాల కాలంలోనే తెలుగుజాతి సమైక్యమై తన సంస్కృతికి రూపురేఖలు దిద్దుకొన్నది.

నాటివరకు ఆం(ధ్రేతర సామ్రాజ్య భాగాలుగా ఛిన్హాభిన్నమైయున్న తెలుగు మాగాణము లన్నింటిని జయించి మహదాం(ధ్ర సా(మ్రాజ్యాన్ని స్టాపించినారు కాకతీయులు, నాటితో వేగినాడు, వెలగనాడు, పలనాడు, రేనాడు, పాకనాడు అన్న ప్రాంతీయాభిమానాలతో స్థానిక యుద్దాలు రెచ్చగొట్టి, ప్రజాజీవితాన్ని సంక్షుభితం చేస్తున్న మాండలిక ప్రభుయుగం అంతరించింది. కాకతీయులు సముద్రాలతో పోల్చదగిన మహాతటాకాలు నిర్మించి పీఠభూమి (ప్రాంతాలను సస్యశ్యామలం చేశారు. గోలుకొండ వజ్రాల గనులు దేశానికి రత్నగర్భ నామాన్ని సార్ధకం చేసినాయి. మోటుపల్లి రేవు పట్టణం సాగించిన విదేశ వాణిజ్యం ద్వారా దేశంలోకి బంగారు నదులు 'ప్రవహించినాయి. సిరిసంపదలతో తులతూగిన నాటి ఆంధ్రభూమి మార్కోపోలో వంటి విదేశ యాత్రికుల నోరు ఊరించింది.

కాకతీయులు సాధించిన రాజకీయ శాంతి సమైక్యాలు ఆర్థిక సొభాగ్యముల ఫలితంగా

60

బౌద్దము - ఆంధ్రము కాకతీయ యుగంలో పాల్కురికి సోమనాథుడు ద్విపదలో రచించిన వీరైైవ కావ్యాలు ప్రాచీన తెలుగు వాజ్బయంలో నిజమైన స్వతంత్ర కావ్యాలనడంలో అతిశయోక్తి లేదు. తైవులననుకరించి కాబోలు వైష్ణవులు ద్విపదలో రంగనాథ రామాయణాన్ని తయారు చేసుకున్నారు. ఇక స్మార్తుల ఇతిహాస పురాణాలను తెలుగులోనికి అనువదించి వేదమత సారాన్ని ప్రజలకు అందించడానికి (ప్రయత్నించారు. శైవవైష్ణవాలు భక్తి ప్రధానాలయి విగ్రపోరాధన పై నాధారపడినందున దేవాలయాలు మతానికి కేంద్రాలయినాయి. కాకతీయ సామ్రాజ్య వైభవానికి దీటుగా పిల్లలమ్రి, పాలంపేట, ఓరుగల్లు అనుమకొండ దేవాలయాల నిర్మాణం జరిగింది. బౌద్దయుగానంతరం ఆంధ్రదేశంలో పెద్దఎత్తున రమణీయమైన శిల్పసృష్టిజరిగింది కాకతీయ యుగంలోనే. దేవాలయాలు వాస్తు శిల్పాలకేగాక నాట్యసంగీలే శాస్త్రాలకు పట్టుగొమ్ములయినాయి. గణపతి దేవుని గజసాహిణియైన జాయప రచించిన 'నృత్తరత్నావళిలోని నాట్యభంగిమలను పాలంపేట రామప్ప దేవాలయంలో శిల్పాలుగొ రూపొందించినారని 'పతీతి,

దేవాలయాలతోబాట్స శైవులు దేశం నలుమూలలా మఠాలు స్థాపించి (ప్రజాసేన చేశారు. శైనమఠాలలో దాపళ దేశం నుండి వచ్చిన గోళకీమరం సుష్రసిద్ధమైనది. ఈ మఠానికి గుంటూరు జిల్లాలోని మంద్రడ్తం 'ప్రధానకేంద్రం. ఇచటి మఠానికి అనుబంధంగొ వేదపాఠశాల సత్రాలు జే వాలయాలతోబాటు “ప్రసూతి ఆ రోగ్యశాల' ఉండడం గమనింపదగిన విశేష కతా ఎలో నీరైవులకు వారేసాటి. పేరుకు తగినట్టు వీరైవులనేక న్‌ న లూగువారు'. తగ్గ (లస గొంకి కంకాళ చర్మము (గ్రుచ్చి ఉడువీధి ను రు

దైవం కోసం కండలు కోసి ఇచ్చేవారు. తలలు కత్తిరించుకొనేవో

మతం పేర దేశం పేర తన ్ప పల్తెలు పట్టణ ప్రతిధ్వనించినాయి. వా గాత చాలించిన వీరుల గాథలతో పలల డు ణా ఉత్సాహ ఉద్రేకాలు పొందేవారు (త్రపటాలను ప్రజలు ఇండ్లలో లల

వీరైన పీ , కీద్షానద్యమ క క వర్షవ్యత్యాసాల్పు లేని సమాజ స్థాపనకు కృషి మూ

ఎలనాట్రి (బ్రహ్మన్న చాపకూడు, పంచముల 62

ఆంధ్ర సంస్కృతీ వికాసము = కాకతీయ యుగము (ప్రవేశం వంటి తీవ్రవాద సాంఘిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. కాని ఈ ఉద్యమాల విజృంభణ కేవలం తాత్కాలికమే. (క్రమంగా సనాతనము వేదహితమువైన స్మార్త ధర్మ (ప్రభావం బలపడింది. ప్రముఖ దేవతల మధ్య సామరస్యాన్ని సాధించింది స్మార్తమతం; భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలను సమన్వయం చేసింది. ఆంధ్ర దేశంలో వీర్షైవోద్యమ నాయకుడైన మల్లికార్జున పండితారాధ్యుడే “భక్తి మీద వలపు (బ్రాహ్మంబుతో పొత్తు బాయలేను నేను బసవలింగ ” అని ప్రకటీంచినాడట. పరమ మహేళ్చర బిరుదాంచితుడైన రుద్రదేవుడు అనుమకొండలో తాను నిర్మించిన 'రుద్రేశ్చరమ'నే 'త్రికూటాలయరిలో శివునితోబాటు సూర్యుని, విష్ణుమూర్తిని (ప్రతిష్టించి పూజించినాడు. గోళకీ మరాధిపతియై గణపతి దేవునకు శివదీక్షా గురువైన విశ్చేళ్ళర శివదేశికులు (బ్రాహ్మాణోత్తములను వైదిక విద్యలను పోషించినాడు. అద్వైత ధర్మప్రచారకుడై మహాకవి తిక్కనను ఆదరించినాడు. వాస్తవానికి నాటీ సాంస్కృతిక సమన్వయ ఉద్యమం తిక్కన మహాకవి జీవితంలో పారవ్యూన్ని పొందింది. భాషలో, శైలిలో, మతంలో సామరస్యాన్ని సాధించినాడు తిక్కన. సంస్కృత భాషా గాంభీర్యాన్ని తెలుగు నుడికారపు మార్చవాన్ని ఇంచుమించు సమపాళంలో మేళవించి మార్గదేశీ విధానాలకు రాజీకుదిర్చి ఉభయ కనిమిత్రుడయినాడు. ఈ బాణీనే ఈ యుగంలోని ఇతర కవులు అఆనుసరించినట్టు కన్చిస్తుంది. అదేవిధంగా “విష్ణురూపాయ నమళ్ళివాయ' అంటే ళివకేశపులకు భేదం లేదని శైవనైస్తవుల మధ్య వారధిగా హరిహర తత్వాన్ని (ప్రచారం చేసి, ఆం(ధ్రజాతి ఐక్యతకు భంగం రాకుండా కృషి చేసి విజయం సాధించాడు, ఈ విధంగా సమైక్య జుతీయ భావము సమరస సమన్వయదృష్టి తన విశ్వాసానికి సిద్దాంతానికీ ఆత్మార్చణ సైతం చేయగల ధైర్యస్టయిర్యాలు ప్రజా జీవితంలో సాధించిన కాకతీయ యుగస్మృతులు ఏయుగంలోనైనా ఆంధ్రుల సాంస్కృతిక పురోగతికి వెలుగుబాటగా సహకరింపగలవు. ఆకాళవాణే విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఈం

ఆంధ్ర సంస్కృతీ వికాసము - కాకతీయ యుగము

(ప్రవేశం వంటి తీవ్రవాద సాంఘిక. సంస్కరణలు ప్రవేశపెట్టాడు. కాని ఈ ఉద్యమాల విజృంభణ కేవలం తాత్కాలికమే. క్రమంగా సనాతనము వేదహితమునైన స్మార్త ధర్మ (ప్రభావం బలపడింది. [ఫముఖ దేవతల మధ్య సామరసాన్ని సాధించింది స్మార్తమత౦; భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలను సమన్వయం చేసేంది. ఆంధ్ర దేశంలో వీరైవోద్యమ

నాయకుడైన మల్లికార్జున పండితారాధ్యుడే “భక్తి మీద వలపు బ్రాహ్మంబుతో పొత్తు బాయలేను నేను బసవలింగ ;” అని 'ప్రకటించినాడట. పరమ మహేశ్వర బిరుదాంచితుడైన రుద్రదేవుడు అనుమకొండలో తాను నిర్మించిన 'రుద్రేశ్చరమినే “త్రికూటాలయం'లో శివునితోబాటు సూర్యుని, విష్ణుమూర్తిని ప్రతిష్టించి పూబించినాడు. గోళకీ మఠాధిపతియై గణపతి దేవునకు శివదీక్షా గురువైన విశ్చేశ్చర శివదేశికులు (బ్రాహ్మణోత్తములను వైదిక విద్యలను పోషించినాడు. అద్వైత ధర్మప్రచారకుడై మహాకవి తిక్కనను ఆదరించినాడు, వాస్తవానికి నాటి సాంస్కృతిక సమన్వయ ఉద్యమం తిక్కన మహాకవి జీవితంలో పారక్ష్యూన్ని పొందింది. భాషలో, శైలిలో, మతంలో సామరస్యాన్ని సాధించినాడు తిక్కన, సంస్కృత భాషా గాంభీర్యాన్ని తెలుగు మడికారపు మార్షవాన్ని ఇంచుమించు సమపాళంలో మేళవించి మార్గదేశీ విధానాలకు రాజీకుదిర్చి ఉభయ కవిమిత్రుడయినాడు. ఈ బాణీనే ఈ యుగంలోని ఇతర కవులు అనుసరించినట్టు కన్పిస్తుంది. అదేవిధంగా “విష్ణురూపాయ నమశ్శివాయ” ఆంటే శివకేశవులకు భేదం లేదని శైవవైష్ణవుల మధ్య వారధిగా హరిహర తత్వాన్ని ప్రచారం చేసి, ఆంధ్రజాతి ఐక్యతకు భంగం రాకుండా కృషి చేసి విజయం సాధించాడు. ఈ విధంగా సమైక్య జాతీయ భావము సమరస సమన్వయదృష్టి తన విళ్వాసానికీ సిద్దాంతానికీ ఆత్మార్సణ సైతం చేయగల ధైర్యస్టయిర్యాలు ప్రజా జీవితంలో సాధించిన కాకతీయ యుగసృతులు ఏయుగంలోనైనా ఆంధ్రుల సాంస్కృతిక పురోగతికి 'వెలుగుబాటగా సహకరింపగలవు, ఆకాళవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో 63

ఇఒగ్జీ ఉగ్జీ 112. ఆంధ్రదేశంలో సంస్కరణ - క్రి బాతువాద ఉద్యమాలు బుగ్వేదములోని ఐతరేయ (బ్రాహ్మణము ప్రకారం ఆంధ్రుల మూలపురుషుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు వేద బుషులలో అస్లిశలాక. విశ్వామిత్రుని వ్యక్తిత్వము చరిత్ర విద్యార్దులకు ఒక చిక్కు సమస్య. బుగ్వేద కాలంలో ఆర్యులకు వ్యతిరేకంగా దాస దస్యగణాల నాయకుడు: రామాయణ కాలం నాటికి ఆర్యమత (ప్రచారకులు దక్షిణా పథం ప్రవేశించారు. వారి రక్షణార్హం ఉత్తర భారతదేశంలో రాజులను ఆశ్రయించాడు; తరువాతి కాలంలో వైదికముత మౌఢ్యం, ఆర్యుల జాత్యహంకారం, పూజారిగణ ఆధిపత్యం, బలులు, కుల ఆసమానతలు మున్నగు వానికి వ్యతిరేకంగా పోరాడిన విషప్ణవకారుడు, ఈ విషయాలను వశిష్టునితో అతని వైరము, సునస్సప - త్రిశంకు ఉపాఖ్యానాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి ప్రతిభా సంపన్నుని నుండి ఆంధ్రులు విప్లవ భావాలను పుణికి పుచ్చుకున్నారు: సునస్సప ఉపాఖ్యానంలో ఆంధ్రులు విశ్వామిత్రుని పైననే తిరుగుబాటు ప్రకటించినట్టు తెలుస్తోంది. క్రూరమైన పైతృక దండనలకు తలజగ్గక ప్రకృతి సిద్ధమైన హక్కులను త్యాగం చేయటానికి యిష్టపడక ఆంధ్రులు దేశాంతరవాసాన్నే ఎంచుకున్నారు, ఆం(ధ్రబాతి విలక్షణమైన తొలిదశ యిదే! ట్‌ వాన కాలంలో ఆంధ్రులు కంసుని ఆస్టానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్యరాజులలో, క తమైన, నిందలకు తీవ్ర దు్త్రచారానికి గురయినవాడు కంసుడు. నిజానికి 0సుడు. ఆర్య - అనార్య వైషమ్యాలను ఆరికట్టే ప్రయత్నం చేశాడు. క్ష కవ ల ఆన్థాన మల్లయుద్ధ ప్రవీణుడైన చాణూరుడు ఆంధ్రుడు. ఆర్యులకు అది బలే అయింది. వారి నాయకుడైన వాసుదేవుడు చాణూరుని, అతన్ని ఆదరించిన రక్తీ

ఆంధ్రదేశంలో సంస్కరణ - హేతువాద ఉద్యమాలు కంసుని హతమార్చాడు. వాసుదేవుని (ప్రియమైన బిరుదనామము “చాణూర ఆంధ్ర నిషుదన” సహస్రనామాలలో ఒకటి. ఈ చర్య ఆంధ్రులలో సవ్ర ప్రతీకారాగ్షిని ప్రజ్బరిల్ల చేసింది. కురుక్షేత్ర ఫం(గ్రామములో వాసుదేవునికి వ్యతిరేకంగా ఆంధ్రులు కౌరవ పక్షం వహించారు. ప్రజల్టో.ఉన్న అభిప్రాయం ప్రకారం, పాండవులు భారతదేశంపై కొత్తగా దండెత్తి వచ్చిన విదేశీయులు; అంతకు పూర్వమే వచ్చిన కౌరవులను అంతమొందించి తమ జాతి అయిన యాదవులకు పట్టం కట్టాలని వాసుదేవుడు పాండవ పక్షాన చేరాడు. కానీ వాసుదేవుని కోరిక నెరవేరలేదు. కారణం సహోదర కలహాలతో యాదవులంతా మరణించారు. అదే సమయంలో వాసుదేవుడు ఒక నిషాదుని బాణంతో చాలా 'హేయంగా హతుడయాడు. చాణూర హత్య ప్రతీకారానికి వేచియున్న ఆంధ్రుడే ఆ నిషాదుడయి ఉండవచ్చునేమో! మనువు ఆంధ్రులను 'నిషాదులు' అన్నాడు. ఇతిహాస కాలంలో వైదికముతము ఆంధ్రదేశంలో (ప్రబలంగా వుండేది. వైదిక మత విషయలోలతకు వ్యతిరేకంగా దేశమంతటా సన్యాసాశ్రమ విధానము అభివృద్ది చెందింది. (శ్రమణుల, పరివ్రాజకుల విధానము ఆర్యేతరమయినది. అపస్తంబుడు, బేధాయనుడు మున్నగు ఆర్యసూ[త్రకారులు ఆ విధానాన్ని నిరసించారు. దర్శనాల జిజ్ఞాస లోకాయత లౌకికతత్త్యము, దక్కనులో బహుళ (ప్రజాదరణ పొందాయి. వైదిక వాజ్యయం ప్రతిపాదించే కళోర నియమాలకు విసుగుచెందిన జౌత్తరాహులు కోకాయత, ఇతర దర్శనాల అధ్యయనానికి దక్షిణాపథం వచ్చేవారు. (శ్రమణులు పరివ్రాజకులు దేశమంతటా సంచరిస్తూ ప్రజల మధ్య నివళిస్తూ ఉండేవారు. కర్మకాండల నిరుపయోగాన్ని విశదం చేసేవారు; వ్యక్తిగత నైతికత, సాంఘిక సమానత - సౌహార్టతల ఆవశ్యకతను వివరించేవారు. ఆ విధమైన మేథా సంపదతో కూడిన వాతావరణం బౌద్ధజైనాల =వ్యాప్తికి అనుకూలం అయింది. ముఖ్యంగా బౌద్దం గహపతుల, వణి(క్రముఖుల, చర్మకారులతో సహా యితర వృత్తి పనివారల ఆదరణ పొందింది. ఆంధ్రదేశంలో బౌద్దము 'పామర జనుల మతము” అయింది, బౌద్ధమత ఉదారభావం ఆంధ్రులను ఏకం చేసింది. సుఖసంతోషాలతో కూడిన 6ర5్‌

బౌద్ధము = ఆంధ్రము జీవితంపై (ప్రేమనిచ్చింది; ఆశావాదాన్ని రేకెత్తించింది. సాహసించాలవే స్పూర్తినిచ్చింది: అమరావతి నాగార్జున కొండలలోని కళాత్మక శిల్చ సంపదను సృజింపచేసింది; శ్ర్‌స్తు శకారంభ శతాబ్దంలోనే వౌకావాణిజ్యాన్ని పెంపొందించింది. గౌతమ బుద్దుని హేతుబద్ధమైన 'ఫ్రతిత్య సముత్సాద' సిద్దాంతము సమస్ర మానవాళికి నిర్యాణము (ప్రాతిపదికతో ముహాయానముగా రూపొందింది. మహాయానాన్ని దర్శనంగా రూపొందించిన ఆచార్య నొగొర్జునుడు శ్రీ పర్వతము (నాగార్జున కొండ)లో చాలా కాలం నివసించాడు. నాగొర్జునాబార్యుడు తనను ఆదరించిన శాతవాహన రాజునకు సర్వమత సహనము, మరణశిక్ష రద్దు, అనాథులకు, వ్యాధిగ్రస్తులకు దరిద్ర నారాయణులకు ఉచిత ఆహార గృహవసతి సౌకర్యాలు మున్దుగు సంస్కరణలను (ప్రతిపాదించాడు. ఇని (శ్రేయోరాజ్య సిద్దాంతానికి పువాదులయిన సంస్కరణలు. బౌద్ద జైనమతాలు అవిద్యను, అజ్ఞానాన్ని చొలగించే ప్రయత్నం చేశాయి. అంధ విశ్వాసాలను ఖండించాయి. 10వ శతాబ్దంలో కరీంనగర్‌ జిల్లాలో నిసించిన జైన రచయిత ఈ (క్రింది ఆచరణలను మూర్థమైనవిగాను, పనికిఘాలినవి గాను వర్లించాడు. నూర్చగ్రవ్యా (హణ స్టానం నంక్రాతౌద వినవ్యయాః గొహదేహార్థునో విధిః నదీనద సముద్రము మజ్ఞనం-ధర్మచేతనం తరుస్తూ పాగ్ర భక్తానాం వందనం భృగు సంస్రయాః గోపుస్తంతు నమస్కారం తన్మూత్రస్య నిషేవనం 656

ఆంధ్రదేశంలో సంస్కరణ - హేతువాద ఉద్యమాలు రత్దువహన భూయక్షా శన్తశ్రైలాది సేవనం _ ఇవినేటికీ సజీవంగానే ఉన్నాయి. విద్యాధికులు (?) కూడా వీటిని పవిత్రంగా భావించి ఆచరించటం ఎంతటి దౌర్భాగ్యం? బౌద్ధ జైనమతాల క్షీణత, వైదికమత. పునరుద్ధరణ దాదాపు ఒకేసారి జరిగినాయి. సాంఘిక అసమానతలు, ఆధ్యాత్మిక, అరాచకత్వముతో కూడిన వైదికమత పునరుద్దరణను ఆంధ్రదేశం తీవ్రంగా ప్రతిఘటించింది. వీర2ైవ, వీరవైష్ణవ ఉద్యమాలు ఈ ప్రతిఘటనకు కారణం. వీరశైవ వీరవైష్ణవ ఉద్యమాలకు అవైదికమైన భక్తితత్యము, బౌద్ధ జైనమతాలలోని విష్లవభావాలు స్ఫూర్తినిచ్చాయి. శైవులు, వైష్ణవులు బలులను యితర కర్మకాండలను ఖండించారు; కులాలను నిరసించారు. సమానతా ప్రాతిపదికపై సంఘ పునర్నిర్మాణాన్ని వాంఛించారు. శ్రైవకవి పాల్కురికి సోమన కులాన్ని గురించి అడిగిన వారి నాలుకను నరకమన్నాడు. అందరిదీ ఒకే కులమనీ - అదే 'భక్త కులము' అని చాటాడు. (ముఖ్యంగా శైవ) కవులు సాంప్రదాయకమైన మార్గ ఛందస్సును వీడి స్టానికమైన 'దేశి' ఛందస్సును అనుసరించారు. పల్నాటి రాజుల మంత్రి క్రీఃశ. 12వ శతాబ్దం వాడు అయిన (బ్రహ్మనాయుడు వీరవైస్ణవ ఉద్యమ నాయకుడు. చాపకూడు, కులాంతర వివాహాలు, పంచములకు దేవాలయ ప్రవేశము మున్నగు హేతుబద్దమయిన సంస్కరణలు ప్రవేశపెట్టాడు. పంచములకు బ్రహ్మన్న (హరి) దాసరులు” అని పేరు పెట్టాడు. (మహాత్ముని హరిజనుల నామాన్ని శతాబ్దాల పూర్వమే ఊహించాడు) (బ్రహ్మనాయుడు ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలు మధ్యయుగ భారతదేశములో ఏ ఇతర 'ప్రాంతములోనూ (ప్రవేశపెట్టబడలేదు. శ్రైవుల = వైష్ణవుల మధ్య విభేదాలు అంతర్గత కుమ్ములాటలతో ఈ ఉద్యమం అంతరించింది. ఇదే సమయంలో భక్తితత్తానికి వైదిక నుతకుల తత్వానికి మధ్య సయోధ్య ప్రయత్నాలు ఉధృతమయాయి. పండితారాధ్యుడు, తిక్కన సోమయాజి మున్నగు ప్రసిద్ధ కవులు ఆ ప్రయత్నాలకు మార్గ దర్శకత్వం వహించారు. ఫలితంగా విష్ణవం విఫలం అయింది; ప్రతీపళక్తులు విజయం సాధించాయి. ర

బౌద్దము = ఆం(ధ్రము

హిందూ ప్రజ ఇస్లాముదాడికి తలవొగ్గటానికి వారి రాజకీయ అనైక్యత మాత్రమే కాదు. సాంఘిక, మత అనైక్యతలు కూడా ప్రధాన కారణాలే. మౌలిక ఐక్యత గురించి ఎంత చెప్పినా హిందూమతం సంఘటిత పరచే మతం కాదని, సంఘాన్ని విభజించటమే దాని సూత్రమనేది యదార్థం. ముస్లిముల ఉదారభావం వారి పాలనా కాలపు తొలిదినాలలోనే (గ్రహింపునకు వచ్చి హిందూమతంలోని అసమ(గ్రత గుర్రింపబడింది. ఫలితంగా ఒక సాంఘిక ఉద్యమం రూపుదాల్చింది. శాఖాపరమైన, కులపరమైన శక్తులను తొలగించి మత సహనము, సుహృద్భావము, సాంస్కృతిక సమైక్యత పునాదులపైన హిందూమతాన్ని ఉద్దరించే కార్యక్రమం మొదలయింది. పద్నాలుగవ శతాబ్దపు తొలిదళ నుండి, ముస్లిం ఆధిపత్యపు దుష్ఫలితాలను ఆంధ్రదేశం చవిచూసింది. దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లిన సాంఘిక్త మత విష్ణవోద్యమాలకు స్పందించింది. ఆంధ్రదేశ సాంఘిక వాజ్మయ చరిత్రలో విలక్షల్ల స్థానాన్ని పొందిన వేమన యోగిని ప్రసాదించింది. ఆంగ్ల పాలకుల దృష్టిని ఆకర్షించి మొదటి యోగులలో వేమన ఒకడు. ఆంగ్లానువాదం పొందిన తాలి భారతీయ రచనలలో వేమన రచనలు చోటు చేసుకున్నాయి.

సంస్కరణ యోగిగా వేమన ఆ నాటి పరిస్థితులకు ఎంతో అవసరం అయిన వ్యక్తి అతడు విద్యావేత్త కాడు; అనారోగ్యకరమైన పునరుజ్జీవన పోకడలకు దూరంగా ఉఉన్నాడ్స మానన స్థితిగతులను నిశితంగా పరిశీలించాడు; ఘాటయిన విమర్శలు చేశ్చాడ్ష హిందూసమాజంలోని గర్హనీయ పరిస్థితులు అతనిని బాధించాయి. అంధవిశ్వాసాల్పు నిరుపయోగమైన కర్మకాండలు, స్వార్ధపూరిత దొంగ పూజారులు, శాఖాద్వే షాలు, కులాల కుమ్ములాటలు సమాజపు ప్రధాన అంగాలను విషపూరితం చేశాయి. సమక్షా లీన సాంఘిక్క ఆధ్యాత్మిక సమస్యలకు అతని పరిష్కారాలు నీతితోనూ, మాన్వ త్వపు విలువలతోనూ కూడియున్నాయి. వేమన హేతుబద్ధమైన నైతికవాది,

వేమన తన భావాలను చక్కని చిక్కని పామర జన భాషలో ప్రజల నాలుకపై ఆడ్ర ఆట వెలది ఛందస్సులో చెప్పాడు. వందల కొలది పద్యాలను చెప్పాడు. అతని అనుయాయులెవరు? ఎందరు? అనేది తేలని సమస్య, వేమన పద్యాలను కొన్నిటినైనా

6కి

ఆంధ్రదేశంలో సంస్కరణ-హేతువాద ఉద్యమాలు కంరస్తంగా రాని ఆం(ధ్రుడుండడనటం అతిశయోక్తి కాదు అతని సూక్తులను ఎన్నిటిని ఎందరు ఆచరించారనేది ప్రశ్నార్హకమే. “భారతీయులు సిద్దాంతకారులే కానీ ఆచరణ బద్దులు' కారనేది కరోరసత్యం. యోగి పుంగవులను సంస్కర్తలను మాటల్తో గౌరవిస్తాము; చేతల్లో ఆచరించము 17-18 శతాబ్దాలలో భారతదేశం కులమత విద్వేషాలకు ఆలవాలమయింది. రాజకీయ మేధావి వర్గాలలో అరాచకం ప్రబలింది ఆంగ్ల రాజ్యస్థాపనకు మార్గం సుగమర అయింది భారతీయులు అంతకు మునుపెన్నడూ అనుభవించని రాజకీయ అణచివేతకు ఆర్థిక దోపిడీకి ఆంగ్ల పాలనా కాలంలో గురి అయినారు. కానీ కొంత మంచి జరిగింది" ఆంగ్లభాష. పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో ప్రవేశించాయి దీనితో మహోన్నతమైన మేధా వికాసము, సాంస్కృతిక పునరుజ్జీవనము జరిగింది. ఆధునిక భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి 'ఉదయితార గా ౮-జూరామమోహనరాయ్‌ని ప్రపంచం కీర్తించింది. మద్రాసు నగరం దక్షిణ భారత దేశానికి 'మేధా రాజధాని”గా విలసిల్లింది మద్రాసులో ఆంధ్రులు కీలకపొత్ర నిర్వహించారు వారలో ఇరువురు ప్రముఖులు చిరస్మరణీయులు. ఒకరు ఎనుగు విశ్వేశ్స్చరయ్య - మద్రాసు హైకోర్టులో అనువాదకుడు. దక్షిణదేశ రాజారామమోహనరాయ్‌గా ప్రసిద్ది గాంచిన రెండవ వ్యక్తి గాజుల లక్ష్మీనరసింహశెట్టి వణి'క్ర్రముఖుడు. 1844లో *క్రాసెంట్‌ పత్రిక స్థాపించాడు పర (విదేశీ ప్రభుత్వ అసమ॥గ్రతలను (క్రెసెంట్‌ పత్రిక ధైర్యంగా విమర్శించేది స్టానిక ప్రజల అభిప్రాయాలను కోరికలను హేతుబద్ధంగా వెలిబుచ్చే 'వేదికగా ఆ పత్రిక ఉపకరించింది. సంఘసంస్కరణలను ఆంగ్లేయులు హృదయ పూర్వకంగా చేపట్టలేదు. వారు చేపట్టిన సంస్కరణలను సైతం సనాతన హైందవులు వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకత 1857 సిపాయి తిరుగుబాటుతో పతాక స్థాయిని చేరింది (ప్రగతికి సంఘ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రభుత్వ మద్దతును 'విక్టోరియా మహారాణి ప్రకటన' వెలిబుచ్చింది దీనితో సనాతన హైందవ ఛాందసులకు విజయం చేకూరింది సంఘ సంస్కరణ ఉద్యమం సహ్నదయుల నిస్వార్థపరుల వ్యక్తిగత సేవలకు మాత్రమే పరిమితం అయింది. 69

బౌద్దము - ఆం(ధ్రము

ఈ విధమైన నిరుత్సాహ పరిస్థితులలో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు మున్నగువారు అంకిత భావంతో సంస్కరణ ఉద్యమాన్ని చేపట్టారు. విరలో కందుకూరి వీరేశలింగం అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాడు. వీఠశలింగం వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడు; ధర్మశాస్తాలలో నిష్టాతుడు; అర్జికంగా శృదవాడు. రాజారామమోహనరాయ్‌ జీవితము - ఆలోచనలు అతనికి స్ఫూర్తినిచ్చాయి. ఆఅంధ్రదేశములోని బాధాసర్పద్రష్టుల ఉద్ధరణకు జీవితాంతము అవిశ్రాంతంగా పోరాడాడు, సనాతన ఛాందసుల అవమానాలనెన్నింటినో భరించాడు. బాల్య వివాహము, అజన్మాంత వైధవ్యము, వేశ్యావృత్తి కన్యాశుల్కము సాంఘిక దురాచారాల నిర్మూలన అతని లక్ష్యము. వీరేశలింగం తెలుగులో మంచి రచయిత. ప్రజలలో సాంఘిక చైతన్యాన్ని తీసుకురావటానికి సాహిత్యాన్ని శక్తివంతమైన ఆయుధంగా వాడుకున్నాడు. తన వాదనలకు బుజువులను హైందవ ధర్మశాస్త్రాల నుండి విరివిగా ఉదహరించేవాడు. దీనిలో అన్ని తరగతుల (ప్రజలను ఆకట్టుకుని వారిలో చైతన్యాన్ని తీసుకురాగలిగొడు. ఈ విధంగా మొదలైన సంఘ సంస్కరణోద్యమం (క్రమంగా మహాత్మాగాంధీ నాయకత్వంలోని స్వాతంత్రోద్యమ నిర్మాణాత్మక కార్యక్రమాలలో అంతర్భాగమయింది. అంటరాని తనం నిర్మూలన; హరిజనుల దేవాలయ ప్రవేశం; స్త్రీ విద్యలకు ఆంధ్రదేశంలో మంచి

స్పందన లభించింది. కవిరాజు (త్రిపురనేని రామస్వామి శివకవుల విప్లవోద్వేగాన్ని కందుకూరి గురజాడల సంస్కరణోత్సాహాన్ని మానవత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆంధ్రుల సాంఘిక చరిత్రలో భావవిష్ణవ వైతాళికుడుగా, అభ్యుదయ తీర్ణంకరుడుగా, విశిష్ట స్థానాన్ని ఆ(క్రమిస్తాడు. సాంఘిక సమస్యలను ఫరిష్కరించటంలో హేతుబద్ధమైన ఆలోచనలను, శాస్త్రీయ దృష్టిని ప్రవేశపెట్టిన ఘనత కవిరాజుకే దక్కుతుంది. మానవుడు మతాన్ని సృష్టించిన నాటి నుండి మతము మానవాళికి మంచికంటే హానినే ఎక్కున చేసిందనే విషయాన్ని (గ్రహించాడు. మతముసై విశ్వాసాన్ని మత సంస్థలపై భక్తిభావాన్ని వ్యంగ్యంగా (ఐరోపా పునరుజ్జీవన కాలం నాటి ఎరాన్మస్‌ వలె) విమర్శించాడు. భారతీయ సాంస్కృతిక

70

ఆంధ్రదేశంలో సంస్కరణ - హేతువాద ఉద్యమాలు వారసత్వంలోని లొసుగులను [గ్రహించి నేటి రాజకీయ సాంఘిక చైతన్యానికి ప్రాచీన రచనల నుండి స్పూర్తి పొందటం “వెనుక ముఖంతో ముందుకు నడవటం” అని వ్యంగీకరించాడు. ఆతని దృష్టిలో పురాణాలు, ధర్మశాస్త్రాలు చారిత్రిక విలువ కలిగినవి మాత్రమే. సంఘం చైతన్యవంతమై, (ప్రగతి దిశలో పయనిస్తుంది. అధికార బలంతో సంప్రదాయాలపై భక్తి విశ్వాసాలతో సత్యావిష్కరణ జరగదని, స్వేచ్చా సమానత్వాలే సత్యావిష్కరణకు పునాదులని కవిరాజు వాదన. ఆతని సిద్దాంతంలో కులమత వర్ణ వ్యత్యాసాలకు తావులేదు. ఆతని 'సూతా(శ్రమము' కవిర్థాజు భావపుంజాలను నలుదిశలా వెదజల్లింది. ఆవుల గోపాలకృష్ణమూర్తి వంటి యువ మేధావులెందరినో ఆకర్షించింది. వారు అతని ఆలోచనలు క్రియారూపం దాల్చటానికి కృషి చేశారు. సం(ప్రదాయాలకు బానిస అయిన భారతదేశంలో హేతువాదం నత్తనడకే నడుస్తుంది. పారిశ్రామికీకరణతో మార్క్సిస్టు - సోషలిస్టు భావాలు భారతదేశంలో ప్రవేశించాయి; హేతువాదము అభివృద్దికి తోడ్చడినాయి; కానీ రెండు ప్రపంచ యుద్దాల మధ్యకాలంలో భారత రాజకీయ వాతావరణము కులమతాలతో నిండి ప్రతీపశక్తులు విజృంభించటానికి దోహదపడింది. ఈ పరిస్టితులలోనే యం.యన్‌.రాయ్‌ రాడికల్‌ డెమో(్రటిక్‌ పార్టీని స్థాపించాడు. తరువాత ఆ పార్టీ రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమంగా రూపొందింది. హేతుతత్వము, లౌకికతత్వము, (ప్రజాస్వామ్యపు విలువలతో నిండిన నాయకత్వాన్ని భారతదేశానికి అందించటం రాయ్‌ ఉద్యమ లక్ష్యం. భారత జాతీయ కాంగ్రెస్‌కు దీటయిన వికల్పం కావాలని రాయ్‌ ఆకాంక్ష. మతాన్ని రాజకీయాన్ని కలపటం, రామ రాజ్య ప్రతిపాదన, రాట్నం ద్వారా ఆర్థిక ప్రగతి, యువకులలో చట్టవ్యతిరేక భావాన్ని (ప్రేరేపించటం మున్లుగు విధానాలకు రాయ్‌ విముఖుడు, నూతన భావ విప్టవం డ్వారా భూతకాలపు సంకెళ్ళను తెంచి భారత జాతిని విముక్తం చేయటం అతని ధ్యేయం. మానవుడు ఏ 'ఇజానికి' బందీ కాకూడదనీ, సంఘ నిర్మాణానికి మానవుడే పునాది కావాలని అతని వాదన. అతని 'శాప్రీయ రాజకీయాలు" "కుడి-ఎడమి'ల దాడి నుండి (ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరినిచ్చి ఉత్తేజాన్ని కలిగించాయి. ఇతర ప్రాంతాలలో వలెనే శక!

బౌద్దము - ఆంధ్రము ఆంధ్రదేశంలో కూడా రాడికల్‌ ఉద్యమం కొంత మంది మేధావులకు మాత్రమే పరిమితం అయింది. అది సాధించిన విజయాలు గొప్పవి కాకపోవచ్చుకానీ స్వల్పమయినవి మాత్రం కావు. అధ్యయన సదస్సులు, శిక్షణా శిబిరాలు వేసవి పాఠశాలలు ద్వారా ఉద్యమం ప్రజలను కొంత వరకు జ్ఞానవంతులను చేసింది. ఒక వైపున మత మౌఢ్యం నుండి రెండవ వైపున కమ్యూనిస్టు నిరంకుశత్వం నుండి ప్రజలను దూరంగా ఉంచగలిగిండి. స్వాతంత్రానంతరం “ఇండియన్‌ రేషనలిస్టు అసోసియేషన్‌ అంధ విశ్వాసాలను ఖండించి హేతుబద్ధమైన దృక్పథాన్ని పెంపొందిస్తోంది. సాంఘిక సమానత్వము, ఐక్యమత్యముల ప్రాధాన్యత వివరిస్తోంది. వరంగల్లు, నల్లొండ, చీరాల, హైదరాబాదు పట్టణాల నుండి 'నాస్తిక', 'మూఢవిశ్వాసలు', 'హేతువాది', 'చార్వాక' మున్నగు పత్రికలు కృషి చేస్తున్నాయి. 'గోరోగా బహుళ ప్రాచుర్యం పొందిన గోపరాజు రామచం(ద్రరావు హేతుదృష్టి, విశ్చడదార స్ఫూర్తికై సుమారు నలబై సంవత్సరాల పాటు కృషిచేశారు. వారు స్థాపించిన “నాస్తిక కేంద్రము” ప్రపంచ హేతువాదుల దృష్టిని ఆకర్షించింది. వారి జీవితము, విశిష్ట వ్యక్తిత్సము ఎందరికో స్ఫూర్తిదాయకమయింది. మార్పు ఒక రాత్రిలో రాదు. మార్పును కోరే ఉద్యమాలు ఎంత చిన్నవైనా మానవుడు తనను. తాను తెలుసుకునే ప్రయత్నంలో కీలక పాత్రను తప్పక నిర్వహిస్తాయి. మానవుడు 'హేతుబద్దుడైన జీవి అనే గ్రహింపే ఉద్యమాల అంతిమ లక్ష్యం. ఆల్తాన్యిలూ కడా 10 ౮4ఆ౦! 1666400) - ఉ౮[ 60౧11000212101676 ౪౦1406 - 1968. లలై

ఒగ్మీ 13. ఆంధ్రదేశంలో కులాల పుట్టుక - త్‌ పెరుగుదల

క్రీ.శ 300 వరకు, అనగా శాతవాహనరాజ్యం చివరిరోజుల వరకు, వృత్తుల (ప్రస్తావనే తప్ప కులం-+ప్రస్తావన దాదాపు లేదు. ధాన్యకటక బౌద్ధస్తూపానికి 'విధిక' పేరుగల చెప్పులు కుట్టే వ్యక్తి కానుకలు సమద్పించినట్టు శాసనాధారం ఉంది. ఇతని తండ్రి ఉపాధ్యాయ. (బౌద్ద భిక్షువుకు ఒక పేరు) వీరిద్దరూ బౌడ్డులు. వైదిక, బౌద్దమతాలు పక్కపక్కనే సాగిన కాలమీటే, మతద్వేషాలు లేవు. కులాల పేరుకూడా లేవు. (బ్రాహ్మణ అనే పేరుమూత్రం ఉంది. వారు వైదిక మతానుయాయులు.

3వ శతాబ్ది మధ్యనుంచి ఆం(ధ్రదేశంలో ఆర్థిక విప్లవం ఒకటి మొదలయింది. విదేశీ వ్యాపారం దాదాపు అంతమయింది. (రోమన్‌ సామ్రాజ్య పతనం ఇందుకు ముఖ్య కారణం) పరిశ్రమలు మూలపడ్డాయి. ఇక్ష్యాకుల రాజధాని విజయపురిలో సైతం ఆసొటి పారిశ్రామిక అవశేషాలు కనపడవు. వ్యవసాయంవైపు దృష్టిమల్లింది. వాశిష్టిపుత్ర ఛాంతమూల అను ఇక్ష్యాకురాజు వేలాది నాగళ్లను, పశువులను రైతులకు దానంచేసినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. ఆ పిమ శ్రైటి కృష్ణానదికి దిగువన ఉన్న పల్నాడు, వెలనాడు (ప్రాంతం అంతా కంచి పల్లవరాజుల పాలనకు లోనయింది. వారి పేరుతోనే పలనాడు అనే పేరు వచ్చింది. (పల్లవనాడు అని మొదటిపేరు)ఆ రాజులలో ఒకరు “కడువెట్టి' అనే బిరుదుకలవాడు. అనగా అడవులను నరికివేసినవాడు అని అర్హం- వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు అని స్పష్టమవుతుంది.

చేతివృత్తులు, వ్యాపారం సన్నగిల్లటంతో మారకం అవసరం తగ్గిపోయింది. ఏ (గ్రామానికి ఆ (గ్రామం ఏకాంతవాసంచేసే తత్వం ఆరంభమయింది, లోహ పరిశ్రమ

73

బౌద్ధము - ఆం(ధ్రము

మూతపడ్డది. ఇక్ష్యాకు రాజులు రాగినాణేలు. విడుదలచేశారు. ఆ తర్వాత రెండు శతాబ్దాలకు (5-6 శతాబ్దాలు) కోస్తా జిల్లాలను పరిపాలించిన విషుకుండిన రాజులు, రాగి లభించక ఇనుపనాణేలు జారీచేశారు. రాగి పూత కొద్దిగా ఉండేది. మతపరమైన మార్పులు. మొదలయ్యాయి. బౌద్ధం వెనుకపడింది. భక్తి ప్రధానమైన భాగవత ధోరణితో కూడిన వైదికమతం.లేక బ్రాహ్మణ మతం పైచేయి సంపాదించింది (బ్రాహ్మాణ మతం అంటే బ్రాహ్మాణులకే పరిమితమైనదని కాదు. వారి ఆచార్యత్వంలో విస్తరించిన వైదికముతం అని అర్హం. చాతుర్వర్హ వ్యవస్థ ఇందులోని ముఖ్యాంశము)

పల్లవరాజులు గాఢ (బ్రాహ్మణ మతాభిమానులు. కృష్ణకు దిగువ జిల్లాలో ఈ రాజులు పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించారు. (వానిలో కొన్ని ఈనాటికీ ఉన్నాయి. చేబ్రోలు అలాంటి వాటిలో ఒకటి) (బ్రహ్మదేయం, దేవభోగం పేర్లతో బ్రాహ్మణులకు అగ్రహారాలు, దేవాలయాలకు భూములు ఇవ్వటంకూడా అప్పుడే మొదలయింది. వెలనాడు అంతటా ఇలాంటి దానధర్మాలతో నిండి ఉంది. (ప్రస్తుతం తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలను వెలనాడు అనేవారు. అంతవరకు వేరు వేరు వృత్తులు చేసే వారందరూ క్క (బ్రాహ్మాణాగ్రహారాలలో వ్యవసాయదారులుగా స్టిరపడసాగారు. వీరందరికీ ఆనాటినుంచీ శూద్రులు అనే పేరు వాడుకలోకి వచ్చింది. వీరే నాలుగో వర్షం.

ఈ కాలంలో బ్రాహ్మణులు పౌర, సైనిక వృత్తులు కూడా స్వీకరించేవారు, ఇక్ష్యాకుల ఆస్థానంలో 'బోధిసిరి" “భద్రబోధిశర | అనే (బ్రాహ్మణులు కోశాధికారులుగా ఉండేవారు. (బౌద్దమత చిహ్నమైన బోధి (బ్రాహ్మాణమత చిహ్నమైన శర్మ కలిసి ఈ పేరు ఏర్పడిన విషయం గమనించాలి) అభీర రాజు ఆస్టానంలో (అభిరులు పళ్చిమ తెలంగాణా,

ప్రాంతంలోని స్టానిక పాలకులు)

భరద్వాజ గోత్రానికిచెందిన శివశర్మ 'మహాశ్రామిక', 'మహాతలవరి' 'మహాదండనాయక' బిరుదు ధరించి విజయపురిపై దండెత్తిన సేనలకు నాయకత్వం వహించాడు, ఇదే గోత్రానికి చెందిన తిష్యశర్మ, మంత్రిగా ఉండేవాడు. ధర్మశర్మ ఆర్యభూతి, అని మరికొ, స దరి పేర్పుకూడా కన్పిస్తాయి. ధర్మశర్మ యుద్ధంలో చనిపోగా అతని స్మృత్యర్థం 'ఛాయాస్తూపం” (సమాధిస్తూపం) నిర్మించబడ్డది,

7జ్శ

ఆం(ధ్రదేశంలో కులాల పుట్టుక-పెరుగుదల

(బ్రాహ్మణులు 3 వృత్తులలోకి విభజితులైనారు. ఒకటి వైదిక పండితులు, రెండు- దేవాలయ పూజారులు, మూడు (ప్రభుత్యోద్యోగులు. సామాజిక ఊర్హ్య చలనం;

'క్రీఃశ. 250, 500 మధ్య కృష్ణకు ఎగువ భాగాన విష్ణుకుండినులు పరిపాలించారు. వీరు దేవాలయ నిర్మాణంకంటే మౌలికమైన యజ్ఞయాగాదులు నిర్వహించసాగారు (యజ్ఞాలు వైదికకర్మలకు దేవాలయ నిర్మాణం భాగవత భక్తిధోరణికి చిహ్నాలు. వీరి రాజధాని నగరాలు విజయవాడ, నల్లొండ జిల్లాలలోని ఇంద్రపాల నగరం. వీరు తొలుత ఆటవిక తెగల వారై ఉండి, సంస్కృతీకరణ క్రమంలో వైదికులరాజులై క్షత్రియ చిహ్నమైన 'వర్మ” బిరుదు ధరించారు. సామాజిక ఆరోహణ(క్రమానికి (బ్రాహ్మణత్వంచే ఆమోదం పాందేందుకుగాను, యజ్ఞయాగాలు విపరీతంగా చేశారు. ఈ రాజులలో మాధవవర్మ నరమేథంకూడా చేశాడని చెప్తారు. వీరింటిపేరు పూపపాటి. విజయనగరం పాలకులైన పూసపాటివారు మాధవవర్మను తమ వంశకర్తగా చెప్పుకుంటారు. తెగలకు చెందినవారిని వర్షవ్యవస్థలో భాగంగా చేసేందుకు 'వ్రాత్యస్తోమం' హిరణ్యగోగర్భ(వతం' లాంటి కర్మకాండలు అప్పటికే రూపొందాయి. వైదిక (బ్రాహ్మణులకు ఈ వ్రతాలద్వారా విస్తారంగా దానధర్మాలు చేసి అగ్రహారాలు ఇవ్వటం, వారు వీరికి క్షత్రియత్వం ఇచ్చి ద్విజులుగా గుర్తించటం అనాదిగా వస్తున్న ఆచారం, విష్ణుకుండినులేకాదు ఆ తర్వాత ఆంధ్రలో రాచరికం నిర్వహించిన వారందరూ ఇలాంటి క్షత్రియులే.

ఆటవిక తెగలవారందరూ మొదట బౌద్దం స్వీకరించారు. ఒకటి రెండు తరాలవరకు సాత్విక సంస్కారం పొందారు. పిమ్మట వర్షవ్యవస్థలో పై స్థాయికి చేరుకున్నారు.ఆటవిక తెగల సంస్కృతీకరణకు మొదట్లో బౌద్దం, తర్వాత జైనం నిచ్చెన మెట్టుగా ఉపకరించాయి.

ఈవిధంగా సంస్కృతీకరణ పొందిన వారు కొందరు (బ్రాహ్మణత్వం కూడా సాధించారు.

కొండముడి శాసనాలతో గోగిరాజు, మైదవోలు శాసనంలో గోనమద్విజ, పికిరో శాసనంలో

విలశర్మ వీరంతా ఆటవిక తెగలనుండి (బ్రాహ్మణత్వం పొందిన వారని స్పష్టపడుతోంది. 75

బౌద్ధము - ఆంధ్రము

వీరందరి గోత్రం కళ్యప గోత్రం సంకీర్షనతో ద్వారా బ్రాహ్మణత్వం పొందిన వారికొరకు ప్రత్యేకంగా ఏర్పరిచిన గోత్రం ఇది. కొందరు బ్రాహ్మణులు తమ, పేర్లచివరలో శర్మ, “అర్య” అను రెండుపదాలు చేర్చుకున్నారు. భావశర్మార్య, భట్టి శర్మార్యయ పేరు అందుకు నిదర్శనాలు. తమ (బ్రాహ్మణత్వాన్ని ఎవరూ ప్రశ్నించకుండా దృఢమైన సాక్ష్యాధారాలు ఏర్పరచుకున్నారు.

(దక్షిణాది బ్రాహ్మాణులందరు దాదాపు ఈవిధంగా (ద్రావిడ ఆటవిక పునాదులనుంచి పైకి ఎగబ్రాకినవారే. వీరంతా ఉత్తరాదినుండి వచ్చిన బ్రాహ్మణులు అనుకోవటం పొరపాటు. తొలిరోజులలో కొందరు అలా వచ్చినమాట నిజమే. వారు సైతంఉత్తరాదిన క్రింది శ్రేణినుండి పైకి ఎగబ్రాకినవారే. వేదకాలం నుండీ నేటివరకూ ఏ వర్షమూ అవిచ్చిన్నంగా లేదు. ప్రతీదీ సంకర వర్ణమే. ఈ వాస్తవాన్ని అంగీకరించటానికి, తెచ్చిపెట్టుకున్న ఆధిక్యతా భావం ప్రతివర్థానికి, కులానికి అడ్డువస్తున్నది. వర్ల వ్యవస్తలోని మౌలికమైన విషబీజం ఇదే - సంపొదకుడు) వేంగీ చాళుక్యులు:

కోస్తా జిల్లాల్లో వేంగీ చాళుక్య రాజ్యం ఏర్పడడంతో నిజమైన మధ్యయుగాలు ఆరంభమైనాయి, (క్రీఈ 600-1000) పశ్చిమ. చాళుక్యుల సేనానులుగా వచ్చి కోస్తాజిల్లాలను ఆక్రమించుకుని తూర్పు చాళుక్యులు లేక వేంగీ చాళుక్యులు అని ప్రసిద్ధి చెందారు. వీరు మొదట్లో జైనులు. పిమ్మట శైవులైనారు. మొదట వీరి భాష కన్నడం, పిమ్మట తెలుగే తమ మాతృభాషగా భావించారు. ఆవిధంగా వీరు తెలుగు భాషకు గొప్ప సేవచేశారు.

మొదటి తెలుగు శాసనం, తెలంగాణాలోనుకాక్త కోస్తాజిల్లాలలోనూ కాక రేనాటిసీమ అయిన కడప జిల్లాలో లభించింది. ప్రాకృత, సంస్కృత, బంధనాలనుండి బైటపడవలసిన అవస్థ ఆనాడు రేనాటిసీమకు లేకపోవడమే ఇందుకు కారణం. అర్థిక విధానంలో వ్యవసాయం అతి ్రధానస్థానం ఆ(క్రమించి స్వయం సంపూర్ణ (గ్రామవ్యవస్థ రూపొందసాగింది.

76

ఆంధ్రదేశంలో కులాల పుట్టుక-పెరుగుదల రాజులమధ్య నిరంతర యుద్దాలు నిత్యకృత్యమైనాయి. పరిపాలనా యంత్రాంగమంత్తా సైనికావసరాల దృష్ట్యా రూపాంతరం చెందింది. మతంకొన్ని మూఢాచారాల పట్టింపుగా మారిపోయింది.భాష, విద్య, శిల్పం, అంతా మతంతో గాఢంగా పెనవేసుకుపోయింది. ఈ కాలంలోనే దాదాపు కోస్తాజిల్బాలోని ఆటవిక తెగలందరూ వర్షవ్యవస్థలో ఏదో ఒకచోట తలదూర్చారు. సంస్కృతీకరణ, సామాజిక ఆరోహణ నిరాఘాటంగా సాగిపోయింది. వృత్తి విభజనతో మతంలో శాఖాభేదాలు విస్తరించాయి. అ(గ్రహారాల సంఖ్య విపరీతంగా పెరిగింది. కర్మరాష్త్రంలో అలుగురాజు , అటి. దుర్ణయ మొదలైనవారందరూ స్థానిక పాలకులు. కర్మరాష్ట్రం అంటే కృష్ణకు దిగువన ఉన్న నరసరావుపేట, గుంటూరు, సత్తెనపల్లి, వినుకొండ, పల్నాడు (ప్రాంతం. (క్రమంగా ఈ మాట కమ్మనాడుగా మారిపోయింది. అలుగురాజు వంశస్తుడే పల్నాటి యుద్ధంలో కీలకస్థానం వహించిన నలగామరాజు. వేంగ్‌ చాళుక్యులలో మొదటివాడు కుబ్జ విషువర్దనుడు. (ఇతనికి కొంచెం గూని ఉండేది, కనుక కుబ్జ అనే విశేషణం వచ్చింది) ఇతడ్ము ఇతని వంశస్థులు కంచిపల్లవులతో నిరంతరం యుద్దాలు చేయవలసి వచ్చింది. వేంగి దేశానికి (ఏలూరు ప్రాంతం, గోదావరి, కృష్ణా, మధ్యస్ట్రప్రాంతం అంతా వేంగీ మండలం) కంచికి మధ్య నెల్లూరు ప్రాలితంలో బోయలు రాజ్యం చేస్తుండేవారు. వీరు భయంకరమైన ఆటవిక పోరాట యోధులు. నాలుగు శతాబ్దాల క్రమంలో వీరు చాళుక్య రాజులచే ఓటమిచెంది వైదికముతం స్వీకరించి వర్షవ్యవస్టలో భాగస్తులైనారు. (బ్రాహ్మణ, వైశ్య శూద్ర వర్ధాలు మూడింటిలోనూ వీరు చేరిపోయారు. ఈ కాలంలోనే బోయ (బ్రాహ్మణులు అనే మాట ఏర్పడ్డది. క్రమంగా బోయ అనేమాట అంతరించి (బ్రాహ్మణులు అనే మాటే మిగిలిపోయింది. ఇదేవిధంగా పశ్చిమ తెలంగాణానుంచి రాష్ట్రకూటులు నిరంతరం వేంగీ చాళుక్యులపై యుద్దాలు చేస్తుండేవారు. ఈ (క్రమంలో వారు తెలంగాణాలోని పుళిందులు అను తెగవారిని వర్షవ్యవస్థలో భాగస్వాములు చేశారు. సైనికదాడులు, సాంస్కృతికసమన్వయం పక్క పక్కనే సాగిన కాలమిది. ఈవిధంగా ఆంధ్రదేశంలో పెక్కు తెగలు వైదికముతంలో 777

బౌద్దము - ఆంధ్రము భాగస్వాములైనారు. వీరిలో కొందరు (బోయలు, పులిందులు) సూటిగానూ మరికొందరు జైనం అనే నిచ్చెన మెట్లద్వారాను వర్షవ్యవస్టలో చేరిపోయారు. మొదటజైనులై తరువాత హిందువులైనవారిలో ముఖ్యులు కోమట్టు, కోమటి అనే పేరు గోమరేశ్చరుని ద్వారా వచ్చింది. ఆనాడు మెదక్‌జిల్లా బోధన్‌లో (బ్రహ్మాండమైన గోమలేశ్చర విగ్రహం ఉండేది. పిమ్మట అది ధ్వంసం అయింది. దాని నమూనాలో నిర్మితమైన గోమఠేశ్చర విగ్రహం ఇప్పటికీ శ్రావణబెళగోళలో ఉంది. కోమట్టు మాత్రమేగాక చేతివృత్తులవారందరూ కంసాలి, కమ్మరి, కంచరి, కాశె వడ్రంగి వీరిని పంచాసనంవారు అంటారు. అంటే ఐదురకాల చేతివృత్తులు చేసేవారు. వీరంతా మొదట్లో జైనులు. పిమ్మట వర్షవ్యవస్థలో భాగమై హెచ్చుమంది శైవులైనారు. పెనుగొండులోని కన్యకగాథ, కన్యకఅగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకోవటం అంతా జైన సల్లేఖనాచారానికి దగ్గరగా ఉంది. రాజులే శైవులైతే (ప్రజలూ శైవులుకాక తప్పదు. ఈ క్రమంలో అనేకకులనామాలు ఏర్పడ్డాయి. సెట్టి, నాయుడు, నీడు, నాయక, రెడ్డి మొదలైనవి. .ఈ మాటలన్నీ పల్నాటి చరిత్రలో ప్రస్తావించబడిన విషయం తెలిసిందే. (బ్రహ్మనాయుడు, మళల్నీడు) మరొక పరిణామం జరిగింది. (బ్రాహ్మణులకు మాత్రమే కాక చాలా సందర్భాలలో వారికంటే ఎక్కువగా కూడా సేనానాయకులకు, వీరులకు (గ్రామాలు (గ్రామ సముదాయాలు దానంచేసే పద్దతి మొదలైంది. ఆయుధోపజీవులకు సమాజంలో అగ్రస్థానం లభించింది. వీరు యుద్దపమయంలో సైనికులు, శాంతియుత పరిస్థితులలో రైతులు. కమ్మ, వెలమ, రెడ్డి కులాలు: ఈ చారిత్రక నేపథ్యంలోనే ఆంధ్రదేశంలో కమ ఖ వెలమ, రెడ్డికులాలు రూపొంది 'ప్రముఖస్థానం వహించసాగాయి. వెలమలు అనుపేరు వెలనాడునుండి వచ్చింది (తెనాలి, రేపల్లె, బాపట్ట తాలూకాలు) ఆ ప్రాంతంలో వీరు రైతులుగా, భూస్వాములుగా, సామసికులైన వీరులుగా రూపొందారు. 78

ఆంధ్రదేశంలో కులాల పుట్టుక-పెరుగుదల

దక్షిణాదిన అప్పటికే ప్రారంభమైన వైష్ణవ ఆళ్వారుల భక్తి ఉద్యమ (ప్రభావం వీరిపై పడ్డది. వెలనాటి గొంకరాజు నాటి పాలకుడు. ఇలా ఉండగా కన్నడంలో మొదలైన వీరశైవ ఉద్యమ (ప్రభావం కోస్తాజిల్హాలపై పడింది. గోదావరి జిల్ద్హాకు చెందిన మల్లికార్జున పండీతారాధ్యుడు వెలనాడు వచ్చి బౌద్దులను ఒడించినట్టు చరిత్రలో బుజువులున్నాయి. బౌద్దులు పారిపోయారు. శవం పైచేయి సంపాదించింది. శ్రైవులు అవలంబించిన కుటిల పద్దతులతో వెలనాడు అంతా మతకలహాలు మొదలయినాయి. వ్యవసాయం మూలపడ్డది. అ(గ్రహారాలు పాడుపడ్డాయి. ఈ కల్గోలాన్ని తట్టుకోలేక ఆయుధోపజీవులైన వెలమలంతా మూకువము శైజిగా తెలంగాణాకు తరలిపోయారు. దేవరకాండ, రాచకొండలాంటి ప్రాంతాలకు పాలకులైనారు. (బ్రాహ్మణులు కృష్ణను దాటి గోదావరిని దాటి తూర్పు (ప్రాంతాలకు తరలివెళ్ళారు. వెలనాటి బ్రాహ్మణులు హెచ్చుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండటానికి అదే కారణం.. వేంగ్‌ చాళుక్యులు ఈ పరిణామానికి దోహదంచేసి ఈ (బ్రాహ్మణులకు విస్తారంగా అ(గ్రహారాలనిచ్చారు. తొమ్మిదవ శతాబ్దినుండి కోస్తా జిల్హాల్లో దేవాలయ నిర్మాణం తిరిగి పుంజుకుంది. చాళుక్య విజయాదిత్యుడు (శ్రీ.ళశ850) ఉభయ గోదావరి జిల్లాల్లో 108 శివాలయాలు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. (ద్రాక్షారామం, క్షీరారామం, అమరారామం, ఇత్యాది శైవ క్షేత్రాలన్నీ అలా రూపొందినవే. వీటిలో హెచ్చుభాగం అంతకుముందున్న బౌద్ధ స్థూప శిథిలాలపై నిర్మింపబడ్డాయి. మత విద్వేషం ఆ స్థాయిలో ఉండేది.

జైనం ప్రజామతం, జైనసారస్వతం హెచ్చుగా ఉండేది. అక్షరాలు చెక్కేవారందరూ జైనులైన విశ్చబ్రాహ్మాణులు. అక్షరాభ్యాస సమయంలో “ఓం నమ: శివాయ సిద్ధం నమః' లో సిద్దుడు జైన గురువు. శివాయ అనుమాట తరువాత చేరింది.

జైనమత ప్రభావాన్ని ఎదుర్కునేందుకు సంస్కృత పురాణాలను తెలుగులో అనువదించే కృషి వెొఎందలయింది. రాజరాజనరేంద్రుని ప్రోత్సాహంతో నన్నయ్య ఆంధ్ర మహాభారతావతరణ అలా జరిగింది. అంతకు ముందు ప్రజలు “గాసట బీసటే చదివి గాథలు తవ్వేవారని” నన్నయ్యగారే చెప్పారు. జైన గాథలు, (గ్రంథాలు ప్రచారంలో ఉండేవన్నమాట అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.

779

బౌద్దము - ఆంధ్రము శూద్రులలో కొందరు సంస్కృతం అభ్యసించి (బ్రాహ్మాణాచారాలు పాటిస్తు 'సత్నూద్రులు" అనే గౌరవం పొందారు. 'విష్పర్ల వంశ ఇతి వివ్రకులా సమానాత్‌' 'చతుర్రవంశ చతురాననస్య' మొదలైన బిరుడులు ధరించారు. విప్పర్లవారు రెడ్లు మతం (బ్రాహ్మాణేతరుల వద్దకు దిగివచ్చింది. (బ్రాహ్మాణేతరులు ఈ సంస్కృతీ (ప్రభావానికి గురయి క్షత్రియత్వం పొందారు. రెడ్డు, వెలమలు, కమ్మవారు రాజులైన తీరు ఇది, ఈ మూడు మాటలు ఎలా వచ్చాయో కొంచెం పరిశీలించుదాం. వెలమల గురించి ఇది వరకు చెప్పాను. పల్నాటియుద్ధం 'కులంపోరు' అంటారు. కేవలం కులం పోరు కాదు. మతం పోరు కూడ. ఈ రెండు పేర్లతో సాగిన అధికారం కొరకు పోరు. అలుగు రాజు వద్ద పెద్దినాయుడు, అతని కుమారుడు (బ్రహ్మనాయుడు మంత్రులు. (బ్రహ్మనాయుడిని మంత్రి పదవి నుండి తొలగించి నాగమ్మ మంత్రి అయింది. నాగమ్మ రెడ్డి వంశస్థురాలు, రెడ్డు అప్పటికే వీర శ్రైవంను అభిమానించారు, లొ (బ్రహ్మనాయుడు 'వీరవైష్ణవ 0" అభిమానించాడు. కులాలన్నిటినీ 3రిపి చాపకూడు, వ శ్రంతర వివాహాలు, హరిజన పూడారిత్వం ఏర్పరచాడు. (మాచర్ల చెన్నకేశవ దేవాలయంలో హరి ప న జనులు పూజారులు) ఈ తీవ సంస్కరణలు శైవులకు ఇష్టం లేదు. శైవులు కూడా మొదట్లో 'బ్రాహ్మణమతంపై తిరుగుబాటు చేసినవారే. కానీ ఒక చోట ఆగిపోయారు. బ్రహ ల ట్రాయుడు ఇంకా ముందుకు వె శ్లాడు. ఇవన్నీ పల్నాటి యుద్దానికి కారణాలు. ప (బ్రహ్మనాయుడు ఓడిపోయాడు. అతని అనుచరులంతా వెలమకులంలో యారు. ఇ రు. హెద్చుముంది తెలంగాణాకు వెళ్లి కాకతీయుల ఆశ్రయం పొందారు. రెడ్డి దూ అనేమాట ఎలా పుట్టిందనేది చెప్పటం కష్టం. అదొక గౌరవపదంగా అధికార ర్పానికి సూచకంగా ఆనాటి నుండి వస్తున్నది. రాష్ట్ర కూటులు తెలుగు దేశం వచ్చి స్థిరపడి (క్రమంగా రెడుగా స స్లగౌ మారారని ఒక వాదన ఉంది. ల! 0గా లకులైనందున వ్షీరక్రా 'ఫేరు 'వచ్చినట్టు కొందరంటారు. ఒక కమ్మ ద్వారా 80

ఆంధ్రదేశంలో కులాల పుట్టుక-పెరుగుదల జాయపసేనానికి గజసైన్యాధిపత్యం రావడంతో ఆ పేరు స్టిరపడి వుండవచ్చు. వీరి రాజ్యం కృష్ణానది దక్షిణ తీరాన రేపల్లె తాలుకా ప్రాంతం, జాయపసేనాని వంశస్తులు క్రమంగా విస్తరించిన మీదట ఇదంతా కమ్మనాడు అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతంలో నివసించిన (బ్రాహ్మణులకు కమ్మనాటి (బ్రాహ్మణులు, కమ్మ (బ్రాహ్మణులు అనే పేర్లుకూడా కొంతకాలం వ్యాప్తిలో ఉండేవి. కులనిద్వేషాలు: కాకతీయుల ఆస్థానంలో వెలమలు రెడ్డు ప్రధానస్టానం ఆక్రమించారు. వీరు నిరంతరం అంత:కలహాలతో రాజ్యానికి అస్రిరత్వం చేకూర్చేవారు. గణపతి దేవుడు వెలమ, రెడ్డి, కమ్ము ఇత్యాదులందరినీ సమదృష్టితో చూసాడు. తన రెండవ కుమార్తెను (బ్రాహ్మణ మంత్రికిచ్చి వివాహం చేసాడు. కులసామరస్యం అత్యవసరం అని గుర్తించాడు. ఆ పిమ్మట రాజ్యానికి వచ్చిన రుద్రమదేవి రెడ్డను, ఆమె కుమారుడు ప్రతాపరుద్రుడు వెలమలను ఎక్కువగా ఆదరించారు. ఈ అంత;కలహాలే కాకతీయ రాజ్య పతనానికి కారణం. అల్హాఉద్దీన్‌ దండయాత్రను ్రతిఘటించటంలో వెలమలు ప్రధాన పాత్ర వహించారు. రెడ్డు పట్టీపట్టనట్టు ఉన్నారు. కాకతీయ రాజ్య పతనానంతరం రెడ్డిరాజులు కృష్ణనుదాటి కొండవీటి రెడ్డిరాజ్యం స్టాపించారు. నాటినుండే రెడ్డి, వెలమరాజుల ఘర్షణ సాగుతూనే వచ్చింది. జాయపసేనాని తర్వాత చెప్పుకోదగిన కమ్మునాయకులు ముసునూరు నాయకులు. నూజివీడు ప్రాంతానికి చెందిన వీరు. కాకతీయ రాజ్య పతనానంతరం, ఢిల్లీ నవాబులను పారద్రోలి కొంతకాలం వరంగలులో పాలించారు. పోలయ, కాపయ నాయకుల వీరోచిత గాథలు స్వర్జాక్షరాలతో లిఖించదగినవి. కానీ ఈ ప్రతిఘటన ఎక్కువ కాలం సాగలేదు: వెలమ, రెడ్డి ఘర్షణలు, ముస్లిం దాడులు. వీటికి తట్టుకోలేక ఆయుధోపజీవులైన కమ్మనాయకులు హంపీ విజయనగరం వెళ్లి సాళువ తుళువ రాజుల ఆశ్రయం పొందారు. కృష్ణదేవరాయల సేనానాయకులలో అత్యధికులు ముఖ్యులు కమ్మసేనానాయకులు. రాయలవారి ఆజ్ఞమేరకు మధుర రాజుపై దండెత్తి మధుర 81

బౌద్దము - ఆం(ధ్రము రాజ్యాన్ని స్థాపించిన నాగమ నాయకుడు కమ్మ (ప్రముఖుడు. వీరితో పొటు వేల సంఖ్యలో సెనికులు దక్షిణ దేశం వెళ్లారు. అక్కడ స్థిరపడ్డారు. మొదట సేనాధిపతులుగా పిమ్మట రైతులుగా భూస్వాములుగా రూపొందారు. మధుర తంజావురు రాజ్యాల పతనానంతరం వీరిలో హెచ్చుమంది తిరిగి ఆంధ్రదేశానికి వచ్చి కోస్తా జిల్లాల్లో స్టిరపడ్డారు. కమ్మవారిలో ప్రముఖుడైన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పూర్వీకులు ఒంగోలు ప్రాంతము వారు. రెడ్డిరాజుల కాలంలో వారికి విశ్వాసపాత్రంగాను, వీరోచితంగాను 'సివచేసినందున వాసిరెడ్డి బిరుదనామంతో అమరావతీ (ప్రాంతానికి పాలకులైనారు. పిమ్మట వాసిరెడ్డి వారి ఇంటిపేరుగా మారింది. వెలమ, రెడ్డి, కమ్మ కులాలకు చెందని ఇతర వ్యవసాయదారులంతా కాపులుగా వ్యవహరించబడ్డారు. 'కాపు' అంటే రైతు అనే సాధారణార్హం సుప్రసిద్ధం. మత విభేదాలు, కుల విద్వేషాలు రాజుల ఆ(శయనిరాశ్రయాల ఫలితంగా ఆయుధోపజీవులు, వ్యవసాయదారులు అయిన ఈ మూడు కులాల వారు కోస్తా తెలంగాణా, రాయలసీమ జిల్దాలన్నీ తిరుగుతూనే వచ్చారు. దాదాపు అన్ని వృత్తులవారు ఈ విధంగా ఒక చోటినుండి మరొక చోటికి తరలీనాచారే. గోల్కొండ నవాబుల కాలంలో (బ్రాహ్మణులు తిరిగి కొంచెం అధిక్యత సంపాదించారు. ముస్లిం నవాబుల వద్ద మంత్రి పదవులు (గ్రామాలలో కరణీకాలు వీరి వశమైనవి. కానీ అదే కాలంలో మహారాష్ట్రనుండి వచ్చిన -దేశ్‌ముఖ్‌: దేశసాండేలతో వీరు పోటీ పడవలసి వచ్చింది. ఈ వచ్చినవారు మహారాష్ట్ర (బ్రాహ్మణులు క్రమంగా వారు తెలుగువారిగా రూపాంతరం చెందారు. ముస్తిం నవాబుల కాలంలో ఉత్తరాదినుండి కాయస్టులు వచ్చి ఎక్కువగా హైదరాబాదులో స్టిరపడ్డారు. ఢిల్లీ నవాబుల పాలన మొదలైనప్పటినుండీ వారివద్ద లేఖఖ ఉద్యోగాలలో ప్రావీణ్యం సంపాదించి ఉన్నత పదవులు పొందిన వారు కాయస్టులు, బీహర్‌ బెంగాల్‌ రాష్ట్రాలలో నేటికీ వీరి సంఖ్య హెచ్చు. రై

ఆంధ్రదేశంలో కులాల పుట్టుక-పెరుగుదల ముగింపుగా ఒక మాట చెప్పనివ్వండి. (బ్రిటీషు వారి రాకతో మనం వలస వ్యవస్థల భాగస్వాములైనాము. 19వ శతాబ్ది ఆఖరు భాగంలో వ్యవసాయ, వర్తక, వ్యాపారాలు, ప్రభుత్వ యంత్రాంగం, బాగా విస్తరించాయి. తమకు గల సాంస్కృతిక వారసత్వం దృష్ట్యా ఇంగ్రీషు విద్యను నేర్చి ప్రభుత్వ పదవులు ఆ(క్రమించటంలో కోస్తా జిల్లాల్లోని (బ్రాహ్మణులు అగ్రస్థానం పొందారు. (బ్రాహ్మణేతర వర్గాలు తమకు తగు న్యాయం లభించలేదని సహజంగానే అభిప్రాయపడ్డారు. ఈ అసంతృప్తిని ఆనాటి బ్రిటీషు పాలకులు ఆసరాగా తీసుకుని విభజించీ పాలించు నీతితో జస్టిస్‌ పార్టీని (ప్రోత్సహించారు. జాతీయతా భావ వ్యాప్తి కొరకు తిలక్‌, అనిబీసెంట్‌ ఇత్యాదులు వైదిక సంస్కృతిని విస్తారంగా కీర్తించారు. వైదిక సంస్కృతి కేవలం ఆర్యసంస్కృతి లేక బ్రాహ్మణ సంస్కృతి అనే దురభిప్రాయాన్ని బ్రిటన్‌ చరిత్రకారులు అంతకు పూర్వమే కలిగించి ఉంచారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మేణతర ఉద్యమం అనేక వికృత రూపాలు ధరించింది. ఈ నాటికి మన సాంస్కృతిక జీవితాన్ని విషపూరితం చేస్తున్న వేయిపడగల విషసర్పమైన కులతత్వం పుట్టిన తీరు యిది. లాకు? “ఉక 1989 జనవరి 4,5 తేదీలలో శ్రీశైలంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగైస్‌ అధ్యక్షోపన్వాస సంక్షిప్తరూపం. విశాలాంధ్ర 1989 సంక్రాంతి (ప్రత్యేకానుబంధం. 83

  1. గాధ భారతదేశంలో అనాదినుండి, విమర్శలకు గురియగుచూ వచ్చిన సంస్థలలో వర్షవ్యవస్ట ఒకటి. హైందవసంస్కృతికి, సమాజ స్వరూపమునకు, వర్షములు విశిష్టమైన స్టిరత్యాన్ని చేకూర్చినవి. కాని కులములు భారతదేశము గుత్తకొన్న సొత్తుమాత్రము కాదు. అతి ప్రాచీన కాలమున, నాగరికతా కేంద్రములైన ఈజిప్టు, బాబిలోనియా, చైనాలలోకూడ పూజారులు ((2గ19513), పాలకులు (7169న. వర్తకులు (4/130050/1410/0౧06౧19, బానిసలు ($16౪69), అని వృత్తు లాధారముగ సామాజిక విభజన జరిగినట్టు చరిత్రలో చదువుచున్నాము. “గుణకర్మ విభాగస అను గీతావాక్యమును బట్టి మన దేశమునసైతము, గుణము (స్వభావము), కర్మ (వృత్తి, అనుసరించియే నాల్లువర్లము లేర్పడినట్టు తెలియుచున్నది. ఇతర (ప్రాంతములందు, సమాజ పరిణామ(క్రమంలో నీ వృత్తి విభజన ఎప్పుడో అంతర్జానమైనది. కాని ఇండియాలోని పూజారులు (010[0౧1౧09 వర్షప్యవస్థ్రకు దివ్యత్వాన్ని ఆపాదించి కాపాడుకుంటూ వచ్చారు. అంతేగాక, భారతసమాజానికి బాహ్యప్రపంచ (ప్రభావాలు సోకకుండ హేమాలయపర్వతములు చల్లని రక్షణకల్పించినవి. తత్పలితముగా ఇండియాలో వర్షవ్యవస్థ్రము శాశ్యతత్వము సిద్దించెను. దీని వలన ప్రజలలో కృత్రిమవిభేదాలేర్చడి, జాతీయజీవనమునక్తు జరుగుచున్న అపకారాన్ని గుర్తించి మహావీరుడు, గౌతమబుద్దుడు, బసవేశ్వరుడు మొదలైన దార్శనికులు, సంస్కర్తలు, కులాలమీద దండయాత్రలు చేసిరి. ఐననూ, వర్షవిభేదములు, వాని వలన కలిగే వైమనస్యములూ, ఈనాటికీ మన దేశమున ప్రధాన సాంఘిక సమస్యగా నిలచియుండుట, భారతజాతీయ సంస్కృతిలోని వైశిష్ష్యమో, దౌర్బల్యమో, దౌర్భాగ్యమో పరిశీలించవలసిన అవసరము నేడెక్కువగా కన్సించుచున్నది. అంతేగాదు; (ప్రజాస్వామ్య సూత్రములసై సమతాసమాజమును (2004116౧౮౧ 300191 సాధింప సంకల్పించిన నేటి భారతీయులు, జన్మహక్కుల తత్వముపై రూపొందిన వర్ణవ్యవస్టను పున;పరిశీలించి, న!

గాధ వర్షవిభేదములలోని జూతీయ విద్రోహకరశక్తులను. గుర్తించి వానికి శాశ్ళతసమాధి నిర్మించుట గూడ నేటి జరూరు సమస్యలలో నొకటి. (క్రీస్తుశకారంభమున దక్షిణాపథము నేకచ్చత్రముగా నేలిన గౌతమాపు(త్రశాతకర్ణికి (క్రీ త. 78-102) “వినివర్తిత చాతుర్వర్ణ సంకరస్య” అను బిరుదమున్నట్టాతని మాతృదేవి గౌతమిబాలశ్రీ నాసికలో వేయించిన శాసనమువలన తెలియుచున్నది. గౌతమి పుత్రునకు ధాన్యకటకము (గుంటూరు జి) ప్రధాన రాజధాని. కాబట్టి 'క్రీస్తుళకారంభమునాటికే ఆంధ్ర దేశమున వర్షములు పాదుకొనినట్టును, ఏవో అవాంతరములవలన వర్ణసాంకర్య మేర్పడుటచే గౌతమిపుత్రుడు నివారించినట్లును స్పష్టమగుచున్నది. గొాతమిపు(తుడు “ఆగమానాం నిలయస్య" అని కూడా సంబోధింపబడినాడు. అందుచేత వైదికధర్మమునకు, వర్తవ్యవస్థకు అవినాభావసంబంధము కూడా నాటికే కల్పింపబడినట్టు (గ్రహించవచ్చును. ఈ పరిణామముల ఫలితముగ వైదికకర్మలకు అర్హతగల అగ్రవర్షములవారు ఆర్యులనియు, అనర్హులు ఆర్యేతరులనియు అభిప్రాయము నెలకొనెను. కాని వర్ణవ్యవస్థ్ర ఆర్యనిర్మాణమను విషయము అనుమానాస్పదము. ఆర్యులు ఇండియాలో ప్రవేశించినప్పుడు పళుపాలకులుగా నున్న సంచారజీవనులు; గుడారములే వారి గృహములు. ఇట్టి ప్రజలలో వర్లవ్యవస్థవంటి సుస్టిర సాంఘిక సాంప్రదాయములుగాని సంస్థలుగాని యేర్చడగల అవకాశములు చాలతక్కువ. ఆర్యులు ఇండియాపై దండెత్తి, స్టానికులైన ప్రజలతో పోరాడి, వారినోడించి దేశము నాక్రమించిరి, ఈ ఆదిమభారతీయులే మహోజ్జుల హరప్పా సంస్కృతీ నిర్మాతలైన సింధు ప్రజలు. సురక్షితమైన కోటలను నిర్మించుకొని ప్రశాంతజీవితము గడుపుచున్న సింధుప్రజలలో గూడ ఈజిప్టు, బాబిలోనియాలలో వలె వృత్తివిభజన జరిగినట్టు నిదర్శనములున్నవి. కాబట్టి విజేతలై భారతదేశము నా(క్రమించిన ఆర్యులు స్టానికముగనున్న వృత్తివిభజనతో జాతీయాధిక్యతను, (శ్చేత, కృష్ణు వర్షప్రాశస్య్యమును చేర్చి కులములను రూసాొందించిరి. ఆర్యుల అధికారము, వైదిక మతములతో బాటు నూతన వర్ణవ్యవస్థ సైతము 85

బౌద్దము - ఆం(ధ్రము

దక్షిణాపథమునకు విస్తరించినది. కాని, దక్షిణదేశ మునందలి (బ్రాహ్మణులు, స్షజ్రియులు,

కీవలము ఆర్యావర్తము నుండి వలస వచ్చిన వైదిక సంస్కృతి నిర్మాతలనుకొనుట చారిత్రక సత్యము కాజాలదు. ఆర్యసంస్కృతి నవలంబించిన దాక్షిణాత్యజాతులలోని పూజారులే బ్రాహ్మణులైరి? ఆ జాతుల నాయకులే క్షత్రియులైరి. కాలక్రమమున వైదిక సంస్కృతి నారాధించు వీరందరును తొము ఆర్యులమని భావించుటలో విచిత్రములేదు. అందుచేతనే దాక్షిణాత్య'బ్రాహ్మాణులు వైదిక బుషిగోత్రములను ధరించిరి; దక్షిణ దేశ రాజవంశములు, కురు కోసల రాజ్యములనేలిన ఐతిహాసిక చంద్రసూర్యవంశక్షత్రియులతో తమకు నంబందమును నరూూచించు కథలు, గాథలు కల్పించుకొనిరి. (శ్రీస్తుశకారంభకాలమున, విదేశీయులైన పహ్హువులుసైతము భారద్వాజగో'త్రజులైన పల్లవులుగా మారిపోయి దక్షిణాపథము నేలిరిగదా!

ఆంధ్ర దేశములో పెక్కు రాజకీయ సాంఘిక పరిణామములు జరిగినవి. వీటిని సమన్వయపరచి నిర్వివాదమైన చరిత్రను రచించుటకు ఉపలభ్యములగు ఆధారములు చాలతక్కువ. అవికూడ అసంబద్ధములై, పరస్పరవిరుద్ధములై చరిత్ర కారులను తలపట్టులు పట్టించునవిగా నున్నవి. వీనికితోడుగా స్టానిక దురభిమానములు చేరుచున్నవి. ఇక్త చరిత్రకుపట్టగల దుర్గతి వేరే చెప్పవలయునా? ఈ సందర్భమున మన దేశమున వర్షములకు సంబంధించిన కొన్ని విరుద్ద ఆధారములను పరిశీలింతము:

(1) సాతవాహన చ(క్రవర్తులు (బ్రాహ్మణులుగా పరిగణింపబడుచున్నారు. అందులకు గౌతమిపుత్రుని ఏక బ్రాహ్మాణస్య' అను బిరుదమువినా యోగ్యముగ మరొక ఆధారము గన్చింపదు. గౌతమోపుడత్రుడు వర్ష సాంకర్యమును మాన్పినట్టు చెప్పబడినది. కాని అతని కుమారుడు. వాసిస్టీపుత్ర శివశ్రీ శాతకర్ణి శక రాకుమారిలైన రుద్రదమనికను వివాహమాడినట్టు తెలియుచున్నది. శ్రీ పరత ఇక్ష్యాకు వంశస్టాపకుడైన శ్రీ శాంతమూల మహారాజు అళ్ళమేధాది యజ్ఞములొనర్చిన వైదిక మతోద్దారి. అతని కుమారుడైన వీరపురీషదత్తుడు ఉజ్జయిని (శక) రాకుమార్తె రుద్రధరభట్టారికను భార్యగా స్వీకరించినాడు, ఇట్టి వివహమునలన వర్ణసాంకర్యమెట్టు నివారింపడును? ఇక, శక రాజవంశముకూడ

86

గాధ తనవైదేశిక స్వభావమును గోల్పోయి, స్టానిక సూర్య, చంద్ర వంశములలో నాకదానియందు లీనమ్రైపోయి యుండును. కాబట్టీ ఏవి ప్రాచీన క్షత్రియరాజవంశములో, కానివేవో పరిశోధింపబూనుట కేవలము ఎండమావుల వేటవంటిది:

(2) పై అంశము చాళుక్యుల విషయమున మరింత స్పష్టము కాగలదు. చాళుక్యులు (బ్రహ్మాచుళుకమునుండి ఉద్భవించిన వీరా వతంసుని సంతతివారని యొకగాథలో నున్నది. కాని వేంగి చాళుక్యులు తాము చంద్ర వంశజులమని వర్షించుకొన్నారు. నన్నయభట్టారకుని ఆంద్రమహాభారతావతారికయే అందుకు నిదర్శనము. మరియొక గాథలో అయోధ్యాధిపుడైన జయసింహుడు దక్షిణాపథమునకు వలసవచ్చి చాళుక్యుల మూల పురుషుడైనట్టు చెప్పబడినది. ఐనచో, చంద్రవంశస్థులైన చాళుక్యులు సూర్యవంశస్టుల రాజ్యమైన అయోధ్యనుండి వలస వచ్చుటయేమి? అను సందేహము రాకమానదు. ఇదియిట్టుండ, సౌరాష్ట్రము నేలిన చాళుక్యులు తాము అగ్నికుల క్షత్రియులమని చెప్పుకున్నారు. వీరినే సోలంకీలు అని అంటారు. అగ్నికుల ప్రశస్తి చందుకవి రచించిన “పృధ్వి రాజ రాసో”అను హిందీ కావ్యములో కన్పించును. పరశురాముడు సర్వక్షత్రాంతకుడై, యజ్ఞమొనర్చి, హోమాస్టి నుండి ఉద్భవించిన మహాపురుషునకు భూమిని దత్తమొనర్చి తపోవనమున కేగెనట. అతని సంతతివారైన (ప్రతీహార, సారమార, చౌహాన, చాళుక్య రాజవంశములవారు తాము అగ్నికుల క్షత్రియులమని చెప్పుకొనిరి. ఐనచో చాళుక్యులు బ్రహ గజులా? చం(ద్రవంశజులా? అసన్నికులజాలా? నిజానికి చాళుక్యులు దక్షిణాపథమునకు స్టానికులై, అతి ప్రాచీనులైన 'చలికి' వంశమునకు చెందినవారు; “చలికి వంశస్థులు హిరణ్యా రాష్ట్రాధిపతులైనట్టు నాగార్జునకొండ శాసనములు చాటు చున్నవి. చలికియే చాళుక్యగా మారి కాల(క్రమమున పై గాథలన్నియు కల్ప్సింపబడినవి.

(3) ఇదేవిధముగ కాకతీయులేవర్షజులు? అను సమస్య. విద్యా నాథుని ప్రతాపరుద్రయశోభూషణ కావ్యములోని “అత్యర్కేందుకుల ప్రశస్తి మభిజద్యమ్‌ కాకతీయాన్వయమ్‌” అను శ్ఞోకపాదాన్ని ఆధారముగా చేసికొని కొందరు పండితులు “అత్యర్కేందుకులము” అనేది ఒకటి ఉన్నట్టు నిర్ణయంచుచున్నారు. చందుకవి సృష్టించిన

87

బౌద్దము - ఆం(ధ్రము అస్నికులము నంటిదే ఈ “అత్యర్కేందుకులము.'. సూర్య చంద్ర వంశములలో బేనికిగాని చెందని రాజులకొరకై వారి పోషణలో కావ్యముల నల్లిన వందిమాగధ కవుల శ్రమఫలితముగా ఇటువంటి గాథ లుత్పన్నమై పురాణములలో గూడ ప్రవేశించినవి. ఇట్టి (ప్రక్రిషముల వలననే చారిత్రక ఆధారములుగా పురాణముల విలువ నశించిపోయినది. పైన పేర్కొన్న అత్యర్కేందు కులానికి చెందిన “కము” డను రాజు సంతానములోని చాళుక్య, కాకతి, రాయ అను వారలా యా పేర్ణుగల రాజవంశములకు మూలపురుషులైనారు. అని ఒక పురాణ గాథ. ఈగాథాస్రస్ట ఇందలి అసందర్భమును (గ్రహించలేదనుట స్పష్టము! చాళుక్య, కాకతి అనునవి వంశనామములే; కాని 'రాయ' అనునది వంశనామము కాదు. రెడ్డి, రాజు, నాయక, పదములవలె గౌారవనామము; రాజశబ్దమునకు పర్యాయ పదము. విజయనగర సామ్రాజ్యాధీశులు రాయశబ్దాన్ని ధరించారు. వీరు సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశముల వారు. వీరెవరును తాము 'రాయ' వంశస్థులమని చెప్పుకొన లేదు. ఇది యిలా ఉండగా, పై గాథలనుబట్టి వీరందరును అత్యర్కేందు కులజాలగుచున్నారు. కాని శ్రీకృష్ణదేవరాయలు చంద్రవంశస్టుడని అల్లసాని పెద్దన పేర్కొన్నాడు. ఐనచో పౌరాణిక గాథ సత్యమా? రాయలి సమకాలికుడైన ఆంధధ్రకవిత్తా పితామహుని నృష్టి సత్యమా? మరొక విశేషము. అసలు శ్రీకృష్ణరాయలు ఆంధ్రుడుకాడుగదా? కన్నడిగుడు! కాబట్టి పై గాథలన్నియు (క్రీ తః 15, 16 శతాబ్దములలోనో, తరువాతనో కల్పింపబడెనని తేలుచున్నది. ఇట్టి గాథలను గురించి సుప్రసిద్ధ చరిత్రకారుల అభిప్రాయమును పరిశీలింపుడు. "106 [904 ౧0 40401 2210606 23 మగ2 00/29, 5060ల [46 ౧౦ క10గ౦౮౩ (26011005 060106 (లం, 206 (611 60ల[0గ౬1 0011866 26%) (0 100% 2040 92001103 ౧0 6 30012 ౧66౮6 2006 52015 ౪10% ౪/29 10 06 ౧0౪/6 0౯016 312%%103 జ0౧660816" (౧%6. (420060 జ).మాన్యము అనుభవించుచు విశ్శాసపాత్రులైన పూజారి కవులు కల్పించిన గాథలవలన చారిత్రక సత్యములను కనుగొనుట ఎంతటి కష్టసాధ్యమో తెలియుచున్నది గదా! మరియొక విషయము. వృత్తులనుబట్టియే వర్ణము లేర్పడినట్టు అందరు 88

గాధ నంగీకరించురు. చిరకాలమువరకును వృత్తులనుబట్టి వర్షముల మార్పుకూడ జరుగుచుండెననుటకు నిదర్శనములున్నవి. “భారద్వాజ గోత్రానామ్‌ పల్లవానామ్‌” అని చాటుకొన్న పల్లవులు కాలక్రమమున క్షత్రియులుగా పరిగణింపబడినారు. అందులకు వారు చిరకాల మనుసరించిన క్షాత్రధర్మమే కారణము. కర్ణాటరాజ్యము నేలిన కదంబవంశస్ట్రాపకుడైన -మయూరశర్మ (బ్రాహ్మణవీరుడు. అతని సంతతివారు రాజ్యపాలకులై వర్మలైనారు! ఇదేవిధమున చతుర్జాన్వయులైయుండియు క్షాత్రధర్మము ననుసరించి ప్రజారంజకులైన వారిని క్షత్రియులుగా పరిగణించుటలో వైపరీత్యము కన్చింపద్యు అది ధర్మవిరుద్దముకాదు. విద్యానాథుడు కాకతీయులను “సూర్య చంద్ర వంశముల (ప్రశస్తిని మించిన (ప్రశస్తికల వంశమువారు” అని (ప్రస్తుతించుటలోని ఆంతర్యముకూడ అదియే! మరియు సమాజము విస్తరించినకాలది, నాలుగు వర్షములవారును తమతమ ఆదిమవృత్తులనే అంటిపెట్టుకొని యుండుటకు పరిస్టితులనుకూలింపలేదు. ఉపవృత్తులేర్చడి వర్షములు శాఖోపశాఖలైనవి. పెక్కు బ్రాహ్మణ కుటుంబములవారు రాజాస్టానములందు మంత్రి, సేనాపతి, దుర్గాధ్యక్షాది పదవులలో నియుక్తులైరి. ఆంధ్రదేశములో నియోగులని వ్యవహరింపబడుచున్న బ్రాహ్మాణులట్టివారే! తామనుసరించుచున్న ధర్మమును సూచించుటకు గాబోలు కొందరు నియోగులు కొమ్మరాజు, మాచిరాజు, అన్నంరాజు మొదలైన వంశనామములను ధరించిరి. అంతమాత్రమున వీరిని రాజులనిగాని, బ్రాహ్మాణేతరులనిగాని నిర్ణయించుట పొరబాటు* 'క్రీత. 14, 15 శతాబ్దములనాటికి ఆంధ్రదేశమున వృత్తులు నశించిస్రోాయినవి. (బ్రాహ్మణులుసైతము నీచవృత్తులకు బాల్బడి అపహాస్యములకు గురియైనట్టు, భట్టుక్లూర్తి దని 'ప్రచారములోనున్న ఈ (క్రింది చాటువు ద్వారా తెలియుచున్నది. గుత్తిన్‌ బుల్లైలుగుట్టి, చంద్రగిరిలో గూడెత్తి, పెన్గొండలో హత్రిన్‌ న్యత్రమునందు వేడి, బలు దుర్గాధీళశ తాంబూలపున్‌' 89

బౌద్దము - ఆంధ్రము దిత్తుల్‌ మోసి, వదస్థులైన మనులన్‌.... ”

వర్షములన్నిటికి ఇంచుమించు ఇట్టిగతియే (ప్రాప్రించియుండును,

కాకతీయ (క్రీ.త. 13వ శతాబ్టి), కుతుబ్‌షాహీల (15వ శ) యుగములందువినా, ఆం(ధ్రదేశమునకు మరెప్పుడునూ రాజకీయ సమైక్యత లభింపలేదు. సాతవాహన పతనకాలము నుండియు (క్రీ.త.200 ప్రాంతము) ఆంధ్రదేశమును పెక్కు రాజవంశముల వారు పరిపాలించిరి. వీరు ఆంత:కలహములలో మునిగియుండిరని వేరుగ చెప్పనక్కరలేదు. దీనికి తోడు, కళింగమునుండి గాంగ, గజపతి వంశజులు, మహారాష్ట్రమునుండి రాష్ట్ర కూట, యాదవ చకక్రవర్హులు, కర్ణాటకమునుండి చాళుక్యులు, (ద్రావిడ దేశమునుండి పల్లవ, చోళ, పాండ్యప్రభువులు తరచు ఆంధ్రదేశముపై దండయాత్రలు సాగించిరి. తెలంగాణము, రాయలసీమ (ప్రాంతములు చాలకాలము అం(ధ్రేతర రాజవంశముల పరిపాలనలోమ్రగ్గుచుండెడివి. అంత:కలహముల వలన, దండయాత్రల వలన రాజులకు పెద్దపెద్ద సైన్యములు అవసరమైనవి. తత్భలితముగ మధ్యయుగ ఐరోపారాజ్యములలో నేర్పడిన భూస్వామ్యవిధానము (8౮66013౧) అనగా భూస్వాములే సేనానాయకులై, రాజులకు తోడ్చడుచుండె సాంఘిక రాజకీయపద్దతి ఆంధ్రదేశములో నేర్పడెనని చెప్పవచ్చును. నాటి సైన్యములు క్షత్రియ వర్షమునకే పరిమితమైయుండగల అవకాశము క్షీణించినది. అధిక సంఖ్యాకులుగా చతుర్ధకులజులు సైన్యములో చేర్చుకొనబడిరి. వీరు శాంతి సమయములలో వ్యవసాయముచేయుచు, అవసరమైనపుడు యుద్ధభూమికి నడచుచుండెడివారు. అనగా, మధ్యయుగయున ఆంధ్రదేశములో ఆయుధధారణ ఉపవృత్తిగానున్న పాలముకాపువర్షమేర్చడినది. ఆంధ్రబ్రాహ్మణులలో రాష్ట్రముల ననుసరించి “నాడీభేదము"లేర్సడినట్టులే నీ కాపు క్షత్రియ - వర్ణములో గూడ ప్రాంతీయ విభేదము లేర్చడినవి. తెలంగాణములోని వారు తెలగలు, కమ్మనాటి వారు కమ వారు, 'వెలనాటివారు వెలనులు - ఐనారు. తెలగాలలో కొందరు బలిజలైనారు. అనగా బలి చక్రవర్తి సంతానమని ఒక ఊహం.క్షాని వాణిజ్యవృత్తి ననుసరించిన తెలగలే (వణిజ) బలిజలైనారనుట సమంజసముగా కన్ప్చించుచున్నది. ఈ మూడువర్ణములతో రెద్డు చేరినారు. రెడ్లది ఒక ప్రత్యేక చరిత్ర, రెడ్డి అనునది ఉద్యోగనామమనియు, దానికి 'రాష్ట

త్త

గాధ కూట" పదము మూలమనఎయు చరిత్ర కారులు నిర్ణయించుచున్నారు. రాస్టకూటరాజులు మాన్య ఖేటము రాజధానిగా దక్షిణాపథమున గొప్పు సామ్రాజ్యమును స్టాసించి పాలించిది. (క్రీశ8,9 శు పశ్చిమ, దక్షిణ ఆంధ్రదేశ భాగములను రాష్ట్రకూటులు జయించి తమ సా(మ్రాజ్యములో కలుపుకొనిరి. ఆయా ప్రాంతములలో రాష్ట్రకూటులు తమవారినే భూస్వాములుగను, పన్నులు వసూలు చేయు ఉద్యోగులుగను నియమించియుందురు. వీరే క్రమమున రెడ్డు అని ప్రసిద్దిచెందిరి. నేటికిని తెలంగాణము, రాయలసీమ (ప్రాంతములలోనే ఆనగా ఒకప్పుడు రాష్ట్రకూటులచే నాక్రమింపబడిన (ప్రాంతములోనే రెడ్డు అధిక సంఖ్యాకులుగ నున్నారు. (క్రమముగా నియోగి అను పదమువలెనే రెడ్డి కూడా వర్తనామముగా స్టిరపడిపోయినది. చిరకాబము వరకును అ నాల్గువర్షములును ఒకేవర్షము. కాపు - క్షత్రియ వర్షము శాఖలుగా భావింపబడిరి.

(క్రీశ 11,12 శతాబ్దముల నుండియు నీ నాల్గు వర్షములు ఆంధ్రదేశమున కన్పించు చున్నవి. ఆం(ధ్రరాజకీయములు అల్లకల్గోలముగ నున్న యుగముకూడ నదియే. చాళుక్య, కోట, చాగి, తెలుగు చోడ, పైహయాదీ మాండలిక వంశముల చారు నిరంతరము యుద్దములలో మునిగి తేలుచుండిరి. అట్టి పరిస్థితులలో, తమ అధికారమును పటిష్టమొనర్చుకొనుటకై మాండలిక (ప్రభువులు స్టానికులై బలవంతులై యున్న తమ సేనాపతుల కుటుంబములతో వైవాహికాది సంబంధము లొనర్భుకొని, వారి విశ్వాస సహకారములను బడయుటకు ప్రయత్నించిరి. ఇట్టీ పరిణామములు కారణముగా, యుద్దము వృత్తిగానున్న వర్షములన్నిము సమ్మిళతములైనవి; ప్రాచీన క్షత్రియ వంశములు అంతర్జానమైనవి. కాపు - క్షత్రియ వర్థమున ముఖ్యముగ కను గవారిలో సూర్యచంద్ర వంశముల వారుభయులు కన్పించుటకు కారణముకూడ నదియే!

ఆంధ్రుల దురదృష్టమో అన్నట్టు (క్రీత. 11వ శతాబ్టినుండియు నీవర్షములమభ్య రాజక్షీయాధికారమునకై స్పర్హ (ప్రారంభమైనది. పల్నాటి యుద్ధమే ఇందలి 'ప్రథమాంకము. తరువాత రెడ్డి, వెలమల స్పర్హఫలలితముగనే క్రీ.శ.15 శతాబ్దము నాటికి తెలంగాణామును బహమనీసుల్తాను లాక్రమించిరి. వీరితో సమకాలికులేయైనను కమ్మవారు విజయనగర యుగముననే పూర్తిగ విబృంభించిరి. పెమ్మసాని, రావెళ్ల, సూర్యదేవర, సాయపనేని కుటుంబములవారు విజయనగర రాజ్యచరిత్రలో శ్ఞాఘ్యమైన పాత్రను నిర్వహించిరి. ఈ

91

బౌద్ధము - ఆంధ్రము యుగమున కమ్మవారి విజృంభణ కొక (ప్రత్యేక కారణముకూడా లకపోలదు. విజయనగరాధీశుల కొకవైపున వెలమలు, మరియొక వైపున రెడ్డు విరోధులైరి. అందు వారు కమ్మ, తెలగ వర్షములను నాదరించి సేవాధిపతులుగా అమర నాయరులుగా, దుర్గాధీశులుగా నియమించిరి తరువాత కుతుబ్‌షాహీల కాలములో ఆంధ్రదేశము చాలా భాగమునకు కమ్మవారు పాలకులై (కీ.శ. 1580) 'చాదరి' బిరుదము ధరింపసాగినారు. 'చౌదరి' అనగా పన్ను వసూలు చేయునధికారి. రెడ్డు, (బ్రాహ్మణులు మొదలైన వారు కూడా చౌదరి పదవులలో నియుక్తులైనారు గానీ ఈ గౌరవనామము కమ్మవారికే రూఢియైనది. కుంభినీ యుగములో కూడా కమ్మవారు ముఖ్యముగా సర్కారు జిల్లాలలో జమీందారీలను బడసి పరిపొలన సాగించిరి. కానీ వీరు విభృంభించు నాటికి దేశము అన్యాక్రాంతమగుట కారణముగ రెడ్డవలె, కమ శ్రవారు ఆంధ్రదేశ చరిత్రలో “కమ్మయుగమును” సృష్టింపలేకపోయిరి.

గడచిన వేయి సంవత్సరాలుగా ఆంధ్రదేశ రాజకీయ సాంస్కృతిక పరిణామ వికాసములతో సన్నిహిత సంబంధముగల కమ్మవారి చరిత్రయగుటచే, నీ గ్రంథము చరిత్ర ప్రియులందరి ఆదరణను పొందగలదని నా నమ్మకము. “ ఇద్‌వల ప్రచురింపబడిన ౬5 తలుసనవలలో? సమాసం న్యా వ్య్య్యా్వులా నియోగిని అడిగిన ప్రశ్న: మీరు బ్రాహ్మణులా? నియోగి ఇచ్చిన సమాధానము : కాదు, నేను నియోగిని ఇట్టి రచనకు కారణము సమాజ పరిణామచరిత్రను గురించీన పూర్తి అజ్ఞానము, లేదా, కరడుగట్టిన శాఖాద్వేషము వలన సంభవించిన వక్రదృష్టి వర్షవిద్వేషములను రెచ్చగొట్టు నిట్టివిపరీతరచనలు సామాజిక శాంతికిగాని, (ప్రజాస్వామ్య సిద్దాంత ఆచరణక్షుగాని, జాతీయభావ సమ్రైక్యతకుగాని గర్భళ్యతువులు. సంస్కారముగల ప్రతియొక్కరు నిట్టి రచనలను బహిష్కరింపవలసియున్నది. కాగొ వై నవల పారితోషికమును సొందుటే గాక్ర విద్యార్థులకు పాఠ్యగ్రంథముగా కూడ నిర్ణయింపబడినది. ఇది చొల కోచనీయము. చరిత్ర” గ్రంథమునకు వ్రాసిన ప్రీ్రక్రా వ్యాసం. - 1962.

92

అశ 15. ఆంధధ్రులలో విశిష్ట వ్యక్తిత్వాలు - (త్రిపురనేని కనిరాజు 'కవులు సమాజానికి శాసన నిర్మాతలు” అనే అర్జాన్నిచ్చే సామెత ఇంగ్లీషులో ఉంది. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్‌ టాగూరుల నుద్దేశించి ఒక సందర్భంలో “ప్రవక్తలను పరిహసిద్దాం; కవుల సందేశాన్ని గౌరవిద్దాం” అన్నాడు యమ్‌.యన్‌.రాయ్‌. మన ప్రాచీన ఆలంకారికులు సైతం, కీర్తి ధనము, వ్యవహారజ్ఞానము, కాంతాసమ్మిత తయోపదేశ సామర్థ్యము- కావ్య ప్రయోజనాలుగా గుర్తించారు. కవులు సమాజంలో భాగస్వాములేగాని, అతీతులుకాదు. సమాజంలోని మంచి చెడుల (ప్రభావానికి వారు కూడా లోనౌతూనే ఉంటారు, సమాజంలోని చెడును నిరసించి నిర్మూలించటానికీ, మంచిని అభినందించి పెంపొందించటానికీ ప్రయత్నమొసరించటం వారి సాంఘిక ధర్మాలలోని భాగమే. ఆలోచనాపరులు, ఆవేశపరులునై నందున కవులు తమకుగల సాంఘిక బాధ్యతలను సులభంగా. గుర్తింపగలుగుతారు. అందుచే తమ రచనల ్రబోధంతో (ప్రజలను చైతన్యవంతులను గావించి ప్రగతిపథంలో పురోగమించుటకు అవసరమైన మానసిక వాతావరణాన్ని సృష్టించి చరితార్థులౌతూ ఉంటారు, బాధ్యతనెరిగిన కవిరాజులు. జీవితంలోని ఏ రంగంలోనైనా చూర్పుకు భావాలలో మార్పు అవసరం; భావాలు కార్యరూపం ధరించటమే ఆచరణ; ఆచరణకు స్థిరమైన రూపకల్చనయే సంస్థగా మారుతుంది. కాబట్టి సమాజ పురోగతికి నూతన భావ చైతన్యం అవసరం; ఆలంబనం. అట్టి చైతన్యాన్ని సృష్టించే వాడు కవి. అందుచేతనే కవులను మానవజాతికి శాసన నిర్మాతలనటం సముచితమైన వర్లన. ఆంధ్రుల సాంఘిక- సాంస్కృతిక జీవితంలో కవులు (ప్రధాన భూమికలు ధరించి సమకాలీక అవసరాలను గుర్తించి తమ రచనల ద్వారా సమాజాన్ని తీర్చి దిద్దటానికి 93

బౌడ్డము - ఆంధ్రము

ప్రయత్నించిన ఘట్టాలు నాలునైదు స్పష్టంగా కన్పిస్టై, అట్టి వారిలో శివకవులు, తిక్కన, శ్రీనాథుడు, వేమన, కందుకూరి, గురజాడ, త్రిపురనేని రామస్వామి గణనీయులు. సమాజం పరిణామ శీలమైనది. పరిణామ(క్రమంలో ప్రతి భావానికి, సంప్రదాయానికి, సంస్థకు ఒక చారిత్రక ప్రాధాన్యమున్నది. సమకాలికంగా ప్రతి సిద్దాంతము అభ్యుదయకర పాత్రనే నిర్వహించింది. ఒక భావంగానీ, సంస్టగానీ ప్రయోజనాన్ని కోల్పోయిన తరువాత సమాజానికి భారంగా అభివృద్దికి నిరోధంగా పరిణమిస్తూ ఉంటుంది. ఇట్టి చరమదళశలో వానిని సమర్దించటం, సంరక్షించటానికి పూనుకొనటం అవివేకం. ఇట్టి అవివేకులే సమాజంలోని ప్రతీపగామిశక్తులు, కానీ, వాని వాని చారిత్రక ప్రాశస్త్యాన్ని గుర్తింపకు నేడు అభ్యుదయానికీయ బడుచున్న నిర్వ్శచనాల పరిభాషలో ప్రతి (ప్రాచీన సంస్థను, భావాన్ని. సంప్రదాయాన్ని తెగనాడటం సముచిత మార్గం కాదు. అట్టి విధానం వల్ల ద్వేషాలు, కావేషాలు (ప్రబలమై విప్లవ వ్యతిరేకశక్తుల సంఖ్య, బలము పెరిగి ఆశించిన సమాజ ప్రగతి కుంటుపడుతుంది. సంఘర్షణ కాక అభివుద్దికి సిరమైన మార్గం సమన్నయమే. ఈ దృష్టితో పరిశీలించినప్పుడు సెన పేర్కొన్న న మ కాలాలలో ప పంంగా (ప్రయోజనకరమైన పాత్రనే నిర్వహించినట్టు స్పష్టమౌతుంది. తిక్కన్న వేమన్నల తెలుగుదనాన్ని, సమరదసదృష్టిని, నుడికారాన్నీ; శ్రీనాథుని స్వాతం త్రేచ్చ, ధిక్కారభావము, వాదనావటిమలను; శివకవ్చబ విష్టవోద్వేగాన్నీ; కందుకూరి, గురజాడల సంస్కరణోత్సాహాన్ని. మానవత్వాన్నీ పుణికి పుచ్చుకొన్నాడు త్రిపురనేని రామస్వామి. వాస్తవానికి వారందరికీ అతడు వారసుడేగదా! ఐతే, సుసంపన్నమైన ఈ వారసత్వంలో, నాలు + అభ్యుదయ శీర్ణంకడుడుగా సముచితస్టానాన్ని అర్జించుకొన్నాడు

త్రిపురనేని కవిరాజు. య్‌ కవిరాజ వ్యక్తిత్వం చాలా చిత్రమైనది. సర్వసమభావాన్ని ప్రచారంచేసిన మానవతావాది ఆతడు. కానీ భారతజాతీయత మూర్తీభవించ్చి త న దేశభక్తుడు ఐనప్పటికీ స్వరాస్త్రాభిమాని: సద. స్వాతంత్ర్యాన్ని కాంక్షించిన దేశభక్తుడు, ? దుకువస్తే కటకందాక్రా మనదేరా' అని ప్రబోధించి,

94

ఆంధ్రులలో విశిష్ట వ్యక్తిత్వాలు-త్రిపురనేని కవిరాజు వీరగంధం పూసి ఆంధ్రులను విశాలాంధ్ర రాష్ట్ర ఉద్యమానికి పురికొల్పినవాడు. జస్టిస్‌ పార్టీ నాయకుడు; ఆ రోజుల్లో జస్టిస్‌ పార్టీని బ్రిటిష్‌ ప్రభుత్వానికి విశ్వాసపాత్రుల పార్టీగా పరిగణించేవారు; కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు ప్రోత్సహించాడు; స్వదేశ ఉద్యమాన్ని బలపరిచాడు. ఆంగ్రభాషలో ఉన్నత పట్టాలు పొందాడు; చిక్కని నుడికారం ఉట్టిపడే తేట తెనుగులో మహాకవులు తలలూపేటట్టు కవిత్వం చెప్పాడు. పరిణామవాదంలో గాఢమైన విశ్వాసంకలవాడు; కానీ (గ్రాంథిక భాషావాదివలె కన్పిస్తాడు. త్రివురనేని పేరుకు దగినట్టు లయకారుడు; తమ బరువుతో సమాజాన్ని అణగారుస్తున్న చివికిపోయిన సంస్తల నిర్మూలనకు కంకణం కట్టినవాడు; అంతమాత్రమేకాదు. (ప్రగతిశీలమైన సమాజానికి, శాస్త్రబద్ధమైన నూతన సిద్దాంతాలపై (క్రొత్త పునాదులు నిర్మించటానికై జీవితం ధారపోశాడు కవిరాజు.అందుచేతనే వేరు వేరు కోణాలనుండి వేరు వేరు రంగులు కన్సించే దుర్చిణి అతని జీవితం, ఈ కారణంచేతనే సమ(గ్రంగా అర్ధంచేసికొనకుండా సంప్రదాయ ప్రియులైన సనాతనులు కవిరాజును కువిమర్శలకు గురిచేశారు. ఇందులో అసహజం యేమీలేదు. చరిత్రలో సంస్కర్తలందరికీ పట్టిన దుర్గతియే అది, కానీ ధైర్యంగా అచంచల దీక్షతో మౌఢ్యాన్ని, కునిమర్శలను ఎదిరించి తన ఉద్యమాన్ని సాగించాడు కవిరాజు. సత్యాన్వేషణకు, సత్యస్థాపనకు దైర్యము, త్యాగశీలము అవసరం, థైర్యంతోకూడిన సత్యాన్వేషణాసక్తియే నాగరికతా వురోగతికి మూలమైనది. అట్టి మహనీయుల ఉదారత్యాగాలే నాగరికతకు పునాదులు. మౌఢ్యం మీద వివేకం సాధించిన విజయాలే నాగరికతా పురోగతి చరిత్ర. మనదేశంలో ఆంగ్ల సార్వభౌమత్వం స్థాపింపబడిన అచిరకాలానికే పాళ్చాత్య విద్యాసంస్కృతుల (ప్రభావం ఫలితంగా విజ్ఞాన పునరుజ్జేవనోద్యమం (ప్రారంభమైంది. భారత చరిత్రలో సంస్కరణోద్యమాలుగానీ, స్వర్ణయుగాలుగానీ విదేశదండయాత్రల ఫలితంగానే జరగటం గమనింపదగిన విశేషం. నిన్నమొన్న జరిగిన చైనా దాడి సైతం భారతీయులలో ఐక్యతను సంఘటిత పరచి ప్రయోజనకారియైనదని చైనాకు కృతజ్ఞత చెప్పుకునే రాజకీయ నాయకులు లేకపోలేదు! స్వతంత్ర జాతిగా ఇంతకంటే సిగ్గుచేటు 9ర్‌

బౌద్దము - ఆం(ధ్రము మరొకటి కన్పింపదు. ఈ పరిస్థితివలన, మన జాతి, స్వయంగా పురోగమింపగల శక్తిని చేకూర్చగల చేవ మన సంస్కృతిలో కొరవడినదా? అందుకు కారణమేమి? అనే ప్రశ్నలు సహజంగా ఉత్పన్నమౌతై. 19వ శతాబ్దంలో విజ్ఞాన పునరుజ్జీవనోద్యమ నాయకులు రాజా రామమోహన రాయలు, దయానంద సరస్వతి; బ్రహ్మసమాజ, ఆర్యసమాజ స్టాపకులు, ఈ రెండును కొంచెం హెచ్చుతగ్గుగా పునరుద్దరణ వాదాలే. ఆర్యసమాజానిది కర్మమార్గం; స్మృతులను పురాణేతిహాసాలను, భగవద్గీతను తిరస్కరంచి శృతులను మాత్రమే అంగీకరించి, ఆదిమ పూజా విధానమైన యజ్ఞాలను పునరుద్దరించింది. దురదృష్టవశాత్తు ఆర్య సమాజం చాలావరకు వ్యతిరేక ఉద్యమంగా రూపొందింది; ఆంధ్రదేశాన్ని పరిశీలిస్తే, తెలంగాణంలో ముస్థిం వ్యతిరేక ఉద్యమంగానూ, సర్కార్లలో బ్రాహ్మాణ వ్యతిరేకుద్యమంగానూ పరిణమించినట్టు కన్నిస్తుంచి. చిరకాలంగా తమకు వైదిక కర్మలకు అర్హతను నిరాకరించిన బ్రాహ్మణులపై ప్రతీకారం సాధించటానికి పనికిరాగలదని (బ్రాహ్మాణేతరులు ఆర్యసమాజాన్ని ఆదరించారా అనిపిస్తుంది. ఇంచుమించు ఈ ఉద్యమానికి అనుబంధంగానే “స్వసంఘ పౌరోహిత్య ఉద్యమం” ముమ్మరంగా సాగింది. ఈ ఉద్యమ ఉద్దేశ్యం పురోహితవర్గ దురాశను, నిరంకుశత్వాన్నీ రూపుమాపటమే. కానీ ఫలితం? దీనివల్ల కలిగిన వర్ణ వైషమ్యూల మాట అటుంచి, పురోహిత వర్గం సంఖ్యాబలంలో పెరిగి సమాజంలో విస్తరించి ఆశించిన దానికి వ్యతిరేక ఫలితాలను మాత్రమే ఇచ్చింది. ఇక, (బ్రహ్మసమాజానిది జ్ఞానమార్గం. దీనికి ఉపనిషత్తులు ఆధారం; ఈ ఉద్యమంలో పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం గోచరిస్తుంది. సమరస భావము, నిశ్చజనీనత సమన్వయ పద్ధతిబ్రహ్మ సమాజ సిద్ధాంతాలలో స్పష్టం. కాని బ్రహ్మ సమాజంలోని ఈ వైదేశిక ప్రభావానికి నిరసనగా పూర్తి దేశీయ సంస్కృతీ పునరుద్దరణ కాంక్షతో ఆర్యసమాజం ప్రారంభమైంది. ఐతే, ఉపనిషత్తులలోని బ్రహ్మ పదార్థమే (బ్రహ్మ సమాజ సిద్దాంతాలకు మూలసూత్రమైంది. ఈ (బ్రహ్మ పదార్థం శాశ్వతం; ఆది మధ్యాంతరహితం; ఎన్నటికీ మారనిది; మార్పులేనిది. ప్రగతికి మూలమైన పరిణామ సిద్దాంతానిక్తీ, ఇట్టి బ్రహ్మ పదార్హంలోని విశ్వాసానికీ పాత్తుకుదరదు. కావున (బ్రహ్మసమాజం సైతం మన దేశంలో పై పై సంస్కరణలకు మాత్రమే దోహదంచేసినదిగాని భారతీయుల మనస్తత్వంలో 9ిగ్ర

ఆంధధ్రులలో విశిష్ట వ్యక్తీత్వాలు-త్రిపురనేని కవిరాజు మౌలికమైన మార్పులకు అవసరమేన తాత్విక బలాన్ని చేకూర్చలేకపోయింది. ఆంధ్రదేశంలో అపర రామమోహనరాయలనిపించుకున్న వాడు కందుకూరివీరేశలింగం. అనేక కష్టనిష్టూరాల నోర్చి సనాతనుల కువిమర్శలను ధైర్యంతో ఎదిరించి నిలిచి సాంఘిక సంస్కరణలు సాగించాడు. కాని, తాను సూచించే సాంఘిక సంస్కరణలు, హిందూ ధర్మశా(స్తాలు ఒకయుగంలో తయారైనవి కావు. నేటి హిందువులకంటె వారి (ప్రాచీనులే వివేకవంతులు; ఏ యుగానికి అనుమూలమైన ధర్మాన్ని ఆ యుగంలో రూసొందించుకొన్నారు; మార్పుకు వారు" సర్వదాసుముఖులే. అందుచేతనే మన ధర్మశా'స్తాలలోను, పుఠరాణాలలోను పరస్పర విరుద్ద విషయాలుకన్సిసై. క్రమంగా ఆయా ధర్మశా(స్త్రాల చారిత్రకనేపథ్యాలు నురుగునపడిపోయి. అవి అన్నీ ఆపౌదుషేయాలేనని, దైవశాసనాలని, అందుచే శిరోధార్యాలనీ వాదించే అవివేకం ప్రబలించి. ఈ కారణంచేతనే మన ధర్మ శాస్త్రాలు ఆధారంగా జరిపే సంస్కరణలు తాత్కాలిక ప్రయోజనాన్ని పొందుతై: అందుచే సమాజం '్రతి యుగంలోనూ గోనుగెద్దువలె తయారై. ఒక్క, అడుగుకూడా ముందుకు కదలలేకపోయింది. సంస్కరణలకు, పురోగతికి. విదేశ దండయాత్రలవసరం కావటానికి ఇట్టి మనస్తత్వము, సంప్రదాయములే కారణం,

ఈ లోపాన్ని కవిరాజు గుర్తించినట్టు కన్పిస్తుంది. మొదట్లో అతడు ఆర్యసమాజం వైపు మొగ్గుచూపిస్తాడు; స్పృతులను తిరస్కరించి శృతుల నంగీకరిస్తాడు. శంబుకవధలో శంబుకునిచేత “చతురామ్నాయములం దలంచుచు నమస్కారంబులన్‌ చేయుచున్‌ స్మృతిధిక్కారము సల్పబూనితిమి మా శ్లేమాభిలాషం బుచే” అనిపిస్తాడు. సూతునిచేతనే పురాణాలు '“పిట్టకథలకు నివియెల్లి బుట్టి నిండ్లు” అనిపించాడు. క్రమంగా కవిరాజ (బ్రహ్మసమాజంవైపు పురోగమించాడు; “విది చరాచరంబయిన నష్టే సర్వము మూలకారణంబేది...నిత్య సత్య పరతత్వ మహత్వము నాశ్రయించెదన్‌”, “జగన్నాటక సూత్రధారియయినాడెవడో ఆతనిందలంచెదన్‌” అనే (ప్రార్ధనలకు కారణము (బ్రహ్మలేక పరమాత్మలో విశ్వాసమే. “ఇది జ్ఞానమార్లానికి లక్షణం, జ్ఞానవాదానికి- పరాకొష్టయే హేతువాదం. దానికి నిదర్శనం మతంలో విశ్వాసం సడలటమే! కవిరాజు నాస్తిక వాదిగా

87

బౌద్దము - ఆంధ్రము పరిణామం పొందాడనే వారు లేకపోలేదు. ఏమైనా మతాన్ని తిరస్కరించాడనేది యదార్థం. మతాల వల్ల మానవ జాతికి మేలుకంటే కీడే అధికం జరిగిందని స్పష్టంగా చాటాడు. ళం 'మతమనుమాట మోసముసుమా అదె మూలము ధర్మపీడకున్‌' అనీ, 'మతములె వుట్టకున్నయెడ మారణ కర్మములిన్ని సొగునే' అనీ బోధించాడు. ఐరోపాలో మధ్యయుగాంతంలో విజృంభించిన విజ్ఞానోద్యమ వైతాళికుడైన ఎరాస్మన్‌ లక్షణాలు 'త్రిపురనేనిలో కన్పిస్తై, ఎరాస్మన్‌ మానవతావాద ఉద్యమనాయకుడు. రాజా రామమోహన రాయలును ఇండియన్‌ ఎరాస్మన్‌ అన్నారు. (త్రిపురనేని ఆంద్ర ఎరాస్‌మన్‌. తన గ్రంథాలలో (20196 01౧01) మతవాదులను తూర్పార బట్టాడు ఎరాస శ్‌. సునిశిత హాస్యంతో మతసంస్థల పునాదులను కదలించి వేశాడు. మార్టిన్‌లూథర్‌ ఆ(గ్రహం కంటె ఎరాస్‌మన్‌ హాస్యమే చర్చి అధికారానికి గర్భ శత్రువైనది అన్నారు. మతంలో, మతసంస్థలలో ప్రజల విశ్వాసాన్ని సడలించటానికి త్రిపురనేని ప్రయోగించిన ఆయుధంకూడా అదే. ఇంద్రుని గురించి వర్షిస్తూ: వేయిగన్నులు నాకు గన్టింవలేదు పొడలు మాత్రము గన్చించె నొడలినిండ అంటాడు. అదే ధోరణిలోస్వర్లాన్ని 'బాగు! శివశివా! అది వట్టి భోగభూమి, యుండరాదిందు మావంటి యోగులకును' అంటూ తిరస్కరిస్తాడు బహుశా త్రిపురనేని ప్రభావం ఫలితమ్సే వావచ్చు! ఆరువాతియొక కవి స్వర్గాన్నీనిధంగా వర్షించాడు: వలపు వన్తులు కడువు కొందలము/గన్దు చెనటి కవిగాడు దీని సృజించియుండు. ఇక దేవతలంతా కేవలం లంచగొండులట! ముడువుగట్టిన గాని సమ్మోదపడరు వేటతల జూచి కాని మోమోటపడరు. అట్టి దేవతలకు లంచాలిచ్చి మానవులు అవినీతి పరులగుట యెందుకు? సోపి 98

ఆం(ధ్రులలో విశిష్ట వ్యక్తిత్వాలు-త్రిపురనేని కవిరాజు లంచమిచ్చినా, మానవులనాదుకొంటారా అంటే అదీ అనుమానమే. కారణం? ఇల్లును వాకిలింగలిగి ఇద్దరొ ముగ్గురొ యాండ్రుగల్లి పై బిల్హలుజల్లలుంగలిగి వెక్కనమైన కుటుంబభారమన్‌ వెల్టువనీద లేక పల వించెడి దైవతకోటి నామొజుల్‌ ఆలకించి రక్షిస్తారనే విశ్వాసం కుదరటానికి అవకాశమే కన్పింపదు గదా! ఇక పితృదేవతల తృప్రికై హిందువుల సంప్రదాయాన్ని గురించి కవిరాజు అంటాడు. పుడమి తలంబు నందు బడ బోసిన దోసెడు మంచినీళ్లుగు ప్పెడు మెదుకుల్‌ తమంతట నె యేవగిదిం బితృలోకమందునుం డెడు పితరుల్‌ (గ్రహింపగ వ డిన్‌ జను దారినినిల్వకుండ నే జడమతులైన నీనుడులు సత్యములంచును విష్ళసింతురే? జడమతులే విశ్వసింపని యీ మూఢాచారములను ఆలోచనాపరు లాచరించుటలోని ఆంతర్యమేమి? మత మౌఢ్యంనుండి విముక్తి సాధించి, శాస్రీయదృక్పథాన్ని అలవరచుకోవాలనీ, హేతుత్వంతో బుద్ది నుపయోగించి, మంచిచెడులను పరామర్శించాలని కవిరాజు 99

భౌద్ధము - ఆంధ్రము ఉద్బోధ. శాస్త్రీయమైన పరిణామ సిద్దాంతాన్నాతడు సమాజానికి వర్తింపచేశాడు. సమాజం ప్రగతి శీలమైనది. ప్రగతిపథంలో ఏ యుగానికి ఆ యుగం ఒకసోపానం; కాబట్టి ఒక్కొక్క యుగంలో, ప్రాతబడి నిష్ర్రయోజనములైన ఆచారాలను త్యజించి, క్రొత్తవానిని నిర్మించుకొనటం సహజమైన మానవధర్మం. ఇందుకు విరుద్దంగా వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో నేటి సాంఘిక సమస్యలకు పరిష్మాణర మార్గాలు, పురోగమన సాధనాలు వెదకటం వెజ్ణితనం; వెనుకజూపుతో ముందుకు నడవటం వలె ప్రమాదకరం! కాబట్టి వానికి కేవలం చారిత్రక (ప్రాధాన్యమును మాత్రమే అంగీకరించి సమకాలిక మానవ (ప్రగతి అంతస్తుకు అనుకూలమైన ధర్మాన్ని, సంస్థలు నిర్మించు కోవాలి. అందుకు సమౌబంలో భావ విష్ణపం అవసరం, అంటే(ప్రాతను తిరస్కరించి క్రొత్తను నిర్మించుకొనగల లం, ఆత్మవిశ్వాసం అవసరం. అట్టి భావ విష్ణవం సాధించే ఆశయంతోనే కవిరాజు సూతపురాణం, భగవద్గీత ట్రశాడు త్రి అంశం మన (ప్రాచీన పురాణాలలోని కథలే! కాని వానినుండి పురాణాలు- అర్యవేత వెలికిదీశాడు కవిరాజు. వాస్తవానికి, మన ఇతిహాసాలు, నీచంగా వర్తిసూ దప సటించిన దేశభక్తులను, స్వాతం(త్ర్య ప్రియులను చరిత్రయే! సమబ పరు జాతి ద్రోహులను శ్లాఘిస్తూ (వ్రాసిన మన (ప్రాచీన శాస్త్రీయ దృక్షథంతో చరిత్ర సూత్రాలను గ్రహించటానికి చారిత్రక జ్ఞానం అవసరం: ఉంటుంది, సత్యశోధన ఏ రోరించినప్పుడే చరిత్ర అధ్యయనంవల్ల ప్రయోజనం డారుణ ఫలితాలు కలుగు * ఎద్‌ ప్రయోజనానికి కొరముట్టుగా చరిత్రను మలచటంవల్ల కన్పిస్తుంది- యధాతథం మై చారిత్రక సత్యాలను- సత్యం సాధారణంగొ వికృతంగానే భవిష్యత్తును నిరి చు ఆంగీకరింపగల ధైర్యం, ఆ గుణసాఠాలు మార్గదర్శకంగా సపలీకృతమౌతుంద ముసి నగల సామర్థ్యం అలవరచుకొనటంలోనే మానవత్వం ముందు తీవ స్టమాదా బూస్‌ మారేడుకాయచేసే (ప్రయత్నాల వలన ముందు చారిత్రక దృష్టిగాన్లీ క నెదుర్కొనవలసివస్తుంది. వాస్తవానికి భారతీయులకు పెద్దగా

  • చరిత్ర గుణపాఠాలపట్ట లక్ష్యంగానీ ఉన్నట్టు కన్పింపదు. చరిత్ర 100

ఆంధ్రులలో విశిష్ట వ్యక్తిత్వాలు-'త్రిపురనేని కవిరాజు అంటే అసత్యాల పుట్ట అని మనవారి విశ్వాసం. ఈ తత్వమే నేటి “హిందూ” దేశభక్తులలో విపరీతంగా కన్పిస్తున్నది. పురాతత్వ పరిశోధనలన్నా, వాని ఫలితాలన్నా వారికి విపరీతమైన ద్వేషం అనటానికి ఇటీవల వెలువడిన “శాతవాహనుని రాచిప్ప"”. అనే కథ చక్కని తార్కాణం. ఇందుకు కారణం, కేవల అహంకార పూరితమైన తమ సిద్దాంతాల గాలిమేడలకుపునాదులు లేవని పురాతత్వ సత్వాలు నిరూపించుననే భయమేగాని మరాండుకాదు. ఈ మనస్తత్వాన్ని తాలగించి పౌరాణిక ఆధారాలను సవిమర్శకంగా పరిశీలించి వానినుండి చారిత్రకాంశల నుద్దరించాడు కవిరాజు, 'ఆ ప్రయత్నమే సూతపురాణం. మన పురాణాల్లో దేవరాక్షస యుద్దాలు ఆర్య అనార్య సంఘర్దణలేననీ రావణాదులను వికృతంగా ఆర్యకవులు వర్షించటానికి వారు ఆర్యవిస్తరణ నరికట్టటమననీ నిరూపించాడు. నేటికీ మధ్య యిండియాలోని 'గదబులు' తాము రావణ వంశీయులమని ఇప్పుకాంటారు; వారిలోని సిడుల వంటి ఒక మతాచారానికి మేఘనాదమని పేరు! ఇదేవిధంగా బలి, (ప్రహాదాదుల యదార్ధ చరిత్రలు వెలువరించాడు. బుజుచారిత్రక పరిజ్ఞానం కలిగినప్పుడే “ప్రాతదైనంత మాత్ర భవ్యంబు కాదు, నవ్యమైనంతమా(త్ర నింద్యంబుకాదు” అనే దృష్టి కలుగుతుంది; సమాజానికిగల ప్రగతి శీలాన్ని (గ్రహింపగలుగుతాం; 'ప్రాతను పరిత్యజించి క్రొత్త సమాజాన్ని నిర్మించుకునే నైతిక బలం అభిస్తుంది.

ఈ నూతన సమాజానికి కేవలం మానవత్వాన్ని పరిగణించే సిద్దాంతమే పునాది కావాలని ప్రబోధించాడు కవిరాజు భగవద్గీతలో! వర్ణము జాతి, భాష అనే అడ్డుగోడలు తొలగి మానవజాతిలోని ఏకత గుర్తింపబడాలి! దాన్ని మించిన ధర్మంలేదు. భగవద్గీతలో నాయునిచేత యీ మాటలనిపిస్తాడు:

“న్వవరపక్ష భేదభావంబునీవంటివానికుండు ” (నాకు లేదు “ఒక్క భాషప్రియంబు కొండొక భాష

101

బౌద్దము - ఆం(ధ్రము చా విప్రియమ్ము నాకనముమాట వెగటుమూట ఇక విశ్చరూపసందర్భన యోగంలో, భగవంతుడనే వాడుంటే అతనికి మానవులందరూ సమమే అనే భావం స్పష్టపడునట్టు బాబచం(దునిచేత అనిపిస్తాడు: యవన వమ్హావ బర్బరోద్రవిడ... హాణ, నీగ్రోబీన.. నిఖిలజాతు అన్లి'నీ యందె కులకులలాడుచుండె. కొందరు ముఖం నుండి పుట్టటం గాని, మరికొందరు పాదాల్లో పుట్టటం గానీ లేదు! ఆ చార యవనికాభ్యంతరమున మ్టేచ్చబుద్దితో దాగుచు, న్రుర్ణుదోషంబు, దృష్టి దోషపంబటంచు బతితమై పోవుచున్న జాతిని సై సిద్దాంచాలమీదృపునస్సృష్టి చేయటమే కవిరాజు సంకల్పం! ఆ ఆదర్శంతోనే కలంపట్టి, అభివృద్దినిరోధకశక్తులపై యుద్దం (ప్రకటించి వాని పునాదులను కదలించి 'సిద్ధార్భుడు” కాగలిగాడు. దయానందుని, గాంధీని నాస్తికులుగా మతద్రోహులుగా, దేశదోహులుగా పరిగణించి హత్యచేసిన ఛాందసులు కవిరాజును గౌరవిస్తారని ఆశించటం కంటె పారబాటు మరొక టుండదు. చివికిన భావాలతో సంప్రదాయాలతో జన్మహక్కులతో వర్ష వైషమ్యాలతో (ప్రగతికి ప్రతిబంధకమైన హిందూ సొమాజిక వ్యవస్థపై వష్టవ ధ్వజమెత్తాడు కవిరాజు. ఆ వ్యవస్థతోనే తమ మనుగడ ముడిపడియున్నదనీ, అది నశిస్తే తమ సంస్కృతికే ముప్పురాగలదనీ పొరబాటుగా భావించారు అగ్రవర్ణాలు, ఆ పొరబాటే కారణంగా, కవిరాజును (బ్రహ్మద్వేషిగా చిత్రించి దూషించారు. సమాజ అభ్యున్నతి నాళించి ప్రారంభించిన ఈ మహోద్యమానికి నాయకత్వం వహించి విజయం సాధించవలసిన విద్యావంతులైన అగ్రవర్ణాలు ఉద్యమ అవరోధకులగుట శోచనీయం! 102

ఆం(ధ్రులలో విశిష్ట వ్యక్తిత్వాలు-త్రిపురనేని కవిరాజు కవిరాజు ఉద్యమం విజయవంతం కావడానికి పలువురు కవిరాజులు అవసరం. ఆంధ్రదేశంలో కవులకు కొదువలేదు. కానీ వీరిలో "నరమేధం చేయాలనీ నరరక్తం త్రాగాలనే” ఆటవిక (ప్రవృత్తితో ఆనందించే వారేగాని ప్రజలలో మానవత్వం ప్రబోధించి అభ్యుదయ పథాన నడిపింపగల సమర్జులు తక్కువ. కవిరాజే అన్నాడు: “కవుల స్వాతంత్ర్యమో మంటగలిసిపోయె బొట్టకూటికి వజువట్టు పుట్టినపుడె; అడ్డమైన దేవురు గొట్టు నాశ్రయించు” కవులు సమాజానికి ప్రగతిశిలమైన శాసన నిర్మాతలెట్టు కాగలరు? మన కవులు తమ బాధ్యతను గుర్తించి, శివకవులు, వేమన, కవిరాజుల సంప్రదాయాలను నిలబెట్టి నూతన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కాగలరని ఆశిద్దాం! అన్తాన్లా ఆయం లలల 10 ౧4౪ఆఓ౦గ66600 -- 4.6.1 60౧0౫0గల646 011006 - 1968. 1౧1

  1. ఆంధ్రులలో విశిష్ట వ్యక్తిత్వాలు ఇసి ముల్లంపల్లి సోమశేఖరశర శ్రే క్రీర్రిశేషులైన మల్లంపల్లి సోమశేఖరశర్మగారు డిగ్రీలు లేని పండితులే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ తాంబూలానికి అర్హతసాధించిన పరిశోధక శిగోమణేి. పళ్చిమ గోదావరిజిల్లా మినుమించిపల్లిపాడులో 1891లో జని ్రంచిన శర్మగారు బాల్యంలోనే రాజమహేంద్రవరం చేరి మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణులై పాత్రికేయుడుగా సారస్వత జీవితం ప్రారంభించారు. నాడు సంఘసంస్కరణోద్యమాలకు సారస్వతోద్యమాలకు ఆంధ్రదేశంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఉండేది. అచటి భాషాపరమైన సాంస్కృతిక పునరుజ్జీవన వాతావరణ ప్రభావంతో శర్మగారు కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు రచించి వివిధ పత్రికల్లో ప్రచురించి పండితలోకం దృష్టినాకర్షించడమే గాక తెలుగుసాహిత్య రంగంలో సముచితమైన శాశ్వత స్టానం సంపాదించినారు. యావద్భారతంలో నాడు సాంస్కృతపునరుజ్జీవనానికి రాజకీయ చైతన్యానికీ చరిత ఆలంబనగా ఉండేది. దేశభక్తికి చారిత్రక పరిజ్ఞానం ఆధారమనడం సర్వజనవేద్యమే. (ప్రాచీనకాలంలో భారతదేశం సాధించిన మహోన్నత సాంస్కృతిక శిఖరాలను తిరిగి అధిరోహించడానికి రాజకీయ స్వాతంత్ర్యం తప్పనిసరా అనే దృష్టితో మేధావివర్లం జాతీయోద్యమంలో చేగుతున్న రోజులు అవి. యువకులు ఉత్నొహవంతులైన శర గగారిని చరిత్రపరిశోధన అర్షించడంలో ఆశ్చర్యంలేదు. అచిరకాలంలో శర్మగారు చరిత్ర పరిశోధనే తన జీవిత లక్ష్యంగా చేసుకొన్నట్టు కన్పిస్తుంది. శర్మగారిలో దేశభక్తి ఆం(ధ్రాభిమానమూ ఆపారం. వారి స్వరూపం ఆం(ధ్రత్వం మూ్తీభవించినట్టు ఉండేది దేశాభిమానంతోనే యువతరంలో దేశ్యక్తిని స్వాతంత్ర్య దీక్షను ఉత్తేజితం చేసే ఉద్దేశంతోనే బహుశా శర్మగారు అనంతర కాలంలో “తెలుగు వీరుల'ను గురించి వ్రాశారు. శర్మగారి 104

ఆంధ్రులలో విశిష్ట వ్యక్తిత్వాలు-మల్లంపల్లి సోమశేఖరశర్మ

కార్యాచరణ స్టానం రాజమహేంద్ర వరంనుండి రాష్ట్ర రాజధానియైన మద్రాస్‌ నగరానికి మారింది.

ఆరోజుల్లో చరిత్ర చతురానను'లైన చిలుకూరి వీరభద్రరావుగారు ఆంధ్రుల చరిత్రను రచిస్తుండేవారు. వారితో శర్మగారికి పరిచయం ఏర్పడి వారికి సాయంగా ప్రాచీన కావ్యాలకు శాసనాలకు ప్రతులు వ్రాయడం జరిగింది. అనంతరం కొమర్రాజు వెంటకలక్ష్మణరావు గారితోను కాశీనాథుని నాగేశ్చరరావుగారితోను విజ్ఞానసర్వస్వంలో కృషిచేశారు. ఈ పరిశ్రమతో శర్మగారికి చరిత్ర పరిశోధనలోను శాసనపరిశీలనలోను 'శ్రద్దాసక్తులు బలపడడమేగాక మంచి శిక్షణ లభించింది.

నాటికి ఆం(ధ్రదేశంలో చరిత్ర పరిశోధన (ప్రాథమిక దళలోనే ఉంది.చరిత్ర రచనకు మౌలిక పురావస్తు సాక్ష్య ఆధారమైన తా(మ్ర శిలాశాసనాలు ప్రజల అజ్ఞానానికి బలియై నష్టమవుతూ ఉండేవి. ఆ శాసనాల లిపిగాని భాషగాని మనకు సన్నిహితమైనవి కానందున సామాన్యులు వానిని చదువలేరు. దాని (ప్రాముఖ్యం (గ్రహించలేరు. అట్టి శాసనాలను రక్షించి వెలుగులోనికి తెచ్చి విశ్లేషించి వ్యాఖ్యానించడం కూడ చరిత్ర కారుని బాధ్యతగా ఉండేది. ఈ బాధ్యతను నిర్వహించడానికి శర్మగారు నడుంకట్టారు. ఒంటరిగాను, మి(త్రులు నేలటూరి వెంకటరమణయ్య గారితో కలిసీ నెల్లూరు జిల్హాలోను రాయలసీమను జిల్లాల్లోనూ శాసన అన్వేషణ యాత్రలు జరిపినారు. ఈ యాత్రల్లో శర్మగారు ఎదుర్కొన్న సమస్యలు, కష్టనష్టాలు, శాసనాలను గురించి హాస్యాస్పదమైన ప్రజల మూఢవిశ్వాసాలు 'నా నెల్లూరుజిల్లా పర్యటని అనే వ్యాసాల్లో శర్మగారు వివరించారు. శర్మగారిని శాసనాల శర్మగారు" అంటూ ప్రజలు సాదరంగా గౌరవిస్తుండేవారు. ఈ అన్వేషణఫలితంగా అశోకమౌర్యుని ఎర్రగుడి శిలాశాసనాలు పల్లవ, తెలుగుచోడు రెడ్డి విజయనగర మొదలైన ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ రాజవంశాల శాసనాలు అనేకం వెలుగులోకివచ్చాయి. అశోకుని శిలాశాసనాలు దక్షిణాంధ్రంలో దారకడంలోని చారిత్రక (ప్రాశస్త్యం వివరించనక్కరలేదు. ఎర్రగుడిపాడు, పొట్లదుర్తి-యూలెపాడుల్లో దొరికిన శేనాటిచోడుల- శాసనాలు ప్రాచీన తెలుగు భాషా స్వరూపాన్నీ భాషపరిణామ రీతిని

105

బౌద్దము - ఆంధ్రము (గ్రహించడానికి ఉపకరిస్తున్నాయి. తాము సేకరించిన శాసనాలను మ్లోషించి లిపి ప్రత్యేకతలను చారిత్రకాంశాల (ప్రాముఖ్యాన్నీ వివరిస్తూ ఎపి(గ్రాఫియా ఇండికా, భారతి, శారద, ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచిక మొదలైన పత్రికల్లో వ్యాసాలు ప్రచురించి ముందుతరాల చరిత్ర సాహిత్య భాషాశాస్త్ర పరిశోధకులకు శర్మగారు మహోపకారం చేశారు. ఘంటసాల ప్రాకృత శాసనాలను గురించిన శర్మగారి వ్యాసం వారి అనంతరం (ప్రచురితం కావడం దురదృష్టం, ఈ శాసనాల్లో ఒకటి మలిశాతవాహన యుగానిది, మిగిలిన నాలుగూ ఇక్ష్యాకుల ఆలంకారిక లిపీలో ఉన్నాయి. శాతవాహన-ఇక్ష్యాకుయుగంలో 'కంటకళిలి పేరున ఘంటసాల సుప్రసిద్ద బౌద్ద క్షేత్రం. గౌతమ సిద్దార్టుని అభిమానవాహనమైన కంటకమనే గుర్రంపేర కంటకశిల ఏర్పడిందన్న శర్మగారి సూచన సముచితంగా ఆలోచనాత్మకంగా ఉంది. ఘంటసాల శాసనాల్లో మహానావికుని (ప్రసక్తి ఉంది. ఘంటసాల్లోనే ప్రాచీన రోమన్‌ బంగారు నాణేలు దొరికినాయి. అందుచే గ్రీకునావికుల రచనల్లోని కంటకోసిల రేవు పట్టణం ఘంటసాలేనని స్పష్టమవుతున్నది.పులోమావి నౌకానాణేలకీ శాసనాలు సార్హక్యం చేకూరుస్తున్నాయి, లిపి శాస్త్ర వైదుష్యంలో శర్మగారితో పరితూగగల పండితులు ఆంధ్రదేశంలో నాటికీ నేటికీ లేరు. శాసన పరిశధనలో అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారులు శర్మగారు ఒక్కరేననడంలో అతిశయోక్తి లేదు. కొత్త శాసనం లభించడంతో దాన్ని చదవడంలోగానీ అందలి చారిత్రకాంశాలను వ్యాఖ్యానించడంలోగానీ శర్మగారిలో తొందరపాటు వుండేదికాదు. ఏ సమస్యనైనా భిన్నదృక్కోణాల నుండి పరిశీలించి సమన్వయ శా'స్తీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు చేసి వెల్లడించేవారు. ఇందుకు అహదనకర శాసనంపై శర్మగారు జరిపిన చర్చయే మంచి ఉదాహరణ. ఈ శాసనం |్తీస్తుశకం ఎన్మిదో శతాబ్ది పూర్వార్టానికి చెందిందని చారిత్రకులు నిర్ణయిస్తున్నారు. ఈ శాసన భాష తమిళమనీ, తెలుగనీ, సంస్కృతాంధ్రాలనీ భిన్న అభిప్రాయాలున్నాయి. 106

ఆంధధ్రులలో విశిష్ట వ్యక్తిత్వాలు-మల్లంపల్లి సోమశేఖరశర్మ ఇందలి అక్షర స్వరూపాన్నీ, పదాల అర్జాన్నీ గురించి నేటికి గూడా పండితుల్లో ఏకాభిప్రాయం లేదు. అహదనకర శాసనభాగాన్ని శర్మగారు (ప్రచురించారు. ముఖ్యంగా ఆ శాసనంలోని 'ష్టా శకట రేఫలను గురించి శర్మగారికీ వేటూరి ప్రభాకర శాస్తి గారికీ మధ్య జరిగిన వాద ప్రతివాదాలు తెలుగు లిపి శాస్త్రంలో చరిత్రాత్మకమైనవి. శర్మగారు శకటరేఫగా గుర్తించిన అక్షరాన్ని శాస్త్రిగారు ష్టగా చదివారు. శకటరేఫను భిన్నకాలాల్టో భిన్న పద్దతుల్లో లిఖించేవారనీ ఏ స్వరూపంలోనైనా అడ్డగీత సర్వత్రా సమానమనీ అందుచే తన పాఠమే సరిత్రైనదనీ అనేక శాసనాలనుండి ఉదాహరణలు గుప్పిస్తూ శర్మగారు నిరూపణ చేసినారు. ఈ చర్చ శర్మగారి పట్టుదలకు, లిపిశాస్త్రంలో వారి పాండిత్యానికి వాదనా సామర్థ్యానికీ నిదర్శనం. అయితే ఎంతటి పట్టుదల ఉన్నా పొరబాటును అంగీకరించి తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి సరిదిద్దుకొనడంలోను, ఎదుటివారి సూచనలను గౌరవించడంలోను ఎంతో సహృదయత, విశాల దృష్టి శర్మగారిలో కన్పిస్తాయి. లిపి శాస్త్రంలోనేగాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమా స్వరూప నిర్ణయంలో శర్మగారు ఆరితేరిన వారు. “అమరావతీ స్తూపం' అనే తమ-గ్రంథంలో ఆంధ్ర బౌద్ధ వాస్తువులోని తీరుతెన్నులు నాటీ స్థ్రపతుల శక్తిసామర్థ్యాలు, సహజ సౌందర్యం ఉట్టిపడే శిల్పాలు గండరించడంలో శిల్పాల నైపుణ్యమూ విపులీకరించారు. హిందూ దేవాలయం' అనే వారి వ్యాసంలో ఆలయ వాస్తు వివరణ కన్పిస్తుంది. బౌద్ద హిందూ వాస్తువులను గురించి తెలుగులో మొదట (వ్రాసింది శర్మగారేనని చెప్పవచ్చు. మొగల్‌లాజపురంలోని దుర్గగుహలో మూలవిరాట్‌ స్టానంలో అస్పష్టంగా ఉన్న కుడ్యశిల్పాన్ని గుర్తించి" అది అర్హనారీశ్స్వరమూర్తియని సహేతుకంగా నిరూపించారు శర్మగారు. ఈ నిరూపణ వారి నిశిత పరిశీలనాశక్తికి ప్రతిమా శాస్త్ర వైదుషానికి తార్కాణము. సోమశేఖర శర్మగారు తమ దృష్టిని ఎక్కువగా మధ్యయుగాంధ్ర చరిత్రపై కేంద్రీకరించారు. మధ్యయుగ ఆంధ్ర చరిత్రలో వేంగి చాళుక్యయుగం ప్రథను ఘట్టం. వేంగి చాళుక్య చరిత్ర ఆద్యంతమూ సమస్యాభూయిష్టమే. వేంగి రాజ్యస్థాపన ఎప్పుడు 107

బౌద్దము - ఆంధ్రము జరిగింది అనేది ఆ సమస్యల్లో మొదటిది. స్లీట్‌ సండితుడు క్రీస్తు శకం 614లో రాజ్యస్థాపన జరిగిందనగా భావరాజు వెంకటకృష్ణారావుగారు క్రీస్తుశకం 624లో జరిగినట్టు నిర్ణయించారు. వేంగి చాళుక్యయుగంలో దాక్షిణాత్య రాజ్యాల మధ్య జరిగిన భిషణయుద్దాల్లో ఎవరికి వారే తాము విజేతలమని వర్షించుకోవడంతో నాటి చరిత్ర చాలా క్షిష్టంగొ తయారయింది. ఆ సమస్యలను నిర్మత్వంతో పరిశీలించి సంభవా సంభవాలను చర్చించి వేంగి రాజ్య చరిత్రను ధారావాహికంగా శర్మగారు భారతి మాసపత్రికలో (ప్రచురించారు. అయితే వేంగి రాజ్యస్థాపనకు శర్మగారు సూచించిన తేదీగానీ, రాజరాజ నరేంద్ర విజయాదిత్యుల మధ్య సంబంధాల స్వభావాన్ని గురించిన వారి నిర్ణయాలుగా, నీ ఇటీవలి చరిత్రకారులు అంగీకరించడంలేదు. అందులో అసహజం ఏమీలేదు. ప్రాచీన చరిత్రలోని నిర్ణయాలు శాశ్వతంగా నిలబడకపోవడానికి నాటి సాక్ష్యాధారాలు సమ(గ్రంగొ ఉండకపోవడమే కారణం. ఉపలభ్యమైన సాక్ష్యసమాచారం ఆధారంగానే చారిత్రక సమస్యలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అజ్ఞాతంగా ఉన్న సొక్ష్య సంపద వెలుగులోకి వస్తున్న కొలదీ పాత నిర్ణయాలకు బదులు కొత్త నిర్ణయాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందుచేతనే ముఖ్యంగా మన (ప్రావీన మధ్యయుగ చరిత్రకు సంబంధించినంతవరకు విజ్ఞడైన _చరిత్రకారుడెవరూ “నేను చెప్పిందే చివరమాట” అనడానికి సాహసించడు.

కాకతీయులన్నా వారి స్వతంత్ర రాజకీయాధికారానికి జన శస్టలమైన తెలంగాణమన్నా శర్మగారికి చాలా అభిమానం. చాలామంది ఆంధ్రచరిత్రకారుల వలెనే శర్మ గారు కూడొ కాకతీయ యుగాన్ని స్వర్ణయుగంగా భావించేవారు. అయితే చారిత్రక సత్యాలు వెల్లడించే సందర్భాల్లో స్వీయాభిమానాలు శర్మగారికి అడ్డువచ్చేవి కావు. తెలంగాణాన్ని పాలించిన రాజవంశాల శాసనాలు ఎనబయికి పైగా లఘువ్యాఖ్యలతో తెలంగాణా శాసనాల నాలుగో సంపుటిగా శర ్ర్రగౌరు తయారుచేశారు. అయితే కాకతీయ యుగం నుండి ఆంధ్రుల చరిత్రకు శాసనాలతోబాటు వాజ్మయ సాక్ష్యం కూడా లభిస్తున్నది. కాని (ప్రతాపచంద్ర, సిద్దేష్సర చరిత్రవంటి స్థానిక వాజు శ్రియం కట్టుకథలతో నిండి చతిత్రకారులను

108

ఆం(ధ్రులలో విశిష్ట వ్యక్తిత్వాలు-మల్లంపల్లి సోమశేఖరశర్మ మభ్యపెట్టేదిగా ఉంటుంది. ఇక, ఖుస్రూ ఇసామీ వంటి ముస్లిం చరిత్రకారుల రచనలు సుల్హానులను శ్ఞాఘిస్తూ ఏకపక్షంగా ఉంటాయి. అయినా కొన్ని సందర్భాల్లో హిందూ వృత్తాంతం కంటె ముస్తిం రచయితల సమాచారమే విశ్చ్శసనీయంగా ఉండవచ్చు. ఓరుగల్టుసైై ఎన్మిదిమార్డు తురుష్క దండయాత్రలు సాగినాయని న్థానికాధారాలు పేర్కొనగా ముస్టిం రచనలు ఐదు దండయా(త్రలనే పేర్కొంటున్నాయి. ఐదు దండయాత్రలకు మాత్రమే సాక్ష్యం అభిస్తున్నందున శర్మగారు ముస్లిం సాక్ష్యాన్నే అంగీకరించారు. నిర్మమత్వం చరిత్రకారున కుండవలసిన లక్షణాల్లో (ప్రధానమయింది. ఆ లక్షణం శర్మగారిలో స్పష్టంగా కనిస్తుంది. మిత్రులు వెంకటరమణయ్య గాదితో కలిసి ఆచార్య యజ్బానీ నంపాదకత్వంలో వెలువడిన 60/7 ౫1310%/ 0 06౧౦౦6 లో శర్మగారు సమగ్రమైన కాకతీయుల చరిత్ర (వ్రాశారు. నేటి పరిశోధకులకు సయితం ఆ చరిత్ర మార్గదర్శకంగా ఉంది. కాకతీయ రాజ్యపతనంతో ఆంధ్రదేశం అరాజకంలో మునిగింది. అన్నివిధాలా ఆంధ్రుల చరిత్రలోనది ఆంధకారయుగంగా కన్పిస్తుంది. ఈ యుగచరిత్రపై వెలుగు ప్రసరించిన ఘనత, కీర్తి శర్మగారివి. (ప్రతాపరుద్రుని కొడుకు తిరిగి ఓరుగల్లును స్వాధీనం చేసుకున్నాడని ముస్లిం చరిత్రకారులు (వ్రాశారు. అతణ్ణి కాపానీడు, కాన్యాపాయర్‌, కాబానాయండ్‌ అంటూ పలు రకాలుగా వ్యవహరించారు. స్టానిక సాక్ష్యాధారాలేవీ (ప్రతాపరుద్రునకు కుమారులున్నట్టు చెప్పవు. ప్రోలయ వాయకుని విలాస తామ శాసనభాగము, కాపయ నాయకుని (ప్రోలవరం శాసనము, అనితల్లికలువచేరు శాసనం ఆధారంగా ముస్తిం చరిత్రకారుల కథనం. యదార్దంకాదని వివరిస్తూ శ్రీస్తు శకం 1323- 36 సంవత్సరాల మధ్యకాలంలో ముసునూరు (ప్రోబయ, కాసయనాయకులు తురుష్క పాలకులతో స్వాతం్య్య పోరాటం సాగించడం, కొాపయనాయకుడు ఓరుగల్లు నా(క్రమించడం శర్మగారు తన సింగ్రంగ6గి 0౧20168 6 ౧6౧172 (౧11910౧ ద్వారా చరిత్ర పుటలకు ఉద్ధరించారు. అంధకార యుగంగా భావించే ఈ “ముసునూరు యుగం” రాజకీయంగా సువర్ల ఘట్టమని శర్మగారు నిరూపించారు. 109

బౌద్ధము - ఆంధ్రము

శర్మగారికి శాళ్చతమైన కీర్తి ప్రతిష్టలనార్జించి పెట్టింది రెడ్డిరాజుల చరిత్రలో వాలి అపూర్వ పరిశోధన. ఆ పరిశోధనా ఫలితమే 7౫౭ [15100/ 2౧6 (19 [666 (960002౧6 గంగరజగరం ౬౧6 గిఇ20గ00౧౮౧/ అనే ఉత్తమ పరిశోధక (గ్రంథం రెడ్డిరాజుల శాసనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఎర్రన; శ్రీనాథాది కవుల కావ్యాల్లోనో ఇరిస్టావంటి ముస్లిం చరిత్ర కారుల రచనల్టోను సమాచారం విశేషంగా లభిస్తున్నది. ఈ ఆధారాలన్నింటినీ పరస్పరం బేరీజువేసి చర్చించి నిగ్గుదేల్చి తయారుచేసిన చరిత్ర. ఇది కేవలం రెడ్డిరాజుల చరిత్ర మాత్రమేకాదు. ఆంధ్రదేశానికి సంబంధించినంతవరకు విజయనగర, వెలమ బహమనీ, ముసునూరు రాజ్యాల చరిత్రనూ ఆ రాజ్యాల మధ్య సంబంధాలను వివరిస్తూ చెప్పిన నాటి ఆంధ్రదేశ చరిత్ర, ఇది కేవల రాజకీయ చరిత్రకాదు; మత, సాంఘిక, సారస్వత, లలితకళారంగాల్లో ఆ యుగంలో వచ్చిన పరిణామాలను వివరిస్తూ తయారుచేసిన విజ్ఞాన సర్వస్వం.

శర్మగారు. రెడ్డిరాజుల చరిత్రకు మాత్రమేకాదు, ఆంధ్రదేశ చరిత్ర సమస్తానికీ సజీవమైన విజ్ఞానసర్వస్వంగా ఉండేవారనడానికి వారి సంపాదకత్వంలో తెలుగు భాషా సమితి వారు వెలువరించిన తెలుగు సంస్కృతి అనే సంపుటమే నిదర్శనం.

లిపి శాస్త్రంలో చరిత్ర. పరిశోధనలో ఈ విధంగా తాను నెలకొల్సిన ఉదాత్త సంప్రదాయాల ద్వారా భావితరాల పరిశోధకులకు వరవడిపెట్టి ఆదర్శ చరిత్రకారునకు ఉదాహరణగా నిల్చిన గురువర్యులు శ్రీ మల్లంపల్లి వారికి నా జోహారులు!

“పైలా ఇకళకా న. ఆకాశవాణి విజయవాడ్త కేంద్రం సౌజన్యంతో

10

  1. దేశ దేశాలలో ఆంధ్ర సంస్కృతి

దేశ దేశాంతరాలలో విస్తరించిన తమ సంస్కృతీ ప్రభావ విశిష్టతను 'శలపోసి గర్వింపనీ ఆంధ్రుడుండడు. కానీ, ఆంధ్ర సంస్కృతి భారతీయ.సంస్కృతిలో అంతర్భాగంగా వికసించి యుండటంచేత, దేశంలోని ప్రతిప్రాంతం వారును, విదేశాలకా సంస్కృతిని 'ప్రసారించిన గౌరవం తమదేనని భావించటం ఆశ్చర్యం లేదు. ఆ కారణంగా, భారత సంస్కృతీ సామ్రాజ్య నిర్మాణగాథలో ఏ ప్రాంతం వారి పొత్ర ఎంతవరకో నిర్ణయించటంలో వాదోపవాదాలు సహజంగా ఉన్నై. ఐనప్పటికీ, భారతీయ సంస్కృతిని గురించి చెప్పే సందర్భంలో, 'భిన్నత్వంలో ఏకత్వం” అనే మాట తరచు వింటూ ఉంటాం. అంటే, ప్రతి (ప్రాంతానికి ఏదో ఒక విశిష్టత ప్రత్యేకత ఉండనే ఉన్నది. కాబట్టి విదేశాలలో విస్తరించిన భారతీయ సంస్కృతిలో ఆంధ్రుల పాలు ఎంతవరకో నిర్ణయించటం అంతకష్టం కాదు. ఇలా నిర్ణయించటంలో కేవలం వాజ్మయ (11160౧7 నిదర్శనల కంటె పురాతత్వశాస్త్ర (/0౧౮౭౦|౦౮|౦౦) నిదర్శనలే ఎక్కువ విశ్వాసయోగ్యములైనవని, ప్రామాణికములనీ పండితుల అభిప్రాయము. వాని ఆధారంతోనే ఆంధ్ర సంస్కృతీ విస్తరణను నిర్ణయించవచ్చును. విదేశ సంబంధాలు - కారణములు

సిరిసంపదలతో తులతూగుచున్న ఆంధ్ర దేశానికి ప్రాచీన కాలంనుండి దూరదేశాలతో వాణిజ్య సంబంధాలుండేవి. పంటలు విరివిగా పండుతూండేవి; ప్రజలు వృత్తిసంఘాలు (శ్రేణులు)గా _ నేర్చడి లోహ, వజ్ర, దారు, వస్త్ర పరిశ్రమల నభివృద్ది చేశారు. సాతవాహనుల శాసనాలలో 19 వృత్తి సంఘాలు పేర్కొనబడినై. సాతవాహనుల నౌకా బలానికి, వారు విదేశ వాణిజ్యానికొసగిన ప్రోత్సాహానికి వారి నౌకా చిహ్నముగల నాణెములే నిదర్శనము. ఆంధ్ర దేశములో వినుకొండ, నెల్లూరు, నాగార్జునకొండ,

శ

బౌద్ధ్దము - ఆంధ్రము కొండాపూర్‌ మున్నగుచోట్ల రోమను చక్రవర్తుల నాణెములు పెక్కు లభించినవి. ఇవి ఆంధ్ర దేశములో తయారైన వస్తువుల ఎగుమతి ద్వారా వచ్చినవేనని డొ రాధాకుముదముఖర్జీ గారి అభిప్రాయము (౧౦౫౦౧ 501001౧౮) . ఈ విదేశ వాణిజ్యమునకు తూర్పు కోస్తాలోని మనార్బా (మోటుపల్లి), కొట్టిస్‌ (కొత్తపట్టణం), కంటకోసిలాస్‌ (ఘంటసాల), కొడ్డూర (కోడూరు), అల్లొసైన్‌ (కోరంగి, మైసలియా స్‌ (మచిలీపట్నం) మొదలైన రేవులు కేంద్రములై నట్టు క్రీస్తు శకారంభమున ఇండియాను దర్శించిన ప్లినీ, టాలెమీ అను గ్రీకు చరిత్రకారులు పేర్కొనినారు. క్రీ.శ. 78 ప్రాంతంలో "పేరు తెలియని గ్రీకు నావికుడు రచించిన “ఎజి సముద్రముపై దినచర్య” (౧౭౧15 01109 6౧౧౪6౧ 860) అనే (గ్రంథంలో నాటికే దాక్షిణాత్యులు తూర్పు ఆఫ్రికా తీరంలోనూ తూర్పు ఆసియా దీవులలోనూ వలసలు స్టాపిచినట్టు చెప్పబడింది. ఇండియా ఇండోనేషియా శిల్పములను గురించి పరిశోధనలు చేసిన డా॥ ఆనందకుమారస్వామిగొరి నిర్ణయము ప్రకారము, తూర్చుదీవులలో ప్రథమ భారతీయ వలసలు స్టాపించిన వారు ఆంధ్రులు; వీరు కృష్ణా ముఖద్వార మందున్న కోడూరునుండి బయలుదేరి, ఆ దేశాలకు వెళ్ళారు. వాణిజ్యం ద్వారా నేర్పడిన ఈ విదేశ సంబంధాలు బౌద్దమత ప్రచార కాంక్షతో మరింత బలపడినై, జాతి, వర్ష విచక్షణలను ఆధిక్యతను నిరసించి, శాంతి, సమత్వము, సౌహార్షములను పెంపొందించు -బౌద్ద ధర్మాన్ని తూర్పు ఆసియా (ప్రజలాదరించారు. అశోకుని మరణానంతరం, భారతదేశంలో మొత్తంమీద బౌద్ధానికి రాజాదరణ సన్జగిల్లినదని చెప్పవమ్బృను; శుంగ, సాతవాహన వంశముల కాలంలో తీవ్రమైన వైదిక ధర్మోద్దరణోద్యమము విజృంభించింది. ఇక్ష్యాకులు కూడా శైవ సంబంధమైన హిందూ మతాభిమానులు; పల్లవుల కాలంలో పాశుపత, కాలాముఖాది తీవ్రవాద శైవం ప్రబలమై బౌద్ధమతాన్ని హింసించసాగింది. ఈ వాతావరణంలో బౌదులకు మాతృదేశంలోకంటె తూర్పుదేశాలలోనే ఆదరాభిమానాలు లభించినవి. తమ మతాన్ని, శిల్పసాంప్రదాయాలను తీసుకొని, బౌద్దులు అసంఖ్యాకంగా తూర్చుదేశాలకు తరలిపోయి. వలపలు స్థాపించుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ విధంగా నేర్చడిన వలసలు ఆంధ్ర సంస్కృతిని ఆ దేశాల ప్రజలకే విధంగా పంచిపెట్టినది పరిశీలిద్దాం. 1122

దేశ దేశాలలో ఆంధ్ర సంస్కృతి బర్మా: క్రీపూ. 5వ శతాబ్దంలోనే తెలాంగులనబడే మాన్‌ ప్రజలు బర్మాలో (ప్రవేశించారు; వీరు తెలుంగు దేశంనుండి వలసవెళ్లినట్టు వారి పేరే సూచిస్తున్నది. వీరు రామన్న దేశమనే రాజ్యాన్ని స్థాపించారు; దాని రాజధాని హంసవటి (పెగూ,). దీనికి కొంచెం ఉత్తరంగా శ్రీ క్షేత్రమనే రాజ్యం వెలసింది. దీనినే 'వనవాసి” అని కూడా వ్యవహరించేవారు. దక్షిణదేశంలో “వనవాసి” (ప్రస్తుతం మైసూరులో ఉంది) సాతవాహన సా(మ్రాజ్యంలోనొక విభాగమై, చుటుకుల శాతకర్ణి వంశస్టులచే పాలింపబడేది. క్రీ.శ రవ శతాబ్దంలో పెగూ రాజ్యాన్ని పాలించిన “శాన్‌లాన్‌ క్రోం” ఇంచుమించు అదేకాలంలో వేంగి, కళింగ రాజ్యాలనేలిన శాలంకాయన రాజవంశ శాఖీయుడేనని భావింపబడుచున్నది. ఇతని వంశము వారే బర్మాలో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టారని ప్రసిద్ది. డా నీహర రంజన్‌రాయ్‌ పరిశోధనల ప్రకారం బర్మాలోని బౌద్ధమతం అనురావతి-నాగార్జునకొండల (ప్రాంతం నుండి వెళ్లినదే. బర్మాలో ప్రచారమందున్న “లోకతిష్య' అర్హకథకును, తెలుగుదేశంలో వాడుకలోనున్న కొల్లేటి దహనం కథకును లేశమైనా వ్యత్యాసం కన్పించదు. ఇటీవల (ప్రోంలో కింబొగోన్‌ అనేచోట [క్రీ.శరవ శతాబ్దికి చెందిన బౌద్ద స్తూపం బయల్సడింది. అందు. బుద్ధ విగ్రహాలకు అమర్చబడిన చేతి ఉంగరములు, చెవి కమ్మలు ఆంధ్రశిల్ప ప్రభావాన్ని చాటుచున్నవి. అచటి శాసనములు 'క్రీ.శ5వ శతాబ్దానికి చెందిన తెలుగు - కన్నడ లిపిలో వ్రాయబడినవి. మలయా: మలయాలో నేటికికూడా విదేశీయులను క్షింగ్‌ (కళింగ)లని పిలుస్తారు. దీనినిబట్టి మలయాలో (ప్రవేశించిన మొదటి విదేశీయులు కళింగులని తేలుచున్నది. కళింగనుంచి విదేశాలకు వలస వెళ్లినవారు పల్లూరు అనే రేవునుండి బయలుదేరారు (౧6౦౮16 0[50061 ౬0591 4ు!0- గిఆరై౧016 ఓ6 140. ఇక, కళింగమంటే ఒరిస్సా (ప్రాంతమేనని కొందరు పండితుల భ్రాంతి. తూర్పు తీరమున గంగా గోదావరీ ముఖద్యారముల మధ్య'ప్రాంతమంతయు కళింగమని ఒకప్పుడు వ్యవహరింపబడినది. ఇందు ఉత్తర, మధ్య, దక్షిణ లేక డ్రికళింగము లను విభాగములుండేవి. ఉత్తర కళింగమే 113

బౌద్ధము - ఆం(ధ్రము ఉత్కళయైనది. (త్రికళింగమే త్రిలింగమైనదని కొందరి వ్లాదము. ఏమైనప్పటికీ ఉత్తరాంధ్రమునకు గళింగమను పేరుండెననుట నిర్వివాదాంశము. పల్గూరు (పాలూరు) గంజాం జిల్లాలోని చిలక సరస్సు దక్షిణ అగ్రమునందున్నది. ఇదియే సంస్కృతే వాజ్మయములో (పల్లు + ఊరు) దంతపురమై యుండును. ప్రస్తుతము ఒరిస్సా రాష్ట్రములో చేరియున్నను, ఈ ప్రాంతమంతయూ నిర్వివాదముగ తెలుగు ప్రాంతమే. పల్లూరునుండి కళింగాంద్రులు మలయాకు వలస వెళ్లిరనుటకు మరికొన్ని నిదర్శనములున్నవి. మలయాలో శాన్‌కోలక్‌లో దొరికిన కంచుబుద్ద విగ్రహములకును గుంటూరు జిల్టాలో బుద్దాము (బాపట్ల తాలూకా)లో దొరికిన విగ్రహాలకును చాలౌొ పోలికలున్నవి; లిగర్‌ అనే చోటనున్న హిందూదేవాలయములలో ఉండవల్లి (గుంటూరు జిల్లా గుహాలయముల పోలికలు కన్పించును; కౌలానెలిన్‌సింగ్‌, జెడాహాలలో దొరికిన శాసనములు క్రీ.శ. 5వ శతాబ్దమునాటి వేంగి లిపిలో వేయబడెను. ఇండో చైనా: ఇండోచైనాలో మొట్టమొదట వలసలు స్టాపించిన వారు ఆంధ్రులు. గౌతమీపుత్ర. శాతకర్ణి కాలంలో (శ్రీశ 1వ శతాబ్ది) కౌండిన్యుడనే ఆంధ్ర బ్రాహ్మణ యువకుడు ఆ దేశాన్ని పాలిస్తున్న “సోమ అనే నాగరాణిని వివాహమాడి కౌండిన్య సోమవంశమును స్టాపించినాడు (4౧౦16౧1 1౧౮6-౧0. 16 న. ౮య/య4/00). అతని సంతతివారు చంపా మున్నగు రాజ్యాలను కూడా జయించారు. చంపారాజ్యం పూర్తిగా ఆంధ్రుల వలసయని చెప్పవచ్చును. ఆ రాజ్యానికి ముఖ్య పట్టణం సింహపురం; అందలి రాష్ట్రాల పేర్లు అమరావతి, కౌధార, విజయ, పం([్రంగ, ఇవియన్ని ఆంధ్రదేశంలోని స్టలముల పేర్లే, సింహపురం: విశాఖపట్టణం జిల్లాలో క్రీ.శ 45 శతాబ్దాలలో రాజ్యం చేసిన మాఠరుల రాజధాని; (ప్రస్తుతం సీంగపురం అనే పేరున చికకోలు, నరసన్నపేటల మధ్య నున్నది (20[1/ 0౧౦౮5116 ౦ షం1066:06 - 80/6 ంం). అమరావతి: సుప్రసిద్ద బొద్దక్షేత్రం; గుంటూరుజిల్లా, కౌదార: సముద్ర గుప్తుని అలహాబాదు ప్రశస్తిలో పిష్టపురము (పిఠాపురం)నకు సమీపమున పేర్కొనబడిన కొత్తూరు. విజయ: శ్రీపర్పలే విజయపురి (నాగార్జునకొండ), పండ్రంగ: నెల్లూరు జిల్లాలోని పండ్రంగమే. ఈ 114

దేశ దేశాలలో ఆంధ్ర సంస్కృతి ప్రాంతముల నుండి వలస వెళ్ళిన ఆంధ్రులు మాతృదేశంపై గల అభిమానము కొలది తమ కొత్త స్ట్థావరముల కాయా పేరులే పెట్టుకొని యుందురు. ఇండోనైనాలో నేర్చడిన మరొక భారతీయ రాజ్యం కాంభోజ (00౧౧౦౦౮౦). ఈ రాజ్యానికి, తెలుగు దేశంలో విరివిగా ('ప్రచారమందున్న కాంభోజరాజకథకు గల సంబంధమేమో పరిశోధింపవలసి యున్నది. చంపా, కాంభోజ రాజ్యముల నేలిన రాజులపేర్టు వేంగినేలిన శాలంకాయన, విష్ణుకుండిన రాజుల పేర్లను బోలి (చండవర్మ, ఇంద్రవర్శ) ఉండేవీ. నేటికిని ఇండోనేషియా ప్రజల పేర్ల చివరనుండే “ఫాన్‌ అనేమాట “వర్మన్‌ అనుదాని అపభ్రంశ రూపమై యుండవచ్చును. ఈ రాజులు పల్లవులవలె “ధర్మ మహారాజాధిరాజ” బిరుదును ధరించారు; వేలాది విద్యల నభ్యసించారు. అమరావతీ రాష్ట్రంలో డాంగ్‌డుయాంగ్‌ చెంత దొరికిన బుద్ద విగ్రహాలు ఆంధ్రదేశంలోని అమరావత్తినుండియే ఎగుమతి యైనవని పండితుల అభిప్రాయము, 'నోకన్‌ అనేచోట దొరికిన శాసనలిపి వాసిస్టీపుత శాతకర్షి కన్హేరి శాసన లిపికి నకలుగా నున్నది: తరువాతి శాసనాలు వేంగి లిపిలో నున్నై. ఇండోచైనాలో శాలివాహన శకం వాడబడింది. కాంభోజ దేశాన్ని పాలించిన ఐదవ జయ వర్మ (క్రీ.శ 968) తనను శ్రీశ్రైలముతో (కర్నూలు జిల్లా) పోల్చుకొన్నాడు. భక్తులకు శ్రీశైలము మోక్షము నిచ్చునట్లు, యాచకులకు జయవర్మ దక్షిణల నిచ్చువాడట! దీనినిబట్టి క్రీ.శ 10వ శతాబ్దము వరకును, శ్రీశైల శ్రైవక్షేత్రము ఇండోచైనా ప్రజల దృష్టి నాకర్షించుచుండెనని వేరుగా చెప్పనక్కరలేదు. కాంభోజ. దేశంలోని _ వైష్ణవులు విష్ణువును, అనంతశాయి రూపంలో ఆరాధించేవారు. ఆ దేశంలోని శ్రైవులను శ్రీశ్రైలం వలె వైష్ణవులను బహుశః ఉండవల్లై గుహాలయంలోని అనంతశాయి ఆకర్షించి యుండవచ్చును. ఇండోనేషియా : పెగూ, కాంభోజ దేశాలనుండి భారతీయులు ఇండోనేషియాను (జావా, బోర్నియో మొదలైన సుగంధ ద్వీపాలను) అ'క్రమించారని 'పెర్లూసన్‌ పండితుని సిద్దాంతము. కళింగాంద్రులాక్రమించారనటానికి నిదర్శనంగా, జావాకు కళింగమనే పేరుండేది. ఈ ద్వీపాల నేలిన రాజులు కూడ 'వర్మ' నామాంకితులే. అందు పురాణ వర్మ 115

బౌద్దము - ఆంధ్రము మహారాజు గోసహస్రదాన మొనర్భెనట! ఇటువంటి దానముల ప్రసక్తి తరచు ఆం(ధ్రదేశము నేలిన చక్రవర్తుల శాసనములలో కన్పించును. విజయ పురిలో ఇక్ష్యాకు రాజవంశ స్థాపకుడైన శ్రీ, శాంతమూలుడు గోశతసప్రస హలశతసహ'్ర ప్రదాతయట!

ఇండోనేషియాలో పెక్కు చోట్ల అమరావతీ సాంప్రదాయములలో మలచబడిన బౌద్ధశిల్పములు లభించినవి. జావాలో నెల్ల బోరోబుదురు శిల్పము జగత్రసిద్ది గాంచినది, ఇచ్చట ఒక మహాపర్వతాన్ని అసంఖ్యాకమైన ఉద్దేశిక స్తూపాలుగా శిల్పి చెక్కివేశాడు, ఆంధ్రదేశంలో బొజ్జన్నకొండ. లింగాలమెట్టలను (విశాఖపట్నం జిల్లా) చూచినవారికి బోరోబుదురు గుర్తుకు వస్తుంది. ఇచట కొండలో మలచబడిన ఉద్దేశిక స్టూపాలనే, తరువాతి కాలంలోని శైవులు లింగాలమెట్ట అన్నారు. కాకతాళీయంగా ద్‌ని జ్వారాైవులవల్ల బౌద్దానికి జరిగిన అపచారాన్ని కూడా (గ్రహించవచ్చు. వీరు లింగాలమెట్టను అనుకొని ఉన్న కొండగుహలోని బుద్దుని బొజ్జన్న (విఘ్నేశ్చరుడు)గా పూజించారు. స్తూపాలు లింగాలైనవి; బుద్దుడు బొజ్జన్నయైనాడు! దాని ప్రక్కనే ఉన్న సంఘారామము నేడు సంకరం ఐపోయింది! (సంకరం అనే (గ్రామం ఇప్పుడున్నది) కాని, బౌద్ద క్షేత్రంగా మండిన లింగాల మెట్టయే బోరోబుదురు శిల్ప మహాకార్యానికి ఉపక్రమణిక మైనదని శిల్పచరిత్రకారుల అభిప్రాయము. (8466౧51 ౧6౧౫౦౧౩ ౧ గీగ౧౦౧/06656 - 4౧ 590[67౧6౧|౦౧౧)

ఇండోనేషియాలో శివ కేశ లిద్దరూ ఆరాధింప బడ్డారు. కాని క్రీశ 12, 13 శతాబ్దాలనాటికి ఈ దేవతల కభేదము నూహించి హరిహరస్వామిని ప్రజలు పూజించారు. ఇండొనేషియాలో హరిహరస్వామి విగ్రహాలు పెక్కు దొరికిన, విశేషమేమంటే, ఇదేకాలంలో ఆంధధ్రదేశంలోకూడ హరిహరభావం ప్రబలంగా ఉండేది. కవిబ్రహ్మయైన తిక్కన సోమయాజి “శ్రీయనగారినాబరగు” అంటూ హరిహరతత్తాన్ని ప్రజలకు మహా భారతం ద్వారా ప్రబోధించినది క్రీ, శ 11వ శతాబ్దిలోనే ఈ రెండు దేశాలలోని హరిహరతత్త్యాలకు గల సంబంధాన్ని పరిశోధింపవలసిఉంది.

హిందూమతంతోబాటు మహాభారత రామాయణేతిహాసములుకూడా సుగంధ ద్వీపాలకు, పయనించినైై, తెలుగు దేశంలో వలెనే ఇచట తోలుబొమ శైలాటలు (6౧0660౪ న|౦౧ ప్రజల వినోదాలు. ఆ ఆటలకు ఇతి హాస కథలే ఇతివృత్తాలుగా ఉండేవి. ఇవి 'కవి”

116

దేశ దేశాలలో ఆంధ్ర సంస్కృతి

భాషలో వ్రాయబడినై. ఇందు నూటికి 90 పాళ్లు సంస్కృతం. లిపిమాత్రం వేంగిలిపియే. బోర్జియోలో దొరికిన 'యూపా' శాసనం వేంగి లిపిలోనే చేయబడిందని (ప్రఖ్యాత (క్రోంపండితుని నిర్ణయము. ఈ దీవుల్లో గూడా శాలివాహన శకమునే ప్రజలు వాడుకొన్నారు.

సింహళము : ఆం(ద్ర సింహళ దేశాలమధ్య సంబంధం బహుపురాతనమైనది. బౌద్ద వాజ్మయంలో సింహళాన్ని నాగలోకమనేవారు; కృష్ణానదీ ముఖద్వార 1ప్రాంతం కూడ నాగదేశమని వ్యవహరింపబడింది. తూర్పుతీర (ప్రాంతాల నుండియ్‌ నాగజాతులు సింహళానికి వలస పోయినారని ఊహించవచ్చును. రామాయణంలో "పేర్కొన బడిన లంకయే సింహళమైైనచో, రావణుడు దండకారణ్య ప్రాంతాన్ని జనస్టానము (జననస్టానము) అని పిలవటం గమనింపదగినది! సింహళానికి గొనిపోబడిన బుద్దుని దంతగాథల్టో కృష్ణా ముఖద్వారంలోని వజ్రాలదిన్నై ప్రస్తావన కన్పిస్తుంది. సింహళ 'ప్రభువులైన విజయుడు, క్షేమ సింహుడు కర్మరాష్ట్రం నుండి 'కమ్మసాలీల' నాహ్వానించినట్టొాక ఐతిహ్యం ఉందీ. దుత్తగామిని అనే సింహళ ప్రభువు, ఆంధ్రదేశం నుండి బుద్దుని ధాతువులు సంపాదిరిచి వానిపై అనూరాధపురంలో స్తూపాలు నిర్మించినట్టును, ఆ స్తూప ఆవిష్కరణ మహోత్సవానికి పల్లవ బొగ్గు (పల్లవభోగ్య లేక పలనాడు) నుండి పదివేలమంది శిష్యులతో మహాదేవభిక్షు సింహళమున కేగినట్టును మహావంశమనే సింహళ (గ్రంధము 'పేర్కొనుచున్నది. భారత దేశంలో నాటికే రూపుమాసిపోయిన “ప్రజ్ఞాపారమిత” శాస్త్రమును ఆచార్య నాగార్జునుడు సింహళ దేశము నుండి తెచ్చి వ్యాఖ్యానాలు రచించినాడట। ఆనాటి నుండి నాగార్జునకొండ సింహళ బౌడ్డులకు పుణ్యక్షేత్రమైనది. సింహళ యాత్రికులకై ప్రత్యేకంగా నాగార్జున కొండలో “సిహాళ విహారము” (సింహళ విహారము)ను నిర్మించి అందు బోధినృక్షమును నెలకొల్పారు. ఆచార్య నాగార్జునుని తరువాత, ఆచార్య పీఠ మధిస్టించిన ఆర్య దేవుని, సింహళ రాజైన ఓహరతిస్స తన దేశానికి ఆహ్యానించి గౌరవించాడు.

కుతూహల మహాకవి రచించిన 'లీలావతి' అనే ప్రాకృత కావ్యం ద్యారా లీలావతి అనే సింహళ రాకుమారి, కవివత్సలుడైన హాలుని వరించి వచ్చి వివాహమాడినట్టు తెలియుచున్నది.

ఇంతటి సన్నిహిత సంబంధాలుండటంనల్ల ఆంధ్ర సంస్కృతిని సింహళ ప్రజ

[17

బౌద్దము - ఆంధ్రము లారాధించారనటంలో విప్రతి పత్తి యుండదు. అనూరాధపురంలోని బౌద్దదేవాలయాలకు ఉండవల్లి గుహాలయాలు నమూనాలైనవి; సింహళములోని (త్రిపిటకములు అంధ్రదేశమునుండి దిగుమతిల్రైన పాళీభాషలో (వ్రాయబడినవని ఓల్లైన్‌ బర్గ్‌ (010౪౧౦౮|ర) పండితుని తీర్మానము. _ మధ్య ఆసియా; ఆంధ్ర సంస్కృతీ ప్రభావము మధ్య ఆసియా వరకునూ 'ప్రాకుట మరీ విశేషము. నాగార్జున కొండలో లభించిన శాసనముల వలన ఆం(ధ్ర(ప్రాంతం నుండి బౌద్ధభిక్షువులు మత ప్రచారార్థం కాశ్మీరు, చైనా మొదలైన దేశాలకు గూడ వెళ్ళినట్టు తెలియుచున్నది. చైనా జపాను దేశాలలో వ్యాపించిన జైన్‌ బౌద్దం శ్రీ పర్వతశిఖరాలనుండి 'ప్రబోధింపబడిన మహాయానంలో నొకభాగమైన ధ్యానబౌద్దమే! ఆచార్య నాగార్జునుడు వైద్యశాస్త్ర 'ప్రవీణుడవి, అతడు చైనా టిబెట్‌ దేశాలకు గూడ వెళ్ళినట్టును విశ్చసింపబడుచున్నది. అతని పరిశోధనా ఫలితములైన నేత్రాంజనము మొదలైన బౌషథములు నేటికి చైనాలో వాడుకలోనున్నవి, నాగార్జునకొండలో ఇటీవల బయల్పడిన పుఠానస్తు విశేషుల వలన నచట రసాయనిక పరిశోధనలు జరిగినట్టు రుజువగుచున్నది. '్రీశు 7వ శతాబ్దంలో శ్రీపర్సత క్షేత్రమును దర్శించిన యువాన్‌చాంగ్‌ కూడ ఆ ఇిహారములోని బొద్దులు ప్రజలకు బౌషధ సేవ చేయుచున్నట్టు వచించినాడు. చైనాలోని పోవానురాష్ట్రముందలి నాన్‌హ్స్‌ంగ్‌ టాంగ్‌ గుహాలయములలోని బొద్దశిల్పాలకు అమరావతీ శిల్పాలుమాతృకలు. జపానులోని హొరియూజి దేవాలయంలోని కుడ్య చిత్రాలకు వందా చిత్రాలకు దగ్గిర పోలికలున్నవట! టిబెట్‌ చరిత్రకారుడైన లామా తారానాథుడు ర హదు రాసా వెష్టద్యాలయాన్ని అమరావతీ-ధాన్యకటక విశ్చవిద్యాలయం విద్యార్థులు వ ళా ఫ్లై ఎర్కొనినాడు. ఆ విశ్చవిద్యాలయంలో 1700 మంది స్రలు విద్య నభ్యసించుచుండేవారట] మధ్య ఆసియాలో కారాసాహర్‌, కూచి మొదలైన చోట్ల బౌద్దస్తూప శిధిలాలతోబాటు పెక్కు సంస్కృత గ్రంథముల ప్రతులు దొరికి వాన్సిత్రో కాతం'త్రవ్యాకరణ మొకటి. ఈ వ్యాకరణము ననుసరించియే మధ్య ఆసియా 'ప్రజలు సంస్కృతము నభ్యసించుచుండిరి. వాతంద్ర వ్యాకరణమును శర్చవర్మ యను పండితుడు (క్రీపూ. 1 వ శతాబ్ది) తన యేలికదైన ఆంధ్ర సాతవాహన చక్రవర్తిని ఆరు మాసములలో సంస్కృత విద్వాంసుని 118

దెశ దేశాలలో ఆంధ్ర సంస్కృతి చేయుటకై రచించి కృతకృత్యుడైనాడట! ఆ వ్యాకరణానికే ఆసియా ప్రజలు జోహారు లర్పించినారు!

ఈ విధంగా ప్రాచీనాంధ్రులు విదేశాలతో నేర్చరచు కొన్న వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, ఇటీవల కాలం వరకూ నిలిచియుండినట్టు తెలుస్తుంది. (క్రీశ 15వ శతాబ్దంలో విజయనగర రాజ్యము నేలిన ఇమ్మడి దేవరాయలికి బర్మాలోని పెగూ, టెనాసరిం రాజ్యములు కప్పము చెల్లించుచుండినట్టు పారశీక బాటసారిరైన అబుల్‌ రజాక్‌ పేర్కొనినాడు. దేవరాయలికి సమకాలికుడైన శ్రీనాథకవిసార్వభౌముడు తన హరవిలాస కావ్యంలో కొండవీటి రాజ్యములో చామిశెట్టి వాణిజ్యమును వర్షించుచు రచించిన ఈ క్రింది పద్యం వల్ల నాడాంధ్ర దేశానికి ఏ యే దేశాలతో సంబంధములున్నవో తెలియగలదు.

పంజార (నుమత్రా గర్పూర పొదపంబులు దెచ్చె జలనోంగి (ులయా) బంగారు మొలక దెచ్చె నింహళంబున గంధ నింధురంబులు దెచ్చె హరుమంజి (అర్మన్స) బలుతేజుూహరులు దెచ్చె యాంవ (జాష్టా గట్టాణీముత్వాలు దెబ్బ భోట (భూటాన్‌ కన్తూరికావుటకోళములు దెచ్చె చీని చీనాంబరడశ్రేణి దెచ్చె. నావికా అకడ 00111 ఉరర[3 ఉంంం1401 - 5876001166 3067601 - 1960 శం

బౌద్దము - ఆంధ్రము ఆచార్య బి.యస్‌.యల్‌. హనుమంతరావుగారి ఇతర రచనలు స్వీయరచనలు : ఆంగ్లము ;: ముద్రితాలు

  1. (81910౧1౧ తిగ౮౧॥/0 2 1౧616% ౫10౧ రగర 001/9
  2. ఆ౮౧1౬౧10[006090 గం్ర65- 4 గం 01506106౪0600౧0౦: “5 “51001610 - 1119100/ & ౧౮16 6 [46066౧ ౬౦౧౪ (3౩466 000% 10! 5%06౧1) ఆంగ్లము : అముద్రితాలు
  3. 6౦/5 0౧౩౦౦10 140011%/ 1౧ 116010! ఉగర౧౧ 2 806ర6ర0%511090[010[౧0 ౦01 షగంగ౧గ౦ ౧౪:౦
  4. ౪/07/01౧6 ౧౦౦ - 1 50010 - ౧౦1౦౦ 510౧*100గ౦6 4 రింయంగంగ & ౮6౮౧౪౫ 1 శీగిర౮గ౧[0 ౦6:౦ (00౧౫౧1౦౧౦౧ ౦01 760600౧ ౧౦౧౦౪౧) 5 35000 - 6611/0 1113)00/ 0 షగిం!69౧1+ & 141666 తీగి౮[౧[0 6౦౧౧౧౦11౦౧ ౦01 ౧౬6౦00 ౧౦౧౦65 ర. ౪64/6 & ౧6౪16446 (6౦౧౫౧ |౮41౦౧ 0గ?౦౧ 6 గఉీగం ౫ తెలుగు: ముద్రితాలు 1 ఆంధ్రుల చరిత్ర
  5. భారతీయ సంస్కృతి - ఒక పరిశీలన
  6. ఆంధ్రలో సామాజిక చలనం 120
  1. విజయవాణి (రేడియో (ప్రసంగాలు)
  2. ప్రణయాంజలి (ఇండ కావ్యము)
  3. డిగ్రీ, ఇంటర్‌, మెట్రిక్‌ ఇతర తరగతులకు పార్యపుస్తకాలు
  4. ఆంధ్రదేశంలో బౌద్దజైనమతాలు (ముద్రణలో తెలుగు అకాడమీ) అనువాదాలు :
  5. యం. యన్‌ రాయ్‌ స్వీయ గాధలు
  6. మానవ నాగరికత న భయ్థగ్రందాలయ వ్‌ ౩. అశోకుడు - మౌర్యవంశక్షీణత ్ధం' + తృ గతాన్ని గురించిన ఆపోహలు నా గింటరచోలో ర్ట.
  7. లోకాయత వాద పరిశీలన మ్షైత్ష్రై భో జీవిత సం[గ్రహము : జననము ఏ ఉ-పే924 దోనేపూడి, గుంటూరుజిల్దా జననీ జనకులు ; వెంకటలక్ష్మి రామకృష్ణయ్య బాల్యం - విద్యాభ్యాసము వ మూల్సూరు, తురిమెళ్ళ తెనాలి కళాశాల విద్య వ గుంటూరు యం.ఎబియిడి ; ఆంధ్ర విశ్వవిద్యాలయము పిహచ్‌డి ? కర్నాటక విశ్వవిద్యాలయము చరిత్ర - సంస్కృతి అధ్యాపన : 1946 నుండి 1983 వరకు : తెనాలి, కూచీపూడి 'హైస్కూళ్లలో హిందూకళాశాల గుంటూరులో 1983 = 1987 : ఆచార్యత్వం - బౌద్దపీరం నాగార్జున విశ్చవిద్యాలయము నిర్యాణము ; 8-6-1993 హైదరాబాదు. అస్తు స అకా.

| ॥ _ |. . 1 | | | || . [| 1 | ॥| | 1 ॥ ॥ సీ