Telugu Badarayanamu - anilvaranasi/indianlanguages GitHub Wiki

. (క షం సాోంసం..... [ 9, యం నేల రడీ ప్రా ల కక హా గ్ర ల! త మ... ౮. షట మ (కట్టీ న! తో )

శీ . జ | ప య న ॥ ము ఢీ స న! మ ళ్‌ /] స్త చా నో | గ. గో చ ॥ ఊఉ = | జో (గీ ష్ష్‌ వ. య. సాబు సా 1ఆళో శ ః. | షు | జయదుర్శా మ. క్‌ . పరాధిపతు! మ / క గారు

సుక హీ ం (ఖందకావ్యము) గ్‌ గ్‌ శీ 4 ౯౯0 జ . 02న శలి,

  • కర్తా చంద్రుశేఖరశాస్తి జండితా కర్రా కార్షికేయ్‌ శర్ష ఎంఏ, ఆశ్రమ హైస్కూలు గంగవరం (పజిక్టి తూగో జిల్లా 533 288 పండిశా కర్రా ౯౯ చేయు శర్యు ఎంపె,' న గంగను. త్త తలను ౨ వెకితి ప్రచురణ విజయదుర్గా పీఠం వెదురుపాక, తూ1గో॥జిల్టా, 533 345.

జశొదరాయుఇరుు

  • కర్రా చంద్రశేఖరశాస్త్రి లాలా మొదటి ముద్రణ జనవరి 19, 2006 ప్రతులు వ 1000 కర్రా కార్తికేయశర్మ (అ కర్రా దత్తాశత్రేయశర్య ప్రతులకు ; న గా ప్రతుల ; _ శ్రీవాద్రేవు వెంకటబాపిరాజు గా శ్రీ విజయదుర్గా ప్రచురణలు ౨ వెదురుపాక / తూ॥గో॥జిల్తా. గ య ముద్రణ వ వీగగికిగ (రాంషా-శిరీషా పబ్లికేషన్స్‌) 14, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ సామర్లకోట - 533 440. ఫోన్‌ ; 2329454. గా న. ట్రంధాలం్య ఫరా ౯౯ విష వల వెల రూ. 25/-( స[4 0. ౧08.2306) య ర్‌ ర. నో

సవన గ్‌. న శు నాశ తన్‌ యట హ్‌ న్‌. (నస సు ఈ మం. సట ॥ నజ . వూ పో నం కీ! టి )] క్‌! చం మ్‌ కే న స క్‌ నా .! జే కీ జ భా || పనే! 1. లి లంలాా్‌ “ల౪౦ 1 నె వ్‌ న పేక | దురు గకను'), న 4 | యాచన వలు మాదక ల | వదనా వాలీ అదిపరాశక్తి - ట్‌ శ్రీ విజయదుర్గా మాతకు... సభక్తికంగా...

విజయదుర్తా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ గాడ్‌ గారు శ్రీ గాడ్‌గారి అసలుపేరు వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం. తల్లిదండ్రులు చిన్నకృష్ణంరాజు-వెంకట రత్నమ్మగార్డు. జన్మస్థలం తూ.గో.జిల్లా. రాయవరం మండలం, వెదురుపాక. 1936వ సం॥ జనవరి నెల 19వ తేదీన శ్రీ గాడ్‌గారు జన్మించారు. వారు పుట్టిన వెంటనే వారి అమ్మమ్మ “గౌడ్‌ పుట్టాడు” అన్నారట. అదేవారికి సార్ధక నామధేయమయింది. శావణమాసనంలో అందునా వరలక్ష్మీ వ్రతంనాడు 1972 ఆగష్టు 18వ లేది అర్థరాత్రి 12.42 ని॥కు జగన్మాత దర్శనమిచ్చి ఆయనకు మంత్రోపదేశం చేసింది. శ్రీ విజయదుర్గాపీఠం మంత్రపీఠం. శృంగేరి పీఠం తరువాత మంత్ర ఫీరాలలో సుప్రసిద్ధమయినది విజయదుర్గా పీఠం మాత్రమే! జగన్మాతచే స్వయంగా మంత్రం పాందిన కారణజన్ములు గనుక శ్రీ గొడ్‌గారికి అన్ని విద్యలు కరతలామలకమయ్యాయి. పండితులన్నా కవులన్నా గాడ్‌గారికి ఎంతో ఇష్టం. కవుల మధ్యలో కూర్చున్నప్పుడు వారు శ్రీకృష్ణ దేవరాయలు. స్నేహితుల మధ్య కూర్చున్నప్పుడు శ్రీ కృష్ణ భగవానులు, అధ్యాత్మిక వేత్తల మధ్య శంకర భగవత్పాదులు, వేద పండితుల మధ్య వేద పురుషులు, దుర్గాదేవి భక్తులమధ్యన వురుష రూపం దాల్చిన అమ్మవారు! ఇలా అనేక రూపాలను తమలో ఇముడ్చుకున్న గొప్ప తపస్సంపన్నులు శ్రీ గాడ్‌గారు. విజయదుర్గా పీఠంలోకి అడుగుపెట్టడమంటే ఎంతో పురాకృత పుణ్య సంపద ఉంటేగాని సాధ్యం కాదు. ఒకసారి అడుగుపెడితే చాలు ఇక మన అడుగులు జగన్మాతవైపుకు సాగుతాయి. శ్రీ గాడ్‌గారి ఆశీర్వచన బలంవల్ల మనజీవితం ఏలోటు లేకుండా సాగిపోతుంది. మరీ ముఖ్యంగా విజయదుర్గా దేవిభక్తులు గొప్ప మనశ్శాంతితో జీవించడం గమనార్హం. విజయదుర్గాపీఠంలో భక్తులందరూ సమానమే. గొప్ప-బీద తారతమ్యం లేదు. పండితుడు-పామరుడు అన్న తేడాకానరాదు. ఒక విధంగా నూ

బీదవారినే గాడ్‌గారు ఎక్కువగా ఆదరిస్తారు. వయస్సు మీరి తనవద్దకు వచ్చే వృద్ధులను సాదరంగా పలుకరించి, చేతికందినంత ధనాన్ని నూతన వస్త్రాలను వారికి బహూకరిస్తారు. అ వృద్ధుల కళ్ళలో కనిపించే సంతోషాన్ని తృప్తిగా వీక్షిస్తారు.

నిత్యం వందలసంఖ్యలో భక్తులకు, పర్వదినాలలో వేలాది మంది భక్తులకు పీరంలో అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ తృప్తిగా భోజనం చేసి వెడతారు. ఎంతమంది వచ్చినా, 'లేదు' అనే మాట పీఠంలో వినిపించదు. అదే విశేషం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. ఇంత మందికి అన్నంపెట్టే శ్రీ గాడ్‌గారు మాత్రం అన్నంతిని చాలా సంవత్సరాలయింది.

1977 వ సం॥ కార్తీక మాసంలో శ్రీశైలం బ్రమరాంబ అమ్మవారి సమక్షంలో గాడ్‌గారు ఆహారం త్యజించారు. కేవలం కొద్దిపాట్‌ ద్రవ పదార్ధాలను మాత్రమే వారు తీసుకుంటారు. తాను అన్నం తినకున్నా అందరికీ ఆహారం అందించే అమ్మతనం - కమ్మదనం గాడ్‌గారిలో ఉన్నాయి.

వారు గొప్ప పండితులు, కవి, తత్వవేత్త, వేద విదులు, సిద్ధాంతకర్త, తపస్సంపన్నులు, అన్నిటికి మించి పుంభావరూపందాల్చిన దుర్గామాత!

70 సం॥లు పూర్తిచేసుకుని, 71వ సం॥లోకి అడుగు పెడుతున్న శ్రీ గాడ్‌గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారు నిండు నూరేళ్ళు మన మధ్యన ఉండి కనువిందు చేయాలని కోరుకుంటున్నాము. మా తండ్రిగారయిన శ్రీ చంద్రశేఖరశాస్త్రి గారు నాలుగు దశాబ్దాల క్రితం వెదురుపాక గ్రామంలోనే వ్రాసిన ఈ “బాదరాయణ” మనే ఖండకావ్యాన్ని “వెదురుపాకతల్లి విజయదుర్గ”కు మా తండ్రిగారి తరపున అంకితమిస్తున్నాము.

శ్రీ దుర్గామాత ప్రతినిధిగా ఈ ఖండకావ్యాన్ని స్వీకరించి, మమ్ములను ఆశీర్వదించమని శ్రీ గాడ్‌గారిని మనసారా కోరుకుంటున్నాము.

ఇట్లు గాడ్‌ గారి విధేయులు కర్రా కార్తికేయశర్మ, కర్రా దత్తాత్రేయ శర్మ నూ

సౌజన్య సంభావనము

  • ఆచార్య శలాక రఘునాధశర్మ

బాదరాయణము ఒక పద్యకావ్యము. విద్వత్కవి వరేణ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు కర్రా చంద్రశేఖరశాస్తిగారు 1984నకు ముందే రచించి వెళ్ళిపోయారు. రెండు దశాబ్బాల తరువాత వారికుమారులు శ్రీ కర్రా కార్తికేయ శర్మ దీని ప్రచురణ బాధ్యతను, పిత్యాణవిముక్తిలో భాగంగా చేపట్టారు. ఇది ఆనందించదగిన విషయం.

ఇందులో తొమ్మిది ఖండికలు ఉన్నాయి. అయితే అన్నిఖండికలలో వస్తువు ఒకటే. అది బాదరాయణులు కాశినివదిలి దక్షిణ కాశికి రావలసి రావటం. కథానుస్యూతి వలన దీనిని అఖండకావ్యంగా, చిన్న చిన్న భాగాలుగా రూపొందటం వలన ఖండకావ్యంగా మనం పరిగణీంచాలి. ఆవిధంగా ఇది యొక విలక్షణమైన ఖండాఖండకావ్యం.

చంద్రశేఖరశాస్త్రిగారు జీవించిన విధానం, వారి గుణగణాలు మొదలైన అంశాలను గూర్చి శ్రీకార్తకేయశర్మ విసృతమైన పీఠిక వ్రాశారు. అది ఆర్రతా నిదానంగా ఉన్నది. సహృదయ హృదయాలను ఆకట్టుకొనే తీరులో రూపొందిన “నొన్నగొరి గురించి” అనే అ పీఠిక ఈ కావ్యానికి తిలకాయ మానంగా ఉన్నది.

బదరీవనం అయనం - స్థానం - గా గలవాడు బాదరాయణుడు. ఆయనకులపతి. వేలకొలది శిష్యులను అన్నవిద్యాదానంతో ఉన్నత స్థితికి తెచ్చిన సమున్నతమూర్తి. కాలమహిమవలన కాలగళుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయి కాశికి దూరంగా వెళ్ళిపోవలసివచ్చిన కథ యిందులో వస్తువు, దీనిని కావ్యంగా మలచిన అక్షరశిల్చి శ్రీచంద్రశేఖరశాస్రి గారు.

శ్రీ శాస్త్రిగారి కవిత్వంలో అన్ని విధాలైన ఉత్తమ కవితా గుణాలు ఉన్నాయి. అన్నిటికంటె ముఖ్యంగా చదివింపజేసే గుణం సమృద్ధిగా ఉన్నది.

“అంజలి సంఘటించి భవదాస్య సమంచిత హృద్య సత్కళా

కంజదళో దరాంతరిత కావ్యమధూదయ మత్తవాసనా

నూ

పుంజములన్‌ బిపాసగల పుక్కిటబట్టి నమన్కరింబెదన్‌ మంజులభావనా మధుర మానస మూగగ బాదరాయణా!” (ఆమంత్రణము)

వంటి పద్యాలలో శబ్దభావనాద మధురిమలు ఒకదానినిమించి ఒకటి స్పర్ధతో వెలువడుతున్నాయి.

చల్లనిపిల్ల వాయువులుకైత్యపరీమళ పుంజమంజరుల్‌

మెల్లగ దెచ్చి ఈశు నెలమిన్‌ మిహిరాంశుమరీచిగ్రుచ్చి, ఉ

త్ఫుల్ల కుశేశయ గ్రథిత తుందిల మాలగ నర్పసేయవే

ఉల్లము పల్లవింప విభవోజ్బలపద్ధతి బాదరాయణా!

(విశ్వలోక కుటుంబి) వంటి పద్యాలను అనుశీలిస్తుంటే బాదరాయణులు పరమశివుని పరమభక్తితో అర్చిస్తున్న విధానం మనకనుల యెదుట జరుగుతున్నదనిపిస్తుంది.

ఈ కావ్యంలో ఒక వైచిత్రి కానవస్తుంది. మొత్తం పద్యాలు నూరు ఉన్నాయి. దాదాపు 93 వద్యాలలో “బాదరాయణా!” అనే మకుటం కనిపిస్తుంది. ఆవిధంగా ఇందులో శతకలక్షణం తొంగి చూస్తున్నది. శతకం కాని శతకంగా దీనిని తీర్చి శ్రీ శాస్రిగారు పాఠకులకు బాదరాయణ జపంచేసే అవకాశం కల్పించారు.

ఈ కావ్యాన్ని వెదురుపాక విజయదుర్గాంబికకు అంకితంగా కుమారుడు కార్తికేయశర్మ నిర్ణయంచడంలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. తండ్రి చంద్రశేఖరుడు. కొడుకు కార్తికయుడు,. అంకితం జగదంబ అయిన విజయదుర్గకు. ఈ త్రిపుటి పరమరమణీయంగా ఒప్పారినది. గాడ్‌గారి ఆదరణ పొందిన ఈకావ్యం ఒక మంత్రం వంటి దవుతుందని నా సంభావన.

“జ్ఞానపూర్ణిను"

78-10-5/12, సి 3,

రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌,

శ్యామలానగర్‌, రాజమహేంద్రి.

ఫోన్‌ : 0883 - 2432906

ఆ

ఆచార్యదేవోభవ!

  • వాడ్రేవు వెంకటబాపిరాజు

1958-60లలో నేను రాయవరంలోని శ్రీ రామయ్య జిల్లాపరిషత్తు ఉన్నతపాఠశాలలో చదివేటప్పుడు శ్రీ చంద్రశేఖరశాస్రిగారు మాకు తెలుగు మాష్టారు. చామనఛాయతో, కుదిమట్టమైన శరీరంతో, లోతైన పాండిత్యంతో, శ్రావ్యమైన కంరస్వరంతో, చురుకైన చూపులతో మాయువతరాన్ని ఉఊ(ర్రూత లూపిన తెలుగు పండితులు వారు. క్రమశిక్షణ ధ్యేయంగా వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేసిన నిజాయితీ పరులువారు.

ప్రతి విద్యా సంవత్సరంలోను డిశంబరు నెలదాటిన తరువాత శ్రీ శాస్త్రిగారు ఎస్‌.ఎస్‌.ఎల్‌సి. వారికి కోర్సును పూర్తిచేసి “టేగ్‌ నోడ్సు”ను విద్యార్థులకు చెప్పేవారు. అనగా ప్రతిరోజు ఒక అరఠావు నిడివిలో ముఖ్యమైన విషయాలు చెప్పేవారు. ఆ కాగితంపై తేది వేసి టేగ్‌ చేయాలి. ఇలా ఓ నలభై రోజులు నోడ్సు సాగేది. టేగ్‌లో నలభై కాగితాలు వచ్చి చేరేవి. ఆ నోడ్సు చదివితే చాలు తెలుగులో అత్యధికమైన మార్కులు 'ప్రతివిద్యార్థికి వచ్చేవి. ఈ రోజున ఎం,సెట్‌ స్థాయి పరీక్షలకు అవలంబించే పద్ధతులను నాలుగున్నర దశాబ్దాల క్రితమే మాష్టారు నిర్వహించి చూపారు.

నేను ఎస్‌.ఎస్‌.ఎల్‌సి, వరకు శాస్త్రిగారి వద్ద చదువుకోవడం వల్లనే తెలుగుభాషలో కొంత ప్రవేశాన్ని అభిరుచిని సంపాదించుకోగలిగాను. ప్రతి ఉదయం భక్తితో నమస్కరింపదగిన 'ప్రాతస్మరణీయులు మా గురువుగారు చంద్రశేఖరశాస్త్రి గారు.

1972లో విజయదుర్గాపీళం ఏర్పడింది. ఇది ఎందరో కవి పండితులకు యాత్రాస్థలమయింది. ఎందరో ఎందరెందరో ఈ పీరంలో సన్మానాలు అందుకున్నారు. కాని చంద్రశేఖరశాస్త్రిగారిని మాత్రం పీరానికి ఆహ్వానించలేకపోయాము. ఈలోగా వారు దేహయాత్ర చాలించి నిజమైన కీర్తశేషులయినారు.

కాని మా గురువుగారి కుమారుడు శ్రీ కర్రా కార్తోయశర్మ పీరానికి వచ్చి

ఆ

విజయదుర్గామాత అనుగ్రహాన్ని శ్రీగాడ్‌గారి అభిమానాన్ని పొంది పీఠంలో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవడం నాకెంతో ఆనందమనిపించింది.

శ్రీ చంద్రశేఖరశాస్తిగారు రాయవరంలో ఉద్యోగించేటప్పుడు వెదురుపాకలో మకాం ఉండేవారు. అలా మా వెదురుపాకకు శ్రీ శాస్త్రిగారి కుటుంబం సన్నిహితమయింది. మాగ్రామంలో ఉండే రోజుల్లోనే వారు - “బాదరాయణం' పేరిట పద్యాలు వ్రాశారు. వాటిని తరచుగా సభలలో వినిపించేవారు. ఈ పద్యాలను ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం చేయబడ్డాయి.

నాలుగు దశాబ్దాలనాటి ఈ హృద్యమైన పద్యాలను విజయదుర్గా పీరాధిపతుల సప్తతివూర్తి జన్మదినోత్సవంసందర్భంగా పీళం తరపున ప్రచురించమని మా కార్తికేయశర్మ కోరాడు. శ్రీ గాడ్‌గారు సంతోషంగా అంగీకరించి ఆశీర్వదించారు. ఈ ఖండకావ్యం విజయదుర్గామాతకు అంకితమీయడం విశేషం.

శ్రీ చంద్రశేఖర శాస్త్రిగారి పద్యాలలోని అందచందాలను అందరూ దర్శించాలి. వారి పాండిత్యపులోతులను అందరూ పరిశీలించాలి. మకుటం గల ఖండకావ్యంగా నూతనంగా ఉన్న ఈ ఇంద్రధనస్సును ప్రతి తెలుగువాడు తన [గ్రంధాలయంలో భద్రపరుచుకోవాలి. నిరాడంబరంగా, నిశ్శబ్దంగా ఏడుదశాబ్దాలు జీవించి ఎందరో శిష్యులను తయారుచేసిన శ్రీ చంద్రశేఖర శాస్త్రిగారికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. మా పీఠం తరపున ఈ పుస్తకాన్ని ముద్రిస్తున్నందుకు గర్విస్తున్నాను.

అడ్మినిస్ట్రేటర్‌

విజయదుర్గాపీఠం

చెదురుపాొక,

తూ.గో, జిల్డా.

కూ

బాదరాయణునికి సాదరాయణం!

  • భళ్ళమూడి లక్ష్మీనారాయణ శ్రీ కర్రా చంద్రశేఖరశాస్త్రి గారి పేరువినగానే నాకు శ్రీనాధుడు గుర్తుకు వస్తాడు. నేను భాషా ప్రవీణ పైనల్‌లో ప్రత్యేకాంశంగా శ్రీనాధ మహాకవిని ఎన్నుకొని చదివాను. ఆ నందర్భంగా శాస్త్రిగారి వ్యాఖ్యాగ్రంథం “దీనారటంకాలు” చదివాను. ఆ పుస్తకం చదివాక శ్రీ శాస్త్రిగారిని దర్శించాలి, వారిలో శ్రీనాధుని చూడాలని భావించాను. చాలాకాలం తరువాత రాజమండ్రిలో శ్రీమధునాపంతుల సత్యనారాయణ శాస్తి గారింట్లో ఆ కోరిక తీరింది. అక్కడ మధునా పంతులవారితో ముచ్చటిస్తున్న శాస్త్రిగారిని తొలిసారి దర్శించాను. నాగురించి మధునా పంతులవారు ఆశీః పూర్వకంగా చెప్పగానే
  • శ్రీశాస్త్రిగారు ఆత్మీయంగా “అస్మత్‌గోత్రం వర్ధతాం” అని పలికి ఎంతో (ప్రేమగా మాట్లాడారు. ఆతరువాత మరో రెండు సందర్భాలలో శాస్త్రిగారిని కలవడం జరిగింది. ఉద్యోగరీత్యా శాస్త్రిగారి కుమారుడు శ్రీ కర్రా కార్తికేయశర్మ నాకు అత్యంత సన్నిహితుడయ్యాడు. గిరిజన సంక్షేమ శాఖయందు మా ఇద్దరినీ సూర్య - చంద్రులవలె అందరూ సంభావించడం మా అదృష్టం. శ్రీ కార్తికేయ శర్మద్వారా శాస్త్రిగారి జీవిత విశేషాలను మరింతగా నేను తెలుసుకోవడం జరిగింది. శాస్త్రిగారి 'బాదరాయణం' శర్మ తీసుకువచ్చి - ముద్రించుటకు అవకాశం వచ్చిందని, పరిశీలించమని కోరాడు. మరియు నాన్న గారిపై నాలుగు మాటలు వ్రాయమని గ్రేమగా అడిగాడు. శ్రీ శాస్త్రిగారు తెలుగు సంస్కృత భాషలలో లోతయిన పాండిత్యం గలవారు. నిగర్వి. సౌజన్య సంపన్నులు. వారు వ్రాసిన ఈ వందపద్యాలు వా

సువర్ధాలే! వీటిని ముద్రించి తండ్రి బుణం కొంత తీర్చుకొంటున్న మా కార్తికేయశర్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

“అస్మత్‌ గోత్రము” వర్ధతామనగ దానానంద ఖావంబుతో అస్మత్‌ భవ్య మహోన్నతాత్త సుకవితాకాశంబు దీపింపగన్‌ అస్మత్‌ స్నేహ సుహాస భావకుసుమ వ్యాపారముల్‌ నిండగొన్‌ అస్మత్‌ జీవనకాంతి రేఖలిలలో హర్షించె మీవాక్కుబే!”

“జయంతితే సుకృతినో రససిడ్ద్ధాః కవీశ్వరాః

నాస్తితేషాం యశఃకాయే జరామరణజం భయం.” 15-12-2005 యగ్రంరెడ్డి నగర్‌ రంపచోడవరం, తూ.గో.జిల్హా,

ఆు

నాన్నగారి గురించి

  • కర్రా కార్తికేయశర్మ చంద్రశేఖరశాస్త్రి సౌజన్య గురుమూర్తి నాలోనికవితకు నాందివారు సంస్కృతాంధ్రములందు చక్కటిధీశక్తి వెన్నవంటి మనసు ఎన్నగాను తెలుగుపండిత వృత్తి వెలుగులో బ్రతుకును నియమబద్ధముగను నీతితోడ గడిపినట్టి మనిషి కారుణ్య మూర్తిరో నాదు తండ్రియనగ నవత! మమత! కథన రంగమునందున మథన బేసి రచనయందున మిక్కిలి రాణకెక్కు “బాదరాయణ” కొవ్య సంభావ్య మూర్తి అట్టి తండ్రికి వందన మాచరింతు! మానాన్నగారు శ్రీచంద్రశేఖరశాస్తిగారు. మాటలకోటీశ్వరుడు. అక్షర లక్షాధికారి. చమత్కారం, పాండిత్యం పడుగుపేకల్లా అల్గుకొన్న ఆయన మాటలు ఎదుటివారి గుండెగదిలో నమ్రతగా జఒదిగిపోతాయి. తన స్నిహితుల, శిష్యుల జ్ఞాపకాలలో ఆయననేటికి సజీవులే! ఆర్థికస్థితి బాగులేకపోతే నిట్టూర్చడం, రోజులు కాస్తంత మంచిగా దొర్హుతుంటే తృప్తిగా రచనలు చేయడం నాన్నగారి దినచర్య. నాన్నగారు స్పేహితులకు ఉత్తరాలు చాలాశ్రద్ధగా అందమైన దస్తూరితో వ్‌ రాసవారు. నిజానికి అవే చక్కటి ఖండకావ్యాలు. చక్కటి (ప్రారంభం, చిక్కటి ముగింపు అందులో విధిగా ఉండేవి. 'స్నేహితులనుండి కేవలం లేఖల ద్వారా ఆయన ఎన్నో ఎన్నెన్నో సంగతులు సేకరించేవారు. ఆ

తృప్తిగా జీవించడానికి సరిపడా డబ్బు ఆయనవద్ద ఉండి ఉంటే - ఎన్నో కథలు, కావ్యాలు, వ్యాఖ్యాగ్రంథాలు ఆయన రచించి ఉండేవారు. ఇది వాస్తవం. తెలుగు, సంస్కృత భాషలలో నాన్నగారికున్న అధికారం చాలా గొప్పది. తాను పుట్టిన కోనసీమలోని పచ్చదనం ఆయన జీవితంలో లేకున్నా మాటలలో, రచనలలో మాత్రం ఎప్పుడూ గుబాళించేది.

72 సం॥లు జీవించి మేకప్‌ చెరుపుకొని తెరవెనుకకు వెళ్ళిపోయారు నాన్న. ఆయన వదిలివెళ్ళిన 'బాదరాయణం' ఇదిగో మీకు సవినయంగా సమర్పిస్తున్నాను అందుకోండి.

(క!

అది తూర్పుగోదావరిజిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక. నా బాల్యంలో కొంతభాగం ఆ గ్రామంలోనే గడిచింది. మేము 1958 నుండి 63 వరకు ఈ గ్రామంలో ఉన్నాము. నాన్నగారు రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్తు హైస్కూల్లో గ్రేడ్‌ 1 తెలుగు పండితులుగా ఉద్యోగం చేసేవారు.

ప్రతిరోజు తెల్లవారు రూమున తాలికోడితోపాటే నిద్రలేచేవాణ్సీ నాన్నగారి ప్రక్కలోకి చేరేవాణ్సీ. ఆయననన్ను గట్టిగావాటేను కుని “బాదరాయణ” పద్యాలు చెప్పేవారు.

“చిటిలిన భస్మదిగ్ధమిటు చిందిలిరాల”

“గగనధునీ జలాల నవగాహము బేదునుగాదు”

“పుట్టెడు బెంగ చిత్తమున బుక్కిట బట్టుచు"

ఇటువంటి దోసెడు పద్యాలు ఆ పసితనంలోనే నాకు కంరస్థం వచ్చేశాయి. ఈ గొప్పదనం నాదికాదు. నాన్నగారిదే. అలా పసితనంలో నారక్తంలో కలిసిపోయిన బాదరాయణ పద్యాలు నాలో సాహిత్యాభిలాషను కలిగించాయి. నన్ను కవినిచేశాయి. విమర్శకుడుగామార్చాయి వక్తగా నిలబెట్టాయి. నా సాహిత్య సౌధానికి బలమైన పునాది “బాదరాయణంి.

ఇది నాన్నగారి రంగులస్వప్నం. ఈ పద్యాలు రచించి నాలుగు దశాబ్దాలు దాటింది. ఇందలి ఖండికలు భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రదేశ్‌

వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురింవబడ్డాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రంనుండి ప్రసారం చేయబడ్డాయి. అయితే పుస్తకరూపంలో తీసుకు రావడానికి నాన్నగారు శ్రద్ధ చెయ్యలేదు. మరి నేనుకూడా నాన్నగారి మార్గంలోనే బధద్గకించాను. ఫలితంగా 'బాదరాయణం' నేటివరకు అముద్రితంగానే మిగిలిపోయింది.

17-9-1984లో నాన్నగారు కాలధర్మం చెందారు. ఆయనకు వైదిక

పరంగా చేయవలసిన తతంగాలన్స్నీ చేశాను. అయినా ఆయన బుణం ఇంకా మిగిలే ఉంది. అది 'బాదరాయణ' ఖండకావ్య ప్రచురణతో కొంతలో కొంత తీరుతుందేమో! అయినా బుణం తీరాలని నేను అనుకోవడంలేదు. మా నాన్న మళ్ళీ నాకు కుమారుడుగా జన్మించారనే నేను భావిస్తున్నాను. అందుకే నాకువమూరునకు “చంద్రమౌళి అని పేరుపెట్టి ఆత్మీయంగా పిలుచుకుంటున్నాను.

ఎంతో ధైర్యంగా, ఆరోగ్యంగా జీవితంగడిపినవ్యక్తినాన్న! ఆయనమాటల్లో బేలతనం, కళ్ళలో తడి ఆయన చివరి రోజుల్లోనే చూశాను.

1912 సం॥లో తూ.గో.జిల్లా కొత్తపేట మండలంలోని “వానపల్లి” గ్రామంలో జన్మించారు. మాతాతగారి పేరు కర్రారామన్న అందరూ ఆయనను రామావధాన్లు గారని పిలిచేవారు. యజుర్వేదంలో మంచిపట్టున్న వేదకుక్షివారు. యజ్ఞయాగాదులు జరిపించడంవారివృత్తి-ప వృత్తి. బహుకుటుంబీకుడు. తనువు చాలించినవారు చాలించగా ఎనమండుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలతో కుటుంబాన్ని అతికష్టం మీద పోషించారు. ఇంట్లో శుభకార్యాలకు పండుగలకు ఉన్న ఆస్థి కర్పూరమై పోయింది. చేసేదిలేక “వానపల్లిని వదిలి అమలాపురం దగ్గరలోని పేరమ్మ అగ్రహారం వలస వెళ్ళారు.

మగపిల్లలలో ఆరవవారు నాన్నగారు. వీరి ప్రాధమిక విద్యాభ్యాసం పేరమ్మ అగ్రహారంలో జరిగింది. సంస్కృత విద్యాభ్యాసం దగ్గరలోని అనాతవరంలో జరిగింది.

1931-35 సం॥లలో విజయనగరం సంస్కృత కళాశాలలో

(1

విద్యాభ్యాసం చేసి ఉభయ భాషా ప్రవీణులయినారు. అక్కడ ఉండగానే భావకవిత్వం, అభ్యుదయ కవిత్వాలతో పరిచయం కలిగి పాతకొత్తల మేలుకలయికను సాదరంగా ఆహ్వానించారు.

1942 సం॥లో వానపల్లి వాస్తవ్యులు శ్రీ అయ్యల సోమయాజుల విస్సన్నగారి కనిష్ట పుత్రిక సుభద్రమ్మగారితో వివాహం జరిగింది.

1944 నం॥లో తూ.గో.జిల్దాబోర్డులో తెలుగు వండితులుగా ఉద్యోగంలో చేరి వుల్లేటికురు, బిక్కవోలు, భీమనపల్లి, రాయవరం, సామర్లకోట ఉన్నత పాఠశాలలో ఉద్యోగించి 1971లో పదవీ విరమణ చేశారు.

సూర్యభవాని

సుబ్బలక్ష్మి

కార్తికేయశర్మ

నాగమణి

దత్తాక్రేయశర్మ - వీరిసంతానం

ఇద్దరు ఆడపిల్లలు అన్నపూర్ణ, ప్రభావతి అనే వారు కొంతకాలం సెరిగి కనుమరుగవడం నాన్నగారికి ఎంతో సంతాపం కలిగించిన సన్నివేశాలు.

నాన్నగారు పదవీ విరమణ చేసేనాటికి బాధ్యతలు ఏమీ తీరలేదు. నడిసముద్రంలో ఉన్నారు. సంస్కృత కళాశాల విద్యార్థిగానేను, పెళ్ళి కావలసిన కూతురు, హైస్కూలు స్థాయిలో మరో కుమారుడు. చేతిలో చిల్లిగవ్వలేదు. ప్రభుత్వపరంగా రావలసిందీ తక్కువే. మరి ఈ సంసారం ఎలా నడున్తుంది? ఇది చాలా జట్‌లపైన (ప్రశ్న. కాని నాన్నగారు చిరునవ్వుతో, చాలాథధైర్యంగా ఈ ప్రశ్నను ఎదుర్కొని విజయం సాధించారు.

“వెజయంతి”

“దీనారటంకాలు”

  • ఈ గ్రంథాలను దాతల సహాయంతో ప్రచురించి, దేశసంచారం చేశారు. తిరగని ఊరులేదు. దర్శించని పాఠశాల లేదు. 1980 వరకు

నూ

సాహిత్యాన్ని “నమ్ముకొని” జీవించారు. మమ్మల్ని ప్రయోజకుల్ని చేశారు. ఇదీ నాన్నగారి గొప్పదనం! ఒక్కటి మాత్రం నిజం - ఆయన కష్టాలలో ఉన్నప్పుడు బంధువర్గం మొహం చాటేసింది. మిత్రబృందం సాదరంగా ఆహ్వానించి సహకారం అందించింది. ముక్కుకు సూటిగా వెళ్ళే మనస్తత్వం, నిజాయితీ నాన్నగారి ఆభరణాలు. ఎంతటి అవేశపరులో అంతటి సౌజన్య సంపన్నులు. ఆయన బుర్రలో ఎన్నెన్నో రంగైన ఆలోచనలు. అవినెరవేరకుండానే 1980 డిశంబరు 23న వచ్చిన పక్షవాతం ఆయన జీవిత గమనాన్ని మార్చేసింది. రెక్కతెగిన పక్షిలామారారు నాన్న! 1984 సెప్టెంబరు 17న కన్నుమూశారు. శ్రీనాథుడంటే నాన్నగారికి చెప్పలేనంత ఇష్టం. శ్రీనాథమహాకవిలాగే భారంగా నిష్క్రమించారు. నాన్న - రేడియో ప్రసంగాలు బేశారు. కథలు రాశారు. వ్యాసాలు రాశారు. పద్యాలు రాశారు. పద్యాలకు వ్యాఖ్య చేశారు. నాటికలు రాశారు. నాటకం రాశారు. ఒక్క నవల తప్ప అన్ని ప్రక్రియలను స్పృశించారు. కాని ఆయనకు రావలసినంత పేరు రాలేదు. పేరుకోసం రూడా ఆయన ఎప్పుడూ తాపత్రయ పడలేదు. 'మహర్నవమి” 'పాలవెల్లి' - నాన్నగారి ముద్రిత కథాసంపుటాలు “వైజయంతి - నాన్నగారి సంపాదకత్వంలో వెలువడిన సాహిత్య విశిష్ట సంపుటి. 'దీనారటంకాలు' శ్రీనాథుని సీసపద్యాలకు మధురమైన వ్యాఖ్య. (యు

ఇక “దీక్ష అనే పేరుతో నాన్నగారు ఓ నాటకం రాశారు. రాజరాజు చిత్రాంగి సారంగధరుడు ఇతివృత్తంగా సాగిన నాటకమిది. దీనిహక్కులు సామర్లకోట షుగర్‌ ఫ్యాక్టరీ సారస్వత విభాగానికి ఇచ్చారు. ఇది అముద్రతం, నాన్నగారిని పత్రికలవారి ధర్మమా అని పద్యకవిగా లోకానికి పరిచయం చేసిన 'బాదరాయణం' పద్యాలు ఇవిగో మీముందుంచుతున్నాను. “బాదరాయణం' = ఇది మకుటంగల ఖండకావ్యం. ఇంతవరకు తెలుగు సాహిత్యంలో మకుటంగల శతకాలున్నాయి గాని మకుటంగల ఖండకావ్యాలు లేవు. ఈ నూతన సంప్రదాయానికి నాన్నగారు ఆద్యులు. కొందరు కవులు ఈ మార్గంలో ప్రయాణిస్తే - నాన్నగారి పవిత్ర ఆశయం నెరవేరుతుంది. 881 శ్రీనాథుడు కవిత్వమన్నా శ్రీశ్రీ గేయమన్నా కృష్ణశాస్రి శైలి అన్నా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలన్నా నాన్నగారికెంతో ఇష్టం. వంచి కధలను ప్రేమించేవారు. మంచి కవిత్వాన్ని గుండెలకద్దుకునే వారు. మంచి మంచి వ్యాసాలు మనసారా చదివేవారు. శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ చాలానాళ్ళ క్రితం రాసిన “అజ్ఞాతకవి చక్రవర్తి సిరిప్రగడ భార్గవరావు*అనే వ్యాసాన్ని నాన్నగారు అనేక సందర్భాలలో ప్రశంసించడం నాకింకా గుర్తే! తాను నవ్వకుండా అందరినీ నవ్వించే చమత్కారం నాన్నగారిలో అదనపు అకర్షణ. ప్రతిభాపాండిత్యాలు ఎవరిలోఉన్నా నిండు మనన్సుతో అభినందించేవారు. శుభ్రమైన దుస్తులు ధరించడం, మంచి భోజనం, చక్కటి చన్నీటి స్నానం, ఖచ్చితమైన సమయంలో నిద్రించడం నాన్న క్రమశిక్షణకు నిదర్శనం. ఎంత పాండిత్యమో, అంతనిరాడంబరత్వం ఆయన విశిష్టత. గొప్పలు చెప్పుకోవడం ఆయనకు చేతగాదు. ఎదుటివారి గొప్పను అభినందించడమే (3౪

ఆయన గొప్ప!

కథలు, నాటికలు, వ్యాసాలు విరివిగా రాసేనాన్నగారు పద్యరచనకు పూనుకొన్న సందర్భం చాలా మధురమైనది.

1960లో వెదురుపాకలో ఉన్నమాఇంటికి ఓ ఇద్దరు అతిథులు వచ్చారు. అందులో ఒకరు శ్రీ ఇంద్రగంటి భానుమూర్తి (హనుమచ్చాస్తి గారి అబ్బాయి) రెండవవారు శ్రీ ముక్తీవి లక్ష్మణదాసుగారు (తరువాత లక్ష్మణ యతీంద్రులయినారు) భోజనాలయ్యాక సరదాగా ముగ్గురిమధ్య సాహిత్య గోష్టి సాగింది. మాటల మధ్యలో శ్రీలక్ష్మణదాసుగారు అన్నారుకదా-

“శాస్రిగారూ! మీలో మంచి పాండిత్యం ఉంది. కల్పనాశక్తి ఉంది. కమనీయత ఉంది. దీనిని కథలకే పరిమితం చేయకండి. మంచి కండగల పద్యాలు వ్రాయండి” అని సలహాయిచ్చారట. ఆ సలహాను పాటించి నాన్నగారు “బాదరాయణ” రచనకు పూనుకున్నారట.

అయితే నేను ముందుగా మనవిచేసుకున్నట్టు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కొంత బద్ధకము నాన్నగారిని స్థిమితంగా ఉఊంచేవికావు. ఒక నెలరోజులు ఆయన స్థిరచిత్తంతో కూర్చోగలిగితే ఎంతటి గ్రంథరచన అయినా ఆయనకు అసాధ్యం కాదు. కాని జగన్మాత ఆయనకు ఎందుకో ప్రశాంతతను యివ్వలేదు.

ఎప్పుడూ ఏవో సమస్యలు, చికాకులు, కోపం ఇవి ముప్పేటలా అల్లుకొని ఆయన జీవితాన్ని అతలాకుతలం చేశాయి.

అందుకే “బాదరాయణ” ప్రవాహం కూడా మందంగా సాగి ముద్రణా యంత్రం ముంగిట్టోకి రాకుండా దూరంగాస్థాణువైపోయింది. దీన్ని అచ్చుయంత్రం గర్భంలోకి జారవిడిచే భగీరథుడు కావాలి.

పుస్తక పఠనం మందగించిన ఈరోజుల్లో కవిత్వం అందునా పద్య కవిత్వం ప్రచురించే ప్రచురణ కర్తలెవరున్నారు? అందుకే భగీరథ అవతారం నేనే ధరించాను. కుమారుడుగా అది నా బాధ్యతకూడా.

ఈరోజున నాన్నలేర్గు. ఈ కృతికి ప్రేరణ అయిన లక్ష్మణయతీంద్రులు లేరు. ఆనాటి వారి కలయికకు గుర్తుగా 'బాదరాయణం' నిలిచి ఉంది.

అ

అముద్రితంగా ఉన్న ఈ బాదరాయణమును సర్వాంగ సుందరంగా మీముందుంచుతున్నాను. క

మేము వెదురుపాకను 1963 వదిలి వచ్చేశాము. నా బాల్యానికి శాశ్వత చిరునామా వెదురుపాక. నాన్నగారి పద్యవ్యవసాయానికి అచ్చమైన చిరునామా వెదురుపాక. నాన్నగారి జీవితంలోను, నా జీవితంలో కూడా వెదురుపాక నిజంగా వెలుగుపాక!

మేము వదిలివచ్చిన వెదురుపాకను 38 సం॥ తరువాత మరల దర్శించాను. 2001 సెప్టెంబరు 18వ తేదిన “వెదురుపాక టీచర్సు అసోషియేషన్‌” వారు గురుపూజోత్సవం నిర్వహించి నన్ను ప్రత్యేక ఆహ్వానితునిగా సన్మానించారు. అలా వెదురుపాకను మరల దర్శించే భాగ్యం కలిగింది. పనిలోపనిగా ఆనాడు మేమున్న మండువా ఇంటినికూడా దర్శించాను. ఎదురుపాక పెద్దగా మారలేదు. ఆనాటి ఆప్యాయత, ఆత్మీయత ఈనాడు కూడా చెక్కు చెదరకుండా వెదురుపాక ప్రజలలో నిలిచి ఉంది.

ఆనాడు వేము నివసించిన మండువా ఇంట్లోకి వెళ్ళేనరికి బాదరాయణ పద్యాలు... నాన్నగారి జ్ఞాపకాలు... పరిమళంగా నన్ను చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేశాయి. కన్నులు నీటి చెలమలయ్యాయి.

నేనెంత కృతఘ్నుణ్డి!

ఇన్నాళ్ళుగా నా కవితా సంపుటాలను ముద్రించుకున్నానే! నాన్న కావ్యం

అముద్రితంగా ఉంచడం న్యాయమా? నాలో నేనే ఎంతో పశ్చాత్తాపపడ్డాను. “నన్ను క్షమించునాన్నా!”

నన్ను కవిగా నిలబెట్టిన బాదరాయణం, పద్యంపట్ట విధేయతను నేర్చిన బాదరాయణం, బాల్యంలో పదిమందిలో నాకొక గుర్తింపును తెచ్చిన బాదరాయణం, మా నాన్న హృదయ తంత్రులనుండి జాలువారిన బాదరాయణం ఇప్పుడు నిస్వార్ధంగా ముద్రిస్తున్నాను.

2001 సెప్టెంబరు నెలలో నేను వెదురుపాకను దర్శించిన్త ముహూర్తం

తళ సదర దశ గం దాలు భ్‌ లె ఏ. ఖ్శా న ల జ జ సడి (క న్నా

చాలాగొప్పది. “విజయదుర్హాపీఠం” వెళ్ళి దుర్గా మాతను దర్శించాను. విజయదుర్గా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ గాడ్‌గారి ఆశీస్సులు అందుకున్నాను. “తల్లిపై ఓ రచన చేయ”మని గాడ్‌గారు ఆదేశించారు.

'వదురుపొక తల్లి విజయదుర్గ అన్న మకుటంతో విజయదుర్గా శతకం రచించాను. దానిని గాడ్‌గారు తమ శిష్యులచే అందంగా ముద్రించారు. 2005 జనవరి 19న గాడ్‌గారి జన్మదినోత్సవంనాడు అది ఆవిషృతమై, గాడ్‌గారికి అంకితం కాబడింది.

*. 2005 ఉగాది నాడు విజయదుర్గా పీఠానికి నన్ను శాశ్వత ఆస్థాన పండితుడుగా శ్రీగాడ్‌ గారు నియమించారు. నా బాల్యపు చిరునామా అయిన వెదురుపాక శాశ్వత చిరునామాగా మారింది. ఆ గ్రామానికి నాపై ఎంత దయ! విజయదుర్గామాతకు ఎంత కరుణ! శ్రీగాడ్‌గారికి ఎంత ప్రేమ! నన్ను కుమారుడుగా భావించి ఆయన ఇస్తున్న గుర్తింపు మరువలేనిది. పవిత్రమైన వెదురుపాక గడ్డపై పుట్టిన ఈ బాదరాయణంను వెదురుపాక తల్లి విజయదుగ్గకు అంకితం చేయడం సముచితమని నేను భావిస్తున్నాను. వ్యాసుణ్ణి దక్షిజకాశికి వెళ్ళిపొమ్మని అయ్య పరమశివుడు హుంకరిస్తూ అజ్ఞాపించినా, అమ్మదుర్గమ్మ మాత్రం వ్యాసుణ్ణి తల్లిప్రేమతోటే చూసింది. అయ్యో! నాయనా! ఆకలికి తట్టుకోలేక ఎంత పనిచేయబోయావు” అని నాచ్చుకుంది. దక్షిణకాశి అయిన దళ్లారావుంకు వ్యానుడంు పయనమయ్యేవేళ ఆమె అమ్మమనసుతో దీవించింది. ఆ దీవెన బలంతోనే వ్యాసుడు కన్నుల నీరునింపుకొని ప్రయాణమయ్యాడు.

ఈ ఇతివృత్తంతో తయారయిన ఈ ఖండకావ్యాన్ని అజగన్మాత విజయదుర్గాంబికకు అంకితమీయాలనే నా ఆలోచనను అంగీకరించి, ఆశీర్వదించిన విజయదుర్గా పీఠాధిపతులు శ్రీ గాడ్‌గారికి, పీరం అడ్మినిప్టేటర్‌ శ్రీ వాడ్రేవు వెంకటబాపిరాజుగారికి కృతజ్ఞతలు తెలియజేసు కొంటున్నాను.

శ్రీ గాడ్‌గారి సప్తతి పూర్తి ప్రచురణగా ముద్రింపబడుతున్న ఈ ఖండకావ్యం సాహిత్యాభిమానుల ఆదరం చూరగొంటుందని అశిస్తున్నాను సెలవు...

మూ

ఏబై ఏళ్ళ సీసపద్యం ఆంధ్రప్రదేశ్‌

  • కర్రా చంద్రశేఖరశాస్త్రి శాతవాహన ప్రొజ్య సాొమాజ్యమున బుట్టి చిరునవ్వు వెన్నెలం జిలుకునాడు. చాళుక్యకులపతి చల్లని యొడిలోన మొదటి గంటముపట్టి మురియునాడు కదనపండితులైన కాళతీయులసిమ గంట గొటుకనీరు కదుపునాడు కృష్ణరాయనివీట గేలూతగాగాని యిభ కుంభమెక్కి యూరేగునాడు హృద్య పద్యానవద్య గద్యాద్య విద్య లెల్ల పుక్కిటబట్టి కేరింతలాడె, నట్టి సద్యశ మీనాడు సమరునట్లు పావ “నాంధ్ర ప్రదేశంబు” గావు దేవ! ప్రచురణ ఆంధ్రప్రదేశ్‌ (మాసపత్రిక) ఫిబ్రవరి - 1962 హం

కృతజ్ఞతలు

2006 జనవరి 19న విజయదుర్గాపీరాధిపతులు శ్రీ గాడ్‌గారి సప్తతిపూర్తి జన్మదినోత్సవం సందర్భంగా ఈ 'బాదరాయణము' ముద్రింప బడుతోంది. శ్రీ గాడ్‌గారికి సర్వముతానే అయిన శ్రీ విజయదుర్గా మాతకు ఈ ఖండకావ్యాన్ని మానాన్నగారి తరపున అంకితమిస్తున్నాము. ఇందుకు అంగీకరించిన శ్రీ గాడ్‌గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము.

ఈ కావ్యాన్ని విజయదుర్గా పీఠం తరపున ప్రచురించడమే కాకుండా, నాన్నగారిపై 'ఆచార్యదేవోభవ' అనే పేరుతో సాభిప్రాయం తెలియజేసిన పీఠం అడ్మినిషస్టేటర్‌ శ్రీ వాడ్రేవు వెంకటబాపిరాజుగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఈ కావ్యానికి 'సొజన్య సంభావనము' వ్రాసియిచ్చిన “సారసాహితీసదధ్వ సంచారి” ఆచార్య శలాక రఘునాథశర్మగారికి మాకళైమోడ్పులు,.

“బాదరాయణునకు సాదరాయణిమున్న అత్మీయమిత్రులు శ్రీ భళ్ళమూడి లక్ష్మీనారాయణ. నాన్నగారి వ్రాత ప్రతిని పరిశీలించి మాకంతో సహాయం చేశారు. వారికి సౌహార్ద సాధువాదములు.

“బాపు బొమ్మతో బాదరాయణం ముద్రింపబడాలని” నాన్నగారి చివరికోరిక. మాలేఖ ద్వారా విషయం తెలుసుకొని, స్పందించి, త్రివర్ణ ముఖచిత్రం అభిమానంతోపంపిన ప్రపంచ చిత్రకారులు శ్రీ బాపుగారికి వందనములు.

(వాత వ్రతిలోని వందవద్యాలను చదివి ఎన్నో నాచనలు మాకందజేసిన డా॥ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారికి, డా॥ కేసాప్రగడ సత్యనారాయణగారికి మా నమస్సులు.

“బాదరాయణంిను సర్వాంగ సుందరంగా ముద్రించిన 41290 ప్రింటర్సువారికి, అధినేత డా॥ పూషాగారికి అభినందనలు.

ఈ అక్షర యజ్ఞానికి సహకరించిన ఎందరో మహానుభావులు, అందరికీ మా అభినందన... వందన... చందనములు...

కర్రా కార్తికేయశర్మ కర్రా దత్తాత్రేయశర్మ (ఆఅ)

క. ఆమంత్రణము

  1. ఎవరిది ? పండుగడ్డము మునీశ్వర! దండకమండలంబులున్‌ చిలికిన గుండెపై జెదరు శ్రీ జపమాలయునూని చింతతో నవిరళ దహ్యమాన పృథుయాతనతో జను కాందిళశీకుడై అవునది నింటినయ్య! తమరా; అవురా! సరి! బాదరాయణా!

  2. వ్యాస! పురాణకర్త! రఘువంశ మహోదయ జీర్ణ సద్గుణా వాస వళిష్టనప్త! పృథు పండిత సన్నుత శక్తి పొత్ర! కై లాసగిరీశపూజ్యపదలాంభిత భావ పరాశరాత్మజా! త్రాసిత భోగ భాగ్య శుకతాత! తపోనిధి! బాదరాయణ!

  3. అంజలి సంఘటించి భవదాస్య సమంచిత హృద్య సత్కళా కంజ దళోదరాంతరిత కావ్య మధూదయ మత్త వాసనా పుంజములన్‌ బిపాస గల పుక్కిటబట్టి నమస్కరించెదన్‌ మంజుల భావనా మధుర మానస మూగగ బాదరాయణా!

  4. _కాశీక్షేత్ర నివాసయోగ్య పరిధిన్‌ కాంక్షించు యోగీశ్వరా! కాశీక్షేత్ర విహారథీర కృత సంకాశాత్త విద్యేశ్వరా! కాశీక్షేత్ర పదాంబుధిన్‌ మునిగి సంఘర్షించు ప్రజ్ఞానిధీ! కాళీక్షేత్ర వియోగ భార మిటు లాకొంక్షింతు వ్యాసాహ్యయా!

  5. ధీరాలోచన తత్ప్సరా! మునివరా! ధీరోత్తమా! యోగిరాట్‌ సౌరాసార విచార తత్పర మహాజ్ఞాన ప్రపూతాన్వితా! కారుణ్యామృత సింధు శీకర సుధాకొర ప్రభాపూజితా! ఏరీతిన్‌ వరపుణ్యకాశి విడుటయ్యెన్‌ నీకు విద్యాలయా!

బాదరాయణము [మాకీ

  1. వేదాంతార్ధ పదార్పితా! బుషివరా! విద్యాభిషేకోత్తమా! వేదార్థ్ధ ప్రవిభాషితా! మునిగురూ! వేదార్ధ చింతామణి! నాదానంద విధాయకా! తపసిరాట్‌! నవ్యాగమానంద థీ నాదోపాసన తత్పరా! నయన విన్యాసొత్త వ్యాసాభిదా! (| తలే బాదరాయణము

  2. ఆశ్వసనము

1 చిటిలిన భస్మదిగ్ధమిటుచిందిలిరాల పరాభవాగ్ని సం పవుటిత తపోనిధాన మొక మూటగ గట్టి బుజాన వైచియా కటగడుదూలుచున్‌ ముఖము కందగ శిష్యులు బాట జూపగా జటపెనవైచికొంచు నెట సాగదవయ్యయొబాదరాయణా!

  1. ఏమగుహోమధూమ పవనైధిత పత్రకముక్తిమంటపా రామవిశాలశాద్వ్యలవిరాజితతాళశిరాలునేటితో ఏమగు సుస్వరాంచిత మనీషి ముఖాగత బుగ్యజుస్సులున్‌ సామకషాయకంరపికళశారిక లేమగు? బాదరాయణా।

  2. _గగనధునీ జలాల నవగాహము చేదును గాదు, సన్నిధిన్‌ విగళదమంద ధౌతరుచివీచికలీనుశళాంకమౌళిసై బగయును గొదు, నందిగళ భఖాగనటన్మణి ఘంటికారవ ప్రగతముకాదు శిష్యగణ ఖావము గాక పరాశరాత్మజా!

  3. కోపము మింగికొమ్ము మునికుంజర। పచ్చని వారణాసినీ శాప కృపీటయోని కణ సంభవ తాప శతాంశలేశము న్నోపగ లేదు, నీలవృజినౌఘ గిరివ్రజ పక్షఖండనో ద్ధీపిత వజ్రధార సురదీర్ధిక యార్చద! బాదరాయణ!

  4. పున్నెము పంచునట్టి వరముక్తి పథంబగు వారణాసిలో వన్నెలు తీరగా నిలిచి పాదములొప్పగ సాగుచున్ననీ చిన్ని మొగంబు నందునిక చిర్నవులీగతి వీడిపోవునే ఎన్నడులేని కోపశిఖి యీగతి నీహృదిజేర వచ్చునే!

బాదరాయణము [సో ఆ6

లీ, 3. ప్రెక్షబ్బాత్రులు

1 అయుతములైన శిష్యుతతులంతట వీధుల భిక్షకోసమై నయవినయాదులుట్టి పడ నల్లడలంజని దూపటిల్లినన్‌ వయసున జిన్నవారల విపద్దశళ గాంచుచు గాశిముంతువే భయదకఠోర శాప జలపాతముతో నిక బాదరాయణా!

  1. _భువిగల మానవాళికి బుభక్షలు దీర సుధాశుధారతో జవిగల కావ్య శర్క్మరలసంఖ్యముగా సమకూర్చి, కాశిలో వివశుడవైతె! ఒక్కదిన వెచ్చపు టోగిర మబ్బకున్న నీ ప్రవిమల కుక్షి నుండి యిది రాలిన రాగమె? బాదరాయణా!

౩. చిదిమిన భక్తి చిమ్ము సరసీరుహసన్నిభ ముగ్గచిత్తులై పది మొదలారుపై బడు నవారుణదేహ వయస్కులౌచు నీ పదముల చాయనంటి తడబాటున దొట్రిలు చున్న వారలీి యదనున వారినొక్క దరహాసముతో గను బాదరాయణా!

  1. విలులిత చిత్తులౌచు బదివేలకు మించిన శిష్యు లెల్లరున్‌ గలు మఠమందు జేరి భువిగావులు సన్నగజార మోడ్పుగే లుల నయనాశ్రువారి తుతులూరగ జెంగట జేరి చూడలే రలుక వహించియున్న భవదాననసీమను బాదరాయణా!

  2. పుట్టెడు బెంగ కంరమున బుక్కిటబుట్టుచు దోయికట్టినీ కట్టెదుట న్వినీత నవకాయము లల్లన మోకరిల్లగా ముట్టి భవత్పదంబు కుటి ముంగిట జేరి శివాజ్ఞ వించునే కట్ట! శిరాలు వంచి వటుకాలి నిలంబడె బాదరాయణా!

శొళతు మమమ సమ బాదరాయణము

  1. బారులు దీరి బాల వటు వర్గము చేతులజోలులూగ సం సార విరక్తులీను కుపసమ్ముల చెంగులు జీరుకాడ వే సారులు కృత్తివాసుని విశాలదయార్దత శంక చేయుచున్‌ జేరిరి తాతపొదులకుశేళయ పీఠము బాదరాయణా!

  2. అక్షయ పాత్రలందు నొక యామలకంబును జారిరాలదీ కుక్షుల గౌవి కచ్చడపు కొంగుల గ్రంథులు వీడ జొచ్చెనీ మోక్ష నిదానరాశి నవిముక్త నివాసులు హుంకరింపగా భిక్షకు మోసమబ్సె గడుపే చెరువయ్యెన? బాదరాయణా!

  3. మెట్టిరి యెల్ల గేహళుల మిర్రులు పల్లములన్ని కాళికా పట్టణ విప్రవాటికల వాయువు గూడ శరించి వీరిపై ముట్టదు ఘర్మవారి కణ పుంజమునంగల చిత్తడిన్‌ వృథా కుట్టు సురుచ్చ్వసించి కలగుండున వచ్చిరి బాదరాయణా!

  4. అసలుగోసి, సంస్కృతి విహారముపై స్పహలుజ్జగించి, సం వాసము నేర్చి, సజ్జన విపశ్చిదపశ్చిమో వీధి బ్రహ్మజి జ్ఞాసకు బూద్యపొద పదకంజ సమీపము జేరు కాళికా వాసులు లబ్ధవర్జులెటు బల్కరు వచ్చియు బాదరాయణా!

*విపశ్చిత్‌+అపశ్చిమ

  1. నుదుటను గంగమట్టి కటి బెన్సడలున్‌ శిఖబిల్వ పత్రమున్‌ ముదిమి నదించు శ్రైవమతపూత సుభాషిత మంగుళంబునన్‌ బొదివిన దర్భముద్రిక సముజ్వ్వల సైకత లింగపూజయున్‌ బదిలపు బాదయాత్ర నటనా కళలే గద బాదరాయణ!

  2. సతతము శైవనాద పదసంచిత పుణ్యము మూటకట్టగా వ్రతములు పూజలున్‌ సలుపు భాగ్యమహోదయ కాశి వాసులున్‌ మతిచెడి నీదుకోసమున మాటలు జేష్టలు దక్కి కొశిలో గుతుక విహీనులై త్వదురుకోప భయాగ్నికి నిల్పియుందురే!

బాదరాయణము తంత (0 [1

  1. మహస్సు

  2. గంటముగ్రుచ్చి దివ్యమణికాంతులుచిమ్మగనూత్రసంతతిన్‌ జంటగ నక్షమాలికలజస్రముసంగ్రధియించికాశికా మంటపమథ్యభాగలసమానమ హేశునిమౌళి జేర్పియా గంటముతోనె శాపవిషగాథ లిఖింతువె? బాదరాయణా!।

  3. కళలకు మూసగట్టి కలకండముపండపురాణమాధురీ సలలిత మౌర్గమందు ప్రభుసమ్మిత రాశిని తీర్చిదిద్దుని న్నలుగుచు కృత్తివాసుడు మహానస మందిర ప్రాంగణంబునన్‌ నిలిపియనిష్కృతుల్‌ మనసునిండగనాడునె బాదరాయణా!।

  4. వేద విభాగ కర్త బహువిద్యల పండిత పూజ్యపాదుడే గాదు, పురాణ శాస్త్ర కృతి గణ్యుడు నీరసక్తుక్షి కోసమై సాదర వీక్షణంబుల విషాద విలోల విషాగ్నికీలలన్‌ వేదన బూని చిమ్మెనన వింతగ దోచదె బాదరాయణా!

  5. పంచమ వేదసారమొక పంటగ గాదెను బోసి తీవు ప్రా పంచిక ధర్మరాశి పరిపక్వ మొనర్చి వురాణ వీధిలో నంచిత రీతి గుప్పలుగ నందరకందగ జేర్ప్చితయ్యనీ మంచితనంబు గాశి గొరమాలెనె? నేడిటు బాదరాయణ!

  6. అంతట దీక్షతోడ మనసారగ ఛాత్రుల వెంటగొంచుధి మంతుల హట్టకొల గుసుమంబులనద్దగ గాలుగ్రుచ్చుచున్‌ పంతము బూని మెట్టితి విపశ్చిదపశ్చిమ! వారణాసినీ కంతయు దారు మారగుటయా పరికింపగ బాదరాయణా!

శ్రొఆ222] బాదరాయణము

  1. చిచ్చర కంట జూచి శశిశేఖరుడంతట పూజ్యపాద! నీ వచ్చిన క్రోవనే మరలి బాహ్యవనిన్‌ గడుదవ్వు భూమికిన్‌ పచ్చదనంబుమాయుమరువాటికి బొమ్మనునే గ్రుఖాకృతిన్‌ మచ్చ్చరమూనిసుంతనెపమావయులేకయెబాదరాయణా!

  2. కతలను జీర్ణ్వమాయెనిక గాళికినీకు బుణంబు ధారుణీ సతి విలసద్దళాన వికసన్నవ కైరవతీర్ధముండదే? గతమును విస్మరించుచు నెకాయెకి దెల్లుల దక్షవాటిలో సతముగ నుండ రమ్ముముని! స్వాగత మియ్యదె బాదరాయణ!

  3. సకల వురాణ భాగములు చక్కగ వ్రాసిన వ్యాస సన్మునీ! సకల పదార్ధ భావములు సత్కృతి జూపిన బాదరాయణా! ప్రకటిత వేద నాదములు వాక్య పదంబున వేరు చేయుదే వికల మనస్కతన్‌ మిగుల భీరుడవైతివి బాదరాయణా!

  4. పంచమవేదమై వరలు భారత నుంతయు నొక్క బేతితో బంచిన జ్ఞానవంతుడవు, భారత భాస్కర కొంతిమంత! నీ మంచితనమ్ము లాదృతులు మాయములయ్యెనె మౌనిశేఖరా! సంచితపుణ్యదేహ! వరశాంతినిధానమ! బాదరాయణ!

బాదరాయణము క్రతు ఆ.

  1. మిధ్యాభియోగము

  2. అటుతగునే విశాల త్రిదశాలయ సీమ వసించు దేవతా కుటిల కిరిట కోటి మణి కుంచిత రోచి రుదంచి తాం(ఘుడై నిటల విలోచనాంచల వినిర్గ్ణత నీరద ధూమ రేఖలే చిటిగల నిన్ను కన్నళవు సేయుట ధూర్జటి బాదరాయణా!

  3. ఏమది? విశ్వనాథుడధరేక్షణమే జ్వలదగ్నికుండమై సోముని రేకజారపరిచుంబికపర్జవియన్నదీలస దైెమజలార్టతామజటలట్టిటులూగగ సాగివచ్చునా “హైమవతీ ముఖాన పరిమాసము చిందగ బాదరాయణా!

౩. చేతుల జిడ్డులోడ బరిషించిన కమ్మని యావునేయియున్‌ మూతుల మీగడల్‌ బులుము పుష్కల పిచ్చిల మాహిషంబులున్‌ వీత సుఖానుషంగ మరువీచిక లింకకమున్నపంక్తిలో గౌతర రక్షకుండు దనకై యిటు లాడునె బాదరాయణ!

  1. _అలికము బీటవార నయనాంచల సంభృత కోపధూమ సం కుల చల దూర్మి మాలి శశికుట్నల మౌళియధిక్కరింపగా వ దలని కంఠ హుంకృతికి భంగము సెందకు భీమఖండ వీ థుల నినునోము దక్షపవురి ధూర్జటి దిక్కయి బాదరాయణా!

  2. _దోసము వీసమంత గలదో నిరునీగిన క్షుక్షిలో వృథా యాస విశీర్ణమైన యొక యాకలి కేకకు కాలకంఠుడై యీసున గన్ను మండి నిరసించునె పొమ్మని విద్వదోషధిన్‌ భూసురుడొక్కనిన్‌ గుతప భుగ్న పథంబున బాదరాయణా!

  3. గంటల గంగడోలు చిరుకందిన నున్నని దేహయప్టితో బంటవలంతిక్రుంగి యొక వైవున కొడ్డిగిలంగనంది తా గుంటిగ గౌలు మోచి భువి గొమ్ముల గొండలు గ్రొచ్చుకొంచుని న్నంటి గిరీశు మోసుకొని యార్చుచు దూకెడి బాదరాయణా!

  4. ముదిరిన మోక్ష కాంక్ష ధన పిపాస విపశ్చిదాంధ్యమున్‌ గద ముని మండన వ్యధకు గారణమ్తై యవిముక్త సీమలో విదలిచె జిచ్చుకంటి నులివెచ్చనివీచికముక్తి కామినీ పదనదవీయ మార్షముఖ వర్చసమందునుబాదరాయణా!

  5. ఇందరు పెద్దలున్న ప్రమఖేంద్రుని వీట శిలోంఛ వృత్తులే మందటిలెన్‌, బుభుక్షులకు, మందర ధీరుల కన్న వూర్ణయే పందెము కట్టెనో, పరులపచ్చనుమెచ్చక హెచ్చుకుందుతో ముందునవచ్చిసమ్మెలకుబూనిరొ పొరులు బాదరాయణా!

  6. ఒక దెస దేళికోత్తముని యుజ్వ్వలదుగ్రతపోవిభూతి వ రొకక డవిశ్వనాథునిటలోదతకోపశిఖామహస్సునూ రక బలవద్విరోధ మెటురాదు కదాయని మౌనమూనుచుం దికమకలాడ జొచ్చిరి మదిన్‌ బురవృద్గులు బాదరాయణ!

  7. కన్నులు నీరు కారగను గాంతివిహిన ముఖ ప్రభాళితో సన్నని గద్గద స్వరము సొగిలమొైొక్కుచు వ్యాసునొద్దనో అన్న! త్వదీయ శాపభర మందగ నిల్చునె; పుణ్యకాశి సం పన్న విరాజమాన శశివాగ్విశిఖమ్ముల దూరవచ్చునే.

  8. శివపంచాక్షరి నామ సంచయముతో చెన్నారు నీ కాశిలో భవ బంధమ్ములు పారద్రోలు ననుచున్‌ భక్తాళి భావింతురే శివధామమ్మున కోపతాపములు నీక్షేమంబు చేకూర్చునే శివధామంబగు పుణ్యకొశి నిటులన్‌ ఛీయంచు భావింతువే!

బాదరాయణము [సము ఉఎశ

  1. శివధామంబున సర్వ భాగ్యములతో క్షేమంబుతో నుందురే శివధామంబున ముక్తి మార్గముల వాసింగాంత్రు సర్వ ప్రజల్‌ శివుక్షేత్రంబున భక్తిభావముల రాశింగాంతు రెవ్వేళలన్‌ శివుక్షేత్రంబున దిట్టబూనె నెటు నీ చిత్తంబు ద్వైపాయనా!

౯ అతతతతతతతతతతతతతతతత బాదరాయణము

  1. భీమ మండలము

1... జయము జయేతిహాసపరిసంగ్రథనాత్తవిశుద్ధచిత్త! ఓ నయవియదంజనాభ్రదళనప్రభవాహిమభానుమండలా! జయమువురాణవుణ్యనదసంభవకారణపూజ్యపొద! భీ మయకొలువుండు నా మొగలి మంటప మయ్యదె బాదరాయణా!

  1. కామిత మిచ్చునీకు గరకంఠుడు దక్షిణ వారణాసిలో నామెతలెల్ల వేళ గమియారగ బెట్టుదురాంధ్రభామినుల్‌ 'సేమము వల్కి సన్నిధికి జేర్పునులే తిరుచుట్టుమాలెనీ చేమయు శంకలేక గమియింపు ముదంబున బాదరాయణా!

  2. కరముల కింకిణీ ధ్వనులు కన్నుల గజ్జల మేచ కచ్చవుల్‌ పరహితగూఢవాంఛయు నపొంగము వెల్వడి తొంగిచూడము త్రరములనాటివృద్ధవనితొమణి భీమయరాణి వాసమున్‌ బరమమునీంద్ర! నీకు ననపాయత గూర్చును బాదరాయణా।

  3. జనులకు భోగమోక్షములసంశయనుచ్చటదక్షవాటిలో జినికిన జాలు సప్తముని సింధువు నీరు శిరంబుపై గడుం బనిగొని భక్తితో మొగలివాకిట నిల్పియు బెద్దవేలుపున్‌ వినమిత గౌొత్రయప్టిగనుపింపగ మొక్కిన బాదరాయణా!

  4. వినుమది వేల్పువీడు వినువీథి సుధాంధసులేగుదెంచితా రనిమిష లోచనాళులవికాంచలభ్రూలత గ్రుచ్చియెత్తి పొ వన సురలోక కల్పతరువాసిత కోమల పృష్పమాలగా ననిశము భీమనాథు కెదురై కయి మోడ్డురు బాదరాయణా!

బాదరాయణము (ముం ఆగ

  1. దండిగ బారుచుండును నిదాఘములందును సింధువచ్చటన్‌ నిండుగ హేమపంకజ వనీ ప్రకరంబులు పూలకోటయా ఖండలుడెన్నడేని కరకంరునిదౌ బొలిమేరకేనినే యండజయౌాన నంపడట యారట బెట్టగ బాదరాయణా!

  2. ఇంద్రధనుస్సులై నవమహేశ్వర మూర్తులు భీమమండలిన్‌ జంద్రిక లీను ధోవతులు సన్నని సాలువ లంగయప్టిపై సాంద్రకురంగనాభ మెద స్వాగతమిత్తురు కుస్తరించిని స్తంద్రత భోగమోక్షపథ చారణులౌచును బాదరాయణా!

  3. దక్షిణకాశి లోపల సుధాకరశేఖరు రాజధానిలో లక్షలుగోట్లునై శుచిలలాటునిలింగములింటనింట ప్ర త్యృక్షములౌచు ముక్తియు నిహమ్ము సుఖంబుల నెల్ల వేళలం దక్షయ సిద్ధిగా నొసగి యాదృతి సేయును బాదరాయణ!

  4. ఎచ్చట జూచినన్‌ జటిలు లేదెస సాగిన బిల్వకాననా లెచ్చట గన్గొన న్విబుధు లేదిశ బుట్టిన దేవళంబులం దెచ్చట దేరి చూచిన మహేశ్వర మూర్తులు దక్షవాటిలో నెచ్చటనన్యవాటికలవెక్కడ లోగన బాదరాయణా!

  5. జడముడి చక్కటిం బొడము చక్కని చుక్కలరాజు నెన్నొసల్‌ వెడదగ సాగి మధ్యనొక వేడికనీనిక నీను నిచ్చటన్‌ మెడపయి కాలకూట విషమేచక రోచులు పాపసెండెరం బడుగుల గూడు జంతుతతి కంతిమయాౌాత్రను బాదరాయణా!

  6. అతత సంహితాధ్యయనహావమనస్కులు బ్రహ్మతైజనో 'పేతులు హవ్యకవ్య ఘృత పిష్ట సమర్పిత వీతి హోత్రులై ప్రాత రుపాసనాదుల నవశళ్యము భక్తిగ దర్శపాణితో బ్రీతిగ భీమనాథ శివలింగము గొల్తురు బాదరాయణా!

కాయ తతత తతతతలై బాదరాయణము

  1. మనమున బండు వెన్నెల లమందములై ప్రసరింపమౌని! వే చని మునిసింధు వీచికల సామి నిమీలిత లోచనుండవై జనములనెల్ల బ్రోచునల శర్వుని లీలలు సంస్మరించుచున్‌ తనువు పవిత్ర ఖభావగతి దాల్చితివే గద బాదరాయణ!

  2. లవణ జలాశయంబు విమలంబగు మేరయ తూర్పుదిక్కునన్‌ లవనచలత్తరంగ పరివాహ, యవాచిని వృద్ధ గంగయున్‌ శివపురి పశ్చిమంబున విశీర్ణ పయఃకణ పుణ్యగౌతమీ స్తవజల తుల్యభాగయు జలించునుదీచిని బాదరాయణ!

  3. దక్షిణకాశి యంచు పరతంత్ర విముక్తిగ పేరుపొందునీ దక్ష నివాస భూమిగనధారుణిసంతతికోరుచుంద్రు-నం రక్షణ భారమూని వరరాజిత ధామముదక్షవాటిలో మోక్షము సిద్ధమౌనుగదె ముక్తి పదార్పన బాదరాయణా!

  4. శివ సంచాక్షరి నామ మంత్రములతో జెల్వొందు నివ్వీటిలో శివ సాన్నిధ్యము పొందగా జనులు రాజీవాక్ష యుగ్మంబుతో శివ సన్మంత్రము పల్కుచున్‌ సతత సౌశీల్యంబు నిండార-నీ శివధామంబగు భీమవాటికకు గాశీ నామమౌవ్యాసుడా!

బాదరాయణము కైకా 6 &

౯. విశ్వలోకకుటుంబి

  1. భసితము పూసికోడు, గజభస్రైక గంటను జూడబోవడున్‌, బసికల పాపరాజుల గపర్దము సేరగనీడు, కాటిలో వసతికి నొల్ల బోడు, గణవర్గము జీరడు, ద్రాక్షతోటలో బిసరుహ లోచనా ప్రియుడు భిమయ దేవుడు బాదరాయణా!

2... కమ్ముల పట్టు పచ్చడము కస్తురి గూర్చిన గంధ సారముల్‌ సొమ్ముగ దారమాల కలశోంబుధి బుట్టిన సొనికూతురే సమ్ముఖ మందు జేరి కనుసన్నల నాట్యము సేయు వేళలో కమ్మునె విస్మరించి లయకారుడు పూనును బాదరాయణా!

  1. అనిశము దక్షవాటిక శరాసన మెక్కిడి పుష్పసాయకుం డినకర సంప్రతిష్టిత మహేశ్వరు మైల సుపర్వ భామినుల్‌ నెనరుగ ముంగిటన్మరుల నృత్యము సేయు దినాంత వేళలో నినుమడి నారిలాగి మొరయించును జాపము బాదరాయణా!

  2. _శారదకౌముదీ రజత సౌంద్ర కిరీటము దాల్చి మాధవుం డీరమణీయదక్ష పరమేష్టి వనాంతర భీమలింగమున్‌ గోరికలూర దివ్యసమకోమల బిల్వదళాల దీప్తితో ఖైరవు నాజ్ఞగొంచును నివాళులు పట్టును బాదరాయణా!

  3. ఈవిపులాంధ్ర భూమి విబుభేశుడు తాదిగివచ్చి వేదవా చావిధినాగ్రహాయణిక శౌద్ధ చతుర్దళి ధారవోసెనా పావనలగ్న మందున నపాంపతి మేరగ భీమమండలిన్‌ గేవల భక్తితోడ రమణీ సహితంబుగ బాదరాయణా!

కోఆలటయటమమము టే! బాదరాయణము

  1. పునరపి జీవనౌషధులు పుష్పశిలీముఖ దేహయప్టికిన్‌ వనితలు దక్షవాటిక నపాంనిధి బుట్టిన వారకాంతలై వినయ వినీత మస్తక వివేచన భంగిమలందగించు-నా మనిబికపంచమస్వన సమర్పితమౌగదె బాదరాయణ!

7, _ తేనెలవాకగా నిసుకతిన్నెలబాడును రేలజేలలో వీణియ మెట్లబోలి వినువిందుగ గోకిల చందనాక్తమం దానిలవీచికానిచుళహర్య్యతలాంతర పుష్పవాటిలో నానన మోరజేసి త్రిపురారి జయంబులు బాదరాయణా!

  1. నిండగు పండువెన్నెలల నిచ్చెనలెక్కి హిమాంశు మౌభిపై దండను మండపంబు దరిదాపున నూగుచు జక్రవాళఠకముల్‌ ఖండ సుధాకరంబు నునుకాంతులు మింగగ నోళ్ళు విప్పియా కుండలి రాజమండనుని గొల్వ నదించును బాదరాయణా!

  2. చల్లని పిల్ల వాయువులు శైత్య పరీమళ పుంజమంజరుల్‌ మెల్లగ దెచ్చి ఈశునెలమిన్‌ మిహిరాంశు మరీచిగ్రుచ్చి, ఉ త్భుల్లకుశేశయగ్రధితతుందిలమాలగ నర్చసేయవే ఉల్లము పల్లవింప విభవోజ్బల పద్ధతి బాదరాయణ!

  3. పూచిన తీవలందు బ్రతి సృష్పము కమ్మని తావులీనుచున్‌ వీవెడిగాలులందు బ్రతి వీచికయున్‌ సుడులథభ్రగాములై కాచిన కాయలందు పులకొంకుర సంతతి సంభ్రమించుచున్‌ దోచినభావసతృలముతుప్టిజనింపదె బాదరాయణా!

  4. వరుసగ పుష్పవంతులు నభంబున బ్రాచిని బశ్చిమంబునన్‌ మరకత రత్నముల్ల ముని మాపటి వేళ నహర్నుఖంబునన్‌ కురగట దక్ష వాటమున గోకనదచ్చవులుప్పతిల్లగా గరములు సొచి కాయుదురు కాలగళస్తుతి బాదరాయణా!

  5. అసువు దొరంగు జీవికి సుధాంశు కిరీటుడు దక్షిణశ్రుతిన్‌ మసలక తారకంబు ననుమానములేక యుపస్కరించెడిన్‌ విసువక పయ్యెదన్‌ గొసరి వీచును ఖభీమయ ధర్మపత్నియున్‌ మెసవెడు మిత్తికోర మిసిమింతుడు గానటు బాదరాయణా!

  6. బాహువు సాచి దక్షప్పురి పార్థివ లింగము జుట్టివచ్చునీ యూహలు పూలరేకులుగ నొల్చి గిరీశుని చెంత జేర్చిసం దేహము పొరద్రోలి పరిదేవనతో నభయంబు వేడుమా యీహర భక్తు బ్రోచు నిను నీశ్వరుడచ్చట బాదరాయణా!

  7. పచ్చని పంటచబేల నిరువాగుల గమ్మని పిన్న తెమ్మరలొ విచ్చిన పుష్పమంజరుల వెచ్చని వాసన మోసికొంచునీ 'హెచ్చగు వారణాసి జనియించిన క్లేశము పారద్రోలునిన్‌ మెచ్చి విపశ్చిదంబునిధి నిశ్చల చంద్రుడ! బాదరాయణా!

  8. సనక సనందనాది ముని సత్తములిచ్చట ముక్కుమూసి స న్మనముల మొల్కవారి జననాంతరధర్మము మోసులెత్తగా వినమిత మస్తకాళినిట బిల్వవనాంతర భీమలింగమున్‌ మనముల వాక్కులంగ్రియల మన్నన సేసిరి బాదరాయణా!

  9. ముంగిట గోముఖాన జలముల్‌ జిలికించి నిరూఢ భక్తి వా మౌంగులు సల్పు సత్కృతుల కందక నేడిటు పూజ్యపాదముల్‌ భంగము "సెంద గాళికకు బాహ్యవనిన్‌ గను చూపు మేరకున్‌ జెంగున బొమ్మటంచు గలబెన్‌ గద నిన్నిట బాదరాయణా!

  10. శంకరకింకరాలి కిహ సౌఖ్యము లిచ్చెడు దక్షవాటినే వంకను జూచినన్‌ విమల వారిజ మంద మరంద భుక్తిచే బొంకము వట్టి దేవళపు మోసల నల్లన సంభ్రమించుచున్‌ కింకరరీతి నాదముల కీర్తి గడించితి బాదరాయణా!

ఫ్ర ఆలఅటపుమలే బాదరాయణము

  1. వాసియు వన్నె నాసిలు ప్రవాసుల పాలిటి పుణ్యరాశి కై లాస నిశాంత వాసి నటలాస్యవిలాసిని భర్శవాసినిన్‌ గాసెబిగించి యిట్లు వెడకన్నులు రెండును జేవురింపగా గాసిల జేయగాదు జితకాళిని కాశిని బాదరాయణ!

  2. మూటలు గట్టుకొన్న తలపుందినుసుల్‌ మెడబెట్టి మెల్లగా దాటుచు గొండకోనల సుధామధురోహలు తీగసాగ నే నాటికొ సప్తసింధు పవనంబులుసోకగ దెల్లునేల నా రాటము వాపికొందు వవురా! మునిమండన! బాదరాయణా!

  3. మోమున చంద్రరేఖయును ముద్దులు చిందెడు మందహాసమున్‌ సామజయానయై సకల సద్గుణ సుందరి భర్గురాణి-యే కామవికారరూపజితకాంతులు చిమ్మెడు దేహ సంపదన్‌ గామిత సర్వ సౌఖ్యములు కల్గగ జూచును బాదరాయణా! బాదరాయణము [మమమ మము /]

  4. పరిసర క్షేత్రములు

  5. అవుర! చళుక్య భీమ నగరావధిలో గొమరేటి బిందువుల్‌ సవిధ వనావనీజ సుమసౌరభవాహసమీర పుంజముల్‌ దవులుగ వారణాసి బహుధా శితికంరుని నిష్టురోక్తిపై వివశత మాన్ని సన్నిధికి జేరి స్పృళించును బాదరాయణా!

  6. నారద కుండికా జలము నందవగాహ మొనర్చి భక్తితో గైరవ గంధిలా నిలము గాశివియోగజదుఃఖ జాలమున్‌ దూరము సేయ గామ్యవరదున్‌ మనమార భజించి తృప్తితో "సైరణ విశ్రమింపుమట సర్పవరంబున బాదరాయణా!

  7. పనసలునారికేళములు పచ్చని రంభలు గున్న మామిడుల్‌ మునుగల పంటభూములకు బుట్టిన యిల్లగు కోనసీమలో ఘనతర కౌశికీ సలిల కైరవ గంధిల గంధ వాహముల్‌ యినకర సుప్రతిష్టిత మహేశున కెల్లయె బాదరాయణా!

  8. మునినొక శోధజేయక్షుదముంపులువెట్టదలంచి కుత్తుకన్‌ పనిగొని మోసపుచ్చ తగవా యిరు వాగుల వారు వాడలో మనసులు మారి తాపసుని మర్శమెరుంగక ధర్మకాననం బును రగులంగ జేయుదురె ముక్తి పురంబున బాదరాయణా!

  9. కచ్చెలు పెంచుకోదలపఖండముగా మదినిండ కాశికా సచ్చరితంబునందు గలుషంబొక యించుక సోకు తీరువన్‌ కుచ్చితులండ జేరి చెవికోణము నందు బినాక పొణికిన్‌ నచ్చిక నొటి నూదుదురొ నమ్మిక వుట్టగ బాదరాయణా!

కొ ఆాతిమయమితమమకతమతతతతతతలై బాదరాయణము

  1. ఖైరవుడుగ్రదం్ల లిరువంకలు సొగగ పంగటించిని డారిన నోట హాల హలమంచులు దాటగ మేనుసాచివి స్తార నఖాగ్రకోటి బహుధా పుడమిన్‌ బిరిగీయు చాడ్పునం భఖోరవ మద్రులన్‌ జిదుప ముందున సాగెను బాదరాయణా!

  2. తలపులురేగి మూగ సముదాత్త చరిత్రు హిమాంశుమౌళిపై దొలకెడి బంధుర ప్రణయ తోయధి ఖావ మరీచి మాలికలొ దొలగగనీక మానసము శొక్కట బాటును దక్షవాటికన్‌ మలయజ గంధవాహ మహిమన్‌ విడనాడుము బాదరాయణా!

  3. చెదరిన యూహ వల్లరి కృశింపగ నేలను దెల్లునేలకున్‌ బదంటు కోనసీమ మృదువాయు నికాయ నిరామయస్థితిన్‌ ముదమొక కొంత చియ్యకొన పుణ్యనదీనద తోయపుంజ మిం పొదవగ జాట జూటమున బుక్కిలి పట్టుము బాదరాయణా!

  4. మెరవడి జూపియుంటెగద మదుర భారత సంహితొకృతిన్‌ సరి! నిగమాంబురాశి నలుచాయల బాయలుగా నమర్చుటలొ సరవిని విన్న వార్తయె విశాలజగంబున, నాంధ్రభూమిలో కొరగల గంటపున్‌ మొనను క్రొన్నన విచ్చెదె? బాదరాయణా!

  5. చక్కని పంటలున్‌ మదికి జల్లదనంబుల నిచ్చుగాలులున్‌ చక్కని గేహసీమలును సంతత సౌరభ దివ్య వల్లరుల్‌ మక్కువ తోడ పల్కు జనమానస వీథుల దైవభక్తియున్‌ నిక్కిన వీనులన్‌ జనులు నేర్పున జూతురు బాదరాయణ!

  6. సతతము చంద్రధారియగు శర్వుని లీలలు పాటపాడుచున్‌ కుతుకమనంబుతో జనులు కూర్మిని భక్తిని రంగరింపగన్‌ వితత వినోద యుక్తులయి వేదనలన్నియు బారద్రోలుచున్‌ మతి శివనామమూని మహిమంబున నిల్చును బాదరాయణ! కైక బాదరాయణ కతా

  7. ఆహ్వానము

  8. చిక్కని బోధలన్‌ దనిపి శిష్యనికాయము దిద్ది కాశిలో వక్కణమందు కొంత సరివారలు మెచ్చమెలంగితీవు నీ వాక్కున నున్న దివ్యరసభారము మా తెలుగుంబౌొలాలలో నొక్కెడ మిశ్రమించి చవులూరగ దింపుము బాదరాయణా!

  9. బ్రదుకున దాచుకొన్న మురిపంపు రుచుల్పడలంగ గన్నులన్‌ బదనుగ నిల్పుకొన్న తెలివన్నెల వెన్నెల వత్తులెల్ల గొం డదరిని ముట్ట బెంగగొనివాడవ సంయమి! కాశికొపురిన్‌ బొదలెడి భాగ్యమింక మరిపోయెనటంచును బాదరాయణా!

  10. పదములు మోచు చోట వలువల్‌ వరపించుచు భక్తి పెంపునన్‌ గదలిక బూసకట్టు శ్రమ ఘర్మజలంబుల దోయిలించి నిన్‌ ముదమున నౌదలంగులుకు బూవును వాడక తెల్లునేల సే ర్మి దెలచి నిల్చుకొందు మురరీకృతి దెల్పుము బాదరాయణా!

4... తీయని గాంగ నిర్ణరము దీర్ణ కవిత్వ పటుత్వ సంహితన్‌ సాయపడెన్‌, కఠోరభవసాగర పారము జేర్చు సూత్రముల్‌ చాయను గంటపున్మొనకు బాటవ మిచ్చెను విశ్వనాథుడున్‌ జేయును సాయమింకమునిసింధువునీవటబాదరాయణా!

  1. కన్నులు గొజువారె వులకండమురాలెడి నోష్టసంపుటిన్‌ నన్నని యార్తరేఖ విరసంబుగ దోచెడి భావవీథిలో మిన్నులురాలజొచ్చెమిసిమింతుడవై యవిముక్త సీమనే తెన్నున వీడి సాగుటకు దేలదు నీమది బాదరాయణ!

కఅుతతతతతతతతతతతతతతనకై బాదరాయంము

  1. ఎక్కడొముక్కు మూసికొని యరిని వేడక వేళ కేదియో గ్రుక్కెడు గంగ మింగుకొని గొంతువెతన్‌ సరిపుచ్చి నిస్పృహన్‌ జక్కగ మోక్ష మౌర్గ విలసద్రుచి నెంచుము వేద వీథులన్‌ జొక్కుచునున్న నిన్నునొక శోధన సేయుట బాదరాయణా!

  2. _గంటము కంఠమై నెమలికన్నుల రంగులు చెంగలింపవె న్వెంట రసార్ధభావములు వియ్యములందగ షడ్డమధ్వనుల్‌ బంటగ గోస్తనీవనము పజ్జను దక్షిణ వారణాసిలో గంటికి విందుగా విడుము కావ్యపు బింఛము బాదరాయణా!

  3. కట్టిన కావిబట్ట రవికాంతి జిలుంగులు తుంగలింపమో ముట్టిపడెన్‌ సితచ్భవుల బుంఖములై శతసాత్విక ప్రభల్‌ పట్టిన పైడి ఘంటమున బండెడి బండెడు సాహితీ రుచుల్‌ చుట్టిన నాంధ్ర భూపతి యశోధన మైతివి బాదరాయణ!

  4. పొడివడు కంటిరెప్పలను బుట్టెడు బెంగలు పుక్కిలింపనో రెడనెడ గద్గదంబు నుమియింపగ నీగతి బ్రహ్మవర్చసం బడలగ ముక్తి మంటపము నంటిన పీఠము పెల్లగించియే యెడముగ బోవ నెంచితివా యేర్పడ జెప్పుము బాదరాయణా!

  5. చక్కగ ముక్కుమూసికొని సౌహృద చిత్తము పల్లవించునీ చిక్కని చిత్తమందు నెటుసాగెను తొపసిశ్రోధభావముల్‌ నిక్కము గాదె నీజపము - నీరవమయ్యెనె - యోగసంపదల్‌ అక్కట పుణ్యకాశిపయి నాగ్రహమూనుదె - బాదరాయణా!

  6. వేదవిభాగకర్త! ఘనవేదపురొణవిభాగవేత్త! యీ వేదన లెట్టులబ్బె - పురవీథుల దుఃఖము నీకు నేల? ఓ వేదవిదాంవరోన్నతనివేదితపుణ్యవిలాస తేజమా! వేదమహార్థ చిత్తమున వేదన వీడుము బాదరాయణ!

బాదరాయణము కైక ననా?

  1. పనసలు నారికేళములు పాలసపోటలు తియ్యమామిడుల్‌ మునుగల సస్యసంపదలు వుట్టెడు చల్లని కోనసీమలో ఘనతర క్రెశికీ సలిల క్రైరవ వాసిత పుణ్యభూమిపై జనిగని “చంద్రశేఖరుని” సామ్యము పొందితి నాహ్యయంబునన్‌. కదర యశ బపంధాలం్య ఖా న నబ | గ టి నటు 0౪9 2ఫింర్సొ ఢి మ లో పాల వాశ ఫీ త్వరలో... "రా చంద్రుశేఖ్ణురశాస్త్రి కథలు" నాలుగు దళాబ్దాలక్రితం ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, భారతి వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడి - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్చాస్తి, పాలగుమ్మి పద్మరాజు, పురిపండా వంటి ప్రముఖుల ప్రశంసలందుకున్న శ్రీ శాస్త్రిగారి కథలు, గతంలో 'మహర్షనమి' పేరిట పుస్తకరూపంలో వచ్చాయి. వాటికి అదనంగా మరో మూడు కథలను చేర్చి, “కర్రా చంద్రశేఖర శాస్త్రికథలు”గా మీముందుకు తీసుకువస్తున్నాం! కొయల 2) బాదరాయణము

'ఉతటాత+ాప+ నః న. యం టీ | 0 సగం వం. గ హ్‌ | | శ న! థ్రీ ప్‌ చమట షాని ల్‌ నా మ ల్‌ ఆ / రా! వి 14 పాళి : న్‌] 6 భర్‌. స! టా. సం స్‌ గ. వ్‌ / ఫై. గ్ల షు స న” ల ష్య శ “ నం | వ్‌ (౯ క ల స శా గ (౧. ఏ2! న ఖు | ల | గ హస టీ చే || న (1 మలై స్తవ ప లా £ +) శు |: జం సు... ళ్‌ | స య (శీ! ౫] ॥ | స ల 1 ర ప్చ్‌ ర్‌ జు ణా లా ॥ ఓం నా ల సీ ం క ణి 'సీ |! శ నషి ర స స లే ర న య. న గి ( ల కే. నటల టి య్‌ + కై మ. రమెక్ట క... క. న్‌ న నా! | స మస్‌ వ. స టీ ము ౯ న న - ము ళ్‌ న్‌ మ ఖే లు జా గ్‌, న టం న క్‌. (1 నము న. ళ్ళ 1 1,4. షక | సా న న. [| [111 య. ? క్త | | ( / ( ర స క | ఖో ఛ క్ట; టై న గ్‌ ద్ర ్టీ మం. 1 ఎ పఫ్‌ గన! న లా నె | గు (7 త్ర | | సళ. | శ్‌ శ్రీ విజయదుర్లామ స

పటు. డు |

ల్‌ ఫె” ల ' (8 ా ఇ గ్ర

॥ స్‌ క్‌. న ం

ని . + థి ర “౯ (( సి క గ గ పనసలు నారికేళములు [| న పొలసపోటలు తియ్యమామిడుల్‌ + శః _

  1. మునుగల సస్యసంపదలు [0 గ పుట్టెడు చల్లని కోనసీమలో ఖీ [| ఘనతర కైళశికీసలిల 111 ( కైరవవాసిత పుణ్యభూమి 'పై గ ([ జనిగని “చంద్రశేఖరుని” "(1 - || సామ్యము పొందితి నాహ్వ్యయంబునన్‌”. /